Comment navigation


15538

« 1 ... 26 27 28 29 30 ... 1554 »

  1. ఆలిస్ మన్రో గురించి v r veluri గారి అభిప్రాయం:

    07/17/2024 3:45 pm

    Dear Hamumantha Rao garu: I just looked into Andrea Skinner. Sad. Very sad. I am sure the other biographies would not have mentioned about the sad experience of Skinner. Now, I will read Munro’s stories only, whenever I can. Regards, v r veluri.

  2. అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు గురించి బి.వి.ఎన్.స్వామి గారి అభిప్రాయం:

    07/16/2024 10:26 pm

    మంచి సమీక్ష. కథలు చదవాలనిపించేలా ఉంది. అనిల్ గారికి అభినందనలు. నిశ్శబ్దంగా రాసే రచయితను మనమే వెతికి పట్టుకోవాలి. విలువైన వాక్యం. రచయిత, రచనలకు ఆరోగ్యకరమైన ధోరణిని పిచ్చేశ్వరరావు గారు తన ఆచరణ ద్వారా అందించారు.

  3. తిక్కన భారతంలో పలుకులపొందు గురించి డా. మోదుగు గారి అభిప్రాయం:

    07/16/2024 2:45 am

    తిక్కన భాషలోని అనేకానేక విశేషాలు వెలువడటానికి కృష్ణమూర్తిగారు తిక్కనపై జరిపిన ప్రత్యేక అధ్యయనం ఒక కారణమైతే, తిక్కన పదప్రయోగకోశ సహకారం రెండవది. ఈ వ్యాసంలో భాషావిశేషాలతోపాటు తిక్కన కవితావ్యక్తిత్వాన్ని కూడా కృష్ణమూర్తిగారు ఎత్తిచూపారు. కృష్ణమూర్తిగారు గొప్ప భాషాశాస్త్రవేత్తేకాదు, గొప్ప సాహిత్యవిమర్శకులు అనటానికి ఈ వ్యాసం ఉపకరిస్తుంది. నా అవగాహనలో సాహిత్యాన్ని, భాషను సమతూకంగా అధ్యయనం చేసిన ఏ పండితులైనా భావితరాలకు ఉపయుక్తగ్రంథంగా నిలుస్తారనటానికి కృష్ణమూర్తిగారికి మించిన ఉదాహరణ ఉండదని చెప్పవచ్చు.

  4. గడినుడి – 91 గురించి మంజరి లక్ష్మి గారి అభిప్రాయం:

    07/15/2024 7:24 am

    మీరు సైట్ బాగుచేసిన తరువాత గడి నుడి గళ్ళు కనపడటం లేదు గమనించారా?

  5. మధుమేహం – రక్తపోటు 1 గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:

    07/15/2024 6:17 am

    స్ట్రైయర్, లెనింజర్ బయోకెమిస్ట్రీ చదివిన వారు కూదా ఇంత వివరంగా చెప్పలేరు, గ్లూకోజ్ ఫ్యూయల్, రక్తకణాలలో మైటోకాండ్రియ, న్యూక్లియస్ లేకపోవడం వల్ల త్యాగనిరతి, ఇంటెగ్రేటెడ్ మెటబాలిజం, ఇంటర్ ప్లే ఆఫ్ జీవకణాలు, అన్నింటినీ మనం రోజూ చూసే వాటితో పోల్చుతూ అర్ధమయ్యేట్టు చెప్పారు. ధన్యవాదాలు.

  6. మరల రామాయణంబదేల… గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    07/14/2024 4:22 pm

    అందుకుతోడు వార్థక్యం.

    మా రిటైర్ అయిపోయి, ఎనభైలలో ఉన్న చైనా ఆచార్యులు గారు నాతో వాట్సాప్ మీద మాట్లాడుతూ ఉంటారు ఏ దేశం చూడ్డానికి వెళ్ళినా, అక్కడ ఫోటోలు తీసినా అవి పంపుతూ. పెళ్ళి అయ్యి ఎన్నేళ్ళైందీ, గలాపెగోస్ వెళ్తే ఏం చూసారూ, బ్రెజిల్ లో వాటర్ ఫాల్స్ చూసిన రోజూ, మొరాకోలో రోడ్డుమీద కనిపించే పిల్లులూ, కుక్కలూ వాటి సంగతీ అన్నీ పొల్లుపోకుండా చెప్పగల్రు. అయితే కాలిఫోర్నియా వచ్చాక ఇంట్లోనో కొట్లోనో ఏదో మర్చిపోవడం, చూసావా నేను ముసలివాణ్ణి అయిపోయేను, ఏదీ గుర్తుండడం లేదు, వార్ధక్యం అంటూ కబుర్లు చెప్తూ ఉంటే నేను నవ్వుకుంటూ ఆయనని ‘ఔనౌను, అన్నీ గుర్తున్నాయి కానీ ఇది మర్చిపోయేసరికి మీకు వయసూ వార్ధక్యం గుర్తొచ్చింది దీని తస్సాదియ్యా, కాదు మరీ?’ అని ఏడిపిస్తూ ఉంటాను సరదాకి. ఆయన కూడా నవ్వుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పరగ పిట్టా, పరిగ పిట్టా, అంతర్వేదీ, బండి ర, క్రావడి, జమిందారు గారింట్లో భోయనం, నైఘంటికులు, కాకులూ, రామాయణం, క్రౌంచం, edible birds, దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందీ, పెరిగే కాకుల సంతతీ అన్నీ గుర్తున్నాయండి మీకు. అబ్బో, ఇంక మీ వార్ధక్యం గురించి చెప్పనేల? కడుపుచించుకుంటే పరిగపిట్టలు కాళ్ళ మీద పడవూ? 🙂

    కాకులు, రకరకాల కాకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అంతర్జాలంలో కూడా!

    ఇప్పుడు కొత్తగా పెరిగేదేవుంది? 32 బిట్ల ఇంటర్నెట్ ఎడ్రసులు అయిపోతున్నందున దాన్ని 128 బిట్ల ఐ.పి 6 వెర్షన్ లోకి మార్చి చాలాకాలం అయింది. అయితే నాలాంటి “పాతకాకులు” ఎక్కడకీ పోలేక ఇక్కడే ఉన్నాం. ఏం చేయమంటారు? చెప్పలేదనకండి తర్వాత, అసలు కధలు రాసేనాలాంటివారు ఈ ‘కాకిగోల’ లేకపోతే అసలు రాయలేం. కొన్ని కాకులు మంచి ఐడియాలు ఇస్తాయి కూడాను. కొంతమంది కాకి గోల లేకపోతే అరే నా కధ ఎవరూ చదవట్లేదు అని గోల చేయడం (అదే రాయడం) మానేస్తారు. అలా కొంతమంది రచయితలు కనుమరుగు అవడం మన దురదృష్టం.

    నమస్కారములతో

  7. చంద్రికాపరిణయంలోని యమకాలంకారాలు గురించి డా. నల్లపనేని విజయలక్ష్మి గారి అభిప్రాయం:

    07/13/2024 9:16 am

    సమగ్రమైన వివరణతో సందేహ నివృత్తి చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు సర్!

  8. స్త్రీ పర్వంలో గాంధారి గురించి Dinitha Rani గారి అభిప్రాయం:

    07/13/2024 8:53 am

    పైన చాలా మంది ఉత్తమ పురుషులు మాత గాంధారిపై అనవసరంగా ఏడుస్తున్నారు ఎందుకో?? ఇక్కడ కూడా బాధ చూడకుండా ఆడ, మగ భేదం చూస్తున్న మహాపురుషులకి వందనం. అసలు ఆవిడ చేసిన నేరం ఏముంది? బిడ్డని మోసి కంటే ఆ నరకం, బాధా తెలుస్తాయి, పుత్ర శోకం ఎంతటి నరకమో తెలుసు కనుకే శ్రీ కృష్ణ పరమాత్మ ఆవిడ శాపాన్ని స్వీకరించాడు, ఇక పైన ఎవరో మహితాత్ముడు ముందే దుర్యోధనుడిని అదుపులో పెట్టవచ్చు కదా అని సెలవిస్తున్నారు. 🤣

    విషయం ఏంటంటే తప్పులు అందరూ చేస్తారు, కృష్ణుడే కానీ తలుచుకుంటే యుద్ధం జరగకుండా ఆపి ఉండేవాడు, ఆయన భగవానుడు కనుక, కానీ ఆయన యుద్ధమే చేయించాడు అని ఆవిడ ఒక స్త్రీ మూర్తిగా సెలవిచ్చింది, ఒక కుటుంబానికి యజమాని లేకుంటే ఆ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒంటరి వాళ్ళే కదా? వృద్దాప్యంలో పిల్లలు మరణించారు అన్న వార్త ఏ తల్లితండ్రులకి మాత్రం గొప్ప వార్త అవుతుంది? అదే స్త్రీ పర్వం, భర్తా పిల్లలు అండ లేని స్త్రీ పడే రోదన అది, గాంధారి మాత జరిగిన నష్టానికి ప్రతీక. తెలుసుకోండి.

  9. మరల రామాయణంబదేల… గురించి V R Veluri గారి అభిప్రాయం:

    07/12/2024 8:03 pm

    శాయి గారూ:

    ‘నైఘంటికులు ‘పరగపిట్ట’ కాదు ‘పరిగపిట్ట’ అంటున్నారు,’ అని మీరు రాశారు. నేను ఆంధ్రభారతిలో చూశాను. నైఘంటికులకి సాధారణ ప్రజలు మాట్లాడుకునే భాష రాదని నా అభిప్రాయం. వాళ్ళందరూ వ్యుత్పత్తి ఆధారంగా నామకరణం చేస్తారనుకుంటాను.

    అయినా, నేను మీకు చెప్పటం ఏమిటి!

    అయితే, కొల్లేరు అంతర్వేదికి నిఘంటువులు తెలియవు. అతను మాకు చెప్పటం: పరగ పిట్టలు అని. పైగా ఈ కొల్లేరు పిట్టలు గడ్డి పరగలు ఏరుకోని తినటం మేము ఎప్పుడూ చూడలేదు. నీటి నాచు, పురుగులూ తినటం చూశాం.

    ఇంతెందుకూ, మీరంటే నాకు గౌరవం; అంతర్వేదంటే ప్రేమా!

    ఈ పిట్టలని చంపడం ఆంధ్ర ప్రభుత్వం ఏనాడో నిషేధించారు కాబట్టి, నేను మీజట్టులోకి వచ్చేస్తా. ఇక ముందు ఈ పిట్టల గొడవ రాస్తే నైఘంటికుల భాషలోనే రాస్తాను. బండి ర మాత్రం రాయను.

    ధన్యవాదాలు.

    వేలూరి వేంకటేశ్వర రావు.

  10. మరల రామాయణంబదేల… గురించి V R Veluri గారి అభిప్రాయం:

    07/12/2024 7:33 pm

    అయ్యా శర్మగారూ: మీరు చదువుకున్నప్పుడు చిన్ననాటి పాఠశాలల్లో జంతువులు, పక్షులు బొమ్మలున్న పోస్టర్లు వుండివుండాలి. మీరు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎలిమెంటరీ బళ్ళకి వెళ్ళిన వాళ్ళు. మాకు ఆ అదృష్టం లేదు. అందుచేత, బకము అంటే బాతు అని బూతు రాశాను. అందుకుతోడు వార్థక్యం. క్షమార్హుణ్ణి.

    మీరు ముమ్మాటికీ రైట్.

    రుచులగురించి మీతో సంభాషణ కూడా తప్పే. నే రాసిన రుచి మీకు తెలిసే అవకాశం లేదు. ఒక్క విషయం మీతో మనవి చేసుకోవాలి: అన్ని పక్షి జాతులూ అంతరించటల్లేదు. Edible birds are in plenty. They are purposefully cultivated and grown in plenty.

    అయితే కాకులు, రకరకాల కాకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అంతర్జాలంలో కూడా!

    నమస్తే
    వేలూరి వేంకటేశ్వర రావు

« 1 ... 26 27 28 29 30 ... 1554 »