Comment navigation


15754

« 1 ... 20 21 22 23 24 ... 1576 »

  1. నో ఎగ్జిట్ .1 గురించి anamakaha గారి అభిప్రాయం:

    11/25/2024 10:22 pm

    ఈమాట నాయకత్వానికీ, తాడిగడప వారికీ వచ్చిన పొరపొచ్చాలు తొలగిపోయినట్లున్నాయి, దెబ్బతిన్న మనోభావాలన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకున్నట్లున్నాయి. ఇప్పుడు వారు పుంఖానుపుంఖాలుగా తమ అభిప్రాయాలు గుమ్మరిస్తున్నారు. వారి వ్యాఖ్య చూడగానే నాలో కలిగే విరక్తి ఎంత బలమైనది అంటే ఈ వ్యాఖ్య రాసేటంత. ఏమిటో, పొరపొచ్చాలున్నప్పుడే బాగుండేది. ఇప్పుడు వారికీ నాకూ పొరపొచ్చాలు వస్తున్నాయి!

    [ఈమాట ఒక పత్రిక. మనోభావాలు వ్యక్తులకు ఉంటాయి. వ్యవస్థలకు కాదు. పత్రిక నియమాలకు లోబడి వచ్చిన ఏ అభిప్రాయాన్నైనా ప్రచురిస్తాము. – సం]

  2. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి Amarendra గారి అభిప్రాయం:

    11/25/2024 7:31 pm

    థాంక్స్ లైలా గారూ!

    మీరు చెప్పిన పుస్తకం తెప్పించుకుంటాను

    థాంక్స్ ఎగైన్!

  3. నో ఎగ్జిట్ .1 గురించి రామారావు కన్నెగంటి గారి అభిప్రాయం:

    11/24/2024 9:31 pm

    తెలుగు కథలకు ఇంగ్లీష్ పేర్లు పెట్టటంలో సామంజస్యం ఏమిటంటే — కథ పేరు చదువరులకు తెలిసిన సాహిత్య చరిత్ర లోంచి తేవటంతో, రచయిత ఒక అర్థం చూపించగలడు. ఈ కథ పేరు సార్థ్ర్ రాసిన “నో ఎగ్జిట్” అనే నాటకం పేరుతో రాసింది. అందులో ముగ్గురు ఒక గదిలో ఉండి ఒకరికొకరు నరకం చూపించుకుంటూ ఉంటారు. “Hell is other people” అనే వాక్యం ఈ నాటకం నుంచే.

    అలాగనే సంస్కృత పదాల పేర్లతో కూడా కొందరు పేర్లు పెడుతుంటారు. ఆ ప్రాచీన గాథలతో సంబంధం గుర్తు చెయ్యడం కోసం. సంస్కృతం లేదా ఆ ప్రాచీన కథలు తెలియని వారికి అది బడాయి గానూ, లేదా అసమంజసంగానూ అనిపించవచ్చు.

    ఇంత బిజీగా ఉన్న రోజుల్లో, ఎటువంటి బాహ్యచిహ్నాలు చూసుకొని ఏవి చదువుకోవాలి అనేది రకరకాలుగా చూసుకుంటారు. అందుకే, “పుస్తకం కాదు బాగుండాల్సింది, అట్ట” అని కొడవటిగంటి ఏనాడో అన్నాడు!

  4. మా బోసన్న ప్రేమ కత గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/24/2024 10:37 am

    మంచి హాస్యంతో చక్కగా నవ్వించారు.

  5. చెప్పులు గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/24/2024 8:48 am

    కథ బాగా వుంది, ఎందుకు ఇంత తీవ్రమైన పరుషమైన విమర్శలు. ఇట్లాంటి కష్టాలు ఎందరి జీవితాల్లోనో వున్నయి.

  6. వీరాభిమాని గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/24/2024 8:32 am

    మీ నుంచి ఇలాంటి కథ ఊహించ లేదు. very bad story.

  7. కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    11/23/2024 7:34 pm

    అయ్యా! యదుకులభూషణ్ గారూ:

    నేను రాసే సైన్సు వ్యాసాలు చదివి, స్పందించే అతి కొద్ధిమందిలో మీరు ఒకరు! కనుక మీ స్పందనకి నా జవాబులు – క్లుప్తంగా.

    (1) అణువు, పరమాణువు, వగైరా

    మంత్రపుష్పంలో …

    తస్య మధ్యే వహ్ని శిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థితా
    …..
    నీవారసూకవత్తన్వీ పీతా భా”స్వత్వణూపమా

    అణువు ప్రస్తావన (నిర్వచనం) కనిపిస్తుంది. ఈ అణువు atomతో సమానార్థకం, moleculeతో కాదు. ఎందుకంటే …

    (క) ఒక హిమోగ్లోబిన్ బణువు (molecule) ఉదజని అణువు (atom) కంటే 64,500 రెట్లు ఎక్కువ బరువు! ఒక హిమోగ్లోబిన్ బణువులో (molecule) 10,000 వరకు (ఖచ్చితమైన లెక్క నాకు తెలియదు) ఉదజని, కర్బనం, నత్రజని, ఆమ్లజని, గంధకం అణువులతో పాటు ఖచ్చితంగా నాలుగు ఇనుము అణువులు (atoms) ఉన్నాయి. ఇంత తేడా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్‍ని “అణువు” అని ఏ ముఖం పెట్టుకుని అనగలం? హిమోగ్లోబిన్, DNA వగైరాలు బణువులే! అణువులు కాదు. నిజానికి అవి బృహత్ బణువులు (mega molecules).
    (చ) నిజానికి అణువులో (atom) అంతర్భాగమైన ఎలక్ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు పరమాణువులు (sub-atomic particles). వీటిలో అంతర్భాగాలైన క్వార్కులు “పరమాణు రేణువులు.”
    (ట) నీరు, మైలుతుత్తం, పంచదార, కిరసనాయిలు, వగైరాలలో అతి చిన్న “రేణువులని” బణువులు (molecules) అందాం. షడ్దర్శనాలలో కాణాదుడు ఇలాంటి బణువులనే “ద్వియాణువు, త్రయాణువు,” అంటూ అణువులకి, బణువులకి తేడాని చెప్పేడు. ఇదంతా నా సొంత పైత్యం కాదు.

    (2) మొసలి కన్నీళ్లు, ముద్రారాక్షసం, సింహభాగం వంటి ప్రయోగాలు “వైరల్” అవుతోన్న ఈ రోజుల్లో “లోతైన జేబులు” అనే ప్రయోగానికి కూడా తావు ఉందనే ధైర్యంతోనే ఆ ప్రయోగం చేసేను.

    (3) “పస” అనే బుర్రలో ఉంది. అది కాగితం మీద “పసరు” అని పడ్డాది. నా మనోనేత్రం భౌతిక నేత్రాన్ని ధిక్కరించింది. తరువాత సంపాదకులు “ప్రూఫులు” చూడమని ఇచ్చినప్పుడు “పసరు” కనిపించింది. పసరు ఇక్కడ నప్పుతుందో నప్పదో చూద్దామని బహుజనపల్లి సీతారామాచార్యులు ని సంప్రదించి “సరిపోతుందిలే” అని సమాధానపడ్డాను. అంతేకాని ఇది ఇంగ్లీషు నుడికారానికి అనువాదం కాదు.

    (a) పస: శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912: దే. వి. 1. సారము; 2. సమృద్ధి; 3. చాతుర్యము.
    “సీ. తననీతిపస యుగంధర భట్టి చాణక్యఘనచాతురికి నిదర్శనముగాఁగ.”

    (b) పసరు: శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912: వై. వి. వ్యాపనము.”ఒకింత బుద్ధిలోఁ బసరిడి చూడుమా.” (ఇక్కడ పసరిడి అనఁగా ఆలోచించి యనుట.) హరి. ఉ. ౮, ఆ.

    (4) మిగిలిన అంశాలు. నేను 1968 నుండి తెలుగులో సైన్సు వ్యాసాలు రాస్తున్నాను. ఆ రోజులలో నా దగ్గర నిఘంటువులు లేవు. ఈనాటిలా online నిఘంటువులు అప్పట్లో అస్సలు లేవు. అన్నీ స్వకపోలకల్పితాలే! వాటినే ఆకారాదిగా అమర్చుకుని వాటినే పదేపదే వాడుతూ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాను. నా నిఘంటువే నేను వాడే పదజాలానికి ఆధారం. ఉత్సాహం ఉంటే ఇక్కడ చూడండి:
    వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు – Wikibooks

    ధన్యవాదాలు!!

  8. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:

    11/23/2024 1:48 pm

    Disfruté de los esfuerzos conjuntos del Dr. S. Nimmagadda y el Sr. A. Dasari para traer estos ensayos de viajes sobre América Central y del Sur a la revista eemaata. Gracias a ambos. Mientras los leía, también asistí a algunas conferencias dictadas localmente por expertos en asuntos latinoamericanos, en geografía, historia política, comercio, defensa, etc. Impresionado por todos ustedes, también tomé prestadas más lecturas de las bibliotecas locales.
    A Amarendra Dasari podría traducir este libro en particular al telugu. Sería una lectura excelente para muchos.
    El libro es -Las venas abiertas de América Latina- de Eduardo Galeano.
    La edición en latín fue entregada al presidente Barack Obama por el presidente Chávez en 2009, durante una cumbre de países hispanohablantes. No creo que este libro deje de imprimirse nunca, al igual que los libros de Cervantes, Don Quijote de la Mancha y Veinte poemas de amor y una canción desesperada de Pablo Neruda.
    Ahora vuelvo a mis viajes de lujo y, señores, los dejo para que vuelvan a sus viajes de aventura.
    Les deseo lo mejor,
    -Lyla

    (English Translation:)
    I enjoyed the joint efforts of Dr. S. Nimmagadda and Mr. A. Dasari in bringing these travel essays on Central and South America to the eemaata magazine. Thanks to both of them. While reading them, I also attended some lectures given locally by experts in Latin American affairs, in geography, political history, trade, defence, etc. Impressed by all of you, I also borrowed more readings from local libraries.
    Amarendra Dasari may like to translate this particular book into Telugu. It would be an excellent read for many.
    The book is – The open veins of Latin America. By Eduardo Galiano.
    The Latin edition was handed over to President Barack Obama by President Chavez in 2009, during a summit of Spanish-speaking countries. I don’t think this book will ever go out of print, just like Cervantes’ books, Don Quixote of La Mancha, and Pablo Neruda’s Twenty Love Poems and a Song of Despair.
    Now I return to my luxury travels and, gentlemen, I leave you to return to your adventure travels.
    I wish you the best,
    -Lyla

  9. సంఘర్షణల పళ్ళచక్రం మధ్య నిలిచిన ‘అనుపమ’ గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/23/2024 2:59 am

    అనుపమ అనే నవలను పరిచయం చేసిన విధానం బాగుంది. ఆనవలను చదివిన భావన కలిగింది.

    నవలను మంగళాంతం చేయాలన్న సంకల్పంతో రచయిత్రి కధను మొదలుపెట్టినట్లుగా తోస్తోంది.

    అర్ధ శతాబ్దం క్రిందట ఇటువంటి దుర్భరజీవితాలకు బలియైన వనితలు కొల్లలు. ఇటీవల పరిస్థితులు కొంచంకొఃచంగా మారుతున్నాయి. నేటికాలం అమ్మాయిలు పెళ్ళికొడుకులను స్వయంగా ఎన్నుకుంటున్నారు. వైకల్యాలనూ కౌటుంబిక సామాజిక అవరోధాలను చక్కగా ఎదిరించి గెలుస్తున్నారు.

    కథాంతంలో అనుపమకు బ్రతుకు పండటం ఆనందదాయకమే కాని అది కావ్యదోషాలలోని అవ్యాప్తిగా చెప్పాల్సిందే.

  10. గడినుడి గురించి తంగిరాల సుందర రఘురాం గారి అభిప్రాయం:

    11/23/2024 2:05 am

    ప్రియమైన సంపాదకులకు,

    గడినుడి ప్రతి నెల చేసే అలవాటున్న పాఠకులలో నేను ఒకడిని. గడినుడి ప్రచురితం అవ్వక దాదాపు ఆరు నెలలు అవుతోంది. గడినుడి లేని ఈమాట నాకు బోసిపోయినట్టు ఉంది. గడినుడి తిరిగి త్వరలో ప్రచురితం కావాలని, మీరు అనుకున్న మార్పులు చేర్పులు చేసి పాఠకులను రంజింపజేసే దిశగా మీరు సఫలీకృతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను.

    ఇట్లు
    రఘు

« 1 ... 20 21 22 23 24 ... 1576 »