పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి దార్ల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    02/07/2026 6:56 pm

    అయ్యో… వారి మరణం తెలుగు సాహిత్వలోకానికి తీరని లోటు. వారు డయాస్పోరా సాహిత్యాన్ని ఎంతో సాధికారికంగా చెప్పిన వ్యాసాలు ఎన్నో ఉన్నాయి. వారికి నా శ్రద్ధాంజలి…

    ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
    సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్

  2. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    02/07/2026 6:30 pm

    పాతికేళ్లుగా అమెరికాలో నేను ఎరిగిన పెద్దమనిషి వేలూరి గారికి కన్నీటి వీడ్కోలు: గతంలో ఒకసారి ‘అమెరికాలో అర శతాబ్దం’ అన్న పేరుతో — తమ ఆత్మకథను రాయవలసిందిగా విజ్ఞప్తి చేశాను. ఇక అది నెరవేరని ఆశయే. వారి మాటల్లో, రాతల్లో గొప్ప ఉత్సాహం ఒకటి కనిపించేది. ఇకపై వారు, బంధుమిత్రుల జ్ఞాపకాల్లో కలకాలం జీవిస్తారు.

    తమ్మినేని యదుకుల భూషణ్

  3. మనసులు దోచే మనస్లు– 1 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/07/2026 5:12 pm

    సునీత గారూ
    సుధ గారూ
    మీ స్పందనలకు ధన్యవాదాలు

  4. కళాసాగరం కర్ణాటకం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    02/07/2026 12:49 pm

    ధన్యవాదాలు చిట్టత్తూరు మునిగోపాల్ గారూ.

  5. కళాసాగరం కర్ణాటకం గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    02/07/2026 12:34 am

    ఎప్పుడో చిన్నప్పుడు 9 వ తరగతిలో 80 లలో అనుకుంటాను, స్కూల్ ద్వారా టూర్ వెళ్ళాను హళిబేడు, హంపి, శ్రావణ బెళగొళ. ఏదో కలలో చూసినట్టు లీలగా మాత్రమే గోమఠేశ్వరుడి విగ్రహం, హోయసళేశ్వరుడి ఆలయ శిల్పసంపద గుర్తుకొస్తాయి. నేను ఉండేది బెంగళూరుకు కేవలం నూరు కిలోమీటర్ల దూరంలోని కుప్పంలో. అయినా మళ్ళీ వెళ్లలేకపోతున్నాను. శ్రీనివాస్ బందా గారూ… మీ పర్యాటక వ్యాసం ఎక్కడో ఎప్పుడో అణగిపోయిన నా లోలోపలి కళాకాంక్షను రగలకొల్పింది. మీ అక్షరాలలో ప్రతిఫలించిన కన్నడిగుల అద్భుత శిల్ప విన్యాసం పదపదమని తొందరపెడుతోంది. చూడాలి… ఏమవుతుందో.

  6. పదమల్లుని పథగమనం: గజ్జెల మల్లారెడ్డికి ఘన నివాళి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    02/07/2026 12:25 am

    కమ్యూనిష్టులు మనుధర్మాన్ని గౌరవించటమూ పాటించటమూ ఏమిటండీ బాబూ.

    ఐనా మీనుండి దానాన్ని స్వీకరించిన వారు ఎవరైనా సరే తీరా మీరే కష్టంలో ఉన్న పక్షంలో మీపైన సానుభూతితో లోగడ మీనుండి స్వీకరించిన దానాన్ని మీకు తిరిగి ఇస్తారా ఏమిటి? అలా ఇచ్చేవారు కోటికి ఒకరూ ఉండరేమో.

  7. మనసులు దోచే మనస్లు– 1 గురించి Subha అభిప్రాయం:

    02/06/2026 5:15 pm

    ఫొటోలు చూస్తూఉంటే ఎంత ప్రమాదకరమైన యాత్రో తెలుస్తున్నది. ఇంత అద్భుతమైన యాత్ర గురించి వ్రాసి మాకళ్ళకెదురుగా నిలిపినందుకు కృతజ్ఞతలు.

  8. మనసులు దోచే మనస్లు– 1 గురించి Subha అభిప్రాయం:

    02/06/2026 5:10 pm

    మాటలు రావటము లేదు మీ ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పటం తప్ప. మేము చూడలేకపోయిన ప్రపంచాన్ని మా కళ్ళకెదురుగా నిలబెట్టి చూపుతున్నందుకు మరిన్ని కృతజ్ఞతలు.

  9. జనవరి 2026 గురించి పొలాస బాలకిషన్ అభిప్రాయం:

    02/06/2026 12:23 pm

    ఈ కవిత డిజిటల్ యుగంలో మానవ సంబంధాల శూన్యతను, భావోద్వేగ దారిద్య్రాన్ని, ప్రేమ ఆకాంక్షను అత్యంత సమకాలీనంగా, బలమైన రూపకాలతో చిత్రీకరించిన అద్భుతమైన రచన. టెక్నాలజీ మెటాఫర్లు—కరప్ట్ ఆడియో ఫైల్, ఫైర్‌వాల్ వెనుక పాట, మ్యూట్ బటన్, ఏకాంత ఆల్గరిథమ్, క్లౌడ్ స్టోరేజ్ లేని ఆకాశం—తెలుగు భాషలో సహజంగా కలిసి, యువత జీవిత అనుభవాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి. నిరాశ, వ్యంగ్యం, ఆశ మధ్య సాగే భావోద్వేగ ఆర్క్, చివరికి “ప్రేమ అనే పాత ప్రోటోకాల్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకో” అనే ఆహ్వానంతో ముగియడం హృదయస్పర్శకం. హైబ్రిడ్ భాష, గ్లిచ్‌లా ఉండే లయ, ఒరిజినల్ రూపకాలు దీన్ని సమకాలీన తెలుగు వచన కవిత్వంలో గుర్తుండిపోయే రచనగా నిలబెడతాయి. మొత్తంగా ఇది ఒక డిజిటల్ యుగ ప్రేమికుడి క్రై—బలంగా, సత్యంగా, ఆకర్షణీయంగా ఉంది. తెలుగు కవిత్వం లో ‘డిజిటల్ ఎరా లవ్ పోయెట్రీ ‘కి ఇది మైలురాయి.

    కవి శ్రీ వఝల శివకుమార్ గారికి అభినందనలు!

    పొలాస బాలకిషన్, హైదరాబాద్.

  10. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి Giri అభిప్రాయం:

    02/06/2026 10:06 am

    సుస్వరాల రాజే”స్వర” రావుగారి గురించి మంచి వ్యాసం చదివినందుకు “మనసున మనసై”న ఆయన స్వరాలు తోడుగా పలకరించాయి. 1985ల్లో వచ్చిన భక్తిసుధ private albumకి ఆయన స్వరాలు కూర్చారు. ఆ cassette ఇప్పటికీ ఉంది. ఈ దిగువ linkలో ఆయన photoతో cassette cover page ఉంది. ఆ audio recordings కూడా కొన్ని ఉన్నాయి.