Comment navigation


15536

« 1 ... 19 20 21 22 23 ... 1554 »

  1. కరుణశ్రీ: తపోభంగము గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    08/31/2024 3:31 am

    చక్కని పరిశీలన. భావకవుల చాపల్యాన్ని బాగా పట్టుకొచ్చారు. పరిమితమైన శబ్ద శక్తితో, భాషా పటిమతో రాయప్రోలు, కరుణశ్రీలు పద్యాలు రాయగలరేమో గానీ వాటిలో కలికానిక్కూడా కవిత్వం కనిపించదు. ప్రధానంగా వీరు ఉపాధ్యాయులు – ఇరువురూ నిర్దుష్టంగా వచనం రాయలేరు. ఉట్టికెక్కలేనమ్మ – స్వర్గానికి అన్నట్టు ఉంటాయి వీరి పద్యాలు. ‘ఏ మంచి పూవులన్ ప్రేమించినావో, నీ తల్లి నిను మోసె కనక గర్భమున’ అన్నప్పుడు మాత్రం రాయప్రోలు ప్రతిభ ద్యోతకమవుతుంది, అంతవరకే. వృత్తాలు , జాతులు అంటే ‘భగవంతుడా’ అని గోచి సవరించుకొని లేచి పోవాలి అనిపిస్తుంది. మా నాన్న స్నేహితులు కరుణశ్రీ ‘అమర్ ఖయ్యాం’ పద్యాలు ఆంధ్రజ్యోతిలో వస్తున్నప్పుడు ‘ఆహా ఓహో’ అనేవారు, నాకు బొత్తిగా రుచించేవి కావు. శ్రీనాథుడు దరులొరుసుకొని ప్రవహించే ఒక గంగా నది. జవజీవాలు ఉట్టిపడే ఆ పద్యాలూ, శాస్త్రస్పర్శచే గట్టి పడిన వచనం – మరెవ్వరిలో చూడము.

    “Approach love and cooking with reckless abandon.” దలైలామా అన్నట్టు చెప్పబడే వాక్యం, టీకా టిప్పణితో ఈ సందర్భంలో ఉటంకించవలసిందే.

    ‘Approach love and cooking with reckless abandon’ is a quote attributed to the Dalai Lama. The phrase ‘reckless abandon’ means to give oneself to a passion or impulse without regard for convention, appearances, or risk. When applied to love, it can mean to love with a whole heart, without considering outside influences.

    శ్రీనాథుడిలో ఉన్న దొమ్మ పొగరు (reckless abandon) నిఖార్సైన ఏ కవిలోనైనా గమనించవచ్చు. మన భావకవుల్లో – ముఖ్యంగా వీరిద్దరిలో లేనిదే అది. నేను భావకవిని కావున ‘చాలా అందంగా’ చెప్పాలి అన్న కట్టుబాటులోనే ఉంది అసలు గొడవ. శ్రీనాథుడిది కవిత్వంలో రాజమార్గం – దిమ్మసా కొట్టిన హై రోడ్డు!

    శ్రీనాథుడికి కట్టుబాట్ల మీద బొత్తిగా ఖాతిరీ లేదు. కావునే ‘అంత ప్రాధాన్యం లేని విధంగా’ (as a matter of fact తీరున) చెప్పేశాడు. లోతుగా ఆలోచిస్తే ‘అంత ప్రాధాన్యం లేని విధంగా’ అంటే అలవోకగా కవిత్వం రాయటం నిజంగా కష్టం.

  2. మధుమేహం – రక్తపోటు 2 గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    08/31/2024 2:02 am

    “ A pancreas transplant ( surgical procedure ) is done to place a healthy pancreas from a deceased donor into a person whose pancreas no longer functions properly.

    One of the main functions of pancreas is to make insulin, a hormone that regulates the absorption of sugar into cells. If the pancreas doesn’t make enough insulin, blood sugar levels can rise to unhealthy levels, resulting in type 1 diabetes.

    Most pancreas transplants are done to treat type 1 diabetes… typically reserved for those with serious complications of diabetes because the side effects of a pancreas transplant can be significant.

    In some cases, pancreas transplants may also treat type 2 diabetes. Rarely, pancreas transplants may be used in the treatment of pancreatic cancer, bile duct cancer or other cancers.

    A pancreas transplant is often done in conjunction with a kidney transplant in people whose kidneys have been damaged by diabetes. “

    ~ Mayo Clinic

  3. మధుమేహం – రక్తపోటు 2 గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    08/31/2024 1:53 am

    ప్రియమైన శ్రీ వేమూరి వేంకటేశ్వర రావు గారికి నమస్కరించి చేయు విన్నపం…

    మధుమేహం–రక్తపోటు ల గురించి విపులము, విశ్లేష్నాత్మక వ్యాసం అందించిన మీరు శ్రమ తీసుకుని థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ హార్మోన్ T3, T4, TSH ( థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్) వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, నివారణలు గురించి కూడా రాయగలరు… పదుగురికి ఉపయోగపడుతుంది.

  4. కరుణశ్రీ: తపోభంగము గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    08/30/2024 6:19 pm

    వేలూరి వారి అభిప్రాయాన్ని ఆలస్యంగా చూశాను. దాన్లో వారు భావకవుల గురించి నేను వాడిన “చాపల్యం” అనే పదానికి అభ్యంతరం చెప్పారు. నాకూ వాళ్ళ చాలా పద్యాలు నచ్చుతాయి. ఐతే కొన్నిట్ని చూశాక నవ్వు కూడ వస్తుంది. అలాటి కలగాపులగపు భావాల్నుంచి పడిన పదమే ఆ “చాపల్యం”.

    ఈ పద్యాలు చూడండి:

    అతను డాక్టరయ్యోరు, మహావిశుద్ధ
    జీవి, నిత్యస్నానాలంకృతా విశేష
    భూషితుండు, ఆరోగ్య సంభాషితుండు
    ధర రుజాబాధిత ప్రజా దండధరుడు. ॥

    పూజ్యులౌ వారి వైద్యసామ్రాజ్యమందు
    రోజులూ నెల్లు పట్టు, ఐవేజు లేదు
    అమృతమూర్తి మందీయ ఒప్పాడ చాలు
    మినిటులూ లిప్తలూ సెకన్ల మీద చంపు ॥

    ఇంట యేర్కన్న సుస్తి యొకింతజేయ
    అసలు ఇంటి కింజక్షనీయాలి యనును
    అంత ఓ ఘడియన్నర కా గృహమ్ము
    అమర కైలాసగిరి క్రింది అప్పడమ్ము ॥

    భావకవిత్వపు రోజుల్లోనే వారి శైలిని వెక్కిరిస్తూ మాచిరాజు దేవీప్రసాద్ రాసిన పేరడీ.

  5. మధుమేహం – రక్తపోటు 2 గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    08/25/2024 11:00 am

    సంపాదకులు వెలిబుచ్చిన కోరికతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. కంప్యూటర్ల చరిత్ర గురించి శ్రీహనుమంతరావు గారు గతంలో రాసిన వ్యాసం అసంపూర్ణంగా ఉండిపోయినట్లనిపించింది. అది కొనసాగించమని మనవి!

  6. మధుమేహం – రక్తపోటు 2 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    08/23/2024 2:51 pm

    జీవ, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలన్నిట్లో ఇంత చక్కగా తెలుగులో రాయడం వేమూరి వారికే సాధ్యం. ఈ వ్యాసాల వెనుక ఎంత కృషి ఉండాలి? Labor of loveని తెలుగులో ఏమనాలి?

    కొడవళ్ళ హనుమంతరావు

    [ఎంతో కృషితో మీరూ అంతే చక్కగా కొంతకాలం కొనసాగించిన ‘కంప్యూటర్ పూర్వాపరాలు – సాధ్యాసాధ్యాలు’ శీర్షికను ఒక ముగింపుకు తెస్తే ఎంత బాగుంటుంది! – సం.]

  7. దొంగముద్దు గురించి Anil ఆట్లూరి గారి అభిప్రాయం:

    08/23/2024 7:15 am

    యుక్త వయస్సుకి వస్తున్న పిల్లలున్న మధ్య వయసు భార్య భర్తల మధ్య, వారి పిల్లల మధ్య జీవితాన్ని సున్నితంగా ఆవిష్కరించిన కథ.

  8. కోట గురించి Anil ఆట్లూరి గారి అభిప్రాయం:

    08/23/2024 6:24 am

    కథంతా మట్టి వాసన!
    బస్తీ వాసులకు ఆ దుమ్ము, ధూళి నచ్చదు!

  9. నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి డా బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:

    08/23/2024 5:01 am

    మంచి వ్యాసం
    ధన్యవాదాలు సార్…
    హంపీ క్షేత్రం పుస్తకం ఒక రెండు సంవత్సరాల క్రిందట కొడాలి సుబ్బారావు గారి మనవడు సునీల్ కుమార్ గారు అచ్చు వేయించారు.

  10. కొన్ని నూతనచ్ఛందోరీతులు గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:

    08/23/2024 1:38 am

    చక్కని వ్యాసం.
    1. హనుమప్ప నాయకుడు గ్రంథాన్ని నేను ఎలా పొందాలి సార్?
    2. తుంగభద్ర మీద వ్రాసిన పద్యం చాలా బాగుంది.
    ఇంకా ఈ నది మీద వచ్చిన సాహిత్యం ఏమైనా ఉందా? ఉంటే తెలుపగలరు.
    3. “”పూర్వసీసపద్యంలోని భ,నల గణాలను భల, నలల గణాలతో ప్రతిక్షేపిస్తే ఏర్పడే పద్యం.”” ——- అంటే ఏమిటో వివరించండి.
    4. ఖండగతి గణాలు అంటే ఏమిటో తెలుపగలరు సార్
    5. కినిగె — అంటే ఏమిటి అసలు ఇది ఏ భాషా పదమో తెలుపగలరు సార్ ??

    ధన్యవాదములు

    ఇట్లు
    సాహిత్యోపాసకుడు
    అనిల్ కుమార్

« 1 ... 19 20 21 22 23 ... 1554 »