పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16391

  1. తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం గురించి Palanki sathya అభిప్రాయం:

    01/18/2026 9:12 am

    చాలా విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు

  2. తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం గురించి ముప్పాళ్ళ అప్పారావు అభిప్రాయం:

    01/17/2026 10:36 pm

    చంద్రమోహన్‌గారూ
    స్వంత భాషలో కవులు రాసుకున్న(కట్టుకున్న) కావ్యాలు కోటల్లాంటివి . వాటిల్లో అతి రమ్యమైన భవనాలు ఉన్నప్పటికీ పరాయి భాషా జ్ఞానం లేని ఇతర భాషల వారికి చెప్పేందుకు పక్కన మీ వంటి ఒక గైడ్ ఉండి వివరిస్తూ చేయి పట్టుకు తీసుకెళ్తుంటే వచ్చే ఆనందమే వేరు. మీ రచన అలాంటి మధురమైన ఆనందం ఇచ్చింది. మాకు PS1 లాంటి తమిళ కావ్యాలను చూసినప్పుడు ఇంకా తెలుస్కోవాలని అనిపిస్తే మీ లాంటి వారి నుండి రచనలను ఆశిస్తామని గట్టిగా గుర్తు పెట్టుకోండి.

  3. పోతన భాగవతంలో దృశ్యీకరణం – 4 గురించి Ramesh అభిప్రాయం:

    01/17/2026 1:43 pm

    ఎంత అద్భుతంగా వివరించారండి. మనస్సు పులకించింది మీ వివరణసహిత భాగవతం చదువుతున్నప్పుడు. పోతన మహానుభావుడు, నమస్కారం, సుఖీభవ.

  4. పదిలక్షల పాదాలు గురించి Buddala Venkatesh అభిప్రాయం:

    01/17/2026 2:19 am

    చాలా బాగుంది. జయమోహన్ గారిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు. ఇంకొక విషయం చాల బాగా అనువదించారు భాస్కర్ గారికి నా నమస్కారములు.

  5. అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి సి. స్ రావ్ అభిప్రాయం:

    01/11/2026 1:45 pm

    *– డా. వెనిగళ్ళ రాంబాబు*
    సినీగీత రచయిత

    ఛందోబద్దకవివి, సినీగేయకవివి, నందిఅవార్డు గ్రహీతవు, ప్రొఫెసర్‌వి, విమర్శకుడివి అయినా వినయభూషణుడివి. గతాన్ని మరువని వాడివి. సంతోషం.

    బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్
    సి. ఎస్. రావ్ (CSR)

  6. పోతన భాగవతంలో దృశ్యీకరణం – 4 గురించి komakulamaheshkumar@gmail.com అభిప్రాయం:

    01/11/2026 10:21 am

    Wonderful analysis sir

  7. కంప్యూటర్ చిప్ కథ – 9: జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ సమీకరణాలు గురించి K Mahesh Kumar అభిప్రాయం:

    01/11/2026 9:42 am

    Wonderful analysis and wonderful article sir, very informative, please keep writing these type of scientific articles sir, thank you very much sir.

  8. అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన గురించి Dr.Venigalla Rambabu అభిప్రాయం:

    01/11/2026 7:13 am

    *
    🙏 *ఆచార్యదేవోభవ !* 🙏

    ఆర్షధర్మమే తమ హృదయం !
    ఆంగ్లవాఙ్మయమె శ్రీ నిలయం !
    ఆచంద్రార్కం ఆర్యా మీదే
    ఆచార్యునిగా దిగ్విజయం !!

    అటువైపున ఓ దేవులపల్లీ !
    ఇటువైపున ఆ పీబీ షెల్లీ !
    కలగలిసిన మీ స్వరూపానికి
    పులకరించవా జాస్మిన్ లిల్లీ !!

    కలువ రేకుపై విలియం బ్లేకును
    నిలుపగలరు తమ పలుకులతో !
    తూర్పూపడమర ఒకటనిపింతురు
    తులనాత్మక పరిశీలనతో .. !!

    జ్ఞానపీఠమౌ గురుపీఠం
    సీఎస్సార్ .. అంటే !
    వేనవేల ప్రియశిష్యబృందముల
    విభవం మీ వెంటే .. !!

    *– డా. వెనిగళ్ళ రాంబాబు*
    సినీగీత రచయిత

  9. మంకుతిమ్మని మరో మిణుకు: పరిచయం గురించి ఎం.ఎస్.బి.పి.ఎన్.వి. రమాసుందరి అభిప్రాయం:

    01/11/2026 5:54 am

    శ్రీ డి.వి.జి. జీవితంలోని ఆటుపోట్లని తట్టుకుని నిలబడ్డారు. మంకుతిమ్మ మినుకు చదివినవారందరికీ జీవనదర్శనం ఒక కొత్త వెలుగుతో ప్రత్యక్షమవుతుంది. కారణం చెప్పుకోలేని సంఘటనలు మనకు జరిగినప్పుడు జీవిత ఫలమేమిటి, ఎందుకు ఈ జీవితం అనే ప్రశ్న వస్తుంది కదా ఎప్పుడో ఒకసారైనా! దానికి డి.వి.జి. సమాధానమేమంటే…జీవితానికి ఫలం జీవించడమే. ఎలా ఉన్నావో అలా బాగో లేదంటే.. బాగా ఉండేలా జీవించమనే…!

  10. రాయలేని కత గురించి Shailendra Dasari అభిప్రాయం:

    01/11/2026 4:52 am

    ఒక మనిషి జీవితంలో అత్యంత మధురమైనది బాల్యం. పట్నాలలోకన్నా పల్లెటూళ్ళల్లో బాల్యం మరింత మధురంగా ఉంటుంది. దాన్ని రచయిత ఆవిష్కరించిన తీరు ఎంతో ప్రశంసనీయం. ఇతివృత్తం ఒక పల్లెటూరిలోని చిన్నపిల్లల ఆటపాటలే అయినా ఆ వినోదంలో అంతర్లీనంగా ఉన్న విషాదాన్ని రచయిత స్పృశించిన తీరు చాలా హృద్యంగా ఉంది. అలాగే పల్లెలలో అగుపించే వర్ణవివక్ష, దుర్భరమైన పేదరికం – ఈ రెంటినీ అధిగమించి సాగే నిష్కల్మష బాల్యస్నేహాలు రచయిత కళ్లకు కట్టినట్టుగా వర్ణించారు. గూనోడి జీవితం అర్ధంతరంగా ముగియటం పెనువిషాదమే కాదు; అదొక కఠోర సత్యం. ఒక మంచి కథ అందించిన సంపాదకవర్గానికి, రచయిత మునిగోపాల్ గారికి అభినందనలు.