Comment navigation


15754

« 1 ... 15 16 17 18 19 ... 1576 »

  1. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:

    12/30/2024 7:09 am

    భట్ట నారాయణుడు నన్నయ కన్నా మూడువందల సంవత్సరాల పూర్వపువాడు కాబట్టి నన్నయ్య వేణీసంహారం తప్పక చదివి ఉండవచ్చును. అందుకేనేమో ఈశ్లోకంలోని ‘చండ గదాభిఘాత’, ‘సుయోధన’, ‘ఊరు’ పదాలు ‘ధారుణి రాజ్యసంపద మదంబున’ అనే నన్నయ పద్యంలోనూ దర్శనం ఇస్తూ ఉన్నాయి.

    చాలా గొప్పగా అనువదించానని మంథా వీరభద్రం గారు అభిప్రాయపడటం వారి సహృదయతకు నిదర్శనం అనుకుంటున్నాను. వీరభద్రం గారికి ధన్యవాదాలు.

  2. నల్ల గాలి గురించి మథు చిత్తర్వు గారి అభిప్రాయం:

    12/30/2024 2:19 am

    కథ అంటే ఇలా చదివించే విధంగా వుండాలి. ఈయనకి అల్జీమర్స్ వ్యాధి వచ్చిందా, ఆవిడకి మానసిక వ్యాధి వచ్చిందా, చివరికి ఎలా డెవలప్ చేస్తారో చూద్దాం అని చివరి దాకా చదవాలి అనిపించింది. కానీ మరొకలా వుంది ముగింపు. నాకయితే ఇలాంటి కథలే ఇష్టం.

  3. కొడుకుల శివరాం భాగవత గానం గురించి Dhananjaya గారి అభిప్రాయం:

    12/30/2024 1:03 am

    ధన్యవాదాలు, మనసుకు ఆనందాన్ని ఇచ్చారు.

  4. పెద్దన్నయ్య, ప్రపంచం గురించి తెలుగు వెలుగు గారి అభిప్రాయం:

    12/29/2024 11:40 am

    ఈ కధ బాహుబలి చలనచిత్రం కన్నా నిజానికి దూరంగా ఉందనిపిస్తూంది. అవాస్తవ కధానాయకులు. ప్రతినాయకులు నవలా సాహిత్యంలో తరుచూ కనిపించేవారు. ఇప్పుడు సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు.

    సాహిత్యానికి కొలమానం వాస్తవికత అని నా నమ్మకం.
    తెలుగు వెలుగు

  5. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి మంథా వీరభద్రం గారి అభిప్రాయం:

    12/29/2024 10:25 am

    తాడిగడప వారికి తాడియెత్తు మ్రొక్కులు! చాలా గొప్పగా అనువదించారు.

    “ధారుణి రాజ్యసంపద మదంబున” అనే నన్నయ గారి పద్యానికి ప్రేరణ భట్ట నారాయణుడి వేణీసంహారం లోని ఈ క్రింది శ్లోకమని ఏల్చూరి వారు వ్యాస ఘట్టాలలో తేల్చారు.

    చంచద్భుజ భ్రమిత చండ గదాభిఘాత
    సంచూర్ణితోరు యుగలస్య సుయోధనస్య
    స్త్యానావనద్ధ ఘన శోణిత సిక్త పాణి
    రుత్తంసయిష్యతి కచాంస్తవ దేవి! భీమః.

    తెలుగుకోరాలో వాఙ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాల గురించి ఒక సమీక్ష దీనిగురించి ప్రస్తావించారు.

  6. అడివంటుకున్నాది గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    12/28/2024 11:24 am

    ప్రపంచ మానవాళి (ముఖ్యంగా ఆదివాసులు, గిరిజనులు) ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అభివృద్ది పేరుతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం. ప్రకృతి విధ్వంసం వల్ల వాతావరణ మార్పులు, పర్వవసానంగా ఎదురవుతున్న సమస్యలు… అకాల వర్షాలు, తుఫానులు, వరదలు, విపరీతమైన ఎండలు, కరువు పరిస్థితులు, భూకంపాలు, మారుతున్న రుతువులు ఇదీ ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి.

    అడవి మృగాలు, పక్షులు, అరుదైన వన సంపద, బయో డైవర్సిటీ నాశనమవుతున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫ్ఫెక్ట్ దానివల్ల గ్లోబల్ వార్మింగ్ సమస్యలు. గ్రామాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. రుతువులు గతి తప్పుతున్నాయి. అడవుల నాశనం వల్ల నిఫా వైరస్, అంటువ్యాధులు వచ్చే కొత్త వైరెస్ వ్యాప్తి జరగొచ్చు. వీటన్నింటికీ మూలం అంతరిస్తున్న అడవులు, కనుమరుగవుతున్న పచ్చదనం.

    అడవులు వల్ల మానవాళికి ఆక్సిజెన్, మంచి నీరు, వైద్యానికి పనికొచ్చే చెట్టూ చేమా మూలికలు, ఆహార వనరులు లభిస్తున్నాయి. 30% మంచి నీటి వనరులు ప్రపంచం లోని ట్రాపికల్ రైన్ ఫారెస్ట్స్ ద్వారా పొందవచ్చు.

    ఆదివాసుల ఆర్తనాదాన్ని, హూంకరించింది అడవి తల్లిని ‘అడివంటుకున్నాది’ కధ ద్వారా వినిపించిన సిక్కోలు బిడ్డ, రచయిత దేశరాజు గారికి ధన్యవాదాలు.

  7. 1-1. సంయమనం ఈమాటకూనా? గురించి Chandra Shekhar Pratapa గారి అభిప్రాయం:

    12/28/2024 10:56 am

    ఓ నందనోద్యానవనంలా, ఓ ఇంద్రధనుస్సులా, అన్ని ప్రక్రియలతో అలరారే “ఈమాట”ను ఏదో ఒక చట్రంలో ఇమిడ్చి చూడాలనుకోవడం, తమ తమ కోణంలోనో, వర్ణoలోనో, వాదంలోనో, పోకడలోనో, తాము నిర్దేశించిన కక్ష్యలో నడవడం లేదనే అక్కసువల్లనో గుచ్చుకునే ఆరోపణలు చేయడం, భావ దారిద్ర్యం కిందకే వస్తుంది! మీ సుదీర్ఘ విశ్లేషణ చదివితే నా “వైరుధ్యాలు” అనే కవిత గుర్తుకు వచ్చింది (తెలుగువెలుగులో ప్రచురితం)

    *వైరుధ్యాలు*

    తూర్పున సూర్యోదయం ఆస్వాదిస్తూ వాడు!
    వెల్తురు వెనక చీకటి కుట్రనేదొ శోధిస్తూ నువ్వు!

    ముళ్ల దారైనా కొత్తగా నడవాలని వాడు!
    ట్రెడ్మిల్ మీద నడుస్తూ నడక తెలీదని
    పరిహసిస్తూ నువ్వు!

    నీ చెంత నాలుగు అక్షరాలు నేర్చుకుంటాననుకుంటూ వాడు.
    వాడి కక్ష్యని సైతం నిర్ణయించాలని నువ్వూ!

    గొంతు సవరించుకుని కొత్త పాట పాడుతూ వాడు!
    అది నీ గూటి పాటై వుండాలని శాసిస్తూ నువ్వు!

    జంతువుల్ని ప్రేమిస్తూ వాడు
    మనిషిగా ఎదగ లేదని వాదిస్తూ నువ్వూ!

    సీతాకోక చిలుక వర్ణాల్తో వివశుడౌతూ వాడు
    ఇంకా గొంగళి పురుగనే ఊహిస్తూ నీవు!

    హృదయం అద్దంలా వుండాలని వాడు
    లైబ్రరీలా వుండాలని నువ్వూ!

    నవ్వులో నవ్వు మాత్రమే చూసే వాడు
    నవ్వు వెనక విషం శోధించే నువ్వు!

    నీకేది తిన్నగా వినిపించదు
    వాడికేదీ నిన్నగా కనిపించదు!

    ఎదిగే కొద్దీ తేటతెల్లం అవుతూ వాడు
    కొత్త ముసుగులు తొడుక్కుంటూ నువ్వు!

    (ప్రతాప చంద్రశేఖర్)

  8. రైటర్స్ బ్లాక్ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    12/27/2024 10:05 am

    స్వార్థపు మంచితనం. అసలు మంచితనమంటేనే స్వార్థం. మనుషుల్ని బలహీనులుగా మాత్రమే తయారు చేయగలిగే ఓ మత్తు అత్తరు విజయం… తన దగ్గర భావమూ, ఆవేశమూ రెండూ లేవు. రచయితగా బతుకుతూ, మనిషిగా పతనమవ్వడం తప్ప… అనుకునే ప్రోటోగానిస్ట్ ప్రస్ట్రేషన్.

    ‘ముసుగులో చేసుకో నీ చూపుల వ్యభిచారం.’ అనే కినుక భావన కలిగించిన ఎదురింటి అమ్మాయి… ఆమె అంటే… చిక్కటి ఆడతనాన్ని నింపుకున్న కళ్లలోకి తనను అమాంతం లాక్కునే నల్లసముద్రాలవి అనుకునే భావావేశం… నాదేమీ ప్రేమ కాదు, స్వచ్ఛమైన వ్యామోహమే. మగ కళ్ళతో ఆడ ఒంటినే కాదు, కంటిని చూసినా కాముకత్వమే అనుకునే ‘సెల్ఫ్ డెప్రికేషన్’ యాటిట్యూడ్.

    పాణిని జన్నాభట్ల గారి ‘రైటర్స్ బ్లాక్’కధ ( రచయిత కొత్త పనిని రూపొందించ లేక పోవడం లేదా సృజనాత్మకలో మందగమనం… writer’s block defined as “ the inability to begin or continue writing for reasons other than a lack of basic skill or commitment ” )

    ప్రతికూల భావోద్వేగాలను ఎదుర్కొంటూ, మానసిక ఒత్తిడి, ఆందోళనను అధిగమిస్తూ స్వీయ విశ్వాసంతో ‘రైటర్స్ బ్లాక్’ నుండి బయటపడొచ్చని… సూచనగా రెండేళ్లు కష్టపడి రాసిన మొత్తం కథ ల్యాప్టాప్‌లో డిలీట్ చేసి; వేళ్ళలోకి పుట్టుకొస్తున్న పచ్చి ధైర్యంతో మళ్లీ మొదటి వాక్యం రాయడం మొదలు పెట్టాడు అనే ఆశాజనకంతో ముగించటం బాగున్నది.

    రచయిత పాణిని జన్నాభట్ల గారికి హార్ధిక అభినందనలు!

  9. భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    12/26/2024 11:54 am

    0 X 1/0 = n (శూన్యం గుణ్యం ఖహరం గుణకం ఐతే వచ్చే లబ్ధం ఒక సంఖ్యయే (zero multiplied by infinity is any number );

    పై దానిలో 1/0 అంటే infinity అని అనుకుంటున్నాను. అయితే మాకు మేష్టర్లు చెప్పిన ప్రకారం సున్నతో భాగించడం అనేది అర్ధంలేని మాట. అది infinity అవదు. సున్న అంటే ఏమీ లేకపోవడం. దానితో ఏదైనా భాగించడం ఎలా కుదురుతుంది? infinity అనేది ఒక కాన్సెప్ట్ అంతేకానీ దానికో విలువ ఇచ్చేసి ఇలా సున్నతో భాగించేస్తే infinity వచ్చేస్తుందనుకోవడం ఏ లెక్కల సైంటిస్టూ ఒప్పుకోడని అనుకుంటా. అందుకోసమే కాబోలు కాలిక్యులేటర్లూ, కంప్యూటర్లూ సున్నతో భాగించే సమీకరణాలు రాస్తే లాక్ అవుతాయి. లేదా they just throw an error to be caught (try-catch).

  10. అడివంటుకున్నాది గురించి శ్రీనివాస్ నేదునూరి గారి అభిప్రాయం:

    12/26/2024 9:08 am

    గిరిపుత్రుల జీవనశైలిని, అడవి తల్లి ఆర్తనాదాన్ని హృదయవిదారకంగా రచించిన మీ రచనకు కళ్ళు చెమ్మగిల్లాయి. వనసంపదను దోచుకుంటున్నవారిపై అడవి కన్నెర్రజేస్తే ప్రళయం రావడం ఖాయం. అడివంటుకున్నాది ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసే రచన. రచయిత దేశరాజుగారికి ధన్యవాదాలు.

    ఇట్లు
    శ్రీనివాస్ నేదునూరి

« 1 ... 15 16 17 18 19 ... 1576 »