పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16391

  1. పదమల్లుని పథగమనం: గజ్జెల మల్లారెడ్డికి ఘన నివాళి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    02/07/2026 12:25 am

    కమ్యూనిష్టులు మనుధర్మాన్ని గౌరవించటమూ పాటించటమూ ఏమిటండీ బాబూ.

    ఐనా మీనుండి దానాన్ని స్వీకరించిన వారు ఎవరైనా సరే తీరా మీరే కష్టంలో ఉన్న పక్షంలో మీపైన సానుభూతితో లోగడ మీనుండి స్వీకరించిన దానాన్ని మీకు తిరిగి ఇస్తారా ఏమిటి? అలా ఇచ్చేవారు కోటికి ఒకరూ ఉండరేమో.

  2. మనసులు దోచే మనస్లు– 1 గురించి Subha అభిప్రాయం:

    02/06/2026 5:15 pm

    ఫొటోలు చూస్తూఉంటే ఎంత ప్రమాదకరమైన యాత్రో తెలుస్తున్నది. ఇంత అద్భుతమైన యాత్ర గురించి వ్రాసి మాకళ్ళకెదురుగా నిలిపినందుకు కృతజ్ఞతలు.

  3. మనసులు దోచే మనస్లు– 1 గురించి Subha అభిప్రాయం:

    02/06/2026 5:10 pm

    మాటలు రావటము లేదు మీ ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పటం తప్ప. మేము చూడలేకపోయిన ప్రపంచాన్ని మా కళ్ళకెదురుగా నిలబెట్టి చూపుతున్నందుకు మరిన్ని కృతజ్ఞతలు.

  4. జనవరి 2026 గురించి పొలాస బాలకిషన్ అభిప్రాయం:

    02/06/2026 12:23 pm

    ఈ కవిత డిజిటల్ యుగంలో మానవ సంబంధాల శూన్యతను, భావోద్వేగ దారిద్య్రాన్ని, ప్రేమ ఆకాంక్షను అత్యంత సమకాలీనంగా, బలమైన రూపకాలతో చిత్రీకరించిన అద్భుతమైన రచన. టెక్నాలజీ మెటాఫర్లు—కరప్ట్ ఆడియో ఫైల్, ఫైర్‌వాల్ వెనుక పాట, మ్యూట్ బటన్, ఏకాంత ఆల్గరిథమ్, క్లౌడ్ స్టోరేజ్ లేని ఆకాశం—తెలుగు భాషలో సహజంగా కలిసి, యువత జీవిత అనుభవాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి. నిరాశ, వ్యంగ్యం, ఆశ మధ్య సాగే భావోద్వేగ ఆర్క్, చివరికి “ప్రేమ అనే పాత ప్రోటోకాల్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకో” అనే ఆహ్వానంతో ముగియడం హృదయస్పర్శకం. హైబ్రిడ్ భాష, గ్లిచ్‌లా ఉండే లయ, ఒరిజినల్ రూపకాలు దీన్ని సమకాలీన తెలుగు వచన కవిత్వంలో గుర్తుండిపోయే రచనగా నిలబెడతాయి. మొత్తంగా ఇది ఒక డిజిటల్ యుగ ప్రేమికుడి క్రై—బలంగా, సత్యంగా, ఆకర్షణీయంగా ఉంది. తెలుగు కవిత్వం లో ‘డిజిటల్ ఎరా లవ్ పోయెట్రీ ‘కి ఇది మైలురాయి.

    కవి శ్రీ వఝల శివకుమార్ గారికి అభినందనలు!

    పొలాస బాలకిషన్, హైదరాబాద్.

  5. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి Giri అభిప్రాయం:

    02/06/2026 10:06 am

    సుస్వరాల రాజే”స్వర” రావుగారి గురించి మంచి వ్యాసం చదివినందుకు “మనసున మనసై”న ఆయన స్వరాలు తోడుగా పలకరించాయి. 1985ల్లో వచ్చిన భక్తిసుధ private albumకి ఆయన స్వరాలు కూర్చారు. ఆ cassette ఇప్పటికీ ఉంది. ఈ దిగువ linkలో ఆయన photoతో cassette cover page ఉంది. ఆ audio recordings కూడా కొన్ని ఉన్నాయి.

  6. కొ.కు ఉత్తరాలు – 3 గురించి K. SriKiran అభిప్రాయం:

    02/06/2026 12:10 am

    విప్రవినోదుల గురించి ఆయన అనుభవం ఆసక్తికరంగా ఉంది. ఆ ఉత్తరం కాపీ నాకు ఇమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా గాని ఇవ్వగలరా. విప్రవినోదుల చరిత్ర చదువుతూ ఉన్నాను. సర్ ఉత్తరం నాకు ఉపయోహాపడుతుంది. ఇమెయిల్ : k.srikiran@gmail.com , 9393099035.

  7. మనసులు దోచే మనస్లు– 2 గురించి Amarendra అభిప్రాయం:

    02/05/2026 6:36 pm

    Thanks for your response Srinivas garu

    Readers like you are the real inspiration for us..thank you

  8. పదమల్లుని పథగమనం: గజ్జెల మల్లారెడ్డికి ఘన నివాళి గురించి Giri అభిప్రాయం:

    02/05/2026 5:13 pm

    ఆస్తులంతకు ముందే పార్టీ పరం చేసిన ఆయనకు …

    ఆస్తులతో సహా అర్పించిన నలభై యేళ్ళ ఆయన అంకితభావం, బాంధవ్యం అలా పంకిలంగా అంతమయ్యింది.

    కాని రామోజీరావు తో కలిసి పనిచేయడం ఆయన్ను చాలామందికి, ముఖ్యంగా ఆయన కమ్యూనిస్టు మిత్రులందరికీ దూరం చేసింది…ఎంత దూరమంటే 1978లో ఆయనకు గుండెపోటొస్తే కనీసం వారెవరూ వచ్చి పరామర్శించనంత దూరం.

    అలాంటప్పుడు పార్టీకి ఇచ్చిన విరాళాలు తిరిగి వారి కుటుంబానికి ఇచ్చేయాలి కదా! మనిషే వద్దనుకొన్నప్పుడు అతని ఆస్తి ఎలా తీసుకొంటారు? ఒకవేళ ఆయన వద్దన్నా “మనుధర్మం” ప్రకారం ఆయన తదనంతరం కుటుంబానికైనా ఇచ్చేయాలి కదా!

  9. నీ ఏకాంతం గురించి Chandrasekhar Cheerla అభిప్రాయం:

    02/05/2026 12:01 pm

    ఇంతవరకు మీ కవితలు కొన్ని చదివినాను. అవి చాలా బాగున్నావనిపించింది. కాని ఈ కవితలో కొంత అస్పష్టత కనిపిస్తున్నది. ‘మనుషులు మినహా మరి ఏవైనా ప్రవేశించగలిగే చోటు’ అంటున్నారు, మళ్ళీ ‘రాత్రి లాంటి ప్రపంచం ఎదురై …’ – అంటే ప్రపంచం ప్రవేశించిందన్నమాట. అది మనుషులు లేని ప్రపంచమా? తర్వాత ‘నీతో నిండుతూ నీ ప్రపంచం’ అన్నారు. మనం కల్పించుకున్న ప్రపంచాన్ని మనం ప్రేమించడం కష్టం కాదు కదా!

    మొత్తంపై కవితలో ఏ అనుభవాన్ని పంచుకోదలచినారో అర్థం కాలేదు.

  10. మనసులు దోచే మనస్లు– 2 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/05/2026 6:31 am

    ‘…అక్కడే ఉండాలనుకొంటాడా’ – చెప్పలేం. ఆ మాట ఈ యాత్రాకథనం అనలేదు కూడానూ..
    మూల రచయిత అలా అనుకొంటూనే – వెంటనే వాటిలోని అసంగతనూ ప్రస్తావించాడు.
    అనుభవాలను తర్కించవచ్చునేమోగానీ అనుభూతులను తర్కించలేము కదా..
    మీ స్పందనకు ధన్యవాదాలు రమేష్ గారూ