హంసానంది నవ్వులాట కాదు. హంసానంది నదులకు ఎవరూ ‘గోదావరి’ అని పేరైనా పెట్టక మునుపంత పురాతనమైన దు:ఖం. స్వఛ్ఛమైన పశ్చాత్తాపపు నొప్పి. నొప్పి బహుశ: అందరికీ ఉంటుందేమో. పశ్చాత్తాపం తనకి ఉంది. కాని గడ్డకట్టుకుని. రాజాలి సమక్షంలో కాదు, పద్మ గారు చాపమీద మఠం వేసుకుని కూర్చుని శ్రుతి పెట్టె సవరించుకొంటూ ‘ఏదీ అది మళ్ళీ ఒక్కసారి ఆదిత్యాసో…?’అని హెచ్చరించినా రాదు. దొంతరలు దొంతరల కింద సంవత్సరాల కింద అది ఎక్కడో ఘనీభవించి ఉంది. గొంతు దాకా వచ్చినట్టే వచ్చి జారిపోతుంది. హంసానందిని అందుకోగలిగినంత పశ్చాత్తాపం తనలో? నాగరికత ఏదో అడ్డు. గోదావరిని చూడటానికి అని ‘ప్లెజర్‌ ట్రిప్‌’ కాదు కొత్తపేట. హంస కోసం.

సాయంత్రం అయిదయ్యింది. పద్మ దిగులుగా వుంది. ఏం చెయ్యాలన్నా మనసు కావటం లేదు. రేపు స్వాతి వెళ్ళిపోతుంది. దాన్ని కాలేజీలో దింపి వచ్చాక, ఇక ఈ లంకంత కొంపలోనూ తనొక్కత్తే బిక్కుబిక్కుమంటూ. విశ్వం పొద్దున్నపోతే రాత్రెప్పుడో వస్తాడు.
రెండేళ్ళ క్రితం పెద్దది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదీ వెళ్ళిపోతుంది.గూడు కాళీ అయిపోతోంది.

రాధిక, వంశీ ఇద్దరూ మెడికల్‌ కాలేజీలో క్లాస్‌మేట్స్‌. హౌస్‌సర్జన్సీ కూడా కలిసి చేస్తున్నారు. ఇద్దరూ చాలా క్లోజ్‌ఫ్రండ్స్‌ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. వంశీ కుటుంబం, రాధిక కుటుంబం కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. రెండు కుటుంబాలూ ఒకే ఊరిలో ఉండటం వల్ల, అన్యోన్యంగా ఫంక్షన్స్‌లో కలవటం, చిన్న చిన్న ట్రిప్‌లకు కలిసి వెళ్ళటం లాంటివి చేస్తూ ఉండేవారు. రాధిక, వంశీ అంత స్నేహంగా ఉండటం రెండు కుటుంబాల వాళ్ళకూ ముచ్చటగా ఉండేది.

ఆయన రిటైర్‌మెంటు గురించి ఆలోచిస్తాను అన్నది ఇదే మొదటిమారు. మరికొంత సేపు అయిన తరువాత ఆయన అన్నారు. నాకు ఒక సెమెస్టరు శెలవు ఉంది. ఆ శెలవు ముందు తీసుకొని, రిటైర్‌మెంటు ఎలాగుంటుందో ఒక ఆరు నెలలు చూసి, లీవు తరువాత రిటైర్‌మెంటుకి అప్లై చేస్తాను ఆన్నారు. ఈ ఆరు నెలలు సెబేటికల్‌ లీవులో డిపార్టుమెంటు చుట్టుపక్కలకి వెళ్ళనని శపథము చేశారు.

చంటోడికి వారం రోజులుగా ఒళ్ళు పెనంలా కాలిపోతోంది. గవర్నమెంటు ఆసుపత్రిలో డాక్టరు చూసి ఏవో మందులిచ్చాడు కానీ జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిపోతూ ఉంది. మళ్ళీ తీసుకెళితే వేరే మందులేవో రాసిచ్చాడు. డిస్పెన్సరీలో అడిగితే, అవి ఖరీదైన మందులనీ, స్టాకులో లేవు, రెండు రోజులు పోయాక వస్తాయనీ చెప్పారు. కానీ అక్కడ తెలిసిన విషయమేమిటంటే, స్టాకులో కొంత మందు ఉందనీ, నాలుగు డబ్బులు చేతిలో పెడితే కానీ ఆ మందును ఇవ్వరనీను. వెంకటలక్ష్మి వాలకం డబ్బులిచ్చేలా లేకపోవడంతో, డబ్బులివ్వగలిగే పేషెంట్ల కోసం మిగిలిన కొద్ది స్టాకునూ అట్టేపెట్టి వీళ్ళని మళ్ళీ రమ్మన్నారు.

చాలా కథలు స్పష్టత లేకుండా, పాత వస్తువులనే తీసుకుని వ్రాసినవి. స్పష్టత, seriousness, విశ్లేషణ లేవు.కథల స్థాయి చాలా తగ్గిపోయిందని చెప్పడానికి విచారిస్తున్నాము.

‘‘ఒక బూములా – పుట్రలా ఏటున్నాయని? ముండ పేట్రీవచ్చి నా బూవి మింగేసింది. నా కట్టమూ నా సీమూ నెత్తురూ అన్నీ దాని మీదనే ఎట్టినాను. అదంతా తుడుసుకు పోయింది. ఎముకల గూడయి పోనాన్నేను. జబ్బు మనిషయి పోయింది ముసల్దాయి. ఆళ్ళు మాటలు ఈల్ల మాటలు నమ్మి ఊకొట్టేసినాను. అన్నాయమై పోనాను. బావూ! కుర్రోడి కుజ్జోగమంతే బెమిసిపోనాను. నా బెమే నన్ను ముంచేసింది’’ శూన్యంలోకి చూస్తున్నాడు ముసలాయన. అతని కళ్ళల్లో నీళ్ళు తళుక్కుమన్నాయి. గతం కళ్ళ ముందు మెదిలింది. ఏదో గొణుకుతున్నట్టుగా. స్పష్టాస్పష్టంగా అతని గొంతు పణుకుతోంది.

మోచేతులు దాటి ఖాకీ చొక్కా, మోకాలు దాటి ఖాకీ నిక్కరు, గడ్డపార భుజాన ఒకవైపు పికాసి, మరోవైపు చెట్లడ్డ, పారతో యంగముని, పంగలకర్ర, మచ్చుగత్తి, ప్లాస్టిక్‌ బిందెతో సావిత్రి, టైర్‌ లేయర్‌తో చేసిన ఆకు చెప్పలు వేసుకుని చీకటి విచ్చీ విచ్చకముందే ఒకవిడత ఉప్పుతో ఊరబెట్టిన అంబలితాగి, మధ్యాహ్నానికి రెండు ఎరగడ్డలు, రెండు పచ్చిమిరపకాయలు, చద్దన్నం మూట, ప్లాస్టిక్‌ బిందెలో పదిలంగా పెట్టుకని బోడిగుట్టకు కోడు కొట్టుకుందుకు బయలుదేరుతారు.

‘‘దీన్ని నక్క తిన! పదైదు దినాలుగా నన్ను సతాయిస్తా ఉండాది చేతికి చిక్కకుండా. వలకూ దొరకదూ, ఉచ్చుకూ దొరకదూ, బరిసెకూ అందదు. దీన్ని ఎట్లా పట్టాలో అర్థం కావడంలేదు. ఒక పక్క రెడ్డోరబ్బాయి తొందర చేస్తా ఉండాడు. ఎవరెవరికో డిన్నరు పెట్టాలంట. వాళ్ళందరూ కలిసి ఈయనకు పెద్ద కాంట్రాక్టులు ఇప్పించినారంట. జింక పిల్ల దొరికితే ఒకరోజు అనుకని అందరికీ ఫోన్లుకొట్టి పిలస్తాడంట. ఏం చేసేది. ఎట్లా పట్టేది ఈ కంతిరీ జింక పిల్లను. ఆఖరి ప్రయత్నంలోనైనా చిక్కుతుందో లేదో చూడాల.’’

ఉదయం ఏడు గంటలవేళ. చిరుచలిగా ఉంది. సంత ఇంకా ప్రారంభం కాలేదు. దుకాణాలవాళ్ళు కందరు బస్తీలనుంచి మెటాడోర్లలో వచ్చి దిగుతున్నారు. చింతచెట్ల కింద ఎవరికి కేటాయించిన స్థలంలో వాళ్ళు చాపలు పరుచుకుని, వాటిమీద తమ సరుకుల మూటలు పెట్టి, అక్కడికి కాస్త ఎడంగా ఉన్న రంగూనోడి టీకొట్టుకి వెళ్ళి వేడివేడి టీ నీళ్ళతో గొంతు తడుపుకని వస్తున్నారు.

భారతదేశం సకల కళలకు కాణాచి, అందులో ఆంధ్రదేశం ఎన్నో కళలకు జన్మస్థానమై విరాజిల్లుచున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సంగీత రంగస్థల కళారంగాన్ని నాటినుంచి నేటి వరకు పర్యావలోకనం చేయుట ప్రస్తుత వ్యాస ఉద్దేశము.

వస్తువులోనూ, కథనంలోనూ ఎన్నదగినవిగా ఉన్నవి ముఖ్యంగా రెండు. అవి జిగిరీ, తోలుబొమ్మలాట. జిగిరీ నవల మానవుడిలో ఉన్న రెండు పార్శ్వాలను స్పృశించిన రచన. తోలుబొమ్మలాట- ఆధునికీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో మన వినోదాలుకూడ టీవీ, సినిమాలకు పరిమితమై, దేశీయ కళలు, జానపద ప్రదర్శన కళలు కనుమరుగైపోతున్న విషయం ఇందులో వస్తువు.

ఇరవయ్యవ శతాబ్ది మధ్య భాగంలో తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు అనేకం చోటుచేసుకున్నాయి. ఒకవైపు పాండిత్య ప్రదర్శనే కవిత్వమనే అపోహతో సుదీర్థ సంస్కృత సమాసాలతో పొంతనలేని అలంకారాలతో, భయం కొలిపే శబ్ద విన్యాసంతో కొందరు కావ్యాలు వ్రాస్తూ ఉండగా, మరోవైపు జాషువా, కరుణశ్రీ, దువ్వూరి, రాయప్రోలు వంటి పండిత కవులే క్రత్త పుంతలు త్రొక్కి సామాన్య విద్యావంతులను సైతం ఆకట్టుకొనేలాగా ఖండకావ్యాలూ, లఘుకావ్యాలూ సరళమైన భాషలో వ్రాయసాగారు.

తెలుగు నవల సంఘ సంస్కరణోద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచింది. ఆంధ్రుల చారిత్రక వైభవాన్ని చాటి చెప్పింది. జాతీయ ఉద్యమానికి ఊపిరులూదింది. మనిషి మనోవల్మీకంలో సంచరించే సరీసృపాల విన్యాసాల్ని, వాటి హేతువుల్ని వెదికింది. పోరాటాల్లో ‘మృత్యుం జయులై’న ‘‘ప్రజల మనుషుల్ని’’ వారి వీరోచిత గాథల్ని గానం చేసింది. ‘‘చెలియలి కట్టల్ని’’ దాటి ‘స్వేచ్ఛ’గా ‘మైదానాల్లో’ సంచరించింది. మధ్య తరగతి బుద్ధి జీవులకు ‘చదువు’ నేర్పించి ‘మంచీ – చెడులను’ విడమరిచింది. ‘అల్పజీవి’కి ఆలంబనగా నిలబడింది. ‘అంధకారంలో’ ఉన్న ‘మట్టి మనిషి’ని గురించి ఆరా తీసింది.

అనురాగాల అందమైన జగతిలో
మమతల దీపం అమ్మ
మెరిసే నక్షత్ర వినీలాకసంలో
పున్నమి జాబిలి అమ్మ