‘అమ్మీ …. ఇయ్యాల్లనన్నా పీడ వదిలిపోతదంటవా ….’ చాంద్ అడిగాడు.
‘వదిలి పోతదిరా …. పొగాకు మందు గట్టిది. ఎనుకట మా మామ పెట్టిండు’ బీబమ్మ అన్నది.
‘దేనికి ….? ఎలుగుకా ….’’ అడిగిండు చాంద్.
Category Archive: గ్రంథాలయం
‘అబ్బా … అరే అబ్బా …’ చాంద్ మాటలతో ఉల్కిపడి తేరుకున్నాడు ఇమామ్. మంచంలోంచి లేచి కొడుకు వైపు చూసిండు. నిలువెత్తు గోతిలోంచి బయటకు వచ్చిండు చాంద్. వచ్చి తండ్రిని మరోసారి పిలిచిండు చాంద్.
ఇమామ్ బదులు పలుకలేదు. లేచి కూర్చున్నాడు. బీబమ్మ కోసం చూశాడు. బీబమ్మ వాకిట్లో కొంగు పరుచుకుని పడుకుంది. నిద్రపోతున్నట్టు గుర్రు వినిపిస్తుంది. ఇమామ్‌కు కోపం వచ్చింది. కోపంతో బాధ కూడా కలిగింది.
‘అరే ఇమామ్ …’’ వాకిట్లో నిలబడి పిలిచాడు చంద్రయ్య.
ఇమామ్ తండ్రి చనిపోయి అప్పటికి సరిగ్గా ఏడాది. తండ్రి చనిపోయిన రోజే తండ్రి తెచ్చుకున్న ఎలుగు చనిపోయింది. తండ్రి చనిపోయి తోడు దూరమై ఎలుగు చనిపోయి బతుకు దెరువు దూరమై పుట్టెడు దు:ఖంతో ఉన్నాడు ఇమామ్.
పొద్దు పొడిచింది.
పొద్దు గూకింది.
పగలు గడిచింది. రాత్రి గడిచింది.
ఇమామ్ రాలేదు. షాదుల్ జాడలేదు.
వాళ్ళు రాకపోవడం బీబమ్మకు సంతోషంగా ఉంది. చాంద్‌కు సంతోషంగా ఉన్నా లోలోపల భయంగా ఉంది. ఇద్దరూ ఇంట్లకూ బయటకు తిరుగుతున్నారు. అడుగుల చప్పుడైతే ఇమామ్ అనుకుని చూస్తున్నారు. గురక వినిపిస్తే షాదుల్ అనుకుని ఉల్కిపడుతున్నారు.
ముగింపు
బొమ్మల పెట్టెను మోస్తూ తోపుడు బండి ఊరు దాటింది.
బొమ్మలాట కళాకారులంతా దీనమైన మొహాలతో వెనక నడుస్తున్నారు.
‘‘మామా! ఇంగ కానిజ్జామా!’’
సుబ్బారావు గొంతు విన్పించి తేరుకొన్నాడు.
‘‘జనమొచ్చినారా?’’ అడిగాడు.
‘‘ఓ మాదిరిగా ….’’
పొద్దు చల్లబడింతర్వాత –
పడమటిళ్ళ నీడలు వీధుల్లోకి పాకిన పిదప –
గుడిముందంతా ఆక్రమించుకొన్న వేపచెట్టు నీడలో కొందరు హుషారుగా పన్జేస్తున్నారు.
గుంతలు తవ్వేవాళ్ళు తవ్వుతూ ఉంటే, కూసాలు బాతే వాళ్ళు బాతుతున్నారు. అడ్డకొయ్యలు కడుతున్నారు. కొందరింకా కొయ్యలు మోసుకొస్తున్నారు. మోకులు చంకకు తగిలించుకొస్తున్నారు.
తుది రోజు
ఆట ఒప్పందం తర్వాత బొమ్మలాట కళాకారుల యోగం మారిపోయింది.
ఉదయం లేచి చెంబుపట్టుకని వంకలోకి వెళ్ళేసరికి వాళ్ళను వెదక్కొంటూ పాములేటి వచ్చాడు.
పళ్ళు తోముకొనేందుకు వేపపుల్లలు విరిచి ఇచ్చాడు.
చిక్కటి పాలు, చక్కెర, కాఫీపొడి పంపాడు గుడి వద్దకు.
పెద్ద మనుషుల ఇళ్ళన్నీ మరోసారి తిరిగాడు గోవిందరావు.
ఆట ఒప్పుకొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.
‘‘ఆట ఒప్పించుకొనే దాకా మా కాళ్ళో కడుపో పట్టుకొంటారు. తాంబూలమిచ్చినాంక పరదాగుడ్డలనీ, మెరుగు ఆముదమనీ, కాల్ల కింద చెక్కలనీ, దీపాలనీ, కోడిపిల్ల అనీ, సారాయి సీసాలనీ …. మా పానాల్దీస్తరు …. మీ సావాసమొద్దు నాయనా! ఊరున్నమ్ముకొని ఒచ్చినందుకు …. అంతో ఇంతో కూలిబాటు ఇస్తాం …. తీసుకొని మీ దావన మీరు బోండి ….’’ చెప్పారు కొందరు ముసలాళ్ళు.
తండ్రి పడే అగచాట్లన్నీ కమలాబాయికి తెలుస్తూనే ఉన్నాయి.
ఇల్లిల్లూ తిరిగి అందరికాళ్ళు పట్టుకన్నా ఎవరి మనస్సూ కరగలేదనే విషయం అర్థమవుతూనే ఉంది.
భోజనం ఏర్పాట్లు ఒక గాడిలో పడ్డాయి. మొహం విరుపులతోటో, తప్పని తద్దినం గానో కొన్ని ఇళ్ళల్లోనైనా తిండి దొరుకుతోంది.
ఆట ఆడించాలనే నాన్న తపన, ఆరాటం ఆమెను కదిలించాయి.
గ్రామ పెద్ద రాఘవరెడ్డి ఇంటినుంచి బియ్యం, బేళ్ళు, ఉప్పు, పప్పు, మిరపకాయ, చింతపండు వగైరా సంభారాలు రావటంతో – ఆయమ్మనో ఈయమ్మనో అడగకుండా చట్టీ ఇప్పించుకని గుడి వద్దనే పొయ్యి రాజేసింది కమలాబాయి.
ఎర్రమట్టి నీళ్ళలో కందుల్ని నానేసి, ఎండబెట్టి, సాంప్రదాయిక పద్ధతిలో తయారుచేసిన కందిబేడల పప్పూ, వేడి వేడి అన్నమూ పాత రోజుల్ని గుర్తుజేసి ఏదో తన్మయా భావన కలిగించింది గోవిందరావుకు. రుచిగ్రంథులు ఎండిన నాలుక చెలిమల్లో తేమ ఊరించాయి.
గ్రామంలోని ఆడవాళ్ళకు సులభంగానే పరిచయమయ్యింది కమలాబాయి. ఆమె తల్లి లక్ష్మీబాయితో ముసలాళ్ళందరికీ సన్నిహిత సంబంధాలుండేవి కాబట్టి ఆమె పని సులువైంది. తత్ఫలితంగా అంబలి పొద్దు మీరక ముందే మనిషికో ముద్ద సంకటి దొరికింది. ఉడుకుడుకు సంకటి, వేరు సెనగల పచ్చడి, మటిక్కాయల తాలింపు జిహ్వకు రుచిగా అన్పించింది.
మలిరోజు
చల్లని నిద్దురవేళ …. చలిపొద్దున ఢమరుక శబ్దం ….
ఆ వీధి నుంచి ఈ వీధికి నిరంతరాయంగా మోగుతూ ఉన్న బుడబుక్కల వాని కంఠస్వరం …. అదో రకమైన యాసతో, చల్లపొద్దును పక్కలో చేయి దూర్చిలేపినంత జలదరింపుగా అతని గొంతు ….
కళ్ళు తెరవకుండానే ఢమరుక శబ్దం వింటూ హృదయం అనుభూతించే పురాభావాల స్పందనల్ని గమనిస్తూ ఉండిపోయాడు కొంతసేపు.
పల్లె నడిబొడ్డు నున్న రామాలయంలో విడిది చేసి ఉన్నారు – బొమ్మలాట గాళ్ళు.
బొమ్మల పెట్టె వగైరాలన్నీ దేవాలయం లోపల సర్దుకున్నారు.
గుడి పంచదిగి ఛెత్రి కర్రను చేతబట్టుకొని మెల్లగా వీధిలోకి నడిచాడు గోవిందరావు.
తొలిరోజు
తోపుడి బండి ఒకటి తార్రోడ్డుమీద జమాయించి కదులుతూ ఉంది.
‘తిక్కలకండి’ అనబడే వనపర్తి కొండలరావు దాన్ని తోస్తూ పయనిస్తున్నాడు.
వెనగ్గా ఏవేవో మాటలు చెబుతూ పయనిస్తున్నాడు అంబోరు సుబ్బారావు.
ప్రారంభం
శివరాత్రి దాటి వారం రోజులైనా చలి ఉరవడి ఇంకా అణగలేదు. రాత్రి నాలుగవ జామున్నించి విజృంభించి పొద్దు పొడిచి బారెడు ఎక్కేదాకా కొనసాగుతూనే ఉంది.
ఇంటి ముందరి వేపచెట్టు కింద నేలంతా రాలిన పండుటాకుల్తో పసుపు పచ్చని దుప్పటి పరచినట్టుగా ఉంది.
1990 తర్వాత తెలుగు సాహిత్యధోరణులు వికేంద్రీకృతమయ్యాయి. దానితో చాల ‘మంచి’ రచనలు సైతం తెలియకుండ పోయాయి. అలాంటి వాటిని నేను ఈ వ్యాసాల ద్వార గమనించగలిగాను. అట్లే సినిమాలకు సంబంధించి, గ్రామపునర్నిర్మాణానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం నాకు కలిగింది.
అన్నపూర్ణమ్మ గారు మా అమ్మకి చిన్ననాటి స్నేహితురాలు. ఓ చిన్న జమీందారు కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటినుంచే వంటిమీద ఓ మణుగు బంగారం ఉన్న మనిషి. ఓ సారి నా చిన్నతనంలో వాళ్ళ యింటికి పెళ్ళికి వెళ్ళినపుడు చూశాను. సూర్యుడు, చంద్రుడు, పెద్ద బంగారు జడ, మెడలో కాసులపేరు, వరహాలపేరు, ఇంకా ఇంకా ఏవో సత్తరకాయలపేర్లు, ఎన్నో ఎన్నెన్నో. వాటితో పాటు మెడకు హత్తుకుని కంటె, సరే నడుముకు వెడల్పుగా పచ్చలు, కెంపులు, వజ్రాలు పొదిగిన లక్ష్మిబిళ్ళతో వఢ్డాణం. ఆవిడని ఎరగని వారుండరు మా కుటుంబాల్లో.
కంపార్ట్‌మెంట్ గోడమీద మొదటిసారిగా హిందీయో, మరాఠీయో తెలియదు కానీ ‘సంకట్ కాల్ మే బాహర్ జానే కా మార్గ్’ అని పేద్ధ అక్షరాలతో వ్రాసి ఉన్న సందేశం చదివాను. ఈ సంకట కాలం అంటే ఏమిటి, అది అక్కడ ఎందుకు రాశారూ అని కాస్త పరిశోధించగానే అక్కడే ఇంగ్లీషులో ‘ఎమర్జెన్సీ ఎక్సిట్’ అనికూడా కనపడింది. అప్పుడు నాకు స్పష్టంగా సంకట కాలం అంటే ఎమర్జెన్సీ అనియూ, బాహర్ జానే కా మార్గ్ అనగా కొంప ములిగే టైములో బయటికి పారిపోయే గుమ్మం అనియూ అర్ధం అయింది.
ఆరువారాల క్రితం మెయిల్ బాక్స్‌లో ఓ కాగితం చూశాడతను. దాన్లో ఇలా వుంది -‘‘డియర్ నైబర్! ఇది మీకు ఆందోళన కలిగించటానికి రాయటం లేదు. అప్రమత్తంగా ఉండమని చెప్పటానికే. ఈ మధ్య కొందరు దొంగలు కేవలం ఇండియన్ల ఇళ్ళ మీద నిఘా వేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి విలువైన వస్తువుల్ని తీసుకుపోతున్న సంఘటనలు చాలా జరిగాయి. ఉదాహరణకి దగ్గర్లోనే వున్న లివింగ్‌వుడ్స్ వీధిలో పదిమంది ఇండియన్లు వుంటే ఒకే వారంలో వాళ్ళలో ముగ్గురి ఇళ్ళలో ఇలాటి దొంగతనాలు జరిగాయి. ఇలాటి వాటిలో పోలీసులు చెయ్యగలిగింది ఏమీ లేదు. కనుక మన జాగ్రత్తలో మనం వుండటం ముఖ్యం. ఇట్లు – మీ శ్రేయోభిలాషి, గురుచరణ్ సింగ్,’’