(సుమనశ్రీ ‘మహాస్వప్నం’ కు పరిచయ వాక్యాలు) పని మీద బయటికి వెడతూ ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులకోసం తాళం చెవి ఏ గూట్లోనో, కుండీ […]
Category Archive: గ్రంథాలయం
అకస్మాత్తుగా గోదావరి శర్మ చనిపోయాడని విన్నప్పుడు ఒక్కమారు మొహం తిరిగి, ‘ఛీ! ఎంత absurd!జీవితానికి అర్థం లేదు సుమా’, అనిపించింది. జీవితాన్ని కవిత్వించి, కవిత్వాన్ని […]
(శ్రీ విద్యారణ్య కాంలేకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూ. 25-9-1989 నాటి “ఆంధ్రపత్రిక”లో ప్రచురితం.) ప్ర: “కళ కళ కోసమే” అన్న వాదన మళ్ళీ ఎదో వొక […]
ఈ మధ్య వస్తున్న సినిమాలను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నా, విడుదలై వస్తున్న సినిమాల సరళి మారలేదు. అటు దర్శక నిర్మాతల, ఇటు నటీనటుల ధోరణిలో కూడా రవ్వంత మంచి మార్పు రాకపోవడం చాలా దురదృష్టకరం, విచారించదగ్గ విషయం కూడా. 50 సంవత్సరాల క్రితం ఒక సినిమా నిర్మించడానికి సంవత్సరాల వ్యవధి చాలేది కాదు. అటువంటిది, ఈనాడు రెండు, మూడు నెలల్లో తయారై సినిమాలు ప్రేక్షకుల్ని హింసిస్తున్నాయి. రాశి పెరిగింది, వాసి తరిగింది.
(శ్రీ విన్నకోట రవిశంకర్ “కుండీలో మర్రిచెట్టుకి పరిచయం”) రవిశంకర్ని నేను పదేళ్ళబట్టి ఎరుగుదును. అప్పట్లో అతను మా కాలేజీ విద్యార్థి. అప్పుడే ప్రారంభమైంది అతని […]
(శ్రీ స్మైల్ చేసిన ఇంటర్‌వ్యూ. 1988లో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. తేదీ గుర్తులేదు) ప్ర: మిమ్మల్ని స్పృశించిన సాహిత్య ప్రభావాలేమిటి? అవేమైనా మీకు మార్గనిర్దేశం […]
కృష్ణశాస్త్రి గారు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆయనే ఎక్కడో ఎప్పుడో ప్రస్తావించిన దృశ్యం నా మనస్సులో బొమ్మ కడుతుంది. కవిత్వం రాయటం ప్రారంభించిన తొలిరోజుల్లో, అంటే […]
(శ్రీ శిఖామణి “మువ్వల చేతికర్ర”కి పరిచయం) కవిత్వం రాయటానికి చిట్కా చెప్పాడు టొనీకోనర్ అనే కవి. ఒక అరణ్యాన్ని సృష్టించుకో. దాన్లో అన్వేషించుకుంటూ పో. […]
మనుషుల్ని కలిపే ఈ “మనీష” వట్టి “బుద్ధి” మాత్రమే కాదు. సానుభూతితో కూడిన అవగాహన, సహృదయత, ఇప్పటి ప్రపంచానికి ముఖ్యావసరం ఇదీ. ఇది అలవర్చుకున్నప్పుడే మనిషి స్వేచ్ఛని సాధిస్తాడు.
(శ్రీ సతీష్ చందర్ చేసిన ఇంటర్వ్యూ. జనవరి 18, 1988 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమయింది) (చెట్లు తమవేళ్ళతో ప్రహరీ గోడల్ని కూల్చేస్తున్నాయ్. లోపల తెరిచిన […]
(శ్రీ బి.వి.బి. ప్రసాద్ ‘దృశ్యాదృశ్యం’ కు భూమిక) హైకూ అంటే చంద్రుణ్ణి చూపించే వేలు; ఏరు దాటాక దిగవిడిచే తెప్ప. చంద్రుణ్ణి చూపించాక వేలు […]
ఐరిష్ కవి యేట్స్ (W.B.Yeats) చనిపోయినపుడు ఇంగ్లీషు కవి ఆడెన్ (W.H.Auden) ఒక అద్భుతమైన సంతాప పద్యం రాశాడు. ఇంగ్లీషు భాషలోని గొప్ప కవితల్లో […]
“ఈ అనుభూతి కవితలో ఆలోచనకీ, తర్కానికీ, విశ్లేషణకీ స్థానం లేదు. మన పంచేంద్రియాల్ని తాకే పద చిత్రాలద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు కవి. తను […]
ప్రవాసాంధ్ర సాహిత్యం ప్రవాసంలో వున్నవారు ఏం రాసినా ప్రవాస సాహిత్యమవుతుందా లేక ప్రవాసజీవితం గురించి రాసిందే ప్రవాసాంధ్ర సాహిత్యమవుతుందా అన్న విషయం మీద గత […]
మనకు పరాయీ అనిపించే పరిస్థితులూ, మనది కాని సంస్కృతి, మనవి కాని భాషల మధ్య – మనకెంత మాత్రమూ తెలియని లోకంలో మన వునికి ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
-ఇవి ఇప్పుడు ప్రవాసాంధ్రసాహిత్యం ముందు వున్న ప్రశ్నలు. అసలు ప్రవాసాంధ్ర సాహిత్యం అంటూ వుందా? వుంటే, దానికి కొన్ని సాంస్కృతిక లక్షణాలు వున్నాయా అన్న మౌలికమైన ప్రశ్న నుంచి ఈ అన్వేషణ మొదలు కావాలి.
ప్రస్తుతం తెలుగుభాషను ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాలనూ, అవి మన భాషపై ఆదరణ తగ్గడానికి ఏ రకంగా కారణమవుతున్నాయన్న వివరాలనూ ఇక్కడ చర్చిస్తాను. దానితోపాటు నాకు తోచిన కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచిస్తాను.
ఈనాటి పరుగు పందెపు ప్రపంచంలో వివిధ రకాలైన కాలుష్యాలతో, అసభ్యకర నాగరికతతో, స్వార్థరాజకీయాలతో పెద్దా – చిన్నా అనే తేడా లేక నైతిక విలువలు పతనమయ్యాయి. తల్లిదండ్రులు, గురువులపైన వినయ విధేయతలు, భక్తిశ్రద్ధలు మృగ్యమైనాయి. సుఖం మరిగి ఆర్థిక జీవన వ్యాపారంలో ధనార్జనే ధ్యేయంగా సొంత లాభంకోసం మానవుడు వెంపర్లాడుతున్నాడు. ఈ కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలో మనుషులు యంత్రాల్లాగా తయారై, మనసులు మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘సమకాలీన తెలుగు గ్రామాలను’’ సింహావలోకనం చేస్తే ….
పదిహేను వసంతాల తెలుగు కథను గురించి ప్రస్తావించుకోవల్సి వచ్చినప్పుడు గత శతాబ్దాపు చివరి దశకం ప్రారంభంలో మన జీవితాల్లోకి ఒక ఉప్పెనలా తోసుకొచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలలోని మార్పు …. పందొమ్మిది వందల తొంభయి అయిదులో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడడం, పాలకులు జాతిభద్రతను సైతం మరిచిపోయి బహుళజాతి కంపెనీలను ప్రేమించడం …. రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తాము విదేశీ సంస్థలతో నేరుగా చేసుకుంటూన్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు లాంఛన ప్రాయమవడం …. దేశ ఆర్థిక భద్రతను అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు నియంత్రించడం …. ఒక దానికకటి అనుబంధంగా జరిగిపోయిన గాథ పరిణామాలు మన వ్యక్తిగత జీవితాలను, సమాజాల్నీ కూడా అతలాకుతలం చేసిన క్రమంలో ఆ మార్పులన్నీ కూడా కథల్లో ప్రతిబించిస్తూ వచ్చాయి…
ఇమామ్ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఆలోచనల్లో పడి ఎప్పుడు పొద్దు గూకిందో తెలియలేదు. మసక మసకగా చీకట్లు పరుచుకుంటున్నాయి. ఊరు ఇంకా చాలా దూరంగా ఉంది. వెనక్కి తిరిగి చూశాడు. షాదుల్ గుర్రు గుర్రుమని వెంబడిస్తున్నాడు.
‘నీకు చేస్తున్న అన్యాయానికి నన్ను చంపేయకుండా ఎందుకురా …. గుడ్డిగా నమ్ముతున్నావు’ అనుకున్నాడు ఇమామ్ షాదుల్‌ను చూస్తూ.
ఇంటికి వెళ్ళాక తను చెప్పిన ఉపాయం పారుతుందా అన్న ఆలోచన ఒకవైపు …. దినదిన గండంగా షాదుల్‌ను ఎన్ని రోజులు ఇలా తప్పించగలను అనే ఆలోచన ఒకవైపు పట్టి కుదిపేస్తుంటే ఇమామ్ నడక వేగం తగ్గింది.
అట్లా సారంపల్లిలో దిగినప్పుడు మండలానికి నడిచిపోయి ఎస్సైని కలిసిండు చాంద్. ఎస్సై ‘ఆడుక పోండ్రిరా’ అన్నాడు. ఎంత ధర్మాత్ముడు అని చాంద్ అనుకున్నాడు.
ఏదో కేసు మీద సారంపల్లి వచ్చిండు ఎస్సై. బజార్లో ఆడుతున్న తండ్రి కొడుకులను చూసి బూతులందుకున్నాడు.
‘‘దొరా …. మొన్న మా కొడుకు కలిసిండు గదా …. మీరే ఆడుకొమ్మంటిరి’’ ఇమామ్ అన్నాడు.
‘‘అరేయ్ …. స్టేషన్‌కు రాండ్రి మీ సంగతి చెప్పత’’ ఎస్సై అన్నాడు.