రచయిత వివరాలు

శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

పూర్తిపేరు: శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా
ఇతరపేర్లు: ఫణి, శ్రీను
సొంత ఊరు: అమలాపురం, హైదరాబాదు
ప్రస్తుత నివాసం: అట్లాంటా
వృత్తి:
ఇష్టమైన రచయితలు: విశ్వనాథ సత్యనారాయణ, కొడవటిగంటి కుటుంబరావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, చలం, బుచ్చి బాబు, ముళ్ళపూడి వెంకట రమణ, శ్రీరమణ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శంకరమంచి సత్యం, గొల్లపూడి మారుతి రావు, తనికెళ్ళ భరణి, రావి కొండల రావు, రావి శాస్త్రి, సోమరాజు సుశీల, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఇంకా బోలెడు మంది ...
హాబీలు: కథలు రాయటం, పాటలు ప్రోగ్రాములివ్వడం, చెస్ ఆడడం, టెన్నిస్ ఆడడం, సినీమా దర్శకత్వం వహించేస్తున్నట్టు రోజూ కలలు కనడం
సొంత వెబ్ సైటు: http://dokka.eemaata.com
రచయిత గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు.

 

కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణా, సంజాయిషీల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. అయితే ఇలాంటి ఇబ్బంది ఇంకోసారి రాకుండా, రచయితలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా మరికొంచెం శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాం.

తీర్థం తాగి చెయ్యి నెత్తిమీద ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు నారాయణకి. యింకా చాలా విషయాలు అతనికి అంతు పట్టవు. సంస్కృతంలో సుప్రభాతం, ఆనక వేద మంత్రాలూ చదివి, అరవంలో తిరుప్పావయ్యో మరేదో చదువుతారు కదా, మరి తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష?

“కర్ణుడి చావుకి కారణాలనేకవనీ..పాపం అన్నీ కలిసొచ్చుంటాయి అతనికి. గయ్యాళి పెళ్ళాం, కొరగాని కొడుకు, చెప్పు చేతల్లో లేని కూతురు.”

కుర్ర చోదకుండు కులుకులాడితొగూడి
కన్ను మిన్ను గనక కారు నడిపి
కొంప ముంచినాడు గోడెవరితో దెల్పు
పచ్చడాయెకారు పట్ట పగలే

పదహారేళ్ళ క్రితం మాట టీవీ లో క్రికెట్‌ మాచ్చొస్తోంది, ఇంటిల్లిపాదీ ఇల్లదిరేలా సౌండు పెట్టి చూసేస్తున్నారు, రవి శాస్త్రి సిక్సు కొట్టాడని కామెంటేటరు చెబుతున్నాడు. […]

పొద్దున్న పదిగంటలకనగా రాజమండ్రీలో బస్సెక్కి, అపరాహ్నం వేళకి వాళ్ళ వూరు చేరాడు జగన్నాధం. స్టాండులో దిగేసరికి ప్రాణం లేచొచ్చినట్ట్లైంది. బస్సులో కూర్చున్నంతసేపూ ఒకటే ఉక్కపోత. […]

దీపావళి అనగా దీపముల వరుస, ఆ రోజు పెందలకడనే లేచి… అంటూ పరీక్షల్లో వ్యాసాలు రాసేస్తావే గానీ, నిజంగా దీపావళి గురించి రాయాలంటే బోల్డుంది. […]

“మావిడికాయ పప్పు మహా అద్భుతం గా కుదిరిందోయ్‌ కాపోతే..కందిపప్పు కాస్తంత వేయించి వుంటేనా.., వర్సాగ్గా ముగ్గురూ కనబడే వారు, ఇంద్రుడి తో సహా.” అన్నాడు […]

(ముందు మాట చాట్‌ రూం లో మొదలైన పరిచయం ప్రణయమైంది. పెళ్ళి సంబంధాలువెదుకుతున్న తనవారికి, ఓ అమ్మాయి యీ విషయం చెప్పవలసి వచ్చింది. ప్రేమ […]

అప్పుడే బోటస్కుర్రు బస్సు కూడా వెళ్ళిపోయింది. అంటే టైము పన్నెండైపోయింది. అన్న బాపేశ్వర శర్మ గారిని పర్మిషనడిగేసి గేటుదెగ్గర నాకోసం ఎదురుచూస్తూ వుంటాడు. ఈ […]

(కవిగా, కథకుడిగా తానా, ఆటా సువనీర్లలో దర్శనమిచ్చే శ్రీనివాస్‌ ఫణికుమార్‌ డొక్కా గారి “ఈమాట” తొలిరచన ఇది. అందరికీ అనుభవమైన చిన్ననాటి ముచ్చట్లు గుర్తుకుతెస్తూ […]