నడిజాము సీకట్లో సనసన్నని మంచుతుంపర
వొణకతా
తడస్తానే ఉండాది వొంటి చింతచెట్టునిద్దర కొమ్మల్లో ఒదిగిన కొంగలు ఉలికులికి పడతా ఉండాయి
రచయిత వివరాలు
పూర్తిపేరు: గోపిని కరుణాకర్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
గోపిని కరుణాకర్ రచనలు
బుడిబుడి అడుగులేసే
నా పద్యాన్ని ఎత్తుకుని,
పాలుగారే బుగ్గల్ని చిదిమి
రెక్కల కింద చేతులేసి ఎన్నిసార్లు ఎగరేశానో!
ఎన్ని నవ్వుల్ని మూటగట్టుకున్నానో!
ఆకాశంలోకి ఎగరేశాను
వర్షం ఆగిపోయింది
నువ్వు వెళ్ళిపోయావు
తడికళ్ళల్లో నువ్వు
ఒంటరి అరణ్యాన్ని నేను
మేడిపట్టిన చేతులు
అండతీసిన చేతులు
ఇత్తనాలు చల్లిన చేతులు
పైరును తడిమిన చేతులు
కట్టిపుల్లలయినాయి
చెంగావి రంగు ఎండ
మొండిగోడ దేహం మీంచి
ఊగుతూ ఊగుతూ ఊసరవెల్లి నీడలు
తెగని రంపపుకోత
ఎగిరే కాకి ఎంతకూ వాలదు