గౌరీదేవి బొటనవేలిపై నిలబడి, బాహువులను పైకెత్తి, నాలుగగ్నుల మధ్యన నిలుచుండి, మార్తాండుని కేసి చూస్తూ, ప్రాణాయామాది నియమాలను పాటిస్తూ, నిరంతరం పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఘోరతపోదీక్షలో ఉంది. ఇలా ఉన్న ఆ నారీమణి శరీరం నుంచి ఆమె సహజసౌందర్యం — ముంగురుల అందాన్ని తుమ్మెదలలోను, మందగమనాన్ని హంసలలోను, ముఖకాంతిని తామరలలోను, శరీరకోమలత్వాన్ని తీగెలలోను, చంచలమైన చూపులను లేళ్ళలోను, దాచి పెట్టిందా అన్నట్టుగా తొలగిపోతోంది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: కాశీనాధుని రాధఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: ప్రస్తుతం న్యూజెర్సీలో నివాసం. ఇండియాలో ఉండగా కాలేజిలో తెలుగు పాఠాలు చెప్పడం జరిగింది. ‘వాలంటీర్’ చెయ్యడం, చిన్నపిల్లలకి తెలుగు పాఠాలు చెప్పడం అన్నవి ప్రీతిపాత్రమైన విషయాలు. సంప్రదాయ సాహిత్యం అంటే ఆసక్తి, అభిమానం. అప్పుడప్పుడు చదివిన వాటి గురించి వ్రాయడం అలవాటు. కొందరు మిత్రులతో కలిసి ‘సాహిత్యభారతి’ అన్న పేరుతో న్యూజెర్సీలో సాహిత్యకార్యక్రమాలు నిర్వహించడం 2009 నుంచి జరుగుతోంది.
కాశీనాధుని రాధ రచనలు
అన్నీ తెలిసిన ఆ భగవంతుడికి అంతా మాయే. అంతా లీలే. కాని ఆ తల్లికి మాత్రం తన బిడ్డడు నవ్వే ప్రతి నవ్వు, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి చేష్టా ఒక అద్భుతము, అపూర్వము అయిన అనుభూతి. దాన్ని కాదనడానికి, త్రోసిపుచ్చడానికి సాధ్యాసాధ్యాలు అంటూ లేని ఆ దేవదేవుడికి కూడా సాధ్యం కాలేదు.