రచయిత వివరాలు

పూర్తిపేరు: అనిల్ అట్లూరి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

శుక్రవారం ఉదయం ఆ అమ్మాయి రాలేదు. మధ్యాహ్నం కూడా రాలేదు. ఫోన్ చేస్తుంటే జవాబు లేదు. కాలుకాలిన పిల్లిలాగా ఫ్లాటులోనే ఆ గదిలోనుంచి ఈ గదిలోకి ఈ గదిలోనుంచి ఆ గదిలోకి తిరుగుతున్నాను. లంచ్ టైమ్ కూడా దాటిపోయింది. కాని నా మనసు నిండా ఆమే! నా కళ్ళనిండా ఆమే! నా దృష్టంతా తలుపు మీదే! గడియ వెయ్యడం, తియ్యడం. తలుపు ముయ్యడం, తెరవడం అంతా చికాకుగా వుంది. తలుపు ఓరగా వేసి అలా నా రిక్లైనర్‌లో కూర్చుండి పొయ్యాను.

వారం ఎలా గడుస్తుందో మీరూ చూశారు. వారాంతంలో తప్ప మాకు సొంత పనులకు టైముండదు. అందుకే శనాదివారాల్లోనే మా షాపిం‌గ్ అంతా చేసుకుంటాం. మీరు గుళ్ళూ గోపురాలూ తిప్పమంటే నేను కాదనలేదే. మా మేనేజరుతో మాట్లాడి, సెలవు తీసుకుని వెళ్దాం అని అన్నాను. అక్కడ లాగా అలా అనుకుని ఇలా వెళ్ళిపోవడం కుదరదు. అందుకని ఆపై వచ్చే శనాదివారాలు వెళ్దామని అన్నానే కాని వద్దని అనలేదుగా! ఆ మాత్రం దానికే అంత మాట అనాలా?

మొన్న నేను ప్లాజాకి వెచ్చాలు కొనుక్కురావడానికి వెళ్ళినప్పుడు మా అపార్ట్‌మెంట్ బిల్డింగ్ కాన్సియార్జ్ వచ్చింది. నాన్నతో అవీ ఇవీ మాట్లాడి వెళ్ళింది. మాకు దగ్గిరలోనే ఉన్న కుట్జివ్‌ గ్రామాన్ని రష్యన్ దళాలు ఆక్రమించుకున్నాయి అని చెప్పిందట. ఇళ్ళళ్ళో ఉన్న స్త్రీలని బలాత్కరించారని చెప్పింది. అని వూరుకున్నా బాగుండేది. ఒంటరి తల్లిని రేప్ చేయబోతున్న రష్యన్ సైనికుడికి ఆవిడకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు అడ్డం పడితే వాడిని కాల్చి చంపి ఆ తల్లిని చెరిచాడట.

కిక్‌లు కొట్టీ కొట్టీ చెమటతో తడిచిపోయి ఉంది ఆ మాస్క్ వేసుకున్నవాడి షర్టు. అతని పక్కనే బిక్కమొహం వేసుకుని వాడి ఫ్రెండ్ నిలబడి ఉన్నాడు. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్ ఊదుతూ స్కూటర్‌ని పక్కకు లాగమని దానిమీద లాఠీ పెట్టి కొడుతూ వాళ్ళను బెదరగొడుతున్నాడు. రుక్కు పక్కనే నెమ్మదిగా కదులుతున్న కారు ఫ్రంట్ సీట్‌లో ఉన్న పెద్దాయనకి రుక్కు ఎందుకు అలా తెరలుతెరలుగా నవ్వుకుంటుందో అర్థం కాలేదు.

నాకర్థం అయ్యింది. నన్ను పిచ్చివాడని అనుకుంటున్నాడు. పాపం, పిచ్చోడు! ఎక్కువ బేరం చెయ్యకుండా, “సరే. కానీ నా అమ్మకం షరతులకి ఒప్పుకుంటేనే,” అన్నాను. అవేమిటన్నట్టు నా వంక ప్రశ్నార్థకంగా చూశాడు. పాల్కురికి విరాట్ ప్రసాదరావు షరతులా! మజాకా! నా సిగరెట్ దమ్ము లాగాను. శరీరమంతా గాలిలో తేలిపోతోన్న భావన. నెమ్మదిగా, నా వేళ్ళ మధ్యనున్న సిగరెట్‌ని అతనికి అందించాను.