Comment navigation


15543

« 1 ... 67 68 69 70 71 ... 1555 »

  1. అలా నచ్చుతుంది గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:

    11/06/2023 12:51 pm

    చాట్ పీజీకి మగ బొమ్మని జోడించి ప్రేమికుడిగానో భర్తగానో ఉంచుకున్న ఏఐ మాయాజాలం, మీ ఊహకి జోడించిన కథ అదుర్స్.

  2. నేత్రోన్మీలనం గురించి Rams గారి అభిప్రాయం:

    11/06/2023 12:02 pm

    ఆసక్తికరమైన రచన, అంతరంగాన్ని ఆవిష్కరించడం, ఆత్మగౌరవం, ఊహ, వర్ణన అన్ని కలగలిసినట్టున్నాయి. సీతదేవి ఆధార్ ప్రూఫ్‌తో వస్తే కాని దీన్ని ఖండించలేనిది. ఎందుకంటే భావప్రకటన స్వేచ్చ.

  3. నేత్రోన్మీలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    11/05/2023 7:39 pm

    చాలా ఆసక్తికరమైన రచన, చర్చ. తెలుగు రామాయణాల గురించి వెల్చేరు నారాయణరావు విస్తృతపరిశోధనావ్యాసం తెలుగు అనువాదం ఈ పత్రికలోనే వున్నది, ఇలాటి రచనల చారిత్రికనేపథ్యం తెలుసుకోవటానికి చాలా ఉపకరిస్తుంది. https://eemaata.com/em/issues/200309/471.html సీత – రావణ, సీత – రామ, సీత – లక్ష్మణ (అలాగే రాముడికీ అనేక ఇతర రామాయణ పాత్రలకీను) సంబంధాల గురించి అనేక ప్రతిపాదనలు చేస్తూ 1920 ప్రాంతాల నుంచి తెలుగులో ఎన్నో రచనలు వచ్చాయి – పాశ్చాత్య ఆలోచనావిధానాల ప్రభావంతో సంప్రదాయ భావపరంపరల మీద తిరుగుబాటుగా మొదలై, బ్రాహ్మణవ్యతిరేక, కమ్యూనిస్ట్, అభ్యుదయ, విప్లవ, దిగంబర, ఫెమినిస్ట్, దళిత, అస్తిత్వ వాదాలు ఏవి మొదలైనా ముందుగా రామాయణ పాత్రల్ని కొత్తదృష్టితో చూడటం వందేళ్ల పైగా తెలుగు సాహిత్యంలో వున్న ఒరవడే. అందాకా ఎందుకు, బాపు – రమణల సీతాకల్యాణం సినిమాలో కూడ ‘ఒక విధంగా’ సీత రావణుడి ఇంటిబిడ్డగా చూపించారు. ఒక్కోరచనని విడివిడిగా కాకుండా ఒక సాంప్రదాయంలో భాగంగా చూడటం వల్ల ఇంకా లోతైన అవగాహన ఏర్పడే అవకాశం వుంది.

  4. నేత్రోన్మీలనం గురించి పల్లిపట్టు నాగరాజు గారి అభిప్రాయం:

    11/05/2023 2:48 am

    అద్భుతమైన కథ. సీత అంతరంగాన్ని ఆవిష్కరించారు.రాముడి స్వభావాన్ని ఎరుకపరిచారు. కథ చదువుతున్నంత సేపూ రామాయణ కథ లా కాకుండా సీత హృదయాన్ని చదువుతున్నట్టు ఉనింది. ఈ తరం కథల్లో నిలిచిపోయే కథ.కథకులకు కొత్త చూపును అందించే రచన ఇది. హృదయ పూర్వక శుభాకాంక్షలు💐💐💐

  5. నేత్రోన్మీలనం గురించి శిరీష్ ఆదిత్య గారి అభిప్రాయం:

    11/04/2023 8:44 pm

    Hello Purnima garu,

    Firstly, congrats on the technical achievement. I was awed by how good, and apt, the language was for this story. మోడ్రన్ అర్బన్ కథలు రాసే రచయిత ఈ స్థాయి భాషలో ఇంత బాగా రాయడం ఆశ్చర్యం, ఆనందం కలిగించాయి.

    Secondly, I think it is a powerful, immersive portrayal of depression and trauma (To be clear, I don’t use those terms as they might mean clinically but in a general social sense). I can imagine a woman going through what she has and then, once the ordeal is over, having to start waging the battle with inner demons. The decision to narrate the story from a closed third-person POV was inspired because it placed the reader in the unrelenting, foggy space of an undefinable sadness.

    I also liked the way fragments of information- people’s opinions, minor myths, palace gossip- enter her consciousness and refract her self-perception disorienting her even further.

    The story does so much that I think I understood why you chose to stand on the edifice of Ramayanam. Please correct me if I’m wrong but by choosing these characters to whom we already have access to and hold certain assumptions about, your choice of shading them differently stood out more powerfully than it would have otherwise. I don’t know the epic well enough to comment on character inconsistencies as some have pointed out, but at a human level I was convinced by their actions.

    Finally, regarding the outrage, not that its any solace but I think it’ll blow away soon enough. For what its worth, I don’t think you demeaned or disrespected Rama or Sita. If anything, you added more depth and complexity, and I, for one, enjoyed it.

    In solidarity,
    Sirish

  6. నేత్రోన్మీలనం గురించి Sneha గారి అభిప్రాయం:

    11/04/2023 7:47 pm

    మీకు తెలిసిన మానసిక రోగాలన్నీ సీతారాములకు ఉన్నట్టు ఊహ చేయగలిగినవారు సొంత పాత్రలను సృజించ లేకపోయారా? వారి వ్యక్తిత్వం నుండి నేర్చుకుని మనం ఎదగాలి అంతే.

  7. నేత్రోన్మీలనం గురించి Anand G. గారి అభిప్రాయం:

    11/04/2023 10:07 am

    I appreciate Ms. Lalitha’s comment. Shows one how to read a story like a story. I have been reading the responses to this story with some sadness and some amusement, both here and on social media.

    I too, had the same opinion about Rama and Kausalya’s characters.  But, when I went back to the story a few times, I noticed the word “జనవాక్యం గురించిన చింత” more than once. So Rama being the king, the worry or the need to maintain the appearances of Ramarajya – that everything is hunkydory in it – is also of prime importance to him, not unlike many current political leaders around the world The dialogue between Rama and Sita at the end also indicates this. Also, her questioning of Rama about the responsibility to protect the art and artist – appears to have come from our recent history. Kausalya, being raajamaata, has to help Rama with his responsibilities. These are not cardboard characters. These are complex beings. Could these hints be a little less subtle in the story? Could be.

    Rama, as Valmiki originally intended, is a flesh and blood human in this story too. So, his love for Sita and the fear that Ravana may come back to abduct her away, might have made him react the way he did.

    Could this story be written better? Of course. Are Rama and Sita above criticism? Definitely not. In fact their susceptibility is what makes them dear to us. Only in societies with tyrannical tendencies, humans are made in to super humans and gods and are forced upon every one as such.

    This is the kind of a story that all the fellow writers should discuss and dissect each and every line. Alas! That is expecting too much from telugu literati. So, instead, in the place of a literary discussion,  we have religious fanatics spewing venom and vulgarities. Responses to stories such as these tells one how feral or human a society is.   What a sad state!

    (Apologies for writing in English. To write this in Telugu is a herculean task for me.)

    ఆనంద్.

  8. అదృశ్యం గురించి k.venkata Rama Krishna గారి అభిప్రాయం:

    11/04/2023 7:43 am

    చాలా బావుంది మీ కవిత. ఆద్వైతాన్ని బోధిస్తున్నది.

  9. నేత్రోన్మీలనం గురించి జిలేబి గారి అభిప్రాయం:

    11/04/2023 7:35 am

    అవాల్మీకమైన రావణుడి కూతురు సీత అనే కతను పట్టుకొచ్చి‌/ మాడర్న్ డే సైకో అనాలిసిస్‌ని‌ రంగరించి, ఫెమినిస్టిక్ వ్యూస్‌తో ఆలోచనా వాహిని సాగించి/ కర్నాటక యక్షగానాన్ని స్ఫూర్తిగా చెబ్తూ వ్రాసిన ఈ కథ తెలుగు కథాలోకంలో చిరస్థాయిగా నిలిచి పోగలిగిన ఉత్తమ కథ అన్న దానిలో సందేహం ఏ మాత్రం లేదు. తమ్మిరెడ్డి గారి ఈ ప్రయత్నం ముదావహం.

    సీతగారి మనోభావాన్ని వ్యక్తీకరించడం కోసం శ్రీరాములవారిని తీవ్రమైన రావణ ద్వేషిగా కథలో చూపించాల్సిన అవసరం మాత్రం ఎందుకో కథ పరంగా అంత సరిగా అనిపించడం లేదు. బహుశా తమ్మిరెడ్డి గారిలో అంతర్లీనంగా పురుష ద్వేషం వుండవచ్చేమో అలా వ్యక్తీకరింప బడటానికి కారణం అనిపిస్తుంది.

    చీర్స్
    జిలేబి

  10. నేత్రోన్మీలనం గురించి డా. విష్ణు నందన్ గారి అభిప్రాయం:

    11/04/2023 6:38 am

    రాముడు సీత వంటి పుణ్యమూర్తులను మనవారని అనుకుంటే ఇటువంటి అభూతకల్పనలు చేయలేరు. ఇంట్లో మనతోనే ఉన్న, మన అనుకున్న వారి పట్ల వికార భావనలతో కథా కమామిషులల్లడం కుదురుతుందా? అలా అనుకోని కొందరు ఆయా పాత్రలను కేవలం ఆధునిక కథా కథనాలకు ముడి సరకుగా మాత్రమే భావించడం వల్ల వచ్చిన ప్రమాదమిది.

    కొన్ని ఆహా ఓహోల కోసం, చప్పట్ల చరుపుల కోసం పూర్వ కవుల పాత్రలకు సొంత ఉద్దేశ్యాలను ఆపాదించడం గర్హనీయం. జాగృతమైన సమాజం నిలదీసి అడగవలసిన కాలమిది.

    అఙ్ఞాన తిమిరాంధస్య
    ఙ్ఞానాంజన శలాకయా
    ‘చక్షురున్మీలనం’ యేన
    తస్మై శ్రీ గురవే నమ:

« 1 ... 67 68 69 70 71 ... 1555 »