Comment navigation


15543

« 1 ... 68 69 70 71 72 ... 1555 »

  1. నాకు నచ్చిన పద్యం: పొలయలుక గురించి S. Narayanaswamy గారి అభిప్రాయం:

    11/04/2023 6:16 am

    అబ్బ ఎంత అందంగా ఉండండి. దాంపత్య శృంగారానికి పట్టుగొమ్మ. ధన్యవాదాలు.

  2. నేత్రోన్మీలనం గురించి Prasuna Balantrapu గారి అభిప్రాయం:

    11/04/2023 1:59 am

    ఓల్గా గారి కథలా ఉంది. ఇది విషయంలో మాత్రమే. కార్నాడ్ గారి కథ చదివాను. మన కథలను వేరే కోణంలో చూడడం మనకి ఎప్పుడూ వుంది. అందుకే ఇన్ని రామాయణాలు. సీత రావణుని కూతురేమో అన్న కథ కూడా ఒకటి ఉంది. మీ కథలో అది కూడా ప్రస్తావించారు. రాముడిలో ఏ మాత్రం మానవగుణాలు కనిపించినా మన వాళ్ళు భరించలేరు. కాని మొదటి సారిగా ఈ గుణాన్ని ప్రస్తావించింది భవభూతి ఉత్తర రామ చరిత్రలో. మానసిక విశ్లేషణకి అవకాశం ఇచ్చారు.

  3. అలా నచ్చుతుంది గురించి Prasuna Balantrapu గారి అభిప్రాయం:

    11/04/2023 1:36 am

    కథ బాగుందండి. మగవాడు (కథ లో పాత్ర ) రోబో నా లేక ఇంతకు ముందు తరం లొ స్త్రీ లా ఊహించారా ?

  4. నవంబర్ 2023 గురించి జయంతి వి.వి.ఎస్.ఎన్. మూర్తి గారి అభిప్రాయం:

    11/03/2023 11:56 pm

    రజతోత్సవ సంబరాన్ని విజయవంతంగా జరుపుకుంటున్న ఈ మాట కు శుభాకాంక్షలు. ఈ వెబ్ పత్రికను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సాహితీ బృందానికి శుభాభినందనలు.

  5. నేత్రోన్మీలనం గురించి Lalitha గారి అభిప్రాయం:

    11/03/2023 11:45 pm

    I searched for the stories which inspired the author and found only a little on them.

    For readers who found the present story offensive, Chitrapata Ramayanam might be just as offensive. Someone commented that Seetha only draws the toe as she saw just that much but Surpanakha draws the entire picture based on the style of her drawing. That may make Seetha’s character left untainted but she claims the picture as her child and Rama is shown as getting angry over such a thing. So, it doesn’t seem as simple as the person who commented described.

    In “Ma Nishada” apparently Bharata says that Rama would find some excuse to abandon Seetha and make himself admired and pitied as someone who made a great sacrifice, basically an attention seeker. This too can offend many.

    Coming to the present story, this is what I think it is: The author added an angle of Seetha considering the possibility of Ravana being her father. She is riddled with doubts about her own identity. Not only that, if she were the daughter of Ravana, then her children would be his grand children. If that were the truth, how disturbing that would be? She wanted to know who she is but was scared to think of it turning out to be what she suspected. Even after she knows who she is, she had to choose between owning it and dismissing it. She choose to own it.

    There seem to be a few more layers woven into it, about gossip, cover-ups, jealousy, suspicion and intolerance.

    I found Draupadi’s supposed feelings for Karna in The Palace of Illusions offensive. In Draupadi: The Tale of an Empress, when the idea of Krishna not bearing a weapon in war was attributed to Draupadi, I reached my limit of making allowances for artistic liberty. In the present story, the description of Rama and Kausalya seemed out of character. If they were the sorts to do cover ups, Rama didn’t have to go to the forests in the first place. Rama showing anger and hatred towards Ravana’s picture, or thinking whatever that would prompt such reactions, go all against the spirit of the story. He never acted out personal suspicion or anger, but on the basis of principles. He fought the war for honor, not out of anger or hatred. He asked Seetha to go her way after the war also for principles, that it will leave room for doubt for anyone so inclined to think, not because he suspected her. He loved Seetha, missed her, pined for her and that had its own place. So, if the present story had to be told, it had to start from before the war and include indications of similar feelings in Rama then, in a way that would tie up well.

    I had been wondering that while many modern readers like Iravati Karve talk about the conception of Karna and Pandavas in humanly explainable ways instead of as divine boons, why no one wonders about the birth of Seetha. If anyone did, I din’t come across such till now. This is the first time I have seen it being considered.

    I looked up on the idea suggested in the present story. It seems that there is a version in which Ravana abandons her after birth because of being told she would destroy his lineage. That actually makes a lot of sense in terms of an interesting plot for the story of Ramayana, but not in modern alternate view.

    Rama absolved Ahalya of her cursed existence, took a vow of monogamy. He was a reformist. How could such Rama abandon Seetha? There is a lot to wonder about here. Let us wonder. While wondering we may wander. Not all those who wander or lost, but some may, so some caution is warranted I guess 🙂

  6. నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/03/2023 2:40 pm

    శివ గారు “పరాయి స్త్రీని చెరబట్టిన క్రూరుడు, దుష్టుడు, దుర్మార్గుడు, రాముడి చేత సంహరింపబడిన రాక్షసుడు” – ఇది జనసామాన్యమైన అభిప్రాయం రావణుడి మీద” అంటున్నారు. కాని ఇది శ్రీమద్వాల్మీకిరామాయణం చెప్తున్న మాట.

    ” తన మానానికి భంగం కలగగకుండా చూసుకున్న ఒక దయ గల” రావణుడి రూపం ఆమెలో ఇంకిపోయి ఉన్నది అంటారు శివ గారు. భలే ఆ రావణుడి ముఖం కూడా సీత ఎన్నడూ చూడలేదు మహాప్రభో అని శ్రీమద్రామాయణం ఖరాఖండిగా చెప్తున్నది. ఎందుకువచ్చిన పిచ్చి సమర్ధన?

    ఈవికారమైన ఊహలు ఆధునికులం అని చెప్పుకుంటూ శ్రీమద్రామాయణాన్ని ఎన్నడూ శ్రధ్ధగా చదవని పరిశీలించని విపరీతవాదుకు మాత్రం కలుగుతాయి. రావణుడు సీతను తాక(లే)క పోవటానికి కారణం వాడికున్న శాపం కారణంగానే తప్ప వాడంత యోగ్యపురుషుడై కాదు. అసలు యోగ్యుడూ దయాశాలీ ఐతే ఆవిడను జుట్టుపట్టుకొని ఈడ్చుకొంటే ఎత్తుకొని వెళ్ళేవాడేనా? మాట్లాడితే ఏమన్నా అర్ధం ఉండాలి.

    ఈదిక్కుమాలిన సమర్ధనను త్రిప్పికొట్టాలని వచ్చాను కాని ఈమాట మీద నా క్రోధాన్ని ఉపసంహరించుకొని కాదు.

    ఇంత దారుణంగా సనాతనధర్మావలంబుల మనోభావాలను అపహాస్యం చేసినవారికి తగిన ప్రతిఫలం లభించుగాక!

  7. అడ్మిన్స్ ఓన్లీ గురించి వఝల శివకుమార్ గారి అభిప్రాయం:

    11/03/2023 2:18 pm

    ఏ కృత్రిమ పరిష్వంగాలూ లేని వ్యాకరణం,
    అసంబద్ధత నటించ లేని అక్షరాల కూర్పు,
    పొడి దుప్పట్లు కప్పుకోని పోహళింపులు,
    లౌల్యాలు లేని ప్రతీకల స్వరచాలనాలూ..
    నీ వేళ్ళు ప్రసవిస్తున్న పారిజాతాల పరిమళం
    నా రెక్కలు లేని పిట్టను చుట్టుకుని
    ఎగరేసుకు పోయింది.
    లండా సాంబమూర్తి కి ఆత్మీయంగా…

  8. నేత్రోన్మీలనం గురించి Siva Somayajula గారి అభిప్రాయం:

    11/03/2023 1:53 pm

    “పరాయి స్త్రీని చెరబట్టిన క్రూరుడు, దుష్టుడు, దుర్మార్గుడు, రాముడి చేత సంహరింపబడిన రాక్షసుడు” – ఇది జనసామాన్యమైన అభిప్రాయం రావణుడి మీద.

    కానీ అతని చెరలో దాదాపు సంవత్సరం గడిపిన సీతకు తెలిసిన రావణుడు వేరు. తృణప్రాయంగా తిరస్కరించిన రావణుడు ఒక స్వరూపమైతే, తన తండ్రేమో అని పుకార్ల వల్ల ఏర్పడిన రూపం ఒకటైతే, తన మానానికి భంగం కలగగకుండా చూసుకున్న ఒక దయ గల రూపం మరొకటి ఆమెలో ఇంకిపోయి ఉన్న రావణుని వివిధ పార్శ్వాలు.

    రావణ వధతో అందరికీ ముగిసిన రావణ కథ, సీతకు ముగియలేదు. No closure for her till the image that she held of Ravana is out of her system. The kind images of Ravana that no one else seem to carry are haunting her in her dreams. They are also juxtaposed with his image of kidnapping her. His image (some of it is similar to Stockholm syndrome) is seeped deeply into her. The colors of the image got out of her during her baths, but, his memory buried deep inside her.

    Only one way to get that closure. To draw the picture, get it off her mind and chest regarding the true image of Ravana that is buried deep within.

    This story captures all these feelings beautifully culminating in the “నేత్రోల్మీలనం” where Sita finds her closure with Ravana. She is finally free of her image of Ravana that has been seeped deep within her.

    She is ready to pay any price to purge her conscience of Ravana and she does end up paying for it.

  9. నేత్రోన్మీలనం గురించి సుధీర్ కస్పా గారి అభిప్రాయం:

    11/03/2023 1:24 pm

    అంతేలే! భావ ప్రకటనా స్వేచ్ఛ! భారతీయుల గుండెల్లో నిరంతరం కొలువుండే దేవీ దేవతల స్వభావాలు సైతం ఈ భావప్రకటనల ముందు చిత్తయిపోవడం ఈరోజు కొత్తగా చూసింది కాదు. తరతరాలుగా ఎందరో రచయిత/త్రులు ఈ రకంగా ఎదిగిన దాఖలాలు కోకొల్లలు. ఎన్నో వక్రీకరణలను, కొత్త భాష్యాలను, దిగ్భ్రాంతికర సాహితీ దాడులను ఎదుర్కొన్న భారతీయ సమాజం బాధను, అవమానాన్ని మౌనంగా దిగమింగుకున్నదే తప్ప ఇటువంటి పత్రికలకు చార్లెస్ హెబ్డో గతి పట్టించాలనుకోదు. ఎందుకంటే వారికి బాగా తెలుసు, ఈ దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ కొందరికే సొంతమనీ… పొరపాటున గొంతెత్తితే అది నిరసన గళం కాదు అసహన దళంగా, ఇంకా గట్టిగా మాట్లాడితే రంగు పూసుకున్న ఉగ్రవాదంగా చూపేందుకు సిద్ధంగా ఓ గుంపు ఉంటారనీ వారికి బాగా తెలుసు… కాబట్టి యధావిధిగా ఈ కథ గొప్ప కథ అని ఒప్పేసుకుని చప్పట్లు కొట్టేద్దాం.

  10. నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/03/2023 12:56 pm

    మన్నించాలి. ఈకథ నామనస్సును బాగా గాయపరచింది. ప్రాణం పోయేంతగా!

    శ్రీమద్రామాయణం ఒక కథ అనుకుంటే అది వ్రాసినది వాల్మీకి మహర్షి. అయన కథలోని పాత్రలకు వ్యతిరేకమైన వ్యక్తిత్వాలను ఆపాదించి కల్పనలు చేసే స్వాతంత్రం ఎవ్వరికీ లేదు.

    శ్రీమద్రామాయణం ఒక చరిత్రగ్రంథం అనుకుంటే ఆచరిత్రను గ్రంథస్థం చేసినది వాల్మీకి మహర్షి. అయన చెప్పిన చారిత్రకకథనాన్ని వెక్కిరించేలా ఆరచనలోని పాత్రలకు కొత్తకొత్త వికృతమైన కల్పనలతో మసిపూయటం క్షమార్హం కాదు.

    కవులకు రచయితలకూ ఆమాటకు వస్తే అన్నిరకాల కళాకారులకు కల్పనాస్వేఛ్చ తప్పకుండా ఉంది. అంటే దాని అర్ధం ఇతరుల సృజనలోని అంశాలని విలోమం చేసి స్థలపాత్రకాలస్వభావాదులను ఇష్టారీతిగా మార్చిపారెయ్యటం కూడా స్వేఛ్చగా చేయవచ్చును అని అర్ధం కాదు.

    రామాయణం ఆధారంగా అనాదిగా ఎందరో కవులు ఎన్నో ఎన్నెన్నో కల్పనలు చేసారు. కాని ఎవరూ రామాయణపాత్రలను అనుచితంగా చిత్రించి అపచారం చేయలేదు.

    శ్రీమద్రామాయణం ప్రకారం సీత రావణుడి ముఖం కూడా ఎన్నడూ చూడలేదు. ఆవిడ ఎంతో కోరికతో శ్రధ్దతో రావణుడి బొమ్మవేయటం అనే వికారమైన అనుచితమైన ఆలోచన చేసిన వారిని ఏమనాలో తెలియటం లేదు.

    రావణుణ్ణి సీత బిడ్డగా భావించిందా – ఇదీ ఎంత ఘోరమైన ఆలోచన!

    సీతాపరిత్యాగానికి జానపదులు తమకు తోచిన కారణాలను తాము వెదుక్కున్నారు ఒక పాటలో. ఆపాట ప్రకారం శూర్పనఖ ఒక యోగిని వేషంలో అంతఃపురప్రవేశం చేసి సీతమ్మ దర్శనం చేసుకొని, సీతమ్మను రావణుడి బొమ్మ వేయమని అడిగితే ఆవిడ వాడి ముఖం చూడలేదంటే చూసిన భాగం వేయి అని అడిగింది. సీతమ్మ వాడి కాలి బొటనవ్రేలును మాత్రం చూసింది – అదే వేయగలిగింది. ఆబొమ్మను శూర్పనఖ అచ్చు సీతవేసినట్లే రేఖావిన్యాసంతో పూర్తిచేసి ప్రాణం పోసి ఎవరూ గమనించని సమయంలో ఆబొమ్మను రాముడి తల్పంలో దాచి చక్కాపోయింది. అర్ధరాత్రి వేళ ఆబొమ్మ రావణుడు “రావేసీతా లంకకుపోదాం” అని పాట లంకించుకుంటాడు. చివరకు రాముడు ఆబొమ్మను కనుగొని ఆబొమ్మ సీతవేసినట్లుగా ఉందని గ్రహించి కోప్పడి సీతను పరిత్యజించాడు. ఒక చమత్కారకథ. అంతే. గమనించండి. ఇక్కడ రామాయణపాత్రల స్వరూపస్వభావాలను కించిత్తూ మార్చటమూ అపహాస్యం చేయటమూ వంటివి జరుగలేదు. ఈ రచయిత్రిగారి కథకు ఆజానపదకథ ఆధారం అని తెలుస్తూనే ఉంది.

    ఈ రచయిత గారెవరో నాకు తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. కాని ఒక స్త్రీ అయి యుండి గతకాలపు మరొక గౌరవనీయ వనిత మీద బురదచల్లే ఇటువంటి రచన ఎలా చేసారో అర్ధం కావటం లేదు. బహుశః ఒక స్త్రీవాది సీతను సృజించి రామాయణాన్ని ప్రశ్నార్ధకం చేదామన్న అత్యాశో దురాశో కారణం కావచ్చును అనుకుంటున్నాను.

    ఏమి చేసి నామనస్సుకు తగిలిన గాయం నుండి నేను కోలుకోగలను? అర్ధం కావటం లేదు. ఇంకా ఇటువంటి భయంకరమైన రచనలను ఆధునిక సాహిత్యధోరణుల పేరుతో ఐతేనేమి తమకూ బాగా నచ్చి అయితేనేమి ప్రచురించిన ఈ “ఈమాట” పత్రికను నేను తక్షణం దూరం పెట్టటం అత్యవసరం అని భావిస్తున్నాను.

    ఈమాటవారూ, మీకో దండం. ఇకపై మీ ఈమాట పత్రికను పొరపాటున కూడా సందర్శించను!

    రామచంద్రప్రభో! బుధ్ధితక్కువై ఈమాట పత్రికను చదివినందూ, ముఖ్యంగా ఈఘోరమైన కధను చదివినందుకూ నన్ను మన్నించు!

« 1 ... 68 69 70 71 72 ... 1555 »