అక్కడకి మిగతా అందరికీ బోధపడుతున్నట్టూ చెప్తున్నారే? సినిమా డయలాగులకీ, టివి న్యూసుకీ అర్ధాలు చెప్పమంటే ఎలాగండి? ఆ మధ్యన ఫేసుబుక్కులో అడిగాను – నాకు తెలుగు రాదు మహాప్రభో, నాటు నాటుకి ఆస్కార్ ఇచ్చారు కదా, ఆ పాటకి అర్ధం చెప్పి పుణ్యం కట్టుకొండొహో అని. ఇప్పటివరకూ వొక్కరు సమాధానం చెప్తే వొట్టు. ఇక్కడైనా ఎవరైనా చెప్తారేమో అని ఆశ.
పుస్తకం చదివితే గానీ నా అభిప్రాయాన్ని చెప్పలేను గానీ వ్యాకరణం యొక్క ప్రాధాన్యత గురించి తెలుగు కోరాలో నేను వ్రాసిన ఒక సమాధానాన్ని ఇక్కడ పంచుకోవడం ఉచితమనిపించింది:
******
వ్యాకరణం యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపే శ్లోకాలు ఒక రెండు ఉదహరిస్తాను:
ఒక తండ్రి కొడుకుతో అంటున్నాడు. ‘నాయనా నువ్వు పెద్ద చదువులు చదువుకోక పోయినా ఫరవాలేదు. కానీ వ్యాకరణం మాత్రం చదువుకో. ఎందుకంటే స్వజనం (బంధువులు) అనడానికి శ్వజనం (కుక్కలు) అనీ, సకలం (మొత్తం) అనడానికి శకలం (ముక్క) అనీ, సకృత్ (ఒకప్పుడు) అనడానికి శకృత్ (మలం) అనీ అనకుండా ఉంటావు.’
మరొక శ్లోకం–
“అవ్యాకరణమధీతం భిన్న ద్రోణ్యా తరంగిణీ తరణమ్
ఔషధమపథ్యయుక్తం త్రయమిదమకృతం వరం నకృతమ్”
‘వ్యాకరణం లేకుండా భాషను నేర్చుకోవడం, చిల్లులు పడిన పడవలో నదిని దాటడం, పథ్యం లేకుండా ఔషధం పుచ్చుకోవడం, ఈ మూడూ వృథా ప్రయాసలే. అవి చేయడం కన్నా చేయకపోవడమే మంచిది.’
పై రెండు శ్లోకాలు వ్యాకరణం యొక్క ప్రముఖతను స్పష్టంగానే చెబుతున్నాయి. మనకు వ్యాకరణం అంటే ఏమిటో సరియైన అవగాహన లేక పోవడం, ముఖ్యంగా తెలుగులో సంస్కృతం నుండి పట్టుకొచ్చిన ముక్కలతో అతుకుల బొంతలాగా తయారు చేసిన వ్యాకరణాలు ఉండడం, ఇక మనకు తెలిసిన ఆంగ్ల భాష వ్యాకరణం దినదినమూ మారే ఆ భాషను ప్రామాణీకరించలేక పోవడం… ఇవన్నీ మనకు వ్యాకరణం పట్ల ఉన్న చిన్న చూపుకు కారణాలు.
ఒక అక్షరం ఎన్ని రకాలుగా ఉచ్చరించవచ్చో, ఆ ఉచ్చారణ ఎప్పుడు ఎలా మారుతుందో అన్న దగ్గర ప్రారంభించి, భాషలో ప్రతి పదం యొక్క ఉత్పత్తిని, మార్పును ఖచ్చితంగా నిర్వచించే సంస్కృత వ్యాకరణాన్ని చదివినప్పుడు వ్యాకరణ శాస్త్రం యొక్క ఉపయోగం, ముఖ్యత్వం తెలుస్తాయి.
******
వ్యావహారిక తెలుగు భాషకు ఒక వ్యాకరణం రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. రచయితకు, పరిచయకర్తకూ కూడా ధన్యవాదాలు!
మావి చిగురు దిన్న మత్త కోకిల పాట మబ్బుగన్న నెమలి ఉబ్బులాట
మాటమాటనుండు తేట తెనుగునందు. వాగ్వధూటి కెన్ని భాషలున్న నామె
పలుకు సంస్కృతమ్ము కులుకు తెలుగు సొగసులూరు మాట సొంతమైనది నాకు.
తెలుగు పాదుజేసి తెలుగు నీళ్ళనుబోసి పెంచి తెలుగు తోట పంచి పూలు
తెలివి గలుగు వరకు తెలుగు లెంక నగుదు. జాషువా కవితల జాజిపూదోటలో
విశ్వనాథ కావ్య వేది మీద తెలుగు తల్లి నుంచి తెల్ల వారులు గొల్తు.
ధన్యవాదాలు. అంకెలు, సంఖ్యలు మీద నేను వ్రాసిన వ్యాసాలు అన్నీ “ఒకటి, రెండు, మూడు,…, అనంతం అన్న పేరుతో ఒక పుస్తకం ప్రచురించేను. దానిని https://www.maganti.org/ జాలస్థలిలో “సైన్సు వ్యాసాలు-పుస్తకాలు” నుండి ఉచితంగా దింపుకుని చదువుకోవచ్చు.
వార్ధక్యం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
02/01/2024 7:50 am
అక్కడకి మిగతా అందరికీ బోధపడుతున్నట్టూ చెప్తున్నారే? సినిమా డయలాగులకీ, టివి న్యూసుకీ అర్ధాలు చెప్పమంటే ఎలాగండి? ఆ మధ్యన ఫేసుబుక్కులో అడిగాను – నాకు తెలుగు రాదు మహాప్రభో, నాటు నాటుకి ఆస్కార్ ఇచ్చారు కదా, ఆ పాటకి అర్ధం చెప్పి పుణ్యం కట్టుకొండొహో అని. ఇప్పటివరకూ వొక్కరు సమాధానం చెప్తే వొట్టు. ఇక్కడైనా ఎవరైనా చెప్తారేమో అని ఆశ.
మూడు పిల్లులు గురించి Sudha గారి అభిప్రాయం:
01/31/2024 9:50 pm
ధన్యవాదాలు మహమూద్ గారు
వెల్చేరు నారాయణరావు తెలుగుదారి గురించి చంద్ర మోహన్ గారి అభిప్రాయం:
01/29/2024 12:53 pm
పుస్తకం చదివితే గానీ నా అభిప్రాయాన్ని చెప్పలేను గానీ వ్యాకరణం యొక్క ప్రాధాన్యత గురించి తెలుగు కోరాలో నేను వ్రాసిన ఒక సమాధానాన్ని ఇక్కడ పంచుకోవడం ఉచితమనిపించింది:
******
వ్యాకరణం యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపే శ్లోకాలు ఒక రెండు ఉదహరిస్తాను:
“యద్యపి బహునాధీషే తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్
స్వజనః శ్వజనోమాభూత్ సకలం శకలం సకృత్ శకృత్”
ఒక తండ్రి కొడుకుతో అంటున్నాడు. ‘నాయనా నువ్వు పెద్ద చదువులు చదువుకోక పోయినా ఫరవాలేదు. కానీ వ్యాకరణం మాత్రం చదువుకో. ఎందుకంటే స్వజనం (బంధువులు) అనడానికి శ్వజనం (కుక్కలు) అనీ, సకలం (మొత్తం) అనడానికి శకలం (ముక్క) అనీ, సకృత్ (ఒకప్పుడు) అనడానికి శకృత్ (మలం) అనీ అనకుండా ఉంటావు.’
మరొక శ్లోకం–
“అవ్యాకరణమధీతం భిన్న ద్రోణ్యా తరంగిణీ తరణమ్
ఔషధమపథ్యయుక్తం త్రయమిదమకృతం వరం నకృతమ్”
‘వ్యాకరణం లేకుండా భాషను నేర్చుకోవడం, చిల్లులు పడిన పడవలో నదిని దాటడం, పథ్యం లేకుండా ఔషధం పుచ్చుకోవడం, ఈ మూడూ వృథా ప్రయాసలే. అవి చేయడం కన్నా చేయకపోవడమే మంచిది.’
పై రెండు శ్లోకాలు వ్యాకరణం యొక్క ప్రముఖతను స్పష్టంగానే చెబుతున్నాయి. మనకు వ్యాకరణం అంటే ఏమిటో సరియైన అవగాహన లేక పోవడం, ముఖ్యంగా తెలుగులో సంస్కృతం నుండి పట్టుకొచ్చిన ముక్కలతో అతుకుల బొంతలాగా తయారు చేసిన వ్యాకరణాలు ఉండడం, ఇక మనకు తెలిసిన ఆంగ్ల భాష వ్యాకరణం దినదినమూ మారే ఆ భాషను ప్రామాణీకరించలేక పోవడం… ఇవన్నీ మనకు వ్యాకరణం పట్ల ఉన్న చిన్న చూపుకు కారణాలు.
ఒక అక్షరం ఎన్ని రకాలుగా ఉచ్చరించవచ్చో, ఆ ఉచ్చారణ ఎప్పుడు ఎలా మారుతుందో అన్న దగ్గర ప్రారంభించి, భాషలో ప్రతి పదం యొక్క ఉత్పత్తిని, మార్పును ఖచ్చితంగా నిర్వచించే సంస్కృత వ్యాకరణాన్ని చదివినప్పుడు వ్యాకరణ శాస్త్రం యొక్క ఉపయోగం, ముఖ్యత్వం తెలుస్తాయి.
******
వ్యావహారిక తెలుగు భాషకు ఒక వ్యాకరణం రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. రచయితకు, పరిచయకర్తకూ కూడా ధన్యవాదాలు!
స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి Sreenivasa Prasad Mullapudi గారి అభిప్రాయం:
01/29/2024 4:47 am
Excellent article about the Stoics.
The translation is very competent..
ఎవరిలో ఎవరో గురించి Y. BHAGYALAKSHMI గారి అభిప్రాయం:
01/28/2024 5:06 am
Very nice poetry
ఒకరికి నచ్చిన పద్యం గురించి రజనీకాంత్ గారి అభిప్రాయం:
01/27/2024 9:57 pm
పరమాత్మ గురించి ఇంత సులభంగా ఇంత అందంగా నాకు తెలిసి ఇంకెక్కడా వినలేదు. ఆ తరవాత చెప్పాల్సి వస్తే “ఇందు గలడందు లేడని సందేహము వలదు” పద్యం చెప్పాలి.
Endowed Chair In Telugu To Expand Language And Cultural Opportunities గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/25/2024 8:37 pm
తః తః గారికి ధన్యవాదాలు. జాషువా నా అభిమాన కవి; ఆయన స్పృశించని జీవిత పార్శ్వం లేదు:
“వసుధ శాసింపగల సార్వభౌముడగును
ధీరుడగు, భిక్షకుండగు, దీనుడగును
దుఃఖితుడగు, నిత్య సంతోషి యగును
సత్కవి ధరింపరాని వేషములు గలవె?”
కొడవళ్ళ హనుమంతరావు
ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1 గురించి Amarendra గారి అభిప్రాయం:
01/24/2024 8:24 pm
రామారావు గారూ, స్పందన సూచనలు గమనించాను.
ధన్యవాదాలు.
Endowed Chair In Telugu To Expand Language And Cultural Opportunities గురించి Vasudeva Y. గారి అభిప్రాయం:
01/23/2024 2:26 pm
మావి చిగురు దిన్న మత్త కోకిల పాట మబ్బుగన్న నెమలి ఉబ్బులాట
మాటమాటనుండు తేట తెనుగునందు. వాగ్వధూటి కెన్ని భాషలున్న నామె
పలుకు సంస్కృతమ్ము కులుకు తెలుగు సొగసులూరు మాట సొంతమైనది నాకు.
తెలుగు పాదుజేసి తెలుగు నీళ్ళనుబోసి పెంచి తెలుగు తోట పంచి పూలు
తెలివి గలుగు వరకు తెలుగు లెంక నగుదు. జాషువా కవితల జాజిపూదోటలో
విశ్వనాథ కావ్య వేది మీద తెలుగు తల్లి నుంచి తెల్ల వారులు గొల్తు.
కోటి చేమొగువులు కొడవళ్ళ జోడుకు – తః తః
తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3 గురించి rao vemuri గారి అభిప్రాయం:
01/21/2024 2:22 pm
వీర దుర్గా ప్రసాదు గారూ,