రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

త్రిపురాంతకోదాహరణము

రచన: త్రిపురాంతకుడు

ప్రథమావిభక్తి

ఉ.
శ్రీనగచక్రవర్తి తుది శృంగము చూచెదమంచు నేఁటికింబో ననిశంబు నుండు నిదె పుట్టువుఁ జావును లేని మందు నాచే ననుచుం బతాక యనుచేఁ దరుణాచల మెక్కి చీఱు పంచాననుఁ డిందుమౌళి త్రిపురాంతకదేవుఁడు భక్తలోకమున్.

కళిక – వృషభగతి రగడ – త్రిపుట తాళము

మఱియు సజ్జనభక్తగృహముల – మరిగి తిరిగెడి కామధేనువుకఱద లెఱుఁగక వేఁడు దీనులఁ – గదియు జంగమరత్నసానువుశైలజాముఖచంద్రరోచుల – చవులఁ దవిలెడు నవచకోరమువేలుపుందపసుల తలంపుల – వెల్లికొల్పెడు నమృతపూరముదేవతలు మువ్వురకు నవ్వలి – దెస వెలుంగుచు నుండు నెక్కటిభావవీథులఁ గలసి పలుకులఁ – బట్టి చెప్పఁగరాని చక్కటిఆఱు రేకుల మంత్రకుసుమము – నందు వెలింగెడి చంచరీకమువేఱుసేయక యోగిజనములు – వెదకి పొందెడు నూర్ధ్వలోకము.

ఉత్కళిక

అడుగుఁ దమ్ములఁ జొప్పు పసిఁగనియడరి శునకాకృతులు గైకొనిమీఱి చదువులు దవుల ముందటఁబాఱు క్రోడమునేసి మందటలాడి తను మార్కొనఁగ వచ్చినక్రీడి కోరిన వరము లిచ్చినయాటవిక కులసార్వభౌముఁడుజూటభాస్వత్తుహినధాముఁడు

ద్వితీయావిభక్తి

ఉ.
పామును హారమున్ నెలయుఁ బాపట సేసయు నేఱు మల్లికాదామము తోలుదువ్వలువు దట్టపు భూతియుఁ జందనంబు మైసామునఁ జాల నందముగ సన్నిధి సేసిన చూడఁగంటి నేనా మదిలోఁ గుమారగిరినాథుని శైలసుతా సనాథునిన్.

కళిక జయభద్ర రగడ – జంపె తాళము

మఱియు వేలుపులేటి – మౌళి నాఁగినవానినెఱయఁ గన్నప నోటి – నీటఁ దోఁగినవానిఁబొలఁతితో నొక్కొడలఁ – బొత్తుఁ గూడినవానిఁదలఁకి సేనమరాజు – దాడి కోడినవానిసాఖ్యతొండని రాల – జడికి నోర్చినవానిసౌఖ్యతరసాయుజ్య – సరణిఁ గూర్చినవానివెన్నెలలఁ బురుణించు – వెలఁది నవ్వులవానివెన్నునకు నలువకును – వెదుక దవ్వులవాని.

ఉత్కళిక

చిగురుఁగైదువు వెఱికిమగల సిగ్గులు నఱికిసతులఁ బాటులు పఱిచియతులవ్రతములు చెఱిచిఅలులు చిలుకలు పిండులెలయఁ గొలువఁగ నుండుమరు జయించినవానిఁగరుణ మించినవాని.

తృతీయావిభక్తి

ఉ.
వాలి నటించు ముక్తివరవర్ణిని పయ్యెదకొంగు చాడ్పునన్గ్రాలు నిజాంకపుం బడకఁ గన్నులఁ జూచినఁ జాలు నిమ్నగాస్ఫాలితమౌళిచేతఁ బురభంజను చేతఁ గుమారపర్వతంబేలెడు రాజు చేత ఫలియించు జనావళి కోరు కోరుకుల్.

కళిక-హయప్రచారము (లేక) తురగవల్గన రగడ – రూపక తాళము

మఱియు మఱ్ఱిమ్రాని మొదల – మరగియున్న గురునిచేతఁగొఱలి తాపసులకు నెఱుకఁ-గొలుపు జటిలవరునిచేతనంబి వనుపఁ గుంటెనలకు – నడచిన యెడకానిచేతనంబరాదితత్త్వములకు – నవలయైన ఱేనిచేతబల్లహుని వధూటి కాస – పడిన దుండగీని చేతనల్ల యలక నేలు రాజు – ననుఁగు సంగడీని చేతభూతిపూయు మానవులకుఁ – బుట్టు మాన్పు వైద్యుచేతప్రీతి ధాత పునుక కోర – భిక్షసేయు నాద్యుచేత.

ఉత్కళిక

ఇల రథంబు లీలనొప్పనలువ నిగమహరుల రొప్పఁబొసఁగఁ బాపనారిఁ బట్టిపసిఁడి కొండ నెక్కువెట్టిజడధి నిద్రవోవు శరముఁదొడఁగి నేలఁ గూలఁ బురములేసియున్న జోదుచేతదాసవరగణాద్యు చేత.

చతుర్థీవిభక్తి

ఉ.
ఆఱడియాస నీరసధరాధిపలోకము లిండ్లు వాకిళుల్దూఱుట మాని శ్రీనగము తూఱుపు వాకిలిఁ జొచ్చి పాపముల్నీఱుగఁ జేసి గంధవతి నీటను గ్రుంగి మనంబులోని చిచ్చాఱఁగఁ జేయుటొప్పు త్రిపురాంతకదేవునకై నమస్కృతుల్.

కళిక – వృషభగతి రగడ – త్రిపుట తాళము

మఱియును మెఱయఁగ దిశ లనియెడు నునుమడుఁగులు గట్టిన శృంగారికినైకొఱలిన దయ బాణాసురు మోసలఁగూరిమిఁ గాచిన ఫణిహారికినైమేలపుఁ జదువులు చదివిన విని మదిమెచ్చిన లక్ష్మీపతి బావకునైయీలువు గల సద్భక్తులు ముక్తికినేఁగెడు చేరువ పెనుత్రోవకునైకూటికిఁ గూరకుఁ గూరిమి భక్తులకొడుకుల నడిగెడి వెడజోగికినైయేటికి బోఁటికి జడలును నొడలునునిచ్చిన జగదేకత్యాగికినైప్రొద్దును రేవెలుఁగును నేత్రములైపొలయఁ గనుంగొనియెడు దేవునకైనిద్దములగు పెద్దల పేరెఱుకలనెలకొనియెడు నిశ్చలభావునకై.

ఉత్కళిక

కడు దీనతతో ముదితాపసికైవడి నింటికిఁ జని వెడకప్పెర గైకొని యాలుమగల పెనురచ్చలకైచనుదెండని నిక్కము సేయుటకైవెనుద్రిప్పిన గుండము లోపలఁ గైకొని చని తన యెప్పటి రూపము కైకొని గుండయ మెచ్చిన వేల్పునకైవినత పితామహఫణితల్పునకై.

పంచమీవిభక్తి

ఉ.
పోయెడుఁ గాల మన్యగతిఁ బొందదు మోక్షము వెండికొండకుంబోయెడు త్రోవ మీ కెఱుఁగఁ బోలదు మానవులార! రండు లేఁబ్రాయపుఁ గొండ కంచు శివభక్తుల లోఁగొను నద్రిరాజకన్యాయుతపుణ్యమూర్తి వలనం గడతేఱెడు జన్మభేదముల్.

కళిక-జయభద్ర రగడ – జంపె తాళము

మఱియు సకలాశ్రితుల – మనుచు నర్థము వలనవఱలు పరమానంద – వనధితీర్థము వలనఁగొమరు మిగిలిన మంచుఁ – గొండయల్లుని వలనవిమతపురదహన కర – విష్ణుభల్లుని వలనశివభక్త హృదయ సంచితనిధానము వలనవివిధరూపములలో – వెలయు జ్ఞానము వలనఅజ్ఞానఘనతమం – బడచు దీపము వలనసుజ్ఞానులకును బొడసూపు రూపము వలన.

ఉత్కళిక

తన కినుకలోఁ బుట్టికనలి దక్షునిఁ గొట్టియడరి వేల్పులఁ బఱచితొడరి జన్నము చెఱచివీరభద్రుఁడు వచ్చిచేరి మ్రొక్కిన మెచ్చియలరు దైత్యుని వలనదళితదైత్యుని వలన.

షష్ఠీవిభక్తి

చ.
కమలజు తోరపుం బునుక కంచము పాదసరోరుహార్చనాకమలము వారిజోదరుని కన్ను కరంబున కాదిభోగి భోగము ఠవణంబు చంద్రుఁడు శిఖాకుసుమం బటె! యెవ్వరీడు మారమణునకుం గుమారగిరిరాజనివాసున కన్యదైవముల్.

కళిక-హయప్రచారము (లేక) తురగవల్గనము – రూపక తాళము

మఱియు మెఱయు వేదవాద – మథనకథనసారమునకుమెఱయు దొట్ట ముట్టి ముట్టు – మేటి నీటి తీరమునకుబత్తు లుత్తు లొరసి యొరసి – పట్టు గట్టి తేజమునకుసత్తుఁ జిత్తుఁ దానయైన – సత్యనిత్యబీజమునకువలచి కొలుచు వారిఁ జేరి – వలపుఁ దలఁపు దయ్యమునకునిలిచి నిలిచి చూడఁ జూడ – నిండియుండు తియ్యమునకుమునులు ఘనులు బోధవీథి – ముట్టినట్టి తత్త్వమునకుపసులుఁ గనులు నెఱుఁగనట్టి – పరమపదమహత్త్వమునకు.

ఉత్కళిక

కదలి వదలి జూటకోటిచదలఁ బొదల నేటి నీటికడలఁ గడలఁ జెంది చెందిజడలఁ నొడలఁ బొంది పొందిబాలలీలఁ జాడఁ జూడసోలి లీలఁ గ్రీడలాడనాదినాథ జనకమునకువాదపూరి కనకమునకు.

సప్తమీ విభక్తి

ఉ.
వాచవి లోనుగా నొడలి వాకిళులం బొడచూపుతీపులంద్రోచి శివార్చనానియతితో వెలిచూడక చూడనేర్చినన్లోచవిఁ బోలునే చవులు లోకముఁ జూడని చూపులం గుమారాచలనాథునందుఁ ద్రిపురాంతకునందుఁ గరంగు చిత్తమా!

కళిక – జయభద్ర రగడ – జంపె తాళము

మఱియును గటాక్షజిత – మారునందుతఱిత్రాడు సొమ్మగు ను – దారునందుబరులూను భక్తపశు – పాలునందుకరుణాసుశీతకరి – కాలునందుజగములు జనించు తొలి – జాడయందునిగమార్థముల్ నిలుచు – నీడయందుపొడవెల్ల శాంతియగు – పుణ్యునందుకడలేక యొప్పు నర – గణ్యునందు.

ఉత్కళిక

ఇలయు సలిలంబువెలుఁగు ననిలంబుదివియు మిత్రుండుకువలయాప్తుండుపరఁగు యజమానపరిపూర్ణుఁ డైనయష్టతనునందుశిష్టనుతునందు.

సంబోధన

ఉ.
శ్రీ చనుదోయిపై శరముఁ జేర్చి భుజంగమరాజసజ్య హేమాచల మెక్కుడించి నిగమావళి యఱ్ఱులు వీడ్చి పద్మజుంజూచి మొగంబులిచ్చి దివిజుల్ గొనియాడఁగ నున్న నీ రణాంతాచరణంబు విందుఁ జెవులారఁ గుమారగిరీంద్రమందిరా!

కళిక – జయభద్ర రగడ – జంపె తాళము

మఱియు నానామంత్ర – మణిగణసుధాకల్ప!కొఱలు నేనుఁగుమోము – కొడుకుఁ గాంచిన వేల్ప!మూఁడు మోముల పోటు ముట్టుఁ బట్టెడు శూర!వేఁడిచూపునఁ దియ్య – విలుతుఁ ద్రుంచిన ధీర!తాపసుల యీలువుల – తనరు తపముల పంట !చూపులకు నెల్లఁ బర – సుఖవార్ధి పెన్నింటతిలకాయమాన దీ – ధితిసుధాసంసూతివెలుఁగులకు నెల్ల తొలి – వెలుఁగగు పరంజ్యోతి.

ఉత్కళిక

వినుతముఖనలినమునుఘనజఘనపులినమునువరవళితరంగములుగురుకుచరథాంగములుగలిగిన యుమాసరసిలలితముఖముల బెరసిక్రాలు నొక కలహంస!బాలచంద్రోత్తంస!

సార్వవిభక్తికము

నీ వాద్యుండవు; నిన్నుఁ దెల్పుఁ జదువుల్; నీ చేత మేలొంద నీకై వాక్పూజ లొనర్తు; నీ వలన బ్రహ్మాండావళుల్ పుట్టు; నీకే వేల్పుల్ సరి? యన్యదైవభజనం బే నొల్ల; నీ యందు మద్భావం బొందఁ దగున్ గుమారగిరినాథా! చంద్రచూడామణీ!
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • త్రిపురాంతకోదాహరణము

ఇటువంటివే…

  1. మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – IV: త్రిపురాంతకోదాహరణము
  2. మౌనంబంతట మాటలాడె… (2వ భాగం)

సంచికలో ...

  • రుబాయీలు
  • చెట్లు
  • కత్తి పడవలు
  • కవిత్వీకరణ కొన్ని సంగతులు
  • విన్నపం
  • శిశిర గీతం
  • స్వప్నవాసవదత్తం
  • ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక
  • మన పేర్లు, ఇంటి పేర్లు
  • మీ ఘంటసాల
  • సంకల్పం
  • స్పర్శ
  • ఒక్కడినై..
  • కవి హృదయం
  • కోరిక
  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3
  • నిశ్చయం
  • మన దీపావళి కథ
  • సశేషమ్‌
  • 1998
  • 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
  • e తరమ్‌ (నాటిక )
  • అతిథి
  • అదే నేను
  • అనాచరణ
  • అనురాగ దగ్ధ సమాధి
  • ఆకలి నిజాయితీ
  • ఆవాహన
  • ఆశాగ్ని రేణువు
  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల
  • ఉక్కు శిశువు
  • ఉన్మాద ప్రకృతి
  • ఊరెడుతున్నాను
  • ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  • ఓటమిలోని గెలుపు
  • కలిశాం
  • గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం
  • చెప్పులు
  • జననం
  • జన్మదిన రాహిత్యం
  • జీవన తీరాలు
  • జ్ఞాపకాల వాసన
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • టైటానిక్‌
  • డబ్బు పంజరం
  • తుపాకి కాల్పులు
  • త్రిశంకు లోకం
  • దేవుడూ
  • దేహాత్మ
  • నటించగల ప్రాణి
  • నిద్రపోతు జాతి
  • నిర్విరామం
  • నివాసం
  • పసిఁడిపల్లకి
  • పాపం ఈ లోకం
  • బహు ‘మతులు’
  • బహుశా ఇంకో నిజం
  • బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
  • భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

“పో” సాహిత్య సర్వస్వం
సీతాంజనేయ సంభాషణం – V

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.