రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

స్పృహ

రచన: లావణ్య సైదీశ్వర్
మార్చి 2021

ఇన్నినాళ్ళ మౌనానికి మాటలొచ్చి కలుస్తాయి
చూపులకి హృదయం విచ్చుకుంటుంది

ఆకాశాన్నోడించగలనని
సాచిన రెక్కల శబ్దం శూన్యంలోనూ
లబ్డబ్ మని స్పష్టంగా వినబడుతుంది
ముక్కలుగా పడివున్న కాలం
శిశిరంలా రాలివున్న నిశ్శబ్దం
ఉన్నపళంగా వసంతంలా ఒకదానికొకటి పెనవేసుకుంటాయి
ఆనందమో, దుఃఖమో తేల్చుకోలేని సందిగ్ధంలో

ఆ నిముషం ఎవరికీ తెలీని రసహ్యమేదో గుసగుసలాడుతూ
ఊపిరి వేగం పెంచుతున్నప్పుడు
కునుకు మరచిన రేయి లాలనగా ఊ కొడుతుంది
ఎదురుచూపులు పలవరింతలైన వేళ
ఒక సూర్యోదయం చురకలు వేస్తూ సర్ది చెబుతుంది.

అది ఏదైనా కావచ్చు; కవిత్వమో, కధో, పాటో
దారులే వేరై పోవచ్చు, కానీ
గాయాన్ని నిన్ను నీకు కానుక చేసిన చెలిమి
ఒక‌ ఊహను చెంతనే వదల్లేక వదిలి
కదల్లేక కదిలి దిగంతాలు దాటిపోతుంది.

ప్రతి క్షణాన్నీ నీతో సరిపోల్చుకుంటున్నాను
కాలం నా రక్తనాళాల్లో కొలవలేనంత వేగంగా ప్రవహిస్తున్నది.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • స్పృహ

ఇటువంటివే…

  1. జన్మజన్మల స్పృహ
  2. ఉత్సాహానికి దూరంగా…
  3. తిరస్కృత
  4. నాకే గనక తెలిస్తే
  5. బొంగురు గొంతు పాట

మార్చి 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 4
  • Match
  • ఉత్సాహానికి దూరంగా…
  • కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 2
  • గడినుడి – 53
  • గల్ఫ్ గీతం: 9. చివరి చరణం
  • చలనం
  • జనరల్ కంపార్ట్‌మెంట్
  • డెఫినిషన్స్
  • తలుపు తీసుకుని…
  • నేనెలా రాస్తాను?
  • పుస్తక పరిచయాలు
  • భయోద్విగ్నక్షణంలో
  • మార్చ్ 2021
  • మేనక
  • విశ్వమహిళానవల: 7అ. దె స్టాఎల్ ‘కొరీన్’
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 53
  • షేక్స్‌పియర్‌ సాహిత్యలోకం: ఒక ఆలోకం
  • స్పృహ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఉత్సాహానికి దూరంగా…
మేనక

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.