రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అసమర్థులు

రచన: రమ్యగీతిక
నవంబర్ 2008

“చెప్పండి ఏమిటి సమస్య?” అలవాటైన రొటీన్‌, క్యాజువల్ గా ప్రశ్నించాను.

“డాక్టర్ గారూ, ఈమె నా భార్య. తీవ్ర నిద్రలేమితో బాధ పడుతోంది” సమాధానమిచ్చాడు ఎదురుగా ఆమె పక్కనే కూర్చుని ఉన్న అతను.

“ఊహూ? ఎన్నాళ్ళనుండి?”

“దాదాపు పదేళ్ళనుండి” ఈ సారీ అతనే.

“ఇంతకాలంగా సమస్య ఉంటే ట్రీట్‌మెంటేమీ తీసుకోలేదా?”

“ఏవో వాడుతూనే ఉన్నాం, ఫలితం లేదు, ప్రతిసారీ ఆశతో ఏదో చికిత్సకి వెళ్ళడం నిరాశతో మానేయడం. అలోపతి, హోమియో, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఇలా అన్నీ ప్రయత్నించి విసుగుతో ఓ సంవత్సరంగా ఏమీ వాడకుండా వదిలేశాం! మరీ ఈ మధ్య లేచి తిరగలేనంతగా మంచం పట్టింది. ఆమె అదృష్టం, మీ హస్తవాసీ బాగుంటే నయమవక పోతుందా అనే ఆశతో ఇలా తీసుకువచ్చాను. ఈ ఊళ్ళో నా తమ్ముడు ఉన్నాడు, వాడు ఎంతో కాలంగా చెపుతున్నాడు ఈ సిటీ లోనే పేరు మోసిన డాక్టర్ మీరనీ, మీ వద్ద తప్పక నయమౌతుందీ అని” అతనే చెప్పుకు పోతున్నాడు. ఆమె మౌనంగా కూర్చుంది.

“సరే..! మీకు ఆకలి సరిగా ఉందా…” ఆమెని పరీక్షిస్తూ, ప్రశ్నలు మొదలు పెట్టాను. ఆమె అన్నింటికీ నిలువుగానో అడ్డంగానో తలూపటం తప్ప నోరు విప్పలేదు, సమాధానాలు అతడి నుండే వస్తున్నాయి. పరిక్షించటం పూర్తయినా అతను ఇంకా ఏవేవో చెపుతూనే ఉన్నాడు. ఆమె పడుతున్న ఇబ్బంది, తరచూ ఆమెకి కలిగే ఆరోగ్య సమస్యలూ, గతంలో వాడిన మందులూ, అతడే ఓపిగ్గా వివరంగా చెప్పుకు పోతున్నాడు.

“నిద్రలేమి వల్ల సైకోసొమాటిక్ ఇష్యూస్ అని ఇలా ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మీకు నిద్రలేమి తొలగిపోయి, సరిపడినంత నిద్ర పోవటం ప్రారంభమైతే ఈ సమస్యలు చాలా వరకు అవే తగ్గిపోతాయి. కొన్ని మెడిసిన్స్ రాస్తున్నా, వాడి చూడండి. వారం తరువాత ఓసారి కలవండి. ఎలా ఉందో చూసి మళ్ళీ ఆలోచిద్దాం” అతనితో చెపుతూ పెన్‌ చేతిలోకి తీసుకుంటూ ఓ సారి ఎందుకో ఆమె వైపు చూసాను.

అప్పుడే కళ్ళు ఎత్తి నా కేసి చూసిన ఆమె కళ్ళు ఒక్క క్షణం నా కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళలో నాకు చాలా చిరపరిచితమైన భావాలు! అప్రయత్నంగా చేతిలోని పెన్ను టేబిల్ పై పడేసాను. పరీక్షగా ఆమె కళ్ళలోకి చూసాను. ఎందుకో ఆమె కూడా నా కళ్ళ లోకే ధీర్ఘంగా చూస్తోంది. నా మనసుకి ఏదో తడుతోంది! జంతువుల్లో లాగే కొన్ని ఇన్‌స్టింక్ట్స్ మనుషుల్లోనూ కొన్ని సార్లు పనిచేస్తాయేమో! విశాలంగా, స్వచ్చంగా ఉన్న అందమైన ఆ కళ్ళలో నాకే తెలిసిన లోతులేవో ఉన్నాయి! తనది కాని ప్రపంచంలో నివసించే జీవి కళ్ళ లోని నిర్వేదం, జూ లోని జంతువు కళ్ళలో గూడు కట్టుకున్న నీడలు. నాకు బాగా తెలిసిన రోజూ చూస్తున్న అవే కళ్ళు .

నన్ను చూస్తున్న ఆమెలొ ఏదో సంచలనం, నా లాగే ఆమే ఏదో అర్ధమైనట్లుగా చూసింది.

టేబిల్ పైని ప్రిస్కిప్షన్‌ ప్యాడ్‌నీ పక్కకి తోస్తూ, “ఉహూ! ఇలా కాదు, మీరు చెప్పండి, మీరు ఏదైనా నోరు తెరచి మాట్లాడితే గాని నేను ఏ సంగతీ నిర్దారించలేను!” ఆమె కేసి సూటిగా చూస్తూ అడిగాను. ఐదు నిమిషాలు, కొత్త కేసులైతే పది నిమిషాలకు మించి ఏ పేషెంట్‌నీ చూడని నేను ఆమెతో మాట్లాడించనిదే ఈ రోజు ఇంకెవర్నీ చూడనని ఆ క్షణం లోనే డిసైడయి పోయాను!

“చెప్పండి! పోనీ మీ గురించి ఏదైనా మాట్లాడండి.”

“ఏముంది, నా గురించి?” నెమ్మదిగా శ్రావ్యమైన లోగొంతుకతో ప్రశ్నిస్తున్నట్లుగా సమాధానమిచ్చింది. ఆమె మాట్లాడటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించినట్టుగా తల తిప్పి ఆమె కేసి చూసాడు అతను.

“మీకు అభ్యంతరం లేకపోతే మీరు కాసేపు బైట కూర్చోగలరా?” అతని వైపు చూస్తూ అడిగి, ఆమె రియాక్షన్‌ కొరకు చూసాను.

“తప్పకుండా!” కుర్చీలోంచి లేస్తూ అన్నాడతను. అతడ్ని వారించకుండా మౌనంగా ఉండిపోయింది ఆమె.

“మీరు ఏదైనా నాతో చెప్పాలనుకుంటే సంశయించకుండా చెప్పవచ్చు. ఇష్టమైతేనే తప్పని సరి అనేం కాదు, మీరేం చెప్పకపోయినా ఫరావాలేదు,ఈ రోజుల్లో అన్ని వ్యాధులకీ మందులున్నాయి, నిజానికి మీకు ఏ వ్యాధీ లేదు, మీకు తప్పక నయమౌతుంది.”

“ఊ…” స్టూడెంట్ లా తలూపింది.

“మీ రొటీన్‌ ఎలా ఉంటుంది? ఏం చేస్తుంటారు? రాత్రి ఎన్ని గంటలకు బెడ్ మీదకి వెళతారు?”

“ఊ.. లేటే అవుతుంది, రోజూ పదకొండు దాటితే గానీ… భోజనాలూ అవీ అయి అందరూ నిద్రకొరిగే సరికి ఒక్కోసారి ఇంకా లేటవుతుంది.”

“ఊహూ… మీకు అబ్బాయి కదూ, తనూ అంతేనా?”

“వాడు టీవీ చూస్తాడు, త్వరగా నిద్రపోమని చెప్పినా వినడు. వాడు పుట్టినప్పుడు పసితనంలో రోజంతా పడుకుని, రాత్రులు నిద్రపోకుండా ఆటలు మొదలెట్టేవాడు.లైట్లు ఆఫ్ చేస్తే ఏడుపు అందుకునే వాడు!” మురిపెంగా చెప్పింది. తన కొడుకు గురించి చెప్పినప్పుడు ఆమె మొహంలో మెరుపు నా దృష్టిని దాటి పోలేదు. కొనసాగించమన్నట్లుగా తల పంకించాను.

1 2అంతా ఒకే పేజీలో

ఈ రచయిత నుంచే...

  • అటో యిటో
  • అసమర్థులు

ఇటువంటివే…

  1. కుతంత్రం
  2. మూడు జ్ఞాపకాలు
  3. రామా కనవేమిరా!

నవంబర్ 2008 సంచికలో ...

  • 2008 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు
  • 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ
  • A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu
  • అసమర్థులు
  • ఈమాట – నామాట
  • ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం!
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం
  • కుతంత్రం
  • జనరంజని: మహానటి సావిత్రి
  • డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష
  • తరువాతేమిటి?
  • తెలుగు కథల పోటీ
  • నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం
  • నాచన సోమన అపురూప పద సంచయం
  • నేనొక సాధారణ పాఠకుణ్ణి
  • పదేళ్ళ “ఈమాట” మాట
  • పళ్ళెం మాత్రం పగలగొట్టకు
  • పురూరవ
  • పురూరవ: శ్రవ్య నాటిక
  • బాలమురళీకృష్ణ సంగీతం
  • మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి
  • మనకు తెలియని మన త్యాగరాజు – 2
  • మరచిపొమ్మంటున్నారు
  • మూడు జ్ఞాపకాలు
  • రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా
  • రామా కనవేమిరా!
  • రెండు తీరాలు
  • సార్ గారండీ… సార్ గారండీ…
  • సువర్ణభూమిలో …
  • స్మైల్ ఒఖడే… ఇహ లేడు!
  • హిమపాతము
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కుతంత్రం
నాచన సోమన అపురూప పద సంచయం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.