!!!ఈమాట పాఠకులకు, రచయితలకు, సమీక్షకులకు, వ్యాఖ్యాతలకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
రెండు శ్రీల విరించి
శ్రీరంగం శ్రీనివాసరావు
02 జనవరి 1910 – 15 జూన్ 1983
తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఈ సంచికను శ్రీశ్రీ స్మారక సంచికగా విడుదల చేస్తున్నాం. మహా ప్రస్థాన కవితా విరించిని వీలైనంత సంపూర్ణంగా పునఃపరిచయం చేసే సంకల్పంతో కొన్ని పాత వ్యాసాలను, అలాగే శ్రీశ్రీ సాహిత్యంలో అంత ఎక్కువగా పరిశీలనకు రాని విషయాలపై కొన్ని కొత్త విశ్లేషణా విమర్శా వ్యాసాలను కలిపి ప్రచురిస్తున్నాం. శ్రీశ్రీ గురించి ఆయనమాటల్లోనే తెలుసుకునేందుకు ఆయనతో జరిగిన చర్చల ఆడియో రూపకాలు, శ్రీశ్రీ ఉపన్యాసం, కవితా పఠనపు వీడియోలూ ఈమాట పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తున్నాం. ఈమాట పాఠకులకోసం శ్రీశ్రీ కవితకి బాపూ బొమ్మల సంకలనం ప్రత్యేక ఆకర్షణ.
ఈ సంచికలో మీకోసం:
- శ్రీశ్రీ గురించి మూడు మాటలు -వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం
- కవితలు: కలైన గోర్వెచ్చని పాట – జాన్ హైడ్ కనుమూరి; హిమబిందు – ఉదయకళ; కలవరపెడుతుంది మనస్సును – సి.ఎస్.రావ్; వెదురు వేది – గొర్తి బ్రహ్మానందం; గాలిపటం – సమీర్ (మొదటి కవిత).
- ప్రత్యేక పునర్ముద్రణలు: శ్రీశ్రీ తాత్విక చిత్తవృత్తి – రాచమల్లు రామచంద్రారెడ్డి; మహాప్రస్థానం నుంచి మరోప్రస్థానం దాకా – చేకూరి రామారావు; విమర్శకుడిగా శ్రీశ్రీ – చేకూరి రామారావు; శ్రీశ్రీ కవిత్వంపై… మరో వ్యాసం – సంపత్; చరమరాత్రి – శ్రీశ్రీ. మహాకవి శ్రీశ్రీ – డా. జి. వి. సుబ్రహ్మణ్యం
- ప్రత్యేక వ్యాసాలు: శ్రీశ్రీ ఛందఃశిల్పము – జెజ్జాల కృష్ణ మోహన రావు; శ్రీశ్రీ అనువాదాలు-ఒక పరిశీలన – భైరవభట్ల కామేశ్వర రావు; శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు – విన్నకోట రవిశంకర్;రెండు శ్రీల కవి – వెల్చేరు నారాయణరావు.
- శబ్ద తరంగాలు: శ్రీశ్రీతో ముఖాముఖీ 1 – అనిసెట్టి సుబ్బారావు; శ్రీశ్రీతో ముఖాముఖీ 2 – పన్నాల సుబ్రహ్మణ్య భట్టు; శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని – ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
- చిత్ర తరంగాలు: పిట్స్బర్గ్ నగరంలో శ్రీశ్రీ ఉపన్యాసం, తెలుగు వీర లేవరా, మరో ప్రపంచం పిలిచింది కవితా పఠనం.
- శీర్షికలు: సామాన్యుని స్వగతం: పాఠం చెప్పటం – వింధ్యవాసిని; నాకు నచ్చిన పద్యం ధర్మజుని గుణవిశేషం – చీమలమర్రి బృందావనరావు;
- వ్యాసాలు:కృష్ణం వందే జగద్గురుం – కొడవటిగంటి రోహిణీప్రసాద్; గుండుగొమ్ములనుమానం 1 – కనకప్రసాద్.
- శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మల ప్రత్యేక సంకలనం.
ఎప్పటిలాగే మీ అభిప్రాయాలనూ సద్విమర్శలను తెలియజేస్తారనీ, మీ ఆదరాభిమానాలు ఇకముందు కూడా మాకు ఉంటాయనీ ఆశిస్తున్నాం.
ఈమాట సంపాదకులు.