ఈమాట నవంబర్ 2009 కొడవటిగంటి కుటుంబరావు స్మారక సంచికకు స్వాగతం!
గతశతాబ్దపు సాహిత్యకారుల్లో ప్రముఖుడిగా పేరెన్నిక గన్న కొడవటిగంటి కుటుంబరావు గారి (అక్టోబర్ 28, 1909 – ఆగస్ట్ 17, 1980) శతజయంతిని పురస్కరించుకొని ఈ ఈమాటను కొ.కు స్మారక ప్రత్యేక సంచికగా మీకు సమర్పిస్తున్నాం. కొడవటిగంటి ఉత్తరాలు, విమర్శకుడు రా.రా, మహీధరల వ్యాసాలు, భారతి పత్రికలో బుర్రా సుబ్రహ్మణ్యం విమర్శ కొడవటిగంటి ప్రతివిమర్శా, పాలగుమ్మితో రేడియో చర్చ, అలాగే కొడవటిగంటి రోహిణీప్రసాద్, విష్ణుభొట్ల లక్ష్మన్న, కొడవళ్ళ హనుమంతరావుల కొత్త వ్యాసాలు ఈ సంచిక ప్రత్యేకం.
అంతేకాకుండా ఈ సంచికలో మీకోసం:
- ఇటీవలే అర్ధాంతరంగా మరణించిన పౌరహక్కుల ఉద్యమనేత, సామాజిక మేధావీ కే. బాలగోపాల్ పై సంపాదకీయం.
- కవితలు: పత్రపతనకాలము – డా. దేశికాచార్యులు; నింగి-నేల – విన్నకోట రవిశంకర్; ప్రశ్న – మాకినీడి భాస్కర్; నాయినమ్మ ఇల్లు – వినీల్ గట్టు; రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది – పాలపర్తి ఇంద్రాణి; రెండు అమెరికన్ రుతాలు – హెచ్చార్కే.
- కథలు: అమ్మ ఉత్తరం – జేయూబీవీ ప్రసాద్; ఎవరి బిడ్డ ఇది – హేమ వెంపటి; “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ – లైలా యెర్నేని.
- సామాన్యుని స్వగతం: లలిత ప్రబంధాలనే కన్నడ సాహితీ ప్రక్రియను ఈమాటకు పరిచయం చేస్తూ ఒక కొత్త శీర్షికలో వింధ్యవాసిని వ్యాసం: మా అమ్మ – నడిచే బడి.
- కొ.కు రచనలపై ప్రత్యేక వ్యాసాలు: కొ.కు రచనలలో కుటుంబ నేపథ్యం – కొడవటిగంటి రోహిణీప్రసాద్; కొడవటిగంటి సాహిత్యంతో ఇంకా అవసరం ఉందా – విష్ణుభొట్ల లక్ష్మన్న; ఐశ్వర్యం – ఒక పరిచయం – కొడవళ్ళ హనుమంతరావు.
- ప్రత్యేక పునర్ముద్రణలు: ప్రాణాధికం – కొ.కు రాసిన మొదటి కథ; భావుకుల రచయిత కొ.కు. – రా.రా.; కొ.కు. స్వగతం పై విమర్శన – బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం; బుర్రా విమర్శకు కొ.కు. సమాధానం; రచయిత ఆర్. సుదర్శనానికి కొ.కు రాసిన ఉత్తరాలు (1, 2, 3). పాలగుమ్మి పద్మరాజు, కొ.కు ల రేడియో ప్రసంగం తన రచనల గురించి, మహీధర రామమోహనరావు వ్యాసం తన రచనల గురించిసమాజంలో స్త్రీ స్థానం.
- ఇంకా: నాకు నచ్చిన పద్యం శీర్షికలో శ్రీనాధుని మధుకేళి వర్ణనపై చీమలమర్రి బృందావనరావు వ్యాసం; విశ్వాంతరాళం పుస్తకాన్ని పరిచయం చేస్తూ జాస్తి జవహర్లాల్; ఇటీవలే జరిగిన డీటీఎల్సీ – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతుత్సవ సభలపై జే.కే. మోహనరావు గారి సమీక్ష, 2009 బ్రౌన్, ఇస్మాయిల్ అవార్డు విజేతల ప్రకటన, మనలో మనం సభకు ఆహ్వానం.
ఎప్పటిలాగానే మీ అభిప్రాయాలనూ సద్విమర్శలను తెలియజేస్తారని ఆశిస్తున్నాం.