20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ

వ్యాహహారిక భాషలో మొట్టమొదటి తెలుగు కథ గురజాడ అప్పారావు గారి కథ “దిద్దుబాటు”. 1909 ఫిబ్రవరిలో ఆ కథ ప్రచురించబడింది. ఈ సందర్భంలో, 2009 వ సంవత్సరం దేశవ్యాప్తంగా సాహితీసంబరాలు చేయటానికి సాహితీపిపాసులంతా సన్నద్ధులవుతున్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 – 15, 2009 లలో హైదరాబాదులో “తెలుగు కథ శతవార్షికోత్సవం” పేరున సభలు జరపటానికి నిశ్చయించడం జరిగింది. ఈ సందర్భంలో అమెరికన్‌ తెలుగు రచయితల నూరు కథలు, కథకుల వివరాలతో ఒక బృహత్సంపుటి వెలువరించాలని వంగూరి ఫౌండేషన్‌ నిర్ణయించింది. అందుకు మీ అందరి సహకారం అర్థిస్తున్నది.

పూర్తి వివరాలకు: 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ (pdf)