వేద పండితుడు ప్లస్ సంస్కృత మాష్టారి కూతురిని పెళ్ళిచేసుకొని తప్పు చేశానని వెయ్యిన్నొక్కోమారు విచారించాడు ప్రద్యుమ్నుడు. ఈ విషయంపై చర్చను పొడిగిస్తే ఆమె వేదాలు, పురాణాలు చెబుతుందేమోనని భయపడ్డాడు కూడా. మొన్నీమధ్యనే ఒకడు దైవదూషణ చేసి బ్రహ్మరాక్షసుడైన కథను చెప్పింది. పైగా వర్క్ ఈజ్ గాడ్ అనీ, పనియే ప్రత్యక్షదైవం అనీ తేల్చిచెప్పింది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: బులుసు సుబ్రహ్మణ్యంఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://bulususubrahmanyam.blogspot.com/
రచయిత గురించి: హాస్యరచయితగా బ్లాగ్లోకంలో ప్రసిద్ధులు. ఇటీవలే వారి రచనల సంకలనం "బులుసు సుబ్రహ్మణ్యం కథలు" ప్రచురించారు.
బులుసు సుబ్రహ్మణ్యం రచనలు
ప్రద్యుమ్నుడికి వంటచేయడం హాబీ కాదు. తినడమే కానీ వంట చేయడం రాదని సగర్వంగానే చెప్పుకుంటాడు. భార్య ఎప్పుడైనా, చాలా అరుదుగానైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వంట చేసుకునే వాడు కాదు. ఆ పది పదిహేను రోజులు బ్రహ్మచారుల మెస్సులోనే నేపాలీ వంట తినేసేవాడు. జోర్హాట్‌లో ఆ కాలంలో వంటమనిషి దొరికేవాడు కాదు. అందుకని ఇన్‌స్టిట్యూట్ కేంటీనులో ఒక నేపాలీ వాడిని కుదుర్చుకున్నారు.
తిరిగి వచ్చేటప్పటికి మా ఆవిడ టెలిఫోనులో ఎవరితోనో మాట్లాడుతోంది. నేను బట్టలు మార్చుకొని వచ్చేటప్పటికి ప్రభావతి ఫోన్ పెట్టేసింది. ఒక పదిహేను నిముషాలు నిశ్శబ్దంగానే గడిచింది. ఒక్కొక్కప్పుడు నిశ్శబ్దం భరించడం కూడా కష్టమే. తొందర పడ్డానేమోనని అనిపించింది. ఒక లక్ష పెట్టి చేయిస్తే ప్రభావతి కోరిక తీరుతుందేమో ననిపించింది కూడాను. ఈ భావం ఒక నిముషం కన్నా నిలువలేదు. ఉన్న నాలుగూ లాకర్లోనే ఉన్నాయి. రెండు జతల గాజులు కూడా.
అబ్బాయిని కోడలు వినకుండా మందలించింది పార్వతమ్మ. ఓ వెఱ్ఱినవ్వు నవ్వి ఊరుకున్నాడు అమ్మూ. కోడలికి చెప్పాలంటే సంకోచపడింది ఆవిడ. గౌరీశంకరం గారు కూడా నోరు మెదపలేదు. అమ్మాయికి చెప్పే స్వతంత్రత లేదని అన్నారు. అమ్మాయి తల్లి తండ్రులు చెపితే బాగుంటుందేమో ప్రస్థుత పరిస్థితులలోయని పార్వతి దగ్గర అభిప్రాయపడ్డారు.
నేను విత్తనాలు నాటి ఇప్పటికి పదేళ్ళయింది. ఉదయం తొమ్మిది గంటలకి నేను, తెల్ల పొడుగు చేతుల చొక్కా వేసుకొని, చొక్కా మీద తెల్ల గ్లాస్కో పంచె ధరించి, నల్ల బెల్టుతో పంచె బిగించి, వంకాయ రంగు కోటు ధరించి, తెల్ల తలపాగా కట్టుకొని, నా ఆఫీసులో అడుగు పెట్టాను. నాకు భారతీయ సంస్కృతి అన్ననూ అందులో తెలుగు సంస్కృతి యన్ననూ మిక్కిలి మక్కువ.
“అమాయకపు జూ. శ్రీరంజనీ, ధర్మసూక్ష్మ మెరుగవు నీవు. యోగా అనగా నేమి? క్రమ పద్ధతిలో గాలి పీల్చుట, వదులుట. టివిలో ఆ యోగా గురువు, కాళ్ళూ, చేతులూ నానా రకాలుగా పెట్టించి, యే ఆసనం వేయించినా, ప్రతీ ఆసనం లోనూ గాలి ఘట్టిగా పీల్చి వదులుడూ, అని చెపుతాడు కదా.”
మన డబ్బు కోసమే ఒప్పుకుంటున్నాడు అని కోపంతో అరిచింది ఈవిడ. పెద్దావిడకి పిచ్చ కోపం వచ్చేసింది. నీ అందం చూసి ఎవడూ రాడు, నీ డబ్బుకోసమే వస్తాడు అంటూ చెడామడా తిట్టింది ఆవిడ. నన్ను చూసి చేసుకునే వాడు దొరికినప్పుడే చేసుకుంటాను అని ఇంకా ఘట్టిగా అరిచింది ఈవిడ. చివరికి మన వెంకట్ కూడా నిన్ను చూసి చేసుకోడు…
బ్రహ్మగారు ఎంత చెప్పినా పశుపతికి భార్యోత్సాహ పద్యం పాడుకోవాలనే ఉబలాటం తగ్గలేదు. కష్టమైనా, నిష్ఠురమైనా సాధించాలని బలంగా కోరుకున్నాడు. లహరి మహా దొడ్డ ఇల్లాలు అని భార్య పేరు పొందాలని, తద్వారా లహరీపశుపతులు ఆదర్శ దంపతులు, ఒకరి కోసమే మరొకరు పుట్టారు అనిపించుకోవాలని తీర్మానించుకున్నాడు. ఘోర ప్రతిజ్ఞ చేసుకున్నాడు.
గత నాలుగు నెలలగా మన ఇంట్లో పొదుపు ఉద్యమం సవ్యంగా సాగిపోతోంది. రేపు మనం నవ్వుతూ బతకడానికి ఈ వేళ ఏడ్చినా ఫరవాలేదు అనే పొదుపు ధర్మ సూత్రం ఆధారంగా, రేపు మనకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని ఈ వేళ సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉద్రేకంతో పొదుపు చేసేస్తున్నాం.
నేను ముందు గది అంటే మా ఆవిడ నా కేసి చురచురా చూస్తుంది. దాన్ని డ్రాయింగ్ రూము అని పిలవాలిట. ఒక టీవీ, నాలుగు కుర్చీలు, నా లాప్టాపూ తప్ప మరేమీ లేని ఆ రూముని అలా పిలవాలంటే నాకు మనస్కరించదు.