అగాధం

గదిలో ఫాన్‌తిరగదు

బల్లి నాలుకపై జిగురు ఆరదు

పాత రహదారుల మీదే కొత్త రహదారులు వేస్తారు

మరణించిన మహామహులు నగరంలో విగ్రహాలై మొలుస్తారు

చీమలు ముద్దుల పరామర్శలతో తిరుగుతాయి

స్నానాలగదిలో గచ్చుమీద ప్రతిబింబాలు నర్తిస్తాయి

నెప్య్టూన్‌చందమామలో అగ్నిపర్వతాలు పేలి మంచులావాను కక్కుతాయి

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...