రంభలతో నిండి వున్న
ముంబయికో
నమస్కారం
స్తంభంలా నిలుచున్న
నన్ను చూడు
పిండి వేసే విచారం.
సరదాలకు హద్దుండదు
పరిచయం లేని లోయల్లోకి
పరికిణీ వదిలేసి
పరుగులు తీస్తుంది నీరు!
పిరికి ప్రియురాలు రైలు
సొరంగాల చీకట్లో
అరకొర దీపాలు..
మరచిపోయింది చాలు.
పచ్చిక కప్పిన
పశ్చిమ కనుమల్లో
నిశ్చింతగా ఎగురుతోంది
పిచ్చుక ఒకటి.
నగలా అమరింది
పొగమంచు తెర
నగరంలో ఏముంది
తగరం ఎర