నే నిద్దుర లేచినపుడు నాతోనే లేచింది
ఆపై ప్రతి అడుగులోన నావెంటే నడిచింది
ఉద్యోగం దొరికినపుడు ఉద్వాసన కలిగినపుడు
ఉల్లాసం కలిగినపుడు ఉద్వేగం రేగినపుడు
నా వూసుల వెనుపూసై ఎల్లెడలా తిరిగింది
నా శ్వాసల, ప్రతి ఆశల రూపంలా తోచింది
నా జీవన గమనంలో సారథిగా నడిచింది
నిదురించిన సమయంలో నాతో పవళించింది
అయిన వాళ్ళనొదిలినపుడు అందలాలనెక్కినపుడు
అమెరికాకు వచ్చినపుడు అందరు గుర్తొచ్చినపుడు
నా కన్నీటి వెచ్చదనం తానే అని అంటుంది
ప్రతి హాసపు మూలధనం తనలోనే వుందంది
మరణంలోనైన కూడ తానే తోడంటుంది
నా దేశపు జ్ఞాపకమది నాతోనే వుంటుంది