మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నని, నేను పలానా పుస్తకంలోనో పత్రికలోనో చదివానని బుకాయించటం లేదని బ్రహ్మానందం గారు నమ్మగలిగితే చాలా ధన్యుడిని. వికీపీడియాలో ఉన్నదంతా ప్రామాణికమూ, వాస్తవమూ అని నమ్మడం కష్టం అన్నమాట అక్షరసత్యం. అసలు వెబ్ ఆధారంగా తెలియవచ్చేవి చాలావరకు నమ్మశక్యం కానివే ఉంటున్నాయేమో కూడాను.
నెట్టింట గాలించగా హిండూపత్రిక వ్యాసం ఒకటి ఒకటి రచయిత పేరూ మెయిల్ ఐడీతో సహా ఉన్నది, ఈవిషయం గురించి ప్రస్తావించేది కంటబడింది. ఆవ్యాసం తాలూకు లింక్
ముఖ్యంగా నేను ఏదో సంగీతం విని కొంచెం ఆనందించగల వాడినే కాని ఆరంగంంలో పాండిత్యప్రతాపాలేమీ ఉన్నవాడిని కాను. ఒకవేళ మధురానగరిలో పాట వేరొకరిదో త్యాగరాజ స్వామిదో అని బ్రహ్మానందం గారు ప్రమాణికమైన ఆధారం వద్ద చదివి ఉంటే ఉండవచ్చును. నా అవివేకం ఉంటే మన్నించగలరు. ఏదో నా యెఱుకకు వచ్చిన విషయం మనవి చేసాను కాని అంతకంటే ఏమీ లేదు.
‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నన్నది నా అభిప్రాయం కాదండీ. మీరన్నట్లు ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన అది చిత్తూరు వారి రచన అనే అభిప్రాయం ప్రామాణికం అవదు కాని ఆంధ్రజ్యోతిలోని ఆ వ్యాసంలో ఆ మాట చెప్పినది సాక్షాత్తూ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గారి కుమార్తె రేవతీ రత్నస్వామి గారు. నిజానికి జ్యోతిలో వచ్చినది ఒక వ్యాసమో ఆవిడతో ముఖాముఖీయో నాకు ఇప్పుడు గుర్తులేదు. వచ్చి ఇరవైయేళ్ళదాకా అయ్యుండవచ్చును. ఆంధ్రజ్యోతివారి నుండి ఆ వ్యాసం సేకరించగలిగితే స్పష్టత వస్తుంది.
ప్రహ్లాద భక్తి విజయము లోని కందపద్యం ఈవ్యాసంలో కొన్ని తప్పులతో వచ్చింది.
కం: శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది సంధ్య రఘుకుల తిలకా
రాజీవ నయన మునిజన
పూజిత పద రామచంద్ర పుణ్యము చరితా
ఈపద్యం ఆంధ్రభారతి వారి సైటులో కూడా కొంత తప్పుగానే ఉంది. aarchive.org వారి సైటులో ఈపుస్తకం (ప్రచురణకు సంబంధించిన వివరాలు లేకుండా) లభిస్తోంది. అందులో ఉన్నపాఠమే ఆంధ్రభారతిలోనూ ఉంది.
అని. ఈపాఠంలో చివరి మాటను పుణ్యచరిత్రా అని సవరించితే ఛందస్సుకు సరిగా ఉంటుంది. ఈమాట వారి వ్యాసంలో వంద్యకు బదులు సంధ్య అని అదనపు తప్పు దొర్లింది. అంతే కాక పుణ్యచరిత్రా బదులు పుణ్యము చరితా అని ఉండటం జరిగింది. ఈ రెండు తప్పుల వలనా ఛందోభంగం జరుగకపోవటం విశేషమే కాని సరిజేసు కొనక తప్పదు.
మరొక్క మాట. సంస్కృతసమాసాలను మధ్యలో స్పేసెస్ ఇచ్చి వ్రాయటం సంప్రదాయం కాదు. సమాసం అంటే సాంకేతికంగా అది ఒకే పదం కాబట్టి దానిలోని పదాలను విడివిడిగా వ్రాయకూడదు. కాని ఈమధ్య అలా వ్రాయటం తరచుగానే చూస్తున్నాం.
[ ఛందోదోషమును, సమాసపదచ్ఛేదదోషమును చూపినందుకు ధన్యవాదాలు. సరిచేసినాము. — సం. ]
వేలూరి గారిని “అమెరికాలో అర శతాబ్దం” పేరిట తమ అనుభవాలు -జ్ఞాపకాలు గ్రంధస్తం చేయమని కోరాను. ఈ ఇంటర్వ్యూ చదివాక ఆయన తప్పక ఈ పని చేయగలరని అనిపించింది. అభిరుచి ఉన్నవారు ఆత్మ చరిత్రలు రాసుకోవడం వల్ల ఎన్నో లాభాలు. సంజీవదేవ్ గారి ‘తెగినజ్ఞాపకాలు’ చదవక పోతే ఆయన గురించి నాకు తెలిసేదే కాదు. (ఆయన ఆత్మచరిత్ర ద్వారా కలిగిన పరిచయం నాకు ఎంత గానో లాభించింది. తత్వశాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, రస శాస్త్రము, మనస్తత్వ శాస్త్రాలు, చిత్రకళా చరిత్ర — ఇలా అనేకము చిన్న వయసులో అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది). తెలుగు వారికి హైకూలు పరిచయం చేసింది ఆయనే. టర్నర్ రంగుల ప్రపంచం గురించి, Constable చిత్రకళ Turner కన్నా ఏ రకంగా భిన్నం? – ఇవన్నీ ఆయన ద్వారా తెలిసి వచ్చిన విషయాలే. ఒక చిత్రకారుని గురించి లోతులకు పోకుండా తెలుసుకోవడం వేరు – చిత్రకారుని ఆత్మను పట్టుకొని చిత్ర శైలీ పరిణామాన్ని గుర్తెరిగి ఆనందించడం వేరు. ఇవన్నీ, ఎంతో క్రమశిక్షణతో, దక్షతతో చేయవలసిన పనులు.
ఇక తెలుగులో కవిత్వం, అనువాదం – ఈ విషయాలకొస్తే – మనవారిలో పీఠాధిపతులు, వారికి అడుగులకు మడుగులొత్తి పాదసేవలో తరించే భక్త బృందాలు అధికం. కార్యరంగం విజయవాడైనా, విస్కాన్సిన్ ఐనా దృశ్యం మారదు. స్నేహాలు వేరు, విమర్శలు వేరు అన్న స్పృహే లేదు. కవిత్వం, అనువాదాలు, వాటిపై వచ్చే విమర్శను సీరియస్ గా పట్టించుకోవాలి అన్న వివేకం మన వారికి లేదు. మనకు కావలసింది భజన బృందాలు.
కొడవళ్ళ గారు ప్రస్తావించినట్టు ఇంటర్‌వ్యూలో అక్కడక్కడా స్పష్టత లేదు. పాద పీఠికలు ఇవ్వాలి – text without context leads to utter confusion -సందర్భ శుద్ధి లేని వచనం, గందరగోళానికి దారి తీస్తుంది.
చక్కగా ఇంటర్వ్యూ చేసినందుకు పరుచూరి, గొర్తి గార్లకు, ఇచ్చినందుకు వేలూరి గారికి, ప్రచురించినందుకు సంపాదకులకు, కృతజ్ఞతలు. అమూల్యమైన ప్రచురణ అయినా, ఒకటి రెండు నచ్చనివి ప్రస్తావిస్తాను.
“శ్రీశ్రీ అమెరికా వచ్చారా?” అని అడిగి, వెంటనే, “మీరు శ్రీశ్రీగారి మాటల్ని రేడియో స్టేషన్‌లో రికార్డు చేయించారు కదా!” అనడం అసంబద్ధంగా ఉంది.
“ప్రసాదరావుగారు మాట్లాడలేక పోయేవారు. అప్పటికే మాట పోయింది. పేపర్ మీద నోట్ లాగా రాసిస్తుండేవాడిని. … చలసాని ప్రసాదరావుగారి గురించి తెలుసుకోవాలంటే… He is a peculiar person. చాలా తక్కువమందికి తెలుసును.”
చిన్నప్పుడే చలసానికి జబ్బు వచ్చి వినికిడి పోయిందని చదివాను; అందుకే నోట్ రాసి చూపెట్టడం, మాట పోయినందుకు అయి ఉండదు. సందర్భం కళ కావున చలసాని దాంట్లో ఏం సాధించారో, చెప్తే, అడిగితే, బావుండేది.
“ఏదో తామర కొలనులో మందారం పువ్వో అదేదో… మన అంపశయ్య నవీన్ రాశాడు దానిమీద. దట్స్ నాట్ క్రిటిసిజమ్. ఆయన సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయలేదని. పోనీ నువ్వు చెయ్. ఇంతకంటే బెటర్ ట్రాన్స్‌లేషన్ నువ్వు చేసి చూపించు. (తమ్మినేని యదుకుల) భూషణ్‌తో కూడా ఇదే గొడవ. భూషణ్ బాగా చదువుకుంటాడు. ఉమాకాన్తమ్‌ని గుర్తుంచుకున్నామా? లేదు. … కావ్యం మీద పుస్తకమే రాశాడాయన. నేటికాలపు కవి ఎలావుండాలి? అనో ఏమో. చదివారా మీరా పుస్తకం? ఏమైంది, ఎవరు గుర్తున్నారు? ”
ఇక్కడ రచనలని నిర్దిష్టంగా ప్రస్తావించకపోవడం, ఇంకాస్త లోతుకు వెళ్ళి తెలుసుకుందామనుకునే చదువరులలో, గందరగోళం కలిగిస్తుంది. “తామర కొలనులో మందారం,” అంటే వెల్చేరు, “Hibiscus on the Lake,” మనసులో మెదిలింది. దానిని నవీన్ విమర్శించారా? ఎక్కడ? తమ్మినేని, “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు,” లో “వెల్చేరు… ఏమి తేల్చారు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. మందారం తేల లేదు … సరికదా,” అన్నారు. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల, “నేటికాలపు కవిత్వం,” పీఠికలో చేకూరి, “సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతం గారి నిర్ణయాలు ముఖ్యం కాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాస్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు,” అన్నారు.
“నేను సంపాదకునిగా ఉన్నన్నాళ్ళు, ఈమాటకు ఆ రకమైన స్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించాను.”
వేలూరి గారు “ఈమాట” ని న్యూయార్కర్ పత్రిక స్థాయిలో మలచాలని యత్నించడం చెప్పుకోదగ్గ విషయం. మొన్న నా వ్యాసానికి చివరి మెరుగులు దిద్దుతుండగా, సంపాదకులతో నేను ‘కామా’ ల గురించి తర్జన భర్జన పడాల్సొచ్చింది. విరామ చిహ్నాలవరకైనా, ఈమాట న్యూయార్కర్ పద్ధతిని అవలంబిస్తే బావుండు.
చివరగా, వేలూరి గారితో నాకు ఇరవై ఏళ్ళ క్రితం, డెట్రాయిట్ లో తానా సభల సందర్భంగా పరిచయం. కన్నెగంటి రామారావూ, నేనూ కాలువ పక్కన నడుస్తూ వేలూరి గారితో మాట్లాడుతుంటే, వారన్న ఓ మాట, “శ్రీశ్రీ కవిత్వం లోని మాటల కర్థం తెలియకుండానే పొగిడే వాళ్ళు అనేకం,” నాకిప్పటికీ గుర్తు. “షెల్లీ కవనపు హల్లీసకమూ,” అని తన్మయించడమే కాని, హల్లీసకం అంటే అర్థం తెలియదే అని నేను మనసులో అనుకున్నాను. అప్పటి నుండి, నా చదువు కాస్త కుంటు పడింది – అర్థం తెలియని పదం తగిలితే, నిఘంటువులో వెతక్కుండా ముందుకు పోలేక. అందుకూ, మరెన్నెటికో మార్గదర్శకులుగా ఉన్నందుకూ, శ్లాఘనీయులైన వేలూరి గారికి కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు
శ్లోకము గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/02/2025 9:01 am
వాగ్వల్లభ దుఃఖభంజనము పుస్తకం కోసం నేను ఇంటర్నెట్ గాలించి లాభం లేకపోయింది.
వ్యాసకర్త గారు కాని మరెవరైనా కాని ఈవిషయంలో ఏమైనా సహాయం చేయగలరా?
తిరుపతిలో తెలుగు భాషోద్యమ సమితి 20వ వార్షికోత్సవంలో కలిసాము. ఇన్నాళ్ళకు మళ్ళీ మీ సోబగైన తెలుగు చదువుతుంటే కలిగిన ఆనందం చెప్పనలవి కానిది. మళ్ళీ కలిసే భాగ్యము ఎప్పుడో.
సంపాదకమహాశయులు ఈ తీగను పట్టుకుని చదువరులు ఆయన ఆత్మకథలోని శతాపత్రాలను చదువాలనేది మా పెద్ద కోరిక అన్నారు. చాలా సంతోషం. బహుసముచితమైన కోరిక. చదువరులు ఎంతమంది ఆకోరికను తీర్చటానికి పూనుకుంటారో తెలియదు. అలా పూనుకొని తీర్చినవారు ఇక్కడ తెలియజేస్తే సంపాదకులతో పాటు చదువరులూ మిక్కిలి సంతోషిస్తారన్నది నిర్వివాదం అనుకుంటాను.
నేను గడియారం రామకృష్ణశర్మ గారి ఆత్మకథ ‘శతపత్రము’ కోసం https://archive.org/ సైటును ఆశ్రయించి చూచాను కాని అది అక్కద లభ్యం కాలేదు. అక్కద వారి రచనలు మన వాస్తుసంపద, విజ్ణానవల్లరి, తెలుగులో పదకవిత కనిపించాయి.
ఈ పుస్తకం మీద సమీక్ష ఒకటి నాకు https://pustakam.net/?p=19853 అనేది కనిపించింది. కనీసం ఏడేళ్ళ క్రిందటి వ్యాసం అనుకుంటాను. ఇంకా చదువలేదు. కొంచెం పెద్దది గానే ఉందది. వ్యాసం మొదట్లోనే పుస్తకం లభించు చోటు ‘ఇది’ అంటూ ఒక లింక్ ఇచ్చారు సహృదయంతో. దురదృష్టవశాత్తు ఆలింక్ ఇప్పుడు పనిచేయటం లేదు.
ఈపుస్తకం Navodaya Book House, Hyderabad వారి వద్ద లభిస్తుందని ఒకచోట చూసాను. వారిని సంప్రదించి చూడాలి. మరొక రకంగా లభ్యం అవుతోందా అన్నది తెలియదు. సంపాదకులకు గాని, చదువరుల్లో ఎవరికైనా గాని తెలిస్తే చెప్పవలసిందిగా విన్నపం చేస్తున్నాను.
Essentially,
‘రాధికా సాంత్వనము’ కామకేళి గురించిన పద్యముల కూర్పు. ఇందులో ఒక మగవాడు, ఇద్దరు స్త్రీల సంభోగం గురించిన కథ ఉంటుంది. జరిగే ప్రదేశం వ్రేపల్లె. మగవాడు కృష్ణుడు. ఆడవాళ్లు రాధ, ఇళ. ఈ కథలో రాధ కృష్ణుడి మేనత్త. ఆమె తన మేనల్లుడు చిన్న వయసులో ఉన్నప్పుడే సెక్స్ పాఠాలు చెప్పి, అతడితో కామకలాపాలు జరుపుతుంది. కాలక్రమాన ఆమె, కృష్ణుడికి చిన్నపిల్ల, అతని మరదలు ఐన ఇళనిచ్చి పెళ్లి చేయిస్తుంది. ఇళ రజస్వల కాగానే ఆమెతో, కృష్ణుడితో రతి కార్యక్రమాలు మొదలెట్టిస్తుంది. ఇళకు కామశాస్త్రం నేర్పింది కూడా రాధయే. ఇక ఆపైన, ఒక్క మగవాడిని పంచుకోటంలో ఆ ఇద్దరు ఆడవారికి కలిగే ఇబ్బందులు సబ్బందులు, తమ శారీరక కోర్కె అవసరాన్ని బట్టి పరస్పర సానుభూతి, సహాయాలు; తాత్కాలిక విరోధాలు, విలాపాలే ఈ కథ సారాంశం.
ఎమెస్కో పబ్లికేషన్ లో, కేవలం సెన్సార్ చెయ్యబడిన -రతి అతిగా ఉన్న పద్యాలు- చదువుకోవాలంటే, ఆరుద్ర తన పరిచయంలో వీలుగా లిస్ట్ ఇచ్చాడు. నేను లైబ్రరీ నుండి ఫ్రెంచ్ బూదలేర్ పొయట్రీ తెచ్చుకున్నప్పుడు కూడా సెన్సార్ చెయ్యబడిన పద్యాలకు అంతకు ముందు పాఠకులు చక్కగా గుర్తులు పెట్టారు. మంచి పని. ముందుగా అవే చదివాను. తెలుగు పద్యాలు, ఫ్రెంచ్ పద్యాలు ఏవి సెక్సీగా ఉన్నవని రెండూ చదివిన పాఠకులు నిర్ణయించుకోవచ్చు.
ఈ కథ ముద్దుపళని ప్రబంధ శైలిలో రాసింది. ఆమె తన సమకాలీనులకు తన పాండిత్యం చూపటానికి ఆ ప్రక్రియను ఎంచుకున్నది. అందువల్ల ప్రబంధాల తరహా -ప్రారంభం, అంకితం, ఆశ్వాసాల ముగింపులు, పదే పదే, అవే చంపకమాలలు, కందాలు, సీసాలు, గద్యాలు వాడుతూ, వాటి ఛందస్సులు, వ్యాకరణం, ఆయా రూల్స్ పాటిస్తూ రాసింది. ఆ రూల్స్ గురించి తెలిపే చక్కని వ్యాసాలు ‘ఈమాట’ పత్రికలోనే ఉన్నవి. అవి చదువుకుని, ఆసక్తి ఉన్నవారు ఇప్పటికీ తెలుగు ప్రబంధాలు రాయవచ్చును. అవి మునుపటి వాటికన్నా బాగానూ ఉండొచ్చును.
పళని తను సంగీత సాహిత్య భరతకళావిశారద నని చెప్పుకున్నది కాని ఆమె కామకేళి గురించే ప్రధానంగా రాసింది. ఎంతైనా ఆమె కోర్టిసాన్ కదా. సంఘంలో ఆడ మగ మధ్య రతి సంబంధాలు, పెళ్లిళ్లు, ఆమె కాలం నాటివే. పళని వాడినన్ని తెలుగు సామెతలు, మా తెలుగు మేనత్తలు కూడా వాడలేదు.
మా మేనత్తలు -వాళ్లు రైటర్లు, సానులు కారుగాని, ఇరవయ్యో శతాబ్ది పూర్వార్ధపు తెలుగు ప్రపంచం, వితంతుతనం, పునిస్త్రీతనం, బాల్య వివాహాలు, మగవాడి రెండో, ఇంకా ఎక్కువో పెళ్లిల్లు, స్త్రీని ఉంచుకోటాలు, వారితో లేచిపోటాలు, ఇంట్లోనే అక్రమ అవినీతి సంబంధాలు, రంకు పుటకలు, అబార్షన్లు, ఒకరి సంతుని ఇంకొకడిదిగా చెలామణి చెయ్యటాలు, ఈ వ్యవహారాల సమాచారాలన్నీ బాగా తెలుసు. మొదటికి వారు పల్లెటూరి గొల్లభామలు కదా. వారు చెప్పిన సమాచారం బట్టి, నాకు తెలియని హాఫ్ సిస్టర్సో, బ్రదర్సో, కజిన్సో, కొందరు అక్కడక్కడా ఉండే ఉంటారు బహుశా.
రాధికాసాంత్వనం ప్రబంధకావ్యంలోని ఇద్దరి ఆడవాళ్ల రభసలు, తిట్టుకోటాలు, తన్నటాలు, తన్నించుకోటాలు, వెళ్లగొట్టటాలు, వెళ్లిపోటాలు, మగవాడి అపేక్ష కోసం పోటీలు -నాకు ఇంగ్లిష్ లో ఈమధ్యే చదివినట్టు అనిపించాయి. ఎవరా అలాటి రచన చేసింది అంటే ఆశ్చర్యంగా అది సమకాలీనుడైన అమెరికన్ మగవాడు. పాపా హెమింగ్వే.
His novel ‘The Garden of Eden’ is set in Southwest France coast, close to Spain. It is about sexual issues, between two women and one man. Catherine is the man’s wife. Marita is the mistress. These two women are attracted to each other too, and engage in sex, when they are bored with the man. (David Bourne) It is a widely read book of Hemingway’s. Published posthumously, like his other book, a memoir -sort of story book, ‘The moveable feast’. (The movie ‘Midnight in Paris’ is Woody Allen’s creation, and Woody’s thematic idea, as well as a lot of characters/famous people and their dialogue are from Hemingway’s book, the moveable feast.)
In the novel ‘Garden of Eden’ -male lead character is an addict not only to alcohol, but to the act of writing itself. Obviously, the main character is Hemingway himself. The writing is papa’s. But, the name of novel, the content, the ending – it appears there is a great deal of editors’ participation in the publication of this book. It sold well, possibly, mainly because Hemingway by then is already a Nobel Laureate for his other literary works.
To me, the book is a bit of a drag, there are repetitious drinking scenes, swimming, sunning, bathing together scenes, too sleepy a wife in bed, too many interspersed excerpts of ‘real writing’ to prove to us, the protagonist is a real writer indeed. (There is a descriptive fishing scene of dragging a poor fish in the sea, no doubt which the writer expanded later into a hundred-page novel -The old man and the sea. A book which was followed later by an excellent movie, starring Spencer Tracy. Love the movie.)
The hidden and emerging homosexuality and bisexuality of all characters is rather boring. Perhaps because Hemingway probably lost his nerve about writing on sex, after too frequent attendance at Gertrude Stein’s Salons. And listening to her admonitions about writing about perverted sex. Or sexual aggression. Hemingway is too shy, too cryptic, and comparatively, Telugu Palani is more direct and explicit in her writing.
I just could not figure out why in the first place either Radha, or Catherine, themselves take the ‘other woman’ by hand, put her into their lover/husband’s bed. And then start on their jealousy and abusive binge. And turn on the tears. What kind of craziness is that? Surely, they brought the misery on themselves.
Anyways, there is no tenderness, no ardor, in these relationships, in either writing. As you could hear in this Shakeel Badayuni’s Hindi poetry,
..tadap rahe hain ham yaha, tumhare intjaar mein,
khija ka rang aa chala hai mausam-e-bahar mein
hava bhi rukh badal chuki, na jaane tum kab aaoge..
Add Naushad’s music, Rafi’s voice, hear the lyric -one would believe, after all there was romantic spirit at some time, somewhere in India.
-Lyla
కాలం కథ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
రచయితకి విషయంపై సాధికారికత, భాషపై పట్టు కలవని రుజువవుతోంది. ముగ్గురు ఉద్దండులను (అరిస్టాటిల్, సెయింట్ అగస్టీన్, న్యూటన్) ఉటంకించారు, కాని ఐన్‍స్టయిన్ ని ప్రస్తావించక పోవడం లోపంగా తోస్తుంది.
తెలుగు సాంకేతిక పదాలని వాడటంలో తగిన శ్రద్ధ చూపినట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తుంది. జడోష్ణతకి (entropy) మాత్రం ఆంధ్రభారతిని సంప్రదించవలసి వచ్చింది. జడ+ఉష్ణత అనుకుంటే జడ అంటే జడత్వమా? అది సరైనదేనా?
ఎంట్రొపీ అంటే ఏమి నష్టం? తన పుస్తకం ఒకదానిని, మహీధర తన అభిమాన రచయిత JBS Haldaneకి అంకితమిస్తూ: “You can not keep out foreign words as you keep out foreign manufactured goods. Perhaps Telugu accepts them more easily than any other Indian language and this will certainly help to make it a rival to Hindi in teaching Science, Medicine and Engineering.” JBS Haldane. The Hindu (27-4-1958)
Entropy మాట ఎవరికీ అర్థం కాదని కొందరు చమత్కరించారు. నేనీ మధ్య ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, Carlo Rovelli, వ్రాసిన, “The Order of Time,” చదివాను (సన్నదే అయినా అర్థమయింది సగమే). దానిలో అంటాడు:
“Clausius introduces a quantity that measures this irreversible progress of heat in only one direction and, since he was a cultivated German, he gives it a name taken from ancient Greek – entropy:”
Clausius explained: “I prefer going to the ancient languages for the names of important scientific quantities, so that they may mean the same thing in all living tongues. I propose, therefore, to call S the entropy of a body, after the Greek word “transformation.” I have designedly coined the word entropy to be similar to energy, for these two quantities are so analogous in their physical significance, that an analogy of denominations seems to me helpful.”
ఈమధ్యనే చనిపోయిన అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, Leon Cooper, వేసిన చెణుకు: “By doing this, rather than extracting a name from the body of the current language (say: lost heat), he succeeded in coining a word that meant the same thing to everybody: nothing”.
(హాస్యప్రియులకు: అమెరికన్ కామెడీ షో Big Bang Theoryలోని నలుగురు యువ CalTech శాస్త్రవేత్తలలో Sheldon Cooper ఒకరు.)
Rovelli పుస్తకం చివర్లో అంటాడు: “Yaksa asks … Yudhistira, what is the greatest of all mysteries. The answer given resounds across millennia: ‘Every day countless people die, and yet those who remain live as if they are immortals.'”
నాకో ధర్మసందేహం: ఇంత ముఖ్యమైన ప్ర.జ.ను మన ఎర్రాప్రెగడ అరణ్యపర్వంలో ఎందుకు ఉంచలేదు
చాలా ఉపయోగకరమైన వ్యాసం. ఎలనాగ గారు ఇలాంటివి కొనసాగిస్తారని ఆశిస్తాను.
ఓ సూచన: ఒకే వాక్యంలో పదస్వరూప దోషాలు, వ్యాకరణ దోషాలు కలపకుండా దేనికది వేరుగా వివరిస్తే సులభంగా అర్థమవుతుంది.
సమిష్టి, సాంప్రదాయము సబబేనంటుంది ఆంధ్రభారతి లోని బ్రౌణ్య నిఘంటువు.
“బయటికి వెళ్ళడానికి కనీసం రెండు జతల బట్టలైనా ఉండాలి,” సరిగానే ఉంది కాని “కనీసం బయటికి వెళ్ళడానికి రెండు మూడు జతల మంచి బట్టలైనా ఉండాలి” లోని కొంత భావాన్ని (“మంచి” ని) మింగేసింది.
“బయటికి వెళ్ళడానికి కనీసం రెండు జతల బట్టలైనా మంచివి ఉండాలి,” అనో
“బయటికి వెళ్ళడానికి మంచి బట్టలు కనీసం రెండు జతలైనా ఉండాలి,” అనో రాయాలి.
చివరి తీర్పు కోసం ఎదురు చూస్తూ… మృత్యువు తర్వాత ఏముంటుందో తెలియని భయంతో… ఈ వేదనకి అంతం దొరుకుతుందా అని ధ్యానాంకితమై అవలోకనం చేస్తున్న స్వాతి తల్లా!
ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగంలో, ఎవరికి ఎవరు సొంతము? ఎంతవరకీ బంధము?! అనొద్దు తల్లా!
జననీ, జన్మభూమి రుణం తీర్చుకోకుండా… ఇహలోకం లోని వేదనల వైతరణి దాటకుండా… ప్రారబ్ద కర్మ అనుభవించడానికి మరణానంతరం కొన్ని వేల యోజనాలు వెడల్పు కలిగిన వైతరణి దాటి ఆత్మ యమపురి చేరటానికి అది నీ ఇష్టానుసారం చేసే యానం కాదు, యాత్ర కాదు తల్లో!
ఒక క్రౌంచ పక్షి జంట లోని ఒక పక్షిని చంపిన బోయవాడిని శపిస్తూ ఆదికవి వాల్మీకి నోట వచ్చిన సంస్కృత శ్లోకం… రామాయణ కావ్యం ప్రారంభం నుండి… కమ్యూనిజం పితామహుడు, జర్మన్ తత్వవేత్త మరియు ఆర్థికవేత్త అయిన 19వ శతాబ్దం కార్ల్ మార్క్స్ నుండి… ఆధునిక నవలాసాహిత్యంలో చిరస్థాయిగా మిగిలిపోయే ‘అసమర్థుని జీవయాత్ర’ రచించి… ‘ఎందుకు?’ అని ప్రశ్నించడం నేర్పిన తండ్రికి అంకితం ఇచ్చిన త్రిపురనేని గోపీచంద్… వరకూ స్పూర్తిదాయకులు ఎందరో మహానుభావులు.
అవును బయట కనపడేదంతా పుణ్యక్షేత్రమే. కర్మక్షేత్రమే. (మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం. నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే) అన్నాడు మహాకవి శ్రీశ్రీ .
అణువు నుండి బ్రహ్మాండం వరకూ వ్యాపించి ఉన్న ఆదిశక్తి నీలోనూ ఉన్నది. శారీరిక, మానసిక అనివార్యతలను అణచిపెట్టే స్పృహ, దానికవసరమైన తెలివి నీకుంది కాబట్టి అనివార్యత నుండి చైతన్యంవైపే నీ ప్రయాణం.
తమస్సు తొలగించి, జీవన ఉషస్సు కలిగించి… జన్మ, మృత్యువు, జరా వ్యాధుల వల్ల ఏర్పడే చిత్త భ్రమలు తొలగించే జ్నానశక్తి స్వరూపుడైన సద్గురువుని శరణు వేడటమే మార్గం.
చిత్తభ్రమల నుండి బయటపడి… పశ్చాత్తాప క్షమాపణ… మలినం కాని స్వచ్ఛమైన క్షమాపణ చెప్పుకోవటానికి సాహిత్యం ఒక మార్గం అని చెప్పిన స్వాతి తల్లికి వొందనాలు. నీకంటే ముందర ఆమార్గంలో (కన్ఫెషనల్ ఎలిమెంట్తో కధా రచన చేసి) నడిచిన వాడు త్రిపుర తండ్రి అని నీకూ తెలుసు తల్లా!
మీరు రాసిన “సంపాదకునికి ఉత్తరం” చదివాకా ఎందుకో ఇది “సంపాదకుని ఉత్తరం”లా తోచింది తప్ప ఒక కొత్త పాఠకురాలు రాసారంటే నమ్మబుద్ధి కాలేదు. నిబిడాశ్చర్యంతో నన్ను నేను గిచ్చుకున్నాను.
యథా రచనా–తథా పాఠకా, తీరులో తెలుగు సాహిత్యం పరిగెడుతోంది.
పత్రికలు కూడా వాల్ పోస్టర్ గోడల్లా తయారయ్యాయి.
మీరు వ్రాక్కుచ్చినట్లు సోషల్ మీడియా ప్రభావం అంతటా వుంది; అన్ని భాషల్లోనూ ఇదే జాడ్యం. దీనికి తెలుగు ఒక్కటీ మినహాయింపు కాదు.
కరోనా కంటే తీవ్రమైన “గుర్తింపు వైరస్” ప్రపంచాన్ని ఆవరించి దశాబ్దం దాటింది. లైకులు, లవ్వులతో ఎదుటవారిని సంతోష పరిచే చట్రంలో అందరూ ఇరుక్కున్నారు.
ఇచ్చినమ్మ లైకు, పుచ్చుకున్నమ్మ లైకు–తీరున ప్రపంచమంతా ఒక అనధికార, అదృశ్య ఒప్పందం సంస్కార ప్రదంగా కుదుర్చుకుంది.
కాబట్టి ఎవరి పుస్తకమ్మీద ఎవరూ ఉన్నదున్నట్లు రాయరు. రాయలేరు కూడా.
రాసే దమ్ముని సభ్య సమాజం కోల్పోయి చాలా కాలం అయ్యింది.
ఇది “గుర్తింపు వైరస్” సైడ్ ఎఫెక్ట్. దీనికి వాక్సిన్ ఇంకా రాలేదు.
కాబట్టి వైరస్ అందరికీ పట్టినా, ఎవరికీ అంటనట్లే నటిస్తున్నారు.
అడుక్కుని రాయించే భిక్షక రచయితలు అన్నికాలాల్లోనూ, అంతటా వున్నారమ్మా! ఇదేం కొత్త కాదు!
ఎవరూ రాయకపోతే సదరు సంపాదక మహాశయులు మారుపేరుతో రాసిన సంఘటనలు కూడా వున్నాయి.
తమ పత్రిక్కి వచ్చిన రచనలన్నీ కుటుంబరావు గారు తిరగరాసేవారని, అప్పట్లో చెవులు కొరుక్కునేవారు రచయితలు .
సోషల్ మీడియా వల్ల రచయితలూ, పాఠకులూ అందరూ ఒకే చోట ఉండటం వలనా, ఎవరి పుస్తకం మీదా ఎవరూ ఉన్నదున్నట్టు రాయరు. పొగిడి తీరాలి. లేదంటే తిరిగి తన పుస్తకానికి మంచి రివ్యూలు రావనే భయం. అందరూ దూరం పెడతారేమో అనే జంకు. దీన్నుండి బయటపడే సూచనలు కనుచూపు మేరలో లేవు.
ఇంతమంచి వాక్యం రాసిన మనస్విని తల్లీ, నువ్వు కూడా నీకు నచ్చిన పుస్తకం గురించి రాయమని నా విన్నపం.
కథో, కవితో ఏదో ఒకటి–నీకు నచ్చింది.
అదీ తెలుగుదే. వేరే భాషది కాకూడదు సుమా?
మీకు సమయం లేకపోతే సదరు సంపాదకుల వారికి తెలుగులో ఒక మంచి పుస్తకం సూచించు.
రాయమని అర్థించు తల్లీ!
కథ ఒక గడచిన కాలం (టైం లూప్) లో ఇరుక్కుపోయిన వ్యక్తి అనుభవాల చుట్టూ తిరుగుతుంది. కథలోని ప్రధాన వ్యక్తి తప్పనిసరి పరిణామాల నుండి తప్పించుకునే ప్రయత్నం, కానీ వాటిని మళ్లీ మళ్లీ ఎదుర్కోవడం. టైం లూప్ అనేది చరిత్ర పునరావృతమయ్యే అంశాన్ని ప్రతిబింబిస్తుంది.
మిత్రుడు, నిజజీవితానికి దగ్గరగా ఉండే తాత్విక తర్కాన్ని ప్రతిబింబిస్తాడు. అతడు తన స్నేహితుడి మాటల పట్ల అవిశ్వాసంతో నిండిపోయి ఉంటాడు. లూప్‌లో ఇరుక్కున్న వ్యక్తి, పాత్ర పూర్తి విభిన్నం. అతడు ప్రతి చిన్న సందర్భాన్ని ముందే గ్రహించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ, అతడిని పరిస్థితులు బంధిస్తాయి.
టైం లూప్లూ కథలో కొత్తదనాన్ని తెస్తుంది. గతం పునరావృతం అవడం, కానీ ఒకే వ్యక్తికి అది తెలిసి ఉండడం కథకు ఆసక్తిని జత చేస్తుంది. విశ్వాసం, సందేహం అనేది కథలోని ప్రధాన థీమ్ ఇది. నమ్మకమా, అనుమానమా అనేది పాత్రల మధ్య సంభాషణ ద్వారా బలంగా ప్రతిబింబించబడింది.
కథలోని లూప్ అనేది వ్యక్తి చర్యల వల్ల కలిగే పరిణామాలను సరిదిద్దుకోవాలనే ప్రయత్నాన్ని సూచిస్తుంది. లూప్ అంటే సమాజంలో మార్పు లేకపోవడం, మనిషి తప్పులను మళ్లీ మళ్లీ చేయడాన్ని ప్రతినిధ్యం చేస్తుందని భావించవచ్చు.
మెసేజ్‌లో ఏముందని చెప్పకపోవడం, కథను మరింత మిస్టీరియస్‌గా చేస్తుంది. పాఠకుడి ఊహకు ఆస్కారం ఇస్తుంది. మెసేజ్ వల్ల స్నేహితుడి నమ్మకాన్ని చెరిపేసి హింసాత్మక చర్యకు దారితీస్తుంది. అందులో నిజమేమిటో తెలియకుండానే స్పందించడం కథలోని ముఖ్యమైన మానవ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.
టైం లూప్, మిస్టరీ, నమ్మకానికి సంబంధించిన అంశాలు చాలా బాగా మిళితమై ఉన్నాయి. కథనం రీతిలో చక్కగా Spannung (tension) ఉంచారు. సంబంధాల్లో నమ్మకం ఎంత కీలకమో, ఒక చిన్న సందేహం ఎలా దుర్ఘటనలకు దారి తీస్తుందో చూపించే ప్రయత్నం ఇది.
చేసిన పనులకు బాధ్యత వహించాల్సిందే” అనే సందేశాన్ని ప్రతిపాదిస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో మనం నిర్వహించలేని పరిణామాల్లో చిక్కుకుపోవచ్చు. చంపే వ్యక్తి ఎందుకు మెస్సేజ్ ను నమ్ముతాడు, మెస్సేజ్ ను ముందే సెట్ చేయడం ఏంటి ఈ ప్రశ్నలకు జవాబులు పాఠకులు వెతుక్కోవాలి.
“మెసేజ్” వెనుక కథ (backstory) గురించి వివరిస్తే కథ తేలిపోతుంది.
డాల్రింపుల్ చరిత్రలోని లోపాలు: 1) చైనీస్ వారి శాస్త్రవిశేషాలను పెద్దగా ప్రస్తావించలేదు; Joseph Needham పేరయినా లేదు. 2) ఇస్లాముల గురించిన భాగంలో ఖయ్యాము లేడు; కవియే గాక (రుబాయత్), గణితంలో ఖగోళంలో విశేషమైన ప్రజ్ఞ చూపెట్టాడు. 3) ఫిబొనాచీ శ్రేణిని ఫిబొనాచీ కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందరే ఆర్యభట ప్రస్తావించాడన్నారు; ఆర్యభట కాదు.
ఫిబొనాచీ శ్రేణి గురించి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి తెలుసు కాని కవులకు మిక్కిలి ఆసక్తికరమైన సంగతి. ఈమధ్య మా ఆవిడ, కన్నెగంటి రామారావు ఫేస్‍బుక్‍లో బైరాగి మీద రాస్తున్నాడు అని చెప్తే, రామారావు పోస్ట్ చూశాను: “పూవుల నెత్తావి కవిత్వంలోనే కాదు, నాకు ఫిబొనాచీ సీక్వెన్స్‌లో కూడా కనబడుతుంది.”
మంజుల్ భార్గవకి (2014 ఫీల్డ్ మెడలిస్ట్) చిన్నప్పుడు తాతగారి దగ్గర సంస్కృత కావ్యాలు చదవడాన గణితంపై ఆసక్తి కలిగిందట. క్రీస్తుకు పూర్వమే పింగళ, ఛందస్సులో గురు, లఘువులు ఎన్ని విధాలగా ఉండవచ్చో తెలిపాడంటారు. ఒక్క బీట్‍లో {(ల)}, రెండు బీట్‍లలో {(ల, ల), (గు)}, మూడయితే {(ల, ల, ల), (ల, గు), (గు, ల)), నాలుగయితే {(ల, ల, ల, ల), (ల, ల, గు), (ల, గు, ల), (గు, ల, ల), (గు, గు)}… అలా, బీట్‍లను బట్టి గురు, లఘువులు రక రకాల విన్యాసాలలో లయబద్ధంగా ఉండొచ్చు. ఎన్ని రకాలు? 1, 2, 3, 5, … అదే ఫిబొనాచీ శ్రేణి; దానిని ఫిబొనాచీ కన్నా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కనిపెట్టారన్న విషయం పాశ్చాత్యులకి ఇటీవలదాకా తెలియదు.
Donald Knuth పేరు తెలియని కంప్యూటర్ సైన్స్ వారు ఉండరు. తెలియని వాళ్ళకి. యయాతి మహారాజు తన కుమారుడు పూరునకు బోధించిన ఓ నీతి:
“ఎఱుక గలవారి చరితలు | గఱచుచు, సజ్జనుల గోష్ఠిఁ గదలక ధర్మం
బెఱుఁగుచు, నెఱిఁగిన దానిని | మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్.” — నన్నయ
Knuth కంప్యూటర్ సైన్స్‌కు ‘బైబిల్’ లాంటిది రాశాడు; రాస్తున్నాడు అనాలి, ఎందుకంటే ఏడు పర్వాలని ఆ యజ్ఞం మొదలెట్టింది 1962లో; మొదటి మూడు, నాలుగోదాంట్లో మొదటి భాగం మాత్రం అచ్చయినాయి. 87 ఏళ్ళ వృద్ధుడు కనుక బహుశా అసంపూర్ణంగానే మిగలొచ్చు. దాని పాత ప్రతులలో, ఫిబొనాచీ శ్రేణి ప్రస్తావనలో మన వాళ్ళ గురించి ఏమీ లేదు. కాని కొత్త ప్రతిలో:
Before Fibonacci wrote his work, the sequence had already been discussed by Indian scholars, who had long been interested in rhythmic patterns that are formed from one-beat and two-beat notes or syllables. The number of such rhythms having n beats altogether is Fn+1; and the rule for computing those numbers was stated by Virahäka (c. 700) in his work Vttajātisamuccaya, sloka 6.49. Therefore both Gopāla (before 1135) and Hemacandra (c. 1150) mentioned the numbers 1, 2, 3, 5, 8, 13, 21, 34, … explicitly.
నేనిది చెప్పడానికి కారణం: సైన్సులో వలసవాదం కరడుగట్టుకొని ఉన్నదనే వాదన ఉంది; కాని గత నాలుగయిదు దశాబ్దాలగా, ఇతర దేశాలలో పూర్వం జరిగిన పరిశోధనలు వెలుగులో కొచ్చేకొలదీ, వాటి విలువ పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు.
చివరగా, సైన్సు చరిత్రని గురించిన చర్చ కనుక, Knuth, పదేళ్ళ క్రితం Stanford Universityలో ఇచ్చిన ప్రసంగంతో ముగిస్తాను:
“Why do I, as a scientist, get so much out of reading the history of science? Let me count the ways:
1. To understand the process of discovery—not so much what was discovered, but how it was discovered. Primary sources are best: the words of somebody who discovered something, as they were discovering it. The more examples I see, the more likely I’ll be able to discover something tomorrow.
2. To understand the process of failure. We learn a good deal from historical errors, not only from our own. It also helps to know that even the greatest minds are unable to grasp things that seem obvious to us. Leibniz spent much time working on combinatorics, and most of what he did was underwhelming and totally wrong.
3. To celebrate the contributions of many cultures. There are many ways of thinking, many points of view, and many independent researchers. Fibonacci numbers were discovered in India long before Fibonacci. Catalan numbers were discovered in China, a hundred years before Catalan. Many uneducated people have discovered wonderful patterns in numbers, and I can share their joy of discovery.
4. Telling historical stories is the best way to teach. It’s much easier to understand something if you know the threads it is connected to. Give credit to Fibonacci, but also to Narayana in India. The complete story is of many separate individuals building a magnificent edifice with a series of small steps.
5. To learn how to cope with life. How did other scientists grow up, make friends or enemies, manage their time, find mentors, mentor others, and serve their communities? Balance is important.
6. To become more familiar with the world, and to know how science fits into the overall history of mankind. What was life like on different continents and in different epochs? The main difference between human beings and animals is that people learn from history.”
“ఆర్యభట బ్రాహ్మణుడు కాదు, దళితుడు. బ్రహ్మగుప్తుడు కూడా బ్రాహ్మణుడు కాదు, వైశ్యుడు. పాశ్చాత్యులు యూక్లిడ్‍ను ఏ రకంగా తెల్లవాడిగా చూపిస్తారో – అదే విధంగా మనవారు ఆర్యభటని తెలిసో తెలియకో ఆర్యభట్టగా రాసి – విషయాన్ని తారుమారు చేస్తారు. మరిన్ని వివరాలకు చూ: Aryabhata dalit, his philosophy of ganita, and its contemporary applications. C. K. Raju. (చంద్ర కాంత రాజు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత వేత్త, గణిత శాస్త్ర చరిత్రను కూలంకషంగా ఎరిగిన వారు.)”
CK Rajuగారి పేరు నేనిదే మొదటిసారి వినడం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణితవేత్త గదా అని AMS (American Mathematical Society) వెబ్‍సైట్‍లో వెదికాను. Terence Tao, CR Rao లాంటి వాళ్ళకున్నన్ని పేపర్లు ఆశించలేదు కాని, రాజుగారు ఓ పేరొందిన గణితవేత్తతో తగాదా పడ్డ విషయం మాత్రమే కనబడటం నిరాశ పరచింది.
“గణితశాస్త్ర చరిత్రను కూలంకషంగా ఎరిగిన వారు” అయితే కావచ్చు; “Decolonization of Mathematics” పేరిట వారి రచనలు ఎక్కువే ఉన్నాయి. కాని వాటిల్లోకూడా రాజుగారు తన ప్రచురణలనే ఎక్కువ ఉటంకించడంతో వారి వాదనలకి ఆ రంగంలోని పండితుల ఆదరణ తక్కువని నా అనుమానం. ఆ పండితులంతా పాశ్చాత్యుల భావాలకు దాసులంటే ఇక వాదించలేం.
భూషణ్‍గారు ప్రస్తావించిన రాజుగారి ప్రచురణనే చూద్దాం. ఆర్యభట్టకీ (విప్రుడు) ఆర్యభటకీ (భటుడు, సేవకుడు) ఉన్న తేడాని చూపి, ఆర్యభట బ్రాహ్మణుడు కాదు, శూద్రుడు అంటారు; అందుకు సాక్ష్యంగా బ్రహ్మగుప్తుడు (వైశ్యుడు), భాస్కరాచార్యుడు (బ్రాహ్మణుడు) ఆర్యభట గురించి నీచంగా పదే పదే వ్యాఖ్యానించడాన్ని ఉదహరిస్తారు. నాకు అవి అంత బలమైన ఆధారాలుగా అనిపించవు. రాజుగారు, అంతటితో ఆగక, ఇద్దరు ఆర్యభటలు ఉన్నారంటే, మన దేశంలో పూర్వకాలంలో కులవ్యవస్థ మరీ క్రూరంగా ఉండేది కాదు (ఉంటే ఒకరు కాదు ఇద్దరు శూద్రులు ఘనమైన గణితవేత్తలు కాగలరా?); వలసపాలన వచ్చిన తర్వాతనే ఆ క్రూరత్వం పెరిగిందంటారు. నాకు తెలిసినంతలో తరతరాలగా, తెల్లవాళ్ళు రాకముందు కూడా, మన కులవ్యవస్థ కారుణ్యరహితం.
సరే, ఈ కులాల గొడవ వదిలి గణితంలోకెళ్దాం. రాజుగారి వాదన – మనం ప్రత్యక్ష నిరూపణ (empirical proof) వాడాలనీ, నిగమిత నిరూపణ (deductive proof) వాడకూడదనీ, యూక్లిడ్ నిరూపణలన్నీ empirical అనీ, వాటిని deductive అని పాశ్చాత్యులు మోసం చేశారనీ, చర్చి ప్రభావంతో formal mathematics మనందరి నెత్తినేశారనీ – ఇలా సాగుతుంది.
ఈ వాదనలకి నాలాంటి సాదా సీదా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఎదురు సమాధానం చెప్పలేడు కాని, యూక్లిడ్ నిరూపణలు deductive అనుకుంటాను. ఉదాహరణకి, ప్రథాన సంఖ్యలు అనంతం అన్న దానికి empirical proof ఏమిటి? దానికున్న ప్రఖ్యాతమైన యూక్లిడ్ నిరూపణ deductive కాదా? ఏం చూసి Edna St. Vincent Millay, “Euclid alone has looked on Beauty bare.” అన్నదో కాని, రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ నిరూపణ నవనవలాడుతూ ఉట్టిపడుతోంది అంటాడు హార్డీ తన అపాలజలో. గణితం మీద కాస్తో కూస్తో అభిరుచి ఉన్నవాళ్ళు అది చదివి తన్మయమవాల్సిందే.
రాజుగారు విమర్శించే formal mathematicsకి నేపథ్యం గణితమే; చర్చీ, వలసపాలనా కాదు. యూక్లిడ్ నిరూపణలలోనూ, 18, 19 శతాబ్దాలలో వచ్చిన గణితంలోనూ లొసుగులున్నాయనీ, గణితాన్ని కట్టుదిట్టం చెయ్యకపోతే పరస్పర విరుద్ధాలతో సంక్షోభం తప్పదనీ, గణితాన్ని గట్టి పునాదులతో ఎలాంటి వైరుధ్యాలకీ దారితీయని విధంగా చెయ్యాలనీ, చెయ్యవచ్చనీ హిల్బర్ట్ పట్టుబట్టాడు. అంతిమంగా ఆయన కల సఫలం కాలేదు. చిత్రంగా ఆ విఫల ప్రయత్నం మూలంగానే కంప్యూటర్ సైన్స్ పుట్టింది.
“ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు
నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు.”
— తిలక్, “మన సంస్కృతి,” అమృతం కురిసిన రాత్రి.
ముందుగా విలియమ్ డాల్రింపుల్ పుస్తకాన్ని ఈమాట పాఠకులకి పరిచయం చేసినందుకు రాణి శివశంకరశర్మ గారికి కృతజ్ఞతలు. ప్రాచీనకాలంలో ఇండియా సాంస్కృతిక విజ్ఞాన రంగాలలో సాధించిన వాటికి తగిన గుర్తింపు తేవడానికే ఈ పుస్తకం రాశానన్నాదు డాల్రింపుల్. అనేక వివరాలతో, తగిన ఆధారాలతో ఉన్న చదవదగ్గ రచన. ఆధ్యాత్మిక పరమైన విషయాలకంటె శాస్త్రీయ విజ్ఞానపరంగానే ఇండియా ప్రాభవాన్ని చెప్పుకోవాలంటాడు.
ఈ వ్యాసాన్ని చూస్తే రాణి బహుగ్రంథపఠితులనీ ఆలోచనాపరులనీ తెలుస్తుంది. కాని అనేకుల ఉటంకింపులతో సాగిన ఈ వ్యాసం అకటవికటంగా తయారయింది. ఎందుకిలా రాశారా అని రాణి గారి “ది లాస్ట్ బ్రాహ్మిన్” ఇటీవల హైద్రాబాదు వెళ్ళినప్పుడు నవోదయలో దొరికితే కొని చదివాను. అందులో అంటారు: “నేనా రోజుల్లో ప్రధానంగా ప్రేమ కవిత్వం రాసేవాణ్ణి. ఒకసారి ఒక వ్యంగ్య కవిత రాసి సీతంపేట గ్రంథాలయంలో జరిగిన కవి సమ్మేళనంలో చదివాను. … నా కవిత్వంలో యేదో వుందని నాను నమ్మకం కుదిరింది. ఇందిరాగాంధీ తాత్విక గురువు ధీరేంద్ర బ్రహ్మచారిని కూడా ఆ కవితలో లింకు పెట్టాను యెందుకో. ఇలా దూర సంబంధం కూడా లేనట్టు కనిపించే రెండు దత్తాంశాల్ని ఆకస్మాత్తుగా కలిపి వాటి అన్యోన్య సంబంధాల నుంచి వెల్లడయ్యే నిజాన్ని అతివాస్తవికంగా చెప్పే కవిత్వశైలి ఆది నుంచీ నాకు సహజంగానే వంటబట్టింది. ఇది థీసిస్ యాంటీ థీసిస్ సింథసిస్ అనే ఈక్వేషన్ కి దగ్గరిదని తర్వాత నేను తెలుసుకున్నాను.” (160 పేజి.)
ఆ ప్రత్యేక కవిత్వ ధోరణి ఈ రచనలో కూడా ప్రజ్వరిల్లి వ్యాస ప్రయోజన్నాన్ని దెబ్బతీసింది.
రాణి గారికి అనంతం అంటే మిగుల అభిమానం లాగుంది. (“ది లాస్ట్ బ్రాహ్మిన్” అంకిత వాక్యం: “గడచిపోయిన అనంత కల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో ఇదే రూపంలో మీరు లేరు, నాన్న గారూ, రాబోయే అనంత కల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో ఇదే రూపంలో మీరు కానరారు.”) కాని అనంతాన్ని సున్నాతో సమానం చేసి (తాత్వికంగానే అయినా) గందరగోళ పరిచారు.
“అనంతాన్ని గ్రీకులు చీకటిగా భావించారు, భయపడ్డారు. అనంతంలో వస్తువులు ఏర్పడవు అని అరిస్టాటిల్ అన్నాడు. భారతీయులు మాత్రమే అనంతాన్ని పాజిటివ్‌గా చూశారు.”
“ఇలా ఋతువులూ యుగాలూ చక్రాకృతిలో ‘అనంతం’గా పునరావృతి చెందడం అనే భావన జీరో, అనంతం, అనంత విశ్వం, చివరికి భూకేంద్రక సిద్ధాంతాన్ని నిరాకరించే లాజిక్‌కి దారితీసింది.”
“అనంతం, జీరో అనే భారతీయ ఆవిష్కరణలు పాశ్చాత్య వికాసయుగానికి మూలం అనేంతవరకూ వెళుతున్నారు విలియమ్ డాల్రింపుల్.”
ఇంతకీ డాల్రింపుల్ పుస్తకం సూచికలో అనంతం లేదు.
అనంతం అంటే విస్మయం కలగని వారుంటారా? “అమలిన తారకా సముదాయంబుల నెన్నను … విధాతృకైనను నేరం బోలునే” అంటాడు నన్నయ. మన వాళ్ళు అనంతాన్ని ఆవిష్కరించి గణితపరంగా ఏమి సాధించారో రాణి గారు చెప్పలేదు. గణితపరంగా అనంతాన్ని మొట్టమొదట గ్రహించింది గ్రీకులే:
“There is no smallest amongst the small and no largest among the large; But always something still smaller and something still larger.” – Anaxagoras (500-428 BC)
కాని జీనో (490-430 BC) పారడాక్స్ లు గ్రీకులని కలవర పెట్టాయి. అందుకని అరిస్తాటిల్ (384–322 BC) సంభావ్య అనంతం (potential infinity), సంపూర్ణ అనంతం (completed infinity) అని విడదీసి, గణితంలోనూ, తత్వంలోనూ సంపూర్ణ అనంతాన్ని నిషేధించాడు. అయినా ఆర్కిమెడెస్ (287– 212BC) అనంతాన్ని ఎంత సృజనాత్మకంగా వాడుకున్నాడో “The Man Who Harnessed Infinity” [1] లో చదవచ్చు. (యురేకా! అంటూ వీధుల్లో నగ్నంగా పరిగెత్తాడని చిన్నప్పుడు చదువుకున్నాం.) ఆర్కిమెడెస్ ఆలోచనలకి సరయిన రూపం, న్యూటన్, లైబ్నిజ్ ల, కలన గణితం ద్వారా రావడానికి దాదాపు మరో రెండు వేల సంవత్సరాలు పట్టింది.
జైనులు పెద్ద పెద్ద సంఖ్యల గురించి ఆలోచించారు; కాని అనంతం వాటి కంటె పెద్దదని గుర్తించారు. అంతేకాక రకరకాల అనంతాలుంటాయని భావించారు (సూర్య ప్రజ్ఞాప్తి, 400BC), కాని లోతుగా వెళ్ళేందుకు కావలసిన గణిత పరిజ్ఞానం అప్పట్లో లేదు.
గెలీలియో (1564-1642) అనంతం గురించిన ఓ తాత్విక సమస్యని పేర్కొన్నాడు: “భాగం కంటే మొత్తం ఎక్కువ” కదా. {1, 4, 9, 16, 25, 36, …} అన్నది {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, …} దాంట్లో భాగం. కాని ప్రతి పూర్ణ సంఖ్యనీ, దాని వర్గం తో జత చెయ్యవచ్చు: (1, 1), (2, 4), (3, 9), (4, 16), (5, 25), … అంటే “భాగం మొత్తంతో సమానమే!”
అనంతంతో వచ్చే ఈ సమస్యలకి అత్యంత ప్రతిభతో సరయిన పరిష్కారం చూపించిన వాడు Cantor (1845-1918) [2].
భూకేంద్రక సిద్ధాంతాన్ని మొదట నిరాకరించింది అరిస్టార్కస్ (310-230BC); అయితే గ్రీకులు దానిని అంగీకరించలేదు. కోపెర్నికస్ (1473-1543) అరిస్టార్కస్ ప్రతిపాదనలనే పునరుద్ధరించాడు.
డాల్రింపుల్ ఇండియా తన పూర్వ వైభవాన్ని తిరిగి చేజిక్కిచ్చుకునే స్థానంలో ఉందని ముగిస్తే, రాణి ‘అసలు మానవ ఆలోచనే వినాశకరమయినదేమో’ అని ముగిస్తారు.
“భారతీయ ఖగోళ గణిత విజ్ఞానాలు పాశ్చాత్యానికి వెళ్ళి ప్రాగ్మాటిక్ లక్షణాల్ని క్రమేపీ సంతరించుకున్నాయి. ఆ విజ్ఞానం పాశ్చాత్యంలో అభివృద్ధి చెంది, తిరిగి వచ్చి భారతదేశాన్నే వ్యాపారం పేరుతో ఆక్రమించింది. ఇది భారతీయులపై కేవలం భౌతిక విజయమే కాదు. భావజాల దురాక్రమణ కూడా.”
ఇది చాలా సంకుచిత దృష్టి. డాల్రింపుల్ కూడా యూరప్ లో వచ్చిన శాస్త్రీయ విప్లవం గురించి మాట్లాడడు.
“Science is now international, perhaps the most international aspect of our civilization, but the discovery of modern science happened in what may loosely be called the West. Modern science learned its methods from research done in Europe during the scientific revolution, which in turn evolved from work done in Europe and in Arab countries during the Middle Ages, and ultimately from the precocious science of the Greeks. The West borrowed much scientific knowledge from elsewhere—geometry from Egypt, astronomical data from Babylon, the techniques of arithmetic from Babylon and India, the magnetic compass from China, and so on—but as far as I know, it did not import the methods of modern science.” – [3]
డాల్రింపుల్, రాణి కూడా, మరో ముఖ్య విషయం ప్రస్తావించరు. మధ్యయుగాల ప్రారంభంలో, బాగ్దాద్ లో పెద్దలు గ్రీకు ఫిలాసఫీ గురించి చర్చించుకుంటూంటే, యూరప్ లో పెద్దలు సంతకం చెయ్యడమెలాగో నేర్చుకుంటున్నారట. అలాంటి స్థితి నుండి యూరప్ ఎలా పైకొచ్చింది?
జయంత్ నర్లీకర్ సామాన్యులకి సైన్సు గురించి తెలియజేయడానికి బాగా కృషిచేసిన పేరున్న భౌతిక శాస్త్రవేత్త. సైన్సూ గణితం పరస్పర ప్రభావంతో నాగరికతకి ఎలా దోహదమయ్యాయో ఓ మరాఠీ పుస్తకంలో వివరిస్తే దానికి పాఠకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది, మహారాష్ట్ర ప్రభుత్వం ఓ బహుమతి నిచ్చింది. ఆ ప్రోత్సాహంతో, దానిని కాస్త విపులీకరించి ఇంగ్లీషులో “Science and Mathematics: From Primitive to Modern Time,” అన్న పేరిట Jayant Narlikar ప్రచురించారు.
దానిలో నాలుగో అధ్యాయంలో ఆసక్తికరమైన చర్చ ఉంది. పాకిస్తాన్ కి చెందిన అబ్దుస్ సలాం (1926-1996, మొదటి ముస్లిం నోబెల్ గ్రహీత) ఓ ప్రశ్న లేవదీశాడు – గొప్ప శిల్ప కట్టడాలయిన ఆగ్రా లోని తాజ్ మహల్, లండన్ లోని సెయింట్ పాల్ కేథడ్రల్ దాదాపు ఒకే కాలంలో నిర్మించారు. అదే సమయంలో యూరప్ లో సైన్సు అనూహ్యంగా పెరిగితే భారత ఉపఖండంలో చాలా అరుదుగా కనిపించింది; ఎందువలన?
“It is good to recall that three centuries ago, around the year 1660, two of the greatest monuments of modern history were erected, one in the West and one in the East; St. Paul’s Cathedral in London and the Taj Mahal in Agra. Between them, the two symbolize, perhaps better than words can describe, the comparative level of architectural technology, the comparative level of craftsmanship and the comparative level of affluence and sophistication the two cultures had attained at that epoch of history. But about the same time there was also created—and this time only in the West—a third monument, a monument still greater in its eventual import for humanity. This was Newton’s Principia, published in 1687. Newton’s work had no counterpart in the India of the Mughals.”
― Abdus Salam, Ideals and Realities: Selected Essays of Abdus Salam
దానికి నర్లీకర్ కొన్ని కారణాలు ఊహిస్తాడు. ఒకటి: మన పాలకులు (చక్రవర్తులు, రాజులు, చిన్న చిన్న జమీందారులు) సంగీత, సాహిత్య, కళా రంగాలకి ఆశ్రయమిచ్చారు కాని, సైన్సుకివ్వలేదు; యూరప్ లో రాయల్ సొసైటీ, ఫ్రాన్సులో ఫ్రెంచ్ అకాడెమీ ఉన్నాయి, మనకలాంటివి లేవు.
ప్రస్తుతానికి ఇంతటితో ముగిస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
[1] Steven Strogatz, “Infintie Powers: How Calculus Reveals the Secrets of the Universe,” HMH, 2019.
[2] Ian Stewart, “Infinity: A Very Short Introduction,” OUP, 2017.
[3] Steven Weinberg, “To Explain the World: The Discovery of Modern Science,” Harper, 2015.
వేలూరి వారి పై రెండు వ్యాఖ్యలను చూసి కొంచెం ఆశ్చర్యపోయాను.
ఇంగ్లీషులో తప్ప ఆ వ్యాఖ్యలను ఆయన తెలుగులో వ్రాయలేరా అంటే తప్పక వ్రాయగలరనే చెప్పాలి. కేవలం శర్మ గారి అభిప్రాయాలను తృణీకరించటానికే వారు ఆంగ్లంలో వ్రాసారన్నది సుస్పష్టం.
తెలుగు పాఠకులకు ఆంగ్లంలో చదువటమే సదుపాయంగా ఉంటుందని ప్రముఖులే అభిప్రాయపడితే చివరకు ఒకనాటికి ఈమాట పత్రిక ఆంగ్లమాధ్యమంలో వెలువడే తెలుగు సాహిత్యపత్రిక అవుతుంది.
తెలుగు భాషాభివృద్ధికి అదే మంచి వెలుగు బాట అంటే చేసేదేముంది, కానివ్వండి. కానివ్వండి.
(నన్నయాదిగా గల కవులు ఇంగ్లీషు రాకనే తెలుగులో సాహిత్యం సృజించిన అమాయకులని అర్థం చేసుకోవాలి మనం)
Eemata has grown and it must agree to publish English articles
వేలూరి గారు,
నేను చెప్పినది మీరు సరిగ్గా చదివినట్టు లేదు. నాతో సహా అందరం అన్నిచోట్లా ఇంగ్లీషు వాడుతున్నాం. ఉదాహరణకి “ట్రైన్ ఎక్కేటప్పుడు టికెట్ ఉందో లేదో కూడా పాకెట్ లో చూసుకున్నాడు.” దానిక్కాదు నేను అభ్యంతరం చెప్పినది. కధ పేరు కనీసం ఇంగ్లీషులో కాకుండా తెలుగులో పెట్టవచ్చు కదా? అబ్బే కాదు మొత్తం ఇంగ్లీషులోనే రాస్తాం అంటే ఈమాట వారు సారంగ వారి తరహాలో ఇంగ్లీష్ సెక్షన్ ఒకటి పెట్టుకుంటే మంచిది. నేను చెప్పేది సంకరం సంగతి. …. జ్యాయతే వర్ణ సంకర: …. సంకరో నరకాయైవ …. అన్నట్టుగా తయారౌతోంది. తల కనీసం తెలుగులో ఉంటే బాగుంటుంది అని చెప్పాను. తెలుగులో రాసే [ఓపిక ఉన్న] రచయితలకి కనీసం తెలుగు హెడింగ్ పెట్టడం రాదా?
the only way, we can encourage our youngsters to know about our culture
దేశం కాని దేశంలో ఉన్నంతకాలం మన పిల్లలకి మన సంస్కృతి ఏనాటికీ “పూర్తిగా” నేర్పలేం. అక్కడవరకూ ఎందుగ్గానీ ప్రస్తుతం రెండు రాష్ట్రాలలోనే ప్రజలకి సంస్కృతి అంటే తెలియదు అనే స్థితిలో ఉన్నాం. పరాయి దేశంలో ఉన్న పిల్లలు ఎప్పుడు పూర్తిగా నేర్చుకుంటారో తెలుసాండి? వాళ్ళకి స్కూల్లో ‘మీ బాషా సంస్కృతి మీద ఒక క్లాసు తీసుకోండి. అందులో ఎ గ్రేడ్ వచ్చి తీరాలి’ అన్నప్పుడు మా-త్ర-మే. అదీకూడా ఆ క్లాసులో గ్రేడ్ ఇచ్చాక పూర్తిగా మర్చిపోతారు. ఏ కోళ్ళ మంగారం, కొ.కు సాహిత్యం మీరు ఇంగీషులో అనువదించి చదవమని చెప్పండి. ఇదెక్కడి తలకాయ నెప్పిరా భగవంతుడా అన్నట్టు చూస్తారు. కనీసం ఇప్పటికే అనువదించిన అమర్ చిత్ర కధ పుస్తకాలు కూడా చదవరు. వీళ్ళు బతుకుతున్న కాలం వేరు. మనం దేశంలో బతికిన కాలం వేరు. ఆ రోజులు – పుస్తకాలు చేత్తో పట్టుకుని కులాసాగా చదువుతూ ఆనందం అనుభవించే రోజులు – గతించాయి. ఫోన్ మీద ఆప్ తయారు చేసి ఇచ్చినా అవి వాడరు. అదీగాక పైన ఒకసారి చెప్పాను కదా, నేను అనువాదాలకి వ్యతిరేకిని కాదు. నేనూ ముళ్ళపూడి వారివి మరో కొంతమందివీ అనువదించాను. నా ఇబ్బంది అంతా సంకరం మీద. కనీసం కధ పేరు తెలుగులో పెట్టాలి.
ఈమాట కి వచ్చి తెలుగు చదివేవారు ఉన్నారు. కొంతమందికి తెలుగులో టైప్ చేయడం రాదో, కష్టమో, సమయాభావమో. సరే వాళ్ళు పూర్తిగా ఇంగ్లీషులో వ్యాఖ్య రాస్తారు. దానికేమీ అభ్యంతరం లేదు. కానీ కధ రాసే వారో? వాళ్ళకి తెలుగులో టైప్ చేయడం వచ్చినట్టే కదా? సమయం వెచ్చించి కధ టైప్ చేసి పంపుతున్నారు. ఆ తర్వాత సంపాదకులు చెప్పినట్టూ దిద్దుతున్నారు కూడా. కధ పేరు తెలుగులో పెట్టడానికి ఏమిటి అభ్యంతరం? వర్ల్డ్ వితిన్ అనేదాన్ని అద్భుతంగా [ఉదా: “అంతర్మధనం,” లేదా “లోపలి ప్రపంచం,” అనో మరోటో] పెట్టలేరా? ఏం?
Repeating the original blame, I stand with my comments. At least all the headings/names of the Telugu stories and poems/kavata “MUST BE” in Telugu. If you cannot do that, put everything into English. At least now, all dictionaries and literature are available at our finger tips with a google search. Spending another few minutes to get a good Telugu word for English is not rocket science. I am aware eemaata publishes English articles and I am happy to read those too but why mix and match even the headings? In that case use Google Translator and publish randomly in Russian, Chinese and Japanese too. And if that is the process, just think what good it would do the Telugu reading public. How many of us would even read/follow those languages? If you still say “no, we cannot accept what this this guy says,” then please modify this top heading at least ” EEMAATA: AN ELECTRONIC MAGAZINE IN TELUGU FOR A WORLD WITHOUT BOUNDARIES” to “…IN VARIOUS LANGUAGES … ” At least then makes a lot of sense. Thanks.
ఈమాట ఒక తెలుగు సాహిత్యపత్రిక. తెలుగుపత్రిలో కథలూ కాకరకాయలూ వ్రాసే వారికి గాని వాటిపై అభిప్రాయాలను వెలిబుచ్చే వారికి గాని ఈమాట ఒక తెలుగు సాహిత్యపత్రిక అన్న స్పృహ తప్పకుండా ఉండే ఉంటుందని ఆశించవచ్చును కదా?
ఒక తెలుగు సాహిత్యపత్రికలో రచనలు చేసేవారికీ చదివేవారికీ తెలుగులో తమతమ భావాలను వెలిబుచ్చేంత సామర్ధ్యం ఉండాలనీ ఉంటుందనీ చదువరులు ఆశించవచ్చును కదా?
అందుచేత రచయితలూ చదువరులూ తమతమ వ్రాతలను తెలుగులోనే చేయమని కోరటంలో అసంబధ్ధత ఏమీ ఉండదు కదా?
శర్మ గారు చెప్పినట్లు అనవసరమైన ఇంగ్లీషు పదాలూ వాక్యాలూ వంటివి తెలుగుభాషాభిమానులకు బాధను కలిగించుతూ ఉంటాయి. కొందరైతే తమ అభిప్రాయాలను పూర్తిగా ఆంగ్లంలోనే ఈపత్రికలో వ్రాస్తున్నారు.
పత్రికాసంపాదకులు గట్టిగా చెప్తే కాని కాస్త తెలుగుకు పెద్దపీట వేద్ద్దామన్న స్పృహ తెలుగురచయితలకూ విమర్శకులకూ కలగదా అన్నది నా ప్రశ్న.
ఇష్టం ఉన్నా లేకున్నా ఎంత కష్టం ఐనా సరే ఈమాటలో వ్రాసే వారందరూ తప్పనిసరిగా తెలుగులోనే వ్రాయవలసిందిగా నా విజ్ణప్తి.
కొడవళ్ళ హనుమంతరావు గారు, మీ వివరణ, చాలా సంతోషం. నేను వ్యాసం చదివి నా అభిప్రాయం రాస్తున్నప్పుడు మీ గురించి తలచుకున్నాను: కారణం మీరు వ్యాసాల్లో గాని, అభిప్రాయాల్లో గాని ఉట్టంకింపుల విషయంలో రాజీలేని ధోరణి ప్రదర్శిస్తారు. నేను అనుకున్నాను కొడవళ్ళ గారే ఈ వ్యాసం రాసివుంటే – ఆధారాల విషయంలో తన్నుకు చచ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను ఉదహరించిన ప్రఖ్యాత శ్లోకం భాస్కరుని బీజగణితం లోనిదే – అనేకులు ఆ శ్లోకాన్ని లీలావతిలో ప్రసంగవశాత్తు ప్రస్తావించారు. శ్లోకానువాదం ఎవరు చేశారో తెలియడానికి ఆ వివరాలు ఇచ్చాను. బీజగణితంలో ‘ఖషడ్విధం’ అన్న ప్రకరణాంతంలో వస్తుందీ శ్లోకం.
ఉట్టంకింపులో మొదటి భాగానికి మూలమేదో నాకు ఇదమిత్థంగా అర్థం కాలేదు. బీజగణితంలోని ‘ఖషడ్విధం’ అన్న ప్రకరణంలో ఇచ్చిన శూన్య పరికర్మలు అన్ని ప్రస్తారాలను పేర్కొంటాయి.
(ఉదాహరణకు -శూన్యంతో గుణకారం: 0xn =0; nX0 =0; 0X0 = 0) లీలావతిలోని సూత్రాలు దానికి భిన్నంగా, సూటిగా ఉంటాయి, భాష్యాన్ని ఆశించవు). సమీక్షకుల మొదటి వాక్యం లీలావతిలోని మూలానికి దగ్గరగా ఉంది, కాబట్టి, సమీక్షకులు ఉదహరించిన వాక్యాలకు మూలం లీలావతిలోని శూన్య పరికర్మాష్టకంలోనే వెదుక్కోవలసి వచ్చింది.
“ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము. ”
(సమీక్షకుల వాక్యాలు)
ఖగుణః ఖః (ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును), ‘శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును’ అన్న దానికి శూన్య పరికర్మాష్టకం లో చూపడానికి ఆధారం లేదు. కానీ ‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము’ (ఖభాజితో రాశిః ఖహరస్యాత్) అన్నది తప్పుడు భావానువాదం.
(నా వాక్యాలు)
నేను చిన్ననాడు ఆంధ్రప్రభలో ప్రాచీన గణితం గురించి ఎవరో వారం వారం రాసేవారు. ఖహారగణితం గురించి మొట్ట మొదటిసారి అక్కడే చదివాను. ఆనాటి నుండి ఈ పద ప్రయోగం పట్ల వింత ఆకర్షణ ఉండి పోయింది.
“Zero Denominator అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి” అని రాశాను గానీ, ఎక్కువ వివరాల్లోకి పోలేదు. మీరు జోసెఫ్ గారి పుస్తకం నుండి ఉట్టంకించి నా పని సులువు చేశారు:
“A quantity divided by zero becomes a fraction, the denominator of which is zero (ఖహరం)
This fraction is termed an infinite quantity. (‘అయమనంతో రాశిః ఖహర ఇత్యుచ్యతే’ ఈ యనంత రాశికి ఖహరమని పేరు. )
పై శ్లోకానికి చక్కని అనువాదం:
In this quantity consisting of that which has zero for its divisor, there is no alteration, though many may be inserted or extracted. [Similarly], no change takes place in the infinite and immutable God when worlds are created or destroyed, though numerous orders of beings are absorbed or put forth.”
ఇక్కడ భాస్కరుల ఖహరంతో గొడవ వస్తోంది:
This, at its face value may seem approaching correctness, by suggesting that any number when divided by zero is infinity, but then Bhaskara II (b. 1114 CE) suggests that zero multiplied by infinity is any number, and hence all numbers are equal, which is certainly not correct. Emancipated from the role of a mere place-holder, zero joined the family of numbers capable of arithmetical operations.
(కాబట్టే, తొందర పడి మూలంలో లేనివి ఊహించరాదు అని చెప్పడం, అక్కడ ఖహరం అని ఉంటే ఖహరం అనే రాయాలి, తొందరపడి అనంతం అనేయరాదు. ప్రాచీన కవిత్వాన్నిగాని, గణిత శాస్త్రాన్నిగాని అనువదించేటప్పుడు మూలం యథాతథంగా తెలుసుకోవడం ప్రథమ కర్తవ్యం. ఒక్కోసారి, ఇవాళ్టి అర్థాలు ఒకప్పటి అర్థాలు ఒకటి కాకపోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టే, hermeneutical study అవసరమవుతుంది.)
0 X 1/0 = n (శూన్యం భాజ్యం ఖహరం భాజకం ఐతే వచ్చే లబ్ధం ఒక సంఖ్యయే (zero multiplied by infinity is any number); అందుకే, “Zero Denominator” అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి” అని రాశాను.
భూషణ్‍గారు భాస్కరుని లీలావతి లోని శ్లోకంతో శర్మగారి ఉటంకింపు చెల్లదన్నారు. కాని శర్మగారు ఇచ్చినది (భాస్కరునిదే) బీజగణితం లోనిదనుకుంటాను. నేను మా మారుమూల గ్రామంలో ఉండటాన భాస్కరుని మూలాలు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్నదానినుండి:
Take an example from Brahmagupta’s seventh century text Brahmasphutasiddhanta. In it he treats the zero as a separate entity from the positive (dhana) and negative (rhna) quantities, implying that sunya is neither positive nor negative but forms the boundary line between the two kinds, being the sum of two equal but opposite quantities. He states that a number, whether positive or negative, remains unchanged when zero is added to or subtracted from it. In multiplication with zero, the product is zero. Likewise the square and square root of zero is zero. But problems arise when he tries to explain division. When a number is divided by zero, he gives no result but merely repeats that the quotient of any number and zero is a fraction with zero as a denominator. However, Brahmagupta’s is the first attempt by any mathematician to explain the arithmetic operations on natural numbers and zero.
In the ninth century, Brahmagupta’s attempts at defining operations using zero was taken up by Mahavira. Although he correctly states that a number multiplied by zero is zero, but wrongly adds that a number remains unchanged when divided by zero. The next attempt came from Bhaskara II in the 12th century:
This section [in Lilavati] ends with [Verses 45–47] listing the eight operations with zero: addition, subtraction, multiplication, division, square, square root, cube and cube root. These rules had become standard by then, and like Brahmagupta, suggests any quantity divided by zero remained ‘zero-divided’. Bhaskaracharya returns to this topic in the first chapter of Bijaganita, when he infers that division by zero gives khahara (infinity), the first clear statement of this result in the history of mathematics.
In Bijaganita:
“A quantity divided by zero becomes a fraction, the denominator of which is zero. This fraction is termed an infinite quantity. In this quantity consisting of that which has zero for its divisor, there is no alteration, though many may be inserted or extracted. [Similarly] no change takes place in the infinite and immutable God when worlds are created or destroyed, though numerous orders of beings are absorbed or put forth.”

George Gheverghese Joseph. Indian Mathematics: Engaging With The World From Ancient To Modern Times. World Scientific Publishing Company. Kindle Edition.
భూషణ్, “Zero Denominator అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది,” అన్నారు. సున్నా సంఖ్యల్లో ఒకటయినప్పుడు ఎందుకు ఆశ్చర్యం? తంటా అంతా భాగించితే విలువ ఏమిటి అని కదా.
భారతీయ బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశనానికి మూలమా?
భారతీయ విజ్ఞానం అంటే చాలు ప్రతి వాక్యంలో బ్రాహ్మణ శబ్దాన్ని జొప్పించడం అనవసరం. ఆర్యభట బ్రాహ్మణుడు కాదు, దళితుడు. బ్రహ్మగుప్తుడు కూడా బ్రాహ్మణుడు కాదు, వైశ్యుడు. పాశ్చాత్యులు యూక్లిడ్‍ను ఏ రకంగా తెల్లవాడిగా చూపిస్తారో – అదే విధంగా మనవారు ఆర్యభటని తెలిసో తెలియకో ఆర్యభట్టగా రాసి – విషయాన్ని తారుమారు చేస్తారు. మరిన్ని వివరాలకు చూ: Aryabhata dalit, his philosophy of ganita, and its contemporary applications. C. K. Raju. (చంద్ర కాంత రాజు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత వేత్త, గణిత శాస్త్ర చరిత్రను కూలంకషంగా ఎరిగిన వారు.)
ఇప్పటి కులతత్వపు కళ్ళద్దాలతో గతాన్ని చూడరాదు. ఈ వ్యాసం కూడా వలసవాద సామ్రాజ్యవాద ప్రతిధ్వనే తప్ప మరొకటి కాదు. అంతేకాదు, వ్యాసం ఆమూలాగ్రం స్పష్టత కొరవడింది. కలిపికొట్టు కావేటి గంగ తరహాలో తయారైంది. భారతీయతను ఎలా నిర్వచించాలి అన్న శీర్షికన వేరొక వ్యాసం రాయవచ్చు, సమీక్షను అడ్డం పెట్టుకొని అర్థం లేని కుల మత రాజకీయాలను ఈడ్చుకురావడం మంచి పద్ధతి కాదు. శ్రద్ధ చూపవలసింది ఆకరాలను సరైన రీతిలో ఇవ్వడంలో. భాస్కరుని వాక్యాలు ఉట్టంకించారు, మూలంలో ఏ శ్లోకం అది, దాని తాత్పర్యం సరి చూసుకున్నారా? భాస్కరుడు సూటిగా అనంత ప్రస్తావన తీసుకువచ్చాడా? భాస్కరుడు దాన్ని ‘ఖహరం’ అని వ్యవహరిస్తాడు. ‘అయమనంతో రాశిః ఖహర ఇత్యుచ్యతే (“ఈ యనంత రాశికి ఖహరమని పేరు.”)
‘ఏ ప్రకారముగా సృష్టి నిర్మాణకాలమందెన్ని భూతములు పుట్టినను ప్రళయ కాలమందెన్ని భూతములు లయించినను అనంతుడును, అచ్యుతుడును అగు పరమేశ్వరుని యందు వికారము పుట్టదో యట్లు ఈయనంత రాశియందెన్ని సంఖ్యలు కలిపినను, ఇందుండి యెన్ని సంఖ్యలు తీసివేసినను దీనికి మార్పు కల్గదు.’ (ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, కొమఱ్ఱాజు వారి సంపాదకత్వం.)
‘తన వలన అనేక భూతజాతము సృష్టి కాలమున సృజింపబడినను, లయకాలమందు తనయందు లీనమైనను, ఆత్మ పదార్థము మార్పు చెందనట్లు ఈ ఖహర రాశియు ఇతర సంఖ్యలను కలిపినను తీసివేసినను మార్పు చెందదు’ (పిడపర్తి వారి భావానువాదం).
ఇక సమీక్షకుల ఉట్టంకింపు పరిశీలిద్దాం:
‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము. అనంతము నుండీ ఏదయినా పరిమిత సంఖ్యను తీసివేసిననూ కలిపిననూ దాని విలువ మారదు. ఈ అనంతము అద్వితీయమగు పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూతసృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మారడు’ అంటాడు భాస్కరాచార్య. పూర్ణమదః పూర్ణమిదం అనే ఉపనిషత్ శ్లోకసారం కూడా ఇదే.’
పై ఉట్టంకింపులో మొదటి భాగం:
“ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము.”
ఖగుణః ఖః (ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును), ‘శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును’ అన్న దానికి శూన్య పరికర్మాష్టకంలో చూపడానికి ఆధారం లేదు. కానీ ‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము’ (ఖభాజితో రాశిః ఖహరస్యాత్) అన్నది తప్పుడు భావానువాదం.
1/0 = ∞ అని ఆధునికులు వ్యవహరించినా, భాస్కరుడు మతి పోగొట్టే స్పష్టత చూపుతాడు ఇక్కడ. ‘ఖభాజితో రాశిః ఖహరస్యాత్’ (శూన్య పరికర్మలు – 4వ ప్రకరణం – లీలావతి గణితం (1936) పిడపర్తి వారి అనువాదం); సున్నతో భాగించబడినది అనగా సున్న హారముగా గలది (ఖహరం – A fraction with cipher as its denominator ( Coolebrook, Henry T (1893, Calcutta). Zero Denominator అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి, శ్రీవారికి సంచలనం కలిగించే రాజకీయాల మీద శ్రద్ధ లావు కావున, ఎన్నో దూడలను వదిలేయడం జరిగింది.
‘అనంతము నుండీ ఏదయినా పరిమిత సంఖ్యను తీసివేసిననూ కలిపిననూ దాని విలువ మారదు'(ఈ వాక్యం కూడా మూలార్ధాన్ని సరిగా తెలపడం లేదు. భాస్కరుని గొడవ ఖహరంతో.)
‘ఈ అనంతము అద్వితీయమగు పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూతసృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మారడు’ (ఇక్కడ కాళిదాసు కవిత్వం కొంత ఆ పై తన పైత్యం కొంత – మూలంలో ఉన్నది ఏమిటి -అచ్యుతం అనంతం – బ్రహ్మ ఎవరి సృష్టి? బ్రహ్మకు స్వయం అస్తిత్వం ఉన్నదా? పై అనువాదాలతో పోల్చి చూడండి.)
ఇంతటితో నా ఆసక్తి పూర్తిగా చచ్చి పోయింది – పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్న కప్పదాటు, అక్కడ చెబుతున్న దేమిటి? బోడిగుండుకు మోకాలికి ముడి వేయడమంటే ఇదే. తర్వాత ధర్మ తత్వజ్ఞుని స్వరంతో: “ఉపనిషత్ పూర్ణమా? బౌద్ధ శూన్యమా? ఏది జీరోకి మూలం? ఏది గణితంలో అనంతానికి ఆధారం?”
భగవంతుడా అని గోచీ సర్దుకొని లేచి పోవలసిన పరిస్థితి! ఇంత దూరం వచ్చిన పాఠకులు ఎవరైనా ఉంటే పుస్తకసారం నాలుగు మాటల్లో ముక్తాయించి బయట పడతాను.
The Golden Road: How Ancient India Transformed the World అన్న పుస్తకంలో, ప్రాచీన కాలంలో భారతదేశం (250 BC – 1200 AD) యావత్ ప్రపంచాన్ని – తన వైజ్ఞానిక ప్రగతి, సాంస్కృతిక ఘనత, వాణిజ్య సరళితో ఎలా మార్చివేసిందో ఒక అంచనా వేసే ప్రయత్నం చేశాడు భారత దేశంలో స్థిరపడ్డ బ్రిటిష్ చరిత్రకారుడు William Dalrymple. ఇదివరకూ వచ్చిన విలియమ్ డాల్రింపుల్ చారిత్రక గ్రంథాలను చదివిన ఎవరికైనా తెలిసివచ్చేది ఏమంటే, ఈతని పుస్తకాల్లో విషయచర్చ ఎంతో విపులంగా ఉంటుంది.ఒక ధ్యేయంతో విషయసేకరణ చేసి, ఒక పద్ధతికి లోబడి గ్రంథరచన చేస్తాడు కావున ఇష్టంగా చదువుతాము. ఐరోపాకు గ్రీసు ఎలాగో మొత్తం ఆసియా ఖండానికి భారతదేశం ఆలాగు అని ఈ చరిత్రకారుని ఉవాచ. కానీ, జ్ఞానప్రదాయినిగా గ్రీసు గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. విజ్ఞానశాస్త్రాలకు కాణాచి ఐన భారతదేశం గురించి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో సైన్సు బోధించే ఆచార్యులకే సరిగా తెలియదు. కావున, విజ్ఞాన రంగంలో భారతదేశం ప్రాశస్త్యాన్ని ఉగ్గడిస్తూ ఈ పుస్తకరచనకు పూనుకున్నాడు. దీన్ని కూడా చైనాకు ధీటుగా భారతదేశాన్ని పోటీగా నిలబెట్టే అగ్రరాజ్యాల ప్రయత్నంలో భాగమే అని పాకిస్తాన్ పత్రికా రచయితలు కొందరు చెవులు కొరుక్కున్నారు.
ఇటీవల పరిశోధనల్లో తేలినదేమిటంటే – అసలు సిల్క్ రోడ్ [జర్మన్‍లో Seidenstrasse అంటారు – కారణం ఆ కూట సృష్టి వారిదే (1877)] అన్నదే లేదు. మంగోల్ దండయాత్రలకు (13వ శతాబ్దం) మునుపు చైనా – పాశ్చాత్య దేశాల మధ్య ప్రత్యక్ష వర్తక వాణిజ్య సంబంధాలు లేవు. చైనా ఉత్పత్తులు – ఇండియా ద్వారానే రోమ్ వెళ్ళేవి. ఇండియా రోమ్‍ల మధ్య సముద్ర వర్తకం చాలా ప్రాచీనమైనది అని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఐనా కూడా, ఘనతరమైన మన భారతదేశం కథ ఎవరికీ తెలియదు. ఇదీ ఈ పుస్తక నేపథ్యం. పుస్తకంలో బౌద్ధం ఏ రకంగా చైనా, మంగోలియా, జపాన్ కొరియా తదితర దేశాలకు పాకిందో, ఏ విధంగా హిందూ ధర్మం ఆగ్నేయాసియా మొత్తం వ్యాపించిందో అనేకాధారాలతో మనముందుకు తీసుకువస్తాడు డాల్రింపుల్. తర్వాత, భారతీయ గణిత ఖగోళ విజ్ఞానం ఎల్లలు దాటి అరబ్బువర్తకుల ద్వారా ఐరోపాకు పాకి చివరికి యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుపుతాడు.
ఈ పుస్తకాన్ని లోతుగా సమీక్షించాలి అంటే History of Science మరీ ముఖ్యంగా History of Mathematics బాగా చదువుకుని ఉండాలి. మరీ ముఖ్యంగా – దశాంశమాన పధ్ధతి, శూన్య భావపరిణామం, అనంత భావనతో దానికి గల సంబంధం; కనీసం ఆర్యభట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్యుల రచనలు మూలంలోనో, అనువాదంలో చదివి అర్థం చేసుకోగల ఓపిక, ఆసక్తి -వెరసి ఆధునిక గణిత శాస్త్ర పద్ధతుల్లో కనీస ప్రవేశం, అప్పుడు గాని ఈ గ్రంథ నేపథ్యం అర్థం కాదు.
8వ శతాబ్దానికే బ్రహ్మగుప్తుని రచనలు అరబ్బీలోకి వెళ్లాయి. తర్వాత అరబ్బులు వైద్య, గణిత శాస్త్ర గ్రంధాలను సంస్కృతం నుండి విరివిగా తర్జుమా చేసుకున్నారు. క్రమేణా భారతీయ విజ్ఞానం అరబ్బు వర్తకుల ద్వారా ఇటలీ, స్పెయిన్ చేరుకుని ఐరోపా పునరుజ్జీవనానికి (Renaissance) దోహదపడిన వైనం రేఖామాత్రంగా నైనా తెలియాలి. ఎడారి మతాల, కొత్త మతాల గొడవలు, పరిమితులు, భారత దర్శనాల ప్రత్యేకత తెలిస్తే సమీక్షకుని పని మరింత సులువవుతుంది. సమీక్షకునికి ఇవేవీ తెలియనప్పుడు ఉపరితల స్పర్శజేసే సమీక్షతో ‘మమ’ అని బయట పడాలి. అలవాటు లేని ఔపోసనం జేస్తే మీసాలు తెగ కాలినవి తరహాలో ఉన్నది సమీక్ష వ్యవహారం. సమీక్ష చేయవలసిన విషయమే ఘనమైనది అయినప్పుడు, అది తనకు సరిగా తెలియనప్పుడు – తా దూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు -హిందుత్వ, ముస్లింలు, నవ బౌద్ధులు, మూల వాసులు, మార్క్సు అని నానా చెత్తను తలకెత్తుకున్నారు. అసలు ఈ పుస్తక సమీక్షకు, వ్యాస శీర్షికకు ఏమైనా సంబంధం ఉన్నదా? నిజంగా భారతీయతను నిర్వచించవలసిన సందర్భం ఇదేనా? సమీక్షకుడు పుస్తకపరిధికి లోబడి సాము చేసి ఉంటే సమీక్ష ప్రయోజనం నెరవేరేది. వ్రతం చెడింది, ఫలం దక్కలేదు అని చెప్పక తప్పదు.
ఇంకొక విషయం రచయిత తరచూ మాతృభాషకాని ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాస్తున్నట్టు తోస్తుంది- ఆ ప్రక్రియలో నుడికారం పూర్ణానుస్వారం కావడంతో వ్యాసరచనలో అనవసరంగా అయోమయం చోటు చేసుకొంటోంది.
“చరిత్ర అంటే గతం కాదు, పూర్తిగా వర్తమానం. వర్తమానం గతంతో చేసే సంభాషణ కూడా కాదు చరిత్ర. వర్తమానం గతంపై చేసే వ్యాఖ్యానమే చరిత్ర.”
ఇదేదో వచనకవిత్వంలో గందరగోళానికి పేరెన్నిక గన్న సీనియర్ కవి శివారెడ్డి వచనంలా ఉంది. ‘అర్థం కాలేదు’ అంటే, ‘మహార్థమును నిక్షేపించితిని’ అని బుకాయించడం కవులకు జన్మహక్కు. కనీసం, వ్యాసరచయితలైనా స్పష్టతకు కట్టుబడాలి కదా. పై పేరాకు ఆంగ్ల తర్జుమా:
“History is not the past, but the present in its entirety. History is not even the conversation of the present with the past. History is the present’s commentary on the past.”
వాక్యనిర్మాణం ఆంగ్లానికి దగ్గరగా ఉంది కాబట్టి, ఆంగ్లంలో చదివితే సులభంగా అర్థమవుతోంది. కానీ, తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’ స్థాయికి దిగజారి పాఠకుడిని దారితప్పిస్తోంది. కావున, ఈ సమీక్ష – రచయిత మాటల్లో చెప్పాలి అంటే ‘వలసవాద సామ్రాజ్యవాద ప్రతిధ్వనుల్లో’ భాగమే.
బ్రాహ్మణవాద భావజాల పత్రిక అన్న ఆరోపణ చెడ్డది. సంపాదకీయం నచ్చక పోతే ఎక్కడ నచ్చలేదో చెప్పవచ్చు. అంతేగాని సంపాదకులకు లేనిపోని ఉద్దేశాలు అంటగట్టడం తప్పు. నాకు ఈ మాట సంపాదకీయాలు పెద్దగా నచ్చవు. నచ్చక పోవడానికి కారణం శైలికి సంబంధించినది – నా దృష్టిలో సంపాదకీయాలు గురిపెట్టిన బాణంలా ఉండాలి. ఒక్క పదం, ఒక్క వాక్యం అటూ యిటూ ఐతే సొంత రచనలైనా నేను మెచ్చలేను. వాక్యానికి వాక్యానికి మధ్య ఉన్న అంతరం రచయిత ఊహాశక్తిని సూచిస్తుంది. ఊహాశక్తి కవికే కాదు, గద్య రచయితకు కావాలి. ఆ తరహా గీటురాళ్ళు నావి – వాటి మీద గోకి చూసి రంగు రాకపోతే రచనను గిరవాటు వేసే అలవాటు నాది.
రచనలో అందరి ప్రమాణాలు ఒక రీతిలో ఉండవు. మనకు నచ్చని వన్నీ బ్రాహ్మణవాదమని, దళితవాదమని బ్రాండ్ వేసి చర్చను పక్కదారులు పట్టించరాదు. అసలు ఇక్కడ కుల,వర్గ, ప్రాంత ప్రస్తావనలు ఎందుకొస్తున్నాయో నాకు అర్థం కాని విషయం. చర్చలో మాధవ్‍గారు ప్రస్తావించిన రచయిత వేణుగోపాల్‍గారి వచన శైలి పరమ దరిద్రమని నా నిశ్చితాభిప్రాయం. దానికి గల కారణాలు శైలీ సంబంధం – ఆయన కులవర్గప్రాంత ప్రస్తావనలు మనకు అప్రస్తుతం. అలా ఆలోచించడమే ప్రజాస్వామ్య వైఖరికి గొడ్డలి పెట్టు. నాగరిక సమాజంలో మనకు ఏది నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో స్పష్టంగా చెప్పగలగాలి. మనం రాసినవన్నీ అందరికీ నచ్చాలి అనుకోవడం, నచ్చకపోతే తూలనాడతాను అంటే అది ఒక రకమైన శఠత్వ ప్రకోపమే (Narcissistic Rage) గాని, మరొకటి గాదు. మన రాతలే కొంత కాలం పోయాక మనకు నచ్చకపోవచ్చు. రచనను బేరీజు వేసే విషయంలో స్వపరాలకు తావు లేదు. కావలిసిందల్లా నిద్రాణం కాని తార్కిక శక్తి , అనితరసాధ్యం కాని అభిరుచి- అవి ఉండవలసిన మోతాదులో ఉంటే గొడవే లేదు.
మన ఆలోచనలు ఒక్క క్షణంలో పక్కదారి పడతాయి. రచయితకు నిరంతర సాధన కావాలి – మెరిసి పోయే ప్రతి ఊహను ఒక వాక్యంలో ఒడిసి పట్టలేము. సంపాదకుడు చక్కని రచనలతో సంచికను నింపాలని కోరుకోవడంలో తప్పు లేదు. చక్కని రచనలు ఎలా సంపాదించాలి అన్న విషయంలో చర్చకు ఆస్కారం ఉంది. ముందు నుంచి పీర్ రివ్యూ పద్ధతి మీద నాకు అభ్యంతరాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, పత్రికా సంపాదకుడు వీలైనంతవరకు copy editingకు (వ్యాకరణ దోషాలు, అచ్చుతప్పులు సవరించడం గట్రా) పరిమితమైతే అపార్థాలకు తావు ఉండకపోవును. Content editingలో (విషయం అటుదిటు చేయమని చెప్పడం, అసంపూర్తిగా ఉన్న, అసంబద్ధంగా ఉన్నవి మార్చమనడం వగైరాలు) పత్రికా సంపాదకులు వేలు పెట్టకపోవడమే మేలు, కారణం అది జీతం భత్యం లేని సంపాదకుడికి శక్తికి మించిన పని. రచయితలను తప్పులు చేయనివ్వండి, సదసద్వివేచన గలిగిన పాఠకులు వాటిని ఎత్తి చూపుతారు. సంపాదకులు బరువు దించుకోవాలే గాని, లోడీలు (dumbbells) పట్టుకుని తిరగరాదు. సంపాదకులు తమ సమయాన్ని వెచ్చించవలసింది సత్తా ఉన్న రచయితలతో లేదా నిరంతరాధ్యయనంలో మునిగితేలే వ్యక్తులతో. అప్పుడు నాలుగు కొత్త విషయాలు/ ఊహలు తెలిసి వచ్చి అవి పత్రికలో చోటు చేసుకుని పత్రికా ప్రమాణాలు మరింత మెరుగు పడతాయి.
ముందు నుండి నేను చెబుతున్నది – సంపాదకులకు కావలసినది ఆలోచనల పెను తుఫాను. (Brainstorming) నలుగురి ఆలోచనలు రాపాడనిదే అది సాధ్యం కాదు. ఆ మార్గంలో ఏమి చేయగలమో ఆలోచించాలి. గతంలో నేను ఒకసారి ప్రస్తావించినట్టు – Ploughshares పత్రిక వారి సంపాదకీయ పద్ధతులు పరిశీలించండి. వారి అతిథి సంపాదకుల పద్ధతి పీర్లు ఫకీర్ల పద్ధతి కన్నా మెరుగైనది అని నా అభిప్రాయం.
“Guest editors are invited to solicit up to half of their issues, with the other half selected from manuscripts submitted to the journal and screened for them by staff editors. This guest-editor policy, which we have used since our founding in 1971, is designed to introduce readers to different literary circles and tastes, and to offer a fuller representation of the range and diversity of contemporary letters than would be possible with a single editorship.”
ఇంకొకటి, సంవత్సరం పొడవునా రచనలు పరిశీలించడం – అమెరికా పత్రికా రంగంతో ఏమాత్రం పరిచయం ఉన్నా అది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ సాహిత్య పత్రికల్లో సంపాదకులు సాధారణంగా జూన్ -డిసెంబర్ మధ్యకాలంలో వచ్చిన రచనలు మాత్రమే చదువుతారు. ఆ పద్ధతి రచయితలూ, సంపాదకులూ ఉభయులకూ మంచిది.
ఇంకొక విషయం, ఈమాట లాంటి పత్రికలు అమెరికా పత్రికా రంగంలోని మంచిని గ్రహించడంతో ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా పత్రికా నిర్వహణలో ఇక్కడ సాహిత్య పత్రికలు నడిచే తీరును అధ్యయనం చేయాలి. ఇక్కడి వదాన్యులు విశ్వవిద్యాలయాల వెంటపడి తెలుగును అధ్యాపన విషయంగా చేయడం మంచి పనే- దానికి ముందు తెలుగు సాహిత్యభాషగా నిలబడాలి కదా, అంటే వారు పెద్ద మనసు చేసుకొని పత్రికా రంగం కోసం ఒక ఫండ్ లాంటిది ఏర్పాటు చేయాలి. రచయితలకు, సంపాదకులకు, సమీక్షకులకు, నిర్వాహకులకు – ఎంత చిన్నదయినా పారితోషికం ఇచ్చి తీరాలి, ‘భారతి ఇచ్చే పారితోషికంతో నా ఖర్చులు వెళ్ళి పోయేవి’ అని ఒకసారి నార్ల గారు అన్నారు- భారతి పాత సంచికలు తిరగేసి చూస్తుంటే రచనల నాణ్యత తెలిసిపోతుంది. దాని వెనుక ఉన్న రహస్యం రచయితలు సంపాదకుల మధ్య ఉన్న సగౌరవ సంబంధం. ‘ఒంటి కాయ శొంఠి కొమ్ము’ ధోరణులు ఏనాటికి సంపాదకుల వంటికి సరిపడవు. వారికి మంచి network ఉండవలసిందే. ఒంటి స్తంభం మేడలు దీర్ఘకాలం నిలవడం కష్టం.
పోతే, ఇక మన సాహిత్యంలో పేరుకు పోయిన చెత్త ఈ నాటిది కాదు, Isuzu వారి పెద్ద ట్రక్కులతో ఒక దశాబ్దం తోలినా అధికభాగం మిగిలే ఉంటుంది. సాహిత్య పత్రికను ఉన్నత ప్రమాణాలతో ఇంత కాలం నడపటం గొప్ప విషయం. తొలినాళ్ళలో ఈమాట పల్లకీ మోసిన బోయీల్లో ఒకడిగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ – మిత్రధర్మంగా ఏవో నాలుగు సూచనలిచ్చాను. సెలవు.
నేటి ద్రావిడవాద, నీలి, నయానీలి, వామ, అతివామ, మహావామ, అభ్యుదయ, ప్రగతిశీల, హేతువాద, మానవవాద, మూలవాస, మారమూలవాస భావజాలాలు విశ్వసించే చారిత్రక ఆవిష్కరణల ప్రకారంగా “బ్రాహ్మణులు అనగా ఆర్యులు, వారు నిజమైన భారతీయతపై దురాక్రమణ చేసినవారు. వేదాలు ఆర్యులవి. ఇతిహాసాలు ఆర్య రాజుల గురించి బ్రాహ్మణ లిఖితాలు పురాణాలు ఆర్యకల్పనలు.”
కాబట్టి, పై వ్యాసంలో చెప్పిన బ్రాహ్మణ శాస్త్ర ఆవిష్కరణలన్నీ ఆర్యులవే. అందుచేత, ఆర్యవలస సిద్ధాంతాన్ని విశ్వసించేవారంతా వ్యాసంలో ’బ్రాహ్మణ‘ అనే పదం ఉన్నచోట ‘ఆర్య’ అని మార్చి చదువుకోవలెను.
ఉదా. ఇంతకీ భారతీయులు, భారతీయ బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశనానికి మూలమా?
దీనిని “ఆర్యులు, ఆర్య బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశానికి మూలమా?” అని చదువుకొనవలెను.
నాకు ఆశ్చర్యం అనిపించినదేమిటంటే పైన పేర్కొన్న మేధావులు, చరిత్రకారులు అందరూ ఆర్య దురాక్రమణ లేదా వలస సిద్దాంతాన్ని విశ్వసించినవారే. మరి, భారతీయతను నిర్వచిస్తూ ‘బ్రాహ్మణ’ అనే పదం ఎందుకు వాడారు అన్నది నాకు అర్థం కాలేదు.
’బ్రాహ్మణ = ఆర్య’ అనే సిద్ధాంతం సరియైనదే అయినట్లయితే ఆర్య విజ్ఞానం కాని భారతీయ మూలవాస, మారుమూలవాస విజ్ఞానం ఏదైనా ఉన్నదా? ఉంటే, దానిని వెలికితేసే ప్రయత్నం ఎవరైనా చేసారా? కనీసం, దాని ప్రస్తావన అయినా ఆర్యవలస సిద్ధాంతాన్ని నమ్మే ఏ చరిత్రకారుడూ ఎందుకు చేయలేదు?
(నేను ఆర్యవలస లేదా ఆర్య దురాక్రమణ సిద్ధాంతాన్ని విశ్వసించను. అది అశాస్త్రీయం అని నా భావన)
ఓ విస్తృత పరిధి విషయాలు కలిగిన దాన్ని “అది నీవు”గా తెలుగులోకి అనుసృజన చేసిన అవినేని భాస్కర్ గారికి… “అదు నీ” తమిళ మూలం రచయిత లోకేశ్ రఘురామన్ గారికి అభినందనలు, కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు.
మొదలు నుండి తుది వరకూ చదివి, గూగులమ్మ సాయంతో సమగ్ర అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించిన తదుపరి నా సంక్షిప్త తలపోతలు ఇలా:
యూదు, క్రిస్టియన్ మరియు ముస్లిం మూడు ప్రధాన ఏకధర్మ మతాలచే ఒక పవిత్ర నగరంగా గౌరవించబడిన, 5,000 సంవత్సరాల పురాతన నగరం జెరూసలేంకు ఉత్తరాన ఉన్న యూదా ఎడారిలోని సంచార జాతికి చెందిన ఒక ఆదివాసీ గొల్లతెగల ప్రజల మెడపై, చెవితమ్మెకు కింద నుంచి మొదలై మెడ, కుడి భుజమూ కలిసే చోటుదాకా సాగి ఉండే కెలాయిడ్ మచ్చల గురించి పరిశోధన కోసం తన మిత్రుడు జియాద్ మహమూద్ అబ్బాస్ పిలవగా న్యూఢిల్లీ నుండి పాలస్తీనా లోని జెరికోకు వెళ్లిన ఫ్రాంకో ఇగ్నేసీ… “తీవ్రమైన దెబ్బ, లేదా కత్తిగాటు అయితే, గాయం చుట్టూ ఈ రకమైన కణజాలం విస్తరించి కెలాయిడ్ మచ్చలు పుడతాయి. జన్యుపరంగా ఒకతరం నుండి మరో తరానికి కొనసాగుతాయి. ఈ మచ్చలకు కారణమైన జన్యువులు కొనసాగినప్పటికీ, అవి బయటపడటానికి ఏదైనా గాయం ఏర్పడాలి కదా? అవి సరిగ్గా మెడమీదే ఎలా వస్తాయి? అనే విషయ పరిశోధన కోసం జియాద్ న్యూఢిల్లీలో ఉంటున్న తన మిత్రుడు ఫ్రాంకోని పాలస్తీనాలోని జెరికోకు రమ్మని పిలుస్తాడు.
జెరూసలేమ్ నుండి, జెరికోకు భయానకమైన ఎడారి దారిలో ప్రయాణిస్తూ దొంగలముఠా, తోడేళ్ళు బారిన బడి… ఒక యూదు గురువు (సింబాలిక్ ఆఫ్ జీసస్ క్రీస్తు?) వల్ల రక్షించబడిన బాటసారి కధ… బైబిల్‌లో ప్రస్తావించబడిన “ఎ రోడ్ డౌన్ టు జెరికో”ను తలపోస్తాడు ఇగ్నేసీ. జోర్డాన్ నది ఉద్భవించిన హెర్మోన్ అనే మంచుపర్వత శిఖరాన యేసుక్రీస్తు తన మానవ శరీరాన్ని విడిచిపెట్టి, మంచులాంటి స్వచ్ఛమైన తెల్లని కాంతిని పొందే ఆ రూపాంతరం అనే మహత్తరమైన అద్భుతాన్ని చేశాడు. యేసు గలిలీ సమీపంలోని నజరేతులో పెరిగాడు. తన ముప్పయ్యవ యేట బాప్తీస్మము తీసుకున్నాడు. గుడ్డివాడికి చూపును ప్రసాదించే అద్భుతాన్ని చేశాడు.
క్రీస్తు పెరిగి పెద్దయి జీవించి మరణించిన నేల అది. క్రీస్తు మళ్ళీ ప్రాణం పోసుకుని లేచి వచ్చినప్పుడు, ఆదివాసీ గొల్ల తెగకు చెందిన ఒక వృద్ధ మహిళ, స్వర్గపు కాంతినిపొంది తిరిగివచ్చిన ఆతని చేతిలో ఒక గొర్రెపిల్లను, మెడపై ఈ మచ్చను చూసిందట. అటువంటి ఒక యేసు క్రీస్తుని వాళ్ళు తమ దేవుడుగా ప్రార్థించారు, స్వీకరించారు. వాళ్ళు యేసు క్రీస్తు తమ వంశంలోనే జన్మించాడు అని నమ్ముతారు.
కల్వరి కొండ గుట్టపైనున్న చిన్న గొయ్యి పక్కన రోమన్ సైనికులు యేసుక్రీస్తును (‘నజరేయుడైన యేసు. యూదుల రాజు’) తను మోసుకొచ్చిన శిలువమీదే వేస్తారు. అదివరకే అక్కడ ఇద్దరు దొంగలను శిలువ ఎక్కించి కుడి, ఎడమలుగా వాటిని పాతిపెట్టి ఉన్నారు. ఎడమ వైపు శిలువ ఎక్కించబడిన దొంగ పేరు గెస్టాస్. కుడివైపు శిలువ ఎక్కించబడిన మరొక దొంగ పేరు డిస్మాస్. క్రీస్తు జన్మించిన సంగతి తెలుసుకొని హేరోదు రాజు తన దేశంలోని రెండేళ్ళలోపున్న మగ శిశువులందరినీ తన ఖడ్గానికి బలిచ్చాడు! ప్రాణాలు తీయబడిన ఆ వేలాదిమంది పిల్లవాళ్ళలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్న ఏకైక పిల్లవాడు గెస్టాస్.
తోడేళ్ళ గుంపు బారి నుండి ఒక పిల్లలతల్లి తోడేలు కాపాడి తన రొమ్మిచ్చి పాలతో పొట్ట నింపి ఆరేళ్లు కాపాడబడిన గెస్టాస్, ఆ తరవాత ఒక మంత్రగాడు కి దొరికి జనావాసాలు లేని కఠోరమైన ఎడారిలో అతని వద్ద పెరుగుతాడు.
మంత్రగాడు చర్నాకోలతో కొట్టి, హింసించి గెస్టాస్నా చేత తోడేలులాగా అరిపించి ఎడారుల్లో వెళ్ళే బాటసారులను దారి మళ్ళించి ఒంటరులను చేసి వాళ్ళ దగ్గరున్న సొమ్మును దోచుకుంటూ ఉండేవాడు. మంత్రగాడు చనిపోయాక, గెస్టాస్ మృగలక్షణం, క్రూరత్వంతో యూదా ఎడారిలో వెళ్ళే బాటసారులపై దయాదాక్షిణ్యం లేకుండా దాడి చేసి దోచుకోవటం దినచర్యగా జీవించాడు.
ఒక రోమన్ సైనికుడు వీధిలో పైకి విసిరి, కత్తికి బలి చేయాలని ప్రయత్నించిగా ఏర్పడిన గాయపు మచ్చను (కుడివైపు మెడభాగంలో చెవితమ్మె క్రింద మొదలై భుజం వరకు విస్తరించి ఉన్న గాయపు మచ్చను) గెస్టాస్ యేసుకు చూపించి: “మానవరూపంలో భూలోకానికి దిగి వచ్చిన దేవుని కుమారులు… మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకున్నా… ప్రపంచ రక్షణ, పాప పరిహారాలు, మోక్షం ఎలా సాధ్యం” అని క్రీస్తుని ప్రశ్నించిన గెస్టాస్‍కు… ఓపికగా అతని కథను విన్న యేసు బదులిస్తూ “నేనుగా గుర్తింపబడే నేను ఇకపై నేను కాను” అని పైకేసి చూపుతున్న ఆయన కుడిచేతి చూపుడు వేలు, అతని వైపుకు చూపించి గెస్టాస్‍కు స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాడు.
జియాద్ తనకు యీ కథ చెప్పడం పూర్తి చెయ్యంగానే ఫ్రాంకో ఇగ్నేసీ కళ్ళనుండి ధారాపాతంగా కన్నీళ్ళు కారతాయి.
ఆ ఆదివాసీ గొల్లవారిని ఇప్పుడే చూసితీరాలి అని సాయంత్రం ఎడారిలో ప్రయాణం చేసి వెళ్లిన వాళ్లు ఒక గొర్రెల మంద, ఇసుక తిన్నెమీద నిలబడి ఉన్న, మెడ మీద ఆ మచ్చ( కెలాయిడ్ ) ఉన్న గొర్రెల కాపరిని చూస్తారు. అతని ముందు పూడుకుపోతున్న ఇసుకలో మోకరిల్లి, ఛాతీపై రెండు చేతులు జోడించి ఫ్రాంకో ప్రార్థించాడు. ఆ గొర్రెలకాపరి ఏమీ తోచనివాడిలా చూస్తూ నిల్చుని ఉన్నాడు, వెనుక మరో ఇసుకతిన్నె కవతల అస్తమిస్తున్న సూర్యుడిని గమనిస్తున్నాడు.
తిరిగి వచ్చిన ఫ్రాంకో రోజంతా ఒంటరిగా, పిచ్చివాడిలాగా, ల్యాబ్‍లో గడిపాడు… జన్యు కాపీలను మళ్ళీ మళ్ళీ తిరగేస్తూ. ఆదివాసీ గొల్లతెగల ప్రజల మెడపై వంశపారంపర్యంగా వస్తున్న కెలాయిడ్ మచ్చలకి కారణం కనుక్కుంటాడు. ఆదివాసీ తెగల జన్యువులు కేవలం బాహ్యజన్యు పరివర్తనకు (ఎపిజెనిటికి మ్యూటేషన్) మాత్రమే గురవ్వలేదు; బాహ్యజన్యు సవరణకు (ఎపిజెనిటిక్ మాడిఫికేషన్) కూడా గురయ్యాయి అనే ఒక కొత్త విషయాన్ని ఫ్రాంకో కనుక్కుంటాడు. ఇటువంటి మార్పులు అంతర్గత కారణాల వల్ల; పర్సనల్ ట్రామా అనబడే బలమైన మానసిక వేదన; వల్ల సంభవిస్తాయి అని కనుగొంటాడు.
పాలస్తీనా లోని జెరికో నుండి తిరిగి వచ్చి, అర్ధరాత్రి దాటాక న్యూఢిల్లీలోని తన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న ఫ్రాంకో కి ఇంట్లో గోడకు వేలాడుతున్న జీసస్ మీద బయటి నుండి వచ్చి పడుతున్న సన్నటి కాంతిలో, పైకి చూపాల్సిన ఆయన కుడి చేతి చూపుడు వేలు తన వైపు చూపుతున్నట్లు అనిపించింది… “ అది నీవు “ అని ‘ you are my disciple ‘ అని చెపుతున్నట్లు అనిపించింది.
John 13:35 “A new command I give you: Love one another. As I have loved you, so you must love one another. By this everyone will know that you are my disciples, if you love one another.”
Matthew 6:15 “ ESV but if you do not forgive others their trespasses, neither will your Father forgive your trespasses. NIV But if you do not forgive others their sins, your Father will not forgive your sins. NASB But if you do not forgive other people, then your Father will not forgive your offenses.
Ephesians 4:32 in Other Translations
“ Be kind to one another, tenderhearted, forgiving one another, as God in Christ forgave you. 32 Instead, be kind to each other, tenderhearted, forgiving one another, just as God through Christ has forgiven you. “
చెప్పులు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/26/2024 1:54 am
చెప్పులు స్వయంగా ఎందుకు కుట్టుకోకూడదు అంటారు లైలా గారు. పైగా చాలమంది చొక్కాలూ, జాకెట్లూ, కుట్టుకుంటూనే ఉంటారుగా అంటారు.
జాకెట్లు కుట్టడం కుట్టు సెంటర్లు నేర్పేవండీ అమ్మాయిలకు. చొక్కాలు కుట్టటం మాత్రం ఎవ్వరూ అబ్బాయిలకు నేర్పించేవారు కాదు. సూదీ దారం తోలూ వంటివి సంపాదించి చెప్పులు స్వయంగా కుట్టుకోవటం కుదిరేపని కాదండీ. అవి సంపాదించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఆటూల్స్ సులువుగా దొరకవు దొరికినా ఎంచుకోవటం తెలియాలి గా? నైపుణ్యం లేకుండా ప్రయత్నం చేస్తే ఆ డబ్బు దండుగ అవుతుంది. నేర్చుకుందుకు ఏ ఐటీఐ లోనో చేరి కోర్సు చేయాలి. ఊరికే ఎద్దేవా చేసేముందు ఆలోచించే పనిలేదా?
ఎందుకో మరి. సంపాదనపరులైన ఆడవాళ్ళను రచయితలు ఫోకస్ లోకి తేరు. ఏం చెయ్యను. నేనే ఊహించుకోవాలి అంటారు లైలా గారు.
ఒక పాత్రను ఫోకస్ లోనికి తేవటం అంటే ఆపాత్ర పాఠకుడికి కథను చదివిన తరువాత కూడా గుర్తు ఉండేలా చేయటం అని అర్థం. అంతే కాని సాధ్యమైనంత ఎక్కువ నిడివిని పాత్ర కోసం కథలో కేటాయించటం కాదు.
ఈ కథలోని అక్క గారి పాత్ర పాఠకుల మందిని నిలచే పాత్రగా ఉంది. ఇంకేం కావాలి?
ఇక కవిత గారికి హిపోక్రసీ కనిపించింది. కథచెప్పిన రచయిత నిజాయితీ కనిపించింది కాదు. విడ్డూరంగా అనిపించింది.
నాకూ పన్నెండవ తరగతిలో కూడా చెప్పులు లేవు కాలేజీలోనికి వచ్చే దాకా పేంట్లూ లేవు. నాస్కూలు చదువంతా సెకండ్ హేండ్ పుస్తకాల తోనే గడిచింది. కాలేజీ చదువు లోనూ లైబ్రరీ పుస్తకాలు దొరక నప్పుడే మొహమాట పడుతూ నాన్నగారిని పుస్తకాల కోసం డబ్బులు అడిగే వాడిని. ఎప్పుడూ బ్రౌన్ పేపర్లతో నోటు పుస్తకాలు కుట్టుకునే వాడిని. ఈకథ చదువుతుంటే ఆరోజు లన్నీ మదిలో మెదిలాయి. ఇదంతా నా హిపోక్రసీ అంటే చేయగలిగింది లేదు.
ఆ టీనేజీ కథకుడి లాగే నేనూ పెద్దయ్యాక కుటుంబానికి అది చేయాలీ ఇది చేయాలీ అని కలలు కనే వాడిని. భగవదనుగ్రహం వలన అవి చాలావరకూ నెరవేరాయి.
అన్నట్లు ఒక మాట. కాలేజీకి వెళ్తున్న పిల్లాడి నని ఒకసారి మా అమ్మగారు నాకు తను దాచుకున్న డబ్బులిచ్చి కాస్త మంచి చెప్పులు కొనుక్కో మన్నారు.
రచయిత తన వ్యాసాలలో భారతీయ గ్రంధాలనుంచి ఉదహరిస్తారు. కానీ, సైన్స్ వ్యాసాలమధ్యలో వాటిని ప్రస్తావించడం సందర్భోచితంగా అనిపించదు. మత/ఆధ్యాత్మిక గ్రంధాలు కొన్ని ఆలోచనలను ప్రస్తావిస్తాయి. అవి (సామాన్యంగా)ఆలోచనలు/ఊహలే కాని వాస్తవాలు లేదా ప్రయోగాలపై ఆధారపడిన నిజాలు కావు. ఇది ఆయా రచయితల ఊహలను కించపరచడం కాదు. కానీ, వాటికి కాన్సెప్ట్‌లను ఆపాదించడం సరైనది కాకపోవచ్చు. ఉదాహరణకు, “నేను టీ కోసం చంద్రునికి వెళ్ళి ఒక గంటలో తిరిగి రావచ్చు” అని ఒక వ్యాసం వ్రాయగలను. భవిష్యత్తులో, ఇది నిజం కావచ్చు. అటువంటి సందర్భంలో కూడా, ఇప్పటి నా ఆలోచన ఒక ఆలోచన/ఊహ మాత్రమే కాని నిరూపించగలిగిన వాస్తవం కాదు. నేను భవిష్య ద్రష్టను కాను.
ఈ విషయం రచయితకు చదువరులకు ఇక్కడ అర్థం అవుతుంది. కాని వీటిని చదివి కొంతమంది “ఇవన్ని వేదాలలొ ఉన్నాయిష” అనుకొనే ప్రమాదం ఉంది. చాలమంది ఇటువంటి వేదాలలొ పేర్కొన్న/నిరూపించిన అంశాల గురించి ఉపన్యాసాలలో ఉటంకించడం చూడవచ్చు.
ఈ వ్యాఖ్య వ్యాసం యొక్క విలువను తగ్గించడానికి కాదు. కాని ఇటువంటి వివరాలు footnoteలో ఇవ్వడం గురించి ఆలొచించవచ్చు.
అణువు ప్రస్తావన (నిర్వచనం) కనిపిస్తుంది. ఈ అణువు atomతో సమానార్థకం, moleculeతో కాదు. ఎందుకంటే …
(క) ఒక హిమోగ్లోబిన్ బణువు (molecule) ఉదజని అణువు (atom) కంటే 64,500 రెట్లు ఎక్కువ బరువు! ఒక హిమోగ్లోబిన్ బణువులో (molecule) 10,000 వరకు (ఖచ్చితమైన లెక్క నాకు తెలియదు) ఉదజని, కర్బనం, నత్రజని, ఆమ్లజని, గంధకం అణువులతో పాటు ఖచ్చితంగా నాలుగు ఇనుము అణువులు (atoms) ఉన్నాయి. ఇంత తేడా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్‍ని “అణువు” అని ఏ ముఖం పెట్టుకుని అనగలం? హిమోగ్లోబిన్, DNA వగైరాలు బణువులే! అణువులు కాదు. నిజానికి అవి బృహత్ బణువులు (mega molecules).
(చ) నిజానికి అణువులో (atom) అంతర్భాగమైన ఎలక్ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు పరమాణువులు (sub-atomic particles). వీటిలో అంతర్భాగాలైన క్వార్కులు “పరమాణు రేణువులు.”
(ట) నీరు, మైలుతుత్తం, పంచదార, కిరసనాయిలు, వగైరాలలో అతి చిన్న “రేణువులని” బణువులు (molecules) అందాం. షడ్దర్శనాలలో కాణాదుడు ఇలాంటి బణువులనే “ద్వియాణువు, త్రయాణువు,” అంటూ అణువులకి, బణువులకి తేడాని చెప్పేడు. ఇదంతా నా సొంత పైత్యం కాదు.
(2) మొసలి కన్నీళ్లు, ముద్రారాక్షసం, సింహభాగం వంటి ప్రయోగాలు “వైరల్” అవుతోన్న ఈ రోజుల్లో “లోతైన జేబులు” అనే ప్రయోగానికి కూడా తావు ఉందనే ధైర్యంతోనే ఆ ప్రయోగం చేసేను.
(3) “పస” అనే బుర్రలో ఉంది. అది కాగితం మీద “పసరు” అని పడ్డాది. నా మనోనేత్రం భౌతిక నేత్రాన్ని ధిక్కరించింది. తరువాత సంపాదకులు “ప్రూఫులు” చూడమని ఇచ్చినప్పుడు “పసరు” కనిపించింది. పసరు ఇక్కడ నప్పుతుందో నప్పదో చూద్దామని బహుజనపల్లి సీతారామాచార్యులు ని సంప్రదించి “సరిపోతుందిలే” అని సమాధానపడ్డాను. అంతేకాని ఇది ఇంగ్లీషు నుడికారానికి అనువాదం కాదు.
(4) మిగిలిన అంశాలు. నేను 1968 నుండి తెలుగులో సైన్సు వ్యాసాలు రాస్తున్నాను. ఆ రోజులలో నా దగ్గర నిఘంటువులు లేవు. ఈనాటిలా online నిఘంటువులు అప్పట్లో అస్సలు లేవు. అన్నీ స్వకపోలకల్పితాలే! వాటినే ఆకారాదిగా అమర్చుకుని వాటినే పదేపదే వాడుతూ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాను. నా నిఘంటువే నేను వాడే పదజాలానికి ఆధారం. ఉత్సాహం ఉంటే ఇక్కడ చూడండి:
వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు – Wikibooks
అర్ధ శతాబ్దం క్రిందట ఇటువంటి దుర్భరజీవితాలకు బలియైన వనితలు కొల్లలు. ఇటీవల పరిస్థితులు కొంచంకొఃచంగా మారుతున్నాయి. నేటికాలం అమ్మాయిలు పెళ్ళికొడుకులను స్వయంగా ఎన్నుకుంటున్నారు. వైకల్యాలనూ కౌటుంబిక సామాజిక అవరోధాలను చక్కగా ఎదిరించి గెలుస్తున్నారు.
కథాంతంలో అనుపమకు బ్రతుకు పండటం ఆనందదాయకమే కాని అది కావ్యదోషాలలోని అవ్యాప్తిగా చెప్పాల్సిందే.
మరో గురుదక్షిణ గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/22/2024 10:46 am
ఇప్పటికే చాలా సార్లు చెప్పి ఉంటాను ఒక మాటను. కల్పన అనేది కవి హక్కు కాని అది మూలఛ్ఛేదిగా ఉండకూడదు అని. కల్పనపేరిట కథాసంవిధానాన్ని కాని పాత్రలస్వరూపస్వభావాలను కాని వికారం చేయకూడదు అని.
ఏకలవ్యుడు అనేది అతని పేరు కాదు. లవము అంటే బొటనవ్రేలు. ఒకే బొటనవ్రేలు కలవాడు అయ్యాడు కాబట్టి అతనికి ఏకలవ్యుడని పేరు వచ్చింది.
అతడు ఒక వేటకుక్క ముఖంలో సూటిగా ఏడుబాణాలు ప్రయోగించినప్పుడే అతడి క్రూరత్వం బయటపడింది ప్రపంచానికి. ద్రోణుడు ఆలోచించినది ఒక క్రూరుడు పట్టుదలతో చేసిన సాధన పర్యవసానం ప్రపంచానికి మంచిది కాదనే. అందుకే వాడి బొటనవ్రేలిని దక్షిణగా అడిగటం జరిగింది. దరిమిలా వాడు అలాగునే మరింతసాధన చేసి చివరకు తనను మించిన క్రూరుడైన జరాసంధుడి సేనాని అయ్యాడు. కృష్ణుడి చేతిలో హతమయ్యాడు. (బొటనవ్రేలిని ద్రోణుడికి దక్షిణ ఇవ్వకుండా ఆ హిరణ్యధన్వుడి కొడుకు ఏకలవ్యుడు ఎలా అయ్యాడో!)
ఏకలవ్యుడి కథను వక్రీకరించారు. ధృష్టద్యుమ్నుడి కథను వక్రీకరించారు. ద్రోణుడి కథను వక్రీకరించారు. ఏమి సాధించాలని? ఈ చెత్తకల్పనకు కృష్ణుడిని సాయం చేసుకున్నారు! అసలు ఈకల్పనావ్యవహారం కోసం భారతకథను దారుణంగా వక్రీకరించారు
అన్నట్లు కర్ణుడిని దాత అని పొగిడినట్లున్నారు? భారతంలో అసలు అలా ఎక్కడన్నా మహాదాత కర్ణ అని ఉందా? ఏమి వెఱ్ఱి!
మూలవిరోధంగా ఇదంతా చేయటం ఒక అందమైన కల్పన అని భారతకథ సరిగా తెలియని వారు అనుకోవచ్చునేమో కాని నాకైతే వికారమైన కల్పనగానే అనిపించింది.
భారతకథ సరిగా తెలియని యువతను మరింత గందరగోళానికి గురిచేయటం తప్ప ఈకథకు మరొక పరమార్ధం ఏమీ కనిపించటం లేదు.
ఇలా మూలఛ్ఛేదకథాప్రచురణలు చేయకుండా ఈనాడు పత్రికవారిని మంచి సంయమనం పాటించవలసిందిగా చేతులుజోడించి అభ్యర్ధిస్తున్నాను.
వంటా వార్పు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
(ఈమాటకు అభిప్రాయాలూ విమర్శలూ పంపే వారు కూడా తెలుగుసాహిత్యం గురించి మాట్లాడుతున్నవారే కాబట్టి వారు కూడా సాధ్యమైనంతవరకు తెలుగుభాషలోనే వ్రాస్తే బాగుంటుందని కూడా నాఅభిప్రాయం.)
కథ మొదలు పెడుతూనే రూంలో అని ఇంగిలిపీసు ముక్కను ప్రధమకబళే మక్షికాపాతః అన్నట్లు వేయకుండా గదిలో అని కాస్త కరుణించవచ్చును కదా! చాదస్తంగా ఇంగ్లీషుముక్క లన్నీ తెలుగుచేయమని అనను కాని కాస్త వీలైనంత తెలుగు వాడవచ్చును కదా అని వాపోతున్నాను.
అదిసరే, ఈకథ బాగుంది. బహుకాలం క్రిందట చదివిన సాంబారు జన్మవృత్తాంతాన్ని వివరించే కథలాగా ఉందనిపించింది ఎందుకో (ఆకథకు రచయిత పెట్టిన పేరు గుర్తులేదు. మన్నించాలి)
ఆకథను టూకీగా చెప్తాను. కైలాసంలో శివకుటుంబంలో అమ్మవారు ఒకసారి చిరాకుపడి వంటావార్పూ అంతా నావంతే అంటే కుదరదూ – నాకూ భక్తులున్నారు బోలెడుమంది – వారిని చూచుకోవద్దా నేను? అందుకని ఇకనుండీ అందరూ వంతులవారీగా వంటపని చూడాలి అని నియమం చేసారట. అలా బండి నడుస్తూ ఉండగా ఒకనాడు సాంబశివులవారి వంతు వచ్చింది. ఆయనకు ఏం చేయాలో తోచక చివరకు గంగాళంలో నీళ్ళు ఉడకనిచ్చి కనిపించిన కూరానారా అంతా ముక్కలు చేసి దాంట్లో వేసి గుప్పెళ్ళతో ఉప్పూ కారం పులుపూ అంతా వేసి కూర్చున్నారు.
భోజనాలసమయంలో అందరూ ఆద్రవపదార్ధాన్ని దాంట్లో భీతావహంగా ములుగుతూ తేలుతూ ఉన్న రకరకాల రంగురంగుల ముక్కల్నీ చూసి ముందు జడుసుకున్నా రుచి మాత్రాం బాగా వచ్చిందని సంతోషపడ్డారు. ఈవంటకం పేరేమిటండీ అని అమ్మవారు అడిగితే నాకు మాత్రం ఏమి తెలుసూ అని శివయ్య నవ్వాడట. సాంబశివులవారు కనిపెట్టిన వంటకం కాబట్టి అప్పటినుండీ దాన్ని సాంబారు అని పిలవాలని ఏకగ్రీవంగా నామకరణం చేసారని ఆకథ చెబుతున్నది. (ఇదీ నాకు గుర్తు ఉన్నంతవరకూ ఆకథ. ఏమిటో మీతో పంచుకోవాలని అనిపించి చెప్పాను. తప్పైతే మళ్ళా మన్నించేయండి.)
శివయ్య కాబట్టి ఎలాచేసినా అమృతంలాగా ఉండటానికి కుదురుతుంది కాని పాపం మనవాడు చేసింది బంగాళాదుంపల పప్పు కదా అలా ఎలా కుదురుతుందీ అని.
ఈ రోజేమో, అక్కడెవరూ లేరు కాని తను పెద్దగా ఏడుస్తూ అరుస్తూంది, ‘మగలంజకొడుకులంతా ఒకటేరా అని తెలిసినా కూడ పెంచి పెద్ద చేసిన కదర ముండా కొడుకా’ అని ఎవరినో తిడుతూంది.
ఆమె లోని అమ్మతనం తను పెంచిన అమ్మాయిని తన సొంత కొడుకే పాడు చేస్తాడు అని అతన్ని తిట్టినప్పుడే తెలుస్తుంది. చాలా మంచి కథ, నమస్కారాలు.
“మనకి మనమాడే అబధ్ధాలు అంతగా అలవాటు అయిపోయినట్లున్నాయి.”
“అబధ్ధమన్న తర్వాత ఏదైనా అబధ్ధమే! చిన్నదీ, పెద్దదీ, హానికరమయిందీ, కానిదీ అనుకునేది మనని మనం సమర్థించుకోటానికే!”
ఈ కథ చాలా ఆలోచింపచేస్తుంది. పిల్లల పెంపకం, వాళ్ళ పట్ల మన ప్రవర్తన గురించి చక్కగా చెప్పారు, నమస్కారం.
భక్తిసాహిత్యంలో అద్భుతమైన సాహిత్యం ఉండవచ్చును. ప్రతిశ్లోకంలోనూ తదాపి ప్రతిపాదంలోనూ కూడా సాహిత్యపువిలువలు బ్రహ్మాండంగా ఉండాలీ, ప్రత్యక్షరం రసరమ్యం కావాలీ అంటే అలా ఉంటే అద్భుతమే కాని మనం సమాహారంగా ఆసాహిత్యఖండికలోని రసరమ్యత వంటివి మాత్రమే స్వీకరించాలి. మైక్రోస్కోప్ క్రింద పెడితే అందమైన వస్తువులనేకం వికారంగా కనిపించవచ్చునండి.
ఇకపోతే భక్తి సాహిత్యం మనసా ఆస్వాదించి రమించవలసినదే కాని కేవలసాహిత్యపు విలువల తూకపురాళ్ళతో బేరీజు వేయదగినది కాదు తరచుగా.
పదాశ్రితానాం చ సమస్తచౌరం అన్న ఒక ప్రయోగం తీసుకుందాం. ఒక భక్తుడు ఈవాక్యం చదివి తన్మయత్వం చెందుతాడు. ఒక విమర్శకుడు ఏముంది ఈవాక్యంలో విశేషం అనుకోవచ్చును.
భగవంతుడు తన పాదాలను ఆశ్రయించినారి సమస్తాన్నీ దోచుకుంటాడట. ఏజీవుడైనా అహమిక ఉన్నంతకాలం ఇది నాది అది నాది అన్న లెక్కలనుండి దాటి బయటకు రాలేడు. వాడు నాది నాది అనుకొనేది సమస్తం భగవానుడు తీసివేసుకున్నాక ఆభక్తుడు నాది అనుకుందుకు గాను ఏదీ మిగలదు. తనది అన్నది ఉంటే దానితో బంధం. అటువంటిది లేకపోతే ఏబంధమూ లేదు కదా. ప్రాపంచికబంధరహితుడై భగవంతుడితో మాత్రమే సంబంధం కలిగి ఉంటాడు. వాడికి ఈస్థితి కలిగించాలనే అన్నీ ఆ భగవంతుడు లాగివేసుకుంటాడని ఈవాక్యం తాత్పర్యం. ఇదంతా స్ఫురించి భక్తుడు తాదాత్మ్యం చెందుతాడు. సాహిత్యవిమర్శకుడు ఏరసానుభూతినీ పొందడు. రసో వై సః అని మన సిధ్ధాంతం కదా. ఆ రససిధ్ధి కేసి అడుగువేయని వాడికి అంతా శుష్క భక్తి ప్రలాపమే.
ఇలాగు భక్తిభావన ఉన్నవారి దృక్కోణంలో ఇది సమున్నతమైన సాహిత్యమే. అసలు సాహిత్యం అంటే ఏమిటండీ? సహితమైనది సాహిత్యం. హితముతో కూడినది అని. ఏది హితము? భగవత్సంబంధి కన్నా హితమైనది ఉందా అని భక్తులు భావిస్తారు. కొందరు సామాజిక హితము వరకూ లెక్కలు వేస్తారు. కొందరు సాహిత్యప్రయోజనం వరకూ ఆలోచిస్తారు. ఇత్యాది.
ఈ నా అభిప్రాయం మూలం గురించి. అనువాదాల గురించి కాదు. అది ఎవరు రాశారు లేదా పాడారు అన్న విషయం పక్కన వుంచి శ్లోకాల్ని మాత్రమే చూస్తే – వీటిలో వీటి కర్త భక్తిపారవశ్యం స్పష్టంగానే మనక్కనిపిస్తుంది. “చౌర్యం” అనే భావాన్ని తీసుకుని దాన్ని అన్ని శ్లోకాల్లోను అంతర్లీనంగా చొప్పించే ప్రయత్నం జరిగింది, అభినందనీయమే. “నవనీతచోరుడిగా”, “గోపీమానసచోరుడిగా” కృష్ణుడు ప్రసిద్ధుడే. మొదటిదాన్ని పాలు, మజ్జిగలకి ఇంకా కావాలంటే నెయ్యికి, రెండోదాన్ని రాధ, రుక్మిణి మొదలైన ప్రియులకీ భక్తులకీ పొడిగించటం సాధారణమే. అలాటి చోరుణ్ణి చీకటికొట్లలో బంధించటం – భక్తుల మనసుల్తో సహా – అనేది కూడ లోతైన భావనగా నాకు కనిపించదు. శబ్దప్రయోగాలూ ఏమంత చెప్పుకోదగ్గవి కావు.
కనుక నా సందేహం వీటిలో కవిత్వం వున్నదా అనేది. అంటే పైపైన కనిపించే విషయమేనా లేక ఆలోచనామృతమైన వ్యవహారం ఏమైనా వుందా అనేది. నాకలాటిది కనిపించలేదు. కనిపించినవారు ధన్యులు. అదేదో మిగిలిన వారితో కూడ పంచుకుంటే ఇంకా బాగుంటుంది.
భక్తిపురస్సరంగా వీటిని పాడుకుంటాం అంటే మంచిదే. కాని దీన్లో ఏదో అద్భుతసాహిత్యం వుందంటే ఒప్పుకోవటం కష్టం.
>> శ్లోకంలో ఒకోసారి ఒక అక్షరం మేర లోటువస్తే చ వేసేయటమే.
ఇది చదివి నవ్వు ఆపుకోలేకపోతున్నానండి. సంస్కృతం, ఛందస్సూ ఇదీ అదీ అంటూ దెప్పకండి నాకు అవేమీ రావు గాక రావు. కామెంటర్ల పేరుతో చకార కుక్షి ఐపోదావని ప్రయత్నం. మీరు/ఎవరు ఎలా తిట్టినా సంతోషమే. ఇలా రాసినండుకు నేను పోయేది ఎలాగా యమలోకానికే కనక ఏమనుకునేది లేదు. 🙂
ఏక శర్మాయ”చ”, ద్వీతీయ శర్మాయ”చ”
శ్యామలాయ”చ” యదుకుల భూషణాయ”చ”
ప్రతి శ్యామలాయ”చ”, కృష్ణమాచారీయ “చ”
ప్రతి శర్మాయ”చ”, కొలిచాలాయ “చ”
ప్రతి ప్రతి శ్యామలాయ”చ” ….
ఇకపోతే దండుగ గణాలు (దండుగ్గణాలు అనటం నాకు నచ్చలేదు) అని ఈసడించబడే వాటి గురించి కొంతైనా చెప్పుకోవాలి. తప్పదు.
సంస్కృతంలో శబ్ధాల స్వరూపం విభక్తులను అనుసరించి మారుతూ ఉంటుంది సాధారణంగా. అందుకే శబ్దమంజరిని తీసుకొని శబ్దాలను బట్టీపట్టటం. తెలుగులో ఐతే విభక్తులు ఎక్కువగా విడిపదాలు. అందుచేత సంస్కృతంలో దీర్ఘంగా సమాసాలను తయారు చేయగలిగినట్లు తెలుగులో చేయటం కుదరదు. అందుచేత సంస్కృతంలోని క్లుప్తతను తెలుగులో అలాగే దిగుమతి చేయటం దుస్సాధ్యం. సంస్కృతంలో ఒకటి చిన్న వృత్తంలో ఉంది కదా దానిని తెలుగులో దైర్ఘ్యం పెంచకుండానే వ్రాసితీరాలి అనటం అన్యాయం.
విడివిడిపదాలతో తెలుగులో పద్యాలను కూర్చేక్రమంలో అనేకకారణాలవలన కొన్ని ఇతరపదాలనూ చేర్చి పద్యపు బిగింపు తప్పదు. కేవలం అవసరమైన పదాలనే ఏరుకోవాలన్న ఆశ మంచిదే కాని తరచుగా వాటిని ఇతరపదాలతో మాటువేయకుండా ఛందస్సులలో ఇరికించటం వీలుకాదు. ఇలా అదనంగా కనిపించిన పదాలను దండుగలు అని ఈసడించటం పొరపాటు. అదనపు పదాలవలన పద్యం బిగువు చెడుతున్నదా అన్నది చర్చనీయాంశం కావచ్చు కాని అదనపు పదాలు ఉండవచ్చా అన్నది కానే కాదు.
ఆమాటకు వస్తే సంస్కృతంలో కూడా ఇలా మాటువేయకుండా శ్లోకాలను అల్లటం కుదరదు. తరచుగా పాదపూరణాక్షరాలను వాడవలసి వస్తుంది. అందరికీ తెలిసిందే చకారాలను బిగించని శ్లోకాలే అరుదు. ద్రోణంచ భీష్మంచ జయద్రధంచ వగైరా శ్లోకాలు తెలియనిది ఎవరికి? అని. కాళిదాసు గారు వ్యాసుణ్ణి చకారకుక్షి అని ఆక్షేపించాడని ఒక ఐతిహ్యం. తు హి చ స్మ హ వై పాదపూరణే అని నానుడి. శ్లోకంలో ఒకోసారి ఒక అక్షరం మేర లోటువస్తే చ వేసేయటమే. మరి దండుగలు అని అంటున్నామా వాటిని? కవుల బాధలు కవులవి, ఛందోబధ్ధంగా వ్రాయటంలో ఉన్న బాధలు ముఖ్యంగా రెండు. ఛందస్సును ఒప్పించటం అందంగా రచించటం – ఈరెండూ తరచు పరస్పర విరుధ్ధమైన త్రోవల్లో ఉంటాయి. కవి ఏవో తిప్పలు పడి ఉభయతారకం చేయాలి మరి. చేయితిరిగిన కవికైతే అంతకష్టం కాదు తరచుగా. కాని ఎంతవారికైనా సరే పూరణపదాలూ పూరణాక్షరాలూ అస్సలు లేకుండా అసిధారావ్రతంగా రసవంతమైన కవిత్వం చెప్పటం సాధ్యం కాదు.
విమర్శకాగ్రేసరులు కాస్త సానుభూతితో ఆలోచించితే బాగుంటుంది. స్వల్పాంతరత్యశ్చ బహూపయోగాః. తత్యజ్యతే తన్నతు దూషణాయ అని ఒక సూక్తిని ఒక జ్యోతిష గ్రంథంలో చదివాను. నాకు సంస్కృతం రాదు. కాబట్టి సూక్తిని ఉటంకించటంలో కించిత్తుగా పొరపాటు ఉండవచ్చును. మన్నించాలి.
అలాగని, చచ్చీచెడీ ఏవో కొన్నికొన్ని మాటలను ఛందశ్చక్రంలో ఇరికించి హమ్మయ్య ఐపోయింది పద్యం అన్నట్లు కిట్టించిన పద్యాలను ఆక్షేపించవద్దని అనటం లేదు. ఛందస్సు ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే. కవి ప్రతిభతోనే పద్యం వస్తుంది.
నేను కూడా గత ఆగస్టు నెలలో ఈ చౌరాష్టకానికి అనువాదం ప్రయత్నించాను. సంస్కృత మూలంలో ఉన్న భావాలను, శబ్దాలను వీలైనంతవరకూ ఉపయోగించడం నాకు ప్రధానం కాబట్టి, సులభమైన రగడలతో అనువాదం ప్రయత్నించాను. దీన్ని ఆగస్టులో ఫేస్‌బుక్ మీద కామెంటుగా పోస్ట్ చేసాను:
మొదటి శ్లోకానికి నేను ఉత్పలమాలను ఎంచుకున్నాను. దానిని వీరు చీల్చి చెండాడారు. వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం గురించి వారి వాదన వారిది. మూలం యధాతధంగా రాకపోవటమూ దీర్ఘవృత్తాన్ని ఎంచుకోవటమూ తత్కారణంగా కొన్ని కొత్తపదాలు చేరటమూ వంటివి వారికి నచ్చలేదు. వారి దృక్కోణం వారిది.
కాని వారు “మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది” అన్నారు. ఈమాట ఆశ్చర్యం కలిగించింది. నిజం చెప్పాలంటే కొంచెం బాధించింది.
అన్న ఈవృత్తం గానయోగ్యంగా లేదని వారు ఎలా భావించారో అర్ధం కాదు. క్లుప్తత వీడి దీర్ఘం అవటం వలన గానయోగ్యం కాకుండా పోయిందా? కొత్తపదాలతో పొడుగై పేలవమై గానయోగ్యం కాకుండా పోయిందా? దీర్ఘవృత్తాలు గానయోగ్యాలు కావనుకుంటే ఎవ్వనిచేజనించు పద్యం కూడా గానయోగ్యం కాదు కదా. తిరుపతివేంకట కవుల చెల్లియో చెల్లకో పద్యం అస్సలు గానయోగ్యం కాదు కదా? ఇక మందారమకరంద అంటూ సాగే సీసం ఐతే అస్సలు గానయోగ్యం కాకుండా పోవాలి కదా?
వీరిదృష్టిలో దండుగ గణాలు చేరాయి. సరే, అలా చేరితే అవి దైర్ఘ్యాన్ని ఆపాదించగలవు కాని పద్యాన్ని ఏకంగా గానయోగ్యం కాకుండా చేస్తాయా?
ఈపద్యం గానయోగ్యంగా ఉందని నావిశ్వాసం. నేను గాయకుడిని కాను. ఐతే పాడి మరీ ఋజువు చేయగలిగి ఉండేవాడి నేమో. మిగిలిన పద్యాలూ నాదృష్టిలో గానయోగ్యాలే. కావనుకుంటే నేను చేయగలిగినది లేదు.
దండుగ గణాలు అంటే ఒక సంగతి గుర్తుకు వస్తోంది కరుణశ్రీ గారు కుంతీకుమారి ఖండకావ్యంలో దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్ అంటారు. దిగటం అంటేక్రిందికి కాక పైకి కూడా ఉంటుందా? క్రిందికి అనటం దండుగే కదా. మెట్లమీదుగన్ అని మాత్రం ఎందుకు? మేడ దిగాలంటే మెట్లే దిగాలి కదా (అప్పట్లో లిఫ్టులు లేవు సుమా) కాబట్టి మెట్లమీదుగన్ అన్నది కూడా దండగే కదా. ఇలా పూరణకోసం పదాలు పడటం దండుగ గణాల వ్యవహారమే కదా. ఇలా లెక్కలు వేస్తూ పోయి కరుణశ్రీకి పద్యాలు వ్రాయటం చేతకాదనీ కుంతీకుమారి, పుష్పవిలాపమూ పేలవకవిత్వాలనీ అనటం చేయవచ్చునేమో. ఏమో నాకు తెలియదు. ఈశంకల వంకల డొంకల నుండి ఏకవి బ్రతికి బయటపడగలడో తెలియదు.
ఈమాట సంపాదకులకు విన్నపం.
దయచేసి ఇక్కడ పుస్తకముఖచిత్రాన్ని అడ్డంగా ముద్రించిన విషయాన్ని గమనించి సరిచేయవలసింది. ఇలా ఉండటం సుదర్శనం గారి పట్ల అపచారం అవునో కాదో నేను చెప్పవలసింది లేదు కాని అలా చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉందని మాత్రం చెప్పక తప్పదు.
ఈ ఏడుసంవత్సరాల కాలంలోనూ ఈవిషయం గమనికకు రాలేదంటే దాని అర్ధం ఈవ్యాసాన్ని పాఠకులు పట్టించుకోలేదనా? ఏమో!
చౌరాష్టకానువాదానికి యదుకులభూషణుల విమర్శ రమ్యంగా ఉంది.
నేను చేసినది చౌరాష్టకానికి స్వేచ్ఛానువాదం అని మనవి చేయటం జరిగింది.
ఒక భాష నుండి మరొక భాష లోనికి అనువదించటం లోని సాధకబాధకాలు తెలిసిన యదుకులభూషణులు అమూలకమైన మాటల నెత్తి చూపటమూ తప్పుబట్టటమూ కొంచెం అచ్చెరువు కలిగించింది. మూలం లోని పదాలను కాని తత్సమానాలను కాని ప్రయోగిస్తూ అలాగే భూలోకంలోని భావానికి న్యూనాతిరిక్తంగా ఏమీ లేకుండా మూలదైర్ఘ్యాన్నే పాటించుతూ అనువదించటం బహుకష్టం. పద్యం కృతకం అయిపోయే ప్రమాదం హెచ్చు.
మహాభారతాంధ్రీకరణం నాటి నుండి నేటిదాకా కవులు అనువాదంలో స్వేచ్ఛ తీసుకున్నారు. మక్కికిమక్కి అనువాదాలు కళగట్టినది తక్కువే కదా.
విషయాన్ని సందర్భానుసారంగా పెంచటం కొత్త విషయం కాదు కదా. పాల దొంగతనం వేమనగారే అంటించారు కదా కృష్ణుడికి గొల్ల యిండ్లపాలు కోరనేల అని. నేనేమీ కొత్తగా అన్నది లేదు.
ఇకపోతే విమర్శకులు నేను బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నానని అన్నారు. చాలా సంతోషం.
నవంబరు రెండవ తారీఖున ఒక శర్మగారున్నూ ఐదున మరొక శర్మగారున్నూ మెచ్చినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు.
సాహిత్యంపై మాకు ఏ నిర్వచనాలు నిబంధనలు లేవని ఇంకెన్ని వేలసార్లు చెపుతూ ఉండాలో అని సంపాదకులు అన్నారు కాని ఆశర్మగారు ఈమాటను తరచుగా చదువుతూ ఉండకపోవచ్చు కాబట్టి వారికి తెలిసి ఉండకపోవచ్చునేమో.
దంతుర్తి వారు అసంపూర్తిగా ఉన్న నా పూతన ఖండ కావ్యాన్ని ఈమాటకి పంపి ప్రచురించండి పూర్తిగా, ఇదే సరైన సమయం అన్నారు. మంచిసలహా – అలాగే చేస్తాను త్వరలో. ఆపైన ఈమాటవారి యిష్టం.
అనువాదం బావుంది. ఇంగ్లీష్ అనువాదానికి సరిపోలినట్లే కాకుండా, తెలుగు రచనలాగే ఉంది. గొప్ప కథే. నిజానికి టాల్‌స్టాయ్ అనువాదానికి అంతా తొందరగా లొంగే రచయిత కాదని నాకు ఇన్నాళ్ళు అనిపించేది. ఈ కథ కాస్త బెటర్ అనుకుంటా.
జీవితానికి, మృత్యువుకు మధ్య మనిషిపడే సంఘర్షణ కథలో ముఖ్యమైనదైనా, తనది కాని కష్టమూ సుఖమూ తనకి పట్టనట్టు ఉండే మానవ నైజాన్ని విపులంగా వర్ణిస్తుంది కథ.
చాలా చక్కటి వ్యాసం రాసేరు వేమూరి వారు, ఎప్పటిలాగానే. ఎనభైల మధ్యలో న్యూరల్ నెట్స్ లో బులబులాగ్గా వేలుపెట్టి అప్పుడున్న కంప్యూటర్లతో ఉపయోగపడే ఫలితాలు రాబట్టలేక తూ నాబొడ్డు అనుకుని వేరే దారి చూసుకుని ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ చిన్న చినుకులా మొదలై ఇప్పుడు ఎంతో విస్తరించి మహోద్ధృత ప్రవాహంగా మారి పరవళ్లు తొక్కుతూ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్న Generative AI ని గుడ్లప్పగించి చూస్తున్న వాళ్లలో నేనూ ఒకణ్ణి ! (Protein Folding problem ని Google Deepmind వాళ్లు సాల్వ్ చేసింది కూడ Generative AI కి గుండెకాయ వంటి Transformer network ఆలోచనల్ని వాడే.) ఒకప్పటి industrial revolution లాటి మరో కొత్త అధ్యాయం మానవచరిత్రలో మొదలౌతున్నట్టు కనిపిస్తుంది దినదినాభివృద్ధి చెందుతున్న ఈ technology ని చూస్తుంటే. ఇది ఎటుగా పయనిస్తుందో బహుశ ఇప్పుడే ఎవరూ చెప్పలేరనుకుంటాను – వేమూరి వారు చెప్పినట్టు రెండు విభిన్న వర్గాలుగా మేధావులు విడిపోయినట్టున్నా it’s too early to make defendable predictions. కాని ఈ technology గురించి ఎంతోకొంత తెలుసుకోవటం ప్రతి వారికి అవసరం అని నా అభిప్రాయం – లేకపోతే వెనకబడిపోయే ప్రమాదం విస్పష్టం. కనుక దీనివల్ల మొత్తం మీద లాభమా నష్టమా అనే చర్చల కన్న దీన్ని ఎలా ఉపయోగించగలం, ఎలా వెనకబడకుండా ఉండగలం అని ఆలోచించటం ఉత్తమం. ప్రస్తుతం అమెరికా, చైనా నువ్వా నేనా అన్నట్టున్నాయి ఈ రంగంలో. మిగిలిన దేశాలు పక్కన నిలబడి చోద్యం చూస్తూ వుంటే ముందుముందు వీళ్లలో ఎవరో ఒకరి వెనక చేతులుకట్టుకు నిలబడవలసి వస్తుందనుకుంటాను.
నవంబర్ 2024 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:
11/05/2024 6:28 am
మీరు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది – పుస్తక సమీక్షలు, విమర్శలు ప్రచురించడం – మీ ధ్యేయాలు, ఆశయాలు ఇప్పటికే అందరికీ స్పష్టంగా తెలిసివచ్చాయి – ఇక కావలిసినదల్లా కార్యాచరణ; అమెరికాలో తెలుగును ఉద్ధరించడానికి ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరికీ అర్థం కాని చిన్న విషయం – భాషను, సాహిత్యాన్ని సజీవంగా ఉంచుకోవాలి అంటే సమీక్షలను, విమర్శలను విరివిగా వచ్చేలా ఒక యంత్రాంగాన్ని, వ్యవస్థను ఏర్పరచుకోవడం. కవిత్వంలో ఒక కవి స్థానాన్ని నిర్ణయించే, సాహిత్యంలో కథ స్థాయిని నిరూపించే, అనువాదాల గుణదోషాలను విచారించే -విమర్శ ద్వారానే అది సాధ్యం. గతంలో ఈ మార్గంలో నేను కొంత ప్రయత్నం చేసి ఉన్నాను – ఆ అనుభవంతో చెప్పగలను – తొలినాళ్ళలో అందరూ మీ ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేరు – సదరు కవి కీర్తికి కళంకం తెస్తున్నారనో, సదరు అనువాదకుడి కంచుఢక్కను పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నారనో వారి అనుచరశ్వానగణం దాడి చేయవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఇతరులకు భుజకీర్తులుగా, భజంత్రీలుగా మారే ‘సృజనకారుల’ సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకరం. ఎవరూ విమర్శలకు అతీతులు కారు. పుఠం పెట్టవలసిందే. వయసు, పదవి, ప్రచురించిన పుస్తకాల సంఖ్యా, తెచ్చుకొన్న లెక్కలేని అవార్డులు -ఇవేవి నహి నహి రక్షతి డుకృఞ్కరణే. మీరు కార్యాచరణ మొదలు పెట్టడం మంచిది. ఒంటి చేత్తో ఒకరు చేయగల పని కూడా పెద్ద పెద్ద పత్రికలు చేయలేక పోవడం క్షమార్హం కాదు. అట్టే సమయం లేదు – ఇరవై ఏళ్ళుగా చూస్తున్నా – ఈమాట ఈ విషయంలో ముందడుగు వేయలేదు అని చెప్పడానికి విచారిస్తున్నాను.
[పుస్తకాలు, కథలు చదివినవారు వాటిగురించి వ్రాయాలి. అలా సమీక్షలు, విమర్శలు, చర్చలతో నిండిన సాహిత్యవాతావరణం కావాలి. తెలుసు. ఈ చింత మాకూ ఉంది. ఈలోటు ఎలా పూడ్చాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. తరచుగా రచయితలను, విమర్శకులను సంప్రదిస్తూనే ఉన్నాం. సమీక్షలు, విమర్శావ్యాసాలు వ్రాయమని అభ్యర్ధిస్తూనే ఉన్నాం. ఇది అందరు రచయితలు, పాఠకులు కలిసి చేయవలసిన పని. విరివిగా చదివి సమీక్షలు ప్రతినెలా వ్రాయగల వారికోసం వెతుకుతూనే ఉన్నాం. – సం.]
నోబెల్ కమిటీ వారు కంప్యూటర్ సైంటిస్టులకూ బహుమతిని ఇవ్వటం బాగుంది కాని కంప్యూటర్ సైన్సులో ఫిజిక్సూ కెమిస్ట్రీ కూడా అంతర్భాగాలన్నట్లుగా చేయటం నాకైతే బాగా అనిపించలేదు. కొన్నాళ్ళూ పోతే ఏదో ఒక సినిమాకు కూడా నోబెల్ బహుమతి రావచ్చును. ఏమో గుర్రం ఎగరా వచ్చు!! ఇకపోతే –
హఠాదుత్పన్న ప్రవర్తన
ఇదేదో రశ్మ్యుద్గారత లాగా నోరుతిరక్కుండా ఉందండీ.
భూగర్భంలో ఆరడుగుల లోతున పడి మగ్గుతూన్న
ఆరడుగుల లోతు భూగర్భం ఏమిటండీ. మనవాళ్ళు బోరుపంపులే వేల అడుగుల లోతుకు వేసేస్తుంటేనూ. ఆరువేల అడుగుల లోతున అనండీ కనీసం…
[మనిషిని సమాధి చేసేది ఆరడగుల లోతులోనే. అదీ రచయిత ఉద్దేశ్యం – సం.]
పెద్దన్నయ్య స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ కాదు అన్నారు. పొరపాటు. ఆయన ప్రవర్తన స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ ఐన వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో అలాగే ఉంది అక్షరాలా.
రమేష్ గారు అద్భుతమైన కథ అన్నారు కాని నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అద్భుతమైన నవలకు స్కెచ్. శర్క గారికి తీరికా ఓపికా ఉంటే పెద్దన్నయ్య అనో కర్మయోగి అనో పేరు పెట్టి ఈకథనానికి నవలారూపం ఇవ్వవచ్చును.
శర్మగారు దీనిని నవలారూపంలో వెలువరించితే చదువరులకు చాలామందికి భుజాలు తడుముకోవలసిన సంగతులు అనేకం తప్పక కనిపిస్తాయి.
ఇలా ఒక స్కెచ్ రూపంలోనే ఆలోచనలను రేకెత్తించే దీనికి నవలారూపం మరెంతగా ఆలోచనీయం అవుతుందో వేరే చెప్పనవసరం లేదు.
“నా చిన్నతనంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దీపావళి ప్రత్యేక సంచికలకి ‘కునేగా మరికుళందు’ అనే సెంటు రాసి అమ్మేవారు” అన్నారు.
నాకు ఆంధ్రపత్రిక ప్రత్యేకసంచికల గురించి తెలియదు కాని ఆంధ్రప్రభ ప్రత్యేక సంచికలకి ‘కునేగా మరికుళందు’ పరిమళం అద్దేవారని చక్కగా గుర్తుంది. ఐతే ఆంధ్రప్రభ ప్రత్యేక సంచిక ఆగష్టు పదిహేనుకు వచ్చేది జన్మదిన ప్రత్యేకసంచిక అన్న పేరుతో అని చాలాబాగా గుర్తు. ఆంధ్రప్రభ దీపావళి ప్రత్యేక సంచిక అంటూ ఒకటి వెలువరించేదా అని నాసందేహం. ఆంధ్రప్రభ వారు నవలల పోటీని ఉగాది సందర్భంగా ప్రకటించేవారనీ గుర్తు.
మీవ్యాసంలో మీరు శాస్త్రసాంకేతిక పదాలకు చేసిన తెలుగుసేత ఆకట్టుకుంది. మీ నిఘంటువును తప్పక పరిశీలించవలసిందే.
తెలుగులో శాస్త్రీయమైన అంశాలమీద వచ్చే రచనలు ఎప్పుడూ చాలా స్వల్పసంఖ్యలోనే ఉంటూ వస్తున్నాయి. నాచిన్నప్పుడు వేమరాజు భానుమూర్తి గారు వెలుగు ధ్వని అంటూ వ్రాసిన పుస్తకాలను చదివి చాలా చాలా ఆనందించే వాడిని. సృష్టికథ అనే పుస్తకం నాకు అప్పట్లో బహుమతిగా వచ్చింది. అదొకటీ మెదడు గురించి వ్రాసిన పుస్తకం ఒకటీ పడీపడీ చదివేవాడిని.
ఇలా శాస్త్రవిషయకమైన రచనలు విరివిగా తెలుగులో వస్తే ఎంతో బాగుంటుంది.
“రాను రాను తెలుగు సాహిత్యం పాఠకులను పోగొట్టుకుంటోంది. ఒకప్పుడు పత్రికలు, ప్రచురణకర్తలే రచయితకి పాఠకులకి మధ్య వారధులు. నాకు తెలియని ఆ పాఠకులు నిర్మొహమాటస్తులు. నా కవితలలో అస్పష్టతని, కథలలో అర్థంకానితనాన్ని వివరిస్తూ వారినుంచి వచ్చే విమర్శలో నిజాయితీ వినిపించేది.”
అన్న ఒక రచయిత చుట్టూ అల్లిన కథ. అహంలేని, కీర్తికాంక్షకి దూరంగా ఉండే రచయిత గూర్చి. అలాంటి వాళ్లు ఉండరని కాదు గానీ, వెబ్ పత్రికలు లేని కాలంలో కూడా శ్రీశ్రీ, దేవులపల్లి, ఆరుద్ర వంటి మహామహులకి బ్రహ్మరథం పట్టారు. వాళ్లని ప్రసంగాలకోసం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఆహ్వానించాయి. రెండు మహారచయితల/కవుల బృందాలు పత్రికా ముఖంగా చేసుకున్న యుద్ధాలగూర్చి విన్నాను కానీ, అది కనీసం అయిదు దశాబ్దాలకి పైగా వెనుక. ఎంత నిష్కర్షగా సంపాదకులకి సామాన్య పాఠకులు ఉత్తరాలు రాశారో గానీ, నేను పత్రికలు చదవడం మొదలయిన దగ్గర్నించి అచ్చులో పేరు చూసుకోవాలన్న తపనలే ఎక్కువ కనిపించాయి. అందుకే ఆ వారధి పోలిక అసమంజసం అనిపించింది. కానీ, అదే ఈ కథకి కీలకం.
బాగుందండీ కథనం… కథ నేపథ్యంగా కొన్ని స్పష్టం చేసారు. “రాను రాను తెలుగు సాహిత్యం పాఠకులను పోగొట్టుకుంటోంది. ఒకప్పుడు పత్రికలు, ప్రచురణకర్తలే రచయితకి పాఠకులకి మధ్య వారధులు. నాకు తెలియని ఆ పాఠకులు నిర్మొహమాటస్తులు. నా కవితలలో అస్పష్టతని, కథలలో అర్థంకానితనాన్ని వివరిస్తూ వారినుంచి వచ్చే విమర్శలో నిజాయితీ వినిపించేది. ఎప్పుడైతే పాఠకులు దూరం అవుతారో, సెల్ఫ్ ప్రమోషన్, ఒకరినుండి ఇంకొకరు మెప్పు ఆశించడం, మొహమాటపు పొగడ్తలు, ఇవన్నీ రచయితలకి అదనపు బరువులు. అందుకే ఇకపైన ఈ రకమైన జీవితానికి దూరంగా వుండదలిచాను” ఇది నిజం… Self promotion ఇటీవల రచయితల్లో ఎక్కూవ అయ్యింది.
అక్టోబర్ 2024 గురించి దాసరి అమరేంద్ర గారి అభిప్రాయం:
10/05/2024 3:57 am
సాహిత్యం వైయక్తిక ప్రక్రియ అనిపించినా అది సామూహిక సామాజిక ప్రక్రియ. మనిషికి సాహిత్యం కళలు ప్రాథమిక అవసరాలు కావు. ఏ సమూహానికైనా తిండి గుడ్డలాంటి అవసరాలు తీరాకే కళాసృజన సాధ్యం.
*
సాహిత్య ప్రయోజనాలు అనేకం: మానసోల్లాసం, మానసిక వికాసం, వ్యవస్థ స్థిరీకరణ, నిరసన ప్రకటన, ప్రతిఘటన, పోరాటం – చరిత్రలోకి వెళితే ఇలా ఎన్నో ప్రయోజనాలు సాధించబడి కనిపిస్తాయి. ఈ ప్రయోజనాల్లో కొన్ని యథాతథస్థితిని కాపాడేవి. కొన్ని గతవైభవం కోరేవి. కొన్ని గతాన్నీ వర్తమానాన్నీ ప్రశ్నించి రేపటి మార్పుకు దారి వేసేవి.
*
గతమూ యథాస్థితీ కోసం రాసేవారి వెనుక శతాబ్దాల సాధన ఉంది. వ్యవస్థ తోడ్పాటు తప్పక ఉంటుంది. వారి వస్తువు ఎలాంటిదైనా శైలి శిల్పం లాంటి సాహితీ విలువలు పుష్కలంగా ఉంటాయి.
రేపటి కోసం రాసేవారిది ఏనాడైనా ఎదురీత. రాయడం అప్పుడే నేర్చుకొంటోన్న బృందమిది. జీవితమే వీరి కథా వస్తువు. పోరాటమే వీరి శైలి. ధిక్కారమే వీరి శిల్పం.
*
ఈమాట ఎవరిది? ఎవరికోసం?
మనకు స్పష్టత అవసరం.
మానసోల్లాసం, వికాసమే లక్ష్యమనీ, రచనలో పరిణత నిర్దుష్టతే ప్రామాణికమనీ ఈమాట అనుకుంటే – సరే… అలానే కానిద్దాం.
కానీ సాహిత్యానికి వేరే ప్రయోజనాలకోసం దగ్గర అయ్యే పాఠకులూ రచయితలూ ఉంటారనీ, వారి రచనల్లో మనమనుకొనే ప్రామాణికత ఉండక పోవచ్చనీ, అంతమాత్రం చేత అవి అరత్నాలు అయిపోవనీ ఈమాట గ్రహించడం ప్రాథమిక అవసరం. అగ్రవర్ణ సాహిత్యమూ అణచబడినవారి సాహిత్యమూ ఒకే స్థాయిలో ఉండాలనకోడం సమంజసం కాదు. అలాంటి సాహిత్యాన్ని నిరసించడం తగదు.
*
ఈ విషయంలో ‘ఆక్టోబరు 2024’ రచనలో ఈమాట మాటలు తూలింది. ఆలోచనను ఆవేశానికి పణంగా పెట్టింది. తానేమిటో ఈమాట తేల్చుకోడానికీ, తేల్చుకున్నాక అడుగులు సవరించుకోడానికీ ఇప్పటి చర్చ సరైన అవకాశం కలిగిస్తోంది. వినియోగించుకుందాం.
అమరేంద్ర
5 అక్టోబర్ 2024
[ఈమాట ఏ రకమైన సాహిత్యానికీ వ్యతిరేకి కాదని, సాహిత్యానికి ఎటువంటి హద్దులు, ఆంక్షలు, నిర్వచనాలు ఉండవు, ఉండకూడదు అని మా నిశ్చితాభిప్రాయమని, మరొక్కసారి స్పష్టం చేయవలసి ఉంది. “పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగలిగినది ఏదైనా మంచి సాహిత్యమే” అన్నది ఒక్కటే ఈమాట మాట. అదే సాహిత్యప్రయోజనం. సాహిత్యానికి వేరే ప్రమాణాలు ఇంకేమీ లేవు. సాహిత్యంగా మలచబడలేని వస్తువు ఏదీ లేదు. ప్రతీ రచనకు ఒకే ఆశయం ఉంటుంది. అది – ఆవేశమైనా, ఆహ్లాదమైనా, అసహ్యమైనా, ఇంకే అనుభవమైనా – పాఠకులలో స్పందన కలిగించడం.
“సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినవి సాహిత్య రత్నాలు కావు” అని ముందుమాటలో మేము అనలేదు. “సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి ‘వ్రాసినంత మాత్రాన’ అవి సాహిత్య రత్నాలయిపోవు” అని మాత్రమే అన్నాం. మమ్మల్ని నిందించిన వారెవరూ ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న అర్థభేదాన్ని గమనించలేదు – కారణాలు అనేకం. ఎవరికి తోచినట్టు వారు అర్థం చెప్పుకున్నారు. ఈ వాక్యానికి బదులు “బ్రాహ్మణుల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు” అని ఉదహరించి ఉంటే ఈ విపరీతార్థాలకు ఆస్కారం ఉండేది కాదని ఇప్పుడు కలిగిన అభిప్రాయం.
కథావస్తువు జీవితం అయినా, భ్రమ అయినా చదివించలేని సాహిత్యానికి ఏ ప్రయోజనం ఉంటుంది? అంటే కేవలం వస్తుబలం వల్లనే సాహిత్యప్రయోజనం చేకూరదు. అందువల్లే, వాక్యంపై శ్రద్ధ పెట్టండి, చదివించగలిగేలా వ్రాయండి అని పదేపదే చెప్తున్నాం. సాహితీ విలువలు పట్టుపడేదాకా వ్రాయకండి అని అనటం లేదు. వ్రాయండి, మీ ఇష్టానుసారం వ్రాయండి. కాని, వస్తువు వల్లనే మీ రచనకు విలువ వస్తుందన్న (సాహిత్య ప్రయోజనం చేకూరుతుందన్న) భ్రమలో ఉండకండి. వ్రాయండి, వ్రాసినది ఒకటికి పదిసార్లు చదువుకోండి. వ్రాసినది దిద్దుకోండి – అనే మేము అంటున్నది. వాక్యానికి శక్తి ఉంది. దానిని సరిగ్గా వినియోగించుకోవాలంటే వాక్య లక్షణం తెలియాలి. రచయితకు ఆవేశం మాత్రమే సరిపోదు, ఆలోచన కూడా అవసరం. నిర్జనమైన ఎడారిలో ఎంత బలంగా మీరు ధిక్కారస్వరం వినిపించినా ఏం ప్రయోజనం? ఎవరూ పూర్తిగా చదవలేని, చదివినా ఆ వస్తువుతో మమేకం కాలేని రచనతో ఏ సాహిత్యప్రయోజనం? రేపటికోసం రాస్తున్నవారు, ధిక్కారపోరాటాలే శైలీశిల్పాలయినవారు నిజంగా తమ సాహిత్యంతో సమాజంలో మార్పు తేగలగితే అంతకంటే కోరుకునేది ఎవరికీ ఏమీ ఉండదు, మాకంటే సంతోషించేవారు, ప్రోత్సహించేవారు ఇంకొకరు ఉండరు. ఏ గొంతుతో చెప్పినా, ఏ భాషలో చెప్పినా మేము ఎప్పుడూ చెప్తున్నది ఒకటే: సాహిత్యం కూడా ఒక కళ. దానికీ అభ్యాసం, పరిశ్రమ అవసరం. రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ ఉండాలన్నదే మా కోరిక, మా నమ్మకం. – సం.
తాక: అక్టోబరు 2024′ రచనలో ఈమాట మాటలు ‘తూలింది’ – ఈ విషయంలో కాదని; మనసాహిత్య వారసత్వసంపద అప్రస్తుతం, ఇప్పుడు చదవడం అనవసరం అని ప్రబలుతున్న ఒక ధోరణి పట్ల మాత్రమేనని గమనించమని విన్నపం.]
అక్టోబర్ 2024 గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
10/04/2024 2:24 pm
ఒక అజెండాతో మాత్రమే రచనలు చేసే రచయితలు…
కీలకం అంతా ఇక్కడ ఉంది. మీవ్యాసంలోనూ, సమకాలీనసాహిత్యం విషయంలోనూ కీలకం అదేను.
ఒక మంచిరచనకు ఉండే ముఖ్యలక్షణాలలో మొదటిది చదివించగలగటం రెండవది ఆలోచన రేకెత్తించగలగటం. మూడవది దాని గురించి ఇతరులకు చెప్పాలని అనుకోవటం. ఈతూకపురాళ్ళు వేసి తూచండి.
సమకాలీనరచనలు ప్రజల మనస్సులకు ఎక్కుతున్న పక్షంలో వాటికి మంచి ఆదరణ ఉండి సాహిత్యరంగం కళకళలాడుతూ ఉండేది. ఆరచయితలకు కాసిని కాసుల గలగలలూ వినిపించేవి (వారూ బ్రతకాలిగా మరి). అలాంటిది స్వప్నంలో తప్ప వాస్తవజగత్తులో సాహిత్యకారులు చూడలేకుండా ఉన్నారే?
ఏవో అజెండాలతో బయలుదేరి రకరకాలవాదాల ప్రచారసాహిత్యం తయారీ ఫాక్టరీ కార్మికులలాగా రచయితలూ కవులూ కష్టపడి అచ్చుపోసి జనం మీద విసిరేసే చిన్న పెద్దా కరపత్రాల్లాంటి సో-కాల్డ్ ఆధునికసాహిత్యాన్ని పోగేసుకొని చదువుకొనే పాఠకులు ఎక్కువమంది ఉండటం కష్టమే.
ఏరంగు కళ్ళద్దంలో నుండి చూస్తే ఈ ప్రపంచం ఆరంగు పులుముకొని కనిపిస్తుందే కాని అది సత్యప్రపంచం కాదు కదా. ఈ ఇజాలూ వాదాల కళ్ళద్దాలను ప్రక్కనబెట్టి స్వఛ్చమనస్క్కులై తెలుగు రచయితలూ మంచి రచనలు చేయటం మొదలుపెట్టితే సాహిత్యరంగానికి మంచిరోజులు వస్తాయి. లేకుంటే లేదు.
వామ్మో !
ఎంత ఆగ్రహం!
చి న
నిజమే కాని వాళ్ళు వినేటట్టు లేరు మరి!
ఆమె మొగుడు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
09/28/2024 2:00 pm
తిక్కపుట్టి తాను గడుపుతున్న జీవితం నుండి పారిపోవటం గురించిన కథ.
నిజానికి నిత్యమూ ఎంతో మందికి ఎన్నో కారణాలవలన తాము గడుపుతున్న జీవితాల నుండి పారిపోవాలన్న గాఢమైన సంకల్పం అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఐతే ఆసంకల్పం ఎంత తీవ్రంగా కలిగినా దానిలో చెప్పుకోదగినంత స్థిరత్వం కుదరక వారు పారిపోకుండా అవేజీవితాల్లో పడుంటున్నారు. ఆకోణంలో జరిగితే చదువరుల్లో కొందరైనా ఈచేతకాని వెధవ తమకంటే కొంచెం నయంగానే ప్రవర్తించి చివరకు తెగించి జీవితాన్నుండి పారిపోయాడు భలే అని ముచ్చటపడతారు. అదలా ఉంచితే పారిపోవటం అనేది ఎన్నటికీ నాయకలక్షణం కాదూ కాలేదూ కాబట్టి పారిపోయిన ఇతగాడి మీద చివరకు ఎక్కువమంది జాలిచూపుతారే కాని ఇతగాణ్ణి మాత్రం స్ఫూర్తిగా తీసుకొనే సాహసం చేయరు లెండి.
నిజం చెప్పాలంటే నేను మీరు నిజంగానే మీకథనాయకుడికి హఠాత్తుగా నాయకలక్షణాలు ప్రసాదించి తిరస్కరణలను తిరస్కరించి నిలబడే సమున్నతుణ్ణి చేసిపారేస్తారేమో కథాంతంలో అని దురాశపడ్డాను. అలాచేస్తే మరీ సాదాసీదా కథ ఐపోతుందీ రొటీన్ ముగింపు ఐపోతుందీ అనుకున్నారు కాని ఇలాంటి వాడు హీరో ఐపోవటం రొటీన్ కాదు కదా అని ఆలోచించారు కాదు కదా.
పోనీయండి.
ఒక జీవితం మనం కోరుకున్నట్లు సాగాలని లేదు.
ఒక కథ మనం అనుకున్నట్లు ఉండాలని లేదు.
మీ అసమర్ధుడి జీవితయాత్ర ఇలా ముగిసినందుకు అతగాడికి నాసానుభూతిని తెలియజేయండి మీకు ఎక్కడన్నా ఎప్పుడన్నా తారసపడితే!
…శ్రీమద్రామాయణమహాకావ్యం లోని సీత లంకలో దుఃఖంలో మునిగిపోయి రావణుణ్ణి అక్షరాలా తృణీకరించి ఎప్పుడు రాముడు.వచ్చి రక్షిస్తాడా అని దీనంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అదంతా తప్పూ అక్కడ లంకలో సీత మహదానందంగా గెంతులు వేస్తూ ఉందని వ్రాయటం ఏమంత సమజసమైన కల్పన అంటారు? ఈ వికారమైన కల్పనకు విజ్ఞతకల చదువరులు ఆనందంతో పులకరించి పోతారా?… -తాడిగడప శ్యామల రావు.
ఈ Janaki’s Zen కథలో సీత రాముడి వర్ణచిత్రాలు గీయటం, అందరికీ చూపటం ఈ పాఠకునికెందుకో గిట్టలేదు. మరి వీరెందుకో తన వర్ణచిత్రంతోనే ఇక్కడ, 8/17/24న ప్రవేశించారు. ఆ మరుసటి రోజు, ఈమాట పత్రికలో మరో అభిప్రాయ వేదికలోనూ అదే వర్ణచిత్ర ప్రదర్శన. అక్కడ వారు తమ పాత స్నేహితులతో సంభాషించినారు. అమెరికా పాత స్నేహితులు ఈయన్ని అన్ని సంవత్సరాల ఎడబాటు తర్వాత ఎలా గుర్తు పడతారు ఇప్పటి తన బొమ్మ చూపితే. అంతేగా మరి. అందువల్లే తన బహుపాతచిత్రంతో, ప్రవేశం ఐఉండాలి.
అక్కడనే, వారి మిత్రులతో (తద్వారా ఈమాట పాఠకులకూ) తామిప్పుడు ఫుల్ టైమ్ “రామస్మరణానందంలో” ఉన్నట్టు తెలిపారు.
మరి Janaki’s Zenలో – సీత రామస్మరణానందంలో ఎందుకు ఉండకూడదు! సీత రాముడు భార్యాభర్తలు. ఒకరియందు ఒకరు అనురాగం కలవారు. సీతకన్నా రాముడితో సన్నిహిత సంబంధం, సాన్నిధ్యం – తాడిగడప శ్యామల రావుకు సాధ్యమా? ఉందనుకుంటే ఎంత అవివేకం! కావాలనుకుంటే ఎంత దురాశ! What an encroachment! What a villainy!
Janaki’s Zen కథలో – రాక్షసుడు రావణుడే చూపలేదు అలాటి అసభ్యమైన చొరవ. సీతారాముల ప్రేమ గురించి తెలిశాక, రావణుడికి వారిని విడదీయబుద్ధి కాలేదు. అదే కరుణ అంటే! వాల్మీకి రామాయణ రచన ప్రతిపాదన అదే. ప్రేమజీవులను విడదీయవద్దు అని. అతడి కావ్యపు ఆశయం అదే. అంతేకాని సీతను చెట్టుకింద కూర్చోబెట్టి, ఆమె ఏడుస్తుంటే, గుడ్లప్పచెప్పి చూడమని, సీత అన్నం నీళ్ళూ లేకుండా పడి ఉంటే, తను మాత్రం సుష్టుగా తిని, సోఫాలెక్కి టి.వి. స్క్రీనుల మీద సుందరాకాండ చూసుకుంటూ ‘అబ్బా, నేనెంత సనాతనుడిని, ధార్మికుడిని’ అనుకుని కులుక్కోమని కాదు.
ఈ పాఠకుడికి కరుణ అంటే అర్థం తెలియదు. కరుణ అంటే sorrow, విషాదించటం మాత్రమే, చూచినవారు జాలిపడిపోయి, అందరూ గుంపుగా ఏడుసుకుంటూ కూర్చోటమని అని ఈయన అనుకుంటున్నాడు? ఎంత తప్పుడు ఆలోచన! కావ్యము, కల్పనలలోనైనా, అలంకారశాస్త్రం ఇలా అర్థం చేసుకోమన్నదా కరుణరసాన్ని! కరుణ అంటే compassion. Kindness. ఇతరుల బాధ నివారించటం. ఈయనకు అలాటి సుజ్ఞానం ఉన్నదా?
లేదు. వీరు, తన కీర్తనలు ఎవరో దొంగతనం చేసేశారని “వ్యసన పడి” సొంత బ్లాగు మూసేసి, వారి కల్పిత స్వబాధోపశమనంకోసం ఇక్కడకు తరలి వచ్చినారు. ఆ సూనృత వాక్యం వారే చెప్పినారు. ఉపశమనం వీరికి ఎలా వస్తుందంటే, ఇతరులను ఎగతాళి, వేళాకోళం చేస్తూ -ప ప పపాత అంటూ నత్తులు కొడుతూ, అది తప్పు ఇది తప్పు అని ఇక్కడ వీరంగం చేస్తే వస్తుంది. సీత ఏడుస్తూ అశోకవనంలో ఉంటే, వీరి దొంగబాధకు ఆమె శోకం మందు?
అలాటి పిచ్చి, తిక్క చేష్టలు ఇక్కడ కుదరదు కాక కుదరదు. ఈ కథలో, శ్రీరాముడి దయ చేతను నారూఢిగ సకల జనులు ఔరా యనగా – సీత రాముడు డ్యూయెట్లు పాడుకుంటారు. సంతోషంగా ఉంటారు.
కోతీ కోతీ ఎందుకు ఉన్నావు అంటే చక్కనమ్మను వెక్కిరించటానికి అన్నట్టు తన వర్ణచిత్రంతో వీరు ఇక్కడకు ప్రవేశించినారు. ఎలాగూ వచ్చారు కనుక వీరే అశోకవనంలో చెట్టుకింద సీత స్థానం భర్తీ చెయ్యవచ్చు. అటూ ఇటూ పోయేవారికి పాములు, పిడకలు అని పాతచెత్త బోగస్ కనికట్టు కబుర్లు చెప్పవచ్చును. శర్మ దంతుర్తి, ఈ నా వ్యాఖ్య ఆధారంగా, ‘అశోక వనంలో చెట్టుకింద తాడిగడప శ్యామల రావు’ అని సీక్వెల్ రాస్తారు. He is a fast writer. ‘పూతన’ మీద పద్యంతో మొదలుపెట్టి, పోతన భాగవతం లోని రసగుళికలు చూపగలిగిన రచయితకు అదెంత పని. అసలుకి, రాక్షసి పూతన చనుకట్టు మీద మోహం కలిగిన ఆ సంప్రదాయఛందోకవిశ్రేష్ఠుడు ఎవరో కదా!
మై గాడ్! సీత ఏడుస్తూనే ఉండాలిట! మై గాడ్! వాల్మీకి అలానే లిఖించాడుట! మై గాడ్! తాను రామ భక్తుడట! రాముడి ప్రియురాలి పైనే విద్వేషం! మై గాడ్!
¡No preocupes! Aquí hay una canción romántica.
En el mismo lugar,
En la misma cuarto
Al mismo tiempo;
Siempre alrededor
Cerca de mí.
Más cerca de mí.
Tocándome, entrando en mí
Dentro de mí
Juntos; uno para el otro.
Incluso cuando
Aparte de mí, Lejos de mí
¡Juntos para siempre! ¡Mi amor!
చక్కని పరిశీలన. భావకవుల చాపల్యాన్ని బాగా పట్టుకొచ్చారు. పరిమితమైన శబ్ద శక్తితో, భాషా పటిమతో రాయప్రోలు, కరుణశ్రీలు పద్యాలు రాయగలరేమో గానీ వాటిలో కలికానిక్కూడా కవిత్వం కనిపించదు. ప్రధానంగా వీరు ఉపాధ్యాయులు – ఇరువురూ నిర్దుష్టంగా వచనం రాయలేరు. ఉట్టికెక్కలేనమ్మ – స్వర్గానికి అన్నట్టు ఉంటాయి వీరి పద్యాలు. ‘ఏ మంచి పూవులన్ ప్రేమించినావో, నీ తల్లి నిను మోసె కనక గర్భమున’ అన్నప్పుడు మాత్రం రాయప్రోలు ప్రతిభ ద్యోతకమవుతుంది, అంతవరకే. వృత్తాలు , జాతులు అంటే ‘భగవంతుడా’ అని గోచి సవరించుకొని లేచి పోవాలి అనిపిస్తుంది. మా నాన్న స్నేహితులు కరుణశ్రీ ‘అమర్ ఖయ్యాం’ పద్యాలు ఆంధ్రజ్యోతిలో వస్తున్నప్పుడు ‘ఆహా ఓహో’ అనేవారు, నాకు బొత్తిగా రుచించేవి కావు. శ్రీనాథుడు దరులొరుసుకొని ప్రవహించే ఒక గంగా నది. జవజీవాలు ఉట్టిపడే ఆ పద్యాలూ, శాస్త్రస్పర్శచే గట్టి పడిన వచనం – మరెవ్వరిలో చూడము.
“Approach love and cooking with reckless abandon.” దలైలామా అన్నట్టు చెప్పబడే వాక్యం, టీకా టిప్పణితో ఈ సందర్భంలో ఉటంకించవలసిందే.
‘Approach love and cooking with reckless abandon’ is a quote attributed to the Dalai Lama. The phrase ‘reckless abandon’ means to give oneself to a passion or impulse without regard for convention, appearances, or risk. When applied to love, it can mean to love with a whole heart, without considering outside influences.
శ్రీనాథుడిలో ఉన్న దొమ్మ పొగరు (reckless abandon) నిఖార్సైన ఏ కవిలోనైనా గమనించవచ్చు. మన భావకవుల్లో – ముఖ్యంగా వీరిద్దరిలో లేనిదే అది. నేను భావకవిని కావున ‘చాలా అందంగా’ చెప్పాలి అన్న కట్టుబాటులోనే ఉంది అసలు గొడవ. శ్రీనాథుడిది కవిత్వంలో రాజమార్గం – దిమ్మసా కొట్టిన హై రోడ్డు!
శ్రీనాథుడికి కట్టుబాట్ల మీద బొత్తిగా ఖాతిరీ లేదు. కావునే ‘అంత ప్రాధాన్యం లేని విధంగా’ (as a matter of fact తీరున) చెప్పేశాడు. లోతుగా ఆలోచిస్తే ‘అంత ప్రాధాన్యం లేని విధంగా’ అంటే అలవోకగా కవిత్వం రాయటం నిజంగా కష్టం.
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి రచించిన వ్యాసాలన్నీ నేను చదువుతూ వస్తున్నాను. 1994 లో ప్రచురించబడిన ‘అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం’ అన్న వీరి వ్యాసాల సంకలనం కూడా డిజిటల్ లైబ్రరీలో చదివాను.
వీరు చాలా చక్కని, చిక్కని ఆలోచన చేస్తారు. పద్యం, సంగీతం, నాట్యం ఒకదానితో ఒకటి కలపనే కూడదు అన్న మొండిపట్టు నుండి, మళ్ళీ అలాగే చిత్రలేఖనం, శిల్పం, వాస్తు (architecture) కలపనే గూడదు అనే మొండిపట్టు దాకా, చక్కని సమర్ధనలతోనే వాదం సాగిస్తారు. చాలా పరిశీలన గలవారే. చాలా నిజాలున్నవి చెప్పిన వాటిలో. ఒప్పుకోటానికి నాకు మహా ఇష్టంగా ఉంటుంది ఈయన చెపుతున్నంత సేపూ.
ఐతే వివిధ కళల మిశ్రణాలు, దేశదేశాలలో, ప్రాంత ప్రాంతానికీ, తేడాలతో విని, చూసి, ఆయా కళాకారుల నుండి, వీలైనప్పుడు లెసన్స్ తీసుకుంటూ, వేర్వేరు వేదికల మీద పలువురి ఉపన్యాసాలు అవీ వింటూ, ఆ పాఠాలు, ప్రదర్శనలు తర్వాత ఎప్పుడైనా చర్చలలో పాల్గొంటూ, వస్తుంటాను. నేను చదివినవి చూసినని కొన్నాళ్ళకు ఎన్నో గుర్తుండవు. ఐనప్పటికీ, ఎప్పటికప్పుడే, ఎన్నో మనసు రంజించే సంఘటనలు, దృశ్యాలు. రోజూ ఒకే ఇల్లు, ఒకే రాష్ట్రం, ఒకే దేశం, గోడమీద ఒకటే కేలండర్ బొమ్మ, వ్యాసపీట మీద ఒకటే సద్గ్రంథంగా, నా జీవితమైతే గడవటం లేదు. వనజభవుండు నెన్నొసట వ్రాసిన వ్రాలు. He has his own style. What can I say about it?
వ్యాసకర్త శ్రీపాద గోపాలకృష్ణమూర్తి -ఫిజిక్స్‌లో లండన్ నుండి డాక్టరేట్ తీసుకున్నట్టు చదివాను. వీరు స్వయంగా కళాకారులు కారనుకుంటాను. తాముగా క్రియేటివిటీ చూపలేదు. అంటే వీరు రాసిన పొయట్రీ, కథ, నాటకం గాని లేవు. ఉన్నవా? ఉంటే చెప్పండి, చదువుతాను. అలాగే వీరు చెక్కిన బొమ్మలు కాని, కట్టిన, కట్టించిన భవంతులు కాని లేవు. అందువల్ల వీరిని ఒక కళాప్రేక్షక, శ్రోత, విమర్శకుడిగానే, నేను చదువుకోవాలి.
మరైతే Creative streak, spark ఉన్నవారు, ఇట్టి వారి అభిరుచులకు, అభిప్రాయాలకు లోబడి ఉండరు. ఈ వ్యాసం ఈ మేగజీన్‌లో చదివినప్పుడు, contrastingగా నాకు స్ఫురించిన వ్యక్తి E.T.A. Hoffmann. And the book – ‘His musical writings: Kreisleriana, The poet and the Composer, Music criticism’ – Cambridge university press 1989. The book is edited, annotated, and introduced by David Charlton. Translated by Martin Clarke.
Hoffmann in his forty and odd years of life, became noted for his wild, ghastly ghost stories, painting, musical composition, opera writing, theater management, screen settings. He did all in his short lifespan, moving from place to place as circumstances dictate. Besides from time to time, doing a daytime job as a lawyer and later holding a judgeship.
This book is extremely tough for me to read. Intros, as well as Hoffmann’s own writings. It is about 476 pages. Still, I wanted to get a taste of this 18,19-century legend. I wanted to see what he had to say about the arts, from his own experiences.
I am reading and re reading a few such as, -his musical sufferings, thoughts about great value of music, Beethoven’s instrumental music, extremely random thoughts, the complete machinist, the music hater, the poet and composer, review of Beethoven’s Fifth symphony, letters on music in Berlin. Mozart’s Don Giovanni etc. etc.
As a small sample, About Mozart’s opera he says: (Excerpt from page 106, Kreisleriana) –
“Mozart is said to have repeatedly put off composing the overture, long after the opera itself had been finished, and even on the day before the performance, when his worried friends thought he was at last sitting at his desk, to have cheerfully gone off for a walk. Finally, on the very day of the performance, early in the morning, he supposedly composed the overture in a few hours, so that the parts were carried to the theatre with the ink still wet. Where upon everyone was bowled over with amazement and admiration that Mozart was able to compose so quickly: and yet one could accord the same admiration to any competent and rapid copyist. Do you not think the composer had for a long time been carrying Don Giovanni in his head? His profoundest work for his friends – for people, that is, who understood his innermost feelings? And that it was all laid out and complete in his mind in all its wonderfully distinctive detail, just as if it had been cast in a perfect mold? And do you not think that this overture of all overtures, in which every aspect of the opera is so brilliantly and vividly suggested, was not just as complete as the whole work before its great composer took up his pen to write it out…
What can I say, I simply loved the above.
So, I will read on as much as I can from this book, still thinking of the Telugu essayist and his fine observations fondly.
సంకా రామకృష్ణ గారికి ధన్యవాదాలు ఇంకా నన్ను మరువనందుకు. అప్పటి పరిచయాలు ఇంకా అప్పుడప్పుడు మదిలో మెదలుతూనే ఉంటాయండీ నాకున్నూ. కాని చాలా వరకు కాంటాక్ట్స్ తెగిపోయాయి. అమెరికాలో ఉన్నప్పుడు పిల్లలమర్రి రామకృష్ణ గారితో (వారి అమ్మాయి పేరు అరవింద. అప్పట్లో ఒకసారి ఆమె ఆంజనేయుడి గురించి స్త్తోత్రం కావాలి అని కాబోలు అడిగింది. ఆవిడ ఏం చేస్తున్నారో ఇప్పుడు) మంచి మెయిల్ పరిచయం ఉండేదా ఇప్పుడు ఆయనను కాంటాక్ట్ చేయలేను. మెయిల్ ఐడి పోయింది మరి. అలాగే చాలా కాంటాక్ట్స్ పోయాయండీ.
ఈమాట మాగజైన్ అపుడపుడూ చదువుతూ ఉంటాను. బాగుంటుంది. కాని వారు ఎపుడైనా రాముణ్ణి తక్కువ చేసేలా ధ్వనించే అంశాలు ప్రచురిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. అందుకని వారితో ఆమధ్యన ఇక ఈమాటను చూడనని చెప్పేసాను. కాని అడపాదడపా ఏదో శోధినిలో వచ్చిన వ్యాఖ్యను చూసి వస్తూ ఉంటాను ఈమాటకు.
కొద్ది రోజుల క్రిందటివరకూ బ్లాగుల్లో వ్రాసుకుంటూ ఉండే వాడిని. అక్కడి నా రామకీర్తనలు చోరీ అవుతున్నాయని తెలిసి వ్యసనపడి బ్లాగును మూసేసాను. భగవదనుగ్రహం ఉంటే, తెలుగువాళ్ళు కోరుకుంటే, అవి పుస్తకరూపంలో వస్తే వస్తాయి. లేకపోతే లేదు. మహామహా నాలుగులక్షల (అక్షరాల?) సింహగిరివచనాలే మనతెలుగునేల నుండి మాయం అయ్యాయి. నా రెండున్నరవేల రామకీర్తనలు మాయం ఐతే అదొక పెద్దవిషయం కాదు. ఐనా రామకీర్తనలు ధారాళంగా వస్తూనే ఉంటాయనుకోండి అది నాప్రవృత్తి కనుక. అంతకంటే మరేమీ విశేషం ఉందనుకోను.
ఇప్పుడు రామస్మరణానందంలో ఉన్నాను. ఇతరాలు పెద్దగా పట్టించుకోవటం లేదండి.
సంపాదకులకు విన్నపం. ఈవ్యాఖ్యను మీరు ప్రచురించలేకపోతే నాకు ఏమీ ఇబ్బంది లేదండీ. మీకు అనుగ్రహం ఉంటే ఈవ్యాఖ్యను సంకా రామకృష్ణ గారికి మంపగలిగితే మాత్రం చాలు కృతజ్ణుడిని.
Janaki’s Zen గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
08/17/2024 2:14 am
శ్యామలగారు అన్నది నిజమే తనది సంప్రదాయిక కవిత్వం అని లైలా గారు చెప్పుకోలేదు. ఆవిడ తప్పు లేదు. సంప్రదాయిక కవిత్వం అనే విభాగంలో ప్రచురించటం పత్రిక సంపాదకులు చేసిన తప్పు అని నా ఉద్దేశం. ఈమధ్య కాలంలో సంప్రదాయం అన్నమాటకు కొత్త అర్ధం ఏదైనా వచ్చిందేమో మరి నాకు తెలియదు. అలాగైతే క్షంతవ్యుడిని.
రామాయణం ఒక పపపపాతకథ రాముడు ఒక ఆపాతకథలో హీరో మాత్రం అని ఈదేశం అనుకోవటం లేదండీ. మీరలా అనుకుంటున్నారేమో. లైలాగారు అలా అనుకుంటున్నారేమో. ఒకవేళ ఈకాలంలో అలాగే అనుకొని తీరాలేమో. నాకు తెలియదు. రామాయణమూ రాముడూ ఈజాతి సంపదలు. వాటి విలువలను నవ్యత కోసం నాశనం చేయటం హర్షణీయం కాదు. ఇది నాపాతచింతకాయపచ్చడి భావం అని ఈకాలం వాళ్ళు అంటారేమో మరి.
కీచకుడు మహాజ్ఞాని అని ఒకాయన తన సినిమాలో అంటాడు. రావణుడి వద్దనే సీత సుఖంగా ఉంది అని ఒకడు అంటాడు. రావణుడు మహాత్ముడు అని కొందరు కథలూ కావ్యాలూ అల్లుతారు.
ఇదంతా మన సంస్కృతిలో ఒకభాగం గొప్పదనం అంటారు మీలాంటి విజ్ఞులు. నేనలా అనుకోలేనండీ.
అవును లెండి. వాల్మీకి కాని రాముడు కాని కోర్టులో కేసువేయరు కదా. ఇక మనిష్టమే కాబోలు.
మనలో అందరమూ హింసను వ్యతిరేకస్తాం. కాని హింసకు పెద్దపీటవేసే సినీమాలు ఎగబడి చూస్తాం.
శ్రీరామనవమి ఓదండం పారేస్తే రాముడికి మముట్టచెప్పవలసిన గౌరవం పారేసినట్టే అవుతుంది. మిగతారోజులు రాముడిని గురించి ఎలాగైనా మాట్లాడవచ్చును. అవసరం ఐతే రాముడిపై రావణుడి విజయం అనీ అల్లవచ్చును. మన సంస్కృతి గొప్పది కదా. ఫరవాలేదు. ఇదేనంటారా మంచిమాట. సంతోషం.
[ఈమాటలో సంప్రదాయిక కవిత్వం అన్న విభాగం లేదు. పద్యసాహిత్యం అన్న కేటగిరీ ఉంది. ఛందోబద్ధమైనదే పద్యం అన్న నిర్వచనం మాకు లేదు. ఈ కేటగిరీలు కేవలం శోధనకు, మా నిర్వహణకూ సహకరించడం కోసమ్ పెట్టుకున్నవే తప్ప వాటికి ఏ రకమైన సాహిత్యప్రయోజనమూ లేదు. అందుకే ఏప్రిల్ 2019 సంచికనుంచీ అవి కనిపించకుండా చేశాం. చూ. ఏప్రిల్ 2019 ముందుమాట. -సం.]

08/17/2024 1:22 am
లైలా గారు రామాయణ పాత్రలను తీసుకున్నారు. రామాయణకథను త్రోసిరాజన్నారు. ఇది సమంజసమా?
మూలకథకు కానీ ఆందులోని పాత్రలకు కానీ స్వరూపస్వభావాలను మార్చకుండా చక్కగా కల్పనలు చేసుకోవటం హర్షణీయం అవుతుంది కాని తదన్యవికారకల్పనాకేళి నిస్సందేహంగా ఆక్షేపణీయం.
ఒకరొక కథను చెబుతారు. అది కేవలకల్పనాకథ కావచ్చును. ఆద్యసత్కథ కావచ్చును. రామాయణ మహాభారత కథలు ఇతిహాసాలు. అనగా అవి నిజంగా ఎలా జరిగాయో ఆలాగే గ్రంథస్థం చేయబడ్డాయి. ఇది ఈదేశంలో సనాతనధర్మవిశ్వాసం కల అశేషప్రజానీకపు నమ్మకం. మూలకథారచయితకు గౌరవం తగ్గించేలా కల్పనలు చేయటం సమంజసమా?
లైలాగారు అలా కాదూ రావణుడు ఒక పురుషోత్తముడూ వాల్మీకి చెప్పినది తప్పు అంటారు. సమంజసమా?
ఒకవేళ రామాయణం కేవలం కవికల్పన అన్నా సరే ఒక కవి యొక్క ప్రసిధ్ధరచనలోని కథనూ పాత్రలనూ మార్చి వ్రాయటం సమంజసమా?
రావణుడిని ఆకాసానికి ఎత్తటం కోసం రాముణ్ణి ఒక మహాముచ్చటగొలిపే అందమైన మగబొమ్మ అంతే అని చెప్పటం సమంజసమా?
శ్రీమద్రామాయణమహాకావ్యం లోని సీత లంకలో దుఃఖంలో మునిగిపోయి రావణుణ్ణి అక్షరాలా తృణీకరించి ఎప్పుడు రాముడు.వచ్చి రక్షిస్తాడా అని దీనంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అదంతా తప్పూ అక్కడ లంకలో సీత మహదానందంగా గెంతులు వేస్తూ ఉందని వ్రాయటం ఏమంత సమజసమైన కల్పన అంటారు? ఈ వికారమైన కల్పనకు విజ్ఞతకల చదువరులు ఆనందంతో పులకరించి పోతారా?
దురాలోచనతో లైలాగారు కల్పనలు చేసారు అనుకోను. కాని అనుచిత కల్పనయే.
దూరదృష్టి లేక పత్రికవారు ఏదో కొత్తదనం ఐతే చాలునని అనాలోచితంగా ప్రచురించారని భావిస్తున్నాను.

08/06/2024 10:12 am
ఈ పేజీ లింకును చూడండి https://eemaata.com/em/category/features/classical-verse అని కదా ఉంది. మహాశయులారా, ఈ Janaki’s Zen అన్న ఇంగ్లీషు పేరు పెట్టుకొన్న తెలుగు రచనలో classical-verse అనగా సంప్రదాయికఛందస్సు ఉన్నదా అని అడుగుతున్నాను. నా అజ్ణానాన్ని మన్నించి తెలిసినవారు చెప్పగలరని ప్రార్ధన. నేను literary values అన్న దానిని గురించి అడగటం లేదు. అది చూచేవారి దృక్కోణం మీద ఆధారపడి ఉంటుందని అనవచ్చును. ముఖ్యంగా ఇతరవిషయాలు ప్రభావితం చేస్తే చేయవచ్చును లేకపోతే లేదు. కాని ఛందస్సు అన్నది అలా కాదు కదా, అదెక్కడుందీ అన్నది నా ప్రశ్న / అనుమానం / ఆశ్చర్యం వగైరా…

08/06/2024 9:25 am
ఏనాటి రాముడు? ఏనాటి రావణుడు?వాల్మీకో లోకమో రాముడు మంచివాడనచ్చు. మనం చూడొచ్చామా? ఇప్పుడు రావణుడు గొప్పవాడంటే, పోనీ అతనూ రాముడంత గొప్పవాడంటే, లేదా రాముడి కంటే గొప్పవాడంటే? బాగుంటుంది కదా?
ఆధునికత అంటే అదే. కొత్తగా ఆలోచించాలి. ఇదే కదా నేటి వాముపక్షభావజాలప్రేరిత నవకవీశ్వరుల యొక్క విమర్శకాగ్రేసరుల యొక్క ఆలోచనా ధోరణి? తప్పా ఒప్పా అంటే మనకేమి లెక్క? రాముడు వచ్చి దెబ్బలాడతాడా? వాల్మీకి అడగొస్తాడా?
బాగుందండీ ఈ కొత్తదనపు చిత్రం.
హిట్లర్ చాలా మానవతావాది మహోన్నతుడు అని ఒక నాటకం వ్రాస్తే మీరు వేసుకుంటారా? ఆహా. తెలుగులో ఏదో వ్రాస్తే అంతర్జాతీయంగా అల్లరయ్యేంత సీన్ లేదు అని ఒకవేళ మీరు ఆలోచిస్తారేమో — కావచ్చును. కానీ, మరి నేను రేపు గాడ్సే గొప్పవాడూ అని గాంధీకంటే కూడా అని ఒక నాటకం వ్రాసి పంపితే అది మీరు ప్రచురించగలరా? (కచ్చితంగా మీరు నిరాకరిస్తారు – లిటరరీవాల్యూస్ లేవనో రాజకీయకోణంలో ఉన్నవి వేయమనో సదుపాయమైన సాకు తప్పకుండా మీరు చూపుతారు అని నమ్మవచ్చును కదా?)
రావణుడిని పైకెత్తి మరీ రాముణ్ణి తగ్గించో దూషించో వ్రాస్తే, ఈసనాతనధర్మం అంటే పడి చచ్చేవాళ్ళు ఐకమత్యం లేకపోవటం వల్ల మీతో కొట్లాడలేకపోవచ్చును. అది మీకు లైసెన్సుగా పనికి రావచ్చును. కాని గాడ్సేని హీరోను చేసి గాంధీ తప్పులుపట్టే రచనను మీరు అచ్చుకొడితే మన రాజకీయప్రపంచం ఊరుకుంటుందా? అప్పుడు జరిగే రగడకు మీరు సిధ్ధం కాగలరా? ముమ్మాటికీ అందుకు మీరు సిధ్ధంగా ఉండరని చెప్పటానికి రాకెట్ సైన్సు పీహెడీ అక్కర్లేదు కదా.

08/06/2024 9:02 am
ఇది ఒక పెడధోరణి రచన.
మూలకథను కాని ఆకథలోని లోని పాత్రలను కాని వాటిస్వభావాలను కాని ఇలా వక్రీకరించి వ్రాయటం చాలా ఆసమంజసం. ఎంతమాత్రం హర్షణీయం కాదు.
రావణ నరక కీచకాదులు లోకోత్తరపుణ్యశీలురని నిరూపించటం వలన ప్రజలను గందరగోళానికి గురిచేయటం మించి ఏమి ప్రయోజనం కలుగుతుంది?
అలాగని కవులకు కల్పనాస్వాతంత్ర్యం లేదని ఆనటం లేదు. భవభూతి ఉత్తరరామచరిత్ర అంతా కల్పనయే యేకో రసః కరుణ ఏవ అని బ్రహ్మాండంగా చేసాడు. కాని పాత్రలను తలక్రిందులుగా చూపలేదే. కథను కాదని కొత్త కథను చేయలేదే.
ఔచిత్యభంగంగా వ్రాసి కవిస్వాతంత్ర్యం అని అనటం కుదరదు.
ఆగస్ట్ 2024 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/04/2024 3:22 pm
ఈ మాట సంపాదకులకి తెలుగు సాహిత్య సమావేశాలపై కించిత్ సదభిప్రాయం కూడా లేదనిపిస్తోంది. వారన్నట్లు సాహిత్యం సామూహిక ప్రక్రియ కాదన్న మాట నిజమే; పెంపొందిన సాంకేతిక సౌకర్యాలని ప్రచారాలకీ పైరవీలకీ వాడుకునేవారు పెరిగి ఉండొచ్చు. కాని, ఎన్ని లోపాలతో కూడుకున్నా, సాహితీ సమావేశాల మూలంగా సాహిత్యం చదివేవాళ్ళు పెరుగుతారు, కొత్త రచయితలకి చెయి తిరిగిన రచయితలతో పరిచయాలు కలిగే అవకాశం ఉంది; వాటివలన కలిగే ప్రయోజనాలని కొట్టివెయ్యకూడదు.
నేను సాహితీ సమావేశానికంటూ వెళ్ళి పన్నెండేళ్లవుతోంది; దానిని పెట్టింది కూడా నేనే. జంపాల చౌదరి గారు పాపినేని శివశంకర్ గారు వాళ్ళమ్మాయి ని చూడటానికి మా ఊరు వచ్చారంటే నేను శివశంకర్ గారిని మొదటి సారిగా కలుసుకున్నాను. ఆయన అప్పుడే ప్రచురించిన పుస్తకాన్ని, “తల్లీ! నిన్ను దలంచి: అందాల తెలుగు పద్యాల లోవెలుగులు,” నాకిస్తే చదివి, దాంట్లోని పద్యాల మాధుర్యం గురించి ఓ ప్రసంగం ఇప్పిద్దామని కుతూహలపడితే ఆయన సరేనన్నారు. నేను దగ్గర్లో ఉన్న Redmond Regional Library లో ఓ హాలు బుక్ చేసి, ఆహ్వాన పత్రికని చుట్టుపక్కల మన దేశ కూరగాయల దుకాణాలలో, రెస్టారెంట్లలో పెట్టి, తెలిసిన వాళ్ళకి చెప్పాను. సమావేశం సమయానికి తినుబండారాలతో సహా వెళ్ళాను. శివశంకర్ గారు చక్కని ప్రసంగం చేశారు. ఆ సమావేశం మూలంగా నాకిప్పటికీ గుర్తుకొచ్చే పద్యం మాత్రం ఇది:
To be a boxer, or not to be there
at all. O Muse, where are our teeming crowds?
Twelve people in the room, eight seats to spare
it’s time to start this cultural affair.
Half came inside because it started raining,
the rest are relatives. O Muse.
The women here would love to rant and rave,
but that’s for boxing. Here they must behave.
Dante’s Infemo is ringside nowadays.
Likewise his Paradise. O Muse.
Oh, not to be a boxer but a poet,
one sentenced to hard shelleying for life,
for lack of muscles forced to show the world
the sonnet that may make the high-school reading lists
with luck. O Muse,
O bobtailed angel, Pegasus.
In the first row, a sweet old man’s soft snore:
he dreams his wife’s alive again. What’s more,
she’s making him that tart she used to bake.
Aflame, but carefully-don’t burn his cake!
we start to read. O Muse.
– “Poetry Reading,” by Wislawa Szymborska. Translated by Stanislaw Baranczak and Clare Cavanagh.
“ఒరే, ఇక వ్యాసుడికి పట్టరాని కోపం వచ్చింది. తాళలేని ఆకలి, కళ్ళు చీకట్లు కమ్ముతున్నై. చేతిలో భిక్షాపాత్రను ఎత్తి కొట్టాడు, ఎలా? మామూలుగా కాదు. శతథా భిన్నంబులై. ముక్కలు ముక్కలైపోయింది అది… చూశా? క్ష-ప్రాస కేవలం ఇలాంటి విపరీతపు సందర్భాల్లోనే వాడతారు…” అంటూ నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ గుర్తొచ్చింది, ఇక్కడి చర్చ వ్యాసుడు, కాశీ, శాపం మీదకు పోగానే. ఆ పద్యం అప్పుడే మర్చిపోయాను కాని, కొన్నేళ్ళ క్రితం, భైరవభట్ల కామేశ్వరరావుగారి పుణ్యమా అని మళ్ళీ తెలుసుకున్నాను. ఆ పద్యం ఇదీ. ఇప్పటికీ చదువుతుంటే వ్యాసుడి మనఃస్థితి కళ్ళకు కట్టినట్టే ఉంది నాకైతే.
(ఇది భీమఖండం లోని పద్యం. భీమఖండంలో కూడా వ్యాసుని కోపం గురించిన కథ వస్తుంది, సంక్షిప్తంగా. వ్యాసుడీ కథని అగస్త్యునికి చెప్తాడు. మీరన్న ఇల్లాళ్ళు భిక్ష వెయ్యకపోవడాన్ని వర్ణించే సీసపద్యం కాశీఖండంలోనిది. అందులో ఈ కథ వివరంగా ఉంది. శివుడూ పార్వతీ వ్యాసునికి పెట్టిన చీవాట్లు బలేగా ఉంటాయందులో. దుష్కర ప్రాసలు సాధారణంగా ఇలాటి ప్రత్యేక సందర్భాలలోనే మన తెలుగు కవులు వాడారు. ఇక్కడ భిక్షాపాత్ర ప్రసక్తి కూడా “క్ష”కార ప్రాసకి నేరుగా దారిచూపించి ఉంటుంది. – భై.కా.)
ఆవిడన్నది కొంతవరకు నిజమే. ఎంతమంది వడ్లు దంచుకొని అన్నం వండుకు తినడంలేదు, ఆకులు దుంపలు తినే వాళ్ళు లేరా. కాని ఓ జీవనవృత్తికి అలవాటుపడ్డ వాణ్ణి హఠాత్తుగా వేరే మార్గం చూసుకోమనడం ఎంతవరకు సమంజసం?
ఈజీవనవృత్తిని అలవాటు పడ్డట్టుగా చూడటం సమంజసం కాదనుకొంటాను.
అన్నం వండుకుతింటుంటే – ‘కౌపీనసంరక్షణార్థం’ మాదిరి – (లింగార్చనంబు కల్పించటం, పంచాక్షరంబు జపంబుచేయటం తనకోసమే అనుకున్నా) శిష్యతతికి శివధర్మములు చెప్పటం, పురాణము చెప్పటం ఇవన్నీ అటకెక్కవా!
మీ సూచన మేరకు నేనివాళ వ్యాసుడు కాశి మీద కోపించిన కథ చదివాను – ముగ్గురు పండితుల సాయంతో [1][2][3]. మీరు పూర్తిగా శివుడి పక్షాన ఉన్నారేమోనని అనుమానంతో వ్యాసుని తరఫున వకాల్తా తీసుకొని ఆయనకి కొంత న్యాయం చేయడానికీ ప్రయత్నం.
మీసంగతేమోకాని నాకు ఓపూట పస్తు ఉంటే కళ్ళు తిరిగి శోష వస్తుంది. మరి రెండు రోజులు (అగస్త్యుడితో, భీమేశ్వర పురాణంలో, ఏడు రోజులంటాడు) కడుపు కాలితే వ్యాసుడేం చెయ్యాలి? శివుడీ దిక్కుమాలిన పరీక్ష పెట్టడం ఎంతవరకు న్యాయం? వ్యాసుడు కోపంలో అనరాని మాటలన్న మాట నిజమే:
వారి మదానికి చికిత్స చెయ్యాలని సంకల్పించాడు, శపింప పూనుకొన్నాడు:
“ధనము లేకుండెదరు మూడు తరములందు
మూడు తరముల చెడుగాక మోక్షలక్ష్మి
విద్యయును మూడు తరముల వెడలవలయు
పంచజనులకు కాశికాపట్టణమున.” కాశి: 7-158.
మీరు ఇక్కడే వ్యాసుడు crossed the line అనొచ్చు ; కాని, శపింపడానికి చెయ్యి రాలేదు:
“అని శపింపగ పూను నయ్యవసరమున
నేమి చెప్పుదునో సంయమీంద్ర వంద్య!
యుదిలగొని కంపమందుచు నుండె గాని
శాపజాలమందుకో కేలు సాగదయ్యె.” భీ.పు. 2-109.

వ్యాసుడికీ శిష్యులకీ భోజనం వడ్డించింది; కరివేపాకు నుండి గడ్డ పెరుగు దాకా రెండు పేజీలకు పైగా శ్రీనాథుడు భోజనవైభవాన్ని వర్ణిస్తాడు. కడుపు నిండింది కదా, విను అని మరలా బుద్ధి చెప్తుంది – “క్రోధంబు ఫలమె నిర్మల బోధమునకు?”:
భీమేశ్వర పురాణము లో పార్వతి వ్యాసుడి పట్ల కొంత సానుభూతితో అంటుంది:
“క్రొన్నెల పువ్వుదాల్చునకుఁగూరిమి భోగ పురంధ్రి కక్కటా
యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టి కోపమే
లన్న! ఘటించెదో మునికులాగ్రణి! నిక్కమువో “బుభుక్షితః
కిన్నకరోతిపాప” మను కేవల నీతి దలంచి చూడగన్.” భీ.పు. 2-117.
అవునులే, “ఆకలితో ఉన్నవాడు ఏపాపానకైనా ఒడిగట్టుతాడన్న” నీతి ఉంది కదా, అని. విశ్వనాథ: “ఈ మాట ఎంత విచిత్రముగా నున్నది. మానవులు రాజ్యములు సిద్ధాంతములు నేటి సర్వ నాగరికతయు నొక్కమాటలో చెప్పినట్లున్నదే!”
త్రినేత్రుడు “కాశినుండంగ నర్హుండు కాడు వీడు, వెడలిపొమ్మను, మాటలు వేయినేల?” అని పరుషంగా మాట్లాడి బహిష్కరిస్తాడు:
“శాపమిచ్చెదనని యనాచార సరణి
నడుగు వెట్టినవాడ వహంకరించి
పొమ్ము నిర్భాగ్య! మాయూరి పొలము వెడలి
యెచటికేన్ శిష్యులును నీవు నీక్షణంబు.” భీ.పు. 2-153.
“ఈ పద్యము చాల చిత్రమైన పద్యము. కాశిలో సర్వదేవతలు కలరు. అందరు దయావంతులట! ఈ మాటలో పార్వతీదేవి యున్నది. … కాలభైరవుని చెప్పెను. డుంఠిని చెప్పెను. ఒకటి చెప్పకుండ వదిలిపెట్టెను. ఆ వదలిపెట్టినది శివునియొక్క లక్షణము. ఆయన చాల కోపియనుట. ఆయన ఆవగింజంత యశ్రద్ధను పర్వతమంత జేయునని చెప్పినాడు కదా!”
“మనమందరము ఋషులము. తపస్సు చేయుదుము. అప్పుడప్పుడు కోపము వచ్చును. మనమెవ్వరినైన శపింతుము. ఇవతల మనమాడినది యాట. పాడినది పాట. ఆ కాశిలో మనకట్లు కుదరదు. పైన శివుడున్నాడు. మనము చేసినపని యాయన కిష్టమగునో కాదో! కానిచో మన బ్రతుకులు బండలెక్కినట్లే. మన మొగములు రాచట్లు మీద రాపించును.”
“ఇట్టి వలపోతయంతయు నీ రెండు పద్యముల నిండ నున్నది. ఈ పద్యముల లోనిదంతయు ధ్వని. ఇట్లు వ్రాయుట చాల కష్టము. తన మనోభావములన్నియు చెప్పుటకు వీలు లేదు. మనసేమో బాధపడుచున్నది.. ఒకటి రెండు మాటలకన్న నెక్కువ చెప్పరాదు. తాను చెప్పదలచుకున్న దా రెండు మాటల వలన వ్యక్తము కావలయును ఇంతియే.”
‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ …’ పద్యంలో చెప్పినట్లు పార్వతి చూపించినట్లు “కరుణ ముఖ్యం”.
చివరగా, “The religion of one age is the literary entertainment of the next.” — Emerson
చలమచర్ల రంగాచార్యులవారి ఆంధ్రప్రతాపరుద్రీయం లో ఛేకానుప్రాసమున కీక్రింది ఉదాహరణ మీయబడినది.
కం. ధర నీకరము కరము శ్రీ
కరమో రాజన్య! జన్య ఖండిత పరభూ
వర! వరగుణభూషణ! భా
స్కరసన్నిభ! పుడమిఁ దాల్చి కావుము రుద్రా!
ఈపద్యంలో గల జన్య,జన్య, వర,వర అను జంటలు అవ్యవహితసమానవ్యంజనస్వరములతో గూడి యుండటయే కాక భిన్నార్థములలో పూర్వసమాసాంతమున, పరసమాసాదిలో నున్నవి. ఈలక్షణములచే నీపద్యము ముక్తపదగ్రస్తయమకాలంకారమున కుదాహరణ మగుచున్నది కాని ఛేకానుప్రాసమునకు గాదు.
కావ్యాలంకారసంగ్రహములో రామరాజభూషణు డిచ్చిన ఛేకానుప్రాసోదాహరణమును పరిశీలించిన సన్నిధానం సూర్యనారాయణశాస్త్రిగారు సైతం పూర్ణవ్యంజనస్వరావృత్తులున్నచోట యమకమని, అట్లు గాక కేవలము వ్యంజనయుగ్మమున కావృత్తి యున్నచో అది ఛేకానుప్రాసమని, ఇది సాహిత్యదర్పణకారు డిచ్చిన ‘స్వరూపము తోడను, క్రమముతోడను వ్యంజనసంఘము నొకతూరి ఆవృత్తి చేసిన అది ఛేకానుప్రాసము’ – అను లక్షణముకు సరిగా నున్నదని తెల్పినారు. ఇక్కడ వ్యంజనమనగా సంయుక్తవ్యంజనము సైత మని అర్థము. ఇట్టి వ్యంజన సంఘములో రెంటికంటె ఎక్కువ అక్షరములు గూడ ఉండవచ్చును. కాని విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో రెండు వ్యంజనముల అవ్యవహితావృత్తికే దీనిని చెప్పినాడు.
ఆలిస్ మన్రో గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/04/2024 6:36 pm
సవరించవలసిన అచ్చుతప్పులు: నోబెల్ వచ్చింది 1913లో కాదు, 2013 లో. కోవలెన్‌స్కీ లో, న్ కి బదులు వ్ ఉండాలి.
పోయిన సంవత్సరం విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడా, వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో చెప్పుకోదగ్గవాటిల్లో మన్రో పుస్తకాల షాపొకటని తెలిసింది.
వేలూరి వారి వ్యాసం నిడివి తక్కువైనా, ఊరించి, మన్రో కథలు చదివింపచేస్తుంది. గొప్ప కథకులని చెకోవ్ తో పోల్చడం సాధారణమేమో, నోబెల్ వచ్చిన సందర్భంగా”Alice Munro, Our Chekhov,” అని James Wood, పొగిడాడు (The New Yorker, October 10, 2013).
ఈ మధ్య ఓ మిత్రుడు, తనకు కాలేజీ రోజుల్లో మిక్కిలిగా నచ్చిన నవల, “చివరకు మిగిలేది,” ఇపుడు రిటైర్ అయింతర్వాత తిరిగి చదివితే చాలా బోర్ కొట్టింది, బుచ్చిబాబు అంతులేని ఉపమానాలతో ఊదరకొట్టేస్తాడు అని వాపోయాడు. నేనందుకు: బుచ్చిబాబు రచనలలో వర్ణనలెక్కువ; నవలలో ఇందిర చనిపోయే దృశ్యం: “పడమటి ఆకాశం మంటలో పడి సూర్యుడు దగ్ధమైపోయాడు. నుసై మేఘాలు కొట్టుకుపోతున్నాయి. ప్రకృతి బాధతో చీకటైంది. పాకచుట్టూ పెనవేసుకుని గాలి మూలుగుతుంది. టెలిగ్రాఫ్ స్తంభంపై కాకి ఏకాంతంగా ఏడుస్తోంది.” వస్తువుకి అనవసరమైనవి కథలో ఉండకూడదన్న చెకోవ్ లాంటి వాళ్ళతో బుచ్చిబాబు ఏకీభవించడు – “కట్టె, కొట్టె, తెచ్చె,” లా తయారవుతుందని. “చెకోవ్ పద్ధతి కథ, ఇసుక మీద కెరటం దిగవిడిచిన చారలాంటిది. నాకది తృప్తి నివ్వదు. కథ, కెరటంలా కనబడాలి. ఆ కెరటం వెనక సముద్రం హోరు వినబడాలి”. [1]
వేలూరి గారు చివర్లో ప్రస్తావించిన “The Bear Came Over the Mountain,” కథ ప్రారంభంలో, “He thought maybe she was joking when she proposed to him, on a cold bright day on the beach at Port Stanley. Sand was stinging their faces and the waves delivered crashing loads of gravel at their feet.” బుచ్చిబాబు చివర అలా ఒక్క వాక్యంతో వర్ణన వదిలేవాడు కాదేమో.
“మన్రో స్త్రీవాది అవునో కాదో తెలుసుకోవాలంటే టూమచ్ హాపీనెస్: స్టోరీస్ (2009) చదవాలి. అందులో ముఖ్యంగా రోజ్ అనే పేదపిల్ల, తెలివైన పిల్ల కథ,” అన్నారు కాని ఆ కథ పేరు ఇవ్వలేదు. అలాంటి కథ నాదగ్గరున్న సంపుటిలో లేదు; అది “What Do You Think You Are?” అనీ, లేక “The Beggar Maid” అనీ వచ్చిన గొలుసు కథ అని వికీపేడియా లో ఉంది.
ఇంతకీ నేనీ వ్యాఖ్య వ్రాయడానికి ముఖ్య కారణం, “Too Much Happiness,” అన్న కథ. మేడం క్యూరీ కి ముందర పేరుగాంచిన మహిళా శాస్త్రవేత్త ఎవరో ఎంతమందికి తెలుసు? Steven Strogatz పుస్తకం [2] చదివేదాకా ప్రపంచంలోకెల్లా లెక్కల్లో డాక్టరేట్ సంపాదించిన మొదటి మహిళ Kovalevsky అని నాకు తెలియదు.
“ఆడవాళ్ళు తమకున్న కొద్ది శక్తిని చదువులకి ధారపోస్తే ఇక పిల్లల్ని పెంచడానికి ఏమీ మిగలదు,” అన్న వింత వాదనలు చేసిన స్పెన్సర్ లాంటి తత్త్వవేత్తలతో వాదించి, ఆ కాలపు రచయితలు, శాస్త్రవేత్తలు, విప్లవకారుల తో సంబంధాలు పెట్టుకొని, కులీన కుటుంబంలో పుట్టి, ఓ జిప్సీ లాగా మనుగడ సాగించిన మహిళ. చదువుకోసం వేరే దేశం వెళ్ళడానికి బూటకపు పెళ్ళి చేసుకొని, కొన్నేళ్ళ తర్వాత అతనితో కాస్త సంసారం సాగించి, ఓ పిల్లను కని, భర్తతో విడాకులు తీసుకొని, అతడంతలోనే ఆత్మహత్య చేసుకుంటే క్షోభించి, తమ్ముడితో సరైన సంబంధం లేక, ఉన్న ఒక్క అక్కా చనిపోతే దగ్గర వాళ్ళు లేక, మధ్యలో రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ కి లోబడి ఆస్తి అంతా హరాయించుకుపోయి, ఎట్టకేలకు ప్రొఫెసర్ గిరీ సంపాదించి, అర్థాంతరంగా జబ్బున పడి, హఠాత్తుగా చనిపోయిన ఆవిడ కథకి మన్రో “Too Much Happiness” అన్న పేరు ఎందుకు పెట్టిందో నాకర్థం కాలేదు. “Little Sparrow” లో అవి ఆవిడ చివరి మాటలంటే నమ్మశక్యం కాలేదు. బహుశా మన్రో వ్యంగభావంతో పెట్టిందా?
పూర్తి కథ తెలుసుకోవాలంటే Ann Koblitz వ్రాసిన జీవిత చరిత్ర [3] చదవదగ్గది.
Koblitz ends her book with an episode where a Rusisan woman, Liubov Murakhina, suffering from domestic abuse, writes to Kovalevskaia for help and Kovalevskaia was sympathetic and immediately responded with practical help:
“I am especially happy,” Liubov wrote to Kovalevskaia, “because this time I was not mistaken [in my judgment of people]. I assumed that a woman who has devoted herself entirely to the service of science and has achieved such brilliant results ought to be a true human being as well.”
“Perhaps Murakhina, who called herself an “unregenerate idealist,” was mistaken about the necessary connection between service to science and kindness to women like herself. In Kovalevskaia’s case, however, Liubov’s confidence was not misplaced. Sofia Kovalevskaia combined mathematical creativity with concern for others and awareness of social and political issues. Her friends, intimates, and fellow scientists would remember her for her human qualities as well as her mathematical expertise and success as the first woman accepted as a colleague in an all-male profession.”
It’s still a male-dominated profession, but thanks to the pioneers like Kovalevskaia, many women survive and even thrive, so cheers to the WIT: Women in Theory (https://www.youtube.com/watch?v=4Wl-3kadvgw).
కొడవళ్ళ హనుమంతరావు
[1] “కథా-దాని కమామీషు,” బుచ్చిబాబు సాహిత్యవ్యాసాలు, మొదటి సంపుటం.
[2] “Infinite Powers: How Calculus Reveals the Secrets of the Universe,” Steven Strogatz, 2019.
[3] “A Convergence of Lives: Sofia Kovalevskaia – Scientist, Writer, Revolutionary,” Ann Koblitz, 1993, Lives of Women in Science series.
సురేశ్‌గారు తెల్పిన క్రౌంచపక్షి అంటే sarus crane అని నిర్ధారణ చేసినారనే అంశం నాకు నూతనోత్కంఠను రేకెత్తించడంవల్ల ఆ sarus crane యొక్క చాలా విస్తృతమైన వికిపీడియాను అంతర్జాలంలో నేను చూచినాను. అందులో హిందీలో దీని పేరు ‘సారస్’ అంటారనీ, దాని మూలంగానే భారతదేశంలోని ఆంగ్లేయభటులు ఈపక్షికి sarus crane అని నామకరణం చేసినారని, ఇదియే వాల్మికి పేర్కొన్న క్రౌంచపక్షి యని ఈ క్రింది వాక్యముల నందులో వ్రాసినారు.
‘The common name sarus is from the Hindi name (sāras) for the species. The Hindi word is derived from the Sanskrit word sarasa for the “lake bird”, (sometimes corrupted to sārhans). British soldiers in colonial India who hunted the birds corrupted the name to serious or even cyrus.’
‘The species is venerated in India, and legend has it that the poet Valmiki cursed a hunter for killing a sarus crane and was then inspired to write the epic Ramayana’
కాని క్రౌంచపక్షి, సారసపక్షి అనేవి వేర్వేరు పక్షులని అమరకోశం తెలుపుతూ ఉన్నది. లోగడ నేను కొంతభాగమే పేర్కొన్న అమరకోశంలోని పూర్తిపాఠమిది: ‘క్రుఙ్ క్రౌంచోఽథ బకః కహ్వః పుష్కరాహ్వస్తు సారసః’
అనగా, క్రుఙ్, క్రౌంచ పదాలు క్రౌంచపక్షికిని, బకః, కహ్వ అనే పదాలు మఱొక పక్షికిని (దీనికి తెలుగులో వక్కుకొంగ అని పేరు), పుష్కరాహ్వః, సారసః అనే పదాలు సారసపక్షికిని పేర్లని ఈశ్లోకార్థం.ఈ సారసపక్షికే తెలుగులో బెగ్గురుపక్షి అని పేరు. దీని వర్ణనలు ప్రబంధములలో తరచుగా నున్నవి. ఇట్లంతవిశ్వసనీయమైన అమరకోశం ప్రకారం క్రౌంచపక్షి సారసపక్షిని బోలినదైనను, సారసపక్షికంటె వేరైన పక్షియే అని తోచుచున్నది. ఒకవేళ హిందీవారు పొరపాటున క్రౌంచపక్షినే సారసమని వ్యవహరించి ఉంటే క్రౌంచపక్షిని sarus crane అనడానికి వీలుంది. కాని నాదగ్గర నున్న హిందీ, తెలుగు నిఘంటువులో సారసపదం క్రౌంచపదానికి పర్యాయపదంగా పేర్కొన బడలేదు, క్రౌంచ్=క్రౌంచపక్షి అని, సారస్=హంసవంటి ఒక పక్షి అని అర్థాలు వ్రాసినారు. అందుచేత క్రౌంచపక్షిని sarus crane గా గుర్తించినారనడం కొంతవఱకు అనుమానాస్పదంగానే ఉంది.
“పాఠకుణ్ణి ఆలోచించేలా చెయ్యాలనుకుంటే కథకు “భ్రాంతి” అని పేరుపెట్టకూడదు.” -శివకుమార శర్మ
2023 అక్టోబరు, నవంబరు నెలల్లోనేమో, ఈమాట పత్రికలోనే కొన్ని వింత సంఘటనలు జరిగాయి. ఒక రచయిత్రి ఆమెకు డెత్ త్రెట్స్ వచ్చాయని, అందువల్ల తన రచనను పత్రికనుండి తొలగించమని పత్రిక యాజమాన్యాన్ని కోరినందున, ఆమె రాసిన ‘నేత్రోన్మీలనం’ అన్న కథను ‘ఈమాట’ పత్రిక నుండి తొలగించారు. ఆ విషయం పత్రిక ఎడిటర్ చెప్పినందునే పాఠకులకు తెలిసింది. అతి తొందరగా తొలగించినందున, ఆ కథను కొందరు ఫేస్బుక్ సభ్యులు తప్ప, ఆ సభ్యత్వం లేనివారు చదవనే లేదు.
చూస్తే, కథ శరీరం తొలగించబడింది. కాని కథ తల (శీర్షం) పత్రికలోనే ఉండిపోయింది. కథ రచయిత్రిగారిది కాని శీర్షిక కాదా? మరెవరికి చెందుతుందా హెడ్డింగ్? మొండెం తీసుకు పోటమేంటీ? హెడ్ మిగల్చటమేంటీ? ఏదో నేరస్థుడి తల నరికి పత్రిక కోటగుమ్మానికి వేలాడేసినట్టు ఇదేం చర్య!
భేతాళ కథలు, ఎందరివో స్పూకీ రచనలు, మస్తుగా చదివిన నాకే ఇది వింతగా అనిపించింది. అందులోనూ నిజప్రపంచంలో అప్పుడది కొంత వింతైన సమయమే. అమెరికాలో ప్రజలు Halloween చేసుకుంటున్నారు. స్పానిష్ ప్రజలు ‘The day of dead’ చేసుకుంటున్నారు. ఏ వీధిలో చూసినా చెట్ల మీద అస్థిపంజరాలు, ఉరేసిన శవాలు, డీమన్స్, ఏంజెల్స్ నిలువెత్తు బొమ్మలు వేలాడుతున్నయ్యి. నేనున్నఊళ్లో జనాలు రకరకాల కాస్ట్యూమ్స్ లో హోటల్, క్లబ్స్, రోడ్డుల మీదా హుషారుగా తిరుగుతున్నారు. అప్పుడే భారత దేశంలో దీపావళి సమయం అనుకుంటా, ప్రపంచంలో ఇండియన్లు ఎక్కడెక్కడివాళ్లూ కలిసి నరకాసురుడిని నరికి పోగులుపెట్టాలి. జోరుగా పటాసులు కాల్చాలి. ఇంచుమించు అప్పుడే రావణాసురుడి గడ్డిబొమ్మలు తయారుచేసి అతడి తలలు నరికి నిప్పెట్టాలి. అదే సమయంలో రాముడు లంకనుండి అయోధ్యకు తిరిగి రావాలి.
ఇలాటి Fantasia festivals ఎన్నోదేశాల జనం హేండిల్ చేస్తున్న సమయంలో ‘ఈమాట’ పత్రికలో, ఆ తెలుగు కథ బాడీ రిమూవ్ చేసి తలకాయ ఉంచేశారు. ఆ రావణాసురుడి కుడ్యచిత్రం తలకాయ కింద ఎందరో వీరులు వారి అభిప్రాయాల కత్తులతో వీరోచితంగా పోరాడారు. అక్కడే ఏంటి, బలగాన్ని పోగేసుకుని, ఫేస్బుక్లోనూ, ఇతర పత్రికల్లోనూ పోరాడారు. కొద్దిగా నాకు నరకబడిన మెడూసా హెడ్, కారే రక్తం నుండి ఉద్భవించే వందలాది తేళ్ల, మండ్రగబ్బల భావన కలిగింది. మెడూసా హెడ్ ఎవరూ చూడకూడదే! చూసి ఎవరు శిలలై పోతారో ఏం పాడో! ఈ కథ రావణుడి హెడ్ కళ్లలోకి మామూలు మానవులు చూడొచ్చా లేదా? చూస్తే ఏ భూతం ఎవరికి పూనుతుందో?
It is one hell of a weird time.
పుస్తకాల షాపులో నిషేధించబడిన పుస్తకం మొత్తం తీసేస్తారు. ఉత్త అట్టలుంచరు. ఆర్ట్ మ్యూజియంలోనైనా అఫెన్సివ్ పెయింటింగ్ తో పాటు టైటిల్ కూడా తీసేస్తారు. అక్కడ ఇక ఎవరి ఒపీనియన్లు గోడమీద ఉండవు. తెలుగు మేగజీన్లు సిమెటరీలు కావు, పూలగుత్తులు ఉంచిపోటానికి. రోడ్ ఏక్సిడెంట్ సైట్‌లు కావు, రోడ్ సైడ్‌న ఒక సిలవ పాతి, ప్లాస్టిక్ పూలు పెట్టి పోటానికి.
సో, ఎప్పటికైనా ఆ రచయిత్రి తన అద్భుతకథ మొండాన్ని పత్రికకు తిరిగి ఇస్తుందా? లేకుంటే ఆమె, తన తెలుగుకథ తలకాయను తీసుకుపోతుందా? పత్రికలో ఇప్పటికీ వేలాడే తలకు ఆ బాడీ మళ్లీ అతుక్కుంటుందా? లేదా? అన్నది -అది ఒక పెద్ద సస్పెన్స్ నాకు.
కథ ప్రచురింపబడిన తరువాతి నెలలలో నేను క్యూరియాసిటీతో Heinrich Zimmer రాసిన ‘King and the corpse’ ఇంగ్లిష్‌లో చదివాను, అందులోని భేతాళ కథలు ఎంతో బాగున్నవి. Thomas Mann ‘The Transposed Heads’ 1940, ఇంగ్లిష్లో, స్పానిష్లో చదివాను. If two men who are friends chop off their own heads in a religious or jealous fervor, in a temple of Kali, and (inspite of the kindness of Kali, to give both men’s lives back,) the wife of one man sticks the heads on to the wrong body, who does the woman then belong to? Who is her husband from then on? అనే పాత భేతాళ ప్రశ్నను దాటి: ఆ స్త్రీ, తన భర్త, స్నేహితుడి తలలు మార్చటం, ఖంగారులో చేసిందా? లేక ఆమె ఆ పొరపాటు కావాలనే చేసిందా (ఆ నవలలో ఆమె పేరు సీత) అసలు ఒక స్త్రీ -ఒక మగవాని తలను/ముఖాన్ని ప్రేమిస్తుందా, లేక అతని శరీరాన్ని ప్రేమిస్తుందా? ఆమె ఎవరితో ఉండ గోరుతుంది? ఎవరితో నిజంగా భోగిస్తున్నది? ఎవరికి తన పిల్లవాడిని కన్నట్టు? మానవ శరీరంలో తల, శరీరాన్ని అదుపు చేస్తుందా, లేక శరీరమే తలను అదుపు చేస్తున్నదా అన్న విషయాలు ఊహిస్తూ – చిన్నదే ఐనా చక్కని నవల రాసి థామస్ మాన్ ఆనందించాడు. తన రచనను తిరిగి జిమ్మర్‌కే అంకితంలో అప్పజెప్పాడు.
వారందరికి ఆ కథలు ఇండియా నుండి వచ్చినవేనని, చక్కగా తెలుసు. అందరూ శ్రద్థతో Sources ఇచ్చినారు. అందువలన భేతాళపంచవింశతి (50 B.C) ముఖ్యంగా ఐదుగురి పండితుల రచనలు సంస్కృతంలో ఉన్నవనీ, అవి అన్నీ ఏళ్ల మీద భారతీయ భాషల్లో విరివిగా అనువదింపబడినవనీ తెలిసింది. I now also know Thomas Mann’s novella ‘The Transposed Heads,’ 1940, Is based on an earlier version of Zimmer’s essay and that essay appeared in the festival volume in the honor of Dr. C.G. Jung’s sixtieth birthday. Berlin 1935.)
తెలుగు దేశంలో, ‘దేవదాసు’ సినిమా (1953) విడుదలయ్యాక, నా ముందు తరం యువతులెందరో (including my mom) ఈ కింది పాట తరచుగా పాడగా నేను విన్నాను.
“మనసున లేని వారి సేవలతో,
మనసీయగ లేని నీపై మమతలతో,
వంతలపాలై చింతిలుటే నా వంతా దేవదా!”
అంటూ ఆ బెంగాలీ బాబు శరత్ -కథ లోని హీరోయిన్ ‘పారూ’ పాటని వారు పాడినారా! లేక వారి మనసులనే తెలియచేస్తున్నారా!
శర్మ దంతుర్తిగారికి నమస్సులు! ఇక్కడ నేను మీరు అడిగిన రెండవభాగపు ప్రశ్నలకు మాత్రమే సమాధానమును ఇస్తున్నాను.
(1) రుబాయీ ప్రక్రియకు ఒక నిర్దిష్టమైన ఛందస్సు గలదు. దానిని వ్యాసములో వివరించినాను.
(2) పారసీక ఉర్దూ భాషలలో గణములకు తగినట్లు పదములు, అంత్యప్రాస మాత్రమే ముఖ్యము. తెలుగులో నేను అదనముగా ద్వితీయాక్షర ప్రాస, అక్షరసామ్య యతిని కూడ వీలైనప్పుడు వాడినాను.
(3) In principle మీరు ఏయుగమునైనను వాడవచ్చును. కాని ఛందస్సు రీత్యా అక్కడ UUUU లేక UUIIU లకు సరిపోయే పదములను మాత్రమే వాడాలి. త్రేతాయుగమే అను పదము UUIIU నకు సరిపోతుంది. రేఫముతో అక్షరసామ్య యతి. నాలుగవ పాదమునకు కూడ ఇక్కడ చెప్పినది వర్తిస్తుంది.
Christopher Isherwood translated Intimate Journals of Charles Baudelaire, into English. (First Beacon paperback edition published in 1957.) His introduction begins with the question of “What kind of a man wrote this book?” and in the next paragraph he summarizes his answers like so.
“A deeply religious man, whose blasphemies horrified the orthodox. An ex-dandy, who dressed like a condemned convict. A philosopher of love, who was ill at ease with women. A revolutionary, who despised the masses. An aristocrat, who loathed the ruling class. A minority of one. A great lyric poet.”
Then Isherwood proceeds to give a life history of C.B. At one point, he says- “Shy men of extreme sensibility are born victims of the prostitute. Baudelaire’s mulatto mistress, Jeanne Duval was a beautiful indolent animal. She squandered his money and slept with his friends. The biographers usually condemn her most unjustly. Few of us would really enjoy a love affair with a genius. Jeannie had to endure Baudelaire’s moods and listen to his poems: she understood neither. But in some mysterious manner, these two human beings needed each other. They stayed together, on and off, for twenty years. Baudelaire always loved and pitied her and tried to help her…”
I think -this is where Suraparaju RadhakrishnaMurthy got his tone for his C. B’ s bio in Telugu. His idea about how to present to the Telugu readers, another slave woman, C.B., meets in Mauritius.
సూరపరాజు గారి మాటల్లో:“బోద్‌లేర్‌లో నిద్రాణంగా ఉండిన కవితకు పునరుద్దీపనమయింది యీ కేరళకాంతనీలకాంతి. ఆమెపై ఒక కవితరాశాడు: ‘మలబారు యువతి’ (A une Malabaraise). బహుశా యీ యువతి కలిసివుండకపోయి ఉంటే, మనకొక బోద్‌లేర్ మిగిలేవాడు కాదేమో? ఈ విషయం బోద్‌లేర్ స్వయంగా ఒకచోట రాసుకున్నాడు. బోద్‌లేర్‌లో కవిని ఆరిపోకుండాఅందమైన తన అరచేతులు అడ్డంపెట్టిన యీ మలబారు మహిళకు సాహిత్యలోకం ఋణపడి ఉండవలసిఉంటుంది.”
అధ్యాపకుడు సూరపరాజుకు,ఈ ఫ్రెంచ్ కవిని “భారతీయ సనాతన ధర్మదృష్టి తో సమన్వయం” చేసి, చూపటం ఆయన రచన ధ్యేయం కనుకనేమో, అక్కడ తెలుగు కవి థూర్జటిశ్రీకాళహస్తీశ్వరశతకంలో ‘రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్..’ – పద్యంతో సాపత్యం తెస్తారు. బూదలేర్ బానిస స్త్రీ, ఆపెరా హౌస్ స్త్రీలతో సంబంధం పెట్టుకోటం నైతికంగా అతడిని పతనం చేసిందనిభావిస్తూనే, అతడు గొప్ప కవికావటానికి నీచ స్త్రీ సంబంధం ఉపకరించిందనీ, అందువల్ల “మనం” ఆ స్త్రీ/ స్త్రీలకు రుణపడి ఉండాలంటారు. ఆ మెలిక నాకర్థం కాదు.అలాగే -తెలుగు కవి థూర్జటి కవిత్వాన్ని గౌరవిస్తూ, ప్రజలు బోగంస్త్రీని నిరసించాలి. ఈ మిసాజినీకి అంతెక్కడ! దేశదేశాల పాతశతాబ్దపు పరిస్థితులు, ఆలోచనలు,ఈ శతాబ్దివిలా ధ్వనింప చెయ్యటం,ఇప్పటి తరం సాహిత్య వేత్తకు,భావ్యమా? స్త్రీ గాని, మగవాడు కాని,ఒక సమయంలో, ఒక వయసులో భోగించి, మళ్లీ మళ్లీ కావాలనిఅనుభవించి, ఆ తరువాత ఆ సుఖాలనునిరసించటం దేనికి? Why knock them? అంత మట్టుకు కృతజ్ఞులై ఉండి ఆ తర్వాత కాలంలో అప్పుడు వారికి ఇష్టమైనవి,అవేవో తెలిస్తే చేసుకోరాదా?
In Christopher Isherwood’s translation -The squibs, there are about 22 of them, followed by “my heart laid bare.” Maybe twenty, thirty. Followed by a selection of ‘consoling maxims upon love.’ Some fifty or so. I lost count. (Bad at counting Roman numerals.) Interspersed are some sketches by Baudelaire. There is a sketch of Jeannie Duval after page 56. Reading them, I got some glimpses of B’s thought processes about some of his contemporaries. In these pages, Baudelaire comes across as an ordinary, o.k., guy. Don’t know why Isherwood thinks he is a super genius. Baudelaire is no match for Emerson, Thoreau in philosophic thought, or Oscar Wilde in wit.
In his squibs: B thinks there are only three worthwhile high-minded pursuits in life. 1. Priest 2. Soldier 3. Poet. B thinks the rest of humans are “professionals.” They do mundane things, just to earn a living, for themselves. This dandy, this ‘Flaneur’ of 19thcentury Paris streets, he is dead wrong, isn’t he?
In actuality, What B really needed is some penicillin. To save his life and sanity. Unfortunately, Alexander Fleming did not find Penicillium notatum, until about a century later. (sept 28, 1928 – a day to remember!) In his experiments with various kinds of plants, Baudelaire himself did not stumble on any cures for any diseases. Therefore, B joined the group of talented artists like Schubert, Schumann, most likely Telugu poet Dhurjati, the prostitutes in his poetry, and many other humans who suffered terribly from syphilis and died of it.
However, I am glad that before he died in his forties, Baudelaire managed to enjoy a few pleasures of life. Otherwise, his life would have been one big wasteland of misery and deprivation. God forbid! Who wants that!
I am all for the delights of body and mind, however transient the pleasure or life may be.! Asi So Yo! A few of my lines in poetry, from memory:
ఎన్నడు కుడిచితినో నీతోటి ఆ తోటలో
ఎన్నడు ఒంపితినో నీకు తేనీరు!
ఎన్నడు ముడిచితినో బిడియము వీడి నీకు విడియము;
కన్నడ! అన్నడె వీగిపోయె నా అంతరంగపు సుడులు,
వెన్నడ! అన్నడె వ్రీలిపోయె నా కంచుకపు ముడులు.
నేను చాందసవాదుణ్ణి కాకపోయినప్పటికి, ఈ సంపాదకీయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవించలేను. కర్నాటక సంగీతాన్ని భక్తి సంగీతము కోసమే కాకుండా వేరే విధంగా కూడా వాడే ప్రక్రియలు ప్రవేశపెట్టాలనుకుంటే పెట్టడంలో తప్పులేదు కాని ప్రస్తుతమున్న భక్తి సంగీతాన్ని భ్రష్టుపట్టిన్చనక్కరలేదు. శంకరాభరణం సినిమాలో చూపించినట్లు “మీలాంటి చాందసులు మాలాంటి మేధావులుచేసే ప్రయోగాలా? 🙂
తెలుగు కథకు ఈ తరహా విశ్లేషణ అపూర్వం. ఇది అందించడానికి తగిన పరిజ్ఞానం, పరిణతి, సామర్థ్యం ఉన్న మెడికో శ్యాం – అందుకు పూనుకోవడం తెలుగు సాహితి అదృష్టం. సాహితీప్రియులందరూ చదివి తీరాల్సిన ఈ ప్రసంగవ్యాసం- వెనుకనున్న కృషి, తపన అభివందనీయం అంటే అది చాలా చిన్నమాట!
తెలుగు సాహితికి అద్భుతమైన ‘షామియానా’ సమకూర్చిన మెడికో శ్యాం లో మరో విశేషం – తన మనోభావాల్ని సూటిగా నిష్కర్షగా నిజాయితీగా చెప్పడం! అందువల్ల వారి పొగడ్తలకూ, విమర్శలకూ విలువ పెరుగుతుంది. ఎన్నో దశాబ్దాల క్రితం జ్ఞాపకాల్లోంచి వ్రాస్తున్నందువల్ల ఎక్కడైనా తప్పులు దొర్ల వచ్చునన్న అనుమానాన్ని వెలిబుచ్చారు వారు. ఆ మేరకు మా (వసుంధర) రచనలకు సంబంధించిన రెండు సవరణలను ఇక్కడ ఇస్తున్నాము.
1. ‘పెసరపప్పు’ మా మొదటి కథ కాదు. మొదటిది ఆంధ్రపత్రికలో వచ్చిన ‘స్టంటు సినిమా కథ’. స్వాతి మాసపత్రిక తాజా సంచిక (మే 2024) లో కెవిఎస్ వర్మ అనే రచయిత ఇటీవలే దీన్ని పరిచయం చేశారు.
2. ముళ్లపూడి వెంకటరమణ గారు ఎస్టీడీ ఖరీదైన రోజుల్లో మద్రాసునుంచి అరగంటకు పైగా మమ్మల్ని మెచ్చుకుంటూ చేసిన ఫోను- ”పెళ్లయ్యాక చూడు’ నవల గురించి కాదు. ‘పెళ్లి చేసి చూడు’ నవల గురించి. మధ్యతరగతి కుటుంబంలో ఓ ఆడపిల్ల పెళ్లి కథ అది. ”పెళ్లయ్యాక చూడు’- దాంపత్య జీవితంలో దంపతులకు తొలి సంతానం ముచ్చట్లు. మెడికో శ్యాం గారు చదివింది ఇది. ఒక విధంగా ఇది మాకు సంతోషమే. రెండు నవలలకూ మహామహుల ప్రశంస లభించినట్లు కదా!
‘షామియానా’లో మెడికో శ్యాం విశ్వరూపాన్ని దర్శించినవారిగా- వారి ప్రసంగవ్యాసంలో మా రచనల ప్రసక్తి రావడం మాకు గౌరవంగా భావిస్తున్నాం.
ఈ ప్రసంగవ్యాసాన్ని- సాహితీలోకానికి అందించిన శ్రీ మెడికో శ్యాం గారికి కృతజ్ఞతలు; ప్రచురించిన ‘ఈ మాట’కు అభినందనలు; మాకు చేర్చిన శ్రీమతి శ్యామల గారికి ధన్యవాదాలు.
‘పరమ నిరంకుశో పత్రికాసంపాదకాః’ అని వాపోయాడో పెద్దమనిషీమధ్య. సంపాదకుని స్థానం, ప్రాముఖ్యత గురించి రచయితలకి పాఠకులకి తేటతెల్లమే.
సంపాదకులకి తెలియవలసిన తమ బాధ్యతలు ఇంకొన్ని ఉన్నాయి. ముందుగా పాఠకుల స్థాయి, రచయితల స్థాయి నిర్ణయించగల నిషోపలకాలు తామే అనే అపోహ నించి సంపాదకులు బయటపడాలి. తాము మెచ్చిందే అందం కాకపోవచ్చు. అందగత్తెలు, అందాన్ని ఆస్వాదించగలిగే రసజ్ఞులు సమాజంలో పుష్కలంగా ఉండవచ్చు, ఉన్నారు అనే స్పృహ సంపాదకులకి లోపించినంతవరకూ సాహిత్యం గిలగిల్లాడుతుంది.
వాన్‌గో చిత్రాల నాణ్యత ఆకాలంలో ఏసంపాదకుడు నిర్ధారించగలిగాడు? ఎన్ని హెమింగ్‌వే కథలు అర్థంకాని సంపాదకులు తృణీకరించారు? వాన్‌గో పాటి అదృష్టం, మనదృష్టం కూడా లేక ఎంతమంది చిత్రకారులు, కవులు, రచయితలు వెలుగు చూడకుండా సమసిపోయారో! సంపాదకుల నిషోఫలకాలచే తిరస్కరింపబడి! ఉన్నతస్థాయి పాఠకులు ఉన్నత రచనలు ఆకాంక్షింస్తారు. వారికి వాక్యంలోకంటే వాక్యానికి, వాక్యానికి మధ్య ఎక్కువ రసం స్ఫురిస్తుంది. రచన స్థాయి నిర్ణయించగల స్థాయికి సంపాదకులు ఎదగాలి.
సినిమాకి తగిన మసాలా ఉందా లేదా అని కొలవగలిగే మూసలో మాత్రమే తర్ఫీదయిన సంపాదకులున్నంతవరకూ అభిరుచిగల పాఠకులు, నాణ్యతగలిగిన రచయితలు పత్రికకి కనుమరుగౌతారు. కాలక్రమేణా పత్రికా కనుమరుగవుతుంది.
శ్రీ వేలూరి: రెండంటే రెండే (తెలుగు) పద్యాలు – ఒకటి చిన్నది, ఒకటి పెద్దది- “తెలుస”న్న వారికి తెలిసిన పద్యాల్లో మొదటిది – ‘ఉప్పు కప్పురంబు’, రెండోది, ‘ఎవ్వనిచే జనించు’ అవుతాయేమో. ఈ పద్యం వ్యాసుని శ్లోకానికి(లకు) అనువాదం అవటంవల్ల తెలుగు నుడికారానికి దూరంగా ఉంది. పోతన అనువాదాలను మించి తన సొంతం గూడా జోడించిన సందర్భాలున్నాయి. [వ్యాస నిర్మాణములో లక్ష్మి లేదు. గజేంద్రునికి ‘కలడో లేడో’ అన్న సందేహమూ లేదు చివరికి – శరీర రక్షణ గాక – కాలానితో ముడిబడకుండా భగవంతుని దయతో మాత్రమే వదిలిపోయే చీకటి పోవాలని కోరుకున్నాడు.*] పోతన ఈ దోవ తొక్కినట్టుగా అనిపించదు. చిక్కని సంస్కృతంతో తెలుగు నుడికారంలో పోతన పద్యాల మాధుర్యం వర్ణింపనలవి కానిది. నాకు “హరికిన్బట్టపుదేవి…” మరీ మరీ ఇష్టం.
నమస్కారాలతో -తః తః
(*గీతా ప్రెస్ గోరఖ్ పూర్ ప్రతి లోని అనువాదం ఆధారంగా)
ఒక గొప్ప వ్యాసానికి చక్కని అనువాదం. ఈ ప్రసంగంలో పంచతంత్రం ప్రస్తావన ముందు చెప్పబోతే విషయానికి శ్రోత/పాఠకుడిని తను చెప్పబోయే విషయానికి ఉన్ముఖీకరణగా ఉంది. ఇతఃపూర్వం శాంతి గురించిన విశ్లేషణ ఈ విధంగా ఎప్పుడూ చదివిన అనుభవం నాకు లేదు. కాని చదువుతుంటే రుష్దీ ఎంతగా దాని గురించి ఆలోచించారో అవగతమౌతుంది. తాను పురస్కారానంతరం ఒకవేళ రాస్తానేమో అంటూ చెప్పిన కథలో నేటి సమాజం ప్రతిబింబిచింది. ఇక స్వేచ్ఛ గురించి చెప్పిన మాటలు మనసును ఆకట్టుకున్నాయి. అన్యాపదేశంగా కవులు కళాకారులకు ఆయన ఇచ్చిన సూచన కూడా మనసును అలరించింది. మానవీయతతో అమానవీయతకో జవాబు ఇవ్వటం అన్నమాట చాలా సంయమనంతో చెప్పిన మాట. ఈ ప్రసంగం చదివిన తరువాత ఆ పురస్కారానికి ఎంతటి అర్హత కలిగి ఉన్నాడో కూడా తెలుస్తున్నది.ఇంత మంచి వ్యాసాన్ని అనువదించి అక్షరాక్షరం మనసుకు హత్తుకునేలా అందించిన మీకు ధన్యవాదాలు. మీ అనువాద పటిమకు జోహార్లు.
ఏదేనా శంఖం లో పోస్తేగాని తీర్థమవదు. అన్ని పోస్టర్లు అనలేను కాని కొన్ని పోస్టర్లు కధ లోని ముఖ్య విషయాన్ని తెలియజేస్తూ చాలా బాగుండేవి. పది చూసేసరికి మాకు కధ తెలిసిపోయేది. నాకు వీటి గురించి అవగాహన లేదు గానీ అమెరికన్ స్నేహితుల్లో పాత యింగ్లీషు సినిమాల పోస్టర్లు వేలం పాటల్లో బోలెడు డబ్బు పెట్టి కొనడం చూశాక ఔరా అనుకున్నాను. రూడాల్ఫు వాలంటీనో నటించిన సినిమా తాలూకు కాగితం చాలా విలువైనదట. మాలపిల్ల, వరవిక్రయా లాటి పాత సినిమాల తాలూకువేమేనా దొరికితే వాటి విలువ యెలా వుంటుందో?
నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/10/2023 11:17 am
ఈచర్చ ఇంకా కొనసాగుతున్నది. ఆశ్చర్యం!
సెక్యులరిజం ముసుగులో సనాతనధర్మాన్ని అవహేళన చేయటానికి వస్తున్న సమర్ధింపులు ఆవేదన కలిగిస్తున్నాయి. చివరకు సెక్యులరిజం అంటే సనాతనధర్మాన్ని అవహేళన చేయటం అన్న దుస్థితి స్థాపించబడుతున్నది.
ఈమాట వారు కాని మరొక సాహిత్యవేదిక వారు కాని ఇతరమతధర్మాలను కాని వారివారి చారిత్రక సాంస్కృతిక వారసర్వాలను కాని అవహేళన చేస్తూ వచ్చే ఏ రచననైనా ప్రచురించగలరా? వారి మనోభావాలు దెబ్బతింటె వీరి అస్తిత్వాలు దెబ్బతింటాయి. మనది సెక్యులర్ దేశం కాబట్టి ప్రచురించాం అని తప్పించుకోవటం అసాధ్యం. ఐతే సనాతనధర్మావలంబులు సాత్వికులు కాబట్టి సెక్యులరిజం పేరుతో వారిని ఎంతగా ఐనా గాయపరచి మేం చేస్తున్నది ఒప్పే మాధోరణి సరైనదే అని చెప్పుకోవచ్చును. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి.
ఇకనైనా దయచేసి ఇటువంటి అవమానకరమైన రచనలను ప్రచురించవద్దని ఈమాట వారికి మనవి. 1994 తెలుసా రోజులనుంచీ ఉన్న పరిచయాన్ని నేను మరువలేదు. ఈమాటను అవమానించాలని నా ఉద్దేశం కాదు. నేను వ్యక్తిగతంగా స్పందిస్తున్నానన్న మాట సరికాదు.
నేను ఒంటరిననీ నాకు భిన్నమైన అభిప్రాయమే బలంగా ఉన్నది ఈవిషయంలో అనుకోవటం లేదు. ఇరువైపులా బాగానే స్పందిస్తున్నారు. కాని సనాతనధర్మాన్ని చులకన చేసే రచనలను ప్రోత్సహించద్దని సాధ్యమైనంతా వేడుకుందుదే పునఃపునః చెప్పవలసి వస్తోంది.
ఈకథ కారణంగా నేను మనశ్శాంతికి దూరమాయ్యాను. దానర్దం నేను మానసికంగా బలహీనుణ్ణని కాదు. ఇది అంతగా నామనస్సును గాయపరచింది అని. ఇంకా ఎంతోమంది సనాతనధర్మపథంలో ఉన్నవారిని గాయపరచే ఉంటుంది.
జరిగింది చాలు. ఇకపైన మీరు రచనలను మరింత శ్రధ్ధగా పరిశీలించగలరని ఆశిస్తున్నాను.

11/07/2023 9:46 am
సంపాదకులు ప్రచురించి చూపిన Kakra Muralidhar గారి వ్యాఖ్య అభ్యంతరకరంగానే ఉంది. సందేహం లేదు. ఆయన ఈకథను ఎద్దేవా చేసినంత మాత్రాన ఆయనను మీరు భక్తుడు అని ఎగతాళిగా చెప్పటం అవసరం కాదు. ఈకథను దురుసుగా ఆక్షేపించారు కాబట్టి ఆయన భక్తుడు అనటం ద్వారా మీరు భక్తులు ఇలాంటి భాషను భావజాలాన్ని వాడుతారని దురదృష్టకరమైన తప్పుడు అవగాహనకు వచ్చారంటే, మీకు సంప్రదాయికంగా భక్తులనే వారు ఎంతటి వినయభూషణులుగా ఉంటారో అన్న విషయంలో ఏమీ అవగాహన లేదని అర్ధం అవుతున్నది.
ఆకథా రచయిత్రి యొక్క గౌరవమర్యాదల గురించిన ఆలోచన మీకు కలిగింది. సంతోషం. కాని మీకు యావద్భారతమూ అనాదిగా ఎంతో ప్రేమతో అభిమానంతో గుండెల్లో నింపుకొని పూజించే సీతారాముల గౌరవమర్యాదల గురించిన ఆలోచన ఏదీ ఈకథను ప్రచురణకు అంగీకరించే సమయంలో కలుగలేదు కదా? కథారచయిత్రిపై ఒక రాయి (పోనీ కొన్ని లేదా అనేక రాళ్ళు) పడినందుకు అభ్యంతరమూ ఆవేదనా కలిగిన మీకు సీతారాముల మీద ఇలాంటి కథల ద్వారా రాళ్ళు వేయటం అనుచితం అని కొంచెం కూడా స్ఫురించలేదు! ఈఈఉదయం మాచెల్లెలు ఒకామె మాట్లాడుతూ రాముడి మీద రాళ్ళు విసిరితే కాని రచయితలు కారా ఏమిటి అంది. ఈకాలపు సోకాల్డ్ అభ్యుదయ రచయుతల వ్రాతలు చూస్తే అలాగే ఉన్నాయి.
మనమధ్యన ఉన్నందుకు రచయిత్రి ఎక్కువ గౌరవనీయురాలున్నూ మనమధ్యన భౌతికంగా లేనందుకు సీతారాములు తక్కువ గౌరవనీయులున్నూ కారని మీరు తప్పక అర్దం చేసుకోవలసి ఉంది. సీతారాముల చరిత్రనూ పాత్రలనూ వక్రీకరించటం వాళ్ళ మీద రాళ్ళు వేయటం అన్నది అగౌరవపరచటం కాదూ అని మీరు అంటే ఇంక చెప్పవలసినది ఏమీ ఉండదు.
[ ఆ వ్యాఖ్య మీకు కేవలం “అభ్యంతరకరం.” భక్తుడు అని ఎగతాళిగా అనలేదండీ. ఇటువంటి ‘భక్తులూ’ ఉన్నారని చెప్పడం కోసం వాడాను. మీ ఉత్తరానికి రాసిన జవాబులో ఇంకొకరి అభిప్రాయాలు స్క్రీన్ షాట్ కూడా పెట్టి చూపించాను. భక్తులమని వారికి వారే చెప్పుకున్నారు కాబట్టే వాడాను. మీరు 1994 తెలుసా రోజులనుంచీ మాకు పరిచయం. మీమీద మాకు గౌరవం ఉంది. ఈ కథపై మీ అభిప్రాయం మీరు చెప్పారు. బలంగా చెప్పారు. కొన్నిసార్లు చెప్పారు. ఈ కథ పట్ల ఎన్నో భిన్నాభిప్రాయాలు. కథ కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. కథ నచ్చినా నచ్చకున్నా సభ్యమైన భాషతో తమ విమర్శను ప్రకటించిన అన్ని అభిప్రాయాలనూ ఈమాట నియమాల ప్రకారం ప్రచురిస్తూనే ఉన్నాం. కాని, ఎవరినేమన్నా మీరు వ్యక్తిగతంగా తీసుకుని అందుకు స్పందిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఇక్కడ మీరొక్కరే లేరు. మీ అభిప్రాయాలే అందరివీ అని అనుకోకండి. దయచేసి ఇక ఇలా చేయకండి. – సం.]
“ఈమాట ఒక సాహిత్యపత్రిక. సాహిత్యానికి పరిధులు, పరిమితులు ఉండవని, సాహిత్యం ఆహ్లాదాన్నే కాదు, ఆలోచననూ కలిగించాలని, సమాజపు పోకడలను ప్రశ్నించి, నిలదీసేలా కూడా ఉండాలని నమ్మే పత్రిక.”
చాలా మంచి నమ్మకం కలిగిన పత్రిక. సమాజపు పోకడలను ప్రశ్నించేలా అన్నారే! ఈ కథ ఏ సమాజపు పోకడను ప్రశ్నిస్తోంది? రామరాజ్యంలో ఏ పోకడలు ఉన్నాయో మీకు తెలుసా? రామరాజ్యం ఎలా ఉండేదో వాల్మీకి మహర్షి చెబితేగానీ తెలిసిరాలేదు. అదే మహర్షి రావణుడు దుర్మార్గుడు అని తీర్పు చెప్పేస్తే కాదు అతి మంచి వ్యక్తి అని కథ రాయడం ఏ సమాజపు పోకడలను ప్రశ్నించడం? సీతారాములది ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం. మనలాంటి సామాన్య జనాలు (మిమ్మల్ని మీరు సామాన్యులు కాక మేధావులు అన్న భ్రమలో ఉంటారేమో) ఆ వ్యక్తిత్వంలోనుండి ఎంతో కొంత, కనీసం ఒక్క లక్షణాన్ని పట్టుకుని ఆచరిస్తే మానసికంగా ఎదగగలము. మనం ఎత్తుకు ఎదిగేకొద్దీ వారి వ్యక్తిత్వాలు అర్థం చేసుకునే శక్తి వస్తుంది. అంతే కాక ఇలా వారి వ్యక్తిత్వాలను మీ ఇష్టం వచ్చినట్ట్లుగా మార్చి కథరాసి ఆలోచన కలిగించే కథ అంటారా? ఇలాంటి ఆలోచనలు కలిగించే కథలు చదివి సమాజం మరింత మానసికరోగగ్రస్థమవుతుంది. ఇలాంటి విపరీతపోకడలను ఆలోచన అనుకొని ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టే సమాజం నిండా ఇలాంటి మానసిక రోగాలు వస్తున్నాయి. గొప్ప కష్టం కలిగితే అంత కష్టాన్ని నా రాముడెట్లా భరించినాడో, సీతమ్మ తల్లి ఎంత ఓర్పుతో సహించిందో అనుకుంటే కష్టం నుండి బయటపడే శక్తి వస్తుంది. ఆ తల్లి మానసిక రోగానికి గురై ఎంతో క్షోభ అనుభవించింది అనుకుంటే కలిగేది మానసికరోగం.
“కళలు, సాహిత్యం పట్ల కాని, వాటిని సృజించే కళాకారులు, కవి రచయితలు ఆ క్రమంలో ఏ రకమైన నిర్బంధాలకూ గురి కాగూడదని, వారికి వారి సృజన పట్ల పూర్తి స్వేచ్ఛ ఉందనీ నమ్మే పత్రిక”
స్వేచ్చ అన్నది కేవలం కవులకు, రచయితలకు మాత్రమే ఉందా? మీ పాటికి మీరు రాసి ఆన్‌లైన్‌లో పడేసి కేవలం మెచ్చుకోవాలి తప్ప వివర్శించకూడదు అంటే చదివేవాడికి లేదా స్వేచ్చ? ఎవరికోసం రాస్తారు ఈ కథలు? కొందరు రచయితలు ఒక గుంపుగా ఏర్పడి ఒకరినొకరు మెచ్చుకోవడానికా? అలా అయితే ఈ చెత్త మా మొహాన కొట్టడం ఎందుకు ఈ కథలను మీకు నచ్చినవారితో పంచుకుని చర్చించుకోండి. మా నమ్మకం మీద, మా సంస్కృతి మీద ఇలా దారుణంగా దెబ్బ కొట్టకండి అని చెబితే దాడి అంటారేమిటి? మొదలుపెట్టడం ఎందుకు, పట్టుబడితే విక్టిమ్ కార్డ్ చూపించడం ఎందుకు? రాసేవాడికి సమాజంలో మనుషుల నమ్మకాల పట్ల, సంస్కృతి పట్ల బాధ్యతలేదా?
“కాని, సాహిత్య విమర్శ ఆ వేదికను దాటి, మత రాజకీయశక్తులకు, వారి దౌర్జన్యానికి ఒక ఆయుధమై, రచయితలకు మానసిక, శారీరక హాని కలిగించే ప్రమాదం ఉందని నిశ్చయమైనప్పుడు ఆయా రచయితలను కళాకారులను కాపాడుకోవడం కూడా ఈమాట తన బాధ్యతగానే పరిగణిస్తుంది.”
భౌతికదాడులు చేయడం అన్నది ఖండించాలి. ఇందులో మరోమాట లేదు. మీ కళాకారులని మీరు కాపాడుకున్నట్లే, మా సంస్కృతిని మేము కాపాడుకుంటాము. మా సంస్కృతిమీద దాడి జరిగినా, మా సీతారాముల వ్యక్తిత్వాలకు మచ్చ తెచ్చేట్లు కథలు రాసినా మేము ఖండిస్తాము. మీరు దాడి మొదలుపెట్టకండి. విమర్శలు వస్తే విక్టిమ్ కార్డ్ వేయకండి.
“నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను. ఈ కథ ప్రచురించడం ద్వారా ముందు ముందు రాబోయే ఏ రకమైన చట్టపరమైన చర్యలకైనా ఈమాట బాధ్యత వహిస్తుందని తెలియజేస్తున్నాను.”
భౌతికమైన దాడులు ఎవరిమీదైనా ఖండించదగినవే.
నేనుకూడా ఇలాంటి కథలు రాసేవాళ్ళ మీద, ప్రచురించే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేరోజు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

11/06/2023 9:46 pm
శోధిని అగ్రిగేటర్ వారి వ్యాఖ్యల పేజీలో ఉన్న చంద్రిక గారి క్రొత్త వ్యాఖ్యను చూసి స్పందనగా వ్రాస్తున్న కొద్ది మాటలు.
నా మనస్సు ఇప్పటికీ గాయపుతీవ్రత నుండి కోలుకోలేదండి. అఖండరామనామస్మరణం కొనసాగిస్తూ దాని పూర్వకంగా ఉపశమనం లభిస్తుందని ఎదురుచూస్తున్నాను.
ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలిసిందని మాధవ్‌గారు అన్నది చదివాను. అది ఆందోళనకరమైన విషయం. రచయితలను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవటం భావ్యం కాదు. అలా లక్ష్యం చేసుకొనే వారి వివేకం చిత్యం.
రచయితలు కూడా సామాజికబాధ్యతను కలిగి ఉండాలని గుర్తెరగాలి. సామాజికబాధ్యత అన్నది సున్నితమైన అంశం. వారి కాల్పనికస్వేఛ్చను సమాజం గౌరవిస్తుంది. వారు నైతిక సాంస్కృతిక ప్రమాణాలను అవహేళన చేయకుండా జాగ్రత వహించాలి కాని నవ్యత అన్నపేరుతో ఇష్టారాజ్యంగా వ్రాయటం క్షమార్హం కాదు.
బాధ్యత కల రచయితలు సమతూకంగా ఆలోచించి వ్రాస్తారు. బాధ్యత కల చదువరులు కూడా వివేకంతో స్పందిస్తారు కాని వ్యక్తులను లక్ష్యం చేసుకోరు.
ఆసక్తికరమైన రచన, అంతరంగాన్ని ఆవిష్కరించడం, ఆత్మగౌరవం, ఊహ, వర్ణన అన్ని కలగలిసినట్టున్నాయి. సీతదేవి ఆధార్ ప్రూఫ్‌తో వస్తే కాని దీన్ని ఖండించలేనిది. ఎందుకంటే భావప్రకటన స్వేచ్చ.
నేత్రోన్మీలనం గురించి Prasuna Balantrapu గారి అభిప్రాయం:
11/04/2023 1:59 am
ఓల్గా గారి కథలా ఉంది. ఇది విషయంలో మాత్రమే. కార్నాడ్ గారి కథ చదివాను. మన కథలను వేరే కోణంలో చూడడం మనకి ఎప్పుడూ వుంది. అందుకే ఇన్ని రామాయణాలు. సీత రావణుని కూతురేమో అన్న కథ కూడా ఒకటి ఉంది. మీ కథలో అది కూడా ప్రస్తావించారు. రాముడిలో ఏ మాత్రం మానవగుణాలు కనిపించినా మన వాళ్ళు భరించలేరు. కాని మొదటి సారిగా ఈ గుణాన్ని ప్రస్తావించింది భవభూతి ఉత్తర రామ చరిత్రలో. మానసిక విశ్లేషణకి అవకాశం ఇచ్చారు.

11/03/2023 2:40 pm
శివ గారు “పరాయి స్త్రీని చెరబట్టిన క్రూరుడు, దుష్టుడు, దుర్మార్గుడు, రాముడి చేత సంహరింపబడిన రాక్షసుడు” – ఇది జనసామాన్యమైన అభిప్రాయం రావణుడి మీద” అంటున్నారు. కాని ఇది శ్రీమద్వాల్మీకిరామాయణం చెప్తున్న మాట.
” తన మానానికి భంగం కలగగకుండా చూసుకున్న ఒక దయ గల” రావణుడి రూపం ఆమెలో ఇంకిపోయి ఉన్నది అంటారు శివ గారు. భలే ఆ రావణుడి ముఖం కూడా సీత ఎన్నడూ చూడలేదు మహాప్రభో అని శ్రీమద్రామాయణం ఖరాఖండిగా చెప్తున్నది. ఎందుకువచ్చిన పిచ్చి సమర్ధన?
ఈవికారమైన ఊహలు ఆధునికులం అని చెప్పుకుంటూ శ్రీమద్రామాయణాన్ని ఎన్నడూ శ్రధ్ధగా చదవని పరిశీలించని విపరీతవాదుకు మాత్రం కలుగుతాయి. రావణుడు సీతను తాక(లే)క పోవటానికి కారణం వాడికున్న శాపం కారణంగానే తప్ప వాడంత యోగ్యపురుషుడై కాదు. అసలు యోగ్యుడూ దయాశాలీ ఐతే ఆవిడను జుట్టుపట్టుకొని ఈడ్చుకొంటే ఎత్తుకొని వెళ్ళేవాడేనా? మాట్లాడితే ఏమన్నా అర్ధం ఉండాలి.
ఈదిక్కుమాలిన సమర్ధనను త్రిప్పికొట్టాలని వచ్చాను కాని ఈమాట మీద నా క్రోధాన్ని ఉపసంహరించుకొని కాదు.
ఇంత దారుణంగా సనాతనధర్మావలంబుల మనోభావాలను అపహాస్యం చేసినవారికి తగిన ప్రతిఫలం లభించుగాక!

11/03/2023 12:56 pm
మన్నించాలి. ఈకథ నామనస్సును బాగా గాయపరచింది. ప్రాణం పోయేంతగా!
శ్రీమద్రామాయణం ఒక కథ అనుకుంటే అది వ్రాసినది వాల్మీకి మహర్షి. అయన కథలోని పాత్రలకు వ్యతిరేకమైన వ్యక్తిత్వాలను ఆపాదించి కల్పనలు చేసే స్వాతంత్రం ఎవ్వరికీ లేదు.
శ్రీమద్రామాయణం ఒక చరిత్రగ్రంథం అనుకుంటే ఆచరిత్రను గ్రంథస్థం చేసినది వాల్మీకి మహర్షి. అయన చెప్పిన చారిత్రకకథనాన్ని వెక్కిరించేలా ఆరచనలోని పాత్రలకు కొత్తకొత్త వికృతమైన కల్పనలతో మసిపూయటం క్షమార్హం కాదు.
కవులకు రచయితలకూ ఆమాటకు వస్తే అన్నిరకాల కళాకారులకు కల్పనాస్వేఛ్చ తప్పకుండా ఉంది. అంటే దాని అర్ధం ఇతరుల సృజనలోని అంశాలని విలోమం చేసి స్థలపాత్రకాలస్వభావాదులను ఇష్టారీతిగా మార్చిపారెయ్యటం కూడా స్వేఛ్చగా చేయవచ్చును అని అర్ధం కాదు.
రామాయణం ఆధారంగా అనాదిగా ఎందరో కవులు ఎన్నో ఎన్నెన్నో కల్పనలు చేసారు. కాని ఎవరూ రామాయణపాత్రలను అనుచితంగా చిత్రించి అపచారం చేయలేదు.
శ్రీమద్రామాయణం ప్రకారం సీత రావణుడి ముఖం కూడా ఎన్నడూ చూడలేదు. ఆవిడ ఎంతో కోరికతో శ్రధ్దతో రావణుడి బొమ్మవేయటం అనే వికారమైన అనుచితమైన ఆలోచన చేసిన వారిని ఏమనాలో తెలియటం లేదు.
రావణుణ్ణి సీత బిడ్డగా భావించిందా – ఇదీ ఎంత ఘోరమైన ఆలోచన!
సీతాపరిత్యాగానికి జానపదులు తమకు తోచిన కారణాలను తాము వెదుక్కున్నారు ఒక పాటలో. ఆపాట ప్రకారం శూర్పనఖ ఒక యోగిని వేషంలో అంతఃపురప్రవేశం చేసి సీతమ్మ దర్శనం చేసుకొని, సీతమ్మను రావణుడి బొమ్మ వేయమని అడిగితే ఆవిడ వాడి ముఖం చూడలేదంటే చూసిన భాగం వేయి అని అడిగింది. సీతమ్మ వాడి కాలి బొటనవ్రేలును మాత్రం చూసింది – అదే వేయగలిగింది. ఆబొమ్మను శూర్పనఖ అచ్చు సీతవేసినట్లే రేఖావిన్యాసంతో పూర్తిచేసి ప్రాణం పోసి ఎవరూ గమనించని సమయంలో ఆబొమ్మను రాముడి తల్పంలో దాచి చక్కాపోయింది. అర్ధరాత్రి వేళ ఆబొమ్మ రావణుడు “రావేసీతా లంకకుపోదాం” అని పాట లంకించుకుంటాడు. చివరకు రాముడు ఆబొమ్మను కనుగొని ఆబొమ్మ సీతవేసినట్లుగా ఉందని గ్రహించి కోప్పడి సీతను పరిత్యజించాడు. ఒక చమత్కారకథ. అంతే. గమనించండి. ఇక్కడ రామాయణపాత్రల స్వరూపస్వభావాలను కించిత్తూ మార్చటమూ అపహాస్యం చేయటమూ వంటివి జరుగలేదు. ఈ రచయిత్రిగారి కథకు ఆజానపదకథ ఆధారం అని తెలుస్తూనే ఉంది.
ఈ రచయిత గారెవరో నాకు తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. కాని ఒక స్త్రీ అయి యుండి గతకాలపు మరొక గౌరవనీయ వనిత మీద బురదచల్లే ఇటువంటి రచన ఎలా చేసారో అర్ధం కావటం లేదు. బహుశః ఒక స్త్రీవాది సీతను సృజించి రామాయణాన్ని ప్రశ్నార్ధకం చేదామన్న అత్యాశో దురాశో కారణం కావచ్చును అనుకుంటున్నాను.
ఏమి చేసి నామనస్సుకు తగిలిన గాయం నుండి నేను కోలుకోగలను? అర్ధం కావటం లేదు. ఇంకా ఇటువంటి భయంకరమైన రచనలను ఆధునిక సాహిత్యధోరణుల పేరుతో ఐతేనేమి తమకూ బాగా నచ్చి అయితేనేమి ప్రచురించిన ఈ “ఈమాట” పత్రికను నేను తక్షణం దూరం పెట్టటం అత్యవసరం అని భావిస్తున్నాను.
ఈమాటవారూ, మీకో దండం. ఇకపై మీ ఈమాట పత్రికను పొరపాటున కూడా సందర్శించను!
రామచంద్రప్రభో! బుధ్ధితక్కువై ఈమాట పత్రికను చదివినందూ, ముఖ్యంగా ఈఘోరమైన కధను చదివినందుకూ నన్ను మన్నించు!
నేత్రోన్మీలనం గురించి Poornima Pemmaraju గారి అభిప్రాయం:
11/03/2023 11:02 am
తనని ఎత్తుకెళ్ళినవాడిని బిడ్డగా భావించింది సీత. మరి ఇంకేం ఎవరైనా వాళ్ళకు నచ్చినవాళ్ళని ఎత్తుకెళ్ళచ్చు, పెళ్ళి చేసుకోమని force చెయ్యచ్చు. అమ్మాయి ఏమనుకోదు. తరువాత కూడా తన బిడ్డలానే అనుకుంటుంది. బిడ్డ తప్పు చేశాడని క్షమిస్తుంది. Very good, చాలా మందికి inspiration ఈ కథ. అక్కడ సీత, రావణుడు, రాముడు పేర్లు పెట్టుకోడం వలన చప్పట్లు కొట్టొచ్చేమో కాని నాకు అర్ధమైన moral అయితే ఇదే. మీకెవరు నచ్చితే వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. బలవంతాన ఎత్తుకెళ్ళండి అని.
ఈకథ బాగుంది. గొప్పగా ఉందని మాత్రం అనిపించలేదు. నాకారణాలు నాకున్నాయి. చర్చనీయాంశం అది కాదు. లైలాగారి స్పందనకు ప్రతిస్పందనగా వ్రాస్తున్నాను నాలుగుముక్కలు.
ఈకథలో ఆపేద అమ్మాయీ ఆమె గురించి చెబుతున్న మగబాసూ ముఖ్యపాత్రలు. బాసు మగవాడైపోవటం ఆపైన ఆమెపైన జాలిపడటం (తద్వారా ద్వారా హీరో ఐపోవటం) లైలా గారికి నచ్చలేదు. ఆడబాసు అయ్యున్నా కథ అచ్చం ఇలాగే ఉండేది. అప్పుడు లైలాగారికి అందులో ఆ హీరోయిజం అనే తప్పు తోచేది కాదు. కానీ ఆ హీరోయిజం కేవలం ఆనుషంగికం.
కోపావేశంలో లైలాగారి దృష్టినుండి తప్పిపోయిన కొన్ని సంగతులున్నాయి. ఆ పేదపిల్లకు ఒక పిన్నీ ముగ్గురు చెల్లెళ్ళూ ఉన్నారు. సగటు పేద/మధ్య తరగతి తండ్రిగా పెద్దనం చెసే ఒక పెద్దమనిషి ఉన్నాడు. నిస్సహాయస్థితిలో ఆమె కండలు వాళ్ళ యింటిపోషణకు కరిగిపోయి బక్కపీచు ఐపోయింది. స్త్రీవాదకోణంలో తగిన స్తోమత లేకుండినా రెండవపెండ్లి చేసుకొని బిడ్డల్ని కని పెద్దపిల్ల నెత్తిన బాధ్యత పెట్టి కనీస ఆప్యాయతను కూడా పంచ(లే)ని ఆమూర్ఖతండ్రి మీద పడాలికదా లైలా గారి కోపదృష్టి? నాకెందుకు అని అనుకోలేక జాలిపడిన ఆబాసు మగవాడైనంత మాత్రాన అందులో ప్రపంచద్రోహం ఉందని గింజుకోవటంలో అర్ధం లేదు.
సగటు స్త్రీలకు సాటి స్త్రీలపట్ల కనీసపు జాలికూడా ఉండటం లేదన్న సంగతిని ఈకథ వేలెత్తి చూపింది. స్త్రీవాదులు ఈసంగతిని – అంటే స్త్రీలలో సానుభూతిరాహిత్యాన్ని – ఒక ఆందోళనకరమైన సంగతిగా ఆలోచించాలి. ఈసంగతి లైలాగారి దృష్టికి రానే లేదు. మగబాసులను తిట్టినంత మాత్రాన స్త్రీవాద దృక్పథం ఐపోతుందా అన్న ఆలోచన ఆవిడకు రాలేదు.
ఎప్పుడూ మగవాళ్ళు రక్షకులూ ఆడవాళ్ళు రక్షితులూ కావటం అనేది దాటి సాహిత్యకారులు ఆలోచించలేరా అన్న లైలాగారి నిలదీత హర్షణీయమే. కాని ఈకథలో అదంత ముఖ్యవిషయం కాదు.
ఈకథ నాకు నచ్చకపోవటానికి ఉన్న అనేకకారణాలలో ఒకటి – ఒక పూట ఆమెకు విందుభోజనం (కించిత్తు బలవంతంగా) తినిపించినంత మాత్రాన ఆపిల్లకు కలిగే ప్రయోజనం ఏముందీ అన్నది.
ఈమాటలో – ఏ కవిత చూసినా ఏమున్నది గర్వ కారణం! స్త్రీ కళ్లలోనే ఎప్పుడూ నీళ్లు. మగవాడు మహాద్రష్ట కవి.
ఈమాటలో – మహా రచయిత జయమోహన్ ఏ కథ చూసినా ఏమున్నది గర్వకారణం! ఈ కథలోనూ స్త్రీ కళ్లలోనే నీళ్లు. ఇతని కథల్లో – ఏనుగు, డాక్టరు, రచయిత ఉంటే – ఏనుగుకి కాదు, ఏనుగుని రక్షించిన డాక్టరుకు కాదు, డాక్టరుని రక్షించే ఏనుగుకి కాదు, కథ రాసిన రచయితకి ఎవార్డు వస్తుంది.
కథలో ‘హీరోయిజమ్’ మగవాడిది. స్త్రీ రక్షించబడేది. స్త్రీ ఇతరులను రక్షించే, కాపాడే, సహాయం చేసే స్థానంలో ఉండదు.
అక్కడికి ఈ ‘రుచి’ కథలో బాస్ హీరో ప్రైడ్ ఏమిటి? ఆమె పే-చెక్ లోనే కొంత కట్ చేసి ఆమెను చీరలు కొనుక్కోమనటమా? ఆమెతో బలవంతాన తన అన్నం తినమని గొంతు పెంచి తన బాస్ గిరీ చూపటమా? ఆ యువతి ఇంటికి పొయ్యాక మిగతా పే-చెక్ ఎలాగూ నాన్న దొబ్బుతాడు కదా? జరిగిన మాలావు ఘనకార్యం ఏం లేదు. కథలో హీరోకి తన పనికిమాలిన సహృదయత గురించిన తన ఓన్ సంతృప్తి తప్ప.
నా చిన్నతనంలో ఓ రోజు, నా ఒక తమ్ముడు డ్రీమ్ లేండ్‌లో ఉన్నట్టుంటే – ఏం ఊహిస్తున్నావని అడిగాను. నాకు పెద్ద కష్టం వచ్చినట్టూ, తను డ్రాగన్‌లతోనూ, రాక్షసులతోనూ యుద్ధం చేసి నన్ను రక్షిస్తున్నట్టూ కలగంటున్నట్టు చెప్పాడు. ఎప్పుడూ నిజమే చెప్తాడు, ఆ సుగుణం ఉంది. కాని నేను – ఆహా! నా తమ్ముడు, నాపై ఎంత ప్రేమ! అనుకోలేక పోయాను. నాకన్నా ఎంతో చిన్న బక్క పీచు వెధవ, గాలేస్తే కొట్టుకు పోయే వెధవను, బోలెడుసార్లు నేను చేయి పట్టుకుని రోడ్ మీద నడిపించి రక్షిస్తే ఇదీ ఈ రాస్కెల్ కృతజ్ఞత. నాకు కష్టాలు రావటమెందుకూ? ఈ బొట్టిగాడు నన్ను రక్షించటమెందుకూ. దాని బదులు తనకే కష్టమొచ్చినట్టు, నేను తనను రక్షించినట్టు ఊహించుకోవచ్చుగా.
అదే హీరోయిజమ్‌లో దాగి ఉన్న ఈగోయిజం. కొందరి రచనల్లో హీరోయిజంకి, విక్టిమిజంకి గల సంపర్కం. అదే! ఈ వెనక బడిన కథలో హీరో వీరత్వం. తన బొచ్చు మగ బతుకులో, తనే ఓ చచ్చు ఇగోయిస్ట్‌నని ఆఖరి సీన్‌లో కూడా గ్రహించుకోలేని మూర్ఖత్వం.
ఒక స్త్రీ ఎఛీవ్‌మెంట్స్ ఏ సెక్టర్‌లో గాని ఎత్తి చూపగల సాహసం, భారతీయ మగరచయితకు ఎప్పటికైనా వస్తుందా? అలాటి హీరో అతడు కాగలడా? ఐ డౌట్ ఇట్.
మీ సంపాదకీయం నాకు నచ్చింది. ఇటీవలి నా రెండో పుస్తకం.”కాలం సైకత తీరం” తుది రూపం ఇచ్చే ముందు కవితల ఎంపిక, ఎడిటింగ్, విభజన, విశ్లేషణ, ముగ్గురు స్నేహితులు చేసేరు. ప్రచురణ బాధ్యత ఛాయా తీసుకున్నా, మూడు, నాలుగు సార్లు ప్రతిని సరిచూసి విడుదల చేసేం. మొదటి పుస్తకానికి కూడా ఇలాగే పని చేసేం. స్వంత ప్రచురణ అంటే మనకి తోచింది ప్రచురించడం కాదు అని నాకూ అనిపిస్తుంది.
చాలా బాగుందండి. బారక్ ఎందుకు ఖాళీ అయ్యిందొ కాని జ్ఞాపకాలు వుండి పోయాయి.
అక్టోబర్ 2023 గురించి S. Narayanaswamy గారి అభిప్రాయం:
10/02/2023 5:56 am
తమ సొంత ఖర్చుతో తమ రచనల్ని ఎవరైనా అచ్చు వేసుకోవాలి అనుకుంటే దానికి ఎవరికీ అభ్యంతరం వుండక్కర్లేదు. తెలుగు భాషలో చాలా ఏళ్లుగానే ఒక పబ్లిషర్ మదుపు పెట్టి పుస్తకం వెయ్యడం అనే బిజినెస్ మోడల్ కనుమరుగు అయింది, రెండు మూడు రకాల పుస్తకాలు మినహాయించి. ఇక పుస్తకాల అమ్మకానికి, చాలా పద్ధతులు ఉన్నాయి, కొత్త టెక్నాలజీలతో ఇంకొన్ని దారులు తెరుచుకున్నాయి కానీ ఆ రంగంలో ఉన్న ఎవరికీ వాటిని సరిగ్గా వాడుకుని పుస్తకాల అమ్మకం పెంచే వైపు ఒక దృష్టి కానీ నిబద్ధత కానీ ఉన్నట్టు కనబడదు. భవిష్యత్ సంగతి ఏమో గానీ ఇప్పటికైతే పుస్తకం కొని చదివే పాఠకులకి కొరత లేదు. కొనుక్కుందాం అని ఆలోచన రాగానే వారికి పుస్తకం అందుబాటు లోకి తెచ్చే వ్యవస్థ మార్కెట్లో లేదు.
ఇది చాలా బిగినింగ్‌లో చేసిన అనువాదం సార్. మూడో కథ. పైగా అతడి కథలన్నిటిలో కొత్త కొత్త పదాలు కాస్త కఠినంగా ఉంటాయి. మీ సూచన మేరకు సవరణలు చేశాను కాని, కేశం, కేశాలు అని తెలుగులో కూడా అంటారు. మీరు తమిళంలోనే అంటారు అనడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.
‘కేశం’ అంటే అంటే తమిళంలో ‘కురులు’ అనుకుంటాను. అత్తియప్పన్ – తంగంల అనుబంధం ఊహించినట్టే జరిగింది. ఆ ఇద్దరూ చనిపోవడం ఒక విధంగా సుఖాంతమే! అనువాదం ఇంకొంచెం సరళంగా వుండవలసింది అనిపించింది.
యాస, మాండలికం మీద తెలుగులోసాహిత్య రంగంలో చాలా చర్చ జరుగుతూనే వుంది. ఉనికిని చాటి చెప్పేది కాబట్టి దానిని మేము వాడుతున్నాము అనే వర్గం ఒక వైపు. ఇతరులకి అర్ధం కావాలి కదా చెప్పదలుచుకున్నది అని మరో వైపు.
వుండేది – సరి కాదేమో. వున్నది. కధా కాలానికి వుంది. కథ ముగిసే నాటికి కూడా వుంది. కాబట్టి ‘వుంది’ సరైన వాడుక అనుకుంటాను.
అలాగే ‘అండా’ అన్న పదం. సందర్భాని బట్టి అది నీరు నిల్వ వుంచే పాత్ర అని ఊహించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాని అండా అన్నది తెలుగు ‘బిందే’ కన్నా పెద్దది అని అనుకోలు. ఆ రెండింటి మధ్య తేడా చాల సున్నితమైనది. అంతర్జాతీయ అనువాదాలలో కూడా ఇటీవల ఒక వాదన వినపడుతోంది. మూలంలో ఉన్న పదాలకు (పర భాషలోని) అర్ధాలు, వివరణ, పాదసూచికలు ఇవ్వాల్సిన అవసరం లేదని. ఆలోచించదగ్గ విషయమనిపించి ఇక్కడ ప్రస్తావించడం.
“సాహిత్యసమాజాలు బలంగా ఎదగడానికి సాహిత్యాభిలాష, సాహిత్య కృషికి తగిన ప్రోత్సాహం మాత్రమే సరిపోవు.”
‘సాహిత్య సమాజం’ అన్న పదానికి ప్రమాణాలు స్ఫురించటం లేదు. సాహిత్యసమాజం ఎందుకు, ఏ ఆశయంతో ఎదగాలి? అందునా బలంగా? చారిత్రాత్మకంగా ఎన్ని సమాజాలు, ఏదేశాల్లో, ఏ కాలాల్లో సాహిత్యపరంగా ఎదిగాయి? బలంగా? ఆ ఎదుగుదల ఎటువంటి పరిగణనీయమైన ప్రయోజనాలు సమాజానికి ఒనగూర్చింది?
సాహిత్యాభిలాష పైన పేర్కొనబడ్డ ఎదుగుదలకి ముఖ్య ప్రేరణాంశం అనుకుందాం. సాహిత్యాభిలాష రచయితలో ఉండాలా, పాఠకుడిలో ఉండాలా? ఇరువురులోనూ సమపాళ్ళలో ఉండాలా?
సాహిత్యాభిలాష కొరవడితే బాధ్యత రాసేవాడిదా, చదివేవాడిదా, ఇద్దరిదీనా?
ఈ అంశాల తర్వాతకదా, ఇవి సరిపొయాయా ఇంకా ఏమైనా తక్కువయాయా అనే చర్చ?
నేడు కావ్యాలు రాయించుకుని, అంకింతం చేయించుకుని మాన్యాలిచ్చే రాజులు లేరు, సమీప భవిష్యత్తులో ఉండే అవకాశాలు లేవు. మాన్యాలే ప్రోత్సాహాలనుకుంటే!
ఆఁ, పిల్లాపెద్దా అతుక్కుపోయి చదివే, పిదప సినిమాలు తీయగలిగే ‘హారీ పాటర్’ శృంఖల రాయి; పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. సాహిత్యం అని కొందర్ననమను, నేను విఠలాచార్య జానపదం అంటాను.
మొన్నీమధ్య (అర్ధశతాబ్దం క్రితం) దాకా విశ్వనాథ వంటి మహామహిన్విత కవులు అనేకమంది దారిద్ర్యంలో మ్రగ్గారు. నేడా పరిస్థితి లేదు. సాంకేతికత పుణ్యమాని, అణాకాని వాళ్ళు కూడా యూట్యూబ్‌ని ఆశ్రయించి కోట్ల లైకులూ, లక్షల డాలర్లు వెనకేసుకుంటున్నారు.
పస ఉన్న, హృదయాన్ని కదిలించగల ఇంకో తిలక్‌ని, మల్లాదిని, కొకుని, చలాన్ని చూపించండి; ప్రశంసలూ, సంపదలూ కోకొల్లలుగా ఎందుకు కురవవో చూద్దాం.
ప్రచురణ సంస్థల రోజులు పోయాయి, రచయితలు వెబ్‌మాగజైన్‌ల మీద ఆధారపడే రోజులూ చరమదశకి వచ్చాయి.
సమాచారం మెరుపు వేగంతో ప్రపంచం అంతా వ్యాపించే రోజు ఇది.
‘ప్రతిభ దాగదు.’ ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నవి డిక్టేషన్ వాక్యాలు కాదు, అక్షర సత్యాలు అని నిరూపించగల సత్తా నేటి సాంకేతికకీ ఉంది, నేటి యువతరానికీ ఉంది.
“కవిని కవియొక్క కావ్యము కమ్మివేసింది. కవి లేడు, కాని కవి పలికిన కావ్యం ఉంది. ఆ కావ్యంలోని నాయిక ఉంది. ఆ కవిత ఇచ్చిన రసానందం ఉంది. దాన్నే గానం చేశారు రామకృష్ణకవి. ఇంతకన్నా కవికి కావలసినదేమిటి?”
Beautiful thoughts.
I would say English poet A.C. Swinburne, (1890) Telugu poet Manavalli (మానవల్లి) are contemporaries, though from different continents.
Swinburne wrote an elegy, on Baudelaire. He titled it “Ave Atque Vale” (Hail and Farewell.) He ran it as a seven-liner rhymed metrical stanzas of total of 200 lines. I am adding up the title and Swinburne’s signature. A quotation from B’s French poetry precedes Swinburne’s poem in English.
Commonalities of course will be mythological references and Nature. Does not surprise me.
Like Manavalli, Swinburne praises B’s major poetic work ‘Les Fleurs du Mal.’ Knowing B did not have an easy life, and was rather a troubled individual, Swinburne just wishes ‘rest’ for him. He is relieved there will be no further aggravations for this dead man. No creditors at his doorstep. No more letters to write to mother begging her to release some money, so he can buy some hashish, opium, and human companionship. Or buy a little more time on earth, to continue his artistic work. Whichever way one wants to look at it.
Swinburne is not a believer of Christian God, afterlife, forgiveness of God for man’s sins.
Seriously, what is God! What is soul! There are no such things. They too are grand poetic thoughts of men. ఘనత వహించిన కవిసమయములు.
Swinburne does not like Church. He loves mythology, but his feet are steadily on earth.
He believes more in man. So, he very humanly -asks B to forgive others who had wronged him personally during his life. For his own peace. Rest, rest peacefully my predecessor! dear B, dear brother! My fellow poet!
Manavalli as per his own beliefs and existing sentiments at that time, sends Madabhushi (మాడభూషి వేంకటార్య) to heaven. He also is not a criticizing poet in his elegy, not critical of liaison between Menaka and Vishwamitra, has no moralistic condemnation. Looks upon the birth and subsequent life of Sakunthala with admiration, joy. He sees beauty in nature, on earth, in heaven.
These two Elegists are very focused on Literary creation, of appreciating Literary work. They ‘come in praise’ for the poet.
I am now giving an old poem of mine just for the heck of it, (which came to my mind when I recently received a certificate for being a member of a medical society for fifty years) without analyzing it. Here it is.
Fall in Rochester
The raker of falling leaves
Of Chestnut and Maple trees
Off 41 Lake Lacoma groves
Rake not too hard
And pierce not my heart
I laid myself down
By the side of the brown lake.
Do you not hear my sighing,
Underneath the rustling leaves?
Rake not too hard
And tear me not to pieces.
Let me be. Let the leaves fall.
Let colors swirl around.
Later when the snows fall,
I may be numb and frozen.
My heart will still be throbbing.
Do not bring in your ploughs!
And carry me away not.
Remember Rochester
Rake not too hard!
I have not left town.
Let things be.
సమస్యాపూరణము, పద్యావిర్భావము గురించి పరిమి భావనలు ఉదాత్తమైనవి. క్లిష్టమైనవి. వారి వచనం- మొదటి పేరాలోని విషయం, ఆ ఆలోచన చేసిన విధం, ఆపైన చెప్పిన విధం, నాకెంతో నచ్చి, it is brilliant! Bravo! అనుకున్నాకే, అప్పుడు నేను పార్వతీశ్వర శాస్త్రి గారి పద్యం చదివాను.
పద్యం నాకు నచ్చింది. ఐతే పరిమి గారి వల్లనే, నేను ఆ పద్యం కొంత వేరు విధంగా చదువుకున్నానేమో. ప్రస్తుతం నేను చదువుతున్న ఇతర కవుల ప్రభావం కూడా ఉండవచ్చును.
Poets Swinburne and Baudelaire -Both are sticklers for music, symmetry and sound in a poem. They both are fanatical about choosing the right words. More so, they hope for proper interpretation of the chosen words, from the reader. And above all, they believe poetry should evoke “Un état d’âme” (a state of mind.)
పరిమి మొదట్లో అన్నట్లు ఈ ఒక్క పద్యమే కావ్యమై, అది భాసించాలంటే, దానిలోని పదాల అర్ధాలు కొంత వేరుగా చదువుకోవాలి.
ఇప్పుడు -‘ఈమాట’ కవి సమ్మేళనంలో శ్రోతలు, ప్రశాంతతతో, ఈ క్రింది గీతం లోని నాయికను ఊహించి, వినండి. ఆమె ఆ రాత్రి, ఇలా పాడుతున్నది.
కవి పార్వతీశ్వరశాస్త్రి మృదుహృదయుడు. ఆయనకు ఒక కోమలి ఒక్క పువ్వు కోస్తే, అంతమాత్రానికే కోయిల కన్నెర్ర చేసి, ఆమెను బెదిరేట్టు చేయటం నచ్చలేదు. అందువల్ల, తన కవితా శక్తితో దరిమిలా అంతటా వెన్నెల పరిపించాడు. మన్మథుడిచే ఆమెపై పలుమార్లు ‘పూలు’ కురిపించి పదేపదే ‘అహహా అనేట్టి వివశతను’ ఆమెకు కలిగించాడు.
I like guys with heart. I like such givers. I like people that can make others happy.
పార్వతీశ్వర శాస్త్రి పద్యంలో ‘అహాహా’ (the woman’s repeated exclamations,) బాధా సూచకము కాదు. ‘బాణం’ అనగానే ‘బాధను’ ఊహించటం సభికులకు సర్వత్రా సరికాదు. నిఘంటువు ప్రకారం ఆ అర్ధం సాధ్యమే కాని ఎందుకు? ఆ ఆలోచన పద్యపు అందం తగ్గిస్తుంది. అందునా ఒక్కటే పద్యం చెపుతున్నప్పుడు Pain, deprivation తో ఎవరి మనసైనా రంజించగలరా!
పూలబాణాలు, పూలు, flowers-intoxication అన్న పొయటిక్ ఆలోచన ఈ సందర్భంలో సరైనది.
యతి మూడు విధములు, అవి విరామ యతి, అక్షరసామ్య యతి, ప్రాస యతి. విరామ యతి అనగా అక్కడ పదము అంతము కావాలి, తఱువాతి అక్షరముతో ఒక క్రొత్త పదము ప్రారంభము కావాలి. సంస్కృత ఛందములలో పాదాంత విరామ యతి సామాన్యము. అందువలన సంస్కృత వృత్తములు సామాన్యముగా గుర్వంతములు. పాదాంత హ్రస్వాక్షరము గురుతుల్యము. కొన్ని ఛందములకు పాద మధ్యములో ఈ విరామ యతి ఉండదు. అక్షరసామ్య యతి అనగా పాదపు మొదటి అక్షరమునకు యతి స్థానమునందలి అక్షరమునకు హల్లుల, అచ్చుల పొంతనము ఉండాలి. మొట్టమొదట ఈ యతుల సంఖ్య తక్కువగా ఉన్నను నేడు అవి పుట్టగొడుగులలా వ్యాపించి పోయాయి. ద్వితీయాక్షరము ప్రాస కనుక ప్రాస యతులు యతి స్థానము పక్కన ఉండే అక్షరమునకు హల్లుల పొంతనముతో ఉంటుంది.
యతిని ఎక్కడ ఉంచాలి? సంస్కృతములో విరామ యతులను పాదపు విఱుపులుగా వివరించినారు, ఉదా. శార్దూలవిక్రీడితపు విఱుపు 12, 7 అక్షరాలు. సంస్కృతములో మానిని కవిరాజవిరాజితము వంటి తాళవృత్తములకు యతిని నిర్దేశించరు, దానిని కవికి వదిలెదరు. తెలుగులో పది లేక అంతకన్న ఎక్కువగా ఉండే అక్షరాలు కలిగిన వృత్తములకు యతి తప్పని సరి. కాని ఈయతి స్థానము ఎల్లప్పుడు logical గా ఉండవు. సామాన్యముగా తెలుగు లాక్షణికులు లఘువుపైన యతిని ఉంచరు. యతి స్థానము నా ఉద్దేశములో ఐచ్ఛికము. కొన్ని సమయాలలో లాక్షణికుల యతి స్థానము మాత్రాగణములకు సరిపోదు, ఉదా. ఇంద్రవజ్ర. UUI UU IIUI UU ఇది గురు లఘువుల అమరిక. సంస్కృతములో దీనికి యతి లేదు. తెలుగులో ఎనిమిదవ అక్షరము పైన. ఎందుకో? పాదము 5,4 5,4 మాత్రలకు సరిపోయినప్పుడు యతి స్థానమును రెండక్షరాల పిదప ఎందుకు ఉంచాలి? అది లఘువు చేసిన పాపమా? ఇలా ఎన్నో ఉన్నాయి. వసంత తిలకకు ఒక యతి, అందులోని మొదటి గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు మఱొక చోట యతి.
నేను పాదమును తాళబద్ధముగా వ్రాయుటకు వీలవుతుందా అని పరిశీలించి యతి స్థానమును నిర్ణయిస్తాను. ఒకే పద్యమునకు రెండు విధములుగా కూడ యతులను పెట్ట వీలగును!
కన్నడములో యతి లేదు, మలయాళములో కూడ విరామయతి మాత్రమే. తమిళములో యతిని మోనై అంటారు. తమిళములో యతి ఉన్నది. కొన్ని సమయాలలో యతి, ప్రాసయతి ఒకే పాదములో ఉంటాయి కూడ!
కావున యతి విషయములో logical personal preferences ఆమోదయోగ్యమే!
వసంతతిలకమునకు నేను నిర్ణయించిన యతికి కారణము అది ఇంద్రవజ్రనుండి జనించినది, దానికి ఇంద్రవజ్రపు యతి పొసగుతుందని. సరసాంక వృత్తమునకు కూడ ఇట్టి యతియే.
రెండు నెలలకు ముందు హైదరాబాదులో ఒక సాహిత్య సమావేశములో ఒక expert కేవలము aaba అంత్యప్రాసలతో ఒక కవితను రుబాయీ అని వ్రాసినారు. నేను దానికి రుబాయీ ఛందస్సు లక్షణములు లేవు అని చెప్పగా రుబాయీకి తెలుగుకు సరిగా మహాకవి దాశరథి చెప్పినట్లు (దాశరథి అలా చెప్పలేదు) వ్రాస్తే చాలు, విదేశీయ ఛందస్సు అవసరము లేదని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా రుబాయీ ఛందములను పరిశీలిస్తున్న నేను అందులోని 3/12 కందములోని సరి పాదములకు సరిపోయినప్పుడు దానికి విదేశీయతను ఆపాదించడము సబబు కాదని ఈ వ్యాసమును రచించినాను. అది దీని background. ఇక పోతే దువ్వూరి ఆదిభట్ల మున్నగువారు వారు వ్రాసినవి అనువాదములు అనుసృజనలు అనియే చెప్పుకొన్నారు. పారసీకములోవలె రుబాయీలు అని చెప్పుకోలేదు. కాని తెలుగులో పారసీక ఉర్దూ భాషలలోవలె రుబాయీలను వ్రాయ వీలగును, అలా వ్రాసినప్పుడు అవి సహజముగానే తెలుగులో ఉంటాయి అన్నదే ఈవ్యాసపు ముఖ్యోద్దేశము. మఱి అరవై సంవత్సరాలుగా ఎందుకు వీటిని గొప్ప కవులు తప్పు దారిని నడిపించారో నాకు తెలియదు. నాకు Spanish తెలియదు కనుక మీ రుబాయీ నాకు అర్థము కాలేదు. నమస్సులు.
మోహనరావుగారికి శిరసు వంచి, పాదాభివందనములు అర్పిస్తున్నాను. చర్చలలో పాల్గొన్న పండితవర్గానికి కైమోడ్పులు. మీరు ఛందశ్శాస్త్రముపై ప్రదర్శించిన పరిశోధనా వ్యాసము అత్యద్భుతము. నాకు మీ వ్యాసము చదివాక ఛందశ్శాస్త్రము మోక్ష సాధకము అనే నా విశ్వాసమునకు ఊతము చిక్కినది. ఈ వ్యాసములో “ఆత్మ పరమాత్మను చేరు సాధకము ఛందశ్శాస్త్రము” అని నా అంతరంగ పరిశోధన, నా తపన ఎంతో కాలంగా వేధిస్తూ ఉంది. ఈ వ్యాసం నాకు చాలా ఊతం ఇచ్చింది. మీ ఛందశ్శాస్త్ర పరిశోధనలు నాకు కావాలి. మెయిల్కు పంపినా సరే! ఎలా లభ్యమవుతాయో దారి చూపగలరు. నాకు మోక్షైకసాధకము ఛందశ్శాస్త్రము అని పరిపూర్ణ నమ్మకముంది.
ఉదాహరణ: 1. భుజంగ ప్రయాతము ఛందస్సు. సర్పపు నడక. అనగా మూలాధారమునుండి సహస్రార పరమాత్మను చేరు సాధనము భుజంగ ప్రయాతము. పంచభూతతథ్వాలను అధిగమించి, వానిపై గల మనసును శూన్యమును చేసి, సుమన దాటి, ఉన్మనను ప్రవేశించి, సహస్రారబిందు పరమాత్మ దర్శనమే భుజంగ ప్రయాతపుటాంతర్యము. అందుకే శంకరులు మానవులను భుజంగప్రయాతములో ఆ యా దైవాలను స్తుతించి, కుండలినీ చైతన్యముపొంది, ఊర్ధ్వగామియై, బ్రహ్మరంధ్రము విచ్ఛిన్నమై విశ్వవిరాట్లో చేరాలని విశ్వహితైక దృష్టితో శంకరులు మనకోసం రచించారు. శంకరుల అద్వైత పునః ప్రతిష్ఠత్వానికి అత్యంత బలీయమైన ఉదాహరణ.
మరొక ఉదాహరణ: శంకరుల ప్రథమమైన ఆశు శ్లోకము వసంతతిలకము “అంగం హరేః పులక….” అనునది. ఆ మొదటి ‘అం’ బ్రహ్మను ‘గం’ పొందించేది. అని వారి జీవితసందేశమును మానవుల జీవితాలు ఆధ్యాత్మిక వసంతంలా విరియాలని, పద్మములై అంటని సరోజములై అద్వైత సిద్ధి పొందాలని వారి హృదయసారమని నా విశ్వాసము. ఇలా చూస్తే ఒక్కోఛందమునకు ఒక్కో అధిదేవత ఉంటాడు. 26 ఛందస్సులు సంస్కృతములో. 26 మంది దేవతల శక్తి ఆ యా 26 ఛందాలలో కప్పబడి ఉండి, “ఆచ్ఛాదనే, ఆహ్లాదనే” అను ఛందోనామ సార్థకతను సంతరించుకున్నాయి. వాల్మీకి రామాయణంలో గాయత్రిని నిబద్ధించారు. శంకరులు కైలాస దర్శనంలో అమ్మ ఇచ్చిన సౌందర్యలహరి లో నందీశ్వరుడు 59 శ్లోకాలు శంకరునివద్దనుండి లాక్కొనిపోతే, శంకరులు అమ్మతో మొరపెట్టుకుంటే అమ్మ నువ్వు 59 వ్రాయి అని కటాక్షించింది. 41+59=100. శిఖరిణి ఛందస్సు. అమ్మ హిమజ. కైలాసపతి సహచరి. శిఖర సంచారిణి. కనుక ‘శిఖరిణి” రూపంలో జగన్మాత దర్శనమిచ్చింది. సౌందర్యలహరి అనుభవిస్తే మన సహస్రారశిఖరములో గోచరిస్తుంది. మోక్షము చేకూరుతుంది.
కావ్యకంఠగణపతిముని ఇంద్రాణీసప్తశతిని ఏడు వైదిక ఛందస్సులలో స్తుతిస్తూ వ్రాసారు. అది ఒక వైపు భరత జాతి విముక్తి. భరత సంఘ బానిసత్వ విముక్తి. దేహవిముక్తి. అలౌకికభక్తి పరాకాష్ఠ, లౌకికంలోనూ ప్రదర్శించిన సిద్ధుడు. తపస్వి, ఉపాసకుడు. మహోత్తుంగశిఖరం. లౌకికాలౌకిత్వములసవ్యసాచి ప్రపంచములో లేడు. ఇంకా ఇలా ఆలోచిస్తే ఒక కవి, ఉత్పలమాల, శార్దూల, మత్తేభాలతో స్తుతి చేసాడంటే సత్వగుణమాలిన్యం, రజోగుణ మాలిన్యం, తమోగుణమాలిన్యం తొలగి “నిస్త్రైగుణ్యో భవ అర్జున!” అన్న గీతాసందేశం, ఛందశ్శాస్త్రము మోక్షప్రదమని ఋజువవుతుంది.శంకరుల స్తోత్ర సాహిత్యజగమంతా దాదాపు 20 వృత్తములలో ఉన్న తీరు మంత్రోపాసనాది గర్భితమై మోక్షైకసాధనము, అద్వైత సిద్ధి సోపానము ఛందశ్శాస్త్రము అని ఋజువవుతుంది. బుధజనులు దొసగులను మన్నించండి.అవి గరళము. అమృతం ఆస్వాదించండి.
ఆర్యా! మరో ఉదాహరణ: పంచచామరము. శకరులవారు గణేశపంచరత్నమును “ముదాకరాత్తమోదకం…. అని అలాగే ‘నర్మదాష్టకమును’ పంచచామరము’ వృత్తములో రచించారు. పంచచామరములో విశేషముంది. చామరము చమరీమృగపు వెంట్రుకలతో తయారు చేసినది. చమరీమృగము సత్వగుణానికి ప్రతీక. ఆ రోమాలు కూడా సత్వసంజాతములు. పరమాత్మ గణేశుడు కాని, జీవనది నర్మదానది గాని ప్రాణదాతలు. గణేశుడు మూలాధారమందు ఉన్న గణేశుడు. ఆయనను ఆరాధిస్తే గాని కుండలినీ చైతన్యము ఊర్ధ్వగామి కాదు. ఆయనను ఆరాధించాలి. ప్రసన్నుడు కావాలి. ఆయనను సర్వాత్మనా రుక్మిణీదేవి, ప్రహ్లాదుడు సర్వేంద్రియములతో పరమాత్మను సేవించారు. ఇంద్రియాలను అంకితం చేసి స్వామిని శూన్యమనసున దర్శించారు. పరమాత్మ కరుణించి, అటు గజేంద్రుని అందరు భక్తులను పంచేంద్రియములతో సర్వసమర్పణ భావముతో ” తుభ్యమ్ నమః, న మమ” భావంతో సేవించారు. అలాంటి సేవనే పంచేంద్రియములతో నర్మదాదేవిని స్తుతిస్తే అమ్మ కమండలము లోనికి వచ్చి రక్షించింది. అలాగే గణేశుని అలాగే పంచేంద్రియములతో ఆరాధిస్తే పరమాత్మ సాయుజ్యం లభ్యం. కనుక పంచ, అనగా ఐదు ఇంద్రియములను సత్వసంయుతచిత్తముతో ఆ ఇంద్రియములనే చామరములుగా చేసి, అటు గణేశుని, నర్మదను సేవించి, తమను భగవంతునకు అర్పణము గావించుకున్నారు. పంచేంద్రియములు ప్రపంచ వాసనలు విసర్జించి, గణేశ, నర్మదలను పంచేంద్రియ సేవ అంతేగాక పంచ అనగా విస్తారం సమస్తదేహాన్ని సర్వాంగాలతో అటు జ్ఞానేంద్రియములు, ఇటు కర్మేంద్రియాలు అన్నిటితో మెప్పు పొంది తరించి, ధన్యులై, మానవులను పంచ చామర వృత్తములతో దేవతలను పంచేంద్రియ సమర్పణముతో సేవించి తరించండి అని ఛందస్సు మోక్షసాధకమని ఆదిశంకర భగవత్పాదులు మనకు దివ్యబోధ గావించారు. ఈ పరమాత్మ సాయుజ్య ప్రాప్తి, ఛందస్సు ద్వారా సాధ్యమని శ్రీ గురువర్యులు మోహనరావు గారు నాకు ఈ అభిప్రాయమంజరిని పంచుకొనుటకు దేశికులైన వారి చరణారవిందములకు మరో మారు వందనములర్పిస్తూ, మీతో కలిసి నడచిన పండిత బృందమునకు ఐదు పది చేసి వినయపూర్వకముగా నమస్కరిస్తూ.
ఛందస్సు పై పరిశోధనాగ్రంథాలు సూచించగలరు. లభ్యములగు విధము తెలుపండి.
కాని ఈ తెలుగువ్యాసంలో సంస్కృతపదాడంబరం హెచ్చుగా ఉన్న వాక్యాలను తొలగించితే మనకు చివరకు ఒక్క వాక్యం కూడా మిగలదు. ఆ విషయం అటుంచితే ఆలోచనీయమైన అంశాలు చాలానే ఉన్నాయి.
వచనకవిత్వప్రక్రియ బలపడి స్థిరపడిందని ఆలోచించి సంతోషించాలో అది వెఱ్ఱితలలు వేసి కవిత్వానికి చదువరులు కరువయ్యారని విచారించాలో తెలియకుండా ఉంది.
అమరేంద్ర గారు మీ వ్యాఖ్యతో నేను ఏకీభవించడం లేదు. క్షమించాలి.
కవర్ పేజీ చూసి (పుస్తకం లో ఒక పేజీ కూడా చదవకుండా) ఇంత చక్కగా తాము చదివే గొప్ప సాహిత్యాన్ని ఉచితంగా మనకు పరిచయం చేస్తూ, వ్యాఖ్యానించారు అంటే చాలా సంతోషంగా వుంది. ఇదో కొత్త ప్రయోగం.
పుస్తకానికి ముందుమాట ప్రశంసాపూర్వకంగా రాసి, బహుమతి ప్రదానం చేసి, ఇక్కడికొచ్చి వెనక మాట చెప్పడం కూడా, అత్యంత శ్లాఘనీయం.
తెలుగు సాహితీ విమర్శను బతికించుకోడానికి ఇలాటి విన్నూత్న ప్రయోగాలు చాలా అవసరం. వ్యాఖ్యాతలిద్దరికీ ధన్యావాదాలు.
ఇదివరకే చదివాను శివ కథని. మళ్ళీ ఈ రోజు because you shared and reminded again on FB, మళ్ళీ ఈ రోజు చదివాను. కథలో ఎక్జైట్మెంట్ ఏమి లేదు. స్వప్న – మధు స్నేహంలో కాని, గోవాలో వన్ నైట్ స్టాండ్ కాని మోరల్ వాల్యూస్‌ని పుష్ చేసిందేమి కనపడలేదు. ప్రతి పాఠకుడికి కామెంట్ చెయ్యడానికి ఏమి లేని కథ. చి న So there you have my 2 cents. 🙂
చాలా గుంభనగా ఉంది సమీక్ష. వెనకటికి బెజవాడలో కమ్యూనిస్టుల మీటింగ్ లా.
సంగీతం పుస్తకమేమో అని చదివాను. కాదనుకుంటా. ఐడెంటిటీ, జెండర్, రేస్ పాలిటిక్స్ పీకి పాకం పెట్టే పిచ్చ బోర్ చరిత్ర ఐ ఉండాలి. ‘దేవదాసీలు’ ఇక లేరు కదా. లేని వాళ్లకు ఇప్పుడు ఈ మగ రచయిత ‘వాయిస్’ ఇచ్చేదేముంది!
అసలుకు జర్నలిస్టు రచయితలకు, ఘోస్ట్ ఆటోబయోగ్రఫర్లకు తమ జీవితంలోని నిజవిషయాలు స్త్రీలు చెప్పరు. మగవాళ్లూ చెప్పరు. ఇప్పటికీ మనుషులు వాళ్లంతట వాళ్లే నిజం చెప్పుకుని ఏడ్చేది -డాక్టర్లకీ, ప్రీస్ట్ లకీ, మంగలాళ్లకీ, బార్టెండర్లకీ. ఈ ప్రొఫెషనల్స్ వీరెవరికీ ‘స్పేర్’ లాటి చెత్త పుస్తకం కొనుక్కుని కుళ్లుమోతు ‘హేరీ’ టోజర్ లెంగ్త్, హెల్త్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉండదు.
ఇంతకీ, నవలలో మనోధర్మ సంగీతం, కర్ణాటక సంగీత ప్రస్తావనలు, సంగీత చర్చలు గల పేజీలు ఏమైనా ఉన్నవా? ఉంటే గాని తెలుపగలరా? సమీక్షకులకు తెలియకపోతే మరెవరైనా చెప్పినా సరే. నవల వెనుకఅట్ట మీద ప్రశంసలు రాసినవారైనా దయతో చెప్పినా సరే.
సంగీతం మీద నేను ఎంచుకుని కొనుక్కుని చదువుతున్నవి Debussy by Stephen Walsh, Wagnerism by Alex Ross. జీవిత చరిత్ర రాస్తున్నట్లే ఉంటారు కాని, వీళ్లు రాసేది మ్యూజిక్, మ్యూజిక్ చరిత్ర గురించే. ఇవి కాక Fundamentals of Musical composition by Schoenberg, Guide to the practical study of harmony by Tchaikovsky కొనుక్కున్నాను. ‘ఈమాట’ పత్రికలో ప్రచురించే జె. కె. మోహనరావు ఛందస్సుపై వ్యాసాలు కొంత ఇలాటివే. ఇవి చదవటం అవ్వదు.
కథను ఒక పాత్ర పర్స్పెక్టివ్ నించి మొదలెట్టి, మిగతా కథంతా ఇంకొకరి పర్స్పెక్టివ్ తో రాయడం – ఆకట్టుకుంది.
శ్రీసుధ గారి కథలు ఇంతకు ముందు కొన్ని చదివాను. కథ చెప్పే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కథల్లో తాత్వికత కనపడుతుంది. కొన్ని గుర్తుండిపోయే వాక్యాలు రాస్తారు. ఉదా. “జీవితం మామూలుగానే గడిచినా, ఆనందం లేకపోయినా, విషాదంగా ఉన్నా బానే ఉంటుంది. కానీ తప్పు చేసినట్లు దాన్ని మోస్తూ తిరగడమే కష్టం. తప్పు ఒప్పు అంటూ ఏమీ ఉండవని, తప్పు జరగడం వెనుక తెలియని, అర్థం కాని అన్యాయాలు ఉంటాయని అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది.”
చాలా లోతైన పరిశీలన ఉంటుంది. కథలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి.
మంచి రచనలు, అవి కథలు గాని, కవితలు గాని ఇప్పుడూ వస్తున్నాయి. కాని పాఠకులలో చదివే అలవాటు, అభిరుచి తగ్గిపోతున్నాయి. అందువల్ల పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. చివరికి రచయితలే పాఠకులుగా మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది. ఏ రచనలైనా సమకాలీన సమాజంలోని సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, వీలైనంత పరిష్కారం చూపిస్తే అటువంటి రచనలు కొంత కాలమైనా నిలబడతాయని నా అభిప్రాయం. మన సినిమాలకు కథలు దొరక్క ఎలాగైతే ఒక స్తబ్ధత ఏర్పడిందో, అలాగే మన రచయితలకు సరైన కథా వస్తువులు దొరకటం లేదు. ఒక తరం వెనక్కు వెళితే సమాజంలో అప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు. క్రమంగా తగ్గుతున్నాయి. వరకట్నం, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం ఇతివృత్తంగా ఎన్నో రచనలు వచ్చేవి. ఇప్పుడు అసలు వైవాహిక వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలా మారుతున్న సమాజంలో సరైన సమస్యలను ఎంచుకుని మంచి కథలుగా మలిచే రచయితలు తక్కువగా ఉన్నారు. ఇక పుస్తక ముద్రణ అనేది వ్యక్తిగతం. రచయితను అనిపించుకోవాలి, నా పేరు ప్రింట్ లో చూసుకోవాలి అనేవాళ్ళు ఆ పుస్తకాలను బంధు మిత్రులకు ఉచితంగా పంచుతున్నారు. కొన్ని పత్రికలు మంచి థీమ్ లను నిర్దేశిస్తూ కథల పోటీలను నిర్వహిస్తున్నాయి. ఇది ముదావహం. ….జయంతి.
విషాద నగరం గురించి అనిసెట్టి శ్రీధర్ గారి అభిప్రాయం:
02/03/2023 4:59 pm
లైలా గారి విమర్శపై నా అభ్యంతరాలు మరికొన్ని:
వారి వ్యాఖ్య: ఈ మినీ కథ చెపుతున్నతనికి అన్నీ ఫ్రీగా రావాలి. రానందున కొంత మంట. ఆకాశం, వెన్నెల, ఎదురింటి అందమైన పాపాయి ఫ్రీగా వచ్చినందున అతని కిష్టం. వీటన్నిటిలో రచయిత ఉష్ కాకీ అని మాయం చెయ్యగలిగిందెవరు? …..
నా సమాధానం: ఇల్లు ఫ్రీగా రానందున మంట అని అసందర్భ ప్రేలాపన ఎందుకు? దిగువ మధ్య తరగతి ఉండే కొన్ని రెండు గదుల ఇళ్ళల్లో అద్దె కట్టినా గాలీ, వెలుతురూ చొరబడదు. ఆకాశమూ కనిపించదు. అందువల్ల అవి దొరకడం అదృష్టంగా బావిస్తాడు కథకుడు. మీరైతే వాటికి కూడా అద్దె వసూలు చేస్తారేమో?
వారి వ్యాఖ్య: పాప తలిదండ్రులకి కానీ, ఇరుగుపొరుగుల వారికి కానీ, ఫ్రీగా పైనెంతో ఎత్తు నుంచి పాపాయిని చూసి ఆనందించే కథకుడి మీద కాని, ఈ పాపాయిని రక్షించే బాధ్యత లేదు.
నా సమాధానం: తేలికపాటి వర్షం పడినపుడు పిల్లలు కాగితపు పడవలు వేసి ఆనందించడం, వాళ్ళని చూసి పెద్దవాళ్ళు ముచ్చటపడడం సహజం. ఈ కథలో జరిగింది అదే. భారీ వర్షం పడి నీరు పారకుండా stagnate అవడానికి ఆక్రమణలు, ప్రజల దురాశ కారణం. అదే కథలో చెప్పాను. పాపాయికి ప్రమాదం జరుగుతూ ఉన్నపుడు పైన పేర్కొన్న వ్యక్తులందరూ ఆ చోద్యం చూస్తూ ఆనందిస్తున్నారని నేనెక్కడా రాయలేదు.
ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరనే presumption చేసుకోలేరా? ప్రమాదం జరగడానికి నిమిషం కూడా అవసరం లేదు.
కథాశీర్షిక చూస్తూనే ఆవేశానికి లోనయ్యి కథ చదవడం మొదలుబెడితే ప్రతిస్పందన బదులు ఇలాంటి అతి స్పందనలే కలుగుతై.
హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు, కుంటలు కబ్జాకి గురయ్యాయో ఈ విమర్శకుడికి తెలుసా? ఇలాంటి ఘోరాలు జరగడానికి ప్రధాన కారణం పాలకుల, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, ప్రజల దురాశే. అది ఎత్తి చూపడం రచయిత dishonest sadistic writing for habituated masochistic babaes in woods అవుతుందా?
వారి వ్యాఖ్య: ఎప్పుడో పాత వార్ గురించి, కీబోర్డ్ మీద వీళ్ళేడిసే లోపల కొత్త వార్ రానే వచ్చె. ఈ రచయితల వ్యర్థపు వెనకబడిన ఏదుపులెందుకు? ఎందుకు వయెలెన్స్, ఏడుపుల మీదే దృష్టి?
నా సమాధానం: అంటే యుద్ధాల గురించి, సమాజంలో జరిగే అన్యాయాల గురించి, హింస గురించి….. మళ్ళీ మళ్ళీ అవి జరుగుతూనే ఉంటాయి కనుక ఎవరూ రాయకూడదన్న మాట. ఆ సంఘటనల గురించి ఎక్కడా మాట్లాడ కుండా సెన్సార్ చేసేస్తారేమో ఈ పాఠకుడు.
వారి వ్యాఖ్య: అసలు ఈ రచయితలు ఏ కార్యాలయం లోనూ బాధ్యతాయుతమైన పనులు చేస్తుండక పోవచ్చు.
నా సమాధానం: నేను నలభై సంవత్సరాలు ఎంత బాధ్యతాయుతంగా ఏ కార్యాలయంలో పని చేసానో నేను ఇక్కడ చెప్పను. కావాలంటే ఒక రెండు వందల మంది ఫోన్ నంబర్స్ ఇవ్వగలను ఎవరేనా చెక్ చెయ్యదలచుకుంటే. కానీ, ఇవ్వను. ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు చేసేవాళ్ళకి నేనేంటో రుజువు చేసుకోవలసిన అవసరం లేదు కాబట్టి.
ఈ విమర్శకుడు నేను ఎలాంటి వాడినో చాలా ఊహించి చెప్పారు కదా. వీరి గురించి నా ఊహా ఏంటో చెబుతాను. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే మనం వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తాం. పాపం నా పాఠకులు (వీరి దృష్టిలో locusts) ఆ తరహా మనుషులు. బహుశా వీరు చచ్చిపోయినవాడిదే తప్పు అని వాళ్ళని దెప్పి పొడుస్తారేమో.
Web magazine లో ఇదే నా మొదటి రచన. అందువల్ల పాఠకుల అభినందల్ని రచయిత “పనిగట్టుకు వచ్చి” స్వీకరించకూడదనే etiquette ఏదైనా ఉందేమో నాకు తెలియదు. విజ్ఞులెవరేనా చెబితే నేర్చుకుంటాను.
రచయిత పాత్రల్ని చంపడం అటుంచి, ఇలాంటి విమర్శకులు రచయితల్ని చంపకుండా moderate చెయ్యాల్సిన బాధ్యత సంపాదకుల మీద ఉండాలి కదా.
1.నేను నిజంగా రచయితనేనా? నిజం – ఎవరికైనా (రచయితకి, రచయిత కానివానికి, రచయితగా చెలామణీ అవుతున్నవానికీ) ఇప్పటి లైకులూ షేర్లూ ప్రపంచంలో – ఎలా తెలుస్తుంది?
1అ. ఇందులో పేరొందిన పత్రికల పేరొందిన సంపాదకుల పాత్ర?
2.పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి: ఎటువంటి పాఠకుడిని?
“Beauty is something wonderful and strange that the artist fashions out of the chaos of the world in the torment of his soul. And when he has made it, it is not given to all to know it. To recognize it you must repeat the adventure of the artist. It is a melody that he sings to you, and to hear it again in your own heart you want knowledge and sensitiveness and imagination.” ― W. Somerset Maugham.
ఎప్పుడన్నా వచ్చి రాత్రికి ఉండి ఆమెను విసిగించి, హింసించి పోయే అన్న… వారానికి ఓ రోజుండి పోయే భర్త… సంవత్సరంలో ఓ వారానికి మించి ఉండని కొడుకు… ఆమె సాంగత్య భాగ్యం లభించిన కౌమారవయస్సు చిన్నా…
రక్తసంబంధం కానిది సాంగత్యం. సాంగత్యం వల్లనే మనకు సంస్కారాలు అబ్బుతాయి. గంగానది పాపాన్ని పోగొడుతుంది. వెన్నెల తాపాన్ని పోగొడుతుంది. కల్పవృక్షం దైన్యాన్ని పోగొడుతుంది. అయితే ఈ మూడింటినీ సజ్జన సాంగత్యం పోగొడుతుంది. సజ్జన సాంగత్యం జీవితాలను మారుస్తుంది. దశా దిశా నిర్దేశం చేస్తుంది. సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది.
“మనుషులు అవసరాన్ని మించిన అవసరం కోసం, సంతృప్తికి మించిన సుఖం కోసం వెంపర్లాడుతుంటారు. వీళ్లు జంతువులనుంచి ఎదిగినవాళ్లు కాదు చిన్నా! అక్కడ నుంచి మనిషిగా దిగజారినవాళ్లు. వీళ్లు జాలిపడాల్సిన వాళ్లే తప్ప ద్వేషించాల్సినవాళ్లు కాదు.” అన్న తల్లి
“(డైరీలో) నేను రాసినవన్నీ… సమాజం లో తనచుట్టూ ఉన్న మనుషుల నైజం గురించి తాత్విక దృష్టితో రాసినవన్నీ … ఎప్పటికైనా నీకే ఇస్తాలే చిన్నా” అని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దయాసముద్రి ఆ తల్లి పాదాలను నా కన్నీళ్లతో కడగాలని ఉంది… కనిగిరి భాస్కర్ రెడ్డి మాస్టారు గారూ!
~ కనిగిరి కె.కె. రామయ్య (త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు)
కథ పేరు – విషాద నగరం. Isn’t that enough warning for me to switch to another story! Unfortunately, my eye scanned the scanty material already. It is obvious the writer intends to kill, in this story. And he is really in a mad rush to do it.
కొన్ని కథలలో, నవలలలో -ఒక పాత్ర ఇంకో పాత్రను కథలోని పరిస్థితులు, మానసిక స్థితుల వల్ల – హింసించటం, చంపటం జరుగుతుంది. కాని, ముందే ‘వయొలెన్స్’ దృష్టిలో పెట్టుకుని, రచయిత డెలిబరేట్‍గా కల్పించే (writerogenic) చావులకు, విషాదాలకు, రచయితే జవాబుదారీ. ఇంకెవరూ లేరు. These killer writers go scot-free.
డిటెక్టివ్ ఫిక్షన్ కాకుండా, మిగతా పుస్తకాల్లో కథల్లోని ‘పాత్రల మరణాల’ గురించి, కధా రచయితలు, నవలా రచయితలు కొందరు రాశారు. ఎందుకు కొంతమంది రచయితలు మాత్రమే హింస, చావు, హత్యలు, తమ రచనలలో ఎక్కువగా చూపిస్తారు, అది, మంచిదా, చెడ్డదా అనేదానికి ఎవరికీ అవగాహన లేదు. గ్రాఫిక్ వయొలెన్స్ ఎందుకు ఉంటుంది కొందరి రచనల్లో, అని కొన్ని నెలల కింద నేను వేసిన ప్రశ్నకిక్కడ సాహితీకారుల నుండి ఏం జవాబు రాలేదు.
“How to read Literature like a professor” by Thomas C. Foster -పుస్తకం లో ఛాప్టర్ 11 –… More Than It’s Gonna Hurt You: Concerning Violence — ఇలాటి విషయాల గురించి ఆలోచించటానికే కేటాయించినట్టుంటే, ఈ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఏమన్నాడో చూద్దామని ఈ మధ్య, చదివాను. థామస్ ఫోస్టర్‍కీ సమాధానం ఏమీ లేదు. ఛాప్టరు ఆఖరులో–ఫిక్షన్ రచయితల వయొలెన్స్ మనం జెనరలైస్ చెయ్యలేం, మనకు వీరిని భరించక తప్పదు, లేకుంటే సాహిత్యంలో మనకు షేక్స్‌పియర్, హోమర్, లారెన్స్, హెమింగ్వే, తదితరులుండరు కదా, అందరూ జేన్ ఆస్టిన్ లాటి పుస్తకాలే రాయలేరు కదా, అని ఒక హాస్యం చేసి వదిలేశాడు.
ఈ ‘విషాదనగరం’ కథలో: ఈ మినీ కథ చెపుతున్నతనికి అన్నీ ఫ్రీగా రావాలి. ఇల్లు ఫ్రీగా రావాలి. రానందున కొంత మంట. ఆకాశం, వెన్నెల, ఎదురింటి అందమైన పాపాయి ఫ్రీగా వచ్చినందున అతని కిష్టం. వీటన్నిటిలో (కథకుడితో సహా) రచయిత -ఉష్ కాకీ! అని మాయం చెయ్యగలిగిందెవరు? ఎవరిని మాయం చేస్తే, అతడు గుచ్చాలనుకునే ముల్లు కసిక్కిన దిగుతుంది విషాదవిషం?
ఈ కథలో అమ్మా నాన్నలు absent. వారి మీద కాని, ఇరుగుపొరుగుల మీద కాని, చివరకు ఫ్రీగా పైనెంతో ఎత్తు మీంచి ఆ పాపాయిని చూసి ఆనందించే కథకుడి (Detached God like, solitary figure) మీద కాని, ఈ పాపాయిని రక్షించే బాధ్యత లేదు. (Where the hell are they?) రచయిత చాతుర్యంగా తన బ్లేమ్, సమస్త తెలుగుజనాలూ సింపథైజ్ చేసేట్టు, అందరి దృష్టీ -పొలిటీషియన్స్, వారి గ్రీడ్, చేతగానితనం, పర్యావర్తం పొల్యూషన్, దాని మూలాన జరిగే ఘోరాల మీదికి మూడు ముక్కల్లో మళ్లించాడు. By doing so, the writer has reduced conflict with a very large population and pocketed them confidently as his readers.
But then to do so, Isn’t it wonderfully clever of the writer! Isn’t that stupendously smart? No. Not at all. It is a dishonest sadistic writing for habituated masochistic babes in woods. It is contrived, formulaic, and routine. జంతురక్షణ, పర్యావరణ రక్షణ. ఇవి ఇప్పటి అందరి ఫేవరిట్ పెట్ ప్రాజెక్ట్స్. ఇవి ఎత్తుకుంటే, రచయిత ఎంతో గొప్ప హృదయం ఉన్నవాడిగా కొందరు బొందన పడతారు. సమాజంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే మేధావిగా కొందరు ఊహిస్తారు. రచయితలకు నిజానికి అలాటి wisdom ఏమీ ఉండనవసరం లేదు. అసలు వీరే కార్యాలయంలోనూ బాధ్యతాయుతమైన పనులు చేస్తుండక పోవచ్చు.
పాఠకులు కొందరు, కథను, మెచ్చుకున్నారు. ఈ పాఠకులు వాళ్లు వచ్చి, వాళ్లు కథ చదివి ఎలా గిలగిల్లాడారో చెపుతారు. ఆ సీన్ చూశాక, the useless masochistic exhibitionism, for a purposeless sadistic stint – అని మళ్లీ నాకనిపించింది.
నా చిన్నతనంలో, మా తమ్ముడికి, సరదాకి ఒక చిన్న ప్లాస్టిక్ గన్ కొనిపెట్టారు. దాని ఉద్దేశం, బచ్చాగాడు గోడ కేసి కొట్టుకుంటే ఓ పుల్ల చివర ఉండే చిన్న సక్షన్ కప్ గోడకి కాసేపు అతుక్కుని, ఊడి పడతది. అప్పుడు మళ్లీ ఆ కుంక, అది తెచ్చుకుని మళ్లీ మళ్లీ గోడ కేసి కొట్టుకోవాలి. అలా వాడటం మానేసి, ఇంట్లో అటూ ఇటూ తిరిగే మా కేసి కొట్టటం మొదలెట్టాడు. నాకు –అమ్మా, కొడుతున్నాడే, నాన్నా, ఊఁ, ఊఁ, అని కళ్లు నలుపుకుంటూ ఏడవటం; మేష్టారూ, చూడండీ, కొడుతున్నాడు- అని ఏడవాల్సిన అగత్యం ఏమిటి? సుబ్రంగా రెండు తుంపులు చేసి ముఖాన కొట్టాను. ఇప్పటికీ ఇంట్లో అందరికీ చెప్పుకుని ఏడుస్తుంటాడు, O she is so cruel, she broke my toy! అని.
ఈ విషాద నగరం కథ గురించి మరో సంగతి: కొన్నాళ్ల తదనంతరం, రచయిత పనిగట్టుకు వచ్చి, పాఠకుల అభినందలను స్వీకరించాడు. రచయిత, వారి ఫాలోయర్స్ locusts లాగా ఈమాట అభిప్రాయ వేదికపై వచ్చి వాలినపుడు, వారి సంభాషణలు విన్న తర్వాత, ఒక విచిత్ర అనుభవం కలిగింది. ఇది నేను సరిగా చెప్పగలనో లేదో కానీ, ప్రయత్నిస్తాను.
కథలోని నగరం లోని, ఒక గాడ్ ఫర్సేకెన్ వీథిలో, ఒక విషాదఘటన చూస్తానికి, ఆ ఇంటిముందు ఎలా వీధిలోని వారు క్యూరియాసిటీతో మూగారో; ఈమాట అభిప్రాయాల వీధిలో, ఈ కథ పాఠకులు గుమికూడటం- అచ్చంగా అలాగే ఉందనిపించింది. It is the same scene. Inside the story. And outside the story. That I thought is eerie. Surreal. మినీ కథలోని onlookersకి సంభాషణలు లేవు. కాని కథ చదివిన onlooker/పాఠకుల సంభాషణలు ఇక్కడ విన్నాను. ఈ మొత్తం సీన్ కలిపి చూసిన నాకు, ఒక ‘పెయింటింగ్ ద సేమ్ వికెడ్ ట్రాజిక్ సీన్, వితిన్ ద పెయింటింగ్’ చూసిన doubled unpleasantness కలిగించింది.
కొందరు రచయితల గురించి అటువంటప్పుడు నా ఆలోచనలు: ఎందుకు వారి అనువాదాల్లో, రచనల్లో శవాలను బొమ్మలతో సహా వీరు మేగజీన్ లోకి లాక్కొస్తారు, పత్రిక ఒక morgue అనుకుంటారా? కొందరు రక్తాన్ని జెల్లీబీన్స్ లాగా రోడ్ల మీద చూపుతారు, కొందరు ఉర్దూ రచయితలకు ప్రాస్టిట్యూట్ల దుర్దశ మీద మహా వ్యధ, ఒక పక్కన రచయిత తాగి తామే స్వయంగా అక్కడ దొర్లుతూనే. మైగాడ్! ఎప్పుడో పాత వార్ గురించి, కీబోర్డ్ మీద వీళ్లేడిసే లోపల కొత్త వార్ రానే వచ్చె. ఈ రచయితల వ్యర్థపు వెనకబడిన ఏడుపులెందుకు? ఎందుకు వయొలెన్స్, ఏడుపుల మీదే వీరి దృష్టి?
మెడికల్ ఫీల్డ్‌లో iatrogenic disasters ఉంటయ్యి. They are unwanted. By all. రచనారంగంలో కొన్ని రచనలలో కేవలం రచయిత prompted death and disasters ఉంటయ్యి. They are wanted, by some sort of readers. The writer gets praise. ఈ చిన్నకథ, పాఠకుల పార్టిసిపేషన్, అందుకు ఉదాహరణ, అని నాకనిపించింది.
I say to myself, what’s the big deal! Writers write as they wish. I read what I like, and when I like. I silently walk away from some writers. I have the freedom.
వ్యాసం బాగుంది. త్యాగయ్య కీర్తనల్లొ వాడిన తెలుగు పదాలు కొన్ని నేడు అస్సలు ప్రాచుర్యంలొ లేవు. వాటిని గురించి ప్రస్తావించితే మనకి తెలియని త్యాగరాజు కాస్తైనా తెలిసె అవకాశం వుండేది. ఆయన రచనల్లొ తామసము అనే పదప్రయోగం తరచుగా కనిపిస్తుంది. ఆయన వాడిన తెలుగు పదాలు మరికొన్ని మనకు తెలియనివి వున్నాయి. మచ్చుకు కొన్నిటిని వివరిస్తే బాగుండేది. ఆయన కాలంలో సామాజిక పరిస్థితులమీద కీర్తనలు లేకపొవటం ఎప్పటికీ అర్ధంకాని విషయం. కృతులన్నీ భక్తిమీదనె కేంద్రీకృతమై వున్నాయి. అందుకేనేమో నేడు శాస్త్రీయ సంగీతం ప్రజల ఆదరణకు నోచుకోవటం లేదు. పాశ్చాత్య సంగీతంగూడా చర్చి లోనే పుట్టినప్పటికీ కాలక్రమంలో దానికి ఒక సొంత దారి ఎంచుకున్నది. అందుకే నేటికీ సామాన్య ప్రజల ఆదరణకు నోచుకున్నది. మనిషికి కలిగే అనుభూతికి అనుగుణంగా వుంది ఆ బాణీ. మన సంగీతం అలా కాదు. మన సంగీతం భక్తి నుంచి బయటపడలేకపోయింది. నేటి జీవిత సమస్యలకు భక్తి సమాధానం చెప్పలేక పోతుంది. సినిమా పాటలకున్న ఆదరణ శాస్త్రీయ సంగీతానికి లేకపోవటానికి కారణం మన శాస్త్రీయ సంగీతం సగటు మనిషి భావోద్వేగాలను అర్ధం చేసుకోలేక పోవటమే. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జీవనం. కానీ వ్యవసాయం మీద ఒక్కటంటే ఒక్క పాట కూడా రాయలేదు త్యాగయ్య. నేటి సమస్యలకు రాముడు ఏవిధంగానూ సమాధానం చెప్పలేడు. మన సంగీతంలో వున్న లోపాన్ని గూడా చూపితే బాగుండేది. చదువరులకు ఒక సమగ్ర అవగాహన కలిగే అవకాశం ఉండేది. మరో వ్యాసంలోనైనా నాటి తెలుగుకు నేటి తెలుగుకు వ్యత్యాసం తెలిపితే బాగుండును. చిత్రమేమిటంటే త్యాగయ్య పాటలు సింహభాగం తెలుగులో వున్నప్పటికీ తెలుగునాట ఆదరణ లేదు. తమిళులకు కృతులలోని భాష భావం పెద్దగా అర్ధంగాకపోయినా వారు బాగా ఆదరిస్తున్నారు. త్యాగయ్యకన్నా చాల ఏళ్ళు ముందు జీవించిన అన్నమయ్య సంకీర్తనల్లో భక్తితో పాటు ప్రాపంచిక విషయాలమీదగూడా పాటలు వున్నాయి. కానీ ఆనాటికి గురుశిష్య పరంపర వ్యవస్థ లేకపోవటంతో అన్నమయ్య పాటలు ఎలా పాడాడో మనకు తెలియదు. త్యాగయ్య ఎలా పాడాడో తెలుసు మనకు. నేటికీ అలానే పాడుతున్నాము.
లైలా గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. కాళిదాసు శ్యామలా దండకంలో “కుచోన్నతే కుంకుమరాగ శోణే”, అలాగే శ్రీ వేంకటేశ్వరస్వామివారి సుప్రభాతంలో “కమలా కుచ చూచుక కుంకుమతో” అన్నచోట కేవలం భక్తిభావనే మనసులో ఉంచి కవులు కూర్చారు. మనమూ ఆ ఉద్దేశంతోనే ఆ కృతులు చదవాలి. అర్థం చేసుకోవాలి. మన దృష్టి సంకుచితం కాని పద్ధతిలో, మనకర్థమయ్యేదే అసలైన అర్థం అని భావించకుండా అనుశీలించాలి. కృతజ్ఞతలు!
1. ఈ కథ చదివించినందుకు అమరేంద్రకు ధన్యవాదాలు.
2. కెత్తేల్ సాయిబు ఎవరు? ఈ ప్రశ్న చిన్నదే. నా జవాబు పెద్దది. అనాది మానవుడు. మిగులు ప్రవేశించాక దాత. ఎలా? అనాది మానవుని సహజాతం పంచుకోటం. అది అనివార్యత లోంచి వచ్చినదన్న ఊహ కూడా ఉంది. కావచ్చు. కాకపోవచ్చు. ఏమైనా ఇది జన్యుపరమైనదనే ఊహ నాకు బాగుంటుంది. మానవ సమాజంలో మిగులు ప్రవేశించేక ఈ పంచుకోటం సంస్కృతి అయింది. ఆ రెంటికీ మధ్య కాలం చాలా పెద్దదే. అది సహజాతం నుంచి సంస్కృతి అయిందని చెప్పటానికి మనం పదేపదే వినే మాట ఒకటి ఆధారం. అతిథి దేవో భవ. ఇది మన ప్రాంతానిదే కావచ్చు. ఇలాంటివి అనేక సంస్కృతులలో ఉండే అవకాశం ఉంది. నేను నీకు కడుపు నిండా పెట్టలేకపోతున్నాను. నన్ను క్షమించు. అని చేతులు జోడించటమూ అదే చెబుతుంది. అయితే మిగులు ప్రవేశంతో పంచుకోటం కాస్తా రూపాంతరం చెంది పెట్టడం అయింది.
3. కెత్తేల్ సాయిబు అంతేనా? కాదు. అతను ఆహార శ్రామికుడు. ఆ శ్రామికుని లక్షణం తను తయారు చేసిన ఆహారాన్ని తిన్న మనిషి ముఖంలోని ఆనందం. తను వడ్డించిన విస్తరి ఖాళీ చేసినవాని ముఖం లోని తృప్తి. వంట, వడ్డనలు వృత్తిగా మారి శ్రామికుని కడుపు నిండటానికి ఆధరువు కావచ్చు. కాని అందులోని అమ్మతనం మారిందని నాకు అనిపించదు.
4. కెత్తేల్ సాయిబు పిల్లలు ఆర్ధికంగా బాగుపడ్డారని కథ చెపుతోంది. దాని వెనక ఆర్ధికత(ఎకనామిక్సు) ఏమిటి? నేను ఫ్రీకనామిక్సు అనే పుస్తకం చదవాను. అందులో ఒక ప్రయోగం చెపుతారు. ఒక పెద్ద వ్యాపారసంస్థ భవనం అది. అందులో నాలుగు అంతస్తులు ఉంటాయి. ఆ సంస్థలో పై అంతస్తులో పైస్థాయి వారుంటారు. క్రమంగా చివరి అంతస్తులో చివరి స్థాయి ఉద్యోగులు. నాలుగు అంతస్తులలోనూ తినే తాగే పదార్ధాలుంటాయి. అమ్మేవాడుండడు. ఎవరికి కావలసినది వాళ్లు తీసుకుని పక్కన ఉన్న పెట్టెలో డబ్బులు వెయ్యాలి. పై స్థాయి వారి నుంచి కింద స్థాయి వరకూ వాటిలో ఆదాయం ఎలా ఉంటుంది – అది మీ ఊహకి వదిలేస్తాను. పిల్లలు బాగుపడ్డది సాయిబు సంపాదన వల్లనా? పేరు(బ్రాండ్ ఇమేజ్) వల్లనా? అతని వంట శిక్షణ వల్లనా? కథలో ఆ విషయ స్పష్టత లేదు. కథకి కేంద్రం అతనా? కథకుడా? కథకుడు రామలక్ష్మిని పెళ్లాడటంలో అతని కూటిఋణం తీరటంలో సాయిబు ఆదర్శం లేదా తాత్వికత ప్రభావం ఉన్నాయా? కాకపోతే భారతదేశంలో చాలాకాలం ఈ ఫ్రీకనామిక్సు ఉండేదన్న అంశం నాకు ఈ కథ ఉద్దేశ్య పూర్లకంగానో అనుద్దేశితంగానో గుర్తు చేసింది.
5. నా వ్యక్తిగత జీవితంలో అటువంటి దారిద్ర్యాన్ని అనుభవించాను. ఒక రాత్రి వేళ భరించలేక చావబోతే నన్ను రక్షించి అన్నం పెట్టి నాకు ఒక ఉద్యోగం వేయించిన ఆ మహానుభావుడు గుర్తువచ్చాడు. ఏదైనా తిండి పెట్టడం గురించే కాక దాని రుచి గురించి చెప్పటం నాకు మల్లాది వారి కృష్ణాతీరం గుర్తు చేసింది.
6. రచయితకీ, పరాయి ప్రాంతపు కథ అని గుర్తురాకుండా ఆత్మీయంగా చెప్పిన అనువాదకునికీ ధన్యవాదాలు.
వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి రేఖాజ్యోతి తల్లికి ఓ చిరు కానుక…
ముళ్లపూడి వెంకటరమణ (1931–2011) ‘కానుక’ కథకు సంక్షిప్త రూపం.
గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్ల మాటున కూర్చున్నాడో అతనికే తెలియదు. ఆకులలో ఆకై పువ్వులో పువ్వయి, ఇసుకలో రేణువై యమునలో బిందువై కృష్ణ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. యమున ఒడ్డున పొదల మాటున దాగి కృష్ణుడి మురళి విన్నప్పుడు వూపిరి బిగబట్టుకునే కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన దానిని కొత్త వేణువును పూరించడానికి ఉపయోగించేవాడు. తీరా అది శ్రుతి శుద్ధంగా వినబడేది కాదు.
ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ మురళిని ఎత్తుకు వచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి, చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునేసరికి అది కనబడలేదు.
గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని ఆ గజదొంగ సాయంత్రం కనబడి “గోపన్నా నా మురళిని తీసుకుపోయావు కదూ… పోనీ ఇంకొకటి చేసిపెట్టు” అన్నాడు నవ్వి. గోపన్న తెల్లబోయాడు. మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు. అతనిలో కొత్త శక్తి, కొత్త చైతన్యం మేల్కొన్నాయి. తన చేతులతో రూపు దిద్దుకుంటున్న మురళి రేపు కృష్ణుడి హస్తాలను అలంకరిస్తుందని ఆశపడుతూ మురళిని రూపొందించాడు.
మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. జీర. రెండు మూడు వేణువులు పలికినట్టుంది. కృష్ణుడు వూదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్లు పులకరించిందా? అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే.
కృష్ణుడి పుట్టినరోజు వచ్చేస్తుంది. పాతిక పండగలనాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమలలేదు. రేపటికైనా సాధించి, తన వేణువును ఆయనకు సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు… వేళయిపోయింది.
కొత్త వెదురు కోసి స్వరద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని ఇందులో పలికించబోయాడు. ఆ స్వరం తన ఈ వేణువులో పలికితే ఇది కృష్ణయ్యకు కానుక ఇవ్వాలి. కాని అది పలకదు. ఎన్ని వేల వేణువులో చేశాడు. ప్రతి అణువునా భగవంతుడున్నాడు. ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది, అన్న వాక్యాల తాత్పర్యం గోపన్న అర్భక దేహానికి దుర్భరమైపోయింది.
అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు.
ఇన్ని వేణువుల గుట్టలో ఎక్కడో సత్యమైన కొత్త వేణువు దాగివుంది. అది సత్యమైనదేనా? ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. చివరి మురళిని పరీక్షించడానికి ధైర్యం చాలలేదు. సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు.
“ఇదే” అన్నాడు ధీమాగా.
“చూడవా” అన్నాడు కుర్రాడు.
“ఒద్దు. లగెత్తు. కిష్టయ్య చేతికియ్యి ఆయనే చూస్తాడు.”
పాతిక సంవత్సరాల గాలివాన వెలిసింది. గోపన్న మేను వాల్చాడు. తాను పని ముగించాడా. భగవంతుడికి శ్రుతి శుద్ధమైన వేణువును పంపాడా. శ్రుతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా? సరిచేసే శక్తి ఆయనకు లేదని తను అనుకొన్నాడా? గోపన్నకు నవ్వు వచ్చింది.
తన పక్కనున్న వేణువులోంచి సన్నటి స్వరం నెమ్మదిగా ఇవతలికి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. ఇంకో క్షణానికి ఆ పక్క మురళి, ఉత్తర క్షణార్థానికి ఇటుపక్క మురళి మేలుకున్నాయి. మరికొద్ది క్షణాలలో కుటీరంలోని సహస్ర వేణువులూ భువన మోహనంగా గానం చేయసాగాయి.
రచయిత్రి, నంబూరి పరిపూర్ణ బొమ్మ, క్వీన్ ఎలిజబెత్ బొమ్మ చూస్తే -నాకేం తేడా కనిపించలేదు. దాదాపు ఇద్దరిదీ ఒకే వయసు కదా. 93, 97. ఒక్కలాగే ఉండక ఈ ఇద్దరు ఆడవాళ్లు, ఇంకెలా ఉంటారు!
ఇద్దరూ పనిమంతులే. ఒక్కరోజు ఖాళీగా కూర్చున్నట్టు లేరు. వారికి ఎన్నో బాధ్యతలు, మరి.
బయొలాజికల్ గా మనిషి జీవితాలను గురించి ఆలోచించేవారికి, ఏ జీవితాల్లోనూ పెద్ద తేడాలుండవు. మగ జంతువులు, స్పెర్మ్ ఇచ్చి, ఆడజంతువులు అండాలిచ్చి -సంతానం ఉత్పత్తి చేస్తారు. ఆడవాళ్లు, పాలిచ్చి ఆ ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువ సంతానాన్నో సాకుతారు. సాకక చస్తారా! అది జంతువులలో built in parental care.
దీనిలో మాత్రం పరిపూర్ణకూ, ఎలిజబెత్ కీ ఏమి తేడా ఉంది. ఆ తర్వాత వారి సంతానాన్నీ, మళ్లీ వారి సంతానాన్నీ, నేను చూస్తే మాత్రం, ఏం తేడా ఉంటుంది? మానవులంతా చేసేది ఈ జంతు కార్యక్రమమే.
మరి ఎందుకు -హేరీ, మేగన్- ఆ మొగుడూ పెళ్లం బొమ్మలు చూస్తానికే, మళ్లీ వాళ్ల పిల్లల బొమ్మలు చూస్తానికే ప్రజలు ఎగబడి చస్తారో నాకైతే అర్ధం కాదు. ఏ ఆడామగా, ఎవరి ప్రేమ కలాపాలకు మాత్రం ఏమి తేడా ఉంటుంది. డెలివరీ రూమ్ లో, ఎలిజబెత్ ప్రసవించినా, డయానా కన్నా, ఆ తర్వాత కేట్, మేగన్ – ఏ ఆడది కన్నా గాని, పిల్లో, పిల్లడోనే ఉద్భవించేది! అందరూ ప్రపంచం లోకి వచ్చే ద్వారం ఒకటే. ఆ ఘట్టం మారదు.
కొన్నేళ్ల క్రితం నేను రచ్చబండలో రాస్తున్నప్పుడు, అప్పుడే తెలుగు వికీపీడియా నిర్మించటం మొదలు పెట్టారు. నన్ను అందులో సహాయం చెయ్యమంటే, నాకు టెంప్లేట్లు, లైఫ్ హిస్టరీ డిక్టేషన్లు బాగా అలవాటే కాబట్టి, నమూనాలేగదా తెలుగువారికి కావలసింది అని, నా సంగతే రాస్తానన్నా. నా పేరూ, ఊరూ, మా అమ్మానాన్నా పేర్లూ, పుట్టిన ఊళ్లూ గట్రా నాకన్నా ఎవరికి బాగా తెలుస్తాయి? పని తేలిక గదా అందుకని.
అప్పుడు నాకు చెప్పబడింది ఏంటంటే, వికీపీడియాలు – ‘ఫేమస్ పీపుల్’ ను ప్రజలకు పరిచయం చెయ్యటానికి అని. ఎవరి సంగతి వాళ్లు రాయటానికి రూల్స్ ఒప్పవంట. నేను, నా జీవితాన్ని తక్కువ చేసుకుని, నేను ఇంపార్టెంట్ కాదనుకుని, నేను అప్పటి దాకా చేసిన పని పిచ్చదండగ అనుకుని, -పోయి ఏ వేమననో , శ్రీశ్రీ నో, ఎంటిఆర్ నో గురించి వాకబు చేసి వాళ్లను గురించి శ్రద్ధాభక్తులతో, వికిపీడియాలు నిర్మించాలి. అది నేను చెయ్యగలిగిన పని కాదు.
ఆ తర్వాత కొన్నేళ్ళకు, ఒక తెలుగు మేగజిన్ కి నేను ఆర్టికల్ రాసి, కావాలంటే మేగజీన్ అట్టమీద నా బొమ్మ వేసుకోమన్నా. ఎవరి బొమ్మేస్తే మాత్రం ఏం? నాకైతే ఏం తేడా లేదు. కాని మేగజీన్కి ఉంది. అట్టలమీద లంబాడీలు, బుట్టలల్లేవాళ్లు, లోక్సత్తా నాయకులు, కొత్త ప్రధానులు, దేవుళ్ల బొమ్మలు, నేను చూసి, ఆహా, ఓహో అని మెచ్చాలి. నా బొమ్మ వాళ్లెందుకు చూడకూడదు? వాళ్లను గురించే మిగతా ప్రపంచం ఎందుకు తెలుసుకోవాలి? నాకు అర్ధంకాదు. ఆ పత్రిక అట్టలు, వేరే కల్చర్ కల నా మెయిల్ మేన్ కి భయం కలిగించాయి. అతని భయం నా కర్ధమయింది. కాని ఆయా దేశస్థుల సంస్కృతీ విషయాల సర్దుబాట్ల గురించి, ప్రచారం గురించీ, కూడా నాకు ఆసక్తి లేదు.
ఇవ్వాళ క్వీన్ ఎలిజబెత్ స్కాట్లెండ్ ఇంటిమీద డబుల్ ఇంద్రధనుస్సు కనిపించిందంట, అందరూ చూస్తున్నారు. చూడవలిసిందే. తప్పక. ‘పరిపూర్ణ’ పేరు గురించి, ఆమె జీవితంలో పరిపూర్ణత ఉన్నదా లేదా అని ఏమీ గుంజాటన పడక్కర్లేదు. ఆవిడ బొమ్మ ఎంతో బాగుంది. చూడవలిసిందే తప్పక. ఆవిడను, ఆమె పిల్లలను గురించి నేను వికీలో చదివాను. ఏం తేడాలేదు. అందరి జీవితం లానే. అందరి పిల్లల్లాటి పిల్లలే.
ఏం తేడాలుండవు మానవజీవితాలలో. అందరికీ ఆకాశంలో ఇంద్రధనుస్సులు, అందరికీ, అందరికీ ఒకటే.
మెడికో శ్యామ్ రచనలు నాకు ఇష్టం. కధలు కానివ్వండి. ఏదేని టాపిక్ పైన రివ్యూ కానివ్వండి. ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది వాటిని చదివినప్పుడు, అతడి విషయ పరిజ్ణానానికి. రిజిష్ట్రేషన్, రిటైన్, రీకాల్ అమోఘం, ఎవ్వరికైనా అనితర సాధ్యం. ఆ రీకాలింగ్ సామర్థ్యాన్ని ఎలా వాడాలో, ఎక్కడ వాడాలో శ్యామ్‍కి తెలిసినట్టు వేరెవరికి సాధ్యం కాదని నా అభిప్రాయం. కధలు రాయడం మానేశాడని బాధ పడుతున్న పాఠకులకు ఈ రివ్యూలు పరిమళ జాస్మిన్లు.
మీరు ఇక్కడ రావిశాస్త్రి గారి గురించి ఇచ్చిన సమాచారం ఏ విశ్వవిద్యాలయంలోనైనా తెలుగులో ఒక సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడానికి సరిపడినంత ఉంది. మీ వ్యాసాలు గాని, ప్రసంగాలు కాని ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని పాఠకుడికి / శ్రోతకి తెలియజేస్తూనే ఉంటాయి. ఈ వ్యాసం కూడా ఆ కోవలోకే వస్తుంది.
ఛందశ్శాస్త్రంలో మీ అపార పాండిత్యమునకు శతాధిక వందనాలు. ఛందస్సు ఒక సముద్రమైతే దానిలో ఆసాంతము ఓలలాడుతున్నవారు జెజ్జాల కృష్ణ మోహన్ గారు. వారికి నా నమస్కారములు🙏🙏 వాయిస్ క్లిప్ play కావటంలేదండి. దయచేసి “లక్ష్మణుని జాగారము” మీ గానము నాకు పంపగలరు. నా దూరవాణి/వాట్సాప్ నం.8919800447. మీ సమాచారమంతా ఉంది కాని ఫోన్ నం. లేదు
దాదాపు తొంభైలలో అనుకుంటా, నేషనల్ జిగ్రాఫిక్ వారు ఓ కధనం ప్రచురించారు. దాని ప్రకారం దాదాపు మొత్తం బాంబే (అప్పట్లో) జనాల్లో ఉద్యోగం లేనివాడు ఎవరూ లేరు. అదే న్యూ యార్క్ లో అయితే అనేకమంది ఉన్నారు. ఉత్తరోత్తరా టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పెరిగాయి కాని తగ్గలేదు. నేను కొంతకాలం బాంబే లో ఉద్యోగం చేసినవాణ్ణే. రోడ్లు, మంచినీరు, ట్రాన్స్ పోర్ట్ విషయం లో బాంబే కి మించిన పట్టణం ఇప్పటికీ ఇండియాలో మరోటి లేదని ఘంటాపధంగా చెప్పగలను. నగరంలో ఉన్న ఒకే ఒక కనాకష్టం ఏమిటంటే ఇల్లుగానీ రూం గాని దొరకడం. అది ఒకసారి కుదురుకుంటే ఎవరూ మళ్ళీ అక్కడనుంచి బయటకి వెళ్లరు. జనం బాగా సహాయం చేసే మనుషులు. రోడ్డుకి రెండువైపులా ఉడిపి హోటళ్ళు, మంచి సేఫ్టీ అన్నీ బాగుంటాయ్. ఇవన్నీ కూడా నేషనల్ జిగ్రాఫిక్ వారు ప్రచురించిన కధనంలో చెప్పారు. ఈ అనువాదంలో ‘ముంబై’ అన్నారంటే కధ గత పదేళ్ళలోపు రాసినదేమో, పేరు మార్చాక. అప్పటికి ఉద్యోగాలు కోకొల్లలుగా ఉన్నాయ్ ముంబై లో. ఏ పనైనా చేస్తాననుకునేవారికి ముంబై లో ఉద్యోగం దొరకదనే ప్రశ్నే ఉదయించదు.
రెండో విషయం – మనిషి పోయాక రిగర్ మార్టిస్ (తప్పుగా పలుకుతున్నానేమో?) అనేది 5 నుంచి ఆరు గంటలు పడుతుంది. మొదటగా జరిగేది దవడలు కిందకి జారతాయి. బిగుసుకుపోవు. అందుకే చర్చ్ లో అందరికీ చివరి దర్శనానికి పోయినవాణ్ణి పెట్టినపుడు నోరు కుట్టేస్తారు(ట). తర్వాత బిగుసుకుంటుంది శరీరం. బిగుసుకోవడం అంటే మరీ నోట్లో వేళ్ళు తెగిపోయే అంత కాదు. మరో రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ బిగువు పోతుంది. అదీగాక భీమా చేతిలో ఏదో ఆయుధం ఉంది దాంతో శవం నోటిమీద కొట్టి చేతులు బయటకి లాక్కోలేడా? అదీ ఒక్క దెబ్బతో నక్కని చంపగలవాడు కదా?
మూడో విషయం – నక్కలు గుంపుగా వేటాడవు. ఎవరి జీవితం వారిదే. ఇది టివి చూస్తే తెలుస్తుంది. పులులు, హైనాలూ, తోడేళ్ళు గుంపుగా వేటాడతాయి. కొన్ని రకాల నక్కలు అలా గుంపుగా వేట చేయొచ్చేమో అనుకున్నా, నక్కలు అతి జాగ్రత్తమైనవి. మనిషనే వాడు రాగానే, లేదా మరో జంతువు రాగానే పక్కకు తప్పుకుని చాలా సేపు అంచనా వేసుకుని గాని దగ్గిరకి రావు. ఇది మనం నీతి కధల్లో చదువుకున్నదే – నక్కల తెలివి గురించి. అరవ్వొచ్చేమో కానీ మనిషి దగ్గిరకి వచ్చేసి కరిచేంత సాహసం *వెంఠనే* చేయవు.
ఇలా చెప్పుకుంటూ పోతే అవకతవలు చాలా ఉన్నై ఈ కధలో. రచయిత మరాఠీ వారని పేరు బట్టి తెలుస్తోంది. ఆయన కూడా బాంబేలో ఉద్యోగాలు, ఇవన్నీ చూసుకోకపోయినా అనువాదకులు చూసుకోవద్దా? గూగిల్ చేస్తే ఈ చిన్న విషయాలు తెలుస్తాయి. ఈ ఇద్దరూ మర్చిపోయినా సంపాదకులు కూడా మర్చిపోయినట్టున్నారు. అదే ఆశ్చర్యం.
GLN శర్మగారు: మీ ప్రశ్నని చాలా ఆలస్యంగా చూసాను. యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ లేక సత్య) గారు “మల్లీశ్వరి” (1951) సినిమాలో రాయలు పాత్రలో కనిపిస్తారు.
విడిగా ఆయన ఫోటో ఎక్కడా చూసిన జ్ణాపకం లేదు. R. అనంత పద్మనాభరావు రాసిన “ప్రసార ప్రముఖులు” అన్న పుస్తకంలో ఆయన గురించి కొద్ది సమాచారం వుంటుంది, కానీ ఫోటో వుండదు. 2010లో ఆకాశవాణి కళాకారుల వివరాలతో, ఎన్నో ఫోటోలతో “వాచస్పతి” అన్న పుస్తకం వచ్చింది. కాని దానిలో కూడా యండమూరి సత్యనారాయణ ఫోటో వున్నట్లుగా లేదు. But I can check my copy and confirm.
నిజానికి ఆయన రేడియోలో చేసిన పనికంటే ఆయన రాసిన “ఉషః కిరణాలు” అన్న పుస్తకం అంటే నాకు చాలా ఆసక్తి. It’s one of my standard reference works. ఈ పుస్తకం గురించి 2014లో ఈమాట పత్రికలోనే ఒక వ్యాసంలో ఈ క్రింది వాక్యాలు రాసాము.
—————-
తెలుగు సాహిత్యంలో పందొమ్మిదవ శతాబ్దం అంధయుగం అనడం పరిపాటి. ఆ శతాబ్దపు సాహిత్యం మీద ప్రత్యేకమైన కృషి చేసినవారు యండమూరి సత్యనారాయణరావుగారు. ఆయన రాసిన ఉషఃకిరణాలు (1960) చెప్పుకోదగ్గ ప్రచారానికి రాలేదు కానీ ఆయన కృషిని మెచ్చుకోవడానికి ఆ పుస్తకం చదవడం అవసరం. ఆయన మాటల్లో: “19వ శతాబ్ది తెలుగు వాఙ్మయమును వర్ణించువారిలో హెచ్చుమంది ఇది యొక క్షీణయుగము లేక అంధయుగమనియే నుడివియున్నారు. అంతవరకు తెలుగుసాహిత్యములో తీరుతెన్నులు దిద్దుకున్న ప్రబంధ కావ్యములు, పురాణములు, శతకములు, యక్షగానములు మొదలైనవి ఈ కాలములో పరస్పర ప్రతిబింబములుగాను ఉపజ్ఞావిహీనములుగాను భావశూన్యములు గాను ఉన్నవని వీరి అభిప్రాయము.”
—————–
ఆయన గురించి వివరంగా ఒక పెద్ద వ్యాసం రాయవలసిన అవసరం ఎంతయినా వుంది.
దేవతల కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన దధీచి, సువర్చలల కుమారుడు పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. రావి చెట్టు (పిప్పల వృక్షము) వద్ద ఉంచిన శిశువు అనే అర్ధంలో తనకి పిప్పలాదుడు అని నామకరణము జరిగినది. పిప్పలాదుడు దయాళువు. త్యాగశీలి. అతను అతని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. ప్రశ్నోపనిషత్తుకి శంకరాచార్యుడు బాష్యరచన చేసాడు.
పిప్పలాదునికి వివాహము చేసుకోవాలని అనిపించి అనవన్య రాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు పద్మను ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు. మొదట్లో రాజుకు తన కూతురును మునికి ఇవ్వటం ఇష్టము లేదు. కానీ అయన మంత్రి చెప్పినాక తన అభిప్రాయము మార్చుకొని తన కూతురు పద్మను పిప్పలాదునికి ఇచ్చి వివాహము చేస్తాడు.
పిప్పలాదుడు తపస్సు చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారి ధర్మ సందేహాలను తీరుస్తూ కాలము గడుపుతుంటాడు. ఒకనాడు కబంధుడు, వైదర్భి, కౌశల్యుడు, సూర్యాయనుడు, శైభ్యుడు, సుకేశుడు, వంటి మునులు ఈయన దర్సనార్ధము వచ్చి వారి సందేహాలను అంటే సృష్టి ఎలా జరుగుతుంది, ప్రాణము ఎలా పుడుతుంది నిద్రించేది ఏది మేల్కొనేది ఏది సుఖము ఎలా కలుగుతుంది వంటి క్లిష్టమైన ప్రశ్నలు, ఆఖరుగా ఓంకారాన్ని ఉపాసించిన వాడు ఏ లోకానికి వెళతాడు అని వేదాంత పరమైన చర్చ చేస్తారు. వారి ప్రశ్నలకు పిప్పలాదుడు ఇచ్చిన వివరణే ప్రశ్నోపనిషద్ గా వచ్చింది. అంతేకాకుండా ఆ వివరణలను బట్టి గర్భోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు వంటి గ్రంధాలు వచ్చినాయి. ఈ విధముగా పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతింపబడ్డాడు.
కె.కె. రామయ్య on February 15, 2022:
“యీ ముగింపు… … నమ్ముతున్నాను.”
You must be kidding. ముగింపు మారిస్తే, ఈ కథ అంత నచ్చకపోతే, మరో కథ ఐనా చదివే హోప్ ఉండేది. ఐనా, “ఆమె ఇల్లు” ముగింపు మారే పరిస్థితి అసలెలాగూ లేదు కదా. అది అనువాదపు కథ. ఇతరుల కథలు అనువదించుకునేవాడు స్వతంత్రుడు కాడు. అతడు ‘అసలు రచయిత’కు విధేయుడు. మూలరచయిత ఏం రాస్తే, అనువాదకుడు అదే రాయాలి.
కథ తను రాసిందైతే, – కాంటెంపరరీ, ప్రొగ్రెసివ్ రైటర్ – ఛ! ఇలా రాసానేంటి, ఇంత వెనకబడిన ముగింపు, ఇది ఒక misogynistic కథ లాగా సౌండ్ అవుతూంది, పొరపాటు, మార్చేస్తున్నా, అని మార్చేసుకునేవాడు. కాని, అనువాదకుడు గదా, అందువల్ల మొదలూ, మధ్యా, ముగింపూ -ఏదీ మార్చలేడు.
అనువాద కథల్లో -అనువాదకుడి కున్న “బాధకాల్లో” ఇది ఒకటై ఉండాలి. అంత సాధకం చేసి, ఈ బాధకం తెచ్చుకోటమెందుకు!
చాలా అసందర్భాలు ఉన్నట్టున్నాయి కథలో. నలభైనాలుగేళ్ళ వాళ్ళావిడ ఉద్యోగం చేస్తోందంటే ఆవిడ ఎంత అనాకారి అయినా “బంగారు గుడ్ల బాతు” అని తెలుస్తుంది మొగుడికి. అలా ఆవిడ స్కూటర్ అమ్మి పారేసి ఆవిణ్ణి వదులుకుంటాడా? అయినా ఇన్నేళ్ళు ఉద్యోగం చేస్తే లోన్ ఇవ్వరా ఇల్లు కొనుక్కోవడానికి? చాలా అవకతవకల్తో రాసిన కథ అని ‘నాకు’ అనిపించింది. అద్దెకి ఇల్లు తీసుకున్నందుకు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా చివరకి పెద్ద ఇల్లు ఓ సారి చూపిస్తే రెక్కలు కట్టుకు వాల్తారు కుటుంబం అంతా. మరో తిక్క వ్యవహారం – ఓ సారి ఇచ్చేసిన అద్దె ఎవరూ తిరిగి ఇవ్వరు ఎంత దెబ్బలాటలు పెట్టినా, పిల్లలు అమెరికాలో ఉన్నా. అయినా ఇది నా స్వంత ఘోష కాని కథలో పటుత్వం నాకైతే అనిపించలేదు.
>>“ఆమె ఇల్లు,” అని పేరు పెట్టకుండా ‘ఆమె మొగుడు’, అని పేరు పెడితే, అప్పుడు కథ లోని మగవాడిని స్టడీ చేసేవారా?
ఈ కథలో ఈ మగవాడిలా ఉన్నాడు, అలా ఎందుకున్నాడు? అని చాలావరకూ ఆడా, మగా పాఠకులు చర్చించరు. “మగవాడు” చర్చనీయాంశం కాదు. అతడిదే సమాజం, అతడే సమాజం అని తప్పుడు అభిప్రాయం మనసులలో నాటుకుపోయి ఉన్నదో, ఏమో?
ఈ కథలోని -ఆమె మొగుడు అనే మగవాడు, ఒక బండాభాయి. అతడికి, ఆమెకున్న రసహృదయం లేదు. ఏబ్రాసి వెధవ, ఉత్త వెంగళాయ! అయ్యో! అంటూ, కథలోని మగవాడిని గురించిన ఆందోళన, జాలి, పాఠకులలో లేదు. మరెందుకు లేదు? Is that an elephant in the room that you can’t see?
అభిప్రాయాలు కథలోని మగవాడి గురించే ఎందుకు రావు? అంటే అతడు ఉదాత్తుడుగా చిత్రించబడినప్పుడు, అతని వైపునుండి అభిప్రాయాలు రాస్తారు. లేనప్పుడు మాఫు చేస్తారు. కాబోలు!
“ఆమె ఇల్లు” కథలోని స్త్రీ రసహృదయిని. పురుషుడు నీరసుడు. ఈ కథ లోని ఆమె లోనే మాకు నేర్చుకోవలసిన అంశాలు ఉన్నాయి. ఈమె ప్రపంచాన్ని మెరుగు చేస్తుంది అన్న ఆ విషయం పాఠక/ విమర్శకులు చెప్పరు. ఈ మగవాడి చెంప మాకు పగలగొట్టాలని ఉంది అని చెప్పరు. ఇతడు తింగిరి వెధవ అని చెప్పరు.
నిజానికి, ఈ కథ ఎప్పుడు రాసారో కాని, రచయితైతే ఏ విషయాలు దాయనే లేదు. రచయిత అన్నీ చక్కగానే చెప్పాడు. కథలో చెప్పబడిన దానిని ignore చేసి, మగవాడిని స్క్రుటినీ నుంచి తప్పించి, ఆడదానిని గురించే ఏదో ఒక ‘జాలి’ అభిప్రాయం రాసే లెక్కన కథ ఎందుకు చదువుకోవటం? “ఆమె ఇల్లు,” అని పేరు పెట్టకుండా ‘ఆమె మొగుడు’, అని పేరు పెడితే, అప్పుడు కథ లోని మగవాడిని స్టడీ చేసేవారా?
కవి శృంగారి, రసాత్మకుడైనచో ఆ ప్రపంచం రసాత్మకమౌతుంది. అతడే నీరసుడైనచో, అది నీరసంగా పరిణమిస్తుంది.’ – అని ఈ శ్లోకాని కర్థం.” (“వసుచరిత్రంలోని వర్ణనలలో సంఘస్థితి ప్రతిబింబాలు,” ఈమాట, అక్టోబర్ 2021.)
ఇంతకు ముందు వాసు, ఈ సంచికలో శివకుమార్ శర్మ, అనిల్, – కవిత్వం, పుస్తక ప్రచురణలు, పుస్తకావిష్కరణల గురించి చెప్పిన విషయాలు చదివాను. నేనిప్పుడు రాసేది ఒక సాహిత్య పాఠకురాలిగా. పుస్తకాలు కొన్నేళ్లుగా విరివిగా కొనుక్కుంటున్న వ్యక్తిగా.
కవికి తన కవిత్వం మాత్రమే పుస్తకంగా తనే ప్రచురించుకోటం, కవిని, ఎవరూ పరిచయం చెయ్యకపోటం, మంచి పనే. శ్రోతకు కవికి మధ్య ఎడం తగ్గుతుంది. పరిచయం చేసేవారి నీడలు, కవి మీద పడవు. అలాగే వారి ధగధగలు, నా దృష్టిని పరిచయం చేస్తున్నవారి వైపుకు మళ్లించవు. కొన్నిసార్లు పాఠకురాలిని నేను -మీ కవిత్వం చదవటం మానేసి, విమర్శకుడితో వెళ్లిపోయే అవకాశం కవులు మీరే కల్పించటం ఎందుకు?
ఇంకోటి; పరిచయాలు లేపోతే కవిత్వం పుస్తకాలు పలచగా ఉంటాయి. ఔట్ డోర్ బుక్ షాప్ లో అప్పటికప్పుడు, సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని, గార్డెన్లో, ఉడ్స్ లో, కఫేలలో కవిత్వం చదువుకోటం ఎంతో బాగుంటుంది. అలా నేనెంతో కవిత్వం చదువుకున్నాను.
కవికి తన కవిత్వం ఇతరులు చదివితే, ఆత్మసంతృప్తి కలుగుతుందా? ఏమో! మీరు చెపుతున్నారు మీరు రాయటంలో అది ఒక పెద్ద ఫాక్టర్ అని. నేను ఆలోచిస్తున్నాను, కవిత్వం చదివే ఒక వ్యక్తిగా. నేను పొయట్రీ చదివేప్పుడు, అలాటి బరువు భారంతో నేనైతే చదవలేను. మీ ఆత్మ సంతృప్తితో నాకేం పని? కవిత్వం లోని విషయంతోనే గాని, కవిమీద రీడర్ కి ఏం ఆసక్తి? ఐతే, చదువరికి రచన తనంత తానే తెలుపుతుంటుంది రాసిందెవరో.
కవికి – చదువుతున్నారా లేదా, తన కవిత్వం వారికి నచ్చిందా, ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో చెప్పమనటం, ఇతరుల అభిప్రాయాలకోసం దేవిళ్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏం చేసుకుంటారు ఆ అభిప్రాయాన్ని? రాసిన పుస్తకాలు మార్కెట్లో అమ్ముడు పోవటమే, పాఠకులు చెప్పే నిజమైన అభిప్రాయం. నేను కొనుక్కున్న పుస్తకానికి ధర, పుస్తకాల షాపులో నేను కట్టివేసాను. అది బతికున్న/ చచ్చిన రచయిత నిర్ణయించిన ధరే. ఇంక ఆ తర్వాత రచయిత నానుండి వేరే వేరే ఆశించటం సరా? నా అభిప్రాయానికి మూల్యం పాఠకురాలిని నేను నిర్ణయిస్తే, రచయితకు కట్టసాధ్యమా? నేను పుస్తకాలు కొనుక్కుని, కొన్ని దశాబ్దాలుగా సంతృప్తిగా చదువుకుంటూనే ఉన్నాను. ఫీడ్ బేక్ అడగనందువలనేమో, మరణించిన రచయితల రచనల మీద నాకు ఎక్కువ అభిమానం.
సమీక్షలు నేను చదవను. ఒకవేళ false pretenses/for their own reasons తో నాతో చదివిస్తే, ఇక ఆ అసలు పుస్తకం చదివే ఆసక్తి నాకుండదు. అలాగే ఘోస్ట్ రైటర్ల రైటింగ్స్ కూడా. తన అనుభవాలు వేరే వాడితో ఎవరైనా ఎలా చెప్పిస్తారు? అది ఉత్త బోగస్ రైటింగ్. అలా రాయల్టీ లాగా ఫీలయ్యే ఒబామాలూ, హేరీలూ రాసేవి, నేను చదవను. అలాగే, ఇతరులకు మౌత్పీస్ లాగా మార్ఫ్ చెందినవారి రచనలు, తెలిసాక నేను చదవను. ఇవన్నీ అసలు పంట కళ్లచూడకుండా పరిగె ఏరుకు తింటున్నట్టు అనిపిస్తుంది. I don’t want that fluff.
ఇక్కడ నా ప్రతిపాదన ఏమనగా: యతి నిర్ణయము అక్షరముల ఉచ్చరణమునుబట్టి కూడ ఉండవలయునని. సంస్కృతపదములలో చకార, జకారములు తాలవ్యములు. అచ్చ తెలుగు పదములలో మాత్రమే కొన్ని అచ్చులతో [అ,ఆ, ఉ,ఊ, ఒ,ఓ, ఔ(అవు)] చకార జకారములను దంత్యములుగా ఉచ్చారణము చేస్తారు. (ఉర్దూలో జిందగీలాటి పదములు దంత్యములు, కాని తెలుగులో కాదు.) కేవలము వీటికి మాత్రమే తవర్గాక్షరములతో యతి ప్రతిపాదన. ఛందస్సులో అచ్చతెలుగు పదములకు కొన్ని చోటులలో ప్రత్యేకమైన నియమము గలదు, ఉదా. అద్రుచు, విద్రుచు లాటి పదములలో అ, వి అక్షరములు లఘువులు, గురువులు కావు. కాని ముద్ర, విద్రుమ వంటి సంస్కృత పదాలలో ము, వి అక్షరములు గురువులు, లఘువులు కావు. అదే విధముగా వైరి సమాసముల విషయములలో కూడ ముందున్న పదము తెలుగా లేక సంస్కృతమా అన్నది ముఖ్యము, ఇది అందరికి తెలిసిన విషయమే. నా ప్రశ్న: పలికేటప్పుడు తకార, దకారములతో వాడగా, అక్షరసామ్య యతి విషయములో ఎందుకిది నిషిద్ధము? నియమములు మనము ఏర్పరచినవే. కవిజనాశ్రయములో కొన్ని యతులు మాత్రమే ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు వాడుక రీత్యా, ఉచ్చరణము రీత్యా ఎక్కువైనది కదా? ఋకార యతికి బహుళత్వము, దంత్య చకార, జకారములకు తవర్గముతో యతి అంగీకరణము ఎందుకు చేయరాదు?
వీటితో మ,వ అక్షరములకు యతి అవసరమా అని ఆలోచించినాను. తమిళములో ఈ రెండక్షరములకు యతి అంగీకృతము. అట్టి పదములు తెలుగులో ఉండినను, దాని సంఖ్య చాల తక్కువ (మామిడి – మావిడి, మామ – మావ, ఇత్యాదులు) అందువలన దానిని పేర్కొనలేదు.
మీరు ప్రస్తావించిన ఋకారమునకు రి, రె, రే,రు ఇత్యాది యతులు పూర్వకవులు ఉపయోగించినవే కాని అన్యములు గావు. కానిదంత్య చ,జ లకు ఏమాత్రము ధ్వనిసామ్యము లేని తవర్గాక్షరములతో యతి నంగీకరించుట అభిలషణీయ మను మీ నూతనప్రతిపాదన నాదృష్టిలో సమర్థనీయముగా లేదు. మీరిచ్చిన పుచ్చుకొని = పుత్సుకొని, పచ్చలు = పత్సలు అను ఉదాహరణములలోని పత్సలు, పుత్సుకొని అను పదాలలో తకారమునకు గల సకారసంయోగముతో చకారసామ్యధ్వని యుండుటచేత, చ,ఛ, జ,ఝ,శ,ష,స- లకు లక్షణగ్రంథములలో చెప్పబడిన యతిమైత్రిద్వారా ‘చ్చు’, ‘చ్చ’లతో ధ్వనిసామ్యం కల్గింది గాని, కేవలం పుత్తుకొని, పత్తలు అని ఉంటే యతిమైత్రికి ఆస్కారమనేదే లేదని నా ఉద్దేశ్యం. ఇక్కడ చ,జ లంటే, చ,ౘ, జ, ౙ లను నాల్గక్షరాలని గుర్తుంచుకొనవలెను.
మంచి ప్రశ్నే. మతం ఎప్పుడెప్పుడు రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటుందో, అప్పుడల్లా రాజకీయాల చేతిలో అది కీలుబొమ్మలాగా మారిపోక తప్పలేదు. ఒక్కసారి మతం లోని మూఢత్వపు రుచిలో జనాన్ని ముంచడం వల్ల కలిగే రాజకీయ ప్రయోజనాలు అర్థమయ్యాక రాజకీయం దాన్ని వదులుకోలేదు. నిజానికి మతం యొక్క అవసరం సమాజానికో, మనిషికో లేకపోతే ఇంతకాలం మతం మనగలిగేది కాదు. మతం కొన్నిరోగాలకు ఒక వైద్యం లాగానే పనిచేస్తుంది. కాని కొన్నిసార్లు రోగం కంటే వైద్యమే భయకరమైన జబ్బుగా మారిపోతుంది.
నిజమే భాస్కర్ గారూ!
చారిత్రిక సాహిత్యమూ, సిద్ధాంత పరమైన సాహిత్యమూ — వీటిలో ఏది దేనికి పనికొస్తుంది అని ఆలోచిస్తే… సాహిత్యం ద్వారా వర్గ పోరాట దారులు ఎప్పుడెప్పుడు రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటారో, అప్పుడల్లా సిద్ధాంత పరమైన సాహిత్యం చేతిలో రచయిత కీలుబొమ్మలాగా మారిపోక తప్పలేదు అనేది మరో సారి నిరూపణ అవుతుంది.
మీరు రాసిన దానిలో అన్నీ సత్య దూరాలన్న సంగతి మీ కన్నా బౌద్ధులకు ఎక్కువ తెలుసు. ఒక ఇండియాన జోన్స్ మూవీలా రాసి ఉంటే బావుండును భిక్ష పాత్ర గురించి. అది కాలేదు. ఎక్కడి మగధ?ఎక్కడి గయ?ఎక్కడ సంఘూడు? చివరికి ఎదో ప్రశ్నల సణుగుడులో మునిగి పోయారు. అసలు వైజాగ్ చుట్టుపక్కల కొండల మీద ఉన్న బౌద్ధ ఆరామాలు 1971 యుద్ధమప్పుడు యుద్ధ విమానాలు తీసిన ఫోటోల నుంచి బయట పడ్డాయి అన్న విషయం మీరు ఎందుకు ప్రాస్తావించ లేదూఅనేది చాలు.. కథ అసలు ఉద్దేశ్యం అర్ధమవడానికి. నిజాయితీ మొదటి సారి మీ రచనలో లోపించింది. కానీ చివరికి వచ్చేసరికి ఒక్క ప్రశ్న జవాబులో అసలు భాస్కరుడు ఉదయించాడు. కానీ ఆలస్యం ఆయ్యీపోయింది.
దిల్ దఢక్నేదో అంటే అదొక్కటేనా అతగాడికి వచ్చింది… ఆవిడకి ఇవ్వ గలిగేది. అని నాలాంటి వారికనిపించినా…
ఈ మధ్య మా కుటుంబంలో జరిగిన ఒకానొక విషయం నన్ను ఈ కధని ఒప్పుకునేలా చేసింది. కాకపోతే కధలో రచయిత్రి స్వేచ్చ. అది తప్పా ఇంకేదీ చేతకాని మొగుడితో పిల్లలుండడం మూలంగా కలిపేసింది. ఇలలో మాత్రం మగాడి స్వేచ్చ ఆడది ప్రశ్నించినందుకు. ఆయనగారి మగతనపు ఆత్మాభిమానం దెబ్బతిని వాదించుకోడాలు శృతిమించి స్వేచ్చకోసం, కొత్తగా పెళ్ళైన జంట విడాకుల కోసం సిద్ధంగా ఉండి కౌన్సిలింగ్ కి పంపించాము. ఏం జరుగుతుందో ఏమో.
కోవిడ్ మూలంగా చాలా కొత్త రకం సమస్యలు. కాకపోతే కొత్త సీసాలో పాత సారా. అంతే తప్ప అర్ధం చేసుకునే గుణాలు మాత్రం కేవలం కధల్లోనూ నవలల్లోనూ మాత్రమే వ్యక్తీకరిస్తున్నారు తప్ప, నిజానికీ ఎవరూ కూడా తగ్గేదే లేదు అనుకుంటూ రెచ్చి పోతున్నారు.
మధ్యలో లాభపడుతున్నది గంటకి 500 నుంచి 1000 రూపాయలకి పెంచుకున్న కౌన్సిలర్లు. సమస్య వినిపించడానికి పోతే ఆర్ధిక స్థితిగతులు కనుక్కుని “ఏమమ్మా నీకు సంసారం కావాలా, విడాకులు కావాలా, నీకేది కావాలంటే అలానే చేద్దాం అంటున్నారు” అని చెపితే నాకు అర్ధం కాక తల పట్టుకున్నా. బహుశా మీలాంటి రచయిత్రులు ఆ కౌన్సిలింగ్ రంగంలోకి దిగితే నాలుగు కుటుంబాలు నిలబడతాయేమో అనిపించింది.
ఇక్కడ పుస్తకాలు అచ్చు వేసుకొనేవారిని మీరు మీ సంపాదకీయంలో కాస్త అపహాస్యం చేశారు. నిజమే, ఇప్పుడు తెలుగునాట ఊకదంపుడు ఉపన్యాసాలు ఎక్కువయ్యాయి. అయితే ఇవి నిన్నటి తరంలోనూ ఉన్నాయి. సాహిత్యం – మరీ ముఖ్యంగా కవిత్వం – ఎవడూ అమ్ముకోగలనని వేసుకోడు. మన సంస్కృతిలో భక్తిసాహిత్యాన్ని కవిత్వం (ఆధునిక కవిత్వం) ఎప్పుడూ మించలేదు. కవులంతా పుస్తకాలు అచ్చు వేసి పంచిపెట్టుకునేవారే. ఇది దాదాపు నిష్కామకర్మ. ఇది passionతో చేసేది, ప్రతిఫలాపేక్ష కోసం కాదు. నాకు పాశ్చాత్యదేశాల్లోని పుస్తకావిష్కరణోత్సవాలు ఎలా జరుగుతాయో చిన్న అవగాహన ఉంది. నిజమే. అదే సరైనదేమో! అయినా మన సంస్కృతి మనది. (దుః)శాలువాలు కప్పడం, వక్తలు ప్రసంగించడం, వగైరా. ఒక మాట నిజం. తెలుగునాట కవిత్వపఠనం డబ్బుపెట్టి కొనుక్కునేంతటి విలువైనది కాదు (Reading poetry is not an experience worth paying for!) ఎవడూ కొనడు. ఇచ్చినా చదివేవారు తక్కువ. చదివినా స్పందించేవారు ఇంకా తక్కువ. ఇది అందరికీ తెలిసినదే. మీరు ఐదువందలకాపీలు అన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య నూటికో రెండొందలకో తగ్గింది కూడా. ఇంకా మీరన్నారు ఇలా:
“రచన నిజంగా గొప్పగా ఉంటే పాఠకుడే అడిగి మరీ కొనుక్కుంటాడు అన్న విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, తన రచన మీద గౌరవం ఉన్న ఏ రచయితా తన పుస్తకాన్ని ఉబ్బరగా ఎవరికీ ఇవ్వడు. ఇవ్వకూడదు.”
నేను మీతో విభేదిస్తున్నాను. కాస్త ఇటు చూడండి. ఈ అపహాస్యం బాగోలేదు. మీరు ఏ దంతప్రాకారంలో (ivory tower) ఉండి చెబుతున్నారో గానీ, మీతో ఏకీభవించేవారెవరూ తెలుగునాట ఉండరు. ఇది నా స్వానుభవం. నేను మీరన్నట్టు నా కవితా సంపుటి (“కాసేపు”) అచ్చువేసుకొని పంచిపెట్టుకున్నవాడినే.
-వాసు-
[వాసుగారూ, ఉంటే గింటే కొండొకచో ఆవేశము, ఆక్రోశమూ ఉన్నాయేమో కాని ఎవరినీ అపహాస్యం చేసే ఉద్దేశ్యం మాకు ఏ కోశానా లేదండీ. మేము అందరిలా నేల మీద ఉండే, నాల్గువైపులా చూసి గమనించే చెప్తున్నాం, చెప్పదలచుకుంది ఏదైనా – సం.]
కలివె విశ్వనాథం గారి ఉపన్యాసాల లింక్ గురించి ఇంతకు ముందు చెప్పినందుకు సంతోషం. చదివాను శక్తి కొద్దీ. కాని ఇంగ్లిష్ అక్షరాలు కనపడక, ప్రతి బాగోనందున, ఆయన విద్వత్తు నాకు ఆనందించటానికి వీలవదు. It’s my loss. I really wish I can read his lectures on English poetry.
దాశరథి తెలుగు కవిత్వం ఆంధ్రభారతిలో చదువుతున్నాను. మీరిచ్చిన మీ కవిత నాకు బాగుంది. యాదాలాపంగా రచించినట్టుండే కవితలు నాకిష్టం. ఐనా మీరు బాగా చదువుకునుండేసరికి మధ్య మధ్య మీ విజ్ఞానం ఆడేపాడే పాటకు అడ్డం పడుతూ ఉంటుంది. I suppose you can’t help it. I like it.
This guy Frank O’ Ohara is a well-educated guy. I saw his poetry books in MOMA two years back, as an exhibit. A sample:
O god it is wonderful
To get out of bed
And drink too much coffee
And smoke too many cigarettes
And love you so much.
అలాటి కొందరి పొయట్రీ, కొందరి భారతీయుల, ఇతర దేశస్థుల ఆర్ట్, నేను చూస్తానికి వెళ్లినప్పుడూ, నేను రాసేవి ఇలా ఉంటయ్యి. మెమొరీ లోంచి కొన్ని పంక్తులు:
…
జడినానలో మేను తడిసింది తెలియదు
శిశిరం ఆకులు నాపై రాల్చింది తెలియదు
గడగడ చలిలో నేను వణికింది తెలియదు
నా దేశం వాసివనీ
నీవేదో చేసావని
ఆ బొమ్మ చూడాలనీ
ఆ రాత చదవాలనీ
నీ ఊహలు నాకు మెరిసి
నా ఊహలు నీకు తెలిసి
ఆ ఊహల ఉయ్యాల జమిలిగ ఊగాలనీ
Humoresque (హుమొరెస్క్యు) అంటే పాత్రల మానసిక స్థితిని తెలియజేసే కల్పిత హాస్యంతో కూడిన (చపలచిత్తమైన తెలివి ప్రదర్శన కాని) శృంగార సంగీత కళా ప్రక్రియగా వర్ణించవచ్చు అని గూగులమ్మ చెపుతోంది†.
ఆవిధంగా హుమొరెస్క్యు అనే పేరు యీ కధలోని అంతర్ సూత్రానికి (నిసి షామల్, పీటర్ కాన్రాయ్‌ల చెర్లాటలకి) చక్కగా సరిపోతున్నదేమో కదా ప్రియమైన తః తః గారూ?!
†Humoresque is a genre of romantic music characterized by pieces with fanciful humor in the sense of mood rather than wit.
“ఏనుగు డాక్టర్” అనాది తాత్వికతను ప్రస్థావించిన ఓ గొప్ప కధ… మీ మరో గొప్ప అనుసృజన. ప్రకృతితో మమేకం కాకుండా, ప్రకృతిలోని అన్ని జీవజాలాల ఉనికిని అర్ధంచేసుకోకుండా, వాటిని ప్రేమించకుండా మనిషి ఆదర్శవంత జీవిత మార్గం లోకి మళ్లలేడని తెలియజేస్థున్న కధను అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
అడవి మృగాలకూ ఇతర పెంపుడు జంతువులకూ వైద్యం చేస్తూ క్రమేణా ఏనుగుల స్పెషలిస్టుగా మారిన అటవీశాఖ జంతువైద్యుడు డాక్టర్ వి. కృష్ణమూర్తి గారి మౌలిక విలువల తాత్వికతని అడవితల్లి వొడిలో సేదతీర్చుకునే జయతి తల్లి (జయతి లోహితాక్షన్) బాగా అర్ధం చేసుకుంటారు.
అడవితల్లి వొడిలో సేదతీర్చుకోవాలనే ధ్యాసే కాని, పురుగూ పుట్రా ఉంటాయ్ అంటే …. అదంతా మనమేర్పరచుకున్న భయాందోళనల తప్పు అభిప్రాయాలు అంటూ నవ్విన; ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి సంధ్యలను ప్రకృతి వొడిలోనుండి వీక్షణానందజనిత తన్మయత్వంతో చూసే… ఎంతో మహోన్నతమైన సంతోషాలు ఈ భూమ్మీద అడవితల్లి ఒడిలో ఉన్నాయని తెలిసిన జయతి తల్లి (అడవి నుండి అడవికి జయతి లోహితాక్షన్) “ఏనుగు డాక్టర్” ను సాధికారికంగా బాగా అర్ధం చేసుకుంటారు.
నమస్కారం. వ్యాసం నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు.
ఒక ఇంగ్లీషు మాటకి సమతూకమైన దేశీ మాట కోసం వెతికినప్పుడు – ఒకొక్కసారి – ఏళ్ల తరబడి ఆలోచిస్తానండి. నేను ఎంపిక చేసిన మాట అనేక సందర్భాలలో నప్పుతుందో నప్పదో అని ఒక భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. చదివే వ్యక్తికి చదువుతూన్న సందర్భం ఒక్కటే కనిపిస్తుంది కాని నేను రాసేటప్పుడు ఇదే మాటని ఏ ఇతర సందర్భాలలో ఎలా ఉపయోగించేనో చూసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు పాఠకులు సూచించిన అభిప్రాయాలని మన్నించడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఒకసారి (ఏళ్ళ క్రితం) తః తః చేసిన విమర్శకి స్పందిస్తూ theory అన్న మాటని “వాదం” అనిన్నీ, theorem అన్న మాటని సిద్ధాంతం అనిన్నీ తెలిగించేను. కనుక మీ వ్యాఖ్యానం మీద నా స్పందన ఎలా ఉంటుందో అని మీకు కుతూహలంగా ఉంటే కొన్నేళ్ళు ఆగి చూడండి.
ఇవి అచ్చు తప్పులా లేక నా అజ్ఞానానికి పరీక్షలా అనే అనుమానంతొనే సుమా…
హర్మ్యమున
సంపర్కము
ఎన్నొమార్లు
సర్వము
[ఎన్నోమార్లు అని ఉండాలి. కాని కవిస్వేచ్ఛలో భాగంగా అది ఎన్నొమార్లు అనే ఉంచాం. మిగతా పదాలలో మాకు ఏ తప్పులూ కనపడలేదు. ఎందుకు తప్పనిపించిందో చెప్పగలరు – సం.]
ప్రాచీన కొలమానం వివరణ చాల బాగుంది. మాది వ్యవసాయ కుటుంబం. ఈ పదాలు వేసవి శెలవుల్లో మా అమ్మమ్మ గారి ఊర్లో వినేవాడిని. తూకానికి ఏబళం అనేవారు అంటే అయిదు పలాలు. మూడు తులాలు ఒక పలం. ఈ వ్యాసం లో సహకరించిన పరుచూరివారికి నా మనవి.ఘంటసాల గారు పాడిన ఒక పాట తండ్రి పుత్రునికి సదా రుణ పడి ఉంటాడని భావం తో ఉంటుంది. ఆ తరంగం అందించమని విన్నపం
అక్టోబర్ 2021 గురించి జయంతి వివిఎస్ మూర్తి గారి అభిప్రాయం:
10/03/2021 12:17 pm
తెలుగులో రచయితల కంటె విమర్శకులు ఎక్కువ ఉన్నారనిపిస్తోంది. ఇప్పుడు వస్తున్న సాహిత్యం పూర్తిగా పనికిమాలినది కాదు. కాకపోతే రచయితలకు కథా వస్తువులుగా బలమైన సామాజిక సమస్యలు లేవు. నేటి సంక్షేమ పథకాల పుణ్యమా అని అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక స్థాయిలో హాయిగా ఉన్నారు. వర్గ పోరాటాలను ప్రతిబింబించే విధంగా వ్రాయాల్సిన అవసరం కనపడటం లేదు. అయినా మానవతా విలువల గురించి, కుటుంబ వ్యవస్థ లో వస్తున్న పెను మార్పుల గురించి, సున్నితమైన స్త్రీ పురుష సంబంధాలు దెబ్బతిని మనుషులు బండబారిపోవడం గురించి, శాడిజం గురించి, ఇతరులను నమ్మించి మోసం చేయడం అనేది ఒక కళగా గౌరవింప బడటం గురించి మంచి కథలు వస్తున్నాయి. కాని మంచి రచయితలు ఒకచోట చేరి చర్చించుకునే తీరిక, ఓపిక, వేదిక కరువయ్యాయి. కథల్లో థ్రిల్ కు పెద్దపీట వేస్తున్నారు. అందువల్ల నేటివిటీ కరువై, విదేశీ వాసనలతో కథలు కృతకంగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితి మారి సమాజంలోని వివిధ సమస్యలపై కథలు వస్తే బాగుంటుంది.
నిన్ననే మొట్టమొదటిసారి మెక్‌బెత్ చదినాను. అది కూడా వచన రూపంలో. అది కూడా పిల్లల కొరకు రాసిన క్లుప్త రూపంలో. మూలం చదవాలన్న కుతూహలంతో అంతర్జాలంలో వెతికి మొదలుపెట్టేను. కాని భాష, భావం రెండూ అర్థం కాలేదు. ఇంతలో, ఈ రోజు, కాకతాళీయంగా ఈ వ్యాసం నా కళ్ళపడింది. దీనిని ఆసరాగా తీసుకుని మెక్‌బెత్ మూలం మరొకసారి చదువుతాను. రచయితకి ధన్యవాదాలు. పేరడైజ్ లాస్ట్ కూడా మరొకసారి చదవాలేమో! చూద్దాం.
ఊహల ఊట 2 గురించి ఉప్పలూరి ఆత్రేయ శర్మ గారి అభిప్రాయం:
09/14/2021 10:08 am
చాగంటి తులసిగారి ఊహల ఊట తరుగెరగని అసలు సిసలైన “జల”తారు వన్నెల తెలుగు అందాల బంగరు నీటి గని. చిన్న వయసులోని చిలిపి ఆడపిల్ల చెంగుచెంగున వాకిలంతా, పెరడంతా కాళ్ళ గజ్జెలు ఘల్లుఘల్లుమని గంతులేసినట్లు చిన్న తులసిగారి మాటల మూటల బుల్లి తూటాలు అన్నివైపులా పేలుతూ అపుడపుడు తికమక పెడుతున్నట్లు కనపడినా చదువరులనందరినీ తమకానికి గురి చేస్తాయి. బాల్య స్మృతుల హరివిల్లు రంగులను తెలుగు సొగసులతో మిళితం చేసి “ఈమాట” ద్వారా చక్కని బాట వేస్తున్న చాగంటి చిఱుతకు నా ఉల్లపు లోతులనుంచి వెల్లువలా జారువాలే అభినందన పారిజాతాలు.
Enjoyed the essay.
The following poem of mine composed 10 or 12 years back, explains itself.
Eliot and Bacon
సుతి లేని ఎలియట్ కి
మతి లేని పెళ్ళాం
శివ శివా! శివ శివా!
అతలాకుతలం అతని ప్రపంచం.
ఇంటిలోని పోరు ఇంతింత కానపుడు
హరి హరీ! హరి హరీ ! ఇంకేదిరా దారీ!
హార్వర్డులో చదువు, ఆక్స్ ఫోర్డులో చదువు, కాని
పిచ్చి పెళ్ళామున్న, కచ్చి కవితలె పుట్టు
కవితలో రట్టు గద అతివపై అతి కసి.
కాగితంపై వక్ర విషాదమే కురిసింది
బ్రతుకు ఇవ్వని సుఖము
సాహితీ బహుమతులలో మెరిసింది!
అతని కన్న ఘనుడు అతని అడారి అభిమాని
ఏథియిస్టు, హోమో, ఫ్రాన్సిస్ బేకన్
ఒకరి కళ వేస్ట్ లేండ్, మరొకరి కళ వాస్ట్ మోర్గ్
బేకన్ కేన్వాసు మీదంతా కార్కాసులే గదా
ఆ కేజ్ లో మనుషులా, మరి మాంసపు ముద్దలా!!
ఎంత జంతువు, ఎంత బందీ, ఎంత బాధ ఇతని మనిషి
ఎంత న్యూనత, ఎంత హేళన, ఎంత శూన్యత ఇతని మనిషి
అందుకేనా అతని కామి జార్జ్ డయర్,
ఆ ఆర్టిస్ట్ అసహ్యాన్నీ,అసహనాన్నీ అనుభవించీ
అనుభవించీ, తనను తానే చంపుకుందీ?
టేట్ బ్రిటన్ లో ఈ కాళకళ విలయనృత్యం
చూసి నే నివ్వెర పోతే, కాలు కదలక నిలిచిపోతే
ప్రళయ వేగంతో పరుగులెత్తే స్ప్రింటర్ల మార్గంలోంచి,
ఇతర ప్రేక్షకులు నన్ను పక్కకు లాగారు.
నాకేం తెలుసు, టేట్ లో ఇప్పుడు
ఆర్టే కాక రన్నింగు కూడా ఎక్సిబిట్ చెయ్యొచ్చని!:-)
గాడ్! ఆ స్ప్రింటర్లు -ఆ వేగపు చలనపు మాస్,
నా స్తంభించిన బాడీని కొడితే
నే ఫట్ ఫట్ పేలిపోయి, నా మాంసం, నా రక్తం, నా ఎముకల
స్ప్లింటర్లు పక్కన గేలరీ తెల్ల గోడలకు ప్లాస్టరైతే,
నేనే ఫ్రాన్సిస్ బేకన్ పాస్తుమస్ మాస్టర్ పీసును.
నే మ్యూసియం గోడ మీంచి – స్వీనీ స్వీటు గొంతులో
“Birth and copulation and death
That’s all the facts when you come to brass tacks”
అని ఎప్పటికీ పాడుతూ ఉండే పని.
అంతేనా, అంతేనా, మళ్ళీ
” Birth and copulation, and death
I have been born, and once is enough.
You don’t remember, but I remember,
Once is enough ”
జననం, సంగమం, ఖననం
ఒకసారి అయ్యింది చాలు
నీకు గుర్తులేదూ! నాకు గుర్తుంది!
ఒకసారి అయ్యింది చాలు:-)
ఈ మరుభూమిలో మరుజన్మ వద్దు
మహదేవా! శివా! శివా! అని
గోడమీద బేకన్ బొమ్మగా, ఎలియట్ పొయెట్రీగా
అతుక్కుపోయి గోల గోల చేసే పని.
ఒక పెళ్ళీడుకొచ్చిన సగటు మధ్య తరగతి (ఆర్ధిక,వర్చస్సు) ఆడపిల్ల ఆలోచనలు, నిర్ణయాలు, రెండో పెళ్ళికి సమాజం చేసే సూటి, పోటు మాటలు సుధగారు చిన్న కథలో ఆడపిల్లల అంతర్మదనాన్ని చాలా లోతుగా, సున్నితంగా తెలియజేసారు.
“పెద్దగా ఇష్టం లేకపోయినా ఇంతకంటే బెటర్ ఛాయిస్ లేక ఆ చాలీచాలని అసౌకర్యాల బ్రతుకునుంచి బయటపడటానికే ఈ పెళ్లి చేసుకున్నానని వాళ్లకి తెలియదు కదా” అని చెప్పుకుంటుంది విజ్జి. పరిస్థితులు, రెండో పెళ్ళి వాడు అనే సర్ధుబాటుతనం అమ్మలక్కల నిష్టూరపు మాటల వల్లనేమొ విజ్జికి మొదటి రాత్రి తంతు అయిష్టత కలిగిస్తుంది. పెళ్ళి నిజానికి ఇద్దరి వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని అధికారికంగా ఇచ్చే లైసెన్సే. కాని పరిణితి కల్గిన వ్యక్తులు ముందు ఒకరినొకరు అర్ధం చేసుకోడానికి, ఒకరిపై మరొకరిని ఇష్టం కలిగే వాతవరణాన్ని సృష్టించుకోవాలి. లైసెన్సు దొరికేసింది కదా అని అమాంతంగా దూకేస్తే ఇలాగే ఉంటుంది.
పెళ్ళైయ్యాక విజ్జికి రామారావు కూతురు డాలి ప్రవర్తన ఒక సవాలుగా మారుతుంది. అది డాలికి వాళ్ళమ్మ నుండి వచ్చిందే .. “ఆఁ! అయినా ఆ కరుణా అంతే, మూగ మొద్దులా ఉండేది” అంటుంది ఒకామే. కొంత మంది తొందరగా ఎవరితోను కలవరు. వారి ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది. కొత్త వాళ్ళని తొందరగా ఇష్టపడరు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా వాళ్ళ ప్రపంచం ఒకటి వేరే ఉంటుంది. బహుశా డాలిది అలాంటి మనస్థత్వమేమో!
నిజంగా మనుషుల మధ్య బంధాలు బలపడాలంటే జివితాల్లో నటించడం మానేయ్యలి. మనం మనలా ఉండాలి. పైకి ఎవరూ చెప్పకపోయినా నటనకు,నిజానికి తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ విషయాల్ని సుధగారు పాత్రల్లో చాల చక్కగా చెప్పారు.
నేనింతకు ముందు Gerald Manley Hopkins కవిత్వం చదవలేదు. సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు, ప్రత్యేకించి పరిచయం చేసిన హాప్కిన్స్ పద్యాలు చక్కగా బోధపడి ఆయన ఇచ్చిన తెలుగు తర్జుమాలు అందంగా ఉండి ఆనందింపచేసాయి. ఇక్కడి పరిచయం రసవత్తరంగా ఉండినందున నెట్ లో హాప్కిన్స్ వి వీలైనన్ని కవితలు చదివాను. పొయెట్రీ లోని భావం, ప్రాసొడీ చిత్ర విచిత్రాలు, మళ్లీ మళ్లీ చదవగా కొంత మెరుగ్గా తెలుస్తున్నవి.
తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ పొయట్రీ -ఇంగ్లిష్ లోనే, తెలుగుసేత కన్నా బాగా అర్థం అవుతుందేమో. తెలుగు రాని తెలుగు వాళ్లున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వాళ్లిప్పుడున్నారా? సంస్కృతం, అరవం, కన్నడం ఇలా ఇతర భాషలు రాని తెలుగు వారున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వారున్నారా? మరొకటి. రచయిత ఇంగ్లిష్ పొయట్రీని విప్పి చెపుతారు, కాని సంస్కృత వాక్యాలను అర్థం చెప్పకుండా వదిలేస్తారు. అదేం పని! ఎందుకని! సంస్కృతం కన్నా, ఇంగ్లిష్ తెలిసిన వారే పాఠకులలో ఎక్కువమంది కాదా? ఇంత నేర్పరి రచయిత, విప్పి చెప్పటమే తన రచన ముఖ్యోద్దేశమైనప్పుడు సగం సగం చెప్పి వదిలెయ్యటం సరికాదు. ఐనా ఏక కాలంలో కొంత తెలుగు భాషను, కొంత ఇంగ్లిష్, వెనకటి కవుల, ఫిలాసఫర్ల పరిచయాలు ఏ రకంగా తెలుసుకున్నా ఆనంద దాయకమే. ఈ పత్రికలో ఇచ్చిన, సూరపరాజు గారి రచనలన్నీ చదువుతున్నాను. Thanks.
ఈ Hopkins కవి కవితలు, ఇక ముందైనా ట్యూటరింగ్ లేకుండా నాకు అర్థంకావనుకుంటాను. నాకు క్రిస్టియానిటీతో కొంత పరిచయం ఉన్నా, కవి కాలం నాటి ఇతరుల కవిత్వంతో కొంత పరిచయం ఉన్నా, ఈ జెస్యూట్ కవిని గ్రహించుకోటానికి ఇంకా చాలాసార్లు చదివితే తప్పించి నాకది సాధ్యపడదు.
ఉదాహరణకు The Wreck of Deutschland పద్యం. ఆ పొడుగు కవితలో ఉన్న 35 సానెట్స్ బిబ్లికల్ భావాలు, లిరికల్ బ్యూటీ అర్థం కాటానికి ప్రత్యేకించి poetry class తీసుకోవలసిందే. ఈ కవితపై సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారి ప్రచురించబడిన పుస్తకంలో గాని పూర్తి వివరణ ఉంటే వారి పుస్తకం, మరో ఇతరులు ఇంగ్లిష్ లో రాసిన మరో పుస్తకం తెప్పించుకుని చదవాలి.
ఈ ‘wreck’ పద్యం పైకి stanza After stanza చదువుతుంటే అందులోని మ్యూజిక్ ఆనందపరుస్తున్నది. హాప్కిన్స్, ఒక పద్యపాదంలో మెలడీ, మరో పాదంలో కౌంటర్ పాయింట్ రాసాడంటే, నాకు మురిపెం. ఈ పొడుగు పద్యం ఒక అందమైన తయారీ. ఒక శిల్పకారితనం. ఒక విషాద సంఘటనను, ఒక ప్రీస్ట్ లిఖించటంలో ఇంత పనితనమా? అని నాకు అచ్చెరపాటు.
(మాటలో మాట! కొద్ది రోజుల క్రితం ఈ పత్రికలో వేటూరి సినిమా పాటల గురించిన ప్రసక్తి, పాఠకులు తెచ్చినందున ఆ వ్యాసం మళ్లీ చదివాను. నేనిప్పుడు హాప్కిన్స్ సానెట్స్, వేటూరి పాటలు కొన్ని పక్కపక్కనే చదవొచ్చు. ఇద్దరి శబ్ద ప్రయోగాలు, కొత్త మాటల తయారీ విధానాలు గమనించవచ్చును. That excites me.)
The Wreck of Deutschland చదువుతుంటే, నాకు పూర్వపు కొందరి ఆర్టిస్ట్ ల, (J.W. Turner లాటి) shipwreck పెయింటింగ్స్ చూడాలనిపించింది. చూసాను. క్రితంలో నేను రాసిన ఈ కిందున్న ఒక పొయెమ్ నా మనసులో మెదిలింది. ఒక స్త్రీ నలుగురి దగ్గరి బంధువుల ఆకస్మికమరణానికి sea drowning తో, ship కు she తో, death కు sea తో, ఇందులో అన్వయం.
All of a Sudden
Three brethren have fallen
And wriggled helplessly in Sea.
The death wave is so massive
It swept them all away
The first mate didn’t even
Know he is dying.
She sees her ship keel
She is not made of steel.
She will wail and reel,
She has no hope to heal.
There is no mainland in sight
There is no island to maroon
A life spent in to and fro freight
She now awaits her own swoon.
The Sea waves rise and fall
Every seaman knows its roar
Every creature knows its fury
Every day begging for small mercies
With fear in hearts, they live and die.
“కప్ప దొరకాలని పాములు కోరుకుంటాయి. తప్పించుకోవాలని కప్పలు కోరుకుంటాయి. తప్పించుకోవడం, దొరికించుకోవడం అనేది వాటికున్న ఒడుపు వల్ల వస్తది. పాము ఒడుపుతో ఇంకో కప్పని దొరికించుకోవచ్చు. కప్ప చురుగ్గా లేనిరోజు ఇంకో పాము నోట్లో పడొచ్చు. నీటిపాము కప్పని పట్టుకోవచ్చు. కాని ఎండ్రకాయని పట్టుకోవాలనుకుంటే దాని చావు అది తెచ్చుకున్నట్లే.”
మనుషులు అవసరాల్లో అవకాశాల్ని ఎంత బాగా మలుచుకుంటారో పై చిన్న ఉదాహరణ ద్వారా కథకు అనుసంధానించిన విధానం చాలా చక్కగా నేర్పుగా ఉంది.
“బలహీనతల్ని దగ్గరుండి చూసిన మనిషి. మనం అడక్కుండానే అంత పెద్ద సాయం చేశాడంటే అతను సులువుగా నమ్మకాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఎంచుకున్నాడు. బలహీనులుగా కనపడుతూ మన బలహీనతలని ఆసరా చేసుకొని అతినమ్మకంగా మనదగ్గర అడుగుపెట్టాలనుకొనే వాళ్ళ వెనుక బలమైన ఆలోచనుంటుంది. ఎందుకో అది మనకి మంచిది కాదనిపించింది. ఆశలు, అవసరాలు పెరిగేకొద్ది అవకాశం దొరికితే మనమైనా మన పరిధులు దాటి వెళ్తాం. అది తప్పుగా కూడా అనిపించదు. అంత అవకాశం అతనికివ్వడం అనవసరమనిపించింది. అందుకే డబ్బులిచ్చి పంపా. అది అతన్ని తక్కువ చేయడం కాదు. మనల్ని మనం సేఫ్ జోన్‌లో ఉంచుకోవడం”
మనుషుల ఆలోచనల్ని చదవగలిగినవారే రాబోయే ప్రమాదాల్ని నివారించుకోగలరు. కరుణలో చూపిన నిశిత దృష్టి, దూరాలోచన ఎంతో బావున్నాయి.
గిరి తన తమ్ముడు పుట్టకముందే నాలో స్వార్థం పుట్టింది అంటాడు. నిజమేనేమో ముందు స్వార్ధం పుట్టి తర్వాత మనిషి పుట్టాడేమో. తోడబుట్టిన వాళ్ళు కూడా ఏదో విషయంలో అది అందం, ఆస్తి, హోదా, పరపతి, చదువు ఏదైన కావచ్చు. వాళ్ళు తన కంటే ఎత్తులో ఉంటే తట్టుకోలేని, ఓర్చుకోలేని మానసిక వైకల్యం చాలా ప్రమాదకరం. అది తారాస్థాయికి చేరినప్పుడు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటుంది, చివరకు ప్రాణాలు తీయడానికి కూడ వెనుకాడదు.
అతి స్వార్దం చాలా కౄరమైంది. తనకు చెందినది వేరొకరితో పంచుకోలేని స్వార్ధం కొంత వరకు భరించొచ్చు. కాని ఎదుటివాడు నాకంటే ఓ మెట్టు ఎత్తులో ఉండకూడదు. నేనే ఉండాలి అనే స్వార్ధం మనిషిని దహించి వేస్తుంది. ఆ ఈర్ష్యగ్నిలో నీతి నియమాలు, బంధాలు అన్నీ ఆహుతైపోతాయి. గిరి లాంటి తెలివైన వాళ్ళు ఎదుటి వాడికి అందకుండా తమ పగ తీర్చుకుంటారు. కాని ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అదే విషయాన్ని గిరి ఇలా అనుకుంటాడు.”ఎవ్వరూ గుర్తు పట్టలేనంత బలంగా ముసుగేసుకున్నా వాడు మాత్రం నా ముసుగెనక అసలు స్వరూపాన్ని గుర్తించేవాడు. అది భరించలేక ప్రతిసారి గొడవపడేవాడు. నిజాయితీ అంటే అదేనేమో! అదే వాడ్ని జనానికి తప్పుటోడుగా కనిపించేట్లు చేసేది.”
కాని వాళ్ళు ఎంత మంచి మనుషులుగా నటించినా, తన ఆత్మసాక్షికి, వాళ్ళు కట్టుకున్న వాళ్ళకు ఎతువంటి వాళ్ళో తెలిసిపోతుంది అందుకే గిరి భారయ “‘ఆఁ, ఈన మాత్రం తక్కువా? కనిపించడు కాని…’ అంటుంది. ఇక మనిషిలోని కుళ్ళు, కుతంత్రం ఎదుటి వాళ్ళు పసిగట్టకా వాళ్ళ ముందు బతకడం చాలా దుర్భరంగా ఉంటుంది.
స్వార్ధం,పెరాశ,ద్వేషం,ఈర్ష్య లాంటి విషయల్ని రచయిత్రి కథలోని పాత్రలతో వ్యక్తపరిచిన విదానం చాలా బావుంది. మనుసు లోతుల్లోని భావాల్ని పట్టుకోవడంలో రచయిత్రి దిట్ట.
ఊహల ఊట 1 గురించి పవన్ కుమార్ రెడ్డి.సి గారి అభిప్రాయం:
06/01/2021 10:25 am
😊 ఆ చిన్న జేబులు, అందులోని కొన్ని చేగోడీలకే ఇన్ని కబుర్లయితే
ఇహ వాళ్ల నాన్నారికున్నట్లు పే…ద్ద జేబులున్న గౌను కుట్టిస్తే
వాటినిండా అమ్మ చేసిన నూనంటని చేగోడీలు నింపుకుంటే
అవయిపోయేదాకా ఇంకెన్ని కబుర్లో కదా
మొత్తానికి నాగమణి రాకముందే అన్నీ పలారం కానిచ్చేసిందనమాట😊😊
పాపం నాగమణి…😎
అడవి పుస్తకం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
05/13/2021 8:58 pm
డా. లైలా యెర్నేని గారు, నమస్కారములు.
‘అడవి పుస్తకం’ గురించి క్రిందపొందుపరిచిన సోమ భూపాల్ గారి వ్యాఖ్యానం దయచేసి చూడండోసారి.
ఫేస్బుక్లో జయతి లోహితాక్షన్ గారి పోస్ట్‌లు; వారు తీసిన అడవి, అడవి బిడ్డల అరుదైన ఫొటోలు చూడండి. దాసరి అమరేంద్ర గారు, కాకినాడ అక్కయ్య డా. వాడ్రేవు వీరలక్ష్మి, వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఇంకా ఎందరెందరికో మల్లే తను మీకూ మరింత దగ్గరిగా పరిచయమవుతారు. మీ అభిమానానానికి పాత్రులవుతారు.
అడవి మాట పక్కన పెట్టి జయతికి తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాల పట్ల ఉన్న ఉత్తమ అభిరుచిని చూడండి. మీరు కనెక్ట్ అవుతారు.
________________________________________
అనంత చీకట్లో ఒక్కటే పాక, దాని ముందు చలిమంట, ఆ మంట ముందు మేము ముగ్గురం
( జయతి, లోహితాక్షన్, వైటీ.)
ఎక్కడో పుస్తకం మధ్యలో వస్తుంది ఈ మాట.నేను మెల్లగా కూరుకుపోతూ ఉన్నాను ఆ భావనలో.యజ్ఞం కాక మరేమిటి అది.యజ్ఞమే.అన్వేషనా యజ్ఞం.కాసేపు పుస్తకం కనపడలేదు నాకు.చీకటి,ముందు మంట.. అనంతమైన ఆకాశం…చేతికందే పాలపుంత.ఆమె ఇది కవిత్వంగా రాయలేదు.ఆ గాఢమైన అడవిలో కవిత్వంలా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు.
అడవి నుండి అడవికి మొదలై అడవి పుస్తకమైపోయిన ఇద్దరు మనుషులు, ఒక కుక్క-వైటీ. పుస్తకం చదివాక మీతో పంచుకోకుండా ఉండలేని కొన్ని విషయాలు ఇక్కడ ఉంచుతున్నాను.
ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నందున పుస్తకం మా ఊరు చేరింది. చేతికందడం ఆలస్యమైంది. ఎదురుచుస్తూ ఉన్నాను. వీలుచేసుకుని నేనే వెళ్లి పుస్తకం తెచ్చుకుని ఇక నిన్న ఉదయం తెరిచాను. నేను ఏదీ ఉహించుకోలేదు ఈ పుస్తకం గురించి. ఎందుకంటే ఇది ఏ ప్రముఖ రచయితో రాసిన కథో, కవితో, ఏ నవలో సీరియలో కాదిది.
ఈ పుస్తకం నిండైన ఒక అన్వేషి యదార్థ జీవన పథ అనుభవాల మాల.మనుషుల ఇరుకుతనం మధ్య, వాడిపోయిన మానవత్వం మధ్య ఇమడలేని ఒక సున్నిత పసి హృదయం పాడిన తన హృదయాంతరాల తపన. సత్యం కోసం అర్రులుచాస్తూ కొండల్లోకి, చిక్కటి అడవుల్లోకి, నదుల్లోకి, అనేక పూల వనాల్లోకి నిశ్చలంగా నడుస్తూ వెళ్లిన ఒక సాధకురాలు చెప్పిన అత్యంత పురాతన మార్మిక రహస్యం ఈ పుస్తకం.
“ఎడారిని చూడటమంటే ప్రియతముని జాడ తెలియడం” అని తన హృదయాంతరాల్లోంచి నాకు ఆ యోగిని గంభీరమైన స్వరం వినపడగానే నా చుట్టూ. నాలో ఒక నిశ్చలత ఆవరించింది. మరుక్షణమే ఎదో అలజడి కూడా.
ఏవీ వద్దు అనుకుని వెళ్లిపోయారంట అడవిలోకి… అనుకుని కాదు. అనుకుంటూ ఉంటే వెళ్లలేం అనుకుని… ఇక అనుకోకుండా వెళ్లిపోయారు. లోకమంటే అసహ్యమూ కాదు. జీవితమంటే నిర్వేదం అసలు కానే కాదు.ఏదీ కాదు. ఏదీ కానప్పుడు మరెందుకు అక్కడున్నారు అంటే “ఇక్కడెందుకు ఉండకూడదు?” అని ప్రశ్నించే తత్వం.
మాలా ఇక్కడ మనుషుల మధ్య ఎందుకు లేరు అంటే “మీరు కూడా మాలాగా అడవిలో ఎందుకు ఉండలేరు?” అని అడిగినట్లు అనిపిస్తుంది నాకు.నిజమే…
కొందరు లోకానికి చెందరు.వాళ్ళను ఆశ అనే గురుత్వాకర్షణ పట్టి ఉంచలేదు. నాది అనే చక్రంలో ఎల్లకాలం తిరుగుతూ ఉండలేరు. ఉండనివ్వదు వారి హృదయం. అలాగే జయతి లోహితాక్షన్లు కూడా లోకానికి చెందరు.వీళ్ళనుగానీ… ఈ పుస్తకాన్నిగానీ “ఇదీ” అని నిక్కచ్చిగా చెప్పలేము. ఒక విషయానికి పరిమితం చెయ్యనూలేము.
వాళ్లు అనంతమైన సత్య దర్శనానికి వెళ్లిపోయారంతే.
జయతిగారి సత్య సౌందర్య దాహానికి సహచరుడు లోహితాక్షన్ గారి సహకారం చరిత్రలో చెరగని ప్రేమ ముద్రగా నిలిచిపోతుంది. తండ్రిమాటను కాదనక రాముడు అడవులకెళ్తే..వెంట సీతాదేవి..లక్ష్మణుడు నడిచినట్టు… సీతాదేవి అడవులకు వెళ్తానంటే వెంట నడచిన ఒక రాముడు, అలాగే వైటీ… ఇది రామాయణంలా ఉంది అనిపిస్తోంది.
“నాకు అడవికి వెళ్లిపోవాలనీ, అడవికే సొంతమైపోవాలనీ, అక్కడే ఆ కొండల్లో ఉండిపోవాలనీ ఉంది” అని జయతిగారు చెప్పినప్పుడు మరొకరిలా “ఏమిటీ పిచ్చి? ఎందుకు అడవి?” అని కేకలేయకుండా
“సరే. నీ ఇష్టం” అని ప్రేమగా అనేంత సముద్రమంత హృదయం లోహితాక్షన్ గారిది. అన్నింటా వెంట ఉండి… వెన్నుగా నిలుస్తూ ఉన్నారు వారు.ఇద్దరూ సాధకులే.సాధువులే.
పగలంతా ప్రకృతి మాత వారిపై కురిపించిన సౌందర్య రసాన్ని హృదయ పాత్ర నిండా నింపుకుని… నింపుకున్న పాత్రను దోసిట్లో ఉంచుకుని జాగ్రత్తగా సాయంత్రానికి కుటీరాన్ని చేరుకుంటారు.గాఢమైన చీకటి పడ్డాక సత్య సౌందర్య రస పాత్ర చేతబుచ్చుకుని త్రాగుతూ అనంతమైన ఆనందంలో మునకలేస్తారు… వారిని చుస్తూ వైటీ కూడా ఆనందంతో గంతులేస్తుంది.
రేపు ఏమి తినాలి? అన్న పట్టింపు లేదు, ఎక్కడికెళ్లాలన్న ప్రణాళికా లేదు, అడవి,కొండ,కుటీరం,వైటీ తో కలసి ముగ్గురి జీవనం. తదేకమైన జీవితం. రోజులతరబడి ఒకే సంగీతం. నదిగలగలలు, జలపాతపు హోరు, జివ్వుమని వీచే మహా వృక్షాల శబ్దం…కుండపోత వర్షపు ఊపిరాడనీయని మ్రోత ఎప్పుడూ తదేకమైన జీవితమే. సుదూరపు అడవులను, కొండలను, నదులను అనంతమైన ఏడారులనూ కలగంటూ తదేకమైన చూపు.
సూర్యోదయ, సూర్యాస్తమయాలు కురిసే మెత్తటి నారింజ రంగు నీరెండలలో నిత్యం తడిసిపోతూ ఉంటారు ఈ అన్వేషకులు. చీకటి పడ్డ పున్నమి రోజులలో కుటీరపు ఆరుబయట కూర్చుని నింగినుండి భూమిపైకి పారే చల్లని వెన్నెల్లో సేదతీరుతారు ఈ పుణ్య దంపతులు.
వేవేల అడవి పూల చెట్లు రంగురంగుల పక్షులు మీదకు వాలే సీతాకోకచిలుకలు భూమిపై ఉండే ఆనందంమంతా వారిదే.
వాళ్ళు అడవికి చెందినవారు.అడవి అపార దయామయి వారికి. అడవి అందాలను ఫోటోలు తీస్తూ… కొన్నిసార్లు ఫోటోతీయలేక ఆ సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోవడం. ఇదొక అద్భుత యదార్థ జీవిత యాత్ర.
అంతా ఆనందమే కాదుగా. ఆకలుంటుంది.భయముంటుంది. అడవంటే అడుగడుగునా ప్రమాదముంటుంది. క్రూర జంతువులు, విష నాగులు, క్రిమి కీటకాలు, ఎండలు… హోరు వానగాలులు… అన్నీ ఉంటాయి. మనం చలిస్తాం. ఇక చాలని చాలిస్తాం. కానీ వాళ్ళలా కాదు….
గీతలో యోగి గురించి శ్రీకృష్ణుడు
సర్వభూతస్తమాత్మానాం సర్వభూతానిచాత్మని
ఈక్షతేయోగయుక్తాత్మా సర్వత్రసమదర్శినః
అన్నట్టు వీరు అన్నింటినీ నిశ్చలంగా చూస్తూ ముందుకు నడచిపోయే, మన కాలంలో జీవిస్తూ ఉన్న అద్భుత సాధకులు. మరింత గాఢమైన అడవి కోసం వెతుకుతూ… చిక్కని ఆనంద పారవశ్యంలో నడుస్తూ అనంతమైన దారుల్లో వారి పయనం.
వీరి అనుభవాలూ, అనుభూతులు పుస్తక రూపంలో వచ్చాయిగనుక ఈ మాట చెబుతున్నాను. వీరి ఈ సాధనా పథం తెలుగు సాహిత్యములో కొందరిని… నిజమైన అన్వేషకులను… మరింత ముందుకు… మరింత లోతుకు… మరెంతో విశాల విస్తీర్ణం చేయగలరని నా చిన్న అభిప్రాయం.
ఇదెంతో అందమైనది కూడా. పుస్తకంలోంచి ఓ బిందువు అమృతానుభూతిని గుండెలోకి ఒంపుకున్నాను. మీరూ అడవి పుస్తకం చదివి హృదయ పాత్రను నింపుకోండి.
Writer! You are much too much. I am totally enjoying your intelligence.
ప్రపంచం అంతా ఈ సరికే అర్థం ఐపోయింది. ఎవరేమిటికి ఎందుకు చేస్తున్నారో అంతా తెలుసు. ఐనా కథా రచన లో మాత్రమే భయభ్రాంతి చేసే విశ్వరూపం చూపించి, ఆ తర్వాత యశోదను మళ్లీ మాయలో పడేసి కృష్ణుడు చిన్న పిల్లడైపోయినట్టు, పాఠక లోకానికి, థాంక్యూ, థాంక్యూ అని చెప్పివెడుతూ మురిపిస్తున్నారు. మళ్లీ మేమంతా మా బొందన పడాలిగా! Is that the way you bring us out of your hypnosis?
Also I saw your photograph elsewhere. You are a pretty woman. Like intelligence, beauty is also one of your attributes. (The minuscule photo in eemaata is not good. A photo is an art form, unless shown and seen in proper size does not do much for the subject. I wish eemaata magazine, provides a bigger and better photograph.) Please do not hesitate, to attach a different photograph, with each of your writings, published here or elsewhere. It helps you grow, glow, and enjoy yourself. The publishers should eagerly show them. The viewers will be delighted.
Kudos on excellent writing! Have a charmed life!
-Lyla
‘అడవి లోంచి అడవికి’, ‘అడవి పుస్తకం’ అనేవి రెండు పుస్తకాలా? రెండు అడవుల గురించి రచయిత రెండు పుస్తకాలు రాసారా? లేక అట్టలు, పుస్తకం పేరు, మార్పులతో రెండు ముద్రణలా? ఒకటి 2018, రెండోది 2021 లోనా? అసలింతకీ రాసింది జయతి లోహితాక్షన్? మరి ఆ పేరు ఎత్తేసి, దాసరి అమరేంద్ర రచనల జాబితాలో ఈ మేగజీన్లో ఎందుకు ప్రచురిస్తారు? అసలు ‘స్టార్’ బదులు, స్టేజ్ మీదకు ‘Stand in’ వచ్చి, కర్టిసీలు చేస్తున్నట్టు, ‘రివ్యూయర్’ తేపతేపకూ పాఠకులకు కృతజ్ఞతలు తెలపటం ఎందుకు? అసలు రచయిత అడివిలో ఉన్నందునా? అంతా గందరగోళం తప్పించి, సాహిత్య ప్రయోజనం ఏమిటి?
ఇతర పుస్తక రచయితలు కొన్నిసార్లు వారే, తమ పుస్తకం లోంచి excerpts ఈ పత్రికలో ప్రచురణకు ఇస్తున్నట్టున్నారు. సంతోషం. (అప్పుడు రచయితతో, గ్రంథం గురించిన సంభాషణకు అవకాశం ఉంది.) కాని వీటిని రచయితల రచనల పేజీలో- ఆసరికే ప్రచురించబడిన పుస్తకం పేరు చెప్పకుండా ‘వ్యాసాలుగా’ లిస్ట్ చెయ్యటం సరియేనా? ఈ ఫలానా పుస్తకంలో ఈ పేజీ నుండి, ఈ పేజీ వరకు అని ఇవ్వాలేమో.
There is a variety of material to read in the magazine. To read it in the right context, please facilitate by accurate identification of literary works, right at the outset. Every time.
Thanks.
-Lyla
[లైలాగారు: 1. అవి రెండు వేరే వేరే పుస్తకాలు. 2. ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తూనో, సమీక్షిస్తూనో రాసిన రచనలను ఆ పరిచయకర్త, లేదా సమీక్షకుల పేరుతోనే ప్రచురించుతారు కదా. అమరేంద్ర రాసిన పరిచయం కాబట్టి ఆయన పేరు మీదే ప్రచురించాము. 3. ఒక పుస్తకం అచ్చవుతున్న సందర్భంలో కాని, లేదూ మంచి పుస్తకం అని మేము భావించినదానిని కాని, మేమే పరిచయం చేయదలచుకున్నప్పుడు, ఆ పుస్తకపు ముందుమాట కాని, ఆ పుస్తకంలోనుంచి ఒక వ్యాసం కాని –ఆ పుస్తకం పట్ల పాఠకులకు ఆసక్తి కలిగించడం కోసం– రచయిత అనుమతితో, మేము అప్పుడప్పుడూ ప్రచురిస్తుంటాం. అలా ప్రచురించినప్పుడు, ఆవ్యాసంలో పుస్తకం వివరాలు పూర్తిగా ఇవ్వబడుతున్నాయి. 4. ఇక, రచయితలు పాఠకులకు కృతజ్ఞతలు తెలపడం వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడివుంది. రచయితలు ఇలా ‘తేపతేపకూ పాఠకులకు కృతజ్ఞతలు తెలపటం’లో మీవంటివారికున్న ఇబ్బందిని గమనిస్తూనే, వారిని అలా చేయద్దనే హక్కు కూడా మాకు లేదని తెలుపుకుంటున్నాం. – సం.]
నిజంగానే మీ జ్ఞాపకాలు చంద్ర దర్శనాన్నే చూపించాయండి. చిత్రకారుడి ఆత్మను పట్టి చూపించిన విశిష్ట రచన మీది. వ్యక్తి జీవితమంటే తెలుసుకోవలసింది ఇంతటి బహుముఖ మూర్తిమత్వాన్నే కదా.. ఇంత పెద్ద కథనాన్ని చదివే ఓపిక కూడా ప్రస్తుత తరంలో చాలామందికి లేనట్లుంది. సాక్షిలో మీ వ్యాసం స్పేస్ సమస్య వల్ల చాలా పరిమితులతోనే వచ్చింది. కాని ఇక్కడ ఆయన విశ్వరూపాన్ని విపులంగా దర్శనం చేయించారు. జీవితం మంచీ చెడు లక్షణాల వైరుధ్య కలయికే అనేది మీ రచనలో అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. అది మీ నిజాయితీ.. అందుకు ధన్యవాదాలు, అభినందనలూ..
మనిషి ప్రతి నిమిషం అంతరంగంతో వాదోపవాదాం చేస్తునే ఉంటాడు. చివరికి వ్యక్తి తనకున్న మేధో స్థాయి చేరాక ఇక అదే సత్యం అని నిర్ణయయించుకుంటాడు. కొందరు తామరకు మీది నీటి బిందువులా బతకాలనుకుంటారు. అటు నీటిలో కలవాలనుకోరు.ఇటు ఆకును అంటుకోవానుకోరు. కాని అక్కడే ఉండాలనుకుంటారు. సత్యా అటువంటిదే.
“నిజానికి ఆ తతంగం నాకు అంత ఇష్టం లేకుండా కూడా లేదు, అంత అందంగా తయారవ్వడం అదే మొదటిసారి జీవితంలో. నా అలంకరణ నాకు నచ్చింది. పెళ్లి ఒక తంతుగానే ఉంది. పెళ్ళీ, భర్త, పిల్లలు అదే జీవితం అంటే ఒప్పుకోదు.నాకు దేనిపైన అభ్యంతరం లేదు, అలాంటి చిన్న ఉత్సాహాల కోసం అతనితో జీవితాంతం ఉండడం కష్టం.” అంటుంది.
“ఏదీ వదిలేయాలని వదిలేయాలనుకోవట్లేదు. అన్నిటిని హత్తుకొని ఉంటాను. కానీ ఏదీ అంటుకోకుండా సమయానికి సాధారణంగా రాలిపోవడం ఎట్లా ఉంటుందో అది నా అనుభవంలోకి రావాలని ఉంది యోగీ” అని అంటుంది. గృహస్థ జీవితంలో ఉండి యోగీలా జీవించాలనుకుంటుంది.
రెండు విభిన్న దృక్పధాల సంవాదమే ఈ కథనం అనిపించిది. కథనంలో తార్కికత, మార్మికత అంత తొందరగా అంతు చిక్కదు.
ఈ Manon, మేనక రెండిటి కథా లక్షణాలలో పెద్ద తేడాలేమీ నాకు తెలియలేదు. దేశికాచార్యులు గారు, భావించే ఈ భారతీయ సంస్కృతి ఎట్టిది? ఎలా ఇటాలియన్, ఫ్రెంచ్ సంస్కృతి, సంప్రదాయాలతో విభేదిస్తుంది, ఎక్కడెక్కడ ఈ మార్పులు ఈ తెలుగు రూపకం లో గమనించాలి? అన్న విషయాలు రచయిత నుండి వివరంగా వినాలని ఉంది.
ఛందోబద్ధకవిత్వమంటే సంపెంగను చూచిన తుమ్మెదలాగా పాఱిపోకుండా, ఓపికతో ఈ రచనను, బెవర్లీసిల్స్ యూట్యూబు ప్రదర్శనను చూచి పైవాక్యాలను వ్రాసిన లైలాగారికి నాకృతజ్ఞతలు. ఐతే, వారు నారచనను, పైయూట్యూబు ప్రదర్శనలోని సన్నివేశ పరంపరనూ నిశితంగా పోల్చుకోనట్లుగా తోస్తున్నది. అట్లా పోల్చుకొని ఉంటే వారే నాకు చెప్పేవారేమో నారచన దానికి మూలభూతమైన ఆపెరా లిబ్రెట్టోకంటె ఎక్కడెక్కడ భిన్నంగా ఉన్నదనే విషయం.
నాదృష్టి కథను పూర్తిగా మార్చాలని కాదు. దేశాలు వేరైనా, మానవప్రకృతి అంతటా ఒక్కటే అని నాభావం. అందుచేత మనోఁ కథ ఫ్రాన్సులో జరిగినట్లే భారతదేశంలోనూ జరుగవచ్చు. ఇట్లా జరుగగలిగినప్పుడు కథాశరీరాన్ని మార్చవలసిన అవసరం లేదు. ఐతే ఆకథాపరిధిలో దేశభేదాలనుబట్టి సన్నివేశపరికల్పనను దేశసంస్కృతికి అనుగుణంగా మార్చవలసి ఉంటుంది. ఇదే నేను వ్రాస్తున్న ఆపెరాలలో చేస్తున్న పునస్సృజన. ఈమార్పు నేను పాత్రలకు, ప్రదేశాలకు ఇచ్చే పేర్లదగ్గరినుండి ప్రారంభమౌతుంది. ఉదాహరణకు ఈ ఆపెరాలో పారిస్ పేరు భోగపురంగాను, ఏమియన్ విజయపురంగాను మార్చబడడమే కాక, బుద్ధపురము, రాజపురము, శాలిగ్రామము అనే మూడు క్రొత్త ఊర్లుగూడ ప్రవేశపెట్టబడినవి. పారిస్‌లో ఉండే St.Sulpice మొనాష్టరీ బుద్ధపురంలోని బుద్ధాశ్రమంగా మార్చబడింది. పారిస్ భోగాలకు, విలాసాలకు పెట్టింది పేరు. అందుచేత దీని పేరు భోగపురంగా మార్చబడ్డది. మేనక ఊరు శాలిగ్రామంగా పేర్కొనబడ్డది. సంస్కృతంలో ‘శాలి’ అంటే వరి అని అర్థం. ఆ ఊరిలో వరి ఎక్కువగా పండటంవల్ల ఆపేరు వచ్చిందని ఊహించవచ్చు. అట్లే వృద్ధుడయ్యును కాంతావ్యామోహమును మానని క్రూరుడైన Guillot పేరు శాకునికునిగను, అత్యంతధనవంతుడైన de Brétigny పేరు భౌరికునిగను మార్చబడినవి. సంస్కృతంలో శాకునికుడంటే వేటకాడని, భౌరికుడంటే బంగారునిధి కధికారి యని , స్థాయుకుడంటే గ్రామాధికారి అని అర్థాలు. (‘జీవాన్తకశ్శాకునికః, భౌరికః కనకాధ్యక్షః, స్థాయుకోఽధికృతో గ్రామే – అని అమరకోశము). అంతేకాక Guillot స్వభావం శూద్రకుని మృచ్ఛకటకంలోని శకారుని పోలియున్నది. అందుచేత పడుచుపిల్లల వేటకాడైన క్రూరస్వభావియగు Guillot ను శాకునికగా పేర్కొనడమే కాక, అతని పాత్రీకరణ శకారునికివలెనే చేయడం జరిగింది. అట్లే మహాధనవంతుడైన de Brétigny కి భౌరికనామధేయం సార్థకమైంది. వేశ్యలైన Poussette, Javotte, Javotte లకు రమణి,రంజని రాగిణి అనే పేర్లుంచడం వారి వేశ్యాస్వభావద్యోతకంగా ఉన్నది. Manon ను మేనక అనడం ఆమే విలాసలాలసతకు, సొమ్ములయందలి అభిలాషతకును తగినట్లుగాను, Manon అను శబ్దమునకు సన్నిహితంగాను ఉన్నది. అట్లే జూదరియైన Lescaut దేవనదత్తుడుగా పేర్కొనబడినాడు. ‘దేవనాః పాశకాశ్చ తే’ అని అమరకోశంలో చెప్పబడినట్లుగా దేవనములంటే పాచిలకలని అర్థం. అందుచే పాచికలాటకు దాసుడైన అతనిని దేవనదత్తు డనటం జరిగింది.
ఇట్లా వ్రాస్తూ పోతే ఇదొక మహాగ్రంథమౌతుంది. అందుచేత సంగ్రహంగా నేను చేసిన సన్నివేశములయందలి మార్పులను పేర్కొంటాను:
1. మొనాష్టరీని బుద్ధాశ్రమంగా మార్చడం. బుద్ధుని కాలంనుండి బుద్ధాశ్రమాలలో శ్రమణికల నియోగం జరిగింది. అందుచే మేనకను శ్రమణికాత్వము స్వీకరించుటకు పంపడం, తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరడం అనేవి భారతీయసంస్కృతికి తగినట్లుగా జరిగినవి.
2. ప్రథమాంకంలో విశ్రాంతిగృహంలో లభించే ఆహారనామాలు భారతదేశీయుల ఆహారనామాలుగా మార్చబడినవి
3. ద్వితీయాంకంలో ప్రథమ, ద్వితీయదృశ్యములు అమూలకములు. ఇవి కథాపుష్టికై పరికల్పింపబడినవి. తృతీయదృశ్యంలో అదే చిన్న రూములో కిటికీకి దగ్గర దేవనతరుణార్కులు కూర్చున్నారనుటకు బదులుగా, వారు ఆరూముకు ముందుండే అంగణంలో కూర్చున్నారని, అందుచేత భౌరికుడు మేనకకు తరుణార్కుని అపహరణవిషయం తరుణార్కునికి దెలియకుండా రహస్యంగా చెప్పడానికి అనుకూలంగా ఉండిందనే కల్పన చేయబడ్డది.
4. తృతీయాంకంలో ప్రథమదృశ్యం అమూలకం. ఇది కథాపరిపుష్టికై కల్పింపబడినది. ద్వితీయదృశ్యం, అందులో సౌందరనందమనే బుద్ధగాథాత్మకమైన అంతర్నాటకం పూర్తిగా మూలంలో లేని, భారతసంస్కృతికి అన్వయించే నూత్నకల్పనలు. మూలంలో des Grieux (తరుణార్కుడు) మొనాష్టరీలో చేరుటకు ప్రేరకం సహేతుకంగా నిరూపింపబడలేదు. కాని ఇచ్చట ఈ ద్వితీయతృతీయ దృశ్యములద్వారా తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరుటకు సిద్ధమగుట సహేతుకంగా కల్పింపబడింది. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.
5. మూలంలోని చతుర్థాంకంలో పారిస్‌లో ఒక కార్నివాల్ జరిగినట్లు, అక్కడ ఒక బాలే డాన్సుగూడ ప్రదర్శింపబడినట్లు, ఆసందర్భంలోనే తరుణార్కుడు మొనాష్టరీలో చేరినవిషయం అతని తండ్రినుండి మేనక నేరుగా విన్నట్లును కథ నడిచింది. కాని ఇటువంటి కార్నివాల్, బాలే భారతసంస్కృతికిపనికిరావు. అందుచే వసంతోత్సవసందర్భంలో భోగపురసమీపంలోని ఒక తోటలో మేనకాదులు విలాసంగా పాల్గొన్నట్లును, ఆసందర్భంలో తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరిన విషయం స్థాయుకుడు భౌరికునికి చెప్పుచుండగా చెట్లచాటునుండి మేనక పరోక్షంగా విన్నట్లును కల్పించినాను. ఆవనవిహారానికి ముందుగా ప్రథమదృశ్యంలో మేనక సేవికలచేత అలంకరింపబడుట అనే అమూలకమైన దృశ్యాన్ని కల్పించి ఆమె భౌరికుని పోషణలో అనుభవించిన వైభవము నిరూపించినాను. అట్లే తృతీయదృశ్యంలో ఆవైభవములపట్ల అమె అనాసక్తి, పునః తరుణార్కుని యందలి అభిలాష చక్కగా నిరూపింపబడినవి. మూలంలో మొనాష్టరీలోనికి మేనకప్రవేశించి అతనిని తనతో పునస్సంగమమునకు సుముఖుని చేసికొన్నట్లున్నది. కాని అది అసంగతంగా ఉన్నదని, ఈఅంకంలోని చతుర్థదృశ్యంలో బుద్ధాశ్రమోద్యానంలో తరుణార్కుడు ధ్యాననిమగ్నుడై ఉండగా మేనక అతనిని సమీపించి, తనకు పునర్వశవర్తుని చేసికొన్నట్లు కల్పించినాను. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.
ఈవిధంగా ఎన్నో మార్పులు, చేర్పులు చేసి, కేవలం భారతసంస్కృతికి సంబంధితమైన స్వతంత్రరచనగా గోచరించే విధంగా నేనిది వ్రాసినానని అనుకొంటున్నాను. దీనిని సమగ్రంగా పరిశీలించి, ఇందులో నేనెంతవఱకు కృతకృత్యుడ నైనానో మీవంటివారు తేల్చవలసియుంటుందని విన్నవించుకొనుచున్నాను. అందుచేత లైలాగారూ, ఈవిషయంలో మీరు చేయవలసిన HomeWork చాలా ఉన్నది.
“పాపం సమాచరతి వీతఘృణో జఘన్యః ప్రాప్యాపదం సఘృణ ఏవ తు మధ్య బుద్ధిః
ప్రాణాత్యయేపి తు న సాధుజనః స్వవృత్తిం వేలాం సముద్ర ఇవ లంఘయితుం సమర్ధః”
I have doubts about the accuracy of Telugu translation given here, in the story. I want a second opinion.
I just don’t get Buddhism. I guess, it just goes against my grain!
If it is Mythology, there got to be Magic
If it is Philosophy, there got to be Logic
Is Buddhism a religion?
It is neither heroic, nor stoic. Not an epic,
What exactly is its legion?
ఈ కథలన్నీ ఎన్ని చదివినా, భవరోగమేంటో, దాని వినాశనం బుద్ధుడెలా చేస్తాడో తెలియటం లేదు. రోగానికి చావుకి జడిసి, సన్యాసిగా మారి గుండు చేయించుకుంటే రోగం రాదా, చావు రాదా? మరి దేని నుండి ఆయన తప్పించుకున్నాడు. ఇతరులను ఎలా విముక్తులను చేశాడు ఇన్ని వందల యేళ్లుగా?
రాజకుమారుడుగా పుట్టి, భోగాలన్నీ వదిలేసాడని అదో గొప్ప. ఇదుగో -ఇప్పుడు ప్రిన్స్ హేరీ తలతిక్క కబుర్లు లాగానే. శుభ్రంగా Duke and Duchess of Sussex – Windsor లోనో, Montecito లోనో వాళ్లు వైభోగంగా ఉంటూ, -ఇతరులను ఉద్ధరిస్తున్నట్టు పోజ్! Who falls for those stunts!
లాజికల్ గా చెప్పిన ప్రతి రచన, ప్రసంగం లో కొన్ని మెప్పించేవి, పాటించదగినవి ఉంటవి. ఎప్పటికీ పాటించేవంటూ సత్యాలు ఏవీ లేవు. ఉండగూడదు. పుడుతూ, చస్తూ, కొత్త జనాలు, కొత్త జాతి కాంబినేషన్లు, కొత్త సైన్స్ ప్రయోగాలు వస్తున్నప్పుడు, జన్మంతా అందరికీ ఒకే గుడిలో, ఒకే మొనాస్టరీలో ఒకే రకమైన సత్సంగం ఎందుకు? అందునా వరసా వాయీ ఆలోచన క్రమం లేని ఉపదేశాలు. భగవానులు గాని, ఆనందులు కాని చిరునవ్వులు నవ్వినంత మాత్రాన, ముఖం ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన, ఒంటరిగా ఊరికే అడవుల్లో పడో, ఆ చివరినించి ఈ చివరికి నడిచో, ఆ ఇంటికో ఈ ఇంటికో, వెళ్లి వస్తేనో, భవరోగాలు నశిస్తాయా?
ఈ మధ్యే వేమూరి, గ్రీక్ మిథాలజీ కొంత, తెలుగులో రాసిస్తే, ‘ఈమాట’ మేగజీన్, పాఠకులకు 11 ప్రకరణాలుగా చదవమని ఇచ్చినప్పుడు, అందులో ఒకచోట అదాటున ఆయన భారతంలో నుండి ఈ పద్యం ఇచ్చారు.
“ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము దనమనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పదములకెల్లన్ (భారతం, శాంతి, 5-220)”
అది చదివినప్పుడు బాగుంది నీతి పద్యం అనుకున్నాను. ఐనా, కిరస్తానీ ప్రభావం నాపైన అంతకంతా ఉన్నందున, నాకు ఈ ప్రవచనం గుర్తొచ్చింది.
“Do unto others as you would have them do unto you” Luke 6:31
ఈ రెండూ చెప్పేదొకటే కదా అంటే, పైపైకి అలానే అనిపిస్తుంది. కాని కానే కాదు. హిందూ ఇతిహాసం లోని పద్యం, – ఇతరులు ఏవి చేస్తే, నీకు మనసులో ఇష్టంకావో, అవి నువ్వు ఇతరుల పట్ల చెయ్యొద్దు. అది ధర్మం అంటున్నది.
బైబిల్ – ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకిష్టమో, నువ్వూ అలాగే వారికి ప్రీతి కలిగించేవి చెయ్యి- అంటున్నది.
ఈ రెంటికీ చాలా తేడా ఉంది. భారతం లోది – ‘అలా చెయ్యకు’ అంటున్నది. అప్రియమైనని చెయ్యకు! అంటుంది. ABOVE ALL DO NO HARM అనే వైద్యుల అల్టిమేట్ గైడ్ లైన్ కూడా కొంత ఇలాటిదే.
కాని, స్క్రిప్చర్స్ చెప్పింది నాకెక్కువ నచ్చింది – ఇతరులనుండి నువ్వేం ఆశిస్తావో, వాళ్లేం చేస్తే నీకు ఇష్టం కలుగుతుందో అలాటి పనులు ఇతరుల పట్ల చెయ్యమంటున్నది. మనిషిని, మునగదీసుకుని, ముసుకేసుకుని, ఎవరికీ హాని చెయ్యను అని సంఘం నుండి, ప్రపంచం నుండి విత్ డ్రా అవకుండా, ఎవరికైనా సంతోషం కలిగించేవి చెయ్యమంటున్నది. Neither is fool proof and complete, but they both are good.
ఈ జాతక కథలు ఏమి చెపుతున్నవి! నాకు తెలియదు.
ఇంతకు ముందొకసారి, శర్మ దంతుర్తి రాసిన “తుఫాను” కథ నాకు బాగా నచ్చిందని రాసాను. The foremost reason I liked it for is;
In a storm, a young girl, takes another girl who can’t go home, into her house. Protects her. Feeds her. Keeps her safe.
The second young girl who is helped, afterwards, just didn’t send her a Thank you note. Instead, she reciprocated. She helped the first girl and family in a big way. She knew she can do it. That she should do it. And she did it.
In this story, she is emphasizing the good side of human nature, and taking a positive action. She is proving the possibility, no, no, – the certainty of one person helping the other.
Negative people may think – It is just a feel good story. These things don’t happen in real life. Wrong! They happen.
ఆలోచిస్తే, ఇతరుల సహాయం లేకుండా మనలో ఒక్కరమైనా పైకి వచ్చామా! రోజువారీ లభించే సహాయాలెన్నో. ఒక్కోసారి, ఇక నా పని ఆఖరు. ఈ విపత్తు లోంచి బైట పడలేము అనుకున్నప్పుడు, అకస్మాత్తుగా సహాయం లభిస్తుంది. అది ఆలోచనాపరులైన పాజిటివ్ పీపుల్ నుండి వస్తుంది.
మానవ స్వభావంలోని లేకితనాన్ని, మోసకారితనం, క్రూరత్వాల గురించి, పన్నెండు సార్లు చెపితే, ఏమిటి ఘనత ఎవరైనా కథలో, కవితలో. మనలోకి మనం ముడుచుకుపోవటం, ఇతరుల నుండి విత్డ్రాయల్, విరక్తిలు వస్తాయి. ఎవరికి కావాలవి? నాకు జాయస్ గా, జాలీగా ఉండి, ఉదారులైన వాళ్లకు మల్లేనే, ఉల్లసిల్లి ఉండాలని ఉంటుంది. జెనరాసిటీ గురించి ఎవరైనా చెప్పినప్పుడు, చూపినప్పుడు నా కళ్లు వర్షిస్తాయి.
బౌద్థం నాకెందుకు! బౌధ్థం ‘సువర్ణ శ్రీ’ కి అక్కర్లేదు. నాకూ అక్కర్లేదు.
మృత్యువు సత్యం, మృత్యువు తథ్యం. ఐనా నాకు లూయీస్ పాశ్చర్, బుద్థుడి కంటే ఇష్టం. పాశ్చర్ జంతువుల, మనుషుల రోగం, పెయిన్, అకాల మరణం తప్పించిన వాడు. సైంటిఫిక్ స్టడీతో, పరిశోధన తర్వాత పరిశోధనతో మానవులకు వందల ఏళ్లు పనికొచ్చే కంక్లూజన్స్ కి వచ్చే, లూయీస్ పాశ్చర్ కి, మృత్యువు, రోగము, భవము, అని ఏవో మాటలు పేర్చే కన్ఫ్యూజింగ్ జాతక కథలకీ పోలిక ఏముంది!
మృత్యువు మీద రాయలేనిది ఎవరు! చనిపోయాక రాయలేం కాబట్టి ముందే రాసుక్కూచ్చోటం. నేనూ రాసాను, అప్పుడప్పుడూ!
వాటిలో ఈ కిందిదొకటి!
గతములో ప్రతి రాత్రి, అతి కాంతి దీపమ్ములన్ని ఆర్పి
శయనమందిరాన మినుకు దీపాలనే మిగుల నిచ్చి
పందిరిమంచపు చుట్టు తెల్లమల్లు తెరలన్ని కదియలాగి
పట్టుపరుపుల మీద సుఖస్వప్నాలలో
పాతప్రియులెందరి తోనొ నే పవళించిన రీతి;
ఆఖరి నిశ్వాసము తరి మృత్యుదేవ!
నీపైనను విశ్వాసముంచి, శాశ్వత స్వప్నాలలో
నీతోను నే సుఖముగ పన్వళింతు!
-Lyla
PS: I read a little while ago, that Sarma Danturti won a prize in Vanguri Foundation’s – Ugadi short story competition. Congratulations to him, other winners and contestants.
Happy Ugadi to All! Enjoy!
మార్చ్ 2021 గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
03/12/2021 10:08 am
ఈ సారి చాలా ఆలస్యంగా ఈమాట చదివాను. అది క్షమించరాని నేరం. అయితే సాహిత్యపరంగా నేను చేసిన క్షమించరాని నేరాలతో పోలిస్తే ఇది చాలా చిన్ననేరం.
ఈ నెల మీరు రాసిన సంపాదకీయం నిజంగా ఒక మణిపూస.
నేనూ సంపాదకీయాలు రాశాను; అవి వ్యాసాల్లా ఉన్నాయని తిట్టిన వాళ్ళు లేకపోలేదు. నేను రాసిన వ్యాసాలని చదివి, ఇవి ’సంపాదకీయాలు’గా రాసి ఉంటే బాగుండును అన్నవాళ్ళూ లేకపోలేదు. ఈమాటతో నాకున్న ప్రత్యేక సంబంధం ఈ స్వోత్కర్షకి కారణం. క్షమార్హుణ్ణి.
మన తెలుగు సాహిత్యరంగంలో ఉన్న ’కుళ్ళు’ని మీరు అతి చాకచక్యంగా బయటికి తెచ్చారు. రచయితనీ, రచననీ వేరుచేసి చూడటం, చదవటం, విమర్శించడం, మనకి ఇంకా అబ్బలేదు. అది ఎప్పటికైనా సాధ్యమా అని నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటాను.
అచ్చులో వచ్చే పత్రికలలో ‘విమర్శల’నీ, ముఖపుస్తకంలో ఎదురయ్యే ‘మెప్పు’లనీ, వ్యాఖ్యానాలనీ వచ్చిన కొద్దిక్షణాల తరువాత పూర్తిగా మరిచిపోవచ్చు. ఇవేవీ కలకాలం నిలవవని అందరికీ తెలిసిన విషయమే. అయినా మన ప్రస్తుత సాహితీ సంస్కృతి ఈ రెంటితో పెనవేసుకొని పోవటం ఆశ్చర్యకరమో, గర్హనీయమో నాకు తెలియదు.
‘విప్లవాత్మక సాహిత్య ప్రతిపాదనలతో ఏకీభవించగలమా లేదా అన్నది సమస్య కాదు, కాని వాటిని విస్తృతంగా అధ్యయనం చేసి విశ్లేషించవలసిన అవసరాన్ని తెలుగు సాహిత్యలోకం ప్రయత్నపూర్వకంగానే విస్మరించడం సాహిత్యనేరం,’ అని మీరు సంపాదకీయంలో రాసినప్పుడు, అమ్మయ్య! కుండబద్దలుగొట్టి నిజం చెప్పారు, ఇప్పటికన్నా పాత్రికేయులు (అచ్చేసే వాళ్ళు, అంతర్జాలం వాళ్ళూ), సాహితీవేత్తలూ, చవకబారు రాజకీయాలకి స్వస్తి చెప్పి, కళ్ళు తెరుస్తారని ఆశించడం నేరం కాదనుకుంటాను.
విధేయుడు
వేలూరి వేంకటేశ్వర రావు.
మూఢనమ్మకాలు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
02/23/2021 1:09 pm
పొరపాటు వ్యాసం. బహుశః ఏదో పరాయి వ్యాసానికి అనువాదం కాబట్టి ఆటోమేటిగ్గా మంచివ్యాసం అని సంపాదకుల భావన కావచ్చును.
ప్రస్తుత విజ్ఞానశాస్త్రాలు కేవలం మానవులకు బుధ్ధికీ అనుభవానికీ అందగల విషయాలను గురించి మాత్రం సాధికారంగా మాటలాడగలదు. మతవిశ్వాసాల వంటివి ఈ శాస్త్రాలకు వెలుపలి విషయాలను గురించినవి కాబట్టి కేవలం హేతువాదం చేసి తప్పెంచటం తొందరపాటు అవుతుంది తరచుగా.
రేడియో టెలివిజన్ అందుబాటులో లేనికాలంలో ఎవరన్నా దూరంగా ఉన్న ధ్వని దృశ్యాలను దూరంగా ఉన్న వారు గ్రహించటం అన్నది అశాస్త్రీయభావన అనే అనేవారు కదా.
ఈసైన్సు మొన్నటిదాకా ప్లూటోని తొమ్మిదో గ్రహం అన్నారు ఈమధ్యనే కాదన్నారు.మళ్ళీ మరేదో భూమికంటే పెద్దదే ఉందేమో అంటున్నారు. ఇంకా మనం తెలుసుకోవటంలోనే ఉన్నాం కదా.
క్వాంటమ్ మెకానిక్స్ పుణ్యమా అని చాలా మౌలికభావనల పునాదులే కదలుతున్నాయి.
అన్ని నమ్మకాలూ మూఢనమ్మకాలు కానక్కరలేదు. కొన్ని కావచ్చు కొన్ని కాకపోవచ్చు. అన్నీ సైన్సుతక్కిట్లో వేయవద్దు. నమ్మకాల మూలాలపై శోధన మంచిదే కాని ముందే మూఢం అని ముద్రవేసి చేసేది హేళనో నిందో అవుతుంది కాని పరిశోధనా కాదు పరిశీలనా కాదు. అలాంటి వ్యాసాలు కాలక్షేపానికే తప్ప నిరుపయోగం.
చదవగానే అనేక సందేహాలు వచ్చాయి. ఆలోచించేకొద్ది కొన్ని కొత్తదారులు తెరుచుకున్నాయి. రెగ్యులర్ పాట్రన్ కథలకు అలవాటుపడినందువలనేమో ఇలాంటి స్పేస్ ఉండే కథలు పాఠకుడ్ని కొంత కష్టపెడతాయనుకుంటా. ఈ కథ ఇప్పటివరకు మీరు రాస్తూ వస్తున్న సరళికి కొంత భిన్నంగా కనిపించింది. ముందుగా ఆమెకు డబ్బులు ఎందుకు,ఏం చేస్తుందనే ఆలోచన, కాసేపటేకే నవ్వు. మనం కూడా వెంకూ దగ్గరే ఆగిపోతున్నామని. నిజానికి ఈ కథ డబ్బుకి సంబంధించింది కాదు అని స్పష్టంగా తెలుస్తున్నా ఆలోచన అక్కడే ఆగిపోవడం ఆశ్చర్యమనిపించింది. నిజానికి ఆమె మానసిక స్థితికి ఆ డబ్బు కారులో వదిలేసైనా దిగిపోగలదేమో. మీవి రీడర్ ప్రెండ్లీ కథలండి. ఆలోచించుకోవడానికి, ఊహించుకోవడానికి వాళ్ల స్థాయిని బట్టి అనేక అవకాశాలను ఇస్తూ వస్తారు. పాతకాంక్ష అనేది బుర్రలో ఓ పెద్ద కథనే సృష్టించగల అవకాశం ఉన్న పదం. ఒక్కోసారి ఆ ఊహలోనే స్టక్ అయిపోతాం కూడా. మీ కథలు కొన్ని సార్లు ఓ ఫజిల్లా అనిపిస్తాయి. కాని దాదాపు ప్రతి చోట హింట్ ఇస్తూనే ఉంటారు. ఆమె చుట్టూ ఉన్న అనేక విశ్వాసాలను, భయాలను దాటే ప్రయత్నంలో వచ్చే గిల్ట్ ను ఓవర్ కమ్ చేసేందుకు లేదా అసత్యంతో ఆమె ప్రయోగాన్నో శోధననో సమర్దించుకునే ప్రయత్నంలోనే బహుశా ఆమె గాందీ సహాయాన్ని బలంగా తీసుకుందేమో అనిపించింది. అనేక ఫ్లాష్ బాక్ లేయర్స్ లోంచి వచ్చిన ఒక బలమైన ఎమోషనల్ స్పాంటేనియస్ డెసిషన్ పై చివరివరకు నిలబడటమే పార్వతమ్మ తనదైన సత్యాసత్యాలతో చేసిన స్నేహశోధనేమో ఈ కథ. గోడమీద పిల్లబుద్ధుడు ఫోటో అనేదే కొంచెం రియాలిటీకీ దూరం జరిగిందనిపించింది. మనదేశంలో పిల్లబుద్ధుడు ఫోటోలు దాదాపు ఎవరి ఇళ్లలో కనబడటం నేను చూడలేదు. అక్కడ బుద్ధుడు వాడి, చివరలో పిల్లబుద్ధుడు అంటే సరిపోయేదేమో. మొత్తంమ్మీద ఒక సింపుల్ ప్లాట్ తో వైవిధ్యమైన మంచి కథ. అభినందనలు సుధగారు.
1. పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది — not complete. You also need to add: శ ష స హ.
You also need to add: ‘శ ష స హ’ అనే వాక్యం వర్తించదు సంస్కృతానికి. అందుచేతనే సంస్కృతానుస్వార సంధిసూత్రంలో వీటిని బహిష్కరించ లేదు. పదమధ్యంలో ‘శ స,హ’ లు నాంత, మాంతపూర్వ వర్ణాలకు పరమైనప్పుడు ఏర్పడిన సంస్కృతపదాలకు దిక్సూచిగా కొన్ని ఉదాహరణాలు:
– ధాతువు: రమ్ క్రీడాయామ్; ఈమకారాంతధాతువునకు సీయ, సీవహి, సీమహి అను ఉత్తమపురుష ఆశీర్లిఙ్ ప్రత్యయాలు పరమైనపుడు ‘రమ్’లోని మకారం అనుస్వారంగా మారి, రంసీయ, రంసీవహి, రంసీమహి అనే క్రియారూపాలు ఏర్పడుతాయి.
– ధాతువు: మన్ జ్ఞానే; ఈ నకారాంతధాతువునకు పై ప్రత్యయాలే పరమైనప్పుడు మంసీయ, మంసీవహి, మంసీమహి అనే రూపాలు ఏర్పడుతాయి. సంహననం, సంహూతిః, సింహః, సంశయః, సంశప్తకః ఇత్యాది నామవాచకములు ‘సమ్’లోని మకారమునకు ‘హ’, ‘శ’ లు పరమైనప్పుడు వచ్చే అనుస్వారానికి ఉదాహరణాలు.
2. Rule of thumb is this: క ఖ గ ఘ form అనుస్వారం with ఞ. Similarly all others. Usually the vowels in this class are: unvoiced unaspirated; unvoiced aspirated; voiced unaspirated; and voiced aspirated. All of them form అనుస్వారం with the last consonant.
ఇది సంస్కృతవ్యాకరణంలోని పరసవర్ణసంధిసూత్రంలో వివరింపబడింది. దానిని చూడగలరు.
3. Next, let us look at the first rule: పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును. After the word ended, how can హల్లు పరమగును? బహుశా ఇది వేరేవిధంగా చెప్పాలనుకుంటున్నాను. Or, I misunderstood?
మీరు వేలూరివారి కామెంటులోని ‘వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.’ అనే వాక్యాన్ని చదివినట్లు లేదు. అది చదివిన ఈసందేహమున కవకాశముండదు.
I am wondering if the grammar rules you mentioned (as told by Desikachary are correct. For instance: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది — not complete. You also need to add: శ ష స హ.
Strictly speaking, మ+క or మ+ట కూడా అనుస్వారం ఇవ్వదు, భాషాశాస్త్ర పరంగా. అయితే, మనం వాటిని అనుస్వారంగా భావిస్తాం, ఎందుకంటే There are no minimal pairs in Telugu (I could be wrong, at least they are not common enough). When you transcribe other languages, you will notice that. For instance, empty — here m+p sound does not yield అనుస్వారం.
Rule of thumb is this: క ఖ గ ఘ form అనుస్వారం with ఞ. Similarly all others. Usually the vowels in this class are: unvoiced unaspirated; unvoiced aspirated; voiced unaspirated; and voiced aspirated. All of them form అనుస్వారం with the last consonant.
None form అనుస్వారం with య ర ళ వ శ ష స.
Next, let us look at the first rule: పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును. After the word ended, how can హల్లు పరమగును? బహుశా ఇది వేరేవిధంగా చెప్పాలనుకుంటున్నాను. Or, I misunderstood?
As always, Suresh Kolichala may offer more accurate assessment of it from linguistics perspective.
నేను రాసిన Vedic Wedding పై శ్రీ కృష్ణదేశికాచారిగారు పెట్టిన మొట్టమొదటి కామెంటుకి నేను సంజాయిషీ ఇచ్చాను. ఆతరువాత ఆయన, నేను రాసిన మంత్రాలలో, శ్లోకాలలో దొర్లిన తప్పులు క్రోడికరిస్తూ శ్రీ కొలిచాల సురేశ్‌కి టపా పంపించారు. శ్రీ సురేశ్ ఆ టపా ఉన్నదున్నట్టుగా, యథాతథంగా నాకు పంపారు. అందుకు కృతజ్ఞుణ్ణి. ఆ టపా చూడగానే, మొట్టమొదట నా గుండె ఆగినంత పని అయ్యింది. నా వ్యాసంలో “తప్పులు” ఎర్ర రంగులో ఉండబట్టి నాకు లెక్కపెట్టడం తేలికయ్యింది. మొత్తం మీద డెబ్బది పైచిలుకు “తప్పులు” లెక్కించాను. నిజం చెప్పద్దూ! కించిత్ భయం కూడా వేసింది. ఈ రొంపిలోకి నేనెందుకు దిగానురా అనిపించింది. (అయినా, నాలో రాక్షసాంశ మస్తుగా వుంది కాబట్టి తేరుకొని సరిపెట్టుకున్నాను!)
కొంచెం జాగ్రత్తగా చూసిన తరువాత, ఆ తప్పులు, కేవలం మకార అనుస్వరాలకు సంబంధించినవి, అవి రెండు వ్యాకరణ సూత్రాలకు పరిమితమైనవి, అని తెలిసి కుదుటపడ్డాను. నేను శ్రీ దేశికాచారిగారితో ఈ విషయంపై సుమారు రెండు గంటలు మాట్లాడాను. ఆయన ఎంతో ఓపికగా నాకు సమాధానాలు ఇచ్చారు. అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
ఆ రెండు వ్యాకరణ సూత్రాలూ కింద ఇస్తున్నాను. (ఇవి శ్రీ దేశికాచారిగారి టపానుంచి కాపీ చేస్తున్నాను.)
మొదటి సూత్రం: ఒక మాట చివర మకారమునకు హల్లు పరమైతే, ఆ మకారము సున్నా గారాయాలి. వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.
రెండవ సూత్రం: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది.
ఉదాహరణకి, నేను రాసిన ఉపనిషత్తు మంత్రం చూడండి. అందులో తమీశ్వరాణామ్ అని నేను రాసిన (మొదటి ప్రార్థనలో) ణామ్ వ్యాకరణం ప్రకారం తప్పు. దానిని ణాం అని రాయాలి. అదే మంత్రంలో, రెండవలైనులో, పరమం చ దైవతమ్ అని ఉన్నది. ఇది వాక్యాంతం కాబట్టి, ఇక్కడ మకారము సున్నా కాదు.
అయితే ఒక్క విషయం. ఈ మంత్రం వల్లించేటప్పుడు, ఈ మకార, అనుస్వరాలలో తేడాలు తెలుస్తాయా, కనిపిస్తాయా అని సహృదయులైన నవీన పాఠకులు ప్రశ్నించవచ్చు. అట్లా ప్రశ్నించడం సమంజసమో కాదో నాకు తెలియదు. నామటుకు నాకు, వ్యాకరణంతప్పయినా, కరణం తప్పయినా తప్పు తప్పే! period. ఈమాట సంపాదకులు నాకు preview పంపినప్పుడు, రోమను స్క్రిప్ట్ చూసి అంతా బాగానే వుంది; అడక్కండానే రోమను స్క్రిప్ట్ లోకి కూడా మార్చారని గొప్పగా సంతోషించాను కాని, ఒళ్ళు దగ్గిరపెట్టుకొని నేను పంపిన ప్రతితో పోల్చి చూడలేదు. బద్ధకం. అది నా తప్పు. ఈ వ్యాకరణం తప్పులు ఎలా దొర్లాయి అని తర్జన భర్జన చేశాం. ఇవి బహుశా, రోమను స్క్రిప్ట్ నుంచి మళ్ళీ తెలుగులోకి రాయటంవలన వచ్చి వుండవచ్చునేమోనని సర్దుకున్నాను.
పోతే, శ్రీ దేశికాచారిగారు కొన్ని అచ్చుతప్పులు కూడా సవరించిన ప్రతి నాకు పంపించారు. దానిని సురేశ్ గారికి, మాధవ్ గారికీ పంపిస్తున్నాను. దయచేసి, వ్యాకరణ దోషాల సవరణ తోపాటు, అచ్చు తప్పులుకూడా సరి చేయమని వారిని కోరుతున్నాను.
Begin Side Bar:
I have to tell a story in regard to మ్ and సున్న. I have written about this in 1997 (Telusaa), 2006 (Racchabanda), and in 2017 in the Facebook.
భవభూతి రాసిన ఉత్తరరామచరిత నాటకంలోని ఈ కింది శ్లోకం సంప్రదాయ సంస్కృత సాహిత్యంలో అతి చక్కని ప్రేమ కవిత అని అటు తూర్పున, ఇటుపడమరనా సాహితీ వేత్తలందరూ చెప్పుతారు.
భవభూతి (బహుశా ఎనిమిదవ శతాబ్దం) తన ఉత్తర రామ చరిత కావ్యాన్ని కాళిదాసుకి (బహుశా నాలుగవ శతాబ్దం) ఒక దూత ద్వారా వినిపించాడట! (ఇది చాటు కథ!)ఆ సమయంలో కాళిదాసు చదరంగం ఆడుతున్నాడట. ఆ దూత భవభూతి దగ్గిరకి తిరిగి రాగానే భవభూతి, ‘కాళిదాసు ఏమన్నాడు?’ అని ఆతృతగా అడిగాడట. ‘ఏమీ అనలేదు,’ అని దూత సమాధానం. ‘మొత్తం కావ్యం అంతా విని ఏమీ అనలేదా?’ అని భవభూతి రెట్టించి మరీ అడిగాడట.
దానికి దూత సమాధానం: ‘కాళిదాసుగారు చదరంగం ఆడుతున్నారు. ఆ చదరంగం ఆట మధ్యలో ఒక పరిచారిక కాళిదాసుకి తమలపాకులు, వక్క, సున్నం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ తాంబూలం వేసికొని, హుఁ! సున్నం ఎక్కువయ్యింది! అన్నాడు, అంతే!’
భవభూతి ఈ పై శ్లోకంలో ఆఖరి పాదంలో ‘ ఏవం వ్యరంసీత్’ అని రాసి ఉండాలి. వెంటనే ఏవం లో సున్న (nasal) తీసిపారేసి ‘ఏవ వ్యరంసీత్’ అని మార్చాడట.
తమాషా ఏమిటంటే, తెలుగులో సున్న, సంస్కృతంలో మకారప్పొల్లు. ఇక్కడ కాళిదాసుగారిని, భవభూతిగారినీ పదహారణాల తెలుగు వాళ్ళని చేసుకున్నాం. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట ఈ శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్టుగా భవభూతికి అర్థం అయ్యింది.
Merwin, Massonలు Sanskrit Love Poetry అన్న సంకలనంలో చెప్పిన కథలో భవభూతే కాళిదాసుకి ఉత్తరరామచరిత అంతా చదివి వినిపించాడని, కాళిదాసు అంతా విని, మొత్తం కావ్యంలో ఒకే ఒక్క శ్లోకంలో ఒక్క మకారపు పొల్లు ఎక్కువయ్యింది అన్నాడని ఉంది.
ఒక్క మాట కవితార్థాన్ని ఎంత పల్చబడేట్టు చెయ్యగలదో, సంస్కృతం క్షుణ్ణంగా వచ్చిన వాళ్ళకి తెలియచ్చు. రాతిర్ ఏవమ్ వ్యరంసీత్, అంటే the night has passed in this way అని అర్థం. దాని బదులు రాతిర్ ఏవ వ్యరంసీత్, అంటే, only the night disappeared, (but the rest of it continued) అని భావం.
End Side Bar.
ఆఖరిగా నా సంజాయిషీ:
కవిత్వభాషలో ఒక్క అక్షరం అర్థం, అలంకారం మార్చివేయచ్చు. రాసిన మంత్రాలు వల్లించడంలో ఆ తేడా కనిపిస్తుందా? నేను క్లుప్తంగా రాసిన వేదసంప్రదాయ వివాహ పద్ధతి, పాశ్చాత్యదేశాల్లో (ముఖ్యంగా అమెరికా ఖండంలో) స్థిరపడ్డ మన వాళ్ళకోసం. అందుకని, సాధ్యమైనంతవరకూ, ఇంగ్లీషులో భావం ఇవ్వడం జరిగింది. తెలుగులో ప్రతిపదార్థాలు, తాత్పర్యాలూ, వ్యాఖ్యలూ కావాలనుకుంటే, ఉపనిషత్తు మంత్రాలకి, శ్రీ నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు గారి ఉపనిషద్దర్శనం – 4, పెళ్ళి మంత్రాలకి, శ్రీ చల్లా లక్ష్మీ నరసింహశాస్త్రి గారి పుస్తకం లోనూ చూడవచ్చు.
ఆమె ( మరణించిన అనిల్ భార్య ), వంట మనిషిగా “ఆమె” ఇంటచేర్చిన ఓ అనామకురాలు చిన్నవయసు పూర్ణ, నలభై ఏళ్ల అనిల్, పూర్ణ ఇల్లు వదిలివెళ్లిపోతే తిండి కూడా తినకుండా విశ్వాసం ప్రకటిస్తూ కాలు కాలిన పిల్లిలా తిరిగే రామం ( పిల్లి )…
తనతో బతికే మనిషిని ( భార్యని కానీ, వంటమనిషి పూర్ణని కాని ) సాటి మనిషిగా పట్టించుకోని నిర్లక్ష్యం …
తన ప్రవర్తనని ప్రశ్నిస్తున్నట్టుగా ఆమె చూసే సూటిచూపు భయపెట్టడం… ఆమెని (భార్యని) తక్కువ చేసి చూడాలనే ప్రతి ప్రయత్నంలో తను పాతాళంలో ఉన్నట్లు అనిపించటం…
ద్వేషం, ప్రేమ, బాధ, భక్తి ఏదో ఒకటి ఆమెని చుట్టుకొని ఉంటాయెందుకో? మళ్ళీ తిరిగిరాలేనంత దూరం ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా బాధ పడటానికి అహమే అడ్డొస్తుంది…
ఆమె ( మరణించిన భార్య ) ఇవ్వలేనిది, పూడ్చలేనిది… పూర్ణ, రామం చేసినా వాళ్ళని తనవాళ్లనుకొనేదానికి అనిల్ మనసు ఒప్పుకోదు. వాళ్ళకి దిక్కులేక వచ్చారనే అనిల్ అహం తొలుస్తుంటుంది; అహమే అన్నిటికి యజమాని అనుకుంటూ.
ఎక్కడెక్కడో తిరిగి దిక్కులేక నిండు గర్భిణీ స్త్రీగా తిరిగి వచ్చిన వంట మనిషి పూర్ణకి మళ్లీ ఆశ్రయం ఇచ్చి, లోకం ఏమనుకుంటుందో ఏమో అని వెరవకుండా ఆశ్రయం ఇచ్చి, పూర్ణ అడుగులతో ఇల్లు ఇల్లులా ఉంటున్నది.. ఖాళీతనమంతా దేనితోనో నిండుతున్నట్లుగా భావించడం అనిల్ మానసిక పరివర్తనకి సూచిక.
పూర్ణ ప్రసవించిన పాప విచ్చుకున్న గుప్పిళ్లు, చికిలించి వెలుగుని చూస్తున్న కళ్లు, లేత పెదాలపై ఉదయిస్తున్న రహస్య భాష నవ్వు లో ఆమెని (భార్య ) చూడగలిగిన అనిల్ … హాస్పిటల్ లోని పురుళ్ల వార్డ్ నర్స్ అడిగిన మీదట… పాప పుట్టుక, తల్లిదండ్రుల వివరాలు ఫామ్‌లో ( బర్త్ సర్టిఫికేట్ లో ) రాస్తూ ( తల్లిగా పూర్ణ, తండ్రిగా తన పేరు రాస్తూ ) ఇలాంటి నిర్ణయాలను కేవలం సమయం మాత్రమే నిర్ణయిస్తుంది అనుకోవడం అనిల్ మానసిక పరిణితికి సూచిక.
అధికారం, కనికరించడం, కొంచెం గర్వం చూపిస్తూ… తనవారి పట్ల విశ్వాసహీనుడినా అనే సందేహాలు… ఏదో తృప్తి, ఎందుకో చాలా అసంతృప్తి. సుఖమెంత దుఃఖమో అనే విరక్తి… లోపలింత శూన్యతెందుకు అనే నైరాశ్యం లాంటి మానసిక రుగ్మతలు, వైకల్యాల నుండి విముక్తుడై ‘నిన్ను కనిపెట్టుకొని తోడుగా ఉండే మనిషికన్నా ఇప్పడు నీకేమి కావాలి? అన్న భార్య హితవుని అర్ధం చేసుకుని జీవితంలో ఉత్తమోత్తమమైన స్థాయికి అనిల్ చేరుకునేలా చెయ్యడమే చనిపోయిన భార్య “ఆమె నవ్వు”… లేత పెదాలపై ఉదయిస్తున్న రహస్య భాష లాంటి అప్పుడే పుట్టిన “పాప నవ్వు” సాధించిన విజయం.
సూర్యనారాయణ మూర్తిగారు, ఈ ప్రశ్నకోసం కొంచెం ఎదురుచూసానండి. శైవుడు అని చెబుతూ రామాచారి పేరు ఏమిటని. ఒక శివాలయానికి రామప్ప దేవాలయం అని పేరు రావడానకి కారణంలో ఇలాంటి కథ ఏదైనా ఉందేమో అనే ఆలోచన ఒకటి ఉండేది నాకు. ఆ ఆలయం నిర్మాణకర్త రేచర్ల రుద్రడని గణపతిదేవుడు వేయించిన శాసనం ఉంది. రామ అనే పేరు జైనులు కూడా పెట్టుకునే వారండి. శైవానికి ముందు కాకతీయరాజ్య ప్రాంతంలో జైనమే ఎక్కువగా ఉండేది. అలాంటప్పుడు వంశపారంపర్యంగా వచ్చేపేర్లలో రామ శబ్దం ఉండే అవకాశం ఉంది. గణపతి దేవుడు చాలాకాలం (6 నుంచి 12 సంవత్సరాలు) బందిగా ఉన్నాడనే అంటారు. ఎలా విడుదలయ్యాడు అనేది తెలియదు కాని, ఒక మంచి రిలేషన్ మాత్రం యాదవులతో కొనసాగిందన్నది నిజం. ఓ యుద్దంలో రెండు సైన్యాలు కలిసి పోరాడాయి. జైత్రపాలుడి కూతురునే పెళ్లి చేసుకున్నాడని అంటారు కొందరు. జైత్రపాలుడి కొడుకు సింగడికి తెలుగురాష్ట్ర ప్రతిష్టాపనాచార్య బిరుదుకి కారణం తెలియదు. హిస్టారికల్ స్పెక్యులేషన్స్ మధ్య నిజాన్ని వెతకడం కూడా కష్టమే ఈ రోజుల్లో. మతం – జనం సంబంధం తేలికైనదా, అత్యంత బలీయమైనదా అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుందండి. బహుశా రేఖామాత్రంగా చెప్పే ప్రయత్నం అంతే. ధన్యవాదాలండి.
ఎప్పుడో చిన్నప్పుడు విన్న విషయం తప్ప నాకు ఈ విషయంలో పాండిత్యం లేదు. నేను చెప్పదలుచుకున్నది: మన పురాణాల ప్రకారం భీముడితో సరితూగగల బలశాలులు ఇంకా ఉన్నారు కాని గ్రీకు పురాణాల ప్రకారం హెర్క్యులీస్ తో సరితూగగల బలశాలులు ఇంకెవ్వరూ లేరు – అని నా అవగాహన.
ఈ కథ చదువుతున్నపుడు చక్కని వింత హాయి కలుగుతుంది. కాని అనుభవంలో తేలేది ఏమిటంటే సున్నితమైన మనుస్సు చాలా చాలా గాయాలు చేస్తుంది.ప్రస్తుత దుర్మార్గపు ప్రపంచంలో సున్నిత మనస్కులు ఉంటే చాలా దుఃఖపడతారు.(అందుకే వేయి యంత్రాలనైనా నడపవచ్చు కాని ఒక మానవప్రాణితో సుఖంగా ఉండలేము)అదే యంత్ర వ్యాప్తికి కారణయ్యింది..
చాల చదువుతాము కాని ఏ కొన్నో పదే పదే మనస్సును పలకరిస్తాయి అందులో రేవతి దేవిగారి శిలాలోలిత నన్ను ఎంతగా కదిలించిందంటే — ఆ కవితల వెనకాల భావాలు –అక్షరాలతో వ్యక్తీకరించటానికి నేను రేవతి దేవిగారిని కాదే
లైలాగారి కథలో ‘లైలా’ కాలేజీ కలికానికైనా కనపడలేదు. అక్కడి (ఆనాటి) లెక్చరర్లు కొందరు లైలాగారి కథా దేశ కాలాల (అప్పటినక్కల రోడ్డు) డాక్టరమ్మల భర్తలుగా తెలుసును.
[కథ ఇంత బాగుండటానికి ఇది కథ కాకపోవటమే కారణమేమో! దుర్గమ్మ గుడిగుమ్మం ముందు నుంచుని పైకి చూస్తూ ‘అమ్మలగన్న అమ్మ’ పద్యం చదువుకుంటూ లోపలికి వెళ్ళి అమ్మను చూడటంలో ఉన్న ఆనందానుభవం ఎటువంటిదంటే ‘జర్నల్ అఫ్ అప్లయిడ్ ఫిజిక్స్’లో పడిన ఒక పేపర్ను -వాసుదేవ- ఆ తల్లికి అంకితం చేసిన విషయం ఆ పేపర్ చివర్లో కనపడుతుంది].
నాకు తెలిసినవి రెండే ఊళ్ళు, ఆ రెండిటి (ఆనాటి) విద్యా సంస్కారాలను కళ్ళకు కట్టించారు మీరు –
డాక్టర్ ఎర్నేని మీకు ధన్యవాదాలు… నమస్కారాలతో- తఃతః
జపానుదేశరచయిత్రి మురాసాకీ ఉదంతమును తెల్పినందులకు ధన్యవాదములు. కానీ ఈవ్యాసం ఆదిలోనే ఉన్న ఈక్రింది వాక్యాన్ని చూస్తూనే అది నాకు చర్చనీయంగా అనిపించింది:
“నవలలకూ, స్త్రీలకూ అవినాభావ సంబంధం ఉందని సంస్కృత భాష సాక్షిగా మనవాళ్లు చెబుతూంటారు. (సంస్కృతంలో నవలా అంటే స్త్రీ)”
ఆఁడుది అనే అర్థం గల నవల (రూపాంతరం నవలా) శబ్దం సంస్కృతంగా గాక దేశ్యంగానే నాకు గుర్తు. కాని ఇది సంస్కృతశబ్దమని ప్రప్రథమంగా ఇక్కడే వినడంచేత, నా అనుమాన నివృత్తికై వావిళ్లనిఘంటువును, ఆంధ్రవాచస్పత్యమును, విక్రాల శేషాచార్యులవారి సంస్కృతాంధ్రపదార్ణవమును పరిశీలించినాను. వీటన్నిటిలో నవల, నవలాపదములు ఆఁడుది అనేఅర్థంలో శుద్ధదేశ్యపదములుగానే పేర్కొనబడినవి. ఎందుకో సూర్యరాయాంధ్రనిఘంటువులో ఈపదం లేనే లేదు, కాని వావిళ్లనిఘంటువులో దీనికి రామాభ్యుదయంనుండి ప్రయోగంకూడ ఈయబడింది. వసుచరిత్రాది ఇతరగ్రంథాలలోనూ ఇది దేశ్యంగానే ప్రయోగింపబడింది. మఱి మీరీశబ్దం సంస్కృత మనుటకు గల ఆధారం తెలిపితే ఆవిషయం తెలుసుకొని నాపదజ్ఞానపరిధిని విస్తరించుకొంటాను.
రాత్రంటే వయసొచ్చి హార్మోనుల భారంతో అల్లల్లాడడమే అని కవి గారి భావన జాలి కొలిపేలాగ ఉంది.. తీరని కోరికలతో సతమతమయ్యే మధ్య తరగతి కష్ట జీవి బ్రతుకులో ఇంకా కోరికలు రగలుతూ ఉండడం తప్పని సరి సమస్యే కావొచ్చు కాని..జీవితమంటే పగలు రాత్రులే నని ఇద్దరు కలిస్తే వచ్చే మూడో వాళ్ళని, ఆ రాత్రి తాలూకూ భాద్యతలను నెర్పే రోజు కూడా కవి హృదయంలో మెదలాలని ఆశిస్తూ….. ఒక చక్కని పొంగే బీరు లాంటి, కాపు కాచిన విప్పపువ్వు సారాలాంటి కవిత.మాత్రం మత్తెక్కించిందనే చెప్పాలి..
మీ వ్యాసం సాయంతో దుబాయ్ ట్రిప్ వేయవచ్చు. అంతా వివరంగా రాసారు. కాని వెళ్లేది ఎప్పుడనేదే ప్రశ్న. సశేషం అన్నారు… మిగతా బాగాల కోసం ఎదురు చూస్తాను.
పుస్తక పరిచయాలు గురించి Dr. Veldandi Sridhar గారి అభిప్రాయం:
06/01/2020 10:46 pm
ఒక గొప్ప పుస్తకానికి అంతే గొప్ప పరిచయం బావుంది. ఉటంకించిన కవితలను బట్టే తెలుస్తుంది ఇది సాధారణ పాఠకులకే కాదు కవులకు కూడా పాఠ్య గ్రంథమని ఇలాంటి గొప్ప పుస్తకాన్ని అందించిన ముకుంద రామారావుగారికి, పత్రిక సంపాదకులకు అభినందనలు…
వ్యాసంలో లింక్స్ ఇచ్చాను కదా అని బద్ధకించాను. టే హాహాఫ్, విలియం గిఫర్డ్ లింకులు ఆ సంఘటనల గురించి నెట్‌లో ఉన్న వ్యాసాలకు దారి తీస్తాయి. ఆన్రీ షారియే పుస్తకం ఏ ప్రతిలో ఉందో తెలియక ఆ ప్రతి ప్రచురణ వివరాలు ఇవ్వలేదు. (కాని, ఏ అనువాదం ముందుమాటలో అయినా ఉంటుందనుకుంటాను.)
“అలాగే వాలి సుగ్రీవులకి తల్లీ తండ్రీ కూడా ఒకరే. అందువల్ల బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారంటే ఎవరో ఒకర్ని పెళ్ళి చేసుకుని అనంతంగా పిల్లల్ని కనేస్తున్నారనుకోవడం మరోటి లేదు అంత బుద్ధి తక్కువ ఆలోచన”
శర్మగారూ!
‘సర్వమూ సాధు కాని పురాణాల’ గురించి – నాకు మాత్రం ఇటువంటి బుద్ధితక్కువ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటినుంచి నేనూ నానుంచి అవీ తప్పించుకోలేము.
“Anthropomorphic deities exhibited human qualities such as beauty, wisdom, and power, and sometimes human weaknesses such as greed, hatred, jealousy, and uncontrollable anger. Greek deities such as Zeus and Apollo often were depicted in human form exhibiting both commendable and despicable human traits” -wiki
నమస్కారాలతో
తః తః
మానస పుత్రులు/పుత్రిక అంటే మీరిచ్చిన వివరణ సరైనదనిపించడం లేదు. బ్రహ్మ, సరస్వతులకు పుట్టిన వాళ్ళను అన్న చెల్లెల్లుగా వ్యవహరించొచ్చు. కాని బ్రహ్మ ఊహకు పుట్టిన వాల్లంతా అన్న చెల్లెల్లు అనడంలో అర్థం లేదు. కాబట్టి అన్న చెల్లెల్లకు ఎక్కడా పెళ్ళవలేదు.
జగదీశ్వర్ వల్లభదాసు
భయం – భక్తి గురించి T.subrahmanyam గారి అభిప్రాయం:
05/08/2020 7:30 am
చాలా బాగుంది కాని ఇరాఖ్ లో భార్యతో వున్నపుడు నిరొధ్ గురించి చెప్పినపుడు కొంచం సున్నితముగా రాసి వుందవలసినది.
“రమణులు తన జీవితకాలంలో ఎన్నడూ ఎవరికీ విభూది ఇచ్చిన దాఖలాలు లేవు. వచ్చినవాళ్లకేసి ఒక్కచూపు చూసేవారు(ట). ఆ చూపుకి వళ్ళు తప్పిపోయి, తలలో గర్వం పాదాల్లోకి ఒక్క క్షణంలో వచ్చి ఆయన శిష్యులైనవారున్నారు (ఉదాః చలం అనబడే ఒకానొక ప్రబుధ్ధుడు)…”
“చెందమ్మి కన్నులవాడు, చేతి పిల్లగ్రోవి వాడు
ఇందువచ్చె కంటిరా? ఏమిదే యమ్మా!”
S. జానకి ఈ పాట ఎంత బాగా పాడింది! ఈ పాట మాధుర్యం అన్నమాచార్యుని పదాల లోంచి వచ్చింది. అలా ఎవరు రాయగలరు!
ఐనా, ఆ పాట నాయకుడు కృష్ణుడు కాకుంటే అంత విరహము, అంత మోహము ఉండేనా!
జన హృదయం దోచిన కృష్ణుడి వేషం కట్టక పోతే, N.T. రామారావు తెలుగునాట ఛీఫ్ మినిస్టర్ అయ్యేనా!
“మందల పశువుల వాడు
మకరాంతముల వాడు
ఎందునున్నాడు చెప్పరే! ఏల దాచేరమ్మ!”
ఈ పాట నాలో ఎప్పుడూ సుళ్లు తిరుగుతుంటుంది. ఇందులో మోహమురళి, మంద్ర తంత్రుల వీణమీటులు మరోలోకాలవి. పాటలోని మాటలు వరసలు అప్పడప్పడు గుర్తు రాపోతేనేం ఎటు మార్చి పేర్చుకున్నా, అందమే అందం.
“చెచ్చెరకోనేటివాడు శ్రీ వేంకటేశ్వరుడు
వచ్చి నన్ను కూడినాడు వాడు ఓ యమ్మా!”
నాకు శృంగారం ఒక్కటే రసం. ఏ శకం లోనూ, ఏ వయసులోనూ, ఏ రోజునైనా, ఏదో ఒక్క కణం లోనైనా, ఒక క్షణమాత్రమైనా, శృంగారం లేక -జీవితం సహ్యం కాదు.
నేను తెలుగు వనితనే! కృష్ణుడి పై పాటలు తెలుగువారి DNA లో భాగం ఐ పోయాయి. అదేమంత కష్టమైన తెలుగా! ఒక చక్కని పాట రాయటానికి ఎంతపాటి తెలుగు రావాలి!
“గోపాలకృష్ణుడు నల్లన
గోకులములో పాలు తెల్లన
కాళిందిలో నీళ్లు చల్లన!
పాట పాడవె నా మనసు ఝల్లన!”
రావు బాలసరస్వతి ఏమీ పటాటోపం లేకుండా పాడే ఆ తెలుగు పాట, ఎందుకు రంజింప చేస్తుంది! ఎందు వలన! అగ్రస్థానంలో గోపాలకృష్ణుడున్నాడు! అందువలన!
ఈ నెల ఈ మేగజీన్ లో వినిపించిన లలిత సంగీతం లో అన్నిటికన్నా బాగున్నది పైనున్న కృష్ణ గీతమేగా!
ఆ పాటలో శాంతకుమారి చివరి మాటలు అంత స్పష్టంగా వినరావటం లేదు! ‘గురు చింత’ అనేనా గేయరచయిత రాసింది?
“పక్షపాతమేలా! నీ పక్షమేది గోపాలా!
‘మురళి’ కన్న ‘రాస’ కన్న “గురుచింత” ఏలా!”
విన్నారుగా!
Edith Hamilton -Mythology చదువుకుంటే, Roman, Greek First tier Gods, Second tier Gods తెలుస్తారు.
పోతన భాగవతంలో, హిందూ దేవతల వంశాలు, ఉపవంశాలు, శాఖలు, తెలియచెప్పాడు.
హిందూ మిథాలజీలో కృష్ణుడు అగ్రశ్రేణిలో ఉన్నాడు. నాకు మిథలాజికల్, ఫిక్షనల్ హీరోలే హీరోలు. వారి మీదే నాకు గురి. నీకు తెలిసిన డాక్టర్లలో ఎవరు నీ హీరో అంటే – Dr. Richard Kimble అంటాను. అతను ఎవరంటే, ఛికాగో కుక్ కౌంటీ హాస్పిటల్లో సర్జన్! ఎక్కడ అంటే “Fugitive” సినిమాలో. ఆ డాక్టర్ ధీరోదాత్తుడైన నాయకుడు.
శర్మగారూ! చలం సాహిత్యం అంతా నా వద్ద ఉంది. అతడు తెలివైన రచయిత. కాని నాకు ఇష్ట రచయిత కాడు. అయిష్ట రచయిత కూడా కాడు.
నిన్నంటే నిన్న Edith Wharton రాసిన కథలు రెండు చదివాను. 1. The afterword. 2. Xingu. తెలివైన రచయిత్రి. రెండూ బాగా రాసింది. ఎక్కడి కక్కడే ఐపోయింది, ఓరినీ! భలే రాసిందే అనుకుంటే, పక్క పేజీలో మళ్లీ కథ సాగించింది. మళ్లీ అదే తంతు. ముగించింది లెండి ఆమె కిష్టమైనప్పుడు.
చలం, ఈడిత్ ల సంగతెందుకు? మీరు కథకులేగా శర్మగారూ! ఎందుకు ఫస్ట్ తారీఖుకే రాయటం. ఉద్యోగాలలో బిజీగా ఉన్నందువల్ల రాయలేని రచయితలు ఇప్పుడు కొన్నాళ్లుగా రోజు కొకటి రాసి ఉండాలిసిందే!
మీరు రాసిన కథలలో “తుఫాను” అన్న కథ నాకు బాగా నచ్చింది. ఆసాంతం బాగా రాసారు. అందులో ambience బాగా వచ్చింది. కథ స్పిరిట్ టాల్స్టాయ్. సెట్టింగ్ ముంబయ్! కథలో ఇద్దరు చక్కని spirited కథానాయికలున్నారు. కథలు కొన్నిసార్లు అవే రాసుకుపోతుంటాయి. జయదేవుడి అష్టపది లో ఆఖరు పంక్తి కుదరక రచయిత లేచిపోతే, కృష్ణుడొచ్చి పూర్తి చేసినట్టు మళ్లీ వచ్చి చూసుకున్నప్పుడు చక్కని ముగింపు రాసి ఉంటుంది. బాగా ముగింపు ఇచ్చారు తుఫాను కథకు! It is a positive Leo Tolstoy! Beautiful!
మీ కథ ఒకటి ‘ఈ మాట’ మరుసటి సంచికలో ఉంటుందని ఎదురుచూస్తాను.
ఈమాటలో గణపతి ముని సంస్కృత రచనకు ఆంగ్ల అనువాదం ప్రకటించటం ఆనేది ఆభిలషణీయం కాని పని. ఎవరికోసం ఈ ఇంగ్లీష్ అనువాదం తెలుగువాళ్ళు చదువుకునే పత్రికలో? తెలుగు అనువాదం అయితే ఎంత ఆనందంగా ఉండేది. సూటి ఆంగ్ల రచన వేయటం వేరు. దానికి కొంత అర్థం ఉంటుంది. కన్నడంలోనో బెంగాలీలోనో ఉన్న రచనలకు ఆంగ్ల అనువాదాలు గూడా వేస్తారేమో ముందు ముందు. ఈ పని పూర్తిగా పాండిత్య ప్రకర్ష గానే ఉంది.
శ్రీనివాస్ గారూ,మంచి ఇంటర్వ్యూ అందించారు, ధన్యవాదాలు. జగ్గయ్య గారితో ఇంటర్వ్యూ ఇదే వినటం.
సినిమా సంభాషణలు గ్రామఫోన్ రికార్దుగా రావటం ముత్యాలముగ్గుతో ప్రారంభం అయింది అని ఇన్నాళ్ళూ అనుకున్నాను, కాని జగ్గయ్యగారు శివాజీ గణేశన్ కు డబ్బింగ్ చెప్పిన మనోహర చిత్రం తో ఆరంభం అయ్యిందని ఈ ఇంటర్వ్యూ వల్లే తెలిసింది
శ్రీహర్షుని ‘అవామే వామార్ధే’ అని మొదలయ్యే ఒక శ్లోకానికి కల మూడు రకాల అర్ధాలు ఇచ్చి, తనుగా ఇంకా శ్లోక రహస్యాలు శోధిస్తూ; ఈ వ్యాసం లో మొదటిగా ఇచ్చిన శ్లోకంలో ‘గ్రంథి’ అన్న మాటకు ముఖ్యార్ధం ముచ్చటించకపోటం, ‘చిక్కు ముడి’ అన్న ఒక్క అర్థంలో మాత్రమే ఆ మాటను శ్రీహర్షుడు వాడినట్టుగా ఆసాంతం ఈ వ్యాస రచయిత అనుకోటం ఆశ్చర్య పరిచింది.
గురువు లేనందున, సంస్కృతమే తెలియదు నాకు. ఐతే, సంస్కృత కావ్యాలు చక్కగా చదువుకున్న, రసికులైన పంతుళ్లు, నాకు బెజవాడలో చెప్పిన తెలుగొచ్చు. అందుకేగా రచ్చబండ యాహూ లో ఇలాటి తెలుగు కవిత్వాలు చెప్పాను.
నిన్న మొన్నటి దాక
ఎన్నొ పున్నమి రాత్రులు
పున్నాగల మీద జంట మిన్నాగుల వలే
పెద్దకాలము మనము పెనగితిమి ప్రియతమా!
నేడా చనువు చెలగాటములు లేవు
నేడా తనువు తగలాటములు లేవు
ఆ బులుపుల పున్నాగల గంధాలు
భద్రముగ నుంచులే
మెదడు మడుపుల సూక్ష్మగ్రంధాలు
తలను వీడవుగాదా వాసనలు
మనమిలను వీడువరకు!
ఆ కవిత్వం చదివిన ఒక సభ్యులు జాబాలిమునిగారు, గ్రంథులు అనబోయి గ్రంథాలన్నారా? వైద్యులు లైలాగారు, అంటే ఆ తర్వాత కొంత డిస్కషన్ నడిచింది. యాహూ నిర్వాహకులు -గ్రూపులు మూసివేసినందున, కంటెంట్ తుడిసివేసినందువలన, ఇక ఆ లింకు ఇచ్చే గొడవ లేదు.
పైది రచ్చబండ- యాహూ లో రాసినప్పటికి ఆంధ్రభారతి నిఘంటువుల తయారీ పూర్తికాలేదు. ఇప్పుడు ఆ నిఘంటువుల నుండి:
గ్రంథి : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
సంస్కృత విశేష్యము
• 1. బుడిపి. గడ్డవలె పుట్టు రోగము.
• 2. చెట్టు మొ.ని ముడి.
• 3. కీలు.
• 4. [జీవశాస్త్రము] శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).
అందులో నాలుగవది అతి ముఖ్యమైన అర్ధం. అన్ని రసాలకు కారణం ఆ గ్రంథులు.
-Lyla
Ps: సంస్కృత పండితులు ఈ వ్యాసంలోని మొదటి శ్లోకం గురించి విడమర్చి చెపుతారని ఆశిస్తాను.
‘పదివేల పేజీలు.. యెవరికీ అర్థంకాని’ – నెట్ లో ఉంది. ఒకసారి చూడండి. I did it. ‘Capitalism based’- అన్న అభ్యంతరం లేకపొతే, మనది అద్భుతమైన రాజ్యాంగం అని నా అభిప్రాయం.
నేరం చేసాడో లేదో తెలియదు అనే ముక్క పట్టుకుని కధ రాసారులా ఉంది. కానీ నిర్భయ కేసునుంచి ఈ రోజు వరకూ జరిగినవి చూస్తే తెలిసేదేమంటే, ఎంత వెధవైనా సరే వాడికి ప్రాణం మీద “అతి” తీపి. నేను అమాయకుణ్ణీ అని చెప్పుకోవాలనే తాపత్రయం; ఏదో ఒక లొసుగు ఉండకపోదా తప్పించుకోవడానికి అనే ఆశ. ఇవన్నీ కూడా రేప్ చేసినప్పుడూ, ఆ తర్వాతా గుర్తుకురాకపోవడం, ఇంతటి నీచమైన పనిచేసినా దానికి ఒప్పుకుని పశ్చాత్తాపం పడకపోవడం దారుణం. ఇదంతా ఒక ఎత్తైతే మన అద్భుతమైన న్యాయ వ్యవస్థా, దాదాపు పదివేల పేజీల – దాదాపు ఎవరికీ అర్ధంకాని, గుర్తు ఉండని – రాజ్యాంగం ఎంతకీ తేలని కోర్టు కేసులూ మరో ఎత్తు. నిర్భయ అమ్మగారు ఏమన్నారో ఎవరైనా విన్నారా? “నా కూతురు పోయి ఏడేళ్ళు దాటుతోంది. ఏడవడానికి కన్నీళ్ళు కూడా ఎండిపోయాయి” అంటున్నారు. మరి ఆవిడ క్షోభో? ఈ ఏడేళ్లలో పాపం ఆవిడ ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపిందో, ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగిందో, ఎంత దారుణంగా ఆ బాధ గుండెల్లో నొక్కుకుందో ఎవరైనా ఆలోచించారా?
ఈ రోజు వచ్చిన వార్త ప్రకారం ఈ నిర్భయ కేసులో ఒకడు క్యూరేటివ్ పిటిషన్ అనే కేసు ఏదో వేశాట్ట ఆఖరు అస్త్రంగా. వాడిని పోలీసులు తీసుకెళ్తున్నట్టూ ఒక బొమ్మ – కలర్ దే – వేసారు. కండలు పెంచి వస్తాదులాగా ఉన్నాడు. జైల్లో ఉచితంగా పెట్టే కోడికూరా బిర్యానీలు బాగా వంటబట్టినట్టున్నాయ్. రేప్ చేసినప్పుడు, ఆవిడ రక్తం కారుతూ చేతులెత్తి మొరపెట్టినప్పుడూ, ఆవిడని బస్సులోంచి తోసేసినప్పుడూ వీళ్లకి లేశమాత్రమైనా లేని కనికరం వీడికి ఎందుకు చూపించాలిట? ఇవి చాలవన్నట్టూ ఈ ముష్టి వెధవల తరపు వాదించడానికో లాయరు తయారు. ఓ సారి గుండెలమీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు లాయర్ అయితే ఇటువంటి కేస్ వాదిస్తారా ఎన్ని డబ్బులిచ్చినా? అలా వచ్చే డబ్బులూ, పేరూనా మీరు లాయర్ గా కోరుకునేది?
ఆ చచ్చిపోయిన అమ్మాయి మీవాళ్లైతే/ఏ మంత్రి గారి కూతురో అయితే ఎలా స్పందిస్తారు? అప్పుడు ఈ న్యాయం అనేది అటవికమా, అన్యాయమా అనేది ఎవరు నిర్ణయం చేస్తారు? అసలీ నిర్భయ కేసు ఇంతకాలం ఇలా బుధ్ధి లేకుండా లాగబట్టే ఇటువంటి రోజు రోజుకీ ఎక్కువౌతున్నాయి. ఇటువంటివే రాగింగ్, చిన్న పిల్లల్ని స్కూల్లో కొట్టడం అనేవి. రాగింగ్ జాడ్యం మనకి ఎక్కువగా ఉండేది కొంతకాలం క్రితం. బాగా రూల్స్ పెట్టి స్ట్రిక్ట్ చేసాం అని చెప్పుకుంటున్నా ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నై. కాలేజీలు తెరవగానే ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అయ్యో పాపం అనుకోవడం ఆవిడ పోయిన రోజున. మర్నాటినుంచి మళ్ళీ అంతా మామూలే.
అసలీ దరిద్రాలు ఎప్పటికి వదుల్తాయి? ఇటివంటివి జరుగుతున్నందుకు మనం సిగ్గుపడితే పడతాం గాక కానీ ఈ కేసు ఇప్పటికీ తేల్చనందుకు ఏ ఒక్క రాజకీయనాయకుడూ కూడా సిగ్గుతో తలదించుకోలేదు. [భగవంతుడా, ఇది 2020 సంవత్సరం, 1745 కాదు] ఇది చాలక ‘మేరా భారత్ మహాన్ రండ్రండి వచ్చి పెట్టుబడులు పెట్టండి’ అని ఆగని సాగర ఘోష.
అన్నింటికన్నా దరిద్రం ఏమిటంటే ఇవన్నీ జరిగినవి ప్రథానమైన నగరాల్లో కనక అవి బయటకొచ్చాయి. రోజువారీ పల్లెల్లో జరిగేవి ఎన్నిఉన్నై? పూర్వకాలంలో కొరత అనేది ఉండేదంటారు. నేరస్తుణ్ణి శూలం మీద గుచ్చి శ్మశానంలో వదిలేస్తారు. వీళ్లని ఎందుకలా చేయకూడదు? “అమానుషం” అయిపోతుందిట. అయ్యో పాపం అమానుషం “మనుషులకి కాదుటండీ?” ఒకప్పుడు రేప్ చేసినా వీడూ “ఒక మనిషే!” నిజమేనా? ని-జ-మే——-నా?” ని….ని…..ని…..నిజంగానేనా?
మాది తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామం, నా వయస్సు 21 సంవత్సరాలు. నేను సావిత్రి గారికి అభిమానిని. సావిత్రి గారు నాకు అమ్మతో సమానమండి. నేను పల్లవి గారు రాసిన మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి పుస్తకాన్ని చదివాను. నిజంగా, ఆ పుస్తకం చదువుతూ ఉంటే సావిత్రి అమ్మగారు నా కళ్లముందు ఉన్నట్లే అనిపించిందండి. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు సావిత్రమ్మ గురించి ప్రతి క్షణం బాధపడ్డానండి. ఆ పుస్తకంలో సావిత్రమ్మ గారి ఫొటోస్ చూసానండి. ఫొటోస్ చూసాను, కాని సావిత్రమ్మ గారి మాట ఎప్పట్నుంచో వినాలని బాగా ఆతురతగ ఉండేది, ఎలా ఉంటది అమ్మగారు ఎలా మాట్లాడతారు అని. అది ఇప్పుడు మీ వల్ల అమ్మగారి మధురమైన మాటా భావాలు విన్నాను. అమ్మగారు మాట్లాడుతుంటే అమ్మను చూసినట్టే ఉంది. అమ్మగారు ఈరోజు మనతో లేకపోయిన అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి, కాబట్టి అమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సావిత్రమ్మ గారి మధురమైన మాటల్ని అందించినందుకు శ్రీనివాస్ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈమాట పత్రికలో ఉన్న సంపాదకులు లాంటివారు, ఈ పుస్తకానికి పని చేస్తే బాగుండేది.
ప్రచురణ పరంగా గత ముప్ఫై యేళ్ళలో ఇరవై పాతిక సంపాదకులను చూశాను. ఈమాట సంపాదకుల లాంటివారు ఒకటీ ఒకటిన్నర మాత్రమే తారసపడ్డారు. This is a rarest of the rare breed in Telugu.
వాడ్రేవు ఈ పత్రికలో ప్రచురించిన రచనలు నేను ఆసక్తితో చదువుతాను. ఈ ‘ముందు మాట’ చదువుకోటానికి బాగుంది. “కాళీ పదములు” అన్న కవితా సంకలనానికి ఈయన ఈ ముందుమాట రచించారు. వ్రాసిన తీరు నింపాదిగా, అనేక విషయాలు సేకరించి, పరిశీలించినదిగా ఉంది.
ఐతే, అంతా చదివిన తర్వాత, ఈ కవితలకు పరిచయాన్ని రామకృష్ణుని జీవిత చరిత్ర ప్రస్తావన, ఆయన భగవంతుని గురించి బోధనో, పాటో, -ఆ కొటేషన్స్‌తో ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. ముందే తెలియక్కర్లేదు కాని, ఎప్పటికో ఒకసారి, కనీసం చిట్టచివరికన్నా తెలియాలి కదా?
బెంగాల్ లో ఉద్భవించిన కాళి భక్తి, అందుకు సంబంధించిన వంగ సాహిత్యావతరణ, విదేశీయ రీసెర్చ్ స్కాలర్స్ రచనలు- ఈ అంశాలు ఇంటరెస్టింగ్‌గా ఉన్నై. అందుకు అవి ‘నిజం’ ఐ ఉండాల్సిన అవసరం కూడా లేదు. రెలిజియస్ ఐకాన్స్, భక్తి, మతం, సంబంధించిన పరిశోధనలలో నిజమేమిటి? అబద్ధమేమిటి?
సరే, కవితల పుస్తకమా అంటే తెలుగు కవిత్వపు పుస్తకం. పుస్తక ప్రచురణ విజయవాడలో. రిలీజ్ విజయవాడలో. రచయిత్రి కూడా చిన్నప్పుడు విజయవాడ (బెజవాడ) లో ఉండి వచ్చినట్టున్నారు. మరి ఆమె పుస్తకానికి ముందుమాటగా బెంగాలీ కాళీ ప్రసక్తి ఎలావచ్చింది? బెజవాడలో ఇంటి వెనకాల కొండమీద గుడిలో వెలసిన కనకదుర్గమ్మ -కాళి కాదా? కాని ఆ దేవత, ఆమె చరిత్ర, ఆమెపై భక్తి సాహిత్యం ఉందో లేదో విమర్శకులు ఎత్తనే లేదు. మరి బెజవాడ దుర్గ ఎలా ఉద్భవించిందో, బెంగాలీ కాళి, బెజవాడ కాళి ఒకరో కారో, అలాటి సంగతులు ఈ ముందుమాట రాసినవారు చెప్పనే లేదు. చెప్పమని కాదు కాని, -ఈ కవితలలో బెజవాడ కాళిని కాదు, ఆ బెంగాలీ కాళిని తల్లిగా ఊహించి, ఈ కవయిత్రి స్మరిస్తున్నది సుమా, అని ముందుమాటలో మనకు స్పష్టం చేస్తున్నారా అని నా సందేహం. ఒకవేళ రచయిత్రి గాని బెంగాల్లో ఉండి, కలకత్తా కాళిపై గాని బెంగాలీ భక్తి సాహిత్యంపై గాని ఆసక్తి జనించి కవితలు రాసారా? ఈ ముందుమాటలోని బెంగాలీ సాహిత్యానికి, ఈ రచయిత్రి కవిత్వానికీ ఉన్న లింక్ ఏమిటో తెలియటం లేదు. ఈ పత్రికలోనే ప్రచురించబడిన ‘కాళీ పదాలు’ కవితలు కొంచెం కూడా ఆ సందేహాన్ని నివారణ చెయ్యలేదు.
కవయిత్రిని, ‘మరొకసారి గంగ నేలకు దిగింది’ లాటి ఇమోషనల్ పదజాలంతో అభినందిస్తూ వాడ్రేవు ఆకస్మికంగా తనే కవి ఐపోటం కొంచెం తబ్బిబ్బు కలిగించింది. గంగావతరణం కథ బాగానే చదివిన నాకు ఆ మాటలు ఆయన వాడటంలో కూడా ఆయన చెప్పదలచిందేమిటో తెలియలేదు.
ఈ కవితల పుస్తకానికి ఆయనను ముందుమాట రాయమని అభ్యర్ధించిన వారికి, ఏవో సాహిత్యపరమైన కారణాలు ఉండే ఉంటాయి. అడిగిందెవరైనాగాని, కవయిత్రి అనుమతి లేకుండా, ప్రచురణకర్తలు, ఆమె కవితల సంకలనానికి వీరి ముందుమాటను జోడించరు కదా. ఈ ముందుమాటకు, కవితలకు అసలు జోడీ ఏదీ?
ఇల్లేరమ్మగారి ఇంపాక్ట్ ఫేక్టర్
By: Dr Mula Ravi Kumar, Asst. Professor, SV Veterinary University
స్వర్గీయ డా. సోమరాజు సుశీలగారు (1945-2019) తెలుగు రచయిత్రిగా పెన్ను పట్టుకుందికి పాతికేళ్ళముందే రసాయనశాస్త్రవేత్త. తన యాబయ్యో ఏట రచయిత్రిగా కలం పట్టుకొని, రెండో పుస్తకంతో ఇల్లేరమ్మగా, తెలుగు ఇళ్ళలో స్థిరపడిపోయారు.
ఆ రసాయన శాస్త్రవేత్త 1974లో ఆవిడ దురదృష్టం, మన అదృష్టం వల్ల చిన్నపరిశ్రమ పెట్టేరు. ఆవిడ దురదృష్టం ఎందుకంటే, భార్యాభర్తలు ఇద్దరూ శాస్త్రవేత్తలుగా ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వ డబ్బుతో పరిశోధనలు చేస్తూ, ఆ “ఫలితాలు నివేదించటానికి” విమాన ప్రయాణాలు, అప్పుడప్పుడూ విదేశ ప్రయాణాలు చెయ్యటం ఎంత హాయైన పని?
అది వదిలి చిన్నపరిశ్రమ పెట్టటం వల్లే కదా ఆవిడలో పోరాట పటిమ మెరుగుపెట్టబడింది? అల్లకల్లోల సముద్రంలోనే నావికుడు రాటుదేలుతాడని ఇంగ్లీషు సామెత కూడా ఉందికదా? అలా, ఆ పాతికేళ్ళ చిన్నపరిశ్రమ కష్టం లేకపోతే ఆవిడలో వేదాంతి, రచయిత్రి, చమత్కారి కట్టకట్టుకొని ఆవిడ యాబయ్యో ఏట బయటపడేవారా? ఆవిడ ఉద్యోగం వదిలి ఉండకపోతే, ఈ ప్రతిభ అంతా శాస్త్రవేత్తల పాలయ్యేది. ఆవిడ కలం నుండి కేవలం పరిశోధనా వ్యాసాలు, ఓ కెమిస్ట్రీ పుస్తకం, మహా ఐతే తెలుగులో “నిత్యజీవితంలో రసాయనశాస్త్రం” అనే ఒక పుస్తకం వచ్చేవేమో.
అంచేత ఈవిడా, డా రంగారావుగారూ నాయుడమ్మగారి స్పూర్తితో లక్షణమైన ప్రభుత్వ శాస్త్రవేత్త ఉద్యోగాలు వదులుకున్నప్పుడే తెలుగు లోగిళ్ళలో ఇల్లేరమ్మ గృహప్రవేశానికి భవిష్యత్తులో ముహూర్తం పెట్టబడింది, అని ఒక హేతువాదిగా నేను చెబుతున్నాను. ఆ ముహూర్తం పెట్టినది దేవుడే అని ఒక నాస్తికుడిగా చెబుతున్నాను. ఆవిడ శ్రమజీవి/ వేతనజీవి స్థాయి వదిలి పెట్టుబడిదారుగా మారడంలో గొప్ప సామాజిక ప్రయోజనముందని ఒక వామపక్షవాదిగా చెపుతున్నాను.
ఇంతకీ ఈవ్యాసానికి “ప్రభావం” లాంటి లక్షణమైన తెలుగుపేర్లు వదిలి ఇంపాక్ట్ ఫేక్టర్ అనే అప్రాచ్యపు పదం (ప్రాచ్యం అంటే తూర్పు, అప్రాచ్యం అంటే పడమర, అంతే) ఎందుకు పెట్టానంటే, ఒక శాస్త్రవేత్త రాసిన పరిశోధనా పత్రాన్ని ఎంతమంది తమ ఇతర పరిశోధనల్లో ఉటంకిస్తారో, (లేదా) ఒక సైన్సు పత్రికలో పడ్డ వ్యాసానికి ఎంత ఎక్కువమంది చదివే అవకాశం ఉందో, దానిని ఇంపాక్ట్ ఫేక్టర్ అంటారు. ఉదాహరణకి నా పత్రం పదిమందీ, నా మిత్రుడి పత్రం వందమందీ ఉదహరిస్తే, అతడి ఇంపాక్ట్ ఫేక్టర్ నాకు పదింతలు. కవనశర్మగారి భాషలో చెప్పాలంటే నేను రాసిన కేజీ పేపర్ల బరువుకి అతడు రాసిన వందగ్రాములు సరిపోతాయి.
ఇప్పుడు ఇల్లేరమ్మగారి ఇంపాక్ట్ ఫేక్టర్ రచయిత్రిగా ఎంతో చెప్పాలంటే శ్రీరమణగారి వాక్యం, దీపశిఖ ముందుమాటలో, “ఇంత స్వల్ప వ్యవధిలో ఇలా దూసుకురావడం మీద కొందరికి తీవ్ర అభ్యంతరాలున్నా…” శ్రీరమణగారి వాక్యం విశదీకరిస్తే, ఆవిడకన్నా పాతికేళ్ళ ముందు కలం పట్టుకొని, తమని తులాభారం తూచటానికి సరిపడా పుస్తకాలు రాసిపారేసి, రచనారంగంలో పరుగులు పెడుతున్నామనుకున్నవారిని ఒక్క అంగలోనే దాటేసి మూడో పుస్తకం నాటికే సీనియారిటీని తుంగలో తొక్కి ప్రముఖరచయిత్రి ఐపోయారు. నేను మాట్లాడేది ఆ ఇంపాక్ట్ గురించి కాదు.
ఇల్లేరమ్మగారి గురించి అందరూ మాట్లాడుతారు కనుక కాసేపు ఆ “నిత్య బాలిక”ని పక్కనబెట్టి, “డా. సోమరాజు సుశీలగారి” ఇంపాక్ట్ ఫేక్టర్ చూద్దాం. ఆవిడ రాసిన చిన్నపరిశ్రమలూ పెద్దకథలూ నా మనసులో తిష్ట వేసేసింది. ఎంతగా అంటే, ఆ పుస్తకం యాబై కాపీలు (ఆవిడ ఎకౌంటులో బలవంతంగా డబ్బులు వేసి) కొని, నలుగురికీ పంచేంత. నా వృత్తిలో భాగంగా నన్ను కలిసేవారిలో కొంతమంది “పదేళ్ళు ఉద్యోగంచేసి కూడబెట్టిన డబ్బు”తో వ్యాపారం చేద్దామన్న సదుద్దేశ్యంతో, “ఏ యూనిట్ పెట్టుకోవచ్చంటారు?” అని నన్ను సలహా అడుగుతూ ఉంటారు (అందులో నా ప్రజ్ఞ కన్నా వారి భ్రమే ఎక్కువ). అలా వచ్చినవారికి ఈ పుస్తకం ఇచ్చి, అందులో కొన్ని పేరాలు అండర్‌లైన్ చేసి చూపించి, ఇవి ఒకటికి నాలుగుసార్లు చదువుకొని, ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించుకొని అప్పుడు ముగ్గులోకి దిగమని హితవు చెబుతూ ఉంటాను. అలా, ఎంతమందిని రక్షించానో, లేదా ఎంతమందిని కోటీశ్వరులు కాకుండా అడ్డంపడ్డానో తెలీదు. మంచో చెడో, ఇంపాక్ట్ ఫేక్టర్ అంటే ఇంపాక్ట్ ఫేక్టరే.
ఒకవేళ నన్ను కలిసేనాటికే చిన్న పరిశ్రమలు నడుపుతున్న వారి పరి-శ్రమ కష్టాలు విన్నప్పుడు వారికి ఒక కాపీ ఇస్తూ ఉంటాను. పుస్తకం చదివిన మర్నాడు నాకు ఫోను చేసి, సార్ ఈవిడెవరో గానీ, నేను పడుతున్న కష్టాలు ఎలా రాసేసారు అని ఆశ్చర్యపడిపోయి, ఈ పుస్తకం నీడలో ఓదార్పు పొందుతూ ఉంటారు.
నేను పనిచేసిన పాడిపరిశ్రమ, పశువైద్యం నేపథ్యంలో రాసిన కథలకు స్పూర్తి ఎవరూ అంటే, ఒకటి, ముళ్ళకుర్చీలు రాసిన ఎలక్ట్రాన్ (పింగళి వెంకటరమణారావు గారు), రెండు, డా సోమరాజు సుశీలగారు.
సోమరాజు సుశీలగారి భర్త డా రంగారావుగారు, నాకు తెలియకుండానే గొప్ప ఉపకారం చేసారు. అదేమిటంటే, మీది యాంత్రిక (మెకానికల్) స్వభావం, ఎమోషన్స్ లేవు, అని మా ఆవిడ అంటే, సోమరాజు సుశీలగారి పుస్తకాల్లో డా రంగారావుగారి గురించి వచ్చిన వాక్యాలు మా ఆవిడకి చూపించి, తాత్కలికంగా బయటపడుతూ ఉంటాను. ఈ మధ్య ఆవిడ రాసిన అత్తగారి జ్ఞాపకాలు చదివి, అలాంటి అత్తగారు దొరికినందుకు మీరు ఎక్కువ అదృష్టవంతులా, మీరు దొరికినందుకు ఆవిడా అని ఫేసుబుక్కులో అడిగితే, “మా ఇద్దరికన్నా మా ఆయన అదృష్టవంతులు” అన్నారు. ఎంత గొప్పనిజమో కదా!
మరి అలాంటి ఆవిడ స్ఫూర్తితో నేను రాసిన చింతలవలస కథలు ఆవిడచేత (బలవంతంగానైనా) చదివించెయ్యకుండా ఎలా ఉండగలను? అదిగో, అప్పుడే ఆవిడ సహృదయతకి ప్రత్యక్షసాక్షిని.
నా పుస్తకం పట్టుకొని ఆవిడ ఇంటికి వెళ్ళాను (2012 జూన్ అని గుర్తు). అదే రోజు కన్నెగంటి అనసూయగారి పుస్తక రిలీజ్ ఐతే అక్కడికి వెళుతున్నారు. పొత్తూరి విజయలక్ష్మిగారు ఆ కార్యక్రమంలో వేదికమీద ఉండాలి, వీరిద్దరూ కలిసివెళ్ళాలని అనుకున్నారుట. నేను వెళ్ళిన అరగంటలోనే వాళ్ళు బయలుదేరే సమయం. ఈ అరగంటలోనే నాకు వారి స్వగృహంలో ఉన్న ఆల్ఫాన్సో చెట్టు మామిడిపళ్ళు కోసి పెట్టారు. నేను ఆల్ఫాన్సో తిన్నది అదే మొదటిసారి. అంతలో పొత్తూరి విజయలక్ష్మిగారు వీరి ఇంటికి వచ్చి అదే కారులో కూకట్‌పల్లిలో పుస్తకావిష్కరణకి బయలుదేరారు. ఆవిడకి ఎంత సహృదయం లేకపోతే, ఆ రోజే చూసిన నాలాంటి అరటిక్కట్టు రచయితని తమతో కారులో తీసుకెళతారు. అందునా, మిగిలిన ముగ్గురూ నాకన్నా పాతిక ముప్పై ఏళ్ళ పెద్దవాళ్ళు. మూడో వ్యక్తి పొత్తూరి విజయలక్ష్మిగారి భర్త శివరావుగారు, రైల్వేలో పేద్దహోదాలో పదవీవిరమణ చేసినాయన.
అలా అప్పుడు ఆవిడని మొదటిసారి కలిసాకా, ఎలాగైనా, మా ఆవిడకి కూడా సోమరాజు సుశీలగారిని చూపించాలి అని అనుకున్నాను. ఆవిడని పరిచయం చేద్దామని ఇల్లేరమ్మ కథలు చదివించాను. నేను చిన్నపరిశ్రమలు పుస్తకానికెంత అభిమానినో, మా ఆవిడ ఇల్లేరమ్మకి అంత అభిమాని అయిపోయింది. మా నివాసం రాజమండ్రి, ఇల్లేరమ్మగారిది హైదరాబాదూ అవటం వల్ల, 2012 నుండీ అనుకుంటూ ఉన్నా 2018లో మాత్రమే ఆ భాగ్యం దక్కింది. అప్పటికి రెండేళ్ళ ముందు నుంచీ ఆవిడ ఫేసుబుక్కులో ఉంటూ, అప్పుడప్పుడూ ఫోను చేసేస్తూ మీరు రాజమండ్రి ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారు అని నెలకోసారైనా అడుగుతూ ఉంటే, మొత్తానికి క్రితం నవంబరులో వాళ్ళ తమ్ముడి రిటైర్మెంటు మరియు షష్టిపూర్తికి వస్తున్నానని చెప్పారు. వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళి కలవడానికి అనుమతి తీసుకున్నాను. ఇల్లేరమ్మకథల్లో ఆఖరి కథలో, పుట్టి, పుట్టీపుట్టగానే తన నలుగురు అక్కలకీ భవిష్యత్తులో రావలసిన రెండెకరాలకూ గండికొట్టిన ఆ తమ్ముడిదే రిటైర్మెంటు. కరువు కథలో, ఏ కొడుకైతే గౌహతీ నుంచి నెలకోసారి రాసిన ఉత్తరాన్ని, మరో ఉత్తరం వచ్చే వరకూ వాళ్ళమ్మగారు భగవద్గీతలా పారాయణ చేసేవారో ఆ తమ్ముడే ఆయన. ఆయన పేరు కూడా రవి అని తెలిసి ఇంకా సంతోషించాను. ఆరోజు వాళ్ళు అన్నవరం వెళ్ళి, తిరిగి వచ్చేసరికి రాత్రి పది అయింది. రోజంతా ప్రయాణం చేసారు, అలసిపోయి ఉంటారు అనే మొహమాటం లేకుండా, వాళ్ళు రావటానికి అరగంట ముందు వాళ్ళింటిదగ్గర మాటువేసి మరీ వెళ్ళి తలుపు కొట్టేసాం. అలా బుద్ధిలేకుండా వచ్చేసారు అని విసుక్కుందికి ఆవిడ మామూలు గృహిణి కాదుకదా! ఇల్లేరమ్మగారు!! ఇలాంటివాళ్ళని ఎంతమందిని ఆవిడ విసుగుపడకుండా భరించారో గానీ, ఆవిడగాని, ఆవిడ తమ్ముడుగారు గాని మేమున్న అరగంటా మమ్మలిని పట్టుపట్టి పిలిచిన అతిథులకిచ్చేంత మర్యాదా ఇచ్చి మరీ మాట్లాడారు. ఆవిడ ఫేస్బుక్కులో రాసిన చిన్నప్పటి క్రిస్మస్ జ్ఞాపకాలు నేను ప్రస్తావిస్తే, ఆవిడైతే, తన పదో ఏట స్కూల్లో నేర్చుకున్న క్రిస్మసు పాటలు (తెలుగువి) పాడేసారు. ఆవిడా, ఆవిడ తమ్ముడూ, తమ్ముడి భార్యా మాతో అంత ఆదరంగా మాట్లాడ్డం నిజంగా మా అదృష్టమే. ఎందుకంటే, ఆ ఇంటి తలుపు కొట్టేముందు, మా ఆవిడతో, “మనం వాళ్ళని ఈ టైములో కలిసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఆవిడ గాని, వాళ్ళ తమ్ముడి కుటుంబం గాని మనతో సరిగ్గా మాట్లాడకపోతే, అది ఈ టైం వల్లే తప్ప అది వారి స్వభావం కాబోదు.” అని మానసికంగా సిద్ధంచేసి తీసుకెళ్ళేను. నా అంచనా తప్పు అయినందుకు చాలా సంబరపడిపోయాం. ఆరోజు మా అమ్మాయికి (8 Years) నిద్ర ముంచుకొస్తూ ఉంటే ఇంక తప్పక బయలుదేరాం. వాళ్ళు కూడా, ఇంకా మాట్లాడాలని ఉంది అని మనస్పూర్తిగానే అన్నారు. “మీ తమ్ముడుగారి ఇంటికి మళ్ళీ వస్తారు కదా, ఈసారి పగటిపూట వస్తాం” అని నేను అంటే, వాళ్ళతమ్ముడు, “అబ్బే లేదు, రిటైరైపోయాను కదా, నేనే మరో నెలలో హైదరాబాదు అక్కకి దగ్గరగా వెళ్ళిపోతాను” అంటూ నా ఆశలమీద నీళ్ళు చల్లేసారు, పెట్రోలియం కంపెనీ విశ్రాంత డీజీఎం.
దీపశిఖ కథాసంకలనంలో, సోమరాజు సుశీలగారు కోకా కృష్ణమోహన్‌గారి నీతి, నిబద్ధత, నిరాడంబరత గురించి స్మరించుకుంటూ ఒక ఒయాసిస్సు గురించి అని రాసారు. నేను స్వయంగా చూసిన ఒయాసిస్సు మాత్రం ఇల్లేరమ్మగారే.
చిన్నప్పుడు పడ్డ వాతలు చితిదాకా పోవు. ఎవరు ఎంత నీతిమంతులని తర్వాత తెల్సినా, తెలియజేద్దామనుకున్నా సరే. కుర్రాడు బాగా చదివేవాడిని, ఆ డబ్బుల్తో సినిమాకి వెళ్ళావేమో అంటే తగిలే దెబ్బ “అతి” దారుణంగా తగుల్తుంది – రచయిత చెప్పినట్టూ. ఐతే మన మేష్టర్లు మాత్రం తమ నోటికొచ్చిన ప్రేలాపనలు, తమ పరిథిలో తమకి తెల్సిన, నేర్చుకున్న పేలుతూ ఉంటారు. ఒక్కసారి మేష్టారు ఓ కుర్రాణ్ణి కసురుకున్నాక జీవితంలో ఆ మరకని తుడిచేసి ఎప్పుడూ మళ్ళీ అటుకేసి వెళ్ళడం అసంభవం. ” అబ్బే అలా కాదురా నువ్వు బాగ చదూతావని అలా అన్నా” అని ఈ మేష్టర్లు మాటలు మార్చినా సరే. ఎవరో “అతి తక్కువ” కొద్ది మంది తప్ప అసలు మనకి పాఠాలు చెప్పే మేష్టర్లలో ఎవరికీ కూడా కసురుకోకుండా, తిట్టకుండా, కొట్టకుండా స్కూల్లో పాఠాలు చెప్పడం రాదు. వాళ్ల జీవితాల్లో జరిగే కష్టనష్టాలకి కుర్రాళ్ళే కారణం అన్నట్టూ కుర్రాళ్లని కొడుతూ ఏదో పైశాచికానందం పొందుతారనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ స్కూళ్లలో పిల్లల్ని కొడుతూ ఆ కుర్రాళ్ళు తెలివి తప్పి పడిపోవడం లాంటి కథలు రోజూ పేపర్లలో చదూతూనే ఉన్నాం. ఈ కథలో ఉద్యోగం పోయిన నువ్వు అనే కుర్రాడు ఏ మాత్రం బాథ పడాల్సిన పని లేదు. ఎందుకంటే కాంప్లెక్స్ గా ఉన్నది మిగతావాళ్ళు.
అన్నింటికన్న దురదృష్టం ఏమిటంటే – యూ నీడ్ టు గ్రో అప్ అనేది మన అలుసు చూసి అవతలవాళ్లు ఆడుకునే పెద్ద ఆట. అటువంటి స్టీవ్ ని కూడా జీవితంలోంచి తుడిచిపారేయడం చేయాల్సిన మొదటి పని. ఇటువంటి స్టీవ్ లు వెన్నుపోటు పొడిచే గోముఖ వ్యాఘ్రాలు. అది చివరి వరకూ తెలుసుకోకపోవడం కథానాయకుడి చేతకానితనం/అమాయకత్వం తప్ప అతను చింతించాల్సిన అవసరం “అస్సలు” లేదు.
మరో విషయం. అమెరికాలో ఉద్యోగాలు తీసేస్తూంటే, ఎవరింట్లో ఎవరికి కేన్సర్ ఉంది, ఎవరి ఆవిడ కడుపుతో ఉందీ అనేవి అస్సలు చూసుకోరు. తీయ్ రాజా తీయ్ అంటూ కొట్టుకుంటూ పోవడమే.
ఈ కథలో కిందనుంచి రెండో వ్యాక్యం అనవసరం అని నాకు అనిపిస్తోంది. ముల్లులా గుచ్చుకోవాల్సినది స్టీవ్ చేసిన వెన్నుపోటు మాత్రమే. కథ మాత్రం బాగా చెప్పారు. రచయితకి అభినందనలు.
పొద్దెరగని పిచ్చగాడిలాగా వెబ్ జైన్స్ ని వెతుక్కుంటూ వెళ్ళి ముందు కధలు చదువుకోవటం నీకున్న అలవాటేగా! అందుకని ఈమాట కి వెళ్లి ముందు కధల కోసం చూస్తావు. అక్కడ ‘నీడ’ కనపడుతుంది. చదవడం మొదలు పెడతావు.
కాలర్ పట్టుకుని లాక్కెళ్తుంది చివరిదాకా. బాగుందిగా అనుకుంటావు.
కింద కామెంట్లేమన్నా ఉన్నాయా అని చూస్తావు. ఏమి ఉండవు. అందరు నీ లాంటి పిచ్చోళ్ళు కాదుగా అనుకుంటావు. ఫేస్ బుక్ కాని చోట్ల చాలమంది కామెంట్ చెయ్యడం లేదు అని కూడా అనుకుంటావు. కధ మీద నీ అభిప్రాయం చెప్పాలనుకుంటావు. ఈలోపు ఎవరిదో ఫోన్ కాల్ వస్తుంది. కామెంట్ చెయ్యడం గురించి మరిచిపోతావు. వేదిక మరొకటో పరుగులో పడతావు. ఈ సారి ఫేస్ బుక్ లోకి వెళ్తావు. అక్కడ న్యూస్ ఫీడ్ లో Siva పోస్ట్ కనబడుతుంది. ఏమిటా అని చూస్తావు. నువ్వు చదివిన ‘నీడ’ మీద అని అర్ధం అవుతుంది. అర్రర్రరే! అని నాలుక కొరుక్కుంటావు. ఒహో శివ ఈ టపా ని సెకెండ్ పర్సన్ నెరెటివ్ రాసాడుగా, కధని బ్రహ్మానందం గారు రాసినట్టుగా అనుకుంటావు. ‘బాగుంది’ అని నవ్వుకుంటావు. తన టపాలో శివ “తల గోక్కోవటం” చూసి కింద కామెంట్ లో జవాబు టైపుదామనుకుంటావు. కాని అప్పటికే కింద కామెంట్స్ లో ఆ కధ రాసిన బ్రహ్మానందం తమాషాగా తన కామెంట్ ని కూడా సెకండ్ పర్సన్ లో పోస్టేసి ఉంటాడు. అరే ఇదేదో బాగానే ఉందిగా అనుకుంటావు. ఇంకెవరు కామెంటారు అని చూస్తావు. శివ సందేహాన్ని నివృత్తిని చేస్తూ మోహన రావు గారి వ్యాఖ్య కనపడుతుంది. మళ్ళీ ఈమాట కెళ్ళి ఆ కధకింద కామెంట్స్ చూస్తావు. ”లాభం లేదు. ఈ సారైనా కమెంటెసెయ్యాలి,” అనుకుని అక్కడ ఈ పెద్ద వ్యాఖ్యన్ని పోస్టుతావు.
‘నీడ’ కధకులు బ్రహ్మానందంగారు,
ఈ వ్యాఖ్య సెకండ్ పర్సన్ నరెటివ్ అవుతుందా? చి న
కొంత ఆలస్యంగా చదివినా ఆలోచింపజేసే వ్యాసం చదివానన్న భావన కలిగింది. విశ్వనాథ పఠాభిని అర్థం చేసుకున్నట్టుగా ఇతర సాహితీవిమర్శకులు అర్థం చేసుకోలేదని అనటం కూడ చాలా వరకు సమంజసంగానే అనిపించింది. పఠాభి, ముఖ్యంగా ఫిడేలు రాగాల డజన్ లో అప్పటివరకు వున్న కవిసమయాల్ని చించిచెండాడాడనేది ఇప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు గాని అప్పటి విమర్శకులు ఎక్కువమంది ఆ రచనలకి ప్రేరకాలు, కారణాలు అన్వేషిస్తూ రకరకాల నిర్హేతుక ప్రతిపాదనలు చెయ్యటం వాస్తవం, చినవీరభద్రుడు గారు అలాటి చాలా ప్రతిపాదనల్ని ఇక్కడ ప్రస్తావించారు కూడ.
ఐతే, నాకు రెండు విషయాల్లో ఈ వ్యాసం అసంపూర్ణంగా అనిపించింది. ఒకటి – విశ్వనాథ ప్రతిపాదనకి, తను చేస్తున్న ‘గ్రోటెస్క్’ అన్న ప్రతిపాదనకి సంబంధం వివరించకపోవటం, రెండు – అసలు గ్రోటెస్క్ లిటరెచర్ అంటే ఏమిటో, పఠాభి రచనలు ఆ కోవలోకి ఎందుకు వస్తాయో వివరించక పోవటం.
ఆన్ లైన్ లో వెదగ్గా కనిపించిన అనేక చోట్లలో, ఈ కిందిది నాకు ‘గ్రోటెస్క్ లిటరెచర్‘కి మంచి క్లుప్తమైన వివరణలా అనిపించింది – The Grotesque is both an artistic and literary term, and is a bit difficult to describe, as it is less of a solid definition, and more of a range between a number of different qualities. The Grotesque is primarily concerned about the distortion and transgression of boundaries,be they physical boundaries between two objects, psychological boundaries, or anything in between. Exaggeration also plays a role.
There are two main ways to define something as Grotesque, as evidenced by the diagrams: The Grotesque fits in between the real and the fantastic (non-real). The Grotesque simultaneously fits somewhere between being funny and being frightening. (This is a bit more difficult to gauge, as what is funny to one person is frightening to another, so maintaining a bit of an open mind is helpful).
వ్యాసకర్త ‘డిస్టార్షన్’గురించి చాలా చెప్పారు కాని గ్రొటెస్క్ గురించి అంతగా మాట్లాడలేదు ఎందుకో మరి. అలాగే వారు చెప్పిన డిస్టార్షన్ కూడ పైన వివరణలో చెప్పిన సరిహద్దుల డిస్టార్షన్ కాదు. ఆ వివరణలో వున్న రెండు లక్షణాల గురించి ఎలాటి ప్రసక్తి కూడ రాలేదు. ఇక విశ్వనాథ ప్రతిపాదనకీ ఈ వ్యాసకర్త చెప్పిన డిస్టార్షన్ కీ సంబంధం గురించి ఒక్క ముక్క కనిపించదు.
నాకు వారితో ప్రత్యక్ష పరిచయం లేదుకాని చినవీరభద్రుడు గారు పేరున్న సాహితీ విమర్శకులని విన్నాను. వారు ఎలాటి పాఠకులని ఉద్దేశించి ఈ వ్యాసం రాశారో కూడ తెలియదు (నేననుకుంటున్నది ఇంకెక్కడో ప్రచురితమైన వ్యాసాన్ని ఇక్కడ పునఃప్రచురించారని). కనుక వారు ఈ పత్రికని చూస్తే వారికి నా మనవి – వారి దృష్టిలో గ్రొటెస్క్ కవిత్వం ఏమిటో, ఆ భావానికి విశ్వనాథ ప్రతిపాదనకి సంబంధం ఏమిటో, సామాన్యంగా గ్రొటెస్క్ రచన అనే పదానికి వున్న డెఫినిషన్ కి వారిది భిన్నమైతే ఎందుకు అలా చేయవలసివచ్చిందో కొంతైనా వివరిస్తే ఇంకా సంతృప్తికరంగా వుంటుందని. కవిత్వానికి తర్కం అక్కరలేదు గాని సాహిత్యవిమర్శకి తర్కం అత్యవసరమని నమ్మే నా లాటి వారికి మార్మికత కన్న తార్కికత ఉంటే బాగుంటుందని.
త్యాగరాజు పట్ల వీరి అభిమానం, ఇతరులపై preconceptions ఈ మొదటి paragraphsలో కనిపిస్తున్నాయి.
అటువంటిదేమీ లేదు. ఒకరిని గురించి చెప్పాలంటే మరో ఇద్దరో ముగ్గురో ‘సమ ఉజ్జీల’ గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. అప్పుడు ఎవరో ఒకరిని తక్కువ చేసినట్టు, కొందరికి అనిపిస్తుంది.
ధర్మరాజు, భీముడు, అర్జునుడు – అవటానికి అందరూ ఇంద్రులే. కాని వారిలో ఎంతెంత తేడాలు! ఎవరు ఎక్కువ తక్కువ కాకపోయినా, ఆ తేడాలబట్టి, మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టులవుతారు.
ఒకప్పుడు కవిత్రయం కన్నా, నాచన సోముడు గొప్పవాడని కొందరు పండితులకు అమాంతంగా ఎందుకో అతని మీద ప్రేమ పుట్టుకు వస్తే, ఎందుకు కాదో రాళ్లపల్లి రచనల్లో చెప్పారు. నేను చదివిన రెండు వ్యాసాలలో ఆయన మాటలలో -సోమన దూషణ నాకు కనిపించలేదు. పొగడ్త కూడా కనిపించలేదు. నాచన సోమన రచనాస్వభావపు విశ్లేషణ ఎంతో బాగా చేసారు అనిపించింది. రాళ్లపల్లి రచనలో హాస్య ప్రియత్వం ఉంటుంది. He has an inner laughter.
త్యాగరాజుపై ఈ వ్యాసం నాకు నచ్చింది. చాలాసార్లు చదివాను. ‘త్యాగయ్య గారి నాద సుధారసం’ అన్న వ్యాసం (ఉపన్యాసం) కూడా చాలా బాగున్నది. అందులో త్యాగరాజు -రామభక్తి, కవిత, గానం, ఈ మూడింటి తత్త్వం గురించి రాళ్లపల్లి ఆలోచనలు ఎంత వివరంగా ఉన్నవో. ఆ వ్యాసం రాయటం ఇంకా కష్టం అనిపిస్తుంది. రెండు వ్యాసాలూ ఒకదాని వెంట మరోటి చదవాలి. అదింకా మంచిపని.
ఆ మరో వ్యాసం చివరలో రాళ్లపల్లి ఇలా అన్నారు. “..కవిత్వం రసింపగలిగితే తెలుగు తెలిసిన వారానందిస్తారు. కాని త్యాగయ్య గారి నాద సుధ దొరికితే – హిందువులే కాదు మనుష్యజాతే తరించి పోతుంది..” ఇంకా బాగా లేదూ! కాని ఆ నాదసుధ కూడా కొంతలో కొంత అది భారతీయతతో ముడిపడి ఉంది.
ఏమైనా, వినగా వినగా; ‘పాలారగించరా’ అనో ‘తులసీదళములతో’ అనో, వాగ్గేయకారుడు కవిత్వం రాస్తే, సంగీతపు సంగతులు వేస్తే, అవి వేరే మథన, వేరే రసన; అంతేకాని విగ్రహాలమీద కడవలతో పాలు పొయ్యటం, తులసి ఆకులు తుంపుకు వచ్చి నెత్తినో కాళ్లమీదో ఉంచటం మాత్రం ఈ కవిత్వపు, సంగీతపు ఉద్దేశం కాదు, అని అంతమట్టుకైనా నాకు తెలిసింది. అది తెలియనివాళ్లు, ఆ మరో విధమైన తెలుగుతనం, భారతీయత గలవాళ్లు ఇప్పటికీ లక్షలు.
చాలా చక్కటి వ్యాసపరంపరని రాశారు నారాయణరావు, శ్రీనివాస్ గార్లు. దీని వెనక ఎంతో పరిశ్రమ వుంది. దీన్లో ఎంతో పనితనం వుంది.
ఐతే గమ్యం ఏదో ముందుగా ముచ్చటగా చెప్పివుంటే ముందు రెండు భాగాలూ ఇంకా తేలిగ్గా అర్థమై వుండేవి (బహుశా ఎక్కడికి చేరతారో మొదలెట్టినప్పుడు వారికి విస్పష్టంగా తెలియక పోయి వుండే అవకాశమూ లేకపోలేదు). ఏమైనా, నాకర్థమైంది ‘కవితలు, కథలు, ఇతర కల్పిత రచనలు కాని’ రచనల్లో రాసే తెలుగు గురించి చాలా కూలంకష చర్చ చేసి ఇప్పటి దుస్థితి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారని. కల్పనా రచనల మీద ఎలాటి ఆంక్షలూ పెట్టటం మంచిది కాదని స్పష్టంగా వివరించారని. ఐతే మాట్లాడే తెలుగు ఎలా వుండాలనేది ఈ వ్యాసాల పరిధి లోకి రాలేదు, నాకర్థమైనంత వరకు. మొత్తం మీద, చాలా విస్తారంగా మొదలైన చర్చ కొంత ఇరుకైన గమ్యాన్ని మాత్రమే చేరిందేమో అనిపిస్తుంది.
ఐతే, అకల్పితరచనల భాష గురించి ఇంత లోతైన పరిశోధన, లోచూపు, విస్తారం వున్న ఈ పరంపరని ఇన్నాళ్లుగా కొనసాగించిన వ్యాసకర్తలు అభినందనీయులు. తెలుగు మీద (ఇంకా) మమకారం వున్నవాళ్లకి ఇది అవశ్యపఠనీయం.
పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను, ఒక తేలికైన mathematical model ని ఉపయోగించి ఇంక ఏడు తరాల్లో తెలుగు భాష కేవలం విద్యావిహీనులు మాట్లాడే భాషగా మాత్రమే మిగుల్తుందని నేనో వ్యాసం రాశాను. చాలా మంది నా మీద విరుచుకు పడ్డారు కూడ. కాని ఇప్పుడు అది బహుశ దురాశాపూరితమైన అంచనా అని, అంతకాలం కూడ పట్టకపోవచ్చునని అనిపిస్తున్నది. తెలుగు మాట్లాడటం వెనకబాటుతనానికి గుర్తని, ఇంకే భాషలూ రాని వాళ్లకి మాత్రమే తెలుగు గతని చాలామంది విద్యావంతులైన తెలుగు వాళ్ల అభిప్రాయమని నా అభిప్రాయం. తెలుగు మనకి గర్వకారణమని భావించి, తెలుగువాళ్లు తెలుగు లోనే మాట్లాడే స్థితి కలగాలంటే, ఎవరో ఒక సినీ ప్రముఖుడు నడుం కట్టి ఉద్యమం నడిపిస్తే తప్ప సాధ్యం కాదని నాకనిపిస్తున్నది ఇప్పటి పరిస్థితుల్లో. కర్ణాటకలో రాజ్ కుమార్ నడిపిన ఉద్యమం గుర్తొస్తున్నది ఈ సందర్భంగా. అలా కాకుండా ఏదో కొద్దిమంది ఎంత అరిచిగీపెట్టినా తెలుగు వాళ్లు అవకాశం ఉంటే తెలుగు తప్ప ఇంకే భాషనైనా మాట్లాడతారు తప్ప తెలుగుని కాదు.
>>ఈనాటి తెలుగు వచనం
క్రమక్రమంగా ఈ ఉద్యోగాల్లో తెలుగు మీద ఏ విధమైన పట్టు లేనివాళ్లు, అంతో ఇంతో ఇంగ్లీషు మాత్రమే చదువుకున్నవాళ్లు చేరారు. దీని ఫలితంగా తెలుగు పత్రికల్లో భాష ఇటు తెలుగూ కాని, అటు ఇంగ్లీషూ కాని ఒక విలక్షణమైన స్థితికి చేరుకుంది. ఇంగ్లీషుకి సమానమైన ఏ తెలుగు మాటా వెంటనే తోచకపోతే, ఆ ఇంగ్లీషు మాటనే వాడెయ్యడం ఈ కొత్త ఉపసంపాదకులు అలవాటుచేసుకున్న పద్ధతి……
తెలుగు భాష – నేటి స్థితి
ఆంధ్రరాష్ట్రాలలో ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగుని గమనిస్తే అనేకవిధాలుగా భాష భ్రష్టుపట్టి పోతోందనిపిస్తూంది. పేలవమైన ఉచ్చారణ, మితిమీరిన పరభాషాపదప్రయోగం, లిపి దోషాలు / ముద్రారాక్షసాలు, అస్తవ్యస్తమైన వ్యాకరణం / మాటలకూర్పు లాంటి లక్షణాలతో జనబాహుళ్యంలో మనభాష ఎన్నోవిధాలుగా సతమతమౌతోంది. సినిమాలూ టీవీలూ పత్రికలూ FM రేడియోలూ తెలుగుభాషకు ఈ స్థితి పట్టడానికి తమవంతు సాయం చేస్తున్నాయి. వాణిజ్య ప్రకటనలలో వాడుతున్న తెలుగుకైతే దౌర్భాగ్యం దాపురించింది.
వీటి గురించి కొంచెం:
1. ఉచ్చారణ:
ముక్యమంత్రి, ఆసాబావం, ఆర్దికసాకా మంత్రి, ప్రస్న, గనవిజయం, అద్యక్షుడు, మద్యాహ్నం, అబ్యర్ది, … చేసారు, స్రీకాకులం, తెలంగానా, వరద ఉద్రుతం, దీపావలి… ఇటువంటి ఘోరమైన ఉచ్చారణలు తెలుగు దృశ్య, శ్రవణ మాధ్యమాలలో కోకొల్లలు. సినిమా హీరోలను మొదలుకొని గుళ్లలో పూజారులది కూడా ఇదే తంతు. హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పేవాళ్లు వేరే ఉంటారు కనుక, వీళ్ల ఉచ్చారణ కొంత నయం. సీనియర్లైన సుమ లాటి వాళ్లు కూడా ఇటీవలి కాలంలో అడపాదడపా ఒత్తుల్ని విస్మరిస్తూండడం విచారకరం.
చక్కగా ఒత్తులు పలికేవాళ్లు రానురానూ తగ్గిపోతున్నారు.
‘చ’, ‘జ’ ల దంత్యాక్షరాలను కంప్యూటర్ పై రాయడం తెలియలేదు. అచ్చులో లేకపోయినప్పటికీ, వీటి దంత్యాలకూ తాలవ్యాలకూ తేడా తెలిసి మాట్లాడేవాళ్లు చాలా తక్కువమంది. ఇది పక్కన పెడితే, ఈ అక్షరాలను అదొక విధంగా పలకడం కొందరికి పరిపాటిగా మారింది.
2. లిపి
పదిమంది చూడాలని పెట్టిన బోర్డుల్లో రాస్తున్న లిపి గురించి ఎవరికైనా తెలుసునా, తెలిస్తే పట్టించుకుంటున్నారా అనిపిస్తుంది. చూపే సదుపాయం ఉంటే ఇందుకు నిదర్శనంగా కొన్ని చిత్తరువులను పెట్టేవాడిని.
విశాఖపట్నంలో కానీ, హైదరాబాదులో కానీ, దుకాణాలముందూ వాహనాలపైనా ఇతరత్రా కూడా రాసిన తెలుగులో, నాలుగింట మూడువంతులు తప్పులతో ఉండడం చూడవచ్చు. మిగతా భాషలలోని వ్రాతని పరికిస్తే ఒక్క తప్పు కూడా దొరకదు.
ముద్రారాక్షసాలకి మరొక కారణం – ముఖ్యంగా ఫ్లెక్సీలలో – కంప్యూటర్లో ఇంగ్లీషు అక్షరాలతో తెలుగు లిపిని తెప్పించడం. ఈ విధంగా తెలుగు బోర్డులు తయారు చేసే వాళ్లకి తగినంత శిక్షణ లేకపోవడం ఒక కారణం కావచ్చు.
ఇంగ్లీషు భాషని తెలుగు లిపిలో రాయడం మరొక జాడ్యం. ఇంగ్లీషు పదాలకి సరైన తెలుగు మాటలు తెలియక ఇలా చేస్తున్నారా?
కొన్ని పత్రికలూ మాధ్యమాలూ స్వతంత్రించి, ‘ఋ’ ని ‘రు’ గా మార్చేశాయి. క్రుష్ణుడు, త్రుప్తి లాటివి రాయడం ఇంకా మొదలయినట్లు లేదు. ‘ఱ’ ఏనాడో కనుమరుగైంది.
3. పరభాషా పదప్రయోగం
ఈ మధ్యకాలంలో మామూలుగా మాట్లాడే తెలుగు వాళ్లెవరూ రంగులూ అంకెలూ వారాలపేర్లూ తెలుగులో వాడగా వినలేదు. బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్, అంకుల్, ఆంటీ, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్: ఇవి చుట్టరికాలు. రైస్, కర్రీస్, పాపడ్, చట్నీ, రసం, కర్డ్, ఇవి భోజన పదార్థాలు. చీర, రవికె, అంచు, పాట, బడి, పరీక్ష, విమానం లాటి పదాలు వినబడటం లేదు. అరకు వేలీ, ఎయిర్ పోర్ట్, టెంపుల్, లెఫ్ట్, రైట్; రాయడమైనా మాట్లాడమైనా అన్నిటికీ ఇంగ్లీషే. కూరలమ్మేవాళ్ల దగ్గర్నుంచి కార్లు కొనుక్కునే వాళ్ల వరకూ ఇదే తీరు.
వంటల కార్యక్రమాలలో ఇంగ్లీషు వాడకం వర్ణనాతీతం. వెజిటబుల్స్ స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చెయ్యడం, బౌల్ లో వెయ్యడం, ఆయిల్, వాటర్, సాల్ట్, సుగర్, బట్టర్ యాడ్ చెయ్యడం, స్టౌ ఆన్ చెయ్యడం (పొయ్యి వెలిగించడం కాదు), మిక్స్ చెయ్యడం, ఫ్రై చెయ్యడం, ఇలాచీలు (ఏలకులు కాదు), సిరప్, టేస్ట్, మచ్చుకి కొన్ని. కొన్ని వాక్యాలలో ఐతే, ఒకటి రెండు తెలుగు పదాలు మినహాయిస్తే, మిగతాదంతా ఇంగ్లీషే. తరగడం, సన్ననిసెగ, కలియ తిప్పడం, కరగబెట్టడం లాటి మాటలు లేనేలేవు. కూరగాయల పేర్లు, పండ్ల పేర్లు, అంకెలు; ఇవేవీ తెలుగులో ప్రస్తుతం వాడుకలో లేవనుకుంటాను. ఆశీర్వాద్ సంస్థ వారు ‘ఆటా’ ని అమ్ముతారు; గోధుమ పిండిని కాదు.
టీవీల్లో సౌందర్యపోషణా కార్యక్రమాలలో వచ్చేవాళ్ల మాటల సోకు చెప్పనలవి కాదు. తెలుగులో అవయవాలే లేవు. అన్నిటికీ ఇంగ్లీషే. ఏవీ పూయరు, రాయరు; అప్లై చేస్తారు.
గమ్మత్తేమిటంటే, పరాయి రాష్ట్రాలవాళ్లు తెలుగులో మాట్లాడితే, తెలుగు వాళ్లకంటే తక్కువ ఇంగ్లీషు పదాలు వాడతారు.
తెలుగు భాషాభివృద్ధికి పాటుబడుతున్నామంటూ సంస్ఠలూ పత్రికలూ నడుపుతున్న రామోజీరావు గారి ‘ఈటీవీ న్యూస్’ తో సహా పత్రికల్లోనూ టీవీల్లోనూ అనేక శీర్షికలు ఇంగ్లీషులోనే ఉన్నాయి.
తెలుగువారికీ మిగతా భారతీయులకీ తేడా ఎక్కడుందంటే, వాళ్ల వ్యావహారిక భాష వేరు, సభాముఖంగా మాట్లాడే భాష వేరు. తమిళులైతే నలుగురిలోనూ / నలుగురితోనూ గ్రాంధికంగా తప్ప మాట్లాడరు. బంగ్లా, మరాఠీ, కన్నడం, మలయాళం, హిందీ మొదలైన భాషా ప్రసంగాలలో పరభాషా పదాలు అతి తక్కువ ఉంటాయి. ఏ స్థాయి వారు సభలో మాట్లాడినా, స్వంత భాషలోని స్వచ్ఛత సొగసులొలుకుతూ ఉంటుంది.
4. అస్తవ్యస్తమైన వ్యాకరణం / మాటలకూర్పు:
తెలుగు వాడకంలో ఈ మధ్య ఎంతో విశృంఖలత్వం చోటు చేసుకుంది.
సెల్ ఫోన్ మాట్లాడుతూ…
హైదరాబాద్, విజయవాడ లో (హైదరాబాద్, విజయవాడ లలో కాదు) …
విపక్షం …
నలుగురు మృతి …
మచ్చుకు కొన్ని. విశదంగా ఉదహరించడం వీలుకాదు.
‘బ్రష్ చేసుకోవడం’, ‘ఆన్ ది వే లో ఉండడం’, ‘లంచ్ చెయ్యడం’ లాటి మిశ్రమ పదజాలాల ప్రయోగం వాడుక భాషలో అలవాటుగా మారింది.
శ్రీ వేంకటేశ్వర భక్తి వాహిని వారి నాదనీరాజనం కార్యక్రమంలో ఎంతో కాలంగా వస్తున్న ఒక వ్యాఖ్యాత, నాలుగైదు పదాలు కూడా ఒక వాక్యంలో సరిగ్గా కూర్చలేకపోవడం శోచనీయం.
ఇవన్నీ చూస్తుంటే, వాడిన భాషను సరిచూసే వాళ్లూ, సరిదిద్దే వాళ్ళూ ఉన్నారా, ఉంటే భాషపట్ల వారికి అవగాహనగానీ ఆసక్తిగానీ శ్రద్ధగానీ ఉన్నాయా అన్న సందేహం కలుగుతుంది.
ఒకప్పుడు ముప్పాళ రంగనాయకమ్మ పత్రికాభాష గురించి రాసిన ‘తెలుగే రాస్తున్నామా?’ అన్న వ్యాసావళిని గుర్తుచేసుకుని పాటించడం ఇప్పుడు చాలా సంపాదకులకి అవసరం.
పతనమౌతున్న తెలుగు భాష తిరిగి ఎలాగ పైకి వస్తుందో తెలియదు. ఒకరిద్దరు పెద్దలకీ పండితులకీ తెలియజేయడం, అభ్యర్ధించడం జరిగింది. సలహాలూ సూచనలూ ఇవ్వడం సులువే. కానీ వాటిని ఆచరణలో పెట్టడం, ఫలితాలు సాధించడం, ఒక బృహత్కార్యం.
‘ఈమాట’ మూలంగా ఎవరైనా స్పందిస్తే సంతోషం.
భవదీయుడు,
ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.
హైదరాబాదు.
జాషువా పిరదౌసి గురించి satyavada venkata subba rao గారి అభిప్రాయం:
10/03/2019 4:51 am
అద్భుతంగా ఉంది. ఇంతకాలము ఫిరదౌసి అంటే జాషువాగారు రాసిన పుస్తకం అని అనుకున్నాను కాని ఇది ఒక కథా కావ్యం అని తెలిపినందుకు ధన్యవాదములు.
” మమతల తావినై మనసంతా నిండిపోవాలని
పరితపించి పరితపించి పరాజయం పాలయ్యాక
తీరా నేను విముక్తమయ్యాక!
గొంతు ఎండిపోయేలా దుఃఖిస్తూ ”
కలిగించిన గ్లూం నుండి తప్పించుకోవటానికి సతిగా అగ్నికి ఆహుతి అయ్యి తిరిగి పర్వత రాజ తనయగా జన్మించి రుద్రతాండవం చేసి విరాగిగా మారిన తన శివయ్యను చేరుకున్న పార్వతి పాదాలను ఆశ్రయించాను.
తనకు అర్ధం కానిదాన్ని తనకిష్టమైన దానితో పోల్చుకోవటం మానసిక దౌర్భలయం క్రిందికి వస్తుందేమో కదండీ డాక్టర్ లైలా ఏర్నేని గారూ !
“ఎందుకు?” అనబోయాను. ఫిరంగి “ఢాం” అంది. ఆ అదురుతో నదిరి యినుప చువ్వల కొనల రాక్షసి గోళ్ళకి అందనంత దూరంగా వెనక్కిపడ్డాను…
రెండూ కంచెల గురించే! కానీ ఒకటి కంచెల గురించి ఆలోచించమంటుంటే…
నేను ప్రస్తావిస్తున్న కధ విముక్తి ఆ కంచెలని, నిలువెత్తు గోడలని పగలగొట్టమంటుంది. మనకి ప్రస్తుతం కావల్సింది, వంతెనలు, నిచ్చెనలు. కంచెలు కాదు. కాని ఆ కంచెలు కట్టడానికే, ” “ఇక్కడ కట్టడాలకు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి.” దుకాణాలు వెలుస్తున్నాయి. ప్రజలు వాటి ముందు బారులు తీరుతున్నారు. ప్చ్.
” భగవాన్ రమణులను గుర్తించి లోకానికి పరిచయం చేసింది మహాతపస్వి కావ్యకంఠ గణపతి ముని. ‘స్వామీ, మీరు భగవాన్ రమణు’ లని గణపతి ముని అనగానే, అలాగే ‘నాయనా’ అని గణపతిమునికి నాయన అనే పేరును స్థిరపరిచారు భగవాన్ రమణులు.
1931-32 ప్రాంతాల్లో భగవాన్‌ను విడిచి నాయన శిరసి, కుళువే, గోకర్ణం, భువనేశ్వర్ ఇలా అనేక ప్రదేశాల్లో పర్యటించారు. తపస్సు చేసారు. అలాంటి సందర్భాల్లో నాయన రమణులకు ఉత్తరాలు రాసారు.
వీటికి 1978లో ఒక పుస్తక రూపం వచ్చింది. భక్తులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అదే ” లేఖల్లో నాయన ” అనే ఫుస్తకం. దీనికి కొన్ని మెరుగులు తోడై 2006లో మలి ముద్రణ వచ్చింది. (ఈ మలి ముద్రణకు కృషి చేసింది న్యూయార్కులోని కావ్యకంఠ ఫౌండేషన్).
ఇందులో నాయన భగవాన్‌ను సంబోధించిన తీరును పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే, ప్రతీ ఉత్తరంలోను ఆయన భగవాన్‌ను భగవాన్ విశ్వగురో అనీ, భగవాన్ లోకాచార్య అనీ కారణగురో అనీ, మాయామానుష్య అనీ, భక్తవత్సలా అనీ-ఇలా ఒక ఉత్తరంలో వాడిన సంబోధన మరో ఉత్తరంలో లేదు. నాయన రమణులకు ఉత్తరాలు ఎక్కువగా సంస్కృతంలో రాసారు. వీటిని ఆనందాశ్రమ లేఖలు అని కూడా అంటుంటారు. మనబోటి వారికి ఆధ్యాత్మిక, తత్వ వివేచనము కలిగిస్తాయి ఆ ఉత్తరాలు. ఇవి గురుశిష్య సంబంధమైనవి.
అదేవిధంగా నాయన వివిధ సమయాల్లో వారి కుటుంబ సభ్యులకూ ఉత్తరాలు రాసారు. ఇవన్నీ ఎక్కువగా తెలుగులోనే రాయడం గమనార్హం.
కవిత చదివినప్పుడు ముందుగా కలిగిన తలపులు ఏమిటో మీరు చెప్పలేదు కాని; పార్వతి కథ, హిమాలయాల హిమం గురించిన ఆలోచనలు ఈ కవితలో లేవు. కవిత గాని అర్థం ఐఉంటే, మీకు కలిగిన తలపులు జనించే అవకాశం కూడా లేదండి.
The poem’s content is quite contemporary, and has nothing, nothing what so ever to do with Hindu mythology.
చాలాబాగా చెప్పారు సర్. కాని గ్రాంధికం అంటే ఏమిటొ కూడా ఒక వ్యాస రూపంలో చెప్పగలరు అని ఆశిస్తున్నాను సర్.
నెమలీకలు గురించి వంగూరి చిట్టెన్ రాజు గారి అభిప్రాయం:
07/01/2019 12:07 pm
ఈ వ్యాసం ఇంద్రాణి పాలపర్తి ఇటీవలి ప్రచురణ “కాకీక కాకికి కాక” అనే కథా, వ్యాస సంకలనానికి పి.సత్యవతి గారు వ్రాసిన ముందు మాట. అదే పుస్తకానికి మరో ముందు మాట వ్రాసినది వాడ్రేవు వీర లక్ష్మీదేవి.
ఆ పుస్త్తకం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 78వ ప్రచురణ కాబట్టి ఈ విషయం నాకు తెలుసు. హాయిగా చదువుకుని ఆనందించదగ్గ ఆ పుస్తకం రచయిత్రి దగ్గరా, నా దగ్గరా దొరుకుతాయి. ..
ప్రసంగం నాకు నచ్చింది. మాట్లాడుతున్నదెవరు! మరి! ‘సారస్వతాలోకము’ అన్న తన వ్యాససంపుటిలో ఒక వ్యాసం లో ‘కావ్యమునకు జీవనము రసము’ అంటూ ‘రసము’ అంటే ఏమిటని తెలియ చెప్పిన వారు. (Pages 99 – 101, నవోదయ పబ్లిషర్స్, హైదరాబాద్.) వీరి ప్రసంగం రసవిహీనంగా ఉంటుందా? No way!
రాళ్లపల్లి తమ ఆలోచనలు, స్పష్టమైన మాటల్లో, స్పష్టమైన చక్కని స్వరంలో చెపుతారు. బయటి ప్రపంచంలో -తను మాట్లాడదలచిన విషయంలో విభిన్నతలు ఉంటే, అవి ఏమిటో వారి ఉపన్యాసం లోనే చెపుతారు. సైంధవి రాగం దక్షిణ భారతంలో మునుపటి నాలుగు రకాల వాడుకలు ఎంత ఓర్పుతో విడదీసి చెప్పారు!
ఈ వక్త, విషయం ఏదైనా అర్థం కాకపోతే కాలేదని చెపుతారు. ప్రసంగం లో ఒకచోట (listen at 3.50 of tape) ‘మ’ ‘పూర్ణంగా’ ఉండాలి అంటే ఏమో నాకు అర్థం కాలేదన్నారు రాళ్లపల్లి. నేననుకోటం, దాని అర్థం, composer is instructing the musician to – Hold the note for its full value. (Tenuto.)
ప్రసంగం లో వసుచరిత్రలోనుంచి ఉదహరించిన పద్యం గురించి:
ఈ ప్రసంగం లో లాగే, చక్కని వివరణలు రాజన్నకవి – (వసుచరిత్ర కవితా విపంచి) వ్యాసంలోను, అలాగే వ్యాఖ్యాన సహితమైన వసుచరిత్ర డిజిటల్ వర్షన్ లోనూ గమనించ వచ్చును. రచయితల అభిప్రాయాలలో చిన్ని తేడాలున్నవి. అన్నీ చదువుకుంటే చాలా సరదా కలుగుతుంది. పద్యం లోని విశేషార్థము బాగా తెలుస్తుంది. సింధుకన్యకలు ఇందులో ముగ్గురు. సింధు ప్రాంతంలో పుట్టిన రాగం, లక్ష్మి, కావ్య నాయిక గిరిక కూడాను. కాని పద్యాన్ని సైంధవి/ సింధూర రాగానికి లక్షణ పద్యంగా ఎవరం అనుకోనక్కర్లేదు. (పాఠక మిత్రులు వసుచరిత్ర కావ్యంలో ఈ పద్యం కన్నా మరో రెండు పద్యాల ముందర, ఒక సీస పద్యంలో – గిరిక, వసురాజుల పెళ్లి అప్పటి ఆర్కెస్ట్రా, పెళ్లి కోలాహలం కూడా వినొచ్చు.)
సంగీత రాగాల పేర్లు, పుట్టుకలు, గుర్తించటాల గురించి:
ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి -అని, ఇప్పుడు ఖరారుగా బతికి ఉన్న ఒక్కొండు రచయితలు పన్నెండు సార్లు చెప్పేకన్నా, ( అదీ ఒక విషయమే అనుకోండి ) ప్రతి పిక్కి పిక్కి స్వర విభేదానికీ ఒక కొత్తపేరు తగిలించే కన్నా ( అదీ ఒక పనే అనుకోండి. ) నా ఉద్దేశంలో – ఏ శాస్త్రం లో నైనా, క్లాసిఫికేషన్స్ బేసిస్ తెలపగలగటం/తెలుసుకోటం ఎక్కువ ఉపయోగకరం. ఉంటాయి విభేదాలు. కాని ప్రతి సంగీతం విషయం గురించి సందిగ్ధతలు మాత్రమే ఉండటానికి సంగీతం రెలిజన్ కాదు కదా? సంగీతం శాస్త్రమయ్యె. ఈ సైన్స్ లోనూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ యా శాస్త్రజ్ఞులు సంభాషించుకోటం వెసులుబాటు కోసం, దానికో సాంకేతిక భాష, విభజన పథకాలుంటం, అవి అవసరాన్ని బట్టి అప్డేట్ చెయ్యబడటం జరుగుతుంది. సంగీత రాగాల ( అలాగే ఛందస్సు) విభజన పథకాల బేసిస్ ఏమిటి అని తెలిస్తే, ‘కొందరు’ ఎవరికి వారే రాగాలు, స్వర స్థానాలు డిరైవ్ చేసుకోగలరు. కొన్ని పాటలు (పద్యాలు) వారే డిజైన్ చేసుకోగలరు.
రవిశంకర్ My music, My Life అన్న పుస్తకం లో (109 వ పేజీ) హిందూస్తానీ రాగాలు (థట్) ప్రధానమైనవి పట్టుమని పది ఉన్నాయని, అవి బిలావల్, కళ్యాణ్, ఖమాజ్, కాఫీ, అసావరి, భైరవి, భైరవ్, పూర్వీ, మార్వా, తోడి – అని తెలిపాడు. ఇది 20 వ శతాబ్ది ‘వి. ఎన్. భక్తఖండే’ ప్రతిపాదించిన విభజన అనీ, దీనికన్న పదిహేడవ శతాబ్ది ‘వెంకట మఖి’ 72 మేళకర్తల విభజన ఉత్తమమైనదని అంటాడు.
In Ravi Shankar’s words (page 30):
“I myself however, as well as a number of other musicians, do not feel that these ten scales adequately accommodate a great variety of ragas. For there are many ragas that use notes not contained in these ten Thats. We therefore think it is more reasonable and scientific to follow the old Melakartha system of the south, because it can almost sustain any raga, no matter how unusual its ascending and descending structures.”
సంగీత విద్వాంసులు రచించిన సంగీతవిషయకమైన గ్రంథాలు, (జీవిత చరిత్రల పోసుకోలు కాదు) కొన్నైనా చదవటం నాకిష్టం. The next book in queue for me is – ‘The infinite variety of music’ by Leonard Bernstein.
అన్నమయ్య పాట గురించి:
అనంతకృష్ణ శర్మ గారు, సైంధవి రాగంలో అన్నమయ్య పాడినట్టు లేదన్నారు. పాడలేదేమో. కాని ఇక్కడ విజయవాడ రేడియోకేంద్రం వారి ఆర్టిస్టులు వినిపించారు.
There you go. Another feather in the cap of Bezwada. Thanks for the lovely broadcast! -Lyla
మీ సాహిత్య సేవ ఎంతో అభినందదాయకం. నా లాంటి సాహిత్యాభిమానులకు దాహార్తి తీర్చిన మీకు శతకోటి ధన్యవాదాలు. ఈ పద్యాలకు భావాలు కూడా చేర్చగలిగితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది.
మీకు వీలైతే క్షేత్రయ్య పదాలు, వాటి భావాలు కూడా అందిస్తే చాలా సంతోషం.
మీ సేవ గురించి ఎంతో వ్రాయాలని వుంది, కాని అధిక ప్రసంగం అవుతుందేమో…
మీ చిరునామా వివరాలేమైనా తెలియపరిస్తే సంతోషం.
చాలా ఆసక్తికరంగా ఉన్నది రచన. పద్యాన్ని నచ్చుకుని మమ్మల్నీ మెచ్చుకోమంటూనే, దాని లోని ముఖ్యాంశం నుండి (భారతీయ మాతల మాతృప్రేమ నిరూపణకు మరో దక్షిణ భారతీయ రచయిత నుండి మరో తిరుగులేని తార్కాణం.) మనసు తప్పించి మరెన్నో ఇతర విషయ చర్చ చేసారు. అలానూ ఆకర్షించారు.
మీ రచన గురించి కొంత ఆలోచించాక, మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ఒక కథ మళ్లీ నిదానంగా చదివాను. కథ పేరు ‘రవిచంద్రిక’. ఆ కథ “ఇది శివుని కథ అనుకునేరు. శ్రీనాథుని కథ” అంటూ మొదలెట్టి ఒక పదిహేడు పేజీలు రాసుకుంటూ పోయి, ద్రాక్షారామం, రాజమహేంద్రవరం, శ్రీశైలం అంటూ, శ్రీనాథుని వ్యక్తిత్వ పరిచయం, చేశాడాయన.
మల్లాది ఆ కథలో – దాదాపు చివరలో, శ్రీశైలం లో ఒక యతీంద్రులు ‘ఈశాన సంహిత’ లోని ‘సుకుమారుని’ చరితం వినిపిస్తున్నప్పుడు శ్రీనాథుడు శ్రోతలలో ఉంటాడు. దాని సారాంశం నచ్చక “ చిత్తశుద్ధిగా చేసిన పాపం శివనామం తుడిచివేస్తుందా? పుణ్యాన బోయేందుకు పాపుల కథలు వినవలెనా?” అని శ్రీనాథుడు అడుగుతాడు.
యతీంద్రుడు అప్పుడు కొన్ని మాటలు సభ హర్షించేట్లు చెప్పి, “ఈ కథను కావ్యంగా రచించమని నీకు ఆదేశించమని శివాజ్ఞ అయినది” అని శ్రీనాథుడికి చెపుతాడు.
శ్రీనాథుడు శివుడు తనను కానిపనులు చెయ్యమని ఆదేశించడని, తరించటానికి కావ్యాలాపం అవసరమా? అని విముఖత చూపితే యతీంద్రుడు “ఇది శివాపరాధం” అంటాడు.
శ్రీనాథుడు మరికొన్ని మాటలు చెప్పి “నాకు పుట్టుకిచ్చినవాడు, నాచేత కవనమల్లించినాడే కాని పాపకర్ముని చెయ్యలేదు. పాపులను వర్ణించేందుకు పలుకీయలేదు. అందుకు తామే సమర్థులని తోస్తున్న”దంటాడు.
మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ఈ కథ నుండి – ‘సుకుమారుడు’ అన్న పాత్ర శ్రీనాథుడు కల్పించింది కాదు, అతని ప్రవర్తనను ఇష్టపడనూ లేదు, తనకూ సుకుమారుడికీ ప్రవర్తనలలో పోలిక ఉందనీ అనుకోలేదు, అతని చరిత (శివరాత్రి మాహాత్యం) మళ్లీ శ్రీనాథుడు రాయనూలేదని, – ఆయన (మల్లాది) చెప్పదలిచారని నాకనిపిస్తూంది. (Ref: రామకృష్ణశాస్త్రి కథలు, నవోదయ పబ్లిషర్స్, విజయవాడ. పేజీలు. 159- 176.)
శ్రీనాథుని పేరిట ఉన్న పుస్తకాలు మరికొన్ని చదవాలని ఉన్నా, అవి తెలుగు పాఠకులకు అందుబాటులో లేవు. విద్వాంసులకే అవి అందుబాటులో ఉన్నట్టు లేవు. మీ ఇక్కడి ఈ రచన చదివాను. ఏల్చూరి మురళీధరరావు గారు రచించిన -‘సిరిమల్లె’ అన్న ఈ-పత్రికలో ఈ నెలలో ప్రచురించబడిన- “శ్రీనాథుని కవిత్వాదర్శం:లక్షణపరిశీలన” – అన్న వ్యాసం చదువుతున్నాను. వారు మొదట్లోనే ‘భీమేశ్వర పురాణం’ అవతారిక నుండి ఒక పద్యం ఇచ్చినారు. నాకు ఆ భీమేశ్వర పురాణం వెంటనే చదవాలని ఉంటుంది. అది దొరకదు. అందువల్ల కొంచెం మనసు కుతకుతలాడుతున్నది. ఐనా సంబాళించుకొని, ఇంతమట్టుకు రాస్తున్నాను.
శర్మ గారు మంచి ప్రశ్నే అడిగారు. నేనన్న పదివేల సంఖ్యకి ఆధారం వారిచ్చిన తొలి వచనానికి ముందున్న పద్యం –
“మీటు గల రాజరథికుల
నాటికి వేవుర వధింతు నరుశరములు నో
నాటి పడవైచునంతకు
వేటాడెద ప్రతిబలంబు వీరుల నెల్లన్ ”
రోజుకి వెయ్యిమందిని చంపుతానని స్పష్టంగానే చెప్పాడు భీష్ముడు. తను మొత్తం పదిరోజులు యుద్ధం చేశాడు. అలా పదివేల లెక్కయింది. తను పదిరోజులే యుద్ధం చేస్తానని భీష్ముడికి ముందే తెలుసా అనొచ్చు కాని అలా అంటే నరుడి శరాలే తనని పడవేస్తాయని మాత్రం ఎలా తెలిసిందన్న ప్రశ్న వస్తుంది. అలాగే మీటుగల రాజరథికులు వెయ్యిమంది, మీటులేని మిగతా వాళ్లు మరో తొమ్మిదివేలమందీ కలిపి రోజుకి పదివేలు అనొచ్చు కాని “అట్లుగా నాకయ్యంబు సేయుదివసంబులలోన” అన్న దానికి అన్ని రోజుల మీదా కలిపి పదివేలని నా అభిప్రాయం.
ఇంతటితో ఈ పిడకల వేటని చాలిస్తాను. అసలు విషయం మరుగున పడటం మంచిది కాదు.
త్వరలో మహా భారత నాగరికత పశ్వాధారితమని ఎందుకనుకోవచ్చునో నా ఆలోచనలు తెలుపుతాను. అలాటి విషయాల మీద చర్చ ఆహ్వానించదగింది.
1 కవిత్వం బాగుంది.
2 కంటిపాప దొన్నెల్లొ అని రావాలి.
3. 2 stanzas గందరగోళంగా వున్నాయు
4. చివరి 2 స్టాంజాలు బాగున్నాయి
5. కవిత్వంలో కంటిన్యూటీ దెబ్బ తింది
6. వేటికవే విడివిడిగా వున్నయ్
7. పొయెట్రీలొ లొతు వుంది కాని గతి సరిగా లీదు
8. ఆమనుషి అయున కాలం వెర్రివెంగళప్ప ఎలా అవుతుంది.
9. వెర్ర్రివెంగల్లప్ప పద ప్రయూగం కవితను నీరుగార్చింది.
కాలీ సల్వార్ కధ కీ , ఈ కధకీ సంబంధమే లేనట్టుంది. చాలా మంది ఊహించుకునే, కాని ధైర్యం చెయ్యలేని జీవితం. కాలీ సల్వార్ కధలో అవసరమూ, ఎలాగోలా జీవించాలనే జీవితం చూపిస్తే, వంద వాట్ల బల్బు కధలో ఓపిక నశించిన ప్రతిచర్య (ప్రతీకారం కాదేమో) కనిపిస్తుంది. దీనిలో ఎలా అనుకున్నామో అలాగే బతికే ధైర్యం కనిపిస్తుంది. మూడు కధలూ మూడు రకాలుగా ఉన్నాయి.
శ్రీనాథుని పోకడ కనిపిస్తున్నది నిజమే గాని – ఇక్కడ బిడ్డ చనిపోతే గుండెలు బాదుకుంటూ ఏడ్చే స్త్రీ రోదన ఇది. ఇలాంటి చోట కుంకుమరాగ రమ్య కుచకుంభాలూ, పరిభావిత పంచమ సుస్వరాలూ పెట్టడం అనౌచిత్యానికి పరాకాష్ఠ!
పోతన భాగవతం లోని షష్ఠ స్కంధము పూరణ చేసే కవి, పోతన పద్యాలు మిక్కుటంగా చదివి ఉండాలికదా!
కాటుక కంటి నీరు చనుకట్టుపై పడంగ అన్న పద్యమే ఉండగా శ్రీనాథుడి సరళి ఎందుకతనికి!
(ఓ! అది చాటు పద్యమయ్యె! అది ఎవరి పద్యమో authorship మనకు తెలియదని ‘ఈ మాట’ లో తెలియ చెప్పారుకదా! ఈ, ఈ పద్యాలు ఇవెవరివో మనకు తెలియదు అంటూ జనాలకు కొందరి పద్యాలను -వారి ఆర్టికల్ లో పందేరం చేసిన ఆథర్లకి మాత్రం ఆథర్షిప్ క్రెడిట్ ఇచ్చితీరాలని, భీష్మించే కొందరి పేరడాక్స్ నన్ను నవ్విస్తుంది.)
ఏర్చూరి సింగయ పద్యము సమయం సందర్భం గురించి నాకు అర్థమైనంతవరకు – ఒక బాలుడు విషప్రయోగం వలన మరణించాడు. అది తెలిసిన దాది నేలమీద పొర్లి ఏడ్చి, కేకలు పెట్టింది, ఆ కేకలు విని వచ్చిన తల్లి గుండెలు బాదుకుని ఏడ్చింది.
ఆమె రాజుగారి భార్య. పెద్ద రాణి. మరి ఆమె కన్నులకు, రొమ్ములకు, చేతులకు అలంకారాలు చేసి ఉంటాయి. ఆభరణాలు ఉంటాయి. అకస్మాత్తుగా అవి ఎక్కడకు పోతాయి? ఆమె రొమ్ములు అంతకు ముందు ఉన్నవి అకస్మాత్తుగా మాయమై పోతాయా? అందరి కళ్లనీళ్లు పడ్డచోటే ఆమెవీ పడ్డాయి కదా? ఆమెగారి స్వరం మామూలుగా పంచమం లో ఉంటే, అది మరో మెట్టులోకి అప్పటికప్పుడు ఎలా పడిపోతుంది? బాగా ఏడ్చాక అప్పుడు కంఠం బొంగురుపోతుందేమో.
ఇంతకీ శృంగార సందర్భాలలోని పద్యాలను చదువుకుంటూ, ఎవరి నాయికలు ఎలా ఏడ్చారా అని పోలుస్తూ ఆ పోటీలో ఒక్క కవినే శృంగారపు ‘శిఖరాగ్రం’ ఎక్కించాలి అని రచయిత అనుకుంటున్నారు. మహ చక్కగా చెయ్యొచ్చు. కాని, స్త్రీ కుచములను కేవలం శృంగార భావనలకే వారు అంకితమిచ్చుకుని, పరిమితం చేసుకుని, అవి వేరేచోట్ల, ఇతర కవులు కనిపింపచెయ్యటం అనౌచిత్యం అంటే ఎలా? అది తప్పు ఆలోచన అని నాకు అనిపిస్తున్నది.
నచ్చిన పద్యం గురించి చెప్పే శీర్షికలో, నచ్చని పద్యాన్ని గురించి ఎందుకు చెప్పారా అని సంశయిస్తూ చదివిన నాకు, ఆ నచ్చని కారణాలు సవ్యంగా లేవనిపించినందువల్ల రాసాను, కొన్ని నెలలకిందటి మరో పద్య పరిచయంతో కొంత తగువు ఉన్నది. అక్కడ మరోసారి రాస్తాను.
ఈ శీర్షిక contributing writers ఎవరైనా కాని, చాలా రసవత్తరంగా నడుపుతున్నారు.
ఇది కేవలం సాంకేతిక పదజాలాన్ని తయారు చెయ్యటానికి పూనుకున్న వారి బద్ధకం, నిర్లక్ష్యం, అంతకు మించి తెలుగుకు చేసిన (చేస్తున్న) ద్రోహం.
కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, డచ్ మొదలైన భాషలు మాట్లాడేవాళ్ళకి కూడా amphiphloic siphonostele అన్నది కొరకరాని కొయ్యే. ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, డచ్ వాళ్ళందరికీ గొప్ప గ్రీక్, లాటిన్ పాండిత్యం ఉందని కాదు. గ్రీక్, లాటిన్ వాడకపోతే వాళ్ళకి కూడా మొత్తం అర్ధాన్నిచ్చే సంక్షిప్తమైన పదం వాళ్ళ భాషల్లో లేదు. కాబట్టి, వాళ్ళు కూడా అవసరం కొద్దీ మాత్రమే వాడతారు. మెల్లమెల్లగా అలవాటు పడతారు. కొత్తపదాల్ని నేర్చుకున్నట్టే ఈ పదాల్ని కూడా నేర్చుకుంటారు. వీలైతే ‘pseudopodia’ లాంటి గ్రీక్ పదానికి సులువైన అనువాదం కుదిరినప్పుడు “False Feet” అని రెండో అర్ధం చెప్పుకుంటారు.
amphiphloic siphonostele లాంటి పదాలు యథాతథంగా తెలుగులో రాసెయ్యాలా? లేకపోతే సంస్కృతభాషలోకి తర్జుమా చెయ్యాలా? అన్నదానికి అప్పటి అకాడెమీ సభ్యులు సంస్కృతభాషలోకి తర్జుమా మంచిది అని ఆశించి ఉండవచ్చు.
యురోపియన్ భాషలవాళ్ళకి గ్రీక్ లాటిన్ గతి అయితే, మనకి సంస్కృతం గతి అయింది. అంతేకాని, ‘బద్ధకం, నిర్లక్ష్యం, అంతకు మించి తెలుగుకు చేసిన (చేస్తున్న) ద్రోహం’ ఏమీలేదు. తెలుగుకున్న పరిధులవల్ల ఇలా చెయ్యకతప్పలేదు. అంతకన్న బాగా చెయ్యలేమా అంటే, చెయ్యచ్చేమో. అకాడెమీ పుస్తకాల్ని విమర్శించినవాళ్ళే గాని, మంచి పదజాలంతో పుస్తకాలు రాసినవాళ్ళు లేరు. ఎందుకంటే వాటికి అమ్మకాలుండవని మనరచయితలకి తెలుసు.
మొదట్లో పరిభాషని standardize చెయ్యడానికి ఎన్ని కష్టాలు పడ్డారో గమనించగలరు.
ఎన్నో గ్రీక్ లాటిన్ పదాలు మనభాషలో సొగసుగా ఒదిగిపోతే అలాగే వదిలేసారు.
ఉదాహరణలు: రేడియో ధార్మికత, క్వాంటీకరణం etc.
ఏ శాస్త్రాధ్యయనంలోనైనా, పరిభాషని నేర్చుకోక తప్పదు.
బహుభాషారాష్ట్రాలున్న భారతదేశంలో మాతృభాషల్లో విద్యాబోధన జటిలమైన పని. 90% ఉద్యోగాల్లో మాతృభాషని వాడలేము. అందువల్ల ఈ ప్రక్రియకి ఆదరణ లేదు.
అన్నిటికన్నా విచారించవలసిన విషయమేమిటంటే, 70వ దశకం వరకూ, తెలుగువాళ్లకి పిండిపదార్ధం, మాంసకృత్తులు, జీర్ణకోశం, లాలాజలం, కాలేయం, ప్లీహం లాంటి పదాలు చక్కగా అర్ధమయ్యేవి. ఇప్పుడు మంచినీళ్ళు, ఉప్పు, చక్కెర లాంటివి కూడా కొందరికి అర్ధంకావటల్లేదు.
ఈ వ్యాసమూ ఇంతకుముందు వచ్చిన వ్యాసమూ చదివాక ఇవి కొన్ని confused premises మీద కట్టినవని అనిపిస్తోంది. చదువుతుంటే నాకు స్ఫురించిన కొన్ని సంగతులు చెబుతున్నాను.
— తెలుగులో శాస్త్ర పరిజ్ఞానం వృద్ధి చెందటానికి తగిన వ్యాకరణయుక్తమైన ఆధునిక రచనా పద్ధతి అవసరాన్ని వ్యాస రచయితలు నొక్కి చెబుతున్నారు. అలాగే దాన్ని అడ్డుకొన్నది గిడుగువారి వ్యావహారిక వాదం అంటూ గిడుగును దించి చిన్నయను పైకెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగులో ఆధునిక శాస్త్ర పరిజ్ఞాన వృద్ధిని ఆపుతున్నది గిడుగు ఆదిగా మొదలైన వ్యవహారిక దృక్పథం కాదు కదా. గిడుగు తదనంతరం వ్యాప్తిలోకొచ్చిన వ్యావహారిక తెలుగు వచనానికి శాస్త్ర పరిజ్ఞానాన్ని వ్యక్తం చేయగలిగే చేవ ఉన్నది. ఈ విషయంలో ఇబ్బంది వాక్యరణం కాదు. అంతకుమించినది- పరిభాష లేకపోవటం. ఈ పరిభాషకూ, వ్యాకరణానికీ ఏమీ సంబంధం ఉన్నట్టు తోచటం లేదు. (ఉదాహరణకి, మాట్లాడే మామూలు భాషలోనే, పెద్ద పద్ధతైనదిగా ఏమీ తోచని వాక్య నిర్మాణంతోనే/ శైలితోనే ఈ వ్యాసం చక్కగా కొత్త ఆలోచనల ప్రతిపాదనకు పూనుకున్నది కదా–పోనీ ఇది పక్కనపెట్టి వెల్చేరు ప్రసిద్ధ గ్రంథమే తీసుకున్నా.)
— ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పొదువుకొనే వచనం తెలుగులో ఎదగకపోవటానికి కారణం గిడుగు మీదకు నెడుతున్నారంటే, వ్యవహారంలో వున్న భాషను రచనలోకి తెచ్చుకొనే స్వేచ్ఛను తప్పుబడుతున్నారని అనాలి (అదే గిడుగు చేసింది కాబట్టి).
— గిడుగు ఉద్దేశంలో మాట్లాడే తెలుగు వాడాలీ అంటే “What did you do” అన్నది “వాడ్డిడ్జుడూ” అన్నట్టు రాయమని కాదు, అంటే “పలికే తీరులో” రాయమని కాదనుకుంటాను. మాట్లాడే భాషలో ఉండే syntactic libertiesనూ, పదాలనూ రాసే భాషలోకి తీసుకోవచ్చని ఆయన ఉద్దేశం. ఆయన మాట్లాడుతున్నది- పదాలు పలికే తీరు గురించి కన్నా, పలుకుబడిలోని వాక్యాలకుండే syntax గురించీ, పలుకుబడిలో మాత్రమే వినిపించే (అప్పటిదాకా రాతలో కనిపించని) పదాల గురించీను. వాటిని రచనలోకి తీసుకురావాలన్నది ఆయన ప్రతిపాదన. మరి అదేమీ వ్యాస రచయితలు వాంఛిస్తున్న “ఆధునిక గ్రాంథికా”నికి అడ్డు కాదే? పైపెచ్చు దాని వల్ల ఆ రచనలోని ఆలోచనల వ్యాప్తికి అవకాశం విస్తృతమవుతుంది కూడాను.
— అసలు గిడుగు ఒక పూర్వనిర్దేశిత నియమాలు ఉండరాదూ అని చెబుతున్నది సృజనాత్మక రచనలకేగాని, శాస్త్ర గ్రంథాల విషయంలో కాదు కదా. ఇదే సంచికలో టేకుమళ్ళ పుస్తకానికి ఆయన రాసిన ముందుమాటలో: “కథలూ, నాటకాలూ, పాటలూ ఇంకా ఇటువంటి రసవద్రచనలు చేసేవారు, ప్రతిభావంతులైతే, పురాణపద్ధతులు అవలంబించరు. వారి రచనలో ‘వ్యక్తిత్వ’ముంటుంది. అద్దెచీట్లు, క్రయచీట్లు, ఒడంబడికలు, ప్రభుత్వంవారి శాసనాలూ, ప్రకటనలూ ఇటువంటివి Standard భాషలో ఉంటవి.” అని ఆయనే చెబుతున్నారు కదా. ఈ తోవలోనే కదా ఆ శాస్త్ర గ్రంథాలూ వచ్చేది. అయితే అదికూడా పూర్తిగా కాదు. శాస్త్ర గ్రంథాలకూ వ్యక్తిత్వం ఉండకుండా పోదు (పాఠ్యపుస్తకాలను, పరిశోధనా పత్రాలనూ మినహాయిస్తే.)
— అసలు ఇంగ్లీషులోనైనా మరే భాషలోనైనా తాత్త్వికులు, శాస్త్రవేత్తల గ్రంథాలు ఒకే స్టయిల్ మాన్యువల్‌ని పాటిస్తున్నాయని వ్యాస రచయితలు ముందు నిరూపించగలిగే బాగుంటుంది. సృజనాత్మక రచనలో రచయిత ప్రత్యేక శైలి ద్యోతకమైనట్టే తాత్త్వికుల, శాస్త్రవేత్తల రచనల్లోనూ ద్యోతకమవుతుంది. అదేమీ లేకుండా ఒట్టి స్టయిల్ మాన్యువల్ శైలిలో పొడిగా రాసే రచనలు బహుశా ఇక్కడ డాక్టరేట్ల కోసం రాసే గ్రంథాలలాగే ఉంటాయి తప్ప, వాటికి ఆలోచనల్ని ముందుకు తీసుకుపోయే చేవ ఉండదు. ఏ ఒరిజినల్ థింకర్ కైనా తన శైలి ఉంటుంది.
— చిన్నయసూరిని గిడుగు వ్యతిరేకించింది కూడా గ్రాంథికపు సింటాక్సు విషయంలో కాదు, గ్రాంథికపు పదజాలం విషయంలో అనుకుంటాను. దీనికి ఫలితరూపమైన వచనం ఒకవేళ గిడుగు దగ్గరే కన్పించకపోతే అందులో ఆయన వాదానికి వచ్చిన లోటేమీ లేదు. ఆయన ప్రయత్నాలు సఫలించిన వైనం మాత్రం తర్వాత తెలుగులో చలం ఆదిగా కొడవటిగంటి మీదుగా ఆ తర్వాతి రచయితలు, నేటి రచయితల ఎందరి రచనల్లోనో కనిపిస్తోంది. చలం వాక్య వైభవం చిన్నయసూరి నీతిచంద్రికలో వాక్యాలకన్నా మెరుగ్గానే ఉంటుంది. ఇక ఈ కథలూ, నవలలూ, కవితలూ రాసుకునే భాష ఆలోచనలు తయారు చేసుకునే భాషగా మారకపోవటానికి గిడుగు పెట్టిన అడ్డేమీలేదు. తెలుగు లోకంలో ఆలోచనాపామరత్వానికి మనం వేరే కారణాలు వెతకాలి. బహుశా విద్యా వ్యవస్థ, గ్రంథాలయ వ్యవస్థల వంటివి సరైన రీతిలో ఎదగకపోవటంలో వెతకాలి. వ్యావహారిక భాష అడ్డురాగా ఆలోచనలు కుంటుపడిపోయిన ఆలోచనాపరులు ఎంతమందో మరి నాకనుమానమే!
— మనక్కావాల్సింది సింటాక్టికల్ లెవెల్లో ఆధునిక గ్రాంథిక భాష అని అనుకున్నప్పుడు ఇక పదాల లెవెల్లో మాత్రమే వ్యాకరణం గురించి మాట్లాడాడని వ్యాస రచయితలే చెబుతున్న చిన్నయసూరి ఎందుకు పనికివస్తాడు? ఆ గ్రాంథికపు పదజాలం తీసివేస్తే చిన్నయలో ఉన్నపాటి సింటాక్టిక్ రిఫైన్మెంటు కొడవటిగంటిలో కనిపించదా? చిన్నయకు ముందువున్న నేపథ్యంలోనుంచి చూస్తే చిన్నయ ఎంతో ప్రకాశవంతంగా కన్పించవచ్చు. ఆయన పాదుకొల్పిన వాక్య నిర్మాణ ఒరవడికి గిడుగు ఇచ్చిన వ్యావహారిక పదజాల స్వేచ్ఛ తోడయ్యాకా, ఆ రెండూ కలిసి రియలైజ్ అయ్యాకా వచ్చిన వచనం ముందు చిన్నయ్య, గిడుగు ఇద్దరూ తేలిపోతారు–ఒకవేళ మనకు కొత్తేదైనా రోతే అన్న మౌఢ్యం అనాలోచితంగా ఉంటే తప్ప.
— “మేం సృజనాత్మక సాహిత్యం గురించి కాదు మాట్లాడుతోంది, ఇతర వచనం గురించి” అంటారా? గిడుగు ఆలోచనలు సృజనాత్మక వచనాన్ని ఎన్నో శృంఖలాల నుంచి తప్పించాయన్నది విశదమైన విషయం. ఆయన సంకెళ్ళు వదులు చేసాకనే భాష ప్రజాస్వామికమైంది. గత మూడు దశాబ్దాలుగా బ్రాహ్మణేతర, ముఖ్యంగా వెనుకబడిన కులాల సంస్కృతి రచనలో ఆవిష్కృతమవుతున్నదంటే గిడుగు తొలిచిన దారి మహిమే. నాగప్పగారి సుందర్రాజు ‘మాదిగోడు’ కథలు ఒక గొప్ప సంభవం కాదూ? అది అంతకుముందు అన్ని వందల ఏళ్ళ తెలుగు పుస్తకాల్లోనూ ఆవిష్కృతంకాని ప్రపంచం కాదూ? అదెలా సాధ్యమైందంటారు? విద్య గ్రాంథికాన్ని వీడి వ్యావహారికంవైపు మరలటం వల్ల కాదూ? మరి అదెలా సాధ్యమైందంటారు? గిడుగు వల్ల కాదూ? తెలుగు సాహిత్యం కొన్ని శతాబ్దాలుగా సాగుతూ వచ్చిన వైనానికి (ఒకే వర్గం చేతిలో చిక్కుపోయిన వైనానికి) స్పీడు బ్రేకులు వేసే సాహిత్యం గత రెండు దశాబ్దాలుగానే వస్తోంది. గిడుగు ప్రభావం అంచెంలంచెలుగా వెదజల్లిన ప్రభావానికి ఫలితమే అది.
— గిడుగు అందించిన స్వేచ్ఛని సృజనకారులు అందిపుచ్చుకున్నట్టు, ఇతరేతర విభాగాల్లోని (చారిత్రక, శాస్త్రీయ, తాత్విక) రచయితలు అందిపుచ్చుకోకపోవటానికి కారణం ఆయన కాదు. సృజన మనసులోంచి పుడుతుంది. దానికి వేరే వ్యవస్థల దన్నూ ప్రాపకం మరీ అంతగా అవసరం లేదు. శాస్త్రపరమైన ఆలోచనలకు విద్యా వ్యవస్థ, ముఖ్యంగా గ్రంథాలయ వ్యవస్థ, ఇతరేతర సంస్కృతీ దన్నుగా నిలవాలి. ముఖ్యంగా ఇప్పటిలా తుప్పుపట్టిపోకుండా స్వేచ్ఛగా ఆలోచనల మారకం జరిగే విశ్వవిద్యాలయాల్లాంటి ఆవరణలు కావాలి. అవి తగినవిధంగా లేకపోవటమే ఆలోచనారంగంలో తెలుగు వెనుకబాటుకి కారణం తప్ప, గిడుగు వ్యవహారిక వాదం కాదు.
నాలుగు శీరుల (గణముల) వృత్తములయందలి ఒక ప్రత్యేకత వనమయూరమును బోలినది. దీనిని ఎనిమిదవ శతాబ్దములో తిరుజ్ఞానసంబందర్ తేవారములో కొన్ని పద్యములుగా వ్రాసెను. అందులో నొకదానిని క్రింద ఇచ్చినాను. ఇది చివరి క్షణములలో నేను చూచినాను. అందువలన వ్యాసములో ఉంచడానికి వీలు లేక పోయినది.
నాలుగు శీరుల వృత్తపు అమరిక – కూవిళంగాయ్/కూవిళంగాయ్ – కూవిళంగాయ్/తేమా
ఈ అమరికలో కూవిళంగాయ్ గణమునకు UIII, తేమా గణమునకు UU ఎంచుకొనబడినవి. అక్కడక్కడ ఇతర గణములు కూడ ఉన్నాయి. కాని పాడేటప్పుడు వనమయూరపు లయయే. పద్యమును చదివి (తెలుగులో కూడ), పాటను ఇక్కడ విన వీలగును –
అంటే అర్థం కావడం కాకపోవడం అనేవి ఇటువంటి వ్యాసాలకు వర్తించవని మీ ఉద్దేశ్యమా నాగమురళి గారూ !వినేవాడికి చెప్పేవాడికి కూడా అర్థం కానిదే వేదాంతం అన్న నానుడి గుర్తొస్తూంది. కానీ భైరవభట్ల గారి “ఎడమ నేను” కు మాత్రం తాను చెప్పదలుచుకున్న విషయమ్లో చాలా స్పష్ఠత ఉన్నట్లు నాకు స్పష్ఠమైంది.
ఇక్కడ నాకు మరో రెండు లాజిక్కులు గుర్తుకొస్తున్నాయి. మా మేనల్లుడొకడు చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తను లేస్తే తన సీట్లో మరొకరు కూచోకుండా “ఈ సీట్లో కూచున్నవాడు పంది” అని ఒట్టు పెట్టే వాడు. వెంటనే వాడికి గుర్తుకు వచ్చేది తరవాత తనే అక్కడ కూచోవాలని ! కాబట్టి ఆ ఒట్టుకు “నా తప్ప” (నేను తప్ప) అని చేర్చేవాడు. మన నిత్యజీవన వ్యవహారాల్లో చాలా వాటికి ఇలా “నా తప్ప”ను అధ్యాహారం గా చేర్చుకోవాలనుకుంటాను. “మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్”అని గిరీశం అన్నప్పడు తానెప్పుడూ “మనవాడు” కాదని అతని ఉద్దేశ్యం స్పష్ఠం గా తెలుస్తూనే ఉంటుంది.
మరోటి నేను గవర్నమెంటులో పని చేస్తున్న నాటి సంగతి. ఒకతను నా సహోద్యోగి గవర్నమెంటు వాళ్ళందరూ అవినీతి పరులండీ అనేవాడు. మనం పొరపాటున అదేంటండీ అలాగంటారు ! మీరూ గవర్నమెంటు వాళ్ళే గదా అనో లేకపోతే వాళ్ళలో కూడ మహానుభావులుంటారు అని “బైరాగి” లెవల్లోనో మాట్లాడామా ! అతని ఉద్దేశ్యం లో మనం మొదటి గవర్నమెంటు వాళ్ళమైపోతాము ! అలా కాకుండా వినయంగా అవునండీ నిజమే ! అంటేనే మనకు ఈ గవర్నమెంటు ( e- government కాదండోయ్ !) వాళ్ళనుండి మినహాయింపు లభిస్తుంది. ఆయన ఏదో కనుక్కున్నట్లు మనకే వచ్చి చెప్తున్నాడంటేనే తననూ మననూ మినహాయించి చెబుతున్నాడనే కదా ! if you negate it, you will be it. అదన్నమాట లాజిక్కు.
1.”…. ‘సంగీత సాహిత్యములు’…….., ‘అనేక కృతులలో ‘ రెండును చేయి చేయి పట్టుకొని అపూర్వ సౌహార్దముతో ఏకాగ్రముగా రూపుగొన్న అద్భుత దృశ్యమును మనకు త్యాగయ్య ఎత్తి చూపఁగలిగినాఁడు’. ‘పలుకు పలుకులకు తేనెలొలుకు’ కృతులు అతనివెన్నో కలవు. ఆ తేనెలు మాటలవో, పాటలవో చెప్పలేము. ఎందుకనగా అవి రెండును మేళగించి దింపిన రసాయనములు”.
2. “కాని మొత్తముమీఁద త్యాగయ్య ‘నాద విద్యా మర్మములను’ గమనించినంత మెలుకువతో శబ్ద రచనా రహస్యములను గమనింపలేదనుట మనము కనుఁగొనఁగలము. భావముల గొప్పతనమునకు సరిరాలేక ఎన్నో చోట్ల అతని భాష తంటాలుపడుచున్నది”
1. 2. లలో గల వైరుధ్యాల తో ‘మొత్తము మీద’ ఈ వ్యాసము బాగుగా నున్నది.
తః తః
నాకు నచ్చిన పద్యములలోని ఒకటైన ఈ పద్యముపై చాల చక్కని వ్యాసము. రచయితకు నమస్సుమాంజలులు. ఒకప్పుడు నేను ఈ పద్యమును గుఱించి వ్రాసినది –
నన్నయ భారతములో చివరి పద్యము శరత్కాలపు రాత్రుల సౌందర్యపు వర్ణన అయితే, ఎఱ్ఱన శరత్కాలములో ప్రాతఃకాలము ఏ విధముగా ఉంటుందని వర్ణిస్తాడు. నన్నయ భారతము ఉత్పలమాలతో అంతమయితే, ఎఱ్ఱన భారతము చంపకమాలతో ఆరంభమవుతుంది.
రాత్రి అంత్యాని సూచిస్తే ఉదయము వెలుగును, భవిష్యత్తును సూచిస్తుంది. ఎఱ్ఱన తన కావ్యాన్ని ఆశాజనకముగా ప్రారంభిస్తాడు. తిక్కన అరణ్యపర్వ శేషమును ముగించలేదు, విరాట పర్వముతో ఆరంభించాడు. కొందఱంటారు అరణ్య పర్వము కొనసాగిస్తే కీడు మూడుతుందేమో అని. అలా కాదని ఒక సంతోషముతో, ఆశతో ఎఱ్ఱన ప్రారంభిస్తాడు తన రచనను. అంతే కాదు అరుణాంశ అని ఎఱుపు రంగును తెలిపినపుడు తన పేరును కూడ తెలిపినాడని నా భావన. మిగిలిన కవులు పీఠికలో తమ పేరిని తెలుపుకొన్నారు. కాని మధ్యలో ఆరంభించిన ఎఱ్ఱనకు ఆ అవకాశము లేదు కదా? అందువలన పద్యములో స్ఫురదరుణాంశు అంటాడు, ప్రకాశించే ఎఱ్ఱన అని చెప్పుకొనక చెప్పుకొన్నాడు కవి. నన్నయ శైలిని కూడ అనుకరించడానికి ప్రయత్నిస్తాడు ఎఱ్ఱన ఈ పద్యములో. అందువలన చదువరులకు అది ఒక చక్కని కొనసాగింపు అవుతుంది.
నన్నయ చివరి పద్యాలను ఈ పత్రికలోని “నన్నయ హంసగీతికలు” అనే వ్యాసములో చర్చించి యున్నాను.
స్త్రీని, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని మనసును తాకి, మెదడును మేల్కొలిపే రచనలు (ఎంతో సమ్యమనంతో) రాస్తారు అని పేరొందారు కదా. (తన వాదనకు అడ్డొస్తే శ్రీశ్రీ, కొ.కు. నాయన, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గార్లనైనా దులిపేసే మా మరో అక్కలా కాదు తను). గుడిపాటి చలం, కొ.కు. నాయన, చక్రపాణి, త్రిపురనేని గోపిచంద్, ఆలూరు బైరాగి, జి.వి. కృష్ణారావు, హితశ్రీ, సంజీవదేవ్, శారద లాంటి వాళ్లనెందరినో మనకిచ్చిన తెనాలి ప్రాంత సాంసృతికిక, సాహిత్య వారసురాలు మన సత్యవతి అక్కయ్య.
స్వేచ్చ పేరిట, సమానత్వం పేరిట అనైతికతను, విశృంఖలతను పాటించవచ్చు అని పాఠకులకు (స్రీలకు కాని, పురుషులకు కాని) చెప్పే వారు కాదు అక్కయ్య.
కాని వారు రాసిన యీ క్రింది వాదనను ఎదిరించి చూపగల ప్రతివాదన నాశక్తికి మించిన పని.
“తరచూ చెప్పే ఒక సూక్తి ప్రకారం ఒక స్త్రీ బాల్యంలో తండ్రి అదుపులో వుంటూ రక్షణ పొందాలి. అట్లాగే యౌవ్వనంలో భర్తను, వార్ధక్యంలో కుమారుడిని అనుసరిస్తూ రక్షణ పొందాలి. స్త్రీకి స్వతంత్రంగా జీవించే అర్హత లేదు.(మను స్మృతి V.147 IX.3) అలాగని మంచి స్త్రీ ఎప్పుడూ ఆబల కాదు. శక్తిహీనురాలు కాదు. ఆమె శక్తిస్వరూపిణి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె పవిత్రతా, సంరక్షణ స్వభావాలే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కానీ, పురుషస్వామ్య సమాజ లక్ష్యాలను కాపాడుకోవాలంటే ఆమె శక్తిని అదుపులో వుంచాలి. ఆమె లైంగిక వాంఛలు భర్త ద్వారా కేవలం సంతానోత్పత్తి కోసమే తీర్చుకోవాలి. అది ఆమె ధర్మం. సాంస్కృతిక కోణంలోనుంచి చూసినట్లయితే, స్త్రీల లైంగికత పట్ల హిందూ వైఖరి, మంచి-చెడు, పవిత్రత-అపవిత్రత, శుభము-అశుభము, అనే ద్వంద్వాల మధ్య వుండే సంబంధం అర్థమౌతుంది”.
రామయ్యగారూ!
అది ప్రస్తుత పరిశోధనాంశానికి ముఖ్యమైన విషయం కాదు గాబట్టి అనిర్ధారితమైన దేశకాల సమాచారాన్ని ప్రచురించకపోవడమే మంచిది. కాని, ఈ తెగని సమస్యల పట్ల మన రచయితలకి ఎందుకో మక్కువ ఎక్కువ.
-BK
చక్కగా మంచి అనువాదం లాగా ఉంది. నాకు ఆ రోజులు చరిత్ర చదువుకోవడం మూలాన మాత్రమే తెలుసు. యుద్ధం మూలాన ధరలు పడటం ఇటువంటి విషయాలు కొన్ని తెలుసు. ఇంకా అప్పడు ఉన్న రాజకీయ వ్యవహారాలు తెలుసు. తెలియందల్లా, మనుషుల గురించి ఒక్కటే. అందుకే మంచి కథ మిగిలిన సబ్జెక్టులకి complementary గా ఉంటుందంటారు.
దీనితో బాటు నేను ఆ వ్యాసం కూడా చదివాను. కాలమే కాకుండా, నేను దేశం కూడా మారడం మూలాన్నేమో, ఆ వ్యాసం ఒక historical interest లాగనే అనిపించింది. నాకు కథలో వేరే విషయాలు ఎక్కువ ఆకర్షించాయి — ఆ మాటలు, శంకర్, ఖుదాభక్ష్ లాంటి వాళ్ళు, ఆ ఫకిర్ మీద ఖుదాభక్ష్ ఆశలు. మధ్య తరగతి వాడినేమో గానీ, జీవితం మీద ముందు చూపు లేకుండా బ్రతకడం ఒక భయాన్ని, ఒక vicarious excitement నీ కలిగిస్తుంది.
మరి ఎందుకు మంచి అనువాదం అన్నాను? ఒక విధంగా చూస్తే, అనువాదం లో మూలం నుంచి ఏదో కొల్పొతామనే భయం ఉంటుంది జనాలకి. కానీ, అనువాదం అర్థం కాని దాని నుంచి, అర్థం అయె దానికి తెస్తుంది. నాకు పాలు పడవు. పెరుగు ఇష్టం. పాల నుండి పెరుగు మార్చె ప్రక్రియ, నాకు బాగ ఉపయోగం. అంతే కానీ పెరుగు పాల కన్నా తక్కువ కాదు. (Crude analogy. But faithfulness in translation is humbug. Nobody understands the original in exactly oneway. As long as the translation in the same ball park, it is a translation. As long as it achieves the objective that the original author hopes for, it is a good translation. The essay sort of tells what the original author hoped for; and the translation achieves that. That is why I called it a good translation).
Why do people think calling it as a translation is damning? Why is the translation’s ulimate compliment is “it does not read like translation”? Obviously, this story is not Telugu. It is written for and written by and written about non-Telugus. I do not know about you, but suppose we change the names khudaabhaksh to mastaan, and ambala to kakinaada and Delhi to Hyderabad, and payikhaana to marugudoddi, etc, and entirely transform it to Telugu land, how we would it look? While we are at it, change the references to the war as say, the post independence. And, devalue the rupee and move the story to 1970s.
I submit that in that case, the story loses its linguistic connection to the original. It will not read like a translation. It would be like a original story.
But, is that desirable? For me, this story managed to create a new world. Within the limited knowledge of that time, I could imagine the world (including the rail yard), which she inhabits. It not only has these three of four characters, but a rich history of the times. That goes with the geography and other minute details. If I were to lose those details, it may be a same story, but in spirit in dissimilar, as it paints a different picture. The background of the white Johns certainly adds a nuance to the story. Or, the history of migrants to Delhi adds an angle to the story. Heck, even the 3 rupee detail and the 20 rupee rent adds an angle to the story. If we were to transform it, it will lose the complete context.
That is why, I am thankful that it reads like a translation. I am thankful that it is good. I think that is the best compliment I can give.
(sorry for switching to English — Telugu typing takes too much time).
అభినవ గుప్తుడు వ్రాసిన “సంస్కృత సౌందర్య శాస్త్రం” అన్నారు కదా.ఈయన భరతముని నాట్యశాస్త్రానికీ, ఆనంద వర్ధనుడి ధ్వన్యాలోకానికీ వ్యాఖ్యానాలు కాకుండా, మరేదైనా aesthetics కు సంబంధించి, మనకు ప్రస్తుతం దొరుకుతున్న గ్రంథం వ్రాసారా? మీరుటంకించిన విషయం ఆయన వ్రాసిన ఏ పుస్తకంలోనిది?
వ్యాసం సోదాహరణంగా బాపుగారి గీతల పరిణతికి అద్దం పట్టింది. బాపుగారి బొమ్మలు తెలుగు వారికే స్వంతం. అవి మరి ఏ ఇతర బాషల సాహిత్యాన్ని గాని, ఇతర ప్రాంతాల జీవనాన్ని గాని ప్రతిబింబించలేదు. అందుకే ఆంధ్రేతరులకి వారు అపరిచితులు. బ్రహ్మానందంగారు రాసినట్టు గియ్యని గీతల్లో చిత్రాలకి కొత్త ఆందాల్ని, అనుభూతిని ఇచ్చినవారు బాపుగారు. కొంతవరుకూ లైలాగారు, కటకటాగారు అన్నట్టు, కొన్ని బాపుబొమ్మల్లొ జీవం కనపడకపోవచ్చు. కాని పరిణతి చెందిన బాపుగారి బొమ్మల్లో అన్ని రకాల భావాలు ప్రస్ఫుటం అవుతాయి. ఉదాహరణకి –సత్యం శంకరమంచిగారి “అమరావతి కథలు”లో ప్రతీ బొమ్మ కథ చదివే ముందే మీతో మాట్టాడుతుంది. వంశీగారి కథలకి బాపుగారి బొమ్మలు అన్ని భావాలూ ఒలకబోస్తాయి. లైలాగారన్నట్టు, రంగుల్లో వారి బొమ్మలు పేలవంగా ఉంటాయి. యేమైనా బాపు-రమణల జోడు తెలుగువాళ్ళకి రాత + గీతలతో కూడిన సాహిత్యాన్ని ఇచ్చింది. వారిద్దరికీ జోహార్లు.
ఏడు కవితలు గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
11/17/2018 3:55 pm
తః తః గారు “మళ్లీ ఒక సారి చదివాను, ‘ఏ వ్యక్తీకరణం ఎప్పుడు తప్పుచేయగలదు?’ ఈ వాక్యం మరీ faithful ఉన్నట్టుంది,” అని రాసిన తర్వాత, నేనూ నా తెలుగు అనుసృజన – ఒరియా మూలం మరోసారి చదివాను.
I hate to disappoint Sri తఃతః. That line is neither faithful nor beautiful. I wondered how my co-author,and I missed it. Here I give the two relevant lines from the original poem in diacritical Roman script.
‘ఇప్పుడు వాటికర్థం లేదు, అర్ధంలేకపోవచ్చు కాని, ఏ మాటలు ఏ సమయంలో తప్పుటర్థం యిస్తాయో?’
అని రాసి వుంటే బాగుండేది.
This might come close to being faithful and closer to being beautiful.
Anyway, I do not subscribe to Sri Ronamki, or the un-named French writer, or for that matter Professor Google who credits Yevgeny Yevtushenko for the irrelevant, irresponsible and insensitive implication in the quotation that compares translations to women. Fortunately, the women I knew are beautiful and faithful. I have to pity those blessed scholars for their misfortune.
మీ వ్యాసం ఆసాంతం నన్ను కట్టి పడేసింది. గణపవరపు వారి ప్రబంధరాజము మీద ఇంత విస్తృతంగా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
ఇకపోతే, పద్య కవిత్వం బాగా అలవడి అదికాస్తా చిత్ర కవిత్వం పై మక్కువ గా మారింది. గర్భ కవిత్వం, ద్వ్యక్షరీ, త్ర్యక్షరి, ముక్త పదగ్రస్తం వంటి ప్రయోగాలు బాగానే చేయగలిగినా ప్రబంధరాజ కావ్యాన్ని దానిపై పరిశోధిత వ్యాసాలను చదివి మరిన్ని మెళుకువలు సాధించాలని ఆశ.
కాని ఆ పొత్తము అంగడిలో అలభ్యంగా ఉంది. అలాగే అంతర్జాలంలోనూ లభించుట లేదు. అది ఉపలబ్దమయ్యే మార్గము సూచించ గలరు.
భవధీయుడు
రాళ్ళపల్లి సున్దర రామ శర్మ
Akshara Vinyasam
Natelugu savvadi blogspot.com
+919440597260
అడవితల్లి వొడిలో సేదతీర్చుకోవాలనే ధ్యాసే కాని, పురుగూ పుట్రా ఉంటాయ్ జాగ్రత్త జయతి బిడ్డా అంటే ( అదంతా మనమేర్పరచుకున్న భయాందోళనల తప్పు అభిప్రాయాలు అంటూ నవ్విన ); జీవితం సుఖంగా జరుగుబాటు కోసం నాలుగు రాళ్లు వెనకేసుకోవద్దా అని కేకలేసే ( “How Much Land Does a Man Require?” by Leo Tolstoy కధ సదివినావు గందా అంటూ నవ్విన ); జీవన సాయంసంధ్యలో పనికొస్తుంది డబ్బులు కూడబెట్టాల బిడ్డా అంటే (
ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి సంధ్యలను ప్రకృతి వొడిలోనుండి వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న జయతి బిడ్డ చిరునవ్వు తప్ప మారుమాట్లాడలేదు ).
అమరేంద్ర గారూ! కాలం నాడు ” భద్రం కొడుకో! నా కొడుకో కొమరన్న” అని విలపించిన గద్దరన్న చేత మళ్లీ భద్రం బిడ్డో! నా బిడ్డో జయతమ్మా అని సుద్దులు చెప్పించాలనిపిస్తోంది అని అన్నా సంటిబిడ్డలా నవ్వుతున్నది మీ జయతి బిడ్డ.
‘అడవి నుండి అడవికి’ పుస్తకం ఆవిష్కరణ సభలో మీరు చేసినది పరిచయంగా కాదు పున్నమి రేయి పోటెత్తిన సంద్రంలా మమ్మల్ని ముచ్చెత్తింది. “అడవి తల్లికి దండాలు, మా కన్నతల్లికి దండాలు, అడవి చల్లగుండాలా… మా బతు కులు చల్లగుండలా” ఆలాపనను గుర్తుకు తెచ్చింది.
జయతి లోహితాక్షన్ గారి ‘అడవి నుండి అడవికి’ పుస్తకం ప్రింటుకాపీ కానీ, e-బుక్కు కాపీ కాని ఎక్కడ దొరుకుతుందో తెలియజెయ్యరా? (నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారి వెబ్ సైట్ లో కాని, కినిగే వారి వెబ్ సైట్ లో కానీ పుస్తకం వివరాలు లేవు).
పోనీ యీ క్రింది అడ్రెస్ తో సంప్రదించి పుస్తకం తెప్పించుకునే సదుపాయం ఉన్నదా?
జయతి లోహితాక్షన్,
“మట్టిముద్రణలు”
ఆలగడప, మిర్యాలగూడ,
నల్లగొండ జిల్లా,
తెలంగాణా – 508 207
ఆస్టిన్యా నగరే విరామసమయే యూటీతరౌ సన్నిధౌ … పత్రిక ప్రారంభదినాలూ, కేవీయస్ రామారావు, మరికొందరు సాహితీప్రియులూ, నేను, సాహిత్యపు ముచ్చట్లు.. ఎన్నో మరచిపోలేని ఆనుభవాలు.
ఈ సమీక్ష రాసిన మోహన గారికీ, దాన్ని తమ పరిశీలనల్తో వన్నెతెచ్చిన మిత్రులు మురళీధర, బీకే, శ్రీనివాస్, కేవీయస్ రామారావుగార్లకి నా అభివందనాలు.
మోహన గారు అనుమతిస్తే రెండు మాటలు..
ఈ పుస్తకం అశ్వఘోషుడి బుద్ధచరితానికి తెలుగు అనువాదమా అంటే అనువాదమే. కాని కాస్త ఎక్కువ. ప్రతిపదార్ధం కూడా ఉండడం వల్ల.
సాధారణంగా పేరుపొందిన పూర్వకావ్యాలకి ఉద్దండులు వ్యాఖ్యానాలు రాసారు. ఆ వ్యాఖ్యానాలవల్ల, ఆ కావ్యాలకి ప్రతిపదార్ధం రాసే పని సులభం అవుతుంది. అశ్వఘోషుడి బుద్ధచరితానికి అలాంటి పండితవ్యాఖ్యలేవీ లేవు. (మొదటి 5 సర్గలకీ మాత్రమే ఒక వ్యాఖ్య ఉంది. కాని, అది కూడా అసంపూర్ణంగా ఉంది).
ఇది 2000+ ఏళ్ళ క్రితం రచింపబడ్డ కావ్యం అయినా, మధ్యలో కొన్నివందల ఏళ్ళపాటు దాని సంస్కృతమూలం అందుబాటులో లేదు. అందుకే వ్యాఖ్యానాలు రాలేదేమో!
19 వ శతాబ్దంలో నేపాళదేశంలో ఒక కంచు గంగాళంలో 14 సర్గలు మాత్రమే దొరికాయి. ఆ 14 సర్గలే ఈ పుస్తకంలో ఉన్నాయి.
నేను జాన్స్టన్ పుస్తకాన్ని కేవలం సంస్కృతమూలం కోసమే వాడాను. దానిలో తాత్పర్యాన్ని అనుసరించలేదు. ఆ పుస్తకంలో ఉన్న Footnotes ఉపకరించాయి.
వాసన, అంతా పల్లెటూరి మట్టి వాసన. ఆ కోళ్ళూ, పిల్లులు, కుక్కలు,ఆ నాటకాలు, ఆడే ఆ మనుషులు, ఆ జీవితాలు, ఆ జీవితాల వాసన. హార్మోనియం తెలుసంటే ఏదో అనుకున్నాను కాని ఇంత బాగా దాని గురించి, వాళ్ల గురించి తెలుసనుకోలేదు. జీవనా కి జీవుడా కి తేడా.
బాగుంది.
ఈ ఆన్‍లైన్ ప్రపంచంలో, పట్టణాలలో ఉండి, దేహ భాషలు, వాటి రాజకీయాలు, ఒక నైంటీ వేసుకుని, జీడిపప్పు నములుతూ చర్చించే కథల నుంచి, ఆలా వసారాలో నులక మంచంమీద కూర్చుని, ఆ సుగుణమ్మ మొగుడు కథ, 16mm లో చూసినట్టే ఉంది.
తిరుపతివేంకటకవుల బుద్ధచరితానికి ఆధారం Sir Edwin Arnold వ్రాసిన “The Light of Asia” అనే పుస్తకం. (ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఒక ప్రసంగంలో ఈ విషయాన్ని వివరించి చెప్పారు. యూట్యూబ్ లో చూడచ్చు).
స్వేచ్ఛానువాదకావ్యాలు తెలుగులో మరికొన్ని కూడా ఊన్నాయి. కరుణశ్రీ వ్రాసినది; అద్దంకి కేశవరావుగారి “తథాగతీయము”.
మోహనగారి వ్యాసాన్ని బట్టి చూస్తే ఈ పుస్తకం ప్రతిపదార్థతాత్పర్యాలతో వ్రాసింది. అశ్వఘోషుడి బుద్ధచరితానికి ఇప్పటివరకూ ప్రతిపదార్థతాత్పర్యాలు ఉన్న పుస్తకం నేను ఏ భాషలోనూ చూడలేదు (ఉంటే ఈమాట ముఖంగా తెలపండి). ఇంగ్లీష్, హిందీ భాషల్లో తాత్పర్యాలు మాత్రమే ఉన్నాయి. కాని ప్రతిపదార్ధం లేదు.
నేను ఇంతకుముందు వరకు ఈ కథని వినలేదు – ఈ చివరి అభిప్రాయం చూశాక కుతూహలం కలిగి విన్నాను. తర్వాత మిగిలిన అభిప్రాయాలు కూడ చదివాను.
కొందరు పాఠకులు గోరంతని కొండంతలు చేస్తూ, సైకాలజిస్టుల వేషాలేసుకుని మరీ రచయిత్రి దీన్ని రాయటం వెనకున్న దురాలోచనల్ని పసిగట్టి కసిపెట్టి ఉతికి ఆరేశామని అనుకోవటం చూశాను.
ఎవరో ఒకరు ఏదో చిన్న ప్రయోగాత్మక కథ, అదీ ఒక మాదిరి కథ, రాసినంత మాత్రానే పోతన గారి భాగవతం అపహాస్యం పాలౌతుందని భావించే ఈ మహానుభావులకి భాగవతం మీద ఎంత గాఢనమ్మకమో అర్థం ఔతూనే వుంది వారి ఆవేశం బట్టి. ఒకరు భాగవతంతో సమానంగా రాస్తే కాని దాని జోలికి వెళ్లకూడదని రచయిత్రి మీదికి ఒంటికాలిపై లేచారు కూడ. ‘కాపీ – పేస్ట్ ‘ ఎంత తేలికో సెలవిచ్చిన వారు తాము చేసిన కాపీ-పేస్ట్ లో ఎన్ని తప్పులు చేశారో ఒకసారి చూసుకుంటే కాపీ-పేస్ట్ కూడ అంత తేలిక కాదని వారికే అర్థం ఔతుంది. ఈ రెంటిలోనూ తప్పులున్నయ్ – గమనించండి :
మీకు నిజంగా తెలుగు సాహిత్యాన్నీ సంస్కృతినీ నిలబెట్టాలనే దీక్షే వుంటే వాటిని బాగా చదవండి, అర్థం చేసుకోండి, ముందు తరాలు వాటిని గుర్తుంచుకోవటానికి మీరు చెయ్యగలిగిన కృషి చెయ్యండి – ముందు మీ పిల్లలు, పిల్లల పిల్లల్తో మొదలుపెట్టి.
పోతన గారు ఎవరో తెలియని వారు వారి భాగవతం మీద ఎవరో రాసిన ఏదో వ్యాసం వల్లో కథ వల్లో చెడిపోయి మన సంస్కృతినీ సాహిత్యాన్నీ మంటగలిపెయ్యరు. ఆ పోతన గారు ఎవరో ఆయన చేసిన గొప్పపని ఏమిటో ముందు వాళ్లకి తెలియాలి కదా ! మీరు ఆవేశంగా పేస్ట్ చేసిన పద్యాలు మీ ఇంట్లో ఎవరికైనా కంఠతా వచ్చేట్లు చేస్తే అప్పుడు మీరు పోతన గారి ఋణం తీర్చుకున్నట్టు, ఒక రచయిత్రి రాసిన ప్రసిద్ధ కథ చదివి ఉత్సాహపడి తెలుగువారికి ఆ విధానాన్ని పరిచయం చేద్దామని చిరుప్రయత్నం చేసిన వారిమీద మీ కుహనా విద్వత్ప్రతాపజ్వాలలు కురిపిస్తే కాదు. ఉతికాం, ఆరేశాం అని జబ్బులు చరుచుకుంటే అసలే కాదు.
ఇది ఏ ఒక్కరినీ ఉద్దేశించింది కాదు, కత్తులు నూరుతున్న అందరినీ.
అమెరికా / కెనడా లాంటి దేశంలోకి కొత్తగా వచ్చే వలసదారులకి ఇమ్మిగ్రేషన్ నార్మ్స్, మోరల్ & ఎథికల్ బెహేవియర్ గురించి కలిగించే అవగాహన గురించి చక్కగా తెలియజేసారు. ధన్యవాదాలు.
కాని అంత మాత్రాన్నే అప్పాదురై ముత్తులింగంగారు రాసిన “బలిసిన మేకను పట్టుకుంటాను“ కథలో జరిగిన సంఘటన లాంటి వాటిని పూర్తిగా నివారించగలిగాయా అనేది ప్రశ్న.
కథలో శ్రీలంక నుండి ( ?? ) కెనడా వలసవచ్చిన గణేశరత్నం పాత్ర మనో వేదనే నాకు కనిపించింది. తను కావాలని ఏ సందర్భంలో కూడా అసభ్యంగా కాని, అవినీతిగా కాని ప్రవర్తించినట్లు కనిపించలేదు. రాళ్ళు మోసి అయినా తన కుటుంబాన్ని పోషించుకోవాలని తపిస్తున్న ఓ కాందిశీకుడి, ఓ వలసపక్షి ఆర్తనాదం ఇందులో నాకు వినిపిస్తోంది. మానవ నైజాలు, పరిస్థితుల ప్రభావాలు, బలహీనతలు వంటివాటిని రచయిత చిత్రీకరించారే కాని పనికట్టుకుని వాటిని సమర్థిస్తూ రాసినట్లు ఎక్కడా కనిపించలేదే. మానవ దౌర్భల్యాలనూ, ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కడైనా కనిపించిందా?
అన్నమయ సంకీర్తనల అభిమాని, అమాయక చక్రవర్తి అని తన మిత్రులు అభిమానంగా పిలుచుకునే అవినేని భాస్కర్ యీ కథను అనువదించారంటేనే దానికో విశిష్టత ఉన్నట్లు నాకనిపించింది.
ఇలాంటి కథను ఏ సోమర్సెట్ మాం కాని, ఏ హెమింగ్వే కాని, ఏ నబకోవ్ కాని, మరే గొప్ప రచయిత కాని రాసినా ఆ రచయితను ఇంతలా తూలనాడుతూ పాఠకులు స్పందిస్తారా అని నాకు ఓ చిన్న అనుమానం కలుగుతోంది. తప్పుగా అనుకోకండి.
మూల కథకుడు ఎన్నో దేశాలు చూసివుండొచ్చు కాని అక్కడి జీవితాల గురించి ఏమాత్రం తెలుసుకోలేకపొయాడనేది స్పష్టంగా చూపుతోందీ కథ. కాకుంటే అతను తనకెన్నో దేశాలు చూసిన పరిజ్ఞానం ఉందని చెప్పుకుని పాఠకుల్ని మోసం చెయ్యటంలో విజయం సాధించి వుండొచ్చు. ఈకథకో సంకలనానికో బహుమతులు కూడ వచ్చివుండొచ్చు. ఇలాటి వాళ్లకి కూడ కథకులుగా గుర్తింపు రావటం (లేకుంటే దీన్ని అనువదించి వుండేవారు కారని నా assumption; అది తప్పైతే, ‘ఇంత చెత్త కథలు కూడ రాసేవాళ్లున్నారు’ అని చెప్పటానికి దీన్ని అనువదించి వుంటే అనువాదకులు అభినందనీయులు) దౌర్భాగ్యం.
నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్దామని కానీ రచయితని కించ పరచడానికి కాదని మనవి.
సంతాన గోపాలం (అర్జునానుగ్రహము) లో విప్రుడికి పుట్టి చనిపోయిన పిల్లలు ఎనిమిది మంది. ఇది ఉషశ్రీగారి భాగవతంలోనూ (అంటే పోతన భాగవతంలోనూ), నారాయణీయంలోను (88 దశకం) ఉంది. వ్యాసంలో రాసినట్టు ముగ్గురు కాదు.
విప్రుడొచ్చినప్పుడు కృష్ణుడు ఏదో దీక్షలో ఉన్నట్టు ఎక్కడా లేదీ పుస్తకాలలో. అర్జునుణ్ణి పరీక్షించడానికి కృష్ణుడు ఊరుకుంటాడు ఏమీ మాట్లాడకుండా. ఈ లోపునే ‘నేనున్నానుగా’ అంటూ అర్జునుడు మాట ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కధ మామూలే – ఏమీ చేయలేక అగ్ని ప్రవేశం చేస్తాననడం, దాన్ని కృష్ణుడు వారించడం. దీనికి నారాయణీయం లో భట్టాత్తిరి గారి విశేష వివరణ ఏమిటంటే “పురుష ప్రయత్నానికీ, పౌరషానికీ దైవ బలం ఆక్కరలేదని అనుకున్నావు కదా అర్జునా, ఇప్పుడేమంటావు?” అని తెలపడానికి.
మూడో విషయం – అర్జునుడు ఏమీచేయలేక వెనక్కి వచ్చినప్పుడు అతన్ని రధం మీద కూర్చోబెట్టుకుని పెంజీకటికవ్వల కి వీసుకు వెళ్ళినది పై లోకమైన వైకుంఠానికి – పాతాళం కింది లోకం కనక దాని ప్రసక్తి రాదు.
ఆఖరి విషయం – విప్రుడి పిల్లలని తీసుకెళ్ళిపోయినది యమభటులు కాదు. వైకుంఠంలో ఉండే మునిగణం నా అంశ తో నిండిన నరనారాయణులని చూడాలని కోరితే నేనే విప్రబాలకులని మాయం చేసాను అని మహావిష్ణువు తన అంశ అయిన కృష్ణుడితో అంటాడు కధ సుఖాంతం అయ్యేముందు. యమ ప్రసక్తి ఇందులో రాదు. దేవకి కృష్ణుడికి ముందు పుట్టిన పిల్లలని చూడాలని ఉంది అంటే అప్పుడు కృష్ణుడు యమలోకానికి వెళ్తాడు. ఆ కధ వేరు. అది వ్యాసంలో ఉదహరించిన సంతానగోపాలం లోది కాదు.
గ్రంధ సూచిక: (1) నారాయణీయము – – కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు (తి.తి.దే 2003)
(2) ఉషశ్రీ భాగవతం – మహాలక్ష్మీ బుక్ ఎంటర్ ప్రైజెస్, సెప్టెంబర్ 1993.
నేను మొదట్లో పెట్టిన వ్యాఖ్య రచయిత కి సంపాదకులకి చేసిన సూచన “మా-త్ర-మే.” ఎవర్నీ కించపరచలేదు. అటువంటి ఉద్దేశ్యమే లేదని చెప్పాను కూడా తర్వాత. ఎందుకు ఎలా వేళ్ల సందుల్లోంచి పదాలు జారిపోతాయో కూడా చెప్పాను. అది పట్టుకుని నా పేరు తో సహా అన్నీ ముక్కలు విరగ్గొట్టి, ఓ ఏపిల్ కంపెనీనీ, అందులో మరో పండితులవారినీ నా పండిత పుత్ర పరిజ్ఞానాన్నీ బయటకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినది, అసలు మొత్తం ఈ వ్యాఖ్య ఇంత పెద్దదవడానికి కారణం ఎవరండి? ఇప్పుడు నేను సమాధానం చెప్తే “ఠాట్ నువ్వింక ఏం చెప్పినా వినేది, చెప్పేది లేదు” అన్నదీ, ఇది చాలనట్టు నేను ఓ శ్లోకం రాయగానే, సంస్కృతంలో ఎంత గొప్పవాణ్ణో (అక్కడకి మీకు నాగురించి బాగా తెలిసినట్టు), ఇంకేం చేయచ్చో రాసినదీ ఎవరండి? మీరిచ్చిన ఉచిత అభిప్రాయం పట్టుకుని నేను రాస్తే ఎవరు, ఎక్కడ, ఎలా వేసుకుంటారో అనేది అసలు ఆలోచించారా?
అది కాక నాలిక బయటపెట్టి వెక్కిరిస్తున్నట్టూ పేరు మరో సారి విరగ్గొట్టి అబ్బే వెక్కిరించట్లేదని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చారు. మీరు దీనికి రచయిత కాదు, సంపాదకులూ కాదని ఈమాట పుటల్లో ఉంది. మరి మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో ఇలా శల్యపరీక్షలు చేసి?
అసలు ఈ వ్యాఖ్య కూడా రాయడం అనవసరం అనుకున్నాను కాని నా మీద ఓ అభిప్రాయం వెలిబుచ్చారు కనక సమాధానం చెప్పుకుందాం అనిపించింది. మొత్తానికి కాళ్ళు కడుక్కునే పరిస్థితి కల్పించారు. శుభాభినందనలు.
మాగంటి గారు
నేను రచయిత ని కానీ, వారి కవితా పటిమని కానీ పండిత విద్వత్తుని కానీ ఏమీ అనలేదండి. వారి ప్రచురణలు చదువుతూ ఉంటాను కనక ఆయన గురించి మాట్లాడలేదు. అయితే ఒక్కొక్కప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా వేళ్ల సందుల్లోంచి ఇలా పదాలు జారిపొతూ ఉంటాయి. రచయిత దిద్దినా ఇది సంపాదకుల చేతుల్లోంచి జారింది. చదువుతుంటే పచ్చడి మెతుకుల్లో పంటికింద రాయిలా తగిలింది. దీన్నే ఇంగ్లీషు వాడు “ఫాలింగ్ త్రూ క్రాక్స్’ అంటాడనుకుంటా. అదే చెప్పాను.
నేను నా కీబోర్డు మీదనుంచి వేళ్లతో “అక్కడకొట్టి ఇక్కడ అతికించే” పద్ధతిలో చేస్తాను కాబట్టి ‘రాయడం’ అనేది సరినదే అనుకుంటున్నాను. పెన్ను కానీ పెనిసిలు కాని వాడి “వ్రాయ” లేదు కదండి? అయినా తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు కనక అలా నేను ఎన్నిన తప్పుని – పెద్ద మనుసుతో – క్షమించి వదిలేయగలరు 🙂
పేరు గురించి – విశ్వం విష్ణర్వ షట్కారో అని రాయడనికి వేరే కారణం ఉంది. మరో విషయం, నా లాంటి మూర్ఖులు “విష్ణాయ” అంటారు. తెలుసున్న మీలాంటివారు, ఏపిల్ పండితులూ ‘విష్ణవే’ అంటారు. అయితే
అని అనడం తెలుసు. అందువల్ల హనుమంతులవారిని దర్శించినంతటి మీకు ఎంత పుణ్యం వచ్చిందో నాకూ అంతే వచ్చిందని (మరియు వైస్ వెర్సా) జబ్బలు చరుచుకుంటూ నేను సంతోషపడిపోతున్నాను.
మీ సూచన బాగానే ఉంది కాని ఎంతమందికి ఆ ఓపిక ఉంది. ఎంత మంది సంపాదకులు తమవంతు కర్తవ్యంగా, బాధ్యతగా నిర్వహించగలరు!
సా.వెం రమేశ్ తన కథల గంపలో వాడిన పదాలు కొన్ని, మీరన్నట్టుగానే తెలుగు తెలుసు అనుకునే వారందరికి అర్ధం కావు. ఉదాహరణకి కొన్ని పదాలుః చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు.
అందరికి అర్ధం కావనుకున్న వాటన్నింటికి తనే అర్ధం ఇచ్చాడు.
మాండలీకంలో వ్రాసే రచయితలందరుఉ ఈ సూచనని పాటిస్తే బాగానే ఉంటుంది.
పూర్ణిమా.. ఏం చెప్పాలో తెలీటం లేదు
మీరు ఎదురుగా ఉంటె …పట్టుకొని లేదా ముట్టుకొని శోకించేదాన్ని
అందరూ అడిగే ప్రశ్న..మనది కాని దుఃఖం మీద నీకు ఇంత ప్రేమెందుకు?
చాలా కదిలిపోయాను .. చాలా థాంక్స్
చాలా చాలా థాంక్స్
దేశికాచారిగారికి, రాఘవగారికి, మీ స్పందనకు నా నమస్సులు.
1) నేను ఈ వృత్తములను సుమారు ఎనిమిది సంవత్సరాలుగా తోచినప్పుడు వ్రాస్తూ ఉన్నాను. అందువలన వాటిని ప్రత్యేకముగా ఒక అంశముపైన, ఇతివృత్తముపైన వ్రాయలేక పోయాను. ఇంకెప్పుడైనా ప్రయత్నిస్తాను.
2) భారా(వా)క్రాంత వృత్తము స్వయంభూ ఛందస్సులో ఉదాహరించబడినది. నాట్యశాస్త్రములో ఉన్నదని జయదామన్‌లో చెప్పబడినది. కాని నాకు కనబడలేదు. బహుశా ఇందులోని భారము అనే పేరు జ-గణము ఉండడమువలన వచ్చినది అనుకొంటాను.
3) శరభ వృత్తము నాట్యశాస్త్రములో పేర్కొనబడినది. ఇది 14 అక్షరముల శక్వరి ఛందమునకు చెందినది. ఇందులో చివరి భాగములో ఒక ర-గణము తక్కువ. దీనిని అశ్వఘోషుడు వాడినాడు, మఱి మందాక్రాంతమును ఎందుకు వాడలేదో?
ఈ వ్యాసకర్త గురించి నాకు ఇదివరకు పరిచయం లేదు. కాని బాగానే డొక్కశుద్ధి వున్న వారిలా కనిపిస్తున్నారు. ఐతే ఈ వ్యాసం మాత్రం ఉపరితలాన్ని స్పృశించిందే తప్ప ఏమాత్రం లోతుకి వెళ్లలేదు. నా అనుమానం వారు దీన్ని ఏ స్వాతి లాటి పత్రిక కోసమో (అంటే ఎలాగూ ఎవరూ చదువరులే అన్న భావనతో) రాశారని. ఈ సందర్భంగా వారికి మనవి – ఈమాటలో ప్రచురించే వాటికి లోతు తప్ప పొడవు గురించి ఆలోచించాల్సిన పని లేదు; మీరు ఎంత విశదీకరించదలుచుకుంటే అంతా చెయ్యవచ్చు; మీలాటి వారి నుంచి పాఠకులం మంచి బరువు, లోతు ఆశిస్తాం. మీ పాండిత్యాన్ని పూర్తిగా ప్రదర్శించండి. “ఒప్పు తప్పు లరయంగల పాఠకులు” ఇక్కడ కొందరైనా మీకు దొరుకుతారు. మీనుంచి ముందు ముందు ఎన్నో లోచూపుల్ని ఆశిస్తూ –
రామారావు
దాడి కచ్చితంగా చెడ్ద పని. మాటతోనే తిప్పికొడితే అయిపోయేదానికి అనవసరంగా చేతులు ఉపయోగిస్తున్నారు.
అయితే అర్థం కానిదేమిటంటే అసలు ఎవరైన కూడ ఒక రచయిత, తనకు మాట అడ్వాంటేజ్ ఉంది కద అని వేరే వాళ్ళను సైకొలాజికల్‌గా దెబ్బతీస్తే, మాటలేని వాళ్ళు దొమ్మిలాటకు కచ్చితంగా దిగుతారు కద? గొడవ మొదలవుతుంది కదా? మరి రచయితది పాత్ర ఏమి లేదంటరా? రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది. రెండు వైపుల తప్పు ఉంది.
“Ilango Krishnan, a well-known name in Tamil literary circles and an acclaimed poet, recently took to poetry to speak out against the killings. “How else can a writer express his extreme sadness?” he asks. “I do everything in my limits to express my anguish, and poetry is one of them. It is the medium I know. To me, this is almost like mourning.”
నాకు తమిళం రాదు. బహుశా ఇలంగో కృష్ణన్ తమిళ మూలంలో కవిత్వం చెప్పారేమో. ఇక్కడ ఇచ్చిన ఈ తెలుగు అనువాదములో శవాలు, గాయాలు, మనుషుల కేకలు, ప్రశ్నలు, పోలీసుల సమాధానాల నమోదు ఉంది. కవిత్వపు జాడ లేదు.
కృష్ణన్ Acclaimed poet అట. ఇప్పటి ప్రజలకు సంబంధించిన విషయాలు, రోజువారీ భాషలో చెప్పటం ప్రస్తుత కవిత్వ లక్షణం. అలాగే చెప్పనీ చదువుదాం, అని మళ్లీ చదివాను.
చదువుతూ, ఈ అనువాదపు ప్రచురణ -మరణాల ‘వార్త’, అందులో పోలీసుల పాత్ర- పాఠకులకు తెలియ చెయ్యటం కోసమైతే, దానికి నెలకోసారి వచ్చే ‘ఈమాట’ సాహిత్య పత్రిక సరైన మీడియమ్ కాదు. అందుకు బొచ్చెడు న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. సాహిత్య పత్రిక వార్తా పత్రిక కాదు. అబ్జెక్షన్! అని అందాం అనుకున్నా. కాని అది మాత్రం ఎందుకు! సంగతి ఏమిటో తెలుసుకుందాం. చూద్దాం, అని మరోసారి సాంతం చదివాను.
చూస్తే, కవిగారు, సంఘటన లోని నిజానిజాలు చిత్రించేందుకు, ‘killings’ జరిగినప్పుడు అసలుకి వారు అక్కడ లేరనుకుంటా. బ్రతికి ఉన్న మనుషుల గాయాలకు, రోడ్డు మీద కాని, హాస్పిటల్ లో కాని – మందు రాయటం, కుట్లు వెయ్యటం, వారి పని ఎలాగూ కాదయ్యె. ఈ కవి ఏంబులెన్స్ నడపరు. స్ట్రెచర్లు తొయ్యరు. హాస్పిటల్లో వాలంటీర్ పనైనా చెయ్యరు. ఎవరి శవాలు మోర్గ్ కి చేర్చరు. తన ఆవేదన, శోకం ‘కవిత్వంగా’ చెప్పటం మాత్రమే వీరు పూనుకొన్న పని. ఈ అనువాదపు మాటల్లో కవిత్వం ఏదీ? ఏమో, ఆ ‘almost like mourning’ ఫీలింగు ఈ అనువాదంలో ఉన్నదేమో. “It’s almost like mourning” అన్న emotion ఏమిటో తెలియని నేను, ఆ సంగతి ఆ తమిళకవికి వదిలి వేస్తాను.
ఇది కాల్పనిక విషయం కాదు. తమిళనాడులో ఇటీవలి ఒక నిజ సంఘటన నుంచి ఈ రాత వచ్చింది. సరే, ఆ వార్త వరకూ అందులో చెప్పిన విషయం నిజమై ఉండొచ్చు. ఐనా, అదొక్కటే కాక ప్రసిద్ధకవి గారు, ప్రజాస్వామ్య రాజ్యాలలో బతికే మామూలు ప్రజలం మనమూ, గుర్తించాల్సిన విషయాలింకా ఉన్నయ్యి. అందుకని ఈ కింది వాక్యాలు.
ప్రస్తుత కాలంలో స్కూల్, చర్చ్, కాన్సర్ట్, రోడ్, ఇల్లు- ఎక్కడైనా సరే, ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారు కాపాడమని పొలీస్ ని పిలుస్తారు. కవులను పిలవరు.
ఇటీవలే, అమెరికాలో ఒక వార్తా పత్రిక ఆఫీసు లో పని చేసే వారిని ఒక వ్యక్తి రైఫిల్ తో కాల్చి చంపుతున్నప్పుడు, వార్తాపత్రికలో పనిచేసేవాళ్లు భయంతో వెంటనే పోలీసులని పిల్చారు రక్షించమని. అదే సమయంలో ఇతర విలేఖరులను, ప్రమాదం నుండి దూరంగా ఉండమని, ఆ బిల్డింగ్ కు రావద్దని కూడా వారికి హెచ్చరికలు పంపారు. ప్రజాస్వామ్యంలో ‘పొలీస్ ఫోర్స్’ పౌర రక్షణ కోసం, ఎప్పుడూ సన్నద్ధంగా ఉండే ఒక శాఖ, అని జర్నలిస్టులకు నమ్మిక ఉంది కాబట్టే, రక్షించమని పొలీస్ ని పిల్చింది.
ప్రొటెస్ట్ కవులు, ఏడుపు కవులు, అన్ని రకాల పాప్యులర్ కవులు కూడా వారి రక్షణకు పొలీస్ నే వినియోగిస్తారు. కవి గాయకులు ఆపదలో ఉన్నప్పుడు పొలీస్ నే పిలుస్తారు.
ఏడవవలెననుకున్న కవులు తనివి తీరా ఏడవ వచ్చును. ఆవేశాలు, ఆవేదనలు, రోదనలు, ఇత్యాది ‘ప్రకటన’ లలో వారు మునిగి తేలవచ్చు. డబ్బుంటే ‘ఏడుపు ఏంథోలజీ’లు మూలాలు/ అనువాదాలు ప్రచురించుకోవచ్చు. కానీ, ఈ విశాల భూప్రపంచంలో డెమొక్రాటిక్ దేశాలలో ప్రజలకు నిత్యం చాలా ఆవశ్యకమైన సర్విసెస్ సమకూర్చేవారిలో, పౌరులను రోజువారీ ప్రమాదాలనుండి రక్షించే శాఖలలో కవులు లేరు. వారికి అలాటి శిక్షణ, స్కిల్స్ లేవు.
నిన్నగాక మొన్న థాయ్ లేండ్ లో underwater caves లో ఇరుక్కుపోయిన పిల్లలను ఎంతమంది divers, కలిసికట్టుగా పని చేసి రక్షించారు! That’s heroic. ప్రజలు చచ్చాక తీరుబాటుగా కవి కాళ్లారజాపుకుని, మైక్రొసాఫ్ట్ వర్డ్ లో మాటలు, శవాలు కుప్పలు పోసి, వెళ్లబోసే ఏడుపు కవిత్వం వల్ల వచ్చేదేంటి, పిడకలు.
If there is a rescuer and there is a weeper -who does nothing but weeping, who would you choose! I will choose the rescuer.
సుభద్ర గారూ! మరొక మాట:
నా అభిప్రాయం లో ‘కొమ్మలు’ అన్నది యెందుకు సరిగ్గా సరిపోయే సమాధానమో చెబుతాను: 23 నిలువుకి ఇచ్చిన ఆధారంలో మరొక స్త్రీ మూర్తి ఉన్నది గమనిస్తారు గదూ! అప్పుడు దానిని ‘పొద్దు తిరుగుడు గుమ్మ’ అని పూర్తి చేయవచ్చు. ‘కొమ్మలు’ లో ఉన్న ‘మ్మ’ తో కలుపు కుంటూ — పైగా 36 అడ్డం లో, ఉన్నది దానికి గూడా నేను విలువ ఉంటుందనే భావించాను.
మీరన్న పాట నాకు తెలియదు ఈనాటి (చాలా) పాటలు తర్కానికి నిలవవు. నుడికట్టు ఆధారాలు బుర్రకు పదును పెట్టాలి! తర్కానికి నిలవాలి! ఉదాహరణకు మీరిచ్చిన 17 అడ్డం చాలా బావుంది.
నమస్సులతో – తః తః
తా. క. ‘మీరన్నది కూడా బాగుంది.’ రచయిత్రి.
పెద్ద పెద్ద పరీక్షలకే తప్పులేని సమాధానాలు ఒకటికి మించి ఉంటున్నాయి. నిర్వాహకులు ‘ఏ తప్పూ లేకుండా’ అని అనకూడ దేమో. ‘మా దగ్గర ఉన్న సమాధానాల తో సరిపోయే’ అని మాత్రమే అనాలి.
రాతల, వాట్సాప్ విషయాలలో మరోమాట: నాలుగేళ్ళు రూమ్మేట్స్ గా ఉండగానే తన స్పెర్మ్ కౌంటు గురించీ, పెళ్ళాం తనని పక్కలోకి ఎందుకు రానివ్వదు, అనేవి పురుషులు – నాకు తెల్సినంతలో – ఎవరికీ చెప్పుకోరు. మహిళలు చెప్పుకూంటారేమో మరి. పేరు బట్టి కధ రాసినావిడ మహిళ అనుకుంటున్నాను కనక ఇది కూడా చెప్పనివ్వండి: మహిళలు ఎలా ఆలోచిస్తారో అనేది పురుషులకి అంటగట్టకండి. కారు నడిపే పురుషుడు డేష్ బోర్డ్ కేసు చూస్తూ పెళ్ళాంతో మాట్లాడకుండా ఉంటే ఆయన ‘రాత్రి ఇవాళైనా ఈవిడ నన్ను పక్కలోకి రానిస్తుందా?” అని కాదు ఆలోచించేది, కారు కు చేయించాల్సిన రాబోయే ఆయిల్ చేంజ్ గురించి, క్రితం సారి ఆ విషయంలో మోసం చేసిన కారు మెకానిక్ గురించీను.
ఇంకో విషయం. ఇది నా స్వానుభవంతో చెప్తున్నది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఆహా ఓహో అనే చదువర్లతో ఏ రచయితకీ ఎంతమాత్రం ఉపయోగంలేదు. వాళ్లవల్ల ఏమీనేర్చుకోలేము. ఎవరైతే నా రచనని ఏకి ఎండగడతాడో వారి వల్లే నా రాతలు బాగుపడతాయి.
స్వస్తి!
[ఈ అభిప్రాయంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు, ఈ కథకు సంబంధం లేని వాక్యాలు తొలగించడమైనది. — సం.]
పద్యములు రెండు విధములు – (1) కేవలము చదువుకొనుటకు మాత్రమే, (2) చదువుతోబాటు, పాడుకొనుటకు కూడ. అన్ని పద్యములను వారికిష్టమైన రాగములలో పాడుకొనవచ్చును. కాని వాటిలో కొన్నిటిని మాత్రమే తాళముతో పాడుకొనుటకు వీలవుతుంది. పాడుకొనేటప్పుడు పొల్లులు, ద్రుతములు శోభించవు, ఏ “సుధవోల్ సుహాసిని” లాటివి తప్ప. అప్పుడు పొల్లులను అజంతములుగా మార్చితే గానసౌలభ్యము లభిస్తుంది. అందుకే ఈ పరిష్కార మార్గాలు, మల్లేశ్వర రావుగారు. నా ఉద్దేశములో ఛందస్సుకు గానసౌలభ్యము లభిస్తే దాని విలువ ఇనుమడిస్తుంది. ఒక పద్యమునకు కావలసినవి – ఉచితమైన ఛందస్సు, భావము, పదముల ఎన్నిక, వాటి విఱుపులు, సులభముగా అర్థమయ్యేటట్లు ఉండే ద్రాక్షాపాకము. ఇవన్నీ చేరినప్పుడు పద్యము పాట అవుతుంది, పాట నోట మెదులుతుంది. ఛందస్సు కలకాలము నిలుస్తుంది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము మాత్రమే. అంగీకరిచడము, లేకపోవడము అన్నది పాఠకుల స్వంత అభిప్రాయము. నమస్సులతో విధేయుడు – మోహన
“కుల వ్యవస్థ గురించిన జ్ఞానం లేకుండా ఆ వివక్షను ఛేదించే ప్రయత్నం లేకుండా, ఆ స్పృహ కూడా లేని మనోస్థితిలో జీవించే మనుషులున్న సమాజంలో భావవ్యక్తీకరణ అన్న ఆధునిక నిర్వచనాల గురించిన అవగాహన ఉండాలని ఎలా ఆశించగలం? దాని అవసరాలను ఎలా చర్చించగలం?” – (28-04-17 బెంగళూరు పెన్ సంస్థ నిర్వహించిన లేఖన-2017 కార్యక్రమంలో ప్రసిద్ధ అరవ రచయిత పెరుమాళ్ మురుగన్ చేసిన ప్రసంగపాఠం.)
పెరుమాళ్ మురుగన్ -బెంగళూరు పెన్ సంస్థలో ఏ భాషలో ప్రసంగించారో తెలియదు. అరవంలో ఉపన్యాసమిస్తే వీరు చెప్పినదానిలో ఏదో ఘనత వహించిన విషయం ఉందని అనువదించి, ఈ తెలుగు సాహిత్య పత్రికలో దించినారేమో, అని చదివాను. ఎంత మాత్రం లేదు.
ఎప్పటి కాలం మనుషుల గురించి ఈ మాటలు! ఏనాటి సంగతులు! ఈ ప్రసంగం ‘వక్త’ వారి తాతగారి తాళపత్ర గ్రంథం నుండి చదివి వినిపించిందా? ఇప్పటి చదువుకున్న పౌరుల కొరకు 2017 లో, ఆలోచించి రాసుకొచ్చి చదువుతున్నట్టు మాత్రం లేదు.
కుల మతాల గురించీ, కులమత వివక్షతలనేవి ఉన్నాయని, ముందు నేర్పించకుండా, ఇప్పటి కాలం మనుషులకు ‘వాక్స్వాతంత్రం’ గురించి తెలిసే విధానం లేదంటున్నాడీయన.
చదువుకున్నంత మాత్రాన జ్ఞానం రాదంట. ఉద్యోగాలు చేసినా రాదంట. పౌరహక్కుల గురించి, తెలియాలన్నా, స్వతంత్రించి మాట్లాడాలన్నా, ఎప్పుడో దేశంలో వర్తింపచేసిన కులమత తత్వాలు గురించి ఈనాడైనా తెలుసుకోపోతే ఎలా అంటున్నాడీయన.
కొన్ని ఆహారాలు కొందరికి సహించకపోటానికి ఉపన్యాసకుడికి కులమొక్కటే కారణంగా తోస్తుంది. ఏ రోజుల మాటలు? ఎప్పటినుండో హోటల్స్‌లో , సమావేశాల్లో, ఎయిర్ లైన్స్‌లో మీకు ఎలర్జీలున్న్నయ్యా, గ్లూటెన్ పడదా లాక్టోస్ పడదా, మాంసం పడదా, -ఇలాటి ప్రశ్నలడుగుతున్నారు, వంటలు వండి వడ్డించే వాళ్లు. పడని వస్తువులకు కొందరికి రకరకాల బాధలు. కొందరికి ప్రాణాపాయం. అందువల్ల ఈ జాగ్రత్తలు అవసరం. వీరెవరూ ఈ రోజుల్లో మీ కులమేంటి అని అడగరు.
ఎప్పుడో ఏదో రోజుల్లో కుల భేదాల బట్టి, కొందరు మనుషులను, మరికొందరు వారి ముందు వంగి మాట్లాడమన్నారేమో. ఇప్పడా అద్భుత చారిత్రక విషయం 2017లో, ఒక డెమొక్రాటిక్ దేశంలో పౌరులకు ఈ ఉపన్యాసంలో ఎందుకు చెపుతున్నట్టు.
ఇప్పటి కాలంలో, కొందరు మనుషులు పొట్టిగా ఉంటే, వారి ముందు ఎవరైనా పొడుగు వాళ్లు వంగి, చెవొగ్గి మాటలు వినాల్సొస్తే, వారు బహు మర్యాదస్తులు. ఎవరూ ఎవరికీ సేవకులు కారు.
ఫ్లూ సీజన్లో, దగ్గేప్పుడు తుమ్మేప్పుడు ఎవరి మీదా ఏ తుంపరలు పడకుండా, అవతలికి ముఖం తిప్పుకుని, చేతులు అడ్డు పెట్టుకోండి, మేస్క్ వేసుకోండి, చేతులు కడుక్కోండి అని సలహాలిచ్చే వాళ్లున్నారు. ఆ నిబంధనలు ఆచార వ్యవహారాల విషయంగా కాదు. కుల మత భేదాల గొడవ లేదు. ఇలాటి ప్రస్తుత ఆవశ్యక ఆరోగ్య కారణాలు వక్త ఉపన్యాసంలోకి రావు.
ఇది ఆలోచన పాలోచన లేని సోదిబుచ్చి ప్రసంగం. వక్తకు ఎప్పడూ తన ఆలోచనలను సవరించుకోటంలో సంసిద్ధత ఉండాలి. పాత ఆలోచనైతే గుడ్ బై చెప్పగలగాలి. సమాజం ముందుకు సాగింది. కాని ఈ ప్రసంగంలో వక్త -కులమతాల ఆలోచనలో కూరుకు పోయి ఉన్నారు. చాలా ఏళ్ల కింది కాలంలో కొంత relevancy, ఉపయోగం ఉన్న, ఆలోచనా పద్ధతులనే ఇప్పటికీ సాధనాలుగా వాడాలనుకుంటున్నారు.
To approach the present people’s education about much beloved, cherished – Freedom, Freedom of speech – thru caste and religion is perverse, divisive, old grudge propagating. It is counter-productive. To think it is essential to do so, in these times, is a corrupt, retrogressive thought. It is not necessary to know about religion and caste, to understand concepts of Freedom, the Freedom of speech.
1. ఛందఃపరిణామాలను ఆధారంగా చేసుకుని మీరు చేసిన ప్రతిపాదన తార్కికంగా చాల బాగుందండీ.
2. ఒక్కొక్క గుణంబు కల్గుదు — టంకణదోషమో ఏమిటో గణభంగమయ్యింది. గమనించగలరు.
3. అజంత-హలంతాల విషయం: పలికే భాషకీ వ్రాసే భాషకీ అంతరం నేటి కాలంలో మాదిరిగానే పూర్వకాలంలో కూడా ఉండే ఉంటుంది. అందువలన పదాన్ని అజంతంగా వ్రాసి హలంతంగా పలకటానికి కూడా అవకాశం ఉందనుకుంటానండీ. ఇది కేవలం నా ఊహ మాత్రమే.
4. నామటుకు నాకు ద్రుతాంతమైనా అజంతమైనా బాధ లేదనిపిస్తుంది. ఐతే ద్రుతాంతంకాని హలంతం కొన్నిచోట్ల కృతకంగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఇటులన్ అంటే బాగానే ఉంటుంది, కానీ అదే అర్థంలో ఇటుల్ అంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
5. అంచున్ + అల = అంచునల / అంచున్నల.
6. దంత్య చకారాన్ని త్స గా వ్రాయటం నేటికీ కొన్ని చోట్ల నేను చూచానండీ. ఉదాహరణకు, అమలాపురంలో చల్లా వారి వీథిని కొందఱు త్సల్లా వారి వీథిగా వ్రాస్తారు.
మొదటి “మాధవ్” కామెంట్లో ఈమాట సంపాదకులని చెప్పే లింకు ఉంది. అందులో టోపీ తో ఇది. టోపీ లేకుండా ఇది అని రాసారు. రెండో “మాధవ్” కామెంట్లో సంపాదకుల టోపీని ఇక్కడ కోతులెత్తుకుపోయాయని ధ్వనించింది – అదే సంపాదకులు పాఠకులు రాసేది ఏమరుపాటుగా చూసీచూడనట్టుపోవడంవల్లా (దీన్నే కథలో టోపీ వ్యాపారస్తుడు పడుకున్నప్పుడు అని చదివినట్టు గుర్తు) టోపీ ఉంది లేదు అని పెట్టకపోవడం వల్లాను. వీరే వారా, వారే వీరా అనేది సందిగ్ధం. అసలు టోపీ ఉందా లేదా అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఆ టోపీ కత్తెరకి గురైందా, అసలు టోపీ రహస్యం ఏమిటీ అనేవి పాఠక లోకానికి తెలియవల్సిన అవసరం లేదా? మీరు కనక టోపీ పారేసుకుంటే చెప్పండి. మా ఇంట్లో కొన్ని ఉన్నాయి. అందులో ఒకదానిమీద ఇప్పుడే పెయింటింగ్ నేర్చుకుంటూ ఇల్లంతా అలికే కుర్రాడి చేత ‘ఈమాట సం.” అని రాయించి పంపిస్తాను. పోస్టు ఖర్చులు కూడా నావే. ఇంక నోరు మూసుకో అంటున్నారా? చిత్తం.
గౌరవనీయులైన మిగతా పాఠకులకి: ఈ వ్యాఖ్య ఈమాట ని జెనెరల్‌గా ఉద్దేశించి రాసినది. మిగతావాళ్ళు భుజాలు తడుముకోనవసరం లేదు.
Before I disagree with you, I need to clarify what I meant.
నేను తరగతులు, రకాలు, తరహాలు, వంటి పదాల బదులు కులాలు అన్నమాట ప్రత్యేకంగా వాడాను, ఎందుకూ అంటే వివక్షను సూచించడానికి. ఇది జాన్రాల మధ్య ఉండే తేడావంటిది కాదు. ఆంగ్ల సాహిత్యంలో ఎన్నో జాన్రాలున్నాయి. కానీ ఏ ఒక్క జాన్రాకూ వేరేవాటి పట్ల చిన్నచూపు లేదు. వివక్ష లేదు. అప్‌డైక్‌నూ, ఆట్‌వుడ్‌నూ, రాత్‌నూ సమీక్షించిన విమర్శకులే బ్రౌన్‌నూ, గ్రిషమ్‌నూ, క్లాన్సీనీ, కింగ్‌నూ కూడా సమీక్షించారు, అదే గౌరవంతో, అవే పత్రికల్లో, వాటి వాటి పరిథుల్లో. విమర్శకులు ఒక తరహా సాహిత్యం గొప్పదని, ఇంకొకటి తక్కువని సాహిత్యంలో నిమ్నౌన్నత్యవిభజన చేయలేదు. ఆరకమైన విభజన కనీసం ఆంగ్ల సాహిత్యంలో నాకు కనపడలేదు. ఇతర భారతీయ భాషల సాహిత్యం గురించి నాకు అంతగా పరిచయం లేదు కాని, తెలుగులో ఆ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది.
Popular writing thrives on supporting and supplementing the existing system. Serious writing is a result of disagreement with the existing order.
This is at best an idealistic notion, at worst a gross generalization. More over, this is a political distinction, not a literary characteristic. నేను అంటున్నది ఇదే. వ్యవస్థను ప్రశ్నించేదే సీరియస్ సాహిత్యం అని అనడంలోనే ఈ వివక్ష ధ్వనిస్తోంది కదా. So, what we have here is a political requirement masquerading as a literary definition. ఈ ధోరణి వల్లనే తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు ఉన్న భిన్నత్వం పోయింది అని నేను అభిప్రాయపడింది.
The problem is not with categorization, it is with value judgement and disregard.
(సందిగ్ధంలో ఉన్నాను, ఇలా చర్చ జరుగుతున్న సమయంలో నేను కామెంట్ పెట్టచ్చా? సాటి ఎడిటర్లేమనుకుంటారు? నేనుగా పెట్టాలా, ఎడిటర్‌గా పెట్టాలా? ఏ హ్యాట్ పెట్టుకోవాలి? అసలు పెట్టుకోవాలా? ఆ తేడా ఎవరైనా కనీసం గమనిస్తారా? అయినా సరే, ఒక రెండు ముక్కలు చెప్పకుండా ఉండలేక ఈ కామెంట్ రాస్తున్నాను. ఒకసారి పోస్ట్ చేసినాక దాన్ని ఏం చేస్తారో సంపాదకుల ఇష్టం. నేనైనా వారి నిర్ణయానికి కట్టుబడి ఉండవల్సిందే మరి.)
1. రామారావు గారూ, మీ సూచనలు ఎప్పుడూ విలువైనవే. మీకు కృతజ్ఞతలు. రెండు విషయాలు.
ఒకటి – I do not see any ‘escalation’ either from Lyla or from the editors. Initially the voices registered a slightly higher note, but then toned down. Looking at the published commentary, it appears to me that the problem here lies not with the decision but the execution of which, could have been a tad better. రచయితలకు, పాఠకులకు ఉన్నంత వాక్‌స్వేచ్ఛ సంపాదకులకు, నిర్వాహకులకు ఉండదు. వారికి నిగ్రహం మరింత అవసరం.
రెండు – [Editor hat ON]ఈమాట రెగ్యులర్‌గా చదివే మీరు కూడానూ ఎవరి “మనోభావాలు దెబ్బతింటాయనో” సంపాదకులు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనడం/అనుకోడం నిజంగా ఆశ్చర్యం. ఆమాట ఈమాట గురించి ఏనోటా వినలేదు ఇన్నేళ్ళలో నేను. పైపెచ్చు “మనోభావాలు” గాయపరుస్తున్నామని మమ్మల్ని తిట్టేవారే ఎక్కువ. That was, is and will be never our concern, but the standards and the etiquette of eemaata are. At times we err in our judgement. We learn from it and go on. కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపం. Our only job is to do our job the best we can.
2. ఈమధ్యనే ఒక స్నేహితునితో అన్నాను అతని రచన గురించిన ప్రస్తావనలో. “మాకు రచన ముఖ్యం, రచయిత ఎవరు అన్నది అనవసరం. మామెక్కడైనా మామే కాని మొక్కజొన్న చేనుకాడ కాదని తెలుగులో ఒక మొరటు సామెత ఉంది. మాకూ అలానే ఈమాట దగ్గర అందరూ పరాయివారే”, అని. ప్రత్యక్షానుభవంతో చెప్తున్నాను – సంపాదకులు కేవలం వారి రచనల నాణ్యత మాత్రమే పరిశీలిస్తూ (చాతయినంతగానే అనుకోండి), వారి మనోభావాలకు, అహంభావాలకు, స్థాయీపరపతులకు విలువనివ్వనందువల్లే ఈమాటకు తమ రచనలు పంపని రచయితలు ఉన్నారు. అదే సమయంలో, ఆ ప్రొఫెషనాలిటీ, సాహిత్యం పట్ల గౌరవం శ్రద్ధాసక్తులు ఆశించి, పొందినందువల్ల తమ రచనలు మొదటగా ఈమాటకే పంపే రచయితలూ ఉన్నారు. నాణేనికి ఒకేవైపు ఎలా ఉండదో అలానే విమర్శ లేకుండా సాహిత్యం ఉండదు. రచయిత నుంచి వచ్చినది వచ్చినట్టు ప్రచురించగల స్థాయి ఏ కొద్ది రచనలకో ఉంటుందేమో. మొదట్లో మా విమర్శ తీసుకోలేకపోయినా, మా పరిష్కరణలను సందేహించినా, ఒకసారి మాతో కలిసి పని చేసినాక, ఈమాటపై తమ అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్న రచయితలూ ఉన్నారు. ఇంకా మా పద్ధతుల పట్ల అపోహల్లోనే ఉన్న రచయితలూ ఉన్నారు. It is a diverse world out there. అందువల్ల, ఇక్కడ పారేది పన్నీరా మురికినీరా అనేది ఎవరి దృక్పథం బట్టి వారు నిర్ణయించుకునేది. [Editor hat OFF]
3. ఇకపోతే, I have known Lyla well and her wickedly sharp wit very well. I am sure, if their tone offended Lyla, she would have openly said so and the editors too would have offered her an unconditional apology. More importantly, what struck me here is the maturity and decorum she has shown. “సాహిత్యం మీదే ఆసక్తి. ఈ లోపల ఈ పత్రికలో వేరే ఆర్టికల్స్ చదువుతూనే ఉంటాను. వాటి మీద అభిప్రాయాలు ఈ మేగజీన్ లో రాస్తూనే ఉంటాను. ఎప్పటి మాదిరే. కొన్నేళ్లుగా ఈ పత్రికలో నేను రచన చేస్తూనే ఉన్నాగా. ఈ ఒక్క కామెంట్ మీద ఎక్కువ తక్కువ ఇంట్రస్ట్ ఏమీలేదు.” She didn’t take this episode personally. తన “మనోభావాలు” గాయపరచుకోలేదు.
తెలుగులో రచయితలు ఈ పరిణితిలో కనీసం సగమైనా కలిగివుంటే ఎంత బాగుండునోనని నేను కలగన్నదీ నిజం! అలాగే, ఇక్కడ కొన్ని వ్యాఖ్యలలో కనిపించిన సృజనాత్మకత చూసి కొంత ముచ్చట పడి, అది కథల్లోనూ కవితల్లోనూ కూడా కనిపిస్తే ఎంత బాగుండునోనని నేను అనుకున్నదీ నిజం!
4. చర్చ ఆ ముందుమాట మీద – కేవలం తెలుగులోనే ఎందుకు పాప్యులర్ రచయితలు, సీరియస్ రచయితలు అని రెండు కులాలు ఉన్నాయి అన్న విషయం మీద – జరిగి ఉంటే బాగుండేదని ఆశించాను. కాని, పక్కదారి పట్టింది. నెట్ స్వభావమే అంత. Personally I think it’s time for us to move on. (నేను చెప్పదలచుకున్న రెండు ముక్కలూ చెప్పేశాను కాబట్టి!)
I hope I did not disappoint any one with my uncharacteristic humility!
ఈమాట సంపాదకులకు:
ఇంతకు మునుపు వ్రాసిన నా అభిప్రాయంలో నా భయానికి కారణాన్ని (వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనన్నది నన్ను భయపెట్టిన విషయమని) నేను స్పష్టంగా వ్రాశాను.
అటువంటి భయం అర్థరహితం కాదనీ, అన్ని అభిప్రాయాల విషయంలో సంపాదకులు ఒకేరకంగా వ్యవహరించడం లేదనీ ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమయింది.
“సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచనని పాటించకుండా వ్రాసిన ఒక వ్యాఖ్యని – అది కూడా హుందాగా కాక అపహాస్యం చేస్తూ వ్రాసిన వ్యాఖ్యని – ప్రచురించడం ద్వారా మీరు ఆ విషయాన్ని స్పష్టం చేశారు.
అది అపహాస్యం కాదు కవిత్వం అనుకునేందుకు కూడా ఇపుడు అవకాశం లేదు. “మీ అభిప్రాయాలను కవితలుగా, ఆలాపనలుగా, కథానికలుగా రాయకండి. మీ సృజనకు అభిప్రాయాల పెట్టె వేదిక కాదు.” అన్న మీ కొత్త నిబంధనను అంగీకరిస్తూ వ్రాసినందువలన ఆ అభిప్రాయాన్ని సూటిగా చేసిన అవమానంగానే తీసుకుంటున్నాను.
ఇలా అవమానింపబడినందుకు బాధపడుతూ ఇకపై ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను.
అభినందనలు!
[క్షమించాలి. అది కేవలం సరదాగా అన్న మాట అని, “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచన ఉన్నప్పటికీ, కొన్నిసార్లు పాఠకుల మధ్య చర్చలో లైట్ బ్యాంటర్ వల్ల లాభమే కాని నష్టం లేదని అనుకోవడం చేత, ఆ వ్యాఖ్యలో మాకేమీ మీ పట్ల అవమానం కనిపించకపోవడం వల్లనే, ఆ వ్యాఖ్య ప్రచురించాం. -సం.]
బ్రహ్మానందం గారు, ధన్యవాదాలు. ఇతర రచయిత(త్రు)ల గురించి నాకు తెలియదు కానీ ఎప్పుడైతే నేను ఏదైనా రాసి పంపిస్తానో అప్పుడే దాని మీద విమర్శ కి సిద్ధంగా ఉంటాను. రచయితగా మీకు తెలిసే ఉండొచ్చు. “ఆహా, ఓహో” అనేవాళ్లతో మీకు ఏమీ ఉపయోగం లేదు – ఛాతీ అయిదంగుళాలు పెంచుకుని మరో కధో, కవితో రాయడానికి అది పనికివచ్చినా. అలా పెరిగిన ఛాతీ అక్కడే ఉండిపోదు కనక విమర్శ చేసేవాళ్లతోనే నాకు లాభం. వాళ్ళు సరైన విషయం, చేదు నిజం చెప్తారు. అయితే అందరూ ఒకేలాగ నెమ్మదిగా చెప్పరు కదా? ఒకరి భాష మరొకరికి రాకపోవచ్చు. కాని వాడిన భాష, వెక్కిరింపూ వదిలేసి అందులో అసలు ఏమి చెప్పదల్చుకున్నారు అనేది; వాళ్ళు చెప్పేది గ్రహించగలిగితే నా రచనలు మెరుగుపడతాయి. లేకపోతే మూసలో పొసినట్టు ఒకే రకం రచనలు రావడం తధ్యం. అంటే మొదటి రెండు పేరాలు చదవగానే ఇది ఫలానా శర్మ గారు రాసారు, చివర్లో ఇలా అవుతుంది గారంటీగా అని చెప్పేయవచ్చు. తెలుగు సినిమాల్లో లాగా మొదట్లో హీరో, నాలుగు గుద్దులూ, చివర్లో మళ్ళీ అందరూ ఒకోచోట ఫేమిలీ ఫోటో, శుభం కార్డు. ఓ సారి ఆ మూస పద్ధతీ, ముద్రా పడగానే ఇంక గొర్రె తోక రచనలు వస్తాయి. ప్రస్తుతం నావి అలాగే ఉన్నాయి కాబోలు.
ఎప్పుడైతే ఒక పత్రికకి రచన పంపించానో అప్పుడే- ఆయా సంపాదకులు విమర్శిస్తారనీ, అందులో తప్పులూ, ఒప్పులూ ఎత్తి చూపుతారని సిద్ధంగా ఉండాలి. నేను రాసిన పదహారు పేజీల కధ ఒక్కోసారి నాలుగు పేజీల్లో రాయొచ్చు. కన్నెగంటి చంద్రగారు దీనికో ఉదాహరణ అనుకుంటా. ఒక్కోసారి దాన్ని పద్ధెనిమిది పేజీలకి పెంచవచ్చు. అయితే “ఈ సంపాదకుడు నేను అమెరికా రాకముందు బొడ్డూడని బచ్చా గాడు ఇప్పుడు నా రచనలనే దిద్దే అంతవాడా?” అనుకుంటే ఆ పత్రిక మీరు చెప్పినట్టు మురికినీరు అయ్యి కడుక్కోవడానిక్కూడా పనికిరాదు. అప్పుడు మరో చెరువు వెతుక్కోవచ్చు. అయితే అక్కడ కూడా ఇదే విధంగా మురికి నీరు ఎదురవ్వొచ్చు కదా? మరో విషయం ఏమిటంటే ఒక సంపాదకుడికి నచ్చని రచన మరోచోట బాగుండవచ్చు (గ్రిషాం, హారీ పాటర్ లాంటి రచయితలకి ఇదే సమస్య మొదట్లో)
నేను రాసినది ప్రతీ అక్షరం పొల్లుపోకుండా వేసి తీరాలి అనుకుంటే బ్లాగు అంత ఉత్తమం మరోటి లేదు. అక్కడ కూడా మీరు మోడరేషన్ పెట్టుకోకపోతే ఎవరో ఒకరు ‘ఇది ఏడిసినట్టు ఉంది” అనడానికి అవకాశం ఉంది కదా? ఆఖరికి ఫేసు బుక్కులో కూడా లైకులు రాలేదంటే అర్ధం అది ఎవరికీ నచ్చకపోవడం కావొచ్చు – చదవక కాదు. అయితే ఆయా మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టూ రాస్తే ఏమౌతుందో రోజూ చూస్తూనే ఉన్నాం. అందువల్ల సంపాదకుల కత్తెర ఉండడం వల్ల లాభమే కానీ నష్టం లేదని నా అభిప్రాయం.
సంపాదకుల పని మూడో కంటితో చదివి ఎలా ఉందో చెప్పడం. దాన్ని వేసుకుంటారా లేదా అనేది వేరే విషయం. ఒకోసారి బూతు కధ, సాహిత్య లోకంలో ఎవరికీ నచ్చనిది పత్రిక లాభం కోసం వేయవచ్చు. అందులో ముఖ్య సంపాదకుడు ఎంత గింజుకున్నా మిగతా సహ సంపాదకులవల్ల కురదరక పోవచ్చు – అచ్చు పత్రిక మనుగడ డబ్బు మీద ఆధారపడి ఉంటుంది కనక. ఇంతకీ ఏమి చెప్పదల్చుకున్నానంటే సంపాదకుల దిద్దుబాటుకి సిద్ధంగా లేకపోతే ఫలానా పత్రికకి పంపడం మానుకోవడమే మంచిది. ఇదే మీరు చెప్పిన మురికినీరు వాడకపోవడం. అయితే దీనివల్ల ఎవరికి నష్టమో రచయితకే బాగా తెలుస్తుంది. నా ఉద్దేశ్యంలో మారవల్సినది రచయితే. అలాగని మొత్తం మారిపోయి సంపాదకుల తొత్తుగా ఉండమని చెప్పట్లేదు.
ఎప్పుడైతే “నేను షరతులకి కట్టుబడి ఉంటాను” అనే “ఆప్ట్ ఇన్” చెక్ బాక్స్ నొక్కి వ్యాఖ్య, కధా పంపించారో అప్పుడే మీరు సంపాదకుల కత్తెర కి ఒప్పుకున్నట్టు లెఖ్ఖ. అలాకాని పరిస్థితుల్లో వేరే చెరువు చూసుకోవడం ఉత్తమమే – రచయిత దృష్టిలో ఫలానా పత్రిక మురికినీరు కాబట్టి. దీన్నే అచ్చు పత్రికలలో ‘ఇందులో ఉత్తర ప్రత్త్యుత్తరాలకి తావు లేదు’ అని రాస్తారనుకుంటా. అయితే మూస పద్ధతిలోంచి బయటకి రావడం అసంభవం అనేది తెలిసి వస్తుంది త్వరలోనే – ఒక్కో చెరువూ మురికి అనుకుంటూ పోతే. మరో మాటండోయ్, నేను అంత పేరున్న రచయితనీ కాదు నన్నెవరూ “దయచేసి మా పత్రికకి రాయండి” అని అడగలేదిప్పటివరకూ. అందువల్ల ఆ విషయం నేను చెప్పలేను. నాకు తెలిసినంతలో సంపాదకులూ చదువరులూ చేసిన విమర్శల వల్ల (ఉదా: కవిత్వం మార్మికంగా ఉండాలి, ఓ చట్రంలోంచి బయటకి రావాలి, ఇందులో ఫలానా సన్నివేశం అనవసరం, ఆ మొదటిపేరా కంగాళీ తీసేయవచ్చు, ఫలానా వ్యాక్యం రాసాక మిగతా కధ అనవసరం, మీరు ప్రతి వ్యాఖ్యలు పెట్టి మరొకరెవరూ వ్యాఖ్య చేయకుండా చేస్తున్నారు [ఇంత ఆశ్చర్యం కలిగించిన కామెంట్ ఇప్పటిదాకా చూడలేదు]) నా రాతలు మెరుగుపడ్డాయని అనుకుంటున్నా.
మరో విధంగా బ్లంట్ గా చెప్పాలంటే నేను రాసిన కధో, వ్యాఖ్యో ఫలానా పత్రిక వారు ఎందుకు వేయాలి? ఆఖరికి నన్ను నిజంగానే “మా పత్రికకి ఏదో ఒకటి రాయండి” అని అడగగానే, నేను రాసినది “ఏది పడితే అది” వేయాలా? ఆహ్వానించారు కదా అని ఏదో ఒకటి రాస్తే అది వాళ్లకి నచ్చవద్దా? రాయడం నా విశేషాధికారం అయితే దిద్దడం, వేయాలా వద్దా అనేవి వాళ్ల ప్రత్యేధికారం కాదా?
చివరిగా, ఏదో చెప్దామనుకుని మరొకటేదో చెప్పినట్టు అనిపిస్తే క్షంతవ్యుడను. నమస్తే
మీరు ప్రస్తావించిన త్రిపుర గారి కవితని వారి అల్లుడు, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు మొన్నామధ్య ఫేస్‍బుక్ లో ఒక టపా ద్వార పంచారు. అది ఇక్కడ ఆసక్తి ఉన్న పాఠకుల కోసం ఇస్తున్నాను.
ఓ కాఫ్కా సుబ్బరామయ్య గారి యింగువ వృత్తాంతం – త్రిపుర
అతనిప్పుడు ఒక ఎముకల గూడు
ఎవరీ ప్రపంచంలో
తమ పాదముద్రలొదిలేసి పోయారు
ఎవరెవరో ఎందరెందరో ఎక్కడెక్కడికో
అనంత కాల ప్రవాహంలో కొట్టుకపోయారు’
అతనోసారి ఎన్నేళ్ల క్రితమో
రోడ్డుమీద నడుస్తూ
ఉన్నట్లుంది అన్నాడు నీతో
జీవితంలో ఎన్నో విషయాలు
తెలుసుకోకుండానే వెళ్లిపోతాం
నువ్వు రోడ్డు మీద పోతూంటావ్
అవతల దూరంగా వెళ్తున్న ఎవరినో
చూడాలనుకుంటావ్ కాని ఏ లారీయో ట్రక్కో అడ్డువస్తుంది
అంతే, ఆ మనిషిని ఎప్పటికీ చూడలేవు
ఏదో తెలుసుకోవాలనో చూడాలనో
అనుకుంటూనే
కాలం గడిచిపోతుంది
చివరకు అట్లాగా చచ్చిపోతాం
ఆఖరుగా ఒక ప్రశ్న:
యింతకీ ‘యింగువ’ ఏమిటి?
ఒక కుడివైపు చిన్నగదిలో
కిటికీ పక్కన నవ్వారు మంచానికి
అతడిపుడొక అంటుకున్న బల్లి
మగత లోంచీ దగ్గు లోంచీ
ఎప్పుడో ఒకసారి పైకి చూస్తూ
వచ్చిన వాళ్లందర్నీ
ఏదో అడుగుతున్నాడు
అతని గుండెలమీదికి వంగి విందామని
నువ్వు ఏమిటి కావాలని అడిగితే
ఆఖరి గరగర ఊపిరితో
యింగువ ఏమిటి అన్నాడు
తరవాత రెండుసార్లు తల ఎగరేసి
దేన్నో వెతుకుతున్నట్లు చూసి
అంతా అయిపోయిందనిపించాడు
యింగువ ఏమిటో అతనికి తెలియలేదు
సుబ్బరామయ్యగారు కూడా చెప్పలేదు
నీక్కూడా చాలా తెలుసు కాని యింగువ ఏమిటో యిప్పటికీ తెలియదు
అదొక కుట్ర
అదొక విద్యుత్ రహస్యం
అదొక మాయావి చెలగాటం
అదొక పులులు తిరిగే రాత్రి
ఏదేనా అవవచ్చు
తెలుసుకోవాల్సిన అవసరం
వుందోలేదో కూడా తెలియదు
నవ్వారు మంచం మీదో
హాస్పిటల్ ఆక్సిజన్ టెంట్ లోనో
ఆఖరి శ్వాస విడుస్తున్నప్పుడైనా
(‘త్రిపుర కాఫ్కా కవితలు’, ప్రచురణ సాహితీ మిత్రులు, విజయవాడ, 2001)
యద్దనపూడి గారి సుపరిచితమైన రచనలన్నింటిని ఒక్కచోట గుదిగుచ్చి ఎంత చక్కగా విశ్లేషించారు !!!
ఆవిడిక లేరు అని తెలియగానే మనసంతా అలముకున్న ఒక తెలియని నిస్పృహ, వేదన, బాధ… నా ఇంటి పుస్తకాల సేకరణ లోంచి సెక్రెటరీ నవల తీసుకొని చదవడం మొదలెట్టాను…..అంతే అలా రాత్రి 2 గంటలకి మొత్తం పూర్తిచేసాక కానీ పుస్తకాన్ని మూయలేకపోయా. 52 ఏళ్ల క్రితం రాసిన నవలకి, ఈనాటికీ ఎంత చదివించే గుణం – అదీ ఇప్పటికే ఎన్నోసార్లు చదివిందైనా !! ఇదనే కాదు , ఆవిడ చాలా రచనలు అంతే.
మన తరువాతి తరాలు తెలుగు మీది మమకారాన్ని బ్రతికించుకోవాలే కాని, కొన్ని తరాలకి సరిపోయే రచనలని వదిలివెళ్లారు ఆ నవలారాణి 🙏🙏
[We refuse to entertain a dialogue with you further. And no! your previous comment will not be reverted to as sent by you. Ed.]
సంపాదకులు గారు: మీరు అసలు మొదటికే సమాధానం ఇచ్చి ఉండనవసరం లేదు. ఎవరేమంటారు. అది మీ ఇష్టం. కాని ఇస్తే గాని, నేను పొయట్రీ ఫార్మ్ లో రాసినది అలాగే ప్రచురించి మీకు తోచిన సమాధానం ఇచ్చి ఉండాల్సింది. మీరు వదిలేస్తే ఇంకెవరైనా పాఠకులు వారికి ఇంట్రస్ట్ ఉంటే, వారు వారికి తోచిన విషయాలు రాసేవారేమో.
మీరు ఇప్పటికీ ఎందుకు నా అభిప్రాయం పొయట్రీ ఫార్మ్ లో ప్రకటించటానికి అశక్తులో తెలియటం లేదు. అలాటి పద్యాలు ఎన్నో నేను ఈమాటలో చదివాను. ఉదాహరణకు ఈ సంచికలోనే ఈ పత్రిక ఎడిటర్ చేసిన అనువాదపు పద్యం ఉంది. పేరు: ” మా పీకల మీదుంచిన కత్తులు తీయండి”
నా పద్యం లోని భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. ఈ పత్రిక ఎడిటర్ రాసిన ఆ పై పద్యం లో భాష మీకు అభ్యంతరకరంగా లేదా? లేనందువల్లే వేసి ఉంటారు కదా. మరి చదివిన ఒక పాఠకుడు భలేగా ఉంది పద్యం అన్నారే. వారికి భాష, సబ్జెక్ట్ కూడా ఏమీ బాధ పెట్టలేదు మరి.
నా అభిప్రాయం పొయట్రీ ఫార్మ్లో ఏమిటని, వచనంగా పేర్చినారా? మరి ఎడిటర్ భాస్కర్ పబ్లికేషన్ వచనం లోకి మార్చలేదే? ఏమిటి తేడా? ఇతరులెందరో అభిప్రాయాలను పొయట్రీగా రాసారు. వాటిని అచ్చు వేస్తూనే ఉన్నారు కద.
ఏ రకంగా చూసినా నా అభిప్రాయాన్ని మీరు ఎందుకు మార్చారో, సరిగా వెయ్యక పోగా పైగా నాకు సలహాలిస్తూ ఆరోపణలు చేస్తూ సమాధానాలు ఇచ్చారో నాకు తెలియటం లేదు.
సరే మీరు నాతో ఇంక మాటలు ఆపివేయదలిచారు. అది మీ నిర్ణయం. నాకైతే ఈ ఉత్తరం మీరు ప్రచురించటానికీ ఇతర పాఠకులు చదువుకోటానికీ ఏమీ అభ్యంతరం లేదు.
“బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు.”
లేదంటారా సంపాదకులు గారూ? ఉందో లేదో తేల్చాలంటే, ముందుగా నేను రాసిన వాక్యాలు రాసినవి రాసినట్టుగా ప్రచురించాలిగా? మీరలా చెయ్యందే. అలా అని మీరు పూర్తిగా విరమించనూ లేదు. నే రాసింది, మీకిష్టమైనట్టు మార్చి ప్రచురించారు. ఎందుకని?
మీరు, నేను రాసిన మెటీరియల్ అంతగా మార్చదలుచుకుంటే, ఆ మార్పులు, చేసిన ఎడిటింగ్ ముందు నాకు పంపి నాకు సమ్మతమైతేనే ప్రచురించాలి. ఆ తర్వాతే సమాధానమివ్వాలి. మీరెంతో మార్చేసిన నా రైటింగ్ ను నేను రాసినదిగా చూపిస్తూ, దానికి మీ సమాధానం ప్రచురించటం సరికాదు. మీ నిడువైన సంపాదకీయం చివరలో రచయితల నుండి మార్పులు ఏవేవో ఆశిస్తున్నామంటూ రాసిన మీరు, నా కిచ్చిన సమాధానంలో, మా పంథా మారదు, you better get used it. -అన్నారు. అలాటి లొంగదీతల హెచ్చరికలు మీనుండి నాకు ఎంత మాత్రమూ సమ్మతం కాదు.
సంపాదకులు: మీరిచ్చిన సమాధానం లోని పదార్థం కూడా నాకు తెలియలేదు. నా రాతను మార్చేసి చదువుకున్నందున, మీకు సమాధానం ఇవ్వటం చేతకాలేదేమో. ఏవో అతురు బొతుకు మాటలున్నాయి. ‘అలా ఒకరిని నిందించటం మీకు తగదు. ‘అన్న వాక్యం ఒకటీ తెలిసింది కాని, మిగతాదంతా తెలియనప్పుడు, అదికూడా తెలియనట్టే.
అందువల్ల;
Please publish this letter of mine, in total. And, if only acceptable to you, in your response make it known that you have made substantial changes to my writing and published it without my consent. Therefore you will be removing all of the material, pertaining to these letters. Post it for all readers of magazine to read and understand what happened here. And if I see no problems, you can remove them from the magazine in a week. That works for me, hope it works for you. I reserve all my legal rights.Thank you.
Have a nice day! – Lyla Yerneni, M.D.
[Your comment is published in full as you asked for. For the record, we did edit your “గుంటకాడి నక్కలు గుర్తుకొస్తున్నాయి అసహ్యంతో కక్కులొస్తున్నాయి.” about other writers as we found it objectionable. And, to paraphrase from పాఠకులకు సూచనలు:”మీ అభిప్రాయాలని పరిష్కరించి ప్రచురించడానికి, అసంగతమైన అభిప్రాయాలు తొలగించడానికీ, సంపాదకులకు అధికారం ఉంటుంది. సంపాదకుల నిర్ణయాలపై ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.” It further talks about ఉత్తరాలలో వ్యక్తిగత నిందలూ, అసభ్యమైన భాషా. By the way, before posting your comment you did agree to “ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను” clause. So, we are the ones well within our legal rights here. – Ed]
“రచయితలు ఇప్పటికీ పాతకాలపు సాహిత్య భావనలనే పట్టుకుని వేలాడడం, విమర్శకులు సాహిత్యరూపలక్షణ పరిమితీపరిణామాలపై చర్చ విస్తృతంగా జరపకపోవడం ఇందుకు కారణాలు. ఈ స్థితిని సంస్కరించే దిశగా నేటి సాహిత్యకారులు అడుగువేస్తారని, రేపటితరంలో వారి వారసత్వంగా చక్కటి సాహిత్యాభిరుచిని పెంపొందిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించడం ఎండమావి చందమే అయినా అది ఎప్పటికీ అత్యాశ కాకూడదనే మా ఆశ.”
పత్రిక మాసపత్రికగా మారింది, ఇండియా, ఔట్ ఆఫ్ ఇండియా రచయితలు పెరిగారు కామోసు! ఈ ఇంటర్నేషనల్ తెలుగు పత్రిక అమ్మయ్య! ఇక కక్కుర్తి నివాళి ఆచారం మాని, నిక్కపు సాహిత్య పత్రికగా మారుతుందని. అని నేనూ, మీలానే ఆశ పడినానేమో, No chance. పాత సంస్కారపు గ్రహచారం వదలదు. మూడు పువ్వులు, ఆరు కాయలు కాలేదు సరికదా, ఇప్పుడు One wedding and thousand funerals.
కొందరు సప్లైదారు రచయితలు- వారి అభిమాన సాహితీవేత్తల చావుకు ముందే ఆర్టికల్ రెడీ చేసి ఉంచుకుని మేక్సిమమ్ ఎఫెక్ట్ కోసం టైమ్డ్ రిలీజ్ చేస్తారో, మరి కొందరి సాహితీ-సంగీత వేత్తల చక్కని రచనలు సేకరించినా, వాటిని దొరికిన వెంటనే ప్రచురించకుండా వారు చనిపోయిన తరుణంలో వాటిని రిలీజ్ చేసి ఘనంగా ధాంధూంగా సాగనంపుదామని, ఫేమిలీ కాని, సప్లైదారులు గాని, రచనలను తొక్కిపట్టి ఆపి ఉంచుతారో తెలియదు.
ఇంతకన్నా అత్యాచారం సాహిత్యం పట్ల ఘోరాపచారం ఒక సాహితీజీవి పట్ల ఇంకోటి ఉంటుందా?
దయచేసి మీ సమాధానమివ్వండి. తప్పక మీ ఉద్దేశమేమిటో చెప్పండి.
Lyla
[As much as you hate to see it, we do believe it is better to celebrate than to ignore the life and works of one when departed. And, please get used to it because we are not changing any time soon about this. ఏదీ తొక్కిపట్టుకుని ఎవరుపోతారా అని ఏ “సప్లయ్ దారులూ” చూడరు. అలా ఒకరిని నిందించటం మీకు తగదు. When we celebrate, some may come and mourn.That’s their prerogative. చచ్చిపోయినవారిని తలచుకోడం మీకు అత్యాచారం ఎలా అనిపిస్తుందో అలా అది వారి ఇష్టం. బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు. – సం.]
చాలా చక్కటి విశ్లేషణ. ఆమె తన దారిలో తాను రాసుకుపోయేరు కాని, ఎవరితోనూ పోటీ పడలేదు. అవసరమైన వివరణలు ఇచ్చుకోలేదు. చాలా డిగ్నిఫైడ్‌గా ఆమె మార్గంలో ఆమె నడిచి పోయేరు!
విజయ భాస్కర రెడ్డి గారూ, మనకి బడిలో వ్యాకరణం నేర్పే తీరు ఇలాంటి సందేహాలకు దారి తీస్తోంది! డు, ము, వు, లు అనేవి ప్రత్యయాలు. కొన్ని రకాలైన పదాలకు ప్రథమావిభక్తిలో ఆ ప్రత్యయాలు వస్తాయి. కొన్ని పదాలకు ప్రథమా విభక్తిలో ఏ ప్రత్యయాలు రావు. అంచేత డు, ము, వు, లు లేకపోయినా చెట్టు, చీర మొదలైన పదాలు ప్రథమావిభక్తిలోనే ఉంటాయి.
తఃతఃగారు,
1. నాకు తెలిసినంతవరకూ ఈ సూత్రానికి తత్సమ, తద్భవ, ఆచ్ఛికమనే భేదం లేదు. ఈ సూత్రం కారక పరిచ్ఛేదంలో వస్తుంది.
2. ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా?” – ఈ వాక్యాన్ని ఇంకొకరు కూడా ఈ వ్యాస సందర్భంలోనే నాతో ప్రస్తావించారు 🙂 నేను అర్థం చేసుకున్నంత వరకూ, పద్య సందర్భాన్ని బట్టి, ఇది పిల్లిని తిన్న కోడి కాదు, పిల్లి తినేసిన కోడి. కాబట్టి ఇక్కడ పిల్లి కర్మ కాదు. అంచేత ఇక్కడ ద్వితీయా విభక్తి అవసరం లేదు. అలాగే “పలుకునా” అనే క్రియకు కర్త కోడి. దానికీ ద్వితీయ రాదు. “పిల్లిని తిన్న కోడి” అనే భావం రావాలంటే అక్కడ కచ్చితంగా “పిల్లిఁ దిన్న కోడి” అని సరళాదేశం జరిగి అరసున్న రావాలి.
3. నేను వ్యాసంలో ప్రస్తావించినట్లు, ఒక సూత్రంలో, ‘వైకల్పికం’, ‘బహుళం’ అనే పదాలు ప్రయోగించకుండా ‘అగు’ అని ఊరుకుంటే అది నిత్యమనే అర్థం. ‘కర్మంబున ద్వితీయయగు’ అనే సూత్రం ప్రకారం కర్మ వాచకానికి నిత్యంగా ద్వితీయ వచ్చి తీరాలి. కాని అలా రాని సందర్భాలు ఉండబట్టే, ఏయే సందర్భాలలో రాకుండా ఉంటుందో చెప్పడానికి ‘జడంబు…’ అన్న సూత్రం అవసరమయ్యింది. సూత్రంలో చెప్పిన కార్యం, కొన్ని చోట్ల ‘వైకల్పికం’గా జరగడమూ, కొన్ని సందర్భాలలో ‘నిత్యంగా’ జరగడమో, లేదా అసలు జరగకుండా ఉండడమో జరిగితే దాన్ని ‘బహుళం’ అంటారు. ఒక సూత్ర కార్యం బహుళంగా జరిగేటప్పుడు, ఏయే సందర్భాలలో నిత్యమో, ఏయే సందర్భాలలో వైకల్పికమో, ఏయే సందర్భాలలో ఆ కార్యం జరగదో చెప్పి తీరాలి. కనీసం కొన్ని ఉదాహరణలిచ్చి ఇలాంటి సందర్భాలలో ఇలా జరుగుతుంది అనయినా చెప్పాలి. ‘జడంబు ద్వితీయ…’ సూత్రంలో కూడా ఏయే సందర్భాలలో ఈ సూత్ర కార్యం జరగదో, అంటే పదం జడమైనా ద్వితీయ కచ్చితంగా వచ్చి తీరుతుందో చిన్నయ్యసూరి వివరించాడు. అయితే అవి నేనీ వ్యాసంలో చెపుతున్న అపవాదాలు కావు కాబట్టి, అతను పేర్కొన్నవి సరికావని నేను భావిస్తాను కాబట్టి, దానికి ఈ వ్యాస విషయంతో సంబంధం లేదు కాబట్టి, వాటిని ఇక్కడ వివరించ లేదు. మీరు కారక పరిచ్ఛేదంలో ఈ సూత్ర వివరణ చూడండి.
4. భాషను పరిపూర్ణంగా ఒదిగించడానికి ఎన్ని సూత్రాలైనా ‘కొద్ది’ సూత్రాలుగా మిగిలిపోతాయని!
తజ్జనని లోగిటం గల
రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్
బొజ్జ దిరిగి రాదయ్యె జ
గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే? :-))
ఈ యుదాహరణములను సామాన్యదృష్టితోఁ జూచినచో ‘పువ్వులను’ అను ద్వితీయకు ‘పువ్వులు’ అని ప్రథమ వచ్చుటమాత్రమే గోచరించును. కాని, యీ సూత్రమందలి పదములకూర్పును, ఉదాహరణవాక్యరీతిని, గలిపి నిదానముగా పరికించినచో, ఇది యొక చిన్న వినోదఘట్టముగా స్ఫురించును.
ఆ పద్యంలో ‘చిద్గగన ప్రాలేయాంశువు’ అనే పదముంది. ‘ప్రా’ అనే ద్విత్వాక్షరం ముందున్న ‘న’ అనే అక్షరం లఘువుగా వాడాడు. ఒకే సమాసం మధ్యలో వున్నప్పుడు ద్విత్వాక్షరం ముందున్న లఘువు గురువౌతుంది గదా, నీ కావ్యం తొలి పద్యంలోనే ఛందోదోషముంది అనీ, మరికొన్ని విషయాలనూ ఉటంకిస్తూ, కొత్త సత్యనారాయణ చౌదరి అనే పండితుడు తీవ్ర విమర్శ లేవనెత్తాడు.
శ్రీ రావూరి దొరసామిశర్మగారి ”విశ్వనాథ-ప్రయోగ వైలక్షణ్య సమీక్ష” (భారతి, జనవరి 1962) నుండి..
కల్పవృక్ష ప్రథమపద్యములో రెండవపాదములో ‘ప్రథమకబళేమక్షికాపాతః’ అన్నట్లు గణభంగ మెదురగునని క్రొత్తవారి యాక్షేపము. ఆ పద్యభాగము:
‘శ్రీమంజూషిక భక్తరక్షణకళాశ్రీచుంచు వానందవ
ల్లీమంజుప్రసవంబుఁ జిద్గగనప్రాలేయాంశువున్ …’
‘గగనప్రాలేయాంశు’ వనుచోట సిద్ధసమాస మగుటచే సామాన్యలక్షణానుసారము ‘న’ గురువు కావలె, కాని యిందు లఘువుగాఁ బ్రయుక్తము. ఇట్లు ప్రయోగించుట దోషముగాదు. దీనికి శాస్త్రమును బ్రయోగములును గలవు; చూడుడు: …
ఆ పులక్ బిశ్వాస్ బొమ్మలే నన్ను ఆకర్షించి ఆ సీ బి టి పుస్తకాలకి దగ్గిర చేసింది. నా ద్వారా కొన్ని వందల పిల్లలకి కూడా! కాని అప్పుడు తెలీదు ఈ పులక్ బిశ్వాస్ గురించి. ఇప్పుడు తెలిసింది.
శాయి గారు కాని చదువుతుంటే, ‘భారతి’ పత్రికలో కర్ణుడి మీద జాషువా గారు రాసిన వ్యాసం దొరుకుతుందా? ఆ వ్యాసం నాకు చదవాలని ఉంది.
కర్ణుడిమీద జాషువగారి వ్యాసాలేమీ లేవు. ‘భారతవీరుఁడు’ అని రెండు ఖండకావ్యములు, ‘శల్యసారథ్యము’ అని ఒక ఖండకావ్యము ‘భారతి’లో ప్రచురించారు. అవి ఇక్కడ చదువుకొనవచ్చును. పుస్తకములుగా సంకలనముచేసినపుడు వీటికి కొలదిమార్పులు జరిగాయి.
K.V.S. Ramarao on January 19, 2018 at 3:30 pm said:
నా ఉద్దేశ్యంలో ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం. ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక. బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం. ఈ దృష్టితో చూస్తే జాషువాకి ఫిరదౌసి గురించి ఏమీ తెలియనక్కర్లేదు ఎప్పుడో ఎక్కడో ఒక కవికి ఎంతో అన్యాయం జరిగిందన్న ఒక myth తప్ప.
Nice of you, to allow the readers here to examine your opinion. Ramarao garu. Here are my thoughts.
1.”ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”
జాషువా “ఫిరదౌసి” 1932 లో వెలువడింది.
‘ఫిరదౌసి’ రాస్తున్నప్పుడు ఆయన బడి పంతులు పని చేస్తున్నాడు. రచన సరిగా సాగటం లేదు. రాసింది ఆయనకే నచ్చటం లేదు. అచ్చుకు డబ్బు లేదు. ఆపివేసాడు. రాసిన రచన లో భాగాలు అక్కడక్కడా చదివి వినిపిస్తున్నాడు. హెడ్ మాస్టరు, జాషువా ఆందోళన, రచన – రెండూ విని తప్పక పూర్తి చెయ్యమనీ, జనులు ఆదరిస్తారనీ చెపితే,- మళ్లీ ఉత్సాహం కలిగి రచన ముగించాడు. (జాషువా రచనలు మూడవ సంపుటి. Page 268.)
జాషువా ఫిరదౌసి రాసేనాటికి, ఆయనకు 37 ఏళ్లు. అప్పటికి ఆయన ఎంతో కవిత్వం చెప్పి ఉండలేదు. ఎన్నో పబ్లికేషన్స్ లేవు. విలువలో Homer- Ilead తో తూగుతుందని, భారత రామాయణాల వంటిదని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షానామా రచయితతో తనను పోల్చుకోడు. తన కెంత ఖ్యాతి రావాలో, అది వస్తుందో రాదో ఊహ చేసే సమయం కాదు.
పైగా ఖ్యాతి, డబ్బు సంగతి పీడా పోయింది, ఫిరదౌసి కథలో కొడుకు పోవటం అన్న దుర్ఘటన ఉన్నది. అప్పట్టున మీ ఉద్దేశం భార్యాబిడ్డలు గల జాషువాకి వర్తింప చేయటం అసాధ్యం.
2.”ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక.”
జాషువా తనే రాసుకున్న జీవిత చరిత్ర ( నా కథ ) చదివితే, ఫిరదౌసికి ప్రతి పద్యానికి బంగారపు దీనారు ఇవ్వవలసి ఉండటమేమో గాని, గమనించండీ – ఒకచోట తన ప్రతి పద్యం లోనూ జాషువా నూటపదహార్ల వర్షం కురిపించాడు. సన్మానాలే సన్మానాలు. ఊరికే శాలువాలు కప్పి తాంబూలాలిస్తే ఆయనకు కుదరదు. డబ్బు ఇవ్వకుండా తన కవిత్వం వినటం ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాడాయన. జాషువాకి ప్రతిష్ఠ పుష్కలంగా లభించింది. ఊరూరా సన్మానాలూ గండపెండేరాలు తొడిగించుకోటం, శాసనసభకు ఎన్నికవటం, పద్మభూషణ్ రావటం. – ఇవన్నీ అతని కవిత్వానికి గుర్తింపూ, వ్యక్తిత్వానికి గుర్తింపూ, జీవితంలో upward moves కదా.
3.”బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం”
“ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా!” అనుకున్న చేమకూరి కవి మాటలు తన పట్ల వర్తించవని జాషువానే చెప్పుకున్నాడు. “నేనే గతి రచియింతునో చెప్పంజాలను కాని సమకాలీనుల వాత్సల్యమునకు గురియైతినని చెప్పుకొను పుణ్యము నాకు గల్పించిన తెలుగువారికి నేను కృతజ్ఞుడను..” అని చెప్పుకున్నాడు.
జాషువాకి తన జీవితకాలం లోనే కవిగా, వ్యక్తిగా సమాజంలోనూ, స్వకుటుంబంలోనూ కూడా ఖ్యాతి, ప్రేమాభిమానాలు లభించాయనే నాకు అనిపిస్తున్నది.
4.” అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”
Not at all. For the reasons already given. Here is what I think is possible at that time.
When he is dwelling on the story, I would say Joshua has made a silent vow to himself, not to be a loser ‘financially’, like the man in his story. Joshua did not want to make the foolish mistake of waiting around 30 years to collect on his poetry revenue. The story taught him financial prudence. If you notice, Joshua showed quite a bit of financial wisdom eventually. He was making sure he is paid every time he wrote. He was lining up his writings, and matching them up with his publishers, donors. He was motivated. He was continuously moving upwards.
Also, knowingly or unknowingly; He sent a message to the public, thru the publication of Firdaus.
జాషువా ఫిరదౌసిమీదున్న కథని కావ్య వస్తువు గా ఎన్నుకుని, కవిని గౌరవించాలనీ, కవిత్వం చాలా గొప్పవస్తువనీ, బంగారు నాణేలు ఇవ్వవచ్చనీ, అతనికి ప్రామిస్ చేసిన డబ్బిస్తేనే, షావుకారు మర్యాద నిలుస్తుంది – అన్న నీతిని ప్రజకు అందించాడు కదా. కవికి డబ్బు ఇవ్వకుండా మహమ్మద్ చచ్చాక – అతని తలకాయ రాత్రులలో గజనీపట్టణ వీధులలో ఆర్తనాదాలు చేస్తూ తిరుగుతుందన్న పద్యంతో ముగించాడు ఫిరదౌసిని. With that, He put God’s fear into people’s hearts.
ఫిరదౌసి కావ్యం రాయటం, జాషువాకి పై విధాలుగా లాభించింది.
Expanding the discussion a bit for clearer understanding, a little more writing on Joshua, based on my reading Joshua’s poetry in ‘జాషువా రచనలు.’
ఫిరదౌసి కావ్యం రాసాక, ఆ కావ్యం రాసిన కవిగా, ఇతరులు అతన్ని గుర్తించారు కాబట్టి, తరవాత తరవాత జాషువా ఆలోచనను ‘అతని ఫిరదౌసి’ కొంత ఆక్రమించాడు. సందర్భాన్ని బట్టి ఆ ఫిరదౌసితో identification వస్తుంది.
జాషువా, సుమారు తన 60 ఏళ్ల వయసులో రాసిన ‘నిర్వేదము’ అని ఒక చిన్నకవితలో అది చూడవచ్చు. (జాషువా రచనలు నాల్గవ సంపుటి. పేజీ 214.) ఆయన మీద ఏవో అభియోగాలు మోపినట్టున్నారు. ఆయనతో కలసి 40 ఏళ్లు పైన కాపురం చేసిన భార్య గతించింది. డబ్బు పొడిదుడుకులు అలానే ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో నేను ఫిరదౌసి కవి లాగానే, డబ్బు ఇబ్బందులతోనే చస్తాను కవీశ్వరేశ్వరీ! నీతో పాటు మట్టిలో కలుస్తాను, జీవితేశ్వరీ! – అనుకుంటాడు. It is momentary. At that point, it is apt. That grief passes. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్ళాడాడు. ఆ పైన ఇంకా చాలా జీవితం నడిచింది.
తొలిరోజుల్లో, జాషువాని ఒకసారి కవిత్వ సభలో పోటీ చేద్దువు గాని అని స్నేహితుడు తీసుకువెడితే, అక్కడ అతడు పంచముడు అని కోపంతో కొంతమంది సభ లోంచి లేచి వెళ్లిపోతారు. అక్కడ కొందరి మాటలకు మనసు గాయపడి, ఇంటికి వెళ్లి ఏడుస్తాడు. అప్పుడు మనశ్శాంతి కోసం భారతం చదువుకుంటూ -నిద్రపడితే- కర్ణుడు ఎంతో ప్రకాశమైన రూపంతో కనిపించినట్టు తలుస్తాడు. కర్ణుడిని – నువ్వు సూతుడవు, నువ్వు రాజకుమారులతో విలువిద్యలో పోటీ చెయ్యటం వీలుకాదన్న ఆ సందర్భం తలుస్తాడు.
అక్కడ కర్ణుని గురించిన పద్యాలు చక్కగా ఉన్నవి.
Pretty easy to see similarity in situation, for any of us.
In his times Joshua is told many times by some people, he is not an equal. He cannot enter certain arenas. He cannot take up sports/studies or compete in certain things reserved only for others. But, truly, Joshua is also a son of India. He is an equal to others.
There is a great deal of truth, in Joshua’s identification with this powerful character from fiction. Karna who is kind and heroic in his spirit and in his suffering. Joshua became better than Karna, deciding in -not to hate others, more in the line of Gandhi, Christ. But, he does not become a sacrificial lamb either.
Thanks, Lyla
PS: నేను సాహిత్యం, సాహిత్య విమర్శ విషయాల ఆలోచనలోనే ఉన్నానని, ‘ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.
శాయి గారు కాని చదువుతుంటే, ‘భారతి’ పత్రికలో కర్ణుడి మీద జాషువా గారు రాసిన వ్యాసం దొరుకుతుందా? ఆ వ్యాసం నాకు చదవాలని ఉంది. Thanks.
మానస చామర్తి గారి వ్యాసానికి డెట్రాయిట్ వారి ప్రధమ బహుమతి లభించినందుకు సంతోషం. అభినందనలు..
వీరు ఇచ్చిన కొత్త ఆలోనలు ప్రత్యేకించినవేమీ కావు.
౧ వీరు చెప్పిన రచనా లోకానికీ జీవన వాస్తవికతకీ తేడాని గమనించలేదు సరికదా భావుకత పేరుతో నిరాకరణని శాస్త్రీకరించారు. ఉదా: రేవతీదేవి “దిగులు”నీ, రాజేశ్వరీదేవి “మార్కెట్ సమాజాన్నీ” వీరు సరిగ్గా అంచనా వేయలేక పోయారని తెలుసుసుకోవడం కష్టమేమీకాదు. వాస్తవం వద్దు రంగుల కలే ముద్దు అనడంలోని (సత్యం వద్దు స్వప్నమే కావాలి) సామాజిక సత్యాన్ని గుర్తించలేకపోవడమే కారణం.
౨ నువ్వు ఏమైనా చెప్పు ముందు అది కవిత్వమై ఉండాలి అన్నది పైకి చాలా సమంజసంగానే కనిపిస్తుంది. కానీ పైకి కనిపించే సామాజిక వాస్తవాల ముసుగు తీయడానికి భావవాద/రూపవాద విమర్శకుల శక్తికి మించిన పని అని వేరే చెప్పనక్కరలేదు.
౩ “సహృదయ విమర్శ” గోడ మీద పిల్లి. సాహిత్యానికీ దాని భూమికైన సమాజానికీ ఈ “రకం” విమర్శ ఏమాత్రం మేలుచేయకపోగా చదువరుల్ని మభ్య పెట్టి మబ్బుల్లో తిప్పుతుంది. కాకపోతే సృజకుడిని (కవి, రచయిత) తృప్తిపరచి పైమెట్టెక్కిస్తుంది.
౪ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు తెలుగులోసాహిత్య విమర్శ లేదనుకోవడానికి కూడా సవాలక్ష కారణాలు కనిపిస్తుండవచ్చు. విమర్శని కూడా ఒక సృజనగా భావించకపోవడం శోచనీయం.
“విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు.” డా. విజయ్ కోగంటి
Well and Good.
మానస గారి వ్యాసం ‘జాషువా –ఫిరదౌసి’ ఈ పత్రికలోనే ఉన్నది. చదివినారా? ముఖ్యంగా ఈ పై కారణం వల్లనే, చాలా పేలవమైన వ్యాసం అని నేను అనుకున్నాను.
జాషువా రచించిన ‘ఫిరదౌసి’ ఒక ఎన్నదగిన రచన కానే కాదు. ఆ ఖండకావ్యానికి మంచిపేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇంటర్మీడియేట్ విద్యార్ధులకు 1940 వరకు పఠనగ్రంధాలలో ఒకటి గా ఉన్నదని జాషువా కవి తెలిపారు. ఆ యా గురువులు ఆ కావ్యం గురించి ఆ రోజులలో వారి విద్యార్ధులకు ఏమి బోధించారో!
నా ప్రశ్న – జాషువా ‘ఫిరదౌసి’ లో ఒక పారశీక కవి రూపుగాని, మాటగాని, ఏ పారశీక కవిత్వపు తీరుగాని, అందునా ఫిరదౌసి కవిత్వ పరిచయం గాని ఉన్నదా? సమాధానం: శూన్యం. సున్నా. షానామా కవిత్వప్రఖ్యాతి వల్లే కదా జనులు ఫిరదౌసిని తెలుసుకోవాలనుకునేది? కాదా? స్వాతంత్ర పోరాటం, సత్యాగ్రహం గురించి కాపోతే, మోహనదాస్ కరంచంద్ గాంధీని గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటారు?
కవిత్వ ప్రియులు, కవిత్వం తెలుసుకోటం మాని, కవిని గురించిన కాకమ్మ కథలు వినటం – జాషువా ఫిరదౌసి చదవటం. ఫిరదౌసి అన్న పారశీక కవిని గురించి ప్రచారం లో ఉన్న ధన సంబంధమైన ఒక కథను గూర్చి మాత్రమే జాషువా రాసినాడు. (ఇలాటి చాటువు, చాటు గురించి ఈ పత్రికలో మాటికి ముమ్మారు చాటి చెప్పిగా విన్నాం కదా.) ఆ రచన ఎలాటిదంటే, ఒక సంగీతవేత్త గాని – భక్త రామదాసు జైల్లో ఉంటే రాముడు లక్ష్మణుడు వచ్చి, కప్పం కట్టి అతడిని చెర వినిపించటం కట్టుకథ మనకు చెప్పి, – రామదాసు కీర్తన ఒక్కటి తెలియచెప్పటం గానీ, పాడటం కానీ చెయ్యలేకపోటం వంటిది.
ఒక కవి, ఇంకో కవి కవిత్వం చదవకుండానో, ఆ ప్రసక్తి ఇంత తేకుండానో, మకుటం లో అతని పేరుతో అతని మీద ఖండకావ్యం రాయటమేమిటి?
జాషువా రాసిన ఫిరదౌసి కావ్యం పేరు మార్చి, కాళిదాసు, బమ్మెర పోతన అని పెట్టినా, కీట్స్ అని గాని, షేక్స్పియర్ అని గాని పెట్టి, లోపల పద్యాలలో పేరు మారిస్తే, చాలు. ఏం తేడా రాదు. ఆ ఏ ఒక్కరి specific జీవనం, విద్య, శైలి, ఆలోచన రీతి, సాధించిన పని, మనకింత కూడా తెలియదు. అలాటి generic రచన జాషువా చేసింది. ఫిరదౌసి పారశీకపు కవిత్వపు తీరు తెన్నులు జాషువాకు బహుశా తెలియవు. ఆయన చెప్పలేనందున ఈ ఖండకావ్యం ద్వారా మనకూ తెలియవు. కొంతమంది చదువరులకు మరి ఫిరదౌసి కవిత్వ పరిచయం జాషువా రచన ద్వారా, ఎలా కలిగిందో?
ఫిరదౌసి అన్న కావ్యంలో ఆ కవి లేనే లేడన్న విషయం మానస మాత్రం గమనించిందా? లేదు.
జాషువా రాసిన ఆ ఖండకావ్యము పేరుగొన్నదనే చదువుకుని, బాగున్నదనే నమ్మి, వాల్మీకి, నారాయణరావు, గురజాడ – ఇలా సాహిత్యంలో తెలిసిన కొందరిని, వారి మాటలను తన వ్యాసం లో ప్రస్తావిస్తూ రివాజు ప్రకారం ఒక సాంప్రదాయికమైన వ్యాసాన్ని, మానస తయారు చేసింది. ఆ ప్రస్తావనలు కూడా ఆమెకు ఈ రచన సందర్భంలో సొంత ఆలోచన లేకపోటాన్నే బలపరుస్తాయి. వాల్మీకి – సీతకు ఎడమ కన్నో, కుడి కన్నో అదరటానికీ, ఒక పారశీక కవి నమ్మికలకూ, మానసిక స్ధితిగతులకూ ఏమిటి సంబంధం?
ఫిరదౌసి గురించి జాషువా “ఏమని కవిత్వం వ్రాసినట్టు, ఎందుకు వ్రాసినట్టు” అని మానస ప్రశ్నించుకుంది. సాహితీ వ్యాసాల్లో – ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి? అని తమ వ్యాసాల్లో అనటం నేర్పిన సాహిత్య సైంటిస్ట్ ల నుండి ఆ వాక్యం రాయటం వరకు ఆమెకు వచ్చింది. మరి సంపాదించిన సమాధానం? అదసలు ఏమిటి? దొరికినది సజావుగా ఉన్నదా?
ఎన్నో విషయాల మీద ఆసక్తితో మనుషులు శ్రమిస్తారు. సైంటిస్ట్ లకు ఒక పరిశోధనలో ముఫ్పై ఏళ్లు శ్రమిస్తే, అందునుండి మనుషులకో, మరెవరికో ఉపయోగించే ఫలితం ఏదీ రాకపోతే ఆవేదన కలుగుతుంది. అనుకున్న ఆదాయం రాకపోయినా కష్టం కలుగుతుంది. నిజమే.. మరి, ఫిరదౌసి కవిత్వమైతే ప్రజలకు ఆనందించటానికి ఉన్నది. జాషువా కావ్యం రాసేనాటికి ఫిరదౌసి ప్రసిధ్ధుడైన కవే. ఆ కవిత్వం దొరుకుతున్నది. మరి జాషువా ఒక పాతకథను పట్టుకు ఎందుకు పాకులాడ్డం? ప్రపంచంలోనే పేరు పడిన కవిని, మరో కవి ముఖ్యంగా అతని కవిత్వాన్ని గుర్తిస్తాడా? కవిత్వాన్ని పరిచయం చేస్తాడా – లేక, అది మరచి, (నిజమో కాదో తెలియని) ఒక పరిదీన పరిస్థితిలో మనకు ఫిరదౌసిని చూపుతాడా? అది చేయదగ్గ పనిగా నాకు అనిపించటం లేదు.
జాషువా కావ్య వస్తువుగా తన తెలుగు జీవితం, తన నిజ పరిస్థితిని తనే వర్ణించి తన సమకాలీన పాఠకులకు చూపవచ్చు. “గబ్బిలము” లో ఎంతో కొంత చూపినాడు. కాని, ఏనాటి వాడో పర్షియన్ ఫిరదౌసిని జీవితంలో ఏదో అన్యాయానికి గురైన వాడుగా మాత్రమే నమ్మి మనకు కావ్యంలో చూపటం గాని, కవిత్వ ప్రస్తావనే లేని కావ్యం రాయటం కాని, ఫిరదౌసి జీవితం తో జాషువా జీవితానికి సాపత్యం ఉంది – అని అతనైనా, ఎవరైనా అనుకోటం కాని, అవి సరైన ఆలోచనలు కావు.
మానస – తన రచనలో 1. జాషువాకు ఫిరదౌసి కవిత్వం తెలుసునో తెలియదో చెప్పగలగాలి. 3. అందుకు స్వయంగా ఫిరదౌసి కవిత్వం కొంతైనా తను చదివి, చర్చించ గలిగి ఉండాలి. అప్పుడు గదా ఆమె ‘జాషువా- ఫిరదౌసి’ అన్న వ్యాసం రాయవలసింది. కాదా? Is it not?
(సమయం కొద్దీ, మానస చామర్తి కవితలు, కవిత పరిచయాల గురించి మరోసారి.)
వాడ్రేవు చినవీరభద్రుడు ఫేస్‌బుక్ లో పొస్టు చేసినది:
కొత్త సంవత్సరం అడుగుపెడుతూనే తెలుగు సమాజం గర్వించదగ్గ కానుకను తీసుకొచ్చింది. ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట వడ్డెర చండీదాస్ అనే తెలుగు తాత్త్వికుడు తనకోసం తాను రాసుకున్న ఒక సత్యమీమాంస ఇప్పటికి వెలుగు చూసింది. Desire and Liberation (2018) అనే ఆ గ్రంథాన్ని ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ ప్రచురించడంతో మొదటిసారిగా ఒక ఆధునిక తెలుగు తాత్వ్వికుడు ప్రపంచతత్త్వశాస్త్ర పటమ్మీద చోటు సంపాదించుకున్నాడు. ఒకవైపు సృజనాత్మక రచయిత, మరొక వైపు మౌలిక తత్త్వవేత్త అయిన ఆధునిక తత్త్వవేత్తల్లో జ్యా పాల్ సార్త్ర్ తర్వాత ఇకనుంచి ప్రపంచం వడ్డెర చండీదాస్ నే తలుచుకోవడం మొదలుపెడుతుంది.
అరుదైన,అపురూపమైన ఈ రచన వెలుగు చూడటం వెనక ఆచార్య అడ్లూరు రఘురామరాజు జీవితకాలం పాటు చేసిన తపసు ఉంది, భగీరథుడు గంగని భూమ్మీదకు తీసుకురావడంలాంటి కథ ఉంది.
ఆ కథ 1972 లో మొదలయ్యింది.
కాళిదాస్ భట్టాచార్య (1911-84) ప్రపంచప్రసిద్ధి చెందిన తత్త్వశాస్త్ర ఆచార్యుడు. శాంతినికేతన్ లో బోధించేవాడు. యు.జి.సి కోరికమీద, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రవిభాగం ఎలా పనిచేస్తోందో చూడటానికి ఆయన 72 లో తిరుపతి వెళ్ళారు. వారం రోజుల పాటు ఆ విభాగాన్ని కూలంకషంగా పరిశీలించటంతో పాటు,ఆ శాఖలో పనిచేస్తున్న ప్రొఫెసరల్నీ, రీడర్లనీ, లెక్చెరర్లనీ స్వయంగా కలుసుకోవాలనుకున్నారు. కలుసుకున్నారు, మాట్లాడేరు. ఒక్కరిని తప్ప.
డా.చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు అనే ముప్పై ఏడేళ్ళ వయసుగల లెక్చెరర్ ని మాత్రం అతని ముందు హాజరుపర్చడానికి ఆ శాఖాధిపతి సుతరామూ ఇష్టపడలేదు. ఇక భట్టాచార్య మర్నాడు వెళ్ళిపోతారనగా, ఆ లెక్చెరర్ ని కూడా ఆయనముందు హాజరు పరచకతప్పింది కాదు.
‘ఏదో ఒకటి చెయ్యకుండా ఎలా ఉంటావు? యూనియన్లు నడుపుతుంటావా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటావా? సినిమాలు తీస్తుంటావా? ‘ అడిగాడు భట్టాచార్య.
‘లేదు, ఏమీ చెయ్యను.’ అన్నాడతడు మళ్ళా.
‘ఏమీ చెయ్యకుండా ఉండటం అంత సులభం కాదు, అది యోగులకే సాధ్యం. నిజం చెప్పు,ఇన్నాళ్ళూ నువ్వు నన్ను కలవలేదు. అసలు నువ్వు చేస్తున్న పనేమిటి?’
‘రాస్తుంటాను.’
‘ఏం రాస్తుంటావు?’
‘కథలూ, నవలలూ, అది కూడా తెలుగులో.’
‘తెలుగు నాకు రాదు. ఇంగ్లీషులో ఏమన్నా రాసావా?’
ఆ యువకుడు ఒక క్షణం పాటు ఆగాడు. అప్పుడు కూడా నెమ్మదిగా సందేహిస్తూ
‘ఒక రచన రాసాను. కాని అది ఫిలాసఫీ డిపార్ట్ మెంటు కి అర్థం కాదు, అంగీకరించదు.’
‘నాకు చూపించగలవా దాన్ని.’
ఆ యువకుడు తన ఛాంబర్ లో తన సొరుగులోంచి ఒక మాన్యుస్క్రిప్ట్ తీసి ఆయన చేతుల్లో పెట్టాడు. పట్టుమని ఇరవైపేజీలు కూడా లేని రచన.
భట్టాచార్య కుతూహలంగా మొదటి పేజీ తెరిచాడు. మొదటి వాక్యం చదివాడు.
“Contradictoriness is an inherent structural tinge of reality.”
ఆయన తనముందున్న యువకుణ్ణి ఎక్స్ రే కళ్ళతో చూస్తూ
‘మీ తండ్రితాతల్లో ఎవరన్నా శాక్తులా? ‘ అనడిగాడు.
‘కాదు. ఎవరూ లేరు.’
ఆయన నమ్మలేకపోయాడు.
‘మీపూర్వీకులెవరేనా రాసిన తాళపత్రాన్ని ఇంగ్లీషులోకి అనువదించావా?’
‘లేదు. ఇది నేనే రాసాను.’
‘నువ్వేం రాసావో నీకు తెలుసా?’
‘కొద్ది కొద్దిగా అర్థమవుతోంది’ అన్నాడా యువకుడు.
అంతే, భట్టాచార్య మర్నాడు రైలు టిక్కెట్టు కాన్సిల్ చేసేయమన్నాడు. నేరుగా గెస్ట్ హవుజ్ కి వెళ్ళిపోయాడు. ఎవరూ తనని కలవొద్దని చెప్పాడు. ఆ రాతప్రతినే అధ్యయనం చేస్తూండిపోయాడు. తాను శాంతినికేతన్ వెళ్తూ ఆ రాతప్రతిని టైపు చేసి ఒక కాపీ తనకి పంపించమన్నాడు.
శాంతినికేతన్ వెళ్ళాక కూడా భట్టాచార్య స్తిమితంగా ఉండలేకపోయాడు. ప్రాచీన భారతీయ దార్శనికుల పంథాలో సూత్రప్రాయంగా రాసిన ఆ ఇరవై పేజీల రాతప్రతి ఆయన్ని నిలవనివ్వలేదు. ఆయన ఒక ఏడాది పాటు ఉద్యోగానికి సెలవుపెట్టేసాడు. భిలాయిలో ఉన్న తన కూతురిదగ్గరకు వెళ్ళిపోయి, ఆ రచనను మరింత లోతుగా అధ్యయనం చేస్తూండిపోయాడు. ఏమైతేనేం, చివరికి, 1975 జనవరి నాటికి, ఆ రచనకు ఒక విపులమైన పీఠికను రాయగలిగాడు.
కాని, ఆ రచనను అట్లా ప్రాచీన సూత్రవాజ్మయం తరహాలో ప్రచురిస్తే ఎవరికీ అర్థం కాదనీ, దానికి కనీసం మూడువందల పేజీల భాష్యం కూడా రాయాలనీ చండీదాస్ ని కోరాడు. ఆ సందర్భంగా ఎనిమిది నెలలపాటు వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.
భట్టాచార్య సూచనను చండీదాస్ ఆదేశంగా స్వీకరించి తన రచనకు తనే వ్యాఖ్యానం రాయడానికి ఉపక్రమించాడు. కాని, ఆ దివ్యావేశం అతడికి మళ్ళా లభించలేదు. తాను రాసింది తనకే సంతృప్తికరంగా అనిపించలేదు.
18 ఏళ్ళు గడిచాయి.
ఆయన జీవితంలోకి రఘురామరాజు అనే తత్త్వశాస్త్ర విద్యార్థి ప్రవేశించాడు. తాను భట్టాచార్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోడానికి ప్రత్యక్షమయిన అవకాశంలాగా కనిపించాడతడు. తనకన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడు. 1993 లో, చండీదాస్ నోరుతెరిచి అతణ్ణి అడిగాడు.
‘ఈ రచనకు నువ్వు భాష్యం రాయగలవా?ఇంగ్లీషు పాఠకలోకానికి నువ్వు పరిచయం చెయ్యగలవా?’
ఆ తర్వాత 2004 దాకా వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.(ఆ లేఖల్ని ‘ప్రేమతో..చండీదాస్ ‘ పేరిట ఎమెస్కో ప్రచురించింది. అందులో కాళిదాసు భట్టాచార్య చండీదాస్ కి రాసిన లేఖలకు నా తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి.) రఘురామ రాజు చండీదాస్ ని చివరి సారి కలిసినప్పుడు ఆయన బయట గుమ్మం దాకా వచ్చి అతడికి వీడ్కోలు పలుకుతూ ‘నేను మరణించినా కూడా నువ్వు నన్ను చూడటానికి రానక్కర్లేదు. కాని నేను భట్టాచార్యగారికి ఇచ్చిన మాట మాత్రం మర్చిపోకు ‘ అన్నాడు.
ఆ రచన ని రఘురామరాజు 16 సంవత్సరాలు అధ్యయనం చేసాడు. దానికొక విపులమైన వ్యాఖ్యానం రాసాడు. వందమందికి పైగా ప్రచురణకర్తలకు పంపాడు. ఒక్కరు కూడా ప్రచురణకు అంగీకరించలేదు. మొదటిసారిగా, జాన్ హారిస్ అనే ఒక తత్త్వశాస్త్ర ఆచార్యుడు దాన్ని work of genius అన్నాడు. కాని అతడు యాక్సిడెంట్ లో మరణించడంతో ఆ పుస్తకం గురించి చెప్పడానికి మరెవరూ లేకపోయారు. చివరికి ఆశిష్ నందీ ఆ రచనని ఆక్స్ ఫర్డ్ కి పరిచయం చేసాడు. కాని ఆక్స్ ఫర్డ్ కూడా నిరాకరించింది.
‘రఘురామరాజు ఎవరు? చండీదాస్ ఎవరు?’ అనడిగింది ఆ ప్రచురణ సంస్థ.
అప్పుడు రఘురామరాజు తానెవరో తెలియచేసుకోడానికి Debates in Indian Philosophy: Classical, Colonial and Contemporary (2006) అనే పుస్తకం రాసాడు. ఆ రచన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ‘ఛాయిస్’ పత్రిక దాన్ని అత్యంత విశిష్ఠమైన రచనగా ఎంపికచేసింది. డా. రాధాకృష్ణన్ తర్వాత మళ్ళా ఆక్స్ ఫర్డ్ కి భారతీయ తత్త్వశాస్త్రం గురించి మాట్లాడగల రచయిత దొరికాడు.
అప్పుడు, చండీదా రచనకి డా. రఘురామరాజు రాసిన భాష్యాన్ని ఆక్స్ ఫర్డ్ Enduring Colonialism: Classical Presences and Modern Absences(2009) పేరిట ప్రచురించింది. ఆ రచన చదివిన తత్త్వశాస్త్రప్రపంచం ‘చండీదాస్ ఎవరు? ఆ మూల రచన ఎక్కడ? ‘అని రఘురామరాజు వెంటపడింది.
అదిగో, ఆ దాహాన్ని తీర్చడానికి, ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ చండీదాస్ రచనను Desire and Liberation:Biography of a text by Vaddera Chandidas (2018 ) పేరిట ప్రచురించింది.
1972 లో ఒక తెలుగు యువకుడు తనకోసం తాను రాసుకున్న ఒక రచన. 45 సంవత్సరాల పాటు దాన్ని ఇద్దరు మటుకే చదివారు. ఒకరు కాళిదాసు భట్టాచార్య, మరొకరు రఘురామరాజు. ఇప్పుడు యావత్ ప్రపంచం చదవబోతున్నది. తత్త్వశాస్త్రంలో metaphysics కి ఒకప్పుడు భారతదేశం పుట్టినిల్లు. కాని ఆధునిక భారతీయ చింతనలో మౌలికమైన metaphysical రచన ఏదీ ఇంతదాకా ప్రభవించలేదు. అరవిందులు, కె.సి.భట్టాచార్య ఆ దిశగా కొంత చింతనచేసారు. కాని ప్రధాన సూత్రగ్రంథమేదీ రాయలేదు. ఆ అవకాశం చండీదాస్ కి దక్కింది. ఆపస్తంబుడు, ఆచార్య నాగార్జునుడు, కుందకుందాచార్యుల తర్వాత ఇన్నాళ్ళకు తిరిగి ఒక తెలుగువాడి మౌలిక దార్శనిక గ్రంథం ప్రపంచం ముందు అవతరించింది.
లైలా యెర్నేని: నిజానికి “‘తిలక్ చెప్పినట్లు’ అంటూనే తిలక్ మాటల్లోని ‘అందమైన’ ని ఎందుకు తప్పించేశావు తల్లీ!” అని సుధామాధురిని అడగాలని నాకూ కుతూహలంగా ఉంది.
‘అందమైన’ అనటంలో కవి లౌల్యానికి గురి అయినట్టుగా అనిపించింది. ఆ మాటతో తిలక్ వంటి కవి – తనకు తెలీకుండానే – అ(క్షరాలు), అం(దమైన), ఆ(డుకునే), ఆ(డపిల్లలు) వంటి అక్షర రమ్యత, శ్రవణ రమణీయతల కోసం – అందమైన వాళ్ళు కానివారికి తన ప్రపంచంలో చోటు లేదని చెపుతున్నాడా! తన ‘ఆనంద పరమావధిని’ విస్మరించాడా! అన్న బాధ కలిగింది.
ఒక ఆత్మగత ప్రపంచానికి ప్రతీకగా ఉన్న అఫ్సర్ గారి కవితల పుస్తకం “ఇంటివైపు”ను నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారు అందించారు కాని దాన్ని ఎలా ఆశ్వాదించాలో మీ యీ విశ్లేషణ వల్లే తెలుసుకున్నాను. (వాకిలి అంతర్జాల పత్రికలో స్వాతి కుమారి బండ్లమూడి గారు కూడా యీ పుస్తక పరిచయం చేసి సాయపడ్డారు). మీకు ధన్యవాదాలు.
మురుగన్ గారు సృజనాత్మక రచయిత. ఆయన వ్యాసం సాంస్కృతిక వ్యాసం. అటువంటి వ్యాసాలకు సాహిత్య పత్రికల్లో తప్పక చోటివ్వాలి. కళను సిద్ధాంతం మింగేయకూడదని ఈరోజుల్లో మార్క్సిస్టులు కూడా ఒప్పుకుంటారు. అలాగే కళ వెనుక ఏదో ఒక భావజాలం ఉండి తీరుతుందని మార్క్సిస్టులు కాని వాళ్ళు కూడా ఈరోజుల్లో ఒప్పుకుంటున్నారు. భారతరామాయణాలు రసవత్తరంగా రాయబడిన కారణం చేతనే అవి ప్రచారం చేసిన భావజాలాలు ఇప్పుడు కూడా ప్రభావితం చేస్తున్నాయి. కళ కళ కోసమే అన్న భావన మన సంప్రదాయంలో ఎప్పుడూ లేదని నా అభిప్రాయం. కవిత్వం విలువ నిర్ణయించడానికి ఆర్ద్రహృదయం ఒక్కటే చాలదు. ఆ కవిత్వం వెనుకనున్న రాజకీయాలు కూడా తెలియాలి. లేకపోతే అందమైన ప్రకటన చూసి కరిగిపోయి అది ప్రకటించే వస్తువు కొనుక్కొనే వినియోగదారుడిలా మిగిలిపోతాం. ప్రకటన అందాన్ని మెచ్చుకోవచ్చు. కాని వస్తువు నాణ్యతను ఇంకా ముఖ్యంగా పరిగణించాలి.
ప్రియమైన శ్రీ దేశికాచారి గారికి, శ్రీ నాగేశ్వరరావు గారికి,
“ప్రచారమే ధ్యేయంగా రాయబడిన వ్యాసము”, “సాహిత్యపు విలువలు” వంటి విషయాల గురించి మీతో వాదించాలనుకుంటున్నా కాని, బహుశా ఇది సమయం కాదేమో అని సందేహిస్తున్నా.
“భావవ్యక్తీకరణ విషయంలో జరిగే తిరుగుబాటుకీ కులవ్యవస్థకీ ఉన్న సంబంధం అతి కీలకమైనది” అంటూ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌గారు చేసిన ప్రసంగపాఠంలో నాకు యెలాంటి తప్పులు కాని, వాస్తవాలకు విరుద్ధమైన తప్పుడు ప్రచారం లాంటిది కాని కనబడుటలేదు. ఇది ఆర్ద్రహృదయముతో వారు చేసిన ప్రసంగంగా అనిపించటం లేదా.
మన కుల వ్యవస్థ, కులవిచక్షణ సాంఘిక రుగ్మతల వల్ల జరుగుతున్న అన్యాయాలు, అనర్థాలు మనకు తెలియని విషయాలా. దేశపురోగమనానికి ఇవి ఆటంకాలు కావా. దయచేసి యీ కోణంలో మరొక్కసారి ఆలోచించగలరు.
కథ, నవల, నాటకం, కవిత్వం ఇంకా అనేక ప్రయోగాలు సాహితీ ప్రక్రియలు అయినట్లే వ్యాసాలు కూడా సాహితీ ప్రక్రియ క్రింద రావా. యీ వ్యాసం ప్రచురించటం వల్ల ఉన్నత సాహితీ విలువలు కలిగి ఉన్న ఈమాట అంతర్జాల పత్రికకు యేవైనా అపకీర్తి చుట్టుకుంటుందా.
I stand by my word. Since it is propagandish devoid of any literary value I said this is not the right forum for that. There are other forums too willing to publish such stuff where it can go. As for the quote by Ramayyagaru, it is irrelevant, because it is not a piece of literature we are talking about. It is a pity that people are too willing to quote foreigners than Indian Laakshanikas on literature. Here is a quote from respected modern poet and scholar Sri Indraganti Hanumacchaastrigaru regarding the true nature of poetry, which, by extension is relevant to all literature.
“కవిత్వము సిద్ధాంతములను మ్రింగివేసి జీర్ణించుకొని తన జీవశక్తితో తాను నిలబడవలెను. కాని సిద్ధాంతములే కవిత్వమును మ్రింగి తూర్యారవములు ప్రారంభించినచో నాటితో ఆ సాహిత్యపు విలువ సరి. నాదములు, వాదములు తాత్కాలికములు. కవిత్వపు విలువ శాశ్వతము. తిక్కన భారతమును, పోతన భాగవతమును, పెద్దన మనుచరిత్రమును సమకాలిక సిద్ధాంతదర్శనమునకై చదువుట లేదు. వాని లోకోత్తర కవితాశిల్పము, వ్యంగ్యప్రభావము తరతరములనుండి చదివించుచున్నవి. కనుక కవిత్వపు విలువను నిర్ణయించుటకు వేరు పరికరములు కాక, ఒక్క ఆర్ద్రహృదయము మాత్రమే ప్రయోజకమని సమ్మతించినచో ఏ రచనకైనను న్యాయము జరుగును” – ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.
అనువాదం అని చూసి చదువుతూ దశాబ్దాలక్రితం రాసినదేమో అని ఊహిస్తూ వచ్చాను. చివరలో ఈఏడాదే చేసిన ప్రసంగమని తెలిసి నిరుత్సాహం కలిగింది. తెలుగు/ తమిళ భాషలలో ధ్వన్యేకత కలిగి సమానర్ధకాలుకాని పదాలనేకం. విచారము అంటే సంతాపం పొందటమనే స్ఫురిస్తుంది. విచారణ క్రియావాచకం. విచారణా భాష అనివాడుంటే మేలుగా ఉండేది.
చాలా ఆనందంగా ఉంది నీ కథ చదివి. పాత్రలన్నీ ఎరుగున్నవే కావడం వల్ల మరింత ఆయా వ్యక్తులు జ్ఞాపకానికి వచ్చారు. సంభాషణ శైలి గ్రామీణతను సంతరించుకుంది. కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు. కుర్రనాకొడుకు వల్ల లోకంలో ఎక్కడా లేని కనీ వినీ ఎరుగని గొప్ప శిక్ష పడింది తాతరాజుకి. చిరంజీవీ ఇక నీ కథన కుతూహలంకు అడ్దులేదు. నీదైన బాణీలొ దూసుకుపో. నీ బాల్యాన్ని తవ్వి పోగెట్టు. బొలెడన్ని కథలు పుడతాయి. కొంచం సీరియస్‌గా శ్రద్ధగా మనసు పెట్టు. నీకు కథాలోకం జేకొడుతుంది. అభినందనలు.
నేను డాక్టర్‌ని, ఇంకా రచయితని కూడా కాబట్టి యెంత ప్రయత్నించినా నిశ్శబ్దంగా ఉండలేక రాస్తున్నాను. ప్రిస్క్రైబ్ మ్యారేజ్ అని గైనకాలజిస్ట్ రాయదు. రాయకూడదు. వ్యక్తిగతంగా సలహా ఇస్తే ఇచ్చి ఉండచ్చు. పెళ్ళి కాకపోవడం జబ్బులకి మూలమని ప్రి మెన్స్ట్రూల్ టెన్షన్ తగ్గుతుంది అని ఒక అభిప్రాయం ఉన్నది కాని అది కరక్ట్ కాదు. చీటి మీద బరువు యెత్తు జబ్బు వివరాలు రాయడం ఇండియాలో సాధారణం. అమెరికాలో అది గోప్యంకావచ్చు.ఈ వివరం తప్ప ఇక కథలో యే లోపం లేదు. ఇది ఆ వ్యక్తి మానసిక సాంఘిక సమస్య. కాని యెంతో మంది వివాహం కాని స్త్రీలు ఉన్నారు. వారికి ఇలా పెళ్ళీ పిల్లలు పరిష్కారం అని చెప్పి చీటి మీద రాయడం యే డాక్టర్ చెయ్యదు. చెయ్యకూడదు. మందుల చీటి చూసి నవ్వే మందుల షాపు వాడిని అసభ్యప్రవర్తనకి లైసెన్స్ తీసేయచ్చు. కాని, ఇది కథ కదా, అలా జరగకూడదని యేమీలేదు.
రవి కారుమంచి: అడిగారు కనక చెప్తున్నా. కధా వస్తువు అద్భుతం. కానీ కధలో రాసిన పదాలు, కధలో ఆవిణ్ణి చూపించిన విధం నాకు పెర్సనల్ గా నచ్చలేదు. [డిస్-క్లైమర్ – నాకు నచ్చినవి అందరికీ నచ్చవు, వైస్ వెర్సా. :-)] ఈ కధలో ఆవిణ్ణి బేలగా చేతకానిదానిలా చూపించారు. రోజుకో రేప్ జరుగుతున్న ఈ రోజుల్లో అది మహిళలని అవమానించం అని నాకు అనిపించింది. మహిళలకి ఉండే పీరియడ్స్, హార్మోన్ గొడవలు, యువర్ లిబిడో, ఇంకా కొంచెం ముందుకి పోయి పోర్న్, మాస్టర్బేషన్ అనే పదాలు వాడి చెడగొట్టారు కధని. నిజమే అవన్నీ ఉన్నాయి కానీ ఆ పదాలు వాడక్కర్లేకుండా ఇంకా హుందాగా చెప్పొచ్చు కధని.
చివరిగా మనసులో అనిపించిన మాట – మహిళా రచయితలే మహిళలని ఇలా చూపిస్తే ఎలా? మహిళలకి ప్రోబ్లెంస్ లేవు అని నేను అనటంలేదు. ఉన్నాయి కానీ పెళ్ళే పరమావధి, హార్మోన్స్, డాక్టర్ ఇచ్చిన కాయితం మీద ఏమి రాశాడో చూసుకోలేనట్టి బేలతనం, బాస్ ఏదైనా అంటే నోరుమూసుక్కూర్చోవడం, తనకన్నా పదేళ్ళ జూనియర్ ఏదో అంటే పొనీలే అని ఊరుకోవడం ఇవన్నీ చూస్తే కధలో అమ్మాయిని చేతకానిదానిగా చూపించారు. పదో క్లాసు చదువుకోని అమ్మాయి కూడా ఎవరైనా ఇలా అంటే మహాకాళిలాగా విరుచుకు పడుతుంది.
కింది పోస్టులో మర్చిపోయిన మరో విషయం చెప్పడం – అమరేంద్ర గారు చెప్పినట్టు జీవితం ఎంత సింపుల్ గా కావాలిస్తే అంత సింపుల్ గా మలుచుకోవచ్చు. అది మనచేతిలోనే ఉంది. నిజం. ఓ సారి వెనక్కి చూసుకుంటే ఎవరికేనా సరే తెలిసేది ఏమిటంటే – ఈ జీవితం మనది. దాన్ని ఎలా కావాలిస్తే అలా మలుచుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా ఉంది అంటే దాదాపు 90% శాతం దానిక్కారణం మనమూ మనకి తీరిన/తీరని కోరికలూను.
మొదట్లో చెప్పిన డిస్ క్లైమర్ మరో సారి చదుకోమని చెప్తూ. 🙂 శెలవు.
℞: మారేజ్ గురించి Sivasankar Ayyalasomayajula గారి అభిప్రాయం:
10/05/2017 5:07 am
మనస్సులో ఒక పల్చటి పొరలో తనలో తాను సంభాషించుకున్నట్లు ఉంది. నవీన నాగరికతకు మానసిక రూపురేఖలు దిద్ది కథగా మలచి, అవ్యక్తము కాని చిత్రాన్ని చాలా బాగా చిత్రించడానికి ప్రయత్నించారు. కథ బావుంది. చదువుతూంటే తెలిసిన సన్నిహితురాలి కథ కళ్ళ ముందు ప్రతిబింబించింది.
ఈ శ్లోకానికి సరియైన సాంకేతికార్థము విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య సురభి లోని వ్యాఖ్యానము చూడండి. విష్ణు పదానికి విశ్వవ్యాపకుడన్న అర్థమే చెప్పుకోవాలి.
గణపతి ఆరాధన తంత్ర శాస్త్రానికి సంబంధించినది. కుండలినీ శక్తి మూలాధారమునుండి ఊర్ధ్వగతిలో పయనించడానికి మొదట నున్న ఆటంకమునే గణపతిగా భావించి స్తుతించినారు. పార్వతి స్నానము చేయబోతూ గణపతిని ద్వారపాలకునిగా నియమించినదన్న కథ కూడా ఈ తత్త్వానికి సంకేతమే. (సరియైన వివరములు యోగా వ్యాసకులు, దేవీ ఉపాసకులు మాత్రమే చెప్పగలరు.)
శ్రీశంకరుల కాలానికే – అనగా 7వ శతాబ్దానికి పూర్వమే – గాణాపత్యము తాంత్రిక సాధనలలో సనప్రసిధ్ధమైనది. షణ్మత స్థాపకులుగా శంకరులు సంస్కరించిన ఆరు మతాలలో గాణాపత్యము కూడా ఉన్నది.
వేదాలలో సంగ్రహంగా చెప్పబడిన ఉపాసనలనుండే పురాణకాలంలో దేవతలకు మూర్తి కల్పన జరిగింది. అందులోనూ గణపతి, స్కందుడు, ఆంజనేయుడు, నరసింహస్వామి వంటి కొందరు కేవల మంత్ర స్వరూపులుగా ఉపాసింపవలసినవారు.
కథారూపంలో వ్రాసిన పై వ్యాసంలో సరియైన పరిశోధన చేసినట్లు కనిపించదు. It is not proper to deal with serious topics in a casual manner, without seeking guidance from the learned scholars in relevant field.
భూభ్రమణ కాంక్షను గొప్పగా పరిచయం చేశారు సార్. పుస్తకాన్ని చదవాలనే అతృతను సమీక్ష ప్రారంభంలోనే కలిగించారు. యాత్రా సాహిత్యం పట్ల గొప్ప అవగాహన ఉన్న మీరు పుస్తకాన్ని అద్భుతంగా పరిచయం చేశారు. భ్రమణం అందరికి సాధ్యపడదు. సాధ్యపడినవారి అనుభవాలు సాహితీ లోకానికి చాలా అవసరం. రచయుత ఆదినారాయణగారు అభినందనీయులు.
సురేశ్ గారు, చదువరులకు ఎర బాగా వేసారు. రెండవ భాగం కోసం ఎదురుచూస్తున్నాను.
ఒక ప్రక్క అమాయకపు భక్తి, మఱొక వైపు తార్కిక యుక్తిని తెలివిగా నిలిపారు. ఇందులో ఎవరి వాదన గెలుస్తుందనేది అప్రస్తుతం అని నేను భావిస్తున్నాను. శ్లోకాలు, అందునా బాగా ప్రాచుర్యం పొందినవి పూర్వపు కవులు తమ కావ్యాలలో అప్పుడప్పుడు వాడుకొనేవారో, లేక తరువాత తరం వారు జోడించేవారో నాకు తెలియదు. అయితే రామరక్షాస్తోత్రం చదివితే అందులో అందమైన కొన్ని శ్లోకాలు వేఱుచోట్ల కనిపిస్తాయి. శుక్లాంబరధరం, ఓం గణానామ్ శ్లోకాలూ ఇదే విధంగా ప్రయాణం సాగించి యుండవచ్చు. స్థూలభావానికి దూరం కానివి, కొన్ని సందర్భాలలో స్తోత్రానికి అందం తెచ్చేవి ఇలా పలుచోట్ల దర్శనమిచ్చేవిగా వెలసియుండవచ్చు. ఏది ఏమైనా, ఒక మహత్తరమైన ఊహాకారుని అంతర్మథనం నుండి వెలువడి, ఆకర్షణీయోచ్ఛారణ అందమై, ఛందోగమనము నడకయై, భక్తిభావము ఆత్మయై పుట్టిన అటువంటి శ్లోకాలు వందల సంవత్సరాలు నిలిచి మనకు చేరినాయి. అది మన భాగ్యము, పూర్వకవుల గొప్పదనము.
ఉత్తర భారత్ దేశం, హిమాలయాలు, అండమాన్, అమెరికాల మీ యాత్రానుభవం రచనల / పుస్తకాల ద్వారా మాకందించిన ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ!
విశాఖ వాస్త్వులు ప్రొఫెసర్ ఎం. ఆదినారాయణ గారి “భూభ్రమణ కాంక్ష” (యాత్రా అనుభూతుల పుట్ట, హృదయ స్పందనల పుట్ట) పుస్తకానికి మీ సవివరణ, సహృదయ సమీక్షకు కృతజ్నతలు. ఇది అందరూ తప్పక చదవవలసిన పుస్తకం.
ఆదినారాయణ గారిని “పాదాచారి” అని ఆప్యాయంగా పిలుచుకుంటారని త్రిపుర గారి సొదరతుల్యుడు విశాఖ డా. అత్తలూరి నరసింహరావు గారి ద్వారా తెలుసుకున్నాను.
“భూభ్రమణ కాంక్ష” పుస్తకం తెప్పించుకోవటానికి నవోదయా బుక్‌హౌజ్, కాచిగూడ, హైదరాబాద్ వారి వెబ్ లింకు యీ క్రింద :
1987 జున్ జులై రొజుల్లో ఎడ్మంటన్‌లో ఒక సమావేశానికి వెళ్లి, వెనువెంటనే (ఫ్రెంచ్ కెనడా) లవాల్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ శాఖలో అతిథిగా గడిపాను. ఎండాకాలంలో అక్కడి పగళ్ళకు రాత్రంటూ ఉండేది కాదు. నిద్ర వచ్చేది కాదు. పైగా అటూ ఇటూ పరుగులు తీస్తున్న కార్ల చక్రాల చప్పుడు విశాఖ పట్నపు సముద్రపు రొదలాగా చెవులకు చుట్టుకొనేది. ఎడ్మంటన్, కుబెక్, మాంత్రేల్ అన్న మాటల్ని ఇంగ్లిష్ లిపి లోనే ఉంచుతూ “కుబెక్‌లో పడుకున్నా చెవుల్లో బంగాళా ఖాతం రొద, మాంత్రేల్‌లో జెట్ దిగి కాబ్ కోసం పరుగెడుతున్నా ఎల్లమ్మ తోటలో బస్సు దిగి చిత్రాలయకు పరుగెడు తున్నట్టే, ఎడ్మంటన్ చిన్నది ఎన్ని సమ్మర్ల పాటు ఎండలో తదిసినా తెలుపు తెలుపేగాని నలుపు కానట్టు గతాగతాల మధ్య గ్రంథులు విప్పలేనివాణ్ణి, నీవీ మోక్షణ వేళ వస్త్ర మూల్య పరీక్షణం నేర్పిన పాఠశాల విద్యార్థిని… అంతరిక్ష నౌక లోంచి అమాతం తన్నినా సూటిగా వచ్చి బూరెల బుట్టలో పడేవాణ్ణి” అంటూ ‘అంతర జాతీయం’ అని ఒక కవితతో – శ్రీ ఫురాణం సుబ్రహ్మణ్య శర్మ, సంపాదకులు, ఆంధ్ర జ్యోతి వార పత్రిక,విజయవాడ, ఏ.ఫ్. ఇండీయా. అన్న చిరునామాకు – తః తః గా ఒక ఎన్వలప్ పొస్ట్ చేశాను. ఈ విషయం మరిచే పోయాను. ఆగస్టు నెలలో అంధ్ర విశ్వకళా పరిషత్ టీచర్స్ క్వార్టర్స్ లో ఇంటికి వచ్చేశాను. ఆంధ్రజ్యోతి 1987 అక్టోబర్ 2 సంచిక పోస్ట్‌లో ఇటికి వచ్చింది అందులో -ఇంగ్లిష్ లిపి లోవన్నీ తెలుగు లిపిలోకి మార్చబడి- ‘అంతర జాతీయం’ తః తః*.
శ్రీరమణ గారికి నమస్కారాలతో
తః తః
* కవిత కేవలం గుర్తు మీద రాశాను . ఆ సంచికను పారేసుకుని దశాబ్దాలు గడిచి పోయాయి. తః తః గా రాస్తున్న నేను అక్టొబర్ 2-3ల మధ్య పుట్టాను. ఆశ్చర్యం! తః తః పుట్టుక కూడా అక్టొబర్ 2)
పాట ఒకటి… గురించి దడాల వెంకటెశ్వరరావు గారి అభిప్రాయం:
08/09/2017 7:02 am
మొదలూ చివరా కాని రెండు మూడు పదాల పరదా చాటు నుండి దొరికీ దొరక్కుండా దాగుడు మూతలాడుతూగుర్తుకొస్తున్న ఆ పాట ఒకటి ఏమిటొ వినాలని ఉంది.
మీరా (1947) సినిమా హిందీ వర్షన్ టైటిల్స్ లో సుబ్బులక్ష్మి పేరును ‘శుభలక్ష్మి’ అని మార్చి వేశారు. హిందీ ప్రాంతం వారికి ఆమె పేరును సన్నిహితం చేయటానికి అలా చేశారట. అలాగే ఈ పుస్తక రచయిత్రి పల్లవి కూడా తెలుగువారికి ఆత్మీయంగా ఉండటం కోసం ‘సుబ్బలక్ష్మి’ అని రాశారు.
నవల్లో ఆ పేరును అలా వాడటంపై విమర్శ/ అభ్యంతరం ఉంటే అది వేరే సంగతి. కానీ అంతమాత్రం చేత పుస్తకానికి రచయిత్రి పెట్టిన టైటిల్ నూ, కొటేషన్లలో వాడిన పేరునూ కూడా సంపాదకులు ఈ సమీక్షలో సవరించటం సరి కాదు కదా!
[పుస్తకం పేరు సవరించటం అనాలోచితంగా జరిగిన తప్పు. క్షమాపణలు. సరిదిద్దాము – సం.]
వారి అసలు పేరు సుబ్బులక్ష్మే. కాని పలికేటప్పుడు ఏ కొద్దిమందో తప్ప, ఆమె భర్త తో సహా అందరూ ‘సుబ్బలక్ష్మి’ అనే పలుకుతారు.ఇక తెలుగు వారికి ఆమె సుబ్బలక్ష్మే. ఆమెను సుబ్బలక్ష్మి అని పిలుచుకునటములో వుండే ఆప్యాయత,చనువు, నాకు సుబ్బులక్ష్మి అనే పిలుపులో అనుభవం కాలేదు. అందుకే ప్రేమతో సుబ్బలక్ష్మి.
పుస్తకం లోపల కొన్ని చోట్ల వారి పూర్తి పేరు తెలుపుతూ సుబ్బులక్ష్మి అని వ్రాశాను.
శ్రీవిద్యా సరస్వతీ ప్రత్యక్షావతీర్ణమూర్తులైన డా. యెర్నేని లైలా గారు, శ్రీమదిత్యాది శ్రీమాన్ తిరుమల కృష్ణదేశికాచార్యులవారు, శ్రీ కల్లూరి భాస్కరం గారు నా యందలి దయతో వ్రాసిన అభిప్రాయవాక్యాలకు కృతజ్ఞుడనై వారి సహృదయతను అభిష్టుతింపగల తుల్యవచనికలు లేక – ఇంతకాలం సమాధానం వ్రాయక – మూకీభావం స్వీకరించి మనస్సులోనే వారికి వేవేల కైమోడ్పులను సమర్పించుకొన్నాను. ఏవేవో నైమిత్తికవికల్పాల వల్ల అప్పటి సమాధితోడి మనఆనుకూల్యం సిద్ధింపనందువల్ల వ్యాసాన్ని యథోద్దిష్టంగా పూర్తిచేయలేకపోయినందుకు వారికి, ‘ఈమాట’ పత్త్రికానిర్వాహకమండలికి నా క్షమార్పణను విన్నవించికొంటున్నాను.
“పరిమి శ్రీరామనాథ్ June 1, 2017 11:40 am – శ్రీ లైలా గారికి, ఈ చిత్రణ కి విశ్వనాథ వారి కల్పవృక్షం ఆధారము.”
Thank you.
విశ్వనాథ సత్యనారాయణ “నేను కల్పవృక్షంలో అచ్చంగా వాల్మీకినే అనుసరించాను” అంటారు. కానీ కొన్నిసార్లు అతిక్రమించాను అనీ అంటారు. వాల్మీకం తో విభేదించిన అట్టి ఒక సందర్భం ఇది కాబోలు.
విశ్వనాథ తను రాసిన రామాయణ బాలకాండలో, ధనుస్సు ప్రకరణంలో; బాల్య యౌవనాల సంధి (teenage) సమయంలో బాల బాలికల లో ఒకరి పట్ల ఒకరికి ఉండే సహజమైన కుతూహలం, శృంగార భావావిర్భావం, ప్రపంచంలో అన్ని ప్రాణులకూ అంతర్గతమైన మిధున కాంక్ష, అక్కడి రెండు మూడు పద్యాలలో చక్కగా చూపించాడు.
పన్నెండేళ్ల రాముడు సభలో విల్లు ఎత్తేముందే, మేడ పైన అలికిడి విని, అటు చూపు సారిస్తే, రామునికి పూర్ణ చంద్రుని వంటి సీత ముఖం కనిపించింది. ఆ పైన అతనికి బాహ్యస్పృహ లేదు. ఎప్పుడు హరుని విల్లు ఎత్తిందీ, నారి బిగించిందీ, పెట్టెలోంచి తీసిందీ, బాణం ఎక్కుపెట్టిందీ, అతనికి తెలియదు. అతని చూపు సీత ముఖం మీదే ఉండింది. విల్లుని కూడా తన చూపుకు అడ్డం రానీయడు. విల్లు ఫెళ్లున విరిగినాకే, ఆ ధ్వనికే రాముడికి పరిసరాలు తెలుస్తాయి. – అని విశ్వనాథ కవి వర్ణించినాడు.
Sure. I like that. My thoughts after reading:
1. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు శివుని విల్లు చూపించటానికే వారిని మిథిలకు తీసుకొస్తాడు. రామునికి శివుని విల్లు చూడాలనే ఉంది. విల్లు చూపించమని అడిగినప్పుడు, జనకుడు విల్లు ఎక్కు పెట్టినవాడికి సీతనిచ్చి వివాహం చేస్తాననటం రాముడు విన్నాడు కదా. ఆ రాత్రి విడిదికి తిరిగిపోయినప్పుడు అతని మనసంతా ఆ ఆలోచన ఉండదా? అతనికి కలవరం కలిగించదా? బాలుడు రాముడు శృంగార భావం అంకురించిన వాడే కాక, వివేకి కూడా అనిపించాడు.
Even though Rama is interested in the bow of Siva, as any sportsman does, it will be foolish to attempt the feat if he does not want to get married to Sita. If he does not like her, is there any point in competing? Just to show off his strength, why get stuck with a prize he does not want?
The fact Rama and Sita see each other, even if it is for an instant, is nice. Seeing Sita gives Rama the incentive to take the challenge. That Rama notices Sita’s interest in him, and he in turn is equally attracted, pleases the world that there is more than showing valor involved in stringing the bow of Siva. The world always loves Lovers.
శ్రీరామనాథ్ గారి పద్యం లోని ఊహలో – రాముడిని సీత తన ఆలోకనంతోనే ముందే గెల్చుకున్నది. ఆమె తనపై ఆసక్తి నేత్రాల ద్వారా ప్రదర్శించినందున, అతడు సభాసదులకోసం తన వీరత్వం చూపించి, సీతను గెలుచుకున్నాడు. ఆ సుందర దృశ్యాన్ని తాను చూస్తూ, అట్టి ఆనందరాముని ఇప్పటి ఈ కవి ధ్యానిస్తున్నాడు. How very nice!
With interest in sports, the following comment.
Sportsmen do want to show off their talents to entire audience. Often more to their fans in the audience. But sometimes, a single person in the audience may mean much more to a sportsman. It is said the Tennis player Jimmy Connors played so much better, when Chris Evert is in the audience. She was a rising young tennis star, and he a young player, was competing to rise in her eyes.
With interest in movies the following comment.
In the movie “A Good Year” (Based on Peter Mayle’s novel) there is a scene between two teenagers near the swimming pool in an Italian Vineyard home. The pretty young lady swims across the pool, to plant a kiss on the young hero, and says in his ear – “pardon my lips, they find pleasure in the most unusual places.” To me it is the best sensual scene of the movie. The thumping and heaving done in adult love scenes, did not gain them no.1 place, in my eyes.
Well, the readers of eemaata know already, I am a die-hard romance fan. And I love beautiful scenery, I love sport, so I love Ramayana, like I love the movie A Good Year.
2. హాస్య రసానికి ఉదాహరణంగా ఇచ్చిన శ్రీరామనాథ్ గారి 7 వ పద్యం లోని విషయం గురించి:
విశ్వనాథ తన ‘కల్పవృక్ష రహస్యములు’ పుస్తకం లో అనుకోటం; రాముడెప్పుడూ తన భార్యను జానకీ, వైదేహీ, మైథిలీ – ఇలా పిలుస్తాడే కాని ‘సీతా!’ అని పిలిచేవాడు కాడని. ఆమె బ్రహ్మర్షుల ఇంటి బిడ్డ అని రాముడు గౌరవిస్తాడు, అని ఆయన భావన.
మరి హాస్యానికైనా సీత జన్మ వృత్తాంతము రాముడు ఎత్తుతాడా? ఆమె జనకుడి కూతురు కాదనీ, ఎక్కడో దొరికితే తీసుకొచ్చి పెంచుకున్న పిల్ల అని ఆమెకు వ్యధ కలిగిస్తాడా? తన పద్యంలో, శ్రీరామనాథ్ గారు హాస్యానికి ఉదాహరణగా సీతారాముల పుట్టుకలే ఇస్తిరి. అలా ఒకరినొకరు వారి పుట్టుకల లోని unusualness/ aberrations ని గూర్చి దెప్పుకునే భార్యాభర్తలా సీతారాములు! అని విశ్వనాథ ధోరణిలో ఒక ఆలోచన కలిగింది.
ఆలోచించాక నాకైతే, బాగుందనుకోండి. ఎందుకంటే భార్యా భర్తలలో ఒకరికి నిక్కు, ఇంకొకరికి న్యూనత ఉంటే, అదెలాటి సంసారం? ఇద్దరూ సమాన ఫాయీగా ప్రవర్తించగలగాలి. ఎవరి లోనూ అంత ఘనమేమీ లేదని, ఇద్దరూ, తమను గురించి నవ్వుకోగలగాలి. కాదా!
SriRamanath, Thanks for giving the opportunity to read your poetry. Appreciate it. Have a nice summer!
Lyla
కోడ్ కూలీ గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
06/15/2017 3:34 am
కథ బాగుంది. అంతకంటే దీన్ని అనవసమైన విస్తరణలు లేకుండా సూటిగా చెప్పి ముగించటం ఇంకా బాగుంది. కాని కథలో కొంత వైరుథ్యం కనిపిస్తోంది. నోటిదురుసువల్ల ఉద్యోగం ఊడగొట్టుకున్న మనిషి ఆతరువాత ఏమీ మారలేదని సుస్పష్టంగానే కథలో కనిపిస్తోంది. కాని అంత తలబిరుసూ నోటిదురదా ఉన్న మనిషి ఒక ఉద్యోగంలోనుండి గెంటించుకొన్నాక ఎలాగ అమెరికాలో కుదురుకొని పైకి వచ్చిందని చెప్పటం ఆ పాత్రస్వభావానికి అస్సలు నప్పటం లేదు. అదొక చెప్పుకోదగ్గ లోపమేను.
నన్నెచోడుని పద్యము – పోడి, మూడు అనే పదాలలో డి కి ముందు, డు కు ముందు అరసున్న ఉన్నది. తెలుగులో సామాన్యముగా హ్రస్వాక్షరమునకు తరవాతున్న అరసున్నను నిండుసున్నగా వాడవచ్చును. ఉదా. తెలుఁగు – తెలుంగు, అనఁగా, అనంగా, ఇత్యాదులు. కాని దీర్ఘముపైని అరసున్నను నిండు సున్నగా వాడరు. కాని నేటికీ తమిళనాడులో ఇలాటి ప్రయోగాలు సామాన్యము. ఉదా. కూంతురు, రోంకలి, వాండు, ఇత్యాదులు. నన్నయ ప్రాససాంకర్యము చేయలేదు. అంటే అరసున్న ఉన్న పదాలను లేని పదాలను ప్రాసలో వాడలేదు. కాని తమిళ సంపర్కము ఉన్న నన్నెచోడుడు దీర్ఘముపైని అరసున్నను ప్రాసకై సున్నగా వాడాడు. అందువల్ల పోఁడి పోండి, మూఁడు మూండు ఐనది.
బావుంది. ఇంతవరకు ప్రచురించబడిన యాత్రా పుస్తకాల పట్టికను ఒక అనుబంధముగా ఇవ్వడానికి సాధ్యమవుతుందేమో?
“రాజశేఖర చరిత్రము, కన్యాశుల్కం ఆ మొదటి రచన హోదాని పెద్ద అభ్యంతరాలు లేకుండానే సంతరించుకొన్నాయి.”
తెలుగులో మొట్ట మొదట వ్రాయబడిన అసంపూర్ణ నవల కొక్కొండ వేంకటరత్నము పంతులుగారి “మహాశ్వేత”. పూర్తిగా ప్రచురించబడిన నవల నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టిగారి “శ్రీరంగరాజ చరిత్ర” (ఆధారము- గిడుగు సీతాపతి). కోరాడ రామచంద్రశాస్త్రిగారి “మంజరీ మధుకరీయము” తొలి నాటకము. కాని దీనిని ఎన్నో ఏండ్ల పిదప ప్రచురించినారు. మొట్టమొదట ప్రచురించబడిన నాటకము పంతులుగారి “నరకాసుర విజయము (లేక వ్యాయోగము)”. రాజశేఖర చరిత్ర, కన్యాశుల్కము వీటికి పిదప అని అనుకొంటాను.
నేను ఉస్మానియాలో చదువుకునేటప్పుడు అసదృశవాఙ్మిశేఖరులు, త్రిభాషాపండితులు బ్రహ్మశ్రీ దివాకర్ల వేంకటావధానిగారు పాఠం చెప్పేవారు. వారు యశఃకాయులైన తర్వాత అట్టివారెక్కడను లేరే యను అసంతృప్తి నా మనస్సులో నొకమూల నెలకొని ఉండేది. కాని, మురళీధరరావుగారి వ్యాసపరంపరలను చూస్తున్నకొలది ఆ అసంతృప్తి క్రమక్రమంగా అపాకృత మగుచున్నది. శ్రీ మురళీధరరావుగా రీవ్యాసంలో చూపిన ఉపపత్తులకు మూలమైన నైకదేశస్థములైన ఇన్ని ముద్రితాముద్రితగ్రంథప్రతులను వారెట్లు సేకరించి చూచినారో నాకు అత్యాశ్చర్యకరముగా నున్నది. వివిధవిషయముల నిర్ధారణకు వారు చూపిన ఆధారముల పరంపరలు నాబోటి అజ్ఞానులకు కనువిప్పు కల్పించుటయే కాక, సాహితీరత్నాకరాన్వేషులగు ఇతరపరిశోధకులకు నౌకాదండములవంటివగు ననుటలో సందేహము లేదు. సుబంధుని ప్రభావము నన్నయశ్రీనాథాద్యనేకాంధ్రకవులపై నున్నట్లు తెలుపుట ఒక నూతనావిష్కృతి. ఉభయభాషాసాహితీపాండిత్యమున్న ఉత్తమపండితులకే ఇది సాధ్యమగును. అన్నిటికంటే ఈ ఆవిష్కరణము నా కత్యంత మనఃపరితుష్టికారకమైనది. ఇవి నేను పైపైన చదివి వ్రాసిన పంక్తులు. ఈ వ్యాసాన్ని ఇంకను ప్రగాఢంగా చదివి బాగుపడవలసిన అవసరం నాకున్నదని విన్నవించుకొనుచున్నాను.
I am so looking forward to the June issue of eemaata, and the next part of this essay.
మురళీధరరావుగారి ఇక్కడి రచనలకు ముందు నేను తెలుగు సాహిత్యం ఎలాటిది చదివాను, చదివినా అది ఎలా చదివాను అని నేను ఆలోచించుకుంటుంటాను. ఇప్పుడు మరోరకమైన సాహిత్యం చదువు మొదలయిందేమో. పోనీలే మొదలయ్యింది కదా అని సంతోషిస్తున్నాను.
ఈ వ్యాసం మొదటి భాగం నేను చాలాసార్లు చదివాను. చదివినప్పుడల్లా, వ్యాసాన్ని గురించి ఏదో ఒక అభిప్రాయం రాసుకుంటూనే ఉన్నా. నా ఆసక్తి, అభిప్రాయాలు నేను చదివే ఇతర పుస్తకాల వల్ల/పట్ల కూడా మారుతూ వచ్చాయి. ఉదాహరణకు రష్యన్ షార్ట్ స్టోరీ 150 సంవత్సరాల చరిత్ర చదువుతున్నప్పుడు – ఆఖ్యాయిక, కథ అన్న విషయం మీద, వాటి నిర్వచనాల మీద ఎక్కువ శ్రద్ధ కలిగింది. అందుకని మళ్లీ వచ్చి చదివాను.
I was learning the words – roman (novel), povest (tale), skazka (folk tale) rasskaz (short story), and their changing meanings, from Charles A. Moser (George Washington University,) who wrote a 24 page introductory essay – ‘Introduction: Pushkin and the Russian Short Story.’ He considers Alexander Pushkin’s year 1830 ‘Tales of Belkin,’ are the foundation for subsequent development of the genre of short story. He also indicates, Russian literature itself moved more towards ‘prose form’ from then on.
A partial quote of a 19th century critic, Vissarion Belinsky “for if there are ideas of time, there are also forms of time” grabbed me.
మురళీధరరావు గారు ఏం రాసారు ఈ వ్యాసంలో, ఆ విషయం ఇందులో ఉండొచ్చా, ఎందుకిన్ని విషయాలు ఒకచోట! అనేవి నా కొక సమస్య కాదు. ఏ రచన లోనూ నాకలాటి పట్టింపంత లేదు. It just does not bother me. Perhaps that is why I am a big fan of Milan Kundera. God bless him, M.K talks whatever he wants, breaks where ever he feels like. That’s perfectly fine with me. This essayist does not wander half as much as Kundera.
మురళీధర రావు గారి ఈ రచనలు కేవలం ఏదో ‘విషయానికి’ సంబంధించినవేనా? వారి భాష సంగతి ఏమిటి? ఆయన భాష, నాకు ప్రవేశం లేని ఒక మాయ భాష. ఐనా గాని, ‘ఏల్చూరి’ ని – అబ్బే! ఎవరికీ అర్థం కావటం లేదండీ. ఒక పది మందిని కనుక్కున్నా, వారికీ ఏం బోధ పడటం లేదట. అందరికీ అర్ధం అయేట్టు రాయండి – అని ఎవరైనా అన్నప్పడు నాకు మనస్తాపం కలుగుతుంది. ఈయన ఈ మాయ భాష రాయటం మానేస్తాడేమో, మేమంతా రాసే దిక్కూ దివాణం లేని భాషకు దిగిపోతాడేమో, దేవుడా! ఏమిటి దారి! అని నే చేతులు పిసుక్కుంటుంటాను. మరి, ఆయన భాష కోసం కూడా నేను చదువుతున్నా. చదవాలి. అర్థం చేసుకోగలగాలి. ఎన్నాళ్లకో కొన్నాళ్లకు. Hopefully. కాని, గమనించుకుంటే, ఈ వ్యాసాల్లో (నా సాయంకాలం వ్యాహ్యాళి లాగానే,) మొదట్లో కన్నా తక్కువ సమయంలో ఎక్కువ దూరం నడవగలగుతున్నా. అంతగా రొప్పటంలేదు. ఆయాసపడటం లేదు. కొంచెం ఎక్కువ పరిసరాలు ఆనందిస్తున్నా. Sincerely, I am a better reader of this author than before.
ఈ రచయిత పాఠకులు ఏమీ తెలియనివారు అనుకోడు. అన్నీ తెలిసినవారు అనీ అనుకోడు. పాఠకులను బేరీజు వెయ్యటం ఈయన పని కాదు. ఏదో సెలెక్ట్ ఆడియన్స్ కోసం రాయడు. విశ్వనాథ లాగా, పాఠకుల మీద వ్యంగ్యాస్త్రాలు వెయ్యడు. పాఠకులూ, మీకన్నీ తెలుసు, ఇది మీకు చెప్పక్కర్లేదు అనడు. ఇక్కడ కాదు, ఈ విషయం మరెక్కడో చెపుతానని దాటవేయడు. ఎక్కడ వివరించితే సందిగ్ధం లేకుండా పాఠకుడు చదువుకోగలడో, అక్కడికక్కడే ఆ విషయ వివరణ జరుగుతుంది.
Elchuri explains sometimes a poem in great detail, breaking it down to word level. Sometimes opens up the meaning of the poetry, by putting it into context with other poets, others’ thoughts. Basic and advanced teaching is accomplished side by side. It is a very effective, intelligent teaching. His reader need not go down a long list of references at the end of the essay, either. All required material is integrated into the essay.
Pardon me for comparing this writing style, with a meticulous demonstrative dissection by an anatomy instructor, or vivisection by a skilled surgeon – wherein they lay open a nerve, or a vessel or a muscle which ever that particular lesson is supposed to lay bare, and display. I am partial to such clear studies.
Also bear with me, for bringing up the name of the multidimensional artist Salvador Dali, who gives us the stereoscopic vision as in the oil painting of “Dali’s hand drawing back the golden fleece in the form of a cloud, to show Gala the Dawn, Completely nude, very, very far away behind the sun.” It is not easy to give infinite depth to a drawing or writing.
ఉండాలి. ఏల్చూరి లానే, రచయితల్లోనే, రచయితలను Clarify చేసే వాళ్లుండాలి. Harold Bloom – Whitman, thru Emerson, Eliot thru Whitman and Tennyson, Dickenson thru Shakespeare, –ఎందరెందరి కవుల lineage లు, అమ్మా నాన్నల DNA తో సంబంధం ఇంత కూడా లేని, మరోవిధమైన వారసత్వాలు, మానసిక, మేధా బాంధవ్యాలు తెలుసుకోటంలో ఎంత సహాయం చేస్తాడు! బ్లూమ్ గాని వారి మాటలు విప్పి చెప్పకుంటే, ఆ రచయితలు ఆ రచనల్లో, ఏమంటున్నారో ఎందుకంటున్నారో, ఏమీ తెలియక, ట్రావెల్ గైడ్ లేని విదేశీ టూరిస్ట్ లాగా, ఎంత విజ్ఞానంతో వెళ్లానో అంతే సుజ్ఞానంతో మరలి వస్తాను గదా.
I will be so lost without good writers and critics! Luckily there are. Hence, Life is gorgeous. – Lyla.
[The second part of this essay will come in the July issue – Ed.]
అదీ కాక, సాహిత్యం చక్కగా అర్థం అయ్యేవారికి, ప్రతి సారీ అర్థాలిస్తే, అట్టి పాఠకులకు రసభంగమవుతుంది. చేయరాదు. పైగా, ప్రతిసారీ రచయితను ప్రశ్నించితే వారికి ధ్యానభంగమవుతుంది. అది మహాపరాధం. ససేమిరా చేయరాదు.
చూశారుగదా, నేను ఇక్కడ ప్రశ్నలు వేసిప్పుడు, పత్రిక మూలపురుషులు వచ్చి, రచయితలను వారి టైమ్ నాలాటి వారి మీద వేస్ట్ చేసుకోవద్దని చెప్పారు. రచయితల సమయం విలువైనదట! మరి నా సమయం? మరి కొందరు, ఆ రచయితలేదో తపస్సులో ఉన్నారనీ, వారు తలదించుకుని ఎత్తిన ఘంటం దించకుండా సాహిత్యం రాసేస్తుంటే నేనేదో వారి ధ్యానం భంగం చేసే …చలో జానే దో.
కాని, మళ్లీ ఈ రచయితలే దేవుడో! నా రచనలు ఎవరూ చదవటల్లేదు అని కుములుతుంటారు. వారికి మళ్లీ కళ్లూ ముక్కూ తుడిచి, ధైర్యం చెప్పటానికి కొందరొస్తారు.
ఇది అక్షరాలా నిజమండి. ఆ మధ్యన నేను కామెంటు పెడితే ఒకాయన అన్నారు “ఇలాంటి కామెంట్లకి సమాధానం చెప్పడం ఎందుకండీ, వాటి మొహం మీదే ‘నన్ను పట్టించుకోవద్దు’ అని రాసి ఉంటే?” ఆయనకి, ఆయన్ని కలిసిన, తెలిసిన వారికీ ధ్యాన భంగమైంది పాపం. ధ్యాన భంగం అయి ఏడిచినది ఒకరూ ఆయన కళ్ళూ ముక్కూ తుడిచేది మరొకరూ! డబ్బా కొట్టేవాళ్ళు “మా-త్ర-మే” కావాలనుకుంటే సరే. వేమూరి వారు ఓ సారి ఎక్కడో రాసినట్టు గుర్తు – నీ రాతల్ని చీల్చి చెండాడే వాడే నీ నిజమైన స్నేహితుడు అని వాళ్ళ గ్రాడ్యుయేట్ స్కూల్ ప్రొఫెసర్ గారు అన్నారుట. అవి వీళ్ళకి అఖ్ఖర్లేదు. ధ్యాన భంగం అయితే వారు మహా పురుషులు కనక విశ్వామిత్రుడిలా శపించనూ గలరు లేకపోతే వశిష్టుడిలా దిగమింగుకుని క్షమించనూ గలరు. లేకపోతే జాన్ గ్రిషాం రాసిన పెలికాన్ బ్రీఫ్ నవలకీ తెలుగులో మిస్సమ్మ సినిమాకీ పోలికలతో మరో ఖంఢకావ్యం రాసి సాహిత్యలోకం మీద వదలనూ గలరు. శెభాషు.
ఏది ఏమైనా మీరు నిర్భయంగా చెప్పినందుకు మిమ్మల్ని అభినందించవల్సిందే.
వ్యాసాన్ని సవిమర్శంగా చదివి ఎంతో ఔదార్యంతో లేఖ వ్రాసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదృతి నిండిన మీ వాక్యాలు నాకెంతో ధైర్యాన్నిచ్చాయి.
మీరు పేర్కొనక మునుపు నేను An imperial history of India in a Sanskrit text ను చూడలేదు. ఇప్పుడు డౌన్ లోడ్ చేసికొన్నాను కాని, ఇంకా అధ్యయన చేయవలసి ఉన్నది. పైపైని చూస్తున్నప్పుడు ‘మంజుశ్రీమూలకల్పము’లో నేను వెతుకుతున్న మరొక సమాచారం కూడా లభ్యమై, ఎంతో సంతోషం కలిగింది. అందుకు కూడా మీకు హార్దిక ధన్యవాదాలు!
‘వాసవదత్తా కథ’లో “తత్ర కేచిత్ కలాఙ్కురా ఇవ విజితనగరమణ్డనా” అన్న ప్రస్తావన ఉన్నమాట నిజమే. శివరామ త్రిపాఠి తన వ్యాఖ్యలో దీనిని మూలదేవునికి అన్వయించి, “కర్ణీసుతో మూలదేవో మూలభద్రః కలాఙ్కురః” అని ఉన్న (పురుషోత్తమదేవుని) హారావళిని ప్రమాణీకరించాడు. ఇది నిమిత్తంగా సుబంధుని కాలనిర్ణయవిషయమై మీరు చేసిన సూచనను నేను తప్పక గుర్తుంచుకొంటాను.
ఈ మూలదేవుని గురించిన కొన్ని విశేషాలను ఈ వ్యాసంలో పేర్కొన్నాను.
“ఎక్కడ జూచినం జిలుకలు” అన్న దళాన్ని బట్టి చిలుక పలుకులు శ్రుతిమధురాలైనప్పటికీ ఉపాలంభనం కనుక కఠోరత ఆపాదింపబడి ఆ పలుకులు ములుకుల వంటివిగా ఆక్షేపతిరస్కృతాలైనాయని మూలానుసారితను ఊహించాను. తద్వ్యతిరిక్తమైన పక్షంలో చిలుకల సర్వాంతర్వర్తనీయతకు అన్యహేతువును నిరూపింపవలసి ఉంటుంది. కవినిబద్ధమైన కందర్పకేతుని ప్రౌఢోక్తి యందలి రోహిణీవల్లభాది స్మరణం అననురూపసంసర్గాత్మకం చేయబడి విరుద్ధకార్యోద్భావమైన ఇంద్రియక్వథనంగా పరిణమించటం వల్ల అర్థమూలకమైన అలంకారధ్వని ప్రతీయమానమని నా ఉద్దేశం. కాదు, మీరన్నట్లు అస్ఫుటవ్యంగ్యమని భావిస్తే – గాడ్పులకు ప్రాణభంజకత్వం, రోహిణీవల్లభునికి ఇంద్రియక్వథనస్వభావం ఇత్యాదిగా వాచ్య-వ్యంగ్యములు రెండింటికీ అభిన్నవాక్యగతహేతుమత్త్వం వల్ల తుల్యప్రాధాన్యాన్ని నిరూపింపవచ్చును.
ప్రవాహగతిని ఏకాంశంగా నిబద్ధమైన ఈ వ్యాసం మీ వంటి ఆత్మీయ సద్విమర్శకుల సుపరీక్షకు పాత్రమైనందున గ్రంథరూపాన్ని తాల్పక మునుపు దీనిని యథాయోగ్యంగా సవరించుకొనే సదవకాశం కలుగుతున్నది. అందుకు మీకు నా కైమోడ్పులు.
శూద్రకునిదని చెప్పబడుతున్న ‘వీణావాసవదత్తం’ అంతర్జాలంలో ఉన్నదేమో నాకు తెలియదు. దాని ఫొటోకాపీని త్వరలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వ్యాఖ్యలేవీ అచ్చుకాలేదనుకొంటాను.
Very fond of Russell’s books for general public – Marriage and Morals, why I am not a Christian, Religion and Science, etc.
The fact that I have four copies of “The conquest of Happiness” is a sure proof of my desperate need for Guru’s counsel on some sojourns away from home that I must have run to the nearest bookstore for a quick restorative.
Of course for mathematicians, it is always Nirvana, and all they need is a piece of chalk. Perhaps they don’t even need that. It was good to get a glimpse of Russell, in the movie ‘The man who knew infinity.’
About poetry “రామరసాయనము” -still struggling to understand. Almost there.
A few thoughts, before enlightenment occurs.
ఈ old style poetry కి రచయిత గాని , ఎడిటర్ గాని అర్థం విశదపర్చలేదు. పైగా ఒక్కో పద్యంలోని రసం పాఠకులను అర్థం చేసుకోమన్నారు. I think it is nice editors challenge readers to understand various hidden secrets in poetry. Certainly I like to stall my Alzheimer’s as long as possible.
అదీ కాక, సాహిత్యం చక్కగా అర్థం అయ్యేవారికి, ప్రతి సారీ అర్థాలిస్తే, అట్టి పాఠకులకు రసభంగమవుతుంది. చేయరాదు. పైగా, ప్రతిసారీ రచయితను ప్రశ్నించితే వారికి ధ్యానభంగమవుతుంది. అది మహాపరాధం. ససేమిరా చేయరాదు.
చూశారుగదా, నేను ఇక్కడ ప్రశ్నలు వేసిప్పుడు, పత్రిక మూలపురుషులు వచ్చి, రచయితలను వారి టైమ్ నాలాటి వారి మీద వేస్ట్ చేసుకోవద్దని చెప్పారు. రచయితల సమయం విలువైనదట! మరి నా సమయం? మరి కొందరు, ఆ రచయితలేదో తపస్సులో ఉన్నారనీ, వారు తలదించుకుని ఎత్తిన ఘంటం దించకుండా సాహిత్యం రాసేస్తుంటే నేనేదో వారి ధ్యానం భంగం చేసే . ..చలో జానే దో.
కాని, మళ్లీ ఈ రచయితలే దేవుడో! నా రచనలు ఎవరూ చదవటల్లేదు అని కుములుతుంటారు. వారికి మళ్లీ కళ్లూ ముక్కూ తుడిచి, ధైర్యం చెప్పటానికి కొందరొస్తారు. ఈ కొందరు రచయితలకు, బరాక్ ఒబామా లాగా వీరి legacy ఏదో భూమ్మీద వదిలేసి పోవాలనుంటుంది. వారు కారణ జన్ములనుకుంటారు. ఈ వేర్వేరు రచయితల మనోవైకల్యికామార్మికఛేదనభేదనాపేక్ష నాకెందుకు గాని, ఈ ‘రామరసాయనానికి’ వస్తే, ‘పివరే రామరసం’ అని ఎప్పుడూ తయారుగా ఉండే నేను, ప్రస్తుతానికి పద్యాలు అర్థం కానందున తన్మయం చెంది ఆంజనేయుడిలా గంతులెయ్యలేకపోతున్నా.
సాహిత్యం అర్ధ ప్రధానమైన మీడియమ్. సంగీతం ఐతే విన్న సౌండ్ కి మన ముందరి రెస్పాన్స్. భాష కూడా తెలిస్తే అప్పుడు దాని బాగు ఓగుల చర్చ. మనకు తెలియని భాషలో చెత్త రాసినా, విన్న మెలొడీకి మనం లోబడతాము. ఇతరులు కావాలంటే, మోసగించి బూతులు పాడించి నవ్వుకోవచ్చు. మనకు తెలిసిన భాష ఐతేనే, అందులో బూతు గాని, ఉచ్చారణ బాగులేదని కాని తెలిసేది. కాగితం మీద రాసి ఉన్న మాటలకు అర్థం ప్రధానం. అర్థం తెలియకపోతే చెప్పించుకుంటాము. సాహిత్యంలో అర్థాన్ని ignore చేసి, Form కి జేకొట్టే ప్రసక్తి లేదు. అంటే, పద్యం అర్థం తెలియకుండా, ఇది మంచి కంద పద్యము, ఇది చక్కని మత్తేభము అని అనే ప్రసక్తి లేదు.
నేను ఏ poetry groups లో లేను. కాని ఛందస్సు చర్చించుకునే వారు, ఒక పద్యం చదివి అందులో వస్తువు, రసం శృంగారమైతే, I feel horny, I feel like making love (not necessarily with the writer) అని ఒక్కమారూ అనకుండా, ఇందులో తతజజరభస గణాలకు నేను స్పందించి తతజజరభస లో రాస్తున్నా, అని భక్తి రస ప్రధానంగా రాస్తే , that blows my mind.
Is it humanly possible to ignore the meaning the language expresses, in whatever ‘Form’ it may be?
పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్కారములు. వ్యాసాన్ని ఆసాంతం చదివి, ఎంతో ఔదార్యంతో వ్రాసిన మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఒక్క చిన్నమాట: మహాకవులు తమ రచనలలో పూర్వులను అనుకరించిన సన్నివేశాలు విశ్వసాహిత్యమంతటా గోచరీభవించేవే. అది వారి కృతజ్ఞతకు, గౌరవభావానికి, వ్యుత్పన్నతకు, శీలితబహుకావ్యత్వానికి నిదర్శకమే గాని శక్తిలోపానికి ప్రదర్శకం కాదు. సభలలో విద్వత్సన్నిధిలో కావ్యపఠనవేళ “ఇది ఫలానా కవి శ్లోకానికి అనుసరణం” అనికూడా తప్పక పేర్కొనేవారనుకొంటాను. అందువల్లనే, అవతారికలోని పూర్వకవిప్రశంసలో తమకై వెలుగుబాటలను పరిచిన మహాత్ములను స్మరించటం జరిగేది. ఎవరి నుంచి మన మనోగతాన్ని మాటలుగా మార్చుకొనటం నేర్చుకొన్నామో, ఆ మహనీయుల ప్రభావం మనపై తప్పనిసరిగా ఉండితీరుతుంది కదా. పూర్వకవుల కవిత్వపు నీడల జాడలు తమ రచనలలో ఏ మాత్రం ప్రతిఫలింపకూడదని ప్రయత్నపూర్వకంగా అభ్యసించిన శ్రీ విశ్వనాథ వంటి మహాకవులే ఆ ప్రభావం నుంచి తప్పించుకొనలేకపోయారు.
సుబంధుడొక విశాలవటవృక్షం. ఆ నీడను ఆశ్రయింపని తెలుగు కవులు లేరు. ఆయన ఒక చల్లని ఊరబావి. అక్కడ ఊహాదాహార్తిని తీర్చుకొననివారు లేరు.
“అందచందమన్న అంతలంతలు ప్రీతి
భోగమన్న నాకు భూరి వలపె;
తెలివితేటలన్న తీరనంతటి భ్రాంతి, కాని, కరుణ కేను కరము మోడ్తు.”
Hats off Dr Yerneni : This stanza of yours ,a wonderful poem by itself,brings to my mind one of my very most favourite passages I ever read – the prologue of Bertrand Russell to his autobiography ,quoted here in appriciation of your ,let me say it again , wonderful poem !
“What I Have Lived For”
“Three passions, simple but overwhelmingly strong, have governed my life: the longing for love, the search for knowledge, and unbearable pity for the suffering of mankind. These passions, like great winds, have blown me hither and thither, in a wayward course, over a great ocean of anguish, reaching to the very verge of despair.
I have sought love, first, because it brings ecstasy – ecstasy so great that I would often have sacrificed all the rest of life for a few hours of this joy. I have sought it, next, because it relieves loneliness–that terrible loneliness in which one shivering consciousness looks over the rim of the world into the cold unfathomable lifeless abyss. I have sought it finally, because in the union of love I have seen, in a mystic miniature, the prefiguring vision of the heaven that saints and poets have imagined. This is what I sought, and though it might seem too good for human life, this is what–at last–I have found.
With equal passion I have sought knowledge. I have wished to understand the hearts of men. I have wished to know why the stars shine. And I have tried to apprehend the Pythagorean power by which number holds sway above the flux. A little of this, but not much, I have achieved.
Love and knowledge, so far as they were possible, led upward toward the heavens. But always pity brought me back to earth. Echoes of cries of pain reverberate in my heart. Children in famine, victims tortured by oppressors, helpless old people a burden to their sons, and the whole world of loneliness, poverty, and pain make a mockery of what human life should be. I long to alleviate this evil, but I cannot, and I too suffer.
This has been my life. I have found it worth living, and would gladly live it again if the chance were offered me.”
(I know this is a place is to write only on the poem,”రామరసాయనము” – my apologies to Sri Parimi )
నమస్కారాల తో
తః తః
In response to above poetry, which is still not totally understood by me;
అందచందమన్న అంతలంతలు ప్రీతి
భోగమన్న నాకు భూరి వలపె;
తెలివితేటలన్న తీరనంతటి భ్రాంతి, కాని, కరుణ కేను కరము మోడ్తు.
If you have the time, Read the following writing on రాముడు, who in my eyes is just a human being. Thanks.
*
While many events in Ramayana hold my interest, to me Ayodhya Kanda appears to be most dramatic.
It all hinges solely on one night, one night so powerful that changes the fate of an individual and thereby of several others’. In fact it could be that one dramatic night that set the tone to the entire epic and then the epic might have set a whole nation’s behavioral patterns for hundreds of years to come.
A seventeen year old Rama, the eldest son of a king is about to be the crown prince, which means he will be the future king of Ayodhya.
ఆ రాత్రి, తెల్లవారితే పట్టాభిషేకం. తండ్రి దశరథుడు – నాకు అశుభచిహ్నాలు చిహ్నాలు కనిపిస్తున్నాయి. నాకు ప్రాణాపాయం కలగొచ్చు. నేను బాగున్నప్పుడే నిన్ను యువరాజుగా చూడనియ్. – అని రాముడికి చెప్పి వసిష్ఠుడి ద్వారా సీతా రాములను ఆ రాత్రి ఉపవాసం చెయ్యమని నిర్దేశించుతాడు. నగరమంతా ఒక్క రాత్రిలో అలంకరించుకుని, జనులంతా ఎప్పుడు తెల్లవారుతుంది! ఎప్పుడు రామ పట్టాభిషేకం! అని ఎదురు చూస్తూ ఉంటారు. ఉత్సవాలకు కారణం కనుక్కున్నమంధర భగ్గున మండిపడి, కైకేయికి విషపు మాటలు చెప్పి మనసు విరుస్తుంది. రానున్న రామ పట్టాభిషేకం, ముందు శుభవార్తగా తీసుకుని మంధర మీదికి రత్నహారం విసిరిన కైక, మెల్లగా మంధర బోధనకు లొంగుతుంది. కోపగృహం చేరుతుంది. దశరధుడు కైకేయి మందిరానికి వెడతాడు. కైక అతనిని గుండె పగిలే వరాలడుగుతుంది.
ఒక్క క్షణంలో అంతా తారుమారు. రాజు కావలసిన రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చెయ్యవలసి రావటం. సుమంత్రుడు రాముడిని కైకేయి మందిరానికి తీసుకొని వస్తే దశరథుడు అతని వంకైనా చూడకుండా తలదించుకుని ఏడుస్తుంటే కైక రాముడు ఏం చెయ్యాలో చెపుతుంది.
ఎంతో విపులంగా వర్ణించబడిన ఈ ఘట్టం నాకిలా తోస్తుంది.
రాముడు అందరిచేతా ప్రేమించబడినవాడు. అతనికి ఆదరించబడటమే తెలుసు. పరుషపు మాటలు, దండన తెలిసినవాడు కాదు. అనుకోని కైక నిరాదరణ, స్వార్థం అతణ్ని గాయపరుస్తుంది. అతడు రాజ్యం కావాలనుకున్నవాడు కాదు. తలిదండ్రుల ఆనందం కోసం అతని విలువిద్యలు, చదువులు ప్రదర్శించి మెప్పించే చిన్నవాడతను. రాజకీయం మీద మోజు కలవాడు కాదు. వాత్సల్యానికి బద్ధుడు. తండ్రి నాకోసం నువ్వు రేపటికి రేపు యువరాజువు కావాలి అంటే సరే అన్నాడు. అది ఒక పెద్ద బరువు. ఎవరికి కావాలి ఆ వయసులో ఆ తగలాటం? తెల్లవారుతూనే మళ్లీ కైకేయి మందిరానికి రమ్మని తండ్రి పిలుపు. తీరా వెడితే, తల్లి కైకేయి- అబ్బే సింహాసనం కాదు, ఇప్పుడు నీకు నగర బహిష్కారం అంటే – ఇలాటి తల్లి తండ్రుల తలతిక్కల ఆలోచనలకు ఏ పిల్లవాని మనసు ముక్కలు కాదు?
Rama the favored son is repulsed by the sudden rejection by Kaika. He is repulsed by the fickleness of love. He is turned off by the sight of an old man who is controlled by a young wife. A man who could not even look his son in the face and tell him what happened. It is doubly hard for him to hear the insulting command -expulsion from the country- from Kaika instead of hearing it from his father. Kaika who says, she wants to use all the grand preparations done for his crowning, now for another son!
Rama all thru, speaks like a broken hearted youngster.
“Why are you sad father? Are you angry with me? Why would you not look at me? Have I done something wrong to displease you? Tell me what you want. I will do anything to please my father and mother.”
These are words of a broken hearted kid. What kind of a son will not be heartbroken if a parent turns against him and wishes him out of his sight and asks him to leave his house and not to return for fourteen years? He will simply do what is asked of him, out of deep hurt.
Rama then has to go to Kausalya and give her the shocking news. He then has to go tell his wife Sita who is preparing to be the future queen that he is no longer going to ascend the throne. Instead he is expelled from the country. He is quite embarrassed to give such humiliating news to his wife, who comes running to greet him as a future king. From prince to pauper in minutes. To shed all pomp and glory. To leave in shame and humiliation at the command of a step mother, to dwell in forests. Lakshmana who witnesses all, wants Ram to rebel and snatch the kingdom. But Rama won’t. He talks about Dharma, respecting his father’s command, his father’s obligation to keep his word. This and that moral and duty.
To me, all of it appears as a big show on part of Rama, who is really broken hearted by the totally unanticipated, sudden loss of affection, and horrid hostility from parents.
To me Ayodhya Kanda represents one of the great tragic life turning moments. That rejection of a parent, that broken heart of a child, that departure of Ram, Sita and Lakshman from Ayodhya – which in turn leads to the death of king Dasaradha and long miserable widowhood of repentant Kaika and other queens – is supreme pathos.
“ఎవరి మహా ప్రలోభము మంగళ తోరణములు తెగిపోయినవయ్యో!
ఆశామయ రాగాలాపనలే అంధకారమై పోయెనుగాదా! రఘురామా! రాఘవా!”
It is this young Rama, who had gripped my heart to begin with.
Lyla
P.s: The above excerpt is typed from my writing in Racchabanda – Yahoo groups dated Nov 7, 2006. These writings are done in RTS, as ground work for development of Telugu software, and to keep in touch with Telugu literature. Perhaps because of the mixed medium and upgrading of yahoo, a few writings are more unintelligible than before. Mission accomplished.
వాసవదత్త కధను సూక్ష్మముగా చిన్నతనములో చదివినా అది సుబంధ ప్రణీతమని నాకు తెలియదు. ఆధునిక విద్యాభ్యాసము వలన నా సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయము లోపభూయిష్ఠమే ! నేడు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వ్యాస పఠనము వలన సుబంధుని వివరాలు, వాసవదత్తాఖ్యాయిక పరిమళ విశేషాలు, నన్నయ శ్రీనాథ ప్రభృతుల సుబంధ కవితానుకరుణలు , వారి కవితా మాధుర్యములు తెలిసాయి. శ్రీ ఏల్చూరి వారి వ్యాసము చదివిన వెంటనే , పాండిత్యానికి అవధులు లేవని తెలియడమే కాక సాహిత్య మింత లోతయినదా, భావాంబర వీధి యింత విశాల మైనదా అని సంభ్రమము కలిగింది. శ్రీ మురళీధరరావు గారి పరిశోధన చాలా విస్తృతమైనది. వాసవదత్త ఆఖ్యాయికమా , కధా, కాక చంపూకావ్యమా అనే అంశము పై వివిధ కవివర్యులను, పరిశీలకులను, వ్యాఖ్యాతలను వారు విశేషముగా పేర్కొన్నారు. సుబంధుడి చారిత్రక వివరణ లుత్సాహముగా నున్నాయి.
వాసవదత్తను చదివి, నన్నయ శ్రీనాథుల భావానుసరణలు చూసి శ్రీ మురళీధరరావు గారు మందహాసమే , చేసారో, కొద్ది పర్యాయములు బిగ్గఱగానే నవ్వుకున్నారో వారికే తెలియాలి. చెప్పే విధానములో నూతనత్వము శోభిల్లు నపుడు , మధుర భావాల ననుకరించడములో తప్పు లేదనే తలుస్తాను. స్వచ్ఛానువాదములైనా, స్వేచ్ఛాను వాదాలైన శ్రీనాథుని అనుసరణలు, నన్నయ, తెనాలి రామకృష్ణుల ఆంధ్రీకరణలు విలక్షణతను పరిపోషించాయి. ప్రత్యక్షముగా సుబంధుని వాసవదత్తను కాని, విస్తృతముగా ఆంధ్రసాహిత్య పఠనమును చెయ్యలేని నావంటి వారికి శ్రీ మురళీధరరావుగారు ఆ కవితా మాధురిమలకు స్వీయ వాక్పటిమ, రచనా చాతుర్యములను చేర్చి చక్కని విందు సమగూర్చారు. వారి రచనలు, వ్యాసావళులు చదివే టప్పుడు చాలా క్రొత్త పదజాలము, విషయపరిజ్ఞానము కలుగుటచే నాలో విద్యార్థి భావన పెల్లుబుకుతుంది. వారికి నమోవాకములు!
ఒక వైపు తెలుగు భాష అజంత భాష అని గర్వపడుతాము. కాని పదమును అజంతముగా ఉపయోగిస్తే అందులో తప్పేమి? వృత్తాలు అనేదానికంటె వృత్తములు అన్నప్పుడు విన సొంపుగా నుంటుంది అని నా భావన. దానికి/అందులకు కారణ మేమి 🙂 ఎందుకో పిల్లిని గుఱించిన ఒక nursery rhyme జ్ఞాపకమునకు వచ్చినది నిన్న.
ఈలాటి శబ్ద తరంగాలు ‘సెలెబ్రిటీ’ మోజు ఉన్నవారి కోసం. అంతే కాని ఇవి కవిత్వ ప్రియులను, సంగీత ప్రియులను రంజింప చేయలేవు.
ఉంటుంది, మనుషులకు కుతూహలం ఉంటుంది. అందమైన వర్ణ చిత్రాలను చూసినా, రచనలు చదివినా, ఆ కళాకారుడు ఎవరు, అతని ఫొటో చూడాలనో, స్వయంగా కలవాలనో ఉంటుంది. చూడొచ్చు, కలవొచ్చు. విశ్వనాథ సాహితీ ప్రియులకు కొందరికి ఆయన కంఠంలో ఆయన కవిత వినాలని ఉంటుంది. పాఠకుల విభిన్న మనస్తత్వాలను, ఇష్టాలను గ్రహించగలిగిన సంపాదకులు బహుశా ఆ కారణం చేత వీటికి ఈ పత్రికలో స్థానం ఇస్తూ ఉంటారు.
కాని, కవితా పఠనం బాగు ఓగుల దృష్యా చూస్తే, కిన్నెరసాని లోని ఊహకు, ఇక్కడ విశ్వనాథ కంఠం నుండి వెలువడే ధ్వనికి సమగ్ర సంయోగం లేదు. కవి -ప్రియురాలా! జవరాలా! అంటూ అస్పష్టపు కూనిరాగాలు తీస్తూ, కవిత చదువుతూ, ఆపుతూ, మధ్య మధ్యలో ఆ కిన్నెరసాని వాగు కథ చెపుతున్నారు. ఆయన మెదడులో ఉన్న ఆ దృశ్యం, ఆ ధ్వని, మన కళ్లకూ, చెవులకూ చేరే దృశ్యం, ధ్వనీ -ఒకటి కావు. మనలో చాలామందిమి, పాడుకుంటున్నప్పుడు జరిగేది ఇదే.
ఉదాహరణకు: నేను (లైలా)
“శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ
నీ శ్రీపాదమే శరణు ఊ…..”
అని పాడుతుంటే, నాకు మెదడులో అప్పటికే రికార్డ్ ఐపోయి ఉన్న నా కిష్టమైన శ్రీమతి సుబ్బులక్ష్మి పాట వినిపిస్తుంటుంది, నామటుకి నేను ఒక ఆనంద ప్రపంచంలో ఉంటాను. నా పాట వింటున్న పక్క వాళ్లు, ముందు నేలమీద మొదలై, అకస్మాత్తుగా ఆకాశాన్నంటి, మళ్లీ గబుక్కున పాతాళంలోకి పోయి, స్వరానికీ స్వరానికీ పొంతన లేని అపశృతి మయమైన కఠోర శబ్దాలు వింటుంటారు. సుబ్బులక్ష్మి పాటనే కాక, నా పాట కూడా రికార్డ్ చేసుకుని నేను వింటే తప్ప, ఆవిడ అత్యంత మధురంగా పాడిన ఆ అన్నమాచార్యుని కీర్తనకు నేను ఎంతదూరంలో ఉన్నానో తెలియదు.
అది తెలియక, ఇంకా అదే చాపల్యంతో;
“కమలాసతీ ముఖ కమల కమల హిత, కమల ప్రియే, కమలేక్షణా
కమలాసన హిత, గరుడగమన, శ్రీ కమల నాభ! నీ పదకమలమే శరణు ఊ….”
అని నే పాడేస్తుంటాను.
నా అదృష్టవశాత్తు, నే వినేది నా మెదడులో, సుబ్బులక్ష్మి పాటనే. సంగీతం లక్షణాలలో, దాని పుణ్యమా అని, అది ఒకటి.
అదే విశ్వనాథకు కూడా జరుగుతున్నది. ఆయన తన కాలంలో చాలా మధుర గాయకులను వినే ఉంటారు. తన కిన్నెరసాని కవితను ఈ సభలో అలా పాడుతున్నాను అనుకుంటున్నారు. వాస్తవం అది కాదు. ఆ పఠనం అంత గొప్పగా లేదు.
ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను. ఎప్పుడో ఒక సభలో ఆయనకు కవిత చదివే అవకాశమిచ్చారు. అప్పటి శ్రోతలు విన్నారు. దాని ఆవశ్యకత అంతటితో తీరిపోయింది. ఫేమస్ ఐన వాళ్ల ఒకప్పటి మాటలు పాటలు ఎట్లా ఉన్నాగాని కలెక్టబుల్స్ అనుకుని, ఆ route లో, నాస్టాల్జియా కలెక్షన్గా, ఇలా ఇప్పటి పత్రికలో వచ్చి చేరతాయి, కొన్ని గరగరల, అపశబ్దాల ఆడియోలు.
కళ మీద ఆసక్తి ఎక్కువ, వ్యక్తి మీద drooling తక్కువ ఉంటే, కిన్నెరసాని ఆకస్మిక కోపం, దు:ఖం, ఆమె నీరవటం, భర్త బండవటం, సముద్రుడు ఆమెకోసమై ఎగసిపడటం, ఆమె కళవళపడి గోదావరిలో లయించటం – ఈ గాథను ఇప్పటి గాన గంధర్వులతో పాడించి, లేదా మంచి వాయిద్యకారులతో సింఫొనీ మ్రోగింపచేయిద్దామని వారిని నియోగించి, ఆ కొత్త రికార్డింగ్ బాగుంటే విడుదల చెయ్యొచ్చు.
లేదూ, విశ్వనాథ కిన్నెరసాని దాని దోవన అది చదువుకుని, అప్పుడో మరోసారో, Edward Greg- Solveig’s song విన్నా. Svetlana – Moldau విన్నా, సుఖం ఉంది. ఆ సంగీత నదీ ప్రవాహాల చలనాలకి హృదయం కరిగి పోతుంది.
చక్కని శబ్దానికి, ఎక్కడిదైతేనేం మంచి శ్రోతగా మారితే చాలదా?
“వెన్నెలలో చంద్రకాంతశిల ద్రవిస్తున్నట్లుగా కనబడటం అటువంటి లోకవిరుద్ధమైన కవిసమయం కాదు. ఆనుభవికమైన దృగ్విషయమే.”
చెప్పింది అర్ధమయింది.
ఐనా, నాకైతే ఈ వర్ణన కవి సమయమే అనిపిస్తుంది. చంద్రకాంతికి ఏ రాయీ కరిగి ప్రవహించదు కదా. Crystallographers, geologists ఉన్నారు పాఠకులలో – వారు మనకు ఇందలి నిజానిజాలు చెప్పగలరేమో. ఈ క్రింది పద్యము చాలా అందమైన కవి సమయము కాదా? ఇది ప్రకృతి సహజమా?
వసుచరిత్రము ద్వితీయాశ్వాసము; పద్యము 21
సీ. రేలెల్ల నమృతమరీచి నంటున నంట గరగి నిర్మలపయోఝరుల దొరగి
బలువిడి పెనులోయ బడిన క్రొన్నెలరాల చఱులలో నిరుగడ దఱచు మెఱచు..
అలాగే -కోయిల పంచమ స్వనంలో పాడుతుంది అనటం కవి సమయమే. కోయిల కూత – భారత కోకిల లతా మంగేష్కర్ कुहू कुहू बोले कोयलिया ( కుహూ కుహూ బోలే కోయలియా) అని పాడింది. అది అమృత వర్షమే. అందులో తడిసి తనిసినారెందరో. ఐనా, కు హూ లో – ‘కు’ కింది స్థాయిలో ఉంటే ‘హూ’ దాని కన్నా రెండు మెట్లో ఏమో పై స్థాయిలో పాడతారు లతా, రఫీ. నిజం కోయిల అలా పలకదు. కూహ్ కూహ్ అంటుంది. పశ్చిమ కోకిల ఐతే, ‘కుకూ కుకూ కుకూ’ లో మొదటి హ్రస్వ స్వరం పై మెట్టు, రెండవ దీర్ఘ స్వరం దానికన్నా దిగువన పలికిస్తుంది. ఎంత సేపూ రెండు స్వరాలు వరసొరసనే పలికిస్తుంది. ఈ రెండు స్వరాలే కోయిల పాట. దానికి కవులు దుంపలు తెంపలు చేసుకుని కోకిల మీద, కోకిల అన్న మాటను వాడుతూనూ వందల వందల గీతాలు రాశారు. కొంతమంది అదృష్టం అది. లోకంలో వారికి ప్రచారకులు ఉంటారు. కోకిలకు అంత ప్రతిభ లేకున్నా కాని, చాలా సమర్ధులైన ప్రచారకులు ఉన్నారు.
A segment (from Saint-Saens “The Carnival of Animals”) called ‘The cuckoo in the depths of woods’ is worth listening. It is easily found on the net. For this segment Roger Moore gives a beautiful narration poking fun at cuckoo –
“….
And so without a proper song
He just sings cuckoo all day long
He is not what you would call a star
With such a basic repertoire
And yet that simple two word phrase
Casts such a spell on summer days…”
There is more of these words. I don’t know whose charming words these are. I don’t think it is Ogden Nash’s poetry. The back drop of piano chords in the music recital is soothing. The sounds of cuckoo D & lower B-flat are played on clarinet. The clarinetist is placed somewhere outside the orchestra. The cuckoo sounds surprise and then on are eagerly anticipated both by musicians and listeners alike.
The whole composition of Camille Saint –Saens is marvelous and is an example of self-deprecating humor of a musician/s. The musician did not dare release this light hearted music of his, in his lifetime, for the fear of being considered a frivolous artist by his contemporaries.
(Dear Readers! By now you noticed I have not digressed one bit, but am only elaborating on relevant themes. i.e., the oppression of artists by fellow contemporary artists. And కవి సమయములు. Mine is never an erratic, all over the place writing. It is always under control delivery. Some contemporaries just can’t stand my scientific approaches and would rather read gossip as theses. )
Anyways, another favorite is Robert Schumann’s ‘Cuckoo in hiding.’ In this piano piece, he uses a combination of notes and chords in the left and right hands to produce the cuckoo sounds. Even though considered as a beginners’ piece, by the teachers, perhaps adults are more charmed by this composition than kids. I love it. Sure there is a G (పంచమము) somewhere in the cuckoo sounds, but that is not the only note he used.
Surprise. Surprise. I am hearing an anxiety inducing grating, two note sound now, in the airport as our boarding passes are being scanned. Cuckoo. Cuckoo. Got to go board the plane.
So Long. Happy Easter!
Lyla
నాకు నారాయణరావుగారి పరిశోధనల గురించి తెలియదు. నేనెప్పుడూ చదవలేదు. ఆయన ప్రతిభావ్యుత్పత్తుల మీద అనుమానం కాని, ఆయనకి వి.స. మీద అభిప్రాయాలేమిటన్నది కాని ఇక్కడ చర్చనీయాంశం కాదు. ‘ఆంగ్ల పాఠకుడికి ఏమి అందుతోంది ఇది చదివితే’ అన్నదే నేను చూస్తున్నది.
కాని, రెండు నవలల అనువాదం ముందు, రచయితని పరిచయం చేస్తూ, ఆయన వ్రాసినది కొంత అటూ ఇటూ పోయింది.
కవి, రచయిత అయిన వి.స ఏమిటో చెప్పడంకన్న మిగతా విషయాలు ఎక్కువ చెప్పారు. నేనే ఆంగ్లపాఠకుణ్ణయితే “ఈ సోది ఏమిట్రా. అసలీ రచయిత వి.స. ఎవరు? ఏమి రాసారు? కథాశిల్పాన్ని ఎలా పోషించారు? అసలు ఈ నవల ఎందుకు రాయబడింది? ” అన్నదే ఆలోచిస్తాను. నాకు శ్రీశ్రీ ఏమన్నాడు, జరుక్ ఏమన్నాడు అన్నది అవసరంలేదు. అసలు వి.స. యే ఎవరో తెలియదు. మిగిలినవాళ్ళంతా అప్రస్తుతం. ఉదాహరణకి “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు” తీసుకుంటే – ‘భాషల నిర్మాణంలో ఉన్న తేడాలు, తిక్కనగారి మనస్తత్వం, విష్ణుశర్మ చాకచక్యం, వాళ్ళు రచించిన గ్రంథాల ప్రభావం వాళ్ళ ప్రవర్తన తీరుతెన్నుల మీద ఎలా పడింది? తిక్కన గొప్పతనం’ … ఇలాంటివి ధ్యేయంగా వ్రాసిన నవల. (ఇంకా నాకుతెలియనివి చాలా ఉంటాయి). ఈ విషయాలు వె.నా.రా. ఆంగ్లపాఠకుడికి ముందుగా తెలియజెప్పాలి. అప్పుడే ఆ అనువాదితనవలలో ఒక అర్ధం పరమార్ధం చూస్తాడు పాఠకుడు. ఈ దిశగా వె.నా.రా ఏమీ చేసినట్టనిపించలేదు. మూడువందల పంక్తుల ఉపోద్ఘాతంలో “కట్టే – కొట్టె-తెచ్చె” అని మూడు ముక్కల్లో కథ రాసారు. ఇలాంటి అనువాదం చెయ్యడం రెండు సంస్కృతులకి వారధి కట్టడం. అందువల్ల పాఠకులకి మంచి పరిచయం కావాలి. ఊరికే “బోధకుడికీ విద్యార్థులకీ మధ్యన సంభాషణలు ఉల్లాసంగా నడుస్తాయి. ” అని చెపితే అనువాదం చదివినవాడికి ఉల్లాసం కలుగుతుందా? నాలాంటివాడు అనకాపల్లిలో కూర్చుని “Shakespearean Comedies” చదివినట్టుంటుంది.
ఆంగ్లపాఠకుడికి కావలసిన దినుసులకన్న, తెలుగు పాఠకులకి కావలసిన మసాలా ఎక్కువ కుమ్మారు వె.నా.రా. అని నాకు అనిపించింది. అది ఎంతవరకూ నిజమో ఆంగ్లపాఠకులే చెప్పాలి.
మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. వాచికంలో సినిమా, రేడియో ఎప్పుడూ ఉత్తర దక్షిణాలే. అయితే మహానటి సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య గార్లు సైతం రేడియోల్లొ నటించారని లోకానికి చెప్పడానికే ఈ ప్రసారం.
సినిమా, రేడియో – ఈ రెండిటికీ మాడ్యులేషన్ లో కుదరదు. అంతెందుకూ రేడియోలో శారదా శ్రీనివాసన్ గారు ఒక హిమశిఖరం కదా – ఆమె “బంగారు కలలు” చిత్రం లో వహిదా రెహెమాన్ గారికి, “తోడు” (ఓల్గా గారి కథ) చిత్రంలో నటి గీత గారికీ డబ్బింగ్ చెప్పారు. అంతగా నప్పలేదని కొందరి అభిప్రాయం.
అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా శారద గారితో కలిసి “పరితాపం” అనే నాటకం లో నటించారు. పి.వి. నరసింహారావు గారికి శారద గారి వాచికం అంటే చాలా ఇష్టం. రంగస్థల నటుల పద్యాల ముందు ఘంటసాల గారి పద్యాలు తేలిపోయినట్టు అంపించడం సబబే. మీరు ఆన్నట్టు ఎవరి శిక్షణ వాళ్ళదే.
అపురూపమైన రేడియో నాటికను అందించారు. మీకూ, ఈ మాట వారికీ కూడా అభినందనలు.
వింటుంటే నాకు అనిపించింది, రేడియో వాచికానికి, సినీ నటుల వాచికం నూటికి నూరుపాళ్లు నప్పలేదేమో నని. ఎంతైనా రేడియో, సినిమా వేర్వేరు మాధ్యమాలు కదా! ఎవరి శిక్షణ వాళ్ళదే.
పీసపాటి నరసింహమూర్తి, రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయరాజు వంటి రంగస్థల నటులు పాడిన రాయబారం పద్యాలు, ఘంటసాల తదితరులు సినిమాల్లో పాడిన రాయబారం పద్యాల మధ్య కూడా నాకు ఇలాంటి తేడాయే కనిపించింది. రంగస్థల నటుల పద్యాల ముందు ఘంటసాల పద్యాలు కూడా తేలిపోయినట్టు అనిపించింది. మళ్ళీ ఇక్కడా పైన చెప్పిన తేడాయే. పద్య నాటకాలు, సినిమా వేర్వేరు మాధ్యమాలు. ఏ మాధ్యమం గొప్ప దానిదే నని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.
పద్యాన్ని అభినవంగా చదివినప్పుడు తోచిన భావం ఇది: ఆమని వేళ క్షితిపయి మోడువారిన వృక్షాలను చిగురింపజేయటంతోపాటు –
వసంతుఁడు దా రసోపగుంభిత పద వాసనల్ నెఱపన్ – వసంతుడు, తాన్ (తానై స్వయంగా పూనుకొని), రస (జలములచే) ఉపగుంభిత (పూర్ణములైన) పదముల నుండి (స్థానముల నుండి) = నదీ జలాశయాల నుంచి, వాసనల్ = పరిమళాలను, నెఱపన్ = వ్యాపింపజేయగా – అని ఒక అర్థం;
వసంతుఁ డుదార సోపగుంభిత పద వాసనల్ నెఱపన్ – వసంతుడు, ఉదార = విరివిగా, సా + ఉపగుంభిత = ఆ రసము అను శబ్దము ‘సా’ అను ముఖవర్ణముచే కూర్పబడినప్పటిదైన, పద = సారసము అను పదముయొక్క (పద్మముల యొక్క), వాసనల్ = సుగంధములను, నెఱపన్ = వ్యాపింపజేయగా – అని ఇంకొక అర్థం.
చంద్రుడు = చందమామ, మెచ్చక = సారసవైరి కాబట్టి ఆ పద్మగంధవ్యాపనకార్యాన్ని శ్లాఘింపలేకపోయాడు.
వసుచరిత్రలో ‘సారసలోచనలు’ రసభంగమై ‘సాలోచనలు’ అయినట్లే, విజయవిలాసంలో సోపగుంభితమైన రసము ‘సారసము’ అయింది.
కవనపరంగా వసంతుని రచనలో ఉదారత (శబ్దార్థముల పరస్పర ధ్వనన వ్యాపారము, వికటత్వము అనే కావ్యబంధం), స+ఉపగుంభిత+పద = పదగుంభనము అనే వాసనలు (శబ్దవృత్తులు) విలసిల్లాయి. ఇవి రెండూ కావ్యప్రౌఢికి అనువర్తించే అంశాలు. చంద్రుడు అంతర్గతమైన ఆ ప్రౌఢిని మెచ్చక ప్రసాదగుణము, సౌకుమార్యము అనే గుణాలను అభిమానించాడు.
జాగ్రత్తగా చూస్తే – చంద్రుని ప్రసన్నతా, సౌకుమార్యఫలాలు పైకి “కనబడేవే” కాని, కఠినమైన చంద్రకాంత శిల నిజంగా కరగటం జరగలేదు. పైగా, ఆ చంద్రుని యొక్క విలాసం వసంతకాలికమే గాని స్వతంత్రం కాదు. వసంతుని ఔదార్యం ముందు చంద్రుని శ్లాఘావిహీనత వెలవెలపోవటం సహజమే.
ఈ పద్యంలోని భావమూ సారమూ కూడా సమకాలపు సాహితీవేత్తల మధ్యనుండే స్పర్థ గురించేనన్నది స్పష్టమే. అయితే ఆ చెప్పడం వాచ్యంగా కాకుండా ప్రస్తావనగా చేప్పబడిందన్నది గమనించాల్సిన అంశం. అందుకే అది కవిత్వం అయింది!
వేదంవారి వ్యాఖ్యని ప్రస్తావించి వేలూరిగారి కోరికని తీర్చినందుకు ఏల్చూరిగారికి ధన్యవాదాలు! వేదంవారి వ్యాఖ్యలో “రసోపగుంభిత పదవాసనల్” అన్నదానికిచ్చిన అదనపు అర్థం, “కాళ్ళకు సిద్ధరసముఁ బూసికొని త్రొక్కడం”, నాకు పెద్దగా నచ్చలేదు. అది ఊహని మరీ ఎక్కువ పొడిగించినట్టు అనిపించింది. అందుకే నేను దాన్ని ప్రస్తావించ లేదు.
వసంతుని చేతను చంద్రుడు మెచ్చకపోవడానికి స్పర్థ తప్ప వేరే కారణం ఎందుకు? అకారణంగా స్పర్థబూనడాన్ని గురించే కదా కవి వాపోతున్నది! ఇక్కడ కవి వసంతుని కార్యాన్ని తక్కువచేసి చెప్పాడని వేదంవారు అభిప్రాయపడ్డారు. వసంతుని చేతకన్నా చంద్రుని కార్యమే గొప్పదని కవి భావిస్తే చివరి వాపోవడం సబబు కాదు కదా, అంచేత అలాంటిదేమీ లేదని తాపీవారు అన్నారు.
ఇద్దరి అభిప్రాయాలూ సమంజసంగానే ఉన్నాయి! వసంతుని తక్కువ చేయడం అనేది పద్యంలో స్పష్టంగా తెలుస్తోంది. కానీ అలా అనుకుంటే చివర వాపోవడం సరికాదు. ఇందుకు నా అన్వయం ఏమిటంటే – పద్యంలో వసంతుని చులకన చేస్తున్న గొంతు, కవిది కాదు చంద్రునిది – అని. సమకాలమువారు ఏ రీతిలో మెచ్చరో మాత్రమే అందులో ధ్వనిస్తోంది తప్ప, ఇద్దరి రచనల విషయమై కవి ఎవరి పక్షమూ తీసుకోలేదని నా అభిప్రాయం. ఇందులో ఎవరి రచన గొప్పదన్న అంశం యిక్కడ అవసరమే లేదు. ఒకరిని చూసి మరొకరు స్పర్థ పూనడమన్నదే ఇక్కడ చెపుతున్న విషయం.
ఈ పద్యాన్ని మరోసారి నెమరు వేస్తూంటే, మరొక సూక్షమైన అంశం కనిపించింది. ఇది భాషలోని వాక్య నిర్మాణానికి సంబంధించిన అంశం. ఈ రెండు వాక్యాలనూ గమనించండి:
అంతటా చికట్లు ముసిరేట్టు ఆకాశంలో మేఘాలు కమ్ముకొన్నాయి.
ఆకాశంలో మేఘాలు కమ్ముకొని అంతటా చీకట్లు ముసురుకొన్నాయి.
మొదటి వాక్యంలో మేఘాలు కమ్ముకోడం అనేది ప్రధానం (వాక్యం దానితో ముగుస్తోంది కాబట్టి), దాని ఫలితమైన చీకట్లు ముసరడం కాదు. కాని రెండో వాక్యంలో చీకట్లు ముసురుకోడం ప్రధానం.
వాక్యనిర్మాణంలోని ఈ ఒడుపు పట్టుకొని పద్యంలో చక్కగా సహజంగా కూర్చాడు చేమకూర. వసంతుని కార్యం గురించి చెపుతున్నప్పుడు ఫలితాన్ని ముందు చెప్పి, తర్వాత ప్రయతాన్ని చెప్పాడు. దానివల్ల చేసిన ప్రయత్నం ప్రధానమయింది (ఎక్కువగా చూపబడింది). చంద్రుని విషయంలో ప్రయత్నం ముందు చెప్పి, ఫలితం తర్వాత చెప్పబడింది. అంచేత ఫలితం ప్రధానమై, అందులోని ఆధిక్యం సహజంగా పాఠకులకి స్ఫురిస్తోంది. ఇన్ని రకాలుగా చంద్రునిది పై చేయిగా చూపబడినా, అది సమకాలము వారిని మెచ్చని చంద్రుని దృష్టినే సూచిస్తుంది తప్ప, కవి స్వంత అభిప్రాయం/నిర్ణయం కాదని నా అభిప్రాయం.
వేలూరి గారు,
కాళిదాసు వసంత వర్ణన గురించి – కంగారేం లేదు, ఇంకా బోలెడన్ని వసంతాలు మిగిలున్నాయి! ఎప్పుడో మరో వసంతానికి ముచ్చటించుకోవచ్చు 🙂
శ్రీ కామేశ్వరరావు గారు అద్యతన వసంతోత్సవ స్మరణోత్సవంగా వెలుగులోకి తెచ్చి వివరించిన ఈ విజయవిలాస పద్యాన్ని చాలా రోజుల తర్వాత చదువుతున్నప్పుడు ఇంతకు మునుపెన్నడూ కలుగని సందేహాలు కలిగి, మళ్ళీ ఒకసారి 1911 నాటి వేదము వేంకటరాయశాస్త్రిగారి వ్యాఖ్యను, 1968లో అచ్చయిన తాపీ ధర్మారావుగారి వ్యాఖ్యను బయటికి తీసి సాకల్యంగా చదువుకొన్నాను.
– అని వేదము వారి వివరణ. ధర్మారావు గారు దీనిని పూర్తిగా అనుసరింపలేదు.
మొత్తం మీద ప్రకృతమైన ఆమని వర్ణన, కవిత్వపరమైన తారతమ్యవర్ణన – రెండూ కవి దృష్టిలో ఉన్నాయన్నది స్పష్టం. వేంకటకవిని కవిత్వేతరకారణాల వల్ల ఎవరో, ఎందుకో నిరాదరించినందువల్ల బాధపడి ఈ పద్యాన్నిక్కడ సందర్భస్థగితంగా నివేశింపజేశాడని జనశ్రుతిలో ఉన్న కథ నిజమే అయివుంటుంది. అయితే, వసంతుని చేతను చంద్రుడు ఎందుకు మెచ్చలేదో వ్యాఖ్యాతలు వివరింపలేదు. మాత్సర్యమో, కీర్తికాంక్షో అందుకు కారణమై ఉండదు. “వసంతుడు ఎండిన మోడు చిగురించేట్లు కవిత్వం చెప్పాడు. చంద్రుడు దాన్ని మెచ్చక రాళ్ళు కరిగేట్లుగా కవిత్వం చెప్పాడు. ఎంత బాగా చెప్పినా సమకాలం వాళ్ళు మెచ్చుకోరు కదా!” అన్నప్పుడు – ఎవరిని విమర్శిస్తున్నట్లు? సండర్భాన్ని బట్టి కవియొక్క సానుభూతి వసంతుని మీదనే అన్నది స్పష్టం. వసంతుని చంద్రుడెందుకు మెచ్చుకోలేదు? అని పాఠకులు అడిగితే – చంద్రుడెందుకు మెచ్చుకోలేదో కల్పనలో సమాధానం తప్పక చెప్పబడాలి. చంద్రుని కవిత్వానికంటె తన కవిత్వమే మేలని వసంతుడు కూడా వాదిస్తే, దొందూదొందే కాబట్టి, “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అన్న అర్ధాంతరన్యాసం ఉభయతారకంగా ఉంటుంది. కాని, అట్లా జరగలేదు. వసంతుని మెచ్చుకోని చంద్రుని ప్రవర్తన మాత్రమే ఇక్కడ విమర్శకు గురైంది. వసంతుని చేతలో ఏదో లోపం ఉన్నందువల్ల చంద్రుడు వసంతుణ్ణి మెచ్చుకోకపోవటం జరిగి, చంద్రుని రచన నిజంగా వసంతుని రచనకంటె మేలుగా ఉన్నట్లయితే – ఆ గుణోత్కర్షను చూసిన వేంకటకవి “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అని బాధపడటం భావ్యం కాదు. తిరస్కృతుడైన వసంతుని రచన మేలైనదీ, తిరస్కరించిన చంద్రుని రచన దానితో సరితూగనిదీ కావటం వల్లనే వేంకటకవికి తన మనసులోని మాటను వెల్లడించే సదవకాశం ఏర్పడింది.
వసంత – చంద్రులిద్దరూ మన్మథుని ప్రియానుచరులే. పద్యంలో వారికి విరోధం చిత్రింపబడి ఉంటుందనుకోవటం సంభావ్యం కాదు. ఎందుకంటే, ప్రథమాశ్వాసంలో ఆ తర్వాతిదైన 211-వ పద్యంలో కవి ఉత్సవసమయంలో మన్మథునికి కానుకగా వసంతుడు చెరకువిల్లును, చంద్రుడు కలువబాణాన్ని బహూకరించి గౌరవాన్ని పొందారని ప్రశంసాపూర్వకంగా అభివర్ణించాడు. అందువల్ల వారిద్దరూ పరస్పరమాత్సర్యోపహతులు కారన్నమాట. వసంతుణ్ణి మెచ్చుకోకపోవటం ఎంత సమంజసమైనా, ఔన్నత్యచికీర్షతో ఆ చంద్రుడు చేసినది వసంతుని చేతకంటె గొప్పేమీ కాదని; కనుకనే, అనాదరింపబడిన వసంతునిపై సానుభూతి కలిగి అతనికి సమర్థనగా వేంకటకవి “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అని వ్యాఖ్యానించాడని మనము ఊహించాలి.
అందువల్ల కవి హృదయావిష్కరణకై వేంకటరాయశాస్త్రి గారు, ధర్మారావు గారు చెప్పిన పద్యార్థాన్ని, చేసిన అన్వయాన్ని సహృదయులు పునర్విమర్శింపవలసి ఉన్నదని మనవి.
మీరు మరీ బడాయికి పోయారు కానీ, ఆఖరి చరణం తీసేస్తే ఈ పద్యం కేవలం ఋతువర్ణన పద్యమేకదా! (Of course, give a little to the poet for drawing the contrast between the Lord of Spring and the satellite to the earth!)
…ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!
అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ – ముఖ్యంగా తెలుగు సాహితీవేత్తలమనుకొనే ఈ నాటి కవుల్లో, విమర్శకులలో కొట్టవచ్చినట్టు కనిపించే ఒకానొకలక్షణం.
‘ఈ పద్యంలో ఉన్నది వసంతుడూ చంద్రుడే కాని కవులు కాదు. కవుల మధ్యనున్న స్పర్థ కేవలం పాఠకులకు స్ఫురించే అంశమే తప్ప నేరుగా కవి చెప్పింది కాదు,’ అని మీరు మొహమాటానికి అన్నారని నేను అంటాను.
కాకపోతే, తరువాత ఇలా ఎందుకు రాసారు?
“… అయినా ఒక కవిగా, ఎంత గొప్ప కవిత్వాన్ని రచించినా సమకాలము వారలు మెచ్చకపోవడాన్ని గూర్చి వాపోయాడు వేంకటకవి. మెచ్చకపోవడమే కాదు, ఏ రకంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతారో కూడా మనకీ పద్యంలో చూచాయగా తెలియజెప్పాడు.”
ఈ పద్యం మీద వేదం వారి వ్యాఖ్యకూడా జోడిస్తే ఇంకా బాగుండేది.
మరొక విషయం: కాళిదాసుని వదిలేయడం ఏమీబాగాలేదు. కుమార సంభవంలో వసంతుడి రాక పై శ్లోకాలు, అంతకన్న మరీముఖ్యంగా, ఋతుసంహారం లోని వసంతవర్ణన (They may be a little explicit, hence more likable!) వదిలేయటం ఏమీ బాగాలేదు, చెప్పొద్దూ!
అసలు విషయం: ఋతుసంహారం, నాలాంటి ‘ మీడియోకర్ల’ కి తేలిగ్గ అర్థమయే కావ్యం. ఎప్పుడో, ధాతనామసంవత్సరంలో, ఋతుసంహారంలో వర్ణనలతో, కన్నెగంటి చంద్ర కవితలని పోల్చానని, నన్ను ఆక్షేపించారు.
(ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!)
ఏది ఎలావున్నా, మంచి పద్యం; మరీమంచి వ్యాఖ్యానం. (I envy you!)
నూతిచుట్టూరా చెట్లు.
పాతవానల రహస్య నిద్రల్ని తట్టి
పాతస్మృతుల సుడిగుండాల్ని గాలించి
ఆ తపించే వర్తమానం కోసం
శైతల్యాన్ని తెస్తాయి, చెట్టూ, బావీ.
ఈ మధ్య సూర్యలంకలో కొందరు తెలుగు కథకులు ఒక శిబిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి నేను ఈ ఎక్ ఫ్రాసిస్ ని పరిచయం చెయ్యవలసి వచ్చింది. డొనాల్డ్ బార్తెల్మి రాసిన ‘టాల్ స్టాయి మ్యూజియం దగ్గర ‘అనే కథని పరిచయం చేసినప్పుడు. ఈ పదాన్ని తనంతట తనుగా మొదటిసారి వాడిన తెలుగు కవి ఇదుగో వేలూరి వారే కనిపిస్తున్నారు. చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని , శిల్పాన్ని కవిత్వంతో వివరైంచే ప్రయత్నం యూరోపియన్ కవులు చాలా తరచు చేసే పని. తెలుగు లో తక్కువ. ఒకరూ అరా రాసినా యూరోపియన్ చిత్రలేఖనాల్నో, కళాకృతుల్నో ఉద్దేశించి మటుకే చేసి ఉంటారు. కాని ఇక్కడ ఒక తెలుగు చిత్రకారుడి పదహారణాల తెలుగు బొమ్మని తెలుగులో చిత్రించిన కవిత. చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా పైన నేను మళ్ళా ఎత్తి రాసిన వాక్యాల్లో కవి అంతరంగమంతా బావిలో నీళ్ళల్లా లోతుగా, చల్లగా కనిపిస్తున్నది. వెంకటేశ్వరరావుగారు గొప్ప చిత్రరహస్యవేత్త కాబట్టి ఆయనిట్లాంటి కవితలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను.
ఈ పోలికల వల్ల ఏమిటండీ మీరు చెప్పదల్చుకున్నది? ఇది చూస్తే మోకాలికి బోడిగుండుకి సంబంధం పెట్టినట్టు ఉంది. అసలు ఇలా పోలికలు చూపించడం మొదలు పెడితే ఏ రెండు యాదృచ్ఛికమైన కధలో ఏరుకుని పోల్చవచ్చు.
గాంధీగారికి ద్వారం వెంకట స్వామి నాయుడు గారికీ పోలిక చెప్పొరే అంటే గాంధీ గారెప్పుడూ నాన్ వాయలెన్సు, ద్వారం గారెప్పుడూ వయలిన్సు అన్నట్టు ఉంది (భ.రా.గో మాటల్లో). మాటల గారడీకి, నవ్వుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు ఇలాంటివి.
ఇలాంటివి తీరిక ఉండాలే గానీ వందల కొద్దీ రాయొచ్చు లైబ్రరీలోకెళ్ళి కళ్ళు ముసుకుని ఏ రెండు పుస్తకాలు తెచ్చినా సరే. ఎక్కడి విశ్వనాధ, ఎక్కడి సినిమా సరుకూ పోల్చడానికి? విశ్వనాథ గారి పుస్తకానికీ ఆయన వేయించిన నాటకాలకీ పోలిక పెట్టినా బావుండేది. నాకేం నచ్చలేదు.
మాన్యులు శ్రీ వాడపల్లి శేషతల్పశాయి గారికి
నమస్కారములతో,
మీ సేకరణలో ఆనంద ముద్రణాలయం వారు అచ్చువేసిన అద్భుతావహమైన శ్రీ తంజనగరం తేవప్పెరుమాళయ్య (దేవరాజసుధి) గారి వసుచరిత్ర వ్యాఖ్యకు పిడియఫ్ ప్రతి ఉన్నట్లయితే తెలియజేయ ప్రార్థన.
శ్రీ తంజనగరం వారి వ్యాఖ్యకు మద్రాసు లోని రాయల్ అండ్ కో వారొక సుపరిష్కృత పునర్ముద్రణను ప్రారంభించి, మూడువంతులు పూర్తయాక దానిని అరుణా పబ్లికేషన్స్ వారికి ఇచ్చివేశారు. ఆ ప్రతులిప్పుడు దొరకటం కష్టం. 2001లో శ్రీ రామరాజభూషణ పరిషత్తు (భీమవరం) వారు పూర్తిగా పునర్ముద్రణను వెలువరించారు కాని, తొలినాటి ఆనంద ముద్రణాలయం వారి ప్రతివలె అది అంత సంతృప్తికరంగా లేదు. జూలూరి అప్పయ్యశాస్త్రి గారి వసుచరిత్ర వ్యాఖ్య ఎక్కడో ఒకటి రెండు చోట్లలో తప్ప అంత విశేషంగా చెప్పుకోవలసినది కాదు.
మీరు ఉదాహరించినట్లు సోమనాథకవి 1750 నాటివాడన్న శ్రీ నిడుదవోలు వారి నిర్ణయమే సరైనది. అయితే కవితరంగిణిలోని వివరాలు, వ్రాతప్రతులలోని వివరాలు, వావిళ్ళ వారి ప్రతిలోని వివరాలు ఒక తీరున లేవు.
రేడియో స్టేషన్ లో కొన్ని సంవత్సరాల క్రింద చేసిన ప్రసారం, ఎంతో ప్రేమతో దేశ దేశాల్లో ఉన్న తెలుగు వారిని, ఈ వక్త వినమని ఇచ్చారు. ఆ ఉదారతకు చాలా సంతోషం కలిగింది.
నాకు వీరి ఉపన్యాసం కన్నా, వీరి గానం ఎక్కువ నచ్చింది. మళ్లీ ఏమన్నా కమ్మగా పాడిన ఆడియోలు పత్రిక శ్రోతల కోసం పంపిస్తారేమో. తప్పక వేచి ఉంటాను.
ఉపన్యాసం లోని విషయాలకు వస్తే:
భట్టుమూర్తిని సంగీత కళా రహస్య నిధి అని ఎవరన్నారో, ఎందుకన్నారో మనకెలా తెలుసు? ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి. భట్టుమూర్తికి, సంగీతం ప్రావీణ్యతలో బిరుదులివ్వటం, అసలు ఒక కావ్యరచన పరిశీలించి చెయ్యటమెలా జరుగుతుంది? ఉపన్యాసకులు చెప్పిన ప్రకారం, కవి కాలానికి సంగీతం, సాహిత్యం (కవిత్వం) స్వంత ప్రతిపత్తి కలిగిన కళలు కదా. సంగీతం, సాహిత్యం లో ప్రజ్ఞలు విడిగా పరీక్షించడానికి సాధనాలున్నయ్యి కదా. సంగీతం పరీక్షలు పెట్టి, సంగీత స్వరకల్పనకు కాని, సాహిత్యం కూర్చినందుకో, పాడగలిగినందుకో, వాయిద్యం వాయించగలిగినందుకో గాని, అతడు మేటి ఐతే సంగీత కళానిధి అని సంగీత విద్వాంసులు బిరుదు ఇవ్వచ్చు. అతను అలాటి పరీక్షలు ఇచ్చి ఉన్నాడేమో, ఇచ్చి ఆ బిరుదు పుచ్చుకున్నాడేమో. మరి ఆ విషయం ఎక్కడా చదవటానికి కనపడదు. వసు చరిత్ర కావ్యం ద్వారా అతని సంగీత పాటవం ఎలా చెపుతారూ? అనేది నా సంశయం.
పైగా, కేవలం రెండు పద్యాల ద్వారా అతని సంగీత ప్రావీణ్యత ఎలా తెలుస్తుంది? అదీ సరి కాదు. వసుచరిత్ర రాసిన భట్టుమూర్తి సంగీత జ్ఞానం గురించి, ఎందుకు ఎవరైనా ఆ రెండు పద్యాలే ఉదహరిస్తారో నాకు అర్థం అవదు.
ఒక కవి పద్యాల్లో అక్కడో చోట ఇక్కడో చోట ‘వీణ’ అనో ‘మద్దెల’ అనో, లేకపోతే ‘నాట’ అనో ‘కల్యాణి’ అన్నంత మాత్రాన, ఎవరైనా సంగీత కళానిధి అని బిరుదు ఇస్తారా? ఊరికే, ఒక కథలో మలేరియా, టైఫాయిడ్ అన్నంత మాత్రాన కథా రచయితకు వైద్య శిఖామణి బిరుదు ఇచ్చిన తంతు ఎక్కడా వినలేదు.
సరే, కొంతమందిని కవి అని అంటే సర్లే పోనీలే అని నాలాటివాళ్లు సరిపెట్టుకుందామంటే, ఇంకా ఉద్రేకులు ఢమిక్కిన ఒక్కొక్కరిని మహాకవి, శతాబ్ది కవి అనేస్తారు. మార్క్సిస్టులు శ్రీశ్రీని ప్రజాకవి, మహాకవి అంటే వాళ్ల అభిమానుల గుంపులో చెల్లుబడి అవుతుందేమో కాని, ప్రపంచ కవులు ఎవరండీ ఈ శ్రీ శ్రీ! అంటే ఏం చెపుతారు? ఇదుగోండి ఈ మా గొప్ప తెలుగు కవి – ఈయన ‘ఆనందం అర్ణవమైతే’ అని ఒక పాట రాసాడు, ఆ పాటకి ‘కన్యాశుల్కం’ తెలుగు సినిమాలో మహానటి సావిత్రి ఇలా డాన్స్ చేసింది, ఈ విడియో బిట్ చూడండి అని గాని – ఎవరైనా డాన్స్ వచ్చిన వాళ్లకు చూపిస్తే, నిజంగా నృత్యం నేర్చిన వాళ్లు, వచ్చిన వాళ్లు – ఇది డాన్సా? ఇదేం పాట, ఇదెక్కడి డాన్స్ అయ్యా ఇదా తెలుగు నృత్యం అని వాళ్లు నవ్వి పోతారు.
ఇప్పుడా మధురవాణి, కుహనా కవిత్వం, కుహనా నృత్యం సంగతి నాకెందుకు గానీ, హిందోళ రాగం, వసంత రాగం గురించి, భట్టుమూర్తి ఒక పద్యం లో చమత్కరించి చెప్పినంత మాత్రాన, పద్యం మొదటి భాగం, హిందోళ లో, రెండో భాగం వసంత రాగంలో పాడమని కవి ఉద్దేశం కానే కాదు. అసలు ఏ రాగంలోనూ తన పద్యాలు పాడమని కవి ఆదేశమివ్వలేదు.
పద్యం కూర్చిన భట్టుమూర్తి అతడు ఉపయోగించిన ఛందస్సులు మాత్రమే ఇచ్చాడు. ఆ పద్యం మత్తేభము. అని మాత్రమే అతడు మనకు చెప్పింది. ఆ ఛందస్సులో ఎన్నైనా పద్యాలున్నయ్యి. ఆ ఛందస్సులు వేల మంది కవులు వాడినారు కదా. వారు కూడ అక్కడో పద్యం ఇక్కడో వచనంలో, నాట, కల్యాణి, వసంత, మోహన, కాంభోజి – అంటే ఇక వారికీ సంగీతం వచ్చినట్లేనా. ఆ లెక్కన తెలుగు సినిమా పాటలు రాసిన వాళ్లు వైణికులై కూర్చుంటారు. తకిట తకిట అంటే తబలా expert, ఓంకార నాదాలు సంధానమౌ గానమే – అంటే శంకరాభరణము specialist– ఐ పోతారు.
ఆ పద్యంలో మొత్తం మీద, కవి చమత్కారంగా ఉద్దేశించింది, తోటలో ఆడవాళ్ల ఉయ్యాల పాటలకు, కోయిలలు గొంతు కలిపినందున వసంతం పరిపూర్ణంగా శోభించిందని. అదే ఇంకోలాగా తిప్పి, గిరిక వీణా వాదనం విన్నప్పుడు, వసురాజు స్నేహితుడు – ఎవరో వీణ ఎంత బాగా వాయిస్తున్నారు, ఈ కొండ కోనలలో! కోయిలలు, నెమళ్లు తమ గొంతు కలిపి -పంచమ, షడ్జమాలు వినిపిస్తున్నాయి, అంటాడు. తెలుగు ( కర్ణాటక) సంగీతంలో, కోయిల స్వరం పంచమం కి సరిపోతుందని, నెమలి షడ్జమమని ఆ విషయాలు అలా రాసి ఉన్న సంగీతం పుస్తకాలు ఉన్నవి. ఒక్కొక్క సంగీత స్వరం ప్రకృతి లోని ఆ యా జంతువుల అరుపుతో సరిపోల్చటం పాతకాలంలో ఉన్నది.
అందువల్ల మహా అనుకుంటే మనం – భట్టుమూర్తి కవి సంగీతం పుస్తకాలు చదివాడేమో, పాట మీద అభిమానం ఉన్నట్లుంది, ఔరంగజేబు కాదు సుమా అనుకోవచ్చు.
హిందోళ రాగం వినాలంటే భట్టుమూర్తి పద్యం కష్టపడి పాడటమెందుకూ? – త్యాగరాజు ఆది తాళములో కూర్చిన ‘సామజ వర గమనా’ కృతి వింటే ధన్యులమై పోమా? సాహిత్యం లేకుండా స్వరం వీణ మీద పలికిస్తే, ముగ్ధులమై వినమా? సంగీత స్వరాలతో మనల్ని సమ్మోహితులను చేసి, ఈ త్యాగరాజు తన మాటలలో ఏమి చెప్పాలనుకుంటున్నాడు అని చూస్తే
అంటూ ఆ సాహిత్యం తోనూ మనల్ని రంజింప చేస్తాడు. సామజ వర గమనా సాధుహృ – అని అక్కడికి ఆపి, సంగతులు వెయ్యటం మొదలు పెడితే, కొంతమంది పట్టూ విడుపూ లేని వాళ్లకు, దొబ్బిడాయి వస్తుంది కాని సంగీత హృదయులు నొచ్చుకోరు. తన్మయులౌతారు. త్యాగరాజు తప్పకుండా సంగీత కళానిధి. సందేహం లేకుండా వాగ్గేయకారుడు.
ఉపన్యాసకులు మనకు ఆయా రాగాలు గురించి ఎంతైనా చెప్ప వచ్చు. కాలక్రమాన రాగాల స్వరాలలో వచ్చిన మార్పులు గురించి చెప్ప వచ్చు. అవి తప్పక శ్రోతలకు ఆసక్తికరంగా ఉంటాయి. ఆ ప్రస్తావనలు నాకు నచ్చాయి.
కాని, భట్టుమూర్తి కావ్యనాయిక గిరిక ఏడిస్తే కాంభోజీ రాగంలో మేళవించిన వీణలా వినిపించిందని -తన ఒక పద్యంలో అంటే ఉపన్యాసకులు ఆ పద్యాన్ని కాంభోజిలో పాడి వినిపించటం ఎందుకు? పద్యం అంతా గిరిక ఏడుపు కాదే. పద్యం ఒక విరహావస్థ వర్ణన. వెన్నెలలో ఒక సుందర స్త్రీ విలాప దృశ్యం. గిరిక ఎవరు? కోలాహలుడు అనే పర్వత రాజు కూతురు. కోలాహలుడు హిమవంతుడి కొడుకు. పార్వతికి సోదరుడు. గిరిక తల్లి నది. ఆ శుక్తిమతి గంగ లాగా స్వర్గంలో, భూమ్మీదా ప్రవహించే నదేమో మనకు తెలియదు. గిరిక దేవకాంత ఏమో. ఆమె నెత్తి మీద ముసుగు వేసుకు ఏడుస్తుందా? తెలుగు ఆడవాళ్ల లాగా, పమిట వెనక నించి ముందుకు లాగి, చెంగులోకి ముక్కు చీదుతుందా. దేవా! ఏమి దుస్థితి. విరహం లో కూడా వసురాజు ప్రేమిక గంభీర కాదా? ఆమెను ‘పటాగ్రంబెత్తి’ అని కవి ఎంత నాజూకుగా వర్ణించినాడు. గిరిక కట్టినది అది ఎంత నాజూకు దుకూలమో. ఆమె దానిని మునివేళ్ళతో ఎత్తి, తన ముఖానికీ, వెన్నెలకూ మధ్య అడ్డంగా ఎలా ఎత్తి పట్టిందో ఆ చిత్రం గొప్ప చిత్రకారుడు గీయాలి, మనం చూడాలి. భట్టుమూర్తి చాలా చక్కని వర్ణన చేసాడు. వడ్డాది పాపయ్య ఐతే బహుశా బాగానే చిత్రించ కలిగి ఉండొచ్చు.
గిరిక కాంభోజీ లో ఏడవటానికి అది సరైన రాగం కాదు, అలా సూచించటంలో భట్టుమూర్తి సంగీత పరంగా పొరపాటు చేసాడనుకోటం సరికాదు. భట్టుమూర్తి ఏదో మొదటి మూడక్షరాల కోసం కక్కుర్తి పడి, కాంభోజీ అన్న మాట వాడతాడా? అన్ని వందల తియ్యని పద్యాలు రాసినతడు, ఒక పద్యం అవతల పారెయ్యటానికి తిరగ రాయటానికి వెనకాడతాడా? ఏ కాలంలోనూ చూడండి, వందల పేజీలు తిరగ రాసే రచయితలుంటారు. వారి మనసుకే నచ్చక మళ్లీ మళ్లీ రాస్తారు. ఎడిటర్ కి నచ్చకపోతే, సలహాను గౌరవించి, తను చెప్పదలచింది సరిగా వివరించ గలిగే దాకా తిరగరాసేవి ఇక ఎన్నో.
కధా విషయం హిమాలయాల ప్రాంతంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఉత్తరాది కాంభోజీ రాగం ఎందుకు కవి ఉదహరించకూడదు? ఆ రాగం కాంభోజ ప్రాంతంకు చెందినందున ఆ పేరు వచ్చిందనీ, గంభీరం ఐన రాగం అని raga guide లో పేర్కొన్నారు. స్వరాలలో కైశిక నిషాదం ఉన్నది. విషాదం ఎందుకు పలకదు!
గిరిక సంగీతం దేవతల దేమో. మానవ సంగీతానికి అతీతమైన దేమో. సంగీతం పుస్తకాల్లో, రాసి ఉన్న ప్రకారం మంద్ర, షడ్జమ స్థాయి లే మానవులకు అందుబాటులో ఉన్నవి. గాంధర్వం దేవతలే పాడగలరు. కాళిదాసు కుమార సంభవం లో కూడా ఈ విషయ ప్రస్తావన ఉంది. భారతదేశంలో తయారయే తంజావూరు వీణలు, సరస్వతీ వీణల నాదం పక్కల కూర్చొన్న వాళ్లకే వినిపిస్తుంది. గిరిక వీణ వసురాజుకు, కొండమీద అడవులలో దూరానికి వినిపించిందంటే, అది మనుషులు చేసిన వీణ కాదు. వసురాజు ఇంద్రుని వరాలు పొందిన వాడు. వసురాజుకు స్వర్గానికి విమానంలో రాకపోకలున్నయ్యి. అతడి నర్మసఖునికి కూడా, స్వర్గానికి వీసా, పాస్పోర్ట్ ఉండి ఉండాలి. వారు గంధర్వ గానం విని ఆనందించి ఉన్నారు. అంతకన్నా ఎక్కువ ఆకర్షణీయంగా గిరిక వీణ పలికించిందని వసురాజు, అతని మిత్రుని సంభాషణలద్వారా కవి మనకు ముందే చెప్పి ఉన్నాడు.
భట్టుమూర్తికి సంగీత కళా రహస్య నిధి అని బిరుదు ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో? నాకు తెలియదు కాని, వసుచరిత్ర కావ్యం చదివి, అతడి సంగీత కళా పాటవం నిర్ణయించక్కర్లేదు. ఒకటి రెండు పద్యాల ద్వారా, అతడు చేయని తప్పులు సంగీత పరంగా అతని మీద ఆరోపించక్కర్లేదు. సంగీతజ్ఞులు ఆ ధోరణిగా ఆలోచించక్కర్లేదు, అని నాకనిపిస్తున్నది.
మాన్యమిత్రులు శ్రీ కామేశ్వరరావు గారు ఎప్పటివలెనే ఒక అందమైన పద్యాన్ని పరిచయం చేసి ఈ వ్యాసంతో మరొక మంచి కవికి మరికొంతకాలం స్మరణీయతను కల్పించటం అభినందనీయమైన విషయం. వ్యాఖ్యానరీతితోపాటు వారి పద్యరథ్యాప్రయాణకథనం కూడా క్రమపరిగతితో ఆసక్తికరంగా సాగిపోయింది. తత్ప్రశంసానైపథ్యంతోనే రెండు మూడు ప్రాస్తావికాంశాలను ప్రస్తావిస్తున్నాను:
మొదటిది: మీరు పేర్కొన్నది కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసారసంగ్రహంలో స్వీకరించిన పాఠం. అంతకు మునుపు సకలనీతిసమ్మతములో మడికి సింగన నీతిభూషణములోనిదిగా ఉదాహరించినప్పటి పాఠమూ ఇదే. రెండూ సరిగా లేవు.
శ్రీరామచంద్రుడు శరసంధానం చేసినప్పుడు సముద్రం ఘూర్ణిల్లినదే కాని, ఇంకిపోలేదు. ఇంకినట్లయితే సేతుబంధనమహాకార్యం సంభవించేదే కాదు. “రాఘవు” అన్న షష్ఠీ విభక్తి మూలాన “శరాగ్రమునందు” అన్నదానికి భావార్థకప్రత్యయాంతములైన శోషణ సంహార ధాతువులు రెండింటితోనూ అన్వయం సాధ్యం కాదు. అందువల్ల ఇది అపపాఠం. 1929 నాటి భైరవుని శ్రీరంగమహత్త్వము పీఠికలో శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు ఉదాహరించినట్లు
అన్నదే సరైన పాఠం. లంకానగరికి దారినివ్వలేదని ఆగ్రహించి, శరసంధానం చేసిన శ్రీరామచంద్రుని ఆ శరాగ్రమునందు (శరాగ్రమునందు – అన్నదానికి ‘శరాగ్రముచే’ అని తృతీయార్థకం చెప్పబడుతున్నది) సముద్రము (ఆకులవృత్తిన్=) వ్యాకులత్వాన్ని పొంది, తన క్షోభమును మాని, సర్వవస్తువులను తన గర్భంలోనికి విలీనం చేసికొనే స్వభావాన్ని మాని, గడ్డిపోచ కొసనున్న నీటిచుక్క వలె నిలిచిపోవటం; శరాగ్రముచే (అన్నది ఈ రెండు క్రియలతోనూ అన్వయిస్తుంది కనుక) రావణుడు మృతిచెందటం – వాల్మీకి గారే చెప్పకపోతే వట్టి మిథ్య కదా! అని సార్థకమైన క్రమాన్వయం.
ఇది శ్రీ రామకృష్ణకవిగారు సరిచేసిన పాఠమో, లేక వేరొక చోట ఈ విధంగా ఉదాహరింపబడినదో నాకు తెలియరాలేదు. ఏ తెలుగు పద్యాన్ని ఉదాహరింపవలసివచ్చినా విమర్శకులు ప్రామాణికస్థితి లేక స్వయంగా పాఠపరిష్కారం చేసికోవలసి ఉండటం మన సాహిత్యానికి పట్టిన శోచనీయమైన దుఃస్థితి.
రెండవ సంగతి: ఈ పద్యానికి మూలమైన బిల్హణుని విక్రమాంకదేవ చరిత్రలోని శ్లోకద్వయిని ముమ్మొదట జల్హణుడు తన సూక్తిముక్తావళిలో చేర్చుకొన్నాడు. బిల్హణుని రచనలను తొలిసారిగా శ్రీనాథుడు తన కృతులలోనూ, చాటువులలోనూ సమర్థంగా అనువదించుకొన్నాడు. అంతకు మునుపు తెలుగు కవులు తత్ప్రభావితులైనట్లు కనబడదు. చాటుకవులైతే సాధారణంగా సంధానగ్రంథాలలో నుంచి స్ఫూర్తిని పొందటం కనబడుతుంది. ఇదే భావంతో సంధానగ్రంథాలలో లభిస్తున్న బిల్హణుని శ్లోకాలను పోలిన మరికొన్నింటిని కూడా పరిశీలించి తెలుగు కవి తన పాఠాన్ని రూపొందించుకొని ఉండటం భావ్యమే. జల్హణుడిచ్చిన బిల్హణుని శ్లోకపాఠం ఇది:
లఙ్కాపతేః సఙ్కుచితం యశో యద్యత్కీర్తిపాత్రం రఘురాజపుత్రః
స సర్వ ఏవాదికవేః ప్రభావో న కోపనీయాః కవయః క్షితీన్ద్రైః.
పృథ్వీ(మహీ)పతేః సన్తి న యస్య పార్శ్వే కవీశ్వరా స్తస్య కుతో యశాంసి?
భూపాః కియన్తో న బభూవు రుర్వ్యా నామాపి జానాతి న కోఽపి యేషామ్.
మూడవ సంగతి: విక్రమాంకదేవ చరిత్రను తెలుగులో అనువాదం చేసినది శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, శ్రీ మాదిరాజు విశ్వనాథరావు గారలు. గొప్ప జంటకవులు. వీరి అనువాదం మొదట చిన్ని చిన్ని సంచికలుగా వనపర్తి సంస్థానం వారిచే ప్రకటింపబడింది. నా చిన్ననాడు వాటిని చదివాను. వాటిలో చాలా విలువైన సమాచారం ఉండింది. అది నేటి గ్రంథంలో లేదు. ఆ ప్రతులను సైతం ఎవరైనా సంపాదింపగలిగితే బాగుంటుంది. ఇప్పుడు అంతర్జాలంలో ఉంపబడిన 1974 నాటి ఆంధ్ర విక్రమాంకదేవ చరితములో పుటల క్రమం అవకతవకగా ఉన్నది. ఎవరైనా దయతో ఆ పుటల వరుసను సరిచేసి మళ్ళీ అందుబాటులోకి తేగలిగితే పాఠకులకు ఎంతో మేలు చేసినవారవుతారని విన్నపం.
శ్రీ మానవల్లి వారు ‘నీతిభూషణము’ను గురించి వ్రాసిన ప్రస్తావనలన్నీ జాగ్రత్తగా పరిశోధింపదగినవి. అది వేరే కథ.
మాన్యులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారికి
నమస్కారములతో,
శివాగ్నిలింగస్కాందాదిపురాణోపదిష్టమైన కథ ఒకటుండగా కాళిదాసు దానిని స్వాయత్తీకరించికొని ఆత్మీయమైన కావ్యశిల్పీకరణకౌశలంతో లోకోత్తరమైన అర్థపుష్టికి, ధ్వనివైభవానికి ఉదాహరణప్రాయంగా మలిచి చెప్పాడన్నది స్పష్టం. మన్మథుడు ధనుస్సుకు బాణాన్ని తొడిగిన సన్నివేశం మాత్రమే కథాగతంగా ఆవిష్కరింపబడింది. పరమశివుని ధైర్యాన్ని కించిన్మాత్రమైనా విలోపింపజేసినది, ఆయనకు ఇంద్రియక్షోభకారకమైనది ఆ మన్మథశరనిపాతమే అన్నది వ్యంజింపబడింది. ధనుశ్శబ్దం కేవలం వింటియందు మాత్రమే గాక ద్వాత్రింశదాయుధాలకు, అష్టావింశత్యుత్తరశతసంఖ్యాకములైన అస్త్రాలకు అనువర్తనీయమని ధనుర్వేదసూత్రం. మన్మథుడు తన ధనుస్సునకు సంధించినది పాణిముక్తాలైన బాణకోటిలోని సామాన్యశిలీముఖాన్ని కాదు. అది బ్రహ్మాస్త్రాదుల వలె ప్రయోగమే తప్ప ఉపసంహారం లేని మంత్రముక్తమైన సంమోహనమనే దివ్యాస్త్రం. శస్త్రాస్త్రములు రెండింటికీ బాణమన్నది వ్యావహారికబోధం. యుద్ధోపక్రమణాన స్వస్తికపాదావస్థితుడైన యోధుడు వామహస్తంతో ధనుస్సును చేతబూని, సప్తవింశత్యంగుళాలు ఉభయపాదాల నడుమనుండగా వైశాఖస్థానంలోకి వచ్చి, శరీరభారమంతటినీ కాలివ్రేళ్ళపై నిలిపి, వింటి క్రిందికొనను నేలకు మోపి, అల్లెత్రాటిని పైకొప్పుకు బిగించటం జరుగుతుంది. ఆ ప్రక్రియను కేవలసాంకేతికమైన ధనుశ్శాస్త్రపరిభాషతో వివరించి కావ్యార్థాన్ని భగ్నం చేయటం ఇష్టం లేక మహాకవి “హరబద్ధలక్ష్యః శరాసనజ్యాం ముహు రామమర్శ” అని దృశ్యాన్ని మాత్రం ప్రకాశింపజేశాడు. అది ప్రమార్జనమనే ధనుష్కరణం. “శరాసనజ్యాం ముహు రామమర్శ” అంటే లక్ష్యభేదనార్థం ఎక్కుపెట్టిన వింటిని, బిగించిన అల్లెత్రాటిని మళ్ళీ ఒకసారి సరిచూసుకొన్నాడని భావం. ఆ తర్వాత అమ్ములపొది నుంచి ‘ఆదానము’ అనే శరగ్రహణక్రియను – ఆ అవసరం లేదు కనుక – మహాకవి ప్రస్తావింపలేదు. నారిని బిగించిన తర్వాత వింటికి తిరుగులేని సంమోహనాన్ని తొడిగాడని శరవిన్యాసాన్ని మాత్రం వర్ణించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడని, సామాన్యబాణకోటికి వలె ఉపచ్ఛేదముతో గాక మంత్రముక్తమైన మహాస్త్రాన్ని విడిచిపెట్టాడని ప్రతీయమానం. అది ధనుఃసంహితలలో ఉపదేశింపబడిన ప్రయోగవిధానం.
అస్త్రప్రభావం వల్ల పరమశివుడు చంద్రోదయారంభం నాటి అంబురాశి వలె ఈషత్పరిలుప్తధైర్యుడు అయ్యాడు. సంమోహనప్రభావం వల్లనే ఆయన ధీరత్వం ఎంతో కొంత సడలిపోయింది. దొండపండు వంటి క్రిందిపెదవిని కలిగిన పార్వతీదేవి ముఖమండలమందు తన మూడుకన్నుల చూపులను నిగుడింపజేశాడు. ఇందుచే భగవంతుడైన పరమశివుని మనస్సులో రతిభావోదయం చెప్పబడినదని మల్లినాథ సూరి వివరించాడు. ఆయన చూపులు సోకి పార్వతీదేవి నిలువెల్లా పులకాంకురాలతో పూచిన లేతకడిమి లాగున కానవచ్చింది. ఆమె మనస్సులో సైతం రతిభావం అంకురించింది. “న కేవలం హరస్యైవ దేవ్యా అ ప్యుదితో రతిభావ ఇతి భావః” అని మల్లినాథ సూరి.
అప్పుడు పరమశివుడు ఎంతో ప్రయత్నం మీద మనస్సును నిగ్రహించికొని, తన ఇంద్రియవికారానికి (రతిభావోదయానికి) కారణమేమిటని నలుదెసల కలయజూశాడు. దండయాత్రను మొదలుపెట్టి, ఆలీఢస్థానంలో నిలబడి, వింటిని వలయాకారంగా ఆకర్షించి, శరమోక్షణానికి అభ్యుద్యతుడై ఉన్న మన్మథుని చూశాడు. ఇది పరమశివుడు వీక్షించిన దృశ్యం.
అయితే, చతుర్థసర్గంలో విలాపావస్థలో ఉన్న రతిదేవికి గుర్తున్న దృశ్యం వేరు. మన్మథుడు ధనుస్సును తొడయందు నిలిపి, ఒకవైపు శరానికి వంకతీర్చుతూ, మరొకవైపు వసంతునితో చిరునవ్వు నవ్వుతూ – అతనితో మాట్లాడుతూనే, నయనోపాంతవిలోకనాలతో (కడకంటి చూపులతో) ఆమెకేసి చూశాడు. ఆలీఢస్థానంలో ఉన్న మన్మథుడు దక్షిణపాదాన్ని కుంచితం చేసినప్పుడు ధనుస్సు ఒడిలో (ఉత్సంగమందు) ఉన్నట్లుగా ఆమెకు కానవచ్చినదన్నమాట. అది ప్రత్యాలీఢస్థానంలో ఉన్న మన్మథుని విక్షేపక్రియ. ప్రయోక్తచే శరమోక్షణం జరిగినదని ప్రతీయమానం. అప్పుడు మనస్సంచలనాన్ని పొందిన పరమశివుడు కన్నువిప్పి చూసే సరికి మన్మథుడు క్రీగంటితో ధనుస్సునకు బిగించిపట్టిన తన పిడికిటిని చూస్తూ (దక్షిణాపాంగనివిష్టముష్టియై), ఆకుంచితసవ్యపాదుడై, మండలీకృతచారుకోదండుడై, బాణం వేయటానికి మళ్ళీ ఆలీఢస్థానకంలో ఉన్నాడు. పునర్విక్షేపక్రియకు సంసిద్ధంగా నిలబడి ఉన్నాడన్నమాట. తపోభంగం చేయటానికి సాహసించాడని పరమశివుడు భ్రూభంగదుష్ప్రేక్ష్యముఖుడు అయ్యాడు. ప్రయోగింపబడినది అమోఘమైన సంమోహనం అయినప్పటికీ ఆయన ధనుర్వేదస్వరూపుడు కాబట్టి మోహావస్థ కలుగలేదు. ఇంద్రియవికారం మాత్రమే కలిగింది. దానినే “త్రినేత్రస్య స్మరశరనిపాతక్షోభః” అని క్షేమేంద్రుడు వివరించాడు.
క్షణలేశంలో మన్మథదహనం సంభవించింది. అది రతిదేవికి గుర్తుండిపోయిన దృశ్యం కాదు.
కాళిదాస మహాకవి అక్షరాక్షరం వాచ్యం చేయక, ప్రకాశ్యార్థప్రకాశకంగా దృశ్యాన్ని నిర్వహించినందువల్ల ఇన్ని రకాల ప్రతిపాదనలకు ఆస్కారం కలిగింది.
అన్నట్లు, శ్రీ దంతుర్తి శర్మగారు జరుగనున్న వ్యాజ్యంలో తమను ముద్దాయిగా భావించినట్లున్నది కాని, మౌలికమైన శివపురాణకథాప్రస్తావన వల్ల వారిని ముత్+దాయి (సంతోషకారకులు) గానే పరిగణింపవలసి ఉన్నది.
శ్రీమన్నారాయణ గారూ, మీరడిగిన చిన్న ప్రశ్న మిక్కిలియానందము కలిగించుచున్నది. ఇటువంటివి చూసే మరెందరికో తోచే తలపుని మీరు ప్రశ్నగా అడిగి నాకు జవాబు చెప్పే అవకాశం కల్పించారు 🙂
భాషా భోధకులైన మీకు తెలియంది కాదు. వ్యాఖ్యరాసే ముందు నాకూ ఈ అనుమానం కలిగింది. సంపాదకులుగా మా వ్యక్తిగతాభిరుచుల ప్రకారమే మేము పోలేము కదా? పత్రికకున్న ప్రమాణాలకు సరిపోయే రచన ఏదైనా, ఎవరు రాసినా ప్రచురించుతాము. మీరన్నట్లే బాగున్నవే పాఠకులకి అందించాలనుకుంటాము, అందిస్తాము!
పాఠకుడిగా చూస్తే కొన్ని నా అభిరుచికి నచ్చేవి ఉంటాయి. అలా నచ్చినపుడు ఆ భావాన్ని రచయితకీ, ఇతరప్రజానికానికీ తెలియజేయాలనుకోవడం తప్పుకాదు అన్న ఉద్దేశ్యంతోనే “చక్కని కథని తెలుగు పాఠకులకు అందించినందుకు ధన్యవాదాలు” అని వ్యాఖ్య రాశాను. బహుశా మీరు కూడా నానుండి ఇది రాబట్టడానికే ఈ ప్రశ్న అడిగారని అనిపిస్తుంది. ఈసారి నుంచీ ఒక పాఠకుడిగా అని చెప్పి మరీ నా స్పందన తెలియజేసుకుంటాను.
ఈ ఒక్క కథనే పైకి తేవాలన్నది నా ఉద్దేశ్యం కానే కాదు. ఒక పాఠకుడిగా నాకు నచ్చిన రచనలకీ, నాలో స్పందన కలగజేసే రచనలకీ వ్యాఖ్యలు రాస్తాను. మీ వ్యాఖ్యని అన్యధా భావించలేదని ఇందుమూలంగా తెలియజేసుకుకుంటున్నాను.
‘ఈమాట’ పత్రికా భూతపూర్వ సంపాదకదిగ్గజాయమానులు, సహృదయులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారు చమత్కారికగా ప్రస్తావించిన దిగ్గజద్వయీ పుంస్త్వ-పుంస్త్వేతరత్వనిర్దిదిక్షకు మునుపు సమాధేయాలుగా రెండు మనవి మాటలు:
దిగ్గజాలు పుంస్త్వభావాన్ని పొందినప్పుడు గజశాస్త్రంలో భద్రగజాలకు ఆవశ్యకమైన ‘మదము’ లేనందువల్ల ఆ ఇద్దరిలోనూ ‘ఉద్ధతులూ’ లేరు; విద్వన్మాన్యులైన మీకు తన్మధ్యోపగతమైన అల్పీయత్వమూ లేదు.
ఆ పద్యం అంతగా మీ అభిమానానికి నోచుకొన్న కృష్ణదేవరాయల కుమార్తె అని చెప్పబడే మోహనాంగి రచన కాదు; అది సంకుసాల నృసింహకవి రచించిన కవికర్ణరసాయనంలోని (3-25) వ పద్యం.
ఇక, అసలు సంగతి: శ్రీ కామేశ్వరరావుగారు నాకు అభిమానపాత్రులు. అద్యతనకాలంలో తమ వ్యాసాల ద్వారా (పద్య) కవిత్వాభిరుచిని బహుముఖీనం చేయటానికి ప్రయత్నిస్తున్న సాహిత్యికులుగా వారంటే అభిమానం నాకు. అందువల్ల ఎప్పుడైనా వారితో అభిప్రాయైకధ్యం విలోపించినా, దిగ్గజాష్టకంలో నా ‘వామనత్వ’మూ, వారి ‘సుప్రతీక’త్వమూ సార్వభౌమంగా తెలిసినవే కనుక “పోరు” నీరాట వనాటాల జోరుగా పరిణమించే అవకాశం లేదు. నేరమిని గూర్చిన చర్చ కాదన్న నేరిమితోడి కూరిమితోడి పోరిమి కాబట్టి నన్నెచోడుని మాటలలోనే చెప్పాలంటే, “అభిరామఘోరంబు” అని ఎవరైనా అనుకోవచ్చును. 🙂
అయినా, ఆత్మీయతానైమిత్తికమైన ముహూర్తకాలచక్రంలో షష్ఠాష్టకమేమీ లేనందువల్ల గాయనశాఫరికపాఠకులకు వాక్పుష్పాపచయం పరిహాసభాజకం కాగల ఆ మాత్రపు పోరు జరిగే అవకాశమూ కనబడటం లేదు. 🙂
నన్నెచోడుని కుమారసంభవంలో శ్రద్ధావైసాదృశ్యం కలరూపు ఎటువంటిదో ప్రతిపద్యాన్ని పరీక్షానిషోపలం పైని గీచి చూచినప్పుడు కాని తెలియదు. కామేశ్వరరావు గారు ప్రకటించిన పద్యం పరిశీలనీయం అని తోచి మైత్రీధర్మంగానే నేను ఆ వాక్యాలను, మరొక పద్యం క్రింద మరికొన్ని వాక్యాలను వ్రాశాను. నా అభిప్రాయం సమంజసం కాకపోతే సరిదిద్దుకోవటానికి నేనెప్పుడూ సిద్ధమే.
సన్నివేశం దాకా తెచ్చి వదిలితే మిగతాది పాఠకులు తమ ఊహాశక్తి పదును పెట్టుకుంటారు కదా! పెళ్ళి కాని వాళ్ళకి కూడా ఇట్టాంటి అనుభూతులు అర్ధం చేయించాలని రాజిరెడ్డి తపన కావచ్చు.
ఉన్నవాళ్ళ లేనివాళ్ళ బతుకు చిత్రాల మధ్యనున్న కాంట్రాస్టుని శక్తివంతంగా పట్టి చూపిన కవిత. బతకడానికి చెమటోడ్చే మనిషికి చెమట రొమాంటిక్‌గా ఉండదేమో కానీ, ఎండకన్నెరుగని సున్నితదేహాలకి అదికూడా రొమాంటిక్ దినుసే!
ఈ కవిత చదవగానే నాకు మొన్నీ మధ్యనే మళ్ళీ చదివిన పెన్నేటిపాటలో పద్యాలు గుర్తుకొచ్చాయి:
ఈ యింటనున్నట్టి యిటుకగోడల పాలగారలో అద్దాలు కలిసిపోవు
ఈ యింటి మహిడీల నెక్కిన చానల వేనలిలో మబ్బుసోన లూరు
ఈ యింట దిరుగాడు నింత పిల్లియు నూరిపెద్ద రైతుల నిలవేయ జాలు
ఇచట త్రేన్పులె కాని విన్పింప వూర్పు, లిచట రూకల గలగల లెత్తిపోవు
ఇచట లక్ష్మీసరస్వతులే వసింతు, రిచట లేనిది మానవహృదయ మొకటె
ఈ యింటి యజమాని ఎంత విద్యావంతు డెపుడు భాగవతమ్మునే పఠించు
ఈ యింటి యిల్లాలు పూయించు గన్నుల కొల్లలు కొల్లలు మల్లెపూలు
ఈ యింటి కొడుకొక్క డింగ్లాండులో ప్రజాస్వామ్యశోధన నెంతొ జరిపి వచ్చె
ఈ యింటి కూతురు పోయిన యేడె సాంఘికశాస్త్రమున పట్ట మొకటి గొనియె
ఎచట జూచిన చిత్రాలు నెన్నొ శిల్పఖండములు కనిపించు నెక్కడను మలిన
మన్నదేలేదు కాని సంపన్నగృహము చొచ్చి చూచిన నాత్మయే శూన్య మిచట
ఎటు చూచినా ప్రక్కలెండి యున్నారు
ఎటు చూచినా విలాపించుచున్నారు
ఎటు చూడలేక తమ కిటికీలు మూసుకొని
కటు జీవిత యథార్థ కథ చూడకున్నారు
అయితే, ఈ “రెండు కవిత్వాలు” కవితలో భావకవిత్వాన్నీ (“అన్నీ జాగర్తగా తుడిచి వుంచిన గాజు పదాలు”), భక్తికవిత్వాన్నీ (“దేవుడికీ భక్తుడికీ మధ్య రొమాన్స్ కవిత్వం”) ఒకే గాటకింద కట్టేయడం సబబుగా లేదు. భావకవిత్వంలో భక్తి ఒక భాగమయినా (ఏకేశ్వరోపాసన), భక్తికవిత్వం అంతకన్నా ప్రాచీనమైనదీ, ప్రత్యేకమైన ఉనికి కలదీనూ. ఆ భక్తికవిత్వం పాడిన భక్తులెవరూ చెమట మరకలంటని అందమైన భవనాల్లో ఉండినవారు కారు. అంతెందుకు, ఈ కవితలోనే ఉదాహరించిన ముగ్గురు కవులుకూడా అలాంటివారు కారు. అంచేత ఆ భాగం మిగతా కవితతో అతకలేదు సరికదా ఒక distraction అనిపించింది.
ముఖము దరహాసమును, చంద్రుడు వెన్నెలను విరియింపజేయటం లోకసహజం. కవి ఆ రెండింటిని కలగలిపి రూపకాన్ని సాధింపజూచినందువల్ల “రమ్యమైన ముఖమనెడి చంద్రునియొక్క దరహాసము” అన్న ఉత్తరోత్తరాన్వయాన్ని పద్యం ఉపక్రమణికలోనే మర్చిపోయాడు. రుచిర = రమ్యమైన, ఆనన = ముఖమనెడి, అబ్జ = చంద్రుని (రుచిరాననాబ్జ), దరహాస = చిరునవ్వు అనెడి, విలాస = లీలయొక్క, వికాస = వికసనముచే, భాసి = భాసమానుడైన, నీహారకర+అతిభాతి = చంద్రునియొక్క విశదప్రకాశముచే – అని అర్థాన్వయం. దీనికి తాత్పర్యం ఏమిటి? ముఖచంద్రదరహాసము అంటే ముఖ-దరహాసము, చంద్ర-దరహాసము అని రెండువిధాలుగా అన్వయిస్తున్నాడు. ఆ ప్రయత్నం వల్ల కల్పన స్వసమర్థకం కాలేకపోయింది. “ఆ రుచిరాననా(…) దరహాసవిలాసవికాసభాసి నీ,హారకరాతిభాతి” అని కాని, “ఆ రుచిరాననాబ్జ దరహాసవిలాసవికాస (…) అతిభాతి” అని కాని వ్రాసివుంటే అర్థం సరిపోయేది. ఇటు ‘అబ్జ’శబ్దాన్ని, అటు ‘నీహారకర’ శబ్దాన్ని ప్రయోగించటం వల్ల అన్వయం తప్పింది. రుచిరానన అయిన పార్వతీదేవి యొక్క దరహాసలీలచే వికాసమును పొంది భాసమానుడైన చంద్రుని వెన్నెలకు (మించిన) అతిభాతిన్ = అధికమైన కాంతిలో – అని ఎట్లాగో సరిపెట్టుకోవటం వీలుకాకపోయింది. ముఖాబ్జమన్న రూపకాన్ని చెప్పిన తర్వాత అదనంగా “భాసి (?) – నీ,హారకర – అతిభాతి” అన్నందువల్ల ప్రారంభంలోనే పద్యశిల్పం భగ్నమైపోయింది. ముఖచంద్రునియొక్క దరహాసమే వెన్నెల అని మర్చిపోయాడు.
పరమేశ్వరునికి “అమలాంగశరీరతుషారదీప్తికాం, తోరునగంబు” అన్న వ్యపదేశం ఎంత కృతకంగా ఉన్నదో చూడండి. ‘అమలాంగ’ శబ్దానికి ‘పరమశివు’ డనే అర్థంలో రూఢి లేదు. దానికి శిల్పశాస్త్రములో చెప్పబడిన అవయవప్రమాణసిద్ధమైన సౌష్ఠవమును కలిగినందువల్ల ‘దోషరహితాంగుడు’ అనే కాని, ‘తెల్లనివాడైన శివుడు’ అన్న ప్రసిద్ధి లేదు. వ్యుత్పత్తిని బట్టి ‘అమల+అంగ = స్వచ్ఛములైన (తెల్లని) కరచరణాద్యంగములు కలవాడు; అమలాంగుడు = శివుడు’ అని మనము చెప్పుకొన్నా, ‘అమలాంగశరీరము’ అన్న సమాసంలోని అంగ-శరీరముల పారస్పరికత (తెల్లని శరీరాంగములు కలవాని శరీరము) పదౌచిత్యము పట్ల కవియొక్క శ్రద్దధానత లేమిని సూచిస్తున్నది. అయశ్చంద్రసూర్యాదులు, వాటి పర్యాయపదాలు ‘కాంత’ శబ్దంతో సమసించినప్పటి అయస్కాంత చంద్రకాంత సూర్యకాంతములలోని ‘కాంత’ శబ్దానికి ‘ఱాయి” అన్న అర్థం ఏర్పడటం కారణంగా “చంద్రకాంతము” అనటానికి “తుషారదీప్తికాంతము” అనటం వ్యాకరణసాధ్యమే కాని, చంద్రునికి ‘తుషారకిరణుడు’ అనే కాని, ‘తుషారదీప్తి’ (మంచువెలుగు) అన్న వ్యవహారం లేకపోవటంవల్ల అది కావ్యదోషప్రకరణంలో చెప్పబడే ‘నేయార్థము’ అనే దోషం. ఏదో కల్పన నిమిత్తం సరిపెట్టుకోవలసినదే కాని, ‘పాలరాతితోడి కొండ’ ఒకటుండటం లోకసిద్ధమేనా? అని కవికి తోచలేదు.
పరమేశ్వరునికి సాత్త్వికభావోదయం ఎప్పుడు కలిగింది? “మదనపరవశయై యున్న పార్వతి ముఖాలంకారంబు”ను చూసినప్పుడు (5-42). ఆమె ముఖమునందు అభివ్యక్తమైన మన్మథపారవశ్యభావాన్ని కనుగొని ఆయన అంతఃకరణ ఆమెయందు సుముఖమైనదని ప్రతీయమానం. ఆ సూచన ‘అలంకారము’ అన్న ఆ బాహ్యచిహ్నంలో లేదు. రమ్యమైన ఆమె ముఖచంద్రదరహాసప్రకాశంలో మునిగి, వెన్నెలలో పాలరాతికొండ ద్రవిస్తున్నట్లుగా ఆయన శరీరమంతటా స్వేదం వెల్లివిరిసింది. అది హిమవత్పర్వతాన్ని ఆకాశగంగ కప్పివేసినట్లుగా ఊహింపబడింది. ఆ హిమవంతుడు పార్వతికి తండ్రి అని, ఆ ఆకాశగంగ పరమేశ్వరునికి భార్య అని; ఆ ఆకాశగంగ ఆయన జటాజూటంలోనిదే కదా! అని, ఆయన ఉన్నదే నీహారపర్వతసీమపైని కాగా నీహారకరాతిభాతి అన్న ప్రయోగానికి ప్రయోజనం ఏమిటని – సందేహపరంపర కలిగితే, అది రామాయణంలో పిడకలవేట వంటిదే అనుకొని, ప్రస్తుతానికి విడిచివేద్దాము.
శరీరమనే పాలరాతికొండ ఎప్పుడు పొల్పారింది? “ఆ … నీహారకరాతిభాతి”లో (సప్తమి); లేక, “ఆ … నీహారకరాతిభాతి”చే (తృతీయ) – పరమేశ్వరుని మనస్సు పారవశ్యాన్ని పొందినప్పుడు. “పరమేశ్వరుని మనస్సు సైతం పారవశ్యాన్ని పొందినప్పుడు” అన్న మాట పద్యంలో లేదు. అసలు హిమాచలాన్ని అమరాధిపవాహిని “పర్వి”, కప్పివేసినప్పుడు “పొల్పారటం” ఎందుకుంటుంది?
ఘర్మజలం పొంగినది పార్వతీముఖదర్శనపారవశ్యంలో ఉన్న పరమేశ్వరుని శరీరం నుంచి. చంద్రకాంతోరునగంబు నుంచి కాదు. చంద్రకాంతోరునగానికి ఘర్మజలోల్బణం ఉండదు. అయితే పద్యంలో, “అమలాంగశరీరతుషారదీప్తికాంతోరునగంబు సమ్మదరసోత్కటఘర్మజలంబు పర్వి” అనే ఉన్నది. సమ్మదరసోత్కటఘర్మజలం పర్వినది శరీరమనే చంద్రకాంతోరునగం నుంచి అని అన్వయం. ఈ సమాసం ‘సమ్మదరసోత్కటఘర్మజలం పర్వినది చంద్రకాంతోరునగం వంటి శరీరం నుంచి’ – అన్న సరియైన అన్వయాన్ని పరిహరిస్తున్నది. మళ్ళీ అమరాధిపవాహిని హిమనగాన్ని కప్పినట్లుగా పొల్పారినది శరీరం కాదు. శరీరమనెడి చంద్రకాంతోరునగం. ఎక్కడికక్కడ పదాలను తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని అన్వయించుకోవాలి. అన్వయమే లేనప్పుడు అలంకారాల చర్చ నిరాధారం అవుతుంది.
శరీరము నుండి కలిగే స్వేదరూపజలోద్గమం రతి వలన, ఘర్మము (వేడి) వలన, శ్రమము (అలయిక) వలన కలుగుతుందని లక్షణం. ఇతరకారణాలు కూడా ఉన్నాయి. సమ్మద రసము అంటే ఆనందరసం. వేదాంతశాస్త్రంలోనూ, అలంకారశాస్త్రంలోనూ అది మనుష్యానందం మొదలుకొని హిరణ్యగర్భానందం వరకు గల ప్రతిబింబానందాలకు బింబభూతమైన పరబ్రహ్మము యొక్క అనుభవము వలన కలిగే ఆనందరసం. అది గ్రీష్మకాలపు తాపాతిశయం వలన కలిగే ఘర్మజలం వంటిది కాదు. అందువల్ల ‘స్వేదము’ అన్న ఆలంకారికరూఢమైన పరిభాషాపదం (స్విద్యతే అనేన అఙ్గ మితి స్వేదః – దీనిచే మేను చెమర్చుతుంది కాబట్టి స్వేదము) తప్ప జిఘర్తీతి ఘర్మః – మాడ్చివేసే వేసవికాలపు ఎండలో కారే చెమట అన్న అర్థాన్ని కలిగిన పదం అక్కడ అనుచితమే అవుతుంది. సమ్మదరసం ఉన్నప్పుడు ఘర్మజలానికి స్థానం ఉండదు. పైగా నీహారకరాతిభాతి వల్ల ఘర్మజలం అసలే ఉద్గమింపదు.
ఇక రసభావాల చిత్రణ విషయం. ఇప్పటికే లేఖ పెద్దదైనందున కేవలం సూచించి, వదిలివేయక తప్పటంలేదు. కొద్దిసేపు క్రితం (5-38)లో కావ్యనాయిక పార్వతికి స్వేదోదయాన్ని వర్ణించాడు. దాదాపు అదే రకమైన భావంతో మళ్ళీ ఇప్పుడు నాయకునికి స్వేదోదయాన్ని చెప్పాడు. అదీ మరచి, (5-45)లో మళ్ళీ వెంటనే రోమాంచము, కంపము అన్న సాత్త్వికభావాలను అపక్రమంలో నాయకుని యందు చిత్రించాడు. పార్వతికి మేను చెమర్చినప్పుడు చిత్రింపబడిన రాగాతిశయం, భావదీప్తి పరమేశ్వరునికి స్వేదోద్గమం ఒళ్ళంతా కప్పివేసినట్లుగా (ముచ్చెమటలు పట్టినట్లుగా) చిత్రింపబడటంలో ఔచిత్యం లేదని కవి ఊహింపలేదు. ఏకకావ్యంలో నాయికానాయకులు ఇద్దరికీ రూపసామ్యోదిత సాత్త్వికభావాలను కాలాంతరసంక్రమితాలుగా వర్ణించటంలో ఉన్న విసంగతి కూడా కవి దృష్టికి రాలేదు.
మాన్యమిత్రులు మన్నించాలి. ఎన్ని విధాల చూచినా ఇందులో ఉత్తరోత్తరాన్వయంతోడి స్పష్టమైన అర్థస్ఫురణ కాని, సుభగమైన రసప్రతీతి కాని కనబడటం లేదు. ప్రాచీనుడైన మహాకవి రచన కాబట్టి సరసులు నెరసులను పట్టించుకోకుండా ఎక్కడికక్కడ సరిపెట్టుకొంటూ ముందుకుపోవాలి.
మొదటి సంగతి: ‘అనుక్త మన్యతో గ్రాహ్యమ్’ అన్నట్లు కాళిదాస కుమారసంభవాన్ని ముందుంచుకొని చదివితే గాని ఈ పద్యార్థం బోధపడదు. కాళిదాసు వర్ణించినది పార్వతీ మనోజ్ఞతనువుపై చిలికిన తొలకరి జలకణాల స్థితిగతులను. ఆ కల్పనలోని సౌందర్యాతిశయం, అభినవత్వం, భావధ్వని, ప్రతిపదాన్ని ఆచితూచి ఎన్నుకొన్నప్పటి పరికరాలంకారపు దివ్యశోభ – వ్యాఖ్యాతల మనస్సులనే గాక మహాలంకారికుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ గంభీరిమను వివరించేందుకు దానిపై లెక్కలేనన్ని వ్యాఖ్యలు వెలిశాయి. అనర్ఘమైన శ్లోకం అది.
తెలుగు కవి రూపిస్తున్నది అడరు నవాంబుధారలను. అంటే, వర్షర్తువేళ క్రమక్రమంగా విజృంభిస్తున్న నవాంబుధారల స్వస్థితిని. ఎంత నవంనవములైనప్పటికీ అతిశయిస్తున్నవి అంబువుల “ధారలు” కనుకనే అవి జటాటవిలో “విభ్రమించటం” (తిరుగుళ్ళు పడటం) సంభవించింది. తొలుకారు నాటి నీటిచుక్కలైతే జటాటవిలో విభ్రమించే అవకాశమే ఉండేది కాదు. బిందువులకు విభ్రమించటం ఉండదు. జలధారలు కాబట్టే విభ్రమణాన్ని పొందాయి. ఎట్లా పొందాయి? అంటే, పరమేశ్వరుని వలె పార్వతీదేవి కూడా కేశపాశాన్ని కపర్దజటాజూటోపమంగా బంధించి ఉన్నందువల్ల ఆ మహాజటాటవిలో అంబుధారలు చిక్కుకొని కేశావర్తాల వెంబడిని తిరుగుళ్ళుపడవలసివచ్చిందని భావం. దట్టమైన చుట్టుకురులకోసం పాపం పార్వతికి సైతం జటాటవిని కల్పింపవలసివచ్చింది. అంతకు ముందు పద్యంలోనే (6-108) పార్వతి అందమైన జడలపై తొలకరి నీటిబిందువులు ముత్యాల సేసల వలె మనోహరంగా ఉండటాన్ని వర్ణించాడు. అంతలోనే ఆ సంగతిని మర్చిపోయి, లేనిపోని జటాటవిని తెచ్చిపెట్టుకోవటం వల్ల – ఆ జటాటవిలో విభ్రమింపవలసివచ్చిన “అడరు నవాంబుధార”లను తెచ్చిపెట్టుకొని తబ్బిబ్బయ్యాడు. అంతకు క్రితమే నెఱిజడలతో ఉన్న పార్వతీదేవి అంతలోనే వేణీబంధకపర్దిని అయినప్పటికీ, అది సమున్నద్ధశిఖండకం కాక, ఆవర్తాకారంలో కుంభీబంధసంయుక్తమై సముల్లేఖ్యంగా ఉన్నప్పటికీ – దానికి జటాటవితో తాద్రూప్యం సరికాదని చూసుకోలేదు. అననురూపమైన ఆ జటాటవిలో వర్షానవాంబుధారలు విభ్రమిస్తుండటం పార్వతీ కేశవర్ణనకు శోభాహేతువు కాదని కవి గ్రహింపలేదు.
అంబుధారలు “వెల్వడి, చనుదెంచి” అంటే, పార్వతీజటాటవిలో విభ్రమించి విభ్రమించి, అక్కడినుంచి బైటపడి వచ్చి – అన్నమాట. “వెల్వడి” అంటే సరిపోయేది. “వెల్వడి, చనుదెంచటం” ఎందుకు? వెల్వడిన తర్వాత ఎక్కడికి చనుదెంచినట్లు? పోనీ, ఫాలాగ్రసీమకో ఎక్కడికో అక్కడికి చనుదెంచిన తర్వాత, “రాలుగొనటం” ఎట్లా సాధ్యమైంది? ‘రాలుగొను’ అన్న ఆ విచిత్రమైన ధాత్వర్థానికి కవి అనుకొన్న భావం ఏమిటో కవికే తెలియాలి. ఎంత సూర్యరాయ నిఘంటువు సర్దిచెప్పినా, ‘గళితమై, క్రిందికి జాఱి’ అన్న అర్థంలో ‘రాలు’ ధాతువుపై క్త్వార్థకమైన ‘కొను’ ధాతువు చేరి ‘రాలుగొని’ అని స్వార్థంలో రూపం ఎట్లా ఏర్పడుతుంది? నీళ్ళకు ‘రాలటం’ ఉండదు కనుక జలధారలకు ‘రాలుగొను’ అన్న భావార్థక స్వతంత్రక్రియాకల్పన సార్థకం కాదు. ఆముక్తమాల్యద (4-82) లో “నవమేఘపృథుకములకు రాలె నొయ్యన వడగండ్లు పాలపండ్లు” అన్నప్పుడు అక్కడ శిశువులకు పండ్లు రాలటమూ ఉన్నది; మేఘాల నుంచి వడగండ్లు రాలటమూ ఉన్నది. అది సార్థకమైన ప్రయోగం. ప్రకృతపద్యంలోని నీటిధారలు ‘రాలుగొనటం’ వ్యర్థకల్పితమని గ్రహించాలి. అందుకే దానికి ప్రయోగాంతరాలు దొరకవు.
కేశబంధం నుంచి (ఫాలస్థలికి కాబోలు) వెల్వడి, (అక్కడినుంచి) చనుదెంచి, రాలుగొంటూ – అంటే, రాలుకుంటూ (క్రిందికి జారుతూ) వచ్చిన జలధారలు కనురెప్పలపై పడి, ఆ పక్ష్మములు (కనురెప్పలు) పక్ష్మలములు (దట్టమైన వెంట్రుకలు కలవి) కావటంవల్ల “వెడ నిల్చి” = కొద్దిసేపు నిలిచిపోయాయన్నమాట. నిలిచినవి ప్రథమోదబిందువులు కాదని, అడరు నవాంబు“ధార”లని అంతలోనే కవి మర్చిపోయాడు. కాళిదాసు వర్ణనలో “ఉదబిందువు-లు” అని బహువచనం ఉన్నది కాబట్టి వాటికి అవిరళత్వం చెప్పబడిన మాట నిజమే. ఎంత అవిరళములైనా, అవి నీటిచుక్కలు. “అడరు నవాంబుధారలు” కావు. ఎంత దట్టమైన కనురెప్ప అయినా, ప్రథమోదబిందువులకు వలె అంబు“ధార”లకు ఆ రెప్పపై నిలుకడ ఎలా సాధ్యమని తెలుగు కవికి తోచలేదు. ‘స్థితాః క్షణం పక్ష్మసు’ అన్నది ‘పక్ష్మములన్ వెడ నిల్చి’ అని తెలుగయింది కాని, అది ఉదబిందువులకు అనువర్తించినట్లుగా అంబుధారలకు వర్తింపదు. “ధార” అన్న తర్వాత, అవిచ్ఛిన్నగతి మూలాన “నిలుకడ”కు వీలుండదు కదా.
‘తాడితాధరాః’ అన్న కర్మవాక్యం తెలుగులో ‘మోవిపై పడి’ అయింది. మోవిపై పడిన ధారలు ఏమైనాయో తెలుగు కవి చెప్పకపోవటం వల్ల – క్రిందిపెదవి యొక్క స్వాభావికమృదుత్వం వ్యంజింపబడిన సంగతి శ్లోకాన్ని చదవనివాళ్ళకు తెలియదు. అధ్యాహారవిషయస్ఫురణ కలుగదు. పయోధరముల ఉత్సేధం (ఉన్నతి, కాఠిన్యము), వాటిపై ఉదబిందువుల నిపాతం, తత్ఫలితంగా ఉదబిందువులు చూర్ణితాలు కావటం అన్న కాళిదాసు శ్లోకంలోని అద్భుతావహమైన పరిణామక్రమమంతా తెలుగులో “మోవిపైఁ బడి”, “కుచఘట్టనన్” అన్న కరుకు మాటలతో కుప్పకూలిపోయింది. ఆ కుచఘట్టన వలన – అంటే, స్తనములతోడి ఒరపిడి వలన ఆ అంబుధారలు చెదరి = చెల్లాచెదరై(నందువల్ల); పాఱి = పరువులెత్తి లేదా పునఃప్రవాహగతిని పొంది; రయంబునన్ = వేగంగా (?); ముత్తరంగలన్ = మూడు వళులనెడి విషమరేఖలయందు (తత్తన్మధ్యములందు); మడుగులువాఱి = నిమ్నోన్నతములందు చిక్కినవైనందున మడుగులు కట్టి (?) – అని భావం. ఒక్క వాక్యశకలంలో ఇన్ని అన్వయింపని వ్యర్థపదాలెందుకు?
కొందరు విమర్శకులు “నాభికిన్ + ఎడము + ఆనక + చొచ్చెను” అని పదచ్ఛేదం చేయటం సరికాదు. ఆ పక్షాన యతిభంగం. కొందరు వ్యాఖ్యాతలు “నాభికిన్ + ఎడ + మానక = చోటువిడువక” అని వ్రాసిన అర్థం కూడా సరిపడదు. నాభికి చోటువిడువకపోవటం ఏమిటి? దానికి ‘స్తనముల రాపుచే చెదరి, ప్రవహించి, మూడు వళులందు మడుగులుగా నయి, నాభియందు సంపూర్ణముగా ప్రవేశించెను’ – అని ముద్రితప్రతులలో ఉన్న తాత్పర్యం ఎట్లా సరిపడుతుంది? ‘మడుగు కట్టిన నీటికి’ అన్న అర్థంలో ‘మడుగులు వాఱటం’ అన్న క్రియారూపం ఎట్లా ఏర్పడుతుంది? “మడుగులుగా” అయిన తర్వాత, మళ్ళీ పాఱే ప్రవాహగతి ఎట్లా సిద్ధిస్తుంది? “చోటు విడువక”, “సంపూర్ణముగా ప్రవేశించటం” ఏమిటి? ఇన్ని వ్యర్థపదాలకు అర్థం ఎట్లా పొందుపడుతుంది?
అక్కడ నిజానికి, “నాభి + కెడ + మానక” అని చదువుకోవాలి. “కెడ” అంటే పార్శ్వసంగతి. “చెదరి తోఁ బఱతెంచు చెందమ్మిఱేకులు గెడగొని మొగుపుఁ గెంగేలు గాఁగ” అని కుమారసంభవం (9-72) లోనిదే మరొక ప్రయోగం. జలధారలు వళుల వద్ద మడుగులు కట్టి ఆగిపోక, నాభి వైపునకు సైతం పరువులువారటం మానక – అని కవిహృదయం.
నీటిచుక్కల నాభీప్రవేశాన్ని అభివర్ణించటం నాభియొక్క లోతును సూచించటానికి – అన్నది భావ్యమే. వళులలోనికి జారిన ఉదబిందువులు “చిరేణ” = నెమ్మది నెమ్మదిగా పొక్కిలిని చేరాయని మాత్రమే కాళిదాసు. “మానక చొచ్చెను” అన్నప్పుడు అంబుధారల ప్రవాహగతి అవిచ్ఛిన్నంగా కొనసాగి, శ్లోకభావం భగ్నమైపోయింది. ‘చేరెను’ అనక, “చొచ్చెను” అన్నందువల్ల, అంబుధారలు నాభిలోనికి ప్రవేశించి అంతర్ధానమైపోయినట్లు ఊహింపవలసివస్తుంది. అది నాభియొక్క ప్రకరణోచితమైన గంభీరిమకు తగని పదసంగతి. ఆ విధంగా జటారణ్యంలోనుంచి వెలువడి, చనుదెంచి, రాలుగొని, దట్టమైన కనురెప్పలపైని ఆగి, కుచఘట్టన మూలాన చెల్లాచెదరైన నవాంబుధారలు వళుల వద్ద మడుగులు కట్టి, ఆ మడుగులు మళ్ళీ ప్రవాహగతిని మానక నాభికి అభిముఖంగా పరుగులుతీసి, ఆ నాభియందు చొరబడటం ప్రకృతిసహజం కాదని, కవితాత్మకం అసలే కాదని, నాయికాసౌందర్యవర్ణనలో అనౌచిత్యాపాదకమని కవికి తోచలేదు.
అద్భుతావహమైన కాళిదాసు శ్లోకానికి అసమర్థమైన అనువాదం ఇది. ఇందులో ఏ అలంకారమూ లేదు. శ్లేష అసలే పొందుపడదు. స్వభావోక్తికి తావులేదు. పరికరం పద్యం మొదట్లోనే భగ్నమైపోయింది.
పెద్దలు ఈ మాటను అంటున్నందుకు మన్నించాలి. పూర్వకవుల పద్యాలలో ఈ విధంగా ఇన్ని సరిపెట్టుకోవలసిన అన్వయదోషాలు కనబడేది మచ్చుకు ఒకటి కూడా ఉండదు.
ఇటువంటిదే లోగడ ఒక కథను చదివాను. అందులో వేటగాడూ పులీ తారుమారు కావటం జరుగుతుందని గుర్తు.
ఈ సర్వవ్యాప్తమైన ఆత్మ అనే భావన భారతీయులకు ప్రత్యేకం కావచ్చును. ఇతర సంస్కృతుల్లో కూడా ఇటువంటి భావనలు అక్కడక్కడా తలెత్తినా ఒక సిధ్ధాంతస్థాయిలో అవి వృధ్ధి చెందాయని అనుకోను. భారతీయదృక్పథం ఈ భావనను ఒక సిధ్ధాంతంగా ఎంత ఉన్నతస్థాయికి చేర్చినదంటే ఆ ఆత్మనుండే దృశ్యభావ్యమానములైన సర్వమూ దృశ్యభావ్యమానేతరమైన సర్వమూకూడా అదే అని నిరూపించేంతగా.
అనువాదం బాగుంది. ఐతే అనువాదాల్లోనికి స్థానికతను మరింతగా చొప్పించవచ్చును, ముఖ్యంగా చిన్నచిన్న కథల్లో – పాత్రలపేర్లూ స్థలాలపేర్లూ కూడా మార్పు చేయటం ద్వారా. చివరలో విడిగా ఈ సంగతిని చెప్పవచ్చును. లేదా చివరన ఫలాని భాషలోని ఫలాని రచన ఆథారంగా అని చెప్పటం సరిపోతుంది. దానివలన కథలో చదివించేగుణం మరింతగా వృధ్ధిచెందుతుంది. అవేవో తెలుగులోనికి అనువదితమైన మతగ్రంథాల విచిత్రభాషలాగా కాక సహజసుందరమైన తెలుగులోనికి సాహిత్యానువాదాలు చేయటం వీలైనంతగా చేయాలి. ఇదంతా నా ఉబోస మాత్రమే రచయితకాని ఇతరసాహిత్యకారులు కాని పట్టించుకోవాలని వాదించటం కోసం చెప్పిన మాటలు మాత్రం కావు.
కథ రక్తి కట్టించింది, భాషపై రచయితకున్న పట్టు ఆకట్టుకుంది. కాని పాణిని సూత్రాలు ఓ పట్టాన అర్థం కాలేదు; అందుకు కొన్నేళ్ళ పాటైనా శ్రమ పడాలనుకుంటాను. నాకు C తెలుసు గాని సంస్కృతం తెలియదు, కథలోనూ వ్యాఖ్యల్లోనూ కంప్యూటర్ ప్రస్తావన ఉండటాన కొందరికైనా ఆసక్తిగా ఉండొచ్చని ఇది వ్రాస్తున్నాను.
గత శతాబ్దపు మొదటి భాగంలో గణిత పునాదుల మీద ముమ్మరంగా పరిశోధనలు జరిగాయి. 1920 ప్రాంతంలో పాతికేళ్ళయినా నిండని Emil Post అన్న గణిత తార్కికుడు ప్రిన్స్టన్ లో ఉండగా, ఓ production system ప్రతిపాదించాడు. పరిమితమైన గుర్తులని మార్చే సూత్రాల మూలంగా, మౌలికమైన గుర్తులతో మొదలెట్టి, అనేక రూపాలని ఎలా సృష్టించవచ్చో చూపెట్టాడు. మచ్చుకి, రెండు గుర్తులు ( a, b ), అయిదు సూత్రాలు (P->aPa, P->bPb, P->a, P->b, P-> ఎడమ చేతి వైపు ఉన్న దానికి బదులు కుడివైపు ఉన్న దానిని వాడవచ్చు); వీటితో, a, b, aaa, bbb, aba, bab, … ఎటువైపు నుండి చదివినా ఒకే విధంగా ఉండే a, b లతో ఉన్న మాటలన్నిటినీ రాబట్టవచ్చు.
1950ల మధ్యలో MIT కి చెందిన ముప్ఫై ఏళ్ళ లోపల వయసున్న Noam Chomsky భాషాశాస్త్రంలో పెద్ద దుమారం లేపాడు. సృష్టిలో భాష మానవులకి మాత్రమే ఉందనీ, రెండు మూడేళ్ళకే బడీ, వ్యాకరణ పాఠాలూ లేకుండానే, పిల్లలు మాతృభాష నేర్చుకుంటారనీ, అందుకు వాళ్ళకి సార్వత్రిక వ్యాకరణం (Universal Grammar) సహజ సంపత్తుగా ఉండి ఉండాలనీ, అందువలనే ఎక్కడ పెరిగితే అక్కడి భాషని నేర్చుకుంటారని ప్రతిపాదించాడు. మరి ఆ వ్యాకరణ సూత్రాలు ఎలా ఉండొచ్చు? భౌతిక శాస్త్రవేత్తలు కనుక్కునే సూత్రాలలాగే ఇవీ ఉంటాయని మొదలెట్టాడు. పాణిని ఘనతని ప్రశంసిస్తూనే, ఆధునికమైన Post పరిశోధనలను తీసుకొని ఆ సూత్రాల రూపాలలో ఉండే భేదాలని బట్టి నాలుగు వ్యాకరణాలని నిర్వచించాడు: Unrestricted (type-0), Context-Sensitive (type-1), Context-Free (type-2), Regular (type-3). సహజభాషలని దీంట్లో ఎక్కడ చేర్చవచ్చన్నది పరిశోధనకి వదిలివేశాడు. దీనిని Chomsky Hierarchy అంటారు.
John Backus (1977 Turing అవార్డు గ్రహీత) అన్న పాతికేళ్ళ కొలంబియా విద్యార్థి న్యూయార్క్ లో IBM కంప్యూటర్ ని చూసి ఉద్యోగం ఇస్తారా అని అడిగితే అప్పటికప్పుడు ఇంటర్వ్యూ చేసి చేరమన్నారు. దానిని ప్రోగ్రామ్ చెయ్యడం చాలా కష్టంగా ఉందని పై స్థాయి భాషలో ప్రోగ్రాములు వ్రాయాలని, యాజమాన్యాన్ని ఒప్పించి రెండేళ్ళలో 1954లో FORTRAN ని విడుదల చేసి, మనందరికీ మెషీన్ భాష లో ప్రోగ్రాం చేసే బాధ లేకుండా చేశాడు. ఈ భాషల వ్యాకరణాన్ని వివరించడానికి Chomsky Hierarchy లో Context-Free Grammar ఆధారంగా ఓ సంకేత పద్ధతిని ప్రవేశ పెట్టాడు. దానిని Backus Normal Form (BNF) అంటారు. అప్పట్లో ALGOL అన్న భాషని వివరించడానికి దీనిని Peter Naur వాడాడు. C, Java, Pascal, ఇలాంటి భాషలన్నీ ALGOL సంతతే. BNF కి Peter Naur (2005 Turing అవార్డు గ్రహీత) దోహదం చెయ్యటానా, దీంట్లో Normal అన్నదానికి అర్థం లేకపోవడానా, Backus Normal Form కి బదులు Backus Naur Form అనాలని Donald Knuth 1967లో ప్రతిపాదించాడు. కాని దీనిని ఎప్పుడో పాణిని కనుక్కున్నాడు కనుక Panini Backus Form అనాలని కొందరు వాదించారు. బహుశా పేరున్న కంప్యూటర్ సైన్సు వాళ్ళ సమర్థన పెద్దగా లేకపోవడాన అది నిలవ లేదు.
C లో సందిగ్ధానికి తావు లేదన్నారు వేమూరి. అది వాస్తవం కాదు. Dangling else ని ఉదాహరణగా ఇస్తారు: If a then if b then s1 else s2 అన్న దాంట్లో else లోన if కి చెందిందా బయట దానికా అన్నది వ్యాకరణ పరంగా చూస్తే తేలదు. పాణిని పద్ధతిలో అలాంటి అసందిగ్ధతకి తావు లేదని చదివాను [1][2]; రెండూ తెలిసిన చంద్రమోహన్ లాంటి వారెవరైనా వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.
ఏమైనా అంత పకడ్బందీగా ఓ సహజ భాషకి వ్యాకరణం రెండు వేళ ఏళ్ళ క్రితమే సృష్టించారంటే నమ్మలేని సత్యం. అది మన దేశంలో పుట్టిందన్నది గర్వించాల్సిన విషయం.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “On Panini and the Generative Capacity of Contextualized Replacement Systems,” by Gerald Penn and Paul Kiparsky, COLING 2012.
[2] “Panini’s Grammar and Modern Computation,” by John Kadvany, History and Philosophy of Logic, Jan 2016.
అసలేముందీ కథలో? అన్నారు.
అసలు కథలో ముఖ్యంగా ఉండవలసినవే పుష్కలంగా ఉన్నాయని సమాధానం.
ఏమిటవి? చదివించే గుణమూ, స్పందింపజేసే గుణమూను.
కథల్లో ఇజాలూ, నిజాలూ, వాదాలూ వివాదాలూ దృక్పథాలూ సిధ్ధాంతాలూ రాధ్ధాంతాలూ సందేశాలూ వంటివి కూరి వ్రాసినంత మాత్రాన అవి మంచికథలుగా తయారు కావు.
ఈమథ్యన చూస్తున్నాను చాలామంది ఏదో ఒక విషయం మీద చిన్నపాటి వ్యాసం ఒకటి తయారు చేసి ఆపైన ఆ విషయాన్నంతా ఒకటి రెండు పాత్రలనోట్లలో క్రుక్కివేసో ఒక లేఖాస్త్రంగా సంధించో అలాంటి మరేదో చిల్లరవేషం వేసి ఆ వ్యాసకళికను కాస్తా కథను చేసిపారేసి హమ్మయ్య అనుకోవటం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే అటువంటి దివ్యరచనలకు బహుమతులూ సంపాదించుకుంటున్నారు.
ఈ చిన్న కథలో తెలుగునాట ఒకనాటి పెళ్ళివారింటి వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అలనాటి మనుషుల తీరుతెన్నులన్నీ కళ్ళకు కట్టినటుగా చూపించారు.
మాటతీర్లూ పెళ్ళిలో జరిగే తంతుల్లో తేడాలు వచ్చి ఉండవచ్చును కాని, మనుష్యుల మనస్తత్త్వాలు అలాగే ఉన్నాయా ఏమన్నా మారాయా అన్న ఆలోచన కలుగుతుంది చదువరికి.
రాసక్రీడాష్టకము గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:
01/14/2017 9:52 pm
జెజ్జాల కృష్ణమోహన రావు గారు అనువదించిన రాసక్రీడాష్టకం చదివాను.
కర్ణామృతంలో చాలా శ్లోకాలు, అర్థం పట్టుపడకపోయినా, వ్యాఖ్యానం అంతుపట్టకపోయినా, పైకి గొంతెత్తి పాడుకోటానికి (చదువుకోటానికి) చాలా బాగా ఉంటాయని నా అభిప్రాయం. మీరు అన్నట్టు ఎందుచేతనో ఎవ్వరూ శ్రద్ధగా పాడి ‘రికార్డ్’ చెయ్యలేదు. తప్పుల తడకగా రకరకాల స్త్రోత్రాలు మాత్రం చేసిపెట్టారు.
మీరు చేసిన అనువాదాలలో చాలా భాగం, సంస్కృత శ్లోకాలలాగా, గొంతెత్తి పాడుకోటానికి (చదువుకోటానికి ) సులువుగా ఉన్నాయి. ఉదాహరణకి, ‘అంగనా మంగనా’ అనువాదం అద్భుతంగా ఉన్నది.
‘కేకి కేకాదృతానేక…’ శ్లోకం లో అనువాద లోపం ఏమీ అగుపడలేదు కాని, అనువాదం పాడుకోడానికి సులువుగా కనిపించలేదు. మొదటిచరణంలో రెండు లఘువులు గొంతుక్కి అడ్డుపడుతున్నట్టనిపించింది. అలాగే ‘చారుచామీకరా భాస భామా విభు,’ శ్లోకంలో మొదటిచరణం చివర ‘పలు’ కొరకరానిదిగా వినిపించింది.
మిగిలిన అనువాదాలన్నీ, నామటుకు నాకు, భేషుగ్గా కని(విని)పించాయి.
మీ శ్రమ అభినందనీయము.
అయితే ఏవిషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. నాకున్న చందోజ్ఞానం సున్న అయితే, నాసంగీత జ్ఞానం అరసున్న. ఇకపోతే, అనువాదపటిమ విసర్గ అని ఒప్పుకోక తప్పదు.
Frances Wilson translated all three SatakA-s into English. It is published by the University of Pennsylvania Press in 1975 as “The Love of Krishna.” Of course, he has paraphrased the SlOkA-s.
ఔరంగజేబు గురించిన మనకు తెలిసినది పరమత సహనం లేనివాడని, హిందూ, సిక్కు చక్రవర్తుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడని ఆలయాల విద్వంసాలకు పాల్పడేవాడని. కాని ఈ లేఖలో అతని గురించి కన్నా అతను చెప్పిన విషయాలు చాలా వరకు మనకు ఉపయోగపడేవి, నిరుపయోగమైన విద్యను నేర్చుకొనుటకు కాలాన్ని, సమయాన్ని వెచ్చించనక్కర్లేదని మనకు తెలుస్తుంది.
కధ, కవిత, వ్యాసం, విమర్శ విషయం ఏదైనా కాని వ్రాస్తున్న వాళ్లకు కనీసం చదివి ఓ చిన్న స్పందన ఇచ్చేవాళ్ళు ఎంతైనా అవసరం. కాని ఈ రోజుల్లో పత్రికల్లో ప్రచురణకు నోచుకోలేదే అన్న బాధ చాలా మందిలో ఉండనే ఉంటుంది. ముందుగా మనం చెప్పే విషయం కొంతమందికి అయినా చేరాలి అంటే ఎన్నో మరెన్నో ముఖ పుస్తక సమూహాలతో పాటు చాలా బ్లాగులు వెబ్ పత్రికలు ఉండనే ఉన్నాయి. మనం వ్రాసేదాంట్లో విషయం ఉంటే మనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడతారు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వ్రాస్తూ ఉంటేనే మనలో ఉండే నాణ్యత కూడా పెరుగుతుంది.
లేఖనవ్యతిక్రమం సవరణకు హృయదయపూర్వక ధన్యవాదాలు. ‘కలే శుక్రే’ అని రామాశ్రమి. ‘కలే రేతసి వ్రియతే ఉపయుజ్యతే’ అని అమరకోశ ముకుట వ్యాఖ్య. తెలుగు వాక్యంలో ‘ఉపయోజ్యము’ అన్నది సరైన రూపం. ఉపోపసర్గాత్మకమైన యుజ్యము కూడా సాధ్యమే కాని, నా ఉద్దేశం ఉపయోజ్యమనే. “కలేవరం, గాత్రం వపుః సంహననం శరీరం వర్ష్మ విగ్రహః, కాయో దేహః క్లీబపుంసోః స్త్రియాం మూర్తి స్తను స్తనూః” అని అమరకోశం. ప్రతిసంస్కృతములు (ఏకార్థవాచక పర్యాయపదములు) కాబట్టి కలేవర గాత్ర తను శరీరాదులన్నీ లోకమర్యాదానుసారం స్త్రీపురుషతిర్యక్కులకు పర్యాయత్వాన అనువర్తనీయములే కదా.
“ఆ మూడవ అడుగు తార్కికం అవునో కాదో కానీ అది లాక్షణిక సాంప్రదాయమండి. “అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగకారణమ్” – అని ఆనందవర్ధనుడు. తార్కికమా, అతార్కికమా అన్న విషయం శ్రీనాథుని కాలాన్ని బట్టి ఊహించాలి. ఈ కాలపు మన ఆలోచనలో తర్కాన్ని శ్రీనాథునిపై ఆరోపించటం సబబెలా అవుతుంది? ఆ కాలం నాటికి లాక్షణిక సాంప్రదాయం ప్రకారం రసభంగమే అనౌచిత్యం.”
కాని మీరిచ్చిన సూత్రం “అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగకారణమ్” అర్థం “రసభంగమే అనౌచిత్యం” అని కాదండి. రసభంగం ఐతే దానికి కారణం అనౌచిత్యమే తప్ప మరొకటి కాదు, అనండి. రసభంగం కానప్పుడు అనౌచిత్యం ఉండదని అది చెప్పటం లేదండి. మీరు కార్యకారణాల్ని సమీకరించేశారు. లాక్షణిక సాంప్రదాయంలో తర్కం వేరేరకంగా వుంటుందేమో నాకు తెలీదు కాని ఇక్కడ కార్యం రసభంగం, కారణం అనౌచిత్యం అండి. రెండూ ఒకటే కావండి. ఆనందవర్ధనుడికి తర్కశాస్త్రంలో మంచిప్రవేశమే వుండి వుంటుందండి. కనక ఆనందవర్ధనుడి ప్రకారం ఐనా రసభంగం లేనంత మాత్రాన అనౌచిత్యం లేదని సిద్ధాంతీకరించలేమండి.
శ్రీ రంగ గారు:
Narayana Rao & Shulman’s work has many more interesting, innovative insights about Srinatha and his inimitable art, in it. You’d be lending a helping hand in finding a right place for Telugu literature in the global literary criticism field by buying a copy of the book, and encouraging everyone else interested in this subject to do so.
ఈ వ్యాసం గురించి నేను చెప్పవలసిందంతా చెప్పేశానని అనుకుంటున్నాను. పైగా సాహిత్యం నా hobby మాత్రమే. చూసుకోవలసిన వ్యవహారాలు ఇంకా చాలా వున్నాయి. సెలవు.
ఏ విధంగా ఆలోచించినా మీరు ఉటంకిస్తున్న తర్కం సమగ్రంగా లేదని అనిపిస్తుంది.
3. అనౌచిత్యం అంటే మూలంలో వున్న రసప్రాతికూల్యతే. “అసలు విషయం: మూలంలో రసప్రాతికూల్యాన్ని ఆరోపించితే గాని, అనౌచిత్యస్థాపనం జరగదు.”
ఇందులో మూడో అడుగు తార్కికం కాదు. ఎందుకంటే, అనువాదంలో అనౌచిత్యం ఉండటానికి వేరే కారణాలు ఉండొచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ, మూలభాషలోని శబ్దసమూహాలు అలాగే తీసుకుంటే గమ్యభాషలో అనుచితార్థాలు రావటం.
ఆ మూడవ అడుగు తార్కికం అవునో కాదో కానీ అది లాక్షణిక సాంప్రదాయమండి. “అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగకారణమ్” – అని ఆనందవర్ధనుడు. తార్కికమా, అతార్కికమా అన్న విషయం శ్రీనాథుని కాలాన్ని బట్టి ఊహించాలి. ఈ కాలపు మన ఆలోచనలో తర్కాన్ని శ్రీనాథునిపై ఆరోపించటం సబబెలా అవుతుంది? ఆ కాలం నాటికి లాక్షణిక సాంప్రదాయం ప్రకారం రసభంగమే అనౌచిత్యం.
మూలభాషలో శబ్దసమూహాలు గమ్యభాషలో అనుచితార్థం అయే అవకాశాన్ని పురస్కరించుకుని, ఒక సరికొత్త లాక్షణిక సాంప్రదాయానికి, సరికొత్త మౌలిక ప్రతిపాదనకూ శ్రీనాథుడు నడుం కట్టడం అన్నది దూరాన్వయమైన విషయమండి. ఒక వేళ అలా ఊహించినా కొన్ని ఇబ్బందులు వస్తాయి.
మూలభాష, గమ్యభాష – అని కాకుండా సంస్కృతమైనా, ప్రాకృతమైనా, ఏదేని ఒక కావ్యానికి సంబంధించి ’అశ్లీలము, అమంగళకరమూ, వ్రీడాజనకము’ అయిన శబ్దాలు పరిహార్యాలు అని మమ్మటుడు కావ్యప్రకాశంలోని దోషప్రకరణం లో నిర్దేశించాడు. పైన మీరు చెప్పిన ’గమ్యభాషలో అనుచితార్థం” అన్న విషయం మమ్మటుని దోషనిర్వచనంలో (ఇంకా నేయార్థమూ ఇత్యాది దోషాదులలో) భాగమై విలీనమవుతుంది. లాక్షణికులు తమ ఉదాహరణలలో ప్రాకృత కావ్యాలనూ ఉదాహరించారు. అందువలన వారి నిర్దేశాలు సంస్కృతానికే కాక సంస్కృతేతర భాషల కావ్యాలకూ వర్తిస్తాయి.
మీరు చెప్పిన ఉదాహరణతోనే Acapulco ను తెనుగులో మూలభాషలో నాదానుగుణంగా యథాతథంగా అనువదించి తెలుగులో ఉపయోగిస్తే అది (సహృదయుడైన సామాజికుని దృష్ట్యా) అశ్లీలశబ్దమవుతుంది. ఇది కావ్యప్రకాశకారుడి ప్రకారం దోషం. అది వరకే ఏర్పడి ఉన్న లాక్షణిక సాంప్రదాయం.ఆ సాంప్రదాయాన్ని గుర్తుంచుకుని రచన చేసి ఉంటాడు కానీ, తిరిగి కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పే అవసరం శ్రీనాథునికి ఉండరాదు.
అందుచేత అనువాదం కోసం ప్రత్యేకమైన ’అనౌచిత్య నిర్వచనాన్ని’ తనకు తానే శ్రీనాథుడు నిర్దేశించుకునే అవసరం లేదు. ఒకవేళ నిర్దేశించుకున్నా అందుకు మూలం ఎక్కడో ఉండాలి. లేదా ఆ విషయం గురించి సమగ్రంగా ఒక లాక్షణిక గ్రంథాన్ని వెలువర్చి, ఈ ప్రతిపాదనను సాకల్యంగా చర్చించి ఉండాలి. ఎందుకంటే సంస్కృత అలంకారిక గ్రంథాలన్నీ ఆ ధోరణిలో రచింపబడినవే కాబట్టి. అలాంటివేవీ మనకు కానరావు.
మరొక పార్శ్వం. శ్రీనాథుని కంటే ముందు మూలఘటిక కేతన – దశకుమారచరితమ్ వచన కావ్యాన్ని తెనుగు పద్యానువాదం చేశాడు. మూలభాష సంస్కృతంలోని దండి దశకుమారచరితమ్ – పదలాలిత్యానికి, మాధుర్యాది గుణాలకు ప్రతీతి. నిజంగా అయితే శబ్దమాధుర్యాన్ని, సంస్కృతస్వరనాదాన్ని శ్రీనాథునికి ముందువాడైన కేతన పరిగణనలోనికి తీసుకొని ఉండాలని ఊహించటం తర్కబద్దం. ఎందుకంటే మూలకావ్యంలోని ప్రధానలక్షణమే ’పదలాలిత్యం’ అన్నారు కనుక. తద్వారా శ్రీనాథునికి కేతన మార్గదర్శకం కావాలి. అలా జరిగినట్టు లేదు. కేతనను శ్రీనాథుడు ఉదాహరింపలేదు.
శ్రీహర్షుని నైషధీయచరితమ్ – శృంగారరససంచితమైన ప్రౌఢకావ్యము. ఈ కావ్యం ప్రౌఢిమకు, పాండిత్యానికి పేరు పొంది “నైషధం విద్వదౌషధమ్’ అనిపించుకున్నది కానీ, దండి కావ్యంలా పదలాలిత్యానికి, జయదేవుని గీతగోవింద కావ్యంలా శబ్దసౌందర్యానికి పేరుపడిన కావ్యం కాదని పండితుల తీర్పు. నైషధాన్ని అనుసరించిన శ్రీనాథుడు – అందులో పాండిత్యాన్ని, రసనిర్భరతను, ధ్వని మార్గాదులను గుర్తెఱిగి తెనుగున అనువదింపడానికి పాల్పడ్డం ఔచిత్యం అవాలి కానీ మీరు చెప్పిన విధంగా మూలభాషపు శబ్దనాదాన్ని పరిగణనలోనికి తీసుకోవడం అన్నది అంతగా పొసగని కారణం. అదే కారణమని భావిస్తే కూలకంషంగా మూల భాషలో కావ్యాన్ని, అందులో శబ్దసౌందర్యానికి, స్వరమాధుర్యానికి ముఖ్యకారణాలు అయిన యమక, అనుప్రాసాది గుణాలను మూలకావ్యం యొక్క శ్లోకాలలో వెతికి వాటి తెనుగు అనువాదాలను సరి చూసి సాకల్యంగా విషయాన్ని ప్రతిపాదించి శ్రీనాథుడు చెప్పిన ’అనౌచిత్యంబు పరిహరించి’ అర్థం ఇదేనని నిరూపించాలి.(శ్రీ వేల్చేరు నారాయణరావు గారు, షూల్మన్ గారు అలా చేశారో లేదో నాకు తెలియదు.) తర్కబద్ధం అన్న ఒక్కమాట తర్కానికి సమగ్రత నివ్వదు.
ఏతావతా – ఈ విషయంలో శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వివరణయే సముచితమని నా వ్యక్తిగత అభిప్రాయం.
తన మాట కోసం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
11/21/2016 10:19 am
లక్ష్మీదేవిగారు నా అభిప్రాయాన్ని సానుకూలంగా తీసుకొన్నందుకు కృతజ్ఞుడిని. కథను తీసుకోండి. అవసరమైనట్లైతే కథనవిధానాన్ని కూడా తీసుకోండి. కాని మీరే మీదైన మంచి వ్యావహారికంలో మీశైలిలో వ్రాయండి. మీ కథలూ అనువాదాలూ మరిన్ని చదవాలని ఆశిస్తున్నాను.
సంస్కృతం లోని హర్ష నైషధం చదవలేను. కాని శ్రీ నాథుడి శృంగారనైషధము ఇదివరలో చదివాను. ఇప్పుడు ఇంకొంచెం మెరుగ్గా చదవగలను. ఎమెస్కో పుస్తకం అట్ట మీద శ్రీనాధుడు అని ఉంది. లోపల చాలా వరకూ శ్రీ నాథుడు అని ఉంది. ఈ రకం పొట్టలో చుక్కల అచ్చు తప్పులు నేను కనిపెట్టగలగటం, నా కంటి డాక్టర్లు మంచి కరెక్షెన్ చేస్తారని చెపుతుంది. ఈ తెలుగు మాటలు ఎలా రాయటం సరైనదో, నేను తప్పులు రాసినప్పుడు కొందరు స్నేహితులు చెపుతారు. కాని, నేనేం లెక్క చేసుకోను. వాదన సాగించి అలాటి అంశాల మీద చిన్న సైజు డిబేట్ లు నడపటం నాకు చాలా ఇష్టం. దరిమిలా కొన్ని తప్పులు సరిచేసుకుంటాననుకోండి.
చాలా డిబేట్ లలో ఎవరు గెలిచారనేది, స్పష్టం కాదు. ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల డిబేట్లు ఎవరు గెల్చారనేది, పోల్స్ ఐతే, ప్రతి డిబేట్ హిల్లరీ నే గెలిచిందని చెప్పాయి. ట్రంప్ తనే గెలిచాడని నిక్కచ్చిగా చెప్పాడు. (ఎలక్షన్ లో ట్రంప్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందేలా గెలిచాడు. నాకైతే సువర్ణ శ్రీ, బెన్ హర్ ఛారియెట్ రేస్ చూసినట్టనిపించింది. It is a fantastic drama. I am thrilled. I congratulate the victor.)
ఏ వివాదం లోనూ ఒకరు నిక్కచ్చిగా గెలిచారనే పరిస్ధితి ఇప్పుడు ప్రపంచంలో లేదు. ఈ వ్యాస విషయం లోనూ లేదు. పొట్టలో చుక్క ఉన్న/ లేని విషయం ఆధారంగా నేను ఇద్దరు శ్రీనాథులు ఉన్నారనొచ్చు. ముగ్గురు డింఢిమ భట్టులుండగా లేంది, ఇద్దరు సర్వజ్ఞ సింగభూపాలురుండగా లేంది ఇద్దరు శ్రీనాధులెందుకు ఉండరాదు?
అసలు, ఈమాటలోనే చూడండి, ఎందరో వేంకటేశ్వరరావులు. తెలుగు దేశంలో మనవడికి తాత పేరు పెట్టే సంప్రదాయంలో, దేవుళ్ల పేర్లుంచే వ్యాపకంలో, ఒకే పేరు వాళ్లు లక్షలు లక్షలు. ఇక ఆ పేరూ ఈ పేరూ పెట్టుకుని రాసే అలవాటు కూడా ఉన్నప్పుడు, వేమ భూపాలుడు, వీర భూపాలుడూ ఒకరా, ఇద్దరా అనేదే కాక, ఈ ఇద్దరి రాజుల బదులూ డబ్బు కోసం శ్రీ నాథుడే రకరకాల కావ్యాలు రాసాడేమో అని కూడా అనుకోవచ్చు. పోనీ కావ్యంలో కంటెంట్ చూసి, రచయితను గుర్తు పడదామంటే, ఐదుగురు నల మహారాజులను ఒకేసారి చూసిన దమయంతి అవస్థ. అన్ని ప్రబంధ కావ్యాలూ ఒకలాగే ఉంటాయి. అట్టలు చూసి గుర్తు పడదామంటే, అన్నమయ్యకీ, వీరేశలింగం గారి ఆంధ్ర కవుల చరిత్రకూ ఒకే లాటి బొమ్మ వేస్తాడు డా. బాపు. అన్ని తెలుగు పుస్తకాల మీదా ఆయన బొమ్మలేనయ్యె!
వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్రము లో ‘మాతృక’ లంటే ఏమిటో, ‘పుత్రిక’ లంటే ఏమిటో చెప్పారు. పాపం, పంతులు గారు తెలుగు కవులను గూర్చి రాయటానికి, మాతృకలను సంపాదించుకోటానికి చాలా ప్రయత్నించారు. ఐనా ఇతరులు ఆయనకు అందనీయకుండా తొక్కి పట్టినట్టున్నారు. మదరాసులో లైబ్రరీ లకు వెళ్లి కొన్ని మాతృకల నుండి ‘పుత్రిక’లను ఆయనే దత్తత చేసుకున్నారు. ఆ కష్టాలు చూస్తే, అప్పుడే దొరకని తాళ పత్ర గ్రంధాలు ఇప్పుడింకేం దొరుకుతాయీ అనిపిస్తుంది. ఆయన పీఠికలు, శ్రీనాథుడి పైన వ్యాసం చూస్తే, కొత్త మెటీరియల్ దొరికినప్పుడల్లా ఆయన వ్యాసాలు upgrade చేస్తూ వచ్చాడని తెలిసింది. కవుల కథలు చాలా వరకూ అతుకుల బొంతలనీ, ఇప్పటి వీకీపీడియాల లాగానే ఏదీ 100% నమ్మేందుకు వీలు లేదనీ తెలుస్తుంది.
అలాగే, అంతకు ముందు కావ్యాలలో కూడా మెటీరియల్ తర్వాత తర్వాత చేర్చి ఉండొచ్చు. నాకూ శృంగార నైషధం చివరి లోని ‘కావ్యోపసంహారము’ out of place లాగానే అనిపించింది. Insert లాగా అనిపించింది. వేమభూపాలుడో, అంకింతం పుచ్చుకున్న అమాత్యుడో, శ్రీ నాథుడి గొంతు మీద కూర్చుని, అక్కడో పద్యం, చివర్లో వచనం, ఇరికింప చేసారా అని సందేహం కలిగింది. అలా చేసే పవర్ వాళ్లకు ఉంది.
భాషను చూసి, శ్రీనాధుడి పద్యం ఏదో చెబుదామా అంటే, పొట్టకూటికై కవి వేషం మార్చుకుంటున్నాడు, పరగణా మారినప్పుడల్లా భాష, యాస మారక తప్పదే. భాష మీద భద్రిరాజు గారి రీసర్చ్ అయ్యే లోపల, తెలుగు వాళ్లు ఎన్నో సార్లు జిల్లాలు, రాష్ట్రాలు మారి ఉంటారు. అందుకని అలా చాలా స్లోగా సంవత్సరాల మీద సాగే ఆ రీసెర్చ్ మీద నాకంత నమ్మకం లేదు.
ఇక కావ్యంలో ఉన్న అశ్లీలం పట్టి రచయిత ఎవరో నిర్ణయం చేద్దామంటే, వీరేశ లింగం పంతులు గారే ఆ ప్రయత్నంలో పరాజయం పొందారు. పోతన కవి, భోగినీ దండకం రాస్తే -భాగవతం రాసిన పరమ భాగవతోత్తముడు, అలాటి రచన రాయటమేంటని, ఆయన కక్కా మింగా లేకపోయాడు. ఒక వేశ్య, రావు సింగభూపాలుని కామించటమేమిటి? ఆయన ఆమె ముద్దు చెల్లించట మేమిటి? పైగా వేశ్యమాతను ఏనుగు ఎక్కించి ఊరేగించటమేమిటని, ఆయన పళ్లు పటపటలాడినయ్యి. అలాటి బోగం stuff/అశ్లీలం? పోతన వ్రాసి ఉండడన్నారు. కానీ ఇతరులు మందలించాక, అప్పుడు మంచె దిగొచ్చి -తనది సైన్స్ దృక్పథం, నిజం చెప్పటమే తన ధ్యేయమని, మనకు సంజాయిషీ ఇచ్చి, పోతనకు pardon ఇచ్చారు.
ఐతే శ్రీనాధుడి విషయంలో వీరేశలింగం గారు నెగెటివ్ గా విజృంభించారు. ఆయన దృష్టిలో శ్రీనాథుడు చెడిపోయినట్టు లెక్క. వేశ్యా సంపర్కం ఆయనకు గిట్టదు. పంతులు గారు -ఈ శ్రీ నాథుడికి ద్రాక్షారామం నగరం లో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర కులస్థులెవరూ ఊళ్లో కనపడలేదు, భోగం స్త్రీలు మాత్రమే కనిపించారని – వారి గ్రంధంలో ఉడుక్కుంటాడు. ఆ కులాలు కల్పించిన మానవ సంఘమే కదా వేశ్యా కులం కూడా కల్పించింది. వేశ్యలు వారు వారంతట వారే మొలుచుకు వచ్చారా? ఆ విషయం ఆయన ఎందుకు గమనించడు?
జాషువా కవి ‘గబ్బిలం’ ఖండకావ్యం మొదట్లోనే – నేను కడజాతిలో జన్మించిన వాడిని, భారత వీరులకు చెప్పులు కుట్టేవాడిని అని ఆయన అన్నప్పుడు, ఆ కవికే న్యూనతా భావం ఉందా? తీరి కూర్చుని నేను ఇతర తెలుగువారి కంటే తక్కువ అని తనే ఊహించుకుంటున్నాడా? లేదు. వాళ్ల అమ్మా నాన్నా, ఒరే నాయనా, మనం మాల వాళ్లంరా మాదిగ వాళ్లంరా అని చెపితేనే జాషువాకి తెలిసింది. ఇతర తెలుగులు – నువ్వు మమ్మల్ని అంటుకోకూడదురా, నువ్వు ఎడంగా ఉండు అంటే జాషువాకి తెలిసింది. ఏ కులాల వాళ్లకు కూడా, వాళ్ల పెద్దలు చెపితేనే, వారు అగ్రవర్ణాల వారనో, నిమ్నవర్ణాల వారనో తెలిసింది. భోగం కులం అనేది ఒకటి ఏర్పడి పోయాక, అందులో పుట్టి పెరిగిన భోగం పిల్లకి, వేశ్యమాత -అమ్మా, నువ్వు ఈ టక్కులు వెయ్యాలి, విటులు వచ్చినప్పుడు ఐటమైజ్ చేసి ప్రతి సర్వీస్ కి ఇలా కలెక్ట్ చెయ్యాలి అని (ఇప్పటి డాక్టర్లకు, లాయర్లకు, వాళ్ల మేనేజింగ్ పార్ట్నర్ చెపితే తెలిసినట్టు) చెపితేనే గదా తెలిసింది. మరి ఆ పాక్షికతలు ఆయన గమనించడేం? సంఘాన్ని సంస్కరించాలనుకున్నవాడు, సంఘం సమగ్రావగాహన లేకుండా, ఆ ఏర్పాటుల ముందు వెనకలు తెలియకుండా, తన బయాస్ అలానే ఉంచుకుని, ఇతరుల నీతిమీద హేయత చూపటం సబబా?
అశ్లీలాలు – అవి ఏవో ఈ శృంగార కావ్యాల్లో నాకు తెలియదు. డాక్టర్లకు, బూతు perception ఇతరులకన్నా వేరుగా ఉండొచ్చేమో. వీరేశలింగం గారికి అనేక ఆసక్తులు. ఒకప్పుడు సైన్స్ మీద మోజు కలిగి, human body dissection చూడ్డానికి వెళ్లి, అక్కడ అమాంతం మూర్ఛపోతే అక్కడి వారు, వారిని బైటకు చేరేసారు. డాక్టర్లకు ఈ నాజూకులు ఒప్పవు. తెలుగు కవుల మీద, భాష మీద, పంతులుగారికి మరింత ఆసక్తి. భక్తి, నీతి విషయంలో ఆయనకు మధన జాస్తి. చాలా తెలుగు పుస్తకాల్లో ఆయన మోతాదు మించిన శృంగారం, ఉన్నదనుకున్న చోట్ల వాటిని ఎత్తి చూపారు. ఆ భాగం (అమ్మ బాబోయ్! పొరపాటున భగం అని రాసా. I think it is a dangerous word. Trump – grab her by the pussy- అంటే ఎంత గోలయ్యింది!). మాత్రమే చదివి, శృంగార ప్రియులు విరమించుకోవచ్చు. నిజంగా, ఈ బూతు/ శృంగారం distinction నాకు తెలియటం లేదు. భారద్దేశంలో శివలింగాలు చాలా చోట ఉంటాయి. ఆ రాతి స్కల్ప్చర్, స్త్రీ యోని, పురుష లింగమే కదా. అన్ని చోట్లా పబ్లిగ్గా, సెక్స్ ఆర్గన్స్ ని ఆరాధిస్తున్నప్పుడు, ఇదివరకటి, ఇప్పటి కావ్యాల్లో వాటిని వర్ణిస్తే మాత్రమేం?
ఈ నా కామెంట్ వీరేశలింగం గురించా, అశ్లీలం గురించా అంటే -కాదు కాని, తెలుగు అనువాదంలో ఏం అంశాలు ఎలా నిభాయించాడో, శ్రీ నాధుడు నైషధంలో కావ్యోపహారం లో చెప్పాడని, పంతులుగారు చెప్పగా, తర్వాత ఎందరో అదే ఆధారంగా తీసుకున్నందున, అసలు పంతులు గారి ఏ ఆలోచనలో సవ్యత లెంతెంత? అని నేను ఆలోచిస్తున్నా. అశ్లీలం అనేది ఉన్నదని, పరిహరించాలనీ అనుకోకుండా, మోరలిస్టిక్ హై హార్స్ ఎక్కకుండా, లింగ్విస్టిక్ వర్క్స్ వేరు భాష లోకి తర్జుమాలు చేసేవారు, వెనకటి వాళ్లు/ఇప్పటి వాళ్లు, ఏం రాసారో ఆ రాసింది రాసినట్లు ఇవ్వగలిగితే చాలు, అని నాకనిపిస్తుంది.
ఏల్చూరి వ్యాసం ఆసక్తికరంగా ఉన్నది. వ్యాసమే కాక మరిన్ని ఇతర పుస్తకాలు తీసి చదివాను. నారాయణరావు, షుల్మన్ ల వ్యాసం కూడా నాకు చదవాలని కుతూహలంగా ఉంది. ఇంకా చదవలేదు.
Thanks
Lyla.
PS: Acapulco ను నేను తెలుగులో రాస్తే, ఆకపూల్కో అని pronunciation.com లో విన్న విధంగా రాస్తాను. I remember reading about a young lady from Bombay who had problem correctly saying ‘José’, recognized the need, and created such a tool.
బాగుంది. చాలా చక్కగా రాశినారు. బ్లాగు ప్రపంచం నశించి చాలా రోజులైపోయినా కూడా ఆ లోకానికి మళ్ళీ తీసుకుపోయినారు. చదివి సంతసించినాను. ధన్యవాదాలు.
పోతే, ఒక చిన్న మాట – ఎన్నో వందల సంవత్సరాలుగా మీ కామెంట్లు చదువుతున్నాను. మీరు ఏ కామెంటు రాసినా అందులో “నాకొచ్చిన తెలుగు అధమం. అన్ని తప్పులూ నావే. నాది మట్టి బుర్ర. నాకు పదో తరగతి తెలుగు మాత్రమే వచ్చు. నేను అమాయకుణ్ణి. నా రాతలు అమాయకత్వం. ఈమాటలో రాయటం నా భాగ్యం. వాళ్ళు అసలు ఎట్లా నా రాతల్ని అనుమతిస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి…” అంటూ డిప్రెషను టు ద పవర్ ఆఫ్ 501 డిటర్జెంటు సబ్బులా తళతళా చదివేవాళ్ళను తోముతున్నారు. ఎంత మిమ్మల్ని తక్కువ చేసుకుంటే అంత అవతలివాళ్ళు సంతోషపడి మళ్ళొక కామెంటు రాయకుండా ఉంటారని మీరేసిన కుంగుబాటు ప్లాను చాలా ఇదిగా ఉన్నది. దీనికన్నా మీరసలు ఏ కామెంటు రాయకపోటం మంచిది.
వ్యాసప్రతిపాదితార్థం మీ అనుమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషం కలిగింది. కావ్యోపసంహారవచనం వేమభూపాలుని మాటకు అనువర్తనమే గాని ఆంధ్రీకరణపద్ధతికి సూచకం కాదన్న అంశాన్ని నొక్కిచెప్పేందుకు నైషధీయచరితంలో అనౌచిత్యదోషారోపణ సాధ్యం కాదని వ్రాసిన మాట నిజమే. శ్రీహర్షుడు క్షేమేంద్రుని ఔచిత్యసిద్ధాంతాన్ని గుర్తెరిగి, దానిని ఆమోదించినవాడని చెప్పేందుకు నైషధీయచరితంలోనే సాక్ష్యాలున్నాయి. ఆధునికదృష్టితో చూచినప్పటి నిర్వేలములైన శృంగారవర్ణనలు తప్ప – లాక్షణికదృష్టితో అన్వయింపదగిన అనౌచిత్యాలు అందులో లేవనే ఇప్పటికీ నా అభిప్రాయం. అందులోని కథ, కథనం, శైలి, కల్పనలు మొదలైనవానిని గూర్చి సుశీల్ కుమార్ దే గారి వంటి పండితుల తీవ్రవిమర్శలన్నీ వ్యాసప్రతిపాదితానికి సంబంధించినవి కావు గనుక నేను ప్రస్తావింపలేదు.
“చింతామణీ మంత్రచింతనఫలంబు” అన్న శ్రీ రావూరి దొరసామిశర్మ గారి పాఠస్వీకారం ఎట్లాగూ (8-203) లోని పద్యానికి విరుద్ధమే గాక శ్రుతకథావిరుద్ధం కూడా అవుతుంది. శ్రీహర్షుడు తన్మంత్రసిద్ధుడని నిరూపించే కావ్యభాగాలను జీవాతు వ్యాఖ్యలో మల్లినాథుడు వేయినోళ్ళతో మెచ్చుకొన్నాడు. వాటిని అన్వయించి చెప్పాడు. “అవామా వామార్ధే” శ్లోకానికి వ్యాఖ్యాతలు వివరించిన భాగాలన్నీ చూడదగినవే. ఆయన “చింతామణీ మంత్రచింతనపరుండు” కావటం వల్లనే ఆ రచన, ఆ అన్వయం సాధ్యమవుతాయి. “తల్లిదండ్రుల చింతనఫలం” అన్న అర్థంలో ఆ అన్వయం సార్థకం కానందువల్ల వేదం వారి పాఠమే స్వీకార్యమని చెప్పాలి. దురదృష్టవశాత్తు తెలుగుదేశంలో నైషధం వ్రాతప్రతులు ఎక్కువగా బ్రతికిలేవు. పరస్పరవిరుద్ధాంశాలు ఏ వ్రాతప్రతిలో ఏ విధంగా ఉన్నాయో సరిచూస్తే కాని ఈ సమస్యను పరిష్కరింపలేము.
మీవంటి ప్రామాణికులు ఈ వ్యాసాన్ని చదివి ఉండటమే నాకు గొప్ప విషయం. మీ స్పందన నన్ను ధన్యుణ్ణి కావించింది.
పాండిత్యప్రకర్షతో తర్కకర్కశముగా సాగిన మురళీధరరావుగారి వ్యాసము ప్రశంసనీయము. ‘మాతృక’కు శ్రీనాథుని కుపలభ్యమానమైన తాళప్రతి యను అర్థమును జెప్పుట సమంజసముగానే యున్నది. కాని ‘ప్రమాదో ధీమతామపి’ అని యున్నదే కదా! శ్రీహర్షుని కావ్యము పరిపూర్ణముగా దోషరహితమను వాదన అంత బలముగా చేయవలసియుండినది కాదనిపించుచున్నది. ఎమస్కో శృంగారనైషధప్రతికి ఉపోద్ఘాతమును వ్రాయుచు విశ్వనాథవారు ‘నిజానికి, సంస్కృతకావ్యములో కొన్ని పచ్చి బూతులవలె కనిపించునవి యున్నవి. శ్రీనాథుడు వాని నన్నిటిని పరిహరించ లేదు. కొన్నిటిని శ్రీనాథుడును వ్రాసెను. ఎన్నని పరిహరించును?’ అన్నారు. కాని ఈదోషనిర్ణయము చేయు పండితు లీకాలములో నొక్కరైన ఉన్నారా అనునది సంశయాస్పదమే. ఎమెస్కో ప్రతి సంపాదకులైన శ్రీరావూరి దొరసామిశర్మగారు పూర్వముద్రితములైన 5 ప్రతులను, తమ యొద్ద నున్న తాళప్రతిని పరిశీలించి పాఠనిర్ణయము చేసినారు. వారు ‘కవిరాజరాజి’ అన్న ప్రథమాశ్వాసంలోని సీసపద్యంలో ‘చింతామణీమంత్రచింతనఫలంబు’ అన్న పాఠమునే గ్రహించినారు. దీనివల్ల దీనిని ‘చింతనపరుండు’ అని యెంచి చేసిన మురళీధరరావుగారి వివేచన కొంతవఱకు బలహీనపడుచున్నది. సంస్కృతనైషధములో ప్రతిసర్గ చివర ‘ఆనంద’ శబ్దయుతమైన శ్లోక మున్నమాట నిజమేకాని, గ్రంథాంతమున శ్రీనాథుడు వాడిన ‘పరమానందంబు నొందిరి’ అను పదమునుకు ఇది కారణమని ఇదమిత్థముగా చెప్పలేము. ప్రతి ఆశ్వాసాంతమునందును ఇట్టిపదము లేదు గదా! ఇతరకవులును (ఉదా: ప్రభావతీప్రద్యుమ్నము) గ్రంథాంతమున ఇట్టి పదమును వాడిరి. ఏమైనను ఈ వ్యాసము తర్కకర్కశముగా నున్న దనుటలో విప్రతిపత్తి లేదు.
మీ లేఖలోని ఆరోగ్యశ్రేయోభిలాషిత ఆ అవసరం ఎంతో ఉన్న నా మనసుకెంతో ఆహ్లాదాన్ని కూర్చింది. వ్యాసాన్ని ఆసాంతం చదివి ఔదార్యంతో స్పందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మమ్మట-శ్రీహర్షుల బంధుత్వోదంత జనశ్రుతిని మొట్టమొదట 1877లో డా. బ్యూలర్ గారు తమ Kashmir Report లో వెలుగులోకి తెచ్చారు. అది ప్రసిద్ధికెక్కింది కాని, ఆయన దానిని చారిత్రికసత్యం కాజాలదని వ్రాసిన వివరాలు మాత్రం ఎందుకనో ప్రచారానికి నోచుకోలేదు. మమ్మటుని కావ్యప్రకాశాన్ని అధికరించి మాణిక్యచంద్రుని అద్భుతావహమైన సంకేత వ్యాఖ్య క్రీ.శ. 1159-1160 లో వెలువడింది. దాని సాక్ష్యాన్ని బట్టి కావ్యప్రకాశ రచనకు ఉత్తరావధి (terminus ad quem) క్రీ.శ. 1110 అని నిశ్చయింపబడుతున్నది. ఆధునిక విమర్శకులు ఆయన క్రీ.శ. 1050-1120 ల మధ్యకాలంలో జీవించినవాడని ఊహిస్తున్నారు. శ్రీహర్షుని జీవితకాలం క్రీ.శ. 1115-1185 (±) కాగా, నైషధీయ చరితం పన్నెండవ శతాబ్ది ఉత్తరార్ధంలో (బహుశః క్రీ.శ. 1165-1175 ల నడిమి కాలంలో) రచింపబడింది. మమ్మటాచార్యుడు క్రీ.శ. 1050 ప్రాంతాల జన్మించి ఉంటే తద్రచన నాటికి కనీసం 110-120 ఏళ్ళవాడై ఉంటాడు. గౌడదేశీయుడైన శ్రీహర్షుని కాశ్మీరకునిగా నిరూపింపదలచినవారెవరో ఈ కథను కల్పించి ఉంటారు. నైషధీయ చరితంలోని ‘తవ వర్త్మని వర్తతాం’ (2-62) అన్న శ్లోకాన్ని మమ్మటుడు, “నేనైతే ఈ విధంగా సవరించి ఉండేవాణ్ణి” అని చెప్పిన సవరణ కథ కూడా ఒకటున్నది. అదే నిజమైతే, మమ్మటునికి నైషధీయం అసలు అర్థమే కాలేదనుకోవాలి. అందువల్ల మేనల్లుని కృతిని చూసి దోషభూయిష్ఠమని వ్యాఖ్యానించటం, మినపరొట్టెల కథ వంటివన్నీ వట్టి కట్టుకథలు మాత్రమే అని మనము నిశ్చయింపవచ్చును.
సంస్కృత సాహిత్యశాస్త్రచరిత్రలో మమ్మటుని కావ్యప్రకాశం తర్వాత ప్రబలిన విద్యారణ్యంలో అంతటి తాలోత్తాలమూర్తులు లేక స్వతఃప్రమాణంగా కావ్యదోషనిర్ణయం చేయగలవారు తక్కువైన మాట నిజమే. మీరన్నట్లు దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం కావ్యగుణాన్ని ఉత్కర్షించే కారణం కాదన్నమాట కూడా నిజమే. అయితే, శ్రీనాథుడు నైషధీయ చరితంలో రసౌచిత్యదృష్టితో “అనౌచిత్యపరిహారం” అవసరమని భావించిన మాట సత్యమే అయితే లోకంలో అంతకు పూర్వం ఏదో ఒక ఆధారం ఉండే ఉండాలి కదా. తానై సాహసించి మొదటిసారి ఆ మాటను అన్నాడని ఊహింపలేము. వ్యాఖ్యాతలో, లాక్షణికులో, విమర్శకులో కనీసం ఒక్కరైనా ఆ మాటను ప్రసిద్ధంగా పేర్కొని ఉండాలి. ఏవో కొన్ని అనౌచిత్యాలు ప్రచారంలో ఉండే ఉండాలి. అటువంటివేవీ కనబడవు. వ్యాఖ్యాతలు – మరీ ముఖ్యంగా చాండూ పండితుడు, మల్లినాథుడు పదే పదే ఆ కావ్యంలోని ఔచిత్యాలను తమ వ్యాఖ్యలలో ప్రశంసించటమే గాని ఒక్కటైనా అనౌచిత్యాన్ని ప్రస్తావించి ఉండకపోవటం మనకు తెలుసు. ఏవో కొన్ని అనౌచిత్యాలు ఉన్నాయని కనీసం లాక్షణికులు గాని, విమర్శకులు గాని ఇంతకాలంగా ఆ మాటను అనలేదు కదా! అని చెప్పే సందర్భంలో ఆ వాక్యప్రసక్తి ఏర్పడింది.
శ్రీ అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులవారు ‘నైషధతత్త్వజిజ్ఞాస’లో అందులోని నాయికానాయకుల భౌతికశృంగారం, రతివర్ణన, రత్యంతచిత్రణ – అనుచితము, అశ్లీలము, అసభ్యము, గ్రామ్యము అని ఎన్నో ఉదాహరణలను చూపారు. ఆ ఉదాహరణలన్నీ మారిన దేశకాలపరిస్థితుల వల్ల ఏర్పడిన అభిప్రాయములే గాని వాస్తవంగా రసదోషవిమర్శకు ఉపకరింపవు. ఆధునిక కాలంలో నైషధీయ చరితం మితిమీరిన శృంగారవర్ణనల మూలాన అనౌచిత్యాలకు పుట్టినిల్లని వ్రాసినవారి వివరాలను నేను ప్రస్తావింపలేదు.
మమ్మటునికి తర్వాత కావ్యదోషాలను సవిస్తరంగా పేర్కొన్న లాక్షణికులు ఎవరైనా ఉన్నారా? అని మీరడిగిన ప్రశ్నకు సమాధానం: కనీసం 40-42 మందికి పైగానే ఉంటారని పేర్లు స్ఫురిస్తున్నాయి. వారందరూ తత్పూర్వుల వలె మౌలికప్రతిపాదనలు చేసినవారు కాకపోవచ్చును కాని, ఉన్నారు. వేమభూపాలుని సాహిత్యచింతామణి ముఖ్యమైనదే. దేశ్యదోషవిమర్శను కలిగిన విశ్వేశ్వర దేశికుని చమత్కారచంద్రిక ఉన్నది. సర్వజ్ఞ సింగభూపాలుడు రసార్ణవసుధాకరంలో “అత్ర నలస్య దమయన్తీ కరస్పర్శహర్షేణ” అని తనకు నచ్చినందువల్ల శ్రీహర్షుని సగౌరవంగా ఉదాహరించాడు కాని, అనౌచిత్యాలను చెప్పినప్పుడు వేరే కవులను ఉదాహరించాడు. అమృతానందయోగి అలంకారసంగ్రహంలో అనౌచిత్యాలను పూర్తిగా తనదైన ధోరణిలో వివరించాడు. ఉదాహరణలను ఇవ్వలేదు. నృసింహకవి నంజరాజయశోభూషణం పైకి విద్యానాథుని అనుసరణగానే కనుపించినా, జాగ్రత్తగా చూసినప్పుడు కావ్యదోషప్రకరణంలో మునుపు లేని ఎన్నో కొత్త విశేషాలను చెప్పాడు. జయదేవ భోజరాజాది తత్పూర్వుల వైశేషికగుణ నిబంధరాంతరస్థ దోషాంకుశాదులను తన మాటలలో వ్యాఖ్యానించాడు. శబ్దగ్రామ్యాన్ని, అర్థగ్రామ్యాన్ని, అశ్లీలతను, కావ్యదోషాల దోషత్వానిత్యతను, అదోషత్వాన్ని సరికొత్తగా వివరించాడు. ధర్మసూరి సాహిత్యరత్నాకరం, అజితసేనుని అలంకారచింతామణి, కందలయార్యుని అలంకారశిరోభూషణం, కృష్ణావధూత మందారమరందం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రసిద్ధులు కాకపోవచ్చును గాని ప్రతివారు ఎన్నో కొన్ని తమ మాటలలో కావ్యదోషాలను నిర్వచించినవారే. లక్షణగ్రంథాలలో మూలకర్త చెప్పకపోయినా, ఉదాహరణలను ప్రదర్శించిన వ్యాఖ్యాతలు కూడా నైషధీయచరితాన్ని ప్రస్తావించినట్లు కనబడదు. వ్యాసప్రతిపాదితానికి ఈ విశేషాలతో సంబంధం లేనందున ఇంతవరకే ప్రస్తావించాను.
మీ సహృదయస్పందనకు కృతజ్ఞుణ్ణి. శ్రీమతి లక్ష్మీదేవి గారి ఔదార్యపూర్వకమైన వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు

11/10/2016 10:49 am
మణి గారి అభిప్రాయంతో యేకోభవించలేక పోతున్నందుకు వారు మన్నించాలి. నాదృష్టిలో అనువాదం యేమంత బాగోలేదు. నిజం చెప్పమని నిలదీస్తే, అస్సలు బాగోలేదని అంటాను.
ఇందులో లక్ష్మి గారి పొరపాటు ఎక్కువగా లేదేమో అనిపిస్తుంది. ఇంచుమించి ఇలాంటి ధోరణి అనువాదకుల్లో సాధారణం!
ఒక అనువాదం చదువుతుంటే అది ఒక అనువాదం అన్న స్పృహ అనుక్షణం మనతో ఉండేలా ఉండేలా చేసే పరిస్థితి ఉండకుండా అనువాదకులు జాగ్రత వహించటం తక్కువగా కనిపించటం విచారపడవలసిన సంగతి. కృతకమైన పదవాక్యశైలీవిన్యాసాలతో అనువాదాలన్నీ సాగవలసిందేనా అని దుఃఖం కలుగుతూ ఉంటుంది. మూలరచనలోని ప్రతిపదమూ వాక్యమూ సాధ్యమైనంతగా అలాగే తెలుగులోనికి వచ్చితీరాలని ఆరాటపడటం వలన అనువాదం చాలా కృతకమైన -సూటిగా చెప్పాలంటే- అతితరచుగా నిర్జీవమైన భాషలోనికి జారిపోతుంది.
అనువాదకులు సహజంగా చేసే ఆ పొరపాటే ఇక్కడా ఉన్నది.
మూలంలోని భావరమ్యతనూ, కథాగమనాన్నీ, శైలీవిన్యాసాన్నీ — ఇలాంటీ గుణాలని వీలైనంతగా గమనించి అవలంబించి అనుకరిస్తూ వ్రాయటం తప్పక మంచి విధానమే. కాని యథామక్షికానువాదం చేయటం ప్రమాదం. అలాచేస్తే తెలుగుచదువుతున్నట్లు కాక విచిత్రంగా ఉండి విచారాన్నీ కొండొకచో వికారాన్నీ కలిగించే అవకాశాలే మొండు.
మూలకథను తీసుకొని తనదిగా ఆవష్కరించటం ముఖ్యం. అనువాదం అన్న భావన వెంటాడితే అనువాదం సరిగా లేనట్లే. కాబట్టి అనువాదకులు తెలుగుకు సహజసుందరమైన నుడికారంలో మూలాన్ని చెప్పటాని ప్రయత్నించాలని మనవి.
మీరు దయతో రాసిన అభిప్రాయం, నేను రాసిన అభిప్రాయం తరువాత రావల్సినది. ఎందుకు తిరకాసుగా వచ్చిందని అడిగితే, కంప్యూటర్ ఇంజనీర్లు
Software Glitch అని చెప్పుతారని మీకు నేను గుర్తుచెయ్యవలసిన అవసరం లేదు. నిన్ననే మీకు వందనాలని చెప్పుదామనుకున్నాను కాని, ఇప్పటివరకూ కంటి డాక్టరు నన్ను ఏకాక్షిగా పడి ఉండమని శపించాడు.
మీ సుహృద్భావానికి ఇప్పుడు వేలూరి వేంకటేశ్వర రావు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. (అన్ని అక్షరాలూ సరిగా అచ్చయ్యాయో లేవో చూసుకునే బాధ్యత సంపాదకులది!)
శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి యీ ప్రసంగ సాంగత్యము వలన ఎప్పటి వలె నేను కొన్ని క్రొత్త పదాలు నేర్చుకున్నాను. అవి మస్తిష్కములో యెన్ని దినాలు నిలుస్తాయో తెలియదు కాని యా క్రొత్త పదాల కర్ధాలు మిగిలిన పాఠకుల సౌలభ్యము కొఱ కిక్కడ నిలుపుతున్నాను.
డిల్లన్ పేరు చాల రోజులబట్టి వింటున్నాను కాని ఇంత సమగ్రంగా తెలుసుకోలేదు. తెలుగు సాహిత్యకారుల గురించే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇతర భాషలలోని సాహిత్య చరిత్రని కూడ తెలుసుకోవడం మంచిది కదా! వ్యాసం బాగుంది.
తెగులుకి శిక్ష గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
11/02/2016 12:54 pm
ఈ రచనతో ఈమాట స్థాయి తగ్గినదన్న అభిప్రాయంతో ఏకీభవించలేక పోతున్నందుకు నాగమురళి గారు దయచేసి మన్నించాలి. కాని ఆ ముక్క వారు అనటం వెనుక వారి ఉద్దేశం ఇంతకంటే హుందాగా ఉండే రచనలకే పీట వేసి ఈమాట మరింత హుందాగా ఉండాలని కావచ్చు. కాని ఈరచనలో నేటి కాలపు వెకిలిహాస్యం యేమీ లేదు కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను.
ఐతే సాహిత్యపు విలువలని సంతరించుకోలేక పోయాయని నేను అభిప్రాయపడిన రచనలూ వచ్చాయి ఈమాటలో. ఇలా అన్నందుకు ఈమాట వారు మన్నించాలి. ఇప్పుడు నిలదీసి అవి యేయే రచనలు అని అడిగితే నావద్ద ఒక పట్టిక యేదీ సిద్ధంగా లేదు. కాని సభాముఖంగా ఆముక్కను ఇంతవరకూ నేను చెప్పలేదు. కాని సందర్భం యేర్పడింది కాబట్టి చెప్పవలసి వస్తోంది.
కాని ఈమాట వారు తమ పత్రికను ఒక చక్కని సాహిత్యప్రతికగా చాలా బాగా నిర్వహిస్తున్నారని చెప్పటానికి నాకైతే యేమీ సందేహంలేదు. అలనాటి భారతి సాహిత్యమాసపత్రిక తరువాత ఆ ఒరవడిలో సమర్ధంగా కృషిచేస్తున్నది ఈమాట పత్రిక అన్నదే ఒక సాహిత్యాభిమానిగా నా నిశ్చితాభిప్రాయం.
సందర్భం అంటూ ఒకటి వచ్చింది కాబట్టి ఈమాటను కూడా చెబుతాను. ఒకటి రెండు ప్రయత్నాలు చేసి కూడా ఈమాట పత్రికవారి స్థాయికి తగిన రచనను నేను పంపలేకపోయాను! శర్మగారన్నట్లు నాగమురళి గారి నుండీ వారితోపాటు దదితర రచయితల నుండీ మంచి సూచనలు వస్తే వాటి పుణ్యమా నాబోటి వాడికీ ఒక అవకాశం రావచ్చు ఒక్క రచనను ఐనా ఈమాటలో చూచుకుందుకు.
దంతుర్తి శర్మగారికి ఆరోజుల్లో నూటికి నలభైవస్తే అది ప్రశంశనీయమే. అప్పట్లో నన్నయ వచ్చి వ్రాసినా నలభైకి మించి మార్కులు రావటం దుస్సాధ్యంగా ఉండేది. నాకు కూడా ఎప్పుడూ ఆస్థాయికి దాటి మార్కులు రాలేదు. ఈరోజుల్లో ఐతే కనీసం ఎనభైమార్కులు పైనే వస్తాయి తెలుగుపరీక్షలో ఒక్కసమాధానమూ అస్సలు సరిగా వ్రాయకపోయినా శరే. చిన్నయసూరి పేరు కూడా వినకుండానే తెలుగులో ఎం.ఎ పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావచ్చును. కాని అధునికమైన వ్యావహారికభాషలో తెలుగువారు రచనలు చేసేందుకు భాషాపాండిత్యం ఒకమోస్తరుగా ఉన్నా దానికిన్నీ కించిత్తు న్యూనంగా ఉన్నా సరిపోతుందని అభిప్రాయ పడుతున్నాను.
పాఠక మహాశయులకి:
ఈ వ్యాసంతోపాటు, ఈమాటలో నేను ప్రచురించిన గణిత సంబంధమైన మరిన్ని వ్యాసాలని కూడగట్టి, “రామానుజన్ నుండి ఇటూ, అటూ” అనే ఇ-పుస్తకం ప్రచురించేను అని గతంలో ఒకసారి మనవి చేసేను కదా! ఇప్పటికి పాఠకులు 1000 ప్రతులు దింపుకున్నారు. అంటే వెయ్యి మంది ఏకైక (యునీక్) పాఠకులని నేను అనుకోను. ఒకొక్కరు పరాగ్గా దింపుకునే బొత్తాన్ని రెండు సార్లు నొక్కి ఉండవచ్చు. కనుక 500 వ్యక్తులు అయినా దింపుకుని ఉంటారు. వీరిలో కనీసం 50 మంది అయినా చదివి ఉంటారు. పరవాలేదు. లెక్కలమీద రాసిన పుస్తకానికి ఈమాత్రం ఆదరణ వచ్చిందంటే సంతోషించవలసిన విషయమే!
కథ చాలా బాగుంది.ఎందుకో నాకు ఎన్నో ఏళ్ళుగా ఈ పద్యాన్ని తలచుకున్నప్పుడల్లా గంగానదిని వివేకభ్రష్టురాలనడం నచ్చేది కాదు.ఈ కథలో చెప్పినట్లు గంగానదికి సముద్రంలో కలిసి ఆవిరై మళ్ళా వర్షరూపంలో హిమాద్రిని చేరుకునే అవకాశం ఉన్నా అలా చేయకుండా పాతాళానికి ఎందుకు వెళ్ళిందనే దానికి ఒక కారణం ఉంది.ఆకాశంలో పారే గంగ భూమి మీదకు రావడానికే ఇష్టపడదు. కాని భగీరథుని కోరిక మన్నించి బ్రహ్మగారు అతడితో వెళ్ళమని చెప్పిన తర్వాత అతడి వెనుకే పాతాళంలో ఉన్న సగరకుమారుల అస్థికలమీదుగా ప్రవహించి వారికి మోక్షాన్ని కలిగించడానికి అంగీకరించి వచ్చిన తర్వాత ఇంక మధ్యలో ఆగిపోయే ప్రశ్నే రాకూడదు. ఆరంభించరు నీచమానవులు ..అన్న పద్యంలో చెప్పినట్లు ధీరుల్ విఘ్న నిహన్యమానసుల్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ కావునన్..అనుకున్న ప్రజ్ఞానిధి కావుననే ధ్యేయాన్ని వదిలిపెట్టకుండా పాతాళానికే సాగింది అని సరిపెట్టుకున్నాను కానీ దీనిని వివేకభ్రష్టతగా చిత్రించడం మాత్రంనాకు ఇప్పటికీ నచ్చలేదు.
శిష్టులు, ప్రామాణికులు అయిన పెద్దల రచనలో అనంగీకర్తవ్యములైన సంశయాంశాలు కనబడినప్పుడు విద్యార్థిత్వం ఉన్న విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుని అడిగినట్లే – విద్వాంసులైన రచయితలను పాఠకులు అడుగుతారు. విషయం చర్చలోకి ప్రవేశపెట్టబడినది కాబట్టే వ్యాఖ్యలు వస్తాయి. వ్యాఖ్య వల్ల వ్యాసవిస్తృతి కలుగదు. వ్యాసకర్తృకృతమైన సందేహనిరాసం మూలాననే వ్యాసవిస్తృతి, చిత్తవిస్తృతి కలుగుతాయి.
వ్యాఖ్యాపరిణామం ఏమిటో తెలిసింది కాబట్టి, ఈ చర్చనుంచి విరమించుకొనే ముందు నాలుగు మాటలు వ్రాయక తప్పటం లేదు: మాన్యులైన శ్రీ కె.వి.ఎస్. రామారావు గారు, వ్యాఖ్యాకర్తను గురించి – “చిన్నయసూరి ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది? అంటూ “అధిక్షేపించారు” – అని చేసిన ఆ నిరుక్తి మూలాన ఈ ప్రస్తావన నిమిత్తీకృతమైంది.
వ్యాఖ్యాకర్త విద్వన్మణులను, తనకు హితకర్మీణులను అధిక్షేపింపలేదు. వ్యాసగతమైన వాక్యాన్ని అధిక్షేపింపలేదు. “ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది?” అన్న ప్రశ్నలో ఏ అధిక్షేపణమూ, తిరస్కారభావమూ లేవు. వాగనుశాసనులు నన్నయ గారు కారా? వాగనుశాసన బిరుదధారి అయిన రెండవ వ్యక్తా? అని వ్యాఖ్యాకర్త అడగవలసి రాదు. వాక్యంలో ‘అన్నాడు’, ‘చెప్పాడు’, ‘పేర్కొన్నాడు’ అని గాక, “ఒప్పుకొన్నాడు” (=సమ్మతించాడు, అంగీకరించాడు) అని వ్రాసినప్పటి నిర్దేశాన్ని మాత్రమే ప్రశ్నించటం జరిగింది. ఆ ఒప్పుకోవటం ఆంధ్రశబ్దచింతామణి నన్నయకర్తృకం అన్న విషయాన్నే కదా. ఆంధ్రశబ్దచింతామణిని నన్నయే రాశాడు అని ఒప్పుకోవలసిరావటం చిన్నయ సూరి గారికి ప్రమేయం కాదు. ఆ ‘కర్తృత్వసమస్య’ అన్నది ఆ వ్యాస కాలపరిధిలో, ఆ సూత్రనిర్మాణపరిధిలో అసలు చిన్నయసూరి గారి దృష్టిపథంలో లేనే లేదు. ఆయన ఆ ఆలోచన చేసిన ఆధారాలు లేవు. చింతామణివిరుద్ధప్రయోగాలు నన్నయ భారతంలోనూ, నన్నయప్రయోగవిరుద్ధలక్షణాలు చింతామణిలోనూ ఉండటాన్ని వ్యాకర్తలు గుర్తించినా, తత్కర్తృత్వసందేహం వారికి కలుగలేదు. ఆనాటి విశ్వాసమల్లా అంతిమగద్యలో వ్రాసిన మాటే. ఆ సమస్యను తొలిసారిగా లేవనెత్తి, తమకాలం నాటి ఆధారాలతో తత్కర్త మహాకవి నన్నయ కాదన్న అంశాన్ని సర్వసమర్థనీయంగా నిరూపించినవారు శ్రీ కందుకూరు వీరేశలింగం గారు. అయినా అది ఆదికవి నన్నయకృతమే అని వాదించినవారు శ్రీ వజ్ఝల వారు. కర్త మహావైయాకరణి అయిన మహావిద్వాంసుడు కాబట్టి, ఆయన ఆదికవి నన్నయ గారు కాదని రూఢమైంది కాబట్టి – ఆ నన్నయభట్టు రెండవ నన్నయభట్టు కావచ్చునని ప్రతిపాదించినవారు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు. తమ కాలానికి అనంతరీయమైన ఆ వివాదంతో ఏ సంబంధమూ లేని చిన్నయసూరి గారు ఆ చింతామణిని (మహాకవి) నన్నయే రాసినట్లుగా ఏవార్థకంతో ఒప్పుకొన్నట్లు ఎట్లా రుజువు కాగలదు? “ఒప్పుకొనటం” అన్న పదం విషయం మాత్రమే చర్చకు వచ్చింది. అన్యవిషయాలు కావు. అది అధిక్షేపణం కాదు.
“చెళ్లపిళ్ల వారు … ఏ ‘శాస్త్రం’లోనూ తను పండితుణ్నయానని ఆయన ఎక్కడా చెప్పలేదు … ఈ వ్యాస కాలపరిధిలో కవులు వేరు, పండితులు వేరు. పండితులంటే తప్పక కనీసం ఏదో ఒక సంస్కృతశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారే తిరుపతివెంకట కవులు కవులు; పండితులు కారు.”
ఈ మాటలు శ్రీ కె.వి.ఎస్. రామారావు గారివి. దీనిని కొనసాగింపక, తిరుపతి వేంకటకవులు శాస్త్రపండితులమని చెప్పుకొన్న పద్యాలలోని కొన్ని ప్రసిద్ధవాక్యాలు ‘నానారాజసందర్శనము’లో నుంచి ప్రమాణీకరింపబడుతున్నాయి. వారి కావ్యాలలో నుంచి అంతకు పదింతలు ఉదాహరింపవచ్చును. ఔగాములను పాఠకులు నిర్ణయించుకొంటారు:
ఇక, తిరుపతి వేంకటకవులు శ్రీ రామచంద్ర అప్పారావు గారికి విన్నవించిన ఈ మాట కూడా ప్రమాణం కాకపోతే, చేసేదేమీ ఉండదు: “చదివినారము శబ్దశాస్త్రమ్ము తుదముట్టఁ, జిరకాల మొక్క దేశికునియొద్ద” అని. శబ్దశాస్త్రం ‘తుదముట్ట’ (శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారి సన్నిధిని ఆసాంతం) చదివిన ఆ మహాత్ములు శాస్త్రపండితులని ఎట్లా తెలుస్తుందో ఒక పద్యాన్ని, ఒక శ్లోకాన్ని చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యాకర్త ఉదాహరించటం జరిగింది.
కవులు శాస్త్రపండితులు అవునో, కాదో వారి రచనలే నిర్ధారిస్తాయి. వారు చెప్పుకోనంత మాత్రాన వారు పండితులని నిర్ధారణ కాకమానదు. వాళ్ళే మేము శాస్త్రపండితులమని చెప్పుకొన్నాక కూడా వారు పండితులు కారంటే చెప్పగలిగినదేమీ ఉండదు.
ఈ పద్యనేపథ్యం చాలా మంది పాఠకులకు తెలిసి ఉండకపోవచ్చును. ఆత్మకూరు సంస్థానంలో తిరుపతి వేంకటకవులకు తీవ్రమైన ప్రతికూలవాతావరణం ఎదురైంది. శఠమర్షణం కృష్ణమాచార్యుల వారి మహాప్రౌఢమైన శ్రీనివాస విలాస చంపువును తెలుగు చేసినందువల్ల కవులకు సభలో కలిగిన ప్రశస్తిని చూసి ఆస్థానకవి తర్కతీర్థ తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు గారికి అసూయ కలిగింది. కవులకు శాస్త్రపాండిత్యం లేదని ప్రసంగించారు. ‘గుణాలయ’, ‘దేవతలు ధర్మవర్తులు’ అన్నవి అపప్రయోగాలని సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆస్థానవిద్వాంసులు ఒకటయ్యారు. కవులు ఆనాడు అసామాన్యమైన తమ వ్యాకరణపాండిత్యంతో విమర్శకులను నిరుత్తరులను చేశారు. భారత ప్రయోగాలను తవ్వి తలకెత్తారు. అప్పుడు శ్రీనివాసాచార్యులు చేసేదేమీ లేక, “మీసములం బట్టి చూడ మీరు పండితులు గారు” అని కుత్సితాక్షేపణ చేశారు. అందుకు సమాధానంగా కవులు జగదేకనుతిపాత్రమైన ఆ పద్యాన్ని చెప్పారు. “దుందుడు కొప్పఁగ” రెండు వైపుల మీసాలు పెంచినది రెండు భాషలలో మేము కవీంద్రులం అని చెప్పుకొనేందుకు (తండ్రిగారు జీవించి ఉండగా వైదికులు మీసాలు పెంచరాదన్న ఆనాటి సంప్రదాయం తెలియని ధర్మశాస్త్రపాండిత్యలోపం వల్ల కాదు, కవీంద్రత్వం మూలాన కలిగిన దుడుకుతనం వల్ల); ఏ పాండిత్యం మాకు లేదని ఆక్షేపించారో – ఆ శాస్త్రార్థంలో “కవివరుల్ (ఆస్థానకవి శ్రీనివాసాచార్యులు గారిని ఉద్దేశించి అన్నమాట అది) మము గెల్వుఁడు” – అని ఆ పద్యభావం. పాండిత్యంలో పోటీకి రమ్మనే ఆరోజు వారన్నారు. ఆత్మకూరు శాస్త్రవాదంలో గెలుపొందిన కొంతకాలానికి తర్వాత కూడా, “నీదు సంస్థానపండితుఁ డైన యల శ్రీనివాసాచార్యవర్యుండు సన్యాసి యయ్యె” అని కవులు ఆ పాండిత్యవిజయాన్ని నెమరువేసుకొన్నారు.
“వ్యాకరణం పుట్టి, కావ్యాలు వస్తాయనే నమ్మకం మనవారికి ఎన్నడూ లేదు.” అంటూ ఏల్చూరి వారొక sweeping generalization చేశారు. ఇందుకు వారిచ్చిన ఉదాహరణలన్నీ పందొమ్మిదో శతాబ్దికి ముందువే. ఈ ప్రస్తుత వ్యాసానికి సంబంధించిన కాలంలో ఉన్న పరిస్థితికి ఈ ఉదాహరణలు ఎలా అన్వయిస్తాయి?”
అందువల్ల ఆ నమ్మకం 19-వ శతాబ్దికి సంబంధించిన కాలంలో ఏ రూపంలో ఉన్నదో అన్వయించటమొక్కటే సమాధానం కాగలదు. పందొమ్మిదో శతాబ్దికి మునుపు, పందొమ్మిదో శతాబ్ది కాలంలో, పందొమ్మిదో శతాబ్దికి తర్వాత, ఆనాటికీ ఈనాటికీ ప్రయోగరక్షే వ్యాకరణప్రయోజనమని నమ్మకం.
“లక్షణోక్తమగు విషయము లక్ష్యమం దిమిడియున్నదే కాని వేఱు కాకపోయినను” … “నన్నయభట్టారకునకుఁ బూర్వము గాని యతనినాఁడు గాని తత్సమ భాషకుఁ గాదు కదా యాచ్ఛికభాషకే లక్షణము పుట్టలేదు” … “శబ్దస్వరూపవిజ్ఞానమును బ్రయోగవిజ్ఞానమును విశదీకరించు లక్షణములే మనభాష కిపు డావశ్యకము” … “ఈ భావముతోనే ‘ప్రయోగశరణం వ్యాకరణ’ మ్మనుచు నే నాంధ్రభాషానుశాసనము నిర్మించినట్లే యీ శాస్త్రిగా రీ తత్సమచంద్రికను నిర్మించినారు” అని 1954లో శ్రీ సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి గారి తత్సమచంద్రిక పీఠికలో శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు. 20-వ శతాబ్దిలోనూ ఈ భావమే ఉన్నది.
జిజ్ఞాస్యమైన సంశయప్రకాశానికి మూలం జిజ్ఞాస. సందేహనివృత్తి వ్యాసకర్తల కర్తవ్యం. వ్యాసంలోని ప్రత్యంగమూ వ్యాసంగానికి పాత్రమే. ఏ అధిక్షేపణమూ లేని ప్రశమితభావంతోనే విషయవిమర్శను వ్యాసరచయితల సహృదయత మన్నింపగలదన్న ఆకాంక్షతో వ్యాఖ్యను ప్రకటించటం జరిగింది.
వ్యాసరచయితలకు, శ్రీ రామారావు గారికి, శ్రీ వంశీమోహన్ గారికి, సంపాదకులకు ధన్యవాదాలు. ఈ మాటకు ఇంతటితో స్వస్తి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
[ఈ వ్యాసపు రెండవ భాగం ప్రచురించబడేవరకూ, ఈ మొదటి భాగంపై చర్చను నిలిపివేస్తున్నాము.అసౌకర్యానికి క్షమార్పణలు – సం.]
ముందుగా, ఏల్చూరి వారికి నమస్కారాలతో కూడిన అభినందనలు – ఒక వ్యాసంలోని అతిముఖ్యమైన పలు సమస్యలని గుర్తించి, దానిని కూలంకషంగా విలోకించి, విచారించి, విశ్లేషించి, కొత్త ఆలోచనలకి దారి తీసే విషయాల్ని వ్యాఖ్యద్వారా ప్రతిపాదిస్తున్నందుకు. ఆ ఆలోచనల లోతులు ఎంతలో వున్నాయో అన్న సంగతి ఎంతమందికి అర్థమవుతుందోనని నాకు కుతూహలంగా వుంది.
“ఏవం విధ విషయవిమర్శ” అని ఒకవంక, “వ్యాసతాత్పర్యానికి భంజకాలు కావని” స్పష్టంగా అపార్థాలకు తావులేకుండా మరోవంక మురళీధరరావు గారు చేసిన వ్యాఖ్య బ్రహ్మాండంగా అనిపిస్తోంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే – వారన్నవి ఒక్కొక్కటి తీసుకుని, అందుట్లోని సారం సంగతి అర్థం కాక ఈ వ్యాస విషయాన్ని పరిష్కరించే ప్రయోజనం చేజార్చుకుంటారేమోనన్న భయం. ఈ రెండు పేజీల వ్యాసంలో చదవవలసిందేదీ లేదని వ్యాసం చదివిన తరువాత అనిపించిన మాట వాస్తవం. అయితే ఇది తర్వాత వచ్చేదానికి ఉపోద్ఘాతం లాటిదన్న రచయిత మాట వలన, ఊరుకొని దానికోసం ఎదురు చూడడమంత మంచి పని ఇంకోటి లేదు. ఇప్పటికయితే నా దృష్టిలో ఈ వ్యాసం చివరన ఇచ్చిన 30 + రెఫెరెన్సు పుస్తకాలు చదువుకోవటం ఉత్తమం. లిష్టు ఇచ్చినందుకు రచయితకు కృతజ్ఞతలు.
పోతే, ఏల్చూరి వారు రచయితను కొన్ని ప్రశ్నలు అడిగినారు. సమాధానం రచయిత ఇస్తే బాగుండును. రచయితకు పట్టనిదో, సమాధానం చెప్పలేని విషయమో, తర్వాతెప్పుడైనా చెపుదామని ఊరకున్నారో తెలియనైతే లేదు కానీ, ఏల్చూరి వారి కామెంటు మీద కె.వి.ఎస్ రామారావు గారనువారు చేసిన కామెంటు నాకు చాలా అనవసరమనే అనిపిస్తోంది. దాని వల్ల వ్యాసాన్ని విస్తృతపరిచే అవకాశమున్నదనుకొని రాసినారో ఏమో? అలా రాసి ఉంటే అది భ్రమగా మిగిలిపోకూడదన్న ఆశతో!
ఏల్చూరి వారి వ్యాఖ్య వల్ల రచయిత ప్రూఫు రీడింగులో చేసిన పొరపాటు బయటపడింది. రాసేవారు పొరపాటు చేసినపుడు చదివేవారు పొరపాటు పడకుండా సరిచెయ్యటమనేది మంచి విమర్శకుని లక్షణం. అది ఏల్చూరి వారిలో పుష్కలంగా ఉన్నదని పట్టవన్న పేర్లు ఇరికించి రాసిన వారి పద్యమే నిరూపించినది. అలాగే వారి వ్యాఖ్య లోని ఇతర విషయాలు కూడాను.
రామారావుగారి కామెంటు వలన ఇసుమంత కూడా ప్రయోజనమేమీ లేదని నాకు అనిపించిన మాట నిజమే కానీ, వ్యాసకర్త రామారావుగారి కామెంటు చదివి వ్యాసాన్ని విస్తృతపరిస్తే అంతకన్నా ఆనందమూ లేదు.
నేను రాసిన ఈ కామెంటు కూడా దేనికి ఉపయోగపడే అవకాశమూ లేదు. ఏమీ ఉపయోగాల్లేని వాటిని రాసుకొని ఆనందించటం కన్నా ఏల్చూరి వారి ప్రశ్నలు మరల చదువుకొని అర్థమూ ఆకళింపూ చేసికొని జ్ఞానసముపార్జన చేసుకోవటం ఉత్తమమని నమ్ముతూ
ఇంతటితో ఈ వ్యాసమునకు, వ్యాఖ్యలకు స్వస్తి
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
[ఎవరి అభిప్రాయాలు వారివి. విమర్శకు ఎవరూ అతీతులు కారు. అయితే ఆ విమర్శ అభిప్రాయం పైన కాక అభిప్రాయం వెలిబుచ్చిన వారిపైకి హేళనలతో మరలించడం వల్ల తాత్కాలికమైన ఉపశాంతి ఏదైనా మిగలవచ్చేమో కాని, అసాహిత్య వాతావరణం ఏర్పడి చర్చ స్థాయి దిగజారిపోతుంది. అది ఎవరికీ విజ్ఞానదాయకమూ కాదు, అందువల్ల ఏ లాభమూ లేదు. దయచేసి ఆసక్తికరము, అవసరము అయిన ఈ వ్యాసంపై చర్చను నిగ్రహంతో కొనసాగించవలసిందని మా మనవి – సం.]
ముందుగా, నారాయణరావు, శ్రీనివాస్ గార్లకి అభినందనలు – అతి ముఖ్యమైన ఒక సమస్యని గుర్తించి, దానిని కూలంకషంగా విలోకించి, విచారించి, విశ్లేషించి, కొత్త ఆలోచనలకి దారి తీసే విషయాల్ని ప్రతిపాదిస్తున్నందుకు. ఆ ఆలోచనల లోతులు ఇంకెంత వున్నాయో రెండో వ్యాసంలో చదవాలని నాకు కుతూహలంగా వుంది.
ఐతే, “ఏవం విధ విషయవిమర్శ” అని ఒకవంక, “వ్యాసతాత్పర్యానికి భంజకాలు కావని” మరోవంక అంటూనే మురళీధరరావు గారు చేసిన వ్యాఖ్య మాత్రం నాకు అనవసరమనే అనిపిస్తోంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే – వారన్నవి ఒక్కొక్కటి తీసుకుని వాటివల్ల ఈ వ్యాస విషయాన్ని విస్తృతపరిచే ఏమన్నా ప్రయోజనం ఉందేమో చూస్తే నాకు అలా కనిపించటం లేదు.
మొదటగా – “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు” అన్న వాక్యం వారికి అభ్యంతరకరమైందన్నారు మురళీధరరావు గారు.. ఐతే వారు చూపిన తిరుపతివెంకట కవులు చెప్పిన శ్లోకాలు, వారి శిష్యుల సంస్కృత భాషాజ్ఞానం తిరుపతి వెంకట కవులు పండితులు ఔనని ఏ అర్థంలో నిరూపిస్తాయో నాకు బోధపడడం లేదు.
ఇక – “పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్లే” అన్న విషయాన్ని తీసుకుందాం. ఈ వ్యాసం మాట్లాడుతున్నది పందొమ్మిదో శతాబ్దపు చివరి భాగం, ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగాల్లోని పరిస్థితుల గురించి. ఆ కాలంలో ఎవరిని పండితులనే వాళ్లో చెళ్లపిళ్ల వారి ఆత్మకథ స్పష్టంగానే చెప్తున్నది. వ్యాసంలో, చెళ్లపిళ్ల వారి ఆత్మకథ నుంచి ఈ సందర్భంలోని కొన్ని విషయాల్ని తీసుకున్నామని వ్యాసకర్తలూ చెప్పారు. ఉదాహరణకి వారి “కథలు గాధలు” పుస్తకంలో “వెనకటి పండితులు” అన్న వ్యాసం చూడండి (అదృష్టవశాత్తు ఎవరో ఈ మధ్యనే ఈ పుస్తకాన్ని archive.org లో పెట్టారు. చెళ్లపిళ్ల వారి “కాశీయాత్ర” కూడ ఎప్పటినుంచో అక్కడ ఉంది.) అందులో వారు పండితులుగా చెప్పిన వారంతా వ్యాకరణ, తర్క, మీమాంస, వేదాంతాది శాస్త్రాల్లో పండితులే, ఎవరూ “తెలుగు పండితులు” కారు. వాళ్లలో కవిత్వం చెప్పగలిగిన వాళ్లు ఎవరైనా ఉన్నారేమో తెలియదు; ఉన్నా వాళ్లని వాళ్లు పండితులుగా భావించుకున్నారు తప్ప కవులుగా చూసుకున్నట్టు దాఖలాలు లేవు ఈ పుస్తకంలో. అలాగే, అప్పుడు పిల్లలెలా పాఠాలు నేర్చుకునేవారో చెప్పే ఈ వాక్యాలు చూడండి (పేజి. 301):
“తెల్లవారుజామున పాఠాలకు ప్రారంభం చేసేవారు. తక్కువ పాఠం వాళ్లకి ముందు ప్రారంభం. ఆ పాఠాన్ని పై తరగతివాళ్లంతా వినడం ఆవశ్యకం. యీ నియమం శాస్త్ర పాఠాలకి మాత్రమే. కావ్య పాఠాల వాళ్లకి గురువుగారు చెప్పడం లేదు. విద్యార్థులలో పెద్దతరగతివాళ్లే చెప్పేవారు. గురువుగారివద్ద చెప్పుకొన్న శాస్త్రపాఠాన్ని క్రిందితరగతి వాళ్లకి పై గ్రంథాలు చదువుకొనే విద్యార్థులు చింతన చెప్పేవాళ్లు. ఆయీ విధంగా కష్టిస్తేనే తప్ప శాస్త్రం స్వాధీనం కాదు. యీ విధంగా అభ్యసించినప్పటికీ యేకొందరికోతప్ప సర్వేసర్వత్ర శాస్త్రం స్వాధీనం కాదు.”
“నేనూ – మా తిరుపతి శాస్త్రుల్లూ” అనే వ్యాసంలో చెళ్లపిళ్ల వారు తాము సంస్కృతంలో ఏమేం చదివిందీ చాలా విస్ఫష్టంగానే రాశారు. ఏ ‘శాస్త్రం’లోనూ తను పండితుణ్నయానని ఆయన ఎక్కడా చెప్పలేదు. తిరుపతిశాస్త్రి తనకన్న ముందుగా సిద్ధాంతకౌముది పూర్తిచేశాడని, వ్యాకరణంలో తనకంటె తిరుపతిశాస్త్రి గట్టివాడని మాత్రం అక్కడక్కడ అభిప్రాయపడటం కనిపిస్తుంది. వాళ్ల ప్రఖ్యాత పద్యంలో “దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ మీసము రెండుబాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా; రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు” అన్నారే కాని పాండిత్యంలో పోటీకి రమ్మనలేదు. ‘కవీంద్రులమని” చెప్పి ‘కవివరుల’తో మాత్రమే పోటీ పడ్డారు. ఈ వ్యాస కాలపరిధిలో కవులు వేరు, పండితులు వేరు. పండితులంటే తప్పక కనీసం ఏదో ఒక సంస్కృతశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారే. తిరుపతివెంకట కవులు కవులు; పండితులు కారు. కవిత్వం గురించే వారు పోటీ పడ్డారు తప్ప శాస్త్రాల గురించి కాదు. గీరతం, గుంటూరుసీమ, ఇంకా అనేకుల్తో వాదాలు ఇలాటివే.
ఇంతెందుకు – కథలు గాధలు, 18వ పేజీలో చెళ్లపిళ్ల వారు అతి స్పష్టంగానే చెప్పారు: “పండితులంటే ఆ కాలంలో ఆ బిరుదు రావడం సామాన్యంగా వచ్చేది కాదు. కావ్యనాటకాలంకారాలు పూర్తిగా చదివిన వారికి ఆ బిరుదు ఉండేదే కాదు. సాహిత్య గాళ్లనేవారు వాళ్లని. ఏదో ఒక శాస్త్రంలో పూర్తిగా పాండిత్యం సంపాదిస్తేనే పండితుడనడం.” ఇది సంస్కృతభాషా సందర్భంలోనేనని, తెలుగు గురించి కాదని చెప్పక్కర్లేదు కదా !
రెండవది – “‘ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయనే నమ్మకం’ మనవారికి ఎన్నడూ లేదు.” అంటూ ఏల్చూరి వారొక sweeping generalization చేశారు. ఇందుకు వారిచ్చిన ఉదాహరణలన్నీ పందొమ్మిదో శతాబ్దికి ముందువే. ఈ ప్రస్తుత వ్యాసానికి సంబంధించిన కాలంలో ఉన్న పరిస్థితికి ఈ ఉదాహరణలు ఎలా అన్వయిస్తాయి?
“సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు.” ఆంధ్రశబ్దచింతామణి 16-వ శతాబ్ది చివరి కాలం నాటిది. అంతకు మునుపటి కవులకు దాని ఉనికి విషయం తెలిసివుండే అవకాశమే లేదు. ఆ తర్వాతి కవులు మాత్రం దానికి “బలమైన ప్రాధాన్యాన్ని” ఇచ్చారని చెప్పేందుకు ఆధారాలు ఏమున్నాయి?”
వారి ఈ వ్యాఖ్యలో మొదటిభాగం వ్యాసకాలానికి ముందుది. రెండోభాగానికి ఉత్తరం బాలవ్యాకరణమే ఇస్తుంది. (దీని గురించి కొంచెం ముందు మాట్లాడదాం).
“పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు.” అనే దానికి అభ్యంతరం వెలిబుచ్చుతూ మళ్లీ వ్యాసకాలానికి పూర్వుల్నే ఉదహరించారు కనుక దీన్ని చర్చించనక్కర్లేదు.
మూడవది – “ఆంధ్రశబ్దచింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణంలో ఒప్పుకున్నాడు.“ చిన్నయ సూరి గారు ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది? “ అంటూ అధిక్షేపించారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి “రమణీయము”లో సంధి పరిఛ్చేదంలో 13 వ సూత్రం, దాని సందర్భం చూడండి. “వాగనుశాసనులు యదా తదా యని గ్రహించుట ప్రపంచార్థమని యెఱుగునది.” అని ఒక వాక్యం కనిపిస్తుంది. ఈ వాగనుశాసనుడు నన్నయ కాదు, మరొకరికెవరికో కూడ ఆ బిరుదుంది, సూరి మాట్లాడుతున్నది ఆ రెండో వ్యక్తి విషయం, నన్నయ గారి గురించి కాదని అంటారా?
చివరగా వ్యాసకర్తల పేర్లు ఛందోబద్ధ పద్యాల్లో పడతాయా లేదా అనేది. వ్యాఖ్యకారులు ఒక ఉదాహరణ ఇచ్చారు వ్యాసంలో విషయానికీ దీనికీ ఎంతదూరమో చదివేవాళ్లకి వెంటనే తెలుస్తుంది.
రచయితల నైకజమైన అభిప్రాయమే గాని, ‘నైజ’మేమీ తెలియవలసి రాలేదు. 🙂 “తెలుగులోనే పనిచేస్తున్నవాళ్లు … కవులే కానీ పండితులు కారు”, “పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే” అన్న నైపథ్యానుసంజనతో ఘట్టితాలైన “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృతపండితులు కారు … అందుచేతనే … ఆశుకవిత్వా(వధానా)దివిద్యల వల్ల … వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు” ఇత్యాదివాక్యాలను పురస్కరించికొని మాత్రమే – తిరుపతి వేంకట కవులు సంస్కృతంలో శాస్త్రపండితులు ఎందుకు కారన్న సంశయాన్ని ప్రకటించటం జరిగింది. నారాయణరావు గారి గురుస్థానీయత, శ్రీనివాస్ గారి బహుముఖప్రామాణికత, ఆ ఉభయుల ప్రభావశీలితల నైజం ఆ ప్రకటనకర్తకు సుజ్ఞాతమన్నది ప్రతిజ్ఞాతమే.
అట్లాగే, తత్సమమైన ‘అయోమయ’ శబ్దానికి ‘ఇనుముతో నిండి(చేసి)నది’, అన్న ప్రాథమికార్థం తొలగిపోయి, ‘అస్తవ్యస్త పరిస్థితి’, ‘అర్థం కాని స్థితి’ అని తెలుగులో అర్థపరిణామం ఏర్పడిన తర్వాతి (ఇటీవలి?) కాలంలో ఎవరో తెలుగువారే, ఏ సమస్యను ఇచ్చినప్పుడో, ఏ చమత్కారవశాననో ప్రాసంగికంగా చెప్పిన శ్లోకమే గాని, “ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం” అన్నది తెలుగు పట్ల ఈసడింపుగా చెప్పబడిన చాటూక్తి భావమై ఉండదు. ఆ మాట శ్లోకపూర్వార్ధంలో ఆ విధమైన శ్లేషార్థంతో ఉండటమే అందుకు నిదర్శనం.
‘గీర్వాణ’ శబ్దం సంస్కృతంలో ‘గీర్బాణ’ శబ్దం నుంచి ఏర్పడినదని “గీరేవ (నిగ్రహానుగ్రహసమర్థా) బాణః అస్త్రం యేషామ్’ అని రామాశ్రమి. ఎవరి వాక్కులు బాణతుల్యములో, వారు గీర్బాణులు. గీరేవ శాపలక్షణా వాణో బాణో వా యేషాం తే వబయో రభేదః’ అని లింగాభట్టీయం. సంప్రదాయస్థమైన ఇదే తెలుగులో ఏర్పడిన అర్థచ్ఛాయకు మూలమని ఊహ్యం. ములుకుల వంటి పలుకులు (బాణతుల్యములైన కఠినోక్తులు) కలవాడు గర్విగా భావింపబడటం సహజమైన అర్థాన్వయమే. అది ఆధునిక సాహిత్యపరిణామగతమైన అర్థాన్వయమో, కాదో ఇంకా పరిశీలింపవలసి ఉన్నది.
ఇవన్నీ వ్యాసప్రతిపాదితానికి భంజకాంశాలు కావని ముందే విన్నవించటం జరిగింది.
మాన్యులు శ్రీ వెల్చేరు నారాయణరావు గారికి, శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
నమస్కారములతో,
వ్యాసం ఇంకా పూర్తికాలేదు కాబట్టి, ఇప్పుడే వ్యాఖ్యానించటం భావ్యం కాదు కాని, మీవంటి ప్రభావశీలి ప్రామాణికుల రచనలో అక్కడక్కడ కొన్ని అనంగీకారయోగ్యములైన భావాలను మాత్రమే – అవి మీ వ్యాసతాత్పర్యానికి భంజకాలు కాకపోయినా, కొంత సంబంధించినవే కనుక ఇక్కడ ప్రస్తావింపవలసి వచ్చింది:
“తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు.”
ఎందుకు కారు? వ్యాకరణ తర్క వేదాంతాది శాస్త్రాలను గురుసన్నిధిని శాస్త్రీయంగా అధ్యయనించి, వేలూరి శివరామశాస్త్రి, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి గారల వంటి అసంఖ్యాతవిద్యార్థులకు సంస్కృతవ్యాకరణం నేర్పి మహావిద్వాంసులను కావించి, కావ్యనాటక ప్రకరణగ్రంథాలను బోధించి, సంస్కృతంలో ధాతురత్నాకర కాళీసహస్రాదులు గాక ఇతరానేకశతశః ప్రౌఢశ్లోకరచనలు చేసిన మహానుభావులు వారు. మామూలు తెలుగు పండితులు వ్రాయలేని ఒక పద్యం, సామాన్య సంస్కృతపండితులు అర్థతాత్పర్యాలు చెప్పలేని ఒక శ్లోకం ఇక్కడ చూపుతున్నాను. రెండూ వారివే. ఇటువంటి ఉదాహరణలను వారి రచనలలో ఒక్కొక్కదానిలోనుంచి ఎన్నింటినైనా చూపవచ్చును:
కొందరు పచాద్యజంతం
బందురు; మఱికొంద ఱర్శ ఆద్యంతం బే
యందురు; మే ముభయం బని
యందుము నీ నామధేయ మానందనృపా!
యః పశ్యతి జగత్సర్వం యో న పశ్యతి సర్వతః
తా వుభౌ పరమాత్మానం పశ్యాపశ్యౌ న పశ్యతః.
“ఎవరో ఒకరు వ్యాకరణం రాయబట్టి, ఆ వ్యాకర్త వాగనుశాసనుడు కాబట్టి, ఆ తరవాత దక్షవాటిలో వుండే కవిరాక్షసుడు అనే ఆయన ఎవరో మనకి తెలియకుండా ఒక శాసనం చేశాడు కాబట్టి, కవులందరూ ఆ శాసనాన్ని పాటించారని వ్యాకరణ పండితుల వాదన … ఆదిని శబ్దశాసన మహాకవి (పద్యం మొత్తం ఇక్కడ ఉదాహరింపలేదు) … ఈ వాదనకి ప్రధానమైన బలం — ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం.”
అప్పకవి వ్రాసిన ఆ పద్యమే – భారతంలో నన్నయ గారిచే చేయబడిన వ్యవస్థ తప్పించి, వ్యాకరణం పేరుతో సూత్రసంపాదనం అంటూ ఎవరూ చేయలేదు కనుక – అందులో ఉన్న తీరున మాత్రమే – అంటే, ఆ భారత ప్రయోగాలను అనుసరించి మాత్రమే – రచన చేయాలని ఆ కవిరాక్షసుని ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నది. అంటే, ఆ కవిరాక్షసునికి నన్నయగారి పేరిట వెలసిన ఆంధ్రశబ్దచింతామణి సంగతే తెలియదన్నమాట. ఆయన వ్యాకరణానికంటె నన్నయగారి ప్రయోగాన్నే శరణ్యమని భావించాడన్నమాట. (‘కవిరాక్షసుడు’ అన్న పేరే ఆయన సంస్కృత పాండిత్యాన్ని సూచిస్తున్నది; అంతటివాడు వ్యాకరణం కంటె కవిప్రయోగం శిరోధార్యం అన్నాడన్నమాట.)
“ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం” మనవారికి ఎన్నడూ లేదు. ‘ప్రయోగశరణం వ్యాకరణం’ అని ఉండనే ఉన్నది కదా. అతిప్రాచీనాచార్యులు, మునిత్రయం వారు ప్రయోగవిజ్ఞానమే వ్యాకరణానికి మూలకందమని (“అపదం న ప్రయుఞ్జీత” వద్ద వృత్తిని చూడండి) పదేపదే చెప్పారు. పాణిని మహర్షి అష్టాధ్యాయికి మునుపే జాంబవతీ పరిణయం చెప్పిన సంగతీ, అందులో పాణినీయానికే లొంగని ప్రయోగాలున్న సంగతీ సుప్రసిద్ధమే. కావ్యాలు ముందు పుట్టి, వాటిని అనుసరించి వ్యాకరణం వస్తుందనే మనవారి నమ్మకం.
“సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు.”
ఆంధ్రశబ్దచింతామణి 16-వ శతాబ్ది చివరి కాలం నాటిది. అంతకు మునుపటి కవులకు దాని ఉనికి విషయం తెలిసివుండే అవకాశమే లేదు. ఆ తర్వాతి కవులు మాత్రం దానికి “బలమైన ప్రాధాన్యాన్ని” ఇచ్చారని చెప్పేందుకు ఆధారాలు ఏమున్నాయి?
“పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు.”
ఏనాటి కవుల సంగతి? ప్రాచీనకవులు పాణినిని కంఠస్థం చేసేవారో, లేరో; ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరింపగలిగి ఉండేవారో, లేరో మనకు తెలిసే అవకాశం లేదు. వారి ప్రయోగాలే అందుకు సాక్ష్యాలు. సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంలోనే “శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు” అన్న కవి, “వక్షోముఖాఙ్గేషు” అని సమాసాంతవ్యవస్థ తెలియక అపాణినీయప్రయోగం చేశాడనుకోవాలా? పాణినీయాన్ని పుడిసిట పట్టిన మహాపండితు డనుకోవాలా? తిక్కన శ్రీనాథ పోతనాదుల మాటేమిటి? “యమునాద్గంగము, కృష్ణభూమదిలము” ఇత్యాదులున్న భాస్కర రామాయణం మాటేమిటి? ఆ రోజుల్లో సంస్కృతవ్యాకరణం కంఠగతం కాకుండా కవిత్వం చెప్పిన తెలుగు కవులు అరుదనే చెప్పాలి.
కాగా, అభినవగుప్తుని పరిచయం 20-వ శతాబ్దికి పూర్వం తెలుగు కవులకు లేకపోవటంలో ఆశ్చర్యం ఉండకూడదు. వ్రాతప్రతులు ఏనాటినుంచో దురుద్ధరంగా ఉండటమూ, తెలుగు కవిత్వం ప్రారంభమయే నాటికి సంస్కృతలాక్షణికులకే ఆ కృతి దుర్లభమైపోవటమూ, తెలుగు కవులెవరూ ఆయనను స్తుతించి ఉండకపోవటమూ అందుకు సాక్ష్యాలు. నాట్యశాస్త్ర ధ్వన్యాలోకాదులను చూసిన తిక్కన శ్రీనాథాదులు సైతం అభినవగుప్తుని వ్యాఖ్యలను చూసినట్లుగా నిరూపించటం కష్టం. “ఎక్కువమంది” కారు; అసలెవరూ ఉండి ఉండరు. ఆధునికకాలంలో మాత్రమే అది అచ్చైనాక ప్రచారంలోకి వచ్చింది. “మామిడి కొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిలస్వామికి మ్రొక్కి … ఈ యభినవధ్వనిధారణ కుద్యమించితిన్” అని రాయప్రోలు.
జగన్నాథ పండితరాయల వారు క్రీస్తుశకం 1674లో పరమపదించారు. 1700కు తర్వాతనే తప్పించి, తెలుగు కవుల్లో అంతకు మునుపు ఎంతమందికి ఆయన పరిచయం సాధ్యం? అనంతరీయాధునికాలంకారికులలో సైతం ఆయనతో చాలా మందికి తీవ్రవిభేదాలున్నాయి. సంస్కృతంలో ప్రసిద్ధవ్యాఖ్యలు లేకపోవటమే దేశమంతటా దాని వ్యాప్తిలోపాన్ని సూచిస్తున్నది. ఆధునికకాలంలో తాతా సుబ్బరాయశాస్త్రి గారు, గాజులపల్లి హనుమచ్ఛాస్త్రి గారు, వారి తర్వాత పంతుల లక్ష్మీనారాయణశాస్త్రి గారు, వేదాల తిరువేంగళాచార్యుల వారు, జమ్ములమడక మాధవరామశర్మ గారు కళాశాలలలో పఠనపాఠనాలలోకి తేక మునుపు తెలుగుదేశంలోనూ దానిలో కృషిచేసిన ప్రసిద్ధులు లేరు. తెలుగు కవులు ఎప్పుడు పడితే అప్పుడు దానిని ఎట్లా ఉదాహరింపగలరు?
చిన్నయ సూరి గారు ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది?
“ఉదాహరణకి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు అనే మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఏ తెలుగు పద్యం లోను పట్టవు … పరుచూరి శ్రీనివాసుడు అని చేసుకుంటే కంద పద్యంలో ఇమిడించొచ్చు. వెల్చేరు నారాయణరావు ఏ పద్యంలోను పట్టదు.”
ముందే వ్రాసినట్లుగా, ఇవి మీ వ్యాసప్రతిపాదితానికి భంజకాలు కాకపోయినా, కొంత సంబంధించినవే కాబట్టి ప్రస్తావింపవలసి వచ్చింది. ఏవంవిధ విషయవిమర్శను మీ సహృదయత మన్నిస్తుంది.
మాన్య మిత్రులు శ్రీ కామేశ్వరరావు గారికి
నమస్కారములతో,
మొదటి పద్యానికి మీ వ్యాఖ్య, పదప్రయోజనాన్ని వివరించిన తీరు – హృద్యంగా ఉన్నాయి. “దేవీసంతతి” అని మీ ప్రతిలో ఉన్నది కాబోలు. అది తప్పు కాదు కాని, ప్రసిద్ధప్రతు లన్నిటిలో దేవీసంహతి, దేవీసంఘము అనే పాఠాలున్నాయి.
రెండవ పద్యంలో “బాహుదుర్గములు” అన్న సమాసాన్ని మీరు బహువచనంగా గ్రహించి, ‘బాహువులనే కోటలు’ అని అన్వయించారు. అవి ఒకటి కాదు; రెండు దుర్గాలు అని కూడా వివరించారు. అయితే, ‘బాహువులనెడి దుర్గము’ అని రూపణను ఏకవచనంగా పఠించటమే సమంజసం. శ్రీకృష్ణుని బాహుమధ్యసీమ (విశాలమైన వక్షఃస్థలం) దుర్గోపమమై, దైత్యదానవదుష్ప్రాపం కనుక తనకు రక్షాకరమని సత్యభామ అంటున్నది. ఇక్కడ ఒక్కొక్క బాహువు ఒక్కొక్క దుర్గమన్న అర్థానికి అవకాశం ఉండదు. బాహువులు రెండైనా, నాలుగైనా రిపుదుర్గమమైన దుర్గం ఒక్కటే.
“త్వం త్వబ్జనాభాఙ్ఘ్రిసరోజకోశ, దుర్గాశ్రితో నిర్జితషట్సపత్నః” అని పంచమ స్కంధంలో (1-19) శ్లోకాన్ని చూడండి: “శ్రీ నారాయణ చరణారవిందంబు లను దుర్గం బాశ్రయించి, యరిషడ్వర్గంబు జయించి” అని గంగనామాత్యుని తెలుగుసేత (5-1-11). అక్కడ ఒక్కొక్క చరణం ఒక్కొక్క దుర్గం కాదు కనుకనే, “చరణారవిందములు అనెడి దుర్గము” – అన్నాడు.
“శ్రీరమణీ కుచదుర్గ విహారే” – శ్రీదేవియొక్క కుచములనెడి దుర్గమునందు (ఎత్తైన రెండు కొండలున్న గిరిదుర్గము వంటి వక్షఃస్థలమునందు) విహరణము కలవాడు – అని భావం. శ్రీదేవియొక్క కుచములనెడు రెండు దుర్గములందు విహరించువాడు అని చెప్పకూడదు. ఇది “మధుకైటభారేః వక్షోవిహారిణి” అన్న ప్రయోగం వంటిదే.
“బాహుదుర్గములు” అన్న అపపాఠం వల్ల ఈ అపార్థానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల పద్యాన్ని –
“దానవు లైన నేమి, మఱి దైత్యసమూహము లైన నేమి? నీ
మానితబాహుదుర్గ మను మాటున నుండఁగ నేమి శంక? నీ
తో నరుదెంతు” నంచుఁ గరతోయజముల్ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని, దన్ను భర్త బహుమానపురస్సరదృష్టిఁ జూడఁగన్. (దశమ: ఉత్తర భాగం-155)
అని సరిదిద్దుకోవాలి. నీయొక్క బాహుదుర్గసీమ అను మాటునన్ = రక్షణస్థానమున ఉండగా, నాకు ఏమి శంక? అని అన్వయం.
అంతే కాదు. ఆమె మ్రొక్కటమూ, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూడటమూ ఏకకాలంలో జరగలేదు. ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచిన తర్వాత ఆమె మ్రొక్కలేదు. ఆమె మ్రొక్కిన తర్వాత, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచాడని అన్వయించేందుకు వీలులేకుండా, “బహుమానపురస్సరదృష్టిన్ చూడఁగన్” – అన్న వెంటనే, “ఇట్లు మ్రొక్కిన” అన్న వచనం ఉన్నది. అప్పుడు “చూడఁగన్” అన్న అసమాపక క్రియకు ఆమె మ్రొక్కగా, ఆతడు చూడగా అన్న అన్వయమూ సరిపడదు.
వాక్యంలో “మ్రొక్కె” అన్న సమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “చూడఁగన్” అన్న అసమాపక క్రియను అన్వయించే వీలుండదు. “చూడఁగన్” అన్న అసమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “మ్రొక్కెను” అన్న సమాపక క్రియను చివరిదిగా అన్వయించాలి. తనను భర్త బహుమానపురస్సరదృష్టితో వీక్షింపగా, ఆమె కరతోయజములు ముకుళించి మ్రొక్కెను – అని మాత్రమే పద్యంలో వాక్యాన్వయం వ్యాకరణసిద్ధం. అప్పుడు అర్థం పొందుపడదు. నీతో నేను వస్తాను, నీవుండగా నాకేమి భయం? అని ఆమె అడిగినంత మాత్రాన ఆయన బహుమానపురస్సరదృష్టితో చూశాడనటమూ, అప్పుడామె నమస్కరించినదనటమూ కవి చిత్రణ అనుకోలేము. ఆ పక్షాన కవితాత్మకమైన అభివ్యక్తీకరణమే ఉండదు.
అందువల్ల, “చూడఁగన్” అన్న క్రియారూపానికి ఇక్కడ తుమున్నర్థంగా మాత్రమే అన్వయం. భర్త తన పలుకులను విని, బహుమానపురస్సరదృష్టితో చూసేందుకే ఆమె అంజలించినదన్నమాట. అది సత్యభామ స్వభావానికి తగిన చిత్రణమే. సాకూతమైన అంజలిబంధం. ముందు ప్రశంస, ఆ తర్వాత ప్రణమనం – రెండూ ఆయన మెప్పుకోసం మాత్రమే అన్నమాట. అదే కవి మనోగతం. “చూడఁగన్ = చూచుట కొఱకు” అని తుమున్నర్థకం.
ఆ జాణతనాన్ని గుర్తించాడు కనుకనే, ఇట్లు (ఈ విధమైన నేర్పరితనంతో) మ్రొక్కినన్ = ఆమె నమస్కరింపగా, ఆయన భావజ్ఞుడు కదా, దగ్గరికి తీసికొని కౌగలించికొన్నాడని తర్వాత అన్నాడు.
సహృదయత ఉట్టిపడుతున్న అమోఘమైన మీ వ్యాఖ్యకు పరిపూరకంగా మాత్రమే ఈ మాటలను వ్రాశాను. పోతనగారి భాగవతం ఎంత పరిష్కరణ సాపేక్షమో ఈ సన్నివేశం మరొక్కసారి నిరూపిస్తున్నది.
రామయ్య గారికీ, రజనీకాంత్ గారికీ ధన్యవాదాలు. రాజ్ రెడ్డి గారి గురించీ, చంద్రశేఖర్ గారి గురించీ రాయమని అడిగేరు. ప్రయత్నిస్తాను. ఫెర్మా గురించి రాయమని ఈమాట సంపాదకులు – మాధవ్ – అడిగి ఉండకపోతే రాసేవాడినే కాదు. మా అన్నయ్య స్నేహితుడు – సిరక్యుస్ యూనివర్శిటీలో ఉండేవాడు – పేరు వాలీ అనుకుంటాను, చంద్రశేఖర్ జీవిత చరిత్ర రాసినట్లు లీలగా జ్ఞాపకం ఉంది. అది సంపాదించి, చదివి, ఆ తరువాత ప్రయత్నిస్తాను. చంద్రశేఖర్ చేసిన పని చాలమట్టుకు నాకు పరిచయమే కాని ఆయన జీవిత విశేషాలు సేకరించాలి. చూద్దాం.
– వేమూరి
“ఏ రామానుజన్ లాంటి వ్యక్తి అయినా తారసపడితే” … మాలాంటి సామాన్యులకి అదంత సులభ సాధ్యం కాదు. అందుకే తారసపడ్డ మీకే చేతులు ముకుళించేటందుకు నమస్సుమాంజలి అనేటందుకు, అనుమతి ఇవ్వరా ఆచార్యవర్యా.
Carnegie Mellon University ( Robotics Institute ) డా. రాజ్ రెడ్డి గారి గురించి కాని, Chicago University ఖగోళ శాస్త్రవేత్త “చంద్ర” ( సుబ్రహ్మమణ్య చంద్రశేకర ) గారి గురించి కాని మీ మరే రచనలైనా కాని చదవాలని కుతూహలంతో,
ఆ టాపిక్స్ అంత తేలిగ్గా అర్ధం అవుతాయని కాకున్నా, మీరు కదళీ పాకంలో చెపుతారనే ఆశతో
Thanks to the contributors, for making it possible to get to know the Telugu Poet మాధవపెద్ది సుందర రామశాస్త్రి. I did not know him before. I am glad, I do now.
I like to get into some discussion on the essay. Because genetically I am contentious. But first, in the same spirit of essayist – which is appreciation of poetry- I am presenting this writing on Duvvuri Ramireddy’s literary work/s. (I like Telugu Script. I feel some of the beauty of any language is associated with its script. So I typed this writing of mine – which is originally published in “RTS” in the racchabanda Yahoo groups, in Dec 2006, – now into Telugu, for readers of eemaata.) Please read on, if you wish.
At some point in my reading I have stopped looking at “పానశాల” as a translation and started looking at it as a love poem.
పానశాల ఒక ప్రేమ కావ్య ఖండిక. పానశాల ఒక విరహ గీతిక. పానశాల ఖయ్యాము అనువాదముగా భావించటం మాని చదివితే అందులో రామిరెడ్డి హృదయ సాక్షాత్కారం జరుగుతుంది. ఈ రామిరెడ్డి ఒక చక్కని స్వభావం కల యువకుడు. ఒక సంపన్నుడు. ఒక మోతుబరి రైతు. అన్ని విషయములయందు ఆసక్తి ఉన్నవాడు. సైన్సు, సాహిత్యము, సంగీతము, భాషలు, వ్యవసాయం, ఇతనికి ఇష్టంలేని వస్తువులేమున్నాయి. అందమైనవన్ని ఇతనికి ప్రియాలు. చక్కని మేడ కట్టుకున్నాడు. ఆ మేడను అందాల మందిరంగా అలంకరించుకున్నాడు. అందులో తన భార్యతో కాపురం ఉంటున్నాడు. ప్రపంచంలో కొందరు తెలివైన వారయ్యీ, ఆలోచనలో వక్రత లేకుండా పూర్తిగా మధుర భావనలతో నిండిన వారుంటారు. భార్య నిజంగా అందగత్తో కాదో కాని వీరికి అందంగా కనిపిస్తుందేమో. నిజంగా అందమైన భార్యలున్నవారుంటారు. సర్వ సమర్ధులైన భార్యలున్నవారుంటారు. ఐనా ఉత్తమ హృదయం లేని వాడికి భార్య అందం, గుణం మనసుకు పట్టదు. రామిరెడ్డి అలా కాదే! స్వచ్ఛ హృదయుడు. రామిరెడ్డి రాముని వంటి వాడు. తన భార్యను గాఢంగా ప్రేమించిన వాడు.
కొంతమంది జీవితంలో ప్రేమ అనే భావనే లేకుండా జీవితం గడుపుకోగలరు. వీరికి అన్నీ డబ్బులూ దస్కాలూ, లెక్కలూ డొక్కలూ, సంఘాలూ సంస్కరణలూ కనిపిస్తాయి. ఎవతికి ఎవడిని ఎలా కట్టబెట్టాలి అందులో బాధ్యతలు, బరువులు, లొసుగులు కిటుకులు, ఇదీ వీరి ఆలోచన. సంఘం నియంత్రిస్తే, ఆ చట్టానికి కట్టుబడి ఏదో కర్మకాండలు చేసుకుపోయేవారికి ఈ ప్రేమ సుఖం అనుభవంలోకి రాకపోవచ్చు. మనకు అనుభవం కాని సుఖం లేనే లేదనుకుంటారు కొందరు శుంఠలు. అసలు కొన్ని సుఖాలే దండగ అనుకునేవాళ్లు, అందరినీ బలిపీఠాల మీద కెక్కించగల సమర్ధులు. కొందరు ‘రోఠీ కపడా మకాన్’ మేధావులకు అదే పెద్ద సమస్య. ‘तेरी दो ढकिये की नौकरी में मेरा लाखों का सावन जाये’ ఆలోచన వీరి మెదడులోకి రాకనే పోవచ్చు.
కానీ ప్రేమికులకు సంఘమే లేదు. వారు ఒకరి కొరకు ఒకరి అందంలో, ఒకరి ఆనందంలో ఇంకొకరు జీవిస్తారు. వారు కలిసి ఉన్న సమయం వారికి స్వర్గం. ఒకరినుండి ఒకరు వేరు పడిన సమయం నరకం. అధిక తెలివితేటలు ప్రదర్శించకుండా, ధనమూలం జీవితం కాకుండా, ఆదర్శాల ప్రదర్శనమే జీవితం అనుకోకుండా, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే స్నేహం, ప్రేమ అనుభవించగల, సొంత జీవితం జీవించగల అదృష్టవంతులున్నారు.
రామిరెడ్డి అటువంటి అదృష్టవంతుడు. అటువంటి వాడికి చిన్న వయసులో భార్యా వియోగం సంభవించింది. భార్యతో గొప్ప ప్రేమ బంధంలో ఉన్నప్పుడు, వియోగం కలిగింది. ప్రేమ లభించినవాడికి గదా, ప్రేమ చెయ్యి జారినప్పటి బాధ అనుభవానికి వచ్చేది. సంయోగమే లేని వాడికి వియోగమెక్కడిది? దుర్భర దుఃఖంలో అల్లాడుతున్నప్పుడు అతనికి ఖయ్యాము రుబాయీలు సహాయమయ్యాయి. రిబాయత్ అతని శోకాన్ని అతని నుంచి బైటకు దొర్లించింది. “ ఘల్తాన్ ఘల్తాన్ హమీరవిద్ తా బెలగు” అని ఆటలాడుతూ అన్న ఒక చిన్ని బాలుడు పలికినది కవిత్వమై, ఆ పిదప నిర్దుష్టపు రూపు దిద్దుకున్న రుబాయీలు, ఖయ్యాం వంటి శాస్త్రజ్ఞుడు, కవి, మానవ జీవితానుభవమే కవితగా పలికించిన రుబాయీలు – ఎన్నో ఏళ్ల తర్వాత ఎక్కడో తెలుగు దేశం లోని ఒక్క తప్త హృదయాన్ని, ఒక మహా వేదన నుండి గట్టెక్కించాయి. పారశీకము నేర్చుకోడము, అన్ని వందల పద్యాలను మళ్లీ మళ్లీ చదవటము, అందులోని భావమును గ్రహించటము, ఆ చదువులు, ఆ తిరగరాసుకోటాలు, ఇవి అతని మేధకు ఒక పనిని కల్పిస్తాయి. అందులోని వేదాంతము – ఎవ్వరికీ ఏదీ శాశ్వతం కాదని, అన్నీ పోగార్చవలసిందే అనీ, ఏ దుఃఖమూ తనదొక్కడిదే కాదనీ – ఈ విషయాల స్మరణలో కొంత సాంత్వన లభిస్తుంది. పద్యాల లోని మధురతకు అతని మనసు లోని మధురతకు సమన్వయం కుదురుతుంది. అతని నైజం మార్చకుండా, అతను ప్రేమలో అనుభవించిన తియ్యదనాన్ని మళ్ళీ ఇంకోమారు తలపుల్లో నిలిపే, అతని దుఃఖాన్ని మళ్ళీ తియ్యగానే వెల్లడి చెయ్యగలిగే, తానై తలచని, విధి విధించిన అవకాశం అది.
ఖయ్యామును ఒక కవి ఒకలాగా భావించుకుంటే, ఇంకో కవి ఇంకోలాగా ఊహించుకోవచ్చు. లత ఖయ్యామును అందంగా సొంతగా భావన చేసింది అనిపించింది నాకు. ఆమె మోహనవంశి ఎప్పుడూ గొప్పగా వేరుగా పలుకుతుంది. రామిరెడ్డి ఖయ్యాము, చలం ఖయ్యాము అనుభూతి ఒకటి కాదు, కాలేదు. రామిరెడ్డి పానశాల చలం రాయలేడు. చెలంకు ఛందస్సుతో పద్యాలు రాయడము రాకపోవటమే కాదు. చెలం స్వభావం వేరు. ప్రపంచంతో, స్త్రీతో, అతడి సంబంధం అతడి ప్రేమ మార్గాలు, అనుభవాలు, ప్రకటనలు వేరు.
రామిరెడ్డి ఖయ్యాము లో, భోగ లాలసత కాదు. ప్రేమ, విరహము, బాధ ఎక్కువ ఉన్నాయి. పానశాల పద్యాలలో రామిరెడ్డి పగిలిన హృదయం ఉంది. పద్యాలు మొదలుకు ఖయ్యామువే కాని, రామిరెడ్డి పానశాల పద్యాలు కూరుస్తున్నపుడు అతని మనసులోని మూర్తి అతని భార్య. అతను కొన్ని కొన్ని రుబాయీలను అతికినప్పుడు, అందులో భావం వెలికి తెస్తున్నానని అనుకున్నప్పుడు వెలికి వచ్చినది అతని మనసులోని వియోగ విషాదమని నా మనసుకు తోస్తూ ఉంది.
చదువరులు మీరే కింది పద్యాలను చదివి నిర్ణయించండి.
వలపుల దివ్వె, నీ మృదుల పాద లతాంతము ముద్దుగొందు; న
న్యల మధురాధరంబులయినం దులతూగవు దాని తోడ; రా
త్రుల సహవాసకామినయి రోసియు నిన్ గనలేక భగ్నవాం
ఛల చివురించు లజ్జ పెలుచం బవలెల్లను బుత్తు దీనతన్.
చెలియరో, నీ వియోగమున చిత్తము చీకి కృశించె; నీవు నే
వలనికి పోయినన్ విడువ పయ్యెదకొంగు; నిరంతరంబు ని
న్వలచినవార లెందఱొ వనారిలి కూలిరి నీవు పోవ; నే
డెలమి దొలంక వచ్చితివి; ఎందఱు నీ బలిపీఠి జత్తురో!
All the above appears to me that he is in his own sorrow. He had slipped into his own life and is expressing his agony.
There are a set of poems he wrote separately on his wife – “భగ్న హృదయము,” “ప్రియా వియోగము” From them I quote:
కలలోన తలంపలేదు గద యో కల్యాణి, నీ కింత లో
పల నూఱేడులు నిండునంచు, విధి దుర్వారప్రభావంబు మ
ర్త్యులయత్నంబు నధ:కరించుగద! వైద్యుల్ దివ్యసంజీవి చెం
బుల త్రావించియు పూర్వ దుష్కృత ఫలంబున్ మార్చలేరైరిగా!
I see the same loving heart and no big difference in the poems. Do not fault me, if somewhere along the line, in my reading, I have stopped seeing Panasala as Rubaiyat’s translation and I have started seeing it as ప్రేమ కావ్యము. Every poem in Panasala is soft in sound, is singable. But, sorry! You cannot recite or read all of them because your eyes will brim with tears and you cannot read the page anymore.
ఎందుకో అసందర్భంగా నాకు పానశాలలో ఒక్కో పద్యమునకు, అడవిలో బృహత్కథా సరిత్సాగరము చదువుతూ గుణాఢ్యుడు, ఒక్కొక్క కాగితం మంటలో కాలుస్తుంటే, అడివి జంతువులు వింటూ కన్నీరు కార్చే దృశ్యం స్మృతిలో కనిపిస్తుంది.
Deeply saddening they are, sadly sweet they are an attempt should be made to sing the whole set of poems of Panasala. Hopefully someone with sweet voice that can speak out the anguish of loss of a love, will recite and record these poems.
Yes! I like a good singer to sing Duvvuri’s Panasala. Alternately, if one sings Panasala as Duvvuri’s love song, one may become a great singer.
ఒకప్పుడు Early 90’s లో నాకెంతో ఇష్టమైన/కష్టమైన టాపిక్ చాలా సులభంగా ఒక వ్యాసం లాగా రాసినందుకు అభినందనలు, కొంతకాలం నేనూ కుస్తీ పడదామని ప్రయత్నించి వదిలేసేను, రాత్రుళ్ళు చాలా వృధా అయ్యేయి, మళ్ళీ కాస్సేపు పృఅయత్నిద్దాం అని ఆశ. ఇంతలో వైల్స్ గురించి తెల్సి హమ్మయ్య అని అనిపించింది, కాని మీరు ఆఖర్లో 7.4 లో అన్నట్టు ఫెర్మా ఉద్దేశ్యంలో ఇంకా సులభమైన ఋజువు ఉందేమోని నాకనిపిస్తోంది.
మాలవికాగ్నిమిత్రమ్ చదివేముందు, ముందుగా కథ తెలుసుకుందామని, “అమరచిత్రకథ” లో బొమ్మల కథని చదివి చూసేను. ఇతివృత్తం చాల క్లిష్టంగా ఉందనిపించి నా ప్రయత్నం మానుకున్నాను. కాని, ఇక్కడ శ్రీ భుజంగరాయశర్మ గారి ప్రసంగం విన్న తరువాత ఈ నాటకం చదవాలన్న కోరిక మళ్లా పుట్టింది. తరువాత రేడియో నాటిక విన్న తరువాత ఈ కోరిక ఇనుమడించింది.
పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు!
వేమూరి వేంకటేశ్వరరావు
శ్రీ వాసుదేవరావు గారికి
నా ‘ఎనాలజీల’తో మిమ్మల్ని బాధించినందుకు క్షమార్పణలు. ఈ ఎనాలజీలు అన్నివేళలలోనూ నప్పవు. పుస్తకం పేరు కూడ నచ్చలేదన్నారు. మీరు సూచించిన పేరు కాసింత మెరుగ్గానే ఉందనిపించింది కాని వేళకి ఆ పేరు నా బుర్రకి తట్టలేదు. మీలాంటి విజ్ఞులు నా పుస్తకం దింపుకుని చదివేరంటేనే అది నాకు ఒక కితాబు! నేను ఈ రకం రాతలు రాయడానికి ఒక కారణం ఉంది. ఇవి చదివి, స్పందించి, ఇంతకంటె బాగా రాయగలిగే వారు ముందుకి వచ్చి నా కంటె బాగా రాస్తారనే ఆశతోటే!
నమస్కారములతో
వేమూరి
ఒక అడివి లో, చింకిపాతల బక్క ఎముకలగూడు దరిద్రుడు, రోజూ పొట్ట పోసుకోటానికై, కట్టెలు కొట్టుకుంటున్నాడు. చెమటలు కారిపోతున్నాయి. కళ్లు తిరుగుతున్నయి. పగలే చుక్కలు కనపిస్తున్నయి. కట్టెలు ఎలాగో మోపు కట్టాడు. అడివి లోంచి బైట పడి ఇల్లు చేరే ఓపిక లేదు. యముడా! ఈ తిప్పలు నేను పడలేనురా. ఎత్తుకు పోటానికి రారా! – అని అరిచాడంట. వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమై, నన్ను తలిచావా? పిలిచావా? అన్నాడట. కట్టెలు కొట్టేవాడు, వెంటనే – ఈ కట్టెలమోపు ఎత్తి నెత్తిన పెట్టి పోతావని సాయానికి పిలిచానయ్యా, నేనే తంటాలు పడతాలే వెళ్లు, వెళ్లు, నీ పని చూసుకో -అన్నాడంట.
(ఈ కథ పల్లెటూళ్లో, ఇంట్లో పొయ్యి రాజటానికి,తన దొడ్లో,గొడ్డలి తో పేళ్లేసే మా అమ్మనాన నాకు చెప్పాడు. ఈ కథలో నీతి ఏమి టో, అది నాకు ఎక్కిందో లేదో, తెలియదు కాని, ఈ మాట లో ‘మృత్యువు’ గురించి జోరుదారుగా కథలు, కవితలు వచ్చినప్పుడు అవి క్లినికల్ గా సినికల్ గా లిరికల్ గా ఉన్నప్పుడు నాకీ డల్ కాటూరు కట్టెల కథ ఎందుకు గుర్తొస్తుందా? అనుకుంటాను.
లైలా
*Watching French Open Tennis Championships. Love human body and its mechanics. Love Neruda – when he opens his poetry with lines like:
“Body of a woman, white hills, white thighs,
you look like a world, lying in surrender.
My rough peasant’s body digs in you…”
తేలిక తెలుగు గురించి ముల్లా జలాలుద్దీన్ గారి అభిప్రాయం:
05/27/2016 5:54 pm
ఎడిటర్‌జీ:
సలామ్ ఆలేకుం.
ఎందరో పాఠకులు ఎన్నెన్నో విషయాలు ముచ్చటించిన తరువాత ఈ రెండు మాటలూ చెబుదామనిపించింది.
“నాకు తెలుగుమాట్లాడటం వచ్చు. నాకు తెలుగులో రాయటం, చదవటం కూడా వచ్చు.అప్పుడప్పుడు, ఏమీ తోచనప్పుడు, పిల్లి దొరకనప్పుడూ, కథలు, కాకరకాయలూ కూడా రాసేశా.”
వేమూరిగారూ,
మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. మీ బాలవ్యాకరణంలో నున్న సమాచారం సరియైనదే. శకటరేఫాన్ని అచ్చతెనుఁగు వర్ణమాలలో చేర్చుకొని 37 అక్షరాలుగా పరిగణించాలని కొందఱు, అది లేకుండ 36 అక్షరాలుగానే పరిగణించాలని కొందఱు సూత్రీకరించినారు. ఆంధ్రవైయాకరణమునిత్రయంలో పతంజలిస్థానీయులుగా భావింపబడుచున్న బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామిగారు వారి ‘బాలవ్యాకరణోద్ద్యోతము’ అనే గ్రంథములో శకటరేఫాన్ని పరిగణిస్తూ 37 వర్ణములని సూత్రీకరించినారు. వారు చిన్నయసూరిగారి సూత్రములను కొన్నిచోట్లను, సూరిగారి సూత్రములను సవరించి వారే సృష్టించిన సూత్రములను కొన్ని చోట్లను ఇస్తూ, విస్తృతమైన విశ్లేషణతో, విమర్శనాత్మకమైన వివరణతో నీగ్రంథమును వ్రాసినారు. ఇది తెలుగువ్యాకరణమునకు కూర్పబడిన ఉత్తమగ్రంథము. సందర్భానుసారముగా ఈగ్రంథములో బ్రాకెట్లలో సూరిగారి సూత్రసంఖ్యలను కూడ పేర్కొన్నారు. పై వర్ణమాలాసూత్రసందర్భంలోనూ వారు సూరిగారి సూత్రసంఖ్యను ఇచ్చినారు. కాని సూరిగారు 36 అక్షరములనే చెప్పినారని వారు చెప్పలేదు. నావద్ద కేవలము వజ్ఝలవారి గ్రంథమే ఉండుటవల్ల నేను సూరిగారి సూత్రమును చూడలేదు. ఇదియే ఈ అక్షరసంఖ్యలో గల వ్యత్యాసమునకు కారణము. 15వ శతాబ్దమునకు చెందిన అనంతామాత్యుని ఛందోదర్పణములోను ‘తెనుఁగున ఱళ లనఁగ రెండధికమండ్రు హరీ’ అని శకటఱేఫను వర్ణమాలలో చేర్చినట్లు వ్యాకరణవిద్వాంసులైన డా. అమరేశం రాజేశ్వరశర్మగారు తెలుపుతున్నారు. ఈవిధంగా కొందఱు శకటరేఫాన్ని గణించడం, లేక అపగణించడంవల్ల వర్ణముల సంఖ్య 37 లేక 36గా చెప్పడం జరుగుచున్నది.
మఱొకవిషయం:
తపఃఫలం > తపోఫలం
వయఃపరిమితి > వయోపరిమితి
తపోఫలం, వయోపరిమితి అనేవి అపశబ్దాలు. అట్లాంటివి భాషలో నుండవు. విసర్గకు ‘క,ఖ’లు, ‘ప,ఫ’ లు పరమైనపుడు విసర్గ అర్ధవిసర్గగానో (అంటే జిహ్వామూలీయంగానో, ఉపధ్మానీయంగానో), అట్లు గాకున్న యథాతథంగామారకుండానో ఉంటుంది. అందుచేత వయః+పరిమితి -> వయఃపరిపమితి, తపః +ఫలం ->తపఃఫలం అని ఔతుంది కాని, తపోఫలం, వయోపరిమితి అను రూపాలు సిద్ధింపవు. వివరములకు సంధిప్రకరణములో ‘విసర్గసంధి’ని చూడగలరు.
శకట రేఫము (ఱ) య వ ల వలె ప్రయత్న భేదముచే మృదు కఠినత్వములయిన రెండు విధములు సిద్ధించును కావున అది ప్రత్యేక అక్షరముగా గ్రహింపబడలేదు. కాని ళ-కారమునకు స్వంతముగా నిర్దిష్టమైన శబ్దము ఉన్నందువలన దానిని ప్రత్యేక అక్షరముగా గ్రహించారు. అందుచేత తెలుగులో 36 అక్షరముల సంఖ్యనే చూపినారు.
మీలోని సరస్వతీదేవికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీ వంటి పండితులు నా వ్యాసం చదవడమే ఒక అదృష్టం. చదివి స్పందించేరంటే అది నా వ్యాసానికి ఒక అలంకారం. మీకు సమాధానం రాస్తే హనుమంతుడి ఎదుట కుప్పిగంతులు వేసినట్లే!
నేను ఏయే నేపథ్యాల నుండి ఇక్కడకి వచ్చేనో కొద్దిగా వివరించనివ్వండి.
మొదటి కోణం: నేను చదువుకునే రోజులలో ఈ దిగువ వాక్యాన్ని నా బల్లకి ఎదురుగా పెట్టుకునేవాడిని.
“A man would do nothing if he waited until he could do it so well that no one could find fault.” – John Henry Cardinal Newman (1801-1890)
తప్పో, ఒప్పో, సమగ్రమో, అసమగ్రమో అని మీమాంస పడకుండా ప్రయత్నించి చూడడం, ఫలితం అనుకున్నట్లు లేకపోతే, లేచి, దుమ్ము దులుపుకుని, మళ్లా ప్రయత్నించడం. ఈ పద్ధతిలో నెట్టుకొస్తున్నాను.
రెండవ కోణం: గత 40 సంవత్సరాలుగా సైన్సుని నలుగురికీ అర్థం అయే రీతిలో, తెలుగులో, రాయడం నా ప్రవృత్తి. సైన్సులోని భావాలని సామాన్యులకి అర్థం అయే విధంగా రాయడం కష్టం; ఇంగ్లీషులోనే కష్టం, పదసంపద పుష్ఠిగా లేని తెలుగులో రాయడం ఇంకా కష్టం. ఈ సందర్భంలో సైన్సుని, జనరంజక శైలిలో అంగరంగవైభవంగా, సమగ్రంగా, సాధికారంగా రాయడం – ఏ భాషా మాధ్యమంలోనైనా సరే – కష్టం. అందుకని మూలంలో ఉన్న భావాన్ని సూక్ష్మీకరిస్తాం. ఆత్యవసరమైన అంశాలని ఉంచి, ప్రస్తుతానికి అవసరంలేని వివరాలని కత్తిరిస్తాం. అలా చెయ్యకపోతే నలుగురికీ అందుబాటులో ఉండేలా రాయలేము. అలా చేస్తే నిష్ణాతులకి కోపం రావచ్చు. “రావచ్చు” ఏమిటి? నేను ఈమాటలో రాసిన వ్యాసం ఒకటి పకడ్బందీగా లేదని గణితజ్ఞులు నా తోలు ఒలిచీసేరు. వారి స్పందనని చూసి కాసింత బిగించి రాసేసరికి “ఇది సామాన్య పాఠకులని ఉద్దేశించి రాసిన రాతేనా? గణితంలో పండితులని ఉద్దేశించి రాసేవా?” అంటూ మరొక పాఠకుడు మందలించేడు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం! అలాగని “పాపులర్ సైన్సు” కి స్థానం లేదనగలమా? సైన్సు ప్రభావం మనందరి జీవితాల మీద పడుతోంది కనుక సైన్సులోని మెలికలు అర్థం కాకపోయినా స్థూలంగా, చూచాయగా, అందరికి అర్థం అవాలి. అందుకని అసలు విషయాన్ని కాసింత తేలిక పరచే ధోరణి ప్రచారంలోకి వచ్చింది.
మూడవ కోణం: నేను కూడ బాలవ్యాకరణం, సంజ్ఞా పరిచ్ఛేదం, తోటే మొదలు పెడదామనుకున్నాను. నా దగ్గర ఉన్న బాలవ్యాకరణం అట్ట చిరిగిపోయింది కనుక ప్రచురణ తేదీ తెలియదు కాని దాని మీద నా అక్క పేరు, నా చెల్లెలి పేరు, నా తమ్ముడి పేరు కనిపించేయి కనుక ఇది ఏ 1945 ప్రాంతాలలోనో ముద్రణ పొంది ఉంటుందని ఊహిస్తున్నాను! ముట్టుకుంటే కాగితాలు విరుగుతున్నాయి, చిరగడం కాదు! ఇందులో సంజ్ఞా పరిచ్ఛేదం, 3 వ సూత్రం ఇలా ఉంది:
“తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు”
మీరు చెప్పినదానికీ, దీనికీ మధ్య లెక్క తేడా వచ్చిందేమిటా అని విచారిస్తే నా ప్రతిలో – అంతా మీరు సూచించినట్లే ఉంది కాని – శకటరేఫ లేదు. అంతే కాదు. ఋ, ౠ, ఒత్తు అక్షరాలు, విసర్గ, ఞ్, ఙ్, శ, ష లు అనే సంస్కృతసమంబులన్నిటిని కలుపుకుంటే తెలుగు అని వ్యవహరించబడుతోంది అని నాలుగవ సూత్రం.
బాలవ్యాకరణంలో మొదటి నాలుగు సూత్రాలూ చదివిన తరువాత మనం ఈ రోజుల్లో వాడుకునే భాష సంస్కృతమా? ప్రాకృతమా? తెనుగా? తెలుగా? అన్న అనుమానం నా బోంట్లకి వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులలో నాలాంటివాడు చెయ్యగలిగేది ఏమిటి?
‘ఈ course ను తప్పు పట్టే వారందఱు దీనిని నేర్చుకొన్న విద్యార్థులు ఇంతటితో ఆగిపోతారు అని అనుకొన్నట్లుంది. దీనిలో ఉత్తీర్ణులయినవారు తఱువాతి మెట్టు course ను తీసికొని తమ భాషను మెఱుగు పెట్టుకోవచ్చును కదా? దానికి ఇది పునాదిగా భావించవచ్చును.
లోపభూయిష్ఠమైన పునాది భవనానికే చేటు కాదా? ఇంగ్లీషులో ‘queue’ అనే పదాన్ని ‘q’ అని వ్రాయండని లోకంలో ఎవరైన నేర్పుతారా? ‘buy’, ‘by’ అనే పదాలను ‘bi’ అని వ్రాయండని నేర్పుతారా? తెలుగుకు మాత్రం ఎందుకీ అర్థరహితమైన అగచాట్లు?
‘ఒక సయిడుబార్ – అసలు అచ్చ తెలుగులో ఐ, ఔ లు ఉన్నాయా? ఐ, ఔలకు బదులు అయి, అవు వాడవచ్చును అనుకొంటాను, ఉదా. అయిదు, అవును, ఇత్యాదులు.’
ఉదా: అయిరి-ఐరి, అవును-ఔను, అయిదు-ఐదు, అవుడు-ఔడు (పెదవి క్రిందిచోటు), గవుసెన-గౌసెన
వివరణ 1: ‘ఐ-ఔ’లకు ‘అయి-అవు’ అనునవి కూడ ఆదేశములగుటయుఁ గలదు. ఉదా:కై – కయి (చేయి), కైత-కయిత, కౌను-కవును, కౌఁగిలి –కవుఁగిలి
వివరణ2: ఆచ్ఛికంబులం దనుటచే నిది సంస్కృతసమములందు వర్తిల్లదు. ఉదా: దైవము దయివము, కైలాసము కయిలాసము, కౌమారము కవుమారము, గౌణము గవుణము – ఇటువంటి రూపములు సిద్ధింపవు. దీనికి కారణము ఈ సంస్కృతసమములకు మూలములైన సంస్కృతకృదంతములు ఆయాధాతువులపై పాణినీయవ్యాకరణప్రకారము వివిధప్రత్యయములు చేర్చుటచే ఏర్పడినవి. అట్టి పదములకు ఈ ఆచ్ఛికసూత్రమును వర్తింపజేసిన అవి అర్థరహితమగును. అందుచేత సంస్కృతసమములపై నిది సర్వదా నిషిద్ధము.
వివరణ3: ఛందోబద్ధపద్యములందు ఇటువంటి ఆదేశములు గణ,యతిభంగములకు కారణమగును. ఉదా:
‘నలువై యత్తఱి నత్తలోదరియు వీణావాదనప్రౌఢిచేఁ’-ఈ మత్తేభవృత్తపాదాన్ని ‘నలువయి యత్తఱి నత్తలోదరియు వీణావాదనప్రవుఢిచేఁ’ — అని మారిస్తే రెండు గణభంగములూ, యతిభంగము అగుట గమనింపవచ్చును. అందుచేత ఛందోబద్ధపద్యముల కీ సూత్రమును వర్తింపఁజేయరాదు. కాని మాత్రాసమకవృత్తములలో క్వచిత్తుగా గణభంగము, యతిభంగము కానిచో ఆచ్ఛికపదములకు మాత్రమే దీనిని వర్తింపజేయవచ్చును.
కాపరి భార్య గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
05/10/2016 10:40 am
కథా, దాని అనువాదమూ బాగున్నాయి.
“ఆ అంటుకున్న అగ్గి ఆర్పేసరికి బ్రహ్మ ప్రళయమైపోయింది తనకి” మంచి తెలుగునుడికారం బ్రహ్మప్రళయం ఐపోయిందీ అనటం.
కాని “మొసలి మూతి మీద ఒకట్రెండు దెబ్బలు తగిలాయి. వాడు పట్టించుకోలేదు.” అన్న చోట మాత్రం చిన్న పొరపాటు దొర్లింది. పాశ్యాత్యులు జంతువులను కూడా లింగబేధాన్ని బట్టి వాడు అది అంటారు కాని తెలుగు నుడికారంలో జంతువులను స్త్రీలింగపరంగానే సంబోధిస్తాం కదా. అది (మొసలి) పట్టించుకోలేదు అనటమే సహజంగా ఉంటుంది తెలుగులో.
ఈ వ్యాసం చదివి మెచ్చుకున్నవారికీ, నచ్చుకోనివారికీ, వెక్కిరించినవారికీ – అందరికీ ధన్యవాదాలు. పూర్తిగా నచ్చుకోకపోయినా నా వ్యాసం యొక్క పరిమిత గమ్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని, వ్యాసంలోని మూల సారాంశాన్ని సంగహించి తిరిగి చెప్పిన మోహన్ గారికి మరొకసారి దండాలు.
దరిదాపు పదేళ్ల క్రితం చేసిన పని ఏమిటో చెప్పిన వ్యాసం ఇది; నేను చేయబోతూన్న ప్రణాళిక గురించి కాదు. ఇప్పుడు ఎందరు అరిచి మొత్తుకున్నా నేను చెయ్యగలిగేది ఏదీ లేదు కనుక చేసిన ప్రయోగం – మీకు నచ్చినా, నచ్చకపోయినా – కోరుకున్న ఫలితాన్ని ఇచ్చిందా? లేదా? అన్నది అడగవలసిన ప్రశ్న. ఎవ్వరూ అడగనేలేదు. ఇప్పుడు నా మీద కోపంతోటీ, ఆవేశం తోటీ విరుచుకుపడడం గతజలసేతుబంధనం.
నేనేదో పాపం చేసినట్లు ఆవేశపడుతూ కొందరు రాసేరు కనుక, వారి కొరకు నా ఆలోచనా సరళిని మరికొంచెం విపులీకరించి చెబుతాను. మీ మెప్పుకోలు కోసం కాదు. సమగ్రత కోసం. ఈ ప్రయోగానికి తయారయే ప్రయత్నంలో ముందు ఒక తెలుగు వ్యాకరణం (ఇంగ్లీషులో) రాసుకున్నాను. నా “వెబ్ సైట్” లో ఉంది. గూగుల్ చేస్తే దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రతి ఒకటి పట్టుకుని అంతర్జాతీయ భాషలు నేర్పే శాఖకి వెళ్లి, నా వ్యాకరణాన్ని వాళ్లకి చూపించి, “వ్యాకరణయుక్తంగా భాష నేర్పుతాను, ఈ పుస్తకం చూసి సలహా ఇవ్వండి” అని అడిగేను. అది తేలిక తెలుగు కాదు; మీరందరూ మెచ్చిన తెలుగే! తెలుగుని తెలుగు లిపిలోనూ, ఇంగ్లీషు లిపిలోనూ కూడ రాసేనేమో కనీసం నా ధోరణి వారికి అర్థం అయింది. వారు పెదవి విరిచేరు; పుస్తకం దోషభూయిష్టం అని కాదు, “వ్యాకరణయుక్తంగా భాష నేర్పుతాను” అన్న నా ధోరణిని. “ఈ రోజులలో కొత్త భాషలు నేర్పే పద్ధతే మారిపోయింది. నువ్వు పిల్లలకి తిన్నగా మాట్లాడడం నేర్పెయ్! సందర్భోచితంగా వ్యాకరణ అంశాలని ఎత్తి చూపు. ఆ పద్ధతిలో ఈ పుస్తకాన్ని తిరగరాయి.” అని సలహా ఇచ్చేరు. అందుకనే మూడొంతులు పూర్తయిన ఆ పుస్తకం అర్ధంతరంగా ఆగిపోయింది. ఆ సందర్భంలోనే అచ్చులు, హల్లులు, గుణింతాలు చూసి “అవి నేర్పేసరికి నీ పది వారాల పుణ్యకాలం పూర్తి అయిపోతుంది” అని హెచ్చరించేరు. ఎలా? ఇంగ్లీషు లిపి వాడి మన దేశంలో సంస్కృతం నేర్పుతూన్నట్లు నేర్పడమా? ఇలా వారితో కూర్చుని తంటాలు పడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చేను.
నేను విజ్ఞాన శాస్త్రం చదువుకున్నవాడిని. లెక్కలతో బాగానే పరిచయం ఉంది. ఆ పరిచయంలో ఒక అనుభవాన్ని ఇక్కడకి బదిలీ చేసి ఈ ప్రయోగం చెయ్యడానికి తలపెట్టేను. గణితంతో బొత్తిగా పరిచయం లేని వారికి క్షమార్పణలతో – గణితంలో రెండు రకాల సమీకరణాలు ఉన్నాయి: సరళమైనవి (linear), విరళమైనవి (non-linear). ప్రకృతిని వర్ణించేటప్పుడు సర్వసాధారణంగా ఎదురయ్యేవి విరళ సమీకరణాలు. కాని వీటిని పరిష్కరించడం కష్టం. అందుకని ఆ విరళ సమీకరణాన్ని ఒక అనంత శ్రేణి (infinite series) లా రాసి, అందులో మొదటి ఒకటో, రెండు పదాలని తీసుకుంటే అది సరళంగా కనిపిస్తుంది. మూడో పదం చేర్చేసరికి కొంచెం విరళం అవుతుంది, నాలుగో పదం చేర్చేసరికి మరింత విరళం అవుతుంది, అలా అనంతవాహినిలా ఉన్న ఆ పదాలని ఒకటీ, ఒకటీ చేర్చుకూంటూ పోతే మన విరళ సమీకరణం వచ్చెస్తుంది. తమాషా ఏమిటంటే మూడొంతుల సందర్భాలలో సరళ భాగంతో లెక్క ఆపేసినప్పుడు వచ్చే “రణ చిత్తు” సమాధానంతో మన అవసరం తీరిపోవచ్చు. తీరకపోతే మరొకటి కలుపుకుని, మరికొంచెం ఇబ్బంది పడి “చిత్తు పరిష్కారం” (రణ చిత్తు కంటె మెరుగైనది) సంపాదించాచ్చు. ఇలా చేసుకుంటూపోవచ్చు. ఇలా సరళీకరించిన బద్దింపు పద్ధతినే శత్రు సేనల మీదకి విసిరే కొన్ని రాకెట్లలో వాడేరు (స్వానుభవంతో చెబుతున్నాను).
ఇదే ధోరణిలో భాషలు కూడ విరళ లక్షణాలు కలవి. ఈ విరళత రకరకాల కోణాల నుండి రావచ్చు. కేవలం ఉపమానంగా చెబుతున్నాను. మనం రోజూ వాడుకుంటూన్న భాషని ఈ కింది సమీకరణంగా ఉహించుకున్నాను. (మీరు ఇలానే ఊహించుకోనక్కరలేదు):
ఇప్పటి భాష = తేలిక భాష + శకట రేఫ + ఋ + ఏ + ఔ + … + ః
అనుకుందాం. ఇప్పుడు ఎవరి అవసరాలకి కావలసిన మేరకి వారు పదాలు చేర్చి వాడుకోవచ్చు. ఎవరి భాష వారిదే. బండీరాలు వాడుకొండి, విసర్గలు వాడుకొండి, దంత్య చ జలు వాడుకొండి. మీ ఇష్టం.
గణితంలో “క్రమీకరించడం (?) (regularization) అనే ప్రక్రియ కూడ ఉంది. అవకతవకగా ఉన్న సమీకరణానికి కొన్ని బంధాలు వేసి పట్టాలు ఎక్కించడం లాంటి ప్రక్రియ ఇది. అమెరికా వాడు బ్రిటిష్ వాడి ఇంగ్లీషుని కొంత క్రమీకరించేడు (ప్రత్యేకించి వర్ణక్రమ, ఉచ్చారణ విషయాలలో, అక్కడక్కడ వ్యాకరణంలో కూడ). అయినప్పటికీ అమెరికాలో చదువుకుని, అమెరికాలో ఉద్యోగం చేసి, రిటైరు అయిన ప్రొఫెసర్ వీశ్వనాథం గారు ఇప్పటికీ బ్రిటిష్ వర్ణక్రమంలోనే రాస్తారు. వద్దన్నానా?
“విశ్వవిద్యాలయాలకు ఈ రకంగా మార్పులతో భాషను నేర్పుతున్నట్లు తెలుసా? వారి అనుమతి ఉందా?”
అని అడిగిన ప్రశ్నకి నాకు తెలిసిన సమాధానం. ఇండియాలో సంగతి నాకు తెలియదు కాని అమెరికాలో (కొన్ని తప్పనిసరి పాఠ్యాంశాలలో తప్ప) ఆచార్యుడికి పాఠం ఎలా చెప్పాలో, ఏ క్రమంలో బోధించాలో, వంటి విషయాలలో పరిపూర్ణ స్వతంత్రం ఉంది. అమెరికాలో పద్ధతి తెలియక అడుగుతున్నారేమోనన్న అభిప్రాయంతో (కొంచెం వ్యంగ్యం ధ్వనించింది కనుక) ఈ సమాధానం ప్రత్యేకించి ఇక్కడి పద్ధతి చెప్పేను.
మధుసూదన్ గారి ఒత్తక్షరాల సంగతి మీరు ఆయననే అడగాలి. కాని ఏమాటకామాటే చెప్పుకోవాలి. నా విద్యార్థులు నన్ను నిలదీసి అడిగిన ప్రశ్నలలో ఒకటి మీకు చెబితే మీరు మరి నాతో మాట్లాడరు. ఉండబట్టక చెబుతున్నాను: “కొన్ని సందర్భాలలో మామూలు హల్లుకి అడుగునో, పక్కనో ఒత్తు ఇస్తే సరిపోతుంది కాని (ఉ. ఛ్, ఢ) మరి కొన్ని సందర్భాలలో అక్షరం రూపు పూర్తిగా మారిపోతోంది (ఉ. ఖ, ఘ). హల్లుకి పక్కన చిన్న గీత గీసి అది ఒత్తక్షరం అనుకుంటే సరిపోతుంది కదా? అప్పుడు మేము గుర్తు పెట్టుకోవలసిన ఆకారాలు తగ్గుతాయి కదా!”
నిఝంగా! వీళ్లు పిల్లలు కాదు, పిట్టపిడుగులు. అప్పుడు వీళ్లకి బెర్నార్డ్ షా ఇంగ్లీషులో FISH వర్ణక్రమం ఎలాగుండాలో చెప్పిన వయినం వివరించి చెప్పేను.
వేమూరి వారూ, చాలా బాగా రాసినారు మీరు. మీ టీచింగులో సాధక”బోధకాలు” సాధక”బోదకాలు” కింద మారి మీకు చాలా వాచిపోయి ఉండుండవచ్చునని అనుకోలు. అయినా అన్నేళ్ళు చెప్పేరంటే మీ ఓపిక్కి వెయ్యి దండలు, దండాలు.
అయితే పాశ్చాత్యులకు అలానే, ఇలానే మీరు నేర్పినట్టు నేర్పితేనే బాగుంటుంది. ఉదాహరణకు మీరు వారిని, ఏవండీ నాయనా అమ్మా మీరు దే రాసి దాని పక్కన వి రాసి ఆ రెండిటినీ కలిపి ఆ పదాన్ని చదువు అంటే వారు డేవీజోన్స్ లాకరులా దానిని డేవి గానే పలుకుతారు కనక, దేవి డేవి అయినా ఇబ్బంది లేదు. అర్థం అర్థమవ్వాలి కాని, ఉచ్చారణతో పని ఏమిరా డింభకా అని గద్దిస్తూ పింగళి వారు చెప్పినట్టు దుసటచతుసటయమూ ఒకటే దుష్టచతుష్టయమూ ఒకటే.
ఇప్పటి తెలుగు మాత్రం బాగ ఏడ్చిందా ఏమి ? అంతో ఇంతో, ఎంతో కొంత మీబోటి పాతకాపుల వద్దే కాసింత బతికున్నది. మా దగ్గరికొచ్చేప్పటికే తిప్పటకాలు వేసుకుని తాటాకుల పాడె ఎక్కినది…. సహృదయులు కాబట్టిన్నూ, రెస్పాన్సిబిలిటీ ఉందనుకునేవారు కాబట్టిన్నూ – మీరు, దాన్ని ఆ పాడె మీంచి దింపి మళ్ళీ ప్రాణం పొయ్యాలని చూస్తున్నట్టుగా ఉన్నది….ఆ “ఇది” జనాలకు అర్థమైతే బాగుండును…
తెలుగు దేశాల్లో ఎట్లా ఉన్నదో పరిస్థితి తెలవదు కాని, ఇక్కడ ఇలాగన్నా బతికుండటం అవసరం! మా బూబమ్మ హిందీలాగున. 🙂
మరొక్కసారి ఈ దీర్ఘ వ్యాసానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలతో
భవదీయుడు
వంశీ
తా.క – ఉద్యాపనలో సారమంతా అంతా చెప్పేశారు కనక, అంతా నిరంజనమే
గుడ్డివాడు మార్గం చూపమంటే వానిని రాజమార్గంనుండి గాక రాళ్లమార్గం దగ్గరని రాళ్లమార్గంద్వారా తీసికెళ్లినట్లుంది ఈవ్యాసకర్తయొక్క ‘vision’. ఇది వానికి మార్గమంటే అదే అనే అనుభవాన్ని, భావాన్ని కలిగించే అపచారమే కాని ఉపచారం కాదు. ప్రతిభాషకు ఒక పద్ధతి,సంప్రదాయమంటూ ఉంటుంది. ఏ మార్గదర్శియైనా ఈసంప్రదాయానికి విధేయమైన సులభమార్గములనే ప్రతిపాదించవలెను గాని, దుష్టవైద్యునివలె అనవసరమైన అంగచ్ఛేదనం చేయరాదు. ఇది విస్మరించి భాషకు మూలాధారమైన అక్షరమాలకు అగచ్ఛేదం చేయవలెనను తలంపు గలవారు భాషాపకారులే కాని భాషోపకారులని నేననుకోను.
ఆంగ్లమును ఎలా బోధించాలి అన్నది ఆంగ్లోపాధ్యాయులకు వదలండి. ఈ వ్యాసముతో నాకు కూడ అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. కాని వ్యాసకర్త ముఖ్యోద్దేశము అందరికీ అవగతమవుతుంది. ఈ course తీసికొన్న తఱువాత (1) ఒక రైల్వే స్టేషన్ పేరు, బస్సు బోర్డు పేరు, వీధి పేరు, హోటల్ (రెస్టొరాన్) పేరు విద్యార్థి చదువగలిగితే సంతోషము. (2) ఒక వార్తాపత్రిక headlines చదువగలిగితే సంతోషము. (3) ఒక వీధిలో ఎవరినయినా directions అడుగగలిగితే సంతోషము. (4) ఒక అంగడి లేక హోటల్‌కి వెళ్లి orders ఇవ్వగలిగితే సంతోషము. (5) చిన్న చిన్న వాక్యాలు వ్రాసి తమపేరును సంతకము చేయగలిగితే సంతోషము. ఈ ఆశయాలతో course ను పరిశీలించండి. ఇవ్వబడిన సమయములో పై ఆశయాలు నెరవేరినాయా లేవా అన్నదే ప్రశ్న. అంతకంటె ఎక్కువగా రంధ్రాన్వేషణ చేయ రాదు.
విధేయుడు – మోహన
ఇది చాలు నాకు గురించి అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:
05/03/2016 2:19 am
వనజ గారూ, ధన్యవాదాలు.
కామేశ్వరరావు గారూ,
“బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు” — మీరన్నది సత్యం! ఈ కవితని మళ్ళీ ఎక్కడైనా reproduce చెయ్యవలసి వస్తే మీరిచ్చిన సూచనలు, మీరు చెప్పిన సవరణలు పాటిస్తానండి. ధన్యవాదములు.
~భాస్కర్
చిరంజీవి గురించి Velcheru Narayana Rao గారి అభిప్రాయం:
05/02/2016 10:35 pm
తెలుగు మాటలు మనస్సులో మెదిలేవాళ్లందరూ ఈ వేళ అదృష్టవంతులు, మానసగారి ఈ పద్యాన్ని చదవగలిగినందుకు.
మనసగారికి మాటలు అందించగల మెత్తదనం ఉన్నందుకు తెలుగు ఇవాళ మురిసిపోతొంది.
ఈతల్లితనం పిల్లలు ఉన్నన్నాళ్లు మనందరి మధ్యా ఉంటుంది. మనందరినీ పిల్లల్నిచేసి, మన తల్లుల్ని మనకళ్లముందు ఆడిస్తుంది.
ఇది గొప్ప పద్యం అనగానే సరిపోదు, ఆ మాటా అంత గొప్పది కాదు. కాని అంతకన్న పెద్ద మాటలు వాడి ఈ పద్యంలొ ఊహని చికాకు పెట్టలేను.
చాలా బావుంది కవిత, అనువాదం! భావంలో సున్నితత్వాన్ని భాషలో చాలావరకూ జాగ్రత్తగా నిర్వహించారు. ఖయాము రుబాయీలు గుర్తుకొచ్చాయి.
రెండు మూడు చిన్న సూచనలు (బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు!):
దిక్కులు లేని అడవి – దిక్కులు తెలియని అడవి
మితంగా ఒక నవ్వు – సన్నగా ఒక చిరునవ్వు
కాసిని ఎండు పళ్ళముక్కలు – Dry fruits పదానికి అచ్చమైన తెలుగు అనువాదం లేదనుకుంటా. “కాసిని ఎండుద్రాక్షలు” అంటే బాగుంటుందేమో.
చాల బాగుంది కామేశ్వరరావు గారు! సామాన్యముగా కవులు తమ కావ్యములలో చిత్రకవిత్వాన్ని ఒక భాగముగా వ్రాస్తారు. కాని చిత్రకవిత్వమే కథలోని ఒక భాగముగా చేసిన ఘనత సూరనదే. కవికి గొల్లవానికి ఉండే పోలికలు ఉన్న ఈ పద్యమంటే కూడ నాకు ఇష్టమే –
“కలకంఠీ అంటే N. of sev. birds. అని ఆంధ్రభారతి సంస్కృత నిఘంటువులో ఉన్నది.”
“ఇందులో మరుత్కుమారుడు అంటే పిల్లగాలి అని నేను అర్థము చేసికొన్నాను.” – మోహన
I guess ‘పిల్లగాలి’లో పిల్ల does not mean girl. I guess, పిల్లగాలి simply means breeze as opposed to a tornado, or typhoon. అలాటి విసురుగాలి ఐతే అక్కడ ఆ వసురాజు తోటలో పూలూ, ఆకులూ, చెట్లు, మహా వృక్షాలు కూడా ఉండవు.
కలకంఠి అంటే కల నాదములు చేయునది. మధుర స్వనములు చేయునది. అవ్యక్త మధుర స్వరము కలిగినది – ఇలాటి అర్ధములు చెప్పబడినవి. అని. స్త్రీ పరంగా ఎక్కువ వాడినా అందరు ఆడవాళ్ళూ కలకంఠులు కారు. కఠోర కంఠులుంటారు. కవి కలకంఠీ! అని వాడితే ఆ ఆడుది మృదుమధురంగా మాట్లాడుతుందని. అట్టి కలకంఠులను మీరు ఏ తోటలోనూ, వసంత సమయంలో కలిసి యుండలేదా?
అలాగే పక్షులన్నీ కలకంఠులు కావు. Singing birds ను సేకరించే వ్యాపారస్తులున్నారు. వారి వద్ద కొనుక్కుని, తమ తోటల్లో పెంచుకునే వారున్నారు. వెదురు గొట్టాలు, వీణలు, గంటలు ఇవి అన్నీ కలకంఠులుగా మారొచ్చు, గాలి తాకులకైనా, సంగీతకారుడు వాడినా.
ఇక్కడ చర్చిస్తున్న పద్యంలో -అది వసురాజు తోట. అది వసంత వర్ణనం. వసుచరిత్రలోని అక్కడి పద్యాలలో, కవి వసంతుడికీ, గాలికీ ఉండే సంబంధాలు మారుస్తూనే ఉన్నాడు. కలకంఠి ప్రయోగం లోని అర్థాలు కూడా మారుస్తున్నాడు.
నేనూ ఆంధ్ర భారతి చదువుతున్నాను. ‘చంద్రికా పరిణయము’ ఒక పీఠిక అక్కడ చదువుతున్నాను. అందులో చంద్రికా పరిణయం నుండి కొన్ని పద్యాలు, వసుచరిత్ర లో పద్యాలు కొన్ని, చాలా దగ్గర పోలికలున్నవి ఇచ్చారు. ఎవరు బాగా రాసారు అనేది పాఠకులనే తేల్చుకోమని. ఇచ్చిన పద్యాల వరకే చూసినా, నాకు ‘వసుచరిత్ర’ గెలిచినట్టనిపించింది. ఇక, ఈ మాట గ్రంథాలయంలో – దేశికాచారి గారుంచిన మరో పీఠిక, ‘చంద్రికా పరిణయం’ చదవాలి. అప్పుడు వసుచరిత్ర నాకింకొంచెం అర్థమవుతుంది.
ఆంధ్ర భారతికి వెళ్లినా, ఈ పద్యం కోసం, మరుత్తులు ఏడుగురు, అందులో ఏడు లోకాల్లో విహరించే మరుత్తుల లో ఏ మరుత్తు ఇక్కడ విహరిస్తున్నాడని ఏ పురాణ కథ లోకో వెళ్లి నేను వెదకలేదు. చర్చలోని ఈ పద్యంలో, కవి పిల్లగాలి, మంద మారుతం అని ఉండొచ్చు. అనలేదు. అని ఉంటే మనం పువ్వులు, ఆకులు, గాలి – అంటూ gender-less, age non-specific interaction చూస్తాము. కాని కవి అలా అనలేదు. The poet attributes masculinity to the wind here. మరుత్కుమారుడు అన్నాడు.
ఆ పవన కుమారు డొస్తే (హనుమంతుడు కాదు), వసంతుడితో పాటు తోటల్లో ఆడే స్నేహితుడు, పవనుడొస్తే –ఉయ్యాలూపుతున్నారు ఆ స్త్రీలంతా అని, కవి భావన. తేనెలు తాపినా, తేనెల్లో ముంచినా, పువ్వుల్లో పొదిగినా, ఆకుల్లో ఊపినా, ఉయ్యాల పాటలు పాడినా అన్నీ -చెట్లు, మొక్కలు, తీవెలు, పొదల సొంత మర్యాదలే, సయ్యాటలే. రసం శృంగారం. సలిపేవి వసంత సమయపు శృంగార క్రీడలు.
అడివి బాపిరాజు ‘అడివి శాంతి శ్రీ’ లో వసంత సమయం వేడుకలు ఎంత చక్కగా రచించాడు! అందులో, రాజకుమారుడిని, వసంతుడుగా (సంగీతం పోటీ పరీక్షలో గెలిచినందుకు) అక్కడివారు ఎన్నుకుంటే, అతడు మలయ పవన దేవుడిని, భృంగ దేవుడిని ఎన్నుకుంటాడు. ‘వనరమ’ గా ఒక రాకుమారిని ఎన్నుకుంటాడు.
జోల అంటే ఉయ్యాల. ఉయ్యాల పాటలన్నీ పసిపిల్లలకూ, వారిని నిద్ర పుచ్చటానికీ కాదు. Individual gardens లోనూ, పూర్వీకుల/ ఇప్పటి వారి ఇళ్ల లోనూ, బల్ల ఉయ్యాలలు adults కోసం ఉండవూ? What about those nice big hammocks in country houses and beach resorts? వసంత సమయంలో ఉయ్యాలలలో కృష్ణుడు, ఇతర వనితలు వర్ణ చిత్రాలెన్నో ఉన్నాయి. రాముడి కోసం బాలుడిగా ఉన్నప్పుడు పాడే జోలపాటలూ, రాజయ్యాక పాడే మేలుకొలుపు, శయనింపు పాటలు ఒకే లాగా ఉండవు కదా.’ జో! అచ్యుతానంద’ చిన్న పిల్లలకు పాడటం తెలుగు వాళ్లకు అలవాటై, అది పరమాత్ముడికి ఒక కవి రాసిన పాట అనే తలపు మరుపున పడి పోయి ఉండొచ్చు.
ఇంతకు ముందు నేనీ పద్యం గురించి రాసినప్పుడు, పాఠకులు ఒకరిద్దరు జోలపాటలని ఇక్కడా ఏవో సినిమా పాటలు వినిపించినట్టున్నారు. అన్నా చెల్లెళ్ల ఏడుప్పాటలు, పిల్లల జోల పాటలట!
ఆ సినిమా పాటల్లో సావిత్రులు, న్. టి. రామారావులు -ఇద్దరూ తెలుగులో, తమిళులో, అక్కడొకరూ ఇక్కడొకరూ చెరో చంటి పిల్లని భుజాన్ని వేసుకుని దబిడీ దిబిడీ చిచ్చి కొడుతూ, ‘చందురుని మించి అందమొలికించు చిట్టిపాపాయివే’ అని ఏడుపు పాటలు పాడితే, అవి జోలపాటలవుతాయా? How Sad! ఆ ఏడుపు స్వరం పిల్లలకు ఎంత వేదన కలిగిస్తుంది. ఆ అమ్మా నాన్నల కన్నీళ్లు పిల్లల మీదే కారి పడుతున్నయి. ఆ ఏడుపేదో అవతలికి పోయి ఏడ్చుకుని, ఆ పిల్లలకు ఆనందపు స్వరంతో, పిల్లల పాటలు పాడి, వారితో ఆటలాడే వారిని ఏర్పాటు చెయ్యటం మంచిది అనిపించింది.
తెలుగు సినిమాల్లో ఒక ఆనంద సమయంలో పాటనే, మరో విషాద సమయంలో టెంపో స్లో చేసి, ఏడుపు గొంతులతో పాడారు. అసహ్యకరమైన పని. పాటలకేదో కరువొచ్చినట్టు. Emotions, events, mess up చెయ్యటం. ఒక్క పాటనీ హాయిగా పాడుకోనివ్వరు. I really didn’t want to get in there. I don’t want to end my note on that kind of note. Leaves a bad taste in my mouth. అందుకని మధురంగా థ్వనించే పద్యాలున్న వసుచరిత్ర లోకే మళ్లీ వెళ్లి, ఇంకొన్ని పేజీలు తిప్పి వసురాజు వచ్చినపుడు ఆ తోట చేసిన మర్యాద ఎంత రమణీయంగా ఉన్నదో, ఇంకోసారి చదువుకుంటాను. ఎన్నో తెలివైన, అందమైన రచవలున్నయ్యి. ప్రపంచంలో ఇంకా చూడని సుందరత ఎంతైనా ఉంది. I am so eager to go get it.
నమస్తే /\
అం, అ, ఆ, ….
కం, క, కాం, కా, …. , క్రం, క్ర, …. , క్రాం, క్రా, …
సామాన్యముగా నిఘంటువులలో ఈ విధముగా పదాల అమరికలు ఉంటాయి.
నాదగ్గర ఉండే నిఘంటువులు, కోశములు ఇట్టి అమరికలతోనే ఉన్నాయి. కాని ఇటీవల నేను కొన్న ఒక కన్నడ పుస్తకములో మీరు చెప్పిన రెండవ అమరిక ఉన్నది. అనగా –
కం, క, క్రం, క్ర, … , కాం, కా, క్రాం, క్రా, …
ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నాకు మొదటి విధముగా చదివి వాడుక.
ఏ విధముగా అమర్చినా మీరు మొట్ట మొదట పీఠికలో స్పష్టము చేయాలి. ఇక్కడ వచ్చిన చిక్కల్లా అందఱు పీఠికను చదవరు!
తమిళుల సంస్కృతి ప్రముఖంగా రెండు భాగాలు. అయ్యర్ – అయ్యంగార్ లదీ, ఇతరులదీ. కర్ణాటక సంగీతం తమిళనాడులో మొదటి వర్గానికి చెందినది. – అందులో అయ్యర్ – అయ్యంగార్లు కాని వారు కూడా ఉన్నారు – వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చేసిన కృషిని చాలా impressive గా ప్రదర్శిస్తారు. దాదాపు ఒక సంవత్సరం క్రితం అనుకోకుండా టీవీ చానెళ్ళ మీద కప్పదాట్లతొ ఒక తమిళ చానెల్ దగ్గర ఆగి పోయాను. ఒక క్షణం చూసి నడుస్తున్నదేమిటొ గుర్తుపట్టేశాను – పసిరిక పొలాల్లో పరుగెడుతున్నాడు. గిరిక తపస్సు – విశ్వనాథను అక్షరం అక్షరం తెరకెక్కించేశారా అనిపించింది. ‘ఆయిరం శిరం’ సీరియల్. తర్వాత కథా భాగాలు చూడటం కుదరలేదు.
నాతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న తమిళ కుర్రకారుతో అంటూ ఉంటాను: “There is not much of a difference or gap between you Tamils and we, Andhras, what we call ‘cap’ you call it, ‘gap’, that is all.” అని.
Streynsham Master పేరు, ఆయన రచనా మీరు చెబితేనే తెలిసింది . ఐంటర్నెట్ లో చూడడం నా వల్ల కావడం లేదు. శ్ame is the czse with the paper published by John Richards and Velcheru Narayana Rao (IESHR, 1980). Being computer illiterate, i consistently fail to retrieve archived documents on line. The task is more difficult without knowing the title of the book/paper.
నికొలో మనూచి Storia do Mogor, విలియం ఇర్విన్ అనువదంలో దొరికింది కాని, ముక్కలు గానే చదవడం వీలయ్యింది.అదీ చాలా కాలం క్రితం. ఇక్కడ ఇంకో రెండు ముక్కలు. తిరుమల రామచంద్ర గారి “హంపి నుంచి హరప్పా” యత్రా చరిత్ర కాదని చదివే వరకూ తెలియలేదు. దాశరథి గారి యత్రాస్మ్రుతి కూడా యత్రా చరిత్ర కాదట. దొరకలేదు.
We, when we were in lower classes of school, came across film artiste Akkineni Nageswara Rao’s “NaaAmerica Yatra”.The book was illustrated by Bapu, and accorded interesting reading . Word was that it had been ghost written by Mullapudi Venkata Ramana.
Did Kesari Narasimham of Kesari kuteeram publish a book in Telugu on his journey to Madras from his village in Addanki seema?
Narla Venkateswara Rao did undertake a tour of Europe, and stray references are cited from his experiences, especially in connection to his remarks about the Amaravathi sculpture he had found in the Louvre Museum, Paris. I do hope that there must be a compilation of his travel experiences in existence in print!
Warm Regards.
S.Bhava Narayana.
సన్మాన లాటరీ గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/22/2016 12:37 pm
నా అభిప్రాయం అనేదానికి ఎంతవిలువ ఉంటుందో తెలియదు కాని ఒకవేళ దానికి ఏ విలువా లేకపోయినా ఒక చెప్పవలసిన అబిప్రాయం అంటూ వచ్చిన తరువాత అది చెప్పటమే మంచిపని అనిపించి ఈ ఒక్క ముక్కా వ్రాస్తున్నాను.
ఈ కథ అనబడే ‘సన్మాన లాటరీ’ ఒక మరీపొడుగైన జోక్. అంతకంటే ఏమీ లేదు.
ఈ మాట అనటం నా అభిరుచిలోపమో మరొకటో అని ఎవరైనా అనుకుంటే దానికి నేనేమీ చేయలేను. నాకనిపించిన అభిప్రాయాన్ని చెప్పానంతే.
ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారూ, మీరు సాయంచేసి చూపిన దారిలో Universal Digital Library నుండి కురుమెళ్ళ వెంకట్రావుగారు గారి “మా మహారాజుతో దూరతీరాలు” పుస్తకం సంపాదించి దాని ప్రింటు కాపీని నాగపూర్లో ఉంటున్న మీ మిత్రులు (త్రిపుర గారికాప్తమిత్రులు) శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారికి చేరవేస్తే అందుకుని వారెంతో సంతోషించారు. కురుమెళ్ళ వెంకట్రావు గారి ఉత్తరాలు అందుకున్న పెమ్మరాజు వెంకట్రావు గారి మనుమడు (యీ వ్యాస రచయిత ) రిషీవ్యాలీ పిడూరి రాజశేఖర్ గారితో కూడా ముచ్చడించారు. యీ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన కాకినాడ వాస్థవ్యులు, అడ్వకేటు శ్రీ M.V. Saastry గారితో తనకున్న చిరు పరిచయాన్ని కూడా భజరా గారు తలపోసుకున్నారు.
“మా మహారాజుతో దూరతీరాలు” పుస్తకం తిరిగి ఏదైనా పెద్ద సంస్థ ద్వారా పునర్ముద్రణ పొందేలా చెయ్యాలనీ ప్రయత్నిస్తున్నాము.
మీరన్నట్లే గమ్మత్తుగా భమిడిపాటి జగన్నాథరావు గారు కూడా తెన్నేటి కోదండరామయ్య గారు రాసిన “మాబడి” (1950) పుస్తకం గురించి అడిగారు (భజరా గారూ తూర్పు గోదావరి జిల్లా వారే అనుకుంటా). నాలుగొందలు లేదా ఐదొందలు పేజీలుండే యీ “మాబడి” పుస్తకం చాలా బాగుంటుంది ఎలాగైనా సంపాదించమని, మిమ్మల్ని, మనసు రాయుడు గారు, శ్యామనారాయణ గార్లను అభ్యర్ధించమని చెప్పారు. ఆపై మీ దయ, మా ప్రాప్తమూ.
మికిమోటో ముత్యాల్లాంటివి, మూడు పద్యాలున్నూ! పద్యాలు ఎన్నుకోటంలో మీకు మేరే సాటి. అయితే మీ ఏరికలో ఒక ప్రమాదం లేకపోలేదు; హరివంశం తిరగతోడటానికి ఆపుస్తకం మనవాళ్ళల్లో ఎంతమందిదగ్గిర ఉంటుందంటారు చెప్పండి?
నాకు తెలుసు. ఎవరో ఒకరు గూగ్లీకరించి చెప్పేస్తారు, ఈ పుస్తకం అంతర్జాలంలో దమ్మిడీ ఖర్చు పెట్టకుండా ఎల్లా కబ్జా చేసుకోవచ్చో! ఏదయితేనేం లెండి. హరివంశం చదవడానికి ప్రేరణ మీరెన్నిక చేసిన మెరికెలు!
అయినా మీకు ఇంత తెలుగు పక్షపాతం ఎందుకబ్బా? బాలకిష్టుడి చేష్టలకి పోతన, ఎర్రన లేనా? ఎంత అన్యాయం!
లీలాశుకుడి శ్రీ కృష్ణ కర్ణామృతంలో పద్యాలు లేవూ! చిన్ని క్రిష్ణుడి పోకిరి చేష్టలు సమర్ధిస్తూ! అవునులెండి; అవి పజ్జాలు కాదు, శ్లోకాలు, దేవభాషలోవి కూడానూ! కాని, తెలుగు వాళ్ళకి పోతన తరువాత, బిళ్వమంగళుడి కర్ణామృతమే బాగా తెలిసిన పుస్తకం, అని మా మేనమామ అనేవాడు. అని మాకు నూరి పోసాడు.
ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు, నమస్కారములు.
మీకు తెలిసే ఉంటుంది …. అజంతా గారి కవితలని పుస్తకంగా ప్రచురించటానికి త్రిపురని డిస్కవర్ చేసి తెలుగు పాఠకులకి అందించిన విశాఖ డా.అత్తలూరి నరసింహరావు గారు ఎంత ప్రయత్నించినా సాధించ లేక పోయారు కాని,వారి మేనల్లుడు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ ఆ ఘనకార్యం సాదించాడు. అజంతా గారిని ఒప్పించి “స్వప్నలిపి” కవితల పుస్తకాన్ని తన సొంత ఖర్చులతో ‘కవిత్వం ప్రచురణల’ ద్వారా ఎంతో అందంగా తీర్చిదిద్ది వెలుగులోకి తెచ్చాడు. ఈ కవితా సంకలనం 1997లో సాహిత్య అకాడెమీ కవిత్వ పురస్కారం అందుకుంది.”స్వప్నలిపి” ని అజంతా, త్రిపురల ప్రియనేస్తం ‘మో’ గారు “Dream Script” పేరిట ఇంగ్లీషులోకి ఆనువదించారు.
” అక్షరం నిండా అన్నీ అద్భుతాలే అని
శబ్ద శక్తి సార్వభౌమాధికారం అనాహాతం అని చెప్ప లేదా నేను చెప్ప లేదా”
“నేను ప్రతి మనిషిలో వుంటాను, నేను ప్రతి మనిషి స్వప్నంలో వుంటాను, స్వప్న సౌందర్యంలో వుంటాను … అధః పతితుడైన మనిషిని ఆప్యాయంగా లేవనెతుత్తున్న కారుణ్య హస్తాలలో వుంటాను ”
అన్న అజంతా “సజీవ స్వరం” ఈమాట ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ప్రవాసం లోని మీకు, విజయవాడ లోని శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు.
విషయసంపన్నమైన ఈ సుదీర్ఘవ్యాసాన్ని, ప్రస్తుతం మధ్యాక్కర వరకూ చదివాను. ఇందులో ప్రస్తావించిన కొన్ని విషయాలపై నా ఆలోచనలు:
1. “…గీతులలో పదములను గణములకు తగ్గట్లు ఎంచుకొంటే ఆ గీతి గానయోగ్యముగా ఉంటుందని”
ఇది పాక్షికసత్యం మాత్రమే అని నా అభిప్రాయం. గణాలకు తగ్గట్టుగా పదాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ గణాలలో “మాత్రా సమత” కూడా ఉండాలి. మచ్చుకి, మోహనగారు ఉదాహరించిన మహాక్కర పాదం పరిశీలిస్తే:
ఈ పాదంలో మొదటి దళం (నీవు లేనిచో జీవమ్ము లేదురా) కన్నా రెండవ దళానికి (నీవెగా నాజీవ రాజీవము) లయబద్ధత (దానివల్ల గానయోగ్యత) అధికంగా ఉన్నదన్న విషయం గమనించవచ్చు. దానికి కారణం రెండవ దళంలోని గణాలలో మాత్రా సమత అధికంగా ఉండటమే. మొదటి దళం “తాన తాననా తానాన తాననా” అయితే, రెండవది “తాననా తానాన తానాన న”. మొదటి దళంలో “తాన తాననా” అనేది లయని కుంటుపరుస్తున్నది. దీన్ని “తాన తానాన” అన్న రీతిలో మారిస్తే కొంత మెరుగైన నడక లభిస్తుంది. “నీవు లేకున్న జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము”. మహాక్కర పాదంలో మొదటి దళానికి ఇంకా మెరుగైన నడక నా దృష్టిలో ఇది: “తాననా/(తన తనన) తాననన తాననా తాన”
“నినువిడిచి జీవనము లేదురా నాకు – నీవెగా నాజీవ రాజీవము”
ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇది కూడా మహాక్కర పాదమే. కాని పదాలు గణాలకు తగ్గట్టుగా విడలేదు. అయినా ఖండగతిలో పాదం హాయిగా సాగింది.
సారాంశం ఏమిటంటే, అంశగణ ఛందస్సు పూర్తి మాత్రాబద్ధ ఛందస్సు కాదు. కాబట్టి అందులో గణాల సమత ఉన్నా, ఆ గణాలబట్టి పదాలను కూర్చినా, స్ఫుటమైన చక్కని నడక ఏర్పడుతుందని చెప్పడానికి లేదు. ఆ గణాలను అనేక రకాలైన మాత్రాక్రమాలుగా రచించవచ్చు. అందులో కొన్ని మాత్రాక్రమాల పోహళింపులే మంచి నడకని అందిస్తాయి. అంచేత గానయోగ్యంగా రాయాలంటే అలాంటి క్రమాలని గుర్తించి, వాటిని అనుసరించి పదాలను కూర్చాలి.
2. మధ్యాక్కర యతి గురించి
దీనిపై చాలా చర్చే జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా చాలావరకూ అందరూ అయిదవ గణం దగ్గర యతి సరి కాదనీ, నాల్గవ గణం దగ్గరదే సరైనదనీ భావించారు. త్రిపురనేని రామస్వామిగారైతే ఏకంగా “అప్పటి బహుళ ప్రచారములో నున్న యక్కరలను నన్నయ వాడినాడు కాని వాని తత్త్వమెరుగజాలక మధురగతి నంతయు మంటపాలు చేసి కుంటినడక యంటించినాడు” అని నన్నయపై విరుచుకుపడ్డారు. నన్నయ మధ్యాక్కరది కుంటినడకే అయినా, అది చేసినది నన్నయ కాదనీ, అంతకుముందు శాసనాలలో కూడా అదే నడక ఉన్నదనీ త్రిపురనేనివారు గమనించకపోవడం దురదృష్టం. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకొనో ఏమో కోవెల సంపత్కుమారాచర్యగారు నన్నయ మధ్యాక్కరలలో కొన్ని చోట్ల నాల్గవ గణంపై కూడా యతి ఉన్నదనీ అందువల్ల నన్నయకి నాల్గవ గణంపై యతి ఆమోదమేననీ సమర్థించడానికి ప్రయత్నించారు. కాని అది అంత సమంజసం కాదు. ఆ విషయాన్ని ప్రస్తావించి సంగనభట్ల నరసయ్యగారు తన “తెలుగులో దేశిచ్ఛందస్సు ప్రారంభ దశలు” అనే పుస్తకంలో దాన్ని సహేతుకంగా ఖండించారు.
“ఆ కాలములో ఈ కాలములో మధ్యాక్కరను నడిపించే విధానములో భేదమున్నదని అనుకొందును. మొదటి నాలుగు గణములు ఒక పట్టుగా ద్విపదవలె నడిపించి శేషించిన రెండు గణములను రెండవ పట్టుగా చదివిన యెడల వినసొంపుగానే యుండును”, అన్న గిడుగు సీతాపతిగారి అభిప్రాయమే నాకు మిగతావారి వాదనలకన్నా సమంజసంగా తోస్తోంది. నరసయ్యగారు కూడా దీనిని తన పుస్తకంలో సమర్థించారు. గిడుగువారు ఇచ్చిన బొబ్బిలిపాట ఉదాహరణతోబాటు, వారు బతుకమ్మపాట ఉదాహరణకూడా ఇచ్చారు:
శ్రీరామభూపాలుడూ పట్టాభి
షేకుడై కొలువుండగా
ఇక్కడ “పట్టాభి” అనేది అధికంగా వచ్చిన గణం. ఇలా ఒకే రకమైన మాత్రాగణాల మధ్యలో అదనంగా మరొక మాత్రాగణం చేరడం మరికొన్ని పాటలలో కూడా గమనించవచ్చు. ఉదాహరణకు
“కస్తూరి రంగరంగా మాయన్న
కావేటి రంగరంగా”
అన్న పాటలో కూడా “మాయన్న” అనేది “తానాన తాననానా” అనే రెండు సమ మాత్రాగణాల మధ్యలో వచ్చిన గణం.
అయితే, గిడుగువారు కానీ నరసయ్యగారు కానీ యిచ్చిన ఉదాహరణలు ద్విపద – మధ్యాక్కర ఉదాహరణలు కాదు. మధ్యాక్కరను ద్విపదలాగా నడిపించిన ఉదాహరణలు వారు ఇవ్వలేదు. వారు పైన సూచించిన అంశంకన్నా కూడా విశేషమైన మరొక ప్రత్యేకత మధ్యాక్కర – ద్విపద మధ్య నాకు కనిపించింది. అదేమిటంటే, “తననాన తానాన తాననా నాన” అనే దివపదలోని నాలుగు దళాలలో చివరి రెండు దళాలూ మళ్ళీ ఆవృత్తి అయితే అది మధ్యాక్కర అవుతుంది! మోహనగారు ఉదాహరించిన మధ్యాక్కర పాదం చూస్తే అది స్పష్టం అవుతుంది:
మనసెందుకో నేఁడు మైన-మై మారె – మౌనమై జారె
ఇక్కడ “మైనమై మారె”, “మౌనమై జారె” అనే రెంటి గణస్వరూపం సరిగ్గా ఒకటే.
దీనిబట్టి, నా ఊహ (లేదా అంచనా) ఏమిటంటే – పూర్వం ద్విపద పాటని ఒకరు పాడి, చివరి రెండు దళాలనూ వంత పాడేవాళ్ళు తిరిగి పాడే సంప్రదాయం ఉండేది. ఉదాహరణకు:
“అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు” అని ఒకరు పాడితే, మిగతావాళ్ళు “తమ్మిపూవుల్లు” అని వంతపాడేవారు. అది అంతా కలిసి ఒక వాక్యంగా రాస్తే సరిగ్గా మధ్యాక్కర పాదం అవుతుంది:
అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు తమ్మిపూవుల్లు
అందువల్ల దీనికి అయిదవ గణం మొదట యతి (పదవిచ్ఛేదం) తప్పనిసరి!
నా ఊహకి సమర్థింపుగా, “లాలమ్మ గుఱ్ఱాలు లంకల్లొ మేసె – లంకల్లొ మేసె” అంటూ ద్విపద నడకలో సాగే జానపదగేయం ఆంధ్రభారతి సైటులో కనిపించింది (లింకు).
ఇది ఇంచుమించుగా మధ్యాక్కర ఛందస్సే (లాలమ్మ గుఱ్ఱాలు లంకలో మేసె – లంకలో మేసె – అని మార్చుకొంటే)!
చివరిగా, వేలూరివారు ఉదాహరించిన విశ్వనాథ మధ్యాక్కరని ఎలా “పాడూకో”వచ్చునో వారినోట కాని, మరెవరి నోటనైనా కాని వినాలనుంది! 🙂
వ్యాసమును చదివి తమ అమూల్యమైన అభిప్రాయములను తెలిపిన శ్రీమతి సుప్రభ, శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారలకు నా నమస్సులు. ఇది అక్కరలపై వ్యాసము కాబట్టి ఒకటికన్న ఎక్కువగా ఉదాహరణములను చూపలేకపోయినాను.
శ్రీమతి దోనేపూడి లక్ష్మీకాంతమ్మ “తెలుగు కవిత్వంలో మధ్యాక్కర – ఒక పరిశీలన” అనే PhD సిద్ధాంత గ్రంథములో మధ్యాక్కరలను ఉపయోగించిన తెలుగు కవులపై ప్రత్యేకముగా కొన్ని ప్రకరణములను కేటాయించారు. అందులో ఆ కవులు వ్రాసిన కావ్యములనుండి ఎన్నియో ఉదాహరణములను కూడ ఇచ్చారు. క్రింది మొదటి ఏడు మధ్యాక్కరలను అక్కడినుండి గ్రహించి, ఉదాహరణములుగా ఇక్కడ పొందుపరచినాను. ఎనిమిదవది “వేదనామధ్యాక్కరలు” (లింకు) అనే పుస్తకమునుండి గ్రహించాను. తొమ్మిదవది శ్రీ రవిగారు నేను వ్రాసిన “ఛందస్సుకు ఒక కొండ – కొక్కొండ” (లింకు) వ్యాసమునకు ఒక అభిప్రాయములో తెలిపినారు. విశ్వనాథ మధ్యాక్కరలు ఇక్కడ లభ్యము (లింకు)
1) తుమ్మల సీతారామమూర్తి చౌదరి – మహాత్మకథ
ఓ యయ్య ప్రాయోపవేశమునకు – మూనకు, నీవు
పోయిన మాకు స్వాతంత్ర్య మేల ప్ర-భుత్వ మదేల
శ్రీయేల జీవిత మేల సౌహార్ద – సిద్ధికై శ్రమము
సేయుదుమని కమ్మ నంపి రా యోగి-శేఖరు కడకు
2) ఆరుద్ర – శుద్ధ మధ్యాక్కరలు
పదమూడు మాత్ర లున్నట్టె – పాదార్ధముల వళ్లు పెట్టె
తుది ప్రాస లందులో నిలుపు – తూకాన అవి రెండు కలుపు
మొదలట్లు తొలి ప్రాస వుంచు – ముద్దుగా నాల్గాలపించు
కుదురైన అందాల గములు – కొత్తవీ మధ్యాక్కరములు
3) నాయని సుబ్బా రావు – విషాద మోహనం
పోయిన సూర్యుండు వచ్చు – పోయిన చంద్రుండు వచ్చు
పోయిన పదునాఱు కళలు – పూర్తిగా విధునకు వచ్చు
పోయిన తారకత మినుకు – పూవుల గుత్తులు వచ్చు
పోయిన మోహనా వినయ – భూషణా తిరిగి రావేమి
4) కోవెల సుప్రసన్నాచార్య – పాంచాలరాయ శతకము
ఎన్నడు వినుటయే కాని – యెన్నడు కనుటయే లేదు
ఎన్నడు కాంచుట కాదు – యెన్న డూహించుట లేదు
ఎన్నాళ్ల కెన్నాళ్ల కయ్యె – యిట్టి మీ దివ్య దర్శనము
కన్నుల పండువు కాగ – కరుణాబ్ధి పాంచాలరాయ
ఒకచేత వీణ ధరించి చిరునవ్వు – లొలుకబోయుచును
నొకచేతఁ బొత్తమ్ము గొనుచు నంచపై – నొప్పారి రావె
ప్రకటింతు వేవేల నతులు సకల సౌ-భాగ్యంబు లీవె
యిక నాకు జ్ఞానసరస్వతీ వాస-రేశ్వరీ దేవి
6) జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి (శాంతిశ్రీ) – సత్యశాయి మధ్యాక్కరలు
తల్లి వందురు కొందరు మరి కొందరు – తండ్రి వందురు జ-
గల్లీల కాని స్త్రీపురుష భేదమ్ము – కలద నీయందు
తల్లివై లాలింతు వెంతొ తండ్రియై – దండింతు వంతె
చల్లని మా తల్లి తండ్రి జయ సత్య-శాయీ నమోస్తు
ఇష్టదైవము దేశమాత కావలె నీతరమ్మునకు
ఇష్టకామ్యార్థము లొసగు నీదేవి యీనాడు మనకు
సర్వ లోకము లేలు తల్లి స్వయముగా సాక్షాత్కరించె
సర్వావతారాల మూలమౌ పరమావతారమ్ము
శర్వాణి వాణి వైష్ణవి సకలదైవ సమ్మేళనమ్ము
ఉర్విలో భరతోర్వి, ఈమె సేవయే ఉత్తమ పూజ
ఆదరపూర్వకమైన మీ సహృదయ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు ప్రస్తావించిన విషయాలు:
మొదటిది: రాయలు ‘ఆంధ్రకవి’ అనటం సాభిప్రాయమూ, విశేష హృదయధర్మమే కాని, ఇతరభాషాకవుల మధ్య వ్యవచ్ఛేదకంగా అన్న మాట కాదు. అది పాదపూరకం కాదు. పరివృత్తిని ఎంతమాత్రం సహింపని భావభావన. తెలుగువారిని ఉద్దేశించి తెలుగులో పద్యం చెబుతూ, ‘తెలుగు కవి ధూర్జటి’ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. “ప్రౌఢకవి ధూర్జటి” అనవచ్చును కదా. అష్టదిగ్గజ కవులందరూ తెలుగువారే అయితే, “స్తుతమతి యైన ఆంధ్రకవి” (లేదా, ‘తెల్గు కవి’) అనవలసిన అవసరం అసలే ఉండదు. అక్కడ “ఆంధ్ర” శబ్దప్రయోగం కేవలం భాషాభిమానాన్ని మాత్రమే సూచిస్తున్నదన్నది ప్రతిపాద్యాంశం.
రాయాస్థానంలో ఉన్నది అష్టదిగ్గజములా? నవరత్నములా? వారిలో అందరూ తెలుగువారు మాత్రమేనా? ఇతరులూ ఉన్నారా? అన్న విషయాన్ని అధికరించి అనేకవాదోపవాదాలున్నాయి. సంస్కృతాంధ్రతమిళకన్నడ కవులవి ఏవేవో పేర్లు విమర్శకుల పరిశీలనకు వచ్చాయి. ఆ కవులలో సుప్రసిద్ధులూ, అప్రసిద్ధులూ ఉన్నారు. ఇదమిత్థమని తీర్పు చెప్పటం సాధ్యం కాదు. కనీసం అందుకు ఆవశ్యకమైన సాధనసామగ్రినైనా సమీచీనంగా సమీకరించటం ఈనాటికీ జరగలేదు.
రెండవది: ఆముక్తమాల్యదలో ఆ వాక్యం ప్రస్తావింపబడిన తీరును బట్టి “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న నిరుక్తికి రాజకీయ, సాంస్కృతిక కారణాలనేకం తప్పక ఉండి ఉంటాయని విశ్వసింపవచ్చును. అటువంటివేవో ఉండినందువల్లనే అదేదో తన మాటగా చెప్పక క్రీడాభిరామములోని ఆ మాటను త్రవ్వి తలకెత్తి, ప్రార్థితస్వప్నాన్ని భగవద్వాక్యంగా నిరూపింపవలసి వచ్చి ఉంటుంది. కారణం ఏదైనా, ఎంతో అభిమానం లేనిది అసలు ఆంధ్రకావ్యరచనకు ఉపక్రమణమే ఉండదు కదా.
మూడవది: కావ్యరచన సాగుతున్న కాలంలో కవులు తత్తత్సన్నివేశాలను నలుగురికీ వినిపించటం వింతేమీ కాదు. అది నాడూ, నేడూ జరుగుతున్న దృగ్విషయమే. నా మటుకు నేనే ఎంతోమంది ప్రసిద్ధుల రచనలను అవి సుపరీక్షితాలూ, సుపరిష్కృతాలూ కాకముందే ఉక్తలేఖనదశలో విన్నాను. చదివాను. కావ్యం మానవసమర్పితమైతే, ఆ కావ్యాన్ని నలుగురికీ నాలుగు చోట్ల వినిపిస్తూ, ఎవరికి అంకితం ఇవ్వాలో వ్యక్తిని కుదుర్చుకోవటానికి ఆ రోజుల్లో ఎంతో కాలం పట్టేది. ఆ ‘కృతిభర్త’కు నలుగురి చేత చెప్పింపవలసి వచ్చేది. అంకితం పుచ్చుకొని ఏమివ్వగలడో, ఏమిస్తానంటాడో; అది తనకు అంగీకార్యమో, కాదో తెలుసుకోవాలి కదా. కృతి పూర్తయిన తర్వాత ఒప్పందాలు కుదుర్చుకొని, వంశచరిత్ర సేకరించి, కృత్యాదిని వ్రాయటానికి పడే ఆ అవస్థనే ‘కృతాద్యవస్థ’ అనేవారు. కృతాద్యవస్థ అంటే రచన మొదలుపెట్టేందుకు పడే అవస్థ కాదు; కృతి పూర్తయిన తర్వాత అవతారికను వ్రాసేందుకు పడే అవస్థ.
శ్రీమహాభాగవతం రచన అద్భుతంగా సాగుతున్నదని విన్న తర్వాతనే కదా, రాజు పోతన గారిని దానిని తనకు అంకితం చేయాలని అడగటమూ, ఆయన ఇవ్వననటమూ జరిగింది? రచనాప్రక్రియ నిర్విఘ్నపరిసమాప్తి పర్యంతం రహస్యంగా ఉంటే ఈ వృత్తాంతాలే సంభవింపవు కదా.
కావ్యరచన ఎంత గజగర్భపద్ధతి అయినా, అదేమీ ఐకాంతికమైన రహస్యవ్యాసంగం కానేరదు. రచనా ప్రారంభానికి పూర్వపు కృషి మాత్రమే కవికి ఆంతరంగికం. రచన సాగుతున్న దశ, రచన పూర్తయాక అంకితోత్సవానికి లేదా భగవత్సమర్పణకు మునుపు సూర్యాలోకం అన్నవి బహిర్ముఖీనములే. నిండుసభలో ఇంకా పూర్తి కాని కావ్యమధ్యసన్నివేశాన్ని గానంచేయటం గుణగౌరవాన్ని, అందుకొనబోయే గౌరవాన్ని గౌణీకరింపదు సరికదా, రచన సవ్యంగా కొనసాగటానికి, కావ్యప్రశస్తికి మరింత ఉల్లాసదోహదం కాగలుగుతుంది.
కావ్యాన్ని పూర్తిచేసిన తర్వాతైనా, కావ్యరచనాకాలంలో నైనా కావ్యగానాన్ని కవి తానై స్వయంగా చేసి ఉండటమూ, ఇతరులు కోరగా చేసి ఉండటమూ రెండూ సహజమే. సాహిత్యసభ అన్నాక కొలువుతీరినవారు వారు వారు వ్రాస్తున్న విశేషాలనూ, నాటినాటికి వ్రాసిన విషయాలనూ తెలుసుకోక మానరు కదా. నిజంగా అష్టదిగ్గజాలలో ఉన్నవాడే అయితే, కావ్యాన్ని ఇంట్లో లేఖకులకు చెప్పి వ్రాయిస్తూ, రచన పూర్తయే దాకా శైలి, కథ, కవిత్వం, చమత్కారాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టటం అసలే వీలుకాదు. కావ్యగానాలు జరుగుతుండేవని, ధూర్జటి ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి కృష్ణరాయలు అప్పటికింకా సుముఖుడై ఉన్న 1523-1524 ప్రాంతాల కావ్యాన్ని మొదలుపెట్టి రచన సాగిస్తూ, అడిగినప్పుడు నలుగురికీ వినిపిస్తూ ఉండేవాడని, పరిస్థితులు తారుమారయిన కొంతకాలానికి పూర్తిచేసేనాటికి భవపరాఙ్ముఖుడుగా ఉన్నాడని ఊహ్యం.
ధూర్జటి గారు అష్టదిగ్గజాలలో ఒకరా? అన్న విషయం అనుమేయమే కాని, ఏ సంగతీ నిర్ధారించి చెప్పలేమని వ్రాశాను.
కందుకూరి రుద్రకవి సాహిత్యజీవితమంతా క్రీస్తుశకం 1550 తర్వాత ప్రారంభమయింది. తొలిరచన నాటికి నలభై యాభై యేళ్ళవాడనుకొంటే, అష్టదిగ్గజకవులలో కాదు సరికదా, మామూలు ఆస్థానకవి కూడా అయివుండడు. ఆయన ఈశాన్య సింహాసనాసీనుడన్నది విశ్వసనీయం కాదు. సంస్కృతంలో ‘రాష్ట్రౌఢ వంశకావ్యం’ ఆయన కృతి అని తెలుగు సాహిత్య చరిత్రకారులు వ్రాసినది సరికాదు.
ఈ లఘుప్రస్తావికను సహృదయంతో చదివి ఎంతో ఔదార్యంతో ఆశీర్వచస్సులను అందించిన పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్సుమాంజలి! _/|\_ !
సౌజన్యమూర్తులు శ్రీ రంగ గారికి, శ్రీ రవి గారికి – ప్రణామాలు.
కళ్యాణిగారూ ధన్యవాదాలు.
తెలుగు సాహిత్యంలో వేశ్యల జీవితచిత్రణ గురించి చాలా ఆలోచనాత్మకంగా, స్పష్టంగా, చెప్పారు. విశ్లేషణ బాధితులవైపు నుంచి సాగడంతో వాళ్ల గొంతుక బలంగా వినిపించింది. మీరు ప్రస్తావించిన రచన్లో కన్యాశుల్కం, అంధకారంలో వంటి ప్రముఖ రచనలు తప్ప చాలా వాటిని చదవలేదు. కొకువి మళ్లీ చదవాలి. పెద్దిభొట్ల సతీసావిత్ర కథను తప్పక చదువుతాను. పరిచయమే పొగిలే దుఖం తెప్పించింది.
మీ వ్యాసంతో కొన్ని సందేహాలు తీరాయి. సెక్స్ వర్కర్లు వాళ్ల మానాన వాళ్లు బతికితే ఎవరికేం నష్టమ అని నాలోనూ ఒక సందిగ్ధ రాజీ ఉండేది, ఈ సబ్జెక్టుపై లోతుగా ఆలోచించకపోవడం వల్ల. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ పురాతన వ్రుత్తి ఏదో ఇష్టంతో తీసుకున్నది కాదు. దాన్ని కొనసాగించాలనే అధర్మవడ్డీ వాదులు నాకు తెలిసి గతంలో కంటే ఎక్కువయ్యారు. ప్రగతివాదులం అని చెప్పేవాళ్లూ ఉన్నారు వీళ్లలో. వేశ్యా వ్యవస్థకు మూలమైన పరిస్థితులను మార్చకుండా ఆ వ్యవస్థను తీసేయలేమని చక్కగా విశ్లేషించారు.
డబ్బు కేవలం దానంతట అదే త్రుప్తి నివ్వదు. సుఖాలు కోరుతుంది. దాంట్లోంచి మొదలవుతాయి జాడ్యాలు. ధనవంతులకు సుఖం, పేదలకు దుఖం.
ఈ వ్యాసంలో మీరు ముఖ్యమైన చాలా రచనలకు కవర్ చేశారు. విస్త్రుతి పెరడగం వల్ల కొన్ని లేకపోవచ్చు. సీమవైపు కొన్ని మంచికథలు వచ్చాయి. చక్రవేణు కువైట్ సావిత్రమ్మ, నిర్మలారాణి గాజు కళ్లు వంటివి. మీకు దొరికి ఉండకపోవచ్చు. కరువుపీడిత కడప, అనంతపురం జిల్లాల్లో ఈ అభాగినులు ఎక్కువ. పైగా దేశంకాని దేశంలో హింస. ఇదో కొత్తకోణం. మన సమాజానికి పతనానికి ఎన్ని ముఖాలో…
ఈ వ్యాసం చాలా ఆలోచనలు రేకిత్తించింది. నా అభిమాన భావవిప్లవకారుడు వోల్టేర్ తన కాండీడ్లో ఈ వ్రుత్తిలోని బీభత్సాన్ని చూపాడు. కన్యాశుల్కం, కాండీడ్ లో చాలా పోలికలు ఉన్నాయి. ఈ నవల్లోని ఇలాంటి విధివంచితలు కథనాయిక క్యూనెగొండ్ సహా ముగ్గురు వున్నారు. పకెట్ అనే దాసి కథానాయకుడైన కాండీడ్తో ఏం చెబుతోందో చదవండి.
‘నా యజమానులకు, ఆ ముచ్చటైన క్యూనెగొండ్ చిన్నమ్మకు జరిగిన దారుణాల గురించి విన్నాను. అయితే నా పరిస్థితి అంతకంటే దారుణం. నేనప్పుడు చిన్నప్పుడు అమాయకురాలి కదా, అందుకే మన గురువు ననుశీ సులభంగా బుట్టలో వేసుకుని పాడు చేశాడు. మిమ్మల్ని అయ్యాగారు చావుదెబ్బలు కొట్టి తరిమేశాక నేనూ బలవంతంగా ఇంట్లోంచి బయటపడాల్సి వచ్చింది. ఓ పెద్ద వైద్యుడు నాపై జాలిపడకుండా ఉన్నట్లయితే నేనప్పుడే చచ్చిపోయేదాన్ని. ప్రాణాలు పోశాడనే కృతజ్ఞతతో కొన్నాళ్లు ఆయనతో గడపాల్సి వచ్చింది. అయితే ఆయన కఁళ్లుబోతు పెళ్లాం నన్ను రోజూ చావగొట్టి చంపేది. అబ్బ! ఎంత గయ్యాళిగంప! ఆ వైద్యుడు కురూపి. అతనిపై ప్రేమ లేకపోయినా, కృతజ్ఞతతో పడుండి అతని పెళ్లాంతో తన్ను తింటూ ఉండేదాన్ని. ఆ రాక్షసిముండ పీడ భరించలేక అతడు ఓ రోజు ఆమెకు చలిజ్వరానికి మందు వేశాడు. అది బాగా పనిచేసి రెండుగంటలు తిరక్కముందే ఆమె నరకయాతన అనుభవించి చచ్చిపోయింది. ఆమె బంధువులు అతనిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. అతడు పారిపోయాడు. అతనికి బదులు నన్ను ఖైదు చేశారు. అయ్యా! నేను గనుక కాస్త అందంగా లేకపోయినట్లయితే నా అమాయకత్వం నన్ను ఏమాత్రం కాపాడేది కాదు. వైద్యుడి స్థానాన్ని తాను తీసుకునే షరతుపై న్యాయమూర్తి నన్ను విడుదల చేయించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత మరొకామెను చేరదీసి నన్ను వెళ్లగొట్టాడు. చేతిలో చిల్లిగవ్వలేకుండా వీధిలో పడ్డాను. అప్పటినుంచి ఈ కంపరం పుట్టించే బతుకు బతుకుతున్నాను. అయ్యా! మీ మగవాళ్లకు ఇందులో ఏదో మజా ఉందఁపించవచ్చు కానీ మాకు మాత్రం యమకూపమే. ఈ దరిద్రపు బతుకు బతకడానికే వెనిస్ వచ్చాను. పడుపుగత్తె బతుకు ఎంత దారుణవెూ మీకు తెలుసకుంటా. కాళ్లు కాటికి చాపుకున్న ముసలి వ్యాపారి, న్యాయవాది, సన్యాసి, సరంగు, ఇలా ప్రతి అడ్డమైన వాడిమీదా ఒకే రకంగా ప్రేమ ఒలకబోయాలి. లెక్కలేనన్ని బాధలు, అవమానాలు పడాలి. తరచూ లంగాను అరువు తెచ్చుకోవాలి… మధ్యలో న్యాయాధికారుల, రక్షకభటుల వేధింపులు, దందాలు షరా మామూలే. చివరకు దుర్భరమైన ముసలితనం, తర్వాత శరణాలయాల్లో, చస్తే ఏ పెంటకుప్పలోనో తేలడం.. లోకంలో నాకంటే దౌర్భాగ్యురాలు లేదు బాబూ..’
మీ వ్యాసం చదుతోంటే నాకు మహానది, సలాం బాంబే వంటి సినిమాలు, జోనా నానా, యమకూపం వంటివెన్నో గుర్తుకొస్తున్నాయి… మళ్లీ చదవాలి ఈ వ్యాసాన్ని.. మీరు ఇలాంటి మరెన్నో రాయాలని కోరుతూ…
పి.మోహన్
1. ” ఇది వ్యాసము రాయు తీరు కాదు కదా,” అని మీరు ఆఖరిమాటగా తీర్పునిచ్చి యున్నారు. వ్యాసము రాయు తీరు, ” ఈ విధము,” అని నిర్థారించుట కష్టమని మీకు తెలిసే ఉండును. వ్యాసము ఎట్లు రాయవలెను అనెడి మకుటముతో ఒక వ్యాసము రాయవలసి ఉన్నది. ( పుస్తకములు ఎట్ట్లు అచ్చు వేయవలెను, అనే శీర్షికతో మీ పత్రికలో వచ్చిన తీరు వలె!)
అటులనే కథ, నవల, విమర్శల తీరులపై పుస్తకములే రాసిన సాహితీవేత్తలున్నారు. అయిననూ, అవి Cast in Concrete అని చెప్పుట సమంజసమా?
2. కాల్పనిక సాహిత్యమంతయు కథ అన్న శీర్షిక కింద గోగోరా రచనని జమ కట్టడం ఆరోగ్యము కాదుకదా! కల్పనలో కథ ఉండవచ్చు; కాదనను. కాని, కథలన్నీ కల్పనలు కావుకదా? ఉదాహరణకి: దినపత్రికలలో సంపాదకుడు, Print the story or Kill the story అంటారని మీకు తెలియదా? వారి భాషలో వార్తలు కథలు. పోతే పేరడీలు కథలా? కాదని నేను అంటాను. కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే అని మీరు పాడుకొన్నచో నాకభ్యంతరము లేదు.
మీరు ఏర్పరచుకొన్న Template లోకి దీనిని బలవంతముగా తోసి మీ అభిరుచులు మా బోంట్లపై రుద్దుట అసమంజసము కదా!
ఒక ఉచిత సలహా. “అవీ, ఇవీ” అనో “కలగాపులగం” అనో “పేరడీలు” అనో, Not in A Serious Vein, అనో వేరొక శీర్షిక ప్రవేశపెట్టుట సమంజసము అని నా అభిప్రాయము. అయిననూ,మీ పత్రికకు ఉచితముగానైనా సలహా ఇచ్చుటకు నేనెవరిని గనుక?
ముప్ఫైఅయిదేళ్ళ క్రితం విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగిస్తుండిన తరుణంలో ఢిల్లీలోని ఆర్కైవ్సుకోసం 1979లో నేను రికార్డు చేసిన ఈ అపరపతంజలి కంఠస్వనాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకు మీ పుణ్యాన వినటం సాధ్యమయింది. దీనిని వెలికితీసి సూర్యాలోకాన్ని కల్పించిన మీకు కృతజ్ఞతతో ఎన్ని మెప్పుల కుప్పలని చెప్పినా తక్కువే.
శ్రీ శాస్త్రిగారు సర్వం ఆశుగతిని చెబుతుంటే రికార్డు చేయాలని అనుకొన్నాను కాని, వాగ్ధోరణిలో వ్యర్థపదాలు దొర్లవచ్చునని, ఒక్క క్షణంకూడా వృధ కారాదని వారు దానిని ఆనాడు ముందుగా వ్రాసికొని చదవటం జరిగింది. అందువల్లనే వ్యావహారికంలో కొంత గ్రాంథికత తప్పలేదు. శ్రీవారి గురుదేవులైన పూజ్యపాదులు శ్రీ దర్భా సర్వేశ్వరశాస్త్రివరేణ్యుల చిట్టచివరి తరం శిష్యులు మా గురుదేవులైన శ్రీ తమ్మన వేంకటేశ్వరరావు గారు కావటం వల్ల ఆరోజు నేను వారింట శిష్యరూపునిగా వారి ఆతిథ్యానికి నోచుకోగలిగాను. నాకు చిత్రకవిత్వాభిమానం ఉన్నదని ఆరోజు వారు, “నేనూ ఒక నాగబంధమును వ్రాసితినండీ” అంటూ, అనర్ఘమైన ఈ నాగబంధపద్యాన్ని ధారణవశాన అలవోకగా వినిపించారు:
అని. ఆ తర్వాత ఇది నాకు లభ్యపడిన వారి ముద్రితకృతులలో కానరాలేదు. ఎందులో ఉన్నదో ఇంకా అన్వేషింపవలసి ఉన్నది. వారి చాటుకృతులు సైతం అచ్చుకావాలి.
ఆ ఉచ్చారణను, ఆ పలుకుబడిని వింటుంటేనే వశీకృతపాణినీయులై సూత్రకార వృత్తికార భాష్యకార మునిత్రయచరిత్రను వ్రాసిన ఆ మహానుభావుని శబ్దాధికారం ఎటువంటిదో సువ్యక్తమవుతూ ఉన్నది. ఆ మూర్తిని మళ్ళీ మీరు శబ్దతరంగాల రూపాన కన్నులకు కట్టారు.
దీనిని అప్పుడే ఆకాశవాణి సరిక్రొత్తగా కొనుగోలుచేసిన స్విట్జర్లాండు నాగ్రా టూ ఛానెల్ స్పూలు రికార్డరుతో తొలి రికార్డింగును చేయటం జరిగింది. ఆరోజే శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి అనుభవాలను కూడా రికార్డుచేశాను. అప్పటి క్యూషీట్లు, వారి వారి వ్రాతప్రతులు ఇంకా ఉన్నాయో లేవో. ఇవి పూర్తయిన ఒక వారం రోజులకు అప్పికట్లకు వెళ్ళి శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారి ఇంట్లో రెండు రోజులుండి వారి అనుభవాలూ, జ్ఞాపకాలను రికార్డు చేశాను. మీ కృషిఫలంగా అవీ వెలుగులోకి రాగలవని ఎదురుచూస్తుంటాను.
అమేయశ్రద్ధతో శుభ్రపరచి దీనిని పునఃశాశ్వతీకరించిన మీకు ధన్యవాద సాహస్రితో,
నేను: “మోహనగారు చెపుతున్నది లయ గురించి, ……..అనిపిస్తోంది”
తఃతఃగారు: కాదు. అర్థవంతంగా పాడుకోవటానికి వీలుగా సంస్క్ర్త త శ్లొకాల పాదాలు పదాలు విరగకుండా ముగుస్తాయి అన్న విషయాన్ని మోహన తన వ్యాసాలలో పదే పదే చెపుతున్నారు. ఈ అభిప్రాయానికి తోడుగా తెలుగు కవులు పాదాంత యతిని పాటించక పోవటాన్ని (కొంత తక్కువ చేసి) కూడా వారు ప్రస్తావిస్తున్నారు.
నేను: ఇక్కడ తఃతఃగారు దేని గురించి “కాదు” అన్నారో నాకు అర్థం కాలేదు. మోహనగారు లయ గురించి కాకుండా స్వరం గురించో, లేక రాగం గురించో చెప్పారని వారి అభిప్రాయమా? తఃతఃగారి మిగతా వ్యాఖ్యబట్టి అలా అనిపించడం లేదు. వారు ప్రస్తావించిన పాదాంత యతి కూడా లయకి సంబంధించినదే తప్ప రాగానికి సంబంధించినది కాదు. ముందుగా, మోహనగారు ప్రస్తావించిన “singability” లేదా “గానయోగ్యత” అనే అంశం లయ/తాళానికి సంబంధించినది అన్న విషయం స్పష్టమై, దానిపైన అంగీకారం కుదిరితే, చర్చను ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఇక పదచ్ఛేదయతి గురించి:
1. ఈ వ్యాసంలో ప్రధానమైన అంశం శ్రీశ్రీ గేయాలు. అవి చాలావరకూ స్పష్టమైన లయతో సాగుతాయనడంలో ఎలాంటి విప్రతిపత్తి లేదు. దీనికి పాదాంతర విరామమూ, పాదాంత విరామమూ చాలా ఉపయోగపడే లక్షణాలన్నది మోహనగారి ప్రతిపాదన. దీనిని నేను అంగీకరిస్తాను. ఎవరైనా అంగీకరించకపోతే, వారి వాదన వివరించవచ్చు.
2. పదచ్ఛేదయతి గురించి మోహనగారు వ్యాసంలో ప్రస్తావించిన మరొక అంశం – “సంస్కృతములో పాదాంతయతి పాటించబడుతుంది.”. “అదే విధముగా సంస్కృతములో శార్దూలవిక్రీడితము, స్రగ్ధరలవంటి వృత్తములకు పాద మధ్యములో కూడ పదముల విఱుపు ఉంటుంది”.
ఇవి సాధారణంగా (చాలా ఎక్కువ శాతం) కనిపించే లక్షణాలే తప్ప నూరుపాళ్ళూ నియతంగా పాటింపబడినాయని ఎక్కడా లేదు. బహుశా ఛందస్సులో ఏ నియమాలకైనా అపవాదాలు ఉండనే ఉంటాయి. అందుచేత ఇందులో కాదనడానికి నాకేమీ కనిపించడం లేదు.
3. మోహనగారు తన వ్యాఖ్యలలో ప్రస్తావించిన అంశం:
“ఉత్తర భారత భాషలలో, సంస్కృతములో, తమిళ, మలయాళములలో ఎక్కువగా పాదాంతయతిని వాడుతారు. అలా చేసినందువలన వాటికి గానయోగ్యత లభిస్తుంది. తెలుగు కన్నడ భాషలలో (ముఖ్యముగా తెలుగులో) సాహిత్యము రెండు భిన్న రీతులలో రూపొందినాయి. కావ్యములు పఠనీయములు మాత్రమే. అది సంగీతముతో ఎక్కువ సంబంధము లేకుండా రూపొందినది. వాగ్గేయకారులు రచించిన గీతులకు మాత్రమే గేయత్వము లభించినది. కవులు ఎక్కువగా ఈ వాగ్గేయకారులను, యక్షగాన కర్తలను సరకుగొనలేదు. ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.”
ఇక్కడ కూడా “గానయోగ్యత” అంటే లయాన్వితంగా పాడుకోడమనే అర్థం స్పష్టం. తెలుగులో కావ్యములు పఠనీయములనే మోహనగారు కూడా అన్నారు. అయితే తెలుగు పద్యాలు చదువుకోనేందుకు కాక పాడుకొనేందుకు వీలుగా ఉంటే బాగుంటుందన్నది మోహనగారి అభిప్రాయం. అది వారి అభిరుచికి సంబంధించిన విషయం. దానితో ఏకీభవించడమా లేదా అన్నది మన అభిరుచికి బట్టి ఉంటుంది తప్ప, అందులో చర్చించడానికి ఏమీ లేదు!
ఇక, తమిళ, మలయాళ భాషల విషయం నాకు ఎక్కువగా తెలియదు కాని, సంస్కృతశ్లోకాలలో పాదాంతయతి వాటి “గానయోగ్యతకి” కారణమయ్యిందా లేదా అన్నది చర్చనీయాంశం. అయితే అది యీ వ్యాసానికి అంతగా అవసరం లేని విషయం. కాబట్టి దాని గురించి యీ వ్యాసంలో/వ్యాఖ్యలలో ప్రస్తావించకుండా ఉండి ఉంటే, చర్చ మోహనగారు కోరుకున్నట్టు వ్యాసంలో అసలు విషయమ్మీద కేంద్రీకృతం అయ్యుండేదేమో!
అలాగే “ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.” అనే అభిప్రాయం కూడా (అది వ్యక్తిగతమే కావచ్చు!) చర్చనీయాంశమే. అది వ్యక్తిగత “అభిరుచి”కి సంబంధించినది కాదు. అయితే, ఇది కూడా ఈ వ్యాస విషయానికి సంబంధం లేని అంశం. పై రెండు చర్చనీయాంశాలకి సంబంధించి మోహనగారి అభిప్రాయాలను నేను పూర్తిగా అంగీకరించను. అయితే అది వేరే చర్చ కాబట్టి, దాన్ని యిక్కడ కొనసాగించడం నాకు యిష్టం లేదు.
చివరిగా, నేను నా అసమ్మతిని తెలిపినప్పటికీ ఏదో కారణాలవల్ల అశ్మాచంగారు నన్ను “అండు కో”లో కలపడం మానలేదు. సరే అది వారి ఆనందం! అయితే నేరుగా నన్ను మాత్రమే ప్రస్తావించి సూటిగా ఏదైనా అడిగితే తప్ప వారికి నా దగ్గరనుండి స్పందన/సమాధానం రాదని మాత్రం మనవి చేసుకొంటున్నాను.
సంస్కృతములో కూడ రెండు యతి (పదచ్ఛేదము) camps ఉన్నాయి. భరతాదులకు యతి పట్టింపు లేదు, పింగళాదులు యతిని పాటిస్తారు. వృత్తాదుల ముద్రణలో కూడ బేసి పాదముల అంతమును ఒక నిలువు గీతతో (|), సరి పాదముల అంతమును రెండు నిలువు గీతలతో (||) సూచిస్తారు. సరి పాదాంతములో యతిని almost విధిగా పాటిస్తారు. బేసి పాదాంతములో కూడ “సామాన్యముగా” (most of the times) పాటిస్తారు.
తమిళములో “సామాన్యముగా”, తెలుగులోకంటే ఎక్కువగా, గణములకు (శీరులు) తగ్గట్లు పదములను ఎన్నుకొంటారు. అదే విధముగా పాదాంత యతి కూడ.
తెలుగు దేశి ఛందస్సులో “సామాన్యముగా” పాదాంతయతి ఉంటుంది. ద్విపదలో, రగడలో ఇది తప్పని సరి (a must). కాని సూర్యేంద్ర గణములకు తగ్గట్లు, మాత్రాగణములకు తగ్గట్లు పదముల విఱుపులు తక్కువ. తాళబద్ధమైన రగడలు ఈ విషయములో కొద్దిగా మేలు. కాని అక్కడ కూడ రెండు మాత్రాగణములను కలిపి వ్రాసిన కవులు ఉన్నారు.
ఏ పద్యమునైనను, వచనమునైనను, తుదకు మాటలను కూడ రాగయుక్తముగా పాడుకొనవచ్చును. కాని అన్నిటిని తాళయుక్తముగా పాడుకోలేము.
అతి స్వేచ్ఛతో వ్రాసే చంపకోత్పలమాలలలో కూడ కొన్ని నియమములను పాటిస్తే వాటిని పాడుకొనడము మాత్రమే కాదు, తాళబద్ధముగా కూడ పాడుకొనవచ్చును. ఈ మాలికా వృత్తములలో 4,5,5 – 4,5,5 మాత్రలతో, 6,4,4 – 6-8 మాత్రలుగా పదముల విఱుపులున్నప్పుడు వాటిని తాళయుక్తముగా పాడుకొనవచ్చును. ఇలాటివి ఇతర వృత్తములకు కూడ సాధ్యము.
సంస్కృతంలో పాదాంత యతి (విరామం) విషయకమైన శ్రీ మోహనరావు గారి వ్యాఖ్యను చదివి, దానిని గురించి ఈ నాలుగు మాటలు వ్రాయాలనిపించింది:
‘పాదాంత యతి’ అంటే ప్రతిపాదం చివర పదం పూర్తయి, మరొక కొత్తపదంతో మరుసటి పాదం ప్రారంభం కావటం అన్నమాట. ఒక పాదానికి, మరొక పాదానికి నడుమ సంధికార్యం జరిగే వీలుండదని దీని అర్థం. నిజానికిది సంస్కృతంలో బహుళంగా కనుపించే దృగ్విషయమే కాని, “లాక్షణికనియత” మైనట్లు లేదు. పాదాంత యతి భగ్నమైనందుకు వేద వాఙ్మయం నుంచి, లౌకిక సాహిత్యం నుంచి కొన్ని ప్రమాణాలు:
లక్షణశాస్త్ర చారిత్రిక పరిణామక్రమంలో తొలిరోజులలో నిజానికి 2 – 3 పాదాల మధ్య మాత్రమే పాదాంతయతి విధింపబడినదని; 1 – 3, 3 – 4 పాదాల మధ్య పాదాంతయతి లేదని భావింపవచ్చును. అందుకు సామవేదచ్ఛందోవిచితిలో చెప్పబడిన లక్షణం:
పాదాంతయతి పాటింపబడనందుకు ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ ఉదాహరణలున్నాయి.
సంస్కృతంలో 1-2; 3-4 పాదాల మధ్య ఆ పాదాంతయతి తప్పనిసరి కాదు అది కవిప్రయోగాలలో రూఢమై, శ్రావ్యసుభగమైన ఒక సమయగతపాలనమే కాని, శాస్త్రవిహితం కానేరదు.
ఒక పద్యమైనా, గీతమైనా, ప్రబంధ గద్యమైనా, కవి తనకు తెలిసి వ్రాసినా, తెలియక కూర్చినా “ఛందస్సు” అనే అతివిస్తృతమైన కట్టుబాటులోనికి (“ఛన్దోహీనో న శబ్దోఽస్తి, నచ్ఛన్దశ్శబ్దవర్జితమ్”) ఇమిడిన తర్వాత అది గానయోగ్యమే అవుతుంది. పాదాంతయతికి, ఎక్కడికక్కడ పదాల విరుపుకు ఆ గాన”యోగ్యత”తో లాక్షణికాన్వయం ఉండదు.
ఛందస్సులో ఉన్నదంటేనే అది తంత్రీలయసమన్వితమై, “పాఠ్యే గేయే చ మధురం” అవుతుంది. పాదాంతయతి, యతిస్థానం వద్ద పదచ్ఛేదం లేని తెలుగు పద్యాన్ని ప్రసిద్ధమైన గతిలోనే గాక వివిధగతులలో హాయిగా పాడుకోవచ్చును. ఏ భాషలోని పద్యానికైనా, గద్యానికైనా, తాళవృత్తానికైనా, గీతికైనా గానయోగ్యత ఉంటుంది. దానికి “రాగ-తాళనిర్దేశం” అన్నది స్వచ్ఛందమూ, ప్రాసంగికమే కాని, లాక్షణికనియతం కాదు.
కొన్ని అక్షరాలు చేరితే పదములవుతాయి. కొన్ని పదములు చేరితే వాక్య మవుతుంది. కొన్ని వాక్యములు చేరితే ఒక paragraph అవుతుంది. అదే విధముగా సంగీతములో కొన్ని స్వరములు చేరితే స్వరపదములు అవుతాయి, ఆ స్వరపదములు కొన్ని చేరితే musical phrase అవుతుంది. స్వర పదముల మధ్య కాని, స్వరపదముల సముదాయముల మధ్య కాని ఒక విరామము (pause) ఉంటుంది. ఈ విరామము అన్ని విధములైన సంగీత శాఖలలో ఉంటుంది. సంగీతములో ఈ విరామము ఛందస్సులోని పదచ్ఛేదయతి వంటిది. ఉదాహరణముగా – తనతననా తనతననా తనతననా తానాతానా తనతననా అని ఉంటే దానికి బదులు సరిగరిగా సరిగరిగా సరిగరిగా సారీసారీ సరిగరిగా అని పాటలో ఉంచుకొనవచ్చును. అప్పుడు వీటి మధ్య విరామము ఉంటుంది. పదములు వీటికి సరిపోయినట్లుగా ఉండకపోతే వినడానికి బాగుండదనే నా ఉద్దేశము. ఒక భాషా-పదము రెండు సంగీతస్వరపదముల మధ్య వ్రేలాడుతూ ఉంటే దానిని ఉచ్చరింఛి రంజింప చేయుట కష్టమే. అందుకే పదచ్ఛేదయతి, పాదాంతయతి గేయములలో అత్యవసరము.
ఇంద్రవజ్రగతి అన్నది serious గానా లేక అశ్మాచంగారి వేళాకోళమా? వారి కామెంటులు చదువుతూ ఉంటే నా బుఱ్ఱకు ఏది హాస్యమో కాదో అన్నది తెలియకుండా ఉన్నది. I am humor impaired, you see! ఇంద్రవజ్రకు ఒక గతి ఉన్నది. ఐదుమాత్రలు, నాలుగు మాత్రలు, ఐదు మాత్రలు, నాలుగు మాత్రలు –
మాణిక్య | వీణాం | ఉపలాల | యంతీం. ఈ 5,4,5,4 గతి ఖండజాతి త్రిపుట తాళానికి సరిపోతుంది, ఉదా. ఓ బాటసారీ నను మఱువకోయీ.
“పోనీలే రచయిత గారు చాంతాడంత కామెంటులో చిటికెడంతముక్క నా అభిప్రాయం అని కనీసం చెప్పినారు.”
అందులోని నిజానిజాలను విమర్శించి ఉంటే సంతోషపడి ఉండేవాడిని. ఏదో చాంతాడు, నైలాన్ తాడు, అని అంటే ఏమి అర్థమవుతుంది?
“ఇక ఈ వ్యాసానికి మీకు నాకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాం ఆనందార్ణేభ్య: అర్ణవమస్తు నిత్యం ఈమాటా: సమస్తా సుఖినోభవంతు!”
ఇలా వ్యాసాన్ని అపహసించకుండా స్వంత పేరుతో my dear friend శ్రీమతి లైలావలె వ్రాస్తే బాగుంటుంది కదా? Let us meet next time, lailA gAru!
ఛందస్సు “బంధనభ్రష్టో గృహకపోతః” వంటిదండి. ఆ కపోతం పండితులకు సంబంధించినదే, అయితే ఆ శ్రీశ్రీని గురించిన వినోదవిహారవ్యవహారచోద్యమంతా చూస్తూ ఉంటే – అది పోయిన కాలంలో కానివ్వుడు, ఈ కాలంలో కానివ్వుడు, రాబోయే కాలంలో కానివ్వుడు – ఆ కపోతమును ఎవరింట్లో బంధించి ఉంచాలనుదాని మీద గొడవలెక్కువగా ఉన్నట్లుగా నాకు అనిపించుచున్నది.
పోయిన ఆ శ్రీశ్రీ – కాపీ అయితేనేమిరా మరి కాఫీనైతేనేమిరానంటూ, నానారకాల కాపీలతో, విపరీత ప్రయోగాలతో ఛందస్సు లేదు దిక్కుమాలిన సంతా లేదు, నా వర్డ్ పవరే పెద్ద వింతా సంతా అంటూ పండితులను అలరించడానికి కాకుండగా పామరుల కోసమూ, సామాన్యుల కోసమును రాసి, తన మింతకకు వారిని చుట్టుకొని పోయినాడు.
ఆయనను, ఆయన రాతలను మోసుకు తిరిగినది, జనాల యందు పరుగులెత్తించినది ఆ పామరులేనన్నది జగమెరిగిన సంగతి సత్యము. పామరులు పరుగులెత్తించగా, బంధించగల శక్తిగల మాకేం తక్కువని ఇక ఆ భూతవర్తమానభవిష్యత్ కాలాల్లో ఛంద: పండిత బిరుదాంకితులు గృహాలొదిలి “బ్బొబ్బొబ్బో” అని ఆ కపోతము కోసము పోతరాజుల్లా బజారులో పడినదీ సత్యమే.
ఛంద: పరిఙానం వున్నా లేకున్నా ఆయా పండితులకు ఆలంబనమోతగా ఒక సమూహ చమూచరులు కొంతమంది కరతాళధ్వనులు చేస్తూ ఉండటమందు ప్రసిద్ధులు. ఈ చమూచరులను సోషలు మీడియానందు, బ్లాగులనందు, అండపిండ అంతర్జాలమునందు చక్కగా చూడవచ్చును. వారి వలయమందు చిక్కుకొని అసలు ప్రశ్నలు వదిలి వేసి, సరియైన సమాధానము చెప్పక తప్పించుకొను పండితులూ ఉండినారు, ఉన్నారు, ఉంటారు.
మొత్తానికి లైలా గారు మంచి ప్రశ్నలతో దుమ్ము దుమారం లేపినారు. వారు పండితులు కాదన్న సంగతి తెలిసినప్పుడు, పండితులు కాని వారి ప్రశ్నల్లోని జోరు అట్లాగే ఉంటుందన్న సంగతి తెలిసీ తెలియక, అద్దానిని సహించలేకో, సమాధానములు తెలియకనో వారు ఎగతాళిగా మాట్లాడినారు అన్న ముద్ర వేసుటకు ప్రయత్నించినారని అనిపింపు.
సమాధానము ఒక మెట్టు దిగి చెప్పే ప్రయత్నము చేయకుండగా ఆ దుమ్మును మరింత ఎగదోయుటకు ప్రయత్నములు మటుకు జరిగినవి. ఇక్కడ లైలా గారు నాకు తెలియదు. మోహనరావు గారు నాకు తెలియదు. మధ్యలో కామేశ్వరరావు గారనువారు వచ్చి, (ఈయనా నాకు తెలియదు) ఆవిడ ప్రశ్నలలోని సమాచారములో తనకు కావలసినదాన్ని, తనకు తెలిసినదానిని పట్టుకొని ఆ భాగమును మరింత ఆసక్తికరమైన రంభము దిశగా మరల్చినారు.
అంతా అయోమయముగానున్నది. అయము (ఇనుప) తెర చేదించటం చాలా కష్టము కావున, “తదో గణ్డస్స ఉవరి పిణ్డిఆ సంవుత్” కావున – స్వస్తి వాక్యము పలకవలెను. ఇపుడు నీకేమి అర్థమయినదో నీవు చెప్పు, వీలైతే నీవే సమాధానము చెప్పుమని, నీవునూ అపరిచితాపరిపక్వుడివని, నీవంటి పామరునకు సమాధానమేమియని రచయిత, ఇతరులు అనవచ్చును. దానికి నా సమాధానము ఒకటే. ఆవిడ వేసిన ప్రశ్నలు నిజసత్యసమంజసమైనవి. వాటికి జవాబు వెతకటము, ఇవ్వటము దాదాపు అసాధ్యం. ఆ సత్యాన్ని ఎవరికి వారు తెలుసుకొనవలసినదే!
ఆవిడ ప్రశ్నలు నాకు నచ్చినవి కావున, ఆవిడకు జోహారులు పలుకుతూ ఇంకొక వ్యాసము చదువుకొనెదను. మీకు నచ్చలేదు కావున మీ పని మీరు చేయుడు.
ఛందస్సు రెండు విధములు – వైదిక, లౌకిక ఛందస్సులు. వైదిక ఛందస్సులోని శ్లోకాలను పఠించేటప్పుడు ఊనిక, అనగా stress లేక accent అవసరము. అందుకే అవి శ్రుతులు అయ్యాయి. సామాన్యముగా వైదిక ఛందస్సు కనీసము half octave పరిమితిలో ఉదాత్త, అనుదాత్త, స్వరితములతో సాగుతుంది. గురువు (మనిషి) దగ్గర వీటిని నేర్చుకోవాలి. తరువాత లౌకిక ఛందస్సులో ఈ ఊనికకు బదులు గురు లఘువులు పుట్టాయి. ఈ గురులఘువులే ఇంద్రవజ్ర కాని శార్దూలవిక్రీడితము కాని, ఇతర వృత్తములకు కాని ఇవి ఇటుకరాళ్ల వంటివి. సంస్కృత కావ్యములన్నియు ఇట్టి వృత్తములతో వ్రాయబడినవి. నాటకయుగము వచ్చిన తరువాత నాటకములో జనరంజకత్వానికి గీతములు, గీతములవంటి పద్యములు పుట్టాయి. ఇవి మాత్రాఛందస్సుపైన ఆధారపడినవి. గాథా లేక ఆర్యా, వైతాళీయములు ఇట్టి కోవకు చెందినవి. అంతే కాక తోటకము, దోధకము, స్రగ్విణి, ఇంద్రవజ్రము లాటి తాళ వృత్తములను వీటిలో వాడారు. ఇవన్నీ పాడ దగినవి. గురువు రెండు మాత్రలకు లేక కళలకు సమానము, లఘువు ఒక మాత్ర. ఇవి ఉచ్చరణకు కావలసిన సమయము. కావున మాత్రను syllabic instant అని పిలుస్తారు. లౌకిక ఛందస్సులో accent or stress స్థానమును ఈ గురులఘువులు ఆక్రమించాయి. పాటలలో తాళవృత్తములలో ఊనికకు బదులు pitch or frequency ముఖ్యము. భారతీయులు ఆంగ్లమును మాటలాడు నప్పుడు కూడ ఒకే గొంతుతో మాటలో హెచ్చు తగ్గులు లేకుండ మాట్లాడుతారు. అందుకే పశ్చిమ దేశాలవారికి మన ఆంగ్లమును అర్థము చేసికొనడము కొద్దిగా కష్టమే. ఆంగ్లములో కవిత్వము ఈ ఊనికపైన ఆధారపడినది. భారతీయ భాషలలోని ఛందస్సు అక్షరముల కాల పరిమితి (హ్రస్వ దీర్ఘములు) పైన ఆధార పడి ఉంటుంది. సంగీతములో కూడ ఈ పరిస్థితియే. Decibels తేడా ఎక్కువ ఉండదు. Swinburne’s “A Match” లో మొదటి రెండు పంక్తులు –
If love were what the rose is, (7 syllables)
And I were like the leaf, (6 syllables)
పద్యమంతా ఈ 7, 6 syllables తో మాత్రమే అల్లబడినది. ఈ syllable గురువైనా, లఘువైనా కావచ్చు. ఈ పంక్తులను చదివేటప్పుడు మార్చి మార్చి ఊనిక ఇవ్వబడుతుంది. దీనిని శ్రీశ్రీ ఆనందార్ణవ ఛందస్సుతో పోల్చరాదు. అక్కడ పాదానికి 14 మాత్రలు, పాద మధ్యములో, పాదాంతములో విరామము ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష అందము, అంతే!
నేను ఈమాట పత్రికలో వ్రాసిన రెండవ వ్యాసము శంకరాచార్యుల స్తోత్రములలోని ఛందస్సుపైన, అందులో ఉపయోగించబడిన వృత్తములకు ఉదాహరణములను ఇస్తూ, వాటిని అర్థము చేసికొనుటకై నేను తర్జుమా చేసాను, అంతే. అది కవిత్వమని నేను చెప్పుకోలేదు, అందువలన అందులో కవిత్వము లేదని చెప్పడము చచ్చిన గుఱ్ఱాన్ని లాఠీతో కొట్టడమే!
శ్రీశ్రీ పాడుకోడానికి అనువుగా ఉండడానికే గేయ రూపములో నియమితమైన మాత్రల సంఖ్యతో వ్రాసినాడు. లైలాగారు అన్నారు – “Sri Sri is not thinking of 6-4-4.” On the other hand, SriSri IS THINKING of 6-4-4!
ఇది నాకు అర్థము కాలేదు, ఒక వేళ వేళాకోళమా? అనుబంధములోని నా ఉదాహరణములను గురించియా? శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో ఉండే వసంతతిలక వృత్తములు, తోటక వృత్తములు ఇవి పాడుకొన దగినవే. శ్రీశ్రీ చతుర్మాత్రా ఛందస్సులో తోటక వృత్తపు ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి.
“In terms of metrics, I feel Sri Sri is thinking more along lines of stressed syllables and end rhymes, of English poetry. ఆనందం అర్ణవ మై తే has Four stresses. So does అనురాగం అంబర మై తే. ‘A match.’ Looks like an Iambic tetrameter to me.”
Interesting! “end rhymes” I understand, but not “stress”.
“ఆనందం అర్ణవమైతే” – ఇందులో ఉన్నవి four stresses ఎలానో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి “Stress” అన్నది అచ్చుపైనుండే ఊనిక. ఇంగ్లీషులో ఒక పదంలో సాధారణంగా రెండు syllables కన్నా ఎక్కువ ఉండవు. కాబట్టి ఒక పదంలో సాధారణంగా ఒకటే stress ఉంటుంది. కాని తెలుగు పదంలో ప్రతి అక్షరమూ ఒక syllable. “ఆనందం” అనే పదంలో మూడు syllables ఉన్నాయి. ఇందులో దేనిపై stress ఉన్నట్టు? నాకు తెలిసి తెలుగులో ఆ పదం పలికినప్పుడు మూడింటిపైనా సమానమైన ఊనికే ఉంటుంది. అందుకే తెలుగు భాష ఇంగ్లీషులా Stressed language కాదు. “ఆనందం అర్ణవ మై తే” అన్నదానిలో ఉన్నవి నాలుగు “stops” లేదా “breaks”. అంచేత దాన్ని నాలుగు “మాత్రాగణాల” వాక్యంగా పరిగణించవచ్చు. ఒకో గణమూ కొన్ని మాత్రల సమాహారం. 6-4-2-2 అనే గణాలు. ఇది 6-4-4 అని కూడా అనుకోవచ్చు. ఆ కవితలో తక్కిన పాదాలకి కూడా ఇదే అన్వయం. అదే మోహనగారు చెప్పింది కూడా.
తెలుగు భాషకి “stress”ని ఎలా అన్వయించవచ్చునో లైలాగారు వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.
“If you were queen of pleasure
And I were king of pain”
నాకున్న కొద్దిపాటి ఇంగ్లీషు పరిజ్ఞానంతో నాకు తోచినదేవిటంటే, యిందులోని రెండో వాక్యం Iambic tetrameter. మొదటిది మాత్రం – x / x / x / x” – tailless iambic pentameter? అనిపిస్తోంది. A Match కవితలో ఈ రెండు రకాల నడకలూ కనిపిస్తాయి. అయితే వాటికి కచ్చితమైన order అంటూ ఏదీ లేదు. శ్రీశ్రీ గేయంలో మాత్రం 99% పాదాలన్నింటా 6-4-4 నడక కనిపిస్తోంది. అలాగే మోహనగారు చూపించిన ఇతర కవితల ఉదాహరణల్లోనూ ఇదే ఛందస్సు ఉంది. మాత్రాఛందస్సు విషయంలో ఇంగ్లీషులో “stress” లాగా పెద్దగా ambiguity లేదు.
అంచేత “Sri Sri is not doing Traditional Telugu syllabic -One long, one short count.” అని ఎందుకన్నారో లైలాగారు వివరించాలి (లైలాగారి వ్యాఖ్యలో ఆ వివరణ ఉందేమో, నా బుఱ్ఱకి మాత్రం అర్థమవ్వలేదు!)
కృష్ణశాస్త్రి, విశ్వనాథల ప్రభావం నుంచి తప్పించుకొని గురజాడ మార్గంలో కవిత్వం వ్రాయడం మొదలుపెట్టానని శ్రీశ్రీ చాలాచోట్ల గర్వంగా చెప్పుకొన్నాడు. అలాగే “గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం నుండి మాత్రాబద్ధ ఛందస్సుల ప్రజాస్వామ్య యుగానికి ఆంధ్ర సాహిత్య చరిత్ర గమనాన్ని పరివర్తన చేసినవాడు గురజాడ” అని, గురజాడ ప్రత్యేకతను కూడా స్పష్టంగా చెప్పాడు. అంచేత శ్రీశ్రీ గురజాడ ప్రభావంతో తన కవిత్వానికి మాత్రాఛందస్సు స్వీకరించాడనుకోడంలో సందేహం అక్కరలేదు.
శ్రీశ్రీ పైన పాశ్చాత్యకవిత్వ ప్రభావం చాలానే ఉంది కాని, ఛందస్సు విషయంలో కూడా అది ఉంది అన్న లైలాగారి అభిప్రాయాన్ని ఒప్పుకోవాలంటే, దానికి మరింత విశ్లేషణ వివరణ అవసరం. ఆ దిశలో ఇప్పటికే ఎవరైనా విమర్శ చేసారేమో నాకు తెలీదు. చేసుంటే కనక, అది తెలిసున్నవాళ్ళెవరైనా ఇక్కడ పంచుకొనమని నా వేడుకోలు. లేదంటే, లైలాగారే ఆ పని చేపడితే బహుబాగుంటుంది!
ఐనా, ఆ తెలుగుసేతలు – ఆయన వ్యాసంలో రాసినపుడు, శంకరాచార్యుని అందమైన రచనలను, రకరకాల ఛందస్సులను పరిచయం చేస్తూ, ప్రతిదానికీ అర్ధం చెప్పక పోతే తెలియని నా లాటి మూఢమతులకోసం జె. కె. మోహన రావు గారు, పెద్ద మనసు చేసి, ఓపికతో, తేలిక భాషలో చెప్పినవి. వాటి ఉపయోగం అంతవరకే ఐనా, అది నా వంటి ఆరంభ దశలోని చదువరులకు చాలా మేలు.
త్యాగరాజు, అన్నమయ్య, రామదాసులలో, నాకు, సంగీతానికి, సాహిత్యానికీ, త్యాగరాజే గొప్ప. సింపుల్ గా “సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మాకు తండ్రి” అన్న దగ్గరే అది డిసైడ్ ఐపోయింది.:-) క్లాసికల్ సంగీతంలో ఏ మాటల వల్ల, గాయకులకు పాడటానికి ఏం బాధ? పాడ చేత కావాలి. కర్ణాటక సంగీతము పాడే వాళ్లకు, సాహిత్యం అర్థం చెప్పి, సరైన ‘voice training’ ఇప్పిస్తే, ఎన్నో మనసు రంజింప చేసే రచనలు ఉన్నయ్యి. I don’t know the current music publishing software status for Karnataka music. I like to find out.
Coming to Sri Sri’s poetry, అద్వైతం- The title and some stanzas reflect, he is taking some of the content and theme from Swinburne’s poem – ‘A match.’ For instance:
“If you were queen of pleasure
And I were king of pain”
Becomes
“హసనానికి రాణివి నీవై
వ్యసనానికి బానిస నీవై,”
“If you were April’s Lady
And I were Lord in May”
Perhaps becomes
“వాసంత సమీరం నీవై
హేమంత తుషారం నేనై”
In terms of metrics, I feel Sri Sri is thinking more along lines of stressed syllables and end rhymes, of English poetry. ఆనందం అర్ణవ మై తే has Four stresses. So does అనురాగం అంబర మై తే. ‘A match.’ Looks like an Iambic tetrameter to me. To sing somewhat upbeat like – ‘For he is a jolly good fellow, for he is a jolly good fellow.’ Sri Sri is not doing Traditional Telugu syllabic -One long, one short count. He is a beginner poet. All he is doing is trying out to write differently from before. His previously written classical Telugu poems are downright ghastly. He definitely needed something new, to stay in the game. He would not be chanting his poetry in -Venkateswara suprabhatam style, which every Telugu hears every Saturday morning. (A few lines partially randomly used. Don’t start counting syllables.)
Sri Sri is not thinking of 6-4-4, or, ధృవ తాళము. (He might have favored Gurazäda’s fourteen syllabic count lines. It’s a nice comfortable length.)
I really don’t like అద్వైతం. It’s poor poetry. Worse than ‘A match.’ The poet is just ‘working’ the words. (To take T.S. Elliot’s expression.) There is no cohesive meaning. Sometimes you get doubts whether there is a man and a woman – two lovers – in Sri Sri’s poem or whether he is addressing a group of people. వేస్తాం, తీస్తాం, పరిహాసిస్తాం, పరిపాలిస్తాం, ప్రపంచమును, భవిష్యమును, all so bombastic and pseudo grand. Well, as I grumbled a few times before, here and there, Sri Sri is not a favorite of mine. He will never be one.
(But if I sing వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై -my way, it is getting a new life. I would not mind editing the poem, giving it a track in ‘my Album’)
When it comes to Gurajada, in the context of this essay, yes, he really wrote a nice Telugu song. “దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” చక్కని తెలుగు పదాలు, చక్కని భావం. గేయము పాడేవారు పాట సొగసును పెంచవచ్చు. చేతకాకపోతే దించవచ్చు.
గురజాడ కవి తన ఛందస్సును గురించి చెప్పినాడు. (Thanks Sayee garu for providing an essay.) And I read some poetry of his. “మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కకు, మనుషులంటే రాయి రప్పల కన్న కనిష్ఠం గాను చూస్తావేల బాలా!” It’s nice work. Nice awakening thought. (Someone sang it on you tube. It is downright horrible.)
Reading this essay, lead me to re-read many more of J.K. Mohana Rao’s essays on chandassu, (I have been reading him for ten years now.) I checked on a few others, namely A.J. Swinburne, (a remarkable rhyming capacity, ‘The Roundel’ is a joy) Tennyson, Shakespeare, some criticisms of Ezra Pound, (beautiful translation by K.V.S. Ramarao, in this magazine.) And excerpts from T.S. Eliot -Sacred Wood. I enjoyed the whole process. (And more so conversations of literary friends in the magazine.) Gained more insights into music and poetry – writing, and reading. Thanks.
Lyla
నేను మన కవులు పాటలను వాగ్గేయకారులకు వదిలారు, తాళ వృత్తములను అలా వ్రాయలేదని మాత్రమే. ఇకపోతే వాగ్గేయకారులు అలా పదములను విఱువకుండ పాడుటకు వ్రాసినారా అనే ప్రశ్నకు ఉత్తరము మీ వ్యాఖ్యలోనే ఉన్నది. కాని ప్రయత్నించారని చెప్పవచ్చును. నా ఉద్దేశములో అన్నమయ్య, రామదాసు ఈ విషయములో కృతకృత్యులయ్యారు.
లైలా గారు,
“కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం?”
కారణములు – (1) అలా అడగవలసిన బాధ్యత రచయితది లేక సంపాదకులది. (2) ఒక శుభకార్యమునకై ఒక వ్యక్తి అడిగినపుడు, మనకు తెలిస్తే మనము సహాయము చేయాలి. (3) ఆ వ్యక్తి చిరునామా నాకు తెలియదు కావున ఇక్కడే ఆ అభిప్రాయమును చెప్పవలసి వచ్చినది. (4) ఇటువంటి సంబంధము లేని ప్రశ్నలకు సంపాదకులు మఱొక చోటు ఉంచితే బాగుంటుందేమో?
“తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?”
శుభలేఖలను తెలుగులో మాత్రమే కాకుండా ఆంగ్లములో కూడ ప్రచురిస్తారుగా, అందువలన దానిని కూడ జత చేసాను.
“వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression.”
నా రచనలలోని విషయాలను అనవసరముగా sidetrack చేసినప్పుడు నేను అలా చేయకండని అభ్యర్థించడము సబబే అనుకొంటాను.
“ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు.”
శ్రీశ్రీ చెప్పనంత మాత్రాన వ్యాసకర్త అభిప్రాయము తప్పు కాదు. Swinburne వ్రాసిన A match లో 7, 6 syllables ఉన్నాయి. అందులోని సారాంశమును శ్రీశ్రీ గ్రహించాడు, syllabic arrangement కాదు.
“గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా?”
అది ఛందస్సు పేరు. నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, సుభద్ర, పూర్నమ్మ అనుబంధము ఇవన్నీ ముత్యాలసరాలు అనే పేరితో ఎమెస్కో వారు ప్రచురించారు. అందులో ముత్యాలసరాలపైన అప్పారావు వ్యాసము ఒకటి ఉన్నది.
“మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.”
ఈమాట శ్రీ వేలూరిగారిని కూడ అడగండి, వారు ఒకప్పుడు 20వ శతాబ్దములోని మహాకవులు విశ్వనాథ, శ్రీశ్రీ అన్నట్లు గుర్తు. జగద్గురు మధ్వాచార్యులు మాత్రాఛందస్సును ద్వాదశస్తోత్రములో వాడినారు. కాని జగద్గురు శంకరాచార్యులు మాత్రాఛందస్సును ఎన్నో స్తోత్రములలో వాడినారు, శ్రీశ్రీకి స్ఫూర్తి ఇచ్చినది ఆ రచనలే.
In the comments essayist says: “ఇకపోతే లైలాగారు రెండవ అంశములో “2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”చెప్పినవి digression కాక మఱేమిటో?”
పక్కనే ఇంకో అభిప్రాయ వేదికలో, అశోక వనంలో సీత గురించిన పద్యం శీర్షికలో, విశ్వనాథ పద్యం గురించి వీరు ఏం చర్చ చెయ్యలేదు. పద్యం పైన వ్యాఖ్యను గురించి నోరు మెదప లేదు. కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం? పైగా, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో తనకు నచ్చిన పద్యం అంటూ రాసారు. తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?
వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression. ఈ మాట మేగజీన్ లో అన్ని అభిప్రాయాలూ అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. నిజంగా వేరు వేరు గదుల్లో, గోడలు అడ్డు ఉంటే, ఒకచోట డైగ్రెషన్ అంటూ, అవతలకు వెళ్లి వారు అదే పని చేస్తున్నట్టు అందరికీ తెలియదు కదా.
In the essay Essayist says: “మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే). ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి…”
భారతం, భాగవతం, ప్రబంధాల లోని పద్యాలు చదువుతున్నప్పుడు ఇది చంపకమాల, ఉత్పలమాల, సీసం, అని కవి చెపుతాడు. ఆ పద్య లక్షణాలు వారికి తెలుసు. మహీధర నళినీ మోహన్ –మాత్రా ఛందస్సులో మేఘసందేశం – అన్న తెలుగు పుస్తకంలో -మాత్రా ఛందస్సులో ఆయన ఎంచుకున్న గణములు, పాదములో గణముల సంఖ్య, పద్యం లోని పాదాల సంఖ్య ముందుగానే చెప్పారు. ఆ యా రచనలలో వారి కూర్పుల గురించి ఆ రచయితలు స్వయంగా సమాచారమిచ్చారు.
ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు. ‘అద్వైతం’ గేయం చివరి దాకా పఠించగలిగితే – అక్కడ ఏ. సి. స్విన్బర్న్ కవికి, ప్రత్యేకంగా A match అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో, 1936(?) – అని మహాప్రస్థానం పుస్తకంలో ముద్రించబడి ఉన్నది. ఏమి మార్గము శ్రీ శ్రీ కవికి -స్విన్బర్న్ నుండి లభించింది అన్న ప్రసక్తే తేలేదే ఈ వ్యాసకర్త? విచిత్రం. కవి చెప్పినది వ్యాసకర్త ఉపేక్ష చెయ్యటం. ఎందువల్ల? వ్యాసకర్త స్విన్బర్గ్ A match చదివారా? అతని ఇతర కవిత్వం చదివారా? శ్రీ శ్రీ కవితలోని వాక్యము -6,4,4 గానే ఎందుకు తను విభజించారో, అలా తీర్మానించుకోటానికి బేసిస్ ఏమిటో, ఈ వ్యాస రచయిత చెప్పాలి. అదంతే, అక్కడ అదే ఛందస్సు ఉంది అనేస్తే చాలదు.
మేగజీన్ చదువరులకు నా ప్రశ్నలు:
1. గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా? గురజాడకు సంగీతములో ప్రవేశముందా? అతని కవితలకు అతడు స్వరములు కూర్చాడా?
2. ఈ పత్రికలో ‘ముత్యాల సరాలు’ అన్న మకుటంతో ఒక కవిత ఉంది. అది కవి ఏ ఛందస్సులో వ్రాసారు? దాని పేరేమిటి?
Lyla
P.S: ఓరి నాయనో! మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.
ముందుగా … నవంబరు 26వ తేదీన రాసిన అభిప్రాయంలో రెండు తప్పులు దొర్లాయి. 1. “… తలంబ్రాలుగా శిరమున మెరిసిన” అని ఉండాలి. 2. “సీతారామ కల్యాణం” లోని ఆ పాట సముద్రాల జూనియర్ రచన అన్నాను. కానీ సినిమా పాటల పుస్తకంలో సముద్రాల రాఘవాచార్యుల (సీనియర్) రచన అని ఉంది. [కొన్ని చోట్ల “సముద్రాల” రచనగాను, ఒక సందర్భంలో సముద్రాల జూనియర్ రచనగాను చెప్పబడింది.]
విశ్వనాథ రాసిన సొగసయిన పద్యాన్ని, బృందావనరావుగారి మంచి వర్ణనని వదిలేసి సినిమా కబుర్లు చెప్పడం భావ్యం కాదు కనుక “జానక్యాః కమలాంలాంజలిపుటే” శ్లోకానికి మరొక తెలుగు సినిమా 🙂 అనుసరణను ప్రస్తావించి ఈ చర్చనుండి తప్పుకుంటాను. ఆరుద్ర “సంపూర్ణరామాయణం”లో (1972) “ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు…” అని ఒక పొడుగాటి పాట రాసారు.
ఆయనే రెండేళ్ల తరవాత వచ్చిన “సీతాకల్యాణం”లో
“తెల్లని ముత్యములెర్రగ మారి
ఎర్రనివేమో నీలములవుతూ …” అని కూడా రాసారు.
భవదీయుడు,
శ్రీనివాస్
తా.క. “అందమె ఆనందం’గా ‘బ్రతుకు తెరువు’కి ఒకే పాటలో తెలుగు చేసినది తండ్రి గారా? తనయుడా?” అన్న ప్రశ్నకి నా వద్ద కచ్చితయిన సమాధానం లేదు. పాటల పుస్తకం, రికార్డులు, కొన్ని ఇంటర్యూలు .. వీటి ప్రకారమయితే అది తనయుడి పాట. అసలు తండ్రీ కాదు, తనయుడూ కాదు, రాసింది మరొక పెద్ద మనిషి అనే వాదం కూడా ఉంది.
“What does that mean? A misleading sentence right in the beginning of the essay. Neither Gurajada nor Sri Sri wrote poetry to show case matra chandassu.”
గురజాడవారు వాడుక భాషలో మాత్రాఛందస్సును ఉపయోగించి వ్రాయుమని చెప్పగా, తాను వ్రాసినానని శ్రీశ్రీ చెప్పాడు. అంటే అట్టి మాత్రాఛందస్సుకు అగ్రస్థానము నిచ్చాడనియే కదా దాని అర్థము? అంతకుముందు శ్రీశ్రీ వృత్తములలో, జాత్యుపజాతులలో తన కవిత్వమును వ్రాసియుండెను, అట్టి కవితలకు ఉదాహరణమును ఇక్కడ ( http://eemaata.com/em/issues/201001/1530.html?allinonepage=1 ) చదువ వీలగును. ఇట్టి ఛందస్సును త్యజించి, మాత్రాఛందస్సును మాత్రమే తఱువాత వాడియున్నాడంటే దానికి ఒక ఉన్నత స్థానము ఇచ్చాడనియే అని నేను అర్థము చేసికొన్నాను. ఇతరులు వేఱు విధముగా అర్థము చేసికొని ఉంటే దానిని విశదీకరించడము వారి కర్తవ్యము అవుతుంది.
ఇకపోతే లైలాగారు రెండవ అంశములో
“2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”
చెప్పినవి digression కాక మఱేమిటో?
పాటలను పాడుకొనేటప్పుడు దాని నడక, లయ – వీటికి తగ్గట్లు పదములు అమరినప్పుడు మాత్రమే శ్రోతలకు గొప్ప అనుభూతి లభిస్తుంది. పదములను గాయకురాలికి తోచినట్లు ఎక్కడిక్కడ నఱికి పాడితే అనుభూతి కలగడము కాదు అసహ్యము కలుగుతుంది. అలా నఱికి పాడిన పాటలు బాగుండవని ఎన్నో మారులు ఎందఱో చేసిన విమర్శలను నేను చదివియున్నాను.
భారాతాది గ్రంథములలో ఉండే అర్థవంతమైన పద్యాలను చదివి ఆనందించ వచ్చును. అదొక అనుభూతి. కాని అన్నిటినీ పాడుకోలేము, ముఖ్యముగా తాళబద్ధముగా పాడుకోలేము. ఈ ఆనందార్ణవ ఛందస్సు తాళబద్ధమైనది. ఆఱు, ఎనిమిది మాత్రలకు విఱుగుతుంది. శ్రీశ్రీ అలా ఎందుకు వ్రాసినాడంటే, అప్పుడే గేయపు నడక, లయ వాటిలో ప్రతిబింబిత మవుతాయి. శ్రీశ్రీ పాదాంత విరామమును కూడ పాటించాడు. ఇవన్నీ ఆ మహాకవి ఎందుకు చేసినాడంటే, వాటిని జనులు పాడుకొని ఒక క్రొత్త ఉద్రేకాన్ని పొందాలని.
ఉత్తర భారత భాషలలో, సంస్కృతములో, తమిళ, మలయాళములలో ఎక్కువగా పాదాంతయతిని వాడుతారు. అలా చేసినందువలన వాటికి గానయోగ్యత లభిస్తుంది. తెలుగు కన్నడ భాషలలో (ముఖ్యముగా తెలుగులో) సాహిత్యము రెండు భిన్న రీతులలో రూపొందినాయి. కావ్యములు పఠనీయములు మాత్రమే. అది సంగీతముతో ఎక్కువ సంబంధము లేకుండా రూపొందినది. వాగ్గేయకారులు రచించిన గీతులకు మాత్రమే గేయత్వము లభించినది. కవులు ఎక్కువగా ఈ వాగ్గేయకారులను, యక్షగాన కర్తలను సరకుగొనలేదు. ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.
అందుకే నేను గానయోగ్యతకు అనువైన వృత్తములను అభ్యసించడములో కృషి చేస్తున్నాను. అంతే కాదు, మనమెఱిగిన మాలికా విక్రీడితములను కూడా తాళబద్ధమును చేయ వచ్చునని నిరూపించినాను.
ఇతరులు దీనిని అంగీకరిస్తారో, అనుమోదిస్తారో, కనీసము బాగుందని ఒక మాటైనా అంటారో లేదో అన్నది వారికే నేను వదలివేస్తాను. కాని నాకు మనఃతృప్తి లభించినది దీనివలన. అది చాలు నాకు. ఎందుకంటే నేను “ఈమాట”లో వ్రాసిన 50 పైన వ్యాసములను ఇతరులు మెచ్చుకోలేదని అనుకొని ఉంటే అర్జునునిలా అస్త్ర సన్యాసము చేయడానికి ఉద్యమించి ఉండేవాడిని.
లైలాగారికి, తహతహగారికి, వేలూరిగారికి, అశ్మాచంగారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు!
“జానక్యాః కమలాంలాంజలిపుటే” శ్లోకానికి మీరు ఉదాహరించిన శ్రీమాన్ సముద్రాల రామానుజాచార్యుల వారి అనురణనం భవ్యంగా ఉన్నది. ఈ విధంగా కర్ణామృతములైన సంప్రదాయశ్లోకాలను తెలుగుచేసి సందర్భోచితంగా చలనచిత్రాలలో ప్రవేశపెట్టటం వారికొక వైనోదికక్రీడ. ఇది శ్రీకృష్ణాంజనేయయుద్ధం లోనిది:
మురళీధరరావుగారు: చేకూరి సిద్ధకవి అనువాదం గురించి నాకింతకుముందు తెలియదు. పూర్తి పద్యం అందించినందుకు నా ధన్యవాదాలు.
సినిమాపాట అయినందువల్ల పెళ్ళి శుభలేఖల్లో అచ్చు వేయడానికి సందేహిస్తారేమో కాని నాకు సముద్రాల జూనియర్ గారి “అనువాదం/అనుసరణ” అంటే చాలా ఇష్టం :).
జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరువురు మెరిసిన సీతారాముల కల్యాణము …
On a related note, there is a good translation (into English) of this popular Sanskrit chATu verse by Velcheru Narayanarao and David Shulman in: A Poem at the Right Moment – Remembered Verses from Premodern South India, Univ. of California Press, Berkeley, 1998.
వేలూరి వెంకటేశ్వరరావు గారి ప్రోత్సాహమునకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
నేను వివరించిన ముఖ్యమైన విషయములపైన చర్చను జరుపక వేఱు విషయములపైన చర్చ జరిగినందులకై ప్రధానాంశములపై చర్చ జరుపమని ప్రార్థిస్తూ అవేవో అన్న విషయమును నేను నా అభిప్రాయములో తెలిపినాను.
“Thank you …. I am sure it will be a smash hit in some circles.”
This appears to me to be a condescending remark, quite unnecessary in my opinion.
“అంటే శ్రీశ్రీ – ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను, display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా?”
325 విధములు వ్రాయవచ్చునని మాత్రమే తెలిపినాను. వాటినన్నిటిని శ్రీశ్రీ పరిశీలించి అందులో 78 ఎన్నుకొన్నాడని నేను ఎక్కడ చెప్పలేదు. అతని ఐదు కవితలలో ఉపయోగించబడినవి 78 ఛందస్సులు అని మాత్రమే తెలిపినాను.
“మీరు చేయగలిగిన పనులు, మీ రచనలలో మీరు చేసి చూపి మెప్పించవచ్చును. ఇతరులు సంకల్పించని, చేయని పనులను, వారు చేసారని చెప్పి, ప్రజలను ఒప్పించ లేరు.”
నేను వ్యాసపు ముగింపులో ఇలా వ్రాసాను – “శ్రీశ్రీ నేను ఆనందార్ణవము అని పేరుపెట్టిన 6-8 మాత్రల ఛందస్సును ఏ విధముగా సృష్టించాడో మనకు తెలియదు. కాని అది చంపకోత్పలమాలలలో, శార్దూల మత్తేభవిక్రీడితములలో అంతర్లీనమై ఉన్నదని ఇక్కడ నిరూపించినాను.” ఇందులో శ్రీశ్రీ ఏ రీతిగా ఏ ఆధారముతో ఈ ఛందస్సును సృష్టించినాడన్న విషయము మనకు తెలియదని స్పష్టముగా చెప్పాను. అది శ్రీశ్రీ సంకల్పించాడని నేను చెప్పానా?
“ఒక విధంగా చూసినట్లయితే, గేయములు నిజముగా ఏకపాద వృత్తములు! ఈ విషయము ఆశ్చర్యకరముగా కనిపించవచ్చును కాని ఇది ముమ్మాటికి నిజము.”
మొదటి అనుబంధములో ఇవి ఇవ్వబడినవి.
“No one needs that kind of research.”
Thanks for the kind encouragement. Again, I don’t carry out my research keeping such opinions in my mind. Thank God, I am not receiving any grants for my research from such people!
“అందుకే పదములను సరిగా విడదీసి పదచ్ఛేద, పాదాంత యతులను ఉంచితే పాడుకొనుటకు బాగుంటుంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయము.”
Thank you. When you are the lyricist, you can request your composer and singer, to sing it the way you like it to be sung. You can compel them, that they need you approval of the sheet music, and the recording, before it is released to the general public. I am sure it will be a smash hit in some circles.
‘ఛందస్సు సర్పపరిష్వంగము’ నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ ఎన్నో ఛందస్సు విధివిధానాలను పాటించాడు.
“ఈ ఆనందార్ణవఛందస్సును ఎన్ని విధములుగ కల్పించ వీలగును అనే ప్రశ్నకు జవాబును పరిశీలిద్దాము […]అందులో 78 విధములను శ్రీశ్రీ పై ఐదు కవితలలో నుపయోగించాడు.”
అంటే శ్రీశ్రీ – ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను, display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా? ఛందస్సు వద్దు మొర్రో, నాకు నిబంధనలు వద్దంటున్న శ్రీశ్రీ అలాటి పని ఎందుకు చేస్తాడు? అది మీకు నచ్చిన ఊహ. ఆ ఊహను అతని ఛందోపరిజ్ఞానంగా గాని, అతని అభిలాషగా గాని రాయటం, అది true finding ఎలా అవుతుంది? అది మీరు ఎలా నిరూపిస్తారు? నేను ఈ విషయం నిరూపించి చూపాను, అని వ్యాసంలో మీరంటే, శ్రీశ్రీ పరంగా అది సరి ఎలా అవుతుంది? అతని గురించిన అతని మాటలనే ఖాతరు చేసుకోటం లేదే మీరు? ఎవరి మాటల ఆధారంగా ఏమి నిరూపిస్తారు?
మీరు చేయగలిగిన పనులు, మీ రచనలలో మీరు చేసి చూపి మెప్పించవచ్చును. ఇతరులు సంకల్పించని, చేయని పనులను, వారు చేసారని చెప్పి, ప్రజలను ఒప్పించ లేరు. No one needs that kind of research.
“ఒక విధంగా చూసినట్లయితే, గేయములు నిజముగా ఏకపాద వృత్తములు! ఈ విషయము ఆశ్చర్యకరముగా కనిపించవచ్చును కాని ఇది ముమ్మాటికి నిజము.”
“ఇంత చేసి కూడా ఆయన ప్రతి పుస్తకంలోను దేవతల అనుగ్రహము, తల్లిదండ్రుల తపస్సు, తన గురువుల కృప ఇవే తన పుస్తకాలకి కర్తలనీ తాను కేవలం ఉపకరణం మాత్రమే అని సవినయంగా చెప్పుకోగల మహానుభావుడాయన.”
వేద భాష్యాన్ని రాసిన సాయణుల గురించి రాస్తూ పుల్లెల వారు సాయణులు తన గురించి తాను రాసుకున్న ” న ధ్యానం న వ్రతం నార్చా న సమాధిర్న వా జపః , సుప్రసిద్ధా బలం యస్య మతిరేవ మహీయసీ ” అన్న శ్లోకాన్ని ని పేర్కొని, తెనిగిస్తూ “ఏ సాయణాచార్యునికి సుప్రసిద్ధమూ చాలా గొప్పదీ అయిన బుద్ధియే బలమో, అంతే కాని ధ్యానం కాని, వ్రతం కాని, దేవతాది పూజ కాని, యోగం గాని, జపం కాని ఎవనికి బలం కాదో…” అని వివరించారు.
(పుల్లెల వారి ప్రస్తావనలు, సంస్కృత భాషా ప్రచార సమితి హైదరాబాద్- 500 001, జులై,2011, పుట 363.)
మేం రాసిన వ్యాసం మీద రకరకాలుగా స్పందించిన వారందరికీ మా నమస్కారాలు. మా వ్యాసంలో మేం ప్రధానంగా ప్రస్తావించిన విషయం ఈ ఉత్తరాలు రాసినవారందిరిలో ఇద్దరో, ముగ్గురో గుర్తించారు. వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. తెలుగు ప్రచురణలో ఒక సంప్రదాయం ఏర్పడాలన్నా, ఒక ప్రామాణికత రావాలన్నా సంస్ఠలే పూనుకోవాలి. తెలుగులో ఇలాంటి సంస్థలు మూడు. లాభాపేక్షలేకుండా పనిచేసే తిరుపతి దేవస్థానం, తెలుగు సాహిత్య ఎకాడమీ, లాభాపేక్షతో పనిచేసే విశాలాంధ్ర, ఈ మూడింటిని సంస్థలుగా ఏర్పడిన ప్రచురణ కర్తలుగా మేం గమనించి వాళ్ళ ప్రచురణల గురించి చర్చించాం.
స్టైల్ మాన్యువల్ గురించి కొంతమంది మాట్లాడారు. స్టైల్ మాన్యువల్ ఒకరు ఏర్పరిచి బయటపెట్టినంత మాత్రాన అందరూ దాన్ని ఆమోదించరు, అలాటి ఆమోదానికి కూడా పెద్ద సంస్థల తోడ్పాటు కావాలి.
సంస్థలుగా ఏర్పడబోతున్న ప్రచురణకర్తలు మనకి లేకపోలేదు. అటువంటి ప్రయత్నాలు కొన్నింటిని ఈ వ్యాసంలో మేం ప్రస్తావించాం, ఇటువంటి ప్రయత్నాలు మరెందరో కూడా చేస్తున్నారు. కాని అవన్నీ ఇప్పటివరకూ ఒక వ్యక్తి బలంవల్ల నడుస్తున్నవి. అవి సంస్థలుగా ఎదగడానికి ఇంకా కొంత కాలం పడుతుంది.
వ్యాసంలో ఉన్న ప్రధాన విషయాన్ని ఆలోచనాత్మకంగా పొడిగించడానికి పనికొచ్చే ఉత్తరాల కోసం ఎదురుచూస్తాం. నమస్కారాలు.
టూఎయిటీన్ డీ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
09/26/2015 11:06 am
పర్స్పెక్టివ్స్, హైద్రాబాదు వారు ప్రచురించిన ‘త్రిపుర కధలు’ మూడో ముద్రణ లోని ‘హోటల్లో’ అనే కధ అది. కినిగే సంస్థ వారి క్రింద ఇచ్చిన లింకు ద్వారా ప్రింటు కాపీ కాని, e-పుస్తకం కాని చెప్పించుకునే సౌకర్యం కలదు. http://kinige.com/book/tripura+kathalu+print+book.
ప్రతిభావంతురాలైన కవయిత్రి, రచయిత్రి, త్రిపుర గారి వీరాభిమాని అయిన స్వాతికుమారి గారు కధా విషయం, విషయ పరిధి మీద ఇంకొంచం శ్రద్ద పెట్టలేదేమో అనే దుగ్ధతో; త్రిపుర గారి ‘హోటల్లో’ కధలోని అంతర్వాహిని లాంటి మానవత్వపు తడిచెమ్మ ( ‘గుడిసెలోని తన కొడుకు సివంచెలంకి మందెవరు తెస్తారు’ అని ఖాళీ కళ్లతో చూస్తున్న రాములు గురించిన సృహ; ‘వెధవ కమ్యూనిస్టులతో చేరి జండాలు అవీ పట్టుకు తిరుగుతూ అల్లరి పెడుతున్నాడు ధర్డ్ ఫెలో’ ఆకాలమే వేరు అంటున్న తండ్రి గురించిన సృహ ) యీ కధలో కనబడక కసితో అలా అవాకులూ చవాకులూ రాసాను. రచయిత్రి మన్నింపు దృష్ఠితో మిన్నకున్నారు. యీ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
సారాలంకార విలక్షణత ను నిరూపిస్తూ సాగిన ఈ వ్యాసం పోతన గారి పద్యం వలెనే ఆకర్షిస్తున్నది.
జయరథుని వ్యాఖ్యలో ఉదహరించబడిన ఆ సంస్కృత శ్లోకం ఎక్కడి నుంచి తీసుకోబడి ఉంటుంది? లేక వ్యాఖ్య కూర్చినవారే వ్రాసి ఉండవచ్చునా?
జయరథుడు వర్ధమానం సారాలంకారంలోనే ఇమిడిపోతుందని అనడం, ఆ సంస్కృత శ్లోకంలో వర్ధమానః అనే పదాన్ని వాడడం చూసినపుడు నాకనిపించిందది.
పద్యంలోని ముఖ్యవస్తువు మహావిష్ణువు యొక్క ఉత్తరోత్తర వృద్ధియే కాని, రవిబింబం యొక్క వివిధ రూపత్వసిద్ధికాదన్నది తెలిసినవిషయమే కాన పద్యంలోని సారాలంకార నిరూపణ అర్థవంతంగా ఉంది.
వ్యాసకర్త అన్నట్టు పోతన గారి ప్రసిద్ధ పద్యంలో ఔచిత్యం నిండుగా ఉంది.
భాగవతగణానాధ్యాయి గారన్నట్టు ఇటువంటి వ్యాఖ్యానాలు మా వంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
పదిహేను నెలల తర్వాత ఈ వ్యాసాన్ని మళ్ళీ ఈరోజు చదువుతున్నప్పుడు – ఇంత అన్వయక్లేశం కలిగిన పద్యం కాకపోయినా, 1893లో గురజాడ శ్రీరామమూర్తిగారు “తెనాలి రామకృష్ణుని చాటువులని వాడుక గల పద్యములు” అని తమ ‘కవిజీవితములు’లో చూపిన వేరొకటి గుర్తుకు వచ్చింది. విద్యార్థులు కొద్దిసేపు ఆలోచిస్తే అర్థస్ఫురణ కలుగుతుంది కాని, దీనికీ పూర్వోత్తరాలలోని పద్యాలు దొరకనందువల్ల – తొలిచూపులో ప్రతిపాద్యాంశం, ప్రతిపదార్థం, తాత్పర్యం బోధపడటం కష్టమే:
పూజ్యతములు శ్రీ కృష్ణదేశికాచార్యుల వారి సన్నిధికి
నమస్కారములతో,
రుయ్యకుని అలంకారసర్వస్వాన్ని వ్యాఖ్యానిస్తూ విమర్శినిలో జయరథుడు సారాలంకారానికి ఉదాహరించిన శ్లోకాన్ని చదువుకొన్న పోతన గారు దానిని సారాలంకారానికి అనురూపంగానే తెలుగుచేసి ఉంటారని భావించటం సులభం. అన్యధాకృతంగా అన్వయించేటపుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఆలోచింపవలసి ఉంటుంది.
తత్త్వతః అపహ్నవం, ఉల్లేఖం, పరిణామం, భ్రాంతిమంతం, రూపకం, సందేహం అన్నవి అభేదప్రాధాన్యం కలిగిన అలంకారాలు. ఏకావళి, కారణమాల, మాలాదీపకం, సారాలంకారం శృంఖలావైచిత్ర్యమూలకాలు. సారము, ఉల్లేఖము – రెండూ అస్ఫుటప్రతీయమానాలే. కాగా, రుయ్యకునికి పూర్వం భామహుని మొదలు మమ్మటుని వరకు గల ఆలంకారికులెవరూ ఉల్లేఖాన్ని ఒక అలంకారప్రభేదంగా గుర్తింపనే లేదు. రుయ్యకుడు తన ప్రతిభామూలాన గుర్తించి, దానికి అలంకారస్థాయిని కల్పించిననాటి నుంచి విద్యానాథాదులు, అమృతానందయోగి, తదనంతరీయులు అందరూ రుయ్యకుని సూత్రబోధనే అనుసరించారు.
రుయ్యకుడు గుర్తించిన ఉల్లేఖముయొక్క స్వరూపం ఇది: ఒక వస్తువు వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు తీరుల గోచరించి, అన్యవస్తుప్రతీతి వలని ఆ రూపబాహుళ్యం వారిచే పరిపరివిధాల ఉల్లేఖింపబడటం జరుగుతుంది. అనేకవిధాల చూచే అనేకులు లేకపోయినప్పటికీ ద్రష్ట ఒక్కడే వస్తువును అనేకవిధాల వర్ణింపవచ్చును. ఆ రాజును మన్మథుడని స్త్రీలు, కల్పవృక్షమని యాచకులు, సమవర్తి అని శత్రువులు చూస్తారు – అనటం మొదటి పద్ధతి. ఆ రాజు ధనుర్విద్య యందు భీష్ముడు, వాక్కున బృహస్పతి, కీర్తియందు అర్జునుడు – అనటం విషయభేదం వలని రెండవ పద్ధతి ఉల్లేఖం. ఇవి రెండూ చంద్రాలోకంలో జయదేవుని ఉదాహరణలు.
ఇది తొలినాటి ఉల్లేఖాలంకార చరిత్ర. ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు అలంకారసర్వస్వంలోని శోభాకర మిశ్రుని నిర్వచనాన్ని అనుసరించి శ్లేషమూలకమైన విషయభేదాన్ని ఈ శ్రేణిలో సరిక్రొత్తగా చర్చించాడు. శ్లేష ఉల్లేఖను పరిహరిస్తుందని కొందరంటారు.
కాలక్రమాన ఉల్లేఖలో శుద్ధోల్లేఖం, సంకీర్ణోల్లేఖం అని ప్రభేదాలు ఏర్పడ్డాయి. సంకీర్ణోల్లేఖంలో ఫలోల్లేఖం, హేతూల్లేఖం అన్న అంతర్భేదాలు; విషయభేదంతోపాటు అధికరణభేదం వల్ల ఉల్లేఖాలంకార ధ్వని అన్నవి లక్షణజాతంలో చేరాయి. అయినా, క్రొత్తను వెంటనే ఆహ్వానించలేని విశ్వేశ్వర పండితాదులు అలంకారకౌస్తుభాదులలో ఉల్లేఖానికి ప్రత్యేకమైన అస్తిత్వాన్ని తిరస్కరించి కేవలం అతిశయోక్తిప్రభేదంగా కొట్టిపారవేశారు.
కావ్యాలంకారసంగ్రహ వ్యాఖ్యలో శ్రీ సన్నిధానం సూర్యనారాయణశాస్త్రుల వారు పై పోతనగారి పద్యాన్ని ఉల్లేఖాలంకారానికి ఉదాహరణగా ఇచ్చిన మాట నిజమే కాని, అందుకు వారు ప్రమాణీకరించిన “గ్రహీతృభేదాభావేఽపి విషయాశ్రయభేదతః, ఏకస్యానేకోల్లేఖ ముల్లేఖం ప్రచక్షతే” అన్న శ్లోకం ఎక్కడిదో వారు చెప్పలేదు. ఆ శ్లోకం అప్పయ దీక్షితుల వారి ‘చిత్రమీమాంస’ లోనిది. అప్పయ దీక్షితుల వారు కువలయానందంలో విషయభేదంతోపాటు ఆశ్రయభేదాన్ని చెప్పిననాటి నుంచి అది పండితరాయాది ముఖ్యాలంకారికులచే ప్రచారంలోకి వచ్చింది. పోతనగారికి ఈ పరిణామక్రమం పరిచితమై ఉండదు.
ఒకవేళ పోతనగారు జయరథుని విమర్శినినే గాక అలంకారసర్వస్వానికి శ్రీవిద్యాచక్రవర్తి రచించిన సంజీవనీ వ్యాఖ్యను కూడా చదివారనుకొన్నా, దీనిని ఉల్లేఖరూపంగా అన్వయించారనుకోవటం సాధ్యం కాదు. శ్రీవిద్యాచక్రవర్తి “యదేకం తద్ధి నానేతి గృహ్యతే రుచిభేదతః” అని వ్రాసిన దళాన్ని పోతనగారు చూచి ఉంటే, ఒకే వస్తువులోని రూపగతభేదానికి “రుచ్యాదివశ”మైన నానాత్వదర్శనాన్ని ఇందులో కల్పించారనలేము. మహాకవి కదా, తమనాటికి లేని అలంకారప్రభేదాన్ని పోతనగారు ప్రయోగించి ఉండకూడదా? అంటే, జయరథుడు చూపిన సారాలంకారపు ఉదాహరణ ఎదుట ఉండగా దానిని అన్యధాకరించి ఉల్లేఖంగా అనువర్తించి ఉండరనే ఇప్పటి నా ఊహ. రుయ్యకుడే తొలిసారి చెప్పిన ఆ ఉల్లేఖాన్ని చదువుకొన్నవారే కద!
“రవిబింబంబు ఛత్రంబై ఉపమించుటకు పాత్రమగును” అన్న ఉపక్రమం ఎటుచూసినా విషయాశ్రయభేదతః ఉల్లేఖానికి అన్వయించేందుకు క్లేశకరమే. విషయమైన రవిబింబానికి ఏది ఆశ్రయమై ఛత్రంతో సాదృశ్యమూలకసిద్ధి కలిగింది? రవిబింబం శిరోరత్నమైనప్పుడు ఛత్రత్వకల్పన జరిగిందనీ అనుకోలేము. అందువల్ల విషయాశ్రయారోపం అక్కడ సాధ్యం కాదు.
అసలు “రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రంబై” అని రవిబింబానికి “ఛత్రోపమాన పాత్రత్వాన్ని” ఎందుకు చెప్పవలసి వచ్చింది? అంటే, పోతనగారు రవిబింబానికి రవిబింబపు వెలుగును, వేడిమిని అపవారించటానికే ఏర్పడిన ఛత్రాన్ని పోలికకు తెచ్చేందుకు కొంత సందేహించి, శిరస్సుపైని ఉన్నదన్నంతవరకే సరిపెట్టుకొని, సమర్థింపవలసి వచ్చిందని అనిపిస్తుంది. “ఛద = అపవారణే (ఆతపాత్) ఛాదయతి” అని రామాశ్రమి. రవిబింబం రవిబింబరశ్మిని అపవారించటానికే ఏర్పడిన ఛత్రము వలె ఉన్నదన్నమాట. లేకుంటే, “ఉపమింపఁ బాత్ర మగు” అన్న దళాన్ని విడిచి మూలశ్లోకాన్ని యథాతథంగానే తెలుగుచేసి ఉండేవారు. మరి “పాత్రత్వసిద్ధి” ఎలాగంటే, అది కేవలం రశ్మివారణోపయోగి కాదని, భగవదలంకారమైన మహైశ్వర్యలాంఛనం అని గ్రహించాలి. శ్రీమహావిష్ణువు యొక్క ఉత్తరోత్తరవృద్ధి మాత్రమే కవి మనస్సులో ఉన్నదని, తత్సమయంలో రవిబింబం సంకోచాన్ని పొందటం మాత్రమే ఉద్దిష్టమని ఊహించాలి. ఉల్లేఖానుప్రాణితమైన సారమని గాక ఒకవేళ సారముచేత అనుప్రాణితమైనప్పటికీ, ఉల్లేఖానికి పాత్రం కావలసినది శ్రీమహావిష్ణువు యొక్క బ్రహ్మాండాంత సంవర్ధనమే కాని రవిబింబముయొక్క నానారూపత్వసిద్ధి కాదు. ఇది శుద్ధోల్లేఖం కాదు. ఉల్లేఖం ధ్వనిస్తున్నదనటానికి ధ్వన్యంగత్వమూ లేదు. తత్తదవస్థలయందు వామనుని ఉత్తరోత్తరస్వరూపోత్కర్షమే చిత్రితమైనందువల్ల సారమే అలంకారం.
ఇది నా ఇప్పటి భావన. తప్పులేమైనా ఉంటే దయతో తెలియజేయగలరని ప్రార్థన.
పరమ భాగవత శ్రేష్ఠులు, పండిత వరేణ్యుల, మా గురుతుల్యులు పూజ్యశ్రీ మురళీధర రావు మహోపాధ్యాయులకు పాదాభివందనలు. అవునండి తమరు శలవిచ్చినట్లు పోతనామాత్యుల వారు “జాతీయ మహాకవి” యే. దానికి సాధికార ప్రమాణీకరణగా తమ వాక్కు ధృవీకరించింది. మరొక్క మారు ప్రణామాలు. సంస్కృత భాగవతాతిరిక్తంగా వారు చేసిన అనువాదాల మూల శ్లోకాలను సేకరించటం; సాహిత్యారాధకులకే కాదు తెలుగు భాషకు బహుళ ప్రయోజనకరం కాగలదు అని నా భావన.
మా “జాలజనుల” పాలిటి కల్పవృక్షం అయిన “ఈమాట” వారికి ఈ ప్రచురణకు ప్రత్యేక ధన్యవాదాలు.
గురు వాక్యాలపై వ్యాఖ్యానించ గల వాడను కాను కాని, చిన్న మనవి చేసుకొంటాను. ఈ మహా విశ్వం పండిత పామర ఆస్వాదనీయం. ‘భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన’ కదండి. సర్వజన సౌకర్యార్థమై, మన బమ్మెర వారికి చెందిన సమస్తం ఏక స్థానంలో (లేదా లోనుండి) అందుబాటులో ఉండేలా ఉంచితే బాగుంటుంది అనే భావనతో, ఇట్టి భాగవతుల ఆశీర్వచన బలంతో, సామాన్య “జాలజనుల” వరకు అందించుటలో తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడు చేస్తున్న చిరు యత్నం తమకు తెలిసినదే అనుకోండి.. ఎలాగూ సంఖ్యాపరంగా కూడా “తెలుగు జాలజనుల”లో పండితజనులు, విజ్ఞాన విశిష్ఠులు కూడ వృద్ధిచెందుతున్నారు. ఇందు నిమిత్తం ఇట్టి విశిష్ఠతమ వ్యాఖ్యానాదులను కూడ ఒక ప్రత్యేక ఏక జాలగూడు వంటి స్థానంలో చదువరుల అనుకూల్యతతో అందిస్తే, సామాన్య జాలజనులకు కాకపోయినా, విద్యార్థులకు ప్రేరణగానూ, “భాషా పరిశోధక, పరమ భాగవత, జిజ్ఞాసా జాలజనుల”కు ప్రయోజనకారిగానూ ఉంటుందేమో.
జాలజనుల నోటిమాట అయిన ఈమాట వారికి వందనశతాలతో, తమ ఆదరాభిమానాలు ఆశ్శీస్సులు జాలగూడు తెలుగుభాగవతం.ఆర్గ్ కు అందించ మనవి
పోతనగారి బహుగ్రంథపరిశీలనానుభవంతో బాటు మురళీధరరావుగారి బహుగ్రంథపరిశీలనానుభవాన్ని కూడ ఈవ్యాసం వ్యక్తపరుస్తూ ఉన్నది. పోతనగారి ఈపద్యాన్ని ఉల్లేఖాలంకారానికి గూడ ఉదాహరణంగా చెప్పడం జరిగింది (ఉదా: సన్నిధానంవారి కావ్యాలంకారసంగ్రహవివరణము). ఇందులో రవిబింబము అనేది విషయము. అది అనేకవిధములుగా రూపొందిందని చెప్పడం మాత్రమే గ్రహిస్తే అది ఉల్లేఖమే ఔతుంది. ఛత్రం కంటె తిలకం గొప్పదని, కౌస్తుభంకంటె పాదపీఠం గొప్పదని సూర్యబింబానికి ఉత్తరోత్తరోత్కృష్టతను చెప్పలేము. అందుచేత సూర్యబింబవర్ణనలో సారాలంకారం లేదు. కాని ఒకే సూర్యబింబం ఇట్లు అనేకవిధములుగా రూపొందింది అని చెప్పడంవల్ల వామనుని ఉత్తరోత్తరౌన్నత్యము స్ఫురిస్తూ ఉన్నది. కావున ఇది ఉల్లేఖానుప్రాణితమైన సారాలంకారము కావలెననిపిస్తున్నది. నాదగు నీ అపండితాభిప్రాయమును సహృదయతో పరిశీలించి ఈవిచారమునందలి దోషమును ఎత్తిచూపగలరని ఆశిస్తున్నాను.
మీరన్నది నిజమే! సంజ్ఞావాచకాలు, విరామ చిహ్నాల వాడనానికి కూడా ప్రమాణాలు ఉండాలి. అవి లేకుండా సాహిత్యం వెలువరిస్తే అవే ప్రమాణాలుగా చెలామణి అయిపోయ్యే ప్రమాదం కూడా ఉంది. మార్పు సహజమే. కాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న కథ పునరావృతం కాకుడదన్నదే ఇక్కడి ఆలోచన. ఇప్పటికే మీరన్నట్టు “ఆశ్చర్యార్థకాలు కూడా ఒకటీ రెండూ సరిపోతాయి, అవి ఎన్ని ఎక్కువ వాడితే అంత ఆశ్చర్యమని కాదు కదా. బహుశా కీబోర్డ్ మీద ఒకే మీట నొక్కిపట్టుకోటం తేలిక కావచ్చు. ఇన్‌ఫార్మల్గా ఈమెయిళ్ళూ చాట్ల వంటి వాటిలో వాడే భాష, ప్రచురణకు తగదని తెలియకపోవడమూ కావచ్చు.” తో సాహిత్యం వెలువడుతున్నది. మరీ ముఖ్యంగా వెబ్‌జైన్‌లలోను / ఆన్‌లైన్ టపాలలోను.
వ్యాసకర్తలు పేర్కొన్న పంక్తుల పోగు వచనం, పద్యమే కాక మిగతా అంశాలతో కూడ పరిచయం ఉంది. అంతే కాదు వారు ప్రస్తావించిన ప్రచురణకర్తలు / ముద్రాపకులందరితో కాకపోయిన చాలమందితో కనీసం ఏదో ఒక సందర్భంలో కలవడం, మాట్లాడడం జరిగిందే,గుజిలి పుస్తక ప్రచురణ కర్తలతో సహా.
మీరన్నట్టు ‘ఒయాసిస్సు’ లను ఏకరువు పెట్టడం ఈ వ్యాసం, వ్యాఖ్యల ముఖ్యోద్దేశం కాదు, కాకూడదు.
వేలూరి వారు కనీసం ఒక డిజిటల్ ఎడిషన్ ప్రచురించాలని కోరుకుంటూ, వేమూరి వారు కూడ అన్యధా భావించక తాము రాసుకున్న స్టయిల్ ‘పుస్తకాన్ని’ తెలుగువారికి అందించవలసిందిగా అభ్యర్ధిస్తూ, ఈమాట “స్టైల్ మాన్యూయల్” కోసం ఎదురుచూస్తూ,
1. సంజ్ఞావాచకాల వాడకం గురించి ఏ అనుమానం ఉన్నా సునాయాసంగా గూగుల్లో వెతుక్కోవచ్చు. ఉదా quotes in quotes అని వెతికాను. చూడండి. పైగా ఆంగ్లంలో స్టయిల్ మాన్యువల్స్ ఉన్నాయి. సాధారణ వ్యాకరణానికే కాకుండా, పత్రికలు తమకోసం తాము రాసుకున్న గైడ్స్ తో సహా. అందువల్ల వాటి వాడకం గురించి తీర్చుకోలేని సందేహం అంటూ ఏమీ లేదు.
తెలుగులో పూర్తిగా మానేయమనటం లేదు నేను. పొదుపుగా, పద్ధతిగా వాడమంటున్నాను చదివే సౌకర్యం కోసం. (అసలు వాడకపోయినా ఇబ్బంది లేదని అలనాటి తెలుసా చర్చల్లో పరుచూరి శ్రీనివాస్ నిరూపించినట్టు గుర్తు. ఈవ్యాసంలో రెండవ బొమ్మ – పంక్తులపోగు వచనం పెద్దది చేసి చదివిచూడండి.)
2. లీలాజనార్దనం ఉంది. బైండింగ్ కొంత బలహీనం తప్ప పుస్తకం నాణ్యత బాగుంటుంది. అదే రకం పుస్తకమైన తిరుప్పావై బైండింగ్ మరీ బలహీనం. ఒక పదిసార్లు తెరచీ మూస్తే తట్టుకోగలదో లేదో. కాని ఇలా ఒక్కో పుస్తకాన్నీ ఉదా. ఇవ్వడం వల్ల ఏమిటి ప్రయోజనం? వ్యాస రచయితలే చెప్పినట్టు ఇలా ఎన్ని ఒంటరి ఒయాసిస్సులను చూపించుకుంటూ పోతాం?
3. ఈమాటలో ఒక మాన్యువల్ చేసి పెట్టచ్చు కదా అంటే అవును అలానే పెట్టచ్చు. 🙂 ఆ దిశగా ఆలోచనలూ, చర్చలూ చేస్తూనే ఉన్నా ఇది ఇంకా పూర్తిగా రూపు దిద్దుకోలేదు. అది కొంత పకడ్బందీగా చేయవలసిన ప్రయత్నం. కానీ చేయాలన్న ఆశయం అయితే దృఢంగానే ఉంది.
చాలా చక్కటి వ్యాసం. చౌదరి గారు అన్నట్టుగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్ళందరికీ గమనించి, ఏమీ చెయ్యలేక నిశ్శబ్దంగా బాధపడుతున్న ఫిర్యాదులు అన్నీ కలగలిపి ఒక్కచోట వ్రాయటం ఎంతయినా బాగున్నది. మనకు పుస్తకాలు ముద్రించేవారే కాని ప్రచురించేవారు లేరు అన్నమాట అక్షర సత్యం.
నేను చూసినంతవరకూ ముప్పాళ రంగనాయకమ్మ గారు తన పుస్తకాలను (ఇప్పుడు వస్తున్నవి, ఇంతకు ముందు తెలియదు) చాలా చక్కటి గట్టి అట్టతో, మంచి కాయితం మీద బుక్ మార్క్ కూడా ఉంచి, సరసమైన ధరతో, చదువుకోవటానికి వీలుగా ప్రచురిస్తున్నారు. ఆవిడ వ్రాసిన పుస్తకాల్లో ఉండే విషయం మీద నాకు ఆసక్తి లేకపోయినా ఆ పుస్తకాలు చూడ ముచ్చటగా, చక్కటి ఇండెక్స్, మంచి నాణ్యమైన ముధ్రణ ఉండి, అటువంటి ప్రచురణలను ప్రోత్సహిస్తే, మనకు ఇష్టమైన పుస్తకాలు కూడా ఆ విధంగా ప్రచురిస్తారన్న ఆశతో ఆవిడ పుస్తకాలు దాదాపుగా అన్నీ కొనుకున్నాను. హైదరాబాదులో టాప్ బైండర్ చేత ఆ పుస్తకాలు బైండ్ చేయిస్తారని వినికిడి.
ఎంతటి పల్ప్ ఫిక్షన్ ఐనా యండమూరి, మల్లాది వంటి రచయితలు తమ తమ పుస్తకాలు ఏ రూపంలో పాఠకులకు అందుతున్నాయో పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. చాలా చౌకబారుగా “గాడీగా” ఉండే ముఖ చిత్రాలతో, పరమ నాశిరపు పేపర్మీద ప్రింటవ్వటం వాళ్ళకే నామోషీ అన్న విషయం తెలిసినట్టు లేదు. దీనికి మరొక కోణం కూడా ఉన్నది. అవే పుస్తకాలు మంచి కాయితం మీద, చక్కటి బైండ్ చేసి,అర్ధవంతమైన చక్కటి ముఖచిత్రంతో ప్రచురిస్తే, ధర ఎంతవుతుంది, ఈ పల్ప్ పుస్తక పాఠకులు ఆ ధరతో ఆయా పుస్తకాలు కొంటారా అన్న ఒక భయం ప్రచురణ కరతల్లో ఉండటం సహజమే మరి. అన్నీ కలగలిపి ఒక బాలెన్స్ తీసుకు రాగలగటమే ఒక “పయనీర్” లక్షణం. అలాంటి “పయనీర్” పుస్తక ప్రచురణలో మనకు తెలుగులో ఒక్క రంగనాయకమ్మ గారే నాకు కనప్దుతున్నారు. కాని ఆవిడ పుస్తకాలన్నీ ఒకే “మార్క్స్” సారీ “మార్క్” పుస్తకాలు అవటం ఒకటి ఉన్నది.
ఏమైనా కూడా మన తెలుగు ప్రచురణా కర్తలు ఒకసారి తిరిగి చూసుకుని, తాము చేస్తున్న పని ఎంతవరకూ బాగున్నది తరచి చూసుకోవాలి. ఎంతసేపూ పుస్తకాదరణ తగ్గిందని, పుస్తక ప్రదర్శనల్లో విలపించటం మాని,తమ “వస్తువు” ఐన పుస్తకం కొనటానికి, పుస్తకాభిరుచి ఉన్న పాఠకుడికి అనుగుణ్యంగా కనపడుతున్నదా లేదా అని చూడాలి.
తరువాత రష్యన్ పుస్తకాలు చాలా అద్భుతమైన బైండింగ్ లో చక్కటి పేపరు మీద చూడ ముచ్చటి బొమ్మలతో 1970లలో ప్రచురణ జరిగింది. ఆ ప్రచురణా స్టాండర్డ్స్ కాపీ కొట్టినా చాలు, మన తెలుగు పుస్తక ప్రచురణ నాణ్యం పెరుగుతుందని నా అభిప్రాయం.
బూదరాజు గారు ఈనాడు కోసం వెలువరించినది “ఈనాడు భాషా స్వరూపుం – గుణదోషాలు” అది అమ్మకానికి లేదు. కనీసం నాకు తెలిసి. ఇక “స్టైల్ మాన్యువల్ అవసరం చాలా ఉందనేది నిర్వివాదాంశం.” అది పాత్రికేయానికి మాత్రమే కాదు. తెలుగులో ప్రతి రచనకి కూడా అవసరమే.
ఇక సంజ్ఞావాచకాల గురించి.
“ప్రత్యేకించి కొటేషన్ మార్కుల వంటివి. ఇలా కామాలూ కొటేషన్లూ మాటకొకటి లేకుండా కూడా తెలుగు వాక్యం చదివి చక్కగా అర్థం చేసుకోగలం.”
మొన్నామధ్య ఖధీర్ కూడా టి వి ఇంటర్యూలో ఒక మాటన్నాడు, తెలుగులో విరామ చిహ్నాలు లేకపోయినా ఇబ్బంది లేదు. మన పాఠకులకి అర్ధం అవుతుంది అని. నాతో పాటు మరి కొందరి సాహితిమిత్రుల అభిప్రాయం ఇది: ఇబ్బందికరమే. మనకి కోట్‌లో కోట్ వంటివి వచ్చినప్పుడు ఎలా చెప్పాలి?
“సొంతడబ్బా అనిపించినా సరే, ఈమాటలో చిన్న అచ్చుతప్పు కనిపిస్తే మాకు కనీసం పదిమంది పాఠకులనుంచి ఈమెయిళ్ళు వస్తాయి. పోనీలే అనుకోకుండా వారు ఆ ప్రయాస తీసుకుని మాకు తప్పు ఎత్తిచూపడం వల్ల, వారు అలా ఆశించే స్థాయి ఒకటి ఏర్పరిచామని మాకు గర్వంగా ఉంటుంది, మా పొగరు కాస్త తగ్గి పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది కూడా.”
మరి ఈమాట వారు తమ స్టైల్‌గైడ్‌ని, లేదు వారు పాటిస్తున్నదానిని ఇక్కడే ప్రచురించవచ్చు కదా? ఆన్‌లైన్ ఎడిషనే. ఈమాట కి పంపే రచనలకి, రచయితలకి ఆ ప్రమాణాలు పాటించాలని చెప్పొచ్చు. అదొక పద్దతి. ఈమాట సంపాదక వర్గానికి కొంత శ్రమ తగ్గుతుంది కదా! ఏమంటారు? చి న
ఇక కందుకూరి రుద్రకవి ‘జనార్ధనాష్టకం'(వి ఎ కె రంగారావు, బాపు బొమ్మలతో) లాంటి పుస్తకం ఈ వ్యాసకర్తల దృష్టికి రాలేదనుకోవడం, కొంచెం ధైర్యం చేసి, మరో ముందడుగు వేసి, వారి personal library లో లేవనుకోవడం కూడా పొరబాటే అవుతుందనుకుంటాను. అలాగే మొన్నిమధ్యే మిత్రులు కాండ్రగుల నాగేశ్వర రావు ప్రచురించిన ‘సప్తపర్ణి’ కూడా ఈ వ్యాసకర్తల దృష్టికి రాలేదనుకోలేము.
రామారావు గారన్నట్టు ఫాంట్ (ఖతి)కూడా చాల పనిచేస్తుంది. He is right when he says, “Different fonts evoke different sensibilities.”
ఇక గొర్తి గారి మాట: ‘ముందు మాట’ సరిపోదా, preface కి సారు? ద హ
“నా పుస్తకం – నా మాట” అనుకునే వారితో ఇబ్బంది ఏముంటుంది? చి న.
ఇక వేలూరి వంటి వారే మనకి కావల్సింది. ఆ పట్టుదల కూడ ఉండాలి మరి.
అసలు ఈ కధ రాయడానికి కారణం – కైకనీ మంధరనీ విలన్లు గా చూపించకూడదనే. ఏదైనా మనం అర్ధం చేసుకునేది మన మనః స్థితి మీదే కదా ఆధారపడేది? ఆదిన్ శ్రీపతి కొప్పుపై … అనే పద్యాన్ని బూతుగా చూడ్డం చాతనవ్వడం వేరూ, భైరవభట్ల గారో ఏల్చూరి గారో చెప్పినట్టు చూడ్డం వేరూను. ఎవరో గూని మనిషి రాముణ్ణి అంత పనిగట్టుకుని 14 సంవత్సరాలు అడవుల్లోకి ఎందుకు పంపిందో అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ రాముడంటే చూడగానే ఒళ్ళు మరిచిపోయేలా ఉండేవాడుట. అలాంటి వాడిమీద మంధరకి కోపం రావడం లేక పగ రావడం ఊహించడం కష్టం.
అవన్నీ అలా ఉంచండి. వెడలెను కోదండపాణి అనేది (నాకు తెల్సినంతలో) త్యాగరాజ కీర్తన. దాన్ని మన సినిమా వాళ్ళు ఎన్ని తికమకలు పెట్టి ఎలా సాగదీసినా సరే త్యాగరాజు త్యాగరాజే. త్యాగరాజ కీర్తన బదులు మీకు సినిమా పాట నచ్చడం అనేది మీ ఇష్టమే. కొంతకాలం పోతే త్యాగరాజునీ, అన్నమయ్యనీ మర్చిపోయి ఫలానా పాట విన్నావా అంటే, అదేనా, నాగార్జున సినిమాలో అనే దశకి చేరుకుంటున్నాం కాబోలు. నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి.
చంపేసారండి. నేను రాసేవి పోతననీ, వాల్మీకిని అనుసరిస్తాయా? మళ్ళీ ఎక్కడా అనకండి. మొహం మీద పేడ నీళ్ళు జల్లుతారు నాకు. ఎక్కడి పోతనా? ఎక్కడి వాల్మీకి? నక్కకీ నాకలోకానికి పెట్టారు పోలిక? నేను మహా అయితే గియితే ఓ కాపీ-పేస్ట్ ఆర్టిస్టుని. పైన అయ్యవారు గారికి ఇచ్చిన రెండో కామెంట్లో నా తెలుగు పాండిత్యం ఎంతో చెప్పాను. ఓ సారి చదవండి. అది చదివితే తెలియట్లేదా?ఈ కధలో మీరు చెప్పినట్టుగా మొదటి పదంలోనే అపశృతి దొర్లింది. హతోస్మి!
పుస్తకాల్లో అచ్చు తప్పుల మీద శ్రద్ధ గురించి నా అనుభవంలో ఒక సంఘటన:
ఒకాయన తన కథల్ని పుస్తకంగా ఆయనే అచ్చు వేయించుకున్నారు. అచ్చు తప్పులు లేకుండా ఒకటికి వంద సార్లు అన్నీ వెయ్యి కళ్ళతో చూసినా, ఆయన పుస్తకానికి ముందు రాసిన ‘నా మాట’ లో ఒక చిన్న అక్షరం తప్పుపడింది. చదివితే అది తప్పని అనిపించదు కూడా! అప్పటికే ఆ పుస్తకం అచ్చులో వచ్చేసింది. దాదాపు 500 కాపీలు ప్రింట్ కూడా అయిపోయాయి. అది చూసి విల విల్లాడిపోయారాయన! పరవా లేదన్నా వినిపించుకోలేదు. మరలా ఇంకో మూడు వందల డాలర్లు ఖర్చు పెట్టి, ఆ అక్షరాన్ని సరిదిద్ది మళ్ళీ ముద్రించుకున్నారు, మరో 100 వంద కాపీలు. ఆయనెవరో కాదు – ఒకప్పటి ఈమాట సంపాదకులు వేలూరి గారు.
“మనకి ప్రామాణికత మీద, పుస్తకాన్ని సుష్టుగా, పదికాలాలు ఉండేటట్టుగా నిర్మించుకోవాలనే పట్టుదల లేకపోవడమొక్కటే కారణం అని చెప్పుకోవాలి.” అన్న మీ మాటతో ఏకిభవిస్తునే అది కేవలం ముద్రాపకుడికి మాత్రమే పరిమితం కాదు అని కూడా అనుకుంటాను.
ప్రచురణకర్త / లు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి మీరన్నట్టు.
అంతే కాదు. పావలాకి, పది రూపాయలకి అమ్మకానికి వచ్చిన పుస్తకాలనుండి ఈ రోజు వందలలోను వేలల్లోను (ఉదా: త్రిపురనేని గోపిచంద్ సమగ్ర సాహిత్యం – పది సంపుటాలు (2009) అక్షరాలా రెండు వేల రూపాయలు )ఉన్నా కొనేపాఠకులున్నారు. కాని వారిని గురించి ఆలోచించే రచయిత కాని, ముద్రాపకులు గాని, ప్రచురణకర్తలు కాని లేరు.
సుమారు పది పన్నెండు కోట్ల వ్యాపారం జరుగుతున్నది అని ఒక అంచనా! కాని ప్రచురణకర్తలకి ఆ పట్టుదల లేదు.
కాబట్టి రచయిత తన పుస్తకాన్ని తనే ప్రచురించుకుంటున్నాడు. తనకి బాగున్న పద్దతిలోనే. వ్యాసకర్తలు అన్నట్టు ఈ రోజు చిన్న ఊళ్ళల్లో కూడా డి టి పి షాపులున్నవి. వారే డిజైనర్లు.
అంతే కాదు, మీరన్న కంపోజింగు దానికి అదనపు ఖర్చు అని అనుకున్న ప్రచురణకర్తలు పాత పేట్లనే వాడి లాభాలు ఆర్జించాలని అనుకోవడం మరో కారణం.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు లాగానే తెలుగు పుస్తక ముద్రణలో కాని ప్రచురణలో కాని ప్రామాణికతలు లేవు.
కాకపోతే పిల్లి మెడలో గంట కట్టేవారెవరు అన్నదే ప్రశ్న. ఇక వేమూరి వారి పెట్ పీవే, నాది కూడా! అసలు మన తెలుగు వారికి ఒక స్టైల్ గైడ్ అనేది ఉందా?
అన్నీ బాగానే ఉన్నాయి కాని నా “నిత్య నసుగుడు” (pet peeve) గురించి ప్రస్తావనే లేదు: విరామ చిహ్నాల వాడుక. అదేమిటో! ఒక్క తెలుగు వారిలోనే కాదు, భారతీయుల రాతలలో ఎక్కువగా కనిపించే దోషం ఒకటి ఉంది. ఉదాహరణగా – కామా పెట్టినప్పుడు అది మాట పూర్తయిన వెంటనే పెట్టాలి. ఫుల్ స్టాప్ వాక్యం పూర్తయిన వెంటనే పెట్టాలి. కాని చాల మంది కామా ముందు ఒక ఖాళీ వదిలేసి కామా తరువాత ఖాళీ లేకుండా రాస్తూ ఉంటారు. అదే విధంగా ఫుల్ స్టాప్ వాక్యం పూర్తి అయిన వెంటనే రావాలి. తరువాత ఒక ఖాళీ వదిలేసి రెండవ వాక్యం మొదలు పెట్టాలి. కాని మనవాళ్లు వాక్యం పూర్తి అయిన తరువాత ఒక జాగా వదిలేసి, చుక్క పెట్టి, అప్పుడు రెండవ వాక్యం మొదలు పెడతారు. ఈ పద్ధతి తప్పు. అలా కాకుంటే వరస చివర వాక్యం విరిగినప్పుడు ఇబ్బంది వస్తుంది. “ఈ పద్ధతి తప్పు,” అని నేను చెబితే “మేము ఇండియాలో ఇలానే రాస్తామండీ, కావలిస్తే చూడండి,” అంటూ ఉదాహరణలు చూపిన వాళ్లు ఉన్నారు. అందరూ చేస్తున్నారు కదా అని తప్పు ఒప్పు అయిపోదు. ప్రకాశకులని, ముద్రాపకులని తప్పుపట్టి ఏమి లాభం? రచనలు చేసేవాళ్లు కూడ తమ రాతలలో తప్పులు లేకుండా, లక్షణంగా ఉండడం కోసం శ్రమ పడాలి. అచ్చు కొట్టించడంలో ఉన్న సంబరం రుజువు పత్రాలు సరి చూడడంలో ఉండదు. ఏది ఏమైతేనేమి ఎంతో శ్రమ పడి, ఎన్నో విషయాలని సేకరించి, పాఠకలోకానికి అందించిన రచయితలని మెచ్చుకోక తప్పదు. – వేమూరి
మంచి వర్ణన. నా రామాయణ పఠనం లొ అయోధ్యాకాండలో ఉండటం రాముడు భరద్వాజుడి ఆశ్రమం లో ఉండటం యాధృచ్చికం ఎమో?
ఒక సందేహం. ఈ కధలో (కొంత కల్పన ఉన్నా) రావణుడు మొదట మాంధత మీద తదుపరి అనరణ్యుడి మీద యుధ్ధం చేసినట్టూ అర్ధం అయింది నాకు. కాని ఇక్ష్వాకు వంశ చరిత్రలో మొదట అనరణ్యుడు తదుపరి మాంధాత వస్తారు. కింద ఇంగ్లీష్ లో (తెలుగు వి దొరకలేదు) ఉన్న శ్రీ వాల్మీకి శ్లోకాలు చూడగలరు. మాంధాత వరకు కాపీ చేశా. అలాగే ఒక చోటా (రెండవ పేజీ) లో విశ్వామిత్రుడు నా బాధ్యత తీరుచుకోడానికి వచ్చాను అని అన్నారు. మహర్షులు కర్తవ్యం నిర్వహిస్తారు కాని బాధ్యతలు నెరవేర్చుకోరు. రామయణం లో కూడ “కర్తవ్యం” అన్న పదమే ఉంటుంది ప్రతి చోటా!!
manuH prajaapatiH puurvam ikShvaakuH ca manoH sutaH |
tam ikShvaakum ayodhyaayaam raajaanam viddhi puurvakam || 1-70-21
“Manu is the earliest Prajaapati and Ikshvaaku is the son of Manu, and that Ikshvaaku is the first king of Ayodhya… know thus… [1-70-21]
ikShvaakoH tu sutaH shriimaan kukShiH iti eva vishrutaH |
kukSheH atha aatmajaH shriimaan vikukshiH upapadyata || 1-70-22
.
“The son of Ikshvaaku is the legendary Kukshi, thus he is renowned, and the famous Vikukshi is the son of Kukshi… [1-70-22]
vikuksheH tu mahaatejaa baaNaH putraH prataapavaan |
baaNasya tu mahaatejaa anaraNyaH prataapavaan || 1-70-23
“From that most brilliant and courageous Vikukshi, Baana emerged as son, and the highly refulgent and valinat Anaranya is the son of Baana… [1-70-23]
జ్యోతిషాన్ని నమ్మేముందు దాని ఫై కనీస అవగాహన ఉండాలి.
1. కృష్ణుడు లేదా క్రిస్ట్ లేదా గాంధీ వంటి వారు పుట్టే సమయానికి చాలామంది పుట్టి ఉంటారు ఆదే స్థలము లో , కాని అందరు వారంత గొప్పవారు కాలేరు. కారణం పాయింట్ అఫ్ ఎవల్యూషన్.
2 కొన్ని వేల మంది ప్రమాదాలలో పోయినపుడు జ్యోతిషశాస్త్రం తో బాటు ఇంకా కొన్ని తెలియాలి. అవి పూర్వ కాలం లో జ్యోతిష్యానికి ముందు నేర్పేవారు.
౩.వ్యక్తిగత కర్మ ఆధారంగా జ్యోతిష్య పలితాలు తెలుస్తాయి. కాని వ్యక్తిగత కర్మ 10% మాత్రమె.
4.ఒకరు లేదా ఈదరు వ్యక్తుల ఆధారంగా శాస్త్రాని అంచనా వేయరాదు.
5. నాది గ్రంధ అంటే ఏమిటి? అది ఎలా రాస్తారు అనే విషయం అవగాహన లేకుండా
అది వేస్ట్ అనరాదు.
6.పూర్వం గాని ఇప్పుడు గాని అర్హత , పాత్రత వల్ల పవిత్ర విషయాలు అంటే మానవాళికి ఉపయోగపడే విషయాలు తెలుస్తాయి. దానికి కారణం మన ద్వార సమాజానికి ఉపయగాపద్తాయి అని తెలిసినప్పుడే.
మాన్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యుల వారి సన్నిధికి
సప్రశ్రయ నమస్కారములతో,
సహృద్వాత్సల్యౌదార్యాలు ఉట్టిపడుతున్న మీ ఆశీర్మయవిలేఖితానికి ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని ఎంతో దీక్షతో అధ్యయనించిన మీరు అదొక కావ్యసామాన్యం కాదని, అపూర్వమైన వినూత్న లక్ష్యసాగరమని చేసిన ప్రతిపాదన మీ ఆమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. గణపవరపు వేంకటకవి కృతులను పరిచయం చేసేటపుడు తత్తత్కాలాదికాన్ని విపులంగా సమీక్షింపవచ్చునని అనుకొన్నాను. అందువల్ల మీ ప్రశ్నకు సంక్షేపతః ఇక్కడ సమాధానిస్తున్నాను:
‘విద్యావతీ దండకం’ 1948లో Bulletin of Govt. Oriental MSS Library (సంపు – 1; సంచిక – 1) లో అచ్చయింది. అది ముద్దళగిరికి అంకితం. ప్రబంధరాజంలో కవి “చండ విద్యావతీ దండక”మని ప్రాసయతి నిమిత్తం అన్నాడే కాని, అది చండవృష్టి దండకం కాదు. నన్నయాదులు ప్రవేశపెట్టిన కామబాణ దండకమే. వీరేశలింగం గారు కవి 1750 నాటివాడనటం సరికాదని; ముద్దళగిరి 1674లో తంజావూరును పరిపాలించినందువల్ల కవి కాలం నిరూపింపబడుతున్నదని కె. వెంకటసుబ్బాశాస్త్రి గారు, నిడుదవోలు వేంకటరావు గారు విద్యావతీ దండకం పీఠికలో వ్రాశారు. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం కూడా తత్సమకాలికమని నిడుదవోలు వారి అభిప్రాయం. అప్పటినుంచి విమర్శకులు కవి కాలాన్ని ఆ విధంగా నిర్ధారించటం జరుగుతున్నది. అది సరికాదు.
1674లో ముత్తులింగ నాయకుడు (ముద్దళగిరి) తన సవతి అన్న చొక్కనాథ నాయకుని ప్రాపకంతో తంజావూరుకు రాజైనాడు. అప్పటికి అతని వయోవస్థాకాలం పాతిక – ముప్ఫై యేళ్ళకు దరిదాపులలో ఉండి ఉంటుంది. యౌవనోద్రేకం వల్ల, అన్నగారన్న చనవు మూలాన చొక్కనాథ నాయకుని ఏలుబడిలో ఉంటూనే, సమానుడైన స్వతంత్రప్రభువు వలె ప్రవర్తించాడు. శివాజీ సవతి తమ్ముడు ఏకోజీ దండెత్తి, ఒకటి రెండు పర్యాయాల విఫలయత్నం తర్వాత 1676 జనవరి 16-వ తేదీని విష్ణుచక్రం కోటను వశపరచుకొన్నాడు. ఏకోజీ తొలిదండయాత్ర నాటి పరాజయగాథ ‘పెదళ్గిరి విజయము’ మాలికా కావ్యంలో సవిస్తరంగా వివరింపబడింది. (‘పెదళ్గిరి విజయము’ నిడుదవోలు వారన్నట్లు గణపవరపు వేంకటకవి రచన కాదని నేను ఇతరత్ర వేరొక వ్యాసంలో నిరూపించాను.) అప్పటికే అతని ప్రవర్తనతో విసిగి ఉన్న చొక్కనాథుడు అతనికి అండరాలేదు. రాజ్యభ్రష్టుడైన ముద్దళగిరి 1678లో మళ్ళీ అన్నగారి వద్దకు చేరుకొని, అపార్థాలకు క్షమాభిక్షను అర్థించి మధుర వద్ద రాజప్రతినిధిగా ఉన్నాడు. 1678 (కాళయుక్తి)లో మధురలోనూ, 1679 (సిద్ధార్థి)లో శ్రీరంగంలోనూ అతని దానశాసనాలున్నాయి. 1682లో చొక్కనాథ నాయకుడు మరణించిన తర్వాత చిన్నచిన్న అధికారపదవులను చేపట్టి, 1700-1705 (±) ప్రాంతాల కర్ణాటకానికి వెళ్ళి సుమారు యాభై – యాభైఅయిదేళ్ళప్పుడు కుంతూరు దుర్గానికి రాజయ్యాడు. ఎంతకాలం ఉన్నాడో స్పష్టంగా చెప్పలేము. ఆ కాలంలోనే లింగనమఖి శ్రీకామేశ్వరకవి ధేనుమాహాత్మ్య రచన జరిగింది. శ్రీకామేశ్వరకవి ‘సత్యభామా సాంత్వనము’ ముద్దళగిరికి అంకితమైంది. ఈ చారిత్రిక పరిణామాలను గుర్తింపక నిడుదవోలు వారు శ్రీకామేశ్వరకవిని కూడా 1674కు పరిమితం చేశారు. వారిని అనుసరించి తర్వాతివారందరూ వ్రాస్తున్నారు.
అంతర్గతసాక్ష్యాల వల్ల గణపవరపు వేంకటకవి ‘సర్వలక్షణశిరోమణి’ క్రీస్తుశకం 1700కు పూర్వరచన కాదని నిశ్చయంగా చెప్పవచ్చును. తద్రచనాకాలం కొంచెం ఇంచుమించుగా 1705-1715 (±) కావచ్చును. అందులో ముద్దళగిరి ప్రస్తావన లేదు. అప్పటికి అతని ప్రాపకం లేదన్నమాట. ‘విద్యావతీ దండకం’ ముద్దళగిరికి అంకితం. దాని చివరను “మహాలక్షణగ్రంథ భాషాభిమానప్రథామాధురీసాధురీత్యర్థవ చ్ఛబ్దబంధానుబంధ ప్రబంధాధినాథాప్పయామాత్య రాడ్వేంకటార్య ప్రణీతంబైన” అని ఉన్నది. అంటే విద్యావతీ దండకం సర్వలక్షణశిరోమణికి అనంతరీయం అన్నమాట. ఆ తర్వాత ఒక దశాబ్ది కాలం కృషిచేసి, వందలాది గ్రంథాలనుంచి లక్షణలక్ష్యాలను సమీకరించుకొని ప్రబంధరాజ సంకలనాన్ని మొదలుపెట్టి ఉండాలి. తలకొక్కతీరుగా ఉన్న వ్రాతప్రతులలోని ప్రక్షిప్తాలను తొలగించి సుష్ఠుప్రతిని పరిష్కరింపగలిగితే ప్రబంధరాజ రచనాకాలం 1730 – 1755 (±) కావచ్చునని ఇప్పటి ఆలోచన. ప్రకృతవ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము యొక్క సర్వాంగీణవిమర్శ గాక, తెలుగు సాహిత్యచరిత్రకు అపరిచితమైన ఒక్క అపూర్వమైన విశేషం మాత్రమే అధికరింపబడుతున్నది. అందులో సంప్రయుక్తమైన లక్షణజాతాన్ని గురించి, చిత్రకవిత్వాన్ని గురించి ప్రత్యేకంగా పరిశీలింపవలసి ఉంటుంది.
వేంకటకవి రచనలో తుల్యసంవాదం ఉంటే ఆ రచన ప్రబంధరాజానికి పౌర్వికమని, వేంకటకవి దానిని పరిశీలించి తన సంకలనంలో చేర్చుకొన్నాడని గ్రహించాలి. ఈ పూర్వాపరాల నిశ్చయం అంత సులభసాధ్యం కాదని వ్యాసంలో నేను మనవిచేశాను. గ్రంథస్థపద్యాల పట్టికను తన్మూలపద్యాల గుర్తింపుతో ప్రకటిస్తేనే కాని అది సాధ్యం కాదు. తెలుగు సాహిత్యచరిత్ర చాల వరకు ప్రామాణ్యభావం లేని ప్రాథమికోహలతో సాగినందువల్ల కావ్యపీఠికలలో నిర్ణయింపబడిన కాలాదికాన్ని ప్రమాణంగా స్వీకరింపక చరిత్రనికషపాషాణపట్టికపై స్వయంగా గీచిచూచి తథ్యమిథ్యావివేకంతో పునారచింపవలసిన అవసరం ఉన్నది.
భౌతిక శాస్త్రంలోను, ఖగోళ శాస్త్రంలోను, గతి శాస్త్రంలోను ప్రధాన సంఖ్యల ఉపయోగం ఉందని చెప్పి ఊరుకుంటే ఎలా? మాలాంటి సామాన్యులకి అర్థం అయే రీతిలో ఎక్కడెక్కడ ప్రధాన సంఖ్యల అవసరం వస్తుందో చెబితే బాగుంటుంది కదా? చాల రోజులు బౌల్య బీజగణితం ఎందుకూ పనికి రాదనుకునేవారు. కాని ఈ “కొత్త లెక్కలు” కలన యంత్రాల నిర్మాణానికి మూలం అయి కూర్చున్నాయి. అలాగే ప్రధాన సంఖ్యలు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసున్న వాళ్లు చెబితే బాగుంటుంది. – వేమూరి
అసాధారణమైన సూక్ష్మేక్షికతో ప్రబంధరాజవిజయవిలాసాన్ని పరీక్షించి, దానినొక లక్ష్యసంకలనగ్రంథంగా నిరూపించిన శ్రీమురళీధరరావుగారి అసమానశేముషిని కొనియాడకుండా ఉండలేము – ఏంత కొనియాడినను తక్కువే యని నా యభిప్రాయము. లక్ష్యములైన ఈపద్యములకు జనకమైన లక్షణముల స్వరూపమును వివరిస్తూ, ఈగ్రంథమునకు విపులవ్యాఖ్యానమును వ్రాయుటకు నాకు దెలిసినంతవఱకు ఈకాలములో వారొక్కరే సమర్థులుగా కనిపించుచున్నారు. సరస్వతీదేవి వారి కాయాదేశమును చేసి తనను తాను సన్మానించుకొనునని యాశించుచున్నాను. ఈ వ్యాసములను చదివిన పిమ్మట గణపవరపుకవియొక్కగారి కాలమును గుఱించిన కొన్ని విషయముల సమన్వయము నాకు కుదురకున్నది.
వేదం వేంకటరాయశాస్త్రిగారి అకాడమీప్రతిలో 1673లో తంజావూరును పరిపాలించుచుండిన ముద్దళగిరిమీద ఈకవి చండవిద్యాదండకమును చెప్పినాడనియు, అందుచేత ఈతడు 17వ శతాబ్దిలో నుండినవాడనియు నేలటూరి వేంకటరమణయ్యగారు వ్రాసినారనియు, ఆరుద్రగారును ఈకాలనిర్ణయమునే సమర్థించుచున్నారనియు వ్రాసినారు. కాని ఈవ్యాసములలో పేర్కొన్న కొన్ని గ్రంథములయొక్క గ్రంథకర్తలు 18వ శతాబ్ది చివర నున్నట్లు తోచుచున్నది. పేర్కొన్న గ్రంథములలో నాదగ్గర నున్న కొన్ని గ్రంథములను చూడగా వాటి కాలనిర్ణయ మీక్రిందివిధముగా నున్నది:
బిల్హణీయము – చిత్రకవి సింగరాచార్యులు – 1775 ప్రాంతం, స్వామి శివశంకరశాస్త్రిగారి పీఠిక
హంసవింశతి – అయ్యలరాజు నారాయణామాత్యుడు – 1800 ప్రాంతం, మద్దులపల్లి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రుల పీఠిక
కనుపర్తి అబ్బయామాత్యుని కాలం 1750 ప్రాంతం – వారణాసి వీరనారాయణశర్మగారి ‘కనుపర్తి అబ్బయామాత్యని కృతులు’ సిద్ధాంతవ్యాసం.
ముకుందవిలాసం, అచలాత్మజాపరిణయం – ఇవి రచించిన కవులిద్దఱూ గద్వాలసంస్థానాధీశుడైన చినసోమభూపాలుని కాలం (1764-1794) వారు, రవ్వా శ్రీహరిగారి ముకుందవిలాసం పీఠిక. (1700 ప్రాంతంలో గద్వాలను నిర్మించిన పెదసోమభూపాలునికి సంబంధించిన కథయే నా ‘హనుమప్పనాయకుడు’ కావ్యానికి ఇతివృత్తం.)
ఈవిధంగా నేలటూరివారు చారిత్రకాధారాలద్వారా నిర్ణయించిన కాలానికి, ఈవ్యాసంలో గణపవరపుకవి సంగ్రహించినాడని పేర్కొన్న కొన్నికావ్యాలకు వందసంవత్సరాల తేడా ఉంది. ఈవ్యాసంలో ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం గణపవరపుకవి 1800 తర్వాత ఉండి ఉండాలి. అట్టి స్థితిలో అతడు 1673 సంవత్సరానికి ముందే ఉన్న ముద్దళగిరిమీద చండవిద్యాదండకమును ఎట్లా చెప్పినాడు? దీనికి, ఈ వ్యాసంలో సాక్షీభూతమైన కాలానికి నామనస్సులో సమన్వయం కుదురుట లేదు. మురళీధరరావుగారు దీనిని విశదీకృతం చేస్తారని కోరుతున్నాను.
ఈ వ్యాసం ప్రచురణ అయే ముందు సంపాదకుడు అందించిన సహాయానికి. ప్రచురణ పొందిన తరువాత పాఠకుల నుండి వచ్చిన అనూహ్యమైన స్పందన నన్ను చకితుణ్ణి చేసింది. నా వ్యాసాన్ని చదివి మెచ్చుకున్నవారందరికీ ఒకొక్క నమస్కారం; తప్పులు ఎత్తి చూపిన పాఠక వర్గానికి వెయ్యి నమస్కారాలు! కేవలం భాషానువాదానికి సంబంధించిన తప్పులని ఎత్తి చూపిన వారు కొందరైతే, గణితపరంగా, మౌలికమైన తప్పులని పట్టి, సవరించిపెట్టినవారు మరికొందరు. వీలయినంత వరకు తప్పులని సరిదిద్దేను. గణితంలోని మూల భావాలని ఇంగ్లీషు నుండి తెలుగులోనికి దింపినప్పుడు నా తెలుగులో ఇంకా వెలితి కనిపించవచ్చు. రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోమని పాఠకలోకానికి మనవి. ఒకటి, ఇది గణితంలో నిష్ణాతులైన పండితులని ఉద్దేసించి రాసినది కాదు; సామాన్య పాఠకులకి అర్థం అయే రీతిలో పదార్థాన్ని పరిచయం చెయ్యాలని చేసిన ప్రయత్నం. రెండు, తెలుగులో ఇటువంటి వ్యాసాలు రాయడానికి ఒరవడి అంటూ ఒకటి స్థిరపడలేదు. కనుక చదువుతూన్నప్పుడు మీకు కనిపించే లొసుగులు రాస్తున్నప్పుడు నాకు కనిపించవు. ఇంకా అక్కడక్కడ తప్పులు ఉండొచ్చు. తొందరపాటుతో ఒక తప్పుని సరిచేస్తూ మరొక తప్పుని ప్రవేశపెట్టే ప్రమాదం ఉంది కనుక నెమ్మదిగా ఆలోచించి సరి చేస్తాను. అందుకని పాఠకులందరూ ఇదే నిష్టతో నా వ్యాసాలని చదివి మీమీ అమూల్య అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఈ వ్యాసాన్ని చదివి స్పందించినవారంతా ఒకొక్కరు ఒకొక్క తెలుగు వ్యాసం రాసి దీనిని నా ఒంటరి పోరాటంగా వదిలెయ్యకుండా సమష్టిగా ప్రయత్నం చేస్తే తెలుగు భాషని శాస్త్రీయ అవసరాలకి వీలుగా మలుచుకోవచ్చని నా అభిప్రాయం. ధన్యవాదాలు – వేమూరి
మొదటి పద్యము తిక్కన ద్రోణ పర్వములో ఉండదగిన పద్యము. ద్రోణ పర్వము పైన థీసీస్ వ్రాసిన పండితులు ‘ఏల్చూరి’ చెప్పగలిగిన పద్యము.
ద్రోణాచార్యులు ఈ పద్యంలో ఉన్నంత/అన్నంత నిందా వాక్యములు పడవలసిన వాడా అంటే, నాకు కాదనే అనిపిస్తుంది. ఏల్చూరి మురళీధరరావు గురుభక్తి కలవారు. సమస్యా పూరణం సందర్భంగా నైనా, ఒక గురువు పై నిందా పద్యం, తన సొంత మాటలుగా చెప్పరు- అనిపిస్తుంది. ఈ శీర్షిక లోని రెండో పద్యంలో, తన గురువుగారి ముఖ సందర్శనం కొరకేగా వారు గూగులించింది!
మరి ఎవరు ఇలాటి మాటలు ద్రోణుని గూర్చి అనగలిగిన వారు? ఎప్పుడు అని ఉండవచ్చు? -అని ఆలోచిస్తే, ఈ మాటలు భారతం లోని ఏదో ఒక పాత్ర అన్నవి – అని తోస్తుంది. భారత యుద్ధంలో, ద్రోణుడి సైన్యాధిపత్యంలో, కొన్ని వ్యూహ రచనల తర్వాత నే అయిఉండాలి. ధర్మరాజును కాపాడటానికి, ద్రోణాచార్యుని అదుపు చేయవలసిన అవసరం పాండవులకు ఉన్నది. అది వారికి శక్యం కావటం లేదు. ఐతే, అట్టి సందర్భంలో కూడా పాండవులు తమ గురువును వారి కత్యంత అయిష్టులతో పోల్చరు. అర్జునుడు ద్రోణుడంటే చాలా భక్తి కలవాడు. ధర్మరాజు పాచికల సంగతి ఎత్తడు. భీముడు, కృష్ణుడు -మాట తూలే స్వభావం ఉన్నవారే. వారు వ్యూహాలు పన్ని, మోసాలు చెయ్యటానికి, మొహమాట పడరు. ద్రోణుడిని కడతేర్చటానికి భీముడు -అశ్వత్థామ చనిపోయాడని దొంగ అరుపు తను అరవటమే కాకుండా, ధర్మరాజుతో కూడా ద్రోణుడికి చెప్పించాడు. ఆ ఆలోచన చెప్పింది కృష్ణ భగవానుడేగా. అట్టి వారు ఆ పద్యం లోని తీరుగా ద్రోణుని గురించి ఆలోచించరు. సాత్యకి కూడా ద్రోణుని కించపరిచే ఊహ చేయడు.
ధర్మరాజు మాటల వలన, తన పుత్రుడు అశ్వత్థామ మరణించినట్టుగా నమ్మి, యుద్ధరంగంలో మారణ కార్యక్రమం చేస్తూనే, మనసులో క్రుంగిపోయి ఉన్న ద్రోణుడితో, అప్పుడు వచ్చిన, -విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతమాది మునులు – బ్రాహ్మణుడికి నీకింత యుద్థం దేనికయ్యా, (పద్యంలో మొదటి వాక్యం) చేసిన వరకూ చాలు, ఇక విడిచి పెట్టెయ్యి. – అన్నారు కాని, ఆ మిగతా దురూక్తులన్నీ వారు పలకరు. ద్రోణుని హీనంగా తలచరు.
ఒక్క ధృష్టద్యుమ్నుడు మాత్రమే, ద్రోణుని పట్ల చులకన, అగౌరవం, వైరం కలవాడు. ద్రోణుడిని అంతం చెయ్యటానికే జన్మించిన వాడతడు. ఇవి అతని మాటలుగా, వినిపిస్తున్నాయి. మునుల హితవు విని, యుద్ధ విరక్తుడై, ద్రోణుడు తనంత తానుగా, యోగశక్తితో తన ప్రాణం విడిచిపెట్టే ముందు, కడసారిగా దృష్టద్యుమ్నుడిని హింసించినప్పుడు, ఆ పాంచాలుడు ద్రోణుని గురించి ఇలా తలచి ఉండవచ్చు ననిపిస్తున్నది.
(చదవదలిస్తే, ద్రోణపర్వంలో శివుడిపై చక్కని పద్యాలున్నయ్యి. నాకైతే తిక్కన రచించిన ఆ పద్యాలను మించి, ఈ మధ్యనే, ఏల్చూరి, ఈ పత్రికలోనే, శివుని మీద చెప్పిన పద్యం -అదెంతో బాగుంది.)
నాలుగు పాదాలు గల సీసపద్యం, నలుగురు వ్యక్తులను గూర్చి చెప్పటానికి చక్కగా సరిపోయింది. విశ్వనాధ సీసపద్యం రాయటంలో అలాటి సదవకాశాలు చిక్కటం తక్కువన్నారు. నాలుగు చరణాలు సమానంగా నడపటం, సరైన పోలికలు కుదరటం కష్టమన్నారు. అది సీసపద్యం లోని దోషమన్నారు. ఆయన ‘కల్పవృక్ష రహస్యాలు’ పుస్తకంలో, ఒక సీసంలో, దశరధుడి ముగ్గురు భార్యల గురించి చెపుతూ, మొదటి రెండు పాదాల్లో, చివరి రెండు పాదాల్లో- సుమిత్రను రెండు, రెండు సార్లు చెప్పి, అలా తాను చెప్పటం, తరవాత కథలో, సుమిత్రకు ‘కవలలు’ కలుగుతారని సూచన అన్నారు. విశ్వనాథ ఏది చెపితే చెల్లుబాటు అవదు కనక! గణిత శాస్త్రజ్ఞులకు లేని సౌలభ్యాలు, సమర్థింపులు కవులకు ఉన్నాయి.
ఈ వ్యాసము లోని రెండో పద్యము కూడా, కవి ధారాళంగా నోరూరగ చవులు పుట్ట, నుడివినందున నచ్చింది. తమి, తమన్నా, ఆతురతన్ – ఓహో ఎవ్వరీ అతివ!
కామేశ్వరరావు గారూ, ఈ పద్య పరిచయము కూడా బాగుందండి. దేవకాంతల (సినిమా తారల) వయసు ముప్ఫైలు దాటదనటం – I love it.
Fans of Oscar Wilde cannot help recalling the words of ‘Lady Bracknell’, from the totally wickedly humorous play ‘The importance of being Earnest’: “Thirty five is a very attractive age. London Society is full of women of the very highest birth who have, of their own free choice, remained thirty five for years.”
In this Oscar Wilde’s writing, I kid you not, almost every sentence is quotable. And the whole delightful flimsy plot revolves around two men‘s assumed identities and pseudonyms. To watch two handsomest actors -Rupert Everett, Colin Firth, play these roles in a movie is – I have to stop my off track idle babble, before my honorable reliable reasonable editor, cuts me off.
వెదుకడానికి ఇంటర్నెట్ లో ఉపయోగించే search engine, గూగుల్ ను “ఇంచుక్” అనే ప్రత్యయం తో కలిపి “గూగులించు” అనే క్రియని సాధించి పద్యం లో ప్రయోగించడం గమ్మత్తు గా వున్నా, శ్రోతకు వెంటనే బోధ పడదు. (మిగతా పద్యం లో పదాల పోహళింపు భిన్నంగా ఉంది కాబట్టి.) గతంలో వడ్డెర చండీదాస్ గారు తమ నవలలలో “స్నానం” అనే నామవాచకానికి ఇంచుక్ ప్రత్యయం కలుపుతూ “స్నానించి ” అనే క్రియా పదాన్ని విస్తారంగా ఉపయోగిస్తూ, పాపులర్ చేయడానికి ప్రయత్నించారు. పైగా, “స్నానం చేసి” అని వాడనక్కర లేదని కూడా తేల్చేశారు. ఇలాంటి పదప్రయోగాలు తాత్కాలికమే అని చెప్పక తప్పదు.
ఐతే, పద్యాలు రెండూ బాగున్నాయి. సీస పద్యం ఆణి ముత్యమే. కవి శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి, కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించిన శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారికీ అభివందన చందనాలు.
నేను రాసిన ప్రధాన (అభాజ్య) సంఖ్యల మీద వ్యాసం చదివి, తప్పులు ఎత్తి చూపిన వారందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. నేను విద్యార్హిగా ఉన్న రోజులలో నా గురువుగారు “pay attention to the harshest reviews of your paper” అనేవారు. అందరు సూచించిన మార్పులు, చేర్పులు చేసి ఈ వ్యాసాన్ని తిరగ రాయవచ్చు. రాస్తాను. కాని ప్రస్తుతానికి కొట్టొచ్చినట్లు కనిపించే రెండు మూడు తప్పులని సరిదిద్ది సంప్రదించవలసిన మూలాలకి ఒక అంశాన్ని చేర్చుతున్నాను.
1. ప్రధాన సంఖ్యలు అన్నీ బేసి సంఖ్యలు కావు. అలా రాయడం నా తొందరపాటే. “ప్రధాన సంఖ్యలు (2 ని మినహాయించి) అన్నీ బేసి సంఖ్యలే” అని ఉండాలి.
2. sexy కి “లైంగిక” అన్న అనువాదం బాగు లేదని నేనే ఒప్పుకున్నాను. యదుకులభూషణ్ గారు దాని లేటిన్ మూలాన్ని సూచించిన తరువాత sexy primes ని “షష్ఠ్యంతరములు” అని తెలిగిస్తున్నాను.
3. నేను వాడిన “కచిక ప్రధాన సంఖ్యలు” కి ప్రత్యామ్నాయాలు ఒకరిద్దరు సూచించేరు. ఈ “కచికలు” (palindromes) అన్న మాటని మొట్టమొదట 1985 లో గణితశాస్త్ర ఆచార్యులు శ్రీ ఉపాధ్యాయుల వేంకట సత్యనారాయణ గారు రాసిన ఒక వ్యాసంలో వాడేరు. ఆ వ్యాసాన్ని 1985 లో నా సంపాదకత్వంలో వెలువడిన తానా వారి సువనీర్ లో ప్రచురించేను. ఆ వ్యాసాన్ని ఈ జాబుకి జత చేసి పంపుతున్నాను.
ఎవ్వరూ చదవరేమో అని భయపడుతూ తెలుగులో రాసిన ఇటువంటి వ్యాసాన్ని చదివి, సహృదయంతో స్పందించి, సలహాలు ఇచ్చిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు.
వేమూరి గారి వ్యాసం ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకోవాలనే కుతూహలాన్ని రెట్టింపు చేసేదిగా ఉన్నా కొన్నిచోట్ల అసంతృప్తి కలిగించింది.
“కాని ఎక్కడ చూసినా ఈ సగటు విలువ కంటె ఎక్కువ, తక్కువలు కనిపిస్తూనే ఉంటాయి…. కనుక ప్రధాన సంఖ్యల గురించి ఏది చెప్పినా ఆషామాషీగా చెబితే కుదరదు; కొంచెం తెలివితేటలతో చెప్పాలి.”
ఇక్కడేదో ముఖ్యమైన విషయమున్నట్లుంది కాని అదేమిటో తెలియడం లేదు. సగటు కుటుంబ ఆదాయం N డాలర్లు అయితే, దాదాపు ఏ కుటుంబ ఆదాయాన్ని చూసినా అది సగటు కన్నా ఎక్కువ గానో తక్కువ గానో, కొన్ని సార్లు విపరీతమైన తేడాతో కూడా కనిపిస్తుంది గదా. ఆ సగటుకీ ఈ సగటుకీ తేడా ఏమిటి?
ముఖ్య విషయాన్ని ప్రస్తావించిన రెండు పేరాలలోనూ ఇంగ్లీషులో చెప్పింది సరిగానే వున్నా తెలుగులో చెప్పింది కచ్చితంగా లేకపోవడాన తప్పుగా అర్థమొచ్చేటట్లుంది. (కామేశ్వరరావు గారి వ్యాఖ్య గందరగోళాన్ని తగ్గించడంలో సహాయపడింది.)
“ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు. ఇంకా నిర్ధిష్టంగా చెప్పాలంటే, ఆ పాతపు విలువ 70,000,000 దాటదు.”
ఖాళీ పరిమితంగా ఉండే జంటలు అనంతంగా కనిపిస్తాయి కాని, ఖాళీ ఎప్పుడూ ఓ అవధిని దాటదనడం తప్పు.
“ప్రధాన సంఖ్యల మధ్య వచ్చే ఖాళీకి ఒక కనిష్ఠ ఊర్ధ్వ అవధి (least upper bound) ఉందిట. అది 70,000,000 కంటె ఖచ్చితంగా తక్కువేనట.”
జంటల మధ్య ఖాళీకి ఊర్ధ్వ అవధి లేదు. మీరు ఎంత ఖాళీ ఇచ్చినా అంతకన్నా ఎక్కువ ఖాళీ ఉన్న జంట సంఖ్యలున్నాయని (gap can be arbitrarily large) సులభంగా చూపెట్టవచ్చు. అక్కడ ఇచ్చిన సమీకరణం చెప్పేది greatest lower bound (infimum) <70M, అని not least upper bound.
ఈటాంగ్ జాంగ్ ఎలా నిరూపించాడన్నది చాలా ముఖ్యం కాని వేమూరి వ్యాసం అందు గురించి కాస్తయినా చెప్పలేదు. Erica Klarreich “Unheralded Mathematician Bridges the Prime Gap” లో అసలెలా నిరూపించాడో కొంతవరకైనా వివరించి ఆసక్తి పెంచింది. ఈ విషయంపై వచ్చిన పాపులర్ సైన్సు వ్యాసాల్లో కెల్లా అది చాలా మెరుగైనది. వేమూరి ఆవిడే రాసిన మరో వ్యాసాన్ని ప్రస్తావించారు కాని అది N కన్నా చిన్నవైన ప్రధాన సంఖ్యల మధ్య ఖాళీ ఎంత పెద్దదిగా ఉండవచ్చు అనే దాని మీద.
పరిమితమైన ఖాళీతో అనంతమైన జంటలు లేకపోతే ఆశ్చర్యపడాలి కాని ఉంటే కాదు, అంటూ వివరించిన ప్రొఫెసర్ Jordan Ellenberg (UW at Madison) వ్యాసం “The Beauty of Bounded Gaps” చదవదగ్గది.
కొప్పాక వారిని పరిచయం చేసినందుకు వేలూరి గారికి ధన్యవాదాలు. నయం, తెలుగతనె ఈ పని చేశాడు, ఎ అమెరికా వాడో తెలుగు నేర్చుకొని పెట్టలెదు. ఇద్దరు తమిళులు కాని, కన్నదిగులు కాని కలిస్తె వారి మాతృభాష లోనె మాట్లాడతారు. మన తెలుగు వాళ్ళకు ఆంగ్లమె ప్రీతి.
పత్రిక స్థాయి పెంచే వ్యాసం అనడం లో సందేహం లేదు. ఎన్నో చక్కని విషయాలను పంచుకొన్నందుకు రచయిత అభినందనీయులు. అంతే గాక: ‘Bounded gap problemని తెలుగులో ఏమంటే స్వయంబోధకంగా ఉంటుందా నేనూ సంపాదకుడూ తర్జనభర్జనలు పడ్డాం. చివరికి సీమితపాత సమస్య అని అన్వయించుకుని సమాధానపడ్డాం. ఇంతకంటే మంచి మాట ఉంటే చెప్పమని పాఠకులని కోరుతున్నాం.’ అని ఒక శాస్త్రీయ దృక్పథం కనబరిచినందుకు కూడా.
‘సీమితపాత సమస్య ‘ అన్న పదబంధం అర్థబోధలో కొత్త సమస్యను సృష్టిస్తుంది. మనకు గణితం లో , ఇదివరకే అనుపాతాలు (proportions) ఉన్నాయి . మామూలు వాడుకలో (పాతము అంటే పడిపోవటానికి సంబంధించిన అర్థం లో) జలపాతం , రక్తపాతం అన్న పదబంధాలు ఉన్నాయి.
ఈ గణిత సందర్భంలో పాతం పొసగడం లేదు , ఎడం / విరామం అన్న పదాలు మెరుగు అలాగే సీమిత అన్న పదం కూడా ముక్కస్య ముక్క అనువాదమే , భావానుగుణంగా నియమిత అని వ్యవహరించడం మేలు.
ఆ ప్రకారం ‘The Bounded Gap Problem ‘ ని ‘నియమిత విరామ సమస్య ‘గా వాడుక చేయవచ్చు.
ఝాంగ్ ఉవాచః
‘ఒక ప్రధాన సంఖ్యకి, దాని తరువాత కనిపించే ప్రధాన సంఖ్యకి మధ్య వచ్చే పాతము పరిబద్ధమైనది లేదా ‘సీమితము’ (bounded) అని అన్నారు. అంటే, ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు. ఇంకా నిర్ధిష్టంగా చెప్పాలంటే, ఆ పాతపు విలువ 70,000,000 దాటదు’
అదే పంపిణీ మీద ఈ వాక్యాన్ని తిరగరాస్తే –
‘ఒక ప్రధాన సంఖ్యకి, దాని తరువాత కనిపించే ప్రధాన సంఖ్యకి మధ్య వచ్చే విరామం నియమితం ’ (bounded) అని అన్నారు. అంటే, ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు. ఇంకా నిర్ధిష్టంగా చెప్పాలంటే, ఆ విరామం విలువ 70,000,000 దాటదు.
మరి కొన్ని చిల్లర విషయాలు:
1. sexy prime numbers : ఆరు ప్రధాన సంఖ్యలుగా అనువదించుకోవచ్చు. లాటిన్ లో ఆరును sex అంటారు దాని మీద శ్లేష వేసి పుట్టించిన పదం ఇది. పోతే, తెలుగులో ఆరుకు సంఖ్యా పరం కాని అర్థాలున్నాయి : అలరారు, ఇంపారు, ఒప్పారు ఆరుకు శృంగార పరమైన అర్థం కూడా ఉన్నది , కాబట్టి ఆరు ప్రధాన సంఖ్యలు అనడం సులువు ; దీనికి బహువచన రూపం సాధించడం కూడా సులువు : ఆర్లు అంటే సరి. లైంగికాలు అనడం బాగాలేదు ( రా. రా అనువాద సమస్యల్లో దీన్ని గూర్చి పెద్ద చర్చ ఉంది)
2. కచిక (palindrome) ప్రధాన సంఖ్యకి ఒక ఉదాహరణ 700666007. ఇది ఎటు నుండి చదివినా ప్రధాన సంఖ్యే!
మన వికటకవి ని మరచిపోవద్దు ; సరదాగా లకోలకోల ప్రధాన సంఖ్యలు అంటే ఎలా ఉంటుంది ?? జంబీరబీజం , లకోలకోల లాంటి పదాలతో ఒక పద్యం ఉంది తః తః గారికి గుర్తుండవచ్చు . లేదా వీటిని వికట ప్రధాన సంఖ్యలు అనవచ్చు.
3. ఒక ప్రధాన సంఖ్యలో అంకెలని ఒకటీ, ఒకటీ మినహాయించుకుంటూ పోతూన్నప్పుడు మిగిలినది ప్రధాన సంఖ్యే అయితే దానిని మినహాయింపు (deletable) ప్రధాన సంఖ్య అంటారు. ఉదా: 1987. ఎడమ పక్క నుండి వరుసగా 1, 9, 8 మినహాయించగా మిగిలిన 987, 87, 7 ప్రధాన సంఖ్యలు. కానీ , 87 (29×3) ప్రధాన సంఖ్య కాదు కదా , కావున 1997 సరైన సంఖ్య
ఆశ్చర్యం గొలిపే విషయం, గతం లో ఈ గణితవేత్త మీద వచ్చిన ఒక అద్భుత వ్యాసంలో ఇదే తప్పు కనిపించింది నాకు:
“A prime from which you can remove numbers and still have a prime is a deletable prime, such as 1987.”
ఒక ఇరవై ఏళ్ళ క్రిందట ఈనాడులో సైన్సు కాలం కోసం వారిచ్చిన విదేశీ పత్రికనుంచి ఒక వ్యాసం అనువాదం చేసి తప్పులు దిద్దమని చిత్తు ప్రతి పట్టుకొచ్చాడు ఒక స్నేహితుడు .ఇలకోడి అనే పురుగు శృంగార జీవితానికి ప్రధాన సంఖ్యలతో ముడివడి ఉంది అన్న విషయాన్ని చర్చిస్తుంది ఆ వ్యాసం:(ఇటీవల న్యూయార్కర్ లో ఈ విషయం మీద మంచి వ్యాసం వచ్చింది )
తప్పు మీద తప్పు చేస్తూ పోయిన లక్ష్మన్న గారు గుణకారఫలం అనడం విచిత్రంగా తోచింది:
(లబ్ధం అంటే సరిపోదా ?? భాగఫలం అని వినడమే గాని ఈ పదబంధం నేను వినలేదు బహుశ వారు చదువుకునే రోజుల్లో ఉండి ఉంటుంది.)
“పైన ఉదాహరించిన సంఖ్య 175,828,273 ప్రధానసంఖ్యలయిన 17,179 X 10,247 గుణకారఫలం.” “ఈ విషయాన్ని వెలికితెచ్చి, ప్రాధమికసంఖ్యల ఉపయోగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళు ముగ్గురు అమెరికన్లు.ఆ ముగ్గురు, MIT లో కంప్యూటర్ సైన్సు విభాగంలో పరిశోధకులయిన Ronald Rivest, Adi Shamir, Leonard Adleman.”
లక్ష్మన్న గారు ఈ చర్చలో పై ముగ్గురిని ఉదహరించి గొప్ప మేలు చేశారు, వీరి పేరు మీద ఉన్నదే అందరికీ తెలిసిన RSA అన్న algorithm: “RSA is an algorithm used by modern computers to encrypt and decrypt messages. It is an asymmetric cryptographic algorithm. Asymmetric means that there are two different keys. This is also called public key cryptography, because one of them can be given to everyone. The other key must be kept private.”
గొప్ప వ్యాసం రాసిన రచయితకు, ప్రచురించిన సంపాదకులకు, అభిప్రాయాలు ఒసగిన పాఠకులకు తిమింగిలమంత లకోలకోల ప్రధాన సంఖ్య కనిపించు గావుత అని ఫలశ్రుతి చెప్పుకొంటూ, సందు చూసుకొని నియమితంగా విరమిస్తాను.
ఎన్నో లక్షల లీటర్ల గంగా జలం ప్రతి క్షణం సముద్రం పాలవుతుంది. దానిలో ఏ కొంతైనా తెలుగువారికి అందించగలిగితే ఎంతో మేలు జరుగుతుంది, ఎన్నో తరాల తెలుగువారికి ఉపయోగపడుతుంది. కాని అది సాధ్యమయ్యే పనేనా? అయితే ఒక్క మనిషితో ఏ మేరకు సాధ్యం? ఆ ప్రశ్నలకు జవాబు ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామచంద్రుడుగారి జీవితం అనిపిస్తుంది. సంస్కృతగంగలో ఉన్న ఎన్నో గ్రంథాలు, వేలాది శ్లోకాలు కాలప్రవాహంలో తెలుగువారికి అందకుండా పోతూండడం చూసి, వాటిని తెలుగులోకి అనువదించి, అర్థతాత్పర్యాలు ఇచ్చి, సంస్కృతంలో ఉన్న సూక్ష్మాలకు “బాలానందినీ” అను పేరుతో వ్యాఖ్యానాన్ని వ్రాసి తెలుగు వారందరు వాటిని సుళువుగా చదువుకొని అర్థం చేసుకోవడానికి వారు జీవితాంతం అవిశ్రాంతంగా చేసిన కృషి ఇప్పటిదాకా ఎవ్వరూ చేయలేదేమో అనిపిస్తుంది. ఒక్కచేతితో వాల్మీకి రామాయణాన్ని ఎలా వ్రాసాడో తెలియదు, కాని ఒక్క చేతితో మొత్తం వాల్మీకి రామాయణానికి తెలుగులో అర్థ తాత్పర్యాలు, వ్యాఖ్యానంతో శ్రీ పుల్లెల వారు అందించడం ఈ తరం, రాబోయే తరాల తెలుగువాళ్ళ అదృష్టం. సంస్కృతంలో ఆది శంకరులు భగవద్గీతకు వ్రాసిన భాష్యాన్ని తెలుగులో అందించిన ఘనత కూడా శ్రీ పుల్లెల వారిదే.
ఎంతో సుదీర్ఘమైన కృషి తో వాల్మీకి రామాయణ వ్యాఖ్యానం అందించి చివరలో వారు చెప్పిన శ్లోకం
“దేవతానుగ్రహః పిత్రోస్తప శ్చాచార్యసత్కృపా
కర్తాస్మద్గ్రంథజాతస్య కరణం కేవలం వయం”
తను రచించిన కృతులకు దేవతానుగ్రహము, తల్లిదండ్రుల తపస్సు, ఆచార్యుల కృప కారణమని, తాను కేవలం ఒక పనిముట్టు ఉపకరణం మాత్రమే అని చెప్పుకోవడం వారి నిరాడంబరత.
వారి “వాల్మీకి రామాయణం”, “శ్రీ భగవద్గీతాశాంకర భాష్యం” ఎప్పుడు చదివినా, మూలం ఎప్పుడో వాల్మీకి, ఆది శంకరుల వైనా, ఇప్పుడు మన మధ్యలో ఉన్న శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారి అనువాదాలు అని అనుకునే భావం, భాగ్యం వారు లేరనే వార్తతో లోటుగా మారిపోయింది. వారిని తలుచుకున్నప్పుడు ఎన్నో గ్రంథాలకు ఒక్క మనిషి ఇంత కృషి చేసారా అని ఆశ్చర్యం కలుగుతుంది. సమాజ శ్రేయస్సుకోసం సలిపే ఏ కృషికైనా వారి కృషి ఒక ఆదర్శంగా ఎప్పటికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎన్నో వేల పేజీల బృహత్ రచనలు చేసినా, అక్షరదోషాలు, టైపోలు దొర్లకుండా శ్రద్ధ వహించడం వారి విశిష్టత. ఆచార్యుల వారు ఉదాహరణ పూర్వకంగా అందించే అదనపు పాఠం. వారి రచనలు అందించే వెలుగులను అందుకోవడం, మరింతగా మరెందరితోనో వాటిని పంచుకోవడం వారికిచ్చే నివాళి అని అనిపిస్తుంది. వారి ఆత్మకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.
———————-
విధేయుడు
-శ్రీనివాస్
వాసుదేవరావుగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఇలాంటి వ్యాసాలలో భాషాంతరీకరణ గురించిన చర్చ అసలు విషయాన్ని దారి తప్పించినదే అవుతుంది. కానీ యీ భాషాంతరీకరణకి ఒక పద్ధతి అంటూ ఏర్పడేదాకా/ఏర్పరచుకొనే దాకా బహుశా అలాంటి చర్చ తప్పదు!
ఇలాంటి పాపులర్ వ్యాసాలు (ఈమాటలో లెక్కల గురించిన వ్యాసాలు పాపులర్ వ్యాసాల లెక్కలోకే వస్తాయని అనుకొంటాను) పాఠకులకి ఎంత సులువుగా అర్థమయితే అంత బాగుంటాయి. దానికి ఇంగ్లీషులోని పడికట్టు పదాలని డు,ము,వు,లు చేర్చి తెలుగులోకి తెచ్చుకోడం ఒక పరిష్కారమయితే అదే తక్షణకర్తవ్యం! బహుశా అలా చేస్తే ఎక్కువ తర్జనభర్జనలు పడే అవసరం కూడా ఉండదు. అసలు డు,ము,వు,లు చేర్చకుండా (అసలు అన్యదేశ్యాలు తెలుగులోకి వచ్చేప్పుడు హలంతాలు ఉకారాంతాలుగా మారడం తప్ప వేరే ప్రత్యయాలేమీ రావు) ఉన్నవున్నట్టుగా కూడా వాడుకోవచ్చు – హోల్ నెంబర్లు, ప్రైమ్ నెంబర్లు, పెర్ఫెక్ట్ నెంబర్లు – ఇలా. “least upper bound” వంటి పదబంధాల విషయంలో, తెలుగులో అర్థం మాత్రమే వివరించి ఇంగ్లీషు పదబంధాలని అలాగే ఉంచేయాలి.
ఇవి తెలుగు వాక్యాలలో ఒదిగిపోతాయా, పంటికింద రాళ్ళలా అడ్డు తగులుతాయా అనేది కొన్ని వ్యాసాల తర్వాత పాఠకులే తేలుస్తారు.
—
‘ఒక ప్రధాన సంఖ్యకి, దాని తరువాత కనిపించే ప్రధాన సంఖ్యకి మధ్య వచ్చే పాతము పరిబద్ధమైనది లేదా ‘సీమితము’ (bounded) అని అన్నారు. అంటే, ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు.
—
దీన్ని కొంచెం వివరించాల్సిన అవసరం ఉందని నాకనిపించింది.
లెక్కలలో “bounded”, “having limit” అనే రెండు పదాలు సమానార్థకాలు కావని తెలియకపోతే, ఇక్కడ చెపుతున్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది.
“ఎంత పెద్ద ప్రైమ్ నెంబర్ల జంటను తీసుకొన్నా, వాటి మద్య దూరం ఒక అవధిని దాటదు” అంటే
lim n->infinity, { p(n+1) – p(n) } < N
అని అర్థం వస్తుంది. ఇది తప్పు. ప్రైమ్ జంటల మధ్య దూరం అనంతంగా పెరుగుతునే పోతుంది!
అంచేత జాంగ్ నిరూపించింది అది కాదు.
ఒక కచ్చితమైన దూరాన్ని (అవధి) తీసుకొంటే, సంఖ్యలను ఎంత పెంచుకొంటూ పోయినా, తమ మధ్య దూరం ఆ అవధిని మించకుండా ఉండే ప్రైమ్ జంటలు దొరుకుతాయా లేదా అన్నది ఇక్కడి ప్రశ్న. దొరుకుతాయి అన్నది జాంగ్ నిరూపించారు. అది 70,000,000 కన్నా తక్కువని కూడా నిరూపితమైంది. ఆ తర్వాత 16 కన్నా తక్కువ అని కూడా నిరూపించారు! అంటే ఎంత పెద్ద సంఖ్య తీసుకొన్నా, ఆ సంఖ్య కన్నా పైన – "16 కన్నా తక్కువ దూరం ఉన్న" ప్రైమ్ జంటలు మనకి దొరుకుతాయి. బహుశా ఈ విషయం వ్యాసంలో స్పష్టంగానే ఉండి ఉండవచ్చు, అయినా నా అవగాహనకోసం మళ్ళీ ఇక్కడ నా మాటల్లో చెప్పానంతే!
ఇంత సవివరమైన అభ్యాసగ్రంథమును గురించిన విస్తారమైన వ్యాసం బాగుంది. ప్రబంధాల్లోనూ, వ్యాకరణగ్రంథాల్లోనూ ఉన్న అభ్యాస రహస్యాలను ఆవిష్కరించడం వల్ల విద్యార్థిలోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. పద్యాలను, ఛందస్సును, శిల్పాన్ని, పర్యాయపదాలను, ప్రతీదాన్నీ అభ్యాసం చేయడానికి లోతులను తెలుసుకోడానికి ఉపయోగపడే ఈ గ్రంథానికి సమగ్ర వ్యాఖ్యానగ్రంథం కూడా రావలసి ఉందనిపిస్తుంది.
ఒకానొకడుగారూ, లక్ష్మన్నగారి వ్యాఖ్య చదవగానే నాకూ అదే అనుమానం వచ్చింది. కాని మళ్ళీ చదివితే అర్థమయింది – 61ని “2,3,4,5,6 చేత భాగిస్తే ఒకటి మిగిలే సంఖ్య”కి ఉదాహరణగా యిచ్చారు. రెండు నుండి ఆరు వరకూ ఉన్న సంఖ్యలచేత భాగిస్తే ఒకటి మిగులుతూ, ఏడు చేత నిశ్శేషంగా భాగింపబడే అతి చిన్న సంఖ్య ఏమిటి అన్నది ప్రశ్న. దాని సమాధానం మూడువందల పైచిలుకే! 🙂
లెక్కలమీద ఆసక్తి ఉన్నవాళ్ళకి వ్యాసం నచ్చుతుంది. కొన్ని సూచనాలోచనలు:
1. gap అంటే “పాతము” కన్నా “అంతరము” అంటే సులువుగా బోధపడుతుందనుకొంటాను. “సీమితాంతర సమస్య” అనవచ్చునేమో.
2. Conjecture అనే పదానికి “శిష్టాభిప్రాయం” కన్నా “ప్రతిపాదితము” వంటి పదం వాడితే అర్థానికి మరికొంత దగ్గరగా సులువుగా ఉంటుందేమో. “అభ్యూహ” అన్న పదం కూడా విన్నట్టు గుర్తు.
3. పూర్ణ – సంపూర్ణ పదాలు మధ్య తికమక పడే అవకాశం ఉంది. రెండిటికీ ఏదో సంబంధముందనే భ్రమ కూడా కలగవచ్చు. అంచేత “perfect number”కి వేరే పదం ఆలోచిస్తే బాగుంటుంది. పక్వ, పరిణత, పుష్ట లాంటి పదాలు చాలానే ఉన్నాయి. “నిధిసంఖ్య” అని కొందరు వాడారు. ఇలాంటి మాటలకి ఇంగ్లీషు పదాన్ని నేరుగా అనువాదించాలా లేదా ఆ పదాల అసలు గుణాల ఆధారంగా తెలుగు చేయాలా అనే ప్రశ్న వేసుకొంటే, రెండో దానికే నా ఓటు. Prime Numberని “ప్రధాన సంఖ్య” అనడం కన్నా “అభాజ్య సంఖ్య” అనడమే నాకు నచ్చుతుంది. ఆ రకంగా perfect numberని “కారణాంకయుతి సంఖ్య” అంటే?
సంస్కృత గణితవేత్తలు ఈ సంఖ్యల గురించి ఏమైనా చెప్పారా? వారు ఏ పదాలు వాడారు?
“ఉవ్వెత్తుగా ఆవరసం త్రాగినట్లుగా’ అయిందట ఇంద్రునికి! ఇంద్రుని చేత ఆవరసం త్రాగించగలిగిన ఘనుడు తెనాలి రామకృష్ణకవి ఒక్కడే!”
అదంత పెద్ద శిక్షేం కాదండి.
ఏ. కె. రామానుజన్ వ్యాసాల సంకలనంలో (ఆక్సస్ ఫొర్డ్ యూనివర్సిటీ ప్రెస్, లావుపాటి పుస్తకం, అతి చిన్న అక్షరాలు, లెక్కకు మిక్కిలిగా కథలు. ఎన్ని గొఱ్ఱెలను లెక్కించినా నిద్ర రానప్పుడు చదువుతుంటాను.) వాల్మీకి రామాయణం బాలకాండ నుంచి చెప్పిన ఒక కథలో, ఇంద్రుడు అహల్యని మోసగించి భోగించిన సందర్భంలో, అహల్య భర్త గౌతముడు శపిస్తే, ఇంద్రుని testes/ ?scrotum ఊడి కింద పడుతుంది. (వీటికి తెలుగు మాటలు నాకు తెలియవు. విశ్వనాథ సత్యనారాయణ చెలియలికట్ట నవలలో, మనిషి ప్రతి అవయవానికీ/భాగానికీ పేరు ఉండి తీరుతుంది అంటారు. కాని లేవు. మగవాళ్ల private partsకి అసలు లేవు. ఉండి ఉంటే గాని ‘ఆంధ్ర భారతి’ నిఘంటువులలో ఎందుకు దొరకవు? పేర్లు లేకుండా మానవ దేహాన్ని గురించి ఎలా తెలుగులో రాయటం?) సర్లెండి, ఈ కథలో ఇంద్రుడు సహస్రాక్షుడు. ఇదే ఉదంతం కంబ రామాయణంలో వేరుగా ఉంది. గౌతముడు ఇంద్రుని శపిస్తే, అతని ఒంటి మీద వెయ్యి యోనులు (వెజైనా, vagina) మొలుస్తాయి. అవి తర్వాత వెయ్యి కళ్లుగా మారతాయి. అప్పటి నుండి అతను సహస్రాక్షుడు.
రామానుజన్ ఇలాటి చాలా కథలు చాలా ఓపిగ్గా విప్పి చెప్పాడు. పుస్తకంలోని ఆర్టికల్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే ఉన్నయ్యి. నేను చదివినంతవరకూ చాలా బాగా రాసాడనిపించింది.
ఈ శీర్షికలోని ఆయుతుని కధ లోని మరో విషయం, ఇంద్రుడు మారు వేషంలో రావటం. ఇండియన్, ఇతర మిధాలజీలలో, సైన్స్ ఫిక్షన్ సీరీస్ లో, -దేవుళ్లు, ఇతరులు మారు రూపు దాల్చటం, మారుపేర్లతో చరించటం, మాయమై పోటం, కనపడకుండా ఉండి మనుషులుతో మాట్లాడటం. చాలా ఎక్కువ కదా. మనుషులకు ఈ మాయల మీద ఇంత మోజు ఎందుకు అని చాలా సార్లు ఆలోచిస్తాను.
So, I was thrilled to see this recently published article “Sight Unseen, The hows and whys of invisibility” by Katheryn Schulz. (A critique on a book named “Invisible: the dangerous allure of the Unseen” by the British Science writer Philip Ball. (I have not read the book.)
The book apparently deals with not just the magical, and mythological, but also the technological, psychological aspects of invisibility. Not just in the kingdom of childhood, but as a grown up matter. The author apparently discusses the paradox of how invisibility can function both as a fantasy of empowerment and a nightmare of powerlessness.
I feel like getting this book. Besides other interesting things, this book may give me answers why so many people use pseudonyms on internet. I want to know if it is empowerment, powerlessness or something else.
You Sure? పద్యంలో అక్షరాలు కొన్ని సరిగా కనపడటం లేదని చెపుతూనే, పన్నెండు రకాల సవరణలు ఇంకా చేస్తూనే, మోహన తాత్పర్యమునకు చేటు లేదంటున్నారు. ఒకవేళ పాత పద్యం కొత్త సవరణలు ‘మోహన తాత్పర్యం’ సహాయంతో గాని, ఆ తాత్పర్యముతో వ్యతిరేకత కలగకుండా కాని చెయ్యటం లేదు కదా.
ఏ మాటకామాటే చెప్పాలి. సదరు తాత్పర్యవేత్త పైని, ఇక్కడ రాసిన మెప్పుపద్యం, పసందుగా ఉంది. తెలుగు మీద, తెలుగు వారి మీద మెప్పు పద్యాలు, వ్యాసాలు రాయటంలో తెలుగువారు సిద్దహస్తులు. (Microsoft corrected word.)
ఇంతవరకూ తెలిపిన/నాకు బోధపడిన (అర్థమైన) back ground story: ఒకసారి కట్టిన గుడి పడిపోయింది. అమ్మన ప్రెగ్గడ పునరుద్ధరించాడు. ఇంకెవరో డబ్బిచ్చి కొంచెం భూమి కొని, అందులో ఒక రాయి పాతి, ఒక ఉత్పల మాల పద్యం చెక్కించి, అందరినీ అమ్మన ప్రెగ్గడ లాగా ఏమేమో చెయ్యమంటున్నాడు.
My thoughts after the recent discussion are: ఈ పద్యం అర్థం అశాశ్వతం. క్షణ క్షణ భంగురం. దీనిని నమ్మరాదు. “అర్థం” అన్న మాటకే నానార్థములు ఏ భాష లోనైనా పెట్టుకుంటారా? అట్టి భాష నిర్ద్వందతను ఆశించదు.
This Telugu language wants to jump onto either side of fence at moment’s notice. It’s always – it could be this, it could be that, it could be both, it could be many things or anything or nothing. It could be none of the above, some of the above or all of the above. All at the same time.
It’s non-committal. It wishes to pass off non-committal nonsense as complexity of thought. When asked to explain ‘the thought’ it fails. ఇరవైయవ శతాబ్దం వచ్చేసరికి, ఈ తెలుగు భాషలో (చెయ్యగలిగిన) double talk ఇంకా పెరిగింది. ధర్మం, అర్థం -పరమాత్మ జీవాత్మల్లా సంయోగం సాధించాయి.
“గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి బాబయా, గంజి కొక్క ధర్మమీ బాబయా” అన్న సినిమా పాటలో ధర్మం అంటే డబ్బే కదా.
Thank you all. So far, I see no point in asking this poem to take a stand and give a deposition.
“కాబట్టి తెలుగు ప్రపంచ భాషే!” అన్న పేరా తర్వాత, దాని గురించే మరికొంత వివరిస్తూ రెండు పేరాలు రాసిన మీదట, “ఇది ఒక రకమైన అంతర్జాతీయత.” అన్నారు కదా. అంటే “ప్రపంచ భాష”, “అంతర్జాతీయ భాష” అనేవి పర్యాయపదాలే కదా. ఇక్కడ వ్యాసకర్తలు ముందు “ఒక రకమైన” అంతర్జాతీయత గురించి వివరించి, దానికి భిన్నమైన మరొక అంతర్జాతీయత గురించి మాట్లాడారు.
“ఉదాహరణకి, యూదులూ జెర్మన్‌లూ ఫ్రెంచ్ వాళ్లూ, తమ భాషలనీ సాహిత్యాలనీ అమెరికా లోని యూనివర్సిటీలలో ప్రవేశపెట్టి నిలబెట్టడం మూలంగా వాళ్ళ సంస్కృతికి ఒక అంతర్జాతీయ స్థితి సంపాదించగలిగారు. ఈ అంతర్జాతీయత ఎలాంటిది — అది తెలుగుకి వొస్తుందా అన్నది ప్రశ్న.”.
ఇక్కడ వాళ్ళు చెప్పదలుచుకొన్న రెండవ రకం అంతర్జాతీయత గురించి ప్రస్తావించి, ఆ తర్వాత పేరాలో దాన్ని నిర్వచించారు: “ముందు ఒక భాష అంతర్జాతీయ భాష ఎలా అవుతుంది అనే ప్రశ్న మరొకసారి వేసుకుని చూద్దాం.” అంటూ. వచ్చిన చిక్కేమిటంటే, అది ఆ పదానికి తామిస్తున్న నిర్వచనంలా కాకుండా ఆ పదానికున్న సార్వజనీనమైన అర్థాన్ని వివరిస్తున్నట్టుగా ఆ నిర్వచనం సాగింది. సహజంగానే అది పాఠకులను గందరగోళంలోకి నెడుతుంది.
ఇక చైనా విషయానికి వస్తే, చైనాలో రాజకీయశక్తుల కారణంగా ముందు ఇంగ్లీషు భాషా ప్రభావానికి ఆ సమాజం దూరంగా ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో తమ శక్తిని పెంపొందించేందుకు శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధి జరిగింది. అందువల్ల అక్కడ సహజంగానే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వారి భాషలోనే అభివృద్ధి చెందింది. అంతేకాని తమ భాషను ప్రపంచభాష చేయడం కోసం శాస్త్రసాంకేతిక అభివృద్ధి జరగలేదు. మన సమాజం విషయానికి వస్తే, ఇప్పటికే మనం ఇంగ్లీషు ప్రభావానికి చాలానే గురయ్యాం. ఇక్కడ ఆర్థిక కారణాలకోసం శాస్త్రసాంకేతికాభివృద్ధి జరగవచ్చు. కాని అది తెలుగులో ఎలా జరుగుతుంది? అన్నది ప్రశ్న.
***
నాగరాజుగారూ,
నారాయణరావుగారి పుస్తకాలను నేను ఎక్కువగా చదవలేదు కాని, చదివినంతలో వారంటున్న విజ్ఞానం గురించి నా ఊహ యిది:
మనకంటూ (తెలుగువాళ్ళకు అనుకోండి, లేదా భారతీయులకు అనుకోండి) ఒక ప్రత్యేకమైన ప్రాపంచిక దృక్పథం ఒకటి ఉండేది. సాంఘికవ్యవస్థ, ఆర్థికవ్యవస్థ, కళలు, శాస్త్రాలు, చరిత్ర – ఇలా అనేక విషయాలమీద మనకి యిప్పుడు పాశ్చాత్యదృక్పథమే సర్వేసర్వత్ర వ్యాప్తిలో ఉంది. వీటి గురించి దీనికన్నా విభిన్నమైన ఒక ఆలోచన, దృక్పథం మనకి ఉండేవి. అవి మన సాహిత్యంలో ప్రతిఫలించాయి. పాశ్చాత్యదృష్టితో కాకుండా, ఈ సాహిత్యాన్ని “మనదైన దృష్టితో” పరిశీలిస్తే, మనం పోగొట్టుకొన్న ఆ ప్రాపంచిక దృక్పథంలోని అనేక పార్శ్వాలను మనం గమనించ వచ్చు. తద్వారా ప్రపంచానికి ఒక కొత్త Alternate World View చూపించవచ్చు. అది మనం ప్రపంచానికి అందించే విజ్ఞానంలో భాగమవుతుంది.
ఇది చెయ్యాలంటే, తెలుగుసాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదిస్తే సరిపోదు. తెలుగుసాహిత్యాన్ని భిన్నమైన దృష్టితో పరిశోధించి, అందులోని Alternate World Viewని విశ్లేషించి ప్రపంచానికి అందివ్వాలి. ఇలాంటి పరిశోధన విశ్వవిద్యాలయాలలోనే కదా జరగాలి!
ఈ వ్యాసం, దానిపై చర్చలు చదివినప్పుడు, కొంతకాలం క్రితం చదివిన ఒక పేపరు లోని క్రింద వాక్యాలు గుర్తుకొచ్చాయి:
“In this context, it becomes important to distinguish between language maintenance (sustaining an ecology in which a population can continue to speak their language) and language preservation (recording texts from a particular language graphically or mechanically). If the current ecology cannot be changed, should not linguists be more realistic and focus on language preservation rather than on maintenance?” – Colonisation, Globalisation, and the Future of Languages in the Twenty-first Century by Salikoko S. Mufwene.
ఆంధ్రదేశంలో ప్రస్తుతం తెలుగుయొక్క అధ్వాన్నస్థితిని కండ్లకు గట్టే చక్కని పద్యం. ఆంధ్రదేశంలోనే తెలుగు అంతరించిపోతుంటే అడిగే నాథుడు లేడు. ఇక అంతర్జాతీయతనుగఱించి ఆలోచించడం ప్రస్తుతపరిస్థితిలో అప్రస్తుత మనిపిస్తుంది. ‘ఉట్టి కెగురలేని జెట్టి స్వర్గాని కెగుర గలడా?’ అన్న దానిని ఇది తలపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాల అధికారికచిహ్నాలను (official emblems) చూడండి. వానిలో ప్రధానంగా కన్పడేవి ఇంగ్లీషులో వ్రాసిన రాష్ట్రనామాలే. తెలుగులో వ్రాసినపేరు అప్రధానంగా ఒక మూలకు ఉంటుంది. ఇదొక్కటి చాలు తెలుగుపై ఆయా ప్రభుత్వాలకు ఎంత మక్కువ ఉందో గ్రహించడానికి.
తమ్మినేనివారు లేవనెత్తిన ‘కకుభ’పదవిచారం. కకుప్ అనునది స్త్రీలింగ భకారాంతపదం. కకుప్, కకుభౌ, కకుభః – అని ప్రథమావిభక్తిలో ఏక,ద్వి,బహువచనరూపాలు. అందుచేత కకుప్+అంత = కకుబంత అనే పదం నిర్దుష్టమైనపదం. ఐతే కకుభా అనే ఆకారాంతమైన స్త్రీలింగపదం కూడ ఉన్నది. అదివాడితే కకుభాంత అని కావాలి. కాని కకుబంత అనే పదం సాధువే కాక సౌమ్యంగా కూడ ఉన్నందున అది వాడటంలో పొరపాటు లేదు. కకుభశబ్దము పుల్లింగమైనప్పుడు వీణె కరివెకు, మద్దిచెట్టుకు, కకుభరాగానికి పేరౌతుంది. కకుప్ అని స్త్రీలింగమైనప్పుడు శోభ, దిక్కు, సంపంగిదండ ఇత్యాదుల కర్థమౌతుంది.
శ్రీ పప్పు :భారతాన అంగ్లేయుల పాలన అంతరించిన తర్వాత అనతి కాలంలోనే సైన్సూ టెక్నాలజీ ల తో ముడిబడ్డ విపణి తో పెనవేసుకు పోయిన ఒక కల్చురల్ హోమోజనై జషన్ ప్రపంచాన్ని కమ్మేసింది. దీని ప్రభావాన ఇంగ్లిష్ ను అమెరికన్ మింగేయటం జరిగింది. ఇల్లాలు ,హవ్స్ వైఫ్ , కాఫీ మేకర్ లాగా హోం మేకర్ అయింది .
యూరప్ మెల్లిగా వెనకపడి పోయి – ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో అరవై ఐదు వరకూ అంతకు కొన్ని సంవత్సరాలు ముందు నుంచీ సైన్స్ విద్యార్థులకు జెర్మన్ నిబంధన గా బొధించేవాళ్ళు- పైన చెప్పిన అమెరికన్ ప్రభావం దట్టంగా అలుముకుని అమెరికా కడుపుకు రొట్టె తో బాటు బుఱ్ఱ కు జామూ ఇచ్చే వితరణ శీలిగా అవుపడటం తో భారతీయ భాషలు ఈ వ్యాపార సాంస్కృతిక బానిసత్వ సంకెళ్ళలోకి తమ చేతులు జాచాయి. ఇప్పుడు ‘వగచిన వగచిన యేమి ఫలము’. మీరన్న ఆనువాదాలు కూడా ప్రపంచాన్నంతటినీ కాక ఎసెన్షియల్ గా అమెరికాని ఇంప్రెస్ చేయటానికే సాగినట్టు గా నాకు అనిపిస్తుంది
ఫ్రపంచం చిన్నదయి పోతోందంటే అమెరికా పెద్దదయిపోతోందనేనన్న నిజానికి పది పదిహేనేళ్ళ క్రితం కళ్ళు తెరిచిన వాళ్ళు చైనా వాళ్ళు. అర్జెంటుగా చైనీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా గుర్తించేటట్టు చేయగలిగారు. ఇక ముందు సైన్స్ – టెక్నాలజీలలతో ఆధిపత్యమే సాంస్కృతిక ఆధిపత్యమై తిష్టవేస్తుంది.
చాన్నాళ్ళుగా యీ వ్యాసానికి స్పందించాలనుకొంటున్నా ఊరుకోడానికి కారణం, పై వ్యాఖ్యల్లో ఒకరన్నట్టుగా, ఇవి వట్టి మాటలుగానే మిగిలిపోతాయి కదా అనే నిరాశ. ఇప్పుడు స్పందించడానికి రెండు కారణాలు. ఒకటి, ఇది ఏభయ్యవ (స్వర్ణ) వ్యాఖ్య అవుతుందని! 🙂
వ్యాసాన్నీ వ్యాసంపై వచ్చిన స్పందనలనూ చదివిన మీదట, వీటిలో మూడు రకాల ఆలోచనాధోరణులు నాకు కనిపించాయి. వాటి గురించి వివరించే ముందు – ఈ వ్యాసంలో “అంతర్జాతీయ/ప్రపంచ భాష” అంటే ఏమిటన్నది స్పష్టంగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు. నేను అర్థం చేసుకొన్నంతలో నాకది స్పష్టంగానే ఉందనిపించింది.
“ఒక భాషలో వున్న విజ్ఞానం ప్రపంచం విజ్ఞానంలో భాగం అయి, ప్రపంచంలో విజ్ఞానులు దానిని గుర్తించవలసిన అవసరం కలిగితే, అప్పుడు అది ప్రపంచ భాష అవుతుంది.”, “నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే ఇదిగో నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున… — అప్పుడు తెలుగు ప్రపంచ భాష అవుతుంది”.
ఇక్కడ “విజ్ఞానం” అంటే Knowledge అన్న అర్థంలో వాడారనుకొంటున్నాను. ఈ వాక్యాలలో “ప్రపంచ భాష” అంటే వ్యాసకర్తల ఉద్దేశం ఏమిటన్నది స్పష్టమే కదా. నాకు అర్థమైనంత వరుకూ “ప్రపంచ భాష”, “అంతర్జాతీయ భాష”ను పర్యాయపదాలుగానే గ్రహించారు. నాకీ వ్యాసంలో కనిపించిన ముఖ్యలోపం ఒకటే, అసలు తెలుగులో అలాంటి విజ్ఞానం ఉన్నదా, ఉంటే అది ఎలాంటిది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. అది వివరించకుండా, తెలుగులోని విజ్ఞానాన్ని ప్రపంచానికి ఎలా తెలియజెప్పడం అనే చర్చలోకి వెళ్ళిపోయారు. ఇక నేను గమనించిన ప్రధాన ఆలోచనా ధోరణుల గురించి:
1. తెలుగు “ప్రపంచభాష” కావడం కన్నా ముందు తెలుగువాళ్ళు “మాట్లాడే భాష”గా ఉండడం ముఖ్యం అనేది ఒక ఆలోచనాధోరణి. ఇది సహజంగా సబబైన ఆలోచనగానే అనిపిస్తుంది. ఇది వ్యాసానికి అంతగా సంబంధం లేని అంశం అన్నది అలా ఉంచితే, కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఇది ఎంతవరకూ సాధ్యం అనే అనుమానాలు ఎదురవుతాయి. నిక్కచ్చిగా ఆలోచిస్తే, ఏ భాష అయినా “అవసరం” అనేది కోల్పోయినప్పుడు అది మాట్లాడే భాషగా మనుగడ సాగించలేదు. కేవలం “అభిమానం”, భాషను ఉద్ధరించడం కల్ల. ఈ “అవసరం” కేవలం సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన “భౌతిక” అవసరమే కానక్కరలేదు. “సాంస్కృతిక” వ్యవస్థకి చెందిన, “మానసిక” అవసరం కూడా కావచ్చు. ఆ అవసరం వ్యక్తిగతం కాకుండా సంఘస్థాయిలో ఉండడం ముఖ్యం. అలాంటి సామాజిక, ఆర్థిక లేదా సాంస్కృతిక పరిస్థితులను కల్పించుకొనే వరకూ, కేవలం భాష వాడుకపైనా వ్యాప్తిపైనా మాత్రమే దృష్టి పెట్టడం పెద్దగా ప్రయోజనాన్ని యివ్వదు. అలాంటి పరిస్థితులను కల్పించడం ఎలా? రోజురోజుకి పెరుగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఇది అసలు సాధ్యమా?
2. పై ప్రశ్నలకు కొంత అనుసంధానమైనదే రెండవ ఆలోచనాధోరణి. ఆధునిక ప్రపంచానికి గణితం, సైన్సు మొదలైన శాస్త్రాలూ, సాంకేతికత, చాలా ముఖ్యం. వాటిలో తెలుగువాళ్ళు గొప్ప విజ్ఞానాన్ని సంపాదించి, దాన్నంతటినీ తెలుగుభాషలో మాత్రమే భద్రపరిస్తే, తెలుగువాళ్ళూ “తెలుగేతరులూ” కూడా తెలుగు నేర్చుకోవలసిన “అవసరం” ఏర్పడుతుంది – అన్నది. ఇదికూడా గొప్ప ఆశయమే! కానీ సాధ్యమవ్వడం ఎలా? తెలుగువాళ్ళు సాంకేతిక విజ్ఞానాలలో పట్టు సాధించాలంటే ముందు “తెలుగువాళ్ళు”గా మిగలాలి. అలా మిగిలినవాళ్ళు అలాంటి పట్టు సాధించగలిగే సాధనాలుండాలి. ఆ తర్వాత వాళ్ళు తెలుగులో మాత్రమే దాన్ని భద్రపరిచేందుకు సిద్ధపడాలి. ఇన్ని లికారాలు సాకారాలవ్వడానికి ఆకరాలేమిటి? దీని కన్నా మొదటి ఆలోచనాధోరణిలో దారి సులభం అనిపించడం లేదూ?
3. చివరగా మూడవ ఆలోచనాధోరణి. ఈ వ్యాసంలో నాకు కనిపించిన ఆలోచన యిదే. ఇప్పటికే తెలుగులో ఉన్న విజ్ఞానాన్ని ప్రపంచానికి ఎందుకు చాటిచెప్పకూడదు. ఎలా అయితే సంస్కృతం ఇప్పుడు వాడుకలో లేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల పరిశోధనాశాలల్లో కనిపిస్తున్నదో అలాగే తెలుగుభాష ఎందుకు ఉండకూడదూ? అయితే యీ వ్యాఖ్య మొదట్లో చెప్పినట్టుగా, ఆ విజ్ఞాన స్వరూపం ఏమిటో వ్యాసకర్తలు స్పష్టంగా చెప్పలేదు. అంతర్గతంగా, వారు తెలుగు సాహిత్యంలో అలాంటి విజ్ఞానం ఉన్నదని నమ్మినట్టుగా నాకనిపించింది. వారు చెప్పిన అంశాలన్నిటికీ యిది చాలా కీలకమైనది. దాని స్వరూపాన్ని మరికాస్త వివరించి ఉంటే బాగుండేది. ఈ నమ్మకాన్ని మనం ఆమోదిస్తే, అది ప్రపంచం వ్యాప్తం కావడానికి వారు చూపించిన మార్గాలు సమంజసంగానే తోస్తాయి. ఇది పైరెండు ఆలోచనా మార్గాల కన్నా కొంత సుగమమే అనిపిస్తోంది. అయితే, ఈ దృష్టి, తెలుగుభాషని ఒక సజీవభాషగా కాక, సంస్కృతంలాగా ఒక మ్యూజియంలో భద్రపరచదగ్గ భాషగానే చూస్తోందేమోనన్న అనుమానం కొంత గొంతుక్కి అడ్డం తగులుతోంది. తెలుగుభాషని “సజీవంగా”, అంటే జనాలు ఎక్కువగా మాట్లాడుకొనే భాషగా మిగల్చడానికి మార్గం యిది కాదని కచ్చితంగా చెప్పవచ్చు.
తెలుగు ప్రభుత్వం కాని ప్రజలు కాని, తమ శక్తియుక్తులనూ సమయాన్నీ, తెలుగుభాషని సజీవంగా ఉంచే ప్రయత్నానికి వినియోగించాలా (దానివల్ల ఫలితముంటుందా?), లేక ప్రపంచ విశ్వవిద్యాలయాలలో పరిశోధనా యోగ్యమైన భాషగా తీర్చిదిద్దాలా అనేది ప్రస్తుతానికి నాకొక భేతాళ ప్రశ్నే!
చర్చ ముగించానన్న తఃతః గారిని మళ్ళీ చర్చలోకి లాగాలన్న చిలిపి కోరిక యీ వ్యాఖ్య వ్రాయడానికి రెండో కారణం. 🙂
బహుశా ఒక్క వెల్చేరు గారు తప్ప మనలో అందరమూ – రచయితలైనా పాఠకులైనా- తెలుగు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి తెలుగు చదువుకోలేదు, నేర్చుకోలేదు అనుకుంటాను. వెయ్యేళ్ళపై బడ్డ భాషను, ఎంతో మంది కవులు, కళాకారులు, మేధావులు, దార్శనికులు వాడిన భాషను “నేర్చుకోవడం” అంటే ఏమిటో కూడా మనం ప్రశ్నించుకోవాలేమో. ఇప్పుడున్నాయో లేదో కాని, కొన్నేండ్ల కింద వరకు రైల్వే స్టేషన్లలో పుస్తకాల బండి మీద “Learn Telugu in 30 days, Learn Tamil in 30 days” అన్నవి కనపడేవి. కేవలం నెల రోజుల్లోనే తెలుగు నేర్చుకోగలిగితే, అదీ ఒక చిన్న పుస్తకంతోనే సాధ్యమైపోతే ఇక వేరే పుస్తకాలు, కోర్సులు, టీచర్లు, విశ్వవిద్యాలయాలు ఎందుకు? నేర్చుకునేవాళ్ళు ఎట్లా నేర్చుకున్నా, నేర్పించడానికి, ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియనివి నేర్చుకోగలగడానికి వ్యవస్థలు అవసరం.
వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా, లోపాలు దిద్దుకుంటాం కాని వ్యవస్థలే అవసరం లేదు అనలేము. “విశ్వవిద్యాలయం” అన్న పదం పుట్టకముందే తెలుగు పుట్టింది, పెరిగింది. కాని, ఇప్పడున్న కాలంలో, తెలుగు నేర్పే వ్యవస్థల పేర్లేవైనా, నిర్వహించే సంస్థలేమైనా, కొంత నిలకడ, నిబద్ధత ప్రజల పైసలతో ప్రభుత్వ సహకారంతో నడిచే విశ్వవిద్యాలయాలలో కనిపించడానికే అవకాశం ఎక్కువుంది. అంటే చిత్తశుద్ధితో నడిచే, నడిపించే వేరే సంస్థలు తక్కువా అని కాదు.
రామానుజన్ యూనివర్సిటీకి పోకుండానే గణితంలో మేధావి అయ్యాడు అని మన పిల్లలను యూనివర్సిటీలకు పంపడం మానుకోము, మనం చదివిన బడులు, యూనివర్సిటీలలో లోపాలు బాగా మనకు తెలుసు కాబట్టి, వాటిని మూసేసుకోము. లోపాలు లేని వ్యవస్థలు లేవు. కాని తెలుగు భాషకు వ్యవస్థలే లేవు అన్న లోపం మాత్రం లేకుండా, రాకుండా చూసుకోవాల్సిన దార్శనికత, బాధ్యత తెలుగు వారందరిదేమో అనిపిస్తుంది.
———–
విధేయుడు
-శ్రీనివాస్
బ్రిటిష్ వాళ్లు ఇండియా వచ్చి తిష్ట వేసిన కొత్త రోజులలో వారికి ఒక సమస్య ఎదురయింది. “ఇంగ్లీషేతరులకి” ఇంగ్లీషు ఎలా నేర్పించాలి అని. వారి మాతృభాష ఇంగ్లీషే కాబట్టి ఎవ్వరూ నేర్పకుండానే వారికి ఇంగ్లీషు వచ్చేసింది. పాఠశాలకి వెళ్లి నేర్చినది రాయడం, చదవడం. కాని భారతీయులకి ఇంగ్లీషు నేర్పబూనుకున్నప్పుడు ఆ పని ఒక క్రమ పద్ధతిలో ఎలా చెయ్యాలో కనిపెట్టడానికి అప్పటి యూనివర్శిటీలు కష్టపడే ఉంటాయి. ఇండియా అంత పెద్ద మార్కెట్ లేకపోతే “రెన్” గ్రామరు వంటి పుస్తకాలు బ్రిటన్లో ఎవరికి కావాలి?
తెలుగు విషయం వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉంది. ఒకటి, ఇంగ్లీషుకి ప్రపంచం లోను, హిందీకి ఇండియాలోను ఉన్న “రాజకీయ బలం” తెలుగుకి లేదు. కనుక తెలుగు పరిస్థితిని లేవనెత్తడానికి చేసే ప్రయత్నాలన్నీ ఏటికి ఎదురీత లాంటివే. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ “ఈత”ని ఈదాలి. రెండు, మన పిల్లలకి, మనవలకి తెలుగు నేర్పి అదే మన గమ్యం అని ఊరుకోదలుచుకుంటే ఈ చర్చ అనవసరం. లేదు, కాదు, తెలుగేతరులు కూడ తెలుగు నేర్చుకోవాలని అనే గమ్యం కూడ ఉంటే తెలుగుని రెండవ భాషగా నేర్పడం ఎలా అన్న విషయం మీద పరిశోధన అవసరం. అటువంటి పనిని ఆదివారం పాఠశాలలు కంటె విశ్వవిద్యాలయాలు చేస్తేనే రాణిస్తుంది. – వేమూరి
కవికులగురువు గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:
05/30/2015 10:50 am
శ్రీమద్రామాయణం – శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు. ఆర్షవిఙ్ఞాన ట్రస్టు – హైదరాబాద్ (పది సంపుటాలు)
రఘువంశం – శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రీ. తెలుగు విశ్వవిద్యాలయం – హైదరాబాద్.
(ఇప్పుడు అమ్మకానికి ప్రతులున్నాయో లేదో తెలియదు. కాని అన్ని కాలేజ్ లైబ్రరీల్లో దొరకవచ్చు)
శ్రీనివాస్ మంచి అంశాలు లేవనెత్తేరు. సాహిత్యేతర రంగాల్లో కూడ – అంటే, వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో, విపణి వీధులలో – తెలుగు వాడకం పెరగాలి. వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో రాసేవాళ్లని, రాయగలిగేవాళ్లని చేతి వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఈ దిశలో ఈమాట ఏదో ఉడతాభక్తితో చేయూత ఇస్తోంది కాని మన దేశంలోని పత్రికలలో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. తెలుగుని కొంచెం సరళీకృతం చెయ్యాలి కూడ. క్షమించండి. ఒక ఇంగ్లీషు పలుకుబడిని తెలుగుకి అనువర్తిస్తూ ఇంగ్లీషులోనే చెప్పనివ్వండి. Telugu is too important to be left alone in the hands of Telugu pundits.
చుట్టూ ఉన్న పరిస్థితులని జాగ్రత్తగా పరిశీలించి, పై పై పటారాలను తోసిపుచ్చుతూ, అవేశం ఆవేదనలకు లోను కాకుండా ఆలోచనతో విశ్లేషిస్తూ, అంతకు మించి సహృదయంతో ఉపయోగపడే సూచనలు అందిస్తూ సాగిన వ్యాసానికి వెల్చేరు పరుచూరి గార్లకు చాలా కృతజ్ఞతలు.
మొత్తం వ్యాసంలో ఎన్నో అంశాలు పూర్తిగానో పాక్షికంగానో అంగీకరించేవి ఉన్నా, చివరి వాక్యం మాత్రం అంగీకరించలేకపోతున్నందుకు క్షమించాలి.
“తెలుగు అంతర్జాతీయ భాష అవడానికి మనం చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణం విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల్లో మొదలవాలి.”
నిస్సందేహంగా ప్రయాణం దూరం. ఇక, తెలుగు అంతర్జాతీయ భాష అవుతుందో, కాదో, అసలు అవ్వాలో లేదో అన్న విషయాలను పక్కకు పెడితే– సజీవ భాషగా తెలుగు పరిపుష్టం అవడానికి సాగే ప్రయాణం విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల్లో పుష్పిస్తుంది, విస్తరిస్తుంది, ఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది. కాని, ప్రయాణం అంకురించేది మొదలయ్యేది మాత్రం తెలుగు ఇళ్ళలో గళాలలో కలాలలోనే అని అనిపిస్తుంది.
రాజుగారి క్షీరాభిషేకానికి నావంతు నీళ్ళు పోస్తే ఏమవుతుంది అనుకొని అందరూ నీళ్ళే పోస్తే పాలు మిగలనట్లు, ఎన్నో రంగాలలో ఎన్నో విద్యలలో తెలుగువారికున్న విజ్ఞాన సాంకేతిక సంపద తెలుగు రూపంలో వ్యక్తీకరింపబడనంత వరకు భాషకు నీటి సహాయమే కాని, పాల సహాయం అందనట్లు అనిపిస్తుంది. చిన్న ఉదాహరణ మచ్చుకి- ఈ రోజు Computer Science విషయాలు వెతుకుతే చైనీసు భాషలో అక్కడక్కడా, German భాషలో అడపా దడపా articles కనిపిస్తాయి. కాని, తెలుగులో “లేవు” అనకుండా ఎంత తక్కువో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. Qualitative వ్యాప్తికి, వాడుకకు, విశ్వవిద్యాలయాల కన్నా జన చైతన్యమే ఎక్కువ దోహదం చేస్తుంది అనిపిస్తుంది.
అయితే, భాషకు సరళీకృతం కాని వ్యాకరణం, ముందుకు సాగడానికి కాళ్ళకు బంధనంగా అడ్డుపడుతుంది. తెలుగులో కనీసం వాడుకునే అక్షరాలు, చేస్తున్న లేదా చేయాల్సిన సంధులను సరళీ కృతం చేస్తూ సహాయపడే వ్యాకరణాంశాలను dry పొడిగా కాకుండా ఆకట్టుకునే రీతిగా విద్యార్థులకు ఎప్పుడు కూర్చుకుంటామో తెలియని స్థితి. తెలుగు చదివే విద్యార్థులు వ్యాకరణం అంటే “వాకరణా క్యా కరనా” అని తల పట్టుకునే స్థితి మారాలి. తెలుగులో చదివితేనే స్పష్టంగా హాయిగా ఉంటుందనే స్థాయికి రచనలు వచ్చిన నాడు తెలుగు తానంతట తనే అంతర్జాతీయ భాష అవుతుంది అని కూడా అనిపిస్తుంది.
===========
విధేయుడు
_శ్రీనివాస్
మీరన్న అవధారణార్థక ప్రత్యయం ఇక్కడ పొసగదు; (నీవు +అ =నీవ) లాంటి వాడుక కద్దు. పద్యంలో అన్వయ క్లేశమున్నది, కాదనను;దాన్ని దూరం చేసే మార్గాలు లేకపోలేదు. ఊహలు పారిన మేర అర్థాన్ని విస్తరించడం ప్రమాదం. భ్రమప్రమాదాలకు లోనయ్యే సందర్భాల్లో Hermeneutics (అర్థ మీమాంస) ఎంత గానో ఉపకరిస్తుంది.
అర్థము శాశ్వతమన్న భావము ఈ దాన శాసనం వచ్చిన చారిత్రిక సందర్భంలో ఇముడు తుందా ?? ఇమడదు, కావున దేశ్యమైన ప్రత్యయాన్ని తత్సమాలకు వర్తింప చేయడం దురన్వయం కాక తప్పదు. తావో తే చింగ్ అనువాదంలో eternal Tao అనడం తప్పు అంటాడు ఒక పండితుడు, కారణం eternal అని దేన్ని ఆధునికులు భావిస్తున్నారో ఆ ఊహే ఆ కాలానికి లేదు.కావున , ఊహా వృత్తానికి వ్యాసార్ధం చారిత్రిక సందర్భం కాక తప్పదు.
“ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. ” అన్న ప్రసాద్ గారి అభిప్రాయం సబబు :
నా అనుమానమల్లా వ్యర్థమటంచు అన్న పాఠం తప్పు . రత్తి గుఱించి అన్నదే సరయినదని.
ప్రాచీన కాలపు లేఖన పద్ధతుల్లో అత్థ౯ము = అర్థము ; రత్థి౯ =రర్థి ;
(కడప జిల్లా శాసనాలు- మొదటి భాగం ( సం. పరబ్రహ్మ శాస్త్రి )శాసన పాఠం అనుసరించి ) ఇప్పుడు అర్థ బోధకు వచ్చిన చిక్కు లేదు, ఛందో భంగం లేదు
అర్థి =కోరిక , ఆసక్తి ;గుఱించి=ఉద్దేశించి , నిర్ణయించి ; నమ్మక పరాత్థ౯ము
నెన్నణ్డు చేటు లేని ధర్మాత్థ౯మ ( ధర్మాత్థ౯ము + అ ) చేయుణ్డి
(వర్గాక్షరంతో కూడిన వర్గానునాసికం , తేల్చి పలుక వలసినదే , ఇలాంటి రూపాలు అద్దంకి పద్య శాసనం నిండా కనిపిస్తాయి )
————-
కడప జిల్లా శాసనాలు సంస్కృతీ చరిత్ర అన్న పరిశోధనా గ్రంథంలో అవధానం ఉమా మహేశ్వర శాస్త్రి గారి పరిశీలన ఎన్న దగినది
” అనిత్యాని శరీరాణి విభవోనైవశాశ్వతః
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః
శరీరాలు అనిత్యమైనవి , సంపదలు అశాశ్వతమైనవి. మృత్యువు ఎల్లప్పుడు పొంచి వుంది. కాబట్టి, ధర్మసంగ్రహమే కర్తవ్యం. ఈ విధమైన ఆశయం ప్రాచీన కాలంనుండి భారత దేశంలో ధర్మానురక్తులైన వారందరూ పయనించిన ఘంటా పథమైంది.
పైన చెప్పబడిన శ్లోకానికి అనువాదమని చెప్పదగిన పద్యమొకటి క్రీ.శ 9 లేదా 10 వ శతాబ్ది నాటి చిడిపిరాల శాసనంలో వుంది. ”
ఆయన ఉదహరించిన పద్యం మన చర్చలోని ఉత్పలమాల అని వేరే చెప్పాలా??
కాబట్టి, మోహన తాత్పర్యానికి చేటు లేదు
“ధనము శాశ్వతమైనది కాదు. శరీరము నశ్వరమైనది. జీవము తత్వార్థము కాదు. యమునిచే దండనార్హమైనది. దీనిని నమ్మరాదు. పరార్థానికై, ఎన్నడు మాసిపోని ధర్మార్థమును అందఱు అమ్మన ప్రెగ్గడలా గొప్పగా చేయండి. ”
* “శైలి అద్భుతం దమయంతీ.” –
🙂 ఎంత గొప్పేస్తోందో! మీ అంత సీనియర్ రచయిత్రి నించి ప్రశంస నందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా – లక్ష్మి అక్కా! నమస్సులతో..
* లతా, చాలా థాంక్స్ రా. మన వూరు ఎంత అందమైన వూరో కదూ? మన వాళ్ళు కూడా! 🙂
* “ఆతయ్య విషయానికొస్తె ఆ పాత్ర సజీవత్వంతొ మనసులొ ముద్ర వేసీంది.”
…లక్ష్మి మాధవ్! నాకు కూడా చాలా ఇష్టం ఆమె అంటే. చాలా దగ్గర్నించి చూశానేమో నా మనసులో ఆమె అలా.. ఒక చిత్రమై పోయింది. చిత్రమే! నాకు ఇప్పటికీ..ఎప్పటికీ అర్ధం కాని ఒక చిత్రమే.థాంక్సండి మీ స్పందన నన్నెంతగానో అలరించింది. చివర్లో ప్రశంస భలే థళుక్కుమందనుకోండి. నిజం. 🙂 థాంక్ యు సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ లక్ష్మి!
శుభాకాంక్షలతో..
“జాతీయ భాషగా తెలుగు” – నాకు అర్థము కాలేదు, తెలుగు ఆంగ్లము, హిందీల వలె అధికార భాష (official language) కాదు, కాని మిగిలిన చాల భాషలతో తెలుగు జాతీయభాషయే (national language) కదా? మఱి ఈ పరిరక్షణ సమితి ఉద్దేశము ఏమిటో బోధపడడము లేదు. ఈ ప్రవేశ రుసుము (registration fees) అన్ని సమావేశములకు ఉన్నాయి, అందులో ఆశ్చర్యము ఏమియు లేదు. 400 రూపాయలు చాల తక్కువే. విధేయుడు – మోహన
భాష అంతర్జాతీయమా కాదా అన్నది అంత ముఖ్యం కాదు. అది జీవభాషగా నిలుస్తోందా లేదా అన్నది ముఖ్యం. దానికై చేయబడుతున్న కృషి గురించి చర్చించలేదు.
ఉదాహరణకి సిలికానాంధ్రా మనబడి, పలు దేవాలయాల్లో, సాంస్కృతిక కేంద్రాల్లో ఎందరో శ్రమకోర్చి నడిపే తెలుగు బడులు కృషి ఎత్తిచెప్పబడలేదు.
ఇక్కడ విశ్వ విద్యాలయాల్లో నాలుగు “కుర్చీలు”, పత్రికలు నడిపి నాలుగు తెలుగులో శాస్త్రీయ వ్యాసాలూ వ్రాస్తే తెలుగు అంతర్జాతీయ భాష అయితే చప్పట్లు కొట్టుకుంటే సుఖమేమిటి? ప్రజలు మాట్లాడాలి.
ప్రజలు మాట్లాడాలంటే, చిన్నప్పటినుంచీ నేర్చుకోవాలి. తెలుగునాట బడుల్లో నేర్పాలి. ఇక్కడ కూడా బడిలో ఒక పాఠ్యాంశంగా నేర్చుకునే అవకాశం ఉండాలి.
ఈ దిశలో ఒక ప్రయత్నాన్ని ఈ లింక్ లో చూసి హర్షించండి. http://www.andhrajyothy.com/Artical.aspx?SID=107888&SupID=42
ఈ వ్యాసంలో సూచించినవి తెలుగు ఒకస్థాయికి చేరుకున్న తర్వాత జరవలసినవి. ఇవే సమస్యకి పరిష్కారాలు కావని నా అభిప్రాయం.
తెలుగులో సాంకేతిక సమాచార ప్రచారం గురించి చెప్పేవారికి విన్నపం.
నేను బి యస్సీ వరకూ తెలుగులోనే చదివా. ఎం ఎస్సీకి వచ్చి నానాపాట్లూపడ్డా.
నాలాంటివాళ్ళు కొన్నివేల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు (ఒక 45 సంవత్సరాలుగా చదివిన వాళ్ళు.)
సాంకేతిక విషయాలు చెప్పేందుకు ఒక నిర్దిష్టమైన పదజాలం కావాలి.తెలుగు అకాడమీ దాన్ని 10,15 సంవత్సరాల్లో తయారు చేసింది. అయినా ఎవరిష్టం వారిదన్నట్టు వ్రాస్తున్నారు. అంతవరకూ ఎందుకు? ఈ ఈమాటలోనే అనుకుంటా, ఒకాయన ఒకవ్యాసం వ్రాసారు. గొప్ప వ్యాసమే, కాని ఆయన స్వంత పరిభాషలో. ఏంచెప్తున్నారో తెల్సుకునే సరికే కష్టమైంది. నాలా తెలుగులో శాస్త్రాలు చదివినవాడికి, ఈ పునశ్చక్ర పరిశోధన దేనికి అనిపిస్తుంది. ప్రభుత్వం అది చెయ్యాలి, ఇది చెయ్యలని ప్రతిపాదించడమే కాని, ఇలా ఉన్నదాన్ని కూడా వాడుకోలేని పరిస్థితి మనది.
ఈ శీర్షికలో స్పందించే అందరికీ తెలుగుపట్ల అభిమానముంది. కాబట్టి మన అందరి శక్తినీ ఒక ఉపయోగకరమైన దిశగా తిప్పుకోవాలి.
చివరిగా ఒక ప్రశ్న: దీన్ని ఒక వ్యాసంగా కాకుండా, అతిథిసంపాదకీయం అనడంలో ఉద్దేశ్యమేమిటో అర్ధం కాలేదు.
వేల్చేరుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుత ఆర్ధిక, సాంఘిక పరిస్థుతుల ప్రభావం తెలుగు భాషాభివృద్ధి పై ఎలా పడుతుందో చక్కగా చెప్పారు. కాని ప్రస్తుతం భారతదేశంలో నైతే నేమి, పాశ్చాత్య దేశాలలో నైతే నేమి, లేక అమెరికాలో నైతే నేమి -ఉన్న విద్యావిధానం అణుమాత్రమూ ప్రశంసనీయం కాదనే విషయాన్ని నిరాకరించే వారు ఎక్కువమందే ఉంటారు అని నా అభిప్రాయము. దీనికి కారణం మారుతున్న సాంఘిక వ్యవస్థలు, ఆర్ధిక పరిస్థితులు, రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు, అతలా కుతలముగా ఉన్న కుటుంబ జీవనాలు, దుర్హంకారాలతో నడుస్తున్న రాజికీయాలు, సంసారాలకు సంసారాలు కూలిపోతున్నాయి, వ్యక్తి జీవితానికి భద్రతలేని వ్యవస్థలు వీటివల్ల తరతరాలుగా మానవుడు మధించి అనుసంధానించిన ఆధ్యాత్మిక నైతిక భాషా నిపుణ్య విషయాలకు గౌరవం లేకుండా పోతుంది.
అందువల్ల, భాషాభివృద్ధి స్కూళ్ళ నుండి మొదలుకావాలి. అది మొదలు కావడానికి మంచి వేతనం, గౌరవంతో కూడిన ఉపాధ్యాయులను నియమించాలి. దానికి ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం. అటుపై, అది కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకు ప్రాకాలి, అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తెలుగు కు సంబంధించిన భర్తీలను పెంచాలి. అవసరం ఒక్క భర్తీ అయినా రెండు లేదా మూడు భర్తీలను నియమించాలి. ఉద్యోగం కొశం చదువుతారు అది వచ్చాక ఆ కొద్ది మందిలో కొదరైనా మీరు చెప్పిన విధానాలను పాటించవచ్చును.
వ్యాసకర్త చెప్పినట్లు విశ్వ విద్యాలయమల ప్రాముఖ్యత చాలా అవ్సరము. దానిని ప్రభుత్వము జీవనోపాధితో ముడిపెడితే గాని అభివృద్ధి జరుగదు. ఇంగ్లీషు విషయము తీసుకోండి, ఈరోజు ఎంగ్లీషులో ఎం.ఎ. లేదా పి.హెచ్.డి. చేస్తే చేసినవాడికి ఖచ్చితంగా తెలుసు ఏదో కార్పొరేటు కాలేజీలో నైనా లేదా బయట ఎక్కడైనా ఉద్యోగము దొరుకుతుందని నమ్మకము ఉండగానే ఉంది. తెలుగు అభివృద్ధి చెందాలంటే ప్రజలకి ఈ ఆశని కల్పించాలి.ఇక భాషమీద మక్కువ ఉండి విద్య నేర్చుకునే వారికి, మీరు చెప్పినట్లు పత్రికా సంస్కరణ ఖచ్చితముగా కావలెను.
ఈ వ్యాసంలో తెలుగు భాషాసారస్వతాల యొక్క ప్రాచీన మూలాల పట్ల గౌరవం లేకపోగా పైపెచ్చు చాలా నీచ/హీనభావమూ, చులకన ధోరణీ ధ్వనిస్తున్నాయి. అందుచేత దీని రచయితల కన్సర్నులలోని నిజాయితీ అనుమానాస్పదం కనుక అవి భాషాభిమానుల సానుభూతికి నోచుకోదగ్గవి కావు. ఒకవేళ తెలుగు నిజంగానే అంతర్జాతీయ భాష అయ్యే రోజొస్తే ప్రపంచం మనల్ని తప్పకుండా అడగబోయే ప్రశ్న: “మీ ఆదికవులెవరు?” అనే తప్ప “గురజాడ ఎవరు? శ్రీశ్రీ ఎవరు? తిలక్ ఎవరు?” అని కాదు. తమ పూర్వీకులకి గౌరవం ఇవ్వడం చేతకానివారు తమ తరువాతి తరాల నుంచి దాన్ని ఆశించడానికి అనర్హులవుతారు. అయిదో పండు తిన్నందువల్లనే ఆకలి తీరిందనీ అందువల్ల ముందు తిన్న నాలుగు పళ్లూ వేస్ట్ అనీ అనుకున్నాడట వెనకటికో ప్రబుద్ధుడు.
[వ్యాసం సరిగ్గా చదివి అర్థం చేసుకోకుండా వెల్లడి చేసే అభిప్రాయాలు కూడా సానుభూతికి నోచుకోదగ్గవి కావు, వాచస్పతి గారూ – సం.]
శ్రీభాస్కర్ గారి వ్యాసం కాళిదాసంటే గొప్పకవి అని అందఱూ చెప్తున్నా, ఆయన ఎందుకు గొప్పకవియో అనే అంశాన్ని తెలియనివాండ్లకు ఈ అంశాన్ని కొంతవఱకు విశదం చేసే విధంగా సాగింది. దీనికి వారికి నా అభినందనలు. కాని కొంత సూక్ష్మంగా చూస్తే ఎందుకో ఏమో అనేకశ్లోకాలలో ముద్రారాక్షసాలు కనిపించినాయి. శరీరంలో పుండులాగ ఇవి పరిహార్యము లని తలచి, నాకు దట్టిన ఆ దోషములను, వాని సవరణలను ఇక్కడ పేర్కొంటున్నాను. అసందర్భం కాదు కనుక వారిచ్చిన ఋతుసంహారంలోని మూడు శ్లోకాలకు నా ఆంధ్ర ఋతుసంహారంలోని అనువాద రూపాలను కూడా ఇస్తున్నాను. దోషాల ప్రక్కనే సవరణలను బ్రాకెట్లలో చూపెట్టినాను.
నాకెంత ఆసక్తి ఉన్నా ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్న ప్రముఖుల. పండితుల అభిప్రాయాలతో ఏకీభవించడం తప్ప మరేమీ చెయ్యలేను. వారంతా రాసిన వాటిని ఇంకా బాగా అద్యయనం చెయ్యాలి. ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాడకం బాగా అభివృద్ధి చెయ్యాలి. విదేశాల్లో ఉన్న తెలుగువారిలో కూడా కృషి చెయ్యాలి. ప్రభుత్వాలనుంచి వాగ్దానాలు, నామమాత్ర సహాయం తప్ప ఆశించలేము. పెద్దేత్తున ఆర్థిక సహాయం అవసరం ఉండాలి. కాని అది ఎలా సమకూడుతుందన్నది చిక్కు ప్రశ్నే. తెలుగు అంతర్జాతీయ భాష కాకపోయిన కొన్ని యూరప్, ఏసియా దేశాల భాషల్లాగ దాని అస్తిత్వాన్ని నిలబెట్టుకొంటే చాలు.
పైన గన్నవరపు గారి అభిప్రాయ్ంతో నేనూ ఏకీభవిస్తాను. ప్రస్తుతం తెలుగు అంతర్జాతీయభాష కావలసిన ఆవశ్యకత ముందు మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. అసలే మన సాధారణ ప్రజానీకానికి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే భాషపట్ల మక్కువ, మమకారం కాస్త తక్కువే అని చాలాచోట్ల చర్చించుకోవటం పరిపాటి. చదువుకున్న వారూ మేధావులూ వ్రాసే భాషకూ దారినిపోయే వారు మాట్లాడే వాడుకభాషకూ కూడ వ్యత్యాసం ఎక్కువే! వ్రాయడానికి కూడ ఒక ప్రమాణికమైన తెలుగు భాష లేదని ఇతరభాషలతో తులన చేసిన మోహన గారి లాంటి పెద్దలు పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఇవన్నీ ఒక యెత్తైతే, అచిరకాలం క్రితమే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలూ తమ ఉనికినీ భాషాసంస్థలనీ పునర్నిర్మించుకోవడమే ఒక కొలిక్కి రాలేదు.
ఈ పరిస్థితులలో తెలుగును అంతర్జాతీయ భాషగా ముందుకు త్రోయడం దేనికి? ఎవరి ప్రయోజనం కోసం? ప్రాచీన భాష హోదా వచ్చి తెలుగుకు ఒరిగిందేమిటో మామూలు ప్రజలలో తొంభైశాతం మందికి తెలియనే తెలియదు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఎవరిస్తారో, అటుపిమ్మట ఎవరు నిర్ధారిస్తారో ఒకసారి వస్తే చాలునో, నిలబెట్టుకుంటూ పోవాల్నో దేనికీ స్పష్టమైన సమాధానం దొరకదు..
అసలే మన భాషలో అల్పసంఖ్యాక మేధావివర్గానికీ – మిగతా సాధారణ ప్రజలకూ అంతరం చాల అధికం. వీలైతే ఈ అంతరాన్ని తగ్గించి, తెలుగును మరింత ప్రజలభాషగా చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఊహాత్మక తులనలపై భాషాశాస్త్ర వేదికలలో తెలుగు జండాని ఎగురవేయడం కన్నా ఇది తక్షణ అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే రచ్చకెళ్ళె ముందర ఇంట గెలవడం చాల అవసరం..
శ్రీ వెల్చేరు నారాయణరావు గారు కొన్ని మాసములు నాకు ఏలురులో కట్టమంచి రామలింగారెడ్డి కళాశాలలో తెలుగు ఉపాన్యాసకులు.తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తెలుగుభాషా పరిశోధకులుగా తరలారు .అందుచే వారు నాకు గురువులు. వారికి నా నమస్సులు. వారికి , శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి అభినందనలు. నేను తెలుగు భాషాభిమానిని. తెలుగు ప్రజలు వివిధ దేశాలేగి తెలుగు మాట్లాడుటచే తెలుగు అంతర్జాతీయ భాష అవునో కాదో అనే చర్చ నాకు అనవసరము . తెలుగు ప్రపంచ భాష అవాలనే ఆశ కూడా నాకు లేదు . విద్యార్థి దశలో ఉన్నత పాఠశాల వఱకు ఆంగ్లము ,హిందీ తప్ప మిగిలిన విద్య అంతా తెలుగు మాధ్యమములో చదువుకున్నాను . గణితశాస్త్రము , భౌతికశాస్త్రము , రసాయనశాస్త్రము ,జీవశాస్త్రము తెలుగులో సునాయాసముగా నేర్చుకొన్నాను . కళాశాలలో ఆంగ్లమాధ్యమమవడముచే క్రొత్తలో కొంచెము యిబ్బంది అయినా త్వరలోనే సర్దుకుపోయాము . వైద్యకళాశాలలో విద్యంతా ఆంగ్లములో జరిగినా రోగులతో సంభాషణలు తెలుగులో జరిగేవి. వారి రోగ చరిత్రను ఆంగ్లములో అనువదించి వ్రాసుకొని , వారి రోగము గురించి ,అవసరమయ్యే పరిశోధనల గురించి , చికిత్స గురించి ఆంగ్లములో వ్రాసుకొన్నా వారికి తిరిగి తెలుగులో వివరించి బోధ చేసేవారము .ఆంగ్లభాష పై వ్యతిరేక భావము లేకపోయినా వైద్యశాస్త్ర గ్రంధాలన్నీ తెలుగు భాషలో మనము అనువదించుకుంటే బాగుంటుందనే ఆశ ఎప్పుడూ ఉండేది . ఇప్పుడు వైజ్ఞానిక గ్రంధాలు , న్యాయశాస్త్ర గ్రంధాలు సకలము తెలుగులో అందుబాటులో ఉండాలనే ఆశ ఉంది .
తెలుగు ఎనిమిది కోట్ల ప్రజానీకానికి మాతృభాష . సంఖ్యాపరముగా ఇటాలియన్ , ఫెంచ్ , జపనీస్, గ్రీక్ , జర్మను ,పోర్చుగీస్ , భాషలకు తీసిపోదు. సంస్కృత భాషా పదజాలము కూడా మిళితమగుటచే విశేషపదజాలము గల భాష .మరి పై భాషలతో సమానముగా తెలుగు ఆధునిక పరిజ్ఞానముతో ఎదగ పోవడానికి అనేక కారణాలున్నాయి. ఫ్రాన్సు ,ఇటలీ , జర్మను ,జపాన్ ల వలె తెలుగు దేశము ( అలాగే వంగదేశము , కర్ణాటక ,తమిళనాడు ) ప్రత్యేక దేశమయితే తెలుగులోనే పరిపాలన పూర్తిగా సాగడమే కాక తెలుగు భాష వికాసము చెంది తెలుగులో వైజ్ఞానిక గ్రంధాలు అనువదించబడి ఉండేవేమో !భారతదేశము విఛ్ఛిన్న మవడము నా ఉద్దేశ్యము కాదు, గాని హిందీతో సమానముగా భారతీయ భాష లన్నిటికీ సమాన ప్రతిపత్తి కలిపించి మాతృభాష లన్నిటినీ అభివృధ్ధి చేసుకో వాలని నా అభిలాష .
తెలివితేటలు నైపుణ్యములు వ్యక్తులలో విభిన్నముగా గోచరిస్తాయి . కొందఱికి గణిత మలవడుతే కొందఱికి భౌతిక శాస్త్రము, కొందఱికి తెలుగు , కొందఱికి సంగీతము , కొందఱికి నటన సులభముగా అలవడుతాయి . అష్టావధానము చేసే కవులకు గణితశాస్త్రము కొఱకరాని కొయ్య అవవచ్చు. పాండిత్యమున్నా కవిత్వము రాకపోవచ్చును . అందుచే తెలుగు నభ్యసించే వారికి తెలివి లేదని చెప్ప రాదు. తెలుగులో వివిధ గ్రంధాలు ప్రచురించుకోవాలనుకుంటే ప్రభుత్వ పరముగాను , స్వఛ్ఛంద సంస్థల పరముగాను , తెలుగు సంస్కృత పండితులు , తెలుగుపై అభిమానము గల శాస్రజ్ఞులు, వైద్యులు ,న్యాయశాస్త్రా కోవిదులు ,అందఱూ సమిష్టిగా కృషి చెయ్యాలి. దానికి తగిన ప్రణాళిక, నాయకత్వము కూడా అవసరము. ఉగ్గుపాలతో ఆంగ్లమును పోసి ,పాఠశాలలలో తెలుగు బోధనను కుంటుపరుస్తే మనము ఉట్టికెగురలేని అమ్మలమే అవుతాము. పోషణ అన్నిటి కంటే ముఖ్యము. ఒకప్పుడు మనదేశము పేదదేశమే గాని యిప్పుడు మనకు తగిన వనరు లుండడమే గాక సాంకేతికాభివృధ్ధి మాతృభాషల నభివృధ్ధి చేసుకొనుటకు సహకరిస్తుంది.తెలుగు నిఘంటువులు అంతర్జాలములో అందుబాటులో ఉన్నాయి. విశ్వనాథ వారు గొప్పా , శ్రీశ్రీ గొప్పా వంటి చర్చల వలన ప్రయోజనము శూన్యము. సకల సాహిత్య ప్రక్రియలు తెలుగు భాష విస్తృతికి ప్రమాణములు. శ్రీ యెల్లాప్రెగడ సుబ్బారావు గారు తమ ఫోలికామ్లపు పరిశోధనలు తెలుగులో ప్రచురించ లేదు. రవీంద్రనాథ టాగూరు గీతాంజలిని ఆంగ్లములో అనువదించక పోతే ఆయనకు నోబెల్ బహుమానము దక్కేది కాదు. నాకే అధికారముంటే రాచకొండ విశ్వనాథశాస్త్రికి , విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆ బహుమానాలు ప్రదానము చేసే వాడిని. తెలుగు ప్రపంచభాష కానవసరము లేదు గాని స్వంత గడ్డలలో వికాసము చెందవలసిన అవసరావకాశము లున్నాయి. అందఱికీ వందనములు.
రచయితలిద్దరికీ అభినందనలు
మీ అభిప్రాయాలూ, సలహాలూ సమంజసంగానే ఉన్నాయి. కాని, అవి అమలు కావాలంటే మోహనగారు ఆఖరి పేరా అక్షరసత్యం కావాలి.
పరిశోధనా రంగంలో ఉన్న మీరు గట్టి పి హెచ్ డీ ఎలా ఉండాలో చిన్న ఉదాహరణని ఇవ్వవలసింది.కనీసం దానికి కావలసిన రెండు మూడు మూలవస్తువుల్ని సూచించినా బాగుండేది. అభిప్రాయముఖంగా సూచన చెయ్యండి.
ఈ మధ్యనే న్యూయార్క్ టైంస్ ప్రపంచంలోని “బలమైన” 20 భాషల్లో 15 వ దానిగా పేర్కొంది. ఆశాజనకమైన వార్త. ప్రణాళికాబద్ధంగా వెడితే సాధించగలం. మనం అందరం ముందు నేర్వవలసింది – ఈ “పూర్వ సాహిత్యం” “ఆధునిక సాహిత్యం” మీమాంసలో కొట్టుకును పోకుండా ఉండడం. అది ఈ వ్యాసంలో కూడా చోటుచేసుకోవడం విచారకరం. రామరాజభూషణుడి వసుచరిత్ర ఎన్ని భాషల్లో కవులు తర్జుమా చెయ్యలేదు?
అంతర్జాతీయ భాషలు ఎలా ఆ స్థాయిని అందుకొన్నాయి అనే విషయమును ముందు చర్చించాలి. ఆంగ్ల భాషను మాట్లాడే నేటి ఇంగ్లండ్ అమెరికా, కెనడా, నేటి కామన్వెల్త్ దేశములైన ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండములలోని వివిధ దేశములను ఒకప్పుడు జయించి పాలించింది. బ్రిటిష్ సామ్రాజ్యము 20వ శతాబ్దపు మొదటి భాగము వఱకు సూర్యుడు అస్తమించని రాజ్యముగా నుండినది. అందువలన ఆంగ్ల భాష ఆ దేశములలో రాజకీయ, సాంస్కృతిక, విద్యా రంగములలో ముఖ్యమైన భాషగా వెలుగొందినది. అదే విధముగా ఫ్రెంచి భాష ఆఫ్రికా, ఆసియా ఖండములలోని దేశములలో, రష్యన్ భాష రష్యా, తూర్పు ఐరోపా దేశములలో వ్యాప్తి చెందినది. ఒకప్పుడు (సుమారు పది శతాబ్దాలకు ముందు) భారతీయ సామ్రాజ్యము కూడ ఆసియా దేశములలో వ్యాపించి యుండినది. ఆ కాలములో సంస్కృతము ఈ నాటి తూర్పు ఆసియా ప్రాంతములలో ఒక అంతర్జాతీయ భాషగా వికసించినది. అందులకు సాక్షిగా ఎన్నో శాసనాలు ఆ భాషలో ఉన్నాయి. అదే విధముగా తమిళ భాష కూడ దక్షిణ, పూర్వా ఆసియాలలో వ్యాపారము ద్వారా వ్యాపించినది. అలా తెలుగు భాష ఎక్కువగా వ్యాపించలేదు. అందువలన ఆ అవకాశము తెలుగు భాషకు లభించలేదు.
ఫ్రెంచి, ఆంగ్లము, జెర్మన్, రష్యన్, చైనా, జపాన్ భాషలు మాట్లడే దేశాలలో ప్రాథమిక విద్యనుండి, కళాశాలల వఱకు బోధనా భాష ఆయా భాషలు. కాని భారతదేశములో, తెలుగు రాష్ట్రాలలో, తెలుగు మాధ్యమములో ఎందఱు చదువుతున్నారనేది అందఱికీ తెలిసిన విషయమే. ఉట్టికెక్క లేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు, ఆయా రాష్ట్రాలలో బోధనా భాషగ లేని తెలుగు అంతర్జాతీయ భాషగా మారబోతుందా అన్నది పెద్ద సందేహమే!
రాజకీయమును పూర్తిగా త్రోసి పారేయకండి. రేపు తెలుగు రాష్ట్రాలు దేశములో ఒక ఉన్నత స్థితికి వచ్చిందంటే, ఎందరో విదేశీయులు అక్కడికి వస్తారు. వారు భాష నేర్చుకొంటారు. అందుకు రాష్ట్రాల ప్రగతి ఒక ముఖ్యాంశమే.
బయటి దేశాలలో ఆచార్య పదవులు స్థాపించి పరిశోధనలు చేసి, పుస్తకాలను ఆంగ్లములో తర్జుమా చేసి పాఠకుల సంఖ్యను పెంచినందువల్ల తెలుగు అంతర్జాతీయ భాష అవుతుందని నేను నమ్మను. ఇప్పటి పరిస్థితులలో పరిశోధనలపై ఎవరికీ ఆసక్తి లేదు. పరిశోధకులు తమ ఆత్మ సంతృపికోసం చేసికొంటున్నారే కాని, దానివల్ల ఎవరికీ ఏమీ ఒరగదని వారికి తెలుసు.
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి జరిగి, లోటు లేని జీవనము ప్రజలకు అందితే అప్పుడు ఈ వ్యాసములో సూచించినవి వీలవుతుంది. ఇప్పటి పరిస్థితులలో నేను ఈ విషయములో నిరాశావాదినే.
“….రచయిత్రి మాలతీ చందూర్ ని, వంటలక్క గానూ, Alan Turing గురించిన మీరు, మీ వ్యాసం లో చూపినప్పుడు – ..”lyla yerneni
ఇది సరి కాదు. శ్రీ కొడవళ్ళ అలా చేయలేదు. సైన్టిఫిక్ కంప్యుటింగ్ లో న్యూమెరికల్ మెథడ్స్ మీద రాసిన చాలా ప్రసిద్ధమైన ఒక పుస్తకానికి, ‘Numerical Recipes’ అని రచయితలు పేరు పెట్టారు. అలా ఒక వంటకాన్ని తయారు చేయటాన్ని ఒక ‘పద్ధతి’ లొ శ్రీమతి చందూర్ చెప్పారని చెప్పటం మాత్రమే శ్రీ కొడవళ్ళ ఉద్దేశ్యం. శ్రీమతి చందూర్ ను ‘వంటలక్క’ ను చేయటం కాదు.
So are you, so are you Vamsi.
‘ओ गंगा तुम बहती हो क्यौ?’ By Bhupen Hazarika is so gorgeous. So is its predecessor song ‘The Old Man River’ by Paul Robenson in Show boat 1936. Two baritones, singing about humans. One uses the back drop of river Mississippi and the other of river Ganga. Yet, we hear the mighty rivers rolling.
గంగ వర్ణ చిత్రం మీరు ఇంకా వేసినట్టు లేరు. శివుడిని ‘వర్ణించి’ నంత తేలిగ్గా గంగ బొమ్మ వెయ్యలేరు. రవివర్మ వెయ్యలేకపోయాడు.
చేతిలో శూలం, మెడలో పాము, నెత్తి మీద గంగ వేసి చూపిస్తే – నర్సరీ పిల్లలు శివుడు, శివుడు అంటారు. ఆర్ట్ లో, ఆభరణాలు అలంకారాలుగా మొదలైనవి, కాలక్రమేణా అవే ప్రతీకలై, ప్రతీకల సహాయంతో మాత్రమే గుర్తించటం అలవాటై, మెల్లిగా అంతర్భావం నశించి, ప్రతీకలే మిగులుతాయి కొందరికి, కొంతకాలంపాటు.
“నమ్మితి నా మనంబున మిమ్ము సనాతనులైన ఉమా మహేశులన్” – అని పాడుకుంటున్నప్పుడు, అప్పుడు తెలుగు భాష ఎంత expressive అనిపిస్తుంది. అంతకన్నా గొప్ప బొమ్మ ఏ ఆర్ట్ మ్యూజియం లో ఎంత వెదికినా కనపడదు. మీరు చదివిన ఎన్నో మంచి పాత తెలుగు రచనలు నేనింకా చదవనే లేదు. చదవాలని కోరిక. మెల్లిగా చదువుతాను.
(విచిత్రం!) రాయప్రోలు ‘‘స్నేహలతా దేవి” లో “గంగ” ను గురించి 33, 34 పద్యాలు ఉన్నవి. కావ్యమంతా చదివాను.
శాయి గారు!
కొన్నేళ్లుగా, ఎంతో సాహిత్యాన్ని చదివింప చేసారు.
‘‘స్నేహలతా దేవి” కావ్యం, కావ్య పద్ధతి ప్రకారం, అన్ని మొక్కుబడులనూ చెల్లించింది. కధ ప్రారంభించక ముందే, కావ్య నాయిక మంటలకు ఆహుతి అవుతుందని, ఒక పద్యం ద్వారా కవి తెలిపినారు. నాకు అర్థమయ్యింది.
బంగారం లాంటి పిల్ల ఎందుకో స్నేహితురాలితో కలిసి, గంగా స్నానానికి వెళ్లింది. అయ్యో! అప్పుడు ఆ స్నేహితురాలు గంగ లో పడి చనిపోయిన అనేకుల విషాద మరణకథలు వినిపించి ఉండక పోతే, కావ్యంలో ఆ పిల్ల బ్రతికి ఉండేదేమో అనిపించింది.
ఏమి కావ్యం! ఏమి రచయితలు! దేవతలను, మానవులను కలగాపులగం చేసి, మనిషి చావును రొమాంటిసైజ్ చేసి, వాళ్లు కన్ఫ్యూజ్ ఐ, పాఠకులను కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తారు.
(ఇంతా చేసి, నేను గ్రహించుకున్న నీతి ఏంటంటే, నేను పరీక్షల్లో ప్రతి answer paper లోనూ ఎక్కడో ఒక చోట “నాకు జ్వరంగా ఉన్నది.” అని పేపర్ దిద్దే వానికి కనిపించే లాగా రాసి ఉండాల్సింది. నాకు ఎక్కువ మార్కులు ఇచ్చి ఉండేవారు. Many Telugu writers come across as sympathy mongers.)
“మరిక ఆయన యెంచుకొన్న అభినవ కవితామార్గం:” -కొడవళ్ళ హనుమంతరావు
H! అక్కడ మీరిచ్చిన ఉదాహరణ చూసి చాలా నవ్వాను. ఏం మార్పు. నా బొంద మార్పు. కాని అంత మాత్రం మారటానికి రాయప్రోలు ఎంత గజగజలాడి పోయుంటాడో, ఎన్నేళ్లు పట్టిందో.
నాకు, ‘పూర్ణమ్మ’, ‘స్నేహలతా దేవి’ ‘The Sorrows of Young Werther’ రాసిన కవులు, నమూనా లో ఒకేలాగా అనిపిస్తారు. వైతాళికులుగా కనిపించరు. I have a problem there.
Recipe చందమామ కధల్ని రాసిన కొ. కు. ను మీరు సైంటిఫిక్ ఆలోచనలకు ఉదాహరణ గానూ, (He is not a scientist.) “ఎన్ని మెట్లెక్కినా” అను చక్కని నవలనూ, చక్కని కథలు రాసిన రచయిత్రి మాలతీ చందూర్ ని, వంటలక్క గానూ, Alan Turing గురించిన మీరు, మీ వ్యాసం లో చూపినప్పుడు – “నర జాతికి నీతి యున్నదా?” అని తర్వాత అనుకున్నా గాని, ముందు బాగా నవ్వొచ్చింది. నచ్చింది. Couldn’t help it. It was very good.
లైలా
Ps: నేను ‘Werther’ అని రాస్తే – Microsoft Word, ‘Weather’ అని మార్చేసింది. నేను స్త్రీ నని నాకు చదువు రాదని పాతకాలం రచయితల రచనలు బాగా ఎక్కి పోయినట్టుంది.
తెలుగులో చెప్పినా, ఇంగ్లీషులో చెప్పినా, ఈమాట చదివేవారికి వార్త అందింది కదా! విషయం ముఖ్యం; ఆ విషయంలో ఉన్న విశేషం అంతకన్నా ముఖ్యం.
అటు బంగాలీవాడు,ఇటు అరవవాడు; ఎవడైతేనేం! వాడు, వాడి భాషలో గొంతు చించుకున్నంతమాత్రాన వాడికి వాడి భాషమీద ప్రేమ, గౌరవం ఉన్నాయని భ్రమపడి, మనని మనం కించపరుచుకోవడం ఒక రకంగా చేతకానితనం! అటు వాడికి, ఇటు వీడికీ — భాష ‘వాడి ‘ కన్నా, భేషజం, దానితో పుట్టిన వేడీ ఎక్కువ.
ఇది భ్రమ కాదు; స్వానుభవం!
మరొక చిన్న విషయం. ఒక్కొక్కసారి కొంతమందికి తెలుగులో చెప్పటంకన్నా ఇంగ్లీషులో చెప్పటం సులువుగా ఉండచ్చుకదా!
శాయి గారూ! మీరు గాని చదువుతూ ఉంటే, నా సందేహాలు తీర్చాలండీ.
‘ఈమాట’ లో వంశీ మాగంటి రాసిన “వచనానికి ఒక జాబు” చదివాక, నా లైబ్రరీ లో “చలం ఉత్తరాలు” కోసం వెదుకుతుంటే – ఆ పుస్తకం కనపడలేదు కాని “చలం ప్రేమలేఖలు” కనిపించింది. చదువుదామా అనుకుని, చలం కి ఎంత సేపూ ‘యావంటే’ అనటమే కాని ప్రేమంటే పెద్దగా తెలియదు అనుకుని, మానేసాను. ఇంతలోకి నేను ఇంతకు ముందు గమనించని “తెలుగులో లేఖా సాహిత్యం” అన్న డాక్టర్. సి హెచ్. సీతాలక్ష్మి గారి పిహెచ్. డి. సిద్ధాంత గ్రంధం కనిపించింది. చదివేశాను. మళ్లీ ఇంకోసారి చదువుతున్నాను.
వంశీ రచనలో ‘పద్యం,’ ‘వచనానికి,’ ఒక జాబు రాసింది. విడ్డూరమా, మరీ విడ్డూరమా. ఈశ్వరా! అని ఇరవై సార్లనుకున్నా. అనుకున్న కొద్దీ ఇంకా ఎక్కువ నవ్వొచ్చింది. (కొన్నాళ్లు పోతే ఈయన ‘ర’ తో ‘ఱ’ కీ, ‘అరసున్నా’ తో ‘గుండు సున్నా’ కీ ఉత్తరాలు రాయిస్తాడు.)
ఈ సిద్ధాంత గ్రంథంలో ‘లేఖా స్వరూపం’ అని ఒక చిన్న ఛాప్టర్ ఉంది. అందులో ఒక పేరాలో ఉన్న సమాచారం బట్టి లేఖ, జాబు ఒకే అర్ధంలో వాడినా, ‘జాబు’ సరైన అర్ధం జవాబు. అంటే, ఇంతకు ముందుగా వంశీ యొక్క-వచనం గారు పద్యానికి లేఖ రాసి ఉండాలి. ఆ లేఖను వంశీ బట్టబయలు చేస్తే బాగుండు. నాకు ఆ లేఖ చదవాలని ఉంది.
వేరే వాళ్ల మధ్య నడిచే ఉత్తరాలు చదవటం మర్యాదా అంటే -అవునూ. కాదూ. మరిప్పుడు పుస్తకాలలో నిజం మనుషులు, ఎవరికో, ఎప్పుడో ప్రైవేట్ గా రాసిన ఉత్తరాలు మనందరినీ చదవనిస్తున్నారుగా. నాకు పూర్వం ఇండియాలో ప్రేమలేఖలు వచ్చినప్పుడు, కొందరైనా నాకన్నా ముందు చదివేవారు. అది ఖచ్చితంగా అమర్యాద. ఆ అమర్యాద పోస్ట్ మేన్ దగ్గరే మొదలయ్యే దనుకుంటా. ఇన్ లాండ్ కవర్ లు ఎప్పుడూ తెరవ బడే ఉండేయి. ఎవరినని అడుగుతాం! మేనర్స్ లేని వారి దగ్గర నిజం మాత్రం ఉంటుందా.
ఇంతకీ శాయి గారండీ! మిమ్మల్ని అడగదల్చింది ఏంటంటే;
ఈ పుస్తకంలో 13వ పేజీలో ఒక పేరాలో, రచయిత్రి – “రాయప్రోలు సుబ్బారావుగారు జ్వరంలో ఉండి కూడా స్నేహలతాదేవి వృత్తాంతాన్ని విని కావ్యాన్ని రచించారు…” అని, ఒక లేఖ, కావ్యరచనకు హేతువైందనీ -అన్నారు.
ఇక్కడి విషయం నాకు సరిగా అర్ధం కాలేదు. స్నేహలతా దేవి వృత్తాంతమేమిటని? ఆ లేఖ ఏమిటి? రాయప్రోలు వ్రాసిన ఆ కావ్యమేమిటి? దయుంచి చెపుతారా?
Hope you are getting to watch the Netflix. I liked their “Blood Line.” Quite a complex family based psychological thriller.
Lyla
• “లేఖా సాహిత్యం” అన్న ఈ గ్రంథం లో తెలుగు సాహిత్యంతో సంబంధం కలిగిన పదముగ్గురి లేఖలను (ఇంతకు ముందే పుస్తక రూపంలో వెలువడిన సాహితీవేత్తల లేఖలు) డా. సీతాలక్ష్మి పరిశీలించింది. దాన్ని బట్టి మాగంటి వంశీ రచన, లేఖా సాహిత్యం లోకి రాదనుకుంటాను. ఐతే, ఆ రచన “పద్యం” గురించిన ప్రమోషనల్ రచనగా కూడా నేను చదవలేదు.
ఇన్ని సంవత్సరాల తరవాత ఇప్పుడే ఈ కథ చదవటం /చూడటం జరిగింది.
కథ లో సంతానం లానే బయటి వారి లో కూడా చాలమంది అనుకుంటారని తెలుస్తొంది. రచయిత జరిగిన కథ అని ప్రత్యెకంగా చెప్పక్కర్లెకుండానే. అయినా old age home ల లో చేరితే వంటరితనం పొయేట్లైతే, అసలు అందరూ పెళ్ళి ఇల్లు జంజాటం లేకుండా వొకమనిషిని వంటకి, ఇల్లు చుసుకోడానికి వొక మనిషిని పెట్టుకుని వో అనాధ పిల్లనో పిల్లాడినో పెంచుకుని సెక్స్ కి ఇంకెదో సదుపాయాం చేసుకుంటే సరిపోతుందిగా.
ఎక్కువ మంది మగవాడు అనగానే ఆడ మనిషి అయితే అని ప్రశ్నించారు ఎంత అజ్ణానం. ఆడ మగ తేడా లేకుండా కలిగే బాధ ఇది. పార్క్ లోనో ఇంకెక్కదయినా కూర్చుంటే వొంటరితనం తగ్గుతుందేమో అసలు ఇలా పెళ్ళి చేసుకున్నా తగ్గక పొవచ్చు కాని వున్న వాటిల్లో నచ్చిన మార్గం ఎన్నుకునే హక్కు స్వతంత్రం ఆ తండ్రికి అంత వయసు వచ్చాక కూడా వుండద్దా ?
కథ బావుంది. కాని అన్నపూర్ణ కి అత్తగారో అన్నపూర్ణ భర్త కి కూడా తాతగారూంటే???? ఆయన తాత గారు పల్లెలో ఇలా అన్నపూర్ణ తాత గారు నాన్న పట్నం లో వుంటే ???? ఇవి చాలా frequent గా కనిపిస్తున్నాయి……..గమ్మత్తుగా బొలెడుసార్లు అబ్బాయిలకి భార్య బంధువులు ఇలా బోలెడంత గొప్పవాళ్ళ లా కనిస్తున్నారు ……
కథ చదివించింది …అభినందనలు …పైన రాసింది ఈ కథ తో పుట్టిన కథ కి సంబంధించని ప్రశ్న
ఎవరెవరో ఎమేమో కామెంట్స్ చేసారు. కాని గుడ్డు పెట్టే కోడిపెట్టకు తెలుసు ఎంత నొప్పో, దయచేసి గుడ్డు చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండ నొప్పిని గ్రహించండి. JUBV గారు మీ కథలోని సారంశం బాగుందండి.
ఈమాట చాలా బాగుంది. కొన్ని requests:
1. రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకాలు గురించి కొంత రాస్తే బావుంటుంది.
2. మేఘదూతం, మనుచరిత్ర, గాథాసప్తశతి upload చేసారు బావుంది, కాని దాని అర్థం కానీ లేక తాత్పర్యం కానీ పెట్టి ఉంటే బావుండేది. అలాగే మిగతా కావ్యాలక్కూడా.
3. వేదాలమీద ఏమైన వ్యాసాలు ఉంటే ప్రచురించగలరు.
4. కల్హాణ [కల్యాణ] రాజతరంగిణి కథలు ..
చాలా బాగుంది. చాలా రోజుల తరవాత మంచి శైలి కనిపించింది. కథా వస్తువు, కథనం అన్నీ బాగున్నాయి కాని భావుకత ఎక్కువయి కొన్ని సందర్భాలలొ క్రుతకంగ అనిపించింది. చాలా మంచి రచన చదివాననే సంత్రుప్తి కలిగించినందుకుకు రచయతకి క్రుతజ్ఞతలు.
నమస్కారం వంశీ గారికి, లైలా గారికీను
కథ గురించి నేను మాట్లాడుతూంటే లైలా గారే మొదట్న ఆవిడ కలలోకి వస్తారేమో అన్నారు (సరదాగానే లెండి). నేనూ అలాగే సరదాగా అన్నాను. ఇంక అక్కడకీ సరదాగా తీసుకోరేమో అని (చురక అంటిస్తే… అనేది బుద్ధిలేక రాసాను). ఆవిడ సరదాగానే తీసుకుంటున్నట్టున్నారు. ఎందుకో సడన్ గా నా పేరూ, బొమ్మ, వ్రాతలూ అన్నీ మొదలెట్టారు. ఇక్కడ పేరు ప్రసక్తి దేనికో మరి. పోనీయండి.
నేను భ్రూణహత్యలు చేసేంత పాపాత్ముణ్ణి కాదు. ఎందుకంటారా? ఈ చిన్న కధ వినండి. ఇంజినీరింగ్ చదివే వేడి వయసులో (వయస్సు వేడి ఎలా అంటే మరో కథ రాయాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ మాత్రం ఈశ్వరానుగ్రహం ఉంటే నా బతుకు ఇలా ఏడిచేదా?) ఒక అమ్మాయిని ప్రేమించాను – దూరం నుంచే లెండి. మాట్లాడే అంత ధైర్యం ఏడిసిందా ఏమిటి? కూడా ఉండే స్నేహితుడు అన్నాడు,”నువ్వు అలా మాట్లాడకుండా చూస్తూ ఉంటే ఆ అమ్మాయ్ పెళ్ళైపోతుంది ఎవరితోటో.” నా సమాధానం -“ఏం చేస్తాం తమ్ముడూ. పోనీ ఆవిడకి పెళ్ళైపోయినా ఎక్కడో ఒక చోట సుఖంగా ఉంటే అదే చాలు.” అదండీ నా ప్రేమ విషయం. అలా ఉత్తరోత్తరా ఇంకో అమ్మాయిని (కాస్త వేడి తగ్గాక, ఉద్యోగం చేసే రోజుల్లో) ప్రేమించాను కానీ ఆవిడా కూడా అలాగే దూరమైపోయింది. ఇద్దర్లో ఎవరికీ కూడా కలలో కూడా హాని తలపెట్టలేదు; ఇంక భ్రూణ హత్యల సంగతి దేనికీ? మనలో మనమాట మహాలక్ష్ములు ఈమాట చూడ్డానికి వస్తూనే ఉన్నారు. కాని కామెంటరు అంతే. ఇది నా – పనికిరాని – ఉద్దేశ్యం.
ఇంక ఇక్కడివరకూ వచ్చాక తెలిసినది ఏమిటంటే, నేను ఇప్పుడు పానకం లో పుడక లాగా తయారయ్యాను; ఇక్కడతో మీ ఇద్దరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు ఇస్తూ తప్పుకుంటున్నాను.
ఈ మాట సంపాదకుల గారికి
నమస్కారములు.
పత్రిక చాలా బాగున్నది.మీ కృషి ప్రశంషనీయం.నేను “అక్షర సేద్యం ” కవితా సంపుటి ని రచించాను.మీ గ్రంథాలయంలొ పుస్తకానికి అవకాశం ఉన్నదా?
ఉంటే ఎలా? దయచేసి తెలుపగలరు.
సంభాషణ కూడా మారుపేరుతో,ముసుగు లోంచి ఆ ఫొటోతోనే చెయ్యరాదా. మారుపేరుతో రాయటంలో ఏమైనా అదనపు లాభాలు ఉన్నాయేమో ఆ బొమ్మతోనే చెప్పండి. కథ! ‘బొమ్మలు చెప్పిన కమ్మని కధలు’ అక్కడే వినగలరేమో.
నిజానికి ‘చురక అంటించటం’ అనే ఎక్స్ప్రెషన్ నాకు నచ్చదు. మోటుగా, సేడిస్టిక్ గా అనిపిస్తుంది. నేను వాడలేను. కాని మీరు స్నేహపూరితంగా చేస్తున్నారు, అది నాకు తెలుసు. కాబట్టి, మీరు మార్చుకోనవసరం లేదు.
ఎంతమంది స్నేహితులుంటే జీవితం, అంత ఉత్సాహభరితంగా ఉంటుంది. రకరకాల కల్చర్స్ నుండి వచ్చిన నా ఫ్రెండ్స్ రకరకాలుగా నాతో మాట్లాడుతారు. స్నేహితుల సంఖ్య పెరుగుతూ ఉంది. నా సంబరం కూడా!
కాని, ఇలాటి సందర్భాలలో ఆ స్నేహం ఎవరితో చేస్తున్నానో తెలియకుండా ఎలా చెయ్యటమో తెలియటం లేదు.
ఇంతకు ముందు మీరు సూచించిన విశ్వనాథ కథలు బాగున్నవి. చిన్న కథలు కూడా బాగా రాశాడాయన. – లైలా
నమస్కారములండి.
మీరు ప్రకటించిన రోజే ఆ వ్యాసము (చిన్ని పుస్తకము) చదివి ఉన్నాను. మీ విశ్లేషణలో అన్ని రకాల కోణాలను చక్కగా మీరు నిరూపించడం ప్రతీ సారీ నన్ను ఆశ్చర్యానందాలలో ముంచివేస్తుందనడంలో ఎటువంటి రెండో అభిప్రాయం లేదు. బాగుందని చెప్పడం కన్నా ఎక్కువ వ్యాఖ్యానించగలిగే అర్హత గానీ, ప్రాచీన కావ్యాలతో పరిచయం గానీ నాకు లేకపోవడంతో నేను ఊరుకున్నాను. ఇదివరకటి మీ వ్యాసాలలో అర్థం చేసుకొనేంత పాండిత్యం లేక కొన్ని సంశయాలను ధైర్యం చేసి మీతో ప్రస్తావించడం జరిగింది.
ఈ వ్యాసంలో ఎక్కడా ఎటువంటి సంశయమూ కలుగలేదు.ప్రాచీన సాహిత్య పరిచయమూ, విమర్శనాత్మక ధోరణిలో రచనానైపుణ్యమూ ఉన్నవారు మీతో చర్చించడం చదువుతూ మురిసిపోతుంటాను. మీ రచనలను చదువకుండా వాయిదా కూడా వేయలేను. వెంటనే చదువుతూ ఉంటాను. మీ దగ్గర సాహిత్యంలో పరిశోధన చేయగలిగే భాగ్యం లేనందుకు చింతిస్తూ ఉంటాను. ఈ విధంగా ప్రాచీన కావ్యాలను వెలికి తీసి మా వంటి భాషాభిమానులకు నిధులుగా తోడి తీసి మీ విమర్శనాత్మక వ్యాసాలతో మెరుగులు దిద్ది సమకూర్చినందుకు మేము, ముందుతరాల వారు మీకు ఋణపడి ఉంటామన్న మాట తప్ప ఇంకేమీ చెప్పలేని అల్పురాలను.
మరొక్కమాట మాత్రం ప్రతీసారి మనవి చేయాలనుకుంటాను. మీ భాషాసంపత్తి ఈ కాలంలో అనన్యసామాన్యమైనదనే చెప్పుకోవాలేమో నాకు తెలిసిన పరిధిలో ఈమధ్య అప్పుడప్పుడూ మీరు జనసామాన్యమైన భాషలో వ్రాస్తున్నట్టనిపిస్తుంది. కానీ నా అభ్యర్థన ఏమంటే … దయచేసి మీ ప్రత్యేకతను మీరు నిలుపుకొనవలసినది. భాష సౌందర్యాన్ని ఇంత సమర్థవంతంగా చూపించే అలవాటు మానవద్దు. అర్థం కాని పదాలు, సమాసాలు ఉన్నంత మాత్రాన పరిశోధనాభిరుచులున్నవారు కొత్త(పాత) పదాలను పరిచయం చేసుకోకుంటే ఎలా కుదురుతుంది? ఇంక అది విద్యార్థిత్వం ఎలా అవుతుంది? కాబట్టి తప్పక ఇటువంటి మంచి తెలుగునే ఇక మీదట కూడా కొనసాగించవలసినదని మనవి.
ఈ వ్యాసమును తొలుత పై పై చదివి మెచ్చుకోలు ప్రకటించినా ఇప్పుడే వారాంతపు ప్రణాళికగా పూర్తిగా చదివాను. ఈ వ్యాసముపై శ్రీ కామేశ్వర రావు గారి వ్యాఖ్యను ఇతర ప్రముఖుల వ్యాఖ్యలను కూడా చదివాను. ఈ విశ్లేషణను వ్యాసమనడము సమంజసము కాదు. ఇది ఒక చిరుగ్రంధమే ! అద్భుతముగా నుంది. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి విద్వత్తు తఱచు ప్రయుక్తమై యీ వయస్సులో కూడా మేధ నుత్తేజ పఱచింది. అందుబాటులో నున్న ఆంధ్రభారతి తెలుగు నిఘంటువును చాలా పర్యాయము లాశ్రయించినా వారి వాక్పటిమకు భాషాసంపత్తికి ముగ్ధుడ నయ్యాననే చెప్పుకోవాలి.
వా రుదహరించిన అన్ని పద్యాల విశ్లేషణ బాగుంది.
అంబరసీమఁ దారలు, జటాటవి మల్లెవిరుల్, భుజాంతరా
ళంబున హారసంతతు లిలాస్థలిఁ బువ్వుల వర్షముల్ ప్రసూ
నంబులు సత్కృతాంజలి ననం దగి మౌక్తికతుల్యమౌళిగం
గాంబుకణంబు లుట్టిపడ నాడెడు శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్.
పద్యమును నేను కూడా శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారి వలె శంభుని మౌక్తికతుల్య గంగాబుకణములే గగనసీమలో తారలు , మల్లెవిరులు, హారసంతతులు , ఇలాస్థలి పుష్పములు ,అంజలిలో ప్రసూనములైనట్లు అర్ధము చేసుకున్నాను. కాని శ్రీ ఏల్చూరి వారి వేమభూపాలుని వ్యాఖ్యావలంబనముగా నిచ్చిన వివరణ అర్ధవంతముగా నుంది. ఈ వ్యాసములో పుష్టి ఉంది. మరోసారి చదువుకోవాలి. మరో వ్యాసము వెలువడే లోపల ఒక నెల ఉందిగా !
చాలా అద్భుతమైన వ్యాసం. మురళీధరరావు గారి కృషి బహుధా ప్రశంశనీయం.
“తెలుగే సరిగా రాదు, ఇక సంస్కృతం నిల్లు” అని ముళ్ళపూడి ఓ సినిమాపాత్ర చేత అనిపించినట్టు ఏ ఏడాదికోసారో ఒక తెలుగు పద్యం చదివటానిక్కూడ తీరక లేని నాబోటి వాళ్లు సంస్కృతాంధ్ర ప్రాకృతాల్లో లోతైన పాండిత్యం అవసరమైన ఇలాటి వ్యాసాన్ని అర్థం చేసుకోవటమే గొప్ప విషయం. కనుక ఇందులో విషయాన్ని గురించి చర్చించే సాహసం చెయ్యను. ఐతే, ఒక పరిశోధకుడిగా నాకర్థమైంది ఇది –
1. కొన్ని పద్యాల్ని ఇదివరకు కొందరు శ్రీనాథుడి శాలివాహనసప్తశతి లోనివిగా “ఊహించారు”
2. ఇప్పుడీ వ్యాసంలో మురళీధరరావు గారు ఆ పద్యాల్ని ఒక్కొక్కటి తీసుకుని అవి అ) సప్తశతి కి చెందినవేనా? ఆ) ఐతే అవి శ్రీనాథకృతాలేనా? అని పరిశీలుస్తున్నారు.
3. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం – ఒక పద్యం సప్తశతిలోదైతే దానికి హాలుడి మూలం ఒకటుండాలి. ఉంటే అదేమిటి, మూలానికీ ఈ పద్యానికీ సామ్యాలు, తేడాలు ఏమిటి అని తరచి చూసి అది సప్తశతికి చెందిందా కాదా అని నిర్ణయించటం.
4. శ్రీనాథుడిదా మరొకరిదా అని తేల్చటానికి ముఖ్యంగా శ్రీనాథుడి శైలిని, శ్రీనాథుడి ఇతర ప్రయోగాల్ని పోల్చిచూసి నిర్ణయించటం.
వీటిలో నాకు సప్తశతి పద్యాలా కావా అనే పరీక్ష సమంజసంగానే అనిపించింది. కాని శ్రీనాథుడిదా కాదా అనే పరీక్ష మాత్రం కాదు. ఐతే ఒకటి చెప్పుకోవాలి, ఇంతకు ముందు ఎంతో లబ్ధప్రతిష్టులైన పరిశోధకులు ఇంతకన్నా చాలా తక్కువ తర్కంతో కేవలం వారి ఊహలే ఆధారంగా ఇంతకన్నా పెద్ద విషయాల్నే సిద్ధాంతీకరించారు.
ఉదాహరణకి మొదటి పద్యం తీసుకుందాం –
వారణసేయ దావగొనవా నవవారిజమందుఁ దేటి క్రొ
వ్వారుచు నంట నీ వెఱుఁగవా ప్రియ హా తెఱగంటి గంటి కె
వ్వారికిఁ గెంపు రాదె తగవా మగవారల దూఱ నీ విభుం
డారసి నీ నిజం బెఱుఁగునంతకు నంతకు నోర్వు నెచ్చెలీ.
ఇందులో ఒక విషయం చాలా తేలిగ్గా గమనించవచ్చు – ప్రతిపాదం లోనూ కనిపించే (17 – 19 శతాబ్దాల మధ్య పద్యాల్లో విపరీతంగా ప్రచారంలో వున్న) శబ్దాలంకారం. తొలిపాదంలో “గొనవా నవవా”, రెండో పాదంలో “తెఱగంటి గంటి”, మూడోపాదంలో “తగవా మగవా”, నాలుగో పాదంలో “నంతకు నంతకు”. నాకు తెలిసినంతవరకు ఇది శ్రీనాథుడి శైలి కాదు, బహుశ వసుచరిత్రకు ముందు లేనిది. ఈ తర్కం ప్రకారం ఇది శ్రీనాథుడి పద్యం కానేకాదు. ఎవరో పద్దెనిమిదో శతాబ్ది కవి రాసింది.
అలాగే ఉదహరించిన వాటిలో కొన్ని పద్యాలు కథాధారితాలు కావు. అలాటప్పుడు అవి సప్తశతికి అనువాదాలని చెప్పటమే సాహసం అని నా అభిప్రాయం.
చాన్నాళ్ళుగా రాద్దామనుకుంటూ వెనకడుగు వేస్తూ వచ్చాను. మీరు ఆచార్యులు, పండితులు. ముఖ్యంగా తెలుగు చదువు చెప్పిన వారు.
మీ వ్యాసాలలో ముడి సరుకు చాలా గొప్పదయినా, అవి చదవడానికి చాలా కష్టంగా ఉంటోంది. ఒక్కోసారి మధ్యలో వదిలేయాల్సి వస్తోంది. దీనిక్కారణం మీ వ్యాసాలలో మీరు వాడే భాష. అది ఓ పట్టాన మింగుడు పడడం లేదు. సుదీర్ఘ సమాసాలూ, నోరు తిరగని సంధి ప్రయోగాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి.
ఉదాహరణకి – ఈ వ్యాసంలో ఒక చోట – ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షకు, గమ్యమానౌపమ్యంతో తుల్యయోగితకు స్వతఃప్రమాణమై హృద్యమైన ఈ పద్యాన్ని అధర్వణ భారతం విరాటపర్వం ప్రథమాశ్వాసం లోనిదిగా నేటికొక శతాబ్ది క్రితం ముమ్మొదటిసారిగా సుగృహీతనామధేయులు శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వెలుగులోకి తెచ్చారు.
అలాగే ఇంకోచోట: ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశాదినిర్వహణపూర్వకంగా – భరత నాట్యశాస్త్రానువాదం కాబట్టి కావ్యారంభంలో నాట్యాధిష్ఠానదైవతమైన శంభుదైవతస్తుతి భావ్యమే కాని, పైని పేర్కొన్న అంబరసీమఁ దారలు … పద్యాంతంలోని ‘శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్’ అన్న యుష్మదర్థకాశీర్వాక్యం ఇది భారతీయకావ్యం –
ఇలా ప్రతీ చోటా పాఠకుడికి (ముఖ్యంగా నాలాంటి పామరుడికి) చాలా కష్టంగా ఉంటోంది. మీరు చెప్పిన, లేవనెత్తిన అంశాలు చూస్తే చదవాలని రెండడుగులు ముందుకేస్తే, మీ వాక్యాలు పదడుగులు వెనక్కి నెట్టేస్తున్నాయి. మీ రచనల్లో సంస్కృత పదాలు ఉబ్బడిముబ్బడిగా వాడడం వలన అర్థాలు తెలీక నానా అవస్థా పడి చదవాల్సి వస్తోంది. నేను పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాసాలూ, విశ్వనాధవారి పీఠికలూ, రాళ్ళపల్లి వారి వ్యాసాలూ ఎంతో అపురూపంగా దాచుకుని తరచు చదువుకుంటూ ఉంటాను. వారి భాషతో ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. మీరా ఆ కాలం వారు కాదే? వస్తు పరంగా మీకూ ఆ స్థాయి ఉంది. తెలుగు చదివే వాళ్ళే పల్చబడి పోతున్నారని ఒక పక్క కొంతమంది గగ్గోలు పెడుతున్నారే? ఇలాంటి మంచి రచనలు కేవలం వాడే భాష వలన దూరం అయిపోతున్నాయి కదా అన్న బాధతో రాస్తున్నాను. అంతే తప్ప మరో దురుద్దేశం లేదు. మీ రచనల్లో ప్రస్తావించిన అంశాలు ఇష్టంగానే చదువుతాను. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.
(ఇది రాసే ముందు నాకు తెలుసున్న కనీసం పదిమందిని అడిగాక ఇది రాస్తున్నాను. మరోసారి ఇలా రాసినందుకు క్షమించేయండి.)
మీరు మంచి తెలుగు రాయలేక కాదు. వ్యాసం చివర్న మీరిచ్చిన సూచికల్లో అందరికీ అర్థమయ్యే అందమైన వాక్యమే రాసారు కదా? మరెందుకు అది వ్యాసంలో అవి తొంగిచూడడం లేదో అర్థం కావడం లేదు.
ఆచార్యకమూ విద్యార్థిత్వమూ సంవాదంలో పరస్పరమూ విశేషింపదగినవి కావు. ఆ మాటకు వస్తే ఉద్యోగాంతంలో వచ్చే ఆచార్య పదవికంటె ఆజీవితం ఉండే విద్యార్థిత్వమే మిన్న. అయినా, ఆచార్య పదవి నాకెలాగూ లేదు కాబట్టి ఆ ఇబ్బందీ లేదు. పదవీబోధకం గాక కేవలవృత్తిరూపమైతే ఆచార్యకం అశ్వక భిషక్పాశ గ్రామటికాదుల వంటి తద్ధితాంతంగా నాకు అనువర్తించేదే.
తెల్లవారుజామున సహృదయులైన శ్రీ కామేశ్వరరావు గారు చూపిన ప్రయోగాలను చదువుకొనటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది మరీ సొగసుగా ఉన్నది. హరిభక్తికల్పలతికను నేనిదివరకు చూచి ఉండలేదు. ఇందులోని లంకెను బట్టి పూర్వోత్తరాలలో చదువుకొంటుంటే మాధుర్యధారగా ఉన్నది. అందుకు వారికి నా ధన్యవాదాలు.
శ్రీనాథుని ప్రయోగం వంటివి ప్రసిద్ధిలో ఉన్నవే: “ముక్తాభా … జటావల్లీషు మల్లీనిభా … హరమూర్ధ్ని పాన్తు గఙ్గాపయోబిన్దవః” అని. పరమేశ్వరుని శీర్షమందలి గంగాంబుకణాలు ముత్యాల లాగానూ, జటావల్లులలో మల్లెల లాగానూ ఉన్నాయని శ్లోకం. ఆభములు, నిభములు అన్న సాదృశ్యవాచకాలు అందులో సార్థకాలుగా ఉన్నాయి. తెలుగు పద్యంలో 1. “అంబరసీమలోని తారలు అనం దగి”, 2. “జటాటవిలోని మల్లెవిరులు అనం దగి”, 3. “భుజాంతరాళంలోని హారాలు అనం దగి”, 4. “ఇలాస్థలిపై పువ్వుల వర్షాలు అనం దగి”, 5. “సత్కృతాంజలిలోని పువ్వులు అనం దగి” అన్నంతవరకు ఉత్ప్రేక్షోపక్రమణిక భావ్యంగా ఉన్నది. ఆ “అనం దగి”నవి “మౌక్తికతుల్య-గంగాంబుకణాలు” కావటం వల్లనే అన్వయంలో ఇబ్బంది వస్తున్నది. జటాటవిలోని మల్లెవిరులతో పోలిక కేవలం గంగాంబుకణాలకు మాత్రమే. మౌక్తికతుల్యగంగాంబుకణాలకు కాదు. మౌక్తికాలకు దానితో సంబంధం ఉండదు. భుజాంతరాళంలోని ముత్యాలహారాలతో పోలిక మౌక్తికతుల్యగంగాంబుకణాలకే. కేవల గంగాంబుకణాలకు కాదు. ఇలాస్థలిపై పువ్వుల వర్షాల పోలిక మళ్ళీ కేవల గంగాంబుకణాలకు మాత్రమే వర్తిస్తుంది. మౌక్తికతుల్యగంగాంబుకణాలకు వర్తింపదు.
ఇలాస్థలిపై పువ్వుల వర్షాలు – అనకపోతే మౌక్తికతుల్యగంగాంబుకణాలతో అన్వయించి ముత్యాల జల్లు కురిసిందని చెప్పుకోవచ్చును. “ఇలాస్థలి పువ్వుల వర్షముల్” అన్నందువల్ల కవి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ‘ఇలాస్థలిపై పువ్వుల వర్షాలు అనదగిన మౌక్తికతుల్యములైన గంగాంబుకణములు’ అని గాని; ‘ఇలాస్థలిపై మౌక్తికతుల్యములైన గంగాంబుకణములు అనే పువ్వుల వర్షాలు’ – అని కాని చెప్పేందుకు వీలులేదు. వాక్యంలో ‘మౌక్తికతుల్యములైన’ అన్న వాచకౌపమ్యాన్ని విడిచివేసి ఏకదేశంగా ‘ఇలాస్థలిపై పువ్వుల వర్షాలు అనదగిన గంగాంబుకణములు’ అని చెప్పటం అన్వయపద్ధతి కాదు. సత్కృతాంజలిలో ఉన్నవి పువ్వులు గాక ముత్యాలయితే అది మౌక్తికాంజలి కాబట్టి మౌక్తికతుల్యగంగాంబుకణాలతో అన్వయించుకోవచ్చును. “ప్రసూనంబులు సత్కృతాంజలిని” అన్నందువల్ల కవి ఆ అవకాశాన్ని ఇవ్వటం లేదు. ‘మౌక్తికతుల్యములైన గంగాంబుకణాలు సత్కృతాంజలిలోని పువ్వులు అనదగి ఉన్నాయి’ – అన్నది ఎట్లాగూ అన్వయింపదు. ‘గంగాంబుకణాలు ముత్యాలు అనదగి, సత్కృతాంజలిలోని పువ్వులు అనదగి ఉన్నాయి’ అన్న ఉభయాన్వయార్థం ఆ సమాసానికి చెప్పదగినదిగా లేదు. “మౌక్తికతుల్యగంగాంబుకణంబులు” అన్న సమాసంలో ఒకసారి గంగాంబుకణాలను విడిచి మౌక్తికాలను, మరొకసారి మౌక్తికాలను విడిచి గంగాంబుకణాలను, ఇంకొకసారి రెండింటినీ నిలిపి మౌక్తికతుల్యగంగాంబుకణాలను చెప్పుకోవటం వ్యాకరణసమ్మతమైతే నాకూ సమ్మతమే. అయిదు దళాలలో ఉత్ప్రేక్షించి, ఒక దళంలో తుల్యత్వాన్ని చెప్పి, ‘మౌక్తికతుల్యగంగాంబుకణాలు’ అన్న సమాసంలో తుల్యత్వానికి ‘మౌక్తికములో అనదగిన గంగాంబుకణాలు’ అన్న గమ్యమానత ప్రతీయమానం అయితే అది సమర్థనీయమే. అప్పటికీ ఏకదేశాన్వయానికి సమాధానం లేదు.
శ్రీ కామేశ్వరరావు గారు వ్రాసినట్లు “శివుడు నాట్యం చేస్తున్నప్పుడు అతని శిరసుపైనున్న ము-త్యా-ల్లాం-టి గం-గాం-బు-క-ణం-బు-లు ఆకాశంలో తారకల్లాగా, శివుని జడలో మల్లెపూలలాగా, ఎడదపై ముత్యాలదండలలాగా, నేలపై పడేటప్పుడు పూలవానలాగ, అతను అంజలి పట్టినప్పుడు అతను విడిచే పుష్పాంజలిలాగా ఒప్పారుతూ ఉండగా, నాట్యం చేస్తున్న శివుడు మిమ్ములను రక్షించు గాక” – అన్న తాత్పర్యం కనుపిస్తుండటం వల్లనే పద్యాన్వయంలో విరోధం ఏర్పడుతున్నది.
ఈ విరోధాన్ని పరిహరించటంకోసమే అర్ఘ్యాంజలిలో పువ్వులను, పండ్లను నిక్షేపించాలన్న వేమభూపాలుని వాక్యంతో పరమేశ్వరుని సంధ్యావనితాప్రణామరూపమైన నాట్యంలో పుష్పాంజలిలో పువ్వులను, ముక్తాఫలాలను అన్వయించుకోవలసివచ్చింది. అది శ్రీనాథుని పద్యం కావచ్చునన్న ఊహ అందువల్లనే కలిగింది. ప్రతిపాదన స్వసమర్థకం కానట్లయితే ఉపసంహరించుకోవటానికి నేనెప్పుడూ సిద్ధమే. ఔగాములను నిర్ణయింపవలసినది సహృదయులైన పాఠకులే. నేనిక చెప్పవలసినదేమీ లేదు.
నేను సాహిత్యవిద్యార్థినే తప్ప నాకు ఆచార్యకము లేదు. కాబట్టి నా అన్వయంలోని గుణదోష విచారణ పెద్దలకే వదిలిపెడతాను. అయితే శ్రీ మురళీధరరావుగారు చూపిన అభ్యంతరాలు చర్చనీయములు కాబట్టి వాటిపై నా అభిప్రాయాలు మాత్రం ఇక్కడ పంచుకుంటున్నాను.
1. “ముత్యాల వంటి అంబుకణాలు – అవి ఎంత తెల్లనివైనా ఆకాశంలో తారకల్లాగా కానరావటం లోకవిరుద్ధం; కవిసమయ విరుద్ధం.” అలాగే “ముత్యాల వంటి అంబుకణాలు జడలో మల్లెపూలలాగా గోచరించటం లోకవిరుద్ధం; కవిసమయ విరుద్ధం. తెల్లనివన్నంతమాత్రాన జలకణాలకు పువ్వులతో ఉపమానసిద్ధి లేదు.”
సంస్కృత తెలుగు సాహిత్యాలతో నా పరిచయం చాలా పరిమితం. కాబట్టి విస్తృతంగా కవిప్రయోగాలను ప్రదర్శించగల శక్తి నాకు లేదు. నాకు కనిపించిన రెండు మూడు ఉదాహరణలు మాత్రం ఇక్కడ చూపిస్తాను. ముందుగా గమనించాల్సిన ముఖ్యాంశం – ఇక్కడ పోలిక మామూలు నీళ్ళతో కాదు, గంగాజలాలతో.
పుట్టపర్తి నారాయణాచార్యులవారి శివతాండవ కావ్యంలోని యీ క్రింది శ్లోకాన్ని గమనించండి:
“గంగాతరంగ బిందువులతో కూడిన శివుని జటాజూటం చుక్కలు పొదిగిన సంధ్యాకాశంలా ఉన్నద”ని మొదటి రెండు పాదాల అర్థం. ఇక్కడ గంగాజలబిందువులకు నక్షత్రాలతో పోలిక గమనించవచ్చు.
ఇక గంగను మల్లెపూలమాలతో పోల్చిన ఉదాహరణలు:
కాశీఖండం పంచమాశ్వాసం 49వ పద్యం (ఇది గంగను వర్ణించే పద్యం) ఎత్తుగీతిలో శ్రీనాథుడు గంగను “మదనవైరి జటాటవీ మల్లికళిక” అన్నాడు.
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకుర రచించిన “హరిభక్తకల్పలతిక” అనే గ్రంథం రెండవ స్తబకంలో (యిది గూగులు పుణ్యమా అని దొరికింది!) మూడవ శ్లోకం:
పద్యంలో కాని నా అన్వయంలో కాని యీ భావం లేదు. ఆడే శివునిపైనున్న గంగాజలశీకరాలు కొన్ని ఇలాస్థలి పై పూలవానగా కురుస్తున్నాయి. కొన్ని శివుని దోసిట పడ్డ పూలవలె ఉన్నాయి.
3. “అంబుకణాలకు ఒకసారి తారకోపమానం, ఒకసారి పుష్పోపమానం చెప్పిన తర్వాత, వేరే ఉపమానాలు తోచక మళ్ళీ మళ్ళీ పుష్పోపమానాన్ని ఎందుకు పునరుక్తం చేస్తాడు? భుజాంతరాళంలోనివి పుష్పహారాలు కావు, ముత్యాల దండలు అని చెబితే, ముత్యాల లాంటి అంబుకణాలు ముత్యాల దండల లాగా ఉన్నాయి – అని చెప్పాలి. అది వాక్యపద్ధతేనా?”
ఈ అభ్యంతరాన్ని గురించి బహుశా చర్చించి లాభం లేదు. ఇందులో ఔచిత్యానౌచిత్యాలు సహృదయవేద్యములే తప్ప హేతుపూర్వకంగా నిరూపింపదగ్గవి కావు. నాకిందులో అనౌచిత్యం కనిపించ లేదు. గంగాంబుకణాలను పూలతో పోల్చినప్పుడు, అవి – కొన్ని శివుని సిగలోపూవులుగా, కొన్ని నేలను కురిసే పూలవానగా, కొన్ని అంజలిలోని పుష్పాలుగా ఒప్పారాయని చెప్పడంలో పునరుక్తి ఏముంది. పోలిక ఒకటే అయినా స్థానాన్నిబట్టి వాటి అమరికలో మార్పు ఉంది కదా. అలాగే గంగాజలబిందువులు ముత్యాలవలె ఉన్నాయి కనుకనే అవి హరుని గళసీమలో హారాల్లా శోభిల్లాయి.
స్టార్‌బక్స్ లో కథలు అని అనుకుని మీరు వ్రాస్తుంటే ఫరవాలేదు. కాని స్టార్‌బక్స్‌లో ఒక బారిస్టా అనుభవాలుగా వ్రాస్తుంటే మాత్రం, ఒక “స్త్రీ” గానో ఒక “పురుషుడు” గానో వ్రాస్తే బాగుంటుందేమో!
భావాలు.
మనోభావాలు.
చెత్త భావాలు.
చిత్తు భావాలు.
ఉత్త భావాలు.
ప్రతి వాడికి ఒక భావం.
ఒక మనోభావం.
అందరివీ దెబ్బతినటమే.
స్త్రీల భావాలు దెబ్బతినటం.
కులాల భావాలు దెబ్బతినటం.
కవుల భావాలు దెబ్బతినటం.
సంపాదకుల భావాలు దెబ్బతినటం.
సంపాదకీయాల భావాలు దెబ్బతినటం.
ఓలు మొత్తంగా అన్నీ దెబ్బతినటం.
దెబ్బతినిపిచ్చుకోవటం.
ఒక్క సంప్రదాయవాదులవి తప్ప.
ఏం సంప్రదాయవాదులు మనుషులు కారా?
ఏమో కారేమో! ఎవడికి తెలుసు ?
వందల ఏళ్ళ నుంచి ఉన్న కట్టూబొట్టూ పాడైపోతే మనోభావాలు గాయపట్టం తప్పు.
వందల ఏళ్ళగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలు పాడైపోతున్నాయని మనోభావాలు గాయపట్టం తప్పు.
వందల ఏళ్ళ నుంచి ఉన్న కుటుంబ సంబంధాలు పాడైపోతే మనోభావాలు గాయపట్టం తప్పు.
వందల ఏళ్ళగా ఉన్న భాష ఆంగ్లంలోకి దిగిపోతోందని బాధ పట్టం తప్పు.
వందల ఏళ్ళగా లేని విచ్చలవిడితనం ఇప్పుడే రెచ్చిపోతోందని బాధపట్టం తప్పు.
పాత సాహిత్యం చదవండిరా, కొత్త సాహిత్యంలో పట్టండిరా అని నెత్తీ నోరు మొత్తుకోవటం తప్పు.
మనదాన్లో ఏవీ లేవని మనల్ని మనం తక్కువచేసుకుంటున్నామని, చేసుకోవాలని ప్రవచించే వాళ్ళను ఏం చెయ్యాలని బాధ పట్టం తప్పు.
వేల సంవత్సరాలుగా జీవితంలో భాగమైపోయిన రామాయణ, భారత, భాగవతాల్ని ఏ రచైత నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నా ఎవడు పట్టిచ్చుకోవట్లేదని మనోభావాలు గాయపర్చుకోటం తప్పు.
వీళ్ళెవరూ కాని సంస్కృతీ పరిరక్షకులు, ఆ పరిరక్షకుల మీద దాడి చేసేవాళ్లు కామోసు. విచిత్రమైన గీత.
ఈ గీత చతుర్ముఖుడు రాసాడని ఊరకోటమా!
లేక మిగతావాళ్ళంతా చేస్తున్న రివోల్టు ఈ సంప్రదాయవాదులెందుకు చేయట్లేదో మీకెవరికన్నా తెలుసా?
ఎవడి పాపాన ఎవడు పోతాడో తెలీక ఊరకుంటున్నారా?
ఎవడి పాపం వాడినే చుట్టుకుంటుందని ఊరకుంటున్నారా?
చతుర్ముఖుడు రాసాడే అనుకో, చిన్న గీతను పెద్ద గీత చేసుకోటం నీ చేతిలో పనే.
పండగలొస్తే సంప్రదాయవాదులు కావాలి.
పబ్బాలొస్తే సంప్రదాయవాదులు కావాలి.
పుడితే సంప్రదాయవాదులు కావాలి.
చస్తే సంప్రదాయవాదులు కావాలి.
అసలు సంప్రదాయవాది, వాడెట్లా చస్తే ఎవడిక్కావాలి ?
నైతిక భావాలు ఎట్లా చచ్చిపోతే ఎవడిక్కావాలి?
మంచి నేర్పే భావాలు చచ్చిపోతే ఎవడిక్కావాలి ?
అంతే! అంతే! అంతే!
ఇంతే! ఇంతే! ఇంతే!
కలికాలంలో అంతే!
అంతా పోయేదాకా ఇంతే!
ఇప్పటికి ఇంతే! అంతే!
‘ఈమాట’మే, 2014 వెబ్ మ్యాగజైన్లో సుజాత గారు ‘అంపశయ్య మరోసారి, కొత్తగా’ పేరుతో రాసిన వ్యాసాన్ని నేను చాలా ఆలస్యంగా, ఒక వారం రోజుల క్రితమే సి.హెచ్.వేణు అనే సాహితీ మిత్రుడు నా ఐపాడ్ కు, నా ఇమెయిల్ ఐడికి పంపించటం వల్ల చూడగల్గాను. ఆ నవల వెలువడిన 45 సంవత్సరాల తర్వాత కూడా ఆ నవలను గూర్చి ఇలాంటి లోతైన విశ్లేషణాత్మక విమర్శా వ్యాసాలు రచింపబడ్తున్నందుకు ఆ నవలా రచయితగా చాలా సంతోషిస్తున్నాను.
అయితే సుజాత గారు ఆ వ్యాసాన్ని ముగిస్తూ ఆ నవల మీద చేసిన రెండు వ్యాఖ్యానాలు నన్ను చాలా ఆశ్చర్యపరచాయి.
అందులో ఒకటి: నవల ముగింపు నాటకీయంగా, బలవంతంగా జరిగింది; నవల మొత్తం వాతావరణంలో ఈ ముగింపు ఇమిడలేదని-
రెండవది: రమేష్ రత్తిని గురించి వివరంగా చెప్పడంలో కూడా ఈ బలవంతమే కనిపిస్తుంది.
1969లో అంపశయ్య వెలువడినప్పట్నించి ఈ నవలను గురించి చాలామంది చాలా విషయాల్ని చెప్పారు. కానీ సుజాత గారు చూపించిన ఈ రెండు అంశాల్ని ఎవరూ ప్రస్తావించలేదు.
నవలలో రవి అనేక మానసిక సంఘర్షణలకు లోనయ్యాడన్న విషయాన్ని సుజాత గారు కరెక్ట్ గానే చెప్పారు. అతడు ఒంటరిగా ఉన్నంతకాలం బలహీనుడే- సుజాత మాటల్లో దుర్బలుడుగానే కనిపిస్తాడు. అలాంటివాడు ఒక సమూహంలో ఉన్నప్పుడు ఎలా బలవంతుడుగా మారాడో చెప్పడానికే నవలను అలా ముగించాను. నవలలోని ఈ ముగింపు నాటకీయంగా కనిపిస్తుందన్నారు సుజాత గారు. ప్రతీ నవలలో అనేకచోట్ల ఎంతో కొంత నాటకీయత ఉంటుందని సుజాత గారికి తెలియని విషయం కాదనుకుంటా! ‘వైయక్తికమైన ప్రయాణం ఉన్నట్టుండి సామాజికం అవుతుంది’ అన్నారు సుజాత గారు. ఏ వైయక్తిక ప్రయాణమైనా సామాజికం కాక తప్పదు. పూర్వం ఎప్పుడో అరిస్టాటిల్ ‘Man is a social animal’ అన్నాడు. దీనికి సుజాత గారు నాటకీయమని అభ్యంతరపెట్టటం ఆశ్చర్యమే. నవలలో ఈ ముగింపు చాలా Spontaneous గా ఉత్పన్నమైనదేనని అనేకమంది పాఠకులు భావించారు.
ఇక రత్తిని గురించి రవి రమేష్ కు వివరంగా చెప్పడాన్ని సుజాత గారు బలవంతంగా జరిగిందని వ్యాఖ్యానించటం ఇంకా ఆశ్చర్యపరిచింది. నవల ప్రారంభం నుండి రత్తి ప్రసక్తి వస్తూనే ఉంది. నవల ముగిసేలోగా రత్తి ఉదంతాన్ని ఎక్కడో అక్కడ వివరంగా రచయిత చెప్పబోతున్నాడనే పాఠకులు అనుకుంటారు. రత్తిని గూర్చి రవి అనుక్షణం ఒక అపరాధ భావనకు లోనవుతున్నాడు. ఆ విషయాన్ని రమేష్ లాంటి అతని మిత్రునితో చెప్పుకుంటే తప్ప అతని హృదయంలో స్థిరపడిన ఆ అపరాధ భావన తొలగిపోయి అతని హృదయం తేలికపడదు. తన హృదయభారాన్ని తొలగించుకోవటం కోసమే రవి రమేష్ తో రత్తిని గురించి అంత వివరంగా చెప్పాడు. దీంట్లో ‘బలవంతం’ యేమీ లేదు.
ఆ తెలిసీ తెలియని వయస్సులో రవి రత్తిని ప్రేమించానన్న భ్రమకు లోనయ్యాడే గానీ ఆమెను నిజంగా ప్రేమించలేదని పాఠకులకు సులభంగానే అర్థమవుతుంది. నిజంగా ప్రేమిస్తే ఆమెను తన స్వంతం చేసుకోవడానికి రవి ఎంతకైనా తెగించేవాడు. కానీ రత్తి పట్ల అతనికి విపరీతమైన సానుభూతి ఉంది. ఆమెకు జరిగిన అన్యాయంలో తను కూడా భాగస్వామి అయ్యానేమోనన్న ఫీలింగ్ కారణంగా అతనిలో తీవ్రమైన అపరాధ భావం చోటుచేసుకుంది. రమేష్ కు ఈ ఉదంతాన్ని వివరంగా చెప్పుకోవడంతో ఆ అపరాధ భావన తొలగిపోయింది.
సుజాత గారూ ! నవలలో పాత్రలు తప్ప రచయిత కనిపించకూడదన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ముగింపులోనూ, రత్తిని గూర్చి రవి రమేష్ కు వివరంగా చెప్పిన ఘట్టంలోనూ రచయితే కనిపించాడని మీరంటున్నారు. కాని ఈ రెండు సందర్భాల్లోనూ రవే కనిపిస్తాడు తప్ప రచయిత కనిపించలేదే! ఒకవేళ మీరు రవే రచయిత అనుకుంటున్నారేమో దయచేసి ఆలోచించండి.
యేదేమైనా , మీరు ‘అంపశయ్య ’ మీద ఇంత లోతైన విశ్లేషణ చేసినందుకు మీకు కృతజ్ఞతలు.
1. Topology ని నిర్వచించడంలో నేను మరికొంత శ్రద్ధ పాటించాల్సింది. వస్తువులని చించకుండా పగలగొట్టకుండా, వంచినా సాగదీసినా, వాటిలో మార్పు చెందని లక్షణాలకి సంబంధించిన శాస్త్రం కాబట్టి స్థిరధర్మ శాస్త్రం అనడం ఘోరమైన తప్పనుకోను. సంస్థితి శాస్త్రం సరైనదా? ఓ గణితశాస్త్రజ్ఞుడి గా మీ సలహా ఏమిటి?
2. Goldbach Conjecture ని ఇలా సవరిస్తాను: రెంటి కన్నా పెద్దదైన ప్రతి సరి సంఖ్యా రెండు ప్రధాన సంఖ్యల కూడిక ఫలితం.
3. పూర్వం సహజ సంఖ్యలలో సున్నా ఉండేది కాదు కాని పందొమ్మిదో శతాబ్దం చివరలో వాడుక మారడం మొదలయింది. 1889 లో Peano సహజ సంఖ్యల మూల సూత్రాలని ప్రతిపాదించినపుడు 1 తో మొదలెట్టినా, 1898 కల్లా మార్చి 0 తో మొదలెట్టాడు. అందరూ ఒప్పుకోకపోవచ్చు కాని, ప్రస్తుతం 0 వాడటమే ఆధునిక పద్ధతి. From “the” book [1] on one of the most famous unsolvable problems, “Following the tradition in mathematical logic, … we shall consider 0 to be a natural number.”
4. రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు తర్కం మీద కాక ఇతర విషయాలపై చూశాను. వీలయితే మీరు ప్రస్తావించిన వాటి ప్రచురణ వివరాలు ఇవ్వండి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Hilbert’s Tenth Problem,” by Yuri V. Matiyasevich. The MIT Press, 1993.
ఎడిటర్ గారికి, కవిత్వం రాయటం ఎలా అనే విషయం ఇప్పుడే చదివాను. చాఆఆఆఆఆఆఆఆఅలా బాగుంది. కృతజ్ఞతలు.మొన్ననే ఒక కవిత మీకు పంపెను. కాని అది ప్రచురించలేమని మెయిల్ పెట్టేరు. పరవాలేదు. ఎందుకంటే నేను కవిత్వం నా సంత్రుప్తికి రాసుకుంటున్నాను. అదే సమయంలో మరి కొంత మందితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఏది ఏమైనా మీరూ పై వ్యాసంలో చెప్పిన చాల పాయింట్స్ నేను అనుకుంటున్నవే.అందుకే నాకు చాల సంతోషం వేసింది. మళ్ళీ ప్రయత్నం చేయడం తప్పుకాదని అనుకుంటున్నాను.
శిక్ష కి సంబంధించి, నేను రాసింది కాస్త సవరించవచ్చు కాని మరీ సత్యదూరం కాదు.
Davis నుండి, “The judge before whom Turing’s case came, acting out of what he believed were humane motives, permitted Turing to escape prison if he would agree to be treated by hormonal injections …”
గణిత పదాల సూచనలకి చాలా కృతజ్ఞతలు.
గ.సా.భ. క.సా.గు. ల తప్పులు చూసి చాలా సిగ్గేసింది (very embarrassed).
ఈ క్రింది విధంగా మార్పులు చేస్తాను:
Distribution = విభాజనము, పంపకము
Central Limit Theorem = కేంద్రీయ అవధి సిద్ధాంతం
Number theory = సంఖ్యా గణితం
Model = నమూనా
Sample = మచ్చు
“ఏ నాటికైనా తెలుగు సైన్సు రచయితల సరసన చేరదలచుకొంటే పైన పేర్కొన్న దోషాలను దిద్దుకోవటం necessary and sufficient condition అని, మాథమాటిక్స్ లో మాలతీ చందూర్ వంటలు-పిండివంటలను కలిపి ఆసక్తి కరంగా వడ్డించిగల రచయితకు ఇది మంచినీళ్ళ ప్రాయమని నమ్ముతాను.”
పదాలకి సంబంధించిన దోషాలు దిద్దుకోవడం సులభమే; కాని అది necessary but not sufficient condition. 🙂 Thanks for the praise.
కంపెనీ లోగో లో ఉన్న apple న్యూటన్ ది, టూరింగ్ ది కాదు అని ఆ కంపెనీ వాళ్ళన్నారట.
మీరు చెప్పిన ఆ మా వూరు వాడెవరో నాకు తెలీదు. ఎవరో చెప్పితే సంతోషిస్తాను. ఎక్కడ ఎప్పుడు భావాలగురించి రాసారో కాస్త వివరంగా చెప్పండి. పోతే, “ఆకలి, నిద్ర, దాహం, ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం-అందరికీ ఇవి సమానమే.” కాదనుకుంటాను. ఇవి అందరికీ ఒకటే! కాని, అందరికీ సమానం (#equal#) కాదు. ఉదాహరణకి, ” ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం,” అందరికీ సమానమా? కాదేమో! అలాగే, అడుక్కొని తినేవాడికి, మూడుపూటలా మెక్కే అవకాశం ఉన్నవాడికీ, ” ఆకలి, నిద్ర, దాహం,” సమానం కాదనుకుంటా!
” భావాలు మానవుల్నందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు మానవుల్ని విడదీస్తాయి.” ఈ వాక్యం నాకు అస్సలు అర్థం కాలేదు. #Tower of Babel# కథ సరదాగానే ఉంటుంది కానీ, అది కట్టు కథ! కాస్త వివరంగా చెప్పితే మరీ సంతోషం.
మోహనగారు “ముగింపు ఎందుకో నన్ను ఆకర్షించలేదు. వాళ్లు చంపబడకుండా ఉండి ఉంటే బాగుండేది” అన్నారు. కానీ కథకుడు ఇచ్చిన ముగింపే సబబు. అది సహజమైన ముగింపు. మోహనగారు కోరిన ముగింపూ ఇవ్వవచ్చును. ట్రాక్టరు బోల్తా కొట్టి ఆ ముసలమ్మ కుటుంబం మొత్తం చనిపోయారన్న దానికి బదులుగా ముసలమ్మకుటంబాన్ని ఏదో చేయటానికి వెడుతూ సత్తిరాజే ట్రాక్టరు బోల్తా కొట్టి చనిపోయాడని వ్రాయవచ్చును. కాని అది వట్టి మెలోడ్రామెటిక్ ముగింపు ఐపోతుంది. ఈ విధమైన ముగింపు కథకుడికి తోచలేదని నేను అనుకోను. అందుచేత సహజమైన ముగింపు వైపుకే కథకుడూ మొగ్గినట్లు నా అభిప్రాయం.
రామారావు గారు ‘ఈ వ్యాసం నాకు ముందు దొరికి ఉంటే’ అన్నారు కనక నా మనసులో ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నాను.
మనకున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రొఫెసర్లు ఎలా ఉద్యోగాలు సంపాదిస్తారో జనాలకి తెల్సిందే. అటు తూర్పులోనూ ఇటు పడమరలోనూ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసి చేతనైనంత దూరం రాళ్ళు విసిరినవాణ్ణే నేనూను; రామారావు గారంతటి పెద్ద స్కూల్లో చదువుకోకపోయినా. కంప్యూటర్స్ అనేసరికి రెండూ మూడు రకాల లాంగ్వేజస్ ఓ రకం డాటాబేస్ నేర్చుకోవడం అనే ముద్ర పడిపోయింది. కంప్యూటర్ ఇంజినీరింగ్ వేరూ, కంప్యూటర్ సైన్సు వేరూ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వేరూ అని చెప్తే నవ్వే రోజులొచ్చాయి. అదలా ఉంచి టీచింగ్ దగ్గిరకి వస్తే ఇండియాలో ఉన్న ఏవో కొద్ది కాలేజీలు తప్పితే మిగతా ఎక్కడా కూడా “మొదటి కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు?” అనే ప్రశ్న తర్వాత కానీ ముందు కానీ ఆలన్ టూరింగ్ పేరు వినిపించదు.
ఈ ప్రొఫెసర్లకే తెలీవు ఇక్కడ రావు గారు చెప్పిన విషయాలు. కుర్రాళ్లకేం చెపుతారు? ఆ మధ్య స్కూల్లో ఎలిప్స్ గురించి చెప్తూ (పడమర యూనివర్సిటీలో) ఆచార్యుల వారు చెప్పారు – దీని అప్లికేషన్ గురించి – అల్ట్రా సౌండ్ లో వాడతారు అని. మన ఇండియాలో అసలు ఇంజినీరింగ్ కాలేజీలో కానీ ఎక్కడా కూడా కాని వినం ఇవి. ఎందుకంటే వాళ్ళకే తెలియదు కదా? Straight line drawn from one of the focal points to any point on the curve and then back to the other focal point has the same length for every point on the curve అనేది మాత్రం మనచేత పిడి కొట్టిస్తూ ఉంటారు. ఓ కుర్రాడు – రామారావు గారు ఇండియాలో చదువుకున్న స్కూల్లోనే – మెకానికల్ ఇంజినీరింగ్ ఆచార్యుల వారిని ఎల్లిప్టికల్ షేప్ లో car engine సిలిండర్ కుదరదా అని అడిగితే క్లాసులో అందరిముందూ వెక్కిరించారని విన్నాను. అదే మోడల్ ఉత్తరోత్తరా ఏదో కార్ కంపెనీ వారు చేసారుట. అది విజయం సాధించిందా లేదా అనేది పక్కన పెట్టి, 18/19 ఏళ్ళ కుర్రాడి తెలివితేటలకి మెచ్చుకోవడం ఎందుకు చేయలేకపోయేరు ఆ ప్రొఫెసర్? ఏదో చెత్త కాలేజీలో అయితే అనుకోవచ్చు కానీ ఐ ఐ టి లో కూడానా అంటే సమాధానం సులభంగా చెప్పవచ్చు – అహంకారం – నువ్వెవడవోయ్ నాకు చెప్పడానికి? నువ్వు 18 ఏళ్ళ కుర్రాడివి నేను అమెరికాలో పీ. హెచ్. డి చేసొచ్చా అనే భావన. Holier than thou.
తప్పు పూర్తిగా మనది కాదు లెండి. డిగ్రీ అవగానే డబ్బులకి ఉద్యోగం వెతుక్కోవల్సిన పరిస్థితి మనది. Chemical Engineering ఉద్యోగం వస్తే మహా అయితే గియితే యాభై వేలొస్తాయేమో మొదట్లో. రెండు లాంగ్వేజెస్ నేర్చుకుంటే అదే డిగ్రీతో నెలకి మూడు నుండి నాలుగు లక్షల జీతం గేరంటీ. నాలుగేళ్ళు కష్టపడి చదివిన నా డిగ్రీ సంతకెళ్తే నాకేం? మరో విషయం మనకున్న రీసెర్చ్. హైద్రాబాద్ అంత ఉంటుందా తైవాన్ అనే దేశం? అక్కడ జరిగే రీసెర్చ్ మొత్తం మన దేశంలో ఎక్కడా లేదని నేను ఘంటాపధంగా చెప్పగలను. మొన్నటికి మొన్న ఒక ఆచార్యుల గారికి ప్రమోషన్ కోసం రికమెండేషన్ రాసిచ్చాము. ఆయన రాసిన పేపర్ల లాంటివి ఇండియాలో ఎక్కడా చూడలేదు. నీకేం తెలుసోయ్ చెవలాయ్ అంటారేమో అని చెప్తున్నాను కానీ స్వోత్కర్ష కోసం కాదు, నేనూ దేశంలో కొన్ని సంవత్సరాలు పాఠాలు చెప్పి పేపర్లు పబ్లిష్ చేసినవాణ్ణే.
అటు తూర్పు ఇలా ఉంటే పడమరలో కూడా రకరకాల ఏడుపులున్నాయి. ఓ ఆచార్యులవారి క్లాసులో నేను సోడియం పొటాషియం ఛానెల్స్ గురించి గుండెకి అవి ఎలా అవసరమో అనేది “Cardiovascular Engineering” course లో విన్నాను. కానీ ఆయన మైక్రోబయాలజీ మేజర్ అవడం వల్ల మొత్తం సెమెస్టర్ అంతా అదే చెప్పి ప్రాణం తీసేడు. సోడియం పోటాషియం చానెల్స్ గొప్పవే కాదనటంలేదు కానీ నాలుగునెలలు వారానికో రెండు గంటల క్లాసులో చెప్పక్కర్లేదు, మిగతా కోర్స్ అంతా వదిలేసి. ఉత్తరోత్తరా తెల్సినదేమిటంటే ఆయనకి ఈ కోర్సులో సోడియం పొటాషియం ఛానెల్స్ తప్ప మిగతా Engineering Principles of Blood Flow, Stress Tensor, Strain, Pressure differences అనేవి అర్ధం కావు. అందుచేత అవి మాకు చెప్పడు. కోర్సు అయ్యాకా దాదాపు అందరికీ ఒకటే గ్రేడ్ – బి. ఎందుకంటే ఒకటే దాన్ని దంచుతూ కూర్చున్నాడు మాకు బోరుకొట్టి వినడం మానేశాం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే పడమర స్కూళ్ళల్లో (వేమూరి వారు క్షమించాలి) – సబ్జెక్ట్ వచ్చినాయనకి క్లాసుకొచ్చి పాఠాలు చెప్పడానికి సమయంలేదు – టీచింగ్ అసిస్టెంట్ ని చూడమంటాడు. అధవా క్లాసుకి వచ్చినా నోటమ్మట మాట రాదు ఆయనకి. వచ్చినది చెప్పలేడు. రెండో రకం వాళ్ళు పైన చెప్పినటువంటి సోడియం పొటాషియం ఆచార్యులు.
ఇంకో కంప్యూటర్ సైన్స్ ఆచార్యులవారి పద్ధతేమిటంటే క్లాసులో టెక్స్ట్ బుక్కు చదవడం. అందరూ పుస్తకం పట్టుకుని రావాలి క్లాసుకి. ఓ పుస్తకం ఇద్దరు చూడడం నిషేధం. పుస్తకం కొనకపోయినా క్లాసుకి తీసుకురాకపోయినా మీ గ్రేడ్ బి. దిక్కున్న చోట చెప్పుకోండి. ఇలాంటి వాటి వల్ల ఓ కుర్రాడికి సెమెస్టర్ అంతా బుర్ర పాడయ్యి వాళ్ల మేజర్ ప్రొఫెసర్ దగ్గిర చివాట్లు తినడం నాకు తెలుసు.
ఎక్కడో ఓ ట్యూరింగ్ నిశ్శబ్దంగా తన పని చేసుకుపోతూంటాడు. ఓ రోజు ఆయన ప్రతిభ – సినిమా మూలంగా అయితేనేం, మరో విధంగా అయితేనేం – బయటకొస్తుంది. అలాగే కేన్సర్, ఎయిడ్స్ కి మందులు కూడా ఓ రోజు వెలుగు చూస్తాయి. ఈ నిశ్శబ్దంగా పనిచేసుకుపోయేవారు జ్ఞానజ్యోతులు. మనం వాటికి చమురు పోసినా పోయకపోయినా అవి వెలుగుతాయి ఏదో విధంగా.
మొదట్లో చెప్పవలిసింది గానీ చివరిగా చెప్తున్నాను. కొడవళ్ళ గారూ మీ వ్యాసం అద్భుతం.వ్యాసం మొత్తం అంతా లెక్కలు బోరుకొట్టకుండా టూరింగ్ ఎక్కడ పుట్టాడో, జీవితం ఎలా గడిచిందో చెప్తూ మధ్య మధ్యలో వివరాలు ఇవ్వడం వల్ల చదువుతున్నప్పుడు ఎక్కడా విసుగనిపించలేదు. ఎనిమిదేసి పేజీల పెద్ద వ్యాసం అప్పుడప్పుడు క్రమం తప్పుతూ రాయడం కంటే మూడు/నాలుగు పేజీలు క్రమం తప్పకుండా రాయడం సులభమేమో ఆలోచించగలరు – ఎందుకంటే ఒకేసారి ఈ ఎనిమిది పేజీలు జీర్ణించుకోవడం కష్టం. “తీరుబడి లేక” రాయట్లేదు అనకండి. మనసుంటే మార్గముంది అన్నారు కదా? రెగ్యులర్ గా రాస్తూ ఉంటారని ఆసిస్తూ.
యధుకుల భూషణ్ గారికి: ఇటువంటి వ్యాసం రాసినప్పుడు కొండకచో అనువాద తప్పులు రావడం సహజం. అవి పెద్ద లెక్కలోకి రావు. ఏపిల్ కంప్యూటర్స్ కీ ట్యూరింగ్ కీ ఏమిటి సంబంధం? నాకర్ధం కాలేదు. నాకు తెల్సున్నంతలో ఏపిల్ కంప్యూటర్స్ వినియోగదారులకి పనికొచ్చే పరికరాలు చేసే కంపెనీ – అవి కంప్యూటర్లు కానీయండి, ఫోన్లు కానీయండి. బతికున్నప్పుడు స్టీవ్ జాబ్స్ కి ఈ వ్యాసంలో రాసిన విషయాలు తెలిసి ఉంటాయంటే సందేహమే.
రామారావు గారికి: క్యూరియాసిటీ వల్ల అడుగుతున్నాను కానీ ఏదో మిమ్మల్ని ఛాలెంజ్ చేయాలని కాదు. మీకు ఇటువంటి వ్యాసం దొరికి ఉంటే మీ కెరీర్ ఏ విధంగా మలుపు తిరిగి ఉండేది?
వ్యసనం అంటే దుఃఖం. అది ఏదో రకంగా మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది. అప్పుడప్పుడు అది కొంచెం తక్కువస్థాయిలో ఉన్నప్పుడు ఆ కాస్త స్థాయీబేధాన్ని బట్టి మనకు సుఖభావన కలుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని బలహీనతలు దుఃఖానికి జన్మస్థానాలయ్యేసరికి బలహీనతలే వ్యసనాలుగా ఒక అభిప్రాయం ప్రపంచంలో స్థిరపడింది. కాని అలవాట్లన్నీ వ్యసనాలు కానక్కర్లేదు. వ్యసనస్థాయికి చేరినవి దురలవాట్లు అన్నమాట.
ఈ కథలో కాఫీ అనేది ఒక వ్యసనంగా చూపారు కాని అదంత బలంగా రాలేదు.అలాగే స్నేహం కూడా సూచనాప్రాయంగా ఒక వ్యసనంగానే చూపారు కానీ అదీ అంత బలంగా రాలేదు.
అన్ని జీవితాలలోనూ ఏదో రకమైన వెలితి ఉండనే ఉంటుంది. అది చాలా సహజం. ఆ వెలితిని కప్పిపుచ్చుకుందుకు మనుషులు ఏవో వ్యాపకాలను ఆశ్రయిస్తారు. అవి అలవాట్లుగా మారవచ్చును. కానీ అన్నీ దురలవాట్లుగా మారవు కాబట్టి అన్నీ వ్యసనపర్యంతం కాక దురలవాట్లూ దుఃఖకారకాలూ కావు. అందుచేత ఇక్కడ వ్యసనం అన్న భావనను కొంచెం అతిచేసి చూపటం జరిగిందని నా భావన.
కథను కాఫీకి ముడివేయటానికి గాని కథకుడు తానే కాఫీని సిప్ చేయటం అనేది దేనినీ సూచించినట్లు నాకనిపించలేదు.
కథనం మాత్రం బాగుంది. కథలో నాకేమీ విశేషం కనిపించలేదు. నా అవగాహనలో ఏమైనా పొరపాట్లున్నాయేమో తెలియదు!
తనదాకా వస్తే కాని తలనొప్పి తెలియదనే సామెతకు ఒక ఉదాహరణగా వ్రాసిన కథ. దేనికైనా సమయం రావాలి అన్న తెలివిడికల ప్రాప్తకాలజ్ఞుడి ముఖంమీద చివరకు మందహాసం వచ్చేసింది – హమ్మయ్య!
ప్రక్షాళన గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/04/2015 10:15 am
అనువాదపు కథ. బాగుంది. అనువాదపు వాసనలతో కాకుండా తెలుగువాతావరణంలో ఈ కథను నడిపి ఉంటే మరింత బాగుండేది.
పాత తెలుగుసినిమాల్లో బాలరాజుకథ అని ఒకటి దివంగత బాపూగారు తీసినది ఉంది. అందులో కొన్ని నీతిసూత్రాలు వరసగా ఒక ఫలకం మీద వ్రాసి ఉంటాయి. ఆ నీతులను ప్రబోధించే కథలు అదే వరుసలో కథానాయకుడైన బాలుడి జీవితంలో జరుగుతాయి. తప్పేమీ లేదు కాని ఎందుకనో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది అప్పట్లోనే. ఈ కథలో కూడా అటువంటి వరుసక్రమం ధోరణి కొంత ఉన్నట్లుంది.
ఇటువంటి తాత్త్వికచింతనకల కథలు చదవటానికి చాలా బాగుంటాయి, ముఖ్యంగా జానపదకథల ధోరణిలో నడచినప్పుడు.
చాల బాగుంది. తరుచు వస్తు పోతూ ఉన్న నాకు మొదట్లొ అంత తేడా తేలిసేది కాదు. కాని ఇప్పుడు మీరు రాసినది మాములు అయిపొయింది. పాత చింతకాయ అంటారు. మీరు రాసే వ్యసాలు చదివె వాళ్ళ వయసు చూస్తే మీకే తెలుస్తుంది. నిజం చెప్పాలంటె చాల బాధగా ఉంటుంది.
చాల బాగుంది. నేను వైజ్ఞానిక విషయాలమీద వ్యాసాలు రాసినప్పుడు “ఇదంతా కంచి గరుడ సేవే” అని నన్ను ఆక్షేపించిన వారే ఎక్కువ; ప్రోత్సహించినవాళ్లు తక్కువ. నేనూ కంప్యూటర్ రంగంలో పని చేసిన వాడినే. కాలేజీలో టూరింగ్ మెషీన్ గురించి చదువుకున్న వాడినే. కాని అదే విషయాన్ని తెలుగులో చదువుతూ ఉంటే బాగా అర్థం అయినట్లు అనిపించింది. ఈ అనిపించడం మాతృభాషలో చదవడం వల్ల అనిపించిందో, రచయిత నేర్పు వల్ల అనిపించిందో చెప్పలేను.
అంతే కాదు. రచయిత ప్రయోగాత్మకంగా వాడిన ఎన్నో కొత్త మాటలు, పదబంధాలు ఈ వ్యాసంలో కనిపించేయి. ఇలా నలుగురూ ప్రయత్నం చేస్తేనే కదా భాష పెరిగేది!
కథ నచ్చిందనే బదులు మనసును తాకిందంటాను. ఈ కథ చదివేక చిన్నప్పటి జ్ఞాపకాలు తాజా అయినాయి. ప్రతీ కుటుంబం లోనూ, ఈ “ఇంటి” కథలు మామూలే. మనుషులు, ఊళ్ళు మార మారవచ్చు. కాని, సంఘటనలు పెద్దగా మారవు. పోతే, ప్రతీ పిల్లకాయకూ ఇలాంటి మామ్మ ఉంటే, పసితనం ఎప్పటికీ వసి వాడదు. మళ్ళీ ఎప్పటికి, ఇలాంటి మరో కథ చదువుతామో అనిపిస్తోంది.
మురళీధరరావు గారి సాహిత్య వ్యాసములు అన్నీ నాకు క్లిష్టంగా ఉండి, ఎంతో ఇష్టంగా ఉన్నాయి. ఎంతో కొంత అర్ధమైతే అదే గొప్ప. ఒకసారి, వీరి ముందటి రచనకు ఈ పత్రికలో, గైడ్ తయారు చెయ్యబడినప్పుడు, అసలేం అర్ధం కాక, దారీ తెన్నూ తెలియక, దారుణ హృదయ వేదన కలిగింది. కాని పాఠకుల పల్స్ చదవగలిగే సంపాదకులు, వ్యాసం అసలు ప్రతిని త్వరలో అందించినందున, పరిస్ధితి వెంటనే మెరుగయ్యింది.
ఈ వ్యాసం లోని మొదటి పద్యం ఇంకా చదవాల్సి ఉంది. రెండవ పద్య సవరణ సరైనదిగా, నాకు అనిపించింది. What a beautiful step by step demonstration of restoration of an old poem. I love it.
ఈ పద్యంలో జింకలు, సింహాలు వంటి ప్రాణుల పోలికలు తెస్తూ, కంఠానికి మాత్రం inanimate శంఖం పోలిక ఎందుకు వాడినాడు ఈ తెనాలి రామలింగ కవి? అనుకున్నాను ముందు నేను ఒక క్షణం. పొరపాటు. నిజానికి శంఖం కూడా ప్రాణమున్న జంతువే. It’s a mollusc. It is a sea snail.
A pink sea shell tossing and turning on a grassy sea bed is so very alive. The poet won’t be thinking of dead, discarded shells on sea shore. The poet is using certain physical and behavioral traits, and natural habitats of four different live animals, to aggrandize a woman of intimidating beauty.
లైలా
(ఆఖరు పేరాలో వాక్యంలో వరుస శంఖం, పాము, జింక, సింహము… అని ఉండాలి గదా.)
మాన్యులు, విద్వత్కవివరేణ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
ప్రణామములతో,
వ్యాసాన్ని ఎంతో సూక్ష్మేక్షికతో చదివి మీరు వ్రాసిన ఆదరవాక్యాలకు ధన్యుణ్ణి. మీ బోటి పెద్దల దృఙ్నివేశం దీనిపై ప్రసరించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది.
‘ఒడ్డియాణము’ విషయమైన నా పొరపాటును వ్యాసాన్ని ముద్రించేటపుడు మీకు కృతజ్ఞుడనై సరిచేస్తాను.
ఇక, ‘స్రవించు’ ధాత్వర్థాన్ని మీరు శంఖానికి అన్వయించిన తీరు ఆశ్చర్యకరంగా ఉన్నది. అది మీ వైజ్ఞానికదృష్టికి, లోకపరిశీలనకు నిదర్శకం. అయితే, ఎంత ఆలోచించినా అది ఆపాతరమణీయమే కాని, కవిసమయవిరుద్ధమని నాకు తోచింది.
కావ్యనాయిక గళశోభకు, కంఠస్వరమాధురికి ఎదురుకాలేక శంఖం వారిధిలో తలదాచుకొనవలసిరావటం, ఆ సమయంలో కవులు ప్రదక్షిణ – దక్షిణావర్తాది శబ్దచిత్రాలను ప్రయోగిస్తుండటం ప్రబంధసామాన్యమైన కవిసమయం. దరము అంటే భయము అనే అర్థంకూడా ఉన్నది కనుక వాసవదత్తా గళసౌందర్యలక్ష్మికి సాటిరాలేని దరము (శంఖము) దరమునొంది (భయపడి) వార్ధిపదంలో భ్రమింపవలసివచ్చింది. ఆ భ్రమణాల (తిరుగుళ్ళ) వల్ల దక్షిణావర్త వామావర్తాదులైన భేదాలేర్పడ్డాయని కల్పన తీగసాగుతుంది. పాము పుట్టలో నిక్కటం, జింక పూరిమేయటం, సింహం కొండగుహలలో తలదాచుకోవటం వలెనే ఇది నిత్యానువర్తనీయమైన క్రియావిశేషం. క్షణలేశప్రవర్త్యమానమైన తద్ధర్మం కాదు.
‘స్రవించు’ ధాత్వర్థం వారిధితటంలో ఉన్న శంఖానికే గాని వారిధిపదంలో ఉన్నదానికి అనువర్తింపదు. ఆ స్రావకత్వమైనా దినైక దినద్వయమాత్రం అనువర్తించేదే కాని శాశ్వతికం కాదు. అప్పుడు నాయికా గళాన్ని ఎదిరించినప్పటి ఓటమి వలని స్రవించటం తాత్కాలికం అవుతుంది. అందువల్ల ఆ శబ్దం అన్వయింపదని నాకు తోచింది.
పైగా, ‘స్రవించు’ అన్న నిశ్చయాత్మిక క్రియకు పరాభూతమైన శంఖము వార్ధిలో “దేనిని” స్రవిస్తున్నదో సూచింపగల కర్మార్థసమర్పకశక్తి లేదు. అందువల్ల కూడా అది స్వీకార్యం కాదని, ‘భ్రమించు’ అన్న ప్రసిద్ధార్థఘటనమే ఉచితమని నాకు తోస్తున్నది.
మీరొక్కసారి ఈ దృష్టితో పాఠాన్ని పరికించి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని ప్రార్థన.
మీ అభిమానాదరాలకు, నిరంతరాయితమైన విమర్శప్రోత్సాహానికి ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను.
శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు ఓ రెండు తెనాలి రామలింగ కవి పద్యాల నెంచుకొని చక్కని పరిశీలనా దక్షతతో ముద్రారాక్షసములను సవరించి వాటికి అందమైన అన్వయమును సమకూర్చారు. వారి ప్రయత్నము వలన పాఠకులకు రెండు చక్కని పద్యాలు సుందరతర విశ్లేషణా భాగ్యముతో లభించాయి.
కందర్ప కేతు విలాసములో “మౌనిఁ గెంజడల జొంపము ఫాలపట్టికఁ దీండ్రించు భసితత్రిపుండకంబు” అనే పద్యానికి ఆధారముగా శ్రీ వామన భట్టబాణుని “పాణౌ వేత్రం పవిత్రం భసిత విరచితం పుణ్డ్రకం ఫాలదేశే” అనే సిధ్ధపురుషుని వర్ణన నుదహరించి తమ సవరణలను చక్కగా నిరూపించారు.
ఓడ్డియాణమునకు ఒడ్డాణ మనే అర్ధము ఆంధ్ర భారతి వారి తెలుగు నిఘంటువులో లభ్యమే ! ఆంధ్ర వాచస్పత్యము ,వావిళ్ళవారి నిఘంటువు , ఆంధ్ర శబ్ద రత్నాకరముల నుంచి వారా అర్ధమును గ్రహించారు. శ్రీ ఏల్చూరి వారెంచుకొనిన
అనే పద్య మెంత బాగున్నదో! ఈ పద్యములో కూడా వారు సూచించిన సవరణలు సమంజసమే! కాని నా అభిప్రాయములో శంఖము భ్రమించడము కంటె స్రవించడమే సరి యని పిస్తున్నది. నా చిన్నతనమంతా సముద్ర తీరములో గడిచింది. ప్రతిదినము సముద్ర తీరానికి పోయి గవ్వలు, చందమామలు, శంఖములు సేకరించి యింటికి కొనిపోయేవాడిని. లవణ సంగత మవడముచే అవి మరునాడు కూడా తేమ నూరుతూ జిడ్డు జిడ్డుగా నుండేవి. పలు సారులు మంచి నీటితో కడిగి పొడి చేశాకే వాటికా తేమ పోయేది. వారిధి పదంబుల నుండుట చేతను, లవణ సాంగత్యము కలుగుట చేతను శంఖములు (గాలిలో తేమను గ్రహించి ) స్రవిస్తాయి. అంతెందుకు ? సముద్ర తీరములో నుండే మనుజులు కూడా తక్కువ శ్రమకే అధిక ఘర్మజలాన్ని స్రవిస్తారు. అందుచేతనే మా శ్రీశ్రీ సముద్ర తీరానుభవముతో ఘర్మజలానికి, ధర్మ జలానికి, కర్మజలానికి ఖరీదు గట్టే షరాబు లేడొయ్! అని కవిత చెప్పగలిగారు!
ఏమైనా శ్రీ ఏల్చూరి వారి విశ్లేషణ ఉత్సాహకరముగా, నాకర్షణీయముగా సాగింది.వారికి కృతజ్ఞతాభివందనములు!
కామేశ్వర రావుగారూ: మీరు రుచిచూపించిన మూడు పద్యరత్నాలూ, ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. అన్నమయ్య శతకం గురించి విన్నానే కాని, శ్రద్ధగా చదివి అనుభవిద్దామని ఇప్పటివరకూ అనుకోలేదు. ఇప్పుడు మీరు ప్రేరేపించారు. సంతోషం.
కవిత్వానికి,తాత్వికతకూ దీటయిన పద్యం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ క్రింది పద్యం — చాలా అందమైన పద్యం — అని నా
అభిప్రాయం.
మీరు ఈ వ్యాసం ద్వారా రజని గారు, వారి లలితసంగీత సేవ గురించి చక్కగా తెలియజేసారు అందుకు గాను మీకు ధన్యవాదాలు. ఇక, నేను లలితసంగీత పాఠం అనే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేదాన్ని కాని ఇప్పుడు ఆ అవకాశం నాకు కలగడం లేదు. ఐతె నేను ఆ కార్యక్రమాలను నా పిల్లలకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి 1980,1990ల ఆ కార్యక్రమాలను నేను ఒన్లినె లో పొందగలనా? దయచేసి వాటిని పంపగలరు.
వాడు ఇంక తిరిగి రాకుండా తలుపులేసేశాను – అంటే ఈ భూమ్మీద తలుపులు మూసుకున్నవి అని; నేను కూడా తిరిగి రాకుండా తలుపులు తెరుచుకున్నాయి – అంటే నరకానికో స్వర్గానికో తలుపులు తెర్చుకున్నాయి అని అర్ధం కాబొలు.
మంజుఘోష గురించి arya marati balaji rao గారి అభిప్రాయం:
10/17/2014 2:35 pm
సమవర్తి గారూ,
మీ మంజులమైన హృద్ఘోష బాగున్నది. శ్రీ శ్రీ గురజాడలు వారి వారి దారిలో వారు ప్రయాణించారు. అయితే నేటి కవికపులు చాలమంది వారి అడుగులజాడలో నడుస్తున్నట్లు నటిస్తూ, పద్యాన్ని తిట్టి పోస్తూ, చేస్తున్న రచనలు మీరు చెప్పినట్లు వారి జీవితంలో వాస్తవాలు కాని వాస్తవాలే సుమా!
“లలితస్కంథము..”, “దుర్వారోద్యమ ..” పద్యాల విషయంలో నాది పొరపాటే. నేననుకుంటున్న పద్యాలు వేరు, రాసినవి వేరు (ఎర్రన గారి పద్యం అన్నది “శాతనఖాగ్రఖండిత ..”; అదీ ఇదీ కూడ ద్రౌపది మాటలే కనక ఒకటి అనుకుంటూ మరోటి రాశాను); ఏమైనా పొరపాటే.
ఐతే ఇదంతా రామాయణంలో పిడకల వేట. ప్రస్తుతవ్యాసానికి ముఖ్యాంగం కూడ కాదు. ఒక గ్రంథం తాలూకు అనేక ప్రతుల్ని సంగ్రహించినప్పుడు ఒక్కో ప్రతి గురించిన సమాచారాన్ని కూడ భద్రపరచనందువల్ల ఎంతో నష్టం జరిగిందన్నది వ్యాసం ముఖ్యవిషయం. పుస్తకాల గురించిన పాశ్చాత్య భావాలు ఇందుకు కారణం అని వారి వాదన. ఆ భావాలు తెలుగు సాహిత్య చరిత్రలో బలంగా నాటుకుపోయాయని, అందుకు బ్రౌన్ తదితరులు బాధ్యులని, ఆ భావాలు ఈనాటికీ వదలలేదని కాని మనం వాటిని వదిలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని వారి సిద్ధాంతం. పరిశోధకులెవరికైనా ఇది ఆహ్వానించదగ్గ విషయమేనని నా అభిప్రాయం. పాతవిషయాల్ని కొత్తచూపుతో చూడటం పరిశోధకుల గీటురాయి కదా !
మీరన్న ఆ భావాన్ని లాక్షణికులు ౧) శబ్దాపహారము, ౨) అర్థాపహారము, ౩) ఉభయాపహారము, ౪) ఛాయాపహారము, ౫) ప్రతిచ్ఛాయాకరణము, ౬) రేఖాపహారము, ౭) ప్రతినిర్మాణము, ౮) వర్ణనాగ్రహణము, ౯) సర్వగ్రంథచౌర్యము అని పరిపరివిధాల నిరూపించారు. రాజశేఖరుని ‘కావ్యమీమాంస’లోని ఒక ప్రకరణమంతా ఈ విషయవివేకానికే అంకితమయింది.
ఇది అనువాదవిషయమైనప్పుడు ౧) శబ్దానువాదం, ౨) అర్థానువాదం, ౩) భావానువాదం, ౪) మూలవిధేయం, ౫) మూలాతిక్రమణం అన్న స్వీకార్యాంశాలలో ఏది, ఏ సందర్భంలో, ఏ తీరున గ్రహణీయం అన్నది కవి ప్రతిభాపురస్కృతమై ఉంటుంది. ఆ పట్టువిడుపుల ఒడుపుకు ఉపదేష్టలు కనుకనే కవిత్రయం వారు మనకు ప్రామాణికులయ్యారు. రసప్రతీతి నిమిత్తం కథాసన్నివేశాల వైపుల్య సంక్షేపాదులకు కూడా మనకు వారు చూపినవే దారిదీపాలు. ఇక, ప్రౌఢి అన్నది కవి పాండిత్య(శక్తి)విలసనాన్ని బట్టి, ఔచితీపరిపాటిని బట్టి నిశ్చయింపబడుతున్నది.
ఈ వ్యాసంలో చర్చింపబడిన ప్రధానాంశం ఇది: వేర్వేరు కథలను కలిగిన కుమారసంభవ – కందర్పకేతువిలాస కావ్యాలలో నన్నెచోడ – తెనాలి రామకృష్ణకవులు కవులు సందర్భావశాన ఒకే భావభావనను, రూపధేయాన్ని కలిగిన పద్యకల్పనను చేశారు. తెనాలి రామకృష్ణకవి స్వయంగా భావనోద్బోధం లేక నన్నెచోడుని నుంచి అర్థచౌర్యం చేశాడని మానవల్లి రామకృష్ణకవి గారు తీవ్రంగా విమర్శించారు. రెండు పద్యాల తీరుతెన్నులు ఒకే ఛందంలో పూర్తిగా ఒకే పదపరిపాటితో ఉన్నందువల్ల, రెండింటి చివరి పాదాలూ పూర్తిగా ఒకటే కావటం వల్ల – అవి యాదృచ్ఛికాలు కావని, ఎవరో ఒకరు మూలకర్త, మరొకరు అనుకర్త అని అంగీకరింపక తప్పని పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణుని పద్యానికి మూలశ్లోకం ఒకటున్నదని, రామకృష్ణుని పద్యం ఆ శ్లోకానికి ఏ మార్పూ లేని సులక్షిత యథాతథానువాదమని ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడింది. వివిధచారిత్రికప్రమాణాల వల్ల ఆ శ్లోకం పూర్వుడైన నన్నెచోడునికి తెలిసి ఉండే అవకాశం లేదని కూడా ఊహింపబడింది. ఆ శ్లోకమొకటి ఉన్నదన్న విషయం తెలియని నన్నెచోడుడు వ్రాసిన దోషపూర్ణపద్యం నిర్దుష్టమైన రామకృష్ణుని పద్యానికి మూలం కాకపోగా దానికే ఒక అసమంజసానుకరణమని నిరూపింపబడింది.
కుమారసంభవ కందర్పకేతువిలాసాలు ఒకే కావ్యానికి అనువాదాలు కావు. అయినా, సందర్భస్థగితంగా ఒకరిని మించి ఒకరు వ్రాయదలచిన నేపథ్యం కనబడుతూనే ఉన్నది. తిరుగులేని పద్యసాదృశ్యం అందుకు కారణం. నన్నెచోడుని పద్యంలోని లోపజాతం వల్ల నన్నెచోడుడే అనుకర్త అని, ఆ కారణాన తెనాలి కవి కంటె ఆధునికుడని వ్యాసంలో ప్రతిపాదింపబడింది.
ఈ వ్యాసంలో కవి-కాలాదులకు సంబంధించిన ప్రతికూలసాక్ష్యాలు అన్నిటిని నేను వ్రాయలేదు కాని, కేవలం “అనుకరణ” విషయాన్ని మాత్రమే తీసికొన్నా సుమారు ౨౮౦ – ౩౦౦ నన్నెచోడుని పద్యాలను పదులకొద్దీ తెలుగు కవులు, కన్నడ కవులు (ఆ మాటకు వస్తే సంస్కృత కవులున్నూ) అనుకరించినట్లు కనబడుతున్నది. ఆ అన్ని చోట్ల నన్నెచోడుని పద్యంలో “ఎంతో కొంత లోపం” ఉన్నదని, ఆ అనుసరించిన కవులు దానికి “మెరుగెక్కించా”రని విమర్శకులు అంటున్నారు. ఇంతమంది బహుభాషల మహాకవులు ఆ స్వర్ణనిధి పేరయినా చెప్పకుండా ఆ మెరుగు తరుగున్న ముడిబంగారాన్ని కొల్లగొట్టి నాణ్యమైన నగలుగా మార్చుకోవాలని ఎందుకు ఉద్యమించారో ఊహించటం కష్టం.
ఇక్కడ వస్తువును, పద్యాన్ని మార్చి వ్రాయటానికి ఆస్కారం లేని నేపథ్యమేదీ లేదు. “అర్థచౌర్యం” నిస్సందేహంగా జరిగింది. అదే కవి కాలనిర్ణయానికి పరికరించింది. ఇప్పటి వ్యాసపరిధి ఇంత మాత్రమే.
ఈ పద్యం చివరి చరణంలో గురువులన్నీ చాలా “తేలికైన”వని స్పష్టమే.
“తేలికైన” గురువులు అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు, రామారావుగారు వివరిస్తే బాగుంటుంది. ఆ చివరిపాదంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక అక్షరం ఎన్ని రకాలుగా గురువు కాగలదో అన్ని రకాల ఉదాహరణలూ ఆ పాదంలో చూడవచ్చు! (ద్విత్వ సంయుక్తాక్షరాలను నేను ఒకే కేటగిరీగా చూస్తాను) క్లిష్టాక్షరాలతో కూడిన గురువులను రామారావుగారు “బరువైన” గురువులుగా భావిస్తున్నారేమో (తద్విపులవక్షశ్శైల రక్తౌఘ నిర్ఝరముర్వీపతి… మొదలైన చోట్ల ఉన్నట్టు). కాని ఆ బరువు, గురువులకి కాక అక్షరాలకు మాత్రమే ఆపాదించడం సమంజసం. ఉదాహరణకు “నిర్ఝర” శబ్దంలో బరువైన అక్షరం లఘువైన “ర్ఝ”. గురువులలో తేడాలు తేలిక, బరువు అని కాక – “పొడుగు”, “పొట్టి” అనే విధాలుగా చూడవచ్చు. దీర్ఘాచ్చులతో కూడినా గురువులు “పొడుగు” గురువులు (ఆ దీర్ఘం సంబోధనైతే, అది మరీ పొడుగు!). మిగతావి “పొట్టి” గురువులు. పొడుగు గురువులతో పద్యమంతా నిడితే, అది సాగినట్టుగా ఉంటుంది.
పద్యం చదవడం గురించి గిడుగు సీతాపతిగారి వంటి కొందరు పూర్వం చర్చించారు. ఈ విషయమై చేరాగారి “వచన కవిత్వం – లక్షణ చర్చ:నిర్మాణ మూలాలు, నిర్వచన క్లేశాలు” కూడా చదవవలసిన వ్యాసం. అందులో వారు పద్యానికి మూడు స్థాయిలను చెపుతారు. నిర్వచన స్థాయి, నిర్వహణ స్థాయి, పఠన స్థాయి. ఇవి వృత్తాలలో, జాతులలో, ఉపజాతులలో, మాత్రాఛందస్సులో ఎలా ఉంటాయన్న సంగతి వివరిస్తారు. ఇది నాకు చాలా నచ్చింది.
వృత్తాలలో(ముఖ్యంగా మాలా విక్రీడిత వృత్తాలలో) పద్యం నడక ఎక్కువగా నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి చంపకమాల మొదటి నాలుగు లఘువులూ ఒకే పదం వాడితే ఆ పద్యానికి వేగం వస్తుంది. ఉదా: “కనుగొని కోపవేగమున”, “అటజని గాంచె” (అట, చని రెండు పదాలైనా సంధి కలిసి ఒకే పదస్ఫురణ అక్కడుంది). అదే రెండు లఘువుల తర్వాత పదం విరిగితే, మెల్లని నడక వస్తుంది. ఉదా: “నను భవదీయదాసుని”.
పోతన గారు “లలితస్కంథము ..” అని చంపకమాలని ఎందుకు ఎంచుకున్నారో తెలుస్తుంది.
శ్రీ శ్యామలరావు గారు తెలుగు సాహిత్యంలో మంచిపట్టు వున్నవారిలా కనిపిస్తున్నారు వారి లేఖల బట్టి. ఐతే వారు ఈ సందర్భంలో నారాయణరావు గారికి వృత్తగణాల గురించి తెలియదని ధ్వనించేలా రాయటం కొంచెం తొందరపాటేమో అనిపిస్తున్నది. వారు ఉదహరించిన పద్యం సందర్భం దాన్ని విశ్వనాథ ఎలా చదివేవారో చెప్పటం. వారు అంతకుముందు వరకున్న పదాల్ని విడివిడిగా విరిచి చదువుతూ చివరిపాదాన్ని మాత్రం మొత్తం ఒకటిగా పదాల్ని దగ్గరగా కుదిస్తూ (బహుశా ఒక గుక్కన) చదివేవారని వ్యాసకర్తలు అనటం. వారి మాటల్లోనే “ఆ పద్యం చివరి పాదం కుంచించుకు పోయి అన్నీ లఘువులతో భయం భయంగా ముడుచుకుపోతుంది. నాలుగు పాదాల్లో అచ్చయిన పద్యం చూస్తే ఈ విషయం బోధపడే అవకాశం లేదు.” ఇక్కడ “అన్నీ లఘువులు” శ్యామలరావు గారికి అభ్యంతరకరమైన పదద్వయం.
ఛందస్సులో అన్ని లఘువులు ఒకేరకంగా ఉంటాయి కాని గురువులు మాత్రం అనేకరకాలని విజ్ఞులకి చెప్పక్కర్లేదు. ఈ పద్యం చివరి చరణంలో గురువులన్నీ చాలా “తేలికైన”వని స్పష్టమే. ఇక్కడ వ్యాసకర్తలు లఘువు అనే పదాన్ని చందస్సుకి సంబంధించిన అర్థంలో వాడారని నేననుకోను. సభాసదులు ఎంత ముడుచుకుపోయారో ( ఇవి లఘువులైన గురువులు) అని చెప్పటానికి ఆ పదం వాడారని నా భావన.
—————————
మన పూర్వులు ముఖ్యంగా చంపకమాలా వృత్తాన్ని చాలా ప్రత్యేకశ్రద్ధతో వాడారని నేననుకుంటాను. ఒక evolving, dynamic situation ని చెప్పటానికి చంపకమాల సారళ్యం, గురువుల నిర్మాణంలో వున్న అనేక శైలుల్ని కొల్లగొట్టి (ఈ పదం సరిగా పడినట్టు లేదు, exploit చేసి అనటం నా ఉద్దేశం) వారు చెప్పదల్చుకున్న విషయానికి శిల్పపరిపుష్టతని సమకూర్చారు వారు. ఉదాహరణకి పెద్దన గారి “అటజని కాంచె” పద్యం తీసుకోండి. అదీ చంపకమాలే. ఐతే మెల్లగా మొదలై ప్రవరుడి విభ్రమాశ్చర్యాల్ని, వేగంగా వెళ్తున్న అతనికి దార్లో కనబడుతున్న అద్భుత ప్రకృతి రామణీయకతని చూపించటానికి గురువులు చాలా బరువెక్కుతాయి. తాపీగా సాగే చంపకమాల శార్దూలంలా పరుగులు తీస్తుంది. మనల్ని మనం ప్రవరుడి స్థానంలో ఊహించుకుంటే చాలా వేగంగా వెళ్తున్నట్టు, ఎదురుగా ఎన్నో వృక్షాలు, ఇతర అడ్డంకులు పక్కనుంచి దూసుకుపోతున్నట్టు అనుభూతి కలక్కమానదు. ఇలాటి దృష్టితో చూస్తే తిక్కన గారు భీముడి కోపాన్ని చూపటానికి “ధారుణి రాజ్యసంపద మదంబున..” అంటూ ఉత్పలమాలని, పోతన గారు “లలితస్కంథము ..” అని చంపకమాలని ఎందుకు ఎంచుకున్నారో తెలుస్తుంది. అదే, మొదటినుంచి చివరివరకు పద్యంలో ఒకే రసాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు శార్దూలం, మత్తేభం వాడారు (“కురువృద్ధుల్ ..”, “సింగంబాకటితో ..”, “దుర్వారోద్యమ బాహువిక్రమ ..” (ఇది ఎర్రన గారిది).
పద్యాలతో పెద్దలు చెక్కిన శిల్పాల గురించి అనంతంగా మాట్టాడుకోవచ్చును కాని ప్రస్తుతం కాదు.
“మీ అన్నయ్య.”
ఈ ట్విస్ట్ బాగుంది.
జీవితంలో ఒక కాలాన్ని గుర్తించడానికి “జయప్రద” ని మరో చరిత్రని వాడుకున్నారు. కాలేజి రోజుల్లో అందులోను ఆ రోజుల్లో అవి చరిత్రని సృష్టింనవే కదా! ఒక విధంగా ఆ రోజుల్లో అవి ఆ రోజుల్లో సాధారణమే! కాని ఈ రోజుల్లో అలా లేదు.
Times have changed. So did so called loving more of puppy love. Felt the story to be more cinematic.
కానీ ఆసాంతం చదివించింది. గుమ్మ్మంలో బొమ్మ కథ మలుపు తిప్పింది.
జ్ఞాపకాల వాసన గురించి ananth mallavarapu గారి అభిప్రాయం:
09/25/2014 1:00 pm
మనిషిలో ఉన్న “కామ పిశాచి” దాని తాలూకు చేదు అనుభవాలు/జ్ఞాపకాలు, తమల్ని తాము దహించుకుంటే కాని తప్పించుకోలేరన్నమాట! ఏమిటో ఈ కథ అంతరార్థం! అంతా మాయ!
బ్రౌన్ మీద మేము చేసిన విమర్శని “విసుర్లు” అనుకోకండి. బ్రౌన్ వచ్చినప్పటి సందర్భాలు, పరిస్థితులు వివరించి, భారతదేశాన్ని ఉద్దరించడానికి వచ్చిన తెల్లవాళ్లకుండే దర్పం గురించి చెప్పి, తెలుగు గ్రంథ ప్రపంచం ఎలా వుందో తెలుసుకోవడానికి ఏ ప్రయత్నమూ చెయ్యకుండా అప్పటికి అమలులో వున్న పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలను తెలుగుకి పట్టించడంలో బ్రౌన్ చేసిన ప్రయత్నం వివరించి, అందువల్ల వల్ల తెలుగుకి జరిగిన అపకారం సహేతుకంగా మేము గుర్తించి రాసిన మా వ్యాసం బ్రౌన్ ని వ్యక్తిగతంగా అగౌరవ పరచడానికి రాసింది కాదు. మాకు బ్రౌన్ మీద మీకున్నట్లుగా భక్తి లేదు నిజమే. బ్రౌన్ మా దృష్టిలో ఒక వ్యక్తి కాదు. ఒక వలస ప్రపంచ భావాలకు ప్రతినిధి. ఆ భావాలు బోధపరుచుకోవడానికి మేమా వ్యాసం రాశాం కాని వ్యక్తిగతంగా ఆయన్ని అగౌరవ పరచడానికి కాదు.
మద్దిపాటి కృష్ణారావుగారికి:
మీరంటున్న “ప్రక్షిప్తము” అనే ఊహ బ్రౌన్ అనుసరించిన పాశ్చాత్య పరిష్కరణ విధానం లోంచి వచ్చింది. అంతకు ముందు భారతీయ గ్రంథ పరిష్కర్తలు కూడా “ప్రక్షిప్తము” అనే మాట వాడారు. ఈ రెండు రకాల ప్రక్షిప్తాలకి తాత్త్వికంగా తేడా వుందని మేము వివరంగా చెప్పలేదు. ఆ సంగతి ఈ వ్యాసంలో చర్చించడానికి అవకాశం లేదని మేము భావించాం. దాన్ని గురించి వేరే వ్యాసం రాయాలి. వేమన పద్యాలు, సుమతీ శతకం పద్యాలు, ఇలాంటి పద్యాలని దొరికినవి ఒక చోట పోగుచేసి ప్రకటించడం వల్ల జరిగిన నష్టాన్ని నారాయణరావు సుమతీశతకాన్ని గురించి రాసిన వ్యాసంలో చెప్పి వున్నాడు. అది మీరు చదివారనుకుంటాం. సుమతీ అనే మకుటంతో వున్న పద్యాలన్ని ఒక చొట పోగుచేసి ప్రచురించడం వల్ల కలిగిన నష్టం ఆ వ్యాసంలో నారాయణ రావు వివరించాడు. ఈ విమర్శ వేమన పేరుతో వున్న పద్యాలకి కూడ వర్తిస్తుంది. దొరికిన రాతప్రతులన్నిట్నీ వాటి లేఖక సందర్భాలతో సంబంధం లేకుండా పోగుచేసి పెట్టకూడదని మా ప్రతిపాదన. మీకు ఈ సంగతి ఇంతకన్నా వివరంగా చెప్పక్కరలేదు.
మంగమ్మగారి పుస్తకం తెలుగులో తొలినాళ్లలో అచ్చయిన తెలుగు పుస్తకాల గురించిన సమాచారాన్ని చక్కగా ప్రదర్శిస్తుంది. కానీ పుస్తక నిర్మాణ చరిత్ర వేరు. అది ఎవరూ రాయలేదని మేమన్నది. నిజానికి ఆ ప్రయత్నం పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో రెండు వ్యాసాలు ప్రచురించారు. మిగిలిన వ్యాసాలు ఇంకా రావలసివున్నాయి. నాగరాజు, శ్రీనివాస్ రాసిన రెండవ వ్యాసంలో మంగమ్మగారి పుస్తకాన్ని ప్రస్తావించారు. అయినా మా వ్యాసంలో కూడా ఆ పుస్తకాన్ని ప్రస్తావించి వుండాల్సింది. అది మా ఏమరపాటే కాని ఆ పుస్తకం ఉదహరించడానికి అర్హమైనదికాదు అని మా ఉద్దేశం కాదు.
మా వ్యాసాన్ని చదివి దాని మీద మీ అభిప్రాయాలు చెప్పిన మీ ఇద్దరికీ మా నమస్కారాలు.
మీరెవరైనా నాకు 2014 విజయవాడ బుక్ ఫైర్ లొ అల్బర్త్ కేము (French Algerian philosopher) పుస్తకానికి తెలుగు తర్జుమాను ఆవిష్కరిస్తూ పన్నాల సుబ్రహ్మణ్య భట్ గారి చేసిన ప్రసంగాన్ని పంపగలిగితే బహు కృతజ్ఞుణ్ణి.
‘శార్ఙ్గధరపద్ధతి’ క్రీ.శ. 1363 నాటిది. 14-వ శతాబ్ది ఉత్తరార్ధం అన్నమాట. పీటర్ పీటర్సన్ ప్రకటించిన ప్రతిని సమీక్షిస్తూ శార్ఙ్గధరుని అవతారికలోని మూడవ హమ్మీర భూపతి చారిత్రిక విషయాలను బట్టి ఆ రోజుల్లో బ్యూలర్ గారు ప్రామాణికమైన కాలనిర్ణయం చేయగలిగారు. శార్ఙ్గధరపద్ధతి దేశవ్యాప్తం కావటానికి కనీసం అర్ధశతాబ్ది కాలం పట్టినదనుకొన్నా, 15-వ శతాబ్దికి పూర్వార్ధానికి గాని అది తెలుగువారికి లభించి ఉండదు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు ఆ సంధానగ్రంథం అవతారికలో చెప్పబడిన కృతికర్తను పోషించిన హమ్మీర భూపతి నామధేయులు చరిత్రలో ముగ్గురుండటం వల్ల అతను మొదటి హమ్మీరుడనుకొని కాలనిర్ణయంలో పొరబడ్డారు. వారు “శార్ఙ్గధరపద్ధతి భర్తృహరి నీతిశతకానికి అనుసరణ, విస్తృతీకరణ” అని చెప్పినది కూడా సరికాదు. (ఆ చర్చ ఇప్పుడు సంగతం కాదు.)
మీరిచ్చిన ఆ శార్ఙ్గధరపద్ధతిలోని పాఠమూ, ఆ ప్రశ్నార్థకాలూ ఎప్పటి ముద్రణ లోనివో నాకు తెలియరాలేదు. మీరిచ్చిన ఆ పాఠంలో ఇంకా దోషాలనేకం ఉన్నాయి. నా దగ్గరున్నది 1987 నాటి పునర్ముద్రణ ప్రతి. అందులో శ్లోకం సరిగానే ఉన్నది:
అని. ఇది కళావిలాస కర్తకు మూలం కాదని దీనిని, ఇటువంటివే మఱికొన్నింటిని నేను ఉదాహరింపలేదు. మీరిచ్చిన రెండవ శ్లోకం కూడా సరిగా లేదు. బహుశః ఈ ప్రకారంగా ఉండి ఉంటుంది:
ఇది శ్లోకంలోని “సఖే” అన్న సంబోధనార్థం వల్ల తెలుగు పద్యానికి మూలం కాలేదు. అందులో చెప్పబడిన పదకొండు లక్షణాలకు యథాయథంగా సన్నిహితమైన మూలం ఇప్పటి వరకు నేను చూచిన 15-వ శతాబ్దికి మునుపటి సంధానగ్రంథాలలో లేనందువల్ల, తదనంతరం వెలసిన ఆయుర్వేదగ్రంథాలలో మాత్రమే కానవస్తున్నందువల్ల – పద్యపు కాలనిర్ణయం ఆ విధంగా చేయవలసివచ్చింది.
సాహిత్యచరిత్రలో విద్యార్థిత్వం కలవారికి తుదిమాట అనేది ఉండదు. నూతనాంశాల గవేషణతో వివిదిషువుల వ్యాసంగం అవ్యాహతంగా కొనసాగుతూనే ఉంటుంది. నా వ్యాసంలో ప్రతిపాదితమైనదానికి సుప్రమాతమైన విరుద్ధాంశం ఏది కనబడినా వ్యాసతాత్పర్యాన్ని మార్చుకోవటం నాకెప్పుడూ ఆనందదాయకమే. సత్యనిరూపణార్థమే తప్ప ఈ చర్చలో వినోదంకరణమన్నది నిర్నిమిత్తమని పెద్దలకు మనవి చేస్తున్నాను.
బహుశా దీన్ని మీరు చూచి ఉంటారు. భోజరాజు చారుచర్య కు దగ్గరగా ఉంది, పైగా తెలుగు అనువాదం దీన్ని అనుసరించలేదు కాబట్టి అనవసరం అని విడిచి ఉండవచ్చు. కానీ సార్ఞదేవుని సార్ఞధరపద్ధతి కావ్యానికి పాఠాలు అనేకం ఉన్నట్టు కనబడుతుంది. (ఈ మాటనే సార్ఙధరపద్ధతిని పరిష్కరించిన ఆంగ్లేయులు పీటర్సన్ ఆ పుస్తక పీఠికలో అన్నారు.) మరొక పాఠం క్రింద. (ఇది జాలంలో దేవనాగరిలిపిలో శోధిస్తే దొరికింది. దీని ప్రామాణికత ఎంతో నాకు తెలీదు.)
పైని తాంబూలవర్ణన మీరు ఉటంకించిన వాటితో కాస్త భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇక్కడ సఖే! అని సంబోధన ఉన్నది కాబట్టి తెలుగు అనువాదానికి ఇదే మూలం అయ్యే అవకాశం తోసిపుచ్చలేనిది. ఒకవేళ ఇది సార్ఞధరపద్ధతిలోనిదయితే ఆ కావ్యం ౧౩ వ శతాబ్దానికి చెందినది. (మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు, సంస్కృత వాఞ్మయచరిత్ర, ద్వితీయభాగం, పుట ౩౩౯).
పైగా ఈ కావ్యం భర్తృహరి నీతిశతకానికి అనుసరణ, విస్తృతీకరణ కాబట్టి, ఇందులో అంతకు పూర్వం ఇతర కవులు రచించిన పద్యాలను ఇందులో గ్రహించి ఉండే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ తాంబూల వర్ణనను బట్టి తెలుగు అనువాదాన్ని 15 వ శతాబ్దపు తర్వాత కాలానికి ఈవలగా నిర్ణయించడానికి లేదేమోనని శంకా, ౧౩ వ శతాబ్దానికి పూర్వమే అయి ఉండవచ్చునన్న సందేహమూ కలుగుతున్నాయి.
మాన్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
సప్రశ్రయంగా,
ఔదార్యపూర్ణమైన మీ స్పందనకు నా మనఃపూర్వక ధన్యవాదాలను తెలియజేసికొంటున్నాను. తత్త్వవిషయసంగ్రహం, పాఠపరిష్కారం మీ అనుమోదాన్ని పొంది ఉండటం నాకెంతో సంతోషాన్ని కూర్చింది. మీరన్నట్లు జడభరతుని కథ ఎన్ని పర్యాయాలు చదువుకొన్నా తనివితీరని గంభీరార్థసంభృతం. విష్ణుచిత్తీయంలోని జడభరతోపాఖ్యానం అన్వయాన్ని కూడా చేర్చాలని అనుకొన్నాను కాని, అప్పటికే సుదీర్ఘమైనందువల్ల విరమించుకోవలసి వచ్చింది. మీ ఆశీర్వచస్సుకు కృతజ్ఞుణ్ణి.
ఇన్ని సంవత్సరాల తరవాత నేను ఇప్పుడే చదవటం తటస్తించింది.
కధలో లా శంకర్ లాంటి నాన్నలున్నా జిమ్మి బ్రైన్ లాంటి ఇన్ఫ్లుఎన్స్ దాటి బయటికి రాలేని వాళ్ళు బోలెడుమంది. అది “నిగ్గర్స్” అనుకునే ఆలోచన కావచ్చు లేదా కులం కావ్చ్చ. అసలు కిరణ్ నాన్నే జిమ్మి బ్రైన్ లా వుండచ్చు. ఇది వొక్క NRI లకి మాత్రమే సంబంధించిన కధ అనుకొనక్కర్లేదు ఇండియాలో మనది కాని రాష్ట్రంలో కూడా కావచ్చు. ముంబైలో బిహారి పిల్లాడితో స్నేహం కూడా మాథ్యుతో స్నేహం కావచ్చు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా మాలవాడలు మాదిగ వాడలు వున్నాయి, హొనౌర్ కిల్లింగ్స్ ఇంకా జరుగుతున్నాయి.
కధలో చెప్పకుండా చెప్పిన బోలెడు విషయాలు ఇప్పటికీ అన్వయిస్తాయి. పర్యావరణ కాలుష్యం లాగా ఈ కాలుష్యం ఇంకా పెద్దదవ్వడానికి మన పాత్ర ఎంత?
ఇలాంటి సజీవమైన కధ రాసిన నారాయణ స్వామి గారికి అభినందనలు
నాకూ అలానే ఎలా అర్ధం చేసుకోవాలో తెలీనట్లు… కాని జ్ణాపకాల గురించి రాసిన చాలా వాక్యాలు నాకెప్పుడూ అనిపించే వాటిలా అనిపించి బావున్నట్లు కూడా వుంది. మొత్తానికి మోడర్న్ఆర్ట్ లా నాకు అర్ధం కాకుండా పొయింది.
“ఇంకొకళ్ళను కష్టపెట్టకుండా జాగ్రత్త పడాలి.” నిజం అందరు ఇలానే అనుకుంటుండచ్చు; కాని అందరికీ అన్నిసార్లూ సాధ్యం కాకపొవచ్చు. మన ప్రమేయం లెకుండానే బరువైపొవచ్చు. బరువయ్యాము అని మనకి తెలియకుండా బరువవ్వచ్చు ఆల్జిమర్స్ లాంటివాటితో…
చాలా చక్కగ చెప్పారు. మీ సుజనరంజనిలో “కల్చరు” హాస్య రచనలో లానే చాలా హృద్యంగా చెప్పారు.
సామాజిక పరిణామక్రమం లో, కలసి ఒక చోట ఒక సమూహం లో జీవించటం, ఒకరికొకరు దైనందిన జీవితం లో సహాయపడటం, స్నెహం గా వుండటం, కలసి భోజనం చేయటం, వివాహ సంబంధాలు ఏర్పరుచుకోవటం, ఇవన్నీ ప్రొగ్రెస్సివ్ గా జరిగే విషయాలు. కుటుంబం లో వ్యక్తి లాగ కలసి మెలసి వున్నంత మాత్రాన వివాహ సంబంధాలకు వొప్పుకోవాలని అనుకోవటం ఇతరుల మీద మన అభిప్రాయాలను రుద్దటం మాత్రమే అవుతుంది. అవతలి వారికి అది ఇష్టం లేక పోతే ఆ అయిష్టత ను గౌరవించగలిగితేనే అది respect for human values అవుతుంది. ఏది మనం ప్రగతి అని అనుకుంటామో, దాన్ని ఇతరులు కూడా అంగీకరించాలి అని అనుకోవటం cultural imperialism అవుతుంది. ఇదే కథలో అబ్బాయి అమ్మాయి పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసికొని వుంటే, దానిని పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళ పై హింసాత్మకమైన పద్ధతి లో వారిని ఆపు చేయాలని ప్రయత్నించి వుంటే, వాళ్ళని తప్పు పట్టవచ్చు. పెద్దలను ఎదిరించలేక వేరు మతాలకు చెందిన అమ్మాయి అబ్బాయి లు పెళ్ళి చేసుకొన లేకపోతే, తప్పు వాళ్ళదే కాని పెద్దలది కాదు.
కధ బాగుంది. సూర్యం పాత్ర స్నేహానికి ఇచ్చిన విలువ బాగుంది. కాని., అతని స్టంట్ కి రాజు డబ్బు ఇచ్చిన సంగతి గోపాలానికి తెలిసినప్పుడు, ఆ సంగతి ముందే చెప్పవచ్చుగా…
చూడామణి.
నా ఆక్షేపణలకు వివరణలను చదివాక, నా సందేహం ఇంకా అదే – ఆయా భాగాలలోని కవిత్వం, ఛందస్సు, వ్యాకరణ శాస్త్రాలలోని సూత్రాలకు పూర్తిగా దగ్గరగా వున్నా, నిత్య జీవితంలోని మానవ సహజమైన ఆలోచనలకు, అనుభూతులకు మాత్రం చాలా దూరంగా వున్నదని!
(తొలకరి) ‘ఆమబ్బులకై జనులు వేచి ఉంటారనేది ఇక్కడ పరిపూర్ణంగా అప్రస్తుతం, అనవసరం’– అన్నంత మాత్రాన ఆలోచన అటువైపు వెళ్ళకుండా ఆగుతుందా… ఆగదు! మానవ సహజమైన అనుభూతి ఆలోచనను మొదటగా అటువైపే తీసుకెళుతుంది. ‘ఆమబ్బుల యొక్క నల్లదనం మాత్రమే ఇచ్చట ప్రయోజనకరమైన అంశం’ అని అంటే… ఎంతమంది ‘తొలకరి’ అన్న మాటలో మబ్బుల ‘నల్లదనాన్ని’ మాత్రమే గణనలోకి తీసుకుంటారో నా ఊహకు అందని సంగతి.
ఎక్కడిదాకానో ఎందుకు వివరణలోని ‘అంతవరకు తెల్లగా ఉండే మబ్బులు తొలకరిలో నవ్యమైన నల్లదనాన్ని సంతరించుకొని ఉంటాయి’ అన్న అంతకు ముందు వాక్యంలోనే (బహుశా అసంకల్పితంగా చేయబడి) ‘నవ్యమైన నల్లదనాన్ని సంతరించుకుని’ అన్న ఆహ్లాదకరమయిన వర్ణన వుంది! అందులోని ఆహ్లాదాన్ని పక్కనబెట్టి కేవలం ‘నల్లదనాన్ని’ మాత్రమే తీసుకుని అలాంటి నల్లని మబ్బుల కలతలు అని అర్ధంచేసుకోవాలి పాఠకుడు అనడం… ఏమో? నాకు అర్ధం కాని సంగతి.
అలాగే, ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అనే మాటలలోని భావనలో (అంత) ఉత్కృష్టత్త్వం (నిరూపితమవుతూ ఉంటే) అభిలషణీయమే కాబట్టి, అది అక్కడితో వదిలెయ్యడమే శ్రేష్ఠం!
ఇక అవగాహనాలోపం/రాహిత్యం అన్న మాటలకొస్తే, “నిజమే, ‘మా కొలది జానపదులకు…’ అది సహజమే!” అన్నది నా విన్నపం.
బిల్హణీయమును చదివి, దీనిపై కొన్ని అనుమానములను వెలిబుచ్చిన వెంకటరావుగారికి కృతజ్ఞతలు. కాని ఈ అనుమానములునిరాధారములు, అవగాహనలోపంవల్ల స్ఫురించినవని తోచుచున్నది.
1. ‘కలతల తొలకరులు’ ఉండగలవా? అంటే ఉండవు. ఉండాలని నేననలేదు. కలతలను నల్లనివస్తువులతో పోల్చడం కవిసమయం. ఆమె ముఖము అచ్చంగా పున్నమిచంద్రుడే అనే రూపకంలో ముఖమునకు పున్నమితో గాదు పోలిక, చంద్రునితో. పున్నమిచంద్రునిలోని ‘పున్నమి’ చంద్రునియొక్క పూర్ణత్వప్రకటనమునకే కాని, ముఖము పున్నమిలాగ ఉందని చెప్పడానికి కాదు. అట్లే కలతలతొలకరిమబ్బులు అనే రూపకంలో, కలతలనే తొలివర్షా కాలపుమబ్బులు అని అర్థంకాని , కలతలనే తొలకరియొక్క మబ్బులు అని అర్థంకాదు. ఇక్కడ తొలకరి అనేది మబ్బుల నల్లదనాన్ని విశ్లేషించే పదం. అంతవరకు తెల్లగా ఉండే మబ్బులు తొలకరిలో నవ్యమైన నల్లదనాన్ని సంతరించుకొని ఉంటాయి, అట్లాంటి నల్లని మబ్బులవంటి కలతలు అని దీనికి అర్థం. ఆమబ్బులకై జనులు వేచి ఉంటారనేది ఇక్కడ పరిపూర్ణంగా అప్రస్తుతం, అనవసరం. ఆమబ్బుల యొక్క నల్లదనం మాత్రమే ఇచ్చట ప్రయోజనకరమైన అంశం.
2. ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అనే దానికి అర్థం దినప్రమాణం ఉండవలసిన సుఖం ఒక క్షణం మాత్రమే ఉండాలని కోరుకోవడం కాదు. కష్టాలలో ఉన్నప్పుడు కాలం మెల్లగా గడుస్తున్నట్టు అనుకోవడం, సుఖంగా ఉన్నప్పుడు కాలం కుంచించుకపోయి త్వరగా నడుస్తున్నట్టు అనుకోవడం మనోధర్మం. అందుచేత ‘యుగమే ఒక దివసోపమం’ కావాలి అనేదానికి యథార్థంగా ఒక దినం గడచినను, మనోధర్మంవల్ల ఆకాలం ఒకక్షణమాత్రమే గడచింది అనుకునేంతటి అత్యుత్కటమైన సుఖానుభవం కలగాలని కోరుకోవడం.
‘దివసోపమ మగుచును’ అనే ప్రయోగంలో ‘ఒక రోజుతో సమానమై’ అనే అర్ధంలో- ‘ఉపమ’ అనే పదానికి ‘సమానము’ అన్న అర్ధంలో ప్రయోగం నేను చదివినంతలో కనబడలేదు. ఒకవేళ, ఎక్కడైనా ఒకటిరెండు ప్రయోగాలు ఉన్నప్పటికీ, ఇక్కడి ఈ ప్రయోగంలో వ్యాకరణదోషం కూడా ఉన్నదేమోననీ, ‘దివసోపమ యగుచును’ అని ఉండడం సరైనదేమోననీ నా సందేహం. అదీగాక, ఈ సందర్భంలో ‘దివసము’ అనే మాట కూడా అంత ఉచితమైనదిగా తోచదు.
పై అనుమానాలు కూడ స్పష్టమైన అవగాహనరాహిత్యం వల్ల వెలిబుచ్చినవే.
అ) ‘స్యు రుత్తరపదేత్వమీ, నిభ సంకాశ నీకాశ ప్రతీకా శోపమాదయః’ – అని అమరకోశము. సమాసోత్తరపదములైనపుడు, నిభ, సంకాశ, నీకాశ, ప్రతీకాశ, ఉపమా శబ్దములు సదృశార్థము లగును అని దీని కర్థము. ఉపమ, ఉపమము అను రెండు రూపములును ఉత్తరపదములైనపుడు సదృశార్థము లని సూర్యరాయాంధ్రనిఘంటువు స్పష్టీకరించుచున్నది. ఉపమేయముయొక్క లింగమునుబట్టి ఈరెంటిలో నొకరూపము ఉపాదేయ మగును. రాజు ప్రతాపమున సూర్యోపముడు. రాణి అందమున రంభోపమ. రాజుకీర్తి చంద్రికోపమము – అని వరుసగా పుం, స్త్రీ,నపుంసకలింగములయందలి ఉపమేయములకు వర్తించు ప్రయోగములు. అందుచేత ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అనేది యుగము నపుంసకలింగ మగుటవల్ల నూటికి నూరుపాళ్లు సాధువే.
ఆ) ‘ఘస్రో దినాహనీవాతు క్లీబే దివస వాసరౌ’ అని అమరకోశము. ఘస్రము, దినము, అహస్సు /అహము, దివసము, వాసరము అనునవి పగటికి పేళ్లు అని దీని కర్థము. ‘దీవ్యన్తి జనా అస్మిన్నితి దివసః, దివు క్రీడాదౌ’ – ‘దీనియందు జనులు ప్రకాశింతురు’ – అని దివసశబ్దానికి వ్యుత్పత్తి. ఈశబ్దాన్ని సరియైనది కాదనుటకు గల ఆధారము తెలియుట లేదు.
ఇన్ని ఇబ్బందులున్న ఈ ప్రయోగాన్ని పక్కనబెట్టి, ‘యుగమే యొక దినసమాన మగుచును’ అని సరళంగా వ్రాసుకోవడంలో ఉన్న సౌకర్యాన్ని ఎందుకు వదులుకోవడం అన్న సందేహం కూడా కలుగక మానదు!
ఆగీతం పాదానికి నాల్గేసి చతుర్మాత్రాగణాలతో, మూడవపాదారంభంలో యతిని గాని, ప్రాసయతినిగాని పాటిస్తూ వ్రాసినది. ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అను దానిలో పాదాదిలోని ‘యు’ తో దివస+ఉపమ అనేపదంలోని ‘ఉ’తో యతిమైత్రి. అందుచేత దీనిని ‘యుగమే యొక దినసమాన మగుచును’ అని మారిస్తే, యతిభంగమూ, లయభంగమూ అన్నీ కలుగుతాయి. ‘సమాన’ మనునది చతుర్మాత్రాగణమైనను, ఇది ఎత్తుగణం (జగణం) కావడంవల్ల గీతంలోని లయ నష్టమౌతుంది. అందుచేత ఇచట ఈగణం పరిహార్యము.
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మన చరిత్రలో పేర్లూ అద్భుతగాథలూ పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి యిలాంటి విషయాలపై కచ్చితమైన నిర్ణయాలు చేయబూనడం సాధ్యం కాదు. అసలు వేములవాడ భీమకవి చరిత్ర మనకి కథలుగా చాటువులుగా మత్రమే తెలుసు! ఇక మైలమ, చిక్క భీముల గురించి. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మైలమ, చిక్క, ఏరువ భీములు ముగ్గురూ ఒక్కరే అని అభిప్రాయపడ్డారు (మీగడతరకలు పుస్తకంలో వేములవాడ భీమకవి గురించిన వ్యాసంలో). అలానే “తెలుగుచాటువు” పుస్తకంలో బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు కూడా అదే అన్నారు. వారే మైలమభీముడు పూసపాటివంశీకుడని “గజపతిరాజుల సాహిత్యపోషణ” అన్న పుస్తకం (బులుసు వేంకటరమణయ్యగారిది) ఆధారంగా చెప్పారు. ఆ పుస్తకాన్ని నేను చూడలేదు.
మీరు ప్రస్తావించిన “పూసపాటి అలక్ నారాయణ గజపతి శతజయంతి ఉత్సవ సంచిక”లోని పూసపాటివారి వంశవృక్షంలో కూడా మైలమభీముడు కనిపిస్తున్నాడు (ఇతను 1330 ప్రాంతంలో వానిగా అందులో ఉంది). “చిక్కభీముడు” పరిచ్ఛేదరాజ వంశానికి చెందిన రాజని (13వ శతాబ్దం) “The History of Andhra Country” (యశోదాదేవిగారిది) అనే పుస్తకంలో ఉంది. అందులోనే ఈ పరిచ్ఛేదవంశానికి చెందిన అమలరాజు “పూసపాటివారివంశావళి”లో కనిపిస్తున్నారని కూడా చెప్పారు. పూసపాటివారి వంశవృక్షంలో మరే భీముడూ నాకు కనిపించలేదు.
చిక్కభీముడు, ఏరువభీముడు ఒకరు అయ్యే అవకాశం లేదని ఒక journal (ఏదో ఇప్పుడు గుర్తుకురావడం లేదు) చదివాను. అయితే చిక్కభీముడు, మైలమభీముడు ఒకరేనా కాదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కాని చిక్కభీముని తల్లి మైలమ అని ఎక్కడా కనిపించడం లేదు. యశోదాదేవిగారు చెప్పినదాని బట్టి చూస్తే, చిక్కభీముడూ భీమకవీ ఒకే కాలానికి చెందినవారయ్యే అవకాశం ఉంది.
ఇంతకన్నా యీ విషయమై నాకు తెలియదు. ఇంకా తెలిసినవారెవరైనా చెప్తారేమోనని నేనూ ఎదురుచూస్తాను.
శ్రీమోహనగారికి, మీరు ఛందస్సునుగఱించి చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. కాని వృత్తలక్షణాలను లక్ష్యంగా నుంచుకొని కవి పద్యాలు వ్రాస్తాడని సాధారణమైన అపోహ ఉన్నది. కాని కవికి లయ ముఖ్యం. భావోద్వేగం కల్గినప్పుడు కవినోట ఏదో ఒక లయతో అది బహిర్గతమౌతుంది. అందుచేత లక్షణకర్తలు పనిగా కూర్చొని 26 ఛందాలలో వివిధవృత్తలక్షణాలకు తగిన వృత్తకల్పన చేసేదొక విధం. దీనితో నిమిత్తం లేకుండా భావావేశం దానికదే ఒక అపూర్వవృత్తమును సృష్టించుట రెండవరకం. ఈ రెండవవిధానంపై ఛందోవిశ్లేషణకర్తలు ఎక్కువగా వ్రాసినట్లుగా లేదు. ఈరెండవపద్ధతిద్వారా నేను నాకావ్యాలలో అనేక నూతనవృత్తములను సృష్టించినాను.వీని విషయంలో నేను ముందుగా పద్యాన్ని వ్రాసి తరువాత లక్షణాన్ని చూచుకొన్నాను. మీరిప్పుడు శా.వి. గుఱించి మాట్లాడుతున్నారు గనుక, దానికి అనురూపమైన గణాలుండేవి నాసృష్టిలోనివి ఈక్రింది రెండు వృత్తాలు.
ఇది డయానావృత్తము. పద్యంవ్రాసిన తర్వాత లక్షణం చూచుకుంటే ఇది ఒక సగణం లోపించిన శా.వి.గా స్పష్టమైంది. దీనికి 4వగణారంభం (10వ అక్షరంయతి)
కోశాగారము గుల్లవాఱినను,ఘోరాపద ల్గూడినన్,
రాశీభూతము లౌచు యోద్ధలపురంబుల్ ధరం గూలినన్,
దేశం బెల్లను రక్తవాహినులఁ దేలించి యుద్ధంబునన్
నాశం బే నొనరింతు సోమనను నవ్యోరుదర్పంబునన్.
ఇది నయాగరావృత్తము. పద్యం వ్రాసిన తర్వాత లక్షణం చూచుకుంటే ఇది ఒక్క గురువు తక్కువైన శా.వి.గా భాసించింది. దీనికి12వ అక్షరం యతి. ఈరెండు వృత్తాలు మొట్టమెదట నాహనుమప్పనాయకకావ్యంలో వ్రాసినాను.ఆతరువాత ఇతరకావ్యాల్లో నయాగరావృత్తాన్ని తరచుగా వ్రాసినాను. ఈదీర్ఘమైన అభిప్రాయాన్ని వ్రాసింది స్వోత్కర్షకొఱకు గాదు, ఈరెండవ నూతనవృత్తనిర్మాణపద్ధతిని విశ్లేషించుటకొఱకే.
నమస్తే లక్ష్మన్న గారు. నా పేరు రాధిక. నేను మీ సంచికకు కొత్త పాఠకురాలిని, నాకు ఇందులో ప్రచురించిన ప్రతి ఒక్కటి బాగ మనసుకి హత్తుకున్నవి, ఐతె నేను ఒక వత్సర కాలంగ పిడేల్ నేర్చుకొనుచున్నాను. కాని నాకు దొంగ రాముడు (1955)నుంచి చిగురాకులలొ చిలకమ్మ పాటకు స్వరం మరియు సాహిత్యం కావాలి. దయచేసి పొందుపరచగలరని ప్రార్ధన మరియు విన్నపములు.
శ్రీకామేశ్వరరావుగార్కి వారి అభిప్రాయప్రకటనకై కృతజ్ఞుడను.
1.నాటికాంతంలో సూచించినట్లుగా నేను 3 పద్యాలను చిత్రకవి సింగరాచార్యులవారి బిల్హణీయకావ్యమునుండి ఇందులో వాడుకొన్నాను. అందులో ‘హాకవిరాజశిఖామణి’ అన్న పద్యాన్ని దోషయుక్తంగా ఇందులో నా అనవధానతవల్ల వ్రాసినాను. మూలంలో ‘హాకవిరాజరాజమణి! హానవ మోహన! హా మనోహరా!’ అని చక్కగానే ఉన్నది కాని, నా అనవధానతవల్ల ఈగణభంగదోషం సంక్రమించినది. 2.వ్యాకరణం మాట ఎట్లున్నను ‘పాండిత్యం ప్రదర్శించుకొంది’ అనేవాక్యం నీచపాత్రలు మాట్లాడుకొనే సందర్భంలోనిది. ఇది పాత్రకు తగినట్లే ఉన్నది. ఇది ‘వాడు ధనము నార్జించుకొన్నాడు’ అను వాక్యంవంటి ప్రయోగం.
ఈ వ్యాస రచయితలకు గాని, జయప్రభగారికి గానీ యోగ్యతాపత్రాలను ఇవ్వడానికి అర్హతలు, తాహతు నాకు లేవు. నేను చలం కాదు. కాని అచలముగా కూడ ఉండడము సాధ్యము కాదు. నా స్పందన క్రింది వాక్యముపైన మాత్రమే.
పట్టుమని ఒక తెలుగు పద్యానికి – పూర్వ ఛందస్సులో వున్నా కొత్త ఛందస్సులో వున్నా – అర్థం వివరించగలిగే సత్తాలేని చచ్చు తెలుగు పి. ఎచ్. డి. లు ఎందరో తెలుసు నాకు. జయప్రభ అలాటి కోవలోదో కాదో నాకు తెలీదు
అదే విధముగా క్రింది వాక్యముపైన కూడ నేను స్పందించినాను –
కానీ పరుచూరి శ్రీనివాస్ గారి సంపత్తి తెలుగు సాహిత్యంలోనూ తెలుగు విమర్శలోనూ ఏపాటిదో తెలియడం కష్టం.
పి.ఎచ్‌డి. డిగ్రీపైన నా ఉద్దేశములను వెల్లడించినాను; తఃతః గారు కూడ దీనిపైన వ్రాసియున్నారు.
ఇది ఈ వ్యాసముపైన అభిప్రాయము కాదు. కాని వ్యాసమును తానా పత్రికలో ప్రకటించిన దానిపైన నా అభిప్రాయము. తానాలాటి సంస్థలు, వారి వార్షిక సమావేశాలలో ప్రత్యేక సంచికలను ప్రచురిస్తారు. తరువాత దానిని ఈమాట మున్నగు పత్రికలలో ప్రచురిస్తారు. ఇది బహుశా తానాకు ఆ పత్రికలకు మధ్యనున్న ఒప్పందము అనుకొంటాను. తానా పత్రిక జ్ఞాపికలను సభ్యులకు, సమావేశమునకు ఆహ్వానింపబడిన వారికి మాత్రమే అందిస్తారు. వారు మాత్రమే ఈ పత్రికలను చదువుటకు వీలవుతుంది. ఈమాటలాటి పత్రికలలో తరువాత అవి ప్రచురించబడినప్పుడు, అందరికి వీటిని చదువుటకు వీలవుతుంది. అందువలన పత్రికలలోని ప్రచురణలకు ఇంకను ఎక్కువ వాచకత్వము లభిస్తుంది. అది రచయితలకు మంచిదే. కాని ఈ విషయమును బహుశా ప్రచురణలను అంగీకరించే ముందే రచయితలకు తెలిపితే బాగుంటుందేమో? అప్పుడు ఇట్టి పరిస్థితులు రావు.
వాసుదేవరావు గారూ:
మీ ఆక్షేపణ అర్థం అయిందనే అనుకుని మీరు “కోట్” చేసిన వాక్యంలో “గణితం” అనడానికి బదులు “శాస్త్రం” అనే మాట ప్రతిక్షేపిస్తున్నాను. నేను “గణితం” అనే మాటని గణిత శాస్తాన్ని కాని గణిత శాస్త్రవేత్తలని కాని ఎగతాళి చేసే ఉద్దేశంతో రాయలేదు. ఏ రంగంలో అయినా సరే మనం వాడే సమీకరణాలు, భిన్నాలు, నిష్పత్తులు వగైరా భావాలని వ్యక్తం చెయ్యడానికి మనం అంతా సామాన్యంగా వాడే “లెక్కలు” అనే భావనే. నేను వాడిన “మోసం,” “కిట్టింపు” వగైరా మాటలు దురుద్దేశంతో వాడినవి కావు. రిచ్ఛర్డ్ ఫైన్‌మన్ వాడిన “షెల్ గేమ్” కి నేను చేసిన తెలుగు సేత. “రెగ్యులరైజేషన్” వంటి మాటల వెనక ఉన్న భావాన్ని తేలిక తెలుగులో చెప్పేటప్పుడు అందరిని మెప్పించడం సాధ్యం కాదు. – వేమూరి.
“లెక్కలలో కాని, భౌతిక శాస్త్రంలో కాని ఎంత పెద్ద సంఖ్యనయినా భరించగలం కాని ‘అనంతం’ వస్తే భరించలేము. అప్పుడు ఆ లెక్క ‘చేసేవాడి ముఖం మీద పేలిపోయింది’ అంటాం.”
“ఇటువంటి పరిస్థితి నుండి తప్పించుకోటానికి గణితంలో రకరకాల చిటకాలు వాడతారు. మౌలికంగా ఈ చిటకాలు అన్నీ చేసే పని ఒకటే, కళ్లు కప్పి మోసం చెయ్యటం! కాని మోసం అన్నా, కనికట్టు అన్నా మర్యాదగా ఉండదని వాటికి రకరకాల పేర్లు పెట్టి సమర్ధించుకుంటారు. ఈ పేర్లలో తరచుగా వినబడేవి నార్మలైజేషన్, రెగ్యులరైజేషన్ అనే మాటలు.”
శ్రీ వేమూరి: మాథమాటికల్ ఫిజిక్స్ కీ గణిత శాస్త్రానికీ (Pure Mathematics) మౌలికంగా పొంతన లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే – తార్కికమైన నిజానిజాలతో తప్ప భౌతికమైన నిజానిజాలతో గణిత శాస్త్రం ప్రమేయం పెట్టుకోదన్న విషయం మీకు తెలియనిది కాదు. పైగా,’లెక్కల’ ఇన్ఫినిటికీ ‘ఫిజిక్స్’ ఇన్ఫినిటికీ భేదాలు ఉన్నాయనిపింపజేసే సందర్భాలు ఉన్నాయి. ఒక మంచి వ్యాసంలో ఈ పైవాక్యాలలో ‘లెక్కలు’, ‘గణితము’ అన్న మాటలు సామాన్యపాఠకులలో ‘లెక్కల’ మీద ఎటువంటి అభిప్రాయాలను కలగచేయటానికి అవకాశం ఉన్నదో అన్న విషయాన్ని గురించి మీరు మరొక సారి ఆలోచిస్తారనుకుంటాను.
మిగిలిన విషయాలు నాకు తెలియవు కాని జయప్రభగారికి కొత్త ఛందస్సులో మాత్రమే కాదు, ప్రాఛీన ఛందస్సులో కూడ ఆసక్తి, ప్రావీణ్యము, గరిమ ఉన్నాయి. ఆమె భావకవిత్వములో స్త్రీపైన మాత్రమే కాదు, అన్నమాచార్యుల రచనలపైన కూడ ప్రచురించియున్నారు. పద్యాలను జ్ఞాపకము చేసికొని అనర్గళముగా గంగాప్రవాహములా వల్లించగలిగే ధారణాశక్తి గలవారు. నా ఉద్దేశములో PhD అనేది ఒక శిక్షణ మాత్రమే. ఆ పట్టా విద్యకు అంతము కాదు, ఒక పునాది మాత్రమే. ఆ పట్టాను పుచ్చుకొన్న తరువాత ఏమి చేస్తారన్నదే ముఖ్యమైన విషయము. ఆ PhD పట్టా లేకుండా కూడ పరిశోధనలను ఇంతకు ముందు చేసారు, ఇప్పుడు చేస్తున్నారు, ఇకపైన కూడ చేస్తారు. PhD degree లేక ఎన్నో విద్యార్థులకు PhD పట్టంకోసం guide చేసిన వారు కూడ ఉన్నారు (ఉదా. రామన్, బోస్). విధేయుడు – మోహన
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం ఒక బ్లాగులో వెలుబుచ్చిన అభిప్రాయం ప్రకారం
జ్యోతిష్యం అనేది…..
ఎవరు చెప్పినదీ ఎవరూ నమ్మాల్సిన పని లేదు. మీరు జ్యోతిష్యాన్ని ఖండించే ముందు దాన్ని నేర్చుకుని ఫలితాలు సరిచూచుకుని ఖండించండి. జ్యోతిష్కులమని చెప్పుకునేవాళ్ళ వ్యక్తిగత లోపాలకు ఒక శాస్త్రాన్ని నిందించకండి. అలా నిందించాల్సి వస్తే ప్రపంచవ్యాప్తంగా అల్లోపతీ చికిత్స తీసుకుని మఱీ చనిపోతున్న కోట్లాదిమంది శవాల సాక్షిగా అల్లోపతీ వైద్యవిధానాన్ని కూడా నిందించాల్సి వస్తుంది. వాతావరణ శాస్త్రజ్ఞుల weather forecasts ని కూడా నిందించాల్సి వస్తుంది. ఏ శాస్త్రంలో నైనా సిద్ధాంతభాగం ఉన్నంత ఖచ్చితంగా ఫలితభాగం ఉండదు.
ఇహపోతే, రాహుకేతువుల సంగతి. భూమి orbit చంద్రుడి orbit తో సమద్విఖండన చేసే బిందువుల మధ్య కుడియెడమల దూరాలకు మన పూర్వీకులు రాహుకేతువులని పేరుపెట్టారు. వాటి వల్ల భవిష్యత్ ఫలితాల్లో తేడా వస్తున్నట్లు గ్రహించడం వల్ల వాటిని కూడా గ్రహాలన్నారు. గ్రహాలంటే planets అనుకోకండి. జ్యోతిశ్శాస్త్రం చెప్పే గ్రహాలు planets గుఱించి మాత్రమే కాదు, జాతకం మీద ప్రభావం కలిగించే యావత్తు జ్యోతిస్సుల (Luminary bodies) గుఱించి. మీరు జ్యోతిశ్శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తే ఇలాంటివన్నీ బోధపడతాయి. ఇలా కూర్చుంటే ఏమీ తెలియదు.
ప్రస్తుతం scientific పేరుతో చెలామణీ అవుతున్నది ఒక గూభ్యాలోచన విధానం. ఈ విధానంలో ఏ పదార్థానికా పదార్థం, ఏ వస్తువుకా వస్తువు ఇతర పదార్థాలతోను వస్తువులతోను సంబంధం లేనిదిగా భావించబడుతూ అపార్థం చేసుకోబడుతూ ఉంటుంది. వాస్తవానికి ప్రకృతి ఆ విధంగా నిర్మించబడలేదు. ప్రకృతిలో ప్రతిదానికీ ఇంకో విషయంతో గొలుసుకట్టు సంబంధాలున్నాయి. మనకు తెలియనంత కాలం ఏమీ లేదనుకుంటాము. ఇప్పుడు scientific అని భావించబడుతున్న అనేక విషయాల గుఱించి గతంలో అలాగే అనుకున్నాం. అయితే జ్యోతిష్యం మన పూర్వులు మనకంటే ముందే ఆలోచించినది కావడం వల్ల దాని క్లెయిములు, అన్నీ తెలుసుననుకుంటున్న మన అహంకారానికి గొడ్డలిపెట్టులా ఉన్నాయి. ఒకటి ఒప్పుకుంటే అన్నీ ఒప్పుకోవాల్సి వస్తుందనే భయంతో అన్నిటినీ ఊచమట్టుగా త్రోసిపుచ్చడానికి ఆధునిక మానవుడు అలవాటు పడ్డాడు. కాని నిజం నిప్పులాంటిది. ఒకప్పుడు మానవ నాగరికతలో జ్యోతిష్యం లేదు. తరువాత కొన్ని వందల సంవత్సరాల పరిశోధనా పరిశీలనా ఫలితంగా ఆ శాస్త్రం ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు “కాదు” అంటే తాత్కాలికంగా విజయం మీదే. కాని మానవ కుతూహలం “కాదు, కూడదు”ల దగ్గర ఆగిపోదు. కుతూహలాన్ని ఎవరూ నిషేధించలేరు. అది మళ్ళీ ఆవిర్భవిస్తుంది. మీరు ఆకాశాని కెత్తుతున్న so-called scientific people నుంచే పునర్జన్మ ఎత్తుతుంది.
“నాకు తెలియదు” అని ఒప్పుకోవడం ఒకప్పటి మర్యాద. “నేను నమ్మను” అనడం ఈనాటి ఫ్యాషన్. మన:స్థితి మాత్రం ఒకటే.
“అది వాడి రక్తంలోనే ఉందిరా !” అని వెనకటి తరం వాళ్ళు అంటే, మొన్నమొన్నటి దాకా నవ్వారు-రక్తంలోనే అన్నీ ఉంటాయా ? అంటూ ! ఇప్పుడు ప్రతిదానికీ జీన్సుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఎవరు గెలిచారు ?
అందుచేత, మన పూర్వీకుల్ని వఠ్ఠి వెధవాయిలుగా శుంఠలుగా త్రోసిపుచ్చకండి. మీరు అనుకుంటున్నట్లు కాదు. మీకు సంస్కృతం రాకపోవడం, ప్రాచీన గ్రంథాలు చదవకపోవడం-ఇలాంటి పొఱపాటు అభిప్రాయాలకు కారణం. ప్రతి వృద్ధుడూ ఒకప్పుడు మనలాంటి యువకుడేనని అర్థం చేసుకోండి.
రాధగారు, కధావస్తువు బాగుంది. కాని,పద్మగారు చెప్పినట్టుగా, పాత్రలు అటు, ఇటు, అయి ఉంటే, కధ ఎలా మలిచేవారు?
మరొక మాట, అంత కాలంగా మెయిల్స్ పంపుకుంటున్నప్పుడు, మాటవరసకైనా, భార్యతో చెప్పవచ్చు కదా? ఇద్దరు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు కదా? ఆ మాత్రం సాహిత్యచర్చ భార్యా భర్తల మధ్య ఉండదా? నేను ఇలా రాసినందుకు తప్పుగా అనుకోవద్దు. దేనికీ ఒక్కరిని అనవద్దు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.
బ్రౌన్ గురించి మేం రాసిన వ్యాసం మీద ఈమధ్య ఆఖరుగా వొచ్చిన ఉత్తరాలు చూస్తే –- అందులో ముఖ్యంగా ఏల్చూరి మురళీధరరావు గారి ఉత్తరం చూస్తే — వివరాలు పక్కన పెట్టి ఒక ముఖ్యమైన విషయం మరొక సారి ప్రస్తావించవలసి వొస్తోంది. మురళీధరరావు గారి ఉత్తరంలో ముఖ్యమైన వాక్యం ఇది:
“బ్రౌన్ పరిష్కరణ సంవిధానం మీరే ఉదాహరించిన ఆంగ్లవాక్యాలను బట్టి, అది సార్థకమై, అంతర్జాతీయప్రమాణాలకు సైతం అనుగుణంగా ఉన్నట్లే నాకనిపించింది. ప్రతులను సేకరించటం, పాఠాంతరాలను గుర్తించటం, కవికి అత్యంతసమీపకాలంలో వెలసిన పాఠాన్ని గుర్తించటం, భావప్రతీతికి దోహదంచేసే మేలైన పాఠాన్ని స్వీకరించటం అన్న ఆయన ‘విధానం’ మీరన్నట్లు ఈనాటికీ మనము అనుసరిస్తున్నదే. అందులో లోపాలుంటే, అవి పరిష్కర్త వైదుష్యలుప్తికి, పరిణతప్రజ్ఞ లేమికి, కావ్యానుభవరాహిత్యానికి మాత్రమే నిదర్శనలు. విధానంలో లోపాలు కావు.”
మాకూ మురళీధరరావుగారికీ వున్న అభిప్రాయ భేదం ఈ వాక్యంలో “విధానంలో లోపాలు కావు” అన్న ఆలోచన దగ్గిరే వుంది. గ్రంథ పరిష్కరణలో అంతర్జాతీయ విధానాలు వుండవు. ఫ్రతి సాహిత్య సంప్రదాయమూ, సాహిత్య ప్రపంచమూ వేరువేరుగా వుంటాయి. ఆ సాహిత్య ప్రపంచానికి అనువైన గ్రంథ పరిష్కరణవిధానాలు ఆ సాహిత్యం అనుసరిస్తుంది. కాని, తెలుగు సాహిత్య ప్రపంచ స్వరూపం ఏమిటి, అది తనకు తెలిసిన లాటిన్, గ్రీక్ సాహిత్య ప్రపంచం కన్న ఎలా భిన్నమైనది అని ఒక ప్రశ్న వేసుకుని తెలుగు సాహిత్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే ఆలోచన కాని, అవసరం కాని బ్రౌన్ కి లేకపోయాయని మేం మా వ్యాసంలో చెప్పాం. బ్రౌన్ ఏర్పరిచిన పరిష్కరణ విధానాలనే తెలుగు పండితులందరూ ఒప్పేసుకుని పనిచేస్తున్నారని మురళీధరరావుగారూ అంటున్నారు. ఈ విషయం అందరికీ గుర్తింపుకి వొచ్చి, అయితే మన సాహిత్య ప్రపంచం ఎటువంటిది, పాశ్చాత్య సాహిత్య ప్రపంచం కన్న ఏ రకంగా భిన్నమయినది అనే ఆలోచన వస్తేనే, బ్రౌన్ మార్గం వల్ల మనం చాలా నష్టపోయామేమో అనే ఒక స్ఫురణ కలుగుతుంది. అప్పుడు చెయ్యవలసిన పని చాలా వుందని ఒక ఉహకి జాగా దొరుకుతుంది. అప్పుడు మనం వేసుకోవలసిన కొత్త ప్రశ్నలు ఏమిటో వెతుక్కుంటాం.
మిగిలిన ఇద్దరి ఉత్తరాలలోని దూకుడు మాకు చాలా ముచ్చట కలిగించింది. ఎంత తక్కువ తెలిస్తే అంత ఉత్సాహంగా రాస్తారని మా అనుభవం. అయితే ఆ సంగతి ఇక్కడ నిజం కాకపోవచ్చు. అందుకని ఆ విషయం పాఠకుల అభిరుచికి వదిలేస్తున్నాం.
“ఇది ఇలా వుండగా బ్రౌన్ తరవాత పుస్తకాలు అచ్చు వేసిన వాళ్లందరూ — వావిళ్ల వారు కావచ్చు, వేదం వారు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు — బ్రౌన్ పరిష్కరించిన ప్రతిని వాడుకోలేదని మనకి స్పష్టంగా తెలుసు.”
నారాయణ రావుగారి వ్యాసం లొ పై వాక్యాల లొని ‘మనకి (స్పష్టంగా) తెలుసు’ గురించి ఒక విషయం మీకు చెప్పాలనిపించి ఈ అభిప్రాయం రాస్తున్నాను.
“ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు.
వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”
పైమాటలు ఊర్మిళాదేవి నిద్ర:ఒక ఆలొచన అన్న పేరుతొ జనవరి 2012 ఈమాటలొ వెల్చేరువారు రాసిన వ్యాసం లోవి. వీటిలొ కూడా వారి అలవాటేమో అనిపించే ‘మనకి తెలుసు’ను చూడవచ్చు. ఆ సందర్భంలో ఈ ‘hand waiving’ని నేను తప్పుపట్టటం ‘ఈ మనం లో నేను లేన’ని చెప్పటమూ గూడా జరిగింది.
మాన్యులు శ్రీ శ్రీనివాస్ గారికి, నారాయణరావుగారికి, నమస్కారములతో,
సౌమ్య వి.బి. గారు మిమ్మల్ని తెలుగు కావ్యాల పరిష్కరణవిధానం గుఱించి అడిగిన ప్రశ్నకు నా వంటి విద్యార్థులకు ఉపకరించే సూత్రాలను కొన్నైనా నిర్దేశింపగలరని ఎదురుచూశాను. అందుకింకా వ్యవధి ఉంటుందని తెలిసి కొంత నిరాశ కలిగింది. మీ బ్రౌన్ దర్శనమీమాంసను అధికరించిన మాటలను ఇప్పటికి వాయిదా వేసి, కొన్ని లఘుప్రస్తావితాల గుఱించిన నా సందేహాలను మాత్రమే విన్నవింపదలిచాను.
(1)
ఇది ఇలా వుండగా బ్రౌన్ తరవాత పుస్తకాలు అచ్చు వేసిన వాళ్లందరూ — వావిళ్ల వారు కావచ్చు, వేదం వారు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు — బ్రౌన్ పరిష్కరించిన ప్రతిని వాడుకోలేదని మనకి స్పష్టంగా తెలుసు. అయితే బ్రౌన్ అనుసరించిన గ్రంథ పరిష్కరణ పద్ధతుల్ని వీళ్ళు దాదాపుగా అనుసరించారా? అయినా ఆయన పేరెందుకు చెప్పలేదు?
ఈ మాటలను మీరు ఏ ఆధారంతో వ్రాశారో నాకు తెలియలేదు. బ్రౌను ‘పరిష్కరించిన ప్రతి’ అన్నారు కాబట్టి. ముఖ్యంగా మనుచరిత్రను, వసుచరిత్రను, ఆముక్తమాల్యదను అచ్చువేసిన వావిళ్ళ వారు; ఆముక్తమాల్యదను, శృంగారనైషధాన్ని ప్రకటించిన వేదం వారు ఆ, ఇంకా తదితరులు ఆయన ప్రతులను వాడుకోలేదని ‘మనకి’ ఎలా స్పష్టంగా తెలుసో నాకు తెలియలేదు.
1927లో ప్రకటితమైన వేదం వారి ఆముక్తమాల్యదా సంజీవనీ వ్యాఖ్యకు ప్రారంభవాక్యమే ఇది: “మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో ఆముక్తమాల్యదం గూర్చి వ్యాఖ్యలును సూచికలును కొన్ని కలవు. అవియన్నియు కొన్నిభాగములకే వివరణోద్యమములు.”
ఇందులో వేదం వారు పేరు చెప్పకపోయినా పేర్కొన్న వ్యాఖ్యలు – బ్రౌను హయాంలో సేకరింపబడిన గుడిపాటి వెంకటకవి తాత్పర్యబోధిని, జోగి జగన్నాథరాజు బుధమనస్తోషిణి, శ్రీనివాసకవి శ్రీనివాసీయ వ్యాఖ్య, అజ్ఞాతకర్తృకమైన ఒక టీక మొదలైనవి. అవి ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. వేదం వారు ‘సూచిక’ అని పేర్కొన్నది బ్రౌను దొర సిద్ధం 1849లో చేసిన ఆముక్తమాల్యదా శబ్దసూచి. అది శబ్దరత్నాకర నిఘంటునిర్మాణంలో బహుజనపల్లి సీతారామాచార్యుల వారికి, సంజీవనీ వ్యాఖ్య నిర్మాణంలో వేదం వేంకటరాయశాస్త్రిగారికి ఎంత ఉపకరించినదీ ఆ గ్రంథాలలోని పాఠాలే మనకు సాక్ష్యామిస్తాయి. బ్రౌన్ ప్రతులు వారికి ఉపకరింపలేదనటం సరికాదు.
వావిళ్ళ వారు బ్రౌను మనుచరిత్ర ప్రతిని ‘వాడుకొన్నారని’ మనుచరిత్రలోని వారి పాఠనిర్ణయక్రమమే వేయినోళ్ళతో చాటుతున్నది. పాఠాలను స్వీకరించి, అర్థనిర్ణయంలో మాత్రం స్వతంత్రమార్గాన్ని అవలంబించారు. మనుచరిత్ర వ్యాఖ్యలో జూలూరి అప్పయ్య గారు ద్వితీయాశ్వాసం ఆఱవ పద్యంలో “పరిమళలహరీ+ హల్లోహల” అని పదచ్ఛేదం చేసి “హల్లోహల = తొట్రువడిన వాక్కులు గల” అని అర్థాన్ని వ్రాయగా, వావిళ్ళ వారు విభేదించి “పరిమళ+లహరీ+ఈహత్+లోహల” అని పదచ్ఛేదం చేసి అర్థాన్ని వ్రాశారు. ఇటువంటివి కోకొల్లలు. బ్రౌనుగారికి అభిమానపాత్రమై బ్రౌణ్యంలోనికి ఎక్కినంతమాత్రాన వావిళ్ళ వారు ఆ అర్థాలను గ్రహింపకపోయినా, చాలా వఱకు బ్రౌను ముద్రణలోని పాఠవ్యవస్థనే అనుసరించారు.
జాగ్రత్తగా చూస్తే, బ్రౌను మనుచరిత్ర ముద్రణలో తప్ప మఱెక్కడా కనిపించని ప్రయోగాలు (చూ. వెల్చ) శబ్దరత్నాకరంలోకి అడుగుపెట్టాయి. అది సీతారామాచార్యులవారు బ్రౌను ప్రతులను వాడుకొన్నారనటానికి నిదర్శనం. ఆయన స్వయంగా పరిష్కరించిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి ‘జైమిని భారతము’, యతిరాజులు నాయుడు గారి ‘జైమిని భారతము’ ముద్రణ – బ్రౌన్ సేకరించిన ప్రతుల మూలకంగా పరిష్కరింపబడినవని తెలుస్తుంది.
బ్రౌను ప్రతులను వాడుకొన్న ‘ఇంకా ఇతరులు’ అనేకులే ఉన్నారు. బ్రౌను ప్రతులను వాడుకొన్న విద్వాంసులందరూ ఆయన పేరును స్మరింపలేదనటం కూడా సరికాదు. 1895లో తొలిసారి ధూర్జటి కాళహస్తి మాహాత్మ్యాన్ని ప్రకటించిన క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రులవారు, ఆర్. వేంకటసుబ్బయ్యగారు తమ ‘పీఠిక’లో – “దొరతనమువారి లిఖితపుస్తక భాండారంబునందు మెస్తరు బ్రౌన్ దొరగారిచే సేకరింపబడి కడు హెచ్చరికతో వ్రాయింపబడిన ప్రతియొకండు మాకు దొరకె.” అని వ్రాశారు. ఈ మాటలు బ్రౌన్ గారి సేకరణపై వారికేర్పడిన కృతజ్ఞతాభావానికి సూచికలు. 1870లో కస్తూరి రంగకవి సాంబనిఘంటువు కర్నూలు జిల్లా రామళ్ళకోట నివాసి నన్నూరు వెంకటకృష్ణశాస్త్రి గారి టీకతోనూ; 1872లో ధనంజయ నిఘంటువు, 1897లో ఇరుగపదండేశుని నానార్థ రత్నమాల వాందారి పాపన్నశాస్త్రులవారి టీకతోనూ; 1898లో సుజనరంజనీ సీరీస్ వారి 4-వ సంపుటంగా గణపవరపు వేంకటకవి వేంకటేశాంధ్రము; 1898లో పైడిపాటి లక్ష్మణకవి ఆంధ్రనామసంగ్రహము వెలువడ్డాయి. ఇవన్నీ మద్రాసులోని బ్రౌను సేకరణ ప్రతుల ఆధారంగా వెలసినవే అని సులభంగా గ్రహింపవచ్చును.
1900లో వీటిని మళ్ళీ ఒక సంపుటంగా రూపొందించి కోటి వేంకనార్యుని ఆంధ్రభాషార్ణవముతో కలిపి అమ్మిన పరవస్తు వేంకటరంగనాథస్వామి గారు వీటిని బ్రౌను ప్రతుల ఆధారంగానే అచ్చువేశారని — “మఱియైదు తాటియాకు ప్రతులును, మఱియొక కాకితపు బ్రతియునుగూడ నున్నవి.” అని పేర్కొన్నది బ్రౌను సంచయంలోని అయిదు ప్రతులను గుఱించే. ఇప్పటికీ అవి మద్రాసులో ఆ ప్రకారంగానే ఉన్నాయి. అంతే గాక, ఆయన — “అకారాది శబ్దసూచి (Index) కూడ ద్వరలో ముద్రింప సమకట్టి యున్నాము” అని పేర్కొన్నది బ్రౌన్ దొర వ్రాయించిన ‘ఆంధ్రభాషార్ణవ శబ్దసూచి’ మూలకమే. బ్రౌన్ దొర వ్రాయించిన ఆ ‘ఆంధ్రభాషార్ణవ శబ్దసూచి’ 216 వరుస సంఖ్యతో ఇప్పటికీ అక్కడున్నది.
ఇవన్నీ బ్రౌను సంచయాన్ని మనవాళ్ళు వాడుకొన్నారనటానికి నేను ప్రస్తుతం నా దగ్గరున్న కొన్ని పుస్తకాలలోనుంచి మాత్రమే ఉదాహరించాను. నా దగ్గర లేనివి ఇంకా ఎన్నో ఉంటాయి.
(2)
అయితే బ్రౌన్ అనుసరించిన గ్రంథ పరిష్కరణ పద్ధతుల్ని వీళ్ళు దాదాపుగా అనుసరించారా? అయినా ఆయన పేరెందుకు చెప్పలేదు?
బ్రౌన్ అనుసరించిన గ్రంథపరిష్కరణపద్ధతులేమిటో మీరు తర్వాత వివరిస్తానన్నారు. అప్పుడు వీళ్ళు దాదాపుగా అనుసరించారో లేదో నిర్ణయించటం సుళువవుతుంది.
(3)
తెలుగుని ఉద్ధరించే పనిలో ఉన్నాడు కాబట్టి ఉచ్చారణలో ఆచూకీ లేని బండి-రలు, అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించాడు.
బ్రౌను తన ముద్రణలలో శకటరేఫలను పూర్తిగా తీసేయించాడన్నది ఎంతవఱకు నిజమో నాకు తెలియదు. మనుచరిత్రలో శకటరేఫలు అసలు లేవనటం సరికాదు. మీరు ఉదాహరించిన ప్రతినే మళ్ళీ చూడండి. నా సొంత ప్రతి ఇప్పుడు హైదరాబాదులో మా ఇంట ఉన్నది కాని, అందులో ఉన్నాయనే నాకు జ్ఞాపకం. మీరు ఉదాహరించిన ప్రతిలోని ఆ తొలిపుటలో శకటరేఫల అవసరం లేదు కాబట్టి అవి అందులో లేవు. నేను నా దగ్గరున్న జూలూరి అప్పయ్య గారి వ్యాఖ్యతో ఉన్న నా సొంత వసుచరిత్ర ప్రతిని ఈరోజు పూర్తిగా పరీక్షించి చూశాను. అందులో నియత శకటరేఫలు నియమానుసారం ఉన్నాయి. కవిత్రయ భారతం తొలినాటి బ్రౌన్ ముద్రణలో ఎట్లా ఉండినదో నేను చెప్పలేను. నా దగ్గరున్న బ్రౌన్ మలిముద్రణలో శకటరేఫ, అరసున్న – రెండూ ఉన్నాయి. మీరు చూడదలచుకొంటే ఒకటి రెండు పేజీలు ఫోటో తీసి పంపించగలను.
అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించాడు.
ఈ వాక్యం నాకు బోధపడలేదు. “అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించటం” ఏమిటి?
బ్రౌన్ దొర బండి-ర లను పాటించినా, మనుచరిత్ర, వసుచరిత్రలలో అరసున్నలను తొలగించి అచ్చువేయించిన మాట నిజమే. అయితే, 1827లో అచ్చువేయించిన ‘ఆంధ్ర గీర్వాణచ్ఛందస్సు’లో అరసున్నలను పాటించాడు, మీరూ చూడండి. ఈ రెండింటి విషయమై బ్రౌన్ ఒక స్థిరనిశ్చయంతో లేరని, వివిధపద్ధతుల ప్రయోగాలను చేస్తూ వచ్చారని – ఈ ఉదాహరణలు వెల్లడిస్తాయి.
ఆ ప్రతులు ఎవరన్నా వాడుకోదలుచుకున్నా పాఠపరిష్కరణ విషయంలో అవి పనికిరావని చెప్పాం. అందులో అర సున్నలు, బండి రలు పాటించక పోవటం, అందుకు ప్రధాన కారణం.
అరసున్నలు, బండి-ర లు తాళపత్ర ప్రతులలోనూ ఉండవు. బ్రౌన్ ప్రతులలో అవి లేకపోతే అదొక సమస్య కాదు. అదే సమస్య అయితే, వాటిని చేర్చటం ఒక రోజు పని. బ్రౌన్ ఎన్నుకొన్న పాఠాలకంటె తమకు లభించిన ప్రతులలో మేలైన పాఠాలున్నాయని అద్యతన పరిష్కర్తలు భావించటమే వాటిని ప్రమాణీకరించకపోవటానికి కారణం. ఎమెస్కో వారి కావ్యాల ప్రచురణకోసం పరిష్కర్త శ్రీ తీర్థం శ్రీధరమూర్తి గారు స్వీకరించిన మేలైన పాఠాలన్నీ బ్రౌన్ దొర సంచయం లోనివే. ఆ గ్రంథాలయంలోని నిబంధనల కారణంగా వారు ఆ కావ్యాలపై తమ పేరును వేసుకొనలేదు. ఆ విధమైన కారణం వల్లనే చాలామంది పరిష్కర్తలు, ముద్రాపకులు బ్రౌన్ సంచయాన్ని వాడుకొన్నా, ఆ రోజులలో ప్రాచ్యలిఖిత గ్రంథాలయం వారి ఏవేవో నియమాల కారణంగా ఆ విషయాన్ని పేర్కొనటం జరగలేదు. అది బ్రౌన్ కృషి స్వరూపం తెలియకా కాదు; వారి కృతజ్ఞతారాహిత్యమూ కాదు; బ్రౌన్ సంచయం నిరుపయోగం కావటం వల్లనూ కాదు.
(4)
కానీ ములుపాక బుచ్చయ్య వసుచరిత్రకి వ్యాఖ్యానం రాసినప్పుడు బ్రౌన్ నిర్దేశించిన పద్ధతుల్ని అనుసరించలేదు. ఆయన వ్యాఖ్యానం గ్రాంథికంలో ఉంది కాబట్టి ముద్రించలేదని బంగోరె మొదలుకొని ఆరుద్ర వరకు చాలా మంది అన్నప్పటికీ, ఆ వ్యాఖ్యానం కళ్లారా చూస్తే కానీ బుచ్చయ్యగారు అనుసరించిన పద్ధతులేమిటో మనకు స్పష్టంగా తెలియవు. అంతే కాదు, ఆయన అచ్చు వేసిన వసుచరిత్ర, మనుచరిత్ర మొదలైన పుస్తకాలని ఎవ్వరూ తిరిగి అచ్చు వేయలేదు.
ఆరుద్ర గారు ఈ విషయమై వ్రాసినది సరిగా లేదు. బుచ్చయ్యగారి వ్యాఖ్య అచ్చుపడకపోవటానికి కారణం ‘పరిష్కరణ పద్ధతి’ కాక ఇంకేదో అయివుంటుంది. జూలూరి వారి వ్యాఖ్య గ్రాంథిక-వ్యావహారికాల సమ్మిశ్రణగా, ఆరుద్రగారు అన్నట్లుగా కాక -– సలక్షణమైన అలంకారాది వివేచనతో, సంస్కృత లక్షణోదాహరణలతో భవ్యంగా, భావ్యంగా ఉన్నది. ఆ తర్వాత కాలంలో సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య, తంజనగరం తేవప్పెరుమాళయ్య గారి అద్భుతమైన వ్యాఖ్య, వావిళ్ళ వారి పరివర్ధిత వ్యాఖ్య మొదలైనవి వెలుగుచూశాక అంతగా రసాలంకారభావధ్వని వివృతులు లేని బుచ్చయ్యగారి వ్యాఖ్య ముద్రణ, జూలూరి వారి వ్యాఖ్య పునర్ముద్రణ అవసరం లేకపోయాయి.
బ్రౌన్ వ్యక్తిత్వాన్ని గుఱించి మీరు వ్రాసిన విషయవిస్తరణతో ఐకధ్యం లేని అంశాలను మఱొకసారి!
(5)
బ్రౌన్ పరిష్కరణ సంవిధానం మీరే ఉదాహరించిన ఆంగ్లవాక్యాలను బట్టి, అది సార్థకమై, అంతర్జాతీయప్రమాణాలకు సైతం అనుగుణంగా ఉన్నట్లే నాకనిపించింది. ప్రతులను సేకరించటం, పాఠాంతరాలను గుర్తించటం, కవికి అత్యంతసమీపకాలంలో వెలసిన పాఠాన్ని గుర్తించటం, భావప్రతీతికి దోహదంచేసే మేలైన పాఠాన్ని స్వీకరించటం అన్న ఆయన ‘విధానం’ మీరన్నట్లు ఈనాటికీ మనము అనుసరిస్తున్నదే. అందులో లోపాలుంటే, అవి పరిష్కర్త వైదుష్యలుప్తికి, పరిణతప్రజ్ఞ లేమికి, కావ్యానుభవరాహిత్యానికి మాత్రమే నిదర్శనలు. విధానంలో లోపాలు కావు.
ఈ విషయమై విద్యార్థిగా అభిమానమూ, జిజ్ఞాస ఉన్న నేను బ్రౌన్ మాటెలా ఉన్నా, ‘తెలుగు భాషకు అనువర్తించే ఆదర్శ పరిష్కరణవిధానం’ గుఱించి మీరు వ్రాయగల ప్రామాణికవ్యాసానికై ఆసక్తితో ఎదురుచూస్తుంటాను.
మిత్రులు వురుపుటూరి శ్రీనివాస్ గారికి, మీరు ఉత్తరం రాసిననందుకు సంతోషం. మీరు చూపించిన దోషాలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం వుంది.
మొదటిది: ఓరియంటల్ లైబ్రరీలో పరుచూరి శ్రీనివాస్ ఏమి చూశాడో సాధ్యమైనంత స్పష్టంగానే చెప్పాం. ఆ లైబ్రరీలో ఎక్కువ సేపు గడపటానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో శ్రీనివాస్ అక్కడికి వెళ్లాడు. అప్పుడు ఆ లైబ్రరీలో రెనొవేషన్ జరుగుతోంది. అయితే అప్పటికీ రెండు రోజుల పాటు అక్కడ గడిపిన తరువాత శ్రీనివాస్ చూసిన విషయాలు మేము వివరంగానే చెప్పాం. మొదటిది మీరే గమనించారు. అక్కడ బ్రౌన్ రాయించిన కాగితపు ప్రతులు ఆలనా పాలనా లేకుండా పడివున్నాయి. రెండోది: ఆ ప్రతులు ఎవరన్నా వాడుకోదలుచుకున్నా పాఠపరిష్కరణ విషయంలో అవి పనికిరావని చెప్పాం. అందులో అర సున్నలు, బండి రలు పాటించక పోవటం, అందుకు ప్రధాన కారణం.
బ్రౌన్ వెళ్లిపోయిన తరువాత మన పాత పుస్తకాలు పాత తాటాకు ప్రతుల ఆధారంగానే చాలామంది పరిష్కరించి వ్యాఖ్యానించి ప్రకటించారు. వీళ్లందరికీ పాత తాళప్రతులు దొరికాయి. ఆ ప్రతులు బ్రౌనే సంపాదించి పెట్టినవో లేకపోతే వేరే రకాలుగా చేరినవో మాకు స్పష్టంగా తెలియదు. మేము చెప్పిందల్లా ఆ తాళపత్ర ప్రతులు నశించిపోలేదనీ, ఇంకా ఉన్నాయనీ, వాటి ఆధారంగానే మన పాత గ్రంథాల పరిష్కరణ చేసుకుంటున్నామనీ, బ్రౌన్ చేయించిన కాగితపు ప్రతులు మనకు ఉపయోగపడలేదనీ — అంత మాత్రమే. ఈ విషయమై ఇంకొంత శ్రద్ధగా పరిశీలించి ఒక నిర్ధారకమైన అభిప్రాయానికి రావడానికి తెలుగు దేశంలో ఉన్న పండితులు, పరిశోధకులు ప్రయత్నించాలి. తాళపత్రగ్రంథాలకు దూరంగా ఒకరం జర్మనీలోను, మరొకరం అమెరికాలోను కూర్చుని ఇంతకన్నా నిర్ధారకంగా చెప్పలేకపోయినందుకు విచారిస్తున్నాం. మా ప్రయత్నమల్లా బ్రౌన్ లేకపోతే తెలుగు సాహిత్యం చచ్చిపోయేదే, బ్రౌన్ చేసిన పునరుద్ధరణ వల్లే బతికి ఉంది అనే లాంటి నిరాధారమైన పొగడ్తలకి అభ్యంతరం చెప్పడమే.
ఇక పోతే బ్రౌన్ ప్రవేశ పెట్టాడని మేం అంటున్న గ్రంథ పరిష్కరణ విధానాలు ఆనాటి చదువుల కారణంగా ఏర్పడినవి, అప్పటి అవగాహనల వల్ల ఏర్పడినవి, అది అప్పటి పరిమితి — అని అనుకోవచ్చుకదా అని మీరు సందేహాన్ని వ్యక్తం చేశారు. బ్రౌన్‌కి పూర్వం తెలుగుదేశంలో ఇంగ్లీషు చదువులు బలంగా లేవు. అవి అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. మన గ్రంథ పరిష్కరణ విధానంలో బలంగా వున్నవి బ్రౌన్ మనకి అలవాటు చేసిన విధానాలే. అది ఎవర్నీ తప్పు పట్టడం కోసం రాసిన వాక్యం కాదు. తెలుగు పండితులు ఆతరవాత చాలాకాలం వరకూ కూడా ఇంగ్లీషు చదువుకోలేదు. వాళ్ల చుట్టూ వున్న ఇంగ్లీషు చదువులు ఈ విధానాలని విమర్శించడానికి కావలిసిన సాంస్కృతిక స్థైర్యం వాళ్లకి లేకుండా చేశాయి. మనకి ఇంగ్లీషు చదువుల వల్ల చాలా లాభాలు కలిగిన మాట నిజమే. అయినా నష్టాలు కూడా జరిగాయి. వాటిని గమనించడానికి, ఆ నష్టాలనుంచి మనం బయటపడడానికి, చాలా ఆలోచన, చాలా పరిశ్రమ కావాలి.
వేమన పద్యాల పట్ల బ్రౌన్‌కున్న అభిమానాన్ని బ్రాహ్మణ వ్యతిరేకతగా మేము చూపించటం కుదరదంటున్నారు మీరు. ఈ విషయాన్నే ఇంతకు ముందు వచ్చిన ఉత్తరాల్లో ‘ఒకడు’గారు కూడా ప్రస్తావించారు. బ్రౌన్‌దృష్టిలో హిందూ మతమంటే బ్రాహ్మణులు చెప్పేదే. బ్రాహ్మణులు కాని వారు అనుసరిస్తున్న అనేక మత విధానాల పట్ల, వాళ్ల సంస్కృతి పట్ల బ్రౌన్‌కేమీ శ్రద్ధ లేదు. అతనికి జంగమ సాహిత్యం, వేమన సాహిత్యం నచ్చటానికి అందులో అతను గమనించిన బ్రాహ్మణ వ్యతిరేకత మాత్రమే నిజమైన కారణం. అతనికి క్రిస్టియన్ మతం పట్ల పట్టుదల, అందులోనూ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మతం పట్ల పట్టుదల ఉందని అతను స్పష్టంగానే చెప్పుకున్నాడు. పోతే అతనిలోని బ్రాహ్మణ వ్యతిరేకతే అతని హిందూ వ్యతిరేకత. అది వ్యక్తులుగా బ్రాహ్మణుల మీద వ్యతిరేకత కాదు. అతను తన దగ్గర పనిచేసే బ్రాహ్మణ పండితుల్ని చవకగా వాడుకున్నా, గౌరవంగానే చూశాడు. అయితే వాళ్ల దగ్గరనుంచి అతను కొత్త ఆలోచనలేమీ నేర్చుకోలేదు. మాటలకి అర్థాలు మాత్రమే నేర్చుకున్నాడు.
ఇలాటి వ్యాసాలు కత్తి మీద సాములాటివి. ఉపోద్ఘాతం బాగున్నా, ఉపోద్ఘాతం అయిపోయిన తరువాత కొన్ని వాక్యాలు చదవగానే అనుకోకుండా ఘాతం తగిలింది. ఆహ్లాదంగా షికారుకెళుతున్న సమయంలో కనపించే మలుపు వద్ద కనపడని స్పీడు బంపు వచ్చి కీచు మని బ్రేకేసినట్టు ఆగవలసి వచ్చింది. అలా ఆగటం వల్ల ఈ వ్యాసరచయిత(త్రి)కి ఒక “ప్రెజ్యుడిస్”, అనగా పక్షపాతం, ఉన్నదన్న భావన వచ్చి చేరి, ఆ తర్వాత బలపడి, ఆ వాక్యాలు చదివాక నాకు అప్పటిదాకా లేని “ప్రెజ్యుడిస్” వచ్చి చేరింది. అలాటి ఎఫెక్టు కలగటం చాలా దరిద్రం ఏ పాఠకుడికైనా, ఏ వ్యాసానికైనా. ఇలా చెప్పడం వల్ల ఈ వ్యాసానికి, వ్యాస రచయితకు, పాఠకలోకానికి, ఈమాటకు ఉపయోగం ఉన్నా ఉండకపోయినా, మా గురువు గారు లైలా గారు లంకె ఇచ్చి మరీ ఇక్కడికి పంపించి చదివింపచేసారు కాబట్టి ఒక రెండు ముక్కలు రాయవలసి వచ్చింది.
ఆ “ప్రెజ్యుడిస్” అన్న సంగతికి చిన్నపాటి వివరణ – ఈ కింది వాక్యాల వల్ల వ్యాసానికి ఉపయోగం లేకపోగా చదవడానికి విముఖత కలిగిస్తై.
**** “పైన నేను పేర్కొన్న నవలల్లో లత నవలకు విమర్శార్హత కూడా లేదు. ఇక గోపీచంద్ నవలలు అటు రచనాపరంగానూ, ఇటు సిద్ధాంతపరంగానూ కూడా బలహీనంగా రాయబడినవి. “వెంకటచలం పాత్ర ” అంటూ గోపీచంద్ చేసిన మరొక గల్పిక లాంటిది మరీ కురచబారిన రచన.” *****
ఇది చదివిన తరువాత, నే చదివే తీరు, అభిప్రాయం మారిపోవటం మొదలుపెట్టింది. అనగా అప్పటిదాకా లేని “ప్రెజ్యుడిస్” వచ్చి చేరింది నాలో. చెలియలికట్టను తీసుకుని దాని మీద రాయడానికి స్వయంగా మనకు ఎంత అర్హత ఉందనుకుని రాసామో అంతే అర్హత పైన పేర్కొన్న నవలలకూ ఉన్నది అని ఈ వ్యాసరచయిత(త్రి)కి తెలియకపోవటం ఆశ్చర్యం. దీనివల్ల అభాసుపాలు కావటం తప్పితే ఉపయోగం నిల్లు.
అయితే వ్యాసంలోని మిగతా సంగతులు బాగానే ఉన్నా, ఇటువంటి వ్యాసాలు కత్తి మీద సాము అని చెప్పాను గాని, ఆ కత్తి పదునా, మొండా అన్నది తేల్చుకోవాలె ముందు. ఇక్కడ కత్తి మొండిగా ఉన్నట్టుగా నాకు కనపడ్డది. కాబట్టి సాము ఎట్లా చేసినా, ఎంత చేసినా పాఠకుడి మీద ప్రభావం లేదనే అనుకోవచ్చునేమో. అలా ప్రభావం లేకపోవటానికి, పదిహేనేళ్ళ క్రితం రాసిన ఈ వ్యాసానికి రెండు కామెంట్లు, ఇప్పుడు నాది మూడు మటుకే ఉండటం ఒక బలమైన సాక్ష్యమని నేను అనుకుంటున్నా.
అలాకాకపోయినా ఇంకో సాక్ష్యంగా చివరాఖరి రెండు పేరాలు చదివితే ఈ వ్యాసం పట్టు ఎంతో, ఏమిటో చప్పున తెలిసిపోయె. కాబట్టి, చదివి సమయం వ్యర్థం చేసుకున్నానో ఏమిటో అన్నది తెలియక, ఇదే వ్యాసం ఇదే వ్యాస రచయిత ఇప్పుడు తిరగ రాస్తే ఎట్లా ఉంటుంది చూడాలన్న ఆలోచన ఉద్భవిస్తున్న సమయంలో స్వస్తి…
నమస్కారం, వ్యాసం చాలా ఉపయోగకరంగ, ఆలోచింపచేసేదిగా, పద్ధతిగ, మంచి రసవంతంగ ఉంది. ధన్యవాదాలు. మీ ప్రతి మాటలో అనుభవం ఉంది. అవగాహన ఉంది. అన్నింటికీ మించి భావాత్మకత ఉంది.
ఇదిగో నా ప్రతిస్పందన-
1. “‘లంగరమ్మలు, లంగరయ్యలు’” — హాస్యం కోసం వ్రాసినా బాగుంది. కానీ Anchor అనే మాటే చాలా పాక్షికంగ, స్వల్పపరిధిలోనే ఆ అర్థాన్ని ఇస్తుండటం గమనార్హం.
2. “కైపొత్తాలు (handbooks)”– ఇవి ముఖ్యంగ యంత్రాదుల వాడుక గురించి పరిజ్ఞానం ఇచ్చే పుస్తకాలు కనక సహాయపుస్తకాలని అనవచ్చేమో.
3. “ఇంగ్లీషులో నాలుగింట ఒక మాట ఫ్రెంచి భాష నుండి వచ్చి కలిసిందన్నది నమ్మశక్యం కాని నిజం”. — ఎనభైశాతం ఆంగ్ల పదాలు ఇతర దేశాల భాషలవే. జర్మన్, పోర్చుగీస్, గ్రీక్, లాటిన్, – ఇవే కాదు- చివరకు మన దేశంలో వివిధ భాషలన్నింటిలో నుంచి ఆ భాషలోకి పదాలు ఎగుమతి అయినవి. ఆ భాష అంత కలగాపులగమైన భాష వేరేది ఈ భూప్రపంచంలోనే ఉండదు.
4. “వెనుక తియ్యను.”– వెనుదీయను అనేది కదా సరైన ప్రయోగం.?
5. “‘క్రోమోజోము’ =‘వారసవాహికలు’” — అద్భుతంగ ఉంది. అయితే వారసత్వ వాహికలు అంటే బాగుంటుందా? ఇంక బణువుకన్నా బృహదణువు బాగానే ఉంది. లేదా గుర్వణువు/ మహాణువు అనవచ్చు.
6. “అణు బాంబులని మరొకసారి పరామర్శిద్దాం.” — హాస్యానికే- ఒక తెలుగు సినిమాలో హాస్యానికి దీన్ని ఢమాల్ ఉండ అని వాడారు. భలే నవ్వుకున్నాము. ఢమాల్ కూడా హిందీలో ధమాకా నుండి అనుకరణగా వచ్చినదే అయినా ఢమఢమలు అనేది తెలుగు శబ్దానుకరణ పదమే.
7. “దుర్నామాలే (మిస్‌నోమర్స్, misnomers).” — దీనినే తెలుగులోకి చేస్తే చెడ్డపేరు అవుతుంది. అంతకన్నా వేరే భావాన్ని అభివ్యక్తం చేయగలిగే స్థాయి తెలుగు భాషకు లేదు. కనక సంస్కృతపదమే బాగుంది. (చెడ్డపేరును సంస్కృతంలో చెప్పాల్సి వస్తే అపయశస్సు లేదా అపకీర్తి అంటారు. కనక భయం లేదు.)
8. “ఏదో ఇంగ్లీషువాడు పప్పులో కాలేస్తే వేసేడు, ఆ కాలు పట్టుకుని మనం ఎందుకు వేల్లాడటం? ఆలోచించండి.” — నిజంగా ఇది నేను చాలా దీర్ఘంగ ఆలోచించాను. మనం తెలుగులో ఒక పదాన్ని కోరి ఆలోచించేముందు కనీసం ఆంగ్లంలో ఆ పదం ఆ వస్తువును సరిగ్గ సూచిస్తున్నదా అని చూసుకుంటే ఎన్నో ప్రమాదాలనుంచి భాషాఘాతుకాల నుంచి తప్పించుకోవచ్చు. అంధానుకరణం ఎక్కడైనా ఎప్పుడైనా హర్షించదగినది కాదు.
9. “సభాపిరికితనం’ అనే పదాన్ని అవసరానికి అనువుగా మార్చి ప్రసంగభయం అనో, సభాభయం అనో వాడుకుంటాడు.” — పిరికి కన్నా బెరుకు, వెరుపు అంటే బాగుండేదేమో. కానీ తెలుగు పదం సంస్కృతపదం కలిపితే అంతగా రుచించదు కనక సభాభయం అనచ్చు. పోనీ రుచింపచేద్దామంటే వేదిక వెరుపు అనచ్చు. ఇప్పుడు సభాపిరికి అనే పదం వాడగా వడగా సామాన్యజనవాహినిలో కలిసిపోయి ఎంతో సహజంగ తెలుగువారు వాడుకోవటం లేదా. సామాన్య భాషలో భావం వ్యక్తమైతే చాలు- శాస్త్రీయ పదాల చిక్కు మాత్రం విప్పలేని ముడే.
10. “జపానీయులు తదుపరి ఇంగ్లిష్ నేర్చుకొటానికి ఎంత అవస్థ పడ్డారొ కూడా ఆయనకు తెలిసి ఊండదు. (వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం)” — వారు ఇంగ్లీషు నేర్చుకోవటానికి ఎంత అవస్థపడ్డారో అనేదానికన్నా సాంకేతికంగ, విజ్ఞానరంగంలో ఎంత పురోగతి సాధించారనేది ముఖ్యం. ఎందువల్ల అది సాధ్యపడింది.? మన పిల్లలు తెలుగులో విజ్ఞానాన్ని చదువుకుని, విషయాన్ని అవగాహన చేసుకుని కూడా విజ్ఞానంరంగంలో సాంకేతిక పరిశోధనలలో తెలుగును ఆశ్రయించి ఎందుకు వెనక ఉంటున్నారనేది ముఖ్యం. జపాను వారు తయారు చేసిన ఏ యంత్రమైనా దాని తాలూకు సమాచారమంతా తమ మాతృభాషలోనే పెట్టుకుంటారు. చివరకు అమెరికా వారు కూడా ఆ రహస్యఛేదన కోసం జపానీ భాష నేర్పించి తమ వైజ్ఞానికులను ఆ దేశం పంపి ఆ పరిజ్ఞానాన్ని పొందవలసిందే. వారు తమ వాడకాల కోసం తామే వస్తువును తయారు చేసుకుంటారు. అంత స్వాభిమానం మనకు ఉందా? మనం తయారు చేసే ఎన్ని మందులు, యంత్రాలు, పరికరాలు మన భారతీయ భాషలలో కనీస సూచనలు కలిగి ఉంటున్నాయో తరచి చూడండి. మనకు మనకన్నా ఆంగ్లేయులు లేదా ఆంగ్లం తెలిసినవారు దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం. ఇక్కడ శాస్త్రపదజాలం, వైజ్ఞానిక పారిభాషిక పదాల చర్చ వచ్చింది కనక చెప్తున్నాను- ఎంత సేపటికీ మన దృష్టి తరువాత ఆ పిల్లలు ఎదిగి దాన్ని ఆంగ్లంలో తెలుసుకుంటేనే కదా పురోగతి అనే భావనమీదే ఉంటుంది. నిజంగ ప్రతిభావంతులైన పిల్లలు ఉత్సాహంతో తెలుగు భాషతో విజ్ఞానాన్ని అర్థం చేసుకుని తెలుగులోనే విషయపరిజ్ఞానాన్ని వ్యక్తం చేస్తామని, తెలుగులోనే పరిశోధనలు చేస్తామని ముందుకు వస్తే దానికోసం కావాల్సిన ఏర్పాట్లు స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళకైనా మన వద్ద సిద్ధంగ ఉన్నాయా..? పోనా మన పిల్లలు విషయం తెలుసుకోలేని పనికిమాలినవాళ్ళా అంటే విదేశాలలో చక్రాలు తిప్పుతున్నారు. వారు విద్యాలయస్థాయిలో నేర్చుకునే ఆ పదజాలం, దాని ఉపయోగం విద్యాలయం దాటాక ఎంత ఉంటోంది అనేదాన్ని బట్టి మనం ఆ పదాలను తెలుగులో పెట్టుకోవాలా, ఆంగ్లంలో పెట్టుకోవాలా అని చర్చ చేసుకోవచ్చు. ముందసలు అటువంటి ప్రయత్నం చేసే ముందే వృథా అని తేల్చేయటం (అది కూడా సంస్కృతాన్ని ఆశ్రయించవలసి వస్తోంది కనక ఆంగ్లాన్నే యథాతథం ఉంచాలనటం అయితే సుతారమూ) సమంజసం కాదు. నిజానికి ఏ పారిభాషిక పదమైనా ఆ భాషలో తయారైనప్పుడు మాత్రం వారికి అది అలవాటయ్యేవరకు కొత్త కావటం లేదా? మొదటిసారి ఒక ఊహ చేసేటప్పుడు వారు మాత్రం ఆయా భాషలలో కొత్త పదాల కోసం వెతుక్కోవటం లేదా..? వివిధ భాషలలో ఉండే శబ్ద-అర్థాలకు నిజంగ ఎన్నో పరిధులలో తేడా లేదా..? వాటర్, నీరు, తన్నీ, పానీ.. అన్నీ నీటిని సూచించటం లేదా.. అటువంటప్పుడు continuous function అవిచ్చిన్న ప్రమేయమంటే వచ్చిన నష్టమేంటి?
11. “if ‘f ‘is a continuous function… తెలుగు మీడియం పుస్తకాల్లో దీని రూపం: f ఒక అవిచ్చిన్న ప్రమేయమైతే… ఇది- ఒక ‘ఒక’ మినహాగా – తెలుగా సంస్కృతమా అన్న సంగతి కాస్త పక్కనుంచితే ఇలా నేర్చుకున్న వారు ఎంత తెలివి గలవారయినా బయట ప్రపంచంలో చెల్లరు.” (వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం)– ప్రతివాడూ ప్రపంచంలో చెల్లాలనేది విదేశాలనో ఆంగ్లాన్నో దృష్టిలోనే పెట్టుకుని ఆలోచించవలసిన అవసరం మనకేంటి? ప్రపంచమంటే ఏంటి? మనం ప్రపంచంలో లేమా? మన దేశం మన పరిశోధన, మన పరిధి, మనకు ముఖ్యం కాదా? అటువంటప్పుడు continuous function ని అవిచ్చిన్న ప్రమేయమని విద్యార్థికి పరిచయం చేసి ఆ విషయావగాహనకు దోహద పడితే అది వాడికోసం అవిచ్చిన్న ప్రమేయంగానే మిగిలిపోతే మాత్రం తప్పేంటి? అందులో ఒక కొత్త క్షేత్రాన్నో, పరిధినో, లోతునో ఆ విద్యార్థి కనుగొనగలిగితే ఆ విజ్ఞానవిషయానికి (శాస్ర్తం ఏదైనా సరే) అతడు న్యాయం చేయటంలో ఏదైనా తక్కువ పడుతోందా?
12. “సంస్కృతం నుండి తెలుగులోకి ఎన్నో మాటలు వచ్చేయి కదా. ఈ ప్రక్రియ శృతి మించటంతో గ్రాంథికానికి ఆదరణ తగ్గి శిష్టవ్యవహారికానికి ఆదరణ పెరిగింది.” — సంస్కృతం ఆంగ్లం తెలుగులోకి చాలా విభిన్న రీతులలో ప్రవేశించాయి. వాటికి పొంతనే లేదు.
“ఈ అభిప్రాయంలొ నేను సరి గానో తప్పు గానో వాడిన సంస్కృత పదాలు నాకు ఇష్టమై మాత్రం కాదు. వాటికి తెలుగు తెలీక.” (వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం)– తెలియక కాదండీ.. లేక. సంస్కృతం తెలుగును ఏదో అన్యాయం చేసిందనే సిద్ధాంతం ఈ మధ్యకాలంలో ప్రబలమైంది. అదీ ఆర్యులదండయాత్ర సిద్ధాంతం–దాని పర్యవసానాన ఆర్య-ద్రావిడ-వేర్పాటు సిద్ధాంతం వల్ల ఆ ఘోరం జరిగింది. ఆర్యులూ లేరు, వారి దండయాత్రా లేదని ఎన్నడో సాక్ష్యాధారాలతో సహా నిరూపణమైనాక కూడా సంస్కృతాన్ని పరాయి భాష అనుకుని మనం ఆ భాషను ఆంగ్లంతో పోల్చటం సరికాదు. కావాలంటే ఈ వీడియో చూడగలరు. కల్యాణరామన్, ఎన్ ఎస్ రాజారామ్- ఈ పరిశోధనలో నాకు తెలిసిన ముఖ్యుల పేర్లు. వారి రచనలు చదవండి. దయచేసి ఆ బూజుపట్టిన సిద్ధాంతాన్ని రాధ్ధాంతం చేయకుండా పూర్వపక్షం చేసి వదిలించేసుకోండి. [https://www.youtube.com/watch?v=fu9Co8b-G1c]
“నా దృష్టిలో ఈ రెంటినీ పక్కపక్కన పెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే, సంస్కృతం తెలుగుపై చూసిన ప్రభావం – విధానంలోనూ, స్వరూపంలోనూ కూడా ఇంగ్లీషు చూపిన/చూపుతున్న ప్రభావం కంటే చాలా వేరయినది.” (కామేశ్వరరావు గారి అభిప్రాయం)– ఇది సరైన మాట. ఆయన చూపిన కారణాలే కాక ఇంకా సంస్కృతం మన దేశంలోది, మన సంస్కృతి నుండి వచ్చినది- వంటి ఎన్నెన్నో ఇతర కారణాలూ చెప్పవచ్చు. సంస్కృతం లేకుండా ఒక్క తెలుగు వాక్యాన్ని ప్రాథమికస్థాయి అవసరం దాటి మనం చెప్పలేమనేది అంగీకరించవలసిన వాస్తవం. అంతే కాదు- భాష అనే మాటకు తెలుగు పదమే లేదు అని ఒక ప్రముఖులు శెలవీయంగా వినటం తటస్థించింది. అట్ల ఎన్నో పదాలు తెలుగులో లేవు. రావు కూడా. సంస్కృతంలో అన్ని భాషలనూ పరిపుష్టం చేయగల శక్తి ఉంది. సంస్కృతాన్ని కాదనుకుని తెలుగువారు తమ భాషాపరమైన అస్తిత్వానికే మూలకుఠారం వేసుకుంటున్నారు. సంస్కృత ధాతువులను, నామపదాలను మనం తెలియకుండానే ఎంతో వాడేస్తున్నాము. అది అవమానజనకం ఏమీ కాదు. కనక కొత్త పదాల సృష్టి సంస్కృతంలో జరిగినా పిల్లలకు, పెద్దలకు ఆంగ్లం కంటే కూడా సులువుగా చక్కగ అర్థమైపోతాయి. భయమే లేదు. సంస్కృతాన్ని కాదనుకుంటే మనకు మిగిలేది పరదేశీయల భాషాపదాలే, దెబ్బతిని చితికిపోయే ఆత్మాభిమానమే.
13. “చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్న “బొగ్గుపులుసు వాయువు” లాంటి అనువాదాలు తెలుగుకి సహజం కావు కదా.” (జయప్రభ గారి అభిప్రాయం) సహజం కాకపోయినా మనం దాన్ని అంగీకరించి ఇవాళ కార్బన్ డయాక్సైడ్ అనే మాటకు సమానార్థకంగా హాయిగా వాడేసుకుంటున్నాము. సంగణకం (కంప్యూటరు) పరికరంగా వాడుక లోకి రాక ముందు ఆంగ్లంలో కూడా “మౌస్” అంటే ఎలుక మాత్రమే. వాళ్ళు చెప్పారు- దీన్ని మౌస్ అందామని.. మనం అంటున్నాము. వాడకంలోకి వచ్చాక ఎవ్వరూ దాన్ని తిరస్కరించరనే మాట మన తెలుగు మాష్టర్లు కాస్త నేర్పుతో ఉపయోగించుకుంటే బాగుండేది.
14. “విమర్శని భరించలేని స్థితికి సమాజం చేరుకోవడం కన్నా వెనకబాటుతనం ఇంకొకటి లేదు.” (జయప్రభగారి అభిప్రాయం)- ఇది అద్భుతమైన మాట. జోహార్లు. ఇందులో చాలా వాస్తవం ఉంది.
15. “ఇంగ్లీషుని తెలుగులోకి మార్చి రాయవలసిన అవసరం నోకియా వాడికీ, ఎమిరేట్స్ వాడికీ కనబడింది.” — అన్నింటికన్నా నాకు నచ్చిన విషయం ఇది మహాశయా. ఒకడిది వ్యాపారావసరం. మరొకడిది పరిశుభ్రతా అవసరం. మన భాష పట్ల మనకు రెండిటిలో ఏ అవసరం కలిగినా తప్పక మనమూ ఆ పంథాలో పోగలము. స్వాభిమానమనేది ముఖ్యం. అది ఉంటే దారులు వాటికవే దొరుకుతాయి.
మంచి వ్యాసం అందించిన రచయితకు, అభిప్రాయాలు వ్యక్తం చేసి నా అవగాహనకు దోహదపడిన వారందరికీ నా కృతజ్ఞతలు. హార్దికాభినందనలు. ఏవైనా తప్పులుంటే మన్నించవలసింది.
ఈ వ్యాసంలో నుంచి మొదట భట్రాజు అనే మాటను ఉపసంహరించండి. భట్రాజులు ప్రస్తుతం అంధ్ర ప్రదేశ్ లో బిసీలు. వారిని కించ పరిచేలా మాట్లాడడం సరి కాదు. మాయాబజార్ లో శర్మా శాస్త్రీలు వుంటారు. కవచమిది కవచమిది అని వుత్తర కుమారుణ్ణి తెగ పొగుడుతుంటారు. పక్కన సారథి (అంజి గాడు) కూడా పొగుడుతుంటాడు. ఇద్దరూ చేస్తున్న పని ఒకటే. కాని శర్మా శాస్త్రీలు బ్రాహ్మణులవుతారు. సారథి భట్రాజు అవుతాడు. brahmanism అంటే అదే.
రాజులనూ ప్రభువులనూ జమిందారులనూ నవాబులనూ పొగిడీ వాళ్ళ మీద కావ్యాలు రాసి అంకితం ఇచ్చీ తాము రాసి వారి పేరు పెట్టి శ్రమ తెలియకపొవడం వల్ల జీవితాంతం ఒకరిని పొగిడీ (ఆశీర్వదించి) అదే ఒక జీవన విధానం చేసుకున్న వారు బ్రాహ్మణులు. కాని నాలుగు మెతుకుల కోసం మారాజ ఓ రాజ అన్న పేదలు – భట్రాజులు.
భారత దేశములో, ముఖ్యముగా ఉత్తర భాగములో, అక్కడక్కడ కర్ణాటకములో వ్యక్తి పేరు, ఇంటి పేరు లేక కులము పేరు ఆ క్రమములో మనకు కనబడుతాయి. కాని మిగిలిన చోట్లలో ఇంటి పేరు (సామాన్యముగా ఊరి పేరు) ముందు, తఱువాత స్వంత పేరు మనకు గోచరమవుతుంది. నెల్లూరు మోహన రావు అంటే అతడు కాని, అతని పూర్వులు కాని నెల్లూరికి చెందినవారో లేక నెల్లూరిలో పుట్టిన వారో అయి ఉంటారు. కాని మోహన రావు నెల్లూరు అంటే అన్వయము సరిగా నుండదు. కొన్ని నామములలో ఇది కొద్దిగా వేడుకగా కూడ ఉంటుంది. రాయవరపు రామనాథమును రామనాథం రాయవరపు అంటే ఏదో ఒక విధముగా ఉంటుంది. సంస్కృత వాక్యములలో సామాన్యముగా పదముల వరుస అంత ముఖ్యము కాదు. కాని ద్రావిడ భాషలలో ఇది చాల ముఖ్యము.
చివరి మాట – ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తికి చెందినది. అతడు / ఆమే దానిని ఏ విధముగానైనను అమర్చుకోవచ్చును, అది ఆ వ్యక్తి జన్మ హక్కు, స్వాతంత్ర్యము. కొన్ని సమయాలలో అది తమాషాగా ఉంటే ఉండనీ గాక! నా రెండు తామ్ర శతకములు 🙂
ముందుగా, ఇంత విపులమైన పరిశోధనా పత్రాన్ని రాసిన శ్రీనివాస్, నారాయణరావు గార్లని మనసా అభినందించాలి. ఎంతో పరిశ్రమించారు, ఎన్నో ఆధారాల్ని పరిశీలించారు, మరెన్నో లోచూపుల్ని (insights) మనకందించారు. నాకు బాగా నచ్చిన విషయం – ఏయే ప్రశ్నలకి సమాధానాలు వెదికే ప్రయత్నం చేశారో స్పష్టంగా ముందస్తుగా చెప్పెయ్యటం. “ఇప్పుడు ఈ వ్యాసం ఉద్దేశం… బ్రౌన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు, అంత పండితులు కానివాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిమర్శకంగా పరిశీలించి సాధ్యమయినంత బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.”
ఇప్పటి వరకు అభిప్రాయాలు చెప్పిన చాలామంది అసలు ఈ భాగాన్ని చదివినట్టు లేరు. ఒకవేళ చదివినా అదంత ముఖ్యమైన విషయం కాదని వదిలేసినట్టున్నారు. ఇక్కడ ఒక general statement ఇవ్వాలనిపిస్తున్నది – నేను చూసినంతవరకు సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ, రచనల గురించి కాక వాటి రచయిత/త్రుల గురించి, వారి motivations గురించి, వారికున్న hidden agendaల గురించి విమర్శకుల అభిప్రాయాలు, ఊహలు, ఆలోచనలతో నిండిపోతున్నది. అదివరకు సంయమనంతో లోతైన సాహిత్యావలోకనం చేసిన వాళ్లు కూడ ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ సాహిత్యవిమర్శని నేతిబీరకాయగా మార్చెయ్యటం మన దౌర్భాగ్యం. ఇక అసలు విషయానికి వస్తాను.
వారు వేసుకున్న ప్రశ్నలకి ఈ వ్యాసంలో వ్యాసకర్తలు సమాధానాలు ఇచ్చారా? అని చూస్తే “బ్రౌన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు, అంత పండితులు కానివాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు?” అన్న ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు సాధించారని నా అభిప్రాయం. “బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది?” అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి చాలా విపులమైన సమాచారాన్ని క్రోడీకరించారు. ఐతే మరీ విపులం కావటంతో దీని సమాధానం విషయంలో నాకు కొంత గందరగోళం కనిపించింది. ఒక ఉదాహరణ: “ఫుస్తకాలు ఎలా పరిష్కరించాలో, దొరికిన తాళపత్ర ప్రతులన్నీ దగ్గర పెట్టుకుని ఏ రకంగా పాఠ నిర్ణయం చెయ్యాలో విశదంగా నిర్దేశించాడు బ్రౌన్. ఈ పద్ధతిలో అతను ఇంగ్లండు, ఇటలీ, జర్మనీలలో గ్రంథాల పరిష్కరణలో అనుసరించే విధానాన్నే తెలుగు పుస్తకాలకి వర్తింపచేశాడు. ఈ విధానంలో అతను కొన్ని సొంత అభిప్రాయాలు తెలుగు భాషలో ప్రవేశ పెట్టాడు…. కానీ ములుపాక బుచ్చయ్య వసుచరిత్రకి వ్యాఖ్యానం రాసినప్పుడు బ్రౌన్ నిర్దేశించిన పద్ధతుల్ని అనుసరించలేదు. ఆయన వ్యాఖ్యానం గ్రాంథికంలో ఉంది కాబట్టి ముద్రించలేదని బంగోరె మొదలుకొని ఆరుద్ర వరకు చాలా మంది అన్నప్పటికీ, ఆ వ్యాఖ్యానం కళ్లారా చూస్తే కానీ బుచ్చయ్యగారు అనుసరించిన పద్ధతులేమిటో మనకు స్పష్టంగా తెలియవు. ఈ కావ్యాలని తిరిగి అచ్చు వేసిన వాళ్ళు ఎవ్వరూ బ్రౌన్ నిర్ణయించిన పద్ధతుల్ని పాటించలేదు.” అని ఒక పక్క చెబుతూనే, మరొకచోట “ఇది ఇలా ఉండగా, అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే బ్రౌన్ తన పండితులచేత అనుసరింప జేసిన పరిష్కరణ విధానం — అరసున్నలు, బండి-రల విషయంలోనూ, అఖండయతి విషయంలోనూ, ఇతర వ్యాకరణ విషయాల లోనూ తప్ప — వావిళ్లవారు, ప్రభాకరశాస్త్రిగారు, ఇంకా ఇతర పండితులు, పరిశోధకులు దాదాపు పూర్తిగా అనుసరించారు.” అన్నారు. అదా ఇదా?
ఈ వ్యాసచర్చ నుంచి నాకు అర్థమైనదేమంటే బ్రౌన్ చేసిన పన్లన్నిట్లో కొంత ఉపయోగకరమైనది నిఘంటువుని తయారుచెయ్యటం, అనేది. మిగిలినవన్నీ వ్యాసకర్తల దృష్టిలో తెలుగు సాహిత్యానికి నష్టం కలిగించినవే. నామట్టుకు నాకు, వ్యాసాన్ని వారు ముందు వేసిన ప్రశ్నలకి సమాధానాలుగా విభజించివుంటే follow కావటం ఇంకొంచెం తేలిగ్గా వుండేది.
నాకు నచ్చని ఒక విషయం – వారు వేసుకున్న ప్రశ్నలకి సంబంధం లేని అనేక విషయాల్ని మధ్యలో తీసుకువచ్చి నారాయణరావు గారు ఇప్పటివరకు చేసిన చాలా పరిశోధనల సారాన్నంతటినీ ఈ వ్యాసంలో చొప్పించే ప్రయత్నం చెయ్యటం. ఒకవేళ ఇదంతా “బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా?” అన్న ప్రశ్నకి సమాధానం ఇచ్చే క్రమంలో జరిగిందనుకున్నా కందుకూరి, కట్టమంచి లాటి వాళ్లని ఈ కథనంలోకి లాక్కురావటం, colonialism గురించిన ఉపన్యాసాలు, పాండిత్యప్రదర్శనకి తప్ప చెప్పదలుచుకున్న విషయానికి అంతగా సహకరించాయనిపించవు. చివరగా, కేవలం ఒక bibliography కాకుండా, ఏ ఆధారాలు వ్యాసానికి ప్రత్యక్షంగా ఉపయోగపడ్డాయో ముందుగా ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన ఉపయుక్త గ్రంథాల పట్టిక విడిగా ఇస్తే చూసేవారికి మరీ భయం కలక్కుండా ఉంటుందనుకుంటాను.
మీ పత్రికలో ప్రచురింపబడిన మనకు తెలియని బ్రౌన్‌దొర వ్యాసం పై నా స్పందనను వ్రాస్తున్నాను ప్రచురించగలరు. పై వ్యాసాన్ని ప్రదాన వ్యాసంగా గుర్తించి ప్రచురించిన సంపాదకులకు జేజేలు.
నా స్పందన రెండు భాగాలు:
1) వ్యాసం ఎంతో సంయమనంతోను పరిశోధనతోను వ్రాయడం జరిగినది జంట రచయితలు సత్యం తెలపటానికి పడిన శ్రమకు ఇచ్చిన ఆధారాలకు అభినందిస్తున్నాను. (ఆ రకమైన పరిష్కరణకి ఇంకా అవకాశం వుంది. తాళపత్ర ప్రతులు దొరికే జాగాలు, వాటిని ఉపయోగించిన వ్యక్తుల యొక్క సమాచారం మనం చాలా చోట్ల పోగొట్టుకున్నా ఇంకా చాలా సమాచారం మిగిలే వుంది.) వ్యాసంలోని పై వాక్యాలకు సంబందించి మరింత వివరంగా తెలిపి ఉంటే బాగుండేది.
2) వ్యాసం ఎంత బాగున్నా, సంపాదకులు ఎంత ప్రాదాన్యత ఇచ్చినా వ్యాసంపై స్పందనలు చూస్తే ఎంతో చింత కలుగుతున్నది. ఎంత వ్యంగ్యం, ఎంత వెక్కిరింపు. నాకు తెలిసి భారత సైనికుడ్ని భారతీయులు పొగడడం, పాకిస్తాన్ సైనికుడ్ని పాకిస్తానీలు పొగడడం ప్రకృతి అయితే భారత సైనికుడ్ని పాకిస్తానీలు పొగడడం, పాకిస్తాన్ సైనికుడ్ని భారతీయులు పొగడడం వికృతి. కానీ విశ్లేషకులు లేక విమర్శకుల తీరు నాకు అత్యంత బాధ కలిగించినది. ఏమో పాపం రచయితలను త్వరలో ఏర్పడే ఫాసిస్టు ప్రభుత్వ ప్రాపకాన్ని పొందడానికి వ్రాశారని, జర్మనీలో తిరుగు వారు కాబట్టి స్వయంగా ఫాసిస్టులని, అనలేదు. ఏ పాపం చేశారని రావణుడు సీతను చరబట్టాడు అంటే రావణుడు రోజుకు వెయ్య లింగాలకు అభిషేకం చేశాడన్నట్లు ఉంది వీరి తీరు. తెలుగు దేశంలో డప్పు వాదమని, కొప్పు వాదమని ఎన్ని వాదాలో లేక ఇజాలో ఉండవచ్చు కానీ పప్పు వాదం మాత్రం ఉండకూడదు లాగుంది (నిజంగా బ్రాహ్మణులే పండితులై ఉంటే వారి శ్రమను కష్టాలను బ్రాహ్మణుడు వ్రాయకూడదా ఇదేనా రాళ్ళెత్తిన కూలీల చరిత్ర వ్రాయడమంటే). రోగుల్ని, దొంగలని కూడా వాడుకున్నారు అంటే అందరు రాజులు అలాగే చేస్తారంటారు, మరి అందరి చరిత్రలాగే వీరి చరిత్ర కూడా వ్రాయాలిగా. ఎవరైనా స్వంతానికే చేసుకుంటారట అయితే దానినేగా చరిత్రగా వ్రాయాలి లేకపోతే లేనిది వ్రాయమనా విమర్శకుల అభిప్రాయం. హతవిథీ! ఎంత మొకాలే మినిట్ ఇచ్చినా అర్దంకాలేదా? లేక అడ్డగోలుగా వాదించాలనా? మొకాలే ప్రభావం అర్ద శతాబ్దం గడిచినా ఇంకా ఎంత బలంగా ఉన్నదో తెలుస్తున్నది.
నేను మొదటిసారిగా నా స్పందన ఈమాటకు వ్రాస్తున్నాను. నా స్పందనలో సత్యముందనుకుంటే సంపాదకులు ప్రచురించగలరు. నాకు చరిత్ర మీద ప్రేమేకాని పాండిత్యం లేనివాడ్ని.
కామేశ్వరరావు గారూ: ఇడ్డెన / ఇడ్లీ, అట్టు/ దోశ, చారు/రసం, పప్పుచారు/సాంబారు — వీటిల్లో తెలుగు మాటలేవి? కానివేవి? వాడుకలో ఉన్నవేవి? మన రోజు వారీ బతుకులో మనం తెలుగుని పెంచుకున్నామా? తుంచుకున్నామా? తిర్యక్ ప్రకంపనలు, అవిచ్చిన్న ప్రమేయములు, మితులు వంటి శాస్త్ర పరిభాషా పదాలు తెలుగును పరిపుష్టం చేస్తున్నట్టా?
సాహిత్యభాషలో నేడు ఒక ప్రముఖ శాఖయై జనబాహుళ్యం లోకి తేలికగా చొచ్చుకు పోయే సినిమా భాషను తీసుకుంటే తెలుగు సినిమాలలో సంభాషణ లైనా, పాటలైనా ఆఖరికి తెలుగు సినిమాల పేర్లు అయినా తెలుగులో ఉన్నాయనగలమా? పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు అనువాదాల విషయంలో అవి శాస్త్ర సాంకేతిక విషయాలు కానివ్వండి, ఇతరములు కానీయండి ఏమి చెప్పి / చేసి ఎవర్ని ఒప్పించగలం? ఎవరికి ఉపయోగ పడగలం? అన్న నిస్పృహ వస్తుంది. అయినా తెలుగు పిల్లలు తెలుగులొ శాస్త్రాలను చిన్నతనం నుంచే తెలుగులో నేర్చుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందనిపించక మానదు. కానీ ఏ భాష కైనా ఒక మాతృభాషగా బుద్ధిని ప్రచోదన చేసే మౌలిక లక్షణాలనేవి ఏమైనా ఉంటే తెలుగు భాషకున్న ఇటువంటి లక్షణాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయనిపిస్తోంది. ఈ విషయం గురించి శ్రీ కొలిచాల వంటి పండితులు కొంత ఆలోచన చేసి నా వంటి వారికి తెలియజెప్పాలని అనుకుంటాను.
ఇంగ్లీషునుండి తెలుగు తర్జుమా విషయమై, వాసుదేవరావుగారు మొదటి వ్యాఖ్యలో చెప్పిన మూడు కోణాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అనువాదాల విషయంలో యీ మూడూ చాలా భిన్నమైనవి. అనువాద ప్రయోజనంలోనూ, విధానంలోనూ, రూపంలోనూ కూడా వీటి మధ్య చాలా తేడాలున్నాయి. తెలుగు తర్జుమాల విషయమై నేను చూసిన చర్చల్లో బహుశా తొంభైశాతం, యీ తేడాలు గమనించకపోవడం వల్ల గందరగోళానికి దారి తీసినవే. వేమూరిగారి వ్యాసంలో కూడా నాకు ప్రధానంగా కనిపించిన లోపం ఇదే. వ్యాస ముఖ్యాంశం వైజ్ఞానికి, సాంకేతిక రంగాలలో తర్జుమా అయినా, ఇందులో చర్చించిన విషయాలూ ఇచ్చిన ఉదాహరణలు, ముప్పాతికవంతు వైజ్ఞానికేతర రంగాల గురించే.
ప్రస్తుతం వైజ్ఞానికరంగానికి పరిమితమై చూస్తే, ముందుగా అసలు తర్జుమా అవసరం లేదా ప్రయోజనం ఏమిటన్నది తప్పక ఆలోచించాలి. ప్రయోజనాన్ని బట్టే, అనువాద విధానం, దాని స్వరూపం ఆధారపడి ఉంటాయి. రెండు ప్రయోజనాలు ఊహించవచ్చు. ఒకటి వైజ్ఞానిక విషయాలు తెలుగువాళ్ళకి సులువుగా బోధపడటం. రెండు, వైజ్ఞానిక పదసంపదతో తెలుగుభాష పరిపుష్టి కావడం. ప్రాథమిక పాఠశాలల్లో వైజ్ఞానిక విషయాలను తెలుగులో బోధించడంలో ఉన్నది మొదటి ప్రయోజనం. అలాగే వైజ్ఞానికవిషయాలను సామాన్యులకు పరిచయం చేయడానికి వ్రాసే జనరంజక వ్యాసాల వల్ల కూడా మొదటి ప్రయోజనమే చేకూరుతుంది. అంచేత, వీటి విషయంలో తర్జుమా ఒక పద్ధతిలో సాగాలి. ఇక ఉన్నతవిద్యలోనూ, పరిశోధనలోనూ తెలుగుభాషను వాడడం వల్ల ఒనగూరే ప్రయోజనం రెండవది, అంటే భాషాపరిపుష్టి. దీనికి అనుసరించాల్సిన మార్గం మొదటి దానికన్నా వేరుగా సాగాలి. ప్రాథమికవిద్య, జనరంజక వ్యాసాల విషయంలో అనువాదానికి ముఖ్యలక్షణం సులభగ్రాహ్యత. నిర్దిష్టత, క్లుప్తత అంత ప్రధానం కావు. అదే ఉన్నతవిద్యలో నిర్దిష్టత, క్లుప్తత ప్రధానం. సులభగ్రాహ్యత కాదు. ఏ భాషలోనైనా చాలావరకూ వైజ్ఞానిక పదాలు తమంత తాము అర్థస్ఫురణని కలిగించేవి కావు. నిత్యవ్యవహారంలో కాస్త సమీపంగా ఉన్న భావాలకు వాడే పదాలు తెచ్చి తమకు అనువుగా వాడుకోవడమో, కొత్త పదాలను సృష్టించడమో జరుగుతుంది. అలా వాడుకభాషలోంచి తెచ్చుకొన్న పదాలకు శాస్త్రరంగంలో తమదైన ప్రత్యేక అర్థం ఏర్పడుతుంది. ఆ భాషలో ఆ శాస్త్రాన్ని అభ్యసించిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. అంచేత, ప్రాథమికవిద్య అయినా, ఉన్నతవిద్య అయినా, శాస్త్రంలోని పదాలన్నీ చప్పున అర్థమైపోవాలని అనుకోవడం తప్పు. మన భాషలో ఎంత బాగా ఇమిడిపోయాయి, ఎంత సులువుగా పాఠకులు దాన్ని గుర్తుపెట్టుకోగలరు, మొదలైన అంశాలే ముఖ్యం. ప్రాథమికవిద్యలోనూ, జనరంజక వ్యాసాలలోనూ ఆయా పదాలకు సంబంధించిన భావాలను ఎంత సులువుగా తెలుగులో బోధపరచగలం అనేదే ముఖ్యమైన విషయం.
మరి అలాంటప్పుడు ఇంగ్లీషులో ఉన్న పారిభాషిక పదాలను అలాగే వాడితే వచ్చిన నష్టమేవిటి? అన్న ప్రశ్న వస్తుంది. నా ఆలోచనకి తడుతున్న ఒక ఇబ్బంది – అప్పుడలాంటి పాఠాలూ వ్యాసాలూ ఆంగ్లపదాలతో నిండిపోయి తెలుగు భాషా స్వరూపాన్ని మౌలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు “కంటిన్యుఅస్” అనేది ఏ కోశానా ఇప్పటి తెలుగుభాషాలో ఇమడలేని పదం. ఇలాంటి పదాలు ఉన్నవున్నట్టుగా తెలుగులో విస్తృతమైతే, తెలుగుభాషా స్వరూపం మారిపోతుంది (ఎందుకంటే, ఇక్కడ మనం మాట్లాడుతున్నది ప్రాథమికవిద్య, జనరంజక వ్యాసాలూ కాబట్టి). అయితే, ప్రాథమిక విద్య పూర్తిగా తెలుగులో తెలుగు పారిభాషిక పదాలతో సాగితే ఉన్నతవిద్య మాటేమిటి? బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పటి సంగతేమిటి? అన్న మరొక ప్రశ్న వస్తుంది. ఈ విషయంలో నాకు ఏ రకమైన అనుభవమూ లేదు కాని, తెలుగులోని ప్రాథమికవిద్యకూ ఇంగ్లీషులో ఉన్నతవిద్యకూ మధ్య వారధి కట్టడం అంత కష్టమైన పని కాదని నా ఉద్దేశం. అయితే దీనికి ఒక ప్రణాళిక తప్పనిసరి. అలా లేనప్పుడే అది వాసుదేవరావుగారు చెప్పిన యిబ్బందులకు దారితీస్తుంది. ఇక ఉన్నతవిద్య విషయానికి వస్తే, అందులో తెలుగు వాడడం వెనక ముఖ్యప్రయోజనం తెలుగు భాషని శాస్త్రభాషగా అభివృద్ధి చేయడం ఒక్కటే. అయితే, ప్రాథమికవిద్యలో తెలుగు విస్తృతంగా వ్యాప్తిలోకి వస్తే తప్ప యిది అసాధ్యం. అసలంతవరకూ దాని గురించి ఆలోచించడమే అనవసరం!
చివరిగా మరొక మాట. తెలుగుభాషపై ఇంగ్లీషు ప్రభావం గూర్చి వచ్చినప్పుడల్లా, సంస్కృతభాషా ప్రభావం గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. నా దృష్టిలో ఈ రెంటినీ పక్కపక్కన పెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే, సంస్కృతం తెలుగుపై చూసిన ప్రభావం – విధానంలోనూ, స్వరూపంలోనూ కూడా ఇంగ్లీషు చూపిన/చూపుతున్న ప్రభావం కంటే చాలా వేరయినది. ఈ తేడాలను గుర్తించడం చాలా అవసరం.
1. నిత్యవ్యవహారంలో సంస్కృత ప్రభావం ప్రధానంగా కనిపించేది తెలుగులోకి వచ్చి చేరిన అక్షరాలలో (మహాప్రాణాలు మొదలైనవి). పదాలు కూడా వచ్చి చేరాయి కాని, అవి తెలుగుభాషా స్వరూపానికి అనువుగా మారి వచ్చాయి. తద్భవాలు తెలుగుభాష ఉచ్చారణకు దగ్గరగా పదస్వరూపాన్ని మార్చుకున్నవి అయితే, తత్సమాలు తెలుగు విభక్తిప్రత్యయాలతో కలిసి తెలుగులోకి వచ్చినవి. ఇంగ్లీషునుండి తెలుగులోకి వస్తున్న పదాలలో ఇలాంటి మార్పులేవీ జరగడం లేదు (ఒకప్పుడు జరిగాయి, క్రమేపీ అది తగ్గుముఖం పట్టి ఉన్నవున్నట్టుగా వాడడం బాగా ఎక్కువయ్యింది).
2. తెలుగుభాషా స్వభావానికి కొంత పరాయిగా ఉండే సంధులు, సమాసాలవంటివి కూడా తెలుగుభాషలోకి వచ్చాయి. అయితే ఇవి చాలావరకూ కావ్యభాషకు మాత్రమే పరిమితం. ఆ కాలంలో కావ్యభాష అత్యల్పవర్గానికి మాత్రమే పరిచితమైన భాష. అంచేత వాడుకభాషపై దాని ప్రభావం పరిమితం. మూలమట్టంగా తెలుగుభాషా స్వరూపాన్ని అవి మార్చేయలేదు. కానీ ప్రస్తుతం ఇంగ్లీషు ప్రభావం అలాంటిది కాదు. ఇది నిత్యవ్యవహారంలోకి చొచ్చుకొనిపోతోంది. అంచేత దీనికి భాష మౌలిక స్వరూపాన్ని మార్చేసే శక్తి ఉంది. అలాంటి సమూలపరివర్తనను మనం ఆహ్వానిస్తామా లేదా అన్నది మనం తేల్చుకోవలసిన విషయం.
1.ఒక ఇంగ్లీషు వ్యాసంలో ఈ దిగువ వాక్యం కనిపిస్తే సంపాదకులు ఒప్పుకుంటారా?
The Brahma brought the pooja saamagri into the madapam and instructed the vadhuvu and varudu to do a pradakshinam to the agnihotram. -వేమూరి
ఒప్పుకోవటానికి అవకాశం వుంది. అది పత్రికని బట్టి, వ్యాసం వస్తువు, దాని స్థాయి/ సీరియస్ నెస్ బట్టి, ఇంగ్లిష్ మాటలు కాని పదాలను – సందర్భానుసారం- అచ్చులో ఏ ఇటాలిక్స్ లొనొ కనబడేటట్టుగా ప్రకటించటానికి అవకాశం ఉంది.
2.అంబాణంకాయ పేరు కన్న హనుమాఫలం పేరు బాగులేదూ?
అప్పన్న అనే ఆయన పేరు మనకి తెలియక ఆయన అందరికన్నా కాస్త పొడుగ్గా ఉండటం చూసి ఆయనకు మనం అమితాభ్ అని పీరు పెట్టుకుని అప్పన్న కన్నా అమితాభ్ పేరు బాగు లేదూ అంటె ఎలా ఉంటుందో అలా ఉంది. మరి కొన్ని విషయాల గురించి వీలైతే తర్వాత.
ప్రసాద్ గారూ, బస్సుల్లో, రైళ్ళల్లో, విమానాల్లో పక్కపక్కనే కూర్చుని ప్రయాణాలు చేసే కాలం ఇది. క్లాస్ రూమ్స్ లో ఒకే బెంచీ మీద కూర్చుని చదువుకునే కాలం ఇది. ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్ట్ లు ప్రాజెక్ట్ పని మీదో, ఉద్యోగాలు చేసుకుంటూనో ఒకే కప్పు కింద నివసిస్తున్న కాలం కూడా ఇది. మా నాయనమ్మ చూస్తే అవ్వ! అని బుగ్గలు నొక్కుకుంటూ వాళ్లని _____ కింద జమ కట్టేస్తుంది. మా అమ్మ ఆ పిల్లల తల్లిదండ్రులని, సమాజాన్ని తిట్టుకుంటుంది. నేను పైకి ఏమీ అనను కాని లోపల ఏదో ఆలోచిస్తాను. నా పిల్లలకి అసలు అలాంటి ఆలోచనలే కలగవు. అయితే వీళ్ళు కూడా భర్త/భార్యల విషయం లో ఈగో, ఈర్షాసూయలతో నిత్యమూ ఘర్షణ పడుతుంటారు. పిల్లలని మధ్యలో నలిపేస్తుంటారు. పైగా ఆ పిల్లలు వినకూడదని పక్క గదిలోకి పంపించి మరీ వాదించుకుంటుంటారు. ఆ పిల్లల సర్వేంద్రియాలూ గోడలని దాటి వచ్చి వింటాయని, వారి చిన్ని హృదయాలు భయంతో వణికిపోతూ ఉంటాయని గ్రహించుకోరు. అయితే ఇదంతా కథకి సంబధించినది కాదు కాని (మీరన్న విషయం కూడా) కథలో అంతర్లీనంగా ఉన్న విషయం కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పాను.
ఈ కథ చదివి డాక్టర్ మహేంద్ర కుమార్ అంటారు “మేడమ్ అభినందనలు. చాలా సున్నితమైన అంశాన్ని చాలా చక్కగా fabricate చేసి అల్లారు. నిజానికి ఈ అంశం contemporary అని నాకు అనిపిస్తుంది. నేను విన్నాను, చూశాను, చూస్తున్నాను పిల్లలు కొంచెం పెద్దయ్యాక అభిరుచుల పట్ల interest పెరగడం, ఒక్కోసారి opposite genderలో ఆ అభిరుచుల వాసనలు ఉంటే వారి పట్ల స్నేహభావం పెరగడం, ఆ ఇద్దరూ వారి వారి ప్రాధమిక, కుటుంబ బాధ్యతలు, ప్రేమల పట్ల నిజాయితీగా ఉంటూనే ఒక emotional bonding కోసం, ఒక soulmate లాంటి బంధం కోసం ఏ వికృతమైన ఆలోచన లేకుండా ఉన్నారనిపిస్తుంది. మీరు answer చేసినట్లు మార్పు రావాలి. అందుకు ప్రయత్నించాలి. opposite gender స్నేహాలని నిజంగా శారీరక సంబంధంతోనే ముడిపడి ఉండవు – ఇది సమాజం తెలుసుకుంటే ముఖ్యంగా feminine genderకి విలువనిచ్చినట్లవుతుంది కూడా. చాలా bold subject ఎన్నుకున్నారు. దీని పట్ల విస్తృతమైన అభిప్రాయం రావొచ్చు”
ప్రసాద్ గారూ, (మీ ఉద్దేశం మైథిలి అనుకుంటా. పొరపాటున రాధిక అన్నారు) – మీరన్నది ఆలోచించదగ్గ పాయింటే. కాని ఇంకా ఈ రోజుల్లో కూడానా!? ఆడ మగ స్నేహం అంటే అలాగే ఎందుకు ఆలోచించడం? రోజులు మారలేదా? స్నేహాల్లో నిజాయితీ పాళ్ళు ఎక్కువవడం గమనించే రాశాను. పోనీ ఇలా మంచి మార్పు రావాలనే ఆశాదృక్పథంతో రాశాను. ధన్యవాదాలతో…
చాలా బాగుంది వేమూరి గారు. ముఖ్యంగా మీ తెలుగు వింటుంటే ఎంతో హాయిగా చెప్పలేనంత తీయ్యగా వుందండీ. మీ రచనలనీ మరియూ మీ తెలుగుని చాలా ఆస్వాదిస్తున్నామండి. కాని ఆలస్యంగా మీ రచనలు చదువుతున్నాను అందుకు కొంచెం బాధగానే వుందండీ కాని ఇప్పటికైనా మీ రచనలు చదవగలుగుతున్నందుకు చాలా సంతోషంగా వుందండి. ధన్యవాదాలు వేమూరి గారు.
“రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు ‘హీమ్’ ఒక్క హీమ్ బణువులో వందలకొద్దీ అణువులు ఉంటాయి.”
ఈ వాక్యంలో చిన్న తప్పు దొర్లిందని ఒక స్నేహితుడు ఎత్తి చూపేడు. ముందుగా ఆ స్నేహితుడికి నా ధన్యవాదాలు. భాషకీ, భావానికీ మధ్య లంకె ఎంత ముఖ్యమో కాళిదాసుని అడగక్కరలేదు, ఈ వాక్యమే చెబుతుంది. ‘హీమ్’ లో వందల కొద్దీ అణువులు లేవు, 75 మాత్రమే ఉన్నాయి అని నా స్నేహితుడు నా తప్పుని ఎత్తి చూపించేడు. “ఎన్నో” అని రాయడానికి బదులు “వందలకొద్దీ” అని అజాగ్రత్తగా రాసేను.
ఎందుకైనా మంచిదని పుస్తకం తెరచి చూసేను. నాలుగు రకాల ‘హీమ్’లు ఉన్నాయిట. ఒక రకంలో వంద దాటి ఉన్నాయి, మరొక రకంలో వంద కంTE తక్కువ ఉన్నాయి. ఒక బణువులో 116 కాని 117 కాని అణువులు ఉంటే దానిని “వందలకొద్దీ” అనకూడదు. “వంద పైబడి” అనొచ్చు. సైన్సు రాసేటప్పుడు భాషలో ‘ఖచ్చితత్త్వం’ ఉండాలంటారు, అలంకారాలకి తావు లేదంటారు.
జానీ కార్సన్ కారల్ సేగన్ ని వెటకారం చేస్తూ “బ్బిలియన్స్” అని బిని వత్తి పలుకుతూ అనేవాడు. అదే ధోరణిలో “వ్వందలకొద్దీ” అని మీరు ఎవ్వరైనా వెటకారం చేస్తే నేను భరిస్తాను. పైన ఉదహరించిన వాక్యం ఇలా ఉంటే సరిపోతుంది: “రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు ‘హీమ్.’ ఒక్క హీమ్ బణువులో 75 నుండి 117 వరకు అణువులు ఉండొచ్చు.”
ఈ తప్పుని సరిదిద్దమని సంపాదకుడిని ప్రార్ధిస్తున్నాను.
బ్రౌనుగారి సాహిత్యసేవను కేవలం వందిత్వదృష్టితోగాక యథార్థదృష్టితో పరిశీలించి వ్రాసిన ఈ వ్యాసం ఎంతో నూతనసమాచారాన్ని తెలుపుతూ ఉన్నది. ప్రపంచంలో ఏఫలాపేక్ష లేకుండ ఉత్తమకార్యాలు చేసే మహామహులు కొందఱుంటారు. ఏదో ఒక ఉత్తమమైన స్వార్థపరమైనలక్ష్యంతో గూడిన అభినివేశంతో మంచి కార్యాలు చేసేవారు కొందఱుంటారు. కొందఱు పూర్వపు జమీందారులు ఈరెండవకోవకు చెందిన వారనుట స్పష్టమైనదే. మీవ్యాసం చదివిన తర్వాత బ్రౌనుగారుకూడ ఈరెండవకోవకు చెందినవారనే అవగాహన నాకు కుదిరింది. ఒక చిన్న సవరణ. మీవ్యాసంలో తెలంగాణమునందలి సంస్థానాధీశులందఱు వెలమదొరలనే అర్థం స్ఫురిస్తున్నది. కాని తెలంగాణమునందలి సంస్థానాధీశులలో ఒక్క జటప్రోలు (కొల్లాపురము) వారు మాత్రమే రాచకొండ నేలిన సర్వజ్ఞసింగభూపాలుని సంతతివారైన పద్మనాయక (వెలమ)ప్రభువులు. మిగితా వనపర్తి, గద్వాల, గోపాలుపేట, ఆత్మకూరు(అమరచింత) ఈ సంస్థానాధీశులందఱు రెడ్డికులజులు.
నిషి: చాలా వున్నాయి నచ్చిన వాక్యాలు! వాక్యాలే కవిత్వం కాకపోవచ్చు కాని, ఎందుకో ముందు వాక్యాల దగ్గిరే ఆగిపోతాను. ఇదిగో, ముందు ఇక్కడ ఆగిపోయాను:
భద్రతలూ భరోసాల బరువు మాటలేమో కానీ
నాకోసమే మౌనంగా వెలిగే స్థిమితానివి నువ్వు
తరవాత మళ్ళీ మిగతా పోయెమ్ మొదటి నించీ చదువుకుంటూ వెళ్లాను. కవిత్వం ఫిలాసఫీ చెప్పడం నాకు అట్టే నచ్చదు. మీరు ఫిలాసఫీ చెప్పరు కానీ, కాసేపు ఆ తాత్విక ఛాయలో నిలబెడ్తారు చదువరిని తెరువరిని చేసి!
“అలాగే సంస్కృత భాగవతంలో రాసక్రీడల శ్లోకాలు చదివిన వారికి ఆ పుస్తకం మీది ముఖచిత్రం అంతా చోద్యంగా అనిపించదు. మచ్చుకు ఈ శ్లోకం అర్థం తెలుసుకోండి:
నద్యాః పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకమ్…”
ఈ వ్యాసం చదువుతున్నానండి. అన్ని సంస్కృత శ్లోకాలకు అర్ధం చెప్పిన వారు, ఈ శ్లోకం అర్ధం మమ్మల్నే తెలుసుకోమన్నారు. ఎలాగండీ తెలుసుకోటం? కృష్ణుడొచ్చి చెపుతాడా?
ఇంతకు ముందోసారి విశ్వనాథ సత్యనారాయణ ఇలానే చేశారు. వసుచరిత్ర కావ్యం, విశ్వనాథ సాయంతో చదువుకుంటున్నప్పుడు, ఆ పుస్తకం మొదట్లోనే ఒక పర్వతం ఒక నదితో ప్రేమలో పడుతుంది. అక్కడి ఒక సన్నివేశం, కవి చమత్కారం, నే చెప్పేది కాదు, ఎవర్నైనా సంప్రదించి తెలుసుకోమని వి.స., ఆదేశం ఇచ్చారు. అది విశ్వనాధ లాటి పండితుడు చెయ్యాల్సిన పనేనా? ఎవరిని వెళ్లి అడగనండీ నేను, ఈ కధలో విషయమేంటి అని, ఇంటింటికీ వెళ్లి తలుపు కొట్టి అడగనా? విశ్వనాథ అంత విపులంగా, రసవంతంగా చెప్పే రచయిత, చెప్పకపోతే ఇంకెవరు చెపుతారు. ఏదో నా ఊహకు తగ్గట్టు ఊహించుకున్నా. అది తప్పో ఒప్పో చెప్పే గురువులేరీ?
అందుకని, ఈసారి ఇక్కడే అడుగుతున్నాను. ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువమందో, పై శ్లోకానికి అనువాదం, దయతో, తెలుగులోగాని, ఇంగ్లీషులో గాని “ఈమాట” పత్రికలో ఇస్తారా. అలాగే, ఈ పుస్తకం అట్ట మీది వర్ణ చిత్రం గురించి కూడా, తెలిసినవారు వివరాలు ఇవ్వండి. ఈ పెయింటింగ్ నాకు మహా ఆకర్షణీయంగా ఉంది.
లైలా
Ps: Isn’t it time to give page numbers to the opinions on a writing in eemaata? Looks like scrolling days are over for opinions. This e-Magazine needs to make browsing opinions, just as efficient as browsing articles. Who knows what gets read more in the long run?
మీరన్న విషయాలన్నీ నిజమే. నేను ఇంగ్లీషులో రాసేటప్పుడు ఆ రాతలో తెలుగు మాటలు వాడను. అలాగే తెలుగులో రాసేటప్పుడు ఇంగ్లీషు మాటలు వాడబుద్ధి కాదు – తప్పని సరి పరిస్థితులలో తప్ప. అది నా రాతకి “ట్రేడ్ మార్క్” అనుకొండి.
పోతే, బల్లి తోక విషయానికి వద్దాం. బల్లి తోకకి దారం కడితే ఆ తోక తెగిపోయి ఆ బల్లి పారిపోవచ్చు. ఈ దృగ్విషయం నిజమే కావచ్చు. కనుక ఒక బల్లి తోకకి దారం కట్టి దాని చేత విషం కక్కించడం అన్నది మూఢనమ్మకం అవుతుంది కదా. పైపెచ్చు నా పరిశోధన ప్రకారం బల్లి చొంగలో విషం ఉంటుందని ఎక్కడా నిర్ధారణ కాలేదు. అదీ మూఢ నమ్మకమే. అందుకనే బళ్లారి ఆసుపత్రిలో వైద్యులు రామయ్యగారు చెప్పిన ఈ కథకి విలువ ఇవ్వకుండా వారి వైద్యం వారు చేసుకుపోయారు.
హోమియోపతీ మందులు పని చేస్తాయన్న నమ్మకమూ మూఢనమ్మకమేనేమో. తెగించి చెప్పలేను. నా స్వానుభవంలో అవి పని చేసేయి – కాని పెద్దలంతా అది కేవలం “ప్లసీబో” అని నా మూఢ నమ్మకాన్ని కొట్టి పారేసేరు. నేను గతంలో రాసిన “పంటికింద పోక చెక్క” అనే కథలో ఒక జన్యు రోగానికి మందు లేదని తెలిసి కూడ ఒక హొమియోపతీ వైద్యుడు పంచదార మాత్రలు ఇచ్చి లక్షణాలకి ఉపశమనం కలుగజేస్తాడు. మందు లేని జాడ్యానికి మందు ఇప్పించి వైద్యం చేయించే ధైర్యం నాకూ లేదు – ఎంత కథలో అయినా సరే!
బల్లి ఫలితం కథలో మూఢ నమ్మకాలు చాల ఉన్నాయి. సీతమ్మగారు గోపాలకృష్ణని పసుపు తినమని సలహా ఇవ్వడంలో శాస్త్రీయత ఏది? పసుపు తినడం మంచిదని ఇప్పుడు అంటున్నారు కాని, పసుపు తినడానికీ మలేరియాని అరికట్టడానికీ మధ్య సంబంధం ఉందో లేదో ఇప్పటికీ నాకు తెలియదు. ఏది ఏమయితేనేమి, ఈ కథలో చెప్పిన సంఘటనలు అన్నీ నిజంగా జరిగినవే – ఊళ్ల పేర్లతో సహా. వ్యక్తుల పేర్లు మార్చేను. నా ప్రయత్నం అంతా “నిజం చెప్పడం” మీద కేంద్రీకరించబట్టి కథనం దెబ్బ తిన్నా తిని ఉండవచ్చు.
ఎంతో శ్రమతో ఎన్నో వివరాలతో అందించిన వ్యాసానికి, మిత్రుడు సురేశ్ కు చాలా కృతజ్ఞతలు.
రెండు మూడు అభిప్రాయాలను పంచుకోవడం.
“హిందూమత చరిత్రలో ప్రత్యమ్నాయ కథనాలకు ఆస్కారం లేదా” అన్న శీర్షికే కొంత స్పష్టపరుచుకోవాలి.
“హిందూమతం” అన్నదే సనాతనధర్మానికి కొత్త మాట, అతకని మాట. సనాతన ధర్మంలో శైవ మతం ఉంది, శాక్తేయ మతం ఉంది, వైష్ణవ మతం ఉంది అని అంటాం. కాని అదే కొత్తమాటను వాడుతూ “హిందూ మతం” లో శైవ మతం ఉంది, శాక్తేయ మతం ఉంది, వైష్ణవ మతం ఉంది, అని అనడం ఏదో అతకని మాటల గుంపు లాగ ఉంటుంది. సరే, సనాతన ధార్మాన్నే ఇవ్వాళ హిందూ “మతం” అంటున్నాం అనుకుంటే, “మతం” అన్నది కూడా విచారించుకోవాలి. “మతి”కి సంబంధించిందే మతం. ఇప్పటి తెలుగులో సైతం “అభిమతం” అని, ఫలానాది ఆయన మతం లెండి, అని, అభిప్రాయానికి “మతం” పర్యాయపదంగా వడడం ఉంది. మరి అటువంటి “మతం” కు చరిత్ర ఏమిటి అని ప్రశ్నించుకుంటే, మతులున్నప్పటినుంచీ చరిత్ర అనిపిస్తుంది కదా. సరే, “సనాతనధర్మాన్ని ఆచరించే మతుల యొక్క చరిత్ర” అని అనుకుంటే, చరిత్రలో “కథనాల” ఆస్కారం అర్థం కాదు. చరిత్ర అంటే కథనం కాదు, కథనం చరిత్ర కాదు. మరి ఈ హిందూమత చరిత్రలో కథనాలకు ఆస్కారం అసంబద్ధంగా కనిపిస్తుంది.
Wendy Doniger గారు పద్యం ఉటంకించారో లేదో కాని, పోతన పద్యం చూడగానే సంతోషం కలిగింది.
ఎబ్బెట్టుగా ఉన్న ముఖ చిత్రానికి పోతన పద్యం సమర్థనా కాదు, సమాధానమూ కాదు. ఆ పద్యం తరువాతనే పోతన భాగవతంలో
“ఇట్లు భగవంతుండైన కృష్ణుం డాత్మారాముండయ్యును గోపసతులెంద ఱందఱకు నందఱై నిజప్రతి బింబంబులతోడం గ్రీడించు బాలు పోలికె రాసకేలి సలిపిన” అని ఉంటుంది.
“ఈ విధముగా షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీ కృష్ణమూర్తి ఆత్మలయందు క్రీడించునట్టి పరమాత్ముడుగానుండియు, ఎందఱు గోపికాస్త్రీలో అందఱు కృష్ణులుగా తాను ఏర్పడి, సొంత నీడలనే చూచి ఇతర బాలురు అని అనుకొని ఆడుకొనునట్టి బాలురవలె, రాసక్రీడ చేయగా” అని తాత్పర్యం. అంతటి భావాన్ని ఇంతగా అందించిన పోతన వర్ణనకు Wendy గారి వట్టి రెచ్చగొట్టే తప్పుదోవ పట్టించే ముఖచిత్రానికి ఏ పోలిక లేదు. ఆ పాటి ముఖచిత్రానికి అంత పరిశోధనల పరిశ్రమల అవసరం లేదు. సరిగ్గా అర్థం చేసుకోవడనికే పరిశోధనలు, ఉడుకెత్తించడానికి కాదు.
అట్లాగే వేదాలు అపరవిద్యలు అని, వాటికి అవతల ఉన్న వేద-అంతంలోని, అక్షర బ్రహ్మ గూర్చి తెల్పేదే పరా విద్య అని ముండకోపనిషత్తు మంత్రం అన్నంత మాత్రాన వేదాలను నిరసించినట్టు కాదు.
జ్ఞానం గురించి ఒక మాట. Academic డిగ్రీలు, పరిశోధనలు ఆధ్యాత్మిక జ్ఞానానికి అవరోధాలు కాకపోయినా, ఏ మాత్రం అవసరం లేదన్నదే భారతీయ- “హిందూ” కాదు- “భారతీయ దార్శనిక సాంప్రదాయం” విశిష్టత. వేమన ఎంతో అందంగా అన్నట్లు
స్వానుభూతిలేక శాస్త్రవాసనలచే
సంశయంబు విడదు సాధకునకు
చిత్రదీపమునకు చీకట్లు పోనట్లు
విశ్వదాభిరామ వినుర వేమ ||
అందుకే, డిగ్రీలు కాదు, కనీసం kindergarten పోని అయిదేళ్ళ నచికేతుడి ప్రశ్నలకు చెప్పిన కఠోపనిషత్తు నుంచి, కబీర్ నుంచి, అక్షరాస్యతలేని రామకృష్ణ పరమహంస, డిగ్రీలులేని రమణ మహర్షి, ఇటీవలి పాన్‌డబ్బా వాలా నిసర్గదత్త మహరాజ్ దాకా – ఎందరివో మాటలు, చేతలు వెలుగులీనుతునే ఉన్నాయి.
చివరిగా, ఎట్లా రాసినా, ఎట్లా చిత్రించి అచ్చేసినా, పుస్తక నిషేధం, రోగాన్ని మించి బలహీనపరిచే మందు.
నిషేదిస్తే ఇంకొకరు, ఇంకో పేరుతో ఇటువంటిదే ఇంకోసారి మళ్ళీ రాయొచ్చు. మళ్ళీ కథ మొదటికే. కాని, పుస్తకాన్ని సమర్థవంతంగా విశ్లేషించి, విమర్శించి, లోపాలను ఎత్తి చూపితే, విషయ ఆవిష్కరణకు, సత్యాన్వేషణకు, సనాతన ధర్మ లక్ష్యానికి మేలే కలిగేది అనిపిస్తుంది.
==============
విధేయుడు
_శ్రీనివాస్
ఈమాట వారు ఆనంద్ గుడ్లురు గారి వ్యాఖ్యను ఎలా ప్రచూరించారో వారికే తెలియాలి. ఆయనకి హిందు సంస్కృతి అన్నా, చర్చల అన్నా ఎంత గౌరవం ఉందో, ఈ క్రింది వ్యాఖ్య చాలు అర్థం చేసుకోవటానికి. *మొన్న ఆయనెవరో లండన్ల బాపనాయన, ఆయన టివిలో హిందూ సంస్కృతి తోలూ తొండం అని ఒకటే ఊదర,ఇప్పుడు మనం గూడా అదే దారిల పోదాం. బొమ్మలు చూడకుండ కాల్చేద్దాం, సినిమాలు జూడకుండనే రాళ్ళేద్దాం, పుస్తకాలు చదవ్కుండనే అరుద్దాం. తిరిగి ఏందిరా అయ్యా ఆ అఘాయిత్యం అంటే, నన్ను తాలిబనంటవా ? మంచికి గాని, చెడ్డకు గాని విమర్శ తీసుకోడం చాతకాని ఏబ్రాసోళ్ళం మనం. మన అజ్ఞానమె మనకు రక్ష. గురివింద గింజలం గద.*.
ఈ మాటవారు గమనించవలసిందేమిటంటే, రచయిత రాసిన దానిని తప్పులు పడుతూ, ఇతనికేమి తెలుసులే అని ప్రశ్నించి, రచయిత రాసిన దానిని ఖండిస్తూ, వ్యాఖ్యలు రాసేవారు తమ తెలివితేటలు ప్రదర్సించటానికో లేక టైం పాస్ కో వచ్చి ఇక్కడ వ్యాఖ్యలు చాలామంది రాయటంలేదు. ఆనంద్ గుడ్లురు గారి వ్యాఖ్యలు ఇప్పటివరకు జరిగిన చర్చ మొత్తం ఎగతాళి చేసే విధంగా ఉన్నాయి.
రాజీవ్ మళోత్రా పేరొచ్చినాది గదా అని… ఆయన చెప్పేది చాలా కాలం వినుకున్నోణ్ణి ఓ రెండు ముక్కలు చెప్తా నాకు తోచింది.
రౌడీ మూకలు జేసే గలాటాలకీ, ఉద్యమాలకీ తేడా ఉళ్ళా? ఎందుకుళ్ళే, సుబ్బరంగా ఉన్నాది. ఏందబ్బా ఆ తేడా అంటే సిద్ధాంతం అని గదా. సైద్ధాంతిక నిబద్ధత అని గాన ఊతం ఉంతే చేసే అల్లర్లకి ఒక ప్రిస్టేజి వస్తాది. సమస్య ఒకటున్నాది, అది ఎంది, ఎందుకున్నాది, కారణాలేంది – దాని మీద తిరుగుబాటు జేస్తే అది ఉద్యమం అవుతాది. కానీ, లేని సమస్యను చూపించి గాని, చిన్నది పెద్దది జేసి గాని, కూడ ఉద్యమం లేపచ్చు, కాని అది ఎంతోకలం బతకుతాదా? అట్ల జేసేది స్వార్థం కోసరం గాని నిజం ఉద్యమం కాదు గదా. స్వాతంత్ర్యోద్యమం గానీ, తెలంగాణా ఉద్యమం గానీ, ఇంకోటింకోటి గానీ. ఐతె ఇందులొ ఒక తిరకాసున్నాది. తప్పుడు కూతల మీన, అఘాయిత్యం జేసి, అబద్ధాలు చెప్పి, మైకు పట్టుకుని ఊదరగొట్టి తిమ్మిని బమ్మిని జేస్తే అది లాహికి ఐన పద్ధతి గాదు గదా. పునాది దిట్టంగా ఉండాల. చూడ్డానికి దిట్టంగ కనిపిస్తే చాలదు గాదా.
రాజీవ్ మళోత్రా. ఆయన హిందూ సంస్కృతిని తెల్లొళ్ళ నుంచి వాళ్ళ పుస్తకాల నుంచి రక్షిచేటందుకు కష్టపడుతున్నడు. అదే మాట ఆయన ఆయన భక్తులు చెప్పుకుంటరబ్బా. కానీ ఆయన అంతా నిజమే చెప్తున్నడా లేదా? ఎంత నిజం ఉండాది, ఏది డబ్బా అని అది తెలుస్కోని గదా ఆయన మాటలు నమ్మాల్సింది. అది ల్యా. ఆయన మనోడు గాబట్టి, ఆయన మనం గొప్ప, మనం నష్టపోతున్నం అని చెప్తే అది మనకుళ్ళా చల్లగుంటుంది. మనకు నిజం నమ్మే ఓపిక ఉండాదా? యాడికి, మొన్నటికి మొన్న, మీ దేశంలో ఆడోళ్ళకు రేపులైతున్నై అని పేపర్లు రాస్తె, ఏం, మీ దేశంలో మాత్రం గాటల్లా? అని దబాయించుకున్నోళ్ళం.
రాజీవ్ మళోత్రా అనే ఆయన చేస్తుండదేంది? ఇంటర్నెట్ల, పుస్తకాలల ఇంకెక్కడ బడితె అక్కడ ఊదర మన సంస్కృతిని ఈ తెల్లోల్లు పుస్తకాలు రాసి అవమానం చేస్తున్నారు అని, వాళ్ళు చెప్పేది వినిపించుకోడు.
వింటే ఈయన అఘాయిత్యం మనకు తెలుస్తాది కదా. ఈయన అన్నదానికి క్రిపాల్ అనే ఆయన ఒక ఉత్తరం రాశినాడు. దానికి ఉలుకూ పలుకూ ఉన్నాదీ. లేదు. మీరే చదివి తేల్చుకోండి.
వెండీని నిలదీసి పుస్తకాలల వాక్యాలు మార్చుకుంటదా? అని అడిగేటోళ్ళు రాజీవ్ మార్చుకుంటడా అని అడిగితే ఏంది చెప్పేది? కుంటి సాకులు. మొన్న ఆయనెవరో లండన్ల బాపనాయన, ఆయన టివిలో హిందూ సంస్కృతి తోలూ తొండం అని ఒకటే ఊదర. ఏందిరా అంటే ఆయన చెప్పిన తప్పుడు కూతలన్ని రాజీవ్ మళోత్ర దగ్గర ఇన్నవే. ఆ పెద్దమనిసి ఒక్క పుస్తకం చదివి ఏంది నిజం అని చూసుకున్న పాపాన బోతే ఒట్టు. మనల్ల కొంతమందికి, మన మతం అంటే పూనకం వస్తాది. వాళ్ళకి గావల్సింది నిజం గాదు. వాళ్ళనుకున్నట్టు ఉండేదే నిజం. దబాయించో, బెదిరించో మనమే గెలవాలె. అదీ ముఖ్యం.
క్రిపాల్ రాసినదాంట్లో ఉండ విషయాలకు, ఇక్కడ ఈమాటలో ఏసిన ప్రశ్నలు ఎంత పోలికలున్నయో నేను చెప్పకర్లా. ఇప్పటికి ఇదే రకంగా గొంతు పెంచుకుని అరిచి ఎవడేం చెప్పినా ఇనకుండానే ఉంటుళ్ళా, మనం? ఇయ్యన్ని ఎవడిక్కావల, తప్పుకో ఎహే, అనుకుంటిరా, అదీ సరే. పోయి ఆడపిలకాయలు జీన్స్ యేసుకున్నా, మన పిల్లగాళ్ళు వాళెంటిన్స్ డే జర్పుకున్నా పోయి వాళ్ళను కొట్టి రండి. ఒకప్పుడు బొట్లు పెట్టుకున్న మనోళ్ళని అమెరికాలో ఇట్లనే జేశినారు గాదా, ఖలిస్తానోళ్ళు ఆడోళ్ళని చీరలు కట్టుకోవద్దని కొట్టినారు గదా. ఇప్పుడు మనం గూడా అదే దారిల పోదాం. బొమ్మలు చూడకుండ కాల్చేద్దాం, సినిమాలు జూడకుండనే రాళ్ళేద్దాం, పుస్తకాలు చదవ్కుండనే అరుద్దాం. తిరిగి ఏందిరా అయ్యా ఆ అఘాయిత్యం అంటే, నన్ను తాలిబనంటవా అని ఎనక్కి తిరిగి దబాయిద్దాం. మనం గొప్ప అని ఎవరు చెప్తే వాళ్ళ మాటలే ఇనుకుందాం. నేను చెప్పేది అబద్ధంగా ఉన్నాదీ? ఈమాటోళ్ళు గాన, పుస్తకం చదివినోడే అబిప్రాయాలు రాయాల అని అంటే, 110 గాదు 10 గూడ ఉండేవి గాదు. పైన నేంచెప్పిన లింకు చూడకుండనే దాని మీద ఇక్కడింకో వంద కామెంట్లొస్తే గాన మనకేమి ఆశ్చర్యం అక్కర్లా. పదిమంది పదిసార్లు అరిస్తె అబద్ధం నిజం అవుతాది కదా. తాడును జూపించి పాము పాము అని పదిసారిస్తే అందరూ నమ్ముతుళ్ళా? ఇంటర్నెట్ పుణ్యమా అని ఎరిగి లేవలేని ప్రతోడూ పండితుడే. అందరూ ఫేస్బుక్ మేధావులే. చదువుకోడం ముఖ్యం గాదు, నేను చదువుతున్నా అని ముందు పదిమందికి తెలియాల. అదీ ముఖ్యం. స్పాము రాసేవాడొకడుండాలే గాని, దాన్ని ముందెనకలు చూడకుండా ప్రతోడికి ఫారర్డు చేసేటోళ్ళకేం తక్కువుండాది.
కాని, ఒక్కటి జెప్పేదీ? మనల్ని మనం తగలబెట్టుకోని బూడిద జేస్కునేదానికి ఇంకెవరో తెళ్ళోడొచ్చి చేయెయ్యకర్లా. వాళ్ళొచ్చి పుస్తకాలు రాయక్కర్లా. ఆపని మనకు మనమే మరింత సుబ్బరంగ జేస్కుంటున్నాం. వాదించేదానికేందబ్బా, ఎంతైన పెట్టుకోవచ్చు గడా. దానికి పోంతేది, అంతేది? అసలు నిజం ఎతుక్కుంటే మనందరికీ పొద్దు పోయేదెట్లా? మంచికి గాని, చెడ్డకు గాని విమర్శ తీసుకోడం చాతకాని ఏబ్రాసోళ్ళం మనం. మన అజ్ఞానమె మనకు రక్ష. గురివింద గింజలం గద.
అన్నయ్య గారూ మీరు చాలా గంభీరంగా వివరించారు. మీరు చెప్పిన పైన విషయాలలో (మొదటి రెందు పారాలలో) నాకు disagreement లేదు. చాలా చక్కగా క్లుప్తం గా వివరించారు. నేను మీతో ఏకీభవిస్తాను. ఇక్కడ మీ వాదనకి నాకు భేదం లేదు.
ఇక పోతే నాకు, మీకు (రచయిత గారికి) ఆ రెండో విషయమై disagreement. పైన నేను ముందే చెప్పినట్టు, నాగరాజు గారు వివరించినట్టు ఆ ముగింపు కి తగ్గ సాక్ష్యాలు లేవు. హిందుత్వా అంటే ఏమిటో నాకు తెలీదు (సవార్కరు వ్రాసినది నేను చదవలేదు). ఐతే ఆయన హిందుత్వా అంటే మనమేదో ఒకే దేవుడు, ఒకే పుస్తకం అని అన్నాడాని నేను అనుకోను, పైగా అలా అన్నాడాని చెప్పడానికి ఎక్కడా విశ్లేషణలు నాకు తారసపడలేదు. నా వైపు నుంచి అసలు మూల కారణమేమిటో కూడా పైన చెప్పాను.
పోనీ for argument sake బాత్రా గానీ, వెండీని వ్యతిరేకిస్తున్న మిగితా వారు (రాజీవ్ మల్హోత్ర కానీ, లేక ఆవిడ చేసిన అనువాదాల మీద తప్పులు చూపించిన రఘోత్తమ రావు గారు కానీ), వీళ్ళెవరూ కూడా మీరుటంకించినట్టు చెయ్యట్లేదే? పైగా పోనీ సంఘ పరివారే హిందుత్వా వాదులు అని ప్రస్తుతానికి అనుకుందాం. వీళ్ళు కూడా ఒకే దేవుడు, ఒకే పుస్తకం, ఇదే నిజం అని నొక్కి వక్కాడించినట్టు కూడా ఆధారాలు లేవు. ఇలా చేస్తున్నారు అన్నవి అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడే మీకూ మాకూ (శ్రీరాం గారిని కలుపుకుని) disagreement. వీళ్ళెవరూ కూడా హుసైన్ విషయం లో శివసేన మూకలు చేసినట్టు ఆధారాలు లేవు. ఇక్కడ కేసుకు ముందు వాగ్వివాదాలు, సంవాదాలు జరిగాయి. ఒప్పుకోనందుకు కేసు వెయ్యడం జరిగింది. నిజానికి బాత్రా గారి కేసు లో కొన్ని విషయాలు హాస్యాస్పదం గా ఉన్నా ఎక్కడా “చాందస” ధోరణి అగుపడట్లేదే? ఈ ముక్క కూడా నేను పైన చెప్పాను.
నా గొడవంతా ఏమిటంటే (మీరన్నట్టే) సెక్యులారిజం ను, ఇలా “చాందస వాదమును” మనం ఆంగ్లం నుంచి తెచ్చిపెట్టుకున్న భావజాలం. ఇది ఒక గంభీరమైన సమస్య. దీన్ని ఇంకా offline చర్చించుకోవచ్చు. వ్యాసానికి పెద్దగా సంబంధం లేదు.
ఒక thought experiment చేసామనుకోండి. ఆంగ్లం తెలీని వాడు బాత్రా గారి హింది పెటీషను చదివితే ఒక వేళ ఎక్కడా “fundamentalism” అని మనం ఈ మధ్య అర్ధం వచ్చేలా అనుకోడు. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టు ఎక్కడా అది గోచరించట్లేడు.
ఐతే కొందరి సంఘ పరివారు లోనే కాదు కొందరు academicians కూడా మీరన్నట్టు మనది కూడా “Monotheistic” అని ఏదో వారితో సరితూగాలనే ఆత్మన్యూనతతో అనటం వాస్తవం. ఆ ఆత్మన్యూనత ను పోగొట్టుకోవాలంటే వెండీ లాంటి (so far unchallenged academic from insiders) ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. దానికి రోజులు వస్తున్నయనిపిస్తోంది. ఈ ఆత్మ న్యూనత మనకి పేదరికం నుంచి, పరపాలన పీడితులవటం వలన అని నా అభిప్రాయం. దీనికి ఆధారలను పరిశీలిస్తే empirical గా గమనించగలం.
ఈ పుస్తకం పుణ్యమా అని ఇప్పుడు ఒక సామన్యుడు (only in comparison to Wendy’s lofty degrees) కూడా చదివి విశ్లేషించగలడు. అందుకు ఈ పుస్తకానికి వచ్చిన పబ్లిసిటీ మంచిదే అనిపిస్తుంది. నాకు అబధ్ధపు, అసంబధ్ధపు, పక్షపాతపు విస్లేషణలతోనే చిక్కు…
@నాగరాజు గారూ: మీ విమర్శ చాలా బావుందండీ…Good writing.
@సతీష్ గారూ: నమస్కారం.
మీరు ఇలా విషయం లేకుండా, ఏవేవో ఊహించేసుకుని, (metaphor అంటే ఏమిటో తెలీకుండా – లేదా తెలీనట్టుగా) రాస్తూ ఉంటే నేను చర్చించలేను…చర్చించను.
వ్యాసానికి సంబంధించినవి, మిగితా కొన్ని చర్చనీయాశమైనవి చెప్పకనే చెప్పాను. మీ ఊహలతో, ఆపోహలతో నాకు సంబంధం లేదు. ధన్యవాదాలు. మన్నించగలరు.
చివరగా ఒక్క మాట: నాకు పేదరికం (దానికి కారణం అర్ధం చేసుకోవడం, ఆ పై నిర్మూలనకి నా వంతు కృషి ఏదో నేను చెయ్యడం) తోనే సంబంధం. పేదరికానికి కులం, జాతి, భాష తో సంబంధం లేడు. అందరినీ ఒకె కర్కశం తో వేధిస్తుంది, అందరినీ ఒకేలా కబళిస్తుంది. ఆ విధం గా పేదరికానికొక్కదానికే అస్మదీయభావాలు ఉండవు. అందుకే పేదరికం తో నే నాకు స్నేహం, శతృత్వం కూడా. కాబట్టీ మీరు ఏవేవో ఊహించుకుని, అనవసర ప్రసంగాలు చెయ్యడం సమయం వృధా చేసుకోవడమే.
డానిగర్ పుస్తకంపై బాత్రా అభియోగాలు అర్థవంతంగాలేవని నిరూపించడానికి ఈవ్యాసంద్వారా రచయిత చేసిన ప్రయత్నం బావుంది. కానీ, ఒక లాయర్లా ఒక్కో అభియోగానికి సమాధానం చెప్పినట్టుగా కాకుండా, డానిగర్ పుస్తకంపై ఒక సమగ్రమైన సమీక్షరాసుంటే, పుస్తకం చదవని నావంటి పాఠకులకి ఇంకా ఉపయోగంగా ఉండేదేమో!
సురేశ్ ఈ వ్యాసంలో డానిగర్ పుస్తకంపై తన అభిప్రాయాలు, ఆయన ఉద్దేశంలో బాత్రా అభియోగాలు ఎందుకు హాస్యాస్పదంగా ఉన్నాయో పాఠకులముందుంచటం అనే పరిధిని దాటి మరెన్నో విషయాలు ప్రస్తావించారు.
1. ప్రత్యామ్నాయ కథలకి అస్కారం ఉండాలి అనుకునేటప్పుడు, అసలైన, ప్రధానమైన సంప్రదాయం ఒకటంటూ ఉండాలి కదా, ఉందని ఒప్పుకోవాలి కదా? ఆ సంప్రదాయం పిల్లలని నిద్రపుచ్చడానికి తప్ప మరిదేనికి పనికిరాదని తేల్చేకా, ఇంక ప్రత్యామ్నాయాల గురించి ఆరాటం ఎందుకు? ఆ ప్రత్యామ్నాయాలే అసలైన, విలువైన చారిత్రక రచనలని వాదిస్తున్నప్పుడు, పక్కకి నెట్టబడుతున్న ప్రధానమైన సంప్రదాయం కొంత తిరుగుబాటు దోరణి ప్రదర్శించటం సహజమే కదా?
2. చారిత్రక దృష్టితో ఈ విషయాలని చూడాలని వాదించిన రచయిత కొన్ని విషయాలలో చారిత్రక దృక్పథం ప్రదర్శించినట్టుగా నాకు అనిపించలేదు. ముఖ్యంగా:
అ. సిద్ధాంత చర్చలు, వాదవివాదాలతో భారతీయ తాత్వికత చరిత్ర అంతా నిండి ఉంది అని చెప్పడానికి ఏవో కొన్ని శ్లోకాలని ఉదాహరించడం ఎలా ఉందంటే, యత్రనార్యంతు పూజ్యంతే శ్లోకం కోట్ చేసి, భారత సంస్కృతిలో మహిళలకి ఎంత గొప్పస్థానం ఉందో ఊదరగొట్టే ఇంటర్మీడియల్ పరిక్షల్లో రాసిన వ్యాసంలా ఉంది. రచయిత భారత సంస్కృతిలో ‘డిబేట్’ గురించి చారిత్రకమైన ఆధారాలతో వాదించలేదు (ఉదా: న్యాయమతస్తులకి – బౌద్ధులకి మధ్య కొన్ని వందల సంవత్సరాలపాటు నడిచిన వాదనలు, అద్వైతులకి-బౌద్ధులకి మధ్య జరిగిన వాద/ప్రతివాదాలు మొదలైనవి.) ఈ వ్యాసంలో ఇదొక లోపం అని ఎందుకంటున్నానంటే, రచయిత హిందుత్వ-వాదులవల్ల, ఎంతో విలువైన ఈ సంప్రదాయం నాశనం అయిపోతోందని వాదించారు. కాని అందుకు తగ్గ సరంజామా ఈ వ్యాసంలో నాకు కనిపించలేదు.
ఆ. రచయిత ఒక వ్యాఖ్యలో, మధ్వాచార్యులు, శంకరుల వ్యాఖ్యానాలన్నీ సంస్కృతభాషలో ఒక పదానికి, సమాసానికి ఎన్నో అర్థాలు చెప్పగలిగే సౌలభ్యాన్ని వాడుకుని చేసే ద్రావిడ ప్రాణాయామాలే అని వాటన్నిటిని కొట్టిపడేశారు. సురేశ్ భగవద్గీతకి ఒక కొత్త వ్యాఖ్యానాన్ని రాయాడానికి పూనుకుంటే అలాంటి వాదనని ఎంచుకోవడంలో తప్పులేదు, కానీ చరిత్రకారుడికి అటువంటి సౌలభ్యంలేదు. చారిత్రక దృక్పథంతో చూడాల్సి వస్తే – “In the Indian Tradition, multiple interpretations of a text based on poetic-interpretations, and argument exploiting the inner, flexible structure of the Sanskrit Language are accepted and integral to the tradition” అని మాత్రమే చెప్పుకోవాలి గదా? వాటిని కొట్టిపడేస్తే ఎలా?
3. డానిగర్, పాశ్చాత్య-పక్షపాతం తన రచనలో చొరబొడే ప్రమాదం ఉందని ఒప్పుకున్నంత మాత్రాన, అది చొరబడలేదని చెప్పలేం కదా? భారతీయ సంప్రదాయలని, సయ్యద్ ఓరియంటలిజంని క్షుణంగా ఎరిగిన సురేశ్, డానిగర్ పుస్తకంలో ఈ పక్షపాతం ఏవరకూ ఉందో సమీక్షించి ఉంటే బాగుండేది.
4. వ్యాసం చివర్లో రచయిత, హిందుత్వవాదం వల్లే హిందూమతానికి ప్రమాదం అనే ముగింపుకి కావాల్సినంత ఆధారాలనిగానీ, “సోషియలాజిల్ ఆర్యుమెంటు”నిగాని ఈ వ్యాసంలో చూపించలేదు. పబ్లిషింగ్ చరిత్రని అధ్యయనం చేసిన వ్యక్తిగా, కేవలం ఇటువంటి చెదురు-మదురు వివాదాల ఆధారంగా ఇంత పెద్ద ప్రమాద సూచికలని ఎగరెయ్యలేం అని నా అభిప్రాయం. ఎందుకంటే..
There is a significant difference between how an academic publisher like Chicago University Press and a general publisher such as Penguin approach publishing.
Academic publishers generally don’t do much marketing since their main distribution channels are university and other academic libraries.
But, for a publishing house like Penguin, marketing and sales constitute large chunk of the overall cost.
So, if they get easy publicity, they will grab it with both hands. If a book can become a controversy, they will do everything in their power to make it so, they would love if somebody goes to court and tries to get a ban on the book.
In this case, Penguin did a brilliant job — they passed on the publicity cost to the public, they made an out of court settlement — which means they don’t have to pull the book out of publication, and they are laughing all their way to bank.
And, as Wendy herself said in her Op-Ed, she is also very happy with the court-case, and the out-of-court settlement — because, just because a radical, right-wing, Hindutva brigade was offended by her book, she gets more ‘academic milage’ in her career, and with her colleagues, and well — her book is selling. That attitude is definitely neither scholarly nor pursuit of truth.
ఇండాలజి అధ్యయనాల్లో ముఖ్యమైన సమస్య సయ్యద్ ఓరియంటలిజం ఒక్కటే కాదనుకుంటా, అంతకన్నా మౌలికమైన సమస్యలున్నాయి. ఇండాలజి పరిశోధనలని బాగా ఎరిగిన సురేశ్ దానిపై వ్యాసం రాస్తే చాలామందికి ఉపయోగపడుతుంది.
మోహనగారూ
వేదాలకు ఛందములన్న వ్యవహారం ఉంది. ఇక్కడ ఛందము అంటే ఆరు వేదాంగాల్లోనూ ఒకటిగా కాక సాక్షాత్తూ వేదము అనే చెప్పుకోవాలి. ఛాందసుడు అంటే సమస్తప్రాంపంచిక వ్యవహారాలనీ వైదికదృష్టితో చూసే వాడు అని అర్థం. ఇంకా కొంచెం ముందుకు పోయి చెప్పుకోవాలంటే వేదంలో ప్రజ్ఞ ఉన్నవాడే కాని లౌకికవ్యవహారాల్లో నేర్పు లేనివాడు. ఛాందసుడు అన్న పదమే చాదస్తుడు అని వ్యవహారంలో మార్పుచెందింది. అర్ధచ్యుతి ఏమీలేదు. కొంచెం అర్థవిస్తృతి కలిగిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం చాదస్తుడు అంటే ఏదో కాలంతీరిన ఆలోచనాధోరణి తప్ప వాస్తవిక ప్రపంచజ్ఞానంలేని వాడు అన్న అర్థంలో వాడుతున్నారు ప్రజలు.
అయ్యో ఈమాత్రం దానికి sorry ఎందుకండీ! చరిత్రలకే alternatives ఉన్నప్పుడు పద్యాలకు alternative interpretations ఉండడంలో ఆశ్చర్యమేవుంది! మనది కాని interpretation ఎప్పుడైనా ఎలానూ misinterpretation అయ్యే తీరుతుంది. ఎవరి interpretationకి వాళ్ళవాళ్ళ reasoning ఉండనే ఉంటుంది. ఉదాహరణకు నా interpretation వెనక నాకున్న reasoning ఇది – “పొత్తి” “పొత్తిలి” అనేది చిన్నపిల్లలకు వేసే గుడ్డ. అందుకే పసిపాపలను “పొత్తిళ్ళలో బిడ్డ” అని కూడా అంటారు.
ఎవరి మనోభావాలూ దెబ్బతిననంత వరకూ ఇందులో ఇబ్బందేమీ లేదు! 🙂
“చాందసులు మతమౌఢ్యం ముసుగు కనిపించకుండా పాండిత్యప్రకర్ష ప్రదర్శిస్తూ మీ అభిప్రాయాలపై దాడిచేయడం శోచనీయం”
అన్నయగారు,
యోగ గారు చాంధస వాదం అంటే ఎమిటో వికీ లోని వివరణ ఇచ్చారు. మీరు చెప్పె ఛాందసవాదం ఎమీటో మీకే తెలియాలి. మీ లాజిక్ ప్రకారం, ఈ వ్యాస రచయిత కూడా పాండిత్యప్రకర్ష ప్రదర్శిస్తూ, అర్థ సత్యాలను అందంగా చెప్పారని అనవచ్చా? నాసదీయ సూక్తం ఋగ్వేదంతో వ్యాసం మొదలు పెట్టి, పద్నాలుగు పేజిలు రాసి, అటుతిప్పి ఇటుతిప్పి,పాఠకులను కంఫ్యుస్ చేసి, చెప్పిచెప్పనట్లు, చివరకు తేల్చింది హిందువులను తాలిబన్ లతో పోల్చటమా ఈ వ్యాసం యొక్క అంతిమ లక్ష్యం? మోడి సంగతి పక్కన పెట్టండి. ప్రగతి కాముక వామపక్ష వాదులు మమత బెనర్జి ముందు బెంగాల్ ను, సుమారు రెండున్నర దశాబ్దాలపైగా పాలించారే, కనీసం కుల వ్యవస్తను బలపరిచే ఖాప్ పంచాయితిని ఎందుకు నిషేదించలేకపోయారో ఎప్పుడైనా ఆలోచించారా? బెంగాల్ లో వారి పాలన మీరనే మత ఛాందసవాదుల పాలన కంటే భిన్నమైనదా? మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోండి.
వెండి గారి ఈ పుస్తకం గొడవకు, ఒక వారం ముందు తస్లీమా నస్రీన్ రాసిన టి వి సీరియల్ ని బెంగాల్ ప్రభుత్వం నిషేదించింది. ఆ వార్తను ఏ మీడీయా హౌస్ వారు గాని, మీరు చెప్పే ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్రవాదులు గాని,వెండి గారి పుస్తకానికి ఇచ్చిన అటెన్షన్ లో కనీసం సగం కూడా ఇవ్వలేదు. ఎందుకని? మీలాంటి ప్రగతి కాముకులు హుసేన్ గారి గురించి ఆలోచించే కన్నా, మధ్యతరగతి ప్రజల జీవితాలను గురించి ఆలోచించే తస్లీమ నస్రిన్ లాంటి వారికి మద్దతు ఇస్తే బాగుంట్టుందేమో!
నిర్మాతలకి మత ఛాందసవాదుల వలన వచ్చిన ముప్పేమిలేదు. మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. వారికి పూర్తి స్వేచ్చ ఉంది, మహేష్ భట్ ఇమ్రాన్ హష్మీ తో తీసిన మడ్డర్ 1 & 2 సినేమాలు చూడండి . భారతదేశం లో ఎంత స్వేచ్చ ఉందో మీకే తెలుస్తుంది.
@ Yoga గారు, “భారతీయ మహిళలు ఎప్పుడు అణగదొక్క బడ్డారు” అన్న విషయం తీర్మానించే ముందు, శుమారు రెండున్నర వేల సంవత్సరాల చరిత్రలో ప్రతి శతాబ్దంలో వివిధ రంగాలలో కృషి చేసిన మహిళలపై Wendy గారు ఒక సమగ్ర అధ్యయనం చేస్తే బావుండేది. కొన్ని శతాబ్దాలలో కాలమాన పరిస్థితుల ప్రభావంతో మహిళలు అన్ని రంగాలలో ప్రతిభ చూపక పోవటం లేదా కొన్ని సార్లు వారిని నిషేధించటం జరిగివుండవచ్చు కాని భారత సమాజంలో స్త్రీలు అణగదొక్కబడితే ఇలా వివిధ రంగాలలో కృషి చేసిన మహిళల పరంపర వుండదు. మహిళల విషయంలో ఇంత సుదీర్ఘ పరంపర వున్న సంస్కృతీ మరొక్కటి నాకు తెలియదు.
చాలామంది Indologists “సత్యార్థ ప్రకాశ” గ్రంధం చదివి వుండరు. స్వామి దయానంద సరస్వతి 18వ శతాబ్దం వాడు. ఆయన ఆర్య సమాజ పరంపర ఇప్పటికి కొనసాగుతూనే వుంది. మొట్ట మొదటగా కర్మ కాండలని ఒక సంస్థాగతంగా నిరసించి వేదాలు అందరు చదువవచ్చు అని చెప్పి వేదాలని సామాన్య మానవులకి అందింపజేసే ప్రయత్నం ఆయన చేసారు. 18వ శతాబ్దం లోనే ఆయనకి ఈ విషయం పై అవగాహన వుంది అంటే ఖచ్చితంగా అంతకు ముందు వేదాధ్యయనం పై తెచ్చిపెట్టుకొని సృష్టించిన ఆంక్షలు కొన్ని ఊండెవెమో అని నాకు అనిపిస్తుంది. మొల్ల (1440–1530) వరకు కూడా మనం స్త్రీలు సాహిత్యంలో ప్రతిభ చూపటం చదివాం. ఇదంతా చదివితే మనకి 1500 నుండి 1800 సంవత్సరాల మధ్య ఈ ఆంక్షలు లేదా, సమాజం లో మూఢనమ్మకాలు పెరిగి ఉండవచ్చు. నేను రెండు కళల గురించి ప్రస్తావించలేదు (సంగీతం, నృత్యం). ఈ రెండు కళలు స్త్రీలకి అట్టే అబ్బుతాయి. ఉత్తర భారతం లో వీటిపై ప్రతిభ చూపిన మహిళలు చాలా మంది వున్నారు.ముఖ్యంగా మొఘల్ పాలన తరువాత స్త్రీలు వేదాధ్యయనం, సాహిత్యం నుండి సంగీత నృత్యాల వైపు మళ్ళారనిపిస్తుంది. So the time it might have started is around 15th – 16th century. The first Panipat war coincides with the time frame. ఇది నా వ్యక్తిగత విశ్లేషణ.
All in all, its a can of worms. If the case went to trial, folks would have to answer many questions. Does suppression is limited to only Vedic Studies? or literature? does it include dance, music ? What about participating in wars ? Claiming women were suppressed in Hindu society is really a, “CLAIM” and will remain a “CLAIM”.
నాకు బధ్ధకం చాలా ఎక్కువండీ. ఒక్కోసారి ఏకబిగిన గంటలకు గంటలు పనిచేస్తాను. ఒక్కోసారి రోజుల తరబడి స్థబ్దుగా కూర్చుంటాను. అలాగే నా ఆరంభశూరత్వం అనే అచ్చతెలుగులక్షణం పుణ్యమా అని నేను మొదలుపెట్టిన పనులు కూడా తరచుగా మధ్యలోనే పడకేసి అలా పడుంటాయన్నమాట. ఇలాంటి అనవసరమైన లక్షణాలు తగ్గటం లేదు కాని, చాదస్తం మాత్రం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఒక్కోసారి వీరావేశంతో వ్యాఖ్యానం చేసేసి, ఎందుకంత చాదస్తంగా వ్రాశానా అని ఆశ్చర్యపడుతూ ఉంటాను తీరిగ్గా.
మీ కథ దాకా వచ్చి కూడా మరి రెండు రోజులదాకా బధ్ధకించి చదవనే లేదు. తీరా చదివాక నాలుగు ముక్కలు గిలక్కుండా ఉండలేక పోయాను. నా మాటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
నా విమర్శలు కూడా రచయితలూ / రచయిత్రులూ గమనికలోనికి తీసుకోవటం అన్నది గమనించాను కాబట్టి, ఇకమీద మరింత బాధ్యతగా నా అభిప్రాయాలు చెబుతూ ఉండటానికి ప్రాయత్నిస్తాను.
శ్యామలరావుగారూ, నమస్కారం. మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీరు మేఘన గురించి ప్రస్తావించగానే ‘అరె! భలే! మేఘన అంటే సందేశాలు పంపించినట్లుంది కదా!’ అనుకున్నాను. మాధవ్ గారు గౌతమి అనే పేరుని కూడా అలాగే పెట్టానని అన్నారు. అయితే సర్ నిజంగా ఈ పేర్లు నేను అసలు అనుకోకుండా పెట్టినవి.
ఇక మీరన్న భర్త వాక్యం నిజంగా నేను మీరన్నట్లు రాయాల్సింది. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. అయితే కీలకమైన మాటలు టీచర్ అనినవి మాత్రం నాకు కూడా బాగా నచ్చాయి సర్. మాధవ్ గారు మార్చాలని అన్నారు కాని నేను ఒప్పుకోలేదు. ఆ డైలాగే కథకి అందం అని నేననుకున్నాను. మీరు ప్రతి కథనీ శ్రద్ధగా చదివి మీ అభిప్రాయాలు అందరికీ తెలియచేస్తున్నారు. శ్యామలరావు గారు నా కథకి కామెంట్ రాయలేదే అని కూడా అనుకున్నాను నాలుగు రోజుల క్రితం.
“భారతీయ సంస్కృతిని రక్షిస్తున్నాం అని రొమ్ములు విరుచుకుంటున్న వారిచేతిలోనే మన సంస్కృతికి బమియన్ బుద్ధుల విగ్రహాలకు పట్టిన గతి పట్టకుండా చూసుకోవాల్సిన తక్షణావసరం మనందరిదీ కూడా”
ఈ వ్యాసం నిశితంగా పరిశీలిస్తే రచయితగారి అభిప్రాయలు, హిందూ పేపర్ లో వ్యాసాలు రాసే (లెఫ్ట్ లిబరల్స్ )శైలికి చాలా దగ్గరగా ఉన్నాయి. రచయితగారు ఇక్కడ గుర్తించనిదేమిటంటే తాలిబన్ల పుట్టుక, పాక్ మిలటరి ప్రభుత్వాల పాలసిలో ఒక భాగం (రచయిత చెప్పే హిందూమతోన్మాదం భారత ప్రభుత్వ పాలసిలో భాగం కాదు.హిందూమతోన్మాదులు తాలిబన్ల వలే పక్కదేశాలలో దూరి యుద్దాలు చేయటంలేదు). ప్రస్తుతం వారు ఆదేశంలో షరియా చట్టం అమలు జరపాలని పట్టుపడుతున్నారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి గత నెల 23 మందిని చంపి పారేశారు.
అంతేనా! ఆదేశంలో జరిగే సంఘటనలు ఒకసారి తొంగి చూస్తే, మా చరిత్ర వేరు, మతం వేరు, భాష, సంస్కృతి, సివిలైజేషన్ వేరు అని ద్విజాతి సిద్దాంతం ప్రతిపాదించి,వేరు పడిన మహానాయకుడు జిన్నా గారిని 60 సంవత్సరాల తరువాత వారు ఎలా సన్మానిస్తున్నారు! ఆ వార్త గత సంవత్సరంది. మరి ఈ సవంత్సరం ఆయనకు ఇంకొక కానుక ఇచ్చారు.
ఇటువంటి సన్మానం మన జాతిపిత గాంధీ గారికి కలలో కూడా ఊహించలేము. ఇక లెఫ్ట్ లిబరల్ వాదులు ఆశించినట్లు మనదేశ సంస్కృతిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనదేశంలో వస్తున్న మార్పులు ఈ క్రింది వార్తలు చదివితే తెలుస్తాయి.
“When you come across news that school managements have installed condom vending machines in the school and advice parents of girl students that there was nothing wrong in their daughters having sex with their friends, it is time for us to intervene. Otherwise this country will end up in ruins,” said the eminent danseuse. She declined to reveal the names of the schools.
India gets first radio station – Q Radio dedicated to LGBT community
హిందూమతోన్మాదానికి ప్రధాన కారణం తాలిబన్ల వలే మత చాంధసవాదం కాదు. బహుశా అది వారు అనుకొనే జాతీయ వాదంలో ఒకభాగం కావోచ్చు లేక కలోనైజేషన్ మైండ్ సేట్ నుంచి బయటపడాలనే చేసే ప్రయత్నం కావచ్చు. వారికి మత చాంధసవాదమే ఉంటే, పై రెండు సంఘటనలు చాలు, పాకిస్తాన్లో వారివలే మన దేశంలో ఎంతో గొడవ జరిగిఉండేది. కాని మనదేశంలో అలా ఎక్కడా జరగలేదు. అందువలన లిబరల్ మహాశయులు భారతీయ సమాజం మళ్లీ హిందువాదుల వలన మతమౌఢ్యాన్ని, ఆత్మన్యూనతను పంచి పెంచి పోషిస్తాయే మొన్న భావనను వదలి, వారిని వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే వారి శక్తి యుక్తులన్ని ప్రపంచంలో ఇతర మతాలలో ఉన్న మతోన్మాదులతో, హిందువులను పోల్చటానికి ఖర్చయిపోతాయి. అయినదానికి కానిదానికి హిందుత్వవాదం వల్లే హిందూమతానికి అత్యంతప్రమాదం అని ప్రచారం చేస్తే, అది సమాజంలోని వాస్తవికతకు సరిపోక, లిబరల్ మహాశయుల విశ్లేషణల మీద ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి.
కొసమెఱుపు ఏమిటంటే, బోలెడు మంది విద్యార్థులు సంస్కృతం చదువుతున్నారు స్కూళ్ళల్లో. కాని వాళ్ళల్లో ముప్పాతికమువ్వీసం మందికి రామశబ్దం కూడా రాదు. తమాషాగా 95% పైనే మార్కులు వచ్చేస్తున్నాయి వాళ్ళందరికీ.
The students take these courses to get more marks to get into top of class. The question papers are in sannskrit but the answers can be written in telugu or english. So nobody cares about sanskrit language. Only how many marks they get is important because that helps them get into front line for Engg/Medical admissions. It is no secret.
కొన్ని చిన్న చిన్న విషయాలు ప్రస్తావించాలని ఈ రెండవవ్యాఖ్య.
ఈ కథలో మేఘన అన్న చిన్నపాత్ర ఉంది. ఇది కేవలం ప్రాస్తావికపాత్ర. మొదటిగా “పెళ్ళి రోజు మాష్టారు ఇవ్వమన్నారంటూ మేఘన ఉత్తరం తెచ్చి ఇచ్చింది” అన్న వాక్యంలో వస్తుంది. కథనడపటానికి అవసరం ఐతె తప్ప ఒక పాత్రకు పేరు పెట్టటం అనవసరం అని నా మతం. ఉదాహరణకు, ఇక్కడ ఈ పాత్రకు మేఘన అన్న పేరును పెట్టకుండా కూడా సులభంగా పని జరుగుతుంది కదా. ఐతే, అతితరచుగా మనకథకులు ప్రతిపాత్రకూ పేరు పెడుతూనే ఉంటారు. ఇక్కడ రచయిత్రిగారు ప్రత్యేకంగా చేసిన పొరబాటేమీ లేదు. సందర్భం చూసుకొని నా అభిప్రాయం చెప్పటం. అంతే.
అలాగే సంభాషణల్లో వాడే మాటల సహజత్వం కోసం రచయితలు/రచయిత్రులు కొంచెం అదనపు శ్రథ్థ తీసుకోవాలని నా అభిలాష. ““వీడి కోసమేనా నీ భర్త దగ్గర నువ్వు పిచ్చిదానిలా నటిస్తుంది?” అని ఒక తల్లి అంటుంది గౌతమితో. భర్త అనే మాట పుస్తకాలభాషలో తప్ప సంభాషణల్లో తక్కువగా వినిపించే పదం. అదీ ఇక్కడి సందర్భంలో ఆవిడ నోట ““వీడి కోసమేనా నీ మొగుడి దగ్గర నువ్వు పిచ్చిదానిలా నటిస్తుంది?” అనిపిస్తే మరింత సహజంగా, సందర్భోచితంగా ఉండేది. తల్లి నిష్ఠురంగా మాట్లాడేటప్పుడు ఇక్కడ ‘నీ మొగుడు’ అనటమే ఉచితంగా అనిపిస్తోంది నాకు. రచయిత్రి వ్రాసినది తప్పు అని అనటం లేదు. అది ఎంతమాత్రం తప్పుకాదు. కేవలం నాకు తోచిన అభిప్రాయం చెబుతున్నానంతే.
కథచివరన కీలకమైన మేడమ్‌గారి మాటలు “యశోధరనీ, బిడ్డనీ నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళే బుద్దుడిని ‘పెళ్ళి అనే బంధనం నీకొక్కడికే సంబంధించినది కాదు, బాధ్యతని వదిలి ఇలా వెళ్ళడం నీకు తగునా!?’ అని ఈ జాలారి చెట్టు అడిగే ఉంటుంది – కదా గౌతమీ?” ఇక్కడ విషయంలో కొంచెం సాంద్రత హెచ్చుగా ఉంది. అంతా ఒక్కబిగిన ఏకవాక్యం చేయటంతో విషయం కొంచెం కషాయం ఐపోయింది. కాని చాలా బాగుంది. అదే సమయంలో పుస్తకాలభాష ఐపోయింది కూడా అని గమనించవచ్చును. రచయిత్రిగారు మరికొంచెం శ్రథ్థవహిస్తే, కొద్ది చిన్న వాక్యాల్లో మరింత సహజమైన సంభాషణాశైలిలో వ్రాసి ఉండేవారని నా అభిప్రాయం.
ఈ మాటలన్నీ నా చాదస్తం కొద్దీ వ్రాసాను కాని, ఇప్పుడున్నది ఉన్నట్లుగా కూడా కథ చాలా బాగుందని మరో సారి అంటున్నాను.
ఈ కథ సందర్భంగా ‘కందుకూరి వీరేశలింగంగారు ఒక పేద్ద సుద్ద మొద్దు తెలుగు మగాడు’ అని లైలాగారు ఎందుకు ఆక్షేపించారో తెలియదు. వీరేశలింగంగారు తన రోజుల్లో జీవించారు, అత్యంత అభివృధ్ధిచెందిన విశేషభావజాలం కలిగి ఉన్న (లేదా కలిగి ఉన్నా మనుకుంటున్న) మన రోజుల్లో కాదు. అది ఆయన తప్పు కాదు.
వైధవ్యం అనేది రెండు కారణాలుగా బాధించే విషయం స్త్రీలకు. ఒకటి తనది అని విశ్వసించదగిన ఆసరా కోల్పోవటం. రెండవది తనను సమాజం ‘చాకిరీకి తప్ప మరి దేనికీ పనికిరాని మనిషిగా’ మార్చి అవమానించటం. వీరేశలింగంగారు అనేక అవమానాలకు ఓర్చుతూ ఆసరా కోల్పడిన ఆ విధవలకు తిరిగి ఆ ఆసరాను కలిగించేందుకు చిత్తశుధ్దితో పాటుబడ్డారు. యావజ్జీవం వెట్టిచాకిరీ చేసుకుంటూ నిరాదరణకు గురి అయ్యే ఆ అమాయకురాళ్ళకు పునర్జీవనం కలిగించాలని తాపత్రయపడ్డారు.
‘ఓ విధవరాళ్ళలారా చూడండి, మీ చుట్టూ బోలెడు మంది బోడిగుళ్ళ మగాళ్ళున్నారు కాబట్టి మీ బోడిగుళ్ళగురించి విచారం వదిలేయండి’ అని వాళ్ళకు ఒక మహత్తరమైన దివ్యసందేశం ఇవ్వాలని ఆయనకు తట్టక పోవటం కారణంగా లైలాగారు పంతులుగార్ని సుద్దమొద్దు అని వెక్కిరించటం ఎంతవరకూ సబబూ?
ఆడపిల్లలూ చక్కగా చదువుకోవాలని పంతులుగారు ఆలోచించటం తెలుగునాట ఆడపిల్లలకు వరమైనదీ లేదా ఆయన ఒక సుద్దమొద్దుస్వరూపం కాబట్టి శాపమే ఐనదీ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా లైలాగారికి నా విజ్ఞప్తి.
స్త్రీలు నాడైనా నేడైనా శిరోముండనం అనేది తప్పకుండా ఘోరమైన అవమానంగానే భావిస్తారు. అది తప్పు భావన, వాళ్ళు అలా ఎందుకు భావించాలీ అంటే దానికి కారణం, ఇంకా ఈ దేశంలో స్త్రీలు సంప్రదాయపు గడపకు లోపల ఒక కాలూ వెలుపల ఒక కాలూగా ఉన్నారు కాబట్టి వారిలో సాంప్రదాయికమైన తప్పూ-ఒప్పూ, మంచీ-చెడూ, మంగళరూపం-అమంగళరూపం వంటి అనేకానేక భావనలు మన పోష్టుమోడర్నిజం రోజులకు తగినట్టుగా ఎగిరిచక్కాపోక పోవటం వలన.
కథకుడు మనకాలం వాడు. అయన అమ్మమ్మ చాలా పాతకాలం మనిషి. అప్పటి వారి బుఱ్ఱల్లో సంప్రదాయపు వాసనలు ఇంగువకట్టినగుడ్డవాసనలుగా కాక ఇంగువవాసనల ఘాటుతో ఉంటాయి. ఆవిడ తనకు జరిగిన శిరోముండనాదులను అవమానంగా భావించినా అసహాయంగా ఉండిపోయి మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక చింతనను ఆశ్రయించింది. ఆశ్చర్యకరంగా ఇది నాటికీ నేటీకి పెద్దవాళ్ళకు మనశ్సాంతి సాధనం అవుతునే ఉన్నది – మన ఆమోదమూ తిరస్కారమూ అనే వాటితో పని లేకుండానే. ఐతే, అమ్మమ్మగారి మనస్సులో ఉన్న వివేచనాజ్ఞానం ఒక మంచి సలహా ఇచ్చేందుకు గాను సంప్రదాయాన్ని బద్దలు కొట్టటానికి వెనుదీయలేదు. నోటి మాట సలహాకాకుండా, తనకు చేతనైన ద్రవ్యసహాయం కూడా చేసారావిడ.
ఇక్కడ అమ్మమ్మగారి పాత్రలో ‘మార్పు’ కోసం తపన చూడండి – స్వయంగా తను అది సాధించుకోలేకపోయినా, మరొకరికి సమాజాన్ని మార్చటానికి తోడ్పడాలన్న ఆమె తపనను గమనించండి.
ఇక్కడ ‘గుండు’ అనేది పదేపదే ఆవిడమీద రుద్దబడిన దురవస్థకు ప్రతీకగా ప్రస్తావించబడింది. ఆవిడ తన తలవెండ్రుకలను కొన్నింటిని దాచుకోవటంలో లైలాగారు ‘అనవసరమైన’ సౌందర్యదృష్టిని చూస్తున్నారని నాకు అనిపిస్తోంది. నేను దాన్ని ఆవిడ తాను కోల్పడిన అస్తిత్వానికి వాటిని ప్రతీకలుగా భావించటాన్ని అర్థంచేసుకున్నాను. ఈప్రపంచం తన అస్తిత్వాన్ని క్రూరంగా అణచి ఉంచినా, దాన్ని ఆవిడ తననుండి ఎన్నడూ దూరంచేసుకోలేదు అని కథ స్పష్టం చేస్తోందని ‘ఈ వెంట్రుకల’ సంగతి స్పష్టం చేస్తోందని అనుకుంటున్నాను. నేనేమీ కాకలు తీరిన విమర్శకుడను కాను కాబట్టి నా అభిప్రాయం తప్పంటే వాదించలేను.
ఒక ఉదాహరణ చెబుతాను, నా అనుభవం లోనిది. అమ్మమ్మల కాలందాకా ఎందుకు? మా అమ్మగారి కాలం చూసినా, ఆవిడ పాతరోజుల ఛాందసం దట్టంగా ఉన్న మనిషే. వివాహాల విషయంలో ఆవిడకు శాఖాబేధం కూడా సమ్మతంగా ఉండేది కాదు చాలాకాలం పాటు. అలాంటి పెద్దావిడ ఒక సందర్భంలో ఒక వితంతువు ఐన ఆడపిల్లకు ‘అమ్మా బొట్టూకాటుకా, పువ్వులూ అన్నీ పెట్టుకో, ఏమీ తప్పులేదు’ అని బోధించిటం ఎంతో ఆశ్చర్యానందాలు కలిగించింది. తమాషా ఏమిటంటే నా తరంవాడే ఐన ఆపిల్ల అన్నగారికి మా అమ్మగారి సలహా అంతగా నచ్చలేదు!
లైలాగారితో సహా ఏ స్త్రీమూర్తులకూ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్త్రీల మనస్సులు అగాథసముద్రాలు. సామాజికపరిస్థితుల కారణంగా వారు తమతమ అభిప్రాయాలూ అభిమతాలు హెచ్చుశాతం సందర్భాలలో వెల్లడించలేక పోవచ్చును. కాని సమయం వచ్చినప్పుడు అవి బయటకు రాకుండా ఎవరూ ఆపలేరు.
ఈ కథలో కథకుడి నమ్మకాలూ ఆలోచనలూ కాదు ముఖ్యం. ఆయన అమ్మమ్మగారి సంగతీ ఆవిడ రోజుల్లోని నమ్మకాలూ ఆలోచనలూ వాటి పరిణామాలూ ముఖ్యం.
చాలా సంవత్సరాల క్రిందట వార్తాపత్రికల్లో చదివిన సంగతి ఒకటి ప్రస్తావించటం అసందర్భం కాదని అనిపిస్తోంది.
ఒకాయన తనకు చదువుచెప్పి డాక్టరేట్ (సంస్కృతంలో) ఇచ్చిన విశ్వవిద్యాలయం మీద దావా వేశారు!
“నాకు సంస్కృతంలో అద్భుతమైన ప్రతిభ ఉందని ప్రోత్సహించి ప్రోత్సహించి పి.హెచ్.డి ఇచ్చారు. ఇప్పుడు నాకు మీరు చెప్పిన చదువు ఆధారంగా దొరికే ఉద్యోగం ఎంతప్రయత్నించినా ఏదీ చిక్కటంలేదు. నా దుస్థితికి మీ విశ్వవిద్యాలయంవారే బాధ్యులు. తెలిసీ తెలియని వయస్సులో ఉన్న నన్ను ‘ఇదేదో గొప్ప చదువూ’ అని మభ్యపెట్టారు. బోలెడు సంవత్సరాలు వృథాచేసారు. అంతేకాని ‘నాయనా, ఈ చదువుకు ఏ ఉద్యోగమూ దొరక్కపోయే ప్రమాదం మెండు సుమా’ అని ఎన్నడూ చెప్పక నన్ను చిన్నవాడిని చేసి మోసం చేసారు” అని ఆయన వాదన అట.
ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని అనిపిస్తోంది.

ఎవరి రచన పై ఈ చర్చ జరుగుతుందో ఆ రచయితకు ముఖ్యంగా రఘోత్తమ రావు గారి వ్యాఖ్యలు (ఎందుకంటే ఆయన చర్చించిన తీరు, ఎంచుకున్న ఆధారాలు – భాషకు సంబంధించినవి నాకు సహేతుకంగా ఉన్నాయి కనుక; అలాగే భాష తటస్థమైనది; దానిని వాడే వారి మనసు అది అద్దం లా ప్రతిఫలిస్తుంది కనుక) పంపించాను. ఆమె వెంటనే తన జవాబు పంపింది అది క్రింది పొందుపరచాను చదువగలరు. మహోన్నతమైన భారత దేశ సంస్కృతి, సాంప్రదాయలు, భాష,ముఖ్యంగా సంస్కృత భాషపై వేద వాగ్మయం పై ఎవరు ఎప్పుడు తప్పు అన్వయాలను చేసినా దానిని ఖండించే హక్కు (అదే వాక్స్వాతంత్ర్యం) ప్రతి భారతీయునికీ ఉంది. భారతీయ తత్వ వాదాలు చెసిన త్రిమతాచార్యులు వారి వారి వాదాలను వారెంచుకున్న వేద ప్రమాణాలతో తెలియచేసారు మినహా ఎవరూ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు. ఇది వారు ఏర్పరచిన అత్యుత్తమ చర్చా/వాద ప్రమాణం. దానికి మనం వారసులం కాని క్రియలలో కాదు ని ఈ చర్చలో తెలిసింది.
———- Forwarded message ———-
From: Wendy Doniger
Date: 11 March 2014 19:25
Subject: Re: Humble submission.
To: ivns raju
dear dr. raju, many thanks for this; i’m always interested in responses to my work. thanks for taking the trouble to send this to me. yours, wendy
On Mar 11, 2014, at 2:20 AM, ivns raju wrote:
> Hi,
> A very good day ahead to you.
> Attached please find some of the excerpts from the discussion that took place in Face Book on your book.
> I thought that this would provide a different perspective of your work to you and you would benefit from gaining this perspective.
> Sanskrit is a Samadhi Bhasha, it needs to be understood based on the context by linking the Kartha, Karma and Kriya.
> I am sure you would appreciate this. I have shared this with one of the Daily News papers in India.
> Dr. IVNS Raju
“ఐతే పాశ్చాత్యులు పట్టుదలగా అభ్యసించినట్లు మనం మన సాంస్కృతికవారసత్వం ఐన సంస్కృతభాషని అధ్యయనం చేయటం లేదు”
“మనం సంస్కృతాన్ని ఆ స్థాయికి ఎందుకు తేవటానికి ప్రయత్నం చేయము?”
శ్యామలరావుగారు: దీనికి చాలా గంభీరమైన కారణాలు ఉన్నాయండీ. కొంత వరకూ సంసృత భారతి కృషి చేస్తోంది.
ఐనా మన దేశం ముందు దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తి చెందాలి. అప్పుడు మిగితావన్నీ. దేహం ఆరోగ్యంగా లేనప్పుడు ఎన్ని చేసి ఏమి లాభం? అలాగే పేదరికంలో అడుక్కు తింటున్న మనకి, ఏ పాటి గౌరవం లభిస్తుంది? ఏ మాత్రం అలౌకిక విషయాల పైన దృష్టి సారించగలము?
ఆ పేదరికానికి మూల కారణమేమిటో ముందు తెలుసుకుని దాని నుంచి ఎలా బైట పడాలా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పటి దాకా ఇలాటి వెండీ లాంటి వాళ్ళ బాధలూ, ప్రత్యమ్నాయ ప్రబుధ్ధుల బాధలూ తప్పవు.
నా ప్రశ్నలకు మంచి జవాబులు వచ్చాయి. అలవాటు కారణంగా నేను తెలుగుగులో కాస్త వేగంగా టైపు చేయ గలుగుతున్నానేమో కాని కొందరికి అదొక యోగాభ్యాసంలాగా ఉంటోందని అర్థమైంది.
ఈమాట పత్రిక పట్ల ఆసక్తి ఉండటం చేతనే, ఆంగ్లంలో వచ్చిన వ్యాఖ్యలను ముఖ్యంగా దీర్ఘవ్యాఖ్యలను చదవటం పట్ల నా మనస్సు యొక్క మొరాయింపు కారణంగా (అసమర్థత యేమీ కాదని తొలుతనే మనవిచేసాను) మంచి వ్యాఖ్యలను చదవలేకపోతున్నానన్న ఆందోళనతోనే నా ఆక్షేపణ తెలిపాను ఆంగ్లవ్యాఖ్యల పట్ల. ఇక్కడి వ్యాఖ్య డబ్బాలో వ్రాయటం, స్క్రోలింగ్ వగైరా ఇబ్బందులు ఉంటే విడిగా వ్రాసి ఇక్కడకు బదిలీ చేయవచ్చును కదా. ఏదిఏమైనా ఆంగ్లవ్యాఖ్యాతలు మాబోటివారి పట్ల కొంచెం కరుణచూపాలని మనవి. అంతే.
సంపాదకులకు ఒక మనవి. ఎలాగూ మా ఈ-మెయిల్ వివరం పొందుపరుస్తున్నాం కదా వ్యాఖ్యలతో. అందుచేత వ్యాఖ్యలకు వచ్చిన స్పందనలను మీరు మాకు సరాసరి మా మెయిల్‌కు అందించ గలిగితే, మా బోటి వ్యాఖ్యాతలకు మంచి సదుపాయంగా ఉంటుంది. స్పందన తాలూకు లింకు పంపితే సరిపోతుంది.
రచయితలకు రచయిత్రులకు కూడా ఇదే విధంగా తమతమ వ్రాతలకు వచ్చిన స్పందనల లింకులు పంపుతూ ఉంటే వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది.
బల్లి ఫలితం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/10/2014 10:31 am
మీరు ప్రస్తావించిన పుస్తకం(చూ. డి. చంద్రశేఖరరేడ్డి, మన భాష, పుట 203, మీడియా హౌస్ పబ్లికేషన్స్, 2001.) నేను చూడలేదు. ఇటుపైన “ఎపాయంట్‌మెంట్” అన్న మాటకి తెలుగుమాట లేదని “డిసపాయంట్” అవకుండా మీరు కూడ ఈ మాట వాడి చూడండి అన్నారు. కాని అభిసారం అన్నది appointment అన్నమాటకు సరైన అనువాదం ఐనా కాకపోయినా అది సంస్కృతపదం కాని అది అసలు తెలుగు మాట కానేకాదు. ఒకవేళ సరైన పదమే ఐతే ఈ సంస్కృతపదం మనం హాయిగా వాడుకోవచ్చును. కాని ఇది సరైన అనువాదం కాదనే నా అనుమానం.
అభిసారం అనే మాట వినగానే అష్టవిధనాయికల్లోని అభిసారిక గుర్తుకువస్తుంది. (కొంచెం మంది ఇదేమిటండోయ్ ఇదేదో అతిసారం అన్నట్లుందే అనుకునే అవకాశమూ ఉందనుకోండి!)
ఈ అభిసారం అనే మాటకు అభిసారం = ప్రేమికులు సంగమార్థం చేసుకునే నిర్ణయం, ప్రేమికుల సంకేతస్థలం అని వికీపీడియా పేజీలో కనిపించింది కూడా. ఇక్కడ అభిసారిక లేదా అభిసారి లేదా అభిసారుడు అనే పదాల్లో ఒక రహస్యసంకేతస్థలంలో సమాగమనం కోసం పోతున్న వ్యక్తి అనే అర్థం వస్తున్నది.
అని కర్ణపర్వంలో ఒక శ్లోకం ఉంది పదవ అధ్యాయంలో. ఇక్కడ అభిసారం అనే మాట ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇది ఒక యుధ్ధరంగవర్ణనలో భాగం. శృంగారమూ చట్టుబండలూ ఏమీ లేదు. సరే, ఇక్కడ ఎవరికీ ఎవరితోనూ ఏవిధమైన appointment కూడా లేదు కదా?
అలాగే బౌధ్ధవాంగ్మయానికి సంబంధించిన త్రిపిటకంలో అసీతినిపాతో అనే అధ్యాయంలో ఈ అభిసారం అనే మాట తరచుగానే కనిపిస్తున్నది. ఉదాహరణకు ఒకచోట
న తే అభిసరం పస్సే న రథే నపి పత్తికే;
నాస్స చమ్మంవ కీటం వా, వమ్మితే చ ధనుగ్గహే
ఇది ప్రాకృతంలో ఉన్నది. మొదటిపాదం సంస్కృతంలోచూస్తే “న తే అభిసరం పశ్యే న రథే నపి పంక్తికే” అని అనివస్తుంది. రథాలూ సైన్యాలు ఏవీ నీ వెంటరావు సుమా అని అర్థం చెప్పుకోవచ్చును. ఇక్కడా ఏవిధమైన appointment ప్రసక్తీ లేదు.
అందుచేత అభిసారం అనేది appointment అన్నమాటకు సరైన అనువాదం కాకపోవచ్చని అనుకుంటున్నాను.
ఒక ఆంగ్లవ్యాఖ్య క్రింద, వేలూరి వేంకటేశ్వర రావు వ్రాలు అన్న సంతకం సంతోషం కలిగించింది. పోనీ లెండి కనీసం ఒక్క సారి తెలుగు సంతకం చేసి మమ్మల్ని ధన్యుల్ని చేసారు. శ్రీవేలూరివారు హాయిగా తెలుగులో వ్యాఖ్యను వ్రాయగలరని నా నమ్మకం.
‘ఈమాట’ పత్రికలో వ్యాఖ్యలు సాధారణంగా తెలుగులోనే ఉంటాయన్న మాధవ్‌గారి అభిప్రాయం నిజం కావచ్చు. ఆ విషయంలో గణాంకాలసంగతిచర్చలు వద్దు కాని, కేవలం తెలుగులో రాయమనడం కొందరికి తమ అభిప్రాయం వెల్లడించడానికి ప్రతిబంధకమౌతుందని వారెందుకన్నారో బోధపడలేదు. తెలుగువారికి తెలుగులో చెప్పటానికి ఏమి ప్రతిబంధకం ఉంటుందీ అని ఆశ్చర్యం కలుగుతోంది.
తెలుగువారు ఆంగ్లంలో వ్యాఖ్యలు వ్రాయటానికి కారణం ఏమిటీ అని ఆలోచిస్తే, మూడు సందర్భాలు కనిపిస్తున్నాయి. మొదటిది వ్యాఖ్యాతకు తెలుగులిపిలో వ్రాయటానికి తగినంత అభ్యాసం లేకపోవటం. రెండవది భావవ్యక్తీకరణకు తెలుగుభాషకు తగినంతశక్తి ఉన్నదన్న విశ్వాసం వ్యాఖ్యాతకు లేకపోవటం. మూడవది, తెలుగుకన్న ఆంగ్లం గొప్పభాష కాబట్టి ముఖ్యమైన విషయాలు ఆంగ్లం లోనే వ్రాయటం సబబు అన్న స్థిరాభిప్రాయం. నా చిట్టిబుఱ్ఱకు తట్టని యే యితర మహత్తర కారణాలైనా ఉన్నాయేమో సందర్భాన్ని బట్టి వ్యాఖ్యాతలో అనుభవాన్ని బట్టి సంపాదకులో సెలవియ్యాలి.
ఆంగ్లంలో ఉన్న వ్యాఖ్యలను చదవటం కంటే, మీరు నాది తెలుగుభాషా దురభిమానం అంటే నిస్సిగ్గుగా ఒప్పేసుకునని ఊరుకోవటమే నాకు సులభమూ సమ్మతమూ కూడా.
వెండీ రచనలో ఉన్న అతి అభ్యంతరకరమైన విషయాలను రఘోత్తమ రావు గారు, యోగా గారు చెప్పినట్లు భాష, వ్యాకరణం, నిరుక్తం, పద పరిచ్చేదం, సమన్వయం ఆధారం గానే వివరించినపుడు ఎందుకు అది చాందస వాదం గా కొందరికి అనిపించిందొ అర్ధం కాదు. సనాతన ధర్మాన్ని (హిందూఇజం అనే ఒక సంకుచిత పద ప్రయోగానికి సుతరమూ ఇష్ట పడని భారతీయుల్లో నెనూ ఒకడిని) తెలిపే వేద వాంగ్మయాన్ని ఇలాగే అర్ధం చెసుకొవాలి అని ఒక విధానాన్ని / పద్ధతిని మనకంటె కొన్ని వందల రెట్లు మెధావులైన మన పెద్దల మాటలను ఎందుకు ప్రశ్నించాలొ నాకు అర్ధం కాని విషయం. ప్రయోగ శాలలొ ఒక రసాయనాన్ని ఇలానే తయారు చెయాలి అనే నిర్దుష్టత మన వాగ్మయాన్ని అన్వయించుకొవడానికి కూడా ఉంది (బ్రహ్మ సూత్రాలు – తత్తు సమన్వయాత్తు వంటివి) అంటె మన మెధస్సు ఎందుకు ప్రశ్నిస్తొందొ అంతుపట్టని విషయం.
ఈ విదేశీ రచయితలు, ఎవరొ ఎందుకు వెండీ గారే హిందూఇజం అనే పదాన్నే వాడారు కాని సనాతన ధర్మం అనే పదాన్ని ఎందుకు వాడలేదు? కనుక విషయం విజ్నులకు విదితమె!
చర్చలో భాగం వహించిన/వహిస్తున్న మిత్రులందరికీ ఓ విన్నపం.
భాషను వీడి ప్రతిపాదించే సిద్ధాంతాలు రాద్ధాంతాలే అవుతాయి.
వెండీ ప్రయత్నమంతా సనాతన ధర్మంకు సంబంధించి తనకు తోచిన alternative history ని వ్రాయడమేనన్న విషయంలో భేదాభిప్రాయం లేదు. కానీ తను ఎంచుకున్న విషయాన్ని నిరూపించే క్రమంలో మౌలికమైన కొన్ని సైద్ధాంతిక, పారిభాషిక పదాలకు/సందర్భాలకు/అంశాలకు ఆవిడ చేసిన వ్యాఖ్యానాలు, అనువాదాలు లోతైన విమర్శకు అర్హమైనవి. ఇది నిస్సందేహం.
ప్రతి భాషకు తనదైన వ్యాకరణం, ఛందస్సు, నిఘంటువులు, నిరుక్తాది విభాగాలు ఉంటాయి. ఇవేవీ మతపరమైన ఛాందసాలు కావనే నా విశ్వాసం. కనుక వాటిల్ని సమన్వయ పరుస్తూ చేసేదే సిసలైన వ్యాఖ్యాన మవుతుంది. వీటన్నింటినీ అతిక్రమించి స్వకపోలకల్పితంగా చేసేవన్నీ దుస్సాహసాలే అవుతాయి. సదరు రచనల్ని ఆయా రచయితల బుద్ధి బులపాటాలుగానే పరిగణించాల్సి వస్తుంది గానీ గంభీరమైన శాస్త్రీయమైన చర్చలు కాబోవు. సైద్ధాంతిక నిరూపణలు కాలేవు కూడా.
పై నేపధ్యానికి అనుగుణంగా నా వ్యాఖ్యలన్నీ భాష, వ్యాకరణం, అర్థ నిరూపణలోని వైవిధ్యాలన్న మూడు అంశాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది.
వ్యాకరణాధారంగా ధార్మిక గ్రంథాలలోని అంశాలపై విమర్శ అన్నది మతతత్త్వం కాబోదని భావించినందువల్ల సదరు వ్యాఖ్యలను చేసింది. అలానే ప్రతి పదంలో అంతర్హితమైవున్న పరమార్థాన్ని గ్రహించి ఆపై వాటిని వ్యక్తిగత దృక్కోణం నుండి వ్యాఖ్యానించడమన్నది సత్సంప్రదాయమని నేను భావించినందువల్లనే కొన్ని భగవద్గీత శ్లోకాలపై ఈ వ్యాసకర్త చేసిన వ్యాఖ్యానాలను కూలంకషంగా విశ్లేషించడం జరిగింది. ఇలా చేయడం కొద్దిమందిని దూషించినట్టుగానో లేక ప్రాచీనాచార్యుల మధ్య ఉచ్ఛనీచాలను ఎంచడమని భావిస్తే నేను నిస్సహాయుణ్ణి.
వెండీ పుస్తకానికి గాని, సురేశ్ గారు ప్రస్తుత వ్యాసానికి గానీ మూలాధారాలైన ధార్మిక గ్రంథాలలోని అసలు విషయాలను వ్యాకరణాది తటస్థ గ్రంథాల సహాయంతో తెలుసుకోవడాన్ని పక్కనెట్టి కోర్టులు, కచేరీలు, చట్టాలు, న్యాయాలంటూ మాట్లాడ్డమే ముఖ్యమైనప్పుడు….అస్తు….
“యాన్ యాన్ కామాన్ కామయంతే తాం స్తాన్…కరోతి” (ఆదిత్య పురాణ వాక్యం)
మొట్టమొదట వేదాలు మౌఖికం, అవి పుస్తక రూపంలో చదవటం కన్నా ఒక గురువు దగ్గర నేర్చుకోవటం ఉత్తమం. ఇక వెండీ మరియు ఇతర యురోపియన్ / అమెరికన్ రచయితలు సంస్కృతాన్ని ఒక భాషగా అధ్యయనం చేసి అసలు సంస్కృతీ తెలియకుండా భారతీయ వేదాలు, ఇతిహాసాలు ఉపనిషత్తులపై పుస్తకాలు రాసిన వారు. భారతీయులు కాని హిందువులు భారత సంస్కృతిని పాటించి రాసే ఇలాంటి గ్రంధాలూ రాస్తే వాళ్లకి కొంత అవగాహన వుంటుంది, అది లేకుండా పెద్ద ఉద్గ్రంధాలని రాసిన వారు, ఒక వైద్యుడు కానివాడు నాలుగైదు వైద్య పుస్తకాలు చదివి ఒక కొత్త పుస్తకం రాసినట్టుగా వుంటుంది. మీకు కామ అన్న పదం కేవలం sex కాదు అన్న విషయం నేను చెప్పక్కర్లేదు. రామాయణంలో దశరథుడు కామం కొద్ది ధర్మాన్ని పక్కన పెట్టాడు అన్నది Wendy లాంటి వాళ్లకి కనిపిస్తుంది, వారు మరిచి పోయే విషయం ఏమిటంటే, అక్కడ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అన్న విషయం (for both Rama and Dasharatha). ఇక్కడ మాటని నిలబెట్టుకోవటం గురించి రాయకుండా, అప్పట్లో శృంగార విశృంఖలత వుంది దాంట్లో తప్పేముంది? అని వాదిస్తే, మనం ఎంత శాతం ప్రజలు అలా మాట్లాడేవారు/ వ్యవహరించేవారు? అది అత్యధికులా? లేక కొంత మంది చేసే పనా? ఇది తెలియనంత వరకు హిందూ మతంలో గొడ్డు మాంసం తినేవారట, లేక అప్పట్లో అంతా కామ చర్చలు బహిరంగంగా జరిపే వారట అని అనుకోవటం తప్పు. పరాయి దేశంలో 28 సంవత్సరాలకే సంస్కృతంలో డాక్టరేట్ పట్టా (in a questionable manner) పొంది విశేషంగా, స్త్రీ వాదం, sex ముఖ్యంగా Mythologies of Transvestism and Transsexuality లాంటి విషయాలని అమెరికాలో విద్యార్థులకి బోధించి దాన్ని ఒక వేరు దృక్పథం అని చెప్పటం వెనకాల ఒక ఉదారవదాన్ని రుద్దే ప్రయత్నం చేసిన Wendy భారత దేశంలో ఖచ్చితంగా సవాళ్ళు ఎదురుకుంటుంది.
సంస్కృత భాష ఆంగ్లము కన్న ప్రాచీనమయినది. భారతీయ చరిత్రకారులందరికి సంస్కృతం నేర్చుకోవటం కష్టం కాదు. సరిపడా పుస్తకాలు వున్నాయి, చెప్పే గురువులు వున్నారు. ఇన్ని ఉండగా పనిగట్టుకొని సంస్కృత గ్రంథాలను తర్జుమా చేసి పాశ్చాత్యులు రాసిన ఆంగ్ల పుస్తకం, దాన్ని ఆధారంగా తీసుకొని ఇంకొక వ్యక్తీ మరొక పుస్తకం, ఇక వీటిపై ఆధారంగా తీసుకొని రాసిన మరికొన్ని పుస్తకాలు, వాటిని ఆధారంగా తీసుకొని చరిత్ర రాసిన ఘనత భారతీయ చరిత్రకారులకె దక్కింది. ఒక హాస్యాస్పద విషయమేమిటంటే, భాష అందుబాటులో ఉండి కుడా ముక్కు ఎక్కడ వుంది అంటే తిప్పి చూపినట్లు, ఒక్కొక్క పుస్తకం వెనక ఒక వంద ఆంగ్ల తర్జుమా మూలసూచీల పునాదిపై రాసిన భారత చరిత్రకారులు ఒక ట్రైను టిక్కెట్ పెట్టి భారత దేశంలోని ఏ సంస్కృత అధ్యాపకుని దగ్గరకు వెళ్లి అడిగిన అంతకన్నా బాగా చెబుతారు.
ఇక వివాదం గురించి మాట్లాడాలంటే, అది ఒక కోర్టు కేసు, రెండు పార్టీల మధ్య జరిగినది. శాంతియుతంగా పరిష్కరించబడ్డది. అది కుడా మన జఠరాగ్నిలో జీర్ణించుకోలేక పొతే, ఈ క్రింది విషయం చూడండి:
ఇప్పటివరకు 50పై చిలుకు పుస్తకాలు 1924 నుండి వివాదం రేపాయి. అందులో 3 మాత్రమె సంఘ్ పరివార్ కు చెందిన సంస్థల నుండి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. మొన్నటికి మొన్న Air India మాజీ డైరెక్టర్ జితేందర్ భార్గవ రాసిన The descent of Air India అనే పుస్తకం నిరోధించడం జరిగింది. నిషేధించిన పుస్తకాలలో రెండు శాతం ప్రమేయం ఉన్న సంఘ్ పరివార్ తో ప్రమాదముంది అంటున్నారు, ఏడెనిమిది వరకు నిషేధించిన ఇస్లాం రచనలు, నాలుగు వరకు గాంధీ – నెహ్రులపై రాసిన పుస్తకాలు అన్ని సంఘ్ పరివార్ నిషేదించిందా? లింగం గురించి రాసిన పుస్తకం 1937 లో నిషేదించబడినది, దాని వెనుక సంఘపరివార్ ఉందంటారా? మరి Da Vinci Code చిత్రాన్ని మూడు నాలుగు రాష్ట్రాల్లో నిషేధించినప్పుడు ఆవిడ ఎక్కడికెళ్ళారు? నాగాలాండు, ప్రపంచంలో మేటి బాప్టిస్ట్ రాష్ట్రంగా పేరుపొందిన ఈ భారత దేశ రాష్ట్రం Da Vinci Code పుస్తకాన్ని కూడా నిషేదించింది. దాని వెనకాల సంఘ్ పరివార్ ఉందంటారా?
ఇది బాత్ర ఒంటరి పోరాటం చేసి గెలిచిన కేసు కాదు, అమెరికాలో స్కూళ్ళలో చాలా వివాదాలు జరిగిన తరువాత నిజానిజాలు నిగ్గు తేల్చి చరిత్రని రాసిన నేపధ్యంలో గెలిచిన కేసు. ప్రమాదం హిందూ సంస్థల నుండి లేదు, ఉన్న దేశంలో సంసృతం చదువకుండా ఇంగ్లీషు తర్జుమాని చదివి ఏరికోరి కొన్ని అవలక్షణాలపై పుస్తకాలు రాసి ఇదే హిందూ ధర్మం లేక ఇది హిందూ ధర్మానికి ఇంకొక కోణం అని తెలిపే భారత రచయితల నుండి, వారెక్కిన పల్లకీలపై ఊరేగి అసలు విషయం రాయక కొత్త దృక్కోణాలని రాసే పాశ్చాత్య రచయితల నుండి వుంది.
చివరిగా నేను ఈ విషయం పై వాదులాడదలచుకోలేదు. కోర్టు లో ఇరుపక్కల వారు లోతుగా చూసి సంధి చేసుకున్న దావా ఇది. All I can say is, opening other works of Wendy is like opening a can of worms.I guess the publishers don’t want to go there. Waste of Time and Money for them. From what I came to know from persons who have personally interacted with her, she collects ( I should say used to collect) an honorarium of $ 10K for each temple visit in the USA. I guess she made enough money from those visits to offset this book case.
రఘోత్తమరావుగారికీ, సురేశ్‌గారికీ ఉన్నంత సంస్కృత జ్ఞానం కానీ, Wendy గురించీ, alternative history గురించీ సురేశ్‌గారి కున్నంత పరిచయం కానీ నాకు లేవు. ఈ వ్యాఖ్య నేనొక సామాన్య హిందువుగా రాస్తున్నాను. (పూర్వకాలంలో ఇలా సామాన్యులు పండితచర్చలలో తలదూర్చే అవకాశం ఉండేదా అనేది అనుమానమే, మంచికో చెడ్డకో యీ కాలంలో అది సాధ్యమయ్యింది!).
1. తాను రాసిన దానికి “Alternative” అనే విశేషణాన్ని స్పష్టంగా శీర్షికలోనే పెట్టారు వెండీ. ఇంక దాన్ని సంప్రదాయ భాష్యాలతో, వ్యాఖ్యానాలతో సరిపోల్చి తప్పుపట్టడంలో అర్థమేముంది? హైందవ వాఙ్మయంపై Wendy కాని, సురేశ్‌గారు కాని చేస్తున్న వ్యాఖ్యానాలు స్పష్టంగా – an alternative to the established or mainstream commentaries. ఇవి వైదిక ప్రామాణ్యాన్ని అంగీకరించని బౌద్ధ, చార్వాక వాదాలవంటివి. వాటిని శంకరుల, మధ్వాచార్యుల వంటి వారి భాష్యాలతో పోల్చి తప్పనడం ఎంతవరకూ సమంజసం?
2. వెండీ సిద్ధాంతాలను Galileo లేదా ఇతర scientific theoriesతో పోల్చడం సరికాదని నా బుద్ధికి తోస్తోంది. వైజ్ఞానికశాస్త్రం భౌతిక ప్రపంచానికి సంబంధించినది. అందులో సత్యాసత్యాలు భౌతిక ప్రయోగాల ద్వారా నిర్ధారించగలిగేవి. Wendy’s subject is not “science”. అంటే ఇందులో వైజ్ఞానికంగా నిర్ధారించగల సత్యాసత్యాల ప్రమేయం లేదు. వేదాలను కాని, స్మృతి పురాణ ఇతిహాసాలను కాని ఒక ప్రత్యేక కోణంలో చూసి, అన్వయించి, పరిశీలించడం మాత్రమే. కాబట్టి, ఇందులో సంప్రదాయ దృష్టే సత్యమైనదీ, లేదా Wendy దృష్టే సబబైనదీ వంటి నిర్ణయాల ప్రసక్తి అసలు వస్తుందా? కాకపోతే, పూర్వకాలంలో అవైదిక మత సిద్ధాంతాలు ఎదుర్కొన్న ప్రతిఘటనే ఇప్పుడూ ఇలాంటి సిద్ధాంతాలు ఎదుర్కొంటున్నాయని భావించ లేమా? పూర్వం ఆయా మతాలనూ మతసిద్ధాంతాలనూ నిజంగానే చాలా సంయమనంతోనూ ఉదారభావంతోనూ హిందువులందరూ స్వీకరించారా?
3. వెండీ పుస్తకాన్ని హిందువులు కానివారు చదివితే హిందూమతం మీద చాలా గౌరవం కలుగుతుందని సురేశ్‌గారు అన్నారు. ఇది నిజమే కావచ్చు. కానీ అది 1st person point of view కాదు. ఒక “సామాన్య” హిందువు దృష్టికన్నా అది వేరైనది. కాబట్టి వారికి గౌరవం కలిగించినంత మాత్రాన ఒక హిందువుకి కూడా అదే భావన కలిగించాలని లేదు. ఒక హిందువు అలాంటి దృష్టితో చూడాలంటే, తనని తాను alienate చేసుకొని తటస్థునిగా మారి చూడగలగాలి. బహుశా ఈ కాలంలో చాలామందికి అది అలవడినట్టుగా ఉంది. అయితే అది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని నా స్వానుభవం. నేను చదువుకున్న చదువు వల్లనో, ఇతర కారణాల వల్లనో నాకూ కొంత అలాంటి దృష్టి అలవడిందని నేను అనుకుంటున్నాను. కాని పూర్తిగా అలవడ లేదు. పూర్తిగా alienate అవ్వగలిస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు కాని, ఈ రెంటికీ చెడ్డ రేవడి స్థితి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఈ alienated viewకి కొన్ని ఉదాహరణలు చెపుతాను.
సురేశ్‌గారు రామాయణ, భాగవత కథలను “అల్లిబిల్లి” కథలు అన్నారు. నా దృష్టిలో యిది ఒక చక్కని ఉదాహరణ. చిన్నప్పుడు, నేను వీటిని విన్నప్పుడు, వీటిని “అల్లిబిల్లి” కథలుగా వినలేదు. నిజంగా జరిగిన కథలుగా విన్నాను. అదే నమ్మాను. పెరిగి పెద్దయిన తర్వాత అవన్నీ బహుశా కట్టుకథలు అనే విషయాన్ని విన్నాను. అలాంటి దృష్టి వచ్చిన తర్వాత, అవి నా హృదయంనుండి కొంత దూరంగా జరిగాయి. కేవలం వాటిని కట్టుకథల్లాగా చూసి, వాటిలోని కల్పనా చమత్కారం, శిల్పనైపుణ్యం, లేదా రసానుభూతి వగైరా వగైరాలను చూసి ఆస్వాదించవచ్చు గదా? వచ్చు, ఇప్పుడు నేనుకూడా చాలావరకూ అదే దృష్టితో వాటిని చూస్తున్నాను. కానీ అవేవీ ఇంతకుముందు అవి నిజమైన కథలే అన్న నమ్మకమున్నప్పుడు యిచ్చిన దగ్గరితనాన్నీ, అనుభూతిని ఇవ్వలేకపోతున్నాయి మనసుకు. ఇదే విషయం, భక్తి కీర్తనలకు కూడా వర్తిస్తుంది. చాలామంది వాటిలోని సంగీతసాహిత్యాలను మాత్రమే ఆస్వాదిస్తారు. నేనుకూడా వాటిని ఆస్వాదిస్తాను. అయితే, రామదాసు నేరుగా రామునితో పెట్టుకున్న మొర, లేదా త్యాగయ్య రాముని ఎదురుగా ఆలపించిన కీర్తన అనే నమ్మకం ఉండిన రోజుల్లో, ఆ పాటలను విన్నప్పుడు కలిగిన ప్రత్యేక అనుభూతి నేనిప్పుడు పొందలేకపోతున్నాను. ఇంకా చాలా ఉదాహరణలు ఇవ్వగలను. పండగలు జరుపుకోవడం కూడా అలాంటి alienated viewకి ఉదాహరణే. ఇదంతా “మానసికమైన ఎదుగుదల”లోనో లేదా “సమాజం ఎదుగుదల”లోనో ఒక భాగమా? అయ్యుండవచ్చు, నాకు తెలియదు. కాని ఏదో లోటు మాత్రం చాలా స్పష్టంగా కష్టపెడుతూ ఉంటుంది.
4. మళ్ళీ మొదటికి వస్తాను. పూర్వ కాలంలో సిద్ధాంత చర్చల్లో సామాన్యులు ఎంతవరకూ భాగస్వాములు? సామాన్యులపై వాటి ప్రభావం ఎంత? ఇవి పండితుల వాదప్రతివాదాలకూ, రాజాశ్రయాలకూ మాత్రమే పరిమితమయ్యేవని అనుకుంటున్నాను. అంచేత వాటివల్ల సామాన్యప్రజలకి (అంటే ఆయా సిద్ధాంతాలలో ప్రవేశం లేని వారికి) పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పుడలా కాదు కదా? ఈ గందరగోళానికి అదొక ముఖ్యకారణం కాదా?
ఆఖరిగా, ఈ వ్యాఖ్య నేను ఒకరిని సమర్థించడానికో మరొకరిని వ్యతిరేకించడానికో రాసింది కాదు. కేవలం, కొంత కాలంగా నాలో ఉడుకుతున్న అస్పష్టభావాలను వ్యక్తపరచడానికి మాత్రమే, జరుగుతున్న చర్చకి ఎంతో కొంత సంబంధం ఉందన్న ఉద్దేశంతో. దీని గురించి ఇంతకన్నా చెప్పే సామర్థ్యం నాకు లేదు. కాబట్టి దీనిపై ఇంకేవైనా వ్యాఖ్యలు వచ్చినా మౌనంగా చదువుకుంటాను.
‘When I use a word,’ Humpty Dumpty said, in rather a scornful tone, ‘it means just what I choose it to mean — neither more nor less.’? 🙂
ఈ మధ్య ఒక సంస్కృత పండిత సభ జరిగితే, అందులో సౌమ్యుడు, వినయశీలి అయిన పండితుణ్ణి అధ్యుక్షునిగా ఎన్నుకున్నారట. అధ్యక్షుడు అన్న పదానికి అందరికీ తెలిసిన అర్థం అధి + అక్షః అంటే పైనుండి చూచువాడు, supervisor, పెద్ద- మొదలైన అర్థాలు మనకు తెలుసు కదా. ఆ వినయశీలి లేచి అధ్యక్షుడు అంటే అ + ధి (=బుద్ధి) + అక్ష (=ఇంద్రియాలు), అని చెబుతూ నాకు బుద్ధి, ఇంద్రియాలు లేవు కాబట్టి నన్ను అధ్యక్షుడిదిగా ఎన్నుకున్నారు అని చమత్కరించారట. పక్కనే కూర్చున్నా మహా పండితుడు లేచి “భగవద్గీతలో ‘అక్షరాణాం ఆకారోస్మి’ అని పరమాత్ముడు అన్నాడు కాబట్టి ఆ అ-కారరూపుమైన పరమాత్మ యందు బుద్ధి, ఇంద్రియాలు కలవాడు కాబట్టి ఆయనను అధ్యక్షుని చేయడం సబబే అని హర్షధ్వానాల మధ్య వివరించాడట.
పదనిర్మాణ రీత్యా (morphologically) సంస్కృత భాష ఒక సంలీన భాష (inflectional language). ఒక వాక్యాన్ని, వివిధ పదాలుగా; ఒక పదాన్ని భిన్నమైన పదాంశాలుగా ఎన్నో రకాలుగా విడదీయవచ్చు. ఈ రకమైన సౌలభ్యం వల్ల ఒకే శ్లోకాన్ని వివిధ రీతులుగా విడగొట్టి పరస్పరం వ్యతిరేకమైన అర్థాలు సాధించవచ్చు. ఈ రకమైన పాండిత్య ప్రకర్ష చమత్కారాలకు బాగానే ఉంటుంది కానీ, శాస్త్ర చర్చల్లో అంతగా పొసగదు. అయితే, గత కొన్ని వందల యేళ్లుగా మన పండితులు పదాలకు కొత్త, కొత్త అర్థాలు క్రోంగొత్త రీతిలో సాధిస్తూ మన గ్రంథాలకు సరికొత్త భాష్యాలు రాయడంలోనే తలమునకలయ్యారంటే అతిశయోక్తి కాదేమో.
ఉదాహరణకు, మధ్వాచార్యులవారు మహావాక్యాలలో ఒకటైన “తత్త్వమసి (that art thou)” అన్న దానికి భాష్యం చెబుతూ ఛాందోగ్యోపనిషత్తులో “శ్వేతకేతో తత్త్వమసి (O Svetaketu, thou art that)” అన్న దానిని “శ్వేతకేతో + అతత్త్వమసి = శ్వేతకేతోతత్త్వమసి”(O Svetaketu, thou art not that)” అని విడదీసి ద్వైత సిద్ధాంత అన్వయాన్ని సాధించాడు. ఈ రకమైన పదవిభజనలతోనే ఆయన ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వన్నీ తన సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయని నిరూపణ చేశాడు. ఈ రకమైన పదవిభజనలు శంకరాచార్యుల, రామానుజాచార్యుల భాష్యాల్లో కూడా కనిపిస్తుంటాయి. అందువల్లే వారు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలన్నీ తమ, తమ సిద్ధాంతాలను సమర్తిస్తున్నాయని చెప్పుకోగలిగారు.
అయితే, చారిత్రకంగా చూస్తే, వేదానంతర కాలంలో వైదిక కర్మకాండ పట్ల ఒక రకమైన నిరసన ఉండేదని, ఆ నిరసన భావం ఉపనిషత్తులలో, భగవద్గీత వ్రాయబడిన తొలిదశల్లో తీవ్రస్థాయిలో ఉండేదని మనకు లభిస్తున్న ఆధారాలను బట్టి ఊహించవచ్చు. ఆ వాతావరణంలోనే వైదిక కర్మకాండలకు తిరుగుబాటుగా భౌద్ధ మతం, జైన మతం, సాంఖ్య, యోగ, అజీవిక, చార్వాక మతాలు ప్రాచుర్యం చెందాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ దృష్టితో చూస్తే, భగవద్గీతలో నేను ఉటంకించిన నాలుగు శ్లోకాలలో వేదాలను తక్కువ చేసి “త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున” అని చెప్పడానికి సులభమైన వివరణ ఇవ్వవచ్చు. అంతేకాని, ఆ శ్లోకాలలో “వేదం” అంటే “వేదం” కాదు అంటూ వితండవాదన చేయడం వల్ల మనకు కొత్త విషయాలేం బోధపడవు.
అలాగే, ముండకోపనిషత్తులో వేదాలను తక్కువస్థాయి విద్యలుని, వాటిని అపరవిద్యలుగా నిర్వచించారని వ్యాసంలో అనుకున్నాం కదా. అదే ఉపనిషత్తులో ద్వితీయఖండంలో అపరవిద్యల గురించి ఇంకా ఇలా అంటారు:
అపరమైన కర్మ పదునెనిమిది అంగాలతో కూడిన యజ్ఞకర్మల పైన ఆధారపడి ఉండును. ఇవన్నియు వాస్తవానికి బలహీనమైన తెప్పల వంటివి. వీటి వల్ల పదే, పదే జరామృత్యువులు తప్పవు.
అజ్ఞానముతో చరించు ఈ మూర్ఖులు తాము ఆప్తకాములైనట్లు చిన్నపిల్లల్లా భావిస్తుంటారు. రాగరతులై ఉన్నందున సత్యమును గ్రహించలేరు. అందువలన పుణ్యకర్మఫలముగా లభించిన స్వర్గాది లోకములు అనుభవించిన పిదప మళ్ళీ క్రిందికి జారుదురు.
కర్మపరులైన ఈ మూర్ఖులు యజ్ఞవిధులు, పుణ్యకార్యములు మాత్రమే శ్రేష్ఠమైనవని భావిస్తూ, అన్యమైన మరే శ్రేయోమార్గమును తెలియలేరు. వీరు ఉన్నతమైన స్వర్గలోకములో పుణ్యఫలము అనుభవించి మఱల ఈ లోకములో గాని, ఇంతకన్నా హీనమైన లోకములో గాని ప్రవేశించుదురు.
అలాగే బృహదారణ్యకోపనిషత్తులోనూ ఇటువంటి వేదనిరసన కనిపిస్తుంది. ఆదిశంకరుని భాష్యాల్లోనూ జ్ఞానాన్ని ఉగ్గడిస్తూ వేదాలను, కర్మకాండను నిరసించే శ్లోకాలు కనిపిస్తాయి. శంకరుడు వేదనింద చేశాడా లేదా అంటూ సుదీర్ఘ చర్చలు మన పండిత లోకంలో మామూలే.
అయితే, వెండీ డానిగర్ రాసిన పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మికం కాదు, చారిత్రాత్మకం. నా వ్యాస ప్రాధాన లక్ష్యం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక చర్చల గురించి కాదు. వేదంలో వర్ణించిన మతానికీ, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో అనుసరిస్తున్న హిందూ మతానికి చాలా తేడాలు ఉన్నాయని, అందువల్ల కేవలం వేదాల ఆధారంగా హిందూ మతం గురించి సంపూర్ణంగా వివరించలేమన్నదే నా వాదన. నా వ్యాసంలో బాత్రా అభియోగానికి బదులుగా ఇలా అన్నాను:
ఋగ్వేదంలో కనిపించే దేవతలు మిత్ర, వరుణ, అర్యమ, భగ, అంశ, ఇంద్ర, అగ్ని, ఉషస్ వంటి ప్రధాన దేవతలు తరువాతి హిందూ మతంలో ప్రాధాన్యత కోల్పోయారు. వేదాలలో ప్రముఖమైన అగ్నిస్తోమ (సోమయాగం), అశ్వమేధ, పురుషమేధ, అగ్నిచయన, చాతుర్మాస్య యజ్ఞాలు తరువాతి కాలంలో కనిపించవు. ప్రస్తుతం హిందూ మతంలో ప్రధానమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వం, లక్ష్మి, పార్వతి, సరస్వతి వంటి స్త్రీ దేవతల ప్రస్తావన వేదాలలో కనిపించదు. హిందూ మతానికి ప్రధానమని చాటిచెప్పే దశావతారాల ప్రస్తావన గాని, కర్మ సిద్ధాంతం గాని, పునర్జన్మ సిద్ధాంతం గాని వేదాలలో ఎక్కడా కనిపించదు.
ఇప్పుడు వివిధ మానవీయ, సామాజిక శాస్త్ర (linguistics, epigraphy, archaeology, history, population genetics etc.) పరిశోధనల ద్వారా మనకు లభ్యమౌతున్న సమాచారాన్ని బట్టి మనం మన చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకొని, హిందూ మత చరిత్రలో పరిణామాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో వెండీ డానిగర్ రాసిన పుస్తకం ఒకటి. కొంత నిష్పాక్షిక దృష్టితో ఆమె పుస్తకాన్ని చదివితే హిందూ మతపరిణామం గురించి కొంతైనా అవగాహన కలుగుతుందని నా అభిప్రాయం.
ఆఫీసు పనుల ఒత్తిడిలో గత రెండురోజులుగా ఈమాటలో నా వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలకు సమాధానాలు వెంటనే రాయలేకపోయినందుకు క్షంతవ్యుణ్ణి. ఇతర అభిప్రాయాలకు కూడా ఈ రోజు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
ఒకే ఒక భరద్వాజుడు, ఒకే ఒక జనకుడు కాక పలువురు భరద్వాజులు, పలువురు జనకులు ఉన్నట్లే ఒకే ఒక శివుడు కాక పలువురు, అనేకులు, అనేకానేకులు శివుళ్లు ఉన్నారని నా అభిప్రాయం. లింగం ఊడిపొయిన శివుడూ, జంగం అయిపొయిన శివుడూ ఒకరు కాదన్నది (కాక పోవచ్చన్నది) నా ప్రతిపాదన. ఒకే ఒక ఒకే ఫిజిక్స్ లేదు ఒకే ఒకే మెకానిక్స్ లేదు. (ఒకదాంతో మరొకటి కలుపుకుని కషాయం చేసుకొవచ్చు, అది వేరే విషయం). కాబట్టి ‘శివుడి చరిత్ర’ అంటూ ఉండదు. కాబట్టి శివుడి చరిత్ర ఒకరికి తెలియటమూ, మరొకరికి తెలియక పోవటమూ అన్న ప్రసక్తి లేదు. అకడమీషియన్స్ సృష్టించిన మోడరన్ మిత్ లలొ ఇది ఒకటి. నా శివుడి గురించి నాకు తెలుసు.
“అమంగల్యం శీలం తవభవతు నా మైవ మఖిలం తథాపి స్మర్తౄణాం వరద పరమం మంగళమసి!”
బల్లి ఫలితం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/06/2014 12:00 pm
అభిసారం అని “appointment” అనే ఆంగ్లపదానికి భాషాంతరీకరణం అంత సబబుగా తోచదు. కాని వైజ్ఞానిక కల్పన అని “science fiction” అనే మాటను భాషాంతరం చేయటం బాగుంది.
ఇటువంటి కథలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. ఐనా, ఇది కూడా చక్కగా ఉంది. ఇలాంటి కథ చదివినప్పుడు చలంగారి దోషగుణం కథ గుర్తుకు వస్తుంది.
కాని ప్రథానంగా ప్రస్తావించిన వైజ్ఞానిక కల్పన ఏమీ ఈ కథలో నాకు కనపడ లేదు మరి.
నా అభిప్రాయములు క్రింది అభిప్రాయములకు మాత్రమే పరిమితము –
1. దశరథునికి శ్రవణ కుమారు డిచ్చిన శాపం.
2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.
కైకేయికి ఈ వరములను గురించి తెలుసు. ఆమెకు కూడ రాముడంటే ప్రీతి, వాత్సల్యము. పట్టాభిషేకమునకు ముందే పుత్రశోక శాపము దశరథుడు అనుభవిస్తే తరువాత రాజ్యపాలన ఎట్టి కష్టము లేకుండ సాగిపోతుంది కాబట్టి ఆ వరములను కైక అడిగినట్లు భాసమహాకవి ప్రతిమా నాటకములో, యజ్ఞఫలనాటకములో వివరిస్తాడు. తన తొట్రుబాటులో 14 రోజులు అనడానికి బదులు 14 ఏండ్లు అంటుంది ఆమె. The rest is history. కాని మునిశాపమును దశరథుడు అనుభవించడమును కైకేయి ఆపలేక పోతుంది. వాల్మీకి రామాయణములో సీత లక్ష్మణుని సందేహించడము ఆమె పాత్రలో లోపమా? విధేయుడు – మోహన
ఈ రెండింటినీ కలిపి చూస్తే, “బంధువులనూ పూజ్యులనూ ధర్మం నేర్పిన గురువులనూ చంపి రాజ్యం చేజిక్కించుకోవడం కంటే త్యజించి బిచ్చమెత్తుకోవడం శ్రేయస్కరం కదా, ఆలోచించు. ఏం చేయాలో నీవే చెప్పు” అన్న అర్జునుడితో కృష్ణుడు “పండితులైనవారు బ్రతికున్నవారిని గురించిగాని, చనిపోయినవారిని గురించిగాని దుఃఖింపరు. నువ్వు పండిత వచనాలు పలుకుతూ (పరిహాసంగా) కూడనివాటిని గురించి దుఃఖిస్తున్నావు” అన్నాడు. ఈ విధంగా చూసినపుడు కర్మధర్మాలలో అభిమానం కలిగి ఉండిన అర్జునుడు ఇతర శ్రుతులకు పలుకుతూ సందిగ్ద వాదన చేశాడుగాని మీరు అన్నట్టు అది అవాదం కాదేమో! నా ఈ అన్వయంలో ఏదన్నా తప్పుంటే చెప్పండి.
గురించి శంకర భాష్యం ఇలా ఉంది: “అర్జునా! వేదములు ఈ సంసారమే విషయముగా గలవి. నీవు నిష్కాముడవును, ద్వంద్వములను వదలినవాడవును, నిత్య సత్వగుణము గలవాడవునూ, ఆత్మజ్ఞానము కలవాడవును కోరికలేనివాడవును నగుము.”
అయితే ఇదే శ్లోకానికి మధ్వాచార్యులు భాష్యం చేస్తూ ఆ త్రిగుణాలు వేదాలలో పైకి కనిపించే అర్దం మాత్రమే అన్నారు.
“యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే..” అన్న శ్లోకం గురించి మధ్వాచార్యులు ఇలా చెప్పారు: “వేదాలలో చెప్పిన ఫలమంతా బ్రాహ్మణునిలో నంతర్భవించును. బ్రాహ్మమును పొందువాడు బ్రాహ్మణుడు. బాహ్మపరోక్షజ్ఞానము గలవాడు బ్రాహ్మణుడు. అది జ్ఞానమువలన కలుగును”
దీనికే శంకర భాష్యం “సమస్తవేదములయందు చెప్పబడిన కర్మలననుష్ఠించడంవల్ల గలుగు ఫలము అంతకన్నను మిక్కిలి గొప్పదైన జ్ఞానముగల బ్రహ్మజ్ఞానికి గలుగు మోక్షరూపఫలములో నంతర్భావము నొందును” గా ఉన్నది.
***
@సురేష్ గారు,
నాకు రచయిత్రి భాషా పరిజ్ఞానం గురించి సందేహాలు లేవండి. ఉన్న సంశయమల్లా ఆమె అన్వయాలు సబబుగా ఉన్నాయా, వాటిని అన్వయించడంలో ఆవిడ నిజాయితీగా ఉన్నారా లేదా అని. రామాయణంలోంచి మీరు ఉదహరించిన శ్లోకాలలో చూసినా “మహారాజు నేడు దుఃఖం అనుభవిస్తుంటాడు”, “అర్థ, ధర్మాదుల కంటే కామమే బలమైనదని నాకనిపిస్తుంది” అని కోరిక (this need not necessarily be lust .. భార్యపై ఉండే సహజమైన ఆసక్తి ఇష్టం కావచ్చు) వల్లనే నేడు మహారాజు దుఃఖితుడై ఉన్నాడని చెప్పిన రాముడు/లక్ష్మణుడితో దశరథుడిని explicit గా sex-addict అని చెప్పించడం కరెక్టేనా అని.
ఈ వ్యాస రచయితగారు నన్నుద్దేశించి ‘మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. “త్రైగుణ్యవిషయా వేదా” అన్నప్పుడు వేద శబ్దానికి చతుర్వేదాలను ఆరోపించటం సబబు కాకపోవచ్చన్నారు. మరైతే, చతుర్వేదాలను పేర్లతో సహా ప్రస్తావించి వాటిని అపరా విద్యలుగా వర్ణించిన ముందకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తులలో శ్లోకాల గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? అని ప్రశ్నించారు.
ఛాందోగ్యోపనిషత్తు నాదగ్గర లేదు కాబట్టి దానిలోని శ్లోకాలను ఉటంకించి అభిప్రాయం చెప్పలేను. ముండకంలో మీరడిన శ్లోకం గురించి వ్రాస్తాను. ముండకోపనిషత్తులో ప్రథమముండకంలో
అన్న మంత్రం నాలుగువేదాలనూ, వాటితో బాటుగా శిక్షాదిగా ఉన్న ఆరు వేదాంగాలనూ ప్రస్తావిస్తున్నది. ఈ మంత్రం తాత్పర్యం ప్రకారం ఇవన్నీ అపరవిద్యలునూ సనాతనమైన ఆత్మను గూర్చి తెలియజేసేది మాతం అపరవిద్యగానూ చెప్పబడుతున్నాయి. నాకున్న మిడిమిడి సంస్కృతభాషాజ్ఞానానికి అవగాహన ఐనదిది. ఈ సందర్భంగా నా అభిప్రాయం క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.
నాలుగువేదాలూ సమస్తమైన (వైదిక)కర్మకలాపానికీ మూలం. ధర్మం యొక్క స్వరూపంగా భాసిల్లే విధినిషేధాలనూ ఈ వేదం ఆధారాలుగానే తెలుసుకుంటున్నాము. సమస్తమైన ఆర్షజీవనానికి శ్రుతి అంటే వేదమే ప్రమాణం. శ్రుతివిరోధం లేనంతవరకూ ఉపనిషత్తులు కూడా ప్రమాణాలు. శ్రుత్యుపనిషత్ప్రమాణాలకు విరోధం కానంత వరకూ పురాణేతిహాసాలు కూడా ప్రమాణాలే. ఇదీ మనం ఆర్షవాంగ్మయం నుండి ప్రామాణికతను గ్రహించే విధానం. శిక్షాదిగా ఉన్న ఆరు వేదాంగాలూ, వీటిని సమగ్రంగా బోధించే సమస్తశాస్త్రాలూ కూడా శ్రుతిప్రామాణ్యతను అనుసరించే తగినంత ప్రమాణాలు. కాని ఇదంతా ఇహలోక వ్యవహారంలో ధర్మానుష్ఠానానికి సంబంధించినది. స్వర్గాదికామసుఖప్రదములైన యజ్ఞాదులన్నీ కూడా వైదికమైన వ్యవహారములే. వేదాధ్యయనం కావచ్చును, యజ్ఞాచరణం కావచ్చును కాని అవేవీ స్వయంగా మోక్షప్రదమైనవి కానేకావు. అందుచేత వీటికి సంబంధించిన సమస్తవ్యవహారమూ అపరవిద్య.
కేవలం ఆత్మాఽనాత్మవివేకసంపాదనా సాధనాలైన ఉపనిషత్తులు మాత్రము పరవిద్యను బోధిస్తున్నాయి. పునరావృత్తిరహితమైన పదమునకు చేర్చేది తత్త్వమసీతి వాక్యప్రబోధములను చక్కగా తెలుసుకున్నవాడే కాని ఏవిధమైన లౌకికవిద్యాభ్యాసం చేసినవాడూ కాడు.
అట్టి పరావిద్యను యెఱిగినవాడు దేహాభిమానం విడచి పరమాత్మతో సంయోగం చెందుతాడు. అనేక జన్మలసాథన పట్టవచ్చు ఒక జీవికి ఆ స్థితి రావటానికి. గీతలోనే, భగవన్ముఖంగా, యోగభ్రష్టుడు తిరిగి తన యోగాభ్యాసాన్ని కొనసాగించేందుకు తగిన ఉత్తమమైన జన్మను పొందుతాడని చెప్పబడింది. అందుచేత అప్పుడప్పుడు మనకు జన్మసిధ్ధులైనవారు కూడా లోకంలో దర్శనం ఇస్తారు. కాని వారు తాము లౌకికప్రపంచంలో పదిమంది దృష్టికి రావటాన్ని ఇష్టపడకపోవచ్చు తరచుగా. అందుచేత అటువంటి వారు మనమధ్యే ఉన్నా వారి సంకల్పం లేనిదే మనం వారిని తెలుసుకోలేము. ప్రాపంచికమైన విషయాలమీద వారికి ఏ విధమైన కోరికా ఉండదు కాబట్టి వారు ఏ విధమైన అపరవిద్యలను ఆశ్రయించరు. రకరకాల సౌఖ్యాలను అపేక్షించే మనకోసమే అపరవిద్యలు. కేవలం పరబ్రహ్మమును కోరిన వారు పరవిద్యను మాత్రం ఆదరిస్తారు.ఇంతకంటే చెప్పగల అధికారిని కాదు, క్షమించాలి.
వేమూరి గారు: వెండీ డానిగర్ విదేశీ పరిశోధకురాలు కాబట్టి ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆక్షేపణలలా కనిపించాయన్నది వాస్తవమే కావచ్చు. నిజానికి హిందువులు కానివారు వెండీ డానిగర్ పుస్తకం చదివితే హిందూ మతంలో తొలినుండి కనిపించే భిన్నత్వంలో ఏకత్వం, కొత్త కొత్త ఆలోచనలను తనలో ఇమిడ్చుకోగలిగే విశాల దృక్పథం మొదలైన వాటి గురించి ఆమె వివరించిన విధానాన్ని బట్టి హిందూ మతంపై ఎనలేని గౌరవం కలుగుతుందనే నా అభిప్రాయం.
ఇక, బైబిల్ లోని కథల గురించి పలురకాల విశ్లేషణలతో క్రైస్తవులు, క్రైస్తవేతరులు రాసిన వందలకొద్ది పుస్తకాలు వచ్చాయి. నీషీ (Nietzsche) రాసిన The Antichrist (Der Antichrist), రసెల్ (Bertrand Russell) రాసిన Why I Am Not a Christian క్రిస్టియానిటీనీ తీవ్రంగా విమర్శిస్తూ రాసిన పుస్తకాలలో కొన్ని. మతాతీత/లౌకిక లక్ష్యాలతో ఐజక్ అసిమోవ్ రాసిన Asimov’s Guide to the Bible, అమెరికన్ ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్ రాసిన The Life and Morals of Jesus of Nazareth వంటి పుస్తకాలపై కొంతమంది మతఛాందసవాదులు విరుచుకుపడ్డా ఆ పుస్తకాలు ఏ నిషేధానికి గురికాలేదు.
విశ్వవిద్యాలయాల్లో బైబిల్ పై అధ్యయనాలు Textual criticism, Source criticism, Form criticism, Redaction criticism, Canonical criticism, Rhetorical criticism, Narrative criticism,Psychological criticism, Socio-scientific criticism, Postmodernist criticism, Feminist criticism అంటూ శాఖోపశాఖలుగా విస్తరిల్లినట్టుగా క్రిస్టియన్ స్టడీస్ పై కొన్ని పేపర్లు చూచాయగా చూసిన నాకనిపిస్తుంది. హిందూ మతానికి చెందిన వారిలో దీపక్ చోప్రా రాసిన The Third Jesus: The Christ We Cannot Ignore, Jesus: A Story of Enlightenment చూశారా? ఇందులో దేవదూతగా మనకు తెలిసిన జీసస్, చర్చి వారు వారి మతప్రచారానికి సృష్టించుకున్న వ్యక్తి అని, చరిత్రకారులు చెబుతున్న రెండవ జీసస్ కాక, అసలు జీసస్ కథ అంటూ ఊహాత్మకంగా మూడవ జీసస్ కథ చెబుతాడు. ఈ పుస్తకాలపై వివాదం కానీ, అనవసరమైన ప్రచారం కానీ జరగలేదు.
పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు భారతదేశానికి పక్కనే ఉండడం, అక్కడ ప్రబలంగా ఉన్న తాలిబన్ ఛాందస భావాలు, వారి మతంపై, మతగ్రంథంపై ఏమాత్రం కొత్తరకమైన విశ్లేషణను సహించలేని మూఢత్వం, మన దేశంపై కూడా పడి హిందూ మతస్థులను ఈ రకమైన మతమౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నాయని నా అభిప్రాయం.
నాకు కొన్ని సందేహలు, ఇవి వెండీ పుస్తకం లోని అంశాలు గురించి కానీ, లేదూ పురాణాలు ఏమి చెబుతున్నాయి అని కానీ కాదు! కొంచెం టాపిక్ నుంచి పక్కకి పోయి అడుగుతున్నందుకు క్షమించాలి (మరీ out of context కాదులెండి).
1. ఇది మీ వ్యాసం లోని భాగం :
[నిజానికి, కాస్త తెలివైన జడ్జి ఎవరైనా ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి ఆపై ఈ కేసు పరిశీలించి ఉంటే ఇటువంటి నిరాధారమైన అభియోగాలు ఉన్నందుకు ఈ కేసు ఎందుకు పనికి రానిదని వెంటనే కొట్టివేసి ఉండేవాడు. కానీ అలా జరగలేదు.]
పెంగ్విన్ పబ్లిషర్స్ (ఇది ఏదో చిన్న పబ్లిషింగ్ సంస్థ కాదు కదా?) ఇది గమనించకుండా అది కూడా కోర్టు బయట ఒప్పందంతో కేసు నుంచి తప్పుకోవటం ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి కారణం ఏదన్నా ఉందంటారా?
2. పుస్తకం ఎవరూ ఇంత వరకు బాన్ చేయలేదు కేవలం పెంగ్విన్ పబ్లిషర్స్ వెనక్కి తీసుకున్నారు అంతే కదా? మరి వెండీనో లేదూ ఆ పుస్తకాన్ని సమర్దించేవారు చాలా మందే ఉన్నారు కదా, వీళ్ళు ఎవరన్నా వేరే పబ్లిషర్స్ నుంచి పుస్తకాన్ని రిలీజ్ చేయొచ్చు కదా?
3. ఇండియన్ లా, అమెరికన్ లా, కంపేర్ చేసి రాశారు. అమెరికాలో జెండాని కాల్చినా నేరం కాదు ఇది అందరికీ తెలిసిన విషయమే, అదే పని ఇండియాలో చేస్తే కేసు. అది కూడా అందరికీ తెలిసిన విషయమే కదా? వేరు వేరు దేశాలకి వేరే వేరే Law policies ఉండటం నేరమా? అయినా ఒక matured సొసైటీ Lawని ఇండియా లో కూడా implement చేయమనడం మనకి బావున్నా అది సాధ్యం కాదేమో. ఆ సాధ్యాసాధ్యాలు ఏంటొ తెలుసుకోవాలి అని ఉంది.
4. బాత్రా తనకున్న కోర్టులో కేసు వేసుకునే వెలుసుబాటు / అవకాశం ఏదో దాన్ని వాడుకుని లీగల్ గా ప్రొసీడ్ కావటంలో నేరం ఏంటి? అది అతను చేయకూడదు అని అనటం తన హక్కుని కాలరాయటం కాదా? ఇది violation of freedom స్పీచ్ కాదంటారా? ఆ లీగల్ నోటిస్ లో బుక్ ని బాన్ చేయమని లేదు కదా? ఏవో కొన్ని అంశాలు ప్రస్తావించారు. దానికి వెండీ ఎందుకు వివరణం ఇవ్వకూడదు? ఫిక్షన్ రాస్తే ఏమో కానీ, ఆల్టర్నేట్ హిస్టరీ అని చెప్తునప్పుడు వివరణలు, దానికి తగిన ఆధారాలు అవసరం కాదా?
5. మీరు The Satanic Versesని ఇక్కడ ప్రస్తావించారు. ఆ పుస్తకం విషయం లోను, ఈ పుస్తకం విషయం జరిగిన రభస ఒక్కటేనా? తేడా లేదంటారా?
మొత్తం మీద మాత్రం అమెజాన్.కామ్‌లో పదకొండు వేల రాంక్ ఉన్న పుస్తకం – (ఇది మీరు చెప్పినదే) మరి అంతగా పాపులర్ కానీ పుస్తకాన్ని పబ్లిషర్స్ వెనక్కి తీసుకుంటే నిజంగా చాలా నష్టం జరిగిపోతుంది అని ఇంత వాదనలు ఎందుకబ్బా వీళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారానే సమాధానం చెప్పి ఉండొచ్చుగా అని కూడా అనిపిస్తుంది. ఇది ఎంత వరకు కరెక్టో అది మాత్రం తేల్చుకోలేక పోతున్నాను.
ఈ పుస్తకానికి అస్సలు సంబంధం లేని ఇంకో సందేహం కూడా వస్తుంది — 200 / 300ఏళ్ళ తరవాత ఎవరన్నా తెలుగు వాళ్ళ చరిత్ర రాయాలని నిర్ణయించుకుంటే ఇప్పుడు వచ్చే సినిమాలు, టివిల్లో వచ్చే సీరియల్స్, తెలుగు బ్లాగుల్లో రాస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా సోర్సెస్ అవుతాయా అని. అవుతాయేమో!
నాగార్జున గారు: మంచి ప్రశ్నే అడిగారు. వెండీ డానిగర్ రామాయణ,మహాభారతాలు క్షుణ్ణంగా చదువుకుందని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. ఫలానా పదానికి ఫలానా ఇంగ్లీష్ పదం వాడింది కాబట్టి ఆమెకు సంస్కృతం రాదు, రామాయణ, మహాభారతాలు ఆమెకు తెలియవు అన్న విమర్శలు వింటూవుంటాం. అయితే, ఆమెకు తెలిసినన్ని పురాణ కథలు, ఉపనిషత్తుల కథలు, అనేక రకాల రామాయణ, మహాభారత కథలు — వాటిలో కనిపించే సూక్ష్మ వ్యత్యాసాలు — ఆమెకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవని ఆమెను వ్యక్తిగతంగా ఎరిగిన వారు నాతో అన్నారు.
మీరు చూపిన శ్లోకంలో దశరథుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాటల్లో కామ- అన్న శబ్దానికి అర్థం ‘దేహ సంబంధమైన కాముకత్వం’ కాదు అన్నదే మీ ఆరోపణ, అవునా?
రాముడు, లక్ష్మణుడు అడవులకు వెళ్ళిన తరువాత అయోధ్యలో ఉన్న తల్లిదండ్రుల గురించి వారు మాట్లాడుకున్న విషయాలను వివరించే వాల్మీకి రామాయణపు శ్లోకాలు చూడండి (అయోధ్య కాండ, 53వ సర్గ):
స తు సమ్విశ్య మేదిన్యాం మహా అర్హ శయన ఉచితః |
ఇమాః సౌమిత్రయే రామః వ్యాజహార కథాః శుభాః || 2-53-5
గొప్ప శయనతల్పం పై పరుండడానికి అలవాటు పడిన రాముడు, మైదానంపై మేను వాల్చి సౌమిత్రితో ఇలా పలికాడు.
అయ్యో! కైకేయి సుతుడు, తన భార్యతో కోసల రాజ్యాన్ని అధిష్టించి ఒక్కడే సంతోషంగా భోగిస్తాడు.
స హి సర్వస్య రాజ్యస్య ముఖం ఏకం భవిష్యతి |
తాతే చ వయసాతీతే మయి చ అరణ్యం ఆశ్రితే || 2-53-12
తండ్రి వయసాతీతుడైనాడు. నేను అరణ్యాలపాలయ్యాను. ఇక భరతుడే సర్వరాజ్యానికి అధిపతిగా కాగలడు.
అర్థ ధర్మౌ పరిత్యజ్య యః కామం అనువర్తతే |
ఏవం ఆపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా || 2-53-13
దశరథ రాజులాగా ఎవరైతే అర్థాన్ని, ధర్మాన్ని పరిత్యజించి కామాన్ని అనువర్తిస్తారో, వానికి ఈ రకమైన కష్టాలు తప్పవు.
వాల్మీకి రామాయణంలో ఇంత వివరంగా చెప్పిన రాముని వచనాలు చదివాక కూడా కామ- అన్న పదం దశరథుని కాముకత్వాన్ని, స్త్రీలోలత్వాన్ని సూచించడానికి వాడిందని అనుకోవడంలో తప్పు లేదు కదా!
వెండీ డానిగర్‌ను విమర్శిస్తున్న వాళ్ళలో చాలా మంది వాల్మీకి రామాయణాన్ని, సంస్కృతమూలాలను చదవలేదు. వీళ్ళలో కొంతమందికి సినిమాల్లో, టీవీ సీరియళ్ళలోనూ చూపిందే వారికి తెలిసిన రామాయణము. వీరందరికంటే, పలు భాషల్లో, పలురకాల రామాయణాలను తరచి చూసి కొత్త కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న వెండీ డానిగర్ దృక్కోణం నాకు చాలా ఆసక్తికరంగాను, పరిశోధనాత్మకంగానూ అనిపిస్తుంది. ఆవిడ విశ్లేషణతో వీరు ఏకీభవించకపోయినా ఫరవాలేదు కాని, ఆమె పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా, సంస్కృత మూలాలతో పరిచయం లేకుండా ఆమె పాండిత్యాన్ని కించపరుస్తూ నానా మాటలు అనడం సమంజసం కాదని నా అభిప్రాయం. మీరేమంటారు?
సురేశ్ చాల శ్రమ పడి, పరిశోధన చేసి ఈ వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసం చదివిన తరువాత నాకు చిన్న అనుమానం వస్తోంది. వెండీ డానిగర్ హిందువు కాదు కనుక ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆక్షేపణలలా కనిపించాయా మనవాళ్లకి? ఒక క్రైస్తవేతరుడు ఇదే రకం పుస్తకం క్రైస్తవమతం మీద కాని, ఇస్లాం మతానికి చెందని వ్యక్తి ఇదే రకం పుస్తకాన్ని ఇస్లాం మీద కాని రాస్తే ఆయా మతాల వారి ప్రతిస్పందన ఎలాగుంటుందో? మన పిల్లలని మనం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం కాని అదే పని పరాయి వాళ్లు చేస్తే చాంతాడంత కోపం వస్తుంది. – వేమూరి.
భగవద్గీత ప్రస్తావనకు వచ్చింది. భగవద్గీతకు ఇప్పటికే లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. అలా వస్తూనే ఉంటాయి రానున్నకాలంలో కూడా.
నేను ‘త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున’ అన్న దాన్ని వ్యాఖ్యానించగల పాండిత్యంకలవాడిని కాను. కాని గీతలో ఇక్కడ ‘వేదా’ అని చెప్పబడినది లౌకికమైన విషయజ్ఞానం గురించి. అది త్రిగుణాత్మకమైన సృష్టిని ఎరుకపరచేది మాత్రమే అనీ, నిస్త్రైగుణ్యుడవు కమ్మని భగవానువాచలోని అంతరార్థం బహుశః త్రిగుణాత్మకమైన ప్రకృతికి అతీతమైన స్థితినిని సంపాదించమనీ చెప్పటం అనీ అనుకుంటున్నాను. నామరూపాత్మకమైనది ప్రకృతి. నామరూపాలు లేకపోతే సృష్టి లేనే లేదు. నామరూపాలచేత తెలియబడే ప్రతిదానికి దాని అభావం కూడా అలాగే తెలియబడటం చేత సమస్తద్వంద్వాలూ ఎరుకలోనికి వస్తున్నాయి. ప్రకృతిని అధిగమించినప్పుడు నామరూపాలూ అధిగమించబడి సమస్తద్వంద్వాలకూ ఉనికి ఉండని ఆ స్థితిలో శుధ్ధసత్త్వం మాత్రమే ఉంటుంది. అందుచేత త్రిగుణాత్మకమైన ప్రకృతినీ దానివలన కలిగే ద్వంద్వాలనీ (వాటిలో సుఖదుఃఖాదులూ ఉన్నాయి) అధిగమించి కేవలం ఆత్మగా సుప్రతిష్ఠితుడవు కమ్మని భగవానుడి అభిప్రాయం. ఇది నా అవగాహన. దీనితో పండితులు ఏకీభవిస్తారో లేదో తెలియదు కాని ముఖ్యంగా ఈలాంటి శ్లోకాలలో వేద శబ్దం రాగానే చతుర్వేదాలకు ఆ శబ్దాన్ని అరోపించటం అన్నిసందర్భాలలోనూ సబబు కాకపోవచ్చునని చెప్పటమే నా వ్యాఖ్య ఉద్దేశం.
మన ప్రాచీన గ్రంధాల్లో శృంగారం గురించి వ్యాసకర్త అభిప్రాయం సమర్థనీయమే. మాటవరసకు జయదేవుడి అష్టపదులకు ఈ రోజున తెలుగుచేస్తే అవి బూతులే అనిపించుకొనే అవకాశం మెండు. అదేదో గుడిలో నగ్నపార్వతి శిల్పం ఉన్నదొక ఆలయస్తంభం పైన.
మరొక అభిప్రాయం వ్యాసకర్తది కూడా సమర్థనీయమే. ఈనాడు మన మతగ్రంథాల గురించి ఇతరులు వ్రాస్తే ఆమోదాక్షేపణాదులు చెప్పటం అటుంచి వాటిపైన సాధికారంగా సమ్యక్దృక్పధంతో వ్యాఖ్యానించగల వారెందరు?
దురదృష్టవశాత్తు శన్కరులను, రామానుజులను అధ్యయనం చేసినట్లు మధ్వాచార్యులను చాల మన్ది అధ్యయనం చేయలేదు. వాస్తవిక ఆస్తికత కేవలం బ్రహ్మమ్ లో ఎలా సమస్త వాంగ్మయమ్ సమన్వయం ఔతుందో తెలుసుకున్నపుడే జిగ్సా పజిల్ సొల్వ్ చెసినట్లు ఆహా ఫీలిన్గ్ కలుగుతున్ది. రఘు గార్కి ధన్యవాదాలు.
అసలు త్రిమతాచార్యులు చెప్పిన్ది ఏమిటొ తెలియదు కాని మిడి మిడి జ్ఞానంతో వేద వాంగ్మయాన్ని చిత్తమ్ వచ్చినట్లు వ్యాఖ్యానిన్చడమ్ మూర్ఖత్వమ్ కాక మరొకటి కాదు.
ఇతర విషయాల కంటే మీరుదహరించిన భగవద్గీత శ్లోకాలపై వివరణ ఇవ్వదల్చాను.
//భగవద్గీతలోనూ వేదవిద్యలను, కర్మకాండను నిరసిస్తూ శ్లోకాలు కనిపిస్తాయి. ప్రసిద్ధి చెందిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా’ అన్న శ్లోకానికి ముందున్న నాలుగు శ్లోకాలు, వేదాలలో ఉన్న జ్ఞానం పైపైన ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నా అది త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందిందని, ఆత్మజ్ఞానానికి పనికిరాదని ఖరాఖండిగా చెబుతున్నాయి.//
మీరు చెప్పిందే గనుక కృష్ణుడి ఉద్దేశ్యమైతే ఇక వేదాలకు విలువేమిటి? వేదవేత్తల అస్తిత్వమెక్కడ? వేదాలను విడిచిపెట్టిన ఆత్మజ్ఞానం అన్నది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. కనుక కృష్ణుని పై మాటలకు అసలైన అర్థాలను తెలుసుకోవాలి.
త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్య వ్రాసిన గీతాభాష్యం ఆధారంగా మీరుదహరించిన శ్లోకాలకు యథామతి వివరణనిస్తున్నాను.
//సురేశ్ వ్రాసినదిః పార్థా: అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు (వేద-వాద-రతాః) ఇంతకు మించింది వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.//
మధ్వాచార్య భాష్యంః
“ముక్తిని పొందడమనేది ’ఫల’మైతే స్వర్గాది భోగాలు పువ్వులవంటివి (పుష్పితాం). కేవలం వేద శబ్దాలను (వాచాం) మాత్రమే వల్లించేవారు కర్మలను, వాటి వల్ల లభించే సుఖాలను మాత్రమే తెలుసుకుంటారు. అలాకాక, ఎవరు వేదాలలోని అర్థాలను తెలుసుకొని మాట్లాడుతారో (వేదవాదరతాః) వారు ఫలం (ముక్తి) పట్లనే ఆసక్తి కలిగివుంటారు గాని పువ్వుల (కర్మజన్యువులైన స్వర్గాది సుఖాలు) పట్ల ఆదరం చూపరు.”
కామాత్మానః స్వర్గ-పరా జన్మ-కర్మ-ఫల-ప్రదాం
క్రియా-విశేష-బహులాం భోగైశ్వర్య-గతిం ప్రతి (2.43)
//సురేశ్ వ్రాసినదిః కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవీ, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైశ్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.//
మధ్వాచార్య భాష్యం: సుఖం, సంపత్తు (భోగైశ్వర్య) మొదలైన వాటిపైనే మనసు పెట్టిన వారు (కామాత్మానః) వాటిని ప్రసాదించే కర్మలందే ఆసక్తి కలిగినవారవుతారు. తద్వారా మళ్ళీ మళ్ళీ కర్మలను చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ చివరకు అనగా మహాప్రళయానంతరం అంధఃతమస్సును (గతిం) పొందుతారు (ప్రతి).
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥ (2-44)\
//సురేశ్ వ్రాసినదిః భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్చయ జ్ఞానం ఏర్పడదు.//
రఘుః పై పేర్కొన్న మధ్వభాష్యంలోనే ఈ శ్లోకాన్ని కూడా చేర్చడమైంది కనుక ప్రత్యేకంగా వ్యాఖ్యానించలేదు.
//సురేశ్ వ్రాసినదిః అంతటా జలం పొంగుతున్నప్పుడు బావి యొక్క ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.//
మధ్వాచార్య భాష్యం: బావి (ఉదప)లోని నీటి యొక్క ఉపయోగం, చుట్టూ విస్తారంగా నిండివున్న నీటి (సంప్లుత+ఉదక) ఉపయోగంతో ఎలా పోల్చవచ్చునో (యావన్ + అర్థ) అదేవిధంగా వేదాలలో (బాహ్యార్థంలో) తెలుపబడ్డ త్రిగుణాత్మకాలైన కర్మల్ని, సుఖాల్ని వేదవిదులు కూడా పొందుతారు. (అంటే వేదవిదులు ఆ సుఖాల కొరకు ప్రత్యేకంగా ప్రయత్నించరు అని అర్థం)
—–
ద్వితీయాధ్యాయారంభంలో కృష్ణుడు “ప్రజ్ఞావాదాంశ్చ భాషసే” అంటాడు. బుద్ధికి తోచినట్టుగా మాట్లాడ్డమే ’ప్రజ్ఞావాదం.’ ఇది నిజానికి ప్రజ్ఞ+అవాదం అన్న సంధితో వచ్చింది. ప్రజ్ఞ అంటే వేదవిహితమైన లేక శాస్త్రవిహితమైన ఆలోచన. దానికి విరుద్ధమైనది (అవైదికమైన/అశాస్త్రీయమైన) అవాద ప్రజ్ఞ.
గీతకు విరుద్ధమైన వ్యాఖ్యానాలను చేస్తే అది కూడా ’ప్రజ్ఞావాద’మే అవుతుంది.
మార్మికత నాకు అర్ధం కాదు. చాలా సార్లు మర్మం లేకుండా ఒక వాక్యం రాయటం ఎంత సులభమో అంత కష్టం కూడా నాకు. అలాంటి ఒక వాక్యాల సమాహారం, ఒక జీవితకాలపు మధనాన్ని ఈ పిల్ల కొన్ని వాక్యాల్లో ఇంత నెప్పితోనో, లేకుండానో ఎలా రాసేస్తుందీ అని నాకెప్పుడూ ఆశ్చర్యమే! ఒక్కోసారి ఆ ఫిలసాఫికల్ డైలమా మీద విచారం కూడా. ఎలాంటి విచారం అంటే, ‘మల్లెపూవు ఎగిరిపోయాక రాయి మీద పడ్డ పగులంత’ ‘ఎదురుచూడ్డం చేతకాని రోజున ఏడవటం మర్చిపోతానేమోనన్న భయమంత…’
నిజమే. మిన్నాగుల్లాంటి మనిషి చేసే పనులకన్నా వానపాముల్లాంటి ఆలోచనలు ఎంత నెప్పో తెలిసినదాన్ని కనుక, స్వాతి మీద ఇష్టం లాంటి గౌరవంతో… వీలుంటే, తప్పక చదవాల్సిన మిస్టికల్ మ్యూసింగ్స్!!
“అసలు మీరెలా ఉంటారు? ఆర్టో, లిటరేచరో, సినిమానో, భక్తో, పేకాటో, అమ్మాయో, మందో, వల్లకాడో ఏదో ఒకటి ఉండాలి కదా? ఏదీ లేకుండా ఎలా ఉంటారు? చెప్పండి. నిజం చెప్పండి?” అన్నాను తీవ్రంగా.
నిజం చెప్పమంటారా? ఆ పాత్రలోని వ్యక్తి గురించి నేను కూడా అంతవరకు ఆసక్తిగా చదువుతూ వస్తున్నానా, అలా ప్రశ్నించడం చదవగానే నాకూ నవ్వొచ్చింది.
చాలా మంది ఈ లోకంలో వాళ్ల కోసం కన్నా ఎదుటివాళ్ల గురించి ఆలోచిస్తూ సమయం గడిపేస్తారు. మొత్తానికి సమయం గడిపేసాము ఇవ్వాళ్టికి అన్నట్టుగా. కాని అనివార్య పరిస్తితుల్లో ఎదుటివ్యక్తుల గురించి తెలుసుకోవడంలో ఉండే ఆ త్రుష్ణే వేరేమో. మొత్తానికి కథలో పేర్లు లేకుండా, చివరి వరకు ఆసక్తిగా కథని నడిపించడం ఒక ఎత్తెతే ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండానే వెనుతిరగడం ఒక లాంటి వెలితి మిగిల్చింది. అదే కథని ఎక్కువ రోజులు గుర్తుంచుకునేలా చేస్తుందేమో.
మీ కవితలు చదివడం వళ్ల, మీరు రాసిన కథలో కూడా ఆ కవిత్వం నాకు అడుగడుగునా కనిపించింది. ప్రకృతిని మీరు వర్ణించిన తీరు అద్భుతం. నాకు కథ చాలా నచ్చింది. నేనే కథకి ముగింపు నిచ్చేసుకున్నా ఆ వ్యక్తి గురించి తెలుస్కోలేని వెలితితో అదే ఆలోచిస్తూ ఆత్మహత్య వాయిదా పడిపోయి ఉంటుందని. లేదా ఒక అద్భుతమైన కళాఖండం చిత్రించాక ఆ సఫలత విజయంలో తన ఆత్మహత్య మరిచిపోయాడని.
“కథని ఉత్తరం ద్వారా చెప్పడం చాలా బాగుంది ”-అనే మీ ప్రశంస నాకెంతగానో నచ్చింది సూర్య నారాయణ మూర్తి గారూ!
-ఫోన్ చేసి కాని,ఎదురయి కానీ మాటల్లో చెప్పలేని కొన్ని అతిసున్నితమైన హృదయ భావాలను – అవలీలగా వ్యక్తపరచగల ఒకేఒక్క సాధనం –‘ఉత్తరం’ అని నా నమ్మకం.భావోద్వేగపూరితమైన వాక్య విన్యాసానికి ఉత్తరం మాత్రమే ఓ గొప్ప శరణ్యం. ఇంకా చెప్పాలంటే,ఉత్తరాలు రాయడం ఒక కళ. అందుకే ఈ కథకింతటి కళని తెచ్చిచ్చిందనిపిస్తుంది నాకు.
నిజానికి ఇదొక ప్రేమలేఖ. మాటల్లో చెబితే మన్నిక పోతుంది. అది- అక్షరం లోనే నమ్మకాన్ని పొందుతుంది. అందుకే కామోసు -“A real love letter is made of insight, understanding, and compassion. Otherwise it’s not a love letter. A true love letter can produce a transformation in the other person, and therefore in the world. But before it produces a transformation in the other person, it has to produce a transformation within us. Some letters may take the whole of our lifetime to write.” అని అంటాడు ఒక జెన్ బోధకుడు. ఈ మాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి,మరెంతగానో ఆలోచింపచేస్తాయి- కదూ?
కథ ‘ఏకబిగిన చదివించిందనే’ మీ మరో ప్రశంసకి..ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ,
సంక్రాంతి పండగ శుభాకాంక్షలతో..
సాయి పద్మగారూ, ‘భార్యాభర్తలు కొంత వయసు మళ్లాక పాత అనుభూతులను పంచుకుంటే జీవితోత్సాహం కలుగుతుంది’ అనేది కల ద్వారా చెప్పడం పాత కధే కాని మీరు కవితాత్మకంగా చెప్పడం వలన కథ బాగుంది. అయినా ఇలాంటి కథలు ఎన్ని వచ్చినా బాగుంటాయి. అభినందనలు
చావంటే ఏమీలేనితనమా? ఎవరు చెప్పారండీ? ఎవడైనా చచ్చిపోతే ప్రపంచంలో ఇంకేమీ ఉండదా? బెంగళూర్ లాంటి ఊళ్ళో ఉద్యోగం చేస్తూ వీకెండ్ కి విహారయాత్రలకి వెళ్లి చూసొచ్చిన రాళ్ళ మీద తొండల్నీ బట్టలు ఉతుక్కునే బండల్నీ బ్రహ్మాండంగా వర్ణించేస్తే కధ అయిపోయిందా?
చావు గురించే కధ అయితే ఏ వల్లకాణ్ణో వర్ణించొచ్చు. ఈ వల్లకాడు అనేది రచయిత వాడిన మాటే. ఈ కధకి తలా, తోకా, వల్లకాడు, ఏమీ లేవు. అయితే ప్రకృతి వర్ణన బాగానే ఉంది కాని కధకి అది సరిపోదు. చావంటే ముక్కూ మొహం తెలియని వాడింట్లో బంగాళా దుంపల వేపుడు అన్నం కడుపు నిండా తినడం కాదు. అది తిన్నాక దాన్ని జీవితాంతం (!) గుర్తుపెట్టుకుంటానని చెప్పడం అంతకన్నా కాదు.
ఏల్చూరివారి వ్యాసం వివిధవిషయసమన్వితంగా, పాండితీమండితంగా ఉందనుటలో సందేహం లేదు. వారునన్నెచోడుని, తెనాలిరామకృష్ణుని పద్యాలు రెండూ శృంగారతిలక మనే సంకలనగ్రంథస్థ ‘బాహూ ద్వౌ చ’ అనే శ్లోకానికి అనుసృజనలని నిరూపించడం గూడ చాలా గొప్పగా నున్నది. కాని శృంగారతిలకసంకలనాలను ఆధారంగా చేసుకొని నన్నెచోడుని కాల నిర్ణయం చేయడం సమర్థనీయంగా తోచుటలేదు.
పండితులవదనాలలో తరతరాలుగా మెదలుచున్న, లేక పూర్వగ్రంథాల్లో నున్న(అవి లుప్తమైనా నిలిచియున్న) చెదురుముదురు శ్లోకాల సంకలనమే శృంగారతిలక మని వారే నిరూపించినారు. అందులో కొన్ని శ్లోకాలు 9, 10 శతాబ్దాల నాటివే అనియు వారే తెల్పినారు. కాని నన్నెచోడునకు గాని, రామకృష్ణునకు గాని పరిచితమైన ఈశ్లోకానికి ఈసంకలనమే మూలమని ఇదమిత్థంగా నిర్ణయించలేము. కాళిదాసు, భోజరాజుల కాలంనాటి చాటువులు కేవలం జనశ్రుతివల్ల ఈనాటికీ నిలిచియుండుట మనం గమనింపవచ్చు. అట్లే జనశ్రుతిలో నున్న పైశ్లోకం నన్నెచోడుని పద్యానికి మూలమై ఉండవచ్చు ననే అంశాన్ని మనం త్రోసిపుచ్చలేము. అందుచేత నన్నెచోడుని కుమారసంభవం శృంగారతిలకానంతరగ్రంథ మని ఇదమిత్థంగా చెప్పలేము. ఈ నిర్ణయం కావ్యమందలి భాషాసంప్రదాయాలను, ఇతర చారిత్రకాధారాలనుబట్టి చేయడం సమంజసంగా ఉంటుంది.
ఏల్చూరివా రొకచోట నన్నెచోడుని పద్యంలో రామకృష్ణుని ఉద్భటారాధ్యచరిత్రలో నీశ్లోకానుకరణలో నున్న ‘అతిరిక్తభావాలు’ వచ్చిచేరాయని తెల్పినను, అది కాలనిర్ణయానికి సరియైన ఆధారంగా కన్పడదు. ఎందుకంటె మూలశ్లోకానువాదం చేసినప్పుడే, రామకృష్ణునితో ప్రసక్తి లేకుండ నన్నెచూడుని కిట్టి పదబంధములు దోచియుండుటలో ఆశ్చర్య మేమీలేదు. ఆమహాకవి కంతపాటి సామర్థ్యము లేకపోలేదు. ఏల్చూరివారి వ్యాసంవల్ల గ్రహింప వలసిన ముఖ్యవిషయం నన్నెచోడుని అనుసృజన రామకృష్ణునికంటె న్యూనంగాను, రసభంగకరంగాను ఉన్నదనుట. ఈవిషయాన్ని వారత్యంత విశ్వసనీయంగా, నిర్ద్వంద్వంగా నిరూపించినారనడంలో విప్రతిపత్తి లేదు. కాని ఈపద్యాన్ననుసరించి వారు చేసిన నన్నెచోడుని కాలనిర్ణయం సమర్థనీయంగా లేదని నాయభిప్రాయము.
“వచ్చిన పని కాకుండా చస్తానేమో అనుకుంటూ బాత్రూంలోకి నడిచాను.” — అన్న మాటల్లో ప్రధానపాత్రను అర్థం చేసుకునేందుకు మొదటి సంకేతం దొరుకుతుంది. పనిలో పనిగా “ఏమిటా పని?” అన్న ఉత్సుకతను పాఠకుల్లో రేకెత్తిస్తుంది కూడా.
“ఏమీ పట్టకుండా ఎవరుంటారు ఈ ప్రపంచంలో? ఏమీ లేని జీవితంలో ఏకాంతం ఉంటుంది. అదీ లేని మనసెలా ఉంటుంది?”ఎం> — ఇది రెండవ సంకేతం. కథలోని ప్రధాన పాత్ర చావడానికి వచ్చినట్టుగా ఇంకా పాఠకులకు తెలీదు. అంతే కాదు అతను కొండ మీది పల్లెను వెదుక్కుని చేయడానికి “వచ్చిన పని” ఏమిటో కూడా బోధపడలేదు. కానీ ప్రకృతి పట్ల అతని ప్రతిస్పందనలు, సాటి వ్యక్తి జీవనశైలిని చూసి ఉలిక్కిపడడాల వల్ల అతను ఓ గొప్ప పనికై వచ్చాడని ఊహించుకొనే అవకాశం ఉంది.
“ఇదేనా నా కాబోయే ఆఖరి అద్భుత కళాఖండం? మై స్వాన్ సాంగ్ టు దిస్ అన్‌డిౙర్వింగ్ వర్‌ల్డ్? పంతం కోసం కాదు. నిజమైన కళాకారుడికి చావంటే భయం ఉండదని లోకానికి నా వల్ల తెలియాలి.” — ఇక్కడ అతని పల్లెయాత్ర గురించి, అతను “వచ్చిన పని” గురించి ముఖ్యమైన విషయాల్ని అతని ద్వారానే చేరవేయిస్తాడు రచయిత.
“మీ లోపల మీరు దాచుకున్నదేమిటి అని అడుగుతున్నాను?”
“ఏముంటుందండీ. ఏమీ లేదు.”
నిజానికి, చావు = ఏమీలేనితనం. తను కోరి కోరి వచ్చింది ఈ emptiness/nothingness ను సాధించడానికి…అదీ ఆత్మహత్య ద్వారా. కానీ ఆసక్తికరంగా తను వచ్చిన పనిని మర్చిపోయి, “కుర్చీలో కూచున్నప్పుడు మీరేం ఆలోచిస్తారు? పోనీ, మీరు ధ్యానం చేసుకుంటారు కదూ. కనీసం ఈ విషయమైనా ఒప్పుకోండి,” అని అడుగుతాడు. ఇదీ అతని లోని జర్జరీకృత మనస్తత్వానికి (split personality?) అసలైన సంకేతం.
ఛస్తే తప్ప తెలిసిరాని తన అస్తిత్వాన్ని కొండమీది టీచర్ ద్వారా వ్యక్తపరిచింది మృత్యువు. ఆ మాత్రపు ప్రతీకదర్శనాన్నే తట్టుకోలేని వాడు కనుకనే పారిపోయాడు. మంచులాంటి వ్యక్తి నుండే కాదు, చావు నుండే కాదు “అత్యద్భుతమైన కళాఖండా”న్ని చిత్రించాలన్న ధృడ సంకల్పం నుండి కూడా పారిపోయాడు. అతను ఓ సంకల్ప వర్జితుడు. వ్రాత్యుడు. ఎత్తైన ఊహల్ని ఆశయాలుగా పెట్టుకుని ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేని ఆరంభశూరుడు. ఆనంద్ సాయ్ గారన్నట్టుగా ఓ సగటు జీవి.
అందుకనే ప్రథమ పురుష చక్కగా కుదిరింది. నా మనోవైకల్యాన్ని నేనుగా ఒప్పుకుంటే, చెప్పుకుంటేనే విలువ ఎక్కువ! ఐనా, రచయిత ఏ పురుషలో చెప్పాడన్నదాని కంటే కూడా చెప్పదల్చుకున్న విషయాన్ని సారభూతంగా చెప్పాడా లేదా అన్నదే ముఖ్యమని నా అభిప్రాయం. ఈ విషయంలో సుబ్బూకు 90/100 మార్కులు 🙂
సావిత్రిగారు,
నిజమే, దూరాలు పెరిగినా ఫోన్లో మాత్లాడుతున్నాం అనుకుంటున్నాము, కాని మనసుల మద్య అగాధాలు పెరిగిపోతున్నాయి. ఏ మాటా మనసులులో నుండి రాదు. అన్నీ పొడి మాటలే. కవిత చాలా బాగుంది
– vaaNi
గ్రాండుకేన్యను పోయేటేళ్ళు యావరేజిన అక్కడుండేది ఆరు నిమిషాలంట. అక్కడికి పోయేది, విస్టా పాయింట్ల ఒక ఫోటో దిగేది, మళ్ళా కారెక్కి ఇంకేడకో బోయేది. బతికినందాకా ఇట్లా అది చూసినా, ఇది చేసినా అని టిక్కులు గొట్టుకునే మనుషులు. లవరుతో తాజ్‌మహలు చూసేదానికి పోయి, ఉన్న కాసేపు ఫేస్‌బుక్కులో పెట్టుకునేటందుకు ఫోటోలు దిగేటోళ్ళు. ఈ కథలో ఉండేటోడు అట్లాంటోడు. మనందరి లాంటోడు.
ఈ కథలో వాడు నిజానికి చచ్చిపోదామని వచ్చినాడా? ఎట్లా నమ్మేది? నాకు నవ్వొస్తా ఉంది మీరంతా దానికి పడిపోతే. కథలో ఏమున్నాదో చూసి కదా కథ ఏం చెప్తావుందని ఆలోచించేది. కథలో ఏంది అనేది వాడు: “పంతం కోసం కాదు. నిజమైన కళాకారుడికి చావంటే భయం ఉండదని లోకానికి నా వల్ల తెలియాలి.” అంటే ఏమని? ఇదేమో వానికి సొంతంగా పుట్టిన బుద్ధి కాదని. వాని స్కాచీ, వాని కాష్మీరీ షాల్, వాని ఇంట్లో పెయింటింగులు, వాడు దిన్న రకరకాల తిళ్ళు గురించి మనకెందుకు చెప్పింది? వానికి పదిమందీ వాణ్ణి జూసి ఏమనుకునేదీ వానికి ముఖ్యమని తెలియట్లా? నా పేరు అడగద్దు అనె.అని నిమిషం గాకపాయె, నీపేరేంది, నీ ఉద్యోగమేందని మొదలెట్టినోడు కదా. వాడా చచ్చిపోయేది? వాడు కళాకారుడే. అడ్వర్టైజింగ్ అని యాడ చెప్పుకునండబ్బా? ఎలక్షన్ల బ్యానర్లు గీసేటోళ్ళు గూడ కళాకారులే. ఇంటినిండుగ ప్రకృతి చిత్రాలు పెట్టుకున్నోళ్ళందరు జిడ్డు కృష్ణమూర్తులా ఏంది? మనసుల లోతు లేకుంటే మల్లెపూలంత తెల్ల లాల్చీలు కట్టుకుంటే వస్తందా? పుస్తకాలు చదువుకున్నోళ్ళు చాలమంది, ఇంటర్నెట్ల వాళ్ళ జ్ఞానం జల్లుతుళ్ళా మనమీద? వాళ్ళల్ల ఎంతమంది నిజంగ చదువుతోటి మరింత మంచి నేర్చుకొన్నోళ్ళు? మనసు నిజంగ పెద్దది చేసుకున్నోళ్ళు? అందులోంచి నిజంగ నేర్చుకున్నోళ్ళు? చావాలనంటే బాత్రూము చాలదా ఏంది, అరకులోయే కావాల్నా? వాడు నాలాంటోడు నీలాంటోడు. పెద్ద ఫేకుగాడు. ఎప్పుడూ దేనికోదానెంబడి మనం పరిగెత్తుతుళ్ళా? మరి మనకి, డబ్బు, పేరు, గొప్ప, ఏదీ పట్టకుండ నిజంగ నిమ్మళంగ బతికేటోడు కనిపిస్తే ఏమనుకుంటం? నిజాయితీగ మీకు మీరే చెప్పుకునండి. ఒక్క నిమిషం ఖాళీగుంటె మనకి బోరు కొడతది. ఎందుకు అని ఒక్క పాలి ఆలోచించినామా? లే. I am feeling bore అని ఫేస్బుక్ల పెట్టి పదిమందికి మాత్రం చెప్పుకుంటం.
వాడేదో ఊడబీకి నేనింత గొప్పోణ్ణి అని అందరూ గుర్తు పెట్టుకోవాల అని వచ్చినోడే గానీ నిజంగా చచ్చేటోడు కాదు. అసలేం ఊడబీకాలనో గూడ వానికి తెలీకపాయె. ముందు నాలుగు రంగులు చాలనుకొనె. ఆపైన ఇంకా కావాలనుకొనె. వాణ్ణి అందరూ పట్టించుకోవాలె, వాణ్ణి గురించి ఆలోచించాల, అదీ వాని కోరిక. పైగా వాణ్ణి వాడు పెద్ద పోటుగాడనుకుంటన్నాడు గదా. మరి అట్లాంటోనికి, ఏమీ పట్టనోడు కనిపిస్తే ఎట్లుంటది? చావును జూసినట్లుంటది. అంతే. తోక కాళ్ళసందుల పెట్టుకొని సక్కంగ వెనక్కి పరిగెత్తిపోయినాడు. అంతే. ఈ కథ ఆ ఫేకు ఆర్టిస్టుగాడి మీద. దామోదర్ మృత్యువు గాదు, ఈ కథ నిజంగా చచ్చిపోదామనుకున్న గొప్ప కళాకారుడిది కాదు. ఈ కథల తాత్వికతా లేదు. గాడిదగుడ్డూ లేదు. తెలివిగ రాశినా కొన్ని చోట్ల డొంకతిరుగుడు మాత్రం ఉండాది. అందుకనే మనకి ఏమేమో కనిపిస్తాఉన్నాయి ఈ కథలొ లేనివన్నీ.
[దయచేసి వాక్యాలను రెండు చుక్కలతో (..) ముగించకండి. కామాల బదులు .. వాడకండి – సం.]
చివర వాడిన “ఆత్మహత్య” అనే పదం పాఠకుల్లో వ్యతిరేకభావాన్ని కలిగించినట్టుంది. దాని బదులు “నిర్యాణము” అనో, “సమాధి” అనో అని ఉంటే ఆలోచనలు మరోలాగా సాగి ఉండేవేమో! సాధారణంగా తీవ్రనిస్పృహ కాని, క్షణికావేశం కాని ఆత్మహత్యకు దారితీస్తాయన్నది బాగా తెలిసిన విషయం. ఇక్కడ కథకుని నిర్ణయానికి ఆ రెండూ కారణాలు కావన్నది స్పష్టమే. ఇంతకీ అతను ఆత్మహత్య చేసుకోలేదు. చేసుకోవాలనుకున్నాడు. ఎప్పుడు? ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించి. తనకి పూర్తి సంతృప్తినిచ్చే ఒక కళాఖండాన్ని ఏ కళాకారుడైనా సృష్టించగలడా అన్నది పెద్ద అనుమానం! అదే కాని జరిగితే, బహుశా ఆపై అతనికి బ్రతుకు కొనసాగించే అవసరం కనిపించదు. అలాంటి ఒక కళాఖండాన్ని సృష్టించి బ్రతుకు చాలించాలన్నది ఈ కళాకారుని వెఱ్ఱి ఆశ. తానొక చిత్రకారుడు కాబట్టి, ప్రకృతికి బాగా దగ్గరై, అందులోని వర్ణాలను తన కుంచెలో పట్టుకోవాలని నాగరికతకు దూరంగా కొండప్రాంతానికి వచ్చాడు. అలా వచ్చినవాడికి తనకు పూర్తిగా భిన్నమైన, వ్యతిరేకమైన వ్యక్తివం, దృక్పథం కలిగిన మనిషి తారసపడ్డాడు!
ప్రకృతిలాగానే, చిత్రకారునికి జీవితం కూడా రంగులమయంగానే కనిపిస్తుంది. రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, కోరికలు, సందేహాలు, అన్నీ అతనికి కావాలి. అలాంటి వాడికి ఒక నిజమైన సన్యాసి తారసపడ్డాడు. అతన్ని చాలా దగ్గరగా చూసే సందర్భం వచ్చింది. అతనో నిర్వికార నిరంజనుడు. జీవితం పట్ల ఎంతో పిపాస ఉన్న తను దాన్ని త్యజించాలని అనుకుంటూ ఉంటే, అసలు దానిపై ఎలాంటి కోరికా కనబరచని మరొకడు ఏమాత్రం విసుగూ విరామం లేకుండా జీవిస్తూ పోవడం అనేది ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అలా అని అతని బ్రతుకులో యాంత్రికత లేదు. జీవం (తడి) ఉంది. కాని అది నీటితడి కాదు, మంచు తడి! కాంతిహీనమైన నలుపు కాదది. అన్ని రంగులూ కలగలిసిపోయిన తెల్లదనం. అతను మూగవాడు కాదు, మౌని. కవి అయినవాణ్ణి భయపెట్టే మౌనం. చిత్రకారుణ్ణి బెంబేలెత్తించే తెల్లదనం!
నా యీ వ్యాఖ్యానమంతా కథలో ఉన్నదని నేననడం లేదు. ఇది కూడా పైన రఘుగారి వ్యాఖ్యానం లాంటిదే. ఇదా, అదా, రచయిత ఉద్దేశం ఏమిటన్నది స్పష్టంగా లేదు. ప్రతి కథలోనూ అలాంటి స్పష్టత ఉండలని నేననను. కాని యీ కథకి మాత్రం అది అవసరమని నా అభిప్రాయం. అది లేకపోవడం కథలో లోపమనే నేను భావిస్తాను. కథకుని వ్యక్తిత్వాన్ని, జీవితం పట్ల అతని దృక్పథాన్ని అంచానా వేసే అవకాశం పెద్దగా పాఠకులకి ఇవ్వలేదు. బహుశా అలాంటి అవకాశం ఇవ్వకూడదనే కథని ఉత్తమపురుషలో నడిపించారేమో తెలియదు కాని, పైన పూర్ణిమగారు అన్నట్టుగా, ప్రథమపురుషలో సాగి ఉంటే అందుకు మరింత అవకాశం ఉండేదని నేను అనుకుంటున్నాను.
కథను గురించి నాదో ప్రశ్న. రచయితగానీ, ఎడిటర్లుగానీ అవసరమనిపిస్తే సమాధానాలు ఇవ్వవచ్చు.
ఈ కథకు first party narration సరిపోయిందని మీకు ఎందుకు అనిపించింది? ఇందులో అతడు పనిజేస్తున్న రంగం అడ్వర్టైజింగ్ అనీ, చిత్రాలు గీస్తాడో / తీస్తాడో అని చూచాయిగా చెప్పుకున్నాడు. అతడి మాటలే బోలెడంత కవితాత్మకంగా ఉన్నాయి. ఇంతిలా చెప్పగలిగినవాడి ఆర్ట్ పెయిటింగో, ఫొటోగ్రఫీయో ఎందుకు కావాలి? కళాఖండం సృష్టించడానికి, ఆపై ఆత్మహత్య ఆలోచన ఉన్నవాడు, వాటిని గురించి గట్టిగా ఆలోచించకుండా, కేవలం తనకు ఆశ్రయమిచ్చినవాడి దినచర్య గురించి అవసరానికి మించిన కుతూహలం చూపడం ఎలా జస్టిఫై అవుతుంది? ఈ కథ third party narrationలో ఉండుంటే కొంచెం మెరుగ్గా ఉండేదనిపిస్తోంది. మీరేమంటారు?
కథ ఆసక్తికరంగా ఉంది గానీ convincingగా లేదనిపిస్తోంది నాకైతే! జననం (life) లాగా చావుకి gestation period అవసరం లేదు కదా! ఒక్క క్షణం చాలు, దాని పని అది కానిచ్చుకోవడానికి. మరి అలాంటి మృత్యువుతో సావాసంలో అర్థమేమిటి? లేక, ఆ కొండపైన అతడున్న రెండురోజులు చనిపోయిన తర్వాత అతగాడి afterlife సూచిస్తుందా? అన్నది కూడా బోధపడ్డం లేదు. (ఈ పేరా కథపై నా ఆలోచనలు మాత్రమే! నేను అడగదల్చుకున్న ప్రశ్నలో భాగం కావు.)
battu vijaykumar గారు, నిజానికి పోటి అవసరం, లామార్క్ చెప్పినట్లు తట్టుకోగలిగినవే మనగలుగుతాయి, కాని ప్రస్తుతం కృత్రిమంగా సృష్టించబడుతున్న అనారోగ్య పోటీ వాతావరణం విషం లాంటిదేమోనని, అలా గరళం అని శీర్షిక పెట్టాను. ధన్యవాదాలండి.
సో, చావు దగ్గిరకి వెళ్తే వేణ్ణీళ్ల స్నానం, మాంఛి రెసెప్షనూ, మళ్లీ వెళ్లిపోతాననే వరకూ ఏమీ అడగకపోవడం, వెనక్కి వచ్చేసేటప్పుడు బస్సుదాకా సహాయం. ఇందులో మళ్లీ తలుపు వేసేసిన రూమూ, పాస్టరు గారూ స్వర్గానికి చిహ్నమా? భలే, భలే. ఏదైనా సినిమా డైరక్టర్ దగ్గిరకి తీసుకెళ్తే బాగుంటుందేమో? చచ్చేవాడికి ఒక సూపర్ పైంటింగ్ వెయ్యాలనే కోరికెందుకో? వాడికి వేణ్ణీళ్లు పెట్టి ఇచ్చేది మృత్యువు! ఆహా ఏమి సూపర్ కధండీ!
దామోదర్ అనే పేరులో, ఆయన చేసే బడి పంతులు ఉద్యోగంలో కూడా ఏదో అర్ధం కాని లొసుగు ఉందేమో కాస్త వివరించి మా లాంటి అల్పులకి జ్ఞానోదయం చెయ్యండి మరి. ఏమో ఈ పేరుకి ఏ అర్ధం తీయగలరో?
చివరిగా ఒక మాట – please read about frost bite on Google before trying to educate other people. And those who decide to kill themselves are not afraid. Those who commit suicide are dare devil people. Anyways, au revoir to this discussion.
తెలుగు కావ్యాలలో మొట్టమొదట మనము కవి ఇష్టదేవతాస్తుతిని చదువుతాము. ఈ పద్యములు సామాన్యముగా త్రిమూర్తులపైన, లక్ష్మీ సరస్వతీ పార్వతులపైన, వినాయకునిపైన, తదితర దేవతల మీద ఉంటాయి. కాని కుమారసంభవములో మనము మన్మథునిపైన కూడ ఒక పద్యమును (హరుఁ డాదిగ సకల) మూడవ పుటలో చదివినాము. ఇలాటి పద్యమును పంపకవి వ్రాసినట్లు తెలిపినాను. ఆ పద్యము –
సహజసౌందర్యముతో రతీదేవితో ఓటమినొందని కేళికలలో మునిగి అపూర్వమైన శుభలక్షణాలతో విరాజిల్లుచు శివుని వరప్రసాదముచే సహజమనోజుడు విచిత్ర సంభోగోత్సవములను మనకీయు గావుత! అరికేసరికి సహజమనోజుడని ఒక బిరుదు గలదు.
నన్నెచోడుడు బహుశా పంపకవిని అనుసరించాడేమో ఈ విషయములో? దీనివలన మనకు నన్నెచోడుని కన్నడ భాషా పరిచయము అవగతమవుతుంది. అంతే కాక ఇతడు ఒక పురాతన కవి అని కూడ అనుకొనుటకు వీలగును.
ఈ పుస్తకం కినిగెలో ప్రస్తుతానికి దొరకదు. ఎమెస్కో వారి దగ్గర కాని, పుస్తక విక్రయశాలలో కాని దొరుకుతుంది. కినిగెలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను.
– వేమూరి
ఈపద్యంలో తుషారబిందువులచేత విశ్లేషణం చెందిన (అంటే రంగులు రంగులుగా విడిపోయిన)సూర్యరశ్మివల్ల లూతాకల్పితతంతుసద్మములు బహు(వర్ణ)రత్నోదీర్ణమగునట్లు వెలుగొందుచున్నట్లున్నవని చెప్పడం జరిగింది. అంటే నీటిబిందువు పట్టకంలాగా సూర్యునిరంగులను విడగొట్టడం ఆనాటికే ఎందరో గమనించడంజరిగింది. కాని ఇందులో ఆవిడగొట్టఁబడిన రంగుల పట్టీలేదు గాని, అవి బహువర్ణములని గమనించినట్లు తెలుస్తున్నది.
2. గుప్తరాజులకాలంనాటిదిగా భావింపఁబడే అమరకోశంలో, తెలుపు, పసుపుతోఁ గూడిన తెలుపు (హరిణవర్ణము), ధూసర (బూడిదరంగు),నలుపు (కృష్ణే నీలాసిత శ్యామ కాల శ్యామల మేచకాః అని అమరం, ఇందులో నీలం అసితశబ్దానికి అంటే నలుపుకు పర్యాయంగా చెప్పఁబడింది), పీతము (పసుపుపచ్చ),హరితము (ఆకుపచ్చ), రక్తము (ఎఱుపు),శోణ, అరుణ, పాటల, కపిశ, ధూమ్ర,కర్బుర, పింగళవర్ణములకు పర్యాయపదము లున్నవి. నీలతివస్త్వన్తరమితి నీలః అంటే ఇతరవస్తువులను నల్లగఅంజేయునది అని నీలశబ్దమునకు వ్యుత్పత్తి. కాని ‘నీలీ’ ‘నీలినీ’ అని నిలిచెట్టుకు పేర్లు. అందుచేత మొదటినుండి నీలశబ్దం నలుపుకు, నీల(బ్లూ) వర్ణానికి వర్తించడం గమనించవచ్చు.
మీ అనుభవాలు చాలా బాగున్నాయి .
మాది సురవరం , మీరు చెప్పే వర్ణన లో నేను కొన్ని మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నాను .
గోషా హాస్పిటల్ ఎదురుగా , దుర్గాదాస్ గారి హాస్పిటల్ వీధి,శ్రీ ప్రకాష్ స్కూల్ వీధి ( రెడ్ కాన్వెంట్ వీధి అనేవాళ్ళం ) , కొంచెం ఇవతల కి సురవరం వైపు వస్తే వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న వీధి ఉంది.
కాని ఆశ్చర్యం ఏంటంటే , కొత్తపేట నుండి తుని కి మధ్యలో ఇలా ఉండేదా ??, చాలా ఆశ్చర్యంగా ఉంది చదువుతుంటే ..
మీరు చెప్తుంటే లక్ష్మి దేవి చెరువు చాలా పెద్దగా ఉండేదని అర్ధం అవుతుంది .
ఇప్పుడు అంతా మారిపోయింది
చిలక – గోరింక గురించి Dr CBS Venkataramana గారి అభిప్రాయం:
12/03/2013 9:18 am
కథ పూర్తయిందా? లేదా, మిగతాది చదువరులను ఆలోచించుకొమ్మని వదిలేసేరా?
కథలో ఒక చోట “మొగుడు పెళ్ళాల మధ్య డైవోర్స్ వస్తే” అన్న టాపిక్ తెచ్చి, ఆదేదో ఒక భరింపరాని విషయమన్నట్లు వదిలేశారు. కాని, జీవితం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఏ విషయాన్ని కూడా తక్కువ చేసి వదలిపెట్టకూడదుకదా!
డైవర్సే కాదు, ఏ కారణం చేతనైనా భర్త చనిపొతే, భార్య దిక్కులేనిదై, పిల్లలతొ పడే అవస్థల గురించి కూడా ఆలొచించాలి కదా!
భార్యా-భర్తలు సమానమైనప్పుడు, ఒకరు ఇంటిపని ఒకరు వుద్యొగమూ చెయ్యాలి అని ఎందుకనుకొవాలి? ఇద్దరూ రెండు పనులూ ఎందుకు కలిసి చేసుకొకూడదు?
పిల్లలను చూసుకొవడమనేది పెళ్ళైన పదిహేను సంవత్సరాలవరకు మాత్రమే. ఆ తర్వాత ఉద్యోగం కావాలంటే భార్యకి దొరుకుతుందా? ఇవన్నీ కూడా చర్చిస్తే బాగుండేదేమో!!
ఇంత చక్కటి పద్యాల్ని ఇంతకాలం భద్రపరచి పాఠకలోకానికి అందించిన శ్రీ మురళీధరరావు గారికి ధన్యవాదాలు.
— ముత్తేవి రవీంద్రనాథ్.
ద్వితీయ కళత్రం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
11/14/2013 10:53 am
జాతకాలు మీద నమ్మకం కన్నా మానవప్రయత్నాన్ని నమ్మటం ముఖ్యం అన్న ఒక సిధ్ధాంతాన్ని ప్రతిపాదించే ఒక్క సంఘటనయే ఈ కధ. ఈ సందర్భంలో జ్యోతిషానికి సంబంధించిన మానవ బలహీనతలు కొన్ని ప్రస్తావించటం జరిగింది. సిధ్ధాంతాన్ని రచయిత తన స్వీయానుభవంతో సమర్థిస్తున్నారు. ఒక స్వీయానుభవంతో సత్యాసత్యాలు ప్రతిపాదించ వచ్చునా అన్న ప్రశ్న ఉంది. దానికేమి? ఒకే చేదు అనుభవంతో జ్యోతిషం పట్ల విరక్తి కలిగినవాళ్ళు ఉన్నారు. అలాగే ఒకే నిదర్శనంతో జ్యోతిషంపై గాఢమైన విశ్వాసం కల్పించుకున్నవాళ్ళూ ఉన్నారు లోకంలో. కధ ప్రతిపాదించిన దాన్ని ఆమోదించటం మానటం చదువరి ఇష్టం.
ప్రస్తుత కథలో, పాప జాతకం అంత వివరంగా విశ్లేషించవలసిన సందర్భం తెలుసుకునే వీలుంటే ఇంకా గొప్పగా వుండేది అన్న అభిప్రాయం ఒకటి వచ్చింది. కాని ఆ సందర్భం తెలుసుకోవటం వలన పాఠకుడికి కొత్తగా అందేది ఏమీ ఉండదూ, అది ప్రస్తావించటం వలన తాను చెప్పదలచిన పిండితార్థానికి చేకూరే బలమూ ఏమీ ఉండదూ అని రచయిత భావించి ఉండవచ్చునని నా అభిప్రాయం.
చాలా మంది కథ అనగానే దానికి కొన్న అంగాలు ఊహించుకుంటారు.
కథకు ఒక ప్రధానవిషయం ఉండాలి – అది మనం మాట వరసకు హృదయం అనుకోవచ్చును. ఆ ప్రథానవిషయం ద్వారా నిరూపితం కావలసిన లేదా ప్రతిపాదించబడ వలసిన లేదా స్పష్టపడ వలసినదైన సిధ్ధాంతమో, జీవనసత్యమో, దృక్పథమో ఉండాలి – అది ప్రాణం వంటిది. కథను నడిపించే సంఘటనలు జ్ఞానేంద్రియాల్లాంటివి. కథను నడిపించే పాత్రలు కర్మేంద్రియాల్లాంటివి. వీటన్నిటి సమాహారమైన ఒక స్వరూపమే కథ.
ఇలా అనుకున్నప్పుడు కథ అనేది సర్వాంగసుందరంగా కుదిరిందా అన్న విషయం ఆలోచించటం జరుగుతుంది సహజంగా.
ఈ దృక్కోణం కథలకూ నవలలకూ కూడా సమంగా వర్తింపచేసుకుని ఒక విలువైన జీవంగల సృష్టి జరిగిందా అని చూడటం ఒక పధ్ధతి.
కాని ఇంకొక విధంగా కూడా చూడవచ్చును.
జీవితం అనేది ఒక ప్రవాహం లాంటిది. ప్రతి జీవితమూ ఒక ప్రత్యేకమైన జీవనదీ ప్రవాహమే. మన జీవితమూ, మన దృష్టికి వచ్చిన ప్రతిజీవితమూ కూడా అంతే. మన జీవితమైనా, ఇతరుల జీవితాలైనా ఆ ప్రవాహాలని మనం సమగ్రంగా చూడలేం. మన దృష్టివైశాల్యానికి అందినంతగా మాత్ర్రమే చూడగలం. ఒక్కటి మాత్రం స్పష్టం – ఏ కొంచెంగా దృష్టికి వచ్చినా ప్రతి జీవన ప్రవాహమూ అద్భుతమే. ఏతజ్జీవి యొక్క అనంత సత్యాన్వేషణాప్రయాణంలో అది ఒక చక్కని భాగమే.
కాబట్టి పూర్వాపరాలు చర్చించి సమగ్రమైన విగ్రహం కుదర్చటానికి ప్రయత్నించకుండా సూటిగా తన దృష్టికోణానికి అందిన ఒక్క సంఘటనను అక్షరబధ్ధం చేసే ప్రయత్నంగా కూడా ఒక కథ అనేది ఉండవచ్చును. జీవికి అణువణువునా ప్రాణం ఉన్నట్లుగా ఏదో ఒక చిన్న సంఘటనలోనూ ఎంతో కొంత చెప్పదగిన విషయాన్ని సమర్థుడైన రచయిత ఆవిష్కరించవచ్చును.
పాత జానపద కథల్లో వినిపిస్తూ ఉంటుంది. ఒక చిత్రకారుడు ఒక గోరుముక్కనో తలవెంట్రుకనో ఆధారం చేసుకుని అందగత్తె బొమ్మను వేసాడని. అలాగే ఒక రచయిత ఒక సంఘటనను చెబితే అక్కడ ఉన్న సారాంశమే మనకు చెప్పటానికి రచయితకు సరిపోవాలి – అలా సరిపోతుంది అనుకున్న ఆ సంఘటనను అతడు సమర్థంగా నిర్వహించాలి. అంతే. కధావిగ్రహంలోని మిగతా సర్వభాగాలు చదువరులు అవసరమైతే స్వతంత్రంగా మనఃఫలకంలో చిత్రించుకోవాలి. అవన్నీ తాను చెప్పటానికి అముఖ్యమైనవి కాబట్టే రచయిత చెప్పలేదు కథలో. అంతేకాదు, అవన్నీ చదువరి సమగ్రంగా తెలుసుకో నవసరం లేదనీ కథకుడి అభిప్రాయం కూడా కాబట్టి వాటిజోలికి పోనవుసరం లేదు కదా ఏ చదువరికీ.
నాకు తోచిన రెండు ముక్కలు వ్రాసాను. నేను రచయితనూ కాను, విమర్శకుడనూ కాను. అది వేరే సంగతి.
జ్యోతిషం లాంటి వివాదాస్పదమైన విషయం పైన రకరకాల కథలు వ్రాయవచ్చును. అలాంటి వాటిలో ఇది కూడా ఒక కథ. ఈ కథ నాకు బాగా నచ్చిందనో నాకు అసలు నచ్చలేదనో నేను చెప్పటం లేదు. నాకు నచ్చటంతో సంబంధం లేదు – ఇది ఒక చక్కని కథ.
అదే నేను గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/11/2013 12:45 pm
రాధ గారు
“దొంగలా నవ్వుతూ” అనడం “దొంగ” దర్శనం అయినతరువాతనే సాధ్యం!
దర్శనం అయితేనే అసలు దొంగ ఉన్నాడో లేడో ఆపై నవ్వుతున్నాడో కాదో తెలుస్తుంది. దర్శనం కాకుండా చెప్పడం “దొంగ” సాక్ష్యం అవుతుంది కదా! ఇది చదివిన తరువాత దొరకని దొంగ గురించి దొరికిన ఊహ రాయాలి అనిపించింది.
దొంగ కోసం దేవులాడుతున్న నేను
నిలుచున్న నేల నాది అనుకుంటే
కాదు కాదు భూమి ఇచ్చిందే అనిపించింది
తాగే నీరు నాది అనుకుంటే
కాదు కాదు నదులిచ్చిందే అనిపించింది
పీల్చే ఊపిరి నాది అనుకుంటే
కాదు కాదు గాలిచ్చిందే అనిపించింది
కనీసం దేహం నాది అనుకుంటే
కాదు కాదు తల్లిదండ్రులిచ్చిందే అనిపించింది
ఏది పట్టుకొని నాది అనుకుంటే
కాదు కాదు పంచభూతాలు ప్రకృతిదే అనిపించింది
కనీసం ఆలోచనైనా నాది అనుకుంటే
కాదు కాదు ఆలోచించే శక్తిదే అనిపించింది
నాది కానిదంతా నాదే అనుకున్నందుకు
నేనే అసలు దొంగని తేలిపోయింది.
============
విధేయుడు
_శ్రీనివాస్
విద్వన్మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
నమస్కృతులతో,
ఈ శ్రీనివాస గద్యను ప్రతిరోజూ తెల్లవారుజామున నేను వింటూనే ఉన్నా, అనేకపర్యాయాలు తిరుమలలోని శ్రీవైష్ణవ విద్వాంసులు దివ్యోత్సవాలలో వాద్యసహకారంతో శ్రుతిమనోహరంగా పఠిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూచి ఆనందించినప్పటికీ – శబ్దసంయోజన వల్ల ఆ గద్యగంభీరిమ మనస్సును ఆకట్టుకొనటమే కాని, అందులోని ఛందోనిర్మాణరీతుల సంస్ఫురణ మనసుకెన్నడూ కలుగలేదు. ఒక శతాబ్ది మునుపటివారే కాబట్టి మహావిద్వాంసులైన పురిసై శ్రీనివాసాచార్యులవారి రచనలన్నీ అచ్చులో ఉన్నాయి కాని, దీని రచనావిశేషాలను గుఱించిన విమర్శనాత్మక పర్యాలోకనం తెలుగులో అంతగా జరిగినట్లు కనిపించదు. ఆ విధంగా ఒకానొక శ్రవణీయరచనను రమణీయసాహిత్యంగా దర్శించిన మీ ప్రజ్ఞాప్రతిభానతను మనసారా అభినందిస్తున్నాను.
భట్ట బాణుని కాదంబరిలో “పాతాలతలవాసిషు దానవేషు” వంటి చోట్ల వృత్తగంధం వినిపిస్తున్నదని వ్యాఖ్యాతలు వ్రాయటమే గాని, అంతకంటె ఎక్కువగా ఆ విశేషాలను పరిశీలింపలేదు. నన్నయ్య గారి గద్యాన్ని విద్యార్థులకు ఇచ్చి, అందులోని వృత్తాంశాలను గుర్తించి, ఆ పద్యాల పేర్లను చెప్పమని శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు శిష్యులకు ఛందస్సును నేర్పుతుండేవారు. అవి శిక్షాప్రణీతాలు.
లాక్షణికులు గద్యనిరూపణాధ్యాయాలలో చూర్ణకాన్ని లలితము, ఆవిద్ధము, అవృత్తిముగ్ధం, అత్యంతవృత్తిముగ్ధం అని; ఇంకా ఉత్కలికను, వృత్తగంధిని – పెక్కు అంతర్భేదాలతో వివరించారు. కవులు కావ్యగతంగా గద్యబంధలీనంగా కొన్ని కొన్ని సమ-విషమవృత్తాలను, అర్ధసమాలను, తాళవృత్తాలను ప్రయోగించినవన్నీ అందరికీ తెలిసిన సంగతులే.
అయితే, వీటి నిర్మాణరీతులను సూక్ష్మంగా అనుశీలించి, ఇంత విస్తారమైన పరిధిలో గద్యంలో సరిక్రొత్తగా నిక్షేపింపగల ఛందోగతులను ప్రస్తారించి, వాటిలో మునుపటి లాక్షణికులు చెప్పని అభినవరూపాలను ప్రకల్పించి, వాటికి లక్ష్యాలను శిల్పించి, ఆ రూపాలను సార్థక నామవృత్తాలుగా ప్రచారంలోకి తెచ్చినవారు మీరొక్కరేనని ఈ విధంగా ‘ఈమాట’ లేఖాముఖతః ఉచ్చైఃస్వనంతో నా బోటి సహపాఠకులకు చెప్పగలగటం నాకెంతో సంతోషంగా ఉన్నది.
శ్రీనివాస గద్యకు మీరు వృత్తపట్టికను అనుబంధించటం చమత్కృతంగానూ ఉన్నది. అది మీ అధికారపరిధిలోని విషయమే కదా! 🙂
అచిరకాలంలో మీ వ్యాసాలు అచ్చుకు వచ్చి, విద్యాస్థానాలలో పఠనపాఠనాలకెక్కి, విద్యార్థులకు ఉపాదేయాలు కావాలని నా శుభాకాంక్ష.
ఈసారి ఎందుకో కొలిచాల కొంచెం సమర్ధించుకోవడం మీదనే శ్రధ్ధ పెట్టారు. నా జవాబుకి ఇది నిజంగా ఆయన జవాబు కాలేదు. అన్నమయ్య మీద మీరు రాసిన వాక్యాన్ని మరోసారి చూసుకుని నా ప్రశ్న ని పరిశీలించండి. పెద తిరుమలయ్య రేఫ మీద ఖచ్చితమైన నియమాలని పాటించాలని చెబుతూ ఒక పుస్తకమే రాశారు. కానీ ఆయన రచనలలోనే “ర” ఉండల్సిన చోట ” ఱ” ఇంకా అటుదిటూ ఉండటాన్ని పండితులు చూపించారు. అలా ఎందుకు జరుగుతుందీ? నియమాలు పాటించిన పెద తిరుమలయ్యంగారికి అది తెలియకనా? 🙂 ఇవాళ మనం మన అక్షరాలని పెన్నుతో రాసినట్టుగానో.. టైపు చేసినట్టుగానో మనకి మనం రాసే విషయాల మీద ఉన్న అదుపు లాంటిది ఆ కాలంలో ఆశువుగా వాగ్గేయాలన ఆలపించిన కవులకో లేదా లేఖకులకి ఆశువుగా పద్యాలని ప్రబంధాలు గా అల్లి చెప్పిన ఇతర కావ్య కవులకో ఉందా? అందుకూ ఒక విషయం చెప్పే ముందు రవ్వంత సందేహం అవసరం! ” ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల” ప్రస్తావన మరి ఊరికే చేశారా పెద్దన గారు? మనకి పాత లేఖన పధ్ధతుల చరిత్ర తెలుసేమో గానీ పుస్తకాలని రాసిన లేఖకుల చరిత్ర తెలియదు. వారి ” ఊహ” వారి ” పాండిత్యం ” తెలియవు. ఆ కాలంలో వాళ్లకున్న డిమాండు ఇంకా వారి ప్రతిభ వ్యుత్పత్తుల వివరాలూ వగైరాలేవీ తెలియవు. అందువలన ఇవాళ రాగి రేకుల లో ఉన్న ప్రతీ శబ్దాన్నీ వ్యాకరణ దోషాలనీ తప్పుల్నీ తిన్నగా తీసుకుని వెళ్ళి కవికి అంటగట్టడం అంత వీలు కాదు. ఇది నా దృక్పధం. అన్నమయ్య తనకాలం నాటి వ్యవహార భాషని వాడాడని మాత్రం చెప్పగలం. ఎక్కువగా దేశి పద ప్రయోగానికి ఇస్టం చూపించాడని ఆయన వాడిన తెనుగు ఆధారం గా మాట్లాడగలం! కాని ఆయన భాషలో ఆయనకి ఇవి తెలుసుననీ ఇవి తెలియవనీ మాత్రం చెప్పలేం! అలాగే ఆయన రాగిరేకుల లిపి లోంచి అవన్నీ అన్నమయ్య భాషే అని కూడా ఖచ్చితంగా తీర్మానించలేం! మిగిలిన వాటిమీద నా భావనలు ఇంకా పై అభిప్రాయం లోనివే, కొలిచాలా!
మాన్యులైన ఏల్చూరి వారికి నమస్కారాలు.
నన్నెచోడుని గురించిన మీ వ్యాసంలో మీ పరిశోధన లోతుల్ని మెచ్చుకొని తీరాల్సిందే. కాని అది నన్నెచోడుని కాలనిర్ణయానికి ఏ మాత్రం ఉపకరించదని చెప్పడానికి చింతిస్తున్నాను. నన్నెచోడుని అనుకరించి తెనాలి కవి రాశాడని మానవల్లి వారు చెప్తే తెనాలినే అనుకరించి చెత్త పద్యాన్ని కుమారసంభవ రచయిత తయారుచేశాడని మీరు, కొర్లపాటి వారు అంటున్నారు. మానవల్లి వారే ఒక చెత్త పద్యం రాసి, దాన్నే విమర్శించుకొని, రామకృష్ణుడు దాన్నే అనుకరించాడని నాటకం ఆడారని అర్థం వచ్చేట్లు రాయటంలో అంతరార్థం స్పష్టమవుతూనేఉంది. మానవల్లి వారిని పాత తాటాకుల దొంగగా నిరూపించటానికి కొన్ని వందల పుటలు వ్యర్థం చేసిన వారిని ఏమని ప్రతివిమర్శ చెయ్యాలి? ఒక్క పద్యం పట్టుకొని నన్నెచోడుని కవితాసామర్థ్యాన్ని విశ్లేషించటం చాలా బాగుంది. తంజావూరి ప్రతిని గురించి తిరుమల రామచంద్ర గారు రాసిన విలువైన మాటలన్నీ గాలికి పోయాయి. కుమారసంభవం లోని ప్రతి పద్యాన్ని, పదాన్ని చదివి మాకు పాఠం చెప్పిన దేవళ్ళ చిన్నికృష్ణయ్య గారు నన్నెచోడుని అర్థం చేసుకోలేదనుకోవాలి. ఎవరు ఎవరిని అనుకరించారు, అనుసరించారు అనేందుకు ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉండాలి.కూట శాసనాలను నిర్ణయించేటప్పుడు లిపి పరిణామాన్ని ఆధారం చేసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ణయిస్తారు. కవుల కాలాదులు నిశ్చయంగా తెలిసినప్పుడు పరస్పర ప్రభావాలను నిర్ణయించాలి. ఒకటి రెండు ఉదాహరణలు: అరుద్ర గారు కందం తెలుగు వారి సృష్టి అని రాసినందుకు వారికి కన్నడంతో గాని, ప్రాకృతంతో గాని పరిచయం లేని విషయాన్ని సూచించి రాళ్ళపల్లి వారు పీఠికలో చురక వేశారు. అలాగే నక్షత్రకుణ్ణి తెలుగు వారే సృష్టించారని ఆరుద్ర రాశారు, కాని అంతకంటే ముందే రాఘవాంకుడు కన్నడంలో ఆ పాత్రను ప్రవేశపెట్టాడు. కాని ఈ రెండింటికి మూలం 10వ శతాబ్దికి చెందిన చండకౌశికమనే నాటకంలో ఉందని మరో పండితుడు వెలికి తీశాడు. కుమారసంభవం విషయంలో చాలాసార్లు కొర్లపాటి వారు నాతో చర్చించారు. 12వ శతాబ్దికి తర్వాతి విషయం (భాషాశాస్త్రానికి, వృక్షశాస్త్రానికి,అలంకారశాస్త్రానికి సంబంధించినవి) మానవల్లి వారు గమనించక పొందుపరిచారని నిర్ద్వందంగా నిరూపించగలిగితే మీ వాదం నిలుస్తుందని చెప్పేవాణ్ణి. నన్నెచోడుడు వాడిన ప్రతి పదాన్నీ గమనించి అది 12వ శతాబ్దానిదే అని తేల్చిన ఎల్. బి.శంకరరావు గారి సిద్ధాంత గ్రంథం,మహనీయులు నేలటూరివారు నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడని నమ్మిన అభిప్రాయం పూర్తిగా నిరాధారాలని నేననుకోను. పంప (10వ శ.) ప్రబంధం రాశాడని తెలియక నన్నెచోడుని తెలుగు ప్రబంధ కవులకు దగ్గరగా తీసుకు వచ్చిన వేదం వారి వాదాన్ని అంగీకరించడం కుదరదు.
ఒక అభిప్రాయాన్ని ముందే ఏర్పరుచుకొని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు అందరికీ నచ్చవు. కాలం విషయం వదిలేస్తే వ్యాసంలో చాలా విషయాలను సేకరించడం జరిగిందని ఒప్పుకోవచ్చు.
రాళ్ళపల్లి సుందరం
లైలాగారు, As they say, all are equal; but some are more equal than others 🙂 నన్నెవ్వరు అడగలేదు, కాని నా ఉద్దేశములో ఏ రచన ప్రత్యేకమైనదో కాదో పాఠకులు నిర్ణయిస్తారు. రచన అనేది ఒక ధనుర్ముక్త బాణములాటిది. అది దూసుకొనిపోయి ఎవరి హృదయాన్ని తాకుతుందో, ఎవరి కెరుక? విధేయుడు – మోహన
నేను ఆంధ్రా యూనివర్సిటీలోచదువుకునే రోజుల్లో మీనాక్షీసుందరం గారి పేరు అడపాదడపా విన్నాను కాని ఇలాటి వివరాలు కాని ఇంతటి విశేషాలు కాని ఎవరూ అనగా విన్లేదు. శ్రమతో ఎన్నో విషయాల్ని సేకరించి అందించిన వాసుదేవరావు గారికి కృతజ్ఞతలు. ఒక కుతూహలం: వాసుదేవరావు గారికి Applied mathematics department తో ప్రత్యక్షసంబంధం ఉన్నదా? తెలియజేస్తే ఆనందిస్తాం.
నన్నెచోడుని కుమార సంభవంలోని పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసంలోని పద్యానికి మూలం కాదని, పద్యశిల్పాన్ని బట్టి రామలింగకవి పద్యం సహజమై ఉండగా నన్నెచోడుని పద్యం కృతకంగా ఉన్నదని, అందువల్ల నన్నెచోడుని పద్యమే అనుకరణం కావచ్చునని మొట్టమొదటిసారి ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ‘నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?’ అన్న తమ గ్రంథంలో ప్రతిపాదించారు. దానికి చెప్పుకోదగిన, సమర్థమైన ప్రతివిమర్శ అంటూ ఏదీ ఇంతవరకు రాలేదు. ఆ తర్వాత నేను తెనాలి రామలింగకవి ‘కందర్పకేతు విలాసం’ సంస్కృతంలో సుబంధుని ‘వాసవదత్తా కథ’కు, కన్నడంలో నేమిచంద్రుని ‘లీలావతీ కథ’కు సంయుక్తానువాదమని గుర్తించి, ‘లలితాస్యాంబురుహంబు’ పద్యం తప్పక అందులోనిదే అయివుంటుందని తదితరవిశేషాలతో వ్యాసాలను ప్రకటిస్తూ వచ్చాను. తెనాలి రామలింగకవి పద్యం ‘శృంగార తిలకము’లోని శ్లోకానికి అనువాదమని గుర్తించాక ఈ విషయంలో మానవల్లి రామకృష్ణకవి గారు పొరబడ్డారని స్పష్టమైంది. రెండు పద్యాలలోనూ (1) కల్పన, (2) పూర్ణతయా నాలుగవ పాదం అన్నవి ఒకటే అయినందువల్ల – నన్నెచోడుడు, తెనాలి రామలింగకవి అన్న ఇద్దరిలో ఎవరో ఒకరే అనుకర్త కాబట్టి ‘శృంగార తిలకము’ కాలనిర్ణయం చేయవలసివచ్చింది. ‘శృంగార తిలకము’ 15-వ శతాబ్దికి పూర్వం ఉండిన ఆధారాలేవీ కనబడలేదు. అందులోని రెండు మూడు శ్లోకాలు తెనాలి రామలింగకవికి అభిమానపాత్రాలని, వాటిని విడివిడిగా ఎక్కడెక్కడో చూసి అనువాదం చేసి ఉంటాడని భావించటం కంటె 15-వ శతాబ్ది (±) ప్రాంతాల వెలసిన ఆ సంకలన కృతినే చదువుకొని అనువాదం చేశాడని భావించటం సమంజసం. అందువల్ల చర్చాసంగతంగా మధ్యలో ‘శృంగార తిలకము’ను గురించి కొంచెం ఎక్కువగా వ్రాయవలసివచ్చింది. అది మీటర్ గేజి పట్టాలమీదికి బ్రాడ్ గేజి పెట్టెను ఎక్కించినట్లుంటే వ్యాసరచనలో పొరపాటే.
వివాదాంశాలు మూడు: (1) పెదపాటి జగన్నాథకవి ‘ప్రబంధరత్నాకరము’లో స్పష్టంగా “లలితాస్యాంబురుహంబు” పద్యం కందర్పకేతు విలాసం లోనిదని పేర్కొనకపోయినా, బలమైన ప్రమాణాంతరాన్ని బట్టి అది అందులోనిదే అని నిశ్చయించటం మొదటిది. కందర్పకేతు విలాసం సుబంధుని ‘వాసవదత్తా కథ’కు అనువాదం కావటం ఆ నిశ్చయానికి దోహదం చేసింది. (2) ఆ పద్యం ‘శృంగార తిలకము’ లోని శ్లోకానికి అనువాదం కనుక, ఆ అనువాదాన్ని రామలింగకవి క్రీ.శ. 1525లో ‘ఉద్భటారాధ్యచరిత్రము’ నాటికే చేపట్టి ఉండటం మూలాన, వాటికి అనుకరణం అయిన నన్నెచోడుని “అలిధమ్మిల్ల” పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం రచనాకాలానికంటె (అంటే, సుమారు క్రీ.శ. 1565 కంటె) తర్వాతిదని నిర్ణయించటం రెండవది. ఒకవేళ కాలాంతరంలో ‘శృంగార తిలకము’ సంకలనం కాని, అందులోని “బాహూ ద్వౌ చ” అన్న శ్లోకం కాని క్రీ.శ. 10 – 13 శతాబ్దులకు మునుపే ఉన్నవని ఆధారాలు దొరికినా, నన్నెచోడుడే అనుకర్త అన్న నేటి మన నిశ్చయంలో మాత్రం మార్పుండదు. (3) దాదాపు కొంత అటూ ఇటూగా ఒకే కాలంలో ఇద్దరు తెనాలి రామలింగకవులు ఉండటం వల్ల – కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి హాస్యచాటువులను చెప్పినది, ‘శష్ప విజయము’, ‘ధీరజనమనోవిరాజితము’ కావ్యాలను చెప్పినది “మల్లికార్జున తనూభవుడు”, విశ్వబ్రాహ్మణుడు అయిన తెనాలి రామలింగకవి అని; ‘కందర్పకేతు విలాసము’, బహుశః ‘హరిలీలా విలాసము’ ఆయనవే కావచ్చునని శ్రీ కొడాలి లక్ష్మీనారాయణ వంటి చరిత్రకారులు భావించారు. ఇది మూడవ వివాదాంశం. ‘కందర్పకేతు విలాసము’, ‘ఉద్భటారాధ్య చరిత్రము’, ‘పాండురంగ మాహాత్మ్యము’, ‘ఘటికాచల మాహాత్మ్యము’ కావ్యాలలో “లలితాస్యాంబురుహంబు” పద్యం వంటి పద్యాలు అదే కల్పనతో విధవిధాలుగా ఉండటం వల్ల ఆ కల్పన రామలింగకవికి అభిమానపాత్రమని నిరూపించే ప్రయత్నం నేనిందులో చేశాను. ఏ మాత్రమూ ప్రామాణికం కాలేని ‘శష్ప విజయము’, ‘ధీరజనమనోవిరాజితము’ వంటి శిథిలబంధపు అప్రౌఢరచనలు చేసిన ఆ రెండవ తెనాలి రామలింగకవి సంస్కృతాంధ్రకావ్యసర్వస్వాన్ని మూదలించిన ‘కందర్పకేతు విలాసం’ వంటి అతిప్రౌఢరచనలను ఒకనాటికీ చేయలేడని – ఆ మొదలైన వివరాలను నేనిందులో విస్తరభీతి మూలాన వ్రాయలేదు. మీరన్నట్లు ప్రస్తావించి వదిలేశాను. ఒకవేళ కందర్పకేతు విలాసాన్ని ఆ రెండవ రామలింగకవే వ్రాసి ఉండినా, కాలాన్ని బట్టి నన్నెచోడుడు ఆయనకూ ఆధునికుడే కావలసి ఉంటుంది.
మీరు వ్యాసతాత్పర్యం ఇది – అని చెప్పినదంతా సవ్యమేనండీ! నన్నెచోడుడు తెనాలి రామలింగకవికంటె ఆధునికుడని మాత్రమే నా ప్రతిపాదన. మానవల్లి రామకృష్ణకవి గారు ఆ పద్యానికి మూలం ఒకటుండి, ఏదో ఒకనాడది నన్నెచోడుని కాలనిర్ణయానికి అవరోధం కాగలదని ఊహింపకపోవటం వల్ల ఈ చర్చ అంతా సంగతం అయింది. దీనిని సంక్షేపించి, ఇంకా స్పష్టంగా చెప్పలేకపోవటం నా లోపమే.
చారిత్రికంగా నన్నెచోడుడు అనే కవి లేడా? లేనట్లయితే, ‘కుమార సంభవము’ ఎవరి రచన? మానవల్లి రామకృష్ణకవి గారే దానిని వ్రాసి ఉండవచ్చునా? ఆ మహామహునిపై ఏర్పడినది వట్టి అపవాదేనా? నన్నెచోడునిదీ, ఆయనదీ కాకపోతే అది ఎవరి రచన? అన్నవి నిజంగా నిగ్గు తేల్చవలసిన ప్రశ్నలు. విశ్వవిద్యాలయాలకు ఎలాగూ అక్కరలేదు. పత్రికలు ప్రకటించవు. ఆ అతీతకాలయవనికను తొలగించి, ప్రతీతసత్యాలను ఆవిష్కరించేందుకు శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారి వంటి విద్వన్మార్గదర్శులు కొందరు ‘ఈమాట’ వంటి సమర్థసాధనాన్ని రూపొందించి ఉండటం ఎంతో అభినందనీయం.
‘శృంగార తిలకము’ను విశదపర్యాలోకనసమేతంగా ప్రకటించటం మంచిదే. వ్యాసాన్ని ఆసాంతం దయతో చదివి, సహృదయంతో స్పందించినందుకు మీకు నా ధన్యవాదాలు.
మాన్యులు శ్రీ NS మూర్తి గారికి, శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి, డా. యద్దనపూడి కామేశ్వరి గారికి – ధన్యవాదాలు!
ఇందులో మొదలు నన్నెచోడ, తెనాలిరామకృష్ణ కవుల పద్యాల లోని విషయాన్ని వివరించ పూనుకుని, ఇద్దరు తెనాలి రామ క్రిష్ణులని గురించి ప్రస్తావించి, మళ్ళీ ఆ విషయాన్ని వదిలేసి, నన్నెచోడకవి కృతమని అనుకునే తెనుగు కుమార సంభవం రచన కాలంలో రామకృష్ణ కవికి తరవాతదే నిజానికి అన్న అర్ధం వచ్చే లాగా తన విమర్శని కొనసాగించి, చివరికి దానినే స్థిరపరిచారు ఏల్చూరి. అంటే మానవల్లి రామకృష్ణ కవి గారే కుమార సంభవాన్ని రాసి నన్నెచోడకవి పేర దానిని ప్రకటించినారన్న అర్ధం రానే వస్తూంది కదా? విషయం బహుశా ఈ వ్యాసం లో ప్రముఖమైనది ఇదే కావలసి ఉండగా మధ్యలో “శృంగార తిలకం” వైపు గా చాలా సేపు వ్యాసం తీగసాగింది. ఇందువలన మొదలుపెట్టిన అసలు విషయం మధ్యలో కాసేపు [కాదు చాలాసేపే ]వెనక్కివెళ్ళింది.
ఇంతకీ ఈ వ్యాసం ప్రతిపాదించే సంగతి, రామకృష్ణకవి [తెనాలి] కల్పన ఆయనకి శృంగారతిలకం మీద ఉన్న ఆసక్తి ఆధారంగానే జరిగినది అనీ, నన్నెచోడకవి [:)] కాలానికి అసలు ఈ శృంగారతిలక రచనే జరగలేదనీ గనక తెనాలి రామకృష్ణ కవి పద్యమే తొలిది కాగా, నన్నెచోడుని వెలికి తెచ్చిన మానవల్లి రామకృష్ణకవిగారు తెనాలి రామకృష్ణ కవి గారి మీద చెసిన ఆరోపణ నిజమైనది కాదని– చివరికి ఈ వ్యాసం ఇచ్చిన అభిప్రాయంగా తేలింది. అంతేనా? లేక నేనేమన్నా పొరబడ్డానా ఏల్చూరిగారూ?? ఈ వ్యాసాన్ని ఇంతకన్నా క్లుప్తంగా చెప్పగలిగే వీలున్నదేమో ఒకసారి అచ్చుకి ఇచ్చేముందు ఏల్చూరి మురళి గారు మరొక సారి చూసుకుని ఉంటే బాగుండెదేమో కదా అని కూడా అనిపించింది సుమా! ఏదైనా సుదీర్ఘమైన తన ఈ వ్యాసంలో ఏల్చూరి శృంగార తిలకం లోని శ్లోకాలని మాత్రం విపులంగా పేర్కొనడం నాకు [ఇదివరకు చదవనందువలన ] లాభించింది.
మురళీధర రావు గారూ ! మీరే మరొక సంకలనం తెలుగులో” శృంగార తిలకానికి” చేయరాదో? బాగుంటుంది.
మురళీధరునిపై ముచ్చటైన మూడు పద్యరత్నాలను పదికాలాలపాటు పదిలపరచి పాఠకులకు అందించిన మురళీధరరావు గార్కి ధన్యవాదాలు.
డబ్బు శాశ్వతం కాదనడానికి ఇదో ఉదాహరణ. కాని, మనం అత్యంత విలువైనదిగా భావించే అది తప్ప ఇంకేం ఇచ్చుకోగలం… సాక్షాత్తూ ఆ కృష్ణ భగవానుడే వచ్చినా, కవిసామ్రాట్టే వచ్చినా! నాకు తెలిసినంత వరకు అప్పటి మూడు వందలంటే ఇప్పటి పదివేలుపైనే!
ఎంతోకాలం తరువాత మంచి పరిశోధనాత్మక వ్యాసం చదివాను. ఇంత ఓపికగా, అవసరమైనన్ని , అంతకుమించి పుస్తకాలను చదివి వివరణాత్మకంగా, తార్కికంగా కొన్ని నిర్ణయాలను చేయటం ఇటీవల వ్యాసాలను వ్రాసిన వారు చేయగా చూడలేదు. ఇటువంటి బరువైన వ్యాసాలను ప్రచురించేవారు కూడా అరుదు. ఈమాట వారిని ఇందుకు అభినందిస్తున్నాను. మీకు నమస్కరిస్తున్నాను. ‘ఏకవీర నవలకు నవలానాయికకు ఆ పేరే ఎందుకు’ అనేవ్యాసాన్ని వ్రాయడానికి నాకు ఆరేడు నెలలు పట్టగా, అదృష్టవశాత్తు ప్రపంచతెలుగు మహాసభలు జరిగి, ప్రత్యేకసంచికలో ప్రచురింపబడటానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది. ఏ పత్రికవారైనా వ్యాసం బాగుంది అనటమే కాని, గంభీర పరిశోధనను ప్రచురించే సాహసం ఎవరికీ లేకపోయింది. చివరకు అది ఆ వ్యాసానికి వరమే అయింది.

10/29/2013 2:46 pm
కవిత అరమరికలు, ఆడంబరాలు లేని సౌందర్యంతో సాగింది. ఎందుకో “దొంగలా నవ్వుతూ” అన్న పదాలే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఇతరులు ఆశ్చర్యపడితే దొంగలు నవ్వుతారో లేదో కాని, “వెన్నదొంగలా నవ్వుతూ” అనుకుంటే వచ్చిన సందేహం నిస్సం”దేహం”గా మారినట్టు అనిపించింది.
=======
విధేయుడు
_శ్రీనివాస్
ఈమాట గురించి గురించి kanaka Raju Tunga గారి అభిప్రాయం:
10/26/2013 12:24 am
నేను రామగుండం వాసిని. ఈ మధ్య శ్రీ పోతనచరిత్రమను శ్రీ వానమామలై వరదాచార్యుల విరచితంబైన పుస్తకం కొరకు ఎతుకుతున్న కాని దొరుకుత లేదు ఏవారైనా కలిగి యుండి వారు వద్దనుకున్న, లేక ఇంకొక పుస్తకమున్న యొడల తగిన ధర చెల్లించి కొనుక్కోగలను అట్టివారెవ్వరైనా యున్న ఎడల దయచేసి నా ఈ మైల్ చిరునామాకు తెలియ జేయగలరు నా ఈ మైల్ అడ్రస్సు tungakanakaraju@gmail.com
పొరపాటన నాకిలా అనిపించింది అని చెప్పి ఈ కథను గురించి గాని, ఆ సినిమాని గురించి గాని రాస్తే ఏమవుతుందో నాకు అర్థమయింది. ఈ టైపు వ్యంగ్యాలని పట్టించుకోకపోవడమో, ధీటైన జవాబివ్వడమో చేతనయిన రోజున, వీటన్నింటికి కొంచెం సమయం చిక్కితే తప్పకుండా రాస్తానండి.
ఒక్క ముక్క మాత్రం చెప్పదల్చుకున్నాను, ఇటీవలి కాలంలో జాల గుంపుల్లో ఎవళ్ళో వెర్రి వెంగళప్పలు (అంటే ఇక్కడ నేను) వాళ్ళకి ఫలానా ఏదో నచ్చింది అనడము, టక్కుమని ఓ పది మందొచ్చి… మీ వివేచన మీద నాకు సందేహం అనో, నీకు చదవడం రాదనో…ఇలాంటి వ్యాఖ్యానాలు రాయడమూ చూస్తున్నాను. అసలుకి ఎవళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వెలిబుచ్చడానికి కాకపోతే, ఈ వ్యాఖ్యల డబ్బా ఎందుకండి? ప్రపంచాన్ని మార్చివేసే సునిశిత విమర్శలు ఉంటే తప్ప వ్యాఖ్యలు రాయకూడదా మొత్తానికైతే?
ఇందుకే ఈమాటలో వీలైనన్ని తక్కువ వ్యాఖ్యలు రాస్తాను..ఇంతమంది మేధావులను తట్టుకోలేక. ఒకవైపు నిజాయితీ గా సందేహాలు అడిగితే, వాటికి స్పందనలు సరిగా (వ్యంగ్యంగా ఏదో ఒకటి అనకుండా) ఇవ్వరు. ఒక వైపు ఏదో, నా మానాన నేను ఇంకోళ్ళ జోలికెళ్ళకుండా వ్యాఖ్యలు రాస్తే, ఏం మాట్లాడుతున్నారో నాకర్థం కాని స్థాయిలో జరిగే వ్యాఖ్యానాల్లోకి నన్ను లాగుతారు.
ఏమైనా, మీ ఇష్టం వచ్చింది అనుకోండి లైలా గారూ నా తెలివితేటల గురించి, నా అభిప్రాయాల విలువ గురించి. మీకు సమాధానాలు చెప్పేంత తెలివిడి నాకు లేదు. ఆపైన మిమ్మల్ని మెప్పించాలన్న/ఒప్పించాలన్న తాపత్రేయం అంతకన్నా లేదు. ఇకపై వ్యాఖ్యలు రాసేందుకు కూడా “నాకు సంబంధంలేని చర్చల్లోకి నన్ను లాగకండి” అని ఒక డిస్ క్లైమర్ పెట్టాలేమో అనిపిస్తోంది.
ఇక్కడి వరకు వ్యాఖ్యని చదివినందుకు, దీన్ని మాడరేట్ చేయకుండా అంగీకరిస్తే సంపాదకవర్గానికి – ధన్యవాదాలు.
“దానికర్థం – “ఆ, సరే రంగి..కథంతా చెప్పావు కదా, ఇంక పో. దమ్మిడీ ఇవ్వను” అని రచయిత చెప్పినట్లు రాసుంటే నాకు నచ్చేదని కాదు.”
నా లైబ్రరీలో పాలగుమ్మి పద్మరాజు కధా సంకలనం ఉంది. పాలగుమ్మి పద్మరాజు, తెలుగు కథకు అంతర్జాతీయ స్థాయిని సాధించిన రచయితగా ఈ పుస్తకం అట్ట మీద ఉంది. లోన వీరి సమగ్ర సాహితిని గూర్చి కొంచెం, వీరి రచనల మీద, డాక్టరేట్ కోసం, పరిశోధనలు జరుపుతున్న విద్యార్ధులు ఉన్నట్టు మార్చి 1985లో అచ్చేసిన ఈ పుస్తకంలో ఉంది. పుస్తకం పేరు ఈ చర్చించబడుతున్న కధ పేరే. “పడవ ప్రయాణం”.
ఇంతకీ ఆ పడవ ప్రయాణం లో జరిగిందేమిటి? నాకు నా ఇప్పటి తెలివితేటల వల్ల అర్థమయింది ఏమిటి?
ఆ పడవ ప్రయాణం రాత్రిలో ఒక చిన్న స్కేలు దొంగతనం జరిగింది. పద్దాలు, రంగి ఇద్దరు దొంగలు. పద్దాలు is the muscle. రంగి is the accomplice, the decoy, the diversion. Both are con artists. ఇద్దరూ తాగుతారు. లేకుంటే, అవసరానికి, తాగకపోయినా తాగినట్టుగా నటిస్తారు. అబద్థాలు చెపుతారు. రంగి ఎప్పటి కప్పుడు కట్టు కథలు అల్లుతూనే ఉంది. పధకం ప్రకారం, సరంగుతో కబుర్లాడింది. చుక్కాని పట్టింది. అందరిని నిద్ర పుచ్చింది. అంత హస్కీ గొంతుతో, అంత సెక్సీ పాట పాడితే కొందరికి నిద్ర ఎగిరి పోతుంది. బెల్లం, చింతపండు యవ్వారాల వాళ్లు, తెడ్డులు వేసి, తాళ్లు లాగిన జీవులు కాబట్టి, వాళ్ళు జోగారు. ఆ పడవ లోనే ప్రయాణం చేస్తున్న మన కథకుడు కూడా నిద్ర పోయాడు. లేచాక, కథకుడు, పడవ టాపెక్కి, రంగిని, ఇంటర్వూ చేస్తాడు. ఈ పడవ ప్రయాణీకుడు, ఈ మగవాడు – పద్దాలు బోట్ మీద ఉన్నప్పుడు, పద్దాలుని గాని, రంగిని కాని, ఒక్క ప్రశ్న అడగడు. అడగటానికి అతనికి దమ్ముల్లేవు. ఎందుకంటే, పద్దాలు మక్కెలు ఇరగదంతాడు.
పడవలో జరిగింది దొంగతనమైతే, ఇతడి curiosity, interrogation, అంతా రంగికి పద్దాలుకి, పెళ్ళయిందో లేదో, పద్దాలు abusive, adulterous relationship ఆమ ఎందుకు భరిస్తోందో, ఈ విషయాల మీద. కథకుడికి, ఆ చీకట్లో ఆమె రవిక ఎత్తి చూపిస్తుందీ, ఆ చీకట్లో ఆమె వీపు మీద అతనికి తెల్లని మచ్చ కనిపిస్తుందీ! అతనికేం తెలుసనీ, అవి burns scars, అవునో కాదో. ఒక వేళ ఆమెకు బొల్లి ఉందో, చల్ది (Herpes zoster) వచ్చిందో? అసలు ఎప్పటి కప్పుడు రంగి అబద్ధాలు కల్పిస్తూనే ఉంది. పద్దాలు తనను విహారయాత్ర తీసుకెళ్ళటం అంతా ఉత్తదని చెప్ప లేదూ? తను, సవితి, వారి మధ్య ఈసులు, పద్దాలు తనను తన్నటాలు, గుడిసెకి నిప్పెట్టటాలు – ఇవన్నీ కూడా అంతకు ముందు పడవ సరంగుకు, (ఇప్పుడు మళ్ళీ, కథకుడికి,) రంగి కల్పించి చెప్పినవి అయ్యుండొచ్చు. ఆమె చెప్పే వాటిలో ఏది నిజమో, ఏది అబధ్ధమో.
రంగికి కావాల్సింది, తోడుదొంగలు వేసుకున్న ప్లాన్ ప్రకారం, ఆ దొంగసొమ్ము పద్దాలు అనుకున్న చోటికి జేరేసే దాకా, ఆ పడవ లోనే ఉండిపోయి, ఏదో సోది వినిపించటం. మరి మన బ్రిలియంట్ కథకుడు గారు, ఆమెకో చుట్ట ఇచ్చి, తనో చుట్ట వెలిగించి, వింటూ, రంగి అందరికీ అబద్దాలు చెప్పి, తనకు మాత్రం, అంతా నిజమే చెపుతుందని అనుకోటం? అంతటితో అయ్యిందా! ఆ దొంగ, అబద్ధాల కోరు రంగి ఇచ్చిన సమాచారాన్ని ఎడాపెడా ఎనలైజ్ చేసి, అతనికి తోచిన conclusions draw చేసి, మన అందరికీ సరఫరా చెయ్యటం. ఏమి విపరీతం! All of a sudden అతనికి, రంగి అంటే భయం, భక్తి, జాలి కలుగుతాయి. ఎందుకంటేనంట ఒక చెడ్డ మగవాడిని, ఆబిడ గారు -ఆ సుగుణాల రాశి, unconditionally ప్రేమించిందంట. (కధ చదువుతూ, “I Love You, just the way you are”, “Stand by your Man” అని పాటలు పాడుతున్నా నే నిక్కడ.)
1940ల్లోని ఈ కధని కొందరు బుద్ధిమంతులు ఎలా చదివినారో తెలిసింది. పాఠకులకు కూడా రంగి నచ్చటం, పైగా కొంతమందికి -బతుకంటే అదే, ప్రేమంటే అదే, మా లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటే బావుండును అని అనుకోటం, ఇదంతా నాకు వింత గా ఉంది. దొంగతనాలు చేస్తూ, తన్నులు తింటూ, పారిపోతూ, – పద్దాలు, రంగి – లాగా బతకటం, తమ సొంత బతుకుల కన్నా సుఖంగా అనిపించటం, నమ్మే మాటేనా?
రంగి గురించి, అంత fuddled, fuddy duddy ఆలోచన చేశాక, ఆ మాయదారి మహత్తర దేవత హుండీలో ఓ రూపాయ వెయ్యటం పడవ లోని కథకుడికి ఎంత పని. అప్పటిదాకా లేని, కొత్తగా వచ్చి పడే అసంబద్ధత ఏముంది?
సర్లెండి, ఆ తెలుగు సినిమా రచయిత, ఈ రంగి హృదయాన్ని, ఎలా గొప్పగా ఆవిష్కరించాడో, ఆ విషయం సౌమ్య ఈ పత్రికలో గానీ రాస్తే, తప్పక చదువుతాను. (ఆమెకు రాయాలని ఉంటేనే.)
కొన్ని రోజుల కింద ఈమాట అంతర్జాలం చూసినంక చాల సంతొషం కలిగింది. నేను పదవ తరగతిలొ నుండగా తెలుగు పధ్య భాగం నన్నెంతొ ప్రభావితుణ్ణి చేసింది. ఇది పంతొమ్మిది వందల డెబ్బైఐదునాడు. అప్పటి నుంది పద్యమంటె ప్రాణం. ఎక్కడ పద్య సాహిత్యం దొరికితే తప్పక కొంటాను. కాని శ్రీ వానమమలై వరదాచార్యుల పోతన చరిత్రము దొరకలేదు. ఒక రెండు రొజులు వివిధ పుస్తకాల దుకాణలల్ల ఎతికిన. పాఠకుల అభిప్రాయాలు చదివిన వారెవరైన తెలియ జేస్తె కొంటాను. ఇక కింది డబ్బాలోనున్న యు ఆర్ ఎల్ అంటె తెలియదు.
అదే నేను గురించి mallikarjuna sarma గారి అభిప్రాయం:
10/07/2013 3:39 am
ఆత్మ విచార మార్గం లో అసలు “నేను” ఎవరో తెలుసుకోవడమే ఈ దేహాన్ని ధరించిన వాళ్లు చేయవలసిన ఏకైక పని. కాని, అది తప్ప అన్నీ చేస్తూ, అన్నీ తెలుసన్న అహంభావం అనుక్షణం చేస్తున్న మాయలో పునరపి మరణం…పునరపి జననం…
ఈ చర్చ ముగిసిపోయిందనుకున్నాను గానీ, ఇంకా కొనసాగుతున్నందుకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకటి రెండు వివరణలు ఇవ్వవలసి ఉందనిపించింది.
1) బాల్యకాల అనే పదబంధంలో లోపమేమిటో నాకు తెలియలేదు. వైకం బహమ్మద్ బషీర్ గొప్ప మళయాళ రచయిత.ఆయన ఒక రచన పేరు బాల్యకాలసఖి. అది మళయాళ పదబంధమంటారా, తెలుగు మీద ఉన్నదానికన్నా సంస్కృత ప్రభావం మళయాళం మీద మరీ ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే.
2) మరువం, దవనం అనే పేర్లని నేను ఉద్దేశ్యపూర్వకంగానే వాడాను. కవి మాట్లాడుతున్న సుగంధం కేవలం పుష్పజాతుల సుగంధం మాత్రమే కాదు, అదీకాక, ఈ వ్యాఖ్యలు చదివి చింతిస్తున్న నన్ను రాళ్ళబండి కవితాప్రసాద్ ఇటువంటి పదప్రయోగాలు గతంలో కూడా ఉన్నాయని, వెంటనే తన ధారణలోంచి సురభి మాధవరాయకవి అనే 18వ శతాబ్దపు కవి తన చంద్రికాపరిణయం అనే ప్రబంధంలో నాయిక తన కొప్పులో మరువం తురుముకున్నప్పుడు దాని మీద తుమ్మెదలు వాలాయని రాశాడని అన్నారు.
3) ఇక తమ్మినేని యదుకులభూషణ్ గారికి నవ్వు తెప్పించిన నా పదప్రయోగం ‘పురాతమైన నీడ’లో నవ్వు తెప్పించిందేమిటో నాకు అర్థం కాలేదు. ఘోష్ట్ అనే పదానికి ప్రేతమనే అర్థమో, దెయ్యమనే అర్థమో గూగుల్ సెర్చ్ చూడకుండా కూడా స్ఫురించేవే. కాని కవి హృదయం అర్థమయితే తప్ప ‘పురాతనమైన నీడ’ అనే అర్థం స్ఫురించదు. కేవలం స్పానిష్ వాచకాన్ని ఇంటర్నెట్ ముందు కూచుని బాబిలోన్ ట్రాన్సలేటింగ్ టూల్ నొక్కితే వచ్చే అర్థం ప్రేతమని మాత్రమే ఉంటుంది. కాని మొత్తం కవిని చదివి కొన్నాళ్ళ పాటు మరే ధ్యాసా లేకుండా గడిపితేగాని ‘పురాతనమైన నీడ’ అన్న మాట స్ఫురించదు.నిజంగానే మహాప్రజ్ఞ చేసే మిరకిల్ ఇది.
ఇంతకీ తెలుగులో ఇందరు స్పానిష్ మహాపండితులు ఉండి కూడా నాకు ఇన్నాళ్ళ పాటు మచాడో పేరు ఎందుకు తెలియలేదో?
కినిగె వారు నేను రాసిన మహాయానం అనే కథల పుస్తకం ప్రచురించేరు. రచయితని కనుక నాకు నాలుగు ప్రతులు ఉచితంగా దిగుమతి చేసుకుందికి “కూపాను” వంటి సదుపాయం కలిగించేరు. నా పుస్తకం దిగుమతి చేసుకుని, చదివి, దానిమీద వారి అభిప్రాయాన్ని రాసి పంపమని నలుగురు “పెద్ద”లకి ఈ విద్యుత్ కూపానులు పంపేను: నలుగురూ బాగా విద్యార్హతలు కలవారే. కాని ఒక్కరూ పుస్తకం ప్రతిని దిగుమతి చేసుకోలేక చేతులెత్తేశారు. ఆ నలుగురికి నా దగ్గర ఉన్న పి. డి. ఎఫ్. కాపీ పంపవలసి వచ్చింది. ఇ-పుస్తకాలని దిగుమతి చేసుకోవడం ఇంత కష్టం అయితే వీటిని ఎవ్వరూ కొనరు. ఈ రంగంలో నాకు అనుభవం తక్కువ. కినిగె సంస్థ ఈ విషయంలో కొంచెం శ్రద్ధ వహించి, వినియోగదారులకి తేలికగా ఉండే పద్ధతులని వెతకమని నా రెండు దమ్మిడీల విలువైన సలహా. – వేమూరి
గురువు గారూ,మీరు అత్యద్భుతంగా పద్యాన్ని వివరించారు.నేను అఖిల భారత సర్వీసులకు సన్నద్ధమౌతున్నాను, మా తెలుగు మాస్టారు శ్రీనాధుని గురించి, ఆయన రచనా పటిమను గురించి చెప్పిన రోజు నుంచి నేను శ్రీనాధునికి పెద్ద అభిమానిని అయిపోయాను,ఈ గుణనిధి కధ మూలంలో హర్షుడు రాశారు కదా? కాని అది మన తెలుగు ప్రజలకు వంట బట్టదని శ్రీనాధుడు అర్థం చేసుకుని తదనుగుణంగా మార్పు చెయ్యటం తెలుగు పై ఆయనకు ఉన్న అభిమానానికి నిదర్శనం. యజ్ఞదత్తుడు సోమిదమ్మ గారిని ఇంటి నుంచి వెడలగొట్టి మరు నిముషమే మరో పెళ్లి చేస్కున్నాడు అని మూలంలో ఉండగా,”కొద్ది దినములు గడిచిన పిదప” అని మార్చి రాయటం శ్రీనాధునికే చెల్లింది. శ్రీనాధుని ఆత్మ ప్రత్యయం ఎక్కువ, ఈ విషయం ఆయన చాటువులతో ప్రస్ఫుటమౌతుంది. నాకు ఇప్పటి వరకు చదివిన పద్య సాహిత్యం లో నచ్చిన పద్యం మీతో పంచుకుంటున్నాను. “దివిజ కవివరుల్గున్డియలు దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాదుడమరపురికి”. నాకు ఎప్పుడైనా నేను సివిల్స్ సాధించాలేనేమోనని అన్పిచినప్పుడు ఈ వాక్యం చదివితే ఎంతో ధైర్యం వస్తుంది.నాకు ఈ సైట్ చాలా బాగా నచ్చిందండి. ఈ విషయంలో మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
సురేశ్ కొలిచాలగారు — నా అనువాదం మీద జయప్రభ వ్యాఖ్యలు నాకేమంత ఆశ్చర్యం కలిగించలేదు గాని ఆ వ్యాఖ్యలకి జవాబు ఇవ్వడానికి మీరు తీసుకున్న శ్రద్ధకి నమోవాకాలు అర్పిస్తున్నాను. నేను ఆ కవితలని ఒక కవిగా గాని, లేదా అనువాదకుడిగా గాని అనువాదం చేయలేదు. ఆ కవిత్వం పట్ల ఆపుకోలేని తమకానికి లోనైన పాఠకుడిగా చేశాను. కాని మీరు రాసిన టీకా చదివాక ద్రోహవస్త్రం అనేమాట ఆ కవితలో మరీ బాగా అమరిందనిపిస్తోంది. మనం అనువాదం చేస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉండే ఒక మహాప్రజ్ఞ చేసే మిరకిల్ అది.
ఇక మరువం,దమనం పూలుకావు. కాని వేరే దేశాల పుష్పాల పేర్లు మన భాషకి సన్నిహితంగా లేనప్పుడు మనం మనకి సన్నిహితంగా ఉండే పేర్లనే వాడుకోవలసిఉంటుంది. మరువం, దమనం అనే పేర్లు పాఠకుడిలో రేకెత్తించగల సున్నితమైన సంవేదన ముఖ్యం తప్ప, వాటి బొటానికల్ ఆక్యురసీ కాదు. నిమ్మ పొద, కేశ రాశి, ఊట నీరు, వేన వేల జలాలు లాంటి పదాల్లో తెలుగు లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. కాని నేను నిస్సహాయుణ్ణి. ఆ కవితల్ని ఇప్పుడు అనువాదం చేసినా అలాగే అనువాదం చేస్తాను.
మరోమాట కూడా చెప్పాలి. నా దృష్టిలో ‘మరీముఖ్యంగా ఒక మాఘమాసపుగాలి’ని నేనేమంత గొప్ప అనువాదంగా పరిగణించలేను.
ఎంతో ఆలోచింపజేసే వ్యాసానికి, practicalగా ఉపయోగపడే సలహాలను అందించినందుకు వెల్చేరుగారికి చాలా కృతజ్ఞతలు.
తెలుగు ప్రపంచ భాష అనేది దేవుడెరుగు, కనీసం ఇంకొక తరానికైనా ఇప్పటి తరం వాళ్ళకున్నంత ప్రవేశం, పాండిత్యం, భాషపైన పట్టు గాని వెసలుబాటూ గాని- “నేర్చుకోవడానికి” అవసరమయ్యే అవకాశాలను అందించగలమా అనేది అనుమానమే.
సిలికానాంధ్ర వారి “మనబడి” ప్రయత్నాలు అభినందనీయం. కాని అందులో ఎందుకో “మన” అన్నదానికే కొంత లోటేమో అనిపిస్తుంది. వారు నిర్దేశించిన సంఖ్యలో విద్యార్థులను పోగుచేస్తేనే కాని వాళ్ళ పుస్తకాలు సైతం అమ్మడానికి నిరాకరించడం విద్యార్థులకు లోటే. అయినా ఎవరికి అమ్మాలో ఎవ్వరికి అమ్మకూడదో వాళ్ళ ఇష్టం. కాని వాళ్ళు ఎంచుకున్న భాషాసేవకు నష్టం.
అపార్థం చేసుకోరనే ఆశతొ, విన్నపంతో అడుగుతున్న ప్రశ్న మాత్రమే – ఎవరికి కావాలండి “ఊర్థ్వజ్ఞుడు” అనే పదం రాయడం? అంటే అది మంచిది కాదని కాదు, సాధారణ విషయాలను సైతం తెలుగులో సరిగ్గా చెప్పడానికి కష్టపడే పిల్లలచేత గహనమైన పదాలు, అసలెప్పుడూ వాడనివి నిఘంటువుల్లో మాత్రమే దొరికేవి (దొరకనివి!) వ్రాయిస్తే వాళ్ళకే కాదు సాటి పిల్లలకు మాత్రం ఏం మేలు ఒరిగింది అనే బాధతో అడిగింది. విమర్శ కన్నా ఇది ఆత్మ విమర్శ. అసలాపదం పెద్దవాళ్ళెంత మందికి తెలుసు, ఎన్ని సార్లు జీవితంలో రాశారు, చదివారు, వాడారు! కాదు, మా పిల్లవాడు ఊర్థ్వజ్ఞుడు అంటే చెప్పేదేమీ లేదు. వీలైనంతవరకు తెలుగులో సొంత భావ వ్యక్తీకరణకు సాయపడినప్పుడే తెలుగు శిక్షణకు, చదువుకు సార్థకత అనిపిస్తుంది.
విధేయుడు
శ్రీనివాస్
దశావతారస్తుతి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/04/2013 11:12 am
మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
నమస్కృతిపూర్వకంగా,
ఆనందరామ బారువా, నీలకంఠయ్య, నగరాజారావు, రావూరి దొరసామిశర్మ గారల తర్వాత ఛందశ్శాస్త్రంలో ఇంత విస్తృతంగా ప్రయోగాత్మక కృషిని చేస్తున్నవారు ఈ తరంలో మీరు తప్ప వేఱొకరు లేరనుకొంటాను.
మీ వరివస్యకు అభినందనలని చెప్పటం చాలా చిన్నమాట.
చంపకమాల, చంపకమాలిని, చంపకావళి, చిత్రలత, చిత్రలతిక, తుమ్మెదకంటు, ధృతశ్రీ, పంచకావళి, పూలపాన్పు, రుచిర, శశివదన, సరసి, సిద్ధి, సిద్ధక – అని మీరు గుదిగ్రుచ్చిన “చంపకమాల” నామాంతరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిలో “చంపకమాలిక”, “చంపకావళి”, “పంచకావళి” అని మూడు పేర్లతో దుఃఖభంజనుడు వాగ్వల్లభచ్ఛందస్సులోనూ; “చిత్రలత”ను హేమచంద్రాచార్యుడు తన ఛందోనుశాసనం టీకలోనూ; “చిత్రలతిక”ను శ్రీకృష్ణభట్టు వృత్తముక్తావళిలోనూ; “శశివదన”ను పింగళుడు ఛందస్సూత్రంలోనూ; “సరసి”ని గంగాదాసు ఛందోమంజరిలోనూ; “సిద్ధకము”ను చంద్రశేఖర భట్టు వృత్తమౌక్తికంలోనూ; “సిద్ధి”ని స్వయంభువు స్వయంభూచ్ఛందస్సులోనూ వాడిన విషయం నాకు తెలుసు. తక్కిన పేర్లను ఎవరు ఏ కావ్యంలో వాడారో తెలియరాలేదు. ఇంకా చంపకమాలను చంద్రశేఖర భట్టు వృత్తమౌక్తికంలో “సురతరు రి త్యన్యత్ర” అని ఎవరో “సురతరువు” అన్నారని చెప్పాడు కాని, ఆ అన్యత్ర ఎక్కడో తెలియదు. నారాయణభట్టు వృత్తరత్నాకరం టీక “సలిలము” అని, “శ్రీ” అని పేర్కొనటం కూడా జరిగింది.
రావూరి దొరసామిశర్మ గారు “సలిలనిధి” అని ఉదాహరించారు కాని, అదెక్కడిదో తెలియదు. మీరు పేర్కొన్న “తుమ్మెదకంటు”, “ధృతశ్రీ”, “పూలపాన్పు”లను ఎవరన్నారో తెలియరాలేదు.
మీరు రూపొందిస్తున్న వృత్తవిజ్ఞానసర్వస్వంలో ఈ విశేషాలన్నీ త్వరలో వెలుగు చూస్తాయనుకొంటాను.
ఔకారాన్ని రెండు గణాలకు వాడటం గుఱించి మీరు ప్రస్తావించారు. అది శాస్త్రపరిభాషాకృతం కాదనుకొంటాను. రెండు నగణాలు అని మాత్రమే అర్థం.
ద్వివచనం. సుబంతమైన న (గణాద్యక్షరం) పైని నామప్రత్యయాలేర్పడి నః – నౌ – నాః అని ప్రథమా విభక్తి రూపాలు సిద్ధించాయి. నః = ఒక్క నగణం; నౌ = రెండు నగణాలు అని. “నుర్గౌ” అని న వర్ణంపైని గుణితక్రమానుసారం తక్కిన గణసంఖ్య సూచిత మవుతున్నది మాత్రం నిస్సంశయంగా లాక్షణిక సంకేతితం.
సార్థక నామవృత్తాలన్న మీ అభిధేయకల్పన చాలా ఔచితీమంతంగా ఉన్నది. అందుకు మీరు దశావతార నామాలను సంకేతించి పద్యాలను వ్రాయటం సొగసైన ఆలోచన. మీ పద్యాలూ భావుకసుభగంభావుకంగా ఉన్నాయి. ఒక్క “హయవాహన”ను మాత్రం “వాహిని కాఁగన్ జగమ్ము” ఇత్యాదిగా భవిష్యదర్థకంలోకి మారిస్తే ఇంకా సమంజసంగా ఉంటుంది.
పరిశోధకుడే లక్ష్య-లక్షణ నిర్మాతృకవయిత కావటం అన్న ప్రాక్సంప్రదాయం మీ యందు పునారూఢమై తెలుగు ఛందశ్శాస్త్రచరిత్రలో మీ స్థితిని సుస్థితం చేస్తున్నది!
మాన్యులు శ్రీ వెల్చేరు నారాయణరావు గారికి
నమస్కృతిపూర్వకంగా,
అధీతిబోధానుభవసంక్షిప్తిగా మీరు వ్రాసిన వాక్యావళికి ధన్యవాదాలు.
ఇటువంటి అపురూపమైన గ్రంథాలకు తమిళ కన్నడదేశాలలో లేని దుఃస్థితి ఒక్క తెలుగుదేశంలో మాత్రమే ఉన్నదన్న విచారంతో పై మాటలను వ్రాశాను. అందులో పొరపాటున “మేకాధీశ శబ్ద శతకోటి” చర్ల భాష్యకారాచార్యుల వారి కృతి అని పేర్కొనటానికి మాఱుగా వాసుదేవ అద్వైత పరబ్రహ్మశాస్త్రి గారి కృతి అని వ్రాశాను. సవ్యాఖ్యానంగా ప్రకటితమైన ప్రశస్తమైన ఆ రచనను నలభై యేళ్ళ క్రితం చూచినపుడు అందులోని నవీన చిత్రబంధాల బొమ్మలను మాత్రం వ్రాసుకొన్నాను కాని, మొత్తం పుస్తకాన్ని వ్రాసుకోవటానికి అవకాశం లేకపోయింది. దాని వ్యాఖ్యానపంక్తులు ఎంతో అందంగా ఉండినవని మాత్రమే నాకు గుర్తున్నది. ఆ తర్వాత ఆ గ్రంథం ఇప్పుడెక్కడున్నదో ఆచూకీ చెప్పగలవారు కనబడలేదు. అటువంటి రచనను చేసిన విద్వాంసులు వేఱే భాషలోనూ లేరు. ఆ గుర్తింపైనా వారికి దక్కలేదని బాధ మాత్రం మిగిలింది.
పోకూరి కాశీపతి గారిది “త్రింశదర్థపద్యరత్నము” అద్భుతావహమైన రచనం. (నేను “త్రింశత్యర్థ” అని వ్రాసినది లేఖనదోషం) అటువంటివి ఎందరో వ్రాయలేరు. వారి “శ్ర్రీ శౌరి శైశవలీల” దశాక్షరీయ కావ్యం పీఠికలో వ్యాఖ్య లేకుండా అచ్చయింది. విడిగా అచ్చయిన లఘుప్రతి ఇప్పుడు లభిస్తుందనుకోను. ఆచూకీ చెప్పగలవారు లేరు. శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి గారి “కంకణబంధ రామాయణము” ప్రతికి ఒకప్పుడు మద్రాసు ఓరియంటల్ లైబ్రెరీలో వ్రాతప్రతులను సరిచూసి ఎవరో అద్భుతంగా పరిష్కరించిన కాగితం ప్రతి ఒకటుండేది. నేను దానిని చూసి 1971లో ముప్పాతిక భాగానికి పైగా ప్రతిని వ్రాసుకొన్నాను. ఆ తర్వాత చాలా కాలానికి వెళ్ళినప్పుడు వేఱే ప్రతులున్నాయి కాని, నేనొకప్పుడు చూసిన ప్రతిని తిరుపతికి తరలించామని చెప్పారు. అది తిరుపతికి చేరనే లేదు. ఇప్పుడేమయిందో తెలియదు. ఉన్న ప్రతులకు ఫోటోకాపీని సంపాదించగలిగినా, ఆ సుపరిష్కృతమైన ప్రతి ఆచూకీని కనుగొనటం సాధ్యం కాలేదు. పరిష్కరించినవారు ఏ వ్రాతప్రతిని చూసి సరిచేశారో కాని, ఆ వ్రాతప్రతి కూడా ఇప్పుడు మద్రాసు ఓరియంటల్ లైబ్రెరీలో లేదు. ఇప్పుడక్కడ తెలుగు పుస్తకాలకు దిక్కూ దివాణం లేని స్థితి. శ్రీమాన్ గోపాలాచార్యులవారి “గురుమూర్తి నాయని విలాస చిత్రప్రబంధము” అద్భుతమైన సుముద్రిత చిత్రబంధకృతి మైసూరు గవర్నమెంటు ఓరియంటల్ లైబ్రెరీలో ఉండేది. ఇప్పుడు లేదు. ఆంధ్రదేశం లోనూ లేదు. కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి కార్యాలయంలో పుస్తకాలన్నీ ఏటేటా కొన్ని కొన్ని “LOST” అన్న పేరుతో మాయమైపోతుంటాయి. ఆరుద్ర గారు ఎంతో శ్రమకోర్చి వెళ్ళి, చూసి, చదివి “సమగ్రాంధ్రసాహిత్యం”లో ఉదాహరించిన అక్కడి గణపవరపు వెంకటకవి గ్రంథాలు నేను వెళ్ళేనాటికి “MISSING” పట్టికలోకి చేరిపోయాయి. ఏమైపోయాయో వాళ్ళూ చెప్పలేకపోయారు.
ఇటువంటి దుఃస్థితిని తెచ్చుకోవటం ఒక్క తెలుగు జాతికి మాత్రమే సాధ్యమనిపించి ఏదో నా ఘోషను వ్రాశాను.
పోనీ, పై పుస్తకాలన్నీ రసవదర్థాలు కావా? అంటే, మహావిద్వాంసుల రచనలు కదా, శ్రద్ధగా పరికించి చూస్తే సరసకావ్యాలే అనిపిస్తుంది. మొన్నీ మధ్యనే నేను దైవజ్ఞ సూర్య పండితుని సంస్కృత కృతి “రామకృష్ణవిలోమ కావ్యం” చదివాను. నాకైతే అద్భుతంగా అనిపించింది. అనులోమవిలోమైక్యంతో ద్వ్యర్థికావ్యాన్ని ఇంత రమణీయంగా, ఇంత భావస్ఫోరకంగా వ్రాశాడే, ఏకార్థకావ్యమే వ్రాసివుంటే ఏ నారాయణీయం లాగా వ్రాసేవాడో! అనిపించింది. అరిశాణఫాల వేంకటాధ్వరి “రాఘవయాదవీయం,” వింజమూరి సోమేశ్వరకవి “రాఘవయాదవీయం,” కృతులకంటె వేయిరెట్లు మిన్న.
ఆధునికపాఠకులు చదివినా, చదవకపోయినా – ఈ మహనీయుల రచనలను తెలుగువాళ్ళు చదవాలని ఆశించటం భావ్యమే అనుకొంటాను. ఒక్క రామలింగారెడ్డి గారి కృషిఫలితంగా పింగళి సూరనకు తెలుగులో మునుపెన్నడూ లేని స్వస్థితి, సుస్థితి కలిగాయి. అందుకు దేశకాలమానపరిస్థితులు తోడయ్యాయి. ఈ రోజు పింగళి సూరన కృతులన్నిటినీ నిజంగా చదివేవారు ఉన్నా, లేకున్నా ఆయన స్థానం మాత్రం పదికాలాలకు పదిలమయింది. అలాగే, సాధనసంపత్తి, సాధికారత కలిగిన మీవంటి విదితవిద్వాంసులు, ఉత్తమ ఉపాధ్యాయులు ఈ శ్రేణి రచనలను అధికరించి ఆంగ్లానువాదపూర్వకంగా పరిచాయక వ్యాసాలను, గ్రంథాలను సహృత్ సుహృత్ శిష్యకృతంగా సర్వసమ్మతంగా వెలయిస్తే వాటికి అర్హగౌరవం లభించి, సమానహృదయులలో కొంతైనా ఆసక్తి జనించి, మళ్ళీ వాటికి కనీసం సూర్యాలోకభాగ్యమైనా దక్కుతుందని, ఆదరం ఏర్పడుతుందని నా దృఢవిశ్వాసం.
మీరూ ఆలోచింపగలరని ప్రార్థన. మీ వంటి పెద్దల వరివస్య మూలాన అనాదరం తగ్గి ఆదరం కలుగుతుంది.
ఇన్నేళ్ల తరువాత ఈ వ్యాసముపైన అభిప్రాయాలు వస్తున్నందులకు ఆనందముగా ఉంది! దశశ్లోకి శంకరాచార్యకృతమని అభిప్రాయమున్నది. నేను ఈ వ్యాసమును వ్రాసినప్పుడు అలాగే ఉండవచ్చుననుకొన్నాను. కాని అది నిస్సంశయము కాదు కాబట్టి నేను దానికి ఉదాహరణను ఇవ్వలేదు. కాని ఇప్పుడు చెప్పగలను అది వారు వ్రాయలేదని. ఎందుకంటే అశ్వధాటి వృత్తము శంకరుల కాలములో లేదు. దానిని హేమచంద్రుడు తన ఛందోనుశాసనములో పేర్కొనలేదు. అశ్వధాటి మొట్టమొదట సుమారు 16వ శతాబ్దపు మందారమరంద చంపువులో కనబడుతుంది మనకు, అశ్వధాటి పేరుతో కాదు మత్తేభము అనే పేరుతో! ఈ విషయాలనుగురించి నేను ఒక ప్రత్యేక వ్యాసము వ్రాయబోవుచున్నాను, బహుశా అది జనవరి నాటికి తయారు కావచ్చును. కామేశ్వరరావుగారు, మీరు చెప్పిన కాలిదాసు ఎప్పటివాడో? విధేయుడు – మోహన
“కొందరు దేవీ అశ్వధాటిని శంకరులు వ్రాసినారందురు. కాని ఇది కాళిదాసకృతమని అధికుల ఊహ. నా ఉద్దేశ్యములో ఇది శంకరాచార్యవిరచితమని, ఎందుకంటే ప్రాసయతులు మున్నగు అలంకారములు కాళిదాసునకు పట్టవు.”
మోహనరావుగారు యీ వ్యాసంలో ప్రస్తావించిన పై వాక్యాలు “చేటీ భవన్నిఖిల” అని మొదలయ్యే దేవీ స్తోత్రం గురించే అనుకుంటాను. ఆ శ్లోకాలన్నీ అశ్వధాటి వృత్తంలో ఉంటాయి. చాటు సంప్రదాయంలో కనిపించే కాళిదాసులాగానే, (శాక్తేయ) మత సంప్రదాయంలో మరొక కాళిదాసు కనిపిస్తాడు. ఈ సంప్రదాయం ప్రకారం – దేవీ పంచస్తవి, సప్తరత్నమాలికాస్తోత్రం, పైన పేర్కొన్న దేవీ స్తుతి (దీనినే దేవీ దశశ్లోకీ అని కూడా అంటారు) – మొదలైనవన్నీ కాళిదాస కృతులే.
నిశ్శబ్దం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
08/03/2013 11:55 pm
ఎప్పుడో వెళ్ళిపోయిన ఆవెని, అందులోనూ తన లిబరల్ కవిత్వాన్ని, మరే రకవైన ముసుగులూ లేని తన కవిత్వాన్ని, మీరు వ్రాసిన పదాలలోనూ, వాక్యాలలోనూ తప్పులేవి లేవు, కానీ ఆ కాంటెక్స్ట్ లో కమలాదాస్ గారి ప్రస్తావన అసలు బాగలేదు.
అయినా ఈ విమర్శలు తెలుగు వ్రాతల్లో బూతు అనే దానిమీద ఒక వివరణ, ఒక సవరణ దిశగా పోతాయని నేననుకున్నాను. కానీ ఒకరిమీద మరొకరి కామెంట్లకే పరిమితం అవటం నిజంగా దురదృష్టకరం. అయినా ఎవరికి ఆశక్తి వుంది కనక, ఏ ముగ్గురు నలుగురో అంతే. కానివ్వండి ఈరోజు కాకపోతే, రేపు ఒక సహజవైన వ్యక్తీకరణని బూతని ఎంతకాలం ఆపగలరు.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
దైవం గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
07/23/2013 3:36 pm
“ట” వేదాంతం
———–
‘ఒక్క “ట” తో ఎంత పని చేయించుకున్నారు మీరు!’ — అని ఒక ప్రఖ్యాత ఆరోచకులు అన్న వెంటనే మరొక ప్రముఖ ఆరోచకులు అవును సుమా, ‘మంచి పద్యమేనని’ కితాబు ఇచ్చిన తదుపరి నాబోటి సాధారణ పాఠకుడు, ఒకరకంగా ‘సతృణాభ్య వ్యవహారి’ ఉద్ధతుల మధ్యకి దిగి, ’తగుదునమ్మా అని’ అభిప్రాయం రాయటానికి నిజంగా భయం వేస్తున్నదంటే నమ్మండి.
నామటుకు నాకు ఒక పద్యం చదవగానే మెరుపులా ఏదో, ఎక్కడో చదివినదో, ఎవరో చెప్పగా విన్నదో జ్ఞాపకాని కొస్తుంది. ఆజ్ఞప్తి నా బుర్రకి పనికల్పించి సాదృశ్యం కోసం వెతుకులాడిస్తుంది. ఆ సాదృశ్యత ఏదో తట్టగానే, ఆ పద్యం ఒకటికి పది సార్లు చదివి, ఆనందించడానికి తోడ్పడుతుంది. ఈ పద్యం, మరీ ముఖ్యంగా ఆ ‘ట’ మీద వివరణ నాకు ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం ( పది.129) జ్ఞప్తి కి తెచ్చింది. మరీ ముఖ్యంగా, ఆ సూక్తంలో ఏడవ ‘శ్లోకం.’
This hymn has been translated, commented and critiqued by tons of scholars. It has been known as the Creation Hymn. It has been interpreted as one of the earliest accounts of skeptical inquiry and agnosticism. There was a Telugu translation by Vadlamudi Gopalakrishnayya from the Rigveda Samhita published by the Tirumala Tirupati Deevasthanam. It was more difficult than the original Rik. I will give one translation, I liked most. It was by Raimundo Panikkar. Here it goes:
“That out of which creation has arisen,
Whether it held it firm or it did not,
He who surveys it in the highest heaven,
He surely knows – or may be He does not.”
May be, it tells more than the alleged ‘ట’; or may be it does not. Who knows!
Whether Indrani Palaparthi has this స్మృతి when she was penning the poem would be a topic of discussion on her knowledge or association with Hindu Scriptures, Mysticism and even Psychoanalysis. And, that would be fodder for other comments and counter-comments.
I know, I have been accused of living in the 1980s, and did not ‘grow up.’ With this note I am afraid I would be condemned to be living some three thousand five hundred years ago! I would like to end my comment with a light hearted story.
Long long ago,there was a king by name Sisunaga. He had banned eight sounds in his kingdom because they were difficult to pronounce. They are :
ట ఠ, డ ఢ, శ ష, హ, క్ష. If this poem were to be written in Magadha during Sisunaga’s time, what could have happened to the, ‘ట,’ story?
Finally, Indrani garu! I loved reading your poems before publication in eemaaTa; and I love them more now after publication in eemaaTa.
వ్యాసాన్ని ఆసాంతం చదివి ఎంతో దయతో స్పందించిన శ్రీ కృష్ణమోహనరావు గారికి, రవి గారికి, పి. లలిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
శ్రీ కృష్ణమోహనరావు గారు! తుమ్మల వేణుగోపాలరావు గారి గూఢచిత్ర రహస్యప్రకాశిక భారతీయ భాషలన్నిటిలోని చిత్రరీతులను పరిశీలించి రూపొందించిన ఒక సమగ్ర విజ్ఞానసర్వస్వం. మొత్తం ఆఱు భాగాలుగా సంకల్పింపబడి, సగం మాత్రమే పూర్తయి అచ్చయింది. ఆ కూర్పు కాలంలో శ్రీ తుమ్మల వేణుగోపాలరావు గారు ఒక వారం రోజులు మా ఇంట ఉండి వారి సహృత్సల్లాపాలతో మా ఇంటిని ధన్యధన్యం చేశారు. పైపైని చదివేవారికి కొంత చాదస్తంగా అనిపిస్తుంది కాని, ఎంతో విలువైన సమాచారాన్ని మనకోసం సేకరించి శేఖరించిన మహానుభావులు వారు.
ఆధునికజీవితం ప్రకృతివిలాసానికి దవీయసమై కవిత్వం అంతర్ముఖీనత నుంచి బహిర్ముఖం కాసాగినపుడు మాఱిన కవిసమయాల నైపథ్యంలో ఇప్పుడు ఇటువంటి పద్యరచనమూ జరగటంలేదు; జరిగినవాటి పద్యార్థమూ తెలియటం లేదు. ఇటీవలి కాలంలో ఇటువంటి విషయాలపై గురుభావం సన్నగిల్లిపోయినందువల్ల చదివేవారూ లేరు; అచ్చువేసేవారూ లేరు.
గుడారు వెంకటదాస కవి గారి “ప్రబంధశిరోభూషణ ప్రకృష్ట బలరామ చరిత్రము”
శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారి “కంకణబంధ రామాయణము”
వఠ్యం పరబ్రహ్మశాస్త్రి గారి “చిత్రకంకణ రామాయణము”
శ్రీమాన్ గోపాలాచార్యుల వారి “గురుమూర్తి నాయని విలాస చిత్రప్రబంధము”
అల్లమరాజు రంగశాయి కవి గారి “చంపూ భారతము”
నాదెళ్ళ పురుషోత్తమకవి గారి “అద్భుతోత్తర రామాయణము”, “కృష్ణానదీ మాహాత్మ్యము”,
గాదె పాపరాజకవి గారి “చతుర్ముఖ కంద పద్య రామాయణము”
పోకూరి కాశీపతి గారి “దశాక్షర శ్రీ శేషశైలేలీల”, “త్రింశత్యర్థపద్యరత్నము”
శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారి “శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిరూష్మ నిర్వచనైకాదశాక్షర శకుంతలా చరిత్రము”
మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారి “ప్రబంధ సంబంధ బంధ నిబంధన గ్రంథము”
బండ్ల సుబ్రహ్మణ్యకవి గారి “విద్యుల్లతా బంధ ప్రబంధము”
వాసుదేవ అద్వైత పరబ్రహ్మశాస్త్రి గారి “మేకాధీశ శబ్ద శతకోటి”
తెలుగువాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఈ నిధులు ఎన్నని చెప్పను? ఇటువంటి కృతులకు కాలం చెల్లిందని, కాలస్రవంతి గతి మళ్ళిందని సమర్థించుకోవటం ఒక్క తెలుగువాళ్ళకే చెల్లింది.
మాన్యమిత్రులు శ్రీ కొలిచాల సురేశ్ గారికి నమస్కృతులతో,
భాషాశాస్త్రంలో శబ్దవ్యుత్పత్త్యధికరణమంటే నాకు అభిమానమే కాని అభినివేశం లేదు. మీ లాగా గాఢమైన కృషి చెయ్యలేదు. అందువల్ల ఈ నా మాటలు మీ నుంచి సమాధేయాలే కాని నా నుంచి సమాధానాలు కావు.
“పట్టణం” ద్రావిడ భాషామాతృకమై సంస్కృతంలోకి చేరినదన్న సాధ్యనిర్దేశానికి, మీ నిగమనానికి ఆధారాలు మీ వివరణ ద్వారా నాకింకా స్పష్టపడలేదు. అది సాంస్కృతికం కాదన్న నమ్మకం కలుగలేదు. సంస్కృతంలో “పట్టణం” కంటె “పత్తనం” ప్రాక్తనకాలికమైనట్లు కనబడుతుంది. క్ర్రి.శ. 4-వ శతాబ్ది నాటికే అమరసింహుడు తన నామలింగానుశాసనంలో – “పూః స్త్రీ పురీ నగర్యౌ వా పత్తనం పుటభేదనం, స్థానీయం నిగమః” అని పర్యాయపదావళిని ఇచ్చాడు.
ప్రాంతభేదాన్ని బట్టి వ్యాఖ్యాతలు “పట్టణం” పదానికి వివిధార్థాలను నిర్దేశించారు. “అమరకోశోద్ఘాటన వ్యాఖ్య”లో క్షీరస్వామి ప్రయాణాలు తక్కువగా ఉండి జనం స్థిరంగా ఒకచోట ఉండే ఊరు “స్థానీయ”మని, జనం తరచు వస్తూ పోతూ ఉండే ఆవాసం “పత్తన”మని వివరించాడు. సంస్కృతకృతులకు లభిస్తున్న దక్షిణదేశపు వ్రాతప్రతులలో “పత్తనం”, “పట్టనం”, “పట్టణం” అన్న మూడు రూపాలు కనబడుతున్నప్పటికీ, ఉత్తరదేశంలోనూ, తమిళ ప్రాంతంలోనూ అచ్చయిన సంస్కృతగ్రంథాలు అన్నింటిలో “పత్తనం” అన్న రూపమే కనబడుతున్నది. ఇదే నిజానికి ప్రాచీనరూపమేమో పరిశీలింపవలసి ఉన్నది.
అయితే, ఆంధ్రుడైన మల్లినాథసూరి తెలుగుదేశంలోని వ్యవహారాన్ని, తెలుగు కావ్యాలలోని ప్రయోగాలను గుర్తించినవాడు కనుక, తన “అమరపదపారిజాతం”లో –
అని పట్టణం అంటే స్కంధావారమంతా అందుబాటులో ఉండే మహానగరమని, దానికి “పత్తనం” అన్న రూపంకూడా ఉన్నదనీ వ్రాశాడు. పట్టణం (City) అని, పత్తనం (Town) శాఖానగరమని వ్రాశాడు. యాదవ ప్రకాశుల వారి “వైజయంతి”ని ప్రమాణీకరించాడు.
లింగయ సూరి తన “అమరపదవివృతి”లో – పతన్తి జనా అత్రేతి పత్తనం. “‘పత గతౌ’. పట్టణమితి పాఠే పటన్తి జనా అత్రేతి పట్టణం. ‘పట గతౌ’ అని వ్రాశాడు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరేది “పత్తన”మని, దానిగుండా జనం ప్రయాణిస్తారు కనుక (floating population వల్ల) అది పట్టణమని – ఛాయాభేదంతో కొత్త అర్థాన్ని చెప్పాడు. ఆ అర్థనిర్ణయానికి శిక్షాప్రణీతంగా ధాతుప్రమాణాలను ఇచ్చాడు.
అచ్యుతోపాధ్యాయుని “వ్యాఖ్యాప్రదీపం”, ఆశాధరుని “క్రియాకలాపం”, నీలకంఠుని “సుబోధిని”, భరత మల్లికుని “ముగ్ధబోధ” – ఇదే తీరున అర్థనిర్ణయం చేశాయి. ఔత్తరాహుడైన కృష్ణమిశ్రుడు “పత్తన” శబ్దాన్ని మాత్రమే అంగీకరించి, “పతన్త్యత్ర” అని నిశ్చయించి, ‘విపతేర్ తనన్’ అని ఉణాది సూత్రం (3-150) ప్రమాణీకరించాడు. ఆయన అర్థం క్షీరస్వాంయాదులతో సంవదిస్తుంది. క్రీ.శ. 16-వ శతాబ్దం నాటి తాళ్ళపాక తిరువేంకటాచార్యులు ఈ అన్నింటినీ పరిశీలించి తన “లింగాభట్టీయం”లో –
భానుజీ దీక్షితుడు తన “వ్యాఖ్యాసుధ” (రామాశ్రమి)లో “పత్తన” శబ్దాన్ని గ్రహించి, “పతన్తి జనా యత్ర” (జనం పెద్ద సంఖ్యలో వచ్చిపడుతుండే చోటు) అన్న భావంతో ‘వీ పతిభ్యాం తనన్’ ఆధారంగా పత్ + తన అని సాధించాడు. అంతటితో ఊరుకోక “పట్టనం ఇతి వాచస్పతిః” అని ఎవరో వాచస్పతిని ఉదాహరించి, అవి సమానార్థకాలని అన్నాడు.
అలాగే కాశీనాథుని “కాశిక”, గోస్వామి “బాలబోధిని”, నారాయణానంద రామచంద్రుని “అమరకౌముది”, బృహస్పతి “అమరకోశ పంజిక”, మధురేశ విద్యాలంకారుని “సారసుందరి” వ్యాఖ్యలన్నీ “వ్యాపారులు వస్తూ పోతూ ఉండే చోటు”, “జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతుండే ఆవాసం” అని చెప్పిన నిర్వచనాలు నిజానికి ఎంతో భావ్యంగానూ, అర్థవంతంగానూ, వ్యాకరణసాధ్యాలు గానూ, సప్రమాణంగానూ ఉన్నాయి.
ద్రావిడశబ్దమైన “పట్టు” నుంచి “పట్టణము”ను సాధించటానికి మీరు ఊహించిన “పట్టు” ధాత్వర్థరూపమైన వ్యుత్పత్తి మార్గాన్ని కూడా సంస్కృత లాక్షణికులు గుర్తింపకపోలేదు.
అని దామోదరుడు తన “సంగీతదర్పణం”లో అన్నాడు. అయితే, అది వీణ తీగలపైని వ్రేళ్ళను మీటే సందర్భంలో వివరించిన భావచ్ఛాయ. జనస్థానమన్న భావంతో కాదు. “పట్టు” సంస్కృత లాక్షణికుల దృష్టిలో ఉన్నదని చెప్పటం మాత్రమే నా ఉద్దేశం.
“పట్టణము” ద్రావిడ భాషామాతృకమై సంస్కృతంలోనికి వెళ్ళినదని ప్రయోగకాల నిర్నిమిత్తంగా “పట్టిన” శబ్దానికి చెబుతున్న భావార్థమాత్రాన రుజువు చెయ్యటం కష్టం. ఇకపోతే, ఊరిపేర్లలోని “పట్నం” సముద్రతీర ప్రాంతమే. సముద్రతీరం కాకపోతే ఒకానొక పెద్ద జలాశయానికి సన్నిహితం. సముద్రతీర ప్రాంతమూ, జలాశయప్రాంతమూ – రెండూ కాని ఊళ్ళ పేర్లు కేవలం అనుకరణమాత్రాన వచ్చిన ఆధునిక నామధేయాలు. ఒకప్పుడు సార్థకంగా ఏర్పడిన పేర్ల వంటివి కావు.
ఈ మాటలన్నీ విద్యార్థిత్వంతో మీ అభిప్రాయాన్ని కోరుతున్నవే గాని, విద్యాధికత్వంతో మీకు చెప్పగోరినవి కావు.
“అనిపిండి” గృహనామ శబ్ద స్వరూపనిరూపణను గుఱించిన మీ చర్చను అధికరించిన నా సందేహాలను మఱొకసారి మనవిచేస్తాను.
రవికిరణ్ గారు: ఇంటిపేర్ల గురించి మీరు దాదాపు సరిగ్గానే ఊహించారు. ఇంటిపేర్లు మనకు కాకతీయులకు పూర్వం ఉన్నట్టు దాఖలాలు లేవు. కవుల విషయంలో నన్నయ్య (భట్టు బిరుదు కావచ్చు) నుండి శ్రీనాథుడి వరకూ ఉన్న కవుల ఇంటిపేర్లు మనకు తెలియవు. నాచన సోమన పేరులో నాచన తండ్రి పేరు అయితే, పాల్కురికి సోమనాథుడి పేరులో పాల్కురికి వారి ఊరుపేరు కావచ్చును. బమ్మెర పోతన, అష్టదిగ్గజాల కాలం నుండి మనకు ఇంటిపేర్లు అవిరళంగా కనిపిస్తున్నాయి.
ప్రాఙ్నన్నయ్య శాసానాలలో ఊరుపేరో, ప్రాంత నామమో తగిలించిన పేర్లు కొన్ని అరుదుగా కనిపిస్తున్నాయి; కాని, ఆ రోజుల్లో తెలుగు వారు కూడా ద్రావిడ సంప్రదాయంలో లాగా తండ్రి పేరు తగిలించుకొనే అలవాటు ఉందని కొన్ని శాసనాలలో పేర్లు సూచిస్తున్నాయి.
స్థూలంగా ప్రస్తుతం తెలుగువారి ఇంటిపేర్లలో ఊరిపేరే అధికంగా కనిపిస్తుంది. వృత్తినామాలు/పదవులు (ప్రగడ మొ.), ధాన్యాల పేర్లు, కుటుంబంలో పేరు పొందిన వారి పేరు ఇలాంటివి కూడా విరళంగా కనిపిస్తున్నాయి.
ఈ విషయంపై వేమూరి గారు రాసిన వ్యాసం, అలాగే, ఇదివరకు నేను ఇండో-యూరేసియన్ రీసర్చ్ వేదికపై చేసిన చర్చను మీరు చదవవచ్చును.
సమావేశాల ప్రత్యేక సంచికలని ఈమాట తో జోడించడంతో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక సంచికలోని పదార్థం అందరికి అందుబాటులోకి వస్తోంది, నిజమే. కాని, ఈమాట లోని పదార్థం వడపోతకి గురి అయినట్లే ఆయా ప్రత్యేక సంచికలలో పదార్థం కూడ గురవుతోంది అనే భావం స్పురిస్తోంది. నాకు తెలిసినంతమట్టుకి సమావేశాల ప్రత్యేక సంచికల కూర్పులో అంత వడపోతకి, సంపాదకుల అభిప్రాయాలని గణనలోకి తీసుకొని రచయితలు తిరగరాయడానికి అవకాశాలు ఉండవు. కనుక ఇలా జోడించడంతో ఈమాటకి ఉన్న విలువ, గుర్తింపు ఆ ప్రత్యేక సంచికకి కూడ ఆపాదించబడుతోంది. ఇది ఎంతవరకు సమంజసమో పాఠకులే నిర్ణయించాలి.
జయప్రభ గారూ,
ద్రావిడుల ప్రస్తావన తీసుకొచ్చేరు కనుక చెబుతున్నాను. చాల రోజుల క్రితం నేను రాసిన ఒక కథలో నాకు తెలిసినంతమట్టుకు ద్రావిడుల చరిత్ర ప్రస్తావించేను. శాస్త్రీయ పద్ధతులలో పరిశోధన చేసినది కాదు కాని కథలో వీరభద్రశాస్త్రి పుట్టుపూర్వోత్తరాలు చర్చిస్తూ ద్రావిడుల కథ కూడ చెప్పేను. సరదా ఉంటే నా “ఇంటిపుట” లో ఉంది. అంశం 17 చూడండి. కథ అంతా చదవక్కర లేదు – మరీ పొడుగెక్కువ.
ఈ కవిత content వల్ల పాత జ్ఞాపకాలేవో రేగి, ఈ కవిత ఒక రచయిత్రిది కావడంతో మరింత ఎక్కవ connect ఐన ఒక మిత్రురాలు ఈ కవిత చదవమని లింక్ పంపారు. జ్వలించే ప్రేమల వల్ల కలిగే సంయోగ వియోగాలు అందరి జీవితాల్లో సహజమే కాబట్టి కవిత చటుక్కున బాగుందనిపిస్తోంది. కానీ, form దృష్ట్యా, అంటే నిర్మాణపరంగా కవిత అంత మంచి కవిత అనిపించడం లేదు.
తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది.
తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె
మట్టిలో రాలిన చప్పుడవుతోంది.
వీధి కొసన గుడ్డి దీపసెమ్మె తల చుట్టూ చలికొంగు కప్పుకుని,
బిక్కుపోతున్న ఒంటరి తోవకి తోడుగా, నించుంది.
గూడు చెదరిన పక్షి తెల్లారడం కోసం తహతహలాడుతోంది.
ఈ పాదాలు ఈ కవితలో శిఖరాయమానమైనవి. దీని స్థాయిలో మిగతా కవితా పాదాలు లేవు. అయితే, శుద్ధ కవిత్వ వాదిలా, అక్షరమక్షరంలో కవిత్వాన్ని పొంగిపొర్లిస్తూ, సారాన్ని గాలికొదిలేయమని నా ఉద్దేశం కాదు. కదంబ మాల వంటి కవితలో కొన్ని prosaic వాక్యాలుండటం ఎంత కొమ్ములున్న కవికైనా సహజమే. ఆయితే, ఆ వాక్యాలు అందులో ఇమడకపోతేనే ఇబ్బంది. అలా ఇబ్బంది కలిగించిన వాక్యాలే…
ఈ హృది ఏ శిల్పి చెక్కని శిలా ఫలకం.
ఇదొక అలిఖిత కఠిన శాసనం!
…ఈ కవితకి శీర్షిక సరఫరా చేయాల్సి రావడం వల్ల ఈ కవిత బలహీన పడిందనిపించింది. ఇదొక మధురావస్థ. మిధ్య కాని తీపి మరణావస్థ. పాదానికి ముందు బొమ్మకట్టిన భావం వల్ల, ఈ పాదంలో ప్రాస చక్కగా అతికింది. కానీ, జాలి మాలిన కాలం ఓ కనికట్టు. ఏ ప్రేమ గాయాలకీ లేదు లేపనాల కట్టు.
వంటి చోట్ల ప్రాసకోసం ప్రయత్నించినట్టు తేలిపోతోంది.
“ఒకటి చెప్పనా? …”
వంటి వాటి ద్వారా కవితలో continuity కోసం చూసినట్టు అనిపించి నచ్చలేదు.
నువ్వంతే! కదలని రాతివి.
నేనూ ఇంతే! కరగని రాత్రిని
అన్న చివరి లైన్లు చూస్తే, కవిత ఎత్తుగడ, ఉపసంహారం వంటి ఎకడమిక్ సూత్రీకరణల స్పృహ ఏమైనా ఉందా అనిపిస్తోంది. ‘అనుభవించిన వారికే తెలుస్తుంది….’ అన్న కామెంట్ తో సహానుభవాన్ని పొందుతున్న ఒకానొక పాఠకుడి మమేకత మీద తగు జాగ్రత్తగా కుండెడు నీళ్ళు పోసినట్టు, అనుభవం సొంతం కావొచ్చు. ఊహా జనితమూ కావొచ్చు… అని దమయంతి గారు బదులివ్వడం ఒక slap on the face లాంటి కొసమెరుపు!
పాదమునకు ఆఱునుండి పండ్రెండు అక్షరములు కలిగిన ఛందములకు వరుసగా గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుభ్, బృహతి, పంక్తి, త్రిష్టుభ్, జగతి అని పేరులు. సూర్యుని రథమునకు ఉండే సప్తాశ్వముల పేరులు ఇవి అని కూడ అంటారు. ఛందస్సు రెండు విధములు – వైదిక, లౌకిక. వేదములలోని ఛందస్సును వైదిక ఛందస్సు అంటారు. వేదములలో పాదమునకు 11 అక్షరములు ఉండే త్రిష్టుభ్ ఎక్కుబగా వాడబడినది. పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే ఛందస్సు మూడు పాదముల త్రిపదగాయత్రిగా, నాలుగు పాదముల అనుష్టుప్పుగా, ఐదు పాదముల పంక్తిగా, ఆఱు పాదముల మహాపంక్తిగా, ఏడు పాదముల శక్వరిగా వాడబడినది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. లౌకిక ఛందస్సులో పాదమునకు పది అక్షరములు ఉంటే అది పంక్తి అవుతుంది. కాని వైదిక ఛందస్సులో ఎనిమిది అక్షరములు గల ఐదు పాదములు పంక్తిగా పరిగణించబడును. పాదమునకు 12 అక్షరములు ఉండే జగతి కూడ చాల వాడబడినవి. ఇవి గాక, మూడు విధములైన త్రిపదలు (8,8,12; 8,12,8; 12,8,8) కూడ వాడబడినవి. జూలై సంచికలోని నా త్రిపదల వ్యాసములో ఇవి చర్చించబడినవి. ఇవి గాక 8-8, 12-8 అక్షరముల బృహతి, 12-8, 12-8 అక్షరముల సతోబృహతి, 8-8-8, 8-8, 12-8 అక్షరముల అతిశక్వరి, 12-12-8, 8-8, 12-8 అక్షరముల అత్యష్టి వీటిని కూడ వాడినారు. బృహతి + సతోబృహతి మనకు బార్హత ప్రగాథను ఇస్తుంది; కకుభ్ + సతోబృహతి మనకు కాకుభ ప్రగాథను ఇస్తుంది. ఈ ప్రగాథలకు మొత్తము 72 అక్షరాలు ఉండాలి. ఈ ప్రగాథలు త్రిపదలే. మీరు ఇచ్చిన శ్లోకములో అస్తు ను విడదీసి, ఓం, నమః కలిపితే మనకు 72 అక్షరాలు లభిస్తుంది. అయినా వాటిని 12, 8 అక్షరాలుగా విడదీయడము కష్టము అనుకొంటాను. వీటిని irregular ఛందములు అని మాత్రమే చెప్పవచ్చును. ఇది నాకు తెలిసిన వైదిక ఛందస్సు. నేను వేదాధ్యయనము చేయలేదు కాబట్టి ఇంతకన్న ఎక్కువ చెప్పలేను. విధేయుడు – మోహన
జాబులో కొంచం బిజి అవడం వల్ల ఈ మద్యన ఆన్లైన్ రాలేక పోయాను. మీ రిప్లైని ఇవ్వాళనే చదివాను. చాలా ధన్యవాదాలు.
ఈ పై శ్లోకము యజుర్వేదములోని కృష్ణపక్షములోని రుద్ర ప్రశ్న (దీనినే శ్రీరుద్రం అని కూడ అంటారు) యొక్క మొదటి అణువాక యొక్క తుదలో వున్నది. ఎన్నొ గ్రంథాలలో దీనిగురించి అన్వేషణ చేశాను. అన్నిటిలో ఇది చతుష్పాదముగానే ఇవ్వబడింది. (చూడండి : రుద్రం).
మీరు చేసిన పద విభజన, అక్షర సంఖ్యలు కూడా చాల బాగుంది మఱియు విచారార్హనీయమైనది. కాని ఏ ఛందస్సో తెలియటం లేదు. నాకు ఇది ప్రగాథ గా తోచుచుంది.
ప్రగాథ :- నాలుగు పాదాలు గలదై, ప్రతిపాదానికి ఎన్నైనా అక్షరాలు వుండవచ్చునని వికిపీడియలో చదివాను. మీ అభిప్రాయము ఏంటిదో తెలుపగోరుతున్నాను.
మీ శ్రేయోభిలాషి,
గూడూరు ఆదినారాయణ
మఱోవిషయమేమిటంటే అన్ని గ్రంథాలలో “నమస్తే అస్తు” అని విడివిడిగానే వ్రాయబడి వుంది. ఎక్కడకూడ అవగ్రహయుక్తముగా ఈ రెంటిని కలిపి “నమస్తేऽస్తు” అని వ్రాయడం చూడలేదు. బహుశః అక్షరాలను ఛందస్సులో కూర్చోబెట్టడానికె ఆలా వ్రాయబడి వున్నదోనని కూడ అనుమానము వస్తున్నది. ఉదాహరణానికి ఈ క్రింది శ్లోకమును చూడండి. ఈ క్రింది శ్లోకము శ్రీరుద్రములోని మొట్టమొదటిది.
ఈ శ్లోకము అనుష్టుభ్ ఛందస్సులో వ్రాయబడ్డది. దీనిని 4 పాదాలుగా విభజిస్తే ప్రతిపాదానికి 8 అక్షరాలు వస్తాయి. ఇందులో “ఉతోత ఇషవే” ను గుణసంధితో కలిపి “ఉతోతేషవే” అని మఱియు “నమస్తే అస్తు” ను “నమస్తేऽస్తు” అని కలిపి వ్రాస్తే 2వ మఱియు 3వ పాదములో 7 అక్షారలు మాత్రము మిగిలి, ఛందస్సులో సరిపోదు.
ఈ వ్యాసం చదవగానే వచ్చిన అనుమానం – దీన్ని వ్రాసిన నారాయణ రావుగారూ, కవితా విప్లవాల స్వరూపం వ్రాసిన నారాయణ రావుగారూ ఒకరేనా? అని. 🙂 అయితే యీ వ్యాసం మరో రెండుసార్లు చదివి, ఆ పుస్తకం మరోసారి తిరగేస్తే కాని నేను పొరబడ్డానా, లేక నా అనుమానం నిజమేనా అన్నది చెప్పలేను!
నా వ్యాసం మీద ఆలోచనకీ, అంతర్దృష్టికీ పనికొచ్చే ఉత్తరాలు (జయప్రభ, సౌమ్య, భావనారాయణ గార్లవి) వొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాటికి సమాధానాలు నాకు నిబ్బరంగా తెలియవు. పదిమందీ ఆలోచనలూ కలబోస్తే నేను చెప్పే వాటికన్నామంచి సమాధానం దొరకొచ్చు. నాకు తోచిన మాటలు చెప్తాను.
విమర్శకులు విమర్శాతీతులు కారు. వాళ్ల దృష్టిలోపాలూ, సంస్కారపరిమితులూ అభిమాన దురభిమానాలూ, వాళ్లకి వుంటాయి. ఒక్కసారి నావ్యాసం మళ్లా చూడండి:
“… చదివేవాళ్ళు, వాళ్ళ మనసులో పొరలు అడ్డం పెట్టుకొని, వాళ్ళ రాగద్వేషాల దారిలో కవిత్వాన్ని చూస్తే దానికి ఇంకొక దుర్వ్యాఖ్యానం వస్తుంది. అందుకనే అచ్చమైన కవిత్వం అచ్చమైన సహృదయులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ బాధ్యత ఒక్క వ్యక్తి మీద పెట్టకుండా కొన్ని తరాల మనుషులు, కొన్ని సంవత్సరాల పాటు ఆ కవిత్వాన్ని చదువుతూ ఉంటే తాత్కాలిక రాగద్వేషాలు, వ్యక్తిగత వైమనస్యాలు క్రమక్రమంగా తొలిగిపోయి కవిత్వమే మిగులుతుంది అని ఒక ఆశ.”
సహృదయుడు ఒక వ్యక్తి కాదు. అచ్చమైన సహృదయులు కొన్ని తరాల విమర్శకుల సంపుటి. విమర్శకులు వేరే ఒక జాతి కాదు. ఇందులో కవులూ, రచయితలూ కూడా వుంటారు. పైగా, రాగద్వేషాలకి అతీతంగా కవిని/రచయితని అర్థంచేసుకోడం సాధ్యం కాదు. ఎందుకంటే కవిత్వమూ, రచనా రాగద్వేషాల లోంచే వొస్తాయి కాబట్టి. కాని, చదివేవాళ్లు తమ వ్యక్తిగత సంకుచిత రాగద్వేషాలకి అతీతంగా రచనని అర్థంచేసుకోడం సాధ్యం. వాళ్లు కొన్ని తరాల వాళ్లు అయితే ఇంకా తేలికగా సాధ్యం.
విమర్శకులు, అంటే సహృదయులు, కవుల్లాగ కథలు కట్టి చెప్పుకునే స్థాయికి ఎదగరు. వాళ్లెప్పుడూ అనామకులే, తెరవెనకవాళ్లే. ఎప్పుడో ఒక అభివగుప్తుడో, మమ్మటుడో, జగన్నాథుడో ఆ స్థాయికి వొస్తారు. అదీ వాళ్లు కవులు కూడా కాబట్టి. ఆధునిక కాలంలో కవి జీవిత చరిత్రల రచయితలు కవులకన్న, రచయితల కన్న, ప్రముఖ స్థాయికి రావడం, వాళ్ల వల్లే కవులూ, రచయితలూ అర్థం చేసుకోబడడం గురించే నా అభ్యంతరం.
కవి జీవితం గురించి తెలిస్తే కవిత్వం, రచయిత బతుకుని గురించి తెలిస్తే ఆ రచయిత రచనలూ ఎక్కువ బాగా తెలుస్తాయనేది ఆధునిక పెట్టుబడిదారీ సమాజం ఏర్పరచిన భ్రమ. కమలాదాస్ కవిత్వానికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇది మీకు రుజువు చెయ్యలేను.
ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను: 8వ శతాబ్దపు సంస్కృత ఆలంకారికుడు దండి తన కావ్యాదర్శపు ప్రారంభంలో సరస్వతీ ప్రార్థన చేస్తూ
చతుర్ముఖముఖాంభోజ కలహంసవధూ ర్మమ
మానసే రమతాం నిత్యం సర్వ శుక్లా సరస్వతీ
(బ్రహ్మ నాలుగు ముఖాలూ అనే పద్మాలలో (విహరించే) హంస, పూర్తిగా తెల్లగా వుండే సరస్వతి, నా మనస్సులో ఎల్లప్పుడు ఆనందంగా ఉండు గాక) అని రాశాడు.
ఇది చదివి, విజ్జిక అనే ఆవిడ ఇలా అందిట:
నీలోత్పలదలస్యామాం విజ్జికాం మా మజానతా
వృథైవ దండినా ప్రోక్తా సర్వ శుక్లా సరస్వతీ
(నల్ల కలువ లాగ (అందంగా) వుండే విజ్జిక అనే నన్ను గుర్తించక (ఎరగక) సరస్వతీ దేవి ఎప్పుడూ తెల్లగానే వుంటుంది అని దండి (తెలివి తక్కువగా) చెప్పాడు.)
దండిని గురించీ, విజ్జికని గురించీ మీ ఇష్టం వొచ్చిన కథ చెప్పుకోండి, కానివాళ్ల నిజ జీవితాలు తెలిస్తే ఈ శ్లోకాలు ఇంకా ఎక్కువ బాగ అర్థం అవుతాయా, లేకపోతే ఆ సమాచారం మీ ఊహకి అడ్డొచ్చి, ఈ శ్లోకాలు దెబ్బతింటాయా?
ఇకపోతే సూరన, సూరన్నల పేర్ల అక్షర నిర్ణయం గురించి: కళాపూర్ణోదయం, ప్రభావతీప్రద్యుమ్నం గద్యలో ఆయన పేరు సూరయ అని వుంది. అయ్య, అన్న, అప్ప, అయ, అన, అప – ఇవన్నీ సమానార్థకాలుగానే వాడారు. ఇందులో ఛందస్సుకి అనువైన రూపాలు ఆచరణలోకి వొచ్చాయి. పేరులో అక్షరబద్ధత మనకి పూర్తిగా ఆధునిక కాలం లోనే వొచ్చింది. అయితే సూరన పేరులో నకారద్విత్వం ఎంతముందు వాడుకలో కనిపిస్తుందో నేను పరిశీలించలేదు.
కృష్ణ మోహన్ గారు,
మీకు మఱియు మీ ఛందస్శాస్త్ర జ్ఞానానికి నా నమస్కారములు.
నేను చాల రోజుల నుండి ఈ క్రింది శ్లోకము ఏ ఛందస్సులో వ్రాయబడ్డదోనని విచారిస్తున్నను, ఇంటర్నెట్ లో చాల వెతికాను కాని ఎక్కడ లభించలేదు. కనీసం మీరైన నాకు చెబుతారని ఆశిస్తున్నాను. కృతజ్ఞున్ని.
ఈ సంచిక గురించి… గురించి Akella suryanarayana murthy గారి అభిప్రాయం:
06/21/2013 2:57 am
వ్యాసాలు అంత జన రంజకంగా ఉండవు అనేది అంత నిజమనిపించదు, కొంచం స్టార్టింగ్ ట్రబుల్ తప్పకుండా ఉంటుంది నాలాంటి వాళ్లకి, కాని మొదలు పెట్టేక ఆపలేము, nothing less than a story or fiction, either English or Telugu. చడవాలని ఉండాలేకాని
“మా జానకి చేట పట్టగ మహరాజువైతివి” అని పల్లవందుకునే సరికి ఒక్కసారి ఉలిక్కిపడి, దేవుడా అనుకొంటూ ఇంటిముఖం పట్టాను. ఇలాంటివి తెలుగు వాళ్ళు ఖండించరు. అలా చెయ్యడానికి వాళ్ళు సంగీత కచేరీలకి వెళితే కదా?
మీరు సంగీత సాహిత్యాలలో గొప్ప పట్టు, విజ్ఞానం కలవారు. కాని మీరు కూడా ఎందుకు తెలుగువాళ్ళని మాటి మాటికి విమర్శిస్తారు? మీరే స్వయంగా కచేరికి వెళ్ళారు, మీరే తప్పు విన్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు వారికి తప్పుని చెప్పలేదు? ఎందుకు వారిని సరిదిద్దలేదు? సంగీతకచేరికి వెళ్ళిన మీరు కూడా తెలుగువారే కద… (కాదా?)
కనీసం మీలాంటి పెద్దవారైనా తెలుగువారిని తిట్టకండి. తప్పులు వారిలో లేవని కాదు. మన వాళ్ళలో తప్పులు మనమే సరిదిద్దటానికి ప్రయత్నించాలి కాని … విమర్శించి వదిలేస్తే ఎలా?
ఈమని గారి కచేరీలు ప్రత్యక్షంగా చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. మాది కాకినాడ దగ్గర రామచంద్రపురం. కాకినాడ, ద్రాక్షారామం వచ్చినప్పుడల్లా ఈమనిగారు మా ఊరిలో కూడా కచేరీ చేసేవారు. వారి కచేరీ గురించి కాని, వాదన గురించి కాని రాసే అంత అర్హత నాకు లేదు. కాని, ఒక్కటి తప్పక చెప్పాలి. వారి కచేరీ వింటూ చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని. ఇప్పటిలాగా రికార్డ్ చేసుకొనే సదుపాయం ఉంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు బాధపడుతుంటాను. వారి కచేరీలో నాకు బాగా గుర్తుండిపోయిన, మనసుకి బాగ హత్తుకుపొయిన సంగతి ఏంటంటే, ఈమనిగారు ఒక గాజుగ్లాస్ తీసుకొని, దానిని వేలితో కొట్టి, ఆ శబ్దాన్ని వీణమీద పలికించారు. అలాగే, చాలా శబ్దాలను పలికించడం అన్నది ఇప్పటికీ నేను మర్చిపోలేనిది.
త: త: గారు వాసాగారి కచేరి గురించి రాశారు. నేను ఆ గొప్ప విద్వాంసుని వాదన వినలేకపోయాను. కాని, నా పూర్వజన్మ సుకృతంచేత వారి వారసురాలైన శ్రీమతి ఆనందరాజ్యలక్ష్మిగారి శిష్యరికం చేస్తూ వారి వాదనను ఎంతో వివరంగా వినగలుగుతున్నాను.
ఈమనివారివలే, వాసాగారి లాగానే మా గురువుగారు కూడా చాలా కల్మషం లేకుండా కేవలం సంగీతం కోసమే సంగీతాన్ని / వీణని పలికించేవారగుటం వలని, వారు హైదరాబాద్ వంటి మహాపట్టణంలో ఉన్నా వారి పేరు వేరే వారి పేరులాగ వినిపించటం లేదు.
ఏది ఎమైనా, ఈమనిగారి రికార్డ్స్ ఎమైనా దొరికితే, ఈమాటలో ఇవ్వండి. బహుశా ఈమని కళ్యాణిగారు ఏమైన సాయం చేస్తారా?
లైలాగారికి, దగ్గుపాటిగారికి వారి అభిప్రాయములకై కృతజ్ఞతలు. దీనివల్ల కొందఱైనా ఈ కాలంలో పద్య కవిత్వంపై ఆదరం చూపుతున్నారని స్పష్టమైంది. లైలాగారు లేవనెత్తిన అంశాలకు ఈ క్రింద వివరణ లిస్తున్నాను.
1. అమరకోశమనేది సుప్రసిద్ధమైన శ్లోకరూపంలో ఉండే సంస్కృతనిఘంటువు. ఇందులో పదిహేను వందల శ్లోకాలున్నవి. సంస్కృతం నేర్చుకొనేవారు మొట్టమొదట కంఠస్థం చేసే గ్రంథమిది. తెలుగు పట్టుబడాలన్నా ఇది నేర్చుకొనవలసిందే.
3. ‘విద్యుల్లతికను మేఘుఁడు హృద్యంబుగఁ బొదివినట్టు లెదలోఁ బొదివెన్’ అన్న భావం పునరుక్తం కాలేదు. అది ఖండికలో ఒకే ఒకసారి వెలిబుచ్చబడింది. ఈ పద్యంలో మఱొక విశేషం ఉంది. ప్రాసస్థానంలో ద్య అను సంయుక్తమైన శబ్దము, ద తో గాఢంగా కూడుకొన్న య ఒత్తు, ఆ గాఢాలింగనదృశ్యాన్ని వ్రాత ద్వారా, శబ్దం ద్వారా మనకు ప్రత్యక్షీకరిస్తున్నవి. పైగా పద్యంలో ప్రాసస్థానంలో, అంటే రెండవస్థానంలో ఉండే ఈ సంయుక్తాక్షరం, అది ఇర్వురు వ్యక్తుల మధ్య కూడిన గాఢాలింగనం అనే విషయాన్నీ సూచిస్తున్నది. ఇటువంటి కావ్యగుణానికి ‘ఔదార్య’మని పేరు.
4. శుకరాయబారాలు, హంసరాయబారాలు చర్వితచర్వణములే. అందులో నూతనత్వ మేముంది?
‘Where there is risk is there the reward’ దూతి నీవిధంగా పంపి అతని బలహీనతను కూడ ప్రత్యక్షంగా నిరూపించి అతనిని ప్రసన్నం చేసికొనడంలో క్రొత్తదనముంది. ఈ పథకానికి అనుగుణంగా నాయికాదూతికల మనఃస్థితులు ఈ ఖండికలో నిరూపింపబడ్డవి.
“సుందరదూతికాకృతియు..” అనే పద్యంలో దౌత్యాని కర్హమైన గుణవిశేషములు, అందులో గూఢంగా నిక్షిప్తమై యున్న పథకం వివరింపబడింది. కాని ఇందులో గల ప్రమాదం తరళికకు స్ఫురించకుండా ఉండలేదు. అందుచేతనే, ఆమె ‘ఏమె! జ్యోత్స్నాభిసారికాకృతినిఁ బూని..’ అన్న పద్యంలో ఈ పథకంలో గల ప్రమాదాన్ని నర్మగర్భితంగా వెలిబుచ్చింది. దానికి ‘అతని రాతిడెందము..’ అన్న పద్యంలో ముఖ్యంగా ‘నీదు మేలు గాదటె చెలి నాదు మేలు?’ అన్న వాక్యం ఆమెకు కొంత ఊరట కల్గించింది. పైగా, ‘ఐన మఱవకుము మననెయ్యంపు మాట!’ అన్న పద్యంలో పైమాటకు కట్టుబడి ఉండమని నాయిక దూతికను మెత్తగా హెచ్చరించింది. మొత్తానికి దూతికయందు నాయికకు అపనమ్మకం కంటె నమ్మకమే కాస్త అధికంగా ఉందనే అనుకోవాలి. దూతిక కూడ మానవసహజమైన లోభమునకు అతీతురాలు గాదనే విషయం ‘అదటున నాతఁ డా యువతి నక్కునఁ జేర్పఁగ …’ అన్న పద్యంలో వ్యక్తీకరింపబడింది. ఇది దౌత్యం చేసినందున దూతిక కబ్బిన విశేషఫల మనుకుంటే నష్టంలేదు. కాని దూతిక స్వార్థపరురాలు గాదు. ఈ విషయం ‘అట్లు పారవశ్యము నంది ..’, ‘అట్టు లుద్బుద్ధచిత్తయై..’ అన్న పద్యాల్లో వ్యక్తమైంది. తరళిక ఆమె అందచందాలు, విధేయత్వము తెలిసినది కావుననే ఆమె నీ కార్యమునకు నియోగించిన దని దీనివల్ల స్పష్టమౌతున్నది.
ఈ వ్యంగ్య కవిత బాగుంది. కాని కల్లలు హాయిగా ఎగురుతున్న ఈ కాలం లో “నేల రాలిన కల్లలు” అని ఎందుకు అన్నారో అర్థం కాలేదు సామాన్యుడికి ప్రతి కాలమూ టోపీల కాలమే కదా అన్న పంక్తి వాస్తవికతకు అద్దం పట్టింది.
ఈ ఖండికయందలి ‘నిగనిగన్నిగలాడు’ అనే సీసపద్యంలోని గిరిశిరంబులఁ దోఁచు మెఱుపుతీవెలచంద మురమందు ప్రాలంబములు ధరించి – అను నాల్గవ చరణాన్ని గిరిశిరంబులఁ దోఁచు మెఱుపుతీవెలచంద మురమందు ముత్యాలసరులు దాల్చి – అని మార్చడమైనది.
“ప్రాలంబ మృజులంబి స్యాత్, కణ్ఠాద్వైకక్షకం తు తత్” – అని అమరకోశము. ప్రలంబతే – ప్రాలంబి, లబి – లమ్బనే (వ్రేలాడునది)- అని దీనికి వ్యుత్పత్తి. అనగా కంఠమునుండి పొడవుగా నురస్సునందు వ్రేలాడు దండకు ప్రాలంబమని పేరు. ఈ ‘లబి’ధాతువునుండే వచ్చిన మఱొక పేరు ‘ప్రాలంబిక’. కాని ఇది కంఠమునుండి వ్రేలాడే బంగారుదండకు పేరుగా, “స్వర్ణెః ప్రాలంబికా” అని ప్రత్యేకంగా అమరకోశంలో చెప్పబడింది. పైపద్యంలో ఉపమేయమైన ముత్యాలదండ ఉపమానమైన మెఱుపుతీగకు అధికసదృక్షంగా ఉంటుందనియు, మునుపున్న అఖండయతిని పరిహరించుటకుగాను ఈమార్పు చేయడమైనది.
శ్రీ పి.బి. శ్రీనివాస్ గారు సంఖ్యాశాస్త్రాన్ని, అక్షరసాంఖ్యాన్ని అభ్యసించి తమను సంప్రతించిన మిత్రులకు పేరును వ్రాయటంలో చిన్న చిన్న మార్పులు చేసుకొంటే మేలవుతుందని సూచనలు చేస్తుండేవారు. జన్మదినాన్ని బట్టి వారి వారి జాతకాలను గుణించి చెబుతుండేవారు. రేసుకోర్సులో వినోదార్థం లెక్కలు వేసి ఈ గుఱ్ఱం ఇప్పుడు గెలుస్తుందని చెబుతుండేవారు కాని, వారు స్వయంగా ఆడిన సందర్భాలు తక్కువ. వీరిది పాశ్చాత్య గణన పద్ధతి. ఆ రీతులను గుఱించిన ఒక వ్యాసంలో కొన్ని వివృతులను వ్రాశారు.
శ్రీనివాస్ గారు 1930 సెప్టెంబరు 22-వ తేదీనాడు (8 సంఖ్య) జన్మించారు. వారు ఆంగ్లంలో వ్రాసికొన్న Sreenivos (వారి పద్ధతి ప్రకారం) 8 సంఖ్య అవుతుంది. దానికి P B చేరిస్తే వచ్చే 9 కలిపినా మళ్ళీ 8 సంఖ్యే వస్తుంది. అది వారి జీవితగతికి నిర్ణాయకమైన అదృష్ట సంఖ్య అన్నమాట.
నేటి మన విశ్వాసావిశ్వాసాలతో నిర్నిమిత్తంగా విశ్వసనీయమని విశ్వసించినందున వారీ విధంగా తమ పేరును వ్రాసికొనేవారు. నేను నా వ్యాసంలో వారి అక్షరసాంఖ్య పరిశోధనలను గూర్చిన వివరాలను వ్రాయలేదు.
దమయంతి గారు, నాకు కూడ రేణుకగారి పాటలంటే ఇష్టమే. [మీరు ఉదహరించిన ఆ పాట ఒక ఓ పి నయ్యర్ హిందీ పాటకు అనుసరణ అనుకొంటాను, పాట జ్ఞాపకానికి రావడము లేదు, కాని కబ్ ఛాయె ఘటా ఘన్ ఘోర్ అని వస్తుంది అందులో.] అరవైలలో బెంగళూరులో ఉండేటప్పుడు ఆమె పాటలను కన్నడములో వినేవాడిని. ముఖ్యముగా ఆమె జానకి, లతాలతో పాడిన హూవతందు మారిదళు తరచుగా రేడియోలో ప్రసారము చేసేవాళ్లు. ఇది పిబిఎస్ పైన వ్యాసము గనుక, రేణుక, పిబిఎస్ యుగళగీతము నొకదానిని దుడ్డే దొడ్డప్ప అనే చిత్రమునుండి వినవచ్చును.
బావుంది వ్యాసము సురేశ్ గారు! పూర్వులు వ్రాసిన కొన్ని గ్రంథాలలో సూర్యోదయమును ఉదయము ఆఱు గంటలుగా (by default) తీసికొనవలెను అని అంటారు. తరువాతి కాలములో సూర్యోదయ కాలమును కచ్చితముగా తీసికొనవలెనని అంటారు. కొన్ని సమయాలలో దీని వ్యత్యాసము సుమారు ఒక అరగంట కాలము ఉంటుంది. సామన్యముగా ఇది సందిగ్ధతను కల్పించదు. కాని తేడా అరగంటకన్న తక్కువైతే ఇది సందిగ్ధతను కల్పించవచ్చును. బహుశా 1901లో ఇలాటి సందిగ్ధత వచ్చిందేమో? జాతకములు వ్రాసేటప్పుడు కూడ లగ్న నిర్ణయములో ఈ సూర్యోదయకాలము మనకు కొన్ని సందిగ్ధ లగ్నములకు దారి తీస్తుంది.
మరో విషయము – కాల నిర్ణయము ఏ రేఖాంశము ద్వార నిర్ణయించారో అన్నది కూడ మనము తెలిసికోవాలి. ఇప్పుడు భారతదేశమునకంతటా ఒకే కాలమున్నను, ప్రతి చోటులో సూర్యోదయకాలము వేరు అనే సంగతిని మనము గుర్తులో నుంచుకోవాలి. కామరూపలో సూర్యుడు త్వరగా ఉదయిస్తే కచ్‌లో ఆలస్యముగా ఉదయిస్తాడు! అందుకే భారతదేశానికి రెండు time zones ఎంతైనా అవసరము, ఇది వేరే విషయము అనుకోండి. అధిక మాస నిర్ణయానికి ఈ శ్లోకమును ఉదహరిస్తారు – ద్వాత్రింశద్భిః గతైః మాసై దినై షోడశభిస్తథా ఘటికానాం చతుష్కేణ పతత్యధికమాసకః (33 నెలలు, 16 దినములు, నాలుగు ఘడియలకు ఒక మారు అధికమాసము వస్తుంది). అధికమాసమును పురుషోత్తమ మాసము, మల మాసము, మలిమ్లుచము అని కూడ పిలుస్తారు. మాసేషు ద్వాదశాదిత్యం తపంతే హి యథాక్రమం నపుంసకేஉధికే మాసి మండలం తపసే రవి (ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆదిత్యుడు (12మంది సూర్యులలో ఒకడు) ఉదయిస్తాడు, కాని అధికమాసములో ఇలాటి సూర్యోదయము లేదు, కావున సూర్యమండలమే ఈ పనులను కొన సాగిస్తుంది).
అధికమాస నిర్ణయాన్ని గుఱించి మీరు వ్రాసిన వివరణ చాలా బాగున్నది.
1901లో మన తెలుగు పంచాంగకర్తలకు “శ్రావణమాసం అధికమా? ఆషాఢమాసం అధికమా?” అన్న గొప్ప వివాదం ఏర్పడటమూ, చివఱికి రాజమండ్రిలో పండిత పరిషత్తు ఏర్పడి పరిష్కారాన్ని సూచింపవలసి రావటమూ, అది కోర్టుకు వెళ్ళటమూ – ఆ కథంతా మీరు వినే ఉంటారు.
నాకు ఎన్నాళ్ళుగానో ఉన్న సందేహం: కాల పరిగణన రీత్యా 1901లో పెద్దలకు అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చి ఉంటుంది? రెండు పక్షాల వారికి వారి వారి ఆధారాలేమై ఉంటాయి? అధికమాసం విషయమై చివఱికి ఏది సరైనదని నిర్ణయించి ఉంటారు? నేను ఈ కథను ఆ వివాదంలో పాల్గొన్న మహాకవి శ్రీ దాసు శ్రీరామకవి గారి మనుమరాలు డా. వైదేహి గారి ద్వారా నా చిన్నప్పుడు పూర్తిగా విన్నాను కాని, చివఱికి తీర్పు ఏమని జరిగిందో ఇప్పుడు గుర్తులేదు.
భావనారాయణ గారు, నిర్మాతలు, దర్శకులు మాత్రమే కాదు, నాయకీనాయకులుగా నటించే నటులు కూడ ఈ (దు)స్థితికి ఒక కారణమే. పిబిఎస్ వంటి వారు నటులకు, గాయకులకు మధ్య ఉండే గాత్రముల సాదృశ్యము ఒక భ్రమ (illusion) అని చెప్పినా, నాయకీ నాయకులు కొందరు గాయకులనే తమకు పాడడానికి ఎంపిక చేసికొన్నారు. ఒక 15 సంవత్సరాలు తెలుగులో ఒక గాయకుడిని మాత్రమే నాయకులు గాత్రదానమునకు ఎంపిక చేసికొనడము జరిగినది, ఒక గాయకి మాత్రమే నాయకురాళ్లకు గాత్రదానము చేయడము జరిగినది. మిగిలిన భాషాచిత్రాలలో కూడా ఈ పరిస్థితియే. హీందీలో కొందరు నాయకురాళ్లు తమ ఒప్పందములో కూడ ఫలానా గాయకి పాడాలని వ్రాసికొన్నారు. బహుశా దక్షిణభాషా చిత్రాలలో కూడ ఇది ఉండి ఉంటుంది. ఈ పరిస్థితిలో కొందరు దెబ్బ తిన్నారు. పిబిఎస్ స్థితి మెరుగే, వారికి కన్నడములో పెద్ద పీట ఉండినది. కాని జిక్కి, జమునారాణి, ఈశ్వరి, బెంగళూరు లతా, సుమిత్ర మున్నగువారు ప్రధాన నటులకు పాడలేకపోయారు. ఇప్పుడు కూడ ఈశ్వరి నాయకికి తరచుగా పాడి ఉంటే ఎలాగుండేదో అని నేను ఊహిస్తుంటాను. కనీసము వీరందరు చిత్రాలలో పాడారు. మంచి శారీరము ఉండి అవకాశము లేకుండా ఎందరు పాడలేకపోయారో అన్నది కూడ గమనార్హమే. విధేయుడు – మోహన
నేను కథ కుదించి చెప్పడంలో పొరపాటున వొదిలేశాను, కాని రాముడు ప్రత్యక్షమై ” నీ భక్తికి మెచ్చితి. మచ్చరితంబు భవ్యంబగు కావ్యంబుగా నొనరింపుమని యానతిచ్చి చనియె.” అని రఘునాథ నాయకుడు రాసిన వాల్మీకి చరిత్రము లో వుంది. నావ్యాసాన్ని సూక్ష్మదృష్టితో చదివినందుకు తః తః గారికి కృతజ్ఞతలు. — నారా
తఃతః గారు,
గుర్వంతమైనా కావచ్చును, లఘ్వంతమైనా కావచ్చును, ఏ పేరితోనైనా సార్థకనామవృత్తమును కల్పించవచ్చును. కాని లాక్షణికులు 20వ శతాబ్దపు మధ్యకాలము వఱకు సుమారు 1500 వృత్తములను మాత్రమే సృష్టించి యున్నారు. సంస్కృత ఛందస్సులో లఘ్వంతముగా పేర్కొనబడిన వృత్తములను వ్రేళ్లపైన లెక్కించవచ్చును. దీనికి కారణము సంస్కృత ఛందస్సులో పాదాంతములో విరామయతి ఉంటుంది. అందువలన చివరి అక్షరము గురుతుల్యమే. అందుకే గురువున్న చోటులో కూడ లఘువును వాడుతారు. ఉదాహరణకు వసంతతిలకవృత్తములో శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ / పూగద్రుమాది సుమనోహర పాళికానాం … ఇందులో నారికేళ లోని ళ లఘువు, కాని అక్కడ గురువు స్థానమును ఆక్రమించుకొన్నది (తరువాతి పాదమునందు నాం వలె). తెలుగు ఛందస్సులో కూడ ఉపజాతులైన సీసము, ఆటవెలది, తేటగీతి, జాతి యయిన ద్విపదలలో పాదాంతములోని అక్షరము లఘువే. సామాన్యముగా ఉపజాతులలో అన్ని పాదములు స్వతంత్రముగా నిలిచి ఉంటాయి. ద్విపదలలో ఇది తప్పని సరి నియమము. అంటే పాదాంతములో ఒక విరామయతి ఉంటుంది. అందువలన ఇవి నా ఉద్దేశములో గురుతుల్యమే.
తెలుగులో సామాన్యముగా లాక్షణికులు గుర్వక్షరముపైన యతి నుంచుతారు. ఇది యెల్లప్పుడు సరి కాదని నేననుకొంటాను. ఉదాహరణకు తోటక వృత్తములో (నాలుగు స-గణములు), తొమ్మిదవ అక్షరము యతి. కాని పాదములో నాలుగు చతుర్మాత్రలు ఉన్నాయి, అవి రెండు రెండుగా విఱిగితే శ్రవణసుభగముగా నుంటుంది. సంస్కృతఛందస్సులో నాకు తెలిసి ఒక సార్థకనామవృత్తము మాత్రమే ఉన్నది, దాని పేరు న-ర. పద్యాలు పఠనీయములు మాత్రమే కావు, వాటిని పాడుకోవాలి కూడ. అందువలన నేను సార్థకనామవృత్తములను సృష్టించినప్పుడు అవి మాత్రాగణములుగా విఱుగుతాయో లేదో అనే విషయముపైన దృష్టి నుంచుతాను. అటువంటి వృత్తములకే నేను ఉదాహరణలను ఇస్తాను. ఈ ఉపోద్ఘాతముతో సామజవరగమనను పరిశీలిస్తే, దాని స్వరూపము ఇలాగుంటుంది –
స-స-మ-జ-వ-ర-గ-మ-న అనగా IIU IIU UUU IUI IU UIU U UUU III. ఈ అమరికను ఆఱు మాత్రలుగా విడదీసి వ్రాసినప్పుడు దీనికి సంగీతసౌలభ్యము లభిస్తుంది. ఆ అమరిక IIUII UUU UIUI IUUI UUU UUIII, ఈ అమరికతో యతి స్థానము 9, 17 అక్షరాలతో చెల్లుతుంది. సామజవరగమనవృత్తమునకు నా ఉదాహరణ –
సామజవరగమన – స స మ జ య య మ న, యతి (1, 9, 17)
24 సంకృతి 14719516
పిబిఎస్ గారికి శ్రీమతి సుశీల తన ట్రస్ట్ తరఫున Lifetime Achievement Award రెండేళ్లకు ముందు బహూకరించారు. ఈ నెల మొదటి వారములో SPB బెంగళూరులో ఒక సన్మానాన్ని ఏర్పాటు చేశారు, కాని ఆ పురస్కారమును పిబిఎస్ అందుకొనటానికి విధి అడ్డు పడినది. తోటి గాయకులు వారిని గురించి తమ హృదయపు లోతులనుండి వివరముగా హిందూ పత్రికలో ఇచ్చిన సందేశములను, అదే విధముగా ఇండియాగ్లిట్జ్ లోని ఈ రెండు ( 1, 2) పేజీలను చదవండి, కొన్ని కొత్త విషయాలను తెలిసికొంటారు.
మధుర గాయకుడు శ్రీ పి.బి. శ్రీనివాస్ గారిపై చక్కటి వ్యాసం రాశారు. అలాగే పాటల లింకులు ఇచ్చారు బావుంది. ధన్యవాదములు. శ్రమ పడ్డారు. పి.బి గారి పాటలంటే మాకు అభిమానమే. కాని మధ్య మధ్యలో శ్రీ ఘంటసాల గారిని తక్కువ చేస్తూ రాయడం, పి.బి. గారిని ఘంటసాల గారి కంటె ఎక్కువ చేస్తూ రాయడం, పోల్చడం బాగులేదు. ఒకరిని పొగడ డానికి వేరొకరిని విమర్శించనక్కర లేదు.. ఏనుగు విలువను సింహంతో పోలుస్తామా. అవి హీరో అభిమానులైన చౌకబారు మనుషులు చేసే పని. మీలా ఎంతో వున్నత చదువులు చదివిన వాళ్ళు చేయవలసిన వారు కాదు. ఘంటసాల గారు ఆ రోజుల్లో తన సమకాలీన గాయకులైన పి.బి, పిఠాపురం, మాధవపెద్ది వారిని ఎంత ప్రోత్సహించారో అందరికీ తెలుసు. అప్పటి ప్రేక్షకులు, నిర్మాత దర్శకులు, హీరోలు అంతా ఘంటసాల వారి పాటలను ఎంతో గొప్పగా ఆదరించారు, అభిమానించారు. అందుకే ఈనాటికీ ఏనాటికీ తెలుగు వాడు బతికి వున్నంత కాలం ఘంటసాల గారికి ఎదురులేని అభిమానులు వుంటారు.. ఘంటసాల వారి పేరున వున్నన్ని వెబ్ సైట్లు ఏ ఇతర గాయకునికి లేవు..
జరిగిన కథ ఇది!
పిబియెస్ మరణవార్త విని కలత చెందిన అనేకుల్లో ఈ వ్యాసరచయితలు కూడా ఉన్నారు! నేను పిబియెస్ పై ఒక వ్యాసం రాద్దామనుకున్నాను. మధురగాయకుడైన పిబియెస్ జీవితంలో కన్నడ పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక మోహన రావు గారుతో సంప్రదించా! వారు ఎంతో సంతోషముగా ఈ ప్రయత్నాకినికి అంగీకరిస్తూ, మా అందరికీ మిత్రుడైన పరుచూరి శ్రీనివాస్ ని కూడా కలుపుకుంటే బాగుంటుందని సూచించారు. ఎన్నో పాత పాటల వివరాలు, వాటి సేకరణలో నిష్ణాతుడైన శ్రీనివాస్ లేకపోతే ఎలా అని ఆయన్ని కూడా కలుపుకున్నాం. ఇంతలో మురళీధర రావు గారు గురించి మోహనరావు గారు చెసిన సూచన మేరకి వారిని కూడా కలుపుకున్నాం కానీ, వారి రచనే స్వతంత్రంగా నిలబట్టం చేత అది ఒక ప్రత్యేక రచనగా రూపొందింది.
ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, పిబియెస్ యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని ఈమాట పాఠకులకి వీలైనంత ఎక్కువగా ఇవ్వాలన్న తాపత్రయం వల్ల! మోహనరావు గాౠ ఎంతో శ్రమకోర్చి రచన చేసాౠ. నేను పనివత్తిడిలో ఉన్నా! వారాంతరాలలొ కూడా పని చేసే పరిస్థితి నాది. పరుచూరి శ్రీనివాస్ యధాప్రకారం ఆఫీసు పని మీద దేశాలు తిరుగుతూ, వీలున్నప్పుడు మా ఈమైల్స్ చదువుతూ తన వంతు రాతకోతలు పూర్తి చేసారు. ఈ హడావిడిలో కొన్ని అచ్చుతప్పులు కూడా జరిగాయి.
ఈ మొత్తం తీసికెళ్ళి ఈమాట సంపాదకుడు మాధవ్ మాచవరం చేతిలో పెట్టీ “మీరు చూసుకోండి” అన్నాం!
ఆయన కష్టపడి పాటలకి, లింకులు, ఎం. పి 3 ఫార్మాట్‌లో మార్చటలు, టైపోలు దిద్దటాలు. వాక్య నిర్మాణాలు సరిగా ఉన్నవో లేదో చూసుకోటాలు జరిగాయి.
తెలుగులో “గ్రంధవిస్తరభీతి” అన్న పదం ఒకటి ఉంది. చదువరలకి ఎంతో చెప్పాలనే తాపత్రయంలో ఎంతో రాస్తాం! అప్పుడప్పుడు అది విసుగుకలిగించే ప్రమాదముంది. నేను 2, 3 పాటలకి సాహిత్యం కూడా ఇచ్చాను. అవి కత్తిరింపులకి గురి అయ్యాయి. ఆ పాటల సాహిత్యం ఇక్కడ ఇస్తున్నా!
*************
అతడు) మనసు మనసు కలిసే వేళా
మౌనమేలనే ఓ చెలియా
ఆమె) కలలు నిలిచి పలికే వేళా
(పలుక లేనురా చెలికాడా)2
1) ఈ వ్యాసము వ్రాయాలని ఏప్రిల్ 16, 17 తేదీలలో మేము తీర్మానించాము. సుమారు పది రోజులలో వ్యాసమంతటిని వ్రాసినాము. లక్ష్మన్నగారు, శ్రీనివాస్ గారు తెలుగు చిత్రగీతాల గురించి, శ్రీనివాస్ గారు అరుదైన లలితగీతాల, చిత్ర గీతాల గురించి వ్రాసినారు. నేను తమిళ, కన్నడ చిత్రసీమలలో పిబిఎస్ కృషిని గురించి వ్రాసినాను. నావరకు నాకు గీతముల ఎంపికకోసం, వాటిని గురించి వ్రాయడముకోసం సుమారు ఒక వారము రాత్రనక పగలనక కాలము వెళ్లబుచ్చవలసి వచ్చింది. తరువాత కూడ తప్పులను సరిదిద్దడానికి దీర్ఘకాలమును గడపవలసి వచ్చినది. త్వరగా వ్రాసినందువలన కొన్ని తప్పులు దొరలడము సహజమే. వాటికి నా తరఫున, నా తోటి రచయితల తరఫున క్షమాపణలను అందుకొనవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
2) పాటగురించి చర్చ ఉన్నప్పుడు ఆ పాటను వ్యాసములోనే ఉంచడము జరిగినది. వేరే లంకెకు వెళ్లితే చదవడములో అంతరాయము కలుగుతుందని ఈ ఏర్పాటు. మరి కొన్ని వేళలలో ఇక్కడి లంకెలో ఒక వీణ పలుకో, లేక ఒక గమకమో ఎక్కువగా ఉండి ఉంటుందని అలా చేయడమైనది.
3) తమిళ చిత్రగీతముల వివరాలు –
అత్తిక్కాయ్ కాయ్ కాయ్ – బలే పాండియా
మనిదన్ ఎన్బవన్, మయక్కమా కలక్కమా – శుమై తాంగి
అనుబవం పుదుమై, నాళాం నాళాం తిరునాళాం – కాదలిక్క నేరమిల్లై
ఇంద మండ్రత్తిల్ ఓడి వరుం, పొన్ ఎన్బేన్ – పోలీస్‌కారన మగళ్
నినైప్పదెల్లాం నడందు విట్టాల్ – నెంజిల్ ఓర్ ఆలయం
నిలవే ఎన్నిడం నెరుంగాదే – రాము
నాన్ ఉన్నై శేర్న్ద శెల్వం – కలైక్కోవిల్
కలైక్కోవిల్ పాటను గురించి ఒక మాట, ఈ చిత్రములో బాలమురళి గళముతో, చిట్టిబాబు వీణతో సరిసమానముగా పిబిఎస్ పాడినాడు, ఇక్కడ ఇవ్వబడిన యుగళగీతము నాకు నచ్చిన పిబిఎస్ యుగళగీతాలలో ఒక ముఖ్య స్థానమును ఆక్రమించుకొన్నది. మిగిలిన పాటల వివరాలు వ్యాసములోనే ఉన్నాయి.
4) ఓహిలేశ్వర చిత్రములోని పాటలోని తునకను సంపాదించుటకు చాల ప్రయత్నము చేసిన తరువాత ఇది దొరికినది. ఆ చిత్రములోని పాటలలో ఘంటసాల పాటలకు మాత్రమే లంకెలు ఉన్నాయి. ఒక టివి కార్యక్రమమునుండి దీనిని గ్రహించాను. అందువలన ఆ సంభాషణ అనివార్యము. ఉద్దేశము ఆ పాటను అందించడము కాబట్టి మాటలను మనము భరించాలి.
5) కూడి వాళ్‌న్దాల్ కోడి నణ్మై అనే చిత్రము remake, కాని ఇవ్వబడిన లంకె fusion. ఈ చిత్రమును youtubeలో చూడ వీలగును.
6) తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో పిబిఎస్ వేలకొలది పాటలు పాడారు. అందులో మాకు నచ్చినవి కొన్నిటిని పాఠకులకు పరిచయము చేసినాము. వాటికి లంకెలను ఇచ్చాము. అందులో ప్రతి భాషలో మూడో నాలుగో పాటలు దీర్ఘముగా చర్చించబడినవి. అందులో కొన్నిటికి అదే మెట్టులో అనువాదమును ఇవ్వడానికి ప్రయత్నించాను.
7) జెమినీ గణేశన్, రాజకుమార్ స్వతహాగా గాయకులు, అయినా వాళ్లకు పిబిఎస్ పాడాడు. మనము శ్రోతలు నటుడి, గాయకుడి గాత్రములు సరిపోయాయని అనుకొంటాము. ఇది ఒక ఊహ మాత్రమే అని అంటాడు పిబిఎస్. ఎందుకంటే అదే గణేశన్‌కు ఏ ఎం రాజా పాడాడు. శ్రోతలు ప్రేక్షకులు అది కూడ సరిపోయింది అన్నారు. రాజకుమార్ తరువాతి కాలములో తనకు తానే పాడు కొన్నాడు. చిత్రసీమలో ఎన్నో illusions ఉన్నాయి. అందులో ఈ గాత్రపు పొంతన కూడ ఒకటి అంటాడు పిబిఎస్, అంతే.
కొత్త సంపాదకుని తొలిమాట
జూలై 2004 » సంపాదకీయం
పాఠకలోకానికి స్వాగతం
ఐదు వసంతాలు ఈమాట పత్రికని అద్భుతంగా నడిపిన రామారావు, “కాస్త విశ్రాంతి తీసుకుంటాను, ఎవరైనా ఈమాట నడిపితే బాగుండును,” అని అనంగానే, తగుదునమ్మా అనుకుంటూ నేను ముందుకి దూకాను. ఎప్పుడో ఎక్కడో విన్నాను, దేవతలు తొందరపడి ఏ పనికీ దిగరని, రాక్షసులు సాహసించి ప్రతిపనికీ నిర్భయంగా, దూకుడుగా దిగుతారనీ. కాస్తో కూస్తో ఆ రాక్షస అంశ నాలో ఉండి ఉండాలి.
కానీ ఒక్క పాత భయం. చిన్నప్పుడు ఏలూరులో రెండు సంవత్సరాలు ఒక రాజకీయ వారపత్రిక నడిపాం. ఆ రెండేళ్ళూ పూర్తి అయ్యేటప్పటికి ఏ రాజకీయ పార్టీ లోనూ ఒక్కడంటే ఒక్కడుకూడా కనీసం పలకరించే స్నేహితుడిగానైనా మిగల్లేదు. మూడు దశాబ్దాలక్రితం, అట్లాంటాలో వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో నెలవారీ పత్రిక వచ్చేది. అందులో రాసిన స్నేహితులతో సాహిత్య పరంగా నాకు చాలా పేచీలు వచ్చిన మాట వాస్తవం. సుమారు రెండున్నర దశాబ్దాలక్రితం చికాగోలో తెలుగు సంస్థకి ఒక మాసపత్రిక రెండేళ్ళు నడపడం జరిగింది. ఇప్పటికీ కొంతమందికి నామీద కోపం తగ్గలేదు.
మీరన్న మాటలు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుస్తుంది.
కొన్ని పదవులు శిరసున ధరించే ముళ్ళ కిరీటాలు. గులాబీలు పరచిన కుర్చీలు. విడిచెళ్తున్నప్పుడు హాయిలేని బాధగా వుంటుంది. బాధే కాని, బరువైన హాయీ వుంటుంది.
సంపాదకులుగా మీ అనుభవాలను హాస్యరచనలుగా అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
మీ సంపాదకత్వంలో నా రచనలిక్కడ చోటు చేసుకున్నాయి. అందుకు చాలా కృతజ్ఞతలు.
మేలైన మరిన్ని మంచి రచనల్ను మీ నించి ఆశిస్తూ,
శుభాకాంక్షలతో ..
-ఆర్.దమయంతి.
జంపాల గారు చూపించిన లోపం నిజమైనదే. మొదటి రామాయణాన్ని కావ్య రామాయణం అనడం ద్వారా ఈ లోపాన్ని పరిహరించొచ్చు ననుకుంటాను. ఏమైనా వాల్మీకి రామాయణానికి రెండు రకాల పఠన మార్గాలున్నాయని చెప్పడం నా ఉద్దేశం.
ఇక పోతే కకార అకారాలు క, కకార ఆకారాలుకా — అని చెప్పే పద్ధతీ, కకు దీర్ఘం ఇస్తే కా, కకు కొమ్మిస్తే కు — అని చెప్పే పద్ధతీ, వేరు వేరు కాలాలకి చెందినవని నేను అనడంలో ఒక ఆంతర్యం వుంది. నేను గవర్నమెంట్ బళ్ళో చదువుకోలేదు. ఇంట్లో చదువుకున్నాను. మా ఇంటికీ బడికీ దూరం తక్కువే, కాని కాలం తేడా ఎక్కువ. నేను ఇరవయ్యో శతాబ్దంలోకి కొంచెం ఆలస్యంగా వొచ్చాను. — నారా
ఆంధ్ర ప్రజానీకానికి మధుర గాయకునిగా శ్రీ పి.బి.శ్రీనివాస్ సుపరిచితులు. ఆయనను ‘ ప్రతివాద భయంకర శ్రీనివాసుగా ‘ కొంతమంది మాత్రమే ఎఱుగుదురు. వారి వంశము ప్రతివాద భయంకర వంశముగా ప్రాచుర్యము నొందిన వివరణ ఆసక్తిదాయకముగా నుంది. శ్రీ శ్రీనివాస్ గారు కవి అని, కొన్ని వృత్తాలు సృజించారని తెలిసినా ఇన్ని వివరాలు నాకు తెలియవు. ఒక మహనీయుని ప్రస్తుతించే టప్పుడు మరెంత మందో స్తవనీయులను కూడా స్మరించుకోవడము జరుగుతుంది. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి వ్యాసములో కూడా ఆ సత్ఫలసిద్ధి సమకూడింది.
వ్యాసకర్త శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి విజ్ఞానము, పాండిత్యము , పరిశీలనా పరిశోధన దీక్షలు, ప్రస్ఫుటము. సంస్కృతాంధ్రా భాషలలో కోవిదులైన వారు కవిపుంగవులు. ఇట్టి పండితులను చూస్తూంటే తెలుగు ప్రశస్తికి లోటు లేదని తృప్తి కలుగక మానదు. శ్రీ శ్రీనివాస్ గారికి చక్కని నివాళి నొసిగిన శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి అభినందనలతో బాటు ధన్యవాదములు.
ఉదాహరణకి, రామాయణానికి వాల్మీకి అలాంటి వాడు. ఇదే పుస్తకం భక్తిగ్రంథంగా చదివితే దానికి కర్త ఇంకొక వాల్మీకి అవుతాడు. అంటే కిరాతుడు ఋషిగా తయారయిన వాల్మీకి అవుతాడు. అంటే పుస్తకానికి అర్థం మారితే దానితో పాటు కర్త కూడా మారతాడు. ఈ రకంగా చూస్తే కవిని గురించిన కథ పుస్తకంలో భాగం. ఆ కథ కర్తృత్వంతో పాటు ఆ పుస్తకానికి వుండవలసిన స్థాయిని, ఆ పుస్తకాన్ని చదవవలసిన విధానాన్ని కూడా చెప్తుంది.
పైన “రామాయణానికి వాల్మీకి అలాంటి వాడు. ” తరువాత ఉండవలసిన వాక్యం తప్పిపోయినట్లు అనిపిస్తుంది.
తెలుగులో గుణింతం చెప్పేటప్పుడు కకారఅకారాలు క, కకారఆకారాలు కా, కకారఇకారాలు కి, కకారఈకారాలు కీ అని చెప్పేవారు. (రాయడం అలవాటు చెయ్యడానికి, కకు దీర్ఘం ఇస్తే కా, కకు కొమ్మిస్తే కు, కకు గుడిస్తే కి అని చెప్పడం తరవాత కాలంలో
ఈ రెండు పద్ధతులూ వేరు వేరు కాలాలవి అనటానికి ఆధారమేమిటి?
పి బి శ్రీనివాస్ రచనలను చదివే అదృష్టము ఇప్పటివరకు నాకు దొరకలేదు. వారు మురళీధరరావుగారిని ఎలా ప్రశంసించి వ్రాసియుండేవారో అన్న విషయాన్ని ఊహించడము కష్టము. కాని మురళిధరరావుగారికి ఇలా ఒక మురళీవృత్తమును వ్రాసి ఉండేవారో అనే ఒక భావన కలిగినది. దాని ఫలితమే ఈ మురళీ వృత్తము. వరుసగా 16 గురువులు వస్తుంది ప్రతి పాదములో. ఇలాటి దీర్ఘాక్షరాలకు సంస్కృత పదాలు బాగుంటాయి. కాని నా సంస్కృతము దుష్కృతమే అవుతుంది. అందువల్ల నాకు తెలిసినట్లు వ్రాసినాను. తప్పులు ఉంటే నా అజ్ఞానానికి క్షమించాలి. పద్యములో నేకవచనముతో సంబోధించినంత మాత్రాన బహువచనశీలురైన వారిపై బహుళ గౌరవము లేక పోలేదు. ఏల్చూరి మురళీధరరావు గారి యత్నమునకు జోహారుగా మురళీ వృత్తము –
సార్థకనామ వృత్తము మురళీ – మ మ మ మ మ ర ల ల ల ల – UUUUUU UUUUUU UUUUIU IIII అనగా మ మ మ మ మ ర న ల గణములతో విరాజిల్లునది మురళీ(లీ)వృత్తము. ప్రతి పాదమునకు 22 అక్షరములు. ఇది సార్థకనామ వృత్తమే కాదు, పాదాంతములో లఘువు ఉండే అరుదైన వృత్తము కూడ.
మురళీవృత్తము – మ మ మ మ మ ర న ల, యతి (1, 7, 13)
22 ఆకృతి 3997697
ఈ వ్యాసం శ్రీనివాస్ గారు కీ.శే. ఐన తర్వాత చదవడం బాధాకరం. ఆయన కన్నా సినిమా సంగీతం గురించి, అందుకు సంబంధించిన ప్రముఖుల గురించి సాధికారంగా ఎవరు రాయగలరు? నాకు కూడా రాజేశ్వరరావు సంగీతదర్శకత్వం అంటే చాలా ఇష్టం. ఆయన ప్రైవేటు రికర్డుల్లో ‘పాట పాడుమా కృష్ణా,’ ‘చల్లగాలిలో,’ ‘ఓహో విభావరీ,’ పాటలు, ‘ఆతోటలోనొకటి ‘ (బాలసరస్వతి) పాటలు చాలా ఇష్టం. కాని రాజేశ్వరరావు గొంతుక మరీ సున్నితంగా ఉండటం చేత హీరోలకు ప్లేబాక్ కి పనికిరాదు. కాని ఆయన genius, prodigy అని చెప్పవచ్చును. ఇంతకీ ‘రసాలూరు స్వరాజ్యేశ్వరరావు’ వంటి తమాషా పదాలు మొదట కాయిన్ చేసిందెవరు? ముళ్ళపూడి రమణ గారా, లేక పీ.బీ. శ్రీనివాస్ గారా? ఇద్దరూ అలాంటి epithetsని ఒకేలాగ వాడారు.
మీ ద్రుక్కోణం బాగుంది. వ్యక్తిగతం, వ్యవస్థలో భాగం, చివరికి వ్యవస్దని శాసించడం; వరుసగా శివ , గాయం, సత్యా ల్లోని పరిణామక్రమం అని నేను అర్ధం చేసుకున్నది . వీటిలో: శివలో ‘భవానిని ఒక్కడిని చంపితే కాదు. వ్యవస్దనే మార్చాలి ‘ అంటాడు కాని అ[ఇ]ప్పటి తెలుగు సినిమాల లానే విలన్ అంతంతొ ముగుస్తుంది. (అలజడి, తమ్మారెడ్డిగారిది చూడండి వీలైతే). ఇక గాయం మనిరత్నం కథ అని మరువకూడదు. గ్యాంగ్ స్టార్ trilogy; సత్య, కంపెని మరియు ఢీ [god father movie మర్వద్దు].
DR.K. SRINIVASARAO
ps; వర్మ నాకు చాల నచ్చే దర్శకులు ఎందుకంటే… మిమ్మ్మల్ని కలిసినపుడు చెపుతాను. [మిమ్మలని కలవాలంటే….?]
సుమతి శతకం కాలాన్ని గురించి, రచయితను గురించి, అందులోని సమాజాన్ని గురించి ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎక్కువగా ఊహలే ఆధారంగా ఉన్నాయి.
నా అభిప్రాయాలు ఇవి:
1. పుస్తకాల పేర్లు సంబోధనను బట్టి. రావు. రచయితనిబట్టి, ఉద్దేశించిన వారినిబట్టి (అది ఆత్మసంబోధన కావచ్చు) వస్తాయి.
2. సుమతి శతకం భీమనదీ కాదు, బద్దెనదీ కాదు, సుమతి అనే జైన మునిది (నా అభిప్రాయం) అందువల్ల అది సుమతి శతకమే.
3. నాకు సంస్కృత సాహిత్య పరిచయం ఉంది కాని త: త: గారికున్నంత వ్యాకరణ పాండిత్యం లేదు. అందువల్ల. ఆ విషయాలను పొడిగించను.
4. నన్నెచోడుడు ఆధునికుడనేది అబద్ధం. మానవల్లి వారే రాశారన్నది దురుద్దేశపూరితమైన ఆపాదన. మానవల్లికంటే ముందే కందుకూరివారు తంజావూరులో ఆ ప్రతిని చూశారు. తెలుగు వారికి 9వ శతాబ్దం లోనే పంప ప్రబంధం రాశాడని తెలీక నన్నెచోడుణ్ణి తర్వాతి కాలానికి నెట్టివేశారు. నేలటూరి వెంకటరమణయ్య గారిలాంటి గొప్ప చరిత్రకారులే నన్నెచోడుడు 10వ శతాబ్దివాడన్నారు. నాదీ అదే అభిప్రాయం.
నా అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని నా ఉద్దేశం కాదు.
రాళ్ళపల్లి సుందరం
కధా రచయితకి ధన్యవాదాలు కధ చదువుతున్నప్పుడు నిజంగా సమాజంలో అందరిలాగే నాకూ అనిపించింది కాని చివరికి వచ్చే టప్పటికి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. పల్లెల్లో ఎన్నో కుటుంబాల చరిత్రలు ఈ రీతి గానె వుంటాయి. కుటుంబం గడవని స్థితి, తల్లి తండ్రి ఎవరి దారి వారిది అన్నట్టు పిల్లల్ని గాలికి వదిలేయడం సర్వ సాధారణం. అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు రచయిత. జోహార్.
కధ రంగనాయకమ్మ గారి స్టైల్లో వుంది అన్నాను అంటే చిన్న కారణానికి కూడా బయటికి వచ్చేసి స్వతంత్రంగా బతకండీ అని మొన్నీమధ్యే వొక “కళ్ళూ తెరిచిన సీత” అని వొక నిజంగా జరిగేలా చేసిన వొక ఎక్స్పీరియన్స్ మీద ఆంధ్రజ్యోతి లో సీరియల్ వచ్చింది. బోలెడంత మంది అమ్మయిలు మాకు సీత(ఆ సీరియల్లో సీత) ఆదర్శం అన్నట్లు వుత్తరాలు కూడా రాశారు. ఇక్కడ కొత్త మలుపు అని పేరుకి మూలం అయిన సరోజ కొడుకుతో వెళ్ళిపోవడం సీత వెళ్ళి పోవడం లాగా వుంది అని ప్రస్తావించాను. కాని ఈ కధలో సరోజకి కనీసం సీత పాత్ర చేసినంత ఆలోచన కూడా చేసినట్లు అనిపించదు. పైగా మూర్తితో సరోజకి సీతకి భర్త మీద వున్న లాంటి అసంతృప్తి కూడా వున్నట్లు అనిపించదు. మరి అంత విప్లవాత్మకంగా, వెళ్ళిపొయేలా ఆ పాత్ర చిత్రణ జరగలేదు. కవన శర్మ గారు “ఆమె ఇల్లు” అని వొక కధ రాశారు. దాన్లో భార్య రిటైర్ అయ్యాక స్వంత ఇల్లు కొనుక్కుని వెళ్ళి పోతుంది. అప్పుడు ఆమె జవాబులో మనకి కొన్ని సంవత్సరాలుగా ఆమె అనుభవించిన వేదన సంఘర్షణ, ఆయనకి తెలియకుండా ఎంతగా గాయపరిచాడో. (అంటే ఈ కధలో మూర్తి లానే వొక మూస ధోరణి భర్తల స్వభావం, అహంభావం… దాన్ని బోలెడంత మంది ఈ సమాజంలో సమర్ధించేవాళ్ళున్నారు; నేను మూర్తి లేక ఆమె ఇల్లులో భర్తలని సమర్ధించట్లేదు; కాని అలాంటి స్వభావం ఇంకా బోలెడంత మంది అబ్బాయిల్లొ, భర్తల్లొ, కొడుకుల్లో కనిపిస్తుంది. అది “వో.కే అని ఎంత మంది అనుకుంటున్నారొ చూస్తుంటే ఆశ్చర్యంగా అసహనంగా అనిపిస్తుంది.) సమాజంలో బోలెడు భర్తలు వులిక్కిపడి తమని తాము చూసుకునేలా రాశారు.
కధ కొంచెం రంగనాయకమ్మ గారి స్టైల్ లో వుంది. అమ్మానాన్నల మధ్య భార్య భర్తలుగా వున్న సంబంధం సరిగ్గ తెలియట్లేదు. భర్త ఈ వొక్క సారి మాత్రమే అమ్మ చెల్లిని పిలిపించాడా ఇలా ఇంతకు ముందు కూడా చేశాడా? సామాన్యంగా భర్త భార్యలలో వొకళ్ళు తన వారిని పిలిపించుకుంటే సంప్రదిస్తే రెండో వాళ్ళు ముందు లేక పోయినా అప్పుడు పిలుచుకుంటారు. ఇది సామాన్యంగా కనిపించేది జరిగేది ఎందుకంటే బయటి వాళ్ళకి ఎప్పుడు తమ అబ్బాయి అమ్మయినే సమర్ధించాలనుకుంటారు. అలా అనుకుంటారనే ధైర్యంతోనే మోరల్ సపొర్ట్ కోసం బయటి వాళ్ళని రప్పించుకుంటారు లేక పోతే సరోజ వెలిబుచ్చినట్లు తమ ముగ్గురు తేల్చుకోవాలనే అనుకోవాలి.
కొంచెం పోపులర్ కధల ధొరణి కనిపిస్తుంది. అంటే బొమ్మరిల్లులో సిద్దు లాంటి పాత్ర, హాపీడేస్ సినిమా లాగా అన్న మాట. సరొజ అత్త గారిని ఆడపడుచు గురించి “కట్టెలను ఎగదోసి నిప్పును ఇంకాస్త రాజుకునేటట్లు చేశారు” అని అనుకున్నట్లు మరి తను చేసింది ఏమిటి? భర్త నాకు ఇష్టం లేదు అన్నప్పుడు తను కొడుకు కనీసం కొన్ని రోజులు తండ్రి ఈగొ తగ్గి మనసు మారుతుందేమో అని ఎందుకు చూడలేదు? ఎలాగు ఆ కొడుకు అప్పుడే చెప్పాలనుకోలేదు అంటే అంత తక్కువ వ్యవధిలో చేసుకోవాల్సిన అగత్యం ఏమి కనిపించట్లేదు. కభి ఖుషి కభి గం అని వొక సినిమాలొ ఇలానే చూపించారు. కనీసం అక్కడ వొక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అలా ఏమీ కనిపించట్లేదు. ఆ భార్య అలా వెళ్ళి పోవాలనుకుంత క్రూరుడా ఆ భర్త? అలా కాని పక్షంలో భార్య భర్త సంభంధం అంత తొందరగా తెంచుకోవాల్సినంత చిన్న విషయం కాదు, తెంచుకోగలిగేంతదీ కాదు. అందుకే ఇది వొక పాపులర్ కధలా వుంది అన్నది వాస్తవికంగా లేదు.
ప్రసాద్ గారు అన్ని కధల లోనూ కొంచెం ఎక్కువ ఆవేశపడుతున్నారేమో.
“సంవత్సరం పైగా ప్రేమించినవాడికి ఇంట్లో ముందుగా చెప్పాలన్న సంస్కారం ఉండదు.” ఇక్కడ “సంస్కారం” పదం పక్కన పెడితే నిజంగానే కనీసం చూచాయగానయినా తన అభిప్రాయం వ్యక్తం చేసాడా? అసలు సామాన్యంగా ముందే కొంచెం తమషాకి అన్నట్లు ఇలాంటి విషాయాలు చర్చకి వస్తాయి. వాటిల్లొంచి వీడు ఇలా చేసేవాడే, అలా చేస్తాడని అస్సలు అనుకోలేదు, ఇలా అభిప్రాయ పడుతుంటాము. అలాటిది ఆ ఇంట్లో ఎప్పుడు జరగలేదా? కనీసం తల్లి తండ్రి ఇష్టాలు అభిప్రాయాలు ముందే అంచనా వుంటుంది కదా. అందుకయినా కొంచం సూచించచ్చు కదా? ఈ రోజుల్లొ కూడా గౌరవం కులం అంటూ మనుషుల్ని చంపేసే ఆచారాలు, వాటికి వొప్పుదలలు ఇచ్చే చుట్టు పక్కల మనుషులు వున్న నేపధ్యం లో స్నేహంగా ఇష్టంగా పంచుకోక పోయినా ఎక్కడే కొంచెం సూచనగా అయినా చెప్పాలి. లేదా అది మోసం కింద వస్తుంది. ప్రసాద్ గారికి ఇంకో కధలో తల్లి మీద తండ్రి మీద బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తించినవాళ్ళ మీద చాలా కఠినంగా “జాలి చూపించక్కర్లేదు” అన్నారు. మరి ఇక్కడ కొడుకుని సమర్ధిస్తున్నారు? నిజానికి కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో లాగా ఇద్దరు రెండు వైపుల వాళ్ళని వొప్పించటానికి కనీసపు ప్రయత్నం చెయ్యకపొవడం చెయ్యాలి అనుకోక పోవడం, మనం అలౌ చేస్తున్న సామాజిక రుగ్మత.
అసలు అలా అబ్బాయి కాని అమ్మాయి కాని ప్రయత్నించాలి అనుకోకపోతే వాళ్ళ ప్రేమ అసలు శంకించాల్సిన విషయం. ఈ రోజు అమ్మ నాన్న లతొ జరిగింది రేపు వాళ్ళ విషయంలో జరగదని గారంటీ ఏమిటి? సంప్రదాయంగా ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు? సంప్రదాయానికి విలువిచ్చాడు కాబట్టి. మరి అలాంటి మనస్తత్వం వున్నవాడు తండ్రితో అలా ఎలా మాట్లాడ గలిగాడు? తండ్రికి కొడుకుకి తేడా ఏమిటి? అలాటప్పుడు తల్లి కొడుకుని ఎందుకు సమర్ధించాలి? ఇది ఈ రోజు అన్ని సినిమాల్లోను కధల్లొను చూపించేస్తున్నారు + ఇది “తల్లి అంటే ఇలా కొడుకునే సమర్ధించాలి” అనే వొక తప్పు ఆలోచనని మనుషుల్లో పెరిగేలా చేస్తొంది. నాలాంటి సామాన్యురాలికే కళ్ళు మనసు తెరుచుకుంటే ఈ ద్వంద ప్రవృత్తి అర్ధం అయిపోతూ వుంటుంది. అసలు చాలా సార్లు ఇద్దరికీ ఇష్టం వుండదు కాని అలా జరగడానికి కారణం నువ్వంటే నువ్వు అని ఇద్దరు ఇద్దరిని దూషించుకోని పోట్లాడుకుంటరు.
కధ పాజిటివ్ గా కనిపిస్తున్న, అసంబద్ధం అయిన పాపులర్ కధ. ముందు చెప్పినట్లు హాపీడేస్ సినిమా లాంటి తప్పు ఆలోచనలని చొచ్చుకుపోయేలా ఆకర్షణీయంగా చెప్పిన కధ. ప్రసాద్ గారి పేద్ద అభిప్రాయం చదివాక నాలాంటి వాళ్ళు వొక్కళ్ళయినా చెప్పకపోతే అదేదో కొంచెం అటు ఇటూ వున్న వాళ్ళని తప్పు మార్గంలోకి వెళ్ళేలా చేస్తుందేమో అని ఇంత రాయడం జరిగింది. కోక్, పెప్సి పిజ్జా లాగా కొబ్బరి నీళ్ళు ఆకర్షణీయంగా నోటికి రుచిగా అనిపించక పోవచ్చు, పెద్ద పెద్ద సినిమా స్టార్లూ క్రికెట్ ఆటగాళ్ళు తాగండీ/నా సీక్రెట్ అంటూ అబద్దపు ఎండొర్స్మెంట్లు లేక పోవచ్చు. కానీ అది వొక మార్పుకి మొదలు పునాది లాంటి అసంగతమైన విషయాలని కాదు అని చెప్పకుండా వుండడం కూడా తప్పే అని…
ఈ కథ చాలా బాగుంది. ఇక కొన్ని పదాలు ఆయా ప్రాంతాల బట్టి ఉన్నా విషయం అర్థం కావాలి కాని అవేమో పెద్ధ తప్పు కాదుగా. కథ నడిపిన తీరు చాల బాగుంది. నాకు కూడ ఈలాంటి student తగిలింది. ఆమెలో మార్పు వచ్చింది. కాని ఆమె సఫలీకృతం కావడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నా నాకు చివరికి happy అనిపించింది. చాలా thanks. ఇలానే మరిన్ని మంచి రచనలు అందించి తెలుగు వారికి ఎంతో ఆనందాన్ని ప్రాచుర్యాన్ని కలిగిస్తారని ఆశిస్తూ మీ కె.ఆర్.కె.రెడ్డి.
ఇక్కడ జరుగుతూన్న చర్చ ఆసక్తి కరంగానే ఉంటోంది కాని నావంటి అర్భకులకి భాష అర్థం అవటం లేదు. ఉదాహరణకి “ఉపస్కారకం” అన్న మాట నా దగ్గర ఉన్న ఏ నిఘంటువులోను కనిపించలేదు. చదివి నేర్చుకోవాలనే ఆసక్తి ఒక పక్క, అర్థం చేసుకోలేకపోవడం అనే అశక్తత మరొక పక్క లాగుతున్నాయి.
మాన్యులు శ్రీ రాళ్ళపల్లి సుందరం గారికి నమస్కారములు. సౌజన్యపూర్ణపూర్ణమైన మీ స్పందనకు ధన్యవాదాలు.
ఈ చర్చను ముగించేముందు మీరు ప్రస్తావించిన రెండు మూడు విషయాలను వివరించాలనిపించింది.
1. “సంస్కృతపదేన పరిమిత మాన్ధ్రపదం కర్మధారయో భవతి” అన్న ఆంధ్రశబ్దచింతామణి నిర్వచనాన్ని పురస్కరించికొని వ్యాకర్తలు “వాడి+మయూఖములు, వేడి+పయోధారలు (?)” వలె వికృతిపదం ఆఱక్షరాల వఱకు పరిమితి గల సంస్కృతపదంతో సమసించి కర్మధారయసమాసం అవుతుందని పేర్కొన్నారు. అయితే, వికృతివివేక అహోబలపండితీయాదులు ఆ సూత్రపరిధిని విస్తరించి “కలికిభుజంగకన్యకలు”, “వేల్పువీరభటవర్గము”, కఱకుదర్భపూరిపఱపులు” వంటి ప్రయోగాలను వ్యవస్థీకరించారు. అవి విరళంగా ప్రయోగింపదగినవే అని సూత్రీకరించారు. నిజానికి కేతనకు ముందే తిక్కనగారు “వేయుమున్నూరుదంతావళములు” వంటివి ప్రయోగించిన సంగతిని కేతన గమనించినట్లు లేదు. కేతన నియమనాన్ని ఆయనకు తర్వాతి వ్యాకర్తలు అంగీకరింపలేదు. తదనుసారం కవులు అవిరళంగా ప్రయోగించుకొన్నారు.
2. “ప్రౌఢవ్యాకర్త వ్యవహారంలో ఉన్న మరికొన్ని పదాలను సూత్రీకరించాడు. అంతమాత్రం చేత అన్ని చోట్లా అలాగే చెయ్యాలని సిద్ధాంతం కాదు.” అన్నప్పటి మీ భావం నాకు స్పష్టంగా బోధపడలేదు. మీ వాక్యం రామరావు, సుబ్బరావు మొదలైన రూపాలు ప్రామాణికాలని, రామారాయాదులు పరిమితంగా ప్రయోక్తవ్యాలని నిర్ణయించటానికి ఉపకరింపదు.
3. మతి సుమతి ఒకటే అని నేననలేదు. దీర్ఘాంతమైన మతి శబ్దం వైదికం ఒకటున్నదని, అది సుమతీ అన్న రూపసాధనకు ఉపస్కారకం కాగలదని సూచించాను. “సుమతి స్త్రీలింగం ఉన్నా సుమతి శతకంలో అది పుల్లింగమే.” అన్న మీ నిర్వచన నాకు బోధపడలేదు. “కుమార శతకం” మగపిల్లలను, “కుమారీ శతకం” ఆడపిల్లలను సంబోధించినట్లు “సుమతి శతకం” “పుల్లింగ”మే అయితే, పురుషులను మాత్రమే సంబోధించే శతకం అవుతుంది. తెలుగులో హ్రస్వాంతమైన “సుమతి” ఉభయలింగార్థకం కనుక “సుమతీ” అన్న సంబోధన వల్ల స్త్రీపురుషులు ఇరువురికీ సమానంగా శ్రోతృత్వం సిద్ధిస్తుంది. ఆ ఉభయలింగసాధన వల్లనే దీర్ఘాంతత్వం లోకంలో రూఢమయింది.
4. “కృష్ణా అని సంబోధన ఉన్నా కృష్ణాశతకం అనం.” అన్న వాక్యానికి ఇంతకు మునుపే సమాధానం చెప్పాను. శ్రీకృష్ణుని సంబోధించిన రచనమయితే, దానిని “కృష్ణ శతకం” అంటారు. ఏ ద్రౌపదినో ఉద్దేశించి వ్రాస్తే “కృష్ణా శతకం” అనే అంటారు.
5. “ఆధ్యక్ష్యం , ఆధ్వర్యవం లాంటి పదాలను గురించి దొరసామి శర్మ గారు, దొణప్ప గారు, తిరుమల రామచంద్ర గారు, రవ్వా శ్రీహరి గారు, శలాక వారు చెప్పినవి, రాసినవి చూచి నేను పొరపాటు పడ్డాను.” అని మీరు వ్రాశారు. “అధ్యక్షత” విషయంలో అసలు పొరబడటానికి, అందులో సందేహానికి అవకాశమే లేదు. “ఆధ్వర్యవము” అన్న రూపాన్ని వారు అభిమానించి తమ రచనలలో వాడుకొని ఉండవచ్చును కాని “ఆధ్వర్యము” అపప్రయోగం అని చెప్పి ఉండరు. “అధ్వర్యు” శబ్దం మీద భావార్థకమైన “అణ్” ప్రత్యయం వచ్చి “ఆధ్వర్యవమ్”, తెలుగులో “ఆధ్వర్యవము” అవుతాయి. “అధ్వరే సాధుః” అన్న అర్థంలో “తత్ర సాధుః” అన్న సూత్రం మూలాన “యత్” ప్రత్యయం వచ్చి “అధ్వర్య” అన్న రూపమూ; దానిమీద భావార్థంలో “తస్యేదమ్” అన్న సూత్రం వల్ల “అణ్” ప్రత్యయం విహితమై “ఆధ్వర్యం” రూపొందుతాయి. రెండు ప్రయోగాలూ సమంజసాలే.
6. “సుమతి శతకం”, “సుమతీ శతకం” రెండూ వాడుకోవచ్చునని నా ఉద్దేశం. “నేను భక్తచింతామణిని రచియించితిని” అని వడ్డాది సుబ్బారాయ కవిగారు (సుబ్బరాయ కవి కాదు!) వ్రాయగా, వారే అచ్చువేయించిన పునర్ముద్రణ పీఠికలో ముద్రాపకులు లోకప్రసిద్ధిని బట్టి “సుబ్బారాయకవిగారు రచించిన భక్తచింతామణీ శతకము” అనే వ్రాశారు. లోకం భక్తచింతామణీ శతకం అనే అంటున్నది. మడిగట్టుకొన్న పండితులెవరో ఒకరిద్దరు మాట్లాడేటప్పుడు కూడా “భక్తచింతామణి శతకం”, “సుమతి శతకం” అంటారేమో కాని నా వంటి సామాన్యులు మాత్రం భక్తచింతామణీ శతకం, సుమతీ శతకం అనే అంటారు. సామాన్య ముద్రాపకులు అనేకపర్యాయాలు బులుసు వెంకటరమణయ్య గారి వంటి పండితులు వ్రాసిన వ్యాఖ్యానాలతోనూ సుమతీ శతకం అనే అచ్చువేశారు.
విషయం విషయాంతరంలోకి ప్రవేశించి శాఖాంతరచంక్రమణానికి దిగింది. “సుమతి శతకం” సుమతీ శతకం” అన్న ప్రయోగాలలో ఏది సరైనది? అన్న చర్చ బహుముఖీనంగానూ, వైయక్తికంగానూ విస్తరిస్తున్నది. అందువల్ల వ్యక్తివిమర్శను పరిహరించి విషయవిమర్శను సుందరంగా చేయాలని నా తహతహ.
ముందుగా శాఖాంతరాల విషయం:
(1) “వాడి మయూఖముల్” అన్నది వైరిసమాసం కాదు. పైగా నన్నయ్యగారు ప్రయోగించినది కనుక నిరాఘాటం. అందువల్ల కవులు యథేచ్ఛగా వాడుకోవచ్చును. “మయూఖవాడి” అన్నట్లయితే, అది వైరిసమాసం. ఇది సమాసవీధిలో అతిప్రాథమికమైన విషయం.
(2) వ్యక్తినామాలైన రామారావు, సుబ్బారావు మొదలైనవి రామరావు, సుబ్బరావు అని మాత్రమే ఉండాలని ఎక్కడా ఏ అనుశాసనమూ లేదు. పైగా, ప్రౌఢవ్యాకర్త “కర్మధారయం బిరుదాద్యుత్తరపదం అయితే అదంతములైన రెండక్షరాల స్త్రీ పుంస సంజ్ఞావాచకం అయిన పూర్వపదం చివరి అక్షరానికి అంతటా దీర్ఘం బహుళంగా వస్తుందని సూత్రీకరించి (సమాస. సూ. 2) రామారావు, సుబ్బారావు పదాలను వ్యవస్థీకరించాడు. నిజానికి దీర్ఘాంతాల ప్రాచుర్యమే భాషలో కనుపిస్తుంది. చిన్నదేవి, ఎఱ్ఱప్రెగ్గడ మొదలైనవే విరళంగా కనబడతాయి.
(3) అధ్యక్ష శబ్దానికి ప్రత్యయాంతవిధుల వల్ల అధ్యక్షత, ఆధ్యక్ష్యం భావార్థకాలుగా ఏర్పడుతాయి. రెండూ సరైనవే. అధ్వర్యు శబ్దం పైని అణ్, య ప్రత్యయాంతవిధుల విధానం వల్ల ఆధ్వర్య, ఆధ్వర్యవ అన్న రెండు రూపాలూ సాధ్యాలే. కనుక ఒకటి సరైనదని, ఒకటి అపకృష్టమని భావించటం వ్యాకరణముఖీనం కాదు.
(4) “సుమతీ శతకం” అంటున్నట్లు భక్తీ శతకం, నీతీ శతకం అంటున్నామా? అన్నది ప్రత్యుత్థాపిత సమస్య. భక్తి, నీతి ఇకారాంత స్త్రీలింగశాబ్దాలు. కనుక భక్తీ, నీతీ అన్న రూపవిధికి ఆస్కారం ఉండదు.
నీతిశాస్త్రం, సామదానాద్యుపాయవిధి అన్న అర్థంలో నీతీ అనే రూపం ఏర్పడదు కనుక నీతీ శతకం ఉండదు. “నీతి” అనే యువతిని సంబోధిస్తూ “నీతీ” అన్న మకుటంతో పద్యశతకాన్ని వ్రాస్తే, అది నీతీ శతకమే అవుతుంది. దేవీ శతకం అన్నట్లు. కనుక వ్యక్తి సంస్కారాన్ని బట్టి, విషయవివేకాన్ని బట్టి రూపభేదాలు, తద్విధులు విధింపబడుతున్నాయి. వీటిని స్థితగతిచింతనగా పరిశీలించటమే కాని ప్రభుసమ్మితంగా నిర్దేశించటం సాధ్యం కాదు.
“సుమతీ శతకం”, “నీతీ శతకం” ఒకతీఱు ఉదాహరణలు కావు. సుమతి ఇకారాంత స్త్రీలింగం. క్తిన్ ప్రత్యయాంతం కావటం వల్ల సుమతీ అనే రూపసిద్ధి ఉండదనుకోవటం సహజమే కానీ శతపథ బ్రాహ్మణంలో “మతీ” శబ్దంకూడా ఉన్నది. ఆ ప్రకారం సుమతీ సుష్ఠుప్రయుక్తమే కాగలదు.
సుమతీ శతకం ఏ పాఠకలోకంలోకి వ్యాపించిందో, ఆ పాఠకులలో అధికసంఖ్యాకులు సుమతీ శతకం అనే అంటున్నారు. అందువల్ల అది ప్రసిద్ధమైంది. చదువుకొన్నవారిలో కొద్దిమంది మాత్రమే సుమతి శతకం అంటున్నారు. అంత మాత్రాన అది ప్రమాణం కాదు.
అంతే కాదు. ఇకారాంతాలైన ఇతర శతకాల పేర్లను చూడండి. భక్తచింతామణీ శతకం, ఆర్తరక్షామణీ శతకం ఆ విధంగానే వ్యాప్తమై ఉన్నాయి. మణి శబ్దానికి ఈకారాంత రూపం ఉన్నప్పటికీ అది ఇక్కడ అన్వయింపదు. చింతామణి శబ్దం “మణి” అన్న అర్థంలో “చింతామణీ” అని ఏర్పడదు. అయినా, భక్తచింతామణీ శతకం అనే అంటున్నాము. చింతామణీ మంత్రమైనప్పుడు మాత్రమే దీర్ఘాంతం ఉన్నది. అది ఇక్కడ ఉద్దేశించిన అర్థం కాదు. ముక్తావళీ శతకం కూడా ఇటువంటిదే.
సుమతీ శతకం తెలుగులో తప్పు కాదు. ఇంకా వివరణ కావలసివస్తే, అహోబలపండితీయంలో “న నామ్ని” అన్న సూత్రం వృత్తిని చూడండి.
తఃతః గారూ దయచేసి మన్నించండి. మీరు అలా అన్నారని కాదు, ఏవైనా పొరపాట్లు దొర్లినప్పుడు మనం సంతోషించాలా అన్నదే నా మథన. దీన్ని పొడిగించటమే నాకు బాధగా ఉంది. ఇతర భాషలనుండి మనం తీసుకొనేటప్పుడు ఆ మర్యాదల్ని పాటించాలి. కాని మనం పాటించం. ప్రవహినీ దేశ్యా అని ఏనాడో ఆంధ్రశబ్దచింతామణికారుడు చెప్పాడు. రూఢిలో స్థిరపడిన ఎన్నో పొరపాట్లని మనం అంగీకరించి వాడుతున్నాం. కాని అలా వాడటంలో కూడా ఒక క్రమం ఉంటుంది. ఫలము అనేదాన్ని ఫలం అంటున్నాం. అది వ్యవహారంలో అన్నిచోట్లా వస్తోంది. సుమతీ శతకం అన్నట్లు భక్తీ శతకం, నీతీ శతకం అంటున్నామా?
రామారావు, సుబ్బారావు మొదలైనవి రామరావు, సుబ్బరావు అనే ఉండాలి. కానీ దాన్ని ఒప్పుకొని అన్నిచోట్లా అలాగే వాడుతున్నాము. అధ్యక్షత అన్నదాన్ని ఆధ్యక్ష్యం అనీ అధ్వర్యం అన్నదాన్ని ఆధ్వర్యవం అనీ అనాలి. కాని ఇలాంటివి వాడుకలోకి వచ్చాయి, అది కేవలం ఒక్క చోట కాదు, కాని సుమతీ శతకం లాగా పుల్లింగాలకన్నిటికీ సమాసంలో మనం దీర్ఘం వాడటం లేదు. మిమ్మల్ని విసిగించి ఉంటే మన్నించండి.
నావి రెండు మాటలు.
ఇంత దీర్ఘంగా ఈ వ్యాసాన్ని చర్చించిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మీరు లేవదీసిన ప్రశ్నలకి నేను రాయబోయే వ్యాసంలో సమాధానాలు ప్రస్తావిద్దామని అనుకుంటున్నాను, అంచేత క్లుప్తంగా ఒకటి రెండు వివరణలు మాత్రం ఇస్తాను.
“ఈ వ్యాసంలో నారాయణరావుగారు, ఈ శతకం మౌఖిక సంప్రదాయంలో పుట్టి క్రమేపి లిఖిత స్వరూపం తీసుకుందని భావించినట్టుగా అనిపిస్తోంది.” అన్నారు కామేశ్వర రావు గారు.
ఇలాటి భావం కలిగించే మాటలు ఎక్కడ అన్నాను చెప్మా!
మనకి కనిపిస్తున్న సుమతీ శతకం పద్యాలలో రెండు రకాల శైలులు ఉన్నాయి, అందులో ఒకటి లిఖిత శైలి అనీ రెండోది మౌఖిక శైలి అనీ అంటూ ఇంగ్లీషులో రాసిన వ్యాసంలోదాన్ని oralized శైలి అన్నాను.
లిఖిత శైలిలో వున్న పద్యాలు మౌఖిక శైలి లోకి మారిన ఆచూకీలు కొన్ని చూపించాను.
ఇక పోతే ఈ రెండు రకాల శైలుల్లో వున్న పద్యాలు ఇద్దరు కర్తలకి ఆపాదించబడ్డాయని అన్నాను, కాని ఈ శతకాలు ఎవరు “రాశారో” నేను చర్చించలేదు.
ఈ విషయాలు మళ్ళా వివరించడానికి అవకాశం ఇచ్చారు, సంతోషం.
రామారావుగారూ, మీ వ్యాఖ్య నాకు సరిగా అర్థం కాలేదు. ఈ వ్యాసంలో ప్రస్తావించబడిన అంశాలు:
1. “నీతి” పద అర్థ విపరిణామం,
2. సుమతిశతక కాలము గురించిన ఆలోచన,
3. ఛందస్స్వరూపం దృష్ట్యా అచ్చులో లభిస్తున్న ప్రతులను మౌఖిక లిఖిత సంప్రదాయాలకు చెందిన రచనలుగా వర్గీకరించడం.
4. మౌఖిక లిఖిత సంప్రదాయాల్లో సుమతిశతకం చెందిన పరిణామాన్ని గూర్చిన ఆలోచన
5, కర్తృత్వ చర్చ (శతకం ఏ వర్గం నుండి వచ్చింది, బద్దెన, భీమన కర్తలుగా ఎందుకయ్యారు మొదలైనవి)
ఇందులో 1, 3 అంశాలలో నాకు చర్చనీయాంశమేదీ కనిపించలేదు. అందుకే అందులో ప్రతిపాదించిన అంశాలు విలువైనవని అన్నాను. ఇక మిగతా అంశాలు చర్చనీయాంశాలుగా అనిపించాయి కాబట్టి వాటి గురించి పట్టించుకొని చర్చ లేవనెత్తాను.
“నారాయణరావు గారు ఏ ఆలోచనామార్గం మారాలని ప్రతిపాదిస్తున్నారో సరిగ్గా ఆ మార్గాన్నే పట్టినట్టనిపిస్తున్నది.”
సుమతిశతకాన్ని గురించి నారాయణ రావుగారు ప్రతిపాదిస్తున్న ఆలోచనామార్గంలోని సామంజస్య ప్రయోజనాలే కదా అసలు చర్చనీయాంశాలు! తాను ప్రతిపాదిస్తున్న ఆలోచనామార్గానికి, నారాయణ రావుగారు ఈ వ్యాసంలో, సుమతిశతకం ద్వారా కొన్ని సమర్థనలు చేశారు. వాటి గురించే కదా చర్చ. వారి ఆలోచనామార్గాన్ని పూర్తిగా అంగీకరించేస్తే ఇక చర్చేముంది?
“ఇకపోతే, రెండు మాతృకలు ఎలా వచ్చాయి, ఆ రెంటికీ ఏమైనా జన్య జనక సంబంధం ఉన్నదా, వాటి పరిణామ క్రమం ఏమిటి అనే ప్రశ్నలు కుతూహలం కలిగించేవే ఐనా వాటికి సమాధానాలు చెప్పగలిగే సమాచారం అందుబాటులో లేదని ఈ వ్యాసం స్పష్టం చేస్తుంది.”
అంత స్పష్టంగా వ్యాసంలో చెప్పిన చోటు ఎక్కడా నాకు కనిపించలేదు. ఉన్న సమాచారాన్ని బట్టి వాటికి తమ ఆలోచనామార్గంలోనుండి సమాధానాలు వెతికే ప్రయత్నం వ్యాసంలో చేశారు. లేకపోతే వాటి గురించి అంత విసృతంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు కదా! పైగా నారాయణ రావుగారు ప్రస్తావించిన మార్గం సుమతిశతకానికి వర్తించవచ్చా లేదా అన్నదానికి, ఈ జన్యజనక సంబంధం అవసరం అని నేను భావిస్తున్నాను. ఎందుకో నా ముందరి వ్యాఖ్యలో వివరించాను.
“ప్రముఖంగా మౌఖిక మార్గాన ప్రచారమైన ఇలాటి రచనల విషయంలో అలాటి భావాలు అర్థవంతాలు కావని చెప్పటం, అందువల్ల ఆ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుననుకున్నవాళ్లు పప్పులో కాలేశారని చూపటం.”
పూర్తిగా మౌఖిక మార్గానికి చెందిన రచనల గురించి మీరన్నది సమంజసమే. ఉదాహరణకు, చాటువుల మొదలైన వాటి గురించి నారాయణ రావుగారు ఇంతకుముందు ఇలాంటి ప్రతిపాదనలు చేశారు. కానీ యిక్కడ సుమతిశతకం పూర్తిగా ఆ మార్గానికే చెందినదన్న నిర్ధారణ జరగకుండా, దాని గురించి ఎలాంటి విశ్లేషణ సరైనదని ఎలా నిర్ణయిస్తాం? పూర్తిగా లిఖిత సంప్రదాయానికి చెందినదని భావించి, ఆ రీతిలో మాత్రమే దాని గురించి విశ్లేషణ చెయ్యడం సరికాదన్నది ఒప్పుకోవలసిన అంశమే. అయితే దానికి ప్రత్యామ్నాయ విశ్లేషణా మార్గాన్ని (మౌఖికమార్గ రచనలకు నారాయణరావుగారు ప్రతిపాదించినది) ఈ వ్యాసంలో సుమతిశతకానికి కూడా వర్తింపచెయ్యాలని బలంగానే చెప్పారు. అది ఎంతవరకూ సమంజసం అన్నది ఇక్కడ చర్చనీయాంశం.
గాలి మళ్ళింది గురించి Mangu Siiva Ram Prasad గారి అభిప్రాయం:
04/03/2013 6:56 am
వృద్ధాప్యం కొందరికి ఒక వరం, కాని చాలామందికి అది ఒక శాపం. ఒంటరితనం పురుగులా తొలుస్తుంటే మాట్లాడడానికి ధైర్యం చెప్పడానికి తోడు ఒకరుండాలనే భావనని చక్కగా ఈ కవితలో చెప్పారు.
అర్ధబిందుప్రాస విషయమై చర్చింపవలసినది ఏమిటో నాకు అర్థం కాలేదు. 1) అర్ధబిందు (లేదా) ఖండప్రాస 2) పూర్ణబిందు ప్రాస 3) ఈ రెండింటి సాంకర్యమైన ఖండాఖండ ప్రాసల అన్నవి లక్ష్య-లక్షణాలు రెండింటిలోనూ రూఢమై ఉన్నవే. అందులో చర్చనీయాంశమేమీ లేదు.
“చీకటి”, “మూడు” మొదలైన కొన్ని శబ్దాలలో అరసున్న ఉండాలో ఉండకూడదో అన్న విషయమై లాక్షణికులలోనూ, కవులలోనూ, నిఘంటుకర్తలలోనూ ఏకాభిప్రాయం లేదు. కనుక ఈ ప్రాసోదాహరణల మూలాన కవి కావ్య కాలనిర్ణయం సాధ్యం కాదు.
“వీండు”, “మూండు”, “పోండిమి” మొదలైన శబ్దాలలో ఒకప్పుడు పూర్ణబిందువు ఉండి, కాలక్రమేణ అది ఉచ్చారణలో నుంచి తొలగిపోయి ఆ శబ్దాలు “వీడు”, “మూడు”, “పోడిమి” అని పలుకబడిన రోజులలో ఒకనాటి ఆ పూర్ణబిందువుకు స్మారికగా ఎటువంటి ఉచ్చారణమూ లేని అర్ధబిందువు ఉచ్చారణ లేకపోయినా తత్తత్పదపూర్వస్వరూపసంకేతంగా లిఖితరూపాలలో మాత్రం “వీఁడు”, “మూఁడు”, “పోఁడిమి” అని నిలిచిపోయింది. భాషాశాస్త్రవిద్యార్థు లందఱికి ఇది తెలిసిన సంగతే.
అయితే కొందఱు కవులు పూర్ణబిందువు సహజంగా ఉన్న “పండు”, “నిండు”, “రెండు” వంటి పదాలతో ఒకనాటి “వీండు”, “పోండిమి” మొదలైన పదాలను ప్రాసస్థానంలో ప్రయోగించినప్పుడు మాత్రమే ఆ సాంకర్యంతోడి ప్రయోగం కవి కాలనిర్ణయానికి కొంతవఱకు సాధకం కాగలుతుంది. అదీ కొంతవఱకే. కవి తెలిసి తెలిసి కావాలని అటువంటి ప్రయోగం చేసి ఉంటే మనము దానిని బట్టి కవి కాలనిర్ణయం చేయలేము.
నన్నెచోడుడు ఆధునికుడా? నిజంగానే పూర్వుడా? అన్న సమస్య ఇదమిత్థంగా తేలలేదు. ఇరవయ్యవ శతాబ్దికంటె పూర్వుడు కాడని నాకూ అనిపిస్తుంటుంది. అటువంటప్పుడు వివాదాస్పదుడైన ఆ కవి ప్రయోగాలు కాలనిర్ణయానికి నిర్వివాదంగా పనికిరావు. నన్నెచోడ – బద్దెనల పౌర్వికతను నిర్ధారించటానికి ప్రామాణికాలైన సాధనాలు లేవు. బద్దెన “నీతిశాస్త్రముక్తావళి” సుమతి శతకం కాలనిర్ణయానికి ఉపయోగిస్తుందనుకోవటం పొరపాటు.
యతి విషయం కొంతవఱకు కాలనిర్ణయానికి పనికివస్తుంది. అది కూడా “నేను నన్నయగారి యతి పద్ధతిలోనే వ్రాస్తాను” అని ఒక ఆధునిక కవి వ్రాసి ఉంటే – అది కాలనిర్ణయానికి ఉపకరింపదు.
పార్యంతికంగా చెప్పదలచినది ఏమంటే – యతి-ప్రాసలు కొంత వఱకు భాషాపరిణామ పరిశీలనకు, సంఖ్యానకానికి దోహదం చేస్తాయి. వివాదాస్పదమైన విషయాలలో తథ్యమిథ్యావివేచనకు, కాలనిర్ణయానికి ఎంత మాత్రమూ పనికిరావు. సుమతి శతకం విషయానికీ ఇది అనువర్తిస్తుంది.
నిజానికి సుమతి శతకం విషయమై దాని ప్రచారవేళాగతంగా మౌఖిక – లిఖిత రూపాలని రెండు అవాంతర శాఖలు అనుశీలనీయంగా ఉండటం; “పేరణము” మొదలైన కొన్ని శబ్దాల అర్థనిర్ణయం ప్రయోగచరిత్రను బట్టి గాక నిఘంటువులను బట్టి చేయటం; వ్యాసముఖ్యోద్దేశం అది కానప్పటికీ శతకం బద్దెన రచనమా? భీమన రచనమా? అది ఒకరి రచనమైతే ఒక వర్గానికి అనుకూలంగా ఉండటం, వేఱొకరి రచనమైతే మఱొక వర్గానికి సహకరించటం; “నీతి” శబ్దార్థ పరిణామచరిత్ర – ఇత్యాదిగా శ్రీ వెల్చేరు నారాయణరావు గారు ప్రతిపాదించి చర్చించిన విషయాలలోని యుక్తాయుక్తాలు – ఈ వ్యాసంలో తప్పక పరిశీలించి నిగ్గుతేల్పవలసిన విషయాలు.
ఆ సమంజసమైన చర్చపై ఈమాట పాఠకులు దృష్టి నిలిపితే విలువైన అంశాలు వెలుగులోకి వస్తాయి.
అర్ధబిందు ప్రాసతో ఉన్న ఈ కందం ఏ శతాబ్దానికి చెందిందంటారు? :-).
ఈ చర్చలలో లేవనెత్తిన భాషాశాస్త్ర సంబంధమైన విషయాల గురించి రెండు ముక్కలు:
1. కామేశ్వరరావు చెప్పినట్టు “సుమతీశతకం” వంటి మాటలలో దీర్ఘం నిజానికి సంస్కృత భాషా ప్రభావం వల్ల వచ్చినదే. భాషాశాస్త్రంలో ఇలాంటి రూపాలను అతిదేశ (analogy) రూపాలు అని అంటారు. అన్యభాషా వ్యాకరణం పూర్తిగా తెలియనప్పుడు కొత్త పదాలను, సమాసాలను తెలిసిన ఇతర పదాల సామ్యం ఆధారంగా నిర్మించే ప్రక్రియకు ఈ పేరు. ఇంకొన్ని ఉదాహరణలు:
“రఘోత్తమ” అని పలకడం తెలుగుదేశంలో చాలాచోట్ల కనిపిస్తుంది. త్యాగరాజ కృతిని “రమించువారెవరురా రఘోత్తమా నిను వినా” అని చాలా పేరుమోసిన గాయకులే పాడారు. రఘోత్తమరెడ్డి, రఘోత్తమరావు అన్న పేర్లుగలవారు ఆంధ్రదేశంలో కోకొల్లలు. అయితే, ‘రఘోత్తమ’ అన్నది కూడా అతిదేశ (analogical) రూపమే. నిజానికి రఘు + ఉత్తమ = రఘూత్తమ (సవర్ణదీర్ఘ సంధి) కావాలి. కానీ, సర్వోత్తమ-, నరోత్తమ- వంటి పదబంధాలకు సామ్యంగా ‘రఘోత్తమ’ అన్న నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు.
ఇటువంటిదే భానోదయం. నిజానికి ఇది భాను + ఉదయం = భానూదయం కావాలి. కానీ, చంద్రోదయం, సూర్యోదయం వంటి పదాల సామ్యంతో ‘భానోదయం’ అని పలుకడం కద్దు.
2. “-అక” “-అకుండా” ప్రత్యాయాల వాడుక గురించి నారాయణరావు గారు ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. భాషాపరిణామ దశలలో ఈ రకమైన మార్పు బహుశా మధ్యతెలుగు యుగంలో వచ్చిఉండాలి. అయితే, ద్రావిడ భాషలలో వ్యతిరేక ప్రత్యయం -అ-/-ఆ-. ‘నేను ఆడను’ అన్న వాక్యంలో ఆడను = ఆడు ‘to play’+ -అ- negative affix + -ను ‘ఉత్తమ పురుష ప్రత్యయం’. పూర్వకాలీనత్వాన్ని సూచించే క్త్వార్థక అసమాపక (non-finite) క్రియల్లో మాత్రం వ్యతిరేకార్థంలో -అ- తో పాటు -క- ప్రత్యయం తోడైతుంది. చెప్పక-, చేయక-, విప్పక-, తప్పక- మొదలైనవి ఉదాహరణలు.
మధ్య తెలుగుయుగంలో వాడుకలోకి వచ్చిన ‘చెప్పకుండా-‘ వంటి క్రియాపదాల్ని విభజన చేస్తే ఇలా ఉండవచ్చని నా ఊహ: చెప్పకుండా- = చెప్పు ‘to say’ + -అ- + -క- + -ఉండు- ‘auxiliary verb’+ -ఆ- శత్రర్థక durative aspect’. నారాయణరావుగారు ఇచ్చిన ‘చెప్పకుండా’ ‘చదవకుండా’ ‘పడిపోకుండా’ వంటి పదాల ప్రయోగాలకు ఉదాహరణలుగా ఇచ్చిన వాక్యాలను తుమున్నర్థక (gerund) రూపాలలో రాస్తే ఈ పదాలలో అంతర్లీనంగా ఉన్న -ఉండు- బహిర్గతమౌతుంది.
చెప్పకుండా వెళ్ళిపోయాడు — చెప్పకుండుట తప్పు కదూ!
చదవకుండా మాట్లాడకండి — వ్యాసం పూర్తిగా చదువకుండుట నేరమే కదా!
పడిపోకుండా నిలుస్తుందా — ఎంతో ప్రభుత్వ ధనం వెచ్చించి కట్టిన ఈ వంతెన వర్షాలకు పడిపోకుండుట న్యాయమే కదా!
నా ఊహలో ఏదైనా పొరపాటు కనిపిస్తే, చెప్పకుండా ఉండకండి.
3. నారాయణరావుగారు “ప్రతి పుస్తకానికి చారిత్రకంగా గుర్తించదగిన ఒక కర్త ఉండాలి అనేది ఆధునిక విద్యావంతులకు అలవాటైపోయిన ఒక భావం” అని చెప్పిన తరువాత కూడా ‘సుమతిశతకం రాసింది భీమనా? బద్దెనా?’ అన్న అంశంపై ఇంత సుదీర్ఘమైన చర్చ ఆశ్చర్యాన్నే కలిగించింది. నాకు అర్థమైనంతవరకూ, ఆయన దృష్టిలో సుమతిశతకంగా కొంతకాలంనుండీ రెండు వేర్వేరు పాఠాలు అభివృద్ధి చెందాయని, వాటికి రెండు వేర్వేరు వర్గాలు తమ తమ అవసరాలకనుగుణంగా బద్దెనను, భీమనను గ్రంథకర్తలుగా ఆపాదించారని ఆయన వాదన.
సుమతి శతకం వాగ్వ్యవహారంలో ప్రచారం అయిన పాఠం ఒకటి, లిఖిత పూర్వకంగా ప్రచారమైన పాఠమొకటి రెండు పాఠాలు ఉన్నాయని, సౌలభ్యం కోసం ఒకదానికి వావిళ్ళ సుమతి శతకమని, రెండవ దానికి బ్రౌన్ సుమతి శతకమని పేరు పెట్టి వాటిని పరిశీలించానని మీరు గమనించారు. లౌకికంగా పైకి రావడానికి సాధికారమైన గ్రంథంగా సుమతి శతకం వుండాలని పూనుకున్న కరణాలు తమ పాఠానికి బద్దెన పేరు పెట్టుకున్నారు. వివేకవంతుడైన రాజ్య పరిపాలకుడుగా బద్దెనకు ఉన్న ప్రఖ్యాతి అతను కర్త అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది.
మౌఖిక సంప్రదాయంలో సుమతిశతకానికి భీమనకు గ్రంథకర్తృత్వం ఆపాదించడంపై నారాయణరావు చెప్పిన ఈ కింది వివరణ కూడా సబబుగానే తోస్తున్నా, కామేశ్వరరావు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు నారాయణరావుగారో, ఆయన సిద్ధాంతం పూర్తిగా తెలిసిన వారెరైనా సమాధానాలు ఇస్తే చదవాలని ఉంది.
ఇక పోతే వాగ్వ్యవహారంలో కరణాలకన్నా ఎక్కువ మందిలో పేరు తెచ్చుకున్న సుమతి శతకానికి శాస్త్ర స్థాయి రావాలంటే భీమన్న పేరు పనికొస్తుంది. ఉదాహరణకి అప్పటికి శాస్త్రాలుగా పేరు పొందిన పుస్తకాలన్నీ చారిత్రకంగా ఫలానా అని చెప్పడానికి వీలులేని ఒక గొప్ప వ్యక్తి పేరుతో వున్నవే. మనువు, కౌటిల్యుడు, భరతుడు, వాత్సాయనుడు, వీళ్ళందరు ఋషులనే పేరే కాని వాళ్ళ చారిత్రక వ్యక్తిత్వాలని గురించి మనకేమి తెలియదు. ఆలా తెలియక పోవడం వల్లనే ఆ శాస్త్రాలకి అంత ప్రామాణికత వచ్చింది. భీమన పేరు అలాటిది. శాపానుగ్రహ సమర్థుడైన భీమన వశ్యవాక్కు కాబట్టి అతని పేరు ఈ సుమతి శతకానికి శాస్త్ర స్థాయిని సంపాదించి పెడుతుంది. అతనెప్పుడు పుట్టాడో, ఎన్నాళ్ళు బతికాడో, ఎక్కడ ఉన్నాడో చారిత్రకంగా తెలియక పోవడం, అతనికి అతి మానవమైన శక్తులు ఉండడం ఈ శతకానికి శాస్త్ర స్థాయి రావడానికి అవసరం.
(1) అర్ధబిందు ప్రాసను గురించి చర్చించునపుడు ఒక విషయము గుర్తుంచుకోవాలి. చీకటివంటి పదాలకు నన్నయ, తిక్కనల కాలములో క అక్షరానికి ముందు అరసున్న లేదు, తరువాతి కాలములో చేర్చబడినది. నన్నయభట్టు మాత్రమే సార్ధబిందుప్రాసను తప్పకుండ అనుసరించినాడని విజ్ఞుల అభిప్రాయము. తిక్కన కాలానికి ఇది కొద్దిగా సడలినది. ర,ఱలు ఉండే పదాలవలెనే అర్ధబిందువులు ఉండే పదాలలో కూడ నియమాలు తగ్గినాయి. ట, ప లకు ముందు అరసున్న ఉండే పదాలకు అలా లేని పదాలతో ప్రాస చెల్లుతుందని అనంతుని ఛందములో (ఛందోదర్పణములో) నున్నది. అట్టి పద్యమును సుమతిశతకమునుండి నేను ఉదహరించినాను. ఈ కారణములన వలననే నేను శతక రచయిత తప్పక నన్నయ నన్నెచోడుల తరువాతి వాడని తెలిపాను.
(2) తిక్కనకు 50 సంవత్సరాలు అటో యిటో అనడానికి మరొక కారణము. సుమతిశతకమును భీమకవి వ్రాసినాడాని అనుకొంటే ఈ భీమకవియే భీమనఛందము అని పిలువబడే కవిజనాశ్రయమును కూడ వ్రాసినాడని అనుకొంటే ఈ కవిజనాశ్రయ కాలమును మనము నిర్ణయించాలి. దీనిని నేను వివరముగా నా క్రౌంచపదము అనే వ్యాసములో వ్రాసియున్నాను. తెలుగులో ఉండే క్రౌంచపదము, మంగళమహాశ్రీ వృత్తపు లక్షణాలు నన్నెచోడుని కుమారసంభవపు ప్రభావము వలన వచ్చినవే. కాబట్టి భీమన కవిజనాశ్రయమును వ్రాసియుంటే అది నన్నయ, నన్నెచోడుల తరువాతనే, ముందు కాదు. ఇక పోతే ఎంత తరువాత అన్నది నన్నెచోడుని కాలమును బట్టి ఉంటుంది. నా ఊహలో నన్నెచోడుడు నన్నయ సమకాలికుడు, కాని చాలమంది అతడు నన్నయ తిక్కనల మధ్యకాలములో జీవించాడని అంటారు.
(3) ఇక్కడ మరొక చిక్కు ఏమనగా, సుమతిశతకములో పద్యాలు చాల తక్కువ, అందువలన మనకు తక్కువ దత్తాంశములతో ఎక్కువ ఫలితాలను ఆశించడము వీలు కాదు (ఉదా. నన్నయ వ్రాసిన రెండున్నర మహాభారత పర్వాలలో అరసున్న ప్రాస ఉండే పద్యాలు పదికంటె తక్కువ). నేను ఇక్కడ తెలిపినవి పూర్తిగా ఛందశ్శాస్త్రముపైన ఆధారపడిన నా ఊహలు మాత్రమే, మిగిలిన విషయాలపైన వ్రాయడానికి నాకు అర్హత లేదు.
సుమతిశతక కర్త కాలాన్ని గురించి మోహనరావు గారి ఆలోచన ఆలోచించదగింది. ఐతే, ఆయన వాడిన తర్కం వల్ల అతను నన్నయ, నన్నెచోడుడుల తర్వాతి వాడని చెప్పొచ్చు కాని తిక్కనకి తర్వాతివాడు కాడని చెప్పటం సాధ్యం కాదు కదా! అతను తిక్కన లాటి ప్రయోగాలు చేసినంతమాత్రాన తిక్కనకి సమకాలికుడు కాడు, తిక్కన తర్వాతి వాళ్లు ఇంకెవరూ అలాటి ప్రాసలు పాటించలేదని రుజువు చేస్తే తప్ప. కవిత్రయం ప్రయోగాల్ని ప్రమాణాలుగా తీసుకుని తర్వాతి వాళ్లు చాలామంది వాళ్లు ముగ్గురు చేసిన ప్రాసలన్నిట్నీ అనుసరించారని నేను విన్నది. అది నిజమైతే సుమతిశతకం తిక్కన గారి తర్వాత వచ్చిందని తప్ప ఎప్పుడు వచ్చిందో ఈ ప్రాసల బట్టి చెప్పలేం.
(1) భర్తృహరి సుభాషిత శతకములలోని పద్యాలు ఒకే ఛందస్సునకు చెందినవి కావు. కాని హాలుని గాథాసప్తశతిలోని పద్యాలన్నియు గాథాలక్షణములు కలిగినవి. దీనిని గురించి నేను ఇటీవల చర్చించియున్నాను. కందపద్యమునకు ఆధారము ఈ గాథయే. అందువలన సుమతిశతక కర్త హాలుని ఉదాహరణముగా నెంచుకొని ఒకే ఛందస్సైన కందమును మాత్రమే వాడియుండవచ్చును.
ఈ పద్యములోని ఒక విశేష మేమనగా – ఇందులోని అన్ని పాదములలో ప్రాసాక్షరమునకు ముందు అర్ధబిందువు (అరసున్న) ఉన్నది. ఇలాటి పద్యములు నన్నయ భారతములో కొన్ని ఉన్నవి, ఉదా.
తిక్కన భారతములో ఇట్టి నియమమును పాటించని పద్యములు ఉన్నాయి. నన్నెచోడుడు అర్ధబిందు, పూర్ణబిందు ప్రాసలను కొన్ని చోటులలో సంకరము చేసెను. కావున సుమతిశతక కర్త నన్నయ తఱువాతి వాడనియు, తిక్కనకంటె ముందో లేక అతని సమకాలికుడో అని చెప్పవచ్చును. ఎందుకంటే ట అక్షరముముండు ఉండే అరసున్నను ప్రాససాంకర్యము చేయడము తిక్కన కాలములో అమలులో నుండినది. సుమతిశతకములో అలాటి పద్యము మాటకు ప్రాణము … పద్యములో బోఁటి పదమునకు అరసున్న ఉన్నది, మిగిలిన పదములకు (మాట, కోట, చీటి) అది లేదు.
(3) నన్నయ, నన్నెచోడుడులాటి కవులు బండి ర, గుండు ర లకు ప్రాస సాంకర్యమును చేయలేదు. సుమతిశతకములో ఱ ప్రాస పాటించబడినట్లే తోచుచున్నది. కొన్ని చోటులలో దాని లేమి తరువాతి కవులు పద్యసౌలభ్యమునకై చేసిన మార్పు అని అనుకొంటాను.
పై మూడు కారణములవలన సుమతిశతక కర్త బహుశా తిక్కనకంటె ముందు లేక తిక్కన సమకాలికుడో అయి ఉండవచ్చును.
(4) మన్మథుని భార్య రతిని గురించి చెప్పేటప్పుడు రతీదేవియే సరి. కాని రతికేళికి, ఆనందమునకు దేవి అన్నప్పుడు ఆ పదము రతిదేవి అవుతుంది.
నేను ఇప్పుడు పదకొండవ తరగతి చదువుతున్నాను. పదవ తరగతి వరకు మొదటి భాష తెలుగు అవడం వల్ల ఇలా మాట్లాడగలుగుతున్నాను. నేను షేక్ స్పియర్ రాసిన నాటకాలు కొన్ని చదివాను. కాని మన అల్లసాని పెద్దన గారు మను చరిత్రలో వ్రాసిన ఒక పద్యం గుర్తువచ్చినప్పుదు మా స్నేహితుల కంటే నేను అదృష్టవంతుడిని అని అనిపిస్తుంటుంది. ఆ పద్యం…
“సుమతిశతక”మని అనాలా “సుమతీశతక”మని అనాలా అనే చర్చలోకి నేను దిగదలుచుకోలేదు కాని ఆ శబ్దాల గురించి నాకు తెలిసిన రెండు విషయాలు మాత్రం చెపుతాను. “సుమతీశతకం”, “దాశరథీశతకం” వంటి మాటలలో దీర్ఘం నిజానికి సంస్కృత భాషా ప్రభావం వల్ల వచ్చినదే. సంస్కృతంలో చాలా ఇకారాంత పదాలు స్త్రీలింగాలు. అవి చాలా వరకూ దీర్ఘాంతాలు. అవి సమాసాలలో (తెలుగులోకి వచ్చిన తర్వాత కూడా) దీర్ఘంతోనే ఉంటాయి – పార్వతీపరమేశ్వరులు, ధరణీచక్రము, దేవీభాగవతం – ఇత్యాదిగా. అది అలవాటైపోయి, దీర్ఘాంతాలు కాని ఇకారాంత పదాలను కూడా సమాసాలలో దీర్ఘాంతాలుగా వాడేస్తూ ఉంటాం. సుమతీశతకం, దాశరథీశతకం వంటి పదాలలో దీర్ఘానికి కారణం ఇది తప్పిస్తే, అవి సంబోధనలు అయినందువల్ల కాదు. తః తః గారే యిచ్చిన “భాస్కరశతకం” అన్న ఉదాహరణలో, సంబోధనే అయినా “భాస్కరాశతకం” అని అనం కదా, ఎందుకంటే ఆ పదం దీర్ఘాంతం కాదు కాబట్టి.
అరుదుగా అకారాంత పదాలకి కూడా యీలా దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టెయ్యడం గమనించవచ్చు. అలాంటి దానికి ఒక ఉదాహరణ “ఊహ”. దీని చివర దీర్ఘం లేదు. కాని సమాసం చేసినప్పుడు “ఊహాశక్తి”, “ఊహాగానం” అని చాలామంది వాడుకలోకి వచ్చేసింది. వ్యాకరణ పరంగా చెప్పాలంటే “ఊహశక్తి” “ఊహగానం” అనేవి సరైన పదాలు. “రతీదేవి” అన్నది కూడా ఇలాంటిదే (“రతిదేవి” అన్నదే సరైన పదం), అయితే దీని గురించి కొంత వాదన ఉంది, వ్యాకరణ ప్రకారం రెండూ సరైనవే అని.
తెలుగులో ప్రతి అడ్డమైనవాళ్ళూ అన్ని విషయాల గురించీ పరిశోధన పేరుతో తమ ఊహలు ప్రకటించేస్తారు, అని రామారావుగారు, ఇంత సూటిగా ఘాటుగా కాదు కాని, తనదైన రీతిలో మెత్తమెత్తగా వాత పెట్టిన (పోనీ నాకలా అనిపించిన!) తర్వాత కూడా యీ వ్యాఖ్య రాస్తున్నానంటే అది నా మూర్ఖత్వమూ, ముఖకండూతీ తప్ప మరొకటి కాదు. అంచేత పెద్దలు పెద్దమనసుతో మన్నించెదరు గాక!
ఈ వ్యాసంలో రెండు విషయాలు చాలా విలువైనవిగా నాకు తోచాయి. ఒకటి పద్యశైలీ ఛందోనిర్మాణమూ ఆధారంగా లిఖిత, మౌఖిక సంప్రదాయ లక్షణాలను గుర్తించడం. ఇది మరిన్ని యితర పద్యాల పరిశీలనకు కూడా ఉపయోగపడే పద్ధతి. ముఖ్యంగా, సంక్లిష్టశైలి కనబరిచే పద్యాలు మౌఖిక సంప్రదాయానికి చెందినవి కావని స్పష్టంగా చెప్పే వీలుంది. మరొక విలువైన విషయం, “నీతి” పదానికి ప్రాచీన ఆధునిక కాలాలలో వచ్చిన అర్థవిపరిణామం.
ఇక, సుమతిశతక కర్తృత్వం గురించి మాత్రం చాలా సందేహాలే మిగిలి ఉన్నాయి.
1. సుమతిశతక కాలం గురించి. ఇది పదిహేడవశతాబ్ది కాలంలో పుట్టిందని చెప్పడానికి బలమైన ప్రమాణాలేవీ నాకీ వ్యాసంలో కనిపించలేదు. సుమతిశతకంలో ప్రస్తావించిన కరణాల, కాపుల వ్యవస్థ ఆధారంగానూ, పద్యాల భాష ఆధారంగానూ, మరి కొన్ని విషయాల ద్వారానూ, వంగూరి సుబ్బారావుగారు దీని కాలాన్ని పన్నెండు, పదిహేను శతాబ్దాల మధ్యకాలంగా నిర్ణయించారు (గ్రంథకర్తతో సంబంధం లేకుండా). అతను చేసిన వాదనలో లోపాలేవీ యీ వ్యాసంలో చూపించ లేదు. అంచేత దాన్ని కాదని, ఇది పదిహేడవశతాబ్దిలో పుట్టినదని అనడానికి ఏమిటి కారణం? “పేరణము” అన్న పదమొక్కటే దీనికి ప్రమాణం అనిపిస్తోంది. అయితే, పేరణము అంటే, దర్జీలచే కుట్టబడిన రవికేనా, ముస్లిములు రాక మునుపు వేరే రకమైన ఆచ్ఛాదన ఉండేది కాదా అన్న విషయాల మీద నాకు అనుమానాలున్నాయి. కనీసం శ్రీనాథుని కాలానికే “ఱవికె” ఉందన్నది అతని రచన ద్వారా తెలుస్తోంది. ఈ “పేరణము” పదం పదిహేడవశతాబ్దికే చెందినదని అనుకున్నా, ఆ ఒక్కటీ ఆధారంగా మొత్తం శతకం ఆ కాలానికి చెంది ఉంటుందని నిర్ణయించడం సమంజసం కాదు. అలాగే, “సుమతీ శతకం ఈ వర్గం నుంచి వచ్చిన పుస్తకం అయ్యుండాలి. కరణాలు లౌక్యులు, రాజనీతిజ్ఞులు అయినా కూడా వాళ్ళు బాహాటంగా పేరు కోసం ప్రయత్నించలేదు. ఎప్పుడూ అణకువగా తెర వెనకనుండే కార్య నిర్వహణం చేసే తమ గుణానికి అనుగుణంగా ఈ సుమతీ శతక కర్త తన పేరు రాసుకోలేదు.” – అన్న వాదనలో కూడా పెద్దగా పస కనిపించడం లేదు. కర్త పేరు మకుటంగా కాని, మొదటి చివరి పద్యాలలో కాని ఎక్కడా పేర్కొనకపోవడం చాలా శతకాలకున్న లక్షణమే, సుమతిశతకానికి ప్రత్యేకం కాదు. శ్రీకాళహస్తీశ్వరశతకం, నారాయణశతకం మొదలైనవన్నీ వీటికి ఉదాహరణలే. అంచేత ఇందులో ప్రత్యేకించి కరణాల స్వభావానికి సంబంధమేమీ లేదు.
2. మౌఖిక, లిఖిత సంప్రదాయాలలో సుమతిశతకం గురించి. నారాయణరావుగారన్నట్టు, బ్రౌను పాఠమూ, వావిళ్ళవారి ప్రతి ఆధారంగా, సుమతిశతక పద్యాలు, రెండు సంప్రదాయాలలోనూ కనిపిస్తున్నాయని అంగీకరించడంలో ఎలాంటి విప్రతిపత్తీ లేదు. అయితే, ఇది రెండు రకాలుగా జరిగి ఉండే అవకాశం ఉంది. ఒకటి – మొదట లిఖిత సంప్రదాయంలో రచింపబడిన పద్యాలు కాలక్రమేణా ప్రజల నోళ్ళలో నాని మౌఖిక సంప్రదాయంలోకి రావడం. రెండు – మౌఖిక సంప్రదాయంలో పుట్టిన పద్యాలు క్రమేపీ లిఖిత స్వరూపాన్ని సంతరించుకోవడం. నాకు అర్థమైనంత మేర, మొదటి మార్గంలో కర్త > గ్రంథము > పాఠకుడు అనే క్రమం ఉంటుంది, రెండవదానిలో గ్రంథం ముందుపుట్టి, ఆ తర్వాత దానికి ఒక కర్త ఆపాదింపబడడం జరుగుతుంది. మనకి తెలుగులో ప్రచారంలో ఉన్న చాలా చాటువుల విషయంలో ఈ రెండవ పద్ధతి కనిపిస్తుంది. అయితే సుమతిశతకం ఈ రెండు మార్గాలలోనూ ఏ మార్గాన్ని అనుసరించిందని ఎలా నిర్ణయించడం? ఈ వ్యాసంలో నారాయణరావుగారు, ఈ శతకం మౌఖిక సంప్రదాయంలో పుట్టి క్రమేపి లిఖిత స్వరూపం తీసుకుందని భావించినట్టుగా అనిపిస్తోంది. దీనికి తగినంత బలమైన కారణాలేవీ వ్యాసంలో చెప్పినట్టుగా నాకు కనిపించలేదు. లిఖిత సంప్రదాయంలో ఉన్న ఒక సంక్లిష్టశైలి గల పద్యం, ప్రజల నోళ్ళలో పడి సులభశైలిని సంతరించుకొనే అవకాశమే నాకు ఎక్కువగా ఉందనిపిస్తోంది. మౌఖిక సంప్రదాయంలో పుట్టిన పద్యం యథాతథంగా లిఖిత రూపం పొందేందుకు పెద్దగా అభ్యంతరం ఏముంటుంది? వ్యాకరణపరమైన దోషాలని పరిహరించడం జరగవచ్చు కానీ ఛందస్సు నిర్మాణాన్ని తీరికూర్చుని సంక్లిష్టశైలిలోకి మార్చడమనేది జరుగుతుందని ఊహించడం నాకు కాస్త కష్టంగా ఉంది. అదికూడా ఒకటి రెండు పద్యాలు అలాంటి మార్పులు చెందాయంటే వేరే విషయం కాని, ఈ వ్యాసంలో ప్రస్తావించినదాన్ని బట్టి చూస్తే, ఇలాంటి క్లిష్టబంధం కలిగిన పద్యాలు బ్రౌను పాఠంలో చాలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అవన్నీ కూడా మౌఖిక సంప్రదాయంలోనుంచి మార్పు చెంది లిఖిత సంప్రదాయంలోకి రావడం నాకయితే సాధ్యమనిపించడం లేదు. నా దృష్టిలో, ఈ రెండు రకాల పాఠాలనుండి మనం చెప్పగలిగింది ఏమిటంటే – ఈ శతకం లిఖితసంప్రదాయంలో ఏక కవి కృతమైనవే. శతకంలో ఉన్న పద్యాలన్నిటిలోనూ సులువుగా చదువుకొని గుర్తుంచుకోడానికి వీలైనవే ప్రజాబాహుళ్యంలో ప్రచారమయ్యాయి. అలా కానివి లిఖిత రూపంలోనే ఉండిపోయాయి. ఈ క్రమంలోనే కొన్ని క్లిష్టశైలిలో ఉన్న పద్యాలు రూపురేఖలు మారి సరళరూపాన్ని పొందాయి.
3. బద్దెన, భీమన గురించి. లిఖిత సంప్రదాయంలో సుమతిశతకానికి బద్దెన, మౌఖిక సంప్రదాయంలో భీమన కృతికర్తలయ్యారని ఊహించడానికి, వ్యాసంలో యిచ్చిన వివరణ అంత నమ్మశక్యంగా అనిపించ లేదు. దానికి చెప్పిన కారణాలు కూడా అంత నమ్మదగ్గవిగా కనిపించ లేదు. అసలు తిమ్మకవి ప్రస్తావించిన, అలాగే ఒక సుమతిశతక పద్యంలో ఉన్న “భీమకవి”, “వేములవాడ భీమకవే”నా కాదా అన్నదే పెద్ద అనుమానం. ఇక దాని ఆధారంగా ఆ భీమకవిని మౌఖిక సంప్రదాయంలో సుమతిశతకానికి ఎందుకు కర్తగా సృష్టించారన్న ఊహలు సాగించడం మరీ దూరాన్వయం అనిపించింది. దీనికన్నా, బద్దెనకున్న బిరుదాలలో “భీమ” అన్నది ఒకటి కాబట్టి, ఇక్కడ పేర్కొనబడిన “భీమకవి” అతనే అన్న ఆలోచనే సజావుగా అనిపిస్తోంది నాకు. అలాగే బద్దెన గురించిన ఊహ కూడాను. ఈ వ్యాసం తెలుగు అనువాదంలో దొర్లిన ఒక పొరపాటు, “బద్దెన కర్త అని చెప్పే సుమతీ శతక పద్యం బిగువైన లిఖిత శైలిలో వుండడం,”. బద్దెన కర్త అని చెప్పే పద్యం సుమతిశతక పద్యం కాదు, నీతిశాస్త్రముక్తావళి లోనిది. తాము సృష్టించిన సుమతిశతకానికి బద్దెనను కర్త చెయ్యడం కోసం నీతిశాస్త్రరత్నావళిలో ఈ పద్యాన్ని కరణాలు ప్రక్షిప్తం చేసి ఉంటారా?! ఇక, శైలికి సంబంధించి నారాయణరావుగారు చేసిన పరిశీలనకు విరుద్ధమైన ఉదాహరణ ఒకటి వంగూరి సుబ్బారావుగారు తమ శతక కవుల చరిత్రములో చూపించి ఉన్నారు. దాన్ని నారాయణరావుగారు చూడలేదో, చూస్తే యీ వ్యాసంలో ఎందుకు ప్రస్తావించ లేదో తెలియదు. సుమతిశతకం (వావిళ్ళవారి ప్రతిలో) యీ పద్యం ఉంది:
ఇది ప్రాచీన ప్రతి అనే సుబ్బారావుగారు చెప్పారు. ఇది అచ్చంగా ఆశు సంప్రదాయంలో ఉన్న పద్యమే. అంటే మౌఖిక సంప్రదాయంలో కూడా బద్దెన కృతికర్త అనే ప్రచారం ఉందని దీని బట్టి భావించ వచ్చును కదా?
అసలీ వివరణ అంతా, సుమతిశతకం మౌఖిక సంప్రదాయం నుండి లిఖిత సంప్రదాయానికి వెళ్ళిందన్న విషయంపై ఆధారపడినది. లిఖిత సంప్రదాయంనుండి మౌఖిక సంప్రదాయంలోకి వచ్చినది అనుకుంటే, అది బద్దెన కృతమనీ, బద్దెనకున్న ఒక బిరుదు “భీమ” కాబట్టి కొన్ని చోట్ల దీని కర్త భీమకవిగా పేర్కొనబడినదని భావించడం అన్నిటికన్నా సజావైన ఊహగా నాకు తోస్తోంది.
సుమతి శతకం గురించి విభిన్నమైన అభిప్రాయాలు రావటం బాగుంది.
సుమతీ శతకం అనకూడదని రాస్తే నేనొక పిచ్చివాడినని కొందరు భావించినట్లుంది. పండితులు తప్పు చేస్తే వందమంది దాన్నే అనుకరిస్తారు. రామ శతకం అనటానికి రామా శతకం అనటానికీ భేదం ఉంది. పుల్లింగాన్ని స్త్రీలింగంగా మార్చకూడదు. పండితులు అచ్చువేసిన ఏ పుస్తకం లోను సుమతీ శతకం అని లేదు.
తెలుగులో అచ్చు వేసిన మొదటి వాడు బ్రౌన్ కాదు. 1728 నాటికే తెలుగు ముద్రణ ఉంది. బెంజమిన్ షూల్జ్ తన వ్యాకరణాన్ని అచ్చుకు సిద్ధం చేశాడు. అతను కొన్ని కారణాలవల్ల అచ్చు వెయ్యలేదు కాని తెలుగు అచ్చుకు అప్పటికే అవకాశం ఉంది. దాఖలాల్ని బట్టి తెలుగులో అచ్చయిన మొదటి పుస్తకం శ్రీరాంపూర్ మిషన్ ప్రెస్స్ లో 1813లో అచ్చయిన తెలుగు వ్యాకరణం. కాని అంతకు ముందే తెలుగు పుస్తకాలు అచ్చయ్యాయి. బహుశా షూల్జ్ జర్మనీలోని హాలేలో మొదటి తెలుగు పుస్తకాన్ని అచ్చు వేశాడు.
సుమతి శతకం రాసింది భీమన లేక బద్దెన అనే రెండు అభిప్రాయాలు ఎక్కువగా ఊహలతో కూడినవే. సుమతి అనే జైన కవి రాశాడనే ఊహని ఎందుకు కొట్టిపడెయ్యాలో అర్థం కాదు. లౌకిక శాస్త్రాలను ఎక్కువగా రాసిన వాళ్ళు జైనులు. సుమతి, రత్నశ్రీ లాంటి పేర్లు జైనులవి,బౌద్ధులవి. సుమతి శతకం సుమతులకయితే నీతులు చెప్పాల్సిన పనిలేదు. అది ఆత్మ సంబోధన (వేమనలాగా) అయిఉండాలి లేదా గురువుని సంబోధించి ఉండాలి. శ్రీరాముని పద్యం తర్వాత చేరింది. సుమతి శతకం జైన రచన అనే అవకాశాన్ని కూడా పరిశీలించాలి.
మూలం చదివాక ఇంతకు ముందు నేను వెలిబుచ్చిన తక్కువ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. నిజానికి దీని వాసి మిగిలిన రచనలకి ఏమాత్రం తీసిపోదు. “తెలుగులో కవితావిప్లవాల” నుంచీ నారా లిఖిత – మౌఖిక పరంపరల్లో ప్రచారమైన రచనల గురించి మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తటం, అనిదంపూర్వమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదించటం చేస్తూనే వున్నారు – ఉదాహరణకి చాటువులు, కాటమరాజు కథ, రామాయణాలు, ఇలా ఎన్నో. సుమతిశతకం విషయంలో ఒక ప్రత్యేకమైన సందర్భమూ, మౌఖిక – లిఖిత మార్గాల కలయికా వల్ల దొరుకుతున్న సమాచారం తనింతకు ముందు చేసిన సిద్ధాంతాలకి ఎలా బలం చేకూరుస్తుందో ఈ వ్యాసంలో చూపారని నా భావన.
ఒక రచన మౌఖికంగా లేదా లిఖిత మార్గాన మొదలౌతుంది. లిఖిత రచనలకి కర్తృత్వ విషయంలో సందేహాలు కలగటానికి అవకాశాలు తక్కువ. మౌఖిక రచనలకి కర్తృత్వం అనే భావనే పాశ్చాత్యభావాలకి లొంగదు. మౌఖికంగా మొదలైన రచన కొంతకాలానికి లిఖిత రూపం పొందొచ్చు. అలాగే లిఖితంగా మొదలైన రచన (పూర్తిగా కాకపోయినా కొంత భాగమైనా) మౌఖికంగా మారటం కూడ జరిగింది (లిఖిత రచనల్లోని పద్యాలు చాటు ప్రపంచంలోకి రావటం ఒక ఉదాహరణ). సుమతిశతకం విషయంలో ముందుగా ముద్రితమైన రెండు రకాల ప్రతులు, ఒకటి మౌఖిక మార్గం నుంచి, మరొకటి లిఖిత మార్గం నుంచి వచ్చాయని నారా ఈ వ్యాసంలో నిరూపించారు.
మౌఖిక మార్గం రచనల కర్తృత్వం ఆ రచన ప్రయోజనాన్ని బట్టి, ఆ రచనని తమ సొంతంగా స్వీకరించిన కులాల బట్టి మారుతూ వుంటుందని నారా ఇదివరకే ప్రతిపాదించారు. అది సుమతిశతకం విషయంలో ఎలా నిజమో మరోసారి చూపించారిక్కడ. రామాయణం ఇతిహాసంగా వున్నప్పుడు దాని కర్తగా ఒక ఋషి కావలసొస్తే, అది భక్తి రచన అయాక దాని కర్త దైవప్రేరితుడైన వ్యక్తిగా ఎలా మారాడో, భారత భాగవతాలకి, పురాణాలకి కర్త వ్యాసుడెందుకు అయాడో, ఆ తర్వాత వచ్చిన భక్తి రచనల కర్తలు చాలామంది చుట్టూ అల్లిన కథల్లో నారదాదులు, దేవుళ్లు ఎందుకు కనిపిస్తారో ఈ సిద్ధాంతం స్పష్టంగా వివరిస్తుంది. మౌఖిక సుమతిశతకానికి భీమన, లిఖిత సుమతిశతకానికి బద్దెన, ఎందుకు కర్తలుగా అంగీకరించబడ్డారో ఈ సిద్ధాంతం నిరూపిస్తుంది.
చివరగా ఒక్కమాట. సినిమా పాటలు ప్రస్తుత కాలంలో మౌఖిక మార్గంలో ప్రచారమయే రచనలకి మంచి ఉదాహరణ. ఒక పాట వినటం తోనే దాని కర్త ఎవరో ఎలా తెలుస్తుంది? ఎందుకు ఒకరు రాసిన పాటని మరొకరెవరో రాశారని అనుకోవటం జరుగుతుంది ? ఆలోచించండి. మౌఖిక రచనల గురించిన నారా సిద్ధాంతాలు వీటికీ వర్తిస్తాయి, పాతకాలపు రచనలకే కాదు.
ఈ వ్యాసం లోని సారాశం మరికొంచెం పొడిగించి చూస్తే … [తప్పని సరిగా ఛూడాల్సి ఉంటుంది. ఇది ఒక సిధ్ధాంత వ్యాసం, సాహిత్య విమర్శా గనుకాను కవిని గురించిన చర్చ అతడి కర్తృత్వాన్ని గురించిన మీమాంశ కూడా గనకాను!!] అప్పుడేమౌతుందంటే, రాబోయే మరి కొన్ని పదుల లేదా వందల ఏళ్ళ తరవాత పేరున్న ఒక పుస్తకానికి వారే అసలు రచయిత అని అంటేనో/లేదా అలా ఎవరన్నా అనుకుంటేనో అది నిజమే కానఖ్ఖర లేదని ఒక తప్పనిసరి ఆలోచన/ప్రతిపాదన వస్తోంది. ఈ వ్యాసంలో మాదిరే ఒక బద్దెన/ఒక భీమన పాత్రలోకి రేపు మరొక అసలు కవి నాలాంటి వారే ఎవరైనా ఒకరు కేవలం ఒక కల్పిత వ్యక్తిగా మారే/లేదా మార్చే వీలుందని సుమతీ శతకం మీద రాయబడిన ఈ భాష్యం ప్రకారం అర్ధం అవుతోంది. [నేను ఇంగ్లీషు వ్యాసాన్ని చదివే దీన్ని రాస్తున్నాను].
ఈ వ్యాసం లోని వాదనని అనుసరించి అసలు ఏ కవీ వారి కవిత్వానికి కర్తలు కాగలరా భవిష్యత్తులో? అని సందేహం రాక మానదు. అసలు బద్దెన/భీమన ఏమి, మన నన్నయ్య భట్టు మాత్రం మహాభారత ఆంధ్రీకరణ చేశాడని ఏమిటీ నమ్మకం? అదొక “విశ్వాసం” మాత్రమే కావాలి. ఎందుకంటే అతడి తరువాత కవులు “ఆదికవి” గా ఆయనని స్తుతిచేశారు గనకా?? అంతకు మించి ఆయనని గురించిన వివరాలు మన ముందు ఏమున్నాయీ?? తిక్కన మాత్రం ఎందుకని కల్పితం కాకూడదో?? మనుమ సిధ్ధి ఏమన్నా ఆయనని గురించి శాసనం చెక్కించాడా? లేదే? ఆ పాతవాళ్ళ ఫోటోలా లేవు. వేల తరాలు గడిచిపోయేయి గనక వారికి కుటుంబ వారసులా లేరు. ఇంక మిగిలిన ఆధారాలేమిటీ?? అది అటుంచితే మరి ఇవాళ రాస్తున్న ఈ కవుల సంగతి మాత్రం ఏమిటో?? ఏమిటీ రుజువూ?? అందుకోసం ఈ పుస్తకం నాదేనని “విల్లు” ఏమన్నా రాసి పెట్టుకోవాలా?? ఫొటొ తాలూకు కాలపరిమితి మాత్రం ఏమాత్రం?? కుటుంబపు కాలపరిమితి మాత్రం ఏమాత్రం?? అసలు నేను నేనే అన్న రుజువేదీ??
ఒక కౌటిల్యుడిని ఒక భరతుడినీ కాళిదాసునీ ఎటూ “కల్పితం” చేసేశాం. ఆ విధానం ప్రకారం రేపు ఈ జయప్రభ మాత్రం ఎందుకని కల్పితం కారాదో ఈ వ్యాస కర్త వివరించవలసి ఉంటుంది మరి. ఆయన వాదానికి గనక ఆయన బధ్ధుడైతే!
దాతలెవరన్నా విరాళాలిస్తే నాపేర నేనొక శిలాశాసనాన్ని వేయించుకోవాలి 🙂 దాన్ని తప్పని సరిగా నకళ్ళు తీయించి అన్ని అమెరికన్ యూనివెర్సిటీల్లోనీ నాటించుకోవాలి కూడాను. ఎందుకంటే భవిష్యత్తు లోని అపూర్వ పరిశోధనలకి ఉనికిపట్టులు అవే గనక!!
ఇట్లు,
కల్పితంకానిచ్చగించని వర్తమాన బద్దెనని అయిన నేను.
జయప్రభని.
ముందుగా, ఈ వ్యాసం నారాయణ రావు గారి ఇతర పరిశోధనల స్థాయికి చేరుకోలేదని నా అభిప్రాయం. మరీ నీరసంగా వున్న అనువాదం కూడ ఈ అభిప్రాయం కలగటానికి బాగానే దోహదం చేసిందనిపిస్తున్నది. మూలం చదవకుండా అంటున్న మాట ఇది. మూలం కూడ ఇదే స్థాయిలో వుంటే అనువాదకులకి క్షమాపణలు.
ఇకపోతే, జయప్రభ గారి అభిప్రాయంలో వున్న తర్కం కొంత వింతగా అనిపించి దాని గురించి రెండు మాటలు చెప్పదల్చుకున్నాను. నారా కాని, ఆరుద్ర కాని, మరొకరు గాని చేసేపని ఒక విషయం గురించిన సమాచారాన్ని వాళ్లకి అందుబాటులో వున్నంతవరకు కూలంకషంగా సేకరించి, నిశితంగా పరిశీలించి, వాళ్లు పరిశోధిస్తున్న సమస్యకి ఒక సిద్ధాంతాన్ని తయారుచెయ్యటం. సమర్థుడైన పరిశోధకుడు తన ఎదురుగా వున్న సమాచారాన్నంతటినీ వివరించేగలిగే విధంగా ఆ సిద్ధాంతాన్ని తీర్చిదిద్దుతాడు. కనక ఒకే సమాచారం అందుబాటులో వున్న పరిశోధకులంతా ఒకే సిద్ధాంతాన్ని తయారుచేస్తారనటం లేదా ఒకేరకమైన సిద్ధాంతాన్ని తయారుచేస్తారనటం అతార్కికం. సిద్ధాంతాలు కేవలం ఊహలే అనుకున్నా ఇద్దరు పరిశోధకుల ఊహలు ఒకటే కావు. అలాగే, ఊహ ఐనది ఏదైనా సరే సమానంగా అనుమానాస్పదం అనటం కూడ అతార్కికం.
ఈ వ్యాసంలో గాని, మరో దాన్లో గాని తను చెప్పేది “సత్యం”అని నారా ఎప్పుడూ అన్నారనుకోను, ఒక కొత్తకోణంలో చూస్తున్నట్టో లేక ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నట్టో తప్ప మరెవరికీ తెలియని కొత్త నిత్యసత్యాన్ని కనుక్కున్నానని ఆయన అనుకుంటారని నేననుకోను.
పాశ్చాత్యులకు ముందు గ్రంథసంస్కరణ ఎలా చేసేవారు అనేది ఆసక్తికరమైన ప్రశ్నే. ఐతే పాశ్చాత్యప్రభావం వల్ల వచ్చిన గ్రంథసంస్కరణ పద్ధతుల్లో లోపాల్ని ఎత్తిచూపటానికి అంతకుముందున్న పద్ధతులు విధిగా తెలిసితీరాలనటం సమంజసంగా కనిపించదు. చివరగా, ఒక విషయం గురించిన ఒక వ్యాసం దానికి సంబంధించిన అన్ని విషయాల్నీ స్పృశించి తీరాలని, అలా చెయ్యకపోతే అది లోపభూయిష్టమని ప్రతిపాదిస్తే, ఇక లోపభూయిష్టం కాని పరిశోధన లోకంలో ఉండనే వుండదు కదా !
వలస పాలనే లేకపోతే తెలుగులో అసలు “అచ్చు పుస్తకమే” లేదు. అంతకు ముందు అంటే బ్రౌన్ కి ముందు ఏదో ఒక పధ్ధతిలో అయినా తెలుగులో “పుస్తక పరిష్కరణ” ఉన్నదా, ఉంటే అది ఏ పధ్ధతిలో ఉండేదీ అన్న విషయాన్ని కనీసం ఒక ప్రశ్నగా కూడా ఈ వ్యాసం సంధించదు. అటువంటప్పుడు ఇంక “ప్రభావం” అన్న ఊహకి అసలు ఆస్కారం ఏదీ? ఆధునిక పధ్ధతులు అన్నీ ఆ వలస పాలకుల ప్రభావమే! ఈ వ్యాసం ప్రతిపాదించే అనేకానేక ఊహలతో సహా! అంటే మౌఖిక సుమతీ శతకం, లిఖిత సుమతీ శతకం వగైరా మాటలతో సహా! ఇంక పరిష్కరణ అన్నది పాశ్చాత్యుల పధ్ధతి అని మనం అనుకుంటే- తత్పూర్వపు తాటి ఆకుల ప్రతుల లేఖన విధానాల ని గురించిన “మనదైన” ఒక పధ్ధతి, దానిని గురించిన ఒక సమాచారం భిన్నమైనది ఏమన్నా మరొకటి మనముందు ఉన్నదా అన్నది మరో ప్రశ్న. అందువలన ఈ వలస పాలనకి ముందు మనదేశం లోని అమలులో ఉన్న ఆ “ఆధునికత” పూర్వాపరాలని గురించిన ఒక స్పస్టమైన ఊహని వ్యాసకర్త పాఠకుల ముందు ఉంచవలసి ఉంటుంది. కానీ ఆ దిశగా ఒక్క వాక్యం కూడా ఈ వ్యాసంలో లేదు. అయితే ఈ వ్యాసం చూసేక ఆరుద్రది ఒక లాంటి “నమ్మకం” అయితే వెల్చేరుది మరొకలాంటి “నమ్మకం” అని మాత్రమే అనుకోవాలి. సరి అయిన ఆకరాలు లేనప్పుడు ఎవరు చేసేవైనా ఊహలే అవుతాయి అవి నిరూపించబడేదాకా!
బ్రౌన్ దొర ఏ కారణంగా ఏ నమూనాని తన ముందు పెట్టుకుని తెలుగు గ్రంధాల అచ్చు పని దాని పరిష్కరణనీ చేపట్టినా ఆ పని చేసిన తెలుగు లేఖకులూ ఆ కొద్దిపాటి తెలుగు పండితులూ ఉన్న “బ్రౌన్ యూనివెర్సిటీ వే అంతకు ముందు తెలుగు లో ఏ కొందరికో అందుబాటులో ఉన్న గ్రంధాలని తెలుగు సమాజం ముందుకి తెచ్చిందన్నది ఒక వాస్తవం! ఆ పనిని తెల్ల దొరే చేశాడు గానీ అప్పటికి ఇంకా చెల్లా చెదురుగా తెలుగునేలని బుక్కుతున్న ఏ పిల్ల జమీందారూ చెయ్యలా! మనం ఎలాగైతే ఎడ్లబళ్లని వదిలి రైలు బళ్ల బాట పట్టామో ఆ “వలస పాలన” ఆధారం గానే తాటాకులమీంచి బ్రౌన్ దొర ముద్రింపించి ఇచ్చిన పుస్తకాన్నీ దొరకపుచ్చుకున్నాం. లేకపోతే ఏ సరస్వతీ మహలు లోనో మరోచోటనో లేదా ఏ కొందరి రాజుల సొంత గూళ్లలోనో చెదలు పట్టి ఉండేది పాత సాహిత్యం! మరి బ్రౌన్ “ఉధ్ధరించకపోయి ఉంటే” మరి ఎవరు వచ్చి ఉధ్ధరించి ఉండేవారో మనకి తెలీనప్పుడు తెలుగు వాళ్లకి బ్రౌన్ దొరమీద గౌరవం ఉండటంలో అసహజం ఏమీ లేదు.
కొన్నాళ్ళు వేలం వెర్రిగా ఇంగ్లీషు పధ్ధతులని అనుకరించిన దశ నించీ ఇవాళ వాళ్ల శైలి లోనే వాళ్లకి మాత్రమే అర్ధమయ్యే రీతిలో మళ్ళీ ఆ ఇంగ్లీషు లోనే మరి కొన్ని “కొత్త మాటల” పట్టిక గా ఆధారాలు లేకుండా తయారవుతున్న కొత్త ఊహల వ్యాసాలు ఇవి. నిడదవోలు వెంకట్రావు, ఆరుద్రా ఇవాళ ఏం జవాబులు చెప్పుకోవాలీ ఈయన సందేహాలకీ? మౌఖిక లిఖిత సాహిత్య వర్గీకరణలు అన్నవి మాత్రం ఇంగ్లీషు ప్రభావం వల్ల తయారైనవే కదా ఆధునిక విమర్శలో! అది మాత్రం వలసపాలకుల ప్రభావం కాదా?
చివరగా- తెలుగు సాహిత్యం లో మధ్య యుగాల దాకా అంటే వలస పాలకుల ప్రమేయం లేక ముందు దాకా ఆ పురాతన కాలంలో మన కవి పండితులు ఆ తాటాకు పుస్తక నిర్మాణం లో అనుసరించిన ప్రత్యేకమైన లేఖన విధానాలూ అలాగే తాళపత్ర ప్రతులకి తిరిగి తిరిగీ పుత్రికలని పుట్టించుకోవడంలో వాటిని పరిష్కరణ చేసుకోవడంలో అనుసరించిన విధానాలూ అన్నవి [అసలు ఒకటి ఉంటే] ఆ పధ్ధతులూ ఏవో వాటిని కూడా సమగ్రంగా వివరించనిదే పట్టించుకోనిదే చర్చలో వాటినీ భాగం చేయనిదే వెల్చేరు చేసిన బ్రౌన్ ప్రమేయం లేకముందటి తెలుగు దేశంలో ఉన్న “ఆధునికత” అన్న తర్కానికి అసలు బలం లేదు. అలాగే “వలస పాలన ప్రభావం” అన్న ఒక్క మాట తోనే ఇప్పటివరకూ తెలుగులో వెలిబుచ్చిన ఇతర విమర్శకుల పాత పధ్ధతులనీ పాత ఊహలనీ కాదనీ తాను చేయబూనుకున్న ఈ “కొత్త విశ్లేషణకి” కూడా ఒక సాధికారత ఏదీ సమకూరనూ లేదు. ఈ వ్యాసం వెల్చేరు ఎంతగా అమెరికన్ విశ్వవిద్యాలయాల పరిశోధనా ప్రభావంలో ఇరుక్కుని ఉన్నదీ చెప్పడానికి ఒక ఉదాహరణగా మాత్రం పనికొస్తుంది. ఆయన పాఠక వర్గం ఎవరో కూడా స్పష్టం గానే ఈ వ్యాసం ద్వారా రూపుకడుతుంది.
గాయకుడు, స్వరకర్త, డాక్టర్ శ్రీపాద పినాకపాణి మృతి భరతావనికి, సంగీత లోకానికి తీరని లోటు. ఆయన కు నా నివాళి. ఆయన కుటుంబానికి, సంగీతాభిమానుల అందరి తరఫున నా సంతాపం తెలుపుకుంటున్నాను.
మీరు పై వ్యాసంపై వేరొక చోట వ్యాఖ్యానిస్తూ “అదీ గాక శ్రీ వెల్చేరు వారు 1868కి పూర్వపు ఏ సుమతీ శతకం ముద్రణా తమకు ప్రపంచంలోని ఏ గ్రంథాలయంలోనూ కనబడలేదు అన్నారు.” అని రాశారు.
But what he wrote is this: “కాని 1868 సంవత్సరపు ప్రచురణ నాకు ప్రపంచంలో ఏ గ్రంథాలయంలోనూ దొరకలేదు.”
He is referring to Vavilla/Adisaraswati’s edition, reported to have been published in 1868, not about any Sumati Satakam. And his distinction throughout the essay is between “Vavilla/Popular” and “Brown” editions. Perhaps Prof. VNR may comment himself, if he should happen to check this comments page.
Well, we all know that C.P. Brown apparently published his edition in 1842 itself (and VNR mentions it as well!), but there is no copy of it came to light so far. Even a person like late ban.gO.re could not locate a copy of it.
Regarding your reference to Barnett’s catalogue that work contains other verses as well. I can personally speak in detail about British Library Telugu collections, also the uncatalogued ones. But, I believe, its out of topic as the question is not about pre-1868 publications in which some verses from sumati Satakam appear.
విస్తారంగా వాడుకలో లేదు కాని wild she buffalo ని అడవి గేదె అనొచ్చు. దున్న అన్నా దున్నపోతు అన్నా he buffalo. ఈ రెండింటికి స్త్రీ లింగం గేదె అన్న మాటే. కాని నుడికారం కోసం తాపత్రయం పడేటప్పుడు, సందర్భానికి భంగం రానప్పుడు “అడవి దున్న” అన్నంత మాత్రాన వచ్చే నష్టమూ లేదు. ఇది తునిలో పెరిగిన వాడి “రెండు దమ్మిడీల” అభిప్రాయం.
మన దేవుళ్ళ గురించి, దేవర్షుల గురించి మనం కాబట్టి ఇంత చౌకగా వ్రాసుకుని ఆనందిస్తున్నామేమో.
ఈ కథలో కనిపించినంత చేత కాని వాడు సృష్టికర్త అని మనం నమ్ముతున్నామా?
ఇంతకూ అనవసరమైన విషయాలన్నీ వదిలేస్తే, కలిపురుషుడు సర్వ బలవంతుడని నిర్ణయించారు. అతను కాలు కూడా పెట్టలేని స్థలాలు భూమి మీద ఎన్నో ఉన్నాయని రచయిత మర్చిపోయారు. గురుస్మరణ జరిగే చోట, దైవపూజ, సత్కర్మలు, సద్-గ్రంథ పఠనం జరిగేచోట అతని గాలి కూడా సోకలేదని మన పెద్దలు చెప్పారు. కనక కథ చదివి ఇదంతా నిజమని బెదిరిన వారికి ఇది శుభవార్త.
మాన్యమిత్రులు శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
అభినందనలు!
“ఈమాట” పత్రిక ఇదానీంతన సంచికలో శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారికి మీరు సమర్పించిన నివాళి ప్రస్తావిక వారి అమేయమైన ప్రతిభను, అపురూపమైన వ్యక్తిత్వాన్ని, అనర్ఘమైన కృషిసారాన్ని, నిరంతరాయితమైన వ్యాసంగాన్ని, వరివస్యను కన్నులకు కడుతూ చాలా బాగుంది. కొంతకాలం క్రితం అబ్బూరి రామకృష్ణారావు గారి పాటల కేసెట్టు రికార్డింగు సమయంలో నాకు వారితోడి పరిచయం పునరుద్ధృతమైంది. ఆ కేసెట్టు విడుదల వేళ సభాధ్యక్షుడిగా వారిని నేను సన్మానించిన సందర్భంలో కలుసుకోవటమే ఆఖరి సమావేశం. ఆ మధ్య ఫోనుచేసినప్పుడు వారు మా నాన్నగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు రేడియోకి వ్రాయగా తాము సంగీతాన్ని కూర్చిన పాటలు తమ వద్ద బయటపడ్డాయని, ఈ పర్యాయం హైదరాబాదు వచ్చినపుడు కలుసుకొంటే, ఆ వివరాలన్నీ మాట్లాడుకోవచ్చునని అన్నారు. అంతలోనే కాలం వారిని తన దురంతగర్భకుహరంలోకి లాక్కొంటుందని ఊహించలేకపోయాను. ఈ లఘువ్యాసముఖంగా ఇన్నిన్ని పాటలతో మీ జ్ఞాపకాలను పొందుపరిచి మీరు ఎంతో కొంత ఆ ఉత్తమఋషి ఋణాన్ని తీర్చుకోగలిగారు.
ఇదే సంచికలో “ప్రతిమా నాటకము” ప్రసారాన్ని గురించిన ఎన్నో అరుదైన విశేషాలను తెలియజేశారు. ఆ పరిచాయికలో మీరు “రజని గారు సంస్కృత చతుర్భాణీలను తెలుగులోకి అనువదించడం జరిగింది” అన్న ప్రయోగం చేశారు. “చతుర్భాణిని తెలుగులోకి అనువదించడం జరిగింది” లేదా, “చతుర్భాణిలోని నాలుగు భాణాలనూ తెలుగులోకి అనువదించడం జరిగింది” – అని ఉండాలి.
శ్రీ వెల్చేరు వారి సుమతీ శతకం గురించిన వ్యాసంలో “సుమతీ శతకం” తొలి ముద్రణ విషయమై నిడుదవోలు వారు ఆ వివరాన్ని ఎక్కడ చూసి ఇచ్చారో గుర్తింపకుండానే, సందేహించటం జరిగింది. అదీ గాక శ్రీ వెల్చేరు వారు 1868కి పూర్వపు ఏ సుమతీ శతకం ముద్రణా తమకు ప్రపంచంలోని ఏ గ్రంథాలయంలోనూ కనబడలేదు అన్నారు. 1912లో ఎల్.డి. బార్నెట్ ప్రకటించిన A CATALOGUE OF THE TELUGU BOOKS IN THE LIBRARY OF THE BRITISH MUSEUM అన్న సూచికలో
JOYES (Walter) and SESHACHARYULU, N. Ch. Telegoo Series. First Poetical Reader, being introductory lessons, with selections from the Vaymana pathyam and Sumathi Shuthagum, by Walter Joyes, and N. C. Sashacharloo, with the assistance of C. Rungiah, and S. Ramanoojiah . . . Pupil’s edition. (ప్రథమకావ్యపాఠము) pp. 44,5. S.P.C.K. Press: Vepery (Madras), 1859.
అని కనబడుతుంది. దీనిని బట్టి సుమతీ శతకానికి ఒకపాటి సంకలనం – అదెంత సమగ్రమైనా, అసమగ్రమైనా 1859 నాటికే వెలువడినట్లు స్పష్టపడుతున్నది. వాల్టర్ జాయిస్, శేషాచార్యులు జంట అందులో సుమతీ శతకం నుంచి ఎన్ని పద్యాలను గ్రహించారో; వాటిని ఏ రూపంలో పరిష్కరించారో, తమ పీఠికలో 1859 కంటె మునుపటి సుమతీ శతకం ముద్రణలను గురించి ఇంకా ఏవైనా వివరాలను ఇచ్చారేమో – ఆ పుస్తకాన్ని చూసి గాని చెప్పలేము.
ప్రసాద్ గారూ !! మొదట గా నేను మీ వ్యాఖ్యని శ్రధ్ధగా చదివేను. మీ వ్యాఖ్య నన్ను నొప్పించలేదు సుమా! మీ అభిప్రాయాలని నిర్మొహమాటంగా రాసే పధ్ధతి నాకు ఇష్టం.
కాకపోతే కల్పనకీ తర్కానికీ చుక్కెదురు. తర్కం ఎంత ప్రయత్నించీ కల్పనని లొంగదీసుకోలేదు. పక్షపాత దృష్టి ఈ సృష్టి లోనే ఉండగా ఆ సృష్టి మీద చేసే ఏ వ్యాఖ్యానమైనా అందుకు అతీతంగా ఉండలేదు. కదా? మనమందరమూ ఏదో ఒక పక్షం వేపుగానే ఉంటాం. అన్ని సార్లూ అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండకనూ పోవచ్చు. అయినా సరే అలా ఉండటం సహజం. Obviously its difficult to be objective towards nature and its laws.
ఇంక ప్రతీకలు అన్నవి సైతం అలాంటివే పాము ఎందుకని చెడ్దది కావాలో పక్షి ఎందుకని కాకూడదో స్పష్టం గా నాకు మాత్రం తెలుసునా 🙂 అబ్బే తెలీదు. అది అర్జున అభిప్రాయం. ఆ అభిప్రాయం మీద నాకేమంత అదుపు ఉండదని నేనంటే మీకు అర్ధం అవుతుందో లేదో మరి! కానీ ఇది సత్యం. చాలా సార్లు రచయిత కల్పనావరణాన్ని అతిక్రమిస్తాయి పాత్రలు. అన్నిసార్లూ రచయిత స్వతంత్రుడని / రాలు .. అని మాత్రం అనుకోబోకండి. అలా అంతా రచయిత స్చాధీనం లోంచే తయారయ్యే రచన ఉంటుందని చెప్పలేం కనీశం నావరకూ నేను అలా చెప్పలేను.
సాధారణంగా బలమైన వాటికన్నా vulnerable species వైపుగా మనసు పోవడం వలన కూడా అలాంటి ప్రతీకలు అలవోకగా చొరబడే వీలుంటుంది. లేదా మనసు లోలోతుల్లో ఎక్కడో పాము మీద ఉండే అయిష్టమో పోనీ పక్షి మీద ఉండే ఇష్టమో కూడా పనిచేసి ఉండవచ్చు 🙂 అప్పుడూ అది సహజమే! అలా ఎందుకంటే దాన్ని చెప్పడం కూడా కష్టమే 🙂
ఏం పిల్లడో ఎల్దమొస్తవా ? అన్న వంగపండు పాట మీకు తెలిసే ఉంటుంది. ఆ పాట లోని ప్రతీకలని గమనించండి. ఆయనకి మరి పులి మీద కోపం గొర్రెపొట్టేలు మీద ప్రేమ అని గభాల్న అనేయలేం. కవి చేసే పని ఏమంటే ఉన్న పరిస్థితి మీద వ్యాఖ్యానం చేయడం కోసం ఏ పోలికనైనా తన భావానికి అనువుగా మలుచుకోవడం. అంతే! కొన్నిసార్లు పులి మంచిది కావొచ్చు. కొన్నిసార్లు కాకపోవచ్చు. అంతిమంగా పులి పాము చెట్టు పుట్టా కధల్ని చెప్పవు గనక వాటిని చెప్పేది మనిషే గనక మనిషికున్న సకల భావ సంచలనాలకీ అవి నిర్నిమిత్తంగా కారణభూతమౌతాయి!
కల్పన మీద నేను ఎప్పుడూ వివరణనిచ్చే పనిచేయను. ఇకపోతే సాహిత్యప్రపంచాన్ని సమ్మోహన పరిచిన రచన చలం “ఒక పువ్వు పూసింది.” ఆ ఒక్క రచనే మిగిలీ మిగిలిన సాహిత్యం అంతా పోయినా పరవాలేదన్నారు చింతా దిక్షితులు గారు [కాబోలు]. దాన్ని తప్పక చదవండి. ఏ రచన మన మనసుని ఎలా మెలిపెడుతుందో మనకే తెలీదు. ద్వైదీ భావం కల్పనాపరులందరికీ సహజ గుణం. ” ఒకటికొకటికిని ఒడబడవు” అంటాడు అన్నమయ్య. పగలంతా రాముణ్ణి తిట్టి సాయంత్రం అయ్యేసరికి త్యాగరాజకీర్తనలని ఆస్వాదించే కొడవటిగంటి కుటుంబరావు… స్త్రీలవైపు ప్రాణం ఇచ్చి మాట్లాడి కూడా “ఒక పువ్వు పూసింది” లాంటి చెవనిస్ట్ కధని రాసిన చలం ఈ అంతరంగ గందరగోళాన్ని అధిగమించగలిగారా?? రసపట్టులో తర్కం కూడదు అని అంటారు పింగళి నాగేంద్రరావు కాబోలు. 🙂
వచనములో కూడ కవిత్వము ఉంటుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. దీనికే విరామాలు ఇచ్చి వ్రాస్తే ఇది ఒక దీర్ఘ కవిత అవుతుంది. ఇది కథ కాదు, కాని ఒక చెట్టు ఆత్మకథ అనుకోవచ్చు గదా! కాకుంటే ఇట్టి రచనలను ఒక మూసలో పెట్టడము కష్టము. ఇది కవిత కాదు, కాబట్టి దీనిని ఎక్కడ ఉంచడము, అందుకే ఇది కథగా మారినది. ఒకప్పుడు దమయంతిగారి ఒక రచనను గురించి కూడ ఇలాటి చర్చ జరిగినట్లు నాకు జ్ఞాపకము. జయప్రభగారికి అభినందనలు. విధేయుడు – మోహన
ఇది కధా? ఈ వచనంలో చాలా అద్భుతమైన వర్ణనలు వుంటే వుండొచ్చు. ఎన్నెన్నో నిగూఢ పోలికలు జీవితంతోనో, మరోదాని తోనో వుంటే వుండి వుండొచ్చు. ఈ వచనాన్ని కధ అంటే, నాకు బొత్తిగా అర్థం కాలేదు. కధ అంటే ఏదో ఒక సంఘటన అయినా వుండాలి కదా? వర్ణనలు పూర్తయి, ఆఖరికి కధేదో మొదలవుతుందని ఎదురు చూస్తే, అంతా పూర్తయిపోయింది. కధేమిటీ అంటే, చెప్పడానికి ఒక్క ముక్క కూడా దొరకలేదు.
బహుశా, ఈ కధ లాంటిది గొప్ప మేధా వర్గానికి మాత్రమే ఉద్దేశించి రాసినది అయి వుండొచ్చును. నా లాంటి మామూలు పాఠకుల కోసం అయి వుండదు. అలా అయితే, నాకు ఏదో ఒక్క ముక్కన్నా కధ గురించి అర్థం అయి వుండేది కదా? “అలా కాదూ, నువ్వు మామూలు పాఠకుడి కన్నా కూడా తక్కువ స్థాయి వాడివీ, అందుకే ఈ కధ లోని కధా, గొప్పతనం, ఇందులోని విషయాలూ నీకర్థం కాలేదూ” అని ఎవరన్నా అంటే, “హతోస్మి” అని అనడం తప్ప, మరింకేమీ చెయ్యలేను.
సరే, ఇది కధ అవునా, కాదా, లేక ఇది మరొకటా అన్న విషయం వదిలేస్తాను. నాకు అర్థం కాని దాని గురించి చర్చ వ్యర్థం.
ఒక విషయం మాత్రం చెప్పాలని వుంది. పక్షి నది లోని చేపలని పట్టి తింటుంది. పిల్లలకి పెడుతుంది. పాము పక్షి పిల్లలని తింటుంది. ఇది ప్రకృతికి సంబంధించిన విషయం. జంతువులు ఆకలి తీర్చుకోవడం కోసం, ఒక దాన్ని ఇంకొకటి తినడం ప్రకృతి విషయం. ఇందులో, మంచీ, చెడూ అనేవి వుండవు. పాము చెడ్డది అయితే, పక్షి కూడా చెడ్డదే అవుతుంది. ఏవేవో పురుగుల్ని తినే చేపా చెడ్డదే అవుతుంది. చెట్టు, పక్షి పిల్లల్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తే, నది, చేప పిల్లల్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తుంది. అర్థం పర్థం లేని విషయం ఇది.
“పులి తినేయగా మిగిలిన కళేబరాన్ని ఆరగించేటందుకని మూకలుగా వచ్చిన రాబందులు ఆవేళ నా కొమ్మల మీదనే కూచుని దున్నని తలుచుకుని దుఃఖించాయి. అది చాలా వింతగా విశేషంగా అనిపించింది నాకు.” – ఈ రాబందులు కూడా మనుషుల్లాగా కపటత్వం (హిపోక్రసీ) కలిగినవై వుంటాయి. మరి మనుషులు కూడా, చేపల కూరా, చేపల పులుసూ హాయిగా, ఆనందంగా ఆరగిస్తూ, “ఫైండిగ్ నీమో” లాంటి సినిమాలు చూసి, కళ్ళ నీళ్ళు పెట్టేస్తూ వుంటారు కదా? అందుకని.
ప్రకృతినీ, సమాజాన్నీ కలగా పులగంగా కలిపేసి మాట్టాడ కూడదు. ఈ రెంటికీ చాలా తేడా వుంది. సమాజంలో మంచీ, చెడూ వుంటాయి. ప్రకృతిలో అలాంటివి వుండవు. ప్రకృతిలోని విషయాలకి లేని పోని ఉదాత్తత అంట గట్టేస్టే, కవిత్వానికి పనికొస్తుందేమో గానీ, అర్థం పర్థం లేనిదిగా వుంటుంది. ప్రకృతి లోని విషయాలు ఎప్పుడూ మారవు. అవి వాటి సూత్రాలతో సాగి పోతూ వుంటాయి. సమాజంలోని విషయాలని మార్చుకోవచ్చు.
“నీకు ఎలాంటి హానీ కలక్కుండా చూస్తాను. నీ భార్య ఆపరేషన్ కి కావలసిన డబ్బు రెండు లక్షలట కదా. మూడు లక్షలు ఇప్పుడే ఇస్తాను. అది కాక, నువ్ జైలు నుంచి విడుదలయ్యాక నీకో మంచి ఉద్యోగమో లేదా వ్యాపారం పెట్టుకోవడానికి మరికొంత డబ్బో ఇస్తాను. నీ గురించి శీను నాకు అంతా చెప్పాడు. అందుకే ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. కానీ ఏ సాక్ష్యమూ లేకుండా ఆ పాపారాయడ్ని పైలోకానికి పంపడం నీ పని!”
పై వాక్యాలు చదవండి. అర్థం కానిదేముంది? బహుశా చదువుతున్నప్పుడు కలిగిన విసుగు వల్ల, కొన్ని వాక్యాలు ఎగర గొట్టేశారేమో!
భార్యని బతికించు కోవడానికి డబ్బు కావాలి. జైలర్ పాపారాయుడిని చంపితే డబ్బిస్తానని హోం మినిష్టరు అన్నాడు. జైలు నించి బయటికి వచ్చాక (ఎప్పటికో మరి) ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాడన్నాడు. ఆ డబ్బు కోసం, జైలరుని చంపడం కోసం మళ్ళీ జైలుకు వచ్చాడు.
ఇదీ నాకర్థమయింది. ఇది తప్పయితే, “హతోస్మి” అని అనుకోవాలి.
మహా బోరైన కధ. కాలక్షేపానికయితే మాత్రం ఎవరయినా బోరు కధలు చదవ గలరా? రాసిన విధానం ఇంకా బోరు కొట్టించింది. కధ ఎలా అంతం అయిందో తెలియడం కోసం, చాలా కష్టపడి నాలుగు ఇన్‌స్టాల్‌మెంట్లలో చదివాను.
అన్నట్టు, ఇది అనువాద కధ కాదు. ఎవరో ఇంగ్లీషాయన ఏదో కధలో ఏదో రాస్తే, దాని వల్ల ప్రేరణ కలిగి, ఈ కధ పుట్టుకొచ్చిందట. సన్నివేశాల మధ్య సరైన విరామ చిహ్నాలు వాడక పోవడం వల్ల, ఏ సన్నివేశం ఎక్కడ పూర్తయి, ఎక్కడ ఇంకోటి మొదలయిందో తెలియలేదు. అంతా కలగాపులగం అయిపోయింది.
మీరు చెప్పే ఆ కవిత్వ మూలాల్లోకి బహుశా నేను పోలేనేవో భూషణ్ గారు. నాకు కవిత్వం కొద్దో గొప్పో తెలుసు. కవిత్వం తెలుసంటే నాకు తెలుగు తెలుసని కాదు, నాకు బతుకు తెలుసని, అంతే. అనుమానం లేదండీ నాకు తెలిసిన తెలుగు పన్నెండో తరగతి వరకు నేను చదువుకున్న తెలుగే, అది కూడా లీలా మహల్ల్లో ఆంగ్ల సినిమా లేకపోతేనే, ఉంటే మా తెలుగు లెక్చరర్లు అదృష్టవంతులు. ఎందుకంటే మేవు క్లాస్ కి వస్తే పాపం వాళ్ళు చాలా దిగులు పడే వాళ్ళు. మా తెలుగు అంతవరకే పరిమితం. కాకపోతే బతుకు చాలా విస్తృతం కదండీ. కొందరు బతుకు ఒక వైపునే చూడగలరు, కానీ ఆ కొండనీ ఆ లోయనీ రెండిటినీ చూడగలగటం అందరకీ కుదరదు కదా.
నేను ఇంతకు ముందు వ్రాసిన కవితలు కానీ, ఒకే ఒక కథ కానీండి, అది నాకు తెలుగు తెలుసు అని వ్రాసింది కాదండీ భూషణ్ గారు. బతుకు తెలుసని వ్రాసినవండీ అవి. అయ్యో నాకు తెలుగులో ఓనమాలు, ఇవి కూడా తప్పుగా వ్రాస్తున్నాను, తెలియవండి. కానీ నాకు తెలిసింత వరకు నేను తప్పు కావచ్చు, కవితగానీ, కథగానీ భాషలోనించి రాదండి, అనుభవంలోనించి వస్తుంది, బతుకులోనించి వస్తుంది.
అమ్మా, కడుపులో ఎండకాస్తున్నట్టుందమ్మా అని వ్రాశాడు నామినీ ఒక కథలో. మిరక్కాయలు (మీరు మిరపకాయలు అంటారేవో) పచ్చడితిని, ఆ పిలగాడు బయట ఎండ కాసినట్టే ఆ కడుపులో మంటని అమ్మా కడుపులో ఎండకాసినట్టుందమ్మా అని చెప్తాడు అమ్మకి. ఇది తెలుగు భాష తెలుసు కాబట్టి రాదు, ఇది అనుభవం నించి వస్తుంది, ఇది బతుకునించి వస్తుంది. నాకు తెలియదండీ నాకు మాత్రం ఇంతగొప్ప వాక్యం, భాష మాత్రమే తెలిసిన వాళ్ళు వ్రాయలేరు, బతుకు తెలిసిన వాళ్ళు మాత్రమే వ్రాయగలరు. అమ్మా కడుపులో ఎండకాస్తున్నట్టుందిమా. కడుపులో ఎండకాస్తున్నట్టుందట. మీరు తప్పు పట్టదలచుకుంటే మొత్తం పచ్చనాకు సాక్షినే తప్పు పట్టేయ్యగలరు మీరు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, రచయిత వ్యక్తిగత జీవితం వాళ్ళ రచనలకి మూలం భూషణ్ గారు. తెలిసీ తెలియని అనుభవాల్ని, అనుభవం కాని బతుకుని కవిత్వీకరించడం కన్నా అబద్దం వుందా?
ఆశ్చర్యం! ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం రాసిన వ్యాసానికి ఇప్పుడు స్పందన వచ్చింది. కనుక మనం రాసిన వాటి మీద వెనువెంటనే స్పందన రాకపోతే కంగారు పడనక్కర లేదు!
ఆర్యా, స్పందించవచ్చును, కాని పది పన్నెండు సంవత్సరాల తరువాత స్పందిస్తే పునః స్పందించడానికి నాలాటి ముసలివాళ్లు బ్రదికి ఉంటారో ఉండరో? ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడితే బాగుంటుందేమో? విధేయుడు – మోహన
స్వార్థిగా ఈ చర్చలో పాల్గొంటున్నాను. ఎన్నో ఏళ్లుగా నా ఇంటి పేరైన జెజ్జాలను గురించి వాకబు చేస్తున్నాను, కాని ఇంతవరకు ఫలితము శూన్యమే. ఈ జెజ్జాల ఎక్కడున్నది? తలిదండ్రుల ద్వారా నేను విన్నంతవరకు ఇది ఇప్పటి తెలంగాణాలోని ఒక గ్రామమని. కాని ఆ గ్రామము ఎక్కడుందో తెలియదు. గోల్కొండ వ్యాపారులైన నా పూర్వీకులు సుమారు 200-250 సంవత్సరాలకు ముందు ఇప్పటి ఆర్కాడు, చిత్తూరు ప్రాంతాలకు వలస వచ్చారు. ఇంటర్నెట్ ఫేస్‌బుక్కుల ద్వారా ఈ జెజ్జాల పేరితో ఇంకా కొందరు ఉన్నారని కనుగొన్నాను. వాళ్లకు కూడ ఈ విషయాన్ని గురించి తెలియదు. ఈ పేరు ఒక్క కులం వారు మాత్రమే ఉంచుకొన్నట్లు లేదు. అందువల్ల బహుశా ఇది ఒక గ్రామము లేక వాడ పేరై ఉండవచ్చును. అసలు ఇది జెజ్జాలయేనా లేక జజ్జాలయా అని కూడ ఒక అనుమానము. ఇంటి ఫేరును గురించి ఏమీ తెలియక జెజ్జాల ఇంటి పేరుతో చెలామణి అవుతున్న – మీ మోహన
ఎడిటర్ గారికి.
ఈ మాట పత్రిక చాల బాగుంది. కాని ఒక్కటే లోపం. మంచి సీరియల్స్ లేవు.
ప్రఖ్యాత రచయితలని కాకుండ కొత్త రచయితల రచనలు ప్రచురించండి. మీ పత్రిక
ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
ఇట్లు
కొండగుంట వెంకటేశ్.
చివర నుదహరించిన Distant Rivers Reach the Sea చదివినప్పుడు నాకు ఏక్‌నాథ్ ఈశ్వరన్ వ్రాసిన God makes the rivers to flow – Passages for meditation అనే పుస్తకము జ్ఞాపకానికి వచ్చినది. నదీనాం సాగరో గతిః అంటారు అందుకే. ఆ కవితకు ఖండగతిలో (ఐదు మాత్రలతో) సాగే నా తెలుగు సేత క్రింద ఇస్తున్నాను –
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
దూరముగ నుండుటయు దగ్గరగ నుండుటయె
దూరమున నుండియును దలతు నే నతనినే
దూర మా సూరీడు తామరకు గాదు గద
దూరములు హెచ్చగా ప్రేమయును హెచ్చు గద
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
నన్నతడు జూడగా నే నతని జూతుగా
నా మొగ మ్మతనిపై కేంద్రీకృతమ్ముగా
వనములో నెమలు లా మేఘముల జూచుగా
చూపులే నాలోని యాశలకు పాశములు
అవధానాన్ని యిష్టపడే ఒక పామరునిగా నా అభిప్రాయాలివి:
1. కవిత్వం అనే బ్రహ్మపదార్థానికి కాలానుగుణంగా అర్థం మారుతూ వచ్చింది. అంచేత ఒకప్పుడు ఆశువు, అవధానమూ కవిత్వంగా, కవిత్వవిద్యగా చెలామణీ అయి ఉండవచ్చు, అందులో ఆశ్చర్యమూ అసంగతమూ ఏమీ లేదు. ప్రస్తుతం కవిత్వమంటే ఉన్న అవగాహన (“మేధావి” వర్గానికి) మేరకు అది కవిత్వం కాదన్నది కచ్చితమే. అయితే అందులో అక్కడక్కడా కవిత్వఛాయలు కనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది, అది వేరే సంగతి. అవధానికీ, పృచ్ఛకులకూ, ప్రేక్షకులకూ కవిత్వదృష్టి ఉంటే అందులో కొంత కవిత్వం పండే అవకాశం ఉంది. లేకపోతే లేదు. అయితే ఆ విద్య ప్రాధాన్యం అది కాదు.
2. అవధానానికీ దొమ్మరి ఆటకూ పోలికలుండడమూ వాస్తవమే, అందులో వాదనకి తావు లేదు. అయితే, దొమ్మరాటను “తక్కువ”గా చూడాల్సిన అవసరం ఏముందో నాకు బోధపడటం లేదు. అది కూడా కష్టించి సాధించాల్సిన ఒక విద్య. మనుషులకి ఆహ్లాదాన్ని కలిగించే ప్రక్రియ. దానివల్ల సమాజానికి నష్టమేమీ లేదు. అలాంటి ప్రక్రియ జనాదరణ పొంది అభివృద్ధి చెందితే మంచిదే కదా. అవధానమూ అంతే.
ఇక వ్యాసం చివరలో పేర్కొన్న కొన్ని విషయాల గురించి, పృచ్ఛకునిగా కొన్ని అవధానాలలో పాల్గొన్న అనుభవాల ఆధారంగా, నా అభిప్రాయాలు:
1. పృచ్ఛకులను గద్దించో బతిమాలో ఒక క్లిష్ట సమస్యని మార్చడం అనేది నేను చాలా కొద్ది సందర్భాలలో మాత్రమే చూసాను. అంచేత అది ఒక “టెక్నిక్”గా ఎక్కువ ఉపయోగపడక పోవచ్చు, కేవలం అరుదైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప.
2. “అవధాని గారికి కోపం వస్తే శాపం పెట్టేస్తారేమో!” అనే అనుమానం ఇతరుల మనస్సుల్లో కలిగించగలిగిన అవధానికి ఇంక ఎలాటి ఢోకా లేదు. – ఇలాంటిది నా కొద్ది అనుభవంలోనూ ఎప్పుడూ చూడలేదు.
3. “మొదటిది పృఛ్ఛకుల్ని మంచి చేసుకోవటం. అవధానం మొదలుకావటానికి ముందుగా వాళ్ళని పలకరించి ఎవరు తనని పరీక్షించటానికి వచ్చారో ఎవరు తన మిత్రులో తెలుసుకుని మొదటి వర్గంలోని వాళ్ళని తనకు అనుకూలంగా తిప్పుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి.” – ఇలాంటిది కూడా నేనుప్పుడూ చూడలేదు.
4. “అవధానం అయి వెళ్ళేప్పుడు “ఆహా! ఆ పద్యం ఎంత బాగా వచ్చింది!” అనుకునే ప్రేక్షకుల్ని ఇంతవరకు చూడలేదు నేను” – అలా అనుకున్న ప్రేక్షకులలో నేను ఉన్నాను. (వ్యాస రచయిత నన్ను “చూడలేదు” కాబట్టి అతనన్నది ఇప్పటికీ నిజమనే అనుకోవచ్చు :-)) నేనిచ్చిన ఒక సమస్యను గరికపాటివారు పూరించిన విధానమూ, న్యస్తాక్షరిని కడిమెళ్ళవారు పూరించిన విధానమూ చూసి, ఎంత బాగా వచ్చాయి పద్యాలు అని అనుకున్నాను.
6. “ఇటీవలి కాలంలో జరుగుతున్న అవధాన కార్యక్రమాల వల్ల భాషకు ఏమీ ఉపయోగం కలక్కపోగా ఒకరకమైన కీడు కూడ జరుగుతున్నదేమో అనిపిస్తున్నది.” – ఎలాంటి కీడు జరుగుతోందో వివరిస్తే బాగుంటుంది.
5. “ఏమైనా అవధాన ప్రక్రియ వల్ల భాషాసాహిత్యాల మీద ఉండే ప్రభావం గురించి ఎవరైనా సాధికారికంగా పరిశోధిస్తే బాగుంటుంది.” – అవును బాగుంటుంది. అలాంటి ప్రభావం (మేలు కాని, కీడు కాని) చాలా తక్కువ అని అభిప్రాయం. బహుశా ప్రేక్షకులకి పద్యాల మీద కొంత ఆసక్తిని పెంచే అవకాశం ఉంది, అంతే. అవధాన స్వరూపంలోనూ, సమస్యల పూరణల స్వరూప స్వభావాలలోనూ, కాలానుగుణంగా చాలా మార్పు వచ్చింది. అవధానం గురించిన ఏ పరిశీలన అయినా దీన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. గరికపాటివారి అవధాన పద్యాలు కొన్ని పుస్తకాలుగా వచ్చాయి. వాటిని పూర్వ కవుల అవధాన పద్యాలతో పోలిస్తే తేడా చక్కగా బోధపడుతుంది. వీటి ఆధారంగా యీ వ్యాసంలో పేర్కొన్న కొన్ని అంశాలని పునస్సమీక్షించు కోవలసిన అవసరం ఉంది.
ఇక్కడ చర్చ “అవధానాలలో కవిత్వం ఉందా లేదా” అన్నది కాదు. అవధానాల పరిమితీ ప్రయోజనమూ కూడా కాదు. అది దొమ్మరి ఆటే అయినా అందులో కవితా రసం చిప్పిల్లక పోయినా అది ఒక మేధో ప్రదర్శన. దాని సామాజిక ప్రయోజనం గురించి కాదు మనం చర్చించుకుంటున్నది. అది జెమినీ సర్కస్సే అయినా కూడా అందులో అందరూ పాల్గోలేరే? ఆ విద్యా ప్రదర్శనని అందరూ చేసెయ్యలేరే? ఆ “వీటి విద్యకి” కూడా దానిదే అయిన పరిమితీ ప్రయోజనమూ ఉన్నాయి. ఈ స్పష్టత దానిని గురించి చర్చ చేసేవారికీ దానిని విమర్శించే వారికీ దానిని అర్ధం చేసుకుని విశ్లేషణ చేసేవారికీ ఖచ్చితంగా ఉండాలి మరి.
అవధానాలలో వారు కవిత్వం చెప్పుతున్నట్టు మాట్లాడినప్పుడు మాత్రమే మీరన్న ఇటువంటి మాటలకి చోటు. కాని అది కేవలం “పామర” రంజన కోసమే అయినా అప్పుడు కూడా అది ఒక కళే! దానిని సైతం అందరూ చేయలేరు. దానికి పద్య విద్యలోని మెలకువలు తెలియాలి. సమయస్పూర్తి ఇత్యాదులు అవసరం! ఒక పక్క తెలుగు భాషే అనేకానేక పరిణామాలలో గిరిగిళ్ళు తిరుగుతూ ఉంటే ఆ అవధానాలు అన్నవి ఏవో అందరూ చేసేయగలిగినట్టు, అదేమంత బ్రహ్మ విద్య కానట్టు దానిని బహిష్కరించేటంతటి తీవ్రతని చూపనఖ్ఖరలేదు. వీరేశలింగంపంతులు గారు ఒక పాపులర్ ఆర్ట్ గా దానిని ప్రదర్శించబోయి దాని పట్ల విసుగొచ్చి మానేసి ఉండొచ్చు. దానిని” దొమ్మరి ఆటగా” చెప్పిన చెళ్లపిళ్ల కవిద్వయం (ఇవాళ్టి యెన్నారైలు అమెరికాకి టికెట్టు ఇస్తే నాలుగు డబ్బులకోసం అవధానులు వెళ్ళినట్టే…) ఆనాడు “నానారాజ సందర్శనం” చేసుకుంటూ ఆ విద్య ద్వారానే నాలుగు డబ్బులు గడించుకునే పని చేశారు మరి.
మనం వినోదం కోసం అని సర్కస్ చూసేందుకు పోమా? కానీ మనకి మనమే ఆ గెడ మీదికి ఎక్కి అదుపు తప్పకుండా నాలుగు అడుగులు వేయలేమే? ఆ అడుగులు వేసే అమ్మాయి కూడా సంవత్సరాలు శిక్షణ చేస్తేనే వచ్చిన వారికి ఇంత సంరంభాన్ని పంచగలదు. అందువలన మనం చేయలేని ఆ “దొమ్మరి ఆట” కూడా ఒక కళే. అక్కడ గడసానులున్నట్టే ఇక్కడ అవధానులూ ఉన్నారు అనే అనుకోండి పోనీ!! (ఆ గడసానులు) అదే ఆ అవధానులు ఆనాడు పంతులుగారు, వేంకటశాస్త్రి గారూ కావొచ్చు. ఈనాడు మరొకరు కావొచ్చు. దానివల్ల ఆనందం పొందే వారున్నారు కదా? అందులో “పండితులూ” “కవులూ” “మేధావులూ” లేకపోతే అక్కడ కూర్చుని ఆ అక్షర విన్యాసానికి అబ్బురపడుతూ వాటిని వీక్షించే వారికి కలిగే ఆనందానికి వచ్చే లోటేమీ లేదే? అలాంటప్పుడు ఆ “కవులూ మేధావులూ” వాటి పట్ల అంత గాఢమైన అసహనాన్ని మాత్రం ఎందుకూ కలిగి ఉండడం?
తెలుగులో ఎక్కాలూ కిందినించి పైకి అప్పచెప్పే వాళ్ళున్నారు. ఇంగ్లీషులో స్పెల్లింగులు చెప్పే వాళ్ళున్నారు ఒక్క తప్పు రాకుండా. అలాంటి వాళ్లకి మీ అమెరికాలో డాలర్లలో ప్రైజ్ మనీలు సైతం ఉన్నాయి. వాటికి ఇంగ్లీషులో మెప్పు కూడా ఉంది. రష్యాలో జిమ్నాసిజం ఎంతో ఆదరణ ఉంది. మరి అలాంటి ఒక పనిని భాషని వాహికగా వాడుకుని “పామరులని” రంజింపజేయడానికే అనుకుందాం పోనీ, ఆ అవధాని గనక ప్రయత్నిస్తే దాన్లో ఎవరికైనా ఏమిటీ ఇబ్బందీ? ఒక సర్కస్ చూసినట్టే ఒక అవధానాన్నీ చూడండి. ఆ కళ “మనలాంటి వాళ్ళకోసం కాదు” అని అనుకునే “మేధావులు” వెళ్ళకండి. అంతేగానీ అవధానాలలోని అక్షరాల గారడీ మీద “మేధావులకి” దేనికీ వైరం? అవధానులనీ వారి విద్యనీ ఎకసెక్కెం చేసి “అబ్బే అందులో ఏముందీ” అని అనుకునే ముందు, “నేర్చుకుని అందరూ ఆ అవధానాలని చేసేయగలరని” రాసేసే ముందు .. అసలు అలాంటి ఒక విద్య కేవలం తెలుగులోనే ఉందనీ అది తెలుగు భాషకి మాత్రమే సాధ్యమైన ఒక అక్షరాల గారడీ అని కూడా గుర్తించండి.
ఒకనాడు ఎంతో ఘనత వహించిన విప్రవినోదుల విద్యలు ఆదరణ లేకనే కదా కనుమరుగై పోయాయి! అలాగే ఎవరూ పట్టించుకోకపోతే ఈ అవధానాలూ కొద్ది కాలానికి కొట్టుకు పోవచ్చు. సూడో వెస్ట్రన్ ప్రభావంతో వాదనలు చేసుకుంటూ ఒక విద్యని పోగొట్టుకుని ఎవరైనా సాధించేది ఏముందీ? నిలుపుకోవడంలో గొప్పదనం ఉంది గానీ? ఆదరించడంలో ఘనత ఉందిగానీ! ఇలా మహా ఘనమైన పని చేసినట్టూ విద్యల్ని ఎగతాళి చేసే “మేధావుల” కన్నా విద్యల్ని తమదైన రీతిలో నిలుపుకునే “పామరులు” గొప్పవాళ్ళు కాదా? అలాకాదూ పోనీ అంతకన్నా మేలుగా ఆ విద్యని తీర్చి దిద్దుకోవడం ఎలాగో దాని గురించి ఆచరణ లో చేసికదా చూపాలీ? ఎప్పుడైనా ఒక మెరుగైన విమర్శ వలన ప్రయోజనం ఉంటుంది గానీ నిస్సారమైన విమర్శ వలన ఒక కళకీ మేలు లేదు. విద్యకీ లేదు. భాషకీ లేదు. అలాంటి విమర్శ దృష్టిలో వ్యతిరేకమైనది. దానివలన ఒరిగేదేమీ ఉండదు ఎవరికైనా!! ఆలోచించి చూడండి మీరు కూడా ఏ ధోరణి మంచిదో!!
సామెతల ఆమెతల ప్రస్తావనలు మీకే కాదు కేవీయెస్ రామారావు గారూ!! అది మీలాగానే తెలుగు భాష వచ్చిన వారికందరికీ తెలుసు. మీ నోటి జోరు చెబుతున్నది మీకు వచ్చిన అసహనం వెనక మీరు చేసిన హేళన ఎంతగా మీకు స్వాభావికమో !! అలాంటివి మీకు బహుశా సహజం కావొచ్చును. మీ వ్యాసం మీద ప్రతిస్పందించేందుకు కుదరదని ఈమాట వారు ఏమీ చెప్పలేదు గనక పాఠకురాలిగా నేను నాకు అనిపించిన సంగతులని రాసేను. మీవ్యాసం ప్రచురించేరూ అంటేనే దాని మీద మిగిలిన వారికి కలిగిన భావాలని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని. అయితే అవి మీకు నచ్చినట్టో… లేదా మీకు కావలసినట్టో ఉండvu కద? మీరు విమర్శని తీసుకోలేని అతి సున్నితమైన వారైతే అందుకు పాఠకులు ఏమి చేయగలరూ?? నా విమర్శ నా మాటలూ మీకు ఎలాగ అర్ధం అయ్యేయో అది మీ భావనలకి మీ సంయమనానికీ సంబంధించినది. ప్రతీ వ్యాఖ్యకీ ఒక సందర్భం ఉంటుంది. మీ వ్యాసమూ అక్కడే ఉంది. నా అభిప్రాయమూ అక్కడే ఉంది. కదా? “ఉలుకు” అంతగా మీరు పడనవసరము లేదు. నేను ఉన్న మాటే అన్నాను.
ఇంక నేను- కవిత్వమూ వగైరాలు అందరికీ నేర్చుకుంటేనే పట్టుబడతాయని విష్ణుభొట్ల లక్స్మన్న గారన్న మాట మీద నా అభిప్రాయంగా నా జవాబు లో స్పష్టం గానే చెప్పాను. లక్ష్మన్న గారి వ్యాఖ్య మీద అది నా అభిప్రాయం. దాని పట్ల మీ “ట..” లతో మీరు ఏవేవో వదిరితే అది మీ స్వభావాన్ని చెబుతుందే తప్ప మరింకేం కాదు. అటువంటి నీరసమైన జవాబుని నేను లక్ష్య పెట్టను. నాకు విషయం ముఖ్యం. అన్ని “విద్యలూ అందరికీ అబ్బవు.” ఇది వాదనతో తేలే సంగతి కాదు. మీరు దీన్ని నిరూపించదలుచుకుంటే వ్యాసాలు రాయడం మాని ముందు దాన్ని నిరూపించడానికి ఆ అవధానాలేవో చేసి చూపండి. అప్పుడు కదా తెలిసేది అది అందరూ చేయగలరో లేక అది కూడా కొందరు మాత్రమే చెయ్యగలరో!! ఇందుకు ఈ మిగిలిన మాటలెందుకూ? నేను నమ్మడం లేదు అన్ని కళల్నీ లేదా అన్ని “విద్యల్నీ” అందరూ చేయగలరూ “నేర్చుకుని” అని. కాని దాన్ని మీరు నమ్ముతున్నారు కదా? అందుకే కద ఆ వ్యాసం రాశారు. మరి మీరు వెనకాడ్డం దేనికీ మీ మాటల్ని నిరూపించుకోవడానికీ?? మేము కూడా ఎదురు చూస్తాం అమెరికాలో ఉన్న ఆ ఒక చిన్న తెలుగుదేశాన తయారు కాగల ఒక మేలైన అవధాని కోసం!! ఆయన చతురతా ఇంకా అందులో తొణికే ఆ సమయస్పూర్తిల కోసం! ఆయన నోట చిందబోయే ఆ భాషా పాటవం కోసమూను. కానివ్వండి మరి.
ఇంక, ఆ గురివింద సామెత అదేదో అది ఈ సందర్భంలో మీకే ఎక్కువ అతికినట్టు ఎక్కడా మీకు తెలియకపోవడం ఇంకా హాస్యాస్పదం కాదూ! మాటలు విలువైనవి. ఎప్పుడైనా వాటిని జాగ్రత్తగా వాడండి.
నాకు స్పష్టంగా అర్ధం కాని అనేక అంశాలలో ఇదీ ఒకటి లక్ష్మన్న గారూ!! “అమెరికా సందర్శన భాగ్యం”?? నాకు తిరుపతి వేంకట కవులన్న మాట “నానా రాజ సందర్శనం” గుర్తుకొస్తోంది. ఆ నానారాజ సందర్శన “భాగ్యాన్ని” ఇవాళ్టి ఈ యెన్ ఆర్ ఐ సంస్థలూ వ్యక్తులూ కాని ఆక్రమించలలేదు కదా ?? 🙂 రామారావు గారి గొంతు ఆ వ్యాసంలో ఒక హేళన ధ్వనితోనే ఉన్నదని ఒక పాఠకురాలిగా నేను చెప్పగలను. అదే నాకు అభ్యంతరకరం. ఇంక ఎవరో ఒకానొక అవధాని చేతల మీదా దాని పర్యవసానం మీదా మనం దానిని అవధాన విద్యకి అనుసంధానంగా చూడకూడదని అనుకుంటాను. మనం ఒక కళని ఒక కళగా మాత్రమే చూడాలి. అంతవరకే విమర్శకుని బాధ్యత. వ్యక్తుల మీద కలిగిన కోపాన్ని లేదా ఏహ్యతనీ ఆ కళారూపం మీద చూపడం సరి అయినది కాదు.
ఇంక “సంగీత సాహిత్యాలు కొందరికి మాత్రమే పట్టుబడతాయి అన్న వాదనను ఖండించడానికి” ఈ మీ మాట సైతం కేవీయెస్ రామారావు వ్యాసం లోని గొంతు లాగానే ఉంది. 🙂
నేను సంగీత సాహిత్యాలు అందరికీ పట్టుబడేవి కావని నమ్ముతాను. అవి నేర్చుకుంటేనే అబ్బేవి కావు కూడాను. పూర్వ జన్మ సుకృతమో కాదో నాకు తెలియదు గానీ 🙂 అందరూ ప్రయత్నం చేసేస్తేనే కవులూ గాయకులూ మాత్రం అయిపోలేరు. అలాగే విమర్శకులు కూడా! అది వ్యక్తిలో అంతర్లీనంగా ఉన్న ప్రజ్ణ, లేదా ప్రతిభకి సంబంధించిన విషయమే!! మనం ఒప్పినా మానినా ఇది నిజం!! మనకి నచ్చినా నచ్చకున్నా కూడా ఇది నిజం!! అందరూ పోటీపడితేనే అబ్బేవి కావు కళలూ కవిత్వాలూ సంగీతాలూను. అలా ఎవరన్నా భావిస్తే దానిని ఒక ఉడుకుమోతుతనం గానూ ఒక అసూయాపరత్వం గానూ మాత్రమే అనుకోవాలి తప్ప యదార్ధంగా నిరూపించలేము. అదే నిజమైతే తెలుగు దేశానా ఈ పాటికి అల్లసాని పెద్దనలూ కృష్ణ శాస్త్రిలూ పుంఖాను పుంఖంగా తిరుగుతూ ఉండేవారే 🙂 యుగానికి ఒక మహా కవి ఉదయిస్తాడు. సూర్యుని లాగే!! మిగిలిన వారు ఆ చాయాపహారులు మాత్రమే!!
ఇంక అవధానుల మీద కలిగిన కోపాన్ని అవధాన విద్య మీదికి మళ్ళించుకోవడం అర్ధం లేని పని. “రోషము కల్గినన్ మమ్ము గెల్వుడు” అన్న చెళ్లపిళ్ల కవుల పద్యమే అవధాన విద్యా గరిడీలో విసిరిన సవాల్! అలాంటి సవాల్ విసరకల్గిన అవధానులు ఇవాళ లేకపోతే అది అవధానుల సమస్య కానీ ఆ విద్యది కాదు. ఇంక అమెరికాకి ఆహ్వానాలూ వారికి “అబ్బిన” లక్ష్మీ కటాక్షాలూ వారిని పిలిచిన వారికి తెలిసిన విషయాలే!! అదేమన్నా సంభావనలా?? వారు [అవి ఎలా చేసినా సరే :)] అవధానాలు చేయించుకుని మెచ్చి ఇచ్చిన కానుకలే కదా?? అంత సునాయాసమైనదే అయితే ఆటాలూ తానాలూ ఆయా అవధాన్లని పిలవడం దేనికీ?? వారిలో ఎవరో ఒకరు అవధానాలు మొదలెట్టి అందరూ సునాయాసంగా అవధానం చేయవచ్చును అని నిరూపించి ఉండవచ్చును కాదా?
ఈ వ్యాసావళి రాయటం వెనుక, అప్పటి “ఈమాట” సంపాదకులమైన మా మధ్య జరిగిన చర్చల మూలంగా ఏ పరిస్థితుల్లో ఈ వ్యాసాలు రాయటం జరిగిందో ఇప్పుడు చెప్పటం అప్రస్తుతం కాదనుకుంటాను!
సుమారు 1980 దశాబ్దం మొదలు అమెరికాలో జరిగే తెలుగు సభల్లో అవధానాల జోరు ఊపందుకున్నాయి. అవధానులకు అమెరికా సందర్శన భాగ్యమే కాక లక్ష్మీ కటాక్షం కూడా దండిగా ఉండేవి. ఈ సందర్భంగా మా మిత్రుల మధ్య వచ్చిన సందేహం – “ఎందుకు అమెరికా తెలుగువారు అవధానాలపై ఇంత ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు?
ఈ ప్రశ్నకి సమాధానాలు ఎలా ఉన్నా, అవధానాలు చెయ్యటం బ్రహ్మ విద్య కాదు అన్న వాదన ఈ వ్యాసాలకు మూల కారణం. తెలుగు పద్య సాహిత్యంలో లోతైన అవగాహన లేని నాకు ఈ వాదన ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికే మేము “ఈమాట” పత్రికను స్థాపించాం! మరి అవధానాలు చేయటం అంత బ్రహ్మ విద్య కాకపోతే – అది ఎంత సులువుగా చెయ్య వచ్చో నిరూపించండి అన్న నాలాంటి మిత్రుల సవాళ్ళకి సమాధానమే ఈ వ్యాసాలకి మూలం అని నాకు గుర్తు.
నిజానికి తిరుపతి వేంకట కవులంతటి సాహితీ వేత్తలు, అవాధాన ప్రక్రియను దొమ్మరి ఆటతో పోల్చిన విషయం తెలుగు సాహితీ ప్రియులకు పరిచయమయే ఉంటుంది! ఈ వ్యాసాల్లో హేళణ ధ్వని కన్నా, తెలుగు పద్యరీతుల్లోని చిన్న మెళకువలు నేర్చుకుంటే ఎంత సులువుగా అవధానం చెయ్యవచ్చో చెప్ప ప్రయత్నించారు వ్యాసకర్త.
ఇటువంటి ప్రయత్నమే సంగీతం విషయంలో కూడా జరిగింది. ఈ మధ్యే అకాలమరణం చెందిన శ్రీ రోహిణీప్రసాద్ రచించిన సంగీతపరమైన వ్యాసపరంపరలకు కూడా ఇదే ధోరణి మూలం. అంటే, సంగీత – సాహిత్యాలు కొందరికి మాత్రమే పట్టుబడతాయి. మిగిలిన వారికి పూర్వజన్మ “సుకృతం” ఉంటే కాని పట్టుబడవు అన్న వాదనను ఖండించటానికి చేసిన ప్రయత్నాలే – ఈ సాహిత్య, సంగీత వ్యాసాలు.
అంతేకాని ఒకరిని కించపరచాలన్న దుగ్ధ ఈ వ్యాస రచయితకి ఉందని నేను అనుకోను.
చివరిగా ఒక సంగతి. అమెరికాలో అవధానాలు చేసి, అమెరికా తెలుగువారు తమ నెత్తి మీద పెట్టుకున్న ఒక అవాధాని అమెరికా తెలుగు ఆడపడుచుపై చేసిన అప్రాచ్యపు పనికి చావు తప్పి కన్ను లొట్టపోయి ఆ అవధాని తిరిగి ఆంధ్రదేశం చేరుకున్నాడు. ఇది మటుకు నిజంగా జరిగిన నిజం.
కథ చాల బాగుంది. అవును, సుబ్బారావు గారు చెప్పినట్టు మెచ్చుకుంటే బాగుండేది. కాని మెచ్చుకోడు. ఆ పాత్ర స్వభావం అలాంటిది. రచయితకు ధన్యవాదాలు, చక్కని ముగింపు.
>> ‘శర్మిష్ఠ‘ (హైదరాబాదు కేంద్రంలో 1960 ప్రాంతంలో మరల రికార్డు కాబడినది. 1942 ప్రాంతంలో ప్రసారితమైన శ్రవ్య రూపకం మనకి ఈనాడు లభ్యం కాదు)
– అయితే అదే శర్మిష్ఠ నాటకానికి రెండు వేర్వేరు సమయాల్లో రజనీగారూ, విశ్వనాథం గారూ సంగీతదర్శకత్వం వహించారా?
ఇవ్వాళ రజనీభావతరంగాలు పుస్తకం చదువుతూంటే అందులో ఆయక “కృష్ణ-రజని” అన్న వ్యాసంలో “రజని సంగీతంతో తయారయి ప్రసారమైన కృష్ణశాస్త్రి తొలి సంగీత నాటకం శర్మిష్ఠ” అనీ, అది 1941 మార్చి 23న మద్రాసు కేంద్రం నుంచి ప్రసారం అయిందని రాశారు.
నా వ్యాఖ్య పానకంలో పుడకలా అనిపించొచ్చు కాని కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, కవితలోని “ఆచార్య సోమనాథ” ఎవరు? చుక్క గుర్తు పెట్టి మరీ యిస్తే ఆసక్తి కలిగింది.
మస్తానీ గురించి pavan santhosh surampudi గారి అభిప్రాయం:
10/14/2012 10:29 am
బాజీరావు-మస్తానీల అపురూప ప్రణయగాథ ఉత్తరభారతదేశవాసులకు పరిచయం ఉన్నంత దక్షిణాత్యులకు తెలియదు. కాని ఇదొక అపూర్వగాథ. అతను యుద్ధరంగంలో పోరాడిన ప్రతి పోరూ గెలిచిన జగదేక వీరుడు ఆమె అలౌకిక సౌందర్యం మూర్తీభవించిన అతిలోకసుందరి. నిజానికి ఈ గాథ షాజహాన్ ముంతాజ్ ల ప్రణయాన్ని మించి ప్రాచుర్యం పొందవలసింది. ఇద్దరి పరిణయాన్నీ చాలా చక్కగా వర్ణించారు.
రచయితలకు సూచనలు గురించి pavan santhosh surampudi గారి అభిప్రాయం:
10/14/2012 10:11 am
గత కొన్నాళ్ల నుండి ఈమాట చూస్తున్నాను. తెలుగు ప్రింట్ మీడియాలో గాని అంతర్జాలంలొ కాని ఈమాటకి సరితూగగల సాహిత్య పత్రిక లేదని నా అభిప్రాయం. ప్రత్యేకంగా నాకు ఇది ఒక నిధిలా ఉంది. పాత సంచికల ఖజానా ఎంత చదివినా మరిన్ని ఆణిముత్యాలు దొరికి నన్ను మురిపిస్తొంది. వేనవేల ధన్యవాదాలతో,
సూరంపూడి పవన్ సంతొష్,
తాడేపల్లిగూడెం.
కామేశ్వరరావు అభిప్రాయం”దీని వల్ల తెలుసుకోవలసిన నీతి: మాంత్రికుడితోనైనా పెట్టుకోండి కాని ఎప్పుడూ మేథమెటీషియన్ తో పెట్టుకోవద్దు! ”
కామేశ్వర రావు గారూ మీరాస్లోవ్ హొలూబ్ కవిత చెప్పన నీతిగూడా మహారాజశ్రీ మాంత్రికుడు గారూ పిల్లవాడైనా మథమాటిషియన్ తొ పెట్టు కొవద్దనే. మీరు డొమైన్ మార్చి ఆ బడి పిల్ల వాడికి తెలిసిన దాని కన్నాపెద్దలైన గణిత శాస్త్ర వేత్తల ను ఉట్టంకిస్తూ చెపుతున్న నీతి కూడా అదే. “ఆ మాయా జాలం తెలియాలంటే ” అని అంటం లొ మీరు మాంత్రికుణ్ణి సమర్ఢిస్తున్నారేమో నని భయం వేసింది. కాంప్లెక్స్ వేరియబుల్ మాంత్రికునికి తెలిస్తే ఆయన్ను అందులోనే ఓడించవచ్చు ఎందుకంటె అతని ప్రవృత్తి జాలం గానీ శాస్త్రం కాదు కాబట్టి. Thank God, you even with your counter example supported the spirit of Miroslav Holub’s poem.
నీతిని కొద్దిగా విస్తరిస్తే మాథమాటీషియన్ తొ నైనా పెట్టు కొవచ్చేమో గానీ అప్లయిడ్మాథమాటీషియన్ తొ అసలు పెట్టుకో కూడదు.
“అప్పుడు ఒక బడి పిల్లాడు “ఒకటికి మించిన విలువను Sine ఫంక్షన్ కి ఇవ్వగలిగిన తీటా ను సృష్టించమని అడుగుతాడు.”
పాపం ఆ మాంత్రికుడికి లెక్కలు బాగా రావు కాబట్టి ఓడిపోయాడు! Sin విలువ ఒకటికన్నా ఎక్కువయ్యే సంఖ్యలున్నాయి. అనంతం ఉన్నాయి! 🙂 ఆ మాయాజాలం తెలియాలంటే ఇది చదవండి:
దీని వల్ల తెలుసుకోవలసిన నీతి: మాంత్రికుడితోనైనా పెట్టుకోండి కాని ఎప్పుడూ మేథమెటీషియన్ తో పెట్టుకోవద్దు! 😉
మనకు దొరికిన తెలుగు ఛందోగ్రంథాలలో కవిజనాశ్రయము ప్రాచీనమైనది. పోతే ఎంత ప్రాచీనమైనదో తెలియదు. దీని కర్త 11వ శతాబ్దపు వాడంటాడు. ఇతడు తప్పక నన్నయ, నన్నెచోడుల పిదప వాడు (ఈ విషయాలను కొన్ని నా క్రౌంచపద వ్యాసములో వివరించి యున్నాను). కాని ఎఱ్ఱనకంటె ముందు వాడు (మధ్యాక్కఱ యతి). అంటే సుమారు 12వ శతాబ్దానికే సూర్యేంద్ర గణములు బ్రహ్మ విష్ణు గణములకన్న భిన్నమైనదని కవిజనాశ్రయము ద్వార మనకు విదితమైనది. సంగభట్ల నరసయ్యగారు చెప్పిన విధముగా సూర్యేంద్ర గణములు 14వ శతాబ్దము నాటిదంటే, కవిజనాశ్రయము ఎప్పుడు వ్రాయబడినది అనే ప్రశ్న ఉదయిస్తుంది. అదియును కాక భీమన ఛందము అని కూడ పిలువబడే కవిజనాశ్రయమునకు, తరువాత వచ్చిన అనంతుని ఛందము అని పిలువబడే ఛందోదర్పణమునకు మధ్య అంతరము అంత ఎక్కువగా ఉండదు. కాని యతుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతుని ఛందము ఒక రెండు శతాబ్దముల పిదప వ్రాయబడినదని భావించవచ్చును. నా ఉద్దేశములో నన్నయ నాటికి బ్రహ్మ, విష్ణు గణాలు, సూర్య ఇంద్ర గణాలు రెండు ఉండి ఉన్నా, తెలుగులో ఎక్కువగా సూర్యేంద్ర గణాలే వాడబడ్డాయి. అదియునుగాక పంపకవి వ్రాసినట్లు చెప్పబడే తెలుగు సీస పద్యాలలో సూర్యేంద్ర గణాలే ఉన్నాయి.
ఈ బ్రహ్మ విష్ణు గణాలు కూడ చాల ప్రాచీనమైనవి. సుమారు క్రీస్తు శకము 700 నాటికే బాదామి శాసనములో ఉండే కన్నడ త్రిపదిలో ఈ గణాలు వాడబడ్డాయి. మనకు లభ్యమైన కన్నడ పద్య శాసనములలో ఇది ప్రాచీనమైనది. అంటే ఆఱు, ఏడవ శతాబ్దముల నాటికే దేశి ఛందస్సు కన్నడములో నుండినది. సుమారు ఏడవ ఎనిమిదవ శతాబ్దపు ద్విపదలను పోలిన తెలుగు పద్య శాసనాలలో కూడ సూర్యేంద్ర గణములే వాడబడినవి, బ్రహ్మ విష్ణు గణములు కావు. అంటే ఈ రెండు భాషల మధ్య దేశి గణాలలో ఈ చీలిక నన్నయకంటె కొన్ని శతాబ్దాలకు ముందే ఉండినవి అన్నది నా ఉద్దేశము.
సాగించి పాడే గణాలకు ఒక పేరు కూడ ఉన్నది. చివర వచ్చే సూర్య గణములవంటి గణములను పద్మ గణములు అంటారు. అలా పొడిగించి పాడవలయు నన్నప్పుడు, దానిని ఒక S గుర్తుతో చూపిస్తారు. ఈ పద్మ గణములను గురించి నేను ఐదు సంవత్సరాలకు ముందు ఇక్కడ వివరించి యున్నాను.
ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు బసవ రాజు గారు. ఆయన సమవయస్కులైన సహాధ్యాయులైన ఇతర ఉపాధ్యాయులతో వాళ్ళ విద్యార్థి రొజుల్ని “మనం చదువుకోని రోజుల్లొ” అని గుర్తు చేసేవారు.
పురూరవ శబ్ద నాటకం రేడీయోలో ఏ సంవత్సరమో గుర్తు లేదు కాని ఇటీవల నా కజిన్ ఇచ్చిన cd ద్వారా viన్నాను. శ్రీమతి శారాద శ్రీనివాసన్, ఛిరంజీవి గార్ల నాటకంలో సంభాషణలు నన్ను ఏదొ వూహలొకాల లోకి తీసుకు వెళ్ళింది.
పోయిన ఏడే రోహిణీ ప్రసాద్ గారు న్యూయార్క్ కి వచ్చినప్పుడు కలవడం జరిగింది. ఆరోగ్యం గా ఉషారుగా ఉన్నేరు. ఇక్కడ హిందుస్తాన్నీ సంగీతం, సినిమా సంగీతం గురించి ఒక చిన్న సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఒక కీ బోర్డు ముందర పెట్టుకుని పాడుతూ, మాట్లాడుతూ, విపులీకరిస్తూ దాదాపు మూడు గంటల సేపు శ్రోతలని అలరించారు. మళ్ళా ఇండియా కి తిరిగిపోయేప్పుడు వస్తానన్నారు, కానీ రాలేకపోయేరు. ఇప్పుడిక ఎప్పటికీ రారు.
ఒక గొప్ప వ్యక్తికి కొడుకుగా వుండటం లో ఒక పెద్ద సమస్య వుంది. నాన నీడలోనుంచి బయటకు రావడం చాలా కష్టం. అది కూడా కుటుంబరావంత గొప్ప మనిషి నీడ నుంచి బయటపడి, తనకు తనుగా తన పేరు నిలబెట్టుకోవటం ఒక గొప్ప విషయం. సైంటిస్టుగా, సితార విధ్వాంసుడిగా, ఒక హేతువాదిగా, రచయితగా, సంగీతాన్ని, సైన్సు ని పామర లోకానికి పరిచయం చేసిన ఒక గొప్ప మనీషి శ్రీ రోహిణీ ప్రసాద్ గారు.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
హితుడు, స్నేహితుడు రోహిణీప్రసాద్ గారి ఆకస్మిక మరణము విభ్రాంతి కలిగించినది. హిందూస్తాని సంగీతముపైన, గాయకులపైన సామాన్య పాఠకలోకానికి అర్థమయ్యేటట్లు వ్యాసాలను వ్రాసినారు వారు. విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞులకు మాత్రమేకాక జనసామాన్యానికి తెలుగులో అందజేయాలని కృషి చేసినారు వారు. కుటుంబరావుగారి శతజయంత్యుత్సవ సందర్భముగా వారిని డిట్రాయిటులో ఒక మారు కలిసి సంభాషించినది నా మధుర స్మృతులలో ఒకటి. వారితో కలిసి ఒక వ్యాసము వ్రాయాలని అనుకొన్నఆశ ఈడేరక ఆలాగే ఉండి పోయినది. వారి ఆత్మ శాంతిల్లు గాక! విధేయుడు – మోహన
ఇక్కడ అంతా పెద్దవారు సంగీత జ్ఞానం ఉన్నవారు మాట్లాడుతున్నారు. నాకు పెద్దగా సంగీత జ్ఞానం లేకపోయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. త్యాగరాజు, అన్నమయ్య ప్రస్తావన వచ్చింది, మరి వారు రచించినవి భగవంతుని కీర్తిస్తూ, పొగుడుతూ, తెగుడుతూ కూడా వ్రాసారు. శాస్త్రీయ సంగీతం లో దాదాపు ౯౦% రచనలు భక్తి సంప్రదాయాన్ని అనుసరించి ఉన్నవే. మరి అందులో భావము వదిలేస్తే పరిపూర్ణత ఉంటుందా? నేను చిన్నప్పుడు వీణ ఒక తమిళ్ టీచర్ దగ్గర నేర్చుకున్నాను. ఆమెకు తెలుగు రాదు కాని తెలుగు లోనే వ్రాసి ఇచ్చేవారు. కాని ఏ రోజు పాడనే లేదు.అర్ధం కూడా చెప్పలేదు. ఏమైనా చెప్పినా అర్ధం అయ్యే వయసు కాదు కూడా. ఇప్పుడు మల్లి ౩౫ వస్త్రాల తరువాత సంగీతం ఒక తమిళ్ టీచర్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఆమెకు తెలుగు వాళ్ళంటేనే చిన్న చూపు. ఆమె దగ్గర ఉన్న తెలుగు వాళ్ళకి కూడా అదే ఉద్దేశ్యం. సో వాళ్ళు ఆమె ఏది నేర్పితే అదే కరెక్ట్ అనే రకం. కాని ఏమైనా సాహిత్యంలో దోషాలు ఉంటే సరి చేస్తే నచ్చదు.
నాకు భావముతో కూడి పాడితేనే తృప్తి. లేదంటే ఏదో ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ తో పాడించవచ్చు కదా? భగవంతుని నామ స్మరణ మనస్పూర్తిగా అవగాహనతో చేయటం వేరు, కాసేట్ ప్లే చేయటం వేరు కదా? అందుకే త్యాగరాజు, అన్నమయ్య వంటి వాళ్ళతో కంపేర్ చేయటం మంచిది కాదు. టెక్నికల్ ఎక్సలెన్స్ ఉండవచ్చు. కాని నాద ఉపాసకులు కావడం కష్టం.
నండూరి పార్ధసారధి గారు శ్రీపాద పినాక పాణి గారిని చేసిన ఇంటర్వ్యూ ఆసాంతం చదివాకా నాకు అర్ధమైన విషయాలు ఇవి. సాహిత్యం గురించి తక్కువగా శ్రీపాద వారు ఏమీ అనలేదు. ఆయన ఆ మాటల్ని అన్న సందర్భం అక్కడ పూర్తిగా వేరు. సంగీతకారులకి రాగం పాడేటప్పుడు దాని మీద ఎక్కువ శ్రధ్ధ ఉంటుందే తప్ప ఆ రాగానికి సహాయకారిగా ఉన్న అక్షరాల మీద ఏమాత్రమూ కాదు అన్నది శ్రీపాద పినాకపాణి గారి భావన. ఇది కృతుల లోని సాహిత్యానికి సంబంధించిన విషయమే గానీ విడిగా సాహిత్యం మొత్తానికి గానూ లేదా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులని గురించి గానీ ఆయన చేసిన వ్యాఖ్య కాదు. అలాగే సాహిత్య ప్రేమికులైన వారి అన్నగారు సైతం కావ్య సాహిత్యాన్ని కవిత్వాన్ని గురించి అన్నది కాదది. వాగ్గేయకారుల రచనలని మాత్రమే ఆయన ప్రస్తావన చేశారు “సాహిత్యం” అని అన్నప్పుడు. ఆయనకి కూడా – గానం లోని రాగ స్వరూపమే ముఖ్యం అంతే! అందుకు ఉపయోగపడే అక్షర సముదాయం కాదు. అందుకే సాహిత్యానికి ఎంతో అభిమాని అయిన ఆయనే వారి అమ్మాయి “డుబుక్కు” 🙂 లని పాడుతూ ఉంటే ఏమాత్రమూ పట్టించుకోలేదు. అందుకు ఇబ్బంది కూడా పడలేదు. “వాగ్గేయకారుల రచనలలో కవిత్వం గురించి వెతకడం దండగ” అన్న అభిప్రాయాన్ని ఈ శ్రీపాద బ్రదర్స్ వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు.
అందువలననే త్యాగరాజు మంచి సంగీతకారుడే గాని మంచి కవి కాదు అని వారు అనుకున్నారు. ఇందులో అంతగా విబేధించవలసిన అవసరం నా వరకూ నాకేమీ కనిపించలేదు. చాలా సార్లు ఆయన రచనలని విన్నప్పుడు అది నిజమే కూడాను అని నాకు అనిపించినది సత్యమే! అయితే అక్కడ త్యాగరాజు గారి ప్రధాన ఉద్దేశ్యం కూడా తన సంగీతమే తన రామ భక్తే! ఆయన కవిత్వం రాస్తున్నానని బహుశా అనుకోలేదేమో? లేదా ఆయనకి శక్తి చాలకనే కవిత్వం రాయలేదో లేక సంగీతానికి అవసరమైనంత అక్షరాలని చాలు లెమ్మని అనుకునే రాయలేదో మనం ఇవాళ చెప్పలేకపోయినా, సాహిత్యం దృష్ట్యా చూస్తే మాత్రం త్యాగయ్య తప్పక కిందిశ్రేణి కవి గానే అనిపించక మానడు. ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను శ్రీపాద వారి అభిప్రాయం కేవలం కృతులలోని కీర్తనలలోని సాహిత్యం మాత్రమే! ఆయనకి ఒక గాయకునిగా తాను పాడే కృతిలోని సంగీతమే ముఖ్యం గానూ సాహిత్యం ఆ తరువాతిది గానూ అనిపిస్తే అందులో విడ్డూరం నాకేమీ కనిపించలేదు మరి.
అయితే ఇది వాగ్గేయకారుల అందరి రచనలలోనూ పూర్తిగా నిజమా? అందులో కవిత్వం ఉండదా అంటే చాలాసార్లు ఉండకపోవడాన్నే మనం గమనించవచ్చు. ఒక్క అన్నమయ్య మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే ఒక సాహిత్య స్వరూపాన్ని సంపూర్తిగా ఆవిష్కారం చేయాలీ అంటే అది సంగీతపు జంజాటం లేని పక్షం లోనే సాధ్యం అని కూడా మనం చెప్పవచ్చు. అందువలననే సంగీతం కోసం పాడుతున్నప్పుడు సాహిత్యం గురించి పట్టించుకోనవసరం లేదని వారు అనుకున్నదీ, అన్నదీను. ఈ రెండూ రెండు రకాలైన విషయాలు.
ఐతే మరి మనకెందుకని సంగీతం పాడేవాళ్ళు అక్షరాలని చిత్రవధ చేసి పాడుతున్నప్పుడు చెప్పనలవి కాని బాధ కలుగుతున్నాదీ అంటే తెలుగు భాష లోని వాళ్ళకి ఆ భాష మీద ఉండే మమకారం అత్యంత సహజం! మనం దాని ఉచ్చారణలో ఎటువంటి అపసవ్యతనీ సహించలేం! కష్టం అది మనకి. అయితే అది సంగీతం పాడేవారికి మాత్రం సమస్య కావడం లేదు. అక్కడ వారి దృష్టి వేరు. గాయకులుగా వారు రాగానికే బాధ్యులు గానీ అక్షరానికి కాదలుచుకోవడం లేదు. వాళ్ళకి సంగీతపు పానం చేయడంలో రాగపు రసం గ్రోలాలి. సాహిత్యాన్ని పిప్పిగా పక్కకి పడేయడానికి వాళ్ళు వెనకాడటం లేదు అని మనకి పినాకపాణి గారి మాటలు తెలియజేస్తున్నాయి అయితే ఇక్కడ మళ్ళీ ఒక తేడా చాలా స్పష్టం గానే మనముందుకి వస్తూంది. అదేమంటే ఈ ఉచ్చారణా రీతి తెలుగు వచ్చిన వారిలో ఒక తీరుగా ఉండి మళ్ళీ పరాయి భాష వారి గాత్రంలో అదే కృతి మరొక తీరున పలకడం. ఇందుకు మాతృభాష అయిన వారు మరీ అంతగా తప్పులని పలకలేకపోవడాన్నే మనం కారణంగా అర్ధం చేసుకోవాలి.
అయితే ఇక్కడ భక్తి అన్న అంశం కూడా అంతే ముఖ్యమైనది. ఆ రామ భక్తే తనని నడిపించకపోయి ఉంటే అంతటి త్యాగయ్య కేవలం సంగీతం కోసమే ఏవో కృతులూ వర్ణాలూ అంటూ అల్లేవారా? త్యాగయ్య సంగీతానికి మూలమైన రామ భక్తిని మనం తక్కువ అంచనా వేయలేము. అయితే మళ్ళీ భక్తి భావం వేరు. సాహిత్యపు స్థాయి వేరూను. మనం ఈ రెండింటినీ కలిపి చూడకూడదనే నేననుకుంటాను.
అందువల్లనే “సాహిత్యం కావాలని అనుకునే వాళ్ళు సంగీతం వినడానికి రావడం దండగ” అని పినాకపాణి గారు అక్కడ అలా అన్నది. అది బయటకి కొంత కరుకుగా వినిపిస్తున్నా వారి సంగీతపు పరిమితి లోని సాహిత్యానికి సంబంధించి అది అక్కడ సత్యమే మరి. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తూందంటే వారన్న “సంగీతమూ సాహిత్యమూ రసమూ పిప్పీ” లాంటి పోలికలని ఒక విస్తృతార్ధంలో మొత్తం సాహిత్యానికి కాక పరిమితమైన అర్ధంలో కేవలం సంగీత రచనల వరకూ మాత్రమే అని మనం అర్ధం చేసుకోవాలి. అప్పుడు శ్రీపాద వారి అభిప్రాయం పట్ల అంత కోప ప్రకటన సాహిత్యం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేయనవసరం లేదని తెలుస్తుంది.
అయితే గాయకులు ఎక్కువాను కవులు తక్కువానా? అన్నారు మోహన గారు. మోహన గారూ! పినాకపాణి గారి మాటలని మీరు మిగతా చోట్లకి అంతగా విస్తృతపరిచి చూడనవసరం లేదు. వారు మంచి కవులు అయినప్పుడు వారు ఏది రాసినా బహుబాగుగా రాయగలరు. అక్కడ అది ఏ చోటైనా ఏ ప్రక్రియ అయినా ఎప్పుడైనా కవిత్వానిదే పై చేయి అవుతుంది. అలాంటి రచనల విషయంలో శ్రీపాద పినాకపాణి గారు కాదు కదా ఎవరేమన్నా అది ఒప్పదు. అలాగే ఆ రాసే వారి లోని ప్రతిభ అందుకు తగిన స్థాయిలో లేదంటారా అక్కడ అక్షరపు ప్రభావం ఏమీ ఉండదు. ఇంక సినిమా రంగమూ అక్కడి పారితోషికాలూ సంగీతపు సాహిత్యపు తూనిక రాళ్ళు కానేరవు. సినిమా రంగాన వారు ఉత్తమ కవులనైనా తక్కువగా కొనగలరు. డబ్బులు వస్తాయని అనుకుంటే ఒక డబ్బా సంగీత దర్శకుని ముందు డబ్బులు కుమ్మరించనూగలరు.
కాకపోతే పినాకపాణిగారు అన్నమయ్య విషయంలో మాత్రం అన్నమయ్య అక్షరం గురించి సరిగ్గా తెలియక నోరు జారారనే అనుకోవాలి. పినాకపాణి గారికి తెలుగు భాషా సాహిత్యాల గురించేమీ అంతగా తెలిసినట్టు లేదు. అన్నమయ్య గురించి అంటూ “ఆయన అచ్చతెనుగు రాసేడు” అనో లేదా త్యాగయ్య అక్షరాన్ని గురించి చెబుతూ ” త్యాగయ్య సంస్కృతమూ తెలుగూ కలిపి రాసేడు” అనో అన్నమాటలు మనకి ఏమీ ప్రత్యేకంగా చెప్పవు. దానికీ అన్నమయ్య గారి కవితా బలానికీ ఏమి సంబంధం? అన్నమయ్య గారు తన పద్నాల్గు లైన్ల పదాలలో అంత గొప్ప కవిత్వాన్ని పలికించడం అన్నది తప్పకుండా ఆయన అసమాన ప్రతిభకి తార్కాణమే! అన్నమయ్యకి బహుశా తన భావ ప్రచారం ప్రధానమూ సంగీతం అటు తరవాతా అయి ఉండాలి. లేదూ సహజం గానే కల్పనాచతురుడై ఉత్తమ భావుకుడైన ఆయన పరిమితమే అయిన తన పద చట్రంలోనే కవిత్వాన్ని అంత అలవోకగా ఒలికించి ఉండాలి. అన్నమయ్య గారి సాహిత్యం విషయం లో మాత్రం శ్రీపాద పినాకపాణి గారి అభిప్రాయం అయోమయంగానూ కాస్త తొందరపాటుగానూ అపరిపక్వంగానూ మిగిలిపోతుంది.
తః తః గారు, సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం.
నేను నా అభిప్రాయాన్ని క్రింది శ్లోకముపైన ఆధారము చేసికొని వ్రాసినాను –
సంగీత మపి సాహిత్యం
సరస్వత్యా స్తనద్వయం
ఏక మాపాత మధురం
అన్య దాలోచనామృతం
నా ఉద్దేశములో ప్రజలు ఎక్కువగా సంగీతాన్ని ఎందుకు ఆదరిస్తారంటే, దానిని వినేటప్పుడు సామాన్యముగా మరే ఆలోచన చేయనక్కరలేదు. కాని సాహిత్యపు సంగతి అలా కాదు. చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని కొద్దిగానైన ఏకాగ్రత చూపాలి. లేకపోతే ఏమి అర్థము కాదు. నా ఉద్దేశములో కవిత్వము పాడుటకు ఉపయోగపడేటట్లు మాత్రమే వ్రాయాలి. సంగీతము ఆ పాటలోని భావాన్ని బాగుగా బహిర్గతము చేయాలి. అప్పుడే ఆ సరస్వతీదేవికి సంతృప్తి కలుగుతుంది. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అంటే ఆ తల్లిని అవమానించినట్లే. విధేయుడు – మోహన
కామేశ్వర రావు గారు, అక్షర గణాలకు, అంశ గణాలకు గణ మేరువు ఒకటే, అనగా గురువులు లేని వృత్తము, ఒక గురువుతోటి వృత్తములు, రెండు గురువులతోటి వృత్తములు, ఇత్యాదులు. అక్షరమేరువులో ఒక గురువుతోటి వృత్తములన్నిటికి మాత్రల సంఖ్య ఒక్కటే. ఆ వృత్తాలలో వాటి స్థానములు మాత్రము వేరు, అంతే. కాని అంశగణములలో అలా కాదు. బ్రహ్మ గణములు ఉండే రెండవ ఛందములో గురువులు లేనిది III, ఒక గురువుతో రెండు UI, IIU, రెండు గురువులతో UU. ఒక గురువుతో ఉండే రెంటికీ మాత్రల సంఖ్య ఒకటి కాదు. ఒకే మాత్రల సంఖ్యతో ఉండే సంఖ్యలను కలిపినప్పుడే మనకు విరహాంకుని (ఫిబనాచ్చీ) అంకెలు లభిస్తాయి. అందుకే ఒకే మాత్రల సంఖ్యలు గల వృత్తముల సంఖ్యలను వేరుపరచవలసి వచ్చింది. అంశ గణములకు అక్షరగణములవంటి మేరువును నిర్మిస్తే అందులో గురులఘువుల సంఖ్య తప్ప యితరార్థములను ఇచ్చుటకు వీలు కాదు. విధేయుడు – మోహన
అవి రెండు ఆటవెలదులు (ఎత్తుగీతితో కలిపి మూడు) అని మాత్రం సులువుగా చెప్పవచ్చు 🙂
మీరు వివరించాక ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యిందండి ఆ పేరా. అక్షరగణాలూ, అంశగణాలూ, సమరూపాలే (isomorphic)! లఘువుతో మొదలయ్యే ప్రతి అక్షరగణానికీ ముందొక లఘువు తగిలిస్తే చాలు. అందుకే ఈ రెండు రకాల గణాలకూ నిజానికి గణమేరువు ఒకటే. మీరు అంశగణమేరువులో గురువుల సంఖ్య బదులు మాత్రా సంఖ్య తీసుకున్నారు కాబట్టి అక్షరగణ మేరువుకు రెట్టింపు వచ్చింది. ఇక్కడా గురుసంఖ్య తీసుకుంటే రెండూ సరిసమానం!
మరొక విషయం, పాఠకులు గమనించే ఉంటారు – అక్షర, అంశ గణ మేరువులు సుష్ఠైనవి (symmetrical). మాత్రాగణ మేరువు కాదు. ఎందుకో ఊహించడం పెద్ద కష్టం కాదు!
మోహన గారికీ, ఇంద్రాణి గారికి, రమగారికీ మీకు నా అనువాదం నచ్చినందుకు కృతజ్ఞతలు.
సాధారణంగా నేను అనువాదాలు చెయ్యడానికి ఇష్టపడను. అనువాదం ఒక ప్రత్యేక కళ. నాకది లేదని నా నమ్మకం.
ఈ బల్రాజ్ సహని వ్యాసం నాకు మిత్రుడు శ్యామ్ పంపిచారు. అది చదివాక ఆపుకోలేక ఎలాగయినా అందరికీ ఇది తెలియాలన్న తపనతో చేసిన అనువాదం.
ఎనభయ్యో పడిలో వున్నా, ఇంకా గెంతుతానూ, పలానా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుంది ( పెళ్ళి సభా మర్యాద, లోపల మాత్రం అనుభవించాలనే ) వంటి నటులున్న మనకి, ఇటువంటి ప్రసంగం వినే అదృష్టం ఎప్పటికయినా వస్తుందా? డాక్టరేట్లూ, బిరుదులూ అన్నీ అమ్మకానికి కొనుక్కునే నటచక్రవర్తులే నేటి యువతకి ప్రేరణ కలిగించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కనీసం నూటికొక్కరయినా ఇది చదివితే నా శ్రమ ఫలించినట్లేనని భావించాను.
రమగారూ, అనువాదం చేసేటప్పుడు సామ్యవాదమా, సమాజ వాదమాని కాస్త తర్జన భర్జన పడిన మాట వాస్తవం, సామ్యవాదం వాడకూడదని కాదు, సమాజవాదం బావుందనిపించింది. ముఖ్యంగా బల్రాజ్ సాహని చెప్పిన విషయాలకి. అంతకు మించి ఏవీ లేదు. మీరు చెప్పినదంతా నూటికి నూరుపాళ్ళూ వాస్తవం. రాజకీయ నాయకులు అన్ని రంగాలని ఆవరించుకోవడం వల్ల పట్టిన దౌర్భాగ్యం ఇది. ప్రజలు కూడా స్తబ్ధుగానే ఉంటున్నారు. ఎవరికి వారికి వారి పనయిపోతే చాలన్న ధోరణే ప్రస్తుత పరిస్థితులకి కారణం.
విజయ వర్ధన్ గారూ, మీరిచ్చిన లింకుకి థాంక్స్! భలే పట్టుకున్నారే!
తెలుగులో కంటే ఇంగ్లీషయితే బాగా ఎక్కుతుందనా?
మంచి వ్యాసము, ఎన్నో క్రొత్త విషయాలు తెలిసినాయి. ఆసక్తి ఉంటే ఏ విభాగములోనైనా రాణించవచ్చును అనే నమ్మకము కలుగుతుంది ఈ వ్యాసము చదివిన తరువాత. ఆ కాలములో తిరుపతిలో పినాకపాణిగారి సంగీత కచ్చేరి విన్నట్లు గుర్తు. 50 ఏళ్ల విషయము, అంశాలు గుర్తుకు రావడము లేదు. బ్రహ్మానందంగారికి అభినందనలు.
తఃతః గారు తెలిపిన వ్యాసాన్ని చదివినాను – అందులోని కొన్ని చర్చనీయమైన అంశాలను క్రింద ఇస్తున్నాను –
పాణిగారు: చెరకు గడను మెషీన్‌లో పెడితే ఏం వస్తుంది? రసం వస్తుంది. ఆ రసం సంగీతం, పిప్పి సాహిత్యం.
సం: కీర్తన చెరుకుగడ అయితే, సాహిత్యము పిప్పి, సంగీతము రసమూను, కీర్తన ఒక వర్ణ చిత్రమనుకొంటే, సాహిత్యము వర్ణలేపనాని కాధారమైన పటము మాత్రమే అని రాశాడు గోపాలకృష్ణముర్తిగారు (పినాకపాణి అన్న). ఇది 1951 భారతిలోని వ్యాసమట. నా దగ్గర ఉందో లేదో చూడాలి.
పాణిగారు: అవును, అంతే.
సం. కాని అన్నమయ్య సాహిత్యంలో ఈ మాదిరి ప్రాబ్లం లేదు కదా?
పాణిగారు: అన్నమయ్య సాహిత్యము అంతేనండి, అది కూడ అంతే. అన్నమయ్య సాహిత్యంలో అచ్చ తెలుగు ఎక్కువ. త్యాగయ్య తెలుగుతోబాటు సంస్కృతం కూడా కలిపాడు. అంతే.
నా కచ్చేరి జరిగిన మరునాడు వారిని (మంగళంపల్లి పట్టాభిరామయ్య) సమీపించి సలహా అర్థించగా “నేను 50 అసంవత్సరాలనుండి పెద్ద విద్వాంసుల పాట విన్నాను, వారిలోనున్న గుణవిశేషాలన్నీ మీలో నున్నాయి” అని మూడు క్షణాలు ఆగి “మరెక్కడా లేవు” అని గొంతు రెట్టించి అన్నారు.
అప్పుడూ, ఇప్పుడూ, బహుశా ఎప్పుడూ ఇంతే. కవులకన్న గాయకునికే అందరూ పెద్ద పీట పెడుతారు. సాహిత్యానికి సంగీతానికి ఒకే స్థానము కల్పించబడినా, సాహిత్యాన్ని చిన్న చూపుతోనే చూస్తారు. చిన్న సందేహం, సినీరంగములో గాయకునికి, కవికి ఒకే విధమైన పారితోషికమా లేక తరతమ భేదము ఉన్నదా? సంగీతమే అంత ప్రధానమయితే మఱుగేలరా ఓ రాఘవా కు బదులు లలలాలలా లా లాలలా అని ఎందుకు పాడుకోరాదో?
విధేయుడు – మోహన
జీవిత నవల – 1 గురించి Rajesh Devabhaktuni గారి అభిప్రాయం:
09/04/2012 2:03 pm
అసలు వ్యాసం తర్జుమా చేయబడినది అనే సంశయమే కలగలేదు, బాగా వ్రాశారు.
ఈ విధంగా తను చెప్పదలచుకున్న కథాస్వరూపాన్ని ఆకళించుకున్నాక, రచయిత వీథిన పడాలి – తన నాయకుడు నివసించిన ప్రదేశాలు, అక్కడి నైసర్గిక, వాతావరణ పరిస్థితులు …
…కాని నైసర్గిక పరిస్థితులు, మనం ఎవరి మీద / గురించి వ్రాస్తున్నామో, వారి కాలానికి, ఇప్పుడు వ్రాయబడుతున్న కాలానికి చాల వరకు మారే అవకాశం ఉంది కదా, అలాంటప్పుడు ఆ ప్రదేశాలకు వెళ్లి కేవలం చూడడం, పరీక్షించడం ద్వారా ఆనాటి నైసర్గిక పరిస్థితులను మనం ఏమి అవగతం చేసుకోగలుగుతాము…?
నా వ్యాసమునకు స్పందించిన పాఠకలోకమునకు వినయపూర్వకమైన వందనములు.
ఛందస్సు నిజముగా ఒక మహాసాగరమే, అది సంగీత, సాహిత్య, గణితాదులవంటి ఎన్నో జ్ఞానస్రవంతులను కలుపుతుంది. చెలియలికట్టపై కూర్చుండి ఆ అలలను చూస్తూ, తీరములోని సైకతముపై ఇసుకతో ఇండ్లు కట్టుతూ, ఒక చిన్ని గవ్వను, ఒక నత్త గుల్లను చూసి ఆనందపడే స్వభావము నాది.
ఈ సమయములో న్యూటన్ విజ్ఞాని ఈ వాక్కులు స్మరణియము – I was like a boy playing on the sea-shore, and diverting myself now and then finding a smoother pebble or a prettier shell than ordinary, whilst the great ocean of truth lay all undiscovered before me.
వేలూరిగారు, భూషణ్ గారు, ఛందస్సుపైన పుస్తకాలు తేవాలనే నా ప్రయత్నము కూడ. మీ ప్రోత్సాహానికి, సహాయానికి సదా కృతజ్ఞుడిని. తప్పు నాదే. సమయాభావము, తాత్సారము, అనారోగ్యము ఇత్యాదులు ఎన్నో కారణాలు.
రమ గారు, నాకు కూడ ఛందశ్శాస్త్రాధ్యయనారంభములో అన్నీ అయోమయమే. కాలక్రమేణ అర్థమయి నేడు కొద్దిగా స్వతంత్రముగా ఆలోచించే అవకాశము కలిగినది. సంస్కృత ప్రాకృత ఛందస్సులలో జ-గణానికి పెద్ద పీట. నవవిధములైన ఆర్య మాత్రమే (అందులో కందము కూడ ఒకటి) కాదు, పజ్ఝటికవంటి పద్యాలలో కూడ జ-గణమునకు గొప్ప స్థానము ఉన్నది. అందుకే దానికి నరేంద్ర అని పేరు. పాదాంతమునుండి తరువాతి పాదమునకు పదములను లాగుకొని వెళ్లడము మొట్టమొదట కన్నడ కవులు ఆరంభించారు, తరువాత తెలుగు కవులు అనుసరించారు. అందుకే పంకరుహ దళేక్షణ పం కరుహ దళేక్షణ అయినది 🙂 దేశి ఛందస్సులో సామాన్యముగా ఏ పాదానికి ఆ పాదము స్వతంత్రముగా ఉంటుంది. రగడలలో, ద్విపదలలో ఇది ఒక నియమము కూడ.
నా ఉద్దేశములో మొదట లఘువు తరువాత గురువు ఉండినప్పుడు, పదముల ఉచ్చరణలో ఆ మొదటి లఘువు సరిగా వినబడని కారణమువలన ఎదురునడకను కవులు, సంగీతకారులు ఆచరించలేదు అనుకొంటాను. కాని సంస్కృతములో సుప్రసిద్ధ వృత్తములయిన పంచచామరము, భుజంగప్రయాతము, శిఖరిణి మున్నగునవి ల-గారంభమే.
కామేశ్వరరావు గారు, నా బాల్యములో తెలుగులో పద్యాలు వ్రాయడానికి ఆరంభించినప్పుడు గణభంగము కాకుండ కాపాడుకోవడము ఒక గొప్ప కసరత్తుగా ఉండేది, కాని వాటిని చదవడము నాకే కష్టముగా ఉండేది 🙂 పద్యములలో లయ ప్రధానము. మీరుదహరించిన సీస పాదములో ఎదురు నడక ఉన్నది, కాని మనకు సుపరిచితమయిన సీసపు నడక అందులో లేదు. రెండు ఇంద్రగణములకు బదులు మూడు సూర్య గణములను ఉపయోగించవచ్చును. దీనిని ఆధారము చేసికొని ఒకప్పుడు సీసపద్యమును త్ర్యస్రగతిలో వ్రాసినాను. కాని దానిని సీసము అని చెప్పడము కష్టమే 🙂 అది –
సీసము-
ఆకసమ్ము వెలిగె నాకు ముదము గల్గె
చీక టంత తొలగె శ్రీలు జెలగె
వేకువాయె గనర వేగ పాట వినర
కేకి నటన మాడె కేక తోడ
ప్రాకటముగ బూచె వనమునందు విరులు
మ్రాకునందు గదలె నాకు లెల్ల
తోక నూపుకొనుచు తొంగి చూచె గపులు
దూకి నడచె లేగ దూడ లెన్నొ
ఆటవెలది (సీసము)-
నీకు లేవ నిపుడు నిజము సమయ మాయె
స్వీకరించు ప్రణతు లో కళాత్మ
నీ కరాబ్జముల ననేక వరము లిమ్ము
మాకు నగును గాత మంగళమ్ము
ఏది ఏమైనా ముఖ్యముగా పద్యమునకు ఒక తూగు ఉండాలి. వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లు పద్యం లయాత్మకం ఛందస్ అని చెప్పవచ్చును.
కామేశ్ గారు, స-గణమును ఎదురు నడక అని చెప్పలేము. చతుర్మాత్రలలో రగడలాటి మాత్రాఛందస్సులలో జ-గణమే నిషిద్ధము.
అక్షర గణముల వృత్త సంఖ్య తెలిసికొనవలసినప్పుడు, అందులోని గురు-లఘువుల సంఖ్య ఆ వృత్తము ఎన్నవ ఛందములో పుట్టినదో అనే విషయమును తెలుపుతుంది. మాత్రా ఛందస్సు విషయములో ఆ వృత్తపు మాత్రల సంఖ్య గురులఘువుల అమరికనుండి తెలిసికొనవచ్చును. అంశగణముల విషయములో ఒక వృత్తములో మొదటి అక్షరము గురువైనప్పుడు కష్టము లేదు, అందులోని మొత్తము అక్షరముల సంఖ్య ఆ ఛందపు సంఖ్య తెలుపుతుంది. ఉదాహరణకు, UII UII UII UU వృత్తము 11వ ఛందములో జనించినది. అక్షరగణములైనా, అంశగణములైనా ఇది 11వ ఛందమే. కాని వృత్తము లఘువుతో ప్రారంభమయితే, గురులఘువుల మొత్తము సంఖ్యనుండి ఒకటి తీసివేయవలయును. ఇది ఎందుకంటే మనము ఈ గణముల ప్రస్తారమును అప్పకవి తెలిపిన ఆ విధముగా చేసియున్నాము. ఉదాహరణకు, వృత్తపు గురులఘువులు IIII UII IIII UU అయినప్పుడు, ఈ వృత్తము 12వ ఛందమునకు చేరినది (లఘ్వాదిగా గల ఈ వృత్తపు మొత్తము గురులఘువుల సంఖ్య 13నుండి ఒకటి తీసివేయగా వచ్చిన ఫలితము). అక్షరగణరీత్యా ఈ వృత్తము 13వ ఛందమునకు చెందినది, అంశగణారీత్యా యిది 12వ ఛందమునకు చెందినది.
ఇలాంటి వ్యాసాలు, నాకు తెలిసినంతలో, తెలుగులో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి! చందో లక్షణ గ్రంథాలలో కూడా, సాధారణంగా, షట్ప్రత్యయాలు అక్షరగణాలకు మాత్రమే పరిమితం. వాటిని మాత్రాగణాలకే కాక, దేశీ ఛందస్సులో కనిపించే విశేష గణాలకు కూడా విస్తరించడం చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి, ఛందస్సూ గణితమూ – రెండిటి మీదా ఆసక్తి ఉన్న నాలాంటి వాళ్ళకిది మాంచి విందుభోజనమే! మన విద్యాలయాలలో Combinatorics పాఠం Coins, Cards బదులు ఈ షట్ప్రత్యయాలను ఉదాహరణలుగా తీసుకొని చెప్పే రోజులు వస్తే ఎంత బాగుణ్ణు!
“ఒక ఛందములో వృత్త సంఖ్య కావలసినప్పుడు, ముందు అది ఎన్నవ ఛందమో తెలిసికోవాలి. ఉదాహరణకు అది 12వ ఛందమనుకొందాము. …” అని మొదలయ్యే పేరా మాత్రం నాకు సరిగా అర్థం కాలేదు.
ఎదురునడక, దేశి గణాల గురించి. వ్యాసంలో చెప్పినట్టుగా ఒక లఘువుతో మొదలుపెట్టకుండా, ఒక గురువు లేదా రెండు లఘువులతో మొదలుపెట్టి ప్రస్తారం చెయ్యడం మూలంగా చాలా వరుకూ ఎదురునడక అరికట్టబడింది. అయితే, పద్యం మొదట లఘు గురువులు రాకపోయినా (అంటే త్రిశ్రగతిలో ఎదురునడక అనుకోవచ్చా?), IIU, UU వంటి గణాలవల్ల కూడా ఎదురునడకలాంటిది వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు రెండు సగణాలు వరుసగా వేస్తే (“అరెరే, అరెరే, వయసే” లాగ), అది ఎదురునడక లాగానే ఉంటుంది కదా (ఇది చతురశ్రగతిలో ఎదురునడక అనవచ్చా?). తెలుగులో యిది కూడా చాలా వరకూ పరిహరింపబడింది. అయితే తెలుగు గణాలను ఉపయోగించి కూడా ఎదురునడక రప్పించవచ్చు. ఉదాహరణకు:
రావూరివారి పుస్తకం ప్రస్తుతం నా దగ్గర లేదు కాని, సంపత్కుమారగారి తెలుగు ఛందోవికాసం ప్రకారం, మధ్యాక్కరలో మాత్రమే సూర్యగణాలైన III, UI బదులు వేరే గణాలు నన్నయ్యగారి పద్యాలలో కనిపిస్తాయి. గగ, స గణాలే కాక, భ, జ కూడా కనిపిస్తాయి! అలాగే ఇంద్రగణాలలో కూడా తేడాలున్నాయి. అయితే అవి నడకకు ప్రత్యేకతనేమీ ఇచ్చినట్టుగా అనిపించవు. అవి లేఖక దోషాలే అయి ఉంటాయని సంపత్కుమారగారు అభిప్రాయబడ్డారు. పాదం/పాదభాగం చివర ఉండే సూర్యగణాల బదులు గగ, స గణాలు వేస్తే నడక బాగుంటుందని నేను అంగీకరిస్తాను. ఉదాహరణకు, “కవనాల వ్రాసేను నీకై – కావ్యమ్ము లల్లేను నీకై” అన్నప్పుడు మామూలు మధ్యాక్కర నడక కన్నా ధార బాగుంది. అలాగే,
అన్న “ద్విపద” పాదాలు కూడా బాగున్నాయి.
వేరే చోట్ల మాత్రం నడక దెబ్బతింటుందని నా అభిప్రాయం. ఉదాహరణకు సీసపాదం చివర రెండు సూర్యగణాలకు బదులు స-స వస్తే నడక చెడుతుంది. అలాగే ఆటవెలది, తేటగీతులలో కూడా.
మోహనగారూ,
ఇంత అరుదైన, అద్భుతమైన వ్యాసాన్ని అందించినందుకు మనఃపూర్వక అభివాదనాలు, అభినందనాలు. మీ కృషికి జోహార్లు!
పండిత మహాశయా ఇదే నా పాదాభివందన శతం, అంగీకరించి నన్ను ధన్యుని చేయ ప్రార్థన. నిజమైన పండితుల రచన చూసే భాగ్యం ఇవాళ కలిగింది. భాషలోకాని ఛందస్సులో కాని గణితంలోకాని పిపీలకం కన్న కనాకష్టమైన వాడినే ఐనా మూటి మీద ఉత్తి ఇష్టం మాత్రం ఉన్న వాణ్ణి. అలాంటి నాకు మీ వ్యాసం అర్థంకాని మాట నిజమేకాని, చూసే అదృష్టం కలిగిందనే స్పృహ పాటి కలిగిన వాడిని. గణనాధ్యాయ మనే పేరు పెట్టేసుకొని ఏదో చేసేస్తున్నాననే ఆశ లావు పీక సన్నంగాడిని. ఐనా నా పాదాభివందనాలు స్వీకరించ మని అర్థిస్తున్న ఆశాజీవిని. తెలుగుకి తగిన ఉత్కృష్టత తేగలిగిన మీ లాంటి మహోన్నతులు మరెందరో రావాలని మా నల్లనయ్యను ఇందుమూలంగా ప్రార్థిస్తున్నాను.
చలం పుస్తకాలు, అవి సమాజం లో కలిగించిన సంచలనం మాట ఎలా ఉన్నా, ఆయన కూదా సగటు మాగవాడిలాగానే ప్రవర్తించాడు. భార్య అందరినీ, పుట్టింటిని, బంధువులని వదులుకుని తనకోసమే ఉంటే ఆయన మాత్రం శృంగారం, అదీ ఇదీ అంటూ ఇతర స్త్రీల వెనక తిరిగాడు. చివరికి ఆవిడ మనస్తాపం చెంది చనిపోయింది కాని, అసలు ఈ రాతలు చదివి ఆవిడే విముక్తి అనుకుంటూ ఇల్లు వదిలి వెల్లిపోయి ఉంటే ఎలా ఉండేదో?
అకౌంటేంట్ జనరల్ గా పదవీ విరమణ చేసి అమెరికాలో ఉంటోన్న శ్రీ ఎ.సత్యవర్ధన ఐ.ఎ.ఎస్. గారి సౌజన్యంతో రంజని, తెలుగులో ప్రథమ జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ పేరుతో 2008 నుంచీ ‘రంజని-విశ్వనాథ పద్య కవితా పోటీలు’ నిర్వహిస్తోంది. 2012 సంవత్సరానికి ‘నేటి నిజం’ దిన పత్రికతో కలసి ఈ పోటీలను సమ్యుక్తంగా నిర్వహిస్తోంది.
ప్రధమ బహుమతి 2,000 రూ.లు. ద్వితీయ బహుమతి 1,500 రూ.లు. మూడు ప్రత్యేక బహుమతులు 1,500 రూ.లు + యోగ్యతా పత్రాలూ.
నిబంధనలు:
*ఏ చందస్సులోనయినా ఒక అంశం మీదే 12 పద్యాలకు తక్కువ కాకుండా ఉండాలి.
* ఇంత వరకూ ప్రచురణ, ప్రసారం కానివై వుండాలి.
* ఎన్ని శీర్షికలైనా పంపొచ్చు.
* పద్య కవితని, హామీ పత్రాన్నీ వేరు వేరు గా రాసి పంపాలి. పద్య కవిత ఉన్న కాగితం పై పేరు, విలాసం ఏదీ రాయకూడదు.
ప్రధాన కార్య దర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, ఏ.జి. ఆఫీస్, హైదరా బాద్ – 500 004 అనే చిరునామాకి 31.8.2012 లోగా అందేలా పంపాలి.
చీకోలు సుందరయ్య (అధ్యక్షులు)
90300 00696
మట్టిగుంట వెంకట రమణ
ప్రధాన కార్యదర్శి
93968 40890.
‘ఆధునికత’ అంటే ఎలాంటిది. అమ్మానాన్నల్ని లంగా, ఓణీలతో బడికి వెళ్తున్నప్పుడు చూసిన కళ్ళతో కాక కోకా రైకలతో ఇద్దరు ఎదిగిన పిల్లల్ని పక్కనుంచుకుని, వారసత్వపు చట్టాల పరిజ్ఞానంతో ఆస్తులు పంపకానికి వచ్చినప్పుడు చూసే కళ్ళతో చూడటం లాంటిదా? వాల్మీకినీ, నన్నయనీ ఇప్పుడు యెలా చూడాలి? ‘మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక’ అన్నాడు త్యాగరాజు. ఆయనని ఇప్పుడు యేం చేద్దాం?
జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి గురించి నేనింతకు ముందు కొంత విన్నాను. కొందరు ప్రముఖులు ఆయన గురించి రాయగా చదివాను. కానీ, నేనెప్పుడూ ఆయన రచించిన పుస్తకాన్ని చూడలేదు. చదవలేదు.
అలాంటి జరుక్ శాస్త్రి గారు! ఎంత మంచి కథ రాసారూ!? అని ఆశ్చర్యమైంది, అబ్బురమైంది- నాకు. ఈ కథ పూర్తిగా చదివాక, నా మనసుకేమీ తోచనట్టైంది. ఉక్కపోతేసింది. కాసేపు చల్ల గాలి కావాలనిపించింది. కారణం -ఆ స్త్రీ మూర్తి నా కళ్ళ ముందే – మంటల్లొ పడి కాలిపోయిన భావన వల్ల కావొచ్చు. అలా అని ఈ కథ బాగుంది అని పొగిడినా, లేదా -, ఈ రచయిత ఆ కారెక్టర్ ని భలే అద్భుతంగా చిత్రీకరించాడని సంబర పడ్డా, అది చాలా దుర్మార్గ గుణమై పోతుంది.
కారణం – ఇది కథ కాదు. జీవితం. ఇందులోనివి పాత్రలూ కావు. అవి అచ్చు- పోత పోసిన మనం. మన్లోని మన మొచ్చి ఇక్కడ మనకెదురుగా కనిపిస్తున్నట్లుంటాయి. ఎప్పుడూ ఎవరమూ చూడని సంకుచితాలు హనుమంతునిలో తాండవమాడుతున్నట్టుంటాయి.
ఈ రచనలో పాఠకులని కదిలించే విషయం ఏమిటంటే: ‘పెళ్ళినాడే మొగుడు. ఆ తర్వాత యముడు..’ అనే పెద్దల పెద్ద సూక్తి మనకుచప్పున స్ఫూరణకొస్తుంది- ఈ రచన చదివాక! ఆనాటి హనుమంతరావు – అప్పట్నుంచీ కథలోనే కాదు, ఇప్పటికీ ఈ సమాజంలో (చావకుండా) ఇంకా ఇంకా బ్రతికే వున్నాడు. విషాదమేమంటే – అప్పట్నుంచి వరసగా చస్తోంది కేవలం నరసమ్మ లాంటి భార్యలు మాత్రమే! పెళ్ళి పేరు మీద హోమ గుండానికి ‘ పవిత్ర బలి’ అవుతున్న నరసమ్మ వంటి ఇల్లాళ్ళు నానాటికీ సంఖ్యా పరంగా పెరుగుతున్నారే తప్ప తరగడం లేదనేది అక్షర సత్యం. కాదు, అంకెల సాక్ష్యం.
అందుకే ఈ కథ 60 యేళ్ళ తర్వాత చదువుతున్నా, – ఈ రచన ఈ కాలందే అని తోస్తుంది. ఇప్పుడే తాజాగా రాసినట్టుంటుంది. రాతి యుగం నుంచి, నేటి యుగం దాకా మానవ జీవనం లో ఎన్నెన్ని ఆధునిక మార్పులు జరిగినా, మారంది మాత్రం ఒకటే – స్త్రీ సామాజిక స్థితి. “స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకానికి నిజమైన సమాధానం వుందా? వుంటుందా? ఈ అంశం మీద రాసిన కథే ఈ హోమ గుండం. కథకి భాష్యం ఈ వాక్యం.
‘కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి. – అని మీరన్నారు కానీ, నా కైతే ఈ కొటేషన్ ఆరంభం లో వుండటమే నూటికి నూరు పాళ్ళు సమంజసమనిపించిందండీ! (కారణం. వ్యక్తి గతం కావొచ్చు. నాక్కూడా ఇలా ప్రముఖుల జీవన సత్యాల సూక్తుల్ని ముందుంచి కథలు రాయడం అంటే ఎందుకో ప్రియం! కథకి మంచి పట్టు వుంటుందనిపిస్తుంది. ఇది కేవలం నా వ్యక్తిగత ఇష్టం మాత్రమే.)
ఇది మాత్రం నిజం: మీకు నచ్చిన కథగా ఇది ఈమాట లో చదవకుంటే అస్సలకీ కథ నేనెప్పటికీ చదివే అవకాశం నాకు వచ్చుండేది కాదు. నరసమ్మ- నా కళ్ళల్లో కన్నీరై మిగిలేదీ కాదు. ఇది మాత్రం నిజం.
ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే ఈ కథ మీకు నచ్చిన వైనాన్ని చదివి, ఇంప్రెస్సయి – అప్పుడు కథలోకి వెళ్ళాను. ఆ వివరణే లేకుంటే ఈ శాస్త్రి గారి కథ చదవడాన్ని పోస్ట్ పోన్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత చదవనూ చదివేదాన్ని కాదు. ఇంత గుర్తైన జ్నాపకం మిగిలేదీ కాదు. ఇది వాస్తవం.
అసలు కధ లో కొస్తే: హనుమంత రావు లాంటి మగాళ్ళు కొందరు గొప్ప కోసం ఇలాంటి సాహసాలు చేసి ఆ తర్వాత తెగ పశ్చాత్తాపంలో ముణిగి తేలుతారు. ఆ మూణ్ణాళ్ళ ముచ్చట తీరాక ‘ఆపరేషన్ తర్వాత వెన్నుకి పొడిచిన మత్తు వొదిలి, కేవలం నొప్పి మాత్రమే మిగిలిన పేషెంట్ లా గిలగిలా కొట్టుకుంటాడు. ఆశయం కోసం ప్రయాసగా ఆశ్రయించిన కరుణా, జాలి, ఉన్నత తత్వం అంతా కూడా దయ్యం వొదిలినట్టు వొదిలి, ఇహ అసలు స్వరూపం చూపిస్తారు. ఇట్లా! హనుమంతునిలా! ఇతగాడు పెళ్ళి చేసుకోకుంటే నరసమ్మ గారు ఏ పాచిపనో చేసుకుని హాయిగా బ్రతికుండేది కాదూ? ఈయనగారూ చేసుకున్న ‘వెధవ వివాహం వల్ల కాదూ’ దహనమై పోయిందీ!? అనే నిజాన్ని నిగ్గు తేల్చారు శాస్త్రి గారు!
ఏ కాలం కథా? ఇదెప్పటి కథా!? ఈ హోమ గుండం 1945 కాలం నాటిదైతే మాత్రమేం ఈ నాటి పురుషహంకార ప్రపంచానికి చక్కగా మచ్చ లేని అద్దంలా నిలుస్తుంది.
వేలూరి గారి మాటల మీద నాదొక మాట: ‘అయితే, హనుమంతరావులో నరసమ్మ పరంగా ఎందుకు అసహ్యం కలిగిందో చెప్పటం కష్టం. అతనికి చిరాకు పెరగటం, చివరకి నరసమ్మని కొట్టడం కూడా జరుగుతూంది; అనుమానంతో!‘ అని మీకు అనిపించింది కానీ నాకైతే ఆ కారణం శుభ్రంగా కళ్ళక్కట్టినట్టు కనిపించనూ కనిపించింది.
* ఎవరో దోస్త్ ఏదో అనుంటాడు. ‘తొందర పడ్డావురా. వ్రతం చెడ్డా ఫలం దక్కాలని. ఎలాగూ ఆదర్శ వివాహం చేసుకునే వాడివి. పెళ్ళం వెనక కాసింత వున్న దాన్ని చేసుకుంటే కష్టాలుండేవి కావుగా అంటూ ఫలానా వారమ్మాయిని ఉదహరించి వుండొచ్చు. లేదా ఆ బుధ్ధి హనుమంతుని లోనే కలిగీ వుండొచ్చు. (కోతి కదా!, పురుషుణ్ని కాదు నేనంటోంది. అతని బుధ్ధిని.)
‘ఆర్యసమాజపు సంస్కర్తలని విమర్శిస్తున్నాడో, సమాజంలో గొప్ప కోసం వేసుకున్న అభ్యుదయపు ముసుగులో ఇమడలేక నలిగిపోయే అసమర్థులను ఎత్తిచూపుతున్నాడో – రచయిత ఉద్దేశ్యం మనకు అర్థం కాదు. ‘- వేలూరి గారు.
* ఎవర్ని విమర్శించినా, ఇంచకున్నా ఒక కుత్సిత మనస్కుణ్ని మన ముందుంచారు రచయిత. ఇంకా నిజం చెప్పాలంటే – ఒక స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోగల మనస్తత్వం కేవలం ఒక పురుషునికి మాత్రమే సాధ్యం అనే నాలాంటి వారి ఒక అంచనాని, ఇక్కడ ఈ రచయిత అక్షర సాక్షిగా నిరూపించారు.
రచనలో రవ్వల్లాంటి మాటలివి:
* నా కోసం అనే ముక్క ప్రేమ ఉన్న చోట యెంత దివ్యాస్త్రమో, కాని చోట అంత విషం. (నాకెంతో అద్భుతం అ నిపించిన కొటేషన్ ఇది.)
* కోపం మీద ఉన్నప్పుడు సర్వేంద్రియాలు బెదిరిన ఫుర్రల్లాగా పనిచేస్తై.
* తాను ఏంచేసినా తప్పే అవుతోంది. పోనీ – యిది చెయ్యి. నాకు యిలాగ వుండాలి అనడు. తన బుధ్ధికి తోచినట్లు చేస్తే – పురుగేరినట్లు మాట్లాడతాడు. (దరిదాపు ఈ కథ రాసి అరవై యేళ్ళు కావస్తోంది. ఇప్పటికీ సగటు మగవాని మనస్థత్వం ఈ పంధా లోనే సాగుతోంది)
* బందిలి దొడ్లో పడ్డా ఆవులాగా ఆమె ఆ రాత్రి ఏమీ తినలేదు. సుఖపెట్టి సుఖపడదామంటే- లోకంలో చోటు తక్కువా.
* దేవుడి పఠాలకు హారతి వెలిగిస్తుంటే- చీర అంటుకుని నరసమ్మ చచ్చిపోయిందటా అనుకున్నారు! (భార్యని చంపేసిన – ప్రతి మొగుడూ చెప్పే కారణం ఇలాగే వుంటుంది.)
ముగింపు – స్త్రీ లోకాన్ని ఆవేశానికి గురి చేస్తుంది. ఆలోచింప చేస్తుంది. పొరబాటున హనుమంతుడి వంటి వాణ్ణి వివాహమాడినా నరసమ్మలా చావకూడదు అనే నిజాన్ని చెబుతుంది.
నా కితాబు: కథలందరూ రాస్తారు. అందరు రాసేవీ అవే అక్షరాలు. కాని, కొందరి చేతుల్లోనే అవి జీవితాలవుతాయి. గుండె మీద రాలి పడే కన్నీటి పుష్పాలవుతాయి.
ముగింపు: రచయిత శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ( జరుక్ శాస్త్రి ) గారికి అంజలి ఘటిస్తూ.. తనకు నచ్చిన ఈ అపురూప కథని ఈ మాట పాఠకులకందించి, సాహిత్య పిపాసుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు గారికి కృతజ్ఞాభినందనలు తెలియ చేసుకుంటూ,
రామారావు గారూ!! దబాయించవలసిన అవసరం నాకేమీ లేదు. మీరు అంత ఎమోషనల్ గా మాట్లాడ వలసిన పని కూడా లేదు. ఇది విమర్శకి సంబందించిన విషయం. “ఆధునిక” దృష్టి కానిది అసలు ఎలా ఉంటుందో అన్న వెటకారపు గొంతుని మీరే ప్రదర్శించారు. అందుకు మనం ఎంతగా ఈ “ఆధునికత” ని నెత్తిన వెసుకుని మోస్తున్నదీ నేను చెప్పవలసి వచ్చింది. సమస్య నాకేమీ లేదు. ఆధునికంగానే క్లాసిక్స్ తాలూకు పరిశీలన ఉండాలని, ఉంటుందనీ మీ భావన కావొచ్చు. అందువలనే ఆధునికత లేనిది అసలు ఎలా ఉంటుందో కూడా మీరు ఊహించలేకపోయారు మరి. ఇంతకీ అది తెలియనిదీ అర్ధం కానిదీ మీకే గనక అది మీ సమస్య. నా సమస్య కాదు. ఇంక వ్యాసకర్తకి ఈ అనువాదకుని సహాయం అంత అవసరం లేదనుకుంటాను తన వ్యాఖ్యానానికి గానీ తన విశ్లేషణకి గానీ! బ్రిటీషు విద్యలు “ఆధునిక మైనవని” మనదేశం లోని “ఆధునిక” ప్రభావాలకి కారణం ఇంగ్లీషు విద్యలని నేనే చెప్పనఖ్ఖర లేదు. అది నారాయణ రావు వ్యాసమే చెబుతున్నది. ఆయన శీర్షికా అదే! విశ్లేషణా అదే!! విషయమూ అదే!! మీరు అన్నీ కట్ట కలిపేసి దెబ్బలాటకి దిగుతున్నారు మరి ఎందుకో?? నేను అన్న మాటలకి సంబంధించి మాత్రమే నేను మాట్లాడగలను గానీ మీరు చేసే రకరకాల వ్యాఖ్యానాలకి నేను బదులు ఇవ్వను. వ్యాసం లోని విషయాలకీ వివరాలకీ వ్యాసకర్త మాత్రమే భాద్యుడు గానీ అనువాదకుడు కాదు. అది మీ వ్యాసం కాదు కద.
మీకు ఆధునికం కాని విషయాలూ వ్యాఖ్యానాలూ ఉంటాయనీ వాటికి కూడా అంతే విలువ ఉంటుందనీ తెలిస్తే నా అభిప్రాయం అర్ధం అవగలదు. మీరు అన్నమాటకే నేను జవాబు ఇచ్చినది. మీరసలు ఆ మాటే అనలేదని అంటే అక్కడే అచ్చు అయి ఉంది మీ అభిప్రాయం. వెనక్కి వెళ్ళి మరోసారి మీ అభిప్రాయాన్ని చదువుకోగలరు.
రామారావు గారు పోలాక్ గారి ప్రస్తావన తెచ్చారు గనుక మాత్రమే నేను ఇది కూడా ప్రస్తావన చేస్తున్నాను. పోలాక్ గారి వ్యాసం “crisis in the classics” లో పోలాక్ తనని తాను “non-modernist” గా సంభావించుకుంటూ, ప్రపంచం మొత్తం మీద classics తాలుకు భవిష్యత్తు ని గురించి తన భావాలనీ తన ఆందోళననీ కూడా చెప్పారు. విశ్వవిద్యాలయాలలో classics ని బోధించగలిగిన వాళ్ళు క్రమేపీ తగ్గిపోతున్న వైనం గురించి ఆయన బాధ పడ్డారు. non-brahminism, islamophobia లాంటి ethno chauvinist movements ప్రభావాలని ఆయన ప్రస్తావన చేసారు.
నారాయణ రావు వ్యాసంలో పోలాక్ చూసే ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా అని రామారావు గారు అనుకోలేదు. మనకి “ఆధునికత” అంటే అర్ధం కాని ఒక మోజు, అలా మాట్లాడక పోతే ఏమన్నా వెనకబడిపోతామేమో అన్న భయం, అంధ విశ్వాసం లాంటి ఆరాధనా భావం [హీరో వర్షిప్] వెరసి విమర్శకి తలుపులు మూసేస్తున్న ధోరణి బాగా పెరిగి చివరికి ప్రతిదాన్నీ ఆధునికతా ముసుగు కప్పి మాట్లాడటాన్ని ఒక తప్పనిసరి విధానంగా చేసుకుంటున్నాం!
అసలిప్పటిదాకా మనం ఎవ్వరం కూడా “ఆధునికత” అన్నదానిని మన సమాజాలకి సంబంధించి ఇధమిథ్థంగా నిర్వచించి చూసుకున్న దాఖలా ఎక్కడా కనిపించదు. అది ఫలానాగా స్పష్టపడనిదే మన సాహిత్య విమర్శ గతి కూడా నిజం గా స్పష్టపడదు.
రమ.
నోట్ : పై అభిప్రాయం లో కలిపి రాయాలని అనుకున్నా అప్పటికే type చేసిందీ అచ్చు తప్పులు దిద్దుకున్నదీ కలిపి శ్రమ అవడంతో ఆపివేసాను. గనుక దీన్ని నా పై అభిప్రాయానికి కలగలుపుకుని చదువుకోమని మనవి.
‘వాల్మీకమూ అవాల్మీకమూ అయిన రచనలని పోల్చి చూసి వచ్చిన మార్పులని సవివరంగా తెలిపే పరిశీలన మనకి రాలేదు‘: rama bharadwaj అభిప్రాయం.
ఈ విషయాన్నె నేను మరొక రకంగా చెప్పాను కొచెం తీవ్ర ధోరణిలో ఊర్మిళా దేవి నిద్ర, సీత గడియల మీద వ్యాసాలు చదివి అభిప్రాయాలు చెప్పినప్పుడు.
వాల్మీకి రాసిన దానిని మాత్రమే (సాంకేతికంగా) ‘రామాయణం’ అనాలి. గణిత శాస్త్రాలలో వాడే ‘దూర సూచి’ ‘Metric / Distance Function’ లాంటి ఒక సమంజసమైన కొలమాన పరికరాన్ని సాహిత్య విమర్శ కూడా తయారుచేసుకోవాలి. మూలం నుంచి అనువాదం గానీ, కొత్తగా ఆ పాత్రల పేర్లూ, వాతావరణమూ ఉంచుతూ రాసిన కల్పనలు గానీ, వాటి ఆధారమైన రచన నుంచి యెంత దూరంగా ఉన్నాయి అన్నది చర్చకు చాలా అవసరం. ఊర్మిళా దేవి నిద్ర, సీత గడియ లాంటి వాటిని రామాయణ పాటలని / కథలని/ గాధలని అనటానికి వీలు లేదు అని రాశాను [ఇక్కడ వాటిలొ ఉన్న రస విషయాలతో సంబంధం లేదు]. రచయిత తను రాసినదానికి ‘రామాయణ కల్పతరువు’ అని పేరు పెట్టుకొవచ్చు, వానికి ఆ స్వేచ్చ ఉంది. విమర్శకులు ‘దూరాన్ని’ ఎంచకుండా ఆ రచన కు ‘రామాయణ’ సంబంధం పెట్ట గూడదు. ఇది కొంచెం కష్టమైనదే గానీ అట్లా కాని పక్షంలో విమర్శకు శాస్త్రీయత ఉండదు. నేనొక ప్రశ్న అడిగాను – రామాంజనేయ నాటకం [గయోపాఖ్యానం] రామాయణ [మహాభారత] కథ అవుతుందా అని. మూలాన్నించి దూరాన్ని యెంచి ఈ విషయాన్ని గురించి చెప్పకుండా చెప్పే ‘రామాయణ రి టొల్డ్’,’ రామాయణ క్వస్చెండ్’ లాంటి వాటికి అర్ఠం లేదు. వాల్మీకి రామాయణాన్ని గానీ దానికి ‘తగినంత చేరువ’ లో ఉన్నవాటిని గానీ చేసిన శాస్త్రీయమైన యే రకమైన పరిశీలన అయినా అభిలషణీయమే. అటువంటి దానిని మాత్రమే ‘రామాయణ’ అన్న మాటతొ అభివర్ణించడం సబబు. ఇతరములకు వాల్మీకి అనే కవి రాసిన కావ్యంతొ ఏ రకమైన సంబంధమూ అంట కట్ట గూడదు. అలాచేస్తే దాన్ని ఒకరకమైన మోసం గానే అనుకోవాలి.
రామారావు గారూ! నా అభిప్రాయాన్ని కూడా నేను మరి కొంచెం వివరించి రాసి ఉండవలసింది. నేను ఎక్కువ సేపు టైపు చెయ్యలేకపోవడం ఒక కారణం కాగా అభిప్రాయాలనే వ్యాసాలుగా విస్తరించి రాసే ఆసక్తి లేకపోవడం మరొక కారణం కావడంతో క్లుప్తంగానే నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.
మీరే అన్నారు ” ఆధునిక” దృష్టి కానిది ఎలా ఉంటుందో నాకు అర్ధం కావడం లేదు అని. ఇది చెప్పడం లేదా మనం ఎంతగా ఈ “ఆధునిక ” స్పృహలో కూరుకుని పోయామో తెలుసుకోవడానికి? మీ ఉద్దేశ్యంలో “ఆధునికత”ని ముందు స్పష్టపరచండి. అసలు మనం ఏ పాటి “ఆధునికులమో” తెలుస్తుంది. అది అటుంచితే ఎందుకని మనకి విమర్శ తప్పనిసరిగా ఇంగ్లీషువారి మార్గాన్ని అనుసరించి వారిని ఉల్లేఖిస్తూ వారి మార్గంలో వారికి ఒప్పుదలగా సాగడం ఒక ఆనవాయితీగా మారిపోయింది? ఇది తప్ప వేరే మార్గం ఎందుకని లేదని మీరు అనుకుంటున్నారూ? మనకి ముందున్న ప్రమాణాలాన్నీ వట్టిపోయినవేననీ మన సమకాలంలోని అమెరికన్ విశ్వవిద్యాలయాలలోని విమర్శ మాత్రమే బలమైనదనీ ఎలా భావిస్తున్నారూ? దీన్నే “అంటగట్టడం” అని అంటాం. నాకు పోలాక్ ఏం చెప్పేరో ఎంతగా తెలియాలో అంతకన్నా ముఖ్యంగా భవభూతి ఏమని అనుకున్నాడో కూడా అంతే ముఖ్యంగా తెలియాలి. నాకు “కాలస్పృహ” లేదు. ఆ ప్రమాణంతో నేను ఆధునికతనే తప్పనిసరి కొలమానంగా ఎంచను. అందునా సాహిత్యంలో అసలే లేదు.
పై వ్యాసంలో ఎంతగా నారాయణ రావు తెలుగున వచ్చిన పాత రామాయణాల ప్రస్తావన తెచ్చినా ఆయన విశ్లేషణ చేసింది మొత్తంగా వలస పాలన ప్రభావంతో మారిన ఆధునికుల చూపుని గురించే! ఇది ఒక ఫ్యాషన్. ఇదేమీ సత్యమూ శాశ్వతమూ కానఖ్ఖరలేదు. నేను భాగవతం లోని కృష్ణుని ప్రస్తావన తెచ్చినది ఎందుకంటే ప్రతిలో లేని దానిని మనం వ్యాఖ్యానం చెయ్యడం కాదు. కవి చెప్పిన దాని మీద మాత్రమే మాట్లాడటం విమర్శకి ముఖ్యం గనక. ఆ వ్యాసంలో చేసిన పని అదే! అంతే గానీ రామాయణాన్ని ఆధునికంగా మార్చిన రచనల మీద ఆధునికతా దృష్టితో ఇతిహాసాలని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఏ రకంగా ఇంగ్లీషు చదువులు అందుకు ప్రేరణని ఇచ్చాయో మాత్రమే కాకుండా ఆయా భాషలలో వారు, వారి వారి ఇతిహాసాలని ఆధునికంగా మార్చుకున్నారా అన్నది సైతం చెప్పాలి. అందుకూ నేను ఆ దేశాలలో ఏం జరిగిందీ కూడా తెలిస్తే బాగుంటుందని అన్నది. ఎందుకంటే రామాయణాలలోని ఆధునికమైన మార్పు ఆధునిక విద్యల కారణంగా వచ్చింది గనుకా, అది “రాజకీయ పరిణామం” అని వ్యాస రచయిత చెబుతున్నారు గనకాను! ఏసు పాత్రని గురించిన ప్రశ్నని నేను అందుకనే వేశాను. అది ఈ వ్యాసపు పరిధిలోకి రానివ్వకపోవడం విమర్శకులకి ఒక సులువు. ఎందుకంటే తెలుగు పాఠకులకి తెలుగులో వచ్చిన రామాయణాల గురించి తెలిసే వీలుందేమో గానీ ఇంగ్లీషు వారి విద్యా విధానమూ వారి రాజకీయాలూ ఈ ఆధునిక రామాయణ రచనల మీద ఏ రకంగా ప్రభావం చూపాయో తెలిసే వీలు లేదు. అలా తెలియాలంటే అసలు ముందు ఆ భాషల్లో ఇటువంటి మార్పులు ఎలా పనిచేసాయో తెలియాలి. ఆ జోలికి మాత్రం పోకుండా ఒక్క ఇంగ్లీషు విమర్శకుల ధోరణిని పాటిస్తూ తెలుగు రచనలమీద వ్యాఖ్యానం చేయడం తెలుగు పాఠకులని అయోమయపరచడమే అని నేను అనుకుంటాను.
ఇంక అసలు ఈ ఆధునిక తెలుగు రామాయణాల గురించీ తెలియని వాళ్ళూ ఆ బ్రిటీషు వలస పాలనని గురించీ తెలియని వాళ్ళూ – ఇప్పటికీ రామాయణాలని అన్ని కులాల వాళ్ళూ కూడా సుబ్బరంగా పఠిస్తున్నారు. పఠిస్తారు కూడాను. వాళ్లకి చాగంటి కోటేశ్వరరావుల వ్యాఖ్యానం కావాలి గానీ, ఈ వ్యాఖ్యానాలతో పని లేదు. “ఆధునిక” కాలం లోనే ఆ ఇంగ్లీషు చదువులు చదువుకున్న వాళ్ళే ఆధునిక వేషధారణ తోనే ఈ మార్గం లో వెళుతూ కనిపిస్తూ ఉంటారు నిత్యమూ! అందువలన నాకు “ఆధునికత” తాలూకు పరిధి బోధపడలేదు. అటువంటి ఒక వ్యాఖ్యానమూ అంతే బోధపడలేదు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంగా మనం ఈ ఆధునికతని పాటిస్తూ ఉన్నట్టు ఉండటమే పెద్ద అబధ్ధం అని అర్ధం అవుతూన్నప్పుడు ఈ వ్యాఖ్యానాల పరిధి మాత్రం ఎంతా? ఏవో కొన్ని కొత్త తరహా మాటలు అంటున్నారు ఈ వ్యాస రచయిత అని అనుకుని మళ్ళి వాల్మీకీ రామాయణాన్నో కనీసం కంకటి పాప రాజు రామాయణాన్నో పఠించేందుకో వినేందుకో తెలుగువాళ్ళూ సిధ్ధపడుతూనే ఉంటారు. [అన్ని కులాల వాళ్ళూ సుమా!] ఎందుకూ? అంత మాత్రం చేత వారంతా వెర్రి వారని మనం అననూ లేము. అనుకోనూ లేము. కదా? ఈ “ఆధునికత” అన్నది సర్వే సర్వత్రా అమలు జరగదు. కావాలంటే ఎలా అమలు జరుగుతుందో మీరు చెప్పండి వింటాను.
దిలీప్ గారు: ఇది చాలాకాలం క్రితం (2003లో) ప్రచురితమైన వ్యాసం. అప్పట్నుంచి ఇప్పటివరకు “ఈమాట” సాంకేతిక పద్ధతుల్లో కలిగిన మార్పుల వల్ల మీకన్న ముందు వారు రాసిన అభిప్రాయాలన్నీ ఇప్పుడు కనుమరుగయ్యాయి.
— ————
ఇప్పుడు రమ గారి సందేహాలకి సమాధానాలివ్వటానికి ప్రయత్నిస్తాను. ఆవిడ ముఖ్యంగా రెండు విషయాలు లేవనెత్తారు. (అ) ఈ వ్యాసం “ఆధునిక” రామాయణాల మీదే కేంద్రీకరిస్తుంది, (ఆ) విశ్లేషణంతా “ఆధునిక” దృష్టితోనే జరిగింది.
వ్యాసం అంతా చదివితే తొలి ఆరోపణ నిజం కాదని ఇట్టే తెలిసిపోతుంది. వాల్మీకి రామాయణం చర్చించే సమస్య గురించి పోలాక్ చెప్పిన అభిప్రాయాన్ని ఈ వ్యాసరచయిత అంగీకరించారు. అంటే అది రాజ్యం ఒకతరాన్నుంచి మరో తరానికి సంక్రమించే పద్ధతుల గురించి ప్రధానంగా చెప్పిందని ఒప్పుకున్నారన్న మాట (వాల్మీకి రామాయణం చెప్పేది అదేనా లేదా మరోటా అనేది వేరే చర్చ, అది ఈ వ్యాసం scope లో లేదు). ఈ ప్రతిపాదన ప్రకారం రాముడు దేవుడు కాడు, ఆదర్శపురుషుడు మాత్రమే. అలాగే, వాల్మీకి రామాయణంలో రాజ్య సంక్రమణకి వున్న మిగిలిన నమూనాలు (ఉదా: సుగ్రీవుడు, విభీషణుడు) సరైనవి కావని, రాముడి మార్గమే అందరికీ అనుసరణీయమని చాటి చెప్తుంది వాల్మీకి రామాయణ కథ. ఇక తెలుగు రామాయణాల విషయానికి వస్తే, తెలుగులో తొలి రామాయణం వచ్చేనాటికే రాముడు దేవుడయ్యాడని ఈ వ్యాసం చేసే ప్రతిపాదన. కనక తెలుగులో ఇరవయ్యవ శతాబ్దానికి ముందు వరకు వచ్చిన రామాయణాలన్నీ రాముణ్ణి దేవుడిగా చూస్తూ ఆ దృష్టి నుంచి రామాయణ కథని ఆయా కవుల ప్రతిభలకి తగ్గట్టుగా, ఆయా కాలాల స్థితిగతులకి అనుగుణంగా చెప్పటానికి ప్రయత్నించాయన్నది corollary. ఐతే ఇరవయ్యవ శతాబ్దంలో కొత్త ఆలోచనలు వచ్చినయ్, రామాయణాన్ని కొత్త కోణాల్లోంచి చూడటం మొదలయ్యింది (స్త్రీల రామాయణాల్లాటి మౌఖిక సంప్రదాయపు కథనాలు అంతకు ముందు నుంచీ వున్నయ్ కాని అవి mainstream లోకి రాలేకపోయినయ్). ఈ కొత్తదారికి దారితీసిన మూల కారణాలేవో వివరించే ప్రయత్నం చేసిందీ వ్యాసం. ముఖ్యంగా అచ్చు యంత్రం, వలస పాలన, వాటి ద్వారా కలిగిన సామాజిక విప్లవం – వీటిని గుర్తించి, వీటి మూలాన ఈ కొత్తదారిలో వచ్చిన రచనల పరిణామాన్ని విశ్లేషించటం జరిగింది. కనక వ్యాసమంతా కేవలం “ఆధునిక” తెలుగు రామాయణాల గురించే అనటం అవాస్తవం.
ఇక రెండో విషయం. మొదటగా, ఈ point నాకు సరిగా అర్థం కావటం లేదు. “ఆధునిక” దృష్టితో విశ్లేషించటానికి అభ్యంతరం చెప్తున్నారు. అంటే ఆధునిక పూర్వ దృష్టితో విశ్లేషిస్తే బాగుండేదని దాని భావం అనుకుంటున్నా. ఐతే ఇప్పటి కాలంలో నివసించే ఒక వ్యక్తికి అలాటి దృష్టి ఎలా సాధ్యమో నాకు తెలియటం లేదు. బహుశ ఆవిడ reference ఇచ్చిన జయప్రభ గారి వ్యాసంలో అలాటి దృష్టితో చేసిన విశ్లేషణ వుందేమో చూడాలి. నాకు బోలెడంత కుతూహలంగా వుంది అలాటి విశ్లేషణ చూడాలని. ఎవరైనా దాన్ని చదివిన వాళ్లు ఆధునిక పూర్వ దృష్టి ఎలా వుంటుందో దయచేసి అందరితోనూ పంచుకోండి.
సురేశ్ గారు,
ఓపికతో వివరించినందుకు కృతజ్ఞతలు, దేశ్‌పాండేగారి వ్యాసం గూగులమ్మ ప్రసాదించినంత వరకూ చదివాను. 🙂 నాకు అర్థమైనంతవరకూ “ళ”కారానికీ యితర మూర్ధన్యాలకీ కొంత తేడా ఉంది. యితర మూర్ధన్యాలు ప్రధానంగా ఉత్తరభారతంలోని పశ్చిమభాగానికి చెందిన ఉచ్చారణ వల్ల ఏర్పడినవైతే, యీ “ళ”కారం తూర్పు భాగానికి చెందిన ప్రాంతాలలోని ఉచ్చారణ వల్ల వచ్చింది. ఆ ప్రాంతాలలో “డ”, “ఢ”లకు కొన్నిసందర్భాలలో “ళ”కార ఉచ్చారణ ఉండేదని, మనకు లభ్యమవుతున్న శాకల్యుని ఋగ్వేద పదపాఠం ఆ ప్రాంతంలో గ్రంథస్థమై ఉంటుందని, పాణిని పశ్చిమభాగానికి చెందిన వాడు కాబట్టి అతనికి లభించిన పదపాఠంలో “ళ”కారం లేకపోవడం వల్ల అతను తన శిక్షలో దాన్ని చేర్చలేదని దేశ్‌పాండే చెప్పినట్టుగా నాకర్థమయ్యింది. ఇది ఆసక్తికరమైన విషయం. తర్వాత కాలంలో తూర్పుభాగానికి చెందిన భాషలలో యీ “ళ”కారం ఎలా మాయమయ్యిందో మరి! బెంగాలీలో “డ”కారంలా వినిపించే “ర”కారం మాత్రం ఇప్పటికీ ఉంది! “హౌరా”లో “ర”కారం వాళ్ళు “డ”కారానికి దగ్గరగా పలుకుతారు (నా పేరుని కూడా వాళ్ళు కామేశ్ వడ రావ్ అని పలికేవారు! 🙂 , దీనికీ వేదవాఙ్మయంలో కనిపించే “ళ”కారానికీ ఏమైనా సంబంధముందేమో!
తెలుగులో “ల”కారం “ళ”కారంగా మారడం గురించి కూడా మీరిచ్చిన వివరణ బాగుంది. “ర”కారం ముందున్న పదాలలో “ల”కారం “ళ”కారంగా మారడం నేనుకుడా గమనించాను కాని అలా కాని సందర్భాలలో కూడా చాలాచోట్ల కనిపించడంతో అదిక్కడ వర్తించదేమో అనుకున్నాను. రెండు మూడు రకాలుగా మార్పు జరిగుండవచ్చునని తట్ట లేదు. సంస్కృతంలో (నతిసూత్రం ప్రకారం) “న”కారం “ణ”కారంగా మారడానికి అడ్డువచ్చే “ల”కారం తెలుగులో తానే “ళ”కారంగా మారడం ఆశ్చర్యం!
‘స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన.‘
* అదే బెటరనిపిస్తుంది మోహనగారూ!
మాకొక డ్రైవర్ వుండే వాడు. పేరు మునిరాజ్. ఎప్ఫుడూ టైం కి వచ్చేవాడు కాడు. ఫోన్ చేసి, ఎక్కడున్నావని అడిగితే, ‘ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా సార్..’ అనే వాడు. ‘ఐతే ఏం చేయమంటావ్’? ఆఫీస్ మానేయమంటావా? అని విసురుగా అడిగితే… ‘మానేయడం ఎందుకు సార్? మీరు బేగ ఫలానాచోటు కొచ్చేస్తే, నేనాడ్నుంచి తోలుకుపోతా’ అంటూ ఓ ఉచిత సలహా చెప్పేవాడు. పైగా, ‘అలా ఐతేనే, మనకు టైం కల్సొస్తుంద్సార్. మీరు త్వరగ ఆఫీస్ కి పోవచ్చు, (ఆలోచించుకోండి)’ అంటూ ఓ సూచన కూడా పడేసే వాడు.
చెబితే నవ్వుతారు కానీ, చివరికి అదే జరిగేది. అతను చెప్పినట్టే నడుచుకునే వాళ్ళం. అలనాడు – రథసారధి గీతోపదేశంతో అర్జునునికి జ్ఞానోదయమైనట్టు, మాకూ ‘కాల జ్ఞానం’ కలిగింది ఈ డ్రైవర్ల వల్ల! అందుకని, మేమే ఓ అడుగు ముందుగా బయల్దేరే వాళ్ళం. “ఏమిటీ! ఇంత త్వరగా,?” అని ఎవరైనా అడిగితే “డ్రైవర్ని పికప్ చేసుకోవాలి!” అంటూ మా జోక్ కి మేమే నవ్వుకునే వాళ్ళం.
ఇలాంటి ‘బద్ధకిష్టుల’ పట్ల మనకు – మానవతా దృక్పధం మెండుగా వుంటే తప్ప, భారత దేశంలో నవ్వడం సాధ్యం కాదని స్వానుభవంతో తెలుసుకున్నా.
థాంక్స్ మోహన గారూ! నా రచన బావుంది అన్నందుకు!
నమస్సులతో-
ఆర్. దమయంతి
ఎం కె రావు గారూ, ఏ లోపం లేకుండా, ఎక్కడా నూటికి నూరుశాతం పెర్ఫెక్షన్ ఉంటున్దని నేను అనుకోను. ఏ లోపం లేని వ్యక్తులెలా ఉండరో అలాగే లోపం లేని కధ ఉండకపోవచ్చు. కాని ఈ కధలో లోపాలు చాలా ప్రధానమైనవి. వాటిని పట్టించుకోకుండా ఈ కధకు గత యాబై ఏళ్ళుగా కొంతమంది వీరపూజ చేసారు. అదే నిజమని ప్రచారం చేసారు. యిప్పటికీ చేస్తునే ఉన్నారు. ఆ ‘అతి’ మీదనే నా వ్యతిరేకత.
యిక మీరన్నట్టు, మంచి అన్నది మల్లెపూల సువాసన లాంటిది దానిని వీలయినంత ఎక్కువ ప్రచారం చేయాలి. చెడు అన్నది మురిక్కాలవ వాసన వంటిది. దానిని వీలయినంత వేగంగా కప్పెట్టేయాలి. నేను అదే చేస్తున్నాననుకుంటున్నాను.
రమ గారు, “పుస్తక మేల” అని అనకుండా ” పుస్తక మేళ ” అని NBT వాళ్ళు అనడం. వాళ్ళు బహుశా తెలుగు నేలని గౌరవించి అలా పెట్టేరని అనుకోవాలి.
ఇక్కడ మేలా (పుస్తక్ మేలా, మేల కాదు) అనేది పండుగ లేక సంత అనే అర్థములో వచ్చే హిందీ పదము అని నా భావన. అది మేళ కాదు, తెలుగులో మేళము అంటే సమూహము, ముఖ్యముగా ఆటకత్తెల సమూహము అనుకొంటాను. పుస్తకము + ఏల = పుస్తక మేల అనలేదే, అందుకు సంతోషించాలి. తమిళంలో “ఎ” కారం తెలుగు లోని అకారానికి సమానమా?? ఏమిటీ కారణం? వాళ్ళకి ఉ , ఎ లాంటివి లేవేంటి ?
అన్ని చోటులలో అలా వాడరు వాళ్లు. జ-కారముతో మొదలయ్యే సంస్కృత పదాలకు జె-కారమును తరచు వాడుతారు, ఉదా. జయం – జెయం. ఇలాటివి తెలుగులో కూడ కొన్ని ఉన్నాయి, ఉదా. చంద్రిక, చెంద్రిక; జలగ, జెలగ. ర-కారానికి బదులు రె-కారమును అరుదుగా వాడుతారు, ఉదా. రమ – రెమ. తమిళ ఛందస్సులో ఐ-కారమును లఘువుగా వాడడము నాకు తెలుసు. ఉ-కారము చివర వస్తే అది ఒక్కొక్కప్పుడు పరిగణించబడదు. కాని కొన్ని విషయాలలో వాళ్ల నియమాలు చాల కఠినమైనవి. మిగిలిన భాషలలో ఆ, అం, కల్ మున్నగునవి ఒకే విధమైన గురువుగా అంగీకరించినా తమిళములో వాటికి భిన్నత ఉన్నది. పాటలలో వీటిని గమనించవచ్చును. విధేయుడు – మోహన
స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన
విశ్వనాథం గారికి, తఃతః గారికి నా వ్యాసము నచ్చినందులకు కృతజ్ఞతలు.
తఃతః గారు – 1962లో తిరుపతి, 1971లో బెంగళూరు వదలిన తరువాత నాకు దైనందినము తెలుగు మాటలాడే అవకాశము లేదు. ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు మాత్రమే అలాటి అవకాశము కలుగుతుంది. ఇదంతా ఎందుకంటే నా మాతృభాష తెలుగు కాదు, కన్నడము. మీరు చెప్పినది బహుశా సరియే అనుకొంటాను. అదలా ఉంచితే, బాలవ్యాకరణములో ఆచ్ఛిక పరిచ్ఛేదములో – ఇ, టి, తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు. ఇవి ద్వితీయాద్యేకవచనంబులు పరంబులగునపుడు నామంబులకుం గొన్నింటికిం ప్రాయికంబుగ నగు అనే సూత్రము క్రింద కాలు – కాలిని – కాలిచే, నాఁగలి – నాఁగటిని – నాఁగటిచే, నేయి – నేతిని – నేతిచే ఉదాహరణములుగా ఇవ్వబడినవి. అలాగే ఆలు (భార్య) కూడ. పాలు పదము కాలు, ఆలు వంటిదే కదా? కాని పాలు ఏకవచనము కాక నిత్యబహువచనమా? అది నిత్య బహువచనము అయితే అప్పుడు, చేలను (చేను – చేలు), ఆలను (ఆవు – ఆలు) వలె పాలు – పాలను అవుతుంది.
ఆంధ్రభాషలో చారిత్రక నవల అనే వ్యాసం చాలాబాగుంది. ఎన్నో చారిత్రక నవలలు వాటిలో విశేషాలు చాలా చక్కగా వివరించేరు నోరి వారు. వారి నవల కవిసార్వభౌముడు నా దృష్టిని శ్రీనాధుని వైపు మళ్ళించింది. పై వ్యాసంలో తెలుగులో వచ్చిన అద్భుత నవల ‘సత్యప్రభ’ గురించి ప్రస్తావన లేకపోవడానికి కారణాలు మనకు తెలియవు. ఈ నవల రచయిత కావ్యకంఠ వాశిష్ఠ గణపతిమునిగారు. ఇది 1937 లోనే భారతి మాస పత్రికలో ధారావాహికంగా వచ్చింది. తదుపరి వారి కుమారుడు కీ.శే. వాశిష్ఠ మహదేవశాస్త్రిగారు 1964లో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించేరు. పిదప ఈ నవలను విశాలాంధ్ర పుస్తక ప్రచురణలు, హైదరాబాదు వారు ముద్రించేరు. ఈ నవలను నా సోదరుడు కీ.శే. డా.గంటి శ్రీరామమమూర్తి, 1982లో ఆంగ్లము లోనికి అనువదించేరు. 2011 అక్టోబరు నుంచి “పొద్దు” అంతర్జాల పత్రికలో ధారావాహికంగా రావడం ముదావహం. కాని ఈ నవల తెలుగు, ఇంగ్లీషు కూడా ఇప్పుడు ఒకటి రెండు కాపీలు తప్ప ఆంధ్రదేశంలో ఎక్కడా దొరకక పోవడం ఆంధ్రుల దురదృష్టం.
ఈ నవల ఇతి వృత్తం అలనాటి ఆంధ్రసామ్రాజ్యమునేలిన శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ. ఆంధ్ర, మగధ రాజ్యాల రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల నాధారంగా జేసుకొని విస్తృతమైన తెరమీద ఎన్నో పాత్రలను సంధానం చేస్తూ ఆంధ్రమహావిష్ణువు యొక్క చారిత్రాత్మక ప్రణయగాధగా మలచిన శ్రీకావ్యకంఠ వాశిష్ఠ గణపతి మునిగారి స్వకపోల కల్పితం.చివరి కొంత భాగమ మాత్రం వారి కుమారుడు వాశిష్ఠ పూరించేరు.
యశస్వి గారూ:మీరు యిలా అన్నారు “ఆదిత్య రెడ్డి గారి భావాలలో మరీ ఎక్కువ “ఎర్రతనం” తొణికిసలాడుతోంది” అని.కాని నిజానికి నేను చాలా నల్లవాణ్ణి, నా భావాలు కూడా నల్లవే. ఎర్రవాళ్ళు, ఎర్రచొక్కాల వాళ్ళు, ఈ కథని ఎర్రకథ అన్నారు,ఆకాశానికి ఎత్తేసారు, అదే నా బాధ. అలా కాకుండా ఈ కధని ఏ ఆర్ష ధర్మ ప్రచార సభ వారో ప్రచారం చేసుంటే అసలు గొడవే లేకపోను. నేను బాగా ఇష్టపడేవాణ్ణికూడా.
ఎం కె రావు గారూ: ఈ కధని గురించి సి.యస్.రావు గారు పైన ఏమన్నారో చూడండి. “ఈ కథ ద్వారా రామారావుగారు ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే అదేదో చెప్పటం కష్టం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా కథ సాగుతుంది.” అని. దాని పరమార్ధమేదో దానికే తెలియదు. యింక అదేం సాధిస్తుందంటారు.
5) కధ ముగింపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సీతారాముడు లోకం తెలిసిన మనిషి. తన తండ్రి చేసిన పని తనకు నచ్చక పోతే, తండ్రిని, గ్రామపెద్దలని ఎదిరించలేని నిస్సహాయతకు లోనయితే, తన బిడ్డని తీసుకుని ఆ గ్రామం విడిచి పెట్టి పోతాడు. లేదు, ఆవేశానికి లోనయితే తనను తాను శిక్షించుకుంటాడు. అంతేగాని తన కొడుకుని ఏ తండ్రి చంపుకోడు. అందులోనా సీతారాముడు అస్సలు అలా చేయలేడు. తన భార్య మరొకరితో పోయినా తన బిడ్డ కోసమే మరో పెళ్ళి కూడా చేసుకోలేదు (చేసుకున్నట్టు ఎక్కడా లేదు.) అయినప్పటికీ, ఒక వేళ ఆవేశముతో కూడిన మూర్ఖత్వముతో చేసాడనే అనుకుందాం. కాసేపటి తరువాతనన్నా వాస్తవంలోకి వచ్చి భయపడతాడు. తాను చేసిన పనికి నిష్కృతి లేదని మనోవేదనకు గురి అవుతాడు.
కాని కధలో చాలా భిన్నంగా ఉంటుంది. – ఒక మాఫియా ముఠా వ్యక్తిలాగా, నిరంతరం హత్యలు చేసి కరుడు గట్టిన వ్యక్తిలాగ, తాను చంపిన వ్యక్తితో ఏమాత్రము సంబంధం లేని వ్యక్తి లాగ, చంపిన శవాన్ని బస్తాకెత్తి దానిని పంచాయితీ వరకు మోసుకు వచ్చి నిబ్బరంగా మాత్లాడుతాడు.
6)సీతారాముడు మూట భుజాన్న తెస్తుంటే జనమంతా అటు వైపు చూస్తారు ఆసక్తిగా. అప్పుడే చేసిన హత్య గదా శవం నుంచి రక్తం కారాలి గదా. అతని చేతులు, బట్టలు రక్తంతో కనపడాలి గదా, కాని అవేమి అక్కడ కనపడవు. (తెలుగు సినిమా హీరో లాగ చేతికి మట్టి అంటకుండా ఎంత చక్కగా చేస్తాడో హత్య!)
7)కధకు యజ్ఞం అని పేరు. ఆకధ ఒక బలితో పూర్తవుతుంది, అని ఆలోచించినపుడు హిందూ మత భావనలు పాఠకుడి మనసులోనికి రావా?
యిలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. కానీ యిక్కడికి ఆపేస్తున్నాను.
3) సుందరం పాలెం గ్రామ రైతుల స్థితిగతులను చెప్పేటప్పుడు విరుద్ధభావాలు కనిపిస్తాయి రచయిత చెప్పినదానికి మరొకచోట పాత్ర చెప్పినదానికి చాలా వ్యత్యాసాలుంటాయి. ఎక్కడా నిర్దిష్టత ఉండదు. (అవన్ని పేరాలు పేరాలుగా ఉటంకిచాల్సి ఉంటుంది. నాకు టైపింగ్ సరిగా రాని కారణం చేత రాయటం లేదు.) అయితే రైతుల నష్టాలు కొంతవరకు ఎలా తీరాయంటే ఇళ్ళ జాగాలకి కల్లాలు అమ్మడం ద్వారా అంటాడు అప్పలరాముడు. ఇది ఎంతవరకు వాస్తవమో ఆలొచిద్దాం. కధాకాలం 1963 లేదా 1966. ఆనాటికి సుందరపాలెం అనే 400 ఇళ్ళు గల గ్రామంలో ఇళ్ళ జాగాల వ్యాపారం జరుగుతుందా. అదీ కేవలం ఒక హైస్కూలు వచ్చిన కారణంగా? 1982, 84 ప్రాంతానికి విశాఖపట్నం లోనే రియల్ ఎస్టేటు వ్యాపారం అంతగా లేదు. నేటి గురుద్వార జంక్షన్లో గల బాలయ్య శాస్త్రి లే అవుట్ లో గజం 4 రూ అంటే ఆలోచించవల్సి వచ్చేది అని స్థానికులు చెప్తారు.అలాంటిది ఎంత జాగా ను ఎంతమందికి ఏ రేటు చొప్పున అమ్మితే రైతుల అప్పులు తీరిపొయాయో అర్ధం కాదు.
4) రచయితలు, ముఖ్యంగా ప్రగతి శీల భావజాలం గల రచయితలు, ఆశా వాద దృక్పధం కలిగి ఉంటారు. తమ రచనలలొ దానినే ప్రతి ఫలింప జేస్తారు. అలా చెయాలి కూడా. కాని ఈ కధలో ఎక్కడా ఆశ అనేది మచ్చుకి కనబడదు.
శ్రీరాములు నాయుడు హైస్కూల్ కావాలంటాడు. దానికి ఎర్రయ్య అనే పాత్ర చదువుకునే కూలీలు కావాలి గదా అంటాడు. చదువుల పట్ల నిరసన వినిపిస్తాడు. రచయిత ఆపాత్ర ద్వారా తప్ప ఖండించడు. మరో చోట రోడ్డు వస్తుందంటే పాతిక మంది బళ్ళ వాళ్ళ వ్యాపారాలు పోతాయంటాడు. కరెంటు వస్తుందంటే దంపుళ్ళ కూలీలు పొతాయంటాడు. మరొక పాత్ర గాని రచయిత గాని ఖండించక పోవడం వలన కధలో అవే అభిప్రాయాలు పాఠకుడికి అందుతాయి గదా. ఇది పాక్షిక నష్టాలను చూపించి ప్రగతిని లేదా మార్పుని అడ్డుకోవడమేగదా. (యింకావుంది)
1) ఏ రచన కైనా వాస్తవమే పునాది. వాస్తవాలను విస్మరించి లేదా వాస్తవాలకు దూరంగా జరిగి చేసే రచన ఏదైనా అంతిమంగా సమాజానికి నష్టమే చేస్తుంది.యజ్ఞం కధలో దళితుడైన అప్పల రాముడి తండ్రికి 12 ఎకరాల భూమి ఉంటుంది.ఎప్పుడూ. కధా కాలానికి యాభై ఏళ్ళ క్రితమే, అంటే నేటికి వందేళ్ళ క్రితమే నన్న మాట. ఇది ఎంతటి సత్య దూరమయిన విషయమో ఏ దళితున్ని అడిగినా తెలుస్తుంది. లేదా నాటి ప్రభుత్వ గణాంకాలు చూసినా తెలిసి పోతుంది .ఆ రోజుల్లో దళిత స్త్రీలు వీసెల కొద్ది వెండి మోసేవారట! ఎంత అవాస్తవమో! తిండికి లేక ప్రతి దలితుడు పాలేరుగా ఉండే స్థితి. చిన్నపిల్లలని సైతం చిన్నపాలేరులుగా పెట్టి కుటుంబం మొత్తంగా ఆ రైతు పొలంలో కల్లములో పనిచేస్తూ పెట్టింది తిని అర్దాకలితొ కాలం గడిపే వారు. ఈ స్థితి 1975, 76 ల వరకు మన కళ్ళ ముందున్నది.
2)ఆదిమ కాలం నుండి మానవుడు అడవి నుండి గ్రామానికి గ్రామం నుండి పట్టణానికి ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఈరొజుల్లో నగరాలనుంచి మహానగరాలకు, విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకని? ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితితి ని పొందాలనే కదా. కధలో సీతారాముడు అలాగే పట్నం వెల్తాడు. అక్కడ బస్తాలు మోస్తాడు, రిక్షా లాగుతాడు. అయితే “వాడి పెళ్ళాం మరొకడితో లేచిపొయింద”ట . దానిని వెటకారంగా, వేళాకోళంగా చెప్తాడు రచయిత ఒక పాత్ర ద్వారా .(అక్కడికి పల్లెల్లొ ఎవడి పెళ్ళామూ మరెవడితొ లేచిపోదని గ్యారంటి నేమో మరి.) ఇక్కడ నూతన వృత్తులను వెతుక్కొవడాన్ని అంగీకరించలేక మళ్ళీ సీతారాముడ్ని వెనక్కి రప్పిస్తాడు. నిజానికి ఒకసారి పట్నం వెళ్ళిన వ్యక్తి అక్కడే క్రిందా మీదా పడతాడు గాని వెనక్కు రావటానికి యిష్టపడడు. పెళ్ళాము లేచిపోయినవాడు అసలే రాడు సి గ్గుపడి. కాని కధలో దానికి భిన్నంగా ఉంటుంది. బహుశా దళితునికి మానాభిమానాలు ఉండవేమో!? (యింకా ఉంది. దయచేసి రేపు యిక్కడే చూడగలరు)
[ఆదిత్య గారూ – దయచేసి మీ అభిప్రాయాలలో అచ్చుతప్పులు సరిదిద్దుకున్న తర్వాతనే పోస్ట్ చెయ్యగలరు. ప్రతీ వాక్యాన్ని ఇంచుమించు తిరగరాసి ప్రచురించడం అన్నిసార్లూ మాకు కుదరని పని. – సం.]
ఆదిత్యా! ఎప్పుడైనా ఎవరి మాటా చివరి మాట కాదు. ఏ విశ్లేషణలో బలముంటుందో అది తప్పక నిలబడుతుందనే నేను నమ్ముతాను. నేను విద్యాసాగర్ రాసిన విమర్శని, యజ్ఞం కధ మీద, చదవలేదు గనక దాని గురించి ఏమీ మాట్లాడలేను. చదివి ఉంటే తప్పక మాట్లాడగలిగి ఉండేదాన్ని. నిజానికి సి యెస్ రావు గారు రాసిన ఈ వ్యాసాన్ని తప్ప మిగిలినవాటిని వేటినీ నేను చదవలేదు. నా అభిప్రాయాలు కేవలం నా పఠనానుభవాన్ని ఆధారం చేసుకుని చెప్పినవే మాస్టారి కధ మీద. నాకు గుర్తున్నంత వరకూ ఆ కధని నేను చదివినప్పుడు అది నన్ను ఇబ్బంది పెట్టలేదని మాత్రం చెప్పగలను. ఆ కధని నేను అర్ధం చేసుకున్న తీరు వేరనుకుంటాను. బహుశా నా దృష్టికోణం వేరై ఉండవచ్చును కదా?? చర్చ సత్యాన్వేషణ కోసమే అయితే జరగవచ్చు దేనిమీదనైనా! సాధారణంగా తెలుగులో సాహిత్య చర్చల్లో అసలు విషయం మరుగున పడిపోయి అదేదో బలాబలాలు తేల్చుకోవడం లాగా మారిపోతూంటుంది చాలాసార్లు. ముఖ్యంగా భావస్పందనలు ముందుకు తోసుకుని వచ్చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఇంక విషయం మీద ఖచ్చితమైన అభిప్రాయాలు గనక ఉన్నప్పుడు కూడా చర్చ ఒక సంయమనంతో సాగే వీలుండదు. ఇదేమీ గోదాం లోని కుస్తీ పోటీ లాంటిది కాదు. ఒకరు గెలవడమో ఒకరు ఓడడమో ఖచ్చితంగా నిర్ణయింపబడదు. పాఠకులు కానివ్వండి, విమర్శకులు కానివ్వండి భిన్న దృష్టి కోణాలలో ఒక అంశాన్ని చూసే వీలుంది. అర్ధం చేసుకునే వీలూ ఉంటుంది. అందువలన ఎప్పుడైనా ఏ విమర్శా సంపూర్తి కాలేదు. అందులో ఎందరో పాల్గొని దానిని పరిపుష్టి చేయగలగడమే ఆ రచనకి ఉన్న బలం! అందువలన చర్చని దెబ్బలాట మార్గంలో నడపకుండా మాట్లాడుకోగలిగితే ఏ చర్చ అయినా ఒక విషయాన్ని పట్టి చూపించే వీలుంది. పాఠకులూ, విమర్శకులూ కూడా పొరపాటు పడే వీలు ఉంటుంది. అలాగే ఒక్కోసారి రచయిత తన రచనలో చూడలేని అంశాలని పాఠకులూ విమర్శకులూ చూసే సందర్భమూ ఉంటుంది. రెండూ సాధ్యమే సుమా! అయితే రచయిత తన రచనని గురించి అనుకునే మాటకి ఒక విలువ ఉంది. ఆ కధ అన్నది ఆయన సృష్టి గనక. దాన్ని చెరిపేసే తీరు విమర్శలో నిలబడదు. ఆయన మాటలు ముఖ్యమైనవే!! వాటిని ఎవరు ఒప్పినా మానినా!
ఇంక నావరకూ క్లుప్తంగా చెప్పవలసి వస్తే నాకు అహింసా మార్గం ఇస్టం . గాంధేయ మార్గం ఇస్టం. ఆ మనసుతోనే నేను ఈ కధని గురించి అనుకున్నది ఏమంటే, అర్ధం చేసుకున్నది ఏమంటే, కాళీపట్నం రామారావు గారు తన యజ్ఞం కధ ద్వారా ప్రత్యేకించి హింసా మార్గాన్ని ప్రోత్సహించారనో, లేదా దానిని ఒక ఆదర్శంగా చూపించారనో కాదు. అలా మరి నాకు అనిపించలేదు. ఆ కధలో తాను బానిసగా ఉండదలుచుకోనప్పుడు బహుశా అప్పల్రాముడి కొడుకు గనక స్వయంగా పోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే గనక అప్పుడది పాఠకుల మనసులలో సానుభూతిగా మిగులుతుంది . అయితే అది రచయిత ఉద్దేశ్యం కాదు (ఈ విషయాన్నే మాస్టారు చెబుతున్నారు.) అలాంటి సానుభూతిని చోటు లేకుండా చేయాలని రచయిత లక్ష్యం గనకే అక్కడ అతడు కొడుకుని చంపుకున్నాడు. ఇది అనైతికమనీ, అమానుషమనీ మీ చర్చ సారాంశమా? సి యెస్ రావు గారు అలాగే అనుకుంటున్నారు. చిన్నపిల్లడిని హత్య కావించడం అన్న అంశాన్ని కధ లోని ప్రధాన అంశంగా చూసి మనం మాట్లాడలేము. అది ఆ తండ్రి చాతకాని చర్య. అతడి లో జనించిన నిర్వేదం. ఒక నిస్సహాయత, మితిమీరిన ఆవేశం కలిసిన చర్య. కోపంతో వివేకం నశించి చేసిన చర్య. అది పాఠకులని “షాక్” చేయాలని అలా చేసానని కారా మాస్టారు అన్నమాటని నేను ముందటి అభిప్రాయంలో ప్రస్తావన చేసింది అందుకనే! ఎవరిని నెపం పెట్టాలో తెలియక, సంతకాలు చేసిన తన తండ్రిని ఏమీ అనలేక, పోయి బాలుడైన తన కొడుకుని చంపుకున్నాడు. అది సమర్ధనీయం కాదు “సభ్య సమాజానికి” (కానీ కోపం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ మగవాళ్ళు వాళ్ళ భార్యలనో, వాళ్ల సంతానానినో చంపుకుంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయే మన వర్తమానంలోనూ?? అక్కడ అది మగవాడి హక్కుగా కదా ఈ సమాజం అర్ధం చేసుకుంటోందీ? వాటి పట్ల ఇవాళ్టికీ కోర్టులూ చట్టాలూ పెద్దగా స్పందించవని మీకు గణాంకాలు చూస్తే తెలుస్తుంది. గృహహింసలో మన తెలుగు వాళ్ళూ మొదటి స్థానం లోకి వచ్చిన విషయం మీకు తెలుసునా?) దీన్నటుంచితే, గమనించి చూడండి ఇంక యజ్ఞం కధలో. ఆ కొడుకుని చంపిన కోపమే అటు తరవాత పెరిగి విస్తరించి చివరికి “వర్గ శత్రు నిర్మూలన” వైపు మళ్ళింది కదా శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో? నేను చెప్పిందీ, ఆ కధ ద్వారా నేను చూసిందీ ఇది. ఈ చర్చని చూసేకనే నా సందేహాన్ని నివృత్తి చేసుకుందికనే నేను యజ్ఞం కధ వాటి పూర్వా పరాల మీద మాస్టారితో మొన్నీమధ్య మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలలో కొన్నింటిని నేను నా అభిప్రాయం లొంచి ఈమాట అభిప్రాయాలలో అవసరమని అనిపించి వ్యక్త పరిచేను. ఇంక ఈ కధ “తిరోగమన కధ “ఎలా అయ్యిందని మీరు భావిస్తున్నారో నాకు తెలియదు గనక దాని మీద నేను ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేను. హింస తాలూకు మూలాలని వదలి మనం బాలుని హత్యని కేంద్రంగా చేసుకుని యజ్ఞం కధని చర్చ చేయకూడదనుకుంటాను. అలా చేసినందువలన జరిగేదేమంటే సున్నిత స్వభావులకి అది ఇబ్బందిగా అనిపించి, తద్వారా కధ రాసిన రచయితని నెపం పెట్టి, నిందించడం జరుగుతుందే తప్ప మరో విషయం బహిర్గతం కాదు. యజ్ఞం కధ మాత్రమే కాదు తన మిగిలిన కధలలోనూ మాస్టారు ఎన్నుకున్న ఇతివృత్తాలనీ వాటి నిర్వహణనీ చూసినప్పుడు మాస్టారు హింసావాదిగా నాకు అనిపించలేదు. అందువలన యజ్ఞం కధ ముగింపు మీద నేను పాఠకురాలి గానూ విమర్శకురాలి గానూ నా విమర్శని ఎక్కుపెట్టలేను. అది దళితుల మీద భూస్వాముల ఆధిపత్యమూ హింసా అనే నేను ఇప్పటికీ అర్ధం చేసుకుంటాను. ఆ శ్రీకాకుళం లోనే, అదే తిరిగీ మళ్ళీ మొన్నటి మద్దువలస రిజర్వాయర్ భూముల దగ్గర బయట పడింది. లక్షింపేటలో మారణ హోమం అంత దారుణంగా జరిగింది. బొత్స వాసుదేవనాయుడు బహుశా ముదిరిన యజ్ఞం కధలోని శ్రీరాములు నాయుడేనేమో అని మీరెందుకని అనుకోలేదో? ఏం మారిందీ పరిస్థితి ఇవాళ్టికైనా? అని మాస్టారు అన్న ప్రశ్నకి ఏం జవాబు ఉంది గనకా తెలుగు మేధావుల ముందు? యజ్ఞం కధని ఎవరు ఏ దృష్టితో చూస్తున్నారు అనే దాన్ని బట్టీ ఆ కధ వారికి ఆ దృష్టి లోంచి అర్ధమవుతుంది.
చివరగా నేను బాలుని హత్యని సమర్ధించడం లేదు అని చెబుతున్నాను. అదే సమయంలో మాస్టారు పిల్లల్ని చంపుకోవడాన్ని ఆ కధలో సందేశం గానో సూచనగానో చెప్పారని కూడా నేను అనుకోవడం లేదనీ చెబుతున్నాను. ప్రస్తుతానికి ఇంతకు మించి ఈ విషయంలో నాకు మాట్లడవలసింది మరి లేదు.
జయప్రభ గారూ: మీ పేరు తప్పుగా పడినందుకు క్షమించండి. మీ పేరు తెలియక కాదు. మీరు తెలుగులో మంచి కవయిత్రి అని తెలుసును. అన్నమయ్య సాహిత్యంపై పరిశోధన చేసారని తెలుసును. ఆ మధ్య విశాఖపట్నం సభలో పాల్గొనటమూ తెలుసును. కాకపొతే పొరపాటు పడింది. యిక విషయనికి వస్తాను.
1) మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారు. “విద్యాసాగర్ కి మాత్రమే నేను జవాబు రాసేను” అంటున్నారు. కానీ, పత్రికలొ రాస్తున్న విషయం మరిచిపోతున్నారు.
2) మీరు “యజ్ఞం కధ నాది కాదు. రామారావు గారిది. అందువలన ఆ కధని గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చెప్పిన మాటలు తప్పక వినవలసినవే అవుతాయి!“అన్నారు. తప్పక వినవలసిందే, వింటాం. కాని ఆయన (కా.రా) చెప్పారు గాబట్టి నమ్మవలసిందే అంటే మాత్రం నమ్మం.
3) లక్షిం పేట హత్యల ప్రస్తావన తెచ్చారు. అగ్ర వర్ణ దురహాంకారంతో చేసే హత్యలకు,కన్న బిడ్డను చేసే హత్యకు పోలికా…!
4) మీరు “మీకు ఆ కధ ఒప్పుదల కాకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన యజ్ఞం కధ ఉత్తమ కధా కాక పోదు.“అన్నారు. కాకూడదని మాకేమి కోరిక లేదు. ఎందుకంటే అది ఎలాగు ఉత్తమ కధ కాదు గనక. యాభయ్యేళ్ళ క్రితం నుంచి వేసిన వీరతాళ్ళు ఉన్నాయి గనక మరి కొన్నాళ్ళు వాటిని మోసే వీరాభిమానులు ఉంటారు. నిజానికి అదో పెద్ద తిరోగమన భావజాలాన్ని ప్రచారం చేసే కధ.
5) మీరు “ఒకవేళ ఈ నా అభిప్రాయం మీకు ఆమోదం కాకపోతే మీరు దీన్ని చదవకండి. చదివినా పట్టించుకోకండి. ఈ అభిప్రాయానికి మీరు పాఠకులు కారన్నమాట 🙂” అని అన్నారు. మీరు చర్చకు నిలబడరని అర్థమయింది. కాబట్టి, అనవసరమనుకున్న చోట నేనూ చర్చించను.
మీ ఉదాహరణలకి కాలరేఖ అక్కర లేదనుకుంటాను. కాని చరిత్రకి కావాలి. అందునా ఆ కధ శ్రీకాకుళం జిల్లా లోని భూసంభందాలకు కధారూపమని విమర్శకులు ప్రవచించారు. చరిత్ర గురించి మాట్లాడితే ఇప్పుడు చరిత్ర అడక్కు చెప్పింది విను అంటున్నారు. శ్రీకాకుళ ఉద్యమం 1968లో మాటవరసకి ప్రారంభం కాలేదు. అక్కడ ఉద్యమం 1959లోనే ప్రారంభం అయింది. కాకుంటే చావులుంటే తప్ప మనకి ఉద్యమం ఉన్నట్టు కాదు. కధ చెప్పినట్టు కాదు. దేశంలో కథ చదివినవాళ్ళంతా రచయితని కలవలేరు.
[అభిప్రాయాలు వెలిబుచ్చే వారు, చర్చించేవారు, దయచేసి అభిప్రాయం పంపే ముందు అచ్చు తప్పులు సరిచేసుకోమని సవినయంగా మనవి చేస్కుంటున్నాం. – సం.]
మా గురువు గారు సంజీవ దేవుల సమక్షంలో చిత్ర కళారంగంలో దిద్దుకున్న ఓనమాలు ఇంతకాలం వెన్నంటి ఉన్నాయంటే అది వారి గొప్పతనమే.వారి ముఖతః రామారావు గారి గురించి విన్నాను. మో మొదటి కవితా సంకలనం చితి- చింత ముఖచిత్రంగా వారి నైరూప్య చిత్రం ఆకట్టుకొనేది.ఇంత కాలానికి ఈ మాటలో గొప్ప చిత్రకారుల మీద ఇంత పెద్ద వ్యాసం ప్రకటించడం అభినందనీయం.వేలూరి వారు ముందు ముందు ఇంకొన్ని వ్యాసాలూ రాసి అలరించ బోతున్నందున ముందు జాగ్రత్తగా నాలుగు వాక్యాలు కుదురుగా రాయబోతాను.
అనువాదం ఎవరు చేశారో ఏమో గాని ఈ బృహత్ వ్యాసం కొరకరాని కొయ్య అయి కూచుంది. పీర్లు ఫకీర్లు వారి నెమలీకల మంత్రదండం ఏమైపోయింది ? అచ్చుతప్పులు కోకొల్లలు సరే! అవి అలా ఉండనిద్దాం. అక్కడక్కడ అన్వయం లేని వాక్యాలు (మచ్చుకు రెండు:)
“రామారావు చిత్రాలలో ఈ ప్రాక్పశ్చిమాలు కలిసి ఒకటిపోయాయి.” (ఇంకా నయం , ఒకటికి పోయాయి, అని పడలేదు, అదే జరిగుంటే , పాఠకుడికి పిచ్చి కుదిరేది )
“ఎంతటి చిత్రకారుడైనా తన చిత్రాల్లో నలుపుని నియంత్రించేటప్పుడు కొంచెం జంకుతారు.”
కాపీ ఎడిటింగ్ లోపాలు అని వీటిని సరిపెట్టుకుందాం. ఈ వ్యాసానికి ఆయువు పట్టు అన దగ్గ పారిభాషిక పదాల ఎంపికలో తబ్బిబ్బు కనిపిస్తుంది. వ్యాసంలో ఒక భావానికి ఒక పదాన్ని చివరి కంటా ఒకే విధంగా వాడితే కాని పాఠకుడికి అర్థబోధ జరగదు.
చిత్ర కళ ఎక్కువ సార్లు సారూప్యం (representive/figurative ), కొండొకచో వైరూప్యం (distortion), బహు సకృతుగా నైరూప్యం (abstraction) కావచ్చు. తెలుగులో చిత్ర కళా విమర్శకు ఆద్యులు సంజీవ దేవ్ గారు representativeను సారూప్యంగా అనువదించి వున్నారు. ఇంకా లోతుకు వెళ్లి, సారూప్యం, వైరూప్యం, నైరూప్యం రస శాస్త్రంలోని అభిద , లక్షణ, వ్యంజనలతో తూగుతాయి అని ఎంతో మీమాంస చేసి వున్నారు. చిత్రకళ రూపానికి సంబంధించినది, కాబట్టి, representative కు సారూప్యం అని ఇదివరకు ఉన్న పారిభాషిక పదాన్ని వాడటమే సబబు. ప్రాతినిథ్యం అనడంలో పాత మార్క్సిస్టు తొంగి చూస్తున్నాడు. అంతేగాక, సారూప్యం, వైరూప్యం,నైరూప్యం అన్నీ రూపంతో ముడివడిన రూపాలే., కాబట్టి, ఇది వరకు పెద్దలు ఏర్పరచిన పారిభాషిక పదాలను వాడటం వల్ల ఎంతో గందర గోళం తప్పుతుంది. ఇక్కడ తమాషా ఏమిటంటే , వ్యాసం చివరి పేజీలో ఒక వాక్యంలో ” నైరూప్యం నుండి సారూప్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలగక పోదు ” అన్న వాక్యంలో representative ని సారూప్యంగానే పట్టుకొచ్చారు. ఇదే , వాక్యాన్ని ” నైరూప్యం నుండి ప్రాతినిథ్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలుగక పోదు ” అని రాసి చూస్తే, మాట్లాడుతున్న విషయం చిత్రకళ కాదేమో అనిపించ వచ్చు.ఇటువంటి వాక్యం ఒకటి ఈ వ్యాసంలో ఉన్నది కూడా “రామారావుకు ప్రాతినిధ్య కళ నుండి నైరూప్య కళకు జరిగిణ పరిణామం ఖచ్చితమైన రూపు తీసుకున్నది అతను స్లేడ్ స్కూల్‌లో వున్న చివరి సంవత్సరం (1964) లోనే.”
మరో రెండు ముఖ్యమైన పారిభాషిక పదాలు: impression అంటే మానసిక ముద్ర , expression అంటే అభివ్యక్తి expression భావ ప్రకాశంగా అనువదించడం కొంత గందరగోళానికి దారి తీసే విషయమే. abstract expressionను నైరూప్య భావ ప్రకాశత గా పట్టుకు రావడం ఏమంత బాగాలేదు. నైరూప్య అభివ్యక్తి అంటే సరిపోయే దానికి ఇంత ద్రవిడ ప్రాణాయామం అవసరమా?
abstract painter (నైరూప్య చిత్రకారుడు) అంటే చాలు, నైరూప్య భావ ప్రకాశ చిత్రకారుడు అనడం దాన వీర శూర కర్ణ అనడం కన్నా వేయి రెట్లు బరువుగా ఉంది. అలాగే , ప్రతిమా రూప చిత్రాల్లో అనకుండా చిత్రాల్లో అంటే చాలు. ఆంగ్లం లా, తెలుగు విశేషణ బహుళమైన భాష కాదు. అనువాదకులు ఇంత ప్రాథమిక విషయాన్ని విస్మరిస్తే పని జరగదు.
‘భావ ప్రకాశత నుంచి నైరూప్యతకు సాగించిన యాత్ర’ అనడం కూడా trపొసగలేదు. సారూప్యం నుంచి నైరూప్యానికి సాగించిన యాత్ర అనడం అర్థవంతం. ప్రాథమిక భావనల పట్ల అవగాహన లోపిస్తే రచయిత / అనువాదకుడు ఏమి చెప్ప దలచుకోన్నారో ఒక పట్టాన అర్థం కాదు.
“1964లో అనామిక అన్న ఈ చిత్రం ప్రాతినిధ్య కళ నుంచి పూర్తిగా వైదొలగి తన అభివ్యక్తతకు ఒక రూపంగా రూపరాహిత్యాన్ని ఎంచుకున్న తీరును తెలియజేస్తుంది.”
“ఒక సృజనాత్మకుడైన వ్యక్తికి తన అంతరంగంలోని జ్ఞానిని ఏ విషయమైతే మరుగు పరుస్తుందో, మొదట దాన్ని అన్వేషించడం ప్రధాన లక్ష్యమౌతుంది. ఆ తరువాతే అతను తన మదిలోని శక్తిని కూడగట్టుకుంటాడు”
ఇవన్నీ తెలుగు వాక్యాలేనా ?? అన్న సందేహం రావడంలో అనుమానం లేదు. ఈ ఒక్క వ్యాసంతో, అయోమయంలో మూడు లాంతర్ల కనక ప్రసాద్ ను జయించ గలిగారు ఈమాట ప్రధాన సంపాదకులు.
“ఫిజిక్స్ డిగ్రీ వచ్చింతరువాత కొన్నాళ్ళపాటు నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం వచ్చి, ఊసుపోక ఆడిట్ చేసిన మోడర్న్ ఆర్ట్ అప్రీషియేషన్ కోర్సులు బహుశా ఇప్పుడు నాకు పనికి రావచ్చు. – వీవీఆర్”.
దీనికన్నా చిత్రకళా విమర్శ లో సంజీవ్ దేవ్ గారి వ్యాసాలను చదువుకొంటే రచయితకు, పాఠకులకు ఉభయతారకంగా ఉంటుంది అని ఈ బుధజన విధేయుడి అభిప్రాయం.
ఈ కథను original రూపములో నేను చదువలేదు. కాని వ్యాసరచయిత వ్రాసిన దానిని బట్టి కథ అర్థము చేసికోగలిగాను. నేను సి. ఎస్. రావుగారితో ఏకీభవిస్తాను. కథలలోగాని, నవలలోగాని, చలనచిత్రాలలోగాని అనవసరముగా పాత్రలను “హత్య” చేయడము ఒక విధమైన జుగుప్సను కలిగిస్తుంది, మానవజీవితముపైన నమ్మకాన్ని తగ్గిస్తుంది. అందువల్ల వీటిని రచయితలు అనుసరించడము నా ఉద్దేశములో సరియైనది కాదనే తోస్తుంది. జీవితానికే అర్థము లేదు అని వాదిస్తే, అప్పుడు కథకు కూడ అర్థము లేదనే ప్రతిస్పందన కూడ ఉదయిస్తుంది. ఒక కథ మనసులో కలకాలం నిలబడాలంటే దారుణ మరణంతో కథను అంతము చేయడము మాత్రము ఒక మార్గము కాదు. విధేయుడు – మోహన
సురేశ్‌గారు, మంచి వ్యాసము, జోహారులు.
1. కవిచింతామణి – వెల్లంకి తాతంభట్టు – తరువాతి లాక్షణికులు ఎంతగానో ప్రశంసించిన ఈ గ్రంథం మనకు పూర్తిగా లభ్యం కాకపోవడం మన దురదృష్టం. ఇందులో ఐదు అధికారములు ఉన్నాయి. దొరసామి శర్మ పుస్తకములో పద్యములలో కొన్ని మార్పులు చేసినానని చెప్పారు. కాని ఈ ఐదు అధ్యాయాలకంటె ఎక్కువ ఉన్నట్లు తెలుపలేదు.
2. పుస్తకము యిప్పటిదే అయినా కూడ, క్రీ. శ. 1000 కి ముందటి కాలపు వ్యాకరణమును గురించి కోరాడ మహాదేవ శాస్త్రిచే వ్రాయబడిన Historical Grammar of Telugu with Special Reference to Old Telugu (200 BC to 1000 AD) ఒక అద్భుతమయిన గ్రంథము.
3) ఓగిరాల రంగనాథకవి ద్విరేఫ వర్ణ దర్పణము అనే పుస్తకము రేఫద్వయమును గురించి విస్తారముగా చర్చిస్తుంది.
విధేయుడు – మోహన
పఠించాను పఠాభి కూర్పుల నేర్పుల తీర్పులతో తహతహలాడుతూ తఃతఃగారి కడుపుబ్బ కవ్వించే విత కాని కత కాని కవితను. సులోచనాల లోచనాలతో చదివిన పదాల ఆ ముదాలు, ఆముదాలు, ఆసాముల ఆ సాములు, మాయల లోయలలోకి తీయగా తీసికొని వెళ్లింది. గ్రే ఫుల్లీ గ్రేస్‌ఫుల్లీ ఆర్ డై ఫుల్లీ – ఇవి రెండు చెయ్యలేను. బహుశా విత్ గ్రేస్ ఫుల్లీ డై ఫుల్లీ విల్లీనిల్లీ. మంచి కొమ్మంచి కవితకు జోహారులు. విధేయుడు – మోహన
మోహనగారూ నమస్కారాలు. తెలుగు సాహిత్యంతో – ఇతరభాషా సాహిత్యాలతో మీ కున్న పరిచయాన్ని పక్కనబెట్టి – మీకుగల పరిచయం తలుచుకుంటే అసూయగా ఉంది. రవీ కవీ చూడలేని వాటిని కూడా మీలొ ఉన్న పరిశోధకుడు చూసేసి లొకానికి చూపిస్తున్నాడు.
ఇక్కడ ఒక విషయాన్ని వివరించడానికి అనుమతి ఇస్తారనుకొంటాను. సెంటో పద్యాలలాగే సెంటో కావ్యాలు కూడ ఉన్నాయి. తెలుగులో అట్టి అపూర్వమైన గ్రంథము ప్రబంధమణి భూషణము. ఇది ఒక సంకలన గ్రంథము. దీని సంకలన కర్త ఎవ్వరో తెలియదు. ఇతడు బహుశా క్రీ. శ. 1700 కు ముందు వాడు. ఎన్నో సంకలన గ్రంథాలు ఉన్నాయి. కాని ప్రబంధమణిభూషణపు విశేషము ఏమంటే ఇందులో కథ కూడ ఉన్నది. ఒక కథను అల్లుతూ దానికి సరిపోయే పద్యాలను వివిధ కావ్యలనుండి ఎన్నుకొన్నాడు కర్త. దీనిని చదివితే యిది ఒక సరికొత్త ప్రబంధమని తోచుతుంది కాని సంకలన మనిపించదు. దీని వివరాలు – ప్రబంధమణిభూషణము – పూర్వకవిసంచితము – సం. నిడుదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1971.
విధేయుడు – మోహన
వేలూరి గారూ !! మీరే కవిత్వం రాస్తానంటే ఇహనేం 🙂 తప్పక ఎదురుచూస్తాను . కవులని వెక్కిరిస్తూ..స్తూ.. స్తూ.. మీరు కవిత్వం వేపు మళ్ళడం, ఇలా మీరు కవిత్వానికి లొంగడం ..ఆసక్తి దాయకమైన విషయమే కదా !! రాయండి రాయండి. నాలాంటి వారికి కాస్త కవిత్వాన్ని గురించి కొత్త సంగతులని చెప్పిన వారవుతారు 🙂 ధన్యోస్మి !!
తహతహ గారూ !! నా ఉద్దేశ్యం లో ఏ కవిత అయినా దానికదే స్వతంత్రం గా నిలబడాలి. మంచికైనా ..కానిదానికైనా !! ఇంకొకరు మెచ్చినందువల్లా కాదు నొచ్చినందువల్లా కాదు. సమర్ధింపుకేమి . దేన్నైనా సమర్ధించవచ్చు. చివరగా ఏదైనా మాటల గారడీ వే కద 🙂 అందువలన మీ కవితలోని భాషా భేషజానికి తిరిగీ నేను సిఫార్సు చేసే పని పడదు లెండి. ఈమాట పత్రికే చాలు . అన్ని సిఫార్సులకీ !! వేలూరి ఆ పనిని అప్పుడే మొదలెట్టారుగా !!
ఇంతకీ , నాకు అనిపించిన అభిప్రాయం నేను రాసేను. అలా కాకుండా మీ” భావావేశం” నా” విమర్శకావేశా”న్ని గనక మించినదే అయితే మంచిదే కద !! ఇలాగే రాస్తూండండి. అయితే నా అభిప్రాయం మాత్రం ఇప్పటికీ ఇదివరకటిదే !!
వేలూరి కొంత కాలంగా -అపరాధులను క్షమించే అమెరికా ప్రెసిడెంట్ మోడ్ లో ఉన్నారు. ఒక్కో కథ, కవిత చదివి -వీరిని క్షమించాలి, వారిని అర్థం చెసుకోవాలి, ఈ కథలో వారిని సానుభూతితో చూడాలి, అని ఉదారులై పోతుంటారు. వేలూరి తరుణ హృదయులు. తరచి చూస్తే, ఉదారత ఎల్ల వేళలా మంచిదే. క్షమాగుణం సర్వత్రా మంచిదే.
కాని,
” దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది ” – అనే విప్లవకవి చెఱబండ రాజు కవిత ఆయనకు ప్రార్థనా పద్యంలాగా వినిపిస్తుంది.
‘వేలూరి’ ఉద్దేశంలో – ” విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు.” (చూడు: “మూడు ప్రార్థనా పద్యాలు” ఈ మాట)
That’s one hell of a topsy turvy hypothesis. – I think.
The utterly selfish, give me give me, irresponsible, సోంబేరి graffiti in this poem makes my skin crawl.
ప్రేమ, అనురాగం భాష అదేనా? దేశాన్ని తల్లిగా ఊహిస్తూ, మళ్ళీ ఆ తల్లిని వేశ్యగా ఊహిస్తూ బూతులు తిడుతున్నది, ఈ కవితలో ఉన్న వ్యక్తి -ఒక చిన్ని బాలుడు కాదు. (శైశవ క్రీడగా తల్లి స్థనాలతో ఆడుకునే చిన్ని mythological వినాయకుడు కాడు.) అసలు చిన్ని బాలుడికి తల్లి గురించి అట్టి ఘటియా ఊహలు రావు. ఆ కవితలో ఉన్నది నిజమైన దేశంలో, ఒక ఎదిగిన పౌరుడు. దేశం మట్టీ కాదు. మశానం కాదు. తల్లీ కాదు తండ్రీ కాదు. దేశం పౌరులే.
“Ask not what the country had done for you, Ask what you have done for the country” – అన్న ధోరణిలో ఆలోచించే పౌరుడు, ఈ కవి కాడు. Entitlement మరిగిన ఒక మనిషి. దేశ వ్యవహారాలలో తన బాధ్యత ఏమిటి అని ఆలోచించకుండా – కవిత్వం లో దేశాన్ని personify చేసి – అందునా ఒక స్త్రీగా, కులటగా ఊహించుకుని, నీ గమ్యం ఏమిటి తల్లీ? – అని విచారపడి పోతూ ఉంటాడు.
ఇది చదివే నాకు; తల్లి పడుపు వృత్తి చేస్తూ సంపాదించుకు వస్తుంటే, ఆ సంపాదనకోసం నోరు తెరుచుకుని ఎదురు చూసే బడితె, -వాడెలాటి కొడుకు? అతడే పని చేస్తున్నట్టు లేదేం, దుష్టపు ఊహలు ఊహిస్తూ తల్లి మీదే రాళ్ళు విసురుతూ నోరు పారేసుకోటం తప్పించి.- అన్న ఆలోచన వస్తుంది. నాకు ఈ కవి నచ్చడు.
వేలూరికి ఈ కవీ నచ్చుతాడు. తిలక్ కవీ నచ్చుతాడు. అదెలా? అది నా కర్థం కాదు.
గమనిస్తే ఈ దిగంబర కవికీ , తిలక్ కూ ఆలోచనల్లో ఎంతో తేడా ఉంది. పాఠకులు గమనించవలసినది ఆ మానవత్వపు తేడాలే. తిలక్ కథలు చదివిన వారికి సవ్యమైన ఆలోచన తెలుస్తుంది. సంస్కృతి. సంప్రదాయము , చట్టుబండలు ఆలోచనలు కావతనివి. తిలక్ కథలూ కవితలూ కొన్ని చదివాక – ఇది కథా, కవితా, ఎలాటిదీ శైలీ, అన్న మీమాంస కాదు, అతను రాసే విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు పాఠకులు. ఇవ్వాలి.
Ron Paul (నాయకుడిగా ఎన్నిక అవడు) ఇటీవలి రిపబ్లికన్ డిబేట్లలో -ఒక డాక్టర్గా, యుద్ధమ్లో స్వయంగా పాల్గొన్న వాడిగా – మనిషి జీవితం ఎంత విలువైనదో, పదే పదే చెప్పాడు. సంవత్సరాల తరబడి -పగ, విద్వేషాలూ, యుద్ధాలలో ఇరుక్కుని ప్రాణ నష్టం, అంగ వైకల్యం పౌరులకు జరగరాదు అని మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు. నిజంగా యుద్ధానికి పంపబడే యువకులు గమనిస్తున్నారు. ఆలోచించుకుంటున్నారు. వారు తప్పక ఆలోచించుకోవాలి. జీవించవలసిన వయసులో జీవించాలి. శృంగారం అనుభవించవల్సిన వయసులో, విడదీయబడి, విరహ కావ్యాలు రాసుకుంటే వారికేం లాభం? వికలాంగులైతే ఏంటి దారి? ఎంత పెన్షన్ ధనం ఆ లోటు తీరుస్తుంది?
కానీ, కొందరు నాయకులు, ఇప్పటికీ, యుద్ధ సైనికులు హీరోలనీ, వీరులనీ, వీర మరణాలనీ, అమరులనీ – అదో పిచ్చికవిత్వ భాష మాట్లాడుతుంటారు. తిలక్ రచనలు – అట్టి nonsensical talk and thought నుండి liberate చేస్తాయి. విభజించి ఆలోచించటాలు, నాయకులను వెర్రిగా నమ్మటాలు, తిలక్ రచయితగా మానేశాడు. యుద్ధాలు, మనుషులకు చేటని తిలక్ కు స్పష్టం.
రాజకీయ నాయకుడు అనే పాత్ర ధరించిన వాడి జీవితం, ప్రవర్తన, evolution, progression, ఎలా ఉంటుంది అన్న ఒక చక్కని study- ‘అద్దంలో జిన్నా’ అన్న రచన. జిన్నా గుండెపై రక్తపు మరకలు – Macbeth చేతులపై రక్తపు మరకలు లాగానే ఎంత కడిగినా పోవు. ఈ తిలక్ కథలు చదివాక, ఏ జిన్నాల -కోట్లు చూస్తానికి, ఊరికే దేశం మీద పడి అరిచే ‘ దిగంబర కవిత్వం’ వింటానికీ – కొందరు ప్రజలు పోరు.
ఇది కవిత్వమా? కథా? అన్న ప్రశ్న తిలక్ కధ విషయంలో, విమర్శకుడికి ఎందుకు? తోటి ప్రజలను గురించిన ఆలోచన మాని, నాయకుడి పై సానుభూతి చూపుదామా – అంటూ – ఆలోచన దారి మళ్ళించటం ఎందుకు? I am sorry. నా కర్థం కాదు. Pardon me too.
“Enough for us are fruits for food, tasty water to drink, the earth for a bed, and tree-barks for dress. I have no taste for the immodesty of the wicked, deluded by drinking the wine of wealth.” (ఈ అనువాదం Shaivam అన్న చోటు లొంచి తీశాను.)
నారాయణ బాబు గారూ – భర్తృహరి వైరాగ్య శతకం లోని 54వ శ్లోకానికి ఈ ఆంగ్లానువాదం చూడండి. గుహలలొ ఉండటం గురించి కూDA మరో శ్లొకంలొ చూడగలము.
కావ్యాల నాయకుడు ఎప్పుడూ ధీరోదాత్తుడే. ఈ ధీరోదాత్తుడు, అతని పేరులా ధీరుడు, ఉదాత్తుడు. గొప్ప వంశానికి చెందినవాడు, ఇట్టి నాయకులు విరహముతో బాధపడుతున్నా సామాన్య మానవునిలా నిగ్రహమును కోల్పోరు. కిష్కింధ కాండలో రాముడు సీత విరహముతో బాధ పడుతున్నప్పుడు కూడ దారిలో కనబడే ప్రకృతి దృశ్యాలను వర్ణించడము మరువలేదు. నా ఉద్దేశములో రామాయణములోని యీ ప్రకృతి వర్ణనలు నిజముగా చాల అందమైనవి. అదే విధముగా ఇక్కడ యక్షుడు కూడ నిగ్రహవంతుడై కనబడుతాడు. అదియునుగాక, అతని ప్రధానమైన గురి తన భార్యకు తన సందేశమును అందజేయడము. ఆ కార్యములో కృతకృత్యుడు కావాలంటే దారిని చక్కగా వివరణలతో మేఘునికి తెలుపవలెను గదా! అందువల్ల ఇది ఒక యాత్రా మార్గదర్శిలా అనిపిస్తుంది. కాని ఇందులో ముఖ్యమైన రసము విరహమే. కావ్య లక్షణాలు, ధీరోదాత్తుల లక్షణాలను గురించి క్లుప్తముగా ఇక్కడ చదువవచ్చును. ఇది పాత తెలుసా పాఠకులకు Down the memory lane లాటిది. – మోహన
మీరన్నది నిజమే గానీ ఆశ్చర్యం ఏమీ లేదు. అందులో, గత ఇరవైయేళ్ళలో సమగ్రమైన తెలుగు సినిమా సమీక్ష అన్నది నా కళ్ళబడలేదు. సమీక్షకులున్నారు కానీ పత్రికలకా అవసరం లేదు. ఇవ్వాళ తెలుగుదేశములో ఎన్ని సినిమా పత్రికలొస్తున్నాయన్నది ఎవరూ నికరంగా తేల్చిచెప్పలేని ఒక విచిత్రమైన ప్రశ్న. ఇవాళ వస్తున్న సినిమా పత్రికలు అభిమానుల కోసమే పాఠకులందరి కోసం కాదు. మిగతా వాటిల్లో అంటే సినిమా పత్రికలు కాని వాటిల్లో సినిమా వార్తలు, విశేషాలూ సచిత్రంగానే ఉంటాయి తప్ప సినిమా సమీక్షలు ఉండవు. ఈనాడు దినపత్రిక ప్రింట్ ఎడిషన్ లో ఇవ్వదు కానీ ఆన్ లైన్ ఎడిషన్ లో సినిమా సమీక్షలు ఇస్తుంది. ఆంధ్రభూమి వెన్నెల ప్రతి శుక్రవారం సినిమా అనుబందం ఉన్నవాటిలో చాలా మెరుగు.
రాష్ట్రంలో జర్నలిజం కోర్సు అందిస్తున్న యే విశ్వవిద్యాలయంలోనూ సినిమా అనేది ‘స్పెషలైజేషన్’ గా లేదు. పైగా యూనివర్శిటీ పట్టాలు పుచ్చుకున్నవారు దాదాపుగా ఎవరూ సినిమా జర్నలిజంలో స్థిరపడటం లేదు.కొ.కు, ఇంటూరి వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ నరసయ్య ప్రభృతులు రాసిన సినిమా వ్యాసాల గురించి ఇవ్వాళ దాదాపుగా ఎవరికీ తెలీదు. తెలియనప్పుడు ‘సినీజర్నలిజంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాలను గురించి కామెంట్లు రాయకపోవడం’ సామాన్యమైన విషయం. అయితే ఈ మాట పాఠకుల వరకూ మీపరిశీలన నిజమే.
రగడలు దేశి ఛందస్సు, అవి మొట్టమొదట రఘటాబంధమని నాగవర్మ ఛందోంబుధిలో పేర్కొన్నాడు. కన్నడములో వీటిని ఉత్సాహ (మూడు మాత్రలు), మందానిల (నాలుగు మాత్రలు), లలిత (ఐదు మాత్రలు) రగళె అంటారు. దాని సామాన్య లక్షణము –
ఇవి మాత్రాగణాలతో ఉంటాయి, ప్రతి పాదములో మాత్రల సంఖ్య సమానము, ఇది ద్విపద, ఇది తాళబద్ధమైనది. చివరి గుణము అంటే రగడ తాళబద్ధమైనదని చెప్పడము చాల ముఖ్యము. జయకీర్తి ఛందోనుశాసనములో ఇలాగంటాడు –
స్వచ్ఛంద సంజ్ఞా రఘటా మాత్రాక్షర సమోదితా
పాదద్వంద్వ సమాకీర్ణా సూశ్రావ్యా సైవ పద్ధతిః
ఇది స్వచ్ఛందము, మాత్రాగణయుక్తము, ద్విపద, సుశ్రావ్యము, ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి పజ్ఝటికా (యశస్తిలక చంపువులో పజ్ఝటికా ఉన్నది) నుండి వచ్చినదని భావన. రగళెను (తెలుగులో రగడ) మొదట పంపకవి తన భారతములో ఉపయోగించాడు. కవిజనాశ్రయకర్త దీనిని ఉదహరించలేదు. అంటే తెలుగులో దీని వాడుక తరువాతి కాలములో. కానీ తెలుగులో రగడను పోలిన ఒక పురాతన శాసనము ఉన్నది. తెలుగులో తొమ్మిది రగడలు ఉన్నాయి. వృషభగతి రగడలాటి మిశ్రజాతి రగడ కన్నడములో లేదు, అది భామినీషట్పదిగా అందులో ఉన్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రగడలకు ముఖ్యప్రాణము అవి మాత్రాబద్ధము, తాళబద్ధము. అందుకే తెలుగులో ఇవి యక్షగానాలలో, ఉదాహరణకావ్యములలోని కళికోత్కళికలలో, కావ్యాలలో కొన్ని వర్ణనలలో వాడబడ్డాయి. త్యాగరాజకీర్తనలు మున్నగు వాటిని పదాలను విరిచి పాడితే బాగుండడము లేదని తరచుగా వింటూ ఉంటాము. రగడలు కూడ పాడదగినవే. అందుకే వీటిని విరిచి వ్రాయడము బాగుండదనే నా భావన. ముఖ్యముగా రెండు నాలుగు మాత్రలను ఒక ఎనిమిది మాత్రలుగా (ఉదా. IIIUIII) వాడడము సరికాదనే నా అభిప్రాయము. కవులు నిరంకుశులు, ఎలాగైనా వ్రాసికోవచ్చు. కాని అవి అన్నీ సరి కావు. ఉదాహరణగా, పాల్కురికి కొన్ని సంస్కృత ద్విపదలలో, విశ్వనాథ ఒక తెలుగు ద్విపదలో పాదాంత యతిని పాటించలేదు. వారిద్దరూ మహాకవులే. అంత మాత్రాన వారి ఈ దోషాన్ని గుణముగా అంగీకరీంచకూడదు అనే నా ఉద్దేశము. ఇవి వారి కవిత్వపు వాసినిగాని, వారి విద్వత్తును గానీ అవమాన పరచడము కాదు. వైయక్తికముగా, నేను కవిని గాను, ఒక లాక్షణికుడు మాత్రమే. లక్షణాలను వివరించడానికి పద్యాలను ఉదాహరణలుగా వ్రాస్తాను. మహాకవులను ఎత్తి చూపే పాండిత్యము, కవిత్వము నాలో లేవు.
1) సంస్కృత కవులు ఒకే విధమయిన వృత్తముతో ఆశ్వాసాలను వ్రాసారు, తెలుగు కవులు ఎన్నో విధములయిన పద్యాలతో వ్రాసారు. రెండు భాషలలో మంచి కవులు తమ ధ్యేయాన్ని సాధించారు. ద్విపదలో వ్రాయబడిన ఏకాంతసేవ టాగూరు గీతాంజలికి సమానమైనది కాదా?
2) నాలుగు ద్రావిడ భాషలలో తెలుగు తమిళ భాషలలో మాత్రమే అక్షరసామ్య యతి లేక వడి ఉన్నది. తమిళములో నియమాలు తెలుగులోలా అంత కఠినమయినవి కావు. ఉదాహరణ – వ, మ లకు యతి చెల్లుతుంది. బహుశా మామ, మావ వంటి పదాలు దీనికి కారణము కావచ్చును. కన్నడములో విరామయతిని కూడ యతిని పాటించరు.
3) ద్రావిడ ఛందస్సులో ముఖ్యమైనది ద్వితీయాక్షర ప్రాస. ఇది అన్ని భాషలలో ఉన్నాయి, తెలుగులో మాత్రము ఉపజాతులలో యిది లేదు.
4) తమిళములో, కన్నడములో దేశి ఛందస్సులో కావ్యాలనే వ్రాసినారు. షట్పదులలో, సాంగత్యములలో (సీసములో చివరి సూర్యగణము సాంగత్యములో లుప్తము) సంపూర్ణ కావ్యములు ఉన్నాయి కన్నడములో. ఇది ఎందుకు చెప్పుతున్నానంటే వీటిని పాడుకోవచ్చును. అంటే కన్నడములో, తమిళములో పాడుకోడానికి అనుకూలముగా కావ్యాలు ఉన్నాయి. కాని తెలుగులో యిట్టివి అరుదు. తెలుగు కావ్యాలు చదువుకోడానికి మాత్రమే వ్రాయబడ్డాయి. పాడుకోడానికి ప్రాస బాగుంటుంది.
5) వేమన పద్యాలు అందముగా నుండడానికి కారణము పదాల విరుపు, అందరికీ అర్థమయ్యే భాష. పాదాంత యతి ఉపజాతులలో ఎప్పుడూ ఉంటుంది.
6) యతి తద్దినము మాత్రము కాదు. తెలుగుతో కూడ అన్ని ద్రావిడ భాషలలో సామెతలు ఆదినుండి ఉన్నవి. అవి మన సంస్కృతికి ఒక కాణాచి. ఈ సామెతలలో అక్షరయతియో లేక ప్రాసయతియో ఎప్పుడూ ఉంటుంది. యతి, ప్రాసయతి వీటినుండి పుట్టాయని ఒక ఊహ. ఈ సామెతలపైన సురేశ్ గారి వ్యాసాన్ని ఎదురుచూస్తున్నాను 🙂
1) సంస్కృతములో కావ్యములను వ్రాసే పద్ధతి వేరు, తెలుగులో వ్రాసే పద్ధతి వేరు. సంస్కృతములో ఒక ఆశ్వాసాన్ని ఒకే వృత్తములో వ్రాస్తారు (ఉదా. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వీటి రెంటితో ఉపజాతులు, వియోగిని, శ్లోకము, స్వాగతము, ఇత్యాదులు). ఆశ్వాసాంతములో మాలిని మున్నగు విశేష వృత్తాలను వాడుతారు. సంస్కృతములో వృత్త వైవిధ్యాన్ని నాటకాలలో చూపుతారు, కావ్యాలలో కాదు. తెలుగులో సంస్కృతములా కాక ఒక ఆశ్వాసాన్ని అన్ని వృత్తములలో వ్రాసినారు.
2) కన్నడ భాషలో మొట్ట మొదట చంపూ సంప్రదాయములో కావ్యాలు వచ్చాయి, దానినే తెలుగులో కూడ అనుసరించారు. ఏవో కొన్ని నిర్వచన కావ్యాలు తప్ప తెలుగులో చంపూ కావ్యాలే ఎక్కువ. ఇందులో గద్యపద్యములు రెండూ ఉంటాయి.
3) కన్నడములో మొట్టమొదట అనుష్టుభ్ శ్లోకాలను వాడారు. కాని తెలుగులో పూర్వ కవులు శ్లోకాన్ని వాడలేదు. తెలుగు కన్నడ కవులు ఆ శ్లోకస్థానములో కందమును వాడారు. ఇది చిన్న పద్యము, కథను సాగించడానికి చక్కగా ఉంటుంది, అందువల్ల.
4) తరువాత ఎక్కువగా వాడిన వృత్తాలు చంపకమాల, ఉత్పలమాల, మత్తేభవిక్రీడితము, శార్దూలవిక్రీడితము – ఈ క్రమములో. అందుకే నేనొక చోట అన్నాను, తెలుగులో శార్దూలానికన్న మత్తేభాన్ని ఎక్కువగా వాడుతారు అని, ఎందుకంటే అందులో ప్రారంభములో శార్దూలములా మూడు గురువులు ఉండవు. సంస్కృతములో ఉపజాతుల స్థానాన్ని తెలుగులో తేటగీతి, ఆటవెలది ఆక్రమించాయి.
5) ఇక యతి విషయము. పదాన్ని యతి స్థానములో విరిచితే కొన్ని సమయాలలో బాగానే ఉంటుంది (ఉదా. లాస్యము లాడవా పలు వి-లాసములన్ …), కొన్ని చోటులలో బాగుండవు (ఉదా. టంగుమని మ్రోగె గంట ప-డతి వినంగ …). జాత్యుపజాతులలో సామాన్యముగా పాదాంత విరామమును వాడుతారు. ఇది ద్విపదలకు, రగడలకు తప్పక ఉండాలి.
6) తెలుగులో పాదాంత యతి ఎందుకు లేదన్నదానికి, కోవెల సంపత్కుమారులు ఇలాగన్నారు. తెలుగులో ప్రాస ఉన్నది, అందువల్ల ఒక్కొక్కప్పుడు, పదములోని రెండవ అక్షరము ప్రాసాక్షరముగా అమరకపోవచ్చు. ముందటి పాదమునుండి పదము ఆరంభమయితే ప్రాసకు సౌలభ్యము దొరుకుతుంది. పదాన్ని ఇలా విరిచినప్పుడు, నా ఉద్దేశములో ముందటి పాదములో చివర పదానికి ఒక అక్షరముకంటె ఎక్కువగా ఉంటే వినడానికి అంత బాగుగా నుండదు.
7) మొట్టమొదట ఉత్పలమాలను, మత్తేభవిక్రీడితమును సంస్కృతములో వ్రాసినప్పుడు వాటికి పాదాంతయతిని ఉంచలేదు మన కవులు. కొన్ని శాసనాలలో ఈ విషయాన్ని గమనించవచ్చును.
8) మాత్రాగణములతో ఉండే రగడలలో కూడ తెలుగు కవులు కొన్ని సమయాలలో పదాలను గణాలకు తగ్గట్లు విరిచి వ్రాయకుండడము నిజముగా ఒక పెద్ద లోటే.
మీ వ్యాఖ్యలో కొన్ని విషయాలను మరికొంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
“బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యితర వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది.”
“తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు.”
వృత్త వైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం సంస్కృత కవులలో కూడా ఉన్నదే. ఒక కావ్యంలో భిన్న భిన్న వృత్తాలు వాడడం సంస్కృత కావ్యాలలో కూడా కనిపిస్తుంది కదా. మీరన్న వృత్త చతుష్కం కన్నా కూడా కందాలు తెలుగు కవులు ఎక్కువ వాడారు. అలాగే ఆటవెలది తేటగీతులు కూడా. సందర్భానుసారంగానే సీస పద్యాలు, అక్కడక్కడ ఇతర దేశి ఛందస్సులూ కూడా వాడారు. ఇతర వృత్తాలను అరుదుగానే వాడారు. అయితే వాటిని విరివిగా ఎందుకు వాడలేదు అనే దానికి కారణాలను వెతికితే మనకి కొంత విషయ పరిజ్ఞానం కలగవచ్చు. కాని, వాళ్ళ తెలివితక్కువ తనం వల్ల, స్పృహ లేని కారణంగా మానేసారని సమాధాన పడితే దాని వల్ల ఒరిగే ప్రయోజనమేమీ లేదు. వాళ్ళు నిజంగా ఎందుకు వాడలేదో మనకి కచ్చితంగా తెలిసే అవకాశం ఎలాగూ లేదు.
వృత్తౌచిత్యమన్నది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి – చెప్పే విషయం, రెండు – చెప్పే భాష. ఉదాహరణకి మందాక్రాంత వృత్తాన్నే తీసుకుందాం. మొదటగా, చెప్పే విషయం. కాళిదాసు మందాక్రాంత వృత్తంలోనే మొత్తం ఒక కావ్యం వ్రాసాడంటే, ఆ కావ్యం ఎలాంటిది? అది కథా కావ్యమా? కాదు. అందులోని వస్తువూ, రసమూ, పాత్రలూ ఇంచుమించుగా మొదటి నుండి చివర వరకూ ఒకటే విధంగా ఉంటాయి. అంచేత ఆ కావ్యమంతా ఒకే వృత్తంలో రచించడంలో ఔచిత్యం ఉంది. అదే కాళిదాసు రఘువంశంలోనూ, కుమారసంభవంలోనూ అనేక వృత్తాలు ఎందుకు వాడవలసి వచ్చింది? అవి కథా కావ్యాలు కాబట్టి. అందులో వివిధ సన్నివేశాలు, పాత్రలు, రసభావాలు ఉంటాయి కాబట్టి.
కాబట్టి, తెలుగులో మందాక్రాంత విరివిగా ఎందుకు వాడబడ లేదు అనే ప్రశ్న వేసుకొనే ముందు, తెలుగులో మేఘదూతం వంటి కావ్యాలు ప్రాచీన కాలంలో ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకోవాలి. అది వేరే చర్చ, కాబట్టి దానిలోకి నేను వెళ్ళడం లేదు. అలాంటి కావ్యాలు రానందువల్ల, ఆ వృత్తం అంత విరివిగా వాడబడలేదు. అది మొదటి కారణం. ఇక రెండవ కారణం భాష. మోహనరావుగారు, మీరూ చెప్పినట్టుగా మందాక్రాంత వృత్తం మొదటి నాలుగు గురువులూ తెలుగుకి ప్రతిబంధకం. గురువు లఘువుల సంఖ్యే కాదు, వాటి క్రమంలో కూడా వివిధ భాషల స్వరూపంలో తేడా ఉంటుంది. వృత్త చతుష్కం కాక మిగిలిన వృత్తాలు తెలుగులో విరివిగా లేకపోవడానికి యిది కూడా కారణమేమో పరిశీలించాలి.
“మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?”
వృత్తాన్ని విరుపులతో వ్రాయాలనే తాపత్రయం లేదు కాబట్టే తెలుగులో యతి విరామ స్థానంగా కాక అక్షర సామ్యంగా మారింది. కావ్యం మొత్తమూ పద్యాల విరుపుల అందం ఒక్కటే ఉంటే సరిపోదని మీకు నేను చెప్పనక్కరలేదు. సంస్కృతంలో కూడా రామాయణ భారతం వంటి కావ్యాలు ఇంచుమించు పూర్తిగా, కేవల పాదాంత విరామం మాత్రమే ఉన్న అనుష్టుప్పుతో నడిపించారు. ఇతర కావ్యాలలో కూడా కథా గమనం కోసం అలాంటి ఛందస్సే వాడబడింది. మందాక్రాంత వంటి అనేక విరుపులున్న పద్యాలు మేఘదూతం వంటి కొన్ని కావ్యాలలో మాత్రమే ఇంత విరివిగా వాడబడింది. తెలుగులో కూడా సందర్భం వచ్చినచోట చక్కని విరుపులతో హొయలుపోయే కందాలూ, సీసాలు మొదలైన మన దేశి ఛందస్సులో వ్రాసిన పద్యాలు ఉన్నాయి. మందాక్రాంత, మత్తకోకిల, లయగ్రాహి మొదలైన పెద్ద వృత్తాలకి విరుపులు లేకుంటే పద్యం అందం చెడిపోతుంది. తెలుగు కవులు ఈ వృత్తాలను వాడిన కొన్ని చోట్ల యీ అందాన్ని దృష్టిలో పెట్టుకో లేదన్నది మాత్రం నిజమే. కథాగమనం కోసం వృత్త చతుష్కంలో పద్యాలు వాడినప్పుడు వాటికున్న ఒక్క విరామ స్థానం అవసరం మన కవులకి కనిపించ లేదు. అందుకే వాటిని పాటించలేదు. పైగా, వాటికి మందాక్రాంత వంటి నిర్దిష్టమైన (మూడు విరుపులతో కూడిన) నడక లేకపోవడం వల్ల, ఆ ఉన్న ఒక్క విరామాన్ని పాటించకపోవడం వల్ల పద్య సౌందర్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అలా విరామ స్థానంలో విరుపు పాటించనవసరం లేని వృత్తాలనే తెలుగు కవులు ఎన్నుకున్నారనీ, అవే వృత్తచతుష్కమనీ నా ఊహ.
కొంతమంది మరొక అభియోగం చేస్తూ ఉంటారు. కథా గమనానికీ సంభాషణలకీ సంస్కృతంలో లాగా చిన్న చిన్న పద్యాలు వాడకుండా యీ చాంతాడు వృత్తాలని తెలుగులో వాడారన్నది. ఇది కూడా అంత సమంజసంగా అనిపించదు. ఒకటి, తెలుగు కవులు కూడా చిన్న పద్యమైన కందాన్ని విస్తృతంగానే వాడారు. రెండు, సంస్కృతానికీ, తెలుగుకీ భాషా స్వరూపంలో చాలా తేడా ఉంది. పదాలలో, వాక్యాలలో సంక్షేపము (brevity) ఎక్కువగా సాధించే లక్షణం సంస్కృతానికి ఉంది. అది ఒక రకంగా formal language కాబట్టి దానికా గుణం ఉంది. తెలుగు భాషా స్వరూపం వేరు. ఇది పూర్తిగా వాడుక భాష. నిత్యవ్యవహారంలో సంక్షిప్తంగా మాట్లాడడం అన్నది సహజమైన విషయం కాదు. అందుకే సంస్కృత భాషలో సాధించ గలిగే సంగ్రహత్వం తెలుగులో సాధించడం సాధ్యం కాదు. అలా సాధించాలని చూస్తే అది సహజ సౌందర్యాన్ని కోల్పోయి కృతకంగా తయారవుతుంది. అంచేత కథ చెప్పడంలోనైతే నేమి, సంభాషణల్లోనైతే నేమి, కొన్ని చోట్ల మనకి పెద్ద వృత్తాలు అవసరం అవుతాయి. ఈ సంగతులన్నీ ఆలోచించకుండా, సంస్కృతంతో పోల్చి, తెలుగు కవిత్వంలో సంక్షిప్తత తక్కువ అని పెదవి విరిచెయ్యడం సరి కాదు.
“అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.”
వృత్త విరామాల గురించి పైన చెప్పాను. ఇక యతి ప్రాసల నియమాలు వదిలి పద్య రచన చేసే సాహసం గురించి. ఎందుకు చెయ్యలేదూ, అలాంటి సాహసాలు కవులు చేసారు! ఈ వ్యాసంలోనే మోహనరావుగారు పేర్కొన్నట్టు రాయప్రోలు సుబ్బారావుగారు మేఘదూతానికి అనువాదమయిన దూతమత్తేభమనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని మత్తేభాలతో రచించారు. అలాగే మల్లవరపు విశ్వేశ్వరరావుగారు చిత్రాంగద అనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని పద్యాలతో రచించారు. యతి ప్రాస నియమాలు పాటించని కందాలు శ్రీశ్రీ సిప్రాలిలో కూడా మనకి కనిపిస్తాయి. ప్రాచీన కవులు ఎందుకలా రాయలేదు అంటే, బహుశా వాళ్ళకా ‘అవసరం’ కనిపించకపోయి ఉండవచ్చు. యతిప్రాసల నియమాలు పాటించడం వల్ల కవిత్వం పలచబడడం, వాటిని పాటించకపోవడం వల్ల గొప్ప పద్యాలు సృష్టింపబడటం జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవు. అక్కిరాజు ఉమాకాంతంగారు అలా జరిగిందని అభిప్రాయపడ్డారు కాని, అది పైన చెప్పినట్టుగా సంస్కృతంతో పోల్చడం వల్ల ఏర్పడిన అభిప్రాయమే అని నేననుకుంటాను. యతిప్రాసల నియమాలు కవికి ఒకోసారి ఎలా ఉపయోగపడతాయో కూడా చక్కగా వివరించే వ్యాసం, ఈమాటలోనే యిక్కడ ఉంది.
కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు.
సముద్రగుప్తుని కొడుకైన రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించిన తరువాత ఉజ్జయినిని తన రెండవ రాజధానిగా చేసుకున్నాడని మనకు దొరికిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. కొన్ని బంగారు నాణేల మీద ఒకవైపు దేవశ్రీ మహారాజాధిరాజ శ్రీ చంద్రగుప్త అని మరోవైపు శ్రీవిక్రమాదిత్య అన్న ముద్రల ఆధారంగా రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడని చెప్పవచ్చు. రెండవ చంద్రగుప్తుని రాజ్యకాలం 380–413/415 CE అని కచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి కాళిదాసు 4వ శతాబ్దానికి చెందినవాడనే చెప్పడం సబబు. ఇది ప్రస్తుతం పండితులంతా (Indologists) ఒప్పుకున్న వాదం.
కాళిదాసు కాలనిర్ణయ వివాదంపై విస్తృత చర్చకు Kālidāsa: Date, Life, and Works (1969) by Vasudev Vishnu Mirashi, Narayan Raghunath Navlekar ను చూడవచ్చు.
జయప్రభ గారు అంత దీర్ఘం గా చెప్పింది ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ మీద చెప్పిన అభిప్రాయమేనా? ఒక రచన మీద వచ్చినట్లుగా ప్రచురిత మైన అభిప్రాయాల్లొ యెన్ని నిజంగా ఆ రచన మీద ఉంటున్నాయి?
అలా యేదైనా రచన మీద కాకుండా చెప్పే అభిప్రాయాలకు ‘ఈమాట’లో చోటు కలిగించే పద్ధతిని గురించి సంపాదకులు ఆలోచించాల్సిన సమయమాసన్న మైనదా?
తఃతః
[అటువంటి చోటు ఈమాట చర్చావేదికల పైన ఎప్పుడో కల్పించాము. కాని, పాఠకులు ఆ వేదికను సద్వినియోగం చేసుకోవడంలేదని చెప్పడానికి చింతిస్తున్నాము … సం]
మోహన రావు గారు: మీ అనుస్పందన హర్షణీయం. “ఈమాట” వ్యాసకర్తలు అందరూ మీదారిలో నడిచి ప్రతివ్యాసానికి మొదల్లో abstract రాస్తారని, అలా ఆ వ్యాసం లో వారేం సాధించదల్చుకున్నారో వారి సొంత contributions ఏవిటో స్పష్టంగా పాఠకులకు ముందుగానే తెలియపర్చే అలవాటుని పాటిస్తారని ఆశిస్తాను.
ఇక మీ వ్యాసం గురించి: నాకు ఛందస్సు ఏమీ తెలియదు కనుక దాన్లో ఒప్పుతప్పరయు రసజ్ఞుడిని కాను. ఐతే ఛందశ్శాస్త్రం మీద మీకున్న మక్కువ అభినందనీయం, మీ కృషి, పట్టుదల శ్లాఘనీయాలు. మీరు చెప్పినదాన్ని బట్టి ఈ వ్యాసం లో చాలా విశేషాలే వున్నట్టున్నాయి.
జయప్రభ గారు: రచయితలకు, పాఠకులకు ఉండవలసిన అర్హతల గురించి మీరన్న మాటల్తో ఏకీభవిస్తాను. ఐతే, “తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని.” అంటూ మళ్లీ “అరుదైన రచనల విలువనెరిగే” పని పాఠకుల మీదే వేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం తమ రచన అరుదైనదైతే అది ఎందుకు అరుదైందో, దాని విలువ ఏమిటో చెప్పటం లో రచయితా భాగస్వామ్యం వహించటం అవసరం. (ఈ అభిప్రాయం వ్యాసాలకే పరిమితం) అందుకే సాంకేతిక పత్రాలలోలాగా ముందుగా ఒక abstract రాయమని కోరటం.
కొత్త పాఠకుల విషయం లో మీ ఆవేదన న్యాయమైందే. ఐతే ఇంటర్నెట్ ఈ విషయం లో చాలా మేలు చేస్తున్నదని నేను భావిస్తాను. ఎందాకో ఎందుకు, మీ అభిప్రాయాల్నిప్పుడు ప్రపంచవ్యాప్తమైన తెలుగు జాతి అంతా చదవగలుగుతున్నది కదా. పదిహేనేళ్ల క్రితం వరకు ఇది అసాధ్యం. ఈ ఇంటర్నెట్ మూలాన ఇదివరకు ద్వీపాల్లా ఉండిపోయిన సాహిత్య ఔత్సాహికులు, professionals ఒకచోట అభిప్రాయాల్ని పంచుకోగలుగుతున్నారు కదా. ఎన్నో వెబ్ పత్రికలు, బ్లాగ్ లు వచ్చాయి. ఇవి తెలుగు సాహిత్యాన్ని బతికిస్తాయో లేదో తెలియదు కాని బతికే probability ని తప్పక పెంచుతున్నాయి.
ఆసక్తికరమైన రచనలు కనిపిస్తే వాటికి పాఠకులూ తయారౌతారు. సాహిత్యాన్ని బతికించటం లో ప్రధానపాత్ర రచయితలది. “మమ్మల్ని మెచ్చుకునే పాఠకులు వుంటేనే మేం రచనలు చేస్తాం” అని వారు భీష్మించుక్కూచుంటే పాఠకులు ఎక్కడినుంచి వస్తారు?
చివరగా – పుస్తకాల గురించి. నా ప్రగాఢ విశ్వాసం పుస్తక రూపానికి కాలం చెల్లిపోతోందని. బహుశా ముందుముందు “పుస్తకరచన” కూడ ఒక సామూహిక క్రియగా పరిణమిస్తుందని నేననుకుంటాను. ఒక పుస్తకాన్ని “రాసే” బాధ్యతని ఒకరే మోయాల్సిన అవసరం తీరిపోతున్నది. సైద్ధాంతికంగానే కాక ఆచరణలో సైతం పుస్తక రచయితా పాఠకుడూ రచనాబాధ్యతని సంయుక్తంగా నిర్వహించే రోజు వస్తుందని నా భావన. చూద్దాం.
కె.యెస్. రామారావు గారూ – నిజంగా ఇది మీరు భావించేటంతటి “జటిల” సమస్య కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి నాకున్న అనుభవం పరిశీలన ఆధారంగా నాకు అనిపించిన విషయాలు ఇవీ! ఎప్పుడైనా కూడా ఏ రంగంలోనైనా పరిశోధనకి ఒక ప్రమాణం ఉండాలి. ఏది రాసినా అది పరిశోధన అవదు. దానికి సరి అయిన ఆకరాలు చూపిస్తూ ఆ పరిశోధన ఇతరుల దృస్టికన్నా ఎలా భిన్నమైనదో తన చూపు ద్వారా అదివరకూ తెలియని కొత్త విషయాలు ఏమున్నాయో అందుకు ఆ పరిశోధకురాలు/డు బాధ్యత వహించాలి. పరిశోధన చేసే వారికి అందుకు తగిన శిక్షణా, అలాగే చాలినంత అనుభవమూ ఉండాలి. తాను రాయదలుచుకున్న విషయం మీద అదుపు ఉండాలి.
ఇది అటుంచితే, పుస్తకాన్నీ దాని బాగోగులనీ ఎంచే వాళ్లకి కూడా తప్పకుండా ఒక స్థాయి ఉండాల్సిందే! ఒక పని లోని సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన వారూ అలాగే పరిశోధనా రంగమ్లో తగిన అనుభవం ఉన్న వారూ మాత్రమే కొంత వరకూ సరి అయిన అభిప్రాయాన్ని చెప్పగలరు. మిగిలిన వారి భావాలు లేదా స్పందనలూ వారికి ఆ వస్తువు నచ్చడం లేదా నచ్చక పోవడం, అర్ధం కావడం లేదా సరిగ్గా తెలియక పోవడం మీద ఆధారపడి బయటికి వచ్చేవే అవుతాయి చాలా సార్లు. అందుకు చేయగలిగింది ఏమీ లేదు. అయితే అభిప్రాయాలు చెప్పే వీలు ఉండాలి. ఎవరినించైనా మంచి సూచనలు లభించే అవకాశం సైతం లేకపోలేదు. వాటి సాధ్యాసాధ్యాలని బట్టి రచయిత వాటిని పాటించవచ్చు లేదా చదివి ఊరుకోవచ్చు. పుస్తక రచనలో ఎప్పుడూ కూడా రచయితదీ పరిశోధకులదే అంతిమ అభిప్రాయం అవుతుంది. అది తప్పదు. పుస్తకం బాగోగుల బాధ్యత వారిదే గనక!
ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, కనీసం తెలుగు భాషా సాహిత్యాల వరకూ అయితే, పరిశోధనా రంగంలో తగిన అనుభవమూ శిక్షణా ఉన్నవారు క్రమంగా తగ్గి పోతున్న కాలం ఇది. అందువలన వేరే రంగాలలో స్థిరపడి తెలుగు మీద ప్రేమ లేదా ఇస్టం ఉన్నవాళ్ళు రాయక తప్పని ఒక పరిస్థితి వచ్చింది ఇవాళ. వారి భావ ప్రకటనకి అనువుగా ఉండే మాధ్యమం సైతం అందుబాటులో ఉంది. “అంతర్జాతీయ ప్రమాణాలు” అంటూ ఒక కొలమానాన్ని తెలుగున తెచ్చి పెట్టిన వాళ్ళు ఇంగ్లీషులో వచ్చే పుస్తకాలలో ఎన్ని అచ్చుతప్పులు ఉంటున్నాయో, ఎన్ని విషయాలు దేశీయమైన వాటినించి గ్రహించి వేరే భాష వారి వారికి తగిన విధంగా రూపొందుతున్నాయో మాట్లాడక పోవడం విడ్డూరం. నా దృష్టిలో ఆసక్తికరమైన రచన కాని రచన అన్నవే చిట్టచివరికి ముఖ్యమైనవి అవుతాయి. అవి ఎవరు రాసినా అంతకన్నా మించిన ప్రమాణం ఏదీ ఉండదు ఎప్పుడైనా! మిగిలినవన్నీ ఊరికే చర్చిందుకుందికి పనికొస్తాయి అంతే!
తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని. సకాలంలో రాని స్పందన ఆ తరువాత వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే! మీనమేషాలు లెఖ్ఖించడాలూ లౌక్యాలు ప్రదర్శించడాలూ ఆ రంగానికి మేలు చేయగలిగిన అంశాలు కాలేవు. ఎందుకంటే తమ విలువైన కాలాన్ని ఎవరు గానీ ఒక క్రమంలో ఒక వస్తువు మీద పెట్టడం అన్నది మామూలు విషయం కాలేదు ఎప్పుడైనా కూడాను. అందునా ఏ డబ్బులూ రాని తెలుగు సాహిత్యమ్లో అంటే మరీను! అలాగే అందరూ అన్ని రకాల రచనలూ చేయలేరు. అందువలన కొన్ని తరహా రచనలు చేయగలిగిన వారే చేయాలి. అలాంటి రచనలు అంటూ అసలు వస్తే, వాటి పట్ల ఒక కుతూహలం పాఠకులకి కనీసం సాహిత్యం గురించి తెలిసిన పాఠకులకి ఉండటం సముచితం! అయితే పాఠకుల స్థాయి ఇక్కడ చాలా ముఖ్యం.
ఎందుకంటే ప్రతీ రచనకీ ప్రతీ వాళ్ళూ పాఠకులు కారు. ఆ వస్తువుని గురించి వారికి కనీశమైన స్పస్టత అయినా ఉండాలి. spoon feedingకి అలవాటు పడిన బధ్ధకస్తులైన పాఠకులు లాభం లేదు. కస్టపడగలిగిన స్వభావం ఉన్నవాళ్లై ఉండాలి పాఠకులు కూడా! అలాగే ఒక పుస్తకం అర్ధం చేసుకోవడం వేరు. అదే పుస్తకాన్ని గురించి వ్యాఖ్యానించడానికి తగిన పరిజ్ఞానం పుష్కలంగా ఉండి వారు ఆ పని చేయడం వేరు. రెండూ భిన్నమైన విషయాలు. దురదృష్టమైన విషయం ఏమంటే తెలుగున విమర్శ అరుదైన అంశం ఎలా అయిందో, అలాగే ఆ విమర్శ గురించి చేసే పాఠక వివేచన కూడా అరుదే అయిపోయింది. సూచనలు చేయడం రాసిన విషయాన్ని విశ్లేషణ చేయడం ఒకటి కాదు. ఎప్పుడైనా ఏ పుస్తకాన్నైనా ఎప్పుడూ అనేక తీరుల్లో రాసే వీలుంది. ఏదీ కూడా “perfect” కాదు. అవదు కూడా! ప్రతీ రచనకీ ఇది వర్తిస్తుంది. ఆ రాసిన వారెవరు అన్నదానితో సంబంధం లేకుండా! అందువలన అభిప్రాయాలు ఆ రచనని బేరీజు వేయడంలో అడుగు తప్పనివి అయి ఉండాలి. అంతే!
ఇంక చివరగా తెలుగు వరకూ పుస్తక ప్రచురణ, దానికి సంబంధించిన ఇతర అంశాలు అనేకం దుస్సాధ్యమైనవి. అయినా తెలుగున కస్టమైన అంశాల మీద ఇంకా పని చేయడం జరుగుతూ ఉందంటే, పుస్తకాలు అచ్చు అవుతున్నాయీ అంటే అది కేవలం రచయితలకి భాషా సాహిత్యాల పట్ల ఉండే ప్రేమ వల్ల మాత్రమే! మరొక్క పదేళ్ళాగండి అప్పుడు ఈ వచ్చే పుస్తకాలూ రావు. ఇంతపాటి మాట్లాడే వాళ్ళూ ఉండరు: కొత్త పాఠక వర్గం తయారైతే తప్ప.-అలా నిజంగా అయితే గనక అప్పుడు నాకన్నా సంతోషించే వాళ్ళుండరు. తెలుగు సాహిత్యం వరకూ రాసే వారిని నిలుపోగలిగితేనూ, పాఠక వర్గాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళ గలిగితేనూ తప్ప అది సాధ్యమయ్యే వ్యవహారంలా లేదు. కారణం తెలుగున ప్రవేశం ఉన్న వాళ్ళు క్రమంగా తగ్గిపోతున్నారు. దీన్ని ఏ రకంగా సరి చేయాలీ అన్నది ఆలోచించవలసిన విషయం. లేకపోతే తెలుగున పుస్తకాలు వచ్చే వీలే ఇటుపై ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే ఇందుకు రచయితా పాఠకులూ విమర్శకులూ వీరందరూ తమ పాత్రలని సక్రమంగానూ నిజాయితీ గానూ పోషించాలి. సరుకున్న రచనలని దూరం పెట్టి తేలిక పాటి రచనలని గురించి బాకా కొట్టే ఒక తప్పుడు పాత్ర పోషించకుండా ఉంటే చాలు. అందులో భాగంగానే మంచి రచనలని గురించి మాట్లాడ వలసిన బాధ్యతని సైతం సాహిత్యం పట్ల మమకారం ఉన్న వారందరూ చూపించవలసి ఉంది. ఇదే మీరు మరి “జటిల”మంటారా? అయితే మరి సాహిత్యాన్ని ఏకంగా అటకెక్కించేస్తే చాలు:)
శ్రీవక్కలంక లక్ష్మీపతిరావు గారు కూడా మేఘసందేశానికి ఒక తెలుగు అనువాదం వెలువరించారు. గత 70వ దశకంలో డిగ్రీ విధ్యార్థులకు అది పాఠ్యగ్రంథంగా కూడా ఉండేది. నేను కూడా అది అలా చదివాను. అయితే నాకు అందులో మూలకావ్యంలోని సొగసు కనుపట్ట లేదు. నాకు గుర్తున్నంత వరకు, వక్కలంకవారు ‘ఆ కాళిదాసు మన తెలుగువాడైతే యెట్లా వ్రాసి యుండేవాడో నని అట్లాగు వ్రాసాను’ అనటం నాకు రుచించ లేదు.
బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యిత వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది. అలాంటిదే మరొక తప్పుడు స్పృహ సంస్కృత పాండిత్య ప్రదర్శన యెంత హెచ్చుగా చేస్తే అంత మంచిదీ, సమాసదైర్ఘ్యంతో అదరగొట్టటం ద్వారా కవిత్వానికి అందమూ కీర్తీ వస్తాయని భావించటం. ఇటువంటి పనులవలన తెలుగు కవిత్వంలో తెలుగు తరచుగా చులకనయింది, ప్రజలకు ఆ తెలుగు(?)కవిత్వం దూరంగా జరిగింది!
మందాక్రాంతంలో పూర్వపాదాంత్యాక్షరంతో కలిపి వరసగా అయిదు గురువులు వచ్చేటట్లు తెలుగులో వ్రాయటానికి పెద్దప్రతిబంధకం. అలాగే మందాక్రాంతం అందమంతా పాదంలో నిర్దిష్టమైన చోట్ల మూడు విరుపులు రావటంలో ఉంది. మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?
తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు. అంతే. అలాగే కొన్ని మందాక్రాంతాలూ ఉన్నాయి.
అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.
1) బ్రహ్మానందం గారు, నచ్చిన విషయాలను ఎప్పుడు నచ్చాయి అనే చెప్పాలి. అందువల్ల మనము తక్కువ కాము. నేను చిన్నప్పుడు Yussouf by James Lowell లో చదివిన క్రింది పంక్తులు మెదడులో తేలుతున్నాయి –
As one lamp lights another, nor grows less,
So nobleness enkindleth nobleness.
2) జయప్రభ గారు, మీరు చెప్పినది నిజమే. నాకు ఎంతో యిష్టము కాబట్టే, ఛందశ్శాస్త్రములో నేను పరిశోధనలు చేస్తున్నాను. ఇవి ఎవరు బావుంది, బాగా లేదు అని చెప్పినా, వ్యాసాలు వ్రాయకున్నా కూడ ఆపను. ఎందుకంటే ఈ శాస్త్రములో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థము చేసికోవడానికి, నన్ను జ్ఞానవంతుడిని గావించుకోడానికి. మీ సలహాలకు కృతజ్ఞుడిని.
3) లైలాగారు, కాళిదాసు నివసించిన కాలమునుగురించి ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇతడు క్రీస్తు పూర్వమే ఉన్నాడంటారు. మరి కొందరు నేను తెలిపినట్లు నాలుగవ శతాబ్దపు వాడంటారు. ఇతని కవిత్వములో అశ్వఘోషుని కొన్ని అనుసరణలు, అనుకరణలు ఉన్నాయి. కాళిదాసులాటి కవికి మిగిలినవారిని ఎందుకు అనుసరించాలి అనే వాళ్లు ఇతడు అశ్వఘోషునికి పూర్వకవి అంటారు. నా ఉద్దేశములో మందాక్రాంతమును వాడిన మొట్టమొదటి కవి కాళిదాసు హరిసేనుడివల్ల ప్రభావితుడై ఆ వృత్తాన్ని మేఘదూత రచనకు ఎన్నుకొన్నాడని అనుకొంటాను. ఇక పోతే, సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి శిలాక్షరాలు కాబట్టి ఇందులో ఎట్టి సందేహము లేదు. కావున నేను కాలిదాసు నాలుగవ శతాబ్దపు వాడనే నమ్ముతాను. సముద్రగుప్తుడన్నది ఒక బిరుదు మాత్రమే. ఇతని అసలు పేరు వేరైనది.
కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు. మీరు ఉదహరించిన ఘటకర్పరునికి పేరు అది కాదు, అదేమో తెలియదు. కాని సందేశకావ్యములలో ఇతడు వ్రాసిన ఘటకర్పరము ఉన్నది. ఇది ఒక యమక కావ్యము కూడ. కొందరు దీనిని చూచిన తరువాతే కాళిదాసు మేఘదూతాన్ని వ్రాసినాడంటారు.
4) రవి గారు, రాజగోపాల శర్మ వ్రాసిన పుస్తకములో (గ్రంథసూచిలో ఎనిమిదవది, ఇది DLI – IISc లో లభ్యము) తెలుగులో కొటికలపూడి వేంకటకృష్ణ పండితులు 1790లో అనువదించారు, అది నేడు దొరకడము లేదు. లభ్యమయిన పుస్తకాలలో వడ్డాది సుబ్బరాయకవి 1884లో చేసిన అనువాదము మొదటిది. సుమరు 50 అనువాదాలు ఇందులో పేర్కొనబడ్డాయి.
5) నిడదవోలు వేంకటరావుగారికి కన్నడ ఛందస్సుతో బాగుగా పరిచయము ఉన్నది. ఆందువలన వీరు భామినీషట్పదిని ఎన్నుకొన్నారేమో లేక కామేశ్వరరావుగారన్నట్లు ఈ ఛందస్సు తెలుగులో కూడ పరిచితము కాబట్టి ఎన్నుకొన్నారేమో? మిశ్రగతిలో సాగే ఈ ఛందస్సుకు ఒక తూగు ఉన్నది. వ్యక్తిగతముగా నా ఉద్దేశములో అది వ్యధకు, బాధకు, విరహానికి సముచితము కాదేమో? దానికి బదులు ఖండగతిలో ఐదు మాత్రలతో ఉంటే అది బరువును సూచించగలదు. ఈ విషయాలను నేను చర్చించలేదు, ఎందుకంటే నా గురి మందాక్రాంతవృత్తము మాత్రమే కావడమువల్ల. నా ఉద్దేశములో పాదాలలోని పదాలకు సరిగా విరుపును కలిగించి ఉంటే మందాక్రాంతములో కూడ పై 50మంది కవులలో ఏ కొందరైనా దీనిని తప్పకుండ సాధించి యుంటారు. నావంటి అల్ప భాషాజ్ఞానియే దీనిని ప్రయత్నము చేసినప్పుడు, సంస్కృతాంధ్రములలో పాండిత్యము ఉన్నవారికి ఇది నల్లేరుపై బండి నడకే.
6) కామేశ్వరరావుగారు, సంస్కృత యతిని గురించి ఒక రెండు వాక్యాలు. నాట్యశాస్త్ర రచయితవంటివారు యతిని పూర్తిగా అంగీకరించలేదు. మిగిలినవారు కూడ మొట్ట మొదట తప్పకుండా పాటించినా, తరువాత పదాలను సంధితో యతిస్థానము వద్ద కలపడము ఒక ఆభరణములాటిది అనుకొన్నారు. దీనికి కాళిదాసాదికవులను పొగిడారు కూడ. నావరకు నేను యతి స్థానము వద్ద విరుపు లేక సంధి అవసరమని భావిస్తాను. పదాలను యతి స్థానములో దూసుకొని వెళ్లేటట్లు వ్రాయడము, పాదాంత యతి లేకుండ వ్రాయడము నాకు రుచించదు. పాదాంతయతి ఉపజాతులలో తప్పక అందరు పాటిస్తారు, కందములో రెండవ పాదానికి పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు యిది నియతము. ఇక పోతే ఆషాఢస్య ప్రథమదివసే అనేటప్పుడు స్య గురుతుల్యమే. ఉదాహరణగా సంస్కృతములో పాదాంత లఘువును గురువుగా అంగీకరిస్తారు, ఎందుకంటే అక్కడ విరామము వస్తుంది కనుక. విరామము ఉన్నప్పుడు సంస్కృతములో లఘువు సామాన్యముగా గురుతుల్యమే.
పాదాంత యతి ఉన్నప్పుడు, పాదారంభములో అచ్చులను వాడుతారు, సంధి లేకుండా కూడ. ఇక మధ్యలో సామాన్యముగా అచ్చులను య-కారముతో తెలుపుతారు.
7) కామేశ్వరరావు గారు, నేను ఇంకా మందాక్రాంత వృత్తరచనను అభ్యాసము చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 30 వ్రాసినాను, మందాక్రాంతపు లయతో సుమారు 15 పద్యాలు, జాతి పద్యముగా సుమారు 25 వ్రాసియున్నాను. ఇందులోని కిటుకులను ఇంకా నేర్చుకొంటున్నాను. వీలు దొరికినప్పుడు వీటిని అంతా ఒకే చోట ఉంచడానికి ప్రయత్నము చేస్తాను.
ఇదే ఒక చిన్న వ్యాసములా తయారైనందులకు సంపాదకులు మన్నిస్తారనే ఆశతో
మోహనరావు, బ్రహ్మానందం, జయప్రభ పాఠకస్పందన గురించి చాలా లోతైన విషయావలోకనకి దారితీసే అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ వ్యాసానికి నేరుగా సంబంధించకపోయినా ఈ “పాఠకస్పందన” గురించి నాకు కలిగిన కొన్ని సాధకబాధకాల్ని “ఈమాట” పాఠకుల ముందుంచుతాను.
1. రచనలో రచయిత పాత్ర. మీరు ఒక సాంకేతిక పరిశోధనాపత్రం రాసి ప్రచురించదల్చుకున్నారనుకోండి. దాన్లో విధిగా మొదల్లోనో (కొన్నిట్లో చివర్లోనో) ఆ విషయం మీద అంతవరకు జరిగిన ముఖ్యమైన పరిశోధనల్ని క్లుప్తంగా వివరించి, మీరు చేస్తున్నపని వాటికన్నా ఏ విషయాల్లో భిన్నమైందో, ఎలా ఆ సమస్య పట్ల మన అవగాహనని విస్తృతం చేస్తుందో, మీరు చేస్తున్న ముఖ్యమైన contributions ఏమిటో ఏకరువు పెడతారు. అప్పుడు ఆ పత్రాన్ని పరిశీలించే పరిశీలకులు (reviewers) మిగిలిన వాళ్ల, మరియు మీసొంత contributions గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతవరకు సత్యాలో కాదో నిర్ణయించి, మీ contributions విలువ మీరు ప్రచురించ ప్రయత్నిస్తున్న పత్రిక (journal, conference proceedings etc) స్థాయికి సరితూగుతుందా లేదా అని బేరీజు వేసి ఆ పత్రాన్ని ప్రచురణార్హమైందో కాదో తేలుస్తారు. ఆ పరిశీలకులు మీరు పనిచేస్తున్న అంశం లోనో, దానికి దగ్గరగా వుండే అంశాల లోనో ఉద్దండులు కనుక ఈ పని చెయ్యగలుగుతారు (ఎప్పుడూ కాకపోవచ్చు కాని అత్యధిక శాతం విషయంలో ఇది నిజం).
కవితల్నీ కథల్నీ బావుందనో లేదనో చెప్పటానికి విస్తృతమైన పాండిత్యం పనికొస్తుందేమో కాని అవసరం మాత్రం కాదు, ఎందుకంటే వాటిని బేరీజు వెయ్యటం హృదయసంబంధి విషయం. వ్యాసాలు అలా కాదు. అవి మేధోసంబంధితాలు. (చాలా మంది తెలుగు కవులు ఈ తేడా తెలియక వ్యాసాల్ని కవితల్లా రాయటానికి ప్రయత్నించటమూ కవితలరూపంలో అప్రయత్నంగానే వ్యాసాలు రాయటమూ మనకు కొత్తకాదు గాని, అది ప్రస్తుతం అప్రస్తుతం.) కనుక ఒక వ్యాసాన్ని చదివినప్పుడు ఆ రచయిత contribution ఏమిటో ముందు మనకు తెలియాలి. ఉదాహరణకు, (అ) ఎవరో రాసిన విషయాన్ని తన మాటల్లో మళ్లీ రాశాడా, (ఆ) రకరకాల పుస్తకాల్లో ఉన్న విషయాల్ని క్రోడీకరించి ఒకచోట చేర్చాడా, (ఇ) అదివరకు ఉన్న విషయాల్ని తీసుకుని వాటికి కొంత కొత్త అవగాహనని కలిపాడా, (ఈ) ఇదివరకు ఎవరూ చూడని ఒక కొత్త కోణం చూపిస్తున్నాడా, (ఉ) ఇదివరకు ఎవరూ ఊహించని కొత్త ఊహతో అదివరకున్న అవగాహనని తల్లకిందులు చేశాడా, (ఊ) అదివరకు అవగాహనే లేని విషయానికి ఒక సిద్ధాంత ప్రాతిపదికని కల్పించాడా,.. ఇలా ఎన్నో levels ఉన్నాయి. ముందే అనుకున్నట్టు సాంకేతిక రంగాల్లో ఐతే తను చేసిన పని ఏమిటో ఈ విశాల రేఖ మీద దాని స్థానం ఎక్కడని తను నమ్ముతున్నాడో చెప్పటం రచయిత పని. అతని ఆ అవగాహన ఖచ్చితమైందో కాదో నిశ్చయించటం పరిశీలకుల పని.
తను చేస్తున్న పని ఏమిటో చెప్పటం మన రచయితలకు అలవాటు లేదు. ఆ పని స్థాయి ఏమిటో చెప్పగలిగే పరిశీలకులు సాహిత్య ఔత్సాహికుల్లో చాలా కొద్దిమంది.
2. దేని గురించి రచయితని అభినందించాలి? ఒక వ్యాసంలో రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు ఆ రచయితని దేని గురించి అభినందించాలి? ఉదాహరణకి ఒక రచయిత చేసిన పని ఎన్నో చోట్ల ఉన్న విషయాల్ని సంగ్రహించి క్రోడీకరించి సంక్షిప్తీకరిచటం అనుకోండి. అప్పుడు అవసరమైన అన్ని విషయాల్ని సంగ్రహించాడా లేక ఏవైనా ముఖ్యమైన వాటిని సంప్రదించలేదా, క్రోడీకరణమూ సంక్షిపీకరణమూ సరిగా ఉన్నాయా లేవా అని వాటి గురించి అభినందనలో చీవాట్లో అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు. రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు, అది తెలుసుకునే జ్ఞానం పాఠకుడికి లేనప్పుడు, చేసే వ్యాఖ్యలు గుడ్డివాడి చేతిలోని రాయి వంటివే ఔతాయి కదా.
3. ఎవరు సరైన వ్యాఖలు చెయ్యగలరు? రచయితా, పరిశీలకులు పాఠకుడికి ఎలాటి సమాచారమూ ఇవ్వనప్పుడు బాధ్యతంతా పాఠకుడి మీదే పడుతుంది. పాఠకుడే ఆ రచనలో రచయిత తెచ్చిన కొత్త అవగాహన ఏమైనా వుందా? ఉంటే అదేమిటి? దాని విలువేమిటి? ఆ విలువ స్థాయి ఏమిటి? మిగిలిన వాటితో పోలిస్తే ఇది నేలబారుదా, సామాన్యమైందా, సగటుదా, ఉన్నతమైందా, అత్యున్నతమైందా, అద్భుతమైందా – అని బేరీజు వెయ్యగలగాలి. మామూలు పాఠకులకి ఇది సాధ్యం కాదు. కనుక ఏదో అనాలి కదా అనటమో లేకపోతే లేని పెద్దరికాన్ని మీద వేసుకుని తెలియని విషయాల్ని తెలిసినట్టు నటించటమో లేదా అలాటి నటన అలవాటైపోయి నిజంగానే పండితుణ్ణని భ్రమించటమో జరుగుతుంది.
4. అందరూ ఔత్సాహికులే ఐనప్పుడు. “ఈమాట” లాటి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు (ఏ నారాయణ రావు లాటి వారో తప్ప) ఔత్సాహికులు. అలాటి వారు తమకున్న అనేక ఇతర వ్యాపకాల నుంచి సమయం వెచ్చించి ఏదో ఒక విషయం మీద వ్యాసం రాయటమే గొప్ప విషయం. కనుక అలాటి వారు రాసే వ్యాసాలకి professional స్థాయి ప్రమాణాలు వర్తిస్తాయా? వర్తించాలా? అది సాధ్యమా? కొంత lenience అవసరం అని బహుశా అందరూ ఒప్పుకోవచ్చుననుకుంటాను. ఐతే, ఎంత? ఉదాహరణకు, ఒక professionalకి “ఉన్నత” స్థాయి ఔత్సాహికుడి “సగటు” స్థాయికి సమానం అనొచ్చా? అంటే, professional scale మీద “సగటు” స్థాయిని చేరే వ్యాసాన్ని ఒక ఔత్సాహికుడు రాస్తే, దాన్ని “ఉన్నత” స్థాయి అని లెక్కవెయ్యొచ్చా? మరోవిధంగా చెప్పాలంటే, professionalకి, ఔత్సాహికుడికి తేడా “ఒక స్థాయి” అన్నమాట. కాదు, అది మరీ దగ్గర, రెండు స్థాయిల తేడా ప్రమాణం ఐతే బాగుంటుంది అనొచ్చు. ఏదో ఒకటి, ఒక ప్రమాణం ఒప్పుకుంటే అప్పుడు professional scale ని కొలమానంగా తీసుకుని ఔత్సాహికుల రచనల విలువని అంచనా కట్టొచ్చు.
చివరగా: మంచి రచనల్ని, మంచివి కాని వాటిని విడదియ్యలేనప్పుడు ఇటు వాసి రచయితలకూ అటు నాసి రచయితలకూ మరోవైపు పాఠకులకూ మంచి జరగదు. నాసి రచయితలు గొప్పవాళ్లమని విర్రవీగి విజృంభించటం, వాసి రచయితలు నీరుగారి నీరసించటం, పాఠకులు చెత్తలో కూరుకుపోయి ఆక్రందించటం జరుగుతాయి. తెలుగు సాహిత్యరంగంలో అలా విడదియ్యటానికి ఇప్పుడు కాలం అనుకూలం కాదు. ఈ జటిలసమస్యకి పరిష్కారం నాకు తెలియదు.
ఎందరో పెద్దవాళ్లు చెప్పినట్టు, రాయగలిగిన వాళ్లు రాస్తూ వుండాలి. ప్రతివారు చేసే ప్రతి రచన కళాఖండం కాదు కాని అభ్యాసంతో ఎప్పుడైనా ఒకటి బయటకు వచ్చే అవకాశం వుంది. “అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు”. ఈ విషయం రచయితలూ పాఠకులూ గ్రహిస్తే అందరికీ హాయి.
వారి వ్యాసంతో సంబంధంలేని విషయాల్ని రాసే అవకాశం ఇచ్చిన మోహనరావు గారి వ్యాసానికి అభినందనలు.
చాల ఆనందముగ వున్నది ఎందువలనంతటే శిశువు నా పదవ తరగతి పాఠ్యాంశము. అప్పుడు నాకు అర్దం అవలేదు కాని నాకు అబ్బాయి జన్మించిన తర్వాత తెలిసింది కవి గొప్పతనము. నిజముగ ఇలాంటి గొప్ప కవులు జన్మించిన ఈ తెలుగుగడ్ద మీద జన్మించినందుకు గర్వపడుతున్నాను.
సంస్కృత తెలుగు యతులను రెండిటినీ పాటిస్తూ మీరు వ్రాసిన తెలుగు పద్యాలు బాగున్నాయి. అయితే వాటిలో మీరు చేసిన యడాగమ సంధుల గురించి చిన్న అనుమానం.
“యలయై రావా – యలఘుతర మో – దాబ్ధిలో ముంచ రావా”
వంటి చోట్ల యడాగమం చెయ్యవచ్చా అని.
తెలుగులో మందాక్రాంతం ఎందుకు అరుదు అన్న మీ ప్రశ్నకి మీ, “వాణిశ్రీదా – వరము లొసగన్ – వందన మ్మిత్తు దేవీ” అన్న పద్యమే సమాధానం అని నాకనిపించింది. మిగతా మూడు పాదాలలో ఉన్న అందం మొదటిపాదంలో ఉందా?
సంస్కృత యతుల గురించి నాకు చాలా రోజులుగా ఉన్న ఒక సందేహం ఇక్కడ అడగడం అసందర్భం కాదనుకుంటాను. సంస్కృతంలో యతి విరామస్థానం కదా. అంటే పద్యం చదువుతున్నప్పుడు అక్కడ కచ్చితంగా ఒక క్షణం ఆగాలి కదా. మరి అలాంటప్పుడు యతి స్థానంలోని అక్షరం సంయుక్తమైతే దాని ముందరి అక్షరం గురువవ్వడం సమంజసమెలా అవుతుంది? ఉదాహరణకి, “ఆషాఢస్య ప్రథమ దివసే” అన్నప్పుడు “స్య” అన్న అక్షరం “ప్ర” అక్షరం సంయుక్తం కావడం వల్ల గురువవుతోంది. కాని “ఆషాఢస్య” అని ఆపి తర్వాత “ప్రథమ దివసే” అని చదివేటప్పుడు “స్య” లఘువే కదా అవ్వాలి?
మోహన గారు, మీ వ్యాసాన్ని సమీక్షించి లేదా విమర్శించే స్థాయి నాకు లేదు. చక్కగా ఉంది అంటే సరిపోదు, ఈ వ్యాసం అలా ఉబుసుపోక చదివి అభిప్రాయం చెప్పేదీ కాదు, అంచేత నాకు కలిగిన కొన్ని ఆలోచనలు పంచుకుంటున్నాను.
>>కోపాన్ని, ధిక్కారాన్ని సూచించడానికి పృథ్వీవృత్తము ఉచితమైనది, అది ఈ భారాన్ని మోయగలదు. వర్షాకాలములో ప్రవాసములో విరహానుభవాన్ని వివరించడానికి మందాక్రాంతము చక్కగా శోభిస్తుంది.
మీరు ఉటంకించిన క్షేమేంద్రుని వ్యాఖ్య సంస్కృతానికి సరిగ్గా సరిపోతుంది. అయితే అదే విరహాన్ని తెలుగులో వర్ణించాలంటే మందాక్రాంతము సరిపోగలదా అన్న అనుమానం కలుగుతోంది. అందుకు కారణం యేభై పైగా తెలుగు అనువాదాలున్న ఈ కావ్యానికి ఒక్క అనువాదం కూడా తెలుగు మందాక్రాంతం లో లేదు.
భారతదేశంలో ఈ కావ్యానికి అత్యధికమైన అనువాదాలు తెలుగులోనే ఉన్నాయట. వీటిలో మొదటిది కొటికలపూడి వెంకటకృష్ణసోమయాజి గారి అముద్రితరచన (1864), మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తకాలయంలో ఉందట. అప్పటి నుండి నేటి వరకూ యేభై కి పైగా అనువాదాలు, గేయాలు, వచనాల రూపంలో కూడా వెలువడినాయి. వీటిలో కాస్త ప్రాచుర్యమైనవి రాయప్రోలు సుబ్బారావు గారి దూతమత్తేభము, విద్వాన్ విశ్వం గారి మేఘసందేశానువాదము, దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి రచనా మూడూ వరుసగా మత్తేభ, కంద, వృత్తాలలో వ్రాసి ఉన్నవి. ఇతర కవుల అనువాదాలు కూడా వృత్తాలలో, గేయాలలో ఉన్నవి. మందాక్రాన్తాన్ని యథాతథంగా తెలుగులో మేఘసందేశానువాదానికి వాడుకున్న కవులు కనిపించడం లేదు.
నిడదవోలు వెంకటరావుగారు ’షట్పదీ మేఘసందేశం’ అన్న ఒక అనువాదానికి పీఠిక వ్రాసి ఒకమాట ఇలా అన్నారు. “భామినీషట్పది వృత్తం మందాక్రాంత వృత్తముతో సన్నిహిత సంబంధమున్నది.” బహుశా మందాక్రాంతాన్ని అనువదించడానికి లేదా మంద్రాక్రాంతములో చెప్పగలిగిన భావానికి తెలుగులో సరిపోలగల వృత్తం షట్పదీ వృత్తం అయి ఉండవచ్చునని ఆయన అలా అన్నారేమోనని నా అనుకోలు. ఈ కావ్యంలో మొదటి పద్యాన్ని ఉటంకిస్తున్నాను. (కశ్చిత్కాన్తా … శ్లోకానికి అనువాదం)
మీరు మందాక్రాంత లయకు దగ్గరగా ఉన్న మందాకిని అనువాదాలను సూచించారు. బావుంది. అయితే విరహానుభవం తెలుగులో ఉద్యోతించడానికి బహుశా షట్పదీ వృత్తం ఎక్కువగా పొసగవచ్చునన్న వెంకటరావు గారి అభిప్రాయం ఆలోచింపజేస్తున్నది.
బ్రహ్మానందంగారికి, వికాస్ గారికి, మీ అభిప్రాయలకు కృతజ్ఞతాపూర్వక వందనాలు.
వికాస్ గారు – మీరు ముందుంచిన విషయాలు చాల ముఖ్యమైనవి. నా అనుభవమువల్ల నేను నేర్చుకొన్న కొన్ని పాఠాలను మీముందు, అలాగే మిగిలినవారి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. (1) ప్రతిరోజు ఒక గంట లేక గంటన్నర ఏదో ఒక సాహితీ పుస్తకాన్ని చదివితే ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. ఒక గంట చాల తక్కువ సమయములా తోచవచ్చును. కాని 20, 30, 40 యేళ్ల కాలములో ఇది తక్కువ కాదు. ఎన్నో కొత్త పుస్తకాలు చదవడానికి వీలవుతుంది, ఎంతో నేర్చుకోడానికి వీలుపడుతుంది. ఇలా చేస్తే ఒంటరిదనము కూడ మరచిపోవచ్చును. (2) చదివేటప్పుడు అర్థము కాని పదాలు కనబడినప్పుడు, నిఘంటువును సంప్రదించి అర్థాలు తెలిసికోవాలి. సుమారు ఒక వేయి పుటలకన్న తక్కువగా ఉండే నిఘంటువు చాలు ఈ కార్యానికి. మిగిలినవాటికి ఆంధ్రభారతివారి నిఘంటువు సైటును చూడవచ్చును. మొట్టమొదట పదాలకు అర్థాలు వెదకడములోనే సమయమవుతుందని బాధపడవచ్చును. కాని కొన్నాళ్లకు చాలా పదాలకు అర్థాలు తెలియడమువల్ల ఇలా వెదకడము తగ్గుతుంది. (3) పాత కవిత్వమయినా, కొత్త కవిత్వమయినా దేనినయినా చదవడానికి ఎన్నుకోవచ్చును. శ్రీశ్రీ కవితలలోని కొన్ని పదాలకు నిఘంటువు తప్పని సరి ఇప్పటికీ. కావ్యాలకన్నా, అందులోని కొన్ని భాగాలను పఠనీయాంశాలుగా ఎన్నుకోవచ్చును, ఉదా. నన్నయ దుష్యంతుని కథ, తిక్కన ఉత్తరగోగ్రహణము, శ్రీనాథుని హంసదూతము, పోతన రుక్మిణీ కల్యాణము, శ్రీరామచరిత్ర,, పాపరాజు కుశలవుల రామాయణ గానము, మున్నగునవి. (4) అంతర్జాలములో ఎన్నో పుస్తకాలు ఉచితముగా లభ్యము. టీకాతాత్పర్యాలతో చాల పుస్తకాలు ఉన్నాయి. వాటిని సులభముగా ఇక్కడినుండి, ఇక్కడినుండి దిగుమతి చేసికొనవచ్చును. ఇవి కొన్ని సలహాలు మత్రమే. మిగిలినవి ఆసక్తిపైన ఆధారపడినవి.
గౌరవనీయులు జెజ్జాల కృష్ణ మోహన రావు మరియు సంపాదకులకు నామస్కారం
నేను, అమెరికాకి వచ్చి రెండేళ్ళు అయ్యింది, చిన్నపుడు 10వ తరగతి నుంచి మొదలు పెట్టిన వృత్తి విద్యలొ పట్టా కోసం వేట ఈమధ్యే పూర్తి అయ్యింది. నాకు జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసాలు చదివినప్పుడు ఒక రకం ఐన depression వస్తుంది. Sir, మీ వ్యాసాలు నాకు అర్ధం కాక పోయినా, తెలుగు భాషలో నా తెలియనితనం అజ్ణానం తేటతెల్లం అవుతోంది. ఈమధ్య ఎందుకో, దూరంగా ఉంటున్నందుకో ఏమో భాష మీద మమకారం, నేర్చుకోవాలన్న తాపత్రయం పెరుగుతోంది, కాని మీరు రాసిన ఋతుపర్ణము, కామవేదం లాంటి కవితలు లేదా మీరు ఎంతో శ్రమకోర్చి, పరిశోధించి రాసే వ్యాసాలు ఐనా సరే, పూర్తిగా కాదు కదా పావు వంతు ఐనా నాకు అర్ధం కావడం లేదు. దయచేసి తప్పుగా అర్ధం చేసుకొకండి. భాష సంస్కృతి అంటూ పెద్ద మాటలు పక్కన పెడితే ఆఖరికి సినిమా పాటలు కూడా కొన్ని సార్లు అర్ధం కాని పరిస్థితిలొ ఉన్న నాలాంటి వాడు తెలుగు నేర్చుకోవాలి అంటే అసలు వీలు పడుతుందా?
ఈ ఒక్క సందర్భమే కాదు ఎప్పుడన్న పైత్యమో భక్తో ప్రకోపించి ఏ రుద్రమో, శంకర భాష్యాల అనువాదాలో netలో వెతికి పట్టుకున్నా నాలాంటి వాడికి ‘ఒం” ‘నమహ్’ తప్ప ఇంకో ముక్క అర్ధంకావు. వాటికి అర్ధాలు తెలియవు.
ఈసారి, India వెళ్ళినప్పుడు ఊరగాయలు కాకుండా, ఓ నాలుగు పుస్తకాలు కొనుక్కుంటే చాలు, కాని ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టలి అన్నదే ప్రశ్న? మీ వ్యాసానికి ఏరకంగాను సంబంధం లేక పొయినా దయచేసి నాకు దైవపరమైన పుస్తకాలు, భాష బాగు పడడానికి ఉపయుక్త కారమైనవి ఏమన్న సుచించమని మనవి.
అలాగే పత్రికా ముఖంగా మరొక్క మనవి, ఈ-మాట గ్రంధాలయంలో కొంచం పురాణ వాఞ్ఙయాలని చేరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, నాబోటి వాళ్ళు ఏమన్న అర్ధం కాక పొయినా అనుమానాలు, అర్ధం కాని విషయాల వ్యక్తం పెద్దలు వివరించగలరు అని ఆశ పడుతున్నాను.
పెద్దలు, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే అది నా చిన్నతనం అని మన్నించగలరు.
వేలూరి గారు, కథ బాగుంది, కడుపుబ్బ నవ్వించారు. ఇంతకు బ్రహ్మ భారతదేశపు వాసియా లేక అమెరికాలోని దక్షిణ ప్రాంత వాసియా? ఇంతకూ నాలుగు తలల బ్రహ్మకు నాలుగు టిక్కెట్లా లేక బ్రహ్మ కూడ కామరూపుడా? లేకపోతే బ్రహ్మ నాలుగు తలలను ఒక బ్రహ్మాణీ మాత్రమే చూడగలుగుతుందా? అసలు బ్రహ్మకు సరిగా గూగుల్ చేయడము చేతనవుతుందా? నేను గూగుల్ చేసినప్పుడు, ఆఫ్రికాలో రెండు చోటులలో, అమెరికాలో ఒక చోట, ఇండియాలో ఒక చోట ఈ శంబళ ఉన్నది, కాని బ్రహ్మకు కావలసిన శంబళ లేదు కాబోలు. బ్రహ్మ ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఇంటిలో కుంపటి ఎలా వెలుగుతుందో? వ్రాయండి, వ్రాయండి, ఇలాగే వ్రాయండి. లాఫ్టర్ ఈస్ ది బెస్ట్ మెడిసిన్ కాబట్టి ఇక మీద మందులు వాడడము తక్కువ చేసికోవచ్చు 🙂 విధేయుడు – మోహన
“తెర చాటు చందమామ” బ్లాగ్ చర్చలొ చెప్పినట్టు అనువాద చిత్రాల గీతాలు రాయడంలొ వేటూరి గారు విఫలమయ్యారేమో కాని అనువాద చిత్రాలకి పాటలు రాసేపుడు చాల limitations ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి, చిత్రీకరణ కావచ్చు, లేదా సంగీత దర్షకుడి pressure కావచ్చు, పెద్దల అనుకరణ కావచ్చు. వీటిని కూడా మనము దృష్టిలొ పెట్టుకొవాలి కదా? చాల మంచి పాటలు రాసిన వాళ్ళు ఇందులొ విఫలం కావడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది.
ఇక్కడ ఇంకొ విషయం గమనించాలి, అనువాద చిత్రాలకి (Dubbing songs) విఫలమయిన వాళ్ళే remake movies songs బాగానే రాశారు కదా? ఉదాహరణకి “సీతాకొక చిలక” సినిమాలొ పాటలు బాగుంటాయి.
మీరు ప్రతిపాదించిన విషయం, చెప్పిన కారణాలు చాల సబబుగా ఉన్నాయి. ఇవి నేను ముందుకి రాయాలని అనుకున్నవి; మీరే అన్నారు. మీరు వర్ణిస్తున్నది లోకంలో సాధారణమైన మన:స్థితి. లౌక్యుల పద్ధతి అని నేనంటున్నది. మంచి పాఠకుడివి కావాలంటే ఇలాంటి పరిమితుల్ని అధిగమించాలి అని రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ అన్నారన్నాను కదా?! ఈ పరిమితుల వలన సంకుచితం కానివి, భిన్నమైన వ్యక్తిత్వాలుంటాయి. జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువారు వంటి ఊహలు అలాంటి మనుషుల్ని చూసి వచ్చి ఉంటాయి. వాళ్ళు వ్యక్తిగతమైన పరిమితుల్ని తమ వ్యక్తిత్వ బలం వలన అధిగమించగలుగుతారు. సుహృద్భావం, ప్రజాస్వామ్యం కోసం కాదు. Because of who they are. వాళ్ళకు మీరు వర్ణించే పరిమితులు వర్తించవు. అలాంటి మనుషుల్ని నేను ఎక్కడున్నా వేటాడి, వెంటాడి పట్టుకుంటాను. ఒదలను. అందుకే నాకు తెలుసు. త్రిపుర అలాంటి మనిషి. ఆయన కధలూ కవిత్వం అవీ నాకు అక్ఖల్లేదు. ఆయనకీ తెలుసు. ఆయన ఏది రాసినా నాకు ఒప్పుతుందని మీరనుకున్నది నిజం కాదు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. బ్రహ్మానందం గారు, కళలో తన్మయమైన కళాకారులకు ఎవరి అభిప్రాయాలతో ఖాతరు లేదు. లోకం అనుకునేది వాళ్ళకు ఈకముక్కా బరాబర్. నామిని ఉన్నారు కదా?
Art Spirit అని ఒక పుస్తకం ఉంది. Robert Henri రాసేరు. ఆయన ఈ మన:స్థితిని వర్ణిస్తారు.
నిఖిల్ బెనర్జీ అని ఒక సితార్ విద్వాన్. ఆయన ఇలా ఉండేవారట. లౌక్యం, తర్కం, మర్యాదా కళాకారుని మనసును అర్ధం చేసుకోలేవు. వాటికి అనుభవం లేదు, హంగులే ఉన్నాయి – social trappings. మీరన్న సుబ్బారావు గనక కళాకారుడైతే ఆయన కూడా అంతే. ఎవరి స్థిరాభిప్రాయాలు, చరాభిప్రాయాలూ ఖాతరు చెయ్యడు. అతనిలోని దయ్యం (సరస్వతీదేవి) అభిప్రాయం తప్ప. మీరు లేవనెత్తిన సంఘర్షణ ఆ ఒక్కలా తప్ప ఇంక ఎలాగూ, ఎవరి వలనా నివారణ కాదు.
మీ మూడు లాంతర్లు చాలా బావుంది. Cognitive Scienceతో కళలకీ, సాహిత్యానికీ ఉన్న అనుబంధం చక్కగా వివరిస్తున్నారు. మా స్నేహితుడి అబ్బాయి ఈ మధ్యనే Congtive Scienceలో డిగ్రీ చేసాడు. ప్రస్తుతమిది కేవలం స్పోర్ట్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. మీ ఈ రచనని ఎంతో ఉత్సాహంగా చదువుతున్నాను. బాగా రాస్తున్నారు.
Cognitive Dissonance గురించి ప్రస్తావిస్తూ – “ఇది నచ్చినట్లు లేదు అనిపించిన రచనను, దాన్ని సమర్ధిస్తూ, మెచ్చుకుంటూ వచ్చిన సిఫారసులు ఎన్ని చదివినా, విన్నా ఆ అభిప్రాయం – అంటే ఫిర్స్త్ ఇంప్రెస్సిఒన్ మార్చుకోవటం దుర్లభం. అది ఎప్పుడు సాధ్యమౌతుందంటే, ఏవో బలమైన కారణాల వలన ఆ పాఠకుడు ‘మారు మనసు’ పొందినప్పుడు – అంటే తన నమ్మకాలు, లక్ష్యాలు, సంకల్పాలు, తన ఔద్వేగిక వ్యవస్థల్లోన అనుకూలంగా మార్పు వచ్చినప్పుడు.” అని రాసారు.
కేవలం ఒక రచనే మీదే ఆధారపడి అభిప్రాయాలు వుండవు. ఉదాహరణకి మనకి ఒక వ్యక్తి నచ్చడనుకోండి. రకరకాల కారణాలుండచ్చు. ఆ సదరు వ్యక్తి ఏం చేసినా అంటే ఎంత మంచి రచన చేసినా మనసు మార్చుకోవడం కాని పని. మిగతా ప్రపంచం మెచ్చుకున్నా మనం మెచ్చుకోలేము. ఎందుకంటే ఇక్కడ రచనని వ్యక్తిగత అభిప్రాయం ఆసాంతమూ ఆవరించుకుంటుంది. ఇదే ఆ వ్యక్తి పరిచయం లేడనుకోండి. రచనగానే పరిగణించి చదువుతాం. నచ్చిందీ, లేనిదీ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. బాగా నచ్చితే మరిన్ని సార్లు చదువుకుంటాం. ఇక్కడ రచనలో మనల్నీ, మన అభిప్రాయాలకి దగ్గరగా ఉన్న సంఘటనలనీ identify చేసుకోవాడానికి ప్రయత్నిస్తాం. ఒకసారి ఒక అభిప్రాయం వచ్చిన తరువాత దాని ప్రభావం అదే వ్యక్తి రాసిన మిగతా రచనల మీదా కూడా ప్రసరిస్తుంది. ఇది కేవలం సాహిత్యానికే సంబంధించిన విషయమే కాదు. మిగతా కళలకీ వర్తిస్తుంది. అందుకే క్రీడల్లో ప్రతీ ఆటగాడికీ అభిమానుల సమూహాలుంటాయి.
మనకి నచ్చని వారు ఏం చేసినా మనం మెచ్చుకోలేము. ఇక్కడ value judgement కంటే personal judgementకే ప్రాముఖ్యత ఉంటుంది. ఒకరికొకరు నచ్చడం, నచ్చకపోవడం సాపేక్షం. ఒక్కోసారి మనకి పరిచయమున్న వారి అభిప్రాయాలు మీద ఆధారపడి మన అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం. ఉదాహరణకి సుబ్బారావంటే నా స్నేహితుడికి మంచి అభిప్రాయం వుంది. అది అతను నాతో చెప్పినప్పుడు నా అభిప్రాయం మీద అతని ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం వుంది. తద్వారా సుబ్బారావంటే నాకొక స్థిరాభిప్రాయం ఏర్పడుతుంది. ఇది రచనలక్కూడా వర్తిస్తుంది. కాదంటారా? ఇంకా – మీకు త్రిపుర గారితో బాగా పరిచయం వుంది. ఇష్టం కూడా. కాబట్టి ఆయన రాసినవన్నీ మీకు నచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక రచనని విభేదిద్దామనుకున్నా ఆయన మీద మీకున్న పూర్వపు అభిప్రాయం ప్రస్తుత విభేధాన్ని మింగేయచ్చు. ఇలాంటి సందర్భాల్లో cognitive dissonanceని personal resonance డామినేట్ చేస్తుందని నా అభిప్రాయం.
మీరు జవాబు చెప్పరని తెలుసు. అయినా ఆత్రుత కొద్దీ రాస్తునాను.
‘పరలొక రాజ్యము మనది సిద్దంగాఉండు’
‘తలుపులను తట్టుము’ అవి తెరువబడును
‘వెతుకుము’ అది నీకు దొరుకును
‘అడుగుము’ అవి నీకు ఈయబడును
అంటాడు ఏసు తన జాలర్లతొ
చేపల హార్బరునుంచి జాలరి
ఇంటికి వట్టిచెతులతొ వస్తాడు
తన తల్లి, ఆలి, పిల్లజల్ల ఆశతొ
తెల్లవారుజాముదాకా ఎదురుచూస్తారు
ఎదురుచుస్తూనె ఉంటారు
ఇంటికి తిరిగి వస్తారొ లెదొ తెలియని జాలర్లకు
పరలొకానికి తలుపు ఎప్పుడు తెరచి ఊంటుంది
తనను నమ్మిన జాలర్లకు ఏసు ప్రభువు
ఇచ్చిన వరం పర లొకానికి మార్గం
శివోహం! శివోహం! గురించి Balakrishna Pillalamarri గారి అభిప్రాయం:
04/05/2012 12:23 am
ధన్యవాదాలు. ఉదయం భక్తిరంజని లొ వచ్చే “శివోహం శివోహం” Internet లో చాల వెదికాను. ఆ recording దొరకలేదు, మళ్ళి ఇప్పుడే వినటం.
వేరె వాళ్ళు ముఖ్యంగా హిందుస్తాని సాంప్రదాయం వాళ్ళు పాడినవి Internet లొ చాల ఉన్నాయి. మచ్చుకి ఇవి చూడండి.
పండిట్ జస్ రాజ్ గారి అద్భుతమైన Rendition. ఎవరు పాడారో తెలియదు కాని చాల మంచి rendition. Visuals are very good and add value to the song.
I think the opinion expressed by Srinivas Nagulapalli is that what I feel after listening to the older version of T Sooryakumaari. I feel a strong sorrow feeling when I here this song. All said and I would like to thank you very much for uploading this rare recording.
సురేష్ గారూ! మీ స్పందన మొత్తం చదివాను. చాలా బాగా రాసారు. అందుకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపనీయండి. మీరు విమర్శించినందుకో, ప్రశంసించినందుకో కాదు, కానీ, ఒక పాఠకుడిగా మీ అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచినందుకు సాటి తెలుగు వారిగా మిమ్మల్నిఆనందంగా – అభినందిస్తున్నా..(ఎందుకంటే చాలా మంది చదువుతారు..కాని చెప్పరు..హార్లిక్స్ ప్రకటనలో లా….) అందుకే మీ ఒకో సందేహానికి ఒక్కో సమాధానాన్నిక్కడ పొందుపరుస్తున్నాను.
@ ” మిమ్మల్ని కాని మీ కవితని కాని ఉద్దేశించి అనటంలేదు కానీ” …
*.. అంటూ ఆగారే! ఇందులో వెనకాడేందుకేముందీ?.. మీరు నా కవిత నుద్దేశించే ఇదంతా రాశారు. (లేకపోతే నేనింత గా ప్రతిస్పందించే అవకాశం నాకెక్కడిదనీ !?)
@ ‘ ఒకసారి మీ కవితని ‘చదివినవెంటనే ‘ అభిప్రాయాన్ని రాయటం మొదలుపెట్టాను. కానీ ‘ మరలా పైనుంచి కొసదాక చదివాను’ భావాన్ని ఎలా ప్రవహింపచేసారా అని.,,’
* చాలా తక్కువమందికి మాత్రమే అలవడే ఒక మంచి అలవాటు ఇది. (నాకు లేని మంచి లక్షణాలు ఎవరిలో వున్నా మెచ్చుకోకుండా వుండలేను మరి! .)
ముందొచ్చే ఆలోచన్లన్నీ – సముద్రపు తుఫాన్లు. ఆ వెనకొచ్చేవే అసలైన తేట తనపు ప్రవాహాలు. – ఇలా రెండో ఆలోచన దగ్గర ఆగి, ఆలోచించి రాసే వారి మాటలే నిజానికి – అందర్నీ ఆలోచింపచేస్తాయి. అందుకే మాట్లాడేటప్పుడు…తెలివైన వారు మాత్రమే – కాసేపాగి, నిదానించి సమాధానమిస్తారు.
@ ” మీ విధానం, పదాలు, అల్లిక బాగుంది.’
* నిజమే. కవిత్వం అంటే – మంచుదారాల పోగులు, మలయ పవనాల పరిమళాలు – కలిపి నేసిన విరిమబ్బుల కోక వంటిది. థాంక్యూ!
@ ‘చదువుతున్నపుడు ప్రతి పాఠకుడు తనకర్ధమైనంతవరకు వాక్యంలో రచయిత పొందుపరిచిన భావానికి లోనవుతాడు..’
* అప్పుడే రచయిత గుర్తుండిపోతాడు. మన తెలుగు లో అలాంటి వారిని వేళ్ళమీద లెక్కించొచ్చు.. (ఆ వరసలో చేరాలనుకోవడం – నా వరకు నాకు ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. కాదనను. కాని, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా అని..)
@ “ఒక వాక్యం నుండి మరో వాక్యానికి, ఒక పాదం నుండి మరో పాదానికి దాటుతున్న గ్రాహకుడికి, ఒక ప్రయాణీకుడు మజిలీలు మజిలీలుగా పల్లకిలో పయ నించి గమ్యాన్ని చేరుకున్న అనుభవం కలగాలి.”
* అంటే మీ వుద్దేశం లో – అక్షరాలు పల్లకీలు, భావాలు మనసుని మోసే బోయీలూ కా వా లంటారు.. అవునా!?
@ “ఒక్కోకవితలో నవరసాల్ని పండించవచ్చు ఐతే భాషతో పాటు భావాన్ని చక్కగా పరచగలిగితే. మన తెలుగు అందుకు ప్రసిద్ధం.”
* మీరంటోంది నిజమే! నేనూ ఒప్పుకుంటాను. మన తెలుగు భాషకున్న విశిష్టత ఏమిటంటే – రచనల్లో నవరత్నాల్ని గుమ్మరించ వచ్చు.. పున్నమి గుత్తులనూ పూయించనూవచ్చు..
@ ‘ఓ పాఠకుడిగా నా అభిరుచిని వ్యక్తపరుస్తున్నానంతే.’
* అంతే అనకండి. ఇంత అద్భుతంగా..అందరూ వ్యక్త పరచలేరు! మంచో, చెడో..తప్పో..ఒప్పో..నిష్టూరమో..నిగ్గదీయడమో..ఏదో ఒక దాని గురించి మన తెలుగు వాళ్ళం స్వేచ్చగా మాట్లాడుకోవాలి. సాహిత్యపరమైన విషయాలు చరిచించుకోవాలి. అభిప్రాయాలు, వ్యక్తపరచుకోవాలి. విస్తృత పరిధిలో వెల్లడించుకోవాలి. అసలిందుకే గా – ఈమాట నిర్వాహకులు మనకిక్కడ ఈ స్పేస్ ఇచ్చింది? మీకు దొరికిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అభినందనలు.
@ “తప్పులుంటే క్షమించాలి.’
* ఎందుకండీ..అంత పెద్ద మాట!..సాహితీ ప్రియుల అంచనా మేరకు రాయలేకపోతున్నందుకు.. ఇలా – నేనే అడగాలేమో! .( రాయకుండా నన్ను నేను బాధపెట్టుకుంటే సరిపోయేదానికి..రాసి అందర్నీ బాధిస్తు న్నానేమో ననే శంక కలుగుతూ వుంటుంది అప్పుడప్పుడు!
మూల్గుతున్న నక్క మీద తాటి పండు .. అన్న సామెత చందంలా..- ఈసారి సంపాదకుల వ్యాసం ‘ ఎమితిని సెపితివె.’. చదివాక నా భయం మరింత హెచ్చిందంటే నమ్మండి!)
సురేష్ గారూ! అందరి రచన్ల మీదా.. మీ అభిప్రాయాల్ని – నిర్భయంగా, నిర్మొహమాటంగా మీరిలాగే అభివ్యక్తీకరించాలని అభిలషిస్తూ…
ముందు కాలంలో కూడా మీ విలువైన అభిప్రాయాలను ఈ రీతిలోనే మాకందచేస్తారని ఆకాంక్షిస్తూ..
మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..మరి వుంటాను.
నమస్సులతో –
– ఆర్.దమయంతి.
మిమ్మల్ని కాని మీ కవితని కాని ఉద్దేశించి అనటంలేదు కానీ అంటూ ఒకసారి మీ కవితని చదివినవెంటనే అభిప్రాయాన్ని రాయటం మొదలుపెట్టాను. కానీ మరలా పైనుంచి కొసదాక చదివాను భావాన్ని ఎలా ప్రవహింపచేసారా అని. మీ విధానం, పదాలు, అల్లిక బాగుంది. చదువుతున్నపుడు ప్రతి పాఠకుడు తనకర్ధమైనంతవరకు వాక్యంలో రచయిత పొందుపరిచిన భావానికి లోనవుతాడు. ఒక వాక్యం నుండి మరో వాక్యానికి, ఒక పాదం నుండి మరో పాదానికి దాటుతున్న గ్రాహకుడికి, ఒక ప్రయాణకుడు మజిలీలు మజిలీలుగా పల్లకిలో పయణించి గమ్యాన్ని చేరుకున్న అనుభవం కలగాలి. ఒక్కోకవితలో నవరసాల్ని పండించవచ్చు ఐతే భాషతో పాటు భావాన్ని చక్కగా పరచగలిగితే. మన తెలుగు అందుకు ప్రసిద్ధం.
ఓ పాఠకుడిగా నా అభిరుచిని వ్యక్తపరుస్తున్నానంతే. తప్పులుంటే క్షమించాలి.
మీ పత్రిక చూసి చాలా సంతోషమయింది. కాని, నాకు సులభంగా దొరుకుందనుకున్న భక్త రామదాసు కీర్తన కనిపించక నిరుత్సాహ పడ్డాను. నా వెతకటంలో లోపమేమో అనుకుంటాను. నాకు కావల్సింది “అయ్యయ్యో రఘు రామయ్యా” అనే కీర్తన రచన,తెలుగులో. అన్నిటి కన్నా ముందు “రామదాసు” అని శోధిస్తే ఏమి దొరక్క చాలా బాధేసింది.
శోధన లో మార్పు కావాలనుకుంటాను.
నేను ఏ రకంగా నయినా సహాయపడ గలిగితే సంతోషం.
రమేశ్ హరి గూడూరు
మెల్బోర్న్,ఆస్ట్రేలియా
[మీ శోధనలో లోపమేమీ లేదు. ఈమాటలో కీర్తనల పూర్తి పాఠాలు సామాన్యంగా ఉండవు. మీకు కావలిసిన కీర్తన ఇక్కడ దొరుకుతుంది, lyric and audio కూడా. ..సం]
naa peru bathula prasad …nenu ganjibuvva katha rachayithanu. meru naa parmission lekundaa naa kathanu me sitelo pettadam entha varaku sababu…okka saari alochinchaqndi.
[మీ కథ ఎక్కడ ప్రచురించబడిందో ఆవివరాలన్నీ ముందు ఇచ్చిన తరువాత మాత్రమే, ఆ సాక్షి లింక్ ఎక్కువ కాలం పనిచేయదని తెలియడం వల్లనే, మీ కథను ఈమాటలో ఉంచాము. అది కూడా మీ కథ గురించి విస్తృతంగా మూడు లాంతర్లు వ్యాస రచయిత తన వ్యాసంలో చర్చించినందువల్లనే. ఇందులో సబబు కానిదేమీ లేదు. అయినా మీ అభ్యంతరం వల్ల మీ కథను ఈమాట నుంచి తీసివేశాము. మీకు కలిగిన ఈ అసౌకర్యానికి క్షమాపణలు. – సం.]
‘సుమిత్ర కైక కూ సురటీలు వేసీ’ అని పాటలొ ఉన్నదని ఇంటర్నెట్లో ఉన్న ప్రతిలొ చూశాను. అయినా దశరథుని ముగ్గురు భార్యలూ పాటలొ ఉన్నారు. శ్రీ వెల్చేరు రాసిన వాక్యం పూర్తిగా ‘నిరర్ధకం’ కాదు అయినా వీటిని రామాయణ పాటలు అనడం సబబు కాదనే అనుకుంటాను. ఆ పాత్రలు ఉన్నంత మాత్రాన వాల్మీకానికి దూరంగా ఉన్నవాటిని అలా అనడం భావ్యం కాదనే నా అభిప్రాయం. వీటిని సీతారాముల పాటలనొ ఇతర పేర్లతోనో పిలవాలి.
నా interpretation పాటలొ ఉన్న [ఇతర] సౌందర్యాలను పక్కకు నెట్టినట్టు కాదు.
అమేజింగ్. నా జీవితంలొ నేను సావిత్రి గారి వాయిస్ వింటానని అసలు ఊహించలేదు. ఏదొ సర్చ్ చేస్తుంటె ఈ rare ఆడియో విన్నాను. చాలా చాలా happyగా ఉంది. నా feelingsని మాటల్లొ చెప్పలేను. చాల థాంక్స్ అండి ఈ ఆడియో మాకు అందించినందుకు. పాత్ర ఏదైన దానికి జీవం పోయాలంటే సావిత్రి గారికే సాధ్యం అనడంలొ సందేహం లేదు. నేను సావిత్రి గారి సినిమాలు తక్కువే చూసాను. కాని ఆ మహానటి గురించి చాలా విన్నాను. ఆమె నటించిన మూగ మనసులు సినిమాలో పాటలా మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది, అన్న సాహిత్యంలా ఆమె మన మధ్య లేకపొయినా ఆ మహానటి మన మనసుల్లొ ఎప్పటికి నిలిచే ఉంటారు.
ఎంతో శ్రమతో, సాహితీ ప్రేమతో తెలుగు పత్రికనందిస్తున్న “ఈమాట” మిత్రులకు హార్థిక తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. వాళ్ళు శుభాకాంక్షలు చెప్పలేదని చదివి, మరి వాళ్ళకు కూడా ఎవ్వరు చెప్పలేదని చెప్పడం, ఆలస్యంగానైనా. వేరే వాటికి మరెవ్వరైనా మరెక్కడైనా మరెప్పుడైనా చెప్పుకోవచ్చు, కాని ఉగాది శుభాకాంక్షలను తెలుగులో తెలుగువాళ్ళు చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు ఇంకెవరికి చెప్తారు?!
ఉగాది ఏ మతస్థుల పండగ అవుతుందా అనే సందేహం ఇంకా మిగిలే ఉంది.
ఈ నా అభిప్రాయము పై వాక్యము పైన మాత్రమే. మౌలికముగా పరిశీలిస్తే ఉగాది ఒక మత సంబంధమైన పండుగే. ఇది తెలుగువాళ్లకు మాత్రమే పండుగ కాదు, కర్ణాటక (యుగాది), మహారాష్ట్ర (గుఢి పాడ్వా) గోవా రాష్ట్రాలలో కూడ ఇది పండుగే. ఇది హిందువులలో శాలివాహనశకమును అనుసరించే వారికి చాంద్రమాన సంవత్సరాది. ఉత్తరదేశములో విక్రమశకమును అవలంబిస్తారు, వారి సంవత్సరాది పౌర్ణమి తరువాతి దినము. కాని సాంస్కృతికపరముగా హిందువులు మాత్రమే కాదు మిగిలినవారు కూడ శుభాకాంక్షలను అందించవచ్చును, అంత మాత్రాన వాళ్లు వారి ఆలయాలలో పండుగను జరుపుకొంటారా అనే విషయము సందేహమే. ప్రథమముగా యిది హిందువుల పండుగ, కాని తెలుగు మాట్లాడేవాళ్లలో ఎక్కువ మంది హిందువులు కాబట్టి ఇది తెలుగువాళ్ల పండుగ అయినది. అలాగే యిది నాలా కన్నడము మాట్లాడే హిందువులకు, మరాఠీ మాట్లాడే హిందువులకు పండుగ అయినది. యూదులు వాళ్ల సంవత్సరాదిని సెప్టెంబరు నెలలో చేసికొంటారు, సుమారు ఆరు నెలల తరువాత. ఈ విషయాలను కొన్నిటిని కళావసంతము వ్యాసములో చర్చించాను.
తాడేపల్లి గారు, వ్యాసము చదివినందులకు సంతోషము. సామాన్యముగా వృత్తాలు చతుష్పాదులు. కొన్ని చోటులలో కవులు నాలుగు పాదాలు చాలక ఐదో పాదము ఒకటి జతచేసి పంచపాది అని వ్రాస్తారు. రెండు పాదాలతో వ్రాస్తే తప్పేమీ లేదనే నా ఉద్దేశము. ఎందుకంటారా? మీరు సులక్షణసారము, లక్షణశిరోమణి లాటి లక్షణ గ్రంథాలను పరిశీలిస్తే వాటిలో వృత్త లక్షణాలు రెండు పాదాలకే పరిమితము. అంతే కాక యక్షగానాలలో అర్ధకందము సర్వసామాన్యము. మూడో విషయాన్నిగురించి ఇంకా లోతుగా పరిశీలిస్తే తప్ప చెప్పలేను. పద్యాలను, జాత్యుపజాతులను మాత్రాగణాలుగా విరిచి వ్రాస్తే అవి చదవడానికి, పాడడానికి, వినడానికి బాగుంటుంది. కాని తెలుగు కవులు చాలమంది దీనిని ఆచరించలేదు. అందువల్లనే నేను వృత్తాలను ఎలా మాత్రాగణయుక్తములుగా వ్రాయవీలగునో అనే సంగతిని రెండవ పట్టికలో తెలిపినాను. నేను సుప్రభగారు ఛందస్సు, రచ్చబండ గుంపులలో వందలాది వృత్తాలను పరిచయము చేసియున్నాము. అందులో కొన్నైనా తప్పక మీకు, మీగురికి సరిపోతుందని నమ్ముతాను. విధేయుడు – మోహన
2) తెలుగు లాక్షణికులకు, కవులకు నచ్చనివి రెండు – చంద్రగణములతో పద్యములను వ్రాయుట, లఘువు పైన యతి నుంచుట. నేను ఎన్నో పుస్తకాలను వెదుకగా నాకు దొరకినవి వ్రేళ్లపైన లెక్క పెట్టగలిగిన అక్కరలు మాత్రమే. అందులో ఒక రెండు క్రింద ఇస్తున్నాను. మధ్యాక్కర తప్ప మిగిలిన అక్కరల ఉపయోగము శాసనయుగముతో అంతరించింది. నవీన యుగములో విశ్వనాథ సత్యనారాయణ అక్కరలను తమ కల్పవృక్షములో వాడారు. చంద్రగణములతోడి తెలుగు షట్పదలను కూడ కవులు వాడలేదు.
3) రావూరి దొరసామి శర్మ ఒక గొప్ప లాక్షణికుడు. వీరు ఎన్నో లక్షణగ్రంథాలను (ఉదా. సులక్షణసారము, కవితసాగరము) పరిష్కరించారు. ఛందస్సుపై వీరు వ్రాసిన “తెలుగు భాషలో ఛందోరీతులు” అన్న పుస్తకానికి గిడుగు సీతాపతి పుస్తకముతోబాటు ప్రథమ బహుమతి లభించినది. వీరి పలుకులను క్రింద వీరి వాక్యాలలోనే తెలుపుతున్నాను –
“సీసమేల సువర్ణసిద్ధి గలుగ నన్నారు కొక్కొండవారు. పరుసవేది సోఁకినఁ జౌకలోహము బంగారమగును. సీసమును బంగారముగా మార్చు స్పర్శవేధి చంద్రగణము. కాని సీసపు నడకలోని గాంభీర్యము బంగారు పద్యమునఁ గుంటువడినది. పద్యము పేరు బంగారే కని యందు సువర్ణత్వము ప్రకాశింపలేదని నా యభిప్రాయము. ఈ వెండి బంగారములకు (పద్యములకు) ధారాశుద్ధి శూన్యము.”
4) సూర్యగణము, చంద్రగణము విడివిడిగా నుండక ఒక పదము ద్వార చేరితే ఇలాగుంటుంది –
శ్రీనివాస్ గారు, ఈ శివోహం చాలా బాగుంది. దీనిని వినటము చాలా ఆనందము గా ఉంది. సాహిత్యం లొ నాకు అంత ప్రావీణ్యము లేదు కాని భక్తి పాటలు వింటాను. ఈ నిర్వాణ శతకాన్ని ఆందించినందుకు గాను మీకు కృతజ్ఞతలు.
ఈ వడుగు గురించి ఒక మాట. ఏది తెర్కు (దక్షిణము) ఏది వడక్కు (ఉత్తరము) అనేది సాపేక్షమైనది. ఇప్పటి కోయముత్తూరుకు (అప్పటి చేర రాజ్యము) కన్నడము మాట్లాడే మైసూరు ప్రాంతము ఉత్తరము, కాని ఇప్పటి చెన్నైకి అది దక్షిణపశ్చిమము. చెన్నై మదురైకి ఉత్తరము, కాని చెన్నైని ఉత్తరదేశము అని చెప్పలేము కదా? తిరుపతి ఉత్తరమే తమిళ ప్రాంతానికి, అందుకే వేంకటేశ్వరస్వామిని వడమలయాన్ అంటారు. కాబట్టి చేర ప్రాంతానికి మైసూరు వడుగు, చెన్నై ప్రాంతానికి తిరుపతి, నెల్లూరు వడుగు! ఈ వడుగు అనేది సంస్కృతానికి కూడ ఉపయోగిస్తారు. అందుకే వడగలై, తెన్గలై శాఖలు వచ్చాయి. మరాఠీ ప్రాకృతము కూడ వడుగే. కన్ఫ్యూస్డ్? విధేయుడు – మోహన
తమిళం కూడా మాట్లాడగలిగిన తెలుగు పడుచులు అని మాత్రం ఎందుకని అనుకోకూడదూ కొలిచాలా? వారు కన్నడ స్త్రీలు అన్న ఊహకి అక్కడ ఆధారం ఏమి?? జయకొండర్ మూలభావం గానీ పుట్టపర్తి అనువాదం గానీ అందుకు ఆస్కారం ఇవ్వడం లేదే? సురేశ్ నమ్మకం లాంటిది నారాయణాచార్యుల వారికి సైతం ఎందుకని ఉండకూడదూ? “వడుగరు” అంటె తమకి “ఉత్తరాన ఉన్నవారు” అన్న అర్ధమ్లో తెలుగు వారిని గురించి తమిళులు భావించిన వారు. కరునాడు అంటే నల్లటి భూభాగం అని అనుకున్నా నల్లమలలు ఉన్న ప్రాంతం ఆంధ్రదేశమే కదా? నల్ల కొండలు అన్న అర్ధానికి వీలులేదా? అదటుంచి.. నారాయణాచార్యుల వారు విద్వత్తూ, అనుభవమూ కూడా మెండుగా ఉన్నవారు. పైగా భాషలో అఖండులూనూ! ఆయన అంత నిరాధారంగా మాట్లాడి ఉండరు. సంగీతంలో కర్ణాటకానికి ప్రాంతీయత కన్నా సంగీత పరంగా “శ్రావ్యత” కే పెద్ద పీట వెయ్యవలసి ఉంటుంది. పైగా దానిని గురించి ఎక్కడా అది “ప్రాంత సంబంధిగా” వాడిన ఉదాహరణ మనం ప్రాచీన సంగీత గ్రంధాల నించి ఒక్కటీ చూపించకుండా కేవలం భాషా పరిధిలోనే గిరిగిళ్ళు తిరుగుతూ వ్యాఖ్యానం చేసుకోవడం లో సంపూర్ణత గానీ, బలం గానీ లేదు. ఇన్ని వందల ఏళ్ళలో జరిగిన సంగీత పరిణామ దశలలో దీనిని గురించి ఒక్క ప్రస్తావనా లేకుండానే ఈ పదం సంగీత పరంగా ప్రాచుర్యానికి రాగల వీలులేదు. అందువలన మరిన్ని స్పస్టమైన ఆకరాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా భావనలు చేయడానికి ఇక్కడ శాస్త్రం ఒప్పదు. అది తేలేదాకా బాలమురళీ చెప్పినట్టూ సంగీతపరంగా శ్రావ్యమైన గానంగానే గ్రహించడం, కర్ణాటకం అనే అనడం ఇక్కడ సముచితం. మనకి సంగీత శాస్త్ర పరిణామం చెప్పే శాస్త్ర గ్రంధాల లిస్టు చాలానే ఉంది. అవన్నీ ఎంత దొరుకుతున్నాయివాళ అన్నది సంగీత రంగం లోని వారెవరన్నా చెప్పాలి. ఆ పుస్తకాలు ఏమైనా దీని గురించి చెప్పేయా? అన్నది కూడా తెలుసుకోవలసి ఉంది. కాకపోతే మన దగ్గర గాన విద్య తెలిసిన వారే తప్ప సంగీత శాస్త్రాన్ని గురించి విపులంగా విశదీకరించి చెప్పగల వారెవ్వరూ కనిపించడం లేదు. కనీసం పుస్తకాలని రాసిన వారు ఎక్కువలేరు. ఒకవేళ వీటిని గురించి రాసిన పుస్తకాలంటూ ఏమన్నా ఉన్నా అవి బహుశా చర్చింపబడక పోయి ఉండవచ్చు. వాటిని గురించిన చింత తమకు సంగీతం తెలుసని చెప్పుకునే వారికి ఉన్నట్టు కనిపించదు కూడా! ఇది చాలా విచారించవలసిన విషయమే! చాలా పెద్ద లోటు ఇది. కాకపోతే తెలిసినంత వరకైనా “సప్రమాణంగా” ముఖ్యంగా సంగీత రంగంలో ఇందుకు చాలిన వారెవరైనా మాట్లాడటమే ఎక్కువ బాగుంటుంది.
బితిరీలకి జలుబు చేసి పదమూడేళ్ళు
పేరడీల్ని గురించి పేరడీలాంటి మాటల్లో తప్ప ఇంకోరకంగా మాట్లాడ్డం యమా యాతన. బహుశా అసాధ్యం. నాకు తెలిసిన పుస్తకాలన్నీ అవతలిసిరీసి ఉంచుకున్న రెండు పుస్తకాల్నే (An Anthology of Modern Telugu Poetry; బేంక్ ఆఫ్ అమిరికా పాస్‌బుక్) ఇలాగా అలాగా ఎన్నిసుట్లు ఎంత తిరగేసినా మిగిలింది ఇలాట ఇగటాలే. వీటిని మా సైడు – అంటే అంపఖండి, పురుషోత్తపురం అటీపు – బితిరీలు అంటారు. నీకు ఇగటాలాడ్డం తెలియకపోతే, ఇగటాలు తెలీదు. మనిషి నడకబట్టి ‘వీరు పూజ్యులు. పెద్దవారి బితిరీలంటే ఇలాగే గావాల!’ అనీసి నువ్వు పట్టీసుకోలేకపోతే నువ్వు ఇంక బితిరీలు పట్టుకోలేవు. అంటే, పెద్దవారి ఎచ్చులంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి అలాట పెద్దలే స్వయంగా చిలకట్లెగ్గట్టుకోనొచ్చి చెప్పకపోయినా తెలుసు. బితిరీలు పోల్చుకోలేని వారికి మరి ఎందరు పెద్దలొచ్చి ఉవాచ చేసినా మరింక తెలీదు. వారు పెద్దలు ఏ ముక్క చెప్పినా ‘మరే! మనందరి తరుఫునా మాష్టారు అధ్యయనీకరించేసారుగా! చారిత్రక సత్యాల్ని విస్మరిస్తే ఎట్లా?!…!!’ అని భక్తితో పల్లకుంతారు.
అయితే మరి ఇది ఎందుకు రాస్తున్నాను? నా కడుపుబ్బరం ఉగ్గబట్టుకోలేక. నాకు వేలూరి రాసిన పేరడీలు చదవగానే ‘మీకు అట్టాగనిపించిందీ? నాకూ అట్టాగే అనిపించింది!’ అనిపించింది. కాని ‘ఆఁ … ఎవరెట్టాపోతే నాకేం!’ అనిపించలా. ఎందుకట్టా అనిపించలేదు చెప్మా? అని నవ్వి నవ్వి లుమ్మచుట్టుకుపోయి నా నాభి లోపల్లోపలకి నేనే అస్తమానం చూసుకోలేక అవస్తలు పడుతుంటే బితిరీలు కితకితలుగా మారి ఎక్కిళ్ళలోకి దిగి ఇవి ఇలాటలాట బితిరీలు కావు, ఇగటాలకే మొగలాయీలు ఈ చెతుర్లనీసి పరమ నిదానంగా బోధపట్టం మొదలెట్టీసింది అనీసి నేనెరుగుదును. వేలూరి ఈ ప్రత్యేకత ఎలా సాధించుకున్నాడో నాకు తెలీదు. బహుశ వారి పెద్ద మేష్టారు నేర్పిన విద్యయే అయ్యుంటాది. కాని వారినుండి ఇలాట కులాసాలు చూట్టాలు, కవితా దేవర దేవతా వస్త్రాల్ని పోల్చుకోడాలు మాత్రం మాసైడు మరి ఇదే మొదటిసారి…!
నాలో ఉన్నాయని నాకే తెలియని ఫన్నీ బోన్స్ అన్నింటిలోకీ ఈ వేళాకోళాలు వేళాపాళా లేకండా ప్రవేశించీసి మాయావిడ ‘ఆపుబే నీ యబ్బా..! వాకింగ్కెల్దామా?!’ అని తిట్టడాలవరకూ వచ్చింది. నా కడుపులో ఇన్నిగటాలున్నాయనీసి నాకు ఇంతకుముందు తెలీదు. నిజంగానే భాషకి జబ్బు చేసి నలభయ్యేళ్ళు అయ్యిందనే నీను కూడా అనుకుని ఊరుకున్నాను. అంతేకాదు; ఆ మరుసట్నాడు వ్యాకరణానికి జలుబు చేసి పదమూడేళ్ళు అనీసి మాయావిడితోటి అన్నాను. అది “అక్ఖల్లేని బితిరీలన్నీ నీకెందుకురా? నోర్మూసుకుని చేతులు గట్టిగా ఊపుతూ, ఒక కన్ను సగం తెరిచి, ఒక కన్ను సగం మూసుకుని, మిగిల్నవన్నీ పూర్తిగా మూసుకుని, నిదానంగా వాకింగ్ చెయ్యి…!” అని వాకింగ్ ఎట్లా చెయ్యాలో ఉవాచల్లోకి దిగిపోయింది. ఆ బితిరీలు నేను ఒద్దంటున్నా వినకుండా ఎవరు పిలిచారని అడగడానికి వీల్లేకుండా నాలోపలికొచ్చీసేయి. ఎంతలా అంటే నా ఊహల్ని నిబ్బరంగా నిలబెట్టే వచనాన్నుండి తప్పించీసుకుని, జాగింగ్ ట్రెయిల్ చుట్టూ అడ్డంగా ఒకసారీ నిలువుగా ఒక సారీ ‘నడువూ నడువూ తిమ్మప్పా! నవ్వాకోయీ తిమ్మప్పా!! పెద్దావారు తిమ్మప్పా! పెదవికి చేటు తిమ్మప్పా!! ‘ అని మాష్టారు చెప్పినట్టు తలూపి బుద్ధిగా నడిచే కవితా బాల వలె!
మనస్సు, మెదడు, భాష, వ్యాకరణం బితిరీలకి బానిసలైపోతాయి. ఆ బితిరీల్ని వొదుల్చుకుని ఏ కొత్త గడుసు లోకాల్లోకీ మాటకారితనంగా పెత్తనం చెయ్యకుండా ఊరుకోడానికి ఒక పట్టాన మనం ఒప్పుకోం. ఒకవేళ మనం ఒప్పుకున్నా, మనలోని పెద్దవారికి ‘మనసు మాట వినదు.’ వేలూరిని వేలూరి అనీసే నేను ఎరుగుదును. కాని ఇలాగ వెవ్వెవ్వేలూరిగా తెలీదు.
ఈ పేరడీని పెద్దవారి ఎచ్చుల్నీ, వారి బితిరీలకి మనం నమస్కారం చెయ్యడాల్నీ, ఇంకా వారి ఉవాచల వెనుక సంకల్పాల వికల్పాలన్నింట్నీ తెలుసుకోకుండా గనక మీరు చూసారా, మీకు ఈ ఇగటం అర్ధం కాదు. పెద్దల్ని వొదిలెయ్యండి. పెద్దవారి ఎచ్చుల వల్ల వచ్చే ఇగటాల్ని ఎవరూ చూడకుండా దొంగచాటుగా ఎంజామెంట్ మాత్రం చేసుకోండి. పెద్దవారి ఎచ్చులు భాషంత అనాది అని, వారి ఆలోచనలకి కూడా ఎప్పుడే నా జలుబు చేస్తుంటుందనీ వారి ఉవాచలే మీలో కొన్ని ఇగటాల్ని పొగబెడతాయి. అప్పుడు వెవ్వెవ్వేలూరి ఇగటానికీ స్నేహానికీ పోషకుడూ విదూషకుడూ అయిన మనిషి కనిపిస్తాడు. ‘అబ్బ ఇదుగో ప్లీజ్! ఒద్దువై, వెవ్వె.. వెళిపోవై!’ అని చెప్పినా వినకుండా. ఆయన ఇగటాలకి అర్ధం పర్ధం ఏమైనా ఉన్నాయో లేవో మీ అంతట మీరు ఆలోచించుకోకుండా ఎవరైనా పెద్ద మేషార్ని కనుక్కోవాలని మళ్ళీ బూకరించుకుంటారు మీరు. భాషకి ఎన్నేళ్ళాయి జబ్బు చేసిందో, నెలకో దినం తక్కువ చేసి ఛందస్సుకి మేహవాతం ఒస్తునాదో లేదో, వ్యాకరణానికి జలుబు చేస్తే ఎట్లా ఒదలగొట్టాలో ఒక సుహృద్భావపూరిత మేధో ఆవరణంలో మీరు మర్యాదగా చర్చించ గలుగుతారు. అట్లా చర్చించినవన్నీ ఎవరైనా సాహితీ మిత్రులతో బుక్కుగా వేయించుకోండి. ఆ పని చాలా నిదానంగా, లేని పద్యాన్ని ఉన్నట్టు రూపించినంత నిబ్బరంగానూ చెయ్యాలి. దానికి ‘మధ్య మాట’ ఎవరు రాయాలో ఈ సుట్టు మొదట వేలూరినే అడగండి. ఎందుకేనా మంచిది …!
గదిలో కలిగిన భావాలను మదిలో పదిలపరచుకొని, మదిలో మెదలిన భావాలను గదిలో పదిలపరచుకొని చక్కగా కవితను అల్లారు. మీ ఊహాగానానికి జోహారులు. కాని ఆవిరితో నిండిపోయిన నీటిని తేనీరనుకోకండి, నాలుక నల్లబడుతుంది 🙂 విధేయుడు – మోహన
శ్రీనివాస్ గారు, చాల బాగుంది. దీనిని వినడం ఇదే మొదటిసారి.
ఒక్కొక్క వృత్తము వ్రాయడములో ఒక్కొక్క కవి కడు నేర్పరి. భారవి వంశస్థవృత్తమునకు, రత్నాకరుడు వసంతతిలకానికి, భవభూతి శిఖరిణికి, కాలిదాసు మందాక్రాంతానికి, రాజశేఖరుడు శార్దూలవిక్రీడితానికి ప్రసిద్ధులని క్షేమేంద్రుడు సువృత్తతిలకములో చెబుతాడు. భుజంగప్రయాత వృత్తములో చేసిన రచనలకు మాత్రము ఆదిశంకరులు సుప్రసిద్ధులు. ఈ నిర్వాణాష్టకము కూడ భుజంగప్రయాతములో వ్రాయబడినదే. శంకరుల రచనలో వృత్తవైవిధ్యాన్ని ఇక్కడ చదువ వీలగును.
“Ode to the Medieval Poets”
ఎక్కడో ఇస్మాయిల్ గారనుకుంటా, మన పాత కవిత్వమంతా ఆర్భాటమయం, మామూలు మనుషులు అసలు కనిపించరు అన్నారు . కాని, ఈ పద్యం విని, మీ విశ్లేషణ చదివితే, మన భాష మీద గర్వంతో ఉప్పొంగి పోకుండా ఉండలేము.
నాకీ మధ్యనే Garrison Keillor పుణ్యమా అని తెలుసుకున్న Auden పద్యం గుర్తుకొచ్చింది:
“Chaucer, Langland, Douglas, Dunbar, with all your
brother Anons, how on earth did you ever manage,
without anaesthetics or plumbing,
in daily peril from witches, warlocks,
lepers, The Holy Office, foreign mercenaries
burning as they came, to write so cheerfully,
with no grimaces of self-pathos?”
…
“I would gladly just now be
turning out verses to applaud a thundery
jovial June when the judas-tree is in blossom,
but am forbidden by the knowledge
that you would have wrought them so much better.”
“కవిత్వపు తామరాకు మీద నీటిబొట్టు లాగా నిల్చిన కవి,” అన్నారు మీరు. “తిక్కన ప్రతిభ” అన్న ప్రసంగంలో, కృష్ణశాస్త్రి, “ఇది కవి కెంత కష్టమైన పనో తెలుసునా? తన్ను తాను పూర్తిగా లేకుండా తుడిచేసుకోవడమన్న మాట. లోకంలో వాడై కూడా దానిలో లేనట్లు తటస్థుడుగా, ఒడ్డున సాక్షిగా కూర్చోవడన్న మాట!” [1]. ఆ ప్రసంగాలు పుస్తకరూపంలో వచ్చినట్లే, మీ ఈ వ్యాఖ్యానాలు కూడా ఓ పుస్తకంగా వస్తే మరింక ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి మన పాతకవుల గొప్పదనం చాటినట్లవుతుంది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] కృష్ణశాస్త్రి వ్యాసావళి-1, కవి పరంపర. రాజహంస ప్రచురణలు, 1982.
1) కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
ఈ పద్యము అందరికీ తెలిసినదే. ఇందులోని చివరి పాదము తీసికొందామా? తెలుగు వృత్తాలలో యతి తప్పక ఉండాలి. యతి స్థానములో ఉండే అక్షరాలు ర్ణా, క. ర-కారానికి లేక ణ-కారానికి క-కారముతో గాని అ-కారముతో గాని యతి చెల్లదు. కాని కమ్మ లోని క-కారము సంధి ద్వార వచ్చినది. కీచకులకు + అమ్మ = కీచకులకమ్మ. అంటే కమ్మలోని అ-కారానికి కర్ణాటలోని (కర్ణ + అట) అ-కారానికి యతి చెల్లుతుంది. అంటే కొన్ని శతాబ్దాలముందు తెలుగువాళ్లు ఇప్పటి కర్నాటక పదాన్ని కరు-నాడు అర్థములో కాక కర్ణాటక అనే వాడేవాళ్లు. ఈ కర్నాటక పదము కర్నాటక రాష్ట్రములో ఇటీవల చేసిన ఒక శాసనము అని చదివాను.
2) నా ఉద్దేశములో కర్ణాటకసంగీతములో మొదటి త్రయము అని చెప్పాలంటే అందులో అన్నమాచార్యులు, శ్రీపాదరాయలు, వ్యాసరాయలు వీరి ముగ్గురి పేరులు ఉంటాయి. కర్ణాటక రాష్ట్రములోని వారు కాబట్టి శ్రీపాదరాయలు మున్నగు కన్నడిగులను గురించి ప్రస్తావించాను. నాకూ అన్నమాచార్యులంటే ఎంతో యిష్టమే. నేను ఆద్యులు అంటే మొదటి తరము వాళ్లు అనే అర్థములో వ్రాసినాను. ఇది అన్నమాచార్యుల అసమాన సంగీత సంపత్తిని కించపరచడానికి మాత్రము కాదు. సంగీతము సాహిత్యము ఈ కళల అభివృద్ధికి ఎందరో పాటు పడ్డారు. కొందరిని గురించి మనకు బాగుగా తెలుసు, మరి కొందరిని గురించి అంతగా తెలియదు. ఈ విషయాలను తెలిసికోవాలన్నదే తహతహ. ఆ కారణమువల్లనే నాకు తెలిసినది (చాలవరకు ఒప్పులు, అక్కడా యిక్కడా తప్పులు) అందరితో పంచుకోవాలనుకొంటాను నేను. ఆ కారణమువల్లనే తెలుగువారికి నాగరత్నమ్మను గురించి, శ్రీపాదరాయలను గురించి నాకు తెలిసినది పంచుకొన్నాను.
దీనినే కన్నడములో నొణ కాట (ఈగ బాధ) అంటారు. నొణ పదములో నకారము, ణకారము రెండూ ఉన్నాయి కదా! కర్ణాటకాన్ని ణకారముతోనే పలకాలి కాని హిందీ ప్రభావమువల్ల నకారముగా కూడ పలుకుతారు. ణకారము ఒత్తుతో ఉండే పదాలైన వర్ణము, స్వర్ణము, కర్ణము, చూర్ణము మొదలగు పదాల ఉచ్చరణలో కూడ ఈ దోషము సర్వసాధారణమే. కర్ణాటక సంగీతములో ఉండే కర్ణాటకము వేరు, ఇప్పటి కర్ణాటక రాష్ట్రము వేరు. కొన్ని శతాబ్దాలముందు ఇప్పటి రాయలసీమ, నెల్లూరు, ఆర్కాడు, చెంగల్పట్టు ప్రాంతాలన్నీ కర్ణాటకమనే వ్యవహరించబడేది. కర్ణాటక యుద్ధాలు జరిగింది కర్ణాటక రాష్ట్రములో కాదు, తమిళనాడు ప్రాంతాలలో. కర్ణాటక సంగీతానికి ఆద్యులైన శ్రీపాదరాయలు, వ్యాసరాయలు, పురందరదాసు, కనకదాసు, మున్నగువారు అందరూ ఇప్పటి కర్ణాటక రాష్ట్రానికి చెందినవాళ్లే. నా ఉద్దేశములో కర్ణాటకమే సరి. హిందుస్తానీ విషయములో హిందూస్థానీ, హిందుస్తాని రెండు సరియే, కాని సామాన్యముగా హిందుస్తాని అనే అంటారు. ఇది పారసీక భాషా ప్రభావమే, ఉదా. పాకీస్తాన్, హిందుస్తాన్, రేగిస్తాన్, ఇత్యాదులు. విధేయుడు – మోహన
“అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహాలను ఇస్లాం అంగీకరిస్తుంది”???
నాకు తెలిసి ఇస్లాం ఫస్ట్ కజిన్స్ (పెదనాన్నా, చిన్నాన్నా) పిల్లల మధ్య వివాహాలను అంగీకరిస్తుంది.
సురేశ్ గారూ,
వెస్సాంతర జాతకాన్నీ (VJ), అయోధ్య కాండ (AK) నూ, దశరథ జాతకాన్నీ (DJ) తులనాత్మకంగా పరిశీలించిన ఓ వ్యాసాన్ని చదివాను. రచయిత పేరు రిచర్డ్ గోంబ్రిక్ (Richard Gombrich, నా ఉచ్చారణ తప్పు కావచ్చును). ఇదీ లింకు. అయోధ్య కాండకూ, వెస్సాంతర జాతకానికీ మధ్య కథావస్తువులలో, కథనంలో, ఎంచుకున్న వర్ణనలలో చాలా పోలికలను చూపిస్తారా రచయిత.
దశరథ జాతకం అయోధ్య కాండనూ, వెస్సాంతర జాతకాన్నీ కలగలిపి రాసిన పేలవమైన కథ అని అభిప్రాయపడతారు. (రెండు జాతక కథల అజెండా – “హిందూ” సమాజాన్నీ/ఆదర్శాలనూ విమర్శించడమే అంటారు.)
Gombrich does not think much of DJ’s suggestion of the consanguineous relationship of Rama and Seeta. Unlike Arudra who read a hint of evolving social mores in it and unlike Jacobi who thought that this was consistent with the Sakya/Koliya traditions, Gombrich thinks that this could be just a minor (?) aberration resulting from the author’s attempt at replay of VJ’s sequence of events by AK’s characters.
As far as the timelines are concerned, Gombrich thinks that VJ’s verses might not have been later than 3rd century BC (earlier than any of the written Ramayanas) and its prose might date back to 5th century AD). He thinks that DJ could have been written in 5th century AD.
సంధ్యారాగ అనే కన్నడం సినిమాలో రాజ్‌కుమార్‌కు భీమ్సేన్ జోషీ పాడిన పాటలు ఇక్కడ వినవచ్చు. పురందరదాసు కీర్తన ఈ పరియ అనేది హంసానంది రాగం. రెండోది దేసీకాని ఆభేరికాని కావచ్చు. మూడోది కల్యాణి.
మధ్యలో బాలమురళి పాడినది కూడా ఉంది. సందర్భం ఏమిటో మోహనగారు వివరిస్తే బావుంటుంది.
మూల వ్యాసం చదవలేదు కానీ… స్వచ్చందంగా అనువదించిన మీరు ఆ రచయిత భావాలను ఆమోదిస్తున్నారని భావించి… నా సందేహాలు మిమ్మల్నే అడుగుతున్నాను. ఆలస్యంగా చదివి మరింత ఆలస్యంగా సందేహాలు అడుగుతున్నందుకు క్షమించగలరు.
ఒకటికి రెండు సార్లు చదవడానికి ప్రింట్ తీసుకుంటే మీ రచన 20 పుటలు వచ్చింది. దానిలో 3 పుటలు హనుమ పిట్ట కథ, 7 పుటలు వాల్మీకి ( మూలం అనకూడదు కదా మీ భావాన్ని బట్టి ), కంబ రామాయణాల్లో నుంచి ఒక ఘట్టపు వేర్వేరు చిత్రీకరణలు. మరో రెండు పుటలు వైదిక ధర్మాన్ని వ్యతిరేకించే జైనులు రాసుకున్న రామాయణాల ఉటంకింపులు, ఇంకో రెండు పుటలు కన్నడ జానపద కథ, తర్వాతి రెందు పుటల్లో థాయ్ రామాయణాల స్థూల పరిశీలన, చివరికి ఆయా రామాయణాల్లోని భేద సామ్యాలు.
అంతా బాగానే ఉంది. వాల్మీకి కథే మూల కథ కాదు అన్న విషయం ముందు ముందు గమనిస్తాం అని చెప్పారు కానీ… అనంతర వ్యాసంలో అలాంటి ప్రయత్నం ఎక్కడా కనబడలేదు.
వాల్మీకి రాసిన కథకూ, ఆయన తర్వాత రాసిన వారి కథలకూ మధ్య భేదాలున్నాయి అన్నారు. మూలం వాల్మీకి కాకపోతే ఆయనకు ముందు రాసిన కథనాలూ ఉండాలి కదా. ఇప్పటి వరకూ అలాంటివి ఎక్కడయినా దొరికాయా? వాటి రచయితలు ఎవరు? ఆయా రచనలకూ వాల్మీకానికీ ఉన్న భేదాలు ఏమిటి? అలాంటివి ఏమీ లేనపుడు వాల్మీకాన్ని మూల కథ కాదు అని అనడానికి ప్రాతిపదిక ఏమిటి?
నాకు తెలిసినంత వరకూ… దశరథ తనయుడు రాముడు జనక దుహిత సీతను పెండ్లాడడం, సవతి తల్లికి తండ్రి ఇచ్చిన వరం మేరకు అరణ్యాలకు వెళ్ళడం, అక్కడ సీతను రావణుడు అపహరించడం, వానర ( జాతి ) సాయంతో రాముడు యుద్ధం చేయడం, సీత అగ్నిప్రవేశం, రామ పట్టాభిషేకం…. మౌలికంగా ఇదీ రామాయణం, అంతేనా !
కంబన్, తులసీదాస్ తదితరులందరూ వాల్మీకి తరువాతి వారే అనడానికి మీకు ఏ అభ్యంతరమూ లేదని అర్ధమయింది. వారందరూ తమ తమ ప్రాంతీయ వాతావరణాలను బట్టి, స్థానిక ఆచార సంప్రదాయాలను బట్టి రామ కథలో మార్పు చేర్పులు చేశారు. మీరు ఉటంకించిన సందర్భాలు అలాంటివే కదా. అయితే మౌలికమయిన కథను వారు అతిక్రమించి వెళ్ళిన దాఖలాలు లేవే? భూమ్మీద ఉన్నంత కాలం మానవుడిగానే ప్రవర్తించినట్టు వాల్మీకి చిత్రించిన రాముడిని ఆయన గుణగణాలు ఆదర్శప్రాయమైనవిగా భావించి దైవాన్ని చేశాదు కంబన్ అని చెబుతున్నారు. తులసీ కూడా అలాగే చేశాడన్నారు. కానీ వారిద్దరూ వాల్మీకిని సైతం ( కవిగానయినా ) ఆరాధించిన వారే కదా. అంటే వారికి వాల్మీకమే మాతృక కాగలదు కదా. ఏమంటారు?
అన్నట్టు కంబ రామాయణానికి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారి తెలుగు అనువాద పద్యాలను ఉటంకించారు కదా. మీ సిద్ధాంతం ప్రకారం పూతలపట్టు వారి రచన స్వతంత్రం తప్ప కంబన్‌కి అనువాదం కాకూడదేమో!
జైన కథనాల విషయానికి వస్తే… వైదిక ధర్మాన్ని నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చిన జైనావలంబులు.. పరమ వైదికుడయిన వాల్మీకి కథను తమకు తగినట్టు మలచుకోడంలో విశేషం ఏముంది? అసలు వారు రామ కథను స్వీకరించడమే విశేషం. ఆ పని వారు చేయడానికి కారణం… అప్పటికే సమాజంలో విస్తృతాదరణ పొందిన గాధను వదులుకోలేకపోడమే అయి ఉండవచ్చని నా భావన. మీరేమంటారు?
ఇక జానపదుల పల్లీయుల మౌఖిక కథలు. అవీ సౌందర్యాలూ, రసపూరితాలూనూ. సీతమ్మకు అమిత ప్రాధాన్యతనివ్వడం అద్భుతం. కానీ అక్కడ కూడా వాల్మీకాన్ని అతిక్రమించిన ఘట్టం ఏదీ మీరు చూపలేదు. రవళుడి వృత్తాంతం ఆసక్తికరమే కానీ అది అసలు కథకు అనుబంధంగానే ఉంది తప్ప వ్యతిరిక్తంగా లేదు కదా.
థాయ్ రామాయణాల విషయంలోనూ అసలు కథకు చేర్చిన పిట్ట కథలనే చూపారు, దానికి చిన్న చిన్న మార్పులు చేసుకోడాన్నే ప్రస్తావించారు. అవి మూల కథకు భిన్నాలు ఎలా అవుతాయో చూపలేదు.
ఒక కథను ఒక రచయిత రాసిన తరువాత మరో రచయిత రాసేటప్పుడు కొత్త కల్పనలు చేస్తే… అది స్వతంత్ర రచన అయిపోతుందా? కథ ఎత్తుగడ దృశ్యాలు మారిస్తే రచన స్వతంత్రం అయిపోతుందా?
ఉత్తర రామాయణం వాల్మీకం కాదని సాధారణ భావన. పలు రామాయణాలు దాన్ని విస్తృతంగా రాసినా అవేవీ వాల్మీకాన్ని కాదనలేదు కదా. ఏదేమైనా పాత్రల ప్రవర్తన, కథా చిత్రణ గమనిస్తే ఉత్తర కథ వాల్మీకానికి భిన్నంగా ఉంటుందన్న మాట నిజమే.
వివిధ రామాయణాల పరిచయం చేసిన ఏ సందర్భంలోనూ మూలం వాల్మీకం కాదూ అని సహేతుకంగా నిరూపించలేకపోయిన మీరు… వడ్రంగి రంపం ఉదాహరణతో ముగించడం… రామాయణాన్ని అపహాస్యం చేయదలచుకోడమే. ఏ రెండు రామాయణాల్లోనూ ఒకే కథ లేదు అని చెప్పడానికి… ఆయా రచయితలు చేసిన చిన్న మార్పులను చూపిస్తే సరిపోతుందా? మూల కథను మార్చిన సందర్భాలు ఒక్కటయినా ప్రస్తావించకుండా… వాల్మీకం మూలం కాదనడం ఎంత వరకు సభ్యం?
ఇక అనువాదకుడికి చిన్న మనవి — బాస్ రిలీఫ్స్‌ని శిలా ఫలకాలు అని కూడా అనలేం. మరో కొత్త పదం వెతకండి. చూపించదలచుకున్న రూపాన్ని లోహ లేదా శిలా వృత్తంలో (బుడగలో గాలి ఊదినట్టు) ఊది నిర్మించే ఆకృతి… అని గుర్తు. పరిశీలించగలరు.
హిందుస్తానీ సంగీతంలో కృషి చేస్తున్న తెలుగువారు బాగా తక్కువేకాని కొందరి పేర్లు తెలుసుకోదగినవి.
రవిశంకర్ శిష్యుడు మిట్టా జనార్దన్ అనేక దశాబ్దాలుగా మద్రాసులోని వివిధభాషల సినీసంగీతంలో సితార్ వినిపించారు. వాటిలో మనసున మనసై, ఎవరివో నీవెవరివో, నీవురావు నిదురరాదు వగైరా పేరుపొందిన పాటలున్నాయి.
శాస్త్రీయగాత్రం వినిపిస్తున్న సుమిత్రా గుహా తెలుగుమహిళే. ఇంకా పేర్లు తెలియవలసినవి ఉంటాయి.
హిందుస్తానీ గాయకులుగా పేరుపొందినవారిలో ఎ. కానన్, ఎం.ఆర్. గౌతమ్, తమిళులు. వయొలిన్ వాయించే ఎన్.రాజమ్, సవ్యసాచిలాగా రెండుపద్ధతుల్లోనూ వయొలిన్ నైపుణ్యం కలిగిన ఎం.ఏస్. గోపాలకృష్ణన్ కూడా తమిళులే. ఇక కన్నడం సంగీతవేత్తలకు కొదవేలేదు.
చాల చక్కని విశ్లేషణ! అర్జునుడి వినయంతో కూడిన పరాక్రమం స్పష్టం అయిన సన్నివేశం. అయితే సినిమాలో పూర్తి గా చూపించబడనిది ఏమిటంటే, కర్ణుడు యుద్ధం నుండి అర్జునుడి ధాటికి భయపడి చేతకాని వాడికి మల్లే రారాజుని విడిచి పారిపోతాడు. స్నేహం కోసం ప్రాణం ఇస్తాను అన్న పెద్దమనిషి చివరకి చేసిన నిర్వాకం ఇదే. కర్ణుడి స్వభావం పరిశీలిస్తే, అతను చాల సందర్భాలలో నిజానిజాలని పరిశీలించకుండా రాజుని శత్రుత్వం వైపే ప్రేరేపిస్తాడు. కారణం అతనిలో ఉన్న మత్సరమే! కర్ణుని పరాక్రమం, శౌర్యం గుర్తెరిగే భీష్ముడు అతనిని మహా రధుడిగా నిర్ణయించడు. ఇదే విషయం కర్ణుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గర అంగీకరిస్తాడు కూడా. కాగా, ఖాండవ దహనంలో అర్జునుడికి ప్రాప్తం అయిన శత్రువుల ద్వారా కర్ణుడికి పరోక్షంగా కొంత బలం ఏర్పడింది. ఇదే కారణంగా అతనితో యుద్ధం కొంత కష్టతరం అయ్యింది.
గుండె గోడల మీద వ్రేలాడే చిత్ర పటాలు ఈ చిన్ని కథలు!
****
అంతులేని శాఖోప శాఖలుగా భూమిన పరచుకున్న పేరు తెలీని ఓ మహా వృక్షం లాంటిది – ఈ సమాజము, ఈ జన సమూహమూ! విభిన్న మానవ మనుగడలను, జీవన వైవిధ్యాలను, విచిత్ర మనస్తత్వ విధానాలను గురించి తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ వుంటాం. ఐతే, ఈ అంశాలని రచయిత – ఏ దృక్కోణం నుంచి పరిశీలించి, పరిశోధించి, చెబుతున్నాడా.. అనేదే రచనలో ఆసక్తిని రేకెత్తించే అసలైన విషయం అవుతుంది. నిజమైన పాఠకుని ఉత్సకత, తపన కూడా ఇదే. సరిగ్గా ఇలాంటి సందర్భాలలోనే ఆ రచయిత సామాజిక శాస్త్రవేత్త గా మారిపోతాడు( మారాలి కూడా). ‘రచయిత కి సామాజిక బాధ్యత వుంటుంది.’ అనే ఒక నైతిక శాసనానికి బహుశా ఇదే పునాది అనుకుంటా!
ఈ కథలు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక గొంతు వినిపిస్తూ వుంటుంది. పూర్తిగా చదివాక అదొక మనిషిదని గుర్తిస్తాం.
మనం మనుషులం. సందేహాల చిచ్చులం. లేకపొతే – మనకింత జ్ఞాన, విజ్ఞాన శా స్త్ర భాండాగారాలు లభించి వుండేవి కావు. ఒక్కోసారి డౌటేస్తూ వుంటుంది. వాచీ సరిగ్గానే తిరుగుతోందా, లేదాని! అప్పుడప్పుడు ఓ గొప్ప చిక్కు ప్రశ్నెదురౌతూ వుంటుంది. అసలీ జీవితం నిజమా? అబద్ధమా? అని. నవ్వుతూ మాట్లాడుతున్న మన ఎదుటి వాడి మనసులో ఏముందో తెల్సుకోవాలనే కుతూహలం కలుగుతూ వుంటుంది. కానీ, ఎలా తెలుసుకోడం ఈ నిజాల్నీ? తెల్సుకోవాలనే జిజ్ఞాస, తెలియరాక నిరాశా కలుగుతూ వుంటాయి. ఐతే, మనిషికి ఈ తపనంతా ఎందుకంటే – ఒక నిజం తెలుసుకోడం కోసం. నిర్ధారించుకోడం కోసం. అంతే. అదెలాంటి విషయమైనా సరే మనకి సందిగ్ధాలుండకూడదు. సందేహాలకి శాస్త్రీయ పరమైన నిరూపణ వుండాలని కోరుకుంటాం.
మనిషి తన నీడని చూసి తాను మొదట భయపడి పోయాడుట. ఆ తర్వాత కొన్ని క్షణాలకి.. ఆలోచనలో పడిపోయాడట. ఏమనంటే – తనకు కనిపించని ఈ నల్ల మనిషి తన వెనక మాత్రమే వస్తున్నాడా లేక అందరి వెంటా వస్తాడా అని. ఆ తక్షణమే తన తోటి వాళ్ళని తన పక్కనే నిలబెట్టుకుని, అందరి నీడల్ని పరిశీలించి ‘నీడ సహజమైన గుణమనీ, అది మనిషినుంచి విడ దీయ లేనిది’ అనీ కనుగొని తేలిక పడ్డాడట.
బ్ర్హమల్ని తొలగించుకుని, వాస్తవాల్ని నిర్ధారించుకున్నాక, కలిగే స్థిమితం పేరే శాంతి! దీని వల్ల మనకేం తెలుస్తుందంటే – తను కలసి జీవిస్తున్న జాతి వారిలో ఏక గుణ లక్షణాలు, స్వభావాలూ (అవి సహజమైనవైనా సరె, అసహజమైనవైనా సరే ) వుండాలని – మనిషి వాంఛిస్తాడు. ఇప్పటికీ ఈ మనిషి వాంఛ తీరడం లేదు.
పట్ట పగలే – కాగడాలు పట్టుకు తిరుగుతున్న ఓ ప్రఖ్యాత తత్వవేత్తని ‘నీకిదేం పిచ్చయ్యా?’ అని అడిగితే చెప్పాడట. ‘ఎక్కడైనా మనిషి కనిపిస్తాడేమో వెతుకుతున్నానని. ఆయన మాటల్లో – ఎంత గొప్ప అర్థం ద్యోతకమౌతుందో కదూ!?
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మాధవ్ గారి కాల్వినో అనువాద కథలు చదువుతున్నప్పుడు – గుప్ఫున గుర్తొచ్చాయి నాకివన్నీ!
చిన్న చిన్న కథలెప్పుడూ పెద్ద పెద్ద సత్యాలే చెబుతాయి. ఇవీ అలాంటివే. మనకు అర్థమైనా, కాకున్నా – మన జీవితాలకున్న అర్థాలు కేవలం రెండు. రెండే రెండు. కథ కైనా అంతే. “The ultimate meaning to which all stories refer has two faces: 1. the continuity of life, 2. the inevitability of death.” అని అంటాడు ఈ రచయిత. ఎంత బాగా చెప్పాడూ!, అనిపించింది నాకు – చదవగానే!
నాకీ కథలు బాగా నచ్చడానికి మరో కారణం. ఇవి అనువాద కథల్లా లేకపోవడం! కథల్లొ పూర్తిగా తెలుగు వాతావరణం నెలకొని వుండటం వల్ల.. మంచి తెలుగు కథలు చదువుతున్నఅనుభూతి కలిగింది. ‘ఇవి అనువాదాలు’ అని చెపితే తప్ప తెలీనంత సహజంగా వున్నాయి. ముఖ్యంగా చదివింపచేసే చక్కని శైలి వల్ల ఆసక్తి కరంగా వున్నాయి. కథలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. మంచి కథలు – బాల్యం నాటి జ్ఞాపకాల్లా.. గుండె గోడల మీద ఫ్రేములు కట్టిన చిత్రాలై కూర్చుంటాయి. నిజానికి షార్ట్ స్టోరీస్ రాయడం కష్టం. చదవడం తేలిక. కాని, మర్చిపోవడం మాత్రం అంత సులభం కాదు.
మాధవ్ గారూ! మీరు పరిచయం చేయడం వల్ల నేనీ రచయిత గురించి మరింతగా చదివి తెలుసుకోగలిగాను. ఈ సందర్భంగా మీకూ, ఈ మాటవారికి నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను. మరిన్ని కాల్వినో రచనలతో బాటు, మరెందరో మంచి రచయితలని మాకు పరిచయం చేయగలరని ఆశిస్తూ…
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.
అంత పాండిత్యం ఉండీ నేనీ లోకానికి అందివ్వ లేక పోతున్నానే..
వీరు నన్ను పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారే ..
అనే బాధ నిరాశ అయ్యలో ప్రగాఢంగా కనిపించేది..
రా.. రా ..
నీకు అరవిందుని ఊర్వశి చెప్తాను..
రా రా .. నీకు మిల్టన్ చెప్తాను ,.
అని తన చుట్టూ ఉన్న వారిని ప్రేమగా పిలిచే వారు..
మీ ‘ఈమాట’ చాలా బాగున్నది. ఈ మార్గము తెలుగు బాషాభిమానులందరిని ఒక దగ్గర చెర్చెలా ఉన్నది. కాని ఇన్కా(iMkA) ఇక్కడ వ్రాయడము అలవాటు కావాలి. అక్కడక్కడ చిన్న తప్పులు వున్నవి, మన్నిMచగలరు.సున్న మరియు త(TA)ని ఎలా type చెయాలొ తెలియటM లెదు.
మల్లికార్జున కొంగాని.
[M వాడితే సున్నా వస్తుంది. త(ta) ట(Ta). తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు. మీ బ్లాగు చదివాను కాని, మీరిలా కథలు కూడా ఆదరగొడతారు అని గ్రహించలేని వెర్రి నాగన్న నయ్యాను. ఇప్పుడు కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి :).
“ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అమ్మలక్కలు మండువా లోగిళ్ళలో పాడుతుండగా విన్న ఊర్మిళాదేవి నిద్ర పాటల శైలి ఇప్పటికీ ఇంకా నాకు బాగా గుర్తుంది. (ఎవరికైనా వినే దమ్ముంటే పాడగలను కూడా!).” -Krishna Rao Maddipati
పాడండి. ఆకస్మిక ప్రసారం చెయ్యటం ఈ పత్రికకు సాధ్యమే అని తెలిసింది. కృష్ణారావ్! మీపాట ఎందుకు మమ్మల్ని విననీయరు. కవిత్వాలు వ్యాసాలు రాసుకుంటే, రాయటం వస్తుందేమో కాని సంగీతం రాదు. సంగీతం వింటే వస్తుంది. పాడితే వస్తుంది. అని రోహిణీ ప్రసాద్ చెప్పింది చాలా నిజమే.
మీరు పాడండి. నాకు వినాలని ఉంది.
కొత్త సంవత్సరం సందర్భంగా ఎక్కడో భారతంలో ఒక చలి ప్రాంతం నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె వైణికురాలు. ఏమి వాయిస్తున్నాదీ ఇప్పుడు అని నేను అడిగి తెలుసుకుంటుంటే, పినాక పాణి పుస్తకం నుంచి కొన్ని కీర్తనలు నేర్చుకుంటున్నా, నువ్వు రా, నేను వినిపిస్తానంది.
ఇప్పుడు ఫోన్లో వినిపించమన్నాను. అప్పుడు నాకు అర్థరాత్రి.
నీకు నిద్ర పోయే సమయం. ఇప్పుడు కాదు -అంది ఆమె.
లేదు నే వింటానన్నా.
ఆమెకు హఠాత్తుగా గుర్తు వచ్చింది. నా వీణకు ఒక తీగ తెగిపోయి ఉంది. మార్చాలి.-అంది
ఎంత సేపు పడుతుంది. తీగ మార్చటానికి? -నా ప్రశ్న
ఒక అరగంట ఇవ్వు. తీగ మార్చి కొంచెం సాధకం చేసుకుని వినిపిస్తా నంది.
నేను మళ్ళీ ఫోన్ చేసే లోపలే, తనే ఫోన్ చేసి,
వీణతో, తన కంఠస్వరం కలిపి పాడితే, నే విని ఈమె నాకు తెలిసిన వ్యక్తేనా అని ఆశ్చర్య పోయాను. నిజంగా చెప్పాలంటే ఆమె నాకు తెలియదు. పదిహేను ఇరవయ్యి సంవత్సరాల పైగా సాధన చేసి వైణికురాలైన ఆమె నాకేం తెలుసు? ఏదో దగ్గిర చుట్టంగా ఆ చనువుతో తెలుసు. ఆమె ఇంకా ఏమేమిటో? నిజంగా నాకేం తెలుసు?
ఆమెకు తన వీణ నేను వినాలనీ, తను వేసిన బొమ్మలు నేను చూడాలనీ ఎంతో ఉబలాటం. ప్రకృతి అందమైన దృశ్యాలు తనతో పాటు నేను చూడాలని ఆమె ఆశ. వీణ వాయించుకోటం ఆమె నిత్యకృత్యం. ఆమెకు గుర్తింపు అంటే ఏమిటో తెలియదు. పద్మశ్రీల సెరిమొనీలు ఆమెకు పట్టవు.
మా సంభాషణలో, -అన్నమయ్య కీర్తనలలో మాటలు నాకు అన్నీ అర్థం కావు- అని తను అన్నప్పుడు, జయప్రభ రాసిన రెండు పుస్తకాలను నువ్వు తెప్పించుకుని చదువుకోవాలని తనకి చెప్పాను. తప్పకుండా చదవాలి. అప్పుడు నువ్వు ఇంకా బాగా వాయిస్తావు. నీ ఆనందం ఇంకా ఎక్కువవుతుంది, అని నేను చెప్పాను.
కృష్ణారావ్! మీ పాట “ఈమాట” లో ప్రసారం కోసం నేను ఎదురు చూస్తాను.
1. “మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటే, మా అమ్మా నాన్న బావున్నారనడం సహజం. ఇక్కడ అది లేదు.”
ఇక్కడ ఊర్మిళ ప్రశ్నలడగలేదే! లక్ష్మణుడిని భయపెడుతూ వాళ్ళ పేర్లు ప్రస్తావించింది. మళ్ళీ అదే వరసలో వారిని ప్రస్తావించడమే సహజం అనడం నా ఉద్దేశంలో సమంజసం కాదు.
2. “సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
సృష్టిలో నేను యెరుగ”
దీనికి చాలా పాఠాంతరాలున్నాయి. ఈ “చెప్పుడీ” అన్న పదం మలయవాసినిగారు పాడిన పాటలో కాని, అక్కడిచ్చిన పాట సాహిత్యంలో కాని, ఇల్లిందిల సరస్వతీదేవిగారి పాఠంలో కాని లేదని గమనించండి. సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం. “అలనాటి పాట ఊర్మిళాదేవి నిద్ర”లో శ్రీమతి సుబ్బులు పాడిన పాటలో కూడా అక్కడ మాట్లాడేది ఒక్క లక్ష్మణుడే అన్నది స్పష్టంగా ఉంది.
3. “అబ్బే, అలా స్త్రీలు ఉండరు, స్త్రీలెప్పుడు భర్తలను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటారనుకోవడమే “మేల్ ఇగో” అని నేననుకుంటున్నాను.”
స్త్రీలెప్పుడూ అలా ఉంటారని నేనెక్కడా అనలేదండి. మళ్ళీ నా వ్యాఖ్య ఒకసారి చదవండి. మీరలా స్త్రీలందరి గురించి సాధారణీకరించడం, దాని ఆధారంగా పాటని అన్వయించుకోడం సమంజసం కాదని మాత్రమే నేనన్నాను.
4. “రెండవది అవడంలో ఇబ్బందేముందండి?”
రెండూ కలిపి చెయ్యడంలో ఇబ్బంది ఉంది. అది circular inference అవుతుంది కాబట్టి. వ్యాసంలో చేసిన ప్రయత్నం మొదటిది కాబట్టి, దానితో రెండవది కలపడం సరికాదని నా ఉద్దేశం. అసలు రెండవ దానిలో విడిగా కూడా ఉన్న ఇబ్బంది “స్త్రీ మనస్తత్వము” అనే సాధారణీకరణ. మీరిచ్చిన విశ్వనాథ ఉదాహరణలో మారీచుడు ఒక పాత్ర. ఆ పాత్ర కల్పవృక్షంలో మనకి స్పష్టంగా గోచరిస్తుంది. ఆ పాత్ర చిత్రణకి అనుగుణంగా అక్కడ మారీచుని ప్రవర్తనని అర్థం చేసుకోడంలో ఇబ్బంది లేదు. కాని యిక్కడ మీరు చెపుతున్నది “స్త్రీ మనస్తత్వము” అనే ఒక బ్రహ్మపదార్థం (I mean an abstract thing) గురించిన సాధారణీకరణ! అదీ ఇబ్బంది.
ఇంతకు మించి యీ విషయంలో నేను చెప్పగలిగేదేదీ లేదు. చెప్పబూనితే, తెగే దాకా లాగడమే అవుతుంది. కాబట్టి యీ విషయంపై యిది నా చివరి వ్యాఖ్య.
‘వాల్మీకి మనకేమీ చెప్పలేదు’ అంటూనే వ్యాసకర్త ‘మనకు తెలుసు’ అనటం నిరాధారంగా ‘మనం’, ‘మనకు తెలుసు’ అంటే ఎంత నేరమో అంత కన్నా ఎక్కువ నేరం.
ఇది వెల్చేరుగారు రాసిన ఈ వాక్యాల గురించి:
“వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”
తహతహ గారు: “మనం”, “మనకు తెలుసు”, “మనకేమీ చెప్పలేదు” అనడం ఒక రకమైన రచనాశైలి (writing style). కథను స్థూలంగా చెబుతూ, పాఠకుకుని ఆసక్తి తగ్గిపోకుండా ఉండడానికి “We”, “We know that”, “We will find out” అని వాడడం ఇంగ్లీషులో రాసే చాలామంది పండితులు ఉపయోగించే టెక్నిక్.
ఇక్కడ “మనకి తెలుసు” అన్నది రాముడు, సీత, లక్ష్మణుడు మాత్రమే అడవికి వెళ్ళారని రామాయణం గురించి ఏ మాత్రం తెలిసిన పాఠకునికైనా అర్థమయ్యే విషయమని చెప్పడం. ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తాననడం వాల్మీకి రామాయణంలో లేదు. తెలుగువాళ్ళు అల్లిన కథలో “ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది” అని చదవగానే రామాయణం తెలిసిన పాఠకుడు “కానీ లక్ష్మణుడు ఒప్పుకోడు” అని ఊహిస్తాడు. పాఠకుడు ఊహిస్తున్న విషయాన్ని రచయిత బలపరచడం ద్వారా రచన పాఠకునికి చేరువౌతుంది. ఇది నాకర్థమైన విషయం.
1. “భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా?”
మా పెద్దవాళ్ళని అడిగాను. ఇలాంటి ఆచారమేదీ (భర్త తన పేరు భార్యకి చెప్పకపోవడం) వారికి తెలియదు. రాజులలో ఉందేమో, లేదా కొన్ని ప్రాంతాలలో ఉన్నదేమో. అయినా నా పాయింటు అది కాదు. అక్కడ లక్ష్మణుడన్న మాటలని వివరించడానికి అసలు దాని ప్రసక్తే అనవసరం అన్నది నా అభిప్రాయం. “దశరథకుమారుడను” అనో, “సుమిత్రానందనుడను” అనో చెప్పుకొని ఉంటే ఆ వివరణ అవసరముండేదేమో. కాని అతను చెప్పిన విధానం చూస్తే, కచ్చితంగా ఊర్మిళ ప్రస్తావించిన వాళ్ళనే తాను ప్రస్తావించడమన్నదే ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అది సంభాషణలో చాతుర్యం.
2. ఇక్కడ నేనిచ్చిన అన్వయం ఒక్కటే సరైనదని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. నారాయణరావుగారు కూడా తన అన్వయం గురించి అలా అంటారని నేననుకోను. ఎందుకంటే మీరన్నట్టుగా నేపథ్యాన్ని బట్టి, దృక్పథం బట్టి అన్వయించుకోడంలో తేడాకి చాలా అవకాశం ఉంది యిక్కడ. ఉదాహరణకి మీరు ప్రస్తావించిన ఇల్లిందుల సరస్వతీదేవిగారి పుస్తకంలో ఆ పాటకి వారిచ్చిన వ్యాఖ్యానం కూడా నారాయాణరావుగారి వ్యాఖ్యానం కన్నా చాలా వేరుగా ఉంది. 1940లో దేవేంద్ర సత్యార్థి యీ ఊర్మిళాదేవి నిద్ర పాటని ఇంగ్లీషులో అనువదించి Modern Review జర్నల్‌లో ప్రచురించారు (ఇల్లిందల సరస్వతీదేవిగారి పుస్తక పీఠికలో సురవరం ప్రతాపరెడ్డిగారు దీని గురించి ప్రస్తావించారు). ఆ అనువాదంలో వారు నాకు తోచిన అన్వయాన్నే తీసుకున్నారు. ఇది కూడా డిజిటల్ లైబ్రరీలో లభ్యమవుతోంది [ఈమాటలో అనుబంధంగా ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – సం.]
నేను చెప్పదలుచుకున్నదల్లా, సరళమైన అన్వయం ఉన్నప్పుడు దాన్ని కాకుండా క్లిష్టాన్వయాన్ని తీసుకోడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని. అందులోనూ అలాంటి అన్వయాన్ని ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగానో ఉదాహరణగానో తీసుకుంటున్నప్పుడు.
మీ 2A వివరణతో నేను ఏకీభవిస్తాను.
4. “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” అనే పదాల వాడుకలో నాకు బాధపడాల్సిన అంశమేదీ కనిపించడం లేదు. ఒకరి వివరణో వ్యాఖ్యానమో విపరీతమనో అతిశయోక్తి అనో అనిపించడం నేరం కాదు కదా. అది చెప్పడం వారిని కించపరచడమూ అవ్వదు. (ఆ మాటకొస్తే నా అభిమాన కవి విశ్వనాథవారి వ్యాఖ్యానం కూడా కొన్ని చోట్ల అతిశయోక్తి, విపరీతమూ అనిపిస్తూ ఉంటుంది!). నాకు చేతనైనంత వరకూ నా అభిప్రాయానికి కారణాలుకూడా చెప్పాను.
వాల్మీకి రామాయణం ప్రసక్తి వచ్చింది కాబట్టి, తహతహగారి వ్యాఖ్య చూసాక నాకు కనిపించిన మరొక చిన్న గందరగోళం: “మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హా లక్ష్మణా అని మాత్రమే అంటాడు.” అన్న వాక్యం. ఇక్కడ నారాయణరావుగారి ఉద్దేశంలో “మనకి తెలిసిన రామాయణం” ఏమిటో నాకు తెలియదు కాని, వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు “హా సీతా! హా లక్ష్మణా!” అనే అరుస్తాడు. అంచేత అది స్త్రీ హృదయానికి ఉదాహరణగా ఇవ్వడం సమంజసం కాదు. విశ్వనాథ కల్పవృక్షంలో మాత్రం మారీచుని పాత్రని ఔన్నత్యం పెంచడానికి, అతనికి అనృతదోషం కలగకుండా అతను “లక్ష్మణాగ్రజా!” అని అరిచాడనీ, అది దూరానికి “లక్ష్మణా” అని మాత్రమే వినిపించిందని ఒక తమాషా మార్పు చేసారు.
క్రిందటి సంచికలో ఈ కధను చదివాను. అప్పుడే ఉద్విగ్నానికి లోనయ్యాను. కాని, ఈ వ్యాసం చదివాక అంతకంటే ఎక్కువ అనుభూతి పొందాను. – నరేన్
I am having exactly the opposite reaction. I am downgrading it, based on added info.
ఒక పాత తెలుగుకథ చదువుతున్నాము. కాని అంతకన్నా ఎక్కువగా ఈ శీర్షికలో- కథ, ఎవరికి, ఎందుకు నచ్చిందో చదువుతున్నాము కదా.
పాతకధ ఎప్పుడు ఎవరికి నచ్చింది, ఎందువలన నచ్చింది? కధ ఏ కాలము నాటిది? చదివిన వారు ఏ కాలము నాటి వారు? ఏ వయసులో చదివారు? చదివేది ఆడవారా? మగవారా? ఇంతకు ముందు ఎప్పుడో చదివితే మళ్ళీ చదివినప్పుడు, అదే కారణాల వల్ల నచ్చిందా, లేక వీరి -అభిప్రాయాల్లో, అభిరుచుల్లో- మార్పు ఏమైనా వచ్చిందా? పాత చదువరి కధ చదివే విధానంలో గాని మార్పు వచ్చిందా? ఇప్పుడు మొదటిసారిగా చదివిన వారికి, ఈ కథ ఏ కారణాల వల్ల నచ్చింది? వీరి వయసు ఏమిటి? దేశ కాల పరిస్థితులు ఏమిటి? విమర్శకుల అభిప్రాయం ఊతంగా తీసుకుని వీరు కథను చదువుకున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి.
చౌదరి – ఇక్కడ మొదటి చదువరి, ఈ కధను మనకు పరిచయం చేసిన చదువరి అనుకుందాం. 1944లో చా. సో., రాసిన ఈ కథను, 1960ల్లో, సుమారు తనకు ఇరవయ్యిల వయసులో విద్యార్ది చౌదరి చదివాడు. చదివినప్పుడు ఇదే విమర్శ, అభిప్రాయం రాసుకుని ఉంటాడా? I doubt it. మరి ఇది ఇప్పటి డాక్టర్. చౌదరి ఇప్పటి అబిప్రాయమా? అంటే అలాగూ అనిపించదు.
ఈ విషయం ఆలొచిస్తూ ఉండగానే, ఇక ఈ కథ style ని గురించి ఇంగ్లీషులో నమ్రంగా తెలియచెప్పిన intellectual నీ, ‘మంచి కథ. సందేహం లేదు’ అని తెలుగు సర్టిఫికెట్టు ఇచ్చిన scholarని, ఇలా కొందరిని 🙂 ‘చదువుతూ’ ఉండగా, మళ్ళీ ఈ సంచిక, చా.సో., కథ గురించి మరికొన్ని విశేషాలు చెప్పింది.
దాన్నుంచి, నా ఆలోచనలు మళ్ళీ సాగాయి.
ఇక, ఈ కథ రాసినందుకు రచయిత తనే మురిసి మూర్ఛపోటమే కాక, ఈ కరుణా రస భరిత రచనను అలమూరు రాజగోపాలరావు చదివినట్లు, సాహిత్యంలో నిష్ణాతులైన నర్సింహాచార్యులు, రోణంకి అప్పల స్వామి, కధ చదివి గద్గదికమైన కొడవటిగంటి కుటుంబరావు, చుట్టలు మానెయ్యటం బాగా లేదనే నారాయణ బాబు, అబ్బే, అది మార్చక్కర్లేదనే జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి, ఈ కథ నీకెందుకు నచ్చింది నాన్నా? అని అడిగి వివరాలు సేకరించిన చాగంటి తులసి -ఇలా ఎందరో కథను పఠించినట్లు తెలిసింది.
ఇంతమంది చదువరుల endorsement. అబ్బా! నేను మొన్న తెల్లారుజాము దాకా చూసిన 2012 Iowa Caucuses కన్నా బలంగా ఉంది. ఇక నా రిపబ్లిక్ ఓటు ఈ డెమోక్రటిక్ కరుణకథకెందుకివ్వను? 🙂
ఇవ్వను. ఇవ్వను. ఎందుకంటే;
1.”కృష్ణుడి పేరు ముందు ‘డిస్కంటిన్యూడ్’ అని రాయబోతున్నారు. ఆ అన్యాయాన్ని తలచుకుంటే కోపం రాదూ?
ఈ కథ చదివాక గుండె బరువెక్కకుండా ఎట్లా ఉంటుంది? కళ్ళల్లో నీళ్ళు తిరిగితే ఆశ్చర్యమేముంటుంది?” – జంపాల చౌదరి అభిప్రాయం
2. “నాకు మాటలు రావడంలేదు. ఆ కుర్రవాడు నాకు కనపడుతున్నాడు. ఆ కుర్రవాడు ఎదురుగుండా వస్తే వాడికి స్కాలర్‌షిప్పు యిస్తాను.” రాజగోపాలరావు అభిప్రాయం. (వీరు హైస్కూలు ఉపాధ్యాయుడిగా, కాలేజీ అధ్యాపకుడుగా బహు సమర్ధుడు. – అని వ్యాసంలో చెప్పబడింది)
3. “భోజనం చేసి ఆ కథని బహుశా పది పదిహేను సార్లు నాకు నేను చదువుకుని ఉంటాను. ఎక్కడన్నా ఏ లోట్లన్నా ఉన్నాయేమోనని బహునిశితంగా విమర్శనాదృష్టితో పదం పదం వాక్యం వాక్యం పట్టిపట్టి చదువుకున్నాను.” – రచయిత చాగంటి సోమయాజులు అభిప్రాయం.
4. “మీరు కథలో మీరు ఒకమాట వెయ్యక్కర్లేదు. ఒకమాట తియ్యక్కర్లేదు.” – రాజగోపాలరావు
ఇట్టి పై ప్రగల్భపు, ఉబ్బేసే మాటలు ఈ కథను గురించి, చదివి, నేను (లైలా) ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యం ఎందుకంటే;
కథ చదివి, ఈ సాహితీపరులు, రచయిత తో సహా, వీరంతా ఉద్విగ్నులైతే, ఎందుకు కృష్ణుడిని చూసే అయ్యారు? ఏడవదలిస్తే ఎందుకు ఆఖరి వాక్యం దాకా ఆగవలిసి వచ్చింది చౌదరికి? మూడో వాక్యంలోనే ఏడవలేదేం? కథను ఏ ఒక్కరూ ఎందుకు వీధిలోకి విసిరి పారెయ్యలేదు? లేకుంటే సంపాదకుడుగా ఎందుకు సవరించలేదు? మూడవ వాక్యం చులాగ్గా అలాగ్గా దాటేసి, (Is it a done deal for all of them? A matter of fact?) అఖరి వాక్యాలకు మాత్రమే అసంకల్పితంగా ఏడ్చే అసమగ్రపు చదువరులుగా తెలుగు సాహిత్యం వీరిని మార్చివేసిందా? తీర్చిదిద్దిందా?
ఇంతోటి బోడి సన్నాసి, ముండమోపి చదువుకి కృష్ణుడు బడికి వెళ్ళక పోతేనేం? – అన్న సందేహాలు నాకు కలిగాయి గాబట్టి.
క్రిందటి సంచికలో ఈ కధను చదివాను. అప్పుడే ఉద్విగ్నానికి లోనయ్యాను.
కాని, ఈ వ్యాసం చదివాక అంతకంటే ఎక్కువ అనుభూతి పొందాను.
కధ వ్రాయడం వెనుక పురిటి నొప్పులంత జంఝాటం పడటం, వివేచన చెయ్యడం ఎంతో కదిలించాయి.
చాగంటి తులసి గారికి, జంపాల చౌదరి గారికి, ఈమాట సంపాదక వర్గానికి, రచయితలకోసం మరొక సారి విషయాన్ని సంగ్రహంగా ఎత్తిచూపిన భవానీ గారి అభిప్రాయానికి ధన్యవాదాలు.
కరుణ రసాన్ని చిందించే మంచి కథ, చక్కని అనువాదము. టరమ్ ఫీసుకోసం బంగారు గాజులు, గొలుసు బ్యాంకుకు వెళ్లిన రోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఫీసులు లేకుండా ఏ పరీక్షలైనా ఉన్నాయా అసలు? విధేయుడు – మోహన
మంచి పద్యానికి చాలా చక్కని వ్యాఖ్యానం అందించారు! ఈ పద్యంలో ధ్వనించే అర్జునుని మనస్స్థితిని అద్భుతంగా వర్ణించారు.
ఈ పద్యానికి ఒక చిన్న పాఠాంతరం కూడా ఉంది.
“కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర” బదులు
“కయ్యమున నోడి పాఱిన గౌరవేంద్ర” అని.
అప్పుడు దాని అర్థం –
ఓ కౌరవేంద్ర! యుద్ధంలో నువ్విలా పాఱిపోతే (పాఱిపోతూ ఉంటేనే కదా పిలిచి తూలనాడేది), ఆ అవమానభారంతో క్రుంగి కృశించడమే కాని, యింక ఏనుగులెక్కి రాజవీథులలో ఎలా ఊరేగుతావు? భూషణాలు ధరించి ఎలా కొలువుతీరగలుగుతావు? సుగంధ్రద్రవ్యాలు పూసుకొని ఎలా భోగిస్తావు? అంగనలతో ఎలా వేడుక చేసుకుంటావు? అందుకే ప్రాణత్యాగమే ఉత్తమం – అని.
పద్యంలో చిన్న అచ్చుతప్పు పడింది. “ఎడ్డోలగంబు” కాదు “ఒడ్డోలగంబు”.
రవీ, “ఔచిత్యం” గురించి క్షేమేంద్రునికి ముందు చాలామంది ఆలంకారికులే ఆలోచించారు. ఆనందవర్ధనుడు కావ్యానికి ఔచిత్యమనేది అవసరమైన లక్షణంగా పేర్కొన్నాడు. భాష, ఇతివృత్తము, పాత్రపోషణ విషయాలలో ఔచిత్యాన్ని గురించి చర్చించాడు. అతని స్ఫూర్తితోనే క్షేమేంద్రుడు ఔచిత్యానికి పట్టంగట్టాడు.
My apologies in advance for this nitpicking and ‘side-tracking’ the actual subject. Recently one columnist in The Hindu wrongly claimed that T.P. Rajyalakshmi (she acted in first Tamil-Telugu Talkie: kaaLidaasu-1931) is the first south-Indian woman director (Miss Kamala-1936), though most of the Tamil film historians rightly credit her being the first woman director in Tamil.
Well, I don’t believe in “who is first” debates, but chronologically speaking Fatima Begum directed a film way back in 1926: Bulbul-é-Paristan.
ఇంక తెలుగు విషయానికొస్తే: భానుమతి కంటే 15 సంవత్సరాల కంటే ముందే సురభి కమలాబాయి “భక్త జయదేవ” (1938) అన్న సినిమాకి దర్శకత్వం చేశారు (నటన, ఎడిటింగ్‌లతో పాటుగా …). ఇంకా అంతకు మూడేళ్ళ ముందే దాసరి కోటిరత్నం గారు అన్నీ తానై సతీ సక్కుబాయి (1935, తుంగల చలపతి రావు కృష్ణుడిగా – వీళ్ళిద్దరు జంటగా మైలవరం నాటకసమాజానికి సక్కుబాయి నాటకాన్ని ఆడేవారు. ఆ నాటకానికి, వీళ్ళిద్దరి గాత్రానికి తెలుగు చరిత్రలో చాలా గొప్ప పేరుంది.) చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. దర్శకుడిగా అరోరా అనే ఉత్తర భారతీయుడి పేరున్నా, చేసిందంతా కోటిరత్నం అనేది చారిత్రక సత్యం. (గిరిజ ఈవిడ కుమార్తె.)
– Regards, Sreenivas.
[That mistake is editor’s. The tidbit that Bhanumati was the first woman director was gleaned from the Web and added above. Thanks for the correction -Ed.]
“ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు.
వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”
ఈ మనము ఎవరు? [ఈ మనము లోనేను లేను, ఎందుకంటే వాల్మీకి మనకేమీ చెప్పలేదు గనక] వారికి ఈ విషయము ఎలా తెలుసు? ఇది చూసింతర్వాత చదవ బుద్ధి వెయ్యలేదు గానీ చదివాను.
పాండురంగ మాహాత్మ్యం కావ్యాన్ని నారికేళ పాకానికి ఉదహరిస్తారు. మీ వివరణ తో నారికేళ పానీయ రసమాధుర్యాన్ని చవి చూచాం. ధన్యవాదాలు స్వీకరించండి. ఒకచోట “మట్ట” మధ్యాహ్నం అనేది మిట్టమధ్యాహ్నం అనే పదానికి పర్యాయ పదం అయివుండవచ్చని చదివి నప్పుడు దాని వెనుక కూడ ఏదైనా రహస్యం దాగి ఉన్నదా అనే సందేహం కలిగింది. కారణం, తమిళం లో “మట్ట” అనే పదాన్ని “పట్ట పైన” అనే వాడుక విన్నాను. ఉదాహరణకి “మట్టమాడి” ( పైన ఏ అంతస్తులూ లేని మేడ పై భాగము) అనే పదం తరచుగ విన్నాను. ఈ సందర్భంలో “ఏ ఆచ్చాదనా లేని తలమీద మధ్యాహ్నపు సూర్యరశ్మి పడటం వల్ల కలిగిన తాపం” అనే అర్థం చెప్పుకోవచ్చా అనే సందేహం. దక్షిణాంధ్ర జిల్లాలలో ఈ జాతీయం “మట్ట” అనేది వాడుకలో ఉన్నదేమో తెలిసికొన గోరుతూ — అరుణాచల.
మరుగున పడిపోయిన (పడిపోతున్న) యిలాంటి సాహిత్యాన్ని పదిలపరుచుకోవడం, కొత్తతరాలకి పరిచయం చెయ్యడం చాలా మంచి పని. ఈ సాహిత్యాన్ని గురించి కొత్తగా ఆలోచించడం కూడా అవసరమే. అయితే యీ వ్యాసంలో నారాయణరావుగారు చేసిన ఆలోచనలో కొన్ని అంశాలపై నాకు అనుమానాలు అభ్యంతరాలు ఉన్నాయి. విజ్ఞులు పరిశీలించగలరు:
1.
శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ
ఇక్కడ లక్ష్మణుడు ఊర్మిళ భర్తనని చెప్పకుండా “డొంకతిరుగుడుగా” చెప్పాడని దానికి కారణం తాను పెరిగిన కుటుంబ మర్యాదలని నారాయణరావుగారు అన్నారు. ఇది నాకు సమంజసమని అనిపించలేదు. నాకు కనిపించిన విషయం ఏమిటంటే – ఊర్మిళ నిద్ర మగతలో లక్ష్మణుడు పరపురుషుడని భ్రమపడినప్పుడు అతన్ని ఎలా భయపెట్టింది?
మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ
మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ
మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో
ఇక్కడ ఆమె ప్రస్తావించినది జనకుడు, రాముడు, సీత, సీత మరది అయిన లక్ష్మణుడు. అందుకే వారినే తన జవాబులో లక్ష్మణుడు పేర్కొన్నాడు. ఆమె మాటలే తీసుకొని తానెవరో వివరించాడన్న మాట. ఇది సహజ సంభాషణే కాని డొంకతిరుగుడు కాదు, కుటుంబ మరియాద కోసం చేసినదీ కాదు.
నారాయణరావుగారి వ్యాసం చదవకముందు, చదివాక కూడా నాకలానే అర్థమయ్యిందా భాగం. ఆ అన్వయం చాలా సహజంగాను సరళంగాను ఉన్నట్టనిపిస్తోంది. నా పురుషాహంకారమేమైనా నేనలా అర్థం చేసుకొనేట్టు చేసిందేమోనని అనుమానం వచ్చి, నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు స్త్రీలనికూడా అడిగి చూసాను. నా అన్వయం కాని, నారాయణరావుగారి అన్వయం కాని చెప్పకుండా. వారికీ నాలాగనే అర్థమయ్యింది మరి! ఈ పాట గురించి వివరించిన మలయవాసినిగారు ఏ అర్థమిచ్చారో నాకు తెలియదు. అసలు నారాయణరావుగారికి నాకు తట్టిన అర్థం తట్టనే లేదో, తట్టినా అది తప్పనుకున్నారో తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ ఆ అర్థం తడితే, దాన్ని కూడా ప్రస్తావించి, తాను చెప్పిన అన్వయమే ఎందుకు సరి అనుకుంటున్నారో వివరిస్తే బాగుండేది.
అసలు ఊర్మిళ ప్రస్తావన లేకుండా హఠాత్తుగా అలా ఆమె మాట్లాడిందని అనుకోవడం నిర్మాణ పరంగానూ, అర్థంచేసుకోడంలోను కూడా సంక్లిష్టత కలిగిన అన్వయం. సరళమైన అన్వయాన్ని వదిలి దాన్ని గ్రహించాల్సిన అవసరం ఏమిటి? ఆ తర్వాత నారాయణరావుగారు తన అన్వయానికిచ్చిన వివరణంతా విపరీత వ్యాఖ్యానమే అని అనిపించింది.
2.
మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే
చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా
దీనికిచ్చిన వివరణ నాకు సంతృప్తిగా లేదు. “చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా” అంటే, ఇంకొకళ్ళ మీద మనసుపెట్టి నన్ను నలుగురిలో చిన్నబుచ్చారని అర్థం తీసుకోవచ్చా? లక్ష్మణుడు ఎవరిపై మనసుపెట్టాడు? ఊర్మిళని నలుగురిలో ఎప్పుడు చిన్నబుచ్చాడు? అన్నమీద మనసుతో తనని విడిచి అడవికి వెళ్ళడం తనని చిన్నబుచ్చడమా? మరి “సమయమున” చిన్నబుచ్చడమేమిటి? ఇందులో “మానవంతుడు” కాకపోవడమేమిటి?
3. ఈ పాట ఏ కాలానికి చెందినదో తెలియదు. ఆ కాలంలో సాంఘికపరిస్థితులు అసలు తెలియవు. అలాంటప్పుడు, ఇందులో యిది ఊహ యిది వాస్తవమూ అని ఎలా నిశ్చయించగలం. ఉదాహరణకి,
“తెలుగు ఆడవాళ్ళు బావగారి పేరూ, భర్త పేరూ చెప్పకూడదు. ఒక పక్క తాను హింసపడే ప్రమాదం ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా తెలుగు కుటుంబాల ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా మసలవలసిన నిర్బంధంలో ఉన్నారో ఈ పాట సున్నితమైన మాటల్లో, కొరడాతో కొట్టినంత చురుక్కుమనిపించేలాగా చెబుతుంది.” అన్నారు. అది చెప్పకూడదనే నిర్బంధమో, అలా వరసలు పెట్టి చెప్పే అలవాటో ఎలా నిర్ణయించగలం? ఇంకొకటి – ఇవి నిజంగానే అచ్చంగా ఊర్మిళ మాటలో, లేదా పాడుతున్న స్త్రీ మాటలో కూడా చెప్పలేం. ఊర్మిళ రావణాసురుడు సీతనెత్తుకుపోవడాన్ని ప్రస్తావిండం అది అచ్చంగా ఆమె మాటలు కావని, అది కథ పాడుతున్న ఆడవాళ్ళ మాటలని సమర్థించారు కదా (ఇంతకీ యిలా కాలక్రమాన్ని అతిక్రమించడంలో “నిర్మాణదక్షత” ఏమిటో నాకర్థం కాలేదు!). అలానే ఇక్కడ కూడా యిలా వరసలతో బావగారిని భర్తని ప్రస్తావించడం పాడుతున్న ఆడవాళ్ళు అలవాటుగా చేసిన ప్రయోగమని ఎందుకు భావించకూడదు?
అలాగే, “తమకి పురుష శాస్త్రాలే ఇచ్చిన గౌరవాన్ని స్త్రీ మర్యాదని కాపాడడానికి, కుటుంబాలలో మొగాళ్ల మాటున బతికే అబలలైన స్త్రీలు అవసరం వొచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలరని ఈ పాటల కవయిత్రులు ఊహించడం వాళ్ల భావనా దక్షతకి నిదర్శనం.” అన్నారు. అవసరం వచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలగడం ఊహో నిజమో ఎలా నిర్ణయించగలం? అలాగే, “ఆడబడుచు దెప్పడం పోయి, ఇలా గొప్పగా పొగడడం ఆడవాళ్ల ఊహల్లో ఉండే మాట.” అన్నది ఆ కాలంలో ఊహో నిజమో మనకి తెలియదు కదా!
4.
“రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది. ఊర్మిళ ఆ సందర్భంలో అనే మాటలు వింటే పరపురుషుడి చేత బలాత్కరించబడిన స్త్రీ ఎంత అసహాయ పరిస్థితిలో ఉంటుందో. తాను హింసకు గురై ఎలా చివరికి అపరాధిలా అందరిముందూ నిలబడాల్సి వస్తుందో గుండె చెదిరే లాగా బోధపడుతుంది.”
ఇక్కడ పటాపంచలమైన రామరాజ్య ధర్మమేమిటో నాకు బొత్తిగా బోధపడలేదు! అలాగే ఊర్మిళ మాటల్లో బలాత్కరింపబడిన స్త్రీ అసహాయ స్థితి కూడా నాకు కనబడలేదు. పరాయి పురుషుడు తన పడకమీదకి వచ్చాడని ఆమె భ్రమించింది. అందుకతన్ని నయానా భయాన పొమ్మని చెప్పింది. “హెచ్చయిన…” అనే రెండు వాక్యాలని పట్టుకొని ఆమె అపరాధిలా అందరిముందూ నిలబడాల్సిన పరిస్థితి గుండె చెదిరేలాగా చిత్రింపబడింది అనడం నాకు అతిశయోక్తిగా తోచింది.
5.
“సుగ్రీవుడు రాముడికి బహుమానంగా ఇచ్చాడు ఈ నగలని. ఎందుకంటే ఆయన కౌసల్యాపుత్రుడు కాబట్టిట. ఒక తల్లికి కొడుకుగా రాముణ్ణి గౌరవించడం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాట.”
ఇది కేవలం విమర్శకుని ఊహ మాత్రమే. ఆ ఉద్దేశంతోనే ఆ మాట వాడబడినదని అనుకోడానికి ఎలాంటి బలమైన కారణమూ లేదు. ఈ పాటలో రామునికి చాలా పేర్లు వాడబడ్డాయి. కనీసం మరికొన్ని చోట్ల యిలా సార్థక ప్రయోగం జరిగిందని స్పష్టంగా తెలిస్తే అప్పుడీ ఊహకి కొంత బలం చేకూరుతుంది.
‘ఈమాట’తో ఒక రాత్రి
భల్లే. నెట్గేర్ రూటర్ను సంధించి, మోడెమ్ సమస్యను దాటేసి, ఇపుడెంచక్కా ‘ఈమాట’ చదివేస్తున్నా. పత్రిక చాల రిచ్ గా వుంది. నవంబర్ సంచికలో సంపాదక వ్యాఖ్యలో ఇచ్చిన దారాలు పట్టుకుని వెళ్లి, ఎకె రామానుజన్ వి రెండు మంచి వ్యాసాలు చదివేశా. నిజ్జంగా చదువుకున్న మనిషి, తన చదువు లోంచి మాట్లాడితే ఎట్టా వుంటుందో తెలిసొచ్చింది. ‘Is There an Indian Way of Thinking?’ (భారతీయ చింతన అంటూ ఒకటి వున్నదా?) ను ఇంగ్లిష్ లో, ‘మూడొందల రామాయణాలు’ (Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translation) ను కొలిచాల సురేష్ గారి తెలుగులో చదువుతూ నిన్న నా రాత్రిని వెలిగించుకున్నా.
మొదటి వ్యాసంలో కాంటెక్స్ట్ సెన్సిటివ్, కాంటెక్స్ట్ ఫ్రీ (సందర్భ గ్రాహ్యం, సందర్భ స్వతంత్రం) అనే భావనలను వివరించి, భారతీయ చింతన ఎక్కువగా ‘సందర్భ గ్రాహ్యం’ అంటారు రామానుజన్. (అంటే ఒక విషయాన్ని ఒక సందర్భంతో ముడిపెట్టి మాత్రమే చూడడం. అన్ని కాలాలకు అన్ని స్థలాలకు పనికొచ్చే సాధాణీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.) ఆయన చెప్పినట్లు ఈ వైఖరులు ప్రాంతీయమా (పశ్చిమం, ప్రాచ్యం), కాలీయమా (మునుపు, నేడు)? నాలో మొలకెత్తిన ప్రశ్నను తడుముతూ నిద్దరోయా. ఆధునిక (అర్బనైజ్డ్) భారతీయుల సంగతి వేరనుకోండీ అన్నట్లు మాట్లాడుతారాయన. కాని ఇదే కదా మన వర్తమానం. ‘పట్టణం’ ప్రవేశించని ప్రదేశం ఎక్కడుందిప్పుడు, (కవులు కథకుల మూర్ఖ స్వప్నాలు మినహా). పశ్చిమం మన కంటె ముందు యంత్ర విప్లవాన్ని ఆవిష్కరించడానికి కారణాలేమిటి? వాళ్లు మన కంటె తెలివైన వాళ్లు కావడం వల్ల మాత్రం కాదు. మరి? కేవలం మానస వీధులలో వెదికితే కారణాలు దొరుకుతాయా? అలాగని, కేవలం విపణి వీధులలో వెదికితే దొరుకుతాయా? రెండూ ముఖ్యమే. మానస సంచారానికి మంచి సందర్భం రామానుజన్ మరో వ్యాసం: ‘మూడొందల రామాయణాలు’
రామాయణాలు… మనల్ని ఏం చేశాయి. భారత కథ చాల డైనమిక్ గా వుంటుంది. వింటున్నా చదువుతున్నా కళ్ల ముందు బతుకు కదులుతుంటుంది. భారతం చలనానికి, మార్పులకు మానసిక ప్రేరణ ఇస్తుంది. రామాయణం మనుషులను ప్రేక్షకుల్ని చేస్తుంది. ధర్మాన్ని నాటకీకరిస్తుంది. ధర్మం అంటే వున్న వ్యవస్థను కాపాడేది. ఉన్న వ్యవస్థను కాపాడడం ద్వారా అది మనల్ని కాపాడుతుందని తరతరాల నమ్మకం. మరో మాటలో ఇది యథాతథ వాది. హెయిరార్కియల్ గా ఒకరి మాటకు ఒకరు తలొంచడం సారాంశం. అలా వ్యవస్థను ఉన్నదున్నట్టు కాపాడుకుంటే నీ జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని ఆశ పెడుతుంది. ఎంచక్కా మొగుడు మొగుడుగా, రాజు రాజుగా, చాకలాయన చాకలాయనగా, శూద్రుడు శూద్రుడుగా, సేవకుడు సేవకుడుగా వుండొచ్చు. అలా వుండడమే ధర్మం. వీళ్లలో ఎవరికైనా అది ఇష్టం లేకపోతే, ఆ ‘అయిష్టం’ తప్పు అని వాల్యూ జడ్జ్మెంటు ముందే తయారైపోయి వుంది. ఆ ‘అయిష్టం’ తప్పు కాదు అనే విలువకు విలువ లేకుండా చేయడం వినా రామాయణం ఇంకేంచేస్తుంది? దీని గురించి అసలేమీ మాట్లాడని ‘రామాయణాల’ చర్చ వల్ల ప్రయోజనం ఏమిటి? వ్యవస్థ యథాతథంగా వుండడం ఎవరికి అనుకూలమో వారిని అలా వుంచుదాం. మిగిలిన వారికి రామాయణం స్థిరీకరించే ధర్మం వల్ల ప్రయోజనం ఏమటి? రామాయణం ఆదర్శీకరించే జీవన వైఖరిని వదిలించుకోనంత వరకు మన గురించి ఎలా ఆలోచించగలుగుతాం? ముందున్న ఆల్టర్నేటివ్స్ అన్నిటినీ చూసి, మన ఇష్టాన్ని మనం ఎన్నుకుని ఎలా అమలు చేయగలుగుతాం? మనలోని పలువురి ఇష్టాలలో ఏది ఎక్కువ న్యాయబద్ధమో, ఏది ఎక్కువ మందికి ఉపయోగకరమో ఎలా తెలుసుకోగలుగుతాం? ఉన్న చోట వుండడాన్ని ఆదర్శీకరించేది ఏదయినా అది (తప్పని సరిగా) మంచిది ఎందుకవుతుంది?
రామానుజన్ గారి వ్యాసాలు ఇలాంటి ప్రశ్నలను తాముగా లేవనెత్తవు. ఆయన వ్యాసాల్ని మన వర్తమానం లోంచి మనం చదువుతాం. ఆయన తన విమర్శనాత్మకతో మొదలెట్టిన చింతనకు మనం మన విమర్శనాత్మకతను కలుపుకుని చదువుకుంటాం. గ్రంథంలో ఏమి చెప్పారనేదానితో పాటు, చెప్పాల్సి వుండి చెప్పనిది కూడా పఠనంలో భాగమవుతుంది. థాంక్ గాడ్, దీన్ని ఎవరూ నిషేధించలేరు.
koteswararao గారికి
ఒక నవ్వూసు [‘నవ్వూసు’ జొక్ కు -నేను చేశానని నేననుకుటున్న- తెలుగు]
చాలా కాలం క్రితం ఒక పత్రికలో చదివినది జ్ఞాపకానికొస్తున్నది.
ఒక స్కూళ్ళ ఇన్స్‌పెక్టరు ఒక బళ్ళో ఒక తరగతిలో తెలుగు ఉపాధ్యాయుని సమక్షం లోనే పిల్లలను పరీక్షిస్తున్నాడు.
“హరిశ్చంద్రు డెవరు?”
పిల్లలు ఆనందంగా ముక్త కంఠంతో “NT రామారావు.”
“తప్పు, మీకు హరిశ్చంద్రు డెవరో గూడా తెలియదు.”
ఆ తెలుగు పంతులు గారందుకుని “పిచ్చి వెధవల్లారా ఆమాత్రం తెలియదూ, హరిశ్చంద్రుడు SV రంగారావు.”
స్కూళ్ళ ఇన్స్‌పెక్టరు కోపంతో ఊగి పోతూ “అయితే మీకూ తెలియదు, హరిశ్చంద్రుడు అద్దంకి శ్రీ రామమూర్తి.”
ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందించినందుకు కృతజ్ఞతలు.
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.
త్యాగరాజు కృతుల్లో కాదు, త్యాగరాజు మనసులో (రామ) భక్తి తప్ప ఇంకేమీ లేదనిపిస్తుంది. తనకుతాను తాదాత్మ్యం చెంది పరవశంతో పాడినవే గాని, ఫలానాది రాయాలన్న తహతహ గాని సంకల్పంగాని కనీసం రాసానన్న కర్తృత్వ భావం సైతం కనిపించదు. కీర్తనలలో కనిపించే “త్యాగరాజనుత” ముద్ర సైతం తనను తానే సాక్షీభావంతో third person గా చూస్తూ విన్నవించుకుంటున్నట్టు గానే ఉంటుంది, ఎక్కువ చేసుకున్నట్టుగా ఉండదు.
చిన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు తల్లి పాత్రలో ఉన్న గొప్ప నటి, అనుగుణమైన దుస్తులు జోడించి, తగిన అలంకారాలు, ఆభరణాలు తొడిగి ముచ్చటపడడం ఒక ఎత్తు. కన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు సాదాసీదా తల్లి సైతం అంతే ఎరుకతో, అనుగుణమైన దుస్తులు జోడించి నప్పిన అలంకారం ఆభరణాలు తొడిగి ఎత్తుకోవడం ఇంకో ఎత్తు, ఏదో గమ్మత్తు. మొదటి సందర్భంలో బట్టలు నగలు పెట్టాననే స్పృహ ఎంత ఎక్కువో, రెండవదానిలో అంత తక్కువగా, అసలు పెట్టాననే భావంకన్నా బిడ్దకు తాను పెట్టుకున్నాననే సంబరమే ఎక్కువ, అసలు బిడ్డ పైనే మక్కువ. అంటే మిగితావి లేవనికాదు, అంతగా ప్రేమించే బిడ్డకు మంచి బట్ట నగ ఎందుకు పెట్టుకోదు, తనివితీరా పెట్టుకుంటుంది, అయినా బిడ్డే ప్రధానం. అట్లే ఆశ్చర్యమో లేక అంత ఆశ్చర్యం కానిదో- నిజమైన భక్తితో పలికిన కృతులలో కవిత్వం, విప్లవ సందేశాలు, స్ఫూర్తి సందేశాలు అవంతట అవే పెట్టని ఆభరణాలుగా చేరుతూండడం ఎప్పటికప్పుడు అబ్బురపరచే అంశం. అందుకే ఎన్ని ఏండ్లు గడిచినా, కాలం, పరిస్థితులు, భాష సైతం ఎంతగా మారినా, ఆ పదాలలో ప్రతి గుండెను ఇప్పటికీ తాకే ఏదో గమ్మత్తు సజీవంగా ఉందేమో అనిపిస్తుంది.
_____________
విధేయుడు
_శ్రీనివాస్
ఒక వేడుకైన జ్ఞాపకం..
********
ఆమె కన్నుల్లో మిస మిసలేవో తొణికిసలాడతాయి
ఆమె చూపుల్లో తారకలు తారట్లాడతాయి
ఆమె నవ్వుల్లో విరజాజులు సరికొత్తగా విచ్చుకుంటాయి
ఆమె నడకల్లో రాజహంసల సొగసులుంటాయి
ఆమె ఎదురైతే..పగలు – పండువెన్నెలౌతుంది. ఒక దేవత లా అగుపిస్తుంది.. వెనక జన్మ బాసల్ని గుర్తుకు తెస్తుంది. తీయని ఆనందానికి గురిచేస్తుంది.
ఆమె వంటి సుందరి కాని..దివ్య స్వరూపిణి కాని ఎందెందు వెదికినా కనిపించదు.
ఆమె సౌందర్యానికే – సౌందర్యవతి. వెరసి ఆమె ఒక వేయి శరత్పూర్ణిమల తేజస్విని.. నిండు నూరు పాళ్ళూ మన తెలుగింటి పడతి.
నటనలకే నటన నేర్పిన మహానటి.
ఆ అభినేత్రి – సావిత్రి..
ఈరోజు ( డిసెంబర్,6) ఆమె పుట్టిన రోజు! తెలుగు వారందరూ వేడుకగా గుర్తు చేసుకుంటారని..
అందరికీ అభిమానంతో –
ఆర్.దమయంతి.
గౌరవనీయులైన అందరికీ
నమస్కారము
సురేష్ గారు మీరు రాసిన కారణాలు – ముఖ్యంగా 5వది నిజమే కదా, ఎందుకు దానికి ఇంత వ్యాఖ్యలు?
మళ్ళీ ఇందులోని వారే (అంత వివాదాస్పదం కావాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు అన్న వారి లాటి వారు ఎడిటోరియల్ లో “కుహనా సాంప్రదాయాన్ని కొనసాగించింది” లాంటి అభిప్రాయాలని వెల్లడించిన వారే) చాలా మంది “ద్రౌపది” కి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం గురించి బాధ పడతారు.
అసలు రామాయణమే కాదు హిందు మతధర్మ ఆచారాలలో చాలా ప్రాంతీయపరమైన భేదాలు కన్పడతాయి. సూర్యమానం చంద్రమానం కానీ సుర్యమానం ప్రకారం నడిచే అందరికీ వొకే సారి వొకే నెలలు రావు. జ్యోతిర్లింగ క్షేత్రాలు చాలా వరకు వొకటే (కొన్ని క్షేత్రాల గురించి వివాదం వుంది) కాని వాటిలో పాటించే పూజా పద్ధతులు వొకటి కాదు. ఉత్తరంలో వొకటి అయితే దక్షిణంలో ఇంకొకటి. వేదాలు ఉత్తర భారతీయులకీ దక్షిణ భారతీయులకీ వొకటే అయినప్పుడు వొకటే పద్దతి వుండాలి కదా!
ఈమాట చదువరులందరూ కనీసం 90 శాతం అంగీకరించేది హిందూ ధర్మఔన్నత్యాన్నిఅనుకుంటే దాని గురించి వదిలేసి, ప్రతిసారి ఇలా ప్రతిసారి “కుహనా సాంప్రదాయాలు, రాజకీయాలు” అంటూ వాటికి లేని ప్రాముఖ్యత కలిగేలా ఇలాంటి చర్చలే తప్ప నిజంగా ఏమీ చెయ్యట్లేదు. వొక సినిమా చూస్తేనే హీరో లాగా తామూ చెయ్యాలని, నాయిక అంటే పాటలకే పరిమితం అనేలా చేసే దర్శక నిర్మాతలని, హీరోలని, అవి చూపించే ప్రభావాలని వదిలేసి ఎక్కడో ఢిల్లీ యూనివర్సిటీ లో జరిగిన వొక చిన్న సంఘటనకి ఇంత చర్చ అవసరమా? ఈ రోజు, సర్దార్ పటేల్ స్టాట్యూల కంటే గాంధీ కాలనీల కంటే రాజీవ్ గాంధీ స్టాట్యూలు నగర్లూ కాలనీలూ ఎక్కువ. ఎందుకంటే అలా కాకుండా చెయ్యగలిగిన చాలామంది ఇలాంటి చర్చలలో లేక తమ పనులలో బిజీ గా వున్నారు. తెలుగు అకాడెమీ నాటక పోటీలలో సీత కి రావణాసురుడి మీద ఇష్టం తో నే వెళ్లింది అన్న నాటకం చూపిస్తే నేను మా పిల్లలకి సీతారాముల గొప్ప దనం ఏ విధంగా చెప్పగలనూ? అసలు రామాయణం గొప్పదనం తెలియని చాలామంది ఆ వయసు పిల్లలు ఈ వ్యాసం చదివి రామాయణం గొప్ప సాంస్కృతిక ప్రతీక అని ఎలా అభిప్రాయ పడగలరు?
మీరు మీ మానసిక పరిపక్వతతో కాక ప్రస్తుతపు విద్యార్థి మనస్తత్వాన్ని దృష్టి లో పెట్టుకుంటే ఈ నిర్ణయం వెనుక సమంజసత్వం అర్ధం అవుతుందేమో!
మంచి వ్యాసం! మనకి “దీపకళిక” అనడమ్ తెలుసు. కానీ తిక్కన “ఘర్మాంబుకళిక” అని వాడటం అపురూపమే!! పొడవు కొండ అని ఉండటం బహుశా అచ్చుతప్పు కావొచ్చు. అది పొడుపుకొండ ఏమో? “పొడుపుకొండమీద పొడుచుటమొదలుగా పరువుపెట్టి ఇనుడు పశ్చిమాద్రి… అన్న పద్యం లోనూ ఈ ప్రయోగం ఉంది. “ఆవులనేయి” లాగే ఆ అర్ధంలో లక్ష్మణ వజ్జల ఇంట ఒకరూకకి దొరికే భోజనాన్ని గురించి రాస్తూ, క్రీడాభిరామ కర్త “ఆలనేయి” అని వాడాడు.
భాషా శాస్త్ర పండితులు రాయవలసిన వ్యాసాలు ఇలాంటివి చాలా బాకీ ఉన్నాయి. తెలుగు వాడకానికి సంబంధించి అన్నమయ్య సంకీర్తనల భాష మీద కూడా ఈ తరహా వ్యాసాలు చాలా రావాల్సిఉంది. క్లుప్తత కలిగిన వాక్యాలూ ..స్పష్టమైన వాక్యాలూ ఉన్న ఈ వ్యాసం చదవడానికి బాగుంది కూడా!
అమూర్త మైన ఊహలు చేసిన ఆధునిక కవులూ ఉన్నారు. కానీ సంఖ్యలో బహుతక్కువే! వాల్మీకి చేసినపోలికలు చాలా గొప్పవి.
ఇంక బాగులేని దానిని చెప్పడం కోసమ్ వారు చేసిన విమర్శ ఆ పోలికలూ కొంచెం కటువైనవే అయినా ఆలోచించవలసినవే! మగవారు గనక వారు నిస్సందేహంగా చెత్త రాసిన కవులని పోలికలతో చెండాడారు. ప్రాచీన కాలంలో ఒక్క కవులే ఎక్కువ ఉండటం అసలు కవిత్వమే రాయని స్త్రీలు ఉండగా అందునా చెత్త కవిత్వం అన్నదానికి మరివీలే లేదుగనక కాబోలు కుకవులని విటులతో పోల్చిన ఉదాహరణలున్నాయి. కానీ కవయిత్రులని వాళ్ళు వదిలేసేరు. మరి ఇవాళ ఈ ప్రజాస్వామిక యుగంలో .. కవిత్వం పేర చెత్త రాసే వారిని సంబోధించడానికి ఏ కొత్త పోలికలు చేయాలో ..అదీ కాక “కు విమర్శక” వర్గం కూడా పుష్కళంగా ఉన్న ఇవాళ ఒక తీరూ తెన్నూ లేకుండా మెచ్చుకుంటూ … ఓహోహో !! అనే బాకాసుర విమర్శకవర్గాన్ని ఏ రకమైన సంబోధనతో సంభావించాలో మనకి ఈ కాలపు భాష చెప్పడంలేదు. దూర్జటి “చదువులునేర్వని పండితాధములు” అని అన్నాడు. గనక ప్రస్తుతానికి దానితో సరిపెట్టుకోవాలి.
రమ.
ప్రజాపతి గురించి Dr. Estari Mamidala గారి అభిప్రాయం:
11/16/2011 5:29 pm
మీ కథనం బాగుంది. కాని భావని అభిప్రాయం బాగాలేదు. హిందూ సామ్రాజ్యవాద ధోరణి అని అనడం సరి కాదు. బౌద్ధాన్ని హిందూ ధర్మం లాక్కున్న విషయం తప్పు. బుద్ధుడు అంటే శ్రీమహావిష్ణువే కదా. వీరందరు హిందూ దేవతలే ఐనప్పుడు బౌద్ధం వేరు హిందూ ధర్మం వేరు ఎలాఅవుతుంది అని భావని గారు గ్రహించాలి.
ఎప్పుడూ చూసే పోస్టర్ల వెనుక ఎప్పడూ చదవని విషయాలు అందించినందుకు కృతజ్ఞతలు.
ఎందుకో అవసరాల రామకృష్ణారావుగారి మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఉందో లేదో కాని కొన్ని యేండ్ల క్రితం వరకు సినిమా పోస్టర్ల మీద “నేడే చూడండి” అని కనిపించేది. నేడే చూడండి, ఎందుకంటే రేపు ఉండదేమో అన్నారట వారు!
పోస్టర్లు ఇంకొక విషయం కూడా చెప్తాయేమో అనిపిస్తుంది- వేసే వారివే గాక చూసే వారి అభిరుచులను.
— ——–
విధేయుడు
_శ్రీనివాస్
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.”
సాయి గారు,
త్యాగరాజ కృతులలో భక్తే ప్రధానం. అదే ఆయన ఎన్నుకున్న మార్గం. చేతకాక కాదు. (నిజానికి అందరు వాగ్గేయకారుల కృతులలో నూ ఇదే పరమప్రయోజనం). సాహిత్య పరంగా చూసినా కొన్ని కృతులు “జగదానందకారకా”, “బాల కనకమయ చేల” మొదలైనవి ఎన్నో కనిపిస్తాయి. త్యాగరాజ సాహిత్యం అంతా రామ మయం, ఇంకొక రామాయణం. అందంగా అనిపించడానికి , “భలే వేసారు ఇక్కడ ఈ పదాల కూర్పు” అనిపించుకోడానికి చేసిన ప్రయోగాలు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోతన గారి అంత్యానుప్రాస ప్రయోగ్రం ఎక్కువగా త్యాగరాజ కృతులలో కనిపిస్తుంది. ఎన్నో కావ్యాలు, కీర్తనలు అనేకమంది ప్రభువుల మీద, వారి భార్యల మీద, వారి ప్రేమికుల మీద రచించారు, సాహిత్య పరంగా మంచి విలువలు ఉన్నవి, రాగాలపరం గా వినసొంపుగా ఉండేవి. కాని అవేవి నిలబడలేదు. భారతీయ సంగీతానికి లక్ష్యం పరమాత్మని అందుకోవడమే. దానికి నవవిధ భక్తి ని ప్రమాణం గా తీసుకున్న వారి కృతులే అజరామరం గా నిలుస్తాయి. ఒక అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు మొదలైనవి. కవిత్వం ఎంత గొప్పగా ఉన్నా, భక్తి లేనిది కేవలం వ్యర్ధమే….
బాలమురళి గారి గానం నాకెంతో ఇష్టం. కొన్ని కీర్తనలు భావం ఎరిగి ఆయన పాడినట్లు ఇంక ఎవరూ పాడ లేరేమో అని అనిపిస్తుంది. ఆయన కృతులు కూడా చాల బాగుంటాయి, బాలమురళి గారు కేవలం భక్తే కాకుండా విప్లవం, స్ఫూర్తి కూడా జోడించాను అన్నారు. నిజానికి వెతికితే త్యాగరాజ కృతులలో అవి కూడా కనిపిస్తాయి. “యజ్ఞాదులు సుఖమనువారాల” , “తెలియలేరు రామ”, మొదలైనవి. భక్తి ప్రధానం గా ఉండి మిగిలినవి అంతర్లీనం గా ఉంటె అది గొప్ప సంగీత సాహిత్యం అవుతుంది. కేవలం సాహిత్య విలువల కోసం ఒకరి కీర్తన కంటే ఇంకొకరిది బాగుంది అని, వీరి కృతులలో కంటే వీరి కృతులలో సాహిత్యం బాగుంది అని ఎలా అనగలం?
మొదటి వేంకటమఖి నాయక రాజుల కాలం లోని వాడు కాగా ముద్దు వేంకటమఖి మరాఠా రాజుల కాలం వాడు. చరిత్ర వీరికి సంబంధించినది ఇంకా మొన్నటి కాలమే గనక ఎంతోకొంత స్పష్టం గానే ఉంది. పైగా మనకన్నా తమిళదేశస్థులు ఈ విషయంలో శ్రధ్ధ చూపించారు. పరిశ్రమ చేయగలిగిన వారికి సంగతులు తెలుస్తాయి.
ఇంక సంగీత లక్షణ గ్రంధాలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సంగీతం + సంస్కృతం రెండూ బాగా తెలిసిన వారు వీటిని గురించి మాట్లాడగలిగిన వాళ్ళు. చర్ల గణపతిశాస్త్రి గారిలాంటి వాళ్ళు సంగీత రత్నాకరం వంటి గ్రంధాలని తెలుగు చేసారనుకుంటాను. ఎవరన్నా ఇటువంటి పనులు చేయడం లో శ్రధ్ధ చూపించగలగాలి. మన వాళ్ళు పైపై విషయాలు మాట్లాడేసి బతికేయడానికి అందులోంచి అరకొరగా విషయాలని వివరించడానికి అలవాటు పడిపోయి ఉన్నవాళ్ళు మరి:)
మిగతా ఇతర శాస్త్రాలకి ఎలా అయితే లక్షణ గ్రంధాలున్నాయో, వాటి అనువాదాలున్నాయో సంగీతానికి సైతం ఉన్నాయి. ముందు తరాలు కృషి చేసి పెట్టాయి. మనం వాటిని నిలబెట్టుకోవడం లేదు.
సంకీర్తనా లక్షణం సంస్కృతంలో అన్నమయ్య రాసినట్టూ దానిని పెద తిరుమలయ్య వ్యాఖ్యానం రాసినట్టూ దానిని అనుసరించి సంకీర్తనా లక్షణాన్ని తాను తెలుగు చేసినట్టూ అన్నమయ్య పెద్ద మనవడైన చిన తిరుమలయ్య చెప్పాడు. అందులో ఆనాటి సంగీత లక్షణ గ్రంధాల ప్రస్తావనలున్నాయి. ఈ పుస్తకం ఒకప్పుడు టిటిడి అచ్చువేసింది. ఇవాళ ఆ ప్రతులు సైతం లేవు. వాళ్ళు మళ్ళీ దీనిని కూడా తిరిగి ప్రచురించలేదు. టిటిడి కి మరి డబ్బులకి కొరత. పనిచేసేవాళ్ళకి కొరత. విశ్వవిద్యాలయాలు తెలుగున పనిచాతకాని వాళ్ళతోనీ ముందుచూపు లేని వాళ్ళ తోనీ కదా నడుస్తున్నాయి. అంచేత వాటినించీ మనం ఏదీ ఆశించడానికి వీలేలేదు.
కొండంత కృషి చేసిన తెలుగువారు ప్రస్తుతం శాస్త్రీయ సంగీతంపై పట్టుకోల్పోతున్నారన్న బాధే, నేను వ్యక్తపరిచిన నిరాశా, నిస్పృహాలకి కారణం రమగారూ! సాహిత్యంలో పసవుంటే దాని కాళ్ళమీద అదే నిలబడుతుంది. ఎవరి భుజాల ఆసరా అవసరం లేదు. కాదనను. అన్నమయ్యని మినహాయిస్తే, మిగతా వాగ్గేయకారులు ఎంతో కొంత భావ సౌందర్యం సంగీతంలో చూపించారనే నా భావన. అవి అత్యంత రమణీయాలు కాకపోయినా పాడుకుంటూ భావాన్ని అస్వాదించడానికి ఆస్కారం ఉన్నాయి. కేవలం వచనం ఒక్కటే ఇరికించ లేదు. బాలమురళిగారి రచనలు చూసాకా నాకలా అనిపించలేదు. అదే రాసాను. ముందు కాలాన్ని నిర్వచించలేమని తెలుసు. త్యాగరాజు తర్వాత అంత ప్రతిభగల మరో తెలుగు విద్వాంసుడు పుట్టడానికి వందేళ్ళ పైనే పట్టింది. రాను రానూ సంగీతం పట్ల తెలుగువారికి శ్రద్ధ తగ్గుతోంది. మరలా పుడితే మంచిదే! నా నిస్పృహా కాలం ఎంత సాగుతుందో చూద్దాం. అంతవరకూ బాలమురళే మనుకున్న వాగ్గేయకారుడు. ఇది చెప్పడానికి సంకోచించనవసరం లేదు.
ఇహ అన్నమయ్య సాహిత్య స్థాయి వేరన్నది అందరికీ తెలుసున్నదే! నా పోలిక మిగతా వాగ్గేయకారుల గురించి: వేంకట మఖి తెలుగువాడేనని చెప్పడానికి కొన్ని ఆధారాలున్నాయి. ఆయన రచనలు “చతుర్దండి ప్రకాశిక”, “రాగలక్షణమ్” సంస్కృతంలో రాయవచ్చుగాక. కానీ ఆయన తండ్రి గోవింద దీక్షితులది తిరుపతి సమీపంలో ఉన్న గ్రామం. ఆయన సుమారు 1575 ప్రాంతంలో అచ్యుతప్ప నాయకునికి మంత్రిగా చేసాడు. తరువాత రఘునాధనాయకుడి వద్ద కొంతకాలం చేసాక చనిపోయాడు. తదనంతరం ఆయన కొడుకులెవరూ మంత్రి పదవులు చేపట్టకపోయినా రాజాస్థానంలోనే గడిపారు. వేంకటమఖి 1620 ప్రాంతంలో చత్రుర్దండి ప్రకాశిక రాసాడు. సుమారు ఆ కాలానికే రఘునాధ నాయకుడు రాజయ్యాడు. ఆయన పేరున వేంకటమఖి ఒక వీణ కూడా చేసాడు.
కానీ మీరు చెప్పిన శరభోజి ఆ కాలంనాటి వాడు కాదు. మరాఠా నాయకులు 1675 ప్రాంతంలో తంజావూరుని పాలించారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, వేంకటమఖి లక్షణ గీతాలు రాసాడు. ఇవి కొన్ని సంస్కృతంలోనూ, తెలుగులోనూ ఉన్నాయి. లక్షణ గీతాలు పిళ్లారి గీతాల తరువాత అప్పట్లో నేర్పేవారు. ఇప్పుడు సరిగమలు వచ్చీ రాగానే, సరాసరి కృతుల్లోకే దూకేస్తున్నారనుకోండి. అది వేరే విషయం. వేంకటమఖి తెలుగువాడని చెప్పడానికింకో ఆధారం కూడా వుంది. ఆయన సంగీతం మీద చేసిన కృషికి వాళ్ళ వంశీకులు ఆయన మీద కొన్ని పాటలు రాసారు. అందులో “ముద్దు వేంకటమఖి” ముద్రతో కొన్ని తెలుగు పాటలు కట్టారు. ముద్దు అన్నది తెలుగు పిలుపే కదా? ఇవన్నీ చూసాక ఆయన తెలుగువాడనే చెప్పవచ్చు? అలాగే నాయకరాజుల కాలంలో తెలుగు, తమిళం రెండూ అధికార భాషలే కూడా!
ఇహ మన తెలుగు వారి గౌరవాలూ, పురస్కారాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అర్హులకి దండేయడం మనకి చేతకాని పని.
శైలి పరంగా చూస్తే ఈ వ్యాసం (కనీసం చాలా భాగం) కొ. కు. వ్రాసిందే అనిపించకమానదు. కేతు వారు చెప్పినట్లు “ప్రథమ పురుష లో.. ఆత్మీయంగా.. చెప్పే ..జానపద కథకుడి అలవోక ధోరణి ” చాలా వాక్యాలలో చూడవచ్చు. ఇది కాక కొ. కు. కే ప్రత్యేకమైన పద ప్రయోగాలకీ, వాక్య నిర్మాణాలకీ ఉదాహరణలు కూడా ఈ వ్యాసం లో చాలానే ఉన్నాయి.
“పని పెట్టుకుని అభ్యసించలేదు”
“చేరినాక…..చదువుకోసాగింది”
“చాలించి, … ఉంచి, … వెతకసాగారు. ”
“లేదుపొమ్మన్నారు”
“కాంచన మాలచిత్రమైతే, అడిగారూ ? ”
శక్తి “ఇంత” ఉన్నది గనక
“కొంత నటించి ఉన్నది”
“గుప్పెడు పొట్టి”
బరువు “దిగిపోయిన దానల్లే”
“హీరో ఉండరాదు ! ”
పాత్ర “కు” నటించేసింది
“వేషం వెయ్యనన్నావటనే ? ”
పుచ్చుకున్నది
హెచ్చు గా వుంటుందని అప్పుడే తెలుసు
“ఇంకేం ! ”
పెళ్ళాడదలచలేదు
పెళ్ళాడగోరుతున్నట్లు
మనసు రాయి చేసుకుని కూర్చున్నది
“ఇట్లాగుటే జరగవలసింది ? ”
వాక్యాలనీ, శైలి ని అటుంచి, వ్యక్తి లోని అత్యంత కీలకమైన, ముఖ్యమైన లక్షణాన్ని సూటిగా చెప్పగలగడం కొ.కు. కు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. -“అయిన దానికీ కానిదానికీ ఉబ్బి తబ్బిబ్బు అయే అలవాటు ఆమెకు లేదు. .. తనను చూసి తానే విస్మయంచెందే మనస్తత్వం ఆమెకు లేదు. “- ఈ వాక్యం భానుమతి వ్యక్తిత్వానికి దర్పణం. ఆయువుపట్టు.
ఇందులో వ్యక్తం చేసిన భావాల లో కొ. కు. కి పేచీ ఉండే వే మీ లేవ నే అనిపిస్తోంది, – వ్యాసం చివరలో సెప్టెంబర్ నెల లో పుట్టిన వాళ్ళను గురించి రాసింది తప్ప.
ఈ ఒక్క పేరా లో మాత్రం ఇంకెవరో ఈ రచనలో ” చెయ్యి చేసుకున్నా”రనిపిస్తుంది. కానీ, వేరే వాళ్ళ వత్తిడుల వల్లా, బలవంతం వల్లా కొ. కు. కొన్ని సినిమా సమీక్షలు రాసారని విన్నాను. ‘చంద్ర హారం’ లో కత్తి యుద్ధాలు బాగున్నాయనీ, “అ. చే. ప. కూ.” ఒక సమగ్ర హాస్య చిత్రమనీ ఇత్యాది – వాటి జాబితా లో దీన్ని (కనీసం సెప్టెంబర్ నెల లో పుట్టిన వాళ్ళని గురించిన ప్రస్తావన) వేసుకోవచ్చేమో !
ఇంత విలువైన వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
కథ బాగుంది. మంచైనా చెడైనా మనసులో మాట మనసులోనో యెన్నాళ్ళు యేకారణం వల్ల దాచినా, చివరికి దానిని ఆప్తహృదయంతో పంచుకోకుండా వెళ్ళిపోవటం కష్టం. అదే జరిగింది. చాలా సహజంగా ఉంది. ఒక సంఘటనలో తమ ప్రవర్తన తప్పా ఒప్పా అన్నది యెవరికి వారికి మనస్సాక్షికి తెలుస్తుంది. అయితే సానుకూలంగా ప్రతిస్పందించే పరిపక్వత గల హృదయంకోసం చిచ్చొడి గట్టుకున్నట్లు బహుకాలం వేచి ఉండవలసి వస్తుంది. ఒక్కొకసారి అటువంటి అవుకాశం జీవితకాలంలో రాకపోవచ్చును కూడా. అదృష్టవశాత్తు అన్నపూర్ణకు ఆమె తమ్మడు అనే వ్యక్తిని చివరి రోజుల్లో భగవంతుడు చూపించాడు. ఆ ఆత్మకు అదే గొప్ప వరం. ఏక్సిడెంట్ కాదని , తన వలనే తండ్రి మరణించాడని తనను తాను దోషిలా అన్నపూర్ణ భావించుకో నవుసరంలేదు. చిన్నతనంలో తల్లిని రక్షించుకునేందుకు తండ్రైనా గాయపరచింది. చనిపోవచ్చన్న అవగాహన కలుగక పోవచ్చును చిన్నతనం కారణంగా. ఆత్మన్యూనతా భావంతో విచక్షణ తరచు కోల్పోయే తండ్రికి జరిగన సంఘటనలో పిల్ల తప్పు యేమీ లేదని తప్పక అనిపించి ఉండవచ్చును తన చివరి క్షణాలలో. శ్రీరాం జీవితంలో యీ నిజం గొప్ప కుదుపు. కాని అతడు పరిణతి చెందిని వ్యక్తి. శుభం.
పెసరు (=పేరు), పెసఱు (పెసలు = greengram) ఒకే ధాతువు నుండి రాలేదు. ఉత్తర ద్రావిడ భాషలైన బ్రాహియిలో పిన్, మాల్తోలో పిన్జె అంటే పేరు. మధ్య ద్రావిడ భాషలైన పర్జీ, గదబ, ఒల్లరీలో పిదిర్ అంటే పేరు అని అర్థం. తమిళంలో పెయర్, కన్నడలో పెసరు/హెసరు. ఇవన్నిటి ఆధారంగా పేరు *పిచర్/*పిసర్- నుండి వచ్చిందని నిరూపించడం సులభం.
పెసఱు (greengram) మాత్రం తమిళంలో పయఱు అని, కన్నడలో పెసఱు/హెసరు అని, నాయికీలో పెసళ్ అని అంటారు. దీనికి పచ/పచ్చ- = green అన్న ధాతువుకు ఏమైనా సంబంధం ఉండవచ్చునేమో కాని పేరుకు సంబంధించింది కాదు.
తెలుగులోని పెసఱు, ఉసిరు/ఉసురు మూలద్రావిడ మాతృకల నుండి కాకుండా కన్నడ నుండి వచ్చాయని మోహనరావు గారు అనడానికి ఆధారాలేమిటో నాకు బోధ పడటంలేదు. అచ్చుల మధ్య స- కార లోపం తెలుగులో సంపూర్ణమైన ధ్వని పరిణామం కాదు. ఒకే ధాతువుకు సంబంధించిన కొసరు, కోరు అన్న పదాలు కూడా తెలుగులో ఉన్నాయి.
సంఖ్యావాచకాల విషయంలో *చయ్‌న్ అన్న మూల ద్రావిడ ధాతువు తెలుగు శాసనాల కాలంలో ఏనుగా మాత్రమే కనిపించి, తరువాత ఆ రూపానికి ఏ మాత్రం సరిపోని అయిదు గా కనిపిస్తోంది కాబట్టి ఆ అయిదు తరువాతి రోజుల్లో కన్నడ నుండి అరువు తెచ్చుకున్నదిగా వివరించరించాల్సివస్తుంది.
తెలుగులో పెసఱు, ఉసురు,కొసరు మొదలైన పదాలు పుట్టుకతోనే తల్లి ద్రావిడభాష నుండి సంక్రంచిన పదాలుగా కాక, తరువాతి కాలంలో కన్నడ నుండి స్వీకరించిన పదాలుగా ప్రతిపాదించడానికి ఆధారాలు ఏవైనా ఉంటే వివరించగలరు.
జడమైన గుండె కి ‘స్పర్శ’ మణిప్రభవం – సంకీర్తనం!
**********
గౌరవ నీయులైన శ్రీ మోహన గారికి !
నమస్తే.
హరి నామ సంకీర్తనములకు మూల పురుషు డైన శ్రీ పాద రాయలు గురించి మీరు వ్రాసిన వ్యాసాన్ని పొల్లు పోకుండా చదివివించిందీ.. అంటే అందుక్కారణం -. మీ రచనా విధానం! ఆ వాగ్గేయ కారుని భక్తి, తత్వజ్ఞాన పద సంపదాసమూహం, సమ్మోహనం!
శ్రీ పాద రాయల బాల్యం, ..అతర్వాత సంఘటనలు ..అంతా కళ్ళ కట్టినట్టు ఒక కథలా చెప్పారు. కన్నడంలో రాసిన ఆ మహానుభావుని కృతులకు మీ తెలుగు అనువాదం రస రమ్యంగా వుంది. అక్షరాలు చక్కని సొగసు తేలాయి. మనసుని భక్తి భావంలో ముంచి తేల్చాయి. భగవంతుని పట్ల జడ మైన గుండె కి ఒక స్పృహని, స్ప ర్శ ని కలిగించే వైద్యం – వాగ్గేయ కారుల భక్తి పదం, పథం – హరి నామ సంకీర్తనం!
హరిపాదోదక మీ కావేరి
విరజానది స్నానముజేసి
అని చదవంగానె, భక్తి నదిలో మునకేసినట్టుంటుంది. అక్షరాల అంచుల్లోంచి ఒక పవిత్రతా భావం జాలు వారుతూ… తీపితేనెవాన తుంపరలు చిమ్ముతున్నట్టు… అనిపిస్తుంది. ఎంత మధురంగా వుందీ భావం!
కాలికి యందము హరియాత్రలె
ఆలయపు టందము తులసి బృందావవనము
చాల యందము చెవికి విష్ణు కథలు
ఇక్కడ ప్రహ్లాదుడు కనిపిస్తాడు..చేతులు జోడించి హరిని సంకీర్తిస్తున్నట్టు! ‘మస్తకమున పర వస్తు’ అని అంటున్న ఈ వాగ్గేయ కారుని మాటలకు ప్రత్యేక విశ్లేషణ ఏదైనా వుండి వుండాలేమో ననిపిస్తుంది. అలాగే.. ‘మనసిజపితునికై..’ అంటున్నప్పుడు కూడా!
దయకై తనుమనధనమ్ము లన్నిటి
నీదు పదకమలములం దుంచితిని
మఱిక నన్ను మాయ జేసెదవె
సరకు నొసగితిని పిదప సుంక మేల నయ్యా..
చదువుతూ వుంటేనే, కళ్ళు చెమ్మ గిల్లుతాయి. భగవంతుని పాదారవిందాలు దర్శనమౌతాయి. భక్తుని ఆవేదన, గళం లో ఆర్ద్రత అంతా కలసి ‘ సరుకు నొసగితిని కదా, మరి సుంకమేల నయ్యా!’ అని బేలగా అడుగుతున్నప్పుడు..ఆయన గొంతు జీర బోయి వుండెనేమో!…అన్న భావన నాకెంతో గొప్ప అనుభూతినిచ్చింది. భగవంతుణ్ని ప్రేమించి , తపించి, వెత చెందే హృదయం లోంచి పొంగే భక్తి రస భావ తరంగా లే.. వాగ్గేయ కారుల కీర్తనలు. అవి సజీవ నదులు. సంగీత స్వరాలను దారులు గా చేసుకుని, అమృత ధార లై ప్రవిహిస్తూ వుంటా యి ! అందుకే, ఎంత పానం చేసినా గానాన్ని, ఇంకా దాహం గానే వుంటుంది. కారణ జన్ములు. తపో ధనులు, భక్తి జ్ఞాన సంపన్నులు – వాగ్గేయ కారులు. సృష్టి కర్తకు, సంసార బంధులకు,బందీలకు మధ్య వారు సంధాతలు!
కాకుంటే, ఎంత తపిస్తే దక్కేను సామాన్యులకు! ఈ కావేరినది తీరాన ఈ విఠలుని సందర్శనం !?
మీ రచనలో మరి కొన్ని సరి కొత్త విషయాలను కూడా చదివి తెలుసుకోవచ్చు. ‘సావి రహే..’ పాటకి ముందు యమునా తీర.. శ్లోకాన్ని పాడాలని మీరొక నిజాన్ని తెలియ చేసారు. (కాని,సినిమా పాటలో ఈ సాంప్రదాయం అనుసరించినట్టు లేదు. కదూ!) అలాగే, ఉగా భోగము అంటె ఒక రాగా లాపన అని, ఐతె, అది అర్థవంతమైన పదాలతో కూడి వుంటుందనే కొత్త విషయం కూడా తెలుసు కోవచ్చు.
ఇక వృత్త మాలిక, దండకము, భ్రమర గీతం, వేణు గీతము.. వీట్లకి తెలుగు అనువాదం చాలా బాగుంది.
నిజమే! కన్నడం వచ్చిన వారికి శ్రీపాద రాయల వారు రాసిన కన్నడం సులభంగానె వుండొచ్చు! అయితే, ఆ భాష రాని మన వారికి మాత్రం, తెలుగు లో మీ అనువాదాలు రసరమ్యంగా వున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరిక్కడ పేర్కొన్న సంగీత సూచనలను అనుసరిస్తూ.. కీర్తనలను ఆలపించే అవకాశాన్ని ఈమాట పాఠకులకు కలగ జేసారు. స్వరార్చన చేసుకునే హరి గాన ప్రియులు – ఇదొక అదృష్టంగా భావిస్తారు.
‘కర్ణాటక సంగీతానికి పటిష్ఠ మైన పునాది వేసిన వారు శ్రీపాదరాయలు’ అని అన్నారు. నేనూ కర్ణాటక సంగీతం వింటూ వుంటా అప్పుడప్పుడు.! మీరన్నట్టు వాగ్గేయకార త్రయం లా.. వీరి పేరు ఎక్కువ గా నేను విన లేక పోయా మరి!
ఈ సాహిత్య వ్యాసాన్ని విపులీకరించి, విశదీకరించి రాయడంలో గల మీ కృషిని, శ్రధ్ధా సక్తులను మనఃస్ఫూర్తి గా ప్రశంసిస్తూ… కర్ణాటక సంగీత సాహిత్య పద పితామహుడైన శ్రీ పాద రాయల వారికి వందనములిడుతూ…
సాహితీప్రియుడైన నా తమిళ స్నేహితుడు సుబ్రమణ్యంగారని ఒకాయనను ఈ విషయాన్నిగురించి అడిగాను. అతడు http://dsal.uchicago.edu/dictionaries/tamil-lex/ నుండి కావలసిన విషయము సేకరించి నాకు ఉత్తరము వ్రాసినారు. అతడు ఇచ్చిన విషయము ప్రకారము నూగారు నూంగు + కారు లేక నూఁగు + కారు లేక నూన్ + కారు అవుతుంది. కారు అంటే సామాన్యమైన అర్థము నలుపు. కాని కారు అనే పదానికి మగవారి వెండ్రుకలు, ఎలుక వెండ్రుకలు అని కూడ అర్థము ఉన్నది. కాబట్టి నూఁగారు అంటే రోమావళి అని అర్థము వస్తుంది. కాలక్రమేణ అది కొన్ని చోటులలోని రోమావళికి మాత్రమేఎ పదము అన్వయించిందేమో? నేను తొడల రోమావళిని కూడ నూగారు అని చదివియున్నాను (చీమలబారులాటి నూగారు :-).
“తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది” అని అన్నది చిన్నయసూరి, చెళ్ళపిళ్ళ కాదు. ఇకపోతే నేను “నునుపారు” లోని ఆరు కి అర్ధం చెప్పలేదు. నునుపు+ ఆరు అని విరిచినట్టుగానే నూగు+ఆరు ని విరవమని సూచన చేసాను. కామేశ్వర రావుగారి వివరణ మరీచులు అన్నది ఒప్పు. మనం నిఘంటువులని అర్ధ వివరణ కోసం మాత్రమే చూస్తున్నాం తప్ప వాటిని సవరించుకోవడమ్ దిశగా గాని, పదాల సంఖ్యని పెంచుకోవాలని గానీ ప్రయత్నమ్ పెద్దగా చెయ్యలేదు. అదునా ఆధునిక కాలంలో ఆసక్తీ అర్హతా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వేరే వృత్తులకి బతుకుతెరువుకి వెళ్లడమూ. ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ పనులకి సరిపడా శ్రధ్ధా సామర్ధ్యాలను చూపకపోవడమూ కారణంగా ఉన్న నిఘంటువులతో కుస్తీలు పట్టుకోవలసి వస్తోంది.
పాత తెలుగుతో పనిచేసే క్రమంలో నిఘంటువులతో పనిచేసే వారికి అందరికీ కొలిచాల లాగే ఈ విషయాలు అనుభవంలోకి వస్తాయి. కవిత్వం విషయంలో మనం కవి హృదయాన్ని అనుసరించాలి తప్ప ముక్కస్యముక్కహ అన్న రీతిలో అర్ధాలని చూడకూడదు కూడాను. అక్కడ ఒప్పైన అర్ధాన్ని మనం తీసుకోవాలి. నూగారు లోని ఆరు సంఖ్యా పదం లోని ఆరు ఒకటి కావు గనక ఇది వేరే విషయం. నూగు అన్నదానికి నేను నూగు+ఆరు గానే విభజించుకుంటాను. మనకి ఇవాళ అరసున్నలూ.. ఖండబిందు పూర్ణబిందులూ.. మామూలు ర బండి ర లూ చాలా తికమకతొ కలిసిపోయి ఉన్నాయి. అందులో సరైనవి ఏవో కానివి ఏవో నిఘంటువులూ ఇవ్వడం లేదు. ఎవరి తోవని అనుసరించి దేన్ని సాధించాలో స్పస్టమైన రీతి ఒకటి ఉన్నట్టు కనబడని సందర్భాలు చాలా ఎదురౌతాయి. చూద్దాం ఇతరులు ఇంకేమంటారో??
ఇక్కడ మరీచులు అంటే కిరణాలు. మిరియాలు కాదు. మరీచము, మరిచము అంటే మిరియము. దానికి బహువచనం మరీచములు అవుతుంది కాని మరీచులు కాదు. పైగా ఇక్కడసలు మిరియపు తీగల, కొమ్మల ప్రసక్తి అవసరమే లేదు! మరీచి – కిరణము. మరీచులు – కిరణాలు. చకోరాలకి చంద్రకిరణాలు ఆహారమని కవిసమయం కదా. పైన ప్రాకే చంద్రకిరణాలనే లేలేత కొమ్మలని (అన్నిసార్లు లేత ఎందుకంటే వెన్నల కిరణాలు అంత సన్నగా ఉన్నాయి కాబట్టి). వాటిని పట్టుకోడానికి తమ చంచువులని కదులుస్తున్నాయి. నూగు అంటే ఆకులమీద, కాయలమీద ఏర్పడే చిన్నచిన్న ముళ్ళు అనే అర్థం దగ్గర యీ పద్యం ఎందుకిచ్చారో నాకు తెలియడం లేదు. అది పొరపాటే అయ్యుండాలి.
ఇక ఇక్కడ “నూగు” అంటే “లేత”, “నునుపు”, “సన్నని” అన్న అర్థాలేమైనా తీసుకోవచ్చు. సన్నని అన్న అర్థమే నాకు సబబుగా తోస్తోంది. నూగుకి సన్నని అనే అర్థం తీసుకున్నా నూగు+ఆరు అన్న విరుపుకి అభ్యంతరమేమీ లేదు. “ఆరు” అన్న పదానికి వెంట్రుకలన్న అర్థం ఎలా వచ్చిందన్నది పరిశీలించవలసిన అంశం.
@కామేశ్వర రావుగారు: మగధీర, మగమహరాజు ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. అలాగే మహాతల్లి, మహమ్మారి, అతిచిన్న, అతిగారాబం అన్న ప్రయోగాలు వాడుకలో ఉన్నాయి. నా దృష్టిలో రాజ్యపుసిరి అన్నది రాజ్య, సిరి అన్న రెండు పదాంశాలు ‘పు’ అన్న ప్రత్యయంతో కలిసి ఏర్పడిన పదబంధమే కాని ఒక సమాసం కాదు. నేను మాట్లాడుతున్నది ఒకే పదబంధంలో ప్రత్యయ రహితంగా చేరి సమాసంగా వచ్చేవి. కనుగవ, నేత్రద్వయం అంటామే గానీ, కనుద్వయం, నేత్రగవ అనంకదా! పెనుచీకటి = పెంజీకటి అంటాం, లేదా, గాఢాంధకారం అంటాం; కానీ, గాఢచీకటి, పెనంధకారం అని అనలేము కదా! అట్లాగే ముల్లోకాలు, ముజ్జగములు అన్న ప్రయోగాలు ఉన్నా, మున్నేత్రాలు, మున్నదులు, ముస్సాగరాలు అన్న ప్రయోగాలు ఒప్పవు గదా!
“పాతిక” పాద నుండి వచ్చుండాలి. పద్యంలో పాదం నాలుగోవంతు కదా!
అవునండీ. సంస్కృతంలో పాదిక అంటే నాలుగోవంతు. పశువులకు, పద్యాలకు నాలుగు పాదాలుంటాయి కాబట్టి పాదిక అంటే నాలుగోవంతు!
మోహనరావుగారి అభిప్రాయం:
ఆరు అంటే నిండు, ఉపశమించు, వెండ్రుకలు (నూగారులాటి పదాలలో) అని అర్థము.
ఆరు అంటే నిండు. ఆఱు అంటే ఉపశమించు. నూగారులో ఆరు లేదు (కొన్ని నిఘంటువులలో ఆరుకు ఆ అర్థం ఇచ్చినా). ద్రావిడ భాషలలో నూన్-అంటే సన్నని, అతిచిన్నని అన్న అర్థాలు ఉన్నాయి. కారు- అంటే నలుపు. నూగారు = నూన్ + కారు అనే నా అభిప్రాయం.
వేమూరి గారు అన్నారు:
అన్నట్టు, సా. శ. 1950 ప్రాంతాలలో, విశాఖ జిల్లాలో, “ముచ్చిలక” అన్న మాటని “నాలుగింట మూడు పాళ్లు” అనే అర్ధంలో వాడగా విన్నట్లు గుర్తు.
ఇప్పటికీ ఈ ప్రయోగం ఉందో లేదో ఎవరైనా విశాఖా జిల్లా వారు చెప్పగలరా? ఈ అర్థంలో ముచ్చిలకకు వ్యుత్పత్తి ఏమై ఉంటుందంటారు?
మీరన్నది నిజమే. చాలా సైట్లలో అలాగే రాశారు. కానీ అది తప్పు.
స్వరాల రీత్యా మధ్యమావతి (లేదా మేఘ్ మల్‌హార్)లో పడని పెద్ద నిషాదం అందులో వినిపిస్తుంది. అలాగే గ1 కూడా.
మధ్యమావతి స రి2 మ1 ప ని1 స. అంతే.
కానడా బహార్ స్వరాలు స రి2 (మ1) గ1మ1 ని1ధ2ని2 స, స ని1ప మ1 ప గ1మ1రి2స.
ఇది నేను ఎవరూ పాడగా వినలేదు కాని స్వరాలను బట్టి ఆ పాటకు ఇది సరిగ్గా సరిపోతుంది.
విశ్వనాథన్ కాఫీకానడా వంటి రాగాలను కూడా ఎక్కడో విని ఉపయోగించాడు కనక అతని ప్రయోగాలు అంత సులువైనవిగా ఉండవు.
కానడా బహార్ సంగతి నాకు బి. సుబ్బారావు రాసిన రాగనిధి వాల్యూంలోనే తెలిసింది. అది హిందుస్తానీ, కర్నాటకరాగాల వివరాల పుస్తకం. 4్ సంపుటలతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రచయిత కన్నడిగుడు కనక రెండు పద్ధతులూ తెలిసినవాడై ఉంటాడు.
పెండ్యాల తెలుగులో మార్చిన తీరు నాకంతగా నచ్చలేదు. గుడ్డిగా కాపీ కొట్టడం ఆయన పద్ధతి కాదనేది సుగుణమే అయినప్పటికీ తమిళ వెర్షన్ బావుంటుంది.
నాకు సంగీతం ఎక్కువగా తెలియదు. కానికర్నాటిక్ సైటులో ముత్తుక్కళో కణ్గళ్ రాగము మధ్యమావతి అని ఉన్నది. ( విన్నానులే ప్రియా ) ఈ సైటులో మధ్యమావతి హిందుస్తానీ సారంగ్ రాగము లాటిది అని ఉన్నది.
విధేయుడు – మోహన
ఆరు అంటే నిండు, ఉపశమించు, వెండ్రుకలు (నూగారులాటి పదాలలో) అని అర్థము. సంఖ్యను సామాన్యముగా ఆఱు అని వాడుతాము. కాని యిప్పుడు బండి ఱ వాడడము లేదు కాబట్టి ఈ సందిగ్ధము, సందేహము కలుగుతుంది. రాణి తెలుగు పదము, రాజ్ఞి సంస్కృతపదము. అందువల్ల తెలుగు సంధితో పట్టపురాణి. సంస్కృతములో పట్టరాజ్ఞి అని అనుకొంటాను. పాదము అంటే ఈ సుభాషితము నాకు జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞానసముపార్జన ఎలాగవుతుంది అనేది ఇందులోని అంశము.
1) కేతన తరువాత సుమారు ఏడు శతాబ్దాలు గడిచాయి, మధ్యకాలములో వచ్చిన ఎందరో కవులు ఎన్నో సమాసాలను ప్రయోగించి ఉంటారు గదా? మూడు నేత్రములు, మూడు మూర్తులు సరియైన సమాసము, కాని మున్నేత్రుడు కాదు, ఎందుకంటే నేత్రుడు మహద్వాచకము, నేత్రము అమహద్వాచకము. కొన్ని సమాసములు వైరి సమాసములవలె కనబడవచ్చును, కాని అవి అలాటివి కాదు. ఉదాహరణకు లక్ష్మిమగడులో లక్ష్మి సంస్కృతపదము, మగడు తెలుగు పదము, రాజ్యపు సిరి లాటిదే ఇది కూడ. సంబంధ షష్ఠీవిభక్తి ఉన్నప్పుడు ఇలాటివి చెల్లుతాయి. అదే విధముగా ఆ కాంత అక్కాంత, నాదు శిరము నాశిరము సరియైనవే. వేయిపద్మాలు కూడ సరియైనదే. ఇట్టివి కోరాడ మహాదేవశాస్త్రి Historical Grammar of Telugu, గణపవరపు వేంకటపతికవి ఆంధ్రకౌముదిలో చర్చించబడినవి.
2) నన్నయగానీ, తిక్కనగానీ దీర్ఘముపైన అరసున్నను నిండుసున్నగా ఉపయోగించలేదు. ఎందుకంటే అలాటి ప్రయోగము వారి కాలములో, అప్పుడు వారుండిన ప్రాంతములో లేదు. కాని నన్నెచోడునికి అవి సుపరిచితములు, అందుకే వాడాడు అలా. మదరాసులో ఆండవాళ్లు అని వాడుతారు, కాని ఆంధ్రదేశములో అలా వాడరు. అందువల్ల చెన్నై తెలుగు మాండలికములో వ్రాస్తే కూంతురు, ఆండవాళ్లు సహజముగా ఉంటుంది. కాని ఆంధ్ర మాండలీకాలలో అవి ఎబ్బెట్టుగా ఉంటుంది.
మీరే అన్నట్లుగా ” పెసరట్టే తెలియని, తినడానికే ఇష్టపడని జనాభా ఉందంటే ” ఆ ప్రాంతంలో తెలుగుదనం తగలపడిపోయినట్లే కదండీ. ఇంకా దేని గురించి మీ కోపం. మీరు అమెరికాలో ఉన్నందున…. మీ ఒక్కరికో , ఇంకోతమందికో పెసరట్టు చేసే విదానం తెలిసినందున, అక్కడ తెలుగుదనం బ్రతికే ఉంది అనుకోమంటే , అనుకుంటాం…! నేను 1984 లో పుట్టాను, నాకు పెసరట్టు తెలుసు , స్వతహాగా చేసుకోగలను కుడా (కావాలని మా అమ్మతో కుర్చుని నేర్చుకున్నాను), అంటే దాన్ని అంత ఇష్టపడ్డాను. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో చాలా మంది దీనిని ఎరుగుదురు కుడా..!
ఇదే కాకుండా దిబ్బరొట్టె , జోన్నరోట్టే కూడా నా చిన్న వయసులో తిన్నాను. అయితే ఇప్పుడు అవి అంతగా లేవు, ముఖ్యంగా జోన్నరోట్టే. మీరు చెప్పిన తరువాతే ” పెసరట్టు ” తెలుగు వారిదని నాకు తెలిసింది. కాని నాకు ఇష్టమైన ఉపహారం ఏది అని ఎవరైనా అడిగితె నేను చెప్పేది పెసరట్టు, పూరి.
దాని కిందే చూస్తే ఒక చిత్రం, ఒక రచయిత వివరాలు ఉన్నాయి. ఈ సంచికకు, ఈ ముందుమాట గాని, వారు రాసినారా? కాని మరణ తేదీ చూస్తే అది సంభవమా? కాదు.
మరి ఆయన గురించిన వివరాలు అక్కడ ఉంటానికి కారణం?
ఇంకా కొంచెం కిందికి వస్తే – ఈ సంచికలో మీకోసం: అని ఒక రచయితల – రచనల చిట్టా ఉంది.
అవి మాకోసం ఐతే, మరి దానికి పైన ఉన్న సమాచారం ఎవరికోసం? మో కోసమా?
ఆ రచన ఎవరిది?
అసలెవరికీ ముందుమాట? ఎవరికి ఈ స్వాగతం? పత్రిక ఎన్నో సంచికో చెపితే చాలు. ఈ పేజీ తెల్లగా వదిలేసినా, పాఠకులు ఎడమ పక్కకి వెళ్ళి సంచిక ఎంచుకుంటారు. కుడిపక్క స్పష్టంగా రచనలు కనిపిస్తున్నాయి. రచయితల పేర్లు అక్కడే ఉన్నయి కూడాను.
ఈ పత్రికలో, నిజంగా ఆ జాగాను తాజా మరణాలకు ఎలాట్ చేశారని, ఎవరికో, ఏదో ఒక మూఢ నమ్మకం ఉంది, అందువల్ల ఆ పేజీ Template మార్చలేకపోతున్నారనీ నాకనిపిస్తున్నది.
Is a break thru possible? can we have a simple ‘table of contents’ page like any other modern magazine?
మార్చ్ 11 న జపాన్ లో జరిగిన బీభత్సం తర్వాత..ఆ వూళ్ళో ఏమీ మిగ ల్లేదు. ప్రాణ నష్టం, తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు నిరాశ్రయులయ్యరు. ఇల్లూ వాకిలీ లేదు. వర్తకాలు లేవు, వుద్యోగాలూ లేవు. పరిస్థితి ఎప్పుడు కుదుట పడుతుందో తెలీదు. కాలూ చేయీ ఎప్పటికి కూడుతుందో తెలీదు. సునామీ సృస్ఠించిన విధ్వంసానికి ప్రత్యక్ష మూగ సాక్షి లా మిగిలింది ఆ వూరు.
నిజమే, ఆ వూరు వూరంతా నీరవుతోంది. కన్నీరు మున్నీరౌతోంది. ఐతే, వాళ్ళు విలపిస్తోంది. తమకు జరిగిన అన్యాయానికి కాదు!
సముద్ర తీరాన వందడుగుల ఎత్తులో రెండొందలేళ్ళ చరిత్ర గల్గిన డెభై వేల దేవదారు వృక్ష సమూహాల చిక్కని తోపుని – సునామీ వొచ్చి ఆ పళంగా తుడుచిపెట్టుకు పోయినందుకూ కాదు!
మరెందుకంటే- తమను సైనికుల్లా కాపాడిన దేవదారు సైన్య దళం మొత్తం ప్రాణ త్యాగం చేసి పోతూపోతూ సెల్యూట్ గా మిగిల్చి పోయిన ఒకే ఒకే ఒక్క చెట్టుని..చూస్తూ..దుఖిస్తున్నారు.
తమ ప్రాణాలు ఒడ్డి ఐనా సరే దాన్ని బ్రతికించుకోవాలని తపిస్తున్నారు. అందుకు ఒక రిటైర్డ్ మాస్టారు తన సర్వ శక్తిని ధార పోస్తున్న వైనం..ఈ వ్యాసం.
ఎంత అద్భుతం! ఇంతద్భుతమైన సజీవ కథని ఈ మధ్య కాలం లో విని వుండం!
ఇన్ని వేల కళ్ళ చెమరింపుకి… ఇన్ని కోట్ల హృదయ స్పందనలకి అతని గుండె చప్పుడొక్కటే కారణం.. అంటే అతిశయోక్తి కాదు.
ఈ వొంటరి వృక్షాన్ని చూస్తూ వుంటే. రణ భూమిలో అయిన వారందర్నీ పోగుట్టుకున్న అర్జుని విలాపం గుర్తోస్తోంది.
దాని దుఖాన్ని చూస్తే – ఆత్రేయ తన సాహిత్యాన్ని తిరగ రాసుకునే వాడే మోననిపిస్తుంది. (మానూ, మాకును కాను..అనే పాట)
కష్టాలు కుంగదీయడం, దుఖాలు కమ్ముకోడం..హఠాత్తుగా ఒక్కరమై మిగిలిపోడం…అసలివేవి కావు విషాదకరాలు..అలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం పక్కనెవరూ లేక పోడమే నిజమైన విషాదం మనిషికి! అలాంటి దుర్దశకు, దురవస్థకు, నిరాశకు, నిస్పృహ కు లోను కాకుండ అతను- ఆ చెట్టు కి చేయూత నివ్వడమే ఇక్కడ మనల్ని కదిలించే విషయం, సన్ని వేశం!
ఇప్పుడా చెట్టుకి అతనొక సేవకుడు. ఒక తండ్రి. ఒక నేస్తం. ఒక ఆయువు. ఒక ఆత్మీయుడు. ఒక మానవుడు. ఒక దేవుడు. అదిన్నాళ్ళు తన ఎత్తు చూసి మురిసింది కానీ, తనకంటే ఎత్తైన మనిషి ఒకడున్నాడనీ, అతని హృదయ వైభవాన్ని చూడ్డం కోసమే తను మిగిలున్నాని అనుకుంటుందేమో ఆ చెట్టు !
ఈ ఒక్క చెట్టే కాదు, హృదయమున్న ప్రతి వారూ ఆ మాష్టర్ గార్ని అభినందిస్తారు.ఆ ఊన్నత హృదయానికి వందనమంటారు.
కొన్ని ప్రత్యేకమైన్ శాస్త్రీయ పద్ధతుల ద్వారా..ఈ వృక్ష జాతి మొక్కలు నాటుకుంటున్నాయి నర్సరీ లో. కొత్త ప్రాణాలు పోసుకుంటూ, కొత్త మొక్కలవుతున్నాయి. వాటిని మళ్ళీ ఈ తీరాన నాటి, దట్టమైన దేవదారు వనం చేయాలని అక్కడి ప్రజ కంకణం కట్టుకుని వుంది.అది అడవిలా విస్తరిస్తుంది. పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఐతే, ఇదంతా జరగడానికి మరో ఇరవై యేళ్ళు పడుతుంది. సందేహంలేదు. కాని, జపాన్ చరిత్ర లో మాత్రం జరిగిపోయిన విషాద సంఘటన కంటే, మాస్టారి మానవత్వపు విలువే గొప్పదిగా నిలిస్తుంది అని చెప్పాలి. !
ఆ దుర్ఘటనలో తాను ఇల్లూ, కారూ , సర్వం కోల్పోయినా…నిలువ నీడ లేకున్నా…..ఆ చెట్టు క్షేమం కోసం నిలువునా కృషి చేస్తున్న ఆ మాస్టారి సేవకు అందరూ జోహార్ అనక తప్పదేమో!మనిషి హృదయ వై శా ల్యాన్ని కొలిచేం దుకు ఒక్కో సారి ఆకాశం కూడా వెనకాడుతుంది . లేకుంటే, వందడుగుల దేవదారు, వొంగి వందనం చేయగలదా ఆ మాష్టారికి!?
ఇన్నాళ్ళు ఆ భూమి – నూరడుగుల చెట్లతో ఆకాశం మీద కవితలు రాసుకునేదిట! ఇప్పుడతని పేరు రాస్తుందేమో!!
నిజానికి ఈ జపాన్ పైన్ ఒక చిన్న వార్త. మన వార్త పత్రికలోమహా ఐతే ఒక బాక్స్ ఐటం కూడా కాదేమో! ‘ఒక వార్తని వార్త లా చెప్పడం వల్ల అది కేవలం చదివించడం వరకే పనికొస్తుంది. కాని, అదే ఒక కధ లా చెప్పడం వల్ల, ఆ వార్త ఎంతమందినో కదిలిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ప్రతిస్పందింపచేస్తుంది..సమాజ ప్రయోజనానికి ఉపకరిస్తుంది’ అని చెబుతూ వుండే వారు జర్నలిజం క్లాస్ లో మా మాస్టార్! ఆయన మాటలు అక్షర సత్యాలులా తోస్తున్నాయి ఇప్పుడిది చదువుతూ వుంటే!
మీ జపాన్ పైన్ చదివుతూనే..జపాన్ ని నాలుగు చెఱగులా చదివొచ్చా. పని లో పని గా ‘క్లబ్బు చప్టా సమాధి’ లో ఇంకా సజీవంగా వున్న ‘నిద్ర గన్నేరు నీ’ చూసొచ్చా. బావుంది. కొత్త పాఠకులకు మీరిలాంటి సౌలభ్యాన్ని కలిగిస్తున్న ఈ ప్రయోగమూ బావుంది. !
ఒక నిజ సమాచారం తో బాటు ఒక సందేశాత్మక మైన వ్యాసాన్ని అందించిన సంపాదకులకు అభినందనలతో..
– ఆర్.దమయంతి.
మీకు మాత్రమే కాదు అంఅదరికీ నచ్చే కథే యిది. హృదయాన్ని పిండించే మంచి కథ. కథకోసం కొన్ని coincidences ఉన్నాయి. అవి కథ కనుక సమర్థించుకోవచ్చు, కాని నిజంగా అలా అవుతుందో లేదో తెలియదు. కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ, భారతదేశంలో మాత్రమే కాదు, అన్ని దేశాలలో బిడ్డలను వదలడము సామాన్యమే. దీనికీ సంస్కృతికీ పెద్ద లంకె లేదు. వదలినవాళ్లందరూ ఈ కథలోని నాయికలా బాధపడరు కూడా. ఇలాటి సంఘటనతో సింధుభైరవిలాటి చలనచిత్రాలను కూడ తీసారు. విధేయుడు – మోహన
పాదారంభములో మూఁడు పదమున్న మరొక పద్యము నాకు కనబడలేదు. కాని, లోఁగు పదాన్ని లోఁగు, లోంగు గాను ఉపయోగించిన ఒక పద్యము దొరికింది. అంటే కావలసినప్పుడు, అర్ధానుస్వారము, లేకపోతే పూర్ణానుస్వారమును ఉపయోగించాడు నన్నిచోడుడు. అంటే ఆ పదాలను రెండు విధాలుగా ఉచ్చరించాడు. ఆ పద్యాలు –
ఇందులో వీఁగు, లోఁగొని అనేవి సామాన్య ప్రయోగాలు. వాటికి బదులు వీంగు, లోంగొని అని ప్రాసకై ఉపయోగిస్తాడు చోడుడు.
(విజృంభించిన గొప్ప సత్త్వ్వగుణశక్తితో ఈశ్వరుని పెద్దదగు ఎడమవైపు శరీరములో ఉద్భవించి నిష్ఠతో సేవించి శివుని అనుగ్రహముతో సకల లోకములను లొంగదీసికొని ప్రేమతో రక్షించు అనంతరూపుడైన లక్ష్మీపతి విష్ణువును నా స్తోత్రముతో సంతోషింపజేస్తాను)
వాఁడు, వీఁడు కు బదులు వాండు, వీండు అని ఉపయోగించిన ఒక పద్యము –
వ్యాసం బాగుంది, కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఒక రెండు విషయాలు –
1) నన్నెచోడుని పద్యము – పోడి, మూడు అనే పదాలలో డి కి ముందు, డు కు ముందు అరసున్న ఉన్నది. తెలుగులో సామాన్యముగా హ్రస్వాక్షరమునకు తరవాతున్న అరసున్నను నిండుసున్నగా వాడవచ్చును. ఉదా. తెలుఁగు – తెలుంగు, అనఁగా, అనంగా, ఇత్యాదులు. కాని దీర్ఘముపైని అరసున్నను నిండు సున్నగా వాడరు. కాని నేటికీ తమిళనాడులో ఇలాటి ప్రయోగాలు సామాన్యము. ఉదా. కూంతురు, రోంకలి, వాండు, ఇత్యాదులు. నన్నయ ప్రాససాంకర్యము చేయలేదు. అంటే అరసున్న ఉన్న పదాలను లేని పదాలను ప్రాసలో వాడలేదు. కాని తమిళ సంపర్కము ఉన్న నన్నెచోడుడు దీర్ఘముపైని అరసున్నను ప్రాసకై సున్నగా వాడాడు. అందువల్ల పోఁడి పోండి, మూఁడు మూండు ఐనది.
2) మిశ్రసమాసాలలో తెలుగు పదము ముందు, సంస్కృతపదము తరువాత వస్తే అది దుష్టసమాసము కాదు. సంస్కృతపదము ముందుండి తెలుగు పదము తరువాత వస్తే అది దుష్ట సమాసము. ముజ్జగములు సరియైనది, కాని మహాతల్లి సరియైంది కాదు. కాని ఇతర ద్రావిడ భాషలలో ఇలాటివి ఉన్నాయి.
గానభారతి ఇటువంటి చర్చలకు మూలం కావడం ముదావహంగానే ఉన్నది. నేను పేర్కొన్నట్లుగా కాల మేదైనా మానవుల ప్రకృతులు కాలాతీతములు. యశస్వివంటివారు ఇటువంటి ఇతివృత్తం గల కథను ఇంకా వివరంగా “తెల్గీషు” గద్యంలోవ్రాస్తే ఆనందిస్తారనటంలో సందేహంలేదు. కాని ఒకవిషయం గమనించాలి. తెల్గీషులో చదివి ఆనందించవలసిన భాషా సౌందర్యం గాని, పదశిల్పంగాని, ఆలంకారికప్రయోగాలు గానీ, వర్ణనావైదగ్ధ్యం గాని, లయవిన్యాసాలు గాని వెతకడం పొరపాటే ఔతుంది. అట్లాగే గానభారతివంటి కవితా కథానికలలో ఈ అంశాలను విస్మరించి, తెల్గీషుభాషలో పద్యం వ్రాయలేదే అని వాపోవడంకూడ పొరపాటే ఔతుంది. అందుచేత వ్రాసిన మాధ్యమంలో ఆ మాధ్యమానికి లక్షణభూతమైన అంశాలను దృష్టిలో నుంచుకొని అందాన్ని ఆస్వాదించడం సహృదయుల ధర్మం. ఉదాహరణానికి పొడిమాటలతో సాగే డ్రామాను ఓపెరాగానో, బ్రాడ్వే సంగీతరూపకంగానో వ్రాసినప్పుడు వీనిని ఆస్వాదించే ప్రేక్షకులు, వాటిని తోలనంచేసే ప్రమాణాలూ వేఱుగా ఉంటాయి. గద్యేతర కవితామాధ్యమంలో కథను వ్రాసినప్పుడు (ఈనాటి వ్వవహారికభాష వాడటం లేదే అని వాపోకుంటే) ఈనాటి వచనకవిత్వంకంటె పద్యమే కథాకథనానికి సమర్థంగా, హృద్యంగా ఉంటుందనటంలో సందేహం లేదు. నేను వ్రాసినది సమర్థంగా ఉన్నా లేకున్నా ఇటువంటి కవితాకథానికా ప్రయోగాలు ఇంకా విరివిగాసాగాలనే ఉద్దేశ్యంతోనే నేనీ ప్రయోగాన్ని చేస్తున్నాను.
లైలాగారి సందేహాలకు సమాధానాలు:
1. రోమంథము = నెమరువేయుట . పోతనభాగవతంలోను, ముక్కుతిమ్మనగారి పారిజాతాపహరణంలోను ఈ పదం థకారయుక్తంగా ఉన్నది గాని సూర్యరాయాంధ్రనిఘంటువులో రోమంధము అని ధకారయుక్తరూపమున్నది. ఈ పదాన్ని వాడిన శ్రీకృష్ణమురళీగానపరవశములైన గోవులను వర్ణించే పోతనగారి పద్యం:
3, గానభారతిలో దౌహృదవర్ణనపద్యాన్ని మార్చి నేను మాదవ్ గారికి సంస్కృతప్రతిని జూలై సంచిక రాకముందే పంపినాను గాని, ప్రాతప్రతియే అంతర్జాలంలో వారు ప్రచురించినారు. ఈ సంస్కృతపద్యరూపాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో దౌహృదవర్ణన వాచ్యంగా కాక చాలా మట్టుకు సూచ్యంగా మార్చబడ్డది.
విశ్వనాథ సత్యనారాయణ వసుచరిత్రము (ఎమెస్కో ప్రచురణ) కు పీఠిక రాస్తూ, వసుచరిత్ర కావ్యము చదవటానికి ఇప్పటి పాఠకులు అధ్యైర్య పడనక్కరలేదనీ, – “మానవజాతిలో నది యొక అవివేకము. ప్రతివాడును తనకేమియు తెలియదనుకొనును. ఆ యనుకొనుట మానివేసినచో మన కావ్యములు కూడ చాలవరకు మనకు తెలియగలవు. నాల్గు మాటలు చదివిన తరువాత నైదవమాట కర్థము తెలియదు. నాకు తెలియుటే లేదని యా పుస్తకము నవతల పారవేయును. ఆ మాట యర్థము కానిచో తక్కిన మాటల కర్థమేమి? పద్యమంతయు చదివినచో నేదో కొంత తెలియదా? ఒక పద్యము తెలియలేదు. రెండవ పద్యము తెలియదా?” – అంటూ కావ్యాలు తప్పక చదవమని సలహా ఇస్తారు.
విశ్వనాథ సలహా నాకు నచ్చింది. ఆయన ఎంతమంది విద్యార్థులకో చదువు చెప్పిన పంతులయ్యె. నేను పద్యాలు అలాగే చదువుతున్నాను. చదివిన కొద్దీ అర్థమవుతున్నయి.
దేశికాచారి గారి పద్యాలు మధురంగా ఉంటాయి. నేను చదువుతున్నా. ఇందులో అన్ని పద్యాల్లో అన్ని మాటలూ అర్థం కాకపోయినా, కథ అర్థమయ్యింది. ఇది ఇప్పటి కాలపు కథ కాదంటానికి వీల్లేదు.
కొంచెం బాగోనట్టు ఎక్కడ అనిపించిందంటే; 🙂 కవితో కథానాయిక .. ఆమె… ఆమె…. – O! What the hell. I will say that horrible word in Telugu – ఆమె తన గర్భిణీ చిహ్నాలను వర్ణించి వర్ణించి చెప్పినప్పుడు. ఈ కాలపు స్త్రీ, ఆ సోదంతా అంత వివరంగా కవికి ఒక లతా నికుంజంలో ఎందుకు చెపుతుంది? అంతకు ముందెప్పుడో తన గైనకాలజిస్ట్ కి హాస్పిటల్లో చెప్పి ఉండొచ్చు.
అంతే. అందుకని. అంతకు మించి నచ్చనిది ఏం లేదు.
ఒంటరిగా, విచారంగా, ఉన్న ఒక స్త్రీని “ఏమిటమ్మా నీ కష్టం?” అని ఒక మగాడు కల్పించుకుని అడగటం ఈ రోజుల్లో జరగదా? అంటే జరుగుతుంది. సరే, కవి తర్వాత కుంచెం, వైద్యుడు, సలహాదారుగా ప్రవర్తించాడు అనుకోండి. అది ఈ రోజుల్లో ఆశ్చర్యం కలిగించే విషయమా అంటే అదీ కాదు. అలా రోజూ ఎడా పెడా లక్ష సలహాలు ఇస్తూనే ఉంటారు చాలామంది మనుషులు. కాని ఇక్కడ ఇచ్చిన సలహా అంత చచ్చుగానూ లేదు. నా కర్థమైనంత వరకూ ఆ కవి, ఆమె మనసు నొచ్చుకునే మాటలు అన్నట్టు లేదు. ఆమెను ఏ చెరువులోనూ దూకించలేదు. పైగా ఆమె కిష్టమయ్యి, ఆమె అదే పొదరింట్లో మరొకరితో సంభోగించితే , కవికి కష్టం కలిగేట్లూ లేదు.
అందువల్ల కవి సహృదయుడు అనిపిస్తున్నది.
అరే! ఒకటి రెండు కూజితాల్లోనే ఆమె కోయిల అని కవికి ఎలా తెలిసింది? అంటే – అదీ అంత నమ్మలేని విషయంలా అనిపించటం లేదు. 🙂 “తాళ్” సినిమాలో ‘మానవి’ /ఐష్వర్యారాయ్ సందేహిస్తూ “జీ. మై క్యా బోలూ” అనంగానే ఆ ధ్వనికి మురిసి ఆమె బాగా పాడుతుందని, స్టార్ క్వాలిటీ అని అనిల్ కపూర్కి తెలిసిపోయి, తన సంగీతం డాన్స్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చెయ్యమనలా:-)
ఐతే ఈ కథలో కవి, తన సలహానే ఆ స్త్రీ పాటించి, అందువల్లే ‘గానభారతి’ ఐపోయిందని, మనసులో అనుకున్నాడా? ఏమో మరి. తెలియదు. కానీ, సలహా ఇచ్చినప్పుడు సంగీతం ఆవిడకు మర్నాటికల్లా వస్తుందని అపోహ మాత్రం పడలేదు. కడుపొచ్చినంత సులువుగా సంగీతం రాదు. సంవత్సరాలు పడుతుందనే అనుకున్నాడు. “ఈ మాట” లో సంగీతం వ్యాసాలు రాసే రచయితలు మాత్రం, – వద్దులెండి, ఇక్కడ ఆ సంగతులు – వాళ్ళు రెండు దరువులు వేస్తే, నే బేరుమంటే, మళ్ళీ సుకవులు … 🙂 ఎందుకు గానీ ‘రోమంధము’, ‘ముకురాయితమైన’ అన్న మాటలకు అర్థాలు చెపితే, ప్రస్తుతానికి చాలు.
చెప్పొద్దూ – వరూధినీ, ప్రవరుడు అని వినిపించేసరికి కుతూహలం కలిగిన మాట వాస్తవం. ఎత్తుగడ అలా అనిపింపజేస్తుంది కూడ. ఐతే మిగిలిన ఏ విషయాల్లోనూ ఎలాటి పోలికా లేదని మనుచరిత్ర తొలి రెండు ఆశ్వాసాలూ చదివిన వారు ఇట్టే పోల్చుకోగలరు (నిజానికి నేను ఆ రెండు ఆశ్వాసాలు “ఈమాట”లో చాలాకాలం క్రితం పెట్టిన గుర్తు, ఇంకా ఉండి ఉండవచ్చు).
ముందుగా, ఇంకా పట్టుపట్టి ఛందోబద్ధమైన పద్యాల్ని రాస్తున్నందుకు తిరుమల దేశికాచార్యుల్ని అభినందించాలి.
ఐతే ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు భాష విషయంలో ఏమైనా కొత్తదనాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తే ఇంకా పాఠకులకు అందుబాటులో వుండే అవకాశం ఉంటుందేమో ! సమకాలీన పాత్రలు సంస్కృతసమాసభూయిష్టమైన సంభాషణలు చేస్తుంటే తమాషాగానూ ఎబ్బెట్టు గానూ ఉంటుంది. అంతే కాదు సంప్రదాయ భాషలో సమకాలీన భావాల్ని చెప్పలేరు కూడ. అందుకే భావకవులు వస్తువుకి అనుగుణమైన భావజాలాన్నీ భాషనీ తయారుచేసుకున్నారు (వసుచరిత్ర తర్వాత వచ్చిన ఏ రచననీ చదివే ఉద్దేశం లేదని కవిగారు ఇదివరకు అన్నగుర్తు; కాబట్టి ఈ మాటలు వారిని ఉద్దేశించినవి కావు – ఇంకెవరన్నా పద్యాలు రాద్దామనుకుంటే వారికీ ఈ మనవి.) తర్వాత పద్యాలు రాసిన నండూరి వారు కాని, కోవెల వారు కాని భాషని ఆధునీకరించటానికి బాగానే ప్రయత్నించారు వస్తువు పౌరాణికమైనదైనా (ఉదాహరణకి నండూరి “శీర్ణమేఖల”). రామాయణాన్ని రాసిన విశ్వనాథ కూడ చాలా ఆధునిక భాషని భావజాలాన్ని వాడాడు. శ్రీశ్రీ, ఆరుద్ర లాటి వాళ్లు సంప్రదాయ ఛందస్సుల్లో అధునాతన భావాలని చెప్పగలిగారు, అందుకు అనుకూలంగా భాషనీ మలుచుకుని. ఎంతోమంది “సెటైర్లు”, “పేరడీ”లకు ఛందోపద్యాల్ని బాగానే ఉపయోగించుకున్నారు.
ఇప్పటికీ చారిత్రక పౌరాణిక నాటకాలకు కొత్త తరం కవులు పాతరకం పద్యాలు రాస్తున్నారు; శ్రోతలూ వింటున్నారు. చిక్కల్లా సమకాలీన పాత్రలు అదే ఒరవడిలో నడవబోయినప్పుడే. కొత్తభాషని తయారుచేసుకోవటం మాటలు కాదు; కాని కష్టే ఫలిః .
తమ వంగ్యాత్మకమైన సమీక్షను ఓపికతో వ్రాసినందుకుశ్రీ యశస్విగారికి ప్రశంసలు. నేను మనుచరిత్రను నెమరు వేసుకుంటూ వ్రాయకున్నా మనుచరిత్రరోమంథాన్ని మీకది కలిగించిందంటే నే నాశించినదానికంటె అధికప్రయోజనమే చేకూరింది!! ఇంతకంటె కావలసిన దేముంది? మీకు మనుచరిత్రతో నున్న పరిచయం మాట అటుంచి, మానవప్రకృతులు, విభావానుభావాలు కాలాతీతములూ, అందుచేత 15వ శతాబ్దిలో వ్రాసినా 25వ శతాబ్దిలో వ్రాసినా ఈ అనుభావాల, ప్రకృతుల సారూప్యత ఉంటుందనే అంశం ఈ రోమంథానికి మూలమనేది మీరు గ్రహించవలసిన విషయం. కథను ఏదో 70% ఇంగ్లీషుపదాలతో గూడిన “తెల్గీషు” భాషలో వ్రాస్తే కాని శంఖులోతీర్థం పోసినట్లు కానేరదనే అపోహ మీ వ్రాతలో చూచాయగా స్ఫురిస్తూ ఉన్నది. ఈ అపోహను తొలగించడానికే లాక్షణికమైన ఛందోబద్ధమైన శైలిలో నేనీ కథను వ్రాసినాను. ఇట్టి ఛందోబద్ధమైన సత్సంప్రదాయ ముకురాయితమైన రచనలకు 15వ శతాబ్దియే కాని 21వ శతాబ్ది తగదని మీ అభిప్రాయమా? మీరేమన్నను ఈమాట సంపాదకులకు మాత్రం ఇటువంటి భావం లేకపోవడం నావంటివారి అదృష్టం. అభినందనీయం.
స్వామిగారూ,
మాండలికం అనేది ట్రాష్ కాదు.
అది జీవద్భాష.
నామిని డొల్ల కాదు. ఆయన తనని తాను అద్దంలో చూసుకున్నారు. దాన్ని యథాతథంగా రాయగలిగారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం ఒకవేళ జూటాతనం అనడం అంటే అది వాస్తవాన్ని నిరాకరించడమే అవుతుంది.
త్రిపురకీ మాండలికానికీ సంబంధం ఏమీలేదు.
నిజాయితీ నిబద్ధతలుంటే చాలు. సంపాదకులతో పరిచయాలు అక్కరలేదు. ఆపరిచయాలవల్ల చెత్తా చెదారాలన్నీ సాహిత్యంగా చెలామణీ కావడం తప్ప మరో ప్రయోజనం లేసదు.
కనక ప్రసాద్ గారూ !! ఒక మాట ..నాకు చెప్పొద్దు . మీకు మీరు చెప్పుకోండి చాలు. “జూటా” కానిదేదీ ? మన మనసు కన్నా జూటా ఏదీ? మనకి మనమే అర్ధమ్ కామే చాలా సార్లు. జీవితమే సత్యం కాదు. దాన్ని ఆవిష్కరించే కల్పన ఉన్నదున్నట్టే ఎలా ఉంటుందీ?? అలా రాయపూనుకుంటే అసలది కల్పన ఎందుకు అవుతుందీ?? కల్పన కానప్పుడు దాన్ని రాయాలనీ..దానికో రచయితా ఒక పాఠకుడూ ఉండాలనీ తపన మాత్రం ఎందుకూ?? అందుకోసమ్ ” గుద్దుకోడం” ఎందుకూ?? మీ సమస్య ఏంటో పూర్తిగా మీకు చెప్పడమ్ అన్నా కస్టమ్ అయిపోయి ఉండాలి. చదివే పాఠకులందరూ వర్గభేదం వల్లమాత్రమే అర్ధంచేసుకోవడం లేదా చేసుకో లేకపోవడం జరగదు కదా?? అలా అయితే ఏ వర్గం వారి రచనలు ఆ వర్గమ్ వాళ్ళూ ఏ ప్రాంతం వాళ్ళ రచనలు ఆ ప్రాంతం వాళ్ళూ మాత్రమే అర్ధం చేసుకోవాలి. అలా అనడమ్ లెదా అనుకోడంలో నిజమ్ లేదు. మనకి సొమ్ములుపోనాయండి.. యజ్నం లోని విషయం ఎంతో బాగా అర్ధమ్ అయ్యిందే?? అది ” జూటా” కాదే??
మీరు త్రిపుర ప్రభావం లో ఉన్నా..ఇంకెవరి ప్రభావమ్ లో ఉన్నా మీ అక్షరమ్ మాత్రమ్ మీ ప్రభావమ్ లోనూ మీ అదుపులోనూ ఉండాలంటారా? కాదంటారా?? అలా లేకపోతే అది పాఠక వర్గమ్ తప్పు మాత్రమ్ కాదు. మీ ఆలోచనలూ ఊహలూ తగిన భాష లోంచీ..తగిన వాక్యం లోంచీ అంతకన్నా ముఖ్యమైన తగిన కధనమ్ లోంచీ రావడమ్ లేదు. ఇందుకు లోపం మీది గానీ ఇంకెవరినీ నెపమ్ పెట్టే పని లేదు. లెదూ మీ శైలే ఇంత అని అనుకుంటే మీ పాఠకులు మరి ఎవరో వారు మాత్రమే మిమ్మల్ని మెచ్చుకోగల్గిన వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా “జూటా” గాళ్ళే నని అనుకుంటే గనక ఒకవేళ ఝూటావే నిజం అన్నమాట వేరే నిజం లేదన్నమాట. అదో వేదాంతం అసలు సత్యాసత్యాల నిగ్గు తేల్చేదెవరో ముందు ముందుకి వస్తే.. అప్పుడు చూదాం.
ఈ కధతో గుద్దుకున్నట్టు అనిపించింది. కాని మీరన్న కారణాల వల్ల కాదు. వేరే అనుకున్నాను. దానిగురించే మూడు లాంతర్లు – ఆరో భాగం అని రాసింది ఉంది. అది ప్రచురణకు పరిశీలిస్తున్నారు. దాన్లో ఈ గొంతు సంగతే చాల చెప్పుకున్నాను. సుధాకర్ అని ఒకాయనున్నారు. మా ఫ్రెండు. నాలుగేళ్ళుగా ఈ కధలో సంగతుల్తో ఒక వేదనలాగ కొట్టుకుంటున్నాను. దీన్లో మనుషులందరితో, వాళ్ళ జీవితాలకి నా బతుక్కి రాజీ చేసుకోలేక చాల యాతనగా ఉండి, ఈ కష్టం ఎవరికీ చెప్పుకోలేకుండా. అందుకే గిరిగారు ఏదైనా రాయమన్నప్పుడు గొప్ప అవకాశంలాగ వచ్చింది ఇది రాసేస్తే చాల తెరిపిగా అయ్యింది, ఓదార్పులా ఉంటుంది. రాసింది ఇంక దాన్ని మళ్ళీ చదవటం, చర్చించటం ఎంతమాత్రం సాయించదు. ‘అదంతా ఒక పీడకలలా మర్చిపో బాబూ!’ అని గుమ్మడి గారంటారు కదా?! టిబెటన్ మంక్స్ ముగ్గులు వేసి చెరిపెస్తారు. అలాగే ఇది చెరిగిపోవాలి, దీనికి గౌరవం, సంరక్షణ ఒద్దు. ఈ కధకి ఉంటే గనక సుధాకర్ – ఆయనొక్కరే చదువరి అనుకున్నాను. బైటికి పంపించే ముందు ఆయన్నడిగేను. ఎందుకంటే – సుధాకర్ ఒక్కడికే ఈ పిల్లల్తో, ప్రపంచంతో యదార్ధంగా పరిచయం ఉంది; ఒక్క ‘మేడమ్ ‘ తో తప్ప బహుశ. నాకైతే వీళ్ళందరూ తెలుసు, మేడమ్ తో సహా. ఈ భాష మాట్లాడే పిల్లల్తో ఇలా బతికే పిల్లల్తో వాళ్ళ ఊళ్ళలో ఆయన బతికేడు, నాలాగ. అంతే కాదు, ఆయన కూడా వాళ్ళలో ఒక గుంట్నాకొడుగ్గా బతికేడు, నాలాగనే. సుధాకర్ ని ఎన్నిసార్లో గుచ్చి గుచ్చి అడిగేను – దీన్లో ‘జూటా ‘ ఉన్నట్టుందా, అదేంటో చెప్పమని. అన్నిసార్లూ ఆయన ఏమన్నారంటే ‘పిల్లలందరూ ప్రాణం పోసుకున్నారు ‘ ఏ అభ్యంతరం తోచదని. మేడమ్ ఒక్కరితోనే ఆయనకు ఇబ్బంది వచ్చిందని. కొండబాబు భాషతో, గొంతుతో ఇప్పటికీ ఏ మాత్రం ఇబ్బంది తోచదు నాకు. వాడు నాకు ఎంత తెలుసంటే ఆ వయసులో అతనితో అలాంటి వాళ్ళందరితో అబేధం. అంత తెలుసు. సుధాకర్ ఒక్కరే అది అర్ధం – అంటే అనుభవం – చేసుకున్నారు. అబ్బ దీనికి ఒకే ఒక్క రీడర్ ఈయనే అని అనుకున్నాను, అలాగే అవుతుందే అనుకున్నాను. సుధాకర్కు రాయించిన దుఖ్ఖం అర్ధం అయ్యింది. ఆయన కూడ సారగారుగా అవతరించిన ఒకనాటి కొండబాబు. ఆయన చాల నచ్చుకున్నాడు ఈ కధని అలాగ ఇలాగ అని. దీని మొదటి చివరి చదువరి. వాళ్ళ గొంతు, లోకాన్ని కధలు కధలుగా చెప్పి వెక్కిరించే తీరూ ముమ్మాటికీ అలాగే ఉంటావి. అందరికీ కాదు. అవే ఊళ్ళు, అదే భాష, ఆ మనుషులూ అనుభవమ్లో ఉన్నవాళ్ళలో ఏ కొందరికోనేమో. ‘మ్రోగింది ‘ వంటి మాటలే కాదు, అంతకంతే ‘శుద్ధం ‘ అయిన మాటలూ, గ్రామ్యం అయిన మాటలూ వాళ్ళ మాటల్లో ఇబ్బంది లేకుండా కలిసుంటాయి. అవి మన, అంటే సంస్కారుల expectationsను అనుసరించి రావు. స్వయంగా దగ్గిరసా చూస్తే అనుభవమౌతాయి. ఇబ్బంది వేరే. మా ఆవిణ్ణి అడిగేను – రాజాతల్లి! దీంట్లో అబద్ధంగా ఉందా చెప్పమని. అది ‘ఏదో అబద్ధం లాగా ఉందిరా’ అన్నాది. ‘నువ్వు బతుకుతున్న బతుక్కీ ఈ కధలో విషయానికీ ఏదో తేడా ఒచ్చిందీ’ అన్నాది. అది కరక్టుగా పట్టుకున్నాది. మళ్ళీ అంది – ‘నాకైతే నీ జీవితం తెలుసు. అందరికీ తెలీదు కదా!’ అని ఊరుకోబెట్టింది. మూడులాంతర్లు ఆరో భాగంలో ఇదే ఇంకా ఉంటుంది – గొంతు సంగతి. మురళి అని ఉన్నారు. ఇంకో ఫ్రెండు. ఆయన్నడిగేను. ఆయన ఏమన్నారంటే narrative by a man torn between the two worlds …. mildly inauthentic.. అని. ఆ mildly inauthentic.. నేను ఒప్పుకున్న జూటా. అది సత్తెం చేసుకొవాలంటే నేను మళ్ళీ కొండబాబుని అయిపోవాలి. అలాగ కధల్లోనే కాగలను – కనీసం జూటాగానైనా. ఆ ఓదార్పు కోసమే కధ – రచయితకు. ఆ తరవాత వాంతిని ఊడ్చి పారీసినట్టు దాన్ని. మురళీతొ నేను “..it is a lie, but to me a very comforting lie, as all lies are.” అప్పటికి నాకలా బాగుంది. ఇప్పటికీ ఏ ఒక్క ముక్కా మార్చాలనిపించదు. జూటా textలో నిర్మాణంలో లేదు. రచయిత బతుక్కీ కధలోని సంగతికీ సమన్వయంలో ఉన్నాది. అది third person narrativeతో పూడ్చేది కాదు సరి కదా మరింత దూరమౌతుంది. గొంతునే చెరిపెయ్యటం ఒక తోవ. Beckett త్రిపుర అలా చేసేరు. వాళ్ళు ద్రష్టకు, దృశ్యానికీ మధ్య దూరం చెరిపెస్తారు. సుధాకర్ అలా చెరిపేసుకుని కధలోకి ప్రవేశించేడు, ప్రయత్నించి కాదు – ఇదంతా ప్రత్యక్షంగా, నిజంగా అతనికి తెలుసు, ఇదివరకే. అతని గొప్ప కాదు, వేరొకరి తక్కువ కాదు. అలా స్వీకరిస్తున్నారు, తమ అనుభవాల వల్ల అనుకుంటాను. అందరికోసం రాయాలి, అందరికీ ఒప్పుకోలుగా ఇలా అయితే బావుండేది ఇలా అంటే ఆ should నాకు మనస్కరించదు. ఇంతకంటె చెప్పాలని, చర్చించాలని లేదు. ఇది వాదించి ఒప్పించగలిగేది కాదు. మీరు లేవనెత్తిన విషయం చాల ముఖ్యమైనది, ఆసక్తి ఉంటే ఎంతో ఉపయోగంగా ఉండే చర్చ, అదంటే విముఖత, అగౌరవం లేదు. మనం Fiction అనేది సాంతం, అంతేగాక Science అనేది, అంతేగాక దైనందిన జీవితం అంటే Life అనేది ఈ మూడూ కూడా ఏదో ఒక స్థాయిల్లో నిజమే కావు – అంటే ఇవన్నీ కూడా జూటా. ఇలాగని చాల చర్చ ఉన్నాది – వేదాంతంలో కాదు, సైన్స్ లోన! ఇది సందర్భం కాదు, వేదిక కాదు, నా వలన కాదు.
[మూడు లాంతర్ల ఆరోభాగం జులై1 న ప్రచురించాము. కానీ ఒక చిన్న తప్పు వల్ల ఆ వ్యాసం ఈమాటలో కనిపించలేదని తెలిసి తప్పు సరిదిద్దాము. మా అలక్ష్యానికి క్షమాపణలు. – సం.]
బాలాంత్రపు రజనీకాంతరావుగారి ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము (విశాలంధ్ర పబ్లిషర్స్, 1975) పుస్తకానికి పరిచయ వాక్యాలు వ్రాస్తూ శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు ఆగస్టు 1, 1958 నాడు క్షేత్రయ్యను గురించి ఇలా అన్నారు –
“నేటి కర్ణాటక సంగీతపు రాగా లెన్నో స్పష్టరూపం దాల్చినది క్షేత్రయ్య పదాలలోనే” (పుట 210), “అనుపల్లవికి క్షేత్రయ్యే మార్గదర్శి” (పుట 232) ఈ యభిప్రాయాలు క్షోదక్షమంగా కానరావు. క్షేత్రయ్య వాడిన రాగాలు తాళాలు అన్నీ పురందరదాసాది ప్రాచీనుల రచనలలో నున్నవి. ఆ పదాలు పాడినట్టే వీటినీ పాడవచ్చును. నా గురువుగారు శ్రీ బిడారం కృష్ణప్పగారు దేవరనామాలు పాడునట్లే క్షేత్రయ్యాదుల పదాలూ అద్భుతంగా పాడేవారు. భక్తి శృంగారరూప భావ భేదమే తప్ప పాట శైలిలో ఏమీ భేదం మా యనుభవానికి అందులో రాలేదు. పదాలను రాగప్రధానంగా తెగయీడ్చి వాగర్థాల భావమే అవగతం కాకుండా పాడే పద్ధతి ఈవల వీణ ధనమ్మాళ్ ప్రచారంలోకి తెచ్చిందని నా ఊహ. ఆమె త్యాగరాజాదుల కీర్తనలు గూడ ఆ శైలిలోనే పాడేది. అందలి రాగమాధుర్యానికి లోగి ఎందరో గాయకులు – వాగర్థాల దృష్టి లేనివారు – దక్షిణదేశంలో ఆ శైలినే అక్షరశః అభ్యాసం చేసి పాడుచున్నారనేది వేరుమాట. క్షేత్రయ్యే యీ శైలిని తెచ్చి పెట్టినాడనేది న్యాయం కాదేమో. అట్లే అనుపల్లవి పురందరదాసుల కీర్తనలలో ఎన్నిటికో యున్నది. కనకదాస కృతులలో కలదు. ఇంతెందుకు? ఈ క్రింది అన్నమయ్య సంకీర్తనలోనే కలదు:
దీనికి తర్వాత నాల్గు పంక్తుల చరణాలు మూడున్నవి. పైమూడు పంక్తులును ఒక పల్లవిగా కలిపికొట్టి పాడేది యెట్లో నా కర్థంకాదు. అట్లే,
“పరిపూర్ణుఁడవు నీకుఁ బరాకున్నదా, నిన్ను
మరిగి వుండనిదే – మావల్ల తప్పుగాక,”
అనే తిరుమలయ్య సంకీర్తనలో రెండవ పంక్తిని అనుపల్లవిలో అమర్చుకొనకపోతే రెంటినీ ఒక రూపంగా భైరవి రాగంలో పాడే రీతి దుర్గ్రహం కనుక దీని బరువంతా క్షేత్రయ్యమీదనే వేయడం నా దృష్టిలో న్యాయం కాదు.
….
ఇట్లే క్షేత్రయ్య వాడిన ‘మోవనాడు’ అనే పలుకుబడిలో ‘మువ్వనాడు’ అనే యెవ్వరూ కనివిని యెరుగని కొత్త నాడుగాని … నా చూపు కందని విషయాలు. మోవన్ ఆడు = నామీద తప్పు మోచునట్లుగా ఆడుము అని మోవనాడు కర్థం.
నా తానా వ్యాసములో 53వ పుటలో త్రిపుట తాళానికి ఏడు అక్షరాలు అని ఉండాలి. తప్పు దొర్లినందుకు క్షంతవ్యుడను.
విశ్లేషణ బావుంది. కాని, చాలా చోట్ల, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుంది.
‘చంటి’ పాటలో, లక్ష్మి మేనకగా మారలేదు. మేనక అనేది, ఉపమానం అంతే. తకిట తదిమి పాటలో భావము లేకుండా, కేవలం భావ భ్రమ కలిగించింది అంటే, ఆశ్చర్యంగా ఉంది.
ఇప్పటిదాకా వేటూరి ని పొగుడుతూ చాలామంది వ్రాశారు. ఇదో కొత్త రకం విశ్లేషణ.
లక్ష్మన్న గారూ,
మీ వ్యాసాలు దశాబ్దం క్రితంవి. నేను రాద్దామనుకుటున్న విషయం మూడు దశాబ్దాలక్రితం నేను అనుకున్నది. ఇప్పుడు మీ రాగలహరి – మోహనం చూసాక రాయాలనిపించి రాస్తున్నాను.
ఏ వృత్తికైనా – మీ ఇంజినీరింగ్, మా లాయరీ(?), మరెవరి మెడిసిన్ – ఏదైనా ఆ వృత్తికి సంబధించిన జార్గన్ ఒకటి ఉంటుంది. సామాన్యులకి అది పట్టబడకపోవచ్చు. అనవసరం కూడా. అది ఆ వృత్తికి సంబంధించిన అసామాన్యుల భాష. కాని కొన్ని పదాలు ఈ ఇద్దరికి సమానమైనవి ఉండొచ్చు. సామాన్యులు ఆ వృత్తిపరంగా ఆ పదాలని సామాన్యార్ధంలో వాడకూడదన్నది గుర్తుంచుకోవాలి. కానీ విశేషార్ధం ఒకటి ఉంటుందన్నది తెలియక సామాన్యులు ఆ తప్పు చేస్తుంటారు.
ఉదాహరణకి – లీడింగ్ క్వొశ్చన్ – అన్న పదం చాలా మంది వాడుతుంటారు. దేన్ని లీడింగ్ క్వొశ్చన్ అనాలి అని ఎవిడెన్స్ ఆక్ట్ చెబుతుంది. ఏ పశ్నకైతే జవాబు అవును లేదా కాదు అని వస్తుందో అదే, అది మాత్రమే లీడింగ్ క్వొశ్చన్. కేవలం క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యడానికి మాత్రమే ఈ ప్రశ్న అడగాడానికి అవకాశం ఉన్నది. ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు లీడింగ్ క్వొశ్చన్ అడగకూడదు. వాది, ప్రతివాది అడ్వొకేట్లిద్దరికీ లీడింగ్ క్వొశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, ఎదుటివాడి సాక్షిని క్రాస్ చేస్తున్నప్పుడు. దాని అవసరం ఆ వృత్తిలోని వారికి తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు ఆ పదాన్ని వాళ్ళకి తోచిన రీతిలో వాడితే అసందర్భంగా ఉంటుంది. ఇప్పుడు నేను తెలుసుకదాని ప్రతివాదిని సంవాది అన్నానుకోండి కోర్టులో, వీడే మార్సునుంచి వచ్చేడ్రా అన్నట్టు చూస్తారు. ఇది కేవలం ఉదాహరణకి చెప్తున్నది. అసలు విషయం –
సంగీతం విషయంలో. ‘శుధ్ధ’ అన్న పదం కొన్ని రాగాలకే పరిమితం. కారణం నాకు తెలీదు. సామాన్యులు శుధ్ధ పదాన్ని pure, pristine అన్న అర్ధంలో వాడతారు. రాగాల విషయంలో – శుధ్ధ సావేరి, శుధ్ధ ధన్యాసి, శుధ్ధసీమంతిని, *శుధ్ధ బంగళా (ఈ ఆఖరిది కర్ణాటక రాగమో కాదో మరి) – ఉద్దేశం అదేనో కాదో నాకు తెలీదు. ఒకే పేరుతో రెండు రాగాలున్నప్పుడు, సావేరి, ధన్యాసిలాంటివి, ఒక దానికి శుధ్ధ prefixతో differentiate చేసినట్టు కనిపిస్తుంది. అవి ఒకే మేళకర్తజన్యాలు కాకపోవచ్చుకూడా. మరే రాగానికి ఈ prefix ఉండదు. శుధ్ధ పదాన్ని లూస్ గా వాడితే ఈ రాగమెక్కడిదీ అని సంగీతం వాళ్ళు అడిగే అవకాశం ఉంది.
ఇక స్వరాల్లో కూడా రిషభ, ధైవతాలు, మొదటివి, రి1, ధ1 శుధ్ధ స్వరాలు. రెండోవి చతుర్ శ్రుతి. నాట రాగంలోని షట్ శ్రుతి రిషభ ధైవతాలు నిజానికి సాధారణ గాంధారం, కైశికనిషాదాలు. స్వరస్థానాలని ఒకటి కంటె ఎక్కువ పేర్లతో గుర్తించడానికి కారణం – నాట లాంటి రాగంలో రెండు గాంధారాలు, రెండు నిషాదాలు ఉన్నప్పుడు వాటిల్లో ఒకటి రిషభం, మరోటి ధైవతంగా గుర్తించి సప్తస్వరాలూ ఉన్నట్టు చూపించడానికేమో? అలాగే కర్ణాటక, హిందుస్థానీ పద్ధతుల్లో ‘శుధ్’ పదం కలిగినవి సమాన స్వరస్థానాలని అనుకోలేం. అంటే హిందుస్ధానీ శుధ్ధ రిషభం కర్ణాటక సంగీతంలో చతుర్ శ్రుతి రిషభం. చతుర్ శ్రుతి రిషభాన్ని శుధ్ధ గాంధారం అన్నా తప్పులేదు. 22 శ్రుతుల ఆధారంగా స్వరస్థానాలని నిర్ణయించినప్పుడు తయారయినది ఈ nomenclature అనుకుంటాను. అందువల్లే చతుర్శ్రుతి, షట్శ్రుతి ఇట్లాంటి పదాలు. నాలుగోది, ఆరోది అని. ఇవన్నీ నాకు తెలిసి అంటున్న విషయాలు కావు. నాన్నగారు చెప్పగా అర్ధంచేసుకుందుకు ప్రయత్నించినవి.
ఈ బాధెందుకు వచ్చిందంటే – శంకారభరణం సినిమా చూసే రోజుల్లో మా ఫ్రెండ్ ఒకతను “శుధ్ధ హిందోళం అన్న రాగం లేదండీ” అని అంటూండే వాడు. ఆ సినిమాలో శంకరశాస్త్రి గొప్ప సంగీతం విద్వాంసుడు – “శుధ్ధహిందోళం లో రిషభం ఎలా వచ్చిందే” అంటాడు హీరోయిన్ని గదామాయించి. ఆయన శంకరాభరణంలోని శంకారాభరణం గురించి అసామాన్యుల అభిప్రాయం apart – వృషభం అంటే రంకెలేస్తాడు, కాని శుధ్ధ హిందోళంలాంటి పదాలు వాడతాడు. అసలు సప్త స్వరస్థానాలు పశుపక్ష్యాదుల శబ్దాలనుంచే వచ్చాయన్నది జ్ఞానుల అభిప్రాయం, వృ(ఋ)షభం సరైనదేనని వాదన. హీరో సమ్మోహనంగా ‘మాణిక్యవీణా’ పాడగానే అంతటి విద్వాంసుడూ మూర్ఛపోతాడు.
ఈ పరిస్థితి ఎందువల్లా అంటే –
రచయిత (అసామాన్యుడు కాని) – ముఖ్యంగా సినిమా అన్న మాస్ మీడియం తీసుకున్న రచయిత ఒక వృత్తికి సంబంధించిన పాత్రచేత ఏం మాట్లాడిస్తున్నాడు అన్నది ఎంతో మంది చూస్తుంటారు. వృత్తిపరమైన పాత్రలని సమగ్రంగా – ఆ వృత్తికి సంబంధించిన సంఘటనలతో – చూపించాలన్న కోరిక ఓపిక ఉన్న రచయితలని, సినిమాలనీ తెలుగులో చూడలేం. జస్టిస్ చౌదరి అని అంటాడు – ఆయన కోటు గౌను వేసుకుని ఇంట్లోనే కనిపిస్తుంటాడు. వీలైతే హీరోయిన్ తో గెంతుతుంటాడు. పైలట్ ప్రేమ్ నాథ్ అని అంటాడు – ఏనాడు ఏరోప్లేన్ లో కూర్చోగా చూడం. ఆ వృత్తికి సంబంధించిన విషయాలేవీ ఉండవు. మనం ఫ్లైట్ ఇన్టు డేంజర్, ఏర్ పోర్ట్ లాంటి థ్రిల్లరేమో అనుకుని వెళతా…మా(?). అబ్బే మనకీ తెలుసు.
మన రచయతలకి బాగా కొట్టిన పిండి – human relations, emotions. మన ఒంట్లో, ఇంట్లో పుట్టిందగ్గర్నుంచి అనుభవిస్తున్నది. పేరేదైనా, పాత్రేదైనా, ఆవు వ్యాసంలాగా చివరకి (కాదు ముందునుంచే) ఈ రెండింటి చుట్టూ తిరగుతుంటుంది కథ. శంకరాభరణం అయినా అంతే. వృత్తిపరమైన విషయాలు convincing గా చెప్పాలంటే కష్టం. ప్రేమలు, అనుమానాలు, ఏడుపులు చుట్టూ తిప్పడం అంటేనా చిటికలో పని. నచ్చిన హీరోయిన్ తో గెంతుతూ ‘నటించ’డానికి హీరోకి స్కోప్ ఉండాలి. రచయితకి ప్రత్యేకంగా ఓ వృత్తికి సంబంధించిన జ్ఞానంతో పనిలేనిది.
సరే ఎందుకింత రాయల్సి వచ్చిందీ అంటే – మీవ్యాసంలో శుధ్ధమోహన అన్న పదం చూసి.
మరోటి – నిర్దిష్టం, నిర్దుష్టం సమానార్ధకాలు కావేమో.
పి.వి. గోపాలకృష్ణ
మూడు మూడున్నర దశాబ్ధాల క్రితం వరకూ కూడా రికార్డ్ చెయ్యటం అనేది సామాన్యుడి చేతిలోలేదు. ఒక్క ఆకాశవాణి వారికే అది కుదిరే పని. ఎక్కడో డబ్బున్న వాళ్ళ దగ్గర స్పూల్ టేఫ్ రికార్డర్ లు ఉండి ఉంటే ;ఉండి ఉండవచ్చు. కాని వాళ్ళకు అభిరుచి కూడా ఉండాలికదా. ప్రస్తుతం సాంకేతిక అభివృధ్ది పుణ్యమా అని నాలాంటి సామాన్యులు కూడా స్వంతంగా రికార్డ్ చేసుకోగలుగుతున్నాము. ఈనాటి మహనీయులు వారి వారి గోంతులు, వీడియోలు ఎన్నెన్నో కలెక్షన్లలో తయారవుతున్నాయతంఎతోమది ఔత్సాహికులు ఎవరి పరిధిలో వారు ఈ కలెక్షన్లు తయారుచేసుకుని, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వారి వారి సేకరణను పరిపుష్టం చేసుకుటూనే ఉన్నారు.
నా బాధ ఒక్కటే అలనాడు ఆకాశవాణి అధికారులకి కొద్దిగా ముందు చూపు ఉండి వాళ్ళు తయారు చేసిన టేపులను భధ్రపరచి ఉండి ఉంటే, ఈ రోజున మనకు ఎన్నో ఆణిముత్యాలు దొరికేవి. అది జరుగలేదు. అదే బాధ.
“ఇప్పుడున్న ఈ వివాహవ్యవస్థ గొప్ప మార్పులకు లోనయితేనే గానీ స్త్రీపురుషుల సమానత్వం సాధ్యం కాదు. ఇప్పుడు వారి మధ్యనుండే అసమానత కేవలం వ్యక్తిగతమైనది కాదు… సామాజికమైనది”
“ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్ళుగా పుడతారు”
”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుడ్ని చేసుకోను… పుణ్యం లేకపోతే పీడాపాయ… ఎవరు పడతారమ్మా ఈ తిట్లూ, దెబ్బలూనూ?”
“భారత నారీత్వం స్పెషల్ రబ్బరులాంటిది… ఎంతలాగినా తిరిగి యథాస్థితికి వచ్చి ఏమీ జరగనట్టుగా మసులుకుంటుంది. దాన్నే మనవాళ్ళు ఆకాశానికెత్తారు… ఇంకా ఎత్తుకున్నారు”
”రంకుతనాల గురించి రాద్ధాంతాలు చేస్తారెందుకూ? మగ వాళ్ళకు లేని పవిత్రత ఆడదానికెందుకు?… పురుషులకు నిజంగా పాతివ్రత్య విశ్వాసముంటే ఇతర భార్యలతోనూ, సానులతోనూ ఎందుకు పోతారు. చూడగా చూడగా నీతి అన్నది ఆడదాన్ని చిత్రహింస చేయడానికి మగాడు సృష్టించిన నరకంలాగ అన్పిస్తోంది”
”ఆడదానికి ప్రకృతి అన్యాయం చేసిందంటారు. కానీ అన్నిటికన్నా ఆడదానికి హెచ్చు అన్యాయం చేసింది వివాహవ్యవస్థ… వివాహవ్యవస్థ ననుసరించి వచ్చిన సామాజిక పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ లేకుండాచేశాయి.”
కొకు గారు రాసిన పై వ్యాక్యాలన్నీ భూమిక వెబ్‌సైట్‌లో ప్రతిమ గారు పేర్కొన్నవి. ఆయన పుస్తకాలు నాకు తక్షణ అందుబాటులో లేకపోవటం చేత భూమిక వ్యాసాన్నే ఆధారంగా తీసుకుంటున్నాను.
నా ఉద్దేశంలో “ఆధునిక మహిళలు భారత దేశ చరిత్రను తిరగరాస్తారు” అన్న గురజాడ భావన కంటే “ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్లుగా పుడతారు” అన్న కొకు భావనే మరింత ప్రాసంగికతను, విప్లవాత్మకతను కలిగి ఉంది. గురజాడను మించిన క్రాంతదర్శనం ఈ చిన్న వాక్యంలో కనబడుతుంది.
రోహిణీ ప్రసాద్ గారి వ్యాసానికి వ్యాఖ్యానాలు రాసిన వ్యక్తుల జోలి నాకు అనవసరం కాని కొకు పరిమితుల గురించి, ఆయన సిద్ధాంత పరిమితుల గురించి ఈ వ్యాఖ్యానాలలో జోడించిన వారు కొకు రచనలలో కొన్నయినా నిజాయితీగా చదివారా అని నా సందేహం. ఎవరయినా దేన్నయినా విమర్శించవచ్చు.. కొత్త కళ్లతో పాత సిద్ధాంతాలుగా కనిపిస్తున్నవాటిని అంచనా వేయవచ్చు.. తప్పేమీ లేదు. కాని ఏ సిద్ధాంతం పట్ల అయినా పూర్వ నిర్ధారిత అభిప్రాయాల ప్రాతిపదికన గుడ్డిద్వేషం, సంపూర్ణ వ్యతిరేకత ప్రకటించడం ఆ సిద్ధాంతం గొప్పతనం మాటేమో కాని మన అల్పత్వం మాత్రం నడిబజారులో ప్రదర్సితమవటం ఖాయం.
“కొద్దిపాటి అభిప్రాయ ప్రకటనలు కాకుండా ఆయన సాహిత్య విశ్లేషణని వివరంగా చేయాల్సివుంది”
ఇది నూటికి నూరుపాళ్ళూ సత్యం.అందరూ ముందుగా ఈ పని చేసి తర్వాత మాట్లాడితే, రాస్తే బాగుంటుంది. ఇది మినహాయింపు లేకుండా మనందరికే వర్తించే సత్యం.
అరచేతిలో ఇమిడే ఎంపీత్రీ రికార్డర్లున్న ఈ రోజుల్లో పెద్దవారి మాటలను సభల్లోనూ, టీవీ, రేడియో ప్రసారాల్లోనూ భద్రపరచడం కష్టమేమీ కాదు. ఇవన్నీ ఇంకెవరో చెయ్యటంలేదని ఫిర్యాదుచేసే బదులుగా ఆసక్తి ఉన్నవారు రికార్డ్ చేసి జాగ్రత్తచెయ్యడం మంచిది.
నేను బొంబాయిలో 1970నుంచీ డజన్లకొద్దీ శాస్త్రీయసంగీత కచేరీలకు హాజరవుతూ ఉండేవాణ్ణి. వాటన్నిటినీ ఒక వయసుమళ్ళిన సింధీ (?) ఆయన తన స్పూల్ రికార్డర్‌లో టేప్ చెయ్యటం గమనించాను. అదంతా బాహాటంగానే జరిగేది కనక ఆయనకు అనుమతి లభించే ఉంటుందని అనిపించింది. ప్రస్తుతం public domain లో లభ్యంకాని ఈ అరుదైన రికార్డింగులన్నీ విడుదల అయిన తరవాత డబ్బు తెచ్చిపెట్టగలిగినవే.
తెలుగువారి విషయంలో అటువంటిది జరగడం దాదాపు అసంభవమే. చారిత్రక దృక్పథం ఉన్నవారు వ్యక్తిగతంగా ఇటువంటి పనులు చేపట్టాలి.
చీమలమర్రి వారికి అనేక ధన్యవాదాలు. ఈ పద్యము ఘంటసాల కర్ణ్ సినిమాలో పడేరు. బాలమురళి కూడ పాడినట్లు గుర్తు. తాత్పర్యం మీరు రాసేక మద్విసిఖ వృష్టి కి చక్కగా అర్ధం తెలిసింది.
నాకు నచ్చిన మరొక పద్యం మీరు వివరిస్తే ధన్యుడనుగతాను.
ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మర్గ నిరూఢులై కంటిమందురు కాని నిత్యము (నిక్కము??)కానరీ భవదాకృతిన్ నే కంటి మాంసపు కన్నులన్ నీ తొంటి రూపము తొలంగ బెట్టుము తోయజాక్షణ్ మ్రొక్కెదన్
ఇట్లు విధేయుడు
నారాయణ్ బాబు వేదుల, జంషెడ్ పూర్ (టాటా నగర్ )
లవణరాజు కల లోని భోజనమ్ గురించి వ్యాసకర్తల ప్రస్తావన అయినప్పటికీ… అప్పారావు గారి తోకచుక్క లోని “చాపకూటి” ప్రస్తావనని అలాగే తోకచుక్క లోని యువకుని భార్య అన్న మాటల ప్రస్తావననీ నేను గుర్తు చేయడం – మార్పులని వాళ్ళు పైపైననే కాక వాటీ మూలాలని గురించి కూడా ప్రస్తావన చేసారు సుమా అని చెప్పడానికి మాత్రమే!! రాయప్రోలు సుబ్బారావుగారు రాసిన లాంటి దేశభక్తీ అప్పారావుగారు రాసిన దేశభక్తీ ఒక్కలాంటివి కావు. వాళ్ళ గొంతుకలు వేరు. వాళ్ళ ఊహలు వేరు. వాళ్ల ఆదర్శాలూ వేరు. అప్పారావు గారు భావకవిత్వానికి ప్రేరకుడూ కాడు. ఆద్యుడూ కాడు.
మనవాళ్ళు కాశీమజిలీకధలూ ..హంసచెప్పినకధలూ చిలకచెప్పినకధలూ ఇవన్నీ జానపద విభాగంలో భాగంగా చేసి ఉండకపోవచ్చు. ఈ రకమైన పేర్లు ఇంగ్లీషు వాళ్ళు ఆ తర్వాత పెట్టినవి కావొచ్చు. కానీ ఆ తరహా సాహిత్యం మనకి కొన్ని వేల ఏళ్లుగా ఉన్నప్పుడు తిరిగీ దానిని గురించి మాట్లాడటమ్ కేవలం ఇంగ్లీషు ప్రభావం వల్లనే జరిగిందని అనడం పరిధిని కుదించి వ్యాఖ్యానించడమే!!. ఇందుకు అలాంటి మాటలు ఇంగ్లీషువాళ్లకి ముందులేవని చెప్పే ఆధారాలు ఏమన్నా ఉండాలి. సాహిత్యం ఉండీ దానికి ఒక ప్రత్యేకమైన పేరు లేకపోతేనే అంతమాత్రానికే అది ఇంగ్లీషు ప్రభావమ్ అని అనేయగలమా?అన్నది ఒక ప్రశ్న.
మనవాళ్ళు సంధ్యావందనమ్ చేస్తూ చెప్పే సంకల్పమ్ ఏళ్ల వెనకటిది. ఇటీవలది కాదు.అప్పుడు వాళ్ళు “భరతఖండే” అని అన్నారు కద. అంగ ఖండే వంగఖండే కాశ్మీర ఖండే అని సంకల్పం చెప్పలేదు కద? ఇది ధార్మికంగా హిందూ సంస్కృతి ఏకమన్న నమ్మకానికి మంత్రరూపమేనని అనుకోకపోడానికి ఏమి కారణం?? వేమన బ్రౌన్ దొర మెచ్చుకుంటాడని శతకం చెప్పలా! వేమన హిందువులనీ ..ముఖ్యంగా భ్రాహ్మలని వారి ఆచారాలనీ విమర్శించినందుకు మాత్రమే క్రైస్తవుడైన బ్రౌన్ కి ఆ శతకం ఎక్కువ నచ్చింది. ఆయన వేమనని అనువాదం చేయపూనుకోడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం.
రాయవాచకలోకాబోలు ఒకచోట పురుషోత్తమ గజపతిని తిమ్మరుసు సాటి హిందూ రాజుగా ఆయన ధర్మనిరతిని గురించి రాయల దగ్గర మెచ్చుకున్నట్టూ… నరపతులకీ గజపతులకీ వైరం ఉన్నా అది సుల్తానులతో ఉన్న వైరంలా ఉండకుండా ఉండాలని కాంక్షించి అలా రాయలు ప్రవర్తించేలా ప్రేరేపించినట్టు ఒక ప్రస్తావన ఉండటం గమనించ వలసిన అంశమే!! హిందూదేశ ఏకతకి బ్రిటీషు వ్యతిరేకత ఎంత పనిచేసిందో ఈ దేశంలో ఉన్న సంస్కృతీ ఏకత కూడా అంతే పనిచేసిందన్నది అంతే ముఖ్యమైన అంశం అవుతుంది. అందునా రాజుల కన్నా ప్రజల మధ్య ఈ ఏకత వివాహాది విధానాల ద్వారా ఇచ్చిపుచ్చుకోవడాల ద్వారా బలపడింది. భాస్కర్ గారన్నట్టు అంగవంగకళింగదేశాల లోని పిల్లలపట్ల వివాహాలకి లేని అభ్యంతరం మ్ళేచ్చజాతుమ్ళేచేయడం పట్ల ఉండటం భరతఖండంలో ఉన్న ఏకత కి నిదర్శనమే కద.
ఇకపోతే కాశ్మీరం నించి కేరళ దేశం దాకా పదకొండవ శతాబ్దం లోనే జయదేవుని అష్టపదులకి నకళ్ళు రాయిచుకుని ప్రాంతీయ భాషలలోకి తర్జుమా చేసుకుని ఆనందించినట్టు మనకి సంస్కృత సాహిత్య చరిత్ర చెబుతోంది. నేపాల్ తో సహా! ఇలాంటి సారస్వత ఆదాన ప్రదానమ్ ఇంగ్లీషు వారి రాకతో సంబధం లేకుండానే జరిగింది. మనకి ఉన్న ఒక సమైక్యత ఇంగ్లీషువాళ్ళ వల్లనే వచ్చిందని అనుకోవడం మనకి ఉన్న సంస్కృతీ నేపధ్యాన్ని కాదనడమే ఒకరకంగా !! అలా భావించడం బహుశా ఇటీవలి మార్పేమో !!
నిన్న విపులంగా రాయడానికి కుదర లేదు. అందుకు మళ్ళీ ఈ మాటలని జోడిస్తున్నాను.
చర్చ రసవత్తరముగా ఉన్నది. కొలోన్ నిఘంటువులొ కేలిక అనే పదానికి ఇవ్వబడిన అర్థాలు – kelika mfn. sporting , sportive W. ; the tree Jonesia As3oka L ఆప్తే నిఘంటువులో అశోక వృక్షము అని మాత్రమే అర్థము ఉన్నది. కొలోన్ నిఘంటువు ప్రకారము కేలిక పుంలింగము, స్త్రీలింగములలో ఉపయోగించవచ్చును. తాల(ళ)మునుండి తాలి(ళి)క అనే పదము కూడ వచ్చింది అనుకొంటాను. బాలికా తాలి(ళి)కా అనే రాసక్రీడ పద్యము జ్ఞాపకానికి వచ్చింది నాకు.
విధేయుడు – మోహన
రాగలహరి: ఆభేరి గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:
04/18/2011 10:52 am
రోహిణీ ప్రసాదు గారి లాంటి పెద్దమనిషి నుండి వచ్చిన వ్యాఖ్య బాధ కలిగించింది.
ప్రసాదు గారూ, మీకు తెలుసున్న సంగీత విషయాలని మీరెలా పదిమందికీ చెప్పాలనుకున్నారో, తరచూ రాసే మిగతా వారూ అనుకోడంలో తప్పులేదనుకుంటాను. అంతేకానీ, ఎదుటి వారిని ఎకసెక్కం చేయడం భావ్యం కాదు.
మీ తరువాత సంగీతం గురించి ఈ మధ్య రాస్తున్నదీ నేనే. నన్ను దూషించడమే మీ లక్ష్యం అయితే కానివ్వండి. మీరు తప్ప సంగీత విషయాలు రాయకూడదంటే చెప్పండి. రాయడం మానేస్తాను. సంగీతం గురించి రాసిన ప్రతీవాళ్ళూ విద్వాంసులు కాలేరన్న జ్ఞానం నాకుంది. విద్వాన్లు అన్న బిరుదులు ఇంకెవరికయినా కేటాయించండి.
“నావంటివాడికి దాని పేరుకంటే అదెలా మోగుతోందనేదే ముఖ్యం!” అని రాసిన మీరే గతంలో రాసిన ఒక వ్యాసం మీ సమాధానానికే సమాధానం చూపిస్తుంది.
1. “ప్రాంతవనాంతరానఁ జివురాకులయాసవమూని” అన్నపాదములో “ఆసవమూని” అన్నది “ఆసవమాని” గా సరిదిద్దాలి. ఊని అంటే ధరించు, అదుము అని అర్థాలు. ఆను అంటే త్రాగు అని అర్థము (నాకు తెలినానంతవరకు).
వివరణ: “ఆసవమాని” అన్నదే సరియైనది. “ఆసవమూని” అన్నది వ్రాతదోషం.
స్పందన: కారణమేదైతేనేం తప్పు తప్పే. ఒప్పుకున్నారు సంతోషం (ప్రమాదో ధీమతామపి) లేకపోతే ఊను శబ్దమేసరైనదని తెలయనివారు భావించే ప్రమాదం తప్పింది.
2. “సాంయాత్రికోపమానం సరిగ్గా అతకలేదు. గగనంలో మేఘాలకీ అభ్దిలో సాంయాత్రికులకీ మధ్య సామ్యం బాగా కుదరలేదని నా అభిప్రాయం. ఆ పద్యనిర్మాణంలో లొసుగు కూడా అక్కడే ఉంది.
వివరణ: ఈ పద్యాన్ని సరిగ్గా అన్వయం చేసుకొనలేకపోవడంవల్ల జనించిన సంశయమిది. “గగనాబ్ధిలో న సాంయాత్రికులట్లు” – అంటే ఆకాశమనే సముద్రంలో చరించే మేఘాలు సముద్రంలో చరించే సముద్రవర్తకులలాగా ఉన్నాయని ఉపమానం. “సాంయాత్రికః పోతవణిక్” – అని అమరం. ఆకాశం సముద్రాన్ని పోలితే అందులో చరించే మేఘాలు ఆ సముద్రంలో ఓడలపై చరించే వర్తకుల లాగ ఉన్నాయని భావం. గగనాన్ని అబ్ధితో పోల్చడం సర్వసామాన్యం. “పోతవణిక్” అనే వివరణ ఇక్కడ ముఖ్యం. వర్తకులు లోనున్నా, పైకి కనపడేవి ఓడలే. అట్లాగే మేఘాలున్నాయని లక్షితార్థం.
స్పందన: సముద్రంలో సాంయాత్రికుల్లా గగనంలో మేఘాలు కదులుతున్నాయి అని ఉండాలి. అంతేగాని గగనాబ్ధిలోన సాంయాత్రికుల్లా మేఘాలు కదులుతున్నాయడంతో అలంకార నిర్వహణ దారితప్పింది. ఇది అటు ఉపమా కాకుండా, ఇటు రూపకం కాకుండా ఏదో ఆయ్యింది.
3. “లేఖకాపేటి” పద స్వరూపం, దానికీ చిత్రకారుడికీ సంబంధం ఏంటో అర్థం కాలేదు.
వివరణ: పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది. ఆలేఖ్యము = చిత్రము, ఆలేఖకుడు = చిత్రకారుడు, ఆలేఖనము = చిత్రరచనము,ఆలేఖకాపేటి = painter’s toolbox. కాని ఆలేఖకపదం పుల్లింగంలో అకారాంతం కావడంవల్ల, ఆలేఖికా అనే స్త్రీలింగరూపం ఆకారాంతం కావడంవల్ల పై సమాసాన్ని ఆలేఖికాపేటి అని మారుస్తే వ్యాకరణ సమ్మతంగా ఉంటుంది. అప్పుడు చిత్రకారిణి toolbox, or painter’s toolbox in general అని జాతివాచకంగా చెప్పుకోవచ్చు.
స్పందన: దీన్ని కిట్టింపు వాదమని అంటారు. ఆడా మగా కాని పదం వాడి, “పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది” అని రొక్కించడం దబాయింపు అవుతుంది. అంతేకాకుండా అప్రసిద్ధ పదం వాడి సరిగా అర్థం చేసుకోలేదని రుసరుసలాడితే ఎలా? వ్యాకరణ సమ్మతం అనే ముసుగులో ఒక పదం రాబట్టి అర్థం కిట్టించేసి నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నట్టుంది ధోరణి.
4. బ్రతిరచించు అనేది ప్రామాణిక శబ్ద ప్రయోగమేనా –
వివరణ: నిస్సందేహంగా. ప్రతిరచనము అంటే ఉన్న రూపానికి ప్రతిగా, అంటే దాని ప్రతిబింబంగా రచించడం. “ప్రతిసృష్టి” వంటి పదం. ప్రతి అనే అవ్యయానికి అనేకార్థా లున్నాయి. ఈ “ప్రతిరచన” “ప్రతిసృష్టి”, “ప్రతిబిమ్బం” వంటి పదాలలో ఇది సదృశార్థంలో, అంటే తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన, తత్తుల్యమైన మూర్తి అనే అర్థాలలో వర్తిస్తుంది. “పరిజ్ఞానే, పదప్రాప్తౌ, కాలహృత్యాం, నివారణే, వ్యళీకావిష్కృతౌ, తుష్టౌ, సేవాయాం, నిష్క్రమేపి చ, ప్రోత్సాహే చా వినాభావే, విఘ్నాఙ్గీ కారయోరపి, వ్యావర్తనే, వినిమయే, పునరావర్తనేపి చ, వైపరీత్యే, వినిద్రత్వే, అవేక్షాక్షేపయోరపి. సంక్షేప స్పర్ధ సాదృశ్యే, స్వీకారాభ్యవహారయోః, ఉత్తరస్తోకయత్నేషు” – అని “ప్రతి” అను అవ్యయం వివిధపదాలకు చేర్చినపుడు కలిగే అర్థపరిణామాలు చెప్పబడ్డవి.
స్పందన: తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన అనే అర్థంలో వాడానంటున్నారు. ఇది క్లిష్టాన్వయార్థ సంపాదనం. వివరణే ప్రత్యక్ష ప్రమాణం.
వివరణ: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ యిది. ఈ పద్యానికి ముందు గల పద్యంలోని
“కొన్ని మబ్బు లూయలరూపు గొనుచు నలర
మఱొక కొన్ని యూయల నూఁగు తరుణికరణి
నమరుచుం గననయ్యె నయ్యంబరాన.”
మేఘవిద్యోతితమైన తరుణీరూపాన్ని “అమరగఁ గేశపాశముగ” అనే ఈ పద్యం విస్తరించి, మేఘాలవల్ల ఆ స్త్రీరూప మెలా ఏర్పడిందో రమ్యంగా తెలుపుతుంది. దీని తరువాతి పద్యం
పై రెండు పద్యాలలోని భావాలను సంక్షేపిస్తుంది. ఈ మూడుపద్యాలను సక్రమంగా అన్వయించుకొనకపోవడమే పై ఆక్షేపణకు కారణమైంది.
స్పందన: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ కాదిది. కర్త, కర్మ, క్రియల సమన్వయాన్నిబట్టి అన్వయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అటువంటి సమన్వయం లేనే లేదు. క్లిష్టాన్వయ దూరాన్వయాలే దోషాలు. అన్వయరాహిత్యం గురించి ఇక చెప్పాలా! ఇక దబాయింపులేమైనా ఉన్నాయేమో చూడాలి.
6. “కాలాఖ్యబాలక కేళికాతాడిత” లో కేళిక వైకృత పదం. తెలియడం లేదు. ఈసమాసానికి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి?
వివరణ: ఇది వైకృతపదం కాదు. శుద్ధమైన సంస్కృతపదం. కేళీ – కేళికా, అట్లే కాశీ – కాశికా, మల్లీ – మల్లికా, ఝిల్లీ – ఝిల్లికా, కాళీ – కాళికా . “కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి” – అని శ్రీనాథప్రయోగం. ఆకారాంతమైన కేళికాపదానికి (హ్రస్వ) అకారాంతమైన కేళిక వైకృతరూపం. అందుచేత ఈ ఆక్షేపణ నిరర్థకం. అన్వయం: కాలాఖ్య= కాలమనెడి, బాలక = బాలకునియొక్క, కేళికా= (బంతి) యాటవలన (యందు) , తాడిత= కొట్ట (తన్న)బడిన, కమనీయ = అందమైన, రోహిత = ఎఱ్ఱనైన, కందుకంబొ = బంతియో! అనగా, కాలమనెడు బాలకుడు బంతియాట ఆడుచు దిశాంతమునకు తన్నినట్టి ఎఱ్ఱని బంతివలె అస్తంగతుడగుచున్న సూర్యు డున్నా డని భావము. కొట్టి (తన్ని)నపుడు బంతి పైకెగిరి ఆ తర్వాత భూపతితమైనట్లు, అప్పు డాకాశంలో కొంత ఎత్తుగా నున్న రవి త్వరలో పశ్చిమాబ్ధియందు బడనున్నాడని ఇందులో ధ్వని.
స్పందన: ఇది ఒక అభినవ పాణినీయం. ఈ వాదన శబ్దస్వరూప విషయిక భ్రాంతి జన్యం. ఇచ్చిన ఉదాహరణాల్లో రెండు రకాల శబ్దాలున్నాయి. కొన్ని ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు, కొన్ని ఇకారాంత ఉభయలింగ శబ్దాలు. కాళీ – కాళికా వంటి శబ్దాలు “కాల”వంటి ప్రథమావిభక్త్యంతమైన అదంత శబ్దాలకు మత్వర్థంలో “ఇని”, “ఠన్” ప్రత్యయాలు వస్తాయి. (సూ. అత ఇనిఠనౌ). కాలః్ అస్య అస్తి కాల శబ్దం పైన “ఇని” ప్రత్యయము చేరి కాళీ (కాలీ) రూపం సిద్ధిస్తుంది. అదే “ఠన్” ప్రత్యయము చేరినప్పుడు “కాలిక” రూపం సిద్ధించి దానిమీద టాప్ వచ్చి కాలికా అవుతుంది. ఇక కేళి శబ్దము కిల శబ్దభవం (కిలంత్యనేనేతి కేళిః కిల క్రీడాయాం). ఇది ఇకారాంత పుల్లింగశబ్దం. దీనిమీద “ఙీప్” ప్రత్యయము వచ్చి కేళీ అనే స్త్రీలింగ శబ్దం ఏర్పడి ఉండవచ్చు (అక్తిన్నంతాలకి ఇ కారం దీర్ఘం వైకల్పికం). ఇక కాళికా శబ్దంలో కనిపించే అంత్య క కారం కేళికా శబ్దంలోని అంత్య క కారం ఒకే విధంగా నిష్పన్నమైనవిగావు. కేళికా లోని అంత్య క కారం స్వార్థమందు కా వర్ణం పరమైనప్పుడు నిష్పన్నం అయిన శబ్దం (కేళీ + కా). కేళీ సంబంధమైనది కేళిక. ఈ పదం విస్తృత వ్యవహారంలో లేదు. ఆంధ్ర శబ్ద రత్నాకరం దీన్ని వైకృత పదంగా పేర్కొని నాట్యం అనే అర్థాన్ని ఇచ్చింది. కొన్ని నిఘంటువులు sportive (కేళీ భావం) అనే అర్థాన్ని ఇచ్చాయి. ఏది ఏమైనా కేళిక పదానికి ఆట అనే అర్థం చెప్పడం కుదరదు. అంతే కాదు “కాలాఖ్యబాలక కేళికాతాడిత” అనే సమాసంలో యోగిత లోపించింది. కర్తృ క్రియా పదానుక్రమాన్ని పాటించి సమాసార్థాన్ని చెప్పాలి. ఇష్టానుసారం విభక్తుల్ని చేర్చి విగ్రహవాక్యాలు చెప్పేస్తే సరిపోదు.
భావనారాయణగారూ,
వాద్యాలు, వాయిద్యాలు అనేవాటికి మధ్య గల తేడాలను ఈమాటలో నిత్యమూ రాసే విద్వాన్లు చెప్పగలరేమో. నావంటివాడికి దాని పేరుకంటే అదెలా మోగుతోందనేదే ముఖ్యం!
ఓ నెలరాజా ఎక్కువగా శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. దీన్నే హిందుస్తానీలో ధానీ అటారు. అక్కడక్కడ భీంపలాస్ ఛాయలు కనబడటానికి కారణం రెండిటి ఆరోహణా ఒకటే కావడం. భీంపలాస్‌లో అవరోహణలో రి2, ద2 కూడా వస్తాయి. అది మాల్కౌఁస్ కాదు. శుద్ధధాన్యాసిని ‘గ్రహభేదం’ చేస్తే (పంచమాన్ని షడ్జమం అనుకుంటే) అలా అనిపిస్తుంది అంతే.
సడిసేయకో గాలి శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. (సినిమా పాటలన్నిటి గురించీ అలాగే రాయాలి. ఎదుకంటే రాగ స్వరూపం పూర్తిగా ప్రకటితం అవాలంటే గమకాలూ, వాదిసంవాది స్వరాలూ అన్నీ పలికించాలని పండితులంటారు).
dear Lakshmann garu,
namaskaram,
not only in typing and in internet ,but also in matters realted to music im an illiterate.My doubts are in sync with my limtations of m y acqisance with music an dwith telugu language. Kindly verify if i stand an y chance to be excused to harbour the following doubts.
1. which form is free of jarring common vulgarity in usage…………………..’ వాయిద్యాలు’ లెక ఆద్యాలు?
2 i am acustomed to hear from music jousnalists the song
ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్.. (భట్టి విక్రమార్క) has a base of malkons!
3.The other song”’సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
has tuned been tuned [by [ Rajani] on the Rga base of Dhanyasi
3.and the basi tune of the song కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు) is almost identical with raga Bhimplasi o f hindushani music.
you may take the trouble , fo r which favour i shud be tahnk ful . to clear m y doubt, iyou reaally feel i deserve a response, i reitearte that my doubt is not to intiate a challenge and ,neither is it meant for a discussion in to the veracity of your conclusion , as iknow well im not equipped to prove contrary to your conclusions.
yours lovingly
S B N
కథ గురించి చాలా కాలం క్రితం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చదవడం ఎలా అని ఒక వ్యాసం రాశారు. కొంతకాలం క్రితం ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డిగారు కూడా చదవడం గురించి ఒక వ్యాసం రాశారు. కానీ ఇంత వరకూ ఎవరూ కథ గురించి కథ రాసినట్టు లేదు. ఇందులో కథ గురించిన కథనం కొత్తగా వుంది. కథ స్వయంగా తనగురించి ఒక కథ రాయడం అనే ఆలోచనే చాలా బాగుంది. అయితే ఇటువంటి కథ రాయడానికి కేవలం కథా కథన శిల్పాలతో బాటుగా చాలా అధ్యయనం కూడా అవసరమౌతుంది. ఆ విషయంలో కొంత అసంతృప్తి కలిగినప్పటికీ, కథగా చాలా బాగుంది.
ఇంతవరకూ పాఠకులు కథలు చదవడమేగానీ ఒక కథే స్వయంగా పాఠకుల్ని చదవడం అనే ఆలోచన రావడమే అపూర్వం. దాన్ని అందమైన కథగా మలచడంలో రచయిత విజయం సాధించారు.
దీన్ని కథ గురించి రాసిన కథ కాని కథగా సాహిత్యంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.
రచయిత చంద్ర కన్నెగంటి గారికి అభినందనలు.
మనకి అన్ని కాలాల్లోనూ popular art forms ఉన్నాయి. అలాగే fine arts ఉన్నాయి. ఈవ్యాసంలో మొదలుపెట్టిన గొంతు వ్యాసం మొత్తం మీద లేదు. సినిమా పాటల విషయంలో కాలాన్ని గురించి అంత సానుకూలతని ప్రదర్శించిన వీరే గ్రూప్ డాన్స్ ల విషయాని కొచ్చేసరికీ చాదస్తపు గొంతుని విన్పించారు.
ఎప్పుడైనా ఒకే కాలంలో జనసామాన్యపు అభిరుచి [డబ్బులొస్తుందనుకుంటే..] popular art forms లో ఎక్కువ చోటు చేసుకుంటుంది, mass media ల్లో! సినిమా ఎప్పుడూ మాస్ మీడియానే. పైగా డబ్బులు సంపాదించుకుందికి అత్యధిక మొత్తంలో సొమ్ములని వెచ్చించి జూదం ఆడిన పధ్ధతిలో ఒక మూసలో నడిచే కళ కూడా!! అక్కడ డబ్బు మాత్రమే ప్రధానం మిగతావాటికన్నా!! ఆత్రేయ రాసినా, వేటూరి రాసినా, సీతారామ శాస్త్రి రాసినా.. ఇంకా మిగిలిన సినిమా కవులెవరన్నా రాసినా డబ్బుకోసమే!! అంచేత డబ్బులు తెచ్చే విధంగా మాత్రమే రాయమని వారిని ఆ నిర్మాతలు అడగడం తప్పదు. వీరు రాయకా తప్పదు. అందులో మంచివీ జనరంజకమైనవీ ఉంటాయి. కానివీ ఉంటాయి. డబ్బులు ఎక్కువ వచ్చేది నాటు శృంగారంలోనే గనక చినమా కవులు ఎక్కువగా ఆయా అర్ధాలని వచ్చే విధంగా రాయడం తప్పనిసరి. ఈ విషయం ఆ రాయమనే వారికీ తెలుసు. ఈ రాసే వారికీ తెలుసు. ఇక్కడ ఎవరూ అమాయకులు కారు.పాతకాలంలో కేతిగాడూ, బంగారక్కా లాంటి వీధిబాగోతాల పాత్రలు సినిమాల్లో సమకాలీన అవసరాలని తీర్చేలాగా రూపొందాయి. అయితే సినిమా మాధ్యమం targeted audience ఎవరు అన్నదాని ఆధారం గానే వాడే భాషా, పాటల్లోని అర్ధాలూ, సంగీతమూ ఉంటాయని ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. ఎలాగైతే సినిమాలోని హీరోయిన్ వాడే సంభాషణలూ, వొలకబోసే వయ్యారమూ ఆమె అవన్నీ నచ్చి చేస్తోందని మనం చెప్పలేం. అది ఆ సినిమా దర్శక నిర్మాతల అభీష్టం బట్టి రూపొందుతుంది.
పాపులర్ కళ ఉన్నా సమాంతరంగా మనకి ఇతర కళలు కూడా అవసరమై ఉంటూనే ఉన్నాయి. వాటిలో డబ్బుకి ఉండే స్థానం రెండవదీ, కళాత్మకత మొదటిదీ. అందువలన ఇతర లలితకళలన్నీ అన్నికాలాల్లోనూ కొనసాగుతూనే ఉన్నాయి. సమకాలము మాత్రమే సాహిత్యానికీ సంగీతానికీ కొలమానం అయితే “ఈమాట”లో త్యాగరాజు మీద వ్యాస పరంపర అవసరం ఉండదు. అలాగే గడిచిపోయిన రచయితల రచనలని గురించిన చర్చా ఉండదు. ఇవాళ్టి వాళ్ళ కవిత్వం మాత్రమే వేసుకుని పత్రిక నడుపుకోవచ్చు కదా? కానీ అలా చేయడం లేదెందుకనీ? చాదస్తం వల్లనేనా? కాదే? అలాగే సినిమాల విషయంలో సైతం అభిరుచి అన్నది ప్రమాణం అయితే ఇవాళ్టి సినిమా ఎవరి అభిరుచిని ప్రతిబింబిస్తోంది అన్నది ముఖ్యమైన ప్రశ్న అవుతుంది. ఈ వ్యాస రచయితా త్రయం చదువుకున్నవారే అయి ఉండి సినిమా పాటకి “సామాజిక అంతరాలూ, ఆడామగా తేడాలూ లేవు” అని చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. ఎందుకు లేవూ? ఖచ్చితంగా ఉన్నాయి. ఏ ఆడపిల్లా వేటూరి గొంతు పెట్టుకుని “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ” అని పాడదు. అలాంటి పాట వేటూరిది. అమ్మాయిల మనోభావాలని అనుసరించి వచ్చింది కాదు. అమ్మాయికి స్వేచ్చ ఉండి పాడుకోగలిగితే మరి ఇంకెలాగైనా పాడుకునేదేమో గానీ.. వేటూరి సుందర్రామ్మూర్తి రాసినట్టు కాదు. అలాగే ఇతర వర్గాల తేడాలు కూడా!! సినిమాల్లోని భాష ఏ వర్గపు అవసరాలు లేదా ఆశయాలూ ముఖ్యమో వాటిని నెరవేర్చడానికే తయారైనది. అమాయకంగా ఏమీ రూపొందింది కాదు. త్యాగరాజ కీర్తనలకి డిమాండ్ ఉండి డబ్బులొస్తాయని అనుకుంటే మన డిస్ట్రిబ్యూటర్లూ మన ఫైనాన్సర్లూ దానికే డబ్బుపెడతారు. డబ్బులకోసం రాసే పాటలో ఎప్పుడూ ఉత్తమ విలువలు ఉండలేవు. దీనికి కాలం కాదు ప్రతిబంధకం! సమకాలపు అభిరుచి కూడా కాదు. వీళ్ళు ఇన్ని సినిమా పాటలని వివరించి రాసేరు. నేను మరి ఇవాళ్టి కాలానికి చెందిన దాన్నే గానీ వీళ్ళ లిస్టులోని చాలా పాటలు మరి నాకు తెలీదు. నేను సినిమాలని తెగ చూసే అలవాటున్నదాన్నీ కాను.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే జనం అభిరుచి అంటూ ఉండదనీ వాళ్ళు తీసేది వాళ్ళు రాసేదీ జనం అనబడు వారు తమ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చూడటమో వినడమో చేయవచ్చు కానీ అవన్నీ “సమకాలము వారి అభిరుచిని” ప్రతిఫలిస్తున్నాయని మనం సాధికారంగా ఏమీ చెప్పలేమనీ నా ఉద్దేశ్యం. తాడేపల్లి హరికృష్ణ గారన్నట్టూ పద్యనాటకాలకీ ఇతర కళారూపాలకీ వచ్చే జనమూ ఇవాళ్టి కాలం వాళ్ళే!! చాయిస్ అని ఒకటుంటుంది మరి. దాని ప్రకారమే బతకడానికి సమకాలం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పుడూ కూడా ఈ “చాయిస్” అన్నది తక్కువగా దొరుకుతుంది ఏ కాలంలో బతికిన వారికైనా!! సినిమా పాటా మాటా ఆటాతో సహా!
జి.సి.యస్.సిద్ధార్థగారు నా పద్యాలనుగుఱించి అనేకవిమర్శనాత్మకాభిప్రాయములను వెలిబుచ్చినారు. ఇవన్నీ పదస్వరూపం గ్రహించకనో, పద్యాలను జాగ్రత్తగా చదివి సరిగా అర్థం చేసికొనక పోవడంవల్లనో జనించిన అసమం జసమైన విమర్శనలని నా అభిప్రాయం. ఈవిధమైన విమర్శనలును విస్మరించితే వారి దృక్పథమే సరియైనదనే అభిప్రాయం ఇతర పాఠకులకు కలిగే ప్రమాదమున్నది. అందుచే వారి విమర్శలకు తగిన వివరణ నిక్కడ నేనిస్తున్నాను.

వివరణ: ఈ అనుమానం నిరర్థకం. ఉపమాన, ఉపమేయాలకు సమానధర్మం చలనం. అన్యవస్తుప్రేరణ ఈ చలనానికి ఉభయత్రాకారణం. ఉపమానం మారుతచాలితమైనది. వనసందర్శనకుతూహలచాలితమైనది ఉపమేయం. ఈరెంటికీ అన్యవస్తుప్రేరితమగుట, చలించుట సమానధర్మములు. అంతే కాని, “తరుశాఖ” కూడ మనిషివలె నడువడం లేదే అని శల్యపరీక్షచేయడం విరసత్వానికి నిదర్శనం.
8. “ముఖేందుబింబమును నల్పపు మేఘములట్లు గ్రమ్మె” – ఇందులో అల్పపు మేఘాలా? నల్పగు మేఘాలా? అల్ప శబ్దాన్ని పరిమాణార్థంలో కవి విరివిగా వాడుతున్నారు. అది సరికాదేమో!
వివరణ: ఈ అనుమానం నిరర్థకం. ఇది అల్పపుమేఘమే కాని నల్పగు మేఘము కాదు. “స్తో కాల్ప క్షుల్లకా స్సూక్ష్మం శ్లక్ష్ణం దభ్రం కృశం తను” – అని అమరం. అల్పము + మేఘము = అల్పపుమేఘము – కర్మధార యంబులందు “పు, ంపు “లగు – అను సూత్రప్రకారము “అల్పము” “అల్పపు”గా మారినది. ఇక్కడ దీనికి సూక్ష్మమైన మేఘము, అంటే – ఆచ్ఛాదితవస్తువును పూర్తిగా తిరోహితం చేయకుండా, మసకగా కనపడేట్టు కప్పిన పలుచనైన మేఘము అని అర్థం. అట్లే ఆ స్త్రీముఖం గూడ విచారగ్రస్తమై, కొంత కళ దప్పియున్న దని భావము.
8. “వినిపించెను తత్కారణ
మును నీగతి నక్కజంబు వొడమఁగ నాకున్.”- ఏ గతి?
వివరణ: పై అనుమానం నిరర్థకం. “ఈ గతి” అంటే “వక్ష్యమాణప్రకారం” ముందు చెప్పే ప్రకారం అని అర్థం. ఆగతి యేదో అనుస్యూతంగా తరువాతి పద్యంలో చెప్పనే చెప్పబడింది.
9. ఈ క్రింది పద్యం మొదలుకు తుదిలేదు అని నాకనిపిస్తుంది.
“ఒక గంధర్వుఁడు మేఘమాలికలలో నూహించి నీరూపమున్
బ్రకటోత్సాహముతోడ నీవు గల యారామస్థలిం జేరి నీ
మొకమం దావృతమైన వంత గెడపం బూనం గలా డప్పుడే
వికలంబౌను మదీయశాప, మిటకు న్వీతెంతు వీ వంచవై”
వివరణ: పద్యాన్ని అర్థంచేసికొనక చేసిన ఆక్షేపణ ఇది. “ఒక గంధర్వుడు అని ముదలైన వాక్యం “గెడపం బూనం గలాడు” – అనే క్రియతో అర్థవంతంగా సమాప్తమైంది.
10. “ఎన్ని యేఁడులు గడచెనో యెఱుగనైతి / అన్యపురుషునితోడ మాటాడి నేను” – ఇది సాంకేతికంగా ఒప్పే కాని ఆడ హంస అలా అంటే పెడార్థం తీయడానికి ఆస్కారం కలిగించడం లేదూ?
వివరణ: దేనికైన పెడ అర్థం తీయవచ్చును. ఎదుట గన్పడినది పురుషుడు గావున పురుషునితో మాట్లాడి బహుకాలమైనది అన్నది. అట్లే పురుషుని బదులు స్త్రీ కనపడి ఉంటే స్త్రీతో మాట్లాడి బహుకాలమైన దని ఉండేది. అంతేకాని ఆ మాటకు వక్రభాష్యంచేయడం అనవసరం.
11. గంధర్వపతియే తన పతి అని నిర్ధారణ కాకుండానే అతని కౌగిల్లో వాలిపోతుంది హంసి – అన్య పురుషుని కోసం మొహం వాచినదానిలా. ఎందుకో?
వివరణ: ఆ సంఘటన యాదృచ్ఛికంగా, దైవికంగా జరిగిందని సరిపెట్టుకోవాలి గాని, దానికీ వక్రభాష్యం చెప్ప రాదు. ముందే గంధర్వుడు పతి అని చెప్పితే కథలోని Suspence , పట్టు పూర్తిగా తప్పిపోతుంది.
12. “నాకుఁ దెలియ దేరీతి గంధర్వరూప మబ్బెనో కాని” అని భలేగా కవికి కారణం చెప్పకుండా తప్పించుకున్నాడు హంసవతంసము.
వివరణ: కథలో కొన్ని అంశాలు గుప్తంగా ఉంచుతేనే Suspenseful గా ఉండి కథ రాణిస్తుంది. ఐనా ఆ గంధర్వునికి పూర్వజన్మపరిజ్ఞానం ఉందనికూడ అనుకోలేము. “ధాతృకుటుంబిని మాదుమేలుకే యీ పథకంబుఁ బన్నెనని యెంచి” –అన్న వాక్యంలోని ఆంతర్యం సరస్వతీదేవి ముందుగా కోపగించినా, శాపానంతరం హంస మిథునం కలిసి ఉండాలనే పైవిధమైన శాపవిమోచనపథకం కల్గించిందని, అందుచేత దైవికమైన ఘటనగా ఆమె ఆ గంధర్వునిఆశ్లేషించిందని, ఈ విషయం సర్వజ్ఞురాలైన సరస్వతీదేవికి తెలిసినా, హంసమిథునానికి అంతవఱకు తెలియదని . భాగవతంలో చెప్పినట్లుగా, నవవిధభక్తిస్వరూపాలలో ప్రముఖమైన “తదంఘ్రి” సేవాభాగ్యము మఱల కలిగిందని ఆ హంసమిథునం తృప్తి. ఇదియే లైలాగారు లేవదీసిన అంశానికి గూడ జవాబు.
‘కఱ్ఱచట్రంబుపై” అన్న పద్యం తేటగీతి. ఈ పద్యానికి ప్రాసనియమం లేదు. పద్యచ్ఛందస్సును సరిగా గుర్తించలేక పొరపడుతున్నారు మీరంతే కాని, పద్యరచనలో దోష మేమీ లేదు.
మొదటిసారిగా ఈ సైట్ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. కొడవళ్ళ హనుమంతరావు గారి వ్యాసానికి, ఆయనకి శతకోటి వందనాలు.
ప్రస్తుత్తమో అప్రస్తుతమో తెలీదు కాని, ఒక విన్నపం. వ్యక్తుల పేర్లలో surnames ని తగ్గిద్దాం, వీలయితే వదిలేద్దాం. ఏమంటారు ?
“ముఖేందుబింబమును నల్పపు మేఘములట్లు గ్రమ్మె” – ఇందులో అల్పపు మేఘాలా? నల్పగు మేఘాలా? అల్ప శబ్దాన్ని పరిమాణార్థంలో కవి విరివిగా వాడుతున్నారు. అది సరికాదేమో!
“వినిపించెను తత్కారణ
మును నీగతి నక్కజంబు వొడమఁగ నాకున్.”- ఏ గతి?
ఈ క్రింది పద్యం మొదలుకు తుదిలేదు అని నాకనిపిస్తుంది.
“ఒక గంధర్వుఁడు మేఘమాలికలలో నూహించి నీరూపమున్
బ్రకటోత్సాహముతోడ నీవు గల యారామస్థలిం జేరి నీ
మొకమం దావృతమైన వంత గెడపం బూనం గలా డప్పుడే
వికలంబౌను మదీయశాప, మిటకు న్వీతెంతు వీ వంచవై”
“ఎన్ని యేఁడులు గడచెనో యెఱుగనైతి
అన్యపురుషునితోడ మాటాడి నేను” – ఇది సాంకేతికంగా ఒప్పే కాని ఆడ హంస అలా అంటే పెడార్థం తీయడానికి ఆస్కారం కలిగించడం లేదూ?
గంధర్వపతియే తన పతి అని నిర్ధారణ కాకుండానే అతని కౌగిల్లో వాలిపోతుంది హంసి – అన్య పురుషుని కోసం మొహం వాచినదానిలా. ఎందుకో?
“నాకుఁ దెలియ దేరీతి గంధర్వరూప మబ్బెనో కాని” అని భలేగా కవికి కారణం చెప్పకుండా తప్పించుకున్నాడు హంసవతంసము.
ఎన్నో సందేహాలున్నాయి ఇంకా – సమయం దొరికితేఅడిగి తెలుసు కొంటాను.
కరటకశాస్త్రి శిష్యుని భాషలో చెప్పాలంటే, “వీని శిగ్గోసిరి..ఎంతబాగా అన్నాడండి ఈ huge harry గాడు. వీని తస్సాగొయ్యా ఆ అలంకారికులంతా పనీపాటాలేకుండా ఒక వెయ్యేళ్లపాటు అదేంటో ఒకటే తెగ హైరానా పడిపోయి ధ్వన్యాలోకాలన్నీ రాసేసి మా గురువుగారి లాంటి వాళ్లచేత నా నెత్తిన రుద్దేస్తున్నారే!! హారిదేవుడో!! ఈ హారీ గాడెవడో ఒక కంప్యూటర్ తెచ్చి నాకిచ్చినట్టాయనా.. ఆ వెంకటేశం గాడి పనిపట్టనూ? వాడిదగ్గరే కంప్యూటర్ ఉందని ఏం గర్రాగా ఉన్నాడూ?? మా ఈ గురువుల సృజనంతా కలుషితం అయిపోయింది.” వాడెవడూ? ఆ కాళిదాసు కావ్యాలన్నీ ఆ కల్పనలన్నీ వట్టిబూజు! ఒక్క కంప్యూటర్ మాత్రమే “స్వచ్చమైన” సృజనని కల్పిస్తుంది. అంతేకదా మరి ..దానికదే విడిగా డబ్బు సంపాదించనఖ్ఖరలేదు. పేరు సంపాదించనఖ్ఖరలేదు. శృంగారపు జంఝాటం దానికి అసలేలేదు. నాకు కూడా ఒక కంప్యూటర్ గురువైతే ఎంత బాగుండూ?!! కనీశం నేను వచ్చేజనమలో అయినా ఇలా ఈ సుబ్బిలాంటి వేషం కట్టి గురువుగారి కూతుర్ని పెళ్ళాడకుండా నాకు నచ్చిన కంప్యూటర్ ని ఎన్నుకుందును కదా?? సృజన అంటే మధురవాణిలా ఉంటుందని అనుకున్నానే ఇన్నాళ్ళూ నేను. చీచీ !! మధురవాణి ఏం బాగుండదన్నమాట. అది కల్తీ సాని!! ఈ కంప్యూటర్ ఉందే!! ఇదొక్కటే మా నికార్సైన “స్వచ్చమైన “సాని!!
ఇట్లు శ్రీ వేంకటేశం స్నేహితుడుకాని “సుబ్బి”వ్రాలు
రమ.
పి.యస్ . అదేంటోగానీ నాకు అన్నిటికీ డు లు పెట్టి పాఠకుడు..విమర్శకుడు అంటూ “డు” “డూ” అని చదూతుంటే కూడా ఒహటే గుద్దుకుంటున్నట్టూందేంటీ?? ఏంటో? “అహం” వల్ల కాబోలు! మరి నేను ఇంతే ఎప్పటికీ కంప్యూటర్ ని కాలేను కాదు. చస్తే కాను కూడాను. నాకు కల్తీ కల్పనే బాగుంటుంది. కల్తీలేని యంత్రమ్ కల్పించే కల్పన కాదు. అలాంటి కల్పన గిరీశాలకి బాగుంటుంది కాబోలు.!!
నాకు తెలుసున్నంత వరకూ తాళ గతికీ అంత్య ప్రాసకీ సంబంధం లేదు. అంత్యప్రాస పాదం ముగించేటప్పుడు అందంగా ఉంటుంది. మీరు చెప్పినట్లు కేవలం రూపకాది తాళాలకే అంత్యప్రాసుండాలన్న నియమమూ లేదు. ఉండకూడదన్న సూత్రమూ లేదు. ఈ క్రింది త్యాగరాజ కీర్తన రూపకతాళంలో వుంది. ఇందులో రెండో అక్షర ప్రాసొక్కటే కనిపిస్తుంది.
భక్తి బిచ్చమియ్యవే
భావుకమగు సాత్వీక (భ)
ముక్తికఖిల శక్తికి త్రి-
మూర్తులకతి మేల్మి రామ (భ)
ప్రాణము లేని వానికి బంగారు పాగ చుట్టి
ఆణి వజ్ర భూషణమురమందు పెట్టు రీతి
జాణలకు పురాణాగమ శాస్త్ర వేద జప ప్రసంగ
త్రాణ కల్గియేమి భక్త త్యాగరాజ నుత రామ (భ)
అయితే సాధారణంగా చాలా భజన పాటలు రూపక తాళంలోనే స్వరపరుస్తారు. మోహనగారు చెప్పినట్లు ఆరేసి మాత్రలకి సమన్వయం కోసం అత్యప్రాస్తలు వాడుతారు. ఖండచాపులో వున్న “నాదుపై పలికేరు నరులు” కృతిలో ఒక చరణంలో ఏ ప్రాసా లేదు. మిగతా చరణాల్లో ద్వితీయాక్షర ప్రాసుంది.
దినము నిత్యోత్సవమునకాస జెందితి
నా మనసున ఇల్లు ఒకటియనియుంటి కాని
అనుదినమునొరుల మేలును జూచి తాళ
లేకను రెండు సేయ వలెననుచు పల్కితినా
ప్రాసుంటే వినడానికి బావుంటుంది. లేకపోయినా పాట వినసొంపుగా ఉన్నంత వరకూ అభ్యంతరం లేదని నా అభిప్రాయం.
వినీల్ గారు, నాకు సంగీత జ్ఞానము లేదు కాని, నాకు తెలిసినంతవరకు తాళం గతి (నడక) పైన ఆధారపడి ఉంటుంది. గతి మాత్రలపైన (దీనినే కళలు అని కూడ అంటారు) ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పిన రూపక తాళానికి ఆధారం ఆరు మాత్రలు. అంత్య ప్రాస పదాలు కనరావా, వినలేవా లాటివి ఉంటే రూపక తాళానికి సరిపోతుంది. విధేయుడు – మోహన
నేను పుట్టింది పట్నవాసములో అయినా పెరిగింది అమ్మమ్మగారింట. నా వయసులో ఓ 17 యేండ్లు తగ్గించి చూసుకుంటే కృష్ణవేణమ్మ గలగలలు, రావిచెట్టు ఆకుల బూరలు, మరీ ముఖ్యంగా మా అమ్మమ్మ నాకోసం దాచే మొదటి అరిశె ఇలా ఎనెన్నో జ్ఞాపకాల దొంతర. కాని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను బహుశా నాదే ఆఖరి తరమేమో అచ్చ తెలుగు సంక్రాంతిని మనసారా ఆస్వాదించినది. దేశాంతరవాసములో రేపు నాపిల్లలు వచ్చిపోయే అతిథులే కాని వారి సొంతము కాదేమో. కాసుల వేటకి దేశాంతరం వచ్చినా నాకు వెంటనే తెలిసిపోయింది నేను తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ సంస్కృతి నాది కాదని. ఏది ఏమైనా మరోసారి నా మనసుని మా ఊరి పోలిమేరకి తీసుకెళ్ళారు. ధన్యవాదాలు.
అరుణ్ చంద్ర గడ్డిపాటి.
రామాయణం కథ నాలాటి అపండిత పల్లెటూరి ఘటం చదువుకుంటే, ప్రతి పాత్ర దేనికదే స్పష్టంగా ఉంటుంది. ఎన్నో పేర్లు వస్తూ ఉంటాయి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు – అందరూ విడివిడిగానే కనిపిస్తారు. ఋషులుంటే వశిష్టుడు, విశ్వామిత్రుడు, ఋష్యశృంగుడు. ఇలా ఎవరికి వారే. ఎవరి పాత్ర వారిదే. మనుషులకేనా అంటే కోతులకు కూడా వారి ఐడెంటిటీలున్నయ్. వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు – ఇలా ఎన్ని పేర్లు గుర్తుంచుకోటానికీ ఏం ఇబ్బంది లేదు.
కధలు ఇష్టపడేవాళ్ళు నాలాటి వారు అనేక రకాల పాత్రలను ఇష్టపడతారు. ఆ పాత్రల వైవిధ్యం లోంచి, వారి సంభాషణల నుంచీ, స్నేహాల నుంచీ, ఘర్షణల్నుంచీ, వినోదం కలుగుతుంది. ఆ జరిగే సంఘటనల మీదా, రాబొయే ఘట్టాల మీదా నాకు ఆసక్తి. అది నా తెలియనితనం లో నుంచి వచ్చిన రక్తి.
కాని పండిత వ్యాసులకు, ఇట్టి మామూలు కథల మామూలు మానవులకుండే అట్టి ఎదురు చూపుల అమాయకమైన ఆనందాలు లేవు. Scholars ఉన్నవీ లేనివీ అర్థాలు తీసుకుని, ప్రతిదీ లోతుగా తవ్వుకుని పోతూ, ఆ గూఢార్థాల గోతిలో పడి చివరికి -అన్నీ ఒకే అర్థం చెప్పుకుని, అన్నీఅంతకు ముందే తెలుసుననుకుని, అంతా ఒకటై పోయి- నిరవధిక, నిరామయ, నిర్గుణ సుఖం అనుభవిస్తూ ఉంటారు.
ఆ సుఖం నాకొద్దండి.
రామాయణంలో సీతా రాముడూ ఒకరే అంటే, ఆ మతమేంటో నాకు మాత్రం అంటించకండి. పైగా శబరి పాత్ర కల్పనకు కారణం ఏంటని ఆలోచన చెస్తూ, సీతా, శబరీ కూడా రాముడికి ఒకటేనంటే, ఇక నేను ‘ఏమి రామ కథ! శబరీ, శబరీ’ – అని లబలబలాడాల్సిందే.
రామా=సీతా= శబరి= బ్రహ్మ పదార్థం.
రాముడు = సీత = విశ్వనాథ = you know who= you know why.
Satan = Milton = T.S. Eliot = H. Bloom=
ఈ వ్యాసంలో ఎవరి అభిప్రాయాలు ఏవో విడదీయటం, ఎవరి తరం?
రెండు నెలలకోసారి ఒక సాహిత్య పురుషుడిపై ప్రేమ ప్రకటనలు చెయ్యమని సంపాదకులు అడిగితే, రాసే ‘మధుర భక్తి’ వ్యాసాలు ఇలాగే గజిబిజిగా ఉంటాయి. అప్పటి వరకు బాగున్న నాకు ఇట్టి ‘కోవెల’ లోకి అడుగు పెట్టగానే ‘జీవుని వేదన’ ఆరంభమవుతుంది.
లైలా ఉవాచ-
(’ఆచార్యులు’ ‘ఆచార్యులు’ -అంటున్నారు మాటల్లో అక్కడక్కడా. అది ‘డా’ కి పర్యాయపదమనీ, ఈ రచయిత పేరులో భాగం కాదనీ, నా ఊహ. తప్పైతే, చెపుతారుగా.:-))
నా ఊహలో రావు, శర్మలా ఆచార్య కూడా అతని పేరిలోని ఒక భాగమే. వైష్ణవులలో మతాచార్యుల వంశములో పుట్టిన వాళ్లు ఇలా పేరులుంచుకొంటారు. తరువాతి కాలంలో సంపత్కుమారులు నిజంగా ఆచార్యులయ్యారు. కాని ఆ ఆచార్య పట్టము పేరుకు ముందు వస్తుంది, తరువాత కాదు. మనకు స్వాతంత్ర్యము సిద్ధించిన తరువాత ఎన్నో కారణాలవల్ల శర్మ, ఆచార్య, భట్ట, అయ్యంగారు లాటి పేరులు వాడుకలో తగ్గిపోయింది. రావు, రెడ్డి ఇత్యాదులు మాత్రము ఇంకా వాడుకలో ఉంది. – మోహన
…సంపత్కుమార రాసిన పద్యాలు కవిత్వమని ఎవరూ అనుకోరనుకుంటాను.
రమ.
… సంపత్కుమారులే ఇది సరదా రచన అని చెప్పుకొన్నారు. …ఈ పుస్తకాన్ని ఆచార్యులు చేరాగారి సతీమణి శ్రీమతి రంగనాయకికి అంకితమిచ్చారు. ఈ శతకాన్ని ఆధారం చేసికొని ఆచార్యులను అంచనా వేయడము తప్పని నా వైయక్తిక భావన. విధేయుడు – మోహన
రమ, మోహన, -విషయాలు కొన్ని తెలియ చెప్పినందుకు సంతోషం.
Reading in between the lines, I get the impression neither of the two, think much of these poems.
నాకు ఈ పద్యాలు బాగున్నయ్యి. సరదాగా ఉన్నయ్యి. పండితులకు ‘సరదా’ ఉండకూడదని నిషేధం ఏం లేదు కదా. కంద పద్యానికి విధించుకున్న నియమాలు ఉల్లంఘించారో, లేదో – అది నాకెలాగా తెలియదు. కాని సం -లు ఎంచి ఇచ్చిన ఈ పద్యాలలో నవ్వు ఉంది. నిజమూ ఉంది. మకుటంలో ‘దోస్తూ’ ‘నేస్తూ’ అన్నా, ‘చేరా’ ‘యారా’ అన్నా, పద్యంలో విషయముంది. చెప్పదల్చుకున్న విషయాలు పద్య్ర రూపంలో సంపత్ చెప్పగలిగారు. మేధావులనుంచి ప్రజలకు వచ్చే బాధలూ చెప్పారు. సమకాలీన కవులను గురించీ నవ్వారు. పిల్లలు వేళకు తిన్నారో లేదో అని పట్టించుకోక, బహుమతుల మోజులో, పిల్లల్ని ప్రైజు పిగ్గు ల్లాగా పెంచుకొనే రివాజు గురించీ చెప్పారు. అట్టి అమ్మానాన్నల పాలనలో పిల్లలకన్నా దళితులెవరురా నాయనా! -అన్నారు. మీవారూ మావారూ సాంబారు కాసుకోటానికి తప్ప నీ నా రాతలు ఎంత చేసేను – అని నవ్వుకుంటూ అంటున్నారు.
నవ్వుతూ నవ్వుతూ రాసిన ఈ పద్యాలు నాకు బాగున్నయ్యి.
పద్యాల్లో మైత్రి గురించి:
ఈ పద్యాలు, ఒక మగవాడు ఇంకో మగవాడికి రాసినవి. వీరి మైత్రి ఒకటో రెండో పద్యాల్లో సూచితము. సంపాదకులు, ఇతరులు కూడా, వీరి మైత్రిని కొంత కవిత్వీకరించారు.
Jumping to a generalisation quickly (fortified from prior reading of a few other writings in this magazine,) my impression is, friendships mostly existed ( and exist ) between ‘male’ writers. What I mean is -they are unisex friendships. There are no cross gender friendships among writers.
డాబా మీద కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్నా, కాలవ గట్టులకు షికారెల్లినా, ఒక కవి ఇంకో యువక కవిని రిక్షా కట్టించుకుని చూస్తానికి వచ్చినా, ఇవన్నీ మగ-మగ స్నేహాలే. (ఈ పత్రికలో ఏ రాతల్లోనూ, మగ ఆడ రచయితల మధ్య సాహిత్యపరంగా, స్నేహం వ్యక్తం చెయ్యబడలేదు.)
What prevails is ‘homophilia’ among male writers and poets. Telugu (Indian) people are very comfortable with such social behaviours. In life. In portraying them in arts. They understand and accept these ‘male’ friendships. There is never any suspicion of homosexuality. నేను అపోహ ప్రవేశపెడుతున్నానని అనుకోకండి. I don’t have the slightest inclination to do so. I really don’t expect it of Telugu. తెలుగులో చెప్పాలంటే – అంత సంబడం కూడానా.:-) I don’t think in Telugu, there are or there will be love sonnets from one male to the other, like from Shakespere to his young friend.
In these Telugu poems, from one male to the other, there are no homoerotic overtones. In this set of poems, there is a sexual void.
Overall, I am making an observation of prevalance of male friendships in Telugu writers and absence of sexuality in their writings.
త్యాగరాజు కృతులు గాని శ్యామశాస్త్రి కృతులు గాని మొదట్లొ తమిళ,కన్నడ విద్వాంసులెవరు పాడినా సాహిత్యం తెలుసుకోడానికి చాలా కష్టపడినా గానీ బోధ పడేది కాదు. తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి కొఱకరాని కొయ్య గా ఉంటుంది. కాని బాలమురళి పాడినది విన్నపుడు ఈ సమస్య ఎదురయ్యేది కాదు. దీని వల్ల ఆయా కీర్తనలూ, కృతులూ వినాలనే అభిలాష కూడా పెరిగి అందులొ అభిరుచి పెరుగుతుదని నీను నా స్వానుభవంతొ చెప్పగలుగుతున్నాను. నాకు కించిత్తు స్వరజ్ఞానం లేదు గాని త్యాగరాజు పంచరత్న కీర్తనల్ని ఇంచుమించు బాలమురళి పాడినట్లుగానే పాడేస్తున్నాని నా మిత్రబ్రుందం అని మెచ్చుకోగా విని ఆనందపడిపొతూ ఉంటూ ఉంటాను. పరోక్షంగా నే బాలమురళి గారి “వీరాభిమానిని” ఐపోయాను కూడా.
నారాయణంబాబు వేదుల జంషెడపూరు.
ఈ విషయం మీద నేను చాలా చోట్ల చర్చించాను కాబట్టి చర్విత చర్వణం అవుతుంది అని చర్చలోకి ప్రవేశించ లేదు. కవిత్వ మీమాంస అన్న వ్యాసంలో రెండవ భాగం కవిత్వ మీమాంస అన్న శీర్షిక కింద నా ఆలోచనలు చూడగలరు.అలాగే ఈ సంభాషణలో మూడవ ప్రశ్నకు నేనిచ్చిన జవాబు కొంతవరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.
చేరా ఆచార్యుల గారి చర్చ గురించి నేను చాలా విన్నాను. కానీ, ఆ పుస్తకం సంపాదించి చదివినప్పుడు (1990 లలో) నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ‘vers libre ‘(free verse) గురించి వీరిద్దరూ పట్టించుకోక పోవడం. చారిత్రక నేపథ్యాన్ని విస్మరిస్తే చర్చలో పదును పోతుంది, ఎన్ని విలువైన విషయాలను ప్రస్తావించినా. సమస్య మూలాలను వదిలి అనేకానేక విషయాలు చర్చించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఏది ఏమైనా ఈ చర్చ చరిత్రలో భాగమే కనుక తప్పక చదవ వలసిందే.
శుష్క వచనాన్ని, శుద్ధ కవిత్వాన్ని విడదీసేది భావనా శక్తి. వచనంలో మామూలు తర్కంతో బండి నడుస్తుంది.ఎక్కువ ఖాళీలు ఉండవు. పాఠకుని ఊహా శక్తికి మేత వేయడు రచయిత. దానికి భిన్నంగా కవి పాఠకుని భావనా శక్తిని పరీక్షిస్తాడు. కవిత్వంలో తర్కం లేదు అన్న వితండ వాదం చేయడం లేదు నేను. తర్కాన్ని మించిన భావనా బలం కవితకు ప్రాణం. దాన్ని పాఠకునిలో స్ఫురింప చేయడానికి పాదకల్పన అవసరమవుతుంది. పాదకల్పన కంద పద్యాల్లోనో ఆటవెలదిలోనో ఉన్నట్టు కాకుండా స్వేచ్చగా ఉంటుంది. పాఠకునికి కవి తాను చూసిన జగత్తును చూపి తద్వారా తాను పొందిన అనుభవాన్నిసూచించడానికి సాధనం పాదకల్పన. పాద కల్పన లేకుండా , వాక్యం తరువాత వచ్చే వాక్యం ఒక తర్క ధోరణిలో పడి పోతుంది. వాక్యాల మధ్య అన్వయం హేతుబుద్ధికి అందుతుంది. కవిత్వంలో వాక్యాల మధ్య అన్వయం
హేతుబుద్ధిని దాటిన భావనా శక్తికి సంబంధించినది.దాన్ని సాధించడానికి ఒక సాధనం పాద కల్పన.కవితకు ఒక క్రమం, నడకా,నిర్మాణం ఉన్నాయి మరి. అంతేకాదు,పాదకల్పన లేకుండా కవితలోని ఎత్తుగడ అర్థం కాదు.లయ అవగతం కాదు.
చివరికి చెప్పేదేమిటంటే వచనం రేఖీయం(linear). కవిత వృత్తం. అది ఎలాంటి వృత్తం? దాని గణితం జోలికి పోవడం అభిప్రాయాన్నిమించిన చర్చ.
ఈ విషయంలో ఇస్మాయిల్ గారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉపయోగిస్తుంది.
“ఆధునిక కవిత్వానికి వచన కవిత్వ మనే దౌర్భాగ్యపు పేరు ఎవరు పెట్టారో కాని,నిజమే ననుకొని శుష్క వచనం రాసేస్తున్నారు చాలామంది.వచనంలాగే కవిత్వానికి ఒక క్రమం, నడకా,నిర్మాణం అవసరం లేదని వీళ్ళ అభిప్రాయం.ఆ మాట కొస్తే,వచనానికి కూడా క్రమం, నిర్మాణం కావాలి కదా!మనం మాట్లాడే భాషే మన అనుభవాన్ని,ఆలోచనల్నీ క్రమబద్ధం చేసే ఉపకరణం.కవిత్వం జీవితానుభవాన్ని క్రమబద్ధం చెయ్యటమే కాదు, వాటి చాటునున్న అర్థవత్వ్తాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.” (నిశ్శబ్దంలో నీ నవ్వులు, నా కవితా సంకలనానికి రాసిన ముందుమాట , భూషణీయం నుంచి.)
కామేశ్వర రావు గారూ ,
ఇప్పటికి మీ మొదటి ,మూడవ ప్రశ్నల కు సమాధానం వచ్చిందే అనుకొంటున్నాను. ఇక మిగిలింది రెండవ ప్రశ్న.
౨.
” అ.ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని,
ఆ. పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?”
( అ. ఆ లు నావి , స్పష్టత కోసం )
‘vers libre ‘(free verse ) స్ఫూర్తితో ఆలోచిస్తే (ఆ )సమంజసం కాదు. కానీ, ‘vers libre ‘(free verse ) పాద కల్పనకు వ్యతిరేకం కాదు. ఫ్రెంచి కవులు బిర్ర బిగుసుకుపోయిన ఛందో నియమ నిబంధనలను అతిక్రమించి వాటిని పాటించడమే కవిత్వం కాదు వాటికి బయట కూడా కవిత్వం ఉంటుంది అని చెప్ప దలుచుకున్నారు. (మోహన గారి విలువైన అభిప్రాయం చూడండి పద్యం కూడా ఒక రకమైన వచనమే).ఈ స్ఫూర్తిని గ్రహించిన కవులు చాలా వరకు అన్ని భాషల్లోనూ వారికి తోచిన రీతిలో పాద కల్పన పాటించారు. జర్మన్ , రష్యన్ లో అంత్య ప్రాసలు వదులుకో లేదు అక్కడి కవులు.(ఈ విషయంలో ఈ నాటికీ రష్యన్లు అమెరికన్ లను ఎద్దేవా చేయడం నేను ప్రత్యక్షంగా చూసిన విషయం.) సారాంశం ఏమంటే ఈ స్ఫూర్తిని గ్రహించి, నీ భాషకు ఏది అందమో దాన్ని వదలకుండా కవిత్వ రచన చేయాలి.
ఇక మిగిలింది prose -poem . కవిత్వాన్ని బహువచనాల బారీ నుండి కాపాడడానికి పుట్టుకొచ్చింది అంటారు Robert Bly. శ్రీ శ్రీ కవిత్వం తీసుకోండి పతితులారా భ్రష్టులారా ..అన్నీ బహువచానాలే. రాజకీయ కవిత్వంలో ఇది తప్పదు. కానీ , ఇది కవిత్వానికి చేటు చేస్తుంది. మనం చూసేది ఒక్కొక్క వస్తువునే. వస్తు సముదాయాలను కాదు. ఈ ఎరుకతో రాసేది prose -poem ఇది కూడా ముందు ఫ్రెంచి కవులే సాధించి చూపారు. ఎక్కువ వివరాలకు Talking All Morning, పుస్తకంలో On Writing Prose Poems అన్న ఇంటర్ వ్యూ (1975 లో వచ్చింది.). అలాగే తొలినాటి ఫ్రెంచి కవుల కవితా సంగ్రహం సవిమర్శకంగా చదవాలి.
మన విమర్శకులకు పరభాషా సాంగత్యం లేక చాలా చేటు జరిగింది. పట్టు మని పది భాషల్లో వచ్చిన విమర్శలు చదవరు. అనువాదాల మీద శ్రద్ధ లేదు.చరిత్ర తెలుసుకోరు.ఆధునిక కవిత్వం దాని విమర్శ ఒక ప్రత్యేక విభాగం అన్న స్పృహే లేదు. పిండి కొద్దీ రొట్టె. శుష్క వాదాలు శూన్య హస్తాలు. ఇక జాలింతును; స్వస్తి.
రమగారూ,
నేనసలు కవుల జోలికే పోలేదండి! తమ కవిత్వంలో పదాలని రకరకాల అర్థాలలో ప్రయోగించే స్చేచ్ఛ కవులకి ఎప్పుడూ ఉంది. అది లేకపోతే కవిత్వమే లేదు. నేను చెప్పినది విమర్శలు, లక్షణ చర్చల విషయంలో. అందులోని పరిభాషకి స్పష్టత నిర్దిష్టత అనివార్యం కదా.
ఈ చర్చని ఈనాటి వచన కవులు చదవలేదంటే అది ఆ కవుల తప్పు కాదా? ఇందులోని అభిప్రాయాలని పరిగణించాల్సిన అవసరం లేదు. కాని విషయం ముఖ్యమైనది అనుకున్నప్పుడు, దాని గురించి తమ అభిప్రాయాలని చెప్పాలి కదా. వచనకవిత్వ రూపాన్ని గురించి, పాదవిభజన గురించి మరింత అవగాహన కవులకి, పాఠకులకి అవసరమని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు కనీసం ఈ చర్చ ద్వారానైనా కవులు ముందుకువచ్చి తమ అనుభవాలనూ, ఆలోచనలనూ పంచుకుంటే బాగుంటుంది కదా?
మాధవ్ గారూ,
పద్య నిర్మాణపు చట్రం గురించి మీరు ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. పాటకి స్వరం మౌలిక లక్షణం. మీరు చెప్పిన ఇతర “గీత” లక్షణాలు “పాట”లన్నిటికీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ దాన్ని పాటగా “స్ఫురింప”జెయ్యడం అంటూ ఏమీ లేదు. అది ముమ్మాటికీ సిసలైన పాటే! పాదవిభజన కవితకి అలాంటి మౌలిక లక్షణం కాదని నేను భావిస్తాను. అయినా మీరు “స్ఫురణ” విషయంలో చెప్పింది నాకు అర్థమయ్యింది. పాదవిభజన చెయ్యడం వలన అది కవిత అన్న స్ఫురణ ఎందుకు కలుగుతోంది అన్న విషయమై ఆలోచించాలి. కేవలం పరంపరగా కవిత్వం పాదబద్ధం కావడం మూలాన ఆ స్ఫురణ కలుగుతోందంటే, అది అంత విలువైన విషయం కాదు. కాలాగతిలో అది చెరిగిపోతుంది. అంతకన్నా విలువైన ప్రయోజనం ఉందా అని ఆలోచించాలి.
రమగారూ,
“పద్యం” అన్న పదాన్ని “కవిత” అనే అర్థంలో కొంతమంది కవులు, విమర్శకులు వాడారన్న విషయం నాకు తెలుసు. అయితే అది శాస్త్రీయం కాదన్నదే నా అభిప్రాయం, దానికే నా ముందు వ్యాఖ్యలో హేతువులు చూపెట్టాను. ముఖ్యంగా అలాంటి వాడుక అయోమయానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటి చర్చాంశమైన వ్యాస పరంపరలో, “వచన పద్యం” అన్న పదంలో పద్యం అంటే పాదబద్ధత ఉన్న రచన అనే ఉద్దేశ్యంలోనే తీసుకున్నారు కాని కేవలం “కవిత” అనే అర్థంలో తీసుకోలేదు. వచనకవితలని వచనపద్యాలు అనుంటున్నాం కాబట్టి అవి కచ్చితంగా పాదబద్ధం కావలసిందేనని సంపత్కుమారగారన్నారు. దాన్ని చేరాగారు కూడా ఖండించ లేదు! కవిత అనే అర్థంలో మాత్రమే “వచనపద్యాలు” అని, అవి వచనపద్యాలు కాబట్టి వాటికి పాదబద్ధత ఉండాలనడం సరైన వాదన కాదు కదా!
వచనకవితా స్వరూపాన్ని గురించి వచనకవులు మరింతగా చర్చించాలన్న విషయమై మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నా వ్యాఖ్యలోకూడా అదే అన్నాను. అలాంటి చర్చ చెయ్యడానికి అడ్డంకి ఏముంది? ఈమాటలో వ్రాసే/ఈమాటని చదివే వచనకవులు/కవయిత్రులు ఇప్పటికీ ఈ చర్చలో ఎందుకు పాల్గొనటం లేదో మరి!
మాధవ్ గారూ,
“ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది.” ఇక్కడ “పద్య నిర్మాణపు చట్రం” అంటే ఏమిటన్నది నాకు పూర్తిగా అర్థమవ్వలేదు. పాదబద్ధతా? లేక అక్షర, గణ, మాత్రా ఛందస్సా? అలాగే ఆ చట్రంలో ఉండటం వల్ల వచ్చే “కవితాలక్షణం” ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు.
“పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!”. రెండిటికీ తేడా ఉంది. ఎక్కడ విరామం ఇవ్వాలన్నది కవి ఊహబట్టి, కవిత బట్టి ఉంటుంది. దాన్ని భావము, భావాంశము అనే చట్రంలో బిగించడం సాధ్యం కాదు. ఒక కవితలో ఒక భావం పూర్తి కాకుండానే సగంలో పాఠకుణ్ణి హఠాత్తుగా ఆపాలని కవి అనుకుంటే, అక్కడ మధ్యలో పాదాన్ని ఆపవచ్చు. అది సంపత్కుమారగారు నిర్వచించిన “భావాంశం” అని చెప్పలేం. ఉదాహరణకి ఈ నెల ఈమాటలో వచ్చిన భూషణ్ గారి “శిశిరచిత్రాలు” కవితలో ఈ పంక్తులు చూడండి.
కలిసిన రోజుల
రంగురంగుల
జ్ఞాపకాల ఆకులను
పెళుసు కొమ్మలతో
దులుపు కోవడమే
మేలు.
…
ప్రేమగా వీచినా అసలు
ఆకులు రాల్చనంది
ఇక్కడ “రంగురంగుల” అన్నది ఏ కోశానైనా భావాంశం అవుతుందా? “ప్రేమగా వీచినా అసలు” అన్న వాక్యంలో భావం కాని భావాంశం కాని పూర్తయ్యిందా? అయినా కవి పాదాలని అక్కడ విరిచాడంటె ఎందుకు? సంపత్కుమారగారు ఇలాంటి వాటిని exceptionsగా లేదా ఛందోదోషాలుగా పరిగణించారు. ఒక చట్రాన్ని ఊహించి దానికి లొంగని వాటిని దోషాలుగా పరిగణించడం కన్నా, ప్రతి కవితకీ తనదైన చట్రం కవి గీసుకుంటాడని అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరు ప్రస్తావించిన సౌష్టవం విషయమై కూడా నాదిదే అభిప్రాయం. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందిచడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను. ఇంగ్లీషు సాహిత్యంలో కవితా నిర్మాణం గురించి సాధారణీకరణలేమైనా చేసారేమో అందులో పరిచయమున్నవారెవరైనా చెప్పాలి. అది మనకి ఉపయోగపడే అవకాశం ఉంది.
సంపత్కుమార, చేరాగార్ల యీ చర్చ కొద్ది కాలం కిందటే నేను చదివాను. దాని వల్ల అసలు విషయం కన్నా కొసరు విషయాలు అనేకం తెలుసుకున్నాను. ముఖ్యంగా, వృత్తాలకి “భరనభభరవ – ఉత్పలమాల” అన్నట్టుగా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న లక్షణం, ఈ వ్యాసాలు చదివాకే అనుకుంటాను, అది కేవలం వెసలుబాటుకే తప్ప అసలు లక్షణం గురులఘు క్రమమే అన్న realization కలిగింది! అలానే మరెన్నో ఛందోవ్యాకరణాంశాలు కూడా తెలిసాయి. ఇక అసలైన, “వచన పద్య లక్షణం” విషయానికి వస్తే, దాని గురించి నా అభిప్రాయాలివి:
1. అన్నిటికన్నా ఈ చర్చలో నన్ను ఆశ్చర్యపరచిన విషయం, “వచన పద్యం” అన్న పేరుకి చేరాగారు కాని నాగరాజుగారు కాని పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం. నాకున్న పెద్ద అభ్యంతరం ఆ పేరు! “పద్యం” అన్నది ప్రక్రియా రూపాన్నే కాని కవిత్వాన్ని సూచించే పదం కాదన్నది అందరూ అంగీకరించే విషయమే. ప్రాచీన సాహిత్యంలో కూడా పద్యాలలో శాస్త్రాలవంటి కవిత్వేతర రచనలూ, అలాగే గద్యంలో కావ్యాలూ ఉండనే ఉన్నాయి. మరి “వచన” అన్న పదం కూడా అది కవిత్వం అన్న విషయాన్ని సూచించదు. అది దేన్ని సూచిస్తుందో ఈ వ్యాసాల్లో స్పష్టంగా ఎవరూ నిర్వచించినట్టు లేదు. వాడుకలో “ఛందోబద్ధము కాకుండా మాటలుగా వ్రాసినది, గద్య” అన్న అర్థం ఉంది. అంటే ఇది కూడా రూపాన్నే సూచిస్తోందన్న మాట. ఇందులో “కవిత్వం” అని సూచించే పదమే లేకపోతే ఈ ప్రక్రియకి కథ, నవల మొదలైన ఇతర ప్రక్రియలతో ఉన్న తేడా ఎలా తెలుస్తుంది? అంతే కాదు, “వచన”, “పద్యం” అనే పదాలకున్న వ్యతిరేకార్థాల వల్ల ఆ రెండూ కలిపిన పదం ఒక oxymoron అవుతుంది! వచన కవిత్వానికి పాదబద్ధత మౌలికమైన లక్షణం అనుకుంటే, అది ఇప్పటి వరకూ ఉన్న ఛందస్సు కన్నా విభిన్నమైనది అనుకుంటే, అలాంటి ఛందస్సుకి ఒక కొత్త పేరు పెట్టుకోవాలి – వృత్తాలు, జాతులు, ఉపజాతులు, గేయాలు (మాత్రా ఛందస్సులోని పద్యాలు) అన్న పేర్ల లాగా. ఉదాహరణకి భావుకములు అందాం (భావ ప్రాధాన్యం కలిగినవి కాబట్టి). ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన పద్యాలు కలిసి పద్య కవితా ఖండిక అయినట్టుగానే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన భావుక పద్యాలు కలిస్తే మనం మామూలుగా చెప్పే “వచన కవిత” అవుతుంది. అందువల్ల, “వచన కవిత”కి “వచన పద్యం” అన్న పేరు సమంజసం కాదు.
2. నాకు ఆశ్చర్యంగా తోచిన మరొక విషయం అందరూ ఆధునిక వచన కవిత్వానికి పాదబద్ధతని అంగీకరించడం. వచన కవిత్వంలో కనిపించే పాదా విభజన ఐచ్ఛికమా, నియతమా అని ఎవరూ ప్రశ్నించినట్టు లేదు! పాద నిర్మాణానికి నిర్దిష్ట నిర్వచనం సాధ్యమవ్వదు అన్న చేరాగారు కూడా, పాదవిభజన మాత్రం తప్పనిసరే అనుకున్నట్టుగా నాకు అనిపించింది. బహుశా అప్పట్లో వచ్చిన కవిత్వం (ఇప్పటికీ కూడా) చాలా వరకూ పాదాలుగా విభజించబడే ఉండడం దీనికి కారణం కావచ్చు. నా దృష్టిలో అలంకారాల మాదిరిగానే, పాద విభజన కూడా వచనకవిత్వంలో ఐచ్ఛికమే తప్ప కచ్చితంగా పాటించాల్సిన నియమం కాదు. కాబట్టి వచన కవితలు అసలు పద్యాలు అవ్వాల్సిన అవసరమే లేదు. ఆధునికంగా వచ్చిన వచన కవిత్వానికి ఊపిరే స్వేచ్ఛ. ఛందస్సు (కొండొకచో వ్యాకరణ) శృంఖలాలను తెంచుకోడమే వాటి వెనకనున్న స్ఫూర్తి. కాబట్టి, ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని, పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?
3. నా ఉద్దేశంలో ఈ చర్చలో ప్రస్తావనకి నోచుకోని అతిముఖ్య విషయం ఒకటుంది. వచన కవితల్లో పాదవిభజన ప్రయోజనం ఏమిటి అన్నది. వచన కవితలు చాలా వాటిల్లో పాదవిభజన కనిపిస్తుంది. దానికి నిర్దిష్టమైన సూత్రాలు లేకపోయినా, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించి కవులీ పాదవిభజన చేస్తారు? పాదవిభజనతో కూడిన రూపం, కవితకి ఎలాంటి అదనపు విలువని చేకూరుస్తుంది? వచన కవిత్వ రూపానికి సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు విమర్శకుల దృష్టికి అంతగా వచ్చినట్టు లేదు. దీనివల్ల అటు వచనకవిత్వం రాసే కవులకి గాని, దాన్ని చదివే పాఠకులకి గాని ఈ విషయమ్మీద సరైన అవగాహన ఏర్పడ లేదనిపిస్తుంది. వచనకవిత్వ రూపమ్మీద జరిగిన ఈ చర్చలో ఈ విషయాన్ని పరిశీలించడానికి చక్కని ఆస్కారం ఉన్నా, కేవలం లక్షణ నిరూపణ వైపే దృష్టంతా కేంద్రీకరించడం వల్ల, అది జరగలేదు. ఇప్పటికైనా దీనిపై ఎవరైనా, ముఖ్యంగా వచనకవిత్వం రాయడంలో చెయితిరిగిన కవులు, దృష్టి పెడితే బాగుంటుంది. అప్పుడు వచనకవితా రూపంలో పాదవిభజన ఒక శక్తివంతమైన పరికరంగా మారే అవకాశం కలుగుతుంది. పాదవిభజన వల్ల నాకు కనిపించే రెండు సాధారణ ప్రయోజనాలు ఇవి:
ఒకటి, ఆ పాదంలో చెప్పిన విషయం పాఠకుడి మనసుకి పట్టేందుకు ఒక విరామం ఇవ్వడం. ఇది పాదవిభజన లేకుండా కామా, ఫుల్స్టాప్ వంటి గుర్తులతో కూడా చెయ్యవచ్చు. అయితే, అచ్చులో కవితని చదివేటప్పుడు, ఈ రెండు చిహ్నాలు కన్నా కూడా మొత్తం వాక్యాన్ని ఆపి వేస్తే చదువరి మరింత ఎక్కువసేపు అక్కడ విరామమిచ్చే అవకాశం ఉంటుంది.
రెండు, సాధారణ వచనంలోని వాక్యాలు వ్యాకరణబద్ధంగా ఉంటాయి. కాని, ఆధునిక కవిత్వంలో వ్యాకరణ అతిక్రమణ చాలా చోట్ల కనిపిస్తుంది. అంచేత అది మామూలు వచనంలాగా రాసుకుంటూ పోతే చదివే పాఠకునికి చిరాకు కలిగే అవకాశం ఉంది. అదే పాదవిభజనతో రాస్తే, అవి వాక్యశకలాలుగా అనిపించి పాఠకుడికి చిరాకు కలగదు.
ఈ సాధారణ ప్రయోజనాలు కాకుండా కవి ప్రత్యేకమైన ప్రయోజనం కోసం పాదవిభజనని వాడుకోవచ్చు. అలాంటి సందర్భాలుంటే వాటిని పాఠకులు, విమర్శకులూ గుర్తించగలిగే మార్గాలు అన్వేషించాలి.
నేను ఈ కథ చదివాను.. కథ లో సస్పెన్స్ ఉంది.. కాని పాత్రలు కొన్ని గజిబిజిగా వున్నట్టు అనిపించింది. దీనిక్కారణం అవి ఫారిన్ పేర్లు అవడం అనుకుంటున్నా.. కథ పెద్దగా ఉంది..కాబట్టి చదువరి కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది..
మూడు లాంతర్లు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/21/2011 1:26 am
కనక ప్రసాద్ గారూ !!
“ఇంకా ఉంది ఇంకా ఉంది ” అన్న మీ మాట వల్ల అంతా ఒక సారే చదవొచ్చు లెమ్మని ఊరుకుంటూంటే మీరు నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. మీ మొత్తం చదివినా నాకు కలిగే సరికొత్త జ్ఞానమ్ ఏదో ఒహటి ఉంటుందనే నమ్మకం నాకైతే కలగడం లేదు గనక నాకు మీ అభిప్రాయాలు చదువుతూంటే కల్గిన అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పడం ఉచితం అని అన్పించింది. గనక ఈ నాలుగు మాటలూను.
దేవుడి సృష్టి ని గురించిన ప్రశ్నలకి మనకి దొరికే జవాబుల్లో ఎంత స్పష్టత దొరుకుతుందో కవి సృజన వెనుక లోపలి కారణాలని వెతికి పట్టుకునే పని లోనూ అంతే దొరుకుతుంది. కవి తనకే స్పష్టంగా తెలియని తన సృజన కార్యాన్ని గురించి ఇధమిథ్థంగా చెప్పగలుగుతారన్నది [ఇది వరకు కవులంతా మగవాళ్ళే గనక “డు” వాడేయడం సాధ్యమయ్యేది. ఇప్పుడది అసాధ్యం. గనక “కవి” శబ్దాన్నిక్కడ బహువచనంగా స్వీకరించండి వాక్యంలో!!:)] ఎదురు చూడగలిగే విషయం కాదు. మీరు రాసిన పాటల్లోని వాక్యాలతో పోలిస్తే మీ వచనంలోని వాక్యాలు చాలా మేలు! కనీసం అర్ధమయ్యేలా ఉన్నాయి మీ ఊహలు. మీ కవిత్వం “బొమ్మకన్నో” మరో కన్నో గాని పాఠకుల కన్నుకి కూడా అందితే బాగుణ్ణు.
దీన్ని అలా ఉంచితే ఇంగ్లీషు వాడికి మార్మికత తెలీదు. “పెంజీకటికావల” ఒక మూర్తిని అతగాడు రాయనూ లేడు ..ఊహించనూ లేడు. గనక వాళ్ళది మేలైన కవిత్వమో మనది మేలైన కవిత్త్వమో చెప్పడం ఎప్పుడూ కుదిరేది కాదు.
మీరే అన్నట్టు ఇవన్నీ “భాషంత పాతవే”!! వీటికి జవాబులు త్రిపురా నారాయణరావు లు గానీ మీ స్నేహితుడు బిపిన్ గానీ నిజంగా తీర్చగలవి అవునని నాకు అన్పించదు. అయితే ప్రశ్నలు అనాదిగా కలుగుతూంటాయి. వాటికి జవాబులు సైతం మీరంతా అనాదిగా వెతుక్కుంటూనే ఉన్నారు.
ఈ ప్రశ్నల కన్నా మనసు దానిదైన ఒక వివేకంతో తనకి బాగున్న కవిత్వాన్నీ అలాగే ఏమీ పసలేని భావాన్నీ కూడా చప్పున పోల్చుకుంటుంది సహజంగానే !! అందుకే ఎక్కడైనా ఏ కాలంలోనైనా మనకి కవిత్వం అన్నది మిగిలే ఉంది. కవిత్వం కానిది సహజంగానే జారిపోతుంది. గనక మనకి కవులైన అన్నమయ్యలు శతాబ్దాల తరబడి మిగిలి ఉన్నారు. ఉంటారు కూడాను. ఉన్నతమైన సృజన అనేక కారణాలకి బాగుంటుంది. ఏ ఒక్క కారణానికో కాదు.
ఇలాటి ప్రత్యేక సంచికలు ఉండాలా ఉండకూడదా అనే దానిపైన కాదు ఈ అభిప్రాయం. పాత సంచికలు తిరగవేసి అందులో ఇలాటివి ఎన్ని ఉన్నాయో అనే విషయాన్ని తెల్పడమే దీని ఉద్దేశం. జనవరి 2007 నుండి విడుదలయిన ఈమాట సంచికలను ఇందుకై ఎన్నుకొన్నాను. జనవరి 2008లో భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినోత్సవము సందర్భముగా దీనిని ప్రచురించారు. చనిపోయినవారిపయిన మాత్రమే కాదు బతికిఉన్న వాళ్లపయిన కూడ సంచికలను ప్రచురిస్తారు అన్నదానికి ఇది నిదర్శనము. తరువాత నవంబరు 2008లో స్మైలుపైన ఒక సంచిక వచ్చింది. నవంబరు 2009 నుండి ప్రత్యేక సంచికలు కొన్ని ఎక్కువే. అయితే దానికి ఒక కారణము ఉంది. నవంబరు 2009 సంచిక కొ.కు.ను, జనవరి 2010 సంచిక శ్రీశ్రీని వారి శతజయంతి సందర్భముగా సంస్మరిస్తూ ప్రచురించినవి. జూలై 2010 సంచిక శ్రీకృష్ణదేవరాయల సింహాసనారోహణమయి 500 సంవత్సరాలు కాలం గడచిన సందర్భముగా వెలువడింది. కృష్ణరాయలను కన్నడిగులకన్న తెలుగువారు “మనవాడు” అనుకొంటారు, అందులకు ఇది నిదర్శనము. ఈ నెల సంచిక దివంగతులు సంపత్కుమారులను సంస్మరిస్తూ వెలువడింది. సామాన్యముగా ఇటువంటి పండితులను పండితులు, పరిశోధకులు తప్ప మిగిలిన వారెవ్వరూ పట్టించుకోరు. అట్టివారు కూడ తెలుగు భాషకు గొప్ప సేవ చేస్తూ ఉన్నారని ఈ సంచికను చూస్తే మనకు విదితమవుతుంది. అదీ కాక ఇందులోని వచన కవిత పద్యమా కాదా అన్నది ఇప్పుడు కూడ ఒక పెద్ద ప్రశ్నే. పై సంచికలకు భిన్నముగా ఊహించని కారణముగా వెలువడిన ఒకే ఒక సంచిక సెప్టెంబరు 2010 సంచిక. ఇది మహాకవి తిలకును గురించినది. ఈ నా అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయమని అడుగలేదు. నేనే వెదకి వ్రాసినది. మరో విషయం – ఈమాటలోని అన్ని విషయాలు అందరికీ నచ్చక పోవచ్చు, కాని ఇందులోని ఒక్కొక్కటి కొందరి కయినా తప్పక నచ్చుతుంది అనుకొంటాను. ముఖ్యముగా తెలుగుజాతి మరచిపోయిన, మరచిపోతున్న కొన్ని సాహిత్య, సంగీత, లలితకళల విలువలను వీరు ప్రోత్సాహం చేయడము ఎంతో ముదావహము. ఇది ముత్యాలసరము అంగడిలో కొనుక్కోవచ్చు అనుకొనే కాలం వాళ్లకు ఎంతో ఉపకరిస్తుంది.
కామేశ్వర రావుగారూ, ఐదవ అక్షరము లఘువు మాత్రమే కాదు, ఆరవ ఏడవ అక్షరాలు గురువుగా కూడ ఉండాలి. మీరు చెప్పిన ఉదాహరణలో అనేకదంతం లోని తం గురువే ఐనా, భక్తానం లోని మొదటి రెండు అక్షరాలు గురువే కనుక శ్లోకాన్ని పాడేటప్పుడు గురువును లఘువుగా పాడుకోవచ్చు. కాని ఇక్కడ సా జయతి లోని జయ అక్షరాలు రెండూ లఘువులే. అందువల్ల ఇది పద్యము కాదని నేను చెప్పలేదు. సామాన్యముగా మనము అర్థము చేసికొనే శ్లోకములా లేదు ఇది అని మాత్రమే అన్నాను. విధేయుడు – మోహన
‘ఈ మాట’ ప్రతి రెండు నెలలకూ వస్తుంది. అందులో ఎన్నో రకాల -పాత, కొత్త రచనలు- ఉంటాయి. అది పత్రికకు ఎంతో వెరైటీని ఇస్తుంది. మంచిది.
కాని ప్రతి సంచికను ఎందుకు ఒక స్మారక సంచికగా తయారు చేస్తున్నారు? వెలువరిస్తున్నారు?ఒకవేళ మీకు ‘మరణించినవారిని స్మరించటమే’ ముఖ్యోద్దేశమైతే అది మీ పత్రిక ఆశయంగా ఎందుకు నిర్మొహమాటంగా చెప్పరు? మీ పత్రిక పేరు -స్మారకం, మాసోలియం, ట్రిబ్యూట్ , నివాళి. పేంథియాన్ – ఇలాటి పేరు పెట్టుకోవచ్చుగదా?
ఈ పత్రిక సంపాదకులకు – ఎందరో జీవించి ఉన్న మానవులు ఆహ్వానించే ప్రతి ఒక నూతన సంవత్సరాన్ని, ఒక ఋతువును, ఒక నెలను, ఒక రోజును , వేలాదివేల మనుష్యులకు సంబంధించిన కాలాన్ని, సంపాదకులు ఎన్నుకున్న ఒకేఒక్క రచయితకు గుర్తుగా వారి స్మారకంగా నిబంధించటానికి, వారికి హక్కు ఎవరిచ్చారు?
తమ రచనలను పంపిస్తున్న ఇప్పటి రచయితలకు , వారి రచనలు ఎవరికో సాంబ్రాణి కడ్డీలవుతున్నాయనీ, ఎవరి ఫొటోలకో దండలవుతున్నాయనీ, ఎవరికో అంకితమైపోతున్నాయనీ, తెలియదు.
ఇప్పటి పాఠకులు, ఇప్పటి రచయితలపై -ఇట్టి అత్యాచారం మీ సంపాదకులచే చేయబడటం, మీరు ప్రతిసారీ స్మరిస్తున్న ఆ గతించిన రచయితల స్పిరిట్ కే విరుద్ధం. వారు బ్రతికి లేనందున మీ ఈ చర్యలను వారు నిరోధించలేరు.
నిరభ్యతరంగా ఒక్కో సంచికలో ఒక రచయిత ( జనన మరణాల ప్రసక్తి దేనికి?) రచనలను ఫోకస్ చేసి చూపవచ్చు. వారి మీద ఒక అనుబంధము ఆ ఇస్స్యూలో ఉంచవచ్చును. ఒక రచయిత గురించి విశదంగా తెలుసుకోవాలి అనుకున్న వారు, చదువుకుంటారు.
పత్రిక సంపాదకులు ‘రిచ్యుయల్ ఓరిఎంటెడ్’ కాక ‘జవరాలైన’ కొత్త పత్రికను ప్రతిసారీ పాఠకులకు అంద చెయ్యాలనుకుంటే, ఈ మార్పు మీరు వెను వెంటనే చెయ్యవచ్చు. ఇప్పటి ఈ పత్రిక పరమపదించిన ‘ముందుమాట’ చదివి – ఉస్సురనక ముందే చెయ్య వచ్చు. కొద్ది చలాకీ మార్పులతో, వేలాది మంది పాఠకులకు ఆనందం కలిగేలాగా, వెంటనే పత్రికకు ప్రాణమివ్వవచ్చు.
మార్పులు చెయ్యగలుగుతారో, లేక ఈ ఉత్తరము ప్రచురించదలుస్తారో, సంపాదకులుగా, ఏది మీ నిజకర్తవ్యంగా భావిస్తారో , మీ శక్తి సామర్ధ్యాలకు ఏది నిదర్శనమనుకుంటారో- మీరే నిరూపించుకోండి.
దక్షిణాదివాళ్ళు సింధుభైరవి అని పిలిచే రాగాన్ని ఉత్తరాదిలో భైరవీ అంటారు. వాళ్ళ శైలిలో దాన్ని రకరకాల పోకడలతో పాడతారు. కర్నాటక నఠభైరవి (స రి2 గ1 మ1 ప ధ1 ని1 స) అనే పోకడ ఉన్నదాన్ని జంగ్లా భైరవీ అంటారు. ఉదాహరణకు తలత్ పాడిన సినిమాపాట యే హవా యే రాత్ లేదా రఫీ పాడిన తుఝే క్యా సునావూ అటువంటిదే. వాడినపూలే కూడా ఆ కోవదే కాని మధ్యలో తిలంగ్ తదితర రాగాలు కూడా వినిపిస్తాయి.
అరుదుగా, అచ్చగా కర్నాటక హనుమతోడిలా పాడినప్పుడు దాన్ని శుద్ధ భైరవీ అంటారు. ఠుమ్రీ, గజల్ లేదా భజన్ వినిపిస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి 12 స్వరాలూ పలికించడం కూడా ఉంటుంది. మామూలుగా అయితే రెండు రిషభాలూ, రెండు ధైవతాలూ వేస్తారు. చాలా జనాదరణ పొందే రాగం కనక ఎలా పాడినా దాన్ని పోల్చడం సులువే.
అయిదు పేరాల అభిప్రాయాన్ని, అవతలి వారి తప్పులెన్నడానికి గుప్పించిన రమ గారికి, రెండు లింకులు క్లిక్ చేసేందుకు తీరికా, ఆసక్తి లేవట. ఆసక్తి తప్పక ఉండదు కొంతమందికి తమ తప్పులు తెలుసుకునేందుకు.
ఎవరో భూషణ్ ఎవరో ప్రభ కవిత్వం మీద వ్యాసం రాస్తే, ఎంతో ఆసక్తితో, తీరికతో అభిప్రాయలిచ్చిన రమ గారు. లాజిక్కు మాట్లాడేప్పటికి “అత్తా కోడళ్ళ మధ్య సంభాషణ” ( మనది ప్రజాస్వామ్యం గనక అందరూ అభిప్రాయాలు చెప్పేయవచ్చును. కాదన్నదెవరూ?? పైగా అదుపులేనంత చోటొకటి ఉండనే ఉంది కూడా కదా?? బోలెడంత రాయడానికీ!! రాసుకుపోతే సరి!! భూమ్మీద ప్రతివారికీ చోటుందాయె !) వంటి సూటిఫోటి వ్యాఖ్యలకు దిగారు.
సరే రమ గారికి కాకపోయినా పాఠక లోకానికి నిజాలందించానన్న తృప్తి నాకు మిగిలింది. “ఈ భూమ్మీద కాసింత చోటిచ్చిన” ఈ మాట సంపాదకులకు కృతజ్ఞతలు.
యేమీ కాని నేనే చదివి ఇంత మురిసిపోతుంటే, సాక్షాత్తు గోదారమ్మ తానెంత మురిసిపోతుందో?? ఇసుక కోవలో నేనూ చేరిపోతున్నానేమో అని భయమేస్తుంది, ఎందుకంటే నాకూ కుళ్ళుగా ఉంది..ఈ ఆలోచనా ప్రవాహం నన్నెందుకు తాకలేదని..
రాజకీయాతీతమైన దృష్టి ఉన్నవాడు అరాచకీయమైన తూకానికి పూనుకుంటే సరిగ్గా ఇదిగో ఈ విమర్శ లాగే ఉంటుంది. జయప్రభ కవిత్వం మీద ఇలాంటి వ్యాఖ్యానాలని చేసిన వాళ్ళలో ఈ యదుకుల భూషణ్ మొదటివాడేమీ కాదనుకుంటాను. జయప్రభ కవితాసంకలనాల మీద మగవాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుని ఇలాంటి రాతలు రాసి ఏదో ఒక తరహా గుర్తింపుకోసం ప్రయత్నించడం చాలాసార్లు జరిగింది కూడా !! ఈయనకి స్త్రీవాదమో లేక మరో వాదమో నచ్చలేదు గనక వాటిని కవిత్వంలోంచి ఎంచి ఖండించడానికి పూనుకుంటే ఆ విమర్శ ఏ తోవలో సాగాలో ఆ తోవలోనే సాగింది ఇది కూడా !! జ్వాలాముఖి మొదలుకుని మరి కొందరు కుర్ర జ్వాలాముఖుల దాకా ఈ తరహా గొంతు ఆమె కవిత్వం విషయంలో “విమర్శ” పేరున రావడం కొత్త ఏమీ కాదు కూడాను. అయితే అవన్నీ ఎంతమేరకి నిలబడ్డాయో దీనికీ అంతే స్థానం ఉంటుంది.
ఆవిడ కవిత్వాన్ని విమర్శ పరిధిని కూడా దాటిపోయి ఆరుద్ర రివ్యూ పేర బోలెడంత తిట్లు కుమ్మరించిన సందర్భమ్ ఉంది. ఆరుద్ర దృష్టి ఏ తోవలో నడిచిందో అది చూపించి ఆయన నీరస దృష్టికి ఆ రాత నిదర్శనంగా నిలిచిందే తప్ప ఆ అభిప్రాయం జయప్రభ కవిత్వాన్ని తక్కువ చేయలేకపోయింది. పాక్షిక దృష్టితో రాసిన ఎన్నో రాతలు ఆవిడ కవిత్వం మీద ఇదివరలో కూడా రాకపోలేదు. ఆ తరహా రాతల్లో ఇది ఒకటి. ఐతే స్త్రీవాదులు ఇటువంటి రాతలని పరిగణన లోకి తీసుకుంటారా?? అన్నదానికి సైతం వాళ్ళ అనేక ప్రతిస్పందనలు జవాబులుగా ఉన్నా ఇంకా ఇటువంటి స్త్రీల రాజకీయ కవిత్వాలని వ్యతిరేకించే వాళ్ళున్నారంటే ఇంకా తెలుగు సాహిత్య రంగంలో తరవాతి తరాలలో సైతం ఎంత వెనకబాటుతనం ఉందో స్పస్టపడుతోంది.
మనకి అన్నా అఖ్మతోవా నచ్చుతుంది. కానీ మన సమకాలంలో మనతో పాటు నడిచే ఒక అన్నా అఖ్మతోవా, ఒక మాయా యాంజిలో నచ్చలేదు. అది తెలుగువిమర్శలో ఉన్న ఒక జాఢ్యం. పేరొచ్చిన వారిని విమర్శించి తానూ పేరు తెచ్చుకోవాలన్న ఒక అతి పాత పాత జాఢ్యం. అందుకు అనేకసార్లు అనేక మందికి జయప్రభ కవిత్వం ఎంతో ఉపయోగపడటం అన్నదే ఆమె కవిత్వానికి ఉన్న బలాన్ని చెప్పకనే చెబుతోంది. ఏమీ లేని పుస్తకాన్ని చదివి అవతల పడేయాలి. కానీ దాన్ని అంత సుదీర్ఘంగా అంత బలంగా కాదని అనవలసి రావడమ్ అంటేనే అందులో ఉన్న విశిష్టతని ఒప్పుకోవడం అన్నమాట. పండితుని వేషం వేసుకున్న వాడు పండితుడు కానట్టే ఈ తెచ్చికోలు హడావిళ్ళూ ఈ డొల్లమాటలూ సైతమ్ అతుకులబొంతలాంటివని అర్ధమ్ అవుతుంది. రాజకీయాతీతమైన జీవితమూ లేదు. రాజకీయాతీతమైన కవిత్వమూ ఉండదు. అది అఖ్ఖరలేని వాళ్ళు ఆ తరహా కవిత్వాన్ని విమర్శించపూనుకోవడం లోనే వారి చూపు లోని అంతరార్ధమ్ అర్ధమవుతుంది ఎవరికైనా !!
అయితే ఈ పరిస్థితి ప్రపంచ సాహిత్యంలో స్త్రీల వ్యక్తీకరణల మీద నిందాపూరిత స్వరాలతో విమర్శ పేరు పెట్టుకుని జరగడం అనేకసార్లు జరిగింది. ఇక్కడ మళ్ళీ జరిగింది. పురుష సాహిత్య ప్రపంచంలో మళ్ళి మళ్ళీ జరుగుతూనే ఉంటుంది కూడాను. ఈ తరహా సాహిత్యమ్ వచ్చిందీ అంటేనే దాని అవసరమ్ ఉందీ అని అర్ధం ! అది ఈ అరాజకీయ వాదులకి ఒప్పుదల అయ్యిందా కాదా అన్నదానితో కవయిత్రులకి ఏమీ ప్రమేయం లేదని వాళ్ళు ముక్తకంఠంతో ఇదివరకే చెప్పేసారు కూడా !!
కవిత్వం అనేక తరహాల్లో బయటికి వస్తుందని ..”శిల్పం” సారంలోనూ రూపం లోనూ భిన్నం గా ఉంటుందనీ కవితా శిల్పం నిజంగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకు సహృదయతా ఉండాలి. సంయమనమూ ..సహనమూ ఉండాలి. కానీ ఈ విమర్శలో అది కొరవడింది. ఇందులో యదుకుల భూషణ్ కి నచ్చినవి కొన్ని ఉన్నట్టే మిగతా తరహా వ్యక్తీకరణలు నచ్చిన వాళ్ళూ మరికొందరుంటారు. విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కవులు వారి తోవన వారు పాడుతూనే ఉంటారు.
ఈ అభిప్రాయంలో ఆధారం లేని వ్యాఖ్యలు అనేకం. మచ్చుకి రెండు :
౧. ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది.
ఆయన జీవితకాలం బోధించింది తత్వ శాస్త్రం. ఆయన సన్నిహితులకు , ఆయన కవిత్వం సీరియస్ గా చదివిన అందరికీ ఇది తెలిసిన విషయమే.
మరిన్ని వివరాలకు ఇంద్రగంటి గారి అమ్మాయి ఇస్మాయిల్ గారు బ్రతికుండగానే చిత్రీకరించిన ఆయన ఆత్మకథ DVD చూడండి. లేదా ” కవిత్వంలో నిశ్శబ్దం” వ్యాస సంపుటిలో రమణారెడ్డి గారికి ఇచ్చిన బదులు చూడండి.
౨. ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఎవడా పాఠకుడు? ఏమా కథ ?? సదరు పాఠకునికి ఇతర కవులు ఆమోద యోగ్యమన్న విషయం మీకెలా తెలిసింది ?? మీకేమైనా కర్ణ పిశాచి ఉందా ?? పై అభిప్రాయం మీ అభిప్రాయం లాగే ఉంది. తప్పు లేదు.పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
ఇక అసలు వ్యాసం విషయానికొస్తే -పొసగని విషయాలు అనేకం , మచ్చుకు రెండు :
౧.ప్రసార మాధ్యమాల పాత్రను అతిగా అంచనా వేశారు.
౨. శబ్దార్థాలను అర్థం చేసుకున్న తీరులో గందరగోళం ఉంది.,
” పద్యం రాతలో కనిపించడానికీ మాటల్లో వినిపించడానికీ మధ్య చాలా తేడా వుంది. ఆనందవర్ధనుడి కాలంలో పద్యం ప్రధానంగా మాటల్లో వినిపించేది. అచ్చుయంత్రం వచ్చేదాకా పద్యం రాతలో కనిపించలేదు. చప్పుడు వినకముందే మాటని కాగితం మీద చూడడం మనకి మాత్రమే సాధ్యపడింది. అచ్చుయంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వంలోనే శబ్దం అప్రధానమయ్యే పరిస్థితికి అవకాశం ఏర్పడింది. అవకాశం ఏర్పడింది కదా అని దాన్ని వెంటనే అందరూ అందిపుచ్చుకోలేదు. కావ్యంలో శబ్దాన్ని వదిలెయ్య వచ్చునని తెలిసి, అందులో ప్రయోజనం వుందని గమనించి, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కవి మనకి ఇస్మాయిల్ ఒక్కడే.”
ప్రాచీన కాలం నుండి నానా విధాల మాధ్యమాలు వచ్చాయి: వెదురు బద్ద, గట్టి ఎముక,మట్టి పలక, పట్టు వస్త్రం ,తాటాకు..నానా రకాల కాగితాలు ,ఇప్పుడు ఈ రీడర్లు. మాధ్యమాలు కవికి ఎటువంటి
అవకాశాన్ని ఇవ్వవు.అవి కేవలం మాధ్యమాలే.పద్యం రూపు దిద్దుకోనేది కవి మనసులో.ఆ తర్వాత, ఏదో ఒక మాధ్యమం ద్వారా అది పాఠకుని మనసు చేరుతుంది. అంతవరకే దాని పాత్ర.పద్యం చేరవలసిన చోటు చేరిన తర్వాత మాధ్యమంతో ఇక పని లేదు. అది , పాఠకుని మనసులో స్వతంత్రంగా మనగలదు అన్నది మనకు అనుభవంలోని విషయం. ఆసక్తి ఉండాలే గాని, ఎన్నో పద్యాలు గుర్తుంటాయి.
కాబట్టి శబ్దం అప్రధాన మయ్యే ప్రసక్తే లేదు. అచ్చు యంత్రం రాక ముందు కూడా లేఖకులు ఉండే వారు , కావలసినన్ని ప్రతులు తయారయ్యేవి , చలామణీ లోకి వచ్చేవి. చైనా లోని సమాధులు తవ్విన ప్రతి సారి సదరు వ్యక్తికీ ఇష్టమైన పుస్తకాలూ పట్టు వస్త్రం పై రాసినవి దొరుకుతూనే ఉన్నాయి. ( క్రీ.పూ రెండవ శతాబ్దం నాటి ప్రతులు లభ్యం ) ఇంకా ముందుకు వెళితే వెదురు ( క్రీ.పూ నాల్గవ శతాబ్దం )కూడా వాడారు.( వాటి పరిష్కృత ప్రతులు నా దగ్గరున్నాయి.)
” తన కవిత్వంలో, శబ్దప్రమేయం లేకుండా కాగితం మీద రాసిన అక్షరం తిన్నగా అర్థానికి దారి తీయగల విలక్షణమైన ప్రజ్ఞని ఆయన సంపాదించారు. ఆయనపద్యం చదువుతుంటే మన కంటికి అక్షరాలు కనిపించే మాట నిజమే. కాని ఆ అక్షరసముదాయం శబ్దసముదాయంగా మార్పుచెందక ముందే మన కళ్ళ ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ అర్థాలు గీసిన బొమ్మే కాని శబ్దాలు గీసిన బొమ్మ కాదు. భాషకి వున్న శబ్దశక్తిని నిశ్శబ్దంగా వాడుకోగల సామర్య్థాన్ని ఇస్మాయిల్ అపూర్వంగా సాధించారు “
ఇస్మాయిల్ శబ్దానికి పట్టం కట్ట లేదు అంటే నిలువునా నిశ్శబ్దంలోకి దూకారని కాదు.మాటలు ఎక్కడ ఆపాలో గ్రహించారు. అక్కడి నుండి మౌనం ప్రవేశిస్తుంది.( అది తూర్పు దేశాల కవులు వేల ఏళ్లుగా
చేస్తున్నదే.). శబ్దాన్ని అనుసరించే ఉంటుంది అర్థం. కాబట్టే, ఇమేజ్ ని పదచిత్రం అన్నారు కాని అర్థ చిత్రం అనలేదు.
రాత్రిని రెండు తరాల కోణాల్లోంచి చూస్తూ జీవితాన్ని బాగా నిర్వచించారు.
ఈ కవిత కి టైటిల్ జీవితం-1 అని అనుకుని మిగిలిన పార్శ్వాలని కూడా ఆవిష్కరించవచ్చు.
ఉదాహరణకు, పిల్లల భవిష్యత్ గురించి పెద్దలు తపిస్తారు. కాని పెద్దైన పిల్లలు
కన్న వాళ్ళను భారంగా భావిస్తున్నారు. ఇది కూడా నిత్య పరంపర, జీవితానికి మరో నిర్వచనం.
శ్రీవెంకటేశ్వరరావుగార్కి –
మీరు పరిచయం చేసిన పూసపాటి కృష్ణంరాజుగారి ‘రెండు బంట్లు పోయాయి’ కథని (మరోసారి), కథ మీకు నచ్చడం వెనకున్న కారణాల్ని చదివాను. రాజుల జీవితాల్ని దగ్గర్నుంచి చూసినవాళ్లకు, పతంజలిగారి రచనల్ని ఔపోసన పట్టిన వాళ్లకూ ఈ కథ బాగా నచ్చుతుంది.
ఇక ‘రెండు బంట్లు పోయాయి’ అనే దానికి అర్థం – కథలోనే ఉంది.
పెళ్లికూతురు తన చేతిలోని పరదాని పెళ్లికొడుకు ముఖాన కొట్టి వెళ్లిపోగానే … తాతగారు ‘ఇంతమంది రాజుల్లోనూ రాజుల పరువూ, మర్యాదా మంటగలిసేయి’ అని గొణుక్కుంటాడు. తాతగారు చదరంగం ఆడే మనిషి కాబట్టి అదే భాషలో చివర్లో అల్లా అన్నాడన్నమాట. ‘పరువూ, మర్యాదా’ ఆయన ఉద్దేశ్యంలో రెండు బంట్లని.
1994లో కారా మాస్టారు సప్తతి సభని విశాఖపట్నంలో జరిపినప్పుడు కొందరు సాహితీ ప్రముఖులతో పాటు అనుకోకుండా నేను కూడా హైద్రాబాద్‌నుండి వెళ్లాను. ఆ సభలో పూసపాటిగారు మాట్లాడ్డం చూశాను. కాని ఆ సభ జరిగిన పది, పదిహేను రోజుల్లోనే ఆయన పోయారనే వార్త విని చాలా బాధపడటం ఒక విషాద జ్ఞాపకమైతే… పదేళ్లక్రితం వంశీ (దర్శకులు) గారు ‘సీతాలు జలుపడ్డది’ పుస్తకాన్ని నా దగ్గర్నుంచి తీసుకొని అన్ని పేజీలూ జిరాక్సు తీసుకోవడం రెండో జ్ఞాపకం.
కృష్ణంరాజుగారి మరోకథ ‘దివాణం సేరీ ఆట’ చదివి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్న సందర్భమూ ఉంది.
ఈ శీర్షిక ప్రకటనపై ఇప్పటిదాకా వచ్చిన అన్ని అభిప్రాయాలూ కేవలం ఒకే విషయంపై రావడం మాకు కొంచెం విడ్డూరంగానే ఉంది. పాతకథలకి ప్రాధాన్యం ఇవ్వడాన్ని కొత్త కథలను నిరుత్సాహపరచడంగా భావించడం ఎందుకో మాకు అర్థం కాని విషయం. ఇప్పటి కథలు చాలా మటుకు అందరికీ అందుబాటులో వున్నవి. వాటిపై చర్చలూ, సమీక్షలూ జరుగుతూన్నై. సంకలనాలూ వస్తున్నై. ప్రస్తుత వ్యవస్థ పైనో, సమాజం పైనో, పోయిన వారమో, నెల్లోనో అచ్చై మీరు చదివిన కథను పరిచయం చేయించడం ఈ శీర్షిక ఉద్దేశం మాత్రం కాదు. వాటి గురించి ఈ శీర్షికలో రాయాలనే ఎందుకు? మీరు ఒక వ్యాసంగా కూడా ఈమాటకు రాయవచ్చు కదా. ఒక కథ, మీరెప్పుడో చదివింది, ఇన్నేళ్ళూ మిమ్మలనంటిపెట్టుకున్నది – ఆ కథ ఉందే, దానిని మీచేత పరిచయం చేయించటం ఈ శీర్షిక లక్ష్యం. పాత కథకులు, కథలు ఇప్పటి తరాలకు విస్మృతులు. వారిని మళ్ళీ పరిచయం చేయడం, తద్వారా ఆనాటి ప్రపంచాన్ని, అందరికీ తెలిసిన ప్రపంచం గురించే కాక, మనకు తెలీని ఇంకో ప్రపంచాన్ని పరిచయం చేసుకోడం ఈ శీర్షిక ఉద్దేశమని స్పష్టంగానే ఉంది కదా. లేదా?
ఏ ఒక్క శీర్షిక తోటో సాహిత్యం మొత్తం చుట్టబెట్టలేం. కేవలం మీకు నచ్చిన కథ అంటే మరీ విస్తారంగా ఉండి, అందరికీ తెలిసిన కథలనే మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తారనే భయంతో, ఈ శీర్షికకు కొన్ని సరళమైన నియమాలు, జనరల్ గైడ్‌లైన్స్ రాశాం. అంతమాత్రం చేత, పైన కామెంట్లలో రాసినట్టు, మాకు లేని అభిప్రాయాలని మాకంటగట్టి, మమ్మల్ని దీవిస్తే మేమేం చేయగలం? చెప్పండి :-). ప్రముఖుల కథలే పరిచయం చేయమని చెప్పామా? కొత్త కథలంటే చిన్నచూపు అన్నామా? (ఉదాహరణకిచ్చిన పేర్లలో ప్రముఖులే ఎక్కువ. అది మా తప్పే!)
పైన అభిప్రాయాలు చెప్పిన వారంతా ఈమాటకి ఆప్తులు. మీ సలహాలు మాకు శిరోధార్యం. ఇంత కష్టపడి, ఈ శీర్షిక ఎలా ఉంటే బాగుంటుందో చెప్పారు కాబట్టీ, అదే శ్రమతో ఓ కథను గూడా పరిచయం చేయండి. సరే, కొత్తదో, పాతదో, మీకు బాగా నచ్చి మిమ్మల్నంటి పెట్టుకుని ఉండిపోయిన ఒక కథ గురించి, ఆ కథ వినూత్నంగా పరిచయం చేసిన ప్రపంచాన్ని గురించి వ్రాయండి. ఆ ప్రపంచాన్ని అందరికీ చూపించండి. కేవలం ఈ శీర్షిక ఎలా ఉండాలో చెప్పి మౌనంగా మాత్రం దయచేసి ఉండకండి.
మంచి ప్రయత్నం. కాని పేరు నిరపేక్షంగా (impersonal గా) ఉంది. “నాకు నచ్చిన కథ” అంటే క్లుప్తంగా బాగుంటుంది. పాత కథలయినంత మాత్రాన అందరూ పదే పదే చెప్పే గొప్ప పేరున్న కథకులవే అయి ఉండాలని లేదు. పూసపాటి గారి గురించి ఎంతమందికి తెలుసు?
నచ్చిన కారణంతో కేవలం పరిచయం చేసేదిగా కాక, వ్యాసం కథకి వన్నె తెచ్చేదిగా ఉంటుందని ఆశిద్దాం. నేను కొన్నేళ్ళ క్రితం షాపులో చూసి వెంటనే కొన్న పుస్తకం, Touchstones [1] గుర్తొచ్చింది. ఈ కాలపు కవులు, బాగా పేరున్న వాళ్ళూ, అంతగా లేని వాళ్ళూ, ఒక్కొక్కరు తమకి నచ్చిన ఓ కవిత, వేరే వాళ్ళు రాసినది, పాతదైనా కొత్తదైనా, ఎందుకు నచ్చిందో రాశారు. కవితలే కాక వ్యాసాలు కూడా గుర్తుంచుకోదగ్గవి. పుస్తకం అంతా ఒక్క పట్టున చదవనవసరం లేదు.
ఇవాళ దాంట్లో Maxine Kumin వ్యాసం చదివాను. తన భుజాల్లో, వెన్నుపూసలో బాధ ఎందుకో కనుక్కోడానికి ఆవిడని డాక్టర్లు MRI scan కి పంపించారు. ఆ పరీక్ష చావుకి దరిదాపుల్లో ఉంటుంది. దాన్ని భరించడానికి తను కంఠస్థం చేసిన కవితలని గుర్తు తెచ్చుకున్నాననీ, వాటన్నిటిలోకీ బాగా పనికొచ్చినది AE Housman కవిత “XXVII,” అన్నది. “We are all mortal, but it is the poet who shivers most articulately under the thin blanket of mortality,” అని ముగించిన వ్యాసం, “Trochee, Trimeter, and the MRI,” నన్నాకట్టుకుంది. నేనూ ఒకసారి MRI తతంగం పాలయ్యాను, అప్పటికిది చదివుంటే బాగుండేది.
తెలుగులో Touchstones లాంటి పుస్తకాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Touchstones: American Poets on a Favorite Poem,” edited by Robert Pack and Jay Parini. Middlebury College Press, 1996.
జీవితం గురించి c.shantha kumar naik గారి అభిప్రాయం:
11/03/2010 10:07 am
ఇది ఎందుకు నచ్చిందో అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాని ఇలాగే మంచి మధురమైన జీవితమునకు ఉపయూగపడే ఎన్నో కథలు పంపిస్తారని అనుకుంటూ మీ అభిమాని.
నేటి కాలం లావణ్యతో -ఆడవాళ్ళు మగవాళ్ళతో కలిసి తిరగటంలో, ప్రత్యేకంగా ఆడవాళ్ళే ఎందుకు జాగ్రత్తగా ఉండాలో, ఎలాటి జాగ్రత్తలు వహించాలో, రివర్సు డైలాగులు చెప్పించిన తీరు గమనీయం.
‘అరిటాకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద అరిటాకు పడ్డా అరిటాకు కే నష్టం.’
‘ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు’ – ఇలాటి పాక్షికమైన పాత తెలుగు డైలాగులు, కొత్త యూనివర్సిటీ కేంపస్ నుండి ఈ యుగం అమ్మాయితో చెప్పించటం – నాకు బాగా నవ్వొచ్చింది.
సెక్స్ -ఆడ మగా ఇద్దరికీ సమానంగా ఇష్టమైన విషయం కాదూ? ఇద్దరికీ అవసరమైనది కాదూ? ఆడ, మగ -జీవితంలో సమ ఉజ్జీలు కారా? ఈ ‘ప్రేమ’ వ్యవహారం లో వారికి లాభనష్టాలు సమం కాదా? ఈ కథలో ఉన్న పాత్రలకు అలా అనిపించటం లేదు.
ఆడది మోసగించబడేదీ, నష్టపోయేదీ. మగవాడు మోసం చేసేవాడు. ఎప్పటి అభిప్రాయాలు ఇవి?
ఆడవారు లొంగదీయబడేవారు. మగవారు లొంగదీసే వాళ్ళూ- అని ఈ కాలపు అమ్మాయితోనే చెప్పిస్తున్నారు, ఈ కథలో ఏమి చమత్కారం. లావణ్య ఇలా అంటుంది కథలో;
” కాని, అభ్యంతరం చెప్పకుండానే లొంగిపోయిన అమ్మాయిని ‘లూజ్ కారెక్టర్’ అని అపార్థం చేసుకునే మనస్తత్వమే అబ్బాయికి ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి అతను వెనుకంజ వేయవచ్చు.”
What an Amazingly twisted complex bamboozling sentence!
For a contrast, hear what this simple man is saying from three centuries back, in this poem,
”
Darling, do not regret the promptness of your surrender!
I think no less of you now, you have not lost my respect” _ Goethe.
In this poem, a male is addressing a woman, who was willing to go to bed with him. Even though he uses a word such as ‘surrender’ -still this man of 18th century , comes across as much more of a man, of natural human impulses and normal desires. The man in Goethe’s poem is Way Way different from Vasu, the hero in this Telugu story.
కథ చివరలో వాసు అయోమయ పరిస్థితి, అతడు 🙂 ఉడాయించిన రీతి అమోఘం.
ఈ కథలో ఉన్న ముగ్గురు పాత్రలకూ ఇక ముందు ముందు, వారి పవిత్ర్తతకు ఎట్టి భంగమూ రాదు, అని అనిపిస్తున్నది. They will all be so very careful, and remain pure, and celibate. What an achievement!
మరెందుకో, ఈ కథలో పాత్రల వలె ఆలోచించటానికి, నాకు ఏ మాత్రం మనస్కరించదు.
మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు రామారావు గారికి కృతజ్ఞతలు. పండితులూ (అరవై పేజీల glossary ఉంది) పామరులూ కూడా చదివి ఆనందించవచ్చు. ముందుగా తెలుగు కవులని ప్రస్తావించి, వారి స్థాయి అధోలోకానికి చేరిందని వాపోయారు. ఎలాంటి ఆధారాలూ, ఉదాహరణలూ చూపకుండా చేసే ప్రకటనల వలన ఏమిటి ఉపయోగం? సౌభాగ్య, “ఈ కాలం కవులు,” [1] చూస్తే, మన కవుల స్థితి రామారావు గారన్నంత దౌర్భాగ్యంగా అనిపించలేదు. అయితే, కవితా సంపుటాలకి సంబంధించి నేను అల్ప సంతోషిని – గుర్తుంచుకోదగ్గ కవితలు రెండు మూడున్నా చాలు నాకు.
అసలు విషయానికొస్తే, Hirsch కవితలని వివరించే తీరూ, సందర్భోచితంగా చెప్పే ఇతర విషయాలూ నాకు నచ్చాయి. Elizabeth Bishop, “One Art,” ని విశ్లేషిస్తూ, అదొక villanelle అని దాని లక్షణాలు వివరించాడు: పందొమ్మిది పాదాలతో ఆరు భాగాలుగా, అయిదు భాగాలు మూడు పాదాలతో, మిగిలినది నాలుగు పాదాలతో … అవన్నీ ఆరితేరిన పాఠకులకే గాని, నాకు ఒంటబట్టవు. ఆధునిక vilanelles అంటూ మరికొన్ని చదవదగ్గవి ఇచ్చాడు.
కవితలో Bishop తాళం చెవి మొదలు ఖండాల దాకా వెళ్ళి, చివరకి ప్రేమతో ముగించే తీరు చాలా బాగా విశ్లేషించాడు. ఈ కవితలో ఉన్న ఆశ్చర్యార్థకాన్ని పట్టుకొని, William Maxwell, రచయిత ఆ సూచికని రెండు సార్లు మాత్రమే వాడవచ్చు – తన జీవిత కాలంలో, అని చెప్పాడన్నాడు. ఈ Maxwel ఎవరో మరీ నిరంకుశుడు అనుకున్నాను.
మార్చి “The New Yorker” లో Patricia Marx, “Four Eyes,” అని కళ్ళజోళ్ళ మీద సరదా కాలమ్ రాసింది. అయుదు పేజీల చక్కని రచనలో ఒక్కసారి కూడా ఆశ్చర్యార్థకాన్ని వాడినట్లు గుర్తు లేదు. ఈవిడ ఎవరో Maxwell సూత్రాన్ని ఒంటబట్టించుకున్నదే అనుకొని, అసలీ Maxwell ఎవరా అని వెతికితే తెలిసింది: నలభై ఏళ్ళ పాటు ఆ పత్రికకి సంపాదకుడుగా పనిచేశాడని. ఇప్పుడు నేనా సూచికని వాడాలంటే భయం. Maxwell ని గుర్తుచేసుకుంటూ [2] Updike కవిత, “Stolen”:
“The boat tilts frozen on the storm’s wild wave.
The concert has halted between two notes.
An interregnum, sufficiently extended,
becomes an absence. When wise
and kindly men die, who will restore
disappeared excellence to its throne?”
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఈ కాలం కవులు,” సౌభాగ్య, 2006.
[2] “A William Maxwell Portrait: Memories and Appreciations,” Edited by Baxter, Collier and Hirsch. WW Norton & Company, 2004.
బాగుంది. పుస్తకంలో చదవటానికీ, పైకి చదివితే వినటానికీ కూడా బాగుంది.
ఐతే, దాదాపు చివరి ఇరవై పంక్తులు – ఇంకో కవితను తెచ్చి అతుకు వేసిట్లుగా ఉంది. కవిత లయ మారింది. లయ మారితే మారింది. కవిత విషయం కూడా మారింది.
అప్పటివరకు వెన్నెలను ప్రయివేటుగా అనుభవిస్తున్న మానవుడు, అకస్మాత్తుగా 🙂 “ఎవరో” – వెధవా! నీ ఒక్కడి కోసమే నీ దొడ్లోనే కురుస్తాందా వెన్నెల? వెన్నెల అందరిదీ కాదూ. అది అన్నిచోట్లా కురవదూ? అని కొరడా పెట్టి కొట్టినట్లు; సన్నాసీ! కవిత్వంలో ఏవి తప్పక రాయాలో మర్చిపోయావా -అని కోప్పడితే ఢమిక్కిన గుర్తుకు వచ్చినట్లు; అక్కణ్ణుంచీ కవితలో -“ధనికులు, నిరుపేదలు, ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ములు, ఊరి బైట కాలీకాలని చితికీలలు” -వచ్చి పడ్డాయి.
నా ఉద్దేశంలో, ‘వెన్నెల’ ఇతివృత్తంగా తీసుకుని రాసిన రెండు వేరు కవితలు ఒకదాని తర్వాత ఒకటి పేర్చబడి – ఒకటి చేయబడ్డాయి. ఆ పని కవి సొంతగానే చేసుకున్నాడో, లేక ఇతరుల ప్రోద్బలం వల్ల జరిగిందో, ఊరికే పోనివ్వడమెందుకు ‘వెన్నెల’ మీద ఉన్న బంతులన్నీ ఒక కవితలోనే ఒక ప్రసారంలోనే వినిపించేద్దాం, పనై పోతుంది – అని ప్రసారకర్తలో, ప్రచురణకర్తలో అనుకున్నారో మరి.
కవితలో కొన్ని పంక్తులు తిలక్ రెండుసార్లు చదవటం నచ్చలేదు. అవి సంగీతంలో సంగతుల వంటివి కావు. రెండో సారి చదివినంతనే వాటి రుచి పెరగలేదు. ఏ వాక్యానికీ రెండో సారి చదవవలసిన అదిక ప్రాముఖ్యతా లేదు.
కామేశ్వరరావు గారూ,
రారా విమర్శపై నేను వ్రాసిన ప్రతివిమర్శ, ఆయన విమర్శకు మాత్రమే పరిమితమై వ్రాసినది.అభ్యుదయ కవిత్వాన్ని తన “అమృతం కురిసిన రాత్రి” పై సమీక్ష లోకి లాగింది రారానే, నేను కాదు. విమర్శ లో చెప్పిన విషయాలపై స్పందించటమే కదా ప్రతివిమర్శ. నేను చేసింది అదే. దానిని మీరు అసమంజసం అన్నారు. ఇది అసమంజసం ఎలా అవుతుంది?
భావుకత్వం పరిపుష్టంగా ఉన్న కవి ఏ అనుభూతిని కవిత్వీకరించినా అది కదిలించే శక్తిని సంతరించుకుంటుంది. తరతరాలుగా సాహిత్యంలో స్థిరపడిన విషయాలమీద మనం పునరాలోచన చేస్తూనే ఉన్నాం కదా. భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే వర్గీకరణ కృత్రిమమైనదే. నినాదప్రాయాలైన రచనల నాధారంగా కవులు కానివారికి కవులుగా అస్తిత్వాన్ని చేకూర్చాలనే వ్యర్ధప్రయత్నం అని నేను నమ్ముతున్నాను. ఒకవైపు మీరు ఈ వర్గీకరణను అంగీకరిస్తూనే, ప్రతి కవినీ, ప్రతి కవితను వర్గీకరణలలోకి బలవంతాన ఇరికించటం సమంజసం కాదు అంటున్నారు. ఇందులో నాకు వైరుధ్యం కనబడుతుంది . అంతేకాక, పదిమంది మెప్పుకోసం పాప్యులర్ విషయాలమీద కవిత వ్రాసినంతమాత్రాన అది కవి యొక్క హృదయతత్వంగా తీసుకోవటానికి వీలు లేదని నా అభిప్రాయం.కారణం, తాను కవిత్వం లో వెలిబుచ్చే అభిప్రాయాల యెడల తన నిత్యజీవితంలో నిబద్ధత కనిపించినపుడే అది అతని “హృదయతత్వం” అవుతుంది.
అందంగా వ్రాయటమంటే ఆకట్టుకునేలా ఏ రకమైన అనుభూతినైనా వ్యక్తీకరించటం అనేది నా నిర్వచనం అన్నారు.అందానికి రారా నిర్వచనం వేరన్నారు.అదేమిటో చెప్పలేదు.
నిజమే ,ఆకట్టుకునేలా వ్రాయకపోతే ఉత్తేజితులెలా అవుతారన్నాను. ఆకట్టుకున్నంతమాత్రాన ఉత్తేజితులని చెయ్యలేదని రారా ఉద్దేశ్యమన్నారు మీరు. బ్రతకాలంటే పుష్ఠికరమైన ఆహారం తినాలి. తిన్నాక కూడా బ్రతకకుండా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు.
నా నిర్వచనం ప్రకారం అభ్యుదయ కవులు, విప్లవకవులు అందానికి వ్యతిరేకులు కాదన్నారు. సంతోషం. వారు అందానికి వ్యతిరేకులయ్యేంత సంకుచితమైన నిర్వచనం రారా “అందానికి” ఇచ్చారా ?
కవిత్వానికి,సాహిత్యానికి అలంకారికులు చెప్పే రసానందమే అస్తిత్వాన్ని ఇస్తుంది. ఆకట్టుకోవటానికి ,ఉత్తేజితులను చేయటానికి ప్రేరకాలు ఆహ్లాదం,ఆనందం.
“నా గీతం గుండెలలో……..” నేననేదీ అదే . ఆయన చెప్పవలసినది తోటి జనుల ఆశలను, ఆశయాలను,ఆకాంక్షలను తన గీతం లో ప్రతిఫలింపచేస్తానని. కానీ ఆయన చెప్పింది తన గీతం జాతి జనుల గుండెలలో మ్రోగాలని. తనకు ప్రాధాన్యత ఆపాదించుకోవటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందే! తనకు నమ్మకంలేని ‘మంత్రం’ ప్రస్తావన ఎందుకు ?త నను తన జాతి జనులు అనుసరించటం కాదు, వారిని తాను అనుసరించి వారి ఆకాంక్షలు తన గీతం లో ప్రతిబింబించి, వారిని ఉత్తేజితులను చేయటం. ఆ విధంగా తన గీతాన్ని వినిపించడం జరగాలి.
కవిత్వం వాస్తవ జీవితానికి దూరమవ్వటంలోనే, దాన్ని(వాస్తవజీవితాన్ని) విస్మరించటం ఇమిడి ఉంది.ఇంక మరలా ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను.
ఆనందం (కవిత ఇచ్చే రసానందం), ఉత్తేజం ఒకే అనుభూతికి రెండు పార్శ్వాలుగానూ, పరస్పరాశ్రయాలు గానూ ఉండవచ్చు. ఒక చిన్న వివరణ: ఏ బలీయమైన అనుభూతి అయినా, ఉత్తేజానికి ప్రేరకంగా ఉండవచ్చు. ఏదో చేయాలని పురికొల్పటం కాన్షస్ గా చేసే ప్రయత్నం. ఇది కళకు విరుద్ధం. కవి బలీయంగా అనుభూతిని వ్యక్తీకరించటం మాత్రమే చేయాలి. “ఆర్ట్ లైస్ ఇన్ కన్సీలింగ్ ఆర్ట్”.
రుచి,శుచి విషయంలో కూడా పైన చెప్పిన విషయమే వర్తిస్తుందనుకుంటాను: బ్రతకాలంటే తినాలి.కానీ తిన్నాక కూడా బ్రతకకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి.
“వెన్నెల సముద్రాలు” మొదలగునవి అందంగా వ్రాయటానికి సంకేతాలు అని స్పష్టంగా తెలుస్తుంది.వాటిలో అన్వయకాఠిన్యం లేదు. మరి రాబందుల రెక్కల చప్పుడు వగైరాలు దేనికి ఏది సంకేతం? ఎలా వీటిని అన్వయించటం? వీటిగురించి ప్రస్తావనకు కారణం, మీరనుకుంటున్నట్లు అసంగతంగానేనైనా రారా, శ్రీశ్రీ కవితా పంక్తులని కోట్ చేయటం. దీనిలో అర్ధం కాకపోవటానికేముంది?
ఇక లాలిత్యాన్ని గురించి:ఇది కడుపు నిండినవాళ్ళ కవిత్వంలోనే ఉంటుందని అనుకుంటే, అభ్యుదయభావాలతో కవిత్వం వ్రాస్తున్నవారందరూ పస్తులు పడుకుంటున్నవాళ్ళా? పీడితప్రజల విముక్తి పోరాటాలకు కలంతో పాటు కత్తిపట్టి దన్నుగా నిలుస్తున్నవారా? ఎవరో చెరబండరాజు లాంటి వారు కోటికొకరు మినహా!
“వచనగేయపు శైలి లలితమైన (లిరికల్) ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని,గంభీరమైన ఇతివృత్తాలకు సముచితంగా ఉంటుదని స్పష్టంగా అర్ధమవుతుంది” – లలితమైన అన్నమాటకు సమానార్ధకంగా లిరికల్ అనే మాటను బ్రాకెట్లో వాడారు, రారా. వచనగేయపు శైలిని గురించి, రెండు రకాల ఇతివృత్తాల గురించి మాట్లాడారు. మీరనుకున్నట్లు రెండు రకాల శైలీ విశేషాలగురించి మాట్లాడలేదు.
మీరు ఆరోపించినట్లు, భావకవుల వేదనను నేను సాంద్రత లేనిదనికానీ, కృత్రిమమైనదని కానీ అనలేదు.వారి వేదనా ప్రియత్వాన్ని మాత్రమే కృత్రిమం అనడం జరిగింది. వేదనలో అనుభూతి సాంద్రత తప్పనిసరిగా ఉంది, కృత్రిమత్వం లేదు. వేదనా ప్రియత్వంలో కృత్రిమత్వం ఉంది,అనుభూతిసాంద్రత లేదు. పాక్షికదృష్టి ఎవరిలో ఉన్నా, బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఎవరు చేసినా అభిలషణీయంకాదు. ఇవి సాహిత్య విమర్శకు వన్నె తెచ్చేవి ఎంతమాత్రమూ కావు.
నీకు మంచి స్నేహితులు ఉన్నారయ్యా! నువ్వదృష్టవంతుడివి.
“నా కవిత్వంలో నేను దొరుకుతాను” అన్న తిలక్ కవితలో :
“నీ కవిత్వం పుస్తకానికి ఎవరిచేతా పీఠికా పరిచయమూ
వగైరాలు రాయించవద్దు అన్నాడు-
నాలుగేళ్ళక్రితమే నా చిరమిత్రుడు శ్రీపాదకృష్ణమూర్తి
సరీగా అలానే అన్నాడు నా యువమిత్రుడూ కవీ
వెల్చేరు నారాయణరావు కూడా…”
“పైగా నా మీద నన్నే రాసుకోమన్నారు..”
అని ఉన్నది.
మంచి సలహా ఇచ్చారు. పీఠికలు, సమీక్షలు ఇత్యాదులు లేనప్పుడు, కవి, శ్రోత ఒకరికొకరు దగ్గరగా వస్తారు. అది middle man లేని ఒక చక్కని direct transaction. ఏ మనిషిని అర్థం చేసుకోవాలన్నా ‘one on one’ సంభాషణ ఉత్తమం.
ఐతే నేను – పీఠికలు, పరిచయాలు, ముందుమాటలు, సమీక్షలు… – చదవనా అంటే చదువుతాను. చాలా ఆసక్తితో చదువుతాను. అవి రాసినవారిని అర్థం చేసుకోటానికి అవి పనికొస్తాయి.:-)
మీ ప్రతివిమర్శపై కూడా నాకు కొన్ని అభ్యంతరాలున్నాయండి. ఎలా అయితే రారా విమర్శలో పాక్షిక దృష్టి కనిపించిందో, అంత మోతాదులో కాకపోయినా, కొంత మీ ప్రతివిమర్శలోనూ కనిపించింది. దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు రారాని అర్థం చేసుకోడంలో కొన్నిచోట్ల పొరపాటుపడ్డారని కూడా అనిపించింది. నేనెలా అర్థం చేసుకున్నానో కూడా వివరిస్తాను.
“భావుకత్వం ఏ ఉత్తమ కవికైనా ఉండవలసిన ముఖ్యలక్షణం అని అన్న తరవాత మరలా ఎవరినో భావకవి అనడం ఏమిటి? భావుకత్వం లేనివాడు కవే కాడుగా?”
– ఇక్కడ “భావకవి” అంటే “భావుకత్వం” ఉన్న కవి అన్న ఏకవాక్య నిర్వచనం మీరు తీసుకున్నారు. రారా ఉద్దేశం ఇది కాదు. ఈ రెండు పదాలనీ రారా వాడారు కాని స్పష్టం చెయ్యలేదు. శ్రీశ్రీ తర్వాత అంత భావుకత్వం ఉన్న కవి తిలక్ అని రారానే అన్నారు. అయినా శ్రీశ్రీ “భావకవి” కాదు అన్నది స్పష్టం కాబట్టి ఈ రెంటి మధ్యనున్న తేడా మనం గమనించాలి. “భావకవి” అనేది ప్రధానంగా “భావకవిత్వం” వ్రాసిన కవి అని అర్థం చేసుకోవాలి. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్ళలో వచ్చిన ఒక రకమైన కవిత్వానికి “భావకవిత్వం” అన్న పేరు సాహిత్యంలో స్థిరపడిన విషయం ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చాలా మంది విమర్శకులు దాని లక్షణాలను వివరించారు. దాన్ని కూడా ఇక్కడ నేను ఉటంకించక్కర లేదనుకుంటాను. అలా స్థిరపడిన రూడ్యర్థంలోనే రారా కూడా “భావకవి”, “భావకవిత్వం” అన్న మాటలు ప్రయోగించారు కాని “భావుకత గల కవి” అన్న అర్థంలో కాదు అన్నది సుస్పష్టం.
“కవిత, వస్తువు ప్రాతిపదికగా, లేదా కవి హృదయతత్వం మీద ఆధారపడి వర్గీకరించటం ఏ మాత్రం సబబు? ఇన్ని విభజనలు చేయాలా?”
– కొన్ని సందర్భాలలో అలాంటి విభజనలు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలని చేకూరుస్తాయి. కాకపోతే ప్రతి కవినీ, ప్రతి కవితనీ అలాంటి వర్గీకరణల్లోకి బలవంతాన ఇరికించడమే సమంజసం కాదు.
“అందంగా వ్రాయటం అంటే”, “ఆకట్టుకునేలా అనుభూతిని, ఏ రకమైన అనుభూతినైనా వ్యక్తీకరించటం.”
– అని మీ నిర్వచనం. అందానికి రారా నిర్వచనం వేరు.
“రారా అన్నట్లు పాఠకులను ఉత్తేజితులని చేయాలన్నా, వారిని ఆకట్టుకునే విధంగా వ్రాయకపోతే ఉత్తేజితులెలా అవుతారు?”
– ఉత్తేజితులని చెయ్యాలంటే ఆకట్టుకోవాలి. కాదని రారా అనలేదు. ఆకట్టుకున్నంత మాత్రాన ఉత్తేజితులని చెయ్యలేదు అన్నది రారా ఉద్దేశం.
“తిలక్ తన కవిత్వం గురించి వ్రాసిన పంక్తులలోని వెన్నెల సముద్రాలు, మణిస్తంభాలు, అత్తరు దీపాలు కేవలం అందంగా వ్రాయటానికి సంకేతాలు.”
– నిజమే. కాని “అభ్యుదయ” కవిత్వపు సంకేతాలు ఇవి కావన్నది రారా పాయింటు.
“అభ్యుదయ కవులనబడే వారు, విప్లవకవులనబడే వారు అందానికి వ్యతిరేకులా? చెప్పదలచుకున్న విషయం, వ్యక్తీకరించదలచుకున్న అనుభూతి అందంగా వ్యక్తీకరించక పోయినా వారు పాఠకులని ఉత్తేజితులని చేయగలరా?”
– మీరు అందానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం వ్యతిరేకులు కారు. రారా దృష్టిలో “అందానికి” కచ్చితంగా వ్యతిరేకులు. రారా దృష్టిలో మనసుకి ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ(ఇక్కడ ఆనందం అంటే మన అలంకారికులు చెప్పిన “రసానందం” కాదు) ఇచ్చేదే అందం. అభ్యుదయకవిత్వం పాఠకులని ఆకట్టుకోగలదు, ఉత్తేజితులనీ చెయ్యగలదు. కాని అది ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ ఇవ్వలేదు.
“నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని” అభ్యుదయకవి తనకు ఇంతటికి ప్రాముఖ్యతను కోరుకుంటాడా?”
– మీకీ వాక్యాల్లో కవి తన ప్రాముఖ్యాన్ని కోరుకోవడం కనిపించిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది! తన జాతి జనుల స్పందనలని తన గీతంలో పలికించాలనీ, ఆ గీతం జనులు పాడుకుని వాళ్ళు మరింత శక్తివంతులు అవ్వాలనీ నాకు అర్థమయ్యింది. కవి తన జాతి జనులతో మమేకమై ఆ ఏకత్వంలోంచి తనలోంచి వచ్చిన గీతం తిరిగి జనాలకి అందివ్వాలన్నది కవి ఆకాంక్షగా నేను అర్థం చేసుకున్నాను. “మంత్రం” ఎందుకంటే అది వాళ్ళని శక్తిమంతం చెయ్యాలన్న ధ్వని కోసం. అలాగే మీరుదహరించిన మరో వాక్యమూను. జాతి జనుల అవసరాలు తనలో మాత్రం మ్రోగి ఊరుకుంటే సరిపోదు, అది తిరిగి జనాలలో మార్మ్రోగాలన్నదే కవి ఆశయం. అప్పుడే అభ్యుదయం సాధ్యమవుతుందన్నది కవి విశ్వాసం.
ఇంతకీ ఈ ప్రతి విమర్శలో అభ్యుదయ కవిత్వాన్ని లాగడం పూర్తిగా అసమంజసమని నా అభిప్రాయం. ఇది రారా చేసిన పొరపాటును కొనసాగించడమే!.
“వాస్తవ జీవితానికీ,కవిత్వానికీ మధ్య అఖాతం విస్తరించేకొద్దీ జీవిత వాస్తవాన్ని విస్మరించటమే కవిత్వధ్యేయం అవుతుంది”
– ఇందులో నాకెలాటి లాజికల్ తప్పూ కనిపించలేదు. ఎప్పుడైతే కవిత్వం (తన వస్తువులోనూ, రూపంలోనూ) వాస్తవ జీవితానికి దూరమవ్వడం మొదలుపెడుతుందో, అప్పుడు క్రమేపీ ఆ కవిత్వ ధ్యేయమే జీవిత వాస్తవాన్ని మరిచిపోవడం అవుతుందని అంటున్నారు. ఇది “తిలక్ భావనలో అభ్యుదయవాది, శైలిలో భావకవీ” అన్న కుందుర్తి అభిప్రాయాన్ని ఖండించడానికి చెప్పిన మాట. “జలుబు తలనొప్పి మొదలైతే అది క్రమేపి జ్వరంగా మారుతుంది” అనడం లాంటిది. లేదా “జలుబు తలనొప్పి – జ్వరం రాబోతోందనడానికి సూచనలు” అనడం.
“ఉత్తేజంలో ఆనందం అంతర్లీనంగా ఉండి తీరుతుందే? ఆనందం అంటే ఇక్కడ కవిత ఇచ్చే ఆనందం. అది వ్యక్తీకరించే అనుభూతి స్వభావం ఏదైనా హృదయానికి హత్తుకునే విధంగా, హృదయం ఆర్ద్రమయ్యే విధంగా చెప్పటంద్వారా కలిగించే ఆకర్షణ. ఆ ఆకర్షణే ఆనందం. ఇది లేనప్పుడు ఉత్తేజం సాధ్యం కాదు. ఆనందం, ఉత్తేజం వేరు వేరు అనుభూతులుగా సిద్ధాంతీకరింపబూనటం గందరగోళానికి గురిచేయటమే.”
– ఆనందాన్ని, ఉత్తేజాన్ని ఒకే అనుభూతిగా సిద్ధాంతీకరింప బూనారు మీరు. అదే గందరగోళానికి దారితీస్తుందని నా అభిప్రాయం. “ఉత్తేజం” అంటే రారా తన వ్యాసంలో చెప్పకనే చెప్పారు. మనిషిలో ఏదో చెయ్యాలనే ఒక బలమైన కోరిక పురికొల్పడం ఉత్తేజం. ఆనందం అంటే రారా దృష్టిలో ఆహ్లాదం, సంతోషం కలిగిన మానసిక స్థితి. ఈ రెంటికీ తేడాని గుర్తిస్తేనే, అంగీకరిస్తేనే రారా చెప్పిన విషయం అర్థమవుతుంది. ఆ దృష్టితో కాక రెండూ ఒకటే అన్న దృఢ నిశ్చయంతో రారా విమర్శని వ్యాఖ్యానించడం – కేవలం మన దృష్టితో రారా విమర్శని చూడ్డమే అవుతుంది కాని రారాని అర్థం చేసుకునే ప్రయత్నం అవ్వదు.
“ఆహారం ఆరోగ్యం కోసం, బలం కోసం. సందేహం లేదు. కానీ అది చక్కగా తినాలంటే రుచి, శుచి ఉండాలి కదా!”
– నిజమే. కాదని రారా అనలేదు. రుచి, శుచి ఉన్నంత మాత్రాన అది ఆరోగ్యం బలం ఇవ్వాలని లేదు అన్నదే రారా చెప్పింది.
“రాబందుల రెక్కల చప్పుడు…”
– రారా ఎలా అయితే “వెన్నెల సముద్రాలు, మణిస్తంభాలు,…” మొదలైనవాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదో, అలానే మీరుకూడా ఈ సంకేతాలని సరిగా అర్థం చేసుకోలేదని నాకనిపించింది. దాని గురించి ఇక్కడ వివరణ అనవసరం. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు, తిలక్ కవిత్వం గురించి మాట్లాడుకొనేటప్పుడు మధ్యలో శ్రీశ్రీ కవిత్వాన్ని గురించిన చర్చ పూర్తిగా అనవసరం.
– నాకర్థమైనంతవరకూ, లాలిత్యం కడుపునిండిన వాళ్ళ కవిత్వంలోనే ఉండగలదనీ, వాళ్ళే లలితమైన భావాలతో, పదాలతో జీవితమెంతో అందమైనదని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని అలా మభ్యపెట్టే నిరుపేదలని దోచుకుంటారనీ రారా (అభ్యుదయ, విప్లవ వాదాల) సిద్ధాంతం. ఇందులో కొంచెం నిజం దాగి ఉంది. ఇది తిలక్‌కి వర్తిస్తుందా లేదా అన్నది వేరే విషయం.
“వచన గేయపు శైలి లలితమైన (లిరికల్)ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని, గంభీరమైన ఇతివృత్తాలకు సముచితంగా ఉంటుందని స్పష్టంగా అర్ధమవుతుంది”.
– ఇక్కడ రారా వచనగేయపు శైలినీ, “లిరికల్” శైలినీ వేరుగా చూపించారన్నది స్పష్టం. మీరు వచనగేయపు శైలి అంటే, ఛందస్సు లేకుండా రాయడమన్న అర్థాన్ని తీసుకున్నారు. కాని రారా తీసుకున్న అర్థం అది కాదు. అయితే అది రారా ఈ వ్యాసంలో పూర్తిగా స్పష్టం చెయ్యకపోవడం బహుశా అతని లోపమే. లేదా అప్పట్లో ఇవి విమర్శకులకి బాగా తెలుసున్న పదాలన్న ఉద్దేశంలో రారా వివరించకపోయి ఉండవచ్చు. వచన కవిత్వపు శైలీ భేదాలని “కవితావిప్లవాల స్వరూపం”లో నారాయణరావు గారు వివరించినట్టు గుర్తు.
“భావకవుల వేదనా ప్రియత్వంలో అనుభూతి సాంద్రత ఎక్కడుంది? అది ఒకరకంగా కృత్రిమమైనది.”
– ఇది మీ పాక్షిక దృష్టినే సూచిస్తోంది కాని సరైన విమర్శ అనిపించుకోదు. అనుభూతి సాంద్రమైన భావకవిత్వం నేను చదివాను. మొత్తం భావకవుల వేదనా ప్రియత్వాన్ని కృత్రిమం అనడం అసమంజసం. కవిత్వం విషయంలో ఇలాంటి blanket statements ఎప్పుడూ తప్పే అవుతాయి.
ఇవి తప్ప మీ వ్యాసంలో మిగతా అన్ని విషయాలతోనూ నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
హెచ్చరిక: రారాగారి వ్యాసంలాగానే, నా యీ పొడుగాటి వ్యాఖ్యలోనూ తిలక్ కవిత్వం గురించి ఏమీ లేదు. కాబట్టి తిలక్ కవిత్వాన్ని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు దీన్ని చదవనక్కర లేదు.
తామొక చట్రంలో ఇరుక్కోడమే కాక తాము చదివిన కవులనీ కవిత్వాన్నీ కూడా అలా చట్రాల్లోకి ఇరికించే ప్రయత్నం చేస్తే అది ఎంత వెగటుగా ఉంటుందో రారాగారి ఈ విమర్శ నిరూపిస్తుంది. అంత మాత్రం చేత రారా అంటే నాకు గౌరవం లేదనీ కాదు, ఇదొక చచ్చు విమర్శ అనీ కాదు. కవుల్లాగే విమర్శకులు కూడా కాలానికీ, ఆయా కాలాలలో ప్రాచుర్యం పొందిన భావజాలాలకీ ప్రభావితులవుతారు. ఆ కాలంలో పాఠకులకి అది గొప్ప విమర్శగా అనిపించవచ్చు, వారూ చాలావరకూ ఆ చట్రాల్లోనే ఉంటారు కాబట్టి. తర్వాత కాలాల్లో అలాంటి చట్రాల్లో లేని వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఈ వ్యాసంలో నాకు తిలక్ కవిత్వం కంటే కూడా అభ్యుదయ కవిత్వం గురించిన వివర విశేషాలే ఎక్కువగా కనిపించాయి. తిలక్ అభ్యుదయ కవి కాడు అని నిరూపించడానికి అభ్యుదయ కవిత్వం గురించి అంత వివరణ అనవసరం అని నాకనిపించింది. అది కాక మిగిలినదంతా, తిలక్ భావకవి అని అంతకన్నా కూడా అథమస్థాయికి దిగజారాడని, నిరూపించడానికే సరిపోయింది. ఎంతసేపూ “అభ్యుదయ”, “భావ” కవిత్వాలు అనే చట్రాల్లోకి తిలక్ కవిత్వం ఒదుగుతుందా లేదా అనే తపనే కాని, ఒక కవిగా అతని కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ధ్యాస లేకపోవడం దురదృష్టకరం.
“శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి బహుశా లేడేమో” అని అన్నారు కాని, శ్రీశ్రీ కున్న భావుకత్వానికీ తిలక్ భావుకత్వానికీ మధ్యనున్న ఆంతర్యం ఏమిటన్న ఆలోచన చెయ్యలేదు. ఇద్దరూ గొప్ప భావుకులే. ఇద్దరికీ గొప్ప శబ్దశక్తి ఉంది. కాని వాళ్ళిరువురూ అంత భిన్నమైన కవిత్వాన్ని ఎందుకు రాసారు?
“దుఃఖితుల పట్లా బాధితుల పట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట ఎవరూ కాదనరు. కాని ఆ కరుణ అభ్యుదయ హృదయ స్పందనగా కనిపించదు. ఆ కరుణ దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురనూ, కర్యవ్యోన్ముఖులనూ చేసేది కాదు. కనీసం వాళ్ళకు ఊరట కలిగించేది కూడా కాదు.” అన్నప్పుడు దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురని చేసేది మాత్రమే “అభ్యుదయ స్పందన” అవుతుందనే ఒక prejudice అందులో దాక్కుంది. పైగా “ఆ కరుణ కేవలం భావకవి కుమారుని ఏకాంత సౌందర్యంగా, కవితానంద హేతువుగా మిగిలిపోయింది” అని అన్నప్పుడు ఆ కరుణ అభ్యుదయం కాకపోతే భావుకవిత్వమే అవ్వాలన్న సంకుచిత దృష్టి కనిపిస్తోంది. తిలక్ కరుణ భావకవులకి మల్లే పూర్తిగా వ్యక్తిగతమైనది కాదు. భావకవుల్లా దుఃఖంలో అతను సౌందర్యాన్ని చూసాడనడమూ సహేతుకం కాదు. తిలక్ శ్రీశ్రీలా ఆవేశపరుడు కాదు. అందుకే అతను ఎంత భావుకుడైనా అతని కవిత్వంలో మృదుత్వం తప్ప రారా అన్న “ఉత్తేజం” కనిపించదు. శ్రీశ్రీ ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అతన్ని మరింత ఆవేశపరుణ్ణి చేసి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు తిలక్ కి లేనందువల్ల అతనిలో ఆ ఆవేశం కలిగే అవకాశమూ రాలేదు. అంత మాత్రం చేత తిలక్ కరుణని ఆవేదనని భావకవుల ఏకాంత సౌందర్యంగా జమకట్టెయ్యడం తప్పు. తిలక్ పీడితతాడిత జనాలని క్రియాశీలురని చెయ్యడానికి కంకణం కట్టుకోలేదు. వాళ్ళ బాధలకి నిజాయితీగా స్పందించాడు. అది భావకవిత్వంలో ఎక్కడా మనకి కనిపించదు.
“ప్రజాశక్తుల పట్ల భావకవి హృదయంలో స్వచ్ఛందమైన సానుభూతి ఉంది కానీ, ప్రజాశక్తులతో తాదాత్మ్యం చెందే అభ్యుదయకవి హృదయం కాదది” అన్నారు. తిలక్ భావకవి అని ముద్రవేసి అతని కవిత్వంలో ప్రజాశక్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ సానుభూతిని భావకవులందరికీ కట్టబెట్టేసారు. కాకపోతే, అసలు అంతకుముందు వచ్చిన భావకవిత్వంలో “ప్రజాశక్తుల” ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఇక ప్రజాశక్తులతో “తాదాత్మ్యం” అభ్యుదయ కవుల్లో ఏ కొద్దిమందికో మాత్రమే ఉన్నది. అభ్యుదయ కవిత్వం పేరుతో వచ్చిన చాలా కవితల్లో ఆ తాదత్మ్యం లోపించే అవి శుష్క నినాదాలుగా మిగిలిపోయాయి.
స్త్రీ గురించి “పెద్దపులి” అనడమూ, “ప్రవహ్లిక”తో పోల్చడమూ ఏ ఇజాలకీ లొంగక పాపం రారాగారికి అస్సలు మింగుడుపడలేదు! ఆఖరికి ఏదో తనకి తెలిసిన ఒక ఆర్యోక్తితో ముడిపెట్టే ప్రయత్నం చేసారు. ప్రతిదాన్నీ ఏదో ఒక ఇజంతో ముడిపెట్టాలన్న ఈ తహతహ ఎందుకసలు? ఒక పురుషుడిగా స్త్రీ వ్యక్తిత్వంలో తనకి తెలియని లోతులు కనిపిస్తే దాన్ని కవిగా తనదైన రీతిలో వ్యక్తం చేస్తే ఆ కవిత్వాన్ని కవిత్వంగా ఎందుకు అర్థం చేసుకోకూడదో నా మట్టి బుఱ్ఱకి తట్టటం లేదు.
ఇక స్త్రీల వర్ణన గురించి ప్రస్తావించి, అది భావకవిత్వం కన్నా దిగజారి ప్రబంధకవిత్వ స్థాయికి చేరుకుందని కొన్ని కవితలు ఉదహరించారు.తిలక్ చేసిన అంగాంగ వర్ణనలని ఆక్షేపిస్తే నాకు పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కాని భావకవిత్వంతో పోల్చి, అంతకన్నా దిగజారిందనడం పూర్తిగా అనవసరం, అర్థ రహితం. భావకవుల కవిత్వంలో కూడా మనకి ఇలాంటివి కనిపిస్తాయి. బాపిరాజుగారి “నగ్న” కవితాఖండిక దీనికి మంచి ఉదాహరణ. ఇంకా కాళ్ళకూరి గోపాలరావు కవిత్వం, కవికొండల గీతాలు మొదలైనవాటిల్లో స్త్రీ అంగాంగ వర్ణన కనిపిస్తుంది. “భావకవిత్వంలో స్త్రీ” పుస్తకంలో జయప్రభగారు దీని గురించి వివరించారు. అంచేత స్త్రీల వర్ణన విషయంలో తిలక్ భావకవిత్వం కన్నా దిగజారుడుతనం చూపించాడన్నది అర్థం లేని ఆక్షేపణ.
అలాగే స్త్రీ పురుష సంబంధాల గురించి, భావకవులది “ఉదాత్త ప్రణయమ”నీ, ఇంద్రియవాంఛ, శరీరదాహం సిగ్గుమాలినతనమనీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చదివితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే “అమలిన శృంగారం” అన్న “ఉదాత్తమైన” ప్రణయాన్ని భావకవుల్లోనే అందరూ ఆదరించిన దాఖలాల్లేవు. అభ్యుదయవాద చట్రంలో ఇరుక్కున్న రారాగారికి అది “ఉదాత్తంగా” కనిపించడంలో వింతలేదు, కాని తర్వాత వచ్చిన స్త్రీవాదులు దాన్ని పూర్తిగా ఖండించడం ఒక విశేషం!
రారాగారు ఎంతగా సిద్ధాంత సర్పపరిష్వంగంలో ఇరుక్కుపోయారంటే, సూత్రాలకీ సిద్ధాంతాలకీ కట్టుబడని తిలక్ మనస్తత్వాన్ని “మానసిక అరాజకత్వం” అనేంతగా! అల్లాంటి ఇరుకుదనమే సంకుచితత్వానికీ, నిరంకుశత్వానికీ దారితీసింది . కలల గురించి కవిత్వం రాసిన కారణానికి తిలక్ ని పిచ్చాసుపత్రికి దగ్గరగా ఉన్నాడని అనేంతగా అతని విమర్శని దిగజార్చింది!
ఇది ఏదైనా కావచ్చును కాని తిలక్ కవిత్వాన్ని గురించిన “సమీక్ష” మాత్రం ఖచ్చితంగా కాదు.
అపారమైన తెలుగు సాహిత్య చరిత్రలో కొద్దిమంది కవులు ,బహుశా ఒక కవయిత్రి పేరు మాత్రమే ప్రసిద్ధి కెక్కాయి. కవిత్రయము,పోతన,శ్రీనాధుడు,అష్టదిగ్గజములు,మొల్ల పూర్వకవులలో ఆ అదృష్టమునకు నోచుకొన్నారు. వైయాకరుణులు పోతన కవిత్వంలో కూడా బోలెడు దోషాలు పట్టారు. నన్నయ, తిక్కనల భాషలో కూడా తప్పులు పట్టి ‘ఆర్యదోషంబు గ్రాహ్యంబు’ అని ఓ వ్యాకరణ సూత్రము తగిలించారు. అందుచేత కవయిత్రి మొల్లను స్త్రీ అనో అగ్రకులమునకు చెందక ఫొవటము వలననో ఆ కాలపు పెద్దలు గౌరవించ లేదని చెప్పడము భావ్యము కాదేమో. అది నిజమయితే అగ్రకులస్థులే ఎక్కువగా సాహిత్య పఠనం చేస్తున్న కాలంలో ఆవిడకు ఆ ఖ్యాతి ఎలా వచ్చింది?
మొల్ల సహజ కవయిత్రి. భాషాధ్యయనము చేయలేదని, ఈశ్వర ప్రసాదముచే కవిత్వము వచ్చినదని ఆవిడ చెప్పారు. నిఘంటువు అవసరము ఎక్కువగా లేని రీతిలో తేనెసోకునటుల తియ్యని మాటలతో కవిత్వము వ్రాసారు. రాజుల వర్ణన బాగుంది. కాని నన్ను ఆకట్టుకొన్న పద్యము
శ్రీరాముడు శివధనస్సు ఎత్తుతుంటే భూకంపము రాకుండా చూడమని లక్ష్మణుడు చెప్పిన పద్యము నాకు నచ్చినది. (మూడవ పాదములో యతి కలసి నట్లు లేదు. పెద్దలు వివరించ గలరు. మనకు నచ్చినప్పుడు యతి కలవక పోతే యేమి ? )
చిక్కని పద్యాలలో చక్కని కవిత్వం, చాలా బాగుందండీ!
“అంభోవాహస్వనితానుకూలనటనంబూనె న్మయూరంబులున్” : మేఘధ్వనికి నెమళ్ళు నాట్యం చెయ్యడం మామూలే, ఆ ధ్వనికి అనుగుణంగా నాట్యం చేసాయనడం విశేషం!
“తారలు క్షపాకరుడుం గనరాకయుండఁ గాలయవనికాంతరస్థనటులం బలె” : కొత్త ఊహ!
“కరుణానిధి”, “కరుణాంబుధీ” లాంటి పదాలు వినివిని అరిగిపోయాయి 🙂 “అనుకంపాబ్ధీ!” : చాలా బాగుందీ పదం!
“రస” విషయికంగానే కొంత నిరుత్సాహం కలిగింది. కథ తెలిసినవాళ్ళకయితే ఫరవాలేదు కాని, తెలియని నాలాంటి వాళ్ళ విషయంలో చివరకి వచ్చేసరికి హఠాత్తుగా ముగిసిపోయినట్టనిపిస్తుంది. అంత గొప్ప వర్ణనలతో ఆ వాతావరణాన్నీ, ఆ సురాంగన దిగిరావడాన్ని వర్ణించిన తీరులో అద్భుత రసాన్ని పోషించి, వెనువెంటనే శాంత రసస్ఫోరకాలయిన బుద్ధుని మాటలు వచ్చెయ్యడం ఒక రకంగా రసభంగమైనట్టు అనిపించింది. అక్కడ మరికొంత కల్పన ఉంటే మరింత రక్తి కట్టి ఉండేదని అనుకుంటున్నాను.
ఏదైనా ఈ కాలంలో ఇంత మంచి పద్యకవిత్వాన్ని చదవడం అదృష్టమే! వీటిని దేశికాచారిగారి గళంనుంచి కాని, లేదా వేరెవరి మధుర గళంనుంచైనా కాని వినగలిగితే మరింత ఆనందంగా ఉంటుంది. ఇది ఈమాటలాంటి ఇంటర్నెట్ పత్రిలలకి పెద్ద పనేం కాదు కదా!
1. రెండవ పాదము గంధము అనే పదమునుండి ఆరంభమవుతుంది. సంపాదకుల సహాయముతో దానిని సరి దిద్దుతాను. నేను పద్యాలను మొట్టమొదట ద్విపదరూపములో వ్రాసి తరువాత నాలుగు పాదాలుగా విడదీసినాను. అప్పుడు జరిగిన తప్పు ఇది. చెప్పినందులకు కృతజ్ఞతలు.
2. అతి అతి అనే పదాలు సంధి రీత్యా అత్యతి అవుతుంది. అంటే చాల చాల అని అర్థము.
3. పదము అంటే పాట అని కూడ అర్థము ఉంది.
4. రాగవతి అంటే రాగము ఉండే స్త్రీ అని అర్థము. రాగము అంటే ఎరుపు రంగు అని కూడ అర్థము. దీనికి మూలమైన సంస్కృత పద్యము రామాయణములో ఉందని కొందరు, లేదని కొందరు అంటారు. కియోటో ప్రతిలో లేదు ఇది. తి.తి.దే. సంక్షిప్త రామాయణములో ఉన్నది. ఆ పద్యము.
ఇందులోని అలంకారము స్వభావోక్తి., శ్లేష. సంధ్యను సాయంకాలముగా, ఒక స్త్రీగా ఈ పద్యములో వర్ణిస్తాడు కవి. స్త్రీపరముగా రాగవతి అంటే రాగము గలది, సంధ్య పరముగా ఎరుపుదనము కలిగినది, అంబరము అంటే ఆకాశము, వస్త్రము అనే రెండర్థాలు సరిపోతాయి. కరము అంటే చేతులు, కిరణాలు.
5. చైత్ర మాసానికి మరొక పేరు మధు మాసము (నేను వ్రాసిన కళావసంతములో దీనిని గురించి చర్చించాను). మదనుని మాసము అంటే కామదేవుని మాసము. అది మనిషికి ఒక ప్రత్యేకమైన నెల కాదు గదా, అన్ని నెలలలో అది ఉంటుంది, అంటే ప్రతి నెలా కామదేవునిదే కదా?
6. సంస్కృత సమాసాలలో ద్విత్వాక్షరానికి ముందు ఉండే అక్షరము ఎప్పుడూ గురువే. కాని తెలుగు పదాలకు ఈ నియమము వర్తించదు. ఉరికెను త్వరగా అనేటప్పుడు ను అక్షరాన్ని ఊది పలుకడము లేదు, కాబట్టి అది లఘువే. అచ్చ తెలుగు పదాల మధ్య కూడా ఇదే నియమము. అద్రుచు వంటి పదాలలో అ లఘువే, గురువు కాదు. అఆ అనే అక్షరాలను పక్కపక్క రాస్తే, చదివేటప్పుడు అ అక్షరము గురువే లఘువు కాదు!
నచ్చిన దాని గురించి కాక నచ్చని వాటి గురించి మాత్రమే మాట్లాడటం భావ్యం కాదని మరో నాలుగు మాటలు. నాకు నచ్చిన కవిత సరిగంగ స్నానం. అసలా మాట విని శతాబ్దాలయింది; పల్లెటూరి జీవితం గుర్తుకి తెప్పించింది: “తానే మనసారా వొక ఏరయి పోయి
చిన్న చిన్న వూళ్ల
పక్కటెముకల్నించి ప్రవహిస్తున్నాడు ఈ కవి హఫీజ్.”
పర్షియన్ మహాకవి హఫీజ్ కవితకి అనువాదం అని ఉన్నది కాని మూలం లేదు. “ఉప్పొంగి వస్తోంది గంగానమ్మ తల్లిలా,” అన్నది చూసి, మూలంలో ఏముందో తెలుసుకోవలని కుతూహలం కలిగింది.
అదీగాక, నేనింతకు ముందు హఫీజ్ కవిత్వమేమీ చదవకపోయినా, గతనెలలో ఓ సగం ధర పుస్తకాల షాపులో తచ్చట్లాడుతూ, అందంగా ఉన్న అట్ట బొమ్మని చూసి,
“The stuff produced in the factories of space and time
Is not all that great. Bring some wine, because
The sweet things of this world are not all that great.”
అన్నది చదివి, హఫీజ్ కవితల పుస్తకం [1] కారుచవగ్గా వస్తుంటే కొన్నాను. దాంట్లో సరిగంగ స్నానం ప్రస్తావన లేదు కాని డెక్కన్ సుల్తాన్ ఆహ్వానం మీద హఫీజ్ మన దేశం రావాలని బయల్దేరి, దారిలో తుఫాను రావడంతో మానుకున్నాడట:
“Hidden inside the crown of a king there’s always
A fear of assassination; a crown is a stylish hat,
But a head is too much to pay for it.
It seemed quite easy to put up with the ocean
And its torments to receive a proft, but I was wrong;
A hurricane is too much to pay for a hundred pearls.”
— Deciding Not To Go To India.
వేరే అనువాదాలేవైనా ఉన్నాయా అని నిన్న వెతికితే, ఓ షాపులో Daniel Ladinsky అనువాదం “Like the Ganges” [2] కనబడింది. దానికి సరిగంగ స్నానం చాలా దగ్గరగా ఉంది. Ladinsky మన దేశంలో మెహర్ బాబా ఆశ్రమంలో గడిపినప్పుడు హఫీజ్ ప్రభావంలో పడ్డాడట. ఓహో అనుకొని ఈ విషయాన్ని పక్కన పెట్టబోతుంటే ఓ చిక్కు వచ్చి పడింది. Ladinsky చేసినవి అనువాదాలు కాదు, ఆయన సొంత కల్పనలు అన్న వివాదం ఉందట!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “The angels knocking on the tavern door : thirty poems of Hafez,” translated by Robert Bly and Leonard Lewisohn. HarperCollins, 2008.
[2] “The Subject Tonight Is Love, 60 Wild and Sweet Poems of Hafiz,” Daniel Ladinsky (Translator). Penguin Group, 2003.
వేటూరి మరణానంతరం ఈమాట వారు ఒక ప్రత్యేక సంచిక గాని, ఒక ప్రత్యేక సంస్మరణ వ్యాసం కాని వెలువరించకపోవడం చాల ఆశ్చర్యంగాను మరియు చాల బాధగాను అనిపించింది. ఇప్పటికైన వేటూరి సంస్మరణార్థం వేటూరి గురించి తెలిసిన విజ్ఞులెవరి చేతనైనా ఒక ప్రత్యేక వ్యాసం రాయించాలని ఈమాట వారికి నా విజ్ఞప్తి.
కొడవళ్ల హనుమంతరావు గారి కామెంట్ సూటిగా, సరళంగా, నిరావేశంగా, బాగుంది. వారు Web 2.0 గురించి అన్న మాటకు చిన్న స్పందన: వారన్నది “పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.” అని. ఇందులో చివరివాక్యం నేనన్న దానికి సంబంధం లేనిది. రచనాసందర్భం మారటం వల్ల కొత్తరకమైన కవిత్వం వస్తుందనే prediction సాధ్యం తప్ప అది ఉత్తమకవిత్వానికీ సృజనతీరులో మార్పులకీ దారితీస్తుందన్నది కాదు. ఏ కవితామార్గం లోనైనా ఉత్తమకవిత్వం రావొచ్చు. ఉదాహరణకు పురాణమార్గంలో వచ్చిన ఉత్తమకవిత్వంగా కొందరు “రామాయణ కల్పవృక్షా”న్ని ఎంచవచ్చు, అది వచ్చింది భావకవిత్వం/అభ్యుదయ కవిత్వం ప్రధానకవితామార్గాలుగా వున్న రోజుల్లోనైనా. అలాగే, “కళాపూర్ణోదయం” సృజనతీరులో మార్పుని చూపే కావ్యంగా నేను భావిస్తాను, అది ప్రబంధమార్గం లోని ఉత్తమకావ్యం కాకపోయినా. ఒక కొత్తకవితావిప్లవం రావటానికి, ఉత్తమ కవిత్వము, సృజనతీరులో మార్పులకీ పరస్పర ఆధార సంబంధం లేదనటానికి ఇవి ఉదాహరణలని నా ఉద్దేశ్యం.
రమా భరద్వాజ్ గారి most recent comment గురించి ఒక చిన్న observation తో ముగిస్తాను. వారు ప్రతిస్పందించిన నా కామెంట్ లో నేను ఎక్కడా “తిట్టు” లేదా “తిట్లు” అనే పదాల్ని వాడలేదు. విమర్శకుల్ని వారు విమర్శించారన్నాను. వారన్నదాన్ని బట్టి ఇప్పుడు తెలుగుకవిత్వానికి సంబంధించిన వాడుకలో “విమర్శ”, “తిట్టు” పర్యాయపదాలుగా వాడుతున్నట్టు (కనీసం వారనుకుంటున్నట్టు) అర్థమౌతున్నది. ఇది నేను ఇప్పుడే తొలిసారిగా తెలుసుకుంటున్న విషయం. ఐతే, దీంతో నాకున్న ఒక సందేహం నివారణ అయింది – అది తెలుగుకవులు, విమర్శకులు “విమర్శ” కు దూరంగా ఎందుకు పారిపోతున్నారనేది. విమర్శ, తిట్టు ఒకటైనప్పుడు అలా జరగటం సహజమే కదా ! అలా ఐతే “విమర్శకుడు” అంటే “తిట్టేవాడు” అనే అర్థం రావటం తప్పదు కాబట్టి, వారు నేను విమర్శకుణ్ని కానని స్పష్టం చేసి పుణ్యం కట్టుకున్నారు. ఇందుకు వారికి ఇంకా థేంక్స్.
సమీక్ష నచ్చింది. కాని 48 కవితల్లో నన్నాకట్టుకున్నవి నాలుగయిదు మాత్రమే. ఎక్కువ భాగం నచ్చకపోవడానికి ఓ ముఖ్య కారణం పదేపదే కనిపించే కొన్ని పదాలు. అఫ్సర్ పదాల ప్రాముఖ్యత తెలియని కవి కాదు:
“చిత్రిక పట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా శవానికి సైతం కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.”
“మరీ ఇంత సున్నితంగా మాట్లాడకు ఈ పూట … కాసింత ముల్లు గుచ్చుకున్నట్లుగా వుండాలి ఈపూట.”
ఎంత గరుకు మాటలు వాడినా చివరకు కవిత చదివేవానిలో సున్నితత్వాన్ని పెంచాలి కదా. “నెత్తురంటిన మాటలు” కవితల్లో చాలా ఎక్కువై పోయి నాకు వెగటు కలిగించాయి. నిజానికి నెత్తురు మాట చదివినప్పుడల్లా, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం చదివిన నెరూడా చెప్పిన మాటల ప్రాముఖ్యత గుర్తొచ్చి, “నెత్తుటి కడవల” దోషం కొట్టొచ్చినట్లయింది:
“I leave them in my poem like stalactites, like slivers of polished wood, like coals, pickings from a shipwreck, gifts from the waves. Everything exists in the word.” [1]
ఇటీవలే తిరిగి ప్రచురితమైన వెల్చేరు పుస్తకానికి [2] KVS రామారావు గారు ఇచ్చిన కితాబు: “నాకెంతగానో నచ్చిన మరొక అంశం, రచయిత రాసిన వచనం. శాస్త్రీయ, విశ్లేషణాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా, పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు.” నేను కొన్ని భాగాలే చదివాను. ఈ విషయంలో నేనూ మెచ్చుకుంటాను.
వెల్చేరు సిద్ధాతం ప్రకారం, రచనా సందర్భం, సామాజిక సందర్భం మారినప్పుడు కవితా స్వరూపం కూడా మారుతుంది. ఆశు రూపం నుంచి శ్రవ్య రూపానికీ, పిదప పాఠ్య రూపానికీ మారడానికి కారణం – రచన చేసే పరికరాల్లో మార్పు రావడమే. (పదో అధ్యాయం)
KVS రామారావు గారుWeb 2.0 కూడా కొత్త రచనా సందర్భమనీ, దీని మూలంగా కొత్త కవితా రూపాలొచ్చే అవకాశముందనీ అంటున్నారు. దానితో నేను విభేదిస్తాను. పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.
Question: The Internet, and in general the information revolution, has already revolutionized our world, and it will continue to do so in even more radical ways, as … suggest. Do you think that philosophy, or let us say, critical thinking, will have a whole new spectrum of questions to deal with, and that we might have to begin a new sub-discipline named something like cyber-philosophy?
Rorty: Maybe, but I see no special reason to think so. The telephone and telegraph didn’t create a tele-philosophy, so I am not sure that the Internet will produce a cyber-philosophy. I think a lot of the stuff about the information revolution is media hype.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Memoirs,” Pablo Neruda.
[2] “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం,” వెల్చేరు నారాయణరావు. తానా ప్రచురణ, 2008.
[3] “Take care of freedom and truth will take care of Itself: interviews with Richard Rorty,” edited with an Introduction by Eduardo Mendieta. Stanford University Press, 2006. Page 111.
రామారావు గారూ!! నా ఆ అభిప్రాయాన్ని ఎడిట్ చేసి వేయడం కారణంగా మీకు కలిగిన పొరపాటు అభిప్రాయం మాత్రమే అది. అందుకు నా బాధ్యత ఏమీ లేదు. గమనించండి. నేను మిమ్మల్ని ఒక “విమర్శకునిగా” ఆ నా అభిప్రాయంలో పేర్కోలేదు. నాకు తెలీదు మీరు విమర్శ ఏమన్నా రాసేరని. అభిప్రాయాలు మీరు ఒక పుస్తకం మీద చెప్పినట్టే అందరికీ ఉంటాయి. నా అభిప్రాయం మీకు ఒప్పుదల కాకపోయినంత మాత్రాన దానిని “తిట్టుగా” భావించనక్కరలేదు. నేను పేర్కొన్న అభిప్రాయం అభిప్రాయం మాత్రమే . “తిట్లు” కావు. నేను రాయని అభిప్రాయాలని నాకు ఆపాదిస్తే అందుకు నేను ప్రతిస్పందించనక్కర లేదు. నా భావం వీళ్లకి అర్ధం కాలేదు అనుకుని ఊరుకుంటాను.
చర్చని “కవితావిప్లవాల స్వరూపం” మీదకి మళ్ళించవలసిన ప్రశ్నలని మీరు వేసేరు. అది వేరే చర్చ అవగలదు. ఆ చర్చని చేసే ఆసక్తి మిగిలిన వారికి ఉండాలి. కదా? మీరు వేసిన అన్ని ప్రశ్నలూ సమంజసగానే ఉన్నాయి. ఆలోచనాత్మకమైన అభిప్రాయాలని గుర్తించగలిగిన మీకు వాటికి జవాబులు అన్వేషించడమూ ఏమంత కస్టం కాకపోవచ్చు. నేను ఇదివరకూ చెప్పిన అభిప్రాయామూ..మీకొచ్చిన సందేహాలతో సహా ఆ పుస్తకానికి సంబంధించి మరోసారి ఒప్పుకుంటున్నాను. నేను తొందరపడి అభిప్రాయాలు ఏర్పరుచుకోను. ఏర్పడిన అభిప్రాయాలని సరైన మరొక కారణం లేకుండా మార్చుకోను.
“తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” గురించి రమా భరద్వాజ్ గారి వ్యాఖ్యలు ఆలోచనాత్మకాలు. ఐతే వారు ఆ గ్రంథం నుంచి ఆశిస్తున్నవి దాని పరిథిలోవి కావనుకుంటాను.
1. వారు ““రచనా సందర్భం” మారితే వచ్చే అవకాశాలనీ.. అంటే వీలూ సాలూ అంటాం తెలుగులో వాటి గురించి మాట్లాడుకుందికి ఉపకరిస్తుందేమో గానీ అది మంచి కవిత్వమా కాదా అని గుర్తించడానికి ఎందుకూ ఉపకరించదు.” అన్నారు. నాకు అర్థమైనంతవరకు ఏది మంచి కవిత్వమో ఏది కాదో గుర్తించటం కాదు ఆ పుస్తకం చేస్తున్న పని; తెలుగు కవిత్వంలో పెనుమార్పులు ఏవో, వాటి వెనక వున్న కారణాలు ఏమిటో గుర్తించటానికి ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించి ఆ సిద్దాంతం ద్వారా వేటిని పెనుమార్పులుగా గుర్తించవచ్చో చూపించింది, అంతే.
2. మరో చోట “కవితావిప్లవాల స్వరూపాన్ని దాటి ముందుకెళ్ళవలసిన “సందర్భం” కూడా ఏనాడో వచ్చింది. నారాయణరావు గారి థియరీ భాషలో చెప్పాలీ అంటే విమర్శా సందర్భం ఏనాడో మారింది. ఆ దృష్ట్యా కవితా విప్లవాల స్వరూపం ఒక పాత పుస్తకం. ఇవాళ్టికాలపు అవసరానికి అది ఎందుకూ ఉపయోగపడదు. ” ఇక్కడ వారు వాడిన తర్కమార్గం సుగమంగా లేకపోయినా, దీన్ని నేను ఇలా అర్థం చేసుకుంటున్నాను (ఇది పెడదారైతే అసలు దారేదో తెలుసుకోవాలని వుంది): ఇది ఒక విమర్శాగ్రంథమనీ, కవిత్వానికి లాగానే విమర్శాసందర్భంలో మార్పు వల్ల విమర్శలో కొత్తవిప్లవం వచ్చిందనీ, ఈ గ్రంథం పాతవిప్లవం తాలూకుదనీ. విమర్శకు సంబంధించి అలాటి సిద్ధాంతం ఒకటి వున్నట్టు, దాని ప్రకారం ఈ పుస్తకం ఒక పాతవిప్లవంలోదని ఆ తర్వాత మరొక రచన లేదా రచనలు కొత్త విప్లవం లేదా విప్లవాలకు దారి తీసినట్టు నిరూపణ అయిందని నాకు తెలియదు; కాని ఈ చర్చ కోసం అలా జరిగిందని ఒప్పుకుందాం. అలా ఒప్పుకున్నా, ఈ పుస్తకం చదవవలసిన అవసరం తీరిపోయిందని దాన్నుంచి ఎలా నిర్ధారణ చెయ్యటం? ఇక “ఇవాళ్టికాలపు అవసరం” అనేది. ఈ అవసరం ఏమిటో ఎక్కడా స్పష్టంగా చెప్పకుండా దానికి ఇది ఎందుకూ ఉపయోగపడదు అంటే అర్థం చేసుకోవటం కష్టం. ఈ వాక్యసందర్భాన్ని బట్టి ఆ అవసరం సైతం ఏదో ఈ పుస్తకపరిథిలో లేనిదే అయుంటుందని అనిపిస్తున్నది. నాకు మూడు సాధ్యమయే అర్థాలు కనిపిస్తున్నాయి:
అ) “చాలా కొత్త విప్లవాలు వచ్చాయి, వాటిని ఈ పుస్తకం లోని సిద్ధాంతం గుర్తించలేదు”
ఆ) “ఈ పుస్తకంలో చెప్పిన కారణాలు కాకుండా కవితావిప్లవాలకి ఇంకొన్ని కొత్తకారణాలు కనుక్కున్నారు”
ఇ) “ఈ సిద్ధాంతం తప్పని నిరూపించబడింది”
వీటిలో ఏది జరిగివున్నా, అలా జరిగినట్టు నాకు తెలియదు. దయచేసి అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో ఎవరైనా చెప్తే తెలుసుకుంటాం.
చివరగా, నేను చేసిన పాడు పనికి విమర్శకులందర్నీ విమర్శించటం ఎందుకు? (అలాగే, నన్నొక విమర్శకుడిగా లెక్క వేసినందుకు రమ గారికి థేంక్స్, నేను కాకపోయినా.)
నేను చర్చని తప్పు దారి పట్టించడం లేదు. అందులో అనుమానమే లేదు. అఫ్సర్ ని అమెరికా తెలుగు కవి అన్నది మీరె కదా?! ఇదిగొ ఇదీ మీ మాట:
చివరగా పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరూ అమెరికన్ తెలుగు రచయితల కోవలోకే వస్తారని నా నమ్మకం.
అమెరికన్ తెలుగు రచయిత అనే మాట మీది కూడా. కాదని ఎలా అంటారు? పైగా, ఆ “శతకోటి నమస్కారాల” వెటకారం హేమిటో నాకు అర్ధం ఆవలేదు.
అది అవతల పెట్టండి. కాని, కవిత్వ విమర్శకుడిగా మీ ఆలోచనల మీద ఇష్టం వుండబట్టే, నెను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను తప్ప మిమ్మల్ని గిచ్చి సంతసిద్దామని కాదు. రమా భరద్వాజ గారి లాగానె నాకూ మీ రచనలు అంటే ఇష్టమే. అఫ్సర్ గారి కవిత్వం గురించి మీ మాట వినాలన్న వుత్సుకతతో మాత్రమే అడిగాను.
నా ప్రవర అడిగారు కదా మీరు? మారుపేర్లతో రాసే అందరినీ కూడా అలా ప్రవర అడిగే సాహసం చెయ్యగలరా, మీరు గానీ, ఈమాట సంపాదకులు గాని?
గత పదేళ్ళుగా నేనూ, నా మిత్రులం ఈమాట చదివి, అందులో విషయాలు చర్చించుకునే అలావాటు చేసుకున్నాం. చదవడమే గాని, ఎప్పుడూ ఒక ముక్క రాసే సాహసం చెయ్యలేకపొయాము. ఇప్పుడు ఈమాటలో కామెంటడానికి అర్హత ఏమిటో ఇక్కడ కొందరి వ్యాఖ్యలు చదవిన తరవాతే తెలిసింది. అంతకు ముందు ఈమాట లో ఒక్క అక్షరం పడ్డా కళ్ళకి అద్దుకుని చదువుకునే వాళ్ళం నేనూ, నా నిజామాబాద్ మిత్రులం! అలాంటిది, ఇప్పుడు ఈ రాతలకి అర్ధమే లేని స్థితి వచ్చే సరికి బాధ పడి, ఇక తప్పని సరయి రాస్తున్నాను.
అయినా మీరు అడిగారు కాబట్టి, మీ మీది గౌరవంతో ఇదీ నా ప్రవర. నా పేరు శ్రీనివాసాచార్యులు కందాళం. నేను ఒక కాలేజీ లెక్చరర్ని. సాహితీ చైతన్య స్రవంతి సభ్యుడిని. ఈమాట పాఠకుడిని అని చెప్పుకోవడం నాకు ఒక ఇష్టం. నేను నా విద్యార్ధులకి కూడా ఈ వెబ్ పత్రిక గురించి చెబుతూ వుంటాను. కవిత్వం రాయను కాని ఇష్టంగా చదువుతాను, విద్యార్ధులకి వినిపిస్తాను. నా చిరునామా ఇతర వివరాలు కూడా కావాలా?
[Post edited – Eds.]
[ఈమాటలో కామెంట్లు అసభ్యంగా ఉంటున్నాయని బాధపడుతూనే, వ్యక్తిగత దూషణలకి పూనుకోడంలో అంతరార్థం మాకు అంతుపట్టడం లేదు. దయచేసి ఎవరికి వారు, వారి కామెంట్లను నియంత్రించుకోండి. – సం.]
మీరు అఫ్సర్ గారి వ్యాఖ్యా, ఆ తరువాత నే చేసినదీ మరోసారి చదవండి. నేను ఊరిచివర కవిత్వంపై విమర్శ చెయ్యలేదు. అఫ్సర్ గారు రాసిన వ్యాఖ్య దురుసుగా అనిపించి దానిపై రాసాను. మీరు అది వదిలేసి, కొత్త కొత్త తెలివైన ప్రశ్నలేస్తే జవాబిచ్చే సత్తా, ఓపికా నాకు లేవు.
అఫ్సర్ గారు అక్కడ కవిత్వం రాసినా, ఇక్కడ కవిత్వం రాసినా నాకభ్యంతరం లేదు. నాకొరిగేదీ ఏమీ లేదు. బావుంటే చదివి ఆనందిస్తాను. లేదంటే చదివినంత వేగంగానే మర్చిపోతాను. అక్కడా, ఇక్కడా అంటూ గీత గీసింది అఫ్సర్ గారు. ఆయన్నొదిలేసి నన్నడిగితే నా దగ్గర సమాధానం లేదు. కాబట్టి మీరు ఆయన్ని సంప్రదించాలి. నన్ను కాదు.
మీరిచ్చిన వలస కవులూ, రచయితల లిస్టు నాకూ తెలుసు. వారందరూ ఇక్కడే ఉండిన అక్కడి వారయితే, ఇక్కడే ఉండిన ఇక్కడి తెలుగువారెవరూ ఉండరు. ఈ వసుధైక కుటుంబంలో వలస పక్షులు కానిదెవరు?
మీరు చర్చని తప్పుదారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు.
చివరగా – గతంలో ఆంధ్రాలో ” సుబ్బారావూ” అని రోడ్డు మీద అరిస్తే కనీసం పదిమందైనా వెనక్కి చూసేవారు. ప్రస్తుతం సుబ్బారావుని శ్రీనివాస్ పేరు ఆక్రమించుకుంది. మీ పూర్తిపేరుతో వ్యాఖ్య రాస్తే పలానా అని తెలిసేది. :)- ఆ అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలేసి తప్పించుకున్నారు. :)-
మంచి మాటలకు ధన్యవాదాలు.ఆలశ్యానికి మన్నించండి. మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ “ఊరి చివర” చర్చలో ఒదగవు కాబట్టి, అది వేరే వ్యాసం రాస్తున్నాను. కొంచెం ఓపిక పట్టండి. కాని,తెలుగు పాఠకుల సంఖ్య ఎక్కడ పెరుగుతూందో, ఇప్పటి అమెరికా తెలుగు రచయితల పరిమితులేమిటో ఆ వ్యాసం చర్చిస్తుంది. కాని, అమెరికా తెలుగు రచయిత/ అమెరికా తెలుగు పాఠకుడు అనే పదాలు ఇంకా కొన్ని ఏళ్ళు మాత్రమే బతుకుతాయి అనిపిస్తోంది, అని ప్రస్తుతానికి చెప్పగలను, ఈ తరం అమెరికా తెలుగు వాళ్ళు తెలుగులో రాస్తే తప్ప, కనీసం చదవాలి అనే ఆసక్తి చూపిస్తే తప్ప.
“ఈమాట” లాంటి వెబ్ పత్రికలు క్రమంగా ఆంధ్రా పాఠకులు/ రచయితల మీదే బతకగలవు. లేకపోతే, వాటికి రచనలు కూడా పుట్టవు.
ఇవి చిలక జోస్యాలు కావు, చేదు నిజాలు. ఇప్పటికీ అమెరికాలో తెలుగు సాహిత్య సభలకి వస్తున్న వాళ్ళలో ఈ తరం తెలుగు వాళ్ళు ఎంత మంది వున్నారు? ఆలోచించండి.
వెల్చేరు నారాయణరావు గారు “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” అనే గ్రంథంలో కొత్త రకమైన కవిత్వం రావటానికి “రచనా సందర్భం” అనే అంశాన్ని ఒక మఖ్య ప్రేరకంగా గుర్తించారు. (ఈ పుస్తకాన్ని చదవమని ఈమాట పాఠకులందరికీ నిస్సంకోచంగా విన్నవిస్తున్నాను.) ఉదాహరణకు, ప్రింటింగ్ ప్రెస్ రాకతో ఓ పుస్తకాన్ని ఎవరికి వారు ఓ కాపీ కొనుక్కుని చదువుకునే అవకాశం కలిగింది; ఆంగ్లవిద్యా విధానాలతో విద్యార్ధులు తమ కుటుంబాల నుంచి దూరంగా వెళ్లి ఉండటం జరిగింది; ఈ రెండూ కలిసి ఏకాంతంగా ఎవరికి వారే చదువుకుని ఆనందించగలిగే కవిత్వానికి (భావకవిత్వం) దారి తీశాయి. ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ , ఆంగ్లవిద్యాలయ వ్యాప్తి – వీటి నుంచి ఒక కొత్త రచనా సందర్భం తయారైందన్నమాట.
ఇప్పుడూ ఒక సరికొత్త రచనా సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది Web 2.0 వల్ల కలిగింది. ఎవరికి వారు ఓ కవితని చదువుకున్నా, దాని గురించిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా వున్న పాఠకుల మధ్య జరగటమే కాదు, కవికి కూడ అవి ఎప్పటికప్పుడు అందుతున్నాయి. సాహిత్యచరిత్రలో ఇదివరకు ఎప్పుడూ ఇది సాధ్యపడలేదు. ఈ కొత్త రచనా సందర్భం తెలుగులో ఎలాటి కొత్త కవిత్వానికి దారితీస్తుంది అనేది ఇంకా స్పష్టంగా లేదు. అలాగే అందులో పాఠకుల, వారి చర్చల పాత్ర ఏమిటనేది కూడ తెలియదు. ఐతే ఈ కొత్త కవితాప్రపంచంలో పాఠకులకు ఇదివరకెప్పుడూ లేని పెద్దపాత్ర వుంటుందనిపిస్తున్నది.
ఒక ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే – ఈ కొత్త రచనాసందర్భం, నాకు తెలిసినంతవరకు, ఆంగ్లసాహిత్యం మీద పెద్ద ప్రభావం చూపలేదు; ముఖ్యంగా అమెరికాలో ఇంటర్నెట్ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుంటున్న కవులు చాలా తక్కువగా కనిపిస్తారు. (ఈ విషయం నాకన్నా బాగా తెలిసిన వారు ఎందరో వుంటారు. వారి నుంచి ఇంకా అధికారికమైన సమాచారం వినాలని వుంది)
నారాయణరావు గారి సిద్ధాంతం ప్రకారం రచనా సందర్భాల మార్పుని గమనించలేని తక్కువరకం కవులు పాతకవిత్వమే రాస్తారు. నిశితదృష్టి వున్న కవులు ఈ మార్పుకి అనుకూలమైన కొత్తరకం కవిత్వం సృష్టిస్తారు.
ఇలా ఒక విప్లవాత్మక సమయంలో పాఠకులం కావటమే కాదు, నారాయణరావు గారి కవితావిప్లవకారకాల సిద్ధాంతం భవిష్యత్తుని ఎంతగా predict చేస్తుందో చూసే ఒక ఆసక్తికరమైన కాలంలో వున్నాం మనం.
ఈ సంధికాలంలో రకరకాల ప్రయోగాలు తప్పవు. వాటిలో చాలాభాగం విఫలం కావటమూ తప్పదు. ఇప్పుడు ఈమాట లోనూ, ఇతర వెబ్ పత్రికలలోనూ జరుగుతున్నవి ఇలాటి ప్రయోగాలే. నా ఉద్దేశ్యం – వీటిలో ఫలానావి మంచివీ ఫలానావి కావు అని చెప్పగలిగే స్థితి ఇంకా రాలేదు గనుక, తొందరపడి పాఠకులు కాని సంపాదకులు గాని వేటినీ ఆపటం, అడ్డుపెట్టటం మంచిది కాదేమో (వ్యక్తిగత దూషణలు మరీ శృతి మించుతుంటే తప్ప).
మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.
నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..
ఉష గారి బాధ అర్ధమవుతున్నది. కాని, కొంచెం స్పష్టంగా చెప్పవచ్చు కదా అనిపించింది. ఈమాటలో అందరి వ్యాఖ్యలూ కాదు, రమా భరద్వాజ పేరిట వస్తున్న వ్యాఖ్యలు మాత్రమే పెడసరంగా వుంటున్నాయి. ఆవిడ గారు పనికట్టుకుని కొందరి మీద రాళ్ళు రువ్వే పని పెట్టుకున్నట్టు, ఆ రాళ్ళన్నీ ఈమాట వైపే రువ్వుతున్నట్టు అనిపిస్తున్నది.ఆవిడ ఇంకెక్కడా కనిపించరు కనుక ఈ మాట అనవలసి వస్తున్నది. అన్యధా భావించరాదు.
చర్చ అఫ్సర్ పుస్తకం “వూరి చివర” గురించి. పుస్తకం చదివిన వేలూరి గారు ఆయనకు తోచింది రాసారు. అందులో విమర్శ కూడా వుంది. రమా భరద్వాజ గారికి ఆ విమర్శ కనిపించలేదు. అఫ్సర్ ని వేలూరి పొగిడారో అని చిన్న పిల్లలాగా ఉక్రోషం పట్టలేక యాగీ చేస్తున్నారు. రమ గారూ: చర్చని పుస్తకం మీద పెట్టి, అందులో అకవిత్వం ఏదో చెప్పగలిగితే బాగుంటుందేమో చూడండి. ఆ విధమ్మున అఫ్సర్ ని అకవి అనాలన్న మీ వుద్దేశం తీరుతుంది. ముందు అఫ్సర్ ని శుభ్రంగా వుతికి ఆరేసిన మీదట ముకుంద రామారావుకి మహాకవి అన్న అచ్చోసి వదులుదాం.
రామారావుగారూ,
ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి మళ్ళీ మళ్ళీ అవే విషయాలు చర్చించడం అనవసరం అన్నాను కాని దాని గురించి కొత్త మార్గంలో పరిశోధించడమే అనవవసరమని నా ఉద్దేశం కాదు. “కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప” అన్న కొసరు అందుకే 🙂
అలాగే ఇలాంటి పరిశోధనకి statistical techniques ఉపయోగపడవని కూడా నా అభిప్రాయం కాదు. వాటిని తెలుగు సాహిత్యంలో ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ ఉపయోగించలేదు కాబట్టి, ఎంతవరకూ ఎలా ఉపయోగపడతాయో ప్రయోగాల ద్వారా పరిశీలించిన తర్వాత ఉపయోగించడం సమంజసమని నా ఉద్దేశం.
“ఏ కారణం చేత ఐతేనేం తెలుగులో ఆముక్తమాల్యద రాయటానికి పూనుకున్నాడు కాని సంస్కృత శ్లోక రచనా పథకాలే ఎక్కువగా ఈ పద్యాల్లోనూ వున్నాయి.” నాది కూడా సరిగ్గా ఇదే అభిప్రాయం. తెలుగు మాట్లాడని వాడు కావడం వల్లనే అలా రాసేడని నా ఉద్దేశం. ఇంతకుముందు చాలామంది విమర్శకులు దీనిని ప్రౌఢశైలి అని, క్షాత్రశైలి అని, క్లుప్తత అని అన్నారు. భావాలలో ప్రౌఢత్వాన్ని పక్క పెడితే, భాషలోని ప్రౌఢత్వం మాత్రం కవి తెలుగువాడు కాకపోవడం వల్లనే వచ్చిందని నాకనిపించింది. అయితే పూర్వకవి ప్రయోగాలు కనిపించనంత మాత్రాన అతనికి తెలుగు సాహిత్యంతో చెప్పుగోదగ్గ పరిచయమే లేదు అని చెప్పలేం. తెలుగువాడు కాకపోవడం వల్ల ఆ ప్రయోగాలు సహజంగా అతని మనసులో ముద్రపడలేదని అనుకోవచ్చు కదా.
సరళంగా ఉండే పద్యాల విషయంలో – we have to look at how they are distributed across the kavya. Only then we can decide on whether they are part of the inherent variability or written/modified by someone else. నేను చదివినంతలో అవి కావ్యమంతా అక్కడక్కడా ఉన్నాయనిపించింది. రాయల కలలో విష్ణువు చెప్పిన మాటల్లోనే, “ఎన్నిను…” అన్న పద్యంలో రాయల ముద్ర చాలా బలంగా కనిపిస్తుంది. వెంటనే “తెలుగదేలయన్న…” పద్యం. “బాసాడి” అన్న పదం ఇతర తెలుగు కవులెవరైనా ప్రయోగించారేమో నాకు తెలియదు. అలాగే రాజనీతి చెపుతున్నప్పుడు కాని (ముఖ్యంగా కందపద్యాలు), విష్ణుస్తుతి చేసేటప్పుడు కొన్ని చోట్ల, ఇలా అక్కడక్కడ కావ్యమంతా సరళమైన, సహజమైన తెలుగు పద్యాలు కనిపిస్తాయి, రెండుమూడు ఉదాహరణలు:
ఏపట్టున విసువక ర
క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్ను
ల్గూపెట్టిన విని తీర్పుము
కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్
ఒక కవిత ఏ విషయం మీద వ్రాసినా ,వ్యక్తీకరింపబడిన అనుభూతి ఏదైనా ,మహాబలీయమైన ముద్ర పాఠకుడి మీద వేసి “ఎంత బాగుంది” అని పదే పదే పలవరించేట్లు చేయాలి. అనేక మార్లు తరగని ఆనందంతో చదువుకునేటట్లు జేసి, దాన్ని కంఠవశం చేసుకోవాలనే తపనను కలిగించకపోతే ఆ కవిత కవితే కాదు.దాని ఆయుఃప్రమాణం అతి స్వల్పం: దాని ఎఫెక్ట్ , ఎఫిమిరల్. కవిత గొప్పదా,కాదా అనే విషయానికి సంబంధించి ఇది నిజమైన టెస్ట్ లా భావించవచ్చుననుకుంటాను.
వ్రాసేది కవిత కావాలి. అంటే పైన చెప్పిన శక్తిని అది సంతరించుకోవాలి. వ్రాసే వ్యక్తి కవి కావాలి. అంటే కేవలం మాటలు పేర్చటం మాత్రమే తన పనిగా భావించే వ్యక్తి కాకూడదు. ఒక బలమైన అనుభూతికి లోనై వ్రాయాలి.
ప్రాచీన ఛందో రీతులలో వ్రాసిన పేరడీ పద్యాలు కూడా కంఠవశం అయ్యే గుణం కలిగి ఉంటవి. అంత మాత్రం చేత అవి కవిత్వం అయిపోవు. ఆ కంఠవశం అయ్యే గుణాన్ని అవి కలిగి ఉండటం మన ప్రాచీన ఛందో రీతుల గొప్పదనం, వాటి వైశిష్ట్యం. కంఠవశం అయ్యే గుణం లేకపోతే మంచి కవిత్వం కాదన్నాము గానీ, కంఠవశం అయ్యే ప్రతిదీ మంచి కవిత్వం అనటం సాధ్యం కాదు.
వచనకవితలో కంఠవశం అయ్యే గుణం సాధించటం చాలా చాలా కష్టం. వచన కవి చాలా ప్రజ్ఞావంతుడై ఉండాలి. కవితా రసవిద్యా రహస్యం తెలిసినవాడై ఉండాలి. శక్తిమంతమైన,రసస్ఫోరకమైన పదచిత్రాలను,వైరుధ్యాలు లేని మెటఫర్ల సమాహారాలను, సంకేతాలను తనదైన, ప్రగాఢమైన అనుభూతిని ఆవిష్కరించటానికి, కవిత్వీకరణ మాధ్యమాలుగా సున్నితంగా మలచుకోవాలి. అంతేకాదు, కవితా పంక్తులలో ఒక మనోజ్ఞమైన, లయబద్ధమైన నడకను, పదబంధప్రయోగంలో శబ్దసారూప్యత వల్ల జనించే రమ్యమైన రిధంను అతను సాధించాలి. అప్పుడది గొప్ప కంఠవశమయ్యే గుణాన్ని, ప్రబలంగా ఆకట్టుకునే శక్తిని సంతరించుకుని ఎప్పుడూ మన మనస్సుని అంటిపెట్టుకుని ఉంటుంది. గొంతెత్తి పరవశంతో చదువుకునేటట్లు చేస్తుంది.
నాకు తెలిసినంతవరకు,నా అనుభవంలోకి వచ్చినంతవరకు వచనకవిత సమగ్ర సర్వాంగ సుందరంగా వ్రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మాత్రమే. వేరే వాళ్ళ కవితాపంక్తులు మూడు నాలుగు కంటే ఎక్కువ గుర్తు ఉండవు. తిలక్ కవితలు మనసులో మార్మోగుతూనే ఉంటవి. చాలా వరకు వారికవితలు ఆమూలాగ్రం ఇట్టే అవలీలగా కంఠవశం అవుతవి. పలుమార్లు పంక్తులకు పంక్తులు, కవితలకు కవితలు గొంతెత్తి చదువుకుంటూ పులకింతలు పోవటం నా స్వానుభవం.ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం.
కవిత్వం వ్రాసే వాళ్ళు మానవ జీవితానుభవాలలో దేనిమీదైనా వ్రాయవచ్చు. ఒక తాత్విక చింతనను కానీ,సామాజిక స్పృహను కానీ సాంఘిక,ఆర్ధిక,రాజకీయ దురన్యాయాన్ని కానీ దోపిడీని కాని కవితలో ఆవిష్కరించవచ్చు. కానీ అది కవితామయం గానే జరగాలి. కవిత యొక్క వస్తువిశేషము కవిత యొక్క గొప్పదనం మీద ప్రభావాన్ని చూపలేదు. కవిత రచనా రీతికి సంబంధించినది; వస్తుప్రాధాన్యతకు సంబంధించినది కాదు. అయితే, కవిత్వానికి సాహిత్యానికి సామాజికప్రయోజనం లేదని కానీ, ఉండకూడదని కానీ కాదు. కవిత్వం, తక్కిన సాహిత్య ప్రక్రియలన్నీ రససిధ్ధి ద్వారా పాఠకులని ఉత్తమ మానవీయత వైపు నడిపించాలి. పునరుక్తి దోషంగా భావించవద్దు :ఇది రససిద్ధి ద్వారానే జరగాలి.
ఇకపోతే కవిత్వ విమర్శ కవితల గుణదోషపరిశీలనకు మాత్రమే పరిమితమై ఉండాలి. అటువంటి పరిశీలన ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ లో ఎనలిటికల్ గా మాత్రమే జరగాలి. వ్యక్తిగత విమర్శలకు, అవహేళనలకు, నిందలకు దిగజారకూడదు. కవిత కవితై ఉండాలి; సాహిత్యవిమర్శ సాహిత్యవిమర్శ మాత్రమే అయి ఉండాలి. అలా మన స్థాయిని పెంచుకునే సామర్ధ్యం మనకు ఉంది, ఆ అవసరం కూడా ఉంది.
కామేశ్వరరావు గారు “ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి ఎప్పుడో ముగిసిపోయిన చర్చని మళ్ళీ లేవనెత్తడం అనవసరం, కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప” అని తేలిగ్గా కొట్టిపారేశారు. తెలిసిన ఫలితాన్నే ఐనా కొత్త మార్గాన సాధిస్తే దాన్ని స్వీకరించటం, మెరుగులు పెట్టటానికి ప్రయత్నించటం శాస్త్రీయ పరిశోధనల్లో సర్వసాధారణమే. ఇకపోతే, కర్తృత్వం, ముఖ్యంగా ఆముక్తమాల్యద విషయంలో, అంత black and white అని నేను అనుకోను. నన్నయ గారి విషయంలోనే భారతావతారిక పద్యాలు బహుశ నన్నయ గారు రాసినవి కావు, నారాయణభట్టు రాసివుండొచ్చు అన్న పరిశోధకులు ఎందరో వున్నారు. ఇక రాయల విషయంలో కనీసం కొన్ని పద్యాలు మరెవరైనా రాసి వుండటానికి బాగా అవకాశం వుంది. ఉదాహరణకు బాగా ప్రాముఖ్యత సంతరించుకున్న –
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొ కండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స
అన్న పద్యం రాయల పద్ధతిలోది కాదు. ఇంత సరళమైన అన్వయం వున్న పద్యాలు ఆముక్తమాల్యదలో చాలా అరుదు; ఇంత సహజమైన తెలుగు ఇక ఏ పద్యంలోనూ కనిపించదు. నాకు అనిపించేది రాయలకి తెలుగు సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు అని; ఆయన నన్నయాదుల రచనల్ని చదివాడని నేననుకోను. ఆముక్తమాల్యదలో పూర్వ తెలుగు కవుల ప్రభావం కనిపించదు (ఒక్క కనియెన్ వైష్ణవుడు అన్న పద్యం మాత్రం అటజని కాంచె పద్యానికి కొంత దగ్గరగా వున్నట్లనిపిస్తుంది; అది పెద్దనదే కనుక రాయలు దాన్ని విని మెచ్చుకుని వుండటానికి బాగా అవకాశం వుంది; అలాగే కొంత అనుసరించటానికీ.). రాయలు ముఖ్యంగా సంస్కృతాన్ని ఆపోశన పట్టినవాడు. ఏ కారణం చేత ఐతేనేం తెలుగులో ఆముక్తమాల్యద రాయటానికి పూనుకున్నాడు కాని సంస్కృత శ్లోక రచనా పథకాలే ఎక్కువగా ఈ పద్యాల్లోనూ వున్నాయి. తెలుగు మాటలు వాడినప్పుడు అవి సానబట్టిన గ్రాంథిక పదాలు కావు, గ్రామీణ వ్యావహారికాలు. వాక్య నిర్మాణం సహజమైంది కాదు, ప్రయత్నపూర్వకం, clumsy గా వుండేది.
నా ఉద్దేశ్యం ఆముక్తమాల్యద మొదల్లో కొన్ని పద్యాలు, మథుర నగర వర్ణన పద్యాలు బహుశ రాయలవి కావు. టూకీగా చెప్పాలంటే, తేలిగ్గా అన్వయం ఉండి, ఇట్టే అర్థమయే పద్యాలు ఇంకెవరన్నా కొంత ఎడిట్ చేసినవో లేక పూర్తిగా రాసినవో.
ఇలాటి విషయాల గురించి పరిశోధించటానికి statistical techniques ఎంతగానో ఉపయోగిస్తాయని నేననుకుంటున్నాను.
పసిఁడిపల్లకి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
07/07/2010 12:24 pm
మంచి ధారతో మాధుర్యంతో పద్యాలందించినందుకు కృతజ్ఞతలు.
ఇంత పెద్ద పద్యకవిత “ఈ మాట”లో చూడడం ఇదే మొదటిసారి,నాకైతే. ఇటువంటివి అందుకొని ఆనందించే అదృష్టవంతులకన్నా అందుకోలేని ఈనాటి ఈమాట పాఠకులే ఎక్కువేమో అని అనుమానం.
ఎన్నో ఇతర ఉపమానాలు వాడినప్పటికీ, వరుసగా మూడు పద్యాలలో పెద్దనను కవిచంద్రుడు కవిసింహుడు కవివృషభుడు అనడం వర్ణన అందాన్ని అతిశయోక్తి కబ్జా చేసినట్టుంది.
వ్యాసునితో పోల్చిన బ్రహ్మగా తోచిన పెద్దన, కృష్ణరాయలే చతురవచోనిధి ఆంధ్రకవితాపితామహ అనిపిల్చిన కవి, రాయల అస్తమయంతో తనకు యిచ్చిన పైసలు,సంపద, చేసిన సన్మానాలే తలుస్తూ రాయలతో పోలేక జీవచ్చవంబుగా బతుకుతున్నాననడం పెద్దన తనను చిన్నగ చేసుకున్నట్లుంది.
ఆ పద్యం పెద్దననే కాదు ఖండికను సైతం నీరుగార్చిన ముగింపు. నాకింత చేసాడనే కాని,రాజ్యానికి ప్రజకు కల్గిన లోటు ఊసెత్తకపోవడం సామాన్యులకు అలంకారమే కాని కవిచంద్రునకు మచ్చ.
బాగుంది. కాని అది విరహమా, వ్యామోహమా, వైరాగ్యమా, విరక్తా, ప్రేమా, పారవశ్యమా లేక యీ అన్ని భావనలు కలబోసుకున్న అయోమయమా అన్నది మాత్రం తెలియడంలేదు. కవిత్వం లోతయిన భావాలను సరళతరం చేయాలని నా అభిప్రాయం.
వ్యాసం బాగుంది. శ్రీకృష్ణదేవరాయలు గురించి గాని, విజయనగరసామ్రాజ్యం గురించి గాని తెలుగు వాళ్ళలో విపరీతమైన ఆరాధనాభావం ఉండటంలో వింతలేదు కాని, ఈమధ్య కాలంలో ఈ విషయాలలో యేమీ పరిశోధన జరగక పోవటం చాలా విషాదకరం.
టీనేజ్ ప్రాయంలో (తూ.గో.జిల్లా) కొత్తపేట గ్రంధాలయంలో పదహరు సంపుటాలుగా ఉన్న ‘విజయనగర సామ్రాజ్య నవలామాలిక’ చదివాను. అది కన్నడ మూలానికి తెలుగుసేత. అనువాదకులు యెవరో సరిగా గుర్తుకు రావటంలేదు. నాకు తట్టినంతవరకు కేవలకాల్పనిక చారిత్రక దీర్ఘనవల. సత్యాసత్యాల పాళ్ళ సంగతి పక్కన పెడితే యేకబిగిని చదివించే రచన.
సౌమ్యగారూ, అన్ని ద్రావిడ భాషలలో పద్యాలు ఉన్నాయండీ. తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో సంస్కృత దేశి ఛందస్సులు రెండూ ఉన్నాయి. మలయాళ భాషలో తమిళ ఛందస్సు కూడా ఉన్నది. కాని తమిళ భాష ఛందస్సు సంస్కృతముతో సంపర్కము లేకుండా స్వతంత్రముగా వెలిసింది. అది సంస్కృత ఛందస్సంత ప్రాచీనమైనదే. మనము తెలుగులో వాడే కొన్ని వృత్తాలు తమిళ ఛందస్సునుండి గ్రహించబడియుండవచ్చు. తమిళ పద్యాలలోని మరొక విశేషము ఏమంటే వాళ్లు సంస్కృతములా పాదచ్ఛేదయతిని, తెలుగులా అక్షరసామ్య యతిని రెంటినీ పెట్టుకొన్నారు. తెలుగులోని అక్షరసామ్య యతి బహుశా తమిళమునుండి వచ్చినదనే నేను అనుకొంటాను. అన్ని ద్రావిడ భాషలలో ప్రాస ఉన్నది. ఇది కూడా మొట్టమొదట తమిళ ఛందస్సులో వాడబడినది. తాళవృత్తాలు కూడా తమిళ ఛందస్సులో ఎక్కువ. నేటిలా కాక పూర్వకాలములో ఒక భాషలోని గొప్పదనాన్ని మరొక భాష గౌరవించి అందులో కొన్నిటిని అనుసరించడానికి వెనుకంజ వేయలేదు. అందుకే కృష్ణరాయలను తర్కించేటప్పుడు తెలుగు కవుల, చరిత్రకారుల అభిప్రాయాలను మాత్రమే తీసికోక అందరి అభిప్రాయాలను జల్లించాలి.
మంచి వ్యాసము. ఆసక్తి ఉన్నవారికి ఇందులోని సూచికలు ఎంతో ఉపయోగపడుతాయి. సుమారు 70, 80 వ దశకాలలో “రాయన దినచరి” అనే ఒక రాయల డయరీని కన్నడములో కనుగొన్నారట. అందులో ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయని చదివాను. దానిని గురించిన పరిశోధన వివరాలను ఎవరైనా తెలిపితే బాగుంటుంది. ఈ పుస్తకాన్ని బహుశా రాయలు వ్రాయలేదు, కాని ఇందులోని సమాచారాలు చారిత్రక సత్యాలనే అంటారు.
విధేయుడు – మోహన
ఈ ఖండికను నిశితంగా పరిశీలించి ఇందులోని కించిద్దోషాల నెత్తిచూపిన కామేశ్వరరావుగారికి నా కృతజ్ఞతలు. ఇట్టి సద్విమర్శలవల్ల రచయితకూ, పాఠకులకూ మేలే జరుగుతుందని నా అభిప్రాయము.
1. పట్టః అనే సంస్కృతపదానికి పట్టు అనేది వైకృతరూపం. సిద్ధసమాసంలో ధవళపట్టాంబరంఅనే ఉండాలి. వ్రాతదోషంవల్ల ఇది పట్టంబరంగా దొరలింది.
2. సీసపద్యంలో “కంఠీరవోజస్సు” అనేది అసాధువు. పద్యధారలో ఈ అసాధురూపం దొరలిపోయింది,నేను తిరిగి చూచుకొనలేదు. కామేశ్వరరావు సూచించినట్లుగా ఇది కంఠీరవౌజస్సనే ఉండాలి. ఇదిదోషంగా నేనంగీకరిస్తాను. వృద్ధిసంధినిగుఱించి మాట్లాడుతున్నాం గనుక, ఈ సంధికి అపవాదాలను కూడా ఇక్కడ పేర్కొంటాను. ఓతుః(పిల్లి), ఓష్ఠః శబ్దములకు సిద్ధసమాసంలో గుణ,వృద్ధిరూపాలు రెండూ వస్తాయి – ఉదా- స్థూలౌతుః,స్థూలోతుః, బిమ్బౌష్ఠః, బిమ్బోష్ఠః. అట్లాగే అక్ష+ఊహినీ అనేచోట గుణసంధికిమారుగా అక్షౌహిణీ అని వృద్ధి వస్తుంది. ఐతే ఆంధ్రభారతంలో అక్షోహిణీ అనే రూపంకూడ వాడబడింది. కాని సంస్కృతవైయాకరణుల ప్రకారం ఇది అసాధువు. ఇట్లాంటివే గుణసంధికి మరికొన్ని అపవాదాలున్నవి, వాని నన్నిటినీ నేనిక్కడ పేర్కొనడం లేదు.
3. పై సీసపద్యంలోనే “కంఠీరవౌజస్సు”, “నళినజుతేజస్సు” అన్నచోట్ల క్షత్రియుడైన రాజుయొక్క ఓజస్సుకు (బలానికి – అంటే రాజు సింహబలుడని చెప్పడం), బ్రాహ్మణుడైన కవియొక్క బ్రహ్మవర్చస్సుకే ప్రాధాన్యంగాని, వారిని సింహంతోగాని, బ్రహ్మతోగాని ప్రత్యక్షంగా పోల్చడంలేదు. సింహ,నళినజపదాలు ఈ ఓజస్తేజస్సులకు పరోక్షాధారములు మాత్రమే. అందుచేత, ఈ రెండు సీసపాదాల ఉద్దేశ్యం రాజుయొక్క క్షాత్రతేజాన్ని, కవియొక్క బ్రహ్మతేజాన్ని ప్రకటించడమే కాని, రాజును సింహంతో, కవిని బ్రహ్మతో పోల్చడం కాదు. అందుచేత, ఇక్కడ వాడబడిన పదాలు ప్రకృతార్థప్రయోజనకారులుగా నున్నవనుటలో సందేహము లేదని నా అభిప్రాయము.
ప్రతి చరిత్ర పుస్తకానికి ఇలా వాళ్ళు చెప్పిన మూలగ్రంథాల గురించి ఒక ముందుమాట రాస్తే ఎంత బాగుంటుందో!
ఇంతకీ – ఒక చిన్న సూచన: ఈ పోర్చుగీసు వారి పేర్లు, పుస్తకాలు: వీటికి ఆంగ్ల స్పెల్లింగులు బ్రాకెట్ల లో ఇస్తే, మాకు వెదుక్కోడానికి సులభం అవుతుందేమో! (కష్టే ఫలీ! మీరే కనుక్కోవాలి! అంటారా?)
[ఈ పేర్లన్నీ మిగతా వ్యాసాల్లో ఇంగ్లీషులో కూడా ఇవ్వడము, నేలటూరి ప్రకరణాన్ని ఏ మార్పులూ లేకుండా ప్రచురించడము – ఈ ఉద్దేశాలతో పోర్చుగీసు పేర్లు ఇంగ్లీషులో ఈ వ్యాసంలో ఇవ్వలేదు. సారీ. – సం.]
నేను ఈ వ్యాసం వ్రాయడానికి పూనుకొన్నప్పుడు నాకు కూడా కామేశ్వరరావుగారిలాగే ఊహ జనించింది. కన్నడరాజ్యరమారమణుడు ఎందుకు కన్నడములో వ్రాయలేదని. దానికి నేను ఊహించిన కారణాలను ఇక్కడ ఇస్తున్నాను.
1) కన్నడ పద్యరచనా సాహిత్యము రాయలనాటికే ఉచ్ఛదశను అందుకొన్నది (It has already peaked). వాళ్లు కీర్తనా సాహిత్య ప్రక్రియను కొనసాగించడానికి ఉద్యుక్తులయ్యారు. తెలుగు సాహిత్యపు ప్రబంధయుగపు ఔన్నత్యానికి కాలము రాయల నాటిది.
2) కన్నడములో వ్రాయడము తెలుగుకన్నా తేలిక, ఎదుకంటే కన్నడములో అక్షరమైత్రి యతి లేదు. కన్నడములో మొట్టమొదట తెలుగులాగే సంస్కృత వృత్తాలతో నిండిన చంపూ కావ్యాలు నాంది పలికినా, తరువాత వచ్చిన కవులు షట్పదలు, సాంగత్యములాటి దేశి ఛందస్సులో (నా ఉద్దేశములో సరియైన నిర్ణయము, ఇలా తెలుగు కవులు అందరూ ఎందుకు ఉద్యమించలేదో అని ఎప్పుడూ నేను విచారపడుతాను) వ్రాసారు. సంస్కృత సందీర్ఘ సమాసాలతో వృత్తాలలో వ్రాసే రాయలకు ఇలా దేశి ఛందస్సులో వ్రాయడము రుచించలేదేమో? లేక challenging గా తోచలేదేమో?
3) తెలుగులో బాగుగా వ్రాసి తెలుగువారిని మెప్పిస్తే తన రాజ్యములోని ఎక్కువ పాలైన తెలుగు ప్రాంతాలు అలజడి లేక ఉంటాయనే రాజకీయ కారణాలు కూడా రాయలకు కలిగిందేమో? అందుకే ఆంధ్రవిష్ణువు తన కలలో వచ్చాడంటాడు.
తెలుగు నేర్చుకోక తెలుగులో కావ్యాలు వ్రాసేటంత జ్ఞానము అబ్బడము సామాన్యము కాదు. కాని రాయలు సామాన్యుడు కాడు. వీరుడు, సాముగరిడీలు, కసరత్తు చేయడములో దిట్ట, రాజనీతిజ్ఞుడు, వీణావాదననైపుణి గలవాడు. సంస్కృతములో అసాధారణ పాండితీ ప్రతిభను ఆర్జించుకొన్నవాడు. In theory, it is possible for SrIkrishnadevaraayalu to excel in Telugu.
రాయలు కన్నడమును మాత్రమే కాదు, తన మాతృభాష ఐన తుళును కూడా ఉద్ధరించలేదు. రాయలవంటి చక్రవర్తి తుళు భాషకు మద్దతును ఇచ్చి ఉంటే నేడు తుళు భాష కన్నడముతో సమానముగా శోభించి ఉంటుంది. నా ఉద్దేశములో రాయలు వ్రాసిన సంస్కృత కావ్యాల (మనకు లభించినవి) శైలికి ఆముక్తమాల్యద శైలికి మధ్య ఉండే సాన్నిహిత్యము, భేదము గమనించాలి.
ఈ వ్యాసపు ముఖ్య విషయం రాయల కొలువులో తెలుగు కాని ఇతర భాషలలో సాహిత్యం ఎలా వర్ధిల్లిందో అన్న విషయాన్ని వివరించడమే. కాని అభిప్రాయాలు ఆముక్తమాల్యదపైన వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక విషయం మనవి చేస్తున్నాను. తెలుగు కవులు సామాన్యముగా ఆశ్వాసాంతములో ఒక గద్యం వ్రాస్తారు. ఉదాహరణకు పెద్దన ఇలా వ్రాసారు –
(ఇది శ్రీమదాంధ్రకవితాపితామహుడని బిరుదుగలవాడు, సర్వతోముఖాంకుడనే బిరుదుగలవాడు, విష్ణుమూర్తి పాదపద్మాల మకరందాన్ని గ్రోలె తుమ్మెదవలె నుండువాడు, శఠకోపయతిచే ప్రసాదించబడిన శ్రేష్ఠమైన చతుర్విధ కవిత్వములు అభ్యసించినవాడు, అల్లసాని చొక్కయమంత్రి కుమారుడు ఐన పెద్దనార్యుడు వ్రాసిన స్వారోచిషమనుసంభవము అనే మహాకావ్యములో రెండవ ఆశ్వాసము.)
కాని ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంతములు గద్యాలు కావు, పద్యాలు. ఉదాహరణకు –
(ఇది సింహాచలములో ఉండే మాయనరసింహస్వామి పాదాలను కొలువగా సంక్రమించిన పుణ్యఫలమువల్ల పొట్టునూరి జయస్తంభములో పేర్కొనబడిన కృష్ణరాయనృపతి వ్రాసిన ఆముక్తమాల్యద కావ్యములో నాల్గవ ఆశ్వాసము అందరికి ప్రీతిగా విరాజిల్లును.)
సంస్కృతకవులు ఇలాగే వ్రాసేవారు. ఉదాహరణకు నేను వ్యాసములో పేర్కొన్న రుక్మిణీశవిజయమునుండి ఒక సర్గాంత పద్యము –
(రోమాంచితమయ్యేటట్లు సంతోషమిచ్చేది, వినగానే పాపాలను నిర్మూలించేది, విచిత్రమైనది, నిర్మలమైనది, అర్థవంతమయినది అయి వాదిరాజయతిచే వ్రాయబడిన రుక్మిణీశవిజయ కావ్యములో ఏడవ సర్గ సురమండలముచే పొగడదగినదైనది.)
ఆముక్తమాల్యదలో ఉపయోగించబడిన చాల సంస్కృతపదాలకు సామాన్యమైన అర్థాలు ఉండక కొద్దిగా మామూలుగా లేని అర్థాలు ఉంటాయి. రాయలే వ్రాసారో, మరెవరు వ్రాసారో కాని రచయితకు మాత్రం కొబ్బరికాయలంటే ఎంతో ఇష్టమనిపిస్తుంది 🙂
రామారావు గారంటే నాకు గౌరవం వుంది, ఆయన కొంచెం ఆలోచించి రాస్తారని. ఆ గౌరవానికి భంగం కలగకుండానే, ఈ నాలుగు మాటలూ రాస్తున్నా.
ఈమాట తరఫు నించి ఆయన చెప్పిన మాటలతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఈమాటకి సంబంధించిన విషయం.
కాని, రచయితలూ, “ఉహా” పాఠకుల గురించి ఆయన చేసిన ఊహలు నాకు కొంచెం ఆశ్చర్యంగా వున్నాయి. మీరు ఏ శాస్త్రీయ సర్వే ప్రకారం ఈ ఊహలు చేశారు, రామారావు గారూ? ఆంధ్ర దేశంలో వొకే రకం పాఠకులు వున్నారన్న ఈ అంచనా ఎక్కడినించి వచ్చింది?
అక్కడి రచయితలకూ, పాఠకులకూ అమెరికాలోని తెలుగు రచయితలకూ, పాఠకులకూ నిజంగా తేడా వుందా? అమెరికాలోని తెలుగు రచయితలూ, తెలుగు పాఠకులూ వొక “ఫ్రోజెన్”తెలుగు సమాజంలో ఇప్పటికీ బతుకుతున్నారు. అది అరవయి, డెబ్బయిల ఆంధ్ర.
అమెరికాలోని తెలుగు వాళ్ళకి మల్లెనే, అక్కడా కొందరు ఫ్రోజెన్ తెలుగు వారు వుండవచ్చు. వారికి విప్లవ రచయితలని తిట్టడమే ఏకైక పని.
నాకు తెలిసీ ఆంధ్రాలో పాఠకుల స్వభావం మారింది, ఇటీవలి ఉనికి చైతన్యమూ, రాజకీయాల తరవాత.
దళిత, ముస్లిం, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర రచయితల ప్రభావం అమెరికాలోని ఈ ఫ్రోజెన్ తెలుగు సమూహాలకు ఇంకా అర్ధం అవుతున్నట్టు లేదు. అవి అందరూ అనుకుంటున్న “విప్లవ” లేదా వామ పక్ష కక్కులు కావు. అమెరికాలోని వివిధ భాషీయుల, జాతుల వేదన కూడా అ.తెలుగులకు అర్ధం అవుతున్నట్టు లేదు. అది వేరే మాట్లాడుకుందాం. అక్కడి ఉనికి వేదనకూ, ఇక్కడి అనేక భిన్న జాతుల వేదనకూ కొంత చుట్టరికం దూరంగానయినా వుంది. కాని, ఆంధ్రాలో ఉనికి చైతన్యం రాజకీయ పరంగా ఎటు మళ్ళినా, సాహిత్య, సాంస్కృతిక రంగాల పరిధిని విశాలం చేసింది. ఆ విశాలమయిన పరిధిలోంచి కొత్త పాఠకుడిని చూడాలని నా అభిప్రాయం.
రామారావు గారి “ఊహా పాఠకులు” ఎవరో , వారి వర్తమానం ఏమిటో తెలుసుకోవాలని వుంది. అలాగే,”అక్కడి” తెలుగు రచయితలు చేయలేకపోతున్న సాహసాలు / విదేశీ తెలుగు రచయితలు సేయంగల సాహసాల భోగట్టా కూడా.
ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో! (కొంత మంది అ.తెలుగు రచయితలు క్షమిస్తే, ఈ నిజం చెప్పక తప్పదు. లైలా లాంటి వారి కామెంట్లు చదువుతున్నప్పుడు అది ఇంకా మూడు నాలుగు తరాలు కూడా పట్టవచ్చని దిగులుగా వుంది)
కన్నడములో దేవరనామ వైష్ణవభక్తిగీతాలను వ్రాయడము మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడైన నరహరితీర్థులతో ప్రారంభమయిది. మధ్వాచార్యులు కూడా వ్రాసినరని అంటారు, కాని కన్నడములో వారి పాటలు దొరక లేదు. కాని సంస్కృతములో వారి ద్వాదశస్తోత్రము పాడడానికి ఎంతో బాగుంటుంది. నేడు కూడా ఈ ద్వాదశస్తోత్రాన్ని నైవేద్య సమయములో పాడుతారు. వ్యాసరాయలపైన దీర్ఘంగానే చర్చించాను. అక్కడ వారి గురువులైన శ్రీపాద రాయలనుగురించి కూడా వ్రాసాను. ఈ శ్రీపాదరాయల మఠము ముళ్బాగలులో ఉంది (బెంగళూరు తిరుపతి బస్సు మార్గములో). కానీ స్థలాభావమువల్ల అదంతా కత్తెరవేటుకి పడ్డది. పురందరదాసు కనకదాసులతో సహా శ్రీపాదరాయలు, వ్యాసరాయలను హరిదాసకూటానికి పితామహులని అనుకొంటారు. శ్రీపాదరాయల ఆనతిపైననో లేక తనంతట తానో చాలా యేళ్ల శిష్యరికం పిదప వ్యాసతీర్థులు ముళ్బాగలునుండి చంద్రగిరికి వెళ్లారు. అక్కడ సాళువ నరసింహరాయలకు రాజగురువుగా ఉన్నారు. శ్రీపాదరాయలు కూడా రాయలకు గురువే. ఆ సమయములో తిరుమలపైన అర్చకులు లంచగొండితనంవల్ల తీవ్రశిక్షకు పాల్పడ్డారు. స్వామివారి అర్చనకు ఎవ్వరూ లేనందువలన నరసింహరాయలు వ్యాసతీర్థులను శ్రీవారికి పూజ చేయమని అడగ్గా, అలాగే సుమారు 12 సంవత్సరాలు పూజ చేసారు ఇంతలో పూజారి వంశపు పసివాళ్లు పెద్ద వాళ్లయ్యారు. వారికి పూజా భారాన్ని అప్పగించారు వ్యాసతీర్థులు. సాళువ నరసింహరాయలతో ఇతడు కూడా విజయనగరానికి వెళ్లారు. తిరుపతిలో ఉన్నప్పుడు వ్యాసతీర్థులు బహుశా అన్నమయ్యను కలిసుంటారనే నా ఊహ. కృష్ణరయలపైని గౌరవము, వాత్సల్యము వలన తన పాటలకు వ్యాసరాయలు కృష్ణ ముద్రను ఉంచారని కొందరు అంటారు. శ్రీపాదరాయలు రచించిన కొన్ని దేవరనామాలు – పోపు హోగోణ బారో రంగ, బారో మనెగె రంగ నిన్నంఘ్రికమలవ తోరో, ఇక్కో నోడే రంగనాథన పుట్టపాదవ, నా నినగేను బేడువుదిల్ల, భూషణకె భూషణ ఇదు భూషణ, ఆవ జనుమద తాయి ఆవ జనుమద తందె మున్నగునవి. నాకు భూషణకె భూషణ ఎంతో ఇష్టం. అతని ఒక పాట కింద ఇస్తున్నాను –
ఈ పుస్తకం గాని, అఫ్సర్ గారి పుస్తకం గాని చదవకుండా రాస్తున్న అభిప్రాయం ఇది. లైలా, రమ గార్ల అభిప్రాయాలు ఆలోచనా ప్రేరకాలుగా వుండటంతో చేస్తున్న సాహసం.
మామూలుగానే కవిత్వసమీక్ష కత్తిమీద సాము. దానికితోడు ఒక పత్రిక సంపాదకుడే ఆడా పాడా మద్దెల కొట్టా అన్నట్టు ఆ పని కూడ చెయ్యాల్సి వస్తే ఇంకా ఇరకాటం. చూస్తూ చూస్తూ బాగా తెలిసిన, తమ పత్రికలో అప్పుడప్పుడు ప్రచురిస్తున్న, ఒకరి రచనని గురించి ప్రతికూలంగా రాయలేరు. అదీ లబ్ధప్రతిష్టులైన రచయితలైతే మరీ కష్టం. ఇది వేలూరి గారి పరిస్థితిలో ఉన్న చిక్కు.
సాధారణంగా సమీక్షకులెవరైనా ఒక రచన గురించి వాళ్లు చూపే సానుభూతికీ, వాళ్లకీ ఆ రచయితకీ ఉన్న ప్రత్యక్ష పరిచయానికీ డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ (తెలుగు పదాలు గుర్తుకురావటం లేదు) ఉంటుందని నా నమ్మకం. అలాటి సానుకూల సమీక్షలలో నిజంగా అర్హమయే రచనలే లేవని అనలేము కాని చాలా తక్కువ శాతం. ఐతే మనకు తెలియని వారి గురించి ప్రతికూలంగా అనటం తేలిక కదా !
ఎవరి మెప్పు కోసమో రాసే కవిత్వంలో నిజాయితీ ఉండదని, అది మాటలపేర్పు తప్ప గుండెలోతుల్లోంచి వచ్చి పాఠకుల మనసు పొరల్ని స్పృశించలేదనీ చెప్పనక్కర్లేదు. అలా ఇతరుల మెప్పుని ఆశించకుండా రాసుకోగలిగే అవకాశం విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో వుండే రచయితలు/కవులకు ఉన్నది. (అలాటి వారిని ప్రోత్సహించటం “ఈమాట” మౌలికలక్ష్యాల్లో ముఖ్యమైందని మరోమారు గుర్తుచేసుకోవటం తప్పుకాకపోవచ్చు.) ఐతే దురదృష్టం ఏమిటంటే చాలా కొద్దిమంది – మహా ఐతే ఒక చేతి వేళ్లమీద లెక్కించగలిగేంత మంది – మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు భౌతికంగా ఎక్కడ వున్నా వాళ్ల ఊహాపాఠకులు మాత్రం ఆంధ్రదేశంలో వున్నవారే. వాళ్ల మెప్పు కోసమే వీళ్ల రాతలు. అందుకే వీటికీ అక్కడ వస్తున్న వాటికీ తేడా వుండదు – అవే భావాలు, అవే బాధలు, అవే విప్లవాలు, అవే వాదాలు, అవే నినాదాలు. అదే గాడి, అదే వేడి, అదే ఒరవడి.
ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ.
ఆంధ్రదేశంలో వున్న వారు ఎలాగూ రమ గారు చెప్పిన నానా ఒత్తిళ్ల మూలాన ఈ పని చెయ్యలేరు. ఆ ఒత్తిళ్లు లేని వారు వాటిని కొనితెచ్చుకుని మరీ ఆ ఇరుకు పరిధుల్లోనే గుడుగుడు కుంచాలాడుకోవటం ఎందుకు? విశాల ప్రపంచాన్ని చూశాక కూడ రచనలు చెయ్యబోయేసరికి ఉష్ట్ర దృష్టి ఎందుకు?
లైలా గారూ !! భలే రాసారు మీరు. మీతో నా గొంతు కలుపుతున్నా!! అయితే ఆంధ్రదేశంలో ఇలా బలవంతపు విప్లవ కక్కులు ఒక తప్పనిసరైపోయిది. మీకు తెలుసోలేదో గానీ మీలా ఎవరన్నా ఉన్నమాట అన్నారో వారికి రకరకాల బిరుదులు రెడీ. మిమ్మల్ని వారి తిట్ల తో “ఎండగడ్తారు” మీకు సరైన “సామాజిక స్పృహ” లేదని తీర్మానించేస్తారు. వెంకటేశ్వర రావు గారు కవిత్వంలో ఎక్కువ పుస్తకాలు రావడానికి కవిత్వం కాదు కవిత్వాన్ని “డెమోక్రటిసైజ్ ” చేయడం అని ఎవరో చెప్పేరని విని హాశ్చర్య పడ్డారా? ఆ అభిప్రాయం పచ్చి నిజం. ఎందుకూ ఏమిటీ అన్న ప్రశ్నలు అడిగే వాళ్ళు లేరు. అలా వచ్చే కవిత్వాన్ని ఎవరూ పట్టించుకోరు. పుస్తకాలు ఎన్నైనా అచ్చుకానివ్వండి వాటిని గురించి ఆ కవులు పంచిపెట్టుకోవడమే తప్పించి అమ్ముకుని ఎరగరు. అంతా తీవ్రాతితీవ్రమైన పదాలతో “విప్లవాల” రాతలు రాసేసేవాళ్ళే!! కానీ సుఖంగా బతుకుతూనే ఈ కడుపుమంట రాతలన్నీ రాస్తారు.
కాదంటే తిడతారు. సాహిత్య రౌడీయిసమ్ లాంటిది. మీకు విసుగు కలిగిందీ అంటే అది సమంజసమే!!
మీరు జీవితాన్నీ అనుభవస్తానూ అని అన్నారా అంటే మీరు వట్టీ “బూర్జువా” అన్నమాట . ఇది మరొక తిట్టూ. ఒక వేళ మీరేమన్నా కొన్నాళ్ళూ విప్లవాలు రాసి మానేసి ఇలాంటి మాట గాని అన్నారా మీరు ” రెనగేడ్ “. అపుడే భయపడకండి. మా బాధలు ఏం చెప్పమంటారు?? ఇక్కడ ఎంత తిట్టూ కవిత్వం రాస్తే వారికి అంత సదుపాయం. అది ఒక షోకు. ఇలా తగలడింది ఎక్కువ శాతం “వచన కవిత” ఎక్కడా వస్తు వైవిధ్యం ఉండదు. వ్యక్తీకరణలూ అంతే. భాష పదబంధాలూ మరి అడక్కండి. కావాలంటే ఓపిక ఉన్న ఎవరన్నా ఒక పుంజీడూ పుస్తకాలని చదివి చూడండి. నాలాగే లైలా తో మీరుకూడా అవునంటూ గొంతు కలుపుతారు. మేం రకరకాల గ్రూపుల రకరకాల భావజాలాల బాధితులం!! కవితా సంకలనాలలో కవిత్వమ్ తప్ప ఇంకేదైనా ఉన్నా దాని గురించి ఎక్కడా మాట్లాడలేని వాళ్ళం!! మెరమెచ్చు మాటలు అనడానికీ వినడానికీ అలవాటు పడి ఉన్నవాళ్ళం. ఉన్నమాట అనడం ఎలాగో కూడా మరిచిపోయిన వాళ్ళం!! మేం తెలుగు కవితా పాఠకులం!! మాయదారి రాతల తలరాతల బరువుని మోస్తూ నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఎన్ని పుస్తకాల మోతని మోస్తున్నామో ఆ జగన్నాధునికెరుక. ఇంక కవిత్వమ్ ఏ సన్నటి గొంతుతోనో ఉన్నా ఈ మోతలో పడి అది చాలా దూరంగా పారిపోతూంటే పట్టి తెచ్చుకోలేక నిస్సహాయంగా చూస్తున్నవాళ్ళం!! బతుకు రుచిని వీళ్ళు మరిచిపోయి అలాంటి ఆనందం జీవితంలోంచి పోయినట్టూ బొల్లేడ్పులు ఏడుస్తున్నారు. అదువల్ల మీ ఉన్నమాట మీరన్నమాట నాకు మహా సుఖంగా ఉంది సుమా!!
ఈ సంకలనానికి ఉద్దేశించిన అఫ్సర్ కవితలన్నీ తను చదివి -ఈ పుస్తకానికి, ముందుమాట రాసేసరికి నెల్లుట్ల వేణుగోపాల్ అన్న వ్యక్తికి అప్పటికే ఆంధ్రాలో ఉన్న కష్టాలు చాలక , ఇప్పుడీ పద్యాలన్నీ చదివి బాధ పడగలనా -అని అనిపించినట్లూ, అతని మనసు ఇంకా పాడయినట్లూ నాకు తోచింది. ఆ ముందుమాట అతి దీనం గానూ, ఎంతో భారంగానూ, ఘోరంగానూ, నాకెందుకు అప్పచెప్పారు సంపాదకులీ పని, దీని నుండి నన్ను విముక్తుడిని చెయ్యండి బాబూ -అని వేడుకున్నా, ఆయనకు తప్పనట్లుగా ధ్వనించింది.
అరే, అఫ్సర్ ఏం రాసిఉంటాడు, ఈయనకు ఇంత డిప్రెషన్ రాటానికి- అనుకున్నా.
ఆ ‘ముందుమాట’ చాలా బాగా రాశారనీ, అసలు బాగా రాయలేదనీ, బాగాలేదు అన్నవాళ్ళు సంస్కారం లేని వారనీ, అసలు కవీ, ముందు మాట రాసిన జర్నలిస్టూ ఎన్నేళ్ళనుంచో స్నేహితులు – స్నేహితులు స్నేహధర్మం నెరపుకుంటుంటే మధ్యలో బైటి వాళ్ళు మాట్లాడటమేంటనీ – ఇలా చాలా ఆశ్చర్యకరమైన కామెంట్లు నేను పుస్తకం.కమ్ లో కొన్ని నెలల క్రితం చదువుకున్నాను.
ఇప్పుడు వేలూరి సమీక్ష – మచ్చుకి పరిచయం చేసిన కవితలు చదివితే- ఈ కవితల సంకలనం నాకు చదవబుద్ది కాదు. అప్పటి ఆ ముందుమాట, ఈ సమీక్ష చదివినందువల్ల ఇప్పటికిలా అనిపిస్తున్నది.
ఇందులో
ప్రతి ఆలోచనా గరళం
ఎవరో గిచ్చారంటు గిలగిలలాడె గళం
తన్ను తాను తన్నుకుంటూ
ఓదార్పుకై అందరి కాళ్ళ చుట్టూ
చేతుల సంకెళ్లెందుకో మెలెయ్యటం
ఎందుకో ఇతనికి
ఏదీ నచ్చదు
ఎవరూ నచ్చరు
ఏదో వేదన ఏదో నిస్పృహ
ఎవరిమీదో కక్కలేని మింగలేని ద్వేషం
తనపై ఇంకొందరిపై ఎంతో ఎంతో జాలి, సానుభూతి.
ఇలా సొంతంగా వెలి వేసుకుంటూ, దుఃఖాలని పోగేసుకుని
మెలివేసుకుని మెడకు వయొలిన్ తీగల్లా
ఉరేసుకుంటే చస్తే సైగల్ సంగీతం పలకదు,
పంకజ్ మల్లిక్ “ఎ రాతే ఏ మౌసమ్ ఎ హసనా హసానా
ముఝే భూల్ జానా, ఇన్హేనా భులానా భులానా భులానా”
మృదుత్వాన్ని ప్రేమించి తరించే భాగ్యం అబ్బదు
గరుకు మాటలు, గరుకు గడ్డం, నిజమే అవీ బాగుంటాయ్
ఎప్పుడంటే అతని కళ్ళూ, పెదాలూ, మనసూ ప్రేమను వర్షిస్తున్నప్పుడు.
బార్లనుండీ , పీర్లనుండీ, వార్తాలయాలనుండీ బార్బర్ పార్లర్ల
నుండీ కవిత్వానికి గరుకు పదాల కోసం కవి వెదక వచ్చునా.
యక్, షరమ్. షరమ్.
ఊరి మంగలాడి మొద్దుకత్తి లోతుకు, గడ్డం తెగి ఏదో ఇంత నెత్తురు రావచ్చు
తుప్పుకోతకు టెటనస్ రావచ్చు
కవిత్వపు నాజూకు మెహబూబా రాదు కాక రాదు.
శరీరం బైట ప్రవహింపజేసే రక్తంలో శక్తి లేదు. ఆకర్షణ లేదు.
జీవితం మధురిమను ప్రేమించేవారికి నల్లనెత్తురు రోత సుమా!
రోజూ రాతల్లొ చచ్చేవాడికి ఏడ్చేదెవడు
నవనవలాడే బ్రతుకుకూ, కవితకూ
ఊరి చివర ఏం పని
కనిపించే దక్కడ కట్టెలూ, కాష్టాలూ,
ఏడుపు సంకేతమిస్తే చాలు ఎగిరొచ్చే కాకులూ
వినిపించే దక్కడ కుళ్ళు రుచి మరిగిన
రాబందుల రెక్కల తటతటలు.
క్షమా కీజియే. It is a matter of life and death. వెంటనే నా ‘పూలరధం’ మళ్ళించి, ఎక్కడ ఉద్యానవనాలు, ఎక్కడ సితారు ధ్వనులు, సుందర భావనలు ఉన్నవో అక్కడికి వెళ్ళి పూలగాలులు పీల్చి జీవించాలి.
లైలా
అ, న్యాయం గురించి jagadeeshwar reddy గారి అభిప్రాయం:
07/02/2010 1:54 am
ఇప్పుడే అ.న్యాయం చదివాను.
ఆ మధ్య ఆరిసీతారామయ్యగారి ‘పరివర్తన’ కథ చదివినప్పుడే అమెరికా జైళ్ళల్లో మగ్గుతున్న తెలుగువాళ్ల దీన పరిస్థితి తలచుకుని భయమేసింది. ఇప్పుడు ఈ కథ చదవగానే ఆ భయం మరింత పెరిగింది. ఆ భయంతో కథని ఎలా విశ్లేషించాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉన్నాను. కాని ఒకటి – కథని క్యాబేజీ ఒక్కో పొర వలిచేసినట్టు చెప్పి మంచికథగా మలిచారు. అదే కొంత బిగితో అల్లివుంటే గొప్పకథ అయ్యేదనిపించింది.
– గొరుసు
మీ పత్రిక చాలా బావుంది. ప్రాంతాలకు అతీతంగా ఇందులొ అందరు తమ అబిప్రాయాలను పంచుకోవడం చాలా సంతొషం కలిగించిన విషయం. కాని ఇప్పుడు మన తెలుగు ప్రజలు గొడవలు పడుతూ మన అభివృద్ధినిని మనమె నాశనం చేసుకుంటున్నాం. ఒకప్పుడు తమిళుల వలన సగం నష్టపోయాం. ఇంకా వద్దు.
నాగమురళి గారూ!! మీ విషయం నా అనుభవానికి మించినది గనక దాని గురించి నాకు తెలియలేదు గానీ ఆ విషయాన్ని మీరు విశదీకరించిన విధానం మాత్రం చాలా బాగుంది. మీ వచనం చదువుతూంటే సుఖంగా ఉంది.
ఇహ.. నాకు అర్ధం కాని విషయాలు ఎప్పుడూ కొన్ని ఉంటాయి. పరస్పర భిన్నమైన నమ్మకాలు కలిగిన వాళ్ళు వాదించుకోడం అన్నది నాకు చాలా ఆశ్చర్యంగా అన్పిస్తుంది. ఈ వాదనలు బ్రహ్మపదార్ధాన్ని మించినవి. ఎటూ తేలేవి కావు. అయినా మనుష్యులకి తమ నమ్మకమే గెలవాలన్న పట్టు ఎక్కువ. హేతువాదులుకూడా వాళ్ళవాళ్ళ నమ్మకాన్ని గెలిపించుకోడంలో అంతే చాదస్తులు మరి.
గమ్మత్తేమంటే గతితార్కిక భౌతిక వాదాన్ని అనుసరించే కమ్యూనిస్టులు చాలా పట్టుదలగా నిరీశ్వర వాదులుగా ఉండటం భారతదేశంలోనే ఎక్కువ. తూర్పు ఐరోపా దేశపు కమ్యూనిస్టులు ప్రొటెస్టెంట్ చర్చి కి వెళ్ళి హాయిగా ప్రార్ధనలు చేసుకుంటారు. వాళ్ళకి పార్టీ రాజకీయాలు వేరు..వ్యక్తిగత విశ్వాసాలు వేరూనూ!! అలాంటి పరిస్థితి ఇండియాల్లాంటి దేశాల్లో చాటుమాటుగా సాగుతుందే గానీ బయటికి కన్పించేలా జరగదు. మనదగ్గర అంత నిజాయితీ ఈ తరహా మార్గంలో నడిచేవారిలో ఉండదు. నమ్మకంలేకపోవడం కూడా చివరికి ఒక నమ్మకం లో భాగమే అని వీళ్ళు అనుకోరు.
ఇంక చాలా పాతకాలంనాటి శాస్త్రాలు, ఉదాహరణకి ప్రాచీన శిల్పశాస్త్రాలు..నౌకా శాస్త్రాలూ వంటివి ఆయా కాలాల్లో ఎంతో ఉన్నత ప్రమాణాలతో నడిచినట్టు మనకి ఉదాహరణ పూర్వకంగా తెలుసు. ఇవాళ ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు లేరు కాబట్టి అవన్నీ అశాస్త్రీయ మైనవని అనలేము కదా?? అలాంటివి ఎలా కట్టేరో కూడా ఇదమిథ్థంగా ఇవాళ స్పస్టంగా మనం అర్ధం చేసుకోలేము కూడా!! అంత ఘనమైన నాగరికతని సాధించిన వెనకటి తరాలు మరికొన్ని విషయాల్లో నేర్పరులు కారని మనకి ఎలాతెలుసూ?? కేవలం హేతువాదమే అన్నిటికీ జవాబుదారీ కాలేదు. గందరగోళం ఉంటే ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యతలేని వారిది కావొచ్చునేమో గానీ శాస్త్రానిది ఎలా అవుతుందీ??ఆధునిక ప్రమాణాలే అన్నిటికీ కొలమానం అన్న నమ్మకం కూడా ” అన్నీ వేదాల్లోనే ఉన్నాయష” అన్న అప్పారావు గారి వెక్కిరింతకి ఒకరకంగా కొనసాగింపే!! ఆధునికమైనదంతా హేతువుకి లొంగనిదంతా ..సత్యమే అన్న భ్రమ..అది మాత్రమే వాస్తవం అన్న భ్రమ మరొకటి లేదు. నాగ మురళి గారూ మీ శైలి బాగుంది. అందుకు మరోసారి మీకు అభినందనలు.
రమ.
హనుమ గారి కామెంటు మిస్సయ్యాను.“The Physics Teacher” పేపరు “Myths about Gravity and Tides” లింకు
చూపినందుకు హనుమగారికి చాలా కృతజ్ఞతలు. అలల తోపుదలకు భూమిపై దినపరిమాణం ఎట్లా పెరగడం, ఆ లెక్కచొప్పున ఎప్పుడో 484లోని సూర్యగ్రహణం స్పేయిన్ లో కాక గ్రీసులో ఎందుకు కనపడిందో విప్పి చెప్పడం అద్భుతం, అనూహ్యం, ఆనందం.
హేతువాదమేమో కాని హేతువులు అర్థంచేసుకోవడమే అద్భుతం అనిపిస్తే, చూపించడానికి ఎంత జాగ్రత్త, పరిశీలన, పరిశ్రమ, పరిశోధన, సృజనాత్మకత కావాలో!
=======
విధేయుడు
శ్రీనివాస్
చాలా కాలం తర్వాత భావకవిత్వపు పోకడలతో మళ్లీ ఇలాటి పద్యాలు రావటం ముదావహం. వెల్చేరు గారు నన్నయ గారి నుంచి నేటి వరకూ వచ్చిన అన్ని రకాల పద్యరచనా ప్రక్రియలు ఏకకాలంలో కనిపించే సాహిత్యం బహుశా తెలుగుభాషలోనే వున్నదని ఒకచోట అన్నారు. ఈ పద్యాలు చదువుతుంటే “వైతాళికులు” సంకలనం లోని అనేక ఖండికలు గుర్తుకొచ్చాయి. ఐతే ప్రస్తుత ఖండికలో వాడిన సాధనాలలో కొత్తదనం లోపించిందనే అనిపిస్తున్నది. ఉదాహరణకు, ప్రేయసి కోసం ప్రకృతి లోని వృక్ష పక్ష్యాదులని అర్థించటం, అవి ఆమె మాకన్నా సుకుమారి అని, కళామూర్తి అని బదులివ్వటం, కథంతా గడిచాక అది కల అని ముగించటం – ఇది ఎన్నో సార్లు నడిచిన దారే. ఛందస్సులో ప్రయోగాలు చెయ్యటం కూడ అలాటిదే. భావాలు కూడ పాతవే అనిపిస్తున్నాయి. అంటే, అవే కవిసమయాలు, పద సంపుటుల ప్రయోగాలు. ఈ ఖండికను తక్కువ చెయ్యటం కాదు కాని ప్రతిభావంతులైన దేశికాచారి గారు భావ కవితా మార్గాన్ని ఇంకొన్ని కొత్త పుంతలకు విస్తరిస్తే ఇంకా బాగుంటుందేమో !
లక్ష్మీప్రసాదుగారికి,
సీసపద్యం ఛందస్సు తెలియక,లేదా సీసపద్యం వ్రాసే సామర్థ్యం లే క అట్లా వ్రాయలేదు. ఇది బుద్ధి పూర్వకంగా సీసపద్యంలోని ఉత్తరార్థంలో 3 ఇంద్రగణాలపైన ఒక సూర్యగణం వేసి, ద్విపదలాగా నడిపించాలని చేసిన ప్రయోగం. ఈ విధంగా సీసపద్యంపై కొద్దిపాటి మార్పులతో సీసపద్యం లాగ నడిచే ఛందస్సులకు నేను పెట్టుకున్న పేరు సీసతుల్యములని. మీకు ఓపిక ఉంటే ఇట్లాంటి నూతనచ్ఛందో ప్రయోగాలు నా వెబ్ సైటులో నా జక్కనచరిత్ర కావ్యంలోచూడగలరు. పైగా అది సీసపద్యమని నేను పైఖండికలో దానిని లేబుల్ చేయలేదు. ఒకవేళ అట్లా చేయాలంటే దానిని సీ.తు. (సీసతుల్యము) అని నా జక్కనచరిత్రలో చేసిన విధంగా చేస్తాను కాని, సీ (సీసము) అని చేయను. మీరు సూచించిన “సొంపుల” అనే మార్పు బాగుందని అంగీకరిస్తాను. కాని రెండవ సూచనతో నేనంగీకరించలేను.”నిధులీనుచు” అనేప్రయోగం అఖండయతిని తొలగించుకొనడానికి చేసిన కృత్రిమయత్నం లాగ ఉంటుందే కాని పద్యం యొక్క సొగసును గాని, అర్థాన్నిగాని పెంపొందింపజేయదు. ఇక్కడ అఖండయతి పడుతున్నదని గుర్తున్నా, దానిని తొలగించడానికి చేసే వికృతయత్నాలకంటే దానిని ఉంచుకోవడమే ఉత్తమపక్షమని నేను ఆవిధంగా వ్రాసినాను.
మీరు చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పారు.మీకు శ్రీరంగశయనం పైకోపమేమో గాని, ఆ పాత్రపై ఖచ్చితమైన అవగాహన ఉంది. నిజ జీవితంలో తారసపడిన ఒక పాత్రలాగా ‘చిత్రీకరించారు’.
70-80 ప్రాంతాల్లో ఇటువంటి మనస్తత్వాలు ఇట్లా ఉండేవేమో నాకు తెలీదు కాని, ఈ కాలం చెత్త సినిమాలు చూసి మనసులు పాడు చేసుకొని…భార్య ఉండగానే కలల్లో తేలిపోయే వాళ్ళు, భార్య పోయిన తర్వాత ఆ కలల్ని నిజం చేసుకోవాలనుకవడంలో నాకేమీ అసహజమనిపించలేదు.
“శ్రీరంగశయనం” ఉత్త వెర్రి పుచ్చకాయ. అగ్నిహోత్రావధానులుకి, ఒకటో రెండో స్టెప్పులు తక్కువలో ఉన్నాడు. అతనికి శాలువా ఎందుకు కప్పారో బెజవాడలో. ఏం ఘనకార్యం చేసి ఉంటాడు? ఆ సభలో గంగిరెద్దులా ప్రవర్తించాడేమో, అసహ్యం పుట్టి ఇంటికి వచ్చి తన శాలువాని ఎద్దు మీదకి విసిరింది వేదవల్లి. ఎందుకు విసిరిందో కూడా గ్రహించుకోలేని మొద్దు మొగుడు.
ఇక ఆమె చనిపోయాక -వేదవల్లి identity ని తన ఇష్టారీతిగా మార్చేసి , చుట్టూ ఇతరులకు ఏమి ప్రదర్శన చేస్తున్నాడీ శ్రీరంగశయనం. పూర్తిగా తన సేవకురాలిగా, భక్తురాలిగా తనలో ఐక్యం చేసేసుకోటంలో ఏమి ‘లాయరు చాకచక్యం’. దానికి తోడ్పాటు నిచ్చే పొరుగువారు కొందరు. అదేంటండీ అని ఏ ఒక్కరో అనబోయినా లాయరు -తన వెధవ ఆలోచన, ఆర్గుమెంట్ తనదే.
ఫిజిక్స్ లెక్చరర్, రచయిత్రి ఐన, -వేదవల్లి ఎఛీవ్మెంట్స్ తన ఖాతాలోకి transfer చేసేసుకుని కేవలం వంటపుట్టిగా, తన caregiver గా ఆమె స్వరూపాన్ని తన మాటల్తో క్విక్ గా మార్చేసి, తను ఇకపైన ఎంచుకున్న కాబొయే భార్య లక్షణాలు, డ్యూటీలు చనిపోయిన ఆమెకు transfer చేసేస్తున్నాడు. ఏం తెలివి! కొడుక్కు దిమ్మ తిరిగి పోయి ఉండాలి, తండ్రిగారు తల్లిని అంత fast గా efface చేసేస్తుంటే. నాకే ఆశ్చర్యంగా ఉంది శ్రీరంగశయనం సంభాషణలు వింటే. శ్రీరంగశయనం దృష్టిలో ఆ పక్కింట్లో ఉన్న స్త్రీకి కూడా identity లేదు. ఆమె ఎప్పుడో చచ్చిన ఎవరో మొగాడి విడో. ఇతడు నిత్య పెళ్ళికొడుకు. భలె. భలే.
ఈ కథ అర్థం కాకేం. 🙂 నాకు బాగా అర్థమయ్యింది.
‘చావు’ ఒక కాలక్షేపంగా పరిగణించే ఒక తెలుగు సమాజ కాలము, ప్రైవసీ అనేదే లేకుండా, తెలిసిన వాళ్ళూ తెలియని వాళ్ళూ ఎవరు పడితే వాళ్ళు వచ్చి, – కట్టెగా పడిఉన్న స్థితిలో ఒక మనిషిని చూసిపోటమూ, -ఆ వ్యక్తిని గూర్చి ఆ క్షణాన తమ కేది నోటికి వస్తే అది మాట్లాడటమూ – ఆ “పరామర్శ” అనే సామాజిక అమర్యాద, కథ చిన్నదైతేనేం నాకు స్పష్టంగా అర్థమయ్యింది.
వేదవల్లికి, గౌతమికి పరిచయం -గౌతమి ఇంటర్లో చేరినప్పుడు జరిగింది. కాలేజీల్లో 1960 తర్వాత ఇంటర్ లేదు. P.U.C. వచ్చింది. కాబట్టి వారి పరిచయం అంతకు ముందే అయ్యుండాలి. కాని ఆంధ్రా కాలేజీల్లో ఇంటర్ ఏ సంవత్సరంలో మొదలయ్యిందో నాకు తెలీదు. కథాకాలం 1920- 1980ల మధ్యన అనుకుంటున్నాను. ఆ కాలంలో ఒక స్త్రీ మరణిస్తే, భర్త, కొడుకు, బోడిగుండు చేయించుకునే వారా? అది నిజమా? లేక కల్పనా? రచయిత్రికి ఇష్టమున్నచో తెలుపగలరు.
నేను శ్రీరంగశయనం పాత్రని పోలి ఉంటానా అని మీరు అనుకోవటంలో అన్యాయం ఏమీ లేదు. 🙂 పాత్రకి సార్వత్రికమైన పార్శ్వం లేక పోతే అది నమ్మదగ్గదిగా మాత్రం ఎట్లా అవుతుంది? (నమ్మనలవి కాని పాత్రలతో కథ చెప్పలేమా అన్నది వేరే విషయం.)
సంచారి గారు చెప్పినది రూపం గురించి. నేను చెప్పినది సారం గురించి. ఎటు నించి నరుక్కు వచ్చామన్నదే తేడా – ఎంత వరకు ఎట్లా ఉపయోగ పడగలిగాము అన్నదానికి అవధి మీరే.
ఎలానూ మిగతా పాఠకులతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టీ ఇక పొడిగించనును, కానీ…
1. మీ బ్లాగుపాఠకులంతా మీ పీర్లనే మీకు అనిపిస్తే మరీ మంచిది. మీ బ్లాగు చదివేవాళ్ళంతా క్రిటికల్గా చదవరేమో అన్నాను. దానితో, పీర్ల గురించి నా నిర్వచనం ఏవని మీకు తెలిసిందో నాకు తెలవడం లేదు. అయినా పర్లేదు.
2. మీ కథను ఎలా మార్చాలో పాఠకులకు ఇవ్వకుండానే వచ్చే హోంవర్క్ మీ కథలు రాయడములో మీరాశించే ఒక ప్రయోజనమని నాకు నిజంగా తెలియదు. ఇప్పుడర్థమయింది, మీరు కావాలనే అపరిపక్వత (raw ness)ని కొంత ఒదిలిపెడుతున్నారని మీ కథల్లో.
3. కథ మెరుగు పెట్టడానికి ఖచ్చితమైన కొలమానాలు ఉన్నాయి. ఉంటాయి. అవి సాపేక్షికమైనవి కావు. ఏ కథకు ఆ కథ, ఆకథ చుట్టూ అల్లబడివున్న వాతావరణం అంతర్లీనంగా వాటిని నిర్దేశిస్తూ ఉంటాయి. వాటి ఆధారంగానే ఆ కథాకథనశైలీశిల్పాల్లో హెచ్చుతగ్గుల్ని అంచనా వేస్తారు.
నేను మెరుగు పెట్టడం అన్నదానికి మీరు తీసుకున్న అర్థమ్ సరి అయినది కానే కాదు. మీ శైలిలోనే, మీ భాషలోనే మీరు చెప్పిందే మరింత బాగా పాఠకులు ఎక్కువమందికి మీరనుకున్న అర్థంలోనే చేరడానికి చేసే మార్పు మెరుగు పెట్టడం అంటే. మిమ్మల్ని నా భాషలో మాట్లాడమని కాదు. (పెళ్ళికి మీ అమ్మాయిని నేను అలంకరించటం అంటే మీ అమ్మాయిని మా అమ్మాయిగా చేసుకోడం కాదు. చాలా మంది, చాలా మంచి అమ్మలకి కూడా కూతుళ్ళకి పెళ్ళి ముస్తాబు రాక, వేరేవారితో చేయిస్తారు. చిన్నపట్నించీ మొఖం కడిగి జడేసి బడికి పంపాను కాబట్టీ పెళ్ళి ముస్తాబు కూడా నేనే చేయగలను అనుకోడమే కాదు, నాకంటే నా కూతురిని ఇంకెవరూ ఇంత బాగా అలంకరించలేరు అని కూడా అనుకోడం సరి అయినది కాదు. అలంకరణలో లోపాలుంటే పెళ్ళాగిపోదు కదా, పెళ్ళయింది కదా అని అలంకరణ గొప్పగా ఉన్నట్టూ కాదు, కథలూ అలాగే. అలంకరణ చక్కగా ఉండటం ఆ కళాకారుడికి కళకు ఉన్న బంధం మీద ఆధారపడి ఉంటుంది… కదా?)
పాఠకులు చదివే కథని తమ భాషలోకి మార్చుకోడమూ, కథని అలా తమ లోకానికి అన్వయించుకోడమూ అనె ప్రక్రియ చాలా లోతైన విషయం. కథని మెరుగు పెట్టడం చాలా మొదట్లో జరిగే (ప్రిలిమినరీ) తంతు. ఇదే తేలుతున్నట్టులేదు సరిగ్గా, అంతదాకా ఎందుకు లేండి.
శైలి అంటే నాకు తెలుసనే అనుకుంటాను. మళ్ళి చెప్పినందుకు కృతజ్ఞతలు.వినదగు నెవ్వరు చెప్పిన… ముందే చెప్పాను గదా నా చాదస్తాలు చాలా ఉన్నాయని. మీకేమో చాలా అధునాతన భావాలు ఉన్నై, ఈ తరంలో చాలా మందికి మల్లే. తాను ముణిగిందే గంగ, తాను వలచిందే రంభ తరహాలో. శుభం. అలానే కానీయండి, ముణిగిపోయిందేమీ లేదు ఎలానూ.
ఇంక ఎలతానండీ, మీరు చెప్పినట్టుగానే “… పెరవారికి చోటొసంగుచున్”
సంచారి.
కథలు ఇక్కడ ప్రచురించినవీ, ఎక్కడా ప్రచురించనివీ కూడా నాబ్లాగులో పెట్టుకున్నప్పుడు పాఠకులకి రాని సందేహాలు పీర్ రెవ్యూయరులకి వస్తున్నాయి. దీనికి మంచి ఉదాహరణ నాబ్లాగులో కొత్తకథ, భయం. దీనిమీద బోలెడు ప్రశ్నలు వేయొచ్చు. కానీ నాబ్లాగు పాఠకులకి ఏమీ సందేహాలు వచ్చినట్టు లేదు.
దానిక్కారణం మీ బ్లాగు పాఠకులు మీ పీర్లు కాకపోడమేమో. ఒక కథని చులాగ్గా చదివి పడేసే వాళ్ళకీ, దాన్ని క్రిటికల్గా చదివేవాళ్ళకీ తేడా లేకపోతే సమీక్ష అనే ప్రహసనానికి అర్థం ఉండదు.
ఉదాహరణకి ఈ కథలోనే:
నెలరోజులయింది. శ్రీరంగశయనం గతించినభార్యనీ, ఆమె ధార్మికచరిత్రనీ కీర్తిస్తూనే ఉన్నారు, గంగాప్రవాహఝరిలా.
అంతవరకూ మాటాడకుండా కూర్చున్న కొడుకూ, కోడలూ లేచారు.
అంటే నెలరోజులూ మాట్లాడకుండా ఉన్న కొడుకూ కోడలూ అనా?
నెలరోజులయింది. శ్రీరంగశయనం గతించినభార్యనీ, ఆమె ధార్మికచరిత్రనీ కీర్తిస్తూనే ఉన్నారు, గంగాప్రవాహఝరిలా. మాసికానికి వచ్చినవారందరూ ఒకొకరే పొద్దు పోతోందంటూ లేచేరు.
అంతవరకూ మాటాడకుండా కూర్చున్న కొడుకూ, కోడలూ లేచారు.
మాసికానికి అన్న వాక్యం ఒక్కటి చేర్చడం వల్ల తేడా ఏమీ కనపడలేదా?
ఇంప్లిసిట్ గా పాఠకులు భావాలని అర్థం చేసుకోడం వేరు, ఇలా తప్పుల్ని సరిదిద్దుకుని చదువుకోడం వేరు. రాశేటప్పుడు శ్రద్ధగా రాయడం ముఖ్యం. అతిచిన్నదిగా కనపడే ఈ తప్పుని ఎత్తిపట్టింది ఇలాంటి చిన్న చిన్న సవరింపులూ, మెరుగులతోటి కథకు పెట్టే నగిషీ రచయిత గురించి చాలా చెపుతుంది. ఏం?
రచయితలు ఒకటి గుర్తెట్టుకోవాలి – వారు చెప్పదలచుకున్న కథ, వారు చెప్పిన కథ వేరు వేరని. చెప్పదలచుకున్నది వారి మెదడులో ఉంటుంది, దానిలో ఏ తప్పులూ లోటుపాట్లూ ఉండవు. చెప్పింది కాగితం మీద ఉంటుంది, అన్ని అవలక్షణాలతోనూ. రచయితకు ఆ రెండు ఒకేలా కనపడతై. అది మామూలే, రాసింది వారే కదా. కానీ అందరూ చదివేది కాగితం మీద ఉన్న కథని. వారి విమర్శ ఆ చెప్పిన కథ మీదే ఉంటుంది. విమర్శని తీసుకోలేకపోతున్నప్పుడు జరుగుతున్నది ఏమిటంటే రచయిత తను “చెప్పిన కథ”ను కాకుండా తను “చెప్పదలచుకున్న కథ”ను విమర్శిస్తున్నారనే అపోహలో పడి తన రచనను వెనకేసుకురావడం, విమర్శను ఒదిలిపెట్టి విమర్శకుల ఉద్దేశాలపై తీర్పు చెప్పుకోడం. (చెప్పదల్చుకున్న కథని ఏమీ చెడకుండా చెప్పడం రచయితలు అందరూ చేయగల్గే పని కాదు. చేయగలమనే భ్రమ కూడా మామూలే. సంపాదకులు చేయాల్సిన పని – చెప్పిన కథ ఆధారంగా చెప్పదల్చుకున్న కథను అర్థం చేసుకుని చెప్పిన కథకు మెరుగులు దిద్ది ఆ రెండిటినీ వీలైనంత ఒకటిగా చేయడం, రచయితకు ఆ రచనలో సహాయపడ్డం. ఇది కూడా అందరూ చేసే చేయగల్గే పని కాదు మరి.)
కథలో క్లుప్తత ముఖ్యం అన్న మీరే ఈ కథలో ఆఖరి వాక్యం ఆ క్లుప్తతను దెబ్బతీసిందని గమనించకపోడం ఆశ్చర్యమే. అంతకు ముందు మీర్రాశిన ఆ వైజాగు బీచిలో అక్కాతమ్ముళ్ళ కథలోనూ ఇలాగే చివరి వాక్యం ఆ కథని చంపేశింది. ఈ చివరి వాక్యాలు పాఠకుల మేథకి వదిలిపెట్టాల్సినవి. నిజానికి చదివినప్పుడల్లా మీ కథల్ని చాలానే సాన పట్టాలని నాకనిపిస్తుంది. ఇదంతా నా చాదస్తేమేనేమో. పోనిద్దురూ..
మీ బ్లాగులోనే ఎప్పుడో రాశేరు కాదూ… అసలీ కథలు ఏదో ఊసుపోక రాశేవి వాటి కింత శ్రద్ధ అవసరమా అనీనూ, నిజంగా సంపాదకులకి ఇంత టైమ్ ఉంటుందా, వారు నిజంగా ఇవన్నీ ఇంత శ్రద్ధగా చదువుతారా అనీనూ. మీరే నిజమేమో, సంపాదకులు మీ కథని చదవకుండానే అచ్చేసినట్టున్నారు, ఊసుపోకకి రాసిందనేమో 🙂
ఏమాటకామాటే – ఈ కథ మీ మిగతా కథలు చాలావాటికంటే బాగా రాశేరు. (ఇంకొంచెం నగిషీ పెట్టి ఉండాల్సింది.) ఇదేదో మెచ్చుకోలుకి అంటున్న మాట కాదు.
(మీ కథ గురించి కదా అని మీరింకెక్కడో రాసిన కామెంటుకి ఇక్కడ ప్రతిస్పందించాను. ఏవనుకోకండి).
నాకు చాలా నచ్చిన అతికొద్దిమంది తెలుగు కథకుల్లో కనకప్రసాద్ ముఖ్యులని ఇదివర్లో చెప్పాను. అదేమాట మరోమారు అనేందుకు ఇది అవకాశంగా తీసుకుంటాను. అతని సునిశిత పరిశీలన, దాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించటానికి అతను ఎంచుకునే భాష మిరుమిట్లుగొలిపిస్తాయి. తొలిసంచిక లోని “బర్సాత్ మే బిల్లీ” నుంచి నేటివరకూ అతని కథల్లో పాత్రలు, వాటి పరిసరాలు ఎంత పరిపూర్ణంగా, మల్టీ డిమన్షనల్ గా వుంటాయో ! అలాగే అతని కవితలూ. ముచ్చటగొలిపే పదాలు, పదబంధాలు, భావాలు.
ఇక ప్రస్తుతానికి వస్తే – బహుశ సాహిత్యం మొదలైనప్పట్నుంచీ వున్న ప్రశ్నేనేమో “ఏది నిజమైన సాహిత్యం? ఏది ఉత్తమం? ఏది కాదు?” అనేది. నా మట్టుకు నా అనుభవం ఉన్నతసాహిత్యసృష్టి ఒక అలౌకికక్రియ అని, అలా సృష్టి ఐన సాహిత్యాన్ని అనుభవించటానికి పాఠకుడు కూడ ఎంతో కొంత అలాటి స్థితిని పొందాలని. అలా సృష్టికర్తా సృష్టిద్రష్టా ఒకే అనుభూతిస్థితిని కొంతవరకైనా కొన్నిక్షణాలపాటైనా పంచుకుంటారని. ఇలా సృష్టి ఐన సాహిత్యం నా దృష్టిలో “అప్రయత్నపూర్వకంగా” వచ్చినది, అలా కానిది “ప్రయత్నపూర్వకంగా” వచ్చినది. మొదటిది బుద్ధిజనితమైతే రెండోది మేధోజనితమో మనోజనితమో ఔతుంది. ఈ చివరి రెంటిలోనూ మేధోజనితం మనోజనితం కంటే ఉన్నతంగా వుంటుందని నేను అనుకుంటాను.
కనుక, పాఠకుడిగా ఒక రచనని చదువుతున్నప్పుడు ఎవరికి వారే బహుశ అసంకల్పితంగా ఎక్కడెక్కడ అది ప్రయత్నపూర్వకమో ఎక్కడెక్కడ అప్రయత్నపూర్వకమో “గ్రహిస్తారని” నా నమ్మకం. (కనకప్రసాద్ అనే జూటాకోరుతనం ప్రయత్నపూర్వకంగా ఎవరి మెప్పు కోసమో లేక మరెవరి భయం వల్లనో లేక తలియని విషయాన్ని తెలిసినట్టు బుకాయిస్తూనో రాసేరాతలలో కనిపిస్తుందని నేననుకుంటాను.) అలాటి గ్రహింపు నుంచే ఎవరికి వారు ఆ రచన గుణాగుణాల గురించిన అభిప్రాయాలు ఏర్పాటుచేసుకుంటారు. అనుభవజ్ఞులైన విమర్శకులు, నిశితశోధన వున్న పాఠకులూ అలా గ్రహించిన రచనాభాగాల గురించిన వారి అనుభూతిని మామూలు భాషలోకి తర్జుమా చేసి ఇతరులతో పంచుకోగలుగుతారు (సోమరిపోతులు ఇతరుల అభిప్రాయాలు విని వాటినే మళ్లీ తమ భాషలోనో లేక అంత ఓపిక కూడా లేకపోతే ఇతరుల భాషలోనో వెళ్లగక్కుతారు).
ఏతావాతా ఏ రచనా సార్వత్రికంగా సార్వకాలికంగా పాఠకులందరికీ ఒకే విధంగా అనుభూతినివ్వటం అసాధ్యం అని నేను అనుకుంటాను. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక రచనకి “నిజమైన” – అంటే దాని సృష్టిస్థితితో కొంతైనా తాదాత్మ్యం చెందగలిగిన – పాఠకులు చాలా కొద్దిమందే. కొండొకచో ఎవరూ లేకపోవచ్చు కూడా – ఓ కవిగారు తన కవిత గురించి వ్యాఖ్యానిస్తూ “అది రాసినప్పుడు ఇద్దరికి అది తెలుసు – ఒకరు నేను, మరొకరు దేవుడు; ఇప్పుడు ఒకరికే తెలుసు, అది నేను కాదు” అన్నట్టు. ఒక రచన విషయంలోనే ఇలా వుంటే ఇక ఒక రచయిత లేదా కవి తన జీవితకాలంలో చేసే రచనలన్నింటినీ కలిపి టూకీగా గుణనిర్ణయం చేసెయ్యటం దుడుకుతనం అని నా ఉద్దేశం. అలా చేసెయ్యటమే కాకుండా మిగిలిన పాఠకులంతా ఆ నిర్ణయాన్ని ఆమోదించి తీరాలనీ, ఆమోదించకపోవటం వాళ్ల సాహిత్యాస్వాదనాదారిద్ర్యానికి నిదర్శనమనీ తిట్టిపొయ్యటం ఘోరం, దౌర్భాగ్యం, దౌర్జన్యం.
ఒక చక్కని విషయాన్ని లేవనెత్తి దాని గురించి అద్భుతమైన వ్యాసాన్ని రాసిన కనకప్రసాద్ ని ఎంతగానో అభినందిస్తూ –
“అంటే నాబోటి రచయితల రచనలు ఎవరూ చదవడం లేదన్న మాట, చదవరన్న మాట. మరి నేనెందుకు రాయడమో?”
విధేయుడు – మోహన
రచయితలు తమ కోసమే తాము రాయాలి. తమకేవి ఇష్టమో వానిని గురించి రాయాలి. పబ్లిష్ చెయ్యవచ్చు, ఇతరులు కూడా ఆనందిస్తారనుకున్నప్పుడు. కాని పబ్లిష్ అయ్యాక ఇక స్పందన కోసం ఆందోళన పడటం, ఆశించిన స్పందన లేకుంటే విరమించటం దేనికి. అంతగా రచయిత వేరే వారి అభిప్రాయానికి తలఒగ్గటం దేనికి?
స్పందన కోసం వెనువెంటనే రొక్కించటం పాఠకునికి విసుగు కలిగించవచ్చు. రచయిత ఇప్పుడు రాసినా ఎప్పుడు రాసినా, ఏ కాలంలో పాఠకులు చదువుకుంటారో, చెప్పలేం. ఎన్నేళ్ళ క్రిందో రాసిన వారిని ఇప్పుడు చదవటల్లేదా? ఇప్పుడు రాసిన వారిన కొందరిని వెనువెంటనే చదువుతాము కూడా. పాఠకులెప్పుడూ ఏ శతాబ్ది రచయితలనైనా వరుస క్రమంలో చదువుతారనుకోటం భ్రమ. పబ్లిషర్లు మేగజీన్లు, ఏంథొలొజీలు, గ్రంధాలు వేస్తూ పోవచ్చు. కాని ఏ పాఠకుడు ఏ సంచికతో, ఏ రచయితతో చదువు మొదలెడతాడో, ముందుకే వెడతాడో, వెనక శతాబ్దులలొకి పయనిస్తాడో చెప్పలేం. అదంతా అతని ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇష్టాలు మారుతుంటయ్.
పాఠకుల టేస్ట్ ననుసరించి రచయిత రాయటం అనే ఘోర గెస్సింగ్ గేం రచయితను గోతిలోకి లాగుతుంది. విమర్శకుల మాటలు, వారి టేస్ట్ సరేసరి. ఇదిగో, కాఫ్కా రచనొకటి మళ్ళీ చదువుకుంటున్నా. దాన్ని రచయితే స్వయంగా తగలపెట్టమన్నాడు. బహుశా అప్పటి సమాజం లోని వేరేవారి ఆలోచనలతో అతని రచనకు సామీప్యం లేదు – దానిని వారు appreciate చెయ్యలేరు అని అతడు భావించి ఉండొచ్చు. అప్పుడది నిజమే కావచ్చు. కాలక్రమాన అలా జరగలేదు. కాఫ్కా నేనెన్నోసార్లు చదువుతాను.
కొన్ని రచనలు ఒక్క సారే చదువుతాను. ఒక్కసారే అనుభవించినంత మాత్రాన అది తక్కువ ఆనందమా? ఆ అనుభవాన్ని గురించి మళ్ళీ మాటల్లో చెప్పకపోతే, ఏం నష్టం. ఫీడ్ బేక్ కి కట్టుబడి రచయిత ఉండనేగూడదు. రచయిత స్వతంత్రుడుగా ఉన్నప్పుడే, ఎవరికైనా గాని ఎక్కువ interesting గా ఉండేది.
శ్రీనివాస్ గారు చెప్పారు – రచయితలకు ఉపయోగమో కాదో కాని పాఠకులకు కామెంట్లొక సౌలభ్యం. అన్నీ చదివే తీరిక,కోరిక లేనప్పుడు ఏం చదవాలో అన్నది కామెంట్లను చూసి నిర్ణయించుకోవడం ‘ఈ మాట’ brand సౌకర్యం.
అంటే నాబోటి రచయితల రచనలు ఎవరూ చదవడం లేదన్న మాట, చదవరన్న మాట. మరి నేనెందుకు రాయడమో?
విధేయుడు – మోహన
కామేశ్వరరావుగారు ఎన్నో మంచి పాయింట్లు చెప్పారు. సైన్సు వ్యాసాలను కొనసాగించడం సంతోషకరం. వివిధ రంగాలలో నిష్ణాతులు చాలా మంది వున్నా,రాయడం రాయించుకోవడం పిల్లికి గంట కట్టడం లాంటిదేమో!
అయినా ప్రయత్నించాలి. రెండు పాయింట్లు చెప్పాలనిపించింది.
1. బహుమతులు పురస్కారాలు ఇవ్వడం మంచిదే. కాని ఇప్పట్లో అది అనవసర భారాన్ని’ఈ మాట’ నిర్వాహక మిత్రులపై పెడుతుందని చెడ్డ అనుమానం.పత్రికనడపడమే పెద్ద పని. దానికి తోడు ఈ బహుమతుల ఎంపిక, నిర్ణయ పద్ధతులు, జడ్జీలను పె(ప)ట్టడం, నిర్వహణ,ప్రదానాలు – అసలే మంచి రచనలకోసం ఎదురుచూస్తుంటే ఇప్పుడు దేనికేమివ్వాలో అని తలపట్టుకోవడం అంతా పత్రిక ముఖ్యలక్ష్యానికి ప్రత్యక్షంగా ఏ మాత్రం సాయపడని లంపటమేమో!
2.రచయితలకు ఉపయోగమో కాదో కాని పాఠకులకు కామెంట్లొక సౌలభ్యం. అన్నీ చదివే తీరిక,కోరిక లేనప్పుడు ఏం చదవాలో అన్నది కామెంట్లను చూసి నిర్ణయించుకోవడం ‘ఈ మాట’ brand సౌకర్యం. చర్చావేదికలున్నా, తీసేస్తే బాగుంటుందీ కామెంట్లు అన్నది సైతం మనం కామెంట్లలోనే చెప్పుకోవడం దాని ఉనికికి ఎంత అలవాటుపడ్డామో అని ఆశ్చర్యం.
====
విధేయుడు
శ్రీనివాస్
“పాడిందే పాడరా…” అన్న శీర్షిక వ్యాసానికే కాకుండా కామెంట్లకి కూడా సరిపోయింది! 🙂 చాలావరకూ అందరూ ఒక్క “పీర్ రివ్యూ” విషయం మీదనే ఎందుకంతగా మల్లగుల్లాలు పడుతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి ఇంటర్నెట్లో ఒకటిరెండు ఇతర తెలుగు పత్రికలు కూడా ఈ పీర్ రివ్యూ పద్ధతిని పాటిస్తున్నాయి. ఇది ఈమాటకే ప్రత్యేకమైన విషయం కాదు.
ఆలోచించాల్సిన ముఖ్యవిషయాలు మరికొన్ని కూడా ఉన్నాయ్. నాకు తోచినవి కొన్ని ఇక్కడ వివరిస్తాను. కిందనంచి మొదలుపెడతాను. వేలూరిగారు చెప్పిన కథ తమాషాగానే ఉన్నా, దానిబట్టి నాకర్థమైనదేమిటంటే, కొత్తదనమంటే వారి దృష్టిలో వాంతి మందులాంటిదని! నిజంగా వారికిలాంటి దృష్టి ఉండకపోవచ్చు. కాని ఆ కథని, దాన్ని చెప్పిన సందర్భాన్ని బట్టి నాకదే అనిపించింది. నాకే కాదు చాలామందికి అలా అనిపించే అవకాశం ఉందని నా బలమైన అనుమానం. ఇందులో సంపాదకుల నిరంకుశ ధోరణి తొంగిచూస్తోంది.
ఈమాటకి కొత్త రచయితలు కొరవడడానికి ఈ ధోరణి ముఖ్యకారణమని నేననుకుంటున్నాను. దీనికి సహేతుకమైన కారణాలు నేనిక్కడ వివరించలేను. దీనికి ఈ వ్యాసంలోనే మరో ఉదాహరణ, “బొబ్బర్లంకనుంచి ప్రచురించబడుతున్న పత్రికలా ఉన్నదికాని,” అన్న వ్యాఖ్యపై స్పందన. ఈ వ్యాఖ్య ఆంతర్యమేమిటో నాకు స్పష్టంకాలేదు. సంపాదకులకి కూడా లేకపోతే అది చేసిన సదరు వ్యక్తిని అడిగి తెలుసుకుంటే బాగుండేది. అంతేకాని గోదవరి జిల్లాల్లోని వేదపండితుల ప్రసక్తి తెచ్చి వారి ఆదరణగురించి చెప్పడంలో సంపాదకుల ఆంతర్యమేమిటో అసలే బోధపడలేదు. నేనా వ్యాఖ్యని అర్థం చేసుకున్నది పత్రికలో “సమకాలీనత” కొరవడిందని. పత్రికలోని కంటెంట్ విషయంలో ఇది నిజమనే నాకూ అనిపిస్తోంది. గత రెండు మూడేళ్ళగా ఈమాటలో వచ్చిన వ్యాసాల్లో ఎంత శాతం ప్రస్తుత తెలుగు సాహిత్యానికి (పోనీ 1980 తర్వాత వచ్చినది) సంబంధించినవి ఉన్నాయో లెక్కకడితే ఈ విషయం స్పష్టమవుతుంది. దీనికి ఏమిటి కారణం? ఈమాట పాఠకులకి సమకాలీన సాహిత్యం మీద అంతగా ఆసక్తి లేకపోవడమా? ఆ సాహిత్యమ్మీద రాయగలిగే రచయితలు ఈమాటకి రచనలు చేయకపోవడమా? ఈ విషయంపై సంపాదకులు దృష్టి పెడితే బాగుంటుంది. నాకు తోచిన మరికొన్ని విషయాలు:
1. గ్రంధాలయం, శబ్దతరంగాలు ఈమాటకే ప్రత్యేకమైన అంశాలు. వీటిని ఇలాగే కొనసాగించాలి. ఈమాటలో వచ్చే వ్యాసాలలో సాహిత్యంతో పాటు సైన్సు, సంగీతం మొదలైన విషయాలపై కూడా ఉంటున్నాయి. ఇదికూడా తప్పకుండా కొనసాగించాల్సిన అంశమే.
2. సమకాలీన భారతీయ/విదేశ సాహిత్యాన్ని పరిచయం చేసే వ్యాసాలు, అనువాదాలు రెగ్యులర్ ఫీచర్‌గా ఉంటే బాగుంటుంది.
3. ఒకటే పత్రిక ఉన్నప్పుడు దాని పరిధి చాలా విసతృతంగా ఉండవచ్చు. కాని ఇప్పుడు ఇంటర్నెట్లో అనేక పత్రికలు వచ్చాయి. ఒకో పత్రికపైనా ఒకో రకమైన రచయిత/పాఠకులు మొగ్గుచూపుతారు . కాబట్టి, ఈమాట ఆశయాలని మరొకసారి సమీక్షించుకొని, ఎలాంటి అంశాలకి ఫోకస్ ఇవ్వాలి, ఎలాంటి పాఠకులకోసం పత్రిక నడపాలి అన్న విషయం పునర్నిర్వచించుకుంటే మంచిదేమో.
4. పాపులర్ పత్రికగా కాక తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక అంశాలలో ఒక ఉత్తమ స్థాయి పత్రికగా నడపడం ఆశయమైతే, ఇందులో తెలుగు విశ్వవిద్యాలయమూ, ఇతర విశ్వవిద్యాలయాలలో తెలుగుశాఖల వారితో ఈమాట వర్గం ఏమైనా ఇంటరేక్టవ్వగలిసి, ఆదానప్రదానాలు(వారు ఈమాటలో రచనలు చెయ్యడం, వారూ వారి విద్యార్థులు ఈమాట పాఠకులవ్వడం వంటివి) జరిగితే చాలా బాగుంటుంది.
5. మంచి రచనలని, రచయితలని ప్రోత్సహించడానికి, ఏడాదికొకసారి, ఆ ఏడు ఈమాటలో ప్రచురించిన కవిత, కథ, వ్యాసాలలో ఒకో ఉత్తమమైనదాన్ని ఎంచి బహుమతులు ప్రకటిస్తే బాగుంటుంది. బహుమతి మంచి పుస్తకాల రూపంలో ఉంటే మరీ బాగుంటుంది! దీని ఖర్చు ఈమాట అభిమానులు తప్పక భరించవచ్చు. ఇచ్చే బహుమతి ముఖ్యం కాదు, ఈమాట బహుమతి గెలవడం ఒక గౌరవంగా చెప్పుకొనే స్థాయి దానికి ఉంటే బాగుంటుంది.
6. ఈమాటలో రచనలపై కామెంట్లు, రచయితలకి ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయో నాకు చాలా అనుమానం. వాటివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోదేమో అని నాకనిపించిన విషయం. ఎలాగో చర్చా వేదికలున్నాయి కాబట్టి, ఇలాంటి విషయాలు ఏమైనా చర్చించ వలసినవి ఉంటే వాటిలో చర్చించ వచ్చు. పాఠకులకి ఏమైనా తీర్చుకోవలసిన సందేహాలు కాని, అవసరమైన సమాచారం కాని కావలసినా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా వ్యాసంపై ప్రత్యేకమైన చర్చ అవసరమనుకున్నా (రచయిత కాని సంపాదకులు కాని) చర్చావేదికనే ఉపయోగించుకోవచ్చు. అంచేత కామెంట్ల సౌకర్యం తీసి వేస్తే బాగుంటుందని నా (చివరి) సలహా.
మే నెల లో వసంతమా? వికృతి ప్రభావమా? ప్రస్తుత మే లో సగం అధిక వైశాఖం, సగం నిజ వైశాఖం ఉన్నాయి. వాన కారుకై ఎదురు చూపులే అంతటా. అయితే మా మహా నగరం లో ఇప్పుడిప్పుడే కోయిల, అదీ మిట్ట మధ్యాహ్న వేళ తెగ కూస్తోంది. ‘కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో?’ అని పింగళి వారన్నట్టు ఆశ్చర్య పోతూ ఆనందించాల్సిందే.
-తాతిరాజు వేణుగోపాల్
పీరు రివ్యూలగురించి ఇంతగా చర్చిండం కాబట్టి “ఈ మాట”మిత్రులకొక ప్రశ్న, సహృదయంతోనే. పీర్ రివ్యూలను ఎవరు రివ్యూ చేస్తారు?రచనలకు రివ్యూలు లాగా,పీర్ రివ్యూలకు feedback పేరుతో అవి ఆ రచయితలకు ఏ విధంగా ఉపకరించాయో లేదో, పేరుతో కాని పేరుచెప్పకుండానైనా అభిప్రాయ సేకరణ, పూర్తిగా కాకపోతే periodical or random గానైనా సేకరిస్తే ఆ పద్దతిలో ఉన్న లోపాలు తెలుసుకోవడానికి మార్చుకోవడానికి సాయపడుతుంది.సాయపడేవి గుర్తించి పెంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాక, దీనితో అపోహలుంటే దిద్దుకోవడానికి అవకాశం కూడా కలుగుతుంది.
ఏదేమైనా, నిస్వార్థంతో సమయాన్ని శ్రమను కొంత ఖర్చునూ భాషా సేవ కోసం అందిస్తున్నఅందరికీ కృతజ్ఞతలు. అవకాశం,సందర్భం వచ్చింది కాబట్టి, సంపాదక బాధ్యతను,సాంకేతిక బరువునూ ఎంతగానో మోసిన వేలూరి, కొలిచాల గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
______
విధేయుడు
_Srinivas
“పియర్ రివ్యూ” ని ప్రవేశపెట్టిన ఇంతకాలానికి దానిగురించిన సుదీర్ఘచర్చ ఆసక్తికరంగా వుంది. నాకు తెలిసిన చరిత్రని కూడ ఈ చర్చలోకి ప్రవేశపెడితే ఇంకొంత మంచి జరుగుతుందేమోనన్న కుతూహలంతో ఈ చిన్నప్రయత్నం.
“ఈమాట” తొలిసంచిక నుంచీ పియర్ రివ్యూ అమలులో వుంది. కథల విషయంలో అప్పటి సంపాదకులం – నేనూ, కొంపెల్ల భాస్కర్ , విష్ణుభొట్ల లక్ష్మన్న, కొలిచాల సురేశ్ – ఎవరమూ నిష్ణాతులం కామని మాకు స్పష్టమే కనుక చాలా మంది రివ్యూయర్లు చేయూత నిచ్చారు. నాకు బాగా జ్ఞాపకం వున్న పేర్లు – జంపాల చౌదరి, కన్నెగంటి చంద్ర, మాచిరాజు సావిత్రి, నాసీ, వేలూరి వేంకటేశ్వరరావు, విప్లవ్ ,వేమూరి వేంకటేశ్వరరావు. ఇంకా భట్టిప్రోలు అక్కిరాజు, డొక్కా ఫణికుమార్ కూడ చెయ్యివేసిన గుర్తు. ఆ రోజుల్లో కొందరు కథల్ని “స్నెయిల్ మెయిల్ “లో పంపడంతో రివ్యూలు కష్టమయేవి కూడ. ఐతే మా సంపాదకవర్గానికి కొంతవరకు నచ్చితే వాటిని ముందు తెలుగులో టైప్ చేసి ఎలెక్ట్రానిక్ కాపీలు రివ్యూయర్లకి పంపేవాళ్ళం. ఇక కవితల విషయంలో కన్నెగంటి చంద్ర, నందివాడ ఉదయభాస్కర్ , విన్నకోట రవిశంకర్ , మాచిరాజు సావిత్రి, విప్లవ్ , కనకప్రసాద్ , (మరొకరు – పేరు గుర్తు రావడం లేదు, మైక్రోసాఫ్ట్ లో పనిచేసేవారు), తమ్మినేని యదుకులభూషణ్ నాకు గుర్తున్నవారు. ఇంకొందరు కూడ సహాయం చేసిన గుర్తు. వ్యాసాలకు వస్తే “బరువైన” వాటి భారం వెల్చేరు నారాయణరావు గారి మీద వేసేవాడిని. వేలూరి వేంకటేశ్వరరావు, జంపాల చౌదరి, ఇండియా నుంచి వచ్చిన వాటిని ద్వానా శాస్త్రి, ఇక్కడ విన్నకోట రవిశంకర్ , తమ్మినేని యదుకులభూషణ్ చాలా రివ్యూ బాధ్యతల్ని మోసినవారు. కొందరి పేర్లు నేను మర్చిపోయే వుంటాను, వారు నన్ను క్షమిస్తారని ఆశ.
మరీ పత్రిక రిలీజ్ కి ముందురోజు వస్తేనో, లేక స్పష్టంగా ప్రచురణార్హంగా కనిపిస్తూంటేనో రివ్యూయర్లకి పంపకుండా సంపాదక వర్గమే నిర్ణయించిన సందర్భాలు వున్నాయి కాని అంత ఎక్కువ కాదు. అలాగే స్పష్టంగా నేలబారుగా కనిపించిన వాటిని కూడా మేమే నేరుగా తిరస్కరించటం అప్పుడప్పుడు జరిగాయి.
తొలిసంపాదకవర్గం లోని నేనూ, భాస్కర్ , లక్ష్మన్న – మాకు అంతకుముందు ఎన్నో ఏళ్లుగా టెక్నికల్ పబ్లికేషన్ , దాని మెలకువలు అనుభవమే కనుక పియర్ రివ్యూ “ఈమాట” పునాదుల్లో ఒకటిగా ఉండాలని ఎలాటి చర్చా లేకుండానే నిర్ణయించుకున్నాం. దాని కారణంగా ఏ కథా లేకుండా ఒకటి రెండు సంచికలు వచ్చిన గుర్తు కూడ. “ఎక్కువమంది రచనలు చేసేవారు లేనప్పుడు పియర్ రివ్యూ అనవసరం” అన్నవాదన అందువల్ల నాకు సమంజసంగా తోచదు. అలాగే, ఇది ఇక్కడి పత్రికలను అనుసరించాలనీ అనుకరించాలనీ చేసిన నిర్ణయం కాదు, ఇక్కడి టెక్నికల్ పబ్లిషింగ్ లో పియర్ రివ్యూ వల్ల జరిగే మంచిని చూసి, అప్పట్లో ఇక్కడ వస్తున్న ఇతర పత్రికల, ప్రచురణల గుణహీనతకి కారణం పియర్ రివ్యూ లేకపోవడం అన్న ప్రతిపాదన తోటి, ఇలా చేస్తే మంచి రచనలు వస్తాయనే భావనతో చేసిన పని. అందువల్ల తిరస్కరించిన రచనలకి, అలాగే మార్పులు చెయ్యవలసిన రచనలకి రివ్యూయర్ల అభిప్రాయాలని పంపేవాళ్లం.
ఇదంతా 2006 వరకు, నేను సంపాదక బాధ్యతలు వహిస్తున్న కాలంలో విషయం. ఇప్పుడు రాసేవారు చాలా పెరిగారు గనుక రివ్యూయర్ల సంఖ్య కూడ పెరిగేవుంటుంది. ఐతే ప్రత్యక్షంగా నాకు తెలియని విషయాల్లో తలదూర్చటం సాహసం గనుక అటు వెళ్లను.
కథ బాగా ఉంది, కాని , ముగింపు సరిగా లేదండీ. శేఖర్ ఎవరితో తిరిగాడో రాధ తెలుసుకుంటీ త్రిల్ ఉండేది. ఇంకో మాట. రాథ ని చెడ్డదాన్ని చెయ్యడం అనవసరం. ఒకవేళ చెయ్య దల్చుకొంటే రాధను కూడా శేఖర్ని లాగా చంపాల్సింది.
బాగుంది కవిత! ఈ వి పదాలతో వచ్చిన గొడవే ఇది. మల అంటే కుళ్లు, కాని విమల, అమల రెంటికీ ఒకటే అర్థము. అదే విధంగా వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. కానీ కృతికి వి చేరిస్తే విశిష్టమైన కృతి కాక వికారమయింది. కానీ జ్ఞానికి వి చేరిస్తే వచ్చిన విజ్ఞానము విశేషమైన జ్ఞానమే. ఒహొరే ఒహొరే బ్రహ్మ దేవుడా, నీవెంత బుద్ధిశాలివయ్యా బ్రహ్మదేవుడా! విధేయుడు – మోహన
తెలగాణెము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
04/22/2010 10:54 am
రమగారూ,
కవుల పట్ల నా “భయం” గురించి మీకు ఎటువంటి భయం అవసరం లేదు. ఇదివరకు చెప్పినట్లే అది కూడా కవిసమయం లోనిదే. అభిప్రాయాన్ని అందించడమే కదా మనం చేసేదిక్కడ. అయినా తెలంగాణపట్ల అన్యాయాలను మన ప్రజాస్వామ్యంలోని అవ్యవస్థను ఎత్తిచూపడానికి ఎటువంటి వకాల్తా పుచ్చుకోవడం కాని, అసలక్కడ పుట్టడం సైతం అనవసరం, అప్రస్తుతం.

04/22/2010 10:38 am
దేశికాచారిగారు
నేను రాసిన భయం కూడా కవిసమయంలోనిదే. మంచి పద్యాలు చదువుతూ “ఈ మాట”లో ఎవరికైనా ఎప్పుడైనా ఎందుకైనా ఏం భయముంటుంది!
వట్టి మభ్యపెట్టే ప్రసంగాలే ప్రస్తుత సమస్యకు కారణమైతే, వాటికి విరుగుడు మరో ప్రసంగాలతో పోయేది. కాని మీరన్న “పార్టీరథచోదకుల”స్వార్థం ముమ్మాటికీ సత్యం. ఎన్నికల ముందు అన్ని ప్రధాన పార్టీలకు గుర్తుకు
రాని “సమైక్యం”, ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చి ఓట్లు పడ్డాకనే, మాట మార్చి బాట మార్చడం మన ప్రజాస్వామ్యంలో చూస్తున్నదే. “సమైక్యం” నినాదం చాటున దాగిన, దాచిన “పార్టీరథచోదకుల”స్వార్థం కూడా చూస్తున్న పర్వమే. సత్కవుల మాటలకన్నా మంచి (నాయకుల) చేతలే ఎక్కువగా ఊరటను ఇస్తాయేమో అనిపిస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజానీకానికి.
========
విధేయుడు
-Srinivas
తెలుగు పాఠకులని గురించి వదిలేయండి రోహిణీప్రసాదు గారూ!! అసలు సంగీతపు టీచర్లు గా చెప్పుకుంటున్నవాళ్ళకే సంగీతపు పూర్వాపరాలని గురించి ఏ పరిజ్ఞానమూ ఉన్నట్టు కనబడని రోజులివి. ప్రొఫెసర్ సాంబమూర్తి గారి వ్యాసాలనీ ..పుస్తకాలనీ సంగీతంమీద ఆసక్తి ఉన్నవాళ్ళు చదవడానికైనా వీలుండాలి. ఆ లోపం అంటూ ఉంటే అది సంగీతరంగం లోని వారిదే కద?
ఇక కేవలం సంగీతాన్ని గురించే అంటే అది హిందుస్తానీ పధ్ధతిలోనే సాధ్యం! కర్నాటకానికి సాహిత్యమే ప్రధానమైనది. దక్షిణాదిన సాహిత్యంలేని సంగీతానికి ప్రాముఖ్యత లేదు. ఇదిమీకు తెలియని విషయమూ కాదు. అయినా మీ అసంతృప్తి సాహిత్య పాఠకులమీదికి మళ్ళుతూంటుంది.
శ్రీనివాసుగారూ,
మీరు భయపడవలసింది కవులకు గాదు, కేవల స్వలాభాపేక్షతో, అధికారదాహంతో ప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రసంగాలూ, కృత్రిమనిరాహారదీక్షలూ చేసే “మతిం దలక్రిందుగ నూహసేయు పార్టీరథచోదకుల”కు. వారి ముందు కవులేపాటి? “కవయః క్రాంతదర్శినః” – అని పెద్దలు పలికిన వాక్యం సత్కవుల పట్ల సర్వదా సత్యం నేటి “పార్టీరథచోదకులు” చేసే స్వార్థపూరితప్రసంగాలు వారి కండ్లముందే బుగ్గిపాలౌతాయి గాని సత్కవుల వాక్యాలు సర్వదా జీవించి సమాజాన్ని సత్పథగామిని చేస్తాయనడం నిర్వివాదాంశం. సత్కవుల సద్వాక్యాలు . సనాతనంగా సమాజాన్ని ఉత్తేజపరుస్తాయనడంలో సందేహం లేదు. వీటికి వెఱవడం ఆత్మభీరుత్వమే కాని అన్యధా కాదు.
చక్కటి వ్యాసం. మొదలుపెట్టాక చివరకంటూ అలా చదువుతూనే వున్నాను. శైలి, విషయం రెండూ బావున్నాయి.
మొబైల్ ఫోనులు రాని క్రితం నాకు బాగా గుర్తుండే ఫోను సంగతి – STD కి రోజులో ఒక్కో సమయంలో ఒక్కో రేటు వుండడం – సగం రేటు, పావు రేటు ఇలా. సరిగ్గా గుర్తులేదు కాని, పొద్దున్న ఐదున్నర లేక ఆరు ముందర పావు రేటు వుండేదనుకుంటా. మా అమ్మ వాళ్ల అక్కచెళ్లల్లందరూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండగ శుభాకాంక్షలు వగైరా వగైరా… ఆ పావు రేటు వున్న సమయంలోనే చెప్పేసుకునేవారు. పొద్దున్నే ఆ ఫోనులో గట్టి గట్టిగా చెప్పుకునే పండగ పలకరింపులూ, కుశల ప్రశ్నలతోటే మాకు శుభోదయమయ్యేది, పైగా ఎవరయినా ఫుల్ రేటు లో ఫోన్చేసి మాట్లాడుకుంటుంటే, “వీళ్ళు ఎంత దుబారా చేస్తారు? ఎంచక్కా పొద్దున్నే పావు రేటులో మాట్లాడుకోవచ్చు కదా” అని అనేవారు.
ఈ చర్చలో అందరూ ఉదహరిస్తున్న పాటల్లో చాలామటుకు నాకు తెలియవు కనక రాగాల పేర్లు చెప్పలేను. ఎటొచ్చీ ఏ మాత్రమూ పోలిక లేని రాగాల విషయంలో కనబడుతున్న వ్యాఖ్యలను చదివాక నేను వాటి సంగతి వదిలెయ్యమన్నాను. ఈమాట పాఠకులకు సాహిత్యం మీదున్న అభిమానం, ప్రవేశం సంగీతంలో కనబడటంలేదు కనకనే నేనలా చెప్పాను.
ఓపిక ఉన్నప్పుడు ఈమాటలో ఒక సంగీతపు విభాగాన్ని మొదలుపెట్టవచ్చునేమో ఆలోచించాలి. నిజమైన సంగీతాభిమానులెవరూ సాహిత్యపత్రికల జోలికి రాకపోవడం కూడా బాధాకరమే. రాగాలనూ, స్వరాలనూ గుర్తించే పద్ధతుల గురించి నేను గత వ్యాసాల్లో కొంత ప్రస్తావించాను కాని మనవాళ్ళకు సాహిత్యం లేని సంగీతం ఒకంతట అర్థం అవుతున్నట్టుగా అనిపించలేదు. పాట గురించి రాయగానే సాహిత్యం గురించిన చర్చ మొదలవుతుంది.
పబ్లిక్‌గా కాకపోయినా వ్యక్తిగతంగా నాకు ఎవరైనా సందేహాలు పంపితే నాకు తెలిసినంతవరకూ వాటికి సమాధానాలివ్వగలను.

04/21/2010 12:58 pm
“కవులు తమకు వెన్నెముక ఉందని వానపాములకూ తమకు భేదం ఉందని నిరూపించుకునే తరుణం ఆసన్నమయింది.”
పద్యాలొదిలేసి, పదకొండు లైన్ల సత్యనారాయణగారి అభిప్రాయానికి యాభైలైన్లకు మించిన భూషణ్ గారి స్పందన ఆశ్చర్యం విస్మయం కలిగించింది.
అసలు కవులంటే నాకు భయం. కవులు కూడా నిరూపించుకోవడం మొదలుపెడితే ఇంకా భయం.కవి వర్ణనలంటేనే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఉపమానాలు,అతిశయోక్తులు,అలంకారాలు వగైరా. ఇక వాటితో కవులు నిరూపణలు సైతం మొదలుపెడితే కవితాసౌందర్యం మాటేమో కాని, వాస్తవాలు నిజాలు హుష్ కాకి అని చచ్చేంత భయం. అయినా కవులను ఆదరిస్తున్నారంటే తెలుగువాళ్ళు ఎంత మంచివారో లేక ఎంతటి అమాయకులో!
======
విధేయుడు
_Srinivas
చాలా చాలా బావుందండీ రచన.అయితే 10 వ రిఫరెన్సుగా -టిటిడి వారి ప్రచురణ ‘శ్రీ జయదేవ కవి కృత గీత గోవింద కావ్యము’ (2000 ) కూడా చేర్చ దగ్గదే.డాక్టరూ,చిత్రకారుడూ అయిన చెలికాని మురళీ కృష్ణా రావు ఇందులో 24 అష్ట పదులకి చక్కని బొమ్మలు గీసారు. అసలు గంటకో అష్టపది చొప్పున ఎవరైనా పాడి గిన్నీస్ రికార్డుకి ఎక్క వచ్చునేమో! ఇక-టంగుటూరి సూర్య కుమారి గారు పాడిన ‘సా విరహే’ యమన్ కళ్యాణ్ రాగమా? కాదేమో? పీలూ అనిపిస్తోంది. రమతే యమునా(ఘంటసాల), అజహున్ న ఆయే బాల్మా(రఫీ, సుమన్),మాధవా మాధవా నను లాలించరా (సుశీల,ఘంటసాల)-ఒక్కొక్కటీ గుర్తుకొస్తున్నాయి. సాలూరు వారు స్వర పరిచిన జయ దేవ అష్ట పదులు (సినిమాలోనివీ , ఆ తరువాత సుశీల గారి చేత పాడించిన లలిత లవంగ, నాథ హరే-లు) మొత్తం దేశమంతటా తెలియాలి. పద్మా సుబ్రహ్మణ్యం పాడినా ఏదో లోపం ఉంది. గానం- మళయాళ చిత్రంలో దక్షిణా మూర్తి బాల మురళి గారి చేత ‘యా రమితా వన మాలినా ‘ భలే అద్భుతంగా పాడించారు. కన్నడ ‘హంస గీతె’ చిత్రంలో ఉన్న అష్ట పదులన్నిటినీ టి జి లింగప్ప స్వర పరిచారు. వాటిని బాల మురళి ఆలపించారు. ‘నిజగాద సా యదునందనే’ మొదలైనవి బాల మురళి పాడిన సినియేతర అష్టపదులు. తెనాలి రామ కృష్ణ లో విశ్వనాథన్-రామమూర్తి స్వర సంపద -‘చందన చర్చిత’ , స్వర్ణ కమలంలో ఒరియా వారైన అక్షయ మహంతీ ట్యూన్ కట్టగా తృప్తి దాస్ పాడిన ‘సఖీ హి కేశి మథన’ -ఇవన్నీ నిజంగానే ‘ఇష్ట పదులు’. అష్ట పదులకి నాట్య గౌరవం తెప్పించినది -సదా స్మరణీయుడు కేలూ చరణ్, ఆయన కుటుంబం –ఇలా చెప్పుకుంటూ పోతే 24 అష్ట పదుల కాలమవ్వొచ్చు.
మీ రచనలో సహోదరులు – దాని పైన వివరణ ముచ్చటగా ఉన్నాయి. సినిమా బండి వాడు ‘సోదర సోదరీ మణులారా- నేడే చూడండి మీ అభిమాన ధియేటర్ జ్యోతిలో’ అన్నా ఈ బహు వచన బెడదే! , ఆత్మ గౌరవంలో ఆరుద్ర ‘ఓ సోదర సోదరీ మణులారా– అని బహు వచనం ప్రయోగించి ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ అని ఏక వచనంలో పల్లవి కూర్చారు. బహుశః ఓ సోదరా, ఓ సోదరీ మణీ అని ఒక్కో ఏక వచనంగా విరుచుకోవాలేమో?
సత్యనారాయణగారు, శ్రీనివాసుగారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఉత్తరాలు నా పద్యాలలోనే ఉన్నవి. నేను సిసలైన తెలంగానావాడినే ఐనా ముమ్మాటికి త్రికరణశుద్ధిగా సమైక్యవాదినే కాని వేర్పాటు ప్రతిపాదకుని కాను. వారి భావాలతో ఏకీభవించవలసిన అవసరం నాకు లేదు. వారి కెంత వాక్స్వాతంత్ర్య మున్నదో నా అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు,ఇట్టి వ్యక్తీకరణద్వారా వీలైన కొందరి మనసులు వేర్పాటు ధోరణినుండి మళ్లించుటకు నాకు అధికారము, పైపెచ్చు బాధ్యతా ఉన్నాయని నా అభిప్రాయము.
సాధారణంగా పుస్తకం అచ్చు వేసేటప్పుడు చిట్టచివర ముందుమాట రాస్తారు. ఈ పుస్తకంలో కథలన్నీ 2000 కి ముందు వచ్చిన కథలనే ప్రచురించామని చెప్పారు.
కానీ ఈ పుస్తకానికి ముందుమాటే చాలా ముందుగా తయారయ్యిందన్న అనుమానం కలుగుతుంది.
అమెరికా రచయితల మంచికథలూ అంటూ పధ్నాలుగో పేజీలో కొన్ని కధల పేర్లు ఉటంకించారు. ఆ కథలన్నీ 2000 తరువాత రాసినవే! ఉదాహరణకి విదేశ గమనే విద్యా పరాదేవతా కథ” అయిదేళ్ళక్రితమే అచ్చయ్యింది. ఈ కథ ఈ సంకలనంలో లేదు.
పుస్తకంలో ప్రచురించిన కథల గురించి కాకుండా వారికి తెలుసున్న కథల పేర్లు నొక్కి వక్కాణించడం ఆశ్చర్యం కలిగించింది. కధలన్నీ చదివి ముందుమాట రాసినట్లుగా ఇది చదివితే అనిపించదు.
ఆఖరి పేజీల్లో పాఠకుల సౌకర్యార్థం ఇండియా రచయితల మంచి కథల లిస్టు కూడా ఇచ్చారు. అవన్నీ మంచి కథలు కావన్నది నా వుద్దేశ్యం కాదు. కానీ రాస్తున్న సందర్భం అమెరికా కథ గురించి. అది తప్ప మొత్తం కథా ప్రపంచమంతా ఇరికించారు.
పది తరాలకి పనికొచ్చే గ్రంధాలు చేస్తున్నామనుకునేటప్పుడు మొదటి పేజీల్లోనే ఇలాంటివి రాకుండా శ్రద్ధ చూపాల్సింది.
నేను ఇంతకు ముందు రాసిన కామెంటు చూసి నన్ను హేళన చేస్తూ, ఓ పెద్దాయన ఈ-మెయిలు పంపారు. నేను వ్యక్తిగతంగా ఎవర్నీ దూషించలేదు. నిందించ లేదు. పుస్తకం బాగోగులు మాత్రమే చెప్పాను. గమనించగలరు.
రసతంత్రులను మీటి సర్వాత్మాన పాత్రలొ లీనమై సభ్య సమాజాన్ని దాటిపోని రచన ఉత్తమరచన అనిపించుకుంటుంది. ద్రౌపది నవలలో ఈ ఉత్తమరచనకు ఆస్కారము లేదని విమర్శించినవారిది కుసంస్కారమనే వారికి నమస్కరించడము తప్ప చేయగలిగిందేమీలేదు. డా.వెన్నావల్లభరావు మొదలైన 19మంది రచయితలు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ద్వారా సంయుక్త ప్రకటనలొ ఇది దుష్టసంప్రదాయమని భావప్రకటన స్వేచ్చను అవహేళన చేశారు.
రచయిత సమర్థతను,అంతరంగభావాలను మనోహరంగావెల్లడించిన ద్రౌపదికి… యార్లగడ్డ శైలిపట్ల విరుచుకుపడే ప్రయత్నము కోసము రచయితలెవరూ కంకణము కట్టుకోలేదు. మరోనవల సత్యభామను రాయకుండా అడ్దుకునే ప్రయత్నమూ చేయలేదు. “రామాయణ కల్పవృక్షము” జ్ఞానపీఠము నెక్కింది. హేతు దృక్పధంతొ,అవ్యక్త అంతరంగభావనతో మానసిక విశ్లేషణ దృష్టితొ, స్త్రీవాద దృక్కోణంతో, రామాయణ విషవృక్ష రచన కూడ చదివి ఆనందించినవారున్నారు. పవిత్రతకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి దుయ్యబట్టిన వారున్నారు. ఆ నవల చదివి రామాయణ కల్పవృక్షమును జ్ఞానపీఠమునుండి దింపేయాలన్న సంయుక్త విమర్శలు రాలెదు.
ద్రౌపది మహారాణి. తన్నోడినన్నోడెనాలేక నన్నోడితన్నోడెనా అన్న ప్రశ్నకు గుడ్డి దృతరాష్ట్రుడు కూడ చలించాడు కనుకనె పుత్ర వ్యామోహాన్ని విడిచి ద్రౌపది మహారాజ్నీత్వాన్ని ఉత్తమ కోడలివని అభినందించి తిరిగి ఇచ్చేశాడు. మరి తిరిగి జూదమాడి అడవులు పట్టిపోయిన పాండవులకు రాజ్యమెక్కడిది? అందుచేతనె కుంతి హస్తినలొ ఆగిపొయి రాజ్యభాగ సమస్యను సజీవంగా నిలిపే ప్రయత్నము చేసింది. పాండవులమీది ద్వేషము తప్ప దుర్యోధనుడిది దుష్ట పరిపాలన అనేపిర్యాదు భారతంలో కనబడదు.
రాజ్యభాగము ఇస్తే మంచిది అన్నారుకాని …ఇవ్వకపొతే అంటూ పాండవుల తరపున కురుగురు వృద్ధులెవరూ ఆకారణంచేత దుర్యొధనుని విడిచి పెట్టకపోవడము గమనార్హము. కాని పాంచాలికి జరిగిన పరాభవము ద్రౌపది ప్రశ్నలొ వెన్నాడి ఆ మహాఇల్లాలికి మహారాణిత్వము సిద్దించాలని కర్ణుడితొసహా మన:స్ఫూర్తిగ యుద్దము చేయలేక నేలకొరిగారు. భీముడంతటి భర్త ప్రతిజ్ఞలు మర్చిపోయాడు. ఒక ఆడదానికి జరిగిన పరాభవము ఏయుగములోను జరగకూడదని ఆశించి భర్తల కనుసన్నలలొ ఉండి గొప్పయుద్దము జరిపించి పుత్ర విహీనయై కూడ అపాండవము కోరుకున్న అశ్వథ్థామను క్షమించి మహారాణీత్వాన్ని చాటుకుంది. ఆ మహారాణిలొని నవలా నాయికలక్షణాలు “‘కొత్త అవిష్కరణగ” రచించిన యార్లగడ్డ రచన అభినందనీయము. అంతేతప్ప సాహిత్య అకాడమీ అవార్డు నిబంధనలకు తగినట్లు లేదన్న వారు ద్వేషంతొ పనిగట్టుకుని విమర్శించి రచ్చకీడ్చారన్న ధోరణితొ విమర్శించేవారిని బుద్దిహీనులనడము బుద్దిగలవారు వేసుకోవలసిన ప్రశ్న. డా.జొన్నలగడ్డ మార్కండేయులు.
> 1950 -60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన
ఆ వాక్యంలో 1920 నుండి 1960 మధ్య ప్రాంతాలలో అని వుండాలి. -Sreenivas Paruchuri
Thanks to Srinivas for correcting the error. -Maddipati Krishna Rao
మన్నించాలి. ఇంకా అర్థం కాలేదు. ఏమి పొరపాటును సరిదిద్దారో కూడా తెలియలేదు.
“అసమర్థుని జీవయాత్ర” నవలలో -సీతారామారావు కాని, అతని పూర్వీకులు కాని, కోస్తాజిల్లా కమ్మ కులస్థులు అని ఎక్కడ ఉన్నది. ఏ పేజీలో ఉన్నది? ఎందుకు నేను ఈ పుస్తకంలోని పాత్రలు ఆ కులస్థులలో వచ్చిన మార్పులను గాని, వారి ప్రవర్తనలను మాత్రమే సూచిస్తునట్లుగా గాని అర్థం చేసుకోవాలి? మీకు అలా అర్థమవ్వటానికి కారణాలు ఏమిటి?
మీ వీలును బట్టి వివరించండి.
”ఇరవయ్యవ శతాబ్దములో అమెరికా తెలుగు కధానిక మరియు అమెరిక తెలుగు సాహితీ వేత్తల పరిచయ గ్రంధము” పై ఈమాట, కౌముది వెబ్ సైట్ల వారి సమీక్షలు చదివిన నాకూ కొన్ని మాటలు రాయాలనిపించింది. నేను అతిరధ మహారధ కవయిత్రుల కోవలో దాన్ని కాను.ఏదో రాయాలనిపించి రాస్తున్నాను, నేనేమైనా పొరపాటు చెప్తే మన్నించి అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను.
కధానికలు ,కవితలు వ్రాయడానికి అందరూ పండితులే కానక్కరలేదేమో ,శాస్త్రబద్ధ్హంగా ఛందస్సు, యతి ప్రాసలతొ కావ్యములల్ల గలిగిన వారూ, తేలికపాటి భాషలో తమకు తోచిన భావాలు, చూసిన సంఘటనలు, స్వానుభవాలు కొన్ని ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు పాఠకులతో పంచుకోవాలని కుతూహల పడతారు. పత్రికలకి పంపుతారు, పాఠకులతో వారి భావాలను పంచుకుంటున్నారు. అప్పుడప్పుడు కొందరికి బహుమతులు కూడా వస్తాయి వారికధలలోని చిత్ర విచిత్ర మలుపులు, సారాంశము గ్రహించి కొంతమంది వాటిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాలను సుగమ మార్గాల మలుచుకునే వీలు కలుగుతూంది. అందుచేత వీలయితే చెయ్యగలిగితే ప్రోత్సహించాలి, వారిని ప్రోత్సహించి వెలుగులోనికి తెచ్చి మహాత్తరకార్యముల చేయువారి చిన్నతప్పులు వుంటే చెప్పవచ్చు కాని మరీ అంత దుయ్యబట్టడము సమంజసము కాదని నాభిప్రాయము. నేటి మహా,మహా కవులు కవయిత్రులూ ఒకనాడు ఓనమాలతో మొదలెట్టినవారే.
అమెరికా, అయినా ఆముదాలవలసైనా, ఆంద్ర ప్రదేశైనా అలవాట్లు , ఆచార వ్యవహారాలూ మారిన ప్రతీ మనిషికీ కష్ట సుఖాలు, మనోభావాలు ఒకే తీరున వుంటాయి. ఏ సంఘటన కధగా మలచినా చదవడానికి బాగానే
కాలక్షేపమవుతుంది. ఇంకొక విషయము – వంగూరి ఫౌండేషన్స్ వారు ఎన్నో శ్రమలకోర్చి ఒక్కోసారి కుటుంబ భాద్యతలను కూడా విస్మరించి సంవత్సరాల తరబడి కావ్య సీమకు చేస్తున్న సేవాకార్యక్రమాలు అపురూపం. ఈ గ్రంధప్రచురణకు వచ్చిన కధలను ఎందఱో ఎడిటోరియల్ కమిటి వారు రాత్రింబగళ్ళు శ్రమించి సమీక్షించి ఈ గ్రంధానికి రూపు దిద్ది 2010లో మరొక పుస్తక ప్రచురణ సన్నాహాల వేళ, అంతటి భుహత్తర కార్యం సాధించడము సామాన్యముకాదు. అయినా ఒక మ౦చి కార్యము చేసినప్పుడు కొన్ని ఘాటైన విమర్సలూ ఎదురు దెబ్బలూ ఎదుర్కోక తప్పదు. అయినా ధీరో దాత్తు లెవరూ విమర్శలకు లొంగి భ్రుహత్కార్యముల వీడి వెనుదిరగరు. అన్ని శ్రమలూ విమర్శలూ ఎదుర్కొని ఈ పధకాన్ని అమలు చేస్తున్న చిట్టెన్ రాజు గారికి అభినందనలు. నిజంగా కిరణ్ ప్రభ గారు పేర్కొన్నట్టు ఈ గ్రంధము తరతరాలకు పదిల పరచవలసిన గ్రంధము.
తప్పులున్న మన్నించగలరు.
కామేశ్వరి భమిడిపాటి
ఛందోధర్మము గురించి Geddapu Lakshmi Prasad గారి అభిప్రాయం:
03/24/2010 8:10 am
అభిప్రాయాలన్నీ చదివాను.సవినయంగా ఒక విషయం చెప్పాలనిపించి చెప్పే ధైర్యం చేస్తున్నాను. మనం ఎన్ననుకున్నా ఏమనుకొన్నా ఒకటి మాత్రం నిజం. మనకి నచ్చింది మంచిది. మనం దక్కించుకోలేనిది మనకు దక్కంది చెడ్డది. మన అర్హతనిబట్టి మన మనస్తత్త్వాన్ని బట్టి మనకు అర్ఠం అయ్యేది మంచిది, అర్థం కానిదీ అర్థం చేసుకోలేనిదీ చెడ్డది. ఇది మంచి, ఇది చెడు అనేవి సార్వజనీనాలూ కావు, సార్వకాలికాలూ కావు.అయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా వ్యక్తులు తమ మానసిక పరిపక్వతా స్థాయులను బట్టి, వివిధాంశాలను దర్శించి వాటిని స్వాభిప్రాయనుగుణమూల్యాంకణం (value judgement) చేస్తారు. అన్నిటినీ ఆయా కోణాల్లోనే దర్శించి ఆస్వాదించే వారు ధన్యులు. ఇతరులు అన్యులు.
“మద్దిపాటి కృష్ణారావు నవల నేపథ్యం గురించి నాకు చెప్పారు. 1950 -60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన – లోకజ్ఞానం తో సమన్వయం లేని ఆదర్శాలూ, కొత్తగా వచ్చిన భేషజాలు, బ్రాహ్మినైజేషన్ ఆఫ్ కమ్మా కేస్ట్ లాంటివి – మార్పులను సీతారామారావు తాత తండ్రుల ప్రవర్తన ఎలా పట్టుకోగలిగిందో కూడా చెప్పారు.” -మాధవ్ మాచవరం.
మద్దిపాటి కృష్ణారావు మీకు చెప్పిన ఆ విషయాలేమిటో మాక్కూడా చెపుతారా. మీరు గాని, మద్దిపాటి గాని, పైన దశాబ్దం ఇవ్వటంలో పొరపడ్డారా? లేక వారు ఉద్దేశించిన దశాబ్దమదేనా?
ఎందుకంటే;
నవలలో -సీతారామారావు, అతని తాత తండ్రుల జనన మరణ తేదీల్లేవు. వారి ఫేమిలీ మెడికల్ హిస్టరీ రచయిత చెప్పకపోతే పోయే, 🙂 రామయ్య తాత కూడా చెప్పలేదు. కాని ఈ నవల గురించి కొంత, నవల రచనాకాలం 1945-1946 అని నవల వెనకఅట్ట మీద చెప్పబడింది. నవలా రచయిత గోపీచంద్ 1910లో పుట్టి, 1962లో మరణించినట్లు వెనకఅట్ట మీద చెప్పబడింది.
సీతారామారావు అసమర్థుడో, ఉన్మాదియో, రెండూ కాడో;
“ఏది ఏమైనా, తుది తీర్పు ……”నా?:-)
లైలా
PS:
Articles by Madhav Machavaram and Krishna Rao MaddipaTi – both are interesting to me.
“Head Case – Can Psychiatry be a science?” – By Louis Menand ( The New Yorker, March 1, 2010) too, is an interesting article.
బాలవ్యాకరణములో తత్సమ పరిచ్ఛేదములో 45వ సూత్రము – ఇత్తునకు బహువచనంబు పరంబగునపుడు డుత్వంబగు. దానికి ఇచ్చిన ఉదాహరణలు: హరులు – గిరులు – కవులు – రవులు – యామినులు – భామినులు . కాని పదము ఈ-కారముతో అంతమయినయెడల దీర్ఘంబున కుత్వంబు లేదు. ఉదా: శ్రీ – శ్రీలు, స్త్రీ – స్త్రీలు. మీరు చెప్పిన మణి పదము కూడా ఇ-కారాంతమే. కాని సహోదరికి ఒక శ్రేష్ఠత్వాన్ని ఇచ్చే పదము అది. నేను మొట్టమొదట సహోదరీమణులు అని వాడాలని అనుకొన్నా, సహోదరులు అనే పదమే సరియైనదని భావించి దానిని వాడాను. ఈ పదము కూడా భామినిలాటి పదమే. మీ ప్రశ్నకు సమాధానము పై సూత్రములో ఉన్నది. విధేయుడు – మోహన
మీ “సా విరహే తవ దీనా” వ్యాసం చాలా బాగుంది. ముఖ్యంగా వివిధ గాయక గాయకీ మణులు పాడిన పాటలను ఒక చోట చేర్చిన మీ కృషి అభినందనీయం. కాని ఒక చిన్న అచ్చుతప్పు దొర్లింది. బాంబే సోదరీమణుల అనడానికి బదులు బాంబే సహోదరుల అని అచ్చయింది.
నేను ఒక సాహిత్యాభిమానిని.ఎంత కాలమో ఈ అన్వేషణ ఇలాంటి వెబ్ సైట్ కోసం అనుకున్నాను .కాని చాల అ తొందరగా లభించింది.నేను ఇలాంటి సుందర వర్ణణాతితమైన కవితల కోసం ఎదురుచూస్తున్నాను.
వాన గురించి వర్ణన ఒక వింతగా అనిపించింది.చాలా చక్కటి వర్ణనలతో వర్ణించారు.
విషయం సరళంగా క్లుప్తంగా సోదాహరణంగా చెప్పుకోవలసిన అవసరం వుంది కానీ చాలా అడ్డంకులున్నాయి. వొక్క మాటలో చెప్పాలంటే – క్లిష్టమైన విషయాన్ని చెప్పటానికి కావలసిన వాడుక భాష లేదు. వాడుకగా క్లిష్టమయిన విషయాలను వోపికగా చర్చించే సంప్రదాయం మనం పోగొట్టుకున్నాము. దాని స్థానంలో మాయాబజారు సినిమాలో రాక్షస గురువు బోధించిన అస్మదీయులా తస్మదీయులా అన్న వొక్క విషయం తేల్చుకుంటే సరిపోతుందనే సిద్ధాంతం మనలో చాలా మందిమి ఫాలో అవుతున్నాము. మహా అయితే పవర్ పాయింటు బుల్లెట్ల రూపంలో విషయం అర్ధం చేసుకుంటాము. దాని నించి బయట పడి కొత్త సాంప్రదాయాలను నిర్మించుకోవటం ఒక్కరితో, ఒక్క రోజులో అయ్యే పని కాదు.
అయినా ప్రయత్నం చేయవచ్చును కానీ, నా వుద్దేశ్యం పూర్తి స్థాయి వ్యాసం వ్రాయటం కాదు. వేలూరు గారు వ్రాసిన వ్యాసం మీద ఆలోచించ వలసిన కొన్ని విషయాలను హైలైట్ చెయ్యటమే కాబట్టి, పెద్దగా టైమ్ వెచ్చించకుండా రాసేశాను.
తెలుగు డయాస్పోరా జీవితాన్ని అర్ధం చేసుకోవాలంటే – తెలుగు భాష మాట్లాడే వాళ్లంతా ఒక జాతికి చెందిన వారు అన్న అభిప్రాయం ఎక్కడినించి వచ్చింది – అన్న దగ్గర మొదలు పెట్టుకోవచ్చును అని అన్నాను నేను. దీనికి సమాధానం చెప్పడం చరిత్రలు రాసే వాళ్ళూ, సాహిత్య విమర్శలు వ్రాసే వారూ చేయ వలసిన పని. విశాలాంధ్ర రాష్ట్రావతరణకి అటూ ఇటూగా జరిగిన సామాజిక చరిత్ర గురించి కథలు ఎవరూ రాయలేదు. పాటలూ పద్యాలూ రాసినట్టు కనపడుతోంది. అవి కూడా వాద ప్రతివాదాల్లో ప్రత్యర్ధులని అవహేళన చేయటానికి మాత్రమే. ఆ సమయానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ ఇప్పుడు జరుగుతున్నా , అస్మదీయులూ తస్మదీయులూ అన్న ప్రశ్నకి అతీతంగా మాట్లాడే వారు వేళ్లమీద లెక్కించడానికి కూడా ఎవరూ లేరు. ఇదంతా తెలుగు భాష గురించి ఆలోచించే వాళ్ళు భాషనీ దాని వుపయోగాలనీ చాలా ఇరుకుగా అర్ధం చేసుకోవటం వలన వచ్చి పడిన నష్టం అని నాకనిపిస్తుంది. ఈ సందర్భంలో సాహిత్య పరంగా నిర్మాణాత్మకమైన పని చేయవలసిన అవసరం ఎంతో వున్నా చేయగలిగిన మనుషులు ప్రస్తుతానికి లేరు. అటువంటి మనుషులు రావటానికి కావలసిన మార్గాలు ఏర్పాటు చేయవలసిన పని ఈ రోజున పాఠకుల బాధ్యతే (పాఠకులు కాకుండా ఎవరూ రచయితలు కాలేరు కాబట్టి – రచయితలను ఇందులోంచి వదిలెస్తున్నాననుకోనవసరమ్ లేదు. చెప్పొచ్చిందేమంటే, క్రిటికల్ రీడింగ్ స్కిల్స్ వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళలో చాలా తక్కువ వుంటారు అని. )
నేను మొదటిసారి రాసినప్పుడు వుదాహరణలు చెప్పకపోవటానికి ఇదీ ఒక కారణమే. సరళంగా, వుదాహరణలతో వున్న వ్యాసాలు చదవటం అలవాటయిపోయిన చాలా మంది చదువరులు ఇన్స్టంట్ జడ్జ్ మెంటులకి అలవాటు పడి పోయారు. చదివిన తరువాత కొంచెం ఆలోచించి చదివిన దాన్ని స్వంతం చేసుకునే ఓపిక ఎవరికీ లేక పోవటంతో — వుదాహరణల మీదే దృష్టి కేంద్రితమైపోయి రెడీ మేడ్ అభిప్రాయాలతో టేబుల్ టెన్నిస్ ఆట మొదలవుతుంది. అది జరగకుండా ఎట్లా రాయాలి అన్నది నాకూ తెలియదు.
వుదాహరణకి – సిద్ధాంతాన్ని సృజనలోకి యధా తధంగా తీసుకు రాకూడదు అన్న మీ అభిప్రాయమే తీసుకుందాము. నిజానికి మీరు మంచి కథల్లో లెక్క వేసిన కాళీపట్నం రామారావు గారు యజ్ఞం కథలో చేసినది – ఒక మార్క్సిస్టు సిద్ధాంతాన్ని యధా తధంగా కథ రూపంలో చెప్పటమే. కథకుడిగా ఆయనకి వున్న నైపుణ్యం వల్లనా, పాఠకులలో ఆ సిద్ధాంతమేమిటో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది వుండటం వల్లనా ఆ విషయం ఎవరికీ తెలియక పోయి వుండవచ్చు. ప్రీమిటివ్ అక్యూములేషన్ – అంటే ఫ్యూడల్ సంబంధాల ద్వారా పోగు పడిన వ్యవసాయరంగంలోని మిగులు ధనం పెట్టుబడిగా మారే క్రమం – అందులో మన స్థల కాల పరిస్థితులలో ఏ భావజాలాలు ఏ పాత్ర వహిస్తున్నాయి – ఎక్కడ నించి మొదలు పెట్టుకుంటే ఈ క్రమాన్ని విరగకొట్ట వచ్చును అన్న ఆలోచన ఆ కధ రాసే నాటికి – సీపీయెమ్ పార్టీలో నాయకత్వానికీ కార్యకర్తలకీ మధ్య తీవ్ర వైరుధ్యాలకి దారి తీసింది. రామారావు గారు – ఆ వైరుధ్యాలలో ఒక పక్షం వహించి – ఆ సిద్ధాంతానికి కధ రూపం ఇచ్చారు. కాబట్టే, ఆ కధకి పెద్ద యోగ్యతా పత్రం ఇచ్చింది కథకులో సాహిత్య విమర్శకులో కాదు. ఆ పని చేసినది ఆ సిద్ధాంతాలను బలంగా నమ్మిన ఆర్ధిక శాస్త్రవేత్త – ఆర్ ఎస్ రావు గారు. అంటే – కధ వెనకాతల పరిణతి చెందుతున్న ఒక రాజకీయ లక్ష్యమూ, ఒక తాత్విక దృక్పధము వున్నాయి. మొగ్గ తొడుగుతున్న మావోయిస్టు సిద్ధాంతం వుంది (అది పుబ్బలో మాడి పోయిందన్నది వేరే విషయం).
ఈ కధ గురించి, కధకుడి గురించి తెలుసుకోవలసిన విషయం మరొకటుంది. రామారావు గారు, ఈ కధ వ్రాసిన తరువాత ఇరవయ్యేళ్లు పైగా మళ్ళీ ఒక్క కధ కూడా రాయలేదు. ఆ వ్యవధిలో ఆయన వ్రాసిన వాటిలో చెప్పుకోదగ్గదేమయినా వుంటే , అది – ‘నేనేందుకు వ్రాయటం లేదు’ అన్న వ్యాసమే. అందులో కూడా ఆయన ఏవో వ్యక్తిగతమైన కారణాలు చెప్తారే కానీ నమ్మదగిన కారణమేమీ స్పష్టంగా చెప్పరు. ఇరవయ్యేళ్ళ తరువాత, మావోయిస్టు వుద్యమంలో మళ్ళీ నాయకత్వం- కార్యకర్తల మధ్య వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయని అనిపిస్తున్న రోజుల్లో ‘సంకల్పం’ అనే కధ రాశారు. ఈ కధకి సన్నివేశం ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెద్దరికం చేతులు మారటం. యజ్ఞమ్ కధ సిద్ధాంతాన్ని కధలోకి అనువదిస్తే, సంకల్పం కుటుంబంలో జరిగే ఘర్షణలో ఒక వ్యక్తి సమాధాన పడిన తీరు చెప్పటం ద్వారా వుద్యమంలో వస్తున్న ఘర్షణకి పరిష్కారం సూచిస్తుంది. యజ్ఞమ్ కధకి వచ్చినంత ప్రాచుర్యం సంకల్పానికి రాలేదంటే దానికి కారణమేమిటో మనకి వివరించి చెప్పిన వారెవరూ లేరు.
ఈ రెండు కధల మధ్య వ్యవధిలో — యజ్ఞమ్ లాంటి కధలు చాలా వచ్చాయి కానీ, అదే పరిణతి చెందిన రాజకీయ లక్ష్యం, తాత్విక చింతనతో వ్రాసిన కధ గా చెప్పుకోదగినది — అల్లం రాజయ్య వ్రాసిన ‘మనిషిలోపలి విధ్వంసం’. యజ్ఞమ్ లో లాగానే — ‘మనిషి లోపలి విధ్వంసం’లో కూడా వస్తువు – తండ్రి కొడుకుల మధ్య సంబంధం. వేయి తలల రాక్కసిగా ఎదిగి పోయిన ప్రీమిటివ్ ఎక్యూమూలేషన్ — మనిషి పరాయీకరణకి సమాధానం చెప్పలేని వుద్యమ నేపధ్యం – ఇవీ ఈ కధకుఉన్న రాజకీయ తాత్విక నేపథ్యాలు. యజ్ఞమ్, మనిషి లోపలి విధ్వంసం – ఈ రెండు కథలలో మొదటిది తెలుగు కథా సాహిత్యగమనంలో ఒక అంకానికి తెర తీస్తే రెండోది తెర వేయటంగా అర్థం చేసుకోవచ్చును. ఈ మధ్యలో తెలుగు కధా సాహిత్యంలో చిన్న చిన్న అంతర్నాటకాలు చాలానే జరిగాయి. యండమూరి వీరేంద్రనాథ్ అనే ఒక కామిక్ రిలీఫ్ చాలా సంవత్సరాల పాటు సాగింది. అది అటు సాగుతుండగానే, యజ్ఞమ్ లాటి కథలని ఫార్ములాగా తీసుకుని రాసేసిన సాహిత్యం ఒక పక్కన సాగింది. మధ్యలో కొన్ని సంవత్సరాలు బాలగోపాల్ సాహిత్య విమర్శ చేసినా — పౌరహక్కుల కార్యకర్తగా ఆయన పేరు పడిపోవటం వలన ఆయన రచనల్లో వున్న సాంస్కృతిక విమర్శని ఎవరూ పట్టించుకోలేదు.(ఎవరూ పట్టించుకోలేదు అంటే లిస్టు చెప్పుకోవాలంటే — ముఖ్యంగా విప్లవ రచయితల సంఘం వారే పట్టించుకోలేదు అని చెప్పుకోవాలి). ఆ ఇరవై ఇరవయ్యయిదు సంవత్సరాలలో విరసం సాహిత్యానికి రాజకీయానికి మధ్యన వుండే సున్నితమయిన సంబంధాన్ని మొరటుగా బండగా ట్రీట్ చేసి పెద్ద నేరమే చేసినట్టు కనపడుతోంది కానీ ఇదమిత్థంగా తేల్చి చెప్పిన వాళ్లెవరూ వున్నట్లు కనపడదు.
జరిగిన చరిత్ర గురించి రాయవలసిన కథలు ఎందుకు రాయబడలేదు అన్నది ఒక కీలకమైన ప్రశ్న అయితే ప్రస్తుతానికి పైన చెప్పిన మూడు కథలూ – యజ్ఞమ్, సంకల్పం, మనిషిలోపలి విధ్వంసం — గ్రామీణ వాతావరణం లోనే చెప్పబడ్డాయి అనిన్నూ, మొదట కాళీపట్నం రామారావు గారు, తరువాత అల్లం రాజయ్య కథకులుగా విజయవంతులు కావటానికి వెనక – రచయితలను సోషలైజ్ చేసే సామాజిక నిర్మాణాలు వున్నాయి అనిన్నూ గుర్తు పెట్టుకుంటే, ఆ ప్రశ్నకి సమాధానాలు మళ్ళీ ఎప్పుడయినా వివరంగా చెప్పుకోవచ్చును.
ఇక పోతే, తెలుగు కథల్లో గ్రామీణ వాతావరణం వాసనలు పోక పోవటానికి పెద్ద కారణం – విశాలాంధ్ర రాష్ట్రావతరణ తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో నిజానికి నగర జీవితం – నగర సంస్కృతీ పెద్దగా ఎవరికీ అనుభవం లోకి రాక పోవటమే అని నాకనిపిస్తుంది. కాలాతీత వ్యక్తులు, హిమజ్వాల ఇలా ఒ కటో రెండో తప్ప ఎవరూ ఆంధ్ర ప్రదేశ్ లోని నగర జీవితాన్ని తరచి చూసిన వారు లేక పోవటానికి కారణం రచయితల్లో వ్యక్తిగతంగా వూహా శక్తి లోపించటమే అంటే నేను నమ్మలేను. నగర జీవితాన్ని తరచి చూసి కధలు నవలలూ రాయటానికి కావలసిన సామాజిక సందర్భం లేక పోవటం కూడా వొక పెద్ద కారణం. అటువంటి సందర్భాన్ని నిర్మించుకోవటానికి కావలసిన సరంజామా రెండవ ప్రపంచ యుద్ధానికి అటూ ఇటూగా కొడవటిగంటి కుటుంబ రావు గారి సృష్టించిన సాహిత్యంలో పుష్కలంగా వున్నప్పటికీ, ఎవరూ ప్రయత్నం చేయక పోవటానికి కారణం పాఠకులు లేక పోవటమేనని కూడా నేనంటాను.
సినిమా నిర్మాణం హైదరాబాదుకి వచ్చిన తర్వాత పైకి నగరంలాగా ఎంత కనపడినా, హైదరాబాదు లో సామాజిక జీవితం పూర్తిగా గ్రామీణ జీవితానికి ఒక ఎక్స్ టెన్షన్ మాత్రమే. హైదరాబాదులో పేరున్న రచయితలెవరూ కూడా ఈ నగరంతో చాలా కాలంగా సజీవ సంబంధాలున్న వారు కాదు. ఇందులో తెలుగు భాష ప్రాంతీయతా పలుకుబళ్ళకి సంబంధించిన రాజకీయాలు చాలా ప్రముఖ పాత్రే వహించాయి.. హైదరాబాదులో వుండి రచయితలము అని చెప్పుకునే వాళ్ళలో ఎంత మందికి వాళ్ల వార్డు కార్పొరేటర్ మొహమయినా తెలిసి వుంటుందా, హైదరాబాదులో వాళ్ళు వుండే ప్రాంతం పేరు ఒక పాతిక సంవత్సరాల క్రితం ఏమయి వుంటుందో, ఆ పక్కనే వున్న గుడిలో దేవత పేరయినా తెలుస్తుందా అని ఆలోచిస్తే సమాధానం తేలికగా దొరకదు. అంటే వొక రకంగా చెప్పాలంటే – డయాస్పోరా జీవితం గురించి వేలూరు గారు చెప్పిన అంశాలలో ముఖ్యమైనవి – హైదరాబాదులో వున్న తెలుగు వారికి కూడా వర్తిస్తాయి.
నగర జీవితాన్ని పూర్తి గా వంట పట్టించుకుని రాసిన రచయితగా కనపడేది – కుప్పిలి పద్మ వొక్కతే. అది కూడా , వస్తువు, సన్నివేశమూ ఒక యువతి అంతరంగానికి మాత్రమే పరిమితమయి వుండటంతో ఎంతో ముందుకు పోలేక ఆగి పోయింది. అక్కడినించి ముందుకు వెళ్ళటానికి దారి చూపించే తాత్విక దృక్పథమో, నిర్మాణ రూపమో ఇచ్చే బాధ్యత ఎవరిదయినట్టు?
మొత్తమ్మీద క్లుప్తంగా – పవర్ పాయింటు బుల్లెట్ల రూపంలో చెప్పుకోవాలంటే — మీరు కధలు రాయండి – మేము వొడ్డున కూచుని ఎవరు బాగా ఈత కొడుతున్నారో మార్కులేస్తాము అనే పద్ధతిలో విమర్శ సాగుతుండటం తెలుగు కథ ఈడిగిల పడటానికి ఒక పెద్ద కారణం. వూహా శక్తిని ఛాలెంజీ చేసే విమర్శకులూ, భాష్యకారులూ, దానిని పదును పెట్టే సామాజిక నిర్మాణాలు తయారు చేసుకోవటం అన్నది పాఠకులకీ , విమర్శకులకీ, రచయితలకీ ఒక ఉమ్మడి బాధ్యత.
వాల్ స్ట్రీటు లో అంతర్జాతీయ బాంకు కుప్ప కూలితే, కువైట్ ఎయిర్ పోర్టులో తారస పడ్డ పని పిల్ల తమ్ముడు నర్సీ పట్నంలో గొల్లు మంటాడు. టాంకు బండ్ మీద సాయంత్రం ఆరుగంటలకి మనమల్ని తీసుకుని వచ్చే వృద్ధ దంపతులకి అల్లుడు కొత్త సాఫ్టువేర్ నేర్చుకోకుండా టైం వేస్టు చేస్తున్నాడేమో నని అనుమానం వస్తోంది. ఆకలేస్తోందని అత్త మామలకి ఎట్లా చెప్పాలో తెలియడం లేదని అమెరికాలో వుద్యోగం చేస్తున్న మొగుడికి చెప్తే కోపం వస్తుందేమోనని కొత్త కోడలు భయ పడుతోంది. అపార్టుమెంటు కాంప్లెక్సులో పొరుగువాళ్ళ గొడవలు పట్టించుకునే పిన్ని గార్లు కూడా దొరకటం లేదు. ఆ కోడలు ఏదో ఒక రకంగా బతకడం నేర్చుకుంటోంది. లేక పోతే బుద్ధ పూర్ణిమ ఆఫీసు పక్కనించో సంజీవయ్య పార్కు మూలనించో హుసేన్ సాగర్లో దూకేస్తోంది. మూసిన తలుపుల వెనక అమెరికన్ సబర్బియాలోనూ, ఐటి కంపెనీల హెడ్ క్వార్టర్లలోనూ, హైదరాబాదు ఫిలిం నగర్లోనూ, ఋషికొండ వెనక రిసార్టు లోనూ ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. వీటన్నిటిమీదా బహిరంగంగా భాష్యం చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. బాపట్ల నించో, జనగామ నించో , సంతనూతల పాడునించో రక రకాల మనుషులు చేసే ప్రయాణాలకధలు ఎన్నయినా చెప్పవచ్చును. కానీ వినే వారిని తయారు చేసే బాధ్యత కూడా ఎవరో వొకరు తీసుకోవాలి కదా ? చెప్ప గలిగే రచయితలకి కావలసిన ధైర్యాన్ని ఇచ్చి, సోషలైజ్ చేసే నిర్మాణం ఎవరో ఒకరు చేయాలి కదా ?
వుదాహరణలు ఇస్తే ఇంకా బాగుండేదన్నారు కాబట్టి — ఒక పుస్తకం పేరు చెప్తున్నాను. “Global Bodyshopping An Indian Labour System in the Information Technology Industry”
Author : Xiang Biao Publisher: Princeton University Press. ఈ పుస్తకం చదవడానికి క్లిష్టంగా అనిపించినప్పటికీ ప్రయత్నం చేసి చదవ దగిన పుస్తకం. ఈ పుస్తకం జియాంగ్ బియావ్ మొదట పీహెచ్ డీ థీసిస్ గా వ్రాసినది. హైదరాబాదు నించి –ఒక వైపు ఐటి వుద్యోగుల సొంత వూళ్ళకీ , మరొక పక్క వాళ్ళు విదేశాలలో వాళ్ళు వుద్యోగాలు చేసుకోవటానికి వెళ్ళే వూళ్ళకీ ప్రయాణం చేస్తూ, ఈ వుద్యోగుల జీవితాలు ఎట్లా మారుతున్నాయో వివరించే పుస్తకం ఇది. నాకు తెలిసినంతలో తెలుగు వారి జీవితాలలొ 1995 తరువాత వచ్చిన మార్పులని ఈ మాత్రంగానయినా పరిశీలించిన పుస్తకం ఈ కోణం నించి పరిశీలించే పుస్తకం మరొకటి లేదు.
ఉపేంద్రగారూ!! మీ అభిప్రాయం మరికొంచెం క్లుప్తం గానూ..సరళమైన వాక్యాలతోనూ ఉండిఉంటే ఎక్కువ బాగుండేదనుకుంటున్నాను. మీరు వేసిన ప్రశ్నల ననువర్తిస్తూ కనీసం ఒకటి రెండు కధలని పేర్కొని [ప్రవాసాంధ్రులవే కానఖ్ఖరలేదు..ఇటీవలి తెలుగు కధలైనా గానీ..మీ అభిప్రాయాలకి బలాన్నిచ్చేవిధంగా ] ఉంటే మరింతవీలుగా ఉండి ఉండేది కూడా!!
పొగాకు వ్యాపారస్తుల మిగులుధనం[ surplus economy] మీడియాలో చేరి చేసిన నష్టం ఎలాంటిదో మనకి కధలు వచ్చాయా? అసలు సినిమాని నేపధ్యంగా చేసుకుని రాసినవి. ముళ్ళపూడి వెంకట రమణ, రావి కొండలరావు, ప్రసన్న కుమార్ సర్రాజు వంటి వాళ్ళు రాసిన కధలు ఉన్నా ఈ కోణం అందులో లేదనుకుంటాను. ఈ మధ్య సినిమా పెట్టుబడిలోని విధ్వంసాన్ని గురించి కూడా వచ్చిన కధలు అరుదే!!
బయటి దేశాలకి పిల్లలు వెళ్తూ అక్కడినించి రాకపోకలు తగ్గి క్రమేణా కుటుంబ సంబంధాల్లో వస్తున్న ఒంటరితనాల మీద కధలు బాగానే వచ్చినట్టున్నాయి, కానీ చప్పున అందులోంచి గుర్తుపెట్టుకోగల కధ ఏమన్నా ఉందా అంటే మాత్రం జవాబు కన్పించడంలేదు. తెలుగుదేశాన “కధ” ఇంకా గ్రామీణ వాతావరణమ్ లోంచి వస్తున్న వైనమ్ మనమ్ గుర్తించవచ్చు. ఒక మూసధోరణి లో కధలు ఉండటం ..కధానిర్మాణలో గానీ..శైలీ సంవిధానంలోగానీ చెప్పుకోతగ్గ కధ రాకపోవడమూ కూడా ఉంది. మీరు చెప్పినట్టూ ” ఉద్యమాల” ప్రభావం ఈనాటికీ తెలుగు కధ మీద బలంగానే ఉంది. సిధ్ధాంతాలు సృజనమీద యధాతధంగా వ్యక్తీకరణలోకి చొచ్చుకురాకూడదని తెలుగులో కధలు రాసే వాళ్ళు ఇంకా నమ్ముతున్నట్టు కనబడదు. అది ఒక బలమైన కారణమే తెలుగు కధలో పస చావడానికి.
ఇంక ప్రవాసాంధ్ర కధ విషయానికి వచ్చినాకూడా జీవితలో ఉన్న సంక్లిష్టత కధనలోకి రాగా నేను చూడలేదు. అందుకు కధకుల ఊహాలేమిని నెపమ్పెట్టక తప్పదు. కధరాసే వాళ్ళు ఏ పాఠకుల కోసం రాస్తున్నారూ..ఏం చెప్పాలని రాస్తున్నారూ అన్నది కూడా అంతే ముఖ్యం. కాళీపట్నమ్ రామారావుగారు “యజ్నం” లో ఆర్ధిక సంబంధాలు మనిషి జీవితాన్ని ఎంతగా విధ్వంసమ్ చేసిందీ గాఢంగా చెప్పారు. ఆ కధని మరిచిపోలేకపోవడమ్ అందువల్లనే! అలాంటి గాఢత ఉన్న కధలు అటు తర్వాతి కాలంలో అస్సలు లేవని కాదు కానీ సంఖ్యలో తక్కువ.
కన్నడిగుడైన రాజారావు తన ప్రపంచానుభవాన్ని వ్యక్తీకరించిన వైనం డయాస్పోరా సృజనకి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. జీవితాన్ని ఆయన చూసిన తీరూ..దాన్ని తన నవలల్లో చూపించినతీరూ గొప్పగా ఉంటాయి. వాళ్ళకి పేరు ఊరికే రాలేదు. అలాగే ఎ.కె.రామానుజన్ కూడా! అలాగ తెలుగులో ఎవరూ ఇవాళ్టిదాకా అమెరికానించి గానీ..లేదా ఇతర యూరోప్ దేశాలనించిగానీ మనకి కన్పించడలేదు. ఒక్క విమర్శలో మాత్రం వెల్చేరు నారాయణరావు చెప్పుకోతగ్గ కృషిచేసారు.
ఏతావాతా చెప్పేదేమంటే రాస్తున్నవాళ్ళు ఆ ప్రక్రియకి తగినవాళ్ళు కాకపోవడమో..లేదా రాయతగిన వాళ్ళు ఇంకా ఈ ప్రక్రియ వైపు చూపుతిప్పక పోవడమో జరుగుతున్నట్టు అర్ధమ్ చేసుకోవచ్చు. ఎవరెంత చెప్పుకున్నా ఒక ఇతివృత్తమ్ మీద పట్టూ ..దాని నిర్మాణపు విషయంలో సామర్ధ్యం రెండూ పుష్కలంగా లేనిదే కధలు పుట్టవు. అందువలన మీడియోకర్ రచనలే వస్తాయి. వాటిని పెద్దగా పాఠకులు గుర్తించరు. ఎన్ని సంకలనాలు రానీ గాక ఫలితమ్ ఒకటే! బహుశా ఉత్తరోత్తరా తరువాతి తరాల్లో ఇంకెవరైనా కాల్పనిక సాహిత్యం పట్ల నిజంగా శ్రధ్ధ కలిగిన వారు మంచి సృజన కల్గిన వారూ ఇందులోకి అడుగిడితే తప్ప.
రమ.
ఈ సంకలనాన్ని నేను ఇప్పట్లో చదివే అవకాశం లేదు. నేను ఈ క్రింద రాసినది కేవలం ఈ సమీక్షా వ్యాసానికి స్పందన మాత్రమే. అది కూడా, బ్లాక్ అట్లాంటిక్ , తెలుగు డయా స్పోరా, హెమింగ్వే మూడూ ఒకే వ్యాసంలో చోటుచేసుకోవటం ముచ్చటగా అనిపించినందు వల్లనే.
వెబ్ పత్రికల్లో స్థలాభావం అన్న సమస్య వుండదు కాబట్టి వెంకటేశ్వరరావు గారు కొంచెం వివరంగా చెప్పి వుండవలసిన ది . బ్లాక్ అట్లాంటిక్ పుస్తకం , ‘దేశము’ అనే భౌగోళిక ఎల్లలను దాటే జీవితానుభవాలలో ( బానిస వ్యాపారాల ద్వారా నయితేనేమి, బానిసత్వాన్నించి బయట పడటంలో నయితేనేమి), నల్లజాతీయులు పడిన ఘర్షణలో చైతన్యపు పొరలు ఎట్లా ఏర్పడ్డాయి అన్నది తవ్వి తీసే పుస్తకం. జాతి, దేశము ఈ రెండూ కూడా చరిత్ర గమనములో ఏర్పడిన శిలాజాలే తప్ప వాటికి కాలాతీతమైన వునికి ఏమీ వుండదు అన్న జ్ఞానం , బ్లాక్ అట్లాంటిక్ పుస్తకానికి వుపోద్ఘాతంగా చెప్పుకోవచ్చును. అక్కడినించి ఎత్తుకుని, పాల్ గిల్రాయ్ ఈ నల్లజాతి చైతన్యపు పార్శ్వాలను తడుముకుంటూ దాని రూపు రేఖాలను పునర్నిర్మిస్తాడు. ఇక్కడ ‘పునర్నిర్మిస్తాడు’ అన్న మాట కావాలని వాడుతున్నదే. సాంస్కృతిక విమర్శ అయినా సాహిత్య సృష్టి అయినా మనిషి చైతన్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలే — ఒక్కొక్క సారి అవి విజయవంతంగా, అందరికీ పనికొచ్చేలా జరిగితే, ఒక్కొక్క సారి ప్రయత్నం కూడా చేయకుండా విఫలమైపోతాయి.
పాల్ గిల్రాయ్ రాసిన బ్లాక్ అట్లాంటిక్ పుస్తకాన్ని కానీ, హెమింగ్వే కధల్లోనూ, జర్నలిస్టుగా నూ ఆవిష్కరించిన సత్యాలను కానీ, మనకి పనికొచ్చేలా అన్వయించుకోవాలంటే, ప్రయత్న పూర్వకంగా మనం చేయాల్సిన పని చాలా వుంది. వేంకటేశ్వర రావు గారు, చూచాయగా చెప్పి వదిలేసిన విషయాన్నే తీసుకుందాము. తెలుగు వారు అమెరికాలో వుంటున్నా ఆంధ్రలో వుంటున్నట్టే ఎందుకు కనపడతారు ? ఇది తెలుగు వారో, వారి తరఫున , తెలుగు కథలూ కవిత్వమూ రాసే వారో తమ ధోరణి కొంచెం మార్చుకుంటే మారిపోతుందా ? తెలుగు లో అమెరికా లో వస్తున్న కథలూ, ఆంధ్ర ప్రదేశ్ లో వస్తున్న కథలూ ఒకేలా వుండటానికి కారణం కేవలం వూహా శక్తి లోపించటమే మరేమైనా వుందా ?
ఇలాటి ప్రశ్నలకు తెలుగు భాష మాట్లాడే వాళ్లంతా ఒక జాతికి చెందిన వారు అన్న అభిప్రాయం ఎప్పుడూ ఎలావచ్చిందో అన్న దగ్గర మొదలు పెట్టుకోవచ్చును. ఈ తెలుగు జాతి అన్న శిలాజంలో జిల్లాల వారీగా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఏ యే సంఘర్షణల చిహ్నాలు కనిపిస్తాయి అన్నది కూడా ఆలోచించ వలసిన విషయమే. వేంకటేశ్వర రావు గారు సూచించిన కాల పరిధి లో ఆంధ్ర ప్రదేశ్ లో సాంఘిక జీవనంలో చాలా పెద్ద ఎత్తున తుఫానులు వచ్చాయి. నాగార్జున సాగర్ కట్టడంతో – గుంటూరు జిల్లా గుర్తు పట్ట రానంతగా మారిపోయింది.
కొద్ది రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లా జంగా రెడ్డి గూడెం నించి, మద్రాసు పాండీ బజారు వరకూ, గుంటూరు జిల్లా పిడుగు రాళ్లనించి హైదరాబాదు శివార్లలో ఈ మేడ్చల్, హైదరాబాదులోనే ఏ యెస్ రావు నగర్ నించి యెల్బీ నగర్ వరకూ ఇటు తిరిగి ఇటు తిరిగీ అమీర్ పేట నించి డెట్రాయిట్ వరకూ ఈ మార్పుల తాలూకా ప్రభావం కనిపిస్తుంది.(ఇక్కడ శిలాజం అన్న మాట ఇంగ్లీషులో ఫాసిల్ అన్న మాటకి తత్సమంగా వాడుతున్నట్లు అనిపించొచ్చు. సామాజిక రూపాలు పూర్తిగా ఫాసిల్స్ గా ఎప్పుడూ వుండవు. పొలం గట్ల లాగా అవి నీరు పారటానికి మార్గాలు చూపించినా ఎప్పటికప్పుడు ప్రయత్న పూర్వకంగానో అప్రయత్నంగానో మారుతూనే వుంటాయి. )
అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవన చరిత్ర వేంకటేశ్వర రావు గారు చెప్పినట్లు – అంతా కలిపి నలభై ఏళ్లు కూడా వుండదు. అమెరికాలో పంజాబీల చరిత్ర దాదాపు వంద సంవత్సరాలుంటుంది. అమెరికాలో గుజరాతీల రోజు వారీ జీవితం , వ్యాపార రంగం ద్వారా అమెరికన్ నాగరికుల రోజు వారీ జీవితంతో కలిసి వుంటుంది. బెంగాలీల సాంస్కృతిక జీవనం – అమెరికన్ యూనివర్సిటీల మేధోత్పాదనలో — ప్రత్యేకించి – లిటరేచర్ , హిస్టరీ , ఇలాటి డిపార్టుమెంట్లలో పెద్ద పాత్ర వహిస్తుంది. ఈ భాషలు మాట్లాడే వాళ్లంతా ఈయీ పనులే చేస్తుంటారని కాదు కానీ, వారి చైతన్యంలో ఈ అనుభవాల ప్రభావం చాలానే వుంటుంది. వేంకటేశ్వర రావు గారు సూచించినట్లు – అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవనంలో ఆఫీసుల్లో , ప్రత్యేకించి ఐటి రంగంలో పనులు చేసుకోవటం, గ్రీన్ కార్డు సంపాదించుకోవటం, కట్నం మాట్లాడుకోవడం , పెళ్లిళ్లు చేసుకోవడం, హైదరాబాదులాంటి చోట ఇల్లో స్థలమో కొనుక్కోవడం, తెల్ల అమెరికన్ సబర్బన్ లైఫ్ లో ఒక చిన్న చోటు వెతుక్కోవటం, ఇలాటివి చాలా ముఖ్యమైన ఘట్టాలు. ఇక్కడా అక్కడా కూడా నగర జీవితంతో సంబంధం లేకుండా , పెళ్లిళ్లూ కట్నాల ద్వారానో , వ్యవసాయమూ – దాన్ని అంటుకునుని వుండే ఇతర రంగాలనుండి కుటుంబాలు మిగుల్చుకున్న డబ్బులతోనో – తల్లి తండ్రులు గుట్టు గా సర్కారీ వుద్యోగాలు చేసుకుని మిగుల్చుకున్న డబ్బులతోనో, అమెరికాకి పోవటం అన్నది సర్వత్రా జరిగింది.
హైదరాబాదు లో ఏదో కొన్నేళ్ళు వుండి , అక్కడ కొంత ఆధారం సంపాదించుకున్నాకూడా, ఇలాటి ప్రవాసులలో ఎవరూ కూడా – తమ చుట్టూ కమ్ముకు వస్తున్న పెను మార్పులని గమనించేటంత వోపిక వున్న వాళ్ళు కాదు. అమెరికా దాకా ఎందుకు – గ్రామం వదిలి, చిన్న పట్టణం, చిన్న పట్టణం వదిలి హైదరాబాదు నగరం , హైదరాబాదు నగరం నించి అమెరికాకో, యూరప్ కో ఎగిరి వెళ్ళటం — ఈ క్రమంలో కూడా ఎక్కడా కూడా కొంచెం వూపిరి పీల్చుకుని, తమ చుట్టూ ఏమీ జరుగుతోందో తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ముందు పరిస్థితి ఇంత ఇరుకుగా వుండేది కాదనుకుంటాను. తెనాలి లో వున్నా, విజయవాడలో వున్నా, వరంగల్లు లోనో , హైదరాబాదులోనో వున్నా తమ చుట్టూతా ఏమి జరుగుతోందో తెలుసుకోక తప్పేది కాదు. బతుకు తెరువుకోసమే అయినా బొంబాయికో, మద్రాసుకో వెళ్ళే వాళ్ళు. ఆ వెళ్లిన అనుభవానికి కేవలం వ్యక్తిగత పరిధిలో కాకుండా పెద్ద కాన్వాసులో భాష్యం చెప్పుకునే వాళ్ళు.
ఎమెర్జెన్సీ తరవాత – ప్రత్యేకించి, ఈనాడు పత్రిక బలంగా ఎదిగిన తర్వాత, తెలుగు దేశం పార్టీ ఉవ్వెత్తున వచ్చిన తర్వాత దేశ రాజకీయాలలో తెలుగు సాంఘిక జీవనమూ, ఆంధ్ర ప్రదేశ్ లో కుటుంబ జీవనమూ పూర్తిగా అంతర్ముఖమైపోయినాయి. జీవితాన్ని , సాహిత్యాన్ని అనుభవించడం కాకుండా వినిమయం చేసుకోవటం పాతుకు పోయింది. సినిమాలు ఈ విషయంలో చాలా కృషి చేసాయనే చెప్పుకోవాలి. ( గుంటూరు జిల్లా వ్యవసాయపు మిగులు ధనం మద్రాసు వెళ్ళి పనికిమాలిన చెత్త ఎట్లా ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిందో – బాలగోపాల్ ఎక్కడో చాలా చక్కగా చెప్పినట్టు గుర్తు). తెలుగు మాట్లాడే వాళ్ళ జ్ఞానేంద్రియాలకి ఆవకాయకీ, ఆత్మకధకీ తేడా తెలియకుండా అయిపోయింది. ఒకే తూనిక రాయి — ఎంత మంది కొన్నారు, ఎంత మంది ఆమోదించారు, ఏ సెలెబ్రిటీ ఎండోర్స్ చేశారు – ఇదీ లెక్క.
అది జరుగుతుండగానే విప్లవ రాజకీయాల పట్ల ఏదో ఒక రోమాంటిక్ వూహాలుండటమూ , అలా మాకు వున్నాయని – అది లేని వాళ్ళందరూ ఉదారవాద మూర్ఖులో, వర్గ శత్రువులో అయి వుంటారని బూకరించటం లోనే సాహిత్య విమర్శకులకు తీరిక లేకుండా పోయింది. మొదట్లో విమర్శకులు చేసిన ఈ పనిని, తరవాత తరవాత రచయితలూ, రచయిత్రులూ, కవులూ, కవయిత్రులూ వాళ్ళని సమర్ధించే వాళ్లూ కూడా అలవాటు చేసేసుకున్నారు. ఇటువంటి సంస్కృతిలో ఎవరికీ దేని పట్లా జవాబు దారీ తనం వుండదు. కష్ట పడి పని నేర్చుకోవలసిన అవసరమూ వుండదు. బుకాయించటం, బూకరించటం వస్తే చాలు. మహా అయితే, తమ కులానికో, తమ వీధికో, తమ జిల్లాకో సంబంధించిన కొంత పనికి మాలిన జ్ఞానం సంపాదించుకుంటే చాలు.
బతకడానికి సరిపోయే దినుసులే ఇట్లా వుంటే ఇందులోంచి సాహిత్యం పుట్టించాలంటే దానికి కావలసిన పనిముట్లు ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సిన అవసరం వుంది. విమర్శకులు చేయ వలసిన పని అది.
తెలుగులో మంచి కధ ఎట్లా వుండాలి అని చెప్పే కన్నా, మనకు కనపడుతున్న సాహిత్యంలో ఏవి మంచి ధోరణులు — అన్నది చెప్పుకోవలసిన అవసరం వున్నది అని మాలతి గారు అడగటం సబబే. కానీ , దానికి సమాధానం ఇప్పుడు వస్తున్న తెలుగు కధల్లోనించే వెతుక్కో నవసరం లేదు. తెలుగు సాహిత్యం మొత్తం నించే కాక ఇతర భారతీయ భాషలనించో ప్రపంచ సాహిత్యంలో ఎక్కడినించో నయినా చూపించుకోవచ్చును. అసలు కధల వూసే ఎత్తకుండా తెలుగు వారి సంస్కృతులని నిర్మొహమాటంగా విమర్శించి చెప్పుకున్నా చాలు.
రోజు వారీ జీవితంలో లేని లోతుని పాఠకులకి అందు బాటులోకి తేవటం రచయిత చేయవలసిన పని. దానికి కావలసిన నైపుణ్యం షెల్ఫ్ మీద దొరకదు. తయారు చేసుకోవాలి. తెలుగు డయాస్పోరా రూపు రేఖలూ, దాని చైతన్యానికి ఆయువు పట్లూ ఇలాటి వాటి గురించి మాట్లాడుకోవటం ఆ దిశగా ఒక మంచి అడుగే. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. సమస్యకి మూలం ఎక్కడో స్థూలంగానానయినా గుర్తించ గలిగితే, ఆ తరువాత దానికి పరిష్కారాలు అందులోంచే దొరుకుతాయి.
లతా మంగేశ్కర్ పాటలు పాడడం మొదలుపెట్టాక మహిళల గొంతులకు character అనేది లేకుండా పోవడం “మంచి” లక్షణంగా రూపొందింది. అద్భుతమైన కంఠంతో ఏ హీరోయిన్‌కైనా, ఏ సందర్భానికైనా సరిపోతుందనిపించే శైలి ఆమెకు ఉండడం అన్నివిధాలా లాభించింది. ఈ లాభం ఆమెకూ, హీరోయిన్లకూ, వినేవారికీ అందరికీ ఉపయోగపడింది.
లతాకన్నా ఎక్కువ “పర్సనాలిటీ” ఉన్న గొంతుతో ఆశా భోంస్లే రెండోస్థానంలోకి వచ్చింది.
ఆ తరవాత అంతకు ముందునుంచీ పాడుతున్న శంశాద్, నూర్జహాన్, సురైయాలూ, తరవాత వచ్చిన గీతాదత్ మొదలైనవారికీ పాడే శైలిలో ప్రత్యేక వ్యక్తిత్వం ఉండడం కాస్త ప్రతిబంధకంగా అనిపించసాగింది. అందుకే వారంతా ఒక్కో రకం పాటలకే పనికొస్తారనే భావన బలపడింది. తెలుగులో సుశీల సరిగ్గా లతా పద్ధతిలోనే తయారయింది.
నూర్జహాన్, సురైయా ఇతరులకు ప్లేబాక్ పాడలేదు కనక వారికి ఇది పెద్ద సమస్య కాలేదు. మనవారిలో భానుమతిదీ, ఎస్ వరలక్ష్మిదీ కూడా అదే పరిస్థితి. వీరిలో వరలక్ష్మి మరెవరికైనా పాడడానికి సిద్ధపడేదేమో తెలియదు కాని ఆమెకు కూడా “ప్రత్యేకంగా” వినిపించే గొంతు ఉండేది. అయితే ఆమె గానపటిమ అసామాన్యమైనదని ఏ పాట విన్నా తెలిసిపోతుంది. ఆమె చివరి రోజుల ఆర్థిక ఇబ్బందుల గురించి రావి కొండలరావు బాగా రాశారు.
ఆమెను తలుచుకునే అవకాశం కల్పించిన శ్రీనివాస్ అభినందనీయుడు.
“ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి..చురకత్తులు పదును పెట్టి…”
అ. ప్రప్రథమంగా విన్నవించవలసింది, తెలుగు భాష వ్యాకరణం ప్రకారం, “తొడలు”, “శృంఖలాలు”, “చురకత్తులు” అనేవి విశేషణాలు కావు. అవి కర్మలు (direct objects). ఇది ముందుగా అర్థం జేసుకోవలయును. “గొట్టి”, “పగులగొట్టి”, “పదును పెట్టి” అనేవి క్రియలు. ఒకే కర్తకు బహు క్రియలు గలవు. ఇది చాలా సరి అయిన విషయమే. అటులనే విశేషణానికి ఏకవచనం, బహువచనం అనేవి వుండను. వచనం అనేది నామవాచకానికి (noun) మాత్రమే ఉండుని. కర్త యొక్క వచనాన్ని అనుసరించి, క్రియా రూపంలో తేడా ఉండును. “రాముడు అరటిపళ్ళు తినెను”, “రాముడూ మరియూ కృష్ణుడూ అరటిపళ్ళు తినిరి” అనే వాక్యములో కర్త వచనము బట్టి, క్రియా రూపములు, “తినెను”, “తినిరి” అని వుండును. గావున విశేషణానికి వచనం లేదు.
ఆ. ఒక వాక్యములో కర్త ఏక వచనంలో వున్నప్పుడు కర్మ అదే వచనంలో వుండనక్కర లేదు. కర్తా, క్రియా రూపం మాత్రమే ఒకే వచనంలో వుండవలయును. “రాముడు అరటిపళ్ళు తిన్నాడు” అన్న వాక్యంలో వున్న కర్మ బహువచనంలో వుంది. అది సరి అయినదే. తప్పు ఎంత మాత్రమూ కాదు. “రాముడూ మరియూ కృష్ణుడూ కలిసి ఒక బొమ్మను తయారుజేసెను” అన్న వాక్యంలో కర్త(లు) బహువచనం. కర్మ (బొమ్మ) ఏకవచనం.
ఇ. ఒక మనిషికి రెండు తొడలు గలవు. ఒక మనిషికి కాళ్ళకూ, చేతులకూ వేరు వేరు శృంఖలాలు వుండగలవు. ఒకే ఒక చురకత్తి బదులు, బహు చురకత్తులు పదును బెట్టవచ్చును ఒక దాని తరువాత ఒకటిగా. ఏకవచనంలో వున్న కర్త (మనిషి)కి బహువచనంలో కర్మలు వుండటం తప్పు కాదు.
ఈ. ఇచ్చట ఉదహరింపబడిన వాక్యంలో ఎటువంటి తప్పూ లేదు. వాక్యం చక్కగానే వున్నది. నేను వ్యాకరణం ప్రకారం “ప్రతి మనిషి” అనేది ఏకవచనం మాత్రమే ననియూ, బహువచనం ఎంత మాత్రం కాదనియూ మాత్రమే ఉటంకించాను. ఇది ఒక భాషకు సంబంధించిన విషయం గావున, భాషా జ్నానం ప్రకారం నేనట్టు చెప్పి ఉంటిని.
ఉ. మీరు, “శ్రీశ్రీ ఆంగ్ల వ్యాకరణముననుసరించి తెలుగు వాక్యములు రాసిన కవి కాడు గావున ఆయనని తెలుగు భావుకునిగా గ్రహించి మీరు తరింతురు గాక! ” అని అని ఉంటిరి. ఆంగ్ల వ్యాకరణం అనుసరించి తెలుగు వాక్యములను కవి రాయవలెను అని నేను ఉటంకించలేదు. మీరట్లు అపోహ పడి నా మీద ఇటువంటి ఆభాండములు వేయుట విజ్నులయిన మీకు భావ్యము కాదు. అర్థము తెలియజేయగలందుకు మాత్రమే ఆంగ్ల వ్యాకరణం కూడా ఉదహరించితిని. అంతెయును గాక, కర్త, క్రియ, కర్మ, విశేషణం, వచనం వంటి విషయాలలో రెండు భాషల వ్యాకరణం ఒకదానిని ఒకటి పోలి ఉండును. సులభంగా గ్రహించుటకు మాత్రమే అంగ్ల భాషా వ్యాకరణమును వివరించితిని. అందువలన ఇటువంటి వ్యక్తిగత దూషణలు మీకు శోభ నివ్వవు. సాహిత్య చర్చలో కొంచెం సంయమనం అవసరం.
ఊ. ఆఖరుగా మీరు, “మీకు వ్యాకరణమ్ మీద చాలా పట్టు ఉన్నట్లైతే మీరు కవిత్వాన్ని చదవడమ్ మానేసి చిన్నయ సూరి గారిని అను నిత్యమూ పఠింతురు గాక!!” అని నన్ను వ్యక్తిగతంగా దూషించితిరి. ఇది నాకు మిక్కిలి ఖేదము కలిగించెను. నా వ్యాఖ్యానంలో నేను మిమ్ములను ఒక చిన్న మాట చేత కూడా దూషించలేదు. నన్ను దూషించుటకు మీకు ఎటువంటి హక్కు కలదో నాకు ఈ జన్మమున అర్థము కాదు. నాకు సలహా ఇచ్చే ఆగత్యం మీకు ఎంత మాత్రమూ లేదని నేను ఎంత గానో నమ్ముతూ ఉన్నవాడను. మీరు సాహిత్య సంయమనం పాటించకుండా, ఇటుల రహాదారి మీద ఒకరితో ఒకరు కలియబడి, కలహించుకున్నట్లు చర్చించిన, మీ మీద ఈమాట సంపాదక వర్గానికి ఆరోపణ చేయడం తప్ప వేరే మార్గము లేదు.
ఋ. అజ్నాత పాఠకులకు కూడా అభిప్రాయములు ఉండుననియూ, అవి వెలిబుచ్చు హక్కూ, అర్హతా వారికి ఉండుననియూ మీరు గమనించకపోవుట బహు శోచనీయమైన విషయము. ఒకరిని అవమానించే హక్కు ఎవరికీ ఎంత మాత్రమూ లేదు. కావున మీరు ఇక మీ వాఖ్యలు విషయమునకు మాత్రమే పరిమితం జేయగలరని ఆశిస్తున్నాను. ఒకరు తమకు ఎంత జ్నానం కలదు అని నమ్మినా, లేని జ్నానం ఎంతో ఉండి ఉంటూనే ఉండును. ఏ ఒక్కరూ సర్వ జ్నాని కాలేరు అని నేను బాగుగా నమ్మువాడను. ఎవరి జ్నానమునకు తోచినట్టు వారు వారి అభిప్రాయములను వెలిబుచ్చుట, అటులనే ఇంకొకరు వెలిబుచ్చిన అభిప్రాయములను గౌరవించుట నాగరీక లక్షణమని నేను వేరే నొక్కి ఒక్కాణించవలసిన ఆగత్యం ఎంత మాత్రమూ లేదు. ప్రతి ఒక్కరి వాఖ్యలూ విషయమునకు మాత్రమే పరిమితం అయి ఉండవలయు. అది వ్రాసిన వారికి సంబంధించి ఉండి ఉండకూడదు. ఇది మీరు గ్రహించగలరని ఆశిస్తున్నాను.
తనమీద తనకు నమ్మకం లేని వాళ్ళు, ఇతరుల మీద పువ్వులు వేసి పూజించో, రాళ్ళు వేసి నిరసించో తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవటానికి తాపత్రయపడతారు. ఎవరు ఏమి చేస్తున్నారో సర్వే చేసి నిరూపించటానికి సాధ్యం కాని విషయం కాబట్టి వదిలేస్తే మంచిది.
నటశేఖర కృష్ణ , టికెట్లు కొనుక్కుని సినిమా చూసిన ప్రజలు – ఈ రెండు కాగడాల మధ్యన ప్రజ్వరిల్లుతున్న అఖండ జ్యోతి శ్రీ శ్రీ రాసినపాట అనటమే తప్ప, ఈ పాట గురించి మీకున్న అవగాహన ఏమై వుంటుందా అని ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. మహాకవి సృష్టిని బేరీజు వేయటానికి మీరు వాడే కొలమానాలు ఇంత పేలవంగా వుంటే ఏమి మాట్లాడాలో తెలియక, మీరు కిందటిసారి రాసిన అభిప్రాయానికి నేను జవాబు చెప్పలేదు. ఇంకొంచెం వూరుకుంటే అన్నమాచార్యుల దగ్గర నించి ఇంకా వెనక్కి వెళ్ళేటట్లున్నారు కాబట్టి మాట్లాడ వలసి వస్తోంది.
తెలుగు వీర లేవరా అన్న పాట తెలుగు భాషా పరమైన జాతీయతని వు ద్బోధించే గీతం. ఆ పాట రాసే నాటికి ఆయన తెలంగాణ ప్రాంతంలో వావిలాల గోపాల కృష్ణ గారితో కలిసి తెలంగాణ వుద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వున్నారు. విరసం సంస్థకి అధ్యక్షుడైనాడు. ఈ కారణాలన్నిటి వలనా, ఆ పాటని ఆనాటి రాజకీయ నేపథ్యంనుంచి వేరు చేసి చూడటం నా వల్ల కాదు. అలాగచూడమని ఆయన కూడా కోరుకునే వాడు కాదనుకుంటాను. మీరు అలాగని కోరుకోక పోవటమే కాక, అట్లా చూడటానికి నిరాకరించిన వాళ్లంతా నిరక్షర కుక్షులయి వుంటా ర నుకుంటున్నారు. అంధకారం కమ్ముకుని వస్తున్న రోజులు అవి. వచనంలో 1970 ల వరకూ కుటుంబరావు గారి లాంటి వాళ్ళు నిర్వహించిన పాత్ర ఆ తరువాత దాదాపుగా మాయం అయి పోవటం ఆ అంధకారంలో ఒక భాగమే. కొత్త దీపాలు వెలగలెదని కాదు కాని ఆ చీకట్లలో ఎవరు ఎలాటి దీపాలు వెలిగించారు అన్నది అడగడానికి ఇప్పటికింకా చాలా మంది తటపటాయిస్తారు. ఇన్నేళ్ల తరవాత రాళ్ళు విసరడమా అన్నది కాదు. అలాటి లెక్కలు కట్టడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది అన్నది .ఆలోచించ వలసిన విషయం అని నేనను కుంటే ఆలోచించ వలసి రావటమే మీకు వింతగా వున్నట్లుంది. కనుకనే సంభాషణ ముందుకి సాగడం లేదు.
మీ అభిప్రాయాలు చూసిన తరువాత దేశమంతా ఇన్ని సాయిబాబా గుళ్ళుండగా లేనిది , శ్రీ శ్రీ కి కూడా ఒక దర్గా కట్టి మొక్కుకునే భక్తులుంటే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి లే అనిపిస్తోంది.
విషయం సజావుగా సాగి వుంటే, శ్రీశ్రీ కవిత్వాన్ని అప్పుడప్పుడు తెలుగు రాని వాళ్ళకి వినిపించి సంతోష పడి వూరుకునే వాడిని. నా కర్మ కొద్దీ, ఆయనకి సమకాలికులైన ఇతర భాషల్లోని కవులు కొంత మందిని చదివాల్సి రావడమూ, ఏవో కారణాల వలన ఎప్పుడో కంఠస్థం చేసి వదిలేసిన తెలుగు ప్రబంధాలలోనివీ, తమిళ దివ్య ప్రబంధంలోనివీ ముక్కలు తెరలు తెరలుగా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవలసి రావటం, ప్రత్యేకించి తెలుగు భాషలో దేశభక్తి గురించి, సంకుచిత ధోరణులూ, అభ్యుదయ ధోరణుల గురించి అడపా దడపా ఏదో చర్చ రావడం ఇలాటి వాటి వలన శ్రీశ్రీ గురించి మళ్ళీ ఆలోచించ వలసి వచ్చింది.
ఈలోపల, తెలుగు భాష ఏనాటికైనా జాతీయ అధికార భాషగా గుర్తించబడుతుందని ఆయన చెప్పిన మాటలు కూడా కళ్ళ బడ్డాయి. (అది చదివి కళ్ళు తిరిగాయి అని కూడా చెప్పాలి. నా మాతృభాష జన జీవనానికి చలన సూత్రం కావాలి అని ఒక కవి అంటే సంతోషించాలి కానీ, నా మాతృ భాష ఇతర మాతృ భాషలు మాట్లాడే వాళ్ళ జీవితాలను కూడా శాసించాలి అని ఒక కవి కోరుకుంటే ఆయన కవిత్వాన్ని ఆమోదించే ముందు కొంచెం జాగ్రత్త గా చదవాలి అని నా గుండె చెప్తుంది. )
కాల క్రమేణా, నేను నిర్మించుకున్న మనో ప్రపంచంలో శ్రీ శ్రీ ని ఒక పది మెట్లు కిందికి దించక తప్పలేదు.
నేను రాసిన మొదటి సారే స్పష్టంగానే చెప్పానని అనుకున్నాను. సరిపోలేదోమో నని వివరించి మళ్ళీ చెప్పాను. ఏకవచన బహు వచనాలూ, వాస్తవికతా ఇట్లా తప్పులు లెక్కించు కుంటూ పోతే ఎప్పటికీ తేలదు కానీ, ఈ పాటలో వున్న అసలు సమస్య ఇందులో వున్న భావజాలంలోని సంకుచితత్వం. ఆ సంకుచితత్వానికి పూర్తి కారణం శ్రీశ్రీ కాదు. ఆయన పాఠకులూ, ఆయన శ్రోతలూ , ఆయనని అభిమానించినవారూ, ఆయన పాటలు రాసిన సినిమాల నిర్మాతలూ కూడా పెద్ద ఎత్తున బాధ్యత వహించ వలసి వస్తుంది. అందుకే నేను వేసిన ప్రశ్నలకి ఆయనే సమాధానం చెప్పుకోవలసిన పని లేదు. తప్పు మీది. మీరు జవాబు చెప్పలేక ఆయన మీదికి తోసేస్తున్నారు.
కేవలం నా వునికిని నిరూపించుకోవడానికి సాహిత్య రంగంలో చెయ్యి చేసుకునేంత వెసులుబాటు వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా కూడా రొజు వారీ జీవితంలో వుండని వాళ్ళలో నేనూ ఒకడిని. రాయక తప్పని పరిస్థితి వచ్చిన రోజు, రాయ వలసిన పద్ధతిలో, బాధ్యతగానే దీస్ని గురించి మళ్ళీ రాస్తాను. అప్పటివరకూ, సెలవు.
రెండు మూడు తెలిసీ తెలియని విషయాల గురించి నాలుగు మాటలు.
శ్రీశ్రీ మీద థీసిస్ చేసింది మిరియాల లక్ష్మీపతి గారన్నారు; రామకృష్ణ గారని గుర్తు.
“నిరాశ అన్నది తాత్కాలికమైన మానసిక పరిస్థితేగాని, కవులతోబాటు ప్రతిఒక్కరు దీనికి లోనుకావటం సహజమే. మహాప్రస్థానం తరువాతి శ్రీశ్రీ పద్యాల్లో ఎక్కడా ఇటువంటి ఉదాహరణలు కనిపించవు. ఎప్పుడైనా నిరాశ వ్యక్తిగతమే.”
శరచ్చంద్రిక రాసింది మహాప్రస్థానం తర్వాతేననుకుంటాను. దాంట్లో నిరాశ తోనే మొదలెడతాడు కాని ఆశాభావంతో ముగిస్తాడు. ఇక్కడే కాక కొన్ని ఇతర పద్యాలలో కూడా ఈ నిరాశా నిస్పహలకి కారణం తన వ్యక్తిగత జీవితం కాదు, సామాన్యుని వాస్తవ జీవితం.
“నువ్వో … కావాలంటే ముందుగా కమ్యూనిస్టువి కావాలి,” అన్నదానిని చవకబారు కవిత్వమంటే ఒప్పుకోవచ్చు కాని, “నిజానికి ఏ సందేహానికైనా నిశ్చయమైన, ఖచ్చితమైన సమాధానం లభించిందని సంతృప్తిపడితే రచన ఆగిపోవటమే జరుగుతుంది,” అన్నదానికి ఇంకాస్త ఆధారాలు కావాలి. “కలడు కలండెడు వాడు కలడొ లేడో” అన్న కవి “ఇందుగలడందు లేడను సందేహము వలదు” లాంటిది రాస్తే అది కవిత్వం కాకుండా పోతుందా?
శ్రీశ్రీ జీవితాంతమూ కవిగా అన్వేషణ తోనే గడిపానని చెప్పుకున్నాడు. ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మినంతనే, ఇక తన జీవితంలో వేరే అన్వేషణే లేదనడం సరికాదు.
ఇస్మాయిల్ గారు కూడా, మహాప్రస్థానంలోని గీతాలన్నీ శ్రీశ్రీ మార్క్సిజం గురించి తెలుసుకోక మునుపు రాసినవే నన్నారు. కాపిటల్ చదవలేదేమో కాని, 1930 ప్రాంతాల్లో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలో చదవదగ్గ పుస్తకాలన్నీ చదివానని చెప్పుకున్న కవికి మార్క్సిజం గురించి తెలియదంటే నమ్మడమెలా? కాస్తోకూస్తో తెలియకుండానే “దేశచరిత్రలు” రాసి ఉంటాడా?
మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ రాసినవన్నీ మరీ దసరా పద్యాల స్థాయిలో ఉన్నాయనుకోను. వాటిల్లో చెప్పుకోదగ్గవీ, మహాప్రస్థానం గీతాలతో పోల్చదగ్గవీ, వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చునంటే ఒప్పుకంటాను. మరి డెబ్భై ఏళ్ళకి పైగా బ్రతికి, చివరిదాకా ఏదో ఒకటి రాస్తూ ఉన్నశ్రీశ్రీ కవిత్వంలో చెప్పుకోదగ్గది దాదాపు అంతా మూడు పదులు నిండక ముందే రాయడానికి కారణం, ఆ తర్వాత ఆయన మార్క్సిజం తీర్థం పుచ్చుకోవడమేనని రవిశంకర్ గారు స్పష్టంగా చెప్పకపోయినా సూచనప్రాయంగా అన్నారు.
సృజనా శక్తి వయసుతో, అనుభవంతో, జ్ఞాన సముపార్జనతో పెరుగుతుందా? ఇది సాహిత్యంలోనేనా, అన్ని రంగాల్లోనూ సహజమా? అన్న సందేహముంది నాకు. హార్డీ తన “సంజాయిషీ” లో [1] రామానుజన్ ముప్ఫై రెండేళ్ళకే చనిపోవడాన గణితానికి వచ్చిన నష్టమేమీ లెదన్నాడు! ఆ వయసు తర్వాత ఏ గణితవేత్తయినా పెద్దగా సాధించేదేమీ లేదని హార్డీకి గట్టి నమ్మకం.
S. చంద్రశేఖర్ కి సృజన తీరు మీద కుతూహలం కలిగి ఓ మంచి ఉపన్యాసం [2] ఇచ్చాడు. షేక్స్పియర్, బీథోవన్ ల సృజనా కౌశల్యం పెరుగుతూ జీవిత చరమదశ దాకా పరిపక్వత చేరిందంటాడు. వాళ్ళతో పోలిస్తే, సృజనా పరంగా మహోన్నతమైన గురుత్వాకర్షణ సూత్రాల ని న్యూటన్ కనుగొన్నది పాతికేళ్ళ వయసు లోపలే!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “A Mathematician’s Apology,” by G. H. Hardy. Cambridge University Press, 1967. గణితమంటే ఇష్టమున్నా లేకపోయనా, కవత్వమంటే ఆసక్తిగల వాళ్ళు చదవాల్సిన పుస్తకం.
[2] Shakespeare, Newton, and Beethoven, or Patterns of Creativity. Nora and Edward Ryerson lecture delivered at the University of Chicago, Center for Public Policy on 22 April 1975. Published in “Truth and Beauty: Aesthetics and Motivations in Science,” by S. ChandraSekhar. The University of Chicago Press, 1987.
జగన్నాధంగారూ, ప్ర, త్ర్య లాటి అక్షరాలవలెనే క్ష అక్షరం కూడా ఒక సంయుక్తాక్షరమే. నిఘంటువులలో క్ష-కారముతో ఆరంభమయ్యే పదాలు క అక్షరం కిందే ఉంటాయి. ప్ర అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు క్ష అక్షరంతో ఆరంభమయ్యే పదాలకంటే ఎక్కువే. కాని దీనికి కొందరు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడానికి కారణం బహుశా క్ష అక్షరం పలికేటప్పుడు, క కు ష ఒత్తు ఇచ్చి పలికేటప్పుడు ఉచ్చరణలో కొద్దిగా భేదం ఉండడంవల్లనేమో? లేకపోతే మతపరంగా (చక్రాలు ఇత్యాదులు) మరేమైనా కారణం ఉందేమో? యూనికోడ్‌లో ఈ అక్షరానికి ఒక ప్రత్యేక స్థానం లేదు అనే అనుకొంటా. విధేయుడు – మోహన
“కవికి ఒకరి మరణం కంటే ఆ మరణంపై ప్రపంచం కనబరచిన ఉదాసీనత ఎక్కువ బాధకలిగిస్తుంది.” దానికి రవిశంకర్ గారిచ్చిన ఉదాహరణలు చక్కగా ఉన్నాయి. ఐతే రవిశంకర్ గారు వారి పరిశీలనని అక్కడతోనే ఆపెయ్యకుండా మరికొంచం ముందుకుపొయ్యుంటే, శ్రీశ్రీ గారి మరో కోణం, సహజంగా కవులని చెప్పుకునే వాళ్ళలో కనపడని మరో ఒకట్రెండు లక్షణాలు తెలిసుండేవి. అవేవిటంటే శ్రీశ్రీ ప్రపంచపు ఉదాసీనత వల్ల మనిషిగా తనకు కలిగిన బాధని కవిగా వ్యక్తం చెయ్యడంతోనే ఆగిపోకుండా, ఆ వ్యక్తం చెయ్యడంలో కూడా ఆ బాధమీద సున్నితవైన కవిత్వపు మేలిముసుగులు కప్పకుండా, చావు ఎంత భయంకరవైనదో తన కవిత్వంలో చూపించాడు. ఆ చావుకన్నా భయంకరవైన ఆ ఉదాసీన ప్రపంచాన్ని, చొక్కా పట్టుకుని ప్రశ్నించాడు. ఆ చావుకి కారణవెవరో చెప్పమని, ఆలోచించమని తన కవితని పెనుప్రశ్నగా మలచాడు.
“కొంపెల్ల జనార్ధనరావు కోసం” లో
మా బురద రోజూ హాజరు
మా కాళ్ళకు డెక్కలు మొలచాయి
మా నెత్తిన కొమ్ముల లాగే!
…….
నిన్న వదిలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు!
కావున ఈ నిరాశామయ లోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను!
“అట్లాగే భిక్షు వర్షియసి” లో
ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి”దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళ్ళిపోయింది
అని చెప్పడంలో ఉదాసీన లోకానికి తన కవిత్వపు షాక్ ట్రీట్మెంట్ రుచి చూపించాడు. అందువలననే గురజాడ రచనలో మీక్కనిపించిన గోప్యత శ్రీశ్రీ బాటసారిలో కనిపించదు.
రవిశంకరు గారు చెప్పినట్టు శ్రీశ్రీ మరణాన్ని ఎక్కడా కీర్తించలేదు. “ఊగరా, ఊగరా, ఉరికొయ్య నందుకుని ఊగరా” అన్న కవితలో వీరుని మరణాన్ని సందేహం లేకుండా కీర్తించారు. ఐతే ఆ వీరుని మరణం పదిమంది బతుక్కోసం చేసిన త్యాగవని మనం గుర్తుంచుకోవాలి. ఆ రకంగా అది బతుకుని కీర్తించడం గానే నాకనిపిస్తుంది. పదిమందికి మంచి బతుక్కోసం తపనగానే నా మనసుకి తెలుస్తుంది.
చేదుపాట, కేక, దేనికొరకు గీతాల్లో శ్రీశ్రీ వ్యక్తిగత ఆశ, నిరాశల దోబూచులాట కనిపిస్తుందని చెప్పేరు రవిశంకర్ గారు. నాకు మాత్రం ఆ గీతాలు ఆ కాలపు (ఈ కాలం కూడా) ఒక సామాన్యుడి, బతుకుబాటలో నడుస్తూ, ఆ బాట, తనలాటి సామాన్యులకి ముళ్ళబాట ఎందుకైందో తెలుసుకునే నేపధ్యంలో, ఆ కారణాలేవో తెలుసుకుని వాటిని మార్చే పోరాటానికి సమాయత్తవయ్యే తరుణంలో ఆ కాలపు కవి శ్రీశ్రీ నే కాదు, ఏ కవిత్వం వ్రాయని సామాన్య శ్రీశ్రీలు మార్పు కోసం, మంచి కోసం, పదుగురి మంచికోసం స్టేటస్ కోను ప్రస్నించపూనుకున్న ఇకనోక్లాస్ట్ మనస్తత్వవే నాక్కనిపిస్తుంది.
శ్రీశ్రీ కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళల గురించి కవిత్వం వ్రాయలేదన్నారు మీరు. కానీ శ్రీశ్రీ వ్రాసిన కవిత్వం దాదాపు అంతా కూడా వాటి గురించే కదా రవిశంకర్ గారు. సమాజంలో హీనాతి హీనవైన బతుకు బతుకుతున్న సామాన్యుడి గురించే కదా ఆయన కవిత్వవంతా, ఆయన తపనంతా. తమలోతు కనుక్కోమనే ఆ అత్యంత హీనవైన బతుకు నిజాల్ని ఆవిష్కరించడవే కదా ఆయన కవిత్వం చేసింది.
వాక్యం వాక్యం విమర్సించడం నా ఉద్దేశం కాదు. ఆఖరగా ఒక విషయం, అన్వేషణ కట్టిపెట్టి, ఒక ఖచ్చితత్వం వైపు ప్రయాణిస్తే కవిత్వం దెబ్బతింటుందన్నారు మీరు. కానీ ఒక ఖచ్చిత తత్వం వైపు ప్రయాణించడవంటే కళ్ళకు గంతలు కట్టుకోవడం కాదు కదా. ఆ ప్రయాణపు బాట పట్టడానికి, ఎంత అన్వేషణ, ఎంత సంఘర్షణ, ఎంత పరిశీలన, ఎన్ని ప్రశ్నలు, ఎంత ప్రయత్నం. నిస్చయత్వం అనేది ఒక సాపేక్షవైన విషయవే కాదా? కవి కూడా సంఘంలో ఒక మనిషే, అందరితోబాటూ కవిక్కూడా, కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, మంచిచెడులుంటాఅయి. నిశ్చితానిశ్చయాలుంటాయి. బతుకుబాటలో అందరిలాగే అన్నిరకాల సంఘర్షణలుంటాయి. రాజకీయాలు, రాజకీయ తాత్వికత కూడా అందులో భాగవే. అవి లేని కవి కవి కాలేడేవో. నాలుగు పదాలని నగిషీచెక్కడం నేర్చుకోవటవే కవిత్వవయితే మీరు చెప్పింది నిజవే, కానీ నలుగురు మనుషుల మనసుల్నిచెక్కాలంటే కవి మనిషై వుండాలి, ఒపీనియేటెడ్ అయ్యితీరాలి. అందువలనే మిగిలిన వాళ్ళు కవులయ్యేరేవో గాని శ్రీశ్రీ అసంఖ్యాక కవుల్ని సృష్టించ గలిగేడు, మహా కవికాగలిగేడు.
శ్రీశ్రీని చూడడానికి అద్దాలెందుకు సార్ మనచుట్టూ మనం కళ్ళు తెరిచి చూస్తే శ్రీశ్రీ కనిపిస్తాడు. మనం పుట్టిపెరిగిన ఊర్లని, మనతో పెరిగిన మనషుల్ని చూస్తే మనకు శ్రీశ్రీ కనిపిస్తాడు. శ్రీశ్రీ నిశ్చితాభిప్రాయాలు ఆయన కవిత్వాన్ని అపేయోలేదో గాని, మన కళ్ళ గంతలు తీస్తే శ్రీశ్రీ కపడతాడు. శ్రీశ్రీ కవిత్వాన్ని, శ్రీశ్రీ కవిత్వంలో వ్యక్తవైన తాత్వికతని, ఆ తాత్వికతకి కారణవైన దేశకాల పరిస్థితుల్ని వదిలేసి, శ్రీశ్రీ ని మాత్రం వేరుచేసి చిన్న అద్దం ముక్కలో ఆయన్ని మీరు చూపించ ప్రయత్నించారు. కానీ ఆ అద్దం ముక్క మసిబారి, మకిలిపట్టిపోయింది మీరు గమనించలేదేవో రవిశంకర్ గారు.
శ్రీశ్రీ చేసిన ఈ ప్రసంగము అందరూ తప్పక విని, ఆనందించి, ఆలోచించవలసినట్టిది. వారు ఆధునిక కవియైనా, ప్రాచీన సాహిత్యాన్ని కూలంకషముగా చదివి, అందులోని విషయాలను అవగాహన చేసికొని ముందడుగు పెట్టారు. భారత కవులు రాసిన పద్యాలను ఉత్సాహంతో చదివి అందులోని లోతులను తెలియ బరచారు. కాని తన దృష్టిలో తిక్కన, వేమన, గురజాడలే కవిత్రయమని వివరించారు. తిక్కన నాటకీయత, వేమన అప్పటి సమాజములోని కుళ్ళును చూపి తన పద్యాలతో ప్రజలను చైతన్య పరచుట, గురజాడ పాత జమిందారి కవిత్వపు ఛాయలను త్యజించి ప్రజల వాడుక భాషలో పాడుకోతగ్గ మాత్రా ఛందస్సులో వ్రాయుట ఇందులకు కారణాలు. తాను కూడా భావ కవిత్వం వ్రాసిన తరువాతే అభ్యుదయ కవిత్వం రాశానని, ఆ కాలపు పరిస్థితులు (ఆర్థిక మాంద్యము, స్పానిష్ సివిల్ వార్, ఫాసిసం) తన్ను ఉద్రేక పరచాయని వివరించారు. వారి గళములో పొలాలనన్నీ హలాల దున్నీ … గేయాన్ని విని ఉప్పొంగిపోవచ్చు. ఈ కానుక నందిచ్చిన మద్దిపాటి కృష్ణారావుగారికి, వడ్లమూడి బాబుగారికి మనం ఋణపడి ఉన్నాము.
నాకు కూడా ఈ ఆల్బం అంటే చాలా ఇష్టం. Music India online లో దీనిని విన్నాను. మామియం చలితా అష్టపదిని సుశీల గళంలో నేను విన్నది లేదు. గీతగోవిందములో వదసియది దంతరుచి తరువాత నాకు నచ్చిన అష్టపది ఇది. ఈ అస్టపదిలోని కొన్ని చరణాలు మహాకవి కాళిదాసు భావాలవలె ఉంటాయి. ఈ మధ్య దీనిని నిత్యసంతోషిణి కంఠంలో విన్నాను. చక్కటి సంగీతవ్యాసాన్ని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి వందనాలు. లలితలవంగలతా అష్టపదిలో ఎందుకో రాజేశ్వర రావు గారు విహరతి హరిరిహ సరస వసంతే అనే ధ్రువమును (పల్లవిని) వాడలేదు. సంస్కృతగీతాలలో పల్లవి చరణము తరువాత వస్తుంది. సువ్వి పాటలలో, లాలి పాటలలో పాత పుస్తకాలలో (అప్పకవీయము లాటిది) సువ్వి, లాలి అని వ్రాయరు. కాని పాడేటప్పుడు ఆ పదాలను ఉపయోగించాలి.
ఇందులో చాలా అచ్చు తప్పు లున్నాయి. నా కంటికి కనబడ్డ కొన్నిటిని కింద జత చేస్తున్నాను.
శ్లోకం – సంకాశం (శంకాశం కాదు)
2) కుంద రదన అని ఉండాలి, తాండవ లీలా అని ఉండాలి.
4) త్వరిత ముపైతి అని ఉండాలి.
5) నళిన వదన, మండిత గుణశీల అని ఉండాలి
6) వాసుదేవం తరువాత బృందాలోలం అని పాటలో ఉంది.
9) దుండగంపు అని ఉండాలి.
విధేయుడు – మోహన
రేఖామాత్రంగా నారాయణరావు గారు శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ కవిత్వం గురించి చేసిన కొన్ని ఊహలమీద రేఖామాత్రంగా నాలో కల్గిన సందేహాలు క్లుప్తంగా ఇలాంటివి.
ఇటీవల హైద్రాబాద్ లో పుస్తకప్రదర్శన జరిగింది. అందులో నా దృష్టిలో పడిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇలా ఉన్నాయి.
తెలుగు సరిగ్గా చదవనుకూడా తెలియని..అర్ధంకాని కొందరు కుర్రకారు పనిగట్టుకుని పుస్తకాల షాపుల్లో అడిగి మరీ శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని కొనుక్కోవడం. నేను వారిని ఆ పుస్తకాన్ని ఎందుకు కొంటున్నారని అడిగాను. అందులో మెడిసన్ ఆఖరు సంవత్సరం చదివే ఒక అమ్మాయి నాతో చెప్పిన జవాబు ఇదీ!! “మామ్ నాకు మహాప్రస్తానం భాష ఏమీ బోధ పడదు. కానీ ఆ పోయెమ్స్ చదివితే నాకు బాగుంటుంది. ఒక ఆకర్షణ ఏదో ఆ మాటల్లో ఉంది. అందుకని కస్టపడి అయినా నేను మహా ప్రస్తానాన్ని చదవాలని అనుకుంటున్నాను అంది.
నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి విప్లవ సంస్థల్లో పనిచేసే అమ్మాయి కాదు. మహాప్రస్థానపు పూర్వాపరాలేవీ ఆ అమ్మాయికి తెలియవు. ఆ అమ్మాయి ఆరుద్రని గాని విరసం ఆవిర్భావాన్ని గానీ ఎరగదు. వాటివేటిమీదా ఆ అమ్మాయికి ఆసక్తి కూడా ఉన్నట్టు లేదు.
ఒకానొక రాజకీయ సంక్షుభిత కాలం గడిచిపోయేకా నారాయణ రావు అభిప్రాయం ప్రకారం మహాప్రస్థానం నాటి ఆవేశాలు సంపూర్తిగా చల్లారాకా నిజానికి ” మరోప్రపంచం” లాంటి కవిత్వపు అవసరం లేని కాలానికి ఆ కవిత్వం మీద ఆసక్తీ లేదా అనురక్తీ కలగడానికి మరి వీలు లేదు. చాలావరకూ “అభ్యుదయ కవిత్వపు స్పందనలు అలా ఎన్నో అలా చల్లారిపోయినవి ఉన్నాయి కూడా!! కానీ మహాప్రస్థానం విషయంలో ఆనాటి రాజకీయ సందర్భం ప్రపంచంలో మారిన ఈనాటికీ ఆ సంకలనం మీద మాత్రం ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేక పోవడాన్ని మనంచూడవచ్చు.
నారాయణరావుగారు ఏ వయసులో శ్రీశ్రీ మహాప్రస్థానం చేత ప్రేరణ పొందారో ఆ వయసులోని యువతీ యువకులు ఈనాటి తరం వాళ్ళు సైతం ప్రేరణపొందటం వెనక గల కారణాన్ని కేవలం “జాంతవమైన ప్రేరణ గా మాత్రమే” క్లుప్తీకరించి మాట్లాడలేం!! ఈనాటి తరానికి కూడా ఆ పుస్తకంలో కావలసినదేదో ఉందన్న అంచనాకి రావాల్సి ఉంటుంది.
శ్రీశ్రీతో తన నడివయసు దాకా సరిపడా పరిచయం కల్గిన నారాయణరావు సూటీగా తనకి కల్గిన అనుమానాలనీ..లేదా తన పరిశీలననీ శ్రీశ్రీతోనే ఎందుకు ప్రస్తావన చేయలేకపోయారన్న ప్రశ్నకి ఇక్కడ చోటుంది. అది అటుంచితే.. శ్రీశ్రీ జతించిన ఒక పాతిక ఏళ్ళకి నారాయణరావుకి మహాప్రస్థానం లోని గేయాలు రష్యా మీద రాసిన దానితో సహా ” నవ్వొచ్చేలా ఉండి ఉండొచ్చు”. కానీ ప్రపంచానికి రష్యా ఒక కాల్పనికమైనదే అయినా ఒక స్వప్నాన్ని అందించిన మాట వాస్తవం. ప్రపంచ సాహిత్యానికి రష్యన్ రచయితలు ఎన్నో రకాలుగా ప్రేరణని ఇచ్చారన్నది ఒక వాస్తవం. ఇక్కడ రష్యా అన్న దాని ఉథ్థాన పతనాలు మనం చూసాము గనక ఆ మాట అనగలుగుతున్నాం!! అది మనకి సమీప కాలంలో జరిగిన రాజకీయ ఘటన. అదే మనకి సుదూరమైన రోమన్ గ్రీక్ రాజకీయ సాహిత్య ఘటనల మీద మనం ఇలాంటి వ్యాఖ్యానాలు చేయగలమా?? రాజకీయ సంక్షోభం సంభవించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆనాటి కాలంలో దానికి సంబంధించిన సాహిత్య స్పందనలు వస్తాయి.ఆనాటికి అవి సత్యం అవి ఆనాటికి ఒక ఆదర్శం! శ్రీశ్రీ మహాప్రస్థానం తో సహా!!
ఇంక శ్రీశ్రీ సృజనలోని నిజాయితీని మనం ఇవాళ శంకించడంలో అర్ధంలేదు. ఆయన మార్క్సిస్ట్ గా మారి వాటిని రాసాడా లేదా కేవలం నిబధ్ధత లేని ఉత్తుత్తి తెచ్చుకోలు ఉద్రేకాన్ని ప్రదర్శంచాడా అన్నది ఏ రుజువులకీ దొరకనిది.అలాంటి ప్రకటనలకి ఏ చెల్లుబాటూ ఉండదు . అలాగే ఆయన నాయకత్వం మీద కూడా!!
శ్రీశ్రీ ప్రభావం అన్నది ఒక వాస్తవం. శ్రీశ్రీ సాహిత్యం ఒక అవసరం అయిన మాట వాస్తవం.ఒక తరానికి కాదు రెండు తరాలకి కాదు. ఈనాటికీ ఆయన సాహిత్యంలో ఉత్తేజ పూరితమైన ఒక ప్రాణశక్తి కవిత్వ పిపాసువులకి దొరుకుతోంది. నారాయణరావుగారికి అర్ధ రహితంగా కన్పించి ” నవ్వుతెప్పిస్తూన్న’ విధానంలో కాకుండా శ్రీశ్రీ గేయంలోంచి తమతమ ఆవేశాలకి తమతమ ప్రేరణలకి మార్గాలు వెతుక్కుంటున్న ఈనాటితరం శ్రీశ్రీలో చూస్తున్నదేమిటి అన్నది అర్ధం చేసుకోవాల్సి ఉంది.
శ్రీశ్రీ కాలంనాటి వ్యక్తిగత స్పర్ధలతో సంబంధం లేని తరాలు ఆయన కవిత్వంలో ఏమిటి వెతుక్కుంటూ ఇవాళ్టికీ మహాప్రస్థానాన్ని కొనుక్కుంటున్నారో గమనించవలసి ఉంది. అది తెలియందే అతి సునాయాసంగా శ్రీశ్రీని అంచనా వేయడం కస్టం. కవితాస్పందన వేరు. అకడమిక్ విశ్లేషణ వేరు. శ్రీ శ్రీ కవిత్వం మెదడు పైపై పొరలనే తాకిందో..మరింతగా ఇంకి ఈనాటికీ మనసులోతులనే అంటిందో తెలుసుకోగల కొలమానం ఒక్క శ్రీశ్రీ కవిత్వమే!! దానికి సాటి అయినది అది మాత్రమే!! ఆకాశానికి సాటి అయినది ఆకాశమే అయినట్టూ..సముద్రానికి సాటి అయినది ఒక్క సముద్రమే అయినట్టు!!
“సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు…. ”
“ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.”
ఆరి సీతారామయ్య అభిప్రాయం: December 2, 2008 3:11 pm
ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ ఈ కవిత, ఈ అభిప్రాయాలు చదువుకుని, ఈ పై అభిప్రాయం వెలిబుచ్చినవారికి, ఈ నా ప్రశ్న.
ఈ కవితలో, ఏ పంక్తుల్లో ఉన్న సమాచారాన్ని వాడి, పాఠకులు ఈ కవితను అర్థం చేసుకోవాలో మొదట్లో చెప్పి, చివరికి ఆ పంక్తులే ఈ కవితకు అనవసరమని చెప్పి ముగించారు.
గమనిస్తారా?
పొరపాటా? కాదా?
సమాధానం చెబితే, అప్పుడు నా రెండో ప్రశ్న అవసరమైతే ఆడుగుతాను.
” కొకు” అన్నపేరు విరసం వారి పుణ్యం!! వారి భావనల్లో రసం ఉండదన్నది సాహిత్య విదితం!! ఇహ రేరాజు గారు చెప్పింది ముఖ్యమైన విషయం ఒకటుంది.అదేమిటంటే “థియరీని మార్చుకోవడం”. ఆ దృష్టితో చూసి ఉంటే..మోహనగారికి చాలా సామాజిక మార్పులు స్పస్టంగానే కన్పించేవి. అర్ధమూ అయ్యేవి కూడా!! కొడవటిగంటి కుటుంబరావు గారు కధలు రాసిన కాలం నాటి సమాజమూ..ఇవాల్టి సమాజమూ ఒక్కలా లేదు. ఈ మధ్య కాలంలో తెలుగు సమాజమూ బాగానే మారింది. తెలుగు సాహిత్య సమాజమూ ఆ అన్ని మార్పులనీ తనలో ప్రతిఫలించింది.అనేకానేక అస్థిత్వ ఉద్యమాలానేపద్యం కుటుంబరావుగారు ఎక్కడా ఊహించినట్టు కనబడదు.కానీ అదే గురజాడ చాలా స్పష్టంగా ఊహ చేయగలిగారు.”modern women will rewrite history” అని గురజాడ అన్నది ప్రపంచవ్యాప్తంగా నిజమైంది. ద్రష్ట అంటే ఆయన. కానీ కుటుంబరావు ఏకోశానా అలాంటి దృశ్యాన్ని ఆధునిక కాలానికి మరింత దగ్గరివాడై కూడా చూడలేకపోయాడు. శ్రీశ్రీ సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. రావిశాస్త్రీ..కాళీపట్నం కూడా కారు. ఇందుకు కారణం వాళ్ళ”థియరీ” లోపమే!!వాళ్ళ్ “ప్రాక్టీస్ ” లోపంకూడానూ!!
ప్రపంచంలో వచ్చే మార్పులని కొలిచి చూసే సిధ్ధాంత పరికరాలు పాతబడిపోయే స్థితి ఒకటి వస్తుందని ఈ రచయితలు ఊహించలేదు. అది వీరి దృస్టి దోషమే!! ఆనాటి యువత ఇవాళ లేరు. ఆనాటి ఆర్ధిక పరిస్థితిలు అలాగే ఇవాళ లేవు. ప్రపంచీకరణ నేపధ్యంలో..కుటుంబరావు కధల్ని లక్ష్మన్న చూడలేదు.”ఎక్కడవేసిన గొంగళీ అక్కడే ఉన్నట్టు”గా ఇవాళ్టికీ సామాజిక పరిస్థితులు ఉన్నాయని మోహన గారు భావించడాన్ని కూడా చాదస్తపు..వెనుకబాటుమాటగానే చూడాల్సి ఉంటుంది. “మంచిగతమున కొంచమే” నని అప్పారావుగారన్నది ఈనాటికీ ఈ తరహా చదువుకున్నవారికి అర్ధంకాలేదని అన్పిస్తుంది ఇటువంటి ప్రకటనలు చూసినప్పుడు.పరిస్థితులు ఎక్కడా మారనే లేదనీ..బహుసా మరి మారవనీ మోహన గారు అనడం నిజంగా ఆశ్చర్యపడవలసిన విషయం!! మార్పుని వీళ్ళూ గమనించరనీ..గమనించినా కూడా దాన్ని ఏకోశానా ఒప్పుకోరనీ తెలియజెప్పేలా ఉంటాయి ఇటువంటి అభిప్రాయాలు. ప్రతి సమాజంలోనూ మంచి మార్పులూ ఉంటాయి..కానివీ ఉంటాయి. ఆ కాలానికి చెందిన సాహిత్యం వాటిని బొమ్మ కట్టి చూపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కూడా!! మనం చేయవలసిందల్లా ఉత్తుత్తి నిట్టూర్పులు విడవకుండా వాటిని గమనించటమూ..వాటిని విశ్లేషించటమూనూ!!
రమ.
ఇంత చర్చ జరిగాకైనా, చాలామంది తెలుగులో శాస్త్ర లేఖనం, పఠనం జరగాలని కోరుకోవడం శుభపరిణామం. రమగారన్నట్లుగా, విజ్ఞానశాస్త్రం సైతం ఎక్కువ తెలుగువారికి చేరువకావాలంటే మొట్టమొదటగా కనీసం మనం మాతృభాషలో బోధించాల్సిన అవసరాన్ని బలంగా గుర్తించాలి. దానికి అవసరమైనన్ని తెలుగు పదాలు కొరవడితే, ఇతర భాషలనుండి-అది సంస్కృత మైనా, ఆంగ్లమైనా-దిగుమతి చేసుకోవాలే కాని, తెలుగే పనికి రాదనడం సరికాదని, వేమూరి వారి ఈ వ్యాసాన్ని చూశాకైనా అర్థం చేసుకోవచ్చు.
పదాల్ని దిగుమతి చేసుకొనేటప్పుడు, తెలుగు నుడికారానికి అనుగుణంగా శాశ్వతంగా దిగుమతి చేసుకుంటే బాగుంటుంది. అలాకాకుండా, ఆంగ్ల పదాలకి విభక్తులు చేర్చి, ” ఫోను చెయ్యి ” అని చెప్పడానికి, ఇప్పుడు ఎక్కువమంది అంటున్నట్లుగా ” కాల్చెయ్యి “, ” కాలియ్యి “, చెయ్యియ్యి అని సంకరం చేస్తే అసహ్యంగా ఉంటుంది.
ఇప్పటికే వేమూరి, కొడవటిగంటి వంటి వారలెందరో వారి వారి శాస్త్ర రచనలు తెలుగులో చేసి, అసంభవమనుకొంటున్నదాన్ని-“సంభవం” చేసి చూపించారు.
ఇది శాస్త్ర పరిజ్ఞానం కోసమేగాని, కావ్యరచనకోసం కాదని అందరూ సహృదయంతో అర్థంచేసుకొని, లేనిపోని శంకలకి పోకుండా, తెలుగు వైభవానికి తెర ఇకనైనా తీయడానికి స్వాగతిద్దాం!
రాయ్‌రాజుగారూ, నాకు కూడా పేరులను క్లుప్తం చేయడం పట్టదు. కొకుకు బదులు కుటుంబరావు అన్నదే అందంగా ఉంది. కాని మీరు మేకు అనే పదాన్ని వాడడం అంతగా బాగు లేదు అనుకొంటాను. మీకు ఇష్టమైతే గ్యాస్ స్టేషన్ కథలు చదువుకోవచ్చు, కొత్త జీవితం చదవనక్కర్లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం అది కాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్నట్లు, ఇన్ని దశాబ్దాలైనా మన సామాజిక పరిస్థితులు మారలేదన్నదే ఇందులోని చర్చనీయాంశము, బహుశా మారదేమో? విధేయుడు – మోహన
మీ పుస్తకాలు అందాయి. ఆకలిగొన్న పులిలా మీద పడ్డాను. తెలుగు మాధ్యమంలో చదువుకున్న నాకు విందు భోజనంలా అనిపించింది. ముఖ్యంగా విశ్వాంతరాళం లో బొమ్మలు కూడా చేరడంతో చాలా శోభనిచ్చింది.
ఆంగ్ల పదాలను ఆచి తూచి వాడడం వలన తెలుగు మాధ్యమంలో చదువుకునే విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా తెలుగులో ముందుగానే ఉన్న పదాలకు కొత్త పదాలు సృష్టించి గందరగోళం చెయ్యకుండా చక్కగా రాసినందుకు వీటి విలువ మరింత పెరిగింది.
కొన్ని చటుక్కున తట్టిన ఆలోచనలు:
1. ఇంత మంచి పుస్తకానికి ముద్రించిన ప్రతులు వెయ్యేనా? ప్రతి
గ్రంధాలయంలో ఉండవలసిన పుస్తకం. దీనికేమైనా మార్గాలు లేవా?
2. పుస్తకానికి కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు అర్థాలు వివరిస్తూ
అనుబంధం వేస్తే బాగుండేదని అనిపించింది.
3. మొన్న మా అమ్మాయికోసమని “Solar System” అని ఒక
పుస్తకం తెచ్చాను. చాలా చిన్న పుస్తకం, ఒకటవ రెండవ తరగతి పిల్లలకు చదవడం అభ్యాసం చెయ్యడానికని (ఆంగ్లంలో ఉంది) అటువంటి పుస్తకాలు తెలుగులో కూడా వస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ ఆంధ్రాలో అర్థ వ్యవస్థ అటువంటి పుస్తకాలు పిల్లలకి కొనిపెట్టేటంత ఎత్తుకు ఎదగలేదేమో.
ఎంతైనా మీ పుస్తకాలు చాలా బాగున్నాయి. ఈ మాత్రమైనా తెలుగు పుస్తకాలు వస్తున్నాయంటే అదంతా మీ వంటి పెద్దల వలనే.
మీ దగ్గర ఇంకా ఏమన్నపుస్తకాలు ఉన్నాయా? తెలుపగలరు.
ఇట్లు
గరికపాటి పవన్ కుమార్
చాలా బాగున్నది. సున్నితమైన,మ0ద్రమైన కథ! కాని అతనెవరొ నాకు తెలియలెదు?
అమ్మ ఉత్తరం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/15/2009 1:05 am
JL గారూ!!
మీ వయసు ఎంత ఉంటుందో..నాకు తెలీదు. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే..
ఉత్తరాల అనుభవం దాటిన తరాలకి మాత్రమే వచ్చే సందేహం మీది. ఈ కధలోని అమ్మ తాలూకు పరిస్థితి నిజంగా తెలియని..అర్ధం చేసుకోలేని వాళ్ళకి
వచ్చిన వాళ్ళ సందేహం ఇది.
మీకు ఒక అమ్మ ఉంటే..ఆ అమ్మకి ఇవాళ్టి ఈ ఆధునిక పరికరాలు ఈ మైళ్ళూ..ఆమైళ్ళూ దాటడం రాకపోతే..ఆ అమ్మ తనలోని అనేకానేక భావాలని చెప్పుకోలేక తనలో తనే మిగిలి పోతే..అప్పుడు ఆ అమ్మ పరిస్థితిలోంచి మీరు ఈ మాటల్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేసి ఉంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నని అడగడానికి మరొక్కసారి ఆలోచించగలిగేవారు.
అప్పుడెప్పుడో ఒకసారి పామర్తి సత్యానారాయణ గారు పుస్తకాల విషయంలో ఆధునిక్ పరిజ్నానం నేర్చుకోని రచయితలు కాలంతో వెనకబడిపోవలసిదే అన్నారు. మరి ఆధునిక పరిజ్నానం వాడటం రాని..చాతకాని..లేదా అఖ్ఖరలేని
అమ్మలు కూడా ఆగిపోవలసిందేనని వాదన కోసమైనా ఎవరూ అనలేరు కదా!! మీరే అయినా కూడా అనలేరు కదా!!
అందువల్ల ఈ మైళ్ళూ..టెలిఫోన్లూ..కూడా లోపల్లోపలి మనసుపొరల్లోని మమతని..ఖేదాన్నీ..చెప్పుకుందికి చాలడం లేదని గనక గమనించగలిగితే [ఇవి వాడటం తెలిసిన వారు]..ఉత్తరాలు రాసుకోడంలోని..వాటిని మనసారా
చదువుకోవడంలోని రహస్యాన్నీ..ఆ అవసరాన్నీ కూడా గమనించగలరు.
పాతకాలంలో చదువురాని వారు రాయడం చదవడం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని అభ్యర్ధించేవారు.[welcome to sajjanpur అన్నshyam benegal సినిమాని చూడండి వీలైతే!!] మరి ఈమైళ్ళు ఇవ్వడంరాని అమ్మలు
ఇన్ని మనోభావాల్ని ఎవరి సహాయంతో కొడుకులకి పంపించాలీ?? అన్నది మీరు ఎందుకని ఆలోచించలేకపోయారో!! అంతా బహిరంగమే అయిన ఉమ్మడి
కుటుంబాల కాలంనించి ఒకరూ ఇద్దరూ పిల్లల్ని పెంచి పెద్దచేసి ఒక్కళ్ళూ అయి మిగిలిన ఈ సంధి తరాల వారిని గురించీ..వారి వంటరితనాలని గురించీ ఎవరు మాట్లాడేదీ?? అలా ఆలోచించి చూడండి మీరు. ఆ అమ్మ ఆ ఉత్తరం ఎందుకని రాసిందో..ఆ ఉత్తరంలో చెప్పకనే ఏమేం చెప్పిందో మీకు మరింత స్పస్టమౌతుంది.
కధ చాలా బాగా రాసారు.
“పోస్టుమేన్ చేతికి ఒక ఉత్తరం అందిస్తే ఎంత బాగుంటుందీ!”
నిజమే!! కాని చివరలొ ఈ వాక్యము అవసరమా?
” కంప్యూటర్ యుగంలో ఫోన్ల తోటీ, ఈమెయిళ్ళ తోటీ మనుషుల మధ్య ఎంత దూరం ఏర్పడుతోందో అర్థమవుతోంది. ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోనూ, ఫోన్లలోనూ సాగవు ఎప్పటికీ. మనసు పంచి రాసుకోలేక పోతే, ఏం సంతోషంగా వుంటుందీ?”
ఫోన్ల తోటీ, ఈమెయిళ్ళ తోటీ మనుషుల మధ్య దూరం ఎలా ఏర్పడుతోందో నాకు అర్దము కాలేదు.
ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోను ఎందుకు సాగవు?
నాగులపల్లి శ్రీనివాస్ గారి ప్రతి అక్షరం తోనూ ఏకీభవిస్తున్నాను. తెలుగు దేశం లోని జిల్లా స్థాయి లోని ఒక ప్రైవేటు పాఠశాల లో చిన్నపిల్లలు స్కూల్లో తెలుగులో మాట్లాడితే అక్కడి టీచర్లు ఆ చిన్నపిల్లల మెళ్ళో క్రిమినల్స్ మెళ్ళో వేల్లాడదీసినట్టుగా ఒక పెద్ద అట్ట మీద తాటికాయంత అక్షరాలతో ఇంగ్లీషులో..” I NEVER SPEAK IN TELUGU ” అని రాసి తగిలించి అందరూ చూసేలా నిలబెట్టారు. ఆ పసిపిల్లల వయసు ఆరేడేళ్ళు. వాళ్ళకి వాళ్ళ తప్పేంటో కూడా తెలీని వయసు. అంత చిన్న వయసులో ఆ పిల్లల మనసులో మాతృభాష మీద చులకననీ..ఇంగ్లీషు మీద ఆలవికాని వ్యామోహాన్నీ..కల్గిస్తున్నారు వాళ్ళ టీచర్లూ ఆ పాఠశాల యాజమాన్యం. ఇందుకు ఆ పసివాళ్ళ తల్లితండ్రుల పూర్తి అంగీకారం ఉన్నట్టే తెలుస్తోంది.
ఒక రెండు తరాలు నిర్లక్ష్యం చేస్తే ఆ భాష నశించిపోయే అవకాశం ఉంది. తిరిగి దాన్ని ఉద్ధరించడానికి తాతలు దిగివచ్చినా లాభం లేదు. వెయ్యేళ్ళ మన తెలుగు గురించి అందులోని అనేక రకాల పదజాలం గురించి తెలుసుకోకుండానే..అందులోంచి అధ్యయనం కష్టం అంటున్నారు. శాస్త్రీయ సంబంధమైన పారిభాషిక పదజాలాన్ని మనం సంస్కృతం నించి గ్రహించి వాటిని తెలుగులో చొప్పించాం..ఎలాగైతే ఇంగ్లీషు లాటిన్ నీ గ్రీకు నీ సైంటిఫిక్ పరిభాషగా గ్రహించిందో అలాగ!! అక్కడ ఇంగ్లీషులో ఉన్న అన్య భాషాపదాలు ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే వాళ్ళకి అదే తెలుగు వాక్యాల్లో ఉన్న సంస్కృత పదాలు ఎబ్బెట్టుగా అన్పిస్తున్నాయి. పోనీ అని మిగతా భాషల వాళ్ళు చేసినట్టుగా చక్కని తెలుగు పదాలని తిరిగి వాడకం చేసే ప్రయత్నం చేసామా అంటే తెలుగుని ఉచ్చరించటం కూడా మరిచిపోతున్నారు. నిత్యవ్యవహారంలో ఉండే ఎన్నో మాటల్ని జారవిడిచేసాం!! వేలయేళ్ళ చరిత్రని కలిగి ఉండటం ఒక్కటే కాదు ఆ వెయ్యేళ్ళ కిందటి పద్యం చదివితే మనకి ఇంకా అర్ధమవుతూంది.అంటే తెలుగు ఇంకా సజీవంగా ఉందని అర్ధం. ఈ స్థితిని అనుభవంలో చూస్తూ కూడా తెలుగునించి పదసేకరణ చేసి వాటిని బోధనాభాషగా తిరిగి వాడుకోలేక ఇలా ఇంత మంది అదేదో అన్ని సమస్యలనీ పరిష్కరించేయగలిగినది అన్నట్టుగా అందరూ అతిగా ఇంగ్లీషు వేపు చూడటమూ..ఆ పదజాలం సహజమూ..తెలుగులో ఉన్న సంస్కృతం ఆసహజమూ..అన్నట్టుగా అనుకోవటమూ జరుగుతూంటే ఈ చర్చల్లో..మీ అభిప్రాయం చదివి ప్రాణం లేచొచ్చింది. అందుకు మీకు వందనాలు.
రమ.
సాహితీ మిత్రులందరికీ వందనాలు,
నేను చాలా కాలంగా ఇటువంటి వేదిక కోసం చూస్తున్నాను. కొంత ఆలస్యంగా నైనా ఈరోజు “ఈమాట” చూడడం జరిగింది. చాలా సంతోషం వేసింది. ఇంతమంది సాహితీ మిత్రులని ఒకచోట చూడడం చాలా సంతోషంగా వుంది. మన మాతృభాష ఇంకా పదికాలాలపాటు జీవిస్తుందని ధైర్యం కలిగింది. ,
నేను చిన్నతనం నుండి తెలుగు సాహిత్యం ఇష్టంగా చదివేవాడిని. కొంతకాలం కవితలు కూడా రాశాను. గత కొద్ది కాలంగా పలు కారణాల వల్ల సాహిత్య లోకానికి దూరంగా వున్నాను. ఈరొజు “ఈమాట” చూసిన తరువాత నేను కూడా ఈ సాహితీస్రవంతిలో భాగం కావాలని అనుకున్నాను.
ఇది నేను తెలుగులో రాసిన మొట్టమొదటి ఈమెయిల్. చాలా సంతోషంగా వుంది.
నేను రాసిన కొన్ని కవితలు మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఎలా పంపాలో తెలుపగలరు.
సమంజసం కానిది విశ్వనాథ వారి కవితావైభవాన్ని చెప్పడానికి ఎన్నో గొప్ప పద్యరత్నాలున్న కావ్యంలోనుంచి “చున్‌కే చున్‌కే” ఈ పద్యాన్నేఎన్నుకోవడం. సమంజసం కానిది, సరదాకో దురదకో ఎక్కడో ఉన్న ఇట్లాంటి పద్యాన్ని పట్టుకొని విశ్వనాథ కవిత్వాన్ని, చాతుర్యాన్ని తెలుసుకోవడానికి ఇదొక మెతుకువంటిదని ఎత్తిచూపడం. సమంజసం కానిది, “నిర్వీర్యం” అన్న పదానికి లింగవివక్షతను ఆపాదించడం. సమంజసం కానిది, పద్యాన్ని వొదిలేసి ఇంకొకరి బుద్ధి ఎటు పారలేదో, పారాలో చర్చించడం.
“తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచు బ్రదుకులు తనవిగాన
చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెదనేనును, నా భక్తి రచనలు నావి గాన”
అని పదికాలాల పాటు గుర్తుండేటట్లుగా చెప్పిన విశ్వనాథ గారి పద్యం చదివిన తరువాత, అంతకంటే సమంజసమైనది,తలచినప్పుడల్లా పరవశింపజేసేది, ఆలోచనామృతాన్ని అందజేసేది, కలకాలం నిలిచిపోయే “రామచరితమానస”లో తులసీదాసు చెప్పిన మాటలు.
“నిజ గిరా పావని కరన కారణి రామ జసు తులసీకరో
రఘువీర చరిత అపార వారధి పార కవి కౌనేరయో”” నా వాక్కును (గిరా) పావనం చేసుకోవడం కోసమే రాముని చరితను చెప్పడం. అపారమైన సముద్రం వంటి రఘువీరుని చరితను ఏ కవి అయినా, కాదు, ఎందరు కవులైనా సరే, (వర్ణించి) దాటగాలరా?!”
__________
విధేయుడు
-Srinivas
ముక్కుకోయడమంటే లైలా గారు “ఊహించినట్టు” మొదలుకంటా నరికిపారేయడము కాదు.దానికి ఒక పద్ధతి పాడూ ఉన్నాయి.మనతెలుగులో సామెతకూడా ఉంది.ముక్కు కోసి సున్నం పెడతాను అని;మొదలు కంటా నరికితే ఇంక సున్నం ఎక్కడ పెడతారు?? అంతే గాక Rhinoplasty (తెగిన ముక్కునతికే శస్త్ర చికిత్స) ప్రాచీన భారతంలో ప్రచలితమైన శస్త్రచికిత్సల్లో ఒకటి.(శుశ్రుత సంహిత లో విపులంగా వర్ణించారు). రావణుడు కూడా శూర్పణఖకు అటువంటి ముక్కు పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేయించాడు. ముక్కు పుటాలు లేకపోతే ఈ చికిత్స కుదరదు అన్న విషయం స్వయాన వైద్యులైన లైలా ఎర్నేని (ఈ పేరు చూసి గాభరా పడతాను. లైలా శుద్ధంగా హీబ్రూ పదము ,ఎర్నేని తెలుగు ఇంటిపేరు) గారికి తెలియని విషయం కాదు.
“ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.) “ కావున ,లైలా గారి రాతల్లో పసలేదు. ఏదో “ఒక ఠస్సా వేసి రంజింపజేద్దామనుకొన్నారు” కానీ అది కుదరలేదు. కామేశ్వరుల వ్యాఖ్యల్లో పొసగనిది శూర్పణఖ నిర్వీర్యురాలు (వీర్యముండేది పురుషులకు; నిశ్చేష్టురాలు అంటే బాగుండేది) కావడం,ఒక డాక్టర్గా లైలా గారు దీన్ని ఎత్తిచూపవలసింది.కానీ వితండవాదంలో తర్కం వెనుకబడుతుంది.కావున వారి బుద్ధి అటు పారలేదు.
విశ్వనాథ తరఫునో లేదా బృందావనరావుగారి తరఫునో వకాల్తా పుచ్చుకొని వాదించడానికి నేను రాలేదు. లైలాగారి అభిప్రాయాన్ని తప్పుపట్టాలన్న ఉద్దేశమూ లేదు. -Kameswara Rao
ఈ పై వాక్యాల నిర్మాణం నాకు ఆసక్తిని కలిగించింది.
విశ్వనాథ, బృందావనరావు, లైలా – వీరెవ్వరి తరుఫున నేను వాదించటానికి రాలేదు. ఎవరి అభిప్రాయాన్ని తప్పు పట్టాలని లేదు – అని వీరు వ్రాసి ఉండవచ్చును. కాని వారు అలా అనలేదు. ఎందువల్ల అలా అనలేదు. ఇలానే ఎందుకు అన్నారు? అన్న అనుమానం లీలగా కలుగుతుంది నాకు. 😉 కామేశ్వరరావు లాటి భాషాప్రవీణులు ఆషామాషీగా రాయరు. అంచేత నాకు అలాటి అనుమానం వస్తుంది.
ఐతేయేం, పద్య సందర్భం విపులంగా వర్ణించారు. శూర్పణఖ, ఖరుని మనస్థితులను (పుస్తకంలో లేకున్నా) తెలియజెప్పారు. సంతోషంగా చదువుకున్నాను.
కానీ, “శూర్పణఖని చూసిన ఖరుడు మొదటగా అనే పద్యం ఇది:” అంటూ ఇవ్వబడిన విశ్వనాధ ఈ క్రింది పద్యం కూడా నాకు నచ్చలేదు. 😉
ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.
లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.)
పదాల ప్రయోగానికి ఉదాహరణలు కొన్ని కొన్ని పదాలకి బ్రౌణ్యంలో కనిపిస్తాయి. శబ్దరత్నాకరం ప్రధానంగా ప్రాచీన కావ్య భాషని దృష్టిలో పెట్టుకొని తయారుచెయ్యబడింది కాబట్టి కావ్యాలలోని ప్రయోగాలు కొన్ని పదాలకి అందులో ఉన్నాయి. ప్రతి పదానికీ ప్రయోగాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే చాలా పెద్ద నిఘంటువు తయారవుతుంది. నేను మళ్ళీ అడిగిన మొదటి ప్రశ్ననే అడుగుతాను. అలాంటి నిఘంటువు ఎవరికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది?
పర్యాయపదకోశాలు పెద్దవేమైనా తెలుగులో ఉన్నాయా అన్నది నాకు తెలియదు కాని “విద్యార్థికల్పతరువు”లో పర్యాయపదాలూ, నానార్థాలూ ఉంటాయి. ఇంటర్నెట్లో Search సౌలభ్యం ఉన్న నిఘంటువులు ఇంచుమించు Thesaurus ప్రయోజనాన్ని అందిస్తాయి. ఏదైనా పదానికి సంబంధించిన పర్యాయపదాలు కావలిస్తే ఆ పదంతో Search చేస్తే సరిపోతుంది. పదకేళి నింపడానికి ఇంటర్నెట్లో ఉన్న బ్రౌణ్యం ఉపయోగించేవాళ్ళకి ఈ విషయం అనుభవమే. అంచేత ప్రత్యేకించి పర్యాయపదకోశాలు ఇంటర్నెట్లో అవసరం లేదనుకుంటాను.
ఇంటర్నెట్లో బ్రౌణ్యం కాకుండా మరో రెండు ఉపయోగకరమైన సైట్లు:
ఈ రెంటికీ Search సౌలభ్యం ఉంది.
నా దృష్టిలో ముఖ్యంగా డిజిటైజ్ చెయ్యాల్సిన నిఘంటువులు మాండలిక పదకోశాలు, వృత్తిపదకోశాలు. వీటి ద్వారా ఈ లాభాలుంటాయి (ముఖ్యంగా ఇంటర్నెట్లో వస్తున్న సాహిత్యానికి):
మాండలికంలో రచనలు చేసేవాళ్ళకీ చదివేవాళ్ళకీ చాలా సౌకర్యంగా ఉంటుంది. అటువంటి రచనలకి మంచి ప్రోత్సాహం కలుగుతుంది.
వృత్తి పదకోశాల ద్వారా చాలా మరుగున పడిపోయిన పదాలు తెలుస్తాయి. అవి తెలియక వాటి స్థానంలో ఇంగ్లీషు పదాలని వాడే చోట్ల మళ్ళీ ఆ తెలుగు పదాలకి వాడుక కలిగే అవకాశం ఉంది.
కొత్త సాంకేతిక పదాలు సృస్ఠించుకోడానికి ఇప్పటికే ఉన్న వృత్తిపదకోశాలు దారి చూపిస్తాయి.
మాండలిక, వృత్తి పదకోశాలు కొన్ని Digital Libraryలో ఉన్నాయి కాని వాటికి Search సౌలభ్యం లేకపోవడంతో వాడటానికి అనువుగా లేవు. వాటిని యూనీకోడీకరించి Searchable చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీని గురించి నలుగురూ ఆలోచిస్తే మంచిది.
ఈ మధ్య నా బ్రతుకు “సత్రవ భోజనం, మఠం నిద్ర” లా తయారయింది. అందువల్ల నా వ్యాసం మీద వచ్చిన అభిప్రాయలనీ, విమర్శలనీ చదివినా సమయపాలనతో స్పందించలేకపోతున్నాను. తెలుగులో ఆధునిక అవసరాలకి సరిపోయే సమగ్రమైన పదసంపద లేదని నాకు తెలుసు. Coordinate అన్న మాటకి సరి అయిన మాట కోసం తడబడ్డాను, నిజమే. అది నా తప్పే. మరికొంచెం జాగ్రత్త తీసుకుని ఉండవలసింది. ఇలాంటి చిక్కులు వస్తాయనే ప్రత్యేకమైన మాటలన్నిటికీ పక్కన కుండలీకరణాలు వేసి ఇంగ్లీషులో వాటి సమానార్ధకాలు రాయటం జరిగింది. వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా.
తెలుగు అకాడమీ వారు ప్రచురించిన మాటలు వాడలేదని నన్ను నిందించవద్దు. తెలుగు అకాడెమీ వారు హుకుం జారీ చేసినట్లు సమానార్ధకాల పట్టికలు ఇచ్చేరేమో కాని వాటి వాడకం సోదాహరణంగా చూపించినట్లు లేదు. నేను నా రాతలలో ఏ కొత్త ప్రయోగం చేసినా అది సోదాహరణంగా వాడి చూపించేను.
పోగా, ప్రోటాన్, నూట్రాన్ మొదలైన మాటలని అలా వదిలెస్తేనే బాగుంటుందని రోహిణీ ప్రసాదు సూచించేరు. నిజమే. ఆ మాటలు వాడవలసి వచ్చినప్పుడు మూడొంతులు ఇంగ్లీషు మాటలే వాడతానేమో. అనవసరంగా, సందర్భశుద్ధి లేకుండా పిల్లిని మార్జాలం అన్నా, కోతిని మర్కటం అన్నా బెడిసికొడుతుంది. కాదనను. కాని “”మేనిఫోల్డ్” ని మేనిఫోల్డు అంటే ఎంతమంది తెలుగువారికి అర్ధం అవుతుంది? బిందుసమూహం అంటే ఎంతమందికి్ అర్ధం అవుతుంది? ఆలోచించండి.
“ఇంగ్లీషు ప్రపంచ భాషలన్నిటి నుండి మాటల్ని స్వీకరించి తనలో కలుపుకుంటోంది. అలాగే ఇంగ్లీషు వృద్ధి చెందుతోంది. మనం మాత్రం ఎందుకు అలా చెయ్యకూడదు?” అని అడిగేవారున్నారు. తప్పకుండా. ఇంగ్లీషులా మనం ప్రపంచ భాషలన్నిటినుండి స్వీకరించి, వాటికి తెలుగుతనం ఇచ్చి స్వీకరిస్తే నేను ఆక్షేపించను. అంతేకాని “హోలుమొత్తం” మీద ఇంగ్లీషుమాటలని దిగుమతి చేసేసి, ఇంగ్లీషు వ్యాకరణం రాక ఈ ఇంగ్లీషు మాటలకి తెలుగు విభక్తులని, క్రియలని చేర్చి సంకర భాష చేస్తే అటు ఇంగ్లీషూ రాక, ఇటు తెలుగూ రాక రెండింటికీ చెడ్డ రేవడులమవుతున్నామేమో అని నా బెంగ.
రోహిణీప్రసాదు చెప్పిన మరొక అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. జనరంజక శైలి (popular style) లో రాసేటప్పుడు పాఠ్యపుస్తకాలలా “జోకొట్టి నిద్రపుచ్చే” శైలిలో రాయక్కరలేదు. ఇక్కడ పాఠకుDiని ఆకట్టుకోవటం ముఖ్యం. ఈ విషయం కూడ ఆలోచించండి.
అర్థాలు చెప్పి వాటికి పద్యాలనుదహరించే నిఘంటువులున్నాయి. కాని, పదాలు సరిగ్గా, అందంగా, స్పష్టంగా వచనంలో వాడడానికి సూచనలిచ్చే నిఘంటువులు లేవు, English లో usages చెప్పినట్లు. చిన్ని ఉదాహరణ: చెరువుకు “గండి” పడి వరదలు అని వార్త. “గండి” కి 1)బిలము 2) రంధ్రము 3) సందు 4)నీళ్ళు ఎక్కువైనప్పుడు కట్ట తెగుట అర్థాలు ఉన్నాయి(శబ్దరత్నాకరములో) . 4వ అర్థమే ఎక్కువగా వాడడం తెలుసు. ఒక గోడకో, బట్టకో రంధ్రం పడితే “గండి పడింది” అనడం వినలేదు_అనొచ్చో లేదోతెలియదు. Usages ఇస్తే ఇట్లాంటివి మెరుగ్గా తెలుసుకునే అవకాశం ఉందనిపిస్తుంది.
తెలియని పదాల అర్థాలనే కాక, తెలిసినట్టు అనిపించే పదాలు సైతం సార్థకంగా వాడడానికి నిఘంటువులు ఉపయోగపడుతాయి కదా. ఆ దృష్టితో ఇంకొంత సాయం చేయడానికి, భాష వాడుకను మరింత పటిష్టపరుస్తూ చేయూత నివ్వడానికి మార్గదర్శకంగా కొత్త నిఘంటువులు ఉంటే లాభం అని కూడా అనిపిస్తుంది.
_________
విధేయుడు
Srinivas
“తెలుగుఁ వారికిఁ జాలినంత తెలుఁగుబాస కలదు; వారు పరభాషా దాస్యమునకుఁ జేతులొగ్గవలసినది లేదు” అంటు, “అచ్చతెలుగు కోశము” (రెండు సంపుటాలు) ని 1979 లో పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి (శ్రీ శ్రీనివాస భవనశ్రీ – నెం 22-7-7, మోటుపల్లి వారి వీధి, కొత్తపేట, తెనాలి-522 201, గుంటూరు జిల్లా, ఆం. ప్రదేశ్ ) గారు వెలువరించారు. ఆవుల సాంబశివరావు గారు కృతికర్త. ధర (50+50) వంద రూపాయలు.
మనకి నిఘంటువులు లేకపోలేదు. కాని వాటిని పట్టించుకుంటున్నామా అన్నది ప్రశ్న.
ఇంత చర్చా అయ్యాక ఇప్పుడు నేనడిగేది చొప్పదంటు ప్రశ్నలా ఉంటుందేమో కాని, అడక్కుండా ఉండలేకున్నాను. ఇక్కడ చర్చిస్తున్న ఈ నిఘంటువులు అసలు ఎవరికోసం?
బడిలో పిల్లలకోసమా? వాళ్ళకి తెలుగు నిఘంటువు చూసే అవసరమూ తీరికా రెండూ లేవు.
తెలుగు చెప్పే పంతుళ్ళకీ, తెలుగు సాహిత్యాభిమానులకీనా? వీళ్ళకైతే ప్రాచీన కావ్యాలని అర్థం చేసుకోడానికి తప్పిస్తే వేరే ఏమైనా అవసరం ఉంటుందా? దానికి ఇప్పటికే ఉన్న శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువు సరిపోతాయి కదా? (పరుచూరిగారు చెప్పినట్టు, సూ.ని. అచ్చులోనే ఉంది నాలుగేళ్ళ కిందటివరకూ)
పోనీ తెలుగు టీవీ, పేపర్ల జర్నలిస్టులకా? హహహ 🙂
ఇక మిగిలింది తెలుగురాని వాళ్ళు తెలుగు నేర్చుకోడానికి. సాధారణమైన తెలుగు పదాలకి అర్థాలు కావాలంటే బ్రౌణ్యం 90% వరకూ సరిపోతుందనే అనుకుంటాను. బ్రిటిషు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత, తెలుగులో సృష్టించబడ్డ కొత్తపదాలన్నీ ఇంచుమించుగా ఇంగ్లీషునుంచి వచ్చినవే కాబట్టి వాటిని అర్థం చేసుకోడం పెద్ద కష్టం కాదు. మరీ సంస్కృత పదాలైతే సూ.ని సరిపోతుంది. మాండలిక పదాలైతే ఆయా పదకోశాలు తిరగెయ్యాలి.
ఇంకా కొత్త నిఘంటువులు ఎవరికోసం చెప్పండి?
అంచేత నా ఉద్దేశంలో కొత్త నిఘంటువు కోసం ఆలోచించే కన్నా, ఉన్నవాటిని డిజిటైజ్ చేసి ఇంటర్నెట్లో పెట్టే ప్రయత్నం అత్యుత్తమమైంది. దీనికి నేను సైతం ఏమైనా చెయ్యడానికి సిద్ధం.
ముందు రమ గారు, రవికిరణ్ గారు, పురాణాల, కవిత్వాల ప్రస్తావనపై లేవనెత్తిన అభ్యంతరాల గురించి ఓ రెండు మాటలు. విశ్వం గురించి మానవుడు అనాదిగా ఆలోచిస్తూ ఉండాలి. ఆ భావనలు కొన్ని పురాణ గాథల్లో, మత గ్రంథాల్లో ఏదో ఒక రూపంలో ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాటి పరిణామం గురించి రాసేటప్పుడు ఆ కథలని ప్రస్తావించడంలో తప్పు లేదు. వాస్తవానికి ఇది పాపులర్ సైన్సులో వాడుక కూడాను. కాల స్వరూపం గురించి రాస్తూ Hawking ఏమంటాడో చూడండి [1]:
“In Newtonian theory, where time existed independently of anything else, one could ask: What did God do before He created the universe? As Saint Augustine said, one should not joke about this, as did a man who said, “He was preparing Hell for those who pry too deep.” It is a serious question that people have pondered down the ages. According to Saint Augustine, before God made heaven and earth, He did not make anything at all. In fact, this is very close to modern ideas.”
అంత మాత్రాన Saint Augustine సైంటిస్టయిపోడనుకోండి. కాని చరిత్రా, చమత్కారమూ కలిస్తే సైన్సు మీద ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది.
అదే పుస్తకంలో, విశ్వానికి అనేక చరిత్రలు, ఒక దానిలో మరొకటి ఇమిడి ఉన్నాయనే సిద్ధాంతాన్ని వివరించడానికి, Hamlet మాటలు వాడుకున్నాడు: “I could be bounded in a nutshell and count myself a king of infinite space.” ఆ అధ్యాయాన్ని ముగిస్తూ, “In this chapter we have seen how the behavior of the vast universe can be understood in terms of its history in imaginary time, which is a tiny, slightly flattened sphere. It’s like Hamlet’s nutshell, yet this nut encodes everything that happens in real time. So Hamlet was quite right. We could be bounded in a nutshell and still count ourselves kings of infinite space.”
Shakespeare కి modern physics తెలుసని కాదు; భావాల్లో కొంత సారూప్యం ఉంది; మనసుకి హత్తుకునేట్లు కవులకి మించి మరెవరూ చెప్పలేరు కనుక వాళ్ళ భాష వాడుకోవడం మంచిదే. ఏమాటకామాటే చెప్పాలి, వేమూరి గారిచ్చిన మన పురాణాలలోని వివరాలు Hawking సోదాహరణాల్లా హత్తుకునేటట్లు లేవు.
ఇక అసలు విషయానికొస్తే, సైన్సు విషయాలని ఆసక్తికరంగా చక్కటి తెలుగులో రాసేవారిలో చెప్పుకోదగ్గవారు వేమూరి. ఈ వ్యాస విషయం సైన్సు చదివిన వాళ్ళకి కూడా అంత సులభంగా కొరుకుడు పడేది కాదు. అంత క్లిష్టమైన దానిని వివరించడం మెచ్చుకోదగ్గ ప్రయత్నం. దానిపై ఇంకాస్త విపులంగా తీరిక దొరికినపుడు రాస్తాను.
కొడవళ్ల హనుమంతరావు
[1] “The Universe in a Nutshell,” by Stephen Hawking. Bantam Books, 2001.
రాగాల గురించి నాకేమీ తెలియదు. పాటలు వింటానికి చాలా బావున్నాయి. జాషువా పద్యాలు అమోఘం. పరిచయం చేసినందుకు లక్ష్మన్న గారికి కృతజ్ఞతలు. “శిశువు” లోని పద్యాలని ప్రస్తావిస్తూ, ముఖ్యంగా కొన్ని సీస పద్యాలు శ్రీనాథుడి పద్యాలకి సమవుజ్జీలని జయప్రభ కొనియాడారు [1].
పై పద్యాల్లో ఒకటి రెండు పొరబాట్లు దొర్లినట్లుంది. విశాలాంధ్ర ప్రచురణ ప్రకారం, “రసవార్ధి తరియించ వచ్చిన పరదేశి,” కి బదులు “ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి,” అని ఉండాలి. రెండోదే సబబనిపిస్తోంది.
“ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని, ఇప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు!” అన్న జాషువానే మరికొన్నేళ్ళకి, “పసితనము” ను [2] తలపోస్తూ,
“మాది గొప్ప జన్మ నావంశమే దొడ్డ
వంశమన్న అహము బలిసె నిపుడు
యెంత చదువుకొన్న నీ భేద భావం
వదల దేమి చేయ వలయు నేను.
పూచిన వనముల జూచిన
పూచెన్నా మనసు బాల్యమున, నా కిపుడా
పూచిన వనముల కాలన్
రాచెడు నీర్ష్యానలంబు రగలు నదేమో.”
కొడవళ్ళ హనుమంతరావు
[1] జాషువా ని మెచ్చుకుంటూనే లోపాలు చూపెట్టిన “పద్యానికి…అభ్యుదయానికి పర్యాయం జాషువా,” అన్న మంచి వ్యాసం. (ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట ఆశ్చర్యార్థకం పెట్టడం మాత్రం చదివేవాళ్ళలో అసహనాన్ని కలిగిస్తుంది.) “మార్గము – మార్గణము (సాహిత్య వ్యాసాలు),” 2003.
[2] “జాషువా రచనలు – నాల్గవ సంపుటం. ఖండ కావ్యాలు, ఏడు భాగాలు”, విశాలాంధ్ర, 2008.
నేను కూడా పదవ తరగతి వరకు తెలుగు మీడియమ్ లోనే చదివి, పదకొండో తరగతినించి ఇంగ్లీషు మీడియంలో చదివేను. కళాశాలలోనూ, ఆ తర్వాత మదరాసులో ఉద్యోగంలోనూ భారతీయ భాషలతో అంత అవసరం లేకుండా ఆంగ్లంతోనే పనిజరిగిపొయ్యేది. ఐనా కూడా పదానికి పదం తెలుగు నుంచి ఆంగ్లానికి తర్జుమా చేసుకోకపోయినా, కాన్షియష్ ఆలోచనలు మాత్రం తెలుగులోనే వుండేవి ఈ అమెరికాకొచ్చిందాకా. బహుశా ఆ కారణం వలననే మాతృభాషలో విధ్యా భోదన అవసరవని నా అభిప్రాయం. తను చదివేది, తరగతిలో అయ్యవారి ముఖతా తనువినేది, ఆ రెండింటిని సమన్వయం చేస్తూ తను అర్థంచేసుకుని ఆలోచించేది ఒకే భాషలో జరిగితే విద్యార్థికి అవగాహన మరింత విశాలంగానూ, లోతుగానూ వుంటుందనేది వాస్తవం. ఆ దిశలో పాఠశాలల్లో తెలుగు భోధన అవసరం.
ఐతే మన తెలుగు భాషాభివృద్దిలో ఒక భాగం కాని శాస్త్రాలెన్నో ఈరోజు పాఠశాల సిలబస్ లో భాగంగా వున్నాయి. ఆ కారణం వలన ఆ శాస్త్ర పఠనానికి సంబందించిన పదాలు తెలుగులో లేవు. వాటిని అచ్చతెలుగులో సృష్టించినందువలన అవి మన అవగాహనని సరళతరం చెయ్యవు. నలుగురూ వాడే సాధారణ తెలుగు నుంచి డిరైవ్ చేసిన పదవైతే ఖచ్చితంగా అవగాహనని సరళం చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడో అదృశ్యవైపోయిన తెలుగు పదాలనించి ఉత్పత్తి చేసిన అధునిక శాస్త్ర పదకోశం ఆ దిశలో ఏవీ ఉపయోగ పడదని నా అభిప్రాయం.
ఇప్పుడు మన తెలుగు అకాడమీ శాస్త్ర పదకోశం ప్రచురించినవి పోనీ తెలుగు పదాలు కావు (ఆ విధంగా తెలుగు చావనిజమ్ కూడా తమిళ మూర్ఖత్వంతో పోటీ పదడానికి), సంస్కృత పదాలు. నాకు తెలిసినంతవరకు (ఎక్కడన్నా, అక్కడక్కడా మార్పులుండొచ్చు) అవి తెలుగు పదకోశాలే కాదు, ఒరియా మొదలైన పదకోశాలు కూడా. నా అనుమానం (దీనిమీద ఎవరైనా ఒక వ్యాసం వ్రాస్తే బాగుండు) అవి భారతీయ భాషలన్నిటిలో అవే సంస్కృత పదాలు. అందువలన ఆ సంస్కృత పదాలని తెలుగులో తెలుగు అకాడమీ చేత బలవంతంగా చొప్పిచ్చినందువలన చదువుకునే పిలకాయల అవగాహనలేవీ ఆకాశంలోకి పోవు. వర్టీబ్రా, ఇన్ వర్టీబ్రా అని చదువుకుంటే ఆ పదాల రూట్ మరికొన్ని ఆంగ్ల పదాలని అర్థం చేసుకోడానికి వుంటుంది. కానీ సకసేరుకాలు, అకసేరుకాలు అనే తెలుగు కాదు సంస్కృత పదాలవలన జరిగే మంచి ఏవిటి? గిరీశం అన్నట్టు ఆంగ్లపదం ఎంత అర్థవవుతుందో, తెలుగు (సంస్కృత) పదం కూదా అంతే అర్థవవుతుంది అనాలుంది. కానీ నిజవేవిటంటే ఆంగ్ల పదం అర్థం తెలుసుకుంటే దాన్నుంచి మరిన్ని ఆంగ్ల పదాలు అర్థవవుతాయి సాధారణ సంభాషణలో ఉపయోగానికి, సంస్కృత పదం కనీసం ఆమాత్రం ఉపయోగాన్ని కూడా ఇవ్వదు. ఆంగ్లపదం ప్రపంచ వ్యాప్తంగా (కనీసం మెజారిటీ భాషల్లో) వుంది ఆయా శాస్త్రాల్లో, సంస్కృత పదం సకసేరుకాలకి మరో ఉపయోగవేవీ లేదు. తెలుగు టెక్స్టు బుక్కుని దాటి, మరో స్టాండర్డ్ ప్రచురణ ఏదన్నా చదవాలంటే తెలుగు మీడియం స్టూడెంటు నానా కష్టాలు పడాలి, ఆ శాస్త్ర పదకోశాన్ని నేర్చుకోవడానికి.
ఏదో ఒకదగ్గరనుంచి, తెలుగు కాని మరో భాషనించి తెలుగులోకి పదాల్ని అరువు తీసుకునేప్పుడు, ఆంగ్లం అంత అంటరానిది, సంస్కృతం అంత అణకవైనది ఎలాగయ్యిందో. ఆంగ్లం కూడా వాటిని చాలావరకు లేటిన్ నుంచి అరువు తెచ్చుకున్నదే కదా. పోనీ సంస్కృతంలో ఆ శాస్త్రాలన్నీ ఇంతకుముందే అభివృద్ది చెందున్నాయా, ఆ శాస్త్ర పదకోశవంతా విరివిగా వినియోగంలో వుందా? లేదు కదా, అక్కడకూడా నానా రకాలుగా సంకరంచేస్తే తప్ప ఆ పద స్రృష్టి కాదు కదా. ఎందుకా ప్రయాస, దానివలన తెలుగు భాషకొచ్చిన ఉపయోగవేవీ పెద్ద లేదుకదా. తమిలమోళ్ళు మడి కట్టుకున్నారా, కట్టుకున్నారు కాబట్టే పదహారు అక్షరాల్తో ఆగిపొయ్యారు. కట్టుకున్నారు కాబట్టే బేంక్ ఆఫ్ బరోడాని, పేంగ్ ఆఫ్ పరోటా అనికూడా అనగలరు. ఆ ఖర్మ తెలుగుకి కూడా అవసరవా? అరవోళ్ళ ఆగాన్ని చూసి ముచ్చట పడే తెలుగు ప్రేమికులు, తెలుగుని కూడా ఆవిధంగా దిగజార్చదలుచుకున్నారా?
నా మనసులో వున్నది, ఇప్పుడా, రేపా అనుకునే నా మెమొరి సెల్స్ లో మిగిలున్నదేదో పెట్టి ఒక్కలు ముక్కలుగా ఈ అభిప్రాయం వ్రాయడం జరిగింది. భాష మీదే కాక, భాషా శాస్త్రం మీద కూడా పట్టున్న కొలిచాల సురేశ్ లాంటివాళ్ళో, ముప్పై రెండు, అరవై నాలుగు రెఫెరెన్సులు చూసి, సరళవైన తెలుగులో చులాగ్గా వ్రాయగల్గిన బ్రహ్మానందం గోర్తి (త్యాగ రాజు మీద మీ వ్యాసాలు బ్రంహ్మాండం సార్ ) లాంటి వాళ్ళో, కాకపోతే ఆంధ్రాంగ్లాల్నే కాక భౌతిక శాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టిన వేలూరి లాంటి వాళ్ళో ఈ తెలుగు పదకోశం పుష్ చేసే సంస్కృత పదాల మీద ఒక పరిశోధక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది కదా అని ఆశ.
చాలా మంచి అంశం, అవసరమయ్యే విషయంపై వ్యాసం. చాలా కృతజ్ఞతలు.
తెలుగు నిఘంటువు అంటే ఒకే రకం font, style లో అచ్చేసిన అక్షరాల కుప్ప అనుకునే నాకు, తూమాటి దొణ్ణప్ప గారు పిల్లలకోసమని చేసిన కృషి బాగా నచ్చింది. పదాలకు సరళమైన అర్థాలేకాక, వీలైనన్ని బొమ్మలు ఇవ్వడం వారి నిఘంటువులో మాత్రమేనేమో తెలియదు. ఇంకా మెరుగైన నిఘంటువులు కావాలి, రావాలి. ఏది బాగుందో తేల్చుకోవడం, పోల్చుకోవడం choice ఉంటేనే! చెట్లు లేని కాడ ఆముదం చెట్టే గొప్ప చందాన దొరికిందే భాగ్యం ఇప్పటి స్థితి.
ఇంగ్లీషు సామెత “Use it or lose it” అన్నది ఒక్క physical abilities, mental abilities కు మాత్రమే కాదనిపిస్తుంది. పదాలు జనాలు వాడితేనే నిలుస్తాయి. సరిగ్గా వాడడానికి మంచి నిఘంటువుకు మించిన సాయం లేదు. తెలుగు భాషాజ్ఞానం ఎక్కువగా ఉన్న తక్కువమంది తోనే ఇది సాధ్యం. సంస్థలు సంఘాలు, ఎకాడమీలు ప్రోత్సాహం, డబ్బు ఇచ్చినా_ అసలు ఇంకే పని చేసినా ఎక్కువ డబ్బులు, పేరు వచ్చే రోజుల్లో_ ఈ పని నెత్తుకెత్తుకునే తెగువ, స్ఫూర్తి, దానికోసం సుధీర్ఘంగా శ్రమించే శక్తి, పూర్తికాకుండా పంచుకోవడానికి వీలుకాని ప్రాజెక్టు వ్రతం_ అంతా నిస్వార్థ భాషాసేవ అని కూడా అనిపిస్తుంది!
_____
విధేయుడు
_Srinivas
నా జీవితాశయాల చిట్టాలో ఒకటి ఇఞుఇట్టు వారి నునావట్టులో ధృవరేఖ పైన ఒక రోజు గడపడం. వేసవిలో సుమండి! కాబట్టి ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది.
‘కథ’ అద్బుతంగా వుంది. ఇది కథ మాత్రమే అవ్వడం నన్ను కాస్త నిరాశ పఱచింది. వ్యాఖ్యలు చదివే వఱకూ ఇది కథ కాదేమో అనుకున్నాను. అలా అనుకుంటూనే ఇంకో ప్రక్క ఇలాంటి సాహసం చేసి బ్రతికి బట్ట కట్టడం, లేదా బ్రతికి తెలివిలో వుండడం అన్నది అసంభవం అని తెలుస్తూనే వుంది. అంతటి నిత్యనిశిలో ఏకాంతాన ఎవ్వరూ ఎవ్వరూ వుండలేరు! సదా చీఁకటిలో! ఇక్కడ మీరు బయటకి వెళ్ళి శబ్దం కోసం అన్వేషించడం కథనంలో ఇమడలేదనిపించింది. అంత చీఁకటిలో మీరు ఎలా అన్వేషిస్తారు? ఏదైనా మీకు ఎలా కనబడుతుంది? శబ్దం మీలోవుంది సరేఁ, కానీ బయటకు వెళ్ళి చీఁకటి వల్ల శోధించలేక పోయానంటే కుదిరేదేమో.
మేరు పర్వతం వంటి వాని గుఱించి, బృహదృక్షము వంటి వాని గుఱించి మీరు చేసిన ప్రస్తావన ఈ కథకు మూలం (నా దృష్టిలో అది లేకపోతే ఈ కథే లేదు). పథం అని వ్రాసేదానికి పధం అని వ్రాసారు. నేను నిఘంటువు వెదకి మోసపోయాను.
ముగుంపు గుఱించి మీ అభిప్రాయమే నాదీను. ఆఖరు వాక్యం వుండరానిది. బయట గోకుడు అనగానే నేనూ ఎలుగుగొడ్డే అనుకున్నాను. వాటి శీతనిద్ర గుర్తుచేశాక అది అసంభవం అని తేలిపోయింది. పైపెచ్చు బృహదృక్ష ప్రస్తావన అప్పుడే తెచ్చారు కాబట్టి, ఇది ఖచ్చితంగా మీ మనసులోని ఎలుగుబంటేనని తేలికగానే గుర్తించ వచ్చుఁ!
ఈ కథలో మనుషుల మానసికాంశాలకు పెద్ద పీట అన్నది కొందరు పాఠకులు గుర్తించలేరేమో. తెలుఁగులో సైకలాజికల్ థ్రిల్లర్ల అవసరం వుంది 🙂
తెలుఁగులో లోకానికి సుదూరమైన లోకాల గుఱించి అచ్చ తెలుఁగులో మీరు వ్రాసే అద్భుతమైన కథల పుస్తకం త్వరలో లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
ఇలాంటి కథతో Into the Wild అనే మంచి సినిమా సైతం వున్నది.
నేను ముసునూరివారి లఘుశబ్దార్థదీపికతో ప్రస్తుతం పనికానిస్తున్నాను. ఇది నాకు హైదరాబాద్‌లో 1982లో 20 రూపాయలకే దొరికింది. ఆ తరవాత 1997లో తెలుగు యూనివర్సిటీతో సంబంధం ఏర్పడినప్పుడు సూర్యారాయాంధ్ర నిఘంటువు ఆరు సంపుటాలూ కొనుక్కున్నాను. అక్కడి మిత్రులు మంచి డిస్కౌంట్ కూడా ఇప్పించారు. సూర్యారాయాంధ్ర నిఘంటువు చూస్తున్నప్పుడు మనం కొన్ని పదాలకి మామూలుగా అనుకునే అర్థాలు తప్పనీ, అసలు అర్థం వేరే ఉందనీ తెలిసేది. ఇవికాక చిన్నవి thesaurus వంటివి కూడా దుకాణాల్లో దొరుకుతున్నాయి. కొంతవరకూ వీటితో పని జరిగిపోతుంది. నిఘంటువులు దగ్గరుండడం తెలుగు రాయడం, చదవడం చేసేవారికి చాలా ఉపయోగకరమే. ఆన్‌లైన్ సదుపాయం ఎప్పుడో ఒకప్పుడు ఏర్పడుతుందనే అనుకుంటున్నాను. సామాన్యంగా రచయిత మరణించిన 50 ఏళ్ళ తరవాత కాపీరైట్ ఉండదు. అంతవరకూ రచయిత వారసుల హక్కులను గౌరవించడంలో తప్పులేదనుకుంటాను.
నేను కాలనిర్ణయ్‌లో ప్రచురించే వ్యాసాలకు రచయితలకూ, వారి వారసులకూ అడ్రస్ కనుక్కుని తప్పక పారితోషికం అందించే ఏర్పాట్లు చేస్తూ ఉంటాను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకసారి నేను పి.వి.నరసింహారావుగారి వ్యాసానికి అలా చెయ్యబోతే ఆయన జవాబు రాసి, సున్నితంగా అవసరం లేదని అన్నారు.
రమగారు, వేలూరిగారూ, పరుచూరిగారూ ఒక విషయం అర్థం కాదండీ – సంస్థల దగ్గర జనాల దానం డబ్బులున్నాయనా, లేక మన డబ్బులు ఖర్చు కాకూడదనా – చిన్నపనికీ, పెద్దపనికీ వాటి ప్రస్తావన ఊరకే ఎందుకు ? మన జేబులో డబ్బులు ఖర్చు కాకూడదు అని నియమం ఉన్నట్టయితే గాడిద కాళ్ళు కూడా పట్టుకోవచ్చు…..ఏ పనయినా ఒక వ్యక్తి మొదలెట్టాల్సిందే, సంస్థలు కాదు. అలా సంస్థలకోసం చకోర పక్షిలా ఎదురు చూడ్డం ఎక్కువయిన రోజు, కురిసే వానలు తక్కువైపోతాయి. సారాంశం అర్థమయ్యిందనే అనుకుంటున్నాను.
అసలు పనంటూ మొదలెడితే ఆసక్తి ఉన్న జనాలు, మీలాటి వారో, మరెవరో జేరతారూ. పనీ ఆటంకాలెదురయినా సాగుతుందీ. ముసునూరి వారు డబ్బులకోసం చూసుకుని ఉంటే, నిఘంటువూ ఉండేదీ కాదు -మీరు ఇప్పుడు ఆయన్ని తలచుకునేవారూ కాదు. ఒక వేళ మన సామర్థ్యం మీద మనకే నమ్మకం లేకపోతే – అంటే తగిన “టెక్నాలజీ” బలం లేదూ అనుకుంటే, చేసిన, చేస్తున్న పనిని ప్రూఫ్ రీడింగో ఏదో ఒకటి చేసి ఆ పనికి సాయపడొచ్చు. ఇంతలేసి దస్త్రాలు దస్త్రాలు కామెంట్లు రాసేవాళ్ళకు ఆమాత్రం సమయం దొరకకపోదు అని అనుకోను, అసలు సాయం చెయ్యాలి అనే తపనే లేకపోతే తప్ప.
దుమారాలు, గాలివి కానివ్వండి, ఇసుకవి కానివ్వండి, టెంటులో దూరిన ఒంటెల సంగతి పక్కన బెట్టి, ముందు కాపీరైట్ల సంగతి చూడాల్సిందే. ఎవడు కనిపెట్టాడో కానీ, ఈ కాపీరైట్లు (ఆపైన “ఇంటలెక్చువల్” మోసగాళ్ళనుంచి కాపాడుకోటానికి అని దానికో మేలిముసుగు) – సిద్ధాంతం, శాస్త్రం ప్రకారం ఒక అవిడియా తమరి బుర్రలో ఉన్నంతవరకే తమరిది, ఒకసారి దాన్ని బయటకు తోలేసాక ప్రపంచానిది. ఏం సిద్ధాంతమో, ఏం శాస్త్రమో ఆ ఏడుకొండలవాడికే తెలియాలె అంటే మటుకు, ఇక్కడ చిద్విలాసమే! సరే ఎలాగూ ఒకడు ఈ కాపీరైటు అనేది కనిపెట్టి గొర్రెల మంద మీదకు తోలాడూ, గొర్రెలు తలూపాయి, వాటివెంటే నడుస్తున్నాయి. మరి నాణ్యమయిన ఉన్ని కావాలంటే, ఆ గొర్రెల తోలు తీయాల్సిందే. అంటే కాపీరైటు తోలు తీయాల్సిందే. అంటే ఆ కాపరి వెనక పడాల్సిందే, ఊలు తెచ్చుకోవాల్సిందే.
ఉపయోగం సంగతి తరువాత, కొండెక్కినా, చెట్టెక్కినా చేసేదేమీ లేదు. కాపోతే ఓ పని చెయ్యచ్చండోయి, మన ఈమాట సంపాదక వర్గంలోని సభ్యులు, పెద్ద తలకాయలు పూనుకుంటే, పర్సనల్ ఇంఫ్లుయెన్సుతో , కాపరికి ఆశచూపో, అది కుదరకపోతే వాతలెట్టో దారికి తీసుకురావచ్చు. పూనుకోవాలి మరి. చెప్పొచ్చావులే ఆ పని చేసి చేతులు మూతులు ఇక్కడ కాల్చుకున్నోళ్ళు ఉన్నారు అంటే చేసేదేమీ లేదు. నాకు తెలిసిన వారితో ప్రయత్నం ఆరంభించాను. ఎంతవరకూ సాగ దీయగలనో చూస్తాను. ఆపైన ఒక గుంపులాటిదేదయినా మొదలెడితే రోజుకో గంట సమయం వెచ్చించగలను.
అదండీ క్ఌప్తంగా సంగతి (ఇదేంటీ ఇలా క్లుప్తం ఇలా రాశాడనుకుంటున్నారా? నేను ఎప్పుడూ ఇలానే రాస్తాను, మర్చిపోయిన ” ఌ ” ని గుర్తుచేసుకుంటూ) . ఇది రాయటానికి పట్టిన సమయం సుమారు 4 నిముషాలు. 4 నిముషాల్లో ఇంత రాయగలిగితే అరగంటలో ఏ పనికయినా ఇంకెంత సాయం చెయ్యొచ్చో అని అబ్బురపడవచ్చు. ఇంతే సంగతులు చిత్తగించవలెను. రేపు ఇదే టపాని మళ్ళీ వీక్షించి, ఎవరయినా సమాధానమో కార్యాచరణప్రణాలికో రాస్తే, దానికి సంసిద్ధత వ్యక్తం చేయటానికి సదా సిద్ధం అని తెలియచేసుకుంటూ
ఆకారాదిక్రమంలో వచనంలో తెలుగు నిఘంటువు అవసరాన్ని పరవస్తు (BTW his three mss were never published!), బహుజనపల్లిల కంటే ఒక 60-70 ఏళ్ళ ముందే గుర్తించిన మనిషి మామిడి వెంకయ్య. ఆయన తయారు చేసిన “ఆంధ్ర దీపిక” 1816 నాటికే అచ్చయ్యింది. Probably this is the first alphabetical dictionary in Indic languages.
తెలుగు నిఘంటువుల చరిత్రపైన చాలా పొడుగాటి వ్యాసమే రాయవచ్చు. A good summary is provided in: వెలగా వెంకటప్పయ్య “తెలుగు నిఘంటువికాసం” (తె.సా.అ,, హైదరాబాదు, 1975). This book also provides an extensive list of various dictionaries published in Telugu over 150 years.
“[సూర్యరాయాంధ్ర నిఘంటువు] ఆ తరువాత మళ్ళీ అచ్చువేసినట్టుగా లేదు” అన్న మాట కూడా నిజం కాదు. 1987 ప్రాంతం వరకు 8 సంపుటాలుగా, తరువాత 6 సంపుటాలుగా (కేవలం 300 రూపాయిలకే, దానిపైన మరల 10 శాతం రాయితీతో!) తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించి అమ్ముతున్నారు. గత 2-3 సంవత్సరాలలో చెప్పలేం కాని 2005-06 వరకు పూర్తి సెట్ మార్కెట్‌లో అందుబాటులో వుంది.
ముసునూరి వారి నిఘంటువులన్నీ (ఆయన 1971లో 2 భాగాలుగా చేసిన “ఆంధ్రనామ సర్వస్వము – అచ్చతెనుగు నిఘంటువు” కలుపుకొని) 2035 వరకు కాపీరైట్ చట్టం క్రిందకొస్తాయి. “కాపీరైటు వ్యవహారాలు పరిష్కరించడం మరీ కష్టమైన విషయం కాదు.” లాంటి వాక్యాలు రాయడం తేలిక. కొన్ని నిఘంటువులకి, చాలా పుస్తకాల పునర్ముద్రణకి హక్కుదారులను సంప్రదించిన అనుభవంతో చెప్తున్న మాటలివి!
శ.రత్నాకరం “మ ద్రాసు మిషనరీ సంస్థలు ప్రచురించిన కారణాన దాని ప్రతులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి.” అన్న మాట నిజం కాదు. శ.ర, దానిని అసలు కూర్చినదెవరు, దాని మూలాలేమిటి, రాస్తూ పోతే మరో పెద్ద వ్యాసమవుతుంది.
“ఆంధ్ర నిఘంటుత్రయము – సటీకము” అన్న పేరుతో “ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్రనామ శేషము, సాంబ నిఘంటువు” ఇప్పటికీ ముద్రణలో వున్నాయి. అలాగే విద్యార్థి కల్పతరువు లాంటి నిఘంటువులు కూడా.
Theres no copyright on CPB’s dictionary. Nor on Bahujanapalli’s. The copyright for సూర్యరాయ… is claimed by Telugu university.
Here is an open request to one and all. Get us the CR permission from TU and we will put సూర్యరాయాంధ్ర on-line in one year’s time. For other dictionaries that don’t fall under CR law, watch these pages.
కథ బాగుంది. ఇలాటి జాతక కథలంటే నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ చెప్పబడిన ఉదంతం మిగారుడి ఇంటిలోనే జరిగిందని ఒక కథలో ఉంది. బుద్ధుడిని విశాఖ ఇంటికి ఆహ్వానించిందని, మిగారుడు తెర వెనుకనుండి బుద్ధుడి పలుకులను విన్నాడని ఆ కథలో ఉంది. ఒకప్పుడు విశాఖ బుద్ధుడిని చూడడానికి జేతవనానికి వెళ్లింది. ఆమె రత్నఖచితమైన ఒక కంబళిని కప్పుకొని ఉండిందట ఆరోజు. అది కొద్దిగా బరువుగా ఉండడంవల్ల దానిని తనతో వచ్చిన పరిచారికకు ఇచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు పరిచారిక ఆ శాలువాను మరచిపోయిందట. ఇంటికి వెళ్ళిన తరువాత ఆమె పరిచారికను మళ్ళీ పంపిందట. ఒక వేళ ఆనందుడు (బుద్ధుని ప్రథమ శిష్యుడు) దానిని జాగ్రత్తపరిచి ఉంటే తీసికొని రావద్దు, అలాగే అది అక్కడే పడి ఉంటే తీసికొనిరా అని పంపిందట. ఆనందుడు అలవాటు ప్రకారం దానిని భద్రపరిచి ఉంచాడు. వద్దన్నా ఆనందుడు తిరిగి ఇచ్చాడట. దానిని అమ్మి ఆ డబ్బుతో విహారం కట్టిద్దామనుకొన్నది విశాఖ. కాని దాన్ని కొనేటంత డబ్బు ఎవరివద్ద లేకపోయింది. చివరకు విశాఖ తానే దానిని కొని ఆ డబ్బుతో విహారమొకటి కట్టించింది. తరువాత విశాఖ తన కుటుంబం లోని వారందరినీ పిలిచి నా కోరికలు ఈడేరాయి. నాకింకేమి అక్కరలేదు అని చెప్పి బుద్ధ విహారానికి వెళ్లి ప్రదక్షిణం చేస్తూ పాడుతూ ఆడుతూ ఉండిందట. ఈ దృశ్యాన్ని చూచిన కొందరికి ఆమె కేమైనా పిచ్చి పట్టిందో ఏమో అని అనుకొన్నారు. బుద్ధుడికి ఈ విషయం చెప్పగా అప్పుడు బుద్ధుడు తాను పూర్వజన్మలో ఒక బోధిసత్త్వుడుగా ఉన్నప్పుడు విశాఖ మరొక భక్తురాలిని చూచి ఆమెలా నేను కూడా ఉండాలనుకొన్నదట. దాని ఫలితమే ఈ జన్మలో ఆమె మంచి కార్యాలు చేసి ఈ స్తాయికి చేరింది అని బుద్ధుడు శిష్యులకు వివరించాడు. ఇది తరువాతి కథ. విధేయుడు – మోహన
మంచి నిఘంటువు ఎంతైనా అవసరమే. నేను సూర్యాంధ్రరాయ నిఘంటువును
నా కళ్లతో ఇంతవరకు చూచింది లేదు 🙂 కాని ఎనిమిది సంపుటాల నిఘంటువు సామాన్య విద్యార్థులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో? సామాన్య విద్యార్థికి కావలసింది చేతిలో పెట్టుకొని తిప్పి చూసికొని పదాలకు అర్థాలు తెలిసికొనేటట్లు ఉండే ఒక నిఘంటువు. అలాటిది ఎక్కడైనా ఉందేమో? జీ. ఎన్. రెడ్డిగారిచే పరిష్కరించబడి 1989లో తెలుగు విశ్వవిద్యాలయంచే ప్రచురించబడిన 868 పుటల “తెలుగు నిఘంటువు (విద్యార్థులకోసం)” బహుశా ఈ కొరతను తీరుస్తుందేమో?
విధేయుడు – మోహన
ఆహా…మంచి తెలుగు నిఘంటువు ఆన్లైను లో దొరికితే ఎంత బాగుండు… ఎంచక్కా నెట్లో చదువుతున్నప్పుడు అర్థంకాని పదం కనబడ్డ ప్రతిసారీ ఆ నిఘంటువుకు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న వాటిలో ఏదీ నా సందేహాలను పూర్తిగా తీర్చడంలేదు 🙁
“ఇందువల్న తెలిసిన నీతి ఏమన్ గా……కాపీలుకొట్టుడు. కావల్సినంత దొంగ
పేరు కొట్టుడు.” -rama bharadwaj అభిప్రాయం
‘దొంగ పేరు’ కాపీలు కొడితే వస్తుందా. మీరు చెప్పబట్టి ఈ రహస్యం ఇప్పటికి తెలిసింది. :-):-)
“రేప్పోద్దుట “తందనానాహి” అంటూ మరో కామ్రేడ్ పదం అందుకోవచ్చు.అబ్బే అదేమన్నా అన్నమయ్య కాపీరైటా?”-rama bharadwaj
తందనాహి లాటి మాటలు, తందనాలు, తదన్నానాలు, తన్నా మన్నాలు, లాటి పదాలూ, మరికొన్ని ఎన్నో పదాలూ ఉపయోగిస్తూ ఎందరో రాయవచ్చు. రాశారు. రాస్తారు. అన్నమయ్య కాని, ఇతర రచయితలు కాని రాసినవి రాసినట్లు భద్రంగా అలాగే ఉంటాయి. అన్నమయ్య రచనలకు వీటి వల్ల ఏం లోటు జరగదు.
పైగా రచనల్లో భావ సామ్యతలు, పద సామ్యతలు చూపిస్తూ -విమర్శకుల/ కవుల వ్యాసాలొస్తే, అన్నమయ్య పాటలు ఇంకా ఎక్కువ ప్రచారం లోకి వస్తాయి. నాకు లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మీకు నష్టాలు తోస్తే చెప్పండి.
[లైలాగారి లాంటి వాళ్ళు..ఎటూ రెడీ గానే ఉన్నారు గన్క..కాపీదారుల హక్కుల్ని కాపాడ్డానికి]-rama bharadwaj
మీరు ఈ మాట పత్రికలో కామెంట్ల మినహా, ఇతర ఏ రచనలు ఎప్పుడు, ఎక్కడ , చేశారో ఇంతవరకూ మీరు చెప్పందే.
ఒకవేళ మీరు రచయితలై ఉంటే అందులో మీరు కాపీ చేసినవి సందేహించకుండా చెప్పండి. 🙂
ప్రస్తుతానికి మీ identty loss, property theft ఇలాటివేవీ జరగకుండా, మీ ఆస్థులు, హక్కులు భద్రంగా ఉన్నాయని, మీరు క్షేమంగా, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని ఆశిస్తాను. 🙂
ఒక ప్రశ్న- “సీతమ్మ మాయమ్మ – శ్రీ రాముడు మా తండ్రి” అన్న కృతి త్యాగరాజు లలిత రాగములో రాస్తే ఇప్పుడు వసంత రాగంలో పాడుతున్నారన్న విషయం ” కొత్త సంగీత విద్యా దర్పణములో చదివాను. ఎందుకలా పాడుతున్నారో వివరించి ఆ కృతిని ఆ రాగాలను musicians వినిపించగలరా?
“మన దేశంలోని జర్నలిస్టులకు జీతాలూ తగినంతగా ఇవ్వరు. ఒత్తిడికూడా ఎక్కువే.”
“చందమామ గురించీ, రజనిగారి గురించీ నేను రాసినవి వాళ్ళకి inspirationగానో, ఇతర పద్ధతుల్లోనో పనికొచ్చాయి.” -Rohiniprasad
మన దేశమంటే? 🙂
రజని అంటే? ఆ రజనిని గురించి ఒక్కరే ఎలా రాయగలరు? ఇతరులెవ్వరూ ఎందుకు రాయలేరు?
చందమామ అంటే -ఆకాశంలో పెరుగుతూ తరుగుతూ ఉన్నట్లు భ్రమపెట్టే గోళమేనా? చందమామ అని మొదటిసారిగా అన్నవారెవరు? చందమామ అన్న ఆ పేరు ఒక మాస పత్రికకు పెట్టుకోవచ్చునా? అది కాపీనా ? ఇన్స్పిరేషనా? చంద్రుడికి రాయల్టీ లిచ్చారా? ఏ చందమామను గురించైనా ఎవరైనా ఎన్ని సార్లైనా ఎందుకు రాయకూడదు?
మీ రచన నిజంగా ‘వాళ్ళకి’ ‘పనికొస్తే’ రచయితగా మీకు వచ్చిన నష్టమేమిటి? మీరు రాసిన రచనకు నష్టమేమిటి? ఘనత పెరగాలే కాని తగ్గదే? ఒక వేళ మీకన్నా బాగా కాని ఇతర రచయితలు రాసారా ఏం? 🙂 రాస్తే గనక పాఠకులకు అది మంచిదేగదా? “మంచి యన్నది పెంచుమన్నా” అన్నారుగా.
రచయితలూ!
త్యాగరాజు మీదో ఇంకే రాగరాజు మీదొ రాసిన ఓ నాలుగు మాటలు ఏ వరసలోనైనా ఓ రచయిత రాయనీయండి, అవి ఆ ఒకరి సొంతమై పోతాయా? ఎలా అవుతాయి? ఎందుకు అవ్వాలి? మీకున్న అభిప్రాయాలూ, ఊహలూ, అనుభవాలను, పోలినవి ఇంకెవరికీ ఉండవా? రావా? కలుగవా?
ఏదీ మీకు ఒక్కరికే వచ్చి, ఇంకెవ్వరూ మానవులకూ ఇంతకు పూర్వమూ ఇక ముందూ రాని, రాబోని, విశేష అభిప్రాయాలు కొన్ని చెప్పండి.
రాముడి మీదో, సోముడి మీదో మా నాన్నగారో, మా నాన్నమ్మో ఇంకెవరో ఏమైనా అనేశారోమో, అని నాలాటివాళ్ళు ఇంకేం అనకూడదా? రాయ కూడదా? రోజూ నేనేదైనా రాసే ముందు, నాకన్నా ముందు ఎవరేం రాశారో అని గూగులించాలా? ఒకవేళ ఎవరైనా రాస్తే, ఇక ఆ విషయం జోలికి పోగూడదా? మెల్లిగా అసలు రాముడిని వదిలి తర్వాత త్యాగరాజును, త్యాగరాజును వదిలి ఆయన గురించి రాసిన ఆ తర్వాతి రచయితను భజించాలా?
ఆ త్యాగరాజు, ఆ అన్నమయ్య -మాకు ఈ ప్రపంచంలొని మనుషులతో వారి గుర్తింపుతో పని లేదు -అని రాముడి మీదో, వెంకటేశ్వరుడి మీదో ఏవో అల్లిబిల్లి పాటలు రాసుకున్నారు (?అట-నిజం ఎవడికి తెలుసు గనక?) కాని ఈ కళాకారుల సంగీతంలోని తీపి గురించో, వారి జీవిత నిరాడంబరత గురించో రాసే ఇప్పటి రచయితలకు (ఆ రచనల మీద) ఇంత డబ్బూ, డంబరమూ, గుర్తింపు, గుత్తాధిపత్యాల తాపత్రయమెందుకు? 🙂
‘మన’ దేశంలో ఇప్పుడు సోషలిజం రాలా? 🙂
సెప్టెంబరులో DTLC సమావేశానికి వెళ్ళి – “నీదీ నాదని భేదం లేద” నే ఇద్దరో ముగ్గురో తెలుగు ప్రజా కవులూ, రచయితలను స్మరించి, భక్తితో పూజించి, 🙂 రచన చేయటం మీద ప్రజల హక్కులు గురించి తిన్నగా తెలుసుకోవాలి.
“The result was a dynamic read for participants and onlookers. A rolling margin for commentary remained in place next to the page of text being commented on. It also allowed further remarks, comments on the comments, to be added, all next to the relevant passage. One of the collaborating readers said of the experience, “It was those lengthy, sometimes tangled conversations in the margins which were the most exciting feature of the project.”
ఆర్టికల్ బాగుంది. చాలా పెద్దది ఇంకా అంతా చదవలేదు. కాని అందులోని ఈ పై విషయం గమనిస్తారని రాస్తున్నాను.
ఈ మాట మేగజీన్లో, పాఠకుల అభిప్రాయాల్లో కొన్నాళ్ళ క్రితం జరిగింది ఇదే. పాఠకులు కొందరు -పత్రికలో ప్రచురించిన రచనల కన్నా కొన్నిసార్లు వాటి మీద రాసిన అభిప్రాయాలు ఇంకా సరదాగా ఉన్నాయన్నారు. అది నిజం.
కొత్త ప్రచురణ మీడియంలో అనుకోని లాభాలు మనకు లభిస్తాయి. అవి మనకు అక్కర్లేదా? అనుకోకుండా పెనిసిలిన్ కనిపెడ్తే, అలెక్సాండర్ ఫ్లెమింగ్ -అబ్బే దీని కోసం కాదు నేనీ ఎక్స్పెరిమెంట్ మొదలెట్టింది అని చెప్పి ఆ మందుని తీసికెళ్ళి అవతల పారెయ్యలేదు. సైంటిస్టులూ కోప్పడలేదు. అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ మాట ఇప్పటి కొత్త పాఠకులు మరింత తెలివైన వారై, వారి కామెంట్లు, కామెంట్ల మీది కామెంట్ల వల్ల పత్రికలో రాతలు పదునెక్కితే పత్రిక చదివేవారు ఎక్కువవుతారు. రాసే వాళ్ళూ ఇంకా ఆసక్తి కలిగించేలా రాస్తారు.
వేలూరి గారు ఇలాటి వ్యాసం “ఈమాట” లో రాయటం ఆశ్చర్యకరం. ఐతే ఇది “వెబ్ కల్చర్ ” మన జీవనవిధానాన్ని పూర్తిగా మార్చేస్తున్న సంధి సమయం గనుక ఈ సందర్భంలో ఈ విషయం గురించిన చర్చ సమంజసమే నేమో.
కాగితపు పత్రికలకు కాలం చెల్లిందన్న విశ్వాసమే “ఈమాట” ఆవిర్భానికి మూలం అని పదేపదే చెప్పనక్కర లేదు. వేలూరి గారు వారి వ్యాఖ్యలో ఉట్టంకించిన “న్యూయార్కర్ ” లోని పుస్తకపరిచయం కూడ వెబ్ మీద అప్పనంగా దొరుకుతుంది – దానికి పుస్తకం అక్కర్లేదు – ఇక్కడ క్లిక్ చెయ్యండి – http://www.newyorker.com/arts/critics/books/2009/07/06/090706crbo_books_gladwell .
వెబ్ మీద ఉన్న “కంటెంట్ ” ఏదైనా సరే ఫ్రీ గా దొరకాలి అనేది దాదాపుగా అందరూ అంగీకరించిన సత్యం ఐపోయింది. ఎక్కడిదాకానో ఎందుకు, “ఈమాట” ఫ్రీ పత్రికే కదా ! ఈ “సత్యం” వల్ల ఇప్పటికే కలిగిన ఉపయోగం ముందు కొందరికి కలిగిన “నష్టాలు” చాలా తక్కువ అని నా అభిప్రాయం. అంతేకాదు, అలా నష్టపోతున్నా మనుకునే వారు ఇంకెవర్నో నిందించటం ఆపి కొత్త మార్గాలు వెదుక్కోవటం అవసరం. వెబ్ విప్లవం రాకముందు ఏదైనా జర్నల్ లో వచ్చిన ఒక టెక్నికల్ పేపర్ కాపీ సంపాయించాలంటే ఎంత భగీరథయత్నం అయేదో చాలా మందికి స్వానుభవమే. అదే ఇప్పుడు ఎలాటి టెక్నికల్ పేపర్ ఐనా (కనీసం నాకు ప్రత్యక్షంగా తెలిసిన కంప్యూటర్ సైన్స్ రంగంలో) పట్టుకోవటానికి ఒక నిమిషం పట్టదు. అలాగే, మనం ఏదైనా ఒక కొత్త విషయం గురించి పరిశోధన చెయ్యాలన్నా అదిప్పుడు ఎంతో తేలిక. ఇలాటివి ఇదివరకు అసాధ్యాలు.
రమ గారు లేవదీసింది దీనికి లంబంగా (“అర్థాగొనల్ ” కి అనువాదం) ఉన్న విషయం. రచయిత్రులకు పారితోషికం విషయం. పత్రికల మనుగడే ప్రశ్నార్థకం ఐతే ఇక వారిచ్చే పారితోషికాల మాట చర్చనీయమా అని సందేహం కలగొచ్చు కాని ఇవి రెండూ వేర్వేరు విషయాలు. ఆర్థికంగా సామర్థ్యం వున్న పత్రికలు తప్పక పారితోషికాలియ్యవలసిందే. కాని పత్రికే ఫ్రీ అయి, మరే విధమైన ఆదాయమూ ఆ పత్రిక్కి లేకపోతే వారు పారితోషికాలు ఎలా ఇవ్వగలరు? ఒకవేళ ఎవరో దానం చేసో లేక సంపాదక వర్గమే సొంత డబ్బు వేసో ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలబడే పద్ధతి కాదు. పత్రికల వారి లాగానే రచయిత్రులు కూడ ఆర్జనకి ఇతర మార్గాలు కనుక్కోవాలి.
ఇది సంధి కాలం కనుక అలాటి మార్గాలు ఇంకా స్పష్టంగా లేవు. ఐతే సినిమాల దెబ్బకు తోలుబొమ్మలాటలు ఎలా మూలబడ్డాయో వెబ్ దెబ్బకు కాగితపు పత్రికలు, వాటికి సంబంధించిన వారూ దెబ్బతినటం తప్పదు. ఎంత త్వరగా ఇది గుర్తించి ఎవరికి అనుకూలమైన మార్గం వారు చూసుకుంటే అందరికీ అంత మంచిది – అని నా అభిప్రాయం.
ఒక్క మాట, వ్యాసం ఉద్దేశానికి సంబంధించింది కాబట్టి ప్రస్తావించడం.
“ఒక కవి పెద్ద కవో, చిన్న కవో నిర్ణయించడానికి సాహిత్య విమర్శ పరిభాషలో ఏర్పడిన లాంఛనాల కోవలోకే వస్తాయి- స్వతంత్ర రచన, ప్రభావం, అనుకరణ, అనువాదం, కాపీ, ఫోర్జరీ- ఇలాంటి మాటలన్నీ” అని అన్నారు. విమర్శలు కవిత గొప్పదో చిన్నదో అనే కాని, రాసింది పెద్ద కవో, చిన్న కవో అని కాదనుకుంటాను. అవార్డులు, పురస్కారాలు ఫలానా కవితకు, కథకు, నవలకు ఇస్తున్నామనే చెప్పుకుంటాం, ప్రకటించుకుంటాం కదా, వ్యక్తికి ఇచ్చినప్పటికినీ.
“‘ప్రభావం’ అంటే కవిత్వానికి సంబంధించినంత వరకూ ఉపయోగపడే అర్థం” అన్నది కవిత్వానికే కాక జీవితానికి కూడా వర్తించే మంచి మాట.
===========
విధేయుడు
-Srinivas
‘తెలుగునాడి’ ఆగిపోవడానికి కారణాలను మన దగ్గరే ఉన్న చెట్టంత మనిషి, జంపాలగారు వివరిస్తే బాగుంటుంది. కాని, ‘తెలుగునాడి’ నడవడానికి, అంటే కనీసం వెయ్యి మంది చందాదారులతో నడవడానికి, చిన్న కారణం చెప్పగలను. ఏమీ లేదు- marketing! వజ్రమైనా, గిట్టుబాటుధరకు వ్యాపారికావాలేమో!
మొత్తం అమెరికా దేశంలోని భారతీయ కూరగాయల దుకాణాలలో cashier దగ్గర కాపీలు పెడితే, ప్రతిపది మందిలో ఒక్కరైనా, తెలుగు రానివారైనా సరే, అట్టచూసో, అందం చూసో(అదే బాపుబొమ్మల అందం!), మొహమాటపడో- కొన్నా, వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం, పత్రిక నడవడం పెద్ద విషయం కాదు. పత్రిక నడవడం కాదు, నడవకపోవడానికే పెద్ద కారణాలు వెతకాలనుకుంటాను, ఆర్థిక మాంద్యం ఇవ్వాళున్నస్థితి కాని, ఐదు ఏళ్ళుగా చందాదారుల సంఖ్య పెరగకపోవడానికి అది కారణం కాదనే అనిపిస్తుంది.
==========
విదేయుడు
-Srinivas
ఈ కథలో feelings బావున్నాయి. కాని సంఘటన ఏది? మనసును గాయపెట్టే అనుభవం ఉంటే సరిపోతుందా. కథకి ఫార్ములా / ట్విస్ట్ / సర్కిల్ – పరిపూర్ణం కావించబడిన సంఘటన ముఖ్యం. ఈ సంవత్సరం అరుణ గారు రాసిన నాలుగు కథలూ చదివాను. చాలామంది అనుభవజ్ఞులైన మూసకొట్టుడు కథకులకంటే ఆమె బాగా రాస్తున్నారు. ఈ ఒక్క లోపాన్ని అధిగమిచగలిగితే ఆమె నుంచి మరిన్నిమంచికథలను ఆశించవచ్చునేమో.
Anyway best of luck to Aruna.
కుమారస్వామి
ఫాదర్స్ డే గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
07/02/2009 10:20 am
నమస్కారం
కదిలించింది. మానవసంబంధాలు సైతం వేగవంతమైన జీవిత పరుగుపందెంలో ఎన్ని పోకడలు పోతుందో కూడా గమనించే తీరిక, స్థైర్యం లేని సమయంలో, సమాజంలో, ఇది ఆలోచింపజేసింది.
మీరు క్షమిస్తే, చిన్న మార్పుతో,
“భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు, పిల్లలు
ఆ భగవంతుని వరశాపం” అనిపిస్తుంది.
========
విధేయుడు
-Srinivas
ఏడుస్తూ వుండిపోయాను పద్యం చదివి చాల సేపు. ఇన్ని మరణాలూ ఏమీ నేర్పవు మనకు. ఎప్పటికప్పుడు ‘అలవాటు కాని చీకటిలోనే, కొత్త కొత్త చీకట్లలోనే నిలబడ’క తప్పదు. మరణించిన వాళ్లూ ఏమీ నేర్పరు మనకు. చనిపోని ప్రేమను రగిల్చి వెళ్లడం తప్ప. అఫ్సర్, నీతో నొప్పిని పంచుకుంటున్నా, పంచుకోడానికి నొప్పి మాత్రమే వుంటం వల్ల.
హెచ్చార్కె
ఈ వ్యాసం చాల బాగుంది. ఆదిశంకరుల రచనలు భక్తిని, ఆ మీదట ముక్తిని ఒసగే మంత్రములే కాని, మామూలు పదజాలముల కూర్పు కాదు.
శారదా మాత తన దివ్యవాక్కును శంకరుల ద్వార మనకు అందించి మన మూఢత్వమును
పారద్రోలిన ‘ అమ్మ’
పాశ్చాత్య శాస్త్రీయసంగీతం గురించిన సమాచారం చాలానే దొరుకుతుంది. ఉదాహరణకు ఈ వెబ్ సైట్ చూడవచ్చు: http://w3.rz-berlin.mpg.de/cmp/musical_history.html
మన దేశపు సంగీతాభిమానులకు రెండిటినీ పోల్చ బుద్ధి అవుతుంది కాని ఈ రెండు పద్ధతుల పరిణామమూ వేరువేరు వైఖరులతో సాగింది.
పాత తరానికి చెందిన బాఖ్ సంగీతం ఇక్కడ వినవచ్చు: http://www.jsbach.net/audio/index.html
తరవాతివాడైన మోత్సార్ట్ స్వరపరిచిన అద్భుతమైన 40th symphony ని సినిమా కోసమని సలీల్ చౌదరి అనుకరించిన సంగతి తెలిసినదే. http://www.archive.org/details/Mozart_Symphony_40
మరొక మేధావి బెథోవెన్ : http://www.lvbeethoven.com/Oeuvres/Music-RealAudio.html
ఈనాడు పాశ్చాత్య శాస్త్రీయసంగీతమంతా polyphonic గానే అనిపిస్తుంది.
ఒకప్పుడు అలా ఉండేదికాదట.
మన సంగీతానికీ (ముఖ్యంగా హిందూస్తానీ), పశ్చిమదేశాల సంగీతానికీ ఉన్న తేడా ఏమిటంటే వారి సంగీతానికి స్వరరచయితా (కంపోజర్), నిర్వాహకుడూ (కండక్టర్), వాయించేవారూ (ఆర్క్కెస్ట్రా) వేరువేరు వ్యక్తులు. మనకు అలాకాదు. ఏ సంతూర్‌నో పట్టుకుని స్టేజి ఎక్కిన కళాకారుడు మూడూ తానే అవుతాడు. వారిలాగ కచేరీల్లో మనకు ‘రాసిపెట్టిన’ స్వరాల అవసరం ఉండదనేది తెలిసినదే.
శ్రోతల స్పందనకూడా కాస్త వేరుగా ఉంటుంది. ప్రసిద్ధుల symphony లన్నీ వినడానికి నాకు చాలా బావుంటాయి. అనేక ‘పొర’లలో చేసిన ఆ స్వరరచనలు ఎంతో అద్భుతమైనవి. మనకు సంగీతంలో individuality ఎంత ముఖ్యమో, వారికి విధేయత, నిబద్ధత అంతే ముఖ్యం.
బడే గులాం అలీ, బిస్మిల్లా ఖాన్ వంటి ఒకరిద్దరు ముస్లిం సంగీత విద్వాంసుల గురించి తప్ప వేరే ఏ ముస్లిం విద్వాంసుల గురించి తెలియని నాకు హిందుస్తానీ సంగీత సామ్రాజ్యానికి వీరే మకుటం లేని సమ్రాట్టులై అత్యున్నత ఆచార్యస్థానాలలో ఉన్నారని మొదటి సారిగా మీ వ్యాసం ద్వారానే తెలిసింది. మత వివక్షత లేకుండా ఆ కాలంలోనే అనేకులైన ముస్లిమేతరులు వారివద్ద శిష్యరికం చేసి సంగీత విద్యను సాధించారని, వారితో వివాహాది సంబంధ బాంధవ్యాలు కలుపుకున్నారని తెలిసి ఆనందం కలిగింది. జాతి మతవిభేదాలు సామాన్య జనానీకానికే గాని సరస్వతీ పుత్రులైన కళా పిపాసులకు ఉండవు.
సంగీత రసాస్వాదనని స్కాచ్ తో పొల్చడం నాకు సంబంధించినంతవరకూ అత్యంత నీచోపమానమే కాక అత్యంత గర్హణీయం/శొచనీయం. మీ ఈ ఉపమా పదార్ధంతో సామ్యం భావించిన ఏ పదార్ధాన్నైనా, భావానైనా, తద్భావ సంబంధితమైన జుగుప్సతో తత్క్షణమే త్యజించే వారుంటారనుకుంటే మీరంత నీచోపమానం వాడేవారు కాదు. చందన కర్దమాలు (ఒక్క అద్వైతికి తప్ప) ఎప్పటికీ సమం కావు.
సంగీతం ఎవరిదైనా అది విని ఆనందించవలసిందే. సంగీతాన్ని గురించి ఎవరు ఎంత రాసినా అవన్నీ పరిచయవ్యాసాలే.
కీబోర్డుతో స్వరాలూ, రాగాల సాధన గురించి నేను చెప్పిన విషయాలను చదివి కొందరు కీబోర్డు మెట్లమీద స్టికర్లు అతికించుకుని ప్రయత్నిస్తున్నారు. అవి వారికి కొంత ప్రేరణనిచ్చి ముందుకెళ్ళేలా చెయ్యవచ్చు.
కాని మొత్తంమీద తెలుగువారికి సంగీతం వినడం, సాధనచెయ్యడంలో చాలా తక్కువ ఆసక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిత్రుల ఎదుట నేను ఎప్పుడైనా చిన్న సోదాహరణ ప్రసంగంవంటిది చేస్తే కాస్త ఆసక్తి కనబరిచేది మగవారే. మహిళలు ఏ మాత్రం ఆసక్తి చూపరు. తెలుగు పిల్లలకు సంగీతం రాకపోవడానికి ఇదొక ముఖ్య కారణం అనిపిస్తుంది. (ఇలా అన్నందుకు నన్ను MCP అని తిట్టుకోకండి!)
రాగం అంటే ఏమిటో తెలిసినదే.
ఖచ్చితంగా చెప్పలేను కాని, తానం ఉత్తరాదినుంచి సంక్రమించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి ఖయాల్ శైలికన్నా పాతదైన ధ్రుపద్ గాత్రంలో నోమ్ తోమ్ ఆలాపన, జోడ్ పాడతారు. నోటితో వీణలాగా పాడడానికి కారణం అప్పటి సంగీతంలో (రుద్ర) వీణకు ఉండిన ప్రాముఖ్యతే అంటారు. రుద్రవీణను సోలో వాద్యంగానూ, గాత్రానికి వంతగానూ ఉపయోగించేవారట. హార్మోనియంవంటిది లేని ఆ రోజుల్లో గాయకుణ్ణి ఇబ్బంది పెట్టాలంటే వైణికులు కష్టసాధ్యమైన శ్రుతిని అందించడం మొదలైన పనులు చేసేవారట. మొత్తంమీద వీణదే పైచెయ్యిగా ఉండేదట. అందుకని ధ్రుపద్ గాయకులు చాలావరకు వీణని అనుకరిస్తూ పాడడం చూస్తాం. రాగప్రస్తారం మధ్యలో ఆపినప్పుడు పాడే మొహ్రా (ముద్ర) కూడా అటువంటిదే. ఇదే తరహాలో దక్షిణాది గాయకులు కూడా తానం పాడతారు. నిజానికి జోడ్ లాగే తానం కూడా వీణవంటి వాద్యాలమీదనే అన్నిటికన్నా బావుంటుంది. ఇందులో లయ ఉంటుంది కాని తాళం ఉండదు.
1565లో జరిగిన తళ్ళికోట యుద్ధానికి పూర్వం ఉత్తర, దక్షిణ సంగీతపద్ధతులకు ఇప్పటికన్నా దగ్గర సంబంధం ఉండేదనీ, ఆ తరవాత రెండూ క్రమంగా విడిపోయాయనీ కొందరంటారు.
నిజం గా ఇది ఆలోచించాల్సిన విషయం. రమాదేవి గారు రాసినట్లు పెళ్ళిని పక్కన పెట్టేసే రోజు తొందరలోనే వస్తుందేమో! అప్పుడు కుటుంబం అంటే తెలియకుండా పోతుందేమో! “సేవ్ ఎర్త్ ” ఆర్గనైజేషన్స్ ఇంక మొదలెట్టాలేమో! కధలో గమనించాల్సింది భార్య భర్త ఫ్రెష్ గా కోరుకుటాడని, దోశ ఇడ్లి లాటివి కావాలనుకుటాడని దాని పై స్థాయి అసలు తను మాత్రమే వంట గురిచి టిఫిన్ గురిచి పట్టించుకోవాలి అని అనుకోకపోవడము……..హనుమంత రావు గారు హాస్యం గా రాశాననుకుంటున్నారేమో కాని అది చేదు నిజం. పచ్చిపాలు etc తో చాలా మంచి భర్త అయిపోయాననుకునే అలాంటి భర్తలే చాలా ప్రోగ్రెస్సివ్ అనుకోవాలేమో! కాలేజీల్లో కంప్యూటర్ ప్రోగ్రాములూ, వేవ్ ఈక్వేషన్స్ తో బాటు సాటి మనిషితో ఎలా బతకాలి, అసలు కుటుంబం ప్రారంభించగల స్కిల్స్ నేర్పించి, సర్టిఫికేట్ ఇచ్చే వ్యవస్థ కావాలేమో! రమాదేవి గారు చెప్పినట్లు పిల్లవాడు అరుణ్ వాళ్ళ నాన్నలా కాకుండా వేరే విధం గా వుండే అవకాశాలు తక్కువ. We are half genetic and half from environment. Here both are suggesting that the child becomes another raaghava!!!!!!!!!! But what is the solution? How to change this? How many legal changes can bring a change in this sort of mentalities? 90% of the society expects a woman to be with the husband since as Mr Hanumantha Rao expressed ” కొట్టడు, వేరే హింస లేదు కదా, భరించవచ్చు.” కానీ సంసారమంటే ఇదేనా! చలం మైదానం రాసి ఎన్ని యేళ్ళు గడిచాయి? కానీ ఇంకా అదే వుపేక్ష స్త్రీ కి వుహూ, భార్యకి ఏమి కావాలో అర్ధం చేసికోవడంలో! ఇది ఫామిలీ/కుటుంబ వ్యవస్థని వాతావరణం లో ఓజోన్ రంధ్రం కంటే పెద్ద హాని కలగచెయ్యగలదని ఎందుకు అనిపించట్లేదో అని దిగులేస్తోంది.
మరొక్క మహోన్నత కళాభాస్కరుని అంధత్వంలో వున్న మాకు పరిచయం చేస్తూ స్ఫూర్తి దాయకమైన సమాచారాన్ని అందజేసినందుకు హార్దిక ధన్య వాదాలు.
ఏ తాళ వాద్యకారుని గూర్చిన ప్రశంస విన్నా లేక వారి వాదనాన్నివినే భాగ్యానికినోచుకున్నా నా చిన్నతనంలో (1962-64మధ్యలో) మా ఊరి త్యాగరాజోత్సవాలలో విన్న ఒక మహా విద్వాంసుని తబలా వాదన ఇప్పటికీ స్మృతిలో చిరనూతనంగా ఉంటూ గుర్తుకు వస్తుంది. ఆనాదు ఆ 90 ఏళ్ళ వృద్ధ విద్వాంసుడు ఒక గంటసేపు తబలా వాదనతో మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేయడమే కాక చివరలో ఒక అద్భుత ప్రక్రియ (నైపుణ్యం) ప్రదర్శించాడు. విఘ్నేశ్వరుని సంస్తుతించే సంస్కృత శ్లోకానికి ఒకరు రాగ యుక్తంగా ఒక్కొక్క పదం పాడుతూంటే ఆ పదాలని ఆయన తన తబలా పైన పలికించారు. తంత్రీ వాద్యాలకు, గాత్రానికి మాత్రమే సాధ్యమైన రాగాలను ఒక తాళ వాద్యంపై పలికింపజేసే ఆ ప్రక్రియ ను నేను మళ్ళీ ఎక్కడా వినలేదు. కనలేదు. ఐతే నేను వేరే ఏ తాళ వాద్య కచేరి ఇంతవరకు వినలేదని చెప్పడం కూడా ఈ సందర్భంలో అత్యవసరం. నేను చూసిన ఈ ప్రక్రియ/నైపుణ్యం ఒకింత ప్రతిభ గల వారెవరైనా చేయగలుగుతారా లేక ఇది ఒక అసాధారణ నైపుణ్యమా చెప్పగలరా. ఎందుకంటే మీ వ్యాసంలో ఇటువంటి చాతుర్యంపై ప్రసక్తి రాలేదు.
ఎప్పటిలాగానే, మంచి పుస్తకాన్ని భద్రిరాజుగారి వ్యాసవిశేషాలగురించి తెలిపినందుకు హనుమగారికి కృతజ్ఞతలు.
పండితులుచేసే వ్యాఖ్యానాలగురించి ఒక్క మాట. భాషలో నుడికారాలు, సమాసాల సొగసులు, ఉక్తివైచిత్రి వగైరాల గురించి ఎంత చెప్పినా, అసలు చెప్పాల్సినదేదో ఎందుకో వదిలేసిన భావం, కొరత. అంటే వాటి ప్రాముఖ్యతను కాదనడం కాదు. కానీ అవన్నీ వాటికవే సొంతంగా ఎంతవరకు సాధారణ పాఠకులను పుస్తకానికి దగ్గరచేస్తాయి అని, అసలు అవేనా తిక్కన కవిత్వం అంత సొగసుగా అందిస్తున్నది అని కూడా అనిపిస్తుంది.
నెత్తిమీదున్న బతుకు బరువుకు, ప్రస్తుత పరిస్థితులకు తిక్కన రచన ద్వారా ఏమైనా లబ్ధిపడే అవగాహన, నిశితమయ్యే దృక్కు, స్పష్టతనిచ్చే అభివ్యక్తి లాంటివి కొంతైనా, ఎంతైనా, వడలి మందేశ్వరరావు, జీ.వి.సుబ్రహ్మణ్యం గార్ల వలె అందించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఆ demand ఎప్పుడూ ఉంటుందని కూడా అనిపిస్తుంది. అట్లా కాకుండా వొట్టి పాండిత్య ప్రకర్షగా, భాషాశాస్త్రం, పద సంపద వివరించడం, వ్యాకరణ అంశాలతో
వూదరగొట్టడం- రుచికర ఆహారపదార్థాలను scientists వాటి పుట్టుపూర్వోత్తరాలు, చెట్ల పేర్లు, వాటి రసాయనాలు, అవి జీర్ణించబడడానికయ్యే reactions- మొత్తం వాళ్ళకు తెలిసిన శాస్త్రమంతా పేజీలలో గుమ్మరించినట్లుంటుందేమో అని అనుమానం. తీరా ఇదంతా మనకు రుచి, బలం ఇచ్చే ఆహారం గురించే(నా) అన్నది కూడా మరిచిపోయేటట్లు చెప్తారేమోనని కూడా భయం! కుయ్యోమంటున్న పాఠకులను చూసి అయ్యో ఇంత పాండిత్యంతో రాసిన వ్యాఖ్యానాలు చదువుకొ(న)డం లేదని వాపోవడం కూడా అతిశయోక్తి కాదేమో అని కూడా అనిపిస్తుంది.
———-
విధేయుడు
_Srinivas
అని చదివితే, అబ్బ! ద్రౌపది కసి ఏం కసి, అనిపించింది. చిన్న చిన్న తెలుగు మాటలతో తిక్కన లెక్కలేనన్ని కొత్త కొత్త సమాసాలూ నుడికారాలూ మన భాషకి చేర్చాడట . ‘నెత్తురు మడువు’, ”కయ్యపునేల’, ‘మెత్తనిపులి’, ‘పెట్టనికోట’, ‘గుండెకాయ’, ‘చెలియలికట్ట’, ‘చిందరవందర’, ‘తేనె పూసిన కత్తి”, ఇలా అనంతం – అని భద్రిరాజు గారి వ్యాసంలో [1] చదివాను. తిక్కన కవితా శిల్పంలో సొగసులు చూడాలంటే, దగ్గరికిపోయి నిలకడతో చూడాలన్నారు. దానికి నాకింకాస్త తీరిక దొరకాలి.
ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి వ్యాఖ్యానాల అవసరం ఉంది కాని దాని గురించి కేవలం చదువుకున్న వాళ్ళు ఆలోచించి చేసేదేముంది? వాటిమీద పండితులు పని చెయ్యాలి. అందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు సాయం చెయ్యాలి. “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు…”
కొడవళ్ళ హనుమంతరావు
[1] భద్రిరాజు కృష్ణమూర్తి “భాష, సమాజం, సంస్కృతి”, పుస్తకంలో “తిక్కన పదసంపద” అన్న వ్యాసం.
మంచి వ్యాసం. చక్కని పద్యాలను ఎన్నో విషయాలను గుర్తుండేలా చెప్పారు.
ఇది ఇటీవల మృణాళిని గారి “గాంధారి” వ్యాసాన్ని (“అంధ్రజ్యోతి”లో)గుర్తుకుతెచ్చింది. ఆ వ్యాసం కూడా గాంధారి గురించి ఆలోచనాత్మకంగా, మంచి పరిశీలనతో వ్రాయడం ఆకట్టుకుంది. మా అమ్మకు ఫోనులో పూర్తి వ్యాసం చదివి వినిపించాను, కాని కాపీ చేద్దామనుకొని చేయాలేకపోయాను.
గాంధారి కృష్ణుని శపించడం అమెరికాలో tongue_in_cheek అనడానికి నిలువెత్తు దర్పణంలాకా తోస్తుంది. వేలూరి గారు వివరించినట్లు “ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు” _”ధర్మం ఎటు వుంటే అటే జయం” అన్న గాంధారి, ధర్మము యొక్క అవగాహన, స్పృహ స్పష్టంగా తెలిసికూడా, దాని పర్యవసానంగా వచ్చే పరిణామాలు అంతకంటే బాగా “చూడగలిగి” కూడా, బిడ్డలను కట్టడి చేయలేకపోవడం, చూసే కళ్ళున్నా గంతలు కట్టుకొన్న చందాన సాక్షాత్కరింపచేసిన వ్యాసుని brilliance ఊహించినప్పుడెల్లా అద్భుతమనిపిస్తుంది! యుద్ధాన్ని కృష్ణుడు ఆపగలిగి కూడా ఆపలేదని రగిలిన గాంధారికి, తను ఇవ్వబోయే, లేదా ఇచ్చిన శాపాన్ని సైతం కృష్ణుడు ఆపగలగికూడా, ఆపలేదనే స్పృహ తట్టకపోవడం, కాదుఆమెకు
తట్టకుండా ఉండేటట్లు చెప్పడం, ఆ పాత్రకు ఎంతో సహజత్వాన్ని ఆపాదిస్తూ
వ్యాసుడు చేసిన అమేయ రూపకల్పన అనికూడా అనిపిస్తుంది!
_____
విధేయుడు
_Srinivas
> ఘంటసాల, రాజాలు ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల (శొభ చిత్రానికి) పాడారు.
ఈరోజు పి.బి.శ్రీనివాస్ 1964-65 ప్రాంతంలో “జ్యోతి” మాసపత్రికలో వివిధ సంగీతదర్శకులపై రాసిన వ్యాసాలు చదువుతూ తెలుసుకున్న విషయం: ఘంటసాల నిర్మించి, సంగీత దర్శకత్వం వహించిన “పరోపకారం” (1953) చిత్రంలో రాజా పాడారని. పాటల పుస్తకం చూసి ఒకటి కాదు రెండు పాడారని నిర్ధారించుకునడమైనది.; “తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనెలూరు…” (A.P.కోమలతో), “హృదయము ఊగిసలాడే…” (ఘంటసాల, A.M.రాజా, P.లీల, A.P.కోమల)
సంగీతంలో సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే నని ప్రసాద్ గారు అంటున్నారు. కానీ మన దేశాన సంగీతపు వృధ్ధి..వికాసమూ బాగా తెలిసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు మాత్రం ఇలా అన్నారు.”మన దేశమున సంగీత సాహిత్య రచనలు అనాదిగా అవినాభూతముగా కలిసి న డుచుచున్నను సంగీతము సాహిత్యమునకు శోభాకరము మాత్రముగానే వెనుకనుండి న డచిదనియు వట్టి నాద రచనలు అంతగా పూర్వకాలమున లేవనియు చెప్పవచ్చును.ఎట్లును దక్షిణ దేశమున భక్తి,శృంగారము,వీరము
మొదలగు భావములను భగవద్విషయముగాగాని, ప్రభువులను గూర్చి కాని
వెలువరించు రచనలు చాలవరకు నిబధ్ధగేయములేయైనను వాని భాషా రచన
కు దేశములోనున్న విలువ నాద రచనకు లేదు గావుననే ఆ గానపధ్ధతులు నశించినవి.”
అనంతకృష్ణశర్మ గారి అభిప్రాయము ప్రకారము..సంగీతమే సాహిత్యాన్ని అనుసరించి న డిచిందిగానీ..సాహిత్యం సంగీతాన్ని అనుసరించలేదు..అన్న ది
విస్పష్టమౌతోంది. సాహిత్యం సంగీతానికి ఉపాంగం కాదనీ..ప్రధానాంగమేననీ కూడా ఇందువలన తేటతెల్లమౌతోంది.
2. హంసగీతె చిత్రంలో శిష్యుడు గురువుతో శ్యామశాస్త్రి పాటను
మరొక తాళంలో పాడటానికి వీలవుతుంది అని నిరూపించాడు.
గురువు ఓటమిని అంగీకరించి ఆత్మహత్య చేసికొంటాడు.
ఒకే గురులఘువుల అమరికతో వేరువేరు గతులలో రాయడానికి
వీలవుతుందని ఛందస్సు రచ్చబండ వేదికలపైన ఎన్నో ఉదాహరణలతో
నేను నిరూపించిన సంగతి కొందరికి గుర్తు ఉందనుకొంటాను. ఇది
కూడా ఒక చిత్రకవిత్వమే.
((పగలే వెన్నెల చరణం నింగి పైన చందమామ … మాత్రలు త్ర్యస్ర గతియే)
అద్భుతం పరమాద్భుతం. చలం గారి గళం వినాలని నాకు ఎప్పటినుండో కోరిక. రేడియో కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారని తెలుసు కాని, ఇంతకాలానికి వినే అవకాశం దొరికింది. పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
ఇదే విధంగా శ్రీ విశ్వనాధ సత్యనారాయాణ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రానికి ఒక గంట నిడివి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది వినే భాగ్యం నాకు దాదాపు పాతిక సంవత్సారాల క్రితం కలిగింది. అప్పట్లో నాదగ్గర రికార్డు చెయ్యటానికి సదుపాయం లేక భద్రపరచలేకపొయ్యాను. శ్రీనివాస్ గారూ ఈ ఇంటర్వ్యూ కూడ సంపాయించి తెలుగు లోకానికి అందిగలిగితే ధన్యులం.
ఇంకా ఇలాంటి నిధులు ఆకాశవాణి వారి మట్టి బీరువాల్లో ఎన్ని ఉన్నాయో,ఇప్పటి వారి అయోమయ, అజ్ఞాన ఉద్యోగులకు వాటి విలువ తెలుసో లేదో, వాళ్ళు బీరువాల ఖాళీ ఉద్యమంలో ఈ నిధుల్ని ఎక్కడ పారేస్తారో లేక ఇప్పటికే పారేశారో తలుచుకుంటే నే దుఖం కలుగుతున్నది. ఆకాశవాణి వారు ఈ పాత రికార్డింగులన్నీ కూడ వారి నెట్ లో పెట్టేట్టుగా చెయ్యటానికి ఇన్ఫర్మేషన్ ఏక్ట్ కింద ఏమైన చెయ్యగలమా అని సాహిత్య సంఘాలన్ని సమకూడి చెయ్యవలసిన పని అని నాకు అనిపిస్తున్నది.
ఈ కథ చదివిన వెంటనే, అనేక సంవత్సరాలుగా ప్రొద్దున్నే లేచి, పచ్చి పాలూ, corn flakes కలుపుకొని తిని పనికి పరుగెట్టే నేను, అమావాస్యకీ పౌర్ణమికీ మా ఆవిడ ఇచ్చే ప్రియా ఇడ్లీలనే ప్రసాదంగా తినే నేను, ఎంత ఉన్నతుణ్ణి, అనుకోడంతో నాఛాతీ పెరిగింది. ఇక ఉండబట్టలేక, మా ఆవిడని పిలిచి, “ఈ కథ చదువు. అప్పుడన్నా తెలుస్తుంది నీవెంత అదృష్టవంతురాలివో, నాలాంటి ఆదర్శప్రాయుడైన భర్తని పొందినందుకు,” అన్నా.
“నీ బడాయి కేమిలే,” అంటూ కథ చదివి, తను, “ఈ కాలంలో అమెరికాలో weekdays ప్రొద్దున్నే లేచి దోసెలు వేసే వాళ్ళున్నారంటే నేను నమ్మను. ఉంటే, నూటికి కోటికి ఒకరున్నారేమో. మన స్నేహితులలో ఎవరన్నా ఉన్నారా అసలు?” అని నన్నొక సామాన్యుడిగా చేసేసింది. “ఏమో! మన స్నేహితుల్లో తెలుగు వాళ్ళు తక్కువ కదా,” అన్నా.
సాయంత్రానికల్లా ఓ తెలుగు స్నేహితురాలితో email సంభాషణ సాగించి, తన కోలీగ్ భర్త రాఘవ లాంటి వాడేనట, అని చెప్పింది. మరి ఎలా ఎందుకు వేగుతోంది అని అడిగితే, “కొట్టడు, వేరే హింస లేదు కదా, భరించవచ్చు” అన్నదట కొలీగ్!
ఇలాంటి కథల అవసరం ఉంది కాని, మృణాళిని రాసిన “కోమలి గాధారం” లాంటి కథల అవసరం ఇంకా ఎక్కువనిపిస్తుంది.
వేమూరి గారి అభిప్రాయం చదివి ఆశ్చర్యపోయాను. తెలుగులో భాషాపరమైన డిగ్రీ ఏదీ లేకుండానే ఆయన నలుగురికీ ఉపయోగపడే నిఘంటువు నొకదానిని నిర్మించారు. మరి ఎవరో ఏదో అంటారని భయపడి శైలి మిద రాసిన పుస్తకాన్ని అచ్చువెయ్యకపోవడమేమిటి? అనుభవజ్ఞులు కూడా ఇలా వెనుకంజ వెయ్యడం చాలా నిరాశ కలిగిస్తుంది.
ఇక్కడ ప్రస్తావించిన – రంగనాయకమ్మ, బూదరాజు, దుర్గెంపూడి ల – పుస్తకాలు చెప్పుకోదగ్గవే కాని, అవేవీ, ఒంటిగా కానీ జమిలిగా కానీ, క్లుప్తత, సమగ్రత లలో Strunk and White కి సాటిరావు. కావాలంటే, “Elementary Principles of Composition,” కి సమాంతరమైనది ఈ పుస్తకాలలో ఏమైనా ఉందేమో చూడండి. వారి ప్రయత్నం ఎంతో మెచ్చుకోదగ్గదే అయినా, దానిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
అఫ్సర్ గారి లాంటి విద్యావేత్తలు, అలాంటి పుస్తకాలకి ఆదరణ ఉంటుందా లేదా అని అనుమాన పడకుండా, వాటి అవసరాన్ని గుర్తించి దానినో కర్తవ్యంగా తీసుకొని రాయాలి. ఫ్రొఫెసర్ Strunk చేసిందదే.
సదసత్కళా… పద్యంలో మరొక దానిని గమనించవచ్చును. అదేమంటే ఆ స్వరాల పాదాలు వచ్చేదానికి ముందు ఆ స్వరాలు కూడా నేపథ్యంలో వినబడుతాయి. నాకు తెలిసిన ఇలాటి అంశమున్న మరొక పాట – మలయమారుత అనే కన్నడ చిత్రంలో వల్లభాచార్యుల మధురాష్టకములో ప్రతి శ్లోకానికి ముందు సరిగమపధనిస స్వరాలు వస్తాయి. దీన్ని వాణీ జయరాం పాడగా బాలసుబ్రహ్మణ్యం ఊకొడుతారు. పాడబడిన మధురాష్టకాలలో ఇది చాలా మధురమైనది.
అనేక వెబ్ పత్రికలు, ఇతర కొత్త ప్రచురణ సాధనాలు పెరుగుతున్న ఈ కాలంలో తెలుగులో వొక శైలీ పుస్తకం చాలా అవసరం. ఈ అవసరాన్ని గుర్తించే విలువయిన వ్యాసం రాసినందుకు వేలూరి గారికి ధన్య వాదాలు. రచన – సృజనాత్మకమయినా, విమర్శ నాత్మకమయినా – కొన్ని సూత్రాలకు, నియమాలకు కట్టుబడి వుండడం వల్ల రచనకి అది బలమే. తెలుగు వాళ్లు సహజంగా ఆవేశజీవులు, ఆగ్రహ భావుకులు. విపరీతంగా పొగడ్డమో, తెగడ్డమో అలవాటయిన వాళ్లం. అందుకే, విమర్శ పేరిట వచ్చే చాలా రచనలు చివరికి కేవలం అర్ధ రహితమయిన ప్రశంసలుగా మిగిలిపోతుంటాయి. ఇక తెగడ్డం తూలనాడ్డంతో సరితూగుతుంది.
రాత అనేది సాధనతో సాధించుకునే విద్య. అది అచ్చు కావడానికి ముందే నలుగురు చదవడం వల్ల, నాలుగు మాటలు సరిదిద్దుకోవడం వల్ల మెరుగుపడుతుంది. తెలుగులో ఈ సాంప్రదాయం లేదు. చదివిన నలుగురూ మెచ్చుకుని తీరాలన్న పసితనపు ఉబలాటం తప్ప. పొరపాటున ఎవరయినా వేరే అభిప్ర్రాయం వ్యక్తం చేస్తే, ఇక ఆ వ్యక్తిని మన చదువరుల జాబితాలోంచి తీసి పడేస్తాం. దిద్దుబాట్లు, సరిదిద్దుబాట్లు మనకి నచ్చేలా వుండాలి. తెలుగు రచయితలు, కవులు చాలా మటుకు నిరంకుశ అధికారాల్ని కోరుకుంటారు. కొన్ని తరాలుగా ఇవి మొద్దు బారిన చర్మాలు. వీటి మీద చర్నాకోల లాంటి పదాలూ, వాక్యాలు తప్ప ఇంకేవీ పనిచెయ్యవు. అందుకే, సున్నితమయిన శైలీ పుస్తకాలు ఇక్కడ పనికి రావు.
తెలుగులో అచ్చు అనేది అచ్చోసిన ఆంబోతు లాంటిది. మనకి అచ్చు యంత్రాలు వచ్చాయి గాని, అచ్చు నియమాలు ఏమీ రాలేదు. అచ్చుకి సంబంధించిన భౌతిక ఏర్పాట్లు తప్ప నిజంగా అచ్చు సంస్కృతి రాలేదు. ఆ మాట కొస్తే, తొలి తరం ప్రచురణ కర్తలకి వున్న పాటి సంస్కృతి కూడా ఇవాళ మిగల్లేదు. ఒక రచన అచ్చుకి పంపడానికి ముందు ఏ ఏ దశలు అవసరమో ఆ ఆ దశల పట్ల మనకి శ్రద్ధ లేదు. అందుకే, రంగుల మయంగా కనిపించే ఇవాళ్టి ప్రచురణల కన్నా, ఆ నాటి వావిళ్ల, దేశి, ఆదర్శ, దక్షిణ భాషా సంస్థ ప్రచురణలు అందంగా కనిపిస్తాయి. ఆ అందం వాటి భౌతికత నించి రాలేదు, నిస్సందేహంగా అవి పాటించిన శైలీ నియమాల నించి వచ్చిందే అనుకుంటాను. అచ్చు తప్పులు లేక పోవడం కూడా ఆ నియమాల్లో భాగమే. ముందు తరాల సంపాదకులకు కూడా శైలి పట్ల ఆ గౌరవం వుండేది. ఈ తరంలో ఆ గౌరవాన్ని నిలిపే సంపాదకులు లేరు. అసలు సంపాదకుడి పాత్ర మీదనే ఇప్పుడు గౌరవం లేదు. ముఖ్యంగా అచ్చు గౌరవాన్ని పోగొట్టడంలో తెలుగు దిన పత్రికల పాత్ర పెద్దది. తెలుగు దిన పత్రికలన్నిటికీ నిజానికి శైలీ పుస్తకాలున్నాయి. అవి ఎవరూ పాటించిన పాపాన పోరు. అసలు అక్షరం ముక్క రాయడం వస్తే చాలు అనే స్థితికి దిన్ పత్రికల మార్కెట్ దిగజారి పోయినప్పుడు నిజమే, శైలి ఆందని ద్రాక్ష పండు మాత్రమే ! ఇప్పుడు సాహిత్యాన్ని పోషించేది కూడా ఈ దిన పత్రికలే కాబట్టి, సాహిత్య శైలి కూడా అంతే!
ఈ స్థితిలో వేలూరి వ్యాసం ఒక చూపుడు వేలు. అది కొందరి కళ్ళల్లో గుచ్చుకోవడం సహజమే! కాని, కాస్త నిగ్రహంగా ఆలోచిస్తే, ఈ వేలు ఒక మంచి రచనా సంస్కృతి వైపు దారి చూపిస్తుంది. మంచి ఆలోచనల్ని అక్షరాల్లోకి అనువదించే మంచి రాత ఆ సంస్కృతికి పునాది. ఇది నేర్చుకుంటే వచ్చేది తప్ప సహజ పాండిత్యం మాత్ర) కాదు. ఆ మాటకొస్తే, సహజ పాండిత్యం ఒక ఆత్మ వంచన, భ్రమ. అలా నేర్చుకోవడానికి మన తెలుగు వాళ్లు సిద్ధంగా వున్నారా అన్నది ప్రశ్న. అసలు నేర్చుకోవడం అనే ప్రక్రియ మీద మనకి గౌరవం వుందా? ఆ గౌరవం లేకపోతే , రాత నియమాలు మనకి పనికి రావు.
పొరపాటుగానే అయినా ఒక ముఖ్య విషయం ప్రస్తావనకు రావటం మంచిదే అయింది. అది “సంపాదన”.గురించి. లోకం మొత్తంమీద తన శ్రమకి తగిన “కూలి” ఏ కోశానా.. గిట్టనిది ఒక్క తెలుగు రచయితకే… అన్న ది జగద్విదితం!! తెలుగుదేశంలోని పత్రికల్లో మంచి కవితకీ.. కాని కవితకీ కూడా ఒకటే రేటు. మీరు ఎంత గొప్ప కవితనైనా రాయండీ..మీకు వారిచ్చేది..ఒక 150రూపాయలు మాత్రమే!! గొప్పవ్యాసం రాసినా అంతే పారితోషికం.!! మరి ఇది రచయిత బుధ్ధి పరిశ్రమని కారుచౌకగా దోచుకోవటమే కదా? ఈమాట లో అచ్చయ్యే వాటికి “అంతర్జాతీయ ప్రమాణాల”కి ధీటుగానే ధర చెల్లిస్తారేమో..నాకు తెలీదు మరి.
నా ఉద్దేశ్యంలొ మంచి రచనలు రావాలంటే మంచి పారితోషికం చాలా ముఖ్యం. అక్కడ మార్పు లేకుండా..ఏమీ కిమ్మనకుండా.. “పెద్ద రచయితలు” రాయడంలేదని ఊరికే వగచినా..అనవసరంగా రచనలు పంపని వారిని ఆడిపోసుకున్నా… లాభం ఏముంటుందీ??
రచనలు కావాలీ..కానీ వారి అక్షరానికి కిట్టుబాటు ధర కల్పించం..అన్న వైఖరి అయాచితంగా రచయితల కల్పనాశక్తిని దోచుకోవటమే అవుతుంది. అందుకే పత్రికలకి అరుదుగా తప్ప చెప్పుకోదగ్గ రచనలు రానిది.ఈపాటి భాగ్యానికి వచ్చిన రాతల్తో సరిపెట్టుకుని నడుపుకోవటమే పత్రికని. అందుట్లో పస లేదని అనుకున్నా ఫలితమేముందీ?? ఊరికే వచ్చింది ఉత్తమం కాదా?!ఆలోచించండి.
రమ.
[విస్తృత చర్చకు వీలుగా ఈ అభిప్రాయం చర్చావేదికలో కూడా వుంచబడింది.]
నా వ్యాసాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం; శ్రమకి ఫలితం దక్కినట్లే. మీరు వీటిని కాపీ చేసి పిల్లలకి పంచి పెడతానంటే నాకానందమేగాని ఎలాంటి అభ్యంతరమూ లేదు; ఈమాటకీ ఉండదు. మీ ఉదారతకి కృతజ్ఞతలు. ఈపనిలో నేను చేయూతనివ్వగలను. (మా హైస్కూలు మాస్టార్లకి పంపిస్తానని మాటిచ్చాను కాని, ఇంకా పంపలేదు. పంపాలి.)
వ్యాసాలన్నీ పూర్తయింతర్వాత, సవరించి పుస్తకంగా ప్రచురించే ఆలోచన చేస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
రామన్న గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/04/2009 10:04 am
వినీల్ గారు
కవిత నచ్చిందందామనుకున్న కాని గుచ్చింది, car accident లో పోగొట్టుకున్న దోస్తు యాదికొచ్చి. చివరి లైను కొసమెరుపు.
______
విధేయుడు
-Srinivas
నమస్కారం
చమత్కారంగా చక్కగా తెలిపారు, ఒక్కటి మాత్రం అర్థం కాలేదు.
“ముఖ్యంగా కవితలలో పునరుక్తి పనికిరాదు. కత్తిరించేయండి.”
అన్నదొక్కటి వ్యంగ్యమో హాస్యమో నిజమో తెలియని (దు)స్థితి.
వచనంలో పునరుక్తి వద్దనేది అర్థంచేసుకోగల్గినా, కవితలలో_ మనకున్న ఎన్నో తెలుగు, తెలుగేతర కవితలలో, అందంగానే కనబడుతుంది, స్పష్టంగానే వినపడుతుంది, సమంజసంగానే అనిపిస్తుంది కదా పునరుక్తి! అపార్థం చేసుకున్నాననేమో అని అనుమానం, అంతకన్నా దాన్ని సరిచేసుకోడానికే ఈ ప్రయత్నం.
To be or not to be: that is the question” అనే అంటాం కాని ఎంత Elements of Style ఘోషించినా To be or not: that is the question” అని అనం కదా! “మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది” అనీ, “భజ గోవిందం, భజగోవిందం, గోవిందం భజ” అనీ, “సంభవామి యుగే యుగే” అనీ, “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ” అనీ, “వాగర్థావివ సంప్రృక్తౌ” అని తిరిగి “వాగర్థ ప్రతిపత్తయే” అనీ, “దేశమంటే మట్టికాదోయ్ దే శమంటే మనుషులోయ్”-పునరుక్తులు లేక్కపెట్టుకుంటూపోతే, కత్తిరిస్తూవుంటే మిగిలేదేమిటో conclusion ఏమిటో తెలియదు!
ప్రార్థన చివర్లో కూడా పునరుక్తే ఓం శాంతిః శాంతిః శాంతిః !
“And miles to go before I sleep, And miles to go before I sleep”
—–
విధేయుడు
-Srinivas
[శ్రీనివాస్ గారూ: మీరు పైన ఉదహరించిన వేటిల్లో కూడా పునరుక్తి దోషం లేదు. -సం.]
నాకు తెలిసి, అటువంటి ప్రయత్నమే ఒకటి డాక్టర్ చంద్రశేఖరరెడ్డి గారు కొన్నేళ్ళ క్రింద “వార్త” పత్రికలో “మన భాష” శీర్షికగా వ్రాసిన వ్యాసపరంపర అనిపిస్తుంది.
సాధ్యమైనంత ఎక్కువ మందికి సాధ్యమైనంత తక్కువ వెలతో అందించే విధంగా నూరు వారాలపాటు ధారావాహికంగా సాగిన ప్రయత్నం, రచయిత పరిశ్రమకూ, అప్పటి “వార్త” సంపాదకులైన శ్రీ కె.రామచంద్రమూర్తి గారి దార్శనికతకూ, ఇప్పుడు కూడా ఆశ్చర్యపడుతుంటాను. ఆ నూరూ వ్యాసాలను సంకలం చేసి “మన భాష” అనే పేరుతో 2001 లో పుస్తకంగా ప్రచురించారు. అది భాషా పరిజ్ఞాన సాధనకు చాలా ఉపకరమైన రచన అని బూదరాజు రాధాకృష్ణ గారు బహుధా ప్రశంసిస్తూ “పరిచయం” వ్రాసారు. భాషాపరంగా, వాడుక పరంగా అది తెలిపిన ఎన్నో విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి.
Elements of Style లో అన్య భాషాలోనుంచి ఇంగ్లీష్లోకి చేరిన పదాలను ఎట్లా ఏ రూపంగా వాడాలి అన్న ప్రస్తావన లేదు, సంశయాలు లేవు కాబట్టి! కాని తెలుగుకు సంస్కృతానికి పెద్ద సంబంధమే ఉంది. “ఏది తెలుగు – ఏది సంస్కృతం”,
“తద్భవాలా – తత్సమాలా”, “శషలు తెలుగులో లేవు”,
“తత్సమాలు ఏర్పడే పద్దతి” “భాషల పరస్పర ప్రభావం” మొదలగు ఎన్నో అంశాలు, పొరపడే ప్రయోగాలు, పదాలు
ఉన్నాయందులో.
ముఖ్యంగా, పత్రికలో వచ్చింది కాబట్టి సాధారణ పాఠకులకు అందుబాటులో ఉండి, ప్రతి అంశం రెండు పేజీలకు మించకుండా (రెండువైపులున్న ఒక్క పేజీనే!) ఒక చక్కని Style లో ఉంది.
ఎప్పుడు చదివినా ఏవో కొత్త అంశాలు (నాకు!) నేర్పే పుస్తకం. సందర్భం వచ్చింది కాబట్టి దాని ఉనికిని తెలియజేసే ప్రయత్నం
మాత్రమే. ఆ పుస్తకమొక్కటే సరిపోతుందని కాదు. ఆ కృషి మాత్రం గుర్తించదగింది, ఇంకా విస్తరించదగింది అనుకుంటాను.
———
విధేయుడు
-Srinivas
తోచిన సూచనలిచ్చింది నిజమే కాని, ముఖ్యంగా నేను చెప్పిన దొక్కటి మాత్రం పూర్తిగా వదిలేసారు సురేశ్. అందుకే చెప్పుకోవడం.
సంస్కృత శ్లోకాలు, పోతన పద్యాలు మొదలగునవేవీ ఇంటెర్నెట్టులో లభించని రోజుల్లో వాటిని అందించి, అర్థ వివరాలను తెలిపి, అన్వయించుకోవడానికి ఆనందించడానికి అప్పట్లో సాయపడిన వారిలో గుర్తున్నంతవరకు సురేశ్ పేరే మొట్టమొదటిగా తడుతుంది. అంతే గాక, సురేశ్ అప్పట్లో SCIT కి “తెలుసా” గ్రూపులకు bridge తయారు చేసారు. దాన్ని వాడినవారికి కూడా తెలుసో లేదో.
WordPress ద్వారా “ఈ మాట” ను ప్రచురించే సాంకేతికపరమైన వివరాలను ఇంకెంతోమంది తెలుగు వారికి కూడా ఉపయోగపడాలనే పెద్ద మనసుతో, “పొద్దు”, “భూమిక”, “ప్రాణహిత” మొదలగు సైట్ల నిర్మాణానికి కూడా దాచుకోకుండా అందజేయడం, వారు చెప్పడం దాచారు కాబట్టి చెప్పడం. శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!
జ్ఞాపకాలు తెలుపుకోవడంలో ఒక ప్రమాదం ఉంది. రాసిన గంటకో రెండ్రోజులకో అయ్యో ఫలానా సంగతే చెప్పడం ఎట్లా మరిచాను అనిపించడం. అట్లా అని చాంతాడంత రాస్తూపోతే మొహమెత్తవచ్చు, తీపి కూడా ఎక్కువైతే అయినట్లు. గుర్తుకొచ్చినవాటికీ, రానివాటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.
______
విధేయుడు
-Srinivas
పుస్తకంలో ఇదే నవలపై రచయిత రాసిన కామెంట్ లోని లింక్ ద్వారా ఇక్కడకొచ్చేను. వ్యాసమ్ చదివాను. ఎంతో సానుభూతితో రాసిన పరిచయం బాగుంది. కాని, నాకనిపించింది ఏమిటంటే మన చూట్టూ మనల్ని నిండా ముంచీసేలా వున్న బ్రామ్మన సాహిత్యం మన మనసులను ఎలా ఆక్రమించిందో చూడండి. ఈ వ్యాసంలొనే ‘పురాణం’, ‘భారత భాగవతాల్ని సూతుడు శౌనకాది మునులకి కూర్చోబెట్టి చెప్పినట్టు’, ‘ఉప్మాలో జీడిపప్పు పలుకుల్లా’ లాంటి మాటలు.. నాకెందుకో ఇక్కడ ఎబ్బెట్టుగా అనిపించాయి. ఎందుకిలా అనిపించిందంటే ఈ నెల “అరుణతార” చదవడం వల్లనా? లేదంటే ప్రస్తుతం బి.ఎస్. రాములుగారి “కన్యాశుల్కంను ఇప్పుడెలా చూడాలి” వ్యాసం చదువుతున్నందుకా? వీరి వ్యాసం నిజానికి నాకు నచ్చింది. గానీ, ఎందుకో పదజాలంలో మరో వాసన కనిపిస్తోంది. ఈ విషయంలో నా ఆలోచనలు అస్పష్టంగానే వున్నాయనుకోండి. అదే ఇక్కడ చెప్పాలనిపించింది. తప్పయితే మన్నించండి.
ఆర్కే గారూ! శ్రీనివాస్ గారూ! మీ అభిప్రాయమే నాకూ వచ్చింది. కాని నా మనసు వ్యతిరేకిస్తున్నా ఇలా రాయడమ్ జరిగింది. ఎందుకంటే, నేటి ప్రపంచం తీరును బట్టి చూస్తే, చాలామంది ఎత్తుకి పై ఎత్తు వేసి గెలవాలని చూసే వాళ్లే కదా! ఈ నాటి “ట్రెండ్”నే కొలికి ముత్యంగా ఉంచడం బాగుంటుందనిపించి అలా వ్రాశా. అలా రాస్తేనే సహజంగా ఉంటుందని మిత్రుల సలహా. ఎంత చెడ్డదైనా, చేతికి చిక్కిన అవకాశం జారవిడుచుకునే వారు చాలా కొద్దిమంది ఈ కాలంలో. ఏది యేమైనా, మీ సలహాకు కృతజ్ఞతలు.
శ్రీనివాస్ గారూ! ఆలస్యం- అన్న మాటను నేను తప్పుగా వ్రాశాను. కాని ఉద్దేశ్యం – అన్నది తప్పు కాదు. టైపోలను ఇక నుంచీ ఎప్పటికప్పుడు సరిచేస్తాను. తెలుగును ఇంగ్లీషులో వ్రాయడం కొత్తగా నేర్చుకున్నాను. అక్కడక్కడ తప్పులు అనివార్యం ఔతున్నాయి. మన్నించండి.
నెనరులతో
వి. హేమ.
పిండంతే నిప్పటి యన్నట్లు అంటే పిండికొద్దీ రొట్టె యన్నట్లు అని అనుకుంటున్నాను. నిప్పట్టు రాయలసీమ కారపు అప్పచ్చి. మొదటిసారి పుంగనూరు నుంచీ “బిన్నీగాడు” తీసుకొస్తే “మద్రాసు” లో రుచి చూసేను. అచ్చు సేమ్ డిటో చేగోడీ. మెటీరియలూ అదే, వేయించడవూ అదే. కనస్ట్రక్షన్ లో తేడా, అంతే. చేగోడీలు నలుపుతారు. జబ్బలు పడిపోతాయి. అదీ గాకుండా చక్కగా వ్రుత్తాల్లా చుట్టకపోతే తిట్లు తప్పవు. గొళ్ళేల్లా చుట్టెస్తే ఇంకా తిట్లు. నూనె ఎక్కువ పీల్చకుండా ఏదో టెక్నిక్ తో మా మేనత్త చేగోడీలు చేసీదికాని అవి “కటక, పటక్” మంటాయి. కరకరలాడవు. బావుండవు. అన్నట్టు నూనె బాగా పీల్చి కరకరలాడీ చేగోడీల్ని జేబులో వేసుకుని ఆడుకుందుకి వెళ్ళకూడదు. ఆ రాత్రి ఎలకలు జేబులు కొట్టెస్తాయి. నిప్పట్లు అప్పచ్చుల్లా చేస్తారు. నలపరు. బహుశా నిప్పట్లని ఉండలా చుట్టిన పిండిని అరచేతిలో పల్చగా అప్పచ్చిలా చేసి వేయిస్తారు కాబోలు. చిన్న ఉండయితే చిన్న నిప్పట్టు, పెద్ద ఉండయితే పెద్ద నిప్పట్టు.
పిండికొద్దీ రొట్టె అన్న ప్రయోగం “పిండంతే నిప్పటి” ముందుదా వెనకదా? రొట్టెలు అన్నమయ్య టైములో లేవా? వున్నా లేకపోయినా నిప్పట్ల వల్ల చేగోడీలకోసం ఏడవడం తప్పిపోయింది నాకు. చిన్నప్పటి పోగుట్టుకున్నాననుకున్న, మరి దొరకదు గాక దొరకదనుకున్న “బంతి” దొరికిందినాకు. అన్నమయ్య పాటల్లో ఇన్ని మంచి వూసులున్నాయా?
తెలుగు వారందరికి
వాడుక భాషా ప్రయోగం వలన కవితా వికాసం పక్కనుంచితే, భాషా వికాసం జరిగిందాలేక వినాశం జరిగిందా అనేది ఆలోచించదగిన విషయం. నాకైతే వినాశం జరిగినదనిపిస్తోంది.
దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించి
ధీరుడై నన్ను బాధించు నొకడు
పాదాంబులోపల పాదంబు లిమిడించి
వీరుడై నన్ను నొప్పించు నొకడు
ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లడరించి
పోటుబంటయి నన్ను పొడుచు నొకడు
బెండు పల్కులు గూర్చి నిండైన నగలంచు
దిట్టయై చెవులు వేధించు నొకడు
ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి
వర్ణముల్ మార్చి నను చిక్కుపరచు నొకడు
కుమతు లొడ లెల్ల విరిచి ప్రాణములు తీయు
ఒడలి పస లేక శుష్కించియున్న దాన
రసజ్ఞులను ఆకట్టుకొనే రసాన్ని అలక్ష్యం చేసి కేవలం అద్భుతం విస్మయం కలిగించే పై దిక్కుమాలిన సర్కస్ ఫీట్ల పై దృష్టి పెట్టిన ఆనాటి కవుల ధోరణిని నిరసిస్తూ చేసిన సరస్వతీ దేవి విలాపం సరి ఐనదే. కానీ దానికి స్పందన, విస్పందన, ప్రతిస్పందన, విపరీత స్పందన బాగా ఎక్కువై ఈనాటి స్థితికి కారణమైనది. నాకైతే ఇప్పుడు మాత సరస్వతి మన ముందు నిలబడి ఈ విధంగా ఆక్రందిస్తున్నట్లు అనిపిస్తుంది.
ప్రాస, యనుప్రాస, బహు ప్రాస, యంత్యను
ప్రాస నా బడు నగల్ దీసినారు
శ్లేషోప మాది విశిష్టార్ధ భూషల
పాత పెట్టెల పార వైచినారు
లలిత నారీకేళ రస రమ్య పాకాల
చీనాంబరాల్ చింపి చీల్చినారు
కంద మత్తేభాది కమనీయ గతులిచ్చు
మంజీరముల హత మార్చినారు
తిలక, మంగరాగము, కురుల్ తీర్చి దిద్దు
సరణి, పారాణి, ప్రాతని పరిహరించి
అన్ని దిగలాగి నగ్నతా ఖిన్న జేసి
నిలిపి నారయ్యయో వీధి నేటి కవులు
పలుభూషణంబులు వలదంటి నే గాని
తల శిరోమణి నైన దాల్పనొక్కొ?
నగలిన్ని మోయంగ జగడమాడితి గాని
ఒకపేట గొలుసైన నొల్లనొక్కొ?
పట్టు జరీ చీర పెట్టెలొల్లను గాక
వస్త్రమే వలదని పలికితొక్కొ?
పలుగతులను నృత్యముల సేయ భరమంటి
నడవనే నని సుడి వడితి నొక్కొ?
భావ భాషాది భూషల బార వైచి
యమక గమకాదిగతులెల్ల యణగ ద్రొక్కి
రస విలాసాఖ్యమౌ యంబరముల నూడ్చి
నిలిపి నారయ్యయో మది తొలచినారు
నేను మీ వ్యాసంలో ఉదహరించిన పేరెన్నిక గన్న మహా కవుల గురించి గానీ జనాదరణ పొందిన వారిఉదాహృత కవితల గురించి గానీ పై అభిప్రాయాన్ని వెలువరించ లేదు. ఈ మహా కవులందరు అద్భుత ప్రతిభా వ్యుత్పత్తి గలవారు. భాషలో అనంత పద పరిజ్ఞానం గలవారు. జనరంజకమైన భావాభి వ్యక్తికై ఛందో బంధనాలనుంతెగద్రెంచిన వారు. కావలసి వస్తే గర్భ కవిత్వాన్ని గానీ బంధ కవిత్వాన్ని గాని అలవోకగా నిర్మించగల భాషా శెముషి గలవారు.
నేను చింతించేది తామర తంపరలుగా అనేక పత్రికలలో వచన కవిత అనే పేరుతో కవితా సరస్వతిని గాయపరచే వారి గురించి. ఈ తరహాలో నాకు తెలిసిన చాలా కవులకు 100 -150 కన్నా తెలుగు పదాలు రావు. ఒక ఆట వెలదిలో పద్యం వ్రాయగలిగే పద సామర్ధ్యం లేదు. అసలు వారికి ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి తెలిసిన పదం ఒకటే, అదీ అన్య భాషా పదం ఐనపుడు ఛందస్సు అనేది తెగగొట్టలేని అయోమయ శృంఖలగా అనిపించడంలో వింత లేదు. కనీసం ఒక లయ (మాత్రా ఛందస్సులో) ప్రకారం కూడా వ్రాయలేక ఈ నియమాలేవీ లేని వచన కవితనిఎన్నుకోవడం శొచనీయం. జన సామాన్యానికి అర్ధం అయే భాషలో వ్రాయడం మాత్రమే ముఖ్యం కాదు, జనరంజకంగా వ్రాయగలగాలి. అందుకు భాషలో పద పరిజ్ఞానం ఉండాలి. అది మృగ్యం ఔతోంది.
ఇంకొక సంగతి. జనసామన్యానికి అర్ధం కాని సాహిత్యం నిరర్ధకమైనదనే దానిని ఎవ్వరూ ఇష్టపడరు, దానిపై మా కసహ్యం లేదు. మానేశాము అనే వాదన ఈ వ్యాసంలో బయట కూడా కర్ణతాడితమౌతోంది. జనసామాన్యానికి అర్ధం కాలేని వన్నీ పరిత్యజించాలంటే, ఒక గణితం, సర్వ విజ్ఞాన శాస్త్రాలు పరిత్యజించి గుహలలో ఉండాల్సి వస్తుంది. క్లిష్టమైన దాని ఆలోచించి అర్ధం చేసుకోవడం ద్వారానే విజ్ఞానం పెరుగుతుంది. భాషకు కూడా ఇది వర్తిస్తుందని తెలుసుకోక పోవడం వలన మన భాష ఇప్పటికే చాలా నష్టమైంది. వ్యాసకర్తగారు వొక చోట వేమన గారు జనసామాన్య భాషలో వ్రాశారన్నారు. ఆ మాట కు కాలదోషం పట్టిందని తెలుసుకుంటే వారు తమ మాటను వెనక్కు తీసుకుంటారేమో. ఎందుకంటే ఇప్పటి తెలుగు వారికి వేమన సుమతీ శతకం లు అర్ధం కావడం లేదు. ఆ గ్రాహ్య శక్తి 100-150 దాక పద పరిజ్ఞానం గలిగిన కవులకే పరిమితం. ఈ విధంగా భాష ఒక్కొక్క తరంలో క్రమక్రమంగా వినష్టమైపోతోంది. ఛందో బద్ధమైన కవిత్వం వ్రాయడం వలన కవి పద పరిజ్ఞానం పెరుగుతుంది. భాష విస్తృతమౌతుంది. తన అధీనంలో వున్న అనంత పదరాశిలో జనరంజకమైన పదాన్ని ఎన్నుకోడానికి కవికి వీలుంటుంది. నియమ బద్ధంగా ఆరంభించినవారికే ఆ నియమాలను ఎట్టి సందర్భాలలో ఎలా అతిక్రమించి జనరంజకమైన కవిత్వం వ్రాయడం సాధ్యమౌతుంది.
తెలుగు సినీ సంగీతంలో రెండు యుగాలున్నాయి. ఒకటి ఘంటసాల యుగం. ఇంకొకటి బాలు యుగం. దేనికదే ప్రత్యేకమైనది. ఘంటసాల వారిది 30 యేళ్ళ యుగం. బాలు వారిది కూడ ఇంచుమించు అంతే. ఒక యుగం మరొక యుగానికి స్వాగతం పలికే యుగ సంధి కాలంలో వారిద్దరూ కలసి పాడిన పాటలు- ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ‘ అనే ఉదయ గీతం మొదటిదైతే ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అనే రేయి గీతం రెండవది. ఇక ఆ తర్వాత వచ్చినవి-‘భలే మజాలే భలే ఖుషీలే టయిము రోజాలే మనం రాజాలే’, ‘దేవుడు చేసిన మనుషుల్లారా …. వినండి’. ఈ రెండు యుగాల్లో మంచి పాటలూ వచ్చాయి, ‘అయ్యో ఖర్మ’ అనుకునేలా చెడ్డ పాటలూ వచ్చాయి. ఇప్పుడు కేవలం మంచి పాటలే ముందు తరాలకు అందేలా చూడాలి. అందుకు అద్భుతమైన సాధనం- కంప్యూటరే. కంప్యూటర్ ఘంటసాల యుగంలో అంత అందుబాటులో లేదు. అందాక ఎందుకూ? క్యాసెట్లే లేవు. కాని కంప్యూటర్ యుగంలో ఘంటసాల పాట ఇంకా ఉంది. బాలు చాలా అద్రుష్టవంతులు. సాంకేతిక ప్రగతిని అంచెలంచెలుగా చూస్తూ తన గొంతును రక్షించుకుంటున్నారు. తెలుగు మాట కరువైపోతున్న ‘కన్ ఫ్యూజన్ యుగంలో తెలుగు పాట ‘రస హీనమై పోతోంది’, పాడేవారి విషయంలో ‘వారస హీనమై పోతోంది’.
– డా. తాతిరాజు వేణుగోపాల్
ఏ కరీముద్దీన్ గారి కలం నుండి గాక ఒక కృష్ణ మోహనుని కలం నుండి వచ్చిన ఈ అల్లా స్తుతి అభినందనీయం.
శివుడెంచగా కాళి, శ్రీ పతి కాళి, పవనాత్మజుడు విఘ్న పతియును కాళి
నవగ్రహ దేవతల్ నారాయణుండు, వివరింప వేంకట విభుడును కాళి
నరసింహదేవుండు నాకెంచ కాళి, గురు రామకృష్ణుండు కొండంత కాళి
శిరిడీ నివాసుండు శ్రీకరి కాళి, అరయ దోచెడు విశ్వమంతయు కాళి
ధరియించు వస్త్రంబు తగ కాలిజోడు, ధరనూడ్చు చీపురు, తట్టయు కాళి
తిరువళికయు కాళి, దీపంబు కాళి, బరగ గూర్చొను గోనె పట్టయు కాళి
అభీష్ట దైవాన్నే అంతటా చూసే వారికి నామ రూపాలతో పని లేదు. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు (న ఏసు అనేసు = ఏసు కానిది)
అనేది ప్రపంచంలో లేదు.
పై పద్యంలో ధార, భావం అన్నీ బాగా వున్నాయనే నేను కూడా అనుకుంటున్నాను. మీకీ పద్యం అవగతం కాలేదన్నారు లేదా భావోత్కృష్టత అంత ప్రశంసనీయం గా మీ కనిపించలేదన్నారు కనుక, నా అల్ప మేధస్సుకి అది ఎందుకు అనర్ఘంగా తోచిందో వివరింప ప్రయత్నిస్తాను.
ధనము శాశ్వతము కాదు. శరీరం క్షణ భంగురము. జీవనము తత్వార్ధముల వలె (అహమ్ బ్రహ్మస్మి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి వగైరా) నిత్యము కాదు. కాల పాశానికి ఏ నిముషమైనా చిక్కవచ్చు. కావున మనుషులైన వారు దీని వ్యావృతిని నమ్మక, మహాత్ముడైన అమ్మెన ప్రెగ్గడ వలె పేర్మితో వరార్ధము (భగవచ్చింతన), ఎన్నడునూ చేటు లేని ధర్మార్ధము (ధర్మ నిరతి) చేయవలయును.
ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. మిగిలిన పదాలు, ధార అవధరిస్తే కవి అసమర్ధుడుగా భాసించడు. ఆ లోపాలు సమ్యగ్రీతిని సంస్కరిస్తే ఈ పద్యం మీకు కూడా హృద్యంగానే వుంటుందని అనుకుంటాను. ఆ విధంగా సంస్కరింపబడినా కూడా అది అంత మంచి పద్యం అని మీకనిపించక పోతే అది మీ అభిరుచి. లోకో భిన్న రుచిః నాలాంటి కొందరికి నచ్చిన దాన్నే ఉత్తమ సాహిత్యమని పలకడం దుస్సాహసమౌతుంది గదా.
మీరు బి.వి.రామన్ గారు గాంధి గురించి వ్రాసిన దానిని ఎగతాళి చేసారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చి పోతున్నారు. జాతకము లోని వివిధ కాంబినేషన్ల బట్టి వివిధ విషయములు చూడాలి. ద్వాదశం, శయ్య సుఖము, మోక్షము, వ్యయము లను సూచించును. ఆత్మ కారకుడు మోక్షస్థానములో ఉండటము వలన అధ్యాత్మికత గురించిన ప్రస్తావన సరియేగదా. ఇది మీరన్నట్లు 2+2=4 లాగా కాదు కదా. వివిధ సిధ్ధాంతములు మనకు సూచకములే (గైడులైనులే).
ఇంకొక సంగతి: డీన్ చేసిన ప్రయోగం చాలా సరళమైనది. ఒక జాతకం సరిగా చెప్పాలంటే, వివిధ వర్గ (రాశి, నవాంశ, దశాంశ, …), ఏ విషయము కావలయునో ఆ దశ భుక్తి తదితర విచారము, గోచార, తిథి ప్రవేశ ఫల నిర్ణయము ఇటువంటి వివిధ ప్రకార చింతనము ఆవశ్యకము. అంచేత, డీన్ ప్రయోగ ఫలితము నాకు అంత ఆశ్చర్యము కలిగింపలేదు. అదీ కాక, ఆయన నమ్మకము అధికమని నిరోపించాడే కాని జ్యోతిష్యము పని చేయదని నిరూపించలేదని నా అభిప్రాయము.
నా అభిప్రాయము ఏమన జ్యోతిష్యము ఎడ్యుకేటెడ్ గెస్ చేయటానికి సాయం చేస్తుంది.
మాధవ్ గారికి
స్పందన తెలుపమన్నందుకు ఈ క్రింది రెండు మాటలు…
“కొందరు శబ్దాలకు తలూపుతారు. కొందరు శబ్దాలకు నాట్యం చేస్తారు. కొందరు శబ్దాలకు ‘చెవి’ విరుస్తారు. కాని కొందరు నిశ్శబ్దసౌందర్యాన్ని దర్శించడం కోసం శబ్దలోకయాత్ర మొదలుపెడతారు.
చివరివారికి లోయలు స్వాగతం పలుకుతాయి. మీకు స్వాగతం పలికిన లోయల్ని పరిచయం చేసుకున్నాను. సంతోషం.
ఈ కథ గురించి రచయితగా చెప్పడానికి ఏమీలేదు. ఎవరి లోయల మీద ఎగురుతొన్న పక్షుల రెక్కల చప్పుళ్ళని వారి రక్తంలోకి అనువదించుకుని ఆనందించడమే…
ప్రసాద్ గారికి నమస్కారం – మీరు రాసింది బాగానే ఉంది. చివరి పాదంలో దురితలోని రితో యతి సరిపోదు. సామాన్యముగా శ్రీకు రికు యతి చెల్లుతుంది. కాని పాదంలో ఒక యతికంటె ఎక్కువగా ఉంటే, మొదటి
అక్షరము సంయుక్తాక్షరమయితే అందులో ఒక అక్షరంతోనే పాదమంతా యతి చెల్లించాలి. అంటే దురితలోని రికు బదులు శీ అక్షరముతో యతి చెల్లించాలి. నా ఈమెయిలు చిరునామా jkmrao@yahoo.com
అక్కడికి మీరు రాస్తే మిగిలిన విషయాలను చర్చించుకోవచ్చు.
విధేయుడు – మోహన
మోహన రావు గారికి,
మీ సద్యో ప్రత్యుత్తరానికి కృతజతలు. ముఖ్యంగా పద్య లక్షణాలను సరిగా తెలియజేసినందుకు. నాకు ఇవి వ్యాసం చదివినపుడు అవగతం కాలేదు. సరిచేసిన పద్యాన్ని క్రింద వ్రాసాను నా అవగాహన పూర్ణమేనా చూడండి
మీకున్న చందో పరిజ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత ఒక చిన్న సంశయం తీర్చుకోవాలనుంది. దండకానికి లక్షణం తెలియచేయ (గల)రా. అనేక త గణాల తరువాత కొన్ని (ఒకటో రెండో) న గణాలు కనబడతాయి. న గణ ప్రయోగమే లేకుండా కేవల త గణాలతో దండకం వ్రాస్తే తప్పవుతుందా?
ఈ మాట సంపాదకులకు – అయ్యా ! ప్రచురితమైన వ్యాసాలతో సంబంధం లేకుండా మా వ్యక్తిగతమైన సంశయాలకు సమాధానం పొందాలంటే మేము ఏమి చెయ్యాలో తెలియపరచగలరు.
[ఈమాటలో ఇటువంటి ప్రశ్నలకూ, అభిప్రాయ చర్చలకూ ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పాఠకులకు త్వరలోనే తెలియజేయగలం. – సం.]
మంచి కథను పరిచయం చేసినందుకు మాధవ్‌గారికి నెనరులు. నేను యిటీవలే అరకు వెళ్ళాను. అంత విశృంఖలమైన ప్రకృతి ఎవరినైనా కదిలిస్తుంది. రచయితలకైతే సహజంగానే ఏదో ఒకటి రాయాలన్న ఉద్దీపన కలిగిస్తుంది. నేనూ ఏదో ఒకటి రాయాలనుకున్నాను. కానీ నేనేం రాసినా ఇందులో శతసహస్రాంసమైనా అయ్యుండేది కాదు. ఆ నేపథ్యాన్ని ఇంత అద్భుతమైన ఉద్దేశ్యానికి వాడుకోగలిగేవాణ్ణి కాదు. కథ అర్థం అవడమూ అర్థం కాకపోవడమూ తరువాతి సంగతి; ముందు చదువరి ఈ కథని పూర్తిగా ఆస్వాదించాలంటే, విశాఖపట్నం నుంచి అరకుకి రైలు మార్గంలో ఒక్కసారైనా ప్రయాణించి వుండడం అతని కనీస అర్హత. మాధవ్‌గారు చూడలేదు కాబట్టే కథని ఒక పార్శ్వం లోంచే ఆస్వాదించగలిగారు. నేనైతే ఆ టన్నెల్స్‌లోంచి కూడా నడిచాను. అదో వింత అనుభవం.
“ఇదంతా నాన్సెన్స్ అంటే ఏం చెప్పను? అర్ధం కాని వన్నీ గొప్పవేనా అంటే ఏం చెప్పను? ‘పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ’ మనకు ఉంటుందని నేననుకుంటాను.”
ఇది నిజం. కొన్ని కళరూపాలు అర్థం కాకపోతే అది వాటి తప్పే అనిపిస్తుంది. మరికొన్నింటి విషయంలో మాత్రం, మనం సరైన దృక్పథం లోంచి చూడలేదు కాబట్టి అర్థం కాలేదనిపిస్తుంది; మనదే లోపమనిపిస్తుంది. ఈ “పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ” మనకు సాధనతోనే సంక్రమిస్తుంది.
బోడి పద్యం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
04/07/2009 2:11 am
అభిప్రాయం స్పష్టంగా లేదేమో అని ఇంకొక్క మాట. మసీదైనా, మందిరమైనా, Golden Temple గురుద్వారా అయినా, ప్రార్థించే ప్రదేశమేదైనా పవిత్రమే, ఎల్లప్పుడూ అందరికీ. మతమేదైనా పవిత్రత ఒక్కటే. కాని ఆ పవిత్రతకు కారణమైన ప్రార్థన, నమాజు అన్నవే లేనప్పుడు వాటిని పూర్వ గౌరవంతో ఆదరించడం ఎంత వరకు సబబు అన్నది కవులు, విజ్ఞులే కాదు మేధావులూ, పౌరులందరూ ఆలోచించి అభిప్రాయాలు పంచుకోవడం ఎంతో ఘర్షణను, రక్తపాతాన్ని నివారించడానికి సహాయం, కాదు- నేటి అవసరం అని కూడా అనుకుంటాను. హింసకు దారితీసిన, తీస్తున్న విషయాలు చర్చలకు దారితీసి వెలుగును వెత్తుక్కోవడం అన్నివిధాల మేలు చేస్తుందని కూడానమ్ముతాను.
________
విధేయుడు
-Srinivas
బోడి పద్యం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
04/04/2009 9:03 am
సమాజంలో బతకడం నేర్చుకోవాలట ఈ కవితనర్థం చేసుకోవడానికి. సమాజంలో బతకడవే సరిపోదట, వెనుకనున్న చారిత్రక సంఘటనల సారస్వం తెలిసుండాలట. కాకపోతే మరేదో వ్యాసం చదివి ఈ కవితని అర్థం చేసుకోవాలట. లేకపోతే, అర్థం లేకుండా గొప్పగా ధ్వనించే ఈ పదాల పజిల్ ని, ఒకదానికొకటి సంబంధంలేకుండా వున్న ఈ పదచిత్రాల ముక్కల్లో, నేలని విడిచి సాముచేసి, తెగిపడివున్న చర్మపు ముక్కనుంచి భూత, భవిష్యత్, వర్తమానాల్ని అన్వయించుకునే (పచ్చ, పచ్చటి డాలరు రంగులో, పడిపోతున్న అమెరికా హంగులో) ప్రత్యేకవైన రంగుల కళ్ళద్దాలన్నా కావాలట.
ఎవరికోసం ఈ కవిత? ఎందు కోసం ఈ కవిత? కొద్దో, గొప్పో చదవనేర్చిన వాళ్లకి కూడా అర్థం కాని ఈ కవిత. పాఠకుల ప్రయత్నంలో మాత్రవే విచ్చీ విచ్చకుండా విచ్చుకునే ఈ కవిత. కవితని చదివి అర్థం చేసుకోడానికి ఒక ప్రత్యేకవైన స్థాయి కావాలని కవిగారనుకునుంటే ఇక పేచీనే లేదు. మా పత్రిక ఆ స్థాయిగల పాఠకుల కోసవే అని సంపాదకులనుకుంటే కూడా పేచీ లేదు. కానీ ఇది సర్వ తెలుగు జనుల కోసం అనే అభిప్రాయం వుంటే మాత్రం కవి(తన కవితకి తానే వివరణ ఇచ్చుకోవడం కష్టవే), వివరణ ఇవ్వడం అవసరవేవో.
రవి
బోడి పద్యం గురించి ravinder posani గారి అభిప్రాయం:
04/01/2009 1:13 pm
ఈ పద్యాన్ని నిజంగా అర్ధం చేసుకోవాల్నే అని వుంటే అన్ని ఆధారాలు, సమీక్షకుల సర్టీఫీకెట్లు అక్కర లేదు. లైలా గారి విశ్లేషణ చాలు… కాని, అర్ధం చేసుకోవాలన్న తపన కన్నా, తప్పులెన్నాలన్న తాపత్రయం ఎక్కువ కనిపిస్తోంది.
ఈ పద్యాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు మీరు ఈ సమాజంలో బతుకుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోగలిగిన వాళ్లకి ఈ కవిత తేలికగానే అర్ధం అవ్వాలి.
రవి
బోడి పద్యం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/31/2009 6:31 am
నర్సింహన్న మాటలు చాన్నాళ్ళకింద ఆల్ఫా హోటల్్ కాడ చాయ్్ తాగినట్లనిపించింది. సుట్టుపక్కల ఎవరి మాటలు వారివి. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, కప్పు సాసర్ల చప్పుడు, ఆటోరిక్షాల అరుపులు, సిగరెట్ల కంపులు, అయినా దిల్ ఏక్దం ఖుషీ! ఆ చాయ్ లెక్క ఏ చాయ్ లేదు.
“తెల్ల పొగరు” అంటే సరిగ్గా ఎరుకగాలె. రంగు తక్కువయితే మాత్రం పొగరు తక్కువయితదా అనిపించింది.
“సగం కూలిన మసీదు గోడలు” అన్న లైను కూడా కొంచెం అర్థం కాలేదు.
నమాజు చేసేచోటే మసీదు. నమాజు లేకుంటే మసీదెట్లయితదో తెలవదు.
అట్లనే ప్రార్థనచేస్తే మందిర్్ కాని, పంచాయితీ చేస్తే అయితదా అనిపించింది.
చిన్నప్పుడు కవిత్వం చదవాలంటే భయమయితుండె, అర్థం కావేమో అని. ఇప్పుడు కూడా భయ మయితది, ఎక్కడ అర్థమయిపోతదేమో అని.
========
విధేయుడు
-Srinivas
జ్యోతిష్యంపై ఎవరి అభిప్రాయము వారికి ఉంటుంది. కాని దానిలో వారికి సంభందించి మంచి జరుగుతాయి అనే విషయాలు ఉంటేనే వారు దాని ఇష్టపడతారు. చెడు జరుగుతుందేమో అని ఉంటే వారు నమ్మాలి అనుకోరు. మనస్సులో భయం ఉన్నప్పటికి ఇదంతా వట్టిదే అంటారు. వారికి జాతకాలు కావాలి కాని వారికి అనుగుణంగా మాత్రమే కావాలి.
బాగుంది. నేను బాగుందన్నది ‘బోడిపద్యం’ కవిత గురించి కాదు. ఆ కవిత మీద జరుగుతున్న చర్చ గురించి. వారపత్రికల్లో, దినపత్రికల సాహిత్యానుబంధాలలో కనిపించే కవితలను ఒకటి, రెండు లైన్లు చదివి నచ్చితే చివరంటా చదవడం, లేకుంటే వదిలేయడం ఆ తర్వాత మరచిపోవడం ఇదీ ప్రస్తుత (నా) పరిస్థితి. కాని కవితల గురించి ఇంత విస్తృతంగా, సాధికారంగా, సమర్థంగా, సమగ్రంగా చర్చ కొనసాగడం చాలా బాగుంది. తెలుగు భాష, తెలుగు కవిత్వం, సాహిత్య విమర్ష కలకాలం సజీవంగా ఉంటాయన్న నమ్మకం కలిగింది. అందరికీ ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బోడి పద్యం గురించి sreelata raavuri గారి అభిప్రాయం:
ఈమాటలో సురయ్య మీద, కొత్త ప్రాణహితలో నవ్వు మీద అఫ్సర్ గారి కవితలు చదివాను.
ఆ రెండిటికీ చాలా తేడాగా వుంది ‘బోడి పద్యం”
ఈ తేడా గురించి అసలు చర్చ జరగాలి.
ఒకే కవి రాసిన మూడు కవితలు ఇంత భిన్నంగా ఎందుకు వున్నాయి? ఏ కవితలో కవి ఆత్మ దొరుకుతుంది? (ఈ ఆత్మల గొడవ నాకు నచ్చలేదు కాని, కొద్దిసేపు ఆలోచిద్దాం)
ఆ కవితలు సుతారంగా వున్నాయి, ఈ కవిత మోటుగా వుంది. అసలు కవిత్వ లక్షణం ఏమిటి? ఒకే కవి రెండు రకాలుగా రాసినప్పుడు ఆ కవిని ఎలా అర్ధం చేసుకోవాలి?
త్యాగరాజుల వారి సాహిత్యం మీద చర్చ సరైనదేనా? చర్చించవలసినంత సాహిత్యం త్యాగరాజుల వారిదా? త్యాగరాజ సాహిత్యం, సంగీతానికి poor cousin ట గదా? త్యాగరాజుల వారి సాహిత్యాన్ని శిష్యులూ వగైరాలు సరిగ్గా రాసుకోలేదుటగదా? ముందు సాహిత్యాన్ని సరిగ్గా రాసుకోపోవడం గురించి:
కర్రపలక మీద గంటంతో మహీధర రామశాస్త్రి గారు వ్రాసుకొన్న ప్రతిని చూసి పెనుమర్తి రామశర్మ గారు వ్రాసుకొన్న పాట.
నగుమోముఁ గనలేని
నగుమోముఁ గనలేని
నా జాలిఁ దెలిసి
ననుఁ బ్రోవగ రావ,
నా రఘువర! నీ //న//
నగరాజధర!నిన్నుఁ
బొగడు వారెల్ల
ఒగి బోధనలనుఁ జే
యగ రాలేదే!
మొగమోడితిరేమో! నీ //న//
ఖగరాజు నీ యానతి
దిగనాడి, చనలేదో!
గగనానికి ఉర్వికిని
తెగ దూరంబని నాడో!
జగమేలే పరమాత్మ!
తగ నీతో మొరలిడుదు
వగఁ దీర్పుము, తాళను,
వేగనేలు కోరా!
రఘువర! శుభచరిత!
త్యాగరాజనుత! నీ //న//
దీనికీ ఇప్పుడు పాడుతున్న సాహిత్యానికీ తేడా గమనించాలి. అలాగే ఇంకో క్రుతిలో:
తప్పకనే వచ్చు! నా
తనువుకు లంపట, నీ కృపఁ
దప్పగనే వచ్చు!
రూకలకై, పైకి మంచి
కోకలకై, కూటి కొరకు
నూకలకై ధ్యానించితి!
నుతుని త్యాగరాజ భజనఁ //దప్పఁగనే//
“తప్పకనే అంటే తప్పకుండా అని, భజనఁ దప్పఁగనే అంటే భజన తప్పిపోగానే అని త్యాగరాజు చమత్కార ప్రయోగాన్ని పాట వ్రాసుకున్న వారు గమనించలేదు. ఆఖరి పాదంలోని poetic order తెలుసుకోలేదు. అందుచేత మూలంలోనున్న నుతుని త్యాగరాజ భజనఁ మార్పు చేయబడి త్యాగరాజ నుతుని భజన గా కనిపిస్తుంది. సి.రామానుజాచారి “తప్పగనే వచ్చునా తనువుకు లంపట?” అని ప్రశ్నార్థకచిహ్నం పెట్టేరు. త్యాగరాజు ప్రశ్న వేయలేదు, సందేహించనూ లేదు.
ఇదంతా నా ప్రతిభ గాదు. ఎక్కడో చదివినది.
ఇదంతా ఒకెత్తు, శ్రీపాద పినాకపాణి గారూ, వారి అన్నగారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారూ సంగీతంలోని సాహిత్యం గురించి:
శ్రీపాద కృష్ణమూర్తి గారు: When I listen to music, I care a damn for poetry…. సాహిత్యం కావాలంటే యింట్లో కూర్చుని చదువుకో. సంగీతమునకు ఔన్నత్యము చేకూర్చిన కారణము చేతనే త్యాగరాజునకు గౌరవము వచ్చినది కాని అందమైన సాహిత్యభావములను వెలిబుచ్చినందుకు కాదు.
శ్రీపాద పినాకపాణి గారు: పొయెట్రీ లేదు. బెగ్గింగ్ ఫర్ మెర్సీ అంతే…. హి ఈజ్ నాట్ ఎ గ్రేట్ పొయెట్. తెలుగు సంస్కృతం అద్భుతంగా వచ్చు, అంతే తప్ప కవి అంటే ఒప్పుకోను.
రసం సంగీతం. సాహిత్యం పిప్పి. ( ఇద్దరూనూ)
ఇది కూడా ఎక్కడో చదివింది. అతడు – ఆమె లో కూడా “లక్ష్మి గారు” శాస్త్రి తోనూ, శాంతం తోనూ మంచి చర్చ చేస్తారు త్యాగరాజుల వారి సాహిత్యం గురించి.
సెబితే సానా వుంది/యింటే ఎంతో వుంది/సెబుతా, యినుకోరా యెంకట సావిఁ ( టియెమ్మెస్సో, శీర్కాళో గుర్తులేదు. డబ్బింగ్ సినిమాయేననుకుంటున్నాను. వావివరసలెవరవో కూడా తెలీదు)
బోడి పద్యం గురించి sarma rallapalli గారి అభిప్రాయం:
03/26/2009 8:39 am
అయ్యా, నేను ముస్లింని కాను. నాకు ముస్లిం సంప్రదాయాల గురించి అసలు తెలియదు కూడా. కాని, కవి ఈ కవిత ‘సుంతీ’ గురించి రాశారనీ, ఆ చిన్న అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ మత విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడుతున్నారనీ నా కొద్దిపాటి జ్నానం చెప్పింది. కాని, అంతకంటే బలమయిన అనుభూతి/ ఉద్వేగం (దీన్ని బాబా కవితా ధార అన్నారేమో!) ఈ కవితలో నన్ను కట్టి పడేశాయి.
ఇది నాకు తెలియని అనుభూతి (భవిష్యత్తులో తెలిసే అవకాశమూ లేదు). అయినా, కవిత నన్ను చాలాసేపు ఆలోచింప జేసింది. చాలా విషయాలు , మతానికి సంబంధించినవి ఉదా:
దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
అన్నప్పుడు దర్గాలకి వెళ్లే నేనే గుర్తు వచ్చాను.
మా నెల్లురు , ఒంగోలు జిల్లాలో మస్తానయ్య, నాంచారయ్యని ఎవరిని అడిగినా ఈ పంక్తికి అర్ధం చెప్పగలడు. నా బ్రాహ్మణత్వం గాయత్రీ మంత్రం. కాని, దర్గా దగ్గిర మా అమ్మ మన్నతు చేసుకుంటుంది. అంత వరకే నాకు తురక మతం తెలుసు.
మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
సగం దళితం సగం ఖండితం
పల్లెల్లో తురకల్ని ఎవరిని అడిగినా, వాళ్ల బతుకు పద్ధతి సగం కింది కులాల వారితో కలుస్తుంది.
ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది. లైలా గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవి వారి పఠనం. నాకు ఆ విషయాలు తెలియవు. ఈ కవితని నేను ఒక పల్లెటూరి వాడిగా చదివాను. ఇందులో అశ్లీలం ఎమిటొ నాకు తెలియదు.
ఈ కవిత రాసినందుకు కవికీ, వేసినందుకు ఈమాటకి ధన్యవాదాలు. ఈ కవితకి ముందు అఫ్సర్ అనే పేరు నాకు తెలియదు. వెనక్కి వెళ్లి, ఆయన రాసిన్ కవితలు చదివాను. సురయ్య గురించి కవిత చదవండి. ఆర్యులకు అది బాగా నచ్చె పద్యం.
రాళ్లపల్లి
ఆ. నచ్చినట్టి వనిత మెచ్చినట్టి కవిత
దృష్టి బట్టి యుండు సృష్టి లోన
కొత్త దృష్టి చూపి కొత్త స్ఫూర్తిడు రాత
రాత కాదు నుదుటి రాత మార్చు!
ప్రసాదు గారు మీరుదహరించిన శ్రీ సుబ్బన్న గారి పద్యాలు ఆసక్తితో చదివాను. అదృష్టం కొద్ది అందిన వారి ‘అవధాన విద్య’ పుస్తకంలో ఇందులోదేదైనా చదివానేమో గుర్తురావడంలేదు. వారి వచనం, వివరించే శైలి కూడా నన్ను ఆకట్టుకుంది.
అది చదివిన తరువాత, వారి రచనలేమైనా ఉన్నాయేమో అని ఇంకా వెతుకుతునే ఉన్నాను. మంచి, కాదు, గొప్ప రచయిత, (గొప్ప వక్త అని కూడా విన్నాను కాని చూసే భాగ్యం లేదు), కూడా అయిన వారి రచనల వివరాలేమైనా ఉంటే చెప్ప మనవి.
========
విధేయుడు
-Srinivas
బోడి పద్యం గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:
03/25/2009 7:42 am
అశ్లీలం గురించీగొడవేవిటి. కవిత నచ్చిందో, నచ్చలేదో అంటే సరేగానీ, కవిత అశ్లీలవటవేవిటి? అలా అనేవాళ్ళు ఎందుకో కూడా చెబుతే బాగుండేది. రహశ్యాంగాన్నో (ఏవిటో అందులో అంత రహశ్యం), దానికి జరిగే వొక ప్రక్రియనో అశ్లీలవని అనగలవా? పోనీ అంత అభ్యంతరవనుకుంటే ఆ కొన్ని పదాల్ని పరాయి భాషలో అనుకోని చదివేసుకుంటే సరిపోతుంది కదా. ఆ పదాల్ని మాత్రం చక్కగా, ఏ ఆంగ్లంలోనో, సంస్కృతంలోనో అనువదించేసుకుని చదివేస్తే అసలు బాధే లేదు. ఆ భాషల్లో ఈ అశ్లీలవైన(?) పదాలు, ప్రక్రియలు చదవడం మనకి అలవాటే కదా.
ఇప్పటికి నేనో అరడజను సార్లు చదివేనీ కవితని, నాకేం బోధపడలా కవితాత్మో, కవితార్థవో దాన్ని మీరేవన్నా సరే. కవిత్వంలో abstraction అవసరవే. కానీ దాన్ని వొక పెయింటింగ్ స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం వుందా? మనిషి మెదడుకి రంగుల చిత్రాలు, పద చిత్రాలు అర్థవయ్యే తీరు వేరు, వేరని నా అభిప్రాయం.
పెయింటింగ్ ని కళ్ళతో చూడంగానే మనసులోకి దూకే ఆ పచ్చి ఎమోషనల్ abstraction, కవితని చదివి దాన్ని అర్థం చేసుకుని అనుభూతించగలిగే ప్రక్రియ వేరు వేరని నా అభిప్రాయం. నక్కని చూసి వాతలు పెట్టుకున్నట్టు, అవకాశం ఉందికదా అని, భాషకున్న (పెయింటింగ్ కి లేని, అందుకనే పెయింటింగ్లో ఆ abstraction అవసరవేవో) ఒక విసృతవైన వ్యక్తీకరణని ఉపయోగించుకోకుండా మామూలు మనుషులకి అర్థంకాని కవిత వల్ల ఉపయోగవేవిటి. పోనీ ఆ కవిత వ్రాసిన వారో, లేకపోతే ప్రచురించిన సంపాదకులో ఆ కవితతోబాటు ఆ కవితార్థాన్ని కూడా ప్రచురించుంటే బాగుండేది.
సాధారణ ప్రచురణలకి లేని ఒక గొప్పతనం వెబ్ ప్రచురణలకుంది. ఇక్కడ కవిత, కథ, వ్యాస కర్త తన అభిప్రాయాల్ని పాఠకులతో ఏక్టివ్ గా పంచుకునే అవకాశం వుంది. I do not know the reason why, here in “eemaata” writers, most of the times do not participate in the debate. Though they are the instigators of the debate by mare act of writing that poetry, story, or an essay, they shy away from the debate. Many times even our editors do the same. I hope they utilize the opportunity of this facility, and participate in this live discussion and help readers like us to a better understanding.
మరో విషయం అభిప్రాయలు రాసే వాళ్ళ పేర్లతో ఆ ఆటలేవిటండి. పేర్లను వక్రీకరించినంత మాత్రాన ఒరిగేదేవిటి.
కలింగత్తుప్పరణిలోని నీడలపైన రెండు పద్యాలను కింద ఇస్తున్నాను. అందులో రెండవది బ్రహ్మానందంగారు ఉదహరించిన నన్నెచోడుని పద్యానికి సరిపోతుంది. కలింగత్తుప్పరణిలోని మొదటి రెండు అధ్యాయాలను ఆరుద్రగారు వెన్నెల – వేసవి అని తెనిగించారు. బాపు బొమ్మలు ఈ పుస్తకానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. వారి తర్జుమాను కింద ఇస్తున్నాను –
ఉత్తర కళింగాధిపతి అనంతవర్మ కప్పమును చెల్లించని కారణాన వానిని యుద్ధములో పరిమార్చమని కులోత్తుంగచోడుడు పల్లవరాజు కరుణాకర తొండమానుని ఆజ్ఞాపించెను. అతడు తన సైన్యముతో పాలేరు,
స్వర్ణముఖి, పెన్న, మన్నేరు, కృష్ణ, గోదావరి, పంప, గౌతమీ నదులను దాటి కళింగ దేశాన్ని చేరి చేసిన యుద్ధములో కళింగ చక్రవర్తి అపజయుడై పారిపోయెనట. ఆ కరుణాకర తొండమాను శౌర్య పరాక్రమాలను
వర్ణించే కావ్యం ఇది. ఇట్టి వీర కావ్యాలను తమిళములో పరణి అంటారు. పరణి కావ్యాలలో ఇదే మొదటిది, దాని రచనలో జయంగొండాన్ దిట్ట. నన్నెచోడుడు ఈ కవిని అనుసరించాడంటే అతని కాలం క్రీ.శ. 1118 తరువాత. కాని జయంగొండాన్ కూడా ఇతర కవులను అనుకరించి రాసిన పద్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయని ఆరుద్రగారు అంటారు. అందువల్ల నేను ముందు చెప్పినట్లు రెండు పద్యాలు ఒకే విధంగా ఉంటే ఏది ముందో ఏది వెనుకో చెప్పడం కష్టం.
యుగంధర్ మహాశయా!
కందపద్యములూ, సీస పద్యములూ వ్రాయగలిగిన మీరు ఈ వచన కవిత గురించి ఎందుకు వ్రాయరు? మిగిలిన శీర్షికలలో చక్కని అభిప్రాయములు వ్రాసిన మీరు ఇచ్చట ఎందుకిటుల వ్రాయుట? మొదటి అభిప్రాయము నాది. అందు నాకవగతమవని వాటిని గురించి అడిగితిని. కవి గారెటూ జవాబివ్వజాలరు. కవితని ఆనందించి, అనుభూతించి అనుభవించిన వారుకూడా కవితని విపులీకరించకపోవడం మా దౌర్భాగ్యం. బొల్లోజుబాబా గారి అభిప్రాయమునకు జవాబుగా నాఅభిప్రాయమందు “ధార” గురించి ప్రశ్నించితిని. ఆయనా తదుపరి మీరునూ కవిత గురించి తప్ప మిగిలిన విషయముల గురించి విశ్లేషించినారు. మీరన్నట్టు కవిగారు రాసేసి జనం మీదకొదిలేస్తే సరిపోదు. ప్రతీ కాళిదాసుకీ ఓ మల్లినాథ సూరి వుంటేనే కాని కుదరదు. “అఫ్సరుడు” (మళ్ళీ వరదలో కొట్టుకొచ్చిన ప్రయోగం”) గారికి మీరో, సూర్య గారో మల్లినాథ సూరనుకుని అడగడం నా తప్పు. క్షమించండి. ఇదే “అఫ్సరుడి” గారి కవిత ఈ మధ్య సోమవారం సాహిత్య పేజీల్లో పడింది. అది లక్ష రెట్లు నయం ఈ బోడి పద్యం కన్నా. బహుశా ఈ బోడి పద్యం ఈమాట కోసం ప్రత్యేకించి రాసేరేమో? One more thing whoever punches some trash in this area are not critics. అభిప్రాయాలు రాసే వారు విమర్శకులు కారు. అంచేత పుంజీడు అభిప్రాయాలు పుంజీడు విమర్శలు కాదు. “మీ అభిప్రాయం తెలియ చేయండి” లో అభిప్రాయం తెలియచేయడం ఎందుకు? ఎవర్నుధ్ధరించడానికి? తెలుగు భాషనుధ్ధరించడానికా?
లేదు బాబ్జీలు గారూ మీ అభిప్రాయం సహేతుకమైందే! సాహిత్యానికి తన నిరంకుశ వైఖరి ద్వారా విరసం సరిపడా అపకారం చేసింది. స్వతహాగా మంచి కవి రచయితలైన..శ్రీశ్రీ..కొకు..రావిశాస్త్రి..కాళీపట్నం..లాం టి వాళ్ళూ..అలాగే మిగిలిన మరి కొందరు..వారి విశ్వాసాలకి కట్టుబడి విరసంలో కొనసాగారు.కానీ విరసానిది ధృతరాష్ట్ర కౌగిలి. అందువల్ల అందులోకి వెళ్ళాకా కవిత్వం తగ్గి..కొత్తవి చెప్పుకోదగ్గవేవీ రాయలేక..విరసానికి పబ్లిసిటీ ముఖంలాగా మిగిలేడు శ్రీశ్రీ. కాళీపట్నం రామారావు గారు “యజ్నం” లాంటి గొప్ప కధని విరసం రాజకీయాలతో సంబంధం లేకుండానే రాసి కూడా..అందులో సభ్యులయ్యాకా..మళ్ళీ అంత బలమైన కధ ఏదీ రాయలేదు.విరసానికి పెద్ద దిక్కుగా పెద్దమనిషి పాత్రలో మిగిలారు. వీరి సంగతే ఇలా ఉంటే ఇహ మిగతా వాళ్ళ మాట చెప్పేదేముందీ??
విరసం ఏనాడూ తన సంస్థలో భాగం కాని కవి రచయితల విషయంలో కొంచెం కూడా సానుకూల వైఖరిని చూపించలేదు సరికదా..తనకి పనిపడినప్పుడు మాత్రం..తెనుగుదేశం లోని సకల కవి,రచయిత విమర్శక శిఖామణులంతా..”మేధావులు” అందరూ..తమ వెనకే ఉన్నారని చెప్పడానికి సదా ప్రయత్నించింది. రచయితలే కాని వారికి సంస్థ పగ్గాలు అప్పజెప్పింది.వాళ్ళూ రచయితలకీ..సాహిత్యానికీ నిరభ్యంతరంగా నాయకత్వం వహించేయగలిగేరు. దీన్ని ప్రశ్నించే వీలుని గానీ..ఇందుకు జవాబు చెప్పే పూచీ గానీ ఆ సంస్థ ఏనాడూ తీసుకోలేదు. అందులో ఉన్న కవి ..రచయితలు సైతం ఈ పరిస్థితిని భరించేరు గానీ..ప్రశ్నించినట్టు కన్పించదు. అందులో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందన్న విషయం బహిరంగ రహస్యమే!! విమర్శకి చోటు తీసేసి..అడిగిన ఎవరినైనా దబాయించడంలో చూపిన శ్రధ్ధ..ఆత్మ విమర్శలో చూపక..దాని పరిధిని సంకుచితం చేసుకుంది….రచయితలు లేని రచయితల సంస్థ అది. ప్రాపగాండా లిటరేచర్ కీ..ఆ తరహా సాహిత్యానికీ మాత్రమే దాని ప్రాపు. గనక మీ పరిశీలన సరైందే!!
ఇప్పటివరకు, ఏ విశ్వబడుల పరిశోధక వ్యాసాల్లో కథల వర్గీకరణ మీద ఎవరూ ప్రచురించకపొయ్యుంటే మీ వ్యాసం ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముందడుగే. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిన అవసరం వుంది. ఈ వర్గీకరణ ఎంత ప్రాధమిక స్థాయిలో వున్నా, ఆ దిశలో అదొక ముందడుగే నని నా అభిప్రాయం.
“మన కథలన్నీ ఎదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి.” మన కథ కానీ, ఇంకేదైనా కథ కానీండీ, కథే ఎందుకు, ఏరకవైన కళ కానీయండి, ఏదో ఒక అంశం గురించే కదా ఉంటాయి. అవి భౌతికం కానీయండి, మానసికం కానీయ్యండి, సిద్దాంతాలు కానియ్యండి. జీవితానుభవం, సంఘటన వస్తువుకి భిన్నవైనవా? భిన్నవైనవే అయితే ఏవిధంగా భిన్నవైనవో కూడా మీరు తెలిపితే బాగుండేది. ఆ తెలుపడానికి ముందు, మీరు ప్రస్తావించిన వస్తువు లేదా కథాంశాన్ని నిర్వచించి వుంటే బావుండేదేవో. మీరు చెప్పిన అనుభూతి, కథాంశం, లేదా వస్తువు కాదా? ఆ ఫలాని బావ, ఆయన మరిదితో తిరిగిన చెట్లూ, పుట్తలు, చూసిన పూలు, బండలు అవన్నీ కథలో ఏవి చేస్తున్నట్టు. కథా వస్తువో, కథాంశాలో ఏవైనా అవి పాఠకుడిలో నిద్రపోతున్న ఎప్పటి గుర్తుల్నో, లేకపోతే పాఠకుడిలో ముడుక్కుపోయున్న ఎప్పటి కలల్నో తట్టి లేపడానికే కదా ఆ కథ. ఇక్కడ వస్తువు లేకపోవడవెక్కడ. కళ్ళకు కనిపించి, స్పర్శకు తెలిసే వస్తువయితేనేం, మనసుకు వినిపించి, గుండెకు తెలిసే వస్తువయితేనేం. వస్తువులో చిన్న, పెద్ద బేధాలు చూడాలా?
ఎప్పుడో అప్పుడు, ప్రతి ఇల్లు ఒక కథల ఖార్ఖానా అయ్యుంటుంది. ప్రతి అమ్మ, అక్కడక్కడా కొందరు నానలు కూడా లెక్కలేనన్ని కథలు కల్పించుంటారు. ఇంకెన్నో పాత కథల్ని చిత్రికపట్టి కొత్త కథలుగా మార్చుంటారు. వీటిలో రెక్కల గుర్రాలు, మాట్లాడే జంతువులు, పోట్లాడే కపాలాలు, మాంత్రికులు, రాకుమారులు, చూడ చక్కని రాకుమార్తెలు వుంటారు. ఈ కథల్లో వస్తువు లేదా? ప్రపంచం తెలియని పిలకాయలకి, అసలలేని కలల ప్రపంచం ఈ కథల వస్తువు కాదా? కలలు, ఊహలు, కథాంశాలు కావని, వాటి చుట్టు అల్లిన కథల్లో కథా వస్తువు లేదని మీ వర్గీకరణ బట్టి అర్థంచేసుకోవలసి వుంటుంది.
కలలైనా, ఊహలైనా, జీవితానుభవాలైనా, మీరు చెప్పిన సంఘటనలైనా, సిద్దాంతాలైనా, ఇంకా వాటి రాద్దాంతాలైనా, అన్నీ బతుకులో ఒక భాగవే సీతారామయ్య గారు. అసలు వస్తువు లేని కథంటూ వుండదు. ఆ వస్తువు కల కావొచ్చు, శిల కావొచ్చు, మనసుకి మాత్రవే తెలిసే అనుభూతుల అల కావొచ్చు. ఆ వస్తువు, సిద్దాంత రాద్దాంతం కావొచ్చు, సామాజిక స్పృహ కావొచ్చు, సందేశం కావొచ్చు, స్వంత వ్యాఖ్యానం కావొచ్చు అన్నీ బతుకులో ఒక భాగవే కదా.
కథ అనేక కోణాలనుండి బతుకుని ప్రతిఫలిస్తుంది. కథ బాగుండడానికి ,బాగలేకపోడానికి, కథా వస్తువు చుట్టూ అల్లడవా, అల్లకపోవడవా కారణం కాదు, కథ చెప్పడంలో పాఠకుడిని ఆకట్టుకుందా లేదా అనేదే ముఖ్యం. అదికూడా, పాఠకులందరూ ఒకటి కాదు. రకరాకాల మనుషులు, రకరకాల పాఠకులు. ఏ కథా కూడా అందర్నీ స్పర్శించలేదు. ఏ కథా కూడా భౌగోలికవైన, సామాజికవైన, మానసికవైన, కాలానుగుణవైన పరిధులకిలోబడి మాత్రవే మంచి కథ అనిపించుకుంటుంది.
మీరు ఉదాహరణలుగా ఇచ్చిన కథల్లో లోపాలు, ఆ కథ చెప్పడంలో లోపాలే గాని, కథలో వస్తువు వల్ల వచ్చిన లోపాలు కాదు. సూటిగా చెప్పదలచుకున్నప్పుడు వ్యాసాలు రాసుకోవచ్చు కదా అన్నారు, వ్యాసాలు రాసుకోవచ్చు, కానీ కథలు కూడా సూటిగా చెప్పడానికి ఉపయోగించే మాద్యమాల్లో ఒకటని నా మనవి. చక్కగా అరటిపండొలచి చేతులో పెట్టినట్టు సూటిగా సిదాంతాన్ని వివరించే కథలు చాలానే వున్నాయి (పిపీలకం). ఎటూ చెప్తాం కదా అని కథని సరిగ్గా అల్లకపోవడం, కథకు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధంలేకపోవటం, స్వయం వ్యాఖానంతో పాఠకుడ్ని బోరు కొట్టించడం ఇవన్నీ కథకునిలోపాలే గాని, దానికి, కథాంశానికి, కథకుడు చెప్పదలుచుకున్న సందేశానికి సంబంధం వుందని నేననుకోను.
కథ నచ్చకపోవడానికి కథకుని లోపవే కాదు, పాఠకుల పరిధులు కూడా (సామాజికవైన, సిద్దాంతపరవైన, కాలాణుగుణవైన) ఒక అంశవే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు, అప్పుడు అడిగి అడిగి మరీ చెప్పించుకున్న కథలు ఈరొజు ఈ వయసులో మనసుకి అంత పట్టకపోవచ్చు. దాచుకుని, దాచుకుని చదివిన డిటెక్టివ్ నవలలు ఇప్పుడు చెత్త బోరుకొట్టొచ్చు, ఆవురావురు మంటూ ఎదురు చూసిన ప్రేమ కథలు ఇప్పుడు తమాషాగా అనిపించొచ్చు. కొందరు మహానుభావులకి కన్యాశుల్కం అనవసరపు రాద్దాంతంలా కనిపించొచ్చు. గోవులొస్తున్నాయి జాగ్రత్త సిద్దాంత రగడలా స్పురించొచ్చు. వీటిల్లో కలలు, కల్పనలు, సంఘ సంస్కరణలు, సిద్దాంతాలు అన్నీ వున్నయి వాటితోపాటు చదివించే గుణం ఈ వీటన్నికీ వుంది. కాబట్టి కథ చెప్పడానికి వస్తువు అడ్దం కాదు. ఏ వస్తువైనా చేవ వున్న కథకుడు మంచి కథగా అల్లగలడు. అంతే కాదు, కవితల్ని స్పురింపజేసే కథలు, కథల్ని చెప్పే కవితలు, రెంటినీ గుర్తుతెచ్చే కరపత్రాలు వీటి సంగతేవిటి?
బాబ్జీ,
ఇదేవిటి, విరసం వల్ల కథలు వ్యాసాలైపోవటవేవిటి. విరసం ముందు అరసం, దాని ముందు సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, దాని ముందు మరింకేదో మార్పు, ఆ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు వుండడవనేది సహజం కదా. విరసం మాత్రమే కథనెందుకు నాశనం చేసింది, లేకపోతే మూసలోకెందుకు నెట్టింది. ఐనా నువ్వుదాహరించిన రావీ శాస్త్రి, కోకు, కారా విరసంతో సరసం చేసిన వాళ్ళే కదా! రచయితల నిజాయితో నీకేం పని, వాళ్ళు వ్రాసిన కథలతో పని కాని. దీనికి వ్యతిరేకంగా ఈ నడవ నువ్వే ఒక అభిప్రాయం వ్రాసినట్టు గుర్తు.
కళ, కళకోసవే అనే వాదాన్ని తమ్మినేని గారు మరొక అడుగు ముందుకి తీసుకెళ్ళేరు, కళలో కల తప్ప నిజం (బుద్ది) వుందకూదదంటున్నారు. కథ బుద్దిని తాకకూడదంటారు. ఐతే మీరు చెప్పింది మాత్రం బాగుంది, సరి ఐన వాతావరణం లేని కథ, నిజవే పాఠకుడ్ని తాకదు. బుద్దిని తాకే కథల్లో ఆ వాతావరణం ఉంటే అవి మంచి కథలే కదా తమ్మినేని గారు.
కోడవళ్ళ గారు, మీ అభిప్రాయాల్లో, పెద్ద, పెద్ద పేర్లినిపిస్తాయి, చాలా కోట్స్ కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం మీ మాటల్లో కనిపించరు ఎప్పుడో తప్ప. పుస్తకాల్లేకపోతే హాయిగా వుండగలవా? తెలీదు, కానీ పుస్తకాల్లేందెప్పుడు? కాగితం లేనప్పుడు, తాటేకులో, మరో చెట్టు బెరళ్ళో, లోహాలో, అవీ కానప్పుడు, నోటిమాటగా తరాన్నుంచి తరానికి సాగే కథలు, పాటలు అవన్నీ ఏవిటి? మనిషి మాటల్తోబాటు కథ కూడా పుట్టుందడంటారా. అది ఏరూపంలో భద్ర పరిస్తేనేవి.
గడ్దగట్టిన సముద్రాలెక్కడవి, ప్రవహించే నదులు తప్ప, అప్పుడప్పుడూ ఆ నదులెండి పోవచ్చు, గడ్డకట్టి పోవచ్చు. కానీ కొద్ది కాలవే. మార్పు మనిషికి సహజ గుణం కదా. కథ, కవిత ఇవేవి గొడ్డళ్ళు కావేవో, మహా అయితే మట్టి బెడ్డలాగా కాసేపు నదిలో చిన్న అలల్ని రేపుతాయేవో. కాఫ్కానే చెప్పుండొచ్చు గానీ గడ్డకట్టిన సముద్రవే అయితే మెటామార్ఫొసిస్లో ఆ గుమస్తా అంత హింస పడివుండడు కదా?
రవికిరణ్ తిమ్మిరెడ్డి
About eemaata గురించి RANGANATH MIDDELA గారి అభిప్రాయం:
03/19/2009 9:39 am
వరంగల్లు
సాహితీ బంధువులకు నమస్సుమాంజలి.
మీరు వెలువరిస్తున్న ఈ మాట చూస్తుంటేనే కనువిందుగా ఉంది. మీ సైటుకు పుస్తకాలు ఎలా పంపాలి.. తెలుగు సాహిత్య లోకానికి అవసరమైన మరింత సమాచారాన్ని పొందుపరిస్తే బాగుంటుందని నా ఆలోచన.. ఇంత మంది సాహితీ మిత్రులు కలిసి చేసే సమిష్టి యాగంలో మీకు పూర్ణ ఫలం అందాలని నా ఆకాంక్ష..
ధన్యవాదాలతో,
రంగనాథ్ మిద్దెల
ఎన్ టీవి
మోహనగారు చక్కగా వివరించారు. ఇది చదవగానే నాకు శంకరాభరణంలోని “బ్రోచే వారెవరురా…” అన్న పాట గుర్తుకువచ్చింది. అందులో కూడా యిలాగే ప్రాస ఉంది కాని పొడవైన పాదాల వల్ల గుర్తించడం కష్టం.
“ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా
నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములిచ్చి వేగమె రా”
ఇలా ప్రతి చరణంలోనూ ప్రాస ఉంటుంది. ఈ విషయం గమనించకుండా పాట చివరి చరణంలో మార్పు చేసారు.
“ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా! నా
పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయిబట్టి విడువకు” అన్న సాహిత్యాన్ని
“భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు” అని మార్చారు. బహుశా ఇక్కడ “వాసుదేవుడవు” అన్న పదంతో యతి/ప్రాస కోసం ఈ మార్పు చేసారేమో!
ప్రశంసించినందుకు అందరికీ కృతజ్ఞతలు. కాని నేను పెద్దగా చేసిందేం లేదు. జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్, నవోదయ రామమోహనరావు, వెల్చేరు – తెర వెనుక ఉండి శ్రమ చేసిన వారు వీళ్ళు.
మూడు నాలుగేళ్ళ క్రితం, నేను కొత్తగా తెలుగు సాహితీ ప్రపంచంలో తలదూర్చి, రచ్చబండలో, తెలిసీ తెలియని సాహితీ జ్ఞానంతో హేమాహేమీలతో తగాదాలు పడేవాణ్ణి. అప్పుడే వేలూరి గారి ఓ ఈమాట వ్యాసం పై గొడవపడ్డాను. ఆ సందర్భంలో ఆయన ఓ పొడవుపాటి జవాబు రాస్తూ, మధ్యలో ఇలా అన్నారు:
“My second assertion, or call it a plea, that we badly need word meanings, paraphrases, and commentaries of their works to better appreciate them, and not to lose them!”
నా ప్రమేయానికి కారణం అదన్న మాట. చాలా సమయం పట్టినా, కార్యరూపం దాల్చినందుకు సంతోషం. అప్పట్లో, అంటే ఆస్తులన్నీ హరించుకుపోక ముందు, ఆయన ఇంకాస్త ఎక్కువ విరాళం అడగనందుకు చాలా విచారపడుతున్నాను.
బాబ్జీలు గారి మంచీ చెడుల మాట చదివి, ఇది రావిశాస్త్రి మాటల్లా ఉందే అనిపించింది. వెతికితే, రావిశాస్త్రి మీద కె. కె. రంగనాథాచార్యులు రాసిన పుస్తకంలో రచయితల కర్తవ్యం గురించి రావిశాస్త్రి అభిప్రాయం కనిపించింది: “అందుచేత రచయిత అయిన ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను తలుస్తాను.” [1]
చిత్రంగా, జనవరి 9న విజయవాడ లో పుస్తక ప్రదర్శనావరణలో విశ్వగుణాదర్శాన్ని విడుదల చేసిన సభలో ప్రసంగించిన వారిలో ముఖ్యులు KKR. సభలకి దూరంగా ఉండే తాను, ఈ పుస్తకం గురించి ప్రసంగించమంటే ఎంతో ఉత్సాహంతో వచ్చానని చెప్పి గ్రంథ ప్రాముఖ్యతని వివరించారు. ఆ ప్రసంగాన్ని ప్రచురిస్తే బావుంటుంది.
KKR, VNR లు సరే, నా అభిప్రాయం ఏమిటి అంటే, నేనీ పుస్తకాన్నింకా పూర్తిగా చదవలేదు. పైపైన తిరగేసినంతలో హానికరమైనదిగా కనిపించలేదు. దాని ప్రచురణకి సాయం చెయ్యడంలో తప్పుందనుకోను.
చదివింతర్వాత వెల్చేరు గారి పరిచయంపై నా అభిప్రాయం చెప్తాను. రవికిరణ్ గారూ, ఆయన పేరు వెల్చేరు; వేల్చూరి కాదు. మనకి యేల్చూరి సుబ్రహ్మణ్యం అని ఓ కవి ఉన్నారనుకుంటా.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “భారతీయ సాహితీ నిర్మాతలు: రాచకొండ విశ్వనాథశాస్త్రి,” కె. కె. రంగనాథాచార్యులు. సాహిత్య అకాడమీ, 2000. పేజి 87.
ఈ వ్యాసం మీద అభిప్రాయం వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు.
బాబ్జీలు గారూ, మంచి కథలు రావిశాస్త్రి, కుటుంబరావులతోనే ఆగిపోయాయనీ, తర్వాత మంచి కథలు రాకపోవటానికి కారణం విరసం అనే అభిప్రాయాలతో నేను ఏకీభవించను. మంచి కథలు ఇప్పుడూ వస్తున్నాయి. విరసానికి ముందుకూడా వ్యాసాల్లాగా కథలు రాసిన వారున్నారు. ఎప్పటికప్పుడు పాతరోజుల్లో మంచి కథలుండేవి అనుకోవటం మనకే కాదు, ఇతర భాషల్లో కూడా కనిపిస్తుంది. అది మానవ సహజమేమో.
వంశీ గారు, ఈ వ్యాసం “రంజింప చేయటంలో కొద్దిగా వెనక పడింది” అన్నారు. సహృదయంతో కొద్దిగా అన్నారు! మీ అభిప్రాయం నాకు అర్థమయింది. నిజానికి ఈ వ్యాసం మీకు కొద్దిగా నచ్చినా దానికి కారణం ఈమాట వారి రివ్యూవర్సే. లోపాలు మాత్రం నావి.
సాయి బ్రహ్మానందం గారూ, నేను పొరపాటు చేసి ఉండవచ్చు, కాని, నాకు తెలిసినంతవరకు, ఇంగ్లీషులో ఫస్ట్ పర్సన్ లో చేసే కథనాన్ని తెలుగులో ఉత్తమ పురుష అంటారు. అలాంటి కథల్లో కథకుడి ఆలోచనలు తప్ప ఇతర పాత్రల ఆలోచనల గురించి రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రథమ పురుష కథనంలో రచయితో లేక మరో కథకుడో కథ చెప్తాడు కాబట్టి అన్ని పాత్రల ఆలోచనల గురించీ రాయటానికి అవకాశం ఉంటుంది. పాత్రల ప్రవర్తన చిత్రించటం ద్వారా కథ నడపాలనీ, వాళ్ళ మనోగతాల గురించి ఎక్కువగా రాయటం అంత మంచిది కాదనీ నా అభిప్రాయం. అదీగాక, నేను ముఖ్యంగా చెప్పదలిచింది, స్వంత అభిప్రాయాలను వ్యక్తీకరించటానికే కథ నడిపినట్లు బాహాటంగానే కనిపిస్తే, వీలయిన (కాకపోయినా) ప్రతిచోటా రచయితే వ్యాఖ్యానం చేస్తే, కథ పేలవంగా ఉంటుందని.
భూషణ్ గారూ, ధన్యవాదాలు. అవును, వాతావరణ కల్పన ఉజ్వలంగా ఉన్న కథలు చదవటం ముగించిన తర్వాత కూడా మనసులో ఉంటాయి.
అభిప్రాయాలకు చర్చలకు మధ్య చాలా తేడా ఉంది.
పాఠకులు వ్యక్తం చేయవలసింది వ్యాసం మీది అభిప్రాయాలను,
అంతేగాని, ఇతరుల అభిప్రాయాల మీద అభిప్రాయాలను కాదు.
ఖండన ముండనలు అంతకన్నా కాదు.ఇది అభిప్రాయ వేదికే కాని చర్చా వేదికని నేననుకోను.ఈ మాట సంపాదకులు రచయితకు సూచనలు లాగానే అభిప్రాయాల ప్రకటనలకు కూడా సూచనలు చేయడం వల్ల ఈ ఆరణ్యకాండ (ఒకరినొకరు వేటాడుకోవడం ) సుందరకాండగా (ఒకరితో ఒకరు మాటాడుకోవడం) మారుతుంది.
అస్మదీయుని సూచనలు (నాకు ఏ వీరతాళ్లు అవసరం లేదు)
1.అభిప్రాయం రచనకే పరిమితం కావాలి.
2.ఇతరుల అభిప్రాయాల్లోకి వెళ్ళరాదు.
3.చర్చలకు వేరొక వేదిక పెట్టుకోవచ్చు.
(అందులో కొంత వేడి పుట్టినా ఫర్వాలేదు,ఒకరినొకరు
సమర్థించుకోవడం,ఖండించుకోవడం గట్రా ఉండవచ్చు)
గరికపాటి పవన్ కుమార్.
[మీ సూచనలకు కృతజ్ఞతలు. పాఠకుల అభిప్రాయాలు ప్రకటించే విధానంపై కొంతకాలంగా ఈమాట సంపాదకులలో చర్చ జరుగుతున్నది. త్వరలోనే కొన్ని మార్పులు ప్రవేశపెట్టబోతున్నాం. – సం.]
వ్యాసం పైన గాక, ఇంకొకరి అభిప్రాయాలపైనే ఎక్కువగా రాయడం చూసిన తరువాత వ్యాసం చదవడానికి కొంత ధైర్యం, కాదు కొత్త కారణం దొరికింది. పదాల వాడుకను బట్టి మాత్రమే కాక, ఛందస్సును బట్టి కాలాన్ని, అనుకరణలను బేరీజువేసే పద్దతి చాలా సకారణంగా, ఆసక్తికరంగా ఉంది. ఇటువంటి యత్నం ఇంతకుపూర్వం ఎవరైనా చేసారో లేదో తెలియదు.
మోహనగారూ, మీ వ్యాసం పుణ్యమా అని ‘కుమారసంభవం’ చదవాలనే కోరిక సంభవించింది. మళ్ళీ కృతజ్ఞతలు. ద్వా.నా.శాస్త్రి గారు నన్నెచోడుడు పది (or 12?) లయగ్రాహి, లయ* (?), మరియు ఒక కందంలో ఎంతో ఆవేశంతో శివున్ని స్తుతించాడు అన్నారు. నా దగ్గరున్న రెండవ భాగం (7 నుంచి 12 ఆశ్వాసాలవరకు) లో అది కనబడలేదు. మొదటి భాగంలో ఉందనుకుంటాను. ఆ ప్రతి నా దగ్గర లేదు, దాని వివరాలేమైనా తెలిస్తే దయ చేసి చెప్ప మనవి. దశమాశ్వాసంలోని దారిద్రావణాదశకం పద్యాలు బాగున్నాయి.
శివ కథాపరమైన వ్యాసం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో, చివరగా అభిప్రాయాలపై చిన్న అభిప్రాయం. శివుడు అందరిలోనూ ఉన్నాడు, కాని తెలుగువారిలో కొంచెం ఎక్కువున్నాడనిపిస్తుంది. ఎందుకంటే మనం తొందరగా శివమెత్తిపోతుంటాం కనుక. అనుగ్రహిస్తే అవధులులేవు. ఆగ్రహించినా అడ్దులేదు. నిలకడగ ఉండే శక్తి, అదే శక్తిరూపిణి, కూడా మనతోడే ఉండాలనుకుంటూ,
విధేయుడు
-Srinivas
వ్యాసం నచ్చినవారికి నా నమస్సులు. నచ్చనివారికి ఇక మీద బాగుగా రాయటానికి ప్రయత్నిస్తా. ఒక రెండు విషయాలు. ఈ వ్యాసరచనకు ప్రోత్సాహం శ్రీ బ్రందావనరావుగారి పద్యం. నన్నెచోడుని విపులంగా ఎందుకు పాఠకులకు పరిచయం చేయరాదనే భావం నాకు అప్పుడు కలిగింది. మొదటి భాగంలో అతని కవిత్వాన్ని గురించి వివరించాను. రెండవ భాగం నా అభిప్రాయాలు. పాఠకుల అభిప్రాయాలకు జవాబు ఇవ్వరాదనే
భావం నాకు లేదని వినయపూర్వకంగా విన్నవించుకొంటున్నాను.
కలింగత్తుప్పరణి మదురై ప్రాజెక్టులో దొరుకుతుంది. బ్రహ్మానందంగారు చెప్పిన పద్యం చూడగలిగాను. దాని అర్థపర్థాలు అడిగి తెలుసుకోవాలి. ఒక పద్యం ఎవరు ముందు రాశారో ఎవరు అనుకరించారో
చెప్పడం సులభం కాదు. భూషణ్ గారు నాగేంద్ర చోడుడు 940 కాలం వాడన్నది బహుశా కవిగారి సిద్ధాంతాన్ని ఉద్ఘాటిస్తున్నారని అనుకొంటాను. రెడ్డిగారు కూడా నన్నెచోడుడు శాలివాహనశకం కాక విక్రమశకం వాడాడని అనుకొన్నారు.
శ్రీనివాస్ గారూ, నాకు నన్నయ లేక నన్నిచోడులలో ఒకరు ముందు మరొకరు వెనుక అనే స్థిరమైన అభిప్రాయం లేదు, అట్టి అభిప్రాయాన్ని బలపరచాలని ఈ వ్యాసం రాయలేదు. నేను చెప్పిందల్లా రేచన నన్నెచోడుని పిదప అని మాత్రమే. నన్నయ నన్నెచోడులకు ముందు గ్రంథాలు ఉన్నాయని పంపడు తెలుగులో రాశాడని వేంకటరావుగారు అభిప్రాయ పడ్డారు. ఇక పోతే నన్నెచోడులు ఎందరో ఉన్నారు. బద్దెనకు కూడా నన్నెచోడుడని పేరుందని చదివాను. నా ఆశయం ఛందస్సు కొన్ని సంశయాలను తీరుస్తుందేమోననే. చరిత్రగురించి చర్చించడానికి నాకు అర్హత లేదు. ముఖ్యంగా కొత్త వృత్తాల ఉపయోగం, వాటి పేరులు, చిత్రకవిత్వం ఇత్యాదులను చోడుడు ఉపయోగించాడు. వీటిని కన్నడం నుండి గ్రహించి ఉండాలి. కవిరాజమార్గములో చిత్రకవిత్వం ఉంది.
శ్రీనివాస్ గారూ, ఆదిదంపతుల శృంగారాన్ని వర్ణించేటప్పుడు కాలిదాసుకు కూడా సమస్యలే వచ్చాయి. ఈశ్వరునిపై ఎన్నో భక్తిభరితమైన పద్యాలు కుమారసంభవంలో ఉన్నాయి. బహుశా నేను బాగా ఎత్తి చూపలేదేమో, అందుకు నన్ను క్షమించాలి. నన్నెచోడునికి సంగీతంలో కూడా బాగా పరిచయము ఉండి ఉండాలి. అతడు ఒక తరువోజలో ఎన్నో రాగాలను (సాహురి, ఫలమంజరి, పౌరాలి, ఆందోలి, భైరవి, నాట రాగాలను) పేర్కొన్నాడు. ఇవన్నీ పురాతన రాగాలు, అపూర్వ రాగాలు. అందులో కొన్ని బృహద్దేశిలో కూడా ఉన్నాయి. సంగీతజ్ఞానము ఉన్న వాళ్లు పరిశోధనలు చేయవచ్చు. వ్యాసం అచ్చవడానికి ముందు విజ్ఞుల క్రిటిసిసం తీసికోవాలని ప్రయత్నించాను, కాని సఫలీకృతుడిని కాలేక పోయాను.
విధేయుడు – మోహన
కవిరాజశిఖామణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/11/2009 7:42 am
నమస్కారం. ఎంతో పరిశ్రమతో ఎన్నో విషయాలను అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మూడవపేజీలో, “తరువాతి కాలంలో తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని *తిక్కనకు* అంకితము చేసి..” అని ఉంది. Typo అనుకుంటాను.
తట్టిన కొన్ని ఆలోచనలు.
కవి తామరలు విష్ణువు, లక్ష్మీదేవి కన్నులలా ఉన్నాయనడం చాలా అసహజంగా, కృత్రిమంగా ఉంది. తెలియని దానిని, తెలిసిన దానితో పోల్చడం, లేక తెలిసిన దానిని సైతం ఇంకో తెలిసిన దానితో పోల్చడం చూస్తాం. ఇక్కడ కళ్ళకు కనబడే తామర పూలను కనిపించని లక్ష్మీనారాయణుల కళ్ళతో పోల్చడం కవిత్వం కన్నా, పాపము శమించుగాక, పైత్యం లాగా అనిపిస్తుంది.
ఎవరి పద్యం ముందో తెలియదుకాని, పోతన గారి “అడిగెదనని కడువడి జను” పద్యం లక్ష్మి తడబడ అడుగులను ఎంతో సహజంగా, సుందరంగా సర్వ లఘు కందంలో అందంగా అనిపిస్తుంది, వినిపిస్తుంది. దాని ముందు “తగుదగదని మనమున” అన్న నన్నెచోడుని పద్యం, కాపీ కొట్టింది కాకపోయినా, వెలవెల పోయినట్లే అనిపిస్తుంది.
పాండిత్యం గురించి కాదు కాని, హృదయాన్ని తాకే భక్తి భావం మాత్రం ఇన్ని పద్యాలను చదివినా ఎందుకో, పోనీ పోతన ధూర్జటి స్థాయిలను అందుకోకపోయినా, ఏ మాత్రం కూడా అనుభవంలోకి రావడం లేదు. కవిరాజశిఖామణికైనా కూడా, కామున్ని స్తుతించిన కలంతోనే కామేశ్వరున్ని గొప్పగా స్తుతించడం కష్టమేనేమో!
నన్నెచోడుని మీద జరుగుతున్న చర్చ చూస్తున్నాను. చర్చలో మంచిచెడ్డల గురించి చెప్పబోయేముందు చర్చకు వాడుతున్న భాషను గురించి ఒక మాటచెప్పాలనుకుంటున్నాను. ఆ చర్చల్లోని కొన్ని వాక్యాలలో స్పష్టత కన్నా ఆవేశం ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకి భూషణ్ గారి మొదటి వాక్యం: “అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం.” ఈ వాక్యం వల్ల చర్చకు ఏ రకమైన ఉపయోగం జరగదు సరికదా అనవసరమైన ఆవేశం పెరుగుతుంది. మనం ఎవరినీ చెంపదెబ్బలు కొట్టనక్కరలేదు. ఎవరి పాండిత్యాన్నీ ఈసడించుకోనవసరం లేదు. “ఈమాట” చదువుతున్న వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళు. వాళ్ళంతట వాళ్ళు మంచి అభిప్రాయాలు ఏర్పరుచుకోగలిగినవాళ్ళు. అందువల్ల “ఈమాట”లో చేస్తున్న చర్చల్లో ఆవేశాలు ఎంత తక్కువుంటే అంత మంచిది.
ఇక నన్నెచోడుని మీద మోహనరావుగారు రాసిన వ్యాసం నిజంగా బాగుంది. అయినా ఆ వ్యాసంలో కూడా సమాచారం కొత్తదే కానీ సమన్వయం కొత్తది కాదు. ఆయన ఛందస్సుని వాడుకున్న పద్ధతి అయన వ్యాసానికి చాలా బలానిచ్చింది. కాని ఆయన వేసుకున్న ప్రశ్న; నన్నెచోడుడు, నన్నయ వీరిద్దరిలో ముందెవరు, తరువాతెవరు అనేది. అయనిచ్చిన సమాచారంలో ఏదీ కూడా ఈ ప్రశ్నకు నిష్కర్షగా జవాబివ్వదు. దానికి కారణం ఆయనిచ్చిన సమాచారంలో లోపం కాదు. ఆ సమాచారాన్ని ఆయన విశ్లేషించిన తీరులో లోపం కూడా కాదు. లోపమల్లా ఆ ప్రశ్నలోనే వుంది. అది సమాధానం దొరకడానికి వీల్లేని ప్రశ్న. ఇంకొక మాటల్లో చెప్పాలంటే అది పరిశోధకులు వేసుకోవలసిన ప్రశ్న కాదు.
నన్నెచోడుడు, నన్నయ రెండు భిన్నమైన సంప్రదాయాలకు చెందినవాళ్ళు. నన్నయది పురాణ సంప్రదాయం, నన్నెచోడుడిది కావ్య సంప్రదాయం. ఇద్దరూ తెలుగులో రాస్తున్నారు అన్నమాట మినహాయిస్తే వీళ్ళిద్దరి మధ్య పోలికలు లేవు. మోహనరావుగారు చేసిన ఉపకారం ఏమిటంటే నన్నెచోడుడు దాదాపుగా నన్నయ కాలానికి చెందినవాడే అని ఛందస్సులో ఋజువులు చూపించి చెప్పగలగడం.
అయితే ఆ కాలంలో నన్నెచోడుని కావ్యంలాంటి కావ్యం ఎలావచ్చిందో చెప్పడానికి కావలసిన సమాచారమేదీ మోహనరావుగారి వ్యాసంలో కనిపించదు. నన్నెచోడుడు ఏ పరిస్థితుల కారణాల వల్ల అలాంటి కావ్యాన్ని తెలుగులో నిర్మించాడో కానీ, ఆ తరువాత అతనికి దరిదాపు అయిదు వందలేళ్ళపాటు ఆయనకు అనూయాయులెవ్వరూ లేకపోయారు. ఎంతగా లేకపోయారంటే తరువాత వచ్చిన కవులెవ్వరూ ఆయన పేరుకూడా చెప్పలేదు. ఆయన రాసిన పుస్తకానికి ఒక్కటే ప్రతి దొరికింది. అంటే ఆ పుస్తకానికి ప్రతులు రాసుకున్నవాళ్ళు కూడా తక్కువేనన్నమాట. దీనితో పోల్చి చూస్తే నన్నయ భారతానికి ప్రతి తరంలోను కొన్ని వందల ప్రతులు రాసుకున్నారు. నన్నయ సంప్రదాయాన్నీ, దానికి తిరుగుబాటుగా వచ్చిన శివకవుల మార్గాన్నీ కలుపుకొని తిక్కన “ఉభయకవిమిత్రుడు” అనే పేరుతో నన్నయకే ఎక్కువ మిత్రుడై తెలుగులో పురాణ సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఆ తరువాత ప్రబంధం అని ఆధునిక విమర్శకులు అనే కావ్య సంప్రదాయం పెద్దన నాటికి కాని నిక్కచ్చయిన రూపు కట్టుకోలేదు. నన్నెచోడుడు ఆయనకు సుమారు 500 ఏళ్ళ ముందే కావ్యసంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టాడని తనకి తెలియకుండానే పెద్దన ప్రబంధ సంప్రదాయాన్ని మొదలు పెట్టి “ఆంధ్రకవితాపితామహుడ”యినాడు.
ఇంతగా తెలుగు సాహిత్య సంప్రదాయంతో సంబంధం లేకుండా ఏకాకిగా నన్నెచోడుడు మిగిలిపోయాడు. నన్నెచోడుడిమీద చర్చంతా మానవల్లి రామకృష్ణకవిగారు కుమారసంభవాన్ని బయటకు తెచ్చిన తరవాతే మొదలయ్యింది. నన్నెచోడుడి భాషలో చాలా మాటలకి అర్థాలు అందుకే ఇప్పటికీ మనకు తెలియవు. ఉదా: వస్తుకవిత, జానుతెలుగు అనే రెండు మాటలు చూడండి. వాటికి తెలుగులో వాడుక లేకపోబట్టి ఆయన ఏ అర్థంలో ఈ మాటలు వాడాడో స్పష్టంగా చెప్పడం కష్టం అవుతుంది. ఈమాటలకు అర్థాలు మోహనరావుగారి వ్యాసం చదివిన తర్వాత కూడా అస్పష్టంగానే మిగిలిపోతాయి.
నన్నెచోడుడు, నన్నయ దాదాపు ఒక కాలం వారయినప్పటికీ భిన్న సంప్రదాయాల వాళ్ళు అనేమాట గుర్తిస్తే ఈ యిద్దరిలో ఎవరు ముందు, ఎవరు తరువాత అనే ప్రశ్న తప్పేది. తారీఖులు మాత్రమే సాహిత్యచరిత్ర అని మనం 19వ శతాబ్దం చివరిలో నేర్చుకున్న పాఠాలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం. మనకు కావలసింది ఋజురేఖలాగా నడిచే తారీఖుల సాహిత్యచరిత్ర కాదు, సంప్రదాయాల చరిత్ర కావాలి.
ఇకపోతే ఈ చర్చలోకి Caldwellని, Brownని తీసుకురావడం స్పష్టత తీసుకురాదు సరికదా ఇంకా గజిబిజికి కారణమవుతుంది. ఈ చర్చకు సంబంధించిన విషయం కాదు కాబట్టి Caldwell, Brown తెలుగు సాహిత్య చరిత్రకు కానీ, తెలుగు భాషకు కానీ చేసిన ఉపకారమేమిటి, అపకారమేమిటి అన్న విషయాలు వేరేగా చర్చించాలి.
శ్రీనివాస్ గారికి,
వుభయకుశలోపరి.
అర్థం కాని భాషలో వ్రాసిన దానిని, అర్థం కాదని వదిలెయ్యడం, ఎవరి mail వల్లో కష్టపడి చదవడం, చదివి దానికి సమాధానమీయడం మీ సహృదయతకు తార్కాణాలు. మరేట్లేదుకానండీ. మా మంచిపని చేసేరండీ. ఈ మాట ప్రతీ సంచికలోనూ ఏదో వొహటి పెట్టాల మీరు. లేకపోతే వొల్లకోం.
ఈ సమీక్ష లో శ్రీకాంత్ శర్మ గారి కంటే కూడా నారాయణ్రావు గారి సొంత అభిప్రాయాలు ఎక్కువున్నట్టు అనిపించింది.. ఈ ఎడమచేతి కుడిచేతి కులాలను గూర్హి తెలుగులో విన్నట్టు లెదు. “గ్రంథం ద్వారా. ఒక భాష బతికి వుందా, చచ్చిపోయిందా అన్న విషయం భాషాగతమైనది కాదనీ, ఆ భాష వాడేవాళ్ళ సామర్థ్యానికి సంబంధించిన విషయమనీ బోధపడుతుంది ఈ పుస్తకం చదివితే.” హిందీ ఎక్కువ వెలుగులో వుండడానికి గల ముఖ్య కారణం వాడుక భాషకి పుస్తకాల భాషకి దూరం తక్కువ వుండడమె అని నా అభిప్రాయం. ఆ దృష్టితో ఆలొచిస్తే తెలుగు సాహిత్యం మామూలు ప్రజలకి దూరమవ్వడా నికి గల కారణాలు ఎమిటి అనేది బొధపడవచ్చు. తెలుగు వెలగాలని ఎంత్ మంది కొరుకుంటున్నారో ఇన్ని వ్యాఖ్యానాలు చూస్తే తెలుస్తోంది. ఆధునిక కవుల వలన తెలుగు పాడయ్యింది అనడం సమంజసం కాదు. పైన కామేశ్వర రావుగారు రాసినట్టు కాలాణుగుణం గా వచ్హే మార్పులను గ్రహించలేక పోవడం మన పాత తరం తప్పు.కొత్త అవసరాలకు సరిపడా మాటలు తయారుచెయ్యాల్సిన భాధ్యత మీరనే పండితులదే. వాళ్ళు తెలుగు కొత్త పదాలకు బదులు సంస్కృతాన్ని వాడడం వల్లె ఈదుస్తితి తలెత్తింది. పాత కవులు గొప్ప వాళ్ళే కాని జన నాడి గ్రహించలేదనిపిస్తోంది.
ఇది పదుహేడవ శతాబ్ధపు కావ్యమని వేల్చూరి గారు చెబుతున్నారు. ఆ కాలంలో దక్షిణ భారత దేశంలో, తమిళనాడులో అధికారంలో వున్న నాయక రాజులు విజయనగర ప్రభువుల వారి రాజ్యంలో వారి ఆస్థాన వుద్యోగులుగా, తమిళ దేశంలో రాయల వారి ప్రతినిధులుగా, రాయల వారితో బంధుత్వాలు వున్నటువంటి తెలుగు నాయక రాజులు కదా. వారు సామాజికంగా పెద్ద ప్రాధాన్యత లేని కులాల వారవటం ఏవిటి? రాజాస్థానోద్యోగులు, రాజ బంధువులు, రాజ ప్రతినిధులు ఊరూ పేరూ లేని కులాల కి చెందిన వారని చెప్పటం సబబా? వొకవేళ మీరు మాట్లాడే నాయక రాజులు వేరు అని అనుకుందాం. అయినా సరే పదిహేడవ శతాబ్ధంలో పెద్దగా ప్రాధాన్యం లేని కులాల వాళ్ళు, సమర్ధులైన వ్యాపారులుగా మారటానికి ఎన్ని తరాల సమయం పడుతుందో ఆలోచించారా. ఎవరో ఒకరో ఇద్దరో కాదు వొక కులవంతా సామాజిక, ఆర్ధిక పరిస్థితులని (భూమి ముఖ్య ఆదాయ వనరుగా వున్న సమాజంలో, ప్రాధాన్యత లేని కులాలకి వున్న ఆర్ధిక బలం అతి బలహీనంగానే వుంటుంది) తమకనుకూలంగా మార్చుకుని, సమాజంలో వ్యాపార పరంగా గానీ, సామాజికంగా గాని, రాజ్యాలు స్థాపించే స్థాయికి ఎదగడం వొకరోజులో, ఒక జెనరేషన్లో అయ్యే పని కాదు కదా. భూమే ప్రధానమైన ఆదాయ వనరుగా, రాజుకైనా, సామాన్యుడికైనా వున్న సమాజంలో, భూస్వామ్యంతో సంబంధం లేకుండా రాజ్యాధికారానికి రావడం, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకోవడం ఎంత వాస్తవవిరుద్దంగా వుందో చూడండి. ఒకవేళ ఆ ప్రాధాన్యత లేని కులాల వారె, పరిణామ క్రమంలో, వ్యాపారులుగా, భూస్వాములుగా, రాజ ప్రముఖులుగా, రాజ ప్రతినిధులుగా ఎదగగలిగినప్పుడు, వారి కులం ప్రాధాన్యతని సంతరించుకుని ఒక ప్రముఖ కులంగా, సామాజిక వర్గంగా మార్పుచెందుతుంది కదా (ఇక్కడ ఏ వొక్క వ్యక్థి అభివృద్దో కాదు, మొత్తం కొన్ని కులాల సామాజిక పరిణామం). కాబట్టి అప్పటి వరకు పెద్ద ప్రాధాన్యం లేని కులాల వారు కాదు, అప్పటికే ప్రాధాన్యతని సంతరించుకున్న కులాలు అయ్యుండాలి వాళ్ళవి.
ఇక ఎడమ చేతి కులాలు, కుడి చేతి కులాల ప్రశక్తి ఒకటి తెచ్చారు. వీరి ఆచార వ్యవహారాలు పరస్పర విరుద్దాలన్నారు. అసలు భావ మాత్రమైన, ఎప్పుడూ జన బాహుళ్యం అనుసరించని, శాస్త్రాలకి, సాహిత్యానికి పరిమితవైన చాతుర్వర్ణ వ్యవస్థ, మీరు చెప్పిన ఎడమ చేతి కులాలు అధికారంలోకి వచ్చేప్పటికి కుప్పకూలి పొయ్యె పరిస్థితి ఎందుకు తలెత్తిందో మీరే చెప్పాలి. అసలు సమాజం పాటించని భావం సమాజంలో ఒక సాజిక వర్గం ఎదుగుదలతో కుప్పకూలి పోవటవేవిటో మీరే వివరించాలి. అసలు కుల వ్యవస్థతో జన్య జనక సంబంధం లేనటువంటి, ఆకాశంలోనో, పాతాళంలోనో, ఉత్తుత్తి ఊహల ఉయ్యాలల్లోనో వుండే చాతుర్వర్ణ వ్యవస్థకి ఎడమ చేతి కులాలతో ఎందుకు తంటానో మరి?
పెద్ద బ్రామ్హలైనా, చిన్ని బ్రామ్హలైనా, ఒక్క బ్రామ్హణులకే వేదాధ్యాయన అర్హత అని కాదనలేని సత్యం. శారీరకవైన, ఆర్ధికవైన స్వశక్థి లేని సామాజిక వర్గం, దాతల మీద, దానాల మీద అధార పడ్డ కులం అధికారాన్ని సంపాదించి, దాన పత్రం చేత పట్టిన ఎవిరినైనా ఆశీర్వదించడానికి, వారికి క్షాత్రపు పోగు తొడగడానికి లైన్ కట్టి వుంటారనడానికి అభ్యంతర వుండదనుకుంటాను. దానికి పైనుంచో, క్రింద నుంచో పిలిపించుకోవాల్సిన అవసరం వుందని నేననుకోను. అందువలననే, రాజ పీఠం ఎక్కిన ప్రతి వక్కరు క్షత్రియులయ్యారు. భారత దేశంలో నానా కులాల వాళ్ళు, బయటనుంచి వచ్చిన, శకులు, గ్రీకులు, తురుష్కులు, ఆంగ్లేయులు, మన దక్షిణంలో రెడ్లు, బలిజలు, వెలమలు, నానా రకాల రాజులు అందరూ క్షత్రియులై, క్షాత్రం ఒలకబోసిన వాళ్ళే. ఐతే ప్రాచీన రాజ్యాల నుంచి, బ్రిటీషు క్షత్రియుల వరకు, వారు బౌద్ద మతావలంబులు కానీ, తురుష్కులు కాని, సముద్రాలవతల నుంచి వచ్చిన మ్లేచ్చులు గానీయండి దేవుడిని, బ్రామ్మడిని తోసిరాజని, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకుని, పూజలందుకున్న రాజులు కూడా కావ్యాల్లో, కథల్లో వున్నరేవోగాని, చరిత్రలో వున్నట్టు తోచదు.
రాజు సామాజిక వర్గం పూర్వవెప్పుడో వర్తక వ్యాపారాలు చేసున్నా, వ్యవసాయాలే చేసున్నా, వేదాలే చదివున్నా, కర్రసాములే చేసున్నా, రాజుకి ఎప్పుడూ ధనం ప్రాధాన్యవే. ప్రత్యేకంగా ఎడమచేతి కులపు రాజులే విత్త ప్రాధాన్యాన్ని పెంచి పోషించేరనడం మీ స్వకపోల సిద్దాంతవేనని నా నమ్మకం. నూటికి తొంభైతొమ్మిది శాతం ప్రజలు భూమి మీద ఆధార పడిన పదిహేడో శతాబ్ధంలో, వ్యాపారం చేసి హటాత్తుగా పైకొచ్చి రాజ్యాలు చేపట్టిన కులాలు కూడా మీరు నమ్మినట్టు చాతుర్వర్ణ వ్యవస్థ లాగే ఊహల్లో వుండి వుంటే వుండి వుండొచ్చు.
ఇటువంటి కుల సంఘర్షన కాలంలో వ్రాసిందే వేంకటాధ్వరి గారు వ్రాసిన కావ్యమని చెప్పేరు. కావ్యం నేను చదవలేదు. ఐతే మీరు పరిచయం చేసిన కావ్యాంశాలని ఒక సారి పరికిద్దాం. మీ పరిచయం ప్రకారం అప్పటి సమాజంలో పెద్ద మార్పు సంభవించింది. ఎడమ చేతి కులపు వాళ్ళు రాజ్యాధికారం సంతరించుకున్నారు. వాళ్ళు రాజ్యాధికారంతో ఆగిపోకుండా తమని తాము భగవంతులుగా ప్రకటించుకున్నారు. వాళ్ళు పూర్వాశ్రమంలో వ్యాపారులుగుట చేత, సమాజంలో డబ్బు ప్రాధాన్యత పెరిగిపొయ్యి, కులం కాకుండా, దబ్బు సంపాదన అనే గుణం సమాజంలో ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది (బలవంతులవుతున్ననవాబులు, అప్పుడప్పుడే దోపిడికి మార్గాలేస్తున్న బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ తప్ప ఆ కాలంలో అంత సమాజాన్నికల్లోలం చేసిన మార్పులేవీ జరగలేదు చరిత్ర ప్రకారం). కాబట్టి ఆ డబ్బు సంపాదన కలిగిన (ఎలా సంపాదించారో మరి, భూమి పుట్ర లేని క్రింది కులస్థులు) క్రింది కులస్థులు కూడా సమాజంలో గౌరవమైన స్థానం సంపాదించ గలిగేరు. ఎలాటి స్థానం, బ్రామ్హణులు కూడా అసూయ పడగలిగే గౌరవ స్థానాన్ని పొందగలిగేరు. దానికి చారిత్రక ఋజువు ఈ సుమతీ శతక పధ్యం. సుమతీ శతక పధ్యం ఆ కాలానిదని చెప్పడానికి, ఏకాలానిదో చెప్పడానికి ఏ ఋజువులు లేవు, కాబట్టి దాన్ని వదిలేస్తాం.
అటువంటి సంఘర్షణల సమాజంలోంచి వచ్చిన కావ్యం, ఆ సంఘర్షణని వివరించే కావ్యం ఈ విశ్వగుణాదర్శం. ఈ కావ్యంలో అధునికులు అనుకునే విమర్శనాత్మక దృక్పథం ఆ కాలానికే వుందనివేల్చూరిగారి ఉవాచ. ఎలా? ఇద్దరు గంధర్వుల సంభాషణని రెండు విరుద్ద అభిప్రాయాలుగా మలచడం ద్వారా, ఆ విమర్శనాత్మకథని రచయిత నెలకొల్పుతాడు. కాకపోతే రెండు అభిప్రాయాలుకూడా తురకలు వీరులని చెప్పటంలో, ఆంగ్లేయులు నీతివంతులని వొప్పుకోవడం లాంటి కొన్ని విషయాల్లో వేరైనా, నారాయణ రావు గారి ఉదాహరణల్లో ఇద్దరి అభిప్రాయాలు కూడా, తరిగిపోతున్న బ్రామ్హణ ప్రాబల్యాన్ని గురించి చింత పడటవే కనిపిస్తుంది. పెరిగిపోతున్న శూద్ర కులాల ప్రాభల్యానికి విచారించడవే గోచరిస్తుంది. పాపం తురుష్కులలో, తెల్లొళ్ళల్లో వీరత్వాన్ని, నీతిని చూడ గలిగిన గాంధర్వులకి, క్రింది కులాలు రాజ్యాధికారానికి రావటం మాత్రం అంత నచ్చినట్టు లేదు. ఇదేదో అప్పుడే మొదలయ్యినట్టు, భూసురులు ఇంతకుముందెప్పుడూ లౌకిక వృత్తుల్లో లేనట్టు, ఎప్పుడూ అగ్రహారం కోసం దోసిలి పట్టనట్టు గాంధర్వులు యమ బాధపడిపోతారు.
ఇంకా విచిత్రవైన విషయం ఏవిటంటే, గంధర్వుల విమర్శనాత్మక దృక్పథాన్ని మరింత ఎత్తుకి తీసుకపొయ్యే ఉద్దేశంతో ఇచ్చిన ఉదాహరణ. వీరు సంస్కృతాన్ని కూడా విమర్శించడానికి కాదు ఈసడించడానికి కూడా వెనుదియ్యరు. నారాయణ రావు గారు, బాపనోళ్ళలో కూడా మహాత్ములుంటారంటే ఉద్దేశం బ్రామ్హణులు మహాత్ములని కాదండి, వాళ్ళు జనరల్ గా మహాత్ములు కాకపోయినా, ఎక్కడో ఎప్పుడో వాళ్ళలో కూడా మహాత్ములుంటారని అర్థం, కాదనగలరా. ద్రవిడ భాషల్లొ మంచి వుంటే పరిగ్రహించవలసిందే, చెడ్డ విషయం సంస్కృతంలో చెప్పినా పరిహరించ వలసిందే అంటే ద్రవిడ భాషలు ప్రామాణికవైనవి, గౌరవించవలసినవి కాకపోయినా, మంచి చెప్తే తీసుకోవలసిందే, సంస్కృతం దేవ భాష, ప్రామాణికవైన భాష అయినప్పటికి చెడ్ద చెప్తే ఆచరించనవసరం లేదు అనే కదా. ఇందులో ద్రవిడ భాషల్ని సున్నితంగా (సున్నితవేం సున్నితం, అదేదో అదైనప్పటికి అది అదే కదా అన్నడట వాడెవ్వడో) కించపరచడవే కదా.
మీరిచ్చిన ఉదాహరణలన్నీ బ్రామ్హణ కుల సంబంధవైనవే, పొనీ అగ్రకులాల అలజడి గురించి ముచ్చటించారు, అప్పుడైనా మరోకుల ప్రశక్తి లేదుకదా. మీ పరిచయం చదివిన తర్వాత ఇది ఒకే ఒక్క అగ్రకులపేడుపని నేననుకుంటే నా తప్పుందని నేననుకోను.
ఇంత నిస్సంకోచంగా మీరెలాగ అసత్యాన్ని సత్యంగా చేయబూనుకున్నారు? కులాలతో సంబంధం లేకుండా వున్నటు వంటి చాతుర్వర్ణ వ్యవస్థ, వేదం చదవడం ద్వారానే కులలతో సంబంధం లేకుండా వర్ణ వ్యవస్థలోకి
ఎదిగిన పెద్ద బ్రామ్హణులు (పాపం బ్రామ్హణ కులంలో చిక్కు పడిపోయిన చిన్న బ్రామ్హణులు) ఇలా అందంగా పుట్టే తక్కువ కులాల ఆడవాళ్ళని చూసి ఏడవడంవవేనా ఆధునికత? సంస్కృత సాహిత్యం ఆధునికం, ఆధునికత్వానికి దూరం కాదని చెప్పడానికి ఇవా మీ ఉదాహరణలు. సమాజంలో మరేరకవైన ఘర్షణ, మార్పు కనిపించలేదా ఉదాహరించడానికి, లేకపొతే కవి గారి ఆధునికత, ఆయన విమర్శనాత్మక దృక్పథం ఆయన ముక్కు దగ్గరే ఆగిపోయిందా? కవిత్వ శొభగుల సంగతి నాకు తెలీదు, మీరు ఏవీ చెప్పినట్టు లేరు, కానీ మీరిచ్చిన ఉదాహరణలే ఆ కావ్యానికి వస్తువైతే, ఆ గంధర్వుల, వారి ద్వారా మీరు పరిచయం చేసిన విమర్శనాత్మక దృక్పథం నిజంగా విచారింపదగిన విషయం. ఐతే అందులో నాకేవీ ఆశ్చర్యం లేదు, మీ కన్యాశుల్కానువాదానికి మీ వెనుక మాట మీద వేలూరివారిచ్చిన పరిచయం చదివేను (కన్యాశుల్కాన్ని మళ్ళీ ఎందుకు చదవాలంటే, వేలూరి వెంకటేశ్వరరావు – సెప్టంబరు 2007), కన్యా శుల్కాన్ని అంతగా వక్రీకరించగలిగిన మీనుంచి మరొకటి ఆశించటం తప్పే కదా.
చివరగా కొడవళ్ళ హనుమంత రావు గారు, అది ప్రాచీనవైనా, అధినికవైనా, అధునికాంతరవైనా మరేదైనా, సాహిత్యాన్ని పదుగురికి అందుబాటులోకి తేవాలనే మీ సంకల్పం అనుమానం లేకుండా అభినందించదగినది. ఐతే బాబ్జీలు తన అభిప్రాయం చివర్లో చెప్పిన విషయం కూడా మనసులో పెట్టుకోదగినదని నా అభిప్రాయం.
మోహన్ గారూ !!
నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను నిన్న చెప్పిన అభిప్రాయానికి ఇది కొనసాగింపు. ముందుగా మీ observation సరైంది. ఇవాళ ఇంగ్లీషులో ఎంతపాటి పాండిత్యం మనవాళ్ళు సంపాదించారో నాకు తెలీదుగానీ..దేశిభాషల్లోనూ..సంస్కృతంలోనూ..మాత్రం్ చాలా నష్ట పోయేరు.ఇలా నష్టపోవడానికి..రెండు కారణాలు. మొదటిది. ఆధునికంగా కన్పించడం్ ..అలాంటి వేష భాషలు ధరించడం్ గొప్ప గా చలామణీ కానిచ్చారు. కన్యాశుల్కం్ లోనే ఈ పరిస్థితి మీద ప్రస్తావన ఉంది.దేశీయ పాండిత్యాన్ని చిన్న చూపు చూసేరు ఆధునికులు. ఆధునికమైన చదువులు
చదివిన వాళ్ళతో పాలన జరిపించుకునే ప్రభుత్వాలూను. రాజుల పోషణ పోయింది. ప్రజల్నించి ఆదరణ కరువైంది. మన తెలుగునేల ఈ భాషల్లో విశ్వవిద్యాలయాలు చేవ ఉన్నవాళవానీ..సామర్ధ్యం ఉన్న వాళ్ళనీ కాక..ఎక్కువశాతం mediocres తో నింపేసేరు. చాటపెయ్యల్లా తయారుచేసేరు వాటిని. పైరవీగాళ్ళూ..పలుకుబడి గల్గినవాళ్ళూ..మాత్రమే అక్కడ చొరబడ్డారు. కాదు అలాంటి వాళ్ళని చొరబడనిచ్చేరు.జో హుజూర్ గాళ్ళు అన్నమాట. ఒకసారి తెలుగుశాఖల్ని వెళ్ళి చూడండి. ఇంక సంస్కృతం వచ్చి డొక్కశుధ్ధి ఉన్న వాళ్ళు సంఖ్యలో తక్కువ. ఉన్న కాసింత మందీ తెలుగు టీవీ చానళ్ళలో “పురాణ ప్రవచనాలు” చెప్పుకు కాలక్షేపం చేసుకుంటున్నారు.
ఏ కాలంలోనైనా పాండిత్యానికి కొనసాగింపు ఉండాలీ అంటే..ముందు నేర్పేవాళ్ళుండాలి. మనం గురువుల్ని గౌరవించుకోలేదు.వాళ్ళ పేదరికాలకి కారణం అయ్యేం. శిష్యుల్నీ తయారుచేసుకోగల వీలు వాళ్ళకి మనం కల్పించలేదు. వాళ్ళ బతుక్కి ఎటువంటి ఆధారమూ ఈ సమాజం చూపించలేదు. ఏ ఉగాది సమయాల్లోనో పిలిచి ఒక శాలువా కప్పి వెయ్యినూట పధార్లు చేతిలో పెట్టి పంపించాం!!. పాశ్చాత్య భాషల మీది మోజుతో..వాళ్ళకి అనుకరణల్తో ఇప్పటికి ఒక 50 ఏళ్ళు గడిపీసేము. ఇవాళ కళ్ళుతెరిచి పాండిత్యం కోసం వెతుక్కుంటే ఎక్కడ కన్పిస్తుందీ??తెలుగులో మంచి పుస్తకాలు రాస్తున్న వాళ్ళు చాలా మంది ఏ ఉద్యోగాలూ లేని వాళ్ళు. యూనివర్సిటీల్లోంచి చెప్పుకోదగ్గ పరిశోధన ఏదీ?? పనిచెయ్యని వారికి అవకాశాలూ..పనిచేసేవాళ్ళకి కష్టాలూను. అసలు ఇలాటి చోట పాండిత్యాన్ని గురించిన పరితాపంలో అర్ధం ఉందా??…రమ.
నా ఉద్దేశంలో ఆ సామర్థ్యం చాలావరకు అంతరించి పోయిందనే అభిప్రాయం. అంతెందుకు, ఈమాటనే ఉదాహరణగా తీస్కోండి. అందులో పాఠకులు అందించే అభిప్రాయాలను ఒక కొలబద్దగా ఎంచుకొంటే, అభిప్రాయాలు ఎక్కువగా కథలపైన, తరువాత కవితలపైన. ఆ తరువాత సంగీతం, సినిమా వ్యాసాలపైన. తరువాతే సాహిత్యం వ్యాసాలపైన. ఈమాట రీడర్షిప్ చాల ఎలీట్. మరి ఇక్కడే ఇలా ఉంటే సాహిత్యంపైన, పుస్తకాలపై వ్యాసాలపైన దృష్టి ఎలా పోతుందండీ జనానికి? ఇలాగున్నా రచయితలు రాస్తున్నారంటే ఆ రచనలు వాళ్లకు ఒక తృప్తి కలిగిస్తుందేమో కాని అందరూ చదువుతారనే ఆశతో కాదని అనుకొంటాను నేను. విధేయుడు – మోహన
అచ్చేసిన తానాకు, అందుకు విరాళమిచ్చిన హనుమగారికి కృతజ్ఞతలు.
వెల్చేరుగారన్నట్లు పూర్వ గ్రంధాలకు ఇప్పటి భాషలో వ్యాఖ్యలు కావాలి. తేవాలి. మరి అట్లా చేసే సామర్థ్యం అంతరించిపోతుందనుకుంటున్నప్పుడు, దాన్ని మాత్రం ఎట్లా కాపాడుకోవాలి అని ప్రశ్న. వ్యాఖ్యానాలు చేసే సమర్థత, అన్వయించే చతురత ఉంటే ఈ రోజుకాకపోతే రేపైనా వ్యాఖ్యలు రాసి అచ్చేసుకుంటాం. కాని ఆ సమర్థత, పాండితి కోల్పోతే తిరిగి వాటిని పోందడం సాధ్యమేనా! ఇక దాన్ని కాపాడుకోవడం పిల్లి మెడలో గంట కట్టే పని లాగుంది.
భాషలో బలమైనదేదైనా నిలుస్తుంది అని అనుకోవడానికి ఈ కృషి నిదర్శనం కాకపోయినా కొంతైనా ఊరట అనిపిస్తుంది.
===
విధేయుడు
-Srinivas
ఇలాంటి కథల గురించి మాట్లాడ్డం కష్టం. తీరా మాట్లాడ్డం మొదలెడితే అది కాస్తా కవిత్వమయి కూర్చుంటుంది. మీరూ అలాంటి ప్రమాదం లొ కాస్త పడ్డారు కాని. వచనానికీ- కవిత్వానికీ మధ్య అంచు పట్టుకుని జారిపొకుండా, పైకి వచ్చెశారు.
విశ్లేషణ బాగుంది, త్రిపుర కథలు కొత్తగా, ఇష్టంగా చదివె వొకానొక కాలం లొ ఇలాంటి వాక్యాల కథలు బాగా నచ్చేవి. త్రిపుర తర్వాత, చంద్రశేఖర రావు, తుల్లుమిల్లి విల్సన్, అనిసెట్టి శ్రీధర్, మధ్యలొ కాస్త సుమనస్పతి రెడ్డి ఇలాంటి వచనంలోకి వెళ్ళి కథల్ని రాబట్టారు.
మీ విశ్లేషణ ఆ అరుదయిన సాంప్రదాయానికి కొండంత బలం…మీ విమర్శ ఆ కథల చీకట్లో గొరంత టార్చ్ లైట్.
ఆధునికత గురజాడతో మొదలవలేదు, వెంకటాధ్వరి గారి లాటి వారితోనో ఇంకా ముందుగానో మొదలయ్యుండొచ్చు లాటి వాదన నిజవేఁ కావొచ్చు. కాకనూ పోవచ్చు. ఆధునికత ఎక్కడ మొదలైతేనేం? ఆధునికం అంటే ఇప్పటికీ వుండాలి. బహుశా అన్నమయ్యని “నొక్కీసినట్టు” వెంకటాధ్వరి గారినీ “నొక్కీసుంటారు” అప్పటి తరం వాళ్ళధ్వనిజం నిలకడ మీద తెలిసిపోతుంది కదూ?
ఈ పుస్తకంలో పరమ రమణీయకరవైఁన కవిత్వం వుందన్నారు. దాని గురించి ఎక్కువ రాయలేదు మీరీ వ్యాసంలో. పోన్లెండి ఎలాగోలాగ చదివి చూస్తాం.”రీడబిలిటీ” వున్న వాళ్ళందర్నీ సామాన్య పాఠకులు నెత్తిన పెట్టుకున్నారు. వుదాహరణకి యం.వీ.నాథ్, మ.వెం.కృష్ణమూర్తి, “షాడో” మధుబాబు వగైరాలు. ఈ పుస్తకం కూడా అలాటిదే అయితే, ఇన్నాళ్ళకి దొరికింది కాబట్టి తప్పకుండా నెత్తిన పెట్టుకుంటాం.
ఇహ భాష విషయం: జనజీవనంలో వుపయోగపడని భాషని ఆ జనులు వదిలేస్తారు. దీనికి అమెరికాలూ, యూరోపులూ వెళ్ళక్కర్లేదు. ఖర్గ్ పూరూ, కలకత్తా, తమిళ్నాడూ, బొంబాయీ వగైరాలు వెళ్తే తెలుస్తుంది. అందులో వాడి, వేడి ఆధునికత్వంతో నిండిపోయిన కవిత్వం రాసినా ఎవరూ పట్టించుకోరు. అంతేకాని సమర్ధులయిన కవులు లేరని ఏ భాషా ఆత్మహత్య చేసుకోదు.
కొడవళ్ళ వారికి: పుస్తక ప్రచురణకి భూరి విరాళం ఇవ్వడం “జయ హో” అని “డేంచు” కట్టవలసిన విషయం. అయితే ఏ మంచికి హాని చేస్తున్నావోఁ, ఏ చెడుకి మంచి చేస్తున్నావోఁ తెలుసుకుంటే హాయి హాయి గా సాగుతుంది ఆమని.
‘గేటెడ్ కమ్యునిటీ’ చదివాక అక్కిరాజు భట్టిప్రోలు పేరు బాగా గుర్తు పెట్టుకున్నాను. కాని చదివిన కథలు తక్కువే..రాసినవే తక్కువని ఇప్పుడే తెలిసింది. కొత్తపాళీ గారి వల్ల ఈ కథ చదవగాలిగా. నేను ఊహించినట్టుగానే బాగుంది కథ. రాస్తూ ఉండండి..
నాటకం గురించి వచ్చిన మంచి పుస్తకం జయప్రభ గారి “నాలుగో గోడ”. తెలుగు నాటకం మీద వచ్చిన మంచి పరిశోధన ఇది.. తెలుగు నాటకరంగం మీద అదివరకు ఎవరూ చేయని కొత్త చర్చలన్నీ… మొదటగా 91 ప్రాంతాల్లోనే ఈ పుస్తకం లో చోటుచేసుకున్నాయి. మరి నాటకం గురించి మాట్లాడేవారెవ్వరూ ..ఈ పుస్తకం ప్రస్తావనే చేయడం లేదు.?? తొలిగా వచ్చిన పుస్తకాన్ని గురించి పేర్కొన టం…ఒక మర్యాద కదా? మీ webzine అభిప్రాయాల్లో… ఇటువంటి వాటికి ఏమంత ప్రాముఖ్యతని ఇవ్వరు కాబోలు!.నాకు తెలిసినంతలో ఒక అంశం మీద మాట్లాడేవారు..ఆ అంశం మీద వచ్చిన ముఖ్యమైన పుస్తకం నించి..విషయాన్ని కోట్ చేయటం అన్న ది ..ఆ విషయానికి ప్రామాణికతని ఆపాదిస్తుంది. కన్యాశుల్కం గురించి చర్చించేటప్పుడు అప్పారావుగారి ప్రసక్తి తెచ్చిన ట్టుగా అన్నమాట.ఆ పుస్తకానికి ఆంధ్రదేశంలో అభిమానులు మెండు. అమెరికా తెలుగువారికి తెలియదేమో ఇంకా అని …చెప్పాలనుకున్నాను.
మీరు, “ఒకటీ, రెండు పదాల కామెంట్లు (అద్భుతం, బాగుంది, నాకు నచ్చింది, వగైరా) ఇకముందు నుంచీ ప్రచురించబడవు. … వీటివల్ల రచయితకైనా, తోటి పాఠకులకైనా ఏ ప్రయోజనమూ లేదని మా అభిప్రాయం,” అన్నారు.
కొత్తగా రాసేవాళ్ళు తమ రచనలన మీద ఎలాంటి స్పందనా లేకపోతే అసలెవరైనా చదివారా అని మధనపడి నిరుత్సాహపడవచ్చు. “నాకు నచ్చింది” అని ఒక్కరన్నా అంటే అది కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. చెయ్యి తిరిగిన రచయితలకి ఇలాంటి వాటి అవసరం లేకపోవచ్చు కాని మిగిలినవాళ్ళలో కొందరికైనా వాటివలన కాస్త ప్రయోజనం ఉంది.
మీ పద్ధతి మార్చుకోమని కోరడం లేదు; రచయితలందరూ వీటికి అతీతులు కాదని చెప్పడానికే.
నాకు కూడా సంగీతం కాని, సాహిత్యం గురించి కాని ఎమి తెలియదు. Comment చెయడానికి అర్హత లెదు అనుకుంటాను ఎప్పుడు, కాని మీ వ్యాసం చాలా intresting గా ఉంది. త్యాగరాజు గురించి ఇంకా తెలుసుకొవాలని అనిపించెలా చెసారు.
Thanks
1985లో వడ్డెర చండీదాస్ “ప్రియమైన మో” అని సంబోధిస్తూ ఉత్తరం రాయడంతో వేగుంట మోహన ప్రసాద్ కేవలం ‘మో’ గా స్థిరపడిపొయ్యాడు. తెలుగు, పాశ్చాత్య సాహిత్యాలని లోతుగా అధ్యయనం చేసిన కవి. మొదటి కవితా సంపుటి, చితి-చింత, తోనే పేరు తెచ్చుకున్నాడు. ఇతర దేశాల కవులని “కరచాలనం” వ్యాసాల ద్వారా తెలుగువాళ్ళకి పరిచయం చేశాడు. ఇంకా చాలా రాశాడు. పోయిన సంచికలోనే ఆయన “నిరాకారుడు” కవితని వేలూరి చవకరకం జిన్ అండ్ టానిక్ గా అభివర్ణిస్తే నేను మంచి కవితగా సమర్థించాను.
మో కి విమర్శకులు ఎక్కువే. కాని, “ఈ కవిత్వ కషాయం వికటిస్తుంది,” అని విమర్శించినాయనే “నిరంతర ‘మో’హనరాగం” ఆలాపించే ఈ కవి మన మధ్యనే ఉన్నందుకు గర్వపడాలనడం గమనార్హం. [1]
మీ వ్యాఖ్య చదివి, హమ్మయ్య, ఒక్కరైనా నా వ్యాసం చదివారు, శ్రమ నిరర్థకం కాలేదు, అన్న సంతోషం కలిగింది.
వాస్తవానికి, నేనీ వ్యాసం ముగించి, గత శతాబ్దంలో గణితశాస్త్రంలో వచ్చిన మూడు విపత్తులని సగటు పాఠకునికి వివరించడంలో విఫలమయ్యాననే నాకు నేను బేరీజు వేసుకున్నాను. మరీ మిక్కిలి అమూర్త (abstract) విషయాలని వివరించడంలో కలిగే చిక్కులు నాకెక్కువే ఎదురయ్యాయి. అయినా దీని వలన కొంత మేలు జరిగిందనీ, ముందు ముందు మీలాంటి వారెవరైనా ఇంకా సరళంగా చెప్పగలరనీ ఆశ.
మీరు ప్రస్తావించిన పుస్తకం నేను చదవలేదు కాని చదవదగ్గదిలా ఉంది. అందరూ మీరిచ్చిన లింకులోని పరిచయం అన్నా చదువుతారని ఆశిస్తాను. నేనీ వ్యాసం రాసే సమయంలోనే, గణితంలో నోబెల్ బహుమతి లేదని తెలిసి ఒకరు నా ముందర విస్మయపడితే, ఆమాత్రం తెలియని ఇంజనీర్లు ఉన్నారా అనుకొని అవాక్కయ్యాను.
శిలాలోలిత పుస్తకంలో రేవతీదేవి ఇంటి పేరివ్వనందున నేనూ దానిని ప్రస్తావించలేదు. కాని మీరన్న విన్నకోట ఆవిడ పుట్టింటి పేరూ కాదు, మెట్టింటి పేరూ కాదు – పుస్తకాన్ని అంకితం చేసింది తండ్రి యన్. సి. రాజారెడ్డి గారికి; భర్త డి. రఘురామిరెడ్డి. ఈ మధ్యనే నిడదవోలు మాలతి గారు మన దృష్టికి తెచ్చిన ఒక పుస్తకం [1] లో ఆవిడని నిడుమానూరి రేవతీదేవి గా పరిచయం చేశారు.
రమ గారికి,
మీ అభిశంసనా పూరక ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. రచ్చబండలో అప్పట్లో కాస్త ఎక్కువగానే వాదోపవాదాలు చేసి ఘర్షణ పడేవాణ్ణి. వాటిల్లో ఒకదానిని, వ్యాసంగా రాసి మాకు పంపగూడదా అని వేలూరి, కొలిచాల అడిగితే హడావిడిగా పంపిన రచన ఇది. నాలాంటి పాఠకులు రాయగలరేమో కాని, సాహిత్యంలో కొంత సాధికారికతగలవాళ్ళు రాస్తేగాని ఈ కవయిత్రులకి న్యాయం జరగదు.
బంగారమ్మని ప్రస్తావించారు కనుక ఓ ముచ్చట చెప్తాను. ముద్దుకృష్ణ మూలంగా ఆవిడ పేరు తెలుసు కాని, ఈ వ్యాసం రాసేముందర నేనావిడ కవిత్వాన్ని అంతగా పట్టించుకోలేదు, వెల్చేరు గారి Hibiscus చూసింతర్వాతే నాకావిడ మీద ఆసక్తి కలిగింది. దాంట్లోనే ఉన్న My Brother మూలం వెంటనే దొరకలేదు. తర్వాత కొన్నాళ్ళకి జనవరి 2006లో శేషశాయి గారు ఆవిడ కవితా సంచికని ఆంధ్రభారతిలో పెట్టి రచ్చబండలో చెప్పారు. అందుమూలంగానే ఆవిడ కొంపెల్ల జనార్దనరావు సోదరి (అక్కో చెల్లెలో ఎందుకు చెప్పరు?!) అని తెలిసింది. అప్పుడు మా ఆవిడ నన్నడిగింది – “మరి శ్రీశ్రీ అనంతంలో ఆ విషయం చెప్పలేదా?” అని. “జనార్దనరావు జ్ఞాపకాలు” అంటూ శ్రీశ్రీ చాలానే రాశాడు కాని ఈ విషయం చెప్పిన గుర్తులేదు.
జ్ఞాపకాలంటే, ఆచంట జానకిరామ్ [2] కొంపెల్ల జనార్దనరావు స్వగ్రామం, అమలాపురం దగ్గర గంగలకుర్రు వెళ్ళి, ఆ ఊరిని వర్ణించి బంగారమ్మ కొత్తగా రాసిన “నీడ” (Hibiscus on the Lake) ఆవిడ చదివితే విని పరవశించడం గుర్తొస్తుంది. ఆవిడ జనార్దనరావుకి అక్క అన్నారు ఆచంట. My Brother కి మూలం “మా అన్న.” పేరుకి తగ్గ కవయిత్రి బంగారమ్మ.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Women Writing in India: 600 BC To the Present,” Volume II: The 20th Century. Edited by Susie Tharu and K. Lalita. Oxford India Paperbacks, 1993.
[2] ఆచంట జానకిరామ్ “సాగుతున్న యాత్ర.” దీనిని “నా స్మృతిపథంలో” తో కలిపి జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు వారు 2008లో ప్రచురించారు. పేజీలు 230-231.
ఈ శ్రు అనే విషయంలో చాలా ఏళ్ళ క్రితం నేను చేసిన పొరబాటును గురించి ఈమాట సంపాదకులకు ఎప్పుడో చెప్పాను కాని వారింకా నా పాత వ్యాసం శీర్షికను సరిదిద్దలేదు.
[రోహిణీ ప్రసాద్ గారు, మీ వ్యాసం శీర్షికను సరిదిద్దాము. ఈమాటలో మరికొన్ని చోట్ల ఉటంకించిన “శృతి” అన్నమాటను కూడా “శ్రుతి” గా సరి దిద్దాము. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. -సం.]
లక్ష్మన్న గారూ,
కొంత మంది పండితుల అభిప్రాయసేకరణకు సమయం పట్టింది.
సంస్కృతంలో ” శృతి ” అన్న పదం అసలు లేదు. ” శ్రుతి ” యే సరియైన పదము.
“శృ” మరియు “శ్రు” – ఈ రెంటికీ ఉచ్చారణ ఒకే విధంగా ఉండదు.
ఎందుకంటే “శృ” అనే అక్షరంలో ఒక హల్లు + ఒక అచ్చు ( శ్ + ఋ ) ఉన్నాయి. ఇది ” శ ” గుణింతములో వస్తుంది. కాని ” శ్రు ” లో రెండు హల్లులు, ఒక అచ్చు ఉన్నాయి ( శ్ + ర్ + ఉ ). ఇది సంయుక్తాక్షరము. కనుక దీని ఉచ్చారణ వేరు.
మూలమైన ధాతువు ” శ్రు – శ్రవణే ” అనేది. అందులో కేవలం వర్తమాన కాలంలో ప్రయోగింపబడే రూపములు ” శృణోతి ” మొదలైన వాటిలో మాత్రమే “శృ” అనేది కనిపిస్తుంది. ఇదొక విలక్షణమైన రూపము.
” అమరకోశం ” లో కూడా దీనిని గురించి మంచి వివరణ ఇవ్వడం జరిగినది.
కాబట్టి ” శ్రుతి ” అన్నదే సరియైనదని పండితుల అభిప్రాయము.
నేనూ సంగీతాభిమానినే. ఈ విషయం ఎందుకు వ్రాశానంటే, సంగీతశాస్త్రం గురించి వ్రాసేటప్పుడు సంస్కృత వ్యాకరణశాస్త్రం కూడా ప్రధానమైనదే కదా.. అందుకని.
అన్యథా భావించవలదని మనవి.
క్రితం ఏడాది అక్టోబర్ లో నాటక రంగ ప్రముఖ వ్యక్తి దుగ్గిరాల సోమేశ్వరరావు 77వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యూనివర్శిటీ ప్రాంగణంలో రావికొండల రావు స్వీయరచన దర్శకత్వంలో “బాంబు పేలింది” అని ఓ నాటకం వేస్తే నేను చూసాను. వయసు శరీరానికి కానీ మనసుకి కాదు అని నిరూపిస్తూ ఇరవై ఏళ్ళ వ్యక్తిలా ఎంతో ఉత్సాహంతో రావి కొండల రావూ, ఆయన సతీమణి రాధా కుమారీ నటించారు. ఇద్దరికీ నటనలో, ముఖ్యంగా హాస్యం పండించడంలో బ్రహ్మాండమైన టైమింగ్ వుంది. ఈ నాటకానికి పట్టుమని పది పుంజీల జనం కూడా లేరు. వచ్చిన వారిలో దాదాపు సగానికి పైగా దుగ్గిరాల వారి అభిమానంతో వచ్చిన వారే! ఇది చూసి పక్కనే ఉన్న నాటకరంగంలో మరో ప్రముఖ వ్యక్తి చాట్ల శ్రీరాములు గార్ని మొత్తం హైద్రబాదులో తెలుగు నాటకరంగానికి చెందిన కళాకారులెంత మందని అడిగితే, దాదాపు రెండు వేల పైగా ఉన్నారని చెప్పారు. అంతమంది ఉంటే అదేమిటి పట్టుమని పదిమంది కూడా లేరేమిటని అడిగితే, ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వులో నిరాశా, నిర్వేదం కనిపించాయి. ఆ ప్రాంగణంలో ఖాళీ కుర్చీల సంఖ్యే నాటక రంగంలో ఉన్న ఐకమత్యాన్ని చెప్పకనే చెప్పింది. హైద్రాబాదు నగరంలో ఉన్న రెండు వేలమంది కళాకారులూ రావాలని ఆశించక పోయినా, కనీసం అందులో పదో వంతుకూడా రాకపోవడం విచారించదగ్గ విషయం. నాటకం పూర్తయ్యాక నటీనటుల పరిచయ కార్యక్రమంలో పరిచయమక్కరలేని రావికొండల రావు గారికి ఓ నలుగురు అతి బలవంతమ్మీద తప్పట్లు కొట్టారు. ఈ తప్పట్ల శబ్దం పాత్రల సంఖ్య పెరిగే కొద్దీ క్షీణిస్తూ వచ్చింది. ఆఖరి నటుని పరిచయమొచ్చేసరికి ఒక్కటంటే ఒక్కటి వినిపించింది. అదీ ఆ సభకు విచ్చేసిన వారి గోలలో కలిసిపోయింది. ఇదీ నేటి నాటకరంగ పరిస్థితి. ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే, అసలు కమిట్మెంట్ లేనిది నాటక రంగంవారికని ఇలాంటి సంఘటనలు మరింత బలపరుస్తాయి. ఈ విషయంపై నేను స్పందించి రాసిన వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చింది. చాట్ల వారు ఓ పది కాపీలు తెలుగు యూనివర్శిటీ ధియేటర్ ఆఫ్ ఆర్ట్స్ కి పంపానని చెప్పారు. ఇలాంటిదే జి.ఎల్.ఎన్. మూర్తిగారు ఇవాళ ఆంధ్రజ్యోతి లో రాసిన “మంచి నాటకం ఎక్కడ?” వ్యాసంలో రాసారు.
ఎంచుకున్న వ్యాస విషయం సార్వ జనీనమయింది. ఎదురు దెబ్బల బాధని వ్యంగం జోడించి వ్యక్తీకరించడం భేషైన ప్రక్రియే! కాని ఎక్కుపెట్టిన బాణాలే కొన్ని గురి తప్పినట్టనిపించింది. వ్యాసకర్త తనని తాను నిర్వాహకుని (ఉత్తమ పురుష లోనున్న వ్యాసంలో) గా పరిచయం చేసుకుని నిర్వాహకులమీదే వేసిన విసుర్లు నన్ను విస్మయానికి లోను చేసేయి. ఇంత సమస్యకి అద్దం పట్టిన వ్యాసకర్త “నివాసి” కాదు ప్రవాసి అని నా నమ్మకం. మరిన్ని జన రంజకమైన రచనలు చేస్తారని ఆశిస్తాను.
రోజు మిగిలిన ‘రసం’ ని ఒక కుండలో మూడు, నాలుగు రోజులపాటు చేర్చి తరువాత దాన్ని అన్నంలో కలుపుకుని తమిళ బ్రాహ్మలు తింటారు అని తెలిసినప్పుడు ఒకింత ఆశ్చర్యం వేసింది.
ద్రవ పదార్ధం పేరు తెలియకుండా ఒక రోజు వారింట్లో భోజనం చేస్తున్నప్పుడు దాన్ని అస్వాదించడం జరిగిన తరువాత అది ఆ ‘రసం’ అని తెలిసినప్పుడు “నిజమా, బాగానే ఉందిగా”అని అనుకోక తప్పలేదు.
అది వారి ‘తరవాణి’ నా? ఏమో, పేరు గుర్తులేదు.
మిగిలిన అన్నాన్ని మరుసటి రోజు భిక్ష ఇవ్వడం ఒక పద్దతి. కాని ఆ మిగిలిన అన్నాన్ని ఎండ బెట్టి, వేయించి, దానికి కొంచెం ఉప్పు కారం జల్లి తింటే రుచిగా ఉంటుందన్నది తెలంగాణ వెళ్ళినప్పుడు తెలిసింది.
బహుశ అదేనేమో cultural preservation లేదా cultural evolution అంటే!
రమగారికి రవిగారికి ధన్యవాదాలు.
రమగారు,
మీరు చెప్పిన “ముక్తాఫల” వ్యాఖ్యలో కొన్ని భాగాలు Digital Libraryలో ఉన్నాయి చూసాను. కాని కొన్ని చోట్ల తప్పులున్నాయి. అంచేత అది ఎంతవరకూ సాధికారికమైనదో తెలీదు. మీరన్న జయప్రభగారి కవిత నేను చదవలేదు. ఆ పుస్తకాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాను.
రవిగారు,
మీరన్న ఆ రెండు పద్యాలు ఇవి:
సోమనది:
ఏది ఎక్కువ భావస్ఫోరకమూ అని చెప్పడం కష్టం (అనవసరం కూడా). దేని ప్రత్యేకత దానికుంది. సోమన పద్యంలోని ప్రత్యేకతంతా “చూచుకములందు మందార కేసరమాలా మకరందపు నీటి బొట్లు స్రవించడం”లో ఉంది. దాన్ని చిత్రించడంలో సోమన ఉద్దేశం ఏమిటన్నది పాఠకులెవరికి వారు ఊహించుకోవలసిందే.
పోతన పద్యం చిత్రాన్ని స్పష్టంగా రూపుకడుతుంది. రోషము – రాగోదయమూ, అవిరత భ్రూకుటి – మందహాసము, కెంపు – సొంపు ఇలా వీర శృంగార రసాలు స్పష్టమైన జంటగా కనిపిస్తాయి. పైగా వాచ్యంగా కూడా కనిపిస్తాయి. సోమన పద్యంలో అది లీలగా మాత్రమే గోచరిస్తుంది. “సరసాలోక సమూహము” కన్నా “దరహాసామృతపూరము” నాకు అందంగా అనిపించింది. సోమన సత్యభామ పయ్యెదని ఒకింత తొలగించాడు, పోతన ఆ పని చెయ్యలేదు. ఈ ఒకింత తొలగిన పయ్యెదని కృష్ణుడా తర్వాత సరిజేస్తాడు. ఆ పద్యం వ్యాసంలో పేర్కొన్నాను. వ్యాసంలో చెప్పినట్టుగా, సోమన ఈ ఘట్టంలో శృంగార రసాన్నే ఎక్కువగా ధ్వనించాడు అని నాకనిపిస్తుంది. పోతన రెంటినీ సమానంగా పోషించాడు.
సత్యభామ యుద్ధానికి లేచి నిలుచున్న తీరుని వర్ణించిన యీ పోతన పద్యం చక్కని చలనచిత్రాన్ని మన కళ్ళకి కట్టిస్తుంది.
పోతన భాగవతంలో సత్యభామ కృష్ణుని యుద్ధానికి తీసుకువెళ్ళమని మురిపెంగా అడుగుతుంది. కృష్ణుడు ముందు వారించినా చివరికి తన మాట చెల్లించుకుంటుంది. అది యీ కథలో పోతన ప్రవేశపెట్టిన అందం.
To be fair to literary enthusiasts, సంగీతాభిమానులు కొందరికి నా వ్యాసాల గురించి చెప్పాను కాని వాటిలో వారికి ఎక్కువ ఆసక్తి కలిగినట్టుగా అనిపించలేదు. ‘వినేవాళ్ళూ చదవరు, చదివేవాళ్ళు వినరు’ అనుకోవాలేమో. వెబ్ పత్రికలో రెండు పనులూ ఒకేసారి చెయ్యవచ్చు కనక వీలున్నప్పుడల్లా నాకు audio links ఇవ్వబుద్ధి అవుతుంది.
రోహిణీ ప్రసాద్!
సంగీత జ్ఞానము, భక్తి -రెండూ లేని పాఠకులము కొందరము ఉంటాం కదా! :)మీకు ఐతే రెంటిలో ఒకటైనా మస్తుగా ఉంది. కాని మీరు పాఠకులు కారయ్యే! మా బోంట్లకు – అంటే సైన్సు, ఆర్ట్సు అసలు ఏవీ రాని, మామూలు పాఠకులకు- అందునా ఆడవాళ్ళకు, అర్థమయ్యేట్లు తేలిక మాటల్లో వ్యాసాలు రాసి, చదువు చెప్పి, సన్మార్గంలో పెట్టే రచయితలు మాత్రమే మీరు.
దుడుకు గల లైలాను ఏ దొర బ్రోచురా – అని నవ్వుకుని ‘వీణ తీగల గురించిన చర్చ’ ఎటువంటిదో చెప్పగలరు. నాకు ఏమీ అర్థం కాలేదు.
పోనీ త్యాగరాజు సంగీతములో ఎందుకు అద్వితీయుడో , ఈ ఒక్కసారికి పాఠకుడి స్థానానికి దిగజారి మీరే స్వయంగా ఒక్క కామెంటైనా చెయ్యరాదూ.
అందరు మహామహోపాధ్యాయులూ – ఎవరికి వారే -ఇతరులకు ఉపయోగించే విషయాలు పరాపరా రాసేస్తూ, బిజీగా ఉండి, వేరేవారి రచనలు, పుస్తకాలు చదవ(లే)క పోయినా, అలాటి పరోపకార బుద్ధి ఏ మాత్రం లేని నేను చదువుకుంటాను. తెలియని విషయాలు కొంచెమైనా తెలుసుకుని ఆనందిస్తాను. కోరిక మన్నించి రాస్తారుగా.
మీరు రాసే లోపు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ సాధన చేస్తూ ఉంటాను. ఎంత గింజుకున్నా రాదనుకోండి.:) ఐతే ఏం.
పాఠకుల సాహిత్యాభిమానం ఎక్కువ కావడం వల్లనో, సంగీతాభిమానం తక్కువ కావడం వల్లనో తెలియదు కాని, త్యాగరాజు సృష్టించిన అద్వితీయమైన సంగీతం గురించి మటుకు ఒక్క కామెంటు కూడా కనబడటం లేదు! వీణ తీగల గురించిన చర్చ కూడా అటువంటిదే.
నిన్ననే వల్లంపాటి వారు రాసిన “విమర్శా శిల్పం” కొన్నాను. చాలా బావుందనుకున్నాను పేజీలు తిరగెయ్యగానే. జీవితం, సాహిత్యం & సాహితీ విమర్శ మొదట్లో సమబాహు త్రిభుజం అనీ, తరవాత కాదనీ మొదటి పేజీ లోనే ఆయన రాయడం (మొదట రాసిన వ్యాసానికీ, ఈ పుస్తకానికీ “ఇంప్రూవ్ మెంట్”) ముచ్చటేసింది. ఈయనెక్కడ దొరుకుతారో, కలిసి బోల్డన్ని అడగాలనుకున్నాను. “యాదృచ్చికంగా” ఈ వ్యాసం చూసేను. అయ్యో రాతా అనిపించింది.
నేను ఇంకా వ్యాసాన్ని సంపూర్ణముగా చదవలేదు. కాని ఈ వట్టి – పట్టి గురించి ఒక రెండు మాటలు. పట్టి తమిళ పదము మాత్రమే కాదు, తెలుగు పదం కూడా, పట్టి అంటే బిడ్డ అని అర్థము. పట్టి గొడ్డు అంటే చిన్న గొడ్డు అని కూడా అనుకోవచ్చు. ప అక్షరానికి వ అక్షరానికి యతి చెల్లుతుంది ఎప్పుడూ! త్యాగరాజు మంచి తెలుగు కవి కూడా, యక్షగానాలను రాశారు. పద్యాలను ఎన్నో రాశారు. ఇక పోతే ప అక్షరానికి వ అక్షరానికి తెలుగు వ్రాతలో సరిగా కొమ్మును కలపక పోతే సందేహం కలగవచ్చు. కానీ తమిళంలో వ-కారానికి, ప-కారానికి ఇలాటి సందేహం లేదు. త్యాగరాజుగారి శిష్యులు కీర్తనలను ఏ భాషలో రాసుకొన్నారో అనే విషయం నాకు తెలీదు.
మళ్ళీ ఈ చిత్రాన్ని చూడడానికి ఈ మంచి వ్యాసం ఒక
అవకాశం కలిగించింది. చిత్రంలో ఎక్కడా హరిహర్
పేరు వినబడలేదు. కాని Satyajit Ray – The Inner Eye
పుస్తకంలో అపూ ట్రిలజీ ప్రకరణంలో, అందులో ఇచ్చిన
ఛాయాచిత్రాలలో హరిహర్ అనే రాయబడింది, హరిహరన్
అని కాదు. విధేయుడు – మోహన
>>ఇప్పుడు గ్రంధాల్లో వున్న భాష గ్రాంధిక భాషా? ఇవి గ్రంధాలు కావా? గ్రాంధిక భాష కాలమహిమవల్ల ఎలా మారిపోతుంది?
“గ్రంధాలలో ఉండేది గ్రాంధికభాష” అన్న నిర్వచనం తీసుకుంటే ఇప్పుడు గ్రంధాలలో వాడే భాషకూడా గ్రాంధికభాషే అవుతుంది. అందులో సందేహం ఏవుంది? కానీ నేను నా వ్యాసంలో ఉద్దేశించింది అది కాదు. అందుకే ఆ పదాన్ని ఏ ఉద్దేశంలో వాడేనో వ్యాసంలోనే పేర్కొన్నాను.
>>తెలుగు గ్రాంధిక భాష ఎలా పుట్టింది? ఆ మాటకొస్తే ఏ భాషలోనైనా గ్రాంధిక భాష గ్రాంధిక భాష ఎలా తయారవుతుంది? ఎవరూ “వాడని” భాషని ఎవరైనా ఎలా తయారుచెయ్యగలరు?
నాకు భాషాశాస్త్రంతో పెద్దగా పరిచయం లేదు కాని, నాకు తెలిసినంతవరకూ తెలుగులో గ్రాంధిక భాష సంస్కృత భాషా సాహిత్య ప్రభావంతో రూపొందిందని అనుకోవచ్చు. ఇది నన్నయ్యో మరే ఒక్కరో కూర్చుని చేసిన పని అనుకోవడం సరికాదు. నన్నయ్యకి ముందున్న తెలుగుశాసనాలలోనూ, కన్నడ సాహిత్యంలోనూ కూడా ఈ భాష కనిపిస్తుంది. ఎలా అయితే వ్యవహారంలోని భాషని ఒకరు సృష్టించరో, అలానే గ్రాంధికభాషాను. ఎలా అయితే వాడుకభాష మారుతూ వస్తుందో అలానే గ్రాంధిక భాష (అంటే గ్రంధాలలో వాడే భాష) కూడా మార్పుచెందుతూనే ఉంటుంది. గ్రాంధిక వాడుక భాషలు ఒకదాన్ని మరొకటి ప్రభావితం కూడా చేసుకుంటూ ఉంటాయి. పూర్వం సాహిత్యమూ, గ్రందాలూ కొన్ని వర్గాలకి పరిమితమవ్వడం వల్ల వాళ్ళకి నచ్చిన, వాళ్ళు వాడడానికి ఇష్టపడిన భాషలో గ్రంధాలు వెలువడ్డాయి. నిత్య వ్యవహారంలో భాషకీ ఆ భాషకీ కొంత స్పష్టమైన భేదం కనిపించేది. ఇప్పుడు మారిన పరిస్థితులలో సాహిత్యం, గ్రంధరచన అన్ని వర్గాల ప్రజలూ చేస్తునారు కాబట్టి, దానికి ఇంతకు ముందున్నంత నిర్దిష్టమైన రూపం లేదు. వ్యవహార గ్రాంధిక భాషల మధ్య తేడా ఇంచుమించు చెరిగిపోయింది.
>>కాలమహిమవల్ల మారిపోయే గ్రాంధిక భాషకి ఈ ధూపదీపనైవేద్యాలెందుకు?
తమకి ఇష్టదైవానికి పూజ చేసుకొనే హక్కు ఈ సెక్యులర్ దేశంలో ప్రతివాడికీ ఉందికదండీ 🙂 నాస్తికుల చెవి మెలిపెట్టి మీరుకూడా పూజ చెయ్యాల్సిందే అనే హక్కు ఆస్తికులకి లేదు. అలానే ఆస్తికులని పూజలు మానుకోండనే హక్కు నాస్తికులకీ లేదు, ఏవంటారు? ఇంతకీ నా వ్యాసంలో నేనెలాంటి పూజా కార్యక్రమమూ పెట్టలేదే!
>>అందులో పచనం కాని పద్యాలైనా, వచనాలైనా పట్టించుకోడం ఎందుకు?
పైన నేను చెప్పినట్టు, ప్రస్తుతం గ్రంధాలలో వాడే భాషకి ఒక నిర్దిష్ట రూపం అంటూ నాకు తెలిసి ఏవీ లేదు. ప్రాచీన కావ్యభాష కావచ్చు, అందరికీ అర్థమయ్యే సామాన్య వాడుకభాష కావచ్చు, ప్రాంతీయ/మాండలిక భాష కావచ్చు, జానపదభాష కావచ్చు ఇలా ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళా భాషలో రాస్తున్నారు. దాన్ని ఇష్టపడే వాళ్ళు చదువుతున్నారు. ఒకో రకమైన భాషలో ఒకో అందం ఉంది, ఒకో శక్తి ఉంది. కాబట్టి ప్రాచీన కావ్యభాష ఇష్టమైన వాళ్ళు, దాని శక్తి తెలిసినవాళ్ళు ఆ భాషలో సాహిత్యం వెలువరించడంలో తప్పేముంది? దాన్నిష్టపడి చదివే వర్గమే దాన్ని పట్టించుకుంటుంది. అలాటి వర్గం అంతరించిననాడు అది సహజ మరణం పొందుతుంది. అది సమాజానికి హాని చెయ్యనంత కాలం దాన్ని బతికించుకోవాలనుకోవడంలో తప్పులేదు, హత్య చెయ్యాలనుకోవడం అన్యాయం.
>>మీరేమో వాడుక భాషలో ఉత్పలమాల, చంపకమాల, పులులూ, ఏనుగులూ కుదరవంటారు. అవును కాబోలు అనుకునే లోపునే, మరో గురు తుల్యులు, కృష్ణమోహన్ గారు వాడుక భాషలో పద్యాలు అంటారు. ఏం దారి?
మేవిద్దరం రెండు కోణాలని చూపించే ప్రయత్నం చేసేమనే నేననుకుంటున్నాను కాని తగువులాడుకోటం లేదు. మీరు మా మధ్య లేని తగువుని సృష్టించకండి 🙂 పద్యాలలో వాడుకబాష వాడకంలోని పరిమితులని నేను విశ్లేషించేను. అంతేకాని వాడుకభాషలో పద్యాలు రాయలేమని కాని, రాయకూడదని కానీ నేననలేదు. పద్యాలలో వాడుక భాషని ఎలా వాడవచ్చో కూడా నేను నా వ్యాసంలో ప్రస్తావించాను. అలానే వాడుకభాషలో పద్యాలు ఎలా రాయవచ్చో మోహనగారు మరో రకంగా వివరించారు.
కావేఁశ్వరరావు గారికి,
తెలుగు గ్రాంధిక భాష ఎలా పుట్టింది? ఆ మాటకొస్తే ఏ భాషలోనైనా గ్రాంధిక భాష గ్రాంధిక భాష ఎలా తయారవుతుంది? ఎవరూ “వాడని” భాషని ఎవరైనా ఎలా తయారుచెయ్యగలరు?
నన్నెచోడుడో, నన్నయో ఆదికవి ఎవరెనే గొడవ వద్దు (ప్రాచీన/క్లాసికల్ భాష స్థాయి తెలుగుకి వచ్చీసింది కాబట్టి) వీళ్ళైనా గ్రాంధిక భాషని ఎలా తయారుచేశేరు? అసలు గ్రాంధికాన్ని ఎందుకు తయారు చెయ్యవలసి వచ్చింది?
ఇప్పుడు గ్రంధాల్లో వున్న భాష గ్రాంధిక భాషా? ఇవి గ్రంధాలు కావా? గ్రాంధిక భాష కాలమహిమవల్ల ఎలా మారిపోతుంది? కాలమహిమవల్ల మారిపోయే గ్రాంధిక భాషకి ఈ ధూపదీపనైవేద్యాలెందుకు? అందులో పచనం కాని పద్యాలైనా, వచనాలైనా పట్టించుకోడం ఎందుకు? వ్యాకరణం భాషని శాసించదు, “రికార్డ్” చేస్తుంది. కాదా? రేపు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ “అమ్మ వొచ్చేడు, నాన్న వొచ్చింది” అని వాడితే భాషా శాస్త్రవేత్తలు/వ్యాకరణ పండితులు – ఆ పుంజీడు మందీ – అదే “రికార్డ్” చేస్తారు తప్ప ఇంకేం చేస్తారు?
ఇన్ని “కొశ్చిన్ మార్కులా?” అని అనుకోవచ్చు. అవును “ప్రశ్నార్ధకాలే?”
“తెవికీ” సభ్యులకి: అయ్యలారా! అమ్మలారా! తెవికీ అంటే తెలీదు నాకు. కానీ ఇదేదో తెలుగు భాషనుధ్ధరించడానికి చేసే పనని అనిపిస్తోంది. అయితే ఈ విషయంలో తెలుగు భాషా శాస్త్రవేత్తల్నీ, తెలుగు భాషా పండితుల్నీ సంప్రదించకండి. తెలుగు మాట్లాడే ప్రజల్ని సంప్రదించండి. మీ శ్రమకి ఫలితం, మీ శ్రమకి కృతజ్నత, మీ శ్రమకి తెలుగు ప్రజల జేజేలు అందుకోవచ్చు. మీకవక్కర్లేదని అందరికీ తెలుసు. అయినా సరే.
కావేఁశ్వరరావు గారికి: మీరేమో వాడుక భాషలో ఉత్పలమాల, చంపకమాల, పులులూ, ఏనుగులూ కుదరవంటారు. మీరు గురు తుల్యులు. అవును కాబోలు అనుకునే లోపునే, మరో గురు తుల్యులు, కృష్ణమోహన్ గారు వాడుక భాషలో పద్యాలు అంటారు. ఏం దారి?
అందరికీ “అమ్మ(భాష)” రాణెమ్మలా బతకాలనే దుగ్ధ. అయితే అది సమకూర్చడానికి పిల్లలు తగవులాడుకున్నట్టు లేదూ ఇదంతా?
చందోబధ్ధమైన పద్యము వ్రాయగల్గిన కుర్రాళ్ళూ, నియమాలేవీఁ లేని శ్రీశ్రీ “తిలకా”లూ, ఆయమ్మకి మనకాడ పూసిన పూలనే “ఒట్టుకెళ్ళిచ్చి, ఇయెట్టుకో కొప్పులో, ఎంత బాగుంటావో తెల్చా” అనే చాత్రిబాబులూ, అన్నీ తెలిసిన రవఁణలూ, ఏవీఁ తెలీని నామినులూ, తెలిసీ తెలీనట్టుండే శ్రీశ్రీరవఁణలూ, అన్నీ తెలుసు మాకన్నీ తెలుసు అని “రికార్డింగ్ డేంచు కట్టే” నాలాటి వాళ్ళూ వీళ్ళందర్నీ “బజ్జో, మళ్ళీ పొద్దున్నే లెగాల” అని దెబ్బలాడతాదాయమ్మ్మ. కాదా?
smile “గౌరవ సంపాదకత్వం” వహించిన “వతన్” ముస్లిం కథలు…అలాగే “అజాఁ” అన్న గుజరాత్_ముస్లిం కవిత్వం కి 23/9/2002 న,రాజమండ్రి నించి స్మయిల్ రాసిన ముందుమాట చదవండి.
“వీళ్ళేం ‘దండోరా’ లు వేయించుకుంటారు. వీళ్ళేం వీధుల్లోకి వచ్చి ఊరేగింపులు జరుపుతారు అంటూ, … బ్రాహ్మణుల మీద…వాళ్ళని soft target చేయడం చాలా తేలిక అన్న సానుభూతితో మాట్లాడిన smile ‘వతన్’కి ఖాజా రాసిన దాన్ని (ఆ పుస్తకానికి “గౌరవసంపాదకుని”గా ఖాజా రాతల్లోని) బ్రాహ్మణ నిందని ఒప్పుకోవడంతో పాటు, తానుగా ‘కౌన్ సునే ఫర్యాద్? కౌన్ కరే ఇన్సాఫ్?’ అని రాసిన దాన్లో అయితే ఖాజాని మించి ‘అగ్రవర్ణాల’పై కోపం చూపించే దిశగా కదలడాన్ని గమనించవచ్చు.
Gujarat riots గానీ …మొన్న తాజ్..నారిమన్ హౌస్ ల మీద ముస్లిం terrorists దాడి గాని ఎవరూ మెచ్చగలిగినవి కాకపోయినా, గుజ్రాత్ హింస మీద అచ్చులో వచ్చినన్ని పుస్తకాలు terrorists హింసని వ్యతిరేకిస్తూ ఒక్క పుస్తకమూ కనీసం తెలుగులో వీళ్ళెవ్వరూ ప్రచురించకపోవడం కూడా మనం గమనించవలసిన విషయాలే !!
వీణకు ఎలెక్ట్రికల్ పికప్ ఉపయోగించడం అనేది ఈమనివారికన్నా చిట్టిబాబు ముందుగా మొదలుపెట్టారని ఎవరో అన్నారు. దాని సహాయంతో అతిసున్నితమైన గమకాలను శాస్త్రిగారు అద్భుతంగా వాయించేవారు. కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది. ఆయన బొటనవేలితో మూడో తీగను మీటితే సుర్ బహార్, గోటువాద్యం తరహాలో పలికేది.
తన సంగీతాన్ని గురించి ఆయన స్వోత్కర్ష ధోరణిలో ‘మనదంతా చిన్నప్పటినించీ రిసెర్చ్ ధోరణే’ అని ఒకసారి అన్నారు కాని అదేమీ అతిశయోక్తిగా, అతిశయంగా అనిపించలేదు. కచేరీకి ముందు ఆయన బాగా సాధన చేసేవారనీ, ఆయన కచేరీకై ప్రేక్షకులు ముందుగానే వచ్చి కూచునేవారనీ తెలుసుకోవడం సంతోషకరం.
నాకు సరస్వతీదేవిలోనూ, నారదుళ్ళోనూ నమ్మకం ఏమీలేదుగాని ఉంటేగింటే వాళ్ళు శాస్త్రిగారి కన్నా బాగా వీణ వాయించారని మాత్రం నేను నమ్మను!
నేను పెద్దయేటప్పటికి శాస్త్రిగారు మద్రాసు వదిలివెళ్ళారు. 1966లో మేము సకుటుంబంగా ఢిల్లీలో ఆయనింటికి వెళ్ళాము. ఆ తరవాత శాస్త్రిగారిని నేను కలుసుకోవడం, మాట్లాడడం కొన్ని సందర్భాల్లో జరిగింది. ఆయన కాస్త అమాయకుడు. ఆయన సంగీతపు మహోన్నత వ్యక్తిత్వంతో పోలిస్తే అటువంటి చిన్న విషయాలను పేర్కొనడం అన్యాయం అనిపించడం వల్ల నేను వాటిని ప్రస్తావించలేదు. ఆయన వీణ ఎప్పుడు విన్నా నా అభిమాన వాయిద్యం సితార్ కన్నా వీణ కాస్త గొప్పదని ఆయన ‘నిరూపించాడని’ నా కనిపిస్తుంది. (అయిష్టంగానైనా నేనా సంగతి ఒప్పుకోవాలి). నా లెక్కన ఆయన Vilayat Khan of Veena.
జెమినీ చిత్రం అవ్వయార్ లో ఆయన సుందరాంబాళ్ చేత మంచి సంగీతం పాడించాడని విన్నాను కాని ఆ సినిమా పూర్తిగా చూడలేదు.
ఆయన కచేరీలు చాలాసార్లు విన్నాను. కర్నాటక సంగీతంలోని సంప్రదాయపు ‘పట్టు’లోని అందాలు ఆయన చూపినట్టుగా మరెవ్వరూ చూపించలేదని నేననుకుంటాను.
సేకరణ అద్భుతం. ధ్వని కూడా బహు నాణ్యంగా వుంది. రచన పూర్తి పాఠం విడిగా ఇవ్వడం చాలా బాగుంది.
అప్పట్లో రేడియో నాటకాలు ఆదివారం మధ్యాహ్నం రెండూ మూడూ మధ్య వచ్చేవి. అన్ని కేంద్రాల్లోనూ (హైదరా, విజయ,, విశాఖ, కడప) ఒకేసారి ప్రసారమయ్యేవి. ఏ కేంద్రం వారు నిర్మిస్తే వారి పేరు ముందొస్తుంది. సినిమాకి ముందు పేర్లేసినట్టు, రేడియో నాటకానికి ముందు పేర్లు చదివేవారు. ” ఇందలి పాత్రలూ, పాత్రధారులూ… ” అంటూ “శబ్ద” దానం చేసిన వారి పేర్లూ, అటు వెంబడి “నిశ్శబ్దంగా” వెనుక పనిచేసిన వారి పేర్లూ చదివేవారు. వాటిలో ఎక్కువగా వినిపించి నాకు జ్ఞాపకమున్న పేర్లు – శారదా శ్రీనివాసన్ (పాత్రధారి), వాడ్రేవు పురుషోత్తం (నిర్వాహకులు).
శ్రోతల ఆదరణ పొందిన మరో నాటకం “దీక్షాంతం”. ఇందులోనూ ఊర్వశి పాత్ర వుంటుంది. ఎవరి గొంతో జ్ఞాపకం లేక పోయినప్పటికీ, నిర్వాహకులు మాత్రం శ్రీ వాడ్రేవు పురుషోత్తం.
మీ కృషి శ్లాఘనీయం. మరిన్ని అజరామరమైన రేడియో నాటకాలని వినిపిస్తారని ఆశిస్తాను.
చాల బాగుంది. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ లో తెలుగు బోధించే ప్రయత్నాలు చేస్తూన్నప్పుడు (ఇంకా ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి) మమ్ము తరచుగా ఎదుర్కున్న ప్రశ్న “మనం తెలుగు భాషని ఎందుకు నేర్చుకోవాలి?” అన్నది. మొదట్లో విరాళం ఇవ్వకుండా తప్పించుకుందికి ఈ ఎదురు ప్రశ్న వేస్తున్నారనుకున్నాను. కాని ఈ వ్యాసం సందర్భంలో రమేష్ బాబు కూడ ఈ ప్రశ్న అడిగేరు కనుక దీనికి సాలోచనగా సమాధానం చెప్ప వలసిన అవసరం ఉన్నట్లనిపిస్తున్నాది. సురేశ్ కి ఈ సామర్ధ్యం ఉంది కనుక నేనూ అడుగుతున్నాను. తెలుగుదేశంలో ఉన్న తెలుగువారు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? ప్రవాసాంధ్రులు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? అన్న ప్రశ్నలని కూలంకషంగా ఎవ్వరయినా చర్చించండి. నేను నా బ్లాగులో ప్రయత్నించేను కాని బాగా రాలేదు.
రావు వేమూరి http://latebloomer-usa.blogspot.com/
బృందావన రావుగారి పద్య పరిచయం జనవరి సంచికలో ఉంటుందని, కొత్త సంవత్సరం కోసం సంబరంగా ఎదురుచూస్తున్నాను.
ఈ పద్య వివరణా వ్యాసం, వారిచ్చిన సమాధానాలు, మరోసారి చదువుకుని రాస్తున్నాను.
నా దగ్గర నన్నెచోడుని తెలుగు పుస్తకం లేదు. కాని కోలాచల మల్లినాథ సూరి తెలుగు టీకా తాత్పర్యంతో -కాళిదాసు కుమార సంభవం ఉంది.
ప్రధమ సర్గలో పార్వతిని పాదాల దగ్గరనుండి తలవరకు వర్ణించారు కాళిదాస కవి. దేవతలను కిందినుండి పైకి, మానవులను పైనుండి కిందకు వర్ణించడం ఆచారమట. ఆ వర్ణన ” మధ్యేన సావేదివిలగ్నమధ్యా వళి త్రయంచారు బభార బాలా..” నుండి -త్రివళులంటే నడుము మీద ఉండే మూడు మడతలని తెలిసింది. అవి నాభికి పైభాగంలో ఉంటాయనీ నాకు తెలిసింది. ( ఎందుకంటే అంతకు ముందు పద్యంలో అప్పటికి నాభి వరకూ వర్ణన ఐపోయింది కాబట్టి. అప్పుడే పార్వతి నతనాభి అని కూడా తెలిసింది. “తస్యా ప్రవిష్టా నతనాభి రంధ్రంరరాజ తన్వీ…” )
తర్వాత పంచమ స్సర్గములో పార్వతి తపస్సు ఘట్టములో కాళిదాసు శ్లోకానికీ, మీరిచ్చిన నన్నెచోడుని పద్యమునకూ గల పొలికలు చూచాను. తేడా అల్లా కాళిదాసువి గ్రీష్మం తర్వాతి తొలి నీటి చుక్కలు. నన్నెచోడునవి నవాంబు ధారలు. కాబట్టి ఇంకా వేగంతో ప్రవహించాయి. (ఐనా కాళిదాసు ముందరి పద్యము లోనే పార్వతి అప్పటిదాకా చెట్లలాగానే వర్షపు నీరుతో మాత్రమే బ్రతికిందంటారు. మళ్ళీ అంతలోనే మరిచి, గ్రీష్మం వెళ్ళిపోయి మొదటి వానకు తడిసి పార్వతి శరీరంలోచి, భూమి లోంచి సెగలుపైకి లేచాయని రాశారు. 🙂 ఆ తర్వాత పద్యమే ఆ వాన పార్వతి మీదుగా ఎలా జారిందొ చెప్పే పద్యం. ) పద్యములు అతి చక్కనివి. కవులు బాగా రాశారు.
కానీ వాన ( ప్రకృతి )సామాన్య విషయమూ, కవులది సుందర కళాసృష్టి అనుకోటానికి నా మనసొప్పదు. కవులు తలకిందులుగా తపస్సు చేసినా భగవంతుని సృష్టిని మేచ్ చెయ్యలేరు. ఒక సౌందర్యవతిని, ఆమె చిత్రాన్నీ చూసి ” జో బాత్ తుఝ్ మే హై, ఒ తేరీ తస్ వీర్ మే నహీ ” అన్న కవిరాజుకి నా నమస్కారము. పకృతి అందాన్ని, ప్రకృతిలో మానవ సౌందర్యాన్ని, చూసి ముందస్తుగా పరవశించని హృదయం, కవి రాసే మాటలకు ఉబ్బిపోటం ఉత్తిమాట. అసలు సౌందర్య స్పృహ, సౌందర్య కాంక్ష లేనివాడు కవే కాడు.
ఒక కవి నుంచి ఇంకొక కవి సంగ్రహించటం, ఒకరిని ఇంకొకరు అనువదించటం , అనుకరించటం -విద్యాభిలాషతో, కళపై కాంక్షతో, చేసే పనులు. కళాకారుడు అనుకరించడం మానడు. మానలేడు. అలా చెయ్యటం అవసరము. ముందు అనుసరించినా, కొన్నాళ్ళ తర్వాత కొత్త కళా స్రష్ట అవుతాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు నాకు నచ్చాయి. ఒకరి చక్కని భావాన్ని ఇంకో భాషలో, ఇంకో సమయంలో, -తన ఆనందం కోసం, పలువురి ఆనందం కోసం- కవి వాడటం, మీరన్నట్లు కవి పాండిత్యాన్నీ, రసికతను, చెపుతుంది. పాఠకులు కూడా ఎంత ఎక్కువగా చదివి ఉన్నవారైతే, ఏ రచనలోనైనా, అన్ని ఎక్కువ మూలాలు గుర్తించగలుగుతారు.
లైలా గారూ:
1. పద్యం లోంచి శ్లేషను మనం లాగవచ్చు. కానీ కవి ఉద్దేశించి వున్నట్లు అనిపించదు. (మాధవ్ అన్నట్లు ఈ ఊహ కవిదో మనదో చెప్పడం కష్టం).
2. కుమార సంభవం సర్వస్వతంత్ర కావ్యం. అనువాదం కాదు. ఎంత స్వతంత్ర కావ్యమైనా, కవి అదే విషయం మీద అంతకుముందే వెలువడిన ఒక ప్రసిద్ధ మహాకవి కావ్యాన్ని చూడకుండా ఎలా ప్రారంభిస్తాడు? అందులో కన్పించిన అందమైన ఊహలను ఎలా వదిలి వేయగలడు? పై పద్యం మాత్రం కాళిదాసు శ్లోకానికి ఖచ్చితమైన అనువాదమే. ఒక మంచి భావాన్ని వదిలివేయలేని రసికతగా దీన్ని భావించవచ్చు.
కామేశ్వర రావు గారూ:
పద్యాన్ని విశ్లేషించేటప్పుడు తెలుగు పద్యాన్నే పరామర్శించాను కానీ దానికి మూలమైన సంస్కృత శ్లోకం నా దృష్టిలో లేదు. ఐనా, తరంగ అంటే వళి అనే అర్ధం నాకు కన్పించలేదు. అందుకని ముత్తరంగలు అంటే మూడు ధారలనే ఉద్దేశించాను. అలాగే, ‘మడుగులు వారి’ అనే పదానికి గూడా ముడుతలు పడి అనేదానికన్నా హ్రదాలై ప్రవహించి అనే అర్ధమే న్యాయంగా వుంటుందనుకుంటాను. కానీ, సంస్కృత శ్లోకం చూసింతర్వాత – నన్నెచోడుడు కూడా త్రివళులనే ఉపలక్షించి వుంటాడని అనిపిస్తున్నది. మీకు కృతజ్ఞతలు.
స్మైల్ చనిపోయారంటే, చాలా కాలం తర్వాత మళ్ళీ “ఖాళీ సీసాలు” చదివాను. అది స్మైల్ రాయడం మొదలెట్టిన ఒకటి రెండేళ్ల లోపునే, 1965లో రాసిన కథ. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా, సాహిత్య అకాడెమీ (వాకాటి, వేదగిరి) కూర్చిన “బంగారు కథలు” లో పొందుపరచిన కథ. బెడ్ టైమ్ రీడింగ్ కి పనికిరాని కథ!
స్మైల్ కవిత్వం ఏమీ నేను చదవలేదు కాని, ఆ కథ ముగింపు:
“… రెప్పలు మూయని కళ్ళు వెయ్యి చావులు శపించాయో.
హాయి హాయిగా వున్న గాలికి, పల్చ పల్చగా వున్న ధూళికి, పచ్చపచ్చగా వున్న చెట్లకి, వెచ్చవెచ్చగా వున్న ఎండకి, దూరంగా హోరు హోరుగా వున్న సముద్రానికి, పైడి మీద బోర్లించిన మూకుడు సమాధి ఆకాశానికి తెలిసి వుండాలి.
తెలియకపోయీ వుండాలి.”
చదివిన వెంటనే రెండేళ్ళ క్రితం ఓ సైన్సు వ్యాసంలో చూసిన ఒమర్ ఖయ్యాం కవిత గుర్తొచ్చింది:
And that inverted Bowl we call The Sky,
Whereunder crawling coop’t we live and die,
Lift not thy hands to It for help – for It
Rolls impotently on as Thou or I.
2006లో ఇండియా వెళ్ళినప్పుడు, అప్పుడే మో, స్మైల్ ఇరువురి సంపాదకత్వాన వెలువడిన “కొమ్మలు రెమ్మలు” చూశాను. “ప్రపంచీకరణ, వాణిజ్యీకరణలకు బలయిపోతున్న ఆంధ్రదేశపు యువతీయువకులకు వారి తెలుగు నేలలో మొలిచిన మహా వృక్షాలనీ, వాటి కొమ్మల్నీ రెమ్మల్నీ పిందెల్నీ పువ్వుల్నీ కాయల్నీ,” పరిచయం చేసే పుస్తకం. స్మైల్ కొమ్మని కూడా వారి మిత్రులు మిగిలిన వాళ్ళకి అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.
చివరగా, పాశ్చాత్య పత్రికల్లో లాగా మరణ వార్తలో వయసు ఇవ్వడం మనకు ఆనవాయితీ కాదు లాగుంది. స్మైల్ మరణం గురించి నాలుగయిదు చోట్ల చదివాను. ఎక్కడా ఆయన వయసు ఇవ్వలేదు. “బంగారు కథలు” ప్రకారం స్మైల్ పుట్టింది 1942లో. పండు వయసు రాకమునుపే ముగిసిన జీవితం.
స్మైల్‌గారికి మీరందించిన నివాళి చదివాను. ఈ సందర్భంగా వారితో గడిపిన కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవాలనిపించింది. నా చిన్నతనంలో స్వాతి మంత్లీలో “నాకు నచ్చిన కథ” అనే పరిచయం వచ్చేది. అందులో అత్తలూరి నరసింహారావుగారు పరిచయం చేసిన “ఖాళీ సీసాలు” కథ చదివి ఆ స్మైల్ అనేవాడు కనిపిస్తే కాళ్లపైన పడిపోవాలనే ఆవేశం కల్గింది. ఆ తర్వాత కొన్నాళ్లకి నేను హైద్రాబాద్ వచ్చేశాక మా కాలేజి లెక్చరర్ వివిఎస్‌ఎన్ మూర్తి అనే ఆయనతో మాటవరసకి ఆ కథ గురించి అంటేం ‘వాడు నా క్లాస్ మేటయ్యా. వాడిక్కడే కమ్మర్షియల్‌టాక్స్‌లో పనిచేస్తున్నాడు’ అంటూ అప్పటికప్పుడు నాతో ఫోన్‌లో మాట్లాడించాడు. అది మొదలు స్మైల్‌గారి ఇంటికి తరచూ వెళ్తుండేవాడిని. వాళ్ల ఇల్లు క్రాస్‌రోడ్స్‌లో సప్తగిరి టాకీస్ దగ్గర ఉండేది. ఇది 1992 లోని సంఘటన. తర్వాత భరాగోగారు వచ్చి వాళ్లింట్లో ఉండి “ఖాళీ సీసాలు” పుస్తకానికి కావలసిన మెటీరియల్ సమకూర్చుకుంటూ ఉండగా స్మైల్‌గారు అనువాదం చేసిన “చుగ్తాయ్” “కంబలి” కథ దొరకలేదు. నాకు మొదట్నుంచి మంచి కథల్ని కుట్టుకోవడం అలవాటు. అలా నా దగ్గరున్న ఆంధ్రప్రభలో వచ్చిన కంబలి కథని తీసుకెళ్లి ఇచ్చాను. ఆ పుస్తకం ముందు మాటలో తనని పుస్తకం వేయమని సతాయించిన వారిలో నన్ను కూడా చేర్చారు స్మైల్‌గారు. ఆ పుస్తకావిష్కరణ 1995లో ప్రెస్‌క్లబ్‌లో ఎంతో నిరాడంబరంగా, ఇంటి పండగలా జరిగింది. రబ్బరుని చెక్కి బొమ్మలుగా మలిచే ఆర్ట్ కూడా వారికి ఉందని నేనా సభలో చెప్పాను. (ఈ విషయం నాకు మా మూర్తి సార్ చెప్పారు)
ఆయన్ని చివరి సారిగా పోయిన ఏడాది అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీకె.రామచంద్రమూర్తిగారి వారబ్బాయి పెళ్లిలో హైదరాబాద్‌లో చూశాను. నా పుస్తకాన్ని అక్కడే ఇచ్చాను – వారు రాజమండ్రి వెళ్లాక ఫోన్ చేశారు. నా ”ఉసుళ్లు” అనే కథకోసం వారి “తూనీగ” కవితలోంచి కొన్ని పదాలు వాడుకున్నాను. వారి “ఖాళీసీసాలు” కథలోని “పాడు పిల్లల”తో నేను “జగదాంబ జంక్షన్” అనే కథ రాశాను. (ఈ కథ ఆంగ్లానువాదం టెక్సాస్ యూనివర్సిటీ వారేసిన “సాగర్”(2002)లో వచ్చింది) అవన్నీ నా పుస్తకంలో ఉటంకించాను. స్మైల్‌గారు ఎంతో సంతోషించారు.
వారి పెద్దమ్మాయి పెళ్లి హైద్రాబాద్‌లో పింగళి వెంకట్రామారెడ్డి హాల్లో అయినప్పుడు అందరం వెళ్లాం. అది పెళ్లిలా జరగలేదు. ఏదో మహా ఉత్సవంలా అనిపించింది. ఆ పెళ్లి విందుని మా అమ్మాయి ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది, జరిగి పుష్కరం దాటినా.
ఆయన అందం పున్నమి చందమామ – ఆయన మాట్లాడినా, నవ్వినా కురిసేది వెన్నెలే!
ఉపేంద్ర గారూ, నాడ్యంశ గురించి నేను విన్నాను. జన్మ సమయాన్ని అతి సున్నితమైన ఖచ్చితత్వం ప్రకారం నమోదు చేస్తేగానీ ఇటువంటి విభాగాలమీద ఆధారపడలేము. ఇటువంటి సూక్ష్మ విభాగాల వల్ల మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అని భావిస్తే, ఈరోజు ప్రపంచంలో వ్యవహారంలో ఉన్న జ్యోతిషంలో అత్యధికశాతం నిజం కాదని అంగీకరించాల్సి ఉంటుంది.
అది అలా ఉంచితే, సెకన్లతో సహా ఖచ్చితమైన జన్మ సమయాన్ని తెలుసుకుని, నాడ్యంశ మొదలైన విభాగాల్ని ఉపయోగించి, జ్యోతిషం నిజమే అని శాస్త్రీయంగా ఋజువు చెయ్యగల అవకాశం ప్రతిభావంతులైన జ్యోతిష్కులకి ఎప్పుడూ ఉంటుంది కదా. అలా చెయ్యగలమని నమ్మేవాళ్ళు ముందుకు వచ్చి, అందరూ అంగీకరించగల ఋజువుల్ని చూపించడానికి గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నదనే నా వ్యాసంలో ముక్తాయించాను.
ఈ వ్యాస పరంపరలోని రెండో భాగంలోని కామెంట్లలో కవలల గురించి లక్ష్మన్నగారితో నేను చేసిన చర్చ ఒకసారి చూడండి. సదుపాయం కోసం అందులోని కొంత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను –
ఇక కవలల సంగతి. ఏ జ్యోతిష గ్రంథంలోనైనా సరే దీని గురించి చర్చ జరగకుండా ఉండదు. భూమియొక్క దైనందిన చలనం (Diurnal Motion) ప్రకారం సుమారుగా ప్రతీ నాలుగు నిమిషాలకీ ఒక డిగ్రీ చొప్పున తూర్పున ఉదయించే బిందువు (లగ్నం), అలాగే మిగతా భావాలూ మారుతూ ఉంటాయి. చాలా మంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఈ బిందువుల్లో ఎంత సూక్ష్మమైన తేడా వచ్చినా సరే ఫలితాలు మారుతాయి. మరీ ముఖ్యంగా భారతీయ జ్యోతిషంలో రాశి చక్రాన్ని చాలా సూక్ష్మ భాగాలుగా చేసి ఫలితాలు చూసే సాంప్రదాయాలు (నవాంశ, దశాంశ, త్రింశాంశ మొదలైన విభాగాలు) ఉన్నాయి. వాటి ప్రకారం జన్మ సమయంలో ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే ఫలితాలు మారిపోతాయిట. అయితే ఆచరణలో మాత్రం అత్యధికశాతం జ్యోతిష్కులు అంత దగ్గరి జాతకాలకి భిన్న ఫలితాలు చెప్పలేరు. అంతేకాదు, చాలా మంది జాతకుల జన్మ సమయాలు కూడా నిమిషంతో సహా ఖచ్చితంగా ఎవరికీ తెలియవు. అందుచేత ఎవరికైనా చెప్పిన ఫలితాలు తప్పిపోతే, ’జన్మ సమయం తప్పై ఉంటుందమ్మా, అది చాలా ఖచ్చితంగా తెలియాలి’ అని జ్యోతిష్కులు తప్పించుకుంటూ ఉంటారు.
కొన్ని పుస్తకాల్లో ఒక్క నిమిషం ఎడంగా పుట్టిన కవలల జాతకాలని ఉదాహరణగా ఇచ్చి, ‘చూశారా ఒక్క నిమిషమే తేడా ఉన్నా, ఫలానా సూక్ష్మాంశం మారిపోవడం వల్ల అసలు ఇద్దరి జీవితాలకీ పొంతనే లేదు!’ అని రాస్తూ ఉంటారు. అయితే ఆ కవలల విషయంలో అన్వయించిన అదే సూక్ష్మాంశం మరొక మామూలు జాతకానికి ఎందుకు అన్వయించరో బోధ పడదు. అంతే కాకుండా అటువంటి సూక్ష్మాంశాలవల్ల నిజంగా మిగతా జాతకాల్లో కూడా ఫలితాలు ఎలా తేడాగా వస్తున్నాయో వివరణలు ఉండవు. వాటికి మాత్రం ఎక్కువ కాలావధిలో మారిపోని అంశాలనే పరిగణనలోకి తీసుకుని ఫలితాలు చెప్పేస్తూ ఉంటారు.
సువర్ణభూమిలో … గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
12/06/2008 9:30 pm
భూషణ్ గారి కవితా దృక్పథం గురించి కామేశ్వరరావు గారన్నది సరిగానే ఉంది. అయితే కవిలో థాయిలాండ్ యాత్ర కలిగించిన గొప్ప అనుభూతిలో అణుమాత్రమైనా చాలా మంది పాఠకులకి కలగడం లేదు. గొప్ప హృదయకంపన కలగకపోతే ఈ కవి రాసి ఉండేవాడు కాదు:
“కవిత్వం భూకంపం లాంటిదే. పునాదులతో సహా పెళ్ళగించివేయడం దాని స్వభావం. నీ అస్తిత్వ మూలాలు కదిలితే గాని కవిత్వ ప్రకంపన నీలో మొదలు కాదు. వెరసి ప్రపంచాన్ని చేరదు. ఏ కారణాల వల్ల లోపలి పొరల రాపిడితో ఆవని హృదయం బద్దలవుతుందో ఇదమిత్థంగా చెప్పలేకున్నాం. నేడు వెలువడుతున్న కవిత్వాలు రోకలి పోటు లాంటివి. వాటి అదుటు పక్కింటి వసారాను కూడా తాకదు. నీలో భూకంపం వుందా? కలం పట్టు.. ఆదిమోద్రేకాల శిలాద్రవాలను ప్రవహించనీ .. ఘనీభవించనీ .. ఆత్మను భస్మీపటలం చేయగల భయానక సౌందర్యాన్ని ఆరాధించగల చేవగలవాడే కవిత్వం చెప్పగలడు .. తతిమ్మా అందరూ ఆటలో అరటిపళ్ళు .. పనికిరాని దండుగ్గణాలు .. హృదయ పరిపాకం లేకుండానే రచనకు ఉపక్రమించిన కరటకదమనకులు.” [1]
అందుకనే గూడార్థం ఏదన్నా ఉండి ఉంటుదని వెతుకుతున్నారనుకుంటాను.
మొదటి మూడు కవితలలో బుద్ధుని గొప్పతనం కళ్ళకు కట్టినట్టున్నదనీ, ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేని పిల్లి, కుక్క (మనలాటి పాఠకుల్లాగే) కూడా ఉన్నారనీ, నాలుగవ కవితని, మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చనీ అన్నారు గరికపాటి. సముద్రం అడుగున చేపల్ని చూసి ఆనందించమన్నది కవిత్వం ఎలా చదవాలి అన్నదానికి ఉపమా? దీనికి చాలా బుద్ధి బలం కావాలనిపించింది నాకు. అది భూషణ్ తత్వానికి వ్యతిరేకం:
“పుస్తకానికి, జీవితానికీ మధ్య దూరం పెంచేది కవిత్వం కాదు. సరైన కవిత్వం చదివాక నీవు పఠిస్తూ వచ్చిన వంద పుస్తకాలను గోదాట్లో గిరవాటు వేయగల తత్వ నిశ్చయం కలగాలి. అంతరాత్మను ముంచెత్తేదే అసలు సిసలు కవిత్వం. హృదయవర్తనను సాకల్యంగా ఎరిగిన వాడే పదహారణాల కవి. బుద్ధి బలంతో మిడిసి పడేవాడు పుస్తకాలను మోసే గాడిద .. అధముల్లో అధముడు. గణుతి కెక్కడు, పైగా వాడికి కవిత్వం నిషిద్ధం.” [1]
పాత కవిత్వంలో పదాల అర్థాలు తెలియకా, కొత్త కవిత్వంలో పద చిత్రాల అనుభూతి చేరకా, నలిగిపోయే వాళ్ళలో నేనొకణ్ణి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] గరికపాటి పవన్ కుమార్ కవితా సంపుటి, “ఆ సాయంత్రం,” కి తమ్మినేని యదుకుల భూషణ్ రాసిన ముందుమాట, “ఒక్క క్షణం …” నుండి. 2003.
నాగ మురళీ గారు,
మీ వ్యాసం ఆసాంతము చదివాను. చాలా బాగుంది.
కాని నాకు తోచిన విషయాలను చెప్పాలనే అత్యుత్సాహాన్ని మన్నిస్తారని ఆశిస్తూ
1) చాలా మంది జ్యోతిష్యులు కేవలం రాశి, నవాంశ చక్రాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. కాని రాశి చక్రము లోని లగ్నము దాదాపు 2 గం|| , మరియు నవాంశ లగ్నము 13 ని|| పాటు మారకుండా స్ఠిరము గా ఉంటాయి. బృహత్ పరాశర హోరా శాస్త్రము లో వివిధ అంశ చక్రముల ప్రస్తావన మరియు ఏ ఏ సమయములలో ఏ చక్రమును ఉపయోగించాలి అని వివరణ ఉంది. ఆ అంశ చక్రాలలో నాఢ్యంశ ( 30 డిగ్రీలను 150 భాగాలు గా చేసి ఈ చక్రమును తయారు చేస్తారు) చక్రము ఒకటి. ఈ చక్రము లోని లగ్నము 1 ని|| కన్నా తక్కువ వ్యవధి లో మారిపోతుంది.
నాకు తెలిసి ఈ ప్రపంచములో జాతకములను నాఢ్యంశ స్థాయి లో పరిశీలించేవారిని వేళ్ళ మీద లెక్కించవచ్చేమో?
సోదాహరణంగా విపులీకరించినందుకు థాంక్స్. నా శీర్షిక మో “పోలికలు” కవితని ఉద్దేశించి, సరదాగా పెట్టింది. పాత కవిత్వంతో పోల్చడానికి కాదు.
వినీల్, శ్రీనివాస్ గార్లని ఉద్దేశించి మీరు రాసిన అభిప్రాయంలో, తనకర్థం కాని కవితని విమర్శించే హక్కు పాఠకుడికి లేదన్నారు. నా ఉద్దేశంలో పాఠకుడికి విమర్శించే హక్కు ఎప్పుడూ ఉండాలి, అర్థం కావడం లేదన్నదీ ఓ విమర్శే. కవిత్వం లో సత్తా ఉంటే ఆ విమర్శల ధాటికి నిలుస్తుంది.
భూషణ్ గారికి,
నేను ప్రస్తావించిన పొరబాట్లు ఎవరివల్ల జరిగినా చివరకి రచయితే బాధ్యుడు. నాకు ఇస్మాయిల్ వ్యక్తిగతంగా తెలియకపోయినా, ఈమధ్య ఆయన రచనలని చదివి, వాటితో పూర్తి అంగీకారం లేకపోయినా, ఉన్నత వ్యక్తిత్వం కలవాడన్న భావన కలిగింది. ఒక్క పొరబాటు మూలాన ఆయన మీద ఉన్న నా అభిప్రాయం మారదు.
మో గురించి కూడా ఒక విషయం. “నిరాకారుడు” ఆయన మొదటి సంపుటి, “చితి-చింత” లోనిది. తరవాత వచ్చిన “రహస్తంత్రి” లో చాలా చోట్ల పాశ్చాత్య కవుల ప్రేరణ సూచిస్తాడు.
ప్రాచీన ఆధునిక కవిత్వాలలోని అస్పష్టతని పోల్చడం నా ఉద్దేశం కాదు. రెండూ వేరువేరు తరహాలకి చెందినవి కాబట్టి వాటిని పోల్చలేము కూడా. ప్రాచీనకవిత్వంలో కూడా అస్పష్టత ఉందని, అది మీరన్న ఆధునికకవిత్వంలోని అస్పష్టతకి భిన్నమైనదని చెప్పడమే నా ఉద్దేశం. ఆధునికకవిత్వంలో అస్పష్టతకి మీరిచ్చిన ఉదాహరణ నేనన్న వాక్యగత అస్పష్టతకి మంచి ఉదాహరణే. ఇక్కడ వాక్యాలు అర్థ రహితం (వ్యాకరణ రీత్యా) కావడం మూలాన అస్పష్టత ఏర్పడుతోంది. ప్రాచీనకవిత్వంలో ఇలాటిది దాదాపుగా కనిపించని మాట వాస్తవమే.
ప్రాచీనకవిత్వంలో అస్పష్టతకి ఇంకా మంచి ఉదాహరణలు ఉన్నాయి కాని ప్రస్తుతానికి ఇది:
“ఈ కలహంసయాన నను నెక్కడి కెక్కడ నుండి తెచ్చె! నా
హా! కడుదూరమిప్పు”డని యక్కున జేర్పక జంపుమాటలన్
వ్యాకుల పెట్టుటేల? విరహాంబుధి ముంపకపోదు నన్; జలం
బేకద నీకు; మంచిదిక నీతకు మిక్కిలి లోతు గల్గునే!
ఇందులో అస్సలు అర్థంకాని పదాలు కానీ, అర్థంలేని వాక్యాలు కానీ ఏవీలేవు. అయినా కవి ఇక్కడ ఏవిటి చెప్పదలచుకున్నాడో స్పష్టంగా తెలియటంలేదు. ఇది విజయవిలాసంలో ఉలూచి అర్జునునితో అనే మాటలు. అర్జునుడు తనని పెళ్ళిచేసుకోడానికి ఒప్పుకోకపోతే అంటున్న మాటలు. సందర్భాన్ని బట్టి ఈ పద్య తాత్పర్యం చూచాయగా తెలుస్తున్నా, దీనికి సంతృప్తికరమైన వివరణ ఎక్కడా నాకు కనిపించలేదు. హృదయోల్లాస వ్యాఖ్య రాసిన తాపీవారు కూడా ఈ పద్యంలో కవి చెపుతున్న “ఎక్కడినుండి ఎక్కడకి” తేవడం, విరహ అంబుధిలో “ముంచడం”, “ఈతకు మిక్కిలి లోతుగల్గునే” అనే జాతీయాన్ని ప్రయోగించడం మొదలైన విషయాల్లో కవి ఆంతర్యం స్పష్టం కాలేదని ఒప్పుకున్నారు. “ఈతకు మిక్కిలి లోతు చావుకి మిక్కిలి చింత ఉండవు” అనే జాతీయాన్ని ఇక్కడ ప్రస్తావించి, తనకి చావే శరణ్యం అని ఉలూచి అంటోంది అని అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన చిక్కల్లా, ఈతవస్తే సముద్రంలో మునిగిపోవడం ఉండదు కదా, మరి విరహాంబుధిలో ముంచడం గురించి ఎందుకు ప్రస్తావించినట్టు?
ఇంతకీ నేను చెప్పదలచుకున్న సారాంశమేమిటంటే, ప్రాచీన కవిత్వంలో కూడా కొన్ని చోట్ల అస్పష్టత కనిపిస్తుంది. అయితే, అది మీరు ఆధునిక కవిత్వంలో చూపిన అస్పష్టత లాంటిది కాదు. ఏది స్వచ్ఛమైనది, గాఢమైనది అన్న ప్రశ్న అనవసరం.
మీ స్పందన ఇప్పుడే చదివాను – గొప్ప భావోద్వేగం కల్గింది. ఎంచేతంటే “కన్నుల దాగిన అనురాగం” పాటకి రావలసిన పేరు రాలేదని నేనెప్పుడూ బాధపడుతుంటాను. ఆ పాట మీకూ ఇష్టమని తెలిసి చాలా ఆనందించాను. ఆయన పాటల్లో ముఖ్యంగా “కాలంకాని కాలంలో” (అప్పు చేసి పప్పుకూడు), “సఖీ శకుంతలా” (కులగోత్రాలు) పాటలు కూడా నన్ను ఎంతో పరవశున్ని చేస్తాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన నా వ్యాసం “చల్లగాలిలో యమునాతటిపై” చదివిన సింగీతం శ్రీనివాసరావుగారు ఆ మర్రోజు సోమవారం ఉదయమే నా ఫోన్ నంబర్ దొరకబుచ్చుకుని నాతో మాట్లాడ్డం నా స్వీట్ మెమోరీస్‌లో ఒకటి. ఆయనే నన్ను గుర్తు పెట్టుకుని ఈ మధ్య అమీర్‌పేట్ గ్రీన్‌పార్క్‌లో జరిగిన సాలూరి వారి సిడీ విడుదలకు ఆహ్వానించారు. ఆయన సినిమాల మాదిరే ఆదీ ఓ ప్రయోగం. రాజేశ్వరరావు పాడిన పాటల పల్లవులతో మొదలెట్టి చరణాల్ని మార్చి రాయించి, బాలసరస్వతి, సుశీల, వాణీ, జానకి, బాలు, సింగీతం, కీరవాణిలతో పాడించారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మిమ్మల్ని రావుబాలసరస్వతిగారికి గుంటూరులో అభో-విభో పురస్కారం సందర్భంలో చూశాను.
సాలూరి రాజేశ్వరరావుపై ఇప్పటిదాకా సావనీరు రాకపోవడం వల్ల ఆయన సంగీతం నిర్వహించిన సినమాల లిస్టు దొరకటం లేదు. ఆయన “ఫోక్” మ్యూజిక్‌పై ఉదా: “బొంగారల బుగ్గలున్న” (డా.చక్రవర్తి), “చెట్టులెక్కగలవా” (చెంచు.లక్ష్మి), “సన్నజాజి సొగసుంది, జున్నులాంటి మనసుంది” (కాలంమారింది)లాంటి ఎన్నో పాటలపై ఎవరైనా రాస్తే బాగుండేది.
పోతన భాగవత ప్రభావం త్యాగరాజుపై ఖచ్చితంగా ఉంది. స్వదస్తూరీతో రాసిన ప్రతి తంజావూరు సరస్వతీ మహల్లో ఉంది. రాజాస్థానం వద్దనడానికి భక్తే కారణం అని చెప్పలేం. తుల్జాజీ ఆస్థాన విద్వాంసుడిగా మొదటి సారి పిలుపొచ్చింది. అప్పటికే అక్కడ 300 మంది పైగా విద్వాంసులున్నారు. గుంపులో గోవిందా లా ఉండడం ఇష్టం లేదు. తన స్వేఛ్ఛకి భంగం అని భావించాడు. అందుకే ఒప్పుకో లేదు. రెండో సారి పిలుపులో శరభోజి తనపై కీర్తనలు కట్టమన్నాడు. అది ఇష్టంలేక వెళ్ళ లేదు. కానుకలు పంపినా ఫలితం లేక పోయింది. ఇక్కడ భక్తొకటే కాదు, ఆత్మాభిమానం కూడా ఉంది. రాముడిపై తప్ప వ్యక్తులపై కీర్తనలు కట్టడం నచ్చక వెళ్ళలేదు. ఒకే విషయం భక్తి కోణం లోంచి చూస్తే ఒకలా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా చూస్తే ఇంకోలా తోస్తుంది.
మీరనుకున్నట్లు కృతుల్లో చివర ముద్ర అనేది పేరుకోసం కాదు. అనాదిగా శాస్త్రీయ సంగీతంలో కృతికర్త పేరు ఉండడం రివాజుగా వస్తోంది. అన్నమయ్య తిరు వేంకట ముద్రా, క్షేత్రయ్య మువ్వ గోపాలుడి ముద్రా ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇది కేవలం ఒక పద్ధతిగానే తీసుకున్నారు తప్ప, పేరు కోసం కాదని నా అభిప్రాయం. ముద్రకీ, Modesty కీ సంబంధం లేదు. మరీ రెట్టిస్తే, తిరువారూరు త్యాగరాజ స్వామి ముద్ర అని అనుకోవచ్చు కదా?
ఇహ ఆధ్యాత్మికత అంటారా, అది వయసు పెరిగే కొద్దీ మారుతూ వస్తుంది. మనసు కి చెప్పుకోడం అనే ప్రక్రియని మాత్రం త్యాగరాజు చాలా ఎక్కువగా ఉపయోగించాడు. మనసుకి గోడు చెప్పుకున్నంత మాత్రాన దేముడు ప్రత్యక్షమయ్యాడనే ఊహ సరికాదు. ఒకవేళ అలానే జరిగితే, త్యాగరాజొక్కడే దేముణ్ణి చూసుండాలి. ఆయనకి ప్రత్యక్ష మయ్యాడని మనం అనుకొని చెప్పడం కాదు. తను దేముణ్ణి చూసానని త్యాగరాజు ఎక్కడా చెప్పలేదు. భావనకీ, నిజానికీ చాలా తేడా వుంది.
సంగీత సృజన పరంగా మీరు వాడిన పోలిక అస్సలు ఒప్పదు. మీ అభిమాన సంగీత కారులు ఇళయ రాజా, రహమాన్ ఉన్న రాగాల్ని వాడుకుంటూ సంగీతం ఇస్తున్నారు. త్యాగరాజు అలా కాదు. కొత్త కొత్త రాగాల్ని కనుక్కున్నాడు. సంగీతానికొక వొరవడి కూర్చాడు. రెంటికీ నక్కకీ, నాకలోకానికీ ఉన్నంత తేడావుంది.
సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు.
ఈ కవితలో మూడు దృశ్యాలున్నాయి. మొదటిది ఒక కొండమీది (ఒక భక్తుడు ఎన్నో మెట్లెక్కి వచ్చాడు కదా) బౌద్ధ దేవాలయం. బౌద్ధ మతాన్ని అభ్యసిస్తున్న విద్యార్ధులు ఎదురెదురుగా కుర్చోనున్నారు. దేవాలయం లోపలికి వెళ్ళేముందు భక్తులు కాళ్ళుకడుక్కోవటానికి ఒక పెద్ద నీళ్ళతొట్టె ఉంది. అందులో కలువలున్నాయి. ఒక కలువ మీద తేనెటీగ వాలి ఉంది. అగరొత్తుల పొగ దేవాలయం అంతా వ్యాపించి ఉంది. ఎర్ర చారల పిల్లి ఒకటి ఉంది ఆ దృశ్యంలో. కవి చూస్తుండగానే కొండ పైదాకా వచ్చిన భక్తుడొకడు పైకప్పుకు అంటుకొనిఉన్న గబ్బిలాలను అదలించాడు. మన కవి, అతని భార్య (మేము అన్నాడు కదా? అరుంధతి గారికి కవితను అంకితం ఇచ్చాడు) బంగారు బుద్ధుడికి కలువలు సమర్పించారు.
రెండో దృశ్యం పర్యాటకులు చూసే ఒక శిధిలమైన దేవాలయం. ఒక పర్యాటక బృందానికి మన కవికి తెలియని ఏదోభాషలో గుడి గురించి చెప్తున్నాడు గైడ్. దేశం మీద జరిగిన దాడుల్లో దేవాలయంలోకూడా విధ్వంసం జరిగింది. విగ్రహాల తలలు తెగిపోయాయి. దేవాలయపు గోడలమీద ఇప్పుడు పెద్దపెద్ద చెట్లున్నాయి. వాటి వేళ్ళలో ఒక బుద్ధ విగ్రహానికి చెందిన తల ఇరుక్కుపోయి ఉంది. మొండెం మాత్రం ఇంకా ధ్యానం చేస్తున్నట్లే ఉంది. మామూలు కవికీ మంచి కవికి తేడా – ఆ పర్యాటకుల బృందంలో ఒకావిడ అక్కడకొచ్చిన కుక్క పిల్లని ఒడిలోకి తీసుకున్నది అని చెప్పటం. చరిత్రలోనుంచి మనల్ను బయటకు తీసుకొచ్చాడు కవి.
మూడో దృశ్యం సముద్రపు నీళ్ళలోతుల్లో జంతుజాలాన్ని చూడటానికి వెళ్ళే పర్యాటకులు. కొంచెం అటూ ఇటూ అయితే ప్రమాదం. బాగా ఈత వచ్చిన వాళ్ళు పర్యాటకులను రక్షించాల్సి వస్తుంది.
ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.
“భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు.”
అని హనుమగారన్నది సరి కాదు. భావకవిత్వం ముందర వాక్యగతమైన (వ్యాకరణ ధిక్కారంతో వచ్చే) అస్పష్టత చాలా వరకూ లేదు. కాని భావగతమైన అస్పష్టత ఉంది. వాక్యగతమైన అస్పష్టత కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అంతకన్నా పై మెట్టు మరొకటి ఉంది! అది కవిత్వంలో పొరలు (layers). అంటే పైకి స్పష్టంగా ఒక అర్థాన్నిస్తూనే అంతర్గతంగా మరొక (మరికొన్ని) అర్థాన్ని స్ఫురింపజెయ్యడం. ఇక్కడనేనంటున్నది శ్లేష గురించి కాదు.
“కవి అమూర్త భావాలు వాడటం వల్ల కలిగిన అస్పష్టత. ట్రాన్స్పరెంట్ చీకట్లు, చంద్రుణ్ణి తాగడాలు లాంటి expressions ఐతే I can empathize with you.” అని వినీల్ గారన్నారు.
But I cannot! ఒక పాఠకుడికి, తనకి అర్థం కాని కవిత్వాన్ని అర్థం కాలేదని చెప్పడానికి అధికారం ఉంది కానీ, దాన్నసలు కవిత్వమే కాదనడానికీ, విమర్శించడానికీ హక్కు లేదని నా ఉద్దేశం. ఆ కవిత్వం వేరెవరికైనా అర్థం కావచ్చు, వాళ్ళా కవిత్వాన్ని అనుభవించవచ్చు. ఏదైనా కవిత్వం ఎవరికీ అర్థం కాకుండా పోతే, దానికి ఆదరణ లేక అది సహజమరణం పొందుతుంది. దాని గురించి విమర్శించడం అనవసరం.
ఈ వ్యాసంలో వేలూరివారు ప్రస్తావించిన కవిత్వానికి కొలమానాలు కాని, టెక్నిక్కు కానీ మొత్తం కవిత్వానికంతకీ వర్తించేవి తయారుచెయ్యడం అసాధ్యం, అనర్థం కూడా. ఒకో “రకమైన” కవిత్వానికీ (కొన్ని ప్రత్యేక కొలమానాలతో) ఒకో టెక్నిక్కు సృష్టించుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. ఒక రకమైన కవిత్వానికి సంబంధించిన టెక్నిక్కుని మరొక రకమైన కవిత్వమ్మీద ప్రయోగించడం పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం వెయ్యడమవుతుంది!
సంపాదకులకి: ఈ అభిప్రాయాన్ని “గ్రంథచౌర్యం గురించి,” అన్న మే 2008 సంపాదకీయం కింద వెయ్యవచ్చు కాని, ఇక్కడే ఉంచమని మనవి.
గట్టు వినీల్ నా కొటేషన్స్ ని ప్రస్తావించి సమర్థించినందుకు థాంక్స్. ఆ సందర్భంలో రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. మొదటిది అల్పమైనది, రెండోది ముఖ్యమైనది.
మొదటిది: కొటేషన్స్ ఇవ్వడం నా బలహీనత. సృజనా లోపమని భావిస్తాను. సాహిత్యం నా వృత్తీ, ప్రవృత్తీ కానందుకు బతికిపోయాననుకుంటాను. 🙂 పదే పదే నేను కోట్ చెయ్యడం విమర్శించదగ్గ విషయమే.
రెండోది: అయితే అది నేనేదో గొప్పవాణ్ణని చూపించడానికో ఇతరులని భయపెట్టడానికో కాదు. భావమో, వ్యక్తీకరణో మనది కానపుడు, ఎవరిదో సూచించడం నైతిక బాధ్యత. సైన్సు రంగంలో ఉండటానో, పాశ్చాత్య ప్రభావమో నాకిది దాదాపుగా అలవాటు. అలా చెయ్యని సందర్భాల్లో తప్పు చేశానని చానాళ్ళు మనసులో పీకుతుంటుంది.
ముఖ్యమైన విషయాలు ప్రస్తావించినపుడు, మూలం మనది కాకపోతే విధిగా కారకులని గుర్తించాలి. మొన్ననే ఇస్మాయిల్ పుస్తకాన్ని ప్రస్తావించాను. దాంట్లోనే “ఇద్దరు భాష్యకారులు,” [1] అన్న 1980లో రాసిన వ్యాసం ఉంది. చలం “మ్యూజింగ్స్” ప్రస్తావనతో మొదలయిన వ్యాసంలో రెండో పేరా చూడండి:
“అప్పుడప్పుడూ రంగులు లేతగానో, ముదరగానో మారుస్తుండటమూ, లేదా ఎడమొహం పెడమొహం వేసి రెంటిగా చీలిపోవటమూ మార్క్సిస్టు ఉద్యమాలన్నిటికీ సామాన్య లక్షణమనుకుంటాను. మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం.”
వెంటనే పక్కా ఇస్మాయిల్ అనిపిస్తుంది కదూ. 🙂 మార్క్సిస్టు విమర్శకుల్లో రెండు రకాలు – ఛాందసులు, అఛాందసులు – అని వాళ్ళలో తేడాలని వివరించే వ్యాసం. నాకు చాలా నచ్చింది. కాని అఛాందసుల మీద మామూలుగా ఇస్మాయిల్ మార్క్సిస్టుల మీద వేసేటన్ని వాతలు పడనందుకు ఆశ్చర్య మేసింది. తెలుగు వాళ్ళు కానందువల్లనేమో నని సమాధానపడ్డాను. వాళ్ళ గురించి ఏమన్నా తెలుసుకుందాం అని వెతికితే ఓ George Steiner పుస్తకం [2] కనబడింది.
నేనీ Steiner వేమీ చదవలేదు. ఆదివారం కదా అని లైబ్రరీకెళ్ళి తెచ్చుకొని తిరగేశాను. దాంట్లోని “Marxism and the Literary Critic,” అన్న వ్యాసం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఇస్మాయిల్ వ్యాసం దీనికి సంక్షిప్తానువాదం! మంచి అనువాదం, సందేహం లేదు. కాని మూలంలో లేనిది ఒక్క అక్షరం కూడా లేదు, దాంట్లో అనుమానం లేదు. మరి ఇస్మాయిల్, “ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం,” అన్న దాంట్లో ఆవగింజంతయినా ఔచిత్యం ఉందా? తను సొంతంగా ఏం ఆరా తీశారు?
ఇస్మాయిల్ ప్రతిభావంతుడైన కవి, విమర్శకుడు. సాహిత్యం, తత్వశాస్త్రాల్లో విద్యాధికుడు. సొంతంగా ఇలాంటి వ్యాసం రాసే సత్తువ ఆయనకుంది, నాకెలాంటి సందేహం లేదు. కాని ఈ వ్యాసం మూలం మాత్రం ఇస్మాయిల్ ది కాదు. Steiner పేరు ప్రస్తావించకపోవడం పెద్ద నేరం.
ఆ రీతిలో కాకపోయినా, ఇక్కడే ప్రస్తావించిన మో “నిరాకారుడు” కవితని చూద్దాం. మొదలొకటే అయినంత మాత్రాన “The Listeners,” తో పోల్చకూడదన్నాడు మో. అది ఒక పేజీ, ఇది ఆరు పేజీలు, అనువాదం కాదు. కాని కవితలోని వాతావరణం అదే, అనుమానం లేదు. మో ఆంగ్ల సాహిత్యం విస్తృతంగా చదివిన వాడు. స్పూర్తి దానినుండే వచ్చి ఉండాలి. పేరు చెప్తే సొమ్మేం పోయింది? సాధారణ పాఠకులకి ఆ కవిత చేరేదేమో కూడాను.
చివరగా, మరో విషయం. మూలాలు చెప్తే, పాఠకులు పోయి ఇంకాస్త చదువుకొని లాభించే అవకాశం ఉంది. చెప్పకపోతేనే నష్టం.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “కవిత్వంలో నిశ్శబ్దం,” ఇస్మాయిల్. పేజీలు 102-106.
[2] “George Steiner: A Reader,” Oxford University Press, 1984. పేజీలు 37-53. “Marxism and the Literary Critic,” వ్యాసం మొదట ప్రచురించింది 1958లో.
1965 లో ఎస్సెసెల్సి లో ప్రవరాఖ్యుని పాఠం ఉండేది. పరీక్షల్లో తెలుగులో ఒక ప్రశ్న వచ్చింది. అది: ప్రవరాఖ్యుడు హిమాలాయాలకు వెళ్ళి ఏమి చూసాడు? అని. దానికి సమాదానంగా నేను అందులోని పద్యం “అటజనికాంచె భూమిసురుదడంబరచుంబి…” అనే పద్యము రాసాను. సమాదానము గద్యంరూపములో రాయ కుండా పద్యంలో రాస్తె మార్కులు వేస్తారో లేదో అనే భయం వుండేది. కాని ఆ పద్యం మీద అభిమానంతో సమాదానం పద్యరూపంలోనే వ్రాసాను. ఆపద్యం అంటే అంత అభిమానం ఆనాడు నేర్చుకున్న్ ఆ పద్యం ఈనాటికి నాకు కంఠతా వచ్చు. ఆ రోజుల్లోనే తెలుగులో నాకు చాల ఎక్కువ మార్కులు వచ్చాయి.
మను చరిత్రలోనె ననుకుంటా…. ఒక వచనం వుండేది అది….విద్యగొనుటయె గాక గుటగుటకు గురుతోనా యని……..” అని వుండేది. అది ఏ అస్వాసంలో వుందో ….
హనుమ గారు
Thanks for the reference.
ఇది రాద్దామనుకోలేదు, కాని నేను రాసింది అస్పష్టంగా ఉందేమోనని అనుమానం వచ్చి రాయడం. “ఈ మాట” యొక్క అభిప్రాయవేదిక చర్చావేదిక గా మారకుండా ఉండాలని గింజుకుంటూ కూడా రాయడం.
గ్లోబలైజేషన్్ ఉన్నా లేకపోయినా, “నారికేళపాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టమే కాదు, నిజాయితీ అని కూడా అనిపించడంలేదు నాకు.
వినీల్్ గారు “అస్పష్టతకు కారణాలేమిటి?” అని చాలా మంచి ప్రశ్న వేసారు. రెండు పాయింట్లు చెప్పి నా అభిప్రాయంతో ముగిస్తాను.
1. అస్పష్టత చాలా సార్లు subjective అనిపిస్తుంది.
2. అస్పష్టత వేరు complexity వేరు.
ఒకరికి అస్పష్టంగా ఉన్నది ఇంకొకరికి ఉండకపోవచ్చు. లోకం మొత్తానికి అస్పష్టంగా ఉన్నది కవికి స్పష్టంగా ఉండొచ్చు, hopefully! Subjective అన్నప్పుడు, అస్పష్టతకు సవాలక్ష కారణాలుండొచ్చు. పాఠకుడు సరిగ్గా చదవకపోవడం నుంచి, భాషా పరిచయం లేకపోవడం నుంచి అచ్చుతప్పులు గ్రహించకపోవడం దాకా ఎన్నో కారణాలుండొచ్చు. వాటికి కవిత మాత్రం కారణం కాదు. కాబట్టి వాటి గురించి, అంటే “1” గురించి కాదు ఈ చర్చ అని అనుకుంటున్నాను.
ఇక “2” వ అంశం. ఆలోచనా విస్తృతి పెరిగినప్పుడు complexity తగ్గిపోతుందని కాదు కాని, complexity పట్ల స్పష్టత పెరుగుతుంది. వీటి ఉదాహరణలు అందరి దగ్గరా ఉంటాయి.
నేను సమర్థించని “అస్పష్టత” పై రెండు కోవలకు సైతం చెందనిది, ఇతరమైనది! కవిత అర్థం కాకముందు కాదు, దాని అర్థం తెలుసుకున్నాక కూడా అది అస్పష్టంగా కనిపించడం గురించి. అప్పుడు ఆ “కవిత” అనే రాతలో ఏముంది డొల్ల అని ఎందుకు నిలదీయకూడదో తెలియదు, నిజాయితీగా. నేనన్న “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టం అని అన్నది దీని గురించి మాత్రమే.
==================
విధేయుడు
-Srinivas
మన భాష ఉనికికే ముప్పు కలిగితే, పాఠశాలల్లో, ప్రజల లావాదేవీలలో తెలుగు వాడకం ఎక్కువ చేస్తే ఫలితం ఉంటుంది కాని, కవులని స్పష్టంగా రాయండర్రో అని మొరెట్టుకున్నా, ఒకవేళ వాళ్ళు దానిని పాటించగలిగినా, ఒరిగేది మాత్రం సున్నా!
సాహిత్యానికీ సమాజ స్థితిగతులకీ పరస్పర సంబంధం ఉంది. కాని కార్యకారణ సంబంధాలు చూపకుండా ప్రతిదానికీ గ్లోబలైజేషన్ పేరెత్తడం వలన సాహిత్య వివేచన పెరగదు.
భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు. ఆధునిక కవిత్వంలో అస్పష్టతని వర్ణించడానికి నారికేళ పాకం అన్న పదమే అనుచితం కావచ్చు. వర్తమాన కాలపు కవిత్వంలో అస్పష్టత స్వభావం ఏమిటి? అది ఎన్ని రకాలు? ఏది అనివార్యం? ఏది అవాంఛనీయం? ఇది రావడానికి అసలు కారణాలు ఏమిటి? అని పాపినేని శివశంకర్ [1] తన సిద్ధాంత గ్రంథంలో కాస్త వివరించాడు. మనమాయనతో ఒప్పుకోనవసరం లేదు కాని చర్చలోకి తీసుకోవాలి.
సామాన్య పాఠకులు తెలుగు PhD థీసిస్ లు చదువుతారా? కవిత్వం ఆస్వాదించడానికి సిద్ధాంత గ్రంథాలు చదవాలా? అంటే అక్కర్లేదు. కాని గ్లోబలైజేషన్ ప్రభావంలో తెలుగు ఉనికికే ఆపద ముంచుకొచ్చిన తరుణంలో నారికేళ పాకం ముసుగులో అస్పష్టతని సమర్థించకూడదన్నప్పుడు – దీంట్లో సాహిత్య ప్రభావం గురించి చాలా గంభీరమైన భావాలున్నాయి కనుక – కాస్తో కూస్తో సిద్ధాంతపరమైన విచారణ చెయ్యాలి. PhD థీసిస్ లు కాకపోతే మరేదో, మనదో మరెవరిదో, కాస్త లోతుగా ఆలోచన చేసిన రచన ఆధారంగా.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “సాహిత్యం – మౌలిక భావనలు,” పాపినేని శివశంకర్, 1996. పేజీలు 139-146.
బాబ్జీలు గారు
నిజమే మీరన్నట్లకు బోలెడు నిర్వచనాలున్నాయి. పంచుకున్నవి నాకు తెలిసిన కొంచెం మాత్రమే.
కవిత్వాన్ని నిర్వచించడం కుదరదు అని అనుకున్నా, చేసిన వాళ్ళు చేసారు, చేయని వాళ్ళు ఆగకుండా చేస్తున్నారు, ఇంకా ముందుకు చేయకుండా ఆగుతారనీ లేదు.
ఇక మీరడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానమే నాది కూడా అని అనుకుంటాను. విశ్వశ్శ్రేయం కావ్యం అంటే విశ్వశ్రేయం కానిదేదీ కావ్యం కాదని కాదు. తీపి మంచి రుచి అంటే తీపి కానిదేదీ మంచి రుచి కాదని అననట్లు.
మీరన్న ఒక మాట మాత్రం చాలా సత్యం. కవిత చదవగానే చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి అన్నది పాఠకుని పట్ల సహాయమే కాదు, అవసరం కూడా అనిపిస్తుంది. తెలుగు భాష ఉనికే సవాలుగా మరుతున్న సమయంలో “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టంగా అనిపిస్తుంది.
————————–
విధేయుడు
-Srinivas
“ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి,” అన్నారు మీరు. కవిత్వానికి సంబంధించినంతవరకు నాలాటి వాడు ఏమీ తేల్చలేడు. (నాలుగేళ్ళ క్రితం గట్టు వినీల్ నో పార్టీలో కలిసి, సాహిత్యం గురించి ముచ్చటించుకున్నాం. వినీల్ ది ఈ తరం. నేనో ఇరవై ఏళ్ళు సాహిత్యాంధకారంలో ఉండటాన ఈ తరం రచయితల పేర్లు కూడా తెలియలేదు. ఆ ఖాళీ పూరించుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాలుగు పుస్తకాలు చదివి, నలుగుర్ని కోట్ చేసినంత మాత్రాన పండితులవుతామన్న అపోహ లేదు.)
మో గురించి చేరా “ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవి కాడు … అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచం తిక్క చూపిస్తాడు” అన్నాడు. సామాన్య పాఠకులయినంత మాత్రాన ఆషామాషీగా చదవాలని లేదు కదా. లోతు ఉంటే తెలుసుకోడానికి కష్టపడితే ఏం?
కొన్ని కవితలు వెంటనే మనసుకు హత్తుకుపోవు. అందీ అందక ఉంటాయి. వాటిని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వివరిస్తే అప్పుడు మామూలు పాఠకులకి కూడా గాఢమైన అనుభూతి కలుగుతుంది.
వేలూరి గారి వ్యాసంలో మో కవిత మీద వ్యాఖ్యానం చూసి, చితి-చింత తీశాను – ఎవరన్నా ప్రస్తావిస్తేనే కాని ఇలాటివాటి జోలి కెళ్ళను నేను. వేలూరి గారు కోట్ చేసిన పాదాలు నాకూ అర్థం కాలేదు. “ఎర్ర ద్రాక్ష పళ్ళూ, తెల్ల అన్నం,” ఏమిటీ గొడవ? అనుకున్నాను.
కాని ఇది దీర్ఘ కవిత. ఇంకా ముందుకు పోతే, నిరాకారుడు, తలుపుతో,
“నీకు నిద్ర వృద్ధాప్యంలా ముంచుకొచ్చినపుడు
చలి కొణుకుతూ రాంకీర్తనలు గొణుగుతూన్నపుడు
నన్ను తలుచుకొని నీ పుస్తకం లోపల్లోపల చదువుకో,
…
మూసేసిన వెన్నెలమాసికలేసిన తలుపూ
నేనెళ్ళొస్తా గడేసుకో.”
అనేటప్పటికి, అయ్యో! ఇది మన గురించే, అని తెలిసింది, విషాదమావరించింది. అందుకే నా మొదటి అభిప్రాయం రాసింది. ఇవాళ మీరు మో మీద రాసింది చదివి, మో తన మీద తనే అన్న మాటలు గుర్తొచ్చాయి [1]:
“నా కవిత్వానికి ఎంతమంది అభిమానులున్నారో అంతేమంది విమర్శకులూ ఉన్నారు. అది అర్థం కాదనేది ప్రధాన విమర్శ. దాన్ని నేను ఖండించను. ఎందుకంటే నిజంగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరిదాకో ఎందుకు… చలసాని ప్రసాదరావు గారే నాకు రాసిన ఆఖరి లేఖలో, ‘మీ కవితా సంకలనాలన్నీ మీరు అరబ్బీలోనో పార్శీలోనో లేదా ఆఫ్రికా ఖండపు బురుండీ దేశభాషలోనో రాశారని ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు,’ అంటూ హాస్యమాడారు. నేనెన్నుకున్న వస్తువు నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ ఇంగ్లీషు కవి ప్రభావమో నామీద పడవచ్చు. ఆ భావాలతో బొత్తిగా పరిచయం లేని వ్యక్తికి… నేను రాసిన కవితలోని మూలం అందకపోవచ్చు. అలాగని నేను రాసిందంతా సంక్లిష్టమైన కవిత్వమంటే మాత్రం ఒప్పుకోను. నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.”
నిరాకారుడి లాంటి కవితలకి చేరానో, మరో పండితుడో కాస్త వ్యాఖ్యానం ఇవ్వాలి. వెతికితే, వడాలి [2] లో కాస్త ఉంది: “Walter de la Mare’s poem The Listeners opens with a traveller “knocking on the moon-lit door”. MO’s Nirakarudu has a similar opening, but he cautions us against reading too much similarity between the two poems.”
“The Listeners” బాగా పేరున్న కవిత అట. ఆ కవి మీద TS Eliot చక్కటి కవిత రాశాడట. ఇవేవీ నాకు తెలియవు. ఇప్పుడవి చదివి, మళ్ళీ “నిరాకారుడు” చదివాను. ఈ వ్యాసంలోని మిగతా కవితలూ చదివాను.
“అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు,” అని చదివితే నాకూ చిన్నప్పటి మాఊళ్ళో బంతి భోజనాలు, గాడిపొయ్యులు, వాటితో పాటు వంటసాల చేసి పొగకి మండిన కళ్ళూ – అవన్నీ గుర్తొస్తాయి. మిగిలిన కవితలు గూడా మరికొన్ని జ్ఞాపకాలని తలపుకొస్తాయి. కాని అవేవీ మో కవిత అంతగా కదల్చడం లేదు. దానికి ఫలానా జ్ఞాపకం కారణం అని చెప్పలేను. నిరాకారుడు గొప్ప కవిత. కాస్త చెయ్యిస్తే సామాన్య పాఠకులని కూడా విషాదంలోనూ మోదంలోనూ ముంచెత్తేది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఏకాంతం నుంచి ఏకాంతంలోకి,” ఈనాడు ఆదివారం, మార్చి 27, 2005.
[2] “Modern Poetry in Telugu,” by V. Mandeswara Rao.
ఒక కవిత పాత జ్ఞాపకాల పుట్ట అని వేలూరి గారు అంటే, పాత జ్ఞాపకాలు, కాదు గాయాలు, మానిపోయాయని మన హనుమగారు ఆశిస్తున్నారు. రెండూ సహృదయంతో చెప్పినవే కాబట్టి, దేన్ని కాదనగలం?
షడ్రుచులున్నాయి అని మన వాళ్ళంటే, “లోకో భిన్న రుచిః” అని అంతకంటే ముందే అన్నారు. ఎంత మధురమైనా మోతాదెక్కువైతే మొహమెత్తిపోతుందని చుట్టున్నవాళ్లు గుర్తుచేస్తూనే ఉంటారు. ఈ రుచి బాగుంది, ఆ రుచి గొప్పది అని వెలకట్టబోతుంటే, “అన్నేసి చూడు, నన్నేసి చూడు” అన్న ఉప్పును మాత్రం ఎవ్వరు తక్కువ చేయగలరు!
రుచులు, వాసనలు అందరికీ సాధారణంగా అనుభవంలోకి వచ్చినట్లు, అన్ని కవితలు అర్థమయి, అనుభవంలోకి వస్తాయి అనలేం. పెళ్ళిచేసుకోవడం, ఇల్లుచూసుకోవడం సంగతేమోకాని, పింగళిగారెప్పుడో “భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్” అనేసారు. పాటలేకాదు, ఏవో కవితలు రాయాలోయ్ అని కూడా అన్వయించుకోవచ్చేమో.
కొన్ని కవితలు మిగిల్చిన జ్ఞాపకాల గురించి రెండు లైన్లు రాయాలనిపించింది.
ఎన్నో జ్ఞాపకాల నిధులున్న మనసే ఒక కోట
ఎన్నో శబ్దాలు నింపుకున్న కవితే ఒక ఫిరంగి
ఇది కూలదు
అది పేలదు!
ఏది ఏమైనా కవులూ, పాఠకులూ, పాఠకులు కానివారుతో సహా
“ఎల్లరు హాయిగ ఉండాలోయ్” అన్న పింగళిగారి కాంక్షనే ఆకాంక్షిస్తూ
===========
విధేయుడు
– Srinivas
Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాల సాహితీ సిద్ధాంతాలని పేర్కొనేవారు తాము సాధారణ పాఠకులమంటే, ఇక “సాధారణ” అన్న మాటకి అర్థమేముంది? “Oh, Lord Venkateswara! If you are only a stone, what are we?” అని ఎక్కడో ఎవరినో అన్నది గుర్తొస్తోంది. 🙂 అల్ప విషయంగా వదిలేద్దాం.
వేలూరి గారన్న దాంట్లో ఓ చిన్న సందేహం: “వాన ఏ రకమైన వెనకటి జ్ఞాపకాలని గుర్తుకి తెచ్చినా, కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి.”
కొత్త జ్ఞాపకం అంటే ఇటీవలిదనా (recent memory)? మంచి కవితకి అదెందుకు ఉండాలో వివరిస్తే బావుండేది.
హార్డీ Apology లో Housman పేరు చూశాను. పోయినేడే ఆయన 1933లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసం, “The Name and Nature of Poetry,” [1] చదివాను. కవిత్వ స్వభావం గురించి Housman చెప్పింది నాకు నచ్చింది. దీనినే రచ్చబండలో కాస్త ఘాటుగా ప్రస్తావించి, ఘర్షణ పడ్డాను. (పడిన గాయాలు అందరిలోనూ మానిపోయాయని ఆశిస్తాను.)
వేలూరి గారు పాఠకుని జ్ఞాపకాలు కవిత్వాన్ని ఆస్వాదించడానికి కావలసిన పరికరం అంటే, Housman, భావోద్వేగాన్ని కలిగించడమే కవిత్వ విశేష లక్షణం అన్నాడు:
“And I think that to transfuse emotion – not to transmit thought but to set up in the reader’s sense a vibration corresponding to what was felt by the writer – is the peculiar function of poetry.”
ఉద్వేగం వేలూరి/Benjamin అన్నట్లు జ్ఞాపకాల వలనే వస్తుందనుకుందాం. అయితే ఒక సందేహం వస్తుంది. మన జ్ఞాపకాలని మనమే గుర్తు తెచ్చుకోడానికి వేరేవాళ్ళ కవిత్వం ఎందుకు? దీనికి సమాధానంగా నాకు రెండు విషయాలు గోచరిస్తాయి.
ఒకటి, కొన్ని జ్ఞాపకాలు గుప్తంగా ఉండొచ్చు; మనకంతుపట్టని అంతర్గత మానవ స్వభావానికి చెంది ఉండొచ్చు. Housman మాటల్లో;
“But in these six simple words of Milton –
Nymphs and shepherds, dance no more –
what is it that can draw tears, as I know it can, to the eyes of more readers than one? What in the world is there to cry about? Why have the mere words the physical effect of pathos when the sense of the passage is blithe and gay? I can only say, because they are poetry, and find their way to something in man which is obscure and latent, something older than the present organisation of his nature, like the patches of fen which still linger here and there in the drained lands of Cambridgeshire.”
రెండోది మనలో ఉద్వేగం కలిగించాలంటే ఆ భావాలని వ్యక్తీకరించే భాష ప్రత్యేకమైనదిగా ఉండాలి. Housman అన్నట్లు, “Poetry is not the thing said but a way of saying it.”
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తన వేమన ఉపన్యాసాలలో అన్నారు: “తీవ్రమైన భావములు మనుష్యులు కందరికిని కలవు, కాని ఆ భావములను బైట పెట్టవలసినప్పుడు మన కందరికిని వచ్చునది కవిత్వం గాదు; నత్తి. కొందరికది నాలుకకే అంటియుండును. మరికొందరికి వ్రాతలోను కలదు. కవులనబడే వారిలో ననేకులిట్టి నత్తివ్రాతవారే. బుద్దిమంతులైన వారి కీరెంటికిని మందొకటే; చేతనైనంతవరకు మౌనము వహించుట.”
(1929లో కన్నా ఇప్పుడు కవుల్లో నత్తి ఎక్కువయిందా?:-))
పైదీ, వేలూరి గారన్నదీ నాకు చాలావరకు సమ్మతమే. కాని నేనిది రాయడానికి కారణం, ఆధునికులు ఇదంతా పాత చింతకాయపచ్చడి, అని కొట్టిపారేస్తారేమోనని. మన ప్రముఖ కవి ఇస్మాయిల్ మాటల్లో [2]:
“మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో కవి చేసే ఎక్స్ ప్లొరేషనే కవిత్వం. అందరికీ తెలిసిందాన్నే అందంగా చెప్పడం కాదన్నమాట కవిత్వం. ఇది సంప్రదాయవాదులిచ్చిన నిర్వచనం. దీన్ని ఆధునికులు ఒప్పుకోరు. కవిత్వం ఎక్స్ ప్లొరేషన్ కనక, కొత్త సత్యాలని ఆవిష్కరిస్తుందని వీళ్ళంటారు. అందుకే, అస్పష్టం అనే ఫిర్యాదు ఆధునిక కవిత్వం గురించి అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అస్పష్టమంటే కొత్త అని అర్థం చేసుకోవాలి, చదువరికి ఇంతవరకూ అనుభవంలోకి రాని విషయమన్న మాట.”
మో ఆధునిక కవి. ఆయన కవిత్వం అస్పష్ట పాకమా? లేక మనకింతవరకూ అనుభవంలోకి రాని సరికొత్త పాకమా?
ఎప్పటికైనా మో “కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం” చేస్తుందని నా ఆశ. అప్పటిదాకా “శాంతి ఒక్కొక్క బొట్టూ పడ్తుంది వేకువ కళ్ళల్లోంచి. కట్టేసిన కన్నీటి మేలిముసుగు కుళాయిల్లోంచి.” అన్న నిరాకారుణ్ణి “లైఫ్ బాయ్ సబ్బుతో కడిగిన గ్లాసులో తాగిన చవకరకం జిన్ అండ్ టానిక్” తో పోల్చడం మాత్రం అన్యాయమే!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “The Name and Nature of Poetry and Other Selected Prose,” by AE Housman. Cambridge University Press, 1961.
శుద్ధ తర్కం/గణితం ఆధారంగా వాదిస్తున్నప్పుడు కొలవగలమా లేదా అన్న ఆచరణపరమైన ఇబ్బందిని తీసుకురాకూడదు కదా.
జీనో ప్రకారం (మీ ప్రకారం కూడా) అకిలీస్ కీ తాబేలుకీ మధ్య దూరం సున్నాకి అతి దగ్గరగా వస్తుంది కాని, ఎప్పటికీ సున్నా కాదు. సున్నా కానిది అకిలీస్ తాబేలుని అందుకోలేడు!
చివరలో, “మనం కొలవలేనంతగా సున్నకి ఎప్పుడైతే దగ్గరవుతుందో,” అని వాదించి వైరుధ్యం తొలిగిపోయిందన్నారు. అయితే జీనో దీనిని చాలా సులభంగా తిరస్కరిస్తాడు! కొలవడం, కొలవలేకపోవడం అన్నవి తర్కానికి చెందవు.
ఆ మాటని తార్కికంగా కూడా అన్వయించకోవచ్చు అని నా ఉద్దేశం, ఇంగ్లీషులో “tends to zero” అన్నదానికి సమానార్థకంగా. సున్నకి ఎంత దగ్గరగా ఉన్న చిన్న కొలతనిచ్చినా, అంతకన్నా దగ్గరగా ఉందని నిరూపించడమే కదా “tends to zero”కి అర్థం. జీనో అనంత శ్రేణిని గురించి మాట్లాడాడు కాబట్టి అతనిచ్చినది గణిత సంబంధమైన వివరణ. అంచేత దానికి గణితసంబంధమైన పరిష్కారం చూపిస్తే వైరుధ్యం తొలగి పోయినట్టే కదా. ఇందులో ఇంకా తీరని సమస్య ఏవిటి?
ద్విభాజక విరోధాభాస” తెలుగు అవొచ్చేమో అనుకుంటే నవ్వొచ్చింది.
మహరాజులా నవ్వుకోండి! ఈ ప్రజాస్వామ్య స్వతంత్ర భారతదేశంలో ఎవరికి వారు, భాషకి తమకి నచ్చిన నిర్వచనాన్ని ఇచ్చుకొనే స్వాతంత్యం ఉంది 🙂
అలానే “అసత్యం కాదు” అని నిరూపించినా “సత్యమే”
నాకు తెలిసి, ఇది మాత్రం కరెక్టు కాదు. అట్లా అనిపిస్తుందేమో, కాని కాదు. Do you remember, “Good Scientific Hypotheses Can NOT Be Proven Correct!” ఇది నాది కాదు, ఒక ఫిజిసిస్ట్ ఉవాచ :).
నా వ్యాఖ్యలో Proof of Contradiction గురించిన చెప్పిన కీలక అంశాన్ని ఒకసారి (మరోసారి) చదవండి.
అప్పుడు కూడా “అకిలీసు” తాబేలు ను దాటుకుని వెళ్ళే ప్రసక్తే ఉండదు. కాంతి (కాలం) వేగంతో పోటీ పడితే తప్ప అకిలీసు తాబేలును దాటే ప్రసక్తే ఉండదు.
ఇక్కడ మాట్లాడుతున్నది స్థలాన్ని గురించైతే మధ్యలో మీరు కాలాన్ని తెచ్చి మరింత గడబిడ చెయ్యడం భావ్యమా!
అన్నట్టు, అకిలీసు ప్రస్తుతానికి గ్రీకు వనిత అనుకుందాం :), గ్రీకు వీరుడు, అనే కన్నా! (తెలుగులో “చేరుతుంది” అని రాసినందుకు).
బాగా పట్టేరు సుమండీ! లెక్కలపేపరులో స్పెల్లింగు మిస్టేకు దిద్దిన మా లెక్కల మాస్టారు గుర్తుకువచ్చారు 🙂 ఏదైనా, తప్పు తప్పే!
ద్విభాజక విరోధాభాస: సాధ్యమైనంతవరకు ఇంగ్లీషు వాడకూడదు అన్న సదుద్దేశం చాలా వరకు మేలు చేసినా కొన్ని వేళల్లో కీడు చేస్తుందనడానికి ఇది ఓ నిదర్శనమని ఒప్పుకుంటాను.
సున్నా విషయం: పూర్ణ సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు, అప్రధాన సంఖ్యలు, అని చదువుకోండి. సరిపోతుంది.
“పూర్ణ సంఖ్యల(Integers) సమితి సైజు వర్గ సంఖ్యల సమితి సైజు కన్నా చిన్నదా పెద్దదా సమానమా?” అని కామేశ్వరరావు గారు అడిగిన ప్రశ్నకి మీరు, “అనంతాలని పోల్చకూడదని హనుమంతరావు గారు రాశారు కదా?” అన్నారు. గెలీలియో అన్నడా మాట. కేంటర్ వచ్చి అవి రెండూ సమానమేనన్నాడు. వ్యాసంలో ఒకదానికొకటి జత చేసే విధానం మీద ఉదాహరణలతో వివరాలిచ్చాను. దీని గురించి ఎలాంటి సందేహమూ ఉండకూడదు.
“అనంతాల మధ్య కూడికలూ, గుణకారాలూ వుంటాయన్నారు. ఒక వుదాహరణ ఇచ్చి వుంటే బాగా అర్థం అయ్యేది,” అన్నారు. నిజమే. n సహజ సంఖ్య అయితే, అనంత సంఖ్యల (transfinite numbers) తో కూడికలకీ, గుణింతాలకీ కొన్ని ఉదాహరణలు:
א0 + n = א0
א0 x n = א0
א0 + א0 = א0
א0 x א0 = א0
కామేశ్వరరావు గారు చక్కగా విశదీకరించారు. థాంక్స్. కాని వారు చివరలో, “మనం కొలవలేనంతగా సున్నకి ఎప్పుడైతే దగ్గరవుతుందో,” అని వాదించి వైరుధ్యం తొలిగిపోయిందన్నారు. అయితే జీనో దీనిని చాలా సులభంగా తిరస్కరిస్తాడు! కొలవడం, కొలవలేకపోవడం అన్నవి తర్కానికి చెందవు.
సూర్యం గారూ, మీరు జీనో పారడాక్స్ లు గందరగోళంగా అర్థం పర్థం లేకుండా ఉన్నాయన్నారు. కామన్ సెన్స్ కి విరుద్ధంగా ఉన్న మాట వాస్తవమే. మీరు ఈ మధ్యన కనుక్కున్న గణిత సూత్రాల మూలంగా సాధించినదీ నిజమే. కాని జీనో వాదనలో తప్పు ఎక్కడ ఉందో మీరు చూప లేదు. నిజానికి అది అంత సులభం కాదు. అతని పారడాక్స్ లు సూక్ష్మం గానూ లోతుగానూ ఉంటాయి.
అనాది నుండి అనంతం గురించిన ఆలోచనలని స్థూలంగా వివరించి కేంటర్ ని ప్రవేశపెట్టాను. జీనో గురించి మరీ లోతుకు పోయే స్థాయి నాకు లేదు. కాని రస్సెల్ మాటలని మననం చేసుకుంటాను:
“In this capricious world nothing is more capricious than posthumous fame. One of the most notable victims of posterity’s lack of judgement is the Eleatic Zeno. Having invented four arguments all immeasurably subtle and profound, the grossness of subsequent philosophers pronounced him to be a mere ingenious juggler, and his arguments to be one and all sophisms. After two thousand years of continual refutation, these sophisms were reinstated, and made the foundation of a mathematical renaissance, by a German professor, who probably never dreamed of any connection between himself and Zeno”
“Although they have often been dismissed as logical nonsense, many attempts have also been made to dispose of them by means of mathematical theorems, such as the theory of convergent series or the theory of sets. In the end, however, the difficulties inherent in his arguments have always come back with a vengeance, for the human mind is so constructed that it can look at a continuum in two ways that are not quite reconcilable.”
“ద్విభాజక విరోధాభాస” తెలుగు అవొచ్చేమో అనుకుంటే నవ్వొచ్చింది.
కామేశ్వర రావు గారు రాసింది:
అలానే “అసత్యం కాదు” అని నిరూపించినా “సత్యమే”
నాకు తెలిసి, ఇది మాత్రం కరెక్టు కాదు. అట్లా అనిపిస్తుందేమో, కాని కాదు. Do you remember, “Good Scientific Hypotheses Can NOT Be Proven Correct!” ఇది నాది కాదు, ఒక ఫిజిసిస్ట్ ఉవాచ :).
కొడవళ్ళ గారి వ్యాసం చదవాలంటే భయమేసి ఆగాను. కానీ ఈ చర్చ మాత్రం చదివాను. Please Continue.
అన్నట్టు కామేశ్వర రావు గారూ:
ఒకవేళ తాబేలు తానున్న చోటు నుండి అసలు కదలదు మెదలదు అనుకుందాం (కాలం అనే ఒక డైమెన్షన్ దాన్ని ఒక చోట ఉండనీయదు అనుకోండి.) “అకిలీసు” ఒక వేళ పడీ పడీ ఎంతో వేగంగా తిరుగుతుందే అనుకుందాం. అప్పుడు కూడా “అకిలీసు” తాబేలు ను దాటుకుని వెళ్ళే ప్రసక్తే ఉండదు. కాంతి (కాలం) వేగంతో పోటీ పడితే తప్ప అకిలీసు తాబేలును దాటే ప్రసక్తే ఉండదు. ఒక వేళ కాంతి వేగాన్ని గనుక అనుకరిస్తే అకిలీసు తమ మధ్య ఉన్న దూరాన్ని పెరక్కుండా చూసుకోగలదేమో. లేకపోతే తాబేలెప్పుడూ ముందే 🙂 –[“ఎక్కడో ఒక చోట” లాంటి కండీషన్స్ వేరే చెప్పాలా!].
పార్వతి వినాయకుడిని తన చుట్టూ తిరిగి పందెం గెలవమనటానికి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి, అవిడకి లెక్కలు వచ్చినా రాకపోయినా! Somehow, Indian Economists are vindicated against their western counterparts who argued in favor of a rapid pace in reforms comes to my mind too.
“ఏ రకంగా చూసినా అకిలీసు తాబేలుని చేరుతుందన్నది స్పష్టం.”
అన్నట్టు, ఇది అసత్యం అని ప్రూవ్ చేసినంత మాత్రాన నేను చెప్పిందే సత్యం అవదు కదా! 😉
విప్లవ్
P.S. పదేళ్ళ “ఈ మాట” ప్రజల బుర్రలకు పని పెట్టే యాగాన్ని కొనసాగించాలని కోరుకునే వాళ్ళలో నేనూ ఒకడిని.
నా వ్యాసాలు నచ్చాయని చెప్తే నాకు ప్రోత్సాహం కలుగుతంది. అర్థం కాలేదంటే, ముందు ముందన్నా ఎలా వివరించాలా అని ఆలోచన మొదలయి, అదీ ప్రోత్సాహాన్నే ఇస్తుంది. ఏ స్పందనా లేకపోతే, వీటివలన ఉపయోగమేమన్నా ఉందా అన్న సందేహం కలుగుతుంది. కాబట్టి మీరు మీ అభిప్రాయాలు నిష్కర్షగా చెప్తే లాభమే కాని ఏమాత్రం నష్టం లేదు. విరుద్ధ నిరూపణా విధానం అర్థం చేసుకోవడం అత్యవసరం కాబట్టి మరోసారి వివరించడానికి ప్రయత్నిస్తాను.
“అసత్య ప్రతిపాదనలు వైరుధ్యాలకి దారి తీస్తే, వాటిని అసత్యాలు కావు అని అనడంలో వున్న ఔచిత్యం అర్థం కాలేదు,” అన్నారు. మళ్ళీ మీరే, “ఒక ప్రతిపాదన సత్యం అని ప్రతిపాదించి, అది వైరుధ్యాలకి దారి తీస్తే, అప్పుడు అది సత్యం కాదు అని అనొచ్చు. అది అర్థం అవుతుంది,” అన్నారు. నిజానికి ఈ రెంటికీ విధానంలో తేడా లేదు! రెండిట్లోనూ ఓ ఊహ (assumption) తో మొదలెట్టి ఓ వైరుధ్యాన్ని చేరుకున్నాం కనుక ఆ ఊహ తప్పు అని తీర్మానిస్తున్నాం. మనం నిరూపించదలచుకున్నదానికి వ్యతిరేకమైనదానిని ఊహ గా తీసుకోవడమే ఈ నిరూపణా విధానం.
దీనికి ఓ మంచి ఉదాహరణ ఇస్తాను. అందరూ, ముఖ్యంగా కవులు:-), చదవాల్సిన పుస్తకం, మన రామానుజన్ ప్రతిభ ప్రపంచానికి వెల్లడి చేసిన GH Hardy రాసిన “A Mathematician’s Apology,” లోనిది. నిరూపించి రెండు వేల ఏళ్ళు దాటినా చెక్కు చెదరని అందం, కొత్తదనం కలిగి, అందరికీ సులభంగా అర్థమయే సిద్ధాంత నిరూపణ అని Hardy దీనిని వర్ణించాడు.
సంఖ్యలు రెండు రకాలు: ప్రధాన సంఖ్యలు (prime numbers), అప్రధాన సంఖ్యలు (non-prime numbers). ప్రధాన సంఖ్యని అదీ, ఒకటీ తప్ప మరే సంఖ్యా నిశ్శేషంగా విభజించలేదు. ఉదాహరణకి 2, 3, 5, 7, 11. ప్రతి అప్రధాన సంఖ్యా (ఒకటిని మినహాయించి) కొన్ని ప్రధాన సంఖ్యలని గుణిస్తే వచ్చే ఫలితమే. ఉదాహరణకి 6 = 2 x 3, 8 = 2 x 2 x 2, 9 = 3 x 3, 10 = 2 x 5. అంటే ప్రతి అప్రధాన సంఖ్యనీ కనీసం ఒక ప్రధాన సంఖ్య అయినా నిశ్శేషంగా విభజిస్తుంది.
ప్రధాన సంఖ్యలు అనంతమా? కాదా? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, … ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. ఈ శ్రేణి అనంతంగా కొనసాగుతుందా? లేక కొన్ని సంఖ్యల తర్వాత అంతమవుతుందా? అనంతం అని ప్రతిపాదిద్దాం. ఇది నిజమో కాదో నిరూపించడం ఎలా?
అనంతం కాదు అనే ఊహతో మొదలెడదాం. అనంతం కాకపోతే, అన్నిటికన్నాపెద్దదైన ప్రధాన సంఖ్య ఒకటుండి తీరాలి. దానిని P అందాం. అంటే ప్రధాన సంఖ్యల శ్రేణి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, … P తో ఆగిపోతుంది. ఇప్పుడో కొత్త సంఖ్య Q ని తయారుచేద్దాం:
Q = (2 x 3 x 5 x 7 x 11 x 13 x 17 x …x P) + 1
అన్ని ప్రధాన సంఖ్యలనీ హెచ్చించి, ఫలితానికి ఒకటి కలిపితే వచ్చే సంఖ్య Q. ఈ కొత్త సంఖ్య P కంటె పెద్దది; కాని P ప్రధాన సంఖ్యలలో కెల్లా పెద్దది కావడాన, Q ప్రధాన సంఖ్య కాదు. అలాగని Q అప్రధాన సంఖ్య కాదు; ఏ ప్రధాన సంఖ్యా దానిని నిశ్శేషంగా విభజించలేదు – శేషం ఒకటి వస్తుంది కనుక! Q ప్రధాన సంఖ్యా కాదు, అప్రధాన సంఖ్యా కాదు! అది వైరుధ్యం. ఈ వైరుధ్యానికి దారి తీసినదేమిటి? ప్రధాన సంఖ్యలు అనంతం కాదు అన్న ఊహ. ఆ ఊహే తప్పు. అంటే ఆ ఊహకి వ్యతిరేకమైనది ఒప్పు. అనగా ప్రధాన సంఖ్యలు అనంతం అన్నది రుజువయింది!
“అర్థమశాశ్వతమ్ము” అనే ఉత్పలమాల వెయ్యేళ్ళ కింద శిలాశాసనం లో కాక, మూడేళ్ళ కింద “ఈ మాట” లోనో ఇంకో చోటనో ఎవరైనా వ్రాసివుంటే దానికి ఏ మాత్రం ప్రాముఖ్యం వచ్చేది అని సందేహం. శిలపైన కాబట్టి నిలిచింది కాని, జనాల నాలుకపై అది ఇంత పాతది అని చెప్పినా కూడా నిలుస్తుందా అని చెడ్డ అనుమానం. ఏదో మనకూ పాత పద్యాలున్నాయి, vintage wine లాగా అని చెప్పుకోవడానికి తప్ప, ఒక్కరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా దీనిని ఉదహరించి ఉటంకించే అవకాశం ఉంటుందా అని కూడా అనుమానమే.
ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. అటువంటి సందర్భమే వస్తే, పద్యమే చెప్పవలసి వస్తే దీన్ని వదిలి “కారే రాజులు రాజ్యముల్ గెలువరే.. వారేరీ సిరి మూటాగట్టుకొని పోవంజాలిరే..” లాంటి వెన్నో రసవంతమైన, బలవంతమైన వి స్ఫురిస్తాయి కాని ఇది తట్టుతుంది అనే ఆశ మాత్రం లేదు. కాదంటారా?
——-
విధేయుడు
-Srinivas
అసలేమీ అర్థం కాలేదా? కామన్ సెన్స్ కి విరుద్ధంగా ఉండటాన అనంతం తో కూడిన వ్యవహారం ముందర నమ్మబుద్ధి కాదు. అలాగని వదిలెయ్య కూడదు. “పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు” అని వేమన చెప్పినట్లు, మీరు చదవడానికి ఉపక్రమించారు కనుక అర్థమయిందాకా వదలకూడదు:-). ఈ వ్యాసంలో ఉన్నవి నాలుగు అంశాలు:
1. ఎన్ని సహజ సంఖ్యలు ({1, 2, 3, …}) ఉన్నాయో అన్నిసరి సంఖ్యలు ({2, 4, 6, …}) ఉన్నాయి! ఇది “మొత్తం, భాగం కన్నా పెద్దది” అన్న సామాన్య భావానికి విరుద్ధంగా ఉండటాన చాలా ఆశ్చర్యమయినది. ఒకదానికొకటి జతపరచే విధానం ద్వారా వివరించాను. దీనినే సంభాషణల ద్వారా తెలుసుకోవాలంటే గెలీలియో డయలాగ్స్ చదవండి. ఇది అర్థం అయేదాకా ముందుకు వెళ్ళకండి.
2. ఎన్ని సహజ సంఖ్యలున్నాయో, అన్ని సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, వర్గ సంఖ్యలు, … ఉన్నాయని తెలుస్తుంది. అంతే కాదు, భిన్న సంఖ్యలు కూడా సహజ సంఖ్యలన్నే ఉన్నాయని కేంటర్ చూపాడు. దీనితో అనంతం ఒకే ఒక సైజులో (సహజ సంఖ్యలెన్ని ఉన్నాయో ఆ సైజులో) ఉన్నదన్న అనుమానం వస్తుంది. అలా కాదు, వాస్తవ సంఖ్యలు (real numbers – వీటిని దశాంశ పద్ధతిలో రాస్తాం) సహజ సంఖ్యల (natural numbers) కన్నా ఎక్కువ ఉన్నాయని కేంటర్ రుజువు చేశాడు – వికర్ణ విధానం (diagnonal proof) ద్వారా. (ఇది మీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్తే, మళ్ళీ ప్రయత్నిస్తాను.)
3. దానితో అనంతం కనీసం రెండు సైజుల్లో ఉందన్నది విశదమయింది. కేంటర్ అంతటితో ఆగక అనంతం అనంత సైజుల్లో ఉన్నదని power sets ని తీసుకొని మళ్ళీ వికర్ణ విధానం ద్వారా నిరూపించాడు. (దీనికి అవసరమయిన సమితుల సిద్ధాంతాన్ని క్లుప్తంగా పరిచయం చేశాను.)
4. కేంటర్ నిరూపణలకి విరుద్ధాలని (proof by contradiction) వాడుకున్నాడు. A అన్న ప్రతిపాదన ఉందనుకోండి. మనకి తెలిసిన, అంతకు ముందే నిరూపించిన వాటి ఆధారంగా A ని రాబట్టితే, దానిని నిర్మాణాత్మక నిరూపణ (constructive proof) అంటారు. మనం హైస్కూల్లో నేర్చుకున్న చాలా రేఖా గణితపు సిద్ధంతాలు అలాంటివే. proof by contradiction వేరే విధానం: A అసత్యం అని మొదలెట్టి, మనం అంతకు ముందే నిజమని తెలుసుకున్న దానికి విరుద్ధమైన దానితో ముగించడం. అంటే ఏమిటి? మనం మొదట్లో అనుకున్నది – A అసత్యం – తప్పన్న మాట – అదే విరుద్ధానికి దారి తీసింది; అది తప్పయితే A నిజమని ఒప్పుకొని తీరాలి! కాని ఈ విధమైన నిరూపణని అనంత సమితులకి వర్తించడాన్ని చాలా మంది గణిత మేధావులు ఖండించారు. ఆ విధంగా గణితంలో కలహాలొచ్చాయి. చిత్రంగా అవి కంప్యూటర్ కనుక్కోడానికి కారణమయ్యాయి.
అదీ విషయం. 1, 4 సులభంగానే అర్థం అవుతాయి; 2 కూడా అర్థం కావాలి – మళ్ళీ ప్రయత్నించండి. 3 కి చిన్నప్పుడు చదివిన వాటిని కాస్త గుర్తు తెచ్చుకోవాలి.
కనీసం చదివి అర్థం చేసుకోడానికి ప్రయత్నించినందుకు కృతజ్ఞతలు.
“చాలా మంది ప్రస్తుతం తెలుగు “కవులు” ‘తెలియని వన్ని తప్పులని…” చెప్పడం పరిపాటి అయ్యింది. మీరలా కాదనుకొన్నాను. ” -గరికపాటి
‘అర్ధ మశాశ్వతమ్ము…’ పద్యం అర్థం తెలుపమంటే, మీరు ఎందుకో నన్ను గురించి ఆలోచిస్తున్నారే. 🙂 మీ పై మాటలు ఈ పద్యం అర్థం తెలుసుకోటానికి, ఎవరికీ (నాతో సహా) ఉపకరించవు. మీకు పద్యం అర్థం తెలిస్తే ఇప్పటికీ చెప్పవచ్చు. మరి నాకిప్పటికీ ఈ ఉత్పలమాలకు అర్థం లేదనే అనిపిసున్నది.
“(మోహన గారి వివరణ తర్వాత అసలు ఈ పద్యానికి ఇంకా వివరణ అనవసరమనుకున్నాను. )”-గరికపాటి
ఈ రచయిత వ్యాసం నేను చదివాను. చదువుతున్నాను. ఎన్నో విషయాలు తెలిసికుంటున్నాను. తరువాత అభిప్రాయాల్లో – ఈ పద్యం, తొలి ఉత్పలమాలల్లో ఒకటి ఐవుండవచ్చునని చారిత్రక పరమైన కుతూహలంతో దీన్ని మనకు ఇప్పుడు తెలిపారు. చరిత్ర మీద దృష్టితో కొందరు చర్చ సాగించుకోవచ్చు. ఈ సందర్భంలో పద్యానికి వివరణ ఇవ్వటం వ్యాస రచయిత ఉద్దేశం కాదనుకుంటాను. వారు, పద్యం లో ఉన్న మాటలను వచనంలో పేర్చారు. వాడిన కొన్ని మాటలు పద్యం లో ఉన్న మాటలంత కఠినంగానూ ఉన్నాయి. ఈ వచనము పద్యభావాన్ని తెలుసుకోటానికి పనికి రాలేదు.
కుతూహలంతో, వేమన శతకం తీసి మొదటి పేజీ చూశాను. అందులో మొదటి పద్యము 🙂
ఆ. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళ్కుబెళ్కు రాళ్ళు తట్టెడేల?
చదువు పద్యమరయ జాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ.
ఈ పద్యానికి నా వద్దనున్న పుస్తకం లో ముందు టీక ఇచ్చారు. అందువల్ల పద్యములోని ప్రతి పదమునకు గల అర్థము తెలిసినది. తర్వాత ఈ కింది విధంగా తాత్పర్యము ఇచ్చారు.
తా. అన్నియును ఇచ్చునట్టి పరమాత్మ యందు ఒప్పిన వేమన్నా వినుము. ఏ రీతిగా వట్టి రంగులు కల మట్టిరాళ్ళు గంపెడయినను ఇంద్రనీలమణితో సాటిగావో ఆ రీతిగానే, మంచిపద్యము ఒక్కటి యయినను చాలును అని భావము.
ఈ వేమన పద్యపు భావము నాకు తెలిసినది. మరి ఇప్పుడు మనము చర్చిస్తున్న పద్యము ఒక పాత ఉత్పలమాల. ఆ పాత దనానికి “antique value” ఉందేమో. ఉండొచ్చు. కాని ఇది గులక రాయా? ఇంద్రనీలమణియా ? అని నేను అడుగుతున్నాను.
“లైలా గారు అప్పుడప్పుడు కొంచెం భారతీయ సాహిత్యం చదువుతూ ఉండండి నిదానంగా అదే అర్దమవటం మొదలవుతుంది.”-గరికపాటి
చిత్తము. నేను ఇక్కడ చేస్తున్న పనే అది. ఈ ఉత్పలమాల పద్యము భారతీయ సాహిత్యము లోనిదే గదా. ఈ పద్యం తెలుసుకుంటే కొంత చదివినట్లే. మరి నా అనుమానం ఈ పద్యానికి అర్థం లేదని. అర్థరహితమైన పద్యము ఎప్పుడైనా కాని గణనీయమెలా అవుతుంది?
ఈ ఉత్పలమాల పద్యానికి టికా తాత్పర్యాలు ఇచ్చి, పద్య చర్చకు దోహదం చెయ్యండి. చక్కని భావమున్నదా పలువురు ఆనందిస్తాను. లేదా ఈ పద్యం అందంగా వినవస్తుంది కాని, అసలు అర్థం పర్థం లేదు అన్న విజం నిరూపించబడుతుంది. నిదానంగానే చదువుకుంటాను సాహిత్యాన్ని. నాకు తొందరేం లేదు. ఒకవేళ నాలో ఉన్న దోషాల వల్ల నాకు తెలియక పోయినా – పద్యానికి అర్థమంటూ ఉంటే, వేరే కొందరికైనా తెలుస్తుంది కాదా.
కల్పన గారు “మైలురాయిగా పొగిడారు” అని రాయడంలో నేను వ్యంగ్యాన్ని సూచిస్తే అది నా తప్పే. మైలురాయి అవునో కాదో తెలుగు సాహిత్య చరిత్ర లోతుపాతులు తెలిసిన వాళ్ళు నిర్ధారించాలి, నేను కాదు. నా దృష్టిలో మీ పుస్తకం కొత్త వెలుగుని ప్రసరించేదీ, కొంత వివాదాస్పదమైనదీ, తెలుగు సాహిత్యాభిమానులు చదవ్వలసినదీ. తగిన ప్రాచుర్యం వస్తుందనీ, విస్తృతంగా చర్చిస్తారనీ ఆశిస్తాను.
పుస్తక ప్రచురణలో సాధక బాధకాలు నాకు తెలియవు. సాహితీ చరిత్రకి గిరాకీ లేకపోవచ్చు కాని అవసరం ఉంది. ఇలాంటి పుస్తకాలని తెలుగులో ప్రచురించడానికి సహాయం కావలసిన వాళ్ళు తానా ప్రచురణ వాళ్ళని సంప్రదించండి; రచ్చబండ లోనో, ఈమాట లోనో, మీ వెబ్ సైటులోనో ఓ మాట వెయ్యండి. ఓ చెయ్యిచ్చే వాళ్ళుండకపోరు. పరపతి ఉంటేనే ప్రచురించుకునే దుస్థితికి తెలుగు సాహిత్యం దిగజారకూడదు.
మీ పుస్తకం మీద “చిరు సమీక్ష” లాంటిది రాయాలనే ఉద్దేశం ఉంది. వీలు చూసుకొని రాయాలి.
హనుమంతరావు గారు,
అయితే మీరు దోషాలు అన్నది కేవలం మీడియమ్ విషయంలో అని అర్థం అయింది. నా పుస్తకం ప్రధాన భాగంలో కూడా మీకు దోషాలుగా తోచినవి చెప్పండి.
మీరు అన్న incongruity నాకు తోచలేదు. తెలుగువాళ్లకే “ప్రతిపాదనలని చర్చించి, విమర్శించవలసిన అవసరం ఎక్కువ“ అన్న మాట కొంతవరకూ నిజం కావచ్చు. నా అభిప్రాయాలు మరోసారి చెప్తాను.
1. తెలుగు పరిశోధకులూ, విమర్శకులూ, నాపుస్తకం స్థాయి పుస్తకాలు చదివేవాళ్లూ ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదువుతున్నారు. మన తెలుగు పరిశోధకులు, విమర్శకులు ప్రచురించిన పుస్తకాలలో ఉపయుక్త గ్రంథాల జాబితా చూస్తే ఇది స్ఫష్టం.
2. తూలిక 8 ఏళ్లగా నడుపుతున్నాను. తూలిక పాఠకుల్లో సగం మంది తెలుగువాళ్లే. — ఇంగ్లీషుబళ్ళలో చదువుకున్న తెలుగువాళ్లూ, ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు అయిపోయిన తెలుగువాళ్లూను. అంచేత నిజంగా చదవాలనుకుంటే భాష అడ్డు వస్తుందనుకోను.
3. నాపుస్తకం ఇండియాలో ప్రచురించడానికి నానా విధాలా ప్రయత్నించాను. దేశవ్యాప్తంగా, ఇతర భాషలలో స్త్రీల రచనలు పరిశీలించేవారికి కూడా ఉపయోగంగా వుంటుందని నా అభిమతం. కాని అది జరగలేదు.
4. పోతే కల్పన నాపుస్తకాన్ని “మైలురాయిగా పొగిడారు“ అన్నారు. ఇంతకుముందు ఈ విషయంమీద ఇంత వివరంగా చర్చించిన పుస్తకాలు ఏమైనా దృష్టికి వచ్చివుంటే చెప్పండి. మరి.
5. ఇంక అందుబాటు మాట అంటారా. నాకున్న పరపతీ, నేనున్న పరిస్థితుల్లో తెలుగులో రాసినా ఎవరూ కొనరు. ఆవిషయంలో నేను చేయగలిగినది ఏమీ లేదు.
6. మీరు చెప్పిన ఇండెక్స్, వేలూరి సలహా వివరణలు చివరికి మారిస్తే బాగుంటుంది లాటివి నాకు createspace.com ఒప్పందం ప్రకారం సాధ్యం కాదు. అక్షరదోషాలు దిద్దడం మాత్రమే సాధ్యం.
పుస్తకం తిరిగి మార్కెట్ లో వుంది. కావలసినవారు నాకు రాయండి. లేదా ఎమెజాన్.కామ్ లో చూడండి.
మీ ఆదరణకి ధన్యవాదాలు.
మాలతి.
రామా కనవేమిరా! గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/15/2008 2:29 pm
“కలడు కలండనెడు వాడు కలడో లేడో?”
ఆధునిక సాహిత్యంలో దేవుళ్ళూ దయ్యాలూ ఉంటే అభ్యంతరం లేదు కాని, మనుషుల్ని దుర్బలులుగా చూపెడితే ఏమిటి ప్రయోజనం? మానవ ప్రయత్నానికి కదా విలువ నివ్వమని ఘోషించేది – ఆస్తికులూ, నాస్తికులూ కూడా.
నిష్ట పాటించని భక్తుని కాళ్ళు బొబ్బలెక్కేలా వేన్నీళ్ళతో కాల్చి, కేవలం సాంబారుతో కడుపు కాల్చి, కార్ల టైర్లు పగలగొట్టి, దేవుడు బుద్ధి తెప్పిస్తే, భక్తుడు చెంపలేసుకొని సన్మార్గుడవుతాడు – ఇక జన్మలో ప్రదక్షిణం చేసికాని ప్రసాదం పుచ్చుకోడు! దీంట్లో ఆస్వాదించాల్సిందేమిటి? హాస్యమా?
నేను మేధావినీ కాదు, పండితుణ్ణీ కాదు. అందుకు కావలసిన అర్హతలు నాకు తెలుసు – దీంట్లో false modesty ఏమీ లేదు. నేను రాసేవి కాస్త చదువుకున్న పాఠకులు చర్చించగల విషయాలే కదా.
పుస్తకం తెలుగు రానివారి కోసం రాస్తున్నానని మీరు ముందుమాటలో చెప్పారు, నిజమే. కాని దాని ముందర మీరీ పుస్తకం రాయడానికిచ్చిన కారణాలు చదివితే ఇది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.
ముఖ్యంగా, మీరు తీసుకున్న రచయిత్రుల మీద సమగ్రమైన సాహిత్యవిమర్శ రాలేదన్నారు – తెలుగులోనే రాలేదని నేనర్థం చేసుకున్నాను; ఇక ఇంగ్లీషు గురించి చెప్పేదేముంది? అకడెమిక్ వాళ్ళు పాత సాహిత్యం మీదా, పత్రికల వాళ్ళు ప్రస్తుత సాహిత్యం మీదా కేంద్రీకరించడాన, ఈ మధ్య చరిత్ర నెవరూ పట్టించుకోలేదని విచారించారు. మీరీ కార్యం తలపెట్టకపోతే అసలీ సాహిత్యమే కనుమరుగైపోయే ప్రమాదముందన్నారు. మీరు మొదలెట్టిన పనిని తెలుగు పండితులు ముందుకు తీసుకుపోవాలని అభిలషించారు. ఈ కారణాలన్నీ ఇచ్చి వెంటనే ఇది తెలుగు రానివాళ్ళ కోసం రాస్తున్నానడం విరుద్ధంగా (incongruent) అనిపిస్తుంది.
కల్పన గారి ముందు మాటలో కూడా మీ కృషిని మన సాహితీ చరిత్రలో ఓ మైలురాయిగా, ఇప్పటివరకూ వచ్చిన మూస చరిత్రను ఛేదించేదిగా పొగిడారు. ఇది ముందర చేరవలసింది తెలుగు వాళ్ళకేనని నా అభిప్రాయం. పరులకి తెలపడాన నష్టమేమీ లేదు కాని మీ ప్రతిపాదనలని చర్చించి, విమర్శించవలసిన అవసరం ఎక్కువ ఎవరికి? తెలుగు చదివే వాళ్ళకి. మరి వాళ్ళలో ఎంతమందికి మీ పుస్తకం చేరుతుంది?
అందుబాటులో ఉన్న ఇంగ్లీషు వచ్చిన తెలుగు వాళ్ళయినా చర్చిస్తారని ఆశిద్దాం.
మార్కెట్ లో ఉన్న పుసకంలోని తప్పులు దిద్దడం కోసం తాత్కాలికంగా అమ్మకాల్ని ఆపడం, మీ అంకిత భావానికి మరో తార్కాణం. వీలయితే, సమయం మించిపోకపోతే, పుస్తకానికి ఇంగ్లీషు పుస్తకాలలో చాలా సామాన్యంగా ఉండే పద పట్టిక (index) ని చేర్చమని మనవి.
సరిగ్గా నలభై సంవత్సరాల క్రిందట బాలమురళిగారి కచేరిని నేను దెహ్రాదూన్ లోవిన్నాను. అక్కడకు వచ్చేముందు ఆయన ఢిల్లీలో కూడా కచేరి చేశారు. అప్పుడు హిందూ పత్రికలో వచ్చిన తమిళ రసికుని విమర్శేమిటంటే బాలమురళి రెండవ స్థాయి వాద్యకారులను పెట్టుకొని తాను వెలిగిపోయే ప్రయత్నాలు చేశారని. ఆకారణంగానో మరెందువల్లనో గాని ఆయన దెహ్రాదూన్ చేరుకొనేసరికి వాయులీన సహకారుడు లేకుండాపోయాడు. స్థానిక ఆహ్వానసంఘంవారు అక్కడే హిమాలయన్ రేడియో ప్రోపగేషన్ సెంటరు లో పనిచేస్తున్న శ్రీ ఎ వి యస్ కృష్ణారావు గారిని యేర్పాటు చేశారు. కృష్ణారావుగారి వయొలిన్ వాదనను అంతకు ముందు ఆంధ్రాయూనివర్శిటీ రోజులనుంచీ విన్నవారెందరో సభలో వున్నారు. ఆనాటి చాలామంది శ్రోతలలో యేర్పడిన అభిప్రాయమేమిటంటే బాలమురళి గాత్రంకన్నా వాయులీన సహవాద్యమే ఒకమెట్టుపైనవుందని. ఒకటి రెండు సార్లు కృష్ణారావుగారిని పక్కకునెట్టే ప్రయత్నంచేసి సఫలంకాకపోగా చివరకు వారిని అభినందించక తప్పని పరిస్తితి యేర్పడ్డది. అమెరికాలో గత పుష్కరకాలంలో ఆయనను చాలా కచేరీల్లో చూశాను, విన్నాను. కాని ఆ నాటి ధోరణి కనపడలేదు. మరి అప్పటి ప్రవర్తనకు వర్ధమాన గాయకులకుండే భద్రతారాహిత్యమేనా కారణం? లేక తోటి కళాకారులపట్ల గౌరవంపెరిగిందా?
మీ వ్యాసం చాలా బాగుంది. ఎన్నో పుస్తకాలను తిరగేసి, చాలా మందిని సంప్రదిస్తే తప్ప ఇటువంటి మంచి వ్యాసం రాదు.
త్యాగరాజుపై ప్రజాభిప్రాయం మీరు రాసిన దానికన్నా ఎందుకు భిన్నంగా వస్తూ ఉందో తెలియదు. త్యాగబ్రహ్మ కటిక పేదరికం అనుభవించాడని అందరిలాగే నేనూ అనుకొనేవాడిని. కాని, దానికి భిన్నంగా తగినంత ఆస్తిపరుడేనని మొన్న మొన్న తెలిసింది.
త్యాగరాజు మీద నాకు చాలా ఎక్కువ గౌరవం. అయితే, నన్ను ఎప్పుడూ ఒక్క విషయం కలవరపెడుతుంది. సంగీతంలో అనుమానం లేకుండా అసామాన్య ప్రతిభ కలవాడైనా, సాహిత్యకారుడుగా ఈయన గొప్పతనం ఎంతవరకు పెద్దలు ఆమోదించారు? భక్తి రసం పోషణ ఈయన సాహిత్యం అంతా అతి చక్కగా తెలుస్తూనే ఉంటుంది. కానీ, సాహిత్యంలో భక్తి రసం పోతన తీసుకెళ్ళిన ఎత్తులు, మరెవరూ చేరలేరేమో!
సాహిత్యంతో బాగా పరిచయమున్న విజ్ఞులు దీనికి సమాధానం చెప్పగలరేమో!
ఈమాట జన్మానికి కారకులైన రామారావు గారికి అభినందనలు, కృతజ్ఞతలు. “వ్యాస విభాగం రాశిలోనూ, వాసిలోనూ పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా వుంది… వస్తువైశాల్యంతో పాటు …,” అని వారు అన్న దానితో నాకు భేదాభిప్రాయం ఉంది.
వ్యాసాల్లో ఎక్కువ భాగం సంగీత, సాహిత్య, విజ్ఞాన శాస్త్రాలకి పరిమితం. అది చాలదా, అంతకన్నా వైవిధ్యమేముంటుంది? అనిపించవచ్చు. కాని ఇవి ‘విషయభారమైన’ వ్యాసాలు; కొన్నయితే, జర్నల్స్ పేపర్లలాగా రెఫరెన్సుల జాబితాలతో సహా ఉంటాయి. 🙂 మహానుభావులు, విజ్ఞానవేత్తలు, కళాకోవిదులు – వీళ్ళ ప్రస్తావన లేని వ్యాసం అరుదు. ఇది ప్రవాసాంధ్రులలో ఉన్న లోపమా అన్న అనుమానం వచ్చింది.
కాని తన వచనం తన కవితలకే మాత్రమూ తీసిపోదని గర్వంగా చెప్పుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాసావళిని చూస్తే వాళ్ళ ఊళ్ళోని రావిచెట్టు మీద చెప్పిన ఓ అమూల్యాభిప్రాయం లాంటి ఒకటి రెండింటిని మినహాయిస్తే, మళ్ళా మహావ్యక్తులు, కవుల పరంపర, కవితా ప్రశస్తి – వాటికే ప్రాధాన్యత. వచనం చెప్పుకోదగ్గదేగాని, వైవిధ్యమెక్కడ?
కుప్ప తెప్పలుగా వ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబరావు ని తిరగేస్తే, “కళలు-శాస్త్రీయ విజ్ఞానం,” “సాహిత్య ప్రయోజనం,” “చరిత్ర వ్యాసాలు,” … – మళ్ళా అన్నీ విషయభారమైనవే!
సాహితీ ప్రక్రియలన్నిటిలోకీ సుళువైనదీ, అనేకానేక విషయాలకి అనువైనదీ, వ్యాసం: “There are as many kinds of essays as there are human attitudes or poses, as many essay flavors as there are Howard Johnson ice creams. The essayist arises in the morning and, if he has work to do, selects his garb from an unusually extensive wardrobe: he can pull on any sort of shirt, be any sort of person, according to his mood or his subject matter — philosopher, scold, jester, raconteur, confidant, pundit, devil’s advocate, enthusiast.” — EB White.
ఈమాట వ్యాసాల్లో కూడా వైవిధ్యం పెరగాలి. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు వేరే విషయాల మీద కూడా దృష్టిసారించాలి. రాయనివాళ్ళు ఇదో బ్రహ్మవిద్య కాదని గ్రహించి ప్రయత్నించాలి.
అలాగని వ్యాసాలు రాసి పేరుప్రతిష్టలు గడించాలనుకుంటే అది దురాశే. ఆ భాగ్యం కలగాలంటే కవితలూ, కథలూ, నవలలూ రాయండి. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అన్న పాదం మన భాష ఉన్నన్నాళ్ళూ నిలుస్తుంది. పూలు పూసినంత కాలం “ఓ పువ్వు పూసింది” చదువుకుంటాం. “అతడు-ఆమె,” మనం, మధ్య సంబంధాల మాటొచ్చినపుడల్లా శాంతం గారు మన మనసులో మెదులుతూనే ఉంటారు. అందుకే వాటికున్న యోగ్యత వ్యాసాలకి లేదు, ఉండబోదు.
అందుకే సాహిత్యకారుల్లోకెల్లా కవులకీ, కథకులకీ, నవలాకారులకీ పెద్ద పీట. అందుకు తగ్గట్టుగా ఈమాట రచయితలు ఎదుగుతారని ఆశిస్తూ,
“కాని కవికి గౌరవం చూపాలి, కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు….
“సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు,వాటిని చదివి ఆనందించవచ్చు…”
-mOhana అభిప్రాయం
కవిత్వంలో పొరలు ఉన్నట్లే, ఈ మాటలలో కూడ ‘ధ్వని’ ఉన్నది. An implied meaning. అది మీరు ఏ మాత్రం ఉద్దేశించి ఉండరు. కాని వేరే చెవులకు అలా వినిపిస్తుంది. అది ఏమిటంటే – చర్చలలో – ప్రశ్న అడిగినప్పుడల్లా, కవితో వ్యతిరేకించినప్పుడల్లా, ఇది మాకు నచ్చలేదు -అని ఒక పాఠకుడు వ్యక్త పరిచినపుడల్లా, మరొక పాఠకుడు వచ్చి -కవిని గౌరవించాలనీ, కవి మనకు తెలియని విషయాలు పరిచయం చేస్తున్నందుకు ఋణపడి ఉండాలనీ – ఇలాటి మాటలు మళ్ళీమళ్ళీ రాయటం.
ప్రశ్నలు అడిగిన వారికి కవిమీద గౌరవం లేదు – అన్న ధ్వని ఈ మాటలలో వినిపిస్తుంది. అది మంచిది కాదు. చాలా పాత పద్ధతి. సత్వరం మానివెయ్యాల్సిన పద్ధతి. ఈ పద్ధతి ప్రశ్నలు రాసే వాళ్ళను విముఖులను చేస్తుంది. విషయాలు నేర్చుకోటానికీ, తమ అభిప్రాయాలు వ్యక్త పరచటానికీ ప్రతిబంధకమవుతుంది. మనుషులు అందరూ ఒకరినొకరు గౌరవించుకోవలసిన అవసరం ఎప్పుడూ ఉంది. ఆ ఆదరానికి నోచుకోటానికి కవులూ, పండితులే కానక్కర్లేదు. కాబట్టి కవితలని గూర్చిన వాదాల్లో- కవులను గౌరవించాలి అని బోధలు అవసర్ల్లేదు.
మనకు అర్థం ఐన కవితలను గురించి అభిప్రాయాలు రాసుకుని, అర్థం కాని వాటిని గురించి మౌనంగా ఉంటే, కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటాము? అర్థం కాని వాటిని గురించి ఎందుకు అడగ్గూడదు? చేతనైన వాళ్ళు చెపుతూనే ఉండాలి. చెప్పినందువల్ల ఈ కవిత కొంతైనా అర్థమయిందికదా.ఈ కవి రచనలు మరింత చదివిన కొద్దీ, ఇంకా ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంది.
ఐనా, కవులు, పాఠకులు, అని వర్గాలు -అన్ని వేళలా లేవే. పండితులూ, కవులూ సర్వ వేళలా గురువులే కారే. వారు శిష్యులు కూడా. ఒకరి ప్రశ్నలూ, అభిప్రాయాలనుంచి ఇంకొకరు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు కాదా.
కవిని గౌరవించక పోతే కవిత్వం మనుషులకు అర్థం కాదా ఏమిటి? ఈ కవి చెప్పిన ప్రకారం ఒక్క ప్రియురాలి మనసు తప్ప అందరికీ అన్నీ అర్థం అయ్యే అవకాశం ఉన్నట్లే ఉంది మరి.
మొన్న డెట్రాయిట్లో జరిగిన సమావేశంలో (నా సమీక్ష చూడండి) కవితల పైన ఒక సదస్సు ఉండింది. అందులో కవితలో పొరలు పొరలుగా అర్థం ఉండాలి అన్నారు ఒకరు. కాని అలా రాస్తే పాఠకులకు అర్థం అవుతుందా అనే ప్రశ్నకు ఈ చర్చ జవాబు అనుకొంటాను. ఇందులో ఎన్నో పొరలు ఉన్నాయి. ఎవరికి కావలసిన అర్థాలు వారు కల్పించుకోవచ్చు. కొన్ని రచయితకు కూడా తోచిఉండక పోవచ్చు. ఉదాహరణకు బుద్ధుని శిరస్సు, మొండెము. దీనిని చదువగానే నాకు తోచింది ఎప్పుడో చదివిన షెల్లీగారు రాసిన ఓజిమాండియస్ అనే సానెట్. అందులో కూడా విరిగిన ఓజిమాండియస్ శిలావిగ్రహం ఎడారిలో ఉంటుంది.
My name is Ozymandius, King of Kings,
Look on my works, ye Mighty, and despair!
అని అంతమవుతుంది. నిరంకుశుని ఎవరూ తలచుకోరు. ఆ విగ్రహంలోని కళను తప్ప, దాని కారకుడు శిల్పి. బుద్ధుని విగ్రహం విరిగి ఉన్నా, బుద్ధుని ఇప్పుడు కూడా పూజిస్తూనే ఉన్నారు కలువలతో. మనం ఎలా జీవిస్తున్నామో అన్నదే ముఖ్యం అనే ఒక భావన కలుగుతుంది ఈ పంక్తులు చదివిన తరువాత. ఈ ఊహ అందరికీ కలుగకపోవచ్చు. కాని పొరలు పొరలుగా ఉండాలి కవిత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక కవిత మంచిదో కాదో అనే దానికి తూనిక రాళ్ళు ఎలాగ ఉండాలో చెప్పలేము (వేలూరిగారి వ్యాసం చదవండి). కవిత మంచిదైతే కలకాలం నిలుస్తుంది, లేకపోతే తెలుగు సినిమాలా ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కాని కవికి గౌరవం చూపాలి,
కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు. సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు, వాటిని చదివి ఆనందించవచ్చు. నేను పారిస్ వెళ్లినప్పుడు పోంపెదూ మ్యూసియంకి వెళ్లాను. అది మాడర్న్ ఆర్ట్ పైన. అందులో కొన్ని నాకు ఇంకా అర్థం కాలేదు. కాని ఉత్తమ కళాకారులచే సృష్టించబడినవి అవి. దానిని రసాస్వాదన చేయలేకపోవడం నా తప్పే గాని మ్యూసియం వారిది మాత్రం కాదు. విధేయుడు – మోహన
సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/07/2008 1:15 pm
కామేశ్వరరావు గారు
ముందుగా, నచ్చనిది మర్యాదగా, అవహేళన చేయకుండా చెప్పడాన్ని పూర్తిగా అంగీకరిస్తాను. నేను రాసింది, రాస్తున్నది అది కాదనే ఆశిస్తాను.
ఇక ఈ చర్చ, కవిత ఎంతమందికి అర్థం అవ్వాలి అని opinion poll లో తూచి వెలకట్టడం కాదనుకుంటాను. సొంతంగా ఎంతవరకు కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడానికి వీలవుతున్నది అన్నదే ప్రశ్న అనిపిస్తుంది. కనీసం దేనిగురించో అన్నదైనా తెలియవీలవుతుందా అని కూడా.
కవిత యొక్క శీర్షిక “సువర్ణ భూమిలో…” అన్నారు. థాయలాండ్్ ని “సువర్ణభూమి” అని అంటారని చదవలేదు, వినలేదు. తెలిసిన వారు చెప్ప మనవి. థాయ్లాండ్్ పూర్వనామం సియాం. సియాం కు సంస్కృతంలో ఉన్న “శ్యామ” కు సంబంధం ఉంది. “శ్యామ” అంటే నలుపు, నీలం కాని సువర్ణమని తోచడంలేదు. ఇదంతా ఎందుకంటే, థాయలాండ్్ గురించి ఎక్కువగా తెలియని వారికి, ఈ కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడం కష్టం. మోహనగారు, మీరూ, చెప్పింతర్వాత కొంత background తెలిసి ఇది అసలు దేనిగురించో అన్న చిక్కుముడి వీడింది. అది చాలు పాఠకునికి ఊరటనివ్వడానికి.
కవితను ఆస్వాదించడం పక్కకు పెట్టి, అసలు దేనిగురించి చెబుతున్నారో కూడా తెలియని అయోమయ స్థితిని నివారించడం రచయిత బాధ్యతే కాదు, politeness to readers అనిపిస్తుంది. ఏం చెప్పారో అని కాదు, దేని గురించి చెప్పారో అన్నదే తేలకపోతే గందరగోళం. సమయం వెచ్చించి, కష్టపడి చదివితే, దేనిగురించి చెప్పారో కూడా తెలియని స్థితిలో ఉంటే ఆ రచనను rude to readers అని ఎందుకు అనుకోకూడదో తెలియదు. That is no reason to be rude to writer in turn.
=============
Regards
-Srinivas
ఇక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే మనుషుల్లో ఇంతటి అసహనం ఉంటుందా అన్న ఆశ్చర్యం కలుగుతోంది, బాధేస్తోంది. ఎందుకంటే,
1. మనకి ఒక కవిత నచ్చకపోతే (అర్థంకాకపోతే) అది నచ్చలేదని (అర్థం కాలేదని) మర్యాదగా చెప్పవచ్చు, అవహేళన చెయ్యాల్సిన అవసరం లేదు.
2. సరే కొంతమందికి అర్థం కాలేదని, మాకు అర్థమయిందేదో నేను, అలానే మోహనగారు చెప్పాం. మేమేమీ కొమ్ములు మొలిచిన పాఠకులం కాదు, మామూలు పాఠకులమే. మేమర్థం చేసుకున్నట్టుగా తక్కిన వాళ్ళు అర్థం చేసుకోవాలని రూలేం లేదు. అయితే దీన్నేదో కవితకి సమర్థింపుగా అనుకోవడంలో అర్థమేముంది? నాకు భూషణ్ గారు చుట్టమేమీ కాదు, అసలు నాకతనితో పరిచయమే లేదు, అతను నా అభిమానకవి అంతకన్నా కాదు. మరి దేనికి ఉట్టినే సమర్థిస్తాను? అసలు అతని కవిత బాగుంది అని కూడా నేననలేదే! మరి సమర్థింపు ఏమిటి?
3. ప్రతికవితా మనకి అర్థం అవుతుందన్న నమ్మకమూ లేదు, అవ్వాల్సిన అవసరమూ లేదు. మనకి అర్థం కాని కవితకి వేరెవరైనా తమకి తోచిన అర్థాన్ని చెపితే, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉచితమైన పని. “నేనలా అర్థం చేసుకోడానికి ప్రయత్నించను, నాకు ప్రతీదీ అప్రయత్నంగానే అర్థమవ్వాలి, అలా అవ్వకపోతే అది కవిత కాదు” అని అనుకోవడం మొండితనమే అవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు?
బాబాగారు, శ్రీనివాస్ గారు, బాబ్జీలు గారు,
కవితని ఒక పాఠకునిగా మనం అర్థం చేసుకొని ఎంతవరకూ ఆస్వాదించేం అన్నది ముఖ్యం కాని, అది ఎంతమందికి అర్థం అవ్వాలి? ఎక్కువమందికి అర్థమయ్యేట్టు కవి రాసాడా? అలా రాయకపోవడం కవి దోషమా ఇత్యాది వాదోపవాదనలు అవసరం అంటారా?
మాధవ్ గారు,
మీరు మంచి లా పాయింటే లాగేరు కాని, మీరా ప్రశ్నవేసింది నన్నూ నన్నెచోడుణ్ణి కాదు, కాళిదాసుని 🙂 ఎందుకంటే ఈ పద్యానికి మూలం సంస్కృత కుమారసంభవంలో ఉన్న ఈ శ్లోకం:
కాకపోతే కాళిదాసు “చిరేణ” అంటూ నీటిబిందువులని నాభి దగ్గరకి కాస్త నెమ్మదిగా తెస్తే, నన్నెచోడుడు “రయంబున” పరిగెట్టించాడు.
అందమైన ఆడవారి సుందరాంగాలలో ఈ వళులు ఒక భాగం, కాబట్టి ఆ స్థితిలో కూడా పార్వతి తన సహజమైన అందాన్ని కోల్ఫోలేదని అనుకోవాలి!
బాబా గారు,
మీరు యదుకులభూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తర్వాత కవిత అర్థం కాకపోయినా ఏదో ఉండి ఉంటుందిలే అని అనుకున్నానన్నారు. నేను కూడా భూషణ్ గారి కవిత్వం, అతనికి కవిత్వంపై ఉన్న దృక్పథం రుచి చూడడం మూలానే, ఆ కవితలో చెప్పిన విషయం కాకుండా అంతర్గతంగా మరేదీ దాగి ఉండదని నిర్ణయించుకున్నాను!వినీల్ గారు గణితంతో చెప్పిన పోలికా, కవితలోంచి తీయడానికి ప్రయత్నించిన అర్థమూ చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నా అవగాహన మేరకు భూషణ్ గారు సరిగ్గా అలాటి దానికి వ్యతిరేకి! క్లుప్తత విషయంలో అతనన్నది నిజమే కాని, కవితలకి అస్పష్టతని తెచ్చి పెట్టే సాంకేతికత (symbolism) అంటే, నాకు తెలిసి భూషణ్ గారికి అసలు నచ్చదు.
చివరిగా మీరడిగిన మిలియన్ డాలర్ల ప్రశ్నకి నా రెండు సెంట్లు: మనవాళ్ళు “సహృదయత” అన్నది పాఠకుల విషయంలోనే చెప్పారు కాబట్టి, కవి హృదయాన్ని తెలుసుకోవలసిన బాధ్యత పాఠకులదే అని నా ఉద్దేశం. అది ఎక్కువమంది పాఠకులు చెయ్యగలిస్తే ఆ కవికి ప్రాచుర్యం లభిస్తుంది. ఎవరూ అర్థం చేసుకోలేకపోతే, ఆ కవి ఒంటరిగా మిగిలిపోతాడు!
కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో సాధారణంగా పాఠకుడు ఉండటంలో తప్పుకాదుగా. ఎందుకంటే యదుకుల భూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తరువాత, కొంత ఎక్స్పెక్టేషన్ తో కవిత ను చదవటం, కొంత అర్ధం కాకపోయినా ఎదో ఉండి ఉంటుందిలే, అని సరిపెట్టుకోవటం, తోచిన రీతిలో అన్వయించుకోవటం సహజమే.
ఏది ఏమైనా ఈ పద్యాలు ఈ క్రింది ఇవ్వబడిన లింకులోని వారి కవితా సంపుటిలోని పద్యాల వలేకాక, కొంత అస్ఫష్టంగానూ, ప్రతీ ఒక వాక్యానికీ ఏదో ఒక భాష్యం చెప్పుకొంటే తప్ప అర్ధంకానట్లు గానూ ఉన్నాయన మాట వాస్తవం.
కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో ప్రతి కవితనీ శల్యపరీక్షకి గురిచేస్తే ఇలాటి అవస్థే ఏర్పడుతుంది కాబోలు!
నాకు చదవగానే కవిత చాలా తేలికగానే అర్థమైందనిపించించి! కవి థాయిలాండు యాత్ర చేసాడు. ఆ యాత్రలో అతని మనఃఫలకంపై బలంగా ముద్రపడిన కొన్ని దృశ్యాలను, మిగిల్చిన అనుభూతిని యథాతథంగా పదాలలో చిత్రించే ప్రయత్నం ఈ కవిత అని నా కనిపించింది.
ఆ తర్వాత వెతికితే ఈ లంకె కనిపించింది: http://www.pbase.com/ratluk/allofthailand
ఈ కవితలో ఉన్న కొన్ని పద చిత్రాలకి చాయా చిత్రాలని ఆ లంకెలో చూడవచ్చు.
నా ఉద్దేశంలో ఇది రచయిత తాయిలాండు దేశం వెళ్లినప్పుడు అక్కడ బుద్ధుని విగ్రహాలను చూచి వ్రాసిందనుకొంటాను. అక్కడ సుఖాసీనులైన బుద్ధుల చిత్రాన్ని ఇక్కడ చూడగలరు. బంగారు బుద్ధ విగ్రహాలు కూడా ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి . సముద్రం అడుగులో బహుశా రచయిత అండర్ వాటర్ డైవింగ్ చేశారేమో? ఆ అనుభూతిని వ్రాసి ఉంటారు. తాయిలాండు సముద్రతీరాలు దీనికి ప్రసిద్ధమైనవి. మన సినిమావాళ్లు కూడా ఇలాటి షూటింగులను ఎన్నో చేశారు గదా! చివరగా భాషలను త్వరగా నేర్వగలము, కాని మనుషులు, వారి మనసులు అర్థం చేసికోవడం కష్టం అని తెలిపారు. రచయితకు చాలా భాషలు వచ్చు, తాయిలాండుకు విహారయాత్రకు వెళ్లినప్పుడు వ్రాసినది అని నా భావన. కవుల మనసులో ఏముందో మనకేం తెలుసు?
విధేయుడు – మోహన
సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/06/2008 9:21 am
I say, not just poem, but any writing starts only in writers mind and ends in reader’s. Probably with the exception of one’s shopping list.
గణితం నేర్చుకున్న ప్రతి విద్యార్థికి Fermat Theorem’s proof అర్థం కాకపోవచ్చు. కాణి, గణితం కూడా రానివారు సైతం అది Fermat Theorem’s proof గురించి అని మాత్రం తెలుసుకోవచ్చు, సుళువుగా.
మరి రచన అర్థం కాకపోయినా, అసలు అది దేని గురించి అన్నది కూడా స్పష్టంగా తెలియకపోతే ఆ రచన పాఠకులను చేరుతుందే కాని, తాకదు. రచన అనే అన్నాను, కవిత అని అనలేదు. ముందు రచన అర్థం అయితే, అది కవితో కాదో కూడా తెలుసుకోవచ్చు.
చివరలో చెప్పింది “దూరమైన థాయ్ భాష నేర్చుకున్నా కూడా, దగ్గరున్న ప్రియురాలు మనసు తెలుసుకోలేకపోయాను” అన్న contrasting తో చేసిన
వ్యక్తీకరణ బాగుంది.
అది తప్ప మిగితాది ఏది కూడా దేన్ని గురించి చెపుతున్నారో, ఏం చెప్పదలచుకున్నారో, ఏమీ అర్థం కాని (దు)స్థితి, interpretation ఇచ్చినప్పటికినీ. Interpretation తెలిసినదానికి లోతును, వైవిధ్యాన్ని ఇవ్వగలదేమో కాని, తెలియని దానిని పరిచయం చేయలేదు అనిపిస్తుంది.
May be better to study about Fermat Theorem’s proof, even if not totally understood _ it only widens one’s understanding.
====
Regards
Srinivas
తెలుగులో ఉండి, అన్నీ తెలిసిన పదాలే ఉన్నంత మాత్రాన ప్రతి కవిత మనకి అర్థం కావలనుకోవడం, కాస్తో కూస్తో గణితం నేర్చుకొన్న ప్రతి విద్యార్థికి, ఫెర్మాట్స్ థియరం ప్రూఫు అర్థమవ్వాలనుకోవడం లాంటిది.
ఈ సంచికలోనే వేలూరి గారి “నేనొక సాధారణ పాఠకుణ్ణి” వ్యాసంలో ఈవాక్యాలు బాగా పనికొస్తాయి ఈ కవిత గురించి రెండు మాటలు చెప్పడానికి. “… ఇలా అనుభవ పరిథి పెరిగి, జ్ఞాపకాలు పెరగడంతో, నీవు విద్యాధికుడవవుతున్నావు. అది మంచిదే. కానీ, దీనితో ఒక చిక్కు లేకపోలేదు. నీకు సరికొత్త పదజాలం అబ్బుతుంది అన్నాం కదూ! దానితో, నీ స్నేహపరివారం తగ్గుతుంది. ఎందుకంటే, నీ పరిభాష అర్థం చేసుకొనే వాళ్ళు, సరిగ్గా నీకు మల్లే అనుభవించి, ఆనందించిన వాళ్ళే అవుతారు. మిగిలినవాళ్ళకి నీ పరిభాష పరమ అరుచి కలిగిస్తుంది…”
భూషణ్ కవిత్వం ఇలాగే ఉంటుందనిపిస్తుంది నాకు. ఈ కవి కవితల్లో క్లుప్తత తారాస్థాయికి చేరి ఒక గణిత సమీకరణమంత క్లుప్తంగా తయారవుతాయి, కవితలు. గణితంలో ఏమో కానీ, కవిత్వంలో ఇలాంటి క్లుప్తత వల్ల కవితలు డేవిడ్ లించ్ సినిమాల్లాగా open to reader’s interepretation అవుతాయి. ఉదాహరణకు సువర్ణభూమి కవితకు నాకు తోచిన ఒక ఇంటర్ ప్రెటేషన్.
“ముఖా ముఖి సుఖాసీనులై బుద్ధులు ( చక్కని కవిత్వం వ్రాసే కవి, అస్వాదిస్తున్నపాఠకుడు)
వాడని కలువలు ( మంచి కవితలు)
అలముకున్న ధూపం (పాఠకుని మదిలో ఆవరించిన కవిత్వ సౌందర్యం)
ఎదురెండలో ఎర్రచారల పిల్లి,
చెలగాట మాడుతుంది
తలపాదాలమీదుంచి.
(కొన్ని కవితలు కదళీ పాకాలైతే, కొన్ని నారికేళ పాకాలు. తమకు అర్థం కాని కవితకు అర్థమే లేదని కుప్పిగంతులు వేసే పాఠకులే ఈ ఎర్రచారల పిల్లులు)
ఎన్నో మెట్లెక్కి/గర్భ గృహంలో/గబ్బిలాలను/అదిలిస్తున్నాడు/విహార భిక్షువు ( ఉచ్ఛస్థాయిలో ఉండే కవిత్వమనే ఆలయపు పవిత్రతను, గబ్బిలాలను పారద్రోలి కాపాడే విమర్శకుడు).
As some wise soul once said, A poem starts in writers mind and ends in readers mind. To conclude, for some one who is used to Van Gogh’s impressionistic paintings, Picasso’s Guernica might be pointless. That does nt reduce the essence of Guernica by an ounce.
వినీల్.
అరణ్య కవితలు గురించి A. KISHORE BABU గారి అభిప్రాయం:
11/05/2008 1:07 am
సుబ్రహ్మణ్యం గారు
మీకు మొదట నా అభినంధనలు.
మీ కవితలు చాలా ఆలస్యంగా చదివాను.నేను కవితలు రాయను కానీ బాగా చదువుతాను. ఎక్కడైనా ఒక మంచి కవిత చూసినా హాయిగా చదువుకొని హృదయంలొ దాచుకొంటాను. ఇక్కడ కొంతమంది చేసిన విమర్శల గురించి ఎమీ పట్టించుకోకండి.అసలు ఏ కవి కూడా కవిత్వం కేవలం తనకోసం రాసుకొంటాడనేది నా అభిప్రాయము. ఆ సమయంలో కవి తాను పొందిన అనుభూతిని అక్షరాల్లో ఆవిష్కరించుకొంటాడు. అది మీరైనా, ఎవరైనా కావొచ్చు. మీ కవితల్లో ఎంతో అనుభూతివుంది.
“ఎంత దారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ
అడవిలో మరొకసారి
తప్పి పోవాలని ఉంది”
ఎంత గొప్ప అనుభూతి. ఇది అనుభవించినవారికే తెలుస్తుంది. మరి కొన్ని కవితల్లో మీరు..
“సముద్రం నుంచి
పల్చటి నీటి పొర
రెక్కలు కట్టుకొని
రెప్పల కిందకి చేరుతుంటే
మౌనంగా
ఆ తీరాన ఆమె
ఈ తీరాన నేను”
…
“….
ప్రకృతి రంగులన్నిటిని
దోచెసుకొని రాత్రి
తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడి చేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదిస్తాడు”
ఆదునికత కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఇప్పుడెలాగు ఆ ప్రకృతి రమణీయతకు దూరమవుతున్నాము.పచ్చటి పైర్లు, పల్లె లోగిళ్ళ అందాలు ఎక్కడా. ఆ ప్రకృతి వొడిలో తిరిగి తిరిగి అలసి సొలసి, సేదతీరి తమని తామె మైమరచిపోయే అదృష్టాన్ని కోల్పోతున్న కాంక్రీట్ జంగిల్ పక్షులం. కనీసం ఇలాంటి కవితలు చదివినప్పుడైనా మళ్ళి ఒకింత సేపు మనసు ఆ ప్రకృతి వొడిని ఊహించుకొని సేద తీరుంది. ఇక్కడ విమర్శకులను నేనేమీ అనడం లేదు. కాకుంటే ఒక మనవి..
నేడు తెలుగు అంతరించి పోతోందని, ముఖ్యంగా ఇంగ్లీషు మోజులో నేటి తరం తెలుగు భాషా సౌందర్యాన్ని మరచి పోతున్నారని బాధపడుతున్న తెలుగు లోకం ఒకసారి ఇలాంటి యువ కవులను వెన్ను తట్టి ప్రోత్సహించండి.ఇది మరికొంతమంది నవ కవులు పుట్టుకు రావడానికి దోహదపడుతుంది. కవులు కాక పోయినా ఫరవాలేదు, కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మార్చే వారైనా పుట్టుకొస్తారు.
ఈ స్పూర్థితో మరికొంత మంది నవ కవులు (మీ దృష్టిలొ కవులు కకున్నా ఫరవాలేదు) కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మర్చే వారైనా పుట్టుకొస్తారు..
“నేను బతకటానికి ఏమి కావాలి
ఒక్క చిరునవ్వు చాలు
ఆమె నవ్వింది
నేను బతికాను”
ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం దారిలొ దొరికిన కాగితంలో కవి ఆశారాజు రాసిన కవితలో చివరి వాక్యలు ఇవి..
ఎంత తృప్తి కలిగించే కవితా ప్రయోగం, (వచనా ప్రయోగం అని కూడా అనుకోండి ఇబ్బంది లేదు).
“తెలుగు బతకడానికి ఏమి కావాలి
చక్కటి భావాన్ని వొలికే
నాలుగు కమ్మని
పదాలు తప్ప”
మంచి కవిత రాశారు
తెలుగు తల్లి నవ్వింది
అమృతంలాంటి తెలుగు
కవితా లోకానికి
మీకు ఇదే
నా చిరునవ్వుల స్వాగతం.
మంచి ప్రశ్న వేసారు. నాకో సందేహం.
విలువలు / Ethics కేవలం రచయితలకే సంబంధించిన విషయమా? సంపాదకులకది వర్తించదా? ఎందుకిలా అడుగుతున్నానంటే, గతంలో ఒక వెబ్ పత్రికలో వచ్చిన కొన్ని కథలూ, వ్యాసాలూ ఇంకో పుస్తకంలో రచయితల ఆమోదమం లేకుండా వేసేసారు. ఆ పుస్తకాలు అమ్మకానికీ పెట్టారు.
గతంలో నేనొక పత్రికకి కాలమ్ రాసేవాణ్ణి. నాకు ఏ రకమైన సమాచారం ఇవ్వకుండానే ఓ రెండు రోజులుంచి, ఆ మర్నాడు తీసేసారు. గట్టిగా అడిగితే మళ్ళీ పెట్టారు. అందుకే చాలా పత్రికలు హామీ పత్రం తీసుకుంటాయి. అది పాటిస్తే సంపాదకులకీ, రచయితలకీ ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం, ఏ పత్రికయినా రచయితలకి పారితోషికం చెల్లిస్తున్నారా? అదుంటే పత్రిక వాళ్ళు అడగడంలో అర్థం ఉంది. ఎదో ఒక వెబ్ పత్రిక పెట్టుకొని అందులో వచ్చే వ్యాసాలూ, కథలూ వేరే చోట ప్రచురణ కాకూడదని ఆ పత్రిక వారికనిపిస్తే అది చెప్పాలి. గతంలో ఈ మాటలో వచ్చిన కథలు కొన్ని ఆంధ్రజ్యోతిలోనూ, విపుల లోనూ వచ్చాయి. అలాగే అమెరికాలో అనేక సావనీర్లలో కథలు తిరిగి ప్రచురించబడుతున్నాయి. ప్రస్తుత సాహితీ రంగంలో Ethics నిర్వచనాలు ఎవరికి తగ్గట్లు వాళ్ళు చెప్తున్నారు. అంతే!
ఇందులో రచయితల్ని Ethics అంటూ నిలదీయడం ఎంత వరకు సబబు? Ethics అందరికీ వర్తిస్తాయి కదా?
రచయితకి ధన్యవాదాలు. ఈసినిమా వచ్చి చాలా కాలంఅయినా, మా చిన్నతనంలో అంటే 60 దశకాల్లో ఆ సినిమా గురించి చెప్పుకునె వాళ్ళు. నేను సినిమా చూడ్టం జరిగింది. కాని ఏమి అర్ధం కాలేదు. అప్ప టికే నలుపు తెలుపు సినిమా క్లియర్ గా లేదు. ఇన్నేళ్ళ తరువాత ఆ సినిమా గురించి విపులంగా తెలిసింది. నాకు నచ్చిన సినిమా ఇది.
ఈమాట – నామాట గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/02/2008 8:11 pm
ఈమాట సంపాదక, రచయిత, పాఠక వర్గానికి పదో జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు కాలాల పాటు ఈ పత్రిక వెలగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంచికకీ రాత్రింబవళ్ళూ శ్రమించే సంపాదకులకి, ముఖ్యంగా నాకెక్కువ సాయపడే సురేష్ కీ, పద్మ గారికీ, కృతజ్ఞతలు. ఎంత చిన్న విషయాన్నయినా తేలిగ్గా తీసుకోకుండా ఉన్నత స్థాయిలో ప్రచురించాలనే వారి దీక్ష మెచ్చుకోదగ్గది. వాళ్ళు మార్చినది బాలేదని నేను పేచీ పెడ్తే ఓపిగ్గా సమాధానం ఇచ్చి సామరస్యంగా పరిష్కరించడం సంతోషకరం. వారి ఉద్యోగ బాధ్యతలని నిర్వర్తిస్తూ, బహుశా కుటుంబ బాధ్యతలని కొంతవరకు నిర్లక్ష్యం చేస్తూ ఈమాట కోసం పాటుపడుతున్న సంపాదకుల అంకిత భావం స్ఫూర్తిదాయకం.
Peer Review గురించి: సంపాదకులకి తలకి మించిన పనిభారం వలన గానీ, పరిమిత విషయ పరిజ్ఞానం వలన గానీ, కొన్నిటిని వేరే వాళ్ళని సమీక్షించమంటే సరే, కాని అది పత్రిక పద్ధతిగా పెట్టుకుంటే, నాదొక సందేహం. ఇది సాహితీ పత్రికలలో సాధారణంగా చేస్తారా? ఉన్నత ప్రమాణాలున్న, తెలుగులో లేకపోతే ఇంగ్లీషులోనే తీసుకోండి, ఇతర సాహితీ పత్రికలలో ఇదేనా ఆనవాయితీ? నాకు నిజంగానే తెలియకే అడుగుతున్నాను.
ఈమాట సంపాదక వర్గం అంతా, రచయితల్లో చాలా మందీ, బహుశా పాఠకుల్లో కూడా చాలా వరకూ, విజ్ఞానశాస్త్రాల్లో విద్యాధికులూ, నిష్ణాతులూనూ. కాని సాహితీ పత్రిక అన్ని రంగాల వాళ్ళనీ ఆకర్షించేదిగా ఉండాలి. ఈమాటని Physical Review ప్రమాణాలతో నడుపుతాం అంటే శాస్త్రరంగాలలో లేనివాళ్ళకి కాస్త “భయం” కలగొచ్చు. The New Yorker పద్ధతిన నడుపుతాం అంటే బహుశా అందరికీ ఆమోదయోగ్యం కావొచ్చు.
ఈమాటకు జన్మదిన శుభాకాంక్షలు. నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకొంటున్నాను. పీర్ రెవ్యూ గురించి ఒక రెండు మాటలు. నా తలలో ఏముందో ఎంత ఉందో తెలియదు, కాని నాకు తలేమో పండిందని ఒప్పుకోవాల్సిందే! సంపాదకుల, సమీక్షకుల సలహాలు రచన అందానికి మెరుగు తెస్తుంది కాని దానికి మసి పూయదు. రచయిత తన రచనను తన దృష్టినుండి మాత్రమే చూడడానికి అవకాశం ఉంది. కాని సంపాదకుల దృష్టి, సమీక్షకుల దృష్టి ఆ రచన పత్రికకు ఎలా సరిపోతుందో, పాఠకులను ఎలా ఆకర్షించ గలుగుతుందో అనే దానిపైన ఉంటుంది. ఈ రెంటికి మధ్య ఒక ఘర్షణ ఉందనుకోవడం పొరబాటు. “మంచి” సంపాదకత్వంవల్ల సామాన్యమైన రచన మంచి రచన అవడానికి, మంచి రచన ఇంకా మంచి రచన అవడానికి అవకాశం ఉంది. అన్ని రచనలను సంపాదకులు మాత్రమే సమీక్షించడానికి వీలుకాదు. వాళ్లకు పని ఉంది, కుటుంబం ఉంది, సరదాలు ఉన్నాయి. అది కాక బయస్ కూడా కలగడానికి అవకాశం ఉంది. కొన్ని రచనలలో వాళ్లు ఎంతో ఓపికతో తమ కాలాన్ని వినియోగిస్తారు. ఇది నాకు బాగా తెలుసు. కాని నాదొక కోరిక. ప్రతి ఏడాది చివర సమీక్షకుల పేరులు తెలియజేస్తే బాగుంటుంది. కొన్ని విజ్ఞాన శాస్త్ర పత్రికలకు ఈ వాడుక ఉన్నది. దీనివల్ల రచయితలకు, పాఠకులకు పత్రిక standard తెలుస్తుంది. పత్రిక ఔన్నత్యము పత్రిక రచనలపైన, రచయితలపైన, సంపాదకులపైన, సమీక్షకులపైన ఆధారపడి ఉంటుంది. వీటిలో మొదటి మూడు మనకు తెలుసు. నాలుగవది మాత్రం తెలియదు. అందుకే ఈ చిన్న సలహా.
విధేయుడు – మోహన
ఈమాట – నామాట గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
11/02/2008 12:03 pm
ఈ మాట సంపాదక వర్గాన్ని ప్రచురణ ముందు “సమీక్ష” విషయంలో అభినందించాలి. ఇందులో రాసినట్లుగా తెలుగు వారికీ, ముఖ్యం గా రచయితలకి మూడో సమీక్ష ( “peer review” ) అనేది కొత్త విషయం. మొదటి సమీక్ష రచయితెలాగూ చేసుకుంటాడు. రెండోది సంపాదకులది. మూడోది చెయ్యడం వల్ల నిష్పాక్షిక అభిప్రాయం వచ్చే అవకాశముంది. రచయిత పేరు తెలీదు కాబట్టి వస్తువు మీదే గురి వుంటుంది. ఒక్కోసారి ఈ మూడో సమీక్షలు స్పష్టంగా ఉండవు. ఒక్కోసారి ఉపయోగపడతాయని నా అభిప్రాయం.
అమెరికా యూనివర్శిటీల్లో ఏదైనా టెక్నికల్ పేపర్ని పదిమందీ రివ్యూ చేస్తే కాని ప్రచురించరు. అలాగే కంపెనీల్లో కూడా రాసిన ప్రతీ టెక్నికల్ పేపర్నీ పదిమందీ రివ్యూ చేస్తారు. అందువల్ల నాణ్యత పెరుగుతుంది. ఒక జత కళ్ళకంటే పది జతలెప్పుడూ మేలే!
ఈ సమీక్ష అనేది తెలుగు వారికి కొత్త. తెలుగు రచయితలకి అహం ఎక్కువ, ఈగో ఇంగువ లాంటిది. ఎంత మూసినా వాసన వదల్దు. శృతిమించనంత వరకూ రివ్యూ అవసరమనే నా అభిప్రాయం.
అనేక వెబ్ పత్రికలొచాయి. వస్తున్నాయి కూడా. రంగులతోముస్తాబవుతాయి. కొన్ని వ్యాసాలూ, కథలూ చదివాకా, అందులో వుండే తప్పులూ తడకల్లో సంపాదకుల అశ్రద్ధ వద్దన్నా కనిపిస్తుంది. కొన్నయితే మరీ గాసిప్ వ్యాసాలు. ఇవన్నీ చూసాకా ఈమాట చాలా బెటరనిపిస్తోంది నాణ్యత విషయంలో. కాకపోతే గత రెండేళ్ళల్లో ఈ మాటలో వచ్చిన కొన్ని వ్యాసాలూ, కథలూ చూసాక ఇవి సంపాదకుల సమీక్షనెలా తప్పించుకుని వచ్చాయాయన్న అభిప్రాయం వుంది.
పత్రికలకి పైపై రంగులు కాదు కావల్సింది. లోపల రుచి నోరూరించాలి. పదిమందికీ పళ్ళెంలో పంచే ముందు, వండిన వస్తువుకి ఉప్పెక్కువా తక్కువా చూస్తే, అది వండిన వాళ్ళకీ, తినే వారి ఆరోగ్యానికి మంచిది. అభిరుచిని బట్టి ఆస్వాదిస్తారు.
ఈ మాట సంపాదకులకి చేకూరిన అనుభవం commendable అని నా ఉద్దేశం. ఈ నేపథ్యంలో Peer Reivew చేయించడం ఎంతవరకూ అవసరమో రచయితలూ, సంపాదకులూ జాగ్రత్తగా ఆలోచించాలి. తక్కిన వెబ్ పత్రికలూ, మామూలు పత్రికలూ ఏం చేస్తున్నారు? దీనివల్ల ‘తలపండిన’ రచయితలు కొందరు వెనక్కి తగ్గుతున్నారు. Brain storming sessions జరిగి ఉంటే వాటి వివరాలు dispassionateగా నమోదు కావాలి. ఈ కామెంటుని తీసేసినా పరవాలేదు కాని వెంటనే కాకపోయినా ఈ చర్చ జరగాలి.
బాబ్జీలు గారు,
మస్తు ఉపకారం చేసారు గా ప్రశ్న అడిగి. నా పాయింటుకు సూ…….టితనం తెచ్చారు.
వాడుక భాషలో పద్యాల గురించే మన ముచ్చట. మస్తుగా సదివినోళ్ళు, సూసినోళ్ళు, వాడుక భాషలోని పదానికే అర్థం తెలియక తటపటాయిస్తే, ఇక అందులో పద్యాలు రాయడం, చదవడం, అవి సులభంగా, సవ్యంగా పాఠకునికి అర్థమవడం- అంతా అయ్యే పనేనా అని పెద్ద, చెడ్డ అనుమానం. కారణం? మన సక్కని భాషకు సక్కని dictionaries సామాన్యులకు అందుబాటులో లేకపోవడం.
అదృష్టం బాగుండి Brown Telugu-English dictionary లో “మస్తు” అంటే “సమృద్ధి, plenty, abundance” అని ఒక అర్థం ఉంది. మనకున్న ఎన్నో dictionaries లో అది ఉంటుందని ఆశైతే లేదు. మనకాడ పుట్టిన bazaar పదానికి అర్థం వ్యుత్పత్తులు మన కాడ కన్నా English dictionaries లోనే మంచిగా దొరుకతయి. మనదైపోయిన పదానికి అర్థం, మరో భాషలోని పాటను చెప్పుకొని వివరించుకుంటేనేగాని అర్థం కాని దుస్థితిలో ఉన్నాం. వాడుక భాష వాడితేనే సదువుకున్నోళ్ళు పరేషానైపోతే, వేరేవాళ్ళ పరిస్థితి దేవుడెరుగు.
==============
విధేయుడు
-Srinivas
బాబ్జీలు గారికి నమస్కారం.
మోహనగారు వాడుక భాషలోనే కాదు, కొత్త ఛందాలలో కూడా పద్యాలు వ్రాస్తూనే ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా, ఎవరైనా ప్రయత్నిస్తే
సాయం కూడా చేస్తున్నారు. మనమే చదవట్లేదు!
త్యాగరాజుగారికి తమిళం బాగానే వచ్చి ఉంటుంది. కాని వారికి అందులో కవిత్వం వ్రాయగలిగిన శక్తి లేదేమో? ఆ కాలంలో దక్షిణదేశంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది సాహిత్యభాషగా. అదీకాక వారి మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాషలోనే తమ పాటలను వ్రాసి వాటికి స్వర జీవాన్ని పోశారు. ఆత్మ పొందే అవస్థను మాతృభాషలో కాక మరే భాషలో సులభంగా చెప్పగలం? ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మణిప్రవాళ కీర్తనలు కొన్ని తెలుగు తమిళ భాషలలో ఉన్నాయి. విధేయుడు – మోహన
చంద్రశేఖర రెడ్ది గారి వ్యాసంలో భాష చక్కగా ఉంది. పల్లె జీవితం కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అయితే జీవితం బహుముఖమైనది. వారి వ్యాసం చదివి, పల్లెటూళ్ళ గురించి బొత్తిగా తెలియని వాళ్ళు, “గుప్తుల కాలం స్వర్ణయుగమందురు” అన్నట్లు, ఒకప్పటి పల్లెలు స్వర్గసీమలని భ్రమపడే ప్రమాదముంది. దానిక్కాస్త విరుగుడుగా నా చిన్నతనంలో, స్వాతంత్ర్యం వచ్చిన పాతికేళ్ళకి, మా ఊళ్ళో జీవితం ఎలా ఉండేదో కాస్త రాస్తాను.
కాలకృత్యాలకీ, బర్రెగొడ్లని కడగడానికీ, చాకిరేవుకీ – అన్నిటికీ ఊరిచెరువే! జబ్బునపడితే మాఊళ్ళోనయితే కనీసం మంచి వైద్యులున్నారు. పొరుగు ఊళ్ళ వాళ్ళకి నాటువైద్యులే దిక్కు.
అతివృష్టీ,, కాకపోతే అనావృష్టీ. ఎండాకాలంలో రెండు మూడు మైళ్ళు పోయి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళం.
ఈ వ్యాసంలో పెద్దగా కనబడని వాళ్ళు మాలమాదిగ వాళ్ళు. ఊరికి వెలిగా ఉండేవాళ్ళు. కూలీలుగా రైతుల ఇళ్ళలో పాలేర్లుగా, జీతగాళ్ళుగా పనిచేసేవాళ్ళు. వీళ్ళని అన్ని కులాలకన్నా అతి హీనంగా చూసేవాళ్ళు.
బళ్ళో “ఆంటరానితనం మహా పాపం,” అని వల్లె వేసేవాళ్ళం. బడి బయట విధిగా అంటరానితనాన్ని పాటించేవాళ్ళు! నాకిప్పటికీ గుర్తు; పెద్ద బజార్లో హోటల్లో పెద్ద మనుషులంతా పేపర్లు చదువుతూ, అన్ని వ్యవహారాలూ మాట్లాడుకునే వాళ్ళు. వాళ్ళెదుటనే, గూట్లో వేరేగా గ్లాసులుండేవు. పబ్లిక్ ప్రదేశాలలోనే అలా ఉంటే ఇళ్ళల్లో విషయం చెప్పేదేముంది? నేను కాలేజీ సెలవులకి ఊరికెళ్ళినప్పుడు, ఓ పెద్దమనిషి, మాలా మాదిగోళ్ళని “ఒరేయ్” అనడానికి జంకాల్సొస్తుందని వాపోయాడు.
బాబాయ్, పిన్నాం, ఇలా వరస పెట్టి పిలుచుకునేవాళ్ళు – వేరే కులమయినా. కాని ఎవరి స్థాయి ఏమిటో అందరికీ తెలుసు. కుల ధర్మం తప్పక పాటిస్తారు. కులాంతర వివాహాలు అసంభవం; కులాంతర వివాహేతర సంబంధాలు మాత్రం అతి సామాన్యం!
ఊరి ప్రెసిడెంటుకి ఎన్నికలు జరిగేవి. రెండు పార్టీల వాళ్ళూ ఒకరికొకరు దాయాదులే. ఎన్ని తరాలు గడిచినా వేరే వాళ్ళు నిలబడే ప్రసక్తే లేదు. అసలా మాటే ఎక్కడా రాదు. ఈ మధ్యనే ఓ మాల ఆయన ప్రెసిడెంటు అయ్యాడు – రిజర్వేషన్ మూలాన. పెద్దమనుషుల చెప్పుచేతల్లో ఉండకుండా పోలేడు.
ధర్మవ్యాధుణ్ణి ప్రస్తావించారు కనుక చెప్తాను. మన సంస్కృతిలో కింద వర్ణాల వారిని పైవారు హీనంగా చూస్తే ఆశ్చర్యం లేదు – అది సంస్థాగతం. కాని తమని తామే హీనంగా భావించుకోవడం – “హీన యోనిజుండనయ్యును నిర్మలుండనైతిం” అని ధర్మవ్యాధుడు సగర్వంగా చెప్పుకోడంలో ఉంది విషాదమంతా.
చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు – వీళ్ళంతా పండక్కీ పబ్బానికీ ఆసాముల ఇళ్ళకి బుట్టతో పొయ్యేవాళ్ళు. “వండుకున్న అమ్మకి ఒక్కటే కూర; అడుక్కునమ్మకి అరవై కూరలు,” అన్న సామెతని బట్టి ఇదెంత గౌరవప్రదమైనదో తెలుస్తుంది. లాండ్రీ షాపో, బార్బర్ షాపో, గిన్నెల కొట్టో, లేకపోతే ఆ దిక్కుమాలిన వృత్తులకి సంబంధించకుండా కాస్త చదువుకొని నాలుగు రాళ్ళు సంపాదించుకుంటే గాని ఆ జీవితాలకి విముక్తి లేదు. అందుకు పల్లెటూళ్ళని వదిలి పారిపోతే విచారమెందుకు?
“మాలపల్లి” లో సంగందాసు అన్నట్లు, “సర్వేగుణాః కాంచన మాశ్రయంతే అని ధనాకర్షణ మార్గాలు చూపించందే, తక్కిన మంచి గుణాలు అలవాటుపడవు.”
భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మాగ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథంస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కత గని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండ గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు. మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం. కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగు తుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షులపేర్లు చెప్పారో చూడండి: మట్టగిడస, కర్రమోను, బొమ్మిడయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….. పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపుచిలుక, నత్తకొట్టుడు…. భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం అన్నారు నెహ్రూ. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా ఇండియాలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005) అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్నత విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించు కుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి. తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడ వెళ్ళారు. కొద్దిరోజులకే జార్జిబుష్ హైదరాబాద్ రావటం, సివికాన్ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‌కు చెందిన వారేనని తేల్చటం, దిల్‌కుష్ అతిథి భవనంలో అమెరికా వెళ్ళ టానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారు: ఆంగ్లమేరా జీవితం- ఆంగ్లమేరా శాశ్వతం ఆంగ్లమే మనకున్నది- ఆంగ్లమేరా పెన్నిధీ ఆంగ్లమును ప్రేమించు భాయీ- లేదు అంతకు మించి హాయీ ||ఆంగ్ల|| తెలుగును విడిచీ- ఆంగ్లము నేర్చీ అమెరికా పోదామూ- బానిసలవుదామూ డాలర్లు తెద్దామూ ||తెలుగు|| అంటూ పాటలు కూడ పాడుతున్నారు.
తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణా లతో సహా వివరిస్తున్నారు:
1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనను పెద్దగా ప్రోత్సాహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు.
2. పెద్ద కులాలవాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండ చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు.
3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవా లని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండి తులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.
4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డులపేర్లు చద వాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడ అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సుల భంగా వస్తుంది.
5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్ను లెత్త బ్రహ్మవశమే?
6. కంప్యూటర్‌కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్ నేర్వాలి.
7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్య మాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి.
ఇక మనం తెలుగువాళ్ళం అనీ, మన తెలుగును రక్షించుకుందాం అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?:
1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా?
2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన
3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సుళువుగా వస్తుంది. మన లిపిని కంప్యూ టర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమయితే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం.
4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడ తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి?
5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండ అమ్మా అని ఎందు కరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం.
6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండలి. కంప్యూటర్ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషు లోకి అనువదించుకున్నారు. అవసరం అటు వంటిది.
7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం చెయ్యడమే. తెలుగులోనే ఇంజనీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందు లకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృ భాషకు ప్రాథంమిక విద్యలోకూడ స్థానం లేకుండ చేసే వాళ్ళది ఇంటి కూడు తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా? మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిర స్కారం అన్నారు మహాత్మాగాంధీ. మాతృ భాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడ సరిగా రావు అన్నారు జార్జి బెర్నార్డ్‌షా. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారు: మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయ స్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినపుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం. (అమ్మనే మరుస్తారా! ఈనాడు 27-2-2006)
అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథల మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ డానియల్ నెగర్స్ ఇలా అంటున్నారు: తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకో డానికి సీఫెల్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయు లకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించ లేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషాసంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాష లున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులు తాయి. భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచిభాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడు కోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు. (ఆంధ్రజ్యోతి 22-2-2006) ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషాశాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవ సరమైన పదాలను రాయడంలో, చదవ డంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు.
మెదక్ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్ పూర్ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోం దట. విత్తనాల పేర్లు చూడండి: తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డ జొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ. (వార్త 6-3-2006) ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవ సాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్ పదాల కిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడ ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయాని కొచ్చారు. బాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యంకాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది.
తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించు కోవాల్సిన పదజాలం ఎంతోఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగు తుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచి నపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథంమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు. ప్రైవేట్ స్కూళ్ళు తెలుగు నేర్పవు.
మార్కుల కోసం కళాశాల విద్యార్ధులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో? కర్నాటకలో కన్నడం లేకుండ హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమి ళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్ స్కూళ్ళమీద కర్నాటక, తమిళనాడు ప్రభు త్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి. భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారుకూడ వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్.
గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవం గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 19ని తెలుగు మాండ లిక భాషా దినోత్సవం గానూ జరుపుకుంటు న్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.
నూర్‌బాషా రహంతుల్లా
ఈమాట గురించి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
10/01/2008 10:32 pm
బాబ్జీలు గారికి,
పల్లెటూరి నుండి వచ్చిన వాణ్ణి కాబట్టి బీడీల గురించి సందేహాలేం లేవు; ఖానా గట్టు గురించి ఉన్నాయి. మీ రాతల్లో నిగూఢంగా ఉన్న పద సంపద చెప్పుకోదగ్గది; మూడు నిఘంటువుల్లో వెతికినా “సబూరి” కనపడలేదు!
(2005 లో పదవీ స్వీకారం సందర్భంగా, ఆవుల మంజులత గారు అకుంఠిత దీక్షతో కృషి చేసి అయిదేళ్ళలో సమగ్ర నిఘంటువుని తయారుచేస్తామని హామీ ఇచ్చారు. పదవీ విరమణ సమయంలో దాని గురించి ఎవరైనా అడిగారా? ప్రభుత్వరంగంలో పలుకుబడి గల వాళ్ళెవరైనా కనుక్కుని వివరాలు తెలపమని మనవి.)
చలం ఇంటర్వ్యూ వినలేదు కాని మ్యూజింగ్స్ (పేజీలు 68-74) చదివాను. అది చదివితే మామూలు వాళ్ళకి ఇక రాయాలంటే భయం! ఆయన మహానుభావుడని ఒప్పుకోవాల్సిందే – ఆఖర్న అష్టగ్రహ కూటాల్ని నమ్మి ఆముష్మిక చింతనలో మునిగినా.
తనని తాను తిట్టుకోడానికి మాత్రమే అయితే చలం పుస్తకాలు రాసి ప్రపంచం మీద వదిలి నానా దుమారం లేపాల్సిన అవసరం లేదు కదా! బీడిలు కాల్చేవాడు కాదు గాని ఎప్పుడూ నోట్లో పైపుతో కనబడే ఒకాయన అరవై ఏళ్ళ క్రితం మాటల్లో :
“Thus, the author writes in order to address himself to the freedom of readers, and he requires it in order to make his work exist. But he does not stop there; he also requires that they return this confidence which he has given them, that they recognize his creative freedom, and that they in turn solicit it by a symmetrical and inverse appeal.” [1]
ఇంతకు మించి రాస్తే వ్యాసమవుతుంది. అది నా అర కొర జ్ఞానంతో కన్నా కాస్త లోతుగా తెలిసినవాళ్ళు రాస్తే బావుంటుంది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] From “Why Write?” in “What Is Literature?” and Other Essays, by Jean-Paul Sartre.
[ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]
జె. యు. బి. వి. ప్రసాద్ గారు చేరా ని ఇప్పుడు తప్పు పడుతున్నారు కాని రంగనాయకమ్మ “ఇదంతా డిగ్రీల అహంకారమే!” అని చేరా ని ఘాటుగా విమర్శించింది. ఎప్పుడు? 1991 లో. ఇన్నేళ్ళ తర్వాత గూడా చేరా తను ఒకప్పుడు చేసిన తప్పును ఇతరులు చెయ్యొద్దని చెప్పకూడదు! ప్రసాద్ గారి ప్రపంచంలో చేరా కి నిష్కృతి లేదు.
“ఇది ఎలా ఉంటుందంటే,” అంటూ మనకి సులభంగా బోధపడటానికన్నట్లు కుటుంబరావుని లాక్కొచ్చారు. చేరా అన్న దానికీ కొకు అన్న దానికీ ఏమిటి లంకె? రంగనాయకమ్మని వేర్వేరు సందర్భాల్లో విమర్శించడం తప్ప.
విషవృక్షానికి సమీక్ష రాస్తూ (1974-75) కుటుంబరావు సోషల్ ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంథం కాదన్నాడు. అన్న తర్వాత “ఆశోక వనం” రాయలేదు – ఆకథ 1937లో వచ్చింది. రామాయణంలో ఆర్యులూ అనార్యులూ గురించి, “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం,” అని రాసింది 1944లో. “నా కథా రచన” అన్న వ్యాసంలో తను మార్క్సిజం చదివింతర్వాత గాని సంఘం వ్యాధిని అర్థం చేసుకోలేదనీ, ఆపాటి జ్ఞానోదయం కలిగిన తర్వాత రాసిన మొదటి రచన “కులంగాడి అంత్యక్రియలు,” (1945) అన్నారు. కాలానుక్రమాన్ని పాటిస్తూ కుటుంబరావుని విమర్శిస్తే సరిగా ఉంటుంది.
కుటుంబరావు రాసిన సమీక్షలో కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి – ఎపిక్ లక్షణాలు, నాటి ఆచార వ్యవహారాలని నేటి విలువలతో అంచనా కట్టటం. వీటికి రంగనాయకమ్మ దీర్ఘమైన ఘాటైన జవాబే ఇచ్చింది. ఇద్దరు చెప్పినవీ కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయాలే.
లోతుగా పోవడానికి ఎవరికి టైముంది? అని నిరాశ పడొద్దు. వాటి సారాంశాన్నంతా, ప్రసాద్ గారు గురువింద గింజంత చక్కెర గుళికగా ఇచ్చారు. మింగి చైతన్యవంతులమవుదాం.
రోహిణీ ప్రసాద్ గారికి,
పాలూ నీళ్ళూ వేరు చేసీసేరు. ఖచ్చితంగా చెప్పేరు.
అయితే, పడక్కుర్చీ విమర్శకుల విలువ, informed (?) public opinion, సాహిత్య సేవ, ఎక్కువ తక్కువలయినా, ఎలాగో విపులీకరించి విశ్లేషించాలి దయచేసి.
కొడవళ్ళ హనుమంతరావు గారికి,
“ఎడ్మెంటు” సంగతి వదిలెయ్యండి. అది మీరెవరూ చూసే చాన్సు లేదు.మీకు చికాకు కలిగించినట్టు రాయడం నా చేతకాని తనం. “శ్రధ్ధ” “సబూరి” లేకపోతే ఇన్ని ఇబ్బందులు.మొదటి సారి రాసినపుడు, సరిగ్గా రాయలేకపోడానికి, కర్ణుడి చావుకున్న కారణాల్లా లక్షాతొంభైయున్నాయి. వాటినొదిలెయ్యండి.
క్షమించాలి.
రోహిణీ ప్రసాదు గారు సరిగ్గా పట్టీసేరు. అదే నా “ప్రెశ్న”?
ఖానా గట్టు మీద బీడీలు కాల్చుకుంటూ “ప్రెపెంచకాన్ని” గుప్పు గుప్పు మని విమర్శంచడం రైటేనా? ఖానా గట్ల గురించి, సందేహం వుంటే, భైరవభట్ల వారు పూర్తిగా తీర్చగలరు. బీడీల గురించి సందేహంవుంటే, నాలాటి వాడెవడైనా తీర్చగలడని అనుకుంటున్నాను.సాఫ్ సాఫ్ గా అడుగుతున్నాను. ఎవరైనా ఎందుకు రాయాలి? ఎందుకు రాస్తారు?
రజనీ గారడిగిన ప్రశ్నకి చలం గారు సమాధానమిస్తూAIR ఇంటర్వ్యూలో:
“నన్ను, నాలో ఏఏ మచ్చలున్నాయో, వాటిని నేను గట్టిగా తిట్టుకోడంతో, వాటిని గట్టిగా గోక్కోడంలో, ఆ పుస్తకాలు-నేను వ్రాసిన పుస్తకాలన్నీ బయలుదేరాయి. అవి మిమ్మల్ని అనుకుని మీరు చాలా కోప్పడ్డారు. మిమ్మల్ని కాదు- నన్ను నేను తిట్టు కున్నది.”
ఇందుకేనా రాస్తారు? ఇందుకేనా రాయాలి? ఇలా రాయకపోతే విమర్శకులు “కోర్ కోర్ శరణు కోర్” అని గగ్గోలెట్టడం రైటేనా? అలా గగ్గోలెట్టకపోతే తప్పా?
ఈ మాట రచయిత(త్రు)లకీ, అభిప్రాయాలు రాసీవాళ్ళకీ వున్న సుఖం మిగిలిన పత్రికలకి రాసీ వాళ్ళకి లేదు. మా బతుకులు మేం బతుకుతూ, తీరికున్నపుడు “బాగా రాసేరు” అని అభిప్రాయమ్ముక్క పడేస్తే ఈ మాట వాళ్ళు, చక్కగా వేస్తారు. కొంపదీసి ఇదా సాహిత్య సేవ?
[ఈ అభిప్రాయం కొద్దిగా రీఫార్మాట్ చేయబడింది. — పద్మ]
హనుమ గారూ:
మిమ్మల్ని అలాగే పిలవాలనిపిస్తుంది.
కొకు రచనల పునః ప్రచురణల గురించి తెలియ చేసినందుకు సంతోషం!
తన రచనల గురించి కొకు తన మాటల్లో: (‘కారుణ్యం’ 1937, ముందు మాట)
నాకు ఒకటే ఆశయం – నా రచనల వల్ల కూడా మనోవికాసం పొందదగిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఉండి తీరాలి, వారందరూ నా కథలు చదవాలని నా కోరిక. వారందరికీ నా రచనల మీద ఎంత త్వరగా ఏవగింపు కలిగితే అంత ఉపకారం చేసినవాణ్ణి అవుతాను తెలుగు సారస్వతానికి. అప్పటికి తెలుగు సారస్వతానికి నాతో పని అయిపోతుంది, నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏ కోశానా లేదు.
ఇంకా ఎప్పుడో పుట్టబోయే వాళ్ళ కోసం రాస్తున్నానన్న అహంకారం కూడా నాకు లేదు. నేను ఆకాశం నుంచి ఊడి పడలేదు. నాకు పూర్వం కథలు రాసిన వారు ఎక్కడ విడిచి పెట్టారో నేను కథా రచనను అక్కడే అందుకోగలను కాని, అంతకు పైన ఎట్లా అందుకోగలను?
తమ కథలు చదివి, ‘బాగున్నాయని’ విమర్శించమనే కథకులున్న ఈ రోజుల్లో, పైన చెప్పిన మాటలు ఆలోచించ తగ్గవి.
సమాజంలో (ఏ సమాజమైనా) సాహిత్యానికి ఉన్న స్థానం సరిగ్గా గమనించిన వారిలో కొకు ఒకరు. సాహిత్య ప్రయోజనాలు గురించి కొకు అవగాహన అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికైనా సరేనని నాకు అనిపిస్తుంది.
నేను TIFRలో Ph.D చేస్తున్న రొజుల్లో, J.R.D.Tata అధ్యక్షతన MGK Menon 60వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చెయ్యబడ్డ సభలో, అప్పటికి “భారతరత్న” రాని J.R.D. Tata మాట్లాడుతూ, “60వ పుట్టిన రోజుకే ఇంత హడావిడా! ఇలాంటి పుట్టిన రోజు నాకు 20 ఏళ్ళ క్రితం వచ్చింది. ఈ సభ అయిన వెంటనే మనం వెళ్ళి ఎవరి పని వారు చేసుకోవాలి” అన్నాడు
కర్ణాటకమా లేక కర్నాటకమా అనే దానిని గురించి ఒక కన్నడ కవి (బహుశా కువెంపు కాబోలు) అది “నొణ (నకార ణకారాలు) కాట” (ఈగ పోరు) అని అన్నారు. ణ-కారాన్ని న-కారంగా పలకడం సర్వసామాన్యం. హిందీ వంటి భాషలో ఇది వ్యాకరణరీత్యా సరియైనదే. అందుకే తెలుగులో ఈ రెండు అక్షరాలకు ప్రాస (యతి) సరిపోతుంది. కాని నాకు నచ్చనిది కర్నాటిక్ అనడం! – మోహన
—రామ (రమ) భరద్వాజ్ గారికి:
మీరు ఉదహరించిన రెండు సమీక్షలు/విమర్శలూ నాకు తెలుసు. వాటి ప్రతులు నా దగ్గిర లేకపోవటంతో, నేను వాటి ప్రస్తావన తేలేదు. నా సంపాదకీయం/వ్యాసం (?)(సరేనా విప్లవ్ గారూ! మీకు అభినందనలు) లో నేను ఉదహరించిన వాటన్నిటికీ నాదగ్గిర ప్రతులున్నాయి! మీరు ఆ రెండుసమీక్షలూ గుర్తుకితెచ్చి నన్ను మందలించినందుకు కృతజ్ఞుడిని.
—రోహిణీప్రసాద్ గారికి:
ఈ మాట గురించి మీరు చెప్పిన రెండు మంచి మాటలు మాకెంతో ఆనందం; గర్వకారణం. మీకు నా నమస్సులు.
—కొత్తపాళీ గారికి:
నిష్పాక్షికము అన్న మాట నేను without bias కి అనువాదంగా వాడాను. నా ఉద్దేశంలో విమర్శలలోసాధ్యమైనంతవరకూ ఏవిధమైన bias (పక్షపాతం అన్న మాట ఒప్పుకుంటారా?) ఉండకూడదు. అంటే విమర్శకుడి biases సమీక్షలోను, విమర్శలోనూ కనపడకూడదు, అని! తన భావస్పందన స్పష్టం గా ఉండకూడదనే అర్థం నావ్యాసం(?)/సంపాదకీయంలో వచ్చిఉంటే, రచయితగా అది నా చేతకానితనం. క్షమార్హుణ్ణి.
హనుమంతరావుగారికి:
కొ.కు. చెప్పినా, రా .రా. వ్రాసినా, తా.ధ. మందలించినా; — అసలు నిజం ఇది: కీట్స్ మరణానికి కారణం అతని క్షయ వ్యాధి. తన క్షయ వ్యాధి, దరిమిలా తన రాబోవు మరణం గురించి కీట్స్ చాలా మథన పడ్డాడు. కీట్స్ apothecary గా ( అంటే, మన భాషలో కాంపౌండర్ అనవచ్చనుకుంటా!) శిక్షణ పొందాడు!
1821 లో (కీట్స్ మరణానంతరం) ఈ కథ / రూమర్ మొదలయ్యింది. క్వార్టర్లీ రివ్యూ పత్రికలో ఒక “కర్కోటక” విమర్శకుడు(విమర్శకురాలు?) వ్రాసిన సమీక్ష కీట్స్ మరణానికి కారణం అని! ఈ రూమర్ కి ఆజ్యం పోసిన వాడు షెల్లీ. మీరు చదివే ఉంటారు; షెల్లీ వ్రాసిన Adonais. అది కీట్స్ పై elegy అని మీకు నేను చెప్పనక్కరలేదు. పోతే, బైరన్ వ్రాసిన Don Juan పద్యంలో, ఈ రూమర్ని కాస్త తక్కువ పాళ్ళల్లో పాడాడు:
‘Tis strange the mind, that very fiery particle,
Should let itself be snuffed out by an Article.”
Stanley Plumly ఈ మధ్యనే Posthumous Keats ( Norton, 2008) ప్రచురించాడు. అందులో ఈ కథ/రూమర్ ప్రస్తావన దొరుకుతుంది.
నమస్కారం.
నేను వ్రాసిందాంట్లో తప్పేమన్నా ఉంటే దయ చేసి క్షమించమని మొదటగా మనవి. మహా కవి తిక్కన కవిత్వాన్ని గాని, ప్రతిభను గాని విమర్శించే తాహతు కాదు కదా, పూర్తిగా గ్రహించి గుర్తించడం కూడా నాకు మించిన పనే. కేవలం ఈ పద్యం చదివిన తరువాత కలిగిన ఆలోచన మాత్రమే ఇది. తిక్కన రచనను బేరీజు వేసే దుస్సాహసం కాదు.
ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ద్రౌపది కోపంగా దుశ్శాసనుని వొళ్ళు ముక్కలైపోనీ, భీముని బలం, అర్జునిని గాండీవం తగలబడడానికా, దుర్యోధనుని పీనుగెల్లనీ, అని వొళ్ళు మండి చెప్పడాన్ని సీస పద్యంలో, సహజత్వానికి దగ్గరగా చెప్పినట్టున్నది. అంత మాత్రం చెప్పడం న్యాయమూ, అవసరమే కాని గొప్ప విషయంగా కనిపించడం లేదు. వీధిలో మంచినీళ్ళ కోసమో, ఇంకదేనికోసమో తెలుగులో కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు ఉన్నట్టుగా అనిపించింది, కాకపోతే సీసం, ఆటలెదులలో. అట్లా కాదు, అసలు అదే ఆ పద్యం గొప్పతనం అంటే చెప్పేదేమీ లేదు, విని ఊరుకోవడం మాత్రమే, ఆ వీధిలోని తిట్లు విని ఊరుకున్నట్లుగా.
అదే తిక్కన గారిదే, “వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి” అన్న పద్యం ఎంతో రసవంతంగా, పదాల ప్రవాహ ధారతో, మనకు గుర్తుండే విధంగా, ఆకట్టుకునే పద్యం ఉంది కదా!
పోనీ, ఈ పద్యం కంటే సహజంగా, సరళంగా, రుసరుస సాగే ధారతో, “గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకంజెండుచున్నప్పుడొక్కండును నీ మొఱ నాలకింపడు” అని బెదిరించే తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ పద్యాలు కూడా ఉన్నవి కదా! తిట్లు, బెదిరింపులు, శపథాలు, ఆవేశపరమైన ఘట్టాలలో ఉన్న పద్యాలెన్నో ఉన్నాయి మనకు. వాటన్నింటి backdrop లో ఈ పద్యం గొప్పగా ఆకట్టుకుంటూ నిలబడుతుందని మాత్రం అనిపించడంలేదు.
***
విధేయుడు
Srinivas
నా వరకు అన్ని నిర్వచనాలకు బద్ధులైన చివరి క్లాసికల్ వాగ్గేయకారులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ మరియు వారి శిష్యులైన మైసూర్ వాసుదేవాచార్యులు. మిగిలినవారు ఆ ఔన్నత్యాన్ని అందలేదు అని నా భావన. అందులో వాసుదేవాచార్యులు సుమారు వంద సంవత్సరాలు జీవించారు. చివరి వరకు గాన విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు. వీరి మాతృభాష కన్నడము అయినా కూడా తెలుగులోనే రాశారు. వీరికి సంస్కృతములో ఎనలేని పాండిత్యము. వీరి గురువుగారే వీరివద్ద సంస్కృతములో రాసినది చదివిచూడమనే వారట! బాలమురళిగారి పాటలను మిగిలిన గాయకులు తమ కచేరీలలో ఇప్పుడు కూడా పాడుతున్నారా, ఈ విషయం నాకు అంతగా తెలియదు. గాయకులందరు వీరి పాటలను “బ్రోచేవారెవరురా..” లేక “రఘువంశ సుధాంబుధి..” లా పాడుతుంటే వీరు కూడా వారిలాటి మహనీయ వాగ్గేయకారులే. అందరూ వాగ్గేయకారులే. కాని Some are more equal than others అని అంటారు గదా! విధేయుడు – మోహన
చక్కటి కథ చదివిన అనుభూతి కాదు కాని, ఒక వాస్తవిక అంశాన్ని ఎంత బాగా చెప్పారు అని అనిపించింది. వారికి రోజు గడవటమే జీవన్మరణ సమస్య ఐతే, పాపం, ఏ పాస్పోర్ట్, వీసాలు వారిని ఆదుకొంటాయీ? ఏ మానవహక్కులు వారికి రక్షణ కల్పిస్తాయి?
వాగ్గేయకారులపైన చర్చ జరుగుతుంది కనుక ఇక్కడ
కొన్ని విషయాలను గురించి చెప్పాలి. కాకి నలుపే,
కోకిల నలుపే, కాని వసంతఋతువులో కాకి కాకే, కోకిల
కోకిలే అన్నట్లు, ఒక పాట వ్రాసి దానికి ఒక వరుస
కట్టినంత మాత్రాన ఒక వ్యక్తిని వాగ్గేయకారుడు అనలేము.
వాగ్గేయకారునికి సాహిత్యం బాగా తెలిసి ఉండాలి. భాషలలో
ప్రజ్ఞ ఉండాలి. ఛందస్సు, వ్యాకరణం తెలిసి ఉండాలి.
అలంకారాల ఉపయోగం తెలిసి ఉండాలి. సంగీత శాస్త్రంలో
గొప్ప ప్రతిభ ఉండాలి. మూడు కాలాలలో పాడే శక్తి ఉండాలి
అతని కంఠానికి. సంగీతశాస్త్రంలోని వివరాలను చక్కగా
ఎరిగి ఉండాలి. రాగ తాళ లయాదుల జ్ఞానం క్షుణ్ణంగా
అవగాహన చేసికొని ఉండాలి. రసానుభూతిని కలిగి
ఉండాలి. స్వరాల ఉపయోగాన్ని తెలిసికొని ఉండాలి.
వివిధ విధాలైన కృతులను వ్రాసి వాటిని సంగీతంతో
జీవంతం చేసి ఉండాలి. ఉదాహరణకు, త్యాగరాజు
పాటలను మాత్రమే కాదు, రెండు యక్షగానాలను
కూడా వ్రాశారు. ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్లు ఏ
కొందరు మాత్రమే నిజంగా వాగ్గేయకారులు.
మిగిలినవారు “నేను కూడా వాగ్గేయకారుడినే” ఆని
అనుకొన్నవారు. విధేయుడు – మోహన
ఇలా మనము ఈ వ్యాసం అభిప్రాయాల శీర్షిక కింద ఇన్ని సార్లు రాసుకోవచ్చో లేదో తెలియదు క్షమించాలి.
మీరు మీ ఈమైల్ ఏదీ ఇవ్వలేదు.
సాహిత్య సేవ చెయ్యక పోయినా ఫరవాలేదు కానీ సాహిత్యం కనీసం అర్ధం చేసికొగలిగితే బాగుండును అని కోరిక. “ఇక్కడ” అని మీరు అన్నది ఎక్కడో అర్ధం కాలేదు. నేను ఆంధ్ర ప్రదేశ్ లో ఇంగ్లీషు మీడియం పిల్లలగురించే చెప్పాను. వీళ్ళకి చదవటం రాయటం మాట్లాడడం వస్తాయి కాని పదవ తరగతి తరవాత తెలుగుకు ఎంత సాధ్యమయితే అంత దూరంగా వుండడానికి ప్రయత్నిస్తారు.
మీరు నా ఆఖరి పేరా చదివారా? గ్లామరైజు చేస్తే, పాపులరైజ్ చేస్తే పిల్లలు ఎంత కష్టానికి కూడా వెనుకాడరు. మా పెద్ద బాబు ని వాడి పుస్తకం కాక CBSE లేక lCSE పుస్తకాలు చదమంటే అవసరం లేదు అనేవాడు. అదే IIT FOUNDATION Classes పేరుతో మిగిలిన పిల్లలు వెళుతుంటే నేనూ అని తయారయ్యాడు.
There is something called Peer group influence.
కాశీనాధుని గారన్నట్లు పిల్లలు ఏది నేర్పితే అది తక్కినవాళ్ళతో కలిసి అయిన పక్షంలో తొందరగా మన కష్టం ఎక్కువ లేకుండా తక్కువ వ్యతిరేకతతో నేర్చుకుంటారని అభిప్రాయం.
విఠ లాచార్య సినిమా ట్త్రాష్ , హేరీ పాటర్ నవల అద్భుతం.
మరీ ఎక్కువ ప్రాచీన సాహిత్యం కాకపోయినా కనీసం ఒక ఆరుద్ర, అత్రేయ పాట, ఒక శ్రీశ్రీ కవిత ని ఆనందించేలా అభిమానం పెంచాలని అసలు మాతృభాషని చులకన చేయడం అంటే తల్లిని కించపరచడం అని వాళ్ళూ అనుకోవాలని ఓ ఆరాటం.
ఆజో ఇభొ ఫౌండేషన్ల లాగ సామాన్య ప్రజానీకం లో ఈ తపన, కనిసం ఒక ఫాషన్ గా ఫీల్ అయ్యేలా చెయ్యగలగాలని. యోగా కంటె Slimming centres fitness centres ఎక్కువ popular అయినట్లు ఒక Brand Image వచ్చెలా ఏమైనా చెయ్యలేమా?
రమాదేవి గొడుగుల
బాబ్జీలు గారు: మీ ఈమైలో, మీ ఫోను నంబరో ఇవ్వగలరా?
email: rd6219@yahoo.com
కొన్ని వూహలు బాగున్నాయి. గులాబీ కుండీలో కూర్చోవడం, స్థానిక వనరులు – లాంటివి.
కథ అనుకోవాలంటే కష్టంగానే ఉంది!
సంబంధంలేని సంఘటనలను సమన్వయించాలి. అలా సమన్వయించి సమర్ధించాలంటే – కాస్త లోతుగా చూస్తే గానీ కనిపిచని సంబంధమన్నా సంఘటనల మధ్య ఉండాలి. లోతుగా చూడాలి అన్న స్పృహను పాఠకులకు కథే కలిగించాలి!
రచనలో మొదటి ముప్పావు భాగానికి (ఇంకా పైనే) చివరి పావు భాగానికి సంబంధం కనిపించదు.
కొత్తపాళీ గారి ‘పాయింట్’ ను ఆమోదించాలంటే, కథలో(కథ అనుకుంటే) ముప్పాతిక భాగం పైనే noise (అనగా చెత్త) ఉందని ఒప్పుకోవాలి. ముగ్గురు మగవాళ్ళు అందమైన అమ్మాయి ఏడుపుకు చలించారని (లేక ఏడుపు వాళ్ళ హృదయాల్ని సున్నితంగా తాకింది అని) చెప్పడమే రచయిత ఉద్దేశ్యమైతే, మొదటి ముప్పావు భాగం – అనగా అంత సుదీర్ఘమైన పాత్రల/పరిసరాల పరిచయం అనవసరం!
‘బార్’లో మసక చీకట్లు మాయమయ్యాక కూడ “గులాబి” కళ్ళలో సన్నటి నీటి తెర “కొంచెం” దగ్గరలోనే కూర్చున్న మగవాళ్ళకు కనిపించడం-వాళ్ళ పరిశీలనా శక్తితో పాటు, కళ్ళ పవర్ కి కూడా సంకేతమా?! ఇంకా ఈ రచనలోపొడవైన వాక్యాలు, వాక్యాల్లో గజిబిజితనం కాస్త చికాకు పెట్టే అంశాలు.
కథలో సంఘటన ఒక అంగం కావాలి, అంతే కాని సంఘటన చిత్రణ మాత్రమే ఎన్నటికీ కథ కాలేదు!
తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలేవీ నాకు అందుబాటులో లేవు కాని ప్రవచనం అంటే గొప్ప మాట, ప్రవక్తలు చెప్పేది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది Propositional Logic – ప్రతిపాదనల తర్కం.
ప్రమేయం (function) అంటే మీ ఆలోచన సరయినదే. నేనో ఉదాహరణ ఇచ్చాను – Square(x). అలాగే Sum(x, y). Sum(4, 5) విలువ 9. ఇది గణితంలో మనకందరికీ తెలిసినదే.
తర్కం మన వివేచనకి సంబంధించింది. అంటే గణితం కన్నా కూడా మౌలికమైనది. అన్ని రకాల భావనలకీ, అన్ని రంగాల్లోనూ వర్తిస్తుంది. ప్రమేయాన్ని Frege కొంచం మార్చి తర్కంలో భావనకి సంకేతంగా వాడుకున్నాడు.
దానిని గణితంలో లాగా సంఖ్యలకి పరిమితం చెయ్యకుండా అన్ని రకాల వస్తువులకీ వాడాడు. RedColored(x) అన్న ప్రమేయం x మనిషైనా, జంతువైనా, వస్తువైనా వర్తిస్తుంది – ఎర్రగాఉందన్న భావనకి సంకేతంగా.
తను రూపొందిస్తున్నది ప్రతిపాద తర్కం కనుక ప్రమేయం తిరుగు ఇచ్చే విలువని రెండు విలువలకే పరిమితం చేశాడు. అలాంటి ప్రమేయాలని Truth-value functions అన్నాడు. ఆ రెండు విలువలు – True, False.
ప్రమేయం అంటే ఒక ఫంక్షన్ కదా, ఫంక్షన్ అంటే కొన్ని విలువలని ఇన్పుట్ గా తీసుకుని ఒక అవుట్పుట్ ఇచ్చేది కదా, ఆ అవుట్పుట్ కి అవును కాదు అని ఎందుకు అవ్వాలి, అది బూలియన్ ఫంక్షన్ అయితే అయ్యే అవకాశం ఉంది కాని. మీరు చెప్పిన సూత్రం ప్రవచనాలకి సరిపోతుంది, ఏదైనా ప్రవచనం అవును కాని లేదా కాదు కాని తప్పక అయితీరాలి.
శ్రీనివాస్ గారన్నట్టు, నాక్కూడా అసలు స్టోరీ మీనింగ్ ఏమిటో తెలియలేదు. ఆ అందమైన అమ్మాయి ఏడ్చే సీనుకీ, వీళ్ళ పార్టీకీ ఏమిటీ సంబంధం? ఏదో వుంది రచయిత దృష్టిలో. అది నాకర్థం కాలేదంతే అని అనిపిస్తుంది. ఒక పురుషుడి పెత్తనం వల్ల ఆ అమ్మాయి ఏడ్చిందని మాత్రం అర్థం అయింది. అయినా ఎవరన్నా అలా రెస్టారెంట్లో అంత బావురుమని ఏడుస్తారా? ఆ పురుషుడి పెత్తనం గురించి అప్పుడే మొదటిసారిగా తెలిసిందా, ఏమన్నానా?
ఆ కోటీశ్వరులకీ, ఆ పేద పంతులికీ మధ్య వున్న స్నేహం కూడా విచిత్రంగానే వుంది. ఆ తాగుళ్ళకీ, తిండికీ బిల్లు కట్టేది ఆ కోటీశ్వరులే కదా ఎప్పుడూ? ఇదేదో డబ్బున్న వారి వెంట లేని వారు తిరగడం లాగానే వుంది తప్ప, స్నేహం లాగా లేదు. ఇక, “దానికీ కారణం కేవీఆర్ మేష్టారే, మా నాన్న, మాస్కూల్లో టీచరు.” అన్న వాక్య నిర్మాణం వల్ల, విషయం మొదట్లో అర్థం కాలేదు.
ఈ కధని మెచ్చుకున్న వాళ్ళెవరైనా, దీనర్థం కాస్త విపులీకరిస్తే, బాగుంటుందనుకుంటున్నాను.
ఖరీదైన రెస్టారెంట్లో పడ్డ ఆ అమ్మాయి కష్టానికి వీళ్ళు చలించలేదనా?
రచయితా, ఈ కధని ఇష్ట పడ్డవాళ్ళూ క్షమించాలి. విషయం అర్థం కానివారు వుంటారని మాత్రం గ్రహించాలి.
– జె. యు. బి. వి. ప్రసాద్
బాలమురళీకృష్ణ గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
09/04/2008 8:46 am
శ్రీ బాలమురళి పై ఇంత సాధికారంగా రోహిణీప్రసాద్ గారు రాయగలరని నాకు తెలుసు. అయినా, “ఈమాట” కోసం రాసినందుకు ధన్యవాదాలు.
ఈ వ్యాసంలో ముచ్చటించిన ఒకటి, రెండు విషయాలను మళ్ళీ మీ ముందుంచాలని:
1. “గాయకుడిగా శ్రీబాలమురళీ దరిదాపులకు వచ్చేవాళ్ళు లేకున్నా, శ్రీ బాలమురళీకి మరిన్ని సుగుణాలు ఉంటే బాగుండేది” అన్న వ్యాసకర్త మాటలు, గమనించతగ్గవి. ఆలోచింపతగ్గవి. సంగీతంతో (పుస్తక జ్ఞానమేకాక) అన్ని రకాలుగా ఎంతో గాఢమైన పరిచయం, అనుభవం ఉంటే కాని ఇటువంటి వాక్యాలు రాయలేరు.
2. శ్రీ బాలమురళి సంగీతం, జీవితం తరవాత తరాల కోసం డాక్యుమెంటేషన్ విషయమై, రోహిణీప్రసాద్ గారు చేసిన సూచనలు ఆలోచించి, ఆచరణలో పెట్టవలసినవి. నాకు ఉన్న పరిచయంలో, తెలుగు సంఘాలకి గాని, సంస్థలకి గాని అటువంటి దమ్ము, ఆసక్తి ఉన్నాయని నే అనుకోను.
అడిగిన వెంటనే, “చెయ్యి” చేసుకున్నందుకు చాలా సంతోషం.
మీరు ఈ రచనకి ఎన్నుకున్న వస్తువు బాగానే ఉంది కాని, మీ సమర్ధత ఇంతకన్నా ఎక్కువ కాబట్టి, వచ్చే సంచికల్లో మరిన్ని మీ “రాతలు” కోసం ఎదురు చూస్తూ, అంత వరకు ఒక్క సిటం ఆగుతాను.
Might be off the track conversation but for some strange reason, your post here brings back memories of the following….Thanks to Dr Dwa.na.Sastry gari sAhitya kaburlu book –
“మున్ పటి రూల్సుకు కట్టుపడమ”ని చెప్పినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు భావకవిత్వంపై ధ్వజమెత్తారు. బహుధాన్య సంవత్సరంనాటి “అభినవ సరస్వతి” పత్రికలోని ఈ రచన చదివితే చెళ్ళపిళ్ళవారి భావాలు తెలుస్తాయి.
భావప్రధానమగు కవిత్వమే భావకవిత్వమగు. ఈ కవిత్వమందు బ్రయోగించు పదములన్నియు సంస్కృత పదములే కాని మనకవి సంపూర్ణముగ దెలియుట దుర్లభము. భావకవిత్వమనినంతమాత్రమున బదుగురకు దెలియనిచో బ్రయోజనమేమి? అంగటిలో నన్నియు నున్నవి – అల్లుని నోట శని యున్నది యన్నట్లగును. భావప్రధాన వాక్యములు కొంతవరకుండి తదితరము కొంతచేరియుండవలెనుగాని తుట్టతుదవఱకు నొకటే యుండరాదు. నేటి భావకవిత్వము గూటి చిలకేదిరా చిన్నన్నా లాగున వెళ్ళుచున్నది. అర్థము జెప్పలేము. ఇది యొక పరిభాష. సైన్సులోను, వైద్యములోను నెటులో యటులే నేటి భావకవిత్వమందును నీ పరిభాష ముక్కలు పడుచుండును.
ప్రతి పుస్తకమందును నీ భావకవిత గాంపింపగలదు. కాని పూర్వులీ కవితకు శీర్షిక పెట్టలేదు. “కుందనము వంటి మేను మధ్యందినా తపోష్మహతి గందె, వడదాకె నొప్పు లొలుకు వదనమ”ని వరూధిని బ్రాహ్మణునితో బలికెను. ఆ పద్యములో భావకవిత్వ మిమిడియున్నది. భావకవిత్వము నారంభించినవారి యుద్దేశము మంచిదే కాని దాని నితరులెంతవఱకు నిర్వర్తించుచున్నారోయనునది విచారణీయము. ప్రస్తుతము వచ్చెడి భావకవిత్వము ప్రజలనెంతవఱకు రంజింపజేయునను విషయము వేఱు.
ఇక నెంకిపాటల విషయమై సుబ్బారావుగారు యోగ్యతాపత్రమీవలసినదిగ నన్ను గోరిరి. “కడుపులో సెయ్యెట్టి కలసేసినాదే” మున్నగు పద్యములు వ్యంగ్యపూరితముగ మంచి యభిప్రాయమును దెల్పుపట్టులు చాలగలవు. ఒక్కొక్కొచో వ్యాకరణ దోషములను గూడ సరకుచేయకపోవచ్చును. “జగమేలే పరమాత్మా యెవరితో మొరలిడిదు”నను త్యాగయ్యగారు జగమేలెడి యని యనజాలకుండెనా? ఎంకిపాటలలో మొదటినుంచి చివరవరకు రసాభాస గలదు. కొన్నివేళల మాత్రము స్వదేశభాషను వాడిన దోషము లేదనిరి. కాని తుట్టతుదివఱకు గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస.
ఇది పూర్తి నిడివి వ్యాసమే! సంపాదకీయం లోకి ఎందుకొచ్చి పడింది? వేలూరి గారికే ఎరుక :).
భారతి, స్వతంత్ర, జ్వాల, వీణ ఇవన్నీ TIFF Files గానో మరో రకంగానో ‘ఈమాట’ వారందించగలరా? ఉన్నంత వరకే, ఒక డంపింగ్ గ్రౌండొకటి తయారు చేసి మిగతా పాఠకులను కూడా వాళ్ళ దగ్గరున్నయి శేర్ చేయమంటే సరిపోతుందేమో (పాతవి కనుక కాపీ రైట్స్ పెద్దగా అడ్డురావేమో).
ఏవో ఒకటీ అరా చూడటమే కాని అంత పాతవి నేను పెద్దగా చదవలేదు, అప్పటి పత్రికల్లో విమర్శకూ సమీక్షకూ పెద్ద తేడాలేదా?
“నిజం చెప్పాలంటే, కీట్స్ ఆ సమీక్షని అమరజీవిగా చేసాడని చెప్పడం సబబు.”
రచనలో సారం లేకున్నా అది నిలవటానికి (వేరే కారణాలతో) ఇదో ఉదాహరణ అనుకుంటాను.
రామ గారు!
మీరెవరో నాకు తెలీదుకాని, మీ వ్యాఖ్యకి నేనెందుకు జవాబు ఇస్తున్నాను అన్నది మీకు తెలియాలి.
నేనో బ్లాగర్ని. ఇంతకుముందు ‘రమ’ అన్న పేరుతో టపాలు రాసేదాన్ని. ఇక్కడ నేను 30 వ తేదీ నాడు వ్యాఖ్య రాస్తే, మీరు 31 వ తేదీ నాడు రాసారు. మన ఇద్దరి పేర్ల దగ్గరి సామీప్యమం వల్ల నయితేనేమి, ఒక రోజు తేడా వల్ల నైతేనేమి, ఇతరులు అపార్ధాలు, అపోహలు కలుగజేసుకొనే అవకాశం వుంది. కాబట్టి, మీ వివరములు తెలియజేయాలని మా విన్నపం.
ఇహ వ్యాఖ్య గురించి: రచనలో విషయంలో, మీకు శ్రీ నారాయణ స్వామి గారి గురించి తక్కువ తెలుసని అనుకొంటున్నాను. ఒకసారి http://www.kottapali.blogspot.com బ్లాగు ని దర్శించండి. చక్కటి శైలి, నిరాడంబరత, చక్కటి విశ్లేషణ కనిపిస్తుంది ఆయన రచనల్లో. ఆయనకి ‘రాదు’ అనడం లేదా ఆయనకి నేర్పుదామనుకోడం “తాతకి దగ్గులు నేర్పడం లా” ఉంటుందని నా అభిప్రాయం.
ఇహ చివరిగా ఏ రచయిత కథ నన్నా విమర్శించండి, అలాగే ఎందుకు విమర్శిస్తున్నారో విపులీకరించండి. అంతే కాని రచయితని వ్యక్తిగతంగా విమర్శించడం (మీ పరిచయంలో…) చదివేవారి మనసు నొప్పిస్తాయి.
“గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొంటున్నా అనుకోవద్దు, అసలు “దొంగ” అనే అవకాశం ఇవ్వకూడదన్నది నా ఆలోచన. మరి మన్నించి మా అపోహలు తొలగిస్తారని ఆశిస్తున్నాము.
ఇప్పటికే ఇక్కడ చాలా మంది చాలా విషయాలు ప్రస్తావించేసారు కానీ తెలుగు మీడియం లో చదివి (1979 ముందు) ఇప్పటి తెలుగు మీడియమ్ పుస్తకాలు చదివి, మా ఇద్దరి పిల్లలు, ఇంగ్లీషు మీడియమ్ లో తెలుగు మీడియమ్ లో చదివిన మిగిలిన పిల్లలని చూసి, నాకు కలిగిన కొన్ని అభిప్రాయాలని వెలిబుచాలని ఈ మాటలు.
తెలుగు మాధ్యమానికి తెలుగు భాష సజీవ స్రవంతి లా వుండడానికి తేడా వుంది. నేను నేర్చుకొన్నప్పుడు ఇన్ని కష్టమైన తెలుగు పదాలని సృష్టించే ఈ పద్ధతి లేదు. హాయిగా అటమ్ అంటె ఆటమ్ అనే చదువు కొన్నాం కానీ ఇప్పుడు పరమాణువు అని ఒక కొత్త పదాన్ని నేర్చుకోవాలి, ద్రావణి, ద్రావణేయత అని నేర్చుకొని, మళ్ళీ ఇంగ్లీషులో తర్జుమా చేసుకొవాలి . ఎన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి వెళ్ళినా కష్టమే. కాబట్టి తెలుగు లో చదివిన వాడు తనకి అవకాశాలు వుండాలి పెరగాలి అనే వుద్దెశం ఎక్కువ కనిపిస్తోంది. బాబ్జీలు గారన్నట్లు రేపు చైనేస్ నెర్చుకొంటే అవకాశాలు ఎక్కువ అనిపిస్తే అదే నేర్చుకుంటాము. ఇది పరమ సత్యం – తెలుగు కీ దీనికీ సంబంధంలేదు.
భాష కి సాహిత్యమంతో పరిచయం ఎక్కువ బలాన్నిస్తుంది. విస్తృతమైన పఠనతోనే ఇది సాధ్యమవుతుంది. కాని ఇప్పుడు తెలుగు సాహిత్యంతో పరిచయం తక్కువ అయిపోయింది. తెలుగు పఠనం చాలా తగ్గిపొయింది. ఈ రెండు అంశాలు ప్రోత్సహిస్తే చాల బాగుంటుంది
( Sorry it is taking too long to type in Telugu. So please excuse me for this switch )
Nowadays everything is glamorized and popularized. Including PETA sort of activism. So there should be a popularization spiced with some glamor. Like Indina idol , KBC sort.
Sankaraabharanam undoubtedly made more people start learn classical music. It compeled people to taste the classical music. I feel sad for my not able to share the the beauty in the telugu literature with my sons. But they feel that I am silly and crazy to expect them so. They don”t mind taking extra efforts to learn about space shutles and moon rovers since it gives them identity. and recognition. we had a small quiz comepetition in Ramayanam charecters on our corporation day. Even small questions were not known to many or most were indifferent to show their knowledge. But the same gathering was asked on something more popular subject everybody was curious or showed interest. The question here is not about Ramayanam It is about the subject being a popular one or “in-thing”. So
Please note that even people who studied in telugu medium are not very comfortable when it comes to enjoying a small story in telugu or small kavitha. There are so many telugu medium students who have not read anything other than their text books. If you ask them if they have read anything other than their text books the answer one gets is no. So what exactly is our aim and objective?
I went to telugu university to ask for some help in popularizing telugu among school going children. But the people who are ready to spend lacs on popularizing to foreign nationals had no interest in this particular thing. The teachers are helpless but to teach children who feel that it is just for 10th percentage which can be dumped once exam is over. Many times the teachers themselves will not have any enthusiasm to enthuse any interest.
If any body who is really interested to promote the language other than writing or taking in elite platforms I will be most happy to work along with them. I am desperately looking for someone to help me.
Bujjilugaaru or Rama gaaru or someone who are able to understand my point if you can give your email ids I will be most happy.
ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ గారి అభిప్రాయం:
08/30/2008 5:31 am
సాయి గారికి:
బాబ్బాబు, నా సందేశం లోని చివరి పేరాని ఏరి పారేసి మిగిలినవి చదువుకుందురూ. మీకు పుణ్యం వుంటుంది. అక్కడ కాస్తంత కవి హృదయాన్ని ప్రదర్శిద్దామని ప్రయత్నించాను. క్షమించండి. 🙂
హనుమంతరావు గారు ఇలా అన్నారు:
“సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.”
దీనితో నేను ఏకీభవిస్తున్నాను. నేను సాధారణ పాఠకుణ్ణే. ఆస్కర్ వైల్డ్ ఏకవాక్యాలు (one-liners) నాకు బాగా నచ్చేవి. ఆ తర్వాత అతని జీవిత చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం తెచ్చి చదివితే తెలిసింది అతన్ని రెండు సంవత్సరాలు అప్పట్లో ఒక చెప్పుకోదగని నేరానికి చెరసాలలో పెట్టారని.
అది చదివి హతాశుణ్ణయ్యాను. కానీ అతని వాక్యాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. అతని నేరం (?) ఏమాత్రమూ నచ్చదు. 🙂
ఈ బాదరాయణ సంభంద బాంధవ్యాలేమిటో కాని, ఒక్కమాట నిజం. మనకోసమంటూ లేదా మనమెలా ఉన్నామో అని ఒక్కసారన్నా ఆలోచించేవాళ్ళే మనవాళ్ళు. ఇది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. మన అవసరానికి అప్పటికప్పుడు మనదగ్గరికి వచ్చేవారే మనకి సహాయకులు గాని, మన సహాయం అడిగితే మటుకు ఎవ్వరైనా కాదనేవారే.
ఈ కథ లో నైనా ఆ సమయంలో అండ్రియా , హార్లీ , ఇంకో తెల్ల జంట అక్కడికి వచ్చారు కాబట్టి ఆ సమయంలో సహాయకంగా చేయి అందించగలిగారు కాని, లేకపోతే వాళ్ళు కూడా అక్కరికి రాని మిత్రులే కదా!
” నమ్మితే ప్రాణాలైనా ఇస్తాము, నమ్మడమేరా కష్టం
ముక్కుసూటిగా ఉన్నది చెప్తాము నచ్చకుంటే మీ ఖర్మం
కష్టమొచ్చిన కన్నీరొచ్చిన
చెదరని కదలని ఇంధ్రధనుస్సులం మేమే ఇండియన్స్ ”
అన్నది గుర్తోస్తోంది. కథలో ‘మన ‘ అనుకొనేవాళ్ళని విలన్ గా(అక్కరకి రాని నేస్తం గా) చూపించడం కొంచం బాధగానే ఉంది.
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/29/2008 11:43 pm
సాయి గారికి,
మీ పురోహితుడి ఉదాహరణ నాకర్థం కాలేదు. కుటుంబరావుది ఉద్యోగధర్మమూ, శ్రీశ్రీది మరొకటీనా? ఎలా? ఇద్దరూ బతుకుతెరువు కోసం తమ నమ్మకాలతో కొంత రాజీపడినట్లుంది. మహాకవులూ, మేధావులూ కూడా రాజీ పడితే ఎలా? అని ధర్మజీవులడగొచ్చు. కాని, రాజీపడకపోతే, మన సమాజంలో అలాంటి నమ్మకాలున్నవాళ్ళకి సరయిన ఆస్తిపాస్తులుంటే తప్ప ఇల్లు గుల్లవచ్చు. ఏం? ఆ మాత్రం త్యాగం చెయ్యలేరా? అంటే, ఏమో, అది కడుపులో చల్ల కదలని నాలాంటి వాళ్ళు చెప్పడం ధర్మం కాదు.
పరిమితమైన నా సాహితీ పరిధిలో చండీదాస్ లా ధైర్యంగా చెప్పే రచయితలెవ్వరూ లేరు – చలం తప్ప.
మీరు “సాధారణ పాఠకులు హంసలు కారు. వ్యక్తినీ, రచన్నీ, వ్యక్తిగత సిద్ధాంతాలనీ దేనికది వేర్వేరుగా తూకం వెయ్యరు. వెయ్యలేరు,” అన్నారు. మీరే సమర్థించిన ప్రసాదు గారి ఆక్రందన – ప్రజలు వేర్వేరుగా తూకం వేస్తున్నారనే గదా?
హంసలంటే చలసాని ప్రసాద్ రాసిన “అనంతం” ముందుమాట గుర్తొచ్చింది: “ఏ ముసుగులూ, దాపరికాలు లేకుండా ఉన్నదున్నట్టు రాశాడు శ్రీశ్రీ. … మింగలేని చేదునిజాలూ, వినలేని సంగతులూ, చూడలేని దృశ్యాలూ … ఏదిఏమయినా ప్రజలు హంసల లాంటివారు…”
సామాన్య పాఠకులకి హంసలతో కాస్తో కూస్తో చుట్టరికం లేకపోతే, అనంతం వెలువడిన పాతికేళ్ళ తర్వాత కూడా మహాప్రస్థానం ఎందుకు నిలుస్తుంది?
సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.
(నేనీ లాంగ్ వీకెండ్ ని సద్వినియోగపరచుకుంటే, వచ్చే వారం అలాంటి ఒక ద్రష్ట గురించి నా కంప్యూటింగ్ వ్యాసంలో చదవచ్చు. విషయం, సందర్భం, మన రచయితలతో పోల్చదగ్గది కాదు కాని నేను పైన అన్న దానికి ఓ ఉదాహరణ.)
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
08/28/2008 11:32 am
It is unfair to take a dig at Vemana’s past. He wrote padyams after, not before, overcoming his past. Same thing with Valmiki et.al.
శ్రీశ్రీ భక్తి రచనలు ఉపాధికోసం రాసాను అనడం వాస్తవికతనే కాక అతని నిజాయితీని కూడా చెప్పుతుంది. అయితే ఈ చర్చ కేవలం రచనలు, రచయితలకే పరిమితం చేయడం అన్యాయం!
“తిట్టొద్దు, కొట్టొద్దు, (లేదా మీకిష్టమొచ్చిన తప్పిదాన్ని ఇరికించండి)
అని చెప్పుతూ, నువ్వు అవ్వే చేయొచ్చు, కాని నేను అవి చేస్తే తప్పేంటి నాన్నా” అని అనడం, వినడం తెలియని వారెవ్వరు! మాటకు, చేతకు అదే సంబంధం. చేత మనిషి వ్యక్తిత్త్వం అయితే మాటలు ఆ వ్యక్తి రచనలు కావచ్చు.
తప్పిదాలగురించి కాదు, వొప్పిదాల గురించి అయితే కూడా ఇదే పరిస్థితా అని అడుగొచ్చు.
అందరికి తెలిసిన కథ గుర్తుకొచ్చింది.
గాందీజీ దగ్గరకు ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి వీడికి చక్కెర ఎక్కువ తినొద్దని చెప్పమని వేడుకుందట. తల్లి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి గాంధీజీ దగ్గరకు తీసుకొచ్చింది ఆయన చెపితేనన్నా వింటాడేమో అని ఆశతో.
ఏముంది! ఇప్పుడు కాదు, వారం రోజులయింతరువాత తిరిగి రమ్మన్నారట గాంధీజీ. మళ్ళీ వారం తరువాత వెళ్ళితే, గాంధీజీ పిల్లవాడిని ప్రేమతో దగ్గరకు చేర్చుకొని చక్కెర ఎక్కువగా తినకు అని చెప్పాడట. ఈ మాత్రం ముక్క చెప్పడానికి వారం తరువాత ఎందుకు రమ్మన్నారు అని ఆ తల్లి ఆడిగిందట. వారం రోజుల క్రితం వరకు నేను కూడా చక్కెర ఎక్కువగా తినేవాడిని. నేను తగ్గించిన తరువాత ఇప్పుడు చెప్పాను అని వివరించాడట గాంధీజీ. కథ కంచికి.
రచయిత అకారణంగానో, సకారణంగానో, ఒకరి దుకాణంకోసమో,లేక సవాలక్షల కారణాలతో రాయొచ్చు. ఎందుకు రాయకూడదు? అందంగా, అధ్భుతంగా కూడా ఆ రచనలు రావొచ్చు. అవార్డులు కూడా పొందొచ్చు. అయితే నిజాయితీ లోపించే రచనలు ఆ తల్లి చెప్పిన మంచి మాటల్లాగానే మిగిలిపోతాయేమో.
నిజాయితీతో చెప్పిన మాటలు పెద్ద రచయితవి అయినా కాకపోయినా, అవార్డులు రివార్డులేవి వచ్చినా రాకపోయినా, అసలు రాయడం చదవడం కూడా రాని వాడివైనా కూడా గుండెకు తగులుతాయి. మార్పుకు ఊపిరి ఇస్తాయి.
విధేయుడు
-Srinivas
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/27/2008 11:30 pm
నమ్మకాలు – బ్రతుకుతెరువు
సాయి గారికి,
చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.
రేపో మాపో చండీదాస్ స్వీయచరిత్ర వెలువడితే, ఆయనొక యోగిలా బ్రతికాడని తెలిస్తే, అనుక్షణికం విలువ ఓ పిసరు పెరగొచ్చు. భ్రష్టుడనిపిస్తే ఓ పిసరు తగ్గొచ్చు. కాని మౌలికంగా నవల విలువలో మార్పుండదు. ఉంటే మనం సాహిత్యాన్ని వెలకట్టడానికి వాడే తూనికరాళ్ళని తనిఖీ చెయ్యాలి.
శ్రీశ్రీ భక్తి రచనలు జీవనోపాధి కోసం రాశానన్న సమర్థన దబాయింపు గానూ లేదు, సంజాయిషీ గానూ లేదు. కఠోరమైన వాస్తవికతతో కూడి ఉంది. మహాప్రస్థానం తోనో విప్లవ రచనలతోనో వచ్చే డబ్బుతో పొట్ట గడుస్తుందంటారా? గడవకపోతే ఏమాయె, “సతుల్, సుతుల్, హితుల్ పోతే పోనీ, … తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ,” అన్న కళా రవి, ఆ మాత్రం నిజజీవితంలో ఆటుపోట్లకి తట్టుకోలేనివాడు, కవిత్వం, కాకరకాయా రాయడమెందుకు అంటారా?
“తన విశ్వాసాలు, నమ్మకాలూ ఎలాంటివైనా చందమామ పాఠకుల కోసం ఆయన విశేషమైన కృషి చేసి, సేకరించి, అందజేసిన ప్రాచీన ఇతిహాసాలూ, పౌరాణిక గాథలూ, ఆ శైలీ మరువరానివి. స్వర్గీయ శ్రీ చక్రపాణి ఆశయాలకు రూపం కల్పించి, తన శైలితో పాఠకలోకాన్నీ, తక్కిన పత్రికలనూ ఆకర్షించిన మేధావి శ్రీ కుటుంబరావు.”
అంటే కుటుంబరావు తన నమ్మకాలతో సంబంధంలేని రచనలకి మెరుగులు దిద్దే పనికి అంకితమయ్యేడనే కదా! ఎందువలన? అని చలసానే కుటుంబరావుని సూటిగా ఆయన బ్రతికుండగనే అడిగారు:
“మీరు – నేనూ ఒకే వృత్తిలో ఉన్నాం. ఎడిటర్ గిరీ అనేది ఒక వృత్తి. బతుకుతెరువు. మనం ఎడిటర్లగా కాక ఏ ఆఫీసర్ గానో, లెక్చరర్ గానో, బ్యాంకు ఉద్యోగిగానో వుంటే, ఆఫీసులో మనం చేసే పని గురించిగానీ, దాని స్వభావం గురించిగానీ ఎవరూ ప్రశ్నించరు, విమర్శించరు. కానీ, ఎడిటర్ అనీగాన అందరూ అతను పనిచేసే పత్రికలోని భావాలన్నింటికీ అతన్నే బాధ్యుడిగా భావిస్తారు, విమర్శిస్తారు. మీరు చందమామ లో వేసే కథల స్వభావం గురించి, వాటిలో రాక్షసులు, భూతాలు, దయ్యాలు, దేవుళ్ళు మున్నగు వాటిలో గల ఔచిత్యాన్ని గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు…. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?” (రసన, పేజీ 133.)
కుటుంబరావు దీనికి సమాధానం ఇవ్వలేదు కాని, నేనూహించుకోగలను – కుటుంబరావుకీ పోషించాల్సిన కుటుంబమొకటుంది. శ్రీశ్రీ, కుటుంబరావు, ఇంకా అనేకమంది, పొట్టపోషణ కోసం తమ నమ్మకాలతో పూర్తిగా కాకపోయినా కొంతయినా పొసగని పనిలో ఉండి ఉండొచ్చు. వాళ్ళు తమ నమ్మకాలని వదిలెయ్యాలా? లేక వేరే బ్రతుకుతెరువు చూసుకోవాలా? మీరయితే ఏం చేస్తారు?
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
08/27/2008 2:17 pm
ఇక్కడ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ, వస్తువూ వేర్వేరు గా చూడ్డం కుదరని పని.
బహుశా జె యు బి వి గారికీ ( నాక్కూడా ) దీనితోనే అభ్యంతరం అనుకుంటాను.
మంచిది నీతిమంతులారా, మహా ప్రస్థానాన్ని విశాఖ సముద్రంలోకి విసిరెయ్యండి, గుయెర్నికాని కాల్చెయ్యండి. అక్కడతో ఆగకండి, ప్రాచీన కళా కారులు, సాహితీకారులేం మడి కట్టుకోని కూర్చోలేదు వారి చిత్రాల్ని, రచనల్ని సైతం సమిధలు చేసెయ్యండి. ఐతే వొక మనవి ఆ మంట వెలుగులో మీవెనక భాగాలు మాత్రం ఎవరికీ కనపడకుండా కప్పి పెట్టుకోండి, లేకపోతే ఎవరో మిమ్మల్ని కూడా ఆ మంటల్లోకి దోశెయ్యగలరు.
నీతులు చెప్పడం సాహిత్యం కాదు. బ్రతుకుని చిత్రించడం సాహిత్యం. ఆ జీవిత చిత్రణ ఎవరి కలంనుంచొస్తేనెవి. అక్ష్రర రూపం తీసుకున్న ఆ అంతరంగ వుప్పెన కి దానికంటూ వొక అస్థిత్వం ఏర్పడుతుంది. రచయితతో సృష్టికర్తతో సంబంధంలేని వ్యక్తిత్వం ఆ రచనకి అబ్బుతుంది. రేఖా మాత్రంగా రచయిత రచనలో కనిపడొచ్చేవో but by itself it will be an independent entity. Like any of us who inherited a few characteristics from our parents. Still we grow up to be independent human beings and we will not and do not want to be judged by personalities of our parents. రచనలు, రచయితల మధ్య కూడా అదేవిధవైన సంబంధం వుందని నా నమ్మకం.
జారుడుబండ మీద కాలేస్తే ఏమవుతుందో తెలిసీ, పెద్దగా పట్టించుకోని రచయితలు మనకు కావాలని ఎవరైనా కోరుకుంటే ‘చదివే సమాజం’ పరిధి పెరగాలి. మనమున్న బావి, కాదు ఇంకుడు గుంత, లోంచి కనీసం తలైనా పైకెత్తి ప్రపంచాన్ని చూద్దాం అని చదివే వాళ్ళకుండాలి. చదివే వాళ్ళకు అర్హత అవసరం అన్నది కొంతవరకూ కరెక్ట్. అది ఎట్లాంటి అర్హత అనేదగ్గరే కొద్ది పేచీలు. వాటిని తీర్చడానికి కొంత అర్హత కలిగిన వాళ్ళే రాయాలి. వాటి మీద మళ్ళీ చదవటానికి, రాయటానికి “క్వాలిఫై” అయిన వాళ్ళే కావాలి.
విషయం తీవ్రబడి, చిక్కబడ్డప్పుడు అర్హత అనేది ముఖ్యమవుతుంది. కొడవళ్ళ కోట్ చేసిన, ఆయన ఫేవరైట్ రచయిత మాటలు ఆ దాంట్లోకే వస్తాయి. అది డిఫెండ్ చేయగలిగే మాట.
విషయానికున్న తీవ్రతను రచయితకన్నా అర్హత కలిగిన పాఠకుడే బాగా గ్రహిస్తాడేమో అని నా అనుమానం.
ఇక మళ్ళీ ఒకసారి ముందునించే మొదలు పెడితే:
సరే, మీరన్న రాయటానికి అర్హత అక్కర్లేదు అన్నది “ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి” అయినా కూడా ఆయా విషయాలకు ఉన్న తీవ్రత ఏ అర్హతా లేని వాళ్ళకు తెలవదు, రాయలేరు. (తెలుస్తుందని, రాయగలరని మీకు అనిపిస్తే, “ప్రూఫులు కావాలి” బాబ్జీలు గారూ అంటాన్నేను :)). “తెలవటం” ఒక అర్హత.
ఇది గుడిపాటి అడిగిన “మన కవులు అక్షరాస్యులేనా!” దగ్గరికే తీసుకు రావచ్చు. లేదా “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్న దగ్గరే మొదలు పెట్టొచ్చు. “కవికి కావలసిన కనీస అర్హత గురించి కవులే చెప్పాలి” అని నేనూ ఒక పెద్ద సారును తల్చుకుని ఇప్పటి మటుకు వదిలించుకోవచ్చు. ఇవి రాయటానికి నాకేం అర్హత ఉందీ అని నన్నే అడిగితే మాత్రం జవాబు “అది చదివే వాళ్ళు డిసైడ్ చేయాల”ని చెప్పటం తప్ప మరో మాట లేదు.
అర్హత కలిగిని చదివే వాళ్ళు, రాసే వాళ్ళ అర్హతను నిర్ణయిస్తారు అని మరోవిధంగా చెప్పొచ్చేమో, మన ఆంజనేయ స్వామి గుడిమెట్ల మీద — చెప్పుకునే విషయంగా. “రచ్చబండ” అయితే మాత్రం ఇంకా స్పష్ఠంగా చెప్పాల్సి ఉంటుంది.
అసలు నేను రాసింది వెనక్కు తీసుకుందామనుకున్నాను. కానీ కాలు పెట్టింతర్వాత అది తీయటం కష్టం అనిపించి మాట్లాడలేదు. ఒక కాలే కదా అని ఊరుకుంటే ఇప్పుడు రెండోది కూడా పెట్టి చూడమన్నందుకు మీకు ధన్యవాదాలు.
ఇక ముందుకెళ్ళి, మిగతావి కూడా చూద్దాం:
(వీటిని పెద్దగా కాంటెక్స్ట్ లో పెట్టి, అంటే వెనక్కెళ్ళి, భూతద్దం అప్పుతెచ్చుకుని, చూడకండి, దేనికదే అన్నట్టు చదవండి, వీలైతే)
“రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.” కాదు, చదివే వాడి అర్హత ఇక్కడ ప్రశ్నార్ధకం.
“నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.” వొల్లకుంతానికి నానేవన్నా పెండ్లి సేసుకున్న సీతాల్నా! అవుసరవైతే అయిదారుగురికి ఒక్క సారే గురెట్టి, ఒకల సిగలొకలకు ముడివెట్టి కొత్త భారతవేదైనా పుట్టి చస్తుందేవో అని సూసే వోడికి ఇదేం లెక్క?
నీతులు చెప్పటానికే కాని వినటానికి బాగుండవు అని ఎవరో పెద్దతలకాయ అనగా విన్నాను. నిజాయితీ అనే అర్హత మాత్రం ఏది రాయాలన్నా కావాలి.
వేమన గురించి “అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి?” అని అడిగినందుకు: కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి ‘నీతి’ మారుతుంది. ‘నిజాయితీ’ మారదు. ఇవాల్టి నీతి రేపుండక పోవచ్చు. నేను రాసిన ఒక బేవార్స్ ఎక్సాంపుల్ ‘నిజాయితీ’ గురించి, నీతి గురించి కాదు. మన దగ్గర (ఇప్పటికీ) పది పదమూడు ఏండ్ల పిల్లలను పెండ్లీలు చేసుకునే వాళ్ళున్నరు, వాళ్ళంతా ఛైల్డ్ మాలెస్టర్సే మరో ప్రాంతపు నీతిని బట్టి చూస్తే. అట్లాంటి క్వాలిఫికేషన్స్ కాకుండా, నిజాయితీ గురించి మాత్రమే నేను రాసింది.
నిజాయితీ మరో అర్హత రాయటానికి.
సెలవ్.
విప్లవ్
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/26/2008 8:49 pm
రచయితలు, శ్రీరంగనీతులు
ఇది జె.యు.బి.వి. ప్రసాద్ గారి అబిప్రాయంపై నా స్పందన. పాతికేళ్ళ క్రితం ఆంద్రజ్యోతిలో అనుక్షణికం సీరియల్ చివరకొస్తుండగా, పాఠకులతో ప్రశ్న-జవాబుల ముచ్చట ముగిస్తూ, వడ్డెర చండీదాస్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి:
“చాలా మంది పాఠకులు నా గురించి (‘పర్సనల్’ విషయాలు) అడుగుతూ వొచ్చారు. మీరు మీ నవలలో కులాలను కులాలుగా స్పష్టంగా చిత్రించారు కదా. మీది యే కులం. మీ సొంత కులాన్ని మీరు ఏ విధంగా చిత్రించారో తెలుసుకోవాలనుంది / మీ భార్య చనిపోయినప్పుడు “హిమజ్వాల”, ప్రేయసి చనిపోయినప్పుడు “అనుక్షణికం” రాశారట కదా / మీరు కన్వెర్టెడ్ క్రిస్టియన్నట కదా / మీ జీవితంలో కులతత్వాల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ వొచ్చారు / మీరు తిరుగుబోతట కదా / మీది కులాంతరమట కదా / మీరు తిక్కమనిషట కదా / మీరు దేవుడిలాంటివారట కదా / మీరు అవివాహితులట కదా / మీకు ఇద్దరు భార్యలట కదా / మీరు బ్రహ్మచారులట కదా, యిలా యెన్నో. వాటికి వేటికీ జవాబు లివ్వలేదు. నచ్చితే నా రచన చదవండి. నా జీవితాన్ని అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ కలిపి పరిశీలించతగిన రచయితనైతే అందుకు యింకా వ్యవధి వుంది….
ఐతే. నా జీవితం – అందులో అల్పత్వాలున్నా మహత్వాలున్నా అసహ్యతలున్నా అభినందనీయాలున్నా అభిశంసనీయాలున్నా నా జీవితం నా జీవితంగా యధాతధంగా పరిశీలించాల్సిన వేళ వొస్తే ఆనాడు తప్పక అలా యధాతధంగా లభ్యమవుతుంది.”
చండీదాస్ లాంటి రచయితలు అరుదు. కాని ఆయనన్నది అందరికీ వర్తిస్తుందనుకుంటాను. యండమూరి, శ్రీశ్రీ, శివారెడ్ది, పసంద్ రెడ్డి (?) – వాళ్ళ రచనలు అసలు ముందర చదవదగ్గవో కావో పరిశీలించండి. చదవదగ్గవి కాకపోతే, వాళ్ళ జీవితం లో కెళ్ళడం వ్యర్థం. చదవదగ్గవే కాక, ఉన్నతమైన రచనలైతే, వాళ్ళ జీవితాల్లో కెళ్ళండి. వారి అల్పత్వాలని బయల్పరచి వాటి మూలంగా ఒకప్పుడు విలువైనవనుకున్న రచనలు ఇప్పుడు పాఠకులు ఎందుకు విసిరి పారెయ్యాలో వివరించండి. వెంటనే పాఠకులలో మార్పు వచ్చి సమాజంలో నీతీ న్యాయం పెరుగుతాయనుకోను గాని, మీ ఆక్రోశానికి మాత్రం సాహితీ గౌరవం లభిస్తుంది.
జ్యొతిష్యము గురించి డిస్కషను బాగుంది కాని జ్యొతిష్యము నమ్మాలి అనే వారికి ఒక్ ప్రశ్న ఒకే రొజు ఒకే time ఒకే place లొ పుటిన వాళు ఒకె రకమయిన జాతకమ్ ఉండదు యెందుకు.
నన్నయ కాలములో ఋ-కారాన్ని రి-కారముగా పలికేవారు.
అందుకే ఆ కాలపు శాసనాలలో కూడ ఋణము అనృ దానికి
బదులు రిణము అని వాడారు. కాని తిక్కన కాలానికే ఋ-కారాన్ని
రు-కారముగా పలకడానికి ఆరంభించారు. తిక్కనగారు కొన్ని
చోటులలో ఋ-కారానికి రు-కారానికి యతి కూడ చెల్లించారు.
సామాన్యముగా ఛందస్సులో ఇది నిషిద్దము. ఋ-కారానికి
రి-కారానికి, ఇ, ఈ, ఎ, ఏ, హి, హీ, హె, హే, యి, యీ, యె,
యే, ఋ-కారము ఉన్న అన్ని హల్లులకు యతి చెల్లుతుంది.
కాబట్టి అమ్రుతము అని పలికేటప్పుడు, వ్యావహారిక భాషలో
అమృతమునకు బదులు అలా రాయడములో తప్పు లేదని
నా భావన. గ్రాంథికముగా మాత్రము అది సరి కాదు, అంతే.
తెలుగువారు మాత్రమే కాదు, కన్నడ, మరాఠీ, ఒరియా భాషలలో
ఋ-కారాన్ని రు-కారముగా పలుకుతారు. మిగిలిన ఉత్తర
భాషలలో రి-కారముగా పలుకుతారు.
విధేయుడు – మోహన
మాస్టారూ,
ఇలాంటి కథలు మా univలో సహాయాన్ని పొంది, అన్నీ మరిచిపోయి, US వెళ్ళి సెటిల్ ఐనవాళ్ళు కాస్త చదివితే, ఒకరిద్దరికైనా సహాయం చేస్తారేమో. కాని, వాళ్ళు గొప్పవాళ్ళు … తెలుగు చదువుతారా?
ఎందుకంటే వాళ్ళు రాసిన దాని “అర్హత” మీద అది బతికితే బతుకుతుంది, లేకపోతేలేదు. రాసినవాళ్ళు “మలబారు పోలీసు గేంగీల్నెట్టి, రాసింది బాగోలేదని రాసిన వాళ్ళందర్నీ సితక్కొంటీచిసినా” దాని అర్హత మారదు.
రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు “రత్తాలు రాంబాబు” నవల విషయంలో చెప్పింది, రాసే వాళ్ళందరూ ఆచరించదగ్గది.
“కథ రాసేక, దాన్ని మరింక విడిచి పెట్టక, దాని మానాన్న దాన్ని బతకనివ్వక (లేదా చావనివ్వక) ఆ రాసినవాడు, దాన్ని సాకుతూ, సంరక్షించుకుంటూ, సమర్థించుకుంటూ, నెత్తిని పెట్టుకొని తిరగడం నాకు ఇష్టం లేదు.
నిజానికి దగ్గరగా వుంటే కథ కొన్నాళ్ళు ఉండవచ్చు. సత్తువుంటే ఉంటుంది, లేకపోతే పోతుంది.
“రత్తాలు రాంబాబు” నవల గురించి ఏమైనా తెలియాలంటే, అది నవల వల్లే తెలియాలి కాని నా వల్ల కాదు.”
అందుచేత, రాసిన ప్రక్రియకి అర్హత ఉండాలి, చదివే వాళ్ళందరిచేతా “సెబాస్” అనిపించుకునే అర్హత. చదివే వారికి అర్హత కావాలి. అర్థం చేసుకునే అర్హత. “సెబాస్” అనగలిగే అర్హత. రాసే వాళ్ళకి ఏ అర్హతా అక్కర్లేదు. రాయగలిగే అర్హత తప్ప.
మిమ్మల్నీ, భైరవభట్ల కామేశ్వర రావు గారినీ, రోహిణీప్రసాదు గారినీ, వైదేహీ శశిధర్ గారినీ, పామర్తి వారినీ, రవికిరణ్ గారినీ, మురళి గారినీ, మూలా సుబ్రహ్మణ్యం గారినీ, లక్ష్మన్న గారినీ మీ అందర్నీ మించి ఉదయకళ గారినీ, వగైరాలతో పోలిస్తే మీ పక్కన నిలబడ గలిగే అర్హత లేదు నాకు. అది నాకు తెలుసు. ఎందుకంటే, ఈ అభిప్రాయాలు రాయకముందు “నథింగ్ టు రైట్ అబౌట్”.
కావాలని మారు పేరుతో అభిప్రాయాల్ని రాయటం లేదు.
2006లో ఈమాట ని మావగాడు పరిచయం చేసినా పట్టించుకోలేదు. అది నా దురద్రుష్టం. ఈ ఏడాది మళ్ళీ న్యూయార్క్ నుంచి వచ్చి తిట్లుతిట్టి “మీ అభిప్రాయం తెలిచేయండి” ని చూపించేడు, మావ గాడు. వున్న వ్యసనాలని మించి ఈమాట చదవడం, అభిప్రాయాలు రాయడం వ్యసనవైపోయింది.
నా ప్రవర చెప్పమని “జయప్రభ” గారన్నారు. ఇదీ వరస.
నా మట్టుకి నేను, నా గురించి “సహస్ర శిరఛ్చేద అపూర్వ చింతామణి” లో దొంగ సన్యాసిననీ, “ఆషాఢభూతి” గురువుగారిననీ, “మందుల భీముడి” మేనల్లుడిననీ, “ముంగేరీలాల్ కె హసీన్ సప్నే” లోని రఘువీర్ యాదవ్ ననీ, “బైరాగినా, అసిరిగాడినా” అన్న సందిగ్ధంలో వున్నవాడిననీ, “సింహాచలాన్నా,అడ్డబుర్రనా” అన్నఅనుమానంలో వున్నవాడిననీ ఖచ్చితంగా నమ్ముతున్నవాడిని. “ధర్మవ్యాధుడిలా” బతకాలని తెలిసికూడా అదెలాగో తెలియనివాణ్ణని అనుకుంటున్నాను.
“రాయని భాస్కరుణ్ణని” మొదట తెగ ఫీలయిపోయీవాడిని.ఎందుకంటే “క్రుశా” గురించి శ్రీశ్రీ అలా అన్నాడు కాబట్టి. తరవాత తెలిసింది రాయడం “చేతకాని” భాస్కరుణ్ణని.
నా పేరు భాస్కర్. సివిల్ ఇంజినీర్ని, మూడేళ్ళయి హైద్రాబాదులో వుంటున్నను. అంతకుముందు, దేశం అంతా తిరిగేను. బొంబాయిలో పదకొండేళ్ళు వున్నాను. చదవడం ఎంత వ్యసనం అంటే, బొంబాయి లోకల్ ట్రైన్లో కూడా, క్రిక్కిరిసిన జనం మధ్య కూడా నిలబడి చదివీ వాడిని. ఇది నా “స్ట్రెంగ్త్” అని నా అనుమానం.
ఈ మాట “ఫార్మాట్” లో వున్న సులువువల్ల తెగించి అభిప్రాయాలు రాసేస్తున్నాను, అంతే.
ధర్మవ్యాధుడిలాటి కొడవళ్ళ హనుమంతరావు గారిని, మీ అందరితో పాటూ స్మరించకపోవడం నా తప్పు.
మొద్దబ్బాయి గారూ,
అసలు పేరు చెప్పకపోవడానికీ, అసలు ఇంటి పేరు వేరే వాళ్ళు మార్చేయడానికీ తేడా తెలుసుకోకుండా, మోకాలికీ, బోడిగుండుకీ ముడి పెట్టి, సార్థకనామ ధేయులనిపించుకున్నారు.
ఒక మనిషి తన అభిప్రాయంలో రాసిందే ముఖ్యం. ఆ మనిషి ప్రవర సెకండరీ. శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు అని మీరంటే, అది మీ అభిప్రాయం అవుతుంది. ఎవరి వ్యంగ్యాలు వారికుంటాయి.
ఈమాట వారు వ్యక్తిగత వ్యంగ్యాలకి చోటు ఇవ్వం అంటూనే, ఇలాంటీ వ్యక్తిగత వ్యంగ్యాలని అనుమతించడం భావ్యంగా లేదు. ఎవరి స్వేచ్చ వారికుండాలి. “నీ పేరు చెప్పూ, నీ పేరు చెప్పూ, అప్పుడే నువ్వన్న విషయాలు పట్టించుకుంటాము” అని అనడం భావ్యం కాదు. ఒకవేళ అలాగే వుండాలీ అని అనుకుంటే, ఈమాట వారు ఆ రూలే పెట్టాలి.
నా అబిప్రాయంలో విషయానికే ప్రాధాన్యత ఇచ్చాను. వ్యాసకర్తని ఒక్క మాట అనలేదు.
అభిప్రాయాలతో ఎవరూ మారరు సాహిత్యానికి సంబంధించిన వరకూ. కానీ అలాంటి అభిప్రాయాలు వుంటాయి అని తెలియడం కోసమే ఈ అభిప్రాయ వేదిక. ఆ పైన సెన్సార్ చెయ్యడానికి పెద్దలున్నారు.
పేరు చెప్పకపోవడం వల్లనే, నా అభిప్రాయానికి విలువ లేదని మీరంటే, అలాగే కానియ్యండి.
పాఠకుడు
అయ్యా బాబ్జీలుగారు కవిత్వం, సాహిత్యం గురించి కాదు కాని, నాకు తెలిసిన విషయంలో మాత్రం మీరు పొరబడ్డారేమో అని భయం!
పిల్లల “హోం వర్క్” (సొంతంగా) చేయడం సులువంటే ఒప్పుకోవచ్చేమో కాని, “చేయించడం సులువు” అంటే నిజమేనా అనిపిస్తుంది. చేయించడానికి కనీసం పిల్లలను ఒక్కచోట కూచోబెట్టాలి. కాళ్ళు కట్టేసినా, పిల్లకాయల మనసులను కట్టేయడం, కాదు ఆకట్టుకోవడం, ఒక చాలెంజ్. ఇంతా అయింతర్వాత మన ధిమాక్ లోకెక్కింది వాళ్ళ ధిమాక్ లోకి ఎక్కించడాన్ని ఏమన్నా అనొచ్చు కాని సులువు అని మాత్రం అనగలమా అని డౌటు. ఈ తిప్పలంతా చూసే గురువుగారిని “గురు బ్రహ్మ” అనికూడా అనేసారేమో అని అనుమానం కూడా. దీనికంటే ఒకచోట కూర్చోని, అక్షరాల ఒక కావ్యమో, విమర్శో, గేయమో, వచనమో, కథనో, నవలనో, లేకపోతే ఇప్పటి దాక పుట్టని ఒక అపూర్వ సాహితీప్రక్రియనో ఈ తిప్పలగురించే వ్రాసేయడం సులువేమో అని కూడా చెడ్డ అనుమానం. కాదంటారా?!
పువ్వుల దండలో దారం దాగున్నట్ల నేను చెప్పబోయేది అంతర్లీనంగా కృష్ణమూర్తి గారిచ్చిన సలహాలలో ఉంది కాని, మరి కొంచెం విపులంగా చెబుతున్నాను, అంతే.
7. ప్రతి విద్యార్ధీ పాఠశాలలో మాతృభాషతో పాటు మరొక్క భాష నేర్చుకుంటే చాలు. ఆ రెండవ భాష ఎవరెవరి అవసరాలకి అనుకూలంగా వారు ఎన్నుకో వచ్చు. ఈ రెండవ భాష సర్వసాధారణంగా ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషలలో ఏదో ఒకటి అవటానికి సావకాశాలు ఎక్కువ.
రవి గారూ, జ్యోతిషాభిమానులకి కొన్ని సూచనలు అన్న అంశంలో నేను చెప్పదలచుకున్నది కొంతమటుకు మీ ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తుంది. అయినా మీరు అడిగారు కాబట్టి కొన్ని సూచనలు –
1) ఎవరైనా జ్యోతిష్కులని భవిష్యత్తు కాకుండా ఇదే విధంగా గతాన్ని గురించి చెప్పమనండి.
2) ఒక పదీ, ఇరవై జాతకాలకి ఒక్కో జాతకానికి పదేసి చొప్పున ఖచ్చితమైన ఫలితాలు రాసి ఇమ్మనండి. (మీ కామెంటులో రాసిన ఫలితాలు అన్నీ ఖచ్చితమైనవే, ambiguity లేదు అని మీరు భావిస్తున్నారా?)
3) చెప్పిన వంద, రెండువందల ఫలితాల్లోనూ ఎన్ని సరైనవో లెక్కపెట్టండి. దాన్ని బట్టి జ్యోతిషం ఎంతవరకు పని చేస్తుందో మీరే నిర్ణయించుకోవచ్చు.
4) ఏదైనా పత్రికలో ఇదే విధంగా గతానికి సంబంధించిన విషయాలు చెప్పి, తరవాత సంచికలో పాఠకులచేత ఆ ప్రిడిక్షన్సు తప్పో, ఒప్పో చెప్పించే శీర్షిక ఒకటి పెట్టడానికి వీలవుతుందో లేదో చూడండి. కనీసం ఇటువంటి ప్రతిపాదనకి పేరుప్రఖ్యాతులున్న జ్యోతిష్కులెవరైనా అంగీకరిస్తారేమో చూడండి. (ఆ శీర్షిక ద్వారా జ్యోతిషం నిజమని నిరూపితమైతే, జేమ్సు రాండీ బహుమతిని గెల్చుకోవడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.)
నాలుగవ తరగతి చదువుతున్న మా అమ్మాయికి, తెలుగు “రెసిటేషన్” పోటీకి, మూడు పెద్దన గారి పద్యాలు, మనుచరిత్రము నుండి, వాళ్ళ తెలుగు “మేమ్” ఇచ్చేరు.
“మేమ్” గారూ శిష్యురాలూ కలిసి, మూడు పద్యాలూ వచన కవిత్వంలా రాసేరు.
వచనకవిత్వాన్ని ఛందస్సర్పపరిష్వంగంలోకి తీసుకెళ్ళాలి. పగవాడికి కూడా వద్దు ఈ బాధ.
“… ప్రాలేయ (కామా) రుణ్మండలీ..” అని రాసేరు “తెలుగుమేమ్ గారు”.(నా యూనీకోడ్ చేతకాని స్పెల్లింగ్ “రుణ్మండలీ”)
మూడవ తరగతి లో “అల వైకుంఠపురములో..” పద్యం, “సిరికింజెప్పడు..” పద్యం “రిసైట్” చేసి “ఫస్ట్ ప్రైజ్” “కొట్టేసిన” విద్యార్ధినిని, “నాలుగోక్లాసు మేమ్” “బాగా చెప్పి ప్రైజ్ రాకపోతే వుంది నీ పెళ్ళి” అని భయపెట్టి మరీ పంపించింది.
మనుచరిత్ర(ము, ప్రథమా విభక్తి????) ఇప్పుడెక్కడ దొరుకుతుందిరా “దేవుడా” (ప్రథమా విభక్తి కాదు) అని అనుకుంటూంటే, “ఈమాట” “గ్రంధాలయం” గుర్తొచ్చి బతుకుజీవుడా అనుకున్నాను.
“ఈ మాట” చలవ వల్ల పద్యాలు, పద్యాల్లా దొరికేయి. “ప్రైజ్” మాట దేవుడెరుగు, “ప్రైజ్” రాకపోతే “నాలుగోక్లాసు మేమ్ చేతిలో మా అమ్మాయి పెళ్ళి దేవుడెరుగు.”
“ఈ మాట” నామాం మరువాం, మరువాం.
చిన్న పిట్టకథ: కిందటేడాది నాకు “ఈ మాట” పరిచయం లేక, “సిరికిం..” పద్యం కోసం, తెలిసిన వాళ్ళిళ్ళకి తిరిగేను. ఓ ఇంట్లో, ఓ ఐటీ అమ్మాయి, ఏడాది కొడుక్కి అన్నం పెడుతూ “అంకుల్, అది శ్రీరామదాసు సినిమాలోది” అంది. ఆ పిల్ల తల్లితండ్రులు చాలా గర్వంగా చూసేరు నావేపు. “ధన్యోస్మి” అని మనసులో అనుకుని, “థేంక్సు సుజాతా” అని బయటకని, బయటపడ్డాను.
గణవిభజన చేసి “అల వైకుంఠపురములో…” “సెట్” చెయ్యగలిగేను. “సిరికింజెప్పడు..” మాత్రం “శ్రీరామదాసు సినిమా సిడిలో” బాలసుబ్రహ్మణ్యం పాడినదే దిక్కయిపోయింది.
[బాబ్జీలు గారు: అభిప్రాయాలు రాసే పెట్టె పైన ఉన్న “కీబోర్డు మ్యాపింగ్ చూపించండి” అన్న లింకు నొక్కితే మీకు R.T.S. (Rice Transliteration Standard) కీబోర్డు మ్యాపింగ్ ప్రత్యక్షమవుతుంది. ఋకారానికి “ru” బదులు “R” అని టైపు చెయ్యాలి. ఉదా: కృష్ణుడు (kRshNuDu), సంస్కృతం (samskRtam). వర్గాల వారీగా అనునాసికాలు: ఙ (~ma), ఞ్ (~na), ణ (Na), న (na), మ (ma). మరికొన్ని ఉదాహరణలు: జ్ఞానము (j~nAnamu), ప్రాలేయరుఙ్మండలీ (prAlEyaru~mmanDalI) ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. — పద్మ, ఈమాట సంపాదక వర్గం.]
శ్రోతలని కట్టిపడేసేలా మాట్లాడే నేర్పు మృణాళినిగారి గొప్పదనం. మంచి ఉపన్యాసాన్ని అందరికీ అందించిన సాయిగారికి ఈమాటకీ ధన్యవాదాలు. శీర్షిక మాత్రం కాస్త తప్పుదోవపట్టించేదిగా ఉంది. ఇది “తెలుగు నవలా చరిత్ర” గురించిన ఉపన్యాసం కాని “సాంఘిక నవలల్లోని కథన శిల్పా”న్ని గురించి కాదు కదా.
ఉపన్యాసం, తర్వాత ప్రశ్నలకిచ్చిన జవాబులూ విన్నాక వచ్చిన అనుమానం. మృణాళినిగారు తెలుగులో హాస్యరచనలకి ప్రాముఖ్యం ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. మరి తన ఉపన్యాసంలో హాస్య నవలలని ఆవిడ పేర్కోకపోవడానికి కారణం ఏమిటి? అలానే, ఈ కాలంలో ఉద్యమాలకతీతమైన నవలలు మంచివి వస్తున్నా వాటికి గుర్తింపు రావడం లేదని కూడా చింతించారు. అటువంటి వాటి గురించి తన ఉపన్యాసంలో ఎందుకు ప్రస్తావించలేదు? ప్రశ్నకి సమాధానంగా అంపశయ్య నవీన్ మొదలైనవాళ్ళని గురించి చెప్పారు. అది తన ఉపన్యాసంలోనే ప్రస్తావించి ఉంటే బావుండేది.
ఇంతకుముందు తెలీక అవాకులూ, చవాకులూ వ్యక్తీకరించాను. ఈ వ్యాసంలో మీరు రాసిన “కంక్లూడింగ్ పేరాగ్రాఫ్” చదివేక తెలిసింది లోతైన వేళ్ళు గురించి.
సంగీత్ సరితా గురించి చిన్న ముచ్చట. లేకపోతే వివిధ్ భారతి గురించి:
మా పిల్లలు, అందరి పిల్లల్లాగే, పొద్దున్న స్కూలుటైముకి తయారవడానికి చాలా ఇబ్బంది పడుతుంటే, ఏందారిరా “బగమంతుడా” అని తెగ ఆలోచించి, వివిధ్ భారతి టెక్నిక్ కనిపెట్టేను. సరిగ్గా ఏడు గంటలకి “భూలేబిసరే గీత్”. భూలేబిసరే గీత్ మొదలయిపోయింది లేవండి, లేవండి అంటే, అదేదో ఆటనుకుని లేచీ వాళ్ళు.
ఇప్పుడు వాళ్ళే “నాన్నా ఇంకా సైగల్ మొదలెట్టలేదు, నువ్వుండు” అంటున్నారు.
దీనివల్ల ఇంకో ఎడ్వాంటేజ్ లేక డిసెడ్వాంటేజ్ ” అదేంటి, సైగల్ సైగలంటావు, మై క్యాజానూ క్యా జాదూ హై.. అలా పాడతాడు? అంటారు వాళ్ళు. “తప్పు, అలా అనకూడదంటే”, ఓకే అనేస్తారు.
నాకే సైగల్ తెలీదు, ముఖేష్ తప్ప.
అయితే “అప్పట్లో సైగల్ షాన్ లేపోతే కైలాష్ ఖేర్” అని నేను చెప్పినప్పుడు “అవునా” అని వాళ్ళు విచిత్రంగా నా వేపు చూస్తారు. అప్పుడు నాకు వేగుంట మోహన్ ప్రసాదు గారు మిగిలిన వాళ్ళు కలిసి ఎప్పుడో ఎనభైల్లో తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీషు లోకి తర్జుమా చేసి ఆ పుస్తకానికి “టెన్స్ టైంస”ని పేరు పెట్టేరు. అద్భుతవయిన పేరు.
వీళ్ళకి బాలసుబ్రహ్మణ్యవే పాత. ఘంటసాల దాటి, నాగయ్య, సైగల్ అంటే ప్రెజెంట్ టైం కాదు, ప్రెజెంట్ టెన్స్ కాదనిపించి ఏడవాలో నవ్వాలో తెలీక వెర్రి నవ్వు నవ్వేస్తాను.
శాస్త్రీయసంగీతమంతా ఆత్మానందం కోసమే అని చెప్పినవారు డా. నేరెళ్ళ వేణుమాధవ్. దాన్ని కాదనడం కష్టమని నాకూ అనిపించింది. ఒకప్పుడు ‘మార్గ’ సంగీతానికి సోషల్ రెలెవెన్సు ఉండే ఉంటుంది కాని ఈరోజుల్లో అటువంటిదేమీ కనబడదు. సాహిత్యం, నాటకం, కొంతవరకూ చిత్రకళ సమకాలీన సమాజానికి సంబంధించినవిగా ఉంటాయనేది తెలిసినదే.
పిల్లలూ, పెద్దవారూ కూడా సంగీతానికి ‘సహజం’గా స్పందించడం స్వాభావికమే. సాహిత్యప్రధానమైన గద్దర్ పాటలవంటివి vibrantగా అనిపించడానికి కారణం వాటికి సమాజంతో ఉండే సంబంధమే కదా.
పందెం కాస్తున్నానండి, నేను తెలుగులోనే పది వరకు చదివాను, విషయ పరిఙ్ఞానంలో, గ్రాహ్యతలో, బుద్ది కుశలతలో నేను ఏ ఆంగ్ల మాధ్యమ విధ్యార్థికన్నా తీసిపోను. తెలుగుని అభివృద్ది చేయడం మన కర్తవ్యం. కాని ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే మన భాషా సంస్కృతులు నశించటానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు.
మృణాళిని గారి విలువైన ఉపన్యాసాన్ని సేకరించినందుకు బ్రహ్మానందం గారికి చాలా కృతజ్ఞతలు. ఒక మనవి. సాహితీవేత్తలైన వక్తలు అమెరికా వచ్చినప్పుడు, వారికి అభ్యంతరం లేకపోతే ఈమాటలోనో రచ్చబండలోనో ఓ చిన్న ప్రకటన వెయ్యండి. వీలయితే వాళ్ళని సాహితీప్రియులు తమ తమ ఊళ్ళకి పిలిపించుకోవచ్చు.
మృణాళిని ఉపన్యాసం కేవలం డాక్టరేటు కోసం చేసిన పరిశోధన నుండి వచ్చినట్లు లేదు. లోతైన పరిశీలనతోబాటు తాదాత్మ్యంతో కూడిన విస్తృత పఠనంతో చేకూరిన అనుభూతితో సాధికారంగా మన నవలా చరిత్రని చెప్పి రక్తి కట్టించారు. ఎటు చూసినా కవితలూ, కథలూ, వాటి మీద చర్చావేదికలే కాని నవల గురించి మాట్లాడే వాళ్ళే తక్కువ. గత పాతికేళ్ళుగా స్తబ్ధుగా ఉండిపోయిన తెలుగు నవలా రంగానికి విశిష్ట చరిత్ర ఉందనీ, పాఠకుల సంస్కారానికి కథా కవితలకన్నా నవలలే ఎక్కువ దోహదిస్తాయనీ, ఆవేదనతో కూడిన ఉత్సాహంతో గంటన్నర పైగా అనర్గళంగా ఉపన్యసించి ఆకట్టుకున్నారు. గురజాడా, శ్రీశ్రీ రచనలకి సముచిత ఆదరణ వచ్చినా వారికే మాత్రమూ తీసిపోని నవలా రచయితల పేర్లన్నా ఇప్పటి వాళ్ళకి తెలియదే, కనీసం వారి రచనల ప్రస్తావన గూడా సాహితీ చర్చల్లో లేశమైనా కనబడదే అని గట్టిగా విమర్శించారు – ఎందువల్ల ఈ చిన్న చూపు?
ఇలా పారంభమైన ఉపన్యాసం వినడంతోటే నాకు ప్రముఖ కవి Auden రాసిన “Letter to Lord Byron” అన్న కవిత గుర్తొచ్చింది:
I don’t know whether
You will agree, but novel writing is
A higher art than poetry altogether
In my opinion, and success implies
Both finer character and faculties
Perhaps that’s why real novels are as rare
As winter thunder or a polar bear.
…
The average poet by comparison
Is unobservant, immature, and lazy.
You must admit, when all is said and done,
His sense of other people’s very hazy,
His moral judgements are too often crazy,
A slick and easy generalization
Appeal too well to his imagination.
కందుకూరి తో మొదలైన మన నవలలు సంఘ సంస్కరణకీ, భావ విప్లవానికీ, మానసిక వికాసానికీ బాట వేశాయనీ, దాదాపు వందేళ్ళ క్రితమే ఉన్నవ రాసిన మాలపల్లి ని ఆకాశానికెత్తేశారు. అసలాకాలానికి మన దేశభాషలు వేటిలోనూ అంతటి గొప్ప నవల రాలేదని ఇతర రాష్ట్రీయులు మెచ్చుకున్నా, తెలుగువాళ్లలో చాలా మందికి ఉన్నవ పేరు కూడ తెలియదని బాధపడ్డారు. చలం నవలలు చదిలోతే చెడిపోతారన్నవాళ్ళు ఆయనని సరిగా అర్థం చేసుకోలేదనీ, ఆయన రాసిన స్త్రీ, బిడ్డల శిక్షణ చదివితే గాని చలం భావ విప్లవం అర్థం కాదన్నారు. మైదానం కి వ్యతిరేకంగా విశ్వనాథ రాసిన చెలియలికట్ట ని ప్రస్తావిస్తూ, వీరిద్దరూ గొప్ప ప్రతిభావంతులనీ, వాళ్ళ మధ్య పోటీ సాహిత్యానికి మేలుచేసిందే కాని కీడు చెయ్యలేదన్నారు.
పల్లెటూరి జీవితాన్ని మరీ ఆదర్శప్రాయంగా కాక రాజకీయాలతో ఎలాముడిపడి ఉందో చిత్రీకరించిన జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు, మొట్ట మొదటిగా విశాలమైన ఉన్నతభావాలతో స్త్రీ పాత్రని ప్రవేశపెట్టిన ఉప్పల లక్శ్మణరావు అతడు-ఆమె, ఒక్క వ్యర్థ పదం కూడా లేకుండా గోపీచంద్ రాసిన గొప్ప మనోవైజ్ఞానిక నవల అసమర్థుని జీవయాత్ర, మనిషి జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనా సంస్కార పరిణామానికి ఎలా దారితీస్తుందో చిత్రీకరించిన బుచ్చిబాబు చివరకు మిగిలేది, ఇలా అనేక పేరున్న తెలుగు నవలల గురింఛి, క్లుప్తంగా నయినా మనసుకి హత్తుకు పొయ్యేట్లు చెప్పి, అవి చదివిన వాళ్ళకి మరోసారి ఉద్విగ్నత కలిగించారు.
ఇంతటి ప్రాభవం ఉన్న నవలా ప్రక్రియ ఎనభయ్యో శతాబ్దం నాటికి వ్యాపార నవలలు విజృంబించడంతో ఓ ఊపు ఊగి, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాల వరవడిలో చదివే పాఠకులు లేకా, పాఠకులేరని రాసే వాళ్ళు లేకా కుంటుబడిందన్నారు. ఉద్యమాల ప్రభావం గురించి మృణాళిని చేసిన వ్యాఖ్య చాలా ఆలోచించదగ్గది: ఉద్యమాల మూలంగా వచ్చే రచనల్లో ఆవేశం పాలెక్కువ. అందుకు కవిత్వానికి మించిన సాహితీ ప్రక్రియ లేదు. అయితే నవలకి కావలసింది స్పష్టతతో కూడిన ఆలోచన, మానవజీవితం గురించి సమగ్రమైన పరిశీలన – వీటితో రసవంతంగా ఏవో నాలుగు పాదాలు కాక కట్టదిట్టంగా నాలుగయిదొందల పేజీల సాహిత్యం సృష్టించాలంటే మాటలు కాదు. మరలా Auden రాసిన “The Novelist” అన్న కవితొకటి గుర్తొస్తుంది:
Encased in talent like a uniform,
The rank of every poet is well known;
They can amaze us like a thunderstorm,
Or die so young, or live for years alone.
They can dash forward like hussars: but he
Must struggle out of his boyish gift and learn
How to be plain and awkward, how to be
One after whom none think it worth to turn.
For, to achieve his lightest wish, he must
Become the whole of boredom, subject to
Vulgar complaints like love, among the Just
Be just, among the Filthy filthy too,
And in his own weak person, if he can,
Must suffer dully all the wrongs of Man.
ఉపన్యాసం అయింతర్వాత చాలా మంది మంచి ప్రశ్నలే వేశారు. మన సాహిత్యం ఉద్యమాలకే ఎందుకు పరిమితమైందని ఒకరడిగారు. మృణాళిని ఉద్యమాల వలన కలిగిన మంచిని గుర్తిస్తూనే, ప్రస్తుత సాహితీ వాతావరణంలో ఏదో ఒక గ్రూపుకి చెందకుండా మనడం కష్టమయిందన్నారు. చంద్రలత రాసిన రేగడివిత్తులు మంచి నవలే అయినా అది రచయిత కోస్తా ప్రాంత దృష్టితో రాసిందని విమర్శించి, సాహితీపరమైన విలువలకి విమర్శకులే తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి వాతావరణం నెలకొని ఉండటం చాలా విచారకరమన్నారు.
ఇది సాహితీ అభిమానులందరూ తప్పక వినవలసిన ఉపన్యాసం. ఇచ్చిన మృణాళిని గారికీ, సేకరించిన బ్రహ్మానందం గారికి మరోసారి కృతజ్ఞ్తలతో,
kRష్ణమోహన్ గారూ,
మరొక సంగతి. శనగన నరసింహస్వామి, ఈయన వివరాలు నాకు తెలీవు, కానీ ఈయన ప్రతీ పండక్కి అయిదో ఆరో పద్యాలు రాసి ఆంధ్రపత్రిక్కి, ఆంధ్రప్రభకీ పంపీవారు. వాళ్ళు వేసీవారు. అంతే వాటిగురించి ఎవరూ మాటాడీ వారు కాదు. మీరెవరూ ఆయన ఛందోబధ్ధవయిన పద్యాల్ని ఉదహరించరు. ఆ పద్యాల్లో భక్తి తప్ప కవిత్వం వుండీదికాదు.
శనగన నరసింహస్వామి గారికి క్షమాపణలు.
కరటకశాస్త్రి చేత గురజాడ చెప్పించినట్టు చదువు పొట్టపోషించుకోడానికే..సంస్కృతం నుంచి తెలుగు నుంచి ఇంగ్లీషు కి పొట్ట నింపీ భాష మారిపోడంవల్ల, ఇంగ్లీషు లోని పద్యరీతులు తెలియడంవల్ల, అవి తేలికగా వుండడంవల్ల, వాటిని ఛందోబధ్ధవయిన కవిత్వం రాసీ ఛాందసులు ఏవీ చేయలొకపోవడంవల్ల, తెలుగు కవిత్వం ఇటు మళ్ళింది. ఇండియా ట్రాఫిక్, ఇండియన్ పోలిటిక్స్ ప్రవాసాంధ్రులికి, ఎంత అసహ్యం కలిగిస్తాయో, బహుశా గురజాడకి, ఛాందసుల స్టాండర్డ్ ప్రకారం కవి, పండితుడు, కానివాడికి, అప్పటి అన్ని విషయాలూ అసహ్యం కలిగించేయి. అందుకే ముత్యాల సరాలు సృష్టించబడ్డాయి, పాత వాసన వదల్లేక. లేక పాతకొత్తల మేలుకలయిక కోసం. పాత వదులుకోలేక. పాత వదులుకోడం, మూలాల్ని తెగ్గొట్టుకోడవేకదా?
కవిత్వాన్నికానీ, సంగీతాన్నికానీ, మిగిలిన కళారూపల్ని కానీ అప్పటి కాలపరిస్తుతులు నిర్ణయిస్తాయి తప్ప ఇంకేవీ ఏవీ చెయ్యలేవు. ఈ కాల పరిస్థితులే విశ్వనాధ వార్ని కూడా మార్పు వేపు ఈడ్చుకొచ్చేయి. కాదని పురాణం సుబ్రహ్మణ్యం గారన్నా, పురాణం సీతన్నా, పి.ఎస్ అన్నా,”చేరా” అన్నా, వేగుంట మోహన్ ప్రసాద్, “మో” అన్నా, భగవంతుడే అన్నా అది ఒప్పుకోకూడదు..
మీ వ్యాసం బాగుంది.
0.04 కారిలేషన్ కొయెఫిషిఎంట్ అనంగీకృతమండీ. ఒక ప్రయోగాన్ని పరిశీలనకు తీసికోవాలంటే ఇది కనీసం 0.2 నుండి 0.3 వరకు ఉండాలి. ఈ 0.2 నుండి 0.3 వరకు గల పరిమితి సుమారు మూడు స్టాండర్ద్ డీవియేషనులకు సమానము. అప్పుడే ఫలితాలను ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రారంభిస్తాము. లేకపోతే దానిని చెత్తబుట్టలో వేయాల్సిందే. అంటే అది తప్పని కాదు. కాని అది సరి అని ఒప్పుకొని ముందంజ వేయలేము. స్టాటిస్టిక్స్ అబద్ధం కాదు. దానిని సరిగా అనలైస్ చేయకపోతే అబద్ధంలాగ కనిపిస్తుంది.
– మోహన
నేను బ్లాగు లొకానికి కొత్త; జ్యోతిషం మీద తెలుగు బ్లాగు లేదెమో, మొదలెడదాం (నేనో ఔత్సాహిక జ్యోతిష్కుణ్ణి లెండి) అనుకున్నాను. మీరు రాసిన మూడు భాగాలూ ఎంతో ప్రేమతో చదివాను, చదివింతర్వాత నోరు వెళ్ళబట్టాను. ఇంత జ్ఞానం ఉండీ విస్పష్టమైన నిర్ణయం తీసుకోలేక ఉన్నారంటే, మీరు మిధున జాతకులు కామోసు. ఏది ఏమైనా ప్రశ్న అనే తీగను పట్టుకొని లాగితే ఇంత విషయం బయటకు (పనికి వచ్చిందో , పనికి రానిదో) వచ్చిందన్నమాట!
కర్ణాటక గాత్రసంగీతం వింటున్నప్పుడు తెలుగు సాహిత్యం ఏ కారణంవల్లనైనా చెడితే తెలుగువారికి కలిగే బాధను అర్థంచేసుకోవచ్చు. అయితే శైలి ఏదైనప్పటికీ శాస్త్రీయసంగీతంలో సాహిత్యానికుండే విలువ చాలా తక్కువ. ముఖ్యంగా హిందుస్తానీ పద్ధతిలో పదాలు ఒకంతట అర్థం కావు కూడా. రాగప్రధానంగా, గమక విన్యాసాలతో సాగే శాస్త్రీయసంగీతంలో మనం ఎక్కువగా విని ఆనందించవలసినవి సాహిత్యేతర అంశాలే. భావగీతాల్లోనూ, లలితసంగీతంలోనూ మాత్రం సాహిత్యభావం ముఖ్యమైనదిగా ఉంటుంది.
కొన్ని త్యాగరాజ కీర్తనల్లో ట్యూన్ ముందుగా చేసి తరవాత పదాలను కూర్చినట్టుగా అనిపించే ఉదాహరణలు కనిపిస్తాయి. దీన్నిబట్టి చూస్తే పెద్ద వాగ్గేయకారులు కూడా కొన్ని సందర్భాల్లో సాహిత్యానికి చిన్నపీట వేశారనిపిస్తుంది.
ఇవన్నీ వింటున్న మనవంటి పామరులు సాహిత్యం అందంగా వినిపిస్తున్నప్పుడు సంతోషిస్తూ, వినిపించనప్పుడు సంగీత అంశాలను ఆస్వాదిస్తూ ఉండాలే కాని పరిష్కారాలు వెతకడం వృథా ప్రయాస కావచ్చు.
వ్యాసం పేరు నాకూ అంత నచ్చలేదు. Deadline దృష్ట్యా రాసేసి పంపాను. అయితే ఇప్పటికీ ఇంతకన్నా మంచి శీర్షిక నాకు తట్టలేదు. (కథల, పాత్ర పేర్ల విషయంలో మా నాన్నగారికి కూడా అంత పట్టింపు ఉండేది కాదు!)
యవ్వనమే గొప్పదని నేననను కాని అది మనం ఎన్నుకున్న మార్గంలో క్రియాశీలంగా ఉండేందుకు అనువైన వయసు. ఇక్కడ నేను ఉద్దేశించినది మానసిక యవ్వనమే అని తెలుస్తూనే ఉంది కదా. ఎంత అనుభవం ఉన్నప్పటికీ కొత్తవి తెలుసుకోవాలనే కుతూహలం ఉండడం ఆ వయసులో అరుదైన విషయం.
నేను, నాలాంటి ఎందరో చాలా తీవ్రంగా ఆక్రోశించే సమస్య ఈ ఆంగ్ల భాషా మాధ్యమం బోధన – ఈ వ్యాసంలోని విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నాకు అనిపించిన మరికొన్ని విషయాలు-
1) “ఇంగ్లీషులో చదువు”ల వల్ల కలుగుతున్న ప్రయోజనాలు – అని చాలా మంది అనుకొనేవి నిజానికి “చదువు” వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రమే. ఇంగ్లీషు మీడియం వల్ల అవి కలుగుతున్నాయన్న భ్రమ వ్యాపించింది.
2) అసలు తెలుగు మీడియంలో అధికంగా చదువడం వలన సమాజానికీ, వ్యక్తికీ కలిగే ఉపయోగాలు ప్రస్తుతం దాచిపెట్టిన నిధిలాంటివి అనుకొంటాను. దేశంలో కోటి మంది (అ)విద్యావంతుల బదులు నూరుకోట్ల విద్యావంతులు ప్రభవించే అవకాశాన్ని మనం గొయ్యి తీసి కప్పెట్టి ఉంచేసుకొంటున్నాము.
3) ఒక సినిమా చూసి వచ్చిన చిన్నపాటి పట్టణంలోని కుర్రవాడిని ఆ సినిమా కధ ఆంగ్లంలో చెప్పమనండి. ఇంగ్లీషు మీడియం అనేది వట్టి మాయ అని క్షణాలలో తేలిపోతుంది.
4) ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో కృతనిశ్చయం లేకుండా పోయింది. ఇక ముందు కలుగుతుందన్న ఆశ లేదు.
5) నేను పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను. ఇంటర్‌లో రెండవ భాషగా తెలుగు చదివాను. నేను చాలా తెలుగు పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలూ చదివాను. దేని గొప్పతనం దానిది. కాని నేను చదివిన తెలుగు రచనలు ఈనాటికీ నా మదిలో ఉన్న నేస్తాలు. ఇంగ్లీషు పుస్తకాలు ప్రయాణంలో కలిసి విడిపోయిన పరిచయాలు.
ఇంతకన్నా సమగ్రంగా, విపులంగా, సెన్సిబ్‌ల్ గా ఈ విషయాన్ని ఎవరూ వివరించలేరేమో.
నేను మద్రాసులో 1964లో 11వ తరగతి పూర్తి చేశాను. మాకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ (ఇందులో సున్నా మార్కులొచ్చినా పరవాలేదు కాని ఫయినల్ పరీక్ష రాసి తీరాలి). తెలుగు గ్రాంథికంలో ఉండేది కనక కాస్త ఆముదం తాగిన మొహంతోనే చదివాననుకోండి. అయితే అప్పట్లో ఆ మాత్రమైనా క్లాసిక్స్ చదవడం మంచిదని ఆ తరవాత గ్రహించాను. కాలేజీ స్థాయిలో తెలుగు కన్నా హిందీ ‘సులభం’ అని అనుభవజ్ఞులు చెప్పిన మీదట బీ.ఎస్ సి దాకా హిందీ చదివాను. గ్రామరూ, ఛందస్సూ, సాహిత్యచరిత్రా చాలా నేర్పేవారు. ఫిజిక్స్ మెయిన్ అయినప్పటికీ. ఇంగ్లీషులో షేక్స్పియర్ నాటకాలు రెండేసీ, మిల్టన్ పేరడైజ్ లాస్ట్, బోలెడంత ప్రోజూ వగైరాలుండేవి. సైన్సుతోబాటు ఇంత ‘లాంగ్వేజి బరువు’ ఉన్నా ఇబ్బంది అనిపించలేదు.
ఈమధ్య విశాఖలోనే ఇంజనీరింగు దాకా చదువుకున్న ఒకతను తాను తెలుగు గబగబా చదవలేనని చెప్పుకున్నాడు. నా మద్రాసు తెలుగే నయమనిపించింది.
పొరబాటయింది. మీ బ్లాగు చూశాను కాని, ఏపీ వీక్లీ చదివే అలవాటు లేక, అభాసు పాలయ్యాను. మూడు వందల వ్యాసాలే?! మీ పుస్తకం తెప్పించుకుంటున్నాను. మీనుంచి మరిన్ని పుస్తకాలొస్తాయని ఆసిస్తాను.
నేను హాల్డేన్ మాటలు ఉటంకించింది ఆయన వ్యాసం, “How to Write a Popular Scientific Article,” నుండని చెప్పడం మరిచాను.
కథ నాకు బాగా నచ్చింది. ఎటొచ్చీ కామేశ్వర్రావుగారి అభిప్రాయం్ “ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు” – ఆవిడ జీవితం మాత్రమే కాదు, ఆవిడ భర్త జీవితం ఈవిడతో ముడిపడలేదా? ఆవిడ స్నేహాలు తన భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని ఆలోచించే మనిషి, తన భర్త స్నేహాలు కూడా తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని అనుకోదా? అది అహంభావమా? ఆత్మోన్నతా ?
రంగనాయకమ్మగారు తన పేరు ముందు ఇంటి పేరు వొదిలేసి చాలా కాలమైంది. ఈ విషయం రచయిత్రి తన ఒకానొక వ్యాసంలో కూడా చెప్పారు.
నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకి కృతజ్ఞతలు.
నాగమురళి గారూ,
మిమ్మల్ని ఏకబిగిన చదివింప చేసిందన్నారు. సంతోషం. నా తెలుగు మూలన పడిందని నాకు భయం. రోజూ పది నిముషాలు మా ఆవిడతో తెలుగులో మాట్లాడటం మినహా, నిత్యజీవితంలో నా తెలుగు వాడకం పుస్తకాలు చదవడానికే పరిమితం.
ప్రస్తుతానికి వేరే విషయాల మీద రాసే ఆలోచన లేదు. ఆయా రంగాలలో అనుభవం ఉన్నవాళ్ళు తెలుగువాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొందరైనా పూనుకొని రాస్తే ఎంతో సేవ చేసిన వారవుతారు.
లక్ష్మన్న గారూ,
నేను ఇంజనీరింగులో అత్యుత్తమ స్థాయికి చెందినవాడిని కాదు. మీరన్నట్లు మన దేశంలో విజ్ఞానశాస్త్రాలలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. కాని వాటిని సామాన్యప్రజలకి పరిచయం చేసినవాళ్ళు తక్కువ. తెలుగులో మహీధర నళినీమోహన్ చెప్పుకోదగ్గవాడు. బహుముఖ ప్రతిభావంతులైన కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఇంకా ఎక్కువ రాస్తే బావుంటుంది.
ఈ వ్యాసాలు తెలుగు దినపత్రికలలో వస్తే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయన్నది నాఆశ కూడా. ఆంధ్రజ్యోతి కి రాశాను – జవాబు లేదు!
సిలికాన్ మహత్యం మీద మీరు రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రాయండి.
సాధ్యమైనంతవరకు కవితలకు దూరంగా ఉండమని సూచన ఇచ్చారు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, నా విభేదాన్ని తెలుపుతాను. కవితయినా, మరేదయినా, అసందర్భంగా ఉటంకిస్తే తప్పుపట్టాల్సిందే. కాని సైన్సు వ్యాసాలలో కవితలుంటే నష్టం లేదు. ఆలోచనకి అడ్డురావనీ, ఆసక్తి కలిగించి అవగాహనని పెంచుతాయనీ నా విశ్వాసం. దీని మీద గతంలో నాగులపల్లి శ్రీనివాస్ గారికి సమాధానమిస్తూ పలుగురు పేర్లని వాడుకున్నాను. ఇప్పుడూ మరొకరి పేరు చెప్పి సమర్థించుకుంటాను.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జీవశాస్త్రవేత్త, తెలుగువాళ్ళకి కాస్త దగ్గ్గరయిన (మరణానంతరం ఆయన దేహాన్ని పరిశోధనలకై కాకినాడ లోని రంగరాయ వైద్య కళాశాల కిచ్చారు), జె బి యస్ హాల్డేన్ అన్న మాటలు:
“In my last book on genetics, there are seven quotations from Dante’s Divine Comedy. I have been criticized for ‘dragging in’ Dante. But I think it worthwhile to show the continuity of human thought. I don’t agree with Dante’s theory that mutations are due to divine providence, but I consider it desirable to point out that he had a theory on this subject. I think popular science can be of real value by emphasizing the unity of human knowledge and endeavor, at their best. This fact is hardly stressed at all in the ordinary teaching of science, and good popular science should correct this fault, both by showing how science is created by technology and creates it, and by showing the relation between scientific and other forms of thought.” [1]
చివరిగా, నా వ్యాసాలని గడువు దాటి పంపినా, తామెంత పని వత్తిడిలో ఉన్నా, ఓపిగ్గా చదివి, ప్రశ్నలేసి, సరిదిద్ది, సాయం చేస్తున్న సంపాదకులకి, ముఖ్యంగా ఇంద్రగంటి పద్మగారికీ, కొలిచాల సురేశ్ కీ కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్: [1] “On Being the Right Size and other Essays,” by J.B.S Haldane. Edited by John Maynard Smith. Oxford University Press, 1985.
మంచి విషయాలని ప్రస్తావించారు. నేనన్న వాటికి కాస్త వివరణ అవసరమే.
1. వ్యావహారిక భాషోద్యమ మూలాలు: నిజమే, మీరన్నట్టు బోధనాభాష విషయం ఒక ముఖ్య చోదకమే కాని మూలాలు ఇంకా ముందే కనిపిస్తాయి. తూమాటి దోణప్పగారు “వ్యావహారిక భాషోద్యమ నేపథ్యం, గిడుగువారి సారథ్యం” అన్న వ్యాసంలో దీన్ని కొంత ప్రస్తావించారు. ముందుగా ఆంగ్లేయుల హయాంలో పరిపాలనాభాషగా వ్యావహారిక భాష ప్రవేశించించడం, ఆ తర్వాత ముద్రణా యంత్ర ప్రభావం వల్ల పుస్తకాలూ, పత్రికలూ సామాన్యజనులకి దగ్గరవ్వడం మొదలైన అంశాలని అతను పేర్కొన్నారు.
2. పాఠ్యపుస్తకాలలో శృంగార ప్రధానమైన కావ్యభాగాల గురించి: వ్యావహారికభాషా వాదుల వ్యాసాలలో కూడా యీ విషయ ప్రస్తావన చదివినట్టుగా గుర్తు. కానీ మీరన్న తర్వాత తిరిగి వెతికితే ఎక్కడా కనపడలేదు. కాబట్టి నేనీ విషయంలో పొరబడినట్టే ఉన్నాను.
3. కందుకూరి మధ్యేమార్గం: “గ్రామ్యదేశ నిరసన సభ”లో జయంతి, కందుకూరి ఉపన్యాసాలని గమనిస్తే ఈ విషయం కొంత స్పష్టమవుతుంది. చిన్నయ్యసూరి రాసిన వ్యాకరణం ముఖ్యంగా పద్యకావ్యాల ఆధారంగా రాయబడిందనీ, దానిననుసరించి రాసే గద్యశైలి చాలా కఠినమైనదనీ అతను ఆనాడే గుర్తించారు. నన్నయ్య కాలమునుండీ గ్రాంధిక భాష మారలేదన్న దురభిప్రాయమూ అతనికి లేదు. అతను వ్యావహారికవాదంతో (మొదట్లో) విభేదించినది, నియమ రాహిత్యం గురించే. వ్యాకరణం లేని వాడుకభాషని రచనకి వాడకూడదని అతని అభిప్రాయం. గ్రాంధికవాదం నుంచి, వ్యావహారికవాదం వైపు అడుగువేసిన తర్వాత కూడా, రచనలో వ్యావహారికభాష వాడినా, అది వ్యాకరణ బద్ధమై ఉండాలనే అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వ్యావహారికభాషకి వ్యాకరణం రాయడానికి పూనుకున్నారు కూడా. వ్యావహారికభాషా వాదుల్లో, ఇది కనిపించదు. గిడుగువారికికూడా వ్యావహారిక రచనా భాషకి వ్యాకరణం ఉండాలా లేదా అన్న విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉన్నట్టు కనిపించదు.
4. గురజాడ “పాతకొత్తల మేలికలయిక”: “పాతకొత్తల మేలికలయిక” అంటే ఆశు, లిఖిత సంప్రదాయాలన్నది వేల్చేరువారి interpretation. అది సమంజసమైనదే కావొచ్చు. కాని, గురజాడ ఉద్దేశం కూడా అదే అనడం సరికాదేమో. గురజాడకి ఆ స్పృహే కనక ఉండి ఉంటే, ముత్యాలసరాల గురించి, రగడలూ లేదా మన జానపద పాటల వరసుంచి తీసుకున్నానని అనకుండా పారశీ గజల్ ప్రేరణ అని ఎందుకంటాడు? “ప్రక్రియ”, “భాష”కి సంబంధించే గురజాడ ఆ మాట అన్నాడని నే ఉద్దేశం. గురజాడ కవిత్వంలో, శ్రవ్య కథాకావ్యం, దృశ్య కావ్యం, జానపద గేయం వంటి పాత ప్రక్రియలూ కనిపిస్తాయి; కొత్తవైన భావగీతాలూ, ఇతర పాశ్చాత్య ప్రక్రియలూ కనిపిస్తాయి. అలాగే అతను వచనరచనలో పూర్తిగా వాడుకభాష వాడినా, కవిత్వంలో గ్రాంధిక పోకడలని గమనించవచ్చు.
5.భావ కవుల “పాతకొత్తల మేలికలయిక”: ఇంతకీ నేను గురజాడని కోట్ చెయ్యడం, అతని పాతకొత్తల మేలికలయికే భావకవులది అని చెప్పడానికి కాదు. భావకవులు వ్యావహారికభాషా వాదాన్ని నెత్తిన పెట్టుకొన్నా, వారి కవిత్వంలో ఎక్కువగా కనిపించేది పూర్వ కావ్యాలలోని భాషే, వాడుకభాష కాదు. “ఎంకిపాటలు”లాంటివి అక్కడక్కడే కనిపిస్తాయి. నేనన్న పాతకొత్తల కలయిక, యీ ఉద్దేశంతో. వీళ్ళతో పోలిస్తే, గురజాడ ఇంకా ఆధునికుడుగా కనిపిస్తాడు. కవిత్వంకూడా వాడుకభాషలో రాయవచ్చని, కాకపోతే దానికి పద్యాలు పనికి రావని అతను గుర్తించాడు. పద్యాలు కూడా వాడుకభాషలో రాయడానికి గిడుగు సీతాపతిలాంటివారు విఫల ప్రయత్నం చేసారు.
6. తిరుపతివేంకటకవులు: వ్యావహారికభాషా వాదానికి వీరు అనుకూలురు కాకపోయినా, వ్యతిరేకులు మాత్రం కాదని అనిపిస్తుంది. ముఖ్యంగా భాష మార్పు చెందే విషయమై, వ్యాకరణాల పరిమితి విషయమై, వ్యావహారికభాషా వాదులతో వీరు ఏకీభవించారు. “కాలముబట్టి దేశమును గాంచి ప్రభుత్వమునెంచి దేశభాషా లలితాంగి మారుటది సత్కవి సమ్మత”మని గుర్తించారు. వాళ్ళ పద్యాలలో లక్షణ విరుద్ధ ప్రయోగాలూ, అన్యభాషా పదాలూ వాడడం ప్రసిద్ధమే కదా. కొంత అధిక్షేపం ఉన్నా, “గిడుగా? పిడుగా?” అన్న వ్యాసంలో గిడుగు గురించి చెళ్ళపిళ్ళవారన్నదాంట్లో నిజాయితీ ఉందని నాకనిపించింది. అందులో, ఈ వాదాలగురించి వారు స్పష్టంగా చెప్పారు:
నామతం గ్రాంథికభాషలో వ్రాసేవారు గ్రాంథికభాషలోనే వ్రాసుకోవచ్చుననిన్నీ వ్యావహారికభాషలో వ్రాసేవారు వ్యావహారికభాషలోనున్నూ వ్రాసుకోవచ్చుననిన్నీ వీరికీ వారికీ వివాదపడవలసిగాని తిట్టుకోవలసికాని లేశమున్నూ ప్రసక్తి వుండకూడదనియ్యేవే. అయితే గ్రాంథిక కవుల పుస్తకాల్లో యెన్నో వ్యావహారిక ప్రయోగాలు కనపడడంచేత యీ గ్రాంథిక కవులు గ్రాంథిక కవులు కారంటూ పంతులవారు తరచు ఆక్షేపించడం కలదు. దానికి నా సమాధానం యేమిటంటే, యెక్కడో వక్కటితప్ప ఆ వ్యావహారిక పదాలు చాలా వఱకు సాధ్యాలే అవుతవి. కానిదేదేనా వుంటే అది ప్రమాదపతితంగా భావించవలసిందేగాని అంతమాత్రంచేత ఆ గ్రంథకర్త వ్యావహారిక భాషా కవి కాడనియ్యేవే.
ఇక, గురజాడ మధ్యేమార్గస్థుడెలాగో వివిరించడం మీ వంతు 🙂
“కాని ఈయన కన్నా ఎంతో తక్కువ రాసి, తోటి మనుషులమీద సానుభూతి నాలుగు గేయాల్లొ కుమ్మరించేసి (అందులొ కొన్ని వేరే దేశపు కవుల పాటల అనువాదాలు) ప్రజాకవులై పోయారు కొందరు. తడి తక్కువ. బడాయి ఎక్కువ. 🙂 కవి ఒక్కటో రెండో చిన్న పాటల పుస్తకాలు రాస్తే, వాటినుండి రోజూ ఉదహరించటం తేలిక. మనకీ కంఠతా వస్తాయి. కంఠతా వచ్చాయి కాబట్టి, పద్యాలు గొప్పవీ, కవి గొప్పవాడు అని ఒక వాదం లేవదియ్యొచ్చు.”
లైలా గారు శ్రీశ్రీ మీద వేసిన పై విసురులో వేడెక్కువ, వెలుగు మాత్రం శూన్యం! కంఠస్థం చెయ్యడం సులభం అని మహాప్రస్థానాన్ని కంఠస్థం చెయ్యరు; గొప్ప కవిత్వం అంతా కంఠస్థం చెయ్యదగ్గది కనుకే చేస్తారు. శ్రీశ్రీ బండెడు సాహిత్యం రాసినా రాయకపోయినా మహాప్రస్థానం ఒక్కటే చాలు తనని నిలపడానికి. అయినా ఈ పోలిక వలన ఒరిగేదేముంది – సాహితీ చర్చల స్థాయిని దిగజార్చడం మినహా!
మన సాహిత్య చరిత్రలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ – ముగ్గురూ మూడు మార్గాలకు ప్రవర్తకులంటూ కాస్త వెలుగు ప్రసరించిన వడలి వ్యాసం [1] చదవదగ్గది.
విశ్వనాథ వ్యాసం బావుంది. కాని, భాషా సంపర్కం కలచోట నివసించే వాళ్ళు మార్పుని సంబాళించుకోలేరు అని ఆయన అన్నదానికీ, భాషాశాస్త్రవేత్తలు చెప్పేదానికీ పొంతన లేదు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “సాహిత్య ప్రస్థానం – కొన్ని మజిలీలు” లో వ్యాసం, “క్లాసిక్ – రొమాంటిక్.” వడలి మందేశ్వరరావు.
పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమన్నది ఈ వాదులాటకి ఒక catalyst లాంటిది మాత్రమే. నా దృష్టిలో యీ ఉద్యమానికి మూలకారణాలు వేరే చోటున్నాయి (ఒక ముఖ్య కారణం అచ్చుయంత్ర ప్రవేశం). మీరు మొదటి పేరాలో చెప్పిన మిగిలిన విషయాలతో అందరూ (నేనైతే) ఏకీభవిస్తారు (ను). కాకుంటే ఈ కింది వాక్యమెందుకు ప్రస్తావించారో బోధపడలేదు. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి. ఈ రెండు చర్చలకు ఎలాంటి సంబంధం లేదు. వీటిలో పాల్గొన్న వ్యక్తులు/సంస్థలు (వావిళ్ళ వారినొక్కరిని మినహాయిస్తే!) కూడా వేర్వేరు అని మీకు నేను చెప్పనవసరం లేదు.
కందుకూరి మధ్య మార్గం పాటించిన మనిషిగా ఎలా చెప్తున్నారో అర్థం కాలేదు. వివరించగలరు. గురజాడ “కొత్తపాతల మేలు కలయిక” అన్నప్పుడు ఆశు (/మౌఖిక), లిఖిత సంప్రదాయాల్ని కలుపుకుంటూ అన్న అర్థంలో వాడాడు. భావకవులకు ఆశుకవిత్వం పట్ల, “గ్రాంథికం” పట్ల వున్న అయిష్టత తెలిసినదే.
అలాగే తి.వెం.కవులు గ్రాంథికవాదాన్ని తిరస్కరించారని ఏ ఆధారంతో చెప్తున్నారో కూడా నాకు బోధపడలేదు. తిరుపతిశాస్త్రి గారు జీవించి వున్న కాలంలో వారిద్దరూ “వ్యావహారిక వాదానికి” అనుకూలురు కాదు. నిజానికి చాలకాలం (అంటే జమీందారుల పోషణ పొందినంతకాలం), వారే చాలాచోట్ల చెప్పుకున్నట్లు, తెలుగంటే చిన్నచూపే (చూ: కథలు-గాథలు, మూడు భాగాలూ). వెంకటశాస్త్రి గారు చివరిరోజుల్లో కూడా “వ్యావహారికానికి” అనుకూలుణ్ణని చెప్పుకోలేదు. ఒక ఉదాహరణ:
“నేనీ పొత్తమును సర్వసాధారణమయిన వ్యవహారిక భాషలోనే వ్రాస్తాను. 64 వత్సరములు నిండు వయస్సులో వ్రాస్తూ వున్న దీనిని చూచి, నన్ను “తుద కబ్బెరా తురక భాష” అని నా మిత్రులూ, శిష్యులూ లోనగువారు కొందరు నిందింతురని నక్కు తెలిసిన్నీ, నేనిట్టి భాషను సమర్థించు వారిలో చేరినవాడను కాక యుండిన్నీ, ఇందులో వ్రాయుటకు కారణము, నాకు ఈ భాష అంటే అంతగా యిష్టం లేకపోయినా, ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయటమే నా ముఖ్యోద్దేశ్యము.” (చూ: కాశీయాత్ర, 1942)
ఏమయినా, వాళ్ళు, ముఖ్యంగా చెళ్ళపిళ్ళ, ఏ గాటానా కట్టడానికి లొంగని వ్యక్తులు :-). వాళ్ళ Cultural Biography ఎవరైనా రాయవలసిన అవసరం యెంతైనా వుంది.
సంస్కృత ప్రభావంతో “తెలుగుకున్న వ్యాకరణదీపం చిన్నదనే” భావన పండితలోకంలో చాలాకాలం బలంగా వుంది. అది చెళ్ళపిళ్ళవారి అభిప్రాయం మాత్రమే కాదు.
#[…] All Telugu courtly poets proudly proclaimed that they commanded scholarship in Sanskrit, Prakrits of different varieties, Puranas, Sastras and a host of related subjects like meter. While they composed poetry almost entirely in Telugu, they did not have to support their Telugu by texts of grammar or dictionaries: Telugu was a language of poetry, not of scholarship. When challenged, the court poet supported the Sanskrit words he had used in his poem by quoting the great Sanskrit lexicographers of the past, but for his Telugu words, he only needed the approval of past usage by an earlier court poet. There was also a long and sustained effort on the part of grammarians and lexicographers to produce a set of rules and dictionaries for the Telugu used in courtly poems. None of them however had the status of the famous Sanskrit grammarians and lexicographers.[…*] #
నాకు తెలిసి మధ్యేమార్గస్తుడెవరైనా వుంటే అది గురజాడ మాత్రమే.
చివరిగా మీరు ముగింపులో ప్రస్తావించిన రెండు విషయాలపై మాత్రం యెంతైనా చర్చ జరగవలసిన అవసరం వుంది.
— శ్రీనివాస్
* V. Narayanarao, Print and Prose: Pundits, Karanams and the East India Company in the Making of Modern Telugu. In _India’s Literary History: Essays on the Nineteenth Century_, S. Blackburn (Ed). Delhi: Permanent Black. 2004. pp. 146-66.
కామేశ్వర రావు గారి “సనాతనవాదం” మీద ఉన్న అవగాహనతో నేనేకీభవిస్తాను కనుక, ఆయనకు “తర్కానికి అందినట్టుగా అనిపించని” వాక్యాలను అదే సనాతనవాదాన్ని ఉదాహరణగా చేసుకుని రాసుకుంటే, భాష గురించి విశ్వనాధ రాసిన మాటలు కొంత వరకూ అర్ధం చేసుకోవచ్చేమో!, అప్పుడవి (భాష గురించిన మాటలు) తర్కానికి అందుతాయనే అనుకుంటున్నాను.
మీరొకసారి ఇది చదవండి:
సజీవమైన సనాతనం పొందే మార్పులు ఆ సనాతన వ్యవహారం పాటించే నడిబొడ్డు అయిన ప్రదేశాల్లో సువ్యక్తంగా కనబడతవి. అక్కడ దానిగురించి సానుభూతి ఉంటుంది. అట్లాగే “సనాతనం” అది పాటించే వాడల్లో, ఇండ్లల్లో కనబడుతుంది. సనాతనం అనేది కొన్ని వాడకట్టుల్లో (ఇండ్లలో, దేశాల్లో) కనిపించే సంస్కృతి, ఒక అవగాహన, లేక ఆచారం. ఇతర ఆచారాలతో కలిసి ఉండే ప్రదేశాల్లో ఈ సనాతనం మార్పునందు అంత సానుభూతి ఉండదు. ఎందుకంటే అక్కడుండే సనాతనం వేరు కనుక. మిగతా చోట్ల (వాడల్లో, ఇండ్లలో, దేశాల్లో) కనపడే, అంటే ఆచార సంపర్కం కలచోట్ల వాళ్ళకి వాళ్ళ మూలాలు నిలబెట్టుకోవటమే కష్టం. అందుచేత సనాతనం పొందే మార్పులని కూడా యెక్కడ సంబాళించుకుంటారు? దాని మూలంగా వాళ్ళకు దీనియందు సానుభూతి తక్కువగా ఉంటుంది.
ఆయన, భాష గురించి రాసిన ఈ పేరా చాలా సున్నితమైన, నిర్దుష్టమైన academic ప్రశ్నకు ఒక సమాధానం అనుకుంటాను. ఆయన ఈ వ్యాసంలో కొన్ని చోట్ల ‘అకడమిక్’ వ్యవహారాన్ని సామాన్య దృష్టితో చెప్పిన వాటితో సంపర్కించి రాయటం వల్ల వచ్చిన పేచీ ఇది, ఒక్కోదాన్ని అర్ధం చేసుకోవటానికి వాడాల్సిన అద్దాలు మార్చి చదువుకోవాలి. ఇది తనకు తాను “అసలు విషయం” అర్ధం చేసుకోవటానికి రాసుకున్న వ్యాసం అయిఉండొచ్చు.
— ——————
ఈ వ్యాసంతో “ఈమాట” ప్రాశస్త్యం పెరిగింది. ఈ మాటలు విశ్వనాధ 1920ల్లో రాసారంటే నమ్మడం కష్టం, అప్పట్లో ఎవరైనా
ఈవ్యాసం మీద మరెవరైనా రాసారా, ఎవరి ఎరుకలోనైనా?
ఇక్కడొక విశ్వనాథ అభిమాన సంఘం ఏర్పడేట్టుందే:)
విశ్వనాథ కల్పవృక్షం కేవలం గ్రాంధికభాషకే కట్టుబడి రాసారన్న మాట నిజం కాదు. అందులో వ్యావహారిక భాష పుష్కలంగా కనిపిస్తుంది.
విశ్వనాథ ఖచ్చితంగా సనాతనవాదే. మార్పుకి వ్యతిరేకి అన్నది మాత్రం సరికాదు. సనాతనవాదమంటే మార్పుకి వ్యతిరేకం అనుకోవడం తప్పు.
విశ్వనాథవారిలో తర్కంపాలు ఎంతో ఆవేశంపాలూ అంతే ఉంటుంది.
ఉదాహరణకి ఈ మాటలు తర్కానికి ఎంతవరకూ నిలుస్తాయి?
సజీవమైన భాషా,ఆ భాష పొందే మార్పులు ఆ భాష మాట్లాడేందుకు నడిబొడ్డు అయిన ప్రదేశాల్లో సువ్యక్తంగా కనబడతవి. అక్కడ దానిగురించి సానుభూతి ఉంటుంది. అట్లాగే ఇంగ్లీషు భాష నేటికాలంలో అసలయిన వాడుక భాష కావాలి అంటే, లండన్ లో కనబడుతుంది. తెనుగు భాష కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలలో మాట్లాడేది అట్లాంటిది. ఇతర భాషలతో కలిసి ఉండే ప్రదేశాల్లో ఈ భాష మార్పునందు అంత సానుభూతి ఉండదు. బరంపురం, హైదరాబాదు, చిత్తూరు ఇటువంటి భాషా సంపర్కం కలచోట్ల వాళ్ళకి గ్రాంధిక భాష నిలబెట్టుకోవటమే కష్టం. అందుచేత భాష పొందే మార్పులని కూడా యెక్కడ సంబాళించుకుంటారు? దాని మూలంగా వాళ్ళకు దీనియందు సానుభూతి తక్కువగా ఉంటుంది.
విశ్వనాథ రచనలు ఎన్నోచదివాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. స్కూల్లో రోజూ పాఠాలు చెబుతూనే అన్ని గొప్ప రచనలు ఎలా చేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో తెలుగు వారు ఒక్క పద్యం రాసినా ఒక పేజీ వచనం రాసినా ఒక సంవత్సరం పాటు దాని గురించే మాట్లాడుతారు. అందులో ఏం ఉండదు కూడా. ఆ రాసిన ఒక్క పెజి చదవమని వంద లింకులు. హంగామా. 🙂
విశ్వనాథ పాండిత్యం, కవితాశక్తి, తర్కం, తాత్విక భావాలు, ఆలోచనలో విశాలత్వం, పాతబడని ఆధునికత – అన్నీ నన్ను మెప్పిస్తాయి. విశ్వనాథకు ఆయన సమకాలంలోనూ, ఇప్పటివరకూ పోటీనే లేదు. కాని ఈయన కన్నా ఎంతో తక్కువ రాసి, తోటి మనుషులమీద సానుభూతి నాలుగు గేయాల్లొ కుమ్మరించేసి (అందులొ కొన్ని వేరే దేశపు కవుల పాటల అనువాదాలు) ప్రజాకవులై పోయారు కొందరు. తడి తక్కువ. బడాయి ఎక్కువ. 🙂 కవి ఒక్కటో రెండో చిన్న పాటల పుస్తకాలు రాస్తే, వాటినుండి రోజూ ఉదహరించటం తేలిక. మనకీ కంఠతా వస్తాయి. కంఠతా వచ్చాయి కాబట్టి, పద్యాలు గొప్పవీ, కవి గొప్పవాడు అని ఒక వాదం లేవదియ్యొచ్చు.
విశ్వనాథ వ్యాసం నాకు నచ్చింది. ఈ ప్రత్యేక వ్యాసాలు అన్నీ చదివాను. మళ్ళీ చదవాలి. ఈమాట పత్రిక చాలా ఉల్లాసం కలిగిస్తున్నది.
బహుశా నా తరమంతా వ్యావహారికమే అభ్యుదయమని నమ్ముతూ పెరిగామంటే అతిశయోక్తి కాదేమో! ఇప్పుడీ నాలుగు వ్యాసాలు చదివి ఆ నమ్మకాలన్నీ మార్చేసుకున్నానని చెప్పను కానీ, ఓపెన్ మైండ్ తో చదివితే వీరి వాదంలో కూడా వ్యావహారిక భాషావాదులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే అని పిస్తుంది. ఇంత చదువూ చదివి కనీసం పోతన భాగవతం కూడా సొంతగా చదువుకోలేక పోవటం అంతకంటే షేక్స్పియర్ నాటకాలనే సులభంగా చదువుకోగలగటం చూస్తుంటే వీరి వాదాలు మరింత అర్థవంతంగా తోస్తున్నాయి.
అదే సమయంలో సాహిత్యాన్ని జన బాహుళ్యానికి దగ్గరగా తెచ్చి, ఇన్ని వేల సంవత్సరాల్లో జరగని సామాన్యుల జీవన చిత్రణ గత వందేళ్ళలోనే జరగటానికి వ్యావహారిక భాషని ఆశ్రయించటం వల్లనే సాధ్యమయుంటుందనే నా అమాయక మయిన నమ్మకానికి ఏమన్నా ఆధారం ఉందోలేదో పెద్దవాళ్ళే చెప్పాలి.
ఇలా రెంటినీ బాలెన్స్ చేసే మార్గం చెప్పే మోడరేట్ గ్రూప్ ఎందుకు ఏర్పడ లేదు? ఏర్పడినా అది నా బోంట్లకు తెలీదా?
ఏమయినా ఈ వ్యాసాలకి ఆనాటి వ్యావహారిక వాదులు ఏం సమాధానం చెప్పారో, ఆ తర్వాతి కాలంలో ఏంజరిగిందో చెప్పాలి.
అలాగే ఈ ఉత్తరాలనీ, వ్యాసాలనీ ఈమాట ఎక్కణ్ణించి సేకరించిందో చెపితే బావుంటుంది.
అక్కిరాజు భట్టిప్రోలు
సడిచేయకే గాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/27/2008 7:17 pm
“జయభేరి”
JUBV ప్రసాద్ గారి వ్యాఖ్య నుండి: సుద్దాల అశోక్ తేజ అనే సినీ పాటల రచయిత, శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధార పోశాను” తీసుకుని, దాన్ని మూడు లైన్ల పల్లవిగా చేసి, సొంత చరణాలు రాసుకుని, ఠాగూర్ సినిమాకి ఇచ్చారు.
సినిమాలో ఏముందో నాకు తెలియదు కాని ఆ శ్రీశ్రీ గీతం ప్రారంభం ఇది:
“నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!”
కొడవళ్ళ హనుమంతరావు
పేరులేదు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/27/2008 12:09 am
వరూధిని అందం, సరస్వతి సౌందర్యం
సంప్రదాయ సాహిత్యాన్నీ, అభ్యుదయ సాహిత్యాన్నీ జమిలిగానే కాదు, విడిగా నయినా విమర్శించడానికి నాకు కనీస యోగ్యత కూడా లేదు. కాని డాక్టర్ స్మైల్ గారి అభిప్రాయం రెండురోజుల నుండి నా మనసును పట్టి వదలకపోవడాన ఇది రాస్తున్నాను. ఇది వారిపై విమర్శ కాదు. దీంట్లో సాహిత్యాభిమానులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉండొచ్చనే ఆశ.
పాతసాహిత్యం సామాన్యప్రజల జీవితాన్ని కావ్యవస్తువుగా తీసుకోలేదనీ, అభ్యుదయసాహిత్యానికీ సంప్రదాయ సాహిత్యానికీ గల ముఖ్యమైన తేడా అదేననీ అంటే నేనొప్పుకుంటాను.
వరూధిని సంప్రదాయసాహిత్యానికి ప్రతీక అయితే నష్టం లేదుగాని, “భిక్షువర్షీయసి” అభ్యుదయసాహిత్యానికి ప్రతీక అయితే మనకి లోటుగానే ఉంటుందనుకుంటాను. “భిక్షువర్షీయసి” మంచి కవిత కాదని కాదు, ప్రతీక కాకూడాదనే నాఉద్దేశం.
వరూధిని ప్రవరులది ప్రేమకథ. ప్రేమకథల్లో అందానికి ప్రాముఖ్యత ఉంటుంది. అందం బాహ్య సౌందర్యం గురించీ, హృదయ సౌందర్యం గురించీ కూడానూ. అయితే ఎవరికైనా మనిషిని చూడటంతోటే ఆకట్టుకునేది బాహ్య సౌందర్యమే. నాభి లోతు దాకా పోవాలో లేదో నాకు తెలీదు కాని, వరూధినిని పరిచయం చేసిన విధం ఆకర్షణీయమే. “మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్,” అన్న మాటలు కవితా సౌరభం తో నిండినవే. ఈతరం కవులు కూడా స్వీకరించదగ్గవే.
ఆ పద్యాల వెనువెంటనే వరూధినిని మన కళ్ళముందట నిల్పే పద్యమిది:
తిక్కన, సూరన లను మించి ఇంత సుకుమారమైన పద్యం మన భాషలోనే లేదన్నారు పుట్టపర్తి [1]. అదెందుకో తెలుసుకునే పరిజ్ఞానం నాకు లేదు కాని, “ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమము తెలుప,” అన్నది నన్నాకర్షించింది.
కారణం దానిపై రారా ఇచ్చిన వివరణలు. ఆయన దానిని “రసపారవశ్య” మని చదువుకున్నాడు. సుకుమార హృదయం గలవాళ్ళే సాహిత్యంలోనైనా ఏకళలోనైనా పారవశ్యం చెందుతారనీ, “కవితా! ఓ కవితా!” లో శ్రీశ్రీ చెప్పిన “క్షణికమై, శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం,” పెద్దన చెప్పిన పారవశ్యమూ ఒకటేననీ అన్నాడు. నాకది నచ్చింది.
ఇంతకీ రారా ఈ మాటలన్నది కొడవటిగంటి కుటుంబరావు రాసిన కొన్ని ప్రేమకథలను విశ్లేషించే సందర్భంలో [2]. కుటుంబరావు రాసిన పెద్దకథ “కురూపి” లో అనాకారిగా కనకం ప్రపంచంలోకి ప్రవేశించిన సరస్వతి అతనిని తన హృదయసౌందర్యం ద్వారా చివరికెలా వశం చేసుకుంటుందీ వివరిస్తూ శిల్పానికి గల ప్రాముఖ్యతని వివరించాడు.
సమాజంలో అందవిహీనమైన స్త్రీ పురుషులు ఉండితీరతారు. మరి వాళ్ళ ప్రేమా పెళ్ళీ లాంటి చిక్కు సమస్యలు తీరేదెలా? దీనికి కుటుంబరావు ఇచ్చిన సమాధానం – ఆధ్యాత్మికం. అంటే అదేదో పరలోకానికి సంబంధించిందని కాదు. మనిషి నుండి వేరే మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటేననీ, అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా ఉంటాయనీ, వీటి మూలంగా ప్రేమా పెళ్ళి సఫలం అవుతాయనీ వ్యక్తం చెయ్యడనికే “కురూపి” రాశానన్నాడు.
“అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలున్నట్టు నాకు చిన్నతనం నుండి కూడా తెలుసు. నాకు తెలియనిదల్లా నేటి మన సమాజం కిందకే దిగుతున్నదో, మీదికో ఎక్కుతున్నదో, నేటీ యువకులు పైనే చూస్తున్నారో, కిందకో చూస్తున్నారో … అది మాత్రమే,” అని కొంత నిరాశపడ్డాడు.
కుటుంబరావువి చదవ్వలసిన ప్రేమకథలు. అవి అభ్యుదయసాహిత్యాన్ని “భిక్షువర్షీయసి” కవితా పరిమితుల్ని దాటి విస్తరింపచేస్తాయి.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1]. “వ్యాసవల్మీకం” లో “వరూధిని” అన్న వ్యాసం. పుట్టపర్తి నారాయణాచార్యులు, 2004. “వరూధిని హృదయమున రససముద్రమున్నది. మాటలలో కవిత యున్నది. ప్రకృతి యొక్క విచికిలస్వరూపము వరూధిని…” అని ముగించారు. ఈయనా, రారా, ఇద్దరూ ప్రొద్దుటూరు వారే! వాళ్ళూ, శ్రీశ్రీ, కొకు, ఇంకా కొందరు అభ్యుదయరచయితలూ కలిసి “సంవేదన” ఆవిష్కరణ సందర్భంగా తీయించుకున్న ఫొటొ ఈ పుస్తకంలో ఉంది.
[2] “కుటుంబరావు సాహిత్యం,” అయిదవ సంపుటం లో “భావుకుల రచయిత కొకు,” అన్న వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి. 1983. కవులలోకెల్లా అల్లసాని పెద్దన తన అభిమాని కవి అని చాటుకుని, “కవిత్వానికి కావలసింది ఆవేశబలం కాదు, అనుభూతి సౌకుమార్యం,” అన్న విలక్షణ విమర్శకుడు రారా.

05/23/2008 9:29 pm
“ప్రశ్నలే శాశ్వతం”
శ్రీశ్రీ షష్టిపూర్తికి ఇస్మాయిల్ రాసిన “శ్రీశ్రీ జన్మ వృత్తాంతం,” అన్న వ్యాసంలో, “కవిత్వమైనా తత్త్వమైనా సందేహాల్లోంచి, ఆందోళన నించి, తిరుగుబాటు నించీ పుడుతుంది. ప్రశ్నలే శాశ్వతం. సమాధానాలు కావు. సమాధానాలతో సంతృప్తి పడితే వెంటనే చస్తుంది కవి ప్రతిభ,” అన్నారు.
ప్రశ్నలతో కూర్చిన పదచిత్రాలతో నిండిన కవిత మనసుని పట్టేసింది. తూచేరాళ్ళని కాదు గాని, నేను స్థూలంగా కవితలని – అర్థంకాని, మామూలు, మంచి, గొప్ప అని – నాలుగు రకాలుగా చెప్పుకుంటాను. ఇది నిస్సందేహంగా మంచి కవిత. నా దృష్టిలో గొప్ప కవిత్వానికున్న ఒక గుణం – కంఠస్థనీయం కావడం. ఈ కవిత గొప్పది కాగలిగి ఉండీ కాలేదనిపించింది. అందుకు అక్కడక్కడా అనవసరంగా వాడిన మాటలే కారణం. క్లుప్తత ముఖ్యం అంటారు, ముఖ్యంగా కవిత్వానికి.
నిజమే, జ్యోతిషం చాలా ఆసక్తికరమైన విషయం. ఈ ఆసక్తికి ప్రధాన కారణం నా ఉద్దేశ్యం ప్రకారం ఇదీ – చాలామంది మనుషులకి తమకి తెలియకుండానే కొంత ‘అధి భౌతిక దృక్పథం’ (Mystical లేక Magical Thinking అనడం సరైనదేమో) ఉంటుంది. నా జీవితంలో పరిస్థితులు ఇలా ఉండడానికి ఏదో పైకి కనిపించని కారణం ఉండి ఉంటుంది (పూర్వ కర్మ లాంటివి). ‘నాకే ఇలా ఎందుకు జరుగుతోంది’ అని మనలో చాలామందిమి ఏదో ఒక సందర్బంలో ప్రశ్నించుకునే ఉంటాము. ఏదో ఒక కారణం వల్లనే మన గతమంతా అలా జరిగింది అనీ, ఏదో ఒక హేతువు ప్రకారమే భవిష్యత్తు కూడా జరుగుతుంది అనీ చాలా ఎక్కువ శాతం మందికి ఒక సహజమైన అభిప్రాయం ఉంటుంది. మన పరిధిలో లేకుండా జరిగే విషయాలని అర్థం చేసుకోడానికి, సర్దిచెప్పుకుని సమాధానపడడానికి ఈ విధమైన దృక్పథం ఒక సహజాతం (instinct) లా పనిచేస్తుంది (చాలా మందికి) అని నా అభిప్రాయం. దాన్ని నేను దుర్బలత్వంగా భావించను – ‘అతి’ లేనంతవరకూ.
జ్యోతిషానికి పునాదులు ఇటువంటి సహజాతాల్లో ఉన్నాయి కాబట్టి అది ఇంకా అనేక సంవత్సరాలపాటు నిలబడి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళూ, అధ్యయనం చేసేవాళ్ళూ కూడా దాన్ని ఒక ఖచ్చితమైన శాస్త్రంగానే (Deterministic అనే) భావిస్తారు. అయితే అధ్యయనం చేసేవాళ్ళు అది ఖచ్చితంగా పని చెయ్యాలి అని పట్టుబట్టి, లోతుగా పరిశీలించదలచుకుంటే మాత్రం అంతిమంగా నిరాశ పడక తప్పదు. అది నా స్వంత అనుభవం. అయితే అది ఖచ్చితంగా పని చెయ్యకపోయినా, పని చేస్తున్నట్టు ఉభయులకీ అనిపిస్తుంది అనడంలో మాత్రం నాకు సందేహం లేదు. తమవద్దకు వచ్చినవాళ్ళనీ, వాళ్ళ సమస్యల్నీ లోతుగా అర్థం చేసుకుని, పరిష్కారాలు చూపించి, సంతృప్తిపరచగల వ్యక్తిత్వమూ, చాతుర్యమూ, వివేకమూ గలవాళ్ళకి జ్యోతిషం చాలా ఉపయోగకరమైన పనిముట్టు. అయితే వ్యక్తుల ప్రతిభతో ప్రమేయం లేకుండా ఒక పనిముట్టుగానే దాని సామర్థ్యాన్ని పరిశీలించదలచుకున్నవాళ్ళకి మాత్రం అది ప్రస్తుతానికి ఎండమావి లాంటిదే.
ఇక కవలల సంగతి. ఏ జ్యోతిష గ్రంథంలోనైనా సరే దీని గురించి చర్చ జరగకుండా ఉండదు. భూమియొక్క దైనందిన చలనం (Diurnal Motion) ప్రకారం సుమారుగా ప్రతీ నాలుగు నిమిషాలకీ ఒక డిగ్రీ చొప్పున తూర్పున ఉదయించే బిందువు (లగ్నం), అలాగే మిగతా భావాలూ మారుతూ ఉంటాయి. చాలా మంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఈ బిందువుల్లో ఎంత సూక్ష్మమైన తేడా వచ్చినా సరే ఫలితాలు మారుతాయి. మరీ ముఖ్యంగా భారతీయ జ్యోతిషంలో రాశి చక్రాన్ని చాలా సూక్ష్మ భాగాలుగా చేసి ఫలితాలు చూసే సాంప్రదాయాలు (నవాంశ, దశాంశ, త్రింశాంశ మొదలైన విభాగాలు) ఉన్నాయి. వాటి ప్రకారం జన్మ సమయంలో ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే ఫలితాలు మారిపోతాయిట. అయితే ఆచరణలో మాత్రం అత్యధికశాతం జ్యోతిష్కులు అంత దగ్గరి జాతకాలకి భిన్న ఫలితాలు చెప్పలేరు. అంతేకాదు, చాలా మంది జాతకుల జన్మ సమయాలు కూడా నిమిషంతో సహా ఖచ్చితంగా ఎవరికీ తెలియవు. అందుచేత ఎవరికైనా చెప్పిన ఫలితాలు తప్పిపోతే, ’జన్మ సమయం తప్పై ఉంటుందమ్మా, అది చాలా ఖచ్చితంగా తెలియాలి’ అని జ్యోతిష్కులు తప్పించుకుంటూ ఉంటారు.
కొన్ని పుస్తకాల్లో ఒక్క నిమిషం ఎడంగా పుట్టిన కవలల జాతకాలని ఉదాహరణగా ఇచ్చి, ‘చూశారా ఒక్క నిమిషమే తేడా ఉన్నా, ఫలానా సూక్ష్మాంశం మారిపోవడం వల్ల అసలు ఇద్దరి జీవితాలకీ పొంతనే లేదు!’ అని రాస్తూ ఉంటారు. అయితే ఆ కవలల విషయంలో అన్వయించిన అదే సూక్ష్మాంశం మరొక మామూలు జాతకానికి ఎందుకు అన్వయించరో బోధ పడదు. అంతే కాకుండా అటువంటి సూక్ష్మాంశాలవల్ల నిజంగా మిగతా జాతకాల్లో కూడా ఫలితాలు ఎలా తేడాగా వస్తున్నాయో వివరణలు ఉండవు. వాటికి మాత్రం ఎక్కువ కాలావధిలో మారిపోని అంశాలనే పరిగణనలోకి తీసుకుని ఫలితాలు చెప్పేస్తూ ఉంటారు.
పాశ్చాత్య జ్యోతిషంలో భూమి యొక్క దైనందిన చలనం (Diurnal Motion) ప్రకారం ప్రిడిక్షన్సు చెప్పే పద్ధతి ఒకటి బహుళ ప్రాచుర్యంలో ఉంది. దానిలో జన్మ సమయం ఒక నాలుగు నిమిషాలు తేడా వస్తే, ఫలితం జరగాల్సిన సమయం ఏడాది దాకా మారిపోతుంది. కాబట్టి ఈ పద్ధతిని రివర్సులో ఉపయోగించి జన్మ సమయాన్ని సరిచేస్తూ ఉంటారు. అంటే, మొదట ఒక జాతకాన్ని చూసి, పెళ్ళి జరిగే తేదీని లెక్క వేశాము అనుకోండి. జాతకుడికి పెళ్ళి ఎప్పుడైందో కనుక్కుంటే, మనం కట్టిన తేదీకి సరిగ్గా ఒక ఏడాది తరవాత పెళ్ళి అయిందనుకోండి. అంటే, మన లెక్కలో ఒక డిగ్రీ తేడా వచ్చింది అన్నమాట. భావ బిందువు ఒక డిగ్రీ జరగడానికి పట్టే కాలాన్ని (నాలుగు నిమిషాల్ని) జన్మ సమయానికి కలిపేస్తే, లెక్క సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా జన్మ సమయాన్ని సరి చేస్తూ ఉంటారు.
సరదాగా ఒకసారి పరిశీలించి చూసుకోండి – మీకూ, మీ అన్న గారికీ వివాహం, ఉద్యోగం, సంతానం ఇలాంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ప్రతీవాటికీ సుమారు ఒక ఏడాది తేడా వస్తూ ఉంటే, ఈ పద్ధతి నిజమేనేమో అని మీరూ అనుమానించవచ్చు.
కవలల జీవిత విశేషాలు తెలుసుకుని, వాళ్ళ జాతకాలని సరిపోల్చడమనేది అనేకమంది జ్యోతిష్కులకి చాలా ఆసక్తికరమైన, కూతూహలమైన పని. కాబట్టి మీ ఇద్దరి జన్మ వివరాలూ ఏ జ్యోతిష విద్యార్థికి ఇచ్చినా వాళ్ళు ఎగిరి గంతేస్తారని ఖచ్చితంగా చెప్పగలను.
ఇక మీరు లేవనెత్తిన మరొక ప్రశ్న – విభిన్న ప్రాంతాల్లో పెరగడం వల్ల మా జీవిత విశేషాల్లో తేడాలు వస్తాయా? అని. ఈ ప్రశ్న కవలలకే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఒక జ్యోతిషాంశం అన్ని దేశాల, సమాజాల వాళ్ళకీ ఒకే రకంగా పని చేస్తుందా ? దీని గురించి ’జ్యోతిషమూ – కొన్ని సూక్ష్మాంశాలూ’ అన్ని అధ్యాయంలో నేను కొద్దిగా చర్చించదలచుకున్నాను కాబట్టి ఇప్పటికి వదిలేస్తున్నా.
మీ సుదీర్ఘమైన వ్యాసాన్ని చదవటం ఇప్పుడే పూర్తి చేసాను. ఈ వ్యాసం రాయడానికి వెనక ఉన్న మీ కృషి, “ఈమాట” సంపాదకుల సంపాదకత్వం మెచ్చుకోవాలి. తెలుగులో ఇటువంటి వ్యాసాలు అరుదు. మీ లాగ సైన్సులో కాని ఇంజినీరింగులో కాని అత్యుత్తమ స్థాయిని చేరుకున్న తెలుగు వారు చాలా మంది ఉన్నా, తెలుగులో ఇటువంటి రచనలకి శ్రీకారలోచుట్టిన వారు తక్కువ. ముఖ్యంగా సైన్సు, ఇంజినీరింగు విభాగాల్లో అతి క్లిష్టమైన భావాలను తేలిక తెలుగులో రాయటం అంత తేలిక కాదు అన్న విషయం, అది ప్రయత్నించిన వారికి అనుభవమే!
ఇటువంటి రచనల్లో ఎదుర్కొనే చిక్కుల్లో రెండు విషయాలు ప్రస్తావిస్తాను. మొదటిది: అత్యుత్తమ స్థాయిలో, సాంకేతికమైన పదజాలం తెలుగులో ఎక్కువ లేకపోటం. రెండవది: తేలికగా చదవటానికి వీలైన తెలుగు భాష. ఈ రెండు కష్టాలని దాటటం అంత సులభం కాదు. మీరు సమర్ధవంతంగా ఈ రెండు కష్టాలని ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ముందు, ముందు మీ రచనల్లో మరింత పరిణితి వస్తుందని నేను నమ్ముతున్నాను.
రెండు చిన్న సూచనలు: (1) ఎంతో అవసరమైతే తప్ప, తెలుగు కాని ఇంగ్లీషు కానీ కవితలని ఇటువంటి వ్యాసాల్లో ఉల్లేఖించకండి. చదువరుల ఆలోచనలను, ఇవి అసలు విషయం నుండి పక్కదారి పట్టిస్తాయి. (2) ఇంటర్నెట్ అందుబాటులో లేని సైన్సు లేక ఇంజినీరింగ్ చదువుతున్న తెలుగు విద్యార్ధుల కోసం, మీ రచనలను ఆంధ్ర దేశంలో ప్రచురిస్తున్న దిన, వార, మాస పత్రికల్లో ప్రచురిస్తే, అక్కడి వారికి సాయపడినవారు అవుతారు. ఇందులో కస్టాకస్టాలు నాకు తెలిసినా, ప్రయత్నించమని మనవి.
ఈ వ్యాసాలు చదువుతుంటే, వృత్తి రీత్యా నాకు బాగా పరిచయమైన సెమికండక్టర్సు సిలికాన్ ఛిప్స్ తయారీ వెనుక ఉన్న ‘సిలికాన్ మహత్యం ” పై ఈమాట కోసం వ్యాసాలు రాయాలని అనిపిస్తోంది. వీలు చూసుకొని ఎప్పుడైనా…
మీ సూచనలకి కృతజ్ఞతలు. మీరు చెప్పిన పుస్తకాలు కొనే శక్తీ, చదవాలనే ఆసక్తీ ఉన్నాయి. కాని అవి చాలవు; చదవాలనే దీక్షా, పట్టుదలా కావాలి! నేను పాత సాహిత్యాన్ని సులభంగా ఆకళింపు చేసుకోలేకపోవడానికి కారణం నా ఇంగ్లీషు చదువు కాదు. నేను ఇటివలి వాణ్ణీ కాదు.
పదో తరగతిదాకా తెలుగు మీడియం లోనే చదివాను. ఇంటర్ ఇంగ్లీషు మీడియం అయినా తెలుగు కూడా ఒక సబ్జెక్ట్. కాలేజీ చదువుల తర్వాత గత పాతికేళ్ళుగా సాహిత్యపరిచయం తక్కువ. వావిళ్ళా, దేవస్థానం వాళ్ళూ చేస్తున్న కృషి చెప్పుకోదగ్గదే కాని, సామాన్య పాఠకుడు తనంతటతాను మన కావ్యాలు – వ్యాఖ్యానాలున్నా – చదవడం శ్రమతో కోడిన వ్యవహారం అన్నది నాకు అనుభవపూర్వకం.
అయితే ఎవరైనా సందర్భోచితంగా ఏదన్నా పద్యాన్ని ఉదహరిస్తే, దాని గురించి ఇంకాస్త తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అందుకు స్వానుభవం నుంచి ముచ్చటగా మూడు ఉదాహరణలు :
1.. ఉప్పల లక్ష్మణరావు రాసిన “అతడు-ఆమె” నవలలో ‘కమ్యూనిస్టు’ చెల్లి అక్కదగ్గర కెళ్ళి పెద్దన మీద ఫిర్యాదు చేస్తుంది – వరూధిని, “నిన్ను వలచి వచ్చాను,” అని ప్రవరుడితో అంటే చులకనయిపోతుందా? అని:
2. తానా 2005 సూవనీర్లో వెలగా వెంకటప్పయ్య వ్యాసం, “తెలుగునాట చదివే అలవాటు పెంచిన గ్రంథాలయోద్యమం,” లో మనరాష్ట్రంలో ప్రస్తుత గ్రంథాలయాల దుస్థితిని వివరిస్తూ ఈ పద్యం ఉదహరించారు. “యుద్ధం ఆపడం నీ చేతిలో ఉంది,” అని ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు హెచ్చరించే సందర్భం:
“సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే శక్తి కలిగి ఉండి, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికి, సర్వ అనర్థాలకు కారణం అవుతుంది.”
3. సైన్సూ, సాహిత్యాలలో ప్రతిభావంతుడైన మహీధర నళినీమోహన్ రాసిన “కేలెండర్ కథ” లో మన దేశంలో కాలాన్ని ఎలా విభజించారో విశదపరుస్తూ, క్రీడాభిరామంలో ఇద్దరు మిత్రులు ఓరుగల్లు వీధుల్లో తిరుగుతూ నగర విశేషాలని వర్ణించిన పద్యం ప్రస్తావన ఉంది:
అది చదివి క్రీడాభిరామం ఇంకాస్త చదవాలనే ఆసక్తి పెరిగింది.
ఈ రీతిన అప్పుడప్పుడు అరా ముక్కా చదివితే ఎన్నేళ్ళకి ఏ కావ్యమైనా గట్టెక్కుతుంది? నిజమే, బహుశా ఇది కావ్య పఠనా మార్గం కాదు. కాని యుక్త వయసులో ఇలా పాత సాహిత్యంతో పరిచయం పెరిగితే కొన్నాళ్ళకి తమంతట తామే చదువుకోగల స్థాయికి చేరుకోవచ్చు. అందుకు తెలుగునాడి లో “రసధుని” శిర్షికా, ఈమాటలో పాత సాహిత్యంపై వచ్చే కొన్ని వ్యాసాలూ సహాయపడతాయి.
ఇది నేను రాయడానికి కారణం మిమ్మల్ని ఖండించడానికి కాదు; నా అనుభవం మిగిలినవాళ్ళకి కొంత ఉపయోగపడుతుందేమోనని ఆశతో.
కొడవళ్ళ హనుమంతరావు
మదర్స్ డే గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/17/2008 8:55 am
రవికిరణ్ గారూ,
కథనంలోని లోపాలకి బాధ్యుడు రచయిత. వాటిని పాత్రకి ఆపాదించడం భావ్యం కాదేమో. దానివలన మన దృష్టి కథ ముఖ్యోద్దేశం మీద కాక వేరే వాటి మీదకి మళ్ళే ప్రమాదం ఉంది.
సుందరం ముందర మదర్స్ డే అంటే అనుమానంగానో తృణీకారంతోనో చూసినా, ఆరోజు ఎలా గడపాలి అన్న చర్చలో అతని వాదన సవ్యంగానే ఉంది.
మీకు సుందరం, వరలక్ష్మి, జీవితంలో అనేక సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద చాలా అనుమానాలుండొచ్చు. కాని ఇది కథానిక – ఓ సంఘటన ఆధారంగా ఒక జీవిత కోణంపై వెలుగు చూపే ప్రయత్నం. పాత్రల విస్తార జీవితాన్ని విశ్లేషించడానికి నవల కాదు.
ఈ మాటల్లో నాకు లింగ వివక్షతతో కూడిన కుటుంబ జీవనంనుంచి స్వేచ్ఛ కన్నా గానుగెద్దు బతుకైపోయిన జీవితంనుంచి వొకరోజు ఆటవిడుపు కోసం తపనే కనిపిస్తుంది.
బ్రతుకలా తయారుకావడానికి పిల్లల బరువూ, ఇంటి పనీ మగవాడి కంటె ఆడదే ఎక్కువ భరించడాన కాదా? ఈ కథ మనం మదర్స్ డే జరుపుకునే తీరులోని అసంబద్ధతని చూపెడుతున్నా, దీని ప్రాధాన్యత నిత్యజీవితంలో మన ఇంట్లో కళ్ళెదుటే సాగే అసమానత గురించి కాస్తన్నా ఆలోచింపచేయడమే.
మాలతి గారి కథ మీదా, సౌమ్య గారి కథ మీదా నేను నాలుగు మాటలు రాయడాన, మాలతి గారు నన్ను కూడా దృష్టిలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వారికి జవాబుగా ఇదిగో మరో ముక్క.
నచ్చిందనో నచ్చలేదనో ముక్తసరిగా చెప్తే, ప్చ్, నిర్మాణాత్మకంగా లేదు, అని పెదవి విరుస్తారు సంపాదకులు. ఇది ఇందుకు నచ్చింది, ఇది ఇందుకు నచ్చలేదు అని సామాన్య పాఠకుడు తన స్థాయికి తగ్గట్టుగా రాస్తే, పీకి పాకాన పెడుతున్నాడని కళెర్ర చేస్తారు రచయితలు. ఎలా చావడం?!
ఈ సందర్భంలో బూదరాజు రాధాకృష్ణ మన విమర్శ గురించి అన్న మాటలు ఆలోచించదగ్గవి: “గ్రంథానికి లేని విలువ దాని విమర్శకు రాదు; విమర్శకు లేని విలువ గ్రంథానికీ రాదు. ఈ రెండూ అన్యోన్యాశ్రితాలు. ఈ రెంటికీ విడదీయరాని పరస్పర సంబంధముంది. ఒకటి పేలవమైతే రెండోది అప్రశస్తమవుతుంది. ఒకటి దురభిమానభూయిష్ఠమయితే రెండోది నిస్సారమవుతుంది. ఉన్నత సాహితీ సృష్టికి విమర్శలను తట్టుకొని పదికాలాల పాటు బతకాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉండాలి. ఉత్తమ విమర్శకు గుణదోష పరీక్షణ శక్తి కావాలి.”
అయితే రచయితలొక విషయం గుర్తుంచుకోవాలి. నాలాంటి పాఠకులు వృత్తిరీత్యా, కనీసం ప్రవృత్తి రీత్యా నయినా విమర్శకులు కారు. వాళ్ళ పరీక్షణ శక్తి చాలా పరిమితం అని గ్రహించాలి. ఆ పరిమిత శక్తితో వాళ్ళు చేసే విమర్శకు కించిత్ విలువన్నా ఉందో లేదో రచయితలే పరామర్శించుకోవాలి.
ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఈమాట లాంటి పత్రికలో ప్రచురించినందుకు రచయితలు గర్వపడొచ్చు. వాటిని కొందరు పాఠకులు మెచ్చుకున్నందుకు పొంగిపోవచ్చు. అది సహజమే. కాని విమర్శించిన సామాన్య పాఠకుల అమాయకత్వానికి జాలిపడకుండా, విమర్శలో తమ రచనలు ఇంకా పైస్థాయికి చేరే సూచనలుంటే స్వీకరించడం, లేకపోతే మర్యాదగా తిరస్కరించడం – అది బాధ్యతగల రచయితల విధి అని నాఉద్దేశం.
‘మదర్స్ డే’ కథ మీద రవికిరణ్ తిమ్మిరెడ్డిగారి అభిప్రాయం చదివాక రాయాలనిపించింది.
రవికిరణ్ గారి ప్రకారం స్వాతంత్ర్యం రోజున జెండాలు పట్టుకు తిరగా అక్కర్లేదు. మదర్స్ డే నాడు మదర్స్ లానూ వుండక్కర్లేదు. మరి వాటిని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఎలా చేసుకోవాలి?
కథలో సుందరం మొదట మదర్స్ డే కి కొంచెం వ్యతిరేకంగానే వున్నాడు. కాని ఆ వ్యతిరేకత దేని పైన? ఒక్క రోజు తల్లుల్ని గౌరవించే పద్ధతుల మీదా, బహుమతుల మీదా. బహుమతులివ్వలేని పిల్లలూ, మీకు మదర్స్ డే వున్నట్టేనా ! పండగలకి గుడ్డ ముక్క పెడితేనే అక్కా, చెల్లీ.
తల్లులందరూ పిల్లలకి దగ్గరగా వున్నప్పుడూ తల్లులే, దూరంగా వున్నప్పుడూ తల్లులే, సరే. మరి మదర్స్ డే ని ఫాలో చేసేవాళ్ళు, ఆ రోజు ఎలా గడపాలి? వినాయక చవితి నాడు వినాయకుడితోనూ వొద్దు, మదర్స్ డే నాడు పిల్లలతోనూ వొద్దు, రవికిరణ్ గారి ప్రకారం.
సుందరానికి తనతో విభేదించే వాళ్ళ పైన కాదు అగౌరవం. దేన్ని ఫాలో చేస్తారో, దాన్ని సరిగా అర్థం చేసుకుని ఫాలో చెయ్యనివాళ్ళ పైనే అగౌరవం.
అసలు, కథని రవికిరణ్ గారు సరిగా అర్థం చేసుకున్నట్టు లేదనిపిస్తోంది నాకు.
ఈ వ్యాసము నేను ప్రచురించిన రోజు నుండీ, రోజూ చదువుతున్నాను. మరి ఎంచుకున్న పద్యాలు అంత అందమైనవి. వ్యాసకర్తకు విషయం పైన అధికారము, అభిమానము, పాఠకులమీద ప్రేమతో, ఓర్పుతో విషయాన్ని విశదీకరించటం, భాషమీది మమకారం గౌరవంతో చక్కని (మధ్యలో ముక్కలు కాని, చివర్లో తునిగిపోని) వాక్యాలు రాయటం – ఇవి కొన్ని నాకు నచ్చిన గుణాలు. ఈ రచయిత వ్యాసాలు నాకు ఒయాసిస్సులు.
హంస గీతికలు అన్న శీర్షిక ఎంతో బాగుంది. కాని ఇంగ్లీషు సంగతి ఎత్తినప్పుడు ‘swan song’ అన్నమాటే వ్యాసము లో ఉండాలని నా అభిప్రాయం.
కామేశ్వర రావు వివరణ కూడా ఎంతో ఎంతో బాగుంది. మళ్ళీ భారతంలో ఈ ఘట్టంలో ముందు వెనుకల పద్యాలన్నీ చదివాను. నాకు మీకున్న పాండిత్యం లేదు. చాలా పద్యాలు అర్థం చెప్పి, వివరణలిస్తేనే చదువుకోగలను.
ఐనా, “అబ్జజు యానముతో సమానమై” అన్నచోట ఆ హంస బ్రహ్మ వాహనమైన హంస కాదా? అబ్జజుడు బహ్మ కదా?
మంచి పద్యాల గురించి మంచి వ్యాసం!
ఈ పద్యాల కథ, ధర్మరాజు సారస్వత యాగం జరిగిన తీర్థంలో స్నానమాడి పొందిన మహానుభూతి దగ్గర మొదలౌతుందని “నన్నయ్యగారి అక్షర రమ్యత”లో వి.వి.ఎల్. నరసింహారావు గారి అభిప్రాయం. ఇక్కడ నన్నయ్యగారు పేర్కొన్న “ప్రసన్న సరస్వతీకము” రాబోయే కథలోని సరస్వతీ గీతకి (తార్క్ష్యునికి సరస్వతి చెప్పిన గీత) సూచన అని అతనుద్దేశం. అయతే ఆ భాగాన్ని ఎఱ్ఱన పూరించాడు.
ఈ భాగం చదువుతూ ఉంటే నాకూ, అంతర్లీనంగా సాగే ఏదో అంతస్సూత్రం కనిపించీ కనిపించకుండా కనిపిస్తుంది.
ఎఱ్ఱన చేసే సరస్వతీ నది వర్ణనకీ నన్నయ్య “భూసతికిన్…” పద్యానికీ చాలా సామ్యం కనిపిస్తుంది. ఈ పద్యంలో, భూమినీ ఆకాశాన్నీ హంసతో పోల్చినట్టుగా మీరన్నారు. కానీ ఇక్కడ శరత్కాలాన్ని సరస్వతీ బ్రహ్మల సమేతమైన “శారద”హంసతో పోల్చినట్టు నాకనిపిస్తోంది. శారద రాత్రులు, సరస్వతీ ఒకదానికొకటి విడదీయలేనంతగా అనిపిస్తాయి. ఇది ఎఱ్ఱన సరస్వతీ గీత తర్వాత చేసిన సరస్వతీ స్తుతి “అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ! శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి!” అనడంతో పరిపూర్ణమైనట్టుగా తోస్తుంది.
ఈ మొత్తం భాగంలో (నన్నయ్య శరత్కాల వర్ణన మొదలు ఎఱ్ఱన సరస్వతీ స్తుతి వరకూ), చాలా పద్యాల్లో తిరిగి తిరిగి కనిపించే పదాలూ పదబంధాలూ కూడా ఈ ఏక సూత్రతని స్ఫురింపజేస్తాయి.
నన్నయకి హృదయఘాతం వంటిది సంభవించి ఉంటుందని కన్నా, శారద హంసనెక్కి బ్రహ్మలోకానికి ఎగిరిపోయి ఆ సరస్వతిలో కలసిపోయాడని ఊహిస్తే మనకి ఆత్మసంతృప్తి కలుగుతుంది కదా!
మధునాపంతుల వారు ఇంచుమించు ఇలాగే ఊహించారు. ఊహించడమే కాక, దానికి ఈ వ్యాసంలో మీరిచ్చిన ఈ నన్నయ్య చివరి పద్యాలని ఆధారం చేసుకొని ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు, “నన్నయ్య భారతి” పుస్తకంలో “నన్నయగారి వెన్నెల రేయి” అన్న వ్యాసంలో.
నాకు సత్యజిత్ రాయ్ సాహిత్యంతో పరిచయం లేదు; డాన్ బ్రౌన్ ఎవరో తెలియదు. నీల్స్ బోర్ principle of complementarity గురించి కొంచం తెలుసు. ఈ కథ సారాంశం నాకర్థం కాలేదు. వింత మనుషులతో కాపురం/స్నేహం ఎలా ఉంటుందనా? దీనికి ప్రేరణ ఇచ్చిన రాయ్ సాహిత్యం చదువుదాం అన్న ఆసక్తి నాకు ఎంతమాత్రమూ కలగలేదు.
పోల్చి కించపరిచే ఉద్దేశం లేదు కాని, రాయ్ పుట్టినరోజన్నారు కనుక చెప్తాను. నిన్న రాత్రి ఎందుకో శ్రీపతి కథలు చదువుతుంటే, ఒకటి నన్ను గట్టిగా కదల్చింది. ఇవాళంతా నా ఆలోచనల్లోనే ఉంది. కథ పేరు, “సత్యజిత్ రాయ్ ఎవరు.” అది చదివి, నేను రాయ్ చిత్రాలు మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది అని తీర్మానించుకున్నాను.
చారులతను గురించి చక్కగా రాసిన రచయితకు అభినందనలు, ధన్యవాదాలు. నాకు నచ్చిన చలనచిత్రాలలో చారులత ఒకటి. ఈ కథను చిత్రం చూడడానికి ముందే కన్నడములో చదివాను. ఇది ఒక పెద్ద కథ లేక నవలిక. కొద్దిగా రవీంద్రుని జీవితంలోని సంఘటనలపైన ఆధారపడిందే. చారులతలాగే కాదంబరీదేవికి కూడా బంకించంద్రునిపై మక్కువ ఎక్కువ. చారులత బొంకిం, బొంకిం అని పాటలా కూడా పాడుతుంది ఈ చిత్రంలో. కాదంబరీదేవికి రవీంద్రుని ముద్దు పేరు హెకేట్ (ఒక నిగూఢ దేవత). ఆమె రవీంద్రుని భాను అని పిలిచేది. తన మొదటి రచనలను రవీంద్రుడు భానుసింహుని పేరుతో రాశాడు. చిత్రంలోని ముగింపు కథకు విరుద్ధమైనది. కథలో భూపతి మైసూరికి వెళ్తాడు. నేను కూడా రావచ్చా అని చారు అడిగితే మాట్లాడ లేదు భూపతి. ఆమె సరే ఇలాగే ఉండనీ అంటుంది. కానీ చిత్రం ఫ్రీజ్ షాట్తో సందిగ్ధంగా అంతమవుతుంది. భారతీయ చిత్రసీమలో ఇదే మొదటి ఫ్రీజ్ షాట్ అట. ఇందులో అమల్ చారుల మధ్య ఆకర్షణ క్రమేణా వస్తుంది. అతని చనువు, భర్త అశ్రద్ధ, ఆమె ఒంటరిదనం దీనికి దారి తీసింది. భర్తకు చివర తాను అశ్రద్ధ చేశాననే పశ్చాత్తాపం, అమల్కు హద్దు మీరరాదనే భావం, కాని ఆమెకు ఇట్టివి ఏమీ లేదు. అందువల్ల ఆమె చివర రాజీ పడటానికి సంసిద్ధురాలైంది. రాయ్ గారు ఇందులో మొట్ట మొదట నేపథ్య గాయకుని ఉపయోగించారు. కిశోర్ కుమార్ గంగూలీ పాడిన ఆమి చినిగొ చిని తుమారే ఆ పాట. దీనికి బ్యాక్ గ్రవుండ్ మ్యూసిక్ కూడా ఉంది. సామాన్యంగా రాయ్ గారి చిత్రాలలో ఇది అరుదు. ఆ పాటను ఇక్కడ చూచి, విని ఆనందించగలరు –
భువన మెల్ల వెదకి
నిను గంటి క్రొత్త చోట
నే నతిథి నీ గృహాన, ఒహో విదేశినీ
ఈ పాటను 1895లో కవిగారు రాశారట. దీని తన స్వంత అనువాదాన్ని ఆర్జెంటీనాకు చెందిన విక్టోరియా ఒకాంపోకు ఆ దేశాన్ని సందర్శించినప్పుడు కవిగారు ఇచ్చారట. ఆమెయే టాగూరు విదేశిని! చిత్రంలో ఈ పాట చివర అమల్ బౌ ఠాకూరాణీ అని తన వదినగారిని ఉద్దేశించి అంటాడు.
చారులతను గురించి రాయ్ గారి కుమారుడు సందీప్ చెప్పినవి కింది లింకులో రొష్మీలా భట్టాచార్య రచనలో చదువగలరు –
ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్ళి ఓ చేత్తో దానిని ఉయ్యాలూపుతూ ఇంకో చేత్తో ఓ తెలుగు పుస్తకం పట్టుకొని చదువుతున్నా. అంతలో ఓ పెద్ద కంపెనీలో IT విభాగంలో పనిచేసే తెలుగాయన ఒకాయన పలకరించాడు. ఈ upgrades, patches తో చచ్చిపోతున్నామన్నాడు. “మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి!” అనుకున్నాను. 🙂
IT వాళ్ళ గతే అలా ఉంటే మిగిలినవాళ్ళు కంప్యూటర్లతో పడే అగచాట్లని ఊహించుకోగలను. కాని అవే ఈ కథకి మూలమయితే అవి ముఖ్య పాత్ర జీవితాన్నెలా ప్రభావితం చేశాయో చూపాలి – చెప్పడం కాకుండా.
సంగాలు జీవితం గురించి తెలిసినంత మాత్రం పధానపాత్ర గురించి తెలియలేదు. ముప్ఫై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నదనీ, కథలు రాస్తుందనీ, తెలియక ఓ డొక్కు ఉద్యోగంలో పడిందనీ తెలుసనుకోండి. కథ ఉత్తమ పురుష దృక్కోణంలో చెప్పడానికి ముఖ్యకారణం పాఠకులకి నమ్మకం పెంచడానికని విన్నాను. దీంట్లో “నేను” ఔట్సోర్సింగ్, ప్రపంచీకరణ, కంప్యూటర్ టెక్నాలజీ, తెలుగు భాషా దుస్థితి, శ్రీశ్రీ కవిత్వం, జీవిత పరమార్థం – ఇలా అనేక విషయాల మీద అభిప్రాయాలు చెప్పేటప్పటికి, మూడు పేజీల కథలో జీవితానికి చోటు తక్కువయి పాఠకుణ్ణి స్పందించే అవకాశం సన్నగిల్లింది.
వారసత్వపు హక్కుగా మిద్దె జీవితాన్ని అనుభవించలేకపోయానే అని వగచే విద్యావంతురాలి పట్ల సానుభూతి ఎలా పుడుతుంది? కూరలమ్ముకొని బ్రతికిన సంగాలుకి తన ‘డూటీ’ పట్ల నిర్లిప్తత లేదు. “నేను” కి తన ‘డూటీ’ ఒక శాపం. అలా ఎందుకు పరిణమించిందో చిత్రించక పోవడం, దాన్నుంచి విముక్తి లేనట్లు చిత్రించడం, ఈ కథలో లోపం.
కొడవళ్ళ హనుమంతరావు
సడిచేయకే గాలి గురించి Sai Brahmanandam Gorthi గారి అభిప్రాయం:
05/03/2008 12:27 pm
లైలా గారూ,
వేలూరి గారి వ్యాసం రాయకపోయినా ఇలాంటివి కనిపిస్తే రాస్తాను. మీకందరికీ తప్పులేదనిపించింది. సంతోషం.
ప్రేరణకి కొత్త అర్థాలూ, అన్వయాలూ చెప్పినందుకు ఆనందించాను. ఇప్పుడే పాత సినిమా పాటలన్నీ ముందేసుకూర్చున్నాను. ఎంత ప్రేరణ దొరుకుతుందో చూడాలి.
మీరు రాసిన –
“కవి ఎవ్వరికీ తెలియదు, కాపీ కొట్టేద్దాం అని కాదు ఈ పాట రాసేది. చాలామందికి ఈ పాట చాలా ఇష్టమనే. ఈ కవి ముందు పాటకి పొంగిపోయాడు. ఇంకో చక్కని విషయానికి దాన్ని అన్వయించి మరో చక్కని పాట రాశాడు. దీనితో మన ఆనందం ఎక్కువ అయ్యింది కాని తగ్గదే.”
అన్న ఈ మాటలు కవి గారంటే ఇంకాస్త అనందించేవాణ్ణి.
పాట చాలా చక్కగా ఉంది. ఆ పాట సాహిత్యంలోని మృదుత్వాన్ని ఆనందించాను. ఇదివరకటి సినిమా పాట లాగానే పాడుకుని కూడా సంతోషిస్తున్నాను. చేతైతే ఈ కొత్త పాటను పాడించి ‘యూ ట్యూబ్” లో కూడా పెట్టించి వింటాను.
కవి ఎవ్వరికీ తెలియదు, కాపీ కొట్టేద్దాం అని కాదు ఈ పాట రాసేది. చాలామందికి ఈ పాట చాలా ఇష్టమనే.
ఈ కవి ముందు పాటకి పొంగిపోయాడు. ఇంకో చక్కని విషయానికి దాన్ని అన్వయించి మరో చక్కని పాట రాశాడు. దీనితో మన ఆనందం ఎక్కువ అయ్యింది కాని తగ్గదే.
అంతకు ముందు ఒక పాట ఉంటే, అది మిగతా మనుషులందరినీ బతికున్నంత కాలం ఆ పాటే పాడమని బంధించటానికి కాదు. ఈ పాట వచ్చినందువల్ల అంతకు ముందు పాటకు హాని ఏమిటి? ఏం లేదు.
వేలూరి వ్యాసం లేక పోతే ఈ పాట మీది కామెంట్లు ఇంకో ధోరణిలో ఉండేవా కావా? అంటే ఆ వ్యాసం ప్రభావం చదివిన వారి మీద పడింది. ఆలోచిస్తున్నారు. మరి అంత చక్కని పాట ప్రభావం శ్రోతను నోరు మూయించలేదు. కవిని చేసింది. ఇంకో చక్కని పాట రాయించింది.
నేనైతే:
సడి చేయకే గాలి సడి చెయ్యకే
సవ్వడి చేసి మా పాప కునుకు చెడనియ్యకే
అని పాడుకుంటున్నాను.
గలగల పారే గోదారిలా సవ్వడి చేస్తూ సాగిన సంద్రాలు సంభాషణల్లో నుండి హఠాత్తుగా ఫ్లాపీలూ, సీడీలూ, పిడియఫ్ ల గందరగోళంలో పడి సజీవంగా సాగుతున్న కథ కాస్తా నిర్జీవమైన సాంకేతిక వ్యాసంగా మారిపోయింది!
“చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా బట్టీపట్టిన గీతం పాడుకోవాలనిపిస్తోంది. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు, … చక్రవర్తి అశోకుడేడీ, … జగద్గురు శంకరుండేడీ”. నిరుడుకురిసిన హిమ సమూహములని వదిలిపెట్టి, పద పదమంటూ ముందుకు తోసుకుపోయాడు శ్రీశ్రీ మరోప్రపంచానికి.”
“మహాప్రస్థానం” ముందో “ఏవి తల్లీ!” ముందో నాకు గుర్తు లేదు కాని,
“చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?”
“. ..కాబట్టి, లైలా యెర్నేని గారి పాయింటు ఈ విషయంలో కరెక్టే. అయితే తోలూ, సూదీ, దారం లాంటివి సంపాదించి, చెప్పులు స్వయంగా కుట్టుకోవాలి అనేది అర్థం లేని విషయం.”
ఎందుకు కుట్టుకోకూడదు. చాలమంది చొక్కాలూ, జాకెట్లూ, కుట్టుకుంటూనే ఉంటారుగా? కరెక్టే అంటూనే మళ్ళీ కాదంటారు. అంతా రైటే అంటే మనమిద్దరం స్నేహితులమై పోతామని భయమా ఏమిటి?
“రెండవ విషయం – ఒక మగ పిల్లాడు, ఆడవాళ్ళ కష్టం, అదీ తన తల్లీ, సోదరిల కష్టం తింటే, అది అతనికి అవమానమా? అదే ఒక ఆడపిల్ల, మగ వాళ్ళ కష్టం, అదీ తన తండ్రీ, సోదరుల కష్టం తింటే, అది ఆమెకి అవమానం కాదా? లైలా గారి అభిప్రాయం ప్రకారం కాదు మరి!”
రామ రామ! నెనెక్కడన్నాను అవన్నీ.
రచయిత కథలో ఒక అమ్మాయి సంపాదన మీద నలుగురు బ్రతుకుతున్నట్లు రాశారు.
అబ్బ! ఆమెకు ఎంత కష్టమైన పనో అని నేను అనుకోకూడదా?
రచయిత ఆమె గురించి పెద్దగా చెప్పరు. ఎందుకో మరి. సంపాదనపరులైన ఆడవాళ్ళను రచయితలు ఫోకస్ లోకి తేరు. ఏం చెయ్యను. నేనే ఊహించుకోవాలి.
ఆడవాళ్ళు పని చేస్తుంటే మగవాళ్ళు , తమ మీదే కథలూ కవితలూ రాసుకుని మరోమారు – అదేంటీ ఆ మాట – తేజో మూర్తులై పోతారు.
అందుకని నెను కూడా – ఆమెను ఇగ్నోర్ చెయ్యాలా? ఆమె, బాథ్యతను , బరువును, ఆమె త్యాగాన్ని. ఎందుకని?
రచయిత కు మస్తుగా చెప్పులు లేని కుర్రాడి మీద జాలి ఉంది. అందుకని నేనూ ఆయన జాలిపడిన వాళ్ళమీదే నా జాలి చూపాలా? వేరే వాళ్ళను గురించి తలచకూడదా? నిషేధమా?
కథలో ఒక్క స్త్రీ సంపాదన, నలుగురి నోట్లోకి ముద్ద వెళ్ళటం కదా రాసిన విషయం? రచయిత ఒక పురుషుడి సంపాదన మీద నలుగురు బ్రతుకుతున్నట్లు రాస్తే, నేను అయ్యో! ఒక్క మగవాడి రెక్కల కష్టం మీద అంతమందా? అతనికి ఎంత కష్టం! అంటానే. అన్నాను ఎన్నోసార్లు. కాని ‘చెప్పులు’ కథలో అది రాయందే. రాయకపోయినా అది అన్న ఐతే, తమ్ముడైతే , తాతైతే – వారు వీరైతే వీరు వారైతే – ఈ కాంబినేషన్లన్నీ నన్నెందుకు ఆలోచించమంటారు.? ముందు సంపాదించి నలుగురికి తిండి పెట్టిన అక్క మీద కథ రాయండి. గొప్పగా రాయండి. నెగెటివ్ గా రాయకండి. అప్పుడు ఆమె శ్రమ సార్థకమౌతుంది.
“వయసులో పెద్దవాళ్ళు, అంటే అన్న చెల్లెలి కష్టం తింటే, తప్పు పట్టొచ్చు. అది తమ్ముడి కష్టం తిన్నా తప్పే మరి. అన్న వుద్యోగం చేస్తూ, చెల్లెలిని పోషిస్తూ, చదివించుకోవడంలో లేని అవమానం, ఒక అక్క వుద్యోగం చేస్తూ, తమ్ముడిని పోషిస్తూ, చదివించుకోవడంలో ఎందుకు వుందీ? ఆడవాళ్ళ కష్టం తినడం అంత హీనమయిన విషయమా? అలా అని ఆడవాళ్ళే అనడం ఏం అర్థమయిన విషయం? ”
అవమానం లేదు. అవమానాలు – కాలం నీతిని బట్టి ఊహించుకునేవి. రుక్మిణి కృష్ణుడితో వెళ్ళి పోతే ఇంట్లో వాళ్ళకి కలిగే తలవంపుల వంటివి. శ్రమ అంటారా అది నిజం. ఉంది. మనిషికి మానసికంగా గాని, శారీరకంగా గాని శ్రమ లేకపోతే ఒక మనిషి ఎంతమందినైనా పోషించవచ్చు. అసలు ఆ పోషించే వాళ్ళు బంధువులే ఐ ఉండవసరం లేదు. ఎవరికైనా సాయం చెయ్య వచ్చు.
కుటుంబంలో పెద్ద సంతానమైనంత మాత్రాన, అమ్మా నాన్నా కన్న మిగతా సంతానాన్ని, వాళ్ళెందుకు సాకాలి. అమ్మా నాన్నా వాళ్ళను అడిగి, ఒప్పందం మీద కన్నారా మిగతా వారిని. మనకు ఏ నీతి ఉపయోగం గా ఉంటే అది వాడేసి, మన బాధ్యతను వేరే వాళ్ళ మీదకు నెట్టటమే కదా?
కథలో హీరో అక్క మనసు బాథ పడుతుందేమో అని సంపాదించుకోటం మానేస్తాడు. అందులో అతనికి నష్టం ఏముంది. తనే పని చెయ్యగా లేంది తన తమ్ముడు గారు పని చేస్తే అక్కకు ఎందుకు కష్టం. తల్లి -తండ్రికి కూతురు పనిచేస్తుంటే బాగానే ఉండి, కొడుకు పనిచెయ్యకుండా చదువుకుంటే వాళ్ళకు అప్పుడు అవమానం ఎందుకు కలగటం లేదు? దీనివల్ల అవమానాలు మనకు ఇస్టం వచ్చిన రీతిగా మార్చుకుంటాం అని తెలుస్తూంది కదా?
“ఆడవాళ్ళ కష్టం, మగవాళ్ళ కష్టం అనే వేరు వేరు పదాలే అర్థం లేనివి.”
అది నిజమే. ఆడ పని, మగపని అని లేదు. మీకూ, నాకూ లేదిప్పు డు. కాని కథా కాలం నాటికి రచయితకు, ఆ కథలో అబ్బాయి మీద ఎక్కువ సానుభూతి ఉంది. అంత మాత్రం చేత అది మంచి కథ కాకుండా పోదు. అది అప్పటి కథ, అప్పటి అవగాహన.
J.D. Salinger రాసిన The Catcher in the Rye చదివి నా మేనల్లుడు , ‘చెప్పులు’ హీరో వయసప్పుడే – Self pitying selfish brat. What is Holden Caulfield’s problem? Why do you like this book? అని అడిగాడు నన్ను.
The characters don’t have to be perfect to like a book 🙂
“ఒక ఆడపిల్ల కుటుంబ భాధ్యతని తీసుకుంటే (జీవితాంతం తన జీవితాన్ని సినిమాల్లో లాగా త్యాగం చేసి కాకుండా), ఆ కుటుంబంలో వున్న చిన్నవాళ్ళకి సిగ్గు పడాల్సిన విషయం కాదు అది.”
కానీ ఆడపిల్ల గర్వ పడవచ్చుగదా? ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు కదా, అవునా? సంపాదించే మగవాళ్ళూ బాగా గర్వ పడుతారేమో. ‘నేను ఆమెవ్వరో డబ్బు ఇబ్బందిలో ఉన్నపుడు డబ్బు పంపాను’ – అని రాయగలిగిన మగవాడు, ‘నాకు ఆమె ఎంతో సాయం చేసింది’ అని అంతే నిజాయితీతో చెప్పవద్దా? అలాగే ప్రతి సంపాదించే స్త్రీ కూడా నా సంపాదన మీదే ఈ ఇల్లు గడుస్తూంది అని చెప్పవచ్చు. చెపితే వేరే వాళ్ళ మనసుకు కష్టం, అవమానము కలుగకూడదు. అవునా? అవును. ఎందుకంటే అది నిజము కాబట్టి. నిజం మనం చెప్పగలగాలి కాబట్టి.
“ఇంతకన్నా చెప్పడానికి ఏమీ వుంటుందని నేననుకోను.”
‘ఈ మాట కథల’ పరిథి దాటి మాట్లడనిస్తే – చాలా ఉంటాయి చెప్పటానికి. కాని మనం రాస్తున్నది రచనల మీద పాఠకుల అభిప్రాయ వేదికలో కదా. ఇంతింత పొడుగు రాస్తే పత్రిక వారికి, పాఠకులకు ఇబ్బంది కలగవచ్చు.
ముగించే ముందు – మీరు నాతో మాట్లాడటం నాకు చాలా సంతోషం కలిగించింది ప్రసాద్!
లైలా
మీరు నవలలు రాయాలి ఇక. కథ పరిథి ఇక మీకు చాలదు జె.యు.బి.వి. 🙂
చాన్నాళ్లతరువాత ఒక మంచి కవిత చదివాను,
మీ కవితలొ చక్కటి పదచిత్రాలు ఉన్నాయి
ఉదా:టీ డికాషనై మారటం, పత్తికాయలా పగలటం, ఆకాశానికి బెలూనై వేలాడటం మార్వలెస్ ఇమేజెస్.
నవ్యంగానూ, హృద్యంగానూ ఉన్నాయి.
కాని చిన్న అబ్యంతరం
ఆ అమ్మాయికి ఇపుడు అద్దంలో తనబొమ్మ తప్ప ఏమీ పట్టదు అని చెప్పటం అంత అందంగా లేదు. అది పెంపక లోపంగా అనిపించదూ. యవ్వనంలో యువత అద్దానికి అంటుకుపోవటం సహజమైనా, సత్యమైనా మీ కవితమొత్తం ఒక మూడ్ లో ఉంటే ఆ రెండు లైన్లు మిస్ ఫిట్ అయినట్లు గా అనిపిస్తూంది. తప్పైతే క్షమించండి.
మరోచోట పిచ్చినాన్న అనిపించటం వ్యంగ్యంగా కాక ప్రేమగానే తీసుకున్నాను సుమా!
నా బ్లాగును విసిట్ చేసి, దయచేసి మీ కామెంట్శ్ వ్రాయండి.
నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు.
శ్రీనివాస్ గారూ, లైబ్నిజ్ పేరిట ఉన్న పురస్కారాల గురించి నాకు తెలియని వివరాలు తెలిపినందుకు కృతజ్ఞతలు. ఒక్క విషయం: బ్రతుకుతెరువు కోసం లైబ్నిజ్ నానా కష్టాలు పడ్డట్లు నేను వర్ణిస్తే అది నాతప్పే. జీవితాంతమూ రాజుల పంచన బ్రతికిన లైబ్నిజ్ జీవనోపాధికి రాజుల వంశ చరిత్ర రాయవలసి వచ్చినా, బ్రతుకు బాగానే గడిచింది.
బెర్ట్రాండ్ రస్సెల్ ఎత్తుకోవడమే లైబ్నిజ్ సార్వజనిక జీనియసే కాని స్పినోజా లాగా ఉదాత్తమైన జీవితం గడిపిన వాడు కాదని ఎద్దేవా చేశాడు! లైబ్నిజ్ చనిపోయినప్పుడు సంక్రమించిన ఆస్తి చూసి మేనల్లుడి భార్య తన్మయంతో మూర్ఛపోయిందట. ఆసక్తి కలవాళ్ళు “The Courtier and the Heretic: Leibnitz, Spinoza, and the Fate of God in the Modern World,” by Matthew Stewart చదవచ్చు.
రాజాశంకర్ గారూ, నిజం చెప్పాలంటే, ఈ వ్యాసం తలపెట్టేముందర నాకూ లైబ్నిజ్ గురించి తెలిసింది చాలా తక్కువ. వ్యాసం పంపే గడువు దాటిపోయిందని ఓ రోజు పనికి సెలవు పెడితే, తోటి పనివాళ్ళు ఎక్కడికన్నా వెళుతున్నావా? అన్నారు. లేదు, లైబ్నిజ్ మీద వ్యాసం పూర్తిచెయ్యాలి, గడువు దాటిపోయిందన్నాను. లైబ్నిజ్ ఎవరు? ఆయనకూ కంప్యూటర్లకూ సంబంధమేమిటి? ఇంగ్లీషులోకి అనువదిస్తే మేమూ చదువుతామే అన్నారు. సైన్సు వాళ్ళకి ముందుచూపే కాని వెనుకచూపు తక్కువ.
మీరన్న (నేనూ అలా స్ఫురించి ఉండొచ్చు) – 12వ శతాబ్దం తర్వాత, అంటే భాస్కరుడి తర్వాత, మన దేశంలతోమధ్య యుగాల్లో చెప్పుకోదగ్గ గణిత శాస్త్రవేత్తలు రాలేదు, అన్నదాన్ని సవరించాలి. అంత పెద్ద దేశంలో కనీసం ఒక మూలన, కేరళలో, గొప్పవాళ్ళు కొందరుద్భవించారు. వాళ్ళలో మాధవుడు (1340-1425) చెప్పుకోదగ్గవాడు. కలన గణితానికి న్యూటన్ కన్నా, లైబ్నిజ్ కన్నా రెండు మూడు వందల ఏళ్ళ ముందరే బీజాలు వేశాడు. అయితే అవి వెలుగులోకి రాలేదు. అమర్త్య కుమార్ దత్త రాసిన Mathematics in Ancient India వ్యాసాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి..
లక్ష్మన్న గారు తెలుగులో సైన్సుకి సంబంధించిన నవలలు, కథలు తక్కువన్నారు. నిజమే. సైన్సు, సాహిత్యం కలవకుండా మన సైంటిస్టులూ సాహితీకారులూ తగిన శ్రద్ధ తీసుకుంటారనిపిస్తుంది. “ఆమె కన్నులలో ననంతాంబరంపు నీలినీడలు కలవు,” అంటే ఆమె ముసిముసి నవ్వులు నవ్వుకొని ప్రేమిస్తుందనుకుంటాం కాని, “విపర్య సిద్ధాంతాన్నెరిగిన మిలమిల లాడే కన్నులు గలదానా, ఈ సంఖ్య ఏదో చెప్పగలవా?” అంటే భ్రుకుటి ముడి వేస్తుందని మనకి భయం. అయితే ఆర్యభట్టు బీజగణితం లోని విపర్యం గురించి అలాగే బోధిస్తాడు. “ఎక్కడ బయలుదేరాం మనం? కడ కెక్కడ చేరాం మనం?” అన్నాడు బైరాగి.
అలాగని అసలు సైన్సు ప్రస్తావనే లేదనను. వాస్తవానికి నా వ్యాసాన్ని ముందర ఇలా మొదలెట్టాను:
“తెలుగు సాహితీవేత్తల్లో విశిష్టమైన వ్యక్తిత్వంగల డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు రాసిన ఉత్తమ నవల “అతడు-ఆమె.” ఆ నవల మూడో భాగం లో శాంతం గారి అమ్మాయి సుభకి ఇంట్లో అమ్మా నాన్నలిద్దరూ రాజకీయాల్లో ఉండటాన ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ. ప్రేమలోపడే వయసు కూడాను. అవి క్విట్టిండియా ఉద్యమరోజులు. అమరవీరులనందరినీ స్మరించుకుంటూ, తనుగూడా మద్రాసులో మెరికల్లాంటి నలుగురు తెలుగు అమ్మాయిలని తీసుకొని అహింసాయుతంగా తెల్లవాణ్ణి భయపెట్టి పారద్రోలే సాహసమేదన్నా చెయ్యాలనే కోరిక సుభకి గాఢంగా కలుగుతుంది. మనుషులెవరూ లేనప్పుడు ఏదన్నా వంతెనని పేల్చేయ్యాలని నిర్ణయించుకుంటుంది.
వంతెనని పేల్చడమంటే మాటలా? దానికి కావాల్సిన ప్రేలుడు మందు సేకరించడానికి, సివిలింజనీరయిన జనార్దనాన్ని పాత వంతెనలు కూల్చి కొత్తవాటిని ఎలా కడతారు? అని నర్మగర్భంగా అడుగుతుంది. సుభని ప్రేమిస్తున్న జనార్దనం, తన పని గురించి ఆవిడ అన్ని వివరాలు అడుగుతున్నందుకు పొంగిపోయి, వివరాలు చెప్తాడు. కాని పెద్ద పెద్ద కాంగ్రెసు నాయకులు తమ కూతుర్ని వారాలు చెప్పుకొని పైకొచ్చి గవర్నమెంటుద్యోగం చేసుకునే తనకిస్తారా అని సందేహిస్తాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, తన బ్రిడ్జీలున్నాయని సరిపుచ్చుకుంటాడు. ఓ వర్తుల పరిధి లేని డెక్ వైశాల్యం ఎలా కనుక్కోవాలా అని, ఓ క్షణం పాటు తెలియక తికమకపడి, ప్రేమలో పడి మరిచిపోయాను గాని, ఏముంది, సింప్సన్స్ ఫార్ములా పెట్టి కొట్టడమే అని వెంటనే తేరుకుంటాడు.
“జామెట్రీ కాలెక్యులస్ / అక్కయ్యకి రెండో కానుపు / తమ్ముడికి మోకాలివాపు / … / గోరుచుట్టులా సలిపే లక్షల సమస్యల” నుండి దూరంగా “ఒకరి నడుం ఒకరు చుట్టి / ఉల్లాసంగా తిరుగుదాం,” స్వేచ్ఛగా విహరిద్దాం అన్న కవులున్నారు కాని, ప్రేమ ఫలించకపోతేనేమాయె, నా వంతెనలూ, నా కాలెక్యులస్ ఫార్ములాలు ఉన్నాయన్న కథానాయకులు అరుదు. ఏకంగా ఇంటెగ్రల్ కాలెక్యులస్కి ఓ పేజీ కేటాయించిన సాహితీ రచన బహుశా మన భాషలోనూ మరే భాషలోనూ కూడా లేదనుకుంటాను.”
వ్యాసం దారి తప్పుతుందేమోనని తొలగించాల్సొచ్చింది. ఈ అభిప్రాయం నా వ్యాసంలాగే చాంతాడంతయింది. ఇక ముగిస్తాను.
ఏప్రిల్ 16 వ తేదీ “ఆంధ్ర నాటక దినోత్సవం“. ఇది కేవలం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి తెచ్చుకున్న రోజులా అనిపిస్తుంది. కనీసం ఒక్క తెలుగు పత్రిక కూడా తెలుగు నాటక రంగం గురించి రాయవు. కనీసం నాటక రంగంలో జీవితాన్ని వెళ్ళబుచ్చే మహామహులైనా “”ఆంధ్ర నాటక దినోత్సవం” అనేది ఒకటుందనీ గ్రహించరు. దాని గురించి ప్రజలకి తెలిసేలా కనీసం ఒక్క నాటక ప్రదర్శన అయినా చేయరు. ఎవరిదైనా ప్రోద్బలం ఉంటే ప్రోత్సాహం అదే వస్తుంది. అది ఎక్కడనుండో రావాలనుకోవడం అవివేకం. అది నాటకరంగం నుండే రావాలి. ముందుగా దాన్ని నమ్ముకొని జీవనాన్ని వెళ్ళబుచ్చే వాళ్ళే స్పందించాలి.
తెలుగు నాటక రంగలో ఓ ప్రముఖ వ్యక్తి నా ఈ వ్యాసం చదివి, తెలుగు నాటకం వెలిగిపోతోంది, మీరు రాసినట్లుగా లేదు అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో నిజం దివిటీలా కనిపించింది.
ఏదేమైనా తెలుగు నాటకానికి మంచి రోజులు వస్తాయన్నదే నా అశ ! చక్రం క్రింది భాగం పైకి రావడానికి కాస్త సమయం పడుతుంది.
వ్యాసకర్త ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. మల్లియ రేచనవంటి ప్రాచీన నామాల్లో తల్లిపేరును చెప్పే మాతృస్వామ్య పద్ధతి ఉండేదని ఆరుద్ర రాశారు. ఈనాటికీ వినబడే చలసాని, మేడసాని, ముద్దసాని మొదలైన ఇంటిపేర్లు స్త్రీలను సూచించేవిగా అనిపిస్తాయి.
తెలుగు బ్రాహ్మణుల ఇంటిపేర్లు కొన్ని మహారాష్ట్రకు సంబంధించినవిగా అనిపిస్తాయి. ప్రసిద్ధికెక్కిన అప్పాజోస్యుల (అప్పాజోషీ) విష్ణుభొట్ల (విష్ణుభట్) అనే పేర్లూ, వల్లభజోస్యుల (వల్లభజోషీ) మొదలైనవి ఇటువంటివే. ఇది నిజమైతే ఇందులో మరాఠీ పద్ధతిలో అప్పా అనేది వ్యక్తిగతనామం అనీ, జోషీ మాత్రమే ఇంటిపేరనీ గమనించాలి. అలాగే శ్రీధర్, మనోహర్ అనే ఇంటిపేర్లున్న మహారాష్ట్ర బ్రాహ్మణులున్నారు. శ్రీధర అనేది తెలుగు బ్రాహ్మణుల్లో వినబడే ఇంటిపేరు. వీళ్ళంతా తెలుగుప్రాంతాలకు వలసవచ్చారేమో.
మహారాష్ట్రులకీ, రష్యన్లకీ పేర్ల క్రమంలో ఒకే పద్ధతిని పాటించే సంప్రదాయం ఉంది. లక్ష్మణ్ రఘునాథ్ కేళ్కర్ అనే పేరులో వ్యక్తిగత నామం లక్ష్మణ్. అతని తండ్రి వ్యక్తిగతనామం రఘునాథ్. వారి ఇంటిపేరు కేళ్కర్. అలాగే మిఖయీల్ సెర్గియేవిచ్ గోర్బచోవ్ అనే పేరు మూడు భాగాలుగా ఉంటుంది. మిఖయీల్ అనే వ్యక్తి సెర్గేయ్ అనే అతని కొడుకు. వారి ఇంటిపేరు గోర్బచోవ్.
పంజాబీల్లో కొందరు సర్దార్లు గుర్మీత్ సింగ్ అని రాసి ఊరుకుంటారు. మన ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అంతే. కొందరు మాత్రం బ్రార్, భాటియా మొదలైన ఇంటిపేర్లను కూడా ఉపయోగిస్తారు. మా కొలీగ్ ఒకాయన (సర్దార్ కాని పంజాబీ) ను ఆయన ఇంటిపేరు గ్రోవర్ అనేమాటకు అర్థం ఏమైఉంటుందని అడిగాను. ఆయనకు తెలియలేదు. గురువర్ (గురువర్యుడు) అనేమాటకు అది రూపాంతరం అయిఉంటుందని నేనన్నాను. ఆయన కాదనలేదు.
మలయాళీల్లో కొందరు మాత్రమే ఇంటిపేరు వాడతారు. ఉదాహరణకి పి.టి.ఉష పేరులో పిలాఉళ్ళకండి అనేది ఇంటిపేరు. బెంగాలీలు తమపేరుకు ఇంటిపేరు తగిలించేస్తారు.
“ఒక సంఘటనా, ఒక ఘర్షణా, ఒక మలుపూ లాంటి కధా ప్రక్త్రియలకి అలవాటు పడి పోవడం వల్ల, ఇటువంటివి కధలుగా అనిపించడం మానేశాయేమోనని అనిపిస్తోంది.” అన్నారు జె.యు.బి.వి ప్రసాదుగారు. ఇలా కాని కథాప్రక్రియ గతంలో వుండేదా? చిన్నప్పటినుంచి నేను చదివిన పిల్లల మాసపత్రికలు, బాలల రామాయణ భారత భాగవతాలు, పంచతంత్రం మొదలు ఈనాటిదాకా ఒకటీ అరా ఆంగ్ల కథలతో కలుపుకున్నా నేను చదివిన కథలు చాలా తక్కువే వుంటాయి. వీటన్నిట్లోనూ దాదాపు ఇదే ప్రక్రియ. ఈ మూసను అనుసరించకుండా ఎక్కువ కథారచనలు చేసి ప్రత్యేకత సంతరించుకొన్నవారెవరైయినా వుంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన భాషలో.
పూకొమ్మలతో, లేరెమ్మలతో, కొమ్మలలో గిజిగాడి గూళ్ళతో, నిలువనీడలేని నిర్భాగ్యుల పాపల ఊయలలూగిస్తో, మనిషి పోయినా, తరం పోయినా నిరంతరంగా నిలబడేవి చెట్లు.. కాని రాను రాను నిర్దాక్షిణ్యంగా మూగ వృక్షాలను నరికివేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేని ఝాన్సీ గారి బాధ వర్ణనాతీతం.
ఇక తను పట్టుకున్న చెట్టూ లేదని, కట్టుకున్న గూడూ లేదని తెలియని వెర్రి పిచుక రోజూ వచ్చి వెతుకుకుని నిరాశతో వెనక్కి తిరిగిపోవడం కళ్ళకి కనిపిస్తూనేవుంది.
లేదు కన్పించడంలేదు. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి కంటిలో తడితో.
కొ స్యా సు రా
సంపాదకులకు నమస్కారం.
తెలుగు నాటకం మీద నాకు తోచినవి రెండు మాటలు.
మనం ఎన్ని పోలికలు ఎవరితో తెచ్చుకున్నా ఏమి ప్రయోజనం? తెలుగులో నాటకరంగంలో క్రియేటివిటీ శూన్యం. ఎక్కడా ఒరిజినాలిటీ లేదు. అందుకని తెలుగు నాటకం చస్తోంది. దీనికి సృజనని గౌరవించే సంప్రదాయం తెలుగువాళ్ళకి చాలినంత లేకపోవటమే ముఖ్య కారణం. అందువల్లనే తెలివైన, సృజనాత్మకులైన రచయితలు నాటక రంగం వేపు ఏనాడు కూడా రాలేదు. నాటక రంగంలో వున్న అనేకమంది క్రియేటివిటీ మీడియోకర్ స్థాయిలోనే వుంటుందని తెలుగు నాటకపు ఇతివృత్తాలనీ, వాటిలోని సంభాషణలనీ చూసిన ఎవరైనా ఇట్టే గ్రహించగలరు. నిష్ఠూరంగా ఉన్నా ఇది పరమ సత్యం.
అందువల్ల క్రియేటివ్ పెర్సన్స్ కాని రచయితల, దర్శకుల చేతిలో ఒక కళారూపం తయారైతే ఎలా వుండగలదో – సరిగ్గా అలాగే వుంది మన నాటకం ఇవాళ. ఇందులో ప్రేక్షకుల తప్పు ఏమిటి? బాగులేని నాటకాన్ని వాళ్ళు కష్టపడి, ఊరికే వేసినా, ఫ్రీగా చూపించినా కూడా ఎందుకని చూడాలి? మిగతా భారతీయ భాషలలో ఇలా లేదు నాటకం పరిస్థితి. కనకే మరాఠీ లొనూ, బెంగాలీ లొనూ ఇవాళ్టికీ నాటకానికి ఆదరణ ఉండటం.
చెప్పుకోవలసిన మంచి కవి, రచయిత ఒక్కరైనా ఇవాళ తెలుగు నాటక రంగం వైపు చూశారా? లేదే! ఎందుకని, అన్నదే ముఖ్యమైన ప్రశ్న. మనకి మంచి విమర్శ లేనందువలన, మొహమాటం సాహిత్య రంగం లోనూ, ఇతర రంగాల లోనూ రాజ్యం ఏలుతుండటం వలన- ఇలాంటి దుస్థితి వచ్చిపడింది. తెలుగు సినిమా, తెలుగు నాటకం, సృజన లేని వ్యక్తులతో నిండిపోయి ఉన్నాయి. అందువల్ల అసలు సమస్యని వదిలేసి మనం కారణాలని ఇంకెక్కడ చూసినా లాభం ఏమిటి? సమాధానం ఎలా దొరుకుతుంది?
దీనికి పరిష్కారం తెలివైన వాళ్ళు, సృజనలో్ మేటిగా వున్న వాళ్ళు, ఈ రంగాలలోకి రావాలి. అందుకు తగిన వాతావరరణం ఇవాళ ఈ రంగాలలో కనిపించడం లేదు. డబ్బు కొందరి చేతులలో చిక్కుకుని వుంది గనక ఇవన్నీ ఇంటర్‌లింక్‌డ్ ఇష్ష్యూస్. అందువలన తెలుగు వారు ముందు తమ భాషలో వున్న ఇవాళ్టి మేటి కవులనీ, రచయితలనీ, విమర్శకులనీ ఆదరించాలి. వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళకి సరైన ప్రోత్సాహం వుంటే, బహుశా వాళ్ళు తమ శక్తి యుక్తులని ఈ రంగాలల వైపు మళ్ళించడానికి ఆసక్తి చూపురేమో! ఏమో??
బ్రహ్మానందంగారు తెలుగు నాటకం గూర్చి, ఈ నాటక పరిస్థితి గూర్చి చాలా విశదంగా ఈ వ్యాసంలో చర్చించారు. ఇంకొక్క మూడు విషయాలు ఈ వ్యాసంలో చేరిస్తే దీనికి సంపూర్ణత చేకూరేదనిపించి ఈ వ్యాఖ్యను వ్రాస్తున్నాను.
దీనిలో మొదటిది, నటీనటులకు ముట్టే ప్రతిఫలం. అమెరికా నాటకరంగంలో నటీ నటులకేగాక ఆహార్యాన్ని సమకూర్చేవారందరికీ ప్రతిఫలం ముడుతుంది. Professional నటులు వారానికి నలభై గంటలు రిహార్సల్సుతో బిజీగా వుంటారు. వాళ్ళు ఒకేసారి రెండు నాటకాలల్లో కూడా నటించవచ్చు. వారికి ఈ నాటకాలే జీవనభృతిని కల్పిస్తాయి. ప్రస్తుతం న్యూయార్కులో Tennessee Williams వ్రాసిన Cat on a hot tin roof నాటక ప్రదర్శన జరుగుతోంది. దీనిలో, దాదాపు ఏడేళ్ళు Bill Cosbyతో TV లో నటించిన Phylicia Rashad, సినిమా నటుడు James Earl Jones నటిస్తున్నారు. ఈ నాటకం దాదాపు మూడు నెలలపాటు ప్రదర్శిస్తారు. Londonలో ఈమధ్య Equus నాటకంలో Daniel Radcliffe (Mr. Harry Potter) నటించాడు. ప్రతిఫలం లేనిదే పేరెన్నికగన్న నటులు రంగస్థలంమీదకు ఎందుకు వస్తారు?
మరి తెలుగు నాటకరంగంమీద నటీనటుల పరిస్థితేమిటి? ఒక్క నటీమణులకే కొంతైనా డబ్బు ముడుతుంది. నటులు, దర్శకులు, రచయితలు, ఆహార్యం సమకూర్చే వారు, అందరూ కూడా ఏదో పరిషత్తులో బహుమతిని పొందితే తప్ప వారి చేతి డబ్బు పెట్టుకునే rehearsalsకే కాక వేరే వూళ్ళో ప్రదర్శనకై టిక్కెట్టు కూడా పెట్టుకుని వెళ్ళాలి. అంటే, భుక్తికై వారందరికీ పగలంతా వేరే వుద్యోగం వుండాలన్న మాట. ఆంధ్రజ్యోతిలో రాళ్ళపల్లిగారు సినిమాల్లో వేషాలకై వెడితే వారి మేనేజరు వుద్యోగంలోనుంచీ తీసేస్తామని బెదిరించారని రాయగా చదివిన గుర్తు. తెలుగు నాటక రంగానికి చేయూత నందించాలనుకునే వారు ముందు నాటకరంగంతో ముడిపడ్డవాళ్ళకి నాటకరంగమే జీవనభృతిని ఎలా సమకూర్చగలదో ఆలోచించాలి.
రెండవ అంశం: ఆంధ్రాలో గానీ అమెరికాలో గానీ, తెలుగు నాటకానికి ప్రతిబంధకాలు మైకులు. పాతకాలంలో పద్యనాటకాలను ఆహార్యాన్ని చూడడానికీ, పేరెన్నికగన్న నటుడు పద్యం పాడడంలో చూపించే నేర్పరితాన్ని చెవులారా విని ఆనందించడానికీ ప్రజలు వెళ్ళేవాళ్ళు తప్ప, పాత్రల మధ్య movements ఎలా వున్నయ్యోననీ, నటులు మొహంలో ఎలాంటి భావాలు చూపిస్తున్నారనీ పరిశీలించడానికి కాదు. అందువల్ల కలిగే సౌకర్యం ఏవిటంటే, ఆ నటులు మైకుకు ఎదురుగా నుంచుని పద్యం పాడడం. అక్కడక్కడా గాలిలో మైకులను వేలాడదీసేవాళ్ళు. (ఒకసారి గుంటూర్లో మా హైస్కూలు మాస్టారు భీముడి వేషం వేసి విసురుగా గదని భుజానికి ఎత్తుకోబోతుంటే ఆ గద పైన వైరుకు చిక్కుకుంది!) ఈ కాలపు సాంఘిక నాటకాలకు పూర్తిగా మైకు ముందు నిలబడి డైలాగులు చెప్పడం బావుండదు. పోనీ clip-on microphones try చేద్దామా అంటే నాలుగు మించి స్టేజీ మీద ఒకేసారి వాడారా, interference problems వచ్చి గోల గోల అవుతుంది. నేను Washington, DC ప్రాంతంలో చూసిన ఏ నాటకంలోనూ మైకులు వాడలేదు. చూసిన auditoriums లో కెపాసిటీ, 50్ నించీ 2000్ (కెన్నెడీ సెంటర్) దాకా. 300్ కెపాసిటీ వున్న చోట, live musicతో, 14్ ఏళ్ళ పాప గొంతెత్తి పాడిన Seussical Musical లో కూడా! వేలమంది మధ్యలో నాటకం వెయ్యడం వేసేవాడికి అద్భుతంగా వుంటుంది సరైన auditorium వున్నప్పుడు. లేకపోతే, మైకుల, మైకులను కంట్రోల్ చేసేవాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పదు.
మూడవ, ముఖ్యమైన అంశం – ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులగూర్చి పరిషత్తులు పట్టించుకుంటున్నాయా? ఈ నాటి నాటకాలను చూసేది ఎవరు? ఆనాటి రాజుల దగ్గరినించీ ఈనాటి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా కళలను పోషించిన వారు ఎప్పుడూ కూడా డబ్బున్న వారే! వాళ్ళు ఈ పరిషత్తు నాటకాలు ఎన్ని చూస్తున్నారు? ఎంతమంది ఇంజనీరులు, డాక్టర్లు, లాయర్లు ఈ నాటకాలకు వస్తున్నారు? వారిమాట అటుంచి, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు సతీ సమేతంగా వీటికి వస్తున్నారు? వారందరి మాట అటుంచితే, ఈ నాటకరంగానికే జీవితాన్ని అంకితం చేసినవాళ్ళే ఎంతమంది సతీ సమేతంగా ఈ నాటకాలను చూస్తారు? జనాదరణకు కరువైన కళ పరిస్థితి ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాలా? అమెరికాలో బ్రాడ్వే నాటకాలకు టిక్కెట్లు $200్ దాకా కూడా వుంటాయి. అయినా కూడా Phantom of the Opera is the 2nd longest running opera in New York (just behind the all-time record holder Cats). అదీ, ప్రతీ రోజూ కనీసం ఒక షో వేస్తూ! ప్రస్తుతం తెలుగులో పరిషత్తు నాటకాలంటే కరుణ రసం అధికంగా వుండేవని బ్రహ్మానందం గారనడంలో ఏమాత్రం్ అబధ్ధం లేదు. అంటే, ఎవరైనా ఒక సాయంత్రం ఏడవాలనిపిస్తే పరిషత్తు నాటకాలకు వెళ్ళచ్చునన్నమాట.
అమెరికాలో, మరాఠీ నాటకాల విడియో కాసెట్లని అద్దెకు తెచ్చుకునల్లా చూస్తారు మహారాష్ట్ర నుండీ వచ్చిన వాళ్ళు. తెలుగు నాటకాన్ని ఉచితంగా స్టేజీ మీద చూపించినా చూసేవాళ్ళకు కొదువ. తెలుగు నాటక రంగాన్ని నేడు నడిపిస్తున్నవాళ్ళు అమెరికాను చూసి నేర్చుకోకపోతే పాయె. కనీసం మన ఇరుగు పొరుగు రాష్ట్ర సోదరులను చూసైనా నేర్చుకోవచ్చుగా?
KS హరీష్ కుమార్ గారి అభిప్రాయం చదివితే చంద్రుడికో నూలు పోగని శ్రీశ్రీ సమర్పించిన దారంలాంటి తేలికైన దీర్ఘమైన కవిత “శరచ్చంద్రిక” గుర్తొచ్చింది.
“అందుచేత ఓ చందమామా!
అందమైన ఓ పూర్ణసోమా!
సముద్రం మీదా అరణ్యం మీదా
సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా!
…
చెప్పొచ్చిందేమిటంటే
చెప్పడనికేమీ లేదని!
అంతమందికీ అన్నీ తెలుసు
అదే మన అజ్ఞానం.
ఎవడో చెబితే వినే రోజులు
ఏనాడో వెళ్ళిపోయాయి
ఇంకా ఏదో చెప్పాలని
ఎందుకీ ఉబలాటం?
అసలు నిజం ఏమిటంటే
ఎవడికీ ఎమీ తెలియదు
ఇలా ఎందుకొచ్చామో
ఇక్కడెంత సేపుంటామో
నిరాశగా కాస్సేపు మాట్లాడి, మరో వైపు నుంచి చూస్తే వెలుగు కనబడుతుందంటూ:
“పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలూ
మహాకాశ వాతావరణంలోని
మర్మాలూ తెలుసుకున్నాక
సరాసరి నీదగ్గరకే
ఖరారుగా వస్తాంలే
అప్పుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావుకదూ నువ్వు?”
అని జోస్యం చెప్పి, మానవుడి progress report చదివాడు.
సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమ్మీద వచ్చే సముద్రాల ఆటుపోట్ల గురించి లోతుగా తెలియాలంటే కష్టమేకాని స్థూలంగా అర్థం చేసుకోవడం సులభమే. చంద్రునికి అభిముఖంగా ఉన్న భూమి ఉపరితలంపై ఒక బిందువు A, దానికి ఎదురుగా భూమ్మీద అవతలివైపు B, భూకేంద్రం C అనుకోండి. చంద్రుడు భూకేంద్రం C కన్నా A ని ఎక్కువ గానూ B ని తక్కువగానూ ఆకర్షిస్తాడు — దూరాల్లో ఉన్న తేడా బట్టి. అందుమూలంగా A, B రెండూ కూడా కేంద్రానికి దూరంగా వెళ్తాయి. కాని అవి భూమిలో భాగం కావడాన, భూమి సాగినట్లవుతుంది. దాని ప్రభావమే సముద్రాల్లో ఆటుపోట్లు.
భూగోళం చాలా పెద్దది కావడాన చంద్రుడికీ A, B, C లకీ మధ్య ఉన్న దూరాల్లో చెప్పుకోదగ్గ తేడా ఉంది – ఆ తేడానే ఆటుపోట్లకి కి కారణం. భూమితో పోలిస్తే మాఊరి చెరువు చాలా చిన్నది – దానిపై అన్ని బిందువులూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చెరువుపై చంద్రుడి ప్రభావం ఉండదు. అలాగే మన శరీరంలో ఎక్కువ వున్నది నీళ్ళే అయినా శరీరంలోని అన్నిభాగాలూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చంద్రుడి ప్రభావం మనపై ఉండదు. (ముఖం పాదాలకన్నా దగ్గర ఉంటుంది కాని, మనిషి పొడవు భూమితో చంద్రునితో పోలిస్తే అతి తక్కువగా ఉంటుంది కనుక ఆ తేడాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.)
సమీకరణాలంటే భయం లేని వాళ్ళు ఈ “The Physics Teacher” పేపరు – “Myths about Gravity and Tides” – చదివి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే వెన్నెల ప్రభావాన్ని సమీకరణాలతో అంచనా వెయ్యలేం. అందుకు కవిత్వమే సాక్ష్యం:
“వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ
మనోహరమైన సంగీతం వినిపిస్తూ
ప్రయాణించు శశీ ప్రయాణించు.
…
ఇదిగో జాబిల్లీ నువ్వు
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలిదాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే.”
చందమామ గురించి ఆసక్తి ఉన్నవారు తెలుగు విఇకిపీడియా లూ ఈ క్రింద ఉన్న లింకు ద్వారా ఒక వ్యాసము చూడవచ్చును, మరియు వారికి తెలిసిన వెశేషాలు ఆ వ్యాసంలొ చేర్చవచ్చును.
అలాగే, చందమామలోని బేతాళ కథలగురించి కూడా ఒక ప్రత్యేక వ్యాసము తెలుగు వికీపీడియాలో ఉన్నది, ఈ లింకు ద్వారా అక్కడకు వెళ్ళవచ్చు.
బేతాళ కథలు ఒరిజినల్గా ఎవరు వ్రాసారో, ఎక్కడనుండి ఈ కథలు ప్రారంభమైనాయో, అన్ని కథలుగా ఉన్నయో, చివరి కథ య్క్కడన్న దొరుకుతుందా. ఇటువంటివంటి ఆసక్తికర విషయాలు తెలిసినవారు ఈ వేదికమీద కాని, తెలుగు వికీపీడియాలో వ్రాసి గానె తెలియ చేయగలరు.
ఈ మాట మీ మాట కాదు, మా మాట .మనందరిమాట ప్రజల మాట కాలం మాట కలకాలం కలాలమాట.
కాలంమీద మీసంతకానికి
అభినందనలతొ……….
మీ… డా.ఈదూరు. సుధాకర్
అద్యక్షులు
నెల్లూరు జిల్లా రచయితల సంగం
నెల్లూరు
ప్రచురించిన రచనను ఇంకొక చోట ప్రచురించబడ్డది అని పూర్తిగా తొలగించడం, జరిగిన పొరపాటుకు మించిన తప్పిదం లాగా అనిపిస్తుంది. పెట్టుకున్న నియమాలను ఉల్లంఘించినా అది దురభిప్రాయంతోనో, దురుద్దేశంతోనో చేసినట్టుగా కనిపించదు. అయినప్పటికినీ, మన్నించమని అడగడమో, ఇక ముందు జాగ్రత్తగా ఉంటామని విన్నవించడమో సరిపోయేదేమో.
ఏ రచయితైనా తన రచనను ప్రచురించకపోతే కొంత నిరుత్సాహపడవచ్చేమో కానీ, ప్రచురించిన తర్వాత తొలగించడం నొప్పి కలిగించేదే. అదీ రచనయొక్క గుణాల గురించిగా కాక, తెలిసో తెలియకో ఇంకో చోట ప్రచురింపబడ్డందుకే అని గుర్తిస్తే సంపాదకుల నిర్ణయం అర్థంచేసుకునేదే అయినా, సహృదయంగా మాత్రం అనిపించడంలేదు. పాఠకులకైతే ఇది వడ్డించిన విస్తరి తీసేసినట్టుగా ఉంది. ఏన్నో ప్రచురించి ఉండొచ్చు, ఈ రచయితవే కూడా, కాని ఇలా వేసి తీసిపారేసారు అన్న మాటే ‘ఈమాటకు’ అన్నింటికన్నా ఎక్కువగా నిలిచిపోతుందనే అనుమానం కలుగుతుంది. సంపాదకులు కొంత సహృదయంతో పునరాలోచించి తీసేసిన రచనను, వారికిష్టమైన, తోచిన గమనికతోనైనా, పునర్ముద్రించాలనీ, ఈ తీసివేతకు తొందరగా తెరదించాలని కోరుకుంటున్నాను, కాదు అర్థిస్తున్నాను.
విధేయుడు
Srinivas
ఏమాట కామాట చెప్పు కోవాలి. అన్నికధలూ కూలంకషంగా చదివి అభిప్రాయాలు రాస్తారు. అది నాకు నచ్చినవిషయం.
ఇహ మిగతా విషయం. వేళాకోళము, వెక్కిరింత వగైరా. ముందే ప్రస్తావించేను. రిచ్ డాడ్ లు తప్పసాధారణ సగటు నాన్న లు, నాన్నగార్లు కూతురొచ్చి “నాన్నా వైటు కోటు” కొడుకొచ్చి “నాన్నా, ఎర్ర బూట్లు” “రేపుదయం వేసుకురమ్మన్నారు”, “రాకపోతేక్లాసులోకి రానివ్వరుట”, “బెంచీ ఎక్కంచీస్తారుట” అంటూంటే ముందు విసుగు పిల్లల మీద తర్వాత తెమ్మన్న ఆ టీచరు మీద ఆనక ఆస్కూలు మీద ఏదో విధంగా మనసులో అనుకోవడమో, గొణుగుకోవడమో, మరీ ఒళ్ళు మండితే బయటకి అనుకోవడం సహజం. ఆతర్వత కాస్తా నిమ్మళించినాక నాలిక కరుచుకోవడం (అది సంస్కారం) సహజం అన్నాను (చూడుడు: పేరా ఒకటి, పంక్తి ఆరు )!
ఇక పోతే “వలంపాటి పిన్నిగారు”, వగైరా డొక్కా వారి హాస్య పాయసం లో సన్నగా తరిగి వేయించిన కొబ్బరి ముక్కలుగా వేస్తే బాగుంటుందన్న సదుద్దేశం. కాని పాయసం మరో మారు “మారు” వేయించుకునేలోపలే అటకెక్కించేసారు సంపాదకుల వారు.
నాగ మురళి గారికి కృతజ్ఞతలు. మీరు ప్రచురించిన ఈ బ్లాగు చాలా ఉపయుక్తంగా ఉంది. ఎన్నో ప్రాధమిక సందేహాలకు చాలా చక్కటి వివరణ ఇచ్చారు.
ఇక చాలా మంది హేతువాదులు అంటే నాస్తికులు అని అనుకుంటారు, అది ఎంతమాత్రము సమ్మతం కాదు. హేతువు అంటే కారణం, కారణం లేకుండా దేనినీ నంమ్మని వారిని హేతువాదులు అంటారు.
నావికులు సముద్రంలో ప్రయాణించేటప్పుడు గాలివాటం అనుకూలంగా ఉందా లేదా అని చూసుకుని ప్రయాణిస్తారు, అలాగే జ్యోతిష్యం కూడా, మనకు రాబోవు కాలం అనుకూలంగా ఉందా లేదా, దాన్ని బట్టి మన కార్యాచరణను నిర్దేశించుకునే వీలు కల్పిస్తుంది.
జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తు ఖచ్చితంగా తెలుసుకునే వీలుందా అనే ప్రశ్నకు సమాధానం చేప్పాలంటే, ముందుగా అండం తల్లి కడుపులో ఎప్పుడు ఫలదీకరించిందో తెలుకుంటే, ఆ సమయాన్ని బట్టి గణించిన జ్యోతిష్య ఫలితాలు 100% ఖచ్చితంగా ఉంటాయి, కాని అది అసాధ్యం కాబట్టి తల్లి బిడ్డను ప్రసవించిన సమయాన్ని బట్టి గణిస్తాము. అది కూడా చాలా మంది ఖచ్చితమైన సమయాన్ని తెలుపరు దాని వల్ల గణించడంలో తేడాలు ఉంటాయి.
మంచి వ్యాసము. సాయి గారికి అభినందనలు. మేము చిన్నప్పుడు
బడిలో చదువుకొంటున్న రోజుల్లో ప్రతి సంవత్సరము ఒక నాటకము,
ఒకటో రెండో నాటికలు వేసేవాళ్లము. మా బడి పక్క సౌందర్యమహలు
అనే నాటకప్రదర్శనశాల ఉండేది అప్పుడు. శ్రీ కృష్ణ లీలలు, కరుణామయి
అనే రెండు నాటకాలు జ్ఞాపకానికి వస్తుంది. తిరుపతిలో ఆ కాలంలో
నాటకాల పోటీలు ఉండేవి. మంచి నాటకాలు, నాటికలు
ప్రదర్శించే వాళ్లు. సురభి నాట్యమండలివారిని గురించి ఈ పుస్తకములో చదువవీలగును. తెలుగు సాంఘిక నాటకాల పరిణామము, వికాసము అనే పుస్తకం కూడా చదవతగినది.
పై పుస్తకాలను డవున్లోడ్ చేసికోవచ్చు.
ఆ కాలపు నాటకాలు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని గురించి నేను కన్నడములో ఒక మంచి సినిమా చూసియున్నాను. దాని పేరు రంగనాయకి. కన్నడములో గిరీశ్ కర్నాడ్ వంటివారు నాటకాల ద్వారా చిత్రరంగం ప్రవేశించారు. గుబ్బి వీరన్న కూడ నాటకాల పురోభివృద్ధిలో చాల ముఖ్య పాత్ర వహించారు. ఇక విజయ్ తెందుల్కర్ వంటి వారిని గురించి చెప్పనక్కరలేదు. చలం రాసిన కొన్ని కథలలో కూడ నాటక రంగం ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకొన్నది.
రోహిణీప్రసాద్ గారూ,
రాగాలని పరిచయం చేస్తూ మీరు, లక్ష్మన్న గారూ వ్రాసిన వ్యాసాలు బాగున్నాయి. ఇవి సంగీతం నేర్చుకుంటున్నవాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. కాకపోతే వచ్చిన చిక్కల్లా నాలాటి వారితొనే. సంగీతాన్ని విని ఆనందించడం తప్ప దాని గురించి ఓనమాలు తెలియని నాలాంటి వాళ్ళకి కలిగే చొప్పదంటు అనుమానాలు ఎన్నెన్నో. ఉదాహరణకు, కేవలం స్వరాలవలనే పాట Tune తయారవుతుందా? (కాదని నేననుకుంటున్నాను కాని స్వరాలు కాక ఇంకా ఏమి కావాలన్నది నాకు అంతు బట్టని విషయం, బహుశా ఊనికా?). ఆరోహణ, అవరోహణ అనేవి దేనికోసం ఉపయోగిస్తారు? అంటే, ఒక రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరరచన చేసేటప్పుడు ఇవి స్వరాల క్రమాన్ని నిర్దేశిస్తాయా? ఫలానా వారి పాటలో ఎన్నో సంగతులున్నాయి అంటారు, ఈ సంగతులు ఏమిటి? ఈ సంగతులు లేకపోయినా, అపస్వరం రాకుండా పాడితే సరిగ్గా పాడినట్లే (గాత్ర సంగీత విషయంలో) లెక్కా? గమకాలు మళ్ళీ వేరుగా ఉన్నాయా? ఇలా వ్రాసుకుంటూ పోతే విసిగించే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అంచేత, మీరు సంగీతంలో ఉన్న ప్రాథమికాంశాలన్నిటినీ వివరిస్తూ నాలాంటి వారికోసం ఒక వ్యాసం వ్రాస్తే, మీ తక్కిన వ్యాసాలని కూడా చదివి ఆనందించే అవకాశాన్ని మాకు కలగజేసిన వారవుతారు.
ధన్యవాదాలతో,
రాజాశంకర్ కాశీనాథుని
తెలుగు అభిమానిగారు కొత్త సినిమాపాటల రాగాలని గుర్తుచేసి నా లోపాన్ని చక్కగా సవరించారు. ఈమధ్య ‘హృదయం ఎక్కడున్నది’ అనేపాట విన్నప్పుడు అందులో ఖరహరప్రియ నాకు వినబడింది. అలాగే ‘నవమన్మథుడా’ అనే పాట శుద్ధధన్యాసి రాగం. కొత్తపాటలు విని వాటి రాగాలను ఉదహరించేంత ఓపికా, వ్యవధీ, ఆసక్తీ లేకపోవడమే నా లోపం.
శాస్త్రీయసంగీతం వెంట విధిగా ఉండే కొంత ‘చాదస్తం’ ప్రతివారికీ రుచించకపోతే వారిని తప్పుపట్టలేం. మెలొడీని విని ఆనందించేందుకు సరిపోయేంత మటుకు కొంత గ్రామరును పరిచయం చేస్తే తెలుగువారిలో సంగీతం మరింత బలపడుతుందని ఆశ. ఈ ప్రయత్నం చాలా గొప్పదని కాని, తద్వారా కీర్తిప్రతిష్ఠలు వస్తాయనిగాని కలలో కూడా అనుకోను.
వ్యాసం పూర్తవలేదు కాని నాకు మొదటినుంచీ కొన్ని సందేహాలున్నాయి. గ్రహాలను భూమినుంచి వీక్షించినప్పుడు వాటి వెనకాల ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రరాశులు కనబడతాయి. చూస్తున్న కోణాన్నిబట్టి ఆ నేపథ్యం మారుతుంది. గ్రహాల ప్రభావం జరగబోయే సంఘటనలమీద ఉంటుందని అనుకున్నా కిటికీ చువ్వలకూ, కిటికీనుంచి కనబడే దూరపు కొండలకూ ముడిపెట్టినట్టు ఈ రాశుల ప్రమేయం ఏమిటో అర్థం కాదు.
“అసలు విషయం ఏమిటంటే, ప్రవాసంలోని జీవితం తెలియాలంటే, ప్రవాసంలో బతకటంలో తప్ప వేరే దారి లేదు. నివాస ఆంధ్రుడు ఎన్ని సార్లు అమెరికాకి వచ్చి వెళ్ళినా, అమెరికాలో తెలుగు వారి జీవితాన్ని అర్ధం చేసుకోటం, వీలు పడదు.”
మీరు చెప్పిన పై విషయం నిజమే ననిపిస్తున్నది.
పై విషయం నిజమైతే, మీరు స్త్రీ ఐతే తప్ప స్త్రీ జీవితం మీకు అర్థం కాదు . మీరు పాఠకురాలికిచ్చిన ఈ కింది సమాధానం చూస్తే మీకు స్త్రీలలో ప్రతిభావంతులున్నారన్న సంగతి అసలు తెలియదేమో అనిపిస్తున్నది.
లక్ష్మన్నా! మీరు, మీ వ్యాసంలో మొదటి పేరాలొ ఉదహరించిన తెలుగు తేజోమూర్తులను, మీరు క్రింద చెప్పిన విధంగా వృద్ధిలోకి తెచ్చినవారిగా స్త్రీలను గుర్తిస్తున్నారు కాని స్త్రీలు స్వయంగా తేజోమూర్తులని, మీకు అనిపిస్తున్నట్లుగా లేదు.
“పాఠకురాలికి: మీరు చెప్పే దాకా, ప్రతిభావంతులైన తెలుగు స్త్రీలను మర్చిపోయాన్నన్న విషయమే తెలియలా! అసలు నేను ఆ కోణం నుంచి తేడాగా ఎప్పుడూ చూడలా. ఒక్క మనవి. ఎంతో మంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, మరెంతో మంది స్త్రీమూర్తుల ప్రేమా, దయ, వాత్సల్యం లేకుండానే తెలుగు తేజోమూర్తులు వృద్ధి లోకి వచ్చారని నేననుకోను. దయచేసి ఇటువంటి తేడాలు మరి తీసుకు రావద్దు.”
పాఠకురాలిని ఇంకెప్పుడూ ఇలాటి తేడాలు తీసుకురావద్దంటున్నారు. ఎంచేత? పాఠకురాలు మీరు మర్చిపోయిన ఒక ముఖ్య విషయం గుర్తు చేశారు. మంచిదేగా! కాదా?
తెలుగుని మన తెలుగు వారికి తెలుగు కాని వారికి నేరుపుటకు ఇంటరునెటుని మాధ్యమంగా ఎందుకు ఉపయొగించరాదు? అన్ని ముఖ్య బాషలలొ interactive WEBSITE should be there to learn Telugu. I have seen lot of discussion on extinction of Telugu but I don’t believe it. Because of development of INTERNET medium, we have a good opportunity to teach the language all over the world. Language is also getting richer by adding lot of new words by bloggers all around the world.
I am able to see lot of rich content, thoughts, affection for the language in blogs. But i have not come accross when web site solely dedicated for learning Telugu. All should start to contribute to develop such a rich and multi media site. This will help every Telugu who don’t know the language to learn language. The site should be developed in such a way that any non-telugu who learns the TELUGU should immediately realise the SWEETNESS of Telugu.
Sorry, For typing in English as this is 1st time for me to use RTS.
కధ బావుంది కాని ఆంగ్లము ఎక్కువ అయింది. ముఖ్యంగా పాత్రలు వాటి గమనము బాగుంది. ఎంత బావా మరదళ్ళు అయినా వాళ్ళ అభిప్రాయాల్లో తేడాల వలన విడి పొవటమే మంచి ముగింపు.
అనుకోకుండా మీ సైట్ లోకి రావటము, కొన్ని రచనలని చదవటము జరిగింది.
congratulations చెప్తాను ముందు. ఎందుకంటే పత్రిక అన్నది – అదీ ఈ formలో కానివ్వండి – నడపటం కొంచెం కష్టమైన విషయమే గనక. అందునా మీరు “ఉత్తమ సాహిత్యం” తెలుగులొ ప్రచురిస్తామని మీ ధ్యేయం గ చెప్పేసరికి కొంచెం ఆసక్తి గ మీ పత్రిక ని browse చేసాను.
నన్ను మరీ నిరాశ పరిచింది మీరు అచ్చు వేసిన కవిత్వం. బహుశా మీరు మంచి సాహిత్యాన్ని తెలిసిన వారే అయి వుంతారు. మంచి కవిత్వాన్ని కూడ. మీరు ప్రకటించిన ఉత్తమమైన అనే standard లోకి రాకపొతే పొయే, గాని మరీ నేలబారు గ వుంటే ఎలాగండీ?? పద్మలత అయల సొమయాజుల గారి ది కవిత్వమా? భాష లేదు. భావం లేదు. మిగతా వాళ్ళవి కూడ బొత్తిగా బాగులేవు. జంధ్యాల సినిమా లో “తవిక” అని వెక్కిరించిన స్థాయి లొ వున్నాయి. ఉదయకళ అన్న ఆవిడవి కాస్త మెరుగు.
మీరు ఒక standard ని ప్రకటించాక అంతకు తగ్గ కుండా వుండక పోయినా అసలు కవిత్వం రాయటం రానివాళ్ళవో… రాయలేని వాళ్ళవో ప్రచురించటం poetry కి ద్రోహం చేయటం కాదా??
am sorry to say this.. కవిత్వం రాయటం చాత కాని వాళ్ళు .. తమ హద్దులు తెలుసుకుని ఆగిపోవటం మంచిది. తెలుగు కవుల మీద గౌరవం వుంటేనూను, తెలుగు పాఠకుల మీద ప్రేమ కాకపోయిన కనీసం జాలి లాంటిది ఉంటేనూను.
అమెరికా వెళ్ళగానే పెళ్ళికాని కుర్రాళ్ళ విలువ “మార్కెట్లో” పెరిగిపోతుంది. అమెరికావంటి ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ వారు సీదాసాదా కోరికలతో మామూలు జీవితాలనే గడుపుతూ ఉంటారు. ఇండియాలో మాత్రం వారి తాహతుకి సరితూగగల సంబంధాలు చూడాలనే ప్రయత్నాలు జరుగుతాయి. అటువంటి హైలీ క్వాలిఫైడ్ పెళ్ళికూతుళ్ళని చూసినప్పుడు కుర్రాళ్ళకి కలిగే అయోమయమే ఈ కథకి ప్రధానవస్తువుగా అనిపిస్తుంది. కథలో వాస్తవికత ఏమీ దెబ్బతినలేదు.
కన్యాశుల్కము కొన్ని నిర్ణీత దేశకాలపరిమితుల్లో ప్రబలంగా ఉన్న సంఘదురాచారాలకి స్పందిస్తూ అప్పారావుగారు వ్రాసిన నాటకం. వితంతు వివాహాలూ, బాల్యవివాహాలూ, కన్యాశుల్కాలూ అనేవి 19వ శతాబ్దమధ్యంలో విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో _కొన్ని_ బ్రాహ్మణ వర్గాలకి మాత్రమే పరిమితాలైన దురాచారాలు. సమకాలంలో ఈ దురాచారాల వ్యాప్తి, విస్తృతి, సందర్భత ఎంతమాత్రం? గురజాడ కాలంలో కూడా ఈ సమస్యలు ఆయా స్థల,కుల, వర్గ పరిమితులు దాటితే, కన్యాశుల్కానికున్న సమాజప్రయోజనం అంతంతమాత్రం. ఇదేరకంగా బెంగాలులో రాజారామ్ మోహన్ రాయ్ వంటి వాళ్ళు బాల్యవివాహాలకీ, సతీ దురాచారాలకీ వ్యతిరేకంగా ఘోషించారు. కానీ అవెంతవరకూ సమకాలికసమస్యలు? అయినాకూడా, కన్యాశుల్కాన్ని నిత్యనూతనంగా పున:పఠించుకోడమూ, మంగళస్తోత్రాలు పాడుకోడమూ, ఏటేటా పందిళ్ళు వేసుకుని వడపప్పు పానకాలు సేవించడాలూ, కొందరు సాహిత్యపిపాసువులకి ఈనాటికీ పవిత్రవంశాచారం.
షేక్స్పియర్ నాటకాలకులాగున, కాళిడాసు నాటకాలలా, లేదా ప్రబంధకావ్యాలలా – కన్యాశుల్కం కూడా ఈనాడుఈఒకానొక సాహిత్యరత్నం. కన్యాశుల్కానికి సాహిత్యవిలువే తప్ప ఏవిధమైన సామాజిక విలువా లేదని ఈ ప్రస్తుత లేఖరి గాఢవిశ్వాసం.
విపరీతంగా పెచ్చరిల్లిన పెట్టుబడిదారి తనము, హేయరాజకీయాలు, ప్రపంచీకరణ పేరిట అరుగుతున్న అల్పవర్గాల దోపిడీ, విద్యోపాధులపేరిట జరుగుతున్న బాలల చిత్రవధ, బతుకంతా రెక్కలువిరుచుకు పెంచిన సంతానాలు ఆకస్మికంగా విదేశాలకి వలసపోయి మరి తిరిగిరాకపోడం, భూమి విడిచి సాముచేసే ఆర్థికవిధానాలు, కూలిపోయిన ప్రభుత్వాంగాలు, అవయవవ్యాపారాలు చేసే కార్పరేట్ హాస్పిటళ్ళూ, ఏనాటికీ మారని చిరుద్యోగుల జీవితాలూ, కులప్రాతిపదికాలైన రాజకీయాలూ, …ఇవీ ఈనాటి సమాజం పడే ఈతి బాధలు. వీటికీ కన్యాశుల్కానికీ ఉన్న సాహిత్య సంబంధమల్లా సమకాలసమస్యలని తవ్వి తలకెత్తడం మాత్రమేను. గ్రహించిన కన్యాశుల్కప్రియులందరూ 1950 దశకానికిటుపక్కికి ఉత్తిష్ఠులై సమకాల సంఘదురాచారాలకి కూడా తమ రెటినాల్లో కొంత చోటిస్తే బాగుంటుంది. అటువంటి సాహిత్యాన్ని పఠనీయంగా విమర్శింఛి చూపిస్తే మరింత ప్రయోజనకరం.
వ్యాసం చాలా పరిశోధనాత్మకంగానూ, చాలా విషయాలను తెలియబరిచేదిగాను వుంది.
కాని, అందరూ భయపడుతున్నట్లుగా సినిమా కారణంగా నాటకం చనిపోయే స్థితిలో వుందని నేననుకోను. అయినా సినిమా నాటకానికి ఒక రూపం. సినిమా నాటకంనుండే పుట్టింది. రంగస్థలం నుండే ఓనమాలు నేర్చుకుంది. పరుగు నేర్చుకున్నామని, నడక మానేస్తామా?
సమాచార విప్లవంతో పోటీ పడలేక నాటకరంగం అన్ని వర్గాలవారినీ అలరించలేకపోతోందని అంతగా భయపడాల్సిన అవసరం లేదేమో? నాకు తెలిసీ, నాటకం ఇంకా నమ్మశక్యం గాని పనులను చేస్తోంది. పల్లెల్లో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ప్రజాసంఘాలు నాటకాలనే నమ్ముకున్నాయి గాని. పండుగలకు, ఇంకా ఏమైనా ఇతర సమయాలలో గుడిలో నాటకాలు వేస్తాం. బడిలో పిల్లల సాస్కృతిక కార్యక్రమాలు అంటే నాటకాలే ముందు వరసలో వుంటాయి. పట్టణాల విషయానికొస్తే నేను తప్పు కావచ్చు. ఆక్కడి పరిస్థితులు వేరు. అక్కడి సంస్కృతులేమారిపోయాయి. కారణం, తీరికలేని జీవితాలు కావచ్చు, లేదా డబ్బు మహిమ కావచ్చు. పట్టణాలు మాత్రం మన సంస్కృతిని ప్రతిబింబించవు.
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీరు కేవలం ఆసక్తితో కంప్యూటర్ భాషలు నేర్చుకున్నారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయమే! ముందు ముందు అవసరం కలిగినప్పుడు ఇద్దామనే ఉద్దేశంతో నేను చదవదగ్గ పుస్తకాల పేర్లివ్వలేదు. నాకు అమితంగా నచ్చిన పుస్తకాలు రెండు:
1. కంప్యూటింగ్ పూర్వాపరాలకు సంబంధించి Martin Davis రాసిన “The Universal Computer: The Road from Leibniz to Turing.”. గత యాభై అరవై ఏళ్ళలో కంప్యూటర్లు అనూహ్య రీతిలో అభివృద్ధి చెందాయి. అందుకు అభినందించాల్సింది నిస్సందేహంగా కంప్యూటర్ ఇంజనీర్లనే. కాని అప్పటి హాలునిండే కంప్యూటర్ల నుండి ఇవాళ్టి సెల్ ఫోనూ, లాప్ టాపూ, సూపర్ కంప్యుటర్ దాకా, అన్నిటికీ ఆధారం ఒకేరకమైన మూలసూత్రాలే! వాటిని కనుక్కోడానికి మూడొందల సంవత్సరాలు పట్టింది. ఆ సూత్రాలని కనుగొన్న వాళ్ళు ముఖ్యంగా ఇంజనీర్లు కాదు, తార్కికులు! వాళ్ళ జీవిత కథల్నీ, ఆలోచనలనీ కలిపి రాసిన పుస్తకం ఇది. దీనిలో వట్టి కథలయినా ఉత్కంఠతో చదివిస్తాయి. వాళ్ళ ఆలోచనలని అర్థం చేసుకుంటే కంప్యుటర్ లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది; అమూర్తపుటాలోచన (abstract thought) మీద గౌరవం పెరుగుతుంది.
2. సాధ్యాసాధ్యాల గురించి David Harel రాసిన “Computers Ltd. What They Really Can’t Do,” చదవదగ్గది. 1984లో TIME పత్రికలో వచ్చిన ఒక కవర్ స్టోరీ లో్ “కంప్యూటర్ సాఫ్ట్ వేర్ తో సాధ్యం కానిది లేదు,” అన్నది చదివి, సామాన్య ప్రజానీకంలో ఉన్న అపోహలని తొలగించడానికి రాసిన పుస్తకం.
వీళ్ళిద్దరూ లెక్కలు, కంప్యూటర్ సైన్సుల్లో ప్రపంచప్రసిద్ధిగాంచిన ప్రొఫెసర్లూ, శాస్త్రవేత్తలూ. “మనకున్న విజ్ఞానాన్ని కాస్తో కూస్తో సామాన్య జనానికి చేరువగా తీసుకొచ్చి అజ్ఞానపు చీకటిని తొలగించడం మన బాధ్యత,” అనే ఆలోచన పాశ్చాత్య శాస్త్రవేత్తల్లో అతిసామాన్యం గానూ, మన “పుణ్యభూమి”లో పుట్టిన శాస్త్రవేత్తల్లో అపురూపంగానూ కనిపించడం విశేషం.
ఆ సూత్రం ప్రవాసంలో ఉండి వచ్చినవాళ్ళకి వర్తించదని నేననలేదు. తప్పకుండా వర్తిస్తుంది. నిజానికి, నేను లక్ష్మన్న గారితో కొంతవరకే ఒప్పుకుంటాను అంటూ, ఆయన అన్నదాంట్లో నేను అంగీకరించని విషయమొకటుందని ఓ ఉదాహరణతో పాటు వివరించాను. (పేరివ్వడం మర్చిపోయాను – పి. సత్యవతి గారి “మంత్రనగరి”)
మరో ఉదాహరణ ఇచ్చి విరమిస్తాను. ఉన్నవ రాసిన “మాలపల్లి” కి ఇతివృత్తం పల్లెలో ఉండే ఓ దళిత కుటుంబం. ఉన్నవ దళితుడు కాడు; వాళ్ళ జీవితానికీ ఆయన జీవితానికీ చెప్పుకోదగ్గ తేడా ఉంది. అయినా గూడా వాళ్ళ జీవితం గురించిన ప్రత్యక్ష అనుభవం ఆయనకుంది – ఎందుకంటే వాళ్ళూ ఆయన ఉండే సమాజంలో భాగమే. ఎంత ఊహాశక్తి గల రచయిత అయినా తను వేరే సమాజంలో ఉంటూ “మాలపల్లి” లాంటిది రాయలేడు అని నా నమ్మకం. రాస్తే అది కత్తిమీదసాము లాగుంటుంది.
“మనం ఇంటర్నెట్ యుగంలో కొచ్చాం, ప్రపంచమంతా ఒక చిన్న కుటుంబం,” అంటే నేనొకటడుతాను. గత వంద సంవత్సారాలలో అనేక దేశాల్లో అనేక మార్పులొచ్చాయి. ప్రచార సౌకర్యాలలో ఊహించలేనంత మార్పులొచ్చాయి. కాస్త విద్యావంతులైన వాళ్ళకి వేరే దేశాల్లోని జీవితాల గురించి కొంతవరకైనా తెలుసుకోడానికి అవకాశం కలిగింది. కాని రచయితలెవరైనా కేవలం తమ ఊహా శక్తి నుపయోగించి తామెప్పుడన్నా నివసించిన దేశంలో కాక వేరే దేశంలో ఉన్న మనుషుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకొని గొప్ప సాహిత్యం సృష్టించారా? సృష్టిస్తే, తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ, దయచేసి కొన్ని పేర్లివ్వండి.
వ్యాసాన్ని చదివి సలహాలిచ్చిన పాఠకులకు వందనాలు.
ఇంకా మీకు తోచిన సలహాలను అందరూ ఇయ్యండి. శాస్త్ర రంగంలో
ఇంకా వ్యాసాలను రాయాలనే నా అభిలాషకు అవి తోడ్పడుతాయి.
1) అన్ని ఘనస్వరూపాలను గురించి ఒకే వ్యాసములో రాయాలనేదే
నా ముఖ్యమైన ఉద్దేశము. దానిని విరిచి రాస్తే కంటిన్యుయిటీ
ఉండదు. అందుకే ఐదు ఘనస్వరూపాలను గురించి కుదించి
ఒకే వ్యాసములో వివరించవలసి వచ్చింది.
2) నేను చదివిన, చూచినా పదకోశాలలో నేను ఉపయోగించిన
టెక్నికల్ పదాలే ఉపయోగించారు. పదాలు అచ్చ తెలుగు పదాలు
కానంత మాత్రాన వాడడానికి వెనుదీయరాదు. సాంకేతిక
పదాలకు సంస్కృతము నిజంగా ఒక కాణాచి వంటిది.
నాకు తెలిసి తెలుగు అకాడెమి వారు స్ఫటిక శాస్త్రముపై
ఒక పుస్తకాన్ని ప్రచిరించారు. ఉదాహరణకు అందులో
సమతల ముఖానికి పార్శ్విక అనే పదాన్ని ఉపయోగించారు.
octahedronను అష్టపార్శ్విక అని అన్నారు.
నా భావనలో దానికంటె అష్టముఖి అనే పదము బాగని
తోస్తుంది. సుబ్బరామయ్యగారి పుస్తకాన్ని ఇక్కడ చూడవచ్చు –
3) సౌష్ఠవమును గురించి ఇంతకు ముందే నేను రాసిన
ముగ్గులు అనే వ్యాసాన్ని చదువమని వ్యాసములో, సూచికలో
తెలిపి ఉన్నాను. ఇందులో ప్రతియొక్క అక్షానికి ముగ్గుల
ఉదాహరణ ఉన్నది. తీరిక ఉన్నప్పుడు సౌష్ఠవము 101
అఏ వ్యాసాన్ని రాస్తా.
4) హెర్మన్ వేల్ పుస్తకము నన్ను ప్రాభావితము చేసిన
పుస్తకాలలో ఒకటి. దీనిని అందరు అర్థము చేసికోవచ్చు.
నా దగ్గర ఈ పుస్తకపు pdf file ఉంది. కాని అది పెద్దది.
దానిని కావలసిన పాఠకులకు ఎలా అందజేయాలో తెలియలేదు.
5) ఇక బొమ్మలను గురించి. ఇవి పారదర్శకము కనుక
ఫోటో తీయడము చాల కష్టమయ్యింది. flash
ఉపయోగిస్తే reflect అవుతుంది. flash లేక తీయవలసి
వచ్చింది. Internetలో కొన్ని ఉన్నాయి కాని ఇలా చేసినవి
లేవు.
6) ప్లేటో ఆపాదన రావుగారు చెప్పింది సరియే. Detailsతో
వ్యాసాన్ని పొడిగించడం ఇష్టంలేక వాటిని గురించి
రాయలేదు.
7) dual అంటే twin అని అర్థము, అందుకే కవల అని
ఉపయోగించా. నా ఉద్దేశములో ఇది తప్పు అని అనుకోను.
8) చిన్న భూషయ్య ప్రస్తావనకు కారణాలు రెండు – (1)
pentagonతో ద్వాదశముఖి చిత్రాన్ని కింది లింకులో
చూడగలరు.
మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు. మీరిచ్చిన కొన్ని సలహాలు పాటిస్తాను. మీరు వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలతో విభేదిస్తాను.
ఎందుకు రాయాలనిపించలేదో తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నానో వివరించి digress అయ్యానన్నారు రాజాశంకర్ గారు. “నరావతారం” కి పరిచయం రాస్తూ నార్ల విష్ణావతారాలవి రాసేవాళ్ళ మీద ఎందుకు విసుర్లు వెయ్యడం? పండిత పురస్కారం గురించి ప్రకటన చేస్తూ తమ్మినేని కవుల మీద ఎందుకు చురక వెయ్యడం? వాళ్ళ వాళ్ళ దృక్పధాన్ని బట్టి తమకి ముఖ్యమైన వాటి గురించి ప్రస్తావించారు. నేను మన భాషలో సైన్సుగా చలామణి అవుతున్న వాటిని చూసి కొంత “కడుపు మండి” నాలుగు మాటలు రాశాను. రాస్తున్నది పాపులర్ సైన్సు గురించి కాబట్టి అవి అసందర్భం కాదు. నిజానికి నాదృష్టిలో చాలా అవసరం. అలాగే ప్రేరణ కలిగించిన వాటిని ప్రస్తావించడం కూడా మామూలే.
కాని అందు మూలంగా అసలు విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, అది తప్పే. ముందు ముందు ఎలాగూ లోతుగా వివరిస్తాను కనుక, అది సరిదిద్దుకునే అవకాశం వుంది.
నేను రాయాలనుకున్నదంతా ఒకే వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు. ఖగోళ శాస్త్రం మీదా, కాలెండర్ మీదా మనకి వ్యాసాలు పరంపర గానే వచ్చాయి. అవి వచ్చింది వారపత్రికల్లో కాబట్టి గత వారం విషయం గుర్తుండటం సులభం కావొచ్చు. ఈమాట, రెండు నెలలకోసారయినా, ఇంటర్నెట్ పుణ్యమా అని పాత సంచిక పక్కనే ఉండటాన పాఠకులు దారితప్పరనే నా ఆశ. కాని శ్రీనివాస్ గారన్నట్లు, ప్రతి వ్యాసమూ సాధ్యమైనంతవరకు సమగ్రంగానూ సమైక్యంగానూ ఉండాలి. మొదటి వ్యాసం కాస్త కలగాపులగంగా వున్న మాట నిజమే. ఈ విషయంలో నేను జాగ్రత్తపడాలి.
ఇకపోతే ఈ వ్యాసాల్లో దొర్లే కవితల వలన ఉపయోగమేమిటి? పాఠకుల ఏకాగ్రతకు భంగం కావా? అన్నదానికి నా సమాధానం: కొడవటిగంటి కుటుంబరావు, “తెలుగులో ఏదన్నా వైజ్ఞానిక రచన, కథలాగా చక్కగా హృద్యంగా, ఆపబుద్ధి పుట్టకుండా రచించినది కంటపడితే పర్వం లాగుంటుంది,” అన్నాడు.
కాని పాత్రలు, సంభాషణలు, ప్రకృతి వర్ణనలూ లేకుండా కథలా హృద్యంగా నడిపించడం ఎలాగ? అందుకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తారు – కవిత, జీవిత చరిత్ర, పురాణ కథ, నవ్వుతెప్పించే సంఘటన, ఇలా ఏది చాతనయితే అది.
“విశ్వరూపం,” తెలుగు వైజ్ఞానిక సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడుతుందన్నాడు కొడవటిగంటి. నా ఉద్దేశంలో మైలురాయే కాదు, ఉత్తమ రచనకి గీటురాయి కూడాను. దాంట్లో, నండూరి, “సాధారణభాషలో సాపేక్షసిద్ధాంతం,” అధ్యాయాన్ని చార్లెస్ లాంబ్ పలుకులతో మొదలెట్టి, మధ్యలో కీట్సు ప్రేమగీతాన్నొకదాన్ని ఉటంకించి, షెల్లీ పద్యాన్ని పఠాభి తెనిగింపుతో సహా ఇచ్చి, పోతన భాగవతాన్నెలా మొదలెట్టాడో వివరించాడు! వాటికితోడు బాపూ కార్టూన్లు!
సాపేక్ష సిద్ధాంతం వివరించడానికి ఇవన్నీ అవసరమా అంటే, బహుశా కాదేమో! కాని అవన్నీ ఉంటే గాని హృద్యంగా ఉండదనీ, అవి వ్యాసాన్ని మళ్ళీ మళ్ళి చదివించేలా చేస్తాయనీ రచయిత ఉద్దేశం.
దీంట్లో ఏకాభిప్రాయం ఉండాలని లేదు. Feynman ఉపన్యాసాల్లో కవిత్వం ఎక్కడా కనిపించదు. కవిత్వం లేకుండా Brownowski ఉపన్యాసం ఉండదు. నాకు Brownowski అంటే చాలా ఇష్టం. మన ఇష్టాఇష్టాలు మన రచనల్లో వ్యక్తం అవతాయి.
చాలా మంది పేర్లని వాడాను. వారి ప్రజ్ఞా పాటవాలు నాకున్నాయనే అపోహ నాకేమాత్రమూ లేదు. వాస్తవం చెప్పాలంటే, పులిని చూచి నక్క వాతబెట్టుకున్న ట్లవుతుందేమోనన్న భయం కొంత వుంది. కాని, చుక్కలదాకా నిచ్చెనేస్తే చూరు దాకానన్నా చేరతాం, అన్నది మన సూక్తి.
శ్రీనివాస్ గారిచ్చిన స్త్రీల, పేదల, రోగుల గురించి రాయడానికి సంబంధించిన పోలిక ఈ సందర్భంలో సమంజసంగా లేదు. ఎందుకంటే వీళ్ళ గురించి రాయడానికి వాళ్ళ జీవితంతో కావలసిన ప్రత్యక్షమైన అనుభవం వేరే వాళ్ళకుండే అవకాశం వుంది. అమెరికా జీవితం గురించి అలాంటి ప్రత్యక్షానుభవం అమెరికాలో ఉంటే తప్ప అసాధ్యం.
“ఇంటర్నెట్ తోనూ, ఈమాట తోనూ, ఇరవై నాలుగ్గంటలూ ప్రసారమయ్యే టీవీ షోల తోనూ వేరే వాళ్ళ జీవితం గురించి తెలుసుకోలేమా? సృజనాత్మక సాహిత్యం సృష్టించలేమా?” అంటే ఎక్కడో కొడవటిగంటి కుటుంబరావు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి: సాహిత్యం జీవితవృక్షాన పూసే పువ్వు అనే ఉపమానం వాస్తవమనుకుంటే, సాహిత్యాన్నించి సాహిత్యం పుట్టడం, పువ్వునుంచి పువ్వు పుట్టడం లాంటిది – అసంభవం.
అసాధ్యం, అసంభవం అన్నవి పెద్ద మాటలనుకోండి. ఎక్కడన్నా మినహాయింపులుండొచ్చు.
కాని లక్ష్మన్న గారితో నేను కొంతవరకే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన నివాసాంధ్రులు ఎన్నిసార్లు ఇక్కడకొచ్చి వెళ్ళినా అమెరికాలోని తెలుగు జీవితం అర్థంచేసుకోలేరన్నారు. జీవితం, తెలుగు వాళ్ళదే అయినా, చాలా విశాలమయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకయినా అది అర్థమయ్యేది అసంపూర్తిగానే.
రెండు మూడు నెలలు వాళ్ళ పిల్లల్ని చూడటానికి వచ్చినవాళ్ళు, తాము చూసి అనుభవించినంతలో అర్థం చేసుకొని రచనలు చెయ్యొచ్చు.
మొన్నో కథ చదివాను: అమెరికాలో తెలుగు వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఎంత ఘనంగా – మీగడలతో భోజనం, తాంబూలంతో ఫాటు వెండిగిన్నె ప్రదానం – చేసుకుంటున్నారో, ఒకరింట్లో స్వామి వారొకరు యజ్ఞం ఎలా జరిపించారో చెప్పి, ఇండియాలో లక్ష వత్తుల నోము ఎవరూ చేస్తున్నట్లు లేరు; అది కూడా ఇక్కడ చూసే భాగ్యం కలుగుతుందేమో అన్నారు.
అలాంటి కథలు విలువయినవే; నిజానికి చుట్టపుచూపుగా వచ్చిన నివాసాంధ్రులే అవి మిన్నగా రాయగలరేమోమో. అవి చదివి, అక్కడ కంటే ఇక్కడే మన సంస్కృతి గురించి ఎక్కువ పట్టించుకుంటూన్నామని సంబరపడొచ్చు; లేదా, పెరిగిన ఆర్థిక స్తోమతుతో పాటు పెరగకూడనవేవో మనలో పెరుగుతున్నాయని విచారించనూ వచ్చు – చదివే వారి దృష్టిని బట్టి.
మంచి వ్యాసము వ్రాసినందులకు అభినందనలు.
తెలుగులో నాటకాలు లేవని అనుకోకూడదు. ఎందుకంటే యక్షగానంతెలుగుభాషకు ప్రత్యేకమైనది. తెలుగులో ఉన్నన్ని యక్షగానాలు మరే భాషలో లేదంటే అతిశయోక్తి కాదు. కాని ఈ నాడు వాటిని గురించి తెలిసినవారు అరుదు.పొరుగు భాష ఐన కన్నడములో, తుళు భాషలో అవి మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. తెలుగు నాటకము గురించిన ఒక మంచి పుస్తకము Surabhi Theatres by Sri Rama Sastri.
– mOhana
============================================
మంజరీమధుకరీయమును గురించిన ప్రస్తావన వచ్చింది కనుక ఆ నాటికను గురించి కొద్దిగా తెలుసుకుందామని పుస్తకాలు తిరగవేస్తుండగా కింది పుస్తకము కనబడింది. దాని నుండి ఈ నాటిక వివరాలు కొన్ని. దీని కర్త కోరాడ రామచంద్ర శాస్త్రిగారు మరొక మహా కావ్యాన్ని రాశారు. అది ఘనవృత్తము. ఇది మేఘదూతపు తరువాతి కథ. అదే మందాక్రాంతములో రాశారు దీనిని. దీనిని ఒకప్పుడు రచ్చబండలో నేను పరిచయము చేశా.
శ్రీ కోరాడ రామకృష్ణయ్య శతజయంతి సాహితీనీరాజనం
సంపాదకుడు – కోరాడ మహాదేవ శాస్త్రి
ప్రచురణ – సీతా ట్రస్ట్, విశాఖపట్ణం,
మరియు శ్రీ ఫవుండేషన్, ఇల్లినాయ్, 1992
అందులో పుటలు 12, 13 నుండి.
ఇది ఒక తెలుగు నాటిక. దీనిని కోరాడ రామచంద్ర శాస్త్రి గారు 1860 ప్రాంతంలో రచించారు. దీని ఇతివృత్తం అపూర్వం. స్వకపోల కల్పితం. పురాణాదులనుంచి సంగ్రహించింది కాదు. దీని కథ సంగ్రహంగా ఇది.
రాజకుమారి మంజరి నవయౌవనవతి అవుతుంది. ఆ సమయంలో శరీరంలో కలిగిన నూతనమైన మార్పులు ఆమెకు అర్థం కాలేదు. పొటమరించిన పాలిండ్లు మొదలయిన వాటిని ఆమె కంతులని భావించింది. మందు ఇప్పించమని తల్లి అయిన సంతానవల్లిని కోరుతుంది. ఆమె సిగ్గుతో తన కుమార్తెకు వాస్తవ విషయం చెప్పలేక పోయింది. తన పుట్టింటినుంచి మంజరి చెలికత్తె ఆమోదరేఖను రప్పించి, రాజకుమారికి ఆమె యౌవనం వివరించమని చెబుతుంది.
ఆమోదరేఖ సకల విద్యాప్రవీణ. ఆమె వల్ల వాస్తవం తెలుసుకొని మంజరి సిగ్గు పడుతుంది. రాజకుమారి ఆమె వల్ల గానకళ నేర్చుకుంది. ఒకనాడు వారిద్దరు ఉద్యానవనంలో ఉండగా కుంభస్తని అనే చేటిక వచ్చి, చండయోగిని అనే యోగినిని చూడ్డానికి మంజరిని అంతఃపురానికి పిలుచుకొని పోతుంది. చండయోగిని క్షుద్ర మంత్రోపాసకురాలు. సామంతరాజకన్యలకు గురువు. మంజరి ఇద్వాంసురాలని ప్రసిద్ధి పొందినందున, ఆమెను వాదంలోనో మరే విధంగానో ఓడించడానికి చండయోగిని వచ్చింది. వారిద్దరికి వాదం జరుగుతుంది. చండయోగినితో ఆమోదరేఖ ఆమె గురువైన రాజయోగిని కూడ వాదించారు. చండయోగిని ఓడి పోతుంది.
ఆమోదరేఖకు సంయమి అనే స్నేహితురాలు ఉంది. ఆమె స్నేహితురాలు సుమతి. విరిద్దరూ తపస్వినులు. వీరు ఆమోదరేఖా మంజరులకు వచ్చిన ఆపదను గురించి చర్చించుకుంటారు. ఆ ఆపద ఇది: మంజరి ఒక రాత్రి కలలో ఒక రాజచంద్రునితో రతి సుఖ మనుభవించి ఆ పారవశ్యంతో అతనిని గురించి ఆశువుగా పద్యాలు చెబుతుంది. అందుకు అందరూ కలత పడుతారు.
ఒకనాడూ మంజరి ఆమోదరేఖలు ఉద్యానవనంలో ఉండగా, చండయోగిని నియమించిన ఒక రాక్షసుడు హరిణ రూపంలో వచ్చి వారిని తన కొమ్ముల సందులో ఇరికించుకొని ఆకాశానికి ఎగిసి పోతాడు. తపస్విను లిద్దరూ ఇలా మాట్లాడు కుంటుండగా, ఒక కాపాలిక వచ్చి, కలలో మంజరిని కలుసుకున్న మధుకర రాజపరమేశ్వరుడు విరహి అయి అరణ్యంలో తిరుగుతూ, ఆకాశంలో ఎగిరిపోతున్న హరిణాన్ని బాణంతో కొట్టాడని, హరిణ రూపంలో ఉన్న రాక్షసుడు నిజరూపంతో తాను అపహరించుకొని పోతున్న ఇద్దరిని ఒక ఇనుప పెట్టెలో బంధించి దాచి, మధు
కరునితో పోరాడి మరణించాడని చెప్పింది. పెట్టె ఏమైందో మధుకరునికీ తెలీలేదు.
మంజరి వార్త తెలియక విలపిస్తున్న, అగ్నిప్రవేశం చేయనున్న రాజమాతకు కాపాలిక మాయతో ఒక మణిఘంటికను ఒక లేఖతో సహా అందజేస్తుంది. అవి రాజమాత చేతిలో పడుతాయి. మంజరి క్షేమంగా తిరిగి వస్తుందని, రాజయోగిని శాపంతో హండయోగిని పిచ్చిదై పోయిందని ఆ లేఖ వల్ల తెలిసింది. రాజమాత మనసు ఊరట చెందుతుంది.
మధుకర చక్రవర్తి భార్య హేలావతి ఎదుట మంజరి ఆమోదరేఖ ఉన్న ఇనుప పెట్టె పడుతుంది. ఆమె ఆ పెట్టె తెరిపించి, దానిలో ఇద్దరు సుందరులు ఉండడం చూచి ఆశ్చర్య పడి వారిని అంతఃపురంలో రాజు కంట పడకుండా దాచింది. రాజు విచారంగా ఉండడానికి కారణమేమో ఆమెకు తెలియలేదు. ఈ విషయాన్ని
కుంభస్తని అనే చేటి విదూషకునికి తెలుపుతుంది. విదూషకుడు రాజును కలిసినప్పుడు రాజు, తన చింతకు కారణం చెబుతాడు.
విదూషకుడు కుంభస్తనితో చెప్పిన దానితో రాజు చెప్పిన దానిని సరిపోల్చుకుని రాణి, రాజును ప్రసన్నుని చేసుకొనేట్టు యుక్తి చేస్తాడు. విదూషకుని భార్య యుక్తితో ఒక విప్రశ్నిక వచ్చి ఖేచరస్త్రీ సందర్శనంవల్ల రాజు స్వస్థ చిత్తుడవుతాడని
ప్రశ్న చెబుతుంది. ఇనుప పెట్టెలో నుంచి బయటపడిన మంజరి, ఆమోదరేఖలు ఖేచర స్త్రీలని రాణి భ్రమపడి ఆమోదరేఖను రాజు కనబడేట్టు చేస్తుంది. మంజరిని చూస్తే రాజు మనస్సు మారుతుందని ఆమెను రాజుకు కనబడానీలేదు.
రాజు, విదూషకుడు మంజరిని చూడడం ఎట్లా అని ఆలోచిస్తూ క్రీడాశాలకు రాగా,
అక్కడ మంజరి కనిపిస్తుంది. మధుకరుడు మంజరిని గాంధర్వ విధితో వివాహం చేసుకుంటాడు. ఇంతలో రాణి వచ్చి అల్లరి చేయగా రాజు వెళ్లి పోతాడు. రాణి కోపంతో ఆమోదరేఖను, మంజరిని చెరసాలలో పడేస్తుంది. రాజు చర్యకు రాణి చింతిస్తుండగా, ఆమె తల్లినుంచి ఒక లేఖ వస్తుంది. దానినిబట్టి మంజరి రాణి
పినతల్లి కుమార్తె అని స్పష్టమవుతుంది. రాణి పశ్చాత్తాప పడుతుంది. రాజు వద్దకు క్షమాపణ కోరుతుంది. మంజరిని రాణిని చేసి, తాను భట్టిని కావడానికి సమ్మతిస్తుంది. పిదప రాణే మంజరిని పిలుచుకొని వచ్చి రాజు చేత పాణిగ్రహణం చేయిస్తుంది.
మచ్చుకు మొదటి అంకములో ఆమోదరేఖామంజరుల సంభాషణ –
ఆమో – హళా మంజరి, సుమాళంబుగా నుంటివి గదా
మంజరి – అత్తికా, నీవు వచ్చుట నింక నింక యద్ది కలుగునని
నెమ్మనంబున నమ్మెదనే.
ఆమో – హళా ఇట్లుంటివేమే
మం – అత్తికా, నీవు నా చెంగట నుంటివే
ఆమో – హళా, నీ కురంగట నవ్వ మొదలుగ వారంద రున్నారు
గదా
మం – అత్తికా, యీ యవ్వ తొంటి యవ్వ యనుకొంటివే
ఆమో – యిప్పుడు గ్రొత్తగ మరి యొకతె యేతెంచెనే
మం – కాదే యవ్వ యనిన యద్దియే కాని దాని యాత్మ మారినదే
ఆమో – ఓసీ చెలియా, కాదే, తొల్లిటికంటె నీ యాత్మ మారిన
దాని నెరుంగక యమ్మను వింతగ దూరుచున్నావు
మం – అత్తికా నీవు కొన్ని నాడులు దడవున నుండుట
నీ యాత్మయుం దారుమారయ్యెనని దలంపనగునే
=========================================
ఆముక్తమాల్యదతో నాకున్న అష్టకష్టాలు ఇవాళ్టివి కాదు. పెద్దలు దీన్ని ప్రౌఢ కావ్యం అన్నారు. మామూలు కావ్యాలని అర్థం చేసుకునే స్తోమతే నాకు లేకపోతే ప్రౌఢ కావ్యాల జోలికెళ్ళే ధైర్యం ఎక్కడుంది? అయినా సాహసం చేసి ఎప్పుడో ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో కొన్ని పేజీలు చదివాను. రాయలు James Joyce కోవలో వారన్నారాయన. నా గుండెలో పెద్ద రాయి పడింది.
కాలేజీ రోజుల్లో బుచ్చిబాబు రాసిన “చైతన్యస్రవంతి” చదివి, ఎప్పటికయినా Ulysses చదవాలని నిశ్చయించుకున్నా. నాలుగు రాళ్ళు సంపాదించే స్థికి రావడంతోటే మద్రాసులో మూర్ మార్కెట్ కెళ్ళి Ulysses కొన్నా. పది పేజీలు గూడా చదవలేకపోయా! ఇప్పటికీ ఇండియాలో ఓ స్నేహితుడింట్లో పెట్లో భద్రంగా ఉందది.
కె. వి. యస్. రామారావు గారి సులభ అనువాదం చదివా. అది మొదటిమెట్టుగా ఉపయోగపడి స్వయంగా చదువుకోడానికి ప్రోత్సాహమిస్తుందని భావించారాయన. అయినా నేను కనీసం రెండో మెట్టుకి కూడా చేరుకోలేకపోయాను. లోపం నాదే కాని వేదం గారి సంజీవనీ వ్యాఖ్య దొరకలేదనే వంకతో సరిపెట్టుకున్నా.
తర్వాత, మెచ్చుకోదగ్గ విస్తృత చదువరి పరుచూరి శ్రీనివాస్ పెట్టిన ‘వాత’ చదివి, కనీసం వావిళ్ళ వారి టీకా తాత్పర్యాలతో నన్నా ఓ మెట్టు ఎక్కగలనేమో అని ఆశ పడ్డా. ఊహు, కదలదే!
ఇప్పుడీ పద్యం చదివాను. వెంటనే అనిపించిందేమిటంటే, “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్న రాయలు వారు రాసిన తెలుగు నాకెందుకందుబాటులో లేదా అనే విచారం! చిన్నగా చీమలమర్రి గారి వివరణ చదివాను. ఓహో అనుకున్నా. కాని “జలరుహనాభగేహ రురుశాబము” లో జింక దాక్కొని ఉందంటే నమ్మశక్యం కాలా!
ఈ కష్టాల్లో నాకింకో పద్యం కనిపించింది. ఇది నాఅష్టకష్టాలకీ ప్రతిఫలం అనిపించింది. వానాకాలంలో ఆడవాళ్ళు పడే అగచాట్లని వర్ణించేది:
ఆముసుర్లో ఇంటింటికీ తిరిగితే కాస్త నిప్పు దొరుకుతుంది. దొరికినా, ఇంట్లోని ఎండుగడ్డి పెడితేగాని రాజుకోదు. రాజుకున్నా, రగులుకోవాలనే ఆశే కాని రగుల్కోదు. రగుల్కొన్నా అన్నం ఉడకదు. అన్నమయినా కూర గాదు. అయినా, ఇల్లంతా పొగతో నిండి, సుఖ భోజనం కాదు. తిన్నా, ఇంట్లో అందరికీ వండిన అన్నం, మొదటి బంతి వాళ్ళకే సరిఫోతుంది. ఆడవాళ్ళు మళ్ళీ వంటకి తయారు. అప్పుడు నేతిలో తడిపిన కోకలూ, ఇంట్లోని వాసాలూ గూడా పొయ్యిలో వెయ్యడానికి వెనుకాడరు. రాత్రంతా వండుతూ, అన్నం లేని గృహిణి, ఎంతకీ పక్కలోకి రానందుకు ఇంటాయన చిందులేస్తాడు!
ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే, ఇదెప్పుడో రాయల కాలంనాటి ఆడవాళ్ళ అగచాట్లు కాదు; నా చిన్నతనంలో మా ఇంట్లో, రావినూతలలో ప్రతి ఇంట్లో, వానాకాలంలో జరిగే తంతు కవితాత్మకంగా చెప్పాడు కనుక.
చివరికే మనిపించిందంటే, రాయల్ని అర్థం చేసుకోవాలంటే నాలాటి సగటు పాఠకుడికీ అగచాట్లు తప్పవు. కాని పడితే, కె.వి.యస్., పరుచూరి, చీమలమర్రి, ఆరుద్ర, వావిళ్ళ వగైరాల సాయం వుంటే, కొన్ని రత్నాలు దొరక్కపోవు!
“Polynomial ని తెలుగులో ఏమనాలో తెలియక అలాగే ఉంచాను,” అని రాసారు హనుమంతరావుగారు.
“Polygon” ని “బహుభుజి, బహుకోణి” అని తెలిగించే సంప్రదాయం ఉంది కదా.
“Poly” ని బహు, అతి అని తెలిగించవచ్చు
అలాగే astronomy లో “నొమీ” అంటే లెక్కపెట్టటం.
కనుక Polynomial అంటే రెండు కాని, అంత కంటె ఎక్కువ కాని పదాలు ఉన్న గణిత సమాసం కనుక దీనిని “బహునామి” అనో “బహుపది” అనో అనొచ్చు.
ఈ సంప్రదాయం తెలుగులో అప్పుడే వాడుకలో ఉంది.
ఉదా.
polyandry = బహుభర్తృత్వం
ployglot = బహుభాషాభాసి
ployhedron = బహుఫలకం
ploymer = బహుభాగి
ploynomial = బహుపది, బహునామి
Poly ని అతి అని తెలిగిస్తే వచ్చేవి
ploydipsia = అతిదాహం
ploypleagra = అత్యాకలి
plourea = అతిమూత్రం
వెబ్ పత్రికల కొత్తదనం మూలానో, ఏమో, వ్యాసాల స్పందనలో ఒక ధోరణి కనబడుతోంది. రాసిన విషయం గురించి కాకుండా రచయిత గురించో, శైలిని గురించో పొగడ్తలూ, విమర్శలూ చూస్తున్నాం. నా లెక్కన ఇటువంటి వ్యాసాలు పాఠకుల ఆసక్తిని చెపుతున్న విషయంకేసి మళ్ళించేవిగా పనిచెయ్యాలి. శైలి వగైరాలను మెచ్చుకుంటే రచయితలకు ఉత్సాహం పెరిగేమాట నిజమే కాని, అది అంత ముఖ్యం కాదని నాకనిపిస్తుంది. ఇలాటివి చదివి విలాయత్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరుల గురించి తెలుసుకునేందుకు ఎవరైనా మొదటిసారిగా ప్రయత్నిస్తే రాసిన ఉద్దేశం నెరవేరినట్టే. తక్కినవన్నీ సెకండరీ విషయాలు.
Wonderful and admirable effort.
Look forward to the rest in the series.
నాటిక – నాటకం అంటే .. కేవలం పాత్రలు డయలాగులు చెప్పడం అన్న తీరులో రాస్తున్నారు. నాటకానికి ఉండాల్సిన స్వంత రూపం గురించి ఎవరికీ అవగాహన ఉన్నట్టు కనబడదు. గత పదేళ్ళలో తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి కొన్ని మంచి నాటికలు నాటకాలు రాశారు.
బహుముఖప్రజ్ఞావంతులైన మోహనరావుగారి వ్యాసం చాలా విజ్ఞానదాయకంగా ఉంది. నేను ఇరవైరెండేళ్ళ క్రిందట Harvard Square లో కొని కొంత చదివిన Hermann Weyl పుస్తకం, “Symmetry,” మరలా కాస్త చదివింపజేసింది. అది ఆయన Princeton నుండి 1951లో రిటైరయిన సందర్భంలో ఇచ్చిన ప్రసంగాల సంకలనం. సగమన్నా సామాన్యులకి అందుబాటులో ఉన్నదే.
కొన్ని చిన్న చిన్న సలహాలు:
అయిదింటినీ పరిచయం చేసి, పిండికీ శక్తికీ కొరతలేదు గనక, ఒక్కోదాని మీద ఒకటి రెండు వ్యాసాలు రాసి సగటు పాఠకుడికి వివరిస్తే ఇంకా బాగుండేది. సంకేతాలూ సిద్ధాంతాలతో మొదలెట్టకుండా, ఇవి అసలెలా వస్తాయో బొమ్మలతో చెప్తే సులభంగా అర్థమవుతుంది. ఒకే కొనకి మూడు త్రిభుజాలు కలిపితే చతుర్ముఖీ, నాలుగయితే అష్టముఖీ, అయిదయితే వింశతిముఖీ, ఆరయితే అసాధ్యం! ఒకే కొనకి మూడు చతురస్రాలు కలిపితే cube, నాలుగయితే అసాధ్యం! ఒకే కొనకి మూడు పంచభుజాలు కలిపితే … … ఇలా నెమ్మదిగా ఇవి ఎందుకు అయిదుకి మించవో చెప్తే బావుంటుంది.
పారదర్శకమైన ప్లాస్టిక్ రేకుతో శ్రమతో బొమ్మలు తయారుచేశారు కాని అంత లాభకరంగా లేవు నాకు – స్పష్టంగా లేకపోవడాన. వెబ్ లో ఇంకా మంచివి దొరకవచ్చు.
“ప్లేటో వీటికి పంచభూతముల గుణాలను ఆపాదించాడు” అన్నారు. గ్రీకులకున్నది మొదట్లో నాలుగేనట! “To the earth then, which is the most stable of bodies and the most easily modelled of them, may be assigned the form of a cube; and the remaining forms to the other elements, to fire the pyramid, to air the octahedron, and to water the icosahedron,–according to their degrees of lightness or heaviness or power, or want of power, of penetration.” ప్లేటో అయిదో రూపం గురించి తెలుసుకొని ఏం చెయ్యాలో తెలియక, దానిని విశ్వానికి ఆపాదించాడట! దానికి విశిష్టమైన గుణాలున్నట్లుంది.
dual అంటే “కవలలు” అన్నారు. వెంటనే నాకా మాట నచ్చింది, కాని మళ్ళీ ఆలోచిస్తే ఈ సందర్భంలో సరికాదేమోననిపిస్తుంది. తెలుగులో సాంకేతిక పదకోశం లాంటిదేమన్నా ఉందా? Polynomial ని తెలుగులోకి తర్జుమా చెయ్యలేక నేనలాగే ఉంచాను!
“చిన్న భూషయ్యగారి పంచభుజికి ఏ సంబంధము లేదని మీతో మనవి చేస్తున్నాను!” అన్నారు. నాకయితే వెంటనే తట్టలేదు. తర్వాత George Bush Jr. కీ Pentagon కీ సంబంధించిందని ఊహించాను. ఈమాట లో రెండు మూడు సార్లు ఈ చిన్న భూషయ్య పేరు చూశాను. సాహిత్యం సంగతెలా ఉన్నా, సైన్సు వ్యాసాల్లో, విమర్శించొచ్చు కాని, పేరుని వక్రీకరీంచకూడదేమో.
లెక్కల చరిత్రలోనే ఆయిలర్ సిద్ధాంతం చాలా అందమైనదంటారు. నా వ్యాసంలో మూడు-రంగుల-ముగ్గుల గురించి ముచ్చటించాను. నాలుగు-రంగుల-మ్యాప్ సమస్య ఇంకా బాగా పేరున్నది: ఎలాంటి మ్యాప్ అయినా సరే, ఎన్ని దేశాలయినా, వాటి సరిహద్దులనెలా మార్చినా, నాలుగు రంగులతో, పక్కపక్క దేశాలకి ఒకే రంగు లేకుండా వెయ్యచ్చని ప్రతిపాదన (conjecture) ఉండేది.
ఆరు రంగుల కంటె ఎక్కువ అవసరం లేదని ఆయిలర్ సిద్ధాంతం ఆధారంగా చక్కగా నిరూపించారు. నాలుగు రంగులు చాలని నిరూపించడానికి వందేళ్ళకు పైగా అనేకమంది జీవితాలు వెచ్చించారు. చివరకి 1976లో నిరూపించారు – కంప్యూటర్ తో!! అందంలో అది టెలిఫోన్ డైరెక్టరీ కేమీ తిసిపోదన్నారు గణిత సౌందర్యాన్వేషకులు. 🙂
మొత్తానికి ఇది నా ఆసక్తి దీపాన్ని వెలిగించింది. కృతజ్ఞతలు.
రచయిత తమాషాకు అన్నారు, బాగానే ఉంది. కాని తమిళములో కూడ పదమధ్యములో ఉండే పరుషములే
సరళములుగా మారుతాయి. ముందు ఉన్న అక్షరము
ఎప్పుడూ పరుషమే. తెలుగువారు కూడ కొన్ని అక్షరాలను
సరిగా పలుకలేరన్న విషయాన్ని మరువరాదు. ఉదా.
దంత్యాలను తాలవ్యాలుగా, త్యాగాన్ని చాగముగా ఉపయోగిస్తారు.
ఇక పోతే థ-కారము తెలుగులో లేదంటే అయోశయోక్తి కాదేమో.
రామనాథము ఎప్పుడు రామనాధమేగా తెలుగులో. ఒక్కొక్క
భాషకు ఒక్కొక్క విధమైన ఆచారము ఉంది. తప్పుగా
ఉచ్చరించినా కర్ణాటక సంగీతానికి తమిళులే జీవగఱ్ఱ అన్న
నిజాన్ని అందరూ అంగీకరిస్తారనుకొంటా.
నేను రఘోత్తమ రావు గారి తోనూ, రఘు గారి తోనూ ఏకీవభిస్తున్నాను. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కాని రచ్చగెలిచి ఇంట గెలవమనలేదు. ఇంట్లో పని అనుత్పాదకము కాదు! అది ఉత్పాదకమే! భార్యాభర్తలకు పరస్పర సహకారం ఉంటేనే అది మంచి దాంపత్యం అవుతుంది. శశాంక్, కళ్యాణి ఇరువురూ సబబే! శశాంక్ ఎటువంటి ఉత్పాదనకైనా సిద్ధమే కాని కళ్యాణి మాత్రం తను సామాజిక వ్యవస్థ నుంచి వచ్చే గుర్తింపు కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నది. ఇటు వంటిది తప్పు అని నేను అనటం లేదు. ఎప్పటి కైనా గంతకి తగ్గ బొంతలు దొరుకుతారు. అప్పటి దాకా ఇరువురూ వేచి చూడాల్సిందే! (ఇక్కడ నేను వాడిన నానుడి ని తప్పు పట్టవద్దు, మనకి తగ్గవాళ్ళు మనకి దొరుకుతారన్న సందర్భం లో వాడాను అంతే! ఎవరికైనా వారి భావాన్ని వ్యక్తీకరించే అధికారముమ, హక్కూ ఉన్నాయి).
మాచిరాజు సావిత్రి గారి విమర్శని చదివిన తర్వాత, మహే జాబీన్ గారి “తెంచుకోవే బంధనాలు” కథని కూడా చదివేను.
గొప్ప కథగా నా కనిపించలేదు. కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు ఏ పాత్ర కూడా సరిగ్గా ఎష్టాబ్లిష్ కాలేదని నా అభిప్రాయం. చెప్పాలనుకున్న కథ వొకటికి పదిసార్లు చెప్పిన కథే ఐనా, వర్తమానానికి సంభందించిన అంశం కాబట్టి చెప్పిన పద్దతి బాగుంటే కథ కూడా బాగుండేది. తనకు సరిగా తెలియని దేశంలో, గబ, గబా నాలుగు పాత్రల్ని కలబోసి, కాగితం మీద కుమ్మరించినట్టుంది. సావిత్రి గారి విమర్శ చదవకపోతే, మహే జబీన్ గారి పేరు తెలియకపోతే, ఈ కథని కడ వరకూ చదవడం కష్టవే. కథ గొప్పగా చెప్పలేదు కాబట్టి, కథ వ్రాసింది గొప్ప పేరున్న రచయిత్రి కాబట్టి, కథని భూతద్దంలో చూసి, లేని లోపాల్ని కూడా కల్పించి విమర్శించాల్సిన అవసరం వుందని నేననుకోను.
సావిత్రి గారు అంతగా మదన పడిపోయ్యే విశేషాలేవీ నాకు కథలో కనపడలేదు. సఖి గురించి, అమెరికాలో గృహ హింస ప్రాసిక్యూషన్లో వున్నటువంటి రూల్స్, రెగులేషన్స్ గురించి రచయిత్రికి అవగాహనా లోపం వుందనడంలో అబద్దవేవీ లేదు, but there is nothing in this story that is so appalling, that requires such a libelous comment from Ms. Machiraju Saavitri.
సఖి సంస్థ సభ్యులు చారుమతి ఇంటికి పోవటం అంత పెద్ద తప్పుగా సావిత్రి గారికి ఎందుకు కనపడిందో మరి. నిజవే చారుమతికి సఖి గురించి తెలియదు, కానీ మదుబనికి చారుమతి గురించి తెలుసు కదా. గృహ హింస నుంచి దక్షణాసియా ఆడవాళ్ళకి విముక్తి కోసం స్థాపించబడిన సంస్థ, “Sakhi for South Asian Women is a community-based organization in the New York metropolitan area committed to ending violence against women of South Asian origin.” అని చెప్పుకునే సంస్థ, ఫలాని ఇంట్లో వొక అభం శుభం తెలియని ఆడపిల్ల, కనీసం తన బాధల్తో తండ్రికి వ్రాసిన వుత్తరం తను పోస్ట్ కూడా చేసుకోలోని స్థితిలో వున్నటువంటి అమాయకపు పిల్ల విషయం తెలిసి కూడా మౌనంగా వుంటారని నేననుకోను. ఫిర్యాదే అంత ముఖ్యవైతే మదుబనికి దొరికిన ఆ వుత్తరవే ఫిర్యాదుగా స్వీకరించడానికి వెనుకాడుతారని నేననుకోను. ఫిర్యాదే ముఖ్యవైతే చారుమతి ఇంటికి పోయిన తర్వాత తను చెప్పిన విషయాలే ఫిర్యాదుగా పరిగణించడాని వెనుకాడుతారని నేననుకోను. సఖి స్వంత మాటల్లోనే వారి మిషన్ గురించి, “Sakhi structured its programming to follow a two-pronged approach in addressing domestic violence within the South Asian community:
1. We create a safe place with support, friendship, and a full range of culturally-sensitive, language-specific information, services, and advocacy to South Asian women facing abuse in their lives; and,
2. We work to inform, actively engage, and mobilize the South Asian community in the movement to end violence against women forever.”
సావిత్రి గారి మరో ఫిర్యాదు, చారుమతికి ఎలాటి కన్సలింగ్ సఖి ఇచ్చిందో రచయిత్రి విపులంగా వివరించలేదని. ఇది లోపవే, కథలో చారుమతికి, ఆమె భర్త కి సఖి ఇచ్చినటువంటి కన్సెలింగ్ గురించి రచయిత్రి సూచనమాత్రంగానైనా చెప్పి వుండాల్సింది. ఇతే సావిత్రి గారు ఈ లోపాన్ని ఫెమినిస్టులని వ్యంగంగా వ్యాఖ్యానించడానికి వుపయోగించుకోవడం చాలా అసభ్యంగా వుంది. సావిత్రి గారు చెప్తారు, సఖి తన కన్సలింగ్ తో చారుమతిని ఫెమినిస్ట్ గా మలచేరంట. ఎలాటి ఫెమినిస్ట్, చారుమతి అనిరుధ్ ని తన భర్త గా కోరుకోవటం. తాళి కట్టిన మొగుడు ధనుంజయ్ కన్నా ముందు, అనిరుధ్ పరిచయం అయ్యుంటే ఇతనే తన భర్త అయ్యేవాడు కదా అని చారుమతి అనుకోవటం సావిత్రి గారు వొక నేరంగా పరిగణించారు. పెళ్ళి వలన కన్నీళ్ళు తప్ప మరోకటి పొందని ఆడకూతురు, తనంటే ఇష్టం చూపించే మరో వ్యక్తి తారస పడినప్పుడు, అతన్ని గురించి తలపొయ్యడంలో, అతన్ని కోరుకోవడంలో నేరపూరితవైన ఆలోచనని, ఆ రకవైన ఆలోచనలే (ఈ ఆలోచనకి ఫెమినిజానికి నిజానికి ఏ సంబధం లేదు) సఖి నుంచి చారుమతి నేర్చుకున్న ఫెమినిజం అని సావిత్రి గారు మరో నేరాన్ని మహె జబీన్ గారి మీదకి తోస్తారు. వాడు కట్టిన ఆ తాళిని తెంచటాన్ని వ్యంగంగా వ్యాఖ్యానిస్తారు.
సావిత్రి గారి మరో ముఖ్యవైన ఫిర్యాదు, మధుబని పెళ్ళితో సంబంధం లేకుండా ఇంద్రనీల్ తో కలసి వుండటం. ఇంద్రనీల్ పెళ్ళికి సుముఖంగా వున్నా, మధుబని కి పెళ్ళిమీద సద్భావం లేకపోవడం. అందరూ మదుబని ఆలోచనని హర్షించాలని లేదు, కానీ ఈ రోజుల్లో, అమెరికా దేశంలో ఆ ఆలోచనా సరళిని అంత ద్వేషించాల్సిన అవసరం నాక్కనిపించడం లేదు. సావిత్రి గారూ, మదుబని ఎప్పుడూ కథలో చారుమతి సమస్యలకి మరో పెళ్ళి పరిష్కారంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇంద్రనీల్, అనిరుధ్ ఆలోచనల తీరుతో చారుమతికి సహాయం చేసిన మదుబనికి, సఖి సంస్థకి, లేకపోతే ఫెమినిజానికి సంబంధం లేదు. కథలోనే వున్న ఈ చిన్న సత్యం మీ మసుకెందుకు ఎక్కలేదో మరి.
చారుమతి స్వయంగా పోలీస్ కి ఫిర్యాదు ఇచ్చేరని కథలో చెప్ప లేదు, సఖి సంస్థే ఫిర్యాదు చేసినట్టు రచయిత్రి వ్రాసేరు. నిజవే, కానీ చారుమతి ఫిర్యాదు లేకుండా ధనుంజయని పోలీసు అరెస్ట్ చేయగలదా? రచయిత్రి ఈ ముక్క చెప్పనందువలన కథకి, సఖి సంస్థకి అంత నష్టం వాటిల్లిందా, సావిత్రి గారు?
“Aside from the domestic violence issue, the story also abounds in cliché and stereotypes.” అని చెప్పేరు. మొత్తం కథలో వున్న వొకే వొక తెలుగు కాని పాత్ర పీటర్. అయన ట్రేష్ కలక్టర్ అనిచెప్పటం మీకు జాతి వివక్షగా కనపడింది. పోనీ పదిమంది నల్ల వాళ్ళు ఈ కథలో వుండుంటే, అందరినీ ట్రేష్ కలక్టర్లు గా చూపించుంటే మీ అభ్యంతరానికి వొక విలువుండేది. మీరొప్పుకున్నా వొప్పుకోక పోయినా చిన్న, చిన్న వుద్యోగాలు చేసే వాళ్ళు ఆఫ్రికన్ అమెరికన్సే అనేది సత్యం. వున్నదాన్ని వున్నట్టు చెప్పటం జాతి వివక్ష కాదు సావిత్రి గారు, లేని దాన్ని వున్నట్టు ప్రచారం చెయ్యడవే వివక్ష. నాకు మీ విమర్సలోనే వివక్ష కనపడుతుంది. ఆచారాల్ని తోసిరాజనే వాళ్ళమీద వివక్ష, మదుబని లాటి వెన్నెముక కలిగిన ఆడవాళ్ళ పట్ల వివక్ష, మన వెనుకనున్న మన నలుపుని ఎత్తిచూపే మహ జాబీన్ లాంటి రచయిత్రుల పట్ల వివక్ష.
అభం, శుభం తెలియని అమాయక ఆడపిల్లలు, తమకు ఈ దేశంలో ఎదో గొప్ప బతుకుందని, పుట్టి పెరిగిన దేశాన్ని, నా అనుకునే నా వాళ్ళని, కష్టం సుఖం చెప్పుకోడానికి తన వాళ్ళంటూ ఎవరూ లేని దేశానికి, భాషా, సంసృతి గురించి ఏ మాత్రం అవగాహన లేనటువంటి ఈ దేశానికి మొగుడనే వాడ్ని నమ్ముకోని వస్తే, వాడు శారీరకంగానూ, మానసికంగానూ పెట్టె హింసని కనీసం చెప్పుకోడానికి కూడా మనిషి, మార్గం తెలియని దేశంలో చారుమతిలాంటి వారి బాధలు మీకు స్టీరియో టైపుగా, వొక క్లిషే లాగా కనపడటం నిజంగా దురదృష్టం. సఖి వారి వెబ్ ప్రకారం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 393 కాల్సు, ఈమైల్సు సఖికి వచ్చాయ్. ఇందులో 355 ఫిర్యాదులు గృహ హింస గురించే. అందులో మెజారిటీ ఫిర్యాదులు న్యూయార్క్ మెట్రోపోలిటన్ ఏరియానుంచే, కానీ దాదాపు 9% ఫిర్యాదులు న్యూజెర్సీ నుంచి కూడా వున్నయని తమరు గమనించాలి. How many women have resources and inner strength to break the mold of conventional beliefs to complain to sakhi? Very few, very few. Imagine majority of women that are victims of domestic violence silently undergoing that torture, because either they have no courage to break the mold of convention or they were deprived of the resources or not aware of the institutions like SAKHI. It is not a cliché Ms. Savitri. If the story failed in literary circles, but if it has informed one woman about the help that is available (like SAKHI), it is a successful storey in my opinion.
మహ జాబీన్ గారు హైదరాబాద్ లో నిర్వహించే సఖిలాంటి సంస్థమీద మీరు ఈ కథని కారణంగాతీసుకోని వ్యాఖ్యానించడం సభ్యతకాదేవో ఆలోచించారా శ్రీమతి మాచిరాజు సావిత్రి గారూ?
ఆఖరుగా ఇది 2007 కాబట్టి సరిపోయింది. ఇదే కాని 1950ల మెకార్థి కాలం అయ్యుంటే, సావిత్రి గారి లాంటి విమర్శకుల చలవ వల్ల “cell”(cell అనే ఆంగ్ల పదం కమ్యునిష్టు తాత్వికతని సూచిస్తుందని తెలియని నా అజ్ఞానానికి చింతిస్తూ) లాంటి కమ్యునిష్టు పదజాలం వున్న కథని ప్రచురించినందుకు, ఈమాట పత్రిక, సంపాదకులు, రచయితలు, రచయిత్రులు, పాఠకులూ అందరూ బ్లాక్ లిస్ట్ లో నమోదయ్యుండే వాళ్ళు. ముఖ్యంగా సంపాదకులు, మహ జబీన్ లాంటి రచయిత్రులూ, క్రిష్ణ జన్మస్థానాన్ని పావనం చేసుండే వాళ్ళనడంలో కోంత అతిశయోక్తి వుంటే వుండొచ్చేవోగాని, కించిత్తు నిజం కూడా వుందని నా అబిప్రాయం.
తెలుగు భాషా బోధన వల్ల భాషాభివృద్ధి జరుగుతుందన్నది అందరికీ సులువుగా అర్థమయ్యే విషయమే. అలానే సాహిత్య అనువాదాల ద్వారా భాషకి కలిగే వ్యాప్తికూడా అందరికీ తెలిసినదే. కాని విశ్వవిద్యాలయాల్లో పరిశోధన భాషాభివృద్ధికి ఎంతవరకూ దారితీస్తుందన్నది సామాన్య ప్రజలకి (అంటే నాలాంటి వాళ్ళకి) చప్పున బోధపడే విషయం కాదు. కాబట్టి, తెలుగు భాషా సాహిత్యాల గురించి విదేశాలలో జరుగుతున్న పరిశోధన, అది తెలుగు భాషాభివృద్ధికి ఎట్లా దోహదం చేస్తోందీ అనే విషయాలపై “ప్రవాసంలో తెలుగు పరిశోధన” వంటి వ్యాసం ఒకటి తెలుసున్న వారిచేత రాయించి ప్రచురిస్తే బాగుంటుంది.
జిమ్ గ్రే సముద్రంలో తప్పిపోయినప్పుడు ఆయన గురించి వికీపీడియాలో చదివాను. కాని మీరు వ్రాసింది మనసుకు హత్తుకునేట్టు ఉన్నది. మీ ప్రయత్నానికి ధన్యవాదాలు, అభినందనలు!
స్వగతంగా సాగిన “సందుక” కవిత లో తెలంగాణా మాండలిక భాష వ్యక్తీకరణ మాధ్యమంగా ఎన్నుకోబడిందని మొదటి కొద్ది పంక్తులలోనే అర్ధమవుతుంది.అంచేత స్వగతం గా సాగిన కవిత మొత్తం ఆ మాండలిక భాషా పదజాలంతోనే సాగుతుందని ఆశించటం అసమంజసం కాదనుకుంటాను.
అసలు ఈ కవిత ప్రత్యేకమైన సొగసు ఆ పదజాల ప్రయోగం లోనే ఉంటుంది కూడాను. ఈ కవిత ఎంత కవితా శక్తిని సంతరించుకున్నదనే విషయం నా ఈ అభిప్రాయం లో సమీక్షాంశం కాదు.కాకపోతే చాలా తక్కువ శాతం తెలంగాణా మాండలిక పదాలను మాత్రమే ఈ కవిత లో వాడటం చూసి నిరుత్సాహ పడ్డాను.
“అర్ర” లో మాండలిక భాష పదాల్ని వాడినంతగా కూడా ఈ కవితలో (సందుక) వాడలేదు.రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారైనా బాగా చదువుకున్నవారు వ్రాసే సంపాదకీయాల వ్యావహారిక భాషే ఈ కవితలో అధికాధికం గా వాడబడటం కనబడుతుంది. ఆ మేరకు ఈ కవితలోని సౌందర్యాన్ని ,ఔచితిని అది బలహీన పరుస్తుంది.
ఈ క్రింది పంక్తులలో తెలంగాణా మాండలిక భాషా పద ప్రయోగం లేకపోవటం
గమనించండి.
” ముదురు రంగులోకి
జీర్ణమవుతున్న
అట్టలు లేని పుస్తకాలు…”
“ఊపిరి పోసిన
ఒక్కో వాక్యం క్రింద
అరిగిన పెన్సిల్ తో…”
“తెరలు తెరలుగా
బాగా పరిచయమున్న
ఒక కొత్త సువాసన
చుట్టుముడుతుంది”
“చెంపకానించుకున్నపుడు
వెచ్చని వాగు నీటి కింది
గరుకైన ఇసుక
మెత్తదనం ఆపేక్షగా తగులుతుంది”
“(ఎట్లా పారేసుకుంటాం)
మన తొలి యవ్వనాల
రంగురంగుల
ఉద్రేకాల్ని?”
మరొక విషయం.పైన ఉదహరించిన మూడవ స్టాంజా లో “బాగా పరిచయమున్న”దంటూనే ,మరలా దాని”నొక కొత్త సువాసన “ననడం లో వైరుధ్యం లేదూ?
C.S.Rao
వేలూరి గారూ, మన దేశంలో అధునికత బ్రిటీష్ వారి రాకతోనే మొదలైందని కోందరు, రాకకు మునుపే పదహారవ శతాబ్దంలోనే మొదలైందని, పలాని వాళ్ళెవరో వారి పరిశోధనల ద్వారా మనకి తెలియ చెప్పడానికి ప్రయత్నిస్తునారని మీరు చెప్పేరు. అధునికత వలస పాలనతోనో, పదహారవ శతాబ్ధంలోనో మొదలు కావటవేవిటండి. పోనీ ఆ పలాని అధునికతకి మీరేవైనా నిర్వచనం చెప్పేరా అంటే అదేంలేదు. మానవ జీవన విధానంలో అభివృధ్ధి, అధునికత వొక విడదీయలేని విషయం. అభివృద్ధి, అధునికత అనేవి రెండు ఒకే నాణానికి వున్న రెండు ముఖాల లాంటివి. ఇవి రెండూ కూడా కాలంతో పాటూ మారేవే, ముందుకు సాగేవే, అప్పుడప్పుడూ కోచేం డిప్ ఐనా. జీవనంలో (బయలోజికల్ లైఫ్ లో), జీవన విధానంలో అభివృధ్ధి ఒక అంతర్భాగం. ఆ అభువృధ్ధితో వచ్చే అధునికత ఒక continuous process. ఐతే వొక సమాజానికి సహజవైన ఈ అభివృధ్ధి, జీవన విధానంలో అధునికత, బయట శక్తుల వల్ల కూడా మార్పుకి లోనవుతాయ్. అది సముద్రాలవతల నుంచి వచ్చిన వలస పరిపాలన కావొచ్చు, సముద్రాలకివతలనుంచే వచ్చిన ఇస్లాం పాలన కావొచ్చు, పొరుగు హిందూ రాజ్యాలతో కలహాలు, విజయాలూ, అపజయాలు, లక్షా సవాలక్ష కారణాల్లో అన్నీ కావొచ్చు, ఏ వైనా కావొచ్చు.
సమాజం అనేది వొక ఓపెన్ సిస్టమ్ లాంటిది. సమాజం లోపలి ఆటుపోట్లతో పాటు, సమాజం బయట ఆటుపోట్లు కూడా సమాజస్థితిని, గతిని నిర్దేశిస్తాయ్. సంస్కృతి, సాహిత్యం అనేవి సమాజం యొక్క అట్రిబ్యూట్స్ ఐనప్పుడు అవికూడా సమాజంతో పాటూ మార్పు చెందటం సహజం కదా. ఐతే ఏవిటీ మార్పు, వొక సాపేక్షంగా నిశ్చలవైనటువంటి సాంప్రదాయ సమాజంలో, ఈ కనిపించీ, కొన్నిసార్లు కనిపించని (cause is separated in time and space from the effect) శక్తులు సృష్టించేటువంటి అనిశ్చల స్థితి. Some times this change in society’s status may be temporary, some times the society may change and move into a state that is relatively different. అంటే ఏవిటి సాంప్రదాయ సమాజం, తన పాత సాంప్రదాయాన్ని, విదిలించుకోని, వదిలించుకోని, వొక క్రొత్త సాంప్రదాయం నెలకోల్పుతుందనమాట. ఈ క్రొత్త సాంప్రదాయ సృష్టికి, సమాజం బయటనుంచి వచ్చే శక్తులే కాణంకాదు, సమాజంలో వున్నటువంటి అంతర్గత శక్తులు కూడా పాత సాంప్రదాయాన్ని మార్చి క్రొత్త సాంప్రదాయాన్ని సృష్టించగలవు. అంటే అధునికత అనేది, పాత సాంప్రదాయాన్ని పాక్షికంగానో, సంపూర్ణంగానో మార్చి వొక అధునిక సాంప్రదాయాన్ని సృష్టించటం.
“వాడికి పూర్వమే అధునికత ఉన్నది” అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ ప్రక్రియ పదహారు, పదిహేడు శతాబ్ధాలనుంచి, వొక్క ఆంద్రదేశంలోనే కాదు, మానవ సమాజపు పుట్టుకనుంచి ఈ విధంగానే సాగుతుందని చెప్పదానికి నూతన పద్దతుల్లో పరిశోధనలవసరం లేదు.
“వలస రాజ్యం తరువాత వచ్చిన అధునికత సాంప్రదాయ విరుద్దం అని చెప్పవచ్చు”, “బ్రితీషు వలస విధానం వలన వచ్చిన అధునికత, చారిత్రకంగా సంప్రదాయంగా వచ్చిన అధినికతని అణగ దొక్కింది” అధునికత అనేదే దేశీయమైన, విదేశీయమైనా సాంప్రదాయాన్ని త్రోసిరాజని క్రొత్త సాంప్రదాయాన్ని సృష్టించడమైనప్పుడు ఈ మాటలకర్థం ఏవిటి? ఆ మారిన సమాజంలో వచ్చిన క్రొత్త సాంప్రదాయంలో వుండే తప్పొప్పులకు బయటిశక్తులను కారణంగా చూపించి, ఆ తప్పులకు ముసుగు కప్పాల్సిన అవసరం లేదు. ఆ తప్పులకు, క్రొత్త సాంప్రదాయంలో పతనమైన విలువలకు, కారణం వలస రాజ్యవైనా, ఆ తప్పులని సంస్కరించుకునే భాద్యత మన సమాజానిదే.
“అప్పారావుగారు తన నాటకంలో దిగజారిపోతున్న సమాజాన్ని, నైతికంగా పతనమవుతున్న సమాజాన్నీ సమర్పించలేదు. నైతిక వైరుధ్యం సమాజంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా తలయెత్తితే ఆ సమాజం తనకు తానుగా మార్పు తెచ్చుకోగల స్థితిలో ఉన్నది కాని, సాంఘిక సంస్కరణకోసం ఎదురు చూడలేదు.” నిజవేనండీ, ఏ సమాజవైనా తన నడకలో, అప్పుడప్పుడూ ఒకటి రెండడుగులు వెనకకు వయ్యడం సహజవే, ఆ అడుగుల్ని సరిచేసుకోని ముందుకు పోవడం సహజవే. కాకపోతే ఆ సరిచేసుకునే క్రమంలో, సంఘసంస్కరణ, సంఘసంస్కర్తలు అనే అంశాలు కూడా సహజవైనవే. సంఘసంస్కరణ సమాజం తనని తాను సరిచేసుకునే క్రమాన్ని మరింత వేగవంతం చేయడం కోసం, సమాజంకన్నా ఒకటిరెండడుగులు ముందుకు చూడగలిగిన (అన్ని విషయాల్లో కాకపోవచ్చు, అన్ని కాలాల్లో కాకపోవచ్చు) వ్యక్తుల ప్రయత్నం. ఆ సంస్కర్తలు తమకన్నా వొకడుగు వెనకబడిన వాళ్ళని సంస్కరించడానికి, తమకన్నా వొకడుగు ముందరున్న వాళ్ళని వెలివేయడానికి (మిగిలిన చాంధసులలాగానే) చూస్తారు. అప్పారావుగారి సౌజన్యారావు పంతులు ఈ సంస్కర్తలలో వుండే ఈ ద్వందాన్ని చూపించడానికేనని నా అభిప్రాయం. ఐతే వొక్కడుగు ముందుచూపున్న ఈ సంస్కర్తలని మనవీరోజు వాళ్ళకి రెండడుగుల ముందుచూపు లేదని విమర్శ చేయాల్సిన పనిలేదు, అసలు ముందుచూపే లేని సమాజంలో కనీశం ఆ మాత్రంముందుచూపు కలిగిన సంస్కర్తలు ఆ సమాజ మార్పుకి కేటలిస్ట్లాగా ఎంతో ఉపయోగపడ్డారు. అప్పారావు గారికి ఈ విషయం తెలుసుగాబట్టే సౌజన్యారావు పంతులుగారిని సృష్టించారని నా అభిప్రాయం. ఈ వొక్క పాత్ర చిత్రణలోనే అప్పారావు గారు అప్పటి సమాజానికాన్నా ఎంత ముందున్నారో మనకర్థవవుతుంది. లోపాన్ని ఎత్తి చూపించటం సంఘ సంస్కర్తలని తేలికపరచడవో, అగౌరపరచడవో, లేకపోతే ఆ సంఘసంస్కరణని గేలిచేయడవో కాదు.
“ఈ సమాజం తనపై తనకి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేటంత వత్తిడి బ్రిటీషు వలస విధానం తెచ్చిపెట్టిన ఉధృతం. ఇందుచేత పైకులాలు తమ ప్రాథమిక యోగ్యతలని మరిచిపోవడం జరిగింది.” అంటే పై కులాలు తమ ప్రాధమిక యోగ్యతలని మరచిపోకపోవడవే మన హిందూ సమాజాన్ని సరిఅయిన దారిలో వుంచుతుందా? అసలు ఏ సమాజం తెచ్చిన వత్తిడి పైకులాల్ని సృష్టించిందో మరి. ఏ వుధృతి, ఏ వత్తిడి సమాజాన్ని కులాలుగా విభజించిందో? ఆ యోగ్యతలని మరచిపోయి దిగజారిన పైకులాల్ని కొంచం పైకి లాగి పూర్తిగా కాకపోయినా కొంచంగానైనా మిగిలిన కులాల సరసన కూర్చోబెట్టింది ఆ వలస పాలన వత్తిడేనేవో.
నాటకంలో ఏడవ అంకం ఆఖరి రంగాన్ని క్లుప్తంగా వివరించిన తర్వాత, వేలూరిగారు, ఆ అంకంలో మధురవాణి పాత్ర మీద తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వివరించారు. “సౌజన్యా రావు కున్న అమాయకత్వపు సంస్కరణాభిలాష దెబ్బతియ్యడానికి మధురవాణి బృహన్నాటకం ఆడుతూ వుండవచ్చు. ఆధునికుడు, పాశ్చాత్య ప్రాభవంలో పెరిగిన పెద్దమనిషి, నీతులు వల్లించే వాడికి గుణపాఠం చెప్పడానికి మధురవాణి వచ్చి వుండవచ్చు. లేదా, కాలం మారుతున్నది; తన దగ్గిరకి గౌరవనీయులైన వాళ్ళెవ్వరూ రారేమో నన్న భయం పుట్టి వుండవచ్చు. — ఏది ఏమో? వీటికి సమాధానం అప్పారావుగారికే తెలియక పోవచ్చు!” ఇన్ని రకాలుగా విశ్లేషించగలిగిన వేలూరిగారు, ఆ అంకాన్ని చదవగానే, మనసుకి తోచే అత్యంత సరళవైన, సహజవైన, నాటకంలో చెప్పిన కారణాన్ని మాత్రం మర్చిపొయ్యారు. వయసు పైబడిన, చేయనినేరానికి శిక్ష పడే అవకాశమున్న, ఆ చెయ్యని నేరం ఆ బాపడి తలమీద పడటంలో తన పాత్ర గురించి తెలిసిన వొక మంచి మనిషిగా లుబ్ధావదాన్లుకి సహాయం చేయడం కోసవే మధురవాణి పంతులుగారింటికి వెళ్ళిందనే విషయం. ఇంత సరళవైన, సహజవైన విషయం వేలూరిగారికి ఎందుకు తట్టలేదో మరి. వెళ్ళిన తర్వాత, పంతులుగారి వెనకనున్న నలుపు, పంతులుగారికి కనిపించకపోతే దాన్ని తెలివిగా ఎత్తిచూపించటం, పంతులుగార్ని అవమానం చెయ్యడానికి కాదని తిరిగి చెప్పల్సిన అవసరం లేదు. వేశ్యని చూడటానికి, మాట్లాడడానికి కూడా విముఖుడైన పంతులు గారు, మధురవాణికి భగవత్ గీతని బహుకరించి, తనతో షేక్ హేండ్ చేయటంలోనే, తన తప్పుని గ్రహించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వేలూరిగారు ఇంత అసహజవైన విశ్లేషణ ఎందుకు చేశారో తరువాతి పేరాలో అర్థమవుతుంది. వేలూరిగారి మాటల్లోనే వారి వివరణ ఇలా సాగుతుంది. “ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ; ఆ సంస్కరణలో నిజమైన సాంఘిక విలువ ఏమీ లేదు. ఈ సంస్కరణ ఘోష కేవలం వలస రాజ్య విధానం వల్ల ఏర్పడ్డ బూటకపు మాయ అని బోధపడుతుంది.” ఇదండీ అప్పారవుగారు కన్యాసుల్కం నాటకం వ్రాయడంలో ఉద్దేశం, వీరేశలింగం పంతులుగారిని వేళాకోళం చేయడానికే. అప్పారవుగారి ఉద్దేశం సంఘసంస్కరణ కాదట, సంఘంలో వుండే నీచ సాంప్రదాయాల్ని పైకెత్తి చూపించడం సంస్కరణాకాంక్ష కాక మరేవిటో. ఆ సంస్కరణలో నిజవైన సాంఘీక విలువ లేదుట. ఏ సంస్కరణలో వేలూరి గారూ? తెలిసీ తెలియని లేత వయసులోనే ఆడ కూతుళ్ళని, చావుకి జానెడు దూరంలో వున్న ముసలాళ్ళకిచ్చి కట్టబెట్టటలో వున్న నీచత్వాన్ని చూపించడంలోనా? లేకపోతే, పరిష్కారం చూపించకుండానే, మూర్ఖంగా మరికొందరాడ కూతుళ్ళని పొగపెట్టి తరివెయ్యడం అనే సంస్కరణలో వుండే మూఢత్వాన్ని బహిర్గతం చెయ్యటంలోనా? మీకు దేంట్లో సంఘసంస్కరణాభిలాష కనపళ్ళేదు సార్.
ఈ అసహజ విశ్లేషణ తర్వాతి కొద్ది పేరాల్లో అబద్దాల జాతరగా పరిణితి చెందుతుంది. “నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. పూజారి, పోలీసు, సేవకులు, స్కూలు పిల్లడు, పెళ్ళికొడుకు కూతురు (మీనాక్షి) అంతా ఈ పెళ్ళి కుదిర్చిన జిత్తులమారి రామప్పంతులునీ, పెళ్ళికొడుకుని మూర్ఖులుగా బయట పెడతారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ఎవరో, సౌజన్యారావు లాంటి అమాయకులు, సమాజం కుళ్ళిపోయిందని భ్రమించి, ఆ భ్రమని నమ్మి, సంస్కరించేద్దామన్న కుతూహలంతప్ప?”
మీరే కన్యాశుల్కాన్ని విశ్లేషిస్తున్నరో అని అనుమానంగా వుంది వేలూరి గారు. గురజాడ గారి కన్యాశుల్కంలో మీరు మీ మనసులో ఏఏ మార్పులు చేసుకున్నారో, ఏఏ చేర్పులు చేసుకునారో! నే చదివిన కన్యాశుల్కంలో, పెళ్ళీ ఆపడం కోసం బావిలో దూకి ప్రాణం తీసుకోడానికి సిద్ద పడిన సుబ్బి అమ్మ, మేన కోడలు బతుకు బండలై పోకుండా వుండాలని కరటక శాస్త్రి, చెల్లెలి బతుకు తన బతుకులా నాశనవై పోకూడదని లేచిపోవడానికి తెగించిన బుచ్చమ్మ, కరటక శాస్త్రితో వున్న పరిచయంతో, తోటి మనిషికి తనవంతు సహాయం చెయ్యడానికోచ్చిన మధురవాణి, తెలొసో తెలియకో కరటక శాస్త్రి చెప్పేడు కాబట్టి శిష్యుడు మహేశం తప్ప సుబ్బి బాగు కోసం పెళ్ళి అపాలనుకున్న వాళ్ళు మరెవరూ నాకు కనపడలేదు సార్. తన సౌభాగ్యం ఎంత బాగుందో ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మీనాక్షి కూడా పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేసిందని చెప్పలేం ( తన పరిస్థితిలో తన పరిధికి మించిన విషయమే కాదనలేం).
ఇంతకాలం ఈ నాటకాన్ని విమర్శకులు సరిగా అర్థం చేసుకోలేక పోయారట, పసిపిల్లకి వైధవ్యాన్ని తెచ్చిపెట్టే సంస్కృతి, కుళ్ళిపోఇందని భ్రమ పడ్డారట, ఈ పరిస్థితిని సంస్కరణల ద్వార మార్చాలని ఈ నాటకం భోధిస్తున్నదని ఆపోహ పడ్డారట. ఈ ఆపోహకి వేల్చేరు నారాయణరావు గారు నాలుగు కారణాలిచ్చారట. వేల్చేరు గారి కారణాలేవో నేను చదవలేదు, అందుకని వారి కారణాల గురించి నేను మాట్లాడటం పద్దతికాదు.
ఏ వలస సమాజపు విలువలు, మరే మత విలువలతోనూ సరి చూసుకోనవసరం లేకుండానే, చిన్న పిల్లలని అమ్ముకునే సమాజపు విలువలు అతి నీచవైనవని చెప్పోచ్చు. ఐతే ఆ నిజాన్ని త్రొక్కి పట్టడానికి, పద్దెనిమిది, పంతొమ్మిదో శతాబ్దపు బ్రాహ్మణవర్గ సమాజాన్ని పైకెత్తటానికే కన్యాశుల్కానికి, ఈ అసంబద్దవైన, అసహజవైన, అశాస్త్రియవైన విశ్లేషణల అవసరంపడిందని నా అభిప్రాయం.
ఈ వ్యాసానికి ఆలంబనలుగా పలు రెఫరెన్సులు, ఆ తర్వాత అనుభంధంలో పలువురి అభిప్రాయాలు ఇవ్వడం జరిగింది. ఐతే ఇక్కడొక్క విషయం చెప్పదలుచుకున్నను. ఈ నాటకవేవీ అతి క్లిష్టవైన scientific concept కాదు. ముందు వెనుకల చరిత్ర పఠనం, క్రొత్త పరిశోధనా పద్దతులు, కనీసం పాత పరిశోధనా పద్దతులు, గతితార్కిక భౌతికవాదం, మాక్సిస్టు వివరణలు, హైజాకులు, ఇవేవీ అవసరం లేకుండానే గురజాడ వారు ఏంచెప్పేరో, ఎందుకు చెప్పేరో, ఏ తప్పుల్ని హైలైట్ చేయదలుచుకున్నరో, ఏ వాస్తవాల్ని, ఏ మూఢత్వాల్ని, ఏ నీచాల్ని, ఏ అవినీతిని, మనుషుల్లో వుండే ఏ మంచి చెడుల్ని, మంచి మనుషులనబడే వాళ్ళలో ఏ చెడ్డని, చెడ్డవాళ్ళనబడే వాళ్ళలో ఏ మంచిని, ఆ కాలపు సంఘానికి తలమానికవనబడే కులంలో కనపడే నీచ సాంప్రదాయాల్ని, అతి సళంగా, అతి మెలుకువగా, ఎక్కడా ఏ విమర్శకుల, విశ్లేషకుల అవసరంలేకుండా, అతి సామాన్య పాఠకుడికి సైతం అర్థవయ్యేరీతిలో చెప్పేరు. ఈ నాటకంలో, అక్షరంలో కనపడని వివరణలకోసం, విశ్లేషణలు చేయడవంటే, చురుక్కుమనే నిజవేదో కన్యాశుల్కంలో మనకి తగిలిందనమాట.
కన్యాశుల్కం నాటకం గురజాడ వారు నిజంగా సంఘసంస్కరణోద్దేశంతోనే వ్రాశారో లేక వీరేశలింగం పంతులుగార్ని ఆట పట్టించడానికే వ్రాశారో ఆ చరిత్రనధ్యయనం చేసినవారు చెప్పాలి గాని నాలాంటి వాడి వల్ల కాదు. నేనీ నాటకాన్ని మొట్టమొదటిసారిగా 1970లో చదివినట్టు గుర్తు. నాటకం చదివే ముందు ఆ నాటకం గురించి ఒకటి రెండు వ్యాసాలు కూడా చదివినట్టు గుర్తు. ఈ నాటకం చదవడానికి ప్రేరణ ఆ వ్యాసాల్లో చదివిన విషయాలు – ముఖ్యంగా సాంఘిక దురాచారాల్ని రూపుమాపడానికి ఈ నాటకం ఎంతగా ఉపయోగపడిందో, చెప్పదల్చుకున్న విషయాన్ని హాస్యరసభరితంగా చెప్పాడో రచయిత అని చదవడంవల్ల. సరే నాటకం చదివితే కలిగే అనుభూతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే అప్పట్లో నన్ను కొంచెం తికమక పెట్టిన విషయం, మధురవాణి, సౌజన్యారావు పంతులు మధ్య జరిగిన సంభాషణ. సౌజన్యారావంతటి ఆదర్శ న్యాయవాది, మధురవాణి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక పోవడం. ఇందులో ఏదో నాకు తెలియని అంతరార్ధం ఏదో ఉందని అనిపిస్తున్నా, అది ఇదమిద్ధంగా తేలలేదు. సౌజన్యారావు చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదేమోననిపించినా, ప్రశ్నించడానికి ధైర్యం, అనుభవం చాలలేదు. దానిక్కారణం చాలావరకు అంతకు ముందు చదివిన వ్యాసాలు కూడా కారణమనుకుంటాను (వ్యాసకర్తలు గురులేరు). ఆ తర్వాత సినిమా చూడడమేగాని మళ్ళీ పుస్తకం చదవలేదు. ఇన్నాళ్ళ తర్వాత వెల్చేరు గారి అనువాదంలో ఉన్న మలిపలుకు చదువుతున్నప్పుడు ముప్పైయేడేళ్ళనాటి ప్రశ్నలు మళ్ళీ గుర్తుకు రావడం, వాటికి సమాధానాలు దొరకడం కూడా జరిగింది. కన్యాశుల్కం నాటకానికి అప్పట్లో సామాజిక ప్రయోజనం ఉన్నా, రచయితకు సంఘసంస్కరణోద్దేశం ఉన్నా, సంఘసంస్కర్తల్లో ఉన్న హిపోక్రసీని మాత్రం చక్కగా అద్దంలో చూపిస్తుంది. పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్న వారిలోని ద్వంద ప్రవర్తనలకి (అగ్నిహోత్రావధాన్లు, రామప్పంతులు, వగైరా) అద్దం పట్టడం సరేసరి. సౌజన్యారావుకి మిగిలిన పెద్దమనుషులకీ ఆట్టే తేడాలేదనిపిస్తుంది, చివరి ఘట్టం చదివేటప్పటికి. ఇది నాటకం చదివినప్పుడు అర్ధంకాకుండా కుమ్మరి పురుగు తొలిచినట్టు వేధించి, ఇన్నాళ్ళకి వెల్చేరు గారి మలిపలుకుతో తేలికపడింది. ఇంతవరకు ఈ నాటకంపై ఎంతమంది వ్యాఖ్యానాలు చేసినా, ఇంత సమగ్రంగా మొత్తం నాటకానికి సరిపడే విశ్లేషణ వ్రాసిన వెల్చేరు గారికి ధన్యవాదాలు. ఈ నాటకంపై ఉన్న రకరకాల వ్యాఖ్యానాల దృష్ట్యా వెల్చేరు గారు ఈ విశ్లేషణను తెలుగులో కూడా ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అయ్యా తిమ్మిరెడ్డిగారు…అసలు విషయాని మీరిట్టా బమ్మిని చెయ్యడం సమయోచితంగాలేదు. మీలెక్కన రారా, చేరా వగైరాల్ని తోసవతల పారేద్దాం. ప్రతి దద్దమ్మనీ కవిత్వం గురించి రాసేయమనేద్దాం. కత్తెర పట్టుకొన్నాడుగదాని దర్జీని కూడా ఆపరేషను ధియేటర్లోకి వొదిలేద్దాం.
పాఠకుడిగా విఫలమైన క్రిష్న గారు విమర్శకుడిగా అవతరించడంతోనే సిసలైన అసంబద్ధత బయలుదేరింది. సదరు అసంబద్ధత మాబాదిగ గారితో పరుగులెట్టడం మొదలెట్టింది. చివరకు క్రిష్నగారు ఆవకాయ గురించి అనర్గళంగా ప్రసంగించడంతో శిఖరాగ్రం చేరింది. హమ్మయ్య అక్కడితో అసంబద్ధం శాంతించిందని సంతోషించేలోగా మీతో మళ్ళీ మొదలైంది. ఈ విపరీత అసంబద్ధత ముందు మీరు నాకు ఆపాదించిన “అసభ్యత” యేపాటి?
//కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం// అని అనడం మీ సభ్యతేవో !! కానివ్వండి.
రవిశంకర్ గారి కవితలో విస్తరణ దోషముంది. సాగతీత వుంది. మీరన్నట్టు సూపర్ కండక్టివిటీ, రేడియోయాక్టివిటీ గట్రా యేవీ లేవు. మీరుత్తినే ఆపాదించేస్తే సరిపోదు. మీమాటల్లోనే చెప్పాలంటే “కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని వానపాట ద్వారా రవిశంకర్ గారు నిరూపించారనే నేననుకుంటునాను”
మఠాధిపతులు, పీఠాధిపతులు,ముఠాధిపతులు వీరంగం జేస్తున్న వర్తమాన తెలుగు సాహిత్య ప్రపంచంలో స్వచ్ఛమైన అక్షరం కోసం తపించడం నేరం.భుజకీర్తులు భజనబృందాలు లేకపోవడం లోపం.వాదాలు బూజులు దులుపుకోవడం ద్రోహం.
అరణ్య కవితలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
09/16/2007 12:35 pm
కవిత్వం గురించి ఫలాని, ఫలాన వాళ్ళు ఏం చెప్పేరో, విమర్శ గురించి, విశ్లేషణ గురించి ఏఏ పెద్ద తలకాయలు ఏం చెప్పెయో తెలుసుకున్న వాళ్ళే విమర్శ చేయదగ్గ వాళ్ళనే స్వరం వొకటి ఈ కవిత మీద వచ్చిన అభిప్రయాల్లో వినిపిస్తుంది. ఐతే వాళ్ళు చెప్పిన కవిత్వ లక్షణాలు కానీ, వాళ్ళు కవిత్వానికిచ్చిన నిర్వచనాలుగానీ, వాళ్ళు స్థిరీకరించిన విష్లేషణా పద్దతులు కానీ తెలీకుండానే, తెలుసుకోవాల్సిన అవసరంలేకుండానే, తెలుగొచ్చిన ప్రతివాడికీ, ఫలాని కవిత తనకు నచ్చిందో, నచ్చలేదో, నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పగలీగే ఙ్ఞానం వుందని నా నమ్మకం.
కృష్ణ గారి అభిప్రాయంతో మొదలైన ఈ చర్చ, మూలా సుబ్రహ్మణ్యం గారి జవాబుతో దారి తప్పిపోయి, అలోక్ గారి అభిప్రాయంతో అసభ్యత వైపు జారిపోయిందేవో అనిపిస్తుంది. “మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని,” కృష్ణ గారికి మూలా గారు జవాబియ్యటంతోనే అసంబద్దవైన వాదం మొదలైందనిపిస్తుంది. ఒక కవితలో వుండేటటువంటి అందాన్ని, అర్థాన్ని, అనుభవాన్ని, అనుభూతిని కష్టపడి తవ్వితీయవలసిన అగత్యం, అవసరం పాఠకుడికి లేదనే నేను భావిస్తాను. రచయిత తన అనుభవాన్ని, తనలోని ఉద్వేగాన్నీ కవిత ద్వారా పాఠకుడికి ట్రాన్ఫర్ చేయలేకపోవటం ఆ రచన బలహీనతని సూచిస్తుందే తప్ప పాఠకుడి అవివేకాన్ని కాదు. ఉదాహరణల కోసం ఎక్కడకో పోవాల్సిన అవసరం లేదు, ఇదే సంచికలో ప్రచురించబడినట్టి విన్నకోట రవిశంకర్ గారి “వాన-పాట” నే ఉదాహరించ వచ్చు. అందం, భావుకతా రెంటిలోనూ వుండొచ్చు, కానీ వాన-పాటలో వున్నటువంటి కవితకి ఆత్మలాంటి ఆ సూపర్కండక్టివిటి, రచయిత ఎమోషన్ ని పాఠకుడి మనసులోకి ట్రాన్ఫర్ చేసి, కవిత చదివేసిన తర్వాత కూడా, మనసుని వదలిపోని వొక ఉద్వేగాన్ని సృష్టించగలిగే ఆ శక్తి మూలా గారి కవితలో లేదు. కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం. దళిత కవిత్వం, లేక అయావాద కవిత్వాలని తలకెక్కించుకోని ఈ అభిప్రాయం చెబుతున్నానని, లేక ఫలాని వారి విమర్శనాత్మక పుస్తకం చదవకపోవటం వలననో, లేకపోతే నా సహజవైన అవివేకంవలననో ఈ కవితమీద ఈ అభిప్రాయానికి వచ్చానని ఎవరైనా భావిస్తే వారి వివేకానికి సంతోషిస్తాను. కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని అరణ్య కవితల ద్వారా మూలా గారు నిరూపించారనే నేననుకుంటునాను.
మన పిల్లకు ప్రాణం మీదకు వచ్చినప్పుడు, మనకు ఆసరాగా నిలబడ్డవాళ్ళు కాకపోతే, మనోళ్ళు ఇంకెవరండీ? వాళ్ళకు సాయం చేసే అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అంతే! బావమరిది వస్తే? వుంటాడు! నవీన్ వాళ్ళు వీళ్ళకు ఎంత పెద్ద help చేశారో, చెప్పి మరీ వెళ్లాలి. నా ఉత్తమార్థభాగం సతీష్ స్థానంలో ఉంటే, airport నుండి, సరాసరి నవీన్ వాళ్ళింటికే వెళ్ళి,అక్కడ్నించి నాకు ఫోన్ చేసి, వాళ్ళ పని పూర్తి అయ్యాక ఇంటికొస్తాడు. అవసరమైతే నన్ను కూడా రమ్మంటాడు. అందుకు నేనేం అభ్యంతరం చెప్పను. నేనేదో గొప్ప చెప్తున్నాననుకోకండి! మేము USA లో ఉన్నప్పుడు, నవీన్ లాంటి అనుభవాలే మాకూ కొన్ని ఎదురయ్యాయి.కాని మేము మాత్రం, reviev గారు చెప్పినట్టు,
సాయం చెయ్యడమే మన ధర్మం,
మనకు అక్కరకు రావడమా, మన కర్మం..
అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నాం! అవుతూనే ఉంటాం!
ఎదుటి మనిషి అవసరానికో, కష్టానికో, స్పందించలేకపోతున్నామూ..అంటే, మానవత్వం నెమ్మదిగా మనలోంచి జారుకుంటోందన్నమాట! (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం)
న్యాయంగా, వేల్చేరు వారి పుస్తకం చదవకుండా నేనేమీ comment చెయ్యకూడదు. కానీ ఈ సమీక్షలోని కొన్ని విషయాలు ఆసక్తిని కలిగించడం వల్ల ఇది రాస్తున్నాను.
“ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ;”
ఇది వేల్చేరువారి ఊహో వేలూరివారి ఊహో తెలియదుకాని వీరేశలింగాన్ని వేళాకోళం చెయ్యడంగా ఊహించడం కొంత అతిశయంగా తోస్తోంది. గురజాడకి కందుకూరి మీద గౌరవం ఉందన్న విషయం అతని డైరీలూ, ఉత్తరాలూ చదివితే తెలుసే విషయమే. అందుచేత అతన్ని వేళాకోళం చేసేడని నేననుకోను. అతను చేపట్టిన సంఘ సంస్కరణలోని పరిమితులని వ్యంగ్యంగా సూచించేడని మాత్రమే చెప్పగలం. అలాగే రచయిత ముఖ్యోద్దేశం సంఘసంస్కరణ కాదు అనడం కూడా పూర్తిగా సమంజసం కాదు. ఇక్కడ సంఘసంస్కరణ అంటే వీరేశలింగంగారు చేపట్టిన సంఘసంస్కరణ అన్న ఉద్దేశంలో అన్నారా? సంఘంలోని లోటుపాట్లను ఎత్తిచూపడం ద్వారా కూడా సంఘాన్ని సంస్కరించే ప్రయత్నం చెయ్యవచ్చు అని ఒప్పుకుంటే, గురజాడ కన్యాశుల్కంలో ఆ ప్రయత్నం చేసాడన్నది ఒప్పుకోవలసిన విషయం.
“నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ”
ఒక్క మధురవాణి పాత్ర తప్ప, మిగతా అందరూ తమ తమ స్వార్థం కారణంగానే సుబ్బి పెళ్ళి ఆపడానికి సాయపడతారు. ఇందులో ఆనాటి సమాజం అటువంటి పెళ్ళికి వ్యతిరేకం అన్న విషయం ఎక్కడా కనిపించదు.
లుద్ధావధానుల పాత్రలోని పరివర్తన ద్వారా ఆనాటి ప్రజలలో రావల్సిన మార్పును సూచించాడు. చివరికి బుచ్చమ్మను కూడా సంస్కరణోద్యమంలో భాగమైన విధవల పునరావాస కేంద్రంలో చేర్పించడం ద్వారా తన సంఘ సంస్కరణాభిలాషని చాటుకున్నాడు.
అసలు గురజాడే స్వయంగా ముందుమాటలో
“When I wrote the play, I had no idea of publication. I wrote it to advance the cause of Social Reform and to combat a popular prejudice that the Telugu language was unsuited to the stage. ” అని చెప్పుకున్న తర్వాత, సంఘసంస్కరణ అతని ముఖ్యోద్దేశం కాదని అనడం చాలా సాహసమే! మరి అతనన్న “Social Reform” ఏమిటి?
నా ఉద్దేశంలో. కన్యాశుల్కం రచనా ధ్యేయం, ముమ్మాటికీ, సంఘంలోని లోటుపాట్లని ఎత్తిచూపడం ద్వారా సంఘసంస్కరణకి దోహదం చెయ్యడమే. ఐతే గురజాడ ఆధునిక నాటకాలలోని వాస్తవికతా లక్షణానికి ప్రభావితుడై, తన నాటకంలోపాత్రలని మూస పాత్రలుగా కాక, సమాజంలోని వివిధ రకాల మనుషులని వారి సహజ స్వాభావాలకి దగ్గరగా తీర్చిదిద్దాడు. ఈ కారణం వల్లనే మనకి నాటకంలో అటు మత మౌఢ్యంతో దురాచారాలకి పాల్పడే వారూ కనిపిస్తారు, ఇటు ఆధునికత/సంస్కరణ పేరుతో మోసాలుచేసే ఆసాములూ కనిపిస్తారు.
కన్యాశుల్కంలో మచ్చలేని (ఆ కారణంగా పూర్తిగా కాల్పనికం అనుకోదగ్గ) ఒకే ఒక పాత్ర మధురవాణి.
Velceru garu might have given more explanation on his proposition in the book and thus answers to my above questions/argument. But as I said, my curiosity has prompted me to put my comments here.
అరణ్య కవితలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
09/10/2007 4:55 pm
ఈ కవితను చదవగానే, ప్రత్యేకముగా చివరి పంక్తులను,
ఎందుకో నాకు విల్లియం వర్డ్స్‌వర్త్ వ్రాసిన క్రింది పద్యము
జ్ఞాపకానికి వచ్చింది. చాల మంది ఈ పద్యాన్ని బడిలో
చదివే ఉంటారు. ఆ పద్యము –
She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love:
A violet by a mossy stone
Half hidden from the eye!
Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!
ఓహో మీరు క్రిష్న గారు కాదా? కానీ మీరిద్దరూ గుంటూరు శేషేంద్రశర్మ గారినే ఉటంకిస్తారా? “వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? ” అని క్రిష్న గారంటే “అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా” అని మీరడిగారు. ఇద్దరి వాదనలూ అర్ధరూపాయి గాదు రెండు పావలాలన్నట్టే వుంది !! సర్లేండి మీరిద్దరూ ఒకటా వేరా అన్నది దండగమారి విషయం.
“కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ”
మీలాంటి లోతైన అధ్యయనశీలి కం పాఠకుడు ఇట్టాంటి ఉబుసుపోని ప్రశ్న వెయ్యడం విచారకరం. లాజిక్కు లేనిదంతా కవిత్వమా అన్న ప్రశ్నలో మీ భోళాతనం, నేటి తెలుగు సాహిత్య పాఠకుని దివాలాతనం కనపడుతోంది. సంతా సింగు బంతాసింగు జోకుల్ని కూడా అద్భుతమైన కవిత్వం అనే మరో తరం త్వరలోనే పుట్టుకొచ్చే సూచనలు కనపడుతున్నాయ్.
కవిత్వానికి లాజిక్కు బద్ధశతృవు. సృజనాత్మకతకు లాజిక్కే పునాదైతే క్రిష్న గారు ఇక్కడే వున్న రవిశంకర్ గారి కవితలో “అద్భుతమైన చిత్రా”న్ని ఎట్లా చూడగలిగారో లాజికల్ గా చెప్పమనండి. పూలదోసిళ్లతో చెట్లు నీళ్ళు పట్టుకోడమేవిటి? చలిగాలి మనసుని కోయడమేవిటని కవిగారు వచ్చి లాజికల్ గా వివరించనివ్వండి. ఇంత లాజికల్ సర్కసూ జరిగాక కవిలోనూ, పాఠకునిలోనూ సున్నితత్త్వం, సృజన బతికుంటుందో లేదో మీరొచ్చి చెప్పండి.
“ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది” అని క్రిష్న గారు అసంబధ్ధంగా బాధ పడగాలేంది నేనేసిన ప్రస్న ఎట్లా అసంబద్ధం మాబా గారూ? ఈ కవితలో కవెక్కడా భాషని చట్టుబండలు కానివ్వలేదే? ఇక్కడెవరో “అల్లాష్టకం” అని రాస్తే గౌ. సంపాదకులు గారు దాన్ని కవిత్వం కింద జమకట్టారు. ఆ అల్లాష్టకం కంటే ఈ కవితేమీ ఘోరంగా లేదే? మరి క్రిష్న గారు సడెన్ గా భాష గురించి కిందా మీదా పడ్డం అవసరమేనా? సంబద్ధమేనా?
ముందు వీటికి సూటిగా ఇద్దరూ కూడబలుక్కుని సమాధానాలివ్వండి. సెలయేటి అలల గురించి చెప్పడం ఆనక….
చివరగా, రాగాల గురించి తెల్సుకొన్నవారు సంగీతాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలరు. పాడాలని వుంది కార్యక్రమంలో పాల్గొన్న 10 ఏండ్ల పాపకు కూడా ఈ సంగతి తెల్సును.
కన్యాశుల్కం గురించి ఎందరో ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు, చేస్తున్నారు. రచయితగా, నాటకకర్తగా ఎంతో ప్రతిభావంతుడైన అప్పారావుగారు ఈ నాటకం చదువుతున్నప్పుడు మనకు సంఘసంస్కర్త రూపంలో కాక తీవ్రమైన విమర్శకుడుగానూ, వ్యాఖ్యాతగానూ కనిపిస్తాడు. ఆయన విమర్శించిన విషయాల్లో సంఘ దురాచారాలూ ఉన్నాయి; సంఘసంస్కర్తలుగా చలామణీ అవుతూ పబ్బం గడుపుకునే దగాకోర్ల వ్యవహారాలూ ఉన్నాయి.
ఈ రోజుల్లో అనాథాశ్రమాలు నిర్మించి డబ్బులు దండుకునేవాళ్ళున్నట్టే ఆ రోజుల్లోనే వీరేశలింగంగారు సదుద్దేశంతో తలపెట్టిన మంచి పనులను దుర్వినియోగం చేసుకునేవారూ ఉండేవారనే సంగతి ఈ నాటకంవల్ల మనకు తెలుస్తుంది. ఎటొచ్చీ ఇటువంటి ఆషాఢభూతుల వల్ల కలిగే హానికన్నా సంఘంలో ప్రవర్తిల్లుతూ ఉండిన దురాచారాలు ఎక్కువ ప్రమాదకరం కనకనే కన్యాశుల్కం నాటకాన్ని వాటిని ఎత్తిచూపినదిగా అందరూ గుర్తించారు.
నాటకమంతా డామినేట్ చేసిన గిరీశం కుయుక్తులను ఎవరూ మిస్ అవరు. సంఘసేవను తప్పుదోవ పట్టించ ప్రయత్నించినవాడుగా అతను కనబడుతూనే ఉంటాడు. అయితే అతని వ్యక్తిగత దోషాలూ, బలహీనతలూ సంఘ దురాచారాలంత తీవ్రమైనవిగా అనిపించవు. అందుకే మనం అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతులు తదితరుల వైఖరిని ఎంతో గర్హనీయంగా పరిగణిస్తాం. గిరీశాన్ని చూసినప్పుడు మాత్రం ‘బాగా అయింది శాస్తి’ అని నవ్వుకుంటాం. పై వర్గంతో పోలిస్తే గిరీశం అంతటి దుర్మార్గుడుగా మనకు అనిపించడు. పైగా నాటకంలో గిరీశం ఒక్కడే ఆధునికుడు. అయితే ఆధునికతలోని ఇతర లక్షణాలతో బాటు దాని అవలక్షణాలూ అతనిలో ఉంటాయి. పాతుకుపోయిన దురాచారాలకు ప్రతీకలు వారైతే వారి అవివేకాన్ని ఆసరాగా చేసుకుని లాభం పొందేవారికి ప్రతీక గిరీశం.
మొత్తం మీద అన్నీ వాస్తవికత ఉట్టిపడే పాత్రలే. సజీవమైనవే. అందుకే కన్యాశుల్కం అందరికీ ప్రీతిపాత్రమైంది. మార్క్సిస్టులు కనాశుల్కాన్ని హైజాక్ చేశారని నేననుకోను. (వారికి నచ్చింది కదా అని దాన్ని మరికాస్త అనుమానంతో చూడాలనీ అనుకోను). ఎవరికి నచ్చిన అంశాలను వారు మెచ్చుకుంటారు. ఈ నాటకానికి వీరాభిమానుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు వంటి ఉద్దండులుండేవారు. మనకన్నా అప్పటి పరిస్థితులు వారి తరంవారికి మరింత బాగా తెలుసు. తక్కినవన్నీ పక్కన పెట్టినా కేవలం భాష, యాసల విషయంలో కూడా చాలామందికి అదెంతో ఆహ్లాదకరమైన రచన.
అప్పటి సామాజిక సమస్యలు ఈనాడు లేకపోవచ్చు. ఇప్పటికీ మనలో ఎందరిలో అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతుళ్ళు, లేదా వారి లక్షణాలు, కనబడుతున్నాయనేదే ముఖ్యం. అందువల్లనే ఈనాటికీ కన్యాశుల్కం రెలెవెంట్ గా అనిపిస్తుంది.
కథ లో సమస్య వివరించారు కాని పరిష్కారం చూపలేదు.ఆర్దిక స్వాతంత్ర్యం లేనపుడు బానిస బతుకు కింద లెక్క. కాని వ్యవస్త తీరు లో మహిళ బానిస కు బానిస మాత్రమే. మగవాళ్ళ జీవితం కూడా కార్యాలయాలలొ బానిస జివితమే కాదంటారా. ఇరువురి మద్య వ్యక్తిత్వ పోరాటం లో పిల్లల విషయం సమస్య గా మారుతుంది. నేను కథ చదువుతున్నపుడు అలాగే వెలుతుంది అనుకున్నాను. శశాంకె బాల్యంలో తను కొల్పోయిన ఆత్మీయత గురించి చెపతాడనుకున్నాను. ఉత్పత్తి కంటే పునరుత్పత్తి గొప్పది. పిల్లలని వుంచె క్రెచెస కి వెల్లి చూస్తె సంపాదన, వ్యక్తిత్వం, హక్కుల పోరాటం లో మద్యలో నిజంగా నలిగి పోతుంది వాళ్ళే అనిపిస్తుంది. కథలో చివరికి నలుగురిలో గుర్తింపు కోసమే ఉద్యోగం అనడం సమస్యను పక్కదారి పట్టించినట్టు అయింది. స్వేచ్చ కోసం చేసే పోరాటం గుర్తింపు కోసం చేసే పోరాటం వేరు. హక్కుల కోసం పోరాటం చెసేటపుడు ఇతరుల పట్ల బాద్యతను గుర్తెరుగుతారు. ఉమ్మడి కుటుంబాలను హొల్డ్ చెసే ఓపిక, బాద్యత తక్కువ అవుతున్నపుడు మద్యలో నిజంగా కొల్పోతుంది పిల్లలే. బ్లాగ్ గురించి తెలిసి ఈ రొజే ఒపెన్ చేసి నా అబిప్రాయం చెపుతున్నాను. మొదటి సారి తెలుగు లో వ్రాయడం (టయిప్ చేయడం ఇబ్బంది ఐంది) స్పష్టంగా చెప్పలేకపొతే అన్యద బవించకండి.
చందమామ మా నాన్నగారు కొని తెచ్చేరోజున దాన్ని మొదట చదవటానికి మా ఇంట్లో మేమంటే మేమని కొట్టుకొన్న రోజులున్నాయి. ఆ పత్రిక పిల్లలకు మంచి బుధ్ధులు నేర్పే మరో ఉపాధ్యాయుడితో సమానం. పత్రికను గురించిన మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు. కాని కే.వి.రెడ్డి మరియు చక్రపాణి లాంటి వారు అసలు రచయిత పేరు లేకుండా కథలు రాయించేవారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఏమి చెప్పావుబ్బా భలే చెప్పావు, ఈ కథకు కథలోని పాత్రకు అలాగే నా నిజ జీవితంలోని సంఘటనకు చాలా దగ్గరి సంబంధం వుండాది. ఇది చదివినంత సేపు నాకు మావాడు కళ్లలోనే కనిపించాడు. మాకు వందపైనే అవులు వుండేవి కాని వాటికి పుట్టిన వాటిని నాటు గిత్తలు అనేవారు. వాటికంటే దేశపు ఎద్దులు బాగా నాజుకుగా వుంటాయి. అలాగే పనికూడా బాగ తొందరగా చేస్తాయి. అందుకని మా నాన్న ఒక కాడి అవి ఒక కాడి నాటు గిత్తలు పెట్టేవాడు. అందరి అలోచన కూడా అదే. అందుకే వ్యాపారము చేసే వాళ్ళు మా పక్క ఊరైన నీలకంఠరావు పేటకు ఈ దేశపు దూడలను తెచ్చి అమ్మేవారు, మా అమ్మ నాన్న కూడా ఉదయాన్నే పాలు పోయడానికి ఆ ఊరు వెళ్ళేవారు. అక్కడ మావాడి అందం, కాళ్ళు, కొమ్ములు, రంగు నచ్చి తీసుకొచ్చారు. మావాడు అన్నిటితో పాటే చాలా తెలివైన వాడు, చలాకి గాడు. మా ఇంటి కొచ్చిన కొన్ని రోజుల్లోనే మాతో బాగా కలిసి పొయాడు. వీడిని చిన్న పిల్ల వాడిలా చూసుకొనే వాళ్ళు. అన్ని అవులున్నా వాటితో పాటు మందలో తోలేవాళ్ళు కాదు, మా అమ్మ దుల్ల కు గరిక తేవడానికి మా గదగుండ్లబావి దగ్గరికి వెళ్ళేటపుడు వీడిని కూడా తీసుకెళ్ళి మేపుకొచ్చేవాళ్ళు. అలా అల్లారు ముద్దుగా పెంచాము. వీడిని మా గదగుండ్ల బావి దగ్గరికి తీసుకొని పోవడానికి పగ్గము అవసరము లేదు బుద్ధిగా మా వెనకాలే వచ్చేవాడు. నాక్కూడా తెగ నచ్చాడు. నన్ను చూస్తే అలా మెడ పైకి ఎత్తుకొని దగ్గరికి వచ్చేవాడు, ఎందుకంటే మెడ కింద నెమరించుకొవడము చాలా ఇష్టం వాడికి.
నేను కూడా అల్లరే, చదువు అంతగా ఎక్కేది కాదు, పొలం దగ్గరకు వెళ్ళడము మహా ఇష్టం. అందులొ ఆ మధ్యే మా లెక్కల్ మాస్టారును తిట్టానని మా నాన్న చెవిలో పడింది. నేను ఏమి తిట్టలేదండి – మా మాస్టారు రెండు మూడు గైడులు ముందరెట్టుకొని బోర్డు పైన అన్ని విధాల సమాధానాలు వ్రాసేవాడు. అందులో ఆ రోజు అతను ఏదో తికమక పడ్డాడు, అందుకే మార్చి మార్చి సమాధానాలు చెప్పాడు. సరే అని నేను వూరుకోకుండా నా పక్క వాడితో “ఈ గుడ్డి సారుకు కనిపించి సావలేదు అందుకే మార్చి మార్చి సమాధానాలు చెపుతున్నాడు” అన్నా నా పక్క వాడితో. అంతే, ఇంక వాడు మంచిగా చేతులు కట్టుకొని నేను అన్నమాటలు మాస్టారుకు చెప్పెసాడు. మనకు వల్లు వాగింది, విషయం ఇంటిదాక తెలిసింది. ఇంక లాభం లేదని చదువు మానిపించారు.
అప్పుడు మావాడు మంచి రంజుమీదున్నాడు, ఆ నడక ఆ ధీమా, ఎకర పొలం ఇరసాలు ఏమిటి, నాలుగు సాల్లు ముల్లు కర్ర లేకుండానే దున్నేస్తా అనేటట్టుగా. అయితే మాది రాళ్ళ చేను (అందుకే దాని పేరే “రాళ్ళచేను “). అందుకే పని ఎక్కువ అవడంతో మనవాడికి ఒక తెల్లదొర గాడిని జత తెచ్చారు. వీడు కూడా మంచి ఆరు అడుగుల అందగాడు, నాకు వీళ్ళంటే ఎంతో ఇష్టం. ఆ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. మావాడికి, ఈతెల్లదొరగాడికి, నాకు బాగా షాడకేసే పని వచ్చి పడింది. మా నాన్న సామాన్యంగా ఒప్పుకోడు. బాగా పొలం దుక్కి పట్టాలంటాడు. ఆవిధంగా ఒక నెల రోజులు రోజూ బురదలో పనే. వరి నాట్లు వేసారు. పని అయితే అయింది కాని మా వాడు బాగా మెత్తపడ్డాడు (“మెత్త కాళ్ళు పడ్డాయి”). మామూలుగా అలా బుడదలో పని వస్తే ముందే లాలాలు (కాళ్ళకు కిందా ఇనుప ముక్కలు) కొడతారు చెప్పులు లాగా. అవిలేకపొవడం వల్ల గట్టలు బాగ మెత్తపడ్డయి. ఇద్దరు నడవలేక పొతున్నారు, నాకు చాలా బాధేసింది. సరే అని ఎవరికి చెప్పకుండా నాతో వున్న డబ్బులతో మా ఊరికొచ్చిన సాయిబు దగ్గర లాలాలు కొట్టించడానికి తీసుకెళ్ళాను.
మా అమ్మ ఒక వైపు చెపుతూనే వుంది (వాటికి లాలాలు కొట్టాలంటే బలవంతంగా కింద పడుకోబెట్టాలి) ఇంతకు ముందు అవి ఎప్పుడు లాలాలు తొడిగించుకోలేదు, వద్దు నాయనా అని. కాని అప్పుడు మా అమ్మ చెప్పేదానికంటే నాకు వాటిమీద ఉన్న ప్రేమతో లేదు ఎలాగయినా కొట్టించాలని తీసుకెళ్ళాను. మన వాడు బుద్ధిగా తొడిగించుకున్నాడు. ఇంకా తెల్లదొరగారికి కొంచం భయం ఎక్కువ, పడుకోలేదు. సాయిబు, మాఊరిలో వేమయ్య ఇద్దరు కలిసి బలవంతంగా పడుకోబెట్టారు. అంతా అయిపోయింది. లేపితే లేచి ముందు కాళ్ళపైనే నిల్చుకుంది. నాకు తెలియలేదు ఎమి అయిందో. ఇంటికి తీసుకెళ్ళాను. అందరు చూశారు కాలు బెసికింది అన్నారు. మా రామయ్య పెద్దనాన్న ఏవో పసుర్లు పూసాడు. ఏమి లాభం లేదు. ఇంక ఎవరిసలహాతోనో కలిపైన వాత పెట్టారు. అయినా బాగా కాలేదు. జోడు తప్పింది. ఇద్దరినీ విడదీసారు. మా వాడిని అమ్మేసారు ఎవరికో. చాలారోజులు నేను బాధపడ్డాను, నా మూలంగానే కాలు పోయిందని. చాలాకాలం వరకూ ఇవి నా కలల్లో ఎక్కువగా కనిపించేవి. మీరు మీ కథ తో మళ్ళీ వాటిని గుర్తు తెచ్చి నా కళ్ళలోకి నీళ్ళు తెప్పించారు.
సంగీతంలోని నా వ్యక్తిగత అభిరుచే కాక ఈ వ్యాసాలకు మరొక ప్రేరణ కూడా ఉంది. ‘హిందూస్తానీ సంగీతంలో ఇందరు గొప్పవారు ఇంతటి కృషి చేస్తూ ఉంటే విని మెచ్చుకున్న తెలుగువారే లేరా?’ అంటే ఉన్నారనే చెప్పాలి. ఎటొచ్చీ సదాశివ, నండూరి పార్థసారథి మొదలైన కొద్దిమంది తప్పిస్తే ‘రాసేవాళ్ళు ఆ సంగతి పట్టించుకోరు; సంగీతాభిమానులు రాయ (లే) రు’ అని నా కనిపిస్తుంది. అందుచేత తెలుగువారి తరఫునా (‘వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను’ అంటే అతిశయోక్తి అవుతుందేమో కాని) ‘వాహ్, ఉస్తాద్’ అనాలని నా కోరిక.
కారణం తెలియదుగాని సంగీతం విషయంలో తెలుగువాళ్ళు కాస్త ‘అణగిమణగి’ ఉండడం కనిపిస్తుంది. కర్ణాటక కచేరీల్లో తమిళులు పంచెలు కట్టుకుని హడావిడిగా, అట్టహాసంగా తిరుగుతారు కాని ప్రేక్షకుల్లో 30 శాతం ఉండే తెలుగువారు మటుకు చడీచప్పుడూ కాకుండా హాజరయి వెళిపోతూ ఉంటారు.
ఇక రచన మాటకొస్తే ఇందులో అమీర్ ఖాన్ ప్రతిభే ప్రధానం. నేను పంపిన ఆడియో లింకులు వింటూ తాను చేపట్టిన ప్రూఫ్ రీడింగ్ సంగతే మరిచిపోయానని సంపాదకులు అన్నారు. అంతకన్నా మంచి నిదర్శనం అనవసరం.
ఖండాంతరాల లో సాంకేతిక పరమైన ఉద్యోగాలు చేస్తూ తెలుగు సాహిత్యంలో, సంగీతం లో వివిధ సాంస్కృతిక కళా రూపాలలో,సంప్రదాయ రీతులలో అభిరుచి,అభినివేశం కలిగి సాధికారికంగా రచనలు చేస్తున్నవారిని చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతుంది,ఆనందం వేస్తుంది.వీరికి ఇంత తీరిక ఎక్కడదా అన్పిస్తుంది.బహుశా వారి కృషిని సులభతరం చేస్తున్నది వారి expert computer access capabilities అయి ఉండవచ్చుననుకుంటాను.
ప్రఖ్యాత హిందూస్తానీ గాయకులు ఉస్తాద్ అమీర్ ఖాన్ గారి మీద రోహిణీప్రసాద్ గారి వ్యాసం చాలా బావుంది.దానికి కారణం రచయితకు సంగీతం పైన ఉన్న గాఢమైన ప్రేమ ,విషయ పరిజ్ఞానం,సరళమైన ,నిరాడంబరమైన,ఆకర్షణీయమైన భాషలో స్వానుభవం లోంచి వచ్చిన తులనాత్మక విశ్లేషణ.We find a blend of narrative and analytical elements which lends a pleasing comprehensiveness to the article.
వ్యాసం లో పేర్కొనబడిన సంగీత విద్వాంసులందరూ హిందూస్తానీ శాస్త్రీయ సంగీత సాధన ఒక తపస్సుగా సాగించటం భారతీయ సాంస్కృతిక ఔన్నత్యానికి అద్దం పడుతుంది.
వ్యాసమంతటా విషయ విపులీకరణ,విశ్లేషణే కాని రోహిణీప్రసాద్ గారు కనిపించరు.అది ఆయన egoless exposition ని ,openmindedness ని సూచిస్తవి.
రోహిణీప్రసాద్ గారు విషయపరమైన మౌలిక శోధనలో ,బాహిరమైన ఇతరేతర ప్రభావాలకు తాను లోను కాకుండా ఉండటం గమనార్హం,హర్షదాయకం.
ముందుగా, తానా అవార్డు అందుకున్నందుకు వెల్చేరు గారికి అభినందనలు. తెలుగు భాష, సాహిత్య, చరిత్రలపై వారు చేస్తున్న నిర్విరామ కృషి ముందుతరాల వారికి మార్గదర్శకం. వేలూరి గారి వ్యాసం వెల్చేరు గారి బహుముఖ పాండిత్యానికి అద్దం పట్టేటట్లుంది..
కాని వ్యాసం మొదట్లో అన్న మాటలు – “వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది” – నన్ను చాలా తికమక పెట్టాయి. కాల్పనిక కథకి ఒక్క రూపమే ఉండటమేమిటి? దానిని అంత నొక్కి చెప్తున్నారంటే గొప్ప ప్రాధాన్యత ఉండాలి – అదేంటో నాకర్థం కాలేదు, వేలూరి గారివీ విప్లవ్ గారివీ ఉదాహరణలు సాయపడలేదు.
సరే, David Shullman అంత పండితుడికే అంతుపట్టని విషయం నాకు అవగతం కాదులే అని సమాధానపడ్డాను. ఇంతలో Dr. Mittapalli వ్యాసంపై నేను వెలిబుచ్చిన అభిప్రాయనికి బదులు రాస్తూ ఓ మిత్రుడు, చెప్పుకోదగ్గ చదువరి, వెల్చేరు రాసిన ఒక వ్యాసం – “When Does Sita Cease To Be Sita? Notes Toward a Cultural Grammar of Indian Narratives” – చదివారా అని అడిగారు. రామాయణం గురించి లవకుశ లాంటి సినిమాలు చూడటం వలన కలిగిన జ్ఞానం కన్నా మించి నాకు లేదు; అలాంటి లోతైన వ్యాసాలు నేనేమీ చదవలేదు మహానుభావా అనుకొని, ఆమధ్య Berkeley వాళ్ళు చవగ్గా అమ్ముతున్నారు కదా అని కొని చదవని ఓ రామాయణం పుస్తకం [1] ఇంట్లో ఉంటే దాంట్లో దీనికి సంబంధించినదేమన్నా ఉండొచ్చు అని తీశాను. దాని మొదటి పేజీలో ప్రస్ఫుటంగా వేసిన వెల్చేరు వాక్యం నన్నాకర్షించింది:
“Fiction has only one form. True story has inevitably many.”
దీన్ని నేను తెలుగులోకిలా తర్జుమా చేసుకున్నాను: “సామాన్య కథకి ఉండేది ఒకటే రూపం. కాని సజీవ కథకి సహజంగానే అనేక రూపాలుంటాయి.” నేను పైపైన చదివిన ఆ పుస్తకంలో రామాయణ కథకి గల అనేక రూపాలని వివరించారు. కాలం మారేకొలదీ, సామాజిక పరిస్థితుల్ని బట్టి ఈ కథ కెన్ని మార్పులూ చేర్పులూ చేరాయో విశ్లేషించారు. ఇది నాకర్థమయింది.
కాని ఆ తిరుపతి మండుటెండలో గంగమ్మ జాతర ఊరేగింపు చూస్తూ వెల్చేరు అన్న మాటల్లో అంతరార్థం ఏమిటో నాకింకా బోధ పడలేదు. అక్కడ అన్నదీ, ఇక్కడ [1] అన్నదీ ఒకటేనా? వేరా?
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1]“Questioning Ramayanas: A South Asian Tradition,” Edited by Paula Richman. Univesity of California Press, 2001. దీంట్లోని వెల్చేరు వ్యాసం, “The Politics of Telugu Ramayanas: Colonialism, Print Culture, and Literary Movements,” చదవదగ్గది. గత శతాబ్దంలో మన సాహిత్యంలో రామాయాణం మీద వచ్చిన అనేక రకాల రచనల్ని వాటి వెనకవున్న సామాజిక కారణాలపరంగా విశ్లేషించారు.
Indian Complex – ఆధారం లేని సిద్ధాంతం
ఆసక్తి కలిగించిన వ్యాసమే కాని రాజేశ్వర్ గారితో నేను అంగీకరించే వాటికన్నా అంగికరించని విషయాలే ఎక్కువ వున్నాయి. సాహితీ విమర్శ కానీ, మానసిక విశ్లేషణ కానీ నా సబ్జక్ట్స్ కావు – నేను రాసేదానికి ఆధారం ఓ శనివారపు సాయంకాలపు చదువు వలన కలిగిన అవగాహన మాత్రమే. ముందుగా రాజేశ్వర్ గారన్న రెండు మూడు స్వల్ప విషయాలు:
“Alpajeevi, together with Buchibabu’s Chivaraku Migiledi (That Which Remains at the End), heralded modernism in Telugu fiction by lending it a new psychological depth. Prior to their publication Telugu novels tended to be patently romantic in orientation and thus hardly served the purpose of truth—psychological or social.”
“చివరకు మిగిలేది” 1946లో, “అల్పజీవి” 1956లో వచ్చాయి. వీటికి ముందర తెలుగు నవలోద్యానవనం మూడుఫువ్వులూ ఆరు కాయలుగా వికసించిందని ఎవరూ అనరు కాని అది బీటలు బారిన బీడు నేల మాత్రం కాదు. చలం రచనల్ని (మైదానం, 1926) వట్టి రోమాన్స్ అని కొట్టిపారేసినా, ఉన్నవ “మాలపల్లి” (1926), విశ్వనాథ “వేయిపడగలు” (1939), గోపీచంద్ “అసమర్థుని జీవయాత్ర” (1945), కొడవటిగంటి చదువు (1946), ఉప్పల “అతడు-ఆమె” (1950) – ఇవన్నీ “అల్పజీవి” కన్నా ముందర వచ్చినవే! అవేవీ “ఆధునికత”ని ఆవిష్కరించలేదనడం వాస్తవం కాదు. దాదాపు అదే కాలంలో వచ్చిన శ్రీదేవి “కాలాతీత వ్యక్తులు” (1958) కూడా చెప్పుకోదగ్గ నవల.
“The term [Inferiority Complex] was originated by Alfred Adler, the onetime disciple of Sigmund Freud and the founder of Individual Psychology.”
మనం “వేలు చీకడం లో సెక్స్ ఉందన్న” ఫ్రాయిడ్ సిద్ధాంతానికీ ప్రతి ఒక్కరి జీవితమూ ఆత్మన్యూనతతోనే మొదలవుతుందన్న ఆడ్లర్ సిద్ధాంతానికీ చాలా తేడా ఉంది. గత శతాబ్దపు మొదట్లో ప్రాచుర్యంలోకొచ్చిన “Psycho Analysis” శాస్త్రానికి ఆద్యుడైన Freudకి ఆడ్లర్ సహచరుడు కావచ్చు కాని అనుచరుడు మాత్రం కాదు. అలా అన్నవాళ్ళ పట్ల ఆడ్లర్ చాలా చిరాకుపడ్డాడు [1].
రాజేశ్వర్ గారు చెప్పే ముఖ్య విషయానికొద్దాం:
”[Subbayya’s] inferiority complex is however not the same as propounded by Adler. Society as a whole, and his own wife as well, regard Subbaiah as a feckless fellow. But in reality he is a law-abiding and god-fearing man, even if unabashedly pusillanimous.”
సుబ్బయకున్న ఆత్మన్యూనతకీ ఆడ్లర్ ప్రతిపాదించినదానికీ తేడా ఏమిటో వివరించలేదు. చుట్టూ వున్నవాళ్ళు అతన్ని తేలికగా చూసిన మాట నిజమేకాని, వాళ్ళలా చూడటానికి కారణం కేవలం అతని స్వభావం – వ్యక్తిత్వం లేని స్వభావం. ఆ స్వభావాన్ని మార్చడానికి వాళ్ళు ప్రయత్నించకపోగా దానిని మరింత తీవ్రం చేశారంటే ఒప్పుకోవచ్చుకాని, వాళ్ళ ప్రవర్తన అతని ఆత్మన్యూనతకి మూలకారణం గానీ ముఖ్యకారణం గానీ కాదు.
సుబ్బయ్య “ఒట్టి చచ్చు దద్దమ్మ” కావడానికి కారణం అతని జీవితంలో మాతృప్రేమ మృగ్యం కావడమే. తల్లి మరణం, సవతి తల్లి క్రూరత్వం అతన్ని తండ్రి ప్రేమించినా అతనూ సుబ్బయ్య సరిగా పెరిగి పెద్దయేలోగానే చనిపోవడం. వీటికితోడు, తండ్రిని కొట్టిన సంఘటన సుబ్బయ్య మనసులో చెరగని ముద్రవేసి, భయానికి కారణమయింది. ఇలా చూస్తే, సుబ్బయ్యకున్న ఆత్మన్యూనత ఆడ్లర్ చెప్పినదానికి చాలా దగ్గరగా ఉంది.
కోస్తా ప్రాంతాల్లో అగ్రకులాల్లో ఆడవాళ్ళకున్న ఆధిక్యత కి, అది నిజంగా ఉన్నా లేకపోయినా, ఈ వ్యాసంలో రాజేశ్వర్ అనవసరమైన ప్రాముఖ్యత కల్పించారు.
”Like Subbaiah, the other important male characters of the novel too had gone through traumatic experiences early in their lives. For example, Venkat Rao was robbed of whatever material wealth he could have inherited from his spendthrift father by his own maternal uncle and a long-standing employee of his zamindari household, and Gavaraiah suffered the ignominy of his wife cheating on him. These experiences, devastating as they are, instead of psychologically destabilizing these two men, only transformed them into hardened individuals. Subbaiah’s experiences, naïve by comparison, have made him only a weakling and psychological wreck. There is thus certainly something innate, and something very ‘Indian’ in him that has subjected him to inferiority complex and made him the man he is”
వెంకటరావు, గవరయ్య, సుబ్బయ్య – వీళ్ళ ముగ్గురి బాల్యం ఒకే విధంగా లేదు. చిన్నతనంలో పెరిగిన వాతావరణం ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్నాడు ఆడ్లర్. గవరయ్య పేదవాడయినా, తండ్రి చిన్నతనంలో రంగూన్ పోయి తిరిగిరాకపోయినా, తల్లి గంగమ్మ కష్టపడి పోషించింది, చదివించింది. ప్రేమతో పెంచింది. ఇది మనిషి వ్యక్తిత్వం పెరగడానికి చాలా ముఖ్యమని ఆడ్లర్ చెప్పాడు. నవలలో వీళ్ళిదరి బాల్యంలో తేడా స్పష్టంగానే ఉంది. సుబ్బయ్య స్వభావానికి ప్రత్యేకంగా “భారతీయ”మైన సహజ కారణాలేమీ నాకు కనిపించడం లేదు.
“Critics, including the perceptive R.S. Sudarshanam, have famously misread the novel and hastily concluded that Subbaiah finally overcomes his inferiority complex due primarily to Manorama’s love for him.”
విమర్శకుల [3] గురించి అన్నది వాస్తవమే కాని, అది రాజేశ్వర్ గారి తీర్మానానికి గూడా వర్తిస్తుంది:
“In all probability Subbaiah will continue with his vacillation, indecisiveness and unfounded fears because, among other things, he is a moral coward, and has been so all his life.”
నాకు మాత్రం నవల ముగించేటప్పటికి సుబ్బయ్య ఏ దారిన వెళ్తాడో స్పష్టంగా తెలియలేదు. రావిశాస్త్రి కావాలనే అలా ముగించాడు. తన “ఆఖర్నో మాట”లో:
“ఈ నవల చివరి భాగాలు రాస్తున్నప్పుడు నాకు సుబ్బయ్యంటే అసహ్యం వేసింది. … అయితే, దేముళ్ళూ, రాజులూ, రచయితలూ మంచిగా ఉండాలనీ, సంతానానికి సన్మార్గం చూపించాలనీ విన్నాను. అందుచేత పత్రిక లోంచి పుస్తకంలోకి వచ్చినప్పుడు సుబ్బయ్యకీ ఆత్మ విమర్శనాజ్ఞానం కలిగింది. తన దుస్థితినీ దుర్బుద్ధినీ కొంతగా గుర్తుంచుకుని, మంచి మార్గాన వెళ్ళేవాళ్ళా కనిపిస్తాడు., నవల చివర్న. ఛివరకి అతనా దారంట వెళ్ళొచ్చు. మానొచ్చు. అతని యిష్టం.”
“In the final analysis it would be better not to accord undue importance to this theory and its operation in the novel. Much of aesthetic value would emerge if the novel is studied on its own terms, as a work of art, and without elaborate reference to Adler and his theories.”
లేని ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు కాని ఆడ్లర్ మన జీవితంలో ముఖ్యమైన సమస్యలన్నీ సమాజం, మనం చేసే పని, ప్రేమ – ఈ మూటితో ముడిపడి వున్నాయన్నాడు [2]. అది గుర్తుంచుకుంటే “అల్పజీవి” లో మరికొన్ని లోతులు కనిపించవచ్చు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “Although individual psychology had obviously diverged from psycho‐ analysis since Adler’s break in 1911, Adler continued to be incensed by popular references to his having once been a “disciple of Freud.” In 1928, when “The Neurotic Constitution” went into a fourth German edition, Adler took the occasion to publish his most explicit denial to date about their nine-year relationship as recounted by Freud in his 1914 monograph, “The History of the Psychoanalytic Movement.”
“Mr. Freud has bad luck with [the interpretation of] my spoken word…. My mild rejection, ‘it was no pleasure to stand in his shadow’—i.e., to be made an accomplice to all the absurdities of Freudianism, because I was a co-worker in the psychology of the neuroses—he at once interprets as a confession of my revolting vanity to put before unsuspecting readers. Since to date none of those who know wanted to admit this bad luck of their teacher—not mine, as is often erroneously maintained—I see myself forced to destroy the formation of a legend.”
From, “The Drive for Self: Alfred Adler and the Founding of Individual Psychology,” by Edward Hoffman, 1996. Page 214.
[2] “For a long time now I have been convinced that all the questions of life can be subordinated to the three major problems—the problems of communal life, of work, and of love. These three arise from the inseparable bond that of necessity links men together for association, for the provision of livelihood, and for the care of offspring.” From “The Individual Psychology of Alfred Adler: A Systematic Presentation in Selections from His Writings,” Book by Heinz L. Ansbacher, Rowena R. Ansbacher; Harper & Row, 1967. Page 131.
[3] కోడూరి శ్రీరామమూర్తి “తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ” అనే మంచి పుస్తకం రాశారు. దాంట్లో “అల్పజీవి”ని ఆడ్లర్ సిద్ధాంత దృష్టితో పరిశిలించారు. “శత వసంత సాహితీ మంజీరాలు: వంద పుస్తకాలపై విశ్లేషణ,” లో అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు “అల్పజీవి” పై రాసిన వ్యాసం కూడా చదవదగ్గది.
తెలుగుదేశములో తెలుగు మాతృభాషగా ఉన్నవారు సుమారు
90% ఐనా ఉంటారు. ఇతర భాషలు మాతృభాషగా గలవారు,
కేంద్ర ప్రభుత్వములో ఉద్యోగము చేసేవాళ్ళు, ఇతర రాష్ట్రాల
నుండి వచ్చినావాళ్ళు 10% ఉంటారేమో. ఈ 90% తెలుగు
వాళ్ళకు తెలుగును తప్పని సరిగా బోధించడములో తప్పేమి
లేదు గదా! వాళ్ళు ఆంగ్లము నేర్చుకోనీ, కాని తెలుగును
ఎందుకు నిరసన చెయ్యాలి? ఇక తమిళనాడులో తమిళమును
రుద్దలేదనుట అతశయోక్తి అవుతుంది. మదరాసు మాత్రమే
కాదు, హొసూరు, సేలం, ఉత్తర ఆర్కాడు, మదురై,
కోయముత్తూరు జిల్లాలలో తెలుగు మాటలాడేవారు చాల
మంది ఉన్నారు. ఎక్కడో తప్ప వారికి తెలుగు బడులు లేవు, ఇతర
భాషల బడులు లేవు, ఒక్క తమిళము తప్ప. మదరాసులోనే
50లలో స్థితికి, ఇప్పటి స్థితికి ఎంతో తేడా ఉంది. అప్పుడులా
ఇప్పుడు తెలుగు తమ మాతృభాష అని జనాలు ప్రకటించుకొనుట
అరుదే! – మోహన
తెలుగు భాషని తెలుగువాళ్ళ మీద ఎందుకు రుద్దాలి (ప్రభుత్వం ప్రజలమీద కాని, బడులు బడి పిల్లలపై కాని, తల్లిదంద్రులు పిల్లలపై కాని) అన్నది చాలా మౌలికమైన ప్రశ్నే (అయినా, చాలా దురదృష్టకరమైన ప్రశ్న)!.
ప్రభుత్వం అధికార భాషగా తెలుగుని సరిగా అమలు చెయ్యడం, ఆ భాషని ప్రజలపై రుద్దడం అవదు.
ఇంగ్లీషుని, అది చదువుకోలేని ప్రజలపై రుద్దకుండా ఉండడమౌతుంది. ఈ మధ్య ఈనాడులో ప్రచురితమైన ఈ వ్యాసం చదివితే అధికారభాషగా తెలుగుని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుపరిస్తే ప్రజలకి కలిగే వెసలుబాటు చక్కగా అర్థం అవుతుంది.
ఇక బడిలోనూ, ఇంటిలోనూ పిల్లలపై రుద్దడం విషయానికి వస్తే:
1. ప్రతి మనిషి తనకి ఇష్తమైన భాషని నేర్చుకోవచ్చనడం సబబుగానే తోస్తుంది. అయితే, సమాజంలో వ్యవహారానికి, ఇతర వ్యక్తులతో సంభాషించడానికి, ఒక సామాన్య భాష అవసరం ఉంది కదా. అది అందరికీ రావాల్సిన అవసరం కూడా ఉంది కదా. అది ఇంట్లో మాట్లాడుకునే భాషకి ఎంత దగ్గరైతే అంత సులువుగా నేర్చుకోవచ్చు. ఎంత ఎక్కువమందికి ఆ భాష ఇంటి భాష అయితే అంత సులువు. ఈ దృష్ట్యా మన రాష్ట్రంలో తెలుగు అందరూ నేర్చుకోవాలి అనుకోవడంలో తప్పేమీ లేదు.
2. పై కారణం కన్నా బలమైనది సాంస్కృతిక కారణం. ఇది ప్రవాసాంధ్రులకి కూడా వర్తించేది. ప్రాణులలోకెల్ల మనిషి పురోగమనానికి ప్రధానమైన కారణాలలో ఒకటి సమాజాలుగా ఏర్పడడం అన్న విషయం శాస్త్రీయమైనది. సమాజాలు ఏర్పడడానికీ, నిలబడడానికీ సంస్కృతి ఒక ప్రధాన సాధనం. భాష సంస్కృతిలో భాగం. అయితే ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులలో సంస్కృతిని నిలబెట్టుకోవడం ఎంతవరకూ అవసరం అన్న విషయం శాస్త్రీయంగా ఎవరైనా పరిశోధించారో లేదో నాకు తెలియదు. దాని అవసరం ఇంకా ఉన్నది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ దృష్టితో చూసినా తెలుగు భాషని కాపాడుకోవడం అవసరం.
ఇక, రాజకీయ నాయకులపై మనమందరం చాలా తేలికగా, హాయిగా తప్పు(ల)ను నెట్టేస్తాం.
నిజమే, రాజకీయనాయకులు స్వార్థపరులే (ఏం మనం కామా?)! వాళ్ళకి ఓట్లువేసే జనాలకి తెలుగు భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం అయితే, వాళ్ళు దానిగురించి పట్టించుకోక ఏం చేస్తారు? ఓట్లు వేసే ప్రజలోఅత్యధిక శాతం సామాన్య ప్రజలు (చదువులేనివాళ్ళు, పేద వాళ్ళు). సహజంగా వాళ్ళకి భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం కాదు. కాబట్టి రాజకీయ నాయకులకి దానిగురించి పట్టదు.
అంచేత తెలుగు భాషాభివృద్ధి జరగాలంటే, అవసరమైనవి రెండు పనులు:
1. చదువుకున్నవాళ్ళు ముందు తెలుగు భాషాభివృద్ధి తాలూకు (శాస్త్రీయమైన) అవసరాన్ని గుర్తించి, దాన్ని తమ పరిధిలో అమలు పరచడం.
2. సామాన్య ప్రజకి దీని అవసరాన్ని తెలియజెప్పడం. సామాన్య ప్రజలకి తెలియాలంటే అది శాస్త్రీయ విధానంలో సాధ్యపడదు. ప్రజలలో భాష పట్ల (దుర)అభిమానం కలిగించడమొక్కటే సాధనం. దీనికి ఒక ఉద్యమం అవసరం.
తమిళభాషాభివృద్ధిలో ఈ పై విషయాల పాత్రని గుర్తించవచ్చు.
In this context, I have recently come across a link on “Orality to literacy: Transition in Early Tamil Society” by IRAVATHAM MAHADEVAN. It contains interesting points on Popular versus elitist literacy, comparing Tamil and Upper South India (Telugu and Kannada) in the ancient period.
వేలూరిగారూ,
మీ సంపాదకీయం చదివాను. నాకు నచ్చింది. అందులో మీరు తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. అంతర్జాతీయ భాష గురించి కొన్ని చక్కటి ప్రశ్నలు వేశారు. భాషా దురభిమానాన్ని వ్యతిరేకించారు. ఇదంతా వుత్త రాజకీయం అని కూడా తేల్చారు. అంతా బాగుంది. అయితే నాకో ప్రశ్న. మనం మన ఈమాట ముందు పేజీలో, “ఇంటర్నెట్టులో తెలుగుకు మొదటి తరగతి పౌరసత్వం కావాలంటే యూనీకోడ్ వాడకం తప్పనిసరి అని మా నమ్మకం” అని రాసుకున్నాం కదా? యూనీకోడ్‌ని నేను కూడా ఇష్టపడతాను లెండి. కానీ ఈ “మొదటి తరగతి పౌరసత్వం” ఏమిటీ? కొన్ని భాషలకి “రెండవ తరగతి పౌరసత్వం”, ఇంకొన్ని భాషలకి “మూడవ తరగతి పౌరసత్వం” వున్నాయా? మొదటి తరవతి గొప్పదనుకుంటే, మూడవ తరగతి అధమం అనేగా అర్థం? భాషకి సంబంధించి ఈ పౌరసత్వ తరగతుల మీద వ్యతిరేకత మనకు లేదా? ఈ ఇంటర్నెట్టు తరగతి పౌరసత్వానికీ, అంతర్జాతీయ భాషకీ ఏదో రక్త సంబంధం కనబడుతోంది. తప్పంటారా?
మీరు మీ సంపాదకీయంలో, “మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలు అల్లేశారు, వల్లించేశారు. అది కొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరి కొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది.” అని స్పష్టంగా తెలుగుని ప్రాచేన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. కొంత మందికి ఇది అర్థం కాక, మీ సంపాదకీయాన్ని మెచ్చుకుంటూ, సమర్థిస్తూ, “కనీసం ప్రాచీన భాషా ప్రపత్తే మనం సాధించుకోలేక పోయాం” అని వాపోయారు. మీ సంపాదకీయం ప్రకారం ఈ వివాదాలన్నీ వుత్త రాజకీయాలు మాత్రమే అయినప్పుడు, ఇలా వాపోవడంలో అర్థమే లేదు. తెలుగుకి “ప్రాచీన భాషా ప్రపత్తి” ఎందుకు సాధించుకోవాలి? ఆ ప్రపత్తి వల్ల బోలెడు డబ్బు శాంక్షను అవుతుంది. అందుకోసమేనా? మీ సంపాదకీయంలో ఈ డబ్బు సంగతి మీరెత్తలేదు గానీ, అటువంటి ప్రపత్తి గోలని మీరు వ్యతిరేకించారు. అది జనాలకి అర్థం కాకుండా పోయింది.
భాషని ఒకరి మీద రుద్దడం ఏమిటీ? పాఠశాలల్లో హిందీని బలవంతంగా రుద్దినప్పుడు వ్యతిరేకించలేదా? “నిజంగా అన్ని రాజకీయ పక్షాలు తలుచుకుంటే, తెలుగు ప్రతీ స్కూలులోనూ తప్పని సరి (కనీసం పదవతరగతి వరకూ) అన్న జీ. వో రావడం అంత కష్టమైన విషయం కాదు” అంటూ తెలుగుని అందరి మిదా రుద్దడం ఎందుకు? ఒక రాష్ట్రంలో వేరే రాష్టాల నించీ వచ్చిన పిల్లలు ఎందరో వుంటారు. అంతేకాదు ఏ విషయమూ ఎవరిమీదా రుద్దకూడదు. వాళ్ళకిష్టం అయితే వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. లేకపోతే లేదు. “మాతృభాషలో విద్యాభోదన”లో వున్న మంచి విషయాలు తెలిస్తే నేర్చుకుంటారు. లేకపోతే లేదు. ఈ బలవంతంగా రుద్దడం అనే అభిప్రాయం మీరు మీ సంపాదకీయంలో ఎక్కడా రాయలేదు.
భాషాభిమానం వుండొచ్చు గానీ, దురభిమానం వుండకూడదు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని గర్వంగా చెప్పుకోవడం మిగిలిన భాషలని కించపరచడమే.
ఈ రకరకాల హోదాల వల్ల ధన ప్రాప్తి కూడా వుంటుంది మరి. ప్రాచీన భాష అనే ప్రపత్తి వల్ల అనేక లక్షల రూపాయలొస్తాయంట. వాటికోసం బోలెడు మంది తాపత్రయపడటం సహజమే మరి.
ఇక రాజకీయనాయకుల సంగతి. మన లాంటి “మేధావులు” ఈ రాజకీయ నాయకులని ఎంత తక్కువగా చూస్తామో, వాళ్ళు కూడా మన లాంటి “మేధావుల్ని” అంతే తక్కువగా చూస్తారుట. ఓట్లు వేసి వాళ్ళని గెలిపించేదీ, వాళ్ళకి అధికారం కట్టపెట్టేదీ మన లాంటి వాళ్ళు కాదుట. అందుకే వారు మనలాంటి వారి ఘోష పట్టించుకోరుట. ఇలా అని తెలుగు సంస్కృతి కోసం ఒక తెలుగు సంస్థలో పని చేసే ఆయన అన్నారు. ఆయన మాటలు వింటుంటే, ఇదంతా కంఠ శోషన్న నిరుత్సాహం కలుగుతుంది. ఆయనే మళ్ళీ, “అరకొరగా చదువుకున్న వారిలోనే ఈ విభేదాలన్నీ, బాగా చదువుకున్న వారికిగ్గానీ, బొత్తిగా చదువుకోని వారికిగ్గానీ విభేదాలుండవు” అని అన్నారు. హతోస్మి అనుకోవాలి మరి.
మొత్తానికి మీ సంపాదకీయంలో ఏ విషయం తేల్చకుండా వదిలేశారు. ఏం చెయ్యాలో స్పష్టంగా చెప్పలేదు. దాంతో కొంతమంది మీరు సంపాదకీయంలో బాధ పడిపోయారని, బాధ పడిపోయారు. ఒక్కో విషయం ఒక్కక్కరికి ఒకలాగా అర్థం అవడంలో ఆశ్చర్యమేమేమీ లేదు. ముందుగా మనమే భాషని సరిగా వుపయోగించుకోవాలీ అనిపిస్తుంది. దీర్ఘాలూ, ఒత్తులూ, కామాలూ, గట్రా లేని జనాలు రాసే తెలుగు చూస్తే నిరుత్సాహం కాక ఏం కలుగుతుందీ? ఒకరైతే ఏది కర్తో, ఏది కర్మో, ఏది క్రియో బొత్తిగా అర్థం కాని వాక్యాలు రాస్తారు. కొంతమంది అకర్మక క్రియలతో కర్మణి వాక్యాలు రాస్తారు. వాడుకలో లేని కర్మణి వాక్యాలు అప్పుడప్పుడు తెచ్చేసుకుని మురిసిపోతూ వుంటారు. ఇంకొకరైతే, మీరేం రాసినా, వాళ్ళకిష్టమైన అర్థం తీసేసుకుంటారు, మీరు రాసింది మెచ్చుకుంటూ. తెలుగు భాషలోనేనా ఇంత గందరగోళం అని అనిపిస్తుంది.
లయలో వైవిధ్యం సాధించడం కష్టమే కాని అసాధ్యం కాదు. ఆదిభట్ల నారాయణదాసుగారు పంచముఖి అని వినిపించేవారట. తలొక చేత్తోనూ రెండు వివిధ తాళాల్లో చిడతలు వాయిస్తూ, తలొక కాలితో మరి రెండు విభిన్న తాళాల మీద నర్తిస్తూ, నోటితో అయిదో తాళంలో కీర్తన పాడేవారట. 5, 6, 7, 8 అక్షరాల తాళాలు వేరువేరు కదా. అయిదోది తొమ్మిదక్షరాల తాళమేమో. మరెవరూ చెయ్యలేని ఈ ఫీట్ ఎల్ సీ ఎం పద్ధతిలో సాగేదని స్వయంగా చూసిన సంగీతరావుగారు నాతో అన్నారు. కలిపి ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని ఆవృతాల తరవాత అన్నిటికీ కామన్ ‘సమం’ వస్తుందనుకోవచ్చు. ఇటువంటిది చెయ్యడానికి అంతులేని మనో నిగ్రహమూ, అవయవాల మీద కంట్రోలూ అవసరం.
సంగీతంలో విన్నదేదైనా సరే నోటితో అనగలనని నాకో నమ్మకం. అయితే అమీర్ ఖాన్ పాడిన మార్వా ద్రుత్ ఖయాల్ పల్లవిని అచ్చం ఆయన లాగే లయ మీద పలకాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అవుతున్నాయి. ఆ టైమింగ్ ఎంతకీ అంతుచిక్కదు. రికార్డు వినమని అన్నది అందుకే. ఆయనవి తక్కిన రాగాలు ఎన్నో మ్యూజిక్ ఇండియా ఆన్ లైన్ డాట్ కామ్ లో ఉన్నాయి.
గురువాయూర్ దొరై వంటి ప్రసిద్ధ విద్వాంసులు ఒక చేత్తో మృదంగం మీద నిశ్శబ్దంగా ఒక చేత్తో తాళం చూపుతూ రెండో చేత్తో వివిధ విన్యాసాలతో మృదంగం వాయించడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. Brain and motor nerves మధ్య ఎంతో సమన్వయం ఉండాలి. సితార్ సాధన చేస్తున్నప్పుడు కుడి పాదాన్ని ఒకటో కాలంలో లయబద్ధంగా కదిలిస్తూ, మెదడుకీ, చేతులకీ రకరకాల లయల్లో స్వరకల్పన చేసే పనిపెట్టడం తప్పనిసరి అవుతుంది. ఇదంతా క్లాసికల్ మ్యూజిక్ సర్కస్ లోని భాగమే. కాని ఎంతో exciting వ్యవహారం.
‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’
it is with pure coincidence i happen to listen to Aminatta Forna, writer of “Ancestor Stones” on NPR on this morning drive (July 2, 2007). She was asked a similar question by Renee Montagne: ‘what is it that can be said … in a novel/fiction that you could not say in a work of non fiction’.
Forna answered, there is depth that is added in fiction which comes from ‘inhabiting people’s lives and speaking directly to the reader’.
కాల్పనిక కథ ఒకే రూపంతో కనిపించినా దానికుండే Depth వాస్తవానికుండదేమో మరి.
ఈ రెండిటినీ కలిపి చూస్తే నాకనిపించింది: ఒక కథకు ఉండే ఆ ఒక్క లక్షణం చేతనే దానికుండే మిగతా రూపాలేమైనా (ఒకవేళ) ఉంటే అవి అదృశ్యమై పోతాయని. ఇక, వాస్తవం చాలా రూపాల్లో ఉంటుంది అని చెప్పటానికి పెద్దగా కథలక్కరలేదేమో, ఫాక్స్ న్యూస్ చానెల్ చూస్తే చాలనుకుంటా (అన్నట్టు Wall Street Journal ఇకపై in depth fiction రెపోర్ట్ చేస్తుందా?)
ఏదేమైనా, వెల్చేరుకు లైఫ్ టైమ్ అఛీవెంట్ అవార్డు ఇచ్చి ‘తానా ‘ వాళ్ళు ఒక మెట్టు ఎక్కినందుకు తానా వాళ్ళకు నా అభినందనలు.
ఈ అవార్డు గురించి వెల్చేరు గారేమంటారో వినాలనుంది.
ఒక వైపు బాలకృష్ణ, ఇలియానా ఇంకో వైపు చంద్రబాబు ఆయనకంటే ఎత్తున ఏడుకొండల వాడు గ్లామర్, పలుకుబడి లేక కళ్యాణం పేరు చెప్పి తెలుగు వాళ్ళ ను తేరగా దోచుకుందామని (మనసులనే అనుకుందాం) వచ్చిన వీళ్ళందరినే కాక చివరి నిమిషంలో వచ్చి ఓ మిలియన్ డాలర్ల కు టెండరు పెట్టిన బిల్ & హిల్లరీలను దాటుకుని వెళ్ళి ఈ తెలుగు వాళ్ళిచ్చే అవార్డు అందుకుంటారా లేక ఆ కాగితమ్ముక్కేదో చెక్కుతో పాటు మెయిల్లో పంపండి అంటారా వెల్చేరు గారు?
కడప ప్రాంతం లో కనిపించే అతి అరుదైన పక్షి గురించి వ్యాసం ప్ర చురించిన మీకు కృతఙ్ఞతలు. వ్యాసకర్త శ్రీ కోనేటిరావు గారికి అభినందనలు. సుమారు 20 సంవత్సరాల క్రిందట నేను లంకమల్ల అడవులకు వెళ్ళినపుడు ఈ అరుదైన పక్షి ని చూసే అవకాశం దొరకలేదు. బట్టమేక లు కనపడ్డాయి కాని కలివికోడి కనబడలేదు.
జయదేవ్ మెట్టుపల్లి
చికాగో
శ్రోతలకూ, పాఠకులకూ అంత ఆసక్తి ఉండకపోవచ్చుగాని జుగల్బందీల్లో ఎన్నో టెక్నికల్ కాంప్రొమైజులు ఉంటాయి. ఉదాహరణకు మొదటినుంచీ బాలమురళిగారిది ఒకటి శ్రుతి. జోషీగారు మొదట్లో 2 , 3 శ్రుతుల్లో పాడుతూ ఉండేవారు. అలాగే వీణ 3, 4 శ్రుతుల్లో ఉంటుంది. సితారుది 1, 2 మధ్యలో ఉంటుంది. నేను సరోద్ తో సితార్ వాయించినప్పుడు ఇబ్బంది కలగలేదు కాని హిందూస్తానీ వేణువుతో (అతనికి 3 శ్రుతి అలవాటు) తేడా వచ్చింది.
ఇక ‘కృతి’ విషయంలో కూడా స్వల్పమైన తేడాలుంటాయి. సితార్, వేణువు రెండూ హిందూస్తానీ వాయిద్యాలే అయినప్పటికీ ‘గత్’ ఎంపికలో వ్యత్యాసాలుంటాయి. అలాగే వేగంలోని ‘కంఫర్ట్ జోన్లో’ కూడా తేడా ఉంటుంది. ఇవన్నీ ముందుగా ప్రాక్టీసు చేసుకుంటునప్పుడు పరిష్కరించుకోవలసిన సమస్యలు.
పెద్ద కళాకారులైతే ఒక్కొక్కరికీ ‘ప్రసిద్ధమైన’ శైలి కూడా ఉంటుంది. అయితే ఒక్కొక్కప్పుడు ఒక కళాకారుడు రెండో వ్యక్తిని ‘హైజాక్’ చేసినట్టనిపిస్తుంది. అంజద్ అలీ ఖాన్ సరోద్ మీద వేగంగా ‘ఝాలా’ వాయించి హంగామా చేస్తున్నప్పుడు లాల్గుడిగారి వాయింపుకి సరైన న్యాయం జరగలేదని అనిపించింది.
ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోతోందన్న ఆదుర్దాతో కాస్త జనరంజకంగా ఉండడానికి ఈ యుగళ కచేరీలను ఏర్పాటు చెయ్యడమూ కద్దు. అంతగా ప్రసిద్ధులు కానివారిద్దరు కలిసి కాస్త ఆకర్షణ పెంచడానికి ప్రయత్నించడమూ చూస్తాం.
చాదస్తం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
03/28/2007 7:34 pm
కథలో ఇంత తర్కం గూటించడం అనవసరం. పాత్రలన్నీ analysis paralysis తో బాధ పడుతునట్టనిపించింది. పాత్రలని సరిగా చిత్రించడానికి వాటితో ఇంత in-depth analysis చేయించవలసిన అవసరం లేదు. ఉదాహరణకి బొమ్మరిల్లు సినిమా గురించి అంత analysis, reasoning, logic అనవసరం. ఆ సినిమా గురించి పాత్రతో తన అభిప్రాయాన్ని సరళంగా చెప్పించి పాఠకుడికి ఆ పాత్రంటే సరైన అవగాహన కల్పించవచ్చు. కథ సజావుగా సాగిపొతే చదువుకోడానికి పాఠకుడికి సుళువుగా ఉంటుంది. దానికి విరుధ్ధంగా ఇంతింత logic గుప్పించేస్తే పాఠకుడికి ఈ తర్కం అంతా follow అవ్వాల్సిన దుస్స్థితి ఏర్పడి ఎందుకొచ్చిన తలనొప్పి అని అనిపించే అవకాశం ఉంది.
కథ మొదలైన వైఖరిని బట్టి సమాజంలో మనకి తరచు తారసపడే మనస్తత్వాలని ఆధారం చేసుకుని అల్లిన ఒక మంచి కథ చదవబోతున్నానని అనుకున్నాను. కాని మొత్తం చదివాక చాలా disappoint అయ్యాను.
అంతరం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
03/28/2007 1:29 pm
ఎదో అక్కడక్కడ కాస్త హాస్యం ఉండటం వలన తోసుకుపోయింది కాని అసలు విషయం సున్న. అసలు సమస్య గురించి ఎక్కువ చర్చ లేకపోవటం ఈ కథలో చాలా పెద్ద వెలితి. పాఠకుడికి వింధ్య కష్టం ఏవిటో తెలియచెప్పి వెంటనే కథను ముగించడంతో అర్ధాంతరంగా కథను ఆపివేసినట్లనిపించింది. మొత్తం మీద below average అని చెప్పాలి.
రవికిరణ్ గారన్నట్టు, కథలో ఆవిడ పాత్ర బాగానే ఎస్టాబ్లిష్ అయ్యింది. కాకపోతే అది two-dimensional అయ్యి కూచుంది. ఎంతసేపూ తన ఆలోచనలే తప్ప ఎదుటివాళ్ళ అభిప్రాయాలగురించి ఆలోచించే అలవాటు బొత్తిగా కనిపించదు.
ఉదాహరణకి “నీ భర్త నిన్ను అర్థం చేసుకున్నంత వరకూ, ఎవరూ మీ స్నేహం గురించి ఏమనుకున్నా లెక్క లేదులే” అని ఇంకొకావిడ అన్నప్పుడు భర్త తనుచేసే ప్రతి స్నేహాన్ని ఆమోదించితీరాలన్న ఆలోచనే తప్ప, అతనికీ స్వంత అభిప్రాయాలు ఉండవచ్చునని గాని, జీవిత భాగస్వామిగా తన స్నేహాలతో అతనికి ప్రమేయం ఉంటుందన్న ఆలోచనగానీ లేకపోయింది.
“మా ఆయన కర్థం అయ్యే స్నేహాలు మాత్రమే నేను చెయ్యాలట!” – అని ఆ ఇంకొకావిడ అనలేదే!
“అతని కర్థం కాకపోతే అది అతని చేతకానితనం అవుతుంది గానీ, నా స్నేహం తప్పెందుకవుతుందీ?” – అతనికర్థం కానంత మాత్రాన తన స్నేహం తప్పవుతుందని ఎవరన్నారు? అతనికి అర్థం కాకపోయినంత మాత్రాన అది అతని చాతకాని తనమూ కాదు.
“అయినా భర్త దయాదాక్షిణ్యాల మీదా, అతను విషయాలనర్థం చేసుకునే చాకచక్యం మీదా ఆధారపడి లేవు నా స్నేహాలు.” – ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు.
పెళ్ళి భారీగా చేసుకోకూడదన్నది ఆవిడ స్వంత అభిప్రాయం. అది తన స్నేహితుడిమీద రుద్దడానికి తాపత్రయ పడిన ఆవిడ, ఒకవేళ తన స్నేహం తన జీవితభాగస్వామికి ఇష్టం లేకపోతే దానిగురించి ఆలోచించాలన్న సహనం కూడాచూపలేదు!
ఆవిడ వ్యక్తిత్వమే ఈ కథ శీర్షికకి సరిగ్గా సరిపోతోంది!
కనక దుర్గ వ్యాసాలు, ఇంకా నాలాంటి సాధారణ వ్యక్తి తర్కానికే నిలవని వ్యాసాలు ఎందుకు ప్రముఖ పత్రికలలో ప్రచురిస్తారో అర్థం కాదు.
మొత్తానికి గడ్డి బాగా పెట్టారు. అలాంటి వాదన ఎక్కడ తలెత్తినా ఇదిగో అంటూ చూపించడానికి మంచి వ్యాసం రాశారు. ధన్య వాదాలు.
వ్యాసానికి మరిన్ని హంగులు దిద్దిన, శోభ చేకూర్చిన ఈ అభిప్రాయమాలకు అభినందనలు.
–ప్రసాద్ http://blog.charasala.com
అందరి అభిప్రాయాలూ చదివేక, ఈ వ్యాస కర్త గా నేను కొంత వివరణ ఇవ్వవలిసిన ఆగత్యం నాకుందనిపించింది. ఈ వ్యాసం రాయడం వెనకాల రెండు ముఖ్యమైన ఉద్దేశ్యాలున్నాయి:
౧. చాలమంది మన వాళ్ళే – పాశ్చాత్య సంగీతంలో ఏముందండీ – అంతా రణగొణి ధ్వనులు తప్ప అంటూ ఉంటారు. అలాటి వ్యాఖ్యలు విన్నప్పుడల్లా చాలా బాధగాను, కోపంగాను ఉంటుంది. మన సొంతడబ్బా కొట్టుకోడానికి ఇంకొకర్ని నిందించనక్కరలేదు. పాశ్చాత్య సంప్రదాయం కూడా మహోన్నతమైనదే అని నాకు వీలయినంతలో వివరించడం ఈ వ్యాసం యొక్క ప్రథమోద్దేశ్యం. మన సంగీతంతో కొన్ని సారూప్యతలు చూపడం కూడా అందుకే.
ఈ వ్యాసంలో నేను “కాస్పిరసీ-థియరీ” ఏదీ ప్రతిపాదించలేదు. ఇది ఒక గొప్ప పరిశోధన వ్యాసం అని కూడా నేనెక్కడా చెప్పలేదు. ఇది కేవలం సాహిత్య వ్యాసం – పొయటిక్-రెఠోరిక్ ఉపయోగించి, పాఠకుడిని త్యాగయ్య ముందు, దీక్షితార్ ముందు కూచోబెట్టడానికి, మిమ్మల్నోసారి నా వీపున కట్టుకొని వియన్నా నగరం అంతా తిప్పితీసుకొని రావడానికి చేసిన ఓ చిన్న ప్రయత్నం – అంతే. నేనందుకే, వ్యాసం ప్రారంభంలోనే – అష్టదిగ్గజాల కథ చెప్తానన్నానుగాని, వారి గురించిన చారిత్రక సత్యాలు మీముందు ఆవిష్కరిస్తానని చెప్పలేదు. ఈ పోపులడబ్బాతో ఒక ఇడ్లీ-సాంబారు వండిపెట్టే ప్రయత్నం చేసేసు. వీలైతే ఇడ్లీని సాంబారులో ముంచుకొని ఆస్వాదించండి. దీక్షితార్ గారికి ఓ పాట రాయడానికి పదిరోజులు పట్టేదేమో అనంటే – ఆయన పాటతో నాకున్న అనుభూతి అలాటిది, నా అనుభూతిని మాటల్లో చెప్పడానికి చేసిన ప్రయత్నం – అంతేకాని, అది ఆయనకు అవమానం ఎలా అవుతుంది? ఆశువుగా ఆయనో నాలుగు కృతులు చెప్పలేరూ? ఎందుకు చెప్పలేరూ? తప్పకుండా చెప్పగలరు. ఆయన చేతికి గండపెండేరాలేసుకొన్నారో లేదో నేనేమైనా చూసేనా? దానికి, చారిత్రక ఆధారాలు తెమ్మంటే నేనెక్కడనుంచి తేగలను?
ఈ వ్యాసానికి లేని “శాస్త్ర” స్థాయిని మీరే దీనికి ఆపాదించేసి, మీరే దీన్ని దుయ్యబట్టనక్కరలేదు. అది సమంజసం కాదు. పరిశోధన వ్యాసాలు, పాండిత్య చర్చలకి ఈ పత్రిక వేదిక కాదేమో కూడా. పరిశోధన వ్యాసాలని – నిష్ణాతులు, పండితులూ చదివే “సైంటిఫిక్-జర్నల్స్”లో ప్రచురించుకోవాలి. అక్కడ పండితులందరూ మనం ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఒప్పుకొంటే, అప్పుడు – సామాన్య పాఠకుడిముందుకి రావొచ్చు.
ఇక, ఒకరు – ఈ వ్యాసంలోవన్నీ యాధృచ్చికాలేగాని, నిజమైన సారూప్యతలు కావన్నారు. ఒక రకంగా చూస్తే నిజమే. నేను చూపించిన సారుప్యతలన్నీ – స్ట్రక్చురల్-సారూప్యతలు. ఎక్కడైనా, ఏ శాస్త్రమైనా – పరిణామం చెందే దశలు ఒక్కలాగే ఉంటాయి. ఎవరో ఒక మహానుభావుడు ఒక విత్తనం పాతుతాడు, ఇంకొకాయన, దానికి కంచెవేసి, నీరుపోసి మొక్కగా ఎదగడానికి తోడ్పడతాడు, దానికి వేర్లు పాతుకుపోయేక, కాండం బలపడేక – అది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఇందులో యాధృచ్చికమేం లేదు, అలాగని ప్రత్యేకమైన, చెప్పుకోదగ్గ సారూప్యతాలేదు. అయితే, ఇలా తోలు తిత్తిలోంచి గాలి తీసేసినట్టు చెప్తే అందులో మజా ఏముంది? దానికే, కొన్ని రంగులు, రెక్కలు అదిమి – ఓ మధురమైన కథగా చెప్తే రంజుగా ఉంటుంది. చదివేవాడి మదిలో ఒక అందమైన ముద్ర పడే అవకాశం ఉంది.
కూలంకుషంగా ఇలాటి పరిశోధన చెయ్యాలంటే – శాస్త్రాలనీ, విజ్ఞానాన్ని క్రోడికరించిచిన పద్దతులు మనకి తెలియాలి. రెండు శాస్త్రాల్లో క్రోడీకరించడానికుపయోగించిన పద్దతుల్లో మౌలికమైన తేడాలుండొచ్చుకదా? రెండురకాల ఒంటాలజీ పద్దతులున్నాయనిన్నీ – అరిస్టాటిల్ ప్రతిపాదించిన ఒంటాలిజికల్ పద్దతి – ఎనలిటికల్ మెథడ్ ఆధారంగా ఉంటుందని, అదే, మన ఫిలాసిఫీలో వైశేషిక దర్శనంలో ప్రతిపాదించిన ఒంటాలిజీ దానికి చాలా భిన్నంగా ఉంటుదనిన్నీ ఈ మధ్యనే కంప్యూటింగ్ శాస్త్రజ్ఞులూ, భాషా శాస్త్రవేత్తలూ ప్రతిపాదిస్తున్నారు. ఒంటాలజీ తయరు చేసే పద్దతులని “శాస్త్రీకరిస్తే” – ఎవైనా నిర్వచనాల మధ్య అన్యోన్యాశ్రయ దోషాలాటి సమస్యలని చాలా తేలికగా పరిష్కరించుకోవచ్చని అంటున్నారు. అయితే, ఈ చర్చలన్నీ ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. వీటిమీద పరిశోధన వ్యాసాలు ఇంకా రావలసి ఉంది. అవి ప్రచురితమైన తర్వాత – ఆ రంగాల్లో నిపుణులూ, పండితులూ చర్చలూ, చెడుగుడాటలూ, యుద్దాలూ ఇంకా చెయ్యవలసి ఉంది. అవన్నీ అయ్యి, వీటిని సిద్దాంతీకరించడానికి చాలా సమయం పడుతుంది. అది అయితే, ఏ రెండు శాస్త్రాల్లో ఉన్న సిమంటిక్-సారూప్యతలూ, విభేదాలు అర్ధం చేసుకోవటంగాని, సమన్వయించడం గాని చాలా సుళువైపోతుంది. (ఉదాహరణకి, ఈ మధ్యనే – మెత్తం వేదాంతంలోని కాన్సెప్టన్నింటీనీ, వాటి మధ్యనున్న సిమంటిక్-రిలేషన్సుని ఒకే పేజీలో పట్టేటంత ఒక చిత్రపటం తయారు చేసేం. ఎవరికైనా కావాలంటే – నాకు ఈమైల్ చేస్తే – మీకు అందచేస్తాను.) ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే – రెండు సంప్రదాయల్లో సారూప్యతలూ, తేడాలూ చూడాలంటే – దానికో శాస్త్రీయమైన ఆధారం కావాలి కదా? నాకు తెలిసినంత వరకూ – అది సిమాంటిక్సుకి సంభందించిన విషయం. ఈ రాగాలూ అవీ – ఒంటాలజి, సిమాంటిక్స్ పరంగా చూస్తే – కోడెడ్-ఇన్-ఫర్మేషన్-స్ట్రక్చర్స్ – విభిన్నమైన సంగీత రీతుల మధ్య సిమాంటిక్-స్టడీస్ చేసి, వాటి గుట్టు విప్పాలంటే మరి ఒంటాలజి లాటి శాస్త్రాల సహాయం కావాలి. ఇప్పటిదాకా – వీటికి థియరిటికల్-బేసిస్ ఇంకా లేదనుకుంటాను. భాషా శాస్త్రానికి ఎలాగైతే ఒక థియరిటికల్-ఫ్రేమ్-వర్క్ ఉందో అలాటి బేసిస్, క్రోడికరించిన ఎటువంటి విజ్ఞానాన్నైనా విశ్లేషించడానికి కూడా కావాలి కదా? అది ఒంటాలజి, సిమాంటిక్స్ ద్వారా సాధ్యపడుతుందని ఈ రచయిత విశ్వాసం.
అది కుదిరేదాకా – ఇలాటి పోపుల డబ్బా వ్యాసాలు రాసుకోవడమే.
ఇకపోతే – ఈ వ్యాసం ప్రేరణతో ఎవైనా శాస్త్ర చర్చలు ఈ పత్రికలో జరిగితే మంచిదే, కాని వాటిని ఈ వ్యాసానికి గాని, దీన్ని రచించిన రచయితకి గాని అంటగట్టకండి. ఇది కేవలం సాహిత్య వ్యాసం – ఇందులో చాలావరకూ పొయటిక్ -రెఠోరిక్ తప్ప ఇంకేం లేదు. దీనిలోంచి గుడ్డుమీద వెంట్రుకలు పీకటం అనవసరం. ఎవరో ఇండో-యూరోపియన్ భాషలదాకా వెళ్ళిపోయేరు. సురేష్ గారు చెప్పినట్టు – పిడుక్కీ, తద్దినానికి ఒకే మంత్రం వేస్తే ఎలాగ? లేనిపోని “కాస్పిరెసి-థియరీలు” ప్రతిపాదించి పాఠకులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం నేను చెయ్యలేదు. సైంటిఫిక్ విలువలు వేటికీ నేను తిలోదాకాలివ్వలేదు, అలాగే సాహిత్య విలువలు వేటికీ ద్రోహమూ చెయ్యలేదు. తులనాత్మక పరిశీలనలాటి వాటి ఛాయలకి కూడా నేను పోలేదు.
త్యాగయ్య సంగీతంలోనూ, దీక్షితార్ సంగీతంలోనూ ఉన్న ‘స్టైలిస్టిక్’ తేడాలు కూడా – వారిద్దరి సంగీతం విన్నప్పుడు నాలో కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పే ప్రయత్నమేగాని, అందులో వేరే “శాస్త్రీయ”మైన అధారమేమీలేదు. అందరికీ అలా అనిపించకపోవచ్చు – ఇలాటివి మీరు కేవలం వ్యక్తిగతమైన అనుభవంగానే పరిగణించాలని నా మనవి. ఎవరికైనా అవి ఉపయోగపడితే అంతకన్నా కావల్సిందేముంది?
ఆఖరుగా – ఏ రచనలోనైనా కొన్ని తప్పులుంటాయి. షేక్సిపియర్ అంతటి వాడి నాటకాల్లోనే – వెతికితే వ్యాకరణ దోషాలుంటాయి. సర్వజ్ఞత ఎవరికుంటుంది? స్వరసాహిత్యం అనే మాట నాకు సమయానికందలేదు. అది ఆధారంగా చేసుకొని, మెత్తం రచనంతా తప్పులతడకలంటూ ఎండగట్టటం, రచయితకేం తెలీదనటం – అంత సమంజసం కాదు. ఒక రచన ఆధారంగా రచయిత పాండిత్యాన్ని అంచనా వెయ్యగలరా?
వ్యాసము బాగుంది. బాఖ్ కాలములో పియానో లేదనుకొంటాను. అప్పుడు హార్ప్సికార్డ్ ఉండేది. క్రింద ముత్తుస్వామి దీక్షితులపై కొన్ని వివరాలు. శ్రీ ముత్తుస్వామి దీక్షితులు మూడు సంగీత పద్ధతులలో ఆరితేరినవారు. వారి తండ్రి రామస్వామి దీక్షితులు కూడ సంగీత విద్వాంసులే. వీరు హంసధ్వని రాగమును కనుగొన్నారు. ముత్తుస్వామి గాత్ర సంగీతమును మాత్రమే గాక వీణను కూడ నేర్చుకొన్నారు. వారు పాడునప్పుడు వీణను కూడ వాయించెడివారు. వీణతో కలిపి పాడుచుండుటచే వారు చౌక (లేక విలంబిత) కాలమును ఎక్కువగా వారి కీర్తనలలో వాడెడివారు. చివర మధ్యమకాలము సామాన్యముగా కీర్తనలలో నుండును. వీరు ఐదారు ఏళ్ళు కాశీలో గడిపినారు. కావున వీరికి హిందూస్తానీ సంగీతముతో బాగుగా పరిచయము. హిందూస్తానీ రాగములను తన కీర్తనలలో వాడియున్నారు (జంఝూటి, జయజయవంతి, యమన్, సారంగ, బృందావనసారంగ, ఇత్యాదులు). వీరు వీరి తండ్రిగారితో మదరాసు సమీపమున నున్న మణలిలో కొన్ని సంవత్సరములు ఉన్నారు. మణలికి నాయకుడు వేంకటకృష్ణ ముదలియార్. వీరు దుబాసి, సెయింట్ జార్జ్ కోటలో పని చేసెడివారు. అప్పుడప్పుడు ముత్తుస్వామిని, వారి తమ్ముడైన బాలాస్వామిని కోటకు తీసికొని వెళ్ళేవారు. ఆ సమయములో అక్కడ పాశ్చిమాత్య బ్యాండ్ మేళమును వినేవారు. సి మేజర్‌కు సరిపోయే
శంకరాభరణములో నోటు(ట్టు) స్వరములను వ్రాసినారు. సుమారు నలభైకు పైన సంస్కృతములో వ్రాసినారు. నేడు కూడ ఇట్టి నోటుస్వరాలు కచేరీల చివరలో తుకడలుగా పాడుతారు. ఇంగ్లాండ్ రాష్ట్రగీతమైన గాడ్ సేవ్ ది కింగ్ మెట్టులో సంస్కృతములో వ్రాసినారు! వీరి తమ్ముడు బాలాస్వామి ఒక ఆంగ్లేయునిచేత ఫిడేల్ నేర్చుకొన్నారు. వారి తండ్రిగారి సలహా ననుసరించి ముత్తుస్వామి కచేరీలలో వయలిన్ వాయించేవారు. ఇదే కర్ణాటక సంగీతములో మొట్టమొదట వయలిన్‌ను పక్కవాద్యముగా ఉపయోగించుట. అంతకు ముందు వీణను ఉపయోగించేవారు. మూడు సంగీత సంప్రదాయాలను అవగాహన చేసికొని అందులో ఘనతను సాధించారు దీక్షితులవారు.
వీరి సంస్కృత కృతులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస, యతి, గోపుచ్ఛయతి, బీజాక్షరములు, ముద్రాలంకరము (రాగము పేరు పాటలో వచ్చుట), ఇత్యాదులు ఎక్కువ. వీరికి భక్తి మాత్రమే కాదు, విభక్తి అంటే కూడ ఇష్టమే. వీరి విభక్తి పాటలు ఒక ప్రత్యేకత. ఒక్కొక్క పాటను ఒక విభక్తిలో వ్రాయుట ఇందులోని విశేషము. ఎనిమిది విభక్తులలో వీరు ఎన్నియో పాటలను వ్రాసియున్నారు. పాటలలో ఉదాహరణ లనవచ్చును వీటిని.
మాత్రుష్కా బొమ్మలాగు పదములలో పదములుంచి వ్రాయుట వీరి కృతులలోని మరొక విశేషము. శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం, వసుప్రదే, శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే పదే, ఇత్యాదులు. దీనికి గోపుచ్ఛయతి అని పేరు.
ఇవన్నీ రచయితకు తెలిసియుండవచ్చు. స్థలాభావమువల్ల వ్రాసియుండక పోవచ్చు. కాని అందరికీ ఇవి తెలిసిన మంచిదని నేను తెలియజేయుచున్నాను.
వివిధ సంగీతకారులని పరిచయం చేసేందుకు ఈ వ్యాసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే వారి బొమ్మలను కూడా చూపడం మంచి ఆలోచన.
ఎటొచ్చీ ఈ సంగీతకారుల మధ్య పోలికలనూ, సామ్యాలనూ వెతకడం అనవసరమేమో అనిపిస్తుంది. వివిధ దేశాల్లో, రకరకాల పరిస్థితుల్లో, వేరువేరు ప్రేరణలకు లోనై జీవించిన ఈ ప్రతిభావంతులు తమ ప్రాంతాల సంగీతానికి ప్రభావితులయిన మాట నిజమే కాని ఈ రెండు విభిన్న సంప్రదాయాల మధ్య పోలికలేవైనా ఉంటే గింటే అవి యాదృచ్ఛికమే.
ఒక చారిత్రక నేపథ్యంలో, ఒక ఆర్థిక, సామాజిక పునాది రూపొందిన తరుణంలో ఒక్కొక్క సంస్కృతి విలసిల్లుతుందనేది తెలిసినదే. రాజులూ, నవాబుల ప్రాపకం ఉన్న రోజుల్లో కొన్ని రకాల లలితకళలూ, సాహిత్యమూ వర్ధిల్లుతాయి.
ఆసక్తికరమైన సంగతేమిటంటే పదిహేడో శతాబ్దం అంతం నుంచి పంతొమ్మిదో శతాబ్దం మొదలైన నాటి దాకా కర్ణాటక, పాశ్చాత్య సంగీతంలోనే కాక హిందూస్తానీ పద్ధతిలో కూడా విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి. (సమకాలీన సంఘటనలుగా వీటిని ప్రస్తావించవచ్చు గాని సామ్యాలను వెతకడం వ్యర్థ ప్రయత్నమని నా అభిప్రాయం)
1719-1748 మధ్య కాలంలో రాజ్యం చేసిన మహమ్మద షా రంగీలే అనే ముగల్ చక్రవర్తి ఆస్థానంలో నియామత్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ అనే ఇద్దరు ప్రసిద్ధ సంగీతకారులు (వీణ, గాత్రం) సదారంగ్, అదారంగ్ అనే కలం పేర్లతో కొత్త ఒరవడి సృష్టించారు. అప్పటిదాకా జనాదరణ పొందిన ద్రుపద్ శైలికి భిన్నంగా వీరు ఖయాల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈనాటికీ అదే కొనసాగుతోంది.
మొత్తం మీద ప్రపంచంలోని మూడు సుదూర ప్రాంతాల్లో ఒకే యుగంలో మూడు ముఖ్య శాస్త్రీయ పద్ధతుల్లో కొత్త పోకడలు మొదలవడం, ప్రఖ్యాత సంగీత రచయితలు ఆవిర్భవించడం ఆసక్తికరమైన విషయం.
తక్కిన సాంస్కృతిక అంశాల్లాగే కళల చరిత్రలో కొన్నిటిని విస్మరించడం జరుగుతుంది. టర్కీ, మధ్యధరా ప్రాంతాలూ, చైనావంటి తూర్పు దేశాలూ అన్ని చోట్లా సంగీతం ఉంటూనే ఉంది. ప్రతిచోటా గొప్ప సంగీతకారులు ఉండే ఉంటారు. అయితే వారి గురించి చెప్పుకోవడం తక్కువగా జరుగుతుంది. ఇదొకరకమైన కల్చరల్ ఇంపీరియలిజం అనిపిస్తుంది. దీన్ని గురించి ప్రత్యేకంగా పరిశోధన చేసి వ్యాసాలు రాయవచ్చు.
ఈ మధ్య నేను గ్రీక్ సంగీతంలో సరిగ్గా కర్ణాటక సంగీతాన్ని పోలిన రాగాలున్నాయని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోవడం జరిగింది. వాటిని గురించి మరికాస్త తెలుసుకుని ఒక చిన్న వ్యాసం రాసే ఆలోచన కూడా ఉంది. నిజమైన పోలికలంటే ఇటువంటివే.
నేను చాలాకాలంగా అమెరికాలో ఉండటాన, మన దినపత్రికలు చదివే అలవాటు పోయి, సాహితి గారు సవరిస్తే, భయమేసి తప్పు ఒప్పేసుకున్నాను. కాని “శబ్దార్థ రత్నాకరము” లో వెతికినా, “బ్రౌన్” లో వెతికినా ఆ రెండు మాటలూ కనిపించక ఏది తప్పో ఏది ఒప్పో నిర్ధారణగా తెలియలేదు. బూదరాజు ఏ సందర్భంలో విలేకరులు అన్నది వాడారో వారి పుస్తకాల్లో కనబడలేదు.
లేఖలు రాసే అలవాటు తప్పినా, చలం రాసిన “ప్రేమలేఖలు” ఇంకా గుర్తున్నాయి. ప్రాచీన కవిత్వంతో పరిచయం లేకపోయినా, కవిత్వం రాయడానికి నిరుపహతిస్థలమూ, ఉయ్యాల మంచమూ, ఊహ తెలిసిన లేఖకులూ, వగైరా అవసరం అని పెద్దన చెప్పిన ఆశుపద్యమొకటి నోటికొచ్చు.
మరి మన పత్రికల్లోకి విలేకరులు ఎలా జొరబడ్డారా అని నా మనసులో తీరని సందేహం ఉండిపోయింది. ఈవిషయంలో పత్రికల వాళ్ళకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అని సరిపుచ్చుకోలేకపోయాను. అల్పప్రాణమా, మహాప్రాణమా అని నాప్రాణం రెంటి మధ్యా చానాళ్ళు ఊగిసలాడింది. చివరకి రాత్రి ఇది నాకంటబడింది. ప్రాణం లేచి వచ్చింది:
“పత్రికలలో విలేకరి, విలేఖరి అనే మాటలు విస్తృతంగా కనిపిస్తుంటాయి. బహువచనంలో విలేకరులు – విలేఖరులు. విలేఖరుడు వంటి ఏకవచనరూపం కూడా ఉండవచ్చు. ఇక్కడ లిఖ్ అన్నది ధాతువు. అందువల్ల విలేఖరి అనే రూపం ఏర్పడుతుంది. దీనిలో ఖర శబ్దాన్ని విరిచి గాడిదలని చమత్కరించడానికి వీలుంటందన్న భయంతోనేమో కొంతమంది విలేకరి అనేమాటకు ప్రచారం కలిగించారు. చంద్రశేఖర, రాజశేఖర, గుణశేఖర వంటి పేర్లలో కూడా ఈ విధమయిన విరుపునకు అవకాశం ఉంది. అట్లా అని ఈ పేర్లు పెట్టుకోవడం మానలేదు కదా. ఈ భయం తప్పితే విలేఖరిని విలేకరి అనడానికి కారణం కనిపించదు. ఖ-క అయి విలేకరి అనే తద్భవపదం ఏర్పడడంలో అసహజమేమీ లేదు. కాని, ఆధునిక రచనా భాషలో విలేఖరి అని రాయడానికి సందేహించ వలసిన అవసరమేమీ లేదు.”
— “మన భాష,” డి. చంద్రశేఖర రెడ్డి, పేజీ 28.
హమ్మయ్య! ఇప్పుడు ప్రాణం కుదుటబడింది.
ఈ సంచిక సంపాదకీయం లో ప్రస్తావించారు కనుక మరో మాట చెప్తాను. విద్యావంతులు తమ మాతృభాషలోనే స్పెల్లింగు తప్పులు చెయ్యటం చాలా సిగ్గుచేటయిన విషయం. కాని ఇలాంటి తప్పులని సవరించుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకన్నా సహాయపడే సమగ్రాంధ్ర నిఘంటువు మనకి లేదు. కవిత్వ భాషకి కాకపోయినా వాడుక భాషకన్నా మంచి నిఘంటువు లేకపోవడం మనకున్న పెద్దలోటు. ఇంతకన్నా శోచనీయమైనది మరేముంది? ఈ లోటు తీర్చడం కన్నా ముఖ్యమైన వేరే పనేముంది?
ఆవుల మంజులత గారు అధికారంలోకి వచ్చినప్పుడు దీనికోసం తప్పక కృషి చేస్తామని మాట ఇచ్చారు. ఆవిడ కార్యదక్షురాలని కూడా విన్నాను. కాని ఆ ప్రాజెక్టు ఏస్థితిలో ఉందో ప్రకటించినట్లు లేదు!
ఇదేదో కొందరు ఔత్సాహికులు చెయ్యగలిగింది కాదు. అనేకమంది పండితులు దీక్షతో చాలాకాలం కలిసి పనిచేస్తేగాని ఫలితం ఉండదు. దీని కోసం తానా, ఆటా సంస్థలు కృషి చెయ్యాలనీ, అందరూ తమ వంతు సాంకేతిక, ఆర్థిక సహాయం అందజెయ్యాలనీ నా కోరిక.
అంతవరకూ, భాషావ్యాసాల ద్వారా నాలాంటి సామాన్య పాఠకులకి ఉపయోగపడే రచనల్ని చేస్తున్న భాషావేత్తలకి కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు
[విలేకరి, విలేఖరి అన్న పదాలలో ఏది సరైనదో నిర్ణయించడం అంత సులభం కాదు. -అరి అన్న తెలుగు ప్రత్యయాన్ని సుంకరి, కుమ్మరి, కమ్మరి మొ॥ తెలుగు పదాల్లో వాడితే, -కర/కరి /కార అన్న సంస్కృత ప్రత్యయాలను సుధాకర, అహంకారి మొ॥ సంస్కృత ప్రత్యయాల్లో వాడుతాము. లెక్క ప్రకారం విలేఖ(సంస్కృతం) లను సృష్టించే వాడు విలేఖకరుడు, విలేఖకరి అవ్వాలి. అయితే, రెండు సన్నిహిత ధ్వనులు పక్కపక్కనే ఉన్నప్పుడు, రెండు ధ్వనులకు మారుగా ఒక్క ధ్వనిని మాత్రమే పలకడం అన్ని భాషలలో జరిగే ధ్వని పరిణామమే (ఈ ధ్వని పరిణామాన్ని సదృశ వర్ణలోపం (Haplology) అని అంటారు). ఈరకమైన ధ్వని పరిణామం వలన విలేఖకరి అన్న పదం విలేఖరి/విలేకరి గా మారిందని చెప్పుకోవచ్చు. లిఖించేవాడిని (రాసేవారిని) అచ్చతెలుగులో “లేకరి” అనేవారు (మహాప్రాణాలు అచ్చతెలుగులో అల్పప్రాణాలు అవుతాయి కదా!). విలేఖలు రాసేవాడు, విలేకరి అయినా కావాలి, లేదా విలేఖకరి అయినా కావాలి. బూదరాజు గారెప్పుడూ విలేకరి అనే రాసేవారు – సం.]
నేను నా వైపు ప్రయత్నంగా పిల్లల కోసం తెలుగు (నా బ్లాగు లింకు) మొదలు పెట్టాను. మెచ్చుకోళ్ళు బాగానే వస్తున్నాయి. అవి నాకు ఉత్సాహాన్నీ ఇస్తున్నాయి. నిజంగా ఎంతమంది ఎంత తరచుగా అందులోని అంశాలు గాని దాని వల్ల స్ఫూర్తినందుకొని ఇతరం ఏవైనా గాని తమ పిల్లలకు తరచుగా పరిచయం చేస్తున్నారు అని నాకు అనుమానంగా ఉంటుంది. కాని నేను సందేహంతో ఆగదల్చుకోలేదు. ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతూనే ఉంటాను. నా పిల్లలకైతే ఉపయోగపడుతోంది. ఇంకొంచెం విస్త్రుతంగా పరిచయమైతే చేసుకుంటూనే ఉంటాను. ఒకే లాంటి అభిరుచులూ, ఆశయాలూ ఉన్న వాళ్ళు కొందరు తప్పని సరిగా ఉంటారు. వారు కొందరూ కలిసినా చాలు. ఇది నా వైపునుంచి నా ప్రయత్నం.
ఇక, రచ్చబండ లో చాలా మంది చాలా advanced భాషా విషయాలు చర్చిస్తారు, మంచి అనువాదాలు, కవితలూ రాస్తూ ఉంటారు. ఎవరైనా పూనుకుని వాటిని compile చేసి ఒక బ్లాగులో కాని వెబ్సైటు లో కాని పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకెప్పుడూ.
ఈ రోజున internet లో తెలుగులో రాయ గలుగుతున్నాము, చాలా మంచి బ్లాగుల్లో మంచి తెలుగు ఉపయోగింప బడుతోంది. తెలుగు భాషకు సంబంధించిన విషయాలు తెలియజేయబడుతున్నాయి. ఈ రాస్తున్న వారిలో చాలా మంది యువకులు కూడ ఉన్నారు. ఇవన్నీ ఆశాజనకమైన విషయాలు అనిపిస్తుంది నాకు. ఏమి లేకున్నా, పిల్లలకు తెలుగుని పరిచయం చెయ్యాలన్నా, వాళ్ళకు కుతూహలం కలిగించాలన్నా, వాళ్ళని తెలుగుతో “touch” లో ఉంచాలన్నా, ఇప్పుడు చాలా సమాచారం అందుబాటులో ఉంది. ఉన్న మంచిని పెంచుకుంటూ ముందుకి సాగుతూ ఉందాము.
సుమారు పది సంవత్సరాలుగా ఛందస్సులో శాస్త్రీయముగా
పరిశోధన చేస్తున్నాను. దాని ఫలితాలను ఛందస్సు, రచ్చబండల
మూలముగా అందరికీ తెలియజేస్తున్నాను. సుమారు 300
పద్యాలను గర్భ, బంధ తదితర చిత్రకవితలను వ్రాసియున్నాను. కాని ఇందులో జనులకు అంతగా ఆసక్తి లేదండీ. దేనికీ ఫీడ్ బ్యాక్
ఉండదు. కొన్నిటికి పవర్ పాయింట్ ప్రెసెంటషన్లు కూడ ఉన్నాయి.
నా ఉద్దేశములో ఇంటర్నెట్ ద్వార తెలుగు నేర్చే ప్రయత్నాలను
ఎక్కువగా చేయాలి. విశ్వవిద్యాలయాల ద్వారా నేర్చుకోవడం
కొద్దిగా కష్టమేమో? కాని ఈ విశ్వవిద్యాలయాలు ఆన్ లైన్
డిస్కషన్లకు వినియోగిస్తే బాగుంటుందేమో?
ఆలోచనలకు ఆసక్తికరమయిన మాటను శ్రీ వేలూరి గారు
అందజేసినందులకు వారికి హార్దిక వందనములు.
తెలుగు సంఘాలని గురించి పెద్ద ఎత్తున చర్చించటానికి ఇది సరైన వేదిక కాకపోవచ్చు గాని విహారిగారు రాసినది చదివాక లోగడ నేను చేసిన ఒక సూచనను మళ్ళీ ప్రస్తావించా లనిపిస్తోంది.
టీనేజర్లకు తెలుగు గురించి చెపుతున్నప్పుడు మన చిత్ర కవిత్వం గురించీ, బంధ కవిత్వం, అష్టావధానాలను గురించీ తెలిసినవారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చెయ్యగలిగితే వారికి కొంత ఆసక్తి కలిగే అవకాశం ఉంది. భాషని పెర్ఫార్మింగ్ ఆర్ట్ గా ప్రదర్శించడం సరికాకపోవచ్చు కాని దాని శక్తుల గురించి తెలియజేస్తే కొన్నేళ్ళకైనా బాపూ, సినారె తదితరులను గురించి తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తారేమో.
తరవాతి తరాలు సంస్కారపరంగా ఆటవిక దశకు చేరుకోకుండా చూడాల్సినది మనమే కదా. అందుకని నిరాశపడకుండా ప్రయత్నాలు చెయ్యాలి. ఏ ప్రోగ్రాములకు ఎంతమంది వస్తున్నారనేది ముఖ్యం కాదు. మంచి ప్రోగ్రాములు నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగి తీరాలి. కేవలం అంకెలనే ప్రామాణికంగా తీసుకుంటే అర్ధనగ్న రికార్డు డాన్సులు పెట్టించాలి. అప్పుడు చిరంజీవి పాటల కన్నా హెచ్చుగా జనం వస్తారు. అందుకని జనం రావడం ఒక్కటే కొలమానం కాదు. ఆడియన్స్ సంస్కారం కంటే కార్యకర్తల సంస్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది మరిచిపోకూడదు.
చాలా మంచి రచనే కాని పర్యవసానం తేలకుండా ఆగిపోయిన ట్టనిపించింది. జీవితానుభవాలని విస్తృతం చెయ్యగలిగిన రచనలు తెలుగులో ఇంకా రావాలి. దీనికి తరువాయి భాగం ఉంటుందని ఆశించవచ్చా?
మీరన్న మాటల్లొ ఎంతో నిజం వుంది. ఎన్ని సంఘాలు వున్నా వాటి ఆదర్శాలు పూర్తిగా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. అలా అని అవి లేకుండా పోతే మొదటికే మోసం వస్తుంది. ఇవన్నీ కంటికి రెప్ప ఇస్తున్నంత రక్షణ అని నా అభిప్రాయం. ఇవి కూడా లేకపోతే మన సంప్రదాయాలు పూర్తి అంతరించే ప్రమాదమున్నది. ఇక్కడే నేను కూడ తెలుగు సంఘం లో వున్న ప్రధాన కార్య వర్గ సభ్యుణ్ణే. దీని గురించి చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. మొన్న మేము చేసిన దీపావళి సంబరాల్లో గాయకులు కొన్ని చిరంజీవి పాటలు పాడారు. దానికి పిల్ల పీచు అందరూ పెద్ద ఎత్తున స్టేజ్ ఎక్కి డ్యాన్సులు చేశారు. తరువాత ఒక “రామ దాసు” సినిమాలోని పాట డ్యాన్సులు చెయ్యడానికి ముందుకు రమ్మంటే ఒక్కరు కూడా రాలేదు. అలాగే ఈ కార్యక్రమాల్లో సినిమా పాటల మీద మసాల మాటల కామెడీల మీద చూపించే ఇంట్రెస్ట్ మిగతా వాటి మీద వుండదు. సినిమా పాటంటే హాలు ఫుల్లు త్యాగరాజ కీర్తనంటే హాలు నిల్లు. అంత మందిని ఒక చోటకు తీసుకు రావడానికి ఎన్నెన్నో తంటాలు పడాల్సి వస్తోంది.
శ్రీ శ్రీ గారు చెప్పింది కరక్టే. శంకరాభరణం సినిమా చూసి హిట్ చేసిందీ తెలుగు జనులే…మంగమ్మ గారి మనవడు, అల్లుడా మజాకా లాంటి డబుల్ మీనింగ్ డైలాగుల సినిమాలను హిట్ చేసింది అదే తెలుగు జనులే. మన కీర్తిని చెప్పడానికి ప్రతి సారీ బాపు నో, సి.నా.రె. నో, ఆత్రేయ నో, బాల మురళీ కృష్ణ నో తీసుకు వస్తే ఇప్పుడున్న నలభై ఏళ్ళ లోపు వాళ్ళలో థొంభై శాతం మంది గుర్తుపట్టలేక పోవచ్చు. అదే ఏ సినిమా వాడినో పట్టు కొస్తే సులభంగా పబ్లిసిటీ వస్తుంది. పనిలో పనిగా ఆ తెప్పించిన వాళ్ళకూ పబ్లిసిటీ వస్తుంది.
అలాగే విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధన మొదట్లో బాగానే వుంటుంది. తరువాతే సమస్య అంతా. కొంత మంది దాతలు డబ్బు ఇచ్చినా అందులో చేరే వారు కరువవుతారు. రోహిణి ప్రసాద్ గారన్నట్లు అర్థ కాని ఫుట్ బాల్ మ్యాచ్ ను అర్థం చేసుకోవడానికి వెచ్చించే సమయాన్ని తెలుగు బాష మీద సంస్కృతి మీద పెడితే మనం తెలుగు ను ఇంకొంత కాలం బతికించుకో గలుగుతాము.
ప్రమంచంలో వున్న తెలుగు సంఘాలన్నీ తెలుగు వాళ్ళ కోసం కాకుండా తెలుగు మీద అభిమానమున్న వాళ్ళకు మాత్రమే పనిచేస్తాం అనే ఆదర్శం తో ముందుకు పోతే కాస్త సఫలమవుతారు.
“ఛందస్సు లేకుండా కవిత్వం లేదు” – వరద
కామేశ్వరరావు గారూ,
కందకీ గీతకీ తేడా తెలియని ‘విద్యావంతుణ్ణి’ నేను. అదేదో గొప్పగా చెప్పుకోడం లేదు; ఉన్న విషయం చెప్తున్నా. అయినా మీ వ్యాసం నాకు బాగా నచ్చింది.
విశ్వనాథ కవిత్వంలోని తెలుగు వెలుగులు చూపినందుకు సంతోషం. మీరు చెప్పింతర్వాత కొన్ని పద్యాలు చదివి “ఓహో” అనుకున్నాను – “ప్రొద్దుననే లేచి పులికాపు పెట్టును” అంటూ మొదలైన సీసం!
మధ్యాక్కర వాడుకభాషకు వీలుగా ఉంటుందన్నారుగాని “విశ్వనాథ మధ్యాక్కరల” నీ ఆరుద్ర “శుద్ధ మధ్యాక్కరల”నీ ప్రస్తావించలేదు. ఆరుద్ర రాసినది వాడుక భాషగానే కనపడుతుంది.
అని అన్నాడట. అని ‘చెరకాలం’ వ్రాతప్రతిని పట్టుకెళ్ళి పోగొట్టుకున్నాడు! అబ్బూరి దగ్గర మరో కాపీ లేదు! ‘తెలుగు స్వతంత్ర’ లోనూ “అందాకా” లోనూ ప్రచురితమైనవీ, అముద్రితమైనవీ, దొరికినంతవరకు వీళ్ళదగ్గరా వాళ్ళ దగ్గరా సేకరించి, లండన్ వాస్తవ్యులైన పరకాల ప్రభాకర్ 1993లో “కవితా సంచిక” గా ప్రచురించారు. దాంట్లో దాదాపు డెబ్భై పేజీలు ‘చెరకాలా’ నివే! దాని చివర్లో అబ్బూరితో “కవిత్వం అంటే…” అన్న పేరుతో పరకాల జరిపిన ఆసక్తికరమైన ఇంటర్వ్యూ కూడ వుంది.
విశ్వనాథ వారు అబ్బూరి ప్రయోగాలని చూసి, “నీ స్నేహితులంతా ఛందస్సు మీద విరుచుకు పడతారేం? వాళ్ళకి చాతకావాలి కాని అందులో రాయటానికేం బాధ? నువ్వు రాసి చూపించావు కదా – యింకా యేం కావాలి వాళ్ళకి?” అని మెచ్చుకున్నాడు.
చెదురుమదురుగా వున్న మరికొన్ని అబ్బూరి రచనల్ని ఒకచోట చేర్చి, వారి కుటుంబసభ్యులు 1995లో “సామిధేని” పేరిట మరో పుస్తకాన్ని ప్రచురించారు. దాంట్లో చేకూరి రామారావు గారి వ్యాసం, “నిరంతరాన్వేషి, నిత్యప్రయోగశీలి వరద,” కోవెల సంపత్కుమారాచార్య గారి వ్యాసం, “ఛందో వరదస్మృతి,” వున్నాయి. నిజం చెప్పాలంటే, ఆ పండితుల వ్యాసాల్లో కన్నా మీ వ్యాసంలో “ప్రవాహ గుణం” బాగుంది.
ఈ పుస్తకాలు నేను గత రెండేళ్ళ లోపునే కొన్నాను కనుక ఇంకా దొరుకుతున్నాయనుకుంటాను. మీ వ్యాసానికి అవి ఉపయోగపడొచ్చు.
భాషకి అనువుగా ఛందస్సు మారాలని మొదట గుర్తించింది గురజాడ. అతని అడుగుజాడలో నడిచిన వాడు శ్రీ శ్రీ (ఆ విషయంలో). గురజాడ, శ్రీ శ్రీ సాంప్రదాయిక ఛందస్సులలో రాసిన పద్యాలలో భాషనీ, మాత్రా ఛందస్సుల్లో రాసిన పద్యాలలోని భాషనీ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికున్న కవితత్వం ప్రథానంగా పద్యరూపం కావడం మూలానా, పద్యాలకి వ్యవహార భాష తగదని తెలుసున్న కారణానా, ఆనాటి వ్యావహారిక భాషా వాదులు వచన సాహిత్యం గురించే పోరాడారుగాని పద్యాలజోలికి, కవిత్వం జోలికీ పెద్దగా పోలేదు. గురజాడ ఒకడుగు ముందుకు వేసి కవిత్వంలో కూడా వ్యవహార భాష తెచ్చే ఉద్దేశంతోనే మాత్రా ఛందస్సులని స్వీకరించాడు. ఐతే మాత్రా/దేశి ఛందస్సులలో కథా కావ్యాలని సృష్టించగలమా, సృష్టించినా అవి ఎంత వరకూ జన రంజకం అవుతాయీ అన్నది పరిశీలించాల్సిన విషయం. పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యాలుకాని, రంగనాథ రామాయణం కానీ అంతగా ప్రసిద్ధి చెందకపోవడానికి కారణం కేవలం రాజకీయమనో, పండితుల నిరాదరణ అనో కొట్టి పారేశాం కానీ, వాటిని ఒక పోతన భాగవతం తోనో, మొల్ల రామాయణంతోనో పోల్చి వాటి అనాదరణకి కారణాలు వెతికే ప్రయత్నం జరగలేదు.
భాషా శాస్త్ర పారిభాషిక పదాలపై నాకు పెద్ద అధికారం లేదు కాని, agglutination, inflection, vowel harmony మొదలైన లక్షణాలన్నీ కలిసి తెలుగు భాషకి ఆ ప్రవాహగుణాన్ని స్తున్నాయి, బహుశా.
“జ”కి “శో” కి హల్ మైత్రి కుదిరినా అచ్చుల మైత్రి కుదరదు (“అ”కి “ఒ”కి). కాబట్టి ఆ రెండక్షరాల మధ్య యతి సాధ్యం కాదు. అలాగే “వ”కి “వి”కి కూడా కుదరదు. కొంత అరుదైనా నన్నయ్య “ప”కి “వ”కి, “బ”కి “వ”కి యతి వేసాడు. ఉదా:
“నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూరిటికంటె నొక్క స
త్క్రతువది మేలు…”
నిజమే, గ్రాంధిక భాషకీ వాడుకభాషకీ మధ్యనున్న భేదాన్ని వివరించడం శ్రమతో కూడుకున్న పనే. అసలు గ్రాంధిక భాషనీ, వ్యావహారిక భాషనీ సరిగ్గా నిర్వచించాలంటేనే అనేక సమస్యలున్నాయి. వాడుక భాషకి ఒక కాలపరిమితిలోనే లక్షణాలు చెప్పుకోగలం, అది నిత్యం మారుతూ ఉంటుంది కాబట్టి. గ్రాంధిక భాష అంటే, గ్రంథస్థమైన భాష అన్న నిర్వచనం చెప్పుకుంటే, అదీ కాలంతోపాటు మారుతూ ఉంటుంది. గాంధిక వ్యావహారిక భాషా వాదాలు నడచిన కాలంలో, గ్రాంధిక భాషంటే ప్రాచీన కావ్యాల ఆధారంగా రూపొందించిన కొన్ని వ్యాకరణాలకి బద్ధమైన భాష అనీ, వ్యావహారిక భాష అంటే ఆ వ్యాకరణాలకి బద్ధం కానిదనీ నిర్వచించుకున్నారు. ఐతే అటువంటి వ్యాకరణాలకి విరుద్ధమైన ప్రయోగాలు కావ్యాలలో ఉండడం అటు గ్రాంధిక భాషా వాదులు, ఇటు వ్యావహారిక భాషా వాదులూ కూడా గుర్తించారు. ఐతే గ్రాంధిక భాషంటే కేవలం సంస్కృత పదభూయిష్టమైన రచనే కాదన్నది నిర్వివాదం. శివుడిని “అరపదిమోముల దయ్య”మనడం వ్యవహార దూరమే కదా, అంచేత అది గ్రాంధిక భాషే అవుతుంది. ఒక రకంగా ఆలోచిస్తే వాడుకభాష ఎప్పుడైనా గ్రాంధిక భాష కావచ్చు. కానీ గ్రాంధిక భాషలో కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ ఉంటాయి.
గ్రాంధికభాష అంటే గ్రంథస్థమైన భాష అని చెప్పుకుంటే, అది వ్రాసే భాష అవుతుంది. అప్పుడు వాడుకభాషంటే మాట్లాడుకునే భాష అని నిర్వచించుకోవాలి. ఐతే ప్రాచీన కాలంలోని కావ్యేతరమైన లిఖిత సాహిత్యాన్ని పరిశీలిస్తే, అది కావ్య భాషకి భిన్నంగా కనిపిస్తుంది.
ఈ రకంగా గ్రాంధిక, వ్యవహార భాషల నిర్వచనాలగురించే చాలా చర్చ చెయ్యవచ్చు. భాషా శాస్త్ర అభిమాన్లు గ్రాంధిక, వ్యవహార భాషల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులని పరిశీలించ వచ్చు.
ఇవన్నీ నా వ్యాసానికి ముఖ్యం కాదని నేననుకోవడం వల్ల ఈ విషయాల్లోకి వెళ్ళలేదు. నేను ప్రథానంగా చర్చించాలనుకున్నది – ఈ కాలంలో పద్య కవిత్వం రాయాలంటే, ఇప్పటి వాడుకభాషను ఎంతమేరకు ఉపయోగించ వీలవుతుంది? ప్రాచీన కావ్య భాష అనువైనంతగా నేటి వాడుక భాష పద్యాలకి తగుతుందా? దీనికోసమే వాడుక భాష అంటే గత వంద సంవత్సరాలుగా వాడుకలో ఉన్న భాష అని అన్నాను. గ్రాంధిక భాషకి తాత్కాలిక నిర్వచనం (ఇది చేరాగారి దగ్గరనుండి నేనరువుతీసుకున్న పదం) మాత్రమే ఇచ్చి, ఆ భాషలో కనిపించే లక్షణాలని ప్రస్తావించాను. ప్రాచీన కావ్య భాష కూడా నన్నయ్య నుండి, విశ్వనాథ వరకూ మార్పులు పొందుతూ వచ్చినా కొన్ని ప్రధానమైన లక్షణాలను మాత్రం కోల్పోలేదు. వాటినే నా వ్యాసంలో ఉపయోగించుకున్నాను. అధికమైన పద సంపద, “-న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి. అలాగే వాడుక భాషలోని ప్రధానమైన లక్షణాలని ప్రస్తావించాను – నామవాచకాలలోని “ము” సున్నాగా మారడం, విసంధి మొదలైనవి.
ఆధునిక పద్య కవిత్వాన్ని పరిశీలించి, వాడుక భాష పద్య కావిత్వంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అన్న విషయమ్మీద ఇంకా పరిశోధన చెయ్యవచ్చు.
“నేనొక పూలమొక్క….” పద్యం మనసుకి హత్తుకోవడం వెనుక వాడుకభాష సహాయం తగినంత ఉందని తెలుస్తుంది – “చివాలున” కొమ్మ వంచడం, “జాలిగ నోళ్ళు”విప్పడం, “బావురు”మనడం వంటి పదాలని గమనిస్తే.
సురేశ్ గారూ, “అడవికి బువ్వులు దేరగ వడి నరిగిన కచుని జంపి…” అన్న నన్నయ్య గారి పద్యాన్ని బాగానే పట్టుకున్నారండీ!
వారిజములంటే తామరపువ్వులుకాబట్టి ఆ పదం సరిపోదు. “ప్రసవమ్ములొగిన్” అంటే సరిపోతుంది:-)
అలాగే చివరి పాదంలో యతిభగం జరిగింది, “జాలింబడగన్” అని మార్చుకోవచ్చు.
కామేశ్వరరావుగారి వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే, గ్రాంథికానికి వాడుక భాషకి తేడా చెప్పడం ఒక పరిథి దాటిన తరువాత చాలా కష్టం అని నాకనిపిస్తుంది.
ఉదాహరణకు ఒక పద్యంలో “అరపది మోముల దయ్యము” (ఐదు ముఖముల దైవము, అనగా శివుడు) అని అచ్చ తెలుగులోని మాటలతో ఈశ్వరుడిని వర్ణిస్తాడు కవీశ్వరుడు. ఈ పద్యం ఏ కోవలోకి వస్తుంది?
సంస్కృత పద భూయిష్టమైన రచనలే గ్రాంథికమని రచయత అభిప్రాయామా?
ఏది ఏమైనా రచయత విషయాన్ని చెప్పిన శైలి చాలా బాగుంది. కామేశ్వరరావుగారి కలంనుంచి మరిన్ని మంచి వ్యాసాలు రావాలని కోరుతున్నాను.
కొలిచాలగారి క్రింది అభిప్రాయంలో ఎదో self-contradiction కనిపిస్తోంది:
“పండితుల పట్టుదల వల్ల, లాక్షణీకుల వ్యాకరణ సూత్రాల వల్ల గ్రాంథిక భాష కొంత జడత్వం చూపినా, “ప్రాఁతవడ్డ మాటలను” పరిహరించడంలో, కొత్త మాటలను, ప్రయోగాలను ఉపయోగించడంలో నన్నయ్య, తిక్కనల నుండి విశ్వనాథ వరకూ, మహాకవులెవ్వరూ సందేహించలేదని నాకనిపిస్తుంది.”
1. పూర్వ కవుల ప్రయోగంబులు గ్రాహ్యంబులని కదా వ్యాకరణ సూత్రం? మరి పై ఆక్షేపణ (వ్యాకరణం వలన భాషలో జడత్వం) ఎంత వఱకు సమంజసం?
2. నన్నయ, తిక్కన, విశ్వనాథ ఇత్యాదులంతా పండితులు కారా?
వొక అద్భుతవైన రచన, పాఠకుల్ని ఎంత ప్రభావితం చేస్తుందో మీ వ్యాసం మీద వెల్లువెత్తిన అభిప్రాయాలే వొక వుదాహరణ. శ్రీశ్రీ కవిత్వం చాలా మంది సాధారణ పాఠకుల్ని కవులుగా మార్చింది అన్నది వొక అభిప్రాయం. మీ వ్యాసం కుడా కొందరు పాఠకుల్ని భాషాశాస్త్ర దిశలో ప్రయాణం కట్టిస్తుందని నా అబిప్రాయం.
పత్రికలు చదివే చాలామంది పాఠకులు నాలాగే, ప్రత్యేకవైన భాషా, సాహిత్య పరిఙ్ఞానంలేని సాధారణ పాఠకులే. సాధారణ జీవితం ఇచ్చిన కొద్దిపాటి లోకఙ్ఞానం, పాఠశాలల్లోనో, కళాశాలల్లోనో నేర్చుకున్న కొద్దిపాటి శాస్త్ర పరిశీలనా పరిఙ్ఞానం, ఈ రెండిటి కలబోతలోంచి అలవరచుకున్న కొద్దిపాటి తర్కఙ్ఞానం ఇవే మాకున్న అతి సరళవైన logical skills, నిజాన్నిఅబద్దంలోంచి వేరుచైడానికి, తప్పుని వొప్పులోంచి చెరిపేయడానికి. ఐతే ఈ nascent rational attitude lives along with irrational emotional beliefs about race, language, nationality in our minds. తెలుగు ప్రాచీనత మీద ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఆ నాలుగు వ్యాసాలు చదివేక మనసుకెంత ఆనందవేసిందంటే, ఎక్కడో కుర్చోని ఎదో చదువుకుంటున్న నా ఏడో తరగతి కుతుర్ని పిలిచి, చదివి వినిపించి, చుశావా, మన తెలుగు జాతి, తెలుగు భాష గొప్పదనం, ఎప్పుడో సుమేరియన్ నాగరికత కాలంలోనే మన roots వున్నయ్ అని డబ్బా కొట్టి మరీ చెప్పెటంత ఆనందం. తర్వాత మళ్ళా నా కుతురుతో కుర్చోని అ తప్పుని సరి చేసుకోవటం సురేష్ రచన చదివేకే సాధ్యపడింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సురేష్ గారి వ్యాసం ఇంతకుముందు వచ్చిన వ్యాసాలమీద విమర్స లేకుండా వొక్క భాషా శాస్త్రం 101 కే పరిమితవైయ్యుంటే బావుండేది అనే అభిప్రాయం ఈమాట అభిప్రాయాల్లో వ్యక్తం కావటం వలనే. మేవు అతి సాధారణ పాఠకులం, మా బుర్రలో వుండే సవాలక్ష తర్కానికి నిలవని నమ్మకాల్ని తొలగించుకొని, ఎక్కడో, మనసులో ఏ ములో నక్కి నిద్రపోతున్న శాస్త్రియ పరిశీలనని నిద్రలేపాలంటే సురేష్ వ్యాసంలో వున్నటువంటి juxtaposition అవసరవని నా ఉద్దేశం.
విప్లవ్ చెప్పినట్టు ఏ కళ్ళంలో గింజలు ఆ కళ్ళంలో నే నూర్చుకోవటం సహజవే. చేనైతే చాలానే వుంది. కానీ అదేం యదకొచ్చిన చేనేం కాదు. నిదర్శనం కావాలంటే మన ఘనత కెక్కిన విశ్వవిధ్యాలయాల భాషాశాస్త్ర శాఖల వెబ్ సైట్లకెళ్ళి వొకసారి చూడండి. పెట్టుబడైతే చాలానే పెడ్తున్నరు గాని, చేన్ని మాత్రం చవుడు నేల చేస్తున్నారు. కాబట్టి దుక్కి దున్ని, నారేతలేసి, కోసి, నూర్పులు చేసే మెళుకువలు, వోపికలు లేని నాలాటి పాఠకులకి శాస్త్రం తో పాటు, అశాస్త్రియతని వేలెత్తి చూపే సురేష్ గారు వ్రాసిన వ్యాసాలే ఉపయోగకరం.
“శాస్తవేత్తలకే గోచరించని Kuhn శాస్త్రీయ స్వరూపం!”
”The Structure of Scientific Revolutions” అంటే “శాస్త్రీయ విప్లవాల స్వరూపం” అన్నది నచ్చింది. ”Paradigm Shift” అంటే “రూపావళి మార్పు” అన్నది శ్రావ్యంగా ఉంది గాని, మాట వివరిస్తే తప్ప మనసుకి తట్టదు. ప్రతిమానం అంటే పరవాలేదేమో. ఆలోచించే తీరు, దృక్పథం అంటే సులభంగా అర్థమవుతుంది నాకు. ”Post-positivist” అంటే “ప్రత్యక్ష్యోత్తర” అన్నది మాత్రం ఇంగ్లీషులోనూ అంతకంటే మిన్నగా తెలుగులోనూ కర్ణకఠోరంగా ఉంది. ఆధునికోత్తర వాదం లాంటిదా ఇది? ఇవి పంటికింద పడిన రాళ్ళలా బాధిస్తాయి.
ఇంతకీ నేను చెప్పదలచుకున్నది అనువాదాల గురించి కాదు. సురేష్ తన వ్యాసంలో అన్న మాట:
ఒక శాస్త్రవేత్త తయారు చేసిన సిద్ధాంతానికి తరువాతి తరం శాస్త్రవేత్తలు మెరుగులు దిద్దటం కానీ, లోపాలు సవరించడం గాని శాస్త్రపరిశోధనారంగంలో ఎల్ల కాలాల్లోను జరుగుతున్న పని.
దానికేననుకుంటాను, బాపారావు గారు కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు: Kuhn పండితుడు Structure of Scientific Revolutions వెలయించి అరశతాబ్దం కావస్తోంది. “Paradigm Shift” అని ఇప్పుడు కాకపోతే కాసేపటికి అనేసేవాడే ప్రతివాడూనూ. ఇప్పటికైనా శాస్త్రీయ పరిశోధన అనేది క్రమపద్ధతిలో, మునుపటి తప్పులని దిద్దుకుంటూ అలాగ్గా పురోగమిస్తుందనే అపప్రథని ప్రచారం చెయ్యడాన్ని నిషేధిస్తే మంచిది. స్థూల స్థాయిలో చూస్తే సైన్సు తన సిద్ధాంతాల్ని ఒక పట్టాన మార్చుకోదనీ, వస్తేగిస్తే అలాంటి సైద్ధాంతి పరిణామం విలయానికేమీ తక్కువకాదనీ ఒప్పుకుతీరాలి. కుశాస్త్ర తరీఖాలని చెండే వ్యాసంలో శాస్త్రగతి తీరుగురించి పాతరోజుల పడికట్టురాళ్లనే తిరగదోడటం అభ్యంతరకరం. .
వారిద్దరి రాతల్ని బట్టి వాళ్ళు నాకన్నా ఈవిషయాల్లో బాగా తెలిసినవాళ్ళని తెలిసినా, బాపారావు గారు అన్నదానికి అభ్యంతరం తెలపక తప్పడం లేదు. వారు Kuhn గురించి అన్న నాలుగు మాటలకి నేనింత చాటభారతం రాయడం అసందర్భం అనిపించవచ్చు. కాని శాస్త్రీయ పద్ధతులూ స్వరూపం ఈ వ్యాసానికీ జరుతున్న సంభాషణకీ ముఖ్యమనిపించి, మిడిమిడి జ్ఞానంతోనే సాహసిస్తున్నాను. ఎందుకంటే:
శాస్త్ర చరిత్రకారుడైన Thomas Kuhn సైన్సు స్వరూపాన్నీ స్థితిగతుల్నీ బట్టబయలు చేసి శాస్త్రీయ అవగాహనలో ఓ నూతనోధ్యాయాన్ని సృష్టించాడంటారు కొందరు. సైన్సు “వాస్తవికత”కి దగ్గరగా రావడమన్నదాంట్లో అర్థం లేదనీ, ఓ ప్రతిమానాన్ని నమ్మిన శాస్త్రవేత్తలు దానికి లోబడి వున్న సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారనీ, కాని కొన్ని చిక్కువిడని సమస్యల్ని తీర్చడానికి కొత్త ప్రతిమానాన్ని ప్రతిపాదిస్తారనీ, కొన్నాళ్ళకి దాంట్లోనూ తీర్చలేని సమస్యలుండి, మరో కొత్త ప్రతిమానాన్ని ప్రవేశపెడతారనీ, అది పాతదాన్ని స్థానభ్రంశం చేస్తుందనీ, ఇదే శాస్త్ర స్వరూపం – ఇది Kuhn సారాంశం అనుకుంటాను.
ఒక ప్రతిమానం మరొకదానికంటె మిన్న అని చెప్పడానికి వాస్తవమైన ఆధారమేమీ లేదు, మిగిలిన శాస్త్రవేత్తలని నమ్మించగలిగితే చాలు అదే నెగ్గుతుంది, అన్నది ఆయన భావన అని అర్థం చేసుకున్నాను. సైన్సు, శాస్త్రవేత్తలు చేసే వ్యాఖ్యానం మాత్రమే, అదొక రకమైన “భాషా క్రీడ”; అంతేగాని కాలం గడిచేకొలదీ సైన్సు “సత్యానికి” దగ్గరగా వస్తుందనటంలో అర్థం లేదన్నది Kuhn వాదన.
అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే Kuhn తో అంగీకరించరు [1]. Structure లో చెప్పిన ప్రతిమానాల చిత్రీకరణతో ఒప్పుకునే శాస్త్రజ్ఞుల పేర్లివ్వమని బాపారావు గారిని కోరుతున్నాను.
శాస్త్రవేత్తల కన్నా Kuhn ప్రభావితం చేసింది ఓ తరహా తత్వవేత్తలనీ, సాహిత్యకారులనీ. వాళ్ళకీ శాస్త్రవేత్తలకీ చుక్కెదురు! ఒక తత్వవేత్త అయితే, భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజేకాదు, ఆశాస్త్రంలో వాళ్ళ పేరుమీద కొన్ని సూత్రాలున్నా కూడా, వాళ్ళకి జ్ఞానమీమాంస (epistemology) గురించి ఏమీ తెలియనప్పుడు నోటికొచ్చినట్లు వాగకూడదని Kuhn ని విమర్శించినందుకు కొందరు శాస్త్రవేత్తలని అమర్యాదగా తిట్టిపోశాడు [2].
నా ఉద్దేశంలో శాస్త్రవేత్తలు కాని వాళ్ళు సైన్సు గురించి రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. Quantum Mechanics మూలంగా సైన్సు సత్యాన్ని నిశ్చయంగా తెలుసుకోలేదని రుజువయింది కనుక సైన్సుకి ఆధునికాంతర కాలంలో వేరే అర్థం, ప్రాముఖ్యతా ఇవ్వాలనే వాళ్ళు వాళ్ళ పరిథిని దాటి పోతున్నారని నా అనుమానం [3].
నామటుకి నాకు ఇవన్నీ అర్థమయానని అనలేను కాని, ఇవి చదవడం వలన ఎవరికీ ఎలాంటి హానీ కలిగిందనుకోను. ఈ భిన్నాభిప్రాయాలలో వేటినీ నిషేధించాల్సిన అవసరం కనబడటం లేదు. నిజం చెప్పాలంటే, Kuhn భావనలని వక్రీకరించి కుశాస్త్రానికి దోహదం చేస్తున్న వాళ్ళు మిక్కిలి హానికరమనుకుంటాను [4].
బాపారావు గారు, తిరుపతిరావు గారు, Thomas Kuhn, Richard Rorty – వీళ్ళనెవరినీ నేను హానికరమైన వాళ్ళ జాబితాలో చేర్చడం లేదని మనవి.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
1. “The Revolution That Didn’t Happen,” Steven Weinberg, The New York Review of Books, Volume 45, Number 15, October 8, 1998. ఈయన University of Texas at Austin లో Physics professor. చాలా పేరున్న శాస్త్రవేత్త, 1979 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత. తన నలభై-ఏభై ఏళ్ళ శాస్త్ర పరిశోధనా జీవితంలో ఎన్నో విప్లవాత్మకైన మార్పుల్ని చూసినా, సిద్ధాంతం సరైనదా కాదా అని పరిశీలించే తీరులో పెద్ద మార్పేమీ లేదనీ, Kuhn ప్రకటించిన Paradigm Shift లాంటివేమీ జరగలేదనీ వాదించాడు.
2. ”Thomas Kuhn, Rocks and the Laws of Physics,” an essay in “Philosophy and Social Hope,” by Richard Rorty. ఈయన సాహిత్యం, ఫిలాసఫీలో Stanford లో Emeritus professor. Kuhn ని మార్గదర్శకుడిగా గుర్తించిన సమకాలీన తత్వవేత్తలలో ముఖ్యుడు.
3. “పోస్ట్ మోడర్నిజం,” బి. తిరుపతిరావు. ఈయన విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులు. క్వాంటం సిద్ధాంతం ఎలక్ట్రాన్ స్థలమూ వేగమూ ఒకేసారి నిశ్చయంగా తెలుసుకోలేమని నిరూపించింది గదా. అణుప్రపంచంలో సాధ్యం కానిది స్థూల ప్రపంచంలో ఎలా సాధ్యమవుతుందంటూ, సైన్సులోకానీ సామాజిక శాస్త్రంలోగానీ నియతివాదానికి చోటులేదనీ, ఇదే ఆధునికాంతర సైన్సు ప్రాముఖ్యత అనీ, అందుకు Kuhn రచనల్ని ఆధారంగా చూపెట్టారు. శాస్త్రవేత్తలు వీటికి ఒప్పుకున్న దాఖలాల్లేవు. వీరి అభిప్రాయాలతో అంగీకరించినా లేకపోయినా, తెలుగులో ఆధునికోత్తర వాదాన్ని పరిచయం చేస్తూ ఈ పుస్తకం రాసినందుకు వీరిని మెచ్చుకోవాలి.
4. “Pseudoscience and Postmodernism: Antagonists or Fellow-Travelers?” by Alan D. Sokal. ఈయన New York University లో Physics professor. పోస్ట్ మోడర్నిజం పేరుతో అన్ని రకాల మూఢత్వమూ సైన్సులోకీ చరిత్రలోకీ జొరబడిందనీ, దురదృష్టవశాత్తూ జాతీయవాదులేకాక వామపక్షవాదులూ దీనికి దోహదం చేస్తున్నారనీ, భారతదేశంలో ఈమధ్యకాలంలో సాగుతున్న శాస్త్రీయ అవగాహనని ఉదాహరణలతో విశ్లేషించి ఖండించాడు.
విశ్వనాథ వారు భాషా చరిత్రపై రాసిన వ్యాసాలు గురించిన వివరాలు కొంచెం ఇస్తారా? అతని వ్యాసాలలో అక్కడక్కడ కొన్ని భాషా చరిత్రకి సంబంధించిన విషయాలు ప్రస్తావనకి రావడం తెలుసుకాని, భాషా చరిత్ర గురించిన వ్యాసాలు నాకు తెలీదు. అతన్ని భాషా శాస్త్రవేత్తగా ఎవరూ పరిగణించినట్టుగా కూడా నాకు తెలీదు. భారత దేశ చరిత్రగురించి అతను పాశ్చాత్యులతో విభేదించడం తెలుసు. అదికూడా అతను శాస్త్ర పద్ధతిలో కాక, తన అభిప్రాయాలను నవలల రూపంలోనే ప్రకటించారు. అంచేత విశ్వనాథ కూడా తనకి తాను చరిత్రకారుడినని భావించలేదనే అనుకోవాలి. మరి మీకా అనుమానం ఎందుకొచ్చింది?
విప్లవ్ గారు నా మొదటి అభిప్రాయంలో అన్న మాటలని కొంత అపార్థం చేసుకున్నారేమో అనిపించింది. సురేష్ గారన్న దాంట్లో “చాలా మంది” సాహిత్య కారులు అన్న దానితోనే నేను విభేదిస్తున్నాను కానీ ఒక్కరూ సాహిత్య కారులు కాదు అన్నది నా ఉద్దేశం కాదు. పైగా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కాబట్టి దీని గురించి చర్చ కొనసాగించడం అనవసరం.
భాషా చరిత్రల పై నాకున్న ఆసక్తి వ్యాపకంగా మారటానికి ప్రేరకులు, కారకులైన కొద్ది మంది వ్యక్తులలో బాపారావు గారొకరు :-]. గత కొంత కాలంగా తెలుగు చర్చావేదికలకు దూరంగా అజ్ఞాతంలో ఉంటున్న బాపారావు గారు ఈ వ్యాసం కారణంగానైనా మరుగుదాటి తెర ముందుకు రావడం నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా ఈమాటలోనూ, మిగిలిన చర్చావేదికలలోనూ ఆయన తన విలక్షణమైన విశ్లేషణా శైలిని ప్రదర్శిస్తూ తిరిగి వ్యాసాలు రాయాలని, రాస్తారని నా ఆశ.
ఇక ఈ వ్యాసాన్ని మెరుగు పరచడానికి ఆయన చేసిన సూచనలు:
1. భాషాశాస్త్రం 101 కి పరిమితం చేసి ఉంటే బాగుండేది.
నిజానికి ఈ వ్యాసంలో “తెలుగు పత్రికల్లో భాషావ్యాసాల తీరు” అన్న విభాగం ఆఖరి నిమిషంలో కూర్చిందే. కుతర్క వాదాల గురించి కొంతైనా విపులంగా ప్రస్తావించక పోతే, తెలుగు పత్రికలు అంతగా చదవని పాఠకులకు భాషాశాస్త్రం-101 యొక్క ఆవశ్యకత అర్థం కాక ఈ వ్యాసం పరమ బోర్ గా తయారవుతుందని ఒక సమీక్షకుడు చేసిన సూచన, నాకు కూడా సబబే అనిపించి ఆ విభాగం చేర్చాను.
2a. కూన్ పండితుని “శాస్త్రీయ విప్లవాల స్వరూపం” గురించి, సామాజిక-విజ్ఞాన (Social Sciences) రంగాలలో ప్రత్యక్ష్యోత్తర (అంటే Post-Positivist:-)) వాదం గురించి గానీ ప్రస్తావించడానికి భాషాశాస్త్రం-101 సరైన చోటు కాదేమో. అయినా ఒక విప్లవాత్మకమైన కొత్త ఆలోచనా-రూపావళి (Paradigm) ద్వారా ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలకైనా పరిష్కారం చూపించేంత వరకూ ప్రస్తుత రూపావళి చట్రంలోనే (within the frame of the current paradigm కి వచ్చిన తిప్పలు) ఇతర పరిశోధనలను విమర్శంచడం కద్దు. అంతేగాక, శాస్త్రగతిలో రూపావళి మార్పు (Paradigm-shift) ని ప్రస్తావిస్తూ భాషాశాస్త్రం-301 రాయడానికి అవసరమైన శిక్షణా, సామర్థ్యాలు నాకు లేవు.
2b. భారతీయ భాషలపై పరిశోధన చేసిన పాశ్చాత్య పండితులందరూ ఏ రకమైన జాత్యంకారము, దురభిమానాలు లేని మహానుభావులని కీర్తించడం నా ఉద్దేశ్యం కాదు. మానవ సహజమైన అభిజాత్యం అందరిలోను ఉండి ఉండవచ్చు. అదీకాక, వారు ప్రతిపాదించిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలను అప్పుటి ఆంగ్ల ప్రభువులు, క్రిస్టియన్ మిషినరీలు, స్వాతంత్ర్యానంతరం మన తమిళ నాయకులు, తమ తమ ప్రయోజనాలకోసం వాడుకోని ఉంటే ఉండవచ్చు. కాని పాశ్చాత్య శాస్త్రజ్ఞులందరూ ఎంత దురభిమానులైనా వారి పరిశోధనల్లో శాస్త్ర ప్రమాణాలను పాటించడంలో ఒక రకమైన చిత్తశుద్ధి, నిబద్ధతా చూపించారని నాకనిపిస్తోంది.
3. పాండిత్యం రాణించాలంటే ప్రతిభతో పాటు వ్యుత్పత్తి, అభ్యాసాలు అవసరమని మన లాక్షణికులు చెప్పారు కదా. వనరులు అంటే నా దృష్టిలో training and infrastructure: అత్యుత్తమ స్థాయిలో పరిశోధనలు చేయడానికి తగిన శిక్షణ, ప్రోత్సాహం (grants, సంఘంలో గుర్తింపు), వాతావరణం (నిరుపహతి స్థలంబు, తప్పు మెప్పరయు లేఖక పాఠకోత్తముల్ వగైరాలు మాత్రమే కాదు) లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా అది మట్టిలో మాణిక్యమే. నా దృష్టిలో భద్రిరాజు, చేకూరి గార్లు భాషా శాస్త్రజ్ఞులుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి వారు అమెరికా విశ్వవిద్యాలయాల్లో పొందిన శిక్షణే కారణం (ఎమెనో గారి వద్ద శిష్యరికం వల్లే తను ఇంతవాడయ్యాడన్న భద్రిరాజు గారి మాటల్లో అతిశయోక్తి లేదు). అద్వితీయమైన ప్రతిభ ఉండీ కూడా బూదరాజు గారు అంతగా శాస్త్ర పరిశోధనలు చేయ(లే)కపోవడానికి కూడా ఈ శిక్షణ లేమి కారణమని నా అనుమానం.
4. ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే భాషా సంబంధ నిరూపణకు ధ్వనులు (phonemes), శబ్దాలు (morphemes), పదజాలం (vocabulary) తోడ్పడినంతగా వేరే వ్యాకరణాంశాలు ఉపయోగపడవు. కాలగతిలో ఒక భాషలో లింగ (gender), కాల (tense), వాక్య నిర్మాణాది (syntax) వ్యాకరణాంశాలలో ఎన్నో మార్పులు సంభవించినప్పటికీ ప్రాథమిక శబ్దాలు మాత్రం అంతగా మార్పు చెందవన్న అంశం తులనాత్మక పద్ధతి (Comparative Method) కి మూలాధారం. అందుకే అంతకు ముందు పద్ధతులైన Comparative Philology, Comparative Grammar లను తోసిరాజని గత శతాబ్దంలో చారిత్రాత్మక భాషా పరిశోధకుల అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రంగా మారిన ఉపకరణం ఈ Comparative Method. Agglutinative భాషలైన తెలుగు, తమిళాదులలో సంధుల గురించి నాకు వేరే అభిప్రాయాలున్నాయి. వాటి గురించి వేరే ఎప్పుడైనా ముచ్చటిద్దాం.
5, 6. తదుపరి వ్యాసాల్లో మీ సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాను.
ఇకపోతే విప్లవ్, కామేశ్వర రావు గార్లు “సాహిత్యకారుల” గురించి చెప్పింది కొంతవరకు కరెక్టే. కానీ ఈ వ్యాసాలు రాసిన వారందరికీ తెలుగు సాహిత్యంతో పరిచయమున్నంతగా విజ్ఞానశాస్త్ర రంగంలో పరిశోధనకు కావల్సిన అవగాహన, శిక్షణ లేవనే నా అభిప్రాయం. అదీ కాక నేను ఆ వాక్యం రాస్తున్నప్పుడు మనసులో అనుకున్న మాట చెప్పేస్తున్నాను: “నాటి కవి సామ్రాట్టు నుండి నేటి నవలా చక్రవర్తి వరకూ భాషా చరిత్రలపై వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు.” సాహితీ క్షేత్రంలో విశ్వనాథ సత్యనారాయణ గారు సామ్రాట్టులే గాని, చరిత్ర అధ్యయనం లో కాదని నా చిన్ని అభిప్రాయం.
“ఏ కల్లంలో గింజలు అక్కడే తూర్పార పట్టాలి” అన్న విప్లవ్ కోరిక ప్రకారమే నా వ్యాసాన్ని తెలుగుదేశంలోని ఓ పత్రికకు పంపించాను. ఈ కోణానికి మెయిన్ స్ట్రీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.
1. పుస్తకం చదవకుండానే పేరాలు కోట్ చెయ్యడానికి నేనేమీ స్వాములవారిని కాదుగదా! మీరు చదివినంత లోతుగా నేను చదివుండకపోవచ్చు. మీదృష్టీ నాదృష్టీ ఉత్తర దక్షిణ ధ్రువాలు కావచ్చు.
2. నేను రాసినదాంట్లో చివరి వాక్యం తప్ప మిగిలినదాంట్లో వెనక్కి తీసుకోవాల్సిందేమీ కనబడలేదు. శ్రుతి మించిన స్తోత్రాలకూ, సంయమనం లోపించిన “శాస్త్రీయ” విశ్లేషణకూ విరుగుడుగా కాస్తంత వ్యంగ్యం వాడాను. భావ్యం కాదంటారా?
3. ఇవి రెండే ముఖ్యమైన విషయాలని గానీ, అదొక చెత్త పుస్తకమని గానీ నేనన లేదు. అక్బరు అంతఃపురం ఎంత వ్యభిచార కేంద్రమో, తాజమహల్ అసలు ఎందుకు హిందూ రాజ్ మహలో, … లాంటి వేడి వేడి కబుర్లనొదిలేసి, నేను అప్రధాన విషయాలని పట్టించుకున్నాననా మీ ఆక్షేపణ? ఇప్పటి వరకూ వచ్చిన చరిత్ర అంతా తప్పుల తడిక, అందుకు ఈ కుహనా చరిత్రకారులే కారణం, మన పురాణాల్లో వున్నవాటిని (కనీసం కాలానికి సంబంధించినంత వరకు) శాస్త్రీయంగా కోటా వెంకటాచలం గారు ఏనాడో నిరూపించారు, అంతకన్నా ఇంకేం కావాలి? అన్నవి రచయిత ఉద్ఘాటించిన ప్రధానాంశాలలో కొన్ని. నేను అసందర్భంగా కోట్ చేస్తే మీరు తప్పు పట్టండి.
4. ఏదో ఒకటి రెండు పేరాలను తీసుకుంటే చాలదు, పుస్తకం మొత్తం మీద అభిప్రాయం వెలిబుచ్చాలంటారా? దానికి వేరే సందర్భం కావాలి. చరిత్ర గురించి మన జాతి అలవరచుకోవాల్సిన దృక్పధాలని ఆకాశానికెత్తేసే ప్రశంసల్ని చదివి, ఉండబట్టలేక ఒకటి రెండు రచయిత దృక్పధాలని ఉదాహరణలగా ఇచ్చాను.
5. ఇంకా చాలా రాయొచ్చు కాని, దీనిని పొడిగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అదీగాక దీనికి సురేష్ వ్యాసంతో కొంత సంబంధమున్నా కాస్త దూరమైన విషయం. చరిత్ర మీదా, “ఏది చరిత్ర?” మీదా కూడా వ్యాసాలు రావాలి. ఆ విషయంలో మీతో ఒప్పుకుంటాను. ఎందుకంటే, కొడవటిగంటి కుటుంబరావు అన్నట్లు, “చరిత్ర గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల గురించీ శాస్త్రీయంగా ఆలోచించగలుగుతాం.”
సురేశ్ గారి వ్యాసంలో భాష గురించిన పరిశోధనలన్నీ శాస్త్రీయ దృక్పథంతోనే జరగాలనీ, అందులో రాజకీయ ధోరణులకూ, ప్రాంతీయ దురభిమానాలూ, కక్షలూ, కావేషాలకూ తావుండకూడదనీ చక్కగా చెప్పబడింది.
తెలుగు ద్రావిడభాష అనేది మద్రాసులో పుట్టి పెరిగిన నాలాంటివాళ్ళకు బాగా అనిపిస్తూ ఉండేది. తమిళంలోని కొన్ని పదాలే కాక త్రికసంధి పద్ధతిలో వాళ్ళు మాటలను ముడిపెట్టడమూ ఇత్యాదులన్నీ తెలుగులాగే అనిపిస్తాయి. పాత శాసనాల్లో ఇమ్మడి (రెండో), ముమ్మడి (మూడో) వగైరా విశేషణాలు కూడా ద్రావిడభాష మూలాలనే సూచిస్తాయనిపిస్తుంది.
ప్రాంతీయంగా సురేశ్ గారు చెప్పినట్టు కన్నడిగులు ప అనేదాన్ని హ అని (తప్పుగా?) పలికినట్టే మలయాళంలో వత్స అనే మాటను వల్స అని తప్పుగా పలుకుతారని నాకు తెలుసు. ఎందుకంటే త్ అనే అక్షరం ల్ లాగా ఉంటుందట.
మధ్య ఆసియాతో వేదకాలానికి వేల ఏళ్ళ మునుపే సింధు నాగరికతకు సంబంధాలుండేవనేది నిజమే. అక్కడి నిప్పూరు మొదలైన స్థలాల పేర్లు తెలుగులా అనిపిస్తాయి కాని కొందరు పరిశోధకులు చెపుతున్నది సింధు నది నాగరికతలో ప్రజలు మాట్లాడినది ద్రావిడ కుటుంబానికి చెందిన భాష అయి ఉంటుందనే. దానికి తిన్నగా తెలుగుతో ముడిపెట్టడం సబబుగా తోచదు. ఆ కాలంలో (క్రీ.పూ.2400-2000 ప్రాంతాల) అక్కడివారు మాట్లాడినది ద్రావిడ భాషే నని తేలితే అది తెలుగు, తమిళం మొదలైనవాటికి మాతృక అయి ఉండే అవకాశం ఉంటుంది. సంస్కృతం, ప్రాకృతం, పాలీ మొదలైన భాషలూ, బ్రాహ్మీ లిపీ అన్నీ తరవాతి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఇది నిరూపణ అయితే ద్రావిడ భాషలన్నీ (ఒక్క తమిళమే కాదు) అతి ప్రాచీనమైనవేనని తేలుతుంది. ఎందుకంటే సింధు నాగరికతకు బీజాలు బలూచిస్తాన్ లో క్రీ.పూ. 6500 నుంచీ ఉన్నాయట. అప్పటి నుంచి వేదకాలం (క్రీ.పూ. 1400 తరవాత) దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగిన సమాజ జీవితంలో కొన్నయినా ద్రావిడ భాషల మాతృకలు ఉండి ఉంటాయని అనుకోవచ్చు.
హనుమ గారికి
మీ పొడవాటి వ్యంగ్యభరితమైన జవాబు చూసాక…
మీరు ఆ పుస్తకం చదివారా లేదా తేల్చుకోలేకపోయాను. పురాణాల నుంచి చారిత్రిక ఆధారాలను సేకరించారని,సుప్రసిద్ధ చరిత్రకారులను (“మార్క్సిస్టు వర్గానికి చెందిన కుహనా మేధావుల”ను) ఆక్షేపించారని మీరు సూచించిన రెండు విషయాలే, ఈ పుస్తకానికి సంబంధించినవి గా తోచాయి.
నేను, కొంతకాలం క్రితం “ఏది చరిత్ర?” చదివాను.హోల్ మొత్తంగా కాకపోయినా, మరీ బేసబబుగా అనిపించలేదు నాకు (అఫ్ కోర్స్, ఉత్సాహం కొద్దీ చదవటమే కానీ, చరిత్రగురించి నాకు పెద్దగా తెలీదు.మూల గ్రంథాలు చదివి నిజానిజాలని బేరీజు చేయటం నాతో అయ్యే పని కాదు). ఎప్పుడో,తీరిగ్గా ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాను. అందాకా…
ఈ పుస్తకం ఉత్తి చెత్తే అనుకుందాం. కానీ, నా లాంటి uninitiated (I can’t think of the right word) పాఠకులను, నా లాంటి వారి నుంచి సెకండ్ హాండ్, థర్డ్ హాండ్ గా విని తెలుసుకునే వారిని ప్రభావితం చేయగలుగుతుంది అని అనుకుంటాను. ముఖ్యం, ఈ వాదనలు మళ్ళీ, మళ్ళీ వినిపిస్తూ ఉండటం వల్ల. ఆ ప్రమాదాన్ని నివారించేందుకైనా సరే,ఎవరైనా ఓ “చరిత్ర 101” రాస్తే బావుంటుందని అనుకుంటాను. ఏవంటారు?
మనకంటూ శాస్త్ర పరిశోధనా పద్ధతి, ముఖ్యంగా భాష పుట్టు పూర్వోత్తరాల గురించి మొదలైంది 20 వ శతాబ్దం లోనే. పైగా ఈ పరిశోధనలకి మూల గ్రంధాలు సాహిత్యమే కదా! పలానా కావ్యంలో ఇలా రాసినట్లుగా ఉంది కాబట్టి ఆ కాలంలో పదాల వాడుక నిర్ధారించి కాల క్రంలో అవి ఎలా రూపాంతరం చెందాయో భాషా కోవిదులు వివరణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది మీరంటునట్లుగా వారు చదివిన, విన్న వాటి నాధారంగా వాళ్ళ సొంత కవిత్వం కలిపి ప్రజల మీది రుద్దేస్తున్నారు. దానికి తోడు ఈ మధ్య రాజకీయం ప్రవేశించి సాహిత్యం కూడా కలుషితం అయిపోతోంది. మాండలికానికి, మూలానికి అర్ధం తెలియని వారికి ఈ వ్యాసం కాస్త కనువిప్పు కలగజేసే అవకాశం ఉంది.
ఆ మధ్య ఇంకో తర్కం చదివాను. మహమ్మదు ప్రవక్త భార తీయుడే ఆయన పేరు మహామతి అని, ఏసుక్రీస్తు పేరు ఈశు కృష్ణ అనీ, ఇలా చాలా కల్పిత తర్కాలు రాసేస్తునారు. పత్రికలవాళ్ళూ పంపిందే తడవుగా ప్రజలందరికీ అచ్చులో అందిస్తున్నారు.
మంచి వ్యాసం. ఈ మధ్య వచ్చిన కొన్ని మంచి వ్యాసాల్లో ఇదీ ఒకటి.
వార్తాపత్రికలలో మన భాష మీద వచ్చే ఊహాగానాల వలన ఒక ఉపయోగముంది – “ఔత్సాహికులు” వాటిని చదివి నిరాశపడి ఊరుకోకుండా వాటిలోని నిజానిజాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాయడం. సురేష్ ఇంతకుమునుపూ, ఇప్పుడూ రాసిన వ్యాసాలు భాషాశాస్త్రంలో ప్రవేశం లేని నాలాంటి వాళ్ళకి సులభంగా అర్థమవడమేకాక ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం కలిగిస్తున్నాయి. ఇవి 201, 301, … సీరీస్ లా కొనసాగుతాయని నా ఆశ.
స్వల్ప లోపాలనిపించిన రెండు విషయాలు:
1. అందుబాటులో లేని ఉపయుక్త గ్రంథాలు: గంటి గారి పుస్తకం అరవై ఏళ్ళనాటిది, అది దొరకడం కష్టం. భద్రిరాజు గారి పుస్తకం ఖరీదు డెబ్భై అయిదు డాలర్లు! అమెరికాలో ఉన్న భాషాభిమానులైనా కాస్త వెనకాడతారు. ఇంతకన్నా అందుబాటులో ఉన్నవి ఏవైనా ఉంటే చెప్పండి.
2. పేరులేని విమర్శలు: “సాహిత్యం కళ, భాషాశాస్త్రం విజ్ఞాన శాస్త్రం” అన్నారు, బావుంది. చరిత్రకారుడిగా పేరున్న ఓ ప్రముఖ రచయిత, తెలుగు పైశాచి భాష నుండి పుట్టిందనీ, అర్జునుడు అమెరికా వెళ్ళొచ్చాడనీ ఘంటాపథంగా చెప్తున్నారనీ విమర్శించారు. సాహిత్యరంగంలో సంప్రదాయాలెలా వున్నా, శాస్త్రీయరంగంలో వేరేవాళ్ళని విమర్శించేటప్పుడు వారి రచనని ప్రస్తావించడం ఆనవాయితీ. కనీసం రచయిత పేరన్నా చెప్తే వారి రచనలని పరిశీలించే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఆ రచయిత గూడా “ఈమాట”లో తనని తాను సమర్థించుకోడానికీ లేకపోతే సరిదిద్దుకోడానికీ వీలవుతుంది.
అర్జునుడు అమెరికా వచ్చాడనడం హాస్యాస్పదం కావచ్చు గాని, పైశాచీ ప్రాకృతమే తెలుగుకు మాతృక అని పేరున్న పండితులే వాదించారని చదివాను. అదీ Caldwell శాస్త్రీయంగా నిరూపించిన వందేళ్ళ తర్వాత గూడా! మన సాహిత్యంపైనేకాక మన భాష మీదకూడా విస్తృతమైన పరిశోధనలు చేసిన చిలుకూరి నారాయణరావు గారు Caldwell తో విభేదించారట. మిడిమిడి జ్ఞానంగల వాళ్ళనీ రాజకీయ ప్రయోజనాల దృష్టి తో చేసే వాదనలనీ వదిలేద్దాం. చిలుకూరి లాంటి గొప్ప పండితుడు గూడా ఒప్పుకోలేదంటే, మనం తెలుసుకోదగ్గ కారణాలు ఏవో ఉండి ఉండాలి. వాటిని స్థూలంగానయినా చెప్తే బావుండేది.
ఇది చదువుతుంటే, శిథిలావస్థలో ఉన్న తిరుమల రామచంద్ర “సాహితీ సుగతుని స్వాగతం” గుర్తుకొచ్చి తీస్తే, దాంట్లో “దేశినామమాల లోని మరికొన్ని తెలుగు పదాలు” అనే వ్యాసం నన్నాకర్షించింది. మన భాషావేత్తల తగాదాలకు రైలుపెట్టెలకన్నా సరైన చోటు మరి లేనట్లుంది.
“నిన్ను చూస్తే తందామనిపిస్తుందోయ్!” అన్నారట చిలుకూరి, మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో తిరుమల రామచంద్రని చూసి. “అంతటి అపరాధం ఏం చేశానండీ?” అని అడిగితే, “అపరాధం? మహాపరాధమే చేశావ్. సంస్కృత ప్రాకృత సాహిత్యాలకే ద్రోహం తలపెట్టావు. గాథాసప్తశతిలో తెలుగు పదాలు చేరాయని వ్రాశావు” అన్నారట.
తిరుమల రామచంద్ర, “నాదేముందండీ, ఆచార్య హేమచంద్రుడంతటి వాడే శ్రమపడి అలాంటి పదాలని “దేశి నామమాల” గా క్రోడీకరిస్తే,” అన్నారట. “పదకొండో శతాబ్దపు హేమచంద్రుడా నీకు ప్రామాణికం?” అంటే, “నేను గూడా సొంతంగా పరిశోధించి కనుగొన్నానన్నా”రట తిరుమల. “ఏదీ చెప్పు చూద్దాం” అంటే, గుక్క తిప్పుకోకుండా, తెలుగు, కన్నడం, తమిళం నుండి సంస్కృతంలో వచ్చి చేరిన పదాలను – వరసలు, వస్తువులు, జంతువులు, రుతువుల గురించి – ఇలా అనేక పదాల పుట్టుపూర్వోత్తరాలని తిరుమల తడువుకోకుండా వివరించారు.
నాకు బాగా నచ్చిన ఒక పదం గురించి మాత్రం రాస్తాను. అందుకు కారణం చిన్నప్పుడు ఆడిన ఆటలూ పెద్దయింతర్వాత చదివిన కవితలూ గుర్తుకురావడమే.
శ్రీశ్రీ Swinburne కవితల్ని “షెల్లీ కవనపు హల్లీసకం” తో పోల్చాడు. నేను పాతికేళ్ళుగా, “హల్లీసకం” అంటే అర్థం తెలియకుండానే ఆ కవితని గుర్తుచేసుకునే వాణ్ణి. ఈ మధ్య, వేలూరి గారితో పరిచయమయిన తర్వాత, “అర్థం తెలియకుండా చదివిన చదువూ ఒక చదువేనా!” అని ఆయన మెత్తని “దీవెనలు” ప్రసాదిస్తే, బుద్ధిగా నిఘంటువు చూడటం అలవాటు చేసుకున్నాను.
“హల్లీసకం” అంటే స్త్రీలు గుండ్రంగా నిలిచి ఆడే ఆట అని బ్రౌన్ లో ఉంది. అది సంస్కృత పదం. దానికి తిరుమల వ్యాఖ్యానం చూడండి:
“హాల్లీసో = రాసకః. మండలేని స్త్రీణాం నృత్యం. మనకు, కన్నడం వారికి హళ్ళి అనే పదం ఉంది. ఇది సున్నకు పర్యాయపదం. చిన్న వర్తులానికి అల్లి అంటారు కొన్ని ప్రాంతాలలో. గోలీలను అల్లి కాయలంటారు. అల్లికాయలంటే గుండ్రని గుళ్ళు. బొంగరాలాటలో నేలమీద గుండ్రని గీటుగీచి దాని మధ్యన ఒక బొంగరాన్ని ఉంచుతారు చూచారా? అలా గీచే గుండ్రని గిరిని అల్లి అంటారు. అలాగే పిల్లలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని గుండ్రంగా పందెం కట్టి నిలవడాన్ని అల్లి కట్టడం అంటారు. కనుక ఈ అల్లే హల్లీసో అయిందేమో! హల్లీసం నుంచే అల్లీ కాకూడదూ అని ఎదురు ప్రశ్న వేస్తారు కదూ? కావచ్చు. కాని హేమచంద్రుడు దీన్ని దేశి పదంగా పరిగణించాడు కనుకనే ఈ శ్రమంతా.”
అలా మాట్లాడుకుంటూ పోతే రైలు అరక్కోణంలో ఆగినప్పుడు గాని తెలియలేదట, ఎంతసేపు అయిందనీ, తను టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాననీ! అప్పుడు చిలుకూరి:
“చూచావా! నీకిదే శిక్ష. తెల్లవారుజాము బండి ఎక్కి మద్రాస్ చేరుకో. మరొకమారి హోరాహోరిగా పోట్లాడుకుందాం. ద్రావిడ భాషావాద సన్నిపాతం ముంచుకొచ్చింది. మీ కందరికీ స్వాస్థ్యం కలగాలంటే కొంతకాలం పడుతుంది,” అన్నారు.
జులై 1959 “భారతి”లో వచ్చిన ఈ వ్యాసాన్ని తిరుమల ఇలా ముగించారు: “నేను బండి దిగాను. బండి కదిలింది. సాహిత్యంలో అభిప్రాయ భేదాలను వ్యక్తిగత ద్వేషంగా భావించుకొని పగపట్టే ఈ కాలం ఎక్కడ? అభిప్రాయ భేదాలు వేరు. అభిమానాదరాలకూ, మానవత్వానికి సాహిత్యంలోని మత భేదాలు అడ్డురావనే ఆ సహృదయ విమర్శక పరిశోధకాగ్రణి ఎక్కడ? అలాంటి ఉదాత్త హృదయుడు మరొకడు నాకు కనిపించలేదు. ఆయన కీర్తిమూర్తికి నా నమోవాకాలు.”
ఇంతకీ చిలుకూరి తెలుగు సంస్కృత ప్రాకృతాలనుంచి పుట్టిందనడానికి కారణాలేవిటో నాకు తెలియలేదు. రైలు ప్రయాణం లో ఎక్కువ మాట్లాడింది తిరుమలే. చిలుకూరి రాసిన “ఆంధ్ర భాషా చరిత్ర” కూడా అందుబాటులో లేదు. ఈ లోటుని ముందు ముందు సురేష్ పూరించాలని కోరుకుంటూ,
ఈ మధ్య ఒక ప్రబుద్ధుడు గురజాడ అప్పారావును సంస్కృతికి విధ్వంసకుడుగా అభివర్ణిస్తూ ఒక వ్యాసం రాశాడు. తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు రచయితలకూ, వాటిని ప్రచురించేందుకు సంపాదకులకూ హక్కు ఉంటుంది కనక దీనికి అభ్యంతరం చెప్పే పనిలేదు. నా లెక్కన గురజాడ వంటి గొప్ప రచయిత దేని విధ్వంసానికైనా పూనుకుని ఉంటే అది విధ్వంసం చెయ్యతగినదే. ఎటొచ్చీ ఆ విధ్వంసకాండ సమగ్రంగా జరగనందువల్లనే ఇటువంటి అభిప్రాయాలు ఇన్ని దశాబ్దాల తరవాత వ్యక్తమవుతున్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పై వ్యాసాన్ని అవహేళన చేస్తూ నేను ఇంగ్లీషులో రాసి పంపిన ఉత్తరాన్ని అదే పత్రిక సంపాదకవర్గం తమకు తోచిన విధంగా తెలుగులో ప్రచురించింది. తెలిసీ తెలియని నావంటి పాఠకులను వదిలేసినా, హాస్యబ్రహ్మగా పేరుపొందిన భమిడిపాటి కామేశ్వరరావుగారూ, మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారూ గురజాడను యుగకర్తగా గుర్తించారు. మీ రచయిత మేధావి అనీ, పేరు మోసిన ఆ రచయితలిద్దరూ మూర్ఖులనీ నేను వెటకారంగా సంపాదకులతో అన్నాను. నన్ను అపార్థం చేసుకున్న కొందరు పాఠకులకు నామీద కోపం కూడా వచ్చింది. ఈ సంవాదాన్ని పొడిగించి, దీనికి ప్రాముఖ్యతను ఆపాదించడం అర్థంలేనిపని. అంతకన్నా ముఖ్యవిషయాలెన్నో ఉన్నాయి. ఇటీవలి హ్యూస్టన్ (టెక్సస్) సాహిత్య సమావేశంలో మిత్రులను కలుసుకుని చర్చిస్తున్నప్పుడు కొన్ని అంశాలు తలెత్తాయి. వాటిని గురించి క్లుప్తంగా చెప్పడమే నా ఉద్దేశం.
మన దేశంలో హైదరాబాదు, బొంబాయివంటి మహానగరాలు విపరీతంగా విస్తరించడం, కొత్త నగర శివార్లూ, వాటిలో కాలనీలూ పుట్టుకురావడం మనకు తెలిసినదే. ఈ ప్రాంతాలన్నిటిలోనూ కిక్కిరిసిన కొంపల్లో హడావిడి జీవితాలు గడుపుతూ, ఆఫీసులకూ, స్కూలు కాలేజీలకూ పరుగులు తీస్తూ జీవిస్తున్న అసంఖ్యాకులకు ఏకైక సాంస్కృతిక సాధనం టీవీయే. ఎందుకంటే పుస్తకాలు కొని చదివే తీరిక దాదాపుగా సున్నాయే. వ్యాపారమే పరమావధిగా పెట్టుకున్న టీవీ చానళ్ళన్నీ అంతులేని చెత్తను “కళా రూపాల్లో” ఎలా ప్రసారం, ప్రచారం చేస్తాయో మనకు తెలియనిది కాదు. ఈ విషయాలనన్నిటినీ జీర్ణం చేసుకుంటూ గత పాతికేళ్ళుగా కుటుంబాల్లో పెరిగిన పిల్లలే నేటి యువత. వీటన్నిటికీ ఎదురీది, మంచి విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించిన కొద్దిమంది తప్ప తక్కినవారంతా ఉన్న పరిస్థితులకు “బలి” అయారంటే ఆ తప్పు వారిది కాదు. పాతవారికి తెలిసిన కొన్ని సామాన్య విషయాలు కూడా వారికి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు.
పాతవారందరికీ అన్నీ తెలుసునని కాదు. 40 ఏళ్ళ క్రితం మద్రాసులో కాలేజిలో చదువుతున్నప్పుడు నేనొకసారి మా బంధువులబ్బాయి ఒకణ్ణి “కన్యాశుల్కం చదివావా?” అనడిగితే, “ఏం, అది మీనాన్న రాశాడా?” అని ఎదురు ప్రశ్న వేశాడు. కన్యాశుల్కం ఎవరు రాశారో వాడికి తెలియదు సరికదా అది మా నాన్న రాసినందువల్లే నేనా విషయాన్ని ప్రస్తావించానని వాడనుకోవడం కూడా గమనార్హం. కుటుంబ వాతావరణమే ఇందుకు కారణం. ఇటువంటి సంఘటనలు ఈ రోజుల్లో మరింతగా జరిగితే ఆశ్చర్యపోవక్కర్లేదు. “గురజాడ అంత గొప్ప రచయితయితే అతని సీరియల్స్ టీవీలో రావటం లేదేం?” అని ఎవరైనా అడిగే అవకాశముంది.
ఈ పద్ధతిలో జరిగిన కొన్ని అవాంఛనీయ మార్పులను సరిదిద్దేందుకు కొత్త రకమైన ప్రయత్నాలు జరిగితే బావుంటుందనిపిస్తుంది. ఇందుకై బుద్ధిపూర్వకంగా కొన్ని పనులు జరగాలి. మొదటగా, తెలుగులో రాయగలిగినవారందరూ వివిధ విషయాలపై రచనలు కొనసాగిస్తూ ఉండాలి. (వీరిలో కొందరు కేవలం తమ పేరు ప్రఖ్యాతులకై రచనలు చెయ్యవచ్చునేమో కాని అదంత ముఖ్యవిషయం కాదు. రచయిత తాపత్రయం ఎటువంటిదైనా మంచి రచనలే నిలుస్తాయి). ఈ రచనల్లో కొన్నయినా మన సాంస్కృతిక వారసత్వంలోని “ఆరోగ్యకరమైన” విషయాలను పరిచయం చెయ్యగలిగినవై ఉండాలి. తమ మాతృభాషను గురించీ, సంస్కృతిని గురించీ ప్రతి తరంవారూ తెలుసుకోదగిన మంచి విషయాలుంటాయి. తల్లిదండ్రులు చెప్పగలిగిన విషయాలతో బాటు పుస్తకాలూ, ఇతర మాధ్యమాల ద్వారా ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. వీటి గురించి తగినంత ఆసక్తిని రేకెత్తించి, యువతీ యువకులకు ఆ వివరాలను వీలున్నంత బాగా అందజేసే బాధ్యత పాత తరానిదే. ఎటొచ్చీ ఈ పనులన్నీ కొనసాగుతున్న పద్ధతి నానాటికీ అతి బలహీనంగానూ, దయనీయంగానూ అనిపిస్తోంది. ఆధునిక జీవితాల పోకడనుబట్టి చూస్తే “కూటికీ, గుడ్డకూ పనికిరాని” మన పాత సంస్కృతిని గురించి తెలుసుకోవడం ఉత్త టైం వేస్టు. ఈ ధోరణిని నిలువరించి వెనక్కు తిప్పడం ఇప్పటికే అసాధ్యం అయిపోతోంది. అందుకని వీటికై బుద్ధిపూర్వకంగా కొన్ని ప్రయత్నాలను చేపడితే బావుంటుందేమో విజ్ఞులు గమనించాలి.
మనలో చాలామందికి పాతవారి గురించీ, వారు సృష్టించిన సాహిత్యాదుల గురించీ నామమాత్రంగానే తెలుస్తూ ఉంటుంది. వారిని పరిచయంచేసే వ్యాసాలూ, వారి కృషికి ఈనాడున్న రెలవెన్స్ మొదలైన అంశాలూ వగైరాలన్నీ అందుబాటులోకి రావాలి. “ఈమాట”లో ఇటీవల వేలూరివారు తిరుపతి వెంకటకవుల పద్యాలను ఉదహరించడం ఇటువంటి మంచి ప్రయత్నాల్లో ఒకటి. పాత కవిత్వ సంకలనాలను కొని, పూర్తిగా చదివే అవకాశమూ, వ్యవధీ లేనివారికి కనీసం మెతుకు పట్టి చూసిన పద్ధతిలో వాటిని చదివే అవకాశం లభించినట్టవుతుంది. అలాగే ఈ సంచికలో సి.ఆర్.రెడ్డి తదితరులు కొన్ని దశాబ్దాల క్రితం చేసిన సాహిత్య విమర్శలోని అంశాలూ, వాటిలో కనబడుతున్న ఆనాటి సంకుచిత ధోరణులూ వగైరాలను వేలూరివారు బాగా వివరించారు. రెడ్డిగారైనా, బసవరాజు అప్పారావుగారైనా వారు చేసిన కృషి చెప్పుకోదగ్గదే. పేర్లు మినహాగా వీరెవరో తెలియని యువపాఠకులకు వీరి రచనలను గురించి క్లుప్తంగానైనా పరిచయం చేసి తీరాలి. వారి రచనల నమూనాలను ప్రచురించాలి. ఆ రచనలు చేసిన కాలాన్నీ, సందర్భాన్నీ, ఆయా రచయితలు గురి అయిన ప్రేరణలనూ కాస్తయినా వివరించాలి. యువపాఠకులు చాలా తెలివైనవారు. అందిస్తే అల్లుకుపోగలిగిన ప్రజ్ఞ కలవారు. పాతతరంవారు చెయ్యవలసిందల్లా అందించడమే. ఈ ప్రక్రియలో భాగంగా ఇంతకు మునుపు అచ్చయిన పరిచయ వ్యాసాలను మళ్ళీ ప్రచురించడం కూడా మంచిపనే. ఇదంతా ఒక చిన్న ఉద్యమం స్థాయిలో జరిగితే పరిమితంగానైనా కొంత సాంస్కృతిక పునరుజ్జీవనం వంటిది జరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు “ఈమాట” కూడా పూనుకుంటే బావుంటుందని నాకనిపిస్తోంది.
శ్రీ వెంకటేశ్వరరావు గారి సూచనలు చాలా బాగున్నాయి.వినోదాత్మక విషయాలకు పెట్టే ఖర్చులో 10% ,భాషాభివృద్ధికోసం ఉపయోగిస్తే ,తెలుగు జాతి తప్పకుండా ప్రగతిని సాధిస్తుంది.భాష,సంస్కృతి,ప్రగతి అనే ఈ మూడు విషయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. భాషలో సంస్కృతి పొదగబడి ఉంటుంది.సంస్కృతి లేని ప్రగతిని నిలుపుకోవడం సాధ్యం కాని విషయం.
#
ఉమాకాంతం గారి “నేటి కాలపు కవిత్వం” చదివిన తరువాత నాకైతే అతనికి ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము లోపించాయని అనిపించలేదు. మరి కృష్ణశాస్త్రిగారికి అనిపించింది. ఏది నిజం ఏది కాదు అంటే ఎవరు చెప్పాలి? అయినా ఇవి కావేమో విమర్శకుడికి ఉండల్సిన ముఖ్యార్హతలు.
ఆర్ద్ర దృష్టి కవితా హృదయము కన్నా వేలూరి గారన్నట్లు నిష్పక్షపాత దృష్టి, నిజాయితీ హృదయమే విమర్శకు ఎక్కువగా కావలసిన సామగ్రి అనుకుంటాను.
చదవగానే వినగానే మైమరిచి కరిగిపోయే ఆర్ద్రదృష్టి, భావాల వెల్లువలో తూలిపోయే కవితా హృదయం, భావ సమాధికి తన్మయత్వానికి సాయపడుతాయి కాని, పలు దృక్కోణాలనుంచి సమగ్రంగా అవగాహన పొందడానికి, సంయమనంతో విశేషంగా విశ్లేషించడానికి సాయపడడం కన్నా, అవి కొంత అడ్డుగానే నిలబడతాయని అనుకుంటాను.
రచనలు పలు రకాలైనప్పుడు విమర్శలు కూడా పలు రకాలుగా ఉండడం సహజమూ అనివార్యమూ కూడా. అయితే రకాలు ఎన్నైనా, విషయం పాఠకునికి అందించడమే రచనలన్నింటి ఉద్దేశం. ఆ ఒక్కటి నెరవేర్చడంలోనే ఎన్నో ప్రక్రియలు, మార్గాలు, వైవిధ్యాలూ, సొగసులు, సృజనాత్మకమైన ప్రయోగాలు అన్నీనూ.
అట్లే విమర్శలు ఎన్నో రకాలున్నా విమర్శించే రచన గురించి విశేషమైన అవగాహనను అందించే వరకూ అవి అన్నీ విమర్శలే, ఖచ్చితంగా. అయితే విశేషమైన అవగాహన కలిగించడం సుళువైన పని కాదు, కొన్ని సార్లు రచన కన్నా కష్టతరమైనది కూడా.
మరి సమగ్ర విమర్శకు ఏమి కావాలి ? విమర్శకునికి రచనలో ఉన్న లోతులను చూసే నిశితమైన దృష్టి, అది వ్యక్తపరచే భావాలను అందుకునే హృదయ వైశాల్యం, సోంత ఇష్ట అయిష్టాలకు అందనట్టి ఎత్తులో ఉన్న నిష్పక్షపాతం – ఇవ్వన్నీ ఉంటేనే సమగ్రమైన అవగాహన పొందడానికి కానీ, ఇతరులకు అందించడానికి కాని సాధ్యం కాదనుకుంటాను. ఇక అవగాహన పెరుగే కొద్దీ విమర్శ యొక్క అభివ్యక్తీకరణలో స్పష్టత, క్లుప్తత వస్తుంది, సహజంగా. సూటిదనం కూడా ఉండి పాఠకున్ని విసిగించదు.
మరి విమర్శ చేయడానికి ప్రేరణ, శిక్షణ అవసరమా అంటే తప్పకుండా అవసరమే. అయితే ప్రేరణ అందుకునేదే కాని అందించేది కాదు. ఇక శిక్షణా పద్ధతులు మాత్రం చర్చనీయాంశం.
చివరగా ఒక్క మాట. తెలుగు భాష యొక్క వెలుగే తగ్గుతున్న రోజుల్లో తెలుగు సాహిత్యం పై చేసే విమర్శలో శిక్షణకు ఎంత priority ఉందో, ఉండాలో తెలియదు. తెల్లటి బట్టపై చిన్న మరక పడితే వేలెత్తి చూపిస్తారు కాని, పూర్తిగా మాయకపోయినా తెలె తెల బోయే బట్టపై మరకలను ఎవరు వెతికి చూపిస్తారు! రచనలు ఎక్కువగా నిస్సారమైనప్పుడు గొప్ప విమర్శలు మాత్రం ఎక్కడినుంచి వస్తాయి అని అనుకుంటాను.
విమర్శల్లో తెగనాడినవి గుర్తున్నంతగా తక్కినవి గుర్తుండవేమో! తెలుగులో మంచి విమర్శలు చాలానే వెలువడ్డాయి. కాని వేలూరివారు చెప్పినట్టుగా కొన్ని విమర్శల ద్వారా రచన గురించే కాక విమర్శకుడి సంగతి కూడా మనకు తెలుస్తుంది.
పాత సాహిత్యంలో “అమలినం” కాని శృంగారాన్ని పద్ధెనిమిదో శతాబ్దం నుంచీ విమర్శకులు ఈసడించుకోవడం కనిపిస్తుంది. ఆ తరవాతి కాలంలో కూడా ముద్దుపళనివంటివారి రచనలు తీవ్ర విమర్శకు లోనవడం గురించి ఆరుద్ర ప్రస్తావించారు. వాటిలో కొన్ని శృంగారాన్ని గురించిన స్త్రీల దృక్పథాన్ని తెలుపుతాయనీ, వాటిని తరవాతి కాలంలో అణచకుండా ఉన్నట్టయితే అదొక ఆధునిక స్త్రీవాద సాహిత్యానికి దారి తీసి ఉండగలదనీ ఆయన భావించారు.
వ్యాసంలో ప్రస్తావించిన రచనలోనే కృష్ణశాస్త్రిగారు తనకన్నా సీనియర్లనూ, జూనియర్లనూ కూడా పేర్కొంటూ, విమర్శ కాకపోయినా సమీక్ష చేశారు. కె.వి.రమణారెడ్డి అనేకుల రచనలను వివరంగా విమర్శించారు. “ఋణ” దృక్పథంతో చేసిన విమర్శల్లో రాచమల్లు రామచంద్రారెడ్డిగారు దిగంబర కవులను గురించి రాసినది కూడా ఒకటి. త్రిపురనేని మధుసూదనరావు విశ్వనాథ రచనలను విశ్లేషించి మరీ చెండాడాడు.
ఈ మధ్య ద్వానాశాస్త్రి తదితరులు విప్లవ, స్త్రీ వాద, దళితవాద, మైనారిటీ వాద రచనలను సహృదయతతో విమర్శ చేస్తున్నారు. ఇవి అంతగా గుర్తుండకపోవటానికి కారణం ఇవన్నీ దిన, వార, మాసపత్రికల్లో ఏదో ఒక మూల కాస్తకాస్తగా కనిపిస్తూ ఉండడమే. సాహిత్యానికే దిక్కులేని ఈ రోజుల్లో విమర్శలను పట్టించుకునేవారే తక్కువ.
మంచి సాహిత్యాన్నిగాని, ఉన్న సాహిత్యంలో మంచినిగాని పరిచయం చేస్తే అది కూడా ఉపయోగకరమే. 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వెల్చేరు నారాయణరావుగారు వెన్నెల రాత్రి వేళ హాస్టలు డాబామీద తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితను విద్యార్థులకు చదివి వినిపించడం గుర్తుంది.
విమర్శకులూ, సమీక్షకులూ సామాన్య పాఠకులకన్నా కాస్త లోతుగా పరిశీలించి, రచనలను గురించి వ్యాఖ్యానం చేస్తారు కనక సాహిత్యాభిమానులకు అది ఉపయోగపడుతుంది. అయితే వారికి కూడా తప్పనిసరిగా కొన్ని పరిమితులుంటాయి. వేలూరివారి వ్యాసంవల్ల నాకు అర్థమయినదిదే.
Alok Vastav గారు కృష్ణశాస్త్రి గారి మూల వ్యాసం చదివి ఉంటే, ఉమాపతి గారి గురించి నేను అన్నమాటలకి అక్షేపణ చేసేవారు కాదనుకొంటాను.
కృష్ణశాస్త్రి గారి “పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము” అన్న 1948 భారతి పత్రికలోని వ్యాసం 1923 నుంచి 1948 వరకూ వచ్చిన కవిత్వంపై, నాటి కవితా ఉద్యమాలపై చక్కని విమర్శనా వ్యాసం అని నిస్సంశయంగా చెప్పవచ్చు.
ఓరియంట్ లాంగ్మన్ వారు 1993 లో ప్రచురించిన “అప్పుడే పుట్టి ఉంటే” అన్న కృష్ణశాస్త్రి గారి వ్యాస సంపుటి లో ఈ వ్యాసం తిరిగి అచ్చయ్యింది. 1/8 డెమీ సైజులో 34 పేజీల సుదీర్ఘ వ్యాసం ఇది. ఆ వ్యాసంనుంచి ఈ కింది వాక్యాలు (చూ: 29 వ పేజీ):
“… కృష్ణపక్షం ప్రచురించాను. స్ఫుటంగా నా మనస్సులో నాటుకొపోయిన మరి రెండు మూడు ఘట్టాలు ఉన్నాయి. 1925 లో నేమో అక్కిరాజు ఉమాకాంతం గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వము” అనే గ్రంథం వచ్చింది. ఆశనిపాతమంత తీవ్రధాటితో వచ్చింది. రాకేం జేస్తుంది? ఎప్పుడయితే నిజమైన ఒక ఉద్యమం బయలుదేరిందో, అప్పుడే దాని గుణదోషవిమర్శన కూడా వస్తుంది. ఆయన తీవ్ర విమర్శననుంచి నావంటి కవులు నేర్చుకోవలసినది లేకపోనూ లేదు; కాని కొంత ఆర్ద్ర దృష్టితో కవితాహృదయముతో ఆ విమర్శన సాగితే, నేటికాలపు కవిత్వంలో వారు చక్కదనమూ కవిత్వగుణమూ గ్రహించి ఉండేవారు. ఊపిరాడనీయనంత కోపంతో ఆ గ్రంథం దాడిచేసినట్లనిపించింది నావంటి వారికి. దానికి జవాబు వ్రాద్దామా అన్నారు కొందరు మిత్రులు. ఏమి జవాబు మేము వ్రాయగలం? కొత్త పద్యాలు వ్రాయడమే జవాబనిపించింది. వ్రాయకుండా ఎలాగుండగలం? ఈ సంకల్పం 1925 లో మదరాసులో మరీ దృఢపడింది.”
ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము ఉమాకాంతపండితులకు లోపించిందని ఇంతకన్నా మృదువుగా, కృష్ణశాస్త్రిగారి కన్నా చక్కగా ఇంకెవరు చెప్పగలరు?
సుమారుగా 100 ఏళ్ళ క్రితం వ్రాసిన విమర్శ గురించి సోదాహరణంగా విపరీతంగా చర్చించారు. 40/50 ఏళ్ళ క్రితం వ్రాయబడ్డ (నాకు ఉమాకాంతం గారు ఏ సంవత్సరంలో వ్రాసారో గుర్తులేదు) విమర్శ గురించి ఒక్క ముక్క చెప్పి, దానిపై మీ అభిప్రాయం వ్రాసారు. ప్రస్తుత విమర్శనా ధోరణి పై మీ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అంత వరకూ బాగుంది. కాని, కొత్త విమర్శలకు ఉదారణలు ఇచ్చి ఉండవలసింది. కనీసం నలుగురి పేర్లు, వారి రచనల పేర్లిచ్చినా బాగుండేది.
విమర్శ ఎలా ఉండకూడదో చెప్పారు బాగానే ఉంది. ఎలా ఉండాలో చెప్పే విమర్శలు తెలుగులో లేవనుకోవాలా? అనే సంశయాన్ని కలిగించారు. మంచి విమర్శల గురించి కనీస ప్రస్తావన చేస్తే బాగుండేది.
వ్యాసంలో ఋణ విద్యుచ్ఛక్తి దండిగా ఉంది. మీ ఆశయం దాన్ని చదువరులకు తెలియజెప్పడం కాదు గదా! వారి దృష్టి ధనాత్మకత వైపు మళ్ళించడానికి అది ఒక వేదిక మాత్రమే.
ఇది ఒక సాహితీ సభలో కీలకోపన్యాసంగా ఇవ్వబడిందని చెప్పుకున్నారు గాబట్టి ఒక మనవి. కీలకోపన్యాసాలు ఋణాత్మకంగా మొదలవడంలో తప్పులేదుగాని, ఉపన్యాసం పూర్తయేసరికి ధనాత్మకత హృదయాల్లో ప్రతిష్ఠించాలి. ఈ వ్యాసం ఆ పని చెయ్యగలదని అనిపించలేదు నాకు.
పైన చెప్పిందంతా కేవలం నాకొక్కడికే అనిపిస్తే అది నాలోపమే.
ఇది ఆసక్తికరమైన వ్యాసం. పరిశోధనా పరంగా విషయాలను వెతికి వెలికి తీసి అందించిన శ్రమ కొట్టొచ్చి నట్లు కనపడుతుంది. రాజుల గురించి, కావ్యాలు, రచనలను ఉటంకించి ఎన్నో విషయాలను అందజేసారు.
కాని వీటినన్నింటి ఆధారంగా చేసిన విశ్లేషణ, conclusion మాత్రం అసమగ్రంగా, అసంబద్ధంగా ఉంది. ఉదాహరణకు భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇది అని వివరించిన
వాక్యం చూడండి. ఇది ఎందుకు ఉటంకించానంటే, మొత్తం వ్యాసానికి ఇది ప్రధాన భూమికగానే కాక, అంతస్సూత్రంగా కూడా ఉన్న ముఖ్యాంశం.
“(భావ కవిత్వం) దేశంలో ఒక మధ్య తరగతిని తయారు చేసి వాళ్ళ ఊహల ద్వారా ఒక భారత జాతీయతని నిర్మించింది” అని అన్నారు.
ఇది అసంబద్ధంగా ఉంది. కవిత్వానికి ఎక్కడైనా మధ్య తరగతిని తయారు చేసే శక్తి ఉంటుందా ? పోనీ, అలా చేస్తే కవిత్వానికి ఎప్పుడైనా ఒక ప్రత్యేక మైన వర్గానికి చెందిన వారి ఊహలను మాత్రమే ప్రభావితం చేసి, ఇతరులను అంటకుండా ముట్టకుండా వదిలేసే విచక్షణాపరమైన శక్తి కూడా ఉంటుందా? పోనీ, మధ్య తరగతి వాళ్ళ ఊహలు ప్రభావితం చేసిందే అని అంగీకరించినా, నేటి మధ్యతరగతి వాళ్ళు రేపు పేద వాళ్ళుగానో, కడు శ్రీమంతులుగానో మారిపోతే అప్పుడు ఏమైపోతాయి ఆ ప్రభావాలూ, ఆ ఊహలూ అన్నీనూ? భావకవిత్వమైనా, ఏ కవిత్వమైనా సరే, అది రచించినప్పుడు మధ్య తరగతిలో ఉన్న వాళ్ళందరూ కూడా తరువాత అలానే మధ్యతరగతిలో ఉండాలని కానీ, ఉంటారని కానీ ఏమీ గ్యారంటీ లేదు కదా.
అసలు economy వల్ల మధ్య తరగతేనిది ఏర్పడుతుంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే మధ్య తరగతిలోనే కాస్త డొక్క మాడే ఆకలి బాధలు తగ్గి, కొంత కడుపు చల్లబడి తీరికగా ఊపిరి పీల్చే అవకాశాలున్నాయి కాబట్టి అటువంటి సందర్భంలోనే కొంత భావమూ, ఊహలు చేసే అవకాశమూ, ఆలోచనలూ కలుగుతాయి కాబట్టి, అసలు ఈ మధ్య తరగతే “భావ కవిత్వానికి” భూమిక అనీ, “భావ కవుల” ఊహలకు “మధ్య తరగతే” బలం, గళం ఇచ్చిందీ అని ఎందుకు అనుకోకూడదో తెలియదు.
Literature ని economy ని ఒక్క గాటున కలిపేసి ఈ విధంగా ఒక కవిత్వం యొక్క పరిణామాన్ని ప్రతిపాదిస్తూ, ఫలానాది మధ్య తరగతి వాళ్ళ ఊహలను ప్రభావితం చేసిందనడం రెంటికి చెడిన రేవడిలాగా ఉంది.
అంతే కాక, ఏ జాతీయ భావం ఈ కవిత్వం కల్పించిందని అన్నారో, అదే భావానికి అంకితమై, ధనిక, పేద, మధ్య తరగతి అనే ఎటువంటి భేదం అణుమాత్రం లేకుండా ఉన్న ఆస్తులూ, పాస్తులూ, పదవులూ, ప్రాణాలు ఒడ్డి పోరాడి జైల్లలో మ్రగ్గిన వారెందరినో మరచిపోవడమే అవుతుంది, ఈ ప్రతిపాదనను అంగీకరించడం. భారత జాతీయతా అనేది కవిత్వమే కనక సృష్టించి ఉంటే ఆ భావకవులందరినీ బ్రిటీషువాళ్ళు జైల్లో త్రోసి సుళువుగానే దాన్ని నొక్కి ఉంచేవారు.
(భావ) కవిత్వం కాదు భారత జాతీయతను నిర్మించింది! అంకురించి పెల్లుబుకి వెల్లువై విజృంబించిన భారత జాతీయతా భావతరంగాలకు తనదైన గొంతు నిచ్చి రసవంతంగా పలికించిన పదాలే కొన్ని మనం భావ కవితలనే పేరుతో పిలుస్తున్నాము అని అనుకుంటున్నాను.
విధేయుడు
-Srinivas
ఈమాట గురించి గురించి Sridhar Chirravuri గారి అభిప్రాయం:
10/16/2006 11:20 am
హల్లొ అండీ!
సాహితీ లోకానికి మీరు చేస్తున్న కృషి కి ఒక సలామ్! మీ కలానికి ఒక సలామాలేకుం! మీ వ్యాసాలు, శీర్షికలు అదుర్స్ ! కొత్త పాఠకుడిని, నా అభినందనలు!
శ్రీధర్
మీరు రాద్దామనుకున్న విషయం బాగానే ఉంది. కాని , విషయాలు చెప్పిన విధానంలో స్పష్టత లోపించినట్టనిపించింది. కొన్ని చోట్ల, “చెప్పేసారు” కాని వివరించలేదు. మీ భాషలో చెప్పాలంటే, చెప్పే విషయాలమధ్య బాగా జాగా వదిలేసారు. అలాంటి వాటిలో కొన్నిటిని మాత్రమే ప్రస్తావిస్తాను.
1. మీ రచనలో 3వ పేరా:
అ) ఈ పేరాలో చెప్పినవి కేవలం తెలుగువాళ్ళకేనా, లేక భారతీయులందరికీ వర్తిస్తాయా?
ఆ) చెప్పిన విషయాలకు ఆధారాల్ని జోడించక పోవడం వల్ల, కేవలం అభిప్రాయాల్లా ఉన్నాయి.
ఇ) వందల ఏళ్ళుగా భారతదేశంలోని ప్రజలు వేరు వేరు రాజ్యాల్లో ఉన్నా అందరిదీ ఒకే ధర్మమని ఎందుకు అనుకున్నారు? మనలో అసంగతంగా ఏదో ఒక సంఘటిత భావం లేకపోతే, అందరం కలసి ఉండాలని 1947లో ఎందుకు నిర్ణయించుకున్నాము. వేరు కాపురం పెట్టిన వాళ్ళని చూసికూడా, మనం ఎందుకలా స్పందించలేదు?
ఈ) మనకు గొప్ప చరిత్ర ఉందని మనకు తెలియదా? అశ్వఘోషుడు, కల్హణుడు, బాణుడు మొదలైన వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు చెప్పేవరకూ మనకు తెలియరా? మనం చరిత్ర అని నమ్మిన పురాణేతిహాసాల మాటేమిటి? ఇవన్నీ భావాలు కావా? ఆ భావాల్లో నిజమెంత అన్నది వేరే వాదన. మనకి మిగిలిన కళలు, కావ్యాలు, శిల్పాలు మొదలైనవి ఏ భావం లేకుండానే వెలిసాయా?/పోషింపబడ్డాయా?
2. “ఈ ఊహల ఆధారంగా మనకి ప్రాచీన కాలం నుంచీ జాతీయతా భావం ఉంది అని వాదించడం పొరపాటు”
అ) బ్రిటిష్ వాళ్ళు మనకి చెప్పిన మన చరిత్ర, మన సంస్కృతులకు గూడ, ఆధారాలు కొంతవరకూ “ఈ ఊహలే”. వాళ్ళు చరిత్రకోసం కొన్ని ఆధారాల్ని తవ్వితీసినా, సంస్కృతికి సంబంధించి కొత్తగా చెప్పిందేమిటి? అప్పటికి, ప్రచారసాధనాలు మెరుగవడం వల్ల వాళ్ళకి అందిందాన్ని ఎక్కువమందికి తెలిపారు.
ఆ) భావకవిత్వం తెచ్చిన కొత్త ఊహలతో నిర్మించిన భారత జాతీయతని మనం నమ్మవలసివస్తే, మీ 4 వ పేరాలో లాంటి పాత ఊహల్తో పుట్టిన ఒక జాతీయత పూర్వం ఉండేది అని ఎందుకు నమ్మకూడదు?
ఇ) మన పెళ్ళిళ్ళలో బ్రాహ్మలు అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజాల దగ్గరే ఆగిపోయారెందుకు? పారశీక, మ్లేచ్ఛ, యవన దేశాల్లో అమ్మాయిల్ని ఎందుకు వెతకలేదు. సంస్కృతో, మరేదో అడ్డు వచ్చాయనేనా?
3) “రాజుల్నీ, రాజభావాన్నీ వదిలించుకున్నాకగాని మనకు జాతీయభావం ఏర్పడలేదు [1]” మీరనుకునే జాతీయభావమేదో నిర్వచించండి. [1] అని వదిలేస్తే అర్ధం అవటల్లేదు.
ఆఖరిగా, తెలుగునాట, చదువు వచ్చినవాళ్ళెంతమంది? అందులో, కవిత్వం చదివే వాళ్ళెందరు? వాళ్ళలో ప్రభావితులయే వాళ్ళెందరు?
ఇతరులనుండి గ్రహించిన విషయాల్ని సంగ్రహంగానైనా స్పష్టపరిచి, మరికాస్త లోతైన పరిశోధన చేసి రాస్తే బాగుండేది.
1. “మన కవులు అక్షరాస్యులేనా అని గుడిపాటి అడిగిన ప్రశ్నని, కొందరు అది కొన్ని రకాల కవిత్వాన్ని అణగదొక్కటానికి వేసిన ప్రశ్నగా తప్పు అర్థం చేసుకున్నారు.”
2. “రాసేవాళ్ళు సమర్థులైతే మంచి కవిత్వం రాస్తున్నారు . సమర్థులు కాని వాళ్ళు ఏ భాషలో రాసినా మంచి కవిత్వం రాయలేకపోతున్నారు.”
3. “కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి. ఈ తేడాలని గురించి ఆయా కవులే మాట్లాడాలనీ, తమరంగంలో కవులకి ఎలాటి శిక్షణ కావాలో కవులే చెప్పాలనీ నారాయణ రావు కోరాడు.”
4. “ఎవరి కవిత్వపు మంచి చెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారుచేసుకోవచ్చు. తయారు చేసుకుంటున్నారు కూడా. ”
5. “తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసేవాళ్ళూ , విమర్శ రాసేవాళ్ళూ తమలో తాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏప్రమాణాలూ లేకుండా ఏది రాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.”
వేలూరి గారు చేసిన పై అయిదు ముఖ్యమైన ప్రతిపాదనల్లో (observations అనుకోండి, “ప్రతిపాదన” అనే పదం నచ్చకపోతే) దేనితో కొడవళ్ళ హనుమంతరావు గారు ఏకీభవించడంలేదో నాకు తెలియలేదు. ఆయన రాసినట్లు: “ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.” భిన్నమైన అభిప్రాయాలు శీర్షికలో ప్రశ్న గురించా లేక పైన ప్రస్తావించిన విశయాల గురించా?
కొడవళ్ళగారికీ, వేలూరికీ ఉన్న భిన్నమైన అభిప్రాయం నాకర్ధమైన వరకూ వ్యాసానికి గుడిపాటి పెట్టిన శీర్షికలో ప్రశ్న “మౌలికమైనదా కాదా” అన్న దాని గురించి మాత్రమే అని నేనర్ధం చేసుకున్నాను, మిగాతావి ఏమైనా ఉన్నయా? (శీర్షిక గురించి వేలూరి గారు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు పైగా, ఆయన మౌలికమైందని మాత్రమే అన్నారు). నేను పైపైన చదవలేదు, ఒకటికి రెండు సార్లు ఈ అభిప్రాయాలన్నీ చదివినా నాకర్ధమవకే ఇంతవరకూ రాస్తున్నాను.
అక్షరజ్ఞానులేనా? అన్నది అవమానకరమని చెప్పటానికీ, గుడిపాటి వ్యాసంలో నాకు కనిపించిన కొన్ని లోపాల్ని చూపటానికీ, రాశాను. వెల్చేరు వ్యాసానికి సంబంధించి మొదటి విషయాన్ని దాటి పోలేదు. భేదాభిప్రాయాన్ని మర్యాదగా వ్యక్తపరిస్తే చాలు; అంతకుమించి ఏదో “సాధించాలని” కాదు.
బహుశా నేను చేస్తున్న పొరబాటు నెలక్రితం వచ్చిన గుడిపాటి వ్యాసం మీద కేంద్రీకరించడం, నాకు తోచిన విషయాలు మాత్రమే తీసుకోవడం, వేలూరి చెప్పినట్లుగా చర్చని సాగించకపోవడం. కాని ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.
అవమానకరంగా ఉందన్నానుగాని అ, ఆ ల గురించిన ప్రశ్న అనలేదు. ఈ తెలుగు వాడకాన్ని అర్థం చేసుకోడానికి ఇంగ్లీషుని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. “మన కవులు అక్షరాస్యులేనా?” అన్నది “Are our poets literate?” గా అనువదించుకోవచ్చు. (అదీ సభ్యతగా అనిపించదు.) కాని దాంట్లో మూలానికున్న బలం లేదు. “Do our poets know the ABC of poetry?” అన్నది దగ్గరగా ఉంది. “Do our engineers know the ABC of Computer Science?” అని అడిగితే కించపరిచినట్లే. ”Do our engineers have the right tools and the right training?” అంటే మర్యాదగానే ఉంది, కాని అదీ ఇదీ ఒకటి కాదు.
నిందార్థం ఏమీ లేదన్నారు వెల్చేరు. అది వారి వ్యాసంలో నిజమే, కాని గుడిపాటి వ్యాసమంతా నిందలతో నిండి ఉంది! మన కవులు పుస్తకాలు చదవరు, వ్యాకరణం నేర్చుకోరు, వారి కవితల్లో స్పష్టత లేదు, కూర్పు లేదు – ఇవన్నీ నిందలే. ఆయన నిందార్థంలోనే వాడారని తెలుస్తుంది. నిందిస్తే తప్పేమీ లేదు – ఇది వాళ్ళ సాహిత్యాన్ని గురించే గాని వ్యక్తిగత జీవితాల గురించి కాదు. కాని అవి అపనిందలు కాదని పాఠకులకి చూపెట్టాలి. ఆయన ఆపని చెయ్యలేదన్నది నా వాదన సారాంశం.
అలవోకగా రాసిన అభిప్రాయమని ఒప్పుకుంటాను. అది వ్యాసమంత ముఖ్యం కాదు. గుడిపాటి వ్యాసం లోతైన విశ్లేషణతో విస్తృతాధారాలతో కూడి ఉన్నదా? మన కవులు నిరక్షరాస్యులని తేల్చిన వ్యాసంలో ఏమాత్రం పరిశోధనా, తర్కం ఉన్నాయ్?
ప్రధాన విషయాన్నించి దారిమళ్ళించలేదు. liberal education లో శిక్షణ ఉండి కూడా ఇలా ఎలా రాశావంటున్నారు. శిక్షణ “ఉండి కూడా” కాదు; “ఉండటం వల్లనే” రాశాను. వివరించే ముందు liberal education అన్నదానికి ఒక నిర్వచనం:
“Liberal education, which consists in the constant intercourse with the greatest minds, is a training in the highest form of modesty, not to say of humility. It is at the same time a training in boldness: it demands from us the complete break with the noise, the rush, the thoughtlessness, the cheapness of the Vanity Fair of the intellectuals as well as of their enemies. It demands from us the boldness implied in the resolve to regard the accepted views as mere opinions, or to regard the average opinions as extreme opinions which are at least as likely to be wrong as the most strange or the least popular opinions.” — Leo Strauss.
నాకు ప్రధాన విషయం గుడిపాటి వ్యాసం. దాని ప్రతిపాదన ఇది – అక్షరాస్యత అంటే స్పష్టత, భాషాధికారం, అధ్యయనంపై ఆసక్తి; కొద్ది మంది తప్ప మనకవులంతా నిరక్షరాస్యులు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఈ ప్రతిపాదనకి వ్యాసంలో ఆధారాలేవీ చూపెట్టలేదు. ఆయన చెప్పేదంతా “నాకీ కవులంతా తెలుసు, నమ్మండి” అన్నట్లుగా ఉంది గాని scholarly article లో ఉండాల్సిన పస లేదు.
నేను తమ్మినేని వ్యాసాన్ని ఎందుకు ఉదహరించాను? అనువాద కవిత్వం గురించి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కొన్ని కవితల విశ్లేషణ ద్వారా సమర్థించాడు. అది నాకు scholarly article అనిపించింది. గుడిపాటి అలాంటిది చెయ్యలేదు, కనీసం ప్రయత్నించలేదు. ఆయన సమస్య చాలా విస్తృతమయిందంటారా? కవిత్వమంతా తీసుకోవాల్సిన పనిలేదు. వ్యాసం చదివేవాడికి గూడా బుర్ర ఉంది. ఆయన ప్రస్తావించిన కొన్ని రకాల కవిత్వ వాదాల్లో ఏదో ఒకదానిని తీసుకొని ఆ కవికో కవులకో అస్పష్టత, అనధికారం, అనాసక్తి ఉండటాన వారి కవితలెంత హీనమయ్యాయో చూపెట్టొచ్చు.
అలా చేస్తే ఆయన వాదానికి బలం చేకూరడమే కాక అంతకన్న ముఖ్యమైన ప్రయోజనమొకటి కలిగేది. అదేంటంటే ఏది మంచి కవిత్వమో ఎందుకో కొంతైనా పాఠకుడికి తెలిసేది. గుడిపాటి వాద విధానంలోని లోపాన్ని వేరే వ్యాసంతో పోల్చి చూపెట్టాను. అది liberal education ఇచ్చిన శిక్షణలో లోపమనుకోను.
“పరమ వినయంగా” దాటేయడం గురించి. వినయాన్ని వెల్లడించ లేదు, చూపాల్సిన సందర్భమూ కాదది. వెల్చేరు గారి వ్యాసం లోతుల్లోకి వెళ్ళని మాట నిజమే. కాని వారు కవుల్నీ విమర్శకుల్నీ చర్చకి పిలిచారు కాని పాఠకుల్ని వదిలేశారు.
“గుడిపాటీ, నేనూ … చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబంధించింది కాదు. వ్యవస్థకి సంబంధించినది…”
శిక్షణా సంస్థల గురించి గుడిపాటి ప్రస్తావించ లేదు. అది వెల్చేరు గారి “వివరణ” వ్యాసంలో ఉంది. నేను దానిని గురించి రాయలేదు. గుడిపాటి వ్యాసంలో అర్థంకానంత క్లిష్ట విషయాలేమీ లేవు. అదంతా వ్యక్తుల గొడవే. అస్పష్టత, అనాసక్తి, అవగాహనా రాహిత్యం, పుస్తకాలు చదవక పోవడం – ఇవన్నీ వ్యక్తుల్లో లోపాలు. ఈ లోపాలు కొన్ని వందల కవుల్లో ఉండటాన ఇది వ్యవస్థకి సంబంధించిందని వెల్చేరు అభిప్రాయం కావొచ్చు. దాని గురించి మరో సారి మాట్లాడదాం.
కొడవళ్ల హనుమంత రావుగారు ఈ మాటలో వేలూరి సంపాదకీయం మీద రాసిన అభిప్రాయం/విమర్శ ఎందుకు, ఏంసాధించడానికి రాశారో నాకు అర్థం కాలేదు. కానిఅందులొ కొన్నిమాటలు వార్త లో నేను రాసిన వ్యాసానికి సంబధించినవి కాబట్టిఈ నాలుగు వాక్యాలూ ఇక్కడ రాస్తున్నాను.
మొదటి సంగతి: గుడిపాటి అడిగిన మన కవులు అక్షరాస్యులేనా అన్న ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని, నేను ఆ ప్రశ్న తిప్పి మన విమర్శకులు అక్షరాస్యులేనా అని అడిగిన ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని నిందార్థం ఏమీ లేదని, వాళ్ళకి అ ఆ లు వొచ్చునా అని ఆ మాటకి అర్థం కాదనీ, ఇంగ్లీషులో cultural literacy, fiscal literacy అనే మాటల్లో literacy లాటిది ఈ అక్షరాస్యత అనే మాట అనీ హనుమంతరావు గారికి తెలియలేదని నేను అనుకోలేకపోతున్నాను. అది ఆయన ఊహకి అందనంత గహనమైన విషయం కాదు. నా వ్యాసం చివరదాకా చదివితే, నేను ఆ వ్యాసంలో అడిగిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది. ఆయన నా వ్యాసం పూర్తిగా చదవలేదనీ, నేను ఆవ్యాసంలో వేసిన ప్రశ్నలు — తెలుగులో విమర్శకులు తయారవడానికి అందుబాటులో వున్న అవకాశా లేమిటి, వాళ్ళు చదవ వలసిన పుస్తకాలు, పొందవలసిన శిక్షణ ఏమిటి — అనేవి ఆ సంగతుల మీద తెలుగులో ప్రముఖ విమర్శకులు దృష్టిపెట్టేట్టు చెయ్యడానికి వేసిన ప్రశ్నలు అని హనుమంతరావు గారు బోధపరుచుకోలేక పోయారనీ కూడా నేను అనుకోవడం లేదు. పైగాఈ చర్చలలో ప్రధాన విషయాన్ని ఆయన గమనించలేదని అనుకోడానికీ వీలులేదు: “వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది. ” అని ఒక అభిప్రాయం చెప్పారు కాబట్టి. కాని ఆయన పరమ వినయంగా ఈవిషయాన్ని, దీనికి సంబంధించిన వివరాల్నీ వొదిలేసి ఆయనకి ఇష్టమైన మరో విషయంలోకి తన వ్యాఖ్యానాన్ని మళ్లించారు.
ఈ దేశంలో liberal education లో భాగంగా చర్చని ప్రధాన విషయాల మీద కేంద్రీకరించే పద్ధతీ, అప్రధాన విషాయలవేపు మళ్లకుండా వుండే జాగ్రత్తలూ నేర్పుతారు. ఈ శిక్షణని హనుమంతరావు గారు పొందలేదని నేను అనుకోను. అయినా ఆయన అసలు విషయాన్ని వొదిలేసి మరొక దారి లో వ్యాఖ్యానాలు చెయ్యడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి.
తెలుగు సాహిత్యరంగంలో ఆయన కోరుకునే రకమైన పుస్తకాలు రావడంలేదు. ఆయనకి బోధపడేలా ఉదాహరణలూ దృష్టాంతాలూ ఉన్న పుస్తకాలూ, వ్యాసాలూ ఎవరో ఒకరు తప్ప ఎక్కువమంది రాయడం లేదు. ఇది ఆయన లేవనెత్తుతున్న సమస్య. ఈ సమస్య చాలా ముఖ్యమైనది, వివరంగా చర్చించదగినదీని. ఇది అయితే దీన్ని గురించి వేరే వ్యాసంలో పరిశీలన చెయ్యాలి. అంతేకాని వేలూరి వెంకటేశ్వర రావు రాసిన సంపాదకీయం మీద అలవోకగా చేసే వ్యాఖ్యానంలో భాగం చెయ్యకూడదు.
(హనుమంతరావు గారిని ఇంతగా మథనపెడుతున్న ఈ సమస్య ని ఈమాట లో వివరంగా చర్చించడానికి వొచ్చే నెల సంచిక కోసం నేను ఒక వ్యాసం రాస్తున్నాను. అది ఈమాటలో ప్రచురించబడితే అప్పుడు ఆ విషయం ప్రధానవిషయంగా చర్చలు కొనసాగుతాయని ఆశిస్తాను.)
వార్తలో గుడిపాటీ, నేనూ, ఆ తరవాత ఈమాటలో వేలూరి చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబధించినది కాదు. వ్యవస్థ కి సంబంధించినది. తెలుగులో కవులూ, విమర్శకులూ శిక్షణ పొందడానికి ఎలాటి సంస్థలు ఉన్నాయి? ఈ రంగం లో ప్రమాణాలు ఎలా నిర్ణయించ బడతాయి? తెలుగు సాహిత్య రంగం కేవలం ఔత్సాహికులు ప్రధానంగా వుండే రంగంగా ఉండి పోకుండా ఇది professionalize ఎలా అవుతుంది? ఈ ప్రశ్నలు ముందు ఈరంగంలో వున్న పదిమందీ వేసుకుంటే — వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో తెలుగు సాహిత్య రంగం వ్యవస్థీకరించ బడడానికి అవసరమైన సంస్థల్ని నిర్మించే ఆలోచనలు చేస్తారని ఒక ఆశ.
ఈ చర్చ తెలుగు దేశం లోనే జరగ వలసిన అవసరం లేదు. వేలూరి అన్నట్టుగా తెలుగు ప్రపంచ భాషగా ఎదుగుతోంది. అంచేత ఇందులో మనకి కూడా జాగా వుంది.
ఆయనకి వ్యాసం నచ్చినందుకు సంతోషం. ఔత్సాహికుల సౌకర్యం కోసమని 16 శ్రుతుల గురించి ప్రస్తావించలేదనీ, నేనూ, ఇతర పాఠకులూ విన్నవించుకోవడం జరిగింది.
మరొక విషయం. 72 మేళకర్తల వరకూ వివరించడానికి 16 శ్రుతులు సరిపోతాయి కాని ఆరభి, దేవగాంధారి వంటి రాగాల మధ్య తేడాలు తెలుసుకోవడానికి ఉపకరించవు. ఔత్సాహికులకు అవసరంలేని ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. 22 శ్రుతుల గురించి తెలియాలంటే ఇది చూడండి.
కొంచెం అటూ ఇటూ తిప్పి హిమజ్వాల నవల్లో యీరో యీరోయిన్లకు మధ్య యింట్రడక్షన్/యింటరాక్షన్ సీన్ రాస్తే కాస్త ఇలాగే ఉంటుంది. కాపీ కొట్టారని అనను. కాని, స్వతంత్రభావాలున్న అమ్మాయి చిత్రీకరణ కాస్త స్టీరియోటైప్ అయ్యింది అనగలను. ఒరిజినాలిటీ విషయంలో నాలుగుకు సున్నా మార్కులు.
“గతశతాబ్దపు” అని పేరు పెట్టారు కనుక సరిపోయింది. లేకపోతే ఇప్పటి
“ప్రజాకవులు” మీకొక కవిత్వపు noose తయారు చేసి వేలాడ దీసే వాళ్ళు.
గత శతాబ్దం అనే కంటే, శ్రీ శ్రీ కంటే ముందు ప్రజా కవులు అంటే మీ సొమ్మేం
పోయింది? శ్రీ శ్రీ ని అనవసరంగా గొప్పవాణ్ణి చేస్తామని భయమా :).
అయినా సరే, మొదట “ప్రజల గురించి” కొద్దిగా:
“ఇకపోతే, ఎవరయ్యా నీ ప్రజలు అని నిలదీసి అడిగితే, నా సమాధానం: వీధి
బడికెళ్ళి చదువుకోని వాళ్ళు, వీధిబడికి కూడా వెళ్ళలేని వాళ్ళు, ఏ రకంగానూ చదువుకోటానికి అవకాశంలేని వాళ్ళు, ఏదో ఒక చిన్న బడికెళ్ళి ఓ న మా లు నేర్చుకోని కాస్తోకూస్తో చదవడం చాకలిపద్దు రాయడం నేర్చుకున్న వాళ్ళు. వీళ్ళు అసలు సిసలైన ప్రజలు. మన మహానగరాలు, పెద్ద పెద్ద పట్టణాలూ వదిలేస్తే, నూటికి డెబ్భైమందో, ఎనభైమందో నేను పైన నిర్థారించిన
ప్రజలకిందే జమా కట్టచ్చు. ఈ ప్రజల్లోకి వెళ్ళి బలపడ్డ కవిత్వం ప్రజా
కవిత్వం.”
ఈ ప్రజల నిర్వచనం కూడా “గత శతాబ్ది” కి చెందేదే అనుకుంటాను.
ఇప్పటి ప్రజలు ఏ కొద్ది మందో తప్పితే పట్టణ లేక నగర వాసన, పత్రికల నీడ సోకని వాళ్ళు తక్కువ.
1991 జనాభా లెక్కల ప్రకారం అప్పటికే 25 శాతానికి పైగా పట్టణాల్లో ఉన్నారు, 2001 వచ్చే సరికి అది మూడవ వంతుకు చేరింది. అక్కడితో సరిపెట్టకుండా ఒక ఎస్టిమేట్ ప్రకారం ఈ దశాబ్ది చివరికి యాభై శాతానికి పైగా పట్టణ వాసులే అవుతారు మన జనాభా.
మీరన్న “ప్రజ” ఇప్పటి వాళ్ళు కాదు అనేది కొంత వరకూ క్లియర్. అంతే కాదు, ప్రజల కు నిర్వచనం మారుతుంది ఎప్పటికప్పుడు, స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కూడా. (ఉదా: అమార్త్య సేన్ పుస్తకం ఐడెంటిటీ & వయలెన్స్).
ఇక ప్రజాకవుల గురించి:
“ఈ ప్రజలని ఉత్తేజ పరిచి, వాళ్ళకి ఉత్సాహాన్నిచ్చిన కవిత్వం రాసిన వాళ్ళు
ప్రజా కవులు. ”
ప్రజలు మారినప్పుడు కవిత్వం మారుతుందన్నమాట ఈ ప్రజా కవుల Definition పట్టుకుని వెళితే. ఏది ఉత్సాహాన్ని ఇస్తే, అది ఎట్లా డెలివరీ చేస్తే
వస్తుందో తెలిస్తే ప్రజాకవుల కు కావలసిన మినిమం క్వాలిఫికేషన్ తీరుతుందనుకుంటే ఇక సాధనాలదే ప్రధాన పాత్ర అవుతుంది, ఆ రాసింది ప్రజల నోళ్ళలో నానడానికి. నాటకాలు, అవధానాలు తిరుపతి కవులను ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాయో ఆ తరువాత సున్నమేసిన తెల్ల గోడలు, సినిమాలు, ఇప్పుడు పత్రికలు శ్రీ శ్రీ ని (అతన్ని అనుకరించే వాళ్ళను) ప్రజల్లోకి
తీసుకెళ్తున్నాయి.
తిరుపతి వెంకట కవులు మీరిచ్చిన డెఫినిషన్ accept చేస్తారని నేననుకోను.
ఒక వేళ చేస్తే అది కూడా ముపటి మాట కిందికే వస్తుంది. గతం గురించి
చెప్పేటప్పుడు అనుకోవలసినమాట.
ఇక ఇప్పటి సంగతి: వీధి నాటకాలు ఇప్పటి ఊళ్ళలో అంతగా కానరావు. ఎప్పుడో ఏడేండ్లప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రాత్రి పూట “బావా ఎప్పుడు వచ్చితివీవు …” లాంటివి వింటూ నాటకం చూస్తూ అక్కడే పడి నిద్రపోయి, సగంలో మళ్ళీ “చెల్లియో చెల్లకో …” అంటూ మొదలు పెట్టిన గొంతుకో, హార్మోనియం దెబ్బకో మళ్ళీ దడుచుకుని లేచి ఇక నిద్ర ఎగిరిపోయి ప్రొద్దున ఆ కప్పు చాయ పడే వరకూ చొప్ప బెండ్లతో కచ్రపు బండ్లు చేసుకోవటం వంటివి తీరి రెండు దశాబ్దాలైనా అవుతుంది అనుకుంటాను.
ఇప్పటి రోజుల్లో కొన్ని పట్నాల్లో, నేను కర్నూలు, వరంగల్లు లో కొద్దిగా
చూసాను, నాటక పోటీల పేరుతో; కానీ చాలా వరకు సాంఘికాలే అవి. మరీ గుంటూరు, గోదావరి జిల్లాల్లో అయితే ఇప్పట్లో దసరా సెలవుల్లో రాత్రిపూట స్టేజీ మీద జరిగేవి నాటకాలు అని వెళితే వేలూరి గారు “శివ శివా” అనుకుంటూనో లేక “శెవ్వా ఇదా వేషం” అంటూ అట్లాంటా పరిగెత్తుకు వచ్చేస్తారనుకుంటాను. (అది నా ఊహే, ఆయన అక్కడే పీఠం వేసుకు కూర్చుంటారేమో మరి నాకెరుక లేదు.)
చెప్పేదేంటంటే, ఇదివరకు ప్రజలకు సాహిత్యాన్ని చేరువ గా తెచ్చే ప్రయోగం
నాటకమైతే ఇప్పటి సాధనాలు వేరు అని. ఇప్పుడు పేపరు చదవని వాళ్ళు అతి తక్కువ. ఒక్క ఈనాడు పత్రికను కోటిన్నర మంది చదువుతారట వాళ్ళ లెక్కల ప్రకారం. ఉన్నది ఏడెనిమిది కోట్లే కదా, పిల్లలను తీసేస్తే మిగిలేది
అయిదు కోట్లే. ఇక పత్రికలు చదవని వాళ్ళు ఆ లెక్కన అతి తక్కువ.
అందుకే ఇప్పటి పత్రికల్లో వచ్చేవి ప్రజా కవితలు, కవిత్వం అనిపిస్తాయి ఈ
రోజుల్లో. అవి తవికలే కావచ్చు, మరింకేమైనా కావచ్చు. ఏ పత్రికయినా చదివే వాళ్ళను ఉద్దేశ్యించింది కాబట్టి వాళ్ళనుద్దేశించిన రాతలే ఎక్కువగా
వస్తయి. అవి ఎటువంటివి వస్తాయి అనడానికి పెద్ద ఊహాగానాలు అక్కరలేదు. చికెన్ గున్యా మీద సీస పద్యాలు వస్తయి. మొసపొటేమియా మీద పొటేలు రంకెలు వినిపిస్తయి. ఇదంతా ప్రజా కవిత్వమే.
దీన్ని బట్టి చూస్తే ఎవరైతే ఆ కాలపు మాధ్యమాన్ని, అప్పటి పరిస్థితులకనుకూలంగా, అతి ప్రతిభావంతంగా ఉపయోగించుకుంటారో వారే ప్రజా కవిగా మిగులుతారు, మిగతా వాళ్ళు ఉత్తుత్తి కవులుగా నిలబడి జాతర చూడవలసిందే.
తిరుపతి వెంకట కవుల నాటకాల్లో పద్యాలు అప్పటి కాలంలో ప్రజా కవిత్వం అయితే, ఇప్పటి ప్రజా కవిత్వం ప్రతి రోజూ అచ్చయే పేజీల మధ్య కనిపిస్తుంది.
చివరగా, వాళ్ళే ఇప్పటి కాలంలో ఉండేదుంటే అరాఫత్, ఒసామాల నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి దాకా పొయిట్రీ రాసి ఉండే వాళ్ళే. ఇదేం పోయేకాలమో ఇంతగా చదువుకుని, ఇంతింత విషయాల గురించి తక్కువ పదాలతో పొయెట్రీ రాయగల ఇప్పటి కవులు వాటినే ఇంకొంచెం సాగదీసి వ్యాసం రాయొచ్చుకదా. “ఈనాడు” లాంటి అటూ ఇటూ కాని పత్రిక(లు), వీళ్ళు వ్యాసాలు రాస్తే మీ పేరు పెట్టి వేయం అనే ఒక దరిద్రపు రూలు పెట్టినందుకే మనకు కవులెక్కువ, వ్యాస కర్తలు తక్కువ అని నా అనుమానం.
ఈ లెక్కన “గత శతాబ్దపు” ప్రజాకవుల పక్కన ఇప్పటి ప్రజా కవులను
నిలబెడతానంటే కుదరనిపని. అసలు ప్రజాకవి అనే పదమే అనవసరం అని outlaw చేస్తే మంచిదని నాకనిపిస్తుంది, లేకపోతే “మహాకవి” అనే పదానికి
బహుపదార్ధాలు వాటికి మళ్ళీ తాత్పర్యాలు చెప్పుకున్నట్టే ఇదీ తయారవుతుంది, only more often we get to define and redefine it.
నేను కవినీ కాదు, విమర్శకుణ్ణీ కాదు. కాని ఓ పాఠకుడిగా “మన కవులు అక్షరాస్యులేనా?” అన్న ప్రశ్న అవమానకరమైన మకుటమనిపించిందిగాని మౌలికమైన ప్రశ్నగా అనిపించలేదు. “ఎదుటివారి అభిప్రాయాలనూ వ్యక్తిత్వాలనూ గౌరవించగల పెద్ద మనిషి తరహా” ఉండాలని చెప్పిన వెల్చేరు గారు కూడా “మన విమర్శకులు అక్షరాస్యులేనా?” అని అడగడం ఆశ్చర్యమేసింది. వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది.
గుడిపాటి తన వ్యాసంలో మన కవుల గురించి చెప్పిన విషయాలు – వేరే వాళ్ళ కవిత్వాన్ని చదవరు, కవిత్వం మీద వచ్చే వ్యాసాల్నీ, సమీక్షల్నీ చదవరు, చదివినా తమ పేరుందో లేదో అన్న ధ్యాసే గాని ఏమి రాశారో అన్న ఆసక్తి లేదు … – ఆ కవులకి సన్నిహితంగా మెలగడాన తెలిసిన సమాచారం కావచ్చు. వాటి గురించి కవులతో కనీసం ముఖ పరిచయం కూడా లేని నాలాంటి పాఠకుడు చర్చించడం వీలవదు.
వెక్కిరింపులూ, అపహాస్యాలూ మన సాహిత్య చర్చల్లో అనివార్యమయినట్లుంది. అయినా వాటితో పాటు నాలుగు ఉపయోగపడే మాటలు, కాసిని ఉదాహరణలతో చెప్తే నాబోటి వాడు అన్వయించుకుని బోధపరచుకుంటాడు.
వాడుక భాషలో రాయడంలేదని వాపోయిన రంగనాయకమ్మ రాసిన పుస్తకం చదివితే వాడుక భాష గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది. మాతృభాషే అయినా తెలుగు భాషా స్వరూపం తెలియని యువకుల్ని చూసి బాధ పడ్డ బూదరాజు రాసిన పుస్తకాలు చదివి కొంతయినా వ్యాకరణ జ్ఞానం పెంచుకోవచ్చు.
అలాగే మన కవిత్వ, విమర్శ రంగాల దుస్థితిని చూసి విచారించేవాళ్ళు కూడా వాటిని సవరించడానికి కృషి చేస్తే బావుణ్ణు. డబ్బుకీ, కీర్తికీ, అవార్డులకీ, రాజకీయాలకీ మన కవులు అమ్ముడు పోయారంటున్నారు. అలాంటి ప్రముఖుల కవితా సంకలనాల్ని కొన్నిటిని తీసుకొని సహేతుకంగా విమర్శించండి. శబ్దం, రూపం, లయ, అవగాహన, పాండిత్యం ఎలా లోపించాయో వివరించండి. వారాల తరబడి జరిగిన చర్చలో ఆరోపణలకు కొదవ లేదు గాని ఉదాహరణలు మాత్రం శూన్యం!
నాకీ విషయంలో సమకాలికుల్లో తమ్మినేని యదుకుల భూషణ్ ఒక్కరే ఆపని చేస్తున్నట్లనిపిస్తుంది. ఉదాహరణకి నిన్ననే చదివిన వారి వ్యాసం, “ఉమర్ ఖయ్యాం – ఉదాహరణలు.” అనువాదానికి ఉండాల్సిన లక్షణాలేమిటో చెప్పి, మూలంలోని రుబాయి నొకదాన్ని తీసుకొని, కరుణశ్రీ, ముద్దుకృష్ణ మొదలైన వాళ్ళ అనువాదాలు ఎందుకు లోపభూయిష్టమో, చలం, ఆదిభట్ల అనువాదాలు ఎందుకు ఉన్నతమైనవో వివరించారు.
విశేష ప్రతిభావంతుడనిపించే తమ్మినేని కున్న లోపం తనకి నచ్చని వాళ్ళని ఎద్దేవా చెయ్యటం, పెద్దమనిషి తరహా లేకపోవడం. “బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా” (?) అన్న వేమన వేదాంతం బాగా వంటబట్టించుకున్నట్లుంది. గుద్దులు తిన్నా, చదివినవాడికి కవిత్వం గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది.
ప్రసాద్ గారి వ్యాసం ఔత్సాహికులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
వారు చెప్పినట్టు కీబోర్డు మీద గుర్తులు వేసుకుని సాధన చేస్తే రాగాల
లోతులు కాకపోయినా కనీసం చాయలు అర్ధమయి తదుపరి మెట్టు కి ఎదగే స్థాయి సమకూరుతుంది.
మనవి కావని ఏ వాయిద్యాన్నీ కూడా వదులుకోనవసం లేదు. ఘంటసాల వంటి వారు పాతాళభైరవి నాడే “మనవి కానివి” వాడుకుని అద్భుతవైన సంగీతం చేసేరు. కీ బోర్డు మీద సాయి గారి చులకన భావం సముచితంగా లేదు. అయితే వారి భావం ఈ నాడూ అన్ని వాయిద్యాల చోటునా కీ బోర్డు మన కొత్త దర్శకులు వాడుకోడం గురించై ఉంటుంది.
ఏమైనా వారి ధన్యవాదాలూ, క్షమాపణలూ వారి స్థాయి కి తగ్గ ట్టు లేవు.
ప్రసాద్ గారు తమ విద్వత్ప్ర కటన కై ఈ వ్యాసం రాసినట్టు నాకనిపించలేదు. రాగం అంటే ఔత్సాహికులకి నీరసం రాకుండా ఆసక్తి కలిగి అభిరుచి గా మారాలని చేసిన సత్ప్రయత్నమని నా ఉద్దేశం. ఒక వాయిద్యాన్ని ఆకాశానికెత్తి వేరే వాటిని తొక్కేయాలని ఆయన ఇవాళ శ్రమపడి ఒక వ్యాసం రాసేరని నేననుకోను. వ్యాస కర్తగా ఆయన తన అనుభవాన్ని, qualifications ని చెప్పుకుంటే అది వ్యాసానికి మరింత authenticity ని ఇవ్వగలదని నా అభిప్రాయం.
సెలవు.
మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. నిజమే గతంలోని పేదరికాన్ని గ్లోరిఫై చెయ్యడం సరైంది కాదు. కాని నేను గతంలో వుజ్వలంగా వున్న “కొత్త సమాజాన్ని నిర్మించాలనే ” ఆకాంక్షని గ్లోరిఫై చేస్తున్నాను. మా తొలి యవ్వన వుద్రేకాలవే కదా! ఆ ఆకాంక్ష ఇంకా సజీవంగా వుండాలనే, వుంచాలనే నా కోర్కె.
గది పాడుబడలేదు – మళ్ళీ పిట్టలన్నీ దాని లోకి రావాలని కోరుకోవడం అత్యాశ కాదేమో!
మీరు సభకి వస్తే గొప్పగా వుండేది. మీరు వున్నారని నాకు తెలియదు – తెలిస్తే తప్పకుండా నేను కలిసే ప్రయత్నమైనా చేసేవాణ్ణి.
ధన్యవాదాలు,
మీ
నారాయణస్వామి
చాలా బాగుంది. అయితే ఒక చోట “పుబ్బలో పుట్టి … మఖలో మాడిపోయి ” అని రాసారు. ప్రాస కోసం అయితే సరే. కాని చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి అయితే “మఖలో పుట్టి , పుబ్బలో మాడి పోయే” అని రాయాలేమో.. అని నా వ్యక్తిగత అభిప్రాయం. రంధ్రాన్వేషణ అనుకోకుండా ఉంటే మంచిదే. లేకపోతే క్షంతవ్యుడిని. ఏదేమైనప్పటికీ, చాలా మంచిగా, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, నిర్భయంగా , సునిశితమైన దృష్ఠతే విశ్లేషించిన తీరు బహూధా ప్రశంసాపాత్రం. మీ నుండి మరిన్ని సమకాలీన సమస్యలపై విశ్లేషణలను ఎదురుచూసేలా చేసారు. హేట్సాఫ్.
నేనా వ్యాసాన్ని నాకు తెలిసిన ప్రాంతపు భాషలో రాశాను. ఆభాషలో ఒత్తులు, దీర్ఘాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నియమాల్ని పాటించడంలో జాగ్రత్త తీసుకోకపోవడం – అందునా ఓ సాహిత్యపత్రికకి రాసేదాంట్లో – నా అజ్ఞానాన్నీ బద్ధకాన్నీ తెలుపుతుంది గానీ, అదేదో అభ్యుదయం అని సమర్థించుకుంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.
ఆ నియమాలు అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉండవని నాకు తెలుసు. ఆ తేడాలని గౌరవించేపాటి సంస్కారం ఉంది. “మెజారిటీ” సంగతేమోగాని, మన ఆధునిక సాహిత్యంలో వేరు వేరు ప్రాంతాల రచయితలు వారి వారి భాషలో రాశారు; వాటిని ఇతర ప్రాంతాల ప్రజలు గూడా బాగానే ఆదరించారు. ఒకే రచనలో అనేక పాత్రలతో ఆయా ప్రాంతాల, వర్గాల భాషలో సంభాషణలు నడిపించిన నవలొకటి గత శతాబ్దానికే తలమానికంగా నిలిచింది:
“Overwhelmed by sorrow – అంటే యేమిటి?” అని అడిగింది గంగి, పుస్తకంలో వొక పేజీలో గుర్తుపెట్టుకున్న చోట తీసి చూస్తూ.
“సారో అంటే తెలుసుగా విచారం, దుఃఖం. వోవర్ వ్వెల్మింగ్ అంటే – ” అని రెప్పలు మూతపడని కళ్ళతో, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – గంగి” అన్నాడు అనాలోచితంగా.
పగలబడి నవ్వింది, గంగి.
రవి అలాగే చూస్తున్నాడు.
నవ్వు ఆపుకుని, “యాడున్నవ్ సారూ? పాఠం చెప్తున్నవా, కార్కాన్ల వున్నవా?” అంది.
…
తేరుకుని, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – యేదైనా వొక భావంగానీ అనుభూతిగానీ ఫీలింగ్ గానీ – సంతోషమో విచారమో అసూయో ద్వేషమో ప్రేమో యివి యేవీ కాని మరేదో అనిర్వచనీయ భావమో – అట్లాంటిది యేదో వుక్కిరిబిక్కిరిగా పుక్కిలింతలుగా నిర్వీర్యంకాని అశక్తతగా చేసినట్లుగా – ” అని ఆ తరవాత యేం చెప్పాలో రాక ఆగిపోయాడు.
“నువ్వు చెప్పేది అర్థంకాకపోయినా నువు చెప్తుంటే వింటం బావుంటుంది” అంది.
రవి ఫక్కున నవ్వాడు.
“దేన్కి?” అంది కోపంగా.
“నీ మాటకి. నీ అనుకరణకి నవ్వొచ్చింది” అన్నాడు.
“నీలాగా మాట్లాడదాఁవని.” అంది.
నవ్వు ఆపుకుంటూ “దేనికి?” అన్నాడు.
“మా మాట బగ్గడ్ గుంటదిలే! మీ ఆంద్రోళ్ళు మంచిగ మాట్లాడతరు” అంది.
“నేను ఆంధ్రావాణ్ని కాదు. తెలంగాణావాణ్నే” అన్నాడు.
“యేదొకటి. నీ మాట అట్లానే వుంటది. నాకు మంచిగ అనిపిస్తది – ఆతీరు మాట్లాడేది. నా మాట మంచిగుండదులే” అంది.
“బావుంటం అనేది మాటలోకంటే, ఆ మాట్లాడే మనసులో మనిషిలో భావంలో వుంటుంది! పుట్టిపెరిగిన ప్రాంతపు వాతావరణాన్ని బట్టి మాట తీరు వుంటుంది. వొక్కొక ప్రాంతంలో వొక్కొక రకంగా మాట్లాడతారు. మనసులు మంచివైతే ఆ మాట్లాడే తేడాలు అంత ముఖ్యంకాదు.” అన్నాడు.
“కాని నా కెందుకో అట్ల మాట్లాడితె మంచిగా అనపిస్తుంది. అటు ఆంధ్రుల అట్లనె మాట్లాడతరు గద?” అంది.
“లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపూరు చిత్తూరుల వరకు తీసుకుంటే చాలా తేడాలుంటయ్. ఐతే చదువుకుని నాలుగు ప్రదేశాలు చూసిన వాళ్ళు అంతా షుమారుగా అందరూ వొక మాదిరిగానే మాట్లాడతారు. రాస్తారు. దానిని మధ్య సర్కారాంధ్ర భాష అనవొచ్చు. పుస్తకాలలో, సినిమాల్లో, రేడియోలో, పత్రికలల్లో మనం సర్వసాధారణంగా చదివే వినేభాష అది. – ”
…
— “అనుక్షణికం,” పేజీలు 267-268.
చాలా బాగుంది. కధ అంతా చదవడానికి హాయిగా వుంది. కాని రెండవ పేరాకి మిగతా కధకి ఎమీ సంభందం లేదు.
నౌషాద్ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/04/2006 9:52 am
తండ్రిని మించిన తనయుడు
సంగీతం గురించి కనీసపు జ్ఞానం లేకపోయినా నేను రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు చదవడానికి కారణం వారి నిరాడంబర భాషా, శైలీ, క్లిష్టమైన విషయాలను విడమరచి సులభంగా చెప్పే నేర్పూ.
నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇతర రాష్ట్రాలకన్నా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా వున్నా కూడా సంగీతంలో ప్రవేశం మనవాళ్ళకంటే వేరే రాష్ట్రాలవాళ్ళకే ఎక్కువున్నట్లనిపించేది. ముఖ్యంగా మనప్రక్కవాళ్ళే అయిన తమిళయన్లలో, ప్రతివాళ్ళూ గాత్రమో వాయిద్యమో చిన్నప్పుడే నేర్చుకునేవాళ్ళని విన్నాను. మనవాళ్ళకి ట్యూషన్లు, కోచింగ్లతో సంగీతానికి సమయం మిగులుతున్నట్లు లేదు. (పల్లెటూళ్ళలో, చిన్న పట్టణాలలో, రెండు మూడేళ్ళకోసారి వెళ్ళి పదిరోజులుండి చూసి ఏర్పరచుకున్న అభిప్రాయమిది; వాస్తవం కాకపోవచ్చు.)
చిన్నప్పుడే, 3-7 ఏళ్ళ మధ్య ప్రతిబిడ్డకూ ఏదో ఒక కళమీద గురి కుదురుతుందనీ, ఆ అభినివేశం పెద్దయ్యాక ఏర్పడటం దాదాపు అసంభవమనీ, చిన్నప్పుడే తగిన వాతావరణం కలిగించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకుందనీ కొకు రాశాడు. పాటల్లోపడితే చదువులు పాడవుతాయని తల్లిదండ్రులకి సహజమైన భయం వుండొచ్చుగాని, దానికి కాస్త మందలింపు సరిపోవచ్చు:
“మా ప్రసాద్ సితార్ తో చదువు పాడు చేసుకోవటం నాకంతగా ఇష్టం లేదు. వాడు పరీక్షలప్పుడు కూడా relax కావటానికి ఓ అరగంట వాయించుకుంటే నేను అభ్యంతరం చెప్పను. కాని social functions లో వాయిస్తే ఇక mind చదువుమీదికి పోదు. ఆమధ్య వాడి స్నేహితులు చిన్న పార్టీ ఏర్పాటు చేసి వాడి చేత రెండున్నర గంటలు సితారు వాయింపించారట. అందులో వున్న ప్రమాదం వాడికీ తెలుసు. అందుకని దాని జోలికిపోక చదువుకోమని రాశాను. డిసెంబరు సెలవుల్లో నెలరోజులూ సితారే వాయిస్తాడు. summer holidays అంతా వాడికి మరోపని వుండదు. వాడికి వ్యక్తిత్వం లేకపోవటమేమిటి? సైన్సులోనూ, సంగీతంలోనూ నాకు వాడు చాలా విషయాలు చెప్పగలడు. నాకున్న వ్యసనాలు కూడా ఆరెండే. అందుచేత వాటిలో నన్ను ఇప్పటికే మించి ముందుకు వెళ్ళాడు.”
— కృష్ణాబాయికి 11-11-1968 న కొకు రాసిన ఉత్తరం నుండి.
నిడుదవోలు మాలతిగారి “కోపం” కథ చదివాను. ఈ కథ మాలతిగారి పాత కథల స్థాయిలో లేదు. ఈ కథలో నాకు అర్థంకాని విషయాలు చాలా ఉన్నాయి.
1. జోగిబాబుకీ, జీనీకీ, బిష్ కి ఉన్న బాంధవ్యం ఏమిటో బోధపడలేదు.
2. కాంతం కి ఇండియన్ల మీద అనవసరపు bias ఉన్నట్టు కనిపించింది
3. రాధలాంటి వాళ్ళు తెలుగుదేశంలో చాలా అరుదు. సాధారణంగా మనవాళ్ళు ప్రతి చిన్న విషయం పట్టించుకొని అపార్థం చేసుకుంటారు.
4. కాంతం తనంత తానే గుంటూరు వెళ్ళలేక పోవడం, హైదరాబాద్ నుండి తమ్ముడిని పిలవకపోవడం వింతగా ఉంది. కాంతం దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నదే కదా!
I regret to say that the editors have not excercised their options properly!
అడిగే వాళ్ళ కోరికలకు అంతూ పొంతూ లేదనుకోండి. కాని ఒక చిన్న విన్నపం.
మీ గ్రంథాలయంలోని పాత పుస్తకాల లింకులు పునరుద్ధరించవలసిందిగా మనవి. శిలాలోలిత సగంలో చదివి ఆపేశాను. ఇప్పుడు లింకు కనిపించట్లేదు.
1. కృష్ణరాయలు తన కవితాసక్తిని బహిరంగంగా ప్రదర్శించాడా, అతడు కవి పోషకుడా?
ఈ ప్రశ్నకి “ప్రదర్శించాడు” అని సమాధానం చెప్పుకోడానికి పెద్ద సందేహపడక్కరలేదు. పెద్దన, తిమ్మన్న కావ్యాలే కాకుండా, రాయవాచకం, కృష్ణరాయవిజయం కూడా ఇందుకు సాక్ష్యాలే. అయితే కవులపేర ఏమైనా భూములిచ్చినట్టుగా శాసనాలు ఉన్నాయా అంటే అనుమానమే. నారాయణరావుగారు ఉదహరించిన ఆముక్తమాల్యదలోని పద్యం అతని కవి పోషకత్వాన్ని అనుమానించడానికి అడ్డురాదు. అందులో ప్రస్తావించినది కవులగూర్చి కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. కవులని భిక్షువులుగా జటాధారులుగా ప్రస్తావించడం సబబుగాలేదు. అలా అని రామారావుగారన్న బౌద్ధులు, శైవులు, జైనులు అవడానికి కూడా అవకాశం లేదని నా ఉద్దేశం. వైష్ణవుడైన కృష్ణదేవరాయలు వాళ్ళని డబ్బులిచ్చి మార్చెస్తే, ధర్మగ్లాని అవుతుందని ఎందుకంటాడు? పైగా వాళ్ళమీద భక్తి చూపించమని ఎందుకంటాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి బౌద్ధ భిక్షువులో, శైవులో కాదు. వేదం వారి వ్యాఖ్య ప్రకారం, వాళ్ళు సన్యాసులు. “అక్షరం” అంటే (నాశనం కాని, ఆధ్యాత్మిక)విద్య.
2. కృష్ణరాయలు స్వయంగా కవా?
ఇది చాలా controversial ప్రశ్న. దీని గురించి చాలామంది పెద్దలు వాదులాడుకున్నారు. ఆముక్తమాల్యద పెద్దన్న కృతమని చాలా రుజువులే చూపించారు. వీటన్నిటిని వేదం వేంకటరాయశాస్త్రిగారు తన ఆముక్తమాల్యదకి రాసిన సంజీవనీ వ్యాఖ్య పీఠికలో చర్చించారు. తెనాలి రామకృష్ణునిదిగా చెప్పబడుతున్న చాటువు, కోకట గ్రామ కైఫీయతు (ఇందులో ఈ గ్రామాన్ని రాయలు పెద్దనకి దానం చేసినట్టు ఉందిట), అప్పకవి పద్యమూ, గుడుపాటి వేంకటకవిదిగా చెప్పబడుతున్న ఆముక్తమాల్యద టీకా… ఇవన్నీ ఆముక్తమాల్యద కర్త అల్లసాని పెద్దనగా పేర్కొన్నాయి. అంతేకాక, ఆముక్తమాల్యదలో కృష్ణరాయల కృతమని పేర్కొన బడ్డ కొన్ని సంస్కృత కావ్యాలు, “ప్రపంచదర్పణమ్” అనే పుస్తకంలో అల్లసాని పెద్దనవిగా పేర్కొనడ్డాయి. అంతేకాక రాయవాచకమూ, కృష్ణరాయ విజయమూ ఆముక్తమాల్యదని పేర్కొనకపోవడం మరింత అనుమానాన్ని కలిగిస్తుంది.
3. అష్టదిగ్గజాలు అసలు ఉన్నారా లేరా ?
దీనికి సమాధానం సబహుశా లేరనే చెప్పాలి. ఉన్నారని బలమైన సాక్ష్యం ఏదీ లేదుకాబట్టి. అష్టదిగ్గజాలుగా చెప్పబడుతున్న కవుల కావ్యాలలో కాని, రాయవాచకం, కృష్ణరాయవిజయం వంటి కావ్యాలలో కాని వీరి ప్రస్తావన లేదు. ఉన్న ఒకే ఒక చిన్న ఆధారం, కడప మండలంలోని తిప్పలూరు గ్రామ శిలాశాసనంలో అష్టదిగ్గజాల ప్రస్తావన.
విప్లవ్ గారి సందేహానికి సమాధానం, చాలా ప్రబంధాలు రాయలకాలంలోవిగా నిర్ణయించబట్టే ఆ కాలాన్ని ప్రబంధయుగం అన్నారు. అయితే వాటికీ కృష్ణరాయల కవిపోషకత్వానికీ ఎంతవరకూ direct సంబంధమున్నదన్నదే ప్రశ్న.
తుది ప్రార్ధన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/02/2006 9:01 am
అమ్మా నాన్న వద్దు అందామనుకుంటే
“అమ్మ, నాన్న” లను చేసింది నా పుట్టుకే అనిపిస్తుంది
అడవి కాని ఇల్లు వాకిలి వద్దు అందామనుకుంటే
అవేవీ కట్టకముందు అంతా అడవే అనిపిస్తుంది
చదువుకోవడానికి మేష్టార్లు వొద్దనుకుంటే
ప్రతి అనుభూతి పాఠంచెప్పే మేష్టారే అనిపిస్తుంది
ఇంద్రజాలం
ఇంద్రాణి గారి కవితల ఇంద్రజాలంలో ఏడాదిగా పడి కొట్టుకుంటున్నాను. జనవరిలో ఎన్నో చోట్ల వెతికినా వస్తుందన్న కవితల పుస్తకం దొరకలేదు. నెట్ లో దొరికిన కాసిన్ని కవితలనే మళ్ళీ మళ్ళీ అబ్బురంగా సంబరంగా చదువుతున్నాను. గుప్తనిధి అని ముకుందరామారావు గారన్నమాట, ప్రతిభ గల కవయిత్రి అని యదుకుల భూషణ్ గారన్నమాట ముమ్మాటికీ నిజం. ఈ కవితలకి ఇంతటి లాలిత్యం ఈ సమ్మోహక శక్తి ఎలా వచ్చి ఉంటాయా అని నాలో నేనే కులికి చస్తున్నాను. ఇది చాల జటిలమైన ప్రశ్న; దీనికి సమాధానాలు మాత్రం ఈ కవితలలానే చాల సున్నితమైనవి, మేధస్సుకు అతీతమైనవి అయి ఉండాలి. ఎంతో ఇష్టంగా అవి వెదుకుతున్నాను; కాని మొత్తం పుస్తకం నాకు దొరకలేదు. పరిచయంలో ముకుందరామా రావు గారు చూపినటువంటి సంయమనం, ఏ నిరాశకు గురి కాకుండా ఉండాలన్న ఆకాంక్ష, ఈ ఐంద్రజాలికి చేయతగిన కనీస గౌరవాలు. దొరికిన కవితలు చదినప్పుడల్లా నేను అలాగే అనుకున్నాను.
నిద్రపోతున్న పిల్లలు, సైకిలు మీద తమ్ముడితో వెళ్ళడం, నీళ్ళు తాగే పిట్ట, వానకు తడిసిన పువ్వూ ఇవి సర్వ సాధారణమైన దృశ్యాలూ, అనుభవాలూ కదా! వీటిని చూసి, రాస్తే అవి అంత చక్కదనాలుగా ఎలా, ఎందుకుంటాయో? ఈ ఒక్క ప్రశ్నDavid Wagoner అని నాకు చాల ఇష్టమైన కవి ఒకరిని అడిగేను. ఆయన ఇది చాల చిక్కు ప్రశ్న అని అంటూనే నాకు నచ్చిన జవాబు చెప్పేరు. నిత్య జీవితంలో మంచి చెడ్డల బేరీజులు, నిర్ణయాలతోనూ సతమతమౌతుంటుండే మన అంతరంగాన్ని మంచి కవిత తన పదాలు, నడకలు, చిత్రాలు, ఉపమలతో ఊరడించి, సర్వ సాధారణమైన దృశ్యాల్ని, మనుషుల్ని, ప్రపంచాన్నే మరింత ఉదారంగా లోతుగానూ దర్శింపచేస్తుంది. (I have no good way to answer your very difficult question. But a partial answer would be that the sounds and rhythms and metaphors of poetry sometimes make us suspend our ordinary judgments and help us see the material world and its people, ordinary actions, and commonplace events more openly and deeply.) ఇందుకే ఇంద్రాణి గారి కవితలలో ఏమేం ఉన్నాయి అని కాకుండా ఏమేం లేవు అని, వేటిని ఒదులుకోవటం వలన వాటికి ఆ శక్తి అనీ ఇంకా అడుగుతున్నాను నన్ను నేనే. తప్పకుండా రాసి తీరాలి అని గిలగిల్లాడుతున్నది రాసినందుకు ముకుంద రామారావు గారికి అభినందనలు.
Begin typing your search above and press return to search. Press Esc to cancel.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/27/2025 7:46 am
మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నని, నేను పలానా పుస్తకంలోనో పత్రికలోనో చదివానని బుకాయించటం లేదని బ్రహ్మానందం గారు నమ్మగలిగితే చాలా ధన్యుడిని. వికీపీడియాలో ఉన్నదంతా ప్రామాణికమూ, వాస్తవమూ అని నమ్మడం కష్టం అన్నమాట అక్షరసత్యం. అసలు వెబ్ ఆధారంగా తెలియవచ్చేవి చాలావరకు నమ్మశక్యం కానివే ఉంటున్నాయేమో కూడాను.
నెట్టింట గాలించగా హిండూపత్రిక వ్యాసం ఒకటి ఒకటి రచయిత పేరూ మెయిల్ ఐడీతో సహా ఉన్నది, ఈవిషయం గురించి ప్రస్తావించేది కంటబడింది. ఆవ్యాసం తాలూకు లింక్
https://www.thehindu.com/features/friday-review/music/a-voice-to-remember/article3686247.ece/amp
ముఖ్యంగా నేను ఏదో సంగీతం విని కొంచెం ఆనందించగల వాడినే కాని ఆరంగంంలో పాండిత్యప్రతాపాలేమీ ఉన్నవాడిని కాను. ఒకవేళ మధురానగరిలో పాట వేరొకరిదో త్యాగరాజ స్వామిదో అని బ్రహ్మానందం గారు ప్రమాణికమైన ఆధారం వద్ద చదివి ఉంటే ఉండవచ్చును. నా అవివేకం ఉంటే మన్నించగలరు. ఏదో నా యెఱుకకు వచ్చిన విషయం మనవి చేసాను కాని అంతకంటే ఏమీ లేదు.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/24/2025 11:58 pm
‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నన్నది నా అభిప్రాయం కాదండీ. మీరన్నట్లు ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన అది చిత్తూరు వారి రచన అనే అభిప్రాయం ప్రామాణికం అవదు కాని ఆంధ్రజ్యోతిలోని ఆ వ్యాసంలో ఆ మాట చెప్పినది సాక్షాత్తూ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గారి కుమార్తె రేవతీ రత్నస్వామి గారు. నిజానికి జ్యోతిలో వచ్చినది ఒక వ్యాసమో ఆవిడతో ముఖాముఖీయో నాకు ఇప్పుడు గుర్తులేదు. వచ్చి ఇరవైయేళ్ళదాకా అయ్యుండవచ్చును. ఆంధ్రజ్యోతివారి నుండి ఆ వ్యాసం సేకరించగలిగితే స్పష్టత వస్తుంది.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/24/2025 12:10 pm
ప్రహ్లాద భక్తి విజయము లోని కందపద్యం ఈవ్యాసంలో కొన్ని తప్పులతో వచ్చింది.
కం: శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది సంధ్య రఘుకుల తిలకా
రాజీవ నయన మునిజన
పూజిత పద రామచంద్ర పుణ్యము చరితా
ఈపద్యం ఆంధ్రభారతి వారి సైటులో కూడా కొంత తప్పుగానే ఉంది. aarchive.org వారి సైటులో ఈపుస్తకం (ప్రచురణకు సంబంధించిన వివరాలు లేకుండా) లభిస్తోంది. అందులో ఉన్నపాఠమే ఆంధ్రభారతిలోనూ ఉంది.
శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది వంద్య రఘుకులతిలకా
రాజీవనయన మునిజన
పూజితపద రామచంద్ర పుణ్యచరితా
అని. ఈపాఠంలో చివరి మాటను పుణ్యచరిత్రా అని సవరించితే ఛందస్సుకు సరిగా ఉంటుంది. ఈమాట వారి వ్యాసంలో వంద్యకు బదులు సంధ్య అని అదనపు తప్పు దొర్లింది. అంతే కాక పుణ్యచరిత్రా బదులు పుణ్యము చరితా అని ఉండటం జరిగింది. ఈ రెండు తప్పుల వలనా ఛందోభంగం జరుగకపోవటం విశేషమే కాని సరిజేసు కొనక తప్పదు.
మరొక్క మాట. సంస్కృతసమాసాలను మధ్యలో స్పేసెస్ ఇచ్చి వ్రాయటం సంప్రదాయం కాదు. సమాసం అంటే సాంకేతికంగా అది ఒకే పదం కాబట్టి దానిలోని పదాలను విడివిడిగా వ్రాయకూడదు. కాని ఈమధ్య అలా వ్రాయటం తరచుగానే చూస్తున్నాం.
[ ఛందోదోషమును, సమాసపదచ్ఛేదదోషమును చూపినందుకు ధన్యవాదాలు. సరిచేసినాము. — సం. ]
వేలూరిగారితో ఒక సంభాషణ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ . గారి అభిప్రాయం:
04/06/2025 9:08 pm
వేలూరి గారిని “అమెరికాలో అర శతాబ్దం” పేరిట తమ అనుభవాలు -జ్ఞాపకాలు గ్రంధస్తం చేయమని కోరాను. ఈ ఇంటర్వ్యూ చదివాక ఆయన తప్పక ఈ పని చేయగలరని అనిపించింది. అభిరుచి ఉన్నవారు ఆత్మ చరిత్రలు రాసుకోవడం వల్ల ఎన్నో లాభాలు. సంజీవదేవ్ గారి ‘తెగినజ్ఞాపకాలు’ చదవక పోతే ఆయన గురించి నాకు తెలిసేదే కాదు. (ఆయన ఆత్మచరిత్ర ద్వారా కలిగిన పరిచయం నాకు ఎంత గానో లాభించింది. తత్వశాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, రస శాస్త్రము, మనస్తత్వ శాస్త్రాలు, చిత్రకళా చరిత్ర — ఇలా అనేకము చిన్న వయసులో అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది). తెలుగు వారికి హైకూలు పరిచయం చేసింది ఆయనే. టర్నర్ రంగుల ప్రపంచం గురించి, Constable చిత్రకళ Turner కన్నా ఏ రకంగా భిన్నం? – ఇవన్నీ ఆయన ద్వారా తెలిసి వచ్చిన విషయాలే. ఒక చిత్రకారుని గురించి లోతులకు పోకుండా తెలుసుకోవడం వేరు – చిత్రకారుని ఆత్మను పట్టుకొని చిత్ర శైలీ పరిణామాన్ని గుర్తెరిగి ఆనందించడం వేరు. ఇవన్నీ, ఎంతో క్రమశిక్షణతో, దక్షతతో చేయవలసిన పనులు.
ఇక తెలుగులో కవిత్వం, అనువాదం – ఈ విషయాలకొస్తే – మనవారిలో పీఠాధిపతులు, వారికి అడుగులకు మడుగులొత్తి పాదసేవలో తరించే భక్త బృందాలు అధికం. కార్యరంగం విజయవాడైనా, విస్కాన్సిన్ ఐనా దృశ్యం మారదు. స్నేహాలు వేరు, విమర్శలు వేరు అన్న స్పృహే లేదు. కవిత్వం, అనువాదాలు, వాటిపై వచ్చే విమర్శను సీరియస్ గా పట్టించుకోవాలి అన్న వివేకం మన వారికి లేదు. మనకు కావలసింది భజన బృందాలు.
కొడవళ్ళ గారు ప్రస్తావించినట్టు ఇంటర్‌వ్యూలో అక్కడక్కడా స్పష్టత లేదు. పాద పీఠికలు ఇవ్వాలి – text without context leads to utter confusion -సందర్భ శుద్ధి లేని వచనం, గందరగోళానికి దారి తీస్తుంది.
నా వంతుగా “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు” పుస్తకానికి లింకు ఇస్తున్నాను.
https://sundarayya.org/sites/default/files/2023-09/Neti%20kalapu%20kavitwam%20-%20Theeru%20thennulu.pdf
కొడవళ్ళ గారు ప్రస్తావించిన వ్యాసం, దానికి తోడుగా మరొక వ్యాసం:
Hibiscus on the lake (పుట 108)
అనువాదంలో ‘పద్య సమాధి’ (పుట 111)
అలాగే, తెలుగు విమర్శలో మైలురాయి అనదగ్గ అక్కిరాజు ఉమాకాన్తం గారి పుస్తకానికి లింకు ఇక్కడ:
https://archive.org/details/in.ernet.dli.2015.333044
వేలూరిగారితో ఒక సంభాషణ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
04/03/2025 12:52 am
చక్కగా ఇంటర్వ్యూ చేసినందుకు పరుచూరి, గొర్తి గార్లకు, ఇచ్చినందుకు వేలూరి గారికి, ప్రచురించినందుకు సంపాదకులకు, కృతజ్ఞతలు. అమూల్యమైన ప్రచురణ అయినా, ఒకటి రెండు నచ్చనివి ప్రస్తావిస్తాను.
“శ్రీశ్రీ అమెరికా వచ్చారా?” అని అడిగి, వెంటనే, “మీరు శ్రీశ్రీగారి మాటల్ని రేడియో స్టేషన్‌లో రికార్డు చేయించారు కదా!” అనడం అసంబద్ధంగా ఉంది.
“ప్రసాదరావుగారు మాట్లాడలేక పోయేవారు. అప్పటికే మాట పోయింది. పేపర్ మీద నోట్ లాగా రాసిస్తుండేవాడిని. … చలసాని ప్రసాదరావుగారి గురించి తెలుసుకోవాలంటే… He is a peculiar person. చాలా తక్కువమందికి తెలుసును.”
చిన్నప్పుడే చలసానికి జబ్బు వచ్చి వినికిడి పోయిందని చదివాను; అందుకే నోట్ రాసి చూపెట్టడం, మాట పోయినందుకు అయి ఉండదు. సందర్భం కళ కావున చలసాని దాంట్లో ఏం సాధించారో, చెప్తే, అడిగితే, బావుండేది.
“ఏదో తామర కొలనులో మందారం పువ్వో అదేదో… మన అంపశయ్య నవీన్ రాశాడు దానిమీద. దట్స్ నాట్ క్రిటిసిజమ్. ఆయన సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయలేదని. పోనీ నువ్వు చెయ్. ఇంతకంటే బెటర్ ట్రాన్స్‌లేషన్ నువ్వు చేసి చూపించు. (తమ్మినేని యదుకుల) భూషణ్‌తో కూడా ఇదే గొడవ. భూషణ్ బాగా చదువుకుంటాడు. ఉమాకాన్తమ్‌ని గుర్తుంచుకున్నామా? లేదు. … కావ్యం మీద పుస్తకమే రాశాడాయన. నేటికాలపు కవి ఎలావుండాలి? అనో ఏమో. చదివారా మీరా పుస్తకం? ఏమైంది, ఎవరు గుర్తున్నారు? ”
ఇక్కడ రచనలని నిర్దిష్టంగా ప్రస్తావించకపోవడం, ఇంకాస్త లోతుకు వెళ్ళి తెలుసుకుందామనుకునే చదువరులలో, గందరగోళం కలిగిస్తుంది. “తామర కొలనులో మందారం,” అంటే వెల్చేరు, “Hibiscus on the Lake,” మనసులో మెదిలింది. దానిని నవీన్ విమర్శించారా? ఎక్కడ? తమ్మినేని, “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు,” లో “వెల్చేరు… ఏమి తేల్చారు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. మందారం తేల లేదు … సరికదా,” అన్నారు. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల, “నేటికాలపు కవిత్వం,” పీఠికలో చేకూరి, “సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతం గారి నిర్ణయాలు ముఖ్యం కాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాస్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు,” అన్నారు.
“నేను సంపాదకునిగా ఉన్నన్నాళ్ళు, ఈమాటకు ఆ రకమైన స్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించాను.”
వేలూరి గారు “ఈమాట” ని న్యూయార్కర్ పత్రిక స్థాయిలో మలచాలని యత్నించడం చెప్పుకోదగ్గ విషయం. మొన్న నా వ్యాసానికి చివరి మెరుగులు దిద్దుతుండగా, సంపాదకులతో నేను ‘కామా’ ల గురించి తర్జన భర్జన పడాల్సొచ్చింది. విరామ చిహ్నాలవరకైనా, ఈమాట న్యూయార్కర్ పద్ధతిని అవలంబిస్తే బావుండు.
చివరగా, వేలూరి గారితో నాకు ఇరవై ఏళ్ళ క్రితం, డెట్రాయిట్ లో తానా సభల సందర్భంగా పరిచయం. కన్నెగంటి రామారావూ, నేనూ కాలువ పక్కన నడుస్తూ వేలూరి గారితో మాట్లాడుతుంటే, వారన్న ఓ మాట, “శ్రీశ్రీ కవిత్వం లోని మాటల కర్థం తెలియకుండానే పొగిడే వాళ్ళు అనేకం,” నాకిప్పటికీ గుర్తు. “షెల్లీ కవనపు హల్లీసకమూ,” అని తన్మయించడమే కాని, హల్లీసకం అంటే అర్థం తెలియదే అని నేను మనసులో అనుకున్నాను. అప్పటి నుండి, నా చదువు కాస్త కుంటు పడింది – అర్థం తెలియని పదం తగిలితే, నిఘంటువులో వెతక్కుండా ముందుకు పోలేక. అందుకూ, మరెన్నెటికో మార్గదర్శకులుగా ఉన్నందుకూ, శ్లాఘనీయులైన వేలూరి గారికి కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు
శ్లోకము గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/02/2025 9:01 am
వాగ్వల్లభ దుఃఖభంజనము పుస్తకం కోసం నేను ఇంటర్నెట్ గాలించి లాభం లేకపోయింది.
వ్యాసకర్త గారు కాని మరెవరైనా కాని ఈవిషయంలో ఏమైనా సహాయం చేయగలరా?
కలుపుకొంటే కలుపుకొన్నంత గురించి రమేశ్ బాబు జవ్వాజి గారి అభిప్రాయం:
04/01/2025 7:28 am
తిరుపతిలో తెలుగు భాషోద్యమ సమితి 20వ వార్షికోత్సవంలో కలిసాము. ఇన్నాళ్ళకు మళ్ళీ మీ సోబగైన తెలుగు చదువుతుంటే కలిగిన ఆనందం చెప్పనలవి కానిది. మళ్ళీ కలిసే భాగ్యము ఎప్పుడో.
వందనాలు సోదరా
నా కవితా వ్యాసంగం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/24/2025 4:07 am
సంపాదకమహాశయులు ఈ తీగను పట్టుకుని చదువరులు ఆయన ఆత్మకథలోని శతాపత్రాలను చదువాలనేది మా పెద్ద కోరిక అన్నారు. చాలా సంతోషం. బహుసముచితమైన కోరిక. చదువరులు ఎంతమంది ఆకోరికను తీర్చటానికి పూనుకుంటారో తెలియదు. అలా పూనుకొని తీర్చినవారు ఇక్కడ తెలియజేస్తే సంపాదకులతో పాటు చదువరులూ మిక్కిలి సంతోషిస్తారన్నది నిర్వివాదం అనుకుంటాను.
నేను గడియారం రామకృష్ణశర్మ గారి ఆత్మకథ ‘శతపత్రము’ కోసం https://archive.org/ సైటును ఆశ్రయించి చూచాను కాని అది అక్కద లభ్యం కాలేదు. అక్కద వారి రచనలు మన వాస్తుసంపద, విజ్ణానవల్లరి, తెలుగులో పదకవిత కనిపించాయి.
ఈ పుస్తకం మీద సమీక్ష ఒకటి నాకు https://pustakam.net/?p=19853 అనేది కనిపించింది. కనీసం ఏడేళ్ళ క్రిందటి వ్యాసం అనుకుంటాను. ఇంకా చదువలేదు. కొంచెం పెద్దది గానే ఉందది. వ్యాసం మొదట్లోనే పుస్తకం లభించు చోటు ‘ఇది’ అంటూ ఒక లింక్ ఇచ్చారు సహృదయంతో. దురదృష్టవశాత్తు ఆలింక్ ఇప్పుడు పనిచేయటం లేదు.
మరొక వ్యాసం ఈపుస్తకం గురించినది కూడా అదే సైటులో https://pustakam.net/?p=1766 ఉంది.
అలాగే ఈపుస్తకం గురించి డా. వాడ్రేవు వీరలక్క్ష్మీదేవి గారు వ్రాసిన సుదీర్ఘసమీక్ష కనిపించింది. దానికి లింక్ https://avkf.org/BookLink/book_of_week/562_book_detail.pdf.
ఈపుస్తకం Navodaya Book House, Hyderabad వారి వద్ద లభిస్తుందని ఒకచోట చూసాను. వారిని సంప్రదించి చూడాలి. మరొక రకంగా లభ్యం అవుతోందా అన్నది తెలియదు. సంపాదకులకు గాని, చదువరుల్లో ఎవరికైనా గాని తెలిస్తే చెప్పవలసిందిగా విన్నపం చేస్తున్నాను.
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
03/22/2025 11:53 am
గ్రంథసూచి 9. ముద్దుపళని రాధికాసాంత్వనము, ఆరుద్ర ప్రవేశిక, EMSCO Books, విజయవాడ, 1997.
Essentially,
‘రాధికా సాంత్వనము’ కామకేళి గురించిన పద్యముల కూర్పు. ఇందులో ఒక మగవాడు, ఇద్దరు స్త్రీల సంభోగం గురించిన కథ ఉంటుంది. జరిగే ప్రదేశం వ్రేపల్లె. మగవాడు కృష్ణుడు. ఆడవాళ్లు రాధ, ఇళ. ఈ కథలో రాధ కృష్ణుడి మేనత్త. ఆమె తన మేనల్లుడు చిన్న వయసులో ఉన్నప్పుడే సెక్స్ పాఠాలు చెప్పి, అతడితో కామకలాపాలు జరుపుతుంది. కాలక్రమాన ఆమె, కృష్ణుడికి చిన్నపిల్ల, అతని మరదలు ఐన ఇళనిచ్చి పెళ్లి చేయిస్తుంది. ఇళ రజస్వల కాగానే ఆమెతో, కృష్ణుడితో రతి కార్యక్రమాలు మొదలెట్టిస్తుంది. ఇళకు కామశాస్త్రం నేర్పింది కూడా రాధయే. ఇక ఆపైన, ఒక్క మగవాడిని పంచుకోటంలో ఆ ఇద్దరు ఆడవారికి కలిగే ఇబ్బందులు సబ్బందులు, తమ శారీరక కోర్కె అవసరాన్ని బట్టి పరస్పర సానుభూతి, సహాయాలు; తాత్కాలిక విరోధాలు, విలాపాలే ఈ కథ సారాంశం.
ఎమెస్కో పబ్లికేషన్ లో, కేవలం సెన్సార్ చెయ్యబడిన -రతి అతిగా ఉన్న పద్యాలు- చదువుకోవాలంటే, ఆరుద్ర తన పరిచయంలో వీలుగా లిస్ట్ ఇచ్చాడు. నేను లైబ్రరీ నుండి ఫ్రెంచ్ బూదలేర్ పొయట్రీ తెచ్చుకున్నప్పుడు కూడా సెన్సార్ చెయ్యబడిన పద్యాలకు అంతకు ముందు పాఠకులు చక్కగా గుర్తులు పెట్టారు. మంచి పని. ముందుగా అవే చదివాను. తెలుగు పద్యాలు, ఫ్రెంచ్ పద్యాలు ఏవి సెక్సీగా ఉన్నవని రెండూ చదివిన పాఠకులు నిర్ణయించుకోవచ్చు.
ఈ కథ ముద్దుపళని ప్రబంధ శైలిలో రాసింది. ఆమె తన సమకాలీనులకు తన పాండిత్యం చూపటానికి ఆ ప్రక్రియను ఎంచుకున్నది. అందువల్ల ప్రబంధాల తరహా -ప్రారంభం, అంకితం, ఆశ్వాసాల ముగింపులు, పదే పదే, అవే చంపకమాలలు, కందాలు, సీసాలు, గద్యాలు వాడుతూ, వాటి ఛందస్సులు, వ్యాకరణం, ఆయా రూల్స్ పాటిస్తూ రాసింది. ఆ రూల్స్ గురించి తెలిపే చక్కని వ్యాసాలు ‘ఈమాట’ పత్రికలోనే ఉన్నవి. అవి చదువుకుని, ఆసక్తి ఉన్నవారు ఇప్పటికీ తెలుగు ప్రబంధాలు రాయవచ్చును. అవి మునుపటి వాటికన్నా బాగానూ ఉండొచ్చును.
పళని తను సంగీత సాహిత్య భరతకళావిశారద నని చెప్పుకున్నది కాని ఆమె కామకేళి గురించే ప్రధానంగా రాసింది. ఎంతైనా ఆమె కోర్టిసాన్ కదా. సంఘంలో ఆడ మగ మధ్య రతి సంబంధాలు, పెళ్లిళ్లు, ఆమె కాలం నాటివే. పళని వాడినన్ని తెలుగు సామెతలు, మా తెలుగు మేనత్తలు కూడా వాడలేదు.
మా మేనత్తలు -వాళ్లు రైటర్లు, సానులు కారుగాని, ఇరవయ్యో శతాబ్ది పూర్వార్ధపు తెలుగు ప్రపంచం, వితంతుతనం, పునిస్త్రీతనం, బాల్య వివాహాలు, మగవాడి రెండో, ఇంకా ఎక్కువో పెళ్లిల్లు, స్త్రీని ఉంచుకోటాలు, వారితో లేచిపోటాలు, ఇంట్లోనే అక్రమ అవినీతి సంబంధాలు, రంకు పుటకలు, అబార్షన్లు, ఒకరి సంతుని ఇంకొకడిదిగా చెలామణి చెయ్యటాలు, ఈ వ్యవహారాల సమాచారాలన్నీ బాగా తెలుసు. మొదటికి వారు పల్లెటూరి గొల్లభామలు కదా. వారు చెప్పిన సమాచారం బట్టి, నాకు తెలియని హాఫ్ సిస్టర్సో, బ్రదర్సో, కజిన్సో, కొందరు అక్కడక్కడా ఉండే ఉంటారు బహుశా.
రాధికాసాంత్వనం ప్రబంధకావ్యంలోని ఇద్దరి ఆడవాళ్ల రభసలు, తిట్టుకోటాలు, తన్నటాలు, తన్నించుకోటాలు, వెళ్లగొట్టటాలు, వెళ్లిపోటాలు, మగవాడి అపేక్ష కోసం పోటీలు -నాకు ఇంగ్లిష్ లో ఈమధ్యే చదివినట్టు అనిపించాయి. ఎవరా అలాటి రచన చేసింది అంటే ఆశ్చర్యంగా అది సమకాలీనుడైన అమెరికన్ మగవాడు. పాపా హెమింగ్వే.
His novel ‘The Garden of Eden’ is set in Southwest France coast, close to Spain. It is about sexual issues, between two women and one man. Catherine is the man’s wife. Marita is the mistress. These two women are attracted to each other too, and engage in sex, when they are bored with the man. (David Bourne) It is a widely read book of Hemingway’s. Published posthumously, like his other book, a memoir -sort of story book, ‘The moveable feast’. (The movie ‘Midnight in Paris’ is Woody Allen’s creation, and Woody’s thematic idea, as well as a lot of characters/famous people and their dialogue are from Hemingway’s book, the moveable feast.)
In the novel ‘Garden of Eden’ -male lead character is an addict not only to alcohol, but to the act of writing itself. Obviously, the main character is Hemingway himself. The writing is papa’s. But, the name of novel, the content, the ending – it appears there is a great deal of editors’ participation in the publication of this book. It sold well, possibly, mainly because Hemingway by then is already a Nobel Laureate for his other literary works.
To me, the book is a bit of a drag, there are repetitious drinking scenes, swimming, sunning, bathing together scenes, too sleepy a wife in bed, too many interspersed excerpts of ‘real writing’ to prove to us, the protagonist is a real writer indeed. (There is a descriptive fishing scene of dragging a poor fish in the sea, no doubt which the writer expanded later into a hundred-page novel -The old man and the sea. A book which was followed later by an excellent movie, starring Spencer Tracy. Love the movie.)
The hidden and emerging homosexuality and bisexuality of all characters is rather boring. Perhaps because Hemingway probably lost his nerve about writing on sex, after too frequent attendance at Gertrude Stein’s Salons. And listening to her admonitions about writing about perverted sex. Or sexual aggression. Hemingway is too shy, too cryptic, and comparatively, Telugu Palani is more direct and explicit in her writing.
I just could not figure out why in the first place either Radha, or Catherine, themselves take the ‘other woman’ by hand, put her into their lover/husband’s bed. And then start on their jealousy and abusive binge. And turn on the tears. What kind of craziness is that? Surely, they brought the misery on themselves.
Anyways, there is no tenderness, no ardor, in these relationships, in either writing. As you could hear in this Shakeel Badayuni’s Hindi poetry,
..tadap rahe hain ham yaha, tumhare intjaar mein,
khija ka rang aa chala hai mausam-e-bahar mein
hava bhi rukh badal chuki, na jaane tum kab aaoge..
Add Naushad’s music, Rafi’s voice, hear the lyric -one would believe, after all there was romantic spirit at some time, somewhere in India.
-Lyla
కాలం కథ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
03/04/2025 10:25 pm
“గతము గతంబె, యెన్నటికి కన్నులఁగట్టదు; సంశయాంధ సం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ, యొక వర్తమానమే
సతత మవశ్యభోగ్యమగు సంపద; రమ్ము విషాదపాత్ర కీ
మతమునఁ దావులేదు; క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్.”
— ఖయ్యాము రుబాయత్ కు దువ్వూరి అనుసృజన, “పానశాల”.
రచయితకి విషయంపై సాధికారికత, భాషపై పట్టు కలవని రుజువవుతోంది. ముగ్గురు ఉద్దండులను (అరిస్టాటిల్, సెయింట్ అగస్టీన్, న్యూటన్) ఉటంకించారు, కాని ఐన్‍స్టయిన్ ని ప్రస్తావించక పోవడం లోపంగా తోస్తుంది.
తెలుగు సాంకేతిక పదాలని వాడటంలో తగిన శ్రద్ధ చూపినట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తుంది. జడోష్ణతకి (entropy) మాత్రం ఆంధ్రభారతిని సంప్రదించవలసి వచ్చింది. జడ+ఉష్ణత అనుకుంటే జడ అంటే జడత్వమా? అది సరైనదేనా?
ఎంట్రొపీ అంటే ఏమి నష్టం? తన పుస్తకం ఒకదానిని, మహీధర తన అభిమాన రచయిత JBS Haldaneకి అంకితమిస్తూ: “You can not keep out foreign words as you keep out foreign manufactured goods. Perhaps Telugu accepts them more easily than any other Indian language and this will certainly help to make it a rival to Hindi in teaching Science, Medicine and Engineering.” JBS Haldane. The Hindu (27-4-1958)
Entropy మాట ఎవరికీ అర్థం కాదని కొందరు చమత్కరించారు. నేనీ మధ్య ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, Carlo Rovelli, వ్రాసిన, “The Order of Time,” చదివాను (సన్నదే అయినా అర్థమయింది సగమే). దానిలో అంటాడు:
“Clausius introduces a quantity that measures this irreversible progress of heat in only one direction and, since he was a cultivated German, he gives it a name taken from ancient Greek – entropy:”
Clausius explained: “I prefer going to the ancient languages for the names of important scientific quantities, so that they may mean the same thing in all living tongues. I propose, therefore, to call S the entropy of a body, after the Greek word “transformation.” I have designedly coined the word entropy to be similar to energy, for these two quantities are so analogous in their physical significance, that an analogy of denominations seems to me helpful.”
ఈమధ్యనే చనిపోయిన అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, Leon Cooper, వేసిన చెణుకు: “By doing this, rather than extracting a name from the body of the current language (say: lost heat), he succeeded in coining a word that meant the same thing to everybody: nothing”.
(హాస్యప్రియులకు: అమెరికన్ కామెడీ షో Big Bang Theoryలోని నలుగురు యువ CalTech శాస్త్రవేత్తలలో Sheldon Cooper ఒకరు.)
Rovelli పుస్తకం చివర్లో అంటాడు: “Yaksa asks … Yudhistira, what is the greatest of all mysteries. The answer given resounds across millennia: ‘Every day countless people die, and yet those who remain live as if they are immortals.'”
నాకో ధర్మసందేహం: ఇంత ముఖ్యమైన ప్ర.జ.ను మన ఎర్రాప్రెగడ అరణ్యపర్వంలో ఎందుకు ఉంచలేదు
కొడవళ్ళ హనుమంతరావు
వచన రచనలో పదస్వరూపాలు, సింటాక్స్ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
03/04/2025 12:17 am
చాలా ఉపయోగకరమైన వ్యాసం. ఎలనాగ గారు ఇలాంటివి కొనసాగిస్తారని ఆశిస్తాను.
ఓ సూచన: ఒకే వాక్యంలో పదస్వరూప దోషాలు, వ్యాకరణ దోషాలు కలపకుండా దేనికది వేరుగా వివరిస్తే సులభంగా అర్థమవుతుంది.
సమిష్టి, సాంప్రదాయము సబబేనంటుంది ఆంధ్రభారతి లోని బ్రౌణ్య నిఘంటువు.
“బయటికి వెళ్ళడానికి కనీసం రెండు జతల బట్టలైనా ఉండాలి,” సరిగానే ఉంది కాని “కనీసం బయటికి వెళ్ళడానికి రెండు మూడు జతల మంచి బట్టలైనా ఉండాలి” లోని కొంత భావాన్ని (“మంచి” ని) మింగేసింది.
“బయటికి వెళ్ళడానికి కనీసం రెండు జతల బట్టలైనా మంచివి ఉండాలి,” అనో
“బయటికి వెళ్ళడానికి మంచి బట్టలు కనీసం రెండు జతలైనా ఉండాలి,” అనో రాయాలి.
కొడవళ్ళ హనుమంతరావు
ఇక్కడే ఉన్నందుకు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
02/05/2025 12:58 am
చివరి తీర్పు కోసం ఎదురు చూస్తూ… మృత్యువు తర్వాత ఏముంటుందో తెలియని భయంతో… ఈ వేదనకి అంతం దొరుకుతుందా అని ధ్యానాంకితమై అవలోకనం చేస్తున్న స్వాతి తల్లా!
ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగంలో, ఎవరికి ఎవరు సొంతము? ఎంతవరకీ బంధము?! అనొద్దు తల్లా!
జననీ, జన్మభూమి రుణం తీర్చుకోకుండా… ఇహలోకం లోని వేదనల వైతరణి దాటకుండా… ప్రారబ్ద కర్మ అనుభవించడానికి మరణానంతరం కొన్ని వేల యోజనాలు వెడల్పు కలిగిన వైతరణి దాటి ఆత్మ యమపురి చేరటానికి అది నీ ఇష్టానుసారం చేసే యానం కాదు, యాత్ర కాదు తల్లో!
ఎన్నిరోజులు బ్రతికినా ఇంతకంటే గొప్పగా చేసేది ఏదైనా ఉందా? అన్నావు. ఎందుకుండదు… కళ్లెట్టుకుని సూత్తే.
ఒక క్రౌంచ పక్షి జంట లోని ఒక పక్షిని చంపిన బోయవాడిని శపిస్తూ ఆదికవి వాల్మీకి నోట వచ్చిన సంస్కృత శ్లోకం… రామాయణ కావ్యం ప్రారంభం నుండి… కమ్యూనిజం పితామహుడు, జర్మన్ తత్వవేత్త మరియు ఆర్థికవేత్త అయిన 19వ శతాబ్దం కార్ల్ మార్క్స్ నుండి… ఆధునిక నవలాసాహిత్యంలో చిరస్థాయిగా మిగిలిపోయే ‘అసమర్థుని జీవయాత్ర’ రచించి… ‘ఎందుకు?’ అని ప్రశ్నించడం నేర్పిన తండ్రికి అంకితం ఇచ్చిన త్రిపురనేని గోపీచంద్… వరకూ స్పూర్తిదాయకులు ఎందరో మహానుభావులు.
అవును బయట కనపడేదంతా పుణ్యక్షేత్రమే. కర్మక్షేత్రమే. (మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం. నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే) అన్నాడు మహాకవి శ్రీశ్రీ .
ఆకలి దప్పులు, కామం, మోహం… శోకం… రాగ, భయ క్రోధం లేని స్థితప్రజ్ఞతో సమస్తమూ ఆత్మస్వరూపంగా కాంచి, ఇంద్రియగోచరముకాని అక్షరపరబ్రహ్మమును ఉపాశించు, ప్రకాశించు.
అణువు నుండి బ్రహ్మాండం వరకూ వ్యాపించి ఉన్న ఆదిశక్తి నీలోనూ ఉన్నది. శారీరిక, మానసిక అనివార్యతలను అణచిపెట్టే స్పృహ, దానికవసరమైన తెలివి నీకుంది కాబట్టి అనివార్యత నుండి చైతన్యంవైపే నీ ప్రయాణం.
తమస్సు తొలగించి, జీవన ఉషస్సు కలిగించి… జన్మ, మృత్యువు, జరా వ్యాధుల వల్ల ఏర్పడే చిత్త భ్రమలు తొలగించే జ్నానశక్తి స్వరూపుడైన సద్గురువుని శరణు వేడటమే మార్గం.
చిత్తభ్రమల నుండి బయటపడి… పశ్చాత్తాప క్షమాపణ… మలినం కాని స్వచ్ఛమైన క్షమాపణ చెప్పుకోవటానికి సాహిత్యం ఒక మార్గం అని చెప్పిన స్వాతి తల్లికి వొందనాలు. నీకంటే ముందర ఆమార్గంలో (కన్ఫెషనల్ ఎలిమెంట్తో కధా రచన చేసి) నడిచిన వాడు త్రిపుర తండ్రి అని నీకూ తెలుసు తల్లా!
త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు
సంపాదకునికి ఉత్తరం గురించి అనామక రచయిత గారి అభిప్రాయం:
02/03/2025 12:14 pm
అమ్మా బి.వి.ఎస్.మనస్విని గారూ:
మీరు రాసిన “సంపాదకునికి ఉత్తరం” చదివాకా ఎందుకో ఇది “సంపాదకుని ఉత్తరం”లా తోచింది తప్ప ఒక కొత్త పాఠకురాలు రాసారంటే నమ్మబుద్ధి కాలేదు. నిబిడాశ్చర్యంతో నన్ను నేను గిచ్చుకున్నాను.
యథా రచనా–తథా పాఠకా, తీరులో తెలుగు సాహిత్యం పరిగెడుతోంది.
పత్రికలు కూడా వాల్ పోస్టర్ గోడల్లా తయారయ్యాయి.
మీరు వ్రాక్కుచ్చినట్లు సోషల్ మీడియా ప్రభావం అంతటా వుంది; అన్ని భాషల్లోనూ ఇదే జాడ్యం. దీనికి తెలుగు ఒక్కటీ మినహాయింపు కాదు.
కరోనా కంటే తీవ్రమైన “గుర్తింపు వైరస్” ప్రపంచాన్ని ఆవరించి దశాబ్దం దాటింది. లైకులు, లవ్వులతో ఎదుటవారిని సంతోష పరిచే చట్రంలో అందరూ ఇరుక్కున్నారు.
ఇచ్చినమ్మ లైకు, పుచ్చుకున్నమ్మ లైకు–తీరున ప్రపంచమంతా ఒక అనధికార, అదృశ్య ఒప్పందం సంస్కార ప్రదంగా కుదుర్చుకుంది.
కాబట్టి ఎవరి పుస్తకమ్మీద ఎవరూ ఉన్నదున్నట్లు రాయరు. రాయలేరు కూడా.
రాసే దమ్ముని సభ్య సమాజం కోల్పోయి చాలా కాలం అయ్యింది.
ఇది “గుర్తింపు వైరస్” సైడ్ ఎఫెక్ట్. దీనికి వాక్సిన్ ఇంకా రాలేదు.
కాబట్టి వైరస్ అందరికీ పట్టినా, ఎవరికీ అంటనట్లే నటిస్తున్నారు.
అడుక్కుని రాయించే భిక్షక రచయితలు అన్నికాలాల్లోనూ, అంతటా వున్నారమ్మా! ఇదేం కొత్త కాదు!
ఎవరూ రాయకపోతే సదరు సంపాదక మహాశయులు మారుపేరుతో రాసిన సంఘటనలు కూడా వున్నాయి.
తమ పత్రిక్కి వచ్చిన రచనలన్నీ కుటుంబరావు గారు తిరగరాసేవారని, అప్పట్లో చెవులు కొరుక్కునేవారు రచయితలు .
సోషల్ మీడియా వల్ల రచయితలూ, పాఠకులూ అందరూ ఒకే చోట ఉండటం వలనా, ఎవరి పుస్తకం మీదా ఎవరూ ఉన్నదున్నట్టు రాయరు. పొగిడి తీరాలి. లేదంటే తిరిగి తన పుస్తకానికి మంచి రివ్యూలు రావనే భయం. అందరూ దూరం పెడతారేమో అనే జంకు. దీన్నుండి బయటపడే సూచనలు కనుచూపు మేరలో లేవు.
ఇంతమంచి వాక్యం రాసిన మనస్విని తల్లీ, నువ్వు కూడా నీకు నచ్చిన పుస్తకం గురించి రాయమని నా విన్నపం.
కథో, కవితో ఏదో ఒకటి–నీకు నచ్చింది.
అదీ తెలుగుదే. వేరే భాషది కాకూడదు సుమా?
మీకు సమయం లేకపోతే సదరు సంపాదకుల వారికి తెలుగులో ఒక మంచి పుస్తకం సూచించు.
రాయమని అర్థించు తల్లీ!
–అనామక తెలుగు పాఠకుడు.
నో ఎగ్జిట్.3 గురించి MK KUMAR గారి అభిప్రాయం:
01/27/2025 11:06 pm
కథ ఒక గడచిన కాలం (టైం లూప్) లో ఇరుక్కుపోయిన వ్యక్తి అనుభవాల చుట్టూ తిరుగుతుంది. కథలోని ప్రధాన వ్యక్తి తప్పనిసరి పరిణామాల నుండి తప్పించుకునే ప్రయత్నం, కానీ వాటిని మళ్లీ మళ్లీ ఎదుర్కోవడం. టైం లూప్ అనేది చరిత్ర పునరావృతమయ్యే అంశాన్ని ప్రతిబింబిస్తుంది.
మిత్రుడు, నిజజీవితానికి దగ్గరగా ఉండే తాత్విక తర్కాన్ని ప్రతిబింబిస్తాడు. అతడు తన స్నేహితుడి మాటల పట్ల అవిశ్వాసంతో నిండిపోయి ఉంటాడు. లూప్‌లో ఇరుక్కున్న వ్యక్తి, పాత్ర పూర్తి విభిన్నం. అతడు ప్రతి చిన్న సందర్భాన్ని ముందే గ్రహించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ, అతడిని పరిస్థితులు బంధిస్తాయి.
టైం లూప్లూ కథలో కొత్తదనాన్ని తెస్తుంది. గతం పునరావృతం అవడం, కానీ ఒకే వ్యక్తికి అది తెలిసి ఉండడం కథకు ఆసక్తిని జత చేస్తుంది. విశ్వాసం, సందేహం అనేది కథలోని ప్రధాన థీమ్ ఇది. నమ్మకమా, అనుమానమా అనేది పాత్రల మధ్య సంభాషణ ద్వారా బలంగా ప్రతిబింబించబడింది.
కథలోని లూప్ అనేది వ్యక్తి చర్యల వల్ల కలిగే పరిణామాలను సరిదిద్దుకోవాలనే ప్రయత్నాన్ని సూచిస్తుంది. లూప్ అంటే సమాజంలో మార్పు లేకపోవడం, మనిషి తప్పులను మళ్లీ మళ్లీ చేయడాన్ని ప్రతినిధ్యం చేస్తుందని భావించవచ్చు.
మెసేజ్‌లో ఏముందని చెప్పకపోవడం, కథను మరింత మిస్టీరియస్‌గా చేస్తుంది. పాఠకుడి ఊహకు ఆస్కారం ఇస్తుంది. మెసేజ్ వల్ల స్నేహితుడి నమ్మకాన్ని చెరిపేసి హింసాత్మక చర్యకు దారితీస్తుంది. అందులో నిజమేమిటో తెలియకుండానే స్పందించడం కథలోని ముఖ్యమైన మానవ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.
టైం లూప్, మిస్టరీ, నమ్మకానికి సంబంధించిన అంశాలు చాలా బాగా మిళితమై ఉన్నాయి. కథనం రీతిలో చక్కగా Spannung (tension) ఉంచారు. సంబంధాల్లో నమ్మకం ఎంత కీలకమో, ఒక చిన్న సందేహం ఎలా దుర్ఘటనలకు దారి తీస్తుందో చూపించే ప్రయత్నం ఇది.
చేసిన పనులకు బాధ్యత వహించాల్సిందే” అనే సందేశాన్ని ప్రతిపాదిస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో మనం నిర్వహించలేని పరిణామాల్లో చిక్కుకుపోవచ్చు. చంపే వ్యక్తి ఎందుకు మెస్సేజ్ ను నమ్ముతాడు, మెస్సేజ్ ను ముందే సెట్ చేయడం ఏంటి ఈ ప్రశ్నలకు జవాబులు పాఠకులు వెతుక్కోవాలి.
“మెసేజ్” వెనుక కథ (backstory) గురించి వివరిస్తే కథ తేలిపోతుంది.
భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/25/2025 12:29 am
డాల్రింపుల్ చరిత్రలోని లోపాలు: 1) చైనీస్ వారి శాస్త్రవిశేషాలను పెద్దగా ప్రస్తావించలేదు; Joseph Needham పేరయినా లేదు. 2) ఇస్లాముల గురించిన భాగంలో ఖయ్యాము లేడు; కవియే గాక (రుబాయత్), గణితంలో ఖగోళంలో విశేషమైన ప్రజ్ఞ చూపెట్టాడు. 3) ఫిబొనాచీ శ్రేణిని ఫిబొనాచీ కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందరే ఆర్యభట ప్రస్తావించాడన్నారు; ఆర్యభట కాదు.
ఫిబొనాచీ శ్రేణి గురించి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి తెలుసు కాని కవులకు మిక్కిలి ఆసక్తికరమైన సంగతి. ఈమధ్య మా ఆవిడ, కన్నెగంటి రామారావు ఫేస్‍బుక్‍లో బైరాగి మీద రాస్తున్నాడు అని చెప్తే, రామారావు పోస్ట్ చూశాను: “పూవుల నెత్తావి కవిత్వంలోనే కాదు, నాకు ఫిబొనాచీ సీక్వెన్స్‌లో కూడా కనబడుతుంది.”
మంజుల్ భార్గవకి (2014 ఫీల్డ్ మెడలిస్ట్) చిన్నప్పుడు తాతగారి దగ్గర సంస్కృత కావ్యాలు చదవడాన గణితంపై ఆసక్తి కలిగిందట. క్రీస్తుకు పూర్వమే పింగళ, ఛందస్సులో గురు, లఘువులు ఎన్ని విధాలగా ఉండవచ్చో తెలిపాడంటారు. ఒక్క బీట్‍లో {(ల)}, రెండు బీట్‍లలో {(ల, ల), (గు)}, మూడయితే {(ల, ల, ల), (ల, గు), (గు, ల)), నాలుగయితే {(ల, ల, ల, ల), (ల, ల, గు), (ల, గు, ల), (గు, ల, ల), (గు, గు)}… అలా, బీట్‍లను బట్టి గురు, లఘువులు రక రకాల విన్యాసాలలో లయబద్ధంగా ఉండొచ్చు. ఎన్ని రకాలు? 1, 2, 3, 5, … అదే ఫిబొనాచీ శ్రేణి; దానిని ఫిబొనాచీ కన్నా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కనిపెట్టారన్న విషయం పాశ్చాత్యులకి ఇటీవలదాకా తెలియదు.
Donald Knuth పేరు తెలియని కంప్యూటర్ సైన్స్ వారు ఉండరు. తెలియని వాళ్ళకి. యయాతి మహారాజు తన కుమారుడు పూరునకు బోధించిన ఓ నీతి:
“ఎఱుక గలవారి చరితలు | గఱచుచు, సజ్జనుల గోష్ఠిఁ గదలక ధర్మం
బెఱుఁగుచు, నెఱిఁగిన దానిని | మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్.” — నన్నయ
Knuth కంప్యూటర్ సైన్స్‌కు ‘బైబిల్’ లాంటిది రాశాడు; రాస్తున్నాడు అనాలి, ఎందుకంటే ఏడు పర్వాలని ఆ యజ్ఞం మొదలెట్టింది 1962లో; మొదటి మూడు, నాలుగోదాంట్లో మొదటి భాగం మాత్రం అచ్చయినాయి. 87 ఏళ్ళ వృద్ధుడు కనుక బహుశా అసంపూర్ణంగానే మిగలొచ్చు. దాని పాత ప్రతులలో, ఫిబొనాచీ శ్రేణి ప్రస్తావనలో మన వాళ్ళ గురించి ఏమీ లేదు. కాని కొత్త ప్రతిలో:
Before Fibonacci wrote his work, the sequence had already been discussed by Indian scholars, who had long been interested in rhythmic patterns that are formed from one-beat and two-beat notes or syllables. The number of such rhythms having n beats altogether is Fn+1; and the rule for computing those numbers was stated by Virahäka (c. 700) in his work Vttajātisamuccaya, sloka 6.49. Therefore both Gopāla (before 1135) and Hemacandra (c. 1150) mentioned the numbers 1, 2, 3, 5, 8, 13, 21, 34, … explicitly.
నేనిది చెప్పడానికి కారణం: సైన్సులో వలసవాదం కరడుగట్టుకొని ఉన్నదనే వాదన ఉంది; కాని గత నాలుగయిదు దశాబ్దాలగా, ఇతర దేశాలలో పూర్వం జరిగిన పరిశోధనలు వెలుగులో కొచ్చేకొలదీ, వాటి విలువ పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు.
చివరగా, సైన్సు చరిత్రని గురించిన చర్చ కనుక, Knuth, పదేళ్ళ క్రితం Stanford Universityలో ఇచ్చిన ప్రసంగంతో ముగిస్తాను:
“Why do I, as a scientist, get so much out of reading the history of science? Let me count the ways:
1. To understand the process of discovery—not so much what was discovered, but how it was discovered. Primary sources are best: the words of somebody who discovered something, as they were discovering it. The more examples I see, the more likely I’ll be able to discover something tomorrow.
2. To understand the process of failure. We learn a good deal from historical errors, not only from our own. It also helps to know that even the greatest minds are unable to grasp things that seem obvious to us. Leibniz spent much time working on combinatorics, and most of what he did was underwhelming and totally wrong.
3. To celebrate the contributions of many cultures. There are many ways of thinking, many points of view, and many independent researchers. Fibonacci numbers were discovered in India long before Fibonacci. Catalan numbers were discovered in China, a hundred years before Catalan. Many uneducated people have discovered wonderful patterns in numbers, and I can share their joy of discovery.
4. Telling historical stories is the best way to teach. It’s much easier to understand something if you know the threads it is connected to. Give credit to Fibonacci, but also to Narayana in India. The complete story is of many separate individuals building a magnificent edifice with a series of small steps.
5. To learn how to cope with life. How did other scientists grow up, make friends or enemies, manage their time, find mentors, mentor others, and serve their communities? Balance is important.
6. To become more familiar with the world, and to know how science fits into the overall history of mankind. What was life like on different continents and in different epochs? The main difference between human beings and animals is that people learn from history.”
కొడవళ్ళ హనుమంతరావు
భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/24/2025 1:30 am
CK Rajuగారి పేరు నేనిదే మొదటిసారి వినడం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణితవేత్త గదా అని AMS (American Mathematical Society) వెబ్‍సైట్‍లో వెదికాను. Terence Tao, CR Rao లాంటి వాళ్ళకున్నన్ని పేపర్లు ఆశించలేదు కాని, రాజుగారు ఓ పేరొందిన గణితవేత్తతో తగాదా పడ్డ విషయం మాత్రమే కనబడటం నిరాశ పరచింది.
“గణితశాస్త్ర చరిత్రను కూలంకషంగా ఎరిగిన వారు” అయితే కావచ్చు; “Decolonization of Mathematics” పేరిట వారి రచనలు ఎక్కువే ఉన్నాయి. కాని వాటిల్లోకూడా రాజుగారు తన ప్రచురణలనే ఎక్కువ ఉటంకించడంతో వారి వాదనలకి ఆ రంగంలోని పండితుల ఆదరణ తక్కువని నా అనుమానం. ఆ పండితులంతా పాశ్చాత్యుల భావాలకు దాసులంటే ఇక వాదించలేం.
భూషణ్‍గారు ప్రస్తావించిన రాజుగారి ప్రచురణనే చూద్దాం. ఆర్యభట్టకీ (విప్రుడు) ఆర్యభటకీ (భటుడు, సేవకుడు) ఉన్న తేడాని చూపి, ఆర్యభట బ్రాహ్మణుడు కాదు, శూద్రుడు అంటారు; అందుకు సాక్ష్యంగా బ్రహ్మగుప్తుడు (వైశ్యుడు), భాస్కరాచార్యుడు (బ్రాహ్మణుడు) ఆర్యభట గురించి నీచంగా పదే పదే వ్యాఖ్యానించడాన్ని ఉదహరిస్తారు. నాకు అవి అంత బలమైన ఆధారాలుగా అనిపించవు. రాజుగారు, అంతటితో ఆగక, ఇద్దరు ఆర్యభటలు ఉన్నారంటే, మన దేశంలో పూర్వకాలంలో కులవ్యవస్థ మరీ క్రూరంగా ఉండేది కాదు (ఉంటే ఒకరు కాదు ఇద్దరు శూద్రులు ఘనమైన గణితవేత్తలు కాగలరా?); వలసపాలన వచ్చిన తర్వాతనే ఆ క్రూరత్వం పెరిగిందంటారు. నాకు తెలిసినంతలో తరతరాలగా, తెల్లవాళ్ళు రాకముందు కూడా, మన కులవ్యవస్థ కారుణ్యరహితం.
సరే, ఈ కులాల గొడవ వదిలి గణితంలోకెళ్దాం. రాజుగారి వాదన – మనం ప్రత్యక్ష నిరూపణ (empirical proof) వాడాలనీ, నిగమిత నిరూపణ (deductive proof) వాడకూడదనీ, యూక్లిడ్ నిరూపణలన్నీ empirical అనీ, వాటిని deductive అని పాశ్చాత్యులు మోసం చేశారనీ, చర్చి ప్రభావంతో formal mathematics మనందరి నెత్తినేశారనీ – ఇలా సాగుతుంది.
ఈ వాదనలకి నాలాంటి సాదా సీదా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఎదురు సమాధానం చెప్పలేడు కాని, యూక్లిడ్ నిరూపణలు deductive అనుకుంటాను. ఉదాహరణకి, ప్రథాన సంఖ్యలు అనంతం అన్న దానికి empirical proof ఏమిటి? దానికున్న ప్రఖ్యాతమైన యూక్లిడ్ నిరూపణ deductive కాదా? ఏం చూసి Edna St. Vincent Millay, “Euclid alone has looked on Beauty bare.” అన్నదో కాని, రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ నిరూపణ నవనవలాడుతూ ఉట్టిపడుతోంది అంటాడు హార్డీ తన అపాలజలో. గణితం మీద కాస్తో కూస్తో అభిరుచి ఉన్నవాళ్ళు అది చదివి తన్మయమవాల్సిందే.
రాజుగారు విమర్శించే formal mathematicsకి నేపథ్యం గణితమే; చర్చీ, వలసపాలనా కాదు. యూక్లిడ్ నిరూపణలలోనూ, 18, 19 శతాబ్దాలలో వచ్చిన గణితంలోనూ లొసుగులున్నాయనీ, గణితాన్ని కట్టుదిట్టం చెయ్యకపోతే పరస్పర విరుద్ధాలతో సంక్షోభం తప్పదనీ, గణితాన్ని గట్టి పునాదులతో ఎలాంటి వైరుధ్యాలకీ దారితీయని విధంగా చెయ్యాలనీ, చెయ్యవచ్చనీ హిల్బర్ట్ పట్టుబట్టాడు. అంతిమంగా ఆయన కల సఫలం కాలేదు. చిత్రంగా ఆ విఫల ప్రయత్నం మూలంగానే కంప్యూటర్ సైన్స్ పుట్టింది.
కొడవళ్ళ హనుమంతరావు
భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/19/2025 2:51 am
“ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు
నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు.”
— తిలక్, “మన సంస్కృతి,” అమృతం కురిసిన రాత్రి.
ముందుగా విలియమ్ డాల్రింపుల్ పుస్తకాన్ని ఈమాట పాఠకులకి పరిచయం చేసినందుకు రాణి శివశంకరశర్మ గారికి కృతజ్ఞతలు. ప్రాచీనకాలంలో ఇండియా సాంస్కృతిక విజ్ఞాన రంగాలలో సాధించిన వాటికి తగిన గుర్తింపు తేవడానికే ఈ పుస్తకం రాశానన్నాదు డాల్రింపుల్. అనేక వివరాలతో, తగిన ఆధారాలతో ఉన్న చదవదగ్గ రచన. ఆధ్యాత్మిక పరమైన విషయాలకంటె శాస్త్రీయ విజ్ఞానపరంగానే ఇండియా ప్రాభవాన్ని చెప్పుకోవాలంటాడు.
ఈ వ్యాసాన్ని చూస్తే రాణి బహుగ్రంథపఠితులనీ ఆలోచనాపరులనీ తెలుస్తుంది. కాని అనేకుల ఉటంకింపులతో సాగిన ఈ వ్యాసం అకటవికటంగా తయారయింది. ఎందుకిలా రాశారా అని రాణి గారి “ది లాస్ట్ బ్రాహ్మిన్” ఇటీవల హైద్రాబాదు వెళ్ళినప్పుడు నవోదయలో దొరికితే కొని చదివాను. అందులో అంటారు: “నేనా రోజుల్లో ప్రధానంగా ప్రేమ కవిత్వం రాసేవాణ్ణి. ఒకసారి ఒక వ్యంగ్య కవిత రాసి సీతంపేట గ్రంథాలయంలో జరిగిన కవి సమ్మేళనంలో చదివాను. … నా కవిత్వంలో యేదో వుందని నాను నమ్మకం కుదిరింది. ఇందిరాగాంధీ తాత్విక గురువు ధీరేంద్ర బ్రహ్మచారిని కూడా ఆ కవితలో లింకు పెట్టాను యెందుకో. ఇలా దూర సంబంధం కూడా లేనట్టు కనిపించే రెండు దత్తాంశాల్ని ఆకస్మాత్తుగా కలిపి వాటి అన్యోన్య సంబంధాల నుంచి వెల్లడయ్యే నిజాన్ని అతివాస్తవికంగా చెప్పే కవిత్వశైలి ఆది నుంచీ నాకు సహజంగానే వంటబట్టింది. ఇది థీసిస్ యాంటీ థీసిస్ సింథసిస్ అనే ఈక్వేషన్ కి దగ్గరిదని తర్వాత నేను తెలుసుకున్నాను.” (160 పేజి.)
ఆ ప్రత్యేక కవిత్వ ధోరణి ఈ రచనలో కూడా ప్రజ్వరిల్లి వ్యాస ప్రయోజన్నాన్ని దెబ్బతీసింది.
రాణి గారికి అనంతం అంటే మిగుల అభిమానం లాగుంది. (“ది లాస్ట్ బ్రాహ్మిన్” అంకిత వాక్యం: “గడచిపోయిన అనంత కల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో ఇదే రూపంలో మీరు లేరు, నాన్న గారూ, రాబోయే అనంత కల్పాలలో అనంత జన్మలలో అనంత రూపాలలో ఇదే రూపంలో మీరు కానరారు.”) కాని అనంతాన్ని సున్నాతో సమానం చేసి (తాత్వికంగానే అయినా) గందరగోళ పరిచారు.
“అనంతాన్ని గ్రీకులు చీకటిగా భావించారు, భయపడ్డారు. అనంతంలో వస్తువులు ఏర్పడవు అని అరిస్టాటిల్ అన్నాడు. భారతీయులు మాత్రమే అనంతాన్ని పాజిటివ్‌గా చూశారు.”
“ఇలా ఋతువులూ యుగాలూ చక్రాకృతిలో ‘అనంతం’గా పునరావృతి చెందడం అనే భావన జీరో, అనంతం, అనంత విశ్వం, చివరికి భూకేంద్రక సిద్ధాంతాన్ని నిరాకరించే లాజిక్‌కి దారితీసింది.”
“అనంతం, జీరో అనే భారతీయ ఆవిష్కరణలు పాశ్చాత్య వికాసయుగానికి మూలం అనేంతవరకూ వెళుతున్నారు విలియమ్ డాల్రింపుల్.”
ఇంతకీ డాల్రింపుల్ పుస్తకం సూచికలో అనంతం లేదు.
అనంతం అంటే విస్మయం కలగని వారుంటారా? “అమలిన తారకా సముదాయంబుల నెన్నను … విధాతృకైనను నేరం బోలునే” అంటాడు నన్నయ. మన వాళ్ళు అనంతాన్ని ఆవిష్కరించి గణితపరంగా ఏమి సాధించారో రాణి గారు చెప్పలేదు. గణితపరంగా అనంతాన్ని మొట్టమొదట గ్రహించింది గ్రీకులే:
“There is no smallest amongst the small and no largest among the large; But always something still smaller and something still larger.” – Anaxagoras (500-428 BC)
కాని జీనో (490-430 BC) పారడాక్స్ లు గ్రీకులని కలవర పెట్టాయి. అందుకని అరిస్తాటిల్ (384–322 BC) సంభావ్య అనంతం (potential infinity), సంపూర్ణ అనంతం (completed infinity) అని విడదీసి, గణితంలోనూ, తత్వంలోనూ సంపూర్ణ అనంతాన్ని నిషేధించాడు. అయినా ఆర్కిమెడెస్ (287– 212BC) అనంతాన్ని ఎంత సృజనాత్మకంగా వాడుకున్నాడో “The Man Who Harnessed Infinity” [1] లో చదవచ్చు. (యురేకా! అంటూ వీధుల్లో నగ్నంగా పరిగెత్తాడని చిన్నప్పుడు చదువుకున్నాం.) ఆర్కిమెడెస్ ఆలోచనలకి సరయిన రూపం, న్యూటన్, లైబ్నిజ్ ల, కలన గణితం ద్వారా రావడానికి దాదాపు మరో రెండు వేల సంవత్సరాలు పట్టింది.
జైనులు పెద్ద పెద్ద సంఖ్యల గురించి ఆలోచించారు; కాని అనంతం వాటి కంటె పెద్దదని గుర్తించారు. అంతేకాక రకరకాల అనంతాలుంటాయని భావించారు (సూర్య ప్రజ్ఞాప్తి, 400BC), కాని లోతుగా వెళ్ళేందుకు కావలసిన గణిత పరిజ్ఞానం అప్పట్లో లేదు.
గెలీలియో (1564-1642) అనంతం గురించిన ఓ తాత్విక సమస్యని పేర్కొన్నాడు: “భాగం కంటే మొత్తం ఎక్కువ” కదా. {1, 4, 9, 16, 25, 36, …} అన్నది {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, …} దాంట్లో భాగం. కాని ప్రతి పూర్ణ సంఖ్యనీ, దాని వర్గం తో జత చెయ్యవచ్చు: (1, 1), (2, 4), (3, 9), (4, 16), (5, 25), … అంటే “భాగం మొత్తంతో సమానమే!”
అనంతంతో వచ్చే ఈ సమస్యలకి అత్యంత ప్రతిభతో సరయిన పరిష్కారం చూపించిన వాడు Cantor (1845-1918) [2].
భూకేంద్రక సిద్ధాంతాన్ని మొదట నిరాకరించింది అరిస్టార్కస్ (310-230BC); అయితే గ్రీకులు దానిని అంగీకరించలేదు. కోపెర్నికస్ (1473-1543) అరిస్టార్కస్ ప్రతిపాదనలనే పునరుద్ధరించాడు.
డాల్రింపుల్ ఇండియా తన పూర్వ వైభవాన్ని తిరిగి చేజిక్కిచ్చుకునే స్థానంలో ఉందని ముగిస్తే, రాణి ‘అసలు మానవ ఆలోచనే వినాశకరమయినదేమో’ అని ముగిస్తారు.
“భారతీయ ఖగోళ గణిత విజ్ఞానాలు పాశ్చాత్యానికి వెళ్ళి ప్రాగ్మాటిక్ లక్షణాల్ని క్రమేపీ సంతరించుకున్నాయి. ఆ విజ్ఞానం పాశ్చాత్యంలో అభివృద్ధి చెంది, తిరిగి వచ్చి భారతదేశాన్నే వ్యాపారం పేరుతో ఆక్రమించింది. ఇది భారతీయులపై కేవలం భౌతిక విజయమే కాదు. భావజాల దురాక్రమణ కూడా.”
ఇది చాలా సంకుచిత దృష్టి. డాల్రింపుల్ కూడా యూరప్ లో వచ్చిన శాస్త్రీయ విప్లవం గురించి మాట్లాడడు.
“Science is now international, perhaps the most international aspect of our civilization, but the discovery of modern science happened in what may loosely be called the West. Modern science learned its methods from research done in Europe during the scientific revolution, which in turn evolved from work done in Europe and in Arab countries during the Middle Ages, and ultimately from the precocious science of the Greeks. The West borrowed much scientific knowledge from elsewhere—geometry from Egypt, astronomical data from Babylon, the techniques of arithmetic from Babylon and India, the magnetic compass from China, and so on—but as far as I know, it did not import the methods of modern science.” – [3]
డాల్రింపుల్, రాణి కూడా, మరో ముఖ్య విషయం ప్రస్తావించరు. మధ్యయుగాల ప్రారంభంలో, బాగ్దాద్ లో పెద్దలు గ్రీకు ఫిలాసఫీ గురించి చర్చించుకుంటూంటే, యూరప్ లో పెద్దలు సంతకం చెయ్యడమెలాగో నేర్చుకుంటున్నారట. అలాంటి స్థితి నుండి యూరప్ ఎలా పైకొచ్చింది?
జయంత్ నర్లీకర్ సామాన్యులకి సైన్సు గురించి తెలియజేయడానికి బాగా కృషిచేసిన పేరున్న భౌతిక శాస్త్రవేత్త. సైన్సూ గణితం పరస్పర ప్రభావంతో నాగరికతకి ఎలా దోహదమయ్యాయో ఓ మరాఠీ పుస్తకంలో వివరిస్తే దానికి పాఠకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది, మహారాష్ట్ర ప్రభుత్వం ఓ బహుమతి నిచ్చింది. ఆ ప్రోత్సాహంతో, దానిని కాస్త విపులీకరించి ఇంగ్లీషులో “Science and Mathematics: From Primitive to Modern Time,” అన్న పేరిట Jayant Narlikar ప్రచురించారు.
దానిలో నాలుగో అధ్యాయంలో ఆసక్తికరమైన చర్చ ఉంది. పాకిస్తాన్ కి చెందిన అబ్దుస్ సలాం (1926-1996, మొదటి ముస్లిం నోబెల్ గ్రహీత) ఓ ప్రశ్న లేవదీశాడు – గొప్ప శిల్ప కట్టడాలయిన ఆగ్రా లోని తాజ్ మహల్, లండన్ లోని సెయింట్ పాల్ కేథడ్రల్ దాదాపు ఒకే కాలంలో నిర్మించారు. అదే సమయంలో యూరప్ లో సైన్సు అనూహ్యంగా పెరిగితే భారత ఉపఖండంలో చాలా అరుదుగా కనిపించింది; ఎందువలన?
“It is good to recall that three centuries ago, around the year 1660, two of the greatest monuments of modern history were erected, one in the West and one in the East; St. Paul’s Cathedral in London and the Taj Mahal in Agra. Between them, the two symbolize, perhaps better than words can describe, the comparative level of architectural technology, the comparative level of craftsmanship and the comparative level of affluence and sophistication the two cultures had attained at that epoch of history. But about the same time there was also created—and this time only in the West—a third monument, a monument still greater in its eventual import for humanity. This was Newton’s Principia, published in 1687. Newton’s work had no counterpart in the India of the Mughals.”
― Abdus Salam, Ideals and Realities: Selected Essays of Abdus Salam
దానికి నర్లీకర్ కొన్ని కారణాలు ఊహిస్తాడు. ఒకటి: మన పాలకులు (చక్రవర్తులు, రాజులు, చిన్న చిన్న జమీందారులు) సంగీత, సాహిత్య, కళా రంగాలకి ఆశ్రయమిచ్చారు కాని, సైన్సుకివ్వలేదు; యూరప్ లో రాయల్ సొసైటీ, ఫ్రాన్సులో ఫ్రెంచ్ అకాడెమీ ఉన్నాయి, మనకలాంటివి లేవు.
ప్రస్తుతానికి ఇంతటితో ముగిస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
[1] Steven Strogatz, “Infintie Powers: How Calculus Reveals the Secrets of the Universe,” HMH, 2019.
[2] Ian Stewart, “Infinity: A Very Short Introduction,” OUP, 2017.
[3] Steven Weinberg, “To Explain the World: The Discovery of Modern Science,” Harper, 2015.
సంపాదకునికి ఉత్తరం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/10/2025 12:17 pm
వేలూరి వారి పై రెండు వ్యాఖ్యలను చూసి కొంచెం ఆశ్చర్యపోయాను.
ఇంగ్లీషులో తప్ప ఆ వ్యాఖ్యలను ఆయన తెలుగులో వ్రాయలేరా అంటే తప్పక వ్రాయగలరనే చెప్పాలి. కేవలం శర్మ గారి అభిప్రాయాలను తృణీకరించటానికే వారు ఆంగ్లంలో వ్రాసారన్నది సుస్పష్టం.
తెలుగు పాఠకులకు ఆంగ్లంలో చదువటమే సదుపాయంగా ఉంటుందని ప్రముఖులే అభిప్రాయపడితే చివరకు ఒకనాటికి ఈమాట పత్రిక ఆంగ్లమాధ్యమంలో వెలువడే తెలుగు సాహిత్యపత్రిక అవుతుంది.
తెలుగు భాషాభివృద్ధికి అదే మంచి వెలుగు బాట అంటే చేసేదేముంది, కానివ్వండి. కానివ్వండి.
(నన్నయాదిగా గల కవులు ఇంగ్లీషు రాకనే తెలుగులో సాహిత్యం సృజించిన అమాయకులని అర్థం చేసుకోవాలి మనం)
సంపాదకునికి ఉత్తరం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
01/10/2025 10:00 am
వేలూరి గారు,
నేను చెప్పినది మీరు సరిగ్గా చదివినట్టు లేదు. నాతో సహా అందరం అన్నిచోట్లా ఇంగ్లీషు వాడుతున్నాం. ఉదాహరణకి “ట్రైన్ ఎక్కేటప్పుడు టికెట్ ఉందో లేదో కూడా పాకెట్ లో చూసుకున్నాడు.” దానిక్కాదు నేను అభ్యంతరం చెప్పినది. కధ పేరు కనీసం ఇంగ్లీషులో కాకుండా తెలుగులో పెట్టవచ్చు కదా? అబ్బే కాదు మొత్తం ఇంగ్లీషులోనే రాస్తాం అంటే ఈమాట వారు సారంగ వారి తరహాలో ఇంగ్లీష్ సెక్షన్ ఒకటి పెట్టుకుంటే మంచిది. నేను చెప్పేది సంకరం సంగతి. …. జ్యాయతే వర్ణ సంకర: …. సంకరో నరకాయైవ …. అన్నట్టుగా తయారౌతోంది. తల కనీసం తెలుగులో ఉంటే బాగుంటుంది అని చెప్పాను. తెలుగులో రాసే [ఓపిక ఉన్న] రచయితలకి కనీసం తెలుగు హెడింగ్ పెట్టడం రాదా?
దేశం కాని దేశంలో ఉన్నంతకాలం మన పిల్లలకి మన సంస్కృతి ఏనాటికీ “పూర్తిగా” నేర్పలేం. అక్కడవరకూ ఎందుగ్గానీ ప్రస్తుతం రెండు రాష్ట్రాలలోనే ప్రజలకి సంస్కృతి అంటే తెలియదు అనే స్థితిలో ఉన్నాం. పరాయి దేశంలో ఉన్న పిల్లలు ఎప్పుడు పూర్తిగా నేర్చుకుంటారో తెలుసాండి? వాళ్ళకి స్కూల్లో ‘మీ బాషా సంస్కృతి మీద ఒక క్లాసు తీసుకోండి. అందులో ఎ గ్రేడ్ వచ్చి తీరాలి’ అన్నప్పుడు మా-త్ర-మే. అదీకూడా ఆ క్లాసులో గ్రేడ్ ఇచ్చాక పూర్తిగా మర్చిపోతారు. ఏ కోళ్ళ మంగారం, కొ.కు సాహిత్యం మీరు ఇంగీషులో అనువదించి చదవమని చెప్పండి. ఇదెక్కడి తలకాయ నెప్పిరా భగవంతుడా అన్నట్టు చూస్తారు. కనీసం ఇప్పటికే అనువదించిన అమర్ చిత్ర కధ పుస్తకాలు కూడా చదవరు. వీళ్ళు బతుకుతున్న కాలం వేరు. మనం దేశంలో బతికిన కాలం వేరు. ఆ రోజులు – పుస్తకాలు చేత్తో పట్టుకుని కులాసాగా చదువుతూ ఆనందం అనుభవించే రోజులు – గతించాయి. ఫోన్ మీద ఆప్ తయారు చేసి ఇచ్చినా అవి వాడరు. అదీగాక పైన ఒకసారి చెప్పాను కదా, నేను అనువాదాలకి వ్యతిరేకిని కాదు. నేనూ ముళ్ళపూడి వారివి మరో కొంతమందివీ అనువదించాను. నా ఇబ్బంది అంతా సంకరం మీద. కనీసం కధ పేరు తెలుగులో పెట్టాలి.
ఈమాట కి వచ్చి తెలుగు చదివేవారు ఉన్నారు. కొంతమందికి తెలుగులో టైప్ చేయడం రాదో, కష్టమో, సమయాభావమో. సరే వాళ్ళు పూర్తిగా ఇంగ్లీషులో వ్యాఖ్య రాస్తారు. దానికేమీ అభ్యంతరం లేదు. కానీ కధ రాసే వారో? వాళ్ళకి తెలుగులో టైప్ చేయడం వచ్చినట్టే కదా? సమయం వెచ్చించి కధ టైప్ చేసి పంపుతున్నారు. ఆ తర్వాత సంపాదకులు చెప్పినట్టూ దిద్దుతున్నారు కూడా. కధ పేరు తెలుగులో పెట్టడానికి ఏమిటి అభ్యంతరం? వర్ల్డ్ వితిన్ అనేదాన్ని అద్భుతంగా [ఉదా: “అంతర్మధనం,” లేదా “లోపలి ప్రపంచం,” అనో మరోటో] పెట్టలేరా? ఏం?
Repeating the original blame, I stand with my comments. At least all the headings/names of the Telugu stories and poems/kavata “MUST BE” in Telugu. If you cannot do that, put everything into English. At least now, all dictionaries and literature are available at our finger tips with a google search. Spending another few minutes to get a good Telugu word for English is not rocket science. I am aware eemaata publishes English articles and I am happy to read those too but why mix and match even the headings? In that case use Google Translator and publish randomly in Russian, Chinese and Japanese too. And if that is the process, just think what good it would do the Telugu reading public. How many of us would even read/follow those languages? If you still say “no, we cannot accept what this this guy says,” then please modify this top heading at least ” EEMAATA: AN ELECTRONIC MAGAZINE IN TELUGU FOR A WORLD WITHOUT BOUNDARIES” to “…IN VARIOUS LANGUAGES … ” At least then makes a lot of sense. Thanks.
సంపాదకునికి ఉత్తరం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/07/2025 12:24 pm
దంతుర్తి శర్మ గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.
ఈమాట ఒక తెలుగు సాహిత్యపత్రిక. తెలుగుపత్రిలో కథలూ కాకరకాయలూ వ్రాసే వారికి గాని వాటిపై అభిప్రాయాలను వెలిబుచ్చే వారికి గాని ఈమాట ఒక తెలుగు సాహిత్యపత్రిక అన్న స్పృహ తప్పకుండా ఉండే ఉంటుందని ఆశించవచ్చును కదా?
ఒక తెలుగు సాహిత్యపత్రికలో రచనలు చేసేవారికీ చదివేవారికీ తెలుగులో తమతమ భావాలను వెలిబుచ్చేంత సామర్ధ్యం ఉండాలనీ ఉంటుందనీ చదువరులు ఆశించవచ్చును కదా?
అందుచేత రచయితలూ చదువరులూ తమతమ వ్రాతలను తెలుగులోనే చేయమని కోరటంలో అసంబధ్ధత ఏమీ ఉండదు కదా?
శర్మ గారు చెప్పినట్లు అనవసరమైన ఇంగ్లీషు పదాలూ వాక్యాలూ వంటివి తెలుగుభాషాభిమానులకు బాధను కలిగించుతూ ఉంటాయి. కొందరైతే తమ అభిప్రాయాలను పూర్తిగా ఆంగ్లంలోనే ఈపత్రికలో వ్రాస్తున్నారు.
పత్రికాసంపాదకులు గట్టిగా చెప్తే కాని కాస్త తెలుగుకు పెద్దపీట వేద్ద్దామన్న స్పృహ తెలుగురచయితలకూ విమర్శకులకూ కలగదా అన్నది నా ప్రశ్న.
ఇష్టం ఉన్నా లేకున్నా ఎంత కష్టం ఐనా సరే ఈమాటలో వ్రాసే వారందరూ తప్పనిసరిగా తెలుగులోనే వ్రాయవలసిందిగా నా విజ్ణప్తి.
భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:
12/25/2024 6:34 pm
కొడవళ్ళ హనుమంతరావు గారు, మీ వివరణ, చాలా సంతోషం. నేను వ్యాసం చదివి నా అభిప్రాయం రాస్తున్నప్పుడు మీ గురించి తలచుకున్నాను: కారణం మీరు వ్యాసాల్లో గాని, అభిప్రాయాల్లో గాని ఉట్టంకింపుల విషయంలో రాజీలేని ధోరణి ప్రదర్శిస్తారు. నేను అనుకున్నాను కొడవళ్ళ గారే ఈ వ్యాసం రాసివుంటే – ఆధారాల విషయంలో తన్నుకు చచ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను ఉదహరించిన ప్రఖ్యాత శ్లోకం భాస్కరుని బీజగణితం లోనిదే – అనేకులు ఆ శ్లోకాన్ని లీలావతిలో ప్రసంగవశాత్తు ప్రస్తావించారు. శ్లోకానువాదం ఎవరు చేశారో తెలియడానికి ఆ వివరాలు ఇచ్చాను. బీజగణితంలో ‘ఖషడ్విధం’ అన్న ప్రకరణాంతంలో వస్తుందీ శ్లోకం.
ఉట్టంకింపులో మొదటి భాగానికి మూలమేదో నాకు ఇదమిత్థంగా అర్థం కాలేదు. బీజగణితంలోని ‘ఖషడ్విధం’ అన్న ప్రకరణంలో ఇచ్చిన శూన్య పరికర్మలు అన్ని ప్రస్తారాలను పేర్కొంటాయి.
(ఉదాహరణకు -శూన్యంతో గుణకారం: 0xn =0; nX0 =0; 0X0 = 0) లీలావతిలోని సూత్రాలు దానికి భిన్నంగా, సూటిగా ఉంటాయి, భాష్యాన్ని ఆశించవు). సమీక్షకుల మొదటి వాక్యం లీలావతిలోని మూలానికి దగ్గరగా ఉంది, కాబట్టి, సమీక్షకులు ఉదహరించిన వాక్యాలకు మూలం లీలావతిలోని శూన్య పరికర్మాష్టకంలోనే వెదుక్కోవలసి వచ్చింది.
“ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము. ”
(సమీక్షకుల వాక్యాలు)
ఖగుణః ఖః (ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును), ‘శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును’ అన్న దానికి శూన్య పరికర్మాష్టకం లో చూపడానికి ఆధారం లేదు. కానీ ‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము’ (ఖభాజితో రాశిః ఖహరస్యాత్) అన్నది తప్పుడు భావానువాదం.
(నా వాక్యాలు)
నేను చిన్ననాడు ఆంధ్రప్రభలో ప్రాచీన గణితం గురించి ఎవరో వారం వారం రాసేవారు. ఖహారగణితం గురించి మొట్ట మొదటిసారి అక్కడే చదివాను. ఆనాటి నుండి ఈ పద ప్రయోగం పట్ల వింత ఆకర్షణ ఉండి పోయింది.
“Zero Denominator అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి” అని రాశాను గానీ, ఎక్కువ వివరాల్లోకి పోలేదు. మీరు జోసెఫ్ గారి పుస్తకం నుండి ఉట్టంకించి నా పని సులువు చేశారు:
“A quantity divided by zero becomes a fraction, the denominator of which is zero (ఖహరం)
This fraction is termed an infinite quantity. (‘అయమనంతో రాశిః ఖహర ఇత్యుచ్యతే’ ఈ యనంత రాశికి ఖహరమని పేరు. )
అస్మిన్ వికారః ఖహరే న రాశా
వపి ప్రవిష్టే ష్వపి నిస్సృతేషు
బహుష్వపి స్యా ల్లయ సృష్టికాలేఽ
నంతేఽచ్యుతే భూత గణేషు యద్వత్
పై శ్లోకానికి చక్కని అనువాదం:
In this quantity consisting of that which has zero for its divisor, there is no alteration, though many may be inserted or extracted. [Similarly], no change takes place in the infinite and immutable God when worlds are created or destroyed, though numerous orders of beings are absorbed or put forth.”
ఇక్కడ భాస్కరుల ఖహరంతో గొడవ వస్తోంది:
This, at its face value may seem approaching correctness, by suggesting that any number when divided by zero is infinity, but then Bhaskara II (b. 1114 CE) suggests that zero multiplied by infinity is any number, and hence all numbers are equal, which is certainly not correct. Emancipated from the role of a mere place-holder, zero joined the family of numbers capable of arithmetical operations.
(కాబట్టే, తొందర పడి మూలంలో లేనివి ఊహించరాదు అని చెప్పడం, అక్కడ ఖహరం అని ఉంటే ఖహరం అనే రాయాలి, తొందరపడి అనంతం అనేయరాదు. ప్రాచీన కవిత్వాన్నిగాని, గణిత శాస్త్రాన్నిగాని అనువదించేటప్పుడు మూలం యథాతథంగా తెలుసుకోవడం ప్రథమ కర్తవ్యం. ఒక్కోసారి, ఇవాళ్టి అర్థాలు ఒకప్పటి అర్థాలు ఒకటి కాకపోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టే, hermeneutical study అవసరమవుతుంది.)
0 X 1/0 = n (శూన్యం భాజ్యం ఖహరం భాజకం ఐతే వచ్చే లబ్ధం ఒక సంఖ్యయే (zero multiplied by infinity is any number); అందుకే, “Zero Denominator” అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి” అని రాశాను.
భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
12/25/2024 10:25 am
భూషణ్‍గారు భాస్కరుని లీలావతి లోని శ్లోకంతో శర్మగారి ఉటంకింపు చెల్లదన్నారు. కాని శర్మగారు ఇచ్చినది (భాస్కరునిదే) బీజగణితం లోనిదనుకుంటాను. నేను మా మారుమూల గ్రామంలో ఉండటాన భాస్కరుని మూలాలు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్నదానినుండి:
Take an example from Brahmagupta’s seventh century text Brahmasphutasiddhanta. In it he treats the zero as a separate entity from the positive (dhana) and negative (rhna) quantities, implying that sunya is neither positive nor negative but forms the boundary line between the two kinds, being the sum of two equal but opposite quantities. He states that a number, whether positive or negative, remains unchanged when zero is added to or subtracted from it. In multiplication with zero, the product is zero. Likewise the square and square root of zero is zero. But problems arise when he tries to explain division. When a number is divided by zero, he gives no result but merely repeats that the quotient of any number and zero is a fraction with zero as a denominator. However, Brahmagupta’s is the first attempt by any mathematician to explain the arithmetic operations on natural numbers and zero.
In the ninth century, Brahmagupta’s attempts at defining operations using zero was taken up by Mahavira. Although he correctly states that a number multiplied by zero is zero, but wrongly adds that a number remains unchanged when divided by zero. The next attempt came from Bhaskara II in the 12th century:
This section [in Lilavati] ends with [Verses 45–47] listing the eight operations with zero: addition, subtraction, multiplication, division, square, square root, cube and cube root. These rules had become standard by then, and like Brahmagupta, suggests any quantity divided by zero remained ‘zero-divided’. Bhaskaracharya returns to this topic in the first chapter of Bijaganita, when he infers that division by zero gives khahara (infinity), the first clear statement of this result in the history of mathematics.
In Bijaganita:
“A quantity divided by zero becomes a fraction, the denominator of which is zero. This fraction is termed an infinite quantity. In this quantity consisting of that which has zero for its divisor, there is no alteration, though many may be inserted or extracted. [Similarly] no change takes place in the infinite and immutable God when worlds are created or destroyed, though numerous orders of beings are absorbed or put forth.”
This, at its face value may seem approaching correctness, by suggesting that any number when divided by zero is infinity, but then Bhaskara II (b. 1114 CE) suggests that zero multiplied by infinity is any number, and hence all numbers are equal, which is certainly not correct. Emancipated from the role of a mere place-holder, zero joined the family of numbers capable of arithmetical operations.
George Gheverghese Joseph. Indian Mathematics: Engaging With The World From Ancient To Modern Times. World Scientific Publishing Company. Kindle Edition.
భూషణ్, “Zero Denominator అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది,” అన్నారు. సున్నా సంఖ్యల్లో ఒకటయినప్పుడు ఎందుకు ఆశ్చర్యం? తంటా అంతా భాగించితే విలువ ఏమిటి అని కదా.
కొడవళ్ళ హనుమంతరావు
భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:
12/24/2024 9:53 am
భారతీయ బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశనానికి మూలమా?
భారతీయ విజ్ఞానం అంటే చాలు ప్రతి వాక్యంలో బ్రాహ్మణ శబ్దాన్ని జొప్పించడం అనవసరం. ఆర్యభట బ్రాహ్మణుడు కాదు, దళితుడు. బ్రహ్మగుప్తుడు కూడా బ్రాహ్మణుడు కాదు, వైశ్యుడు. పాశ్చాత్యులు యూక్లిడ్‍ను ఏ రకంగా తెల్లవాడిగా చూపిస్తారో – అదే విధంగా మనవారు ఆర్యభటని తెలిసో తెలియకో ఆర్యభట్టగా రాసి – విషయాన్ని తారుమారు చేస్తారు. మరిన్ని వివరాలకు చూ: Aryabhata dalit, his philosophy of ganita, and its contemporary applications. C. K. Raju. (చంద్ర కాంత రాజు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత వేత్త, గణిత శాస్త్ర చరిత్రను కూలంకషంగా ఎరిగిన వారు.)
ఇప్పటి కులతత్వపు కళ్ళద్దాలతో గతాన్ని చూడరాదు. ఈ వ్యాసం కూడా వలసవాద సామ్రాజ్యవాద ప్రతిధ్వనే తప్ప మరొకటి కాదు. అంతేకాదు, వ్యాసం ఆమూలాగ్రం స్పష్టత కొరవడింది. కలిపికొట్టు కావేటి గంగ తరహాలో తయారైంది. భారతీయతను ఎలా నిర్వచించాలి అన్న శీర్షికన వేరొక వ్యాసం రాయవచ్చు, సమీక్షను అడ్డం పెట్టుకొని అర్థం లేని కుల మత రాజకీయాలను ఈడ్చుకురావడం మంచి పద్ధతి కాదు. శ్రద్ధ చూపవలసింది ఆకరాలను సరైన రీతిలో ఇవ్వడంలో. భాస్కరుని వాక్యాలు ఉట్టంకించారు, మూలంలో ఏ శ్లోకం అది, దాని తాత్పర్యం సరి చూసుకున్నారా? భాస్కరుడు సూటిగా అనంత ప్రస్తావన తీసుకువచ్చాడా? భాస్కరుడు దాన్ని ‘ఖహరం’ అని వ్యవహరిస్తాడు. ‘అయమనంతో రాశిః ఖహర ఇత్యుచ్యతే (“ఈ యనంత రాశికి ఖహరమని పేరు.”)
అస్మిన్ వికారః ఖహరే న రాశా
వపి ప్రవిష్టే ష్వపి నిస్సృతేషు
బహుష్వపి స్యా ల్లయ సృష్టికాలేఽ
నంతేఽచ్యుతే భూత గణేషు యద్వత్
‘ఏ ప్రకారముగా సృష్టి నిర్మాణకాలమందెన్ని భూతములు పుట్టినను ప్రళయ కాలమందెన్ని భూతములు లయించినను అనంతుడును, అచ్యుతుడును అగు పరమేశ్వరుని యందు వికారము పుట్టదో యట్లు ఈయనంత రాశియందెన్ని సంఖ్యలు కలిపినను, ఇందుండి యెన్ని సంఖ్యలు తీసివేసినను దీనికి మార్పు కల్గదు.’ (ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, కొమఱ్ఱాజు వారి సంపాదకత్వం.)
‘తన వలన అనేక భూతజాతము సృష్టి కాలమున సృజింపబడినను, లయకాలమందు తనయందు లీనమైనను, ఆత్మ పదార్థము మార్పు చెందనట్లు ఈ ఖహర రాశియు ఇతర సంఖ్యలను కలిపినను తీసివేసినను మార్పు చెందదు’ (పిడపర్తి వారి భావానువాదం).
ఇక సమీక్షకుల ఉట్టంకింపు పరిశీలిద్దాం:
‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము. అనంతము నుండీ ఏదయినా పరిమిత సంఖ్యను తీసివేసిననూ కలిపిననూ దాని విలువ మారదు. ఈ అనంతము అద్వితీయమగు పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూతసృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మారడు’ అంటాడు భాస్కరాచార్య. పూర్ణమదః పూర్ణమిదం అనే ఉపనిషత్ శ్లోకసారం కూడా ఇదే.’
పై ఉట్టంకింపులో మొదటి భాగం:
“ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును. శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును. కానీ ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము.”
ఖగుణః ఖః (ఏ సంఖ్యనైననూ శూన్యముతో గుణించిన శూన్యము అగును), ‘శూన్యమును ఏ సంఖ్యతో భాగించిననూ శూన్యము వచ్చును’ అన్న దానికి శూన్య పరికర్మాష్టకంలో చూపడానికి ఆధారం లేదు. కానీ ‘ఏ సంఖ్యనైననూ శూన్యముతో భాగించినచో వచ్చునది అనంతము’ (ఖభాజితో రాశిః ఖహరస్యాత్) అన్నది తప్పుడు భావానువాదం.
1/0 = ∞ అని ఆధునికులు వ్యవహరించినా, భాస్కరుడు మతి పోగొట్టే స్పష్టత చూపుతాడు ఇక్కడ. ‘ఖభాజితో రాశిః ఖహరస్యాత్’ (శూన్య పరికర్మలు – 4వ ప్రకరణం – లీలావతి గణితం (1936) పిడపర్తి వారి అనువాదం); సున్నతో భాగించబడినది అనగా సున్న హారముగా గలది (ఖహరం – A fraction with cipher as its denominator ( Coolebrook, Henry T (1893, Calcutta). Zero Denominator అన్న ఊహే ఆశ్చర్యం గొలుపుతుంది. వీటి స్వారస్యాన్ని గ్రహించడానికి ఇంచుక గణిత రసజ్ఞత కావాలి, శ్రీవారికి సంచలనం కలిగించే రాజకీయాల మీద శ్రద్ధ లావు కావున, ఎన్నో దూడలను వదిలేయడం జరిగింది.
‘అనంతము నుండీ ఏదయినా పరిమిత సంఖ్యను తీసివేసిననూ కలిపిననూ దాని విలువ మారదు'(ఈ వాక్యం కూడా మూలార్ధాన్ని సరిగా తెలపడం లేదు. భాస్కరుని గొడవ ఖహరంతో.)
‘ఈ అనంతము అద్వితీయమగు పరబ్రహ్మ వంటిది. బ్రహ్మ కూడా భూతసృష్టి వల్ల కానీ లయము వల్ల కానీ మారడు’ (ఇక్కడ కాళిదాసు కవిత్వం కొంత ఆ పై తన పైత్యం కొంత – మూలంలో ఉన్నది ఏమిటి -అచ్యుతం అనంతం – బ్రహ్మ ఎవరి సృష్టి? బ్రహ్మకు స్వయం అస్తిత్వం ఉన్నదా? పై అనువాదాలతో పోల్చి చూడండి.)
ఇంతటితో నా ఆసక్తి పూర్తిగా చచ్చి పోయింది – పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్న కప్పదాటు, అక్కడ చెబుతున్న దేమిటి? బోడిగుండుకు మోకాలికి ముడి వేయడమంటే ఇదే. తర్వాత ధర్మ తత్వజ్ఞుని స్వరంతో: “ఉపనిషత్ పూర్ణమా? బౌద్ధ శూన్యమా? ఏది జీరోకి మూలం? ఏది గణితంలో అనంతానికి ఆధారం?”
భగవంతుడా అని గోచీ సర్దుకొని లేచి పోవలసిన పరిస్థితి! ఇంత దూరం వచ్చిన పాఠకులు ఎవరైనా ఉంటే పుస్తకసారం నాలుగు మాటల్లో ముక్తాయించి బయట పడతాను.
The Golden Road: How Ancient India Transformed the World అన్న పుస్తకంలో, ప్రాచీన కాలంలో భారతదేశం (250 BC – 1200 AD) యావత్ ప్రపంచాన్ని – తన వైజ్ఞానిక ప్రగతి, సాంస్కృతిక ఘనత, వాణిజ్య సరళితో ఎలా మార్చివేసిందో ఒక అంచనా వేసే ప్రయత్నం చేశాడు భారత దేశంలో స్థిరపడ్డ బ్రిటిష్ చరిత్రకారుడు William Dalrymple. ఇదివరకూ వచ్చిన విలియమ్ డాల్రింపుల్ చారిత్రక గ్రంథాలను చదివిన ఎవరికైనా తెలిసివచ్చేది ఏమంటే, ఈతని పుస్తకాల్లో విషయచర్చ ఎంతో విపులంగా ఉంటుంది.ఒక ధ్యేయంతో విషయసేకరణ చేసి, ఒక పద్ధతికి లోబడి గ్రంథరచన చేస్తాడు కావున ఇష్టంగా చదువుతాము. ఐరోపాకు గ్రీసు ఎలాగో మొత్తం ఆసియా ఖండానికి భారతదేశం ఆలాగు అని ఈ చరిత్రకారుని ఉవాచ. కానీ, జ్ఞానప్రదాయినిగా గ్రీసు గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. విజ్ఞానశాస్త్రాలకు కాణాచి ఐన భారతదేశం గురించి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో సైన్సు బోధించే ఆచార్యులకే సరిగా తెలియదు. కావున, విజ్ఞాన రంగంలో భారతదేశం ప్రాశస్త్యాన్ని ఉగ్గడిస్తూ ఈ పుస్తకరచనకు పూనుకున్నాడు. దీన్ని కూడా చైనాకు ధీటుగా భారతదేశాన్ని పోటీగా నిలబెట్టే అగ్రరాజ్యాల ప్రయత్నంలో భాగమే అని పాకిస్తాన్ పత్రికా రచయితలు కొందరు చెవులు కొరుక్కున్నారు.
ఇటీవల పరిశోధనల్లో తేలినదేమిటంటే – అసలు సిల్క్ రోడ్ [జర్మన్‍లో Seidenstrasse అంటారు – కారణం ఆ కూట సృష్టి వారిదే (1877)] అన్నదే లేదు. మంగోల్ దండయాత్రలకు (13వ శతాబ్దం) మునుపు చైనా – పాశ్చాత్య దేశాల మధ్య ప్రత్యక్ష వర్తక వాణిజ్య సంబంధాలు లేవు. చైనా ఉత్పత్తులు – ఇండియా ద్వారానే రోమ్ వెళ్ళేవి. ఇండియా రోమ్‍ల మధ్య సముద్ర వర్తకం చాలా ప్రాచీనమైనది అని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఐనా కూడా, ఘనతరమైన మన భారతదేశం కథ ఎవరికీ తెలియదు. ఇదీ ఈ పుస్తక నేపథ్యం. పుస్తకంలో బౌద్ధం ఏ రకంగా చైనా, మంగోలియా, జపాన్ కొరియా తదితర దేశాలకు పాకిందో, ఏ విధంగా హిందూ ధర్మం ఆగ్నేయాసియా మొత్తం వ్యాపించిందో అనేకాధారాలతో మనముందుకు తీసుకువస్తాడు డాల్రింపుల్. తర్వాత, భారతీయ గణిత ఖగోళ విజ్ఞానం ఎల్లలు దాటి అరబ్బువర్తకుల ద్వారా ఐరోపాకు పాకి చివరికి యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుపుతాడు.
ఈ పుస్తకాన్ని లోతుగా సమీక్షించాలి అంటే History of Science మరీ ముఖ్యంగా History of Mathematics బాగా చదువుకుని ఉండాలి. మరీ ముఖ్యంగా – దశాంశమాన పధ్ధతి, శూన్య భావపరిణామం, అనంత భావనతో దానికి గల సంబంధం; కనీసం ఆర్యభట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్యుల రచనలు మూలంలోనో, అనువాదంలో చదివి అర్థం చేసుకోగల ఓపిక, ఆసక్తి -వెరసి ఆధునిక గణిత శాస్త్ర పద్ధతుల్లో కనీస ప్రవేశం, అప్పుడు గాని ఈ గ్రంథ నేపథ్యం అర్థం కాదు.
8వ శతాబ్దానికే బ్రహ్మగుప్తుని రచనలు అరబ్బీలోకి వెళ్లాయి. తర్వాత అరబ్బులు వైద్య, గణిత శాస్త్ర గ్రంధాలను సంస్కృతం నుండి విరివిగా తర్జుమా చేసుకున్నారు. క్రమేణా భారతీయ విజ్ఞానం అరబ్బు వర్తకుల ద్వారా ఇటలీ, స్పెయిన్ చేరుకుని ఐరోపా పునరుజ్జీవనానికి (Renaissance) దోహదపడిన వైనం రేఖామాత్రంగా నైనా తెలియాలి. ఎడారి మతాల, కొత్త మతాల గొడవలు, పరిమితులు, భారత దర్శనాల ప్రత్యేకత తెలిస్తే సమీక్షకుని పని మరింత సులువవుతుంది. సమీక్షకునికి ఇవేవీ తెలియనప్పుడు ఉపరితల స్పర్శజేసే సమీక్షతో ‘మమ’ అని బయట పడాలి. అలవాటు లేని ఔపోసనం జేస్తే మీసాలు తెగ కాలినవి తరహాలో ఉన్నది సమీక్ష వ్యవహారం. సమీక్ష చేయవలసిన విషయమే ఘనమైనది అయినప్పుడు, అది తనకు సరిగా తెలియనప్పుడు – తా దూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు -హిందుత్వ, ముస్లింలు, నవ బౌద్ధులు, మూల వాసులు, మార్క్సు అని నానా చెత్తను తలకెత్తుకున్నారు. అసలు ఈ పుస్తక సమీక్షకు, వ్యాస శీర్షికకు ఏమైనా సంబంధం ఉన్నదా? నిజంగా భారతీయతను నిర్వచించవలసిన సందర్భం ఇదేనా? సమీక్షకుడు పుస్తకపరిధికి లోబడి సాము చేసి ఉంటే సమీక్ష ప్రయోజనం నెరవేరేది. వ్రతం చెడింది, ఫలం దక్కలేదు అని చెప్పక తప్పదు.
ఇంకొక విషయం రచయిత తరచూ మాతృభాషకాని ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాస్తున్నట్టు తోస్తుంది- ఆ ప్రక్రియలో నుడికారం పూర్ణానుస్వారం కావడంతో వ్యాసరచనలో అనవసరంగా అయోమయం చోటు చేసుకొంటోంది.
“చరిత్ర అంటే గతం కాదు, పూర్తిగా వర్తమానం. వర్తమానం గతంతో చేసే సంభాషణ కూడా కాదు చరిత్ర. వర్తమానం గతంపై చేసే వ్యాఖ్యానమే చరిత్ర.”
ఇదేదో వచనకవిత్వంలో గందరగోళానికి పేరెన్నిక గన్న సీనియర్ కవి శివారెడ్డి వచనంలా ఉంది. ‘అర్థం కాలేదు’ అంటే, ‘మహార్థమును నిక్షేపించితిని’ అని బుకాయించడం కవులకు జన్మహక్కు. కనీసం, వ్యాసరచయితలైనా స్పష్టతకు కట్టుబడాలి కదా. పై పేరాకు ఆంగ్ల తర్జుమా:
“History is not the past, but the present in its entirety. History is not even the conversation of the present with the past. History is the present’s commentary on the past.”
వాక్యనిర్మాణం ఆంగ్లానికి దగ్గరగా ఉంది కాబట్టి, ఆంగ్లంలో చదివితే సులభంగా అర్థమవుతోంది. కానీ, తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’ స్థాయికి దిగజారి పాఠకుడిని దారితప్పిస్తోంది. కావున, ఈ సమీక్ష – రచయిత మాటల్లో చెప్పాలి అంటే ‘వలసవాద సామ్రాజ్యవాద ప్రతిధ్వనుల్లో’ భాగమే.
1-1. సంయమనం ఈమాటకూనా? గురించి తమ్మినేని యదుకుల భూషణ్ . గారి అభిప్రాయం:
12/08/2024 9:30 am
బ్రాహ్మణవాద భావజాల పత్రిక అన్న ఆరోపణ చెడ్డది. సంపాదకీయం నచ్చక పోతే ఎక్కడ నచ్చలేదో చెప్పవచ్చు. అంతేగాని సంపాదకులకు లేనిపోని ఉద్దేశాలు అంటగట్టడం తప్పు. నాకు ఈ మాట సంపాదకీయాలు పెద్దగా నచ్చవు. నచ్చక పోవడానికి కారణం శైలికి సంబంధించినది – నా దృష్టిలో సంపాదకీయాలు గురిపెట్టిన బాణంలా ఉండాలి. ఒక్క పదం, ఒక్క వాక్యం అటూ యిటూ ఐతే సొంత రచనలైనా నేను మెచ్చలేను. వాక్యానికి వాక్యానికి మధ్య ఉన్న అంతరం రచయిత ఊహాశక్తిని సూచిస్తుంది. ఊహాశక్తి కవికే కాదు, గద్య రచయితకు కావాలి. ఆ తరహా గీటురాళ్ళు నావి – వాటి మీద గోకి చూసి రంగు రాకపోతే రచనను గిరవాటు వేసే అలవాటు నాది.
రచనలో అందరి ప్రమాణాలు ఒక రీతిలో ఉండవు. మనకు నచ్చని వన్నీ బ్రాహ్మణవాదమని, దళితవాదమని బ్రాండ్ వేసి చర్చను పక్కదారులు పట్టించరాదు. అసలు ఇక్కడ కుల,వర్గ, ప్రాంత ప్రస్తావనలు ఎందుకొస్తున్నాయో నాకు అర్థం కాని విషయం. చర్చలో మాధవ్‍గారు ప్రస్తావించిన రచయిత వేణుగోపాల్‍గారి వచన శైలి పరమ దరిద్రమని నా నిశ్చితాభిప్రాయం. దానికి గల కారణాలు శైలీ సంబంధం – ఆయన కులవర్గప్రాంత ప్రస్తావనలు మనకు అప్రస్తుతం. అలా ఆలోచించడమే ప్రజాస్వామ్య వైఖరికి గొడ్డలి పెట్టు. నాగరిక సమాజంలో మనకు ఏది నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో స్పష్టంగా చెప్పగలగాలి. మనం రాసినవన్నీ అందరికీ నచ్చాలి అనుకోవడం, నచ్చకపోతే తూలనాడతాను అంటే అది ఒక రకమైన శఠత్వ ప్రకోపమే (Narcissistic Rage) గాని, మరొకటి గాదు. మన రాతలే కొంత కాలం పోయాక మనకు నచ్చకపోవచ్చు. రచనను బేరీజు వేసే విషయంలో స్వపరాలకు తావు లేదు. కావలిసిందల్లా నిద్రాణం కాని తార్కిక శక్తి , అనితరసాధ్యం కాని అభిరుచి- అవి ఉండవలసిన మోతాదులో ఉంటే గొడవే లేదు.
మన ఆలోచనలు ఒక్క క్షణంలో పక్కదారి పడతాయి. రచయితకు నిరంతర సాధన కావాలి – మెరిసి పోయే ప్రతి ఊహను ఒక వాక్యంలో ఒడిసి పట్టలేము. సంపాదకుడు చక్కని రచనలతో సంచికను నింపాలని కోరుకోవడంలో తప్పు లేదు. చక్కని రచనలు ఎలా సంపాదించాలి అన్న విషయంలో చర్చకు ఆస్కారం ఉంది. ముందు నుంచి పీర్ రివ్యూ పద్ధతి మీద నాకు అభ్యంతరాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, పత్రికా సంపాదకుడు వీలైనంతవరకు copy editingకు (వ్యాకరణ దోషాలు, అచ్చుతప్పులు సవరించడం గట్రా) పరిమితమైతే అపార్థాలకు తావు ఉండకపోవును. Content editingలో (విషయం అటుదిటు చేయమని చెప్పడం, అసంపూర్తిగా ఉన్న, అసంబద్ధంగా ఉన్నవి మార్చమనడం వగైరాలు) పత్రికా సంపాదకులు వేలు పెట్టకపోవడమే మేలు, కారణం అది జీతం భత్యం లేని సంపాదకుడికి శక్తికి మించిన పని. రచయితలను తప్పులు చేయనివ్వండి, సదసద్వివేచన గలిగిన పాఠకులు వాటిని ఎత్తి చూపుతారు. సంపాదకులు బరువు దించుకోవాలే గాని, లోడీలు (dumbbells) పట్టుకుని తిరగరాదు. సంపాదకులు తమ సమయాన్ని వెచ్చించవలసింది సత్తా ఉన్న రచయితలతో లేదా నిరంతరాధ్యయనంలో మునిగితేలే వ్యక్తులతో. అప్పుడు నాలుగు కొత్త విషయాలు/ ఊహలు తెలిసి వచ్చి అవి పత్రికలో చోటు చేసుకుని పత్రికా ప్రమాణాలు మరింత మెరుగు పడతాయి.
ముందు నుండి నేను చెబుతున్నది – సంపాదకులకు కావలసినది ఆలోచనల పెను తుఫాను. (Brainstorming) నలుగురి ఆలోచనలు రాపాడనిదే అది సాధ్యం కాదు. ఆ మార్గంలో ఏమి చేయగలమో ఆలోచించాలి. గతంలో నేను ఒకసారి ప్రస్తావించినట్టు – Ploughshares పత్రిక వారి సంపాదకీయ పద్ధతులు పరిశీలించండి. వారి అతిథి సంపాదకుల పద్ధతి పీర్లు ఫకీర్ల పద్ధతి కన్నా మెరుగైనది అని నా అభిప్రాయం.
“Guest editors are invited to solicit up to half of their issues, with the other half selected from manuscripts submitted to the journal and screened for them by staff editors. This guest-editor policy, which we have used since our founding in 1971, is designed to introduce readers to different literary circles and tastes, and to offer a fuller representation of the range and diversity of contemporary letters than would be possible with a single editorship.”
ఇంకొకటి, సంవత్సరం పొడవునా రచనలు పరిశీలించడం – అమెరికా పత్రికా రంగంతో ఏమాత్రం పరిచయం ఉన్నా అది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ సాహిత్య పత్రికల్లో సంపాదకులు సాధారణంగా జూన్ -డిసెంబర్ మధ్యకాలంలో వచ్చిన రచనలు మాత్రమే చదువుతారు. ఆ పద్ధతి రచయితలూ, సంపాదకులూ ఉభయులకూ మంచిది.
ఇంకొక విషయం, ఈమాట లాంటి పత్రికలు అమెరికా పత్రికా రంగంలోని మంచిని గ్రహించడంతో ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా పత్రికా నిర్వహణలో ఇక్కడ సాహిత్య పత్రికలు నడిచే తీరును అధ్యయనం చేయాలి. ఇక్కడి వదాన్యులు విశ్వవిద్యాలయాల వెంటపడి తెలుగును అధ్యాపన విషయంగా చేయడం మంచి పనే- దానికి ముందు తెలుగు సాహిత్యభాషగా నిలబడాలి కదా, అంటే వారు పెద్ద మనసు చేసుకొని పత్రికా రంగం కోసం ఒక ఫండ్ లాంటిది ఏర్పాటు చేయాలి. రచయితలకు, సంపాదకులకు, సమీక్షకులకు, నిర్వాహకులకు – ఎంత చిన్నదయినా పారితోషికం ఇచ్చి తీరాలి, ‘భారతి ఇచ్చే పారితోషికంతో నా ఖర్చులు వెళ్ళి పోయేవి’ అని ఒకసారి నార్ల గారు అన్నారు- భారతి పాత సంచికలు తిరగేసి చూస్తుంటే రచనల నాణ్యత తెలిసిపోతుంది. దాని వెనుక ఉన్న రహస్యం రచయితలు సంపాదకుల మధ్య ఉన్న సగౌరవ సంబంధం. ‘ఒంటి కాయ శొంఠి కొమ్ము’ ధోరణులు ఏనాటికి సంపాదకుల వంటికి సరిపడవు. వారికి మంచి network ఉండవలసిందే. ఒంటి స్తంభం మేడలు దీర్ఘకాలం నిలవడం కష్టం.
పోతే, ఇక మన సాహిత్యంలో పేరుకు పోయిన చెత్త ఈ నాటిది కాదు, Isuzu వారి పెద్ద ట్రక్కులతో ఒక దశాబ్దం తోలినా అధికభాగం మిగిలే ఉంటుంది. సాహిత్య పత్రికను ఉన్నత ప్రమాణాలతో ఇంత కాలం నడపటం గొప్ప విషయం. తొలినాళ్ళలో ఈమాట పల్లకీ మోసిన బోయీల్లో ఒకడిగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ – మిత్రధర్మంగా ఏవో నాలుగు సూచనలిచ్చాను. సెలవు.
భారతీయతను ఎలా నిర్వచించాలి? గురించి శ్రీనివాసుడు గారి అభిప్రాయం:
12/02/2024 7:36 am
నేటి ద్రావిడవాద, నీలి, నయానీలి, వామ, అతివామ, మహావామ, అభ్యుదయ, ప్రగతిశీల, హేతువాద, మానవవాద, మూలవాస, మారమూలవాస భావజాలాలు విశ్వసించే చారిత్రక ఆవిష్కరణల ప్రకారంగా “బ్రాహ్మణులు అనగా ఆర్యులు, వారు నిజమైన భారతీయతపై దురాక్రమణ చేసినవారు. వేదాలు ఆర్యులవి. ఇతిహాసాలు ఆర్య రాజుల గురించి బ్రాహ్మణ లిఖితాలు పురాణాలు ఆర్యకల్పనలు.”
కాబట్టి, పై వ్యాసంలో చెప్పిన బ్రాహ్మణ శాస్త్ర ఆవిష్కరణలన్నీ ఆర్యులవే. అందుచేత, ఆర్యవలస సిద్ధాంతాన్ని విశ్వసించేవారంతా వ్యాసంలో ’బ్రాహ్మణ‘ అనే పదం ఉన్నచోట ‘ఆర్య’ అని మార్చి చదువుకోవలెను.
ఉదా. ఇంతకీ భారతీయులు, భారతీయ బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశనానికి మూలమా?
దీనిని “ఆర్యులు, ఆర్య బ్రాహ్మణ విజ్ఞానం చివరికి వినాశానికి మూలమా?” అని చదువుకొనవలెను.
నాకు ఆశ్చర్యం అనిపించినదేమిటంటే పైన పేర్కొన్న మేధావులు, చరిత్రకారులు అందరూ ఆర్య దురాక్రమణ లేదా వలస సిద్దాంతాన్ని విశ్వసించినవారే. మరి, భారతీయతను నిర్వచిస్తూ ‘బ్రాహ్మణ’ అనే పదం ఎందుకు వాడారు అన్నది నాకు అర్థం కాలేదు.
’బ్రాహ్మణ = ఆర్య’ అనే సిద్ధాంతం సరియైనదే అయినట్లయితే ఆర్య విజ్ఞానం కాని భారతీయ మూలవాస, మారుమూలవాస విజ్ఞానం ఏదైనా ఉన్నదా? ఉంటే, దానిని వెలికితేసే ప్రయత్నం ఎవరైనా చేసారా? కనీసం, దాని ప్రస్తావన అయినా ఆర్యవలస సిద్ధాంతాన్ని నమ్మే ఏ చరిత్రకారుడూ ఎందుకు చేయలేదు?
(నేను ఆర్యవలస లేదా ఆర్య దురాక్రమణ సిద్ధాంతాన్ని విశ్వసించను. అది అశాస్త్రీయం అని నా భావన)
అది నీవు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
11/28/2024 7:33 am
ఓ విస్తృత పరిధి విషయాలు కలిగిన దాన్ని “అది నీవు”గా తెలుగులోకి అనుసృజన చేసిన అవినేని భాస్కర్ గారికి… “అదు నీ” తమిళ మూలం రచయిత లోకేశ్ రఘురామన్ గారికి అభినందనలు, కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు.
మొదలు నుండి తుది వరకూ చదివి, గూగులమ్మ సాయంతో సమగ్ర అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించిన తదుపరి నా సంక్షిప్త తలపోతలు ఇలా:
యూదు, క్రిస్టియన్ మరియు ముస్లిం మూడు ప్రధాన ఏకధర్మ మతాలచే ఒక పవిత్ర నగరంగా గౌరవించబడిన, 5,000 సంవత్సరాల పురాతన నగరం జెరూసలేంకు ఉత్తరాన ఉన్న యూదా ఎడారిలోని సంచార జాతికి చెందిన ఒక ఆదివాసీ గొల్లతెగల ప్రజల మెడపై, చెవితమ్మెకు కింద నుంచి మొదలై మెడ, కుడి భుజమూ కలిసే చోటుదాకా సాగి ఉండే కెలాయిడ్ మచ్చల గురించి పరిశోధన కోసం తన మిత్రుడు జియాద్ మహమూద్ అబ్బాస్ పిలవగా న్యూఢిల్లీ నుండి పాలస్తీనా లోని జెరికోకు వెళ్లిన ఫ్రాంకో ఇగ్నేసీ… “తీవ్రమైన దెబ్బ, లేదా కత్తిగాటు అయితే, గాయం చుట్టూ ఈ రకమైన కణజాలం విస్తరించి కెలాయిడ్ మచ్చలు పుడతాయి. జన్యుపరంగా ఒకతరం నుండి మరో తరానికి కొనసాగుతాయి. ఈ మచ్చలకు కారణమైన జన్యువులు కొనసాగినప్పటికీ, అవి బయటపడటానికి ఏదైనా గాయం ఏర్పడాలి కదా? అవి సరిగ్గా మెడమీదే ఎలా వస్తాయి? అనే విషయ పరిశోధన కోసం జియాద్ న్యూఢిల్లీలో ఉంటున్న తన మిత్రుడు ఫ్రాంకోని పాలస్తీనాలోని జెరికోకు రమ్మని పిలుస్తాడు.
జెరూసలేమ్ నుండి, జెరికోకు భయానకమైన ఎడారి దారిలో ప్రయాణిస్తూ దొంగలముఠా, తోడేళ్ళు బారిన బడి… ఒక యూదు గురువు (సింబాలిక్ ఆఫ్ జీసస్ క్రీస్తు?) వల్ల రక్షించబడిన బాటసారి కధ… బైబిల్‌లో ప్రస్తావించబడిన “ఎ రోడ్ డౌన్ టు జెరికో”ను తలపోస్తాడు ఇగ్నేసీ. జోర్డాన్ నది ఉద్భవించిన హెర్మోన్ అనే మంచుపర్వత శిఖరాన యేసుక్రీస్తు తన మానవ శరీరాన్ని విడిచిపెట్టి, మంచులాంటి స్వచ్ఛమైన తెల్లని కాంతిని పొందే ఆ రూపాంతరం అనే మహత్తరమైన అద్భుతాన్ని చేశాడు. యేసు గలిలీ సమీపంలోని నజరేతులో పెరిగాడు. తన ముప్పయ్యవ యేట బాప్తీస్మము తీసుకున్నాడు. గుడ్డివాడికి చూపును ప్రసాదించే అద్భుతాన్ని చేశాడు.
క్రీస్తు పెరిగి పెద్దయి జీవించి మరణించిన నేల అది. క్రీస్తు మళ్ళీ ప్రాణం పోసుకుని లేచి వచ్చినప్పుడు, ఆదివాసీ గొల్ల తెగకు చెందిన ఒక వృద్ధ మహిళ, స్వర్గపు కాంతినిపొంది తిరిగివచ్చిన ఆతని చేతిలో ఒక గొర్రెపిల్లను, మెడపై ఈ మచ్చను చూసిందట. అటువంటి ఒక యేసు క్రీస్తుని వాళ్ళు తమ దేవుడుగా ప్రార్థించారు, స్వీకరించారు. వాళ్ళు యేసు క్రీస్తు తమ వంశంలోనే జన్మించాడు అని నమ్ముతారు.
కల్వరి కొండ గుట్టపైనున్న చిన్న గొయ్యి పక్కన రోమన్ సైనికులు యేసుక్రీస్తును (‘నజరేయుడైన యేసు. యూదుల రాజు’) తను మోసుకొచ్చిన శిలువమీదే వేస్తారు. అదివరకే అక్కడ ఇద్దరు దొంగలను శిలువ ఎక్కించి కుడి, ఎడమలుగా వాటిని పాతిపెట్టి ఉన్నారు. ఎడమ వైపు శిలువ ఎక్కించబడిన దొంగ పేరు గెస్టాస్. కుడివైపు శిలువ ఎక్కించబడిన మరొక దొంగ పేరు డిస్మాస్. క్రీస్తు జన్మించిన సంగతి తెలుసుకొని హేరోదు రాజు తన దేశంలోని రెండేళ్ళలోపున్న మగ శిశువులందరినీ తన ఖడ్గానికి బలిచ్చాడు! ప్రాణాలు తీయబడిన ఆ వేలాదిమంది పిల్లవాళ్ళలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్న ఏకైక పిల్లవాడు గెస్టాస్.
తోడేళ్ళ గుంపు బారి నుండి ఒక పిల్లలతల్లి తోడేలు కాపాడి తన రొమ్మిచ్చి పాలతో పొట్ట నింపి ఆరేళ్లు కాపాడబడిన గెస్టాస్, ఆ తరవాత ఒక మంత్రగాడు కి దొరికి జనావాసాలు లేని కఠోరమైన ఎడారిలో అతని వద్ద పెరుగుతాడు.
మంత్రగాడు చర్నాకోలతో కొట్టి, హింసించి గెస్టాస్నా చేత తోడేలులాగా అరిపించి ఎడారుల్లో వెళ్ళే బాటసారులను దారి మళ్ళించి ఒంటరులను చేసి వాళ్ళ దగ్గరున్న సొమ్మును దోచుకుంటూ ఉండేవాడు. మంత్రగాడు చనిపోయాక, గెస్టాస్ మృగలక్షణం, క్రూరత్వంతో యూదా ఎడారిలో వెళ్ళే బాటసారులపై దయాదాక్షిణ్యం లేకుండా దాడి చేసి దోచుకోవటం దినచర్యగా జీవించాడు.
ఒక రోమన్ సైనికుడు వీధిలో పైకి విసిరి, కత్తికి బలి చేయాలని ప్రయత్నించిగా ఏర్పడిన గాయపు మచ్చను (కుడివైపు మెడభాగంలో చెవితమ్మె క్రింద మొదలై భుజం వరకు విస్తరించి ఉన్న గాయపు మచ్చను) గెస్టాస్ యేసుకు చూపించి: “మానవరూపంలో భూలోకానికి దిగి వచ్చిన దేవుని కుమారులు… మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకున్నా… ప్రపంచ రక్షణ, పాప పరిహారాలు, మోక్షం ఎలా సాధ్యం” అని క్రీస్తుని ప్రశ్నించిన గెస్టాస్‍కు… ఓపికగా అతని కథను విన్న యేసు బదులిస్తూ “నేనుగా గుర్తింపబడే నేను ఇకపై నేను కాను” అని పైకేసి చూపుతున్న ఆయన కుడిచేతి చూపుడు వేలు, అతని వైపుకు చూపించి గెస్టాస్‍కు స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాడు.
జియాద్ తనకు యీ కథ చెప్పడం పూర్తి చెయ్యంగానే ఫ్రాంకో ఇగ్నేసీ కళ్ళనుండి ధారాపాతంగా కన్నీళ్ళు కారతాయి.
ఆ ఆదివాసీ గొల్లవారిని ఇప్పుడే చూసితీరాలి అని సాయంత్రం ఎడారిలో ప్రయాణం చేసి వెళ్లిన వాళ్లు ఒక గొర్రెల మంద, ఇసుక తిన్నెమీద నిలబడి ఉన్న, మెడ మీద ఆ మచ్చ( కెలాయిడ్ ) ఉన్న గొర్రెల కాపరిని చూస్తారు. అతని ముందు పూడుకుపోతున్న ఇసుకలో మోకరిల్లి, ఛాతీపై రెండు చేతులు జోడించి ఫ్రాంకో ప్రార్థించాడు. ఆ గొర్రెలకాపరి ఏమీ తోచనివాడిలా చూస్తూ నిల్చుని ఉన్నాడు, వెనుక మరో ఇసుకతిన్నె కవతల అస్తమిస్తున్న సూర్యుడిని గమనిస్తున్నాడు.
తిరిగి వచ్చిన ఫ్రాంకో రోజంతా ఒంటరిగా, పిచ్చివాడిలాగా, ల్యాబ్‍లో గడిపాడు… జన్యు కాపీలను మళ్ళీ మళ్ళీ తిరగేస్తూ. ఆదివాసీ గొల్లతెగల ప్రజల మెడపై వంశపారంపర్యంగా వస్తున్న కెలాయిడ్ మచ్చలకి కారణం కనుక్కుంటాడు. ఆదివాసీ తెగల జన్యువులు కేవలం బాహ్యజన్యు పరివర్తనకు (ఎపిజెనిటికి మ్యూటేషన్) మాత్రమే గురవ్వలేదు; బాహ్యజన్యు సవరణకు (ఎపిజెనిటిక్ మాడిఫికేషన్) కూడా గురయ్యాయి అనే ఒక కొత్త విషయాన్ని ఫ్రాంకో కనుక్కుంటాడు. ఇటువంటి మార్పులు అంతర్గత కారణాల వల్ల; పర్సనల్ ట్రామా అనబడే బలమైన మానసిక వేదన; వల్ల సంభవిస్తాయి అని కనుగొంటాడు.
పాలస్తీనా లోని జెరికో నుండి తిరిగి వచ్చి, అర్ధరాత్రి దాటాక న్యూఢిల్లీలోని తన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న ఫ్రాంకో కి ఇంట్లో గోడకు వేలాడుతున్న జీసస్ మీద బయటి నుండి వచ్చి పడుతున్న సన్నటి కాంతిలో, పైకి చూపాల్సిన ఆయన కుడి చేతి చూపుడు వేలు తన వైపు చూపుతున్నట్లు అనిపించింది… “ అది నీవు “ అని ‘ you are my disciple ‘ అని చెపుతున్నట్లు అనిపించింది.
John 13:35 “A new command I give you: Love one another. As I have loved you, so you must love one another. By this everyone will know that you are my disciples, if you love one another.”
Matthew 6:15 “ ESV but if you do not forgive others their trespasses, neither will your Father forgive your trespasses. NIV But if you do not forgive others their sins, your Father will not forgive your sins. NASB But if you do not forgive other people, then your Father will not forgive your offenses.
Ephesians 4:32 in Other Translations
“ Be kind to one another, tenderhearted, forgiving one another, as God in Christ forgave you. 32 Instead, be kind to each other, tenderhearted, forgiving one another, just as God through Christ has forgiven you. “
చెప్పులు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/26/2024 1:54 am
చెప్పులు స్వయంగా ఎందుకు కుట్టుకోకూడదు అంటారు లైలా గారు. పైగా చాలమంది చొక్కాలూ, జాకెట్లూ, కుట్టుకుంటూనే ఉంటారుగా అంటారు.
జాకెట్లు కుట్టడం కుట్టు సెంటర్లు నేర్పేవండీ అమ్మాయిలకు. చొక్కాలు కుట్టటం మాత్రం ఎవ్వరూ అబ్బాయిలకు నేర్పించేవారు కాదు. సూదీ దారం తోలూ వంటివి సంపాదించి చెప్పులు స్వయంగా కుట్టుకోవటం కుదిరేపని కాదండీ. అవి సంపాదించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ఆటూల్స్ సులువుగా దొరకవు దొరికినా ఎంచుకోవటం తెలియాలి గా? నైపుణ్యం లేకుండా ప్రయత్నం చేస్తే ఆ డబ్బు దండుగ అవుతుంది. నేర్చుకుందుకు ఏ ఐటీఐ లోనో చేరి కోర్సు చేయాలి. ఊరికే ఎద్దేవా చేసేముందు ఆలోచించే పనిలేదా?
ఎందుకో మరి. సంపాదనపరులైన ఆడవాళ్ళను రచయితలు ఫోకస్ లోకి తేరు. ఏం చెయ్యను. నేనే ఊహించుకోవాలి అంటారు లైలా గారు.
ఒక పాత్రను ఫోకస్ లోనికి తేవటం అంటే ఆపాత్ర పాఠకుడికి కథను చదివిన తరువాత కూడా గుర్తు ఉండేలా చేయటం అని అర్థం. అంతే కాని సాధ్యమైనంత ఎక్కువ నిడివిని పాత్ర కోసం కథలో కేటాయించటం కాదు.
ఈ కథలోని అక్క గారి పాత్ర పాఠకుల మందిని నిలచే పాత్రగా ఉంది. ఇంకేం కావాలి?
ఇక కవిత గారికి హిపోక్రసీ కనిపించింది. కథచెప్పిన రచయిత నిజాయితీ కనిపించింది కాదు. విడ్డూరంగా అనిపించింది.
నాకూ పన్నెండవ తరగతిలో కూడా చెప్పులు లేవు కాలేజీలోనికి వచ్చే దాకా పేంట్లూ లేవు. నాస్కూలు చదువంతా సెకండ్ హేండ్ పుస్తకాల తోనే గడిచింది. కాలేజీ చదువు లోనూ లైబ్రరీ పుస్తకాలు దొరక నప్పుడే మొహమాట పడుతూ నాన్నగారిని పుస్తకాల కోసం డబ్బులు అడిగే వాడిని. ఎప్పుడూ బ్రౌన్ పేపర్లతో నోటు పుస్తకాలు కుట్టుకునే వాడిని. ఈకథ చదువుతుంటే ఆరోజు లన్నీ మదిలో మెదిలాయి. ఇదంతా నా హిపోక్రసీ అంటే చేయగలిగింది లేదు.
ఆ టీనేజీ కథకుడి లాగే నేనూ పెద్దయ్యాక కుటుంబానికి అది చేయాలీ ఇది చేయాలీ అని కలలు కనే వాడిని. భగవదనుగ్రహం వలన అవి చాలావరకూ నెరవేరాయి.
అన్నట్లు ఒక మాట. కాలేజీకి వెళ్తున్న పిల్లాడి నని ఒకసారి మా అమ్మగారు నాకు తను దాచుకున్న డబ్బులిచ్చి కాస్త మంచి చెప్పులు కొనుక్కో మన్నారు.
ఈకథ అరవైల నాటి వాస్తవిక జీవితాలను ఆవిష్కరించింది.
రచయితకు అభినందనలు.
కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి Srinivasarao Chaavli గారి అభిప్రాయం:
11/25/2024 11:00 pm
రచయిత తన వ్యాసాలలో భారతీయ గ్రంధాలనుంచి ఉదహరిస్తారు. కానీ, సైన్స్ వ్యాసాలమధ్యలో వాటిని ప్రస్తావించడం సందర్భోచితంగా అనిపించదు. మత/ఆధ్యాత్మిక గ్రంధాలు కొన్ని ఆలోచనలను ప్రస్తావిస్తాయి. అవి (సామాన్యంగా)ఆలోచనలు/ఊహలే కాని వాస్తవాలు లేదా ప్రయోగాలపై ఆధారపడిన నిజాలు కావు. ఇది ఆయా రచయితల ఊహలను కించపరచడం కాదు. కానీ, వాటికి కాన్సెప్ట్‌లను ఆపాదించడం సరైనది కాకపోవచ్చు. ఉదాహరణకు, “నేను టీ కోసం చంద్రునికి వెళ్ళి ఒక గంటలో తిరిగి రావచ్చు” అని ఒక వ్యాసం వ్రాయగలను. భవిష్యత్తులో, ఇది నిజం కావచ్చు. అటువంటి సందర్భంలో కూడా, ఇప్పటి నా ఆలోచన ఒక ఆలోచన/ఊహ మాత్రమే కాని నిరూపించగలిగిన వాస్తవం కాదు. నేను భవిష్య ద్రష్టను కాను.
ఈ విషయం రచయితకు చదువరులకు ఇక్కడ అర్థం అవుతుంది. కాని వీటిని చదివి కొంతమంది “ఇవన్ని వేదాలలొ ఉన్నాయిష” అనుకొనే ప్రమాదం ఉంది. చాలమంది ఇటువంటి వేదాలలొ పేర్కొన్న/నిరూపించిన అంశాల గురించి ఉపన్యాసాలలో ఉటంకించడం చూడవచ్చు.
ఈ వ్యాఖ్య వ్యాసం యొక్క విలువను తగ్గించడానికి కాదు. కాని ఇటువంటి వివరాలు footnoteలో ఇవ్వడం గురించి ఆలొచించవచ్చు.
కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
11/23/2024 7:34 pm
అయ్యా! యదుకులభూషణ్ గారూ:
నేను రాసే సైన్సు వ్యాసాలు చదివి, స్పందించే అతి కొద్ధిమందిలో మీరు ఒకరు! కనుక మీ స్పందనకి నా జవాబులు – క్లుప్తంగా.
(1) అణువు, పరమాణువు, వగైరా
మంత్రపుష్పంలో …
తస్య మధ్యే వహ్ని శిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థితా
…..
నీవారసూకవత్తన్వీ పీతా భా”స్వత్వణూపమా
అణువు ప్రస్తావన (నిర్వచనం) కనిపిస్తుంది. ఈ అణువు atomతో సమానార్థకం, moleculeతో కాదు. ఎందుకంటే …
(క) ఒక హిమోగ్లోబిన్ బణువు (molecule) ఉదజని అణువు (atom) కంటే 64,500 రెట్లు ఎక్కువ బరువు! ఒక హిమోగ్లోబిన్ బణువులో (molecule) 10,000 వరకు (ఖచ్చితమైన లెక్క నాకు తెలియదు) ఉదజని, కర్బనం, నత్రజని, ఆమ్లజని, గంధకం అణువులతో పాటు ఖచ్చితంగా నాలుగు ఇనుము అణువులు (atoms) ఉన్నాయి. ఇంత తేడా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్‍ని “అణువు” అని ఏ ముఖం పెట్టుకుని అనగలం? హిమోగ్లోబిన్, DNA వగైరాలు బణువులే! అణువులు కాదు. నిజానికి అవి బృహత్ బణువులు (mega molecules).
(చ) నిజానికి అణువులో (atom) అంతర్భాగమైన ఎలక్ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు పరమాణువులు (sub-atomic particles). వీటిలో అంతర్భాగాలైన క్వార్కులు “పరమాణు రేణువులు.”
(ట) నీరు, మైలుతుత్తం, పంచదార, కిరసనాయిలు, వగైరాలలో అతి చిన్న “రేణువులని” బణువులు (molecules) అందాం. షడ్దర్శనాలలో కాణాదుడు ఇలాంటి బణువులనే “ద్వియాణువు, త్రయాణువు,” అంటూ అణువులకి, బణువులకి తేడాని చెప్పేడు. ఇదంతా నా సొంత పైత్యం కాదు.
(2) మొసలి కన్నీళ్లు, ముద్రారాక్షసం, సింహభాగం వంటి ప్రయోగాలు “వైరల్” అవుతోన్న ఈ రోజుల్లో “లోతైన జేబులు” అనే ప్రయోగానికి కూడా తావు ఉందనే ధైర్యంతోనే ఆ ప్రయోగం చేసేను.
(3) “పస” అనే బుర్రలో ఉంది. అది కాగితం మీద “పసరు” అని పడ్డాది. నా మనోనేత్రం భౌతిక నేత్రాన్ని ధిక్కరించింది. తరువాత సంపాదకులు “ప్రూఫులు” చూడమని ఇచ్చినప్పుడు “పసరు” కనిపించింది. పసరు ఇక్కడ నప్పుతుందో నప్పదో చూద్దామని బహుజనపల్లి సీతారామాచార్యులు ని సంప్రదించి “సరిపోతుందిలే” అని సమాధానపడ్డాను. అంతేకాని ఇది ఇంగ్లీషు నుడికారానికి అనువాదం కాదు.
(a) పస: శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912: దే. వి. 1. సారము; 2. సమృద్ధి; 3. చాతుర్యము.
“సీ. తననీతిపస యుగంధర భట్టి చాణక్యఘనచాతురికి నిదర్శనముగాఁగ.”
(b) పసరు: శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912: వై. వి. వ్యాపనము.”ఒకింత బుద్ధిలోఁ బసరిడి చూడుమా.” (ఇక్కడ పసరిడి అనఁగా ఆలోచించి యనుట.) హరి. ఉ. ౮, ఆ.
(4) మిగిలిన అంశాలు. నేను 1968 నుండి తెలుగులో సైన్సు వ్యాసాలు రాస్తున్నాను. ఆ రోజులలో నా దగ్గర నిఘంటువులు లేవు. ఈనాటిలా online నిఘంటువులు అప్పట్లో అస్సలు లేవు. అన్నీ స్వకపోలకల్పితాలే! వాటినే ఆకారాదిగా అమర్చుకుని వాటినే పదేపదే వాడుతూ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాను. నా నిఘంటువే నేను వాడే పదజాలానికి ఆధారం. ఉత్సాహం ఉంటే ఇక్కడ చూడండి:
వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు – Wikibooks
ధన్యవాదాలు!!
సంఘర్షణల పళ్ళచక్రం మధ్య నిలిచిన ‘అనుపమ’ గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/23/2024 2:59 am
అనుపమ అనే నవలను పరిచయం చేసిన విధానం బాగుంది. ఆనవలను చదివిన భావన కలిగింది.
నవలను మంగళాంతం చేయాలన్న సంకల్పంతో రచయిత్రి కధను మొదలుపెట్టినట్లుగా తోస్తోంది.
అర్ధ శతాబ్దం క్రిందట ఇటువంటి దుర్భరజీవితాలకు బలియైన వనితలు కొల్లలు. ఇటీవల పరిస్థితులు కొంచంకొఃచంగా మారుతున్నాయి. నేటికాలం అమ్మాయిలు పెళ్ళికొడుకులను స్వయంగా ఎన్నుకుంటున్నారు. వైకల్యాలనూ కౌటుంబిక సామాజిక అవరోధాలను చక్కగా ఎదిరించి గెలుస్తున్నారు.
కథాంతంలో అనుపమకు బ్రతుకు పండటం ఆనందదాయకమే కాని అది కావ్యదోషాలలోని అవ్యాప్తిగా చెప్పాల్సిందే.
మరో గురుదక్షిణ గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/22/2024 10:46 am
ఇప్పటికే చాలా సార్లు చెప్పి ఉంటాను ఒక మాటను. కల్పన అనేది కవి హక్కు కాని అది మూలఛ్ఛేదిగా ఉండకూడదు అని. కల్పనపేరిట కథాసంవిధానాన్ని కాని పాత్రలస్వరూపస్వభావాలను కాని వికారం చేయకూడదు అని.
ఏకలవ్యుడు అనేది అతని పేరు కాదు. లవము అంటే బొటనవ్రేలు. ఒకే బొటనవ్రేలు కలవాడు అయ్యాడు కాబట్టి అతనికి ఏకలవ్యుడని పేరు వచ్చింది.
అతడు ఒక వేటకుక్క ముఖంలో సూటిగా ఏడుబాణాలు ప్రయోగించినప్పుడే అతడి క్రూరత్వం బయటపడింది ప్రపంచానికి. ద్రోణుడు ఆలోచించినది ఒక క్రూరుడు పట్టుదలతో చేసిన సాధన పర్యవసానం ప్రపంచానికి మంచిది కాదనే. అందుకే వాడి బొటనవ్రేలిని దక్షిణగా అడిగటం జరిగింది. దరిమిలా వాడు అలాగునే మరింతసాధన చేసి చివరకు తనను మించిన క్రూరుడైన జరాసంధుడి సేనాని అయ్యాడు. కృష్ణుడి చేతిలో హతమయ్యాడు. (బొటనవ్రేలిని ద్రోణుడికి దక్షిణ ఇవ్వకుండా ఆ హిరణ్యధన్వుడి కొడుకు ఏకలవ్యుడు ఎలా అయ్యాడో!)
ఏకలవ్యుడి కథను వక్రీకరించారు. ధృష్టద్యుమ్నుడి కథను వక్రీకరించారు. ద్రోణుడి కథను వక్రీకరించారు. ఏమి సాధించాలని? ఈ చెత్తకల్పనకు కృష్ణుడిని సాయం చేసుకున్నారు! అసలు ఈకల్పనావ్యవహారం కోసం భారతకథను దారుణంగా వక్రీకరించారు
అన్నట్లు కర్ణుడిని దాత అని పొగిడినట్లున్నారు? భారతంలో అసలు అలా ఎక్కడన్నా మహాదాత కర్ణ అని ఉందా? ఏమి వెఱ్ఱి!
మూలవిరోధంగా ఇదంతా చేయటం ఒక అందమైన కల్పన అని భారతకథ సరిగా తెలియని వారు అనుకోవచ్చునేమో కాని నాకైతే వికారమైన కల్పనగానే అనిపించింది.
భారతకథ సరిగా తెలియని యువతను మరింత గందరగోళానికి గురిచేయటం తప్ప ఈకథకు మరొక పరమార్ధం ఏమీ కనిపించటం లేదు.
ఇలా మూలఛ్ఛేదకథాప్రచురణలు చేయకుండా ఈనాడు పత్రికవారిని మంచి సంయమనం పాటించవలసిందిగా చేతులుజోడించి అభ్యర్ధిస్తున్నాను.
వంటా వార్పు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/19/2024 6:42 am
తెలుగుసాహిత్యకారులు సాధ్యమైనంతవరకు తెలుగుభాషలోనే వ్రాస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.
(ఈమాటకు అభిప్రాయాలూ విమర్శలూ పంపే వారు కూడా తెలుగుసాహిత్యం గురించి మాట్లాడుతున్నవారే కాబట్టి వారు కూడా సాధ్యమైనంతవరకు తెలుగుభాషలోనే వ్రాస్తే బాగుంటుందని కూడా నాఅభిప్రాయం.)
కథ మొదలు పెడుతూనే రూంలో అని ఇంగిలిపీసు ముక్కను ప్రధమకబళే మక్షికాపాతః అన్నట్లు వేయకుండా గదిలో అని కాస్త కరుణించవచ్చును కదా! చాదస్తంగా ఇంగ్లీషుముక్క లన్నీ తెలుగుచేయమని అనను కాని కాస్త వీలైనంత తెలుగు వాడవచ్చును కదా అని వాపోతున్నాను.
అదిసరే, ఈకథ బాగుంది. బహుకాలం క్రిందట చదివిన సాంబారు జన్మవృత్తాంతాన్ని వివరించే కథలాగా ఉందనిపించింది ఎందుకో (ఆకథకు రచయిత పెట్టిన పేరు గుర్తులేదు. మన్నించాలి)
ఆకథను టూకీగా చెప్తాను. కైలాసంలో శివకుటుంబంలో అమ్మవారు ఒకసారి చిరాకుపడి వంటావార్పూ అంతా నావంతే అంటే కుదరదూ – నాకూ భక్తులున్నారు బోలెడుమంది – వారిని చూచుకోవద్దా నేను? అందుకని ఇకనుండీ అందరూ వంతులవారీగా వంటపని చూడాలి అని నియమం చేసారట. అలా బండి నడుస్తూ ఉండగా ఒకనాడు సాంబశివులవారి వంతు వచ్చింది. ఆయనకు ఏం చేయాలో తోచక చివరకు గంగాళంలో నీళ్ళు ఉడకనిచ్చి కనిపించిన కూరానారా అంతా ముక్కలు చేసి దాంట్లో వేసి గుప్పెళ్ళతో ఉప్పూ కారం పులుపూ అంతా వేసి కూర్చున్నారు.
భోజనాలసమయంలో అందరూ ఆద్రవపదార్ధాన్ని దాంట్లో భీతావహంగా ములుగుతూ తేలుతూ ఉన్న రకరకాల రంగురంగుల ముక్కల్నీ చూసి ముందు జడుసుకున్నా రుచి మాత్రాం బాగా వచ్చిందని సంతోషపడ్డారు. ఈవంటకం పేరేమిటండీ అని అమ్మవారు అడిగితే నాకు మాత్రం ఏమి తెలుసూ అని శివయ్య నవ్వాడట. సాంబశివులవారు కనిపెట్టిన వంటకం కాబట్టి అప్పటినుండీ దాన్ని సాంబారు అని పిలవాలని ఏకగ్రీవంగా నామకరణం చేసారని ఆకథ చెబుతున్నది. (ఇదీ నాకు గుర్తు ఉన్నంతవరకూ ఆకథ. ఏమిటో మీతో పంచుకోవాలని అనిపించి చెప్పాను. తప్పైతే మళ్ళా మన్నించేయండి.)
శివయ్య కాబట్టి ఎలాచేసినా అమృతంలాగా ఉండటానికి కుదురుతుంది కాని పాపం మనవాడు చేసింది బంగాళాదుంపల పప్పు కదా అలా ఎలా కుదురుతుందీ అని.
ఆవిడ గురించి Ramesh గారి అభిప్రాయం:
11/18/2024 5:34 am
ఈ రోజేమో, అక్కడెవరూ లేరు కాని తను పెద్దగా ఏడుస్తూ అరుస్తూంది, ‘మగలంజకొడుకులంతా ఒకటేరా అని తెలిసినా కూడ పెంచి పెద్ద చేసిన కదర ముండా కొడుకా’ అని ఎవరినో తిడుతూంది.
ఆమె లోని అమ్మతనం తను పెంచిన అమ్మాయిని తన సొంత కొడుకే పాడు చేస్తాడు అని అతన్ని తిట్టినప్పుడే తెలుస్తుంది. చాలా మంచి కథ, నమస్కారాలు.
సత్యం గురించి Ramesh గారి అభిప్రాయం:
11/18/2024 3:41 am
“మనకి మనమాడే అబధ్ధాలు అంతగా అలవాటు అయిపోయినట్లున్నాయి.”
“అబధ్ధమన్న తర్వాత ఏదైనా అబధ్ధమే! చిన్నదీ, పెద్దదీ, హానికరమయిందీ, కానిదీ అనుకునేది మనని మనం సమర్థించుకోటానికే!”
ఈ కథ చాలా ఆలోచింపచేస్తుంది. పిల్లల పెంపకం, వాళ్ళ పట్ల మన ప్రవర్తన గురించి చక్కగా చెప్పారు, నమస్కారం.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/13/2024 5:09 am
భక్తిసాహిత్యంలో అద్భుతమైన సాహిత్యం ఉండవచ్చును. ప్రతిశ్లోకంలోనూ తదాపి ప్రతిపాదంలోనూ కూడా సాహిత్యపువిలువలు బ్రహ్మాండంగా ఉండాలీ, ప్రత్యక్షరం రసరమ్యం కావాలీ అంటే అలా ఉంటే అద్భుతమే కాని మనం సమాహారంగా ఆసాహిత్యఖండికలోని రసరమ్యత వంటివి మాత్రమే స్వీకరించాలి. మైక్రోస్కోప్ క్రింద పెడితే అందమైన వస్తువులనేకం వికారంగా కనిపించవచ్చునండి.
ఇకపోతే భక్తి సాహిత్యం మనసా ఆస్వాదించి రమించవలసినదే కాని కేవలసాహిత్యపు విలువల తూకపురాళ్ళతో బేరీజు వేయదగినది కాదు తరచుగా.
పదాశ్రితానాం చ సమస్తచౌరం అన్న ఒక ప్రయోగం తీసుకుందాం. ఒక భక్తుడు ఈవాక్యం చదివి తన్మయత్వం చెందుతాడు. ఒక విమర్శకుడు ఏముంది ఈవాక్యంలో విశేషం అనుకోవచ్చును.
భగవంతుడు తన పాదాలను ఆశ్రయించినారి సమస్తాన్నీ దోచుకుంటాడట. ఏజీవుడైనా అహమిక ఉన్నంతకాలం ఇది నాది అది నాది అన్న లెక్కలనుండి దాటి బయటకు రాలేడు. వాడు నాది నాది అనుకొనేది సమస్తం భగవానుడు తీసివేసుకున్నాక ఆభక్తుడు నాది అనుకుందుకు గాను ఏదీ మిగలదు. తనది అన్నది ఉంటే దానితో బంధం. అటువంటిది లేకపోతే ఏబంధమూ లేదు కదా. ప్రాపంచికబంధరహితుడై భగవంతుడితో మాత్రమే సంబంధం కలిగి ఉంటాడు. వాడికి ఈస్థితి కలిగించాలనే అన్నీ ఆ భగవంతుడు లాగివేసుకుంటాడని ఈవాక్యం తాత్పర్యం. ఇదంతా స్ఫురించి భక్తుడు తాదాత్మ్యం చెందుతాడు. సాహిత్యవిమర్శకుడు ఏరసానుభూతినీ పొందడు. రసో వై సః అని మన సిధ్ధాంతం కదా. ఆ రససిధ్ధి కేసి అడుగువేయని వాడికి అంతా శుష్క భక్తి ప్రలాపమే.
ఇలాగు భక్తిభావన ఉన్నవారి దృక్కోణంలో ఇది సమున్నతమైన సాహిత్యమే. అసలు సాహిత్యం అంటే ఏమిటండీ? సహితమైనది సాహిత్యం. హితముతో కూడినది అని. ఏది హితము? భగవత్సంబంధి కన్నా హితమైనది ఉందా అని భక్తులు భావిస్తారు. కొందరు సామాజిక హితము వరకూ లెక్కలు వేస్తారు. కొందరు సాహిత్యప్రయోజనం వరకూ ఆలోచిస్తారు. ఇత్యాది.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
11/12/2024 6:46 pm
ఈ నా అభిప్రాయం మూలం గురించి. అనువాదాల గురించి కాదు. అది ఎవరు రాశారు లేదా పాడారు అన్న విషయం పక్కన వుంచి శ్లోకాల్ని మాత్రమే చూస్తే – వీటిలో వీటి కర్త భక్తిపారవశ్యం స్పష్టంగానే మనక్కనిపిస్తుంది. “చౌర్యం” అనే భావాన్ని తీసుకుని దాన్ని అన్ని శ్లోకాల్లోను అంతర్లీనంగా చొప్పించే ప్రయత్నం జరిగింది, అభినందనీయమే. “నవనీతచోరుడిగా”, “గోపీమానసచోరుడిగా” కృష్ణుడు ప్రసిద్ధుడే. మొదటిదాన్ని పాలు, మజ్జిగలకి ఇంకా కావాలంటే నెయ్యికి, రెండోదాన్ని రాధ, రుక్మిణి మొదలైన ప్రియులకీ భక్తులకీ పొడిగించటం సాధారణమే. అలాటి చోరుణ్ణి చీకటికొట్లలో బంధించటం – భక్తుల మనసుల్తో సహా – అనేది కూడ లోతైన భావనగా నాకు కనిపించదు. శబ్దప్రయోగాలూ ఏమంత చెప్పుకోదగ్గవి కావు.
కనుక నా సందేహం వీటిలో కవిత్వం వున్నదా అనేది. అంటే పైపైన కనిపించే విషయమేనా లేక ఆలోచనామృతమైన వ్యవహారం ఏమైనా వుందా అనేది. నాకలాటిది కనిపించలేదు. కనిపించినవారు ధన్యులు. అదేదో మిగిలిన వారితో కూడ పంచుకుంటే ఇంకా బాగుంటుంది.
భక్తిపురస్సరంగా వీటిని పాడుకుంటాం అంటే మంచిదే. కాని దీన్లో ఏదో అద్భుతసాహిత్యం వుందంటే ఒప్పుకోవటం కష్టం.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
11/10/2024 12:45 pm
>> శ్లోకంలో ఒకోసారి ఒక అక్షరం మేర లోటువస్తే చ వేసేయటమే.
ఇది చదివి నవ్వు ఆపుకోలేకపోతున్నానండి. సంస్కృతం, ఛందస్సూ ఇదీ అదీ అంటూ దెప్పకండి నాకు అవేమీ రావు గాక రావు. కామెంటర్ల పేరుతో చకార కుక్షి ఐపోదావని ప్రయత్నం. మీరు/ఎవరు ఎలా తిట్టినా సంతోషమే. ఇలా రాసినండుకు నేను పోయేది ఎలాగా యమలోకానికే కనక ఏమనుకునేది లేదు. 🙂
ఏక శర్మాయ”చ”, ద్వీతీయ శర్మాయ”చ”
శ్యామలాయ”చ” యదుకుల భూషణాయ”చ”
ప్రతి శ్యామలాయ”చ”, కృష్ణమాచారీయ “చ”
ప్రతి శర్మాయ”చ”, కొలిచాలాయ “చ”
ప్రతి ప్రతి శ్యామలాయ”చ” ….
ఇతి తు హి చ స్మ హ వై పాదపూరణే.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/10/2024 11:31 am
ఇకపోతే దండుగ గణాలు (దండుగ్గణాలు అనటం నాకు నచ్చలేదు) అని ఈసడించబడే వాటి గురించి కొంతైనా చెప్పుకోవాలి. తప్పదు.
సంస్కృతంలో శబ్ధాల స్వరూపం విభక్తులను అనుసరించి మారుతూ ఉంటుంది సాధారణంగా. అందుకే శబ్దమంజరిని తీసుకొని శబ్దాలను బట్టీపట్టటం. తెలుగులో ఐతే విభక్తులు ఎక్కువగా విడిపదాలు. అందుచేత సంస్కృతంలో దీర్ఘంగా సమాసాలను తయారు చేయగలిగినట్లు తెలుగులో చేయటం కుదరదు. అందుచేత సంస్కృతంలోని క్లుప్తతను తెలుగులో అలాగే దిగుమతి చేయటం దుస్సాధ్యం. సంస్కృతంలో ఒకటి చిన్న వృత్తంలో ఉంది కదా దానిని తెలుగులో దైర్ఘ్యం పెంచకుండానే వ్రాసితీరాలి అనటం అన్యాయం.
విడివిడిపదాలతో తెలుగులో పద్యాలను కూర్చేక్రమంలో అనేకకారణాలవలన కొన్ని ఇతరపదాలనూ చేర్చి పద్యపు బిగింపు తప్పదు. కేవలం అవసరమైన పదాలనే ఏరుకోవాలన్న ఆశ మంచిదే కాని తరచుగా వాటిని ఇతరపదాలతో మాటువేయకుండా ఛందస్సులలో ఇరికించటం వీలుకాదు. ఇలా అదనంగా కనిపించిన పదాలను దండుగలు అని ఈసడించటం పొరపాటు. అదనపు పదాలవలన పద్యం బిగువు చెడుతున్నదా అన్నది చర్చనీయాంశం కావచ్చు కాని అదనపు పదాలు ఉండవచ్చా అన్నది కానే కాదు.
ఆమాటకు వస్తే సంస్కృతంలో కూడా ఇలా మాటువేయకుండా శ్లోకాలను అల్లటం కుదరదు. తరచుగా పాదపూరణాక్షరాలను వాడవలసి వస్తుంది. అందరికీ తెలిసిందే చకారాలను బిగించని శ్లోకాలే అరుదు. ద్రోణంచ భీష్మంచ జయద్రధంచ వగైరా శ్లోకాలు తెలియనిది ఎవరికి? అని. కాళిదాసు గారు వ్యాసుణ్ణి చకారకుక్షి అని ఆక్షేపించాడని ఒక ఐతిహ్యం. తు హి చ స్మ హ వై పాదపూరణే అని నానుడి. శ్లోకంలో ఒకోసారి ఒక అక్షరం మేర లోటువస్తే చ వేసేయటమే. మరి దండుగలు అని అంటున్నామా వాటిని? కవుల బాధలు కవులవి, ఛందోబధ్ధంగా వ్రాయటంలో ఉన్న బాధలు ముఖ్యంగా రెండు. ఛందస్సును ఒప్పించటం అందంగా రచించటం – ఈరెండూ తరచు పరస్పర విరుధ్ధమైన త్రోవల్లో ఉంటాయి. కవి ఏవో తిప్పలు పడి ఉభయతారకం చేయాలి మరి. చేయితిరిగిన కవికైతే అంతకష్టం కాదు తరచుగా. కాని ఎంతవారికైనా సరే పూరణపదాలూ పూరణాక్షరాలూ అస్సలు లేకుండా అసిధారావ్రతంగా రసవంతమైన కవిత్వం చెప్పటం సాధ్యం కాదు.
విమర్శకాగ్రేసరులు కాస్త సానుభూతితో ఆలోచించితే బాగుంటుంది. స్వల్పాంతరత్యశ్చ బహూపయోగాః. తత్యజ్యతే తన్నతు దూషణాయ అని ఒక సూక్తిని ఒక జ్యోతిష గ్రంథంలో చదివాను. నాకు సంస్కృతం రాదు. కాబట్టి సూక్తిని ఉటంకించటంలో కించిత్తుగా పొరపాటు ఉండవచ్చును. మన్నించాలి.
అలాగని, చచ్చీచెడీ ఏవో కొన్నికొన్ని మాటలను ఛందశ్చక్రంలో ఇరికించి హమ్మయ్య ఐపోయింది పద్యం అన్నట్లు కిట్టించిన పద్యాలను ఆక్షేపించవద్దని అనటం లేదు. ఛందస్సు ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే. కవి ప్రతిభతోనే పద్యం వస్తుంది.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
11/10/2024 11:29 am
నేను కూడా గత ఆగస్టు నెలలో ఈ చౌరాష్టకానికి అనువాదం ప్రయత్నించాను. సంస్కృత మూలంలో ఉన్న భావాలను, శబ్దాలను వీలైనంతవరకూ ఉపయోగించడం నాకు ప్రధానం కాబట్టి, సులభమైన రగడలతో అనువాదం ప్రయత్నించాను. దీన్ని ఆగస్టులో ఫేస్‌బుక్ మీద కామెంటుగా పోస్ట్ చేసాను:
వ్రజేప్రసిద్ధం నవనీత చోరం
గోపాంగనానాంచ దుకూలచోరం |
అనేక జన్మార్జిత పాప చోరం
చోరాగ్ర గణ్యం పురుషం నమామి || (1)
రేపల్లెలో తాను నవనీత చోరుండు
గోపాంగనల యెడ దుకూలముల చోరుండు
పాహియను వారికిని పాపాల చోరుండు
చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్!
శ్రీరాధికాయా హృదయస్య చోరం
నవాంబుదశ్యామలకాంతిచోరం .
పదాశ్రితానాం చ సమస్తచోరం
చోరాగ్రగణ్యం పురుషం నమామి. 2
శ్రీరాధికాసతికి హృదయాబ్జ చోరుండు
క్రొక్కారు మబ్బులకు కఱకాంతి చోరుండు
పాదాశ్రితులకెల్ల సకలార్థ చోరుండు
చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (2)
అకించనీకృత్య పదాశ్రితం యః
కరోతి భిక్షుం పథి గేహహీనం
కేనాప్యహో భీషణచౌర ఈదృగ్-
దృష్టఃశ్రుతో వా న జగత్త్రయేఽపి ..3..
అకించనులను జేయు ఆశ్రితావళినితడు
దారి భిక్షకుఁ జేయు దామోదరుండితడు
ఇటువంటి చోరుండు ముల్లోకమున లేడు
చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (3)
యదీయ నామాపి హరత్యశేషం
గిరిప్రసారాన్ అపి పాపరాశీన్ .
ఆశ్చర్యరూపో నను చౌర ఈదృగ్
దృష్టః శ్రుతో వా న మయా కదాపి .. 4..
ఎవరి నామము తలచ ఎడలించు పూర్తిగా
*పర్వతము వలెనున్న పాపరాశులనైన *
*అటువంటి చోరుణ్ని కనలేదు వినలేదు *
చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (4)
ధనం చ మానం చ తథేంద్రియాణి
ప్రాణాంశ్చ హృత్వా మమ సర్వమేవ .
పలాయసే కుత్ర ధృతోఽద్య చౌర
త్వం భక్తిదామ్నాసి మయా నిరుద్ధః .. 5..
ధనములను మానమును తస్కరించుటె గాక
పంచేద్రియముతోడ ప్రాణముల హరియించి
పారిపోయెదవెందు? భక్తితో బంధింతు!
చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (5)
ఛినత్సి ఘోరం యమపాశబంధం
భినత్సి భీమం భవపాశబంధం .
ఛినత్సి సర్వస్య సమస్తబంధం
నైవాత్మనో భక్తకృతం తు బంధం .. 6..
ఘోరమౌ యమపాశ బంధముల త్రెంపించి
జననమరణములన్న చక్రమును తప్పించి
భవబంధముల తేర్చు భక్తజన బాంధవుడు
చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (6)
మన్మానసే తామసరాశిఘోరే
కారాగృహే దుఃఖమయే నిబద్ధః .
లభస్వ హే చౌర! హరే! చిరాయ
స్వచౌర్యదోషోచితమేవ దండం .. 7..
నా మనసు లోనున్న అజ్ఞాన తిమిరంపు
కారాగృహమునందు నిను కట్టి బంధింతు
నీ చోర కృత్యాల కనువైన దండనే!
చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (7)
కారాగృహే వస సదా హృదయే మదీయే
మద్భక్తిపాశదృఢబంధననిశ్చలః సన్ .
త్వాం కృష్ణ హే! ప్రలయకోటిశతాంతరేఽపి
సర్వస్వచౌర! హృదయాన్ న హి మోచయామి .. 8..
నా మనసు చెరలోన వసియించు మెల్లప్పుడు
నా భక్తి పాశమను దృఢబంధనముతోడ
శౌరి నిను బంధింతు శతకోటి జన్మలకు
సకలాఘ చోరుండ! సాష్టాంగ దండముల్! (8)
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/09/2024 10:58 am
మొదటి శ్లోకానికి నేను ఉత్పలమాలను ఎంచుకున్నాను. దానిని వీరు చీల్చి చెండాడారు. వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం గురించి వారి వాదన వారిది. మూలం యధాతధంగా రాకపోవటమూ దీర్ఘవృత్తాన్ని ఎంచుకోవటమూ తత్కారణంగా కొన్ని కొత్తపదాలు చేరటమూ వంటివి వారికి నచ్చలేదు. వారి దృక్కోణం వారిది.
కాని వారు “మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది” అన్నారు. ఈమాట ఆశ్చర్యం కలిగించింది. నిజం చెప్పాలంటే కొంచెం బాధించింది.
దొంగిలె పాలువెన్నలను తొల్లిట నీతడు గొల్లపల్లెలన్
దొంగిలె గొల్లకన్నియలు తోయములాడెడు వేళ చీరలన్
దొంగతనంబుచేసె బహుధూర్తత నావగు పాపసంపదల్
దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద వీని కెప్పుడున్
అన్న ఈవృత్తం గానయోగ్యంగా లేదని వారు ఎలా భావించారో అర్ధం కాదు. క్లుప్తత వీడి దీర్ఘం అవటం వలన గానయోగ్యం కాకుండా పోయిందా? కొత్తపదాలతో పొడుగై పేలవమై గానయోగ్యం కాకుండా పోయిందా? దీర్ఘవృత్తాలు గానయోగ్యాలు కావనుకుంటే ఎవ్వనిచేజనించు పద్యం కూడా గానయోగ్యం కాదు కదా. తిరుపతివేంకట కవుల చెల్లియో చెల్లకో పద్యం అస్సలు గానయోగ్యం కాదు కదా? ఇక మందారమకరంద అంటూ సాగే సీసం ఐతే అస్సలు గానయోగ్యం కాకుండా పోవాలి కదా?
వీరిదృష్టిలో దండుగ గణాలు చేరాయి. సరే, అలా చేరితే అవి దైర్ఘ్యాన్ని ఆపాదించగలవు కాని పద్యాన్ని ఏకంగా గానయోగ్యం కాకుండా చేస్తాయా?
ఈపద్యం గానయోగ్యంగా ఉందని నావిశ్వాసం. నేను గాయకుడిని కాను. ఐతే పాడి మరీ ఋజువు చేయగలిగి ఉండేవాడి నేమో. మిగిలిన పద్యాలూ నాదృష్టిలో గానయోగ్యాలే. కావనుకుంటే నేను చేయగలిగినది లేదు.
దండుగ గణాలు అంటే ఒక సంగతి గుర్తుకు వస్తోంది కరుణశ్రీ గారు కుంతీకుమారి ఖండకావ్యంలో దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్ అంటారు. దిగటం అంటేక్రిందికి కాక పైకి కూడా ఉంటుందా? క్రిందికి అనటం దండుగే కదా. మెట్లమీదుగన్ అని మాత్రం ఎందుకు? మేడ దిగాలంటే మెట్లే దిగాలి కదా (అప్పట్లో లిఫ్టులు లేవు సుమా) కాబట్టి మెట్లమీదుగన్ అన్నది కూడా దండగే కదా. ఇలా పూరణకోసం పదాలు పడటం దండుగ గణాల వ్యవహారమే కదా. ఇలా లెక్కలు వేస్తూ పోయి కరుణశ్రీకి పద్యాలు వ్రాయటం చేతకాదనీ కుంతీకుమారి, పుష్పవిలాపమూ పేలవకవిత్వాలనీ అనటం చేయవచ్చునేమో. ఏమో నాకు తెలియదు. ఈశంకల వంకల డొంకల నుండి ఏకవి బ్రతికి బయటపడగలడో తెలియదు.
ఈ రచన నా సొంతం కాదు! గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/09/2024 6:20 am
ఇప్పుడు వ్రాస్తున్న మాటలు నాదగ్గర దాదాపుగా యాభైయేళ్ళుగా మురుగుతున్న మాటలు.
విశ్వనాథ వారి నవల ఒకటి ఉంది “బాణామతి” అని. తెన్నేటి హేమలత గారి నవల ఒకటి ఉంది “దెయ్యాలు లేవూ” అని.
ఎవరైనా ఈ రెండు పుస్తకాలను చదివితే అవి ఒకదానికి ఒకటి దాదాపు కార్బన్ కాపీల వంటివి అని స్పష్టంగానే తెలుస్తుంది.
ఇద్దరూ ఉద్దండులైన రచయితలు.వీరిలో ఎవరికీ మరొకరి నవలను దాదాపు యధాతధంగా వ్రాయవలసిన అగత్యం లేదు.కాని ఇలా ఎలా జరిగింది?
అదే నాకు అయోమయంగా అనిపిస్తుంది.
మరొకసారి ఈ రచనలను రెండింటినీ చదువుదామంటే నాకు అంతర్జాలంలో ఐతే కనబడటం లేదు. అవి సంపాదించగలిగితే ఏది ముందుగా వెలువడిందీ అన్నదైనా తెలుస్తుంది.
పుస్తక పరిచయం: సుదర్శనం గారికి… గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/09/2024 5:25 am
ఈమాట సంపాదకులకు విన్నపం.
దయచేసి ఇక్కడ పుస్తకముఖచిత్రాన్ని అడ్డంగా ముద్రించిన విషయాన్ని గమనించి సరిచేయవలసింది. ఇలా ఉండటం సుదర్శనం గారి పట్ల అపచారం అవునో కాదో నేను చెప్పవలసింది లేదు కాని అలా చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉందని మాత్రం చెప్పక తప్పదు.
ఈ ఏడుసంవత్సరాల కాలంలోనూ ఈవిషయం గమనికకు రాలేదంటే దాని అర్ధం ఈవ్యాసాన్ని పాఠకులు పట్టించుకోలేదనా? ఏమో!
[మా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు – సం.]
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/09/2024 2:21 am
చౌరాష్టకానువాదానికి యదుకులభూషణుల విమర్శ రమ్యంగా ఉంది.
నేను చేసినది చౌరాష్టకానికి స్వేచ్ఛానువాదం అని మనవి చేయటం జరిగింది.
ఒక భాష నుండి మరొక భాష లోనికి అనువదించటం లోని సాధకబాధకాలు తెలిసిన యదుకులభూషణులు అమూలకమైన మాటల నెత్తి చూపటమూ తప్పుబట్టటమూ కొంచెం అచ్చెరువు కలిగించింది. మూలం లోని పదాలను కాని తత్సమానాలను కాని ప్రయోగిస్తూ అలాగే భూలోకంలోని భావానికి న్యూనాతిరిక్తంగా ఏమీ లేకుండా మూలదైర్ఘ్యాన్నే పాటించుతూ అనువదించటం బహుకష్టం. పద్యం కృతకం అయిపోయే ప్రమాదం హెచ్చు.
మహాభారతాంధ్రీకరణం నాటి నుండి నేటిదాకా కవులు అనువాదంలో స్వేచ్ఛ తీసుకున్నారు. మక్కికిమక్కి అనువాదాలు కళగట్టినది తక్కువే కదా.
విషయాన్ని సందర్భానుసారంగా పెంచటం కొత్త విషయం కాదు కదా. పాల దొంగతనం వేమనగారే అంటించారు కదా కృష్ణుడికి గొల్ల యిండ్లపాలు కోరనేల అని. నేనేమీ కొత్తగా అన్నది లేదు.
ఇకపోతే విమర్శకులు నేను బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నానని అన్నారు. చాలా సంతోషం.
యదుకులభూషణులకు ధన్యవాదాలు.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/08/2024 8:56 am
నవంబరు రెండవ తారీఖున ఒక శర్మగారున్నూ ఐదున మరొక శర్మగారున్నూ మెచ్చినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు.
సాహిత్యంపై మాకు ఏ నిర్వచనాలు నిబంధనలు లేవని ఇంకెన్ని వేలసార్లు చెపుతూ ఉండాలో అని సంపాదకులు అన్నారు కాని ఆశర్మగారు ఈమాటను తరచుగా చదువుతూ ఉండకపోవచ్చు కాబట్టి వారికి తెలిసి ఉండకపోవచ్చునేమో.
దంతుర్తి వారు అసంపూర్తిగా ఉన్న నా పూతన ఖండ కావ్యాన్ని ఈమాటకి పంపి ప్రచురించండి పూర్తిగా, ఇదే సరైన సమయం అన్నారు. మంచిసలహా – అలాగే చేస్తాను త్వరలో. ఆపైన ఈమాటవారి యిష్టం.
మరణ మృదంగం గురించి Indra Prasad గారి అభిప్రాయం:
11/07/2024 2:14 pm
అనువాదం బావుంది. ఇంగ్లీష్ అనువాదానికి సరిపోలినట్లే కాకుండా, తెలుగు రచనలాగే ఉంది. గొప్ప కథే. నిజానికి టాల్‌స్టాయ్ అనువాదానికి అంతా తొందరగా లొంగే రచయిత కాదని నాకు ఇన్నాళ్ళు అనిపించేది. ఈ కథ కాస్త బెటర్ అనుకుంటా.
జీవితానికి, మృత్యువుకు మధ్య మనిషిపడే సంఘర్షణ కథలో ముఖ్యమైనదైనా, తనది కాని కష్టమూ సుఖమూ తనకి పట్టనట్టు ఉండే మానవ నైజాన్ని విపులంగా వర్ణిస్తుంది కథ.
కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
11/05/2024 5:49 pm
చాలా చక్కటి వ్యాసం రాసేరు వేమూరి వారు, ఎప్పటిలాగానే. ఎనభైల మధ్యలో న్యూరల్ నెట్స్ లో బులబులాగ్గా వేలుపెట్టి అప్పుడున్న కంప్యూటర్లతో ఉపయోగపడే ఫలితాలు రాబట్టలేక తూ నాబొడ్డు అనుకుని వేరే దారి చూసుకుని ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ చిన్న చినుకులా మొదలై ఇప్పుడు ఎంతో విస్తరించి మహోద్ధృత ప్రవాహంగా మారి పరవళ్లు తొక్కుతూ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్న Generative AI ని గుడ్లప్పగించి చూస్తున్న వాళ్లలో నేనూ ఒకణ్ణి ! (Protein Folding problem ని Google Deepmind వాళ్లు సాల్వ్ చేసింది కూడ Generative AI కి గుండెకాయ వంటి Transformer network ఆలోచనల్ని వాడే.) ఒకప్పటి industrial revolution లాటి మరో కొత్త అధ్యాయం మానవచరిత్రలో మొదలౌతున్నట్టు కనిపిస్తుంది దినదినాభివృద్ధి చెందుతున్న ఈ technology ని చూస్తుంటే. ఇది ఎటుగా పయనిస్తుందో బహుశ ఇప్పుడే ఎవరూ చెప్పలేరనుకుంటాను – వేమూరి వారు చెప్పినట్టు రెండు విభిన్న వర్గాలుగా మేధావులు విడిపోయినట్టున్నా it’s too early to make defendable predictions. కాని ఈ technology గురించి ఎంతోకొంత తెలుసుకోవటం ప్రతి వారికి అవసరం అని నా అభిప్రాయం – లేకపోతే వెనకబడిపోయే ప్రమాదం విస్పష్టం. కనుక దీనివల్ల మొత్తం మీద లాభమా నష్టమా అనే చర్చల కన్న దీన్ని ఎలా ఉపయోగించగలం, ఎలా వెనకబడకుండా ఉండగలం అని ఆలోచించటం ఉత్తమం. ప్రస్తుతం అమెరికా, చైనా నువ్వా నేనా అన్నట్టున్నాయి ఈ రంగంలో. మిగిలిన దేశాలు పక్కన నిలబడి చోద్యం చూస్తూ వుంటే ముందుముందు వీళ్లలో ఎవరో ఒకరి వెనక చేతులుకట్టుకు నిలబడవలసి వస్తుందనుకుంటాను.
నవంబర్ 2024 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:
11/05/2024 6:28 am
మీరు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది – పుస్తక సమీక్షలు, విమర్శలు ప్రచురించడం – మీ ధ్యేయాలు, ఆశయాలు ఇప్పటికే అందరికీ స్పష్టంగా తెలిసివచ్చాయి – ఇక కావలిసినదల్లా కార్యాచరణ; అమెరికాలో తెలుగును ఉద్ధరించడానికి ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరికీ అర్థం కాని చిన్న విషయం – భాషను, సాహిత్యాన్ని సజీవంగా ఉంచుకోవాలి అంటే సమీక్షలను, విమర్శలను విరివిగా వచ్చేలా ఒక యంత్రాంగాన్ని, వ్యవస్థను ఏర్పరచుకోవడం. కవిత్వంలో ఒక కవి స్థానాన్ని నిర్ణయించే, సాహిత్యంలో కథ స్థాయిని నిరూపించే, అనువాదాల గుణదోషాలను విచారించే -విమర్శ ద్వారానే అది సాధ్యం. గతంలో ఈ మార్గంలో నేను కొంత ప్రయత్నం చేసి ఉన్నాను – ఆ అనుభవంతో చెప్పగలను – తొలినాళ్ళలో అందరూ మీ ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేరు – సదరు కవి కీర్తికి కళంకం తెస్తున్నారనో, సదరు అనువాదకుడి కంచుఢక్కను పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నారనో వారి అనుచరశ్వానగణం దాడి చేయవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఇతరులకు భుజకీర్తులుగా, భజంత్రీలుగా మారే ‘సృజనకారుల’ సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకరం. ఎవరూ విమర్శలకు అతీతులు కారు. పుఠం పెట్టవలసిందే. వయసు, పదవి, ప్రచురించిన పుస్తకాల సంఖ్యా, తెచ్చుకొన్న లెక్కలేని అవార్డులు -ఇవేవి నహి నహి రక్షతి డుకృఞ్కరణే. మీరు కార్యాచరణ మొదలు పెట్టడం మంచిది. ఒంటి చేత్తో ఒకరు చేయగల పని కూడా పెద్ద పెద్ద పత్రికలు చేయలేక పోవడం క్షమార్హం కాదు. అట్టే సమయం లేదు – ఇరవై ఏళ్ళుగా చూస్తున్నా – ఈమాట ఈ విషయంలో ముందడుగు వేయలేదు అని చెప్పడానికి విచారిస్తున్నాను.
[పుస్తకాలు, కథలు చదివినవారు వాటిగురించి వ్రాయాలి. అలా సమీక్షలు, విమర్శలు, చర్చలతో నిండిన సాహిత్యవాతావరణం కావాలి. తెలుసు. ఈ చింత మాకూ ఉంది. ఈలోటు ఎలా పూడ్చాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. తరచుగా రచయితలను, విమర్శకులను సంప్రదిస్తూనే ఉన్నాం. సమీక్షలు, విమర్శావ్యాసాలు వ్రాయమని అభ్యర్ధిస్తూనే ఉన్నాం. ఇది అందరు రచయితలు, పాఠకులు కలిసి చేయవలసిన పని. విరివిగా చదివి సమీక్షలు ప్రతినెలా వ్రాయగల వారికోసం వెతుకుతూనే ఉన్నాం. – సం.]
కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/02/2024 10:16 am
మంచి వ్యాసం.
నోబెల్ కమిటీ వారు కంప్యూటర్ సైంటిస్టులకూ బహుమతిని ఇవ్వటం బాగుంది కాని కంప్యూటర్ సైన్సులో ఫిజిక్సూ కెమిస్ట్రీ కూడా అంతర్భాగాలన్నట్లుగా చేయటం నాకైతే బాగా అనిపించలేదు. కొన్నాళ్ళూ పోతే ఏదో ఒక సినిమాకు కూడా నోబెల్ బహుమతి రావచ్చును. ఏమో గుర్రం ఎగరా వచ్చు!! ఇకపోతే –
ఇదేదో రశ్మ్యుద్గారత లాగా నోరుతిరక్కుండా ఉందండీ.
ఆరడుగుల లోతు భూగర్భం ఏమిటండీ. మనవాళ్ళు బోరుపంపులే వేల అడుగుల లోతుకు వేసేస్తుంటేనూ. ఆరువేల అడుగుల లోతున అనండీ కనీసం…
[మనిషిని సమాధి చేసేది ఆరడగుల లోతులోనే. అదీ రచయిత ఉద్దేశ్యం – సం.]
పెద్దన్నయ్య, ప్రపంచం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/01/2024 3:01 pm
పెద్దన్నయ్య స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ కాదు అన్నారు. పొరపాటు. ఆయన ప్రవర్తన స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ ఐన వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో అలాగే ఉంది అక్షరాలా.
రమేష్ గారు అద్భుతమైన కథ అన్నారు కాని నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అద్భుతమైన నవలకు స్కెచ్. శర్క గారికి తీరికా ఓపికా ఉంటే పెద్దన్నయ్య అనో కర్మయోగి అనో పేరు పెట్టి ఈకథనానికి నవలారూపం ఇవ్వవచ్చును.
శర్మగారు దీనిని నవలారూపంలో వెలువరించితే చదువరులకు చాలామందికి భుజాలు తడుముకోవలసిన సంగతులు అనేకం తప్పక కనిపిస్తాయి.
ఇలా ఒక స్కెచ్ రూపంలోనే ఆలోచనలను రేకెత్తించే దీనికి నవలారూపం మరెంతగా ఆలోచనీయం అవుతుందో వేరే చెప్పనవసరం లేదు.
శర్మ గారికి అభినందనలు.
పంచేంద్రియాలు: 1. వాసన గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
10/31/2024 10:37 am
“నా చిన్నతనంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దీపావళి ప్రత్యేక సంచికలకి ‘కునేగా మరికుళందు’ అనే సెంటు రాసి అమ్మేవారు” అన్నారు.
నాకు ఆంధ్రపత్రిక ప్రత్యేకసంచికల గురించి తెలియదు కాని ఆంధ్రప్రభ ప్రత్యేక సంచికలకి ‘కునేగా మరికుళందు’ పరిమళం అద్దేవారని చక్కగా గుర్తుంది. ఐతే ఆంధ్రప్రభ ప్రత్యేక సంచిక ఆగష్టు పదిహేనుకు వచ్చేది జన్మదిన ప్రత్యేకసంచిక అన్న పేరుతో అని చాలాబాగా గుర్తు. ఆంధ్రప్రభ దీపావళి ప్రత్యేక సంచిక అంటూ ఒకటి వెలువరించేదా అని నాసందేహం. ఆంధ్రప్రభ వారు నవలల పోటీని ఉగాది సందర్భంగా ప్రకటించేవారనీ గుర్తు.
మీవ్యాసంలో మీరు శాస్త్రసాంకేతిక పదాలకు చేసిన తెలుగుసేత ఆకట్టుకుంది. మీ నిఘంటువును తప్పక పరిశీలించవలసిందే.
తెలుగులో శాస్త్రీయమైన అంశాలమీద వచ్చే రచనలు ఎప్పుడూ చాలా స్వల్పసంఖ్యలోనే ఉంటూ వస్తున్నాయి. నాచిన్నప్పుడు వేమరాజు భానుమూర్తి గారు వెలుగు ధ్వని అంటూ వ్రాసిన పుస్తకాలను చదివి చాలా చాలా ఆనందించే వాడిని. సృష్టికథ అనే పుస్తకం నాకు అప్పట్లో బహుమతిగా వచ్చింది. అదొకటీ మెదడు గురించి వ్రాసిన పుస్తకం ఒకటీ పడీపడీ చదివేవాడిని.
ఇలా శాస్త్రవిషయకమైన రచనలు విరివిగా తెలుగులో వస్తే ఎంతో బాగుంటుంది.
అజ్ఞాతవాసి గురించి శివకుమార శర్మ గారి అభిప్రాయం:
10/16/2024 10:46 pm
అన్న ఒక రచయిత చుట్టూ అల్లిన కథ. అహంలేని, కీర్తికాంక్షకి దూరంగా ఉండే రచయిత గూర్చి. అలాంటి వాళ్లు ఉండరని కాదు గానీ, వెబ్ పత్రికలు లేని కాలంలో కూడా శ్రీశ్రీ, దేవులపల్లి, ఆరుద్ర వంటి మహామహులకి బ్రహ్మరథం పట్టారు. వాళ్లని ప్రసంగాలకోసం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఆహ్వానించాయి. రెండు మహారచయితల/కవుల బృందాలు పత్రికా ముఖంగా చేసుకున్న యుద్ధాలగూర్చి విన్నాను కానీ, అది కనీసం అయిదు దశాబ్దాలకి పైగా వెనుక. ఎంత నిష్కర్షగా సంపాదకులకి సామాన్య పాఠకులు ఉత్తరాలు రాశారో గానీ, నేను పత్రికలు చదవడం మొదలయిన దగ్గర్నించి అచ్చులో పేరు చూసుకోవాలన్న తపనలే ఎక్కువ కనిపించాయి. అందుకే ఆ వారధి పోలిక అసమంజసం అనిపించింది. కానీ, అదే ఈ కథకి కీలకం.
అజ్ఞాతవాసి గురించి రమేశ్ బాఋ గారి అభిప్రాయం:
10/08/2024 10:14 pm
బాగుందండీ కథనం… కథ నేపథ్యంగా కొన్ని స్పష్టం చేసారు. “రాను రాను తెలుగు సాహిత్యం పాఠకులను పోగొట్టుకుంటోంది. ఒకప్పుడు పత్రికలు, ప్రచురణకర్తలే రచయితకి పాఠకులకి మధ్య వారధులు. నాకు తెలియని ఆ పాఠకులు నిర్మొహమాటస్తులు. నా కవితలలో అస్పష్టతని, కథలలో అర్థంకానితనాన్ని వివరిస్తూ వారినుంచి వచ్చే విమర్శలో నిజాయితీ వినిపించేది. ఎప్పుడైతే పాఠకులు దూరం అవుతారో, సెల్ఫ్ ప్రమోషన్, ఒకరినుండి ఇంకొకరు మెప్పు ఆశించడం, మొహమాటపు పొగడ్తలు, ఇవన్నీ రచయితలకి అదనపు బరువులు. అందుకే ఇకపైన ఈ రకమైన జీవితానికి దూరంగా వుండదలిచాను” ఇది నిజం… Self promotion ఇటీవల రచయితల్లో ఎక్కూవ అయ్యింది.
అక్టోబర్ 2024 గురించి దాసరి అమరేంద్ర గారి అభిప్రాయం:
10/05/2024 3:57 am
సాహిత్యం వైయక్తిక ప్రక్రియ అనిపించినా అది సామూహిక సామాజిక ప్రక్రియ. మనిషికి సాహిత్యం కళలు ప్రాథమిక అవసరాలు కావు. ఏ సమూహానికైనా తిండి గుడ్డలాంటి అవసరాలు తీరాకే కళాసృజన సాధ్యం.
*
సాహిత్య ప్రయోజనాలు అనేకం: మానసోల్లాసం, మానసిక వికాసం, వ్యవస్థ స్థిరీకరణ, నిరసన ప్రకటన, ప్రతిఘటన, పోరాటం – చరిత్రలోకి వెళితే ఇలా ఎన్నో ప్రయోజనాలు సాధించబడి కనిపిస్తాయి. ఈ ప్రయోజనాల్లో కొన్ని యథాతథస్థితిని కాపాడేవి. కొన్ని గతవైభవం కోరేవి. కొన్ని గతాన్నీ వర్తమానాన్నీ ప్రశ్నించి రేపటి మార్పుకు దారి వేసేవి.
*
గతమూ యథాస్థితీ కోసం రాసేవారి వెనుక శతాబ్దాల సాధన ఉంది. వ్యవస్థ తోడ్పాటు తప్పక ఉంటుంది. వారి వస్తువు ఎలాంటిదైనా శైలి శిల్పం లాంటి సాహితీ విలువలు పుష్కలంగా ఉంటాయి.
రేపటి కోసం రాసేవారిది ఏనాడైనా ఎదురీత. రాయడం అప్పుడే నేర్చుకొంటోన్న బృందమిది. జీవితమే వీరి కథా వస్తువు. పోరాటమే వీరి శైలి. ధిక్కారమే వీరి శిల్పం.
*
ఈమాట ఎవరిది? ఎవరికోసం?
మనకు స్పష్టత అవసరం.
మానసోల్లాసం, వికాసమే లక్ష్యమనీ, రచనలో పరిణత నిర్దుష్టతే ప్రామాణికమనీ ఈమాట అనుకుంటే – సరే… అలానే కానిద్దాం.
కానీ సాహిత్యానికి వేరే ప్రయోజనాలకోసం దగ్గర అయ్యే పాఠకులూ రచయితలూ ఉంటారనీ, వారి రచనల్లో మనమనుకొనే ప్రామాణికత ఉండక పోవచ్చనీ, అంతమాత్రం చేత అవి అరత్నాలు అయిపోవనీ ఈమాట గ్రహించడం ప్రాథమిక అవసరం. అగ్రవర్ణ సాహిత్యమూ అణచబడినవారి సాహిత్యమూ ఒకే స్థాయిలో ఉండాలనకోడం సమంజసం కాదు. అలాంటి సాహిత్యాన్ని నిరసించడం తగదు.
*
ఈ విషయంలో ‘ఆక్టోబరు 2024’ రచనలో ఈమాట మాటలు తూలింది. ఆలోచనను ఆవేశానికి పణంగా పెట్టింది. తానేమిటో ఈమాట తేల్చుకోడానికీ, తేల్చుకున్నాక అడుగులు సవరించుకోడానికీ ఇప్పటి చర్చ సరైన అవకాశం కలిగిస్తోంది. వినియోగించుకుందాం.
అమరేంద్ర
5 అక్టోబర్ 2024
[ఈమాట ఏ రకమైన సాహిత్యానికీ వ్యతిరేకి కాదని, సాహిత్యానికి ఎటువంటి హద్దులు, ఆంక్షలు, నిర్వచనాలు ఉండవు, ఉండకూడదు అని మా నిశ్చితాభిప్రాయమని, మరొక్కసారి స్పష్టం చేయవలసి ఉంది. “పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగలిగినది ఏదైనా మంచి సాహిత్యమే” అన్నది ఒక్కటే ఈమాట మాట. అదే సాహిత్యప్రయోజనం. సాహిత్యానికి వేరే ప్రమాణాలు ఇంకేమీ లేవు. సాహిత్యంగా మలచబడలేని వస్తువు ఏదీ లేదు. ప్రతీ రచనకు ఒకే ఆశయం ఉంటుంది. అది – ఆవేశమైనా, ఆహ్లాదమైనా, అసహ్యమైనా, ఇంకే అనుభవమైనా – పాఠకులలో స్పందన కలిగించడం.
“సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినవి సాహిత్య రత్నాలు కావు” అని ముందుమాటలో మేము అనలేదు. “సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి ‘వ్రాసినంత మాత్రాన’ అవి సాహిత్య రత్నాలయిపోవు” అని మాత్రమే అన్నాం. మమ్మల్ని నిందించిన వారెవరూ ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న అర్థభేదాన్ని గమనించలేదు – కారణాలు అనేకం. ఎవరికి తోచినట్టు వారు అర్థం చెప్పుకున్నారు. ఈ వాక్యానికి బదులు “బ్రాహ్మణుల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు” అని ఉదహరించి ఉంటే ఈ విపరీతార్థాలకు ఆస్కారం ఉండేది కాదని ఇప్పుడు కలిగిన అభిప్రాయం.
కథావస్తువు జీవితం అయినా, భ్రమ అయినా చదివించలేని సాహిత్యానికి ఏ ప్రయోజనం ఉంటుంది? అంటే కేవలం వస్తుబలం వల్లనే సాహిత్యప్రయోజనం చేకూరదు. అందువల్లే, వాక్యంపై శ్రద్ధ పెట్టండి, చదివించగలిగేలా వ్రాయండి అని పదేపదే చెప్తున్నాం. సాహితీ విలువలు పట్టుపడేదాకా వ్రాయకండి అని అనటం లేదు. వ్రాయండి, మీ ఇష్టానుసారం వ్రాయండి. కాని, వస్తువు వల్లనే మీ రచనకు విలువ వస్తుందన్న (సాహిత్య ప్రయోజనం చేకూరుతుందన్న) భ్రమలో ఉండకండి. వ్రాయండి, వ్రాసినది ఒకటికి పదిసార్లు చదువుకోండి. వ్రాసినది దిద్దుకోండి – అనే మేము అంటున్నది. వాక్యానికి శక్తి ఉంది. దానిని సరిగ్గా వినియోగించుకోవాలంటే వాక్య లక్షణం తెలియాలి. రచయితకు ఆవేశం మాత్రమే సరిపోదు, ఆలోచన కూడా అవసరం. నిర్జనమైన ఎడారిలో ఎంత బలంగా మీరు ధిక్కారస్వరం వినిపించినా ఏం ప్రయోజనం? ఎవరూ పూర్తిగా చదవలేని, చదివినా ఆ వస్తువుతో మమేకం కాలేని రచనతో ఏ సాహిత్యప్రయోజనం? రేపటికోసం రాస్తున్నవారు, ధిక్కారపోరాటాలే శైలీశిల్పాలయినవారు నిజంగా తమ సాహిత్యంతో సమాజంలో మార్పు తేగలగితే అంతకంటే కోరుకునేది ఎవరికీ ఏమీ ఉండదు, మాకంటే సంతోషించేవారు, ప్రోత్సహించేవారు ఇంకొకరు ఉండరు. ఏ గొంతుతో చెప్పినా, ఏ భాషలో చెప్పినా మేము ఎప్పుడూ చెప్తున్నది ఒకటే: సాహిత్యం కూడా ఒక కళ. దానికీ అభ్యాసం, పరిశ్రమ అవసరం. రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ ఉండాలన్నదే మా కోరిక, మా నమ్మకం. – సం.
తాక: అక్టోబరు 2024′ రచనలో ఈమాట మాటలు ‘తూలింది’ – ఈ విషయంలో కాదని; మనసాహిత్య వారసత్వసంపద అప్రస్తుతం, ఇప్పుడు చదవడం అనవసరం అని ప్రబలుతున్న ఒక ధోరణి పట్ల మాత్రమేనని గమనించమని విన్నపం.]
అక్టోబర్ 2024 గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
10/04/2024 2:24 pm
కీలకం అంతా ఇక్కడ ఉంది. మీవ్యాసంలోనూ, సమకాలీనసాహిత్యం విషయంలోనూ కీలకం అదేను.
ఒక మంచిరచనకు ఉండే ముఖ్యలక్షణాలలో మొదటిది చదివించగలగటం రెండవది ఆలోచన రేకెత్తించగలగటం. మూడవది దాని గురించి ఇతరులకు చెప్పాలని అనుకోవటం. ఈతూకపురాళ్ళు వేసి తూచండి.
సమకాలీనరచనలు ప్రజల మనస్సులకు ఎక్కుతున్న పక్షంలో వాటికి మంచి ఆదరణ ఉండి సాహిత్యరంగం కళకళలాడుతూ ఉండేది. ఆరచయితలకు కాసిని కాసుల గలగలలూ వినిపించేవి (వారూ బ్రతకాలిగా మరి). అలాంటిది స్వప్నంలో తప్ప వాస్తవజగత్తులో సాహిత్యకారులు చూడలేకుండా ఉన్నారే?
ఏవో అజెండాలతో బయలుదేరి రకరకాలవాదాల ప్రచారసాహిత్యం తయారీ ఫాక్టరీ కార్మికులలాగా రచయితలూ కవులూ కష్టపడి అచ్చుపోసి జనం మీద విసిరేసే చిన్న పెద్దా కరపత్రాల్లాంటి సో-కాల్డ్ ఆధునికసాహిత్యాన్ని పోగేసుకొని చదువుకొనే పాఠకులు ఎక్కువమంది ఉండటం కష్టమే.
ఏరంగు కళ్ళద్దంలో నుండి చూస్తే ఈ ప్రపంచం ఆరంగు పులుముకొని కనిపిస్తుందే కాని అది సత్యప్రపంచం కాదు కదా. ఈ ఇజాలూ వాదాల కళ్ళద్దాలను ప్రక్కనబెట్టి స్వఛ్చమనస్క్కులై తెలుగు రచయితలూ మంచి రచనలు చేయటం మొదలుపెట్టితే సాహిత్యరంగానికి మంచిరోజులు వస్తాయి. లేకుంటే లేదు.
అక్టోబర్ 2024 గురించి Anil ఆట్లూరి గారి అభిప్రాయం:
10/01/2024 8:39 pm
వామ్మో !
ఎంత ఆగ్రహం!
చి న
నిజమే కాని వాళ్ళు వినేటట్టు లేరు మరి!
ఆమె మొగుడు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
09/28/2024 2:00 pm
తిక్కపుట్టి తాను గడుపుతున్న జీవితం నుండి పారిపోవటం గురించిన కథ.
నిజానికి నిత్యమూ ఎంతో మందికి ఎన్నో కారణాలవలన తాము గడుపుతున్న జీవితాల నుండి పారిపోవాలన్న గాఢమైన సంకల్పం అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఐతే ఆసంకల్పం ఎంత తీవ్రంగా కలిగినా దానిలో చెప్పుకోదగినంత స్థిరత్వం కుదరక వారు పారిపోకుండా అవేజీవితాల్లో పడుంటున్నారు. ఆకోణంలో జరిగితే చదువరుల్లో కొందరైనా ఈచేతకాని వెధవ తమకంటే కొంచెం నయంగానే ప్రవర్తించి చివరకు తెగించి జీవితాన్నుండి పారిపోయాడు భలే అని ముచ్చటపడతారు. అదలా ఉంచితే పారిపోవటం అనేది ఎన్నటికీ నాయకలక్షణం కాదూ కాలేదూ కాబట్టి పారిపోయిన ఇతగాడి మీద చివరకు ఎక్కువమంది జాలిచూపుతారే కాని ఇతగాణ్ణి మాత్రం స్ఫూర్తిగా తీసుకొనే సాహసం చేయరు లెండి.
నిజం చెప్పాలంటే నేను మీరు నిజంగానే మీకథనాయకుడికి హఠాత్తుగా నాయకలక్షణాలు ప్రసాదించి తిరస్కరణలను తిరస్కరించి నిలబడే సమున్నతుణ్ణి చేసిపారేస్తారేమో కథాంతంలో అని దురాశపడ్డాను. అలాచేస్తే మరీ సాదాసీదా కథ ఐపోతుందీ రొటీన్ ముగింపు ఐపోతుందీ అనుకున్నారు కాని ఇలాంటి వాడు హీరో ఐపోవటం రొటీన్ కాదు కదా అని ఆలోచించారు కాదు కదా.
పోనీయండి.
ఒక జీవితం మనం కోరుకున్నట్లు సాగాలని లేదు.
ఒక కథ మనం అనుకున్నట్లు ఉండాలని లేదు.
మీ అసమర్ధుడి జీవితయాత్ర ఇలా ముగిసినందుకు అతగాడికి నాసానుభూతిని తెలియజేయండి మీకు ఎక్కడన్నా ఎప్పుడన్నా తారసపడితే!
Janaki’s Zen గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
09/03/2024 11:16 am
ఈ Janaki’s Zen కథలో సీత రాముడి వర్ణచిత్రాలు గీయటం, అందరికీ చూపటం ఈ పాఠకునికెందుకో గిట్టలేదు. మరి వీరెందుకో తన వర్ణచిత్రంతోనే ఇక్కడ, 8/17/24న ప్రవేశించారు. ఆ మరుసటి రోజు, ఈమాట పత్రికలో మరో అభిప్రాయ వేదికలోనూ అదే వర్ణచిత్ర ప్రదర్శన. అక్కడ వారు తమ పాత స్నేహితులతో సంభాషించినారు. అమెరికా పాత స్నేహితులు ఈయన్ని అన్ని సంవత్సరాల ఎడబాటు తర్వాత ఎలా గుర్తు పడతారు ఇప్పటి తన బొమ్మ చూపితే. అంతేగా మరి. అందువల్లే తన బహుపాతచిత్రంతో, ప్రవేశం ఐఉండాలి.
అక్కడనే, వారి మిత్రులతో (తద్వారా ఈమాట పాఠకులకూ) తామిప్పుడు ఫుల్ టైమ్ “రామస్మరణానందంలో” ఉన్నట్టు తెలిపారు.
మరి Janaki’s Zenలో – సీత రామస్మరణానందంలో ఎందుకు ఉండకూడదు! సీత రాముడు భార్యాభర్తలు. ఒకరియందు ఒకరు అనురాగం కలవారు. సీతకన్నా రాముడితో సన్నిహిత సంబంధం, సాన్నిధ్యం – తాడిగడప శ్యామల రావుకు సాధ్యమా? ఉందనుకుంటే ఎంత అవివేకం! కావాలనుకుంటే ఎంత దురాశ! What an encroachment! What a villainy!
Janaki’s Zen కథలో – రాక్షసుడు రావణుడే చూపలేదు అలాటి అసభ్యమైన చొరవ. సీతారాముల ప్రేమ గురించి తెలిశాక, రావణుడికి వారిని విడదీయబుద్ధి కాలేదు. అదే కరుణ అంటే! వాల్మీకి రామాయణ రచన ప్రతిపాదన అదే. ప్రేమజీవులను విడదీయవద్దు అని. అతడి కావ్యపు ఆశయం అదే. అంతేకాని సీతను చెట్టుకింద కూర్చోబెట్టి, ఆమె ఏడుస్తుంటే, గుడ్లప్పచెప్పి చూడమని, సీత అన్నం నీళ్ళూ లేకుండా పడి ఉంటే, తను మాత్రం సుష్టుగా తిని, సోఫాలెక్కి టి.వి. స్క్రీనుల మీద సుందరాకాండ చూసుకుంటూ ‘అబ్బా, నేనెంత సనాతనుడిని, ధార్మికుడిని’ అనుకుని కులుక్కోమని కాదు.
ఈ పాఠకుడికి కరుణ అంటే అర్థం తెలియదు. కరుణ అంటే sorrow, విషాదించటం మాత్రమే, చూచినవారు జాలిపడిపోయి, అందరూ గుంపుగా ఏడుసుకుంటూ కూర్చోటమని అని ఈయన అనుకుంటున్నాడు? ఎంత తప్పుడు ఆలోచన! కావ్యము, కల్పనలలోనైనా, అలంకారశాస్త్రం ఇలా అర్థం చేసుకోమన్నదా కరుణరసాన్ని! కరుణ అంటే compassion. Kindness. ఇతరుల బాధ నివారించటం. ఈయనకు అలాటి సుజ్ఞానం ఉన్నదా?
లేదు. వీరు, తన కీర్తనలు ఎవరో దొంగతనం చేసేశారని “వ్యసన పడి” సొంత బ్లాగు మూసేసి, వారి కల్పిత స్వబాధోపశమనంకోసం ఇక్కడకు తరలి వచ్చినారు. ఆ సూనృత వాక్యం వారే చెప్పినారు. ఉపశమనం వీరికి ఎలా వస్తుందంటే, ఇతరులను ఎగతాళి, వేళాకోళం చేస్తూ -ప ప పపాత అంటూ నత్తులు కొడుతూ, అది తప్పు ఇది తప్పు అని ఇక్కడ వీరంగం చేస్తే వస్తుంది. సీత ఏడుస్తూ అశోకవనంలో ఉంటే, వీరి దొంగబాధకు ఆమె శోకం మందు?
అలాటి పిచ్చి, తిక్క చేష్టలు ఇక్కడ కుదరదు కాక కుదరదు. ఈ కథలో, శ్రీరాముడి దయ చేతను నారూఢిగ సకల జనులు ఔరా యనగా – సీత రాముడు డ్యూయెట్లు పాడుకుంటారు. సంతోషంగా ఉంటారు.
కోతీ కోతీ ఎందుకు ఉన్నావు అంటే చక్కనమ్మను వెక్కిరించటానికి అన్నట్టు తన వర్ణచిత్రంతో వీరు ఇక్కడకు ప్రవేశించినారు. ఎలాగూ వచ్చారు కనుక వీరే అశోకవనంలో చెట్టుకింద సీత స్థానం భర్తీ చెయ్యవచ్చు. అటూ ఇటూ పోయేవారికి పాములు, పిడకలు అని పాతచెత్త బోగస్ కనికట్టు కబుర్లు చెప్పవచ్చును. శర్మ దంతుర్తి, ఈ నా వ్యాఖ్య ఆధారంగా, ‘అశోక వనంలో చెట్టుకింద తాడిగడప శ్యామల రావు’ అని సీక్వెల్ రాస్తారు. He is a fast writer. ‘పూతన’ మీద పద్యంతో మొదలుపెట్టి, పోతన భాగవతం లోని రసగుళికలు చూపగలిగిన రచయితకు అదెంత పని. అసలుకి, రాక్షసి పూతన చనుకట్టు మీద మోహం కలిగిన ఆ సంప్రదాయఛందోకవిశ్రేష్ఠుడు ఎవరో కదా!
మై గాడ్! సీత ఏడుస్తూనే ఉండాలిట! మై గాడ్! వాల్మీకి అలానే లిఖించాడుట! మై గాడ్! తాను రామ భక్తుడట! రాముడి ప్రియురాలి పైనే విద్వేషం! మై గాడ్!
¡No preocupes! Aquí hay una canción romántica.
En el mismo lugar,
En la misma cuarto
Al mismo tiempo;
Siempre alrededor
Cerca de mí.
Más cerca de mí.
Tocándome, entrando en mí
Dentro de mí
Juntos; uno para el otro.
Incluso cuando
Aparte de mí, Lejos de mí
¡Juntos para siempre! ¡Mi amor!
(Título: Un jardín sin lágrimas)
-Lyla
కరుణశ్రీ: తపోభంగము గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:
08/31/2024 3:31 am
చక్కని పరిశీలన. భావకవుల చాపల్యాన్ని బాగా పట్టుకొచ్చారు. పరిమితమైన శబ్ద శక్తితో, భాషా పటిమతో రాయప్రోలు, కరుణశ్రీలు పద్యాలు రాయగలరేమో గానీ వాటిలో కలికానిక్కూడా కవిత్వం కనిపించదు. ప్రధానంగా వీరు ఉపాధ్యాయులు – ఇరువురూ నిర్దుష్టంగా వచనం రాయలేరు. ఉట్టికెక్కలేనమ్మ – స్వర్గానికి అన్నట్టు ఉంటాయి వీరి పద్యాలు. ‘ఏ మంచి పూవులన్ ప్రేమించినావో, నీ తల్లి నిను మోసె కనక గర్భమున’ అన్నప్పుడు మాత్రం రాయప్రోలు ప్రతిభ ద్యోతకమవుతుంది, అంతవరకే. వృత్తాలు , జాతులు అంటే ‘భగవంతుడా’ అని గోచి సవరించుకొని లేచి పోవాలి అనిపిస్తుంది. మా నాన్న స్నేహితులు కరుణశ్రీ ‘అమర్ ఖయ్యాం’ పద్యాలు ఆంధ్రజ్యోతిలో వస్తున్నప్పుడు ‘ఆహా ఓహో’ అనేవారు, నాకు బొత్తిగా రుచించేవి కావు. శ్రీనాథుడు దరులొరుసుకొని ప్రవహించే ఒక గంగా నది. జవజీవాలు ఉట్టిపడే ఆ పద్యాలూ, శాస్త్రస్పర్శచే గట్టి పడిన వచనం – మరెవ్వరిలో చూడము.
“Approach love and cooking with reckless abandon.” దలైలామా అన్నట్టు చెప్పబడే వాక్యం, టీకా టిప్పణితో ఈ సందర్భంలో ఉటంకించవలసిందే.
‘Approach love and cooking with reckless abandon’ is a quote attributed to the Dalai Lama. The phrase ‘reckless abandon’ means to give oneself to a passion or impulse without regard for convention, appearances, or risk. When applied to love, it can mean to love with a whole heart, without considering outside influences.
శ్రీనాథుడిలో ఉన్న దొమ్మ పొగరు (reckless abandon) నిఖార్సైన ఏ కవిలోనైనా గమనించవచ్చు. మన భావకవుల్లో – ముఖ్యంగా వీరిద్దరిలో లేనిదే అది. నేను భావకవిని కావున ‘చాలా అందంగా’ చెప్పాలి అన్న కట్టుబాటులోనే ఉంది అసలు గొడవ. శ్రీనాథుడిది కవిత్వంలో రాజమార్గం – దిమ్మసా కొట్టిన హై రోడ్డు!
శ్రీనాథుడికి కట్టుబాట్ల మీద బొత్తిగా ఖాతిరీ లేదు. కావునే ‘అంత ప్రాధాన్యం లేని విధంగా’ (as a matter of fact తీరున) చెప్పేశాడు. లోతుగా ఆలోచిస్తే ‘అంత ప్రాధాన్యం లేని విధంగా’ అంటే అలవోకగా కవిత్వం రాయటం నిజంగా కష్టం.
3. పద్యానికీ, రాగానికీ కుదురుతుందా? గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
08/18/2024 5:01 pm
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి రచించిన వ్యాసాలన్నీ నేను చదువుతూ వస్తున్నాను. 1994 లో ప్రచురించబడిన ‘అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం’ అన్న వీరి వ్యాసాల సంకలనం కూడా డిజిటల్ లైబ్రరీలో చదివాను.
వీరు చాలా చక్కని, చిక్కని ఆలోచన చేస్తారు. పద్యం, సంగీతం, నాట్యం ఒకదానితో ఒకటి కలపనే కూడదు అన్న మొండిపట్టు నుండి, మళ్ళీ అలాగే చిత్రలేఖనం, శిల్పం, వాస్తు (architecture) కలపనే గూడదు అనే మొండిపట్టు దాకా, చక్కని సమర్ధనలతోనే వాదం సాగిస్తారు. చాలా పరిశీలన గలవారే. చాలా నిజాలున్నవి చెప్పిన వాటిలో. ఒప్పుకోటానికి నాకు మహా ఇష్టంగా ఉంటుంది ఈయన చెపుతున్నంత సేపూ.
ఐతే వివిధ కళల మిశ్రణాలు, దేశదేశాలలో, ప్రాంత ప్రాంతానికీ, తేడాలతో విని, చూసి, ఆయా కళాకారుల నుండి, వీలైనప్పుడు లెసన్స్ తీసుకుంటూ, వేర్వేరు వేదికల మీద పలువురి ఉపన్యాసాలు అవీ వింటూ, ఆ పాఠాలు, ప్రదర్శనలు తర్వాత ఎప్పుడైనా చర్చలలో పాల్గొంటూ, వస్తుంటాను. నేను చదివినవి చూసినని కొన్నాళ్ళకు ఎన్నో గుర్తుండవు. ఐనప్పటికీ, ఎప్పటికప్పుడే, ఎన్నో మనసు రంజించే సంఘటనలు, దృశ్యాలు. రోజూ ఒకే ఇల్లు, ఒకే రాష్ట్రం, ఒకే దేశం, గోడమీద ఒకటే కేలండర్ బొమ్మ, వ్యాసపీట మీద ఒకటే సద్గ్రంథంగా, నా జీవితమైతే గడవటం లేదు. వనజభవుండు నెన్నొసట వ్రాసిన వ్రాలు. He has his own style. What can I say about it?
వ్యాసకర్త శ్రీపాద గోపాలకృష్ణమూర్తి -ఫిజిక్స్‌లో లండన్ నుండి డాక్టరేట్ తీసుకున్నట్టు చదివాను. వీరు స్వయంగా కళాకారులు కారనుకుంటాను. తాముగా క్రియేటివిటీ చూపలేదు. అంటే వీరు రాసిన పొయట్రీ, కథ, నాటకం గాని లేవు. ఉన్నవా? ఉంటే చెప్పండి, చదువుతాను. అలాగే వీరు చెక్కిన బొమ్మలు కాని, కట్టిన, కట్టించిన భవంతులు కాని లేవు. అందువల్ల వీరిని ఒక కళాప్రేక్షక, శ్రోత, విమర్శకుడిగానే, నేను చదువుకోవాలి.
మరైతే Creative streak, spark ఉన్నవారు, ఇట్టి వారి అభిరుచులకు, అభిప్రాయాలకు లోబడి ఉండరు. ఈ వ్యాసం ఈ మేగజీన్‌లో చదివినప్పుడు, contrastingగా నాకు స్ఫురించిన వ్యక్తి E.T.A. Hoffmann. And the book – ‘His musical writings: Kreisleriana, The poet and the Composer, Music criticism’ – Cambridge university press 1989. The book is edited, annotated, and introduced by David Charlton. Translated by Martin Clarke.
Hoffmann in his forty and odd years of life, became noted for his wild, ghastly ghost stories, painting, musical composition, opera writing, theater management, screen settings. He did all in his short lifespan, moving from place to place as circumstances dictate. Besides from time to time, doing a daytime job as a lawyer and later holding a judgeship.
This book is extremely tough for me to read. Intros, as well as Hoffmann’s own writings. It is about 476 pages. Still, I wanted to get a taste of this 18,19-century legend. I wanted to see what he had to say about the arts, from his own experiences.
I am reading and re reading a few such as, -his musical sufferings, thoughts about great value of music, Beethoven’s instrumental music, extremely random thoughts, the complete machinist, the music hater, the poet and composer, review of Beethoven’s Fifth symphony, letters on music in Berlin. Mozart’s Don Giovanni etc. etc.
As a small sample, About Mozart’s opera he says: (Excerpt from page 106, Kreisleriana) –
“Mozart is said to have repeatedly put off composing the overture, long after the opera itself had been finished, and even on the day before the performance, when his worried friends thought he was at last sitting at his desk, to have cheerfully gone off for a walk. Finally, on the very day of the performance, early in the morning, he supposedly composed the overture in a few hours, so that the parts were carried to the theatre with the ink still wet. Where upon everyone was bowled over with amazement and admiration that Mozart was able to compose so quickly: and yet one could accord the same admiration to any competent and rapid copyist. Do you not think the composer had for a long time been carrying Don Giovanni in his head? His profoundest work for his friends – for people, that is, who understood his innermost feelings? And that it was all laid out and complete in his mind in all its wonderfully distinctive detail, just as if it had been cast in a perfect mold? And do you not think that this overture of all overtures, in which every aspect of the opera is so brilliantly and vividly suggested, was not just as complete as the whole work before its great composer took up his pen to write it out…
What can I say, I simply loved the above.
So, I will read on as much as I can from this book, still thinking of the Telugu essayist and his fine observations fondly.
Hasta luego amigos!
-Lyla
ముష్టి పలురకములు గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
08/18/2024 3:21 am
సంకా రామకృష్ణ గారికి ధన్యవాదాలు ఇంకా నన్ను మరువనందుకు. అప్పటి పరిచయాలు ఇంకా అప్పుడప్పుడు మదిలో మెదలుతూనే ఉంటాయండీ నాకున్నూ. కాని చాలా వరకు కాంటాక్ట్స్ తెగిపోయాయి. అమెరికాలో ఉన్నప్పుడు పిల్లలమర్రి రామకృష్ణ గారితో (వారి అమ్మాయి పేరు అరవింద. అప్పట్లో ఒకసారి ఆమె ఆంజనేయుడి గురించి స్త్తోత్రం కావాలి అని కాబోలు అడిగింది. ఆవిడ ఏం చేస్తున్నారో ఇప్పుడు) మంచి మెయిల్ పరిచయం ఉండేదా ఇప్పుడు ఆయనను కాంటాక్ట్ చేయలేను. మెయిల్ ఐడి పోయింది మరి. అలాగే చాలా కాంటాక్ట్స్ పోయాయండీ.
ఈమాట మాగజైన్ అపుడపుడూ చదువుతూ ఉంటాను. బాగుంటుంది. కాని వారు ఎపుడైనా రాముణ్ణి తక్కువ చేసేలా ధ్వనించే అంశాలు ప్రచురిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. అందుకని వారితో ఆమధ్యన ఇక ఈమాటను చూడనని చెప్పేసాను. కాని అడపాదడపా ఏదో శోధినిలో వచ్చిన వ్యాఖ్యను చూసి వస్తూ ఉంటాను ఈమాటకు.
కొద్ది రోజుల క్రిందటివరకూ బ్లాగుల్లో వ్రాసుకుంటూ ఉండే వాడిని. అక్కడి నా రామకీర్తనలు చోరీ అవుతున్నాయని తెలిసి వ్యసనపడి బ్లాగును మూసేసాను. భగవదనుగ్రహం ఉంటే, తెలుగువాళ్ళు కోరుకుంటే, అవి పుస్తకరూపంలో వస్తే వస్తాయి. లేకపోతే లేదు. మహామహా నాలుగులక్షల (అక్షరాల?) సింహగిరివచనాలే మనతెలుగునేల నుండి మాయం అయ్యాయి. నా రెండున్నరవేల రామకీర్తనలు మాయం ఐతే అదొక పెద్దవిషయం కాదు. ఐనా రామకీర్తనలు ధారాళంగా వస్తూనే ఉంటాయనుకోండి అది నాప్రవృత్తి కనుక. అంతకంటే మరేమీ విశేషం ఉందనుకోను.
ఇప్పుడు రామస్మరణానందంలో ఉన్నాను. ఇతరాలు పెద్దగా పట్టించుకోవటం లేదండి.
సంపాదకులకు విన్నపం. ఈవ్యాఖ్యను మీరు ప్రచురించలేకపోతే నాకు ఏమీ ఇబ్బంది లేదండీ. మీకు అనుగ్రహం ఉంటే ఈవ్యాఖ్యను సంకా రామకృష్ణ గారికి మంపగలిగితే మాత్రం చాలు కృతజ్ణుడిని.
Janaki’s Zen గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
08/17/2024 2:14 am
శ్యామలగారు అన్నది నిజమే తనది సంప్రదాయిక కవిత్వం అని లైలా గారు చెప్పుకోలేదు. ఆవిడ తప్పు లేదు. సంప్రదాయిక కవిత్వం అనే విభాగంలో ప్రచురించటం పత్రిక సంపాదకులు చేసిన తప్పు అని నా ఉద్దేశం. ఈమధ్య కాలంలో సంప్రదాయం అన్నమాటకు కొత్త అర్ధం ఏదైనా వచ్చిందేమో మరి నాకు తెలియదు. అలాగైతే క్షంతవ్యుడిని.
రామాయణం ఒక పపపపాతకథ రాముడు ఒక ఆపాతకథలో హీరో మాత్రం అని ఈదేశం అనుకోవటం లేదండీ. మీరలా అనుకుంటున్నారేమో. లైలాగారు అలా అనుకుంటున్నారేమో. ఒకవేళ ఈకాలంలో అలాగే అనుకొని తీరాలేమో. నాకు తెలియదు. రామాయణమూ రాముడూ ఈజాతి సంపదలు. వాటి విలువలను నవ్యత కోసం నాశనం చేయటం హర్షణీయం కాదు. ఇది నాపాతచింతకాయపచ్చడి భావం అని ఈకాలం వాళ్ళు అంటారేమో మరి.
కీచకుడు మహాజ్ఞాని అని ఒకాయన తన సినిమాలో అంటాడు. రావణుడి వద్దనే సీత సుఖంగా ఉంది అని ఒకడు అంటాడు. రావణుడు మహాత్ముడు అని కొందరు కథలూ కావ్యాలూ అల్లుతారు.
ఇదంతా మన సంస్కృతిలో ఒకభాగం గొప్పదనం అంటారు మీలాంటి విజ్ఞులు. నేనలా అనుకోలేనండీ.
అవును లెండి. వాల్మీకి కాని రాముడు కాని కోర్టులో కేసువేయరు కదా. ఇక మనిష్టమే కాబోలు.
మనలో అందరమూ హింసను వ్యతిరేకస్తాం. కాని హింసకు పెద్దపీటవేసే సినీమాలు ఎగబడి చూస్తాం.
శ్రీరామనవమి ఓదండం పారేస్తే రాముడికి మముట్టచెప్పవలసిన గౌరవం పారేసినట్టే అవుతుంది. మిగతారోజులు రాముడిని గురించి ఎలాగైనా మాట్లాడవచ్చును. అవసరం ఐతే రాముడిపై రావణుడి విజయం అనీ అల్లవచ్చును. మన సంస్కృతి గొప్పది కదా. ఫరవాలేదు. ఇదేనంటారా మంచిమాట. సంతోషం.
[ఈమాటలో సంప్రదాయిక కవిత్వం అన్న విభాగం లేదు. పద్యసాహిత్యం అన్న కేటగిరీ ఉంది. ఛందోబద్ధమైనదే పద్యం అన్న నిర్వచనం మాకు లేదు. ఈ కేటగిరీలు కేవలం శోధనకు, మా నిర్వహణకూ సహకరించడం కోసమ్ పెట్టుకున్నవే తప్ప వాటికి ఏ రకమైన సాహిత్యప్రయోజనమూ లేదు. అందుకే ఏప్రిల్ 2019 సంచికనుంచీ అవి కనిపించకుండా చేశాం. చూ. ఏప్రిల్ 2019 ముందుమాట. -సం.]
Janaki’s Zen గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
08/17/2024 1:22 am
లైలా గారు రామాయణ పాత్రలను తీసుకున్నారు. రామాయణకథను త్రోసిరాజన్నారు. ఇది సమంజసమా?
మూలకథకు కానీ ఆందులోని పాత్రలకు కానీ స్వరూపస్వభావాలను మార్చకుండా చక్కగా కల్పనలు చేసుకోవటం హర్షణీయం అవుతుంది కాని తదన్యవికారకల్పనాకేళి నిస్సందేహంగా ఆక్షేపణీయం.
ఒకరొక కథను చెబుతారు. అది కేవలకల్పనాకథ కావచ్చును. ఆద్యసత్కథ కావచ్చును. రామాయణ మహాభారత కథలు ఇతిహాసాలు. అనగా అవి నిజంగా ఎలా జరిగాయో ఆలాగే గ్రంథస్థం చేయబడ్డాయి. ఇది ఈదేశంలో సనాతనధర్మవిశ్వాసం కల అశేషప్రజానీకపు నమ్మకం. మూలకథారచయితకు గౌరవం తగ్గించేలా కల్పనలు చేయటం సమంజసమా?
లైలాగారు అలా కాదూ రావణుడు ఒక పురుషోత్తముడూ వాల్మీకి చెప్పినది తప్పు అంటారు. సమంజసమా?
ఒకవేళ రామాయణం కేవలం కవికల్పన అన్నా సరే ఒక కవి యొక్క ప్రసిధ్ధరచనలోని కథనూ పాత్రలనూ మార్చి వ్రాయటం సమంజసమా?
రావణుడిని ఆకాసానికి ఎత్తటం కోసం రాముణ్ణి ఒక మహాముచ్చటగొలిపే అందమైన మగబొమ్మ అంతే అని చెప్పటం సమంజసమా?
శ్రీమద్రామాయణమహాకావ్యం లోని సీత లంకలో దుఃఖంలో మునిగిపోయి రావణుణ్ణి అక్షరాలా తృణీకరించి ఎప్పుడు రాముడు.వచ్చి రక్షిస్తాడా అని దీనంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అదంతా తప్పూ అక్కడ లంకలో సీత మహదానందంగా గెంతులు వేస్తూ ఉందని వ్రాయటం ఏమంత సమజసమైన కల్పన అంటారు? ఈ వికారమైన కల్పనకు విజ్ఞతకల చదువరులు ఆనందంతో పులకరించి పోతారా?
దురాలోచనతో లైలాగారు కల్పనలు చేసారు అనుకోను. కాని అనుచిత కల్పనయే.
దూరదృష్టి లేక పత్రికవారు ఏదో కొత్తదనం ఐతే చాలునని అనాలోచితంగా ప్రచురించారని భావిస్తున్నాను.
Janaki’s Zen గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
08/06/2024 10:12 am
ఈ పేజీ లింకును చూడండి https://eemaata.com/em/category/features/classical-verse అని కదా ఉంది. మహాశయులారా, ఈ Janaki’s Zen అన్న ఇంగ్లీషు పేరు పెట్టుకొన్న తెలుగు రచనలో classical-verse అనగా సంప్రదాయికఛందస్సు ఉన్నదా అని అడుగుతున్నాను. నా అజ్ణానాన్ని మన్నించి తెలిసినవారు చెప్పగలరని ప్రార్ధన. నేను literary values అన్న దానిని గురించి అడగటం లేదు. అది చూచేవారి దృక్కోణం మీద ఆధారపడి ఉంటుందని అనవచ్చును. ముఖ్యంగా ఇతరవిషయాలు ప్రభావితం చేస్తే చేయవచ్చును లేకపోతే లేదు. కాని ఛందస్సు అన్నది అలా కాదు కదా, అదెక్కడుందీ అన్నది నా ప్రశ్న / అనుమానం / ఆశ్చర్యం వగైరా…
Janaki’s Zen గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
08/06/2024 9:25 am
ఏనాటి రాముడు? ఏనాటి రావణుడు?వాల్మీకో లోకమో రాముడు మంచివాడనచ్చు. మనం చూడొచ్చామా? ఇప్పుడు రావణుడు గొప్పవాడంటే, పోనీ అతనూ రాముడంత గొప్పవాడంటే, లేదా రాముడి కంటే గొప్పవాడంటే? బాగుంటుంది కదా?
ఆధునికత అంటే అదే. కొత్తగా ఆలోచించాలి. ఇదే కదా నేటి వాముపక్షభావజాలప్రేరిత నవకవీశ్వరుల యొక్క విమర్శకాగ్రేసరుల యొక్క ఆలోచనా ధోరణి? తప్పా ఒప్పా అంటే మనకేమి లెక్క? రాముడు వచ్చి దెబ్బలాడతాడా? వాల్మీకి అడగొస్తాడా?
బాగుందండీ ఈ కొత్తదనపు చిత్రం.
హిట్లర్ చాలా మానవతావాది మహోన్నతుడు అని ఒక నాటకం వ్రాస్తే మీరు వేసుకుంటారా? ఆహా. తెలుగులో ఏదో వ్రాస్తే అంతర్జాతీయంగా అల్లరయ్యేంత సీన్ లేదు అని ఒకవేళ మీరు ఆలోచిస్తారేమో — కావచ్చును. కానీ, మరి నేను రేపు గాడ్సే గొప్పవాడూ అని గాంధీకంటే కూడా అని ఒక నాటకం వ్రాసి పంపితే అది మీరు ప్రచురించగలరా? (కచ్చితంగా మీరు నిరాకరిస్తారు – లిటరరీవాల్యూస్ లేవనో రాజకీయకోణంలో ఉన్నవి వేయమనో సదుపాయమైన సాకు తప్పకుండా మీరు చూపుతారు అని నమ్మవచ్చును కదా?)
రావణుడిని పైకెత్తి మరీ రాముణ్ణి తగ్గించో దూషించో వ్రాస్తే, ఈసనాతనధర్మం అంటే పడి చచ్చేవాళ్ళు ఐకమత్యం లేకపోవటం వల్ల మీతో కొట్లాడలేకపోవచ్చును. అది మీకు లైసెన్సుగా పనికి రావచ్చును. కాని గాడ్సేని హీరోను చేసి గాంధీ తప్పులుపట్టే రచనను మీరు అచ్చుకొడితే మన రాజకీయప్రపంచం ఊరుకుంటుందా? అప్పుడు జరిగే రగడకు మీరు సిధ్ధం కాగలరా? ముమ్మాటికీ అందుకు మీరు సిధ్ధంగా ఉండరని చెప్పటానికి రాకెట్ సైన్సు పీహెడీ అక్కర్లేదు కదా.
ఆధునికత పేర దయచేసి పెడధోరణులని ప్రోత్సహించవద్దని మనవి.
Janaki’s Zen గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
08/06/2024 9:02 am
ఇది ఒక పెడధోరణి రచన.
మూలకథను కాని ఆకథలోని లోని పాత్రలను కాని వాటిస్వభావాలను కాని ఇలా వక్రీకరించి వ్రాయటం చాలా ఆసమంజసం. ఎంతమాత్రం హర్షణీయం కాదు.
రావణ నరక కీచకాదులు లోకోత్తరపుణ్యశీలురని నిరూపించటం వలన ప్రజలను గందరగోళానికి గురిచేయటం మించి ఏమి ప్రయోజనం కలుగుతుంది?
అలాగని కవులకు కల్పనాస్వాతంత్ర్యం లేదని ఆనటం లేదు. భవభూతి ఉత్తరరామచరిత్ర అంతా కల్పనయే యేకో రసః కరుణ ఏవ అని బ్రహ్మాండంగా చేసాడు. కాని పాత్రలను తలక్రిందులుగా చూపలేదే. కథను కాదని కొత్త కథను చేయలేదే.
ఔచిత్యభంగంగా వ్రాసి కవిస్వాతంత్ర్యం అని అనటం కుదరదు.
ఆగస్ట్ 2024 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/04/2024 3:22 pm
ఈ మాట సంపాదకులకి తెలుగు సాహిత్య సమావేశాలపై కించిత్ సదభిప్రాయం కూడా లేదనిపిస్తోంది. వారన్నట్లు సాహిత్యం సామూహిక ప్రక్రియ కాదన్న మాట నిజమే; పెంపొందిన సాంకేతిక సౌకర్యాలని ప్రచారాలకీ పైరవీలకీ వాడుకునేవారు పెరిగి ఉండొచ్చు. కాని, ఎన్ని లోపాలతో కూడుకున్నా, సాహితీ సమావేశాల మూలంగా సాహిత్యం చదివేవాళ్ళు పెరుగుతారు, కొత్త రచయితలకి చెయి తిరిగిన రచయితలతో పరిచయాలు కలిగే అవకాశం ఉంది; వాటివలన కలిగే ప్రయోజనాలని కొట్టివెయ్యకూడదు.
నేను సాహితీ సమావేశానికంటూ వెళ్ళి పన్నెండేళ్లవుతోంది; దానిని పెట్టింది కూడా నేనే. జంపాల చౌదరి గారు పాపినేని శివశంకర్ గారు వాళ్ళమ్మాయి ని చూడటానికి మా ఊరు వచ్చారంటే నేను శివశంకర్ గారిని మొదటి సారిగా కలుసుకున్నాను. ఆయన అప్పుడే ప్రచురించిన పుస్తకాన్ని, “తల్లీ! నిన్ను దలంచి: అందాల తెలుగు పద్యాల లోవెలుగులు,” నాకిస్తే చదివి, దాంట్లోని పద్యాల మాధుర్యం గురించి ఓ ప్రసంగం ఇప్పిద్దామని కుతూహలపడితే ఆయన సరేనన్నారు. నేను దగ్గర్లో ఉన్న Redmond Regional Library లో ఓ హాలు బుక్ చేసి, ఆహ్వాన పత్రికని చుట్టుపక్కల మన దేశ కూరగాయల దుకాణాలలో, రెస్టారెంట్లలో పెట్టి, తెలిసిన వాళ్ళకి చెప్పాను. సమావేశం సమయానికి తినుబండారాలతో సహా వెళ్ళాను. శివశంకర్ గారు చక్కని ప్రసంగం చేశారు. ఆ సమావేశం మూలంగా నాకిప్పటికీ గుర్తుకొచ్చే పద్యం మాత్రం ఇది:
To be a boxer, or not to be there
at all. O Muse, where are our teeming crowds?
Twelve people in the room, eight seats to spare
it’s time to start this cultural affair.
Half came inside because it started raining,
the rest are relatives. O Muse.
The women here would love to rant and rave,
but that’s for boxing. Here they must behave.
Dante’s Infemo is ringside nowadays.
Likewise his Paradise. O Muse.
Oh, not to be a boxer but a poet,
one sentenced to hard shelleying for life,
for lack of muscles forced to show the world
the sonnet that may make the high-school reading lists
with luck. O Muse,
O bobtailed angel, Pegasus.
In the first row, a sweet old man’s soft snore:
he dreams his wife’s alive again. What’s more,
she’s making him that tart she used to bake.
Aflame, but carefully-don’t burn his cake!
we start to read. O Muse.
– “Poetry Reading,” by Wislawa Szymborska. Translated by Stanislaw Baranczak and Clare Cavanagh.
కొడవళ్ళ హనుమంతరావు
ముష్టి పలురకములు గురించి Madhav గారి అభిప్రాయం:
07/29/2024 4:00 pm
“ఒరే, ఇక వ్యాసుడికి పట్టరాని కోపం వచ్చింది. తాళలేని ఆకలి, కళ్ళు చీకట్లు కమ్ముతున్నై. చేతిలో భిక్షాపాత్రను ఎత్తి కొట్టాడు, ఎలా? మామూలుగా కాదు. శతథా భిన్నంబులై. ముక్కలు ముక్కలైపోయింది అది… చూశా? క్ష-ప్రాస కేవలం ఇలాంటి విపరీతపు సందర్భాల్లోనే వాడతారు…” అంటూ నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ గుర్తొచ్చింది, ఇక్కడి చర్చ వ్యాసుడు, కాశీ, శాపం మీదకు పోగానే. ఆ పద్యం అప్పుడే మర్చిపోయాను కాని, కొన్నేళ్ళ క్రితం, భైరవభట్ల కామేశ్వరరావుగారి పుణ్యమా అని మళ్ళీ తెలుసుకున్నాను. ఆ పద్యం ఇదీ. ఇప్పటికీ చదువుతుంటే వ్యాసుడి మనఃస్థితి కళ్ళకు కట్టినట్టే ఉంది నాకైతే.
కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుదిత దుష్క్రోధాంధకారంబునన్
జక్షుల్ రెండును జిమ్మచీకటులుగా సంరంభ శుంభద్గతిన్
బ్రేక్షచ్ఛాత్రులు భీతిబొంద గడునుద్రేకించి హట్టంబునన్
భిక్షాపాత్రము రాతిమీద శతధా భిన్నంబుగా వైచితిన్
కొడవళ్ళగారు ఇందాకే వర్ణించారు ఆ చీవాట్లను.
మాధవ్
ముష్టి పలురకములు గురించి VSTSayee గారి అభిప్రాయం:
07/29/2024 2:57 pm
హనుమంతరావుగారు:
ఈజీవనవృత్తిని అలవాటు పడ్డట్టుగా చూడటం సమంజసం కాదనుకొంటాను.
అన్నం వండుకుతింటుంటే – ‘కౌపీనసంరక్షణార్థం’ మాదిరి – (లింగార్చనంబు కల్పించటం, పంచాక్షరంబు జపంబుచేయటం తనకోసమే అనుకున్నా) శిష్యతతికి శివధర్మములు చెప్పటం, పురాణము చెప్పటం ఇవన్నీ అటకెక్కవా!
వీరిలాంటి గురువులకు/అధ్యాపకులకు భృతి సమాజమే కల్పించాలి.
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
ముష్టి పలురకములు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/28/2024 12:45 am
వేలూరి గారూ,
మీ సూచన మేరకు నేనివాళ వ్యాసుడు కాశి మీద కోపించిన కథ చదివాను – ముగ్గురు పండితుల సాయంతో [1][2][3]. మీరు పూర్తిగా శివుడి పక్షాన ఉన్నారేమోనని అనుమానంతో వ్యాసుని తరఫున వకాల్తా తీసుకొని ఆయనకి కొంత న్యాయం చేయడానికీ ప్రయత్నం.
మీసంగతేమోకాని నాకు ఓపూట పస్తు ఉంటే కళ్ళు తిరిగి శోష వస్తుంది. మరి రెండు రోజులు (అగస్త్యుడితో, భీమేశ్వర పురాణంలో, ఏడు రోజులంటాడు) కడుపు కాలితే వ్యాసుడేం చెయ్యాలి? శివుడీ దిక్కుమాలిన పరీక్ష పెట్టడం ఎంతవరకు న్యాయం? వ్యాసుడు కోపంలో అనరాని మాటలన్న మాట నిజమే:
“ధన మదంబును వేదవిద్యామదంబు
మోక్షలక్ష్మీ మదంబును ముదిరికాదె?
కాశికాపట్టణంబున కరుణ లేక
బ్రాహ్మణులు నను నిటు భంగపరిచి రనచు.” – కాశి: 7-156.
వారి మదానికి చికిత్స చెయ్యాలని సంకల్పించాడు, శపింప పూనుకొన్నాడు:
“ధనము లేకుండెదరు మూడు తరములందు
మూడు తరముల చెడుగాక మోక్షలక్ష్మి
విద్యయును మూడు తరముల వెడలవలయు
పంచజనులకు కాశికాపట్టణమున.” కాశి: 7-158.
మీరు ఇక్కడే వ్యాసుడు crossed the line అనొచ్చు ; కాని, శపింపడానికి చెయ్యి రాలేదు:
“అని శపింపగ పూను నయ్యవసరమున
నేమి చెప్పుదునో సంయమీంద్ర వంద్య!
యుదిలగొని కంపమందుచు నుండె గాని
శాపజాలమందుకో కేలు సాగదయ్యె.” భీ.పు. 2-109.
అంతలో ఓ మంజులభాషిణి అడ్డుకొంది. (“వేనలి పాటపాట నర వెండ్రుకతో తిలతండులాన్వయశ్రీ,” అంటే అక్కడక్కడ నెరసిన వెంట్రుకలతో నువ్వులు బియ్యపు గింజలు కలిసినట్లుగా నట – రమ్యమైన పార్వతి కొప్పు వర్ణన.)
పార్వతి నానా చివాట్లు పెట్టింది:
“ఆ కంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా
లేకున్నం గడునంగలార్చెదవు మేలే? లెస్స! శాంతుండవే!
నీ కంటేన్ మతిహీనులే కటకటా! నీవార ముష్టింపచుల్
శాకాహారులు కంద భోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్.” కాశి. 7-163.
ఆవిడన్నది కొంతవరకు నిజమే. ఎంతమంది వడ్లు దంచుకొని అన్నం వండుకు తినడంలేదు, ఆకులు దుంపలు తినే వాళ్ళు లేరా. కాని ఓ జీవనవృత్తికి అలవాటుపడ్డ వాణ్ణి హఠాత్తుగా వేరే మార్గం చూసుకోమనడం ఎంతవరకు సమంజసం?
వ్యాసుడికీ శిష్యులకీ భోజనం వడ్డించింది; కరివేపాకు నుండి గడ్డ పెరుగు దాకా రెండు పేజీలకు పైగా శ్రీనాథుడు భోజనవైభవాన్ని వర్ణిస్తాడు. కడుపు నిండింది కదా, విను అని మరలా బుద్ధి చెప్తుంది – “క్రోధంబు ఫలమె నిర్మల బోధమునకు?”:
“ఎట్టు పురాణాముల్ పదియునెన్మిది జెప్పితి వెట్టు వేదముల్
గట్టితి వేర్పరించి? నుడికారము సొంపెసలార భారతం
బెట్టు రచించితీవు? ఋషి వెట్టయి? నొక్క దినంబు మాత్రలోఁ
బొట్టకులేక తిట్టెదవు పుణ్యగుణంబులరాశి కాశినన్?” కాశి. 7-194.
భీమేశ్వర పురాణము లో పార్వతి వ్యాసుడి పట్ల కొంత సానుభూతితో అంటుంది:
“క్రొన్నెల పువ్వుదాల్చునకుఁగూరిమి భోగ పురంధ్రి కక్కటా
యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టి కోపమే
లన్న! ఘటించెదో మునికులాగ్రణి! నిక్కమువో “బుభుక్షితః
కిన్నకరోతిపాప” మను కేవల నీతి దలంచి చూడగన్.” భీ.పు. 2-117.
అవునులే, “ఆకలితో ఉన్నవాడు ఏపాపానకైనా ఒడిగట్టుతాడన్న” నీతి ఉంది కదా, అని. విశ్వనాథ: “ఈ మాట ఎంత విచిత్రముగా నున్నది. మానవులు రాజ్యములు సిద్ధాంతములు నేటి సర్వ నాగరికతయు నొక్కమాటలో చెప్పినట్లున్నదే!”
త్రినేత్రుడు “కాశినుండంగ నర్హుండు కాడు వీడు, వెడలిపొమ్మను, మాటలు వేయినేల?” అని పరుషంగా మాట్లాడి బహిష్కరిస్తాడు:
“శాపమిచ్చెదనని యనాచార సరణి
నడుగు వెట్టినవాడ వహంకరించి
పొమ్ము నిర్భాగ్య! మాయూరి పొలము వెడలి
యెచటికేన్ శిష్యులును నీవు నీక్షణంబు.” భీ.పు. 2-153.
వెళ్ళకపోతే నీమొహం రాతితో చితగ్గొడతానని వినతగని మాటలంటాడు శివుడు.
“వడి విడువక యివ్వడువున
నుడుపతి మకుటుండు చెవులకొనరని నుడుగుల్
నొడివిన నే నయ్యురువుర
యడుగులబడి కాశి వెడలి యరిగెడు వేళన్.” భీ.పు. 2-155.
పార్వతి, “భయపడకు, నీకు నేనున్నాను, నువు దక్షారామము వెళ్ళు, నీకు శుభములు కలుగుతాయంటే,” ఇలా వచ్చాను అని అగస్త్యుని తో చెప్పి:
“అనవధానత యావగింజంత సూవె
పర్వతంబంత యపరాధ భరము కొలిపి
కాశి వెడలంగ మొత్తిన గాసిఁబొంది
తిరుగుచున్నాడ నిదియేను దిక్కుమాలి.” భీ.పు. 2-158.
“కడు దయాళురు దేవతా గణము లెల్లఁ;
గాలభైరవు చిత్తంబు కఠినపాక
మీరసము పెద్దడుంఠి విఘ్నేశ్వరునకుఁ
గాశి మనబోంట్ల కెల్లను గాని బ్రతుకు.” భీ.పు. 2-159.
విశ్వనాథ:
“ఈ పద్యము చాల చిత్రమైన పద్యము. కాశిలో సర్వదేవతలు కలరు. అందరు దయావంతులట! ఈ మాటలో పార్వతీదేవి యున్నది. … కాలభైరవుని చెప్పెను. డుంఠిని చెప్పెను. ఒకటి చెప్పకుండ వదిలిపెట్టెను. ఆ వదలిపెట్టినది శివునియొక్క లక్షణము. ఆయన చాల కోపియనుట. ఆయన ఆవగింజంత యశ్రద్ధను పర్వతమంత జేయునని చెప్పినాడు కదా!”
“మనమందరము ఋషులము. తపస్సు చేయుదుము. అప్పుడప్పుడు కోపము వచ్చును. మనమెవ్వరినైన శపింతుము. ఇవతల మనమాడినది యాట. పాడినది పాట. ఆ కాశిలో మనకట్లు కుదరదు. పైన శివుడున్నాడు. మనము చేసినపని యాయన కిష్టమగునో కాదో! కానిచో మన బ్రతుకులు బండలెక్కినట్లే. మన మొగములు రాచట్లు మీద రాపించును.”
“ఇట్టి వలపోతయంతయు నీ రెండు పద్యముల నిండ నున్నది. ఈ పద్యముల లోనిదంతయు ధ్వని. ఇట్లు వ్రాయుట చాల కష్టము. తన మనోభావములన్నియు చెప్పుటకు వీలు లేదు. మనసేమో బాధపడుచున్నది.. ఒకటి రెండు మాటలకన్న నెక్కువ చెప్పరాదు. తాను చెప్పదలచుకున్న దా రెండు మాటల వలన వ్యక్తము కావలయును ఇంతియే.”
‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ …’ పద్యంలో చెప్పినట్లు పార్వతి చూపించినట్లు “కరుణ ముఖ్యం”.
చివరగా, “The religion of one age is the literary entertainment of the next.” — Emerson
ఇవాళ శ్రీనాథుని చదివింపచేసినందుకు ధన్యవాదములతో,
కొడవళ్ళ హనుమంతరావు
[1] శ్రీనాథ విరచిత “శ్రీ కాశీఖండము,” వ్యాఖ్యాత శ్రీ మలంపల్లి శరభేశ్వర శర్మ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 2018.
[2] శ్రీనాథ మహాకవి విరచిత “శ్రీ భీమేశ్వర పురాణము,” వ్యాఖ్యాత డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ. 1997.
[3] “కావ్య పరీమళము,” విశ్వనాథ విమర్శ గ్రంథనిధి – IV, విశ్వనాథ సత్యనారాయణ.
చంద్రికాపరిణయంలోని యమకాలంకారాలు గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
07/06/2024 3:34 pm
తుల్యస్వరవ్యంజనసహితమైన రెండువర్ణములు అవ్యపేతముగ (వెనువెంటనే) భిన్నార్థములతో ఆవృత్తినందిన అది అవ్యపేతసూక్ష్మయమకమని చెప్పుకొన్నాం. ద్వివర్ణఛేకానుప్రాసమునకు తుల్యస్వరత్వముగాని, భిన్నార్థత్వముండవలెనను నియమము లేదు. ఇదియే ఛేకానుప్రాసమునకు అవ్యపేతసూక్ష్మయమకమునకు భేదము. ఉదాహరణకు చంద్రికాపరిణయంలోని ఈక్రింది పద్యంలో ‘సుచంద్రుఁ జంద్రిక’ అన్నచోట అర్థభేద మున్నను చంద్రు, చంద్రి పదములకు స్వరసామ్యము లేకుండుటచే నది ఛేకానుప్రాసమౌతుంది కాని యమకం గాదు:
మ. జననాథేంద్రు సుచంద్రఁ జంద్రిక వరింప న్నేఁడుగా మత్కృతా
తనుపుణ్యంబు ఫలించె నంచు ముద మాత్మన్గాంచి పాంచాలభూ
వనితావల్లభమౌళి వేగ మహిదేవశ్రేణి రావించి శో
భనలగ్నం బలరాత్రివేళ ఘటియింపం జేసె నప్పట్టునన్.
చలమచర్ల రంగాచార్యులవారి ఆంధ్రప్రతాపరుద్రీయం లో ఛేకానుప్రాసమున కీక్రింది ఉదాహరణ మీయబడినది.
కం. ధర నీకరము కరము శ్రీ
కరమో రాజన్య! జన్య ఖండిత పరభూ
వర! వరగుణభూషణ! భా
స్కరసన్నిభ! పుడమిఁ దాల్చి కావుము రుద్రా!
ఈపద్యంలో గల జన్య,జన్య, వర,వర అను జంటలు అవ్యవహితసమానవ్యంజనస్వరములతో గూడి యుండటయే కాక భిన్నార్థములలో పూర్వసమాసాంతమున, పరసమాసాదిలో నున్నవి. ఈలక్షణములచే నీపద్యము ముక్తపదగ్రస్తయమకాలంకారమున కుదాహరణ మగుచున్నది కాని ఛేకానుప్రాసమునకు గాదు.
కావ్యాలంకారసంగ్రహములో రామరాజభూషణు డిచ్చిన ఛేకానుప్రాసోదాహరణమును పరిశీలించిన సన్నిధానం సూర్యనారాయణశాస్త్రిగారు సైతం పూర్ణవ్యంజనస్వరావృత్తులున్నచోట యమకమని, అట్లు గాక కేవలము వ్యంజనయుగ్మమున కావృత్తి యున్నచో అది ఛేకానుప్రాసమని, ఇది సాహిత్యదర్పణకారు డిచ్చిన ‘స్వరూపము తోడను, క్రమముతోడను వ్యంజనసంఘము నొకతూరి ఆవృత్తి చేసిన అది ఛేకానుప్రాసము’ – అను లక్షణముకు సరిగా నున్నదని తెల్పినారు. ఇక్కడ వ్యంజనమనగా సంయుక్తవ్యంజనము సైత మని అర్థము. ఇట్టి వ్యంజన సంఘములో రెంటికంటె ఎక్కువ అక్షరములు గూడ ఉండవచ్చును. కాని విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో రెండు వ్యంజనముల అవ్యవహితావృత్తికే దీనిని చెప్పినాడు.
ఆలిస్ మన్రో గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/04/2024 6:36 pm
సవరించవలసిన అచ్చుతప్పులు: నోబెల్ వచ్చింది 1913లో కాదు, 2013 లో. కోవలెన్‌స్కీ లో, న్ కి బదులు వ్ ఉండాలి.
పోయిన సంవత్సరం విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడా, వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో చెప్పుకోదగ్గవాటిల్లో మన్రో పుస్తకాల షాపొకటని తెలిసింది.
వేలూరి వారి వ్యాసం నిడివి తక్కువైనా, ఊరించి, మన్రో కథలు చదివింపచేస్తుంది. గొప్ప కథకులని చెకోవ్ తో పోల్చడం సాధారణమేమో, నోబెల్ వచ్చిన సందర్భంగా”Alice Munro, Our Chekhov,” అని James Wood, పొగిడాడు (The New Yorker, October 10, 2013).
ఈ మధ్య ఓ మిత్రుడు, తనకు కాలేజీ రోజుల్లో మిక్కిలిగా నచ్చిన నవల, “చివరకు మిగిలేది,” ఇపుడు రిటైర్ అయింతర్వాత తిరిగి చదివితే చాలా బోర్ కొట్టింది, బుచ్చిబాబు అంతులేని ఉపమానాలతో ఊదరకొట్టేస్తాడు అని వాపోయాడు. నేనందుకు: బుచ్చిబాబు రచనలలో వర్ణనలెక్కువ; నవలలో ఇందిర చనిపోయే దృశ్యం: “పడమటి ఆకాశం మంటలో పడి సూర్యుడు దగ్ధమైపోయాడు. నుసై మేఘాలు కొట్టుకుపోతున్నాయి. ప్రకృతి బాధతో చీకటైంది. పాకచుట్టూ పెనవేసుకుని గాలి మూలుగుతుంది. టెలిగ్రాఫ్ స్తంభంపై కాకి ఏకాంతంగా ఏడుస్తోంది.” వస్తువుకి అనవసరమైనవి కథలో ఉండకూడదన్న చెకోవ్ లాంటి వాళ్ళతో బుచ్చిబాబు ఏకీభవించడు – “కట్టె, కొట్టె, తెచ్చె,” లా తయారవుతుందని. “చెకోవ్ పద్ధతి కథ, ఇసుక మీద కెరటం దిగవిడిచిన చారలాంటిది. నాకది తృప్తి నివ్వదు. కథ, కెరటంలా కనబడాలి. ఆ కెరటం వెనక సముద్రం హోరు వినబడాలి”. [1]
వేలూరి గారు చివర్లో ప్రస్తావించిన “The Bear Came Over the Mountain,” కథ ప్రారంభంలో, “He thought maybe she was joking when she proposed to him, on a cold bright day on the beach at Port Stanley. Sand was stinging their faces and the waves delivered crashing loads of gravel at their feet.” బుచ్చిబాబు చివర అలా ఒక్క వాక్యంతో వర్ణన వదిలేవాడు కాదేమో.
“మన్రో స్త్రీవాది అవునో కాదో తెలుసుకోవాలంటే టూమచ్ హాపీనెస్: స్టోరీస్ (2009) చదవాలి. అందులో ముఖ్యంగా రోజ్ అనే పేదపిల్ల, తెలివైన పిల్ల కథ,” అన్నారు కాని ఆ కథ పేరు ఇవ్వలేదు. అలాంటి కథ నాదగ్గరున్న సంపుటిలో లేదు; అది “What Do You Think You Are?” అనీ, లేక “The Beggar Maid” అనీ వచ్చిన గొలుసు కథ అని వికీపేడియా లో ఉంది.
ఇంతకీ నేనీ వ్యాఖ్య వ్రాయడానికి ముఖ్య కారణం, “Too Much Happiness,” అన్న కథ. మేడం క్యూరీ కి ముందర పేరుగాంచిన మహిళా శాస్త్రవేత్త ఎవరో ఎంతమందికి తెలుసు? Steven Strogatz పుస్తకం [2] చదివేదాకా ప్రపంచంలోకెల్లా లెక్కల్లో డాక్టరేట్ సంపాదించిన మొదటి మహిళ Kovalevsky అని నాకు తెలియదు.
“ఆడవాళ్ళు తమకున్న కొద్ది శక్తిని చదువులకి ధారపోస్తే ఇక పిల్లల్ని పెంచడానికి ఏమీ మిగలదు,” అన్న వింత వాదనలు చేసిన స్పెన్సర్ లాంటి తత్త్వవేత్తలతో వాదించి, ఆ కాలపు రచయితలు, శాస్త్రవేత్తలు, విప్లవకారుల తో సంబంధాలు పెట్టుకొని, కులీన కుటుంబంలో పుట్టి, ఓ జిప్సీ లాగా మనుగడ సాగించిన మహిళ. చదువుకోసం వేరే దేశం వెళ్ళడానికి బూటకపు పెళ్ళి చేసుకొని, కొన్నేళ్ళ తర్వాత అతనితో కాస్త సంసారం సాగించి, ఓ పిల్లను కని, భర్తతో విడాకులు తీసుకొని, అతడంతలోనే ఆత్మహత్య చేసుకుంటే క్షోభించి, తమ్ముడితో సరైన సంబంధం లేక, ఉన్న ఒక్క అక్కా చనిపోతే దగ్గర వాళ్ళు లేక, మధ్యలో రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ కి లోబడి ఆస్తి అంతా హరాయించుకుపోయి, ఎట్టకేలకు ప్రొఫెసర్ గిరీ సంపాదించి, అర్థాంతరంగా జబ్బున పడి, హఠాత్తుగా చనిపోయిన ఆవిడ కథకి మన్రో “Too Much Happiness” అన్న పేరు ఎందుకు పెట్టిందో నాకర్థం కాలేదు. “Little Sparrow” లో అవి ఆవిడ చివరి మాటలంటే నమ్మశక్యం కాలేదు. బహుశా మన్రో వ్యంగభావంతో పెట్టిందా?
పూర్తి కథ తెలుసుకోవాలంటే Ann Koblitz వ్రాసిన జీవిత చరిత్ర [3] చదవదగ్గది.
Koblitz ends her book with an episode where a Rusisan woman, Liubov Murakhina, suffering from domestic abuse, writes to Kovalevskaia for help and Kovalevskaia was sympathetic and immediately responded with practical help:
“I am especially happy,” Liubov wrote to Kovalevskaia, “because this time I was not mistaken [in my judgment of people]. I assumed that a woman who has devoted herself entirely to the service of science and has achieved such brilliant results ought to be a true human being as well.”
“Perhaps Murakhina, who called herself an “unregenerate idealist,” was mistaken about the necessary connection between service to science and kindness to women like herself. In Kovalevskaia’s case, however, Liubov’s confidence was not misplaced. Sofia Kovalevskaia combined mathematical creativity with concern for others and awareness of social and political issues. Her friends, intimates, and fellow scientists would remember her for her human qualities as well as her mathematical expertise and success as the first woman accepted as a colleague in an all-male profession.”
It’s still a male-dominated profession, but thanks to the pioneers like Kovalevskaia, many women survive and even thrive, so cheers to the WIT: Women in Theory (https://www.youtube.com/watch?v=4Wl-3kadvgw).
కొడవళ్ళ హనుమంతరావు
[1] “కథా-దాని కమామీషు,” బుచ్చిబాబు సాహిత్యవ్యాసాలు, మొదటి సంపుటం.
[2] “Infinite Powers: How Calculus Reveals the Secrets of the Universe,” Steven Strogatz, 2019.
[3] “A Convergence of Lives: Sofia Kovalevskaia – Scientist, Writer, Revolutionary,” Ann Koblitz, 1993, Lives of Women in Science series.
[అచ్చుతప్పులు సవరించాము. చూపినందుకు ధన్యవాదాలు. — సం. ]
చంద్రికాపరిణయంలోని యమకాలంకారాలు గురించి డా. నల్లపనేని విజయలక్ష్మి గారి అభిప్రాయం:
07/04/2024 1:24 am
సర్!
నమస్తే! చక్కని వ్యాసం. అవ్యపేత సూక్ష్మ యమకానికి, ఛేకానుప్రాసాలంకారానికి గల భేదాన్ని తెలుపగలరు.
మరల రామాయణంబదేల… గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
07/02/2024 11:04 pm
సురేశ్‌గారు తెల్పిన క్రౌంచపక్షి అంటే sarus crane అని నిర్ధారణ చేసినారనే అంశం నాకు నూతనోత్కంఠను రేకెత్తించడంవల్ల ఆ sarus crane యొక్క చాలా విస్తృతమైన వికిపీడియాను అంతర్జాలంలో నేను చూచినాను. అందులో హిందీలో దీని పేరు ‘సారస్’ అంటారనీ, దాని మూలంగానే భారతదేశంలోని ఆంగ్లేయభటులు ఈపక్షికి sarus crane అని నామకరణం చేసినారని, ఇదియే వాల్మికి పేర్కొన్న క్రౌంచపక్షి యని ఈ క్రింది వాక్యముల నందులో వ్రాసినారు.
‘The common name sarus is from the Hindi name (sāras) for the species. The Hindi word is derived from the Sanskrit word sarasa for the “lake bird”, (sometimes corrupted to sārhans). British soldiers in colonial India who hunted the birds corrupted the name to serious or even cyrus.’
‘The species is venerated in India, and legend has it that the poet Valmiki cursed a hunter for killing a sarus crane and was then inspired to write the epic Ramayana’
కాని క్రౌంచపక్షి, సారసపక్షి అనేవి వేర్వేరు పక్షులని అమరకోశం తెలుపుతూ ఉన్నది. లోగడ నేను కొంతభాగమే పేర్కొన్న అమరకోశంలోని పూర్తిపాఠమిది: ‘క్రుఙ్ క్రౌంచోఽథ బకః కహ్వః పుష్కరాహ్వస్తు సారసః’
అనగా, క్రుఙ్, క్రౌంచ పదాలు క్రౌంచపక్షికిని, బకః, కహ్వ అనే పదాలు మఱొక పక్షికిని (దీనికి తెలుగులో వక్కుకొంగ అని పేరు), పుష్కరాహ్వః, సారసః అనే పదాలు సారసపక్షికిని పేర్లని ఈశ్లోకార్థం.ఈ సారసపక్షికే తెలుగులో బెగ్గురుపక్షి అని పేరు. దీని వర్ణనలు ప్రబంధములలో తరచుగా నున్నవి. ఇట్లంతవిశ్వసనీయమైన అమరకోశం ప్రకారం క్రౌంచపక్షి సారసపక్షిని బోలినదైనను, సారసపక్షికంటె వేరైన పక్షియే అని తోచుచున్నది. ఒకవేళ హిందీవారు పొరపాటున క్రౌంచపక్షినే సారసమని వ్యవహరించి ఉంటే క్రౌంచపక్షిని sarus crane అనడానికి వీలుంది. కాని నాదగ్గర నున్న హిందీ, తెలుగు నిఘంటువులో సారసపదం క్రౌంచపదానికి పర్యాయపదంగా పేర్కొన బడలేదు, క్రౌంచ్=క్రౌంచపక్షి అని, సారస్=హంసవంటి ఒక పక్షి అని అర్థాలు వ్రాసినారు. అందుచేత క్రౌంచపక్షిని sarus crane గా గుర్తించినారనడం కొంతవఱకు అనుమానాస్పదంగానే ఉంది.
భ్రాంతి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
06/12/2024 1:50 pm
“పాఠకుణ్ణి ఆలోచించేలా చెయ్యాలనుకుంటే కథకు “భ్రాంతి” అని పేరుపెట్టకూడదు.” -శివకుమార శర్మ
2023 అక్టోబరు, నవంబరు నెలల్లోనేమో, ఈమాట పత్రికలోనే కొన్ని వింత సంఘటనలు జరిగాయి. ఒక రచయిత్రి ఆమెకు డెత్ త్రెట్స్ వచ్చాయని, అందువల్ల తన రచనను పత్రికనుండి తొలగించమని పత్రిక యాజమాన్యాన్ని కోరినందున, ఆమె రాసిన ‘నేత్రోన్మీలనం’ అన్న కథను ‘ఈమాట’ పత్రిక నుండి తొలగించారు. ఆ విషయం పత్రిక ఎడిటర్ చెప్పినందునే పాఠకులకు తెలిసింది. అతి తొందరగా తొలగించినందున, ఆ కథను కొందరు ఫేస్బుక్ సభ్యులు తప్ప, ఆ సభ్యత్వం లేనివారు చదవనే లేదు.
చూస్తే, కథ శరీరం తొలగించబడింది. కాని కథ తల (శీర్షం) పత్రికలోనే ఉండిపోయింది. కథ రచయిత్రిగారిది కాని శీర్షిక కాదా? మరెవరికి చెందుతుందా హెడ్డింగ్? మొండెం తీసుకు పోటమేంటీ? హెడ్ మిగల్చటమేంటీ? ఏదో నేరస్థుడి తల నరికి పత్రిక కోటగుమ్మానికి వేలాడేసినట్టు ఇదేం చర్య!
భేతాళ కథలు, ఎందరివో స్పూకీ రచనలు, మస్తుగా చదివిన నాకే ఇది వింతగా అనిపించింది. అందులోనూ నిజప్రపంచంలో అప్పుడది కొంత వింతైన సమయమే. అమెరికాలో ప్రజలు Halloween చేసుకుంటున్నారు. స్పానిష్ ప్రజలు ‘The day of dead’ చేసుకుంటున్నారు. ఏ వీధిలో చూసినా చెట్ల మీద అస్థిపంజరాలు, ఉరేసిన శవాలు, డీమన్స్, ఏంజెల్స్ నిలువెత్తు బొమ్మలు వేలాడుతున్నయ్యి. నేనున్నఊళ్లో జనాలు రకరకాల కాస్ట్యూమ్స్ లో హోటల్, క్లబ్స్, రోడ్డుల మీదా హుషారుగా తిరుగుతున్నారు. అప్పుడే భారత దేశంలో దీపావళి సమయం అనుకుంటా, ప్రపంచంలో ఇండియన్లు ఎక్కడెక్కడివాళ్లూ కలిసి నరకాసురుడిని నరికి పోగులుపెట్టాలి. జోరుగా పటాసులు కాల్చాలి. ఇంచుమించు అప్పుడే రావణాసురుడి గడ్డిబొమ్మలు తయారుచేసి అతడి తలలు నరికి నిప్పెట్టాలి. అదే సమయంలో రాముడు లంకనుండి అయోధ్యకు తిరిగి రావాలి.
ఇలాటి Fantasia festivals ఎన్నోదేశాల జనం హేండిల్ చేస్తున్న సమయంలో ‘ఈమాట’ పత్రికలో, ఆ తెలుగు కథ బాడీ రిమూవ్ చేసి తలకాయ ఉంచేశారు. ఆ రావణాసురుడి కుడ్యచిత్రం తలకాయ కింద ఎందరో వీరులు వారి అభిప్రాయాల కత్తులతో వీరోచితంగా పోరాడారు. అక్కడే ఏంటి, బలగాన్ని పోగేసుకుని, ఫేస్బుక్లోనూ, ఇతర పత్రికల్లోనూ పోరాడారు. కొద్దిగా నాకు నరకబడిన మెడూసా హెడ్, కారే రక్తం నుండి ఉద్భవించే వందలాది తేళ్ల, మండ్రగబ్బల భావన కలిగింది. మెడూసా హెడ్ ఎవరూ చూడకూడదే! చూసి ఎవరు శిలలై పోతారో ఏం పాడో! ఈ కథ రావణుడి హెడ్ కళ్లలోకి మామూలు మానవులు చూడొచ్చా లేదా? చూస్తే ఏ భూతం ఎవరికి పూనుతుందో?
It is one hell of a weird time.
పుస్తకాల షాపులో నిషేధించబడిన పుస్తకం మొత్తం తీసేస్తారు. ఉత్త అట్టలుంచరు. ఆర్ట్ మ్యూజియంలోనైనా అఫెన్సివ్ పెయింటింగ్ తో పాటు టైటిల్ కూడా తీసేస్తారు. అక్కడ ఇక ఎవరి ఒపీనియన్లు గోడమీద ఉండవు. తెలుగు మేగజీన్లు సిమెటరీలు కావు, పూలగుత్తులు ఉంచిపోటానికి. రోడ్ ఏక్సిడెంట్ సైట్‌లు కావు, రోడ్ సైడ్‌న ఒక సిలవ పాతి, ప్లాస్టిక్ పూలు పెట్టి పోటానికి.
సో, ఎప్పటికైనా ఆ రచయిత్రి తన అద్భుతకథ మొండాన్ని పత్రికకు తిరిగి ఇస్తుందా? లేకుంటే ఆమె, తన తెలుగుకథ తలకాయను తీసుకుపోతుందా? పత్రికలో ఇప్పటికీ వేలాడే తలకు ఆ బాడీ మళ్లీ అతుక్కుంటుందా? లేదా? అన్నది -అది ఒక పెద్ద సస్పెన్స్ నాకు.
కథ ప్రచురింపబడిన తరువాతి నెలలలో నేను క్యూరియాసిటీతో Heinrich Zimmer రాసిన ‘King and the corpse’ ఇంగ్లిష్‌లో చదివాను, అందులోని భేతాళ కథలు ఎంతో బాగున్నవి. Thomas Mann ‘The Transposed Heads’ 1940, ఇంగ్లిష్లో, స్పానిష్లో చదివాను. If two men who are friends chop off their own heads in a religious or jealous fervor, in a temple of Kali, and (inspite of the kindness of Kali, to give both men’s lives back,) the wife of one man sticks the heads on to the wrong body, who does the woman then belong to? Who is her husband from then on? అనే పాత భేతాళ ప్రశ్నను దాటి: ఆ స్త్రీ, తన భర్త, స్నేహితుడి తలలు మార్చటం, ఖంగారులో చేసిందా? లేక ఆమె ఆ పొరపాటు కావాలనే చేసిందా (ఆ నవలలో ఆమె పేరు సీత) అసలు ఒక స్త్రీ -ఒక మగవాని తలను/ముఖాన్ని ప్రేమిస్తుందా, లేక అతని శరీరాన్ని ప్రేమిస్తుందా? ఆమె ఎవరితో ఉండ గోరుతుంది? ఎవరితో నిజంగా భోగిస్తున్నది? ఎవరికి తన పిల్లవాడిని కన్నట్టు? మానవ శరీరంలో తల, శరీరాన్ని అదుపు చేస్తుందా, లేక శరీరమే తలను అదుపు చేస్తున్నదా అన్న విషయాలు ఊహిస్తూ – చిన్నదే ఐనా చక్కని నవల రాసి థామస్ మాన్ ఆనందించాడు. తన రచనను తిరిగి జిమ్మర్‌కే అంకితంలో అప్పజెప్పాడు.
వారందరికి ఆ కథలు ఇండియా నుండి వచ్చినవేనని, చక్కగా తెలుసు. అందరూ శ్రద్థతో Sources ఇచ్చినారు. అందువలన భేతాళపంచవింశతి (50 B.C) ముఖ్యంగా ఐదుగురి పండితుల రచనలు సంస్కృతంలో ఉన్నవనీ, అవి అన్నీ ఏళ్ల మీద భారతీయ భాషల్లో విరివిగా అనువదింపబడినవనీ తెలిసింది. I now also know Thomas Mann’s novella ‘The Transposed Heads,’ 1940, Is based on an earlier version of Zimmer’s essay and that essay appeared in the festival volume in the honor of Dr. C.G. Jung’s sixtieth birthday. Berlin 1935.)
తెలుగు దేశంలో, ‘దేవదాసు’ సినిమా (1953) విడుదలయ్యాక, నా ముందు తరం యువతులెందరో (including my mom) ఈ కింది పాట తరచుగా పాడగా నేను విన్నాను.
“మనసున లేని వారి సేవలతో,
మనసీయగ లేని నీపై మమతలతో,
వంతలపాలై చింతిలుటే నా వంతా దేవదా!”
అంటూ ఆ బెంగాలీ బాబు శరత్ -కథ లోని హీరోయిన్ ‘పారూ’ పాటని వారు పాడినారా! లేక వారి మనసులనే తెలియచేస్తున్నారా!
ఈ కథ, ఆ కథ, ఏ కథైనా; “అంతా భ్రాంతియేనా?”
¡Es posible!
-Lyla
రుబాయీలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
05/02/2024 7:51 pm
శర్మ దంతుర్తిగారికి నమస్సులు! ఇక్కడ నేను మీరు అడిగిన రెండవభాగపు ప్రశ్నలకు మాత్రమే సమాధానమును ఇస్తున్నాను.
(1) రుబాయీ ప్రక్రియకు ఒక నిర్దిష్టమైన ఛందస్సు గలదు. దానిని వ్యాసములో వివరించినాను.
(2) పారసీక ఉర్దూ భాషలలో గణములకు తగినట్లు పదములు, అంత్యప్రాస మాత్రమే ముఖ్యము. తెలుగులో నేను అదనముగా ద్వితీయాక్షర ప్రాస, అక్షరసామ్య యతిని కూడ వీలైనప్పుడు వాడినాను.
(3) In principle మీరు ఏయుగమునైనను వాడవచ్చును. కాని ఛందస్సు రీత్యా అక్కడ UUUU లేక UUIIU లకు సరిపోయే పదములను మాత్రమే వాడాలి. త్రేతాయుగమే అను పదము UUIIU నకు సరిపోతుంది. రేఫముతో అక్షరసామ్య యతి. నాలుగవ పాదమునకు కూడ ఇక్కడ చెప్పినది వర్తిస్తుంది.
విధేయుడు – మోహన
అసాధారణకవి: షార్ల్ బోద్‌లేర్ గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
04/28/2024 10:11 am
(Notes on my reads on Charles Baudelaire, contd.)
Christopher Isherwood translated Intimate Journals of Charles Baudelaire, into English. (First Beacon paperback edition published in 1957.) His introduction begins with the question of “What kind of a man wrote this book?” and in the next paragraph he summarizes his answers like so.
“A deeply religious man, whose blasphemies horrified the orthodox. An ex-dandy, who dressed like a condemned convict. A philosopher of love, who was ill at ease with women. A revolutionary, who despised the masses. An aristocrat, who loathed the ruling class. A minority of one. A great lyric poet.”
Then Isherwood proceeds to give a life history of C.B. At one point, he says- “Shy men of extreme sensibility are born victims of the prostitute. Baudelaire’s mulatto mistress, Jeanne Duval was a beautiful indolent animal. She squandered his money and slept with his friends. The biographers usually condemn her most unjustly. Few of us would really enjoy a love affair with a genius. Jeannie had to endure Baudelaire’s moods and listen to his poems: she understood neither. But in some mysterious manner, these two human beings needed each other. They stayed together, on and off, for twenty years. Baudelaire always loved and pitied her and tried to help her…”
I think -this is where Suraparaju RadhakrishnaMurthy got his tone for his C. B’ s bio in Telugu. His idea about how to present to the Telugu readers, another slave woman, C.B., meets in Mauritius.
సూరపరాజు గారి మాటల్లో:“బోద్‌లేర్‌లో నిద్రాణంగా ఉండిన కవితకు పునరుద్దీపనమయింది యీ కేరళకాంతనీలకాంతి. ఆమెపై ఒక కవితరాశాడు: ‘మలబారు యువతి’ (A une Malabaraise). బహుశా యీ యువతి కలిసివుండకపోయి ఉంటే, మనకొక బోద్‌లేర్ మిగిలేవాడు కాదేమో? ఈ విషయం బోద్‌లేర్ స్వయంగా ఒకచోట రాసుకున్నాడు. బోద్‌లేర్‌లో కవిని ఆరిపోకుండాఅందమైన తన అరచేతులు అడ్డంపెట్టిన యీ మలబారు మహిళకు సాహిత్యలోకం ఋణపడి ఉండవలసిఉంటుంది.”
అధ్యాపకుడు సూరపరాజుకు,ఈ ఫ్రెంచ్ కవిని “భారతీయ సనాతన ధర్మదృష్టి తో సమన్వయం” చేసి, చూపటం ఆయన రచన ధ్యేయం కనుకనేమో, అక్కడ తెలుగు కవి థూర్జటిశ్రీకాళహస్తీశ్వరశతకంలో ‘రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్..’ – పద్యంతో సాపత్యం తెస్తారు. బూదలేర్ బానిస స్త్రీ, ఆపెరా హౌస్ స్త్రీలతో సంబంధం పెట్టుకోటం నైతికంగా అతడిని పతనం చేసిందనిభావిస్తూనే, అతడు గొప్ప కవికావటానికి నీచ స్త్రీ సంబంధం ఉపకరించిందనీ, అందువల్ల “మనం” ఆ స్త్రీ/ స్త్రీలకు రుణపడి ఉండాలంటారు. ఆ మెలిక నాకర్థం కాదు.అలాగే -తెలుగు కవి థూర్జటి కవిత్వాన్ని గౌరవిస్తూ, ప్రజలు బోగంస్త్రీని నిరసించాలి. ఈ మిసాజినీకి అంతెక్కడ! దేశదేశాల పాతశతాబ్దపు పరిస్థితులు, ఆలోచనలు,ఈ శతాబ్దివిలా ధ్వనింప చెయ్యటం,ఇప్పటి తరం సాహిత్య వేత్తకు,భావ్యమా? స్త్రీ గాని, మగవాడు కాని,ఒక సమయంలో, ఒక వయసులో భోగించి, మళ్లీ మళ్లీ కావాలనిఅనుభవించి, ఆ తరువాత ఆ సుఖాలనునిరసించటం దేనికి? Why knock them? అంత మట్టుకు కృతజ్ఞులై ఉండి ఆ తర్వాత కాలంలో అప్పుడు వారికి ఇష్టమైనవి,అవేవో తెలిస్తే చేసుకోరాదా?
In Christopher Isherwood’s translation -The squibs, there are about 22 of them, followed by “my heart laid bare.” Maybe twenty, thirty. Followed by a selection of ‘consoling maxims upon love.’ Some fifty or so. I lost count. (Bad at counting Roman numerals.) Interspersed are some sketches by Baudelaire. There is a sketch of Jeannie Duval after page 56. Reading them, I got some glimpses of B’s thought processes about some of his contemporaries. In these pages, Baudelaire comes across as an ordinary, o.k., guy. Don’t know why Isherwood thinks he is a super genius. Baudelaire is no match for Emerson, Thoreau in philosophic thought, or Oscar Wilde in wit.
In his squibs: B thinks there are only three worthwhile high-minded pursuits in life. 1. Priest 2. Soldier 3. Poet. B thinks the rest of humans are “professionals.” They do mundane things, just to earn a living, for themselves. This dandy, this ‘Flaneur’ of 19thcentury Paris streets, he is dead wrong, isn’t he?
In actuality, What B really needed is some penicillin. To save his life and sanity. Unfortunately, Alexander Fleming did not find Penicillium notatum, until about a century later. (sept 28, 1928 – a day to remember!) In his experiments with various kinds of plants, Baudelaire himself did not stumble on any cures for any diseases. Therefore, B joined the group of talented artists like Schubert, Schumann, most likely Telugu poet Dhurjati, the prostitutes in his poetry, and many other humans who suffered terribly from syphilis and died of it.
However, I am glad that before he died in his forties, Baudelaire managed to enjoy a few pleasures of life. Otherwise, his life would have been one big wasteland of misery and deprivation. God forbid! Who wants that!
I am all for the delights of body and mind, however transient the pleasure or life may be.! Asi So Yo! A few of my lines in poetry, from memory:
ఎన్నడు కుడిచితినో నీతోటి ఆ తోటలో
ఎన్నడు ఒంపితినో నీకు తేనీరు!
ఎన్నడు ముడిచితినో బిడియము వీడి నీకు విడియము;
కన్నడ! అన్నడె వీగిపోయె నా అంతరంగపు సుడులు,
వెన్నడ! అన్నడె వ్రీలిపోయె నా కంచుకపు ముడులు.
-Lyla
ఏప్రిల్ 2024 గురించి Anon గారి అభిప్రాయం:
04/26/2024 3:22 am
నేను చాందసవాదుణ్ణి కాకపోయినప్పటికి, ఈ సంపాదకీయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవించలేను. కర్నాటక సంగీతాన్ని భక్తి సంగీతము కోసమే కాకుండా వేరే విధంగా కూడా వాడే ప్రక్రియలు ప్రవేశపెట్టాలనుకుంటే పెట్టడంలో తప్పులేదు కాని ప్రస్తుతమున్న భక్తి సంగీతాన్ని భ్రష్టుపట్టిన్చనక్కరలేదు. శంకరాభరణం సినిమాలో చూపించినట్లు “మీలాంటి చాందసులు మాలాంటి మేధావులుచేసే ప్రయోగాలా? 🙂
ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి వసుంధర గారి అభిప్రాయం:
04/06/2024 9:22 am
తెలుగు కథకు ఈ తరహా విశ్లేషణ అపూర్వం. ఇది అందించడానికి తగిన పరిజ్ఞానం, పరిణతి, సామర్థ్యం ఉన్న మెడికో శ్యాం – అందుకు పూనుకోవడం తెలుగు సాహితి అదృష్టం. సాహితీప్రియులందరూ చదివి తీరాల్సిన ఈ ప్రసంగవ్యాసం- వెనుకనున్న కృషి, తపన అభివందనీయం అంటే అది చాలా చిన్నమాట!
తెలుగు సాహితికి అద్భుతమైన ‘షామియానా’ సమకూర్చిన మెడికో శ్యాం లో మరో విశేషం – తన మనోభావాల్ని సూటిగా నిష్కర్షగా నిజాయితీగా చెప్పడం! అందువల్ల వారి పొగడ్తలకూ, విమర్శలకూ విలువ పెరుగుతుంది. ఎన్నో దశాబ్దాల క్రితం జ్ఞాపకాల్లోంచి వ్రాస్తున్నందువల్ల ఎక్కడైనా తప్పులు దొర్ల వచ్చునన్న అనుమానాన్ని వెలిబుచ్చారు వారు. ఆ మేరకు మా (వసుంధర) రచనలకు సంబంధించిన రెండు సవరణలను ఇక్కడ ఇస్తున్నాము.
1. ‘పెసరపప్పు’ మా మొదటి కథ కాదు. మొదటిది ఆంధ్రపత్రికలో వచ్చిన ‘స్టంటు సినిమా కథ’. స్వాతి మాసపత్రిక తాజా సంచిక (మే 2024) లో కెవిఎస్ వర్మ అనే రచయిత ఇటీవలే దీన్ని పరిచయం చేశారు.
2. ముళ్లపూడి వెంకటరమణ గారు ఎస్టీడీ ఖరీదైన రోజుల్లో మద్రాసునుంచి అరగంటకు పైగా మమ్మల్ని మెచ్చుకుంటూ చేసిన ఫోను- ”పెళ్లయ్యాక చూడు’ నవల గురించి కాదు. ‘పెళ్లి చేసి చూడు’ నవల గురించి. మధ్యతరగతి కుటుంబంలో ఓ ఆడపిల్ల పెళ్లి కథ అది. ”పెళ్లయ్యాక చూడు’- దాంపత్య జీవితంలో దంపతులకు తొలి సంతానం ముచ్చట్లు. మెడికో శ్యాం గారు చదివింది ఇది. ఒక విధంగా ఇది మాకు సంతోషమే. రెండు నవలలకూ మహామహుల ప్రశంస లభించినట్లు కదా!
‘షామియానా’లో మెడికో శ్యాం విశ్వరూపాన్ని దర్శించినవారిగా- వారి ప్రసంగవ్యాసంలో మా రచనల ప్రసక్తి రావడం మాకు గౌరవంగా భావిస్తున్నాం.
ఈ ప్రసంగవ్యాసాన్ని- సాహితీలోకానికి అందించిన శ్రీ మెడికో శ్యాం గారికి కృతజ్ఞతలు; ప్రచురించిన ‘ఈ మాట’కు అభినందనలు; మాకు చేర్చిన శ్రీమతి శ్యామల గారికి ధన్యవాదాలు.
వసుంధర, హైదరాబాద్
ఫిబ్రవరి 2024 గురించి శామల గారి అభిప్రాయం:
02/22/2024 3:51 am
“నిరంకుశో కవిః” అన్నది ఆర్యోక్తి.
‘పరమ నిరంకుశో పత్రికాసంపాదకాః’ అని వాపోయాడో పెద్దమనిషీమధ్య. సంపాదకుని స్థానం, ప్రాముఖ్యత గురించి రచయితలకి పాఠకులకి తేటతెల్లమే.
సంపాదకులకి తెలియవలసిన తమ బాధ్యతలు ఇంకొన్ని ఉన్నాయి. ముందుగా పాఠకుల స్థాయి, రచయితల స్థాయి నిర్ణయించగల నిషోపలకాలు తామే అనే అపోహ నించి సంపాదకులు బయటపడాలి. తాము మెచ్చిందే అందం కాకపోవచ్చు. అందగత్తెలు, అందాన్ని ఆస్వాదించగలిగే రసజ్ఞులు సమాజంలో పుష్కలంగా ఉండవచ్చు, ఉన్నారు అనే స్పృహ సంపాదకులకి లోపించినంతవరకూ సాహిత్యం గిలగిల్లాడుతుంది.
వాన్‌గో చిత్రాల నాణ్యత ఆకాలంలో ఏసంపాదకుడు నిర్ధారించగలిగాడు? ఎన్ని హెమింగ్‌వే కథలు అర్థంకాని సంపాదకులు తృణీకరించారు? వాన్‌గో పాటి అదృష్టం, మనదృష్టం కూడా లేక ఎంతమంది చిత్రకారులు, కవులు, రచయితలు వెలుగు చూడకుండా సమసిపోయారో! సంపాదకుల నిషోఫలకాలచే తిరస్కరింపబడి! ఉన్నతస్థాయి పాఠకులు ఉన్నత రచనలు ఆకాంక్షింస్తారు. వారికి వాక్యంలోకంటే వాక్యానికి, వాక్యానికి మధ్య ఎక్కువ రసం స్ఫురిస్తుంది. రచన స్థాయి నిర్ణయించగల స్థాయికి సంపాదకులు ఎదగాలి.
సినిమాకి తగిన మసాలా ఉందా లేదా అని కొలవగలిగే మూసలో మాత్రమే తర్ఫీదయిన సంపాదకులున్నంతవరకూ అభిరుచిగల పాఠకులు, నాణ్యతగలిగిన రచయితలు పత్రికకి కనుమరుగౌతారు. కాలక్రమేణా పత్రికా కనుమరుగవుతుంది.
వార్ధక్యం గురించి తః తః గారి అభిప్రాయం:
02/02/2024 9:25 am
శ్రీ వేలూరి: రెండంటే రెండే (తెలుగు) పద్యాలు – ఒకటి చిన్నది, ఒకటి పెద్దది- “తెలుస”న్న వారికి తెలిసిన పద్యాల్లో మొదటిది – ‘ఉప్పు కప్పురంబు’, రెండోది, ‘ఎవ్వనిచే జనించు’ అవుతాయేమో. ఈ పద్యం వ్యాసుని శ్లోకానికి(లకు) అనువాదం అవటంవల్ల తెలుగు నుడికారానికి దూరంగా ఉంది. పోతన అనువాదాలను మించి తన సొంతం గూడా జోడించిన సందర్భాలున్నాయి. [వ్యాస నిర్మాణములో లక్ష్మి లేదు. గజేంద్రునికి ‘కలడో లేడో’ అన్న సందేహమూ లేదు చివరికి – శరీర రక్షణ గాక – కాలానితో ముడిబడకుండా భగవంతుని దయతో మాత్రమే వదిలిపోయే చీకటి పోవాలని కోరుకున్నాడు.*] పోతన ఈ దోవ తొక్కినట్టుగా అనిపించదు. చిక్కని సంస్కృతంతో తెలుగు నుడికారంలో పోతన పద్యాల మాధుర్యం వర్ణింపనలవి కానిది. నాకు “హరికిన్బట్టపుదేవి…” మరీ మరీ ఇష్టం.
నమస్కారాలతో -తః తః
(*గీతా ప్రెస్ గోరఖ్ పూర్ ప్రతి లోని అనువాదం ఆధారంగా)
ప్రపంచమే ఒక కథనరంగం గురించి వివిన గారి అభిప్రాయం:
12/08/2023 11:40 pm
పరిచయం ఒక్కటే కాదు మీ స్పందన నింపారు. ఎందుకో చెప్పలేను కాని హెమింగ్వే కథల తీరులో.
శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి తుమ్మూరి రాంమోహనా రావు గారి అభిప్రాయం:
12/02/2023 6:21 am
ఒక గొప్ప వ్యాసానికి చక్కని అనువాదం. ఈ ప్రసంగంలో పంచతంత్రం ప్రస్తావన ముందు చెప్పబోతే విషయానికి శ్రోత/పాఠకుడిని తను చెప్పబోయే విషయానికి ఉన్ముఖీకరణగా ఉంది. ఇతఃపూర్వం శాంతి గురించిన విశ్లేషణ ఈ విధంగా ఎప్పుడూ చదివిన అనుభవం నాకు లేదు. కాని చదువుతుంటే రుష్దీ ఎంతగా దాని గురించి ఆలోచించారో అవగతమౌతుంది. తాను పురస్కారానంతరం ఒకవేళ రాస్తానేమో అంటూ చెప్పిన కథలో నేటి సమాజం ప్రతిబింబిచింది. ఇక స్వేచ్ఛ గురించి చెప్పిన మాటలు మనసును ఆకట్టుకున్నాయి. అన్యాపదేశంగా కవులు కళాకారులకు ఆయన ఇచ్చిన సూచన కూడా మనసును అలరించింది. మానవీయతతో అమానవీయతకో జవాబు ఇవ్వటం అన్నమాట చాలా సంయమనంతో చెప్పిన మాట. ఈ ప్రసంగం చదివిన తరువాత ఆ పురస్కారానికి ఎంతటి అర్హత కలిగి ఉన్నాడో కూడా తెలుస్తున్నది.ఇంత మంచి వ్యాసాన్ని అనువదించి అక్షరాక్షరం మనసుకు హత్తుకునేలా అందించిన మీకు ధన్యవాదాలు. మీ అనువాద పటిమకు జోహార్లు.
దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి కంభంపాటి సుశీల గారి అభిప్రాయం:
11/25/2023 8:34 pm
ఏదేనా శంఖం లో పోస్తేగాని తీర్థమవదు. అన్ని పోస్టర్లు అనలేను కాని కొన్ని పోస్టర్లు కధ లోని ముఖ్య విషయాన్ని తెలియజేస్తూ చాలా బాగుండేవి. పది చూసేసరికి మాకు కధ తెలిసిపోయేది. నాకు వీటి గురించి అవగాహన లేదు గానీ అమెరికన్ స్నేహితుల్లో పాత యింగ్లీషు సినిమాల పోస్టర్లు వేలం పాటల్లో బోలెడు డబ్బు పెట్టి కొనడం చూశాక ఔరా అనుకున్నాను. రూడాల్ఫు వాలంటీనో నటించిన సినిమా తాలూకు కాగితం చాలా విలువైనదట. మాలపిల్ల, వరవిక్రయా లాటి పాత సినిమాల తాలూకువేమేనా దొరికితే వాటి విలువ యెలా వుంటుందో?
నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/10/2023 11:17 am
ఈచర్చ ఇంకా కొనసాగుతున్నది. ఆశ్చర్యం!
సెక్యులరిజం ముసుగులో సనాతనధర్మాన్ని అవహేళన చేయటానికి వస్తున్న సమర్ధింపులు ఆవేదన కలిగిస్తున్నాయి. చివరకు సెక్యులరిజం అంటే సనాతనధర్మాన్ని అవహేళన చేయటం అన్న దుస్థితి స్థాపించబడుతున్నది.
ఈమాట వారు కాని మరొక సాహిత్యవేదిక వారు కాని ఇతరమతధర్మాలను కాని వారివారి చారిత్రక సాంస్కృతిక వారసర్వాలను కాని అవహేళన చేస్తూ వచ్చే ఏ రచననైనా ప్రచురించగలరా? వారి మనోభావాలు దెబ్బతింటె వీరి అస్తిత్వాలు దెబ్బతింటాయి. మనది సెక్యులర్ దేశం కాబట్టి ప్రచురించాం అని తప్పించుకోవటం అసాధ్యం. ఐతే సనాతనధర్మావలంబులు సాత్వికులు కాబట్టి సెక్యులరిజం పేరుతో వారిని ఎంతగా ఐనా గాయపరచి మేం చేస్తున్నది ఒప్పే మాధోరణి సరైనదే అని చెప్పుకోవచ్చును. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి.
ఇకనైనా దయచేసి ఇటువంటి అవమానకరమైన రచనలను ప్రచురించవద్దని ఈమాట వారికి మనవి. 1994 తెలుసా రోజులనుంచీ ఉన్న పరిచయాన్ని నేను మరువలేదు. ఈమాటను అవమానించాలని నా ఉద్దేశం కాదు. నేను వ్యక్తిగతంగా స్పందిస్తున్నానన్న మాట సరికాదు.
నేను ఒంటరిననీ నాకు భిన్నమైన అభిప్రాయమే బలంగా ఉన్నది ఈవిషయంలో అనుకోవటం లేదు. ఇరువైపులా బాగానే స్పందిస్తున్నారు. కాని సనాతనధర్మాన్ని చులకన చేసే రచనలను ప్రోత్సహించద్దని సాధ్యమైనంతా వేడుకుందుదే పునఃపునః చెప్పవలసి వస్తోంది.
ఈకథ కారణంగా నేను మనశ్శాంతికి దూరమాయ్యాను. దానర్దం నేను మానసికంగా బలహీనుణ్ణని కాదు. ఇది అంతగా నామనస్సును గాయపరచింది అని. ఇంకా ఎంతోమంది సనాతనధర్మపథంలో ఉన్నవారిని గాయపరచే ఉంటుంది.
జరిగింది చాలు. ఇకపైన మీరు రచనలను మరింత శ్రధ్ధగా పరిశీలించగలరని ఆశిస్తున్నాను.
నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/07/2023 9:46 am
సంపాదకులు ప్రచురించి చూపిన Kakra Muralidhar గారి వ్యాఖ్య అభ్యంతరకరంగానే ఉంది. సందేహం లేదు. ఆయన ఈకథను ఎద్దేవా చేసినంత మాత్రాన ఆయనను మీరు భక్తుడు అని ఎగతాళిగా చెప్పటం అవసరం కాదు. ఈకథను దురుసుగా ఆక్షేపించారు కాబట్టి ఆయన భక్తుడు అనటం ద్వారా మీరు భక్తులు ఇలాంటి భాషను భావజాలాన్ని వాడుతారని దురదృష్టకరమైన తప్పుడు అవగాహనకు వచ్చారంటే, మీకు సంప్రదాయికంగా భక్తులనే వారు ఎంతటి వినయభూషణులుగా ఉంటారో అన్న విషయంలో ఏమీ అవగాహన లేదని అర్ధం అవుతున్నది.
ఆకథా రచయిత్రి యొక్క గౌరవమర్యాదల గురించిన ఆలోచన మీకు కలిగింది. సంతోషం. కాని మీకు యావద్భారతమూ అనాదిగా ఎంతో ప్రేమతో అభిమానంతో గుండెల్లో నింపుకొని పూజించే సీతారాముల గౌరవమర్యాదల గురించిన ఆలోచన ఏదీ ఈకథను ప్రచురణకు అంగీకరించే సమయంలో కలుగలేదు కదా? కథారచయిత్రిపై ఒక రాయి (పోనీ కొన్ని లేదా అనేక రాళ్ళు) పడినందుకు అభ్యంతరమూ ఆవేదనా కలిగిన మీకు సీతారాముల మీద ఇలాంటి కథల ద్వారా రాళ్ళు వేయటం అనుచితం అని కొంచెం కూడా స్ఫురించలేదు! ఈఈఉదయం మాచెల్లెలు ఒకామె మాట్లాడుతూ రాముడి మీద రాళ్ళు విసిరితే కాని రచయితలు కారా ఏమిటి అంది. ఈకాలపు సోకాల్డ్ అభ్యుదయ రచయుతల వ్రాతలు చూస్తే అలాగే ఉన్నాయి.
మనమధ్యన ఉన్నందుకు రచయిత్రి ఎక్కువ గౌరవనీయురాలున్నూ మనమధ్యన భౌతికంగా లేనందుకు సీతారాములు తక్కువ గౌరవనీయులున్నూ కారని మీరు తప్పక అర్దం చేసుకోవలసి ఉంది. సీతారాముల చరిత్రనూ పాత్రలనూ వక్రీకరించటం వాళ్ళ మీద రాళ్ళు వేయటం అన్నది అగౌరవపరచటం కాదూ అని మీరు అంటే ఇంక చెప్పవలసినది ఏమీ ఉండదు.
[ ఆ వ్యాఖ్య మీకు కేవలం “అభ్యంతరకరం.” భక్తుడు అని ఎగతాళిగా అనలేదండీ. ఇటువంటి ‘భక్తులూ’ ఉన్నారని చెప్పడం కోసం వాడాను. మీ ఉత్తరానికి రాసిన జవాబులో ఇంకొకరి అభిప్రాయాలు స్క్రీన్ షాట్ కూడా పెట్టి చూపించాను. భక్తులమని వారికి వారే చెప్పుకున్నారు కాబట్టే వాడాను. మీరు 1994 తెలుసా రోజులనుంచీ మాకు పరిచయం. మీమీద మాకు గౌరవం ఉంది. ఈ కథపై మీ అభిప్రాయం మీరు చెప్పారు. బలంగా చెప్పారు. కొన్నిసార్లు చెప్పారు. ఈ కథ పట్ల ఎన్నో భిన్నాభిప్రాయాలు. కథ కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. కథ నచ్చినా నచ్చకున్నా సభ్యమైన భాషతో తమ విమర్శను ప్రకటించిన అన్ని అభిప్రాయాలనూ ఈమాట నియమాల ప్రకారం ప్రచురిస్తూనే ఉన్నాం. కాని, ఎవరినేమన్నా మీరు వ్యక్తిగతంగా తీసుకుని అందుకు స్పందిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఇక్కడ మీరొక్కరే లేరు. మీ అభిప్రాయాలే అందరివీ అని అనుకోకండి. దయచేసి ఇక ఇలా చేయకండి. – సం.]
నేత్రోన్మీలనం గురించి Sneha గారి అభిప్రాయం:
11/06/2023 10:00 pm
ఈమాట సంపాదకులకు,
“ఈమాట ఒక సాహిత్యపత్రిక. సాహిత్యానికి పరిధులు, పరిమితులు ఉండవని, సాహిత్యం ఆహ్లాదాన్నే కాదు, ఆలోచననూ కలిగించాలని, సమాజపు పోకడలను ప్రశ్నించి, నిలదీసేలా కూడా ఉండాలని నమ్మే పత్రిక.”
చాలా మంచి నమ్మకం కలిగిన పత్రిక. సమాజపు పోకడలను ప్రశ్నించేలా అన్నారే! ఈ కథ ఏ సమాజపు పోకడను ప్రశ్నిస్తోంది? రామరాజ్యంలో ఏ పోకడలు ఉన్నాయో మీకు తెలుసా? రామరాజ్యం ఎలా ఉండేదో వాల్మీకి మహర్షి చెబితేగానీ తెలిసిరాలేదు. అదే మహర్షి రావణుడు దుర్మార్గుడు అని తీర్పు చెప్పేస్తే కాదు అతి మంచి వ్యక్తి అని కథ రాయడం ఏ సమాజపు పోకడలను ప్రశ్నించడం? సీతారాములది ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం. మనలాంటి సామాన్య జనాలు (మిమ్మల్ని మీరు సామాన్యులు కాక మేధావులు అన్న భ్రమలో ఉంటారేమో) ఆ వ్యక్తిత్వంలోనుండి ఎంతో కొంత, కనీసం ఒక్క లక్షణాన్ని పట్టుకుని ఆచరిస్తే మానసికంగా ఎదగగలము. మనం ఎత్తుకు ఎదిగేకొద్దీ వారి వ్యక్తిత్వాలు అర్థం చేసుకునే శక్తి వస్తుంది. అంతే కాక ఇలా వారి వ్యక్తిత్వాలను మీ ఇష్టం వచ్చినట్ట్లుగా మార్చి కథరాసి ఆలోచన కలిగించే కథ అంటారా? ఇలాంటి ఆలోచనలు కలిగించే కథలు చదివి సమాజం మరింత మానసికరోగగ్రస్థమవుతుంది. ఇలాంటి విపరీతపోకడలను ఆలోచన అనుకొని ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టే సమాజం నిండా ఇలాంటి మానసిక రోగాలు వస్తున్నాయి. గొప్ప కష్టం కలిగితే అంత కష్టాన్ని నా రాముడెట్లా భరించినాడో, సీతమ్మ తల్లి ఎంత ఓర్పుతో సహించిందో అనుకుంటే కష్టం నుండి బయటపడే శక్తి వస్తుంది. ఆ తల్లి మానసిక రోగానికి గురై ఎంతో క్షోభ అనుభవించింది అనుకుంటే కలిగేది మానసికరోగం.
“కళలు, సాహిత్యం పట్ల కాని, వాటిని సృజించే కళాకారులు, కవి రచయితలు ఆ క్రమంలో ఏ రకమైన నిర్బంధాలకూ గురి కాగూడదని, వారికి వారి సృజన పట్ల పూర్తి స్వేచ్ఛ ఉందనీ నమ్మే పత్రిక”
స్వేచ్చ అన్నది కేవలం కవులకు, రచయితలకు మాత్రమే ఉందా? మీ పాటికి మీరు రాసి ఆన్‌లైన్‌లో పడేసి కేవలం మెచ్చుకోవాలి తప్ప వివర్శించకూడదు అంటే చదివేవాడికి లేదా స్వేచ్చ? ఎవరికోసం రాస్తారు ఈ కథలు? కొందరు రచయితలు ఒక గుంపుగా ఏర్పడి ఒకరినొకరు మెచ్చుకోవడానికా? అలా అయితే ఈ చెత్త మా మొహాన కొట్టడం ఎందుకు ఈ కథలను మీకు నచ్చినవారితో పంచుకుని చర్చించుకోండి. మా నమ్మకం మీద, మా సంస్కృతి మీద ఇలా దారుణంగా దెబ్బ కొట్టకండి అని చెబితే దాడి అంటారేమిటి? మొదలుపెట్టడం ఎందుకు, పట్టుబడితే విక్టిమ్ కార్డ్ చూపించడం ఎందుకు? రాసేవాడికి సమాజంలో మనుషుల నమ్మకాల పట్ల, సంస్కృతి పట్ల బాధ్యతలేదా?
“కాని, సాహిత్య విమర్శ ఆ వేదికను దాటి, మత రాజకీయశక్తులకు, వారి దౌర్జన్యానికి ఒక ఆయుధమై, రచయితలకు మానసిక, శారీరక హాని కలిగించే ప్రమాదం ఉందని నిశ్చయమైనప్పుడు ఆయా రచయితలను కళాకారులను కాపాడుకోవడం కూడా ఈమాట తన బాధ్యతగానే పరిగణిస్తుంది.”
భౌతికదాడులు చేయడం అన్నది ఖండించాలి. ఇందులో మరోమాట లేదు. మీ కళాకారులని మీరు కాపాడుకున్నట్లే, మా సంస్కృతిని మేము కాపాడుకుంటాము. మా సంస్కృతిమీద దాడి జరిగినా, మా సీతారాముల వ్యక్తిత్వాలకు మచ్చ తెచ్చేట్లు కథలు రాసినా మేము ఖండిస్తాము. మీరు దాడి మొదలుపెట్టకండి. విమర్శలు వస్తే విక్టిమ్ కార్డ్ వేయకండి.
“నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను. ఈ కథ ప్రచురించడం ద్వారా ముందు ముందు రాబోయే ఏ రకమైన చట్టపరమైన చర్యలకైనా ఈమాట బాధ్యత వహిస్తుందని తెలియజేస్తున్నాను.”
భౌతికమైన దాడులు ఎవరిమీదైనా ఖండించదగినవే.
నేనుకూడా ఇలాంటి కథలు రాసేవాళ్ళ మీద, ప్రచురించే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేరోజు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/06/2023 9:46 pm
శోధిని అగ్రిగేటర్ వారి వ్యాఖ్యల పేజీలో ఉన్న చంద్రిక గారి క్రొత్త వ్యాఖ్యను చూసి స్పందనగా వ్రాస్తున్న కొద్ది మాటలు.
నా మనస్సు ఇప్పటికీ గాయపుతీవ్రత నుండి కోలుకోలేదండి. అఖండరామనామస్మరణం కొనసాగిస్తూ దాని పూర్వకంగా ఉపశమనం లభిస్తుందని ఎదురుచూస్తున్నాను.
ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలిసిందని మాధవ్‌గారు అన్నది చదివాను. అది ఆందోళనకరమైన విషయం. రచయితలను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవటం భావ్యం కాదు. అలా లక్ష్యం చేసుకొనే వారి వివేకం చిత్యం.
రచయితలు కూడా సామాజికబాధ్యతను కలిగి ఉండాలని గుర్తెరగాలి. సామాజికబాధ్యత అన్నది సున్నితమైన అంశం. వారి కాల్పనికస్వేఛ్చను సమాజం గౌరవిస్తుంది. వారు నైతిక సాంస్కృతిక ప్రమాణాలను అవహేళన చేయకుండా జాగ్రత వహించాలి కాని నవ్యత అన్నపేరుతో ఇష్టారాజ్యంగా వ్రాయటం క్షమార్హం కాదు.
బాధ్యత కల రచయితలు సమతూకంగా ఆలోచించి వ్రాస్తారు. బాధ్యత కల చదువరులు కూడా వివేకంతో స్పందిస్తారు కాని వ్యక్తులను లక్ష్యం చేసుకోరు.
నేత్రోన్మీలనం గురించి Rams గారి అభిప్రాయం:
11/06/2023 12:02 pm
ఆసక్తికరమైన రచన, అంతరంగాన్ని ఆవిష్కరించడం, ఆత్మగౌరవం, ఊహ, వర్ణన అన్ని కలగలిసినట్టున్నాయి. సీతదేవి ఆధార్ ప్రూఫ్‌తో వస్తే కాని దీన్ని ఖండించలేనిది. ఎందుకంటే భావప్రకటన స్వేచ్చ.
నేత్రోన్మీలనం గురించి Prasuna Balantrapu గారి అభిప్రాయం:
11/04/2023 1:59 am
ఓల్గా గారి కథలా ఉంది. ఇది విషయంలో మాత్రమే. కార్నాడ్ గారి కథ చదివాను. మన కథలను వేరే కోణంలో చూడడం మనకి ఎప్పుడూ వుంది. అందుకే ఇన్ని రామాయణాలు. సీత రావణుని కూతురేమో అన్న కథ కూడా ఒకటి ఉంది. మీ కథలో అది కూడా ప్రస్తావించారు. రాముడిలో ఏ మాత్రం మానవగుణాలు కనిపించినా మన వాళ్ళు భరించలేరు. కాని మొదటి సారిగా ఈ గుణాన్ని ప్రస్తావించింది భవభూతి ఉత్తర రామ చరిత్రలో. మానసిక విశ్లేషణకి అవకాశం ఇచ్చారు.
నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/03/2023 2:40 pm
శివ గారు “పరాయి స్త్రీని చెరబట్టిన క్రూరుడు, దుష్టుడు, దుర్మార్గుడు, రాముడి చేత సంహరింపబడిన రాక్షసుడు” – ఇది జనసామాన్యమైన అభిప్రాయం రావణుడి మీద” అంటున్నారు. కాని ఇది శ్రీమద్వాల్మీకిరామాయణం చెప్తున్న మాట.
” తన మానానికి భంగం కలగగకుండా చూసుకున్న ఒక దయ గల” రావణుడి రూపం ఆమెలో ఇంకిపోయి ఉన్నది అంటారు శివ గారు. భలే ఆ రావణుడి ముఖం కూడా సీత ఎన్నడూ చూడలేదు మహాప్రభో అని శ్రీమద్రామాయణం ఖరాఖండిగా చెప్తున్నది. ఎందుకువచ్చిన పిచ్చి సమర్ధన?
ఈవికారమైన ఊహలు ఆధునికులం అని చెప్పుకుంటూ శ్రీమద్రామాయణాన్ని ఎన్నడూ శ్రధ్ధగా చదవని పరిశీలించని విపరీతవాదుకు మాత్రం కలుగుతాయి. రావణుడు సీతను తాక(లే)క పోవటానికి కారణం వాడికున్న శాపం కారణంగానే తప్ప వాడంత యోగ్యపురుషుడై కాదు. అసలు యోగ్యుడూ దయాశాలీ ఐతే ఆవిడను జుట్టుపట్టుకొని ఈడ్చుకొంటే ఎత్తుకొని వెళ్ళేవాడేనా? మాట్లాడితే ఏమన్నా అర్ధం ఉండాలి.
ఈదిక్కుమాలిన సమర్ధనను త్రిప్పికొట్టాలని వచ్చాను కాని ఈమాట మీద నా క్రోధాన్ని ఉపసంహరించుకొని కాదు.
ఇంత దారుణంగా సనాతనధర్మావలంబుల మనోభావాలను అపహాస్యం చేసినవారికి తగిన ప్రతిఫలం లభించుగాక!
నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/03/2023 12:56 pm
మన్నించాలి. ఈకథ నామనస్సును బాగా గాయపరచింది. ప్రాణం పోయేంతగా!
శ్రీమద్రామాయణం ఒక కథ అనుకుంటే అది వ్రాసినది వాల్మీకి మహర్షి. అయన కథలోని పాత్రలకు వ్యతిరేకమైన వ్యక్తిత్వాలను ఆపాదించి కల్పనలు చేసే స్వాతంత్రం ఎవ్వరికీ లేదు.
శ్రీమద్రామాయణం ఒక చరిత్రగ్రంథం అనుకుంటే ఆచరిత్రను గ్రంథస్థం చేసినది వాల్మీకి మహర్షి. అయన చెప్పిన చారిత్రకకథనాన్ని వెక్కిరించేలా ఆరచనలోని పాత్రలకు కొత్తకొత్త వికృతమైన కల్పనలతో మసిపూయటం క్షమార్హం కాదు.
కవులకు రచయితలకూ ఆమాటకు వస్తే అన్నిరకాల కళాకారులకు కల్పనాస్వేఛ్చ తప్పకుండా ఉంది. అంటే దాని అర్ధం ఇతరుల సృజనలోని అంశాలని విలోమం చేసి స్థలపాత్రకాలస్వభావాదులను ఇష్టారీతిగా మార్చిపారెయ్యటం కూడా స్వేఛ్చగా చేయవచ్చును అని అర్ధం కాదు.
రామాయణం ఆధారంగా అనాదిగా ఎందరో కవులు ఎన్నో ఎన్నెన్నో కల్పనలు చేసారు. కాని ఎవరూ రామాయణపాత్రలను అనుచితంగా చిత్రించి అపచారం చేయలేదు.
శ్రీమద్రామాయణం ప్రకారం సీత రావణుడి ముఖం కూడా ఎన్నడూ చూడలేదు. ఆవిడ ఎంతో కోరికతో శ్రధ్దతో రావణుడి బొమ్మవేయటం అనే వికారమైన అనుచితమైన ఆలోచన చేసిన వారిని ఏమనాలో తెలియటం లేదు.
రావణుణ్ణి సీత బిడ్డగా భావించిందా – ఇదీ ఎంత ఘోరమైన ఆలోచన!
సీతాపరిత్యాగానికి జానపదులు తమకు తోచిన కారణాలను తాము వెదుక్కున్నారు ఒక పాటలో. ఆపాట ప్రకారం శూర్పనఖ ఒక యోగిని వేషంలో అంతఃపురప్రవేశం చేసి సీతమ్మ దర్శనం చేసుకొని, సీతమ్మను రావణుడి బొమ్మ వేయమని అడిగితే ఆవిడ వాడి ముఖం చూడలేదంటే చూసిన భాగం వేయి అని అడిగింది. సీతమ్మ వాడి కాలి బొటనవ్రేలును మాత్రం చూసింది – అదే వేయగలిగింది. ఆబొమ్మను శూర్పనఖ అచ్చు సీతవేసినట్లే రేఖావిన్యాసంతో పూర్తిచేసి ప్రాణం పోసి ఎవరూ గమనించని సమయంలో ఆబొమ్మను రాముడి తల్పంలో దాచి చక్కాపోయింది. అర్ధరాత్రి వేళ ఆబొమ్మ రావణుడు “రావేసీతా లంకకుపోదాం” అని పాట లంకించుకుంటాడు. చివరకు రాముడు ఆబొమ్మను కనుగొని ఆబొమ్మ సీతవేసినట్లుగా ఉందని గ్రహించి కోప్పడి సీతను పరిత్యజించాడు. ఒక చమత్కారకథ. అంతే. గమనించండి. ఇక్కడ రామాయణపాత్రల స్వరూపస్వభావాలను కించిత్తూ మార్చటమూ అపహాస్యం చేయటమూ వంటివి జరుగలేదు. ఈ రచయిత్రిగారి కథకు ఆజానపదకథ ఆధారం అని తెలుస్తూనే ఉంది.
ఈ రచయిత గారెవరో నాకు తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. కాని ఒక స్త్రీ అయి యుండి గతకాలపు మరొక గౌరవనీయ వనిత మీద బురదచల్లే ఇటువంటి రచన ఎలా చేసారో అర్ధం కావటం లేదు. బహుశః ఒక స్త్రీవాది సీతను సృజించి రామాయణాన్ని ప్రశ్నార్ధకం చేదామన్న అత్యాశో దురాశో కారణం కావచ్చును అనుకుంటున్నాను.
ఏమి చేసి నామనస్సుకు తగిలిన గాయం నుండి నేను కోలుకోగలను? అర్ధం కావటం లేదు. ఇంకా ఇటువంటి భయంకరమైన రచనలను ఆధునిక సాహిత్యధోరణుల పేరుతో ఐతేనేమి తమకూ బాగా నచ్చి అయితేనేమి ప్రచురించిన ఈ “ఈమాట” పత్రికను నేను తక్షణం దూరం పెట్టటం అత్యవసరం అని భావిస్తున్నాను.
ఈమాటవారూ, మీకో దండం. ఇకపై మీ ఈమాట పత్రికను పొరపాటున కూడా సందర్శించను!
రామచంద్రప్రభో! బుధ్ధితక్కువై ఈమాట పత్రికను చదివినందూ, ముఖ్యంగా ఈఘోరమైన కధను చదివినందుకూ నన్ను మన్నించు!
నేత్రోన్మీలనం గురించి Poornima Pemmaraju గారి అభిప్రాయం:
11/03/2023 11:02 am
తనని ఎత్తుకెళ్ళినవాడిని బిడ్డగా భావించింది సీత. మరి ఇంకేం ఎవరైనా వాళ్ళకు నచ్చినవాళ్ళని ఎత్తుకెళ్ళచ్చు, పెళ్ళి చేసుకోమని force చెయ్యచ్చు. అమ్మాయి ఏమనుకోదు. తరువాత కూడా తన బిడ్డలానే అనుకుంటుంది. బిడ్డ తప్పు చేశాడని క్షమిస్తుంది. Very good, చాలా మందికి inspiration ఈ కథ. అక్కడ సీత, రావణుడు, రాముడు పేర్లు పెట్టుకోడం వలన చప్పట్లు కొట్టొచ్చేమో కాని నాకు అర్ధమైన moral అయితే ఇదే. మీకెవరు నచ్చితే వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. బలవంతాన ఎత్తుకెళ్ళండి అని.
రుచి గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
10/16/2023 2:25 pm
ఈకథ బాగుంది. గొప్పగా ఉందని మాత్రం అనిపించలేదు. నాకారణాలు నాకున్నాయి. చర్చనీయాంశం అది కాదు. లైలాగారి స్పందనకు ప్రతిస్పందనగా వ్రాస్తున్నాను నాలుగుముక్కలు.
ఈకథలో ఆపేద అమ్మాయీ ఆమె గురించి చెబుతున్న మగబాసూ ముఖ్యపాత్రలు. బాసు మగవాడైపోవటం ఆపైన ఆమెపైన జాలిపడటం (తద్వారా ద్వారా హీరో ఐపోవటం) లైలా గారికి నచ్చలేదు. ఆడబాసు అయ్యున్నా కథ అచ్చం ఇలాగే ఉండేది. అప్పుడు లైలాగారికి అందులో ఆ హీరోయిజం అనే తప్పు తోచేది కాదు. కానీ ఆ హీరోయిజం కేవలం ఆనుషంగికం.
కోపావేశంలో లైలాగారి దృష్టినుండి తప్పిపోయిన కొన్ని సంగతులున్నాయి. ఆ పేదపిల్లకు ఒక పిన్నీ ముగ్గురు చెల్లెళ్ళూ ఉన్నారు. సగటు పేద/మధ్య తరగతి తండ్రిగా పెద్దనం చెసే ఒక పెద్దమనిషి ఉన్నాడు. నిస్సహాయస్థితిలో ఆమె కండలు వాళ్ళ యింటిపోషణకు కరిగిపోయి బక్కపీచు ఐపోయింది. స్త్రీవాదకోణంలో తగిన స్తోమత లేకుండినా రెండవపెండ్లి చేసుకొని బిడ్డల్ని కని పెద్దపిల్ల నెత్తిన బాధ్యత పెట్టి కనీస ఆప్యాయతను కూడా పంచ(లే)ని ఆమూర్ఖతండ్రి మీద పడాలికదా లైలా గారి కోపదృష్టి? నాకెందుకు అని అనుకోలేక జాలిపడిన ఆబాసు మగవాడైనంత మాత్రాన అందులో ప్రపంచద్రోహం ఉందని గింజుకోవటంలో అర్ధం లేదు.
సగటు స్త్రీలకు సాటి స్త్రీలపట్ల కనీసపు జాలికూడా ఉండటం లేదన్న సంగతిని ఈకథ వేలెత్తి చూపింది. స్త్రీవాదులు ఈసంగతిని – అంటే స్త్రీలలో సానుభూతిరాహిత్యాన్ని – ఒక ఆందోళనకరమైన సంగతిగా ఆలోచించాలి. ఈసంగతి లైలాగారి దృష్టికి రానే లేదు. మగబాసులను తిట్టినంత మాత్రాన స్త్రీవాద దృక్పథం ఐపోతుందా అన్న ఆలోచన ఆవిడకు రాలేదు.
ఎప్పుడూ మగవాళ్ళు రక్షకులూ ఆడవాళ్ళు రక్షితులూ కావటం అనేది దాటి సాహిత్యకారులు ఆలోచించలేరా అన్న లైలాగారి నిలదీత హర్షణీయమే. కాని ఈకథలో అదంత ముఖ్యవిషయం కాదు.
ఈకథ నాకు నచ్చకపోవటానికి ఉన్న అనేకకారణాలలో ఒకటి – ఒక పూట ఆమెకు విందుభోజనం (కించిత్తు బలవంతంగా) తినిపించినంత మాత్రాన ఆపిల్లకు కలిగే ప్రయోజనం ఏముందీ అన్నది.
రుచి గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
10/10/2023 5:04 pm
ఈమాటలో – ఏ కవిత చూసినా ఏమున్నది గర్వ కారణం! స్త్రీ కళ్లలోనే ఎప్పుడూ నీళ్లు. మగవాడు మహాద్రష్ట కవి.
ఈమాటలో – మహా రచయిత జయమోహన్ ఏ కథ చూసినా ఏమున్నది గర్వకారణం! ఈ కథలోనూ స్త్రీ కళ్లలోనే నీళ్లు. ఇతని కథల్లో – ఏనుగు, డాక్టరు, రచయిత ఉంటే – ఏనుగుకి కాదు, ఏనుగుని రక్షించిన డాక్టరుకు కాదు, డాక్టరుని రక్షించే ఏనుగుకి కాదు, కథ రాసిన రచయితకి ఎవార్డు వస్తుంది.
కథలో ‘హీరోయిజమ్’ మగవాడిది. స్త్రీ రక్షించబడేది. స్త్రీ ఇతరులను రక్షించే, కాపాడే, సహాయం చేసే స్థానంలో ఉండదు.
అక్కడికి ఈ ‘రుచి’ కథలో బాస్ హీరో ప్రైడ్ ఏమిటి? ఆమె పే-చెక్ లోనే కొంత కట్ చేసి ఆమెను చీరలు కొనుక్కోమనటమా? ఆమెతో బలవంతాన తన అన్నం తినమని గొంతు పెంచి తన బాస్ గిరీ చూపటమా? ఆ యువతి ఇంటికి పొయ్యాక మిగతా పే-చెక్ ఎలాగూ నాన్న దొబ్బుతాడు కదా? జరిగిన మాలావు ఘనకార్యం ఏం లేదు. కథలో హీరోకి తన పనికిమాలిన సహృదయత గురించిన తన ఓన్ సంతృప్తి తప్ప.
నా చిన్నతనంలో ఓ రోజు, నా ఒక తమ్ముడు డ్రీమ్ లేండ్‌లో ఉన్నట్టుంటే – ఏం ఊహిస్తున్నావని అడిగాను. నాకు పెద్ద కష్టం వచ్చినట్టూ, తను డ్రాగన్‌లతోనూ, రాక్షసులతోనూ యుద్ధం చేసి నన్ను రక్షిస్తున్నట్టూ కలగంటున్నట్టు చెప్పాడు. ఎప్పుడూ నిజమే చెప్తాడు, ఆ సుగుణం ఉంది. కాని నేను – ఆహా! నా తమ్ముడు, నాపై ఎంత ప్రేమ! అనుకోలేక పోయాను. నాకన్నా ఎంతో చిన్న బక్క పీచు వెధవ, గాలేస్తే కొట్టుకు పోయే వెధవను, బోలెడుసార్లు నేను చేయి పట్టుకుని రోడ్ మీద నడిపించి రక్షిస్తే ఇదీ ఈ రాస్కెల్ కృతజ్ఞత. నాకు కష్టాలు రావటమెందుకూ? ఈ బొట్టిగాడు నన్ను రక్షించటమెందుకూ. దాని బదులు తనకే కష్టమొచ్చినట్టు, నేను తనను రక్షించినట్టు ఊహించుకోవచ్చుగా.
అదే హీరోయిజమ్‌లో దాగి ఉన్న ఈగోయిజం. కొందరి రచనల్లో హీరోయిజంకి, విక్టిమిజంకి గల సంపర్కం. అదే! ఈ వెనక బడిన కథలో హీరో వీరత్వం. తన బొచ్చు మగ బతుకులో, తనే ఓ చచ్చు ఇగోయిస్ట్‌నని ఆఖరి సీన్‌లో కూడా గ్రహించుకోలేని మూర్ఖత్వం.
ఒక స్త్రీ ఎఛీవ్‌మెంట్స్ ఏ సెక్టర్‌లో గాని ఎత్తి చూపగల సాహసం, భారతీయ మగరచయితకు ఎప్పటికైనా వస్తుందా? అలాటి హీరో అతడు కాగలడా? ఐ డౌట్ ఇట్.
-Lyla
అక్టోబర్ 2023 గురించి Indra Prasad గారి అభిప్రాయం:
10/06/2023 12:31 pm
మీ సంపాదకీయం నాకు నచ్చింది. ఇటీవలి నా రెండో పుస్తకం.”కాలం సైకత తీరం” తుది రూపం ఇచ్చే ముందు కవితల ఎంపిక, ఎడిటింగ్, విభజన, విశ్లేషణ, ముగ్గురు స్నేహితులు చేసేరు. ప్రచురణ బాధ్యత ఛాయా తీసుకున్నా, మూడు, నాలుగు సార్లు ప్రతిని సరిచూసి విడుదల చేసేం. మొదటి పుస్తకానికి కూడా ఇలాగే పని చేసేం. స్వంత ప్రచురణ అంటే మనకి తోచింది ప్రచురించడం కాదు అని నాకూ అనిపిస్తుంది.
సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి Prasuna Balantrapu గారి అభిప్రాయం:
10/03/2023 12:27 am
చాలా బాగుందండి. బారక్ ఎందుకు ఖాళీ అయ్యిందొ కాని జ్ఞాపకాలు వుండి పోయాయి.
అక్టోబర్ 2023 గురించి S. Narayanaswamy గారి అభిప్రాయం:
10/02/2023 5:56 am
తమ సొంత ఖర్చుతో తమ రచనల్ని ఎవరైనా అచ్చు వేసుకోవాలి అనుకుంటే దానికి ఎవరికీ అభ్యంతరం వుండక్కర్లేదు. తెలుగు భాషలో చాలా ఏళ్లుగానే ఒక పబ్లిషర్ మదుపు పెట్టి పుస్తకం వెయ్యడం అనే బిజినెస్ మోడల్ కనుమరుగు అయింది, రెండు మూడు రకాల పుస్తకాలు మినహాయించి. ఇక పుస్తకాల అమ్మకానికి, చాలా పద్ధతులు ఉన్నాయి, కొత్త టెక్నాలజీలతో ఇంకొన్ని దారులు తెరుచుకున్నాయి కానీ ఆ రంగంలో ఉన్న ఎవరికీ వాటిని సరిగ్గా వాడుకుని పుస్తకాల అమ్మకం పెంచే వైపు ఒక దృష్టి కానీ నిబద్ధత కానీ ఉన్నట్టు కనబడదు. భవిష్యత్ సంగతి ఏమో గానీ ఇప్పటికైతే పుస్తకం కొని చదివే పాఠకులకి కొరత లేదు. కొనుక్కుందాం అని ఆలోచన రాగానే వారికి పుస్తకం అందుబాటు లోకి తెచ్చే వ్యవస్థ మార్కెట్లో లేదు.
కేశం గురించి Srinivas గారి అభిప్రాయం:
09/12/2023 10:21 pm
ఇది చాలా బిగినింగ్‌లో చేసిన అనువాదం సార్. మూడో కథ. పైగా అతడి కథలన్నిటిలో కొత్త కొత్త పదాలు కాస్త కఠినంగా ఉంటాయి. మీ సూచన మేరకు సవరణలు చేశాను కాని, కేశం, కేశాలు అని తెలుగులో కూడా అంటారు. మీరు తమిళంలోనే అంటారు అనడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.
కేశం గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
09/08/2023 8:47 pm
‘కేశం’ అంటే అంటే తమిళంలో ‘కురులు’ అనుకుంటాను. అత్తియప్పన్ – తంగంల అనుబంధం ఊహించినట్టే జరిగింది. ఆ ఇద్దరూ చనిపోవడం ఒక విధంగా సుఖాంతమే! అనువాదం ఇంకొంచెం సరళంగా వుండవలసింది అనిపించింది.
యాస, మాండలికం మీద తెలుగులోసాహిత్య రంగంలో చాలా చర్చ జరుగుతూనే వుంది. ఉనికిని చాటి చెప్పేది కాబట్టి దానిని మేము వాడుతున్నాము అనే వర్గం ఒక వైపు. ఇతరులకి అర్ధం కావాలి కదా చెప్పదలుచుకున్నది అని మరో వైపు.
వుండేది – సరి కాదేమో. వున్నది. కధా కాలానికి వుంది. కథ ముగిసే నాటికి కూడా వుంది. కాబట్టి ‘వుంది’ సరైన వాడుక అనుకుంటాను.
అలాగే ‘అండా’ అన్న పదం. సందర్భాని బట్టి అది నీరు నిల్వ వుంచే పాత్ర అని ఊహించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాని అండా అన్నది తెలుగు ‘బిందే’ కన్నా పెద్దది అని అనుకోలు. ఆ రెండింటి మధ్య తేడా చాల సున్నితమైనది. అంతర్జాతీయ అనువాదాలలో కూడా ఇటీవల ఒక వాదన వినపడుతోంది. మూలంలో ఉన్న పదాలకు (పర భాషలోని) అర్ధాలు, వివరణ, పాదసూచికలు ఇవ్వాల్సిన అవసరం లేదని. ఆలోచించదగ్గ విషయమనిపించి ఇక్కడ ప్రస్తావించడం.
సెప్టెంబర్ 2023 గురించి శామల గారి అభిప్రాయం:
09/04/2023 5:58 am
‘సాహిత్య సమాజం’ అన్న పదానికి ప్రమాణాలు స్ఫురించటం లేదు. సాహిత్యసమాజం ఎందుకు, ఏ ఆశయంతో ఎదగాలి? అందునా బలంగా? చారిత్రాత్మకంగా ఎన్ని సమాజాలు, ఏదేశాల్లో, ఏ కాలాల్లో సాహిత్యపరంగా ఎదిగాయి? బలంగా? ఆ ఎదుగుదల ఎటువంటి పరిగణనీయమైన ప్రయోజనాలు సమాజానికి ఒనగూర్చింది?
సాహిత్యాభిలాష పైన పేర్కొనబడ్డ ఎదుగుదలకి ముఖ్య ప్రేరణాంశం అనుకుందాం. సాహిత్యాభిలాష రచయితలో ఉండాలా, పాఠకుడిలో ఉండాలా? ఇరువురులోనూ సమపాళ్ళలో ఉండాలా?
సాహిత్యాభిలాష కొరవడితే బాధ్యత రాసేవాడిదా, చదివేవాడిదా, ఇద్దరిదీనా?
సాహిత్యకృషికి ప్రోత్సాహం, తగినంత, ఎక్కడినించి వస్తుంది, ఎవరిస్తారు, ఎవరివ్వాలి?
ఈ అంశాల తర్వాతకదా, ఇవి సరిపొయాయా ఇంకా ఏమైనా తక్కువయాయా అనే చర్చ?
నేడు కావ్యాలు రాయించుకుని, అంకింతం చేయించుకుని మాన్యాలిచ్చే రాజులు లేరు, సమీప భవిష్యత్తులో ఉండే అవకాశాలు లేవు. మాన్యాలే ప్రోత్సాహాలనుకుంటే!
ఆఁ, పిల్లాపెద్దా అతుక్కుపోయి చదివే, పిదప సినిమాలు తీయగలిగే ‘హారీ పాటర్’ శృంఖల రాయి; పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. సాహిత్యం అని కొందర్ననమను, నేను విఠలాచార్య జానపదం అంటాను.
మొన్నీమధ్య (అర్ధశతాబ్దం క్రితం) దాకా విశ్వనాథ వంటి మహామహిన్విత కవులు అనేకమంది దారిద్ర్యంలో మ్రగ్గారు. నేడా పరిస్థితి లేదు. సాంకేతికత పుణ్యమాని, అణాకాని వాళ్ళు కూడా యూట్యూబ్‌ని ఆశ్రయించి కోట్ల లైకులూ, లక్షల డాలర్లు వెనకేసుకుంటున్నారు.
పస ఉన్న, హృదయాన్ని కదిలించగల ఇంకో తిలక్‌ని, మల్లాదిని, కొకుని, చలాన్ని చూపించండి; ప్రశంసలూ, సంపదలూ కోకొల్లలుగా ఎందుకు కురవవో చూద్దాం.
ప్రచురణ సంస్థల రోజులు పోయాయి, రచయితలు వెబ్‌మాగజైన్‌ల మీద ఆధారపడే రోజులూ చరమదశకి వచ్చాయి.
సమాచారం మెరుపు వేగంతో ప్రపంచం అంతా వ్యాపించే రోజు ఇది.
‘ప్రతిభ దాగదు.’ ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నవి డిక్టేషన్ వాక్యాలు కాదు, అక్షర సత్యాలు అని నిరూపించగల సత్తా నేటి సాంకేతికకీ ఉంది, నేటి యువతరానికీ ఉంది.
నాకు నచ్చిన పద్యం: మానవల్లివారి మాలికాస్మృతిగీతం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
08/07/2023 9:05 am
“కవిని కవియొక్క కావ్యము కమ్మివేసింది. కవి లేడు, కాని కవి పలికిన కావ్యం ఉంది. ఆ కావ్యంలోని నాయిక ఉంది. ఆ కవిత ఇచ్చిన రసానందం ఉంది. దాన్నే గానం చేశారు రామకృష్ణకవి. ఇంతకన్నా కవికి కావలసినదేమిటి?”
Beautiful thoughts.
I would say English poet A.C. Swinburne, (1890) Telugu poet Manavalli (మానవల్లి) are contemporaries, though from different continents.
Swinburne wrote an elegy, on Baudelaire. He titled it “Ave Atque Vale” (Hail and Farewell.) He ran it as a seven-liner rhymed metrical stanzas of total of 200 lines. I am adding up the title and Swinburne’s signature. A quotation from B’s French poetry precedes Swinburne’s poem in English.
Commonalities of course will be mythological references and Nature. Does not surprise me.
Like Manavalli, Swinburne praises B’s major poetic work ‘Les Fleurs du Mal.’ Knowing B did not have an easy life, and was rather a troubled individual, Swinburne just wishes ‘rest’ for him. He is relieved there will be no further aggravations for this dead man. No creditors at his doorstep. No more letters to write to mother begging her to release some money, so he can buy some hashish, opium, and human companionship. Or buy a little more time on earth, to continue his artistic work. Whichever way one wants to look at it.
Swinburne is not a believer of Christian God, afterlife, forgiveness of God for man’s sins.
Seriously, what is God! What is soul! There are no such things. They too are grand poetic thoughts of men. ఘనత వహించిన కవిసమయములు.
Swinburne does not like Church. He loves mythology, but his feet are steadily on earth.
He believes more in man. So, he very humanly -asks B to forgive others who had wronged him personally during his life. For his own peace. Rest, rest peacefully my predecessor! dear B, dear brother! My fellow poet!
Manavalli as per his own beliefs and existing sentiments at that time, sends Madabhushi (మాడభూషి వేంకటార్య) to heaven. He also is not a criticizing poet in his elegy, not critical of liaison between Menaka and Vishwamitra, has no moralistic condemnation. Looks upon the birth and subsequent life of Sakunthala with admiration, joy. He sees beauty in nature, on earth, in heaven.
These two Elegists are very focused on Literary creation, of appreciating Literary work. They ‘come in praise’ for the poet.
I am now giving an old poem of mine just for the heck of it, (which came to my mind when I recently received a certificate for being a member of a medical society for fifty years) without analyzing it. Here it is.
Fall in Rochester
The raker of falling leaves
Of Chestnut and Maple trees
Off 41 Lake Lacoma groves
Rake not too hard
And pierce not my heart
I laid myself down
By the side of the brown lake.
Do you not hear my sighing,
Underneath the rustling leaves?
Rake not too hard
And tear me not to pieces.
Let me be. Let the leaves fall.
Let colors swirl around.
Later when the snows fall,
I may be numb and frozen.
My heart will still be throbbing.
Do not bring in your ploughs!
And carry me away not.
Remember Rochester
Rake not too hard!
I have not left town.
Let things be.
-Lyla
నాకు నచ్చిన పద్యం: ఒక పరిణతమైన ఆశుధార గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
07/18/2023 8:20 am
Parimi’s opening paragraph is brilliant.
సమస్యాపూరణము, పద్యావిర్భావము గురించి పరిమి భావనలు ఉదాత్తమైనవి. క్లిష్టమైనవి. వారి వచనం- మొదటి పేరాలోని విషయం, ఆ ఆలోచన చేసిన విధం, ఆపైన చెప్పిన విధం, నాకెంతో నచ్చి, it is brilliant! Bravo! అనుకున్నాకే, అప్పుడు నేను పార్వతీశ్వర శాస్త్రి గారి పద్యం చదివాను.
పద్యం నాకు నచ్చింది. ఐతే పరిమి గారి వల్లనే, నేను ఆ పద్యం కొంత వేరు విధంగా చదువుకున్నానేమో. ప్రస్తుతం నేను చదువుతున్న ఇతర కవుల ప్రభావం కూడా ఉండవచ్చును.
Poets Swinburne and Baudelaire -Both are sticklers for music, symmetry and sound in a poem. They both are fanatical about choosing the right words. More so, they hope for proper interpretation of the chosen words, from the reader. And above all, they believe poetry should evoke “Un état d’âme” (a state of mind.)
పరిమి మొదట్లో అన్నట్లు ఈ ఒక్క పద్యమే కావ్యమై, అది భాసించాలంటే, దానిలోని పదాల అర్ధాలు కొంత వేరుగా చదువుకోవాలి.
ఇప్పుడు -‘ఈమాట’ కవి సమ్మేళనంలో శ్రోతలు, ప్రశాంతతతో, ఈ క్రింది గీతం లోని నాయికను ఊహించి, వినండి. ఆమె ఆ రాత్రి, ఇలా పాడుతున్నది.
“ఏదీ చాందినీ?
ఏదా చలువల కాంతీ?
ఇవేళా
అలలమిలమిలలవేవీ!
ఏదీ సంపగీ?
ఏదా కుసుమపు భ్రాతీ!
ఇవేళా
సుఖపరిమళములవేవీ!
ఏదీ తెమ్మెరా
ఏలా నిమురదు చెక్కిలీ?
ఇవేళా
తనువులపులకలవేవీ!”
కవి పార్వతీశ్వరశాస్త్రి మృదుహృదయుడు. ఆయనకు ఒక కోమలి ఒక్క పువ్వు కోస్తే, అంతమాత్రానికే కోయిల కన్నెర్ర చేసి, ఆమెను బెదిరేట్టు చేయటం నచ్చలేదు. అందువల్ల, తన కవితా శక్తితో దరిమిలా అంతటా వెన్నెల పరిపించాడు. మన్మథుడిచే ఆమెపై పలుమార్లు ‘పూలు’ కురిపించి పదేపదే ‘అహహా అనేట్టి వివశతను’ ఆమెకు కలిగించాడు.
I like guys with heart. I like such givers. I like people that can make others happy.
పార్వతీశ్వర శాస్త్రి పద్యంలో ‘అహాహా’ (the woman’s repeated exclamations,) బాధా సూచకము కాదు. ‘బాణం’ అనగానే ‘బాధను’ ఊహించటం సభికులకు సర్వత్రా సరికాదు. నిఘంటువు ప్రకారం ఆ అర్ధం సాధ్యమే కాని ఎందుకు? ఆ ఆలోచన పద్యపు అందం తగ్గిస్తుంది. అందునా ఒక్కటే పద్యం చెపుతున్నప్పుడు Pain, deprivation తో ఎవరి మనసైనా రంజించగలరా!
పూలబాణాలు, పూలు, flowers-intoxication అన్న పొయటిక్ ఆలోచన ఈ సందర్భంలో సరైనది.
-Lyla
వసంతతిలకము గురించి J K మోహన రావు గారి అభిప్రాయం:
06/14/2023 11:39 am
శ్యామల రావు గారు,
యతి:
యతి మూడు విధములు, అవి విరామ యతి, అక్షరసామ్య యతి, ప్రాస యతి. విరామ యతి అనగా అక్కడ పదము అంతము కావాలి, తఱువాతి అక్షరముతో ఒక క్రొత్త పదము ప్రారంభము కావాలి. సంస్కృత ఛందములలో పాదాంత విరామ యతి సామాన్యము. అందువలన సంస్కృత వృత్తములు సామాన్యముగా గుర్వంతములు. పాదాంత హ్రస్వాక్షరము గురుతుల్యము. కొన్ని ఛందములకు పాద మధ్యములో ఈ విరామ యతి ఉండదు. అక్షరసామ్య యతి అనగా పాదపు మొదటి అక్షరమునకు యతి స్థానమునందలి అక్షరమునకు హల్లుల, అచ్చుల పొంతనము ఉండాలి. మొట్టమొదట ఈ యతుల సంఖ్య తక్కువగా ఉన్నను నేడు అవి పుట్టగొడుగులలా వ్యాపించి పోయాయి. ద్వితీయాక్షరము ప్రాస కనుక ప్రాస యతులు యతి స్థానము పక్కన ఉండే అక్షరమునకు హల్లుల పొంతనముతో ఉంటుంది.
యతిని ఎక్కడ ఉంచాలి? సంస్కృతములో విరామ యతులను పాదపు విఱుపులుగా వివరించినారు, ఉదా. శార్దూలవిక్రీడితపు విఱుపు 12, 7 అక్షరాలు. సంస్కృతములో మానిని కవిరాజవిరాజితము వంటి తాళవృత్తములకు యతిని నిర్దేశించరు, దానిని కవికి వదిలెదరు. తెలుగులో పది లేక అంతకన్న ఎక్కువగా ఉండే అక్షరాలు కలిగిన వృత్తములకు యతి తప్పని సరి. కాని ఈయతి స్థానము ఎల్లప్పుడు logical గా ఉండవు. సామాన్యముగా తెలుగు లాక్షణికులు లఘువుపైన యతిని ఉంచరు. యతి స్థానము నా ఉద్దేశములో ఐచ్ఛికము. కొన్ని సమయాలలో లాక్షణికుల యతి స్థానము మాత్రాగణములకు సరిపోదు, ఉదా. ఇంద్రవజ్ర. UUI UU IIUI UU ఇది గురు లఘువుల అమరిక. సంస్కృతములో దీనికి యతి లేదు. తెలుగులో ఎనిమిదవ అక్షరము పైన. ఎందుకో? పాదము 5,4 5,4 మాత్రలకు సరిపోయినప్పుడు యతి స్థానమును రెండక్షరాల పిదప ఎందుకు ఉంచాలి? అది లఘువు చేసిన పాపమా? ఇలా ఎన్నో ఉన్నాయి. వసంత తిలకకు ఒక యతి, అందులోని మొదటి గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు మఱొక చోట యతి.
నేను పాదమును తాళబద్ధముగా వ్రాయుటకు వీలవుతుందా అని పరిశీలించి యతి స్థానమును నిర్ణయిస్తాను. ఒకే పద్యమునకు రెండు విధములుగా కూడ యతులను పెట్ట వీలగును!
కన్నడములో యతి లేదు, మలయాళములో కూడ విరామయతి మాత్రమే. తమిళములో యతిని మోనై అంటారు. తమిళములో యతి ఉన్నది. కొన్ని సమయాలలో యతి, ప్రాసయతి ఒకే పాదములో ఉంటాయి కూడ!
కావున యతి విషయములో logical personal preferences ఆమోదయోగ్యమే!
వసంతతిలకమునకు నేను నిర్ణయించిన యతికి కారణము అది ఇంద్రవజ్రనుండి జనించినది, దానికి ఇంద్రవజ్రపు యతి పొసగుతుందని. సరసాంక వృత్తమునకు కూడ ఇట్టి యతియే.
విధేయుడు – మోహన
రుబాయీలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
06/11/2023 8:35 am
రెండు నెలలకు ముందు హైదరాబాదులో ఒక సాహిత్య సమావేశములో ఒక expert కేవలము aaba అంత్యప్రాసలతో ఒక కవితను రుబాయీ అని వ్రాసినారు. నేను దానికి రుబాయీ ఛందస్సు లక్షణములు లేవు అని చెప్పగా రుబాయీకి తెలుగుకు సరిగా మహాకవి దాశరథి చెప్పినట్లు (దాశరథి అలా చెప్పలేదు) వ్రాస్తే చాలు, విదేశీయ ఛందస్సు అవసరము లేదని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా రుబాయీ ఛందములను పరిశీలిస్తున్న నేను అందులోని 3/12 కందములోని సరి పాదములకు సరిపోయినప్పుడు దానికి విదేశీయతను ఆపాదించడము సబబు కాదని ఈ వ్యాసమును రచించినాను. అది దీని background. ఇక పోతే దువ్వూరి ఆదిభట్ల మున్నగువారు వారు వ్రాసినవి అనువాదములు అనుసృజనలు అనియే చెప్పుకొన్నారు. పారసీకములోవలె రుబాయీలు అని చెప్పుకోలేదు. కాని తెలుగులో పారసీక ఉర్దూ భాషలలోవలె రుబాయీలను వ్రాయ వీలగును, అలా వ్రాసినప్పుడు అవి సహజముగానే తెలుగులో ఉంటాయి అన్నదే ఈవ్యాసపు ముఖ్యోద్దేశము. మఱి అరవై సంవత్సరాలుగా ఎందుకు వీటిని గొప్ప కవులు తప్పు దారిని నడిపించారో నాకు తెలియదు. నాకు Spanish తెలియదు కనుక మీ రుబాయీ నాకు అర్థము కాలేదు. నమస్సులు.
శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి రంగావజ్ఝల మురళీధరరావు గారి అభిప్రాయం:
06/02/2023 3:54 am
మోహనరావుగారికి శిరసు వంచి, పాదాభివందనములు అర్పిస్తున్నాను. చర్చలలో పాల్గొన్న పండితవర్గానికి కైమోడ్పులు. మీరు ఛందశ్శాస్త్రముపై ప్రదర్శించిన పరిశోధనా వ్యాసము అత్యద్భుతము. నాకు మీ వ్యాసము చదివాక ఛందశ్శాస్త్రము మోక్ష సాధకము అనే నా విశ్వాసమునకు ఊతము చిక్కినది. ఈ వ్యాసములో “ఆత్మ పరమాత్మను చేరు సాధకము ఛందశ్శాస్త్రము” అని నా అంతరంగ పరిశోధన, నా తపన ఎంతో కాలంగా వేధిస్తూ ఉంది. ఈ వ్యాసం నాకు చాలా ఊతం ఇచ్చింది. మీ ఛందశ్శాస్త్ర పరిశోధనలు నాకు కావాలి. మెయిల్కు పంపినా సరే! ఎలా లభ్యమవుతాయో దారి చూపగలరు. నాకు మోక్షైకసాధకము ఛందశ్శాస్త్రము అని పరిపూర్ణ నమ్మకముంది.
ఉదాహరణ: 1. భుజంగ ప్రయాతము ఛందస్సు. సర్పపు నడక. అనగా మూలాధారమునుండి సహస్రార పరమాత్మను చేరు సాధనము భుజంగ ప్రయాతము. పంచభూతతథ్వాలను అధిగమించి, వానిపై గల మనసును శూన్యమును చేసి, సుమన దాటి, ఉన్మనను ప్రవేశించి, సహస్రారబిందు పరమాత్మ దర్శనమే భుజంగ ప్రయాతపుటాంతర్యము. అందుకే శంకరులు మానవులను భుజంగప్రయాతములో ఆ యా దైవాలను స్తుతించి, కుండలినీ చైతన్యముపొంది, ఊర్ధ్వగామియై, బ్రహ్మరంధ్రము విచ్ఛిన్నమై విశ్వవిరాట్లో చేరాలని విశ్వహితైక దృష్టితో శంకరులు మనకోసం రచించారు. శంకరుల అద్వైత పునః ప్రతిష్ఠత్వానికి అత్యంత బలీయమైన ఉదాహరణ.
మరొక ఉదాహరణ: శంకరుల ప్రథమమైన ఆశు శ్లోకము వసంతతిలకము “అంగం హరేః పులక….” అనునది. ఆ మొదటి ‘అం’ బ్రహ్మను ‘గం’ పొందించేది. అని వారి జీవితసందేశమును మానవుల జీవితాలు ఆధ్యాత్మిక వసంతంలా విరియాలని, పద్మములై అంటని సరోజములై అద్వైత సిద్ధి పొందాలని వారి హృదయసారమని నా విశ్వాసము. ఇలా చూస్తే ఒక్కోఛందమునకు ఒక్కో అధిదేవత ఉంటాడు. 26 ఛందస్సులు సంస్కృతములో. 26 మంది దేవతల శక్తి ఆ యా 26 ఛందాలలో కప్పబడి ఉండి, “ఆచ్ఛాదనే, ఆహ్లాదనే” అను ఛందోనామ సార్థకతను సంతరించుకున్నాయి. వాల్మీకి రామాయణంలో గాయత్రిని నిబద్ధించారు. శంకరులు కైలాస దర్శనంలో అమ్మ ఇచ్చిన సౌందర్యలహరి లో నందీశ్వరుడు 59 శ్లోకాలు శంకరునివద్దనుండి లాక్కొనిపోతే, శంకరులు అమ్మతో మొరపెట్టుకుంటే అమ్మ నువ్వు 59 వ్రాయి అని కటాక్షించింది. 41+59=100. శిఖరిణి ఛందస్సు. అమ్మ హిమజ. కైలాసపతి సహచరి. శిఖర సంచారిణి. కనుక ‘శిఖరిణి” రూపంలో జగన్మాత దర్శనమిచ్చింది. సౌందర్యలహరి అనుభవిస్తే మన సహస్రారశిఖరములో గోచరిస్తుంది. మోక్షము చేకూరుతుంది.
కావ్యకంఠగణపతిముని ఇంద్రాణీసప్తశతిని ఏడు వైదిక ఛందస్సులలో స్తుతిస్తూ వ్రాసారు. అది ఒక వైపు భరత జాతి విముక్తి. భరత సంఘ బానిసత్వ విముక్తి. దేహవిముక్తి. అలౌకికభక్తి పరాకాష్ఠ, లౌకికంలోనూ ప్రదర్శించిన సిద్ధుడు. తపస్వి, ఉపాసకుడు. మహోత్తుంగశిఖరం. లౌకికాలౌకిత్వములసవ్యసాచి ప్రపంచములో లేడు. ఇంకా ఇలా ఆలోచిస్తే ఒక కవి, ఉత్పలమాల, శార్దూల, మత్తేభాలతో స్తుతి చేసాడంటే సత్వగుణమాలిన్యం, రజోగుణ మాలిన్యం, తమోగుణమాలిన్యం తొలగి “నిస్త్రైగుణ్యో భవ అర్జున!” అన్న గీతాసందేశం, ఛందశ్శాస్త్రము మోక్షప్రదమని ఋజువవుతుంది.శంకరుల స్తోత్ర సాహిత్యజగమంతా దాదాపు 20 వృత్తములలో ఉన్న తీరు మంత్రోపాసనాది గర్భితమై మోక్షైకసాధనము, అద్వైత సిద్ధి సోపానము ఛందశ్శాస్త్రము అని ఋజువవుతుంది. బుధజనులు దొసగులను మన్నించండి.అవి గరళము. అమృతం ఆస్వాదించండి.
ఆర్యా! మరో ఉదాహరణ: పంచచామరము. శకరులవారు గణేశపంచరత్నమును “ముదాకరాత్తమోదకం…. అని అలాగే ‘నర్మదాష్టకమును’ పంచచామరము’ వృత్తములో రచించారు. పంచచామరములో విశేషముంది. చామరము చమరీమృగపు వెంట్రుకలతో తయారు చేసినది. చమరీమృగము సత్వగుణానికి ప్రతీక. ఆ రోమాలు కూడా సత్వసంజాతములు. పరమాత్మ గణేశుడు కాని, జీవనది నర్మదానది గాని ప్రాణదాతలు. గణేశుడు మూలాధారమందు ఉన్న గణేశుడు. ఆయనను ఆరాధిస్తే గాని కుండలినీ చైతన్యము ఊర్ధ్వగామి కాదు. ఆయనను ఆరాధించాలి. ప్రసన్నుడు కావాలి. ఆయనను సర్వాత్మనా రుక్మిణీదేవి, ప్రహ్లాదుడు సర్వేంద్రియములతో పరమాత్మను సేవించారు. ఇంద్రియాలను అంకితం చేసి స్వామిని శూన్యమనసున దర్శించారు. పరమాత్మ కరుణించి, అటు గజేంద్రుని అందరు భక్తులను పంచేంద్రియములతో సర్వసమర్పణ భావముతో ” తుభ్యమ్ నమః, న మమ” భావంతో సేవించారు. అలాంటి సేవనే పంచేంద్రియములతో నర్మదాదేవిని స్తుతిస్తే అమ్మ కమండలము లోనికి వచ్చి రక్షించింది. అలాగే గణేశుని అలాగే పంచేంద్రియములతో ఆరాధిస్తే పరమాత్మ సాయుజ్యం లభ్యం. కనుక పంచ, అనగా ఐదు ఇంద్రియములను సత్వసంయుతచిత్తముతో ఆ ఇంద్రియములనే చామరములుగా చేసి, అటు గణేశుని, నర్మదను సేవించి, తమను భగవంతునకు అర్పణము గావించుకున్నారు. పంచేంద్రియములు ప్రపంచ వాసనలు విసర్జించి, గణేశ, నర్మదలను పంచేంద్రియ సేవ అంతేగాక పంచ అనగా విస్తారం సమస్తదేహాన్ని సర్వాంగాలతో అటు జ్ఞానేంద్రియములు, ఇటు కర్మేంద్రియాలు అన్నిటితో మెప్పు పొంది తరించి, ధన్యులై, మానవులను పంచ చామర వృత్తములతో దేవతలను పంచేంద్రియ సమర్పణముతో సేవించి తరించండి అని ఛందస్సు మోక్షసాధకమని ఆదిశంకర భగవత్పాదులు మనకు దివ్యబోధ గావించారు. ఈ పరమాత్మ సాయుజ్య ప్రాప్తి, ఛందస్సు ద్వారా సాధ్యమని శ్రీ గురువర్యులు మోహనరావు గారు నాకు ఈ అభిప్రాయమంజరిని పంచుకొనుటకు దేశికులైన వారి చరణారవిందములకు మరో మారు వందనములర్పిస్తూ, మీతో కలిసి నడచిన పండిత బృందమునకు ఐదు పది చేసి వినయపూర్వకముగా నమస్కరిస్తూ.
ఛందస్సు పై పరిశోధనాగ్రంథాలు సూచించగలరు. లభ్యములగు విధము తెలుపండి.
రంగావజ్ఝల మురళీధరరావు,
శోభకృత్, జ్యేష్ఠ శుక్ల త్రయోదశ్యనంతర చతుర్దశి.
ముక్తచ్ఛంద కవిత – కొన్ని మౌలిక సమస్యలు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
05/16/2023 10:24 am
మంచి వ్యాసం.
కాని ఈ తెలుగువ్యాసంలో సంస్కృతపదాడంబరం హెచ్చుగా ఉన్న వాక్యాలను తొలగించితే మనకు చివరకు ఒక్క వాక్యం కూడా మిగలదు. ఆ విషయం అటుంచితే ఆలోచనీయమైన అంశాలు చాలానే ఉన్నాయి.
వచనకవిత్వప్రక్రియ బలపడి స్థిరపడిందని ఆలోచించి సంతోషించాలో అది వెఱ్ఱితలలు వేసి కవిత్వానికి చదువరులు కరువయ్యారని విచారించాలో తెలియకుండా ఉంది.
మనోధర్మపరాగం: ఒక మంచి నవల గురించి ram kanteru గారి అభిప్రాయం:
03/31/2023 9:37 pm
అమరేంద్ర గారు మీ వ్యాఖ్యతో నేను ఏకీభవించడం లేదు. క్షమించాలి.
కవర్ పేజీ చూసి (పుస్తకం లో ఒక పేజీ కూడా చదవకుండా) ఇంత చక్కగా తాము చదివే గొప్ప సాహిత్యాన్ని ఉచితంగా మనకు పరిచయం చేస్తూ, వ్యాఖ్యానించారు అంటే చాలా సంతోషంగా వుంది. ఇదో కొత్త ప్రయోగం.
పుస్తకానికి ముందుమాట ప్రశంసాపూర్వకంగా రాసి, బహుమతి ప్రదానం చేసి, ఇక్కడికొచ్చి వెనక మాట చెప్పడం కూడా, అత్యంత శ్లాఘనీయం.
తెలుగు సాహితీ విమర్శను బతికించుకోడానికి ఇలాటి విన్నూత్న ప్రయోగాలు చాలా అవసరం. వ్యాఖ్యాతలిద్దరికీ ధన్యావాదాలు.
వన్ నైట్ స్టాండ్ గురించి అనిల్ అట్లూరి గారి అభిప్రాయం:
03/20/2023 8:32 pm
ఇదివరకే చదివాను శివ కథని. మళ్ళీ ఈ రోజు because you shared and reminded again on FB, మళ్ళీ ఈ రోజు చదివాను. కథలో ఎక్జైట్మెంట్ ఏమి లేదు. స్వప్న – మధు స్నేహంలో కాని, గోవాలో వన్ నైట్ స్టాండ్ కాని మోరల్ వాల్యూస్‌ని పుష్ చేసిందేమి కనపడలేదు. ప్రతి పాఠకుడికి కామెంట్ చెయ్యడానికి ఏమి లేని కథ. చి న So there you have my 2 cents. 🙂
మనోధర్మపరాగం: ఒక మంచి నవల గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
03/16/2023 3:04 pm
చాలా గుంభనగా ఉంది సమీక్ష. వెనకటికి బెజవాడలో కమ్యూనిస్టుల మీటింగ్ లా.
సంగీతం పుస్తకమేమో అని చదివాను. కాదనుకుంటా. ఐడెంటిటీ, జెండర్, రేస్ పాలిటిక్స్ పీకి పాకం పెట్టే పిచ్చ బోర్ చరిత్ర ఐ ఉండాలి. ‘దేవదాసీలు’ ఇక లేరు కదా. లేని వాళ్లకు ఇప్పుడు ఈ మగ రచయిత ‘వాయిస్’ ఇచ్చేదేముంది!
అసలుకు జర్నలిస్టు రచయితలకు, ఘోస్ట్ ఆటోబయోగ్రఫర్లకు తమ జీవితంలోని నిజవిషయాలు స్త్రీలు చెప్పరు. మగవాళ్లూ చెప్పరు. ఇప్పటికీ మనుషులు వాళ్లంతట వాళ్లే నిజం చెప్పుకుని ఏడ్చేది -డాక్టర్లకీ, ప్రీస్ట్ లకీ, మంగలాళ్లకీ, బార్టెండర్లకీ. ఈ ప్రొఫెషనల్స్ వీరెవరికీ ‘స్పేర్’ లాటి చెత్త పుస్తకం కొనుక్కుని కుళ్లుమోతు ‘హేరీ’ టోజర్ లెంగ్త్, హెల్త్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉండదు.
ఇంతకీ, నవలలో మనోధర్మ సంగీతం, కర్ణాటక సంగీత ప్రస్తావనలు, సంగీత చర్చలు గల పేజీలు ఏమైనా ఉన్నవా? ఉంటే గాని తెలుపగలరా? సమీక్షకులకు తెలియకపోతే మరెవరైనా చెప్పినా సరే. నవల వెనుకఅట్ట మీద ప్రశంసలు రాసినవారైనా దయతో చెప్పినా సరే.
సంగీతం మీద నేను ఎంచుకుని కొనుక్కుని చదువుతున్నవి Debussy by Stephen Walsh, Wagnerism by Alex Ross. జీవిత చరిత్ర రాస్తున్నట్లే ఉంటారు కాని, వీళ్లు రాసేది మ్యూజిక్, మ్యూజిక్ చరిత్ర గురించే. ఇవి కాక Fundamentals of Musical composition by Schoenberg, Guide to the practical study of harmony by Tchaikovsky కొనుక్కున్నాను. ‘ఈమాట’ పత్రికలో ప్రచురించే జె. కె. మోహనరావు ఛందస్సుపై వ్యాసాలు కొంత ఇలాటివే. ఇవి చదవటం అవ్వదు.
-Lyla
విభాజకం గురించి ram kanteru గారి అభిప్రాయం:
02/14/2023 6:29 am
కథను ఒక పాత్ర పర్స్పెక్టివ్ నించి మొదలెట్టి, మిగతా కథంతా ఇంకొకరి పర్స్పెక్టివ్ తో రాయడం – ఆకట్టుకుంది.
శ్రీసుధ గారి కథలు ఇంతకు ముందు కొన్ని చదివాను. కథ చెప్పే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కథల్లో తాత్వికత కనపడుతుంది. కొన్ని గుర్తుండిపోయే వాక్యాలు రాస్తారు. ఉదా. “జీవితం మామూలుగానే గడిచినా, ఆనందం లేకపోయినా, విషాదంగా ఉన్నా బానే ఉంటుంది. కానీ తప్పు చేసినట్లు దాన్ని మోస్తూ తిరగడమే కష్టం. తప్పు ఒప్పు అంటూ ఏమీ ఉండవని, తప్పు జరగడం వెనుక తెలియని, అర్థం కాని అన్యాయాలు ఉంటాయని అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది.”
చాలా లోతైన పరిశీలన ఉంటుంది. కథలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి.
మనకున్న గొప్ప కథకులలో శ్రీసుధ గారు ఒకరు.
ఫిబ్రవరి 2023 గురించి JVVSN Murthy గారి అభిప్రాయం:
02/05/2023 2:30 am
మంచి రచనలు, అవి కథలు గాని, కవితలు గాని ఇప్పుడూ వస్తున్నాయి. కాని పాఠకులలో చదివే అలవాటు, అభిరుచి తగ్గిపోతున్నాయి. అందువల్ల పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. చివరికి రచయితలే పాఠకులుగా మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది. ఏ రచనలైనా సమకాలీన సమాజంలోని సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, వీలైనంత పరిష్కారం చూపిస్తే అటువంటి రచనలు కొంత కాలమైనా నిలబడతాయని నా అభిప్రాయం. మన సినిమాలకు కథలు దొరక్క ఎలాగైతే ఒక స్తబ్ధత ఏర్పడిందో, అలాగే మన రచయితలకు సరైన కథా వస్తువులు దొరకటం లేదు. ఒక తరం వెనక్కు వెళితే సమాజంలో అప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు. క్రమంగా తగ్గుతున్నాయి. వరకట్నం, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం ఇతివృత్తంగా ఎన్నో రచనలు వచ్చేవి. ఇప్పుడు అసలు వైవాహిక వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలా మారుతున్న సమాజంలో సరైన సమస్యలను ఎంచుకుని మంచి కథలుగా మలిచే రచయితలు తక్కువగా ఉన్నారు. ఇక పుస్తక ముద్రణ అనేది వ్యక్తిగతం. రచయితను అనిపించుకోవాలి, నా పేరు ప్రింట్ లో చూసుకోవాలి అనేవాళ్ళు ఆ పుస్తకాలను బంధు మిత్రులకు ఉచితంగా పంచుతున్నారు. కొన్ని పత్రికలు మంచి థీమ్ లను నిర్దేశిస్తూ కథల పోటీలను నిర్వహిస్తున్నాయి. ఇది ముదావహం. ….జయంతి.
విషాద నగరం గురించి అనిసెట్టి శ్రీధర్ గారి అభిప్రాయం:
02/03/2023 4:59 pm
లైలా గారి విమర్శపై నా అభ్యంతరాలు మరికొన్ని:
వారి వ్యాఖ్య: ఈ మినీ కథ చెపుతున్నతనికి అన్నీ ఫ్రీగా రావాలి. రానందున కొంత మంట. ఆకాశం, వెన్నెల, ఎదురింటి అందమైన పాపాయి ఫ్రీగా వచ్చినందున అతని కిష్టం. వీటన్నిటిలో రచయిత ఉష్ కాకీ అని మాయం చెయ్యగలిగిందెవరు? …..
నా సమాధానం: ఇల్లు ఫ్రీగా రానందున మంట అని అసందర్భ ప్రేలాపన ఎందుకు? దిగువ మధ్య తరగతి ఉండే కొన్ని రెండు గదుల ఇళ్ళల్లో అద్దె కట్టినా గాలీ, వెలుతురూ చొరబడదు. ఆకాశమూ కనిపించదు. అందువల్ల అవి దొరకడం అదృష్టంగా బావిస్తాడు కథకుడు. మీరైతే వాటికి కూడా అద్దె వసూలు చేస్తారేమో?
వారి వ్యాఖ్య: పాప తలిదండ్రులకి కానీ, ఇరుగుపొరుగుల వారికి కానీ, ఫ్రీగా పైనెంతో ఎత్తు నుంచి పాపాయిని చూసి ఆనందించే కథకుడి మీద కాని, ఈ పాపాయిని రక్షించే బాధ్యత లేదు.
నా సమాధానం: తేలికపాటి వర్షం పడినపుడు పిల్లలు కాగితపు పడవలు వేసి ఆనందించడం, వాళ్ళని చూసి పెద్దవాళ్ళు ముచ్చటపడడం సహజం. ఈ కథలో జరిగింది అదే. భారీ వర్షం పడి నీరు పారకుండా stagnate అవడానికి ఆక్రమణలు, ప్రజల దురాశ కారణం. అదే కథలో చెప్పాను. పాపాయికి ప్రమాదం జరుగుతూ ఉన్నపుడు పైన పేర్కొన్న వ్యక్తులందరూ ఆ చోద్యం చూస్తూ ఆనందిస్తున్నారని నేనెక్కడా రాయలేదు.
ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరనే presumption చేసుకోలేరా? ప్రమాదం జరగడానికి నిమిషం కూడా అవసరం లేదు.
కథాశీర్షిక చూస్తూనే ఆవేశానికి లోనయ్యి కథ చదవడం మొదలుబెడితే ప్రతిస్పందన బదులు ఇలాంటి అతి స్పందనలే కలుగుతై.
హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు, కుంటలు కబ్జాకి గురయ్యాయో ఈ విమర్శకుడికి తెలుసా? ఇలాంటి ఘోరాలు జరగడానికి ప్రధాన కారణం పాలకుల, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, ప్రజల దురాశే. అది ఎత్తి చూపడం రచయిత dishonest sadistic writing for habituated masochistic babaes in woods అవుతుందా?
వారి వ్యాఖ్య: ఎప్పుడో పాత వార్ గురించి, కీబోర్డ్ మీద వీళ్ళేడిసే లోపల కొత్త వార్ రానే వచ్చె. ఈ రచయితల వ్యర్థపు వెనకబడిన ఏదుపులెందుకు? ఎందుకు వయెలెన్స్, ఏడుపుల మీదే దృష్టి?
నా సమాధానం: అంటే యుద్ధాల గురించి, సమాజంలో జరిగే అన్యాయాల గురించి, హింస గురించి….. మళ్ళీ మళ్ళీ అవి జరుగుతూనే ఉంటాయి కనుక ఎవరూ రాయకూడదన్న మాట. ఆ సంఘటనల గురించి ఎక్కడా మాట్లాడ కుండా సెన్సార్ చేసేస్తారేమో ఈ పాఠకుడు.
వారి వ్యాఖ్య: అసలు ఈ రచయితలు ఏ కార్యాలయం లోనూ బాధ్యతాయుతమైన పనులు చేస్తుండక పోవచ్చు.
నా సమాధానం: నేను నలభై సంవత్సరాలు ఎంత బాధ్యతాయుతంగా ఏ కార్యాలయంలో పని చేసానో నేను ఇక్కడ చెప్పను. కావాలంటే ఒక రెండు వందల మంది ఫోన్ నంబర్స్ ఇవ్వగలను ఎవరేనా చెక్ చెయ్యదలచుకుంటే. కానీ, ఇవ్వను. ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు చేసేవాళ్ళకి నేనేంటో రుజువు చేసుకోవలసిన అవసరం లేదు కాబట్టి.
ఈ విమర్శకుడు నేను ఎలాంటి వాడినో చాలా ఊహించి చెప్పారు కదా. వీరి గురించి నా ఊహా ఏంటో చెబుతాను. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే మనం వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తాం. పాపం నా పాఠకులు (వీరి దృష్టిలో locusts) ఆ తరహా మనుషులు. బహుశా వీరు చచ్చిపోయినవాడిదే తప్పు అని వాళ్ళని దెప్పి పొడుస్తారేమో.
Web magazine లో ఇదే నా మొదటి రచన. అందువల్ల పాఠకుల అభినందల్ని రచయిత “పనిగట్టుకు వచ్చి” స్వీకరించకూడదనే etiquette ఏదైనా ఉందేమో నాకు తెలియదు. విజ్ఞులెవరేనా చెబితే నేర్చుకుంటాను.
రచయిత పాత్రల్ని చంపడం అటుంచి, ఇలాంటి విమర్శకులు రచయితల్ని చంపకుండా moderate చెయ్యాల్సిన బాధ్యత సంపాదకుల మీద ఉండాలి కదా.
– శ్రీధర్
ఫిబ్రవరి 2023 గురించి తః తః గారి అభిప్రాయం:
02/01/2023 10:53 am
1.నేను నిజంగా రచయితనేనా? నిజం – ఎవరికైనా (రచయితకి, రచయిత కానివానికి, రచయితగా చెలామణీ అవుతున్నవానికీ) ఇప్పటి లైకులూ షేర్లూ ప్రపంచంలో – ఎలా తెలుస్తుంది?
1అ. ఇందులో పేరొందిన పత్రికల పేరొందిన సంపాదకుల పాత్ర?
2.పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి: ఎటువంటి పాఠకుడిని?
“Beauty is something wonderful and strange that the artist fashions out of the chaos of the world in the torment of his soul. And when he has made it, it is not given to all to know it. To recognize it you must repeat the adventure of the artist. It is a melody that he sings to you, and to hear it again in your own heart you want knowledge and sensitiveness and imagination.” ― W. Somerset Maugham.
నమస్కారాలతో -తః తః
సాంగత్యం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
01/10/2023 11:29 am
ఎప్పుడన్నా వచ్చి రాత్రికి ఉండి ఆమెను విసిగించి, హింసించి పోయే అన్న… వారానికి ఓ రోజుండి పోయే భర్త… సంవత్సరంలో ఓ వారానికి మించి ఉండని కొడుకు… ఆమె సాంగత్య భాగ్యం లభించిన కౌమారవయస్సు చిన్నా…
రక్తసంబంధం కానిది సాంగత్యం. సాంగత్యం వల్లనే మనకు సంస్కారాలు అబ్బుతాయి. గంగానది పాపాన్ని పోగొడుతుంది. వెన్నెల తాపాన్ని పోగొడుతుంది. కల్పవృక్షం దైన్యాన్ని పోగొడుతుంది. అయితే ఈ మూడింటినీ సజ్జన సాంగత్యం పోగొడుతుంది. సజ్జన సాంగత్యం జీవితాలను మారుస్తుంది. దశా దిశా నిర్దేశం చేస్తుంది. సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది.
“మనుషులు అవసరాన్ని మించిన అవసరం కోసం, సంతృప్తికి మించిన సుఖం కోసం వెంపర్లాడుతుంటారు. వీళ్లు జంతువులనుంచి ఎదిగినవాళ్లు కాదు చిన్నా! అక్కడ నుంచి మనిషిగా దిగజారినవాళ్లు. వీళ్లు జాలిపడాల్సిన వాళ్లే తప్ప ద్వేషించాల్సినవాళ్లు కాదు.” అన్న తల్లి
“(డైరీలో) నేను రాసినవన్నీ… సమాజం లో తనచుట్టూ ఉన్న మనుషుల నైజం గురించి తాత్విక దృష్టితో రాసినవన్నీ … ఎప్పటికైనా నీకే ఇస్తాలే చిన్నా” అని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దయాసముద్రి ఆ తల్లి పాదాలను నా కన్నీళ్లతో కడగాలని ఉంది… కనిగిరి భాస్కర్ రెడ్డి మాస్టారు గారూ!
~ కనిగిరి కె.కె. రామయ్య (త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు)
విషాద నగరం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
12/08/2022 4:21 pm
కథ పేరు – విషాద నగరం. Isn’t that enough warning for me to switch to another story! Unfortunately, my eye scanned the scanty material already. It is obvious the writer intends to kill, in this story. And he is really in a mad rush to do it.
కొన్ని కథలలో, నవలలలో -ఒక పాత్ర ఇంకో పాత్రను కథలోని పరిస్థితులు, మానసిక స్థితుల వల్ల – హింసించటం, చంపటం జరుగుతుంది. కాని, ముందే ‘వయొలెన్స్’ దృష్టిలో పెట్టుకుని, రచయిత డెలిబరేట్‍గా కల్పించే (writerogenic) చావులకు, విషాదాలకు, రచయితే జవాబుదారీ. ఇంకెవరూ లేరు. These killer writers go scot-free.
డిటెక్టివ్ ఫిక్షన్ కాకుండా, మిగతా పుస్తకాల్లో కథల్లోని ‘పాత్రల మరణాల’ గురించి, కధా రచయితలు, నవలా రచయితలు కొందరు రాశారు. ఎందుకు కొంతమంది రచయితలు మాత్రమే హింస, చావు, హత్యలు, తమ రచనలలో ఎక్కువగా చూపిస్తారు, అది, మంచిదా, చెడ్డదా అనేదానికి ఎవరికీ అవగాహన లేదు. గ్రాఫిక్ వయొలెన్స్ ఎందుకు ఉంటుంది కొందరి రచనల్లో, అని కొన్ని నెలల కింద నేను వేసిన ప్రశ్నకిక్కడ సాహితీకారుల నుండి ఏం జవాబు రాలేదు.
“How to read Literature like a professor” by Thomas C. Foster -పుస్తకం లో ఛాప్టర్ 11 –… More Than It’s Gonna Hurt You: Concerning Violence — ఇలాటి విషయాల గురించి ఆలోచించటానికే కేటాయించినట్టుంటే, ఈ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఏమన్నాడో చూద్దామని ఈ మధ్య, చదివాను. థామస్ ఫోస్టర్‍కీ సమాధానం ఏమీ లేదు. ఛాప్టరు ఆఖరులో–ఫిక్షన్ రచయితల వయొలెన్స్ మనం జెనరలైస్ చెయ్యలేం, మనకు వీరిని భరించక తప్పదు, లేకుంటే సాహిత్యంలో మనకు షేక్స్‌పియర్, హోమర్, లారెన్స్, హెమింగ్వే, తదితరులుండరు కదా, అందరూ జేన్ ఆస్టిన్ లాటి పుస్తకాలే రాయలేరు కదా, అని ఒక హాస్యం చేసి వదిలేశాడు.
ఈ ‘విషాదనగరం’ కథలో: ఈ మినీ కథ చెపుతున్నతనికి అన్నీ ఫ్రీగా రావాలి. ఇల్లు ఫ్రీగా రావాలి. రానందున కొంత మంట. ఆకాశం, వెన్నెల, ఎదురింటి అందమైన పాపాయి ఫ్రీగా వచ్చినందున అతని కిష్టం. వీటన్నిటిలో (కథకుడితో సహా) రచయిత -ఉష్ కాకీ! అని మాయం చెయ్యగలిగిందెవరు? ఎవరిని మాయం చేస్తే, అతడు గుచ్చాలనుకునే ముల్లు కసిక్కిన దిగుతుంది విషాదవిషం?
ఈ కథలో అమ్మా నాన్నలు absent. వారి మీద కాని, ఇరుగుపొరుగుల మీద కాని, చివరకు ఫ్రీగా పైనెంతో ఎత్తు మీంచి ఆ పాపాయిని చూసి ఆనందించే కథకుడి (Detached God like, solitary figure) మీద కాని, ఈ పాపాయిని రక్షించే బాధ్యత లేదు. (Where the hell are they?) రచయిత చాతుర్యంగా తన బ్లేమ్, సమస్త తెలుగుజనాలూ సింపథైజ్ చేసేట్టు, అందరి దృష్టీ -పొలిటీషియన్స్, వారి గ్రీడ్, చేతగానితనం, పర్యావర్తం పొల్యూషన్, దాని మూలాన జరిగే ఘోరాల మీదికి మూడు ముక్కల్లో మళ్లించాడు. By doing so, the writer has reduced conflict with a very large population and pocketed them confidently as his readers.
But then to do so, Isn’t it wonderfully clever of the writer! Isn’t that stupendously smart? No. Not at all. It is a dishonest sadistic writing for habituated masochistic babes in woods. It is contrived, formulaic, and routine. జంతురక్షణ, పర్యావరణ రక్షణ. ఇవి ఇప్పటి అందరి ఫేవరిట్ పెట్ ప్రాజెక్ట్స్. ఇవి ఎత్తుకుంటే, రచయిత ఎంతో గొప్ప హృదయం ఉన్నవాడిగా కొందరు బొందన పడతారు. సమాజంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే మేధావిగా కొందరు ఊహిస్తారు. రచయితలకు నిజానికి అలాటి wisdom ఏమీ ఉండనవసరం లేదు. అసలు వీరే కార్యాలయంలోనూ బాధ్యతాయుతమైన పనులు చేస్తుండక పోవచ్చు.
పాఠకులు కొందరు, కథను, మెచ్చుకున్నారు. ఈ పాఠకులు వాళ్లు వచ్చి, వాళ్లు కథ చదివి ఎలా గిలగిల్లాడారో చెపుతారు. ఆ సీన్ చూశాక, the useless masochistic exhibitionism, for a purposeless sadistic stint – అని మళ్లీ నాకనిపించింది.
నా చిన్నతనంలో, మా తమ్ముడికి, సరదాకి ఒక చిన్న ప్లాస్టిక్ గన్ కొనిపెట్టారు. దాని ఉద్దేశం, బచ్చాగాడు గోడ కేసి కొట్టుకుంటే ఓ పుల్ల చివర ఉండే చిన్న సక్షన్ కప్ గోడకి కాసేపు అతుక్కుని, ఊడి పడతది. అప్పుడు మళ్లీ ఆ కుంక, అది తెచ్చుకుని మళ్లీ మళ్లీ గోడ కేసి కొట్టుకోవాలి. అలా వాడటం మానేసి, ఇంట్లో అటూ ఇటూ తిరిగే మా కేసి కొట్టటం మొదలెట్టాడు. నాకు –అమ్మా, కొడుతున్నాడే, నాన్నా, ఊఁ, ఊఁ, అని కళ్లు నలుపుకుంటూ ఏడవటం; మేష్టారూ, చూడండీ, కొడుతున్నాడు- అని ఏడవాల్సిన అగత్యం ఏమిటి? సుబ్రంగా రెండు తుంపులు చేసి ముఖాన కొట్టాను. ఇప్పటికీ ఇంట్లో అందరికీ చెప్పుకుని ఏడుస్తుంటాడు, O she is so cruel, she broke my toy! అని.
ఈ విషాద నగరం కథ గురించి మరో సంగతి: కొన్నాళ్ల తదనంతరం, రచయిత పనిగట్టుకు వచ్చి, పాఠకుల అభినందలను స్వీకరించాడు. రచయిత, వారి ఫాలోయర్స్ locusts లాగా ఈమాట అభిప్రాయ వేదికపై వచ్చి వాలినపుడు, వారి సంభాషణలు విన్న తర్వాత, ఒక విచిత్ర అనుభవం కలిగింది. ఇది నేను సరిగా చెప్పగలనో లేదో కానీ, ప్రయత్నిస్తాను.
కథలోని నగరం లోని, ఒక గాడ్ ఫర్సేకెన్ వీథిలో, ఒక విషాదఘటన చూస్తానికి, ఆ ఇంటిముందు ఎలా వీధిలోని వారు క్యూరియాసిటీతో మూగారో; ఈమాట అభిప్రాయాల వీధిలో, ఈ కథ పాఠకులు గుమికూడటం- అచ్చంగా అలాగే ఉందనిపించింది. It is the same scene. Inside the story. And outside the story. That I thought is eerie. Surreal. మినీ కథలోని onlookersకి సంభాషణలు లేవు. కాని కథ చదివిన onlooker/పాఠకుల సంభాషణలు ఇక్కడ విన్నాను. ఈ మొత్తం సీన్ కలిపి చూసిన నాకు, ఒక ‘పెయింటింగ్ ద సేమ్ వికెడ్ ట్రాజిక్ సీన్, వితిన్ ద పెయింటింగ్’ చూసిన doubled unpleasantness కలిగించింది.
కొందరు రచయితల గురించి అటువంటప్పుడు నా ఆలోచనలు: ఎందుకు వారి అనువాదాల్లో, రచనల్లో శవాలను బొమ్మలతో సహా వీరు మేగజీన్ లోకి లాక్కొస్తారు, పత్రిక ఒక morgue అనుకుంటారా? కొందరు రక్తాన్ని జెల్లీబీన్స్ లాగా రోడ్ల మీద చూపుతారు, కొందరు ఉర్దూ రచయితలకు ప్రాస్టిట్యూట్ల దుర్దశ మీద మహా వ్యధ, ఒక పక్కన రచయిత తాగి తామే స్వయంగా అక్కడ దొర్లుతూనే. మైగాడ్! ఎప్పుడో పాత వార్ గురించి, కీబోర్డ్ మీద వీళ్లేడిసే లోపల కొత్త వార్ రానే వచ్చె. ఈ రచయితల వ్యర్థపు వెనకబడిన ఏడుపులెందుకు? ఎందుకు వయొలెన్స్, ఏడుపుల మీదే వీరి దృష్టి?
మెడికల్ ఫీల్డ్‌లో iatrogenic disasters ఉంటయ్యి. They are unwanted. By all. రచనారంగంలో కొన్ని రచనలలో కేవలం రచయిత prompted death and disasters ఉంటయ్యి. They are wanted, by some sort of readers. The writer gets praise. ఈ చిన్నకథ, పాఠకుల పార్టిసిపేషన్, అందుకు ఉదాహరణ, అని నాకనిపించింది.
I say to myself, what’s the big deal! Writers write as they wish. I read what I like, and when I like. I silently walk away from some writers. I have the freedom.
-Lyla
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి గుమ్మడిదల రంగారావు గారి అభిప్రాయం:
11/30/2022 1:29 pm
వ్యాసం బాగుంది. త్యాగయ్య కీర్తనల్లొ వాడిన తెలుగు పదాలు కొన్ని నేడు అస్సలు ప్రాచుర్యంలొ లేవు. వాటిని గురించి ప్రస్తావించితే మనకి తెలియని త్యాగరాజు కాస్తైనా తెలిసె అవకాశం వుండేది. ఆయన రచనల్లొ తామసము అనే పదప్రయోగం తరచుగా కనిపిస్తుంది. ఆయన వాడిన తెలుగు పదాలు మరికొన్ని మనకు తెలియనివి వున్నాయి. మచ్చుకు కొన్నిటిని వివరిస్తే బాగుండేది. ఆయన కాలంలో సామాజిక పరిస్థితులమీద కీర్తనలు లేకపొవటం ఎప్పటికీ అర్ధంకాని విషయం. కృతులన్నీ భక్తిమీదనె కేంద్రీకృతమై వున్నాయి. అందుకేనేమో నేడు శాస్త్రీయ సంగీతం ప్రజల ఆదరణకు నోచుకోవటం లేదు. పాశ్చాత్య సంగీతంగూడా చర్చి లోనే పుట్టినప్పటికీ కాలక్రమంలో దానికి ఒక సొంత దారి ఎంచుకున్నది. అందుకే నేటికీ సామాన్య ప్రజల ఆదరణకు నోచుకున్నది. మనిషికి కలిగే అనుభూతికి అనుగుణంగా వుంది ఆ బాణీ. మన సంగీతం అలా కాదు. మన సంగీతం భక్తి నుంచి బయటపడలేకపోయింది. నేటి జీవిత సమస్యలకు భక్తి సమాధానం చెప్పలేక పోతుంది. సినిమా పాటలకున్న ఆదరణ శాస్త్రీయ సంగీతానికి లేకపోవటానికి కారణం మన శాస్త్రీయ సంగీతం సగటు మనిషి భావోద్వేగాలను అర్ధం చేసుకోలేక పోవటమే. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జీవనం. కానీ వ్యవసాయం మీద ఒక్కటంటే ఒక్క పాట కూడా రాయలేదు త్యాగయ్య. నేటి సమస్యలకు రాముడు ఏవిధంగానూ సమాధానం చెప్పలేడు. మన సంగీతంలో వున్న లోపాన్ని గూడా చూపితే బాగుండేది. చదువరులకు ఒక సమగ్ర అవగాహన కలిగే అవకాశం ఉండేది. మరో వ్యాసంలోనైనా నాటి తెలుగుకు నేటి తెలుగుకు వ్యత్యాసం తెలిపితే బాగుండును. చిత్రమేమిటంటే త్యాగయ్య పాటలు సింహభాగం తెలుగులో వున్నప్పటికీ తెలుగునాట ఆదరణ లేదు. తమిళులకు కృతులలోని భాష భావం పెద్దగా అర్ధంగాకపోయినా వారు బాగా ఆదరిస్తున్నారు. త్యాగయ్యకన్నా చాల ఏళ్ళు ముందు జీవించిన అన్నమయ్య సంకీర్తనల్లో భక్తితో పాటు ప్రాపంచిక విషయాలమీదగూడా పాటలు వున్నాయి. కానీ ఆనాటికి గురుశిష్య పరంపర వ్యవస్థ లేకపోవటంతో అన్నమయ్య పాటలు ఎలా పాడాడో మనకు తెలియదు. త్యాగయ్య ఎలా పాడాడో తెలుసు మనకు. నేటికీ అలానే పాడుతున్నాము.
నాకు నచ్చిన పద్యం: వరూధిని వగపు గురించి డా.జగర్లపూడి శ్యామ సుందర శాస్త్రి గారి అభిప్రాయం:
10/20/2022 2:49 am
లైలా గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. కాళిదాసు శ్యామలా దండకంలో “కుచోన్నతే కుంకుమరాగ శోణే”, అలాగే శ్రీ వేంకటేశ్వరస్వామివారి సుప్రభాతంలో “కమలా కుచ చూచుక కుంకుమతో” అన్నచోట కేవలం భక్తిభావనే మనసులో ఉంచి కవులు కూర్చారు. మనమూ ఆ ఉద్దేశంతోనే ఆ కృతులు చదవాలి. అర్థం చేసుకోవాలి. మన దృష్టి సంకుచితం కాని పద్ధతిలో, మనకర్థమయ్యేదే అసలైన అర్థం అని భావించకుండా అనుశీలించాలి. కృతజ్ఞతలు!
కూటి రుణం గురించి వివిన మూర్తి గారి అభిప్రాయం:
10/06/2022 11:46 am
1. ఈ కథ చదివించినందుకు అమరేంద్రకు ధన్యవాదాలు.
2. కెత్తేల్ సాయిబు ఎవరు? ఈ ప్రశ్న చిన్నదే. నా జవాబు పెద్దది. అనాది మానవుడు. మిగులు ప్రవేశించాక దాత. ఎలా? అనాది మానవుని సహజాతం పంచుకోటం. అది అనివార్యత లోంచి వచ్చినదన్న ఊహ కూడా ఉంది. కావచ్చు. కాకపోవచ్చు. ఏమైనా ఇది జన్యుపరమైనదనే ఊహ నాకు బాగుంటుంది. మానవ సమాజంలో మిగులు ప్రవేశించేక ఈ పంచుకోటం సంస్కృతి అయింది. ఆ రెంటికీ మధ్య కాలం చాలా పెద్దదే. అది సహజాతం నుంచి సంస్కృతి అయిందని చెప్పటానికి మనం పదేపదే వినే మాట ఒకటి ఆధారం. అతిథి దేవో భవ. ఇది మన ప్రాంతానిదే కావచ్చు. ఇలాంటివి అనేక సంస్కృతులలో ఉండే అవకాశం ఉంది. నేను నీకు కడుపు నిండా పెట్టలేకపోతున్నాను. నన్ను క్షమించు. అని చేతులు జోడించటమూ అదే చెబుతుంది. అయితే మిగులు ప్రవేశంతో పంచుకోటం కాస్తా రూపాంతరం చెంది పెట్టడం అయింది.
3. కెత్తేల్ సాయిబు అంతేనా? కాదు. అతను ఆహార శ్రామికుడు. ఆ శ్రామికుని లక్షణం తను తయారు చేసిన ఆహారాన్ని తిన్న మనిషి ముఖంలోని ఆనందం. తను వడ్డించిన విస్తరి ఖాళీ చేసినవాని ముఖం లోని తృప్తి. వంట, వడ్డనలు వృత్తిగా మారి శ్రామికుని కడుపు నిండటానికి ఆధరువు కావచ్చు. కాని అందులోని అమ్మతనం మారిందని నాకు అనిపించదు.
4. కెత్తేల్ సాయిబు పిల్లలు ఆర్ధికంగా బాగుపడ్డారని కథ చెపుతోంది. దాని వెనక ఆర్ధికత(ఎకనామిక్సు) ఏమిటి? నేను ఫ్రీకనామిక్సు అనే పుస్తకం చదవాను. అందులో ఒక ప్రయోగం చెపుతారు. ఒక పెద్ద వ్యాపారసంస్థ భవనం అది. అందులో నాలుగు అంతస్తులు ఉంటాయి. ఆ సంస్థలో పై అంతస్తులో పైస్థాయి వారుంటారు. క్రమంగా చివరి అంతస్తులో చివరి స్థాయి ఉద్యోగులు. నాలుగు అంతస్తులలోనూ తినే తాగే పదార్ధాలుంటాయి. అమ్మేవాడుండడు. ఎవరికి కావలసినది వాళ్లు తీసుకుని పక్కన ఉన్న పెట్టెలో డబ్బులు వెయ్యాలి. పై స్థాయి వారి నుంచి కింద స్థాయి వరకూ వాటిలో ఆదాయం ఎలా ఉంటుంది – అది మీ ఊహకి వదిలేస్తాను. పిల్లలు బాగుపడ్డది సాయిబు సంపాదన వల్లనా? పేరు(బ్రాండ్ ఇమేజ్) వల్లనా? అతని వంట శిక్షణ వల్లనా? కథలో ఆ విషయ స్పష్టత లేదు. కథకి కేంద్రం అతనా? కథకుడా? కథకుడు రామలక్ష్మిని పెళ్లాడటంలో అతని కూటిఋణం తీరటంలో సాయిబు ఆదర్శం లేదా తాత్వికత ప్రభావం ఉన్నాయా? కాకపోతే భారతదేశంలో చాలాకాలం ఈ ఫ్రీకనామిక్సు ఉండేదన్న అంశం నాకు ఈ కథ ఉద్దేశ్య పూర్లకంగానో అనుద్దేశితంగానో గుర్తు చేసింది.
5. నా వ్యక్తిగత జీవితంలో అటువంటి దారిద్ర్యాన్ని అనుభవించాను. ఒక రాత్రి వేళ భరించలేక చావబోతే నన్ను రక్షించి అన్నం పెట్టి నాకు ఒక ఉద్యోగం వేయించిన ఆ మహానుభావుడు గుర్తువచ్చాడు. ఏదైనా తిండి పెట్టడం గురించే కాక దాని రుచి గురించి చెప్పటం నాకు మల్లాది వారి కృష్ణాతీరం గుర్తు చేసింది.
6. రచయితకీ, పరాయి ప్రాంతపు కథ అని గుర్తురాకుండా ఆత్మీయంగా చెప్పిన అనువాదకునికీ ధన్యవాదాలు.
కూటి రుణం గురించి బదరీనాథ్ గారి అభిప్రాయం:
10/03/2022 7:07 am
చాల మంచి కథ. అలివి కాని కథ.
శెలవు రోజున గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
09/19/2022 1:26 pm
వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి రేఖాజ్యోతి తల్లికి ఓ చిరు కానుక…
ముళ్లపూడి వెంకటరమణ (1931–2011) ‘కానుక’ కథకు సంక్షిప్త రూపం.
గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్ల మాటున కూర్చున్నాడో అతనికే తెలియదు. ఆకులలో ఆకై పువ్వులో పువ్వయి, ఇసుకలో రేణువై యమునలో బిందువై కృష్ణ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. యమున ఒడ్డున పొదల మాటున దాగి కృష్ణుడి మురళి విన్నప్పుడు వూపిరి బిగబట్టుకునే కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన దానిని కొత్త వేణువును పూరించడానికి ఉపయోగించేవాడు. తీరా అది శ్రుతి శుద్ధంగా వినబడేది కాదు.
ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ మురళిని ఎత్తుకు వచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి, చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునేసరికి అది కనబడలేదు.
గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని ఆ గజదొంగ సాయంత్రం కనబడి “గోపన్నా నా మురళిని తీసుకుపోయావు కదూ… పోనీ ఇంకొకటి చేసిపెట్టు” అన్నాడు నవ్వి. గోపన్న తెల్లబోయాడు. మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు. అతనిలో కొత్త శక్తి, కొత్త చైతన్యం మేల్కొన్నాయి. తన చేతులతో రూపు దిద్దుకుంటున్న మురళి రేపు కృష్ణుడి హస్తాలను అలంకరిస్తుందని ఆశపడుతూ మురళిని రూపొందించాడు.
మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. జీర. రెండు మూడు వేణువులు పలికినట్టుంది. కృష్ణుడు వూదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్లు పులకరించిందా? అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే.
కృష్ణుడి పుట్టినరోజు వచ్చేస్తుంది. పాతిక పండగలనాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమలలేదు. రేపటికైనా సాధించి, తన వేణువును ఆయనకు సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు… వేళయిపోయింది.
కొత్త వెదురు కోసి స్వరద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని ఇందులో పలికించబోయాడు. ఆ స్వరం తన ఈ వేణువులో పలికితే ఇది కృష్ణయ్యకు కానుక ఇవ్వాలి. కాని అది పలకదు. ఎన్ని వేల వేణువులో చేశాడు. ప్రతి అణువునా భగవంతుడున్నాడు. ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది, అన్న వాక్యాల తాత్పర్యం గోపన్న అర్భక దేహానికి దుర్భరమైపోయింది.
అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు.
ఇన్ని వేణువుల గుట్టలో ఎక్కడో సత్యమైన కొత్త వేణువు దాగివుంది. అది సత్యమైనదేనా? ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. చివరి మురళిని పరీక్షించడానికి ధైర్యం చాలలేదు. సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు.
“ఇదే” అన్నాడు ధీమాగా.
“చూడవా” అన్నాడు కుర్రాడు.
“ఒద్దు. లగెత్తు. కిష్టయ్య చేతికియ్యి ఆయనే చూస్తాడు.”
పాతిక సంవత్సరాల గాలివాన వెలిసింది. గోపన్న మేను వాల్చాడు. తాను పని ముగించాడా. భగవంతుడికి శ్రుతి శుద్ధమైన వేణువును పంపాడా. శ్రుతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా? సరిచేసే శక్తి ఆయనకు లేదని తను అనుకొన్నాడా? గోపన్నకు నవ్వు వచ్చింది.
తన పక్కనున్న వేణువులోంచి సన్నటి స్వరం నెమ్మదిగా ఇవతలికి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. ఇంకో క్షణానికి ఆ పక్క మురళి, ఉత్తర క్షణార్థానికి ఇటుపక్క మురళి మేలుకున్నాయి. మరికొద్ది క్షణాలలో కుటీరంలోని సహస్ర వేణువులూ భువన మోహనంగా గానం చేయసాగాయి.
అన్నిటిలోనూ కృష్ణుడి మోహన గానమే. అసత్యమైన వేణువు లేనేలేదు. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు. గోపన్న సహస్ర వేణునాద స్వరార్ణవంలో–సాక్షాన్మహావిష్ణువై తేలుతున్నాడు.
ష్! ఆమె పని చేసుకుంటోంది గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
09/08/2022 7:51 pm
రచయిత్రి, నంబూరి పరిపూర్ణ బొమ్మ, క్వీన్ ఎలిజబెత్ బొమ్మ చూస్తే -నాకేం తేడా కనిపించలేదు. దాదాపు ఇద్దరిదీ ఒకే వయసు కదా. 93, 97. ఒక్కలాగే ఉండక ఈ ఇద్దరు ఆడవాళ్లు, ఇంకెలా ఉంటారు!
ఇద్దరూ పనిమంతులే. ఒక్కరోజు ఖాళీగా కూర్చున్నట్టు లేరు. వారికి ఎన్నో బాధ్యతలు, మరి.
బయొలాజికల్ గా మనిషి జీవితాలను గురించి ఆలోచించేవారికి, ఏ జీవితాల్లోనూ పెద్ద తేడాలుండవు. మగ జంతువులు, స్పెర్మ్ ఇచ్చి, ఆడజంతువులు అండాలిచ్చి -సంతానం ఉత్పత్తి చేస్తారు. ఆడవాళ్లు, పాలిచ్చి ఆ ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువ సంతానాన్నో సాకుతారు. సాకక చస్తారా! అది జంతువులలో built in parental care.
దీనిలో మాత్రం పరిపూర్ణకూ, ఎలిజబెత్ కీ ఏమి తేడా ఉంది. ఆ తర్వాత వారి సంతానాన్నీ, మళ్లీ వారి సంతానాన్నీ, నేను చూస్తే మాత్రం, ఏం తేడా ఉంటుంది? మానవులంతా చేసేది ఈ జంతు కార్యక్రమమే.
మరి ఎందుకు -హేరీ, మేగన్- ఆ మొగుడూ పెళ్లం బొమ్మలు చూస్తానికే, మళ్లీ వాళ్ల పిల్లల బొమ్మలు చూస్తానికే ప్రజలు ఎగబడి చస్తారో నాకైతే అర్ధం కాదు. ఏ ఆడామగా, ఎవరి ప్రేమ కలాపాలకు మాత్రం ఏమి తేడా ఉంటుంది. డెలివరీ రూమ్ లో, ఎలిజబెత్ ప్రసవించినా, డయానా కన్నా, ఆ తర్వాత కేట్, మేగన్ – ఏ ఆడది కన్నా గాని, పిల్లో, పిల్లడోనే ఉద్భవించేది! అందరూ ప్రపంచం లోకి వచ్చే ద్వారం ఒకటే. ఆ ఘట్టం మారదు.
కొన్నేళ్ల క్రితం నేను రచ్చబండలో రాస్తున్నప్పుడు, అప్పుడే తెలుగు వికీపీడియా నిర్మించటం మొదలు పెట్టారు. నన్ను అందులో సహాయం చెయ్యమంటే, నాకు టెంప్లేట్లు, లైఫ్ హిస్టరీ డిక్టేషన్లు బాగా అలవాటే కాబట్టి, నమూనాలేగదా తెలుగువారికి కావలసింది అని, నా సంగతే రాస్తానన్నా. నా పేరూ, ఊరూ, మా అమ్మానాన్నా పేర్లూ, పుట్టిన ఊళ్లూ గట్రా నాకన్నా ఎవరికి బాగా తెలుస్తాయి? పని తేలిక గదా అందుకని.
అప్పుడు నాకు చెప్పబడింది ఏంటంటే, వికీపీడియాలు – ‘ఫేమస్ పీపుల్’ ను ప్రజలకు పరిచయం చెయ్యటానికి అని. ఎవరి సంగతి వాళ్లు రాయటానికి రూల్స్ ఒప్పవంట. నేను, నా జీవితాన్ని తక్కువ చేసుకుని, నేను ఇంపార్టెంట్ కాదనుకుని, నేను అప్పటి దాకా చేసిన పని పిచ్చదండగ అనుకుని, -పోయి ఏ వేమననో , శ్రీశ్రీ నో, ఎంటిఆర్ నో గురించి వాకబు చేసి వాళ్లను గురించి శ్రద్ధాభక్తులతో, వికిపీడియాలు నిర్మించాలి. అది నేను చెయ్యగలిగిన పని కాదు.
ఆ తర్వాత కొన్నేళ్ళకు, ఒక తెలుగు మేగజిన్ కి నేను ఆర్టికల్ రాసి, కావాలంటే మేగజీన్ అట్టమీద నా బొమ్మ వేసుకోమన్నా. ఎవరి బొమ్మేస్తే మాత్రం ఏం? నాకైతే ఏం తేడా లేదు. కాని మేగజీన్కి ఉంది. అట్టలమీద లంబాడీలు, బుట్టలల్లేవాళ్లు, లోక్సత్తా నాయకులు, కొత్త ప్రధానులు, దేవుళ్ల బొమ్మలు, నేను చూసి, ఆహా, ఓహో అని మెచ్చాలి. నా బొమ్మ వాళ్లెందుకు చూడకూడదు? వాళ్లను గురించే మిగతా ప్రపంచం ఎందుకు తెలుసుకోవాలి? నాకు అర్ధంకాదు. ఆ పత్రిక అట్టలు, వేరే కల్చర్ కల నా మెయిల్ మేన్ కి భయం కలిగించాయి. అతని భయం నా కర్ధమయింది. కాని ఆయా దేశస్థుల సంస్కృతీ విషయాల సర్దుబాట్ల గురించి, ప్రచారం గురించీ, కూడా నాకు ఆసక్తి లేదు.
ఇవ్వాళ క్వీన్ ఎలిజబెత్ స్కాట్లెండ్ ఇంటిమీద డబుల్ ఇంద్రధనుస్సు కనిపించిందంట, అందరూ చూస్తున్నారు. చూడవలిసిందే. తప్పక. ‘పరిపూర్ణ’ పేరు గురించి, ఆమె జీవితంలో పరిపూర్ణత ఉన్నదా లేదా అని ఏమీ గుంజాటన పడక్కర్లేదు. ఆవిడ బొమ్మ ఎంతో బాగుంది. చూడవలిసిందే తప్పక. ఆవిడను, ఆమె పిల్లలను గురించి నేను వికీలో చదివాను. ఏం తేడాలేదు. అందరి జీవితం లానే. అందరి పిల్లల్లాటి పిల్లలే.
ఏం తేడాలుండవు మానవజీవితాలలో. అందరికీ ఆకాశంలో ఇంద్రధనుస్సులు, అందరికీ, అందరికీ ఒకటే.
-Lyla
అన్‍జానా జాస్మిన్ గురించి సంపత్ కుమార్ గారి అభిప్రాయం:
08/07/2022 7:26 pm
మెడికో శ్యామ్ రచనలు నాకు ఇష్టం. కధలు కానివ్వండి. ఏదేని టాపిక్ పైన రివ్యూ కానివ్వండి. ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది వాటిని చదివినప్పుడు, అతడి విషయ పరిజ్ణానానికి. రిజిష్ట్రేషన్, రిటైన్, రీకాల్ అమోఘం, ఎవ్వరికైనా అనితర సాధ్యం. ఆ రీకాలింగ్ సామర్థ్యాన్ని ఎలా వాడాలో, ఎక్కడ వాడాలో శ్యామ్‍కి తెలిసినట్టు వేరెవరికి సాధ్యం కాదని నా అభిప్రాయం. కధలు రాయడం మానేశాడని బాధ పడుతున్న పాఠకులకు ఈ రివ్యూలు పరిమళ జాస్మిన్లు.
అన్‍జానా జాస్మిన్ గురించి NS Murty గారి అభిప్రాయం:
08/01/2022 11:07 pm
శ్యామ్ గారూ,
మీరు ఇక్కడ రావిశాస్త్రి గారి గురించి ఇచ్చిన సమాచారం ఏ విశ్వవిద్యాలయంలోనైనా తెలుగులో ఒక సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడానికి సరిపడినంత ఉంది. మీ వ్యాసాలు గాని, ప్రసంగాలు కాని ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని పాఠకుడికి / శ్రోతకి తెలియజేస్తూనే ఉంటాయి. ఈ వ్యాసం కూడా ఆ కోవలోకే వస్తుంది.
హృదయపూర్వక అభినందనలు.
లక్ష్మణుని జాగారము గురించి తాడిచెర్ల రవి గారి అభిప్రాయం:
07/03/2022 7:45 pm
ఛందశ్శాస్త్రంలో మీ అపార పాండిత్యమునకు శతాధిక వందనాలు. ఛందస్సు ఒక సముద్రమైతే దానిలో ఆసాంతము ఓలలాడుతున్నవారు జెజ్జాల కృష్ణ మోహన్ గారు. వారికి నా నమస్కారములు🙏🙏 వాయిస్ క్లిప్ play కావటంలేదండి. దయచేసి “లక్ష్మణుని జాగారము” మీ గానము నాకు పంపగలరు. నా దూరవాణి/వాట్సాప్ నం.8919800447. మీ సమాచారమంతా ఉంది కాని ఫోన్ నం. లేదు
బూడిదలో బంగారం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
06/04/2022 2:51 pm
దాదాపు తొంభైలలో అనుకుంటా, నేషనల్ జిగ్రాఫిక్ వారు ఓ కధనం ప్రచురించారు. దాని ప్రకారం దాదాపు మొత్తం బాంబే (అప్పట్లో) జనాల్లో ఉద్యోగం లేనివాడు ఎవరూ లేరు. అదే న్యూ యార్క్ లో అయితే అనేకమంది ఉన్నారు. ఉత్తరోత్తరా టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పెరిగాయి కాని తగ్గలేదు. నేను కొంతకాలం బాంబే లో ఉద్యోగం చేసినవాణ్ణే. రోడ్లు, మంచినీరు, ట్రాన్స్ పోర్ట్ విషయం లో బాంబే కి మించిన పట్టణం ఇప్పటికీ ఇండియాలో మరోటి లేదని ఘంటాపధంగా చెప్పగలను. నగరంలో ఉన్న ఒకే ఒక కనాకష్టం ఏమిటంటే ఇల్లుగానీ రూం గాని దొరకడం. అది ఒకసారి కుదురుకుంటే ఎవరూ మళ్ళీ అక్కడనుంచి బయటకి వెళ్లరు. జనం బాగా సహాయం చేసే మనుషులు. రోడ్డుకి రెండువైపులా ఉడిపి హోటళ్ళు, మంచి సేఫ్టీ అన్నీ బాగుంటాయ్. ఇవన్నీ కూడా నేషనల్ జిగ్రాఫిక్ వారు ప్రచురించిన కధనంలో చెప్పారు. ఈ అనువాదంలో ‘ముంబై’ అన్నారంటే కధ గత పదేళ్ళలోపు రాసినదేమో, పేరు మార్చాక. అప్పటికి ఉద్యోగాలు కోకొల్లలుగా ఉన్నాయ్ ముంబై లో. ఏ పనైనా చేస్తాననుకునేవారికి ముంబై లో ఉద్యోగం దొరకదనే ప్రశ్నే ఉదయించదు.
రెండో విషయం – మనిషి పోయాక రిగర్ మార్టిస్ (తప్పుగా పలుకుతున్నానేమో?) అనేది 5 నుంచి ఆరు గంటలు పడుతుంది. మొదటగా జరిగేది దవడలు కిందకి జారతాయి. బిగుసుకుపోవు. అందుకే చర్చ్ లో అందరికీ చివరి దర్శనానికి పోయినవాణ్ణి పెట్టినపుడు నోరు కుట్టేస్తారు(ట). తర్వాత బిగుసుకుంటుంది శరీరం. బిగుసుకోవడం అంటే మరీ నోట్లో వేళ్ళు తెగిపోయే అంత కాదు. మరో రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ బిగువు పోతుంది. అదీగాక భీమా చేతిలో ఏదో ఆయుధం ఉంది దాంతో శవం నోటిమీద కొట్టి చేతులు బయటకి లాక్కోలేడా? అదీ ఒక్క దెబ్బతో నక్కని చంపగలవాడు కదా?
మూడో విషయం – నక్కలు గుంపుగా వేటాడవు. ఎవరి జీవితం వారిదే. ఇది టివి చూస్తే తెలుస్తుంది. పులులు, హైనాలూ, తోడేళ్ళు గుంపుగా వేటాడతాయి. కొన్ని రకాల నక్కలు అలా గుంపుగా వేట చేయొచ్చేమో అనుకున్నా, నక్కలు అతి జాగ్రత్తమైనవి. మనిషనే వాడు రాగానే, లేదా మరో జంతువు రాగానే పక్కకు తప్పుకుని చాలా సేపు అంచనా వేసుకుని గాని దగ్గిరకి రావు. ఇది మనం నీతి కధల్లో చదువుకున్నదే – నక్కల తెలివి గురించి. అరవ్వొచ్చేమో కానీ మనిషి దగ్గిరకి వచ్చేసి కరిచేంత సాహసం *వెంఠనే* చేయవు.
ఇలా చెప్పుకుంటూ పోతే అవకతవలు చాలా ఉన్నై ఈ కధలో. రచయిత మరాఠీ వారని పేరు బట్టి తెలుస్తోంది. ఆయన కూడా బాంబేలో ఉద్యోగాలు, ఇవన్నీ చూసుకోకపోయినా అనువాదకులు చూసుకోవద్దా? గూగిల్ చేస్తే ఈ చిన్న విషయాలు తెలుస్తాయి. ఈ ఇద్దరూ మర్చిపోయినా సంపాదకులు కూడా మర్చిపోయినట్టున్నారు. అదే ఆశ్చర్యం.
మేఘసందేశం (తెలుగులో) గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
05/28/2022 5:05 pm
GLN శర్మగారు: మీ ప్రశ్నని చాలా ఆలస్యంగా చూసాను. యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ లేక సత్య) గారు “మల్లీశ్వరి” (1951) సినిమాలో రాయలు పాత్రలో కనిపిస్తారు.
విడిగా ఆయన ఫోటో ఎక్కడా చూసిన జ్ణాపకం లేదు. R. అనంత పద్మనాభరావు రాసిన “ప్రసార ప్రముఖులు” అన్న పుస్తకంలో ఆయన గురించి కొద్ది సమాచారం వుంటుంది, కానీ ఫోటో వుండదు. 2010లో ఆకాశవాణి కళాకారుల వివరాలతో, ఎన్నో ఫోటోలతో “వాచస్పతి” అన్న పుస్తకం వచ్చింది. కాని దానిలో కూడా యండమూరి సత్యనారాయణ ఫోటో వున్నట్లుగా లేదు. But I can check my copy and confirm.
నిజానికి ఆయన రేడియోలో చేసిన పనికంటే ఆయన రాసిన “ఉషః కిరణాలు” అన్న పుస్తకం అంటే నాకు చాలా ఆసక్తి. It’s one of my standard reference works. ఈ పుస్తకం గురించి 2014లో ఈమాట పత్రికలోనే ఒక వ్యాసంలో ఈ క్రింది వాక్యాలు రాసాము.
—————-
తెలుగు సాహిత్యంలో పందొమ్మిదవ శతాబ్దం అంధయుగం అనడం పరిపాటి. ఆ శతాబ్దపు సాహిత్యం మీద ప్రత్యేకమైన కృషి చేసినవారు యండమూరి సత్యనారాయణరావుగారు. ఆయన రాసిన ఉషఃకిరణాలు (1960) చెప్పుకోదగ్గ ప్రచారానికి రాలేదు కానీ ఆయన కృషిని మెచ్చుకోవడానికి ఆ పుస్తకం చదవడం అవసరం. ఆయన మాటల్లో: “19వ శతాబ్ది తెలుగు వాఙ్మయమును వర్ణించువారిలో హెచ్చుమంది ఇది యొక క్షీణయుగము లేక అంధయుగమనియే నుడివియున్నారు. అంతవరకు తెలుగుసాహిత్యములో తీరుతెన్నులు దిద్దుకున్న ప్రబంధ కావ్యములు, పురాణములు, శతకములు, యక్షగానములు మొదలైనవి ఈ కాలములో పరస్పర ప్రతిబింబములుగాను ఉపజ్ఞావిహీనములుగాను భావశూన్యములు గాను ఉన్నవని వీరి అభిప్రాయము.”
—————–
ఆయన గురించి వివరంగా ఒక పెద్ద వ్యాసం రాయవలసిన అవసరం ఎంతయినా వుంది.
విశ్వనాథ సమాధానం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
04/09/2022 7:05 am
దేవతల కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన దధీచి, సువర్చలల కుమారుడు పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. రావి చెట్టు (పిప్పల వృక్షము) వద్ద ఉంచిన శిశువు అనే అర్ధంలో తనకి పిప్పలాదుడు అని నామకరణము జరిగినది. పిప్పలాదుడు దయాళువు. త్యాగశీలి. అతను అతని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. ప్రశ్నోపనిషత్తుకి శంకరాచార్యుడు బాష్యరచన చేసాడు.
పిప్పలాదునికి వివాహము చేసుకోవాలని అనిపించి అనవన్య రాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు పద్మను ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు. మొదట్లో రాజుకు తన కూతురును మునికి ఇవ్వటం ఇష్టము లేదు. కానీ అయన మంత్రి చెప్పినాక తన అభిప్రాయము మార్చుకొని తన కూతురు పద్మను పిప్పలాదునికి ఇచ్చి వివాహము చేస్తాడు.
పిప్పలాదుడు తపస్సు చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారి ధర్మ సందేహాలను తీరుస్తూ కాలము గడుపుతుంటాడు. ఒకనాడు కబంధుడు, వైదర్భి, కౌశల్యుడు, సూర్యాయనుడు, శైభ్యుడు, సుకేశుడు, వంటి మునులు ఈయన దర్సనార్ధము వచ్చి వారి సందేహాలను అంటే సృష్టి ఎలా జరుగుతుంది, ప్రాణము ఎలా పుడుతుంది నిద్రించేది ఏది మేల్కొనేది ఏది సుఖము ఎలా కలుగుతుంది వంటి క్లిష్టమైన ప్రశ్నలు, ఆఖరుగా ఓంకారాన్ని ఉపాసించిన వాడు ఏ లోకానికి వెళతాడు అని వేదాంత పరమైన చర్చ చేస్తారు. వారి ప్రశ్నలకు పిప్పలాదుడు ఇచ్చిన వివరణే ప్రశ్నోపనిషద్ గా వచ్చింది. అంతేకాకుండా ఆ వివరణలను బట్టి గర్భోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు వంటి గ్రంధాలు వచ్చినాయి. ఈ విధముగా పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతింపబడ్డాడు.
ఆమె ఇల్లు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
02/25/2022 9:31 am
You must be kidding. ముగింపు మారిస్తే, ఈ కథ అంత నచ్చకపోతే, మరో కథ ఐనా చదివే హోప్ ఉండేది. ఐనా, “ఆమె ఇల్లు” ముగింపు మారే పరిస్థితి అసలెలాగూ లేదు కదా. అది అనువాదపు కథ. ఇతరుల కథలు అనువదించుకునేవాడు స్వతంత్రుడు కాడు. అతడు ‘అసలు రచయిత’కు విధేయుడు. మూలరచయిత ఏం రాస్తే, అనువాదకుడు అదే రాయాలి.
కథ తను రాసిందైతే, – కాంటెంపరరీ, ప్రొగ్రెసివ్ రైటర్ – ఛ! ఇలా రాసానేంటి, ఇంత వెనకబడిన ముగింపు, ఇది ఒక misogynistic కథ లాగా సౌండ్ అవుతూంది, పొరపాటు, మార్చేస్తున్నా, అని మార్చేసుకునేవాడు. కాని, అనువాదకుడు గదా, అందువల్ల మొదలూ, మధ్యా, ముగింపూ -ఏదీ మార్చలేడు.
అనువాద కథల్లో -అనువాదకుడి కున్న “బాధకాల్లో” ఇది ఒకటై ఉండాలి. అంత సాధకం చేసి, ఈ బాధకం తెచ్చుకోటమెందుకు!
-Lyla
ఆమె ఇల్లు గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
02/16/2022 2:16 pm
చాలా అసందర్భాలు ఉన్నట్టున్నాయి కథలో. నలభైనాలుగేళ్ళ వాళ్ళావిడ ఉద్యోగం చేస్తోందంటే ఆవిడ ఎంత అనాకారి అయినా “బంగారు గుడ్ల బాతు” అని తెలుస్తుంది మొగుడికి. అలా ఆవిడ స్కూటర్ అమ్మి పారేసి ఆవిణ్ణి వదులుకుంటాడా? అయినా ఇన్నేళ్ళు ఉద్యోగం చేస్తే లోన్ ఇవ్వరా ఇల్లు కొనుక్కోవడానికి? చాలా అవకతవకల్తో రాసిన కథ అని ‘నాకు’ అనిపించింది. అద్దెకి ఇల్లు తీసుకున్నందుకు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా చివరకి పెద్ద ఇల్లు ఓ సారి చూపిస్తే రెక్కలు కట్టుకు వాల్తారు కుటుంబం అంతా. మరో తిక్క వ్యవహారం – ఓ సారి ఇచ్చేసిన అద్దె ఎవరూ తిరిగి ఇవ్వరు ఎంత దెబ్బలాటలు పెట్టినా, పిల్లలు అమెరికాలో ఉన్నా. అయినా ఇది నా స్వంత ఘోష కాని కథలో పటుత్వం నాకైతే అనిపించలేదు.
>>“ఆమె ఇల్లు,” అని పేరు పెట్టకుండా ‘ఆమె మొగుడు’, అని పేరు పెడితే, అప్పుడు కథ లోని మగవాడిని స్టడీ చేసేవారా?
లైలా గారి ఈ వ్యాఖ్య చదివాక నవ్వు ఆగలేదు.
ఆమె ఇల్లు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
02/14/2022 1:08 pm
ఈ కథలో ఈ మగవాడిలా ఉన్నాడు, అలా ఎందుకున్నాడు? అని చాలావరకూ ఆడా, మగా పాఠకులు చర్చించరు. “మగవాడు” చర్చనీయాంశం కాదు. అతడిదే సమాజం, అతడే సమాజం అని తప్పుడు అభిప్రాయం మనసులలో నాటుకుపోయి ఉన్నదో, ఏమో?
ఈ కథలోని -ఆమె మొగుడు అనే మగవాడు, ఒక బండాభాయి. అతడికి, ఆమెకున్న రసహృదయం లేదు. ఏబ్రాసి వెధవ, ఉత్త వెంగళాయ! అయ్యో! అంటూ, కథలోని మగవాడిని గురించిన ఆందోళన, జాలి, పాఠకులలో లేదు. మరెందుకు లేదు? Is that an elephant in the room that you can’t see?
అభిప్రాయాలు కథలోని మగవాడి గురించే ఎందుకు రావు? అంటే అతడు ఉదాత్తుడుగా చిత్రించబడినప్పుడు, అతని వైపునుండి అభిప్రాయాలు రాస్తారు. లేనప్పుడు మాఫు చేస్తారు. కాబోలు!
“ఆమె ఇల్లు” కథలోని స్త్రీ రసహృదయిని. పురుషుడు నీరసుడు. ఈ కథ లోని ఆమె లోనే మాకు నేర్చుకోవలసిన అంశాలు ఉన్నాయి. ఈమె ప్రపంచాన్ని మెరుగు చేస్తుంది అన్న ఆ విషయం పాఠక/ విమర్శకులు చెప్పరు. ఈ మగవాడి చెంప మాకు పగలగొట్టాలని ఉంది అని చెప్పరు. ఇతడు తింగిరి వెధవ అని చెప్పరు.
నిజానికి, ఈ కథ ఎప్పుడు రాసారో కాని, రచయితైతే ఏ విషయాలు దాయనే లేదు. రచయిత అన్నీ చక్కగానే చెప్పాడు. కథలో చెప్పబడిన దానిని ignore చేసి, మగవాడిని స్క్రుటినీ నుంచి తప్పించి, ఆడదానిని గురించే ఏదో ఒక ‘జాలి’ అభిప్రాయం రాసే లెక్కన కథ ఎందుకు చదువుకోవటం? “ఆమె ఇల్లు,” అని పేరు పెట్టకుండా ‘ఆమె మొగుడు’, అని పేరు పెడితే, అప్పుడు కథ లోని మగవాడిని స్టడీ చేసేవారా?
“శృఙ్గారీ చేత్కవిః కావ్యే జాతం రసమయం జగత్।
స ఏవ వీతరాగశ్చే న్నీరసం సర్వమేవ తత్॥ (ఆనందవర్ధనుడు-ధ్వన్యాలోకము)
కవి శృంగారి, రసాత్మకుడైనచో ఆ ప్రపంచం రసాత్మకమౌతుంది. అతడే నీరసుడైనచో, అది నీరసంగా పరిణమిస్తుంది.’ – అని ఈ శ్లోకాని కర్థం.” (“వసుచరిత్రంలోని వర్ణనలలో సంఘస్థితి ప్రతిబింబాలు,” ఈమాట, అక్టోబర్ 2021.)
-Lyla
తెలుగు వాళ్ళకిది వర్తించదు! గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
02/14/2022 11:31 am
ఇంతకు ముందు వాసు, ఈ సంచికలో శివకుమార్ శర్మ, అనిల్, – కవిత్వం, పుస్తక ప్రచురణలు, పుస్తకావిష్కరణల గురించి చెప్పిన విషయాలు చదివాను. నేనిప్పుడు రాసేది ఒక సాహిత్య పాఠకురాలిగా. పుస్తకాలు కొన్నేళ్లుగా విరివిగా కొనుక్కుంటున్న వ్యక్తిగా.
కవికి తన కవిత్వం మాత్రమే పుస్తకంగా తనే ప్రచురించుకోటం, కవిని, ఎవరూ పరిచయం చెయ్యకపోటం, మంచి పనే. శ్రోతకు కవికి మధ్య ఎడం తగ్గుతుంది. పరిచయం చేసేవారి నీడలు, కవి మీద పడవు. అలాగే వారి ధగధగలు, నా దృష్టిని పరిచయం చేస్తున్నవారి వైపుకు మళ్లించవు. కొన్నిసార్లు పాఠకురాలిని నేను -మీ కవిత్వం చదవటం మానేసి, విమర్శకుడితో వెళ్లిపోయే అవకాశం కవులు మీరే కల్పించటం ఎందుకు?
ఇంకోటి; పరిచయాలు లేపోతే కవిత్వం పుస్తకాలు పలచగా ఉంటాయి. ఔట్ డోర్ బుక్ షాప్ లో అప్పటికప్పుడు, సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని, గార్డెన్లో, ఉడ్స్ లో, కఫేలలో కవిత్వం చదువుకోటం ఎంతో బాగుంటుంది. అలా నేనెంతో కవిత్వం చదువుకున్నాను.
కవికి తన కవిత్వం ఇతరులు చదివితే, ఆత్మసంతృప్తి కలుగుతుందా? ఏమో! మీరు చెపుతున్నారు మీరు రాయటంలో అది ఒక పెద్ద ఫాక్టర్ అని. నేను ఆలోచిస్తున్నాను, కవిత్వం చదివే ఒక వ్యక్తిగా. నేను పొయట్రీ చదివేప్పుడు, అలాటి బరువు భారంతో నేనైతే చదవలేను. మీ ఆత్మ సంతృప్తితో నాకేం పని? కవిత్వం లోని విషయంతోనే గాని, కవిమీద రీడర్ కి ఏం ఆసక్తి? ఐతే, చదువరికి రచన తనంత తానే తెలుపుతుంటుంది రాసిందెవరో.
కవికి – చదువుతున్నారా లేదా, తన కవిత్వం వారికి నచ్చిందా, ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో చెప్పమనటం, ఇతరుల అభిప్రాయాలకోసం దేవిళ్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏం చేసుకుంటారు ఆ అభిప్రాయాన్ని? రాసిన పుస్తకాలు మార్కెట్లో అమ్ముడు పోవటమే, పాఠకులు చెప్పే నిజమైన అభిప్రాయం. నేను కొనుక్కున్న పుస్తకానికి ధర, పుస్తకాల షాపులో నేను కట్టివేసాను. అది బతికున్న/ చచ్చిన రచయిత నిర్ణయించిన ధరే. ఇంక ఆ తర్వాత రచయిత నానుండి వేరే వేరే ఆశించటం సరా? నా అభిప్రాయానికి మూల్యం పాఠకురాలిని నేను నిర్ణయిస్తే, రచయితకు కట్టసాధ్యమా? నేను పుస్తకాలు కొనుక్కుని, కొన్ని దశాబ్దాలుగా సంతృప్తిగా చదువుకుంటూనే ఉన్నాను. ఫీడ్ బేక్ అడగనందువలనేమో, మరణించిన రచయితల రచనల మీద నాకు ఎక్కువ అభిమానం.
సమీక్షలు నేను చదవను. ఒకవేళ false pretenses/for their own reasons తో నాతో చదివిస్తే, ఇక ఆ అసలు పుస్తకం చదివే ఆసక్తి నాకుండదు. అలాగే ఘోస్ట్ రైటర్ల రైటింగ్స్ కూడా. తన అనుభవాలు వేరే వాడితో ఎవరైనా ఎలా చెప్పిస్తారు? అది ఉత్త బోగస్ రైటింగ్. అలా రాయల్టీ లాగా ఫీలయ్యే ఒబామాలూ, హేరీలూ రాసేవి, నేను చదవను. అలాగే, ఇతరులకు మౌత్పీస్ లాగా మార్ఫ్ చెందినవారి రచనలు, తెలిసాక నేను చదవను. ఇవన్నీ అసలు పంట కళ్లచూడకుండా పరిగె ఏరుకు తింటున్నట్టు అనిపిస్తుంది. I don’t want that fluff.
-Lyla
రెండు అక్షరసామ్య యతులు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
02/12/2022 3:24 pm
పరమ కల్యాణి, బ్రతుకు సం-పదగ రమ్ము
=
పరమ కల్యాణి, బ్రతుకు స-మ్పదగ రమ్ము
ఎందుకంటే అనుస్వారము ఒక #shorthand#.
కాని
గ / మ్మత్తు సగాలదేవర వి-పత్తరి నమ్మెదనిన్ను – ఇందులోని గమ్మత్తులో
అనుస్వారపు శబ్దము ఉండవచ్చును, గంమత్తు అని. కాని పకారము లేదు. మఱి అక్షరసామ్య యతి ఎలా కుదురుతుంది?
విధేయుడు – మోహన
రెండు అక్షరసామ్య యతులు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
02/11/2022 8:19 pm
ఇక్కడ నా ప్రతిపాదన ఏమనగా: యతి నిర్ణయము అక్షరముల ఉచ్చరణమునుబట్టి కూడ ఉండవలయునని. సంస్కృతపదములలో చకార, జకారములు తాలవ్యములు. అచ్చ తెలుగు పదములలో మాత్రమే కొన్ని అచ్చులతో [అ,ఆ, ఉ,ఊ, ఒ,ఓ, ఔ(అవు)] చకార జకారములను దంత్యములుగా ఉచ్చారణము చేస్తారు. (ఉర్దూలో జిందగీలాటి పదములు దంత్యములు, కాని తెలుగులో కాదు.) కేవలము వీటికి మాత్రమే తవర్గాక్షరములతో యతి ప్రతిపాదన. ఛందస్సులో అచ్చతెలుగు పదములకు కొన్ని చోటులలో ప్రత్యేకమైన నియమము గలదు, ఉదా. అద్రుచు, విద్రుచు లాటి పదములలో అ, వి అక్షరములు లఘువులు, గురువులు కావు. కాని ముద్ర, విద్రుమ వంటి సంస్కృత పదాలలో ము, వి అక్షరములు గురువులు, లఘువులు కావు. అదే విధముగా వైరి సమాసముల విషయములలో కూడ ముందున్న పదము తెలుగా లేక సంస్కృతమా అన్నది ముఖ్యము, ఇది అందరికి తెలిసిన విషయమే. నా ప్రశ్న: పలికేటప్పుడు తకార, దకారములతో వాడగా, అక్షరసామ్య యతి విషయములో ఎందుకిది నిషిద్ధము? నియమములు మనము ఏర్పరచినవే. కవిజనాశ్రయములో కొన్ని యతులు మాత్రమే ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు వాడుక రీత్యా, ఉచ్చరణము రీత్యా ఎక్కువైనది కదా? ఋకార యతికి బహుళత్వము, దంత్య చకార, జకారములకు తవర్గముతో యతి అంగీకరణము ఎందుకు చేయరాదు?
వీటితో మ,వ అక్షరములకు యతి అవసరమా అని ఆలోచించినాను. తమిళములో ఈ రెండక్షరములకు యతి అంగీకృతము. అట్టి పదములు తెలుగులో ఉండినను, దాని సంఖ్య చాల తక్కువ (మామిడి – మావిడి, మామ – మావ, ఇత్యాదులు) అందువలన దానిని పేర్కొనలేదు.
విధేయుడు – మోహన
వోర్టెక్స్‌లో వాన గురించి sudha గారి అభిప్రాయం:
02/07/2022 10:36 pm
బావుంది శ్రీనివాస్ గారు, కాని నెరేషన్ Discontinuity కి subtlety మధ్య ఎడ్జ్ లో ఉంది.
రెండు అక్షరసామ్య యతులు గురించి Desikachary గారి అభిప్రాయం:
02/06/2022 5:48 pm
మీరు ప్రస్తావించిన ఋకారమునకు రి, రె, రే,రు ఇత్యాది యతులు పూర్వకవులు ఉపయోగించినవే కాని అన్యములు గావు. కానిదంత్య చ,జ లకు ఏమాత్రము ధ్వనిసామ్యము లేని తవర్గాక్షరములతో యతి నంగీకరించుట అభిలషణీయ మను మీ నూతనప్రతిపాదన నాదృష్టిలో సమర్థనీయముగా లేదు. మీరిచ్చిన పుచ్చుకొని = పుత్సుకొని, పచ్చలు = పత్సలు అను ఉదాహరణములలోని పత్సలు, పుత్సుకొని అను పదాలలో తకారమునకు గల సకారసంయోగముతో చకారసామ్యధ్వని యుండుటచేత, చ,ఛ, జ,ఝ,శ,ష,స- లకు లక్షణగ్రంథములలో చెప్పబడిన యతిమైత్రిద్వారా ‘చ్చు’, ‘చ్చ’లతో ధ్వనిసామ్యం కల్గింది గాని, కేవలం పుత్తుకొని, పత్తలు అని ఉంటే యతిమైత్రికి ఆస్కారమనేదే లేదని నా ఉద్దేశ్యం. ఇక్కడ చ,జ లంటే, చ,ౘ, జ, ౙ లను నాల్గక్షరాలని గుర్తుంచుకొనవలెను.
విశాఖ గురించి srinivas sathiraju గారి అభిప్రాయం:
02/02/2022 1:32 pm
నిజమే భాస్కర్ గారూ!
చారిత్రిక సాహిత్యమూ, సిద్ధాంత పరమైన సాహిత్యమూ — వీటిలో ఏది దేనికి పనికొస్తుంది అని ఆలోచిస్తే… సాహిత్యం ద్వారా వర్గ పోరాట దారులు ఎప్పుడెప్పుడు రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటారో, అప్పుడల్లా సిద్ధాంత పరమైన సాహిత్యం చేతిలో రచయిత కీలుబొమ్మలాగా మారిపోక తప్పలేదు అనేది మరో సారి నిరూపణ అవుతుంది.
మీరు రాసిన దానిలో అన్నీ సత్య దూరాలన్న సంగతి మీ కన్నా బౌద్ధులకు ఎక్కువ తెలుసు. ఒక ఇండియాన జోన్స్ మూవీలా రాసి ఉంటే బావుండును భిక్ష పాత్ర గురించి. అది కాలేదు. ఎక్కడి మగధ?ఎక్కడి గయ?ఎక్కడ సంఘూడు? చివరికి ఎదో ప్రశ్నల సణుగుడులో మునిగి పోయారు. అసలు వైజాగ్ చుట్టుపక్కల కొండల మీద ఉన్న బౌద్ధ ఆరామాలు 1971 యుద్ధమప్పుడు యుద్ధ విమానాలు తీసిన ఫోటోల నుంచి బయట పడ్డాయి అన్న విషయం మీరు ఎందుకు ప్రాస్తావించ లేదూఅనేది చాలు.. కథ అసలు ఉద్దేశ్యం అర్ధమవడానికి. నిజాయితీ మొదటి సారి మీ రచనలో లోపించింది. కానీ చివరికి వచ్చేసరికి ఒక్క ప్రశ్న జవాబులో అసలు భాస్కరుడు ఉదయించాడు. కానీ ఆలస్యం ఆయ్యీపోయింది.
దిల్ ధడక్‌నే దో! గురించి srinivas sathiraju గారి అభిప్రాయం:
01/08/2022 5:41 pm
ఎంత అన్యాయంగా ఉందో కదా.
దిల్ దఢక్నేదో అంటే అదొక్కటేనా అతగాడికి వచ్చింది… ఆవిడకి ఇవ్వ గలిగేది. అని నాలాంటి వారికనిపించినా…
ఈ మధ్య మా కుటుంబంలో జరిగిన ఒకానొక విషయం నన్ను ఈ కధని ఒప్పుకునేలా చేసింది. కాకపోతే కధలో రచయిత్రి స్వేచ్చ. అది తప్పా ఇంకేదీ చేతకాని మొగుడితో పిల్లలుండడం మూలంగా కలిపేసింది. ఇలలో మాత్రం మగాడి స్వేచ్చ ఆడది ప్రశ్నించినందుకు. ఆయనగారి మగతనపు ఆత్మాభిమానం దెబ్బతిని వాదించుకోడాలు శృతిమించి స్వేచ్చకోసం, కొత్తగా పెళ్ళైన జంట విడాకుల కోసం సిద్ధంగా ఉండి కౌన్సిలింగ్ కి పంపించాము. ఏం జరుగుతుందో ఏమో.
కోవిడ్ మూలంగా చాలా కొత్త రకం సమస్యలు. కాకపోతే కొత్త సీసాలో పాత సారా. అంతే తప్ప అర్ధం చేసుకునే గుణాలు మాత్రం కేవలం కధల్లోనూ నవలల్లోనూ మాత్రమే వ్యక్తీకరిస్తున్నారు తప్ప, నిజానికీ ఎవరూ కూడా తగ్గేదే లేదు అనుకుంటూ రెచ్చి పోతున్నారు.
మధ్యలో లాభపడుతున్నది గంటకి 500 నుంచి 1000 రూపాయలకి పెంచుకున్న కౌన్సిలర్లు. సమస్య వినిపించడానికి పోతే ఆర్ధిక స్థితిగతులు కనుక్కుని “ఏమమ్మా నీకు సంసారం కావాలా, విడాకులు కావాలా, నీకేది కావాలంటే అలానే చేద్దాం అంటున్నారు” అని చెపితే నాకు అర్ధం కాక తల పట్టుకున్నా. బహుశా మీలాంటి రచయిత్రులు ఆ కౌన్సిలింగ్ రంగంలోకి దిగితే నాలుగు కుటుంబాలు నిలబడతాయేమో అనిపించింది.
డిసెంబర్ 2021 గురించి Vasu గారి అభిప్రాయం:
01/02/2022 11:07 am
ఈమాట సంపాదకులకు నమస్కారాలు:
ఇక్కడ పుస్తకాలు అచ్చు వేసుకొనేవారిని మీరు మీ సంపాదకీయంలో కాస్త అపహాస్యం చేశారు. నిజమే, ఇప్పుడు తెలుగునాట ఊకదంపుడు ఉపన్యాసాలు ఎక్కువయ్యాయి. అయితే ఇవి నిన్నటి తరంలోనూ ఉన్నాయి. సాహిత్యం – మరీ ముఖ్యంగా కవిత్వం – ఎవడూ అమ్ముకోగలనని వేసుకోడు. మన సంస్కృతిలో భక్తిసాహిత్యాన్ని కవిత్వం (ఆధునిక కవిత్వం) ఎప్పుడూ మించలేదు. కవులంతా పుస్తకాలు అచ్చు వేసి పంచిపెట్టుకునేవారే. ఇది దాదాపు నిష్కామకర్మ. ఇది passionతో చేసేది, ప్రతిఫలాపేక్ష కోసం కాదు. నాకు పాశ్చాత్యదేశాల్లోని పుస్తకావిష్కరణోత్సవాలు ఎలా జరుగుతాయో చిన్న అవగాహన ఉంది. నిజమే. అదే సరైనదేమో! అయినా మన సంస్కృతి మనది. (దుః)శాలువాలు కప్పడం, వక్తలు ప్రసంగించడం, వగైరా. ఒక మాట నిజం. తెలుగునాట కవిత్వపఠనం డబ్బుపెట్టి కొనుక్కునేంతటి విలువైనది కాదు (Reading poetry is not an experience worth paying for!) ఎవడూ కొనడు. ఇచ్చినా చదివేవారు తక్కువ. చదివినా స్పందించేవారు ఇంకా తక్కువ. ఇది అందరికీ తెలిసినదే. మీరు ఐదువందలకాపీలు అన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య నూటికో రెండొందలకో తగ్గింది కూడా. ఇంకా మీరన్నారు ఇలా:
“రచన నిజంగా గొప్పగా ఉంటే పాఠకుడే అడిగి మరీ కొనుక్కుంటాడు అన్న విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, తన రచన మీద గౌరవం ఉన్న ఏ రచయితా తన పుస్తకాన్ని ఉబ్బరగా ఎవరికీ ఇవ్వడు. ఇవ్వకూడదు.”
నేను మీతో విభేదిస్తున్నాను. కాస్త ఇటు చూడండి. ఈ అపహాస్యం బాగోలేదు. మీరు ఏ దంతప్రాకారంలో (ivory tower) ఉండి చెబుతున్నారో గానీ, మీతో ఏకీభవించేవారెవరూ తెలుగునాట ఉండరు. ఇది నా స్వానుభవం. నేను మీరన్నట్టు నా కవితా సంపుటి (“కాసేపు”) అచ్చువేసుకొని పంచిపెట్టుకున్నవాడినే.
-వాసు-
[వాసుగారూ, ఉంటే గింటే కొండొకచో ఆవేశము, ఆక్రోశమూ ఉన్నాయేమో కాని ఎవరినీ అపహాస్యం చేసే ఉద్దేశ్యం మాకు ఏ కోశానా లేదండీ. మేము అందరిలా నేల మీద ఉండే, నాల్గువైపులా చూసి గమనించే చెప్తున్నాం, చెప్పదలచుకుంది ఏదైనా – సం.]
The song cycle of Shyam గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
12/23/2021 1:15 pm
నమస్కారం తః!
కలివె విశ్వనాథం గారి ఉపన్యాసాల లింక్ గురించి ఇంతకు ముందు చెప్పినందుకు సంతోషం. చదివాను శక్తి కొద్దీ. కాని ఇంగ్లిష్ అక్షరాలు కనపడక, ప్రతి బాగోనందున, ఆయన విద్వత్తు నాకు ఆనందించటానికి వీలవదు. It’s my loss. I really wish I can read his lectures on English poetry.
దాశరథి తెలుగు కవిత్వం ఆంధ్రభారతిలో చదువుతున్నాను. మీరిచ్చిన మీ కవిత నాకు బాగుంది. యాదాలాపంగా రచించినట్టుండే కవితలు నాకిష్టం. ఐనా మీరు బాగా చదువుకునుండేసరికి మధ్య మధ్య మీ విజ్ఞానం ఆడేపాడే పాటకు అడ్డం పడుతూ ఉంటుంది. I suppose you can’t help it. I like it.
This guy Frank O’ Ohara is a well-educated guy. I saw his poetry books in MOMA two years back, as an exhibit. A sample:
O god it is wonderful
To get out of bed
And drink too much coffee
And smoke too many cigarettes
And love you so much.
అలాటి కొందరి పొయట్రీ, కొందరి భారతీయుల, ఇతర దేశస్థుల ఆర్ట్, నేను చూస్తానికి వెళ్లినప్పుడూ, నేను రాసేవి ఇలా ఉంటయ్యి. మెమొరీ లోంచి కొన్ని పంక్తులు:
…
జడినానలో మేను తడిసింది తెలియదు
శిశిరం ఆకులు నాపై రాల్చింది తెలియదు
గడగడ చలిలో నేను వణికింది తెలియదు
నా దేశం వాసివనీ
నీవేదో చేసావని
ఆ బొమ్మ చూడాలనీ
ఆ రాత చదవాలనీ
నీ ఊహలు నాకు మెరిసి
నా ఊహలు నీకు తెలిసి
ఆ ఊహల ఉయ్యాల జమిలిగ ఊగాలనీ
నీకై, నీకై, నీకై, వచ్చి ఉన్నాకదా! ప్రియా!
-లైలా
Happy Holidays to All!
Humoreske గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
12/04/2021 11:34 am
Humoresque (హుమొరెస్క్యు) అంటే పాత్రల మానసిక స్థితిని తెలియజేసే కల్పిత హాస్యంతో కూడిన (చపలచిత్తమైన తెలివి ప్రదర్శన కాని) శృంగార సంగీత కళా ప్రక్రియగా వర్ణించవచ్చు అని గూగులమ్మ చెపుతోంది†.
ఆవిధంగా హుమొరెస్క్యు అనే పేరు యీ కధలోని అంతర్ సూత్రానికి (నిసి షామల్, పీటర్ కాన్రాయ్‌ల చెర్లాటలకి) చక్కగా సరిపోతున్నదేమో కదా ప్రియమైన తః తః గారూ?!
†Humoresque is a genre of romantic music characterized by pieces with fanciful humor in the sense of mood rather than wit.
ఏనుగు డాక్టర్ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
12/03/2021 2:07 pm
ప్రియమైన అవినేని భాస్కర్ గారూ…
“ఏనుగు డాక్టర్” అనాది తాత్వికతను ప్రస్థావించిన ఓ గొప్ప కధ… మీ మరో గొప్ప అనుసృజన. ప్రకృతితో మమేకం కాకుండా, ప్రకృతిలోని అన్ని జీవజాలాల ఉనికిని అర్ధంచేసుకోకుండా, వాటిని ప్రేమించకుండా మనిషి ఆదర్శవంత జీవిత మార్గం లోకి మళ్లలేడని తెలియజేస్థున్న కధను అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
అడవి మృగాలకూ ఇతర పెంపుడు జంతువులకూ వైద్యం చేస్తూ క్రమేణా ఏనుగుల స్పెషలిస్టుగా మారిన అటవీశాఖ జంతువైద్యుడు డాక్టర్ వి. కృష్ణమూర్తి గారి మౌలిక విలువల తాత్వికతని అడవితల్లి వొడిలో సేదతీర్చుకునే జయతి తల్లి (జయతి లోహితాక్షన్) బాగా అర్ధం చేసుకుంటారు.
అడవితల్లి వొడిలో సేదతీర్చుకోవాలనే ధ్యాసే కాని, పురుగూ పుట్రా ఉంటాయ్ అంటే …. అదంతా మనమేర్పరచుకున్న భయాందోళనల తప్పు అభిప్రాయాలు అంటూ నవ్విన; ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి సంధ్యలను ప్రకృతి వొడిలోనుండి వీక్షణానందజనిత తన్మయత్వంతో చూసే… ఎంతో మహోన్నతమైన సంతోషాలు ఈ భూమ్మీద అడవితల్లి ఒడిలో ఉన్నాయని తెలిసిన జయతి తల్లి (అడవి నుండి అడవికి జయతి లోహితాక్షన్) “ఏనుగు డాక్టర్” ను సాధికారికంగా బాగా అర్ధం చేసుకుంటారు.
భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 1 గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
10/31/2021 5:40 pm
నమస్కారం. వ్యాసం నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు.
ఒక ఇంగ్లీషు మాటకి సమతూకమైన దేశీ మాట కోసం వెతికినప్పుడు – ఒకొక్కసారి – ఏళ్ల తరబడి ఆలోచిస్తానండి. నేను ఎంపిక చేసిన మాట అనేక సందర్భాలలో నప్పుతుందో నప్పదో అని ఒక భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. చదివే వ్యక్తికి చదువుతూన్న సందర్భం ఒక్కటే కనిపిస్తుంది కాని నేను రాసేటప్పుడు ఇదే మాటని ఏ ఇతర సందర్భాలలో ఎలా ఉపయోగించేనో చూసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు పాఠకులు సూచించిన అభిప్రాయాలని మన్నించడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఒకసారి (ఏళ్ళ క్రితం) తః తః చేసిన విమర్శకి స్పందిస్తూ theory అన్న మాటని “వాదం” అనిన్నీ, theorem అన్న మాటని సిద్ధాంతం అనిన్నీ తెలిగించేను. కనుక మీ వ్యాఖ్యానం మీద నా స్పందన ఎలా ఉంటుందో అని మీకు కుతూహలంగా ఉంటే కొన్నేళ్ళు ఆగి చూడండి.
The song cycle of Shyam గురించి Krishna Rao Maddipati గారి అభిప్రాయం:
10/30/2021 4:42 pm
ఇవి అచ్చు తప్పులా లేక నా అజ్ఞానానికి పరీక్షలా అనే అనుమానంతొనే సుమా…
హర్మ్యమున
సంపర్కము
ఎన్నొమార్లు
సర్వము
[ఎన్నోమార్లు అని ఉండాలి. కాని కవిస్వేచ్ఛలో భాగంగా అది ఎన్నొమార్లు అనే ఉంచాం. మిగతా పదాలలో మాకు ఏ తప్పులూ కనపడలేదు. ఎందుకు తప్పనిపించిందో చెప్పగలరు – సం.]
ప్రాచీన తెలుగు కొలమానం గురించి పర్వతాల రంగయ్య గారి అభిప్రాయం:
10/18/2021 8:11 am
ప్రాచీన కొలమానం వివరణ చాల బాగుంది. మాది వ్యవసాయ కుటుంబం. ఈ పదాలు వేసవి శెలవుల్లో మా అమ్మమ్మ గారి ఊర్లో వినేవాడిని. తూకానికి ఏబళం అనేవారు అంటే అయిదు పలాలు. మూడు తులాలు ఒక పలం. ఈ వ్యాసం లో సహకరించిన పరుచూరివారికి నా మనవి.ఘంటసాల గారు పాడిన ఒక పాట తండ్రి పుత్రునికి సదా రుణ పడి ఉంటాడని భావం తో ఉంటుంది. ఆ తరంగం అందించమని విన్నపం
అక్టోబర్ 2021 గురించి జయంతి వివిఎస్ మూర్తి గారి అభిప్రాయం:
10/03/2021 12:17 pm
తెలుగులో రచయితల కంటె విమర్శకులు ఎక్కువ ఉన్నారనిపిస్తోంది. ఇప్పుడు వస్తున్న సాహిత్యం పూర్తిగా పనికిమాలినది కాదు. కాకపోతే రచయితలకు కథా వస్తువులుగా బలమైన సామాజిక సమస్యలు లేవు. నేటి సంక్షేమ పథకాల పుణ్యమా అని అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక స్థాయిలో హాయిగా ఉన్నారు. వర్గ పోరాటాలను ప్రతిబింబించే విధంగా వ్రాయాల్సిన అవసరం కనపడటం లేదు. అయినా మానవతా విలువల గురించి, కుటుంబ వ్యవస్థ లో వస్తున్న పెను మార్పుల గురించి, సున్నితమైన స్త్రీ పురుష సంబంధాలు దెబ్బతిని మనుషులు బండబారిపోవడం గురించి, శాడిజం గురించి, ఇతరులను నమ్మించి మోసం చేయడం అనేది ఒక కళగా గౌరవింప బడటం గురించి మంచి కథలు వస్తున్నాయి. కాని మంచి రచయితలు ఒకచోట చేరి చర్చించుకునే తీరిక, ఓపిక, వేదిక కరువయ్యాయి. కథల్లో థ్రిల్ కు పెద్దపీట వేస్తున్నారు. అందువల్ల నేటివిటీ కరువై, విదేశీ వాసనలతో కథలు కృతకంగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితి మారి సమాజంలోని వివిధ సమస్యలపై కథలు వస్తే బాగుంటుంది.
గడినుడి-59 సమాధానాలు గురించి ద్రోణంరాజు వెంకట మోహన్ రావు గారి అభిప్రాయం:
10/01/2021 1:00 pm
నేను అన్ని సరైన జవాబులు పంపిచాను. నాకు మెయిల్ కూడా పంపించారు. కాని సరైన సమాధానాలు పంపించిన వారి పేర్లలో నా పేరు లేదు.
షేక్స్‌పియర్ సాహిత్యలోకం: ఒక ఆలోకం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
10/01/2021 5:11 am
నిన్ననే మొట్టమొదటిసారి మెక్‌బెత్ చదినాను. అది కూడా వచన రూపంలో. అది కూడా పిల్లల కొరకు రాసిన క్లుప్త రూపంలో. మూలం చదవాలన్న కుతూహలంతో అంతర్జాలంలో వెతికి మొదలుపెట్టేను. కాని భాష, భావం రెండూ అర్థం కాలేదు. ఇంతలో, ఈ రోజు, కాకతాళీయంగా ఈ వ్యాసం నా కళ్ళపడింది. దీనిని ఆసరాగా తీసుకుని మెక్‌బెత్ మూలం మరొకసారి చదువుతాను. రచయితకి ధన్యవాదాలు. పేరడైజ్ లాస్ట్ కూడా మరొకసారి చదవాలేమో! చూద్దాం.
ఊహల ఊట 2 గురించి ఉప్పలూరి ఆత్రేయ శర్మ గారి అభిప్రాయం:
09/14/2021 10:08 am
చాగంటి తులసిగారి ఊహల ఊట తరుగెరగని అసలు సిసలైన “జల”తారు వన్నెల తెలుగు అందాల బంగరు నీటి గని. చిన్న వయసులోని చిలిపి ఆడపిల్ల చెంగుచెంగున వాకిలంతా, పెరడంతా కాళ్ళ గజ్జెలు ఘల్లుఘల్లుమని గంతులేసినట్లు చిన్న తులసిగారి మాటల మూటల బుల్లి తూటాలు అన్నివైపులా పేలుతూ అపుడపుడు తికమక పెడుతున్నట్లు కనపడినా చదువరులనందరినీ తమకానికి గురి చేస్తాయి. బాల్య స్మృతుల హరివిల్లు రంగులను తెలుగు సొగసులతో మిళితం చేసి “ఈమాట” ద్వారా చక్కని బాట వేస్తున్న చాగంటి చిఱుతకు నా ఉల్లపు లోతులనుంచి వెల్లువలా జారువాలే అభినందన పారిజాతాలు.
టి. ఎస్. ఎలియట్ కవితాశిల్పం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
09/02/2021 2:34 pm
Enjoyed the essay.
The following poem of mine composed 10 or 12 years back, explains itself.
Eliot and Bacon
సుతి లేని ఎలియట్ కి
మతి లేని పెళ్ళాం
శివ శివా! శివ శివా!
అతలాకుతలం అతని ప్రపంచం.
ఇంటిలోని పోరు ఇంతింత కానపుడు
హరి హరీ! హరి హరీ ! ఇంకేదిరా దారీ!
హార్వర్డులో చదువు, ఆక్స్ ఫోర్డులో చదువు, కాని
పిచ్చి పెళ్ళామున్న, కచ్చి కవితలె పుట్టు
కవితలో రట్టు గద అతివపై అతి కసి.
కాగితంపై వక్ర విషాదమే కురిసింది
బ్రతుకు ఇవ్వని సుఖము
సాహితీ బహుమతులలో మెరిసింది!
అతని కన్న ఘనుడు అతని అడారి అభిమాని
ఏథియిస్టు, హోమో, ఫ్రాన్సిస్ బేకన్
ఒకరి కళ వేస్ట్ లేండ్, మరొకరి కళ వాస్ట్ మోర్గ్
బేకన్ కేన్వాసు మీదంతా కార్కాసులే గదా
ఆ కేజ్ లో మనుషులా, మరి మాంసపు ముద్దలా!!
ఎంత జంతువు, ఎంత బందీ, ఎంత బాధ ఇతని మనిషి
ఎంత న్యూనత, ఎంత హేళన, ఎంత శూన్యత ఇతని మనిషి
అందుకేనా అతని కామి జార్జ్ డయర్,
ఆ ఆర్టిస్ట్ అసహ్యాన్నీ,అసహనాన్నీ అనుభవించీ
అనుభవించీ, తనను తానే చంపుకుందీ?
టేట్ బ్రిటన్ లో ఈ కాళకళ విలయనృత్యం
చూసి నే నివ్వెర పోతే, కాలు కదలక నిలిచిపోతే
ప్రళయ వేగంతో పరుగులెత్తే స్ప్రింటర్ల మార్గంలోంచి,
ఇతర ప్రేక్షకులు నన్ను పక్కకు లాగారు.
నాకేం తెలుసు, టేట్ లో ఇప్పుడు
ఆర్టే కాక రన్నింగు కూడా ఎక్సిబిట్ చెయ్యొచ్చని!:-)
గాడ్! ఆ స్ప్రింటర్లు -ఆ వేగపు చలనపు మాస్,
నా స్తంభించిన బాడీని కొడితే
నే ఫట్ ఫట్ పేలిపోయి, నా మాంసం, నా రక్తం, నా ఎముకల
స్ప్లింటర్లు పక్కన గేలరీ తెల్ల గోడలకు ప్లాస్టరైతే,
నేనే ఫ్రాన్సిస్ బేకన్ పాస్తుమస్ మాస్టర్ పీసును.
నే మ్యూసియం గోడ మీంచి – స్వీనీ స్వీటు గొంతులో
“Birth and copulation and death
That’s all the facts when you come to brass tacks”
అని ఎప్పటికీ పాడుతూ ఉండే పని.
అంతేనా, అంతేనా, మళ్ళీ
” Birth and copulation, and death
I have been born, and once is enough.
You don’t remember, but I remember,
Once is enough ”
జననం, సంగమం, ఖననం
ఒకసారి అయ్యింది చాలు
నీకు గుర్తులేదూ! నాకు గుర్తుంది!
ఒకసారి అయ్యింది చాలు:-)
ఈ మరుభూమిలో మరుజన్మ వద్దు
మహదేవా! శివా! శివా! అని
గోడమీద బేకన్ బొమ్మగా, ఎలియట్ పొయెట్రీగా
అతుక్కుపోయి గోల గోల చేసే పని.
-Lyla
D/o విజ్జి గురించి Siddhiq గారి అభిప్రాయం:
09/01/2021 4:34 am
ఒక పెళ్ళీడుకొచ్చిన సగటు మధ్య తరగతి (ఆర్ధిక,వర్చస్సు) ఆడపిల్ల ఆలోచనలు, నిర్ణయాలు, రెండో పెళ్ళికి సమాజం చేసే సూటి, పోటు మాటలు సుధగారు చిన్న కథలో ఆడపిల్లల అంతర్మదనాన్ని చాలా లోతుగా, సున్నితంగా తెలియజేసారు.
“పెద్దగా ఇష్టం లేకపోయినా ఇంతకంటే బెటర్ ఛాయిస్ లేక ఆ చాలీచాలని అసౌకర్యాల బ్రతుకునుంచి బయటపడటానికే ఈ పెళ్లి చేసుకున్నానని వాళ్లకి తెలియదు కదా” అని చెప్పుకుంటుంది విజ్జి. పరిస్థితులు, రెండో పెళ్ళి వాడు అనే సర్ధుబాటుతనం అమ్మలక్కల నిష్టూరపు మాటల వల్లనేమొ విజ్జికి మొదటి రాత్రి తంతు అయిష్టత కలిగిస్తుంది. పెళ్ళి నిజానికి ఇద్దరి వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని అధికారికంగా ఇచ్చే లైసెన్సే. కాని పరిణితి కల్గిన వ్యక్తులు ముందు ఒకరినొకరు అర్ధం చేసుకోడానికి, ఒకరిపై మరొకరిని ఇష్టం కలిగే వాతవరణాన్ని సృష్టించుకోవాలి. లైసెన్సు దొరికేసింది కదా అని అమాంతంగా దూకేస్తే ఇలాగే ఉంటుంది.
పెళ్ళైయ్యాక విజ్జికి రామారావు కూతురు డాలి ప్రవర్తన ఒక సవాలుగా మారుతుంది. అది డాలికి వాళ్ళమ్మ నుండి వచ్చిందే .. “ఆఁ! అయినా ఆ కరుణా అంతే, మూగ మొద్దులా ఉండేది” అంటుంది ఒకామే. కొంత మంది తొందరగా ఎవరితోను కలవరు. వారి ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది. కొత్త వాళ్ళని తొందరగా ఇష్టపడరు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా వాళ్ళ ప్రపంచం ఒకటి వేరే ఉంటుంది. బహుశా డాలిది అలాంటి మనస్థత్వమేమో!
నిజంగా మనుషుల మధ్య బంధాలు బలపడాలంటే జివితాల్లో నటించడం మానేయ్యలి. మనం మనలా ఉండాలి. పైకి ఎవరూ చెప్పకపోయినా నటనకు,నిజానికి తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ విషయాల్ని సుధగారు పాత్రల్లో చాల చక్కగా చెప్పారు.
మంచి కథ అందించిన సుధగారికి దన్యవాదాలు.
జెరర్డ్ మేన్లీ హాప్కిన్స్ గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
07/26/2021 1:54 pm
నేనింతకు ముందు Gerald Manley Hopkins కవిత్వం చదవలేదు. సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు, ప్రత్యేకించి పరిచయం చేసిన హాప్కిన్స్ పద్యాలు చక్కగా బోధపడి ఆయన ఇచ్చిన తెలుగు తర్జుమాలు అందంగా ఉండి ఆనందింపచేసాయి. ఇక్కడి పరిచయం రసవత్తరంగా ఉండినందున నెట్ లో హాప్కిన్స్ వి వీలైనన్ని కవితలు చదివాను. పొయెట్రీ లోని భావం, ప్రాసొడీ చిత్ర విచిత్రాలు, మళ్లీ మళ్లీ చదవగా కొంత మెరుగ్గా తెలుస్తున్నవి.
తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ పొయట్రీ -ఇంగ్లిష్ లోనే, తెలుగుసేత కన్నా బాగా అర్థం అవుతుందేమో. తెలుగు రాని తెలుగు వాళ్లున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వాళ్లిప్పుడున్నారా? సంస్కృతం, అరవం, కన్నడం ఇలా ఇతర భాషలు రాని తెలుగు వారున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వారున్నారా? మరొకటి. రచయిత ఇంగ్లిష్ పొయట్రీని విప్పి చెపుతారు, కాని సంస్కృత వాక్యాలను అర్థం చెప్పకుండా వదిలేస్తారు. అదేం పని! ఎందుకని! సంస్కృతం కన్నా, ఇంగ్లిష్ తెలిసిన వారే పాఠకులలో ఎక్కువమంది కాదా? ఇంత నేర్పరి రచయిత, విప్పి చెప్పటమే తన రచన ముఖ్యోద్దేశమైనప్పుడు సగం సగం చెప్పి వదిలెయ్యటం సరికాదు. ఐనా ఏక కాలంలో కొంత తెలుగు భాషను, కొంత ఇంగ్లిష్, వెనకటి కవుల, ఫిలాసఫర్ల పరిచయాలు ఏ రకంగా తెలుసుకున్నా ఆనంద దాయకమే. ఈ పత్రికలో ఇచ్చిన, సూరపరాజు గారి రచనలన్నీ చదువుతున్నాను. Thanks.
ఈ Hopkins కవి కవితలు, ఇక ముందైనా ట్యూటరింగ్ లేకుండా నాకు అర్థంకావనుకుంటాను. నాకు క్రిస్టియానిటీతో కొంత పరిచయం ఉన్నా, కవి కాలం నాటి ఇతరుల కవిత్వంతో కొంత పరిచయం ఉన్నా, ఈ జెస్యూట్ కవిని గ్రహించుకోటానికి ఇంకా చాలాసార్లు చదివితే తప్పించి నాకది సాధ్యపడదు.
ఉదాహరణకు The Wreck of Deutschland పద్యం. ఆ పొడుగు కవితలో ఉన్న 35 సానెట్స్ బిబ్లికల్ భావాలు, లిరికల్ బ్యూటీ అర్థం కాటానికి ప్రత్యేకించి poetry class తీసుకోవలసిందే. ఈ కవితపై సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారి ప్రచురించబడిన పుస్తకంలో గాని పూర్తి వివరణ ఉంటే వారి పుస్తకం, మరో ఇతరులు ఇంగ్లిష్ లో రాసిన మరో పుస్తకం తెప్పించుకుని చదవాలి.
ఈ ‘wreck’ పద్యం పైకి stanza After stanza చదువుతుంటే అందులోని మ్యూజిక్ ఆనందపరుస్తున్నది. హాప్కిన్స్, ఒక పద్యపాదంలో మెలడీ, మరో పాదంలో కౌంటర్ పాయింట్ రాసాడంటే, నాకు మురిపెం. ఈ పొడుగు పద్యం ఒక అందమైన తయారీ. ఒక శిల్పకారితనం. ఒక విషాద సంఘటనను, ఒక ప్రీస్ట్ లిఖించటంలో ఇంత పనితనమా? అని నాకు అచ్చెరపాటు.
(మాటలో మాట! కొద్ది రోజుల క్రితం ఈ పత్రికలో వేటూరి సినిమా పాటల గురించిన ప్రసక్తి, పాఠకులు తెచ్చినందున ఆ వ్యాసం మళ్లీ చదివాను. నేనిప్పుడు హాప్కిన్స్ సానెట్స్, వేటూరి పాటలు కొన్ని పక్కపక్కనే చదవొచ్చు. ఇద్దరి శబ్ద ప్రయోగాలు, కొత్త మాటల తయారీ విధానాలు గమనించవచ్చును. That excites me.)
The Wreck of Deutschland చదువుతుంటే, నాకు పూర్వపు కొందరి ఆర్టిస్ట్ ల, (J.W. Turner లాటి) shipwreck పెయింటింగ్స్ చూడాలనిపించింది. చూసాను. క్రితంలో నేను రాసిన ఈ కిందున్న ఒక పొయెమ్ నా మనసులో మెదిలింది. ఒక స్త్రీ నలుగురి దగ్గరి బంధువుల ఆకస్మికమరణానికి sea drowning తో, ship కు she తో, death కు sea తో, ఇందులో అన్వయం.
All of a Sudden
Three brethren have fallen
And wriggled helplessly in Sea.
The death wave is so massive
It swept them all away
The first mate didn’t even
Know he is dying.
She sees her ship keel
She is not made of steel.
She will wail and reel,
She has no hope to heal.
There is no mainland in sight
There is no island to maroon
A life spent in to and fro freight
She now awaits her own swoon.
The Sea waves rise and fall
Every seaman knows its roar
Every creature knows its fury
Every day begging for small mercies
With fear in hearts, they live and die.
-లైలా
అజెండా గురించి Siddhiq గారి అభిప్రాయం:
07/01/2021 10:02 am
“కప్ప దొరకాలని పాములు కోరుకుంటాయి. తప్పించుకోవాలని కప్పలు కోరుకుంటాయి. తప్పించుకోవడం, దొరికించుకోవడం అనేది వాటికున్న ఒడుపు వల్ల వస్తది. పాము ఒడుపుతో ఇంకో కప్పని దొరికించుకోవచ్చు. కప్ప చురుగ్గా లేనిరోజు ఇంకో పాము నోట్లో పడొచ్చు. నీటిపాము కప్పని పట్టుకోవచ్చు. కాని ఎండ్రకాయని పట్టుకోవాలనుకుంటే దాని చావు అది తెచ్చుకున్నట్లే.”
మనుషులు అవసరాల్లో అవకాశాల్ని ఎంత బాగా మలుచుకుంటారో పై చిన్న ఉదాహరణ ద్వారా కథకు అనుసంధానించిన విధానం చాలా చక్కగా నేర్పుగా ఉంది.
“బలహీనతల్ని దగ్గరుండి చూసిన మనిషి. మనం అడక్కుండానే అంత పెద్ద సాయం చేశాడంటే అతను సులువుగా నమ్మకాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఎంచుకున్నాడు. బలహీనులుగా కనపడుతూ మన బలహీనతలని ఆసరా చేసుకొని అతినమ్మకంగా మనదగ్గర అడుగుపెట్టాలనుకొనే వాళ్ళ వెనుక బలమైన ఆలోచనుంటుంది. ఎందుకో అది మనకి మంచిది కాదనిపించింది. ఆశలు, అవసరాలు పెరిగేకొద్ది అవకాశం దొరికితే మనమైనా మన పరిధులు దాటి వెళ్తాం. అది తప్పుగా కూడా అనిపించదు. అంత అవకాశం అతనికివ్వడం అనవసరమనిపించింది. అందుకే డబ్బులిచ్చి పంపా. అది అతన్ని తక్కువ చేయడం కాదు. మనల్ని మనం సేఫ్ జోన్‌లో ఉంచుకోవడం”
మనుషుల ఆలోచనల్ని చదవగలిగినవారే రాబోయే ప్రమాదాల్ని నివారించుకోగలరు. కరుణలో చూపిన నిశిత దృష్టి, దూరాలోచన ఎంతో బావున్నాయి.
ఆట గురించి Siddhiq గారి అభిప్రాయం:
06/09/2021 8:14 am
గిరి తన తమ్ముడు పుట్టకముందే నాలో స్వార్థం పుట్టింది అంటాడు. నిజమేనేమో ముందు స్వార్ధం పుట్టి తర్వాత మనిషి పుట్టాడేమో. తోడబుట్టిన వాళ్ళు కూడా ఏదో విషయంలో అది అందం, ఆస్తి, హోదా, పరపతి, చదువు ఏదైన కావచ్చు. వాళ్ళు తన కంటే ఎత్తులో ఉంటే తట్టుకోలేని, ఓర్చుకోలేని మానసిక వైకల్యం చాలా ప్రమాదకరం. అది తారాస్థాయికి చేరినప్పుడు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటుంది, చివరకు ప్రాణాలు తీయడానికి కూడ వెనుకాడదు.
అతి స్వార్దం చాలా కౄరమైంది. తనకు చెందినది వేరొకరితో పంచుకోలేని స్వార్ధం కొంత వరకు భరించొచ్చు. కాని ఎదుటివాడు నాకంటే ఓ మెట్టు ఎత్తులో ఉండకూడదు. నేనే ఉండాలి అనే స్వార్ధం మనిషిని దహించి వేస్తుంది. ఆ ఈర్ష్యగ్నిలో నీతి నియమాలు, బంధాలు అన్నీ ఆహుతైపోతాయి. గిరి లాంటి తెలివైన వాళ్ళు ఎదుటి వాడికి అందకుండా తమ పగ తీర్చుకుంటారు. కాని ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అదే విషయాన్ని గిరి ఇలా అనుకుంటాడు.”ఎవ్వరూ గుర్తు పట్టలేనంత బలంగా ముసుగేసుకున్నా వాడు మాత్రం నా ముసుగెనక అసలు స్వరూపాన్ని గుర్తించేవాడు. అది భరించలేక ప్రతిసారి గొడవపడేవాడు. నిజాయితీ అంటే అదేనేమో! అదే వాడ్ని జనానికి తప్పుటోడుగా కనిపించేట్లు చేసేది.”
కాని వాళ్ళు ఎంత మంచి మనుషులుగా నటించినా, తన ఆత్మసాక్షికి, వాళ్ళు కట్టుకున్న వాళ్ళకు ఎతువంటి వాళ్ళో తెలిసిపోతుంది అందుకే గిరి భారయ “‘ఆఁ, ఈన మాత్రం తక్కువా? కనిపించడు కాని…’ అంటుంది. ఇక మనిషిలోని కుళ్ళు, కుతంత్రం ఎదుటి వాళ్ళు పసిగట్టకా వాళ్ళ ముందు బతకడం చాలా దుర్భరంగా ఉంటుంది.
స్వార్ధం,పెరాశ,ద్వేషం,ఈర్ష్య లాంటి విషయల్ని రచయిత్రి కథలోని పాత్రలతో వ్యక్తపరిచిన విదానం చాలా బావుంది. మనుసు లోతుల్లోని భావాల్ని పట్టుకోవడంలో రచయిత్రి దిట్ట.
ఊహల ఊట 1 గురించి పవన్ కుమార్ రెడ్డి.సి గారి అభిప్రాయం:
06/01/2021 10:25 am
😊 ఆ చిన్న జేబులు, అందులోని కొన్ని చేగోడీలకే ఇన్ని కబుర్లయితే
ఇహ వాళ్ల నాన్నారికున్నట్లు పే…ద్ద జేబులున్న గౌను కుట్టిస్తే
వాటినిండా అమ్మ చేసిన నూనంటని చేగోడీలు నింపుకుంటే
అవయిపోయేదాకా ఇంకెన్ని కబుర్లో కదా
మొత్తానికి నాగమణి రాకముందే అన్నీ పలారం కానిచ్చేసిందనమాట😊😊
పాపం నాగమణి…😎
అడవి పుస్తకం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
05/13/2021 8:58 pm
డా. లైలా యెర్నేని గారు, నమస్కారములు.
‘అడవి పుస్తకం’ గురించి క్రిందపొందుపరిచిన సోమ భూపాల్ గారి వ్యాఖ్యానం దయచేసి చూడండోసారి.
ఫేస్బుక్లో జయతి లోహితాక్షన్ గారి పోస్ట్‌లు; వారు తీసిన అడవి, అడవి బిడ్డల అరుదైన ఫొటోలు చూడండి. దాసరి అమరేంద్ర గారు, కాకినాడ అక్కయ్య డా. వాడ్రేవు వీరలక్ష్మి, వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఇంకా ఎందరెందరికో మల్లే తను మీకూ మరింత దగ్గరిగా పరిచయమవుతారు. మీ అభిమానానానికి పాత్రులవుతారు.
అడవి మాట పక్కన పెట్టి జయతికి తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాల పట్ల ఉన్న ఉత్తమ అభిరుచిని చూడండి. మీరు కనెక్ట్ అవుతారు.
________________________________________
అనంత చీకట్లో ఒక్కటే పాక, దాని ముందు చలిమంట, ఆ మంట ముందు మేము ముగ్గురం
( జయతి, లోహితాక్షన్, వైటీ.)
ఎక్కడో పుస్తకం మధ్యలో వస్తుంది ఈ మాట.నేను మెల్లగా కూరుకుపోతూ ఉన్నాను ఆ భావనలో.యజ్ఞం కాక మరేమిటి అది.యజ్ఞమే.అన్వేషనా యజ్ఞం.కాసేపు పుస్తకం కనపడలేదు నాకు.చీకటి,ముందు మంట.. అనంతమైన ఆకాశం…చేతికందే పాలపుంత.ఆమె ఇది కవిత్వంగా రాయలేదు.ఆ గాఢమైన అడవిలో కవిత్వంలా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు.
అడవి నుండి అడవికి మొదలై అడవి పుస్తకమైపోయిన ఇద్దరు మనుషులు, ఒక కుక్క-వైటీ. పుస్తకం చదివాక మీతో పంచుకోకుండా ఉండలేని కొన్ని విషయాలు ఇక్కడ ఉంచుతున్నాను.
ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నందున పుస్తకం మా ఊరు చేరింది. చేతికందడం ఆలస్యమైంది. ఎదురుచుస్తూ ఉన్నాను. వీలుచేసుకుని నేనే వెళ్లి పుస్తకం తెచ్చుకుని ఇక నిన్న ఉదయం తెరిచాను. నేను ఏదీ ఉహించుకోలేదు ఈ పుస్తకం గురించి. ఎందుకంటే ఇది ఏ ప్రముఖ రచయితో రాసిన కథో, కవితో, ఏ నవలో సీరియలో కాదిది.
ఈ పుస్తకం నిండైన ఒక అన్వేషి యదార్థ జీవన పథ అనుభవాల మాల.మనుషుల ఇరుకుతనం మధ్య, వాడిపోయిన మానవత్వం మధ్య ఇమడలేని ఒక సున్నిత పసి హృదయం పాడిన తన హృదయాంతరాల తపన. సత్యం కోసం అర్రులుచాస్తూ కొండల్లోకి, చిక్కటి అడవుల్లోకి, నదుల్లోకి, అనేక పూల వనాల్లోకి నిశ్చలంగా నడుస్తూ వెళ్లిన ఒక సాధకురాలు చెప్పిన అత్యంత పురాతన మార్మిక రహస్యం ఈ పుస్తకం.
“ఎడారిని చూడటమంటే ప్రియతముని జాడ తెలియడం” అని తన హృదయాంతరాల్లోంచి నాకు ఆ యోగిని గంభీరమైన స్వరం వినపడగానే నా చుట్టూ. నాలో ఒక నిశ్చలత ఆవరించింది. మరుక్షణమే ఎదో అలజడి కూడా.
ఏవీ వద్దు అనుకుని వెళ్లిపోయారంట అడవిలోకి… అనుకుని కాదు. అనుకుంటూ ఉంటే వెళ్లలేం అనుకుని… ఇక అనుకోకుండా వెళ్లిపోయారు. లోకమంటే అసహ్యమూ కాదు. జీవితమంటే నిర్వేదం అసలు కానే కాదు.ఏదీ కాదు. ఏదీ కానప్పుడు మరెందుకు అక్కడున్నారు అంటే “ఇక్కడెందుకు ఉండకూడదు?” అని ప్రశ్నించే తత్వం.
మాలా ఇక్కడ మనుషుల మధ్య ఎందుకు లేరు అంటే “మీరు కూడా మాలాగా అడవిలో ఎందుకు ఉండలేరు?” అని అడిగినట్లు అనిపిస్తుంది నాకు.నిజమే…
కొందరు లోకానికి చెందరు.వాళ్ళను ఆశ అనే గురుత్వాకర్షణ పట్టి ఉంచలేదు. నాది అనే చక్రంలో ఎల్లకాలం తిరుగుతూ ఉండలేరు. ఉండనివ్వదు వారి హృదయం. అలాగే జయతి లోహితాక్షన్లు కూడా లోకానికి చెందరు.వీళ్ళనుగానీ… ఈ పుస్తకాన్నిగానీ “ఇదీ” అని నిక్కచ్చిగా చెప్పలేము. ఒక విషయానికి పరిమితం చెయ్యనూలేము.
వాళ్లు అనంతమైన సత్య దర్శనానికి వెళ్లిపోయారంతే.
జయతిగారి సత్య సౌందర్య దాహానికి సహచరుడు లోహితాక్షన్ గారి సహకారం చరిత్రలో చెరగని ప్రేమ ముద్రగా నిలిచిపోతుంది. తండ్రిమాటను కాదనక రాముడు అడవులకెళ్తే..వెంట సీతాదేవి..లక్ష్మణుడు నడిచినట్టు… సీతాదేవి అడవులకు వెళ్తానంటే వెంట నడచిన ఒక రాముడు, అలాగే వైటీ… ఇది రామాయణంలా ఉంది అనిపిస్తోంది.
“నాకు అడవికి వెళ్లిపోవాలనీ, అడవికే సొంతమైపోవాలనీ, అక్కడే ఆ కొండల్లో ఉండిపోవాలనీ ఉంది” అని జయతిగారు చెప్పినప్పుడు మరొకరిలా “ఏమిటీ పిచ్చి? ఎందుకు అడవి?” అని కేకలేయకుండా
“సరే. నీ ఇష్టం” అని ప్రేమగా అనేంత సముద్రమంత హృదయం లోహితాక్షన్ గారిది. అన్నింటా వెంట ఉండి… వెన్నుగా నిలుస్తూ ఉన్నారు వారు.ఇద్దరూ సాధకులే.సాధువులే.
పగలంతా ప్రకృతి మాత వారిపై కురిపించిన సౌందర్య రసాన్ని హృదయ పాత్ర నిండా నింపుకుని… నింపుకున్న పాత్రను దోసిట్లో ఉంచుకుని జాగ్రత్తగా సాయంత్రానికి కుటీరాన్ని చేరుకుంటారు.గాఢమైన చీకటి పడ్డాక సత్య సౌందర్య రస పాత్ర చేతబుచ్చుకుని త్రాగుతూ అనంతమైన ఆనందంలో మునకలేస్తారు… వారిని చుస్తూ వైటీ కూడా ఆనందంతో గంతులేస్తుంది.
రేపు ఏమి తినాలి? అన్న పట్టింపు లేదు, ఎక్కడికెళ్లాలన్న ప్రణాళికా లేదు, అడవి,కొండ,కుటీరం,వైటీ తో కలసి ముగ్గురి జీవనం. తదేకమైన జీవితం. రోజులతరబడి ఒకే సంగీతం. నదిగలగలలు, జలపాతపు హోరు, జివ్వుమని వీచే మహా వృక్షాల శబ్దం…కుండపోత వర్షపు ఊపిరాడనీయని మ్రోత ఎప్పుడూ తదేకమైన జీవితమే. సుదూరపు అడవులను, కొండలను, నదులను అనంతమైన ఏడారులనూ కలగంటూ తదేకమైన చూపు.
సూర్యోదయ, సూర్యాస్తమయాలు కురిసే మెత్తటి నారింజ రంగు నీరెండలలో నిత్యం తడిసిపోతూ ఉంటారు ఈ అన్వేషకులు. చీకటి పడ్డ పున్నమి రోజులలో కుటీరపు ఆరుబయట కూర్చుని నింగినుండి భూమిపైకి పారే చల్లని వెన్నెల్లో సేదతీరుతారు ఈ పుణ్య దంపతులు.
వేవేల అడవి పూల చెట్లు రంగురంగుల పక్షులు మీదకు వాలే సీతాకోకచిలుకలు భూమిపై ఉండే ఆనందంమంతా వారిదే.
వాళ్ళు అడవికి చెందినవారు.అడవి అపార దయామయి వారికి. అడవి అందాలను ఫోటోలు తీస్తూ… కొన్నిసార్లు ఫోటోతీయలేక ఆ సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోవడం. ఇదొక అద్భుత యదార్థ జీవిత యాత్ర.
అంతా ఆనందమే కాదుగా. ఆకలుంటుంది.భయముంటుంది. అడవంటే అడుగడుగునా ప్రమాదముంటుంది. క్రూర జంతువులు, విష నాగులు, క్రిమి కీటకాలు, ఎండలు… హోరు వానగాలులు… అన్నీ ఉంటాయి. మనం చలిస్తాం. ఇక చాలని చాలిస్తాం. కానీ వాళ్ళలా కాదు….
గీతలో యోగి గురించి శ్రీకృష్ణుడు
సర్వభూతస్తమాత్మానాం సర్వభూతానిచాత్మని
ఈక్షతేయోగయుక్తాత్మా సర్వత్రసమదర్శినః
అన్నట్టు వీరు అన్నింటినీ నిశ్చలంగా చూస్తూ ముందుకు నడచిపోయే, మన కాలంలో జీవిస్తూ ఉన్న అద్భుత సాధకులు. మరింత గాఢమైన అడవి కోసం వెతుకుతూ… చిక్కని ఆనంద పారవశ్యంలో నడుస్తూ అనంతమైన దారుల్లో వారి పయనం.
వీరి అనుభవాలూ, అనుభూతులు పుస్తక రూపంలో వచ్చాయిగనుక ఈ మాట చెబుతున్నాను. వీరి ఈ సాధనా పథం తెలుగు సాహిత్యములో కొందరిని… నిజమైన అన్వేషకులను… మరింత ముందుకు… మరింత లోతుకు… మరెంతో విశాల విస్తీర్ణం చేయగలరని నా చిన్న అభిప్రాయం.
ఇదెంతో అందమైనది కూడా. పుస్తకంలోంచి ఓ బిందువు అమృతానుభూతిని గుండెలోకి ఒంపుకున్నాను. మీరూ అడవి పుస్తకం చదివి హృదయ పాత్రను నింపుకోండి.
– సోమ భూపాల్ May 11, 2021
అస్తిత్వన్యాయం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
05/04/2021 11:24 am
Writer! You are much too much. I am totally enjoying your intelligence.
ప్రపంచం అంతా ఈ సరికే అర్థం ఐపోయింది. ఎవరేమిటికి ఎందుకు చేస్తున్నారో అంతా తెలుసు. ఐనా కథా రచన లో మాత్రమే భయభ్రాంతి చేసే విశ్వరూపం చూపించి, ఆ తర్వాత యశోదను మళ్లీ మాయలో పడేసి కృష్ణుడు చిన్న పిల్లడైపోయినట్టు, పాఠక లోకానికి, థాంక్యూ, థాంక్యూ అని చెప్పివెడుతూ మురిపిస్తున్నారు. మళ్లీ మేమంతా మా బొందన పడాలిగా! Is that the way you bring us out of your hypnosis?
Also I saw your photograph elsewhere. You are a pretty woman. Like intelligence, beauty is also one of your attributes. (The minuscule photo in eemaata is not good. A photo is an art form, unless shown and seen in proper size does not do much for the subject. I wish eemaata magazine, provides a bigger and better photograph.) Please do not hesitate, to attach a different photograph, with each of your writings, published here or elsewhere. It helps you grow, glow, and enjoy yourself. The publishers should eagerly show them. The viewers will be delighted.
Kudos on excellent writing! Have a charmed life!
-Lyla
అడవి పుస్తకం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
05/04/2021 10:26 am
Hope the editors clarify.
‘అడవి లోంచి అడవికి’, ‘అడవి పుస్తకం’ అనేవి రెండు పుస్తకాలా? రెండు అడవుల గురించి రచయిత రెండు పుస్తకాలు రాసారా? లేక అట్టలు, పుస్తకం పేరు, మార్పులతో రెండు ముద్రణలా? ఒకటి 2018, రెండోది 2021 లోనా? అసలింతకీ రాసింది జయతి లోహితాక్షన్? మరి ఆ పేరు ఎత్తేసి, దాసరి అమరేంద్ర రచనల జాబితాలో ఈ మేగజీన్లో ఎందుకు ప్రచురిస్తారు? అసలు ‘స్టార్’ బదులు, స్టేజ్ మీదకు ‘Stand in’ వచ్చి, కర్టిసీలు చేస్తున్నట్టు, ‘రివ్యూయర్’ తేపతేపకూ పాఠకులకు కృతజ్ఞతలు తెలపటం ఎందుకు? అసలు రచయిత అడివిలో ఉన్నందునా? అంతా గందరగోళం తప్పించి, సాహిత్య ప్రయోజనం ఏమిటి?
ఇతర పుస్తక రచయితలు కొన్నిసార్లు వారే, తమ పుస్తకం లోంచి excerpts ఈ పత్రికలో ప్రచురణకు ఇస్తున్నట్టున్నారు. సంతోషం. (అప్పుడు రచయితతో, గ్రంథం గురించిన సంభాషణకు అవకాశం ఉంది.) కాని వీటిని రచయితల రచనల పేజీలో- ఆసరికే ప్రచురించబడిన పుస్తకం పేరు చెప్పకుండా ‘వ్యాసాలుగా’ లిస్ట్ చెయ్యటం సరియేనా? ఈ ఫలానా పుస్తకంలో ఈ పేజీ నుండి, ఈ పేజీ వరకు అని ఇవ్వాలేమో.
There is a variety of material to read in the magazine. To read it in the right context, please facilitate by accurate identification of literary works, right at the outset. Every time.
Thanks.
-Lyla
[లైలాగారు: 1. అవి రెండు వేరే వేరే పుస్తకాలు. 2. ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తూనో, సమీక్షిస్తూనో రాసిన రచనలను ఆ పరిచయకర్త, లేదా సమీక్షకుల పేరుతోనే ప్రచురించుతారు కదా. అమరేంద్ర రాసిన పరిచయం కాబట్టి ఆయన పేరు మీదే ప్రచురించాము. 3. ఒక పుస్తకం అచ్చవుతున్న సందర్భంలో కాని, లేదూ మంచి పుస్తకం అని మేము భావించినదానిని కాని, మేమే పరిచయం చేయదలచుకున్నప్పుడు, ఆ పుస్తకపు ముందుమాట కాని, ఆ పుస్తకంలోనుంచి ఒక వ్యాసం కాని –ఆ పుస్తకం పట్ల పాఠకులకు ఆసక్తి కలిగించడం కోసం– రచయిత అనుమతితో, మేము అప్పుడప్పుడూ ప్రచురిస్తుంటాం. అలా ప్రచురించినప్పుడు, ఆవ్యాసంలో పుస్తకం వివరాలు పూర్తిగా ఇవ్వబడుతున్నాయి. 4. ఇక, రచయితలు పాఠకులకు కృతజ్ఞతలు తెలపడం వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడివుంది. రచయితలు ఇలా ‘తేపతేపకూ పాఠకులకు కృతజ్ఞతలు తెలపటం’లో మీవంటివారికున్న ఇబ్బందిని గమనిస్తూనే, వారిని అలా చేయద్దనే హక్కు కూడా మాకు లేదని తెలుపుకుంటున్నాం. – సం.]
నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్… గురించి కె. రాజశేఖరరాజు గారి అభిప్రాయం:
05/02/2021 10:22 pm
నిజంగానే మీ జ్ఞాపకాలు చంద్ర దర్శనాన్నే చూపించాయండి. చిత్రకారుడి ఆత్మను పట్టి చూపించిన విశిష్ట రచన మీది. వ్యక్తి జీవితమంటే తెలుసుకోవలసింది ఇంతటి బహుముఖ మూర్తిమత్వాన్నే కదా.. ఇంత పెద్ద కథనాన్ని చదివే ఓపిక కూడా ప్రస్తుత తరంలో చాలామందికి లేనట్లుంది. సాక్షిలో మీ వ్యాసం స్పేస్ సమస్య వల్ల చాలా పరిమితులతోనే వచ్చింది. కాని ఇక్కడ ఆయన విశ్వరూపాన్ని విపులంగా దర్శనం చేయించారు. జీవితం మంచీ చెడు లక్షణాల వైరుధ్య కలయికే అనేది మీ రచనలో అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. అది మీ నిజాయితీ.. అందుకు ధన్యవాదాలు, అభినందనలూ..
అ దృశ్యం గురించి M A Siddhiq గారి అభిప్రాయం:
04/17/2021 4:32 pm
మనిషి ప్రతి నిమిషం అంతరంగంతో వాదోపవాదాం చేస్తునే ఉంటాడు. చివరికి వ్యక్తి తనకున్న మేధో స్థాయి చేరాక ఇక అదే సత్యం అని నిర్ణయయించుకుంటాడు. కొందరు తామరకు మీది నీటి బిందువులా బతకాలనుకుంటారు. అటు నీటిలో కలవాలనుకోరు.ఇటు ఆకును అంటుకోవానుకోరు. కాని అక్కడే ఉండాలనుకుంటారు. సత్యా అటువంటిదే.
“నిజానికి ఆ తతంగం నాకు అంత ఇష్టం లేకుండా కూడా లేదు, అంత అందంగా తయారవ్వడం అదే మొదటిసారి జీవితంలో. నా అలంకరణ నాకు నచ్చింది. పెళ్లి ఒక తంతుగానే ఉంది. పెళ్ళీ, భర్త, పిల్లలు అదే జీవితం అంటే ఒప్పుకోదు.నాకు దేనిపైన అభ్యంతరం లేదు, అలాంటి చిన్న ఉత్సాహాల కోసం అతనితో జీవితాంతం ఉండడం కష్టం.” అంటుంది.
“ఏదీ వదిలేయాలని వదిలేయాలనుకోవట్లేదు. అన్నిటిని హత్తుకొని ఉంటాను. కానీ ఏదీ అంటుకోకుండా సమయానికి సాధారణంగా రాలిపోవడం ఎట్లా ఉంటుందో అది నా అనుభవంలోకి రావాలని ఉంది యోగీ” అని అంటుంది. గృహస్థ జీవితంలో ఉండి యోగీలా జీవించాలనుకుంటుంది.
రెండు విభిన్న దృక్పధాల సంవాదమే ఈ కథనం అనిపించిది. కథనంలో తార్కికత, మార్మికత అంత తొందరగా అంతు చిక్కదు.
మేనక గురించి desikachary గారి అభిప్రాయం:
04/13/2021 7:04 pm
ఛందోబద్ధకవిత్వమంటే సంపెంగను చూచిన తుమ్మెదలాగా పాఱిపోకుండా, ఓపికతో ఈ రచనను, బెవర్లీసిల్స్ యూట్యూబు ప్రదర్శనను చూచి పైవాక్యాలను వ్రాసిన లైలాగారికి నాకృతజ్ఞతలు. ఐతే, వారు నారచనను, పైయూట్యూబు ప్రదర్శనలోని సన్నివేశ పరంపరనూ నిశితంగా పోల్చుకోనట్లుగా తోస్తున్నది. అట్లా పోల్చుకొని ఉంటే వారే నాకు చెప్పేవారేమో నారచన దానికి మూలభూతమైన ఆపెరా లిబ్రెట్టోకంటె ఎక్కడెక్కడ భిన్నంగా ఉన్నదనే విషయం.
నాదృష్టి కథను పూర్తిగా మార్చాలని కాదు. దేశాలు వేరైనా, మానవప్రకృతి అంతటా ఒక్కటే అని నాభావం. అందుచేత మనోఁ కథ ఫ్రాన్సులో జరిగినట్లే భారతదేశంలోనూ జరుగవచ్చు. ఇట్లా జరుగగలిగినప్పుడు కథాశరీరాన్ని మార్చవలసిన అవసరం లేదు. ఐతే ఆకథాపరిధిలో దేశభేదాలనుబట్టి సన్నివేశపరికల్పనను దేశసంస్కృతికి అనుగుణంగా మార్చవలసి ఉంటుంది. ఇదే నేను వ్రాస్తున్న ఆపెరాలలో చేస్తున్న పునస్సృజన. ఈమార్పు నేను పాత్రలకు, ప్రదేశాలకు ఇచ్చే పేర్లదగ్గరినుండి ప్రారంభమౌతుంది. ఉదాహరణకు ఈ ఆపెరాలో పారిస్ పేరు భోగపురంగాను, ఏమియన్ విజయపురంగాను మార్చబడడమే కాక, బుద్ధపురము, రాజపురము, శాలిగ్రామము అనే మూడు క్రొత్త ఊర్లుగూడ ప్రవేశపెట్టబడినవి. పారిస్‌లో ఉండే St.Sulpice మొనాష్టరీ బుద్ధపురంలోని బుద్ధాశ్రమంగా మార్చబడింది. పారిస్ భోగాలకు, విలాసాలకు పెట్టింది పేరు. అందుచేత దీని పేరు భోగపురంగా మార్చబడ్డది. మేనక ఊరు శాలిగ్రామంగా పేర్కొనబడ్డది. సంస్కృతంలో ‘శాలి’ అంటే వరి అని అర్థం. ఆ ఊరిలో వరి ఎక్కువగా పండటంవల్ల ఆపేరు వచ్చిందని ఊహించవచ్చు. అట్లే వృద్ధుడయ్యును కాంతావ్యామోహమును మానని క్రూరుడైన Guillot పేరు శాకునికునిగను, అత్యంతధనవంతుడైన de Brétigny పేరు భౌరికునిగను మార్చబడినవి. సంస్కృతంలో శాకునికుడంటే వేటకాడని, భౌరికుడంటే బంగారునిధి కధికారి యని , స్థాయుకుడంటే గ్రామాధికారి అని అర్థాలు. (‘జీవాన్తకశ్శాకునికః, భౌరికః కనకాధ్యక్షః, స్థాయుకోఽధికృతో గ్రామే – అని అమరకోశము). అంతేకాక Guillot స్వభావం శూద్రకుని మృచ్ఛకటకంలోని శకారుని పోలియున్నది. అందుచేత పడుచుపిల్లల వేటకాడైన క్రూరస్వభావియగు Guillot ను శాకునికగా పేర్కొనడమే కాక, అతని పాత్రీకరణ శకారునికివలెనే చేయడం జరిగింది. అట్లే మహాధనవంతుడైన de Brétigny కి భౌరికనామధేయం సార్థకమైంది. వేశ్యలైన Poussette, Javotte, Javotte లకు రమణి,రంజని రాగిణి అనే పేర్లుంచడం వారి వేశ్యాస్వభావద్యోతకంగా ఉన్నది. Manon ను మేనక అనడం ఆమే విలాసలాలసతకు, సొమ్ములయందలి అభిలాషతకును తగినట్లుగాను, Manon అను శబ్దమునకు సన్నిహితంగాను ఉన్నది. అట్లే జూదరియైన Lescaut దేవనదత్తుడుగా పేర్కొనబడినాడు. ‘దేవనాః పాశకాశ్చ తే’ అని అమరకోశంలో చెప్పబడినట్లుగా దేవనములంటే పాచిలకలని అర్థం. అందుచే పాచికలాటకు దాసుడైన అతనిని దేవనదత్తు డనటం జరిగింది.
ఇట్లా వ్రాస్తూ పోతే ఇదొక మహాగ్రంథమౌతుంది. అందుచేత సంగ్రహంగా నేను చేసిన సన్నివేశములయందలి మార్పులను పేర్కొంటాను:
1. మొనాష్టరీని బుద్ధాశ్రమంగా మార్చడం. బుద్ధుని కాలంనుండి బుద్ధాశ్రమాలలో శ్రమణికల నియోగం జరిగింది. అందుచే మేనకను శ్రమణికాత్వము స్వీకరించుటకు పంపడం, తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరడం అనేవి భారతీయసంస్కృతికి తగినట్లుగా జరిగినవి.
2. ప్రథమాంకంలో విశ్రాంతిగృహంలో లభించే ఆహారనామాలు భారతదేశీయుల ఆహారనామాలుగా మార్చబడినవి
3. ద్వితీయాంకంలో ప్రథమ, ద్వితీయదృశ్యములు అమూలకములు. ఇవి కథాపుష్టికై పరికల్పింపబడినవి. తృతీయదృశ్యంలో అదే చిన్న రూములో కిటికీకి దగ్గర దేవనతరుణార్కులు కూర్చున్నారనుటకు బదులుగా, వారు ఆరూముకు ముందుండే అంగణంలో కూర్చున్నారని, అందుచేత భౌరికుడు మేనకకు తరుణార్కుని అపహరణవిషయం తరుణార్కునికి దెలియకుండా రహస్యంగా చెప్పడానికి అనుకూలంగా ఉండిందనే కల్పన చేయబడ్డది.
4. తృతీయాంకంలో ప్రథమదృశ్యం అమూలకం. ఇది కథాపరిపుష్టికై కల్పింపబడినది. ద్వితీయదృశ్యం, అందులో సౌందరనందమనే బుద్ధగాథాత్మకమైన అంతర్నాటకం పూర్తిగా మూలంలో లేని, భారతసంస్కృతికి అన్వయించే నూత్నకల్పనలు. మూలంలో des Grieux (తరుణార్కుడు) మొనాష్టరీలో చేరుటకు ప్రేరకం సహేతుకంగా నిరూపింపబడలేదు. కాని ఇచ్చట ఈ ద్వితీయతృతీయ దృశ్యములద్వారా తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరుటకు సిద్ధమగుట సహేతుకంగా కల్పింపబడింది. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.
5. మూలంలోని చతుర్థాంకంలో పారిస్‌లో ఒక కార్నివాల్ జరిగినట్లు, అక్కడ ఒక బాలే డాన్సుగూడ ప్రదర్శింపబడినట్లు, ఆసందర్భంలోనే తరుణార్కుడు మొనాష్టరీలో చేరినవిషయం అతని తండ్రినుండి మేనక నేరుగా విన్నట్లును కథ నడిచింది. కాని ఇటువంటి కార్నివాల్, బాలే భారతసంస్కృతికిపనికిరావు. అందుచే వసంతోత్సవసందర్భంలో భోగపురసమీపంలోని ఒక తోటలో మేనకాదులు విలాసంగా పాల్గొన్నట్లును, ఆసందర్భంలో తరుణార్కుడు బుద్ధాశ్రమంలో చేరిన విషయం స్థాయుకుడు భౌరికునికి చెప్పుచుండగా చెట్లచాటునుండి మేనక పరోక్షంగా విన్నట్లును కల్పించినాను. ఆవనవిహారానికి ముందుగా ప్రథమదృశ్యంలో మేనక సేవికలచేత అలంకరింపబడుట అనే అమూలకమైన దృశ్యాన్ని కల్పించి ఆమె భౌరికుని పోషణలో అనుభవించిన వైభవము నిరూపించినాను. అట్లే తృతీయదృశ్యంలో ఆవైభవములపట్ల అమె అనాసక్తి, పునః తరుణార్కుని యందలి అభిలాష చక్కగా నిరూపింపబడినవి. మూలంలో మొనాష్టరీలోనికి మేనకప్రవేశించి అతనిని తనతో పునస్సంగమమునకు సుముఖుని చేసికొన్నట్లున్నది. కాని అది అసంగతంగా ఉన్నదని, ఈఅంకంలోని చతుర్థదృశ్యంలో బుద్ధాశ్రమోద్యానంలో తరుణార్కుడు ధ్యాననిమగ్నుడై ఉండగా మేనక అతనిని సమీపించి, తనకు పునర్వశవర్తుని చేసికొన్నట్లు కల్పించినాను. ఈవిధంగా ఈ అంకమంతా అమూలకమైన నూతనకల్పనయే.
6. పంచమాంకంలోని ప్రథమదృశ్యంలో మేనకాదేవనులు తరుణార్కుని జూదమునకు ప్రేరేచినసన్నివేశం అమూలకం.
ఈవిధంగా ఎన్నో మార్పులు, చేర్పులు చేసి, కేవలం భారతసంస్కృతికి సంబంధితమైన స్వతంత్రరచనగా గోచరించే విధంగా నేనిది వ్రాసినానని అనుకొంటున్నాను. దీనిని సమగ్రంగా పరిశీలించి, ఇందులో నేనెంతవఱకు కృతకృత్యుడ నైనానో మీవంటివారు తేల్చవలసియుంటుందని విన్నవించుకొనుచున్నాను. అందుచేత లైలాగారూ, ఈవిషయంలో మీరు చేయవలసిన HomeWork చాలా ఉన్నది.
నాలుగో వరం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
04/12/2021 8:36 pm
“పాపం సమాచరతి వీతఘృణో జఘన్యః ప్రాప్యాపదం సఘృణ ఏవ తు మధ్య బుద్ధిః
ప్రాణాత్యయేపి తు న సాధుజనః స్వవృత్తిం వేలాం సముద్ర ఇవ లంఘయితుం సమర్ధః”
I have doubts about the accuracy of Telugu translation given here, in the story. I want a second opinion.
I just don’t get Buddhism. I guess, it just goes against my grain!
If it is Mythology, there got to be Magic
If it is Philosophy, there got to be Logic
Is Buddhism a religion?
It is neither heroic, nor stoic. Not an epic,
What exactly is its legion?
ఈ కథలన్నీ ఎన్ని చదివినా, భవరోగమేంటో, దాని వినాశనం బుద్ధుడెలా చేస్తాడో తెలియటం లేదు. రోగానికి చావుకి జడిసి, సన్యాసిగా మారి గుండు చేయించుకుంటే రోగం రాదా, చావు రాదా? మరి దేని నుండి ఆయన తప్పించుకున్నాడు. ఇతరులను ఎలా విముక్తులను చేశాడు ఇన్ని వందల యేళ్లుగా?
రాజకుమారుడుగా పుట్టి, భోగాలన్నీ వదిలేసాడని అదో గొప్ప. ఇదుగో -ఇప్పుడు ప్రిన్స్ హేరీ తలతిక్క కబుర్లు లాగానే. శుభ్రంగా Duke and Duchess of Sussex – Windsor లోనో, Montecito లోనో వాళ్లు వైభోగంగా ఉంటూ, -ఇతరులను ఉద్ధరిస్తున్నట్టు పోజ్! Who falls for those stunts!
లాజికల్ గా చెప్పిన ప్రతి రచన, ప్రసంగం లో కొన్ని మెప్పించేవి, పాటించదగినవి ఉంటవి. ఎప్పటికీ పాటించేవంటూ సత్యాలు ఏవీ లేవు. ఉండగూడదు. పుడుతూ, చస్తూ, కొత్త జనాలు, కొత్త జాతి కాంబినేషన్లు, కొత్త సైన్స్ ప్రయోగాలు వస్తున్నప్పుడు, జన్మంతా అందరికీ ఒకే గుడిలో, ఒకే మొనాస్టరీలో ఒకే రకమైన సత్సంగం ఎందుకు? అందునా వరసా వాయీ ఆలోచన క్రమం లేని ఉపదేశాలు. భగవానులు గాని, ఆనందులు కాని చిరునవ్వులు నవ్వినంత మాత్రాన, ముఖం ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన, ఒంటరిగా ఊరికే అడవుల్లో పడో, ఆ చివరినించి ఈ చివరికి నడిచో, ఆ ఇంటికో ఈ ఇంటికో, వెళ్లి వస్తేనో, భవరోగాలు నశిస్తాయా?
ఈ మధ్యే వేమూరి, గ్రీక్ మిథాలజీ కొంత, తెలుగులో రాసిస్తే, ‘ఈమాట’ మేగజీన్, పాఠకులకు 11 ప్రకరణాలుగా చదవమని ఇచ్చినప్పుడు, అందులో ఒకచోట అదాటున ఆయన భారతంలో నుండి ఈ పద్యం ఇచ్చారు.
“ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము దనమనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పదములకెల్లన్ (భారతం, శాంతి, 5-220)”
అది చదివినప్పుడు బాగుంది నీతి పద్యం అనుకున్నాను. ఐనా, కిరస్తానీ ప్రభావం నాపైన అంతకంతా ఉన్నందున, నాకు ఈ ప్రవచనం గుర్తొచ్చింది.
“Do unto others as you would have them do unto you” Luke 6:31
ఈ రెండూ చెప్పేదొకటే కదా అంటే, పైపైకి అలానే అనిపిస్తుంది. కాని కానే కాదు. హిందూ ఇతిహాసం లోని పద్యం, – ఇతరులు ఏవి చేస్తే, నీకు మనసులో ఇష్టంకావో, అవి నువ్వు ఇతరుల పట్ల చెయ్యొద్దు. అది ధర్మం అంటున్నది.
బైబిల్ – ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకిష్టమో, నువ్వూ అలాగే వారికి ప్రీతి కలిగించేవి చెయ్యి- అంటున్నది.
ఈ రెంటికీ చాలా తేడా ఉంది. భారతం లోది – ‘అలా చెయ్యకు’ అంటున్నది. అప్రియమైనని చెయ్యకు! అంటుంది. ABOVE ALL DO NO HARM అనే వైద్యుల అల్టిమేట్ గైడ్ లైన్ కూడా కొంత ఇలాటిదే.
కాని, స్క్రిప్చర్స్ చెప్పింది నాకెక్కువ నచ్చింది – ఇతరులనుండి నువ్వేం ఆశిస్తావో, వాళ్లేం చేస్తే నీకు ఇష్టం కలుగుతుందో అలాటి పనులు ఇతరుల పట్ల చెయ్యమంటున్నది. మనిషిని, మునగదీసుకుని, ముసుకేసుకుని, ఎవరికీ హాని చెయ్యను అని సంఘం నుండి, ప్రపంచం నుండి విత్ డ్రా అవకుండా, ఎవరికైనా సంతోషం కలిగించేవి చెయ్యమంటున్నది. Neither is fool proof and complete, but they both are good.
ఈ జాతక కథలు ఏమి చెపుతున్నవి! నాకు తెలియదు.
ఇంతకు ముందొకసారి, శర్మ దంతుర్తి రాసిన “తుఫాను” కథ నాకు బాగా నచ్చిందని రాసాను. The foremost reason I liked it for is;
In a storm, a young girl, takes another girl who can’t go home, into her house. Protects her. Feeds her. Keeps her safe.
The second young girl who is helped, afterwards, just didn’t send her a Thank you note. Instead, she reciprocated. She helped the first girl and family in a big way. She knew she can do it. That she should do it. And she did it.
In this story, she is emphasizing the good side of human nature, and taking a positive action. She is proving the possibility, no, no, – the certainty of one person helping the other.
Negative people may think – It is just a feel good story. These things don’t happen in real life. Wrong! They happen.
ఆలోచిస్తే, ఇతరుల సహాయం లేకుండా మనలో ఒక్కరమైనా పైకి వచ్చామా! రోజువారీ లభించే సహాయాలెన్నో. ఒక్కోసారి, ఇక నా పని ఆఖరు. ఈ విపత్తు లోంచి బైట పడలేము అనుకున్నప్పుడు, అకస్మాత్తుగా సహాయం లభిస్తుంది. అది ఆలోచనాపరులైన పాజిటివ్ పీపుల్ నుండి వస్తుంది.
మానవ స్వభావంలోని లేకితనాన్ని, మోసకారితనం, క్రూరత్వాల గురించి, పన్నెండు సార్లు చెపితే, ఏమిటి ఘనత ఎవరైనా కథలో, కవితలో. మనలోకి మనం ముడుచుకుపోవటం, ఇతరుల నుండి విత్డ్రాయల్, విరక్తిలు వస్తాయి. ఎవరికి కావాలవి? నాకు జాయస్ గా, జాలీగా ఉండి, ఉదారులైన వాళ్లకు మల్లేనే, ఉల్లసిల్లి ఉండాలని ఉంటుంది. జెనరాసిటీ గురించి ఎవరైనా చెప్పినప్పుడు, చూపినప్పుడు నా కళ్లు వర్షిస్తాయి.
బౌద్థం నాకెందుకు! బౌధ్థం ‘సువర్ణ శ్రీ’ కి అక్కర్లేదు. నాకూ అక్కర్లేదు.
మృత్యువు సత్యం, మృత్యువు తథ్యం. ఐనా నాకు లూయీస్ పాశ్చర్, బుద్థుడి కంటే ఇష్టం. పాశ్చర్ జంతువుల, మనుషుల రోగం, పెయిన్, అకాల మరణం తప్పించిన వాడు. సైంటిఫిక్ స్టడీతో, పరిశోధన తర్వాత పరిశోధనతో మానవులకు వందల ఏళ్లు పనికొచ్చే కంక్లూజన్స్ కి వచ్చే, లూయీస్ పాశ్చర్ కి, మృత్యువు, రోగము, భవము, అని ఏవో మాటలు పేర్చే కన్ఫ్యూజింగ్ జాతక కథలకీ పోలిక ఏముంది!
మృత్యువు మీద రాయలేనిది ఎవరు! చనిపోయాక రాయలేం కాబట్టి ముందే రాసుక్కూచ్చోటం. నేనూ రాసాను, అప్పుడప్పుడూ!
వాటిలో ఈ కిందిదొకటి!
గతములో ప్రతి రాత్రి, అతి కాంతి దీపమ్ములన్ని ఆర్పి
శయనమందిరాన మినుకు దీపాలనే మిగుల నిచ్చి
పందిరిమంచపు చుట్టు తెల్లమల్లు తెరలన్ని కదియలాగి
పట్టుపరుపుల మీద సుఖస్వప్నాలలో
పాతప్రియులెందరి తోనొ నే పవళించిన రీతి;
ఆఖరి నిశ్వాసము తరి మృత్యుదేవ!
నీపైనను విశ్వాసముంచి, శాశ్వత స్వప్నాలలో
నీతోను నే సుఖముగ పన్వళింతు!
-Lyla
PS: I read a little while ago, that Sarma Danturti won a prize in Vanguri Foundation’s – Ugadi short story competition. Congratulations to him, other winners and contestants.
Happy Ugadi to All! Enjoy!
మార్చ్ 2021 గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
03/12/2021 10:08 am
ఈ సారి చాలా ఆలస్యంగా ఈమాట చదివాను. అది క్షమించరాని నేరం. అయితే సాహిత్యపరంగా నేను చేసిన క్షమించరాని నేరాలతో పోలిస్తే ఇది చాలా చిన్ననేరం.
ఈ నెల మీరు రాసిన సంపాదకీయం నిజంగా ఒక మణిపూస.
నేనూ సంపాదకీయాలు రాశాను; అవి వ్యాసాల్లా ఉన్నాయని తిట్టిన వాళ్ళు లేకపోలేదు. నేను రాసిన వ్యాసాలని చదివి, ఇవి ’సంపాదకీయాలు’గా రాసి ఉంటే బాగుండును అన్నవాళ్ళూ లేకపోలేదు. ఈమాటతో నాకున్న ప్రత్యేక సంబంధం ఈ స్వోత్కర్షకి కారణం. క్షమార్హుణ్ణి.
మన తెలుగు సాహిత్యరంగంలో ఉన్న ’కుళ్ళు’ని మీరు అతి చాకచక్యంగా బయటికి తెచ్చారు. రచయితనీ, రచననీ వేరుచేసి చూడటం, చదవటం, విమర్శించడం, మనకి ఇంకా అబ్బలేదు. అది ఎప్పటికైనా సాధ్యమా అని నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటాను.
అచ్చులో వచ్చే పత్రికలలో ‘విమర్శల’నీ, ముఖపుస్తకంలో ఎదురయ్యే ‘మెప్పు’లనీ, వ్యాఖ్యానాలనీ వచ్చిన కొద్దిక్షణాల తరువాత పూర్తిగా మరిచిపోవచ్చు. ఇవేవీ కలకాలం నిలవవని అందరికీ తెలిసిన విషయమే. అయినా మన ప్రస్తుత సాహితీ సంస్కృతి ఈ రెంటితో పెనవేసుకొని పోవటం ఆశ్చర్యకరమో, గర్హనీయమో నాకు తెలియదు.
‘విప్లవాత్మక సాహిత్య ప్రతిపాదనలతో ఏకీభవించగలమా లేదా అన్నది సమస్య కాదు, కాని వాటిని విస్తృతంగా అధ్యయనం చేసి విశ్లేషించవలసిన అవసరాన్ని తెలుగు సాహిత్యలోకం ప్రయత్నపూర్వకంగానే విస్మరించడం సాహిత్యనేరం,’ అని మీరు సంపాదకీయంలో రాసినప్పుడు, అమ్మయ్య! కుండబద్దలుగొట్టి నిజం చెప్పారు, ఇప్పటికన్నా పాత్రికేయులు (అచ్చేసే వాళ్ళు, అంతర్జాలం వాళ్ళూ), సాహితీవేత్తలూ, చవకబారు రాజకీయాలకి స్వస్తి చెప్పి, కళ్ళు తెరుస్తారని ఆశించడం నేరం కాదనుకుంటాను.
విధేయుడు
వేలూరి వేంకటేశ్వర రావు.
మూఢనమ్మకాలు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
02/23/2021 1:09 pm
పొరపాటు వ్యాసం. బహుశః ఏదో పరాయి వ్యాసానికి అనువాదం కాబట్టి ఆటోమేటిగ్గా మంచివ్యాసం అని సంపాదకుల భావన కావచ్చును.
ప్రస్తుత విజ్ఞానశాస్త్రాలు కేవలం మానవులకు బుధ్ధికీ అనుభవానికీ అందగల విషయాలను గురించి మాత్రం సాధికారంగా మాటలాడగలదు. మతవిశ్వాసాల వంటివి ఈ శాస్త్రాలకు వెలుపలి విషయాలను గురించినవి కాబట్టి కేవలం హేతువాదం చేసి తప్పెంచటం తొందరపాటు అవుతుంది తరచుగా.
రేడియో టెలివిజన్ అందుబాటులో లేనికాలంలో ఎవరన్నా దూరంగా ఉన్న ధ్వని దృశ్యాలను దూరంగా ఉన్న వారు గ్రహించటం అన్నది అశాస్త్రీయభావన అనే అనేవారు కదా.
ఈసైన్సు మొన్నటిదాకా ప్లూటోని తొమ్మిదో గ్రహం అన్నారు ఈమధ్యనే కాదన్నారు.మళ్ళీ మరేదో భూమికంటే పెద్దదే ఉందేమో అంటున్నారు. ఇంకా మనం తెలుసుకోవటంలోనే ఉన్నాం కదా.
క్వాంటమ్ మెకానిక్స్ పుణ్యమా అని చాలా మౌలికభావనల పునాదులే కదలుతున్నాయి.
అన్ని నమ్మకాలూ మూఢనమ్మకాలు కానక్కరలేదు. కొన్ని కావచ్చు కొన్ని కాకపోవచ్చు. అన్నీ సైన్సుతక్కిట్లో వేయవద్దు. నమ్మకాల మూలాలపై శోధన మంచిదే కాని ముందే మూఢం అని ముద్రవేసి చేసేది హేళనో నిందో అవుతుంది కాని పరిశోధనా కాదు పరిశీలనా కాదు. అలాంటి వ్యాసాలు కాలక్షేపానికే తప్ప నిరుపయోగం.
అ సత్యం గురించి భాస్కర్ కె గారి అభిప్రాయం:
02/06/2021 7:07 am
చదవగానే అనేక సందేహాలు వచ్చాయి. ఆలోచించేకొద్ది కొన్ని కొత్తదారులు తెరుచుకున్నాయి. రెగ్యులర్ పాట్రన్ కథలకు అలవాటుపడినందువలనేమో ఇలాంటి స్పేస్ ఉండే కథలు పాఠకుడ్ని కొంత కష్టపెడతాయనుకుంటా. ఈ కథ ఇప్పటివరకు మీరు రాస్తూ వస్తున్న సరళికి కొంత భిన్నంగా కనిపించింది. ముందుగా ఆమెకు డబ్బులు ఎందుకు,ఏం చేస్తుందనే ఆలోచన, కాసేపటేకే నవ్వు. మనం కూడా వెంకూ దగ్గరే ఆగిపోతున్నామని. నిజానికి ఈ కథ డబ్బుకి సంబంధించింది కాదు అని స్పష్టంగా తెలుస్తున్నా ఆలోచన అక్కడే ఆగిపోవడం ఆశ్చర్యమనిపించింది. నిజానికి ఆమె మానసిక స్థితికి ఆ డబ్బు కారులో వదిలేసైనా దిగిపోగలదేమో. మీవి రీడర్ ప్రెండ్లీ కథలండి. ఆలోచించుకోవడానికి, ఊహించుకోవడానికి వాళ్ల స్థాయిని బట్టి అనేక అవకాశాలను ఇస్తూ వస్తారు. పాతకాంక్ష అనేది బుర్రలో ఓ పెద్ద కథనే సృష్టించగల అవకాశం ఉన్న పదం. ఒక్కోసారి ఆ ఊహలోనే స్టక్ అయిపోతాం కూడా. మీ కథలు కొన్ని సార్లు ఓ ఫజిల్లా అనిపిస్తాయి. కాని దాదాపు ప్రతి చోట హింట్ ఇస్తూనే ఉంటారు. ఆమె చుట్టూ ఉన్న అనేక విశ్వాసాలను, భయాలను దాటే ప్రయత్నంలో వచ్చే గిల్ట్ ను ఓవర్ కమ్ చేసేందుకు లేదా అసత్యంతో ఆమె ప్రయోగాన్నో శోధననో సమర్దించుకునే ప్రయత్నంలోనే బహుశా ఆమె గాందీ సహాయాన్ని బలంగా తీసుకుందేమో అనిపించింది. అనేక ఫ్లాష్ బాక్ లేయర్స్ లోంచి వచ్చిన ఒక బలమైన ఎమోషనల్ స్పాంటేనియస్ డెసిషన్ పై చివరివరకు నిలబడటమే పార్వతమ్మ తనదైన సత్యాసత్యాలతో చేసిన స్నేహశోధనేమో ఈ కథ. గోడమీద పిల్లబుద్ధుడు ఫోటో అనేదే కొంచెం రియాలిటీకీ దూరం జరిగిందనిపించింది. మనదేశంలో పిల్లబుద్ధుడు ఫోటోలు దాదాపు ఎవరి ఇళ్లలో కనబడటం నేను చూడలేదు. అక్కడ బుద్ధుడు వాడి, చివరలో పిల్లబుద్ధుడు అంటే సరిపోయేదేమో. మొత్తంమ్మీద ఒక సింపుల్ ప్లాట్ తో వైవిధ్యమైన మంచి కథ. అభినందనలు సుధగారు.
అ దృశ్యం గురించి M Vamsi Krishna గారి అభిప్రాయం:
02/01/2021 12:32 am
వైరాగ్యం ఎవరికి సత్య కా, యోగికా… తనదికాని గతాన్ని అంటిపట్టి లాగేదెవరు. ముగ్గురిలో సత్యం తెలుసుకున్నది రాయి విసిరినవారు, తెలుకునేందుకు ప్రయత్నించేది సత్య, తెలుసుకోవలసింది యోగి… అనేనా మీ ఉద్దేశ్యం. .. బాగుంది.
A Solemn Vedic Wedding గురించి desikachary గారి అభిప్రాయం:
01/17/2021 11:41 pm
You also need to add: ‘శ ష స హ’ అనే వాక్యం వర్తించదు సంస్కృతానికి. అందుచేతనే సంస్కృతానుస్వార సంధిసూత్రంలో వీటిని బహిష్కరించ లేదు. పదమధ్యంలో ‘శ స,హ’ లు నాంత, మాంతపూర్వ వర్ణాలకు పరమైనప్పుడు ఏర్పడిన సంస్కృతపదాలకు దిక్సూచిగా కొన్ని ఉదాహరణాలు:
– ధాతువు: రమ్ క్రీడాయామ్; ఈమకారాంతధాతువునకు సీయ, సీవహి, సీమహి అను ఉత్తమపురుష ఆశీర్లిఙ్ ప్రత్యయాలు పరమైనపుడు ‘రమ్’లోని మకారం అనుస్వారంగా మారి, రంసీయ, రంసీవహి, రంసీమహి అనే క్రియారూపాలు ఏర్పడుతాయి.
– ధాతువు: మన్ జ్ఞానే; ఈ నకారాంతధాతువునకు పై ప్రత్యయాలే పరమైనప్పుడు మంసీయ, మంసీవహి, మంసీమహి అనే రూపాలు ఏర్పడుతాయి. సంహననం, సంహూతిః, సింహః, సంశయః, సంశప్తకః ఇత్యాది నామవాచకములు ‘సమ్’లోని మకారమునకు ‘హ’, ‘శ’ లు పరమైనప్పుడు వచ్చే అనుస్వారానికి ఉదాహరణాలు.
ఇది సంస్కృతవ్యాకరణంలోని పరసవర్ణసంధిసూత్రంలో వివరింపబడింది. దానిని చూడగలరు.
మీరు వేలూరివారి కామెంటులోని ‘వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.’ అనే వాక్యాన్ని చదివినట్లు లేదు. అది చదివిన ఈసందేహమున కవకాశముండదు.
A Solemn Vedic Wedding గురించి Ramarao Kanneganti గారి అభిప్రాయం:
01/16/2021 6:09 pm
I am wondering if the grammar rules you mentioned (as told by Desikachary are correct. For instance: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది — not complete. You also need to add: శ ష స హ.
Strictly speaking, మ+క or మ+ట కూడా అనుస్వారం ఇవ్వదు, భాషాశాస్త్ర పరంగా. అయితే, మనం వాటిని అనుస్వారంగా భావిస్తాం, ఎందుకంటే There are no minimal pairs in Telugu (I could be wrong, at least they are not common enough). When you transcribe other languages, you will notice that. For instance, empty — here m+p sound does not yield అనుస్వారం.
Rule of thumb is this: క ఖ గ ఘ form అనుస్వారం with ఞ. Similarly all others. Usually the vowels in this class are: unvoiced unaspirated; unvoiced aspirated; voiced unaspirated; and voiced aspirated. All of them form అనుస్వారం with the last consonant.
None form అనుస్వారం with య ర ళ వ శ ష స.
Next, let us look at the first rule: పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును. After the word ended, how can హల్లు పరమగును? బహుశా ఇది వేరేవిధంగా చెప్పాలనుకుంటున్నాను. Or, I misunderstood?
As always, Suresh Kolichala may offer more accurate assessment of it from linguistics perspective.
Yours in phonemes,
Ramarao Kanneganti
A Solemn Vedic Wedding గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
01/11/2021 2:56 pm
నేను రాసిన Vedic Wedding పై శ్రీ కృష్ణదేశికాచారిగారు పెట్టిన మొట్టమొదటి కామెంటుకి నేను సంజాయిషీ ఇచ్చాను. ఆతరువాత ఆయన, నేను రాసిన మంత్రాలలో, శ్లోకాలలో దొర్లిన తప్పులు క్రోడికరిస్తూ శ్రీ కొలిచాల సురేశ్‌కి టపా పంపించారు. శ్రీ సురేశ్ ఆ టపా ఉన్నదున్నట్టుగా, యథాతథంగా నాకు పంపారు. అందుకు కృతజ్ఞుణ్ణి. ఆ టపా చూడగానే, మొట్టమొదట నా గుండె ఆగినంత పని అయ్యింది. నా వ్యాసంలో “తప్పులు” ఎర్ర రంగులో ఉండబట్టి నాకు లెక్కపెట్టడం తేలికయ్యింది. మొత్తం మీద డెబ్బది పైచిలుకు “తప్పులు” లెక్కించాను. నిజం చెప్పద్దూ! కించిత్ భయం కూడా వేసింది. ఈ రొంపిలోకి నేనెందుకు దిగానురా అనిపించింది. (అయినా, నాలో రాక్షసాంశ మస్తుగా వుంది కాబట్టి తేరుకొని సరిపెట్టుకున్నాను!)
కొంచెం జాగ్రత్తగా చూసిన తరువాత, ఆ తప్పులు, కేవలం మకార అనుస్వరాలకు సంబంధించినవి, అవి రెండు వ్యాకరణ సూత్రాలకు పరిమితమైనవి, అని తెలిసి కుదుటపడ్డాను. నేను శ్రీ దేశికాచారిగారితో ఈ విషయంపై సుమారు రెండు గంటలు మాట్లాడాను. ఆయన ఎంతో ఓపికగా నాకు సమాధానాలు ఇచ్చారు. అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
ఆ రెండు వ్యాకరణ సూత్రాలూ కింద ఇస్తున్నాను. (ఇవి శ్రీ దేశికాచారిగారి టపానుంచి కాపీ చేస్తున్నాను.)
1. పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును.
2. అపదాంతములైన నకార, మకారములకు ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ తప్ప ఇతరహల్లులు పరమైనపుడు అనుస్వారము (సున్నా) వచ్చును.
మొదటి సూత్రం: ఒక మాట చివర మకారమునకు హల్లు పరమైతే, ఆ మకారము సున్నా గారాయాలి. వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.
రెండవ సూత్రం: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది.
ఉదాహరణకి, నేను రాసిన ఉపనిషత్తు మంత్రం చూడండి. అందులో తమీశ్వరాణామ్ అని నేను రాసిన (మొదటి ప్రార్థనలో) ణామ్ వ్యాకరణం ప్రకారం తప్పు. దానిని ణాం అని రాయాలి. అదే మంత్రంలో, రెండవలైనులో, పరమం చ దైవతమ్ అని ఉన్నది. ఇది వాక్యాంతం కాబట్టి, ఇక్కడ మకారము సున్నా కాదు.
అయితే ఒక్క విషయం. ఈ మంత్రం వల్లించేటప్పుడు, ఈ మకార, అనుస్వరాలలో తేడాలు తెలుస్తాయా, కనిపిస్తాయా అని సహృదయులైన నవీన పాఠకులు ప్రశ్నించవచ్చు. అట్లా ప్రశ్నించడం సమంజసమో కాదో నాకు తెలియదు. నామటుకు నాకు, వ్యాకరణంతప్పయినా, కరణం తప్పయినా తప్పు తప్పే! period. ఈమాట సంపాదకులు నాకు preview పంపినప్పుడు, రోమను స్క్రిప్ట్ చూసి అంతా బాగానే వుంది; అడక్కండానే రోమను స్క్రిప్ట్ లోకి కూడా మార్చారని గొప్పగా సంతోషించాను కాని, ఒళ్ళు దగ్గిరపెట్టుకొని నేను పంపిన ప్రతితో పోల్చి చూడలేదు. బద్ధకం. అది నా తప్పు. ఈ వ్యాకరణం తప్పులు ఎలా దొర్లాయి అని తర్జన భర్జన చేశాం. ఇవి బహుశా, రోమను స్క్రిప్ట్ నుంచి మళ్ళీ తెలుగులోకి రాయటంవలన వచ్చి వుండవచ్చునేమోనని సర్దుకున్నాను.
పోతే, శ్రీ దేశికాచారిగారు కొన్ని అచ్చుతప్పులు కూడా సవరించిన ప్రతి నాకు పంపించారు. దానిని సురేశ్ గారికి, మాధవ్ గారికీ పంపిస్తున్నాను. దయచేసి, వ్యాకరణ దోషాల సవరణ తోపాటు, అచ్చు తప్పులుకూడా సరి చేయమని వారిని కోరుతున్నాను.
Begin Side Bar:
I have to tell a story in regard to మ్ and సున్న. I have written about this in 1997 (Telusaa), 2006 (Racchabanda), and in 2017 in the Facebook.
భవభూతి రాసిన ఉత్తరరామచరిత నాటకంలోని ఈ కింది శ్లోకం సంప్రదాయ సంస్కృత సాహిత్యంలో అతి చక్కని ప్రేమ కవిత అని అటు తూర్పున, ఇటుపడమరనా సాహితీ వేత్తలందరూ చెప్పుతారు.
కిమపి కిమపి మందం మందమాసక్తియోగా-
దవిరలితకపోలం జల్పతోరక్రమేణా |
అశిథిల పరిరంభ వ్యాప్రతైకైకదోషనో—
రవిదితగతయామా రాతిర్ ఏవ వ్యరంసీత్ | I.27
భవభూతి (బహుశా ఎనిమిదవ శతాబ్దం) తన ఉత్తర రామ చరిత కావ్యాన్ని కాళిదాసుకి (బహుశా నాలుగవ శతాబ్దం) ఒక దూత ద్వారా వినిపించాడట! (ఇది చాటు కథ!)ఆ సమయంలో కాళిదాసు చదరంగం ఆడుతున్నాడట. ఆ దూత భవభూతి దగ్గిరకి తిరిగి రాగానే భవభూతి, ‘కాళిదాసు ఏమన్నాడు?’ అని ఆతృతగా అడిగాడట. ‘ఏమీ అనలేదు,’ అని దూత సమాధానం. ‘మొత్తం కావ్యం అంతా విని ఏమీ అనలేదా?’ అని భవభూతి రెట్టించి మరీ అడిగాడట.
దానికి దూత సమాధానం: ‘కాళిదాసుగారు చదరంగం ఆడుతున్నారు. ఆ చదరంగం ఆట మధ్యలో ఒక పరిచారిక కాళిదాసుకి తమలపాకులు, వక్క, సున్నం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ తాంబూలం వేసికొని, హుఁ! సున్నం ఎక్కువయ్యింది! అన్నాడు, అంతే!’
భవభూతి ఈ పై శ్లోకంలో ఆఖరి పాదంలో ‘ ఏవం వ్యరంసీత్’ అని రాసి ఉండాలి. వెంటనే ఏవం లో సున్న (nasal) తీసిపారేసి ‘ఏవ వ్యరంసీత్’ అని మార్చాడట.
తమాషా ఏమిటంటే, తెలుగులో సున్న, సంస్కృతంలో మకారప్పొల్లు. ఇక్కడ కాళిదాసుగారిని, భవభూతిగారినీ పదహారణాల తెలుగు వాళ్ళని చేసుకున్నాం. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట ఈ శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్టుగా భవభూతికి అర్థం అయ్యింది.
Merwin, Massonలు Sanskrit Love Poetry అన్న సంకలనంలో చెప్పిన కథలో భవభూతే కాళిదాసుకి ఉత్తరరామచరిత అంతా చదివి వినిపించాడని, కాళిదాసు అంతా విని, మొత్తం కావ్యంలో ఒకే ఒక్క శ్లోకంలో ఒక్క మకారపు పొల్లు ఎక్కువయ్యింది అన్నాడని ఉంది.
ఒక్క మాట కవితార్థాన్ని ఎంత పల్చబడేట్టు చెయ్యగలదో, సంస్కృతం క్షుణ్ణంగా వచ్చిన వాళ్ళకి తెలియచ్చు. రాతిర్ ఏవమ్ వ్యరంసీత్, అంటే the night has passed in this way అని అర్థం. దాని బదులు రాతిర్ ఏవ వ్యరంసీత్, అంటే, only the night disappeared, (but the rest of it continued) అని భావం.
End Side Bar.
ఆఖరిగా నా సంజాయిషీ:
కవిత్వభాషలో ఒక్క అక్షరం అర్థం, అలంకారం మార్చివేయచ్చు. రాసిన మంత్రాలు వల్లించడంలో ఆ తేడా కనిపిస్తుందా? నేను క్లుప్తంగా రాసిన వేదసంప్రదాయ వివాహ పద్ధతి, పాశ్చాత్యదేశాల్లో (ముఖ్యంగా అమెరికా ఖండంలో) స్థిరపడ్డ మన వాళ్ళకోసం. అందుకని, సాధ్యమైనంతవరకూ, ఇంగ్లీషులో భావం ఇవ్వడం జరిగింది. తెలుగులో ప్రతిపదార్థాలు, తాత్పర్యాలూ, వ్యాఖ్యలూ కావాలనుకుంటే, ఉపనిషత్తు మంత్రాలకి, శ్రీ నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు గారి ఉపనిషద్దర్శనం – 4, పెళ్ళి మంత్రాలకి, శ్రీ చల్లా లక్ష్మీ నరసింహశాస్త్రి గారి పుస్తకం లోనూ చూడవచ్చు.
భవదీయుడు,
వేలూరి వేంకటేశ్వర రావు.
ఆమె నవ్వు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
12/27/2020 6:02 am
ఆమె ( మరణించిన అనిల్ భార్య ), వంట మనిషిగా “ఆమె” ఇంటచేర్చిన ఓ అనామకురాలు చిన్నవయసు పూర్ణ, నలభై ఏళ్ల అనిల్, పూర్ణ ఇల్లు వదిలివెళ్లిపోతే తిండి కూడా తినకుండా విశ్వాసం ప్రకటిస్తూ కాలు కాలిన పిల్లిలా తిరిగే రామం ( పిల్లి )…
తనతో బతికే మనిషిని ( భార్యని కానీ, వంటమనిషి పూర్ణని కాని ) సాటి మనిషిగా పట్టించుకోని నిర్లక్ష్యం …
తన ప్రవర్తనని ప్రశ్నిస్తున్నట్టుగా ఆమె చూసే సూటిచూపు భయపెట్టడం… ఆమెని (భార్యని) తక్కువ చేసి చూడాలనే ప్రతి ప్రయత్నంలో తను పాతాళంలో ఉన్నట్లు అనిపించటం…
ద్వేషం, ప్రేమ, బాధ, భక్తి ఏదో ఒకటి ఆమెని చుట్టుకొని ఉంటాయెందుకో? మళ్ళీ తిరిగిరాలేనంత దూరం ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా బాధ పడటానికి అహమే అడ్డొస్తుంది…
ఆమె ( మరణించిన భార్య ) ఇవ్వలేనిది, పూడ్చలేనిది… పూర్ణ, రామం చేసినా వాళ్ళని తనవాళ్లనుకొనేదానికి అనిల్ మనసు ఒప్పుకోదు. వాళ్ళకి దిక్కులేక వచ్చారనే అనిల్ అహం తొలుస్తుంటుంది; అహమే అన్నిటికి యజమాని అనుకుంటూ.
ఎక్కడెక్కడో తిరిగి దిక్కులేక నిండు గర్భిణీ స్త్రీగా తిరిగి వచ్చిన వంట మనిషి పూర్ణకి మళ్లీ ఆశ్రయం ఇచ్చి, లోకం ఏమనుకుంటుందో ఏమో అని వెరవకుండా ఆశ్రయం ఇచ్చి, పూర్ణ అడుగులతో ఇల్లు ఇల్లులా ఉంటున్నది.. ఖాళీతనమంతా దేనితోనో నిండుతున్నట్లుగా భావించడం అనిల్ మానసిక పరివర్తనకి సూచిక.
పూర్ణ ప్రసవించిన పాప విచ్చుకున్న గుప్పిళ్లు, చికిలించి వెలుగుని చూస్తున్న కళ్లు, లేత పెదాలపై ఉదయిస్తున్న రహస్య భాష నవ్వు లో ఆమెని (భార్య ) చూడగలిగిన అనిల్ … హాస్పిటల్ లోని పురుళ్ల వార్డ్ నర్స్ అడిగిన మీదట… పాప పుట్టుక, తల్లిదండ్రుల వివరాలు ఫామ్‌లో ( బర్త్ సర్టిఫికేట్ లో ) రాస్తూ ( తల్లిగా పూర్ణ, తండ్రిగా తన పేరు రాస్తూ ) ఇలాంటి నిర్ణయాలను కేవలం సమయం మాత్రమే నిర్ణయిస్తుంది అనుకోవడం అనిల్ మానసిక పరిణితికి సూచిక.
అధికారం, కనికరించడం, కొంచెం గర్వం చూపిస్తూ… తనవారి పట్ల విశ్వాసహీనుడినా అనే సందేహాలు… ఏదో తృప్తి, ఎందుకో చాలా అసంతృప్తి. సుఖమెంత దుఃఖమో అనే విరక్తి… లోపలింత శూన్యతెందుకు అనే నైరాశ్యం లాంటి మానసిక రుగ్మతలు, వైకల్యాల నుండి విముక్తుడై ‘నిన్ను కనిపెట్టుకొని తోడుగా ఉండే మనిషికన్నా ఇప్పడు నీకేమి కావాలి? అన్న భార్య హితవుని అర్ధం చేసుకుని జీవితంలో ఉత్తమోత్తమమైన స్థాయికి అనిల్ చేరుకునేలా చెయ్యడమే చనిపోయిన భార్య “ఆమె నవ్వు”… లేత పెదాలపై ఉదయిస్తున్న రహస్య భాష లాంటి అప్పుడే పుట్టిన “పాప నవ్వు” సాధించిన విజయం.
దేవగిరి గురించి భాస్కర్ కె గారి అభిప్రాయం:
11/04/2020 8:06 am
సూర్యనారాయణ మూర్తిగారు, ఈ ప్రశ్నకోసం కొంచెం ఎదురుచూసానండి. శైవుడు అని చెబుతూ రామాచారి పేరు ఏమిటని. ఒక శివాలయానికి రామప్ప దేవాలయం అని పేరు రావడానకి కారణంలో ఇలాంటి కథ ఏదైనా ఉందేమో అనే ఆలోచన ఒకటి ఉండేది నాకు. ఆ ఆలయం నిర్మాణకర్త రేచర్ల రుద్రడని గణపతిదేవుడు వేయించిన శాసనం ఉంది. రామ అనే పేరు జైనులు కూడా పెట్టుకునే వారండి. శైవానికి ముందు కాకతీయరాజ్య ప్రాంతంలో జైనమే ఎక్కువగా ఉండేది. అలాంటప్పుడు వంశపారంపర్యంగా వచ్చేపేర్లలో రామ శబ్దం ఉండే అవకాశం ఉంది. గణపతి దేవుడు చాలాకాలం (6 నుంచి 12 సంవత్సరాలు) బందిగా ఉన్నాడనే అంటారు. ఎలా విడుదలయ్యాడు అనేది తెలియదు కాని, ఒక మంచి రిలేషన్ మాత్రం యాదవులతో కొనసాగిందన్నది నిజం. ఓ యుద్దంలో రెండు సైన్యాలు కలిసి పోరాడాయి. జైత్రపాలుడి కూతురునే పెళ్లి చేసుకున్నాడని అంటారు కొందరు. జైత్రపాలుడి కొడుకు సింగడికి తెలుగురాష్ట్ర ప్రతిష్టాపనాచార్య బిరుదుకి కారణం తెలియదు. హిస్టారికల్ స్పెక్యులేషన్స్ మధ్య నిజాన్ని వెతకడం కూడా కష్టమే ఈ రోజుల్లో. మతం – జనం సంబంధం తేలికైనదా, అత్యంత బలీయమైనదా అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుందండి. బహుశా రేఖామాత్రంగా చెప్పే ప్రయత్నం అంతే. ధన్యవాదాలండి.
గ్రీకు పురాణ గాథలు 10 గురించి RAO VEMURI గారి అభిప్రాయం:
10/04/2020 1:36 pm
ఎప్పుడో చిన్నప్పుడు విన్న విషయం తప్ప నాకు ఈ విషయంలో పాండిత్యం లేదు. నేను చెప్పదలుచుకున్నది: మన పురాణాల ప్రకారం భీముడితో సరితూగగల బలశాలులు ఇంకా ఉన్నారు కాని గ్రీకు పురాణాల ప్రకారం హెర్క్యులీస్ తో సరితూగగల బలశాలులు ఇంకెవ్వరూ లేరు – అని నా అవగాహన.
ఐసోలేషన్ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
09/11/2020 9:34 pm
కళాత్మకతతో పాటు వర్తమానత, సామాజికత, మానవత్వ దృక్పథంతో కవితలు రాసిన ” ఎనిమిదో రంగు కవి ” అని తగుళ్ళ గోపాల్ గారిచే పాఠకలోకానికి పరిచయం చెయ్యబడ్డ అనిల్ డ్యాని గారు … కలలు పాతిపెట్టబడి, కల్లోలాలు మొలుస్తున్న వేళ… ఒంటరితనం, కనిపించని దిగులు ముసురుకుంటున్న వేళ … ” ఐసొలేషన్ ” హద్దులు దాటి నలుగురికీ వినపడే ఆప్యాయతల గళం విప్పినందుకు నెనర్లు.
ఏటి గట్టున ఇల్లు గురించి Tadepalli subtahmanyam గారి అభిప్రాయం:
08/09/2020 6:33 am
ఈ కథ చదువుతున్నపుడు చక్కని వింత హాయి కలుగుతుంది. కాని అనుభవంలో తేలేది ఏమిటంటే సున్నితమైన మనుస్సు చాలా చాలా గాయాలు చేస్తుంది.ప్రస్తుత దుర్మార్గపు ప్రపంచంలో సున్నిత మనస్కులు ఉంటే చాలా దుఃఖపడతారు.(అందుకే వేయి యంత్రాలనైనా నడపవచ్చు కాని ఒక మానవప్రాణితో సుఖంగా ఉండలేము)అదే యంత్ర వ్యాప్తికి కారణయ్యింది..
శిలాలోలిత : విషయ సూచిక గురించి udaya గారి అభిప్రాయం:
07/31/2020 12:05 am
చాల చదువుతాము కాని ఏ కొన్నో పదే పదే మనస్సును పలకరిస్తాయి అందులో రేవతి దేవిగారి శిలాలోలిత నన్ను ఎంతగా కదిలించిందంటే — ఆ కవితల వెనకాల భావాలు –అక్షరాలతో వ్యక్తీకరించటానికి నేను రేవతి దేవిగారిని కాదే
డివెర్టిమెంటో గురించి తఃతః గారి అభిప్రాయం:
07/11/2020 8:39 am
లైలాగారి కథలో ‘లైలా’ కాలేజీ కలికానికైనా కనపడలేదు. అక్కడి (ఆనాటి) లెక్చరర్లు కొందరు లైలాగారి కథా దేశ కాలాల (అప్పటినక్కల రోడ్డు) డాక్టరమ్మల భర్తలుగా తెలుసును.
[కథ ఇంత బాగుండటానికి ఇది కథ కాకపోవటమే కారణమేమో! దుర్గమ్మ గుడిగుమ్మం ముందు నుంచుని పైకి చూస్తూ ‘అమ్మలగన్న అమ్మ’ పద్యం చదువుకుంటూ లోపలికి వెళ్ళి అమ్మను చూడటంలో ఉన్న ఆనందానుభవం ఎటువంటిదంటే ‘జర్నల్ అఫ్ అప్లయిడ్ ఫిజిక్స్’లో పడిన ఒక పేపర్ను -వాసుదేవ- ఆ తల్లికి అంకితం చేసిన విషయం ఆ పేపర్ చివర్లో కనపడుతుంది].
నాకు తెలిసినవి రెండే ఊళ్ళు, ఆ రెండిటి (ఆనాటి) విద్యా సంస్కారాలను కళ్ళకు కట్టించారు మీరు –
డాక్టర్ ఎర్నేని మీకు ధన్యవాదాలు… నమస్కారాలతో- తఃతః
విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి గురించి desikachary గారి అభిప్రాయం:
07/04/2020 10:53 pm
జపానుదేశరచయిత్రి మురాసాకీ ఉదంతమును తెల్పినందులకు ధన్యవాదములు. కానీ ఈవ్యాసం ఆదిలోనే ఉన్న ఈక్రింది వాక్యాన్ని చూస్తూనే అది నాకు చర్చనీయంగా అనిపించింది:
“నవలలకూ, స్త్రీలకూ అవినాభావ సంబంధం ఉందని సంస్కృత భాష సాక్షిగా మనవాళ్లు చెబుతూంటారు. (సంస్కృతంలో నవలా అంటే స్త్రీ)”
ఆఁడుది అనే అర్థం గల నవల (రూపాంతరం నవలా) శబ్దం సంస్కృతంగా గాక దేశ్యంగానే నాకు గుర్తు. కాని ఇది సంస్కృతశబ్దమని ప్రప్రథమంగా ఇక్కడే వినడంచేత, నా అనుమాన నివృత్తికై వావిళ్లనిఘంటువును, ఆంధ్రవాచస్పత్యమును, విక్రాల శేషాచార్యులవారి సంస్కృతాంధ్రపదార్ణవమును పరిశీలించినాను. వీటన్నిటిలో నవల, నవలాపదములు ఆఁడుది అనేఅర్థంలో శుద్ధదేశ్యపదములుగానే పేర్కొనబడినవి. ఎందుకో సూర్యరాయాంధ్రనిఘంటువులో ఈపదం లేనే లేదు, కాని వావిళ్లనిఘంటువులో దీనికి రామాభ్యుదయంనుండి ప్రయోగంకూడ ఈయబడింది. వసుచరిత్రాది ఇతరగ్రంథాలలోనూ ఇది దేశ్యంగానే ప్రయోగింపబడింది. మఱి మీరీశబ్దం సంస్కృత మనుటకు గల ఆధారం తెలిపితే ఆవిషయం తెలుసుకొని నాపదజ్ఞానపరిధిని విస్తరించుకొంటాను.
రాత్రి గురించి srinivas sathiraju గారి అభిప్రాయం:
07/04/2020 8:25 pm
రాత్రంటే వయసొచ్చి హార్మోనుల భారంతో అల్లల్లాడడమే అని కవి గారి భావన జాలి కొలిపేలాగ ఉంది.. తీరని కోరికలతో సతమతమయ్యే మధ్య తరగతి కష్ట జీవి బ్రతుకులో ఇంకా కోరికలు రగలుతూ ఉండడం తప్పని సరి సమస్యే కావొచ్చు కాని..జీవితమంటే పగలు రాత్రులే నని ఇద్దరు కలిస్తే వచ్చే మూడో వాళ్ళని, ఆ రాత్రి తాలూకూ భాద్యతలను నెర్పే రోజు కూడా కవి హృదయంలో మెదలాలని ఆశిస్తూ….. ఒక చక్కని పొంగే బీరు లాంటి, కాపు కాచిన విప్పపువ్వు సారాలాంటి కవిత.మాత్రం మత్తెక్కించిందనే చెప్పాలి..
గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి పొత్తూరి సునీత గారి అభిప్రాయం:
07/01/2020 7:10 am
మీ వ్యాసం సాయంతో దుబాయ్ ట్రిప్ వేయవచ్చు. అంతా వివరంగా రాసారు. కాని వెళ్లేది ఎప్పుడనేదే ప్రశ్న. సశేషం అన్నారు… మిగతా బాగాల కోసం ఎదురు చూస్తాను.
పుస్తక పరిచయాలు గురించి Dr. Veldandi Sridhar గారి అభిప్రాయం:
06/01/2020 10:46 pm
ఒక గొప్ప పుస్తకానికి అంతే గొప్ప పరిచయం బావుంది. ఉటంకించిన కవితలను బట్టే తెలుస్తుంది ఇది సాధారణ పాఠకులకే కాదు కవులకు కూడా పాఠ్య గ్రంథమని ఇలాంటి గొప్ప పుస్తకాన్ని అందించిన ముకుంద రామారావుగారికి, పత్రిక సంపాదకులకు అభినందనలు…
ఈమాట సంపాదకుల పద్ధతి గురించి Madhav గారి అభిప్రాయం:
05/28/2020 12:38 pm
వ్యాసంలో లింక్స్ ఇచ్చాను కదా అని బద్ధకించాను. టే హాహాఫ్, విలియం గిఫర్డ్ లింకులు ఆ సంఘటనల గురించి నెట్‌లో ఉన్న వ్యాసాలకు దారి తీస్తాయి. ఆన్రీ షారియే పుస్తకం ఏ ప్రతిలో ఉందో తెలియక ఆ ప్రతి ప్రచురణ వివరాలు ఇవ్వలేదు. (కాని, ఏ అనువాదం ముందుమాటలో అయినా ఉంటుందనుకుంటాను.)
మాధవ్
గ్రీకు పురాణ గాథలు 5 గురించి తః తః గారి అభిప్రాయం:
05/26/2020 9:34 pm
“అలాగే వాలి సుగ్రీవులకి తల్లీ తండ్రీ కూడా ఒకరే. అందువల్ల బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారంటే ఎవరో ఒకర్ని పెళ్ళి చేసుకుని అనంతంగా పిల్లల్ని కనేస్తున్నారనుకోవడం మరోటి లేదు అంత బుద్ధి తక్కువ ఆలోచన”
శర్మగారూ!
‘సర్వమూ సాధు కాని పురాణాల’ గురించి – నాకు మాత్రం ఇటువంటి బుద్ధితక్కువ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటినుంచి నేనూ నానుంచి అవీ తప్పించుకోలేము.
“Anthropomorphic deities exhibited human qualities such as beauty, wisdom, and power, and sometimes human weaknesses such as greed, hatred, jealousy, and uncontrollable anger. Greek deities such as Zeus and Apollo often were depicted in human form exhibiting both commendable and despicable human traits” -wiki
నమస్కారాలతో
తః తః
గ్రీకు పురాణ గాథలు 5 గురించి Jagadeswar Vallabhadas గారి అభిప్రాయం:
05/17/2020 1:28 am
వేమూరి వేంకటేశ్వరరావు గారు,
మానస పుత్రులు/పుత్రిక అంటే మీరిచ్చిన వివరణ సరైనదనిపించడం లేదు. బ్రహ్మ, సరస్వతులకు పుట్టిన వాళ్ళను అన్న చెల్లెల్లుగా వ్యవహరించొచ్చు. కాని బ్రహ్మ ఊహకు పుట్టిన వాల్లంతా అన్న చెల్లెల్లు అనడంలో అర్థం లేదు. కాబట్టి అన్న చెల్లెల్లకు ఎక్కడా పెళ్ళవలేదు.
జగదీశ్వర్ వల్లభదాసు
భయం – భక్తి గురించి T.subrahmanyam గారి అభిప్రాయం:
05/08/2020 7:30 am
చాలా బాగుంది కాని ఇరాఖ్ లో భార్యతో వున్నపుడు నిరొధ్ గురించి చెప్పినపుడు కొంచం సున్నితముగా రాసి వుందవలసినది.
Tara and the Teacher గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
04/28/2020 7:58 pm
“రమణులు తన జీవితకాలంలో ఎన్నడూ ఎవరికీ విభూది ఇచ్చిన దాఖలాలు లేవు. వచ్చినవాళ్లకేసి ఒక్కచూపు చూసేవారు(ట). ఆ చూపుకి వళ్ళు తప్పిపోయి, తలలో గర్వం పాదాల్లోకి ఒక్క క్షణంలో వచ్చి ఆయన శిష్యులైనవారున్నారు (ఉదాః చలం అనబడే ఒకానొక ప్రబుధ్ధుడు)…”
శర్మగారు!
“నెమలి పింఛము వాడు, నీలమేఘకాంతివాడు
రమణుడాతడు మొక్కేను రమ్మనరమ్మ!”
అతడొక్కడే రమణుడు! కృష్ణుడుండగా మరొకరికి అగ్రపూజా! మహాభారతం చదివిన వారలము కాదా!
“చెందమ్మి కన్నులవాడు, చేతి పిల్లగ్రోవి వాడు
ఇందువచ్చె కంటిరా? ఏమిదే యమ్మా!”
S. జానకి ఈ పాట ఎంత బాగా పాడింది! ఈ పాట మాధుర్యం అన్నమాచార్యుని పదాల లోంచి వచ్చింది. అలా ఎవరు రాయగలరు!
ఐనా, ఆ పాట నాయకుడు కృష్ణుడు కాకుంటే అంత విరహము, అంత మోహము ఉండేనా!
జన హృదయం దోచిన కృష్ణుడి వేషం కట్టక పోతే, N.T. రామారావు తెలుగునాట ఛీఫ్ మినిస్టర్ అయ్యేనా!
“మందల పశువుల వాడు
మకరాంతముల వాడు
ఎందునున్నాడు చెప్పరే! ఏల దాచేరమ్మ!”
ఈ పాట నాలో ఎప్పుడూ సుళ్లు తిరుగుతుంటుంది. ఇందులో మోహమురళి, మంద్ర తంత్రుల వీణమీటులు మరోలోకాలవి. పాటలోని మాటలు వరసలు అప్పడప్పడు గుర్తు రాపోతేనేం ఎటు మార్చి పేర్చుకున్నా, అందమే అందం.
“చెచ్చెరకోనేటివాడు శ్రీ వేంకటేశ్వరుడు
వచ్చి నన్ను కూడినాడు వాడు ఓ యమ్మా!”
నాకు శృంగారం ఒక్కటే రసం. ఏ శకం లోనూ, ఏ వయసులోనూ, ఏ రోజునైనా, ఏదో ఒక్క కణం లోనైనా, ఒక క్షణమాత్రమైనా, శృంగారం లేక -జీవితం సహ్యం కాదు.
నేను తెలుగు వనితనే! కృష్ణుడి పై పాటలు తెలుగువారి DNA లో భాగం ఐ పోయాయి. అదేమంత కష్టమైన తెలుగా! ఒక చక్కని పాట రాయటానికి ఎంతపాటి తెలుగు రావాలి!
“గోపాలకృష్ణుడు నల్లన
గోకులములో పాలు తెల్లన
కాళిందిలో నీళ్లు చల్లన!
పాట పాడవె నా మనసు ఝల్లన!”
రావు బాలసరస్వతి ఏమీ పటాటోపం లేకుండా పాడే ఆ తెలుగు పాట, ఎందుకు రంజింప చేస్తుంది! ఎందు వలన! అగ్రస్థానంలో గోపాలకృష్ణుడున్నాడు! అందువలన!
“ముజ్జగాలు మోహించగ మురళిని మ్రోయించరా, కృష్ణా!
శంఖమేల, చక్రమేల, సారబ్జము లేలరా
అస్ర్తశస్త్రజాలమెల్ల యమునబారవైచి రార!
ఈ నెల ఈ మేగజీన్ లో వినిపించిన లలిత సంగీతం లో అన్నిటికన్నా బాగున్నది పైనున్న కృష్ణ గీతమేగా!
ఆ పాటలో శాంతకుమారి చివరి మాటలు అంత స్పష్టంగా వినరావటం లేదు! ‘గురు చింత’ అనేనా గేయరచయిత రాసింది?
“పక్షపాతమేలా! నీ పక్షమేది గోపాలా!
‘మురళి’ కన్న ‘రాస’ కన్న “గురుచింత” ఏలా!”
విన్నారుగా!
Edith Hamilton -Mythology చదువుకుంటే, Roman, Greek First tier Gods, Second tier Gods తెలుస్తారు.
పోతన భాగవతంలో, హిందూ దేవతల వంశాలు, ఉపవంశాలు, శాఖలు, తెలియచెప్పాడు.
హిందూ మిథాలజీలో కృష్ణుడు అగ్రశ్రేణిలో ఉన్నాడు. నాకు మిథలాజికల్, ఫిక్షనల్ హీరోలే హీరోలు. వారి మీదే నాకు గురి. నీకు తెలిసిన డాక్టర్లలో ఎవరు నీ హీరో అంటే – Dr. Richard Kimble అంటాను. అతను ఎవరంటే, ఛికాగో కుక్ కౌంటీ హాస్పిటల్లో సర్జన్! ఎక్కడ అంటే “Fugitive” సినిమాలో. ఆ డాక్టర్ ధీరోదాత్తుడైన నాయకుడు.
శర్మగారూ! చలం సాహిత్యం అంతా నా వద్ద ఉంది. అతడు తెలివైన రచయిత. కాని నాకు ఇష్ట రచయిత కాడు. అయిష్ట రచయిత కూడా కాడు.
నిన్నంటే నిన్న Edith Wharton రాసిన కథలు రెండు చదివాను. 1. The afterword. 2. Xingu. తెలివైన రచయిత్రి. రెండూ బాగా రాసింది. ఎక్కడి కక్కడే ఐపోయింది, ఓరినీ! భలే రాసిందే అనుకుంటే, పక్క పేజీలో మళ్లీ కథ సాగించింది. మళ్లీ అదే తంతు. ముగించింది లెండి ఆమె కిష్టమైనప్పుడు.
చలం, ఈడిత్ ల సంగతెందుకు? మీరు కథకులేగా శర్మగారూ! ఎందుకు ఫస్ట్ తారీఖుకే రాయటం. ఉద్యోగాలలో బిజీగా ఉన్నందువల్ల రాయలేని రచయితలు ఇప్పుడు కొన్నాళ్లుగా రోజు కొకటి రాసి ఉండాలిసిందే!
మీరు రాసిన కథలలో “తుఫాను” అన్న కథ నాకు బాగా నచ్చింది. ఆసాంతం బాగా రాసారు. అందులో ambience బాగా వచ్చింది. కథ స్పిరిట్ టాల్స్టాయ్. సెట్టింగ్ ముంబయ్! కథలో ఇద్దరు చక్కని spirited కథానాయికలున్నారు. కథలు కొన్నిసార్లు అవే రాసుకుపోతుంటాయి. జయదేవుడి అష్టపది లో ఆఖరు పంక్తి కుదరక రచయిత లేచిపోతే, కృష్ణుడొచ్చి పూర్తి చేసినట్టు మళ్లీ వచ్చి చూసుకున్నప్పుడు చక్కని ముగింపు రాసి ఉంటుంది. బాగా ముగింపు ఇచ్చారు తుఫాను కథకు! It is a positive Leo Tolstoy! Beautiful!
మీ కథ ఒకటి ‘ఈ మాట’ మరుసటి సంచికలో ఉంటుందని ఎదురుచూస్తాను.
-Lyla
Tara and the Teacher గురించి తఃతః గారి అభిప్రాయం:
04/01/2020 3:29 pm
ఈమాటలో గణపతి ముని సంస్కృత రచనకు ఆంగ్ల అనువాదం ప్రకటించటం ఆనేది ఆభిలషణీయం కాని పని. ఎవరికోసం ఈ ఇంగ్లీష్ అనువాదం తెలుగువాళ్ళు చదువుకునే పత్రికలో? తెలుగు అనువాదం అయితే ఎంత ఆనందంగా ఉండేది. సూటి ఆంగ్ల రచన వేయటం వేరు. దానికి కొంత అర్థం ఉంటుంది. కన్నడంలోనో బెంగాలీలోనో ఉన్న రచనలకు ఆంగ్ల అనువాదాలు గూడా వేస్తారేమో ముందు ముందు. ఈ పని పూర్తిగా పాండిత్య ప్రకర్ష గానే ఉంది.
నమస్కారాలతో
తఃతః
కొంగర జగ్గయ్యతో ముఖాముఖీ గురించి K.Sivaramaprasad గారి అభిప్రాయం:
03/10/2020 9:29 am
శ్రీనివాస్ గారూ,మంచి ఇంటర్వ్యూ అందించారు, ధన్యవాదాలు. జగ్గయ్య గారితో ఇంటర్వ్యూ ఇదే వినటం.
సినిమా సంభాషణలు గ్రామఫోన్ రికార్దుగా రావటం ముత్యాలముగ్గుతో ప్రారంభం అయింది అని ఇన్నాళ్ళూ అనుకున్నాను, కాని జగ్గయ్యగారు శివాజీ గణేశన్ కు డబ్బింగ్ చెప్పిన మనోహర చిత్రం తో ఆరంభం అయ్యిందని ఈ ఇంటర్వ్యూ వల్లే తెలిసింది
శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
02/08/2020 3:46 pm
గ్రంథ గ్రంథులు = ?
శ్రీహర్షుని ‘అవామే వామార్ధే’ అని మొదలయ్యే ఒక శ్లోకానికి కల మూడు రకాల అర్ధాలు ఇచ్చి, తనుగా ఇంకా శ్లోక రహస్యాలు శోధిస్తూ; ఈ వ్యాసం లో మొదటిగా ఇచ్చిన శ్లోకంలో ‘గ్రంథి’ అన్న మాటకు ముఖ్యార్ధం ముచ్చటించకపోటం, ‘చిక్కు ముడి’ అన్న ఒక్క అర్థంలో మాత్రమే ఆ మాటను శ్రీహర్షుడు వాడినట్టుగా ఆసాంతం ఈ వ్యాస రచయిత అనుకోటం ఆశ్చర్య పరిచింది.
గురువు లేనందున, సంస్కృతమే తెలియదు నాకు. ఐతే, సంస్కృత కావ్యాలు చక్కగా చదువుకున్న, రసికులైన పంతుళ్లు, నాకు బెజవాడలో చెప్పిన తెలుగొచ్చు. అందుకేగా రచ్చబండ యాహూ లో ఇలాటి తెలుగు కవిత్వాలు చెప్పాను.
నిన్న మొన్నటి దాక
ఎన్నొ పున్నమి రాత్రులు
పున్నాగల మీద జంట మిన్నాగుల వలే
పెద్దకాలము మనము పెనగితిమి ప్రియతమా!
నేడా చనువు చెలగాటములు లేవు
నేడా తనువు తగలాటములు లేవు
ఆ బులుపుల పున్నాగల గంధాలు
భద్రముగ నుంచులే
మెదడు మడుపుల సూక్ష్మగ్రంధాలు
తలను వీడవుగాదా వాసనలు
మనమిలను వీడువరకు!
ఆ కవిత్వం చదివిన ఒక సభ్యులు జాబాలిమునిగారు, గ్రంథులు అనబోయి గ్రంథాలన్నారా? వైద్యులు లైలాగారు, అంటే ఆ తర్వాత కొంత డిస్కషన్ నడిచింది. యాహూ నిర్వాహకులు -గ్రూపులు మూసివేసినందున, కంటెంట్ తుడిసివేసినందువలన, ఇక ఆ లింకు ఇచ్చే గొడవ లేదు.
పైది రచ్చబండ- యాహూ లో రాసినప్పటికి ఆంధ్రభారతి నిఘంటువుల తయారీ పూర్తికాలేదు. ఇప్పుడు ఆ నిఘంటువుల నుండి:
గ్రంథి : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
సంస్కృత విశేష్యము
• 1. బుడిపి. గడ్డవలె పుట్టు రోగము.
• 2. చెట్టు మొ.ని ముడి.
• 3. కీలు.
• 4. [జీవశాస్త్రము] శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).
అందులో నాలుగవది అతి ముఖ్యమైన అర్ధం. అన్ని రసాలకు కారణం ఆ గ్రంథులు.
-Lyla
Ps: సంస్కృత పండితులు ఈ వ్యాసంలోని మొదటి శ్లోకం గురించి విడమర్చి చెపుతారని ఆశిస్తాను.
హెచ్చరిక గురించి Amarendra గారి అభిప్రాయం:
01/12/2020 8:18 pm
‘పదివేల పేజీలు.. యెవరికీ అర్థంకాని’ – నెట్ లో ఉంది. ఒకసారి చూడండి. I did it. ‘Capitalism based’- అన్న అభ్యంతరం లేకపొతే, మనది అద్భుతమైన రాజ్యాంగం అని నా అభిప్రాయం.
హెచ్చరిక గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
01/09/2020 10:32 am
నేరం చేసాడో లేదో తెలియదు అనే ముక్క పట్టుకుని కధ రాసారులా ఉంది. కానీ నిర్భయ కేసునుంచి ఈ రోజు వరకూ జరిగినవి చూస్తే తెలిసేదేమంటే, ఎంత వెధవైనా సరే వాడికి ప్రాణం మీద “అతి” తీపి. నేను అమాయకుణ్ణీ అని చెప్పుకోవాలనే తాపత్రయం; ఏదో ఒక లొసుగు ఉండకపోదా తప్పించుకోవడానికి అనే ఆశ. ఇవన్నీ కూడా రేప్ చేసినప్పుడూ, ఆ తర్వాతా గుర్తుకురాకపోవడం, ఇంతటి నీచమైన పనిచేసినా దానికి ఒప్పుకుని పశ్చాత్తాపం పడకపోవడం దారుణం. ఇదంతా ఒక ఎత్తైతే మన అద్భుతమైన న్యాయ వ్యవస్థా, దాదాపు పదివేల పేజీల – దాదాపు ఎవరికీ అర్ధంకాని, గుర్తు ఉండని – రాజ్యాంగం ఎంతకీ తేలని కోర్టు కేసులూ మరో ఎత్తు. నిర్భయ అమ్మగారు ఏమన్నారో ఎవరైనా విన్నారా? “నా కూతురు పోయి ఏడేళ్ళు దాటుతోంది. ఏడవడానికి కన్నీళ్ళు కూడా ఎండిపోయాయి” అంటున్నారు. మరి ఆవిడ క్షోభో? ఈ ఏడేళ్లలో పాపం ఆవిడ ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపిందో, ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగిందో, ఎంత దారుణంగా ఆ బాధ గుండెల్లో నొక్కుకుందో ఎవరైనా ఆలోచించారా?
ఈ రోజు వచ్చిన వార్త ప్రకారం ఈ నిర్భయ కేసులో ఒకడు క్యూరేటివ్ పిటిషన్ అనే కేసు ఏదో వేశాట్ట ఆఖరు అస్త్రంగా. వాడిని పోలీసులు తీసుకెళ్తున్నట్టూ ఒక బొమ్మ – కలర్ దే – వేసారు. కండలు పెంచి వస్తాదులాగా ఉన్నాడు. జైల్లో ఉచితంగా పెట్టే కోడికూరా బిర్యానీలు బాగా వంటబట్టినట్టున్నాయ్. రేప్ చేసినప్పుడు, ఆవిడ రక్తం కారుతూ చేతులెత్తి మొరపెట్టినప్పుడూ, ఆవిడని బస్సులోంచి తోసేసినప్పుడూ వీళ్లకి లేశమాత్రమైనా లేని కనికరం వీడికి ఎందుకు చూపించాలిట? ఇవి చాలవన్నట్టూ ఈ ముష్టి వెధవల తరపు వాదించడానికో లాయరు తయారు. ఓ సారి గుండెలమీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు లాయర్ అయితే ఇటువంటి కేస్ వాదిస్తారా ఎన్ని డబ్బులిచ్చినా? అలా వచ్చే డబ్బులూ, పేరూనా మీరు లాయర్ గా కోరుకునేది?
https://www.sakshi.com/news/national/nirbhaya-convict-files-plea-against-death-sentence-1254498
ఆ చచ్చిపోయిన అమ్మాయి మీవాళ్లైతే/ఏ మంత్రి గారి కూతురో అయితే ఎలా స్పందిస్తారు? అప్పుడు ఈ న్యాయం అనేది అటవికమా, అన్యాయమా అనేది ఎవరు నిర్ణయం చేస్తారు? అసలీ నిర్భయ కేసు ఇంతకాలం ఇలా బుధ్ధి లేకుండా లాగబట్టే ఇటువంటి రోజు రోజుకీ ఎక్కువౌతున్నాయి. ఇటువంటివే రాగింగ్, చిన్న పిల్లల్ని స్కూల్లో కొట్టడం అనేవి. రాగింగ్ జాడ్యం మనకి ఎక్కువగా ఉండేది కొంతకాలం క్రితం. బాగా రూల్స్ పెట్టి స్ట్రిక్ట్ చేసాం అని చెప్పుకుంటున్నా ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నై. కాలేజీలు తెరవగానే ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అయ్యో పాపం అనుకోవడం ఆవిడ పోయిన రోజున. మర్నాటినుంచి మళ్ళీ అంతా మామూలే.
అసలీ దరిద్రాలు ఎప్పటికి వదుల్తాయి? ఇటివంటివి జరుగుతున్నందుకు మనం సిగ్గుపడితే పడతాం గాక కానీ ఈ కేసు ఇప్పటికీ తేల్చనందుకు ఏ ఒక్క రాజకీయనాయకుడూ కూడా సిగ్గుతో తలదించుకోలేదు. [భగవంతుడా, ఇది 2020 సంవత్సరం, 1745 కాదు] ఇది చాలక ‘మేరా భారత్ మహాన్ రండ్రండి వచ్చి పెట్టుబడులు పెట్టండి’ అని ఆగని సాగర ఘోష.
అన్నింటికన్నా దరిద్రం ఏమిటంటే ఇవన్నీ జరిగినవి ప్రథానమైన నగరాల్లో కనక అవి బయటకొచ్చాయి. రోజువారీ పల్లెల్లో జరిగేవి ఎన్నిఉన్నై? పూర్వకాలంలో కొరత అనేది ఉండేదంటారు. నేరస్తుణ్ణి శూలం మీద గుచ్చి శ్మశానంలో వదిలేస్తారు. వీళ్లని ఎందుకలా చేయకూడదు? “అమానుషం” అయిపోతుందిట. అయ్యో పాపం అమానుషం “మనుషులకి కాదుటండీ?” ఒకప్పుడు రేప్ చేసినా వీడూ “ఒక మనిషే!” నిజమేనా? ని-జ-మే——-నా?” ని….ని…..ని…..నిజంగానేనా?
జనరంజని: మహానటి సావిత్రి గురించి Bhukya Balaji గారి అభిప్రాయం:
12/16/2019 10:23 pm
మాది తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామం, నా వయస్సు 21 సంవత్సరాలు. నేను సావిత్రి గారికి అభిమానిని. సావిత్రి గారు నాకు అమ్మతో సమానమండి. నేను పల్లవి గారు రాసిన మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి పుస్తకాన్ని చదివాను. నిజంగా, ఆ పుస్తకం చదువుతూ ఉంటే సావిత్రి అమ్మగారు నా కళ్లముందు ఉన్నట్లే అనిపించిందండి. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు సావిత్రమ్మ గురించి ప్రతి క్షణం బాధపడ్డానండి. ఆ పుస్తకంలో సావిత్రమ్మ గారి ఫొటోస్ చూసానండి. ఫొటోస్ చూసాను, కాని సావిత్రమ్మ గారి మాట ఎప్పట్నుంచో వినాలని బాగా ఆతురతగ ఉండేది, ఎలా ఉంటది అమ్మగారు ఎలా మాట్లాడతారు అని. అది ఇప్పుడు మీ వల్ల అమ్మగారి మధురమైన మాటా భావాలు విన్నాను. అమ్మగారు మాట్లాడుతుంటే అమ్మను చూసినట్టే ఉంది. అమ్మగారు ఈరోజు మనతో లేకపోయిన అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి, కాబట్టి అమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సావిత్రమ్మ గారి మధురమైన మాటల్ని అందించినందుకు శ్రీనివాస్ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
వలపారగించవమ్మ వనిత నీ యలుక చిత్తమున గురించి Amarendra గారి అభిప్రాయం:
11/17/2019 6:49 pm
ఈమాట పత్రికలో ఉన్న సంపాదకులు లాంటివారు, ఈ పుస్తకానికి పని చేస్తే బాగుండేది.
ప్రచురణ పరంగా గత ముప్ఫై యేళ్ళలో ఇరవై పాతిక సంపాదకులను చూశాను. ఈమాట సంపాదకుల లాంటివారు ఒకటీ ఒకటిన్నర మాత్రమే తారసపడ్డారు. This is a rarest of the rare breed in Telugu.
మరొకసారి గంగ నేలకు దిగింది గురించి lyla yerneni గారి అభిప్రాయం:
11/10/2019 1:47 pm
వాడ్రేవు ఈ పత్రికలో ప్రచురించిన రచనలు నేను ఆసక్తితో చదువుతాను. ఈ ‘ముందు మాట’ చదువుకోటానికి బాగుంది. “కాళీ పదములు” అన్న కవితా సంకలనానికి ఈయన ఈ ముందుమాట రచించారు. వ్రాసిన తీరు నింపాదిగా, అనేక విషయాలు సేకరించి, పరిశీలించినదిగా ఉంది.
ఐతే, అంతా చదివిన తర్వాత, ఈ కవితలకు పరిచయాన్ని రామకృష్ణుని జీవిత చరిత్ర ప్రస్తావన, ఆయన భగవంతుని గురించి బోధనో, పాటో, -ఆ కొటేషన్స్‌తో ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. ముందే తెలియక్కర్లేదు కాని, ఎప్పటికో ఒకసారి, కనీసం చిట్టచివరికన్నా తెలియాలి కదా?
బెంగాల్ లో ఉద్భవించిన కాళి భక్తి, అందుకు సంబంధించిన వంగ సాహిత్యావతరణ, విదేశీయ రీసెర్చ్ స్కాలర్స్ రచనలు- ఈ అంశాలు ఇంటరెస్టింగ్‌గా ఉన్నై. అందుకు అవి ‘నిజం’ ఐ ఉండాల్సిన అవసరం కూడా లేదు. రెలిజియస్ ఐకాన్స్, భక్తి, మతం, సంబంధించిన పరిశోధనలలో నిజమేమిటి? అబద్ధమేమిటి?
సరే, కవితల పుస్తకమా అంటే తెలుగు కవిత్వపు పుస్తకం. పుస్తక ప్రచురణ విజయవాడలో. రిలీజ్ విజయవాడలో. రచయిత్రి కూడా చిన్నప్పుడు విజయవాడ (బెజవాడ) లో ఉండి వచ్చినట్టున్నారు. మరి ఆమె పుస్తకానికి ముందుమాటగా బెంగాలీ కాళీ ప్రసక్తి ఎలావచ్చింది? బెజవాడలో ఇంటి వెనకాల కొండమీద గుడిలో వెలసిన కనకదుర్గమ్మ -కాళి కాదా? కాని ఆ దేవత, ఆమె చరిత్ర, ఆమెపై భక్తి సాహిత్యం ఉందో లేదో విమర్శకులు ఎత్తనే లేదు. మరి బెజవాడ దుర్గ ఎలా ఉద్భవించిందో, బెంగాలీ కాళి, బెజవాడ కాళి ఒకరో కారో, అలాటి సంగతులు ఈ ముందుమాట రాసినవారు చెప్పనే లేదు. చెప్పమని కాదు కాని, -ఈ కవితలలో బెజవాడ కాళిని కాదు, ఆ బెంగాలీ కాళిని తల్లిగా ఊహించి, ఈ కవయిత్రి స్మరిస్తున్నది సుమా, అని ముందుమాటలో మనకు స్పష్టం చేస్తున్నారా అని నా సందేహం. ఒకవేళ రచయిత్రి గాని బెంగాల్లో ఉండి, కలకత్తా కాళిపై గాని బెంగాలీ భక్తి సాహిత్యంపై గాని ఆసక్తి జనించి కవితలు రాసారా? ఈ ముందుమాటలోని బెంగాలీ సాహిత్యానికి, ఈ రచయిత్రి కవిత్వానికీ ఉన్న లింక్ ఏమిటో తెలియటం లేదు. ఈ పత్రికలోనే ప్రచురించబడిన ‘కాళీ పదాలు’ కవితలు కొంచెం కూడా ఆ సందేహాన్ని నివారణ చెయ్యలేదు.
కవయిత్రిని, ‘మరొకసారి గంగ నేలకు దిగింది’ లాటి ఇమోషనల్ పదజాలంతో అభినందిస్తూ వాడ్రేవు ఆకస్మికంగా తనే కవి ఐపోటం కొంచెం తబ్బిబ్బు కలిగించింది. గంగావతరణం కథ బాగానే చదివిన నాకు ఆ మాటలు ఆయన వాడటంలో కూడా ఆయన చెప్పదలచిందేమిటో తెలియలేదు.
ఈ కవితల పుస్తకానికి ఆయనను ముందుమాట రాయమని అభ్యర్ధించిన వారికి, ఏవో సాహిత్యపరమైన కారణాలు ఉండే ఉంటాయి. అడిగిందెవరైనాగాని, కవయిత్రి అనుమతి లేకుండా, ప్రచురణకర్తలు, ఆమె కవితల సంకలనానికి వీరి ముందుమాటను జోడించరు కదా. ఈ ముందుమాటకు, కవితలకు అసలు జోడీ ఏదీ?
-Lyla
ఇంతింతైన ఇల్లేరమ్మ గురించి Dr Mula Ravi Kumar గారి అభిప్రాయం:
11/08/2019 8:21 am
ఇల్లేరమ్మగారి ఇంపాక్ట్ ఫేక్టర్
By: Dr Mula Ravi Kumar, Asst. Professor, SV Veterinary University
స్వర్గీయ డా. సోమరాజు సుశీలగారు (1945-2019) తెలుగు రచయిత్రిగా పెన్ను పట్టుకుందికి పాతికేళ్ళముందే రసాయనశాస్త్రవేత్త. తన యాబయ్యో ఏట రచయిత్రిగా కలం పట్టుకొని, రెండో పుస్తకంతో ఇల్లేరమ్మగా, తెలుగు ఇళ్ళలో స్థిరపడిపోయారు.
ఆ రసాయన శాస్త్రవేత్త 1974లో ఆవిడ దురదృష్టం, మన అదృష్టం వల్ల చిన్నపరిశ్రమ పెట్టేరు. ఆవిడ దురదృష్టం ఎందుకంటే, భార్యాభర్తలు ఇద్దరూ శాస్త్రవేత్తలుగా ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వ డబ్బుతో పరిశోధనలు చేస్తూ, ఆ “ఫలితాలు నివేదించటానికి” విమాన ప్రయాణాలు, అప్పుడప్పుడూ విదేశ ప్రయాణాలు చెయ్యటం ఎంత హాయైన పని?
అది వదిలి చిన్నపరిశ్రమ పెట్టటం వల్లే కదా ఆవిడలో పోరాట పటిమ మెరుగుపెట్టబడింది? అల్లకల్లోల సముద్రంలోనే నావికుడు రాటుదేలుతాడని ఇంగ్లీషు సామెత కూడా ఉందికదా? అలా, ఆ పాతికేళ్ళ చిన్నపరిశ్రమ కష్టం లేకపోతే ఆవిడలో వేదాంతి, రచయిత్రి, చమత్కారి కట్టకట్టుకొని ఆవిడ యాబయ్యో ఏట బయటపడేవారా? ఆవిడ ఉద్యోగం వదిలి ఉండకపోతే, ఈ ప్రతిభ అంతా శాస్త్రవేత్తల పాలయ్యేది. ఆవిడ కలం నుండి కేవలం పరిశోధనా వ్యాసాలు, ఓ కెమిస్ట్రీ పుస్తకం, మహా ఐతే తెలుగులో “నిత్యజీవితంలో రసాయనశాస్త్రం” అనే ఒక పుస్తకం వచ్చేవేమో.
అంచేత ఈవిడా, డా రంగారావుగారూ నాయుడమ్మగారి స్పూర్తితో లక్షణమైన ప్రభుత్వ శాస్త్రవేత్త ఉద్యోగాలు వదులుకున్నప్పుడే తెలుగు లోగిళ్ళలో ఇల్లేరమ్మ గృహప్రవేశానికి భవిష్యత్తులో ముహూర్తం పెట్టబడింది, అని ఒక హేతువాదిగా నేను చెబుతున్నాను. ఆ ముహూర్తం పెట్టినది దేవుడే అని ఒక నాస్తికుడిగా చెబుతున్నాను. ఆవిడ శ్రమజీవి/ వేతనజీవి స్థాయి వదిలి పెట్టుబడిదారుగా మారడంలో గొప్ప సామాజిక ప్రయోజనముందని ఒక వామపక్షవాదిగా చెపుతున్నాను.
ఇంతకీ ఈవ్యాసానికి “ప్రభావం” లాంటి లక్షణమైన తెలుగుపేర్లు వదిలి ఇంపాక్ట్ ఫేక్టర్ అనే అప్రాచ్యపు పదం (ప్రాచ్యం అంటే తూర్పు, అప్రాచ్యం అంటే పడమర, అంతే) ఎందుకు పెట్టానంటే, ఒక శాస్త్రవేత్త రాసిన పరిశోధనా పత్రాన్ని ఎంతమంది తమ ఇతర పరిశోధనల్లో ఉటంకిస్తారో, (లేదా) ఒక సైన్సు పత్రికలో పడ్డ వ్యాసానికి ఎంత ఎక్కువమంది చదివే అవకాశం ఉందో, దానిని ఇంపాక్ట్ ఫేక్టర్ అంటారు. ఉదాహరణకి నా పత్రం పదిమందీ, నా మిత్రుడి పత్రం వందమందీ ఉదహరిస్తే, అతడి ఇంపాక్ట్ ఫేక్టర్ నాకు పదింతలు. కవనశర్మగారి భాషలో చెప్పాలంటే నేను రాసిన కేజీ పేపర్ల బరువుకి అతడు రాసిన వందగ్రాములు సరిపోతాయి.
ఇప్పుడు ఇల్లేరమ్మగారి ఇంపాక్ట్ ఫేక్టర్ రచయిత్రిగా ఎంతో చెప్పాలంటే శ్రీరమణగారి వాక్యం, దీపశిఖ ముందుమాటలో, “ఇంత స్వల్ప వ్యవధిలో ఇలా దూసుకురావడం మీద కొందరికి తీవ్ర అభ్యంతరాలున్నా…” శ్రీరమణగారి వాక్యం విశదీకరిస్తే, ఆవిడకన్నా పాతికేళ్ళ ముందు కలం పట్టుకొని, తమని తులాభారం తూచటానికి సరిపడా పుస్తకాలు రాసిపారేసి, రచనారంగంలో పరుగులు పెడుతున్నామనుకున్నవారిని ఒక్క అంగలోనే దాటేసి మూడో పుస్తకం నాటికే సీనియారిటీని తుంగలో తొక్కి ప్రముఖరచయిత్రి ఐపోయారు. నేను మాట్లాడేది ఆ ఇంపాక్ట్ గురించి కాదు.
ఇల్లేరమ్మగారి గురించి అందరూ మాట్లాడుతారు కనుక కాసేపు ఆ “నిత్య బాలిక”ని పక్కనబెట్టి, “డా. సోమరాజు సుశీలగారి” ఇంపాక్ట్ ఫేక్టర్ చూద్దాం. ఆవిడ రాసిన చిన్నపరిశ్రమలూ పెద్దకథలూ నా మనసులో తిష్ట వేసేసింది. ఎంతగా అంటే, ఆ పుస్తకం యాబై కాపీలు (ఆవిడ ఎకౌంటులో బలవంతంగా డబ్బులు వేసి) కొని, నలుగురికీ పంచేంత. నా వృత్తిలో భాగంగా నన్ను కలిసేవారిలో కొంతమంది “పదేళ్ళు ఉద్యోగంచేసి కూడబెట్టిన డబ్బు”తో వ్యాపారం చేద్దామన్న సదుద్దేశ్యంతో, “ఏ యూనిట్ పెట్టుకోవచ్చంటారు?” అని నన్ను సలహా అడుగుతూ ఉంటారు (అందులో నా ప్రజ్ఞ కన్నా వారి భ్రమే ఎక్కువ). అలా వచ్చినవారికి ఈ పుస్తకం ఇచ్చి, అందులో కొన్ని పేరాలు అండర్‌లైన్ చేసి చూపించి, ఇవి ఒకటికి నాలుగుసార్లు చదువుకొని, ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించుకొని అప్పుడు ముగ్గులోకి దిగమని హితవు చెబుతూ ఉంటాను. అలా, ఎంతమందిని రక్షించానో, లేదా ఎంతమందిని కోటీశ్వరులు కాకుండా అడ్డంపడ్డానో తెలీదు. మంచో చెడో, ఇంపాక్ట్ ఫేక్టర్ అంటే ఇంపాక్ట్ ఫేక్టరే.
ఒకవేళ నన్ను కలిసేనాటికే చిన్న పరిశ్రమలు నడుపుతున్న వారి పరి-శ్రమ కష్టాలు విన్నప్పుడు వారికి ఒక కాపీ ఇస్తూ ఉంటాను. పుస్తకం చదివిన మర్నాడు నాకు ఫోను చేసి, సార్ ఈవిడెవరో గానీ, నేను పడుతున్న కష్టాలు ఎలా రాసేసారు అని ఆశ్చర్యపడిపోయి, ఈ పుస్తకం నీడలో ఓదార్పు పొందుతూ ఉంటారు.
నేను పనిచేసిన పాడిపరిశ్రమ, పశువైద్యం నేపథ్యంలో రాసిన కథలకు స్పూర్తి ఎవరూ అంటే, ఒకటి, ముళ్ళకుర్చీలు రాసిన ఎలక్ట్రాన్ (పింగళి వెంకటరమణారావు గారు), రెండు, డా సోమరాజు సుశీలగారు.
సోమరాజు సుశీలగారి భర్త డా రంగారావుగారు, నాకు తెలియకుండానే గొప్ప ఉపకారం చేసారు. అదేమిటంటే, మీది యాంత్రిక (మెకానికల్) స్వభావం, ఎమోషన్స్ లేవు, అని మా ఆవిడ అంటే, సోమరాజు సుశీలగారి పుస్తకాల్లో డా రంగారావుగారి గురించి వచ్చిన వాక్యాలు మా ఆవిడకి చూపించి, తాత్కలికంగా బయటపడుతూ ఉంటాను. ఈ మధ్య ఆవిడ రాసిన అత్తగారి జ్ఞాపకాలు చదివి, అలాంటి అత్తగారు దొరికినందుకు మీరు ఎక్కువ అదృష్టవంతులా, మీరు దొరికినందుకు ఆవిడా అని ఫేసుబుక్కులో అడిగితే, “మా ఇద్దరికన్నా మా ఆయన అదృష్టవంతులు” అన్నారు. ఎంత గొప్పనిజమో కదా!
మరి అలాంటి ఆవిడ స్ఫూర్తితో నేను రాసిన చింతలవలస కథలు ఆవిడచేత (బలవంతంగానైనా) చదివించెయ్యకుండా ఎలా ఉండగలను? అదిగో, అప్పుడే ఆవిడ సహృదయతకి ప్రత్యక్షసాక్షిని.
నా పుస్తకం పట్టుకొని ఆవిడ ఇంటికి వెళ్ళాను (2012 జూన్ అని గుర్తు). అదే రోజు కన్నెగంటి అనసూయగారి పుస్తక రిలీజ్ ఐతే అక్కడికి వెళుతున్నారు. పొత్తూరి విజయలక్ష్మిగారు ఆ కార్యక్రమంలో వేదికమీద ఉండాలి, వీరిద్దరూ కలిసివెళ్ళాలని అనుకున్నారుట. నేను వెళ్ళిన అరగంటలోనే వాళ్ళు బయలుదేరే సమయం. ఈ అరగంటలోనే నాకు వారి స్వగృహంలో ఉన్న ఆల్ఫాన్సో చెట్టు మామిడిపళ్ళు కోసి పెట్టారు. నేను ఆల్ఫాన్సో తిన్నది అదే మొదటిసారి. అంతలో పొత్తూరి విజయలక్ష్మిగారు వీరి ఇంటికి వచ్చి అదే కారులో కూకట్‌పల్లిలో పుస్తకావిష్కరణకి బయలుదేరారు. ఆవిడకి ఎంత సహృదయం లేకపోతే, ఆ రోజే చూసిన నాలాంటి అరటిక్కట్టు రచయితని తమతో కారులో తీసుకెళతారు. అందునా, మిగిలిన ముగ్గురూ నాకన్నా పాతిక ముప్పై ఏళ్ళ పెద్దవాళ్ళు. మూడో వ్యక్తి పొత్తూరి విజయలక్ష్మిగారి భర్త శివరావుగారు, రైల్వేలో పేద్దహోదాలో పదవీవిరమణ చేసినాయన.
అలా అప్పుడు ఆవిడని మొదటిసారి కలిసాకా, ఎలాగైనా, మా ఆవిడకి కూడా సోమరాజు సుశీలగారిని చూపించాలి అని అనుకున్నాను. ఆవిడని పరిచయం చేద్దామని ఇల్లేరమ్మ కథలు చదివించాను. నేను చిన్నపరిశ్రమలు పుస్తకానికెంత అభిమానినో, మా ఆవిడ ఇల్లేరమ్మకి అంత అభిమాని అయిపోయింది. మా నివాసం రాజమండ్రి, ఇల్లేరమ్మగారిది హైదరాబాదూ అవటం వల్ల, 2012 నుండీ అనుకుంటూ ఉన్నా 2018లో మాత్రమే ఆ భాగ్యం దక్కింది. అప్పటికి రెండేళ్ళ ముందు నుంచీ ఆవిడ ఫేసుబుక్కులో ఉంటూ, అప్పుడప్పుడూ ఫోను చేసేస్తూ మీరు రాజమండ్రి ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారు అని నెలకోసారైనా అడుగుతూ ఉంటే, మొత్తానికి క్రితం నవంబరులో వాళ్ళ తమ్ముడి రిటైర్మెంటు మరియు షష్టిపూర్తికి వస్తున్నానని చెప్పారు. వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళి కలవడానికి అనుమతి తీసుకున్నాను. ఇల్లేరమ్మకథల్లో ఆఖరి కథలో, పుట్టి, పుట్టీపుట్టగానే తన నలుగురు అక్కలకీ భవిష్యత్తులో రావలసిన రెండెకరాలకూ గండికొట్టిన ఆ తమ్ముడిదే రిటైర్మెంటు. కరువు కథలో, ఏ కొడుకైతే గౌహతీ నుంచి నెలకోసారి రాసిన ఉత్తరాన్ని, మరో ఉత్తరం వచ్చే వరకూ వాళ్ళమ్మగారు భగవద్గీతలా పారాయణ చేసేవారో ఆ తమ్ముడే ఆయన. ఆయన పేరు కూడా రవి అని తెలిసి ఇంకా సంతోషించాను. ఆరోజు వాళ్ళు అన్నవరం వెళ్ళి, తిరిగి వచ్చేసరికి రాత్రి పది అయింది. రోజంతా ప్రయాణం చేసారు, అలసిపోయి ఉంటారు అనే మొహమాటం లేకుండా, వాళ్ళు రావటానికి అరగంట ముందు వాళ్ళింటిదగ్గర మాటువేసి మరీ వెళ్ళి తలుపు కొట్టేసాం. అలా బుద్ధిలేకుండా వచ్చేసారు అని విసుక్కుందికి ఆవిడ మామూలు గృహిణి కాదుకదా! ఇల్లేరమ్మగారు!! ఇలాంటివాళ్ళని ఎంతమందిని ఆవిడ విసుగుపడకుండా భరించారో గానీ, ఆవిడగాని, ఆవిడ తమ్ముడుగారు గాని మేమున్న అరగంటా మమ్మలిని పట్టుపట్టి పిలిచిన అతిథులకిచ్చేంత మర్యాదా ఇచ్చి మరీ మాట్లాడారు. ఆవిడ ఫేస్బుక్కులో రాసిన చిన్నప్పటి క్రిస్మస్ జ్ఞాపకాలు నేను ప్రస్తావిస్తే, ఆవిడైతే, తన పదో ఏట స్కూల్లో నేర్చుకున్న క్రిస్మసు పాటలు (తెలుగువి) పాడేసారు. ఆవిడా, ఆవిడ తమ్ముడూ, తమ్ముడి భార్యా మాతో అంత ఆదరంగా మాట్లాడ్డం నిజంగా మా అదృష్టమే. ఎందుకంటే, ఆ ఇంటి తలుపు కొట్టేముందు, మా ఆవిడతో, “మనం వాళ్ళని ఈ టైములో కలిసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఆవిడ గాని, వాళ్ళ తమ్ముడి కుటుంబం గాని మనతో సరిగ్గా మాట్లాడకపోతే, అది ఈ టైం వల్లే తప్ప అది వారి స్వభావం కాబోదు.” అని మానసికంగా సిద్ధంచేసి తీసుకెళ్ళేను. నా అంచనా తప్పు అయినందుకు చాలా సంబరపడిపోయాం. ఆరోజు మా అమ్మాయికి (8 Years) నిద్ర ముంచుకొస్తూ ఉంటే ఇంక తప్పక బయలుదేరాం. వాళ్ళు కూడా, ఇంకా మాట్లాడాలని ఉంది అని మనస్పూర్తిగానే అన్నారు. “మీ తమ్ముడుగారి ఇంటికి మళ్ళీ వస్తారు కదా, ఈసారి పగటిపూట వస్తాం” అని నేను అంటే, వాళ్ళతమ్ముడు, “అబ్బే లేదు, రిటైరైపోయాను కదా, నేనే మరో నెలలో హైదరాబాదు అక్కకి దగ్గరగా వెళ్ళిపోతాను” అంటూ నా ఆశలమీద నీళ్ళు చల్లేసారు, పెట్రోలియం కంపెనీ విశ్రాంత డీజీఎం.
దీపశిఖ కథాసంకలనంలో, సోమరాజు సుశీలగారు కోకా కృష్ణమోహన్‌గారి నీతి, నిబద్ధత, నిరాడంబరత గురించి స్మరించుకుంటూ ఒక ఒయాసిస్సు గురించి అని రాసారు. నేను స్వయంగా చూసిన ఒయాసిస్సు మాత్రం ఇల్లేరమ్మగారే.
నీడ గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
11/05/2019 11:20 am
చిన్నప్పుడు పడ్డ వాతలు చితిదాకా పోవు. ఎవరు ఎంత నీతిమంతులని తర్వాత తెల్సినా, తెలియజేద్దామనుకున్నా సరే. కుర్రాడు బాగా చదివేవాడిని, ఆ డబ్బుల్తో సినిమాకి వెళ్ళావేమో అంటే తగిలే దెబ్బ “అతి” దారుణంగా తగుల్తుంది – రచయిత చెప్పినట్టూ. ఐతే మన మేష్టర్లు మాత్రం తమ నోటికొచ్చిన ప్రేలాపనలు, తమ పరిథిలో తమకి తెల్సిన, నేర్చుకున్న పేలుతూ ఉంటారు. ఒక్కసారి మేష్టారు ఓ కుర్రాణ్ణి కసురుకున్నాక జీవితంలో ఆ మరకని తుడిచేసి ఎప్పుడూ మళ్ళీ అటుకేసి వెళ్ళడం అసంభవం. ” అబ్బే అలా కాదురా నువ్వు బాగ చదూతావని అలా అన్నా” అని ఈ మేష్టర్లు మాటలు మార్చినా సరే. ఎవరో “అతి తక్కువ” కొద్ది మంది తప్ప అసలు మనకి పాఠాలు చెప్పే మేష్టర్లలో ఎవరికీ కూడా కసురుకోకుండా, తిట్టకుండా, కొట్టకుండా స్కూల్లో పాఠాలు చెప్పడం రాదు. వాళ్ల జీవితాల్లో జరిగే కష్టనష్టాలకి కుర్రాళ్ళే కారణం అన్నట్టూ కుర్రాళ్లని కొడుతూ ఏదో పైశాచికానందం పొందుతారనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ స్కూళ్లలో పిల్లల్ని కొడుతూ ఆ కుర్రాళ్ళు తెలివి తప్పి పడిపోవడం లాంటి కథలు రోజూ పేపర్లలో చదూతూనే ఉన్నాం. ఈ కథలో ఉద్యోగం పోయిన నువ్వు అనే కుర్రాడు ఏ మాత్రం బాథ పడాల్సిన పని లేదు. ఎందుకంటే కాంప్లెక్స్ గా ఉన్నది మిగతావాళ్ళు.
అన్నింటికన్న దురదృష్టం ఏమిటంటే – యూ నీడ్ టు గ్రో అప్ అనేది మన అలుసు చూసి అవతలవాళ్లు ఆడుకునే పెద్ద ఆట. అటువంటి స్టీవ్ ని కూడా జీవితంలోంచి తుడిచిపారేయడం చేయాల్సిన మొదటి పని. ఇటువంటి స్టీవ్ లు వెన్నుపోటు పొడిచే గోముఖ వ్యాఘ్రాలు. అది చివరి వరకూ తెలుసుకోకపోవడం కథానాయకుడి చేతకానితనం/అమాయకత్వం తప్ప అతను చింతించాల్సిన అవసరం “అస్సలు” లేదు.
మరో విషయం. అమెరికాలో ఉద్యోగాలు తీసేస్తూంటే, ఎవరింట్లో ఎవరికి కేన్సర్ ఉంది, ఎవరి ఆవిడ కడుపుతో ఉందీ అనేవి అస్సలు చూసుకోరు. తీయ్ రాజా తీయ్ అంటూ కొట్టుకుంటూ పోవడమే.
ఈ కథలో కిందనుంచి రెండో వ్యాక్యం అనవసరం అని నాకు అనిపిస్తోంది. ముల్లులా గుచ్చుకోవాల్సినది స్టీవ్ చేసిన వెన్నుపోటు మాత్రమే. కథ మాత్రం బాగా చెప్పారు. రచయితకి అభినందనలు.
నీడ గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
11/04/2019 10:18 pm
పొద్దెరగని పిచ్చగాడిలాగా వెబ్ జైన్స్ ని వెతుక్కుంటూ వెళ్ళి ముందు కధలు చదువుకోవటం నీకున్న అలవాటేగా! అందుకని ఈమాట కి వెళ్లి ముందు కధల కోసం చూస్తావు. అక్కడ ‘నీడ’ కనపడుతుంది. చదవడం మొదలు పెడతావు.
కాలర్ పట్టుకుని లాక్కెళ్తుంది చివరిదాకా. బాగుందిగా అనుకుంటావు.
కింద కామెంట్లేమన్నా ఉన్నాయా అని చూస్తావు. ఏమి ఉండవు. అందరు నీ లాంటి పిచ్చోళ్ళు కాదుగా అనుకుంటావు. ఫేస్ బుక్ కాని చోట్ల చాలమంది కామెంట్ చెయ్యడం లేదు అని కూడా అనుకుంటావు. కధ మీద నీ అభిప్రాయం చెప్పాలనుకుంటావు. ఈలోపు ఎవరిదో ఫోన్ కాల్ వస్తుంది. కామెంట్ చెయ్యడం గురించి మరిచిపోతావు. వేదిక మరొకటో పరుగులో పడతావు. ఈ సారి ఫేస్ బుక్ లోకి వెళ్తావు. అక్కడ న్యూస్ ఫీడ్ లో Siva పోస్ట్ కనబడుతుంది. ఏమిటా అని చూస్తావు. నువ్వు చదివిన ‘నీడ’ మీద అని అర్ధం అవుతుంది. అర్రర్రరే! అని నాలుక కొరుక్కుంటావు. ఒహో శివ ఈ టపా ని సెకెండ్ పర్సన్ నెరెటివ్ రాసాడుగా, కధని బ్రహ్మానందం గారు రాసినట్టుగా అనుకుంటావు. ‘బాగుంది’ అని నవ్వుకుంటావు. తన టపాలో శివ “తల గోక్కోవటం” చూసి కింద కామెంట్ లో జవాబు టైపుదామనుకుంటావు. కాని అప్పటికే కింద కామెంట్స్ లో ఆ కధ రాసిన బ్రహ్మానందం తమాషాగా తన కామెంట్ ని కూడా సెకండ్ పర్సన్ లో పోస్టేసి ఉంటాడు. అరే ఇదేదో బాగానే ఉందిగా అనుకుంటావు. ఇంకెవరు కామెంటారు అని చూస్తావు. శివ సందేహాన్ని నివృత్తిని చేస్తూ మోహన రావు గారి వ్యాఖ్య కనపడుతుంది. మళ్ళీ ఈమాట కెళ్ళి ఆ కధకింద కామెంట్స్ చూస్తావు. ”లాభం లేదు. ఈ సారైనా కమెంటెసెయ్యాలి,” అనుకుని అక్కడ ఈ పెద్ద వ్యాఖ్యన్ని పోస్టుతావు.
‘నీడ’ కధకులు బ్రహ్మానందంగారు,
ఈ వ్యాఖ్య సెకండ్ పర్సన్ నరెటివ్ అవుతుందా?
చి న
పఠాభి కవిత్వం: మళ్ళీ కొత్తగా కొన్ని ఆలోచనలు గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
10/27/2019 12:46 am
కొంత ఆలస్యంగా చదివినా ఆలోచింపజేసే వ్యాసం చదివానన్న భావన కలిగింది. విశ్వనాథ పఠాభిని అర్థం చేసుకున్నట్టుగా ఇతర సాహితీవిమర్శకులు అర్థం చేసుకోలేదని అనటం కూడ చాలా వరకు సమంజసంగానే అనిపించింది. పఠాభి, ముఖ్యంగా ఫిడేలు రాగాల డజన్ లో అప్పటివరకు వున్న కవిసమయాల్ని చించిచెండాడాడనేది ఇప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు గాని అప్పటి విమర్శకులు ఎక్కువమంది ఆ రచనలకి ప్రేరకాలు, కారణాలు అన్వేషిస్తూ రకరకాల నిర్హేతుక ప్రతిపాదనలు చెయ్యటం వాస్తవం, చినవీరభద్రుడు గారు అలాటి చాలా ప్రతిపాదనల్ని ఇక్కడ ప్రస్తావించారు కూడ.
ఐతే, నాకు రెండు విషయాల్లో ఈ వ్యాసం అసంపూర్ణంగా అనిపించింది. ఒకటి – విశ్వనాథ ప్రతిపాదనకి, తను చేస్తున్న ‘గ్రోటెస్క్’ అన్న ప్రతిపాదనకి సంబంధం వివరించకపోవటం, రెండు – అసలు గ్రోటెస్క్ లిటరెచర్ అంటే ఏమిటో, పఠాభి రచనలు ఆ కోవలోకి ఎందుకు వస్తాయో వివరించక పోవటం.
ఆన్ లైన్ లో వెదగ్గా కనిపించిన అనేక చోట్లలో, ఈ కిందిది నాకు ‘గ్రోటెస్క్ లిటరెచర్‘కి మంచి క్లుప్తమైన వివరణలా అనిపించింది – The Grotesque is both an artistic and literary term, and is a bit difficult to describe, as it is less of a solid definition, and more of a range between a number of different qualities. The Grotesque is primarily concerned about the distortion and transgression of boundaries,be they physical boundaries between two objects, psychological boundaries, or anything in between. Exaggeration also plays a role.
There are two main ways to define something as Grotesque, as evidenced by the diagrams: The Grotesque fits in between the real and the fantastic (non-real). The Grotesque simultaneously fits somewhere between being funny and being frightening. (This is a bit more difficult to gauge, as what is funny to one person is frightening to another, so maintaining a bit of an open mind is helpful).
వ్యాసకర్త ‘డిస్టార్షన్’గురించి చాలా చెప్పారు కాని గ్రొటెస్క్ గురించి అంతగా మాట్లాడలేదు ఎందుకో మరి. అలాగే వారు చెప్పిన డిస్టార్షన్ కూడ పైన వివరణలో చెప్పిన సరిహద్దుల డిస్టార్షన్ కాదు. ఆ వివరణలో వున్న రెండు లక్షణాల గురించి ఎలాటి ప్రసక్తి కూడ రాలేదు. ఇక విశ్వనాథ ప్రతిపాదనకీ ఈ వ్యాసకర్త చెప్పిన డిస్టార్షన్ కీ సంబంధం గురించి ఒక్క ముక్క కనిపించదు.
నాకు వారితో ప్రత్యక్ష పరిచయం లేదుకాని చినవీరభద్రుడు గారు పేరున్న సాహితీ విమర్శకులని విన్నాను. వారు ఎలాటి పాఠకులని ఉద్దేశించి ఈ వ్యాసం రాశారో కూడ తెలియదు (నేననుకుంటున్నది ఇంకెక్కడో ప్రచురితమైన వ్యాసాన్ని ఇక్కడ పునఃప్రచురించారని). కనుక వారు ఈ పత్రికని చూస్తే వారికి నా మనవి – వారి దృష్టిలో గ్రొటెస్క్ కవిత్వం ఏమిటో, ఆ భావానికి విశ్వనాథ ప్రతిపాదనకి సంబంధం ఏమిటో, సామాన్యంగా గ్రొటెస్క్ రచన అనే పదానికి వున్న డెఫినిషన్ కి వారిది భిన్నమైతే ఎందుకు అలా చేయవలసివచ్చిందో కొంతైనా వివరిస్తే ఇంకా సంతృప్తికరంగా వుంటుందని. కవిత్వానికి తర్కం అక్కరలేదు గాని సాహిత్యవిమర్శకి తర్కం అత్యవసరమని నమ్మే నా లాటి వారికి మార్మికత కన్న తార్కికత ఉంటే బాగుంటుందని.
త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గానప్రతిభ గురించి lyla yerneni గారి అభిప్రాయం:
10/26/2019 7:03 pm
అటువంటిదేమీ లేదు. ఒకరిని గురించి చెప్పాలంటే మరో ఇద్దరో ముగ్గురో ‘సమ ఉజ్జీల’ గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. అప్పుడు ఎవరో ఒకరిని తక్కువ చేసినట్టు, కొందరికి అనిపిస్తుంది.
ధర్మరాజు, భీముడు, అర్జునుడు – అవటానికి అందరూ ఇంద్రులే. కాని వారిలో ఎంతెంత తేడాలు! ఎవరు ఎక్కువ తక్కువ కాకపోయినా, ఆ తేడాలబట్టి, మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టులవుతారు.
ఒకప్పుడు కవిత్రయం కన్నా, నాచన సోముడు గొప్పవాడని కొందరు పండితులకు అమాంతంగా ఎందుకో అతని మీద ప్రేమ పుట్టుకు వస్తే, ఎందుకు కాదో రాళ్లపల్లి రచనల్లో చెప్పారు. నేను చదివిన రెండు వ్యాసాలలో ఆయన మాటలలో -సోమన దూషణ నాకు కనిపించలేదు. పొగడ్త కూడా కనిపించలేదు. నాచన సోమన రచనాస్వభావపు విశ్లేషణ ఎంతో బాగా చేసారు అనిపించింది. రాళ్లపల్లి రచనలో హాస్య ప్రియత్వం ఉంటుంది. He has an inner laughter.
త్యాగరాజుపై ఈ వ్యాసం నాకు నచ్చింది. చాలాసార్లు చదివాను. ‘త్యాగయ్య గారి నాద సుధారసం’ అన్న వ్యాసం (ఉపన్యాసం) కూడా చాలా బాగున్నది. అందులో త్యాగరాజు -రామభక్తి, కవిత, గానం, ఈ మూడింటి తత్త్వం గురించి రాళ్లపల్లి ఆలోచనలు ఎంత వివరంగా ఉన్నవో. ఆ వ్యాసం రాయటం ఇంకా కష్టం అనిపిస్తుంది. రెండు వ్యాసాలూ ఒకదాని వెంట మరోటి చదవాలి. అదింకా మంచిపని.
ఆ మరో వ్యాసం చివరలో రాళ్లపల్లి ఇలా అన్నారు. “..కవిత్వం రసింపగలిగితే తెలుగు తెలిసిన వారానందిస్తారు. కాని త్యాగయ్య గారి నాద సుధ దొరికితే – హిందువులే కాదు మనుష్యజాతే తరించి పోతుంది..” ఇంకా బాగా లేదూ! కాని ఆ నాదసుధ కూడా కొంతలో కొంత అది భారతీయతతో ముడిపడి ఉంది.
ఏమైనా, వినగా వినగా; ‘పాలారగించరా’ అనో ‘తులసీదళములతో’ అనో, వాగ్గేయకారుడు కవిత్వం రాస్తే, సంగీతపు సంగతులు వేస్తే, అవి వేరే మథన, వేరే రసన; అంతేకాని విగ్రహాలమీద కడవలతో పాలు పొయ్యటం, తులసి ఆకులు తుంపుకు వచ్చి నెత్తినో కాళ్లమీదో ఉంచటం మాత్రం ఈ కవిత్వపు, సంగీతపు ఉద్దేశం కాదు, అని అంతమట్టుకైనా నాకు తెలిసింది. అది తెలియనివాళ్లు, ఆ మరో విధమైన తెలుగుతనం, భారతీయత గలవాళ్లు ఇప్పటికీ లక్షలు.
-Lyla
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
10/07/2019 8:18 pm
చాలా చక్కటి వ్యాసపరంపరని రాశారు నారాయణరావు, శ్రీనివాస్ గార్లు. దీని వెనక ఎంతో పరిశ్రమ వుంది. దీన్లో ఎంతో పనితనం వుంది.
ఐతే గమ్యం ఏదో ముందుగా ముచ్చటగా చెప్పివుంటే ముందు రెండు భాగాలూ ఇంకా తేలిగ్గా అర్థమై వుండేవి (బహుశా ఎక్కడికి చేరతారో మొదలెట్టినప్పుడు వారికి విస్పష్టంగా తెలియక పోయి వుండే అవకాశమూ లేకపోలేదు). ఏమైనా, నాకర్థమైంది ‘కవితలు, కథలు, ఇతర కల్పిత రచనలు కాని’ రచనల్లో రాసే తెలుగు గురించి చాలా కూలంకష చర్చ చేసి ఇప్పటి దుస్థితి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారని. కల్పనా రచనల మీద ఎలాటి ఆంక్షలూ పెట్టటం మంచిది కాదని స్పష్టంగా వివరించారని. ఐతే మాట్లాడే తెలుగు ఎలా వుండాలనేది ఈ వ్యాసాల పరిధి లోకి రాలేదు, నాకర్థమైనంత వరకు. మొత్తం మీద, చాలా విస్తారంగా మొదలైన చర్చ కొంత ఇరుకైన గమ్యాన్ని మాత్రమే చేరిందేమో అనిపిస్తుంది.
ఐతే, అకల్పితరచనల భాష గురించి ఇంత లోతైన పరిశోధన, లోచూపు, విస్తారం వున్న ఈ పరంపరని ఇన్నాళ్లుగా కొనసాగించిన వ్యాసకర్తలు అభినందనీయులు. తెలుగు మీద (ఇంకా) మమకారం వున్నవాళ్లకి ఇది అవశ్యపఠనీయం.
పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను, ఒక తేలికైన mathematical model ని ఉపయోగించి ఇంక ఏడు తరాల్లో తెలుగు భాష కేవలం విద్యావిహీనులు మాట్లాడే భాషగా మాత్రమే మిగుల్తుందని నేనో వ్యాసం రాశాను. చాలా మంది నా మీద విరుచుకు పడ్డారు కూడ. కాని ఇప్పుడు అది బహుశ దురాశాపూరితమైన అంచనా అని, అంతకాలం కూడ పట్టకపోవచ్చునని అనిపిస్తున్నది. తెలుగు మాట్లాడటం వెనకబాటుతనానికి గుర్తని, ఇంకే భాషలూ రాని వాళ్లకి మాత్రమే తెలుగు గతని చాలామంది విద్యావంతులైన తెలుగు వాళ్ల అభిప్రాయమని నా అభిప్రాయం. తెలుగు మనకి గర్వకారణమని భావించి, తెలుగువాళ్లు తెలుగు లోనే మాట్లాడే స్థితి కలగాలంటే, ఎవరో ఒక సినీ ప్రముఖుడు నడుం కట్టి ఉద్యమం నడిపిస్తే తప్ప సాధ్యం కాదని నాకనిపిస్తున్నది ఇప్పటి పరిస్థితుల్లో. కర్ణాటకలో రాజ్ కుమార్ నడిపిన ఉద్యమం గుర్తొస్తున్నది ఈ సందర్భంగా. అలా కాకుండా ఏదో కొద్దిమంది ఎంత అరిచిగీపెట్టినా తెలుగు వాళ్లు అవకాశం ఉంటే తెలుగు తప్ప ఇంకే భాషనైనా మాట్లాడతారు తప్ప తెలుగుని కాదు.
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి Dr. I.A.P.S. Murthy గారి అభిప్రాయం:
10/07/2019 1:49 am
>>ఈనాటి తెలుగు వచనం
క్రమక్రమంగా ఈ ఉద్యోగాల్లో తెలుగు మీద ఏ విధమైన పట్టు లేనివాళ్లు, అంతో ఇంతో ఇంగ్లీషు మాత్రమే చదువుకున్నవాళ్లు చేరారు. దీని ఫలితంగా తెలుగు పత్రికల్లో భాష ఇటు తెలుగూ కాని, అటు ఇంగ్లీషూ కాని ఒక విలక్షణమైన స్థితికి చేరుకుంది. ఇంగ్లీషుకి సమానమైన ఏ తెలుగు మాటా వెంటనే తోచకపోతే, ఆ ఇంగ్లీషు మాటనే వాడెయ్యడం ఈ కొత్త ఉపసంపాదకులు అలవాటుచేసుకున్న పద్ధతి……
తెలుగు భాష – నేటి స్థితి
ఆంధ్రరాష్ట్రాలలో ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగుని గమనిస్తే అనేకవిధాలుగా భాష భ్రష్టుపట్టి పోతోందనిపిస్తూంది. పేలవమైన ఉచ్చారణ, మితిమీరిన పరభాషాపదప్రయోగం, లిపి దోషాలు / ముద్రారాక్షసాలు, అస్తవ్యస్తమైన వ్యాకరణం / మాటలకూర్పు లాంటి లక్షణాలతో జనబాహుళ్యంలో మనభాష ఎన్నోవిధాలుగా సతమతమౌతోంది. సినిమాలూ టీవీలూ పత్రికలూ FM రేడియోలూ తెలుగుభాషకు ఈ స్థితి పట్టడానికి తమవంతు సాయం చేస్తున్నాయి. వాణిజ్య ప్రకటనలలో వాడుతున్న తెలుగుకైతే దౌర్భాగ్యం దాపురించింది.
వీటి గురించి కొంచెం:
1. ఉచ్చారణ:
ముక్యమంత్రి, ఆసాబావం, ఆర్దికసాకా మంత్రి, ప్రస్న, గనవిజయం, అద్యక్షుడు, మద్యాహ్నం, అబ్యర్ది, … చేసారు, స్రీకాకులం, తెలంగానా, వరద ఉద్రుతం, దీపావలి… ఇటువంటి ఘోరమైన ఉచ్చారణలు తెలుగు దృశ్య, శ్రవణ మాధ్యమాలలో కోకొల్లలు. సినిమా హీరోలను మొదలుకొని గుళ్లలో పూజారులది కూడా ఇదే తంతు. హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పేవాళ్లు వేరే ఉంటారు కనుక, వీళ్ల ఉచ్చారణ కొంత నయం. సీనియర్లైన సుమ లాటి వాళ్లు కూడా ఇటీవలి కాలంలో అడపాదడపా ఒత్తుల్ని విస్మరిస్తూండడం విచారకరం.
చక్కగా ఒత్తులు పలికేవాళ్లు రానురానూ తగ్గిపోతున్నారు.
‘చ’, ‘జ’ ల దంత్యాక్షరాలను కంప్యూటర్ పై రాయడం తెలియలేదు. అచ్చులో లేకపోయినప్పటికీ, వీటి దంత్యాలకూ తాలవ్యాలకూ తేడా తెలిసి మాట్లాడేవాళ్లు చాలా తక్కువమంది. ఇది పక్కన పెడితే, ఈ అక్షరాలను అదొక విధంగా పలకడం కొందరికి పరిపాటిగా మారింది.
2. లిపి
పదిమంది చూడాలని పెట్టిన బోర్డుల్లో రాస్తున్న లిపి గురించి ఎవరికైనా తెలుసునా, తెలిస్తే పట్టించుకుంటున్నారా అనిపిస్తుంది. చూపే సదుపాయం ఉంటే ఇందుకు నిదర్శనంగా కొన్ని చిత్తరువులను పెట్టేవాడిని.
విశాఖపట్నంలో కానీ, హైదరాబాదులో కానీ, దుకాణాలముందూ వాహనాలపైనా ఇతరత్రా కూడా రాసిన తెలుగులో, నాలుగింట మూడువంతులు తప్పులతో ఉండడం చూడవచ్చు. మిగతా భాషలలోని వ్రాతని పరికిస్తే ఒక్క తప్పు కూడా దొరకదు.
ముద్రారాక్షసాలకి మరొక కారణం – ముఖ్యంగా ఫ్లెక్సీలలో – కంప్యూటర్లో ఇంగ్లీషు అక్షరాలతో తెలుగు లిపిని తెప్పించడం. ఈ విధంగా తెలుగు బోర్డులు తయారు చేసే వాళ్లకి తగినంత శిక్షణ లేకపోవడం ఒక కారణం కావచ్చు.
ఇంగ్లీషు భాషని తెలుగు లిపిలో రాయడం మరొక జాడ్యం. ఇంగ్లీషు పదాలకి సరైన తెలుగు మాటలు తెలియక ఇలా చేస్తున్నారా?
కొన్ని పత్రికలూ మాధ్యమాలూ స్వతంత్రించి, ‘ఋ’ ని ‘రు’ గా మార్చేశాయి. క్రుష్ణుడు, త్రుప్తి లాటివి రాయడం ఇంకా మొదలయినట్లు లేదు. ‘ఱ’ ఏనాడో కనుమరుగైంది.
3. పరభాషా పదప్రయోగం
ఈ మధ్యకాలంలో మామూలుగా మాట్లాడే తెలుగు వాళ్లెవరూ రంగులూ అంకెలూ వారాలపేర్లూ తెలుగులో వాడగా వినలేదు. బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్, అంకుల్, ఆంటీ, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్: ఇవి చుట్టరికాలు. రైస్, కర్రీస్, పాపడ్, చట్నీ, రసం, కర్డ్, ఇవి భోజన పదార్థాలు. చీర, రవికె, అంచు, పాట, బడి, పరీక్ష, విమానం లాటి పదాలు వినబడటం లేదు. అరకు వేలీ, ఎయిర్ పోర్ట్, టెంపుల్, లెఫ్ట్, రైట్; రాయడమైనా మాట్లాడమైనా అన్నిటికీ ఇంగ్లీషే. కూరలమ్మేవాళ్ల దగ్గర్నుంచి కార్లు కొనుక్కునే వాళ్ల వరకూ ఇదే తీరు.
వంటల కార్యక్రమాలలో ఇంగ్లీషు వాడకం వర్ణనాతీతం. వెజిటబుల్స్ స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చెయ్యడం, బౌల్ లో వెయ్యడం, ఆయిల్, వాటర్, సాల్ట్, సుగర్, బట్టర్ యాడ్ చెయ్యడం, స్టౌ ఆన్ చెయ్యడం (పొయ్యి వెలిగించడం కాదు), మిక్స్ చెయ్యడం, ఫ్రై చెయ్యడం, ఇలాచీలు (ఏలకులు కాదు), సిరప్, టేస్ట్, మచ్చుకి కొన్ని. కొన్ని వాక్యాలలో ఐతే, ఒకటి రెండు తెలుగు పదాలు మినహాయిస్తే, మిగతాదంతా ఇంగ్లీషే. తరగడం, సన్ననిసెగ, కలియ తిప్పడం, కరగబెట్టడం లాటి మాటలు లేనేలేవు. కూరగాయల పేర్లు, పండ్ల పేర్లు, అంకెలు; ఇవేవీ తెలుగులో ప్రస్తుతం వాడుకలో లేవనుకుంటాను. ఆశీర్వాద్ సంస్థ వారు ‘ఆటా’ ని అమ్ముతారు; గోధుమ పిండిని కాదు.
టీవీల్లో సౌందర్యపోషణా కార్యక్రమాలలో వచ్చేవాళ్ల మాటల సోకు చెప్పనలవి కాదు. తెలుగులో అవయవాలే లేవు. అన్నిటికీ ఇంగ్లీషే. ఏవీ పూయరు, రాయరు; అప్లై చేస్తారు.
గమ్మత్తేమిటంటే, పరాయి రాష్ట్రాలవాళ్లు తెలుగులో మాట్లాడితే, తెలుగు వాళ్లకంటే తక్కువ ఇంగ్లీషు పదాలు వాడతారు.
తెలుగు భాషాభివృద్ధికి పాటుబడుతున్నామంటూ సంస్ఠలూ పత్రికలూ నడుపుతున్న రామోజీరావు గారి ‘ఈటీవీ న్యూస్’ తో సహా పత్రికల్లోనూ టీవీల్లోనూ అనేక శీర్షికలు ఇంగ్లీషులోనే ఉన్నాయి.
తెలుగువారికీ మిగతా భారతీయులకీ తేడా ఎక్కడుందంటే, వాళ్ల వ్యావహారిక భాష వేరు, సభాముఖంగా మాట్లాడే భాష వేరు. తమిళులైతే నలుగురిలోనూ / నలుగురితోనూ గ్రాంధికంగా తప్ప మాట్లాడరు. బంగ్లా, మరాఠీ, కన్నడం, మలయాళం, హిందీ మొదలైన భాషా ప్రసంగాలలో పరభాషా పదాలు అతి తక్కువ ఉంటాయి. ఏ స్థాయి వారు సభలో మాట్లాడినా, స్వంత భాషలోని స్వచ్ఛత సొగసులొలుకుతూ ఉంటుంది.
4. అస్తవ్యస్తమైన వ్యాకరణం / మాటలకూర్పు:
తెలుగు వాడకంలో ఈ మధ్య ఎంతో విశృంఖలత్వం చోటు చేసుకుంది.
సెల్ ఫోన్ మాట్లాడుతూ…
హైదరాబాద్, విజయవాడ లో (హైదరాబాద్, విజయవాడ లలో కాదు) …
విపక్షం …
నలుగురు మృతి …
మచ్చుకు కొన్ని. విశదంగా ఉదహరించడం వీలుకాదు.
‘బ్రష్ చేసుకోవడం’, ‘ఆన్ ది వే లో ఉండడం’, ‘లంచ్ చెయ్యడం’ లాటి మిశ్రమ పదజాలాల ప్రయోగం వాడుక భాషలో అలవాటుగా మారింది.
శ్రీ వేంకటేశ్వర భక్తి వాహిని వారి నాదనీరాజనం కార్యక్రమంలో ఎంతో కాలంగా వస్తున్న ఒక వ్యాఖ్యాత, నాలుగైదు పదాలు కూడా ఒక వాక్యంలో సరిగ్గా కూర్చలేకపోవడం శోచనీయం.
ఇవన్నీ చూస్తుంటే, వాడిన భాషను సరిచూసే వాళ్లూ, సరిదిద్దే వాళ్ళూ ఉన్నారా, ఉంటే భాషపట్ల వారికి అవగాహనగానీ ఆసక్తిగానీ శ్రద్ధగానీ ఉన్నాయా అన్న సందేహం కలుగుతుంది.
ఒకప్పుడు ముప్పాళ రంగనాయకమ్మ పత్రికాభాష గురించి రాసిన ‘తెలుగే రాస్తున్నామా?’ అన్న వ్యాసావళిని గుర్తుచేసుకుని పాటించడం ఇప్పుడు చాలా సంపాదకులకి అవసరం.
పతనమౌతున్న తెలుగు భాష తిరిగి ఎలాగ పైకి వస్తుందో తెలియదు. ఒకరిద్దరు పెద్దలకీ పండితులకీ తెలియజేయడం, అభ్యర్ధించడం జరిగింది. సలహాలూ సూచనలూ ఇవ్వడం సులువే. కానీ వాటిని ఆచరణలో పెట్టడం, ఫలితాలు సాధించడం, ఒక బృహత్కార్యం.
‘ఈమాట’ మూలంగా ఎవరైనా స్పందిస్తే సంతోషం.
భవదీయుడు,
ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.
హైదరాబాదు.
జాషువా పిరదౌసి గురించి satyavada venkata subba rao గారి అభిప్రాయం:
10/03/2019 4:51 am
అద్భుతంగా ఉంది. ఇంతకాలము ఫిరదౌసి అంటే జాషువాగారు రాసిన పుస్తకం అని అనుకున్నాను కాని ఇది ఒక కథా కావ్యం అని తెలిపినందుకు ధన్యవాదములు.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
09/14/2019 11:22 am
సాహితి గారు:
ఈ క్రింది మాటలు మీతో పంచుకోవాలని ముందే అనుకున్నా కాని మర్చిపోయా!
“స్వరాలైన జ్ఞాపకాలు”:
పాట సాహిత్యంలో ఉన్న పై పదాలు, మీకు అన్వయిస్తాయి! మీకు తెలియకుండానే మీ జ్ఞాపకాలు స్వరాలైనాయి! మీరు ఆ విషయాన్ని సంగీతపరంగా వ్యక్త పరచలేకపోయారు అంతే.
అభినందనలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
పోగొట్టుకునేవి కొన్ని (ఏ వరసా లేకుండా) గురించి udayarani గారి అభిప్రాయం:
09/02/2019 2:52 am
అవును ఈ కొత్తనేను ను ఇష్టపడటము లేదు కాని తప్పదు కదా రాజీపడటము ఇది పులిమీద సవారి నిజమే–సమర్థనలు సంజాయిషీలు తప్పవు కదా
తీరా నేను విముక్తమయ్యాక! గురించి కె.కె రామయ్య గారి అభిప్రాయం:
08/14/2019 10:13 am
లైలా ఏర్నేని గారూ !
” మమతల తావినై మనసంతా నిండిపోవాలని
పరితపించి పరితపించి పరాజయం పాలయ్యాక
తీరా నేను విముక్తమయ్యాక!
గొంతు ఎండిపోయేలా దుఃఖిస్తూ ”
కలిగించిన గ్లూం నుండి తప్పించుకోవటానికి సతిగా అగ్నికి ఆహుతి అయ్యి తిరిగి పర్వత రాజ తనయగా జన్మించి రుద్రతాండవం చేసి విరాగిగా మారిన తన శివయ్యను చేరుకున్న పార్వతి పాదాలను ఆశ్రయించాను.
తనకు అర్ధం కానిదాన్ని తనకిష్టమైన దానితో పోల్చుకోవటం మానసిక దౌర్భలయం క్రిందికి వస్తుందేమో కదండీ డాక్టర్ లైలా ఏర్నేని గారూ !
మంటో కథలు: సియా హాషియే 1 గురించి అనిల్ అట్లూరి (@AtluriAnil) గారి అభిప్రాయం:
08/14/2019 7:31 am
Good work, and pleasant surprise, Purnima. You have come a long way.
నీ యీ అనువాదం చదువుతుంటే, విముక్తి కధలోని ఈ text జ్ఞాపకం వచ్చింది.
…
రెండూ కంచెల గురించే! కానీ ఒకటి కంచెల గురించి ఆలోచించమంటుంటే…
నేను ప్రస్తావిస్తున్న కధ విముక్తి ఆ కంచెలని, నిలువెత్తు గోడలని పగలగొట్టమంటుంది. మనకి ప్రస్తుతం కావల్సింది, వంతెనలు, నిచ్చెనలు. కంచెలు కాదు. కాని ఆ కంచెలు కట్టడానికే, ” “ఇక్కడ కట్టడాలకు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి.” దుకాణాలు వెలుస్తున్నాయి. ప్రజలు వాటి ముందు బారులు తీరుతున్నారు. ప్చ్.
ఇంద్రగీతమ్ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
08/13/2019 9:30 pm
” భగవాన్ రమణులను గుర్తించి లోకానికి పరిచయం చేసింది మహాతపస్వి కావ్యకంఠ గణపతి ముని. ‘స్వామీ, మీరు భగవాన్ రమణు’ లని గణపతి ముని అనగానే, అలాగే ‘నాయనా’ అని గణపతిమునికి నాయన అనే పేరును స్థిరపరిచారు భగవాన్ రమణులు.
1931-32 ప్రాంతాల్లో భగవాన్‌ను విడిచి నాయన శిరసి, కుళువే, గోకర్ణం, భువనేశ్వర్ ఇలా అనేక ప్రదేశాల్లో పర్యటించారు. తపస్సు చేసారు. అలాంటి సందర్భాల్లో నాయన రమణులకు ఉత్తరాలు రాసారు.
వీటికి 1978లో ఒక పుస్తక రూపం వచ్చింది. భక్తులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అదే ” లేఖల్లో నాయన ” అనే ఫుస్తకం. దీనికి కొన్ని మెరుగులు తోడై 2006లో మలి ముద్రణ వచ్చింది. (ఈ మలి ముద్రణకు కృషి చేసింది న్యూయార్కులోని కావ్యకంఠ ఫౌండేషన్).
ఇందులో నాయన భగవాన్‌ను సంబోధించిన తీరును పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే, ప్రతీ ఉత్తరంలోను ఆయన భగవాన్‌ను భగవాన్ విశ్వగురో అనీ, భగవాన్ లోకాచార్య అనీ కారణగురో అనీ, మాయామానుష్య అనీ, భక్తవత్సలా అనీ-ఇలా ఒక ఉత్తరంలో వాడిన సంబోధన మరో ఉత్తరంలో లేదు. నాయన రమణులకు ఉత్తరాలు ఎక్కువగా సంస్కృతంలో రాసారు. వీటిని ఆనందాశ్రమ లేఖలు అని కూడా అంటుంటారు. మనబోటి వారికి ఆధ్యాత్మిక, తత్వ వివేచనము కలిగిస్తాయి ఆ ఉత్తరాలు. ఇవి గురుశిష్య సంబంధమైనవి.
అదేవిధంగా నాయన వివిధ సమయాల్లో వారి కుటుంబ సభ్యులకూ ఉత్తరాలు రాసారు. ఇవన్నీ ఎక్కువగా తెలుగులోనే రాయడం గమనార్హం.
– వజఝల వేంకట రమణ
లేఖల్లో నాయన
సంకలనకర్త: కీ.శే. గంటి శ్రీరామమూర్తి
పేజీలు: 135.. వెల: రు.80
ప్రతులకు: 1) ఠాగూర్ పబ్లిషింగ్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్
2) శ్రీమతి గంటి రమణి, బెంగుళూరు-76
చరవాణి – 09980936107, 09483163948
తీరా నేను విముక్తమయ్యాక! గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
08/13/2019 2:03 pm
కె. కె. రామయ్య గారు!
కవిత చదివినప్పుడు ముందుగా కలిగిన తలపులు ఏమిటో మీరు చెప్పలేదు కాని; పార్వతి కథ, హిమాలయాల హిమం గురించిన ఆలోచనలు ఈ కవితలో లేవు. కవిత గాని అర్థం ఐఉంటే, మీకు కలిగిన తలపులు జనించే అవకాశం కూడా లేదండి.
The poem’s content is quite contemporary, and has nothing, nothing what so ever to do with Hindu mythology.
Lyla
ఆంధ్రభాష – గ్రాంథిక వ్యావహారికములు గురించి karra srinadh గారి అభిప్రాయం:
08/05/2019 5:27 am
చాలాబాగా చెప్పారు సర్. కాని గ్రాంధికం అంటే ఏమిటొ కూడా ఒక వ్యాస రూపంలో చెప్పగలరు అని ఆశిస్తున్నాను సర్.
నెమలీకలు గురించి వంగూరి చిట్టెన్ రాజు గారి అభిప్రాయం:
07/01/2019 12:07 pm
ఈ వ్యాసం ఇంద్రాణి పాలపర్తి ఇటీవలి ప్రచురణ “కాకీక కాకికి కాక” అనే కథా, వ్యాస సంకలనానికి పి.సత్యవతి గారు వ్రాసిన ముందు మాట. అదే పుస్తకానికి మరో ముందు మాట వ్రాసినది వాడ్రేవు వీర లక్ష్మీదేవి.
ఆ పుస్త్తకం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 78వ ప్రచురణ కాబట్టి ఈ విషయం నాకు తెలుసు. హాయిగా చదువుకుని ఆనందించదగ్గ ఆ పుస్తకం రచయిత్రి దగ్గరా, నా దగ్గరా దొరుకుతాయి. ..
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
05/15/2019 2:23 pm
ప్రసంగం నాకు నచ్చింది. మాట్లాడుతున్నదెవరు! మరి! ‘సారస్వతాలోకము’ అన్న తన వ్యాససంపుటిలో ఒక వ్యాసం లో ‘కావ్యమునకు జీవనము రసము’ అంటూ ‘రసము’ అంటే ఏమిటని తెలియ చెప్పిన వారు. (Pages 99 – 101, నవోదయ పబ్లిషర్స్, హైదరాబాద్.) వీరి ప్రసంగం రసవిహీనంగా ఉంటుందా? No way!
రాళ్లపల్లి తమ ఆలోచనలు, స్పష్టమైన మాటల్లో, స్పష్టమైన చక్కని స్వరంలో చెపుతారు. బయటి ప్రపంచంలో -తను మాట్లాడదలచిన విషయంలో విభిన్నతలు ఉంటే, అవి ఏమిటో వారి ఉపన్యాసం లోనే చెపుతారు. సైంధవి రాగం దక్షిణ భారతంలో మునుపటి నాలుగు రకాల వాడుకలు ఎంత ఓర్పుతో విడదీసి చెప్పారు!
ఈ వక్త, విషయం ఏదైనా అర్థం కాకపోతే కాలేదని చెపుతారు. ప్రసంగం లో ఒకచోట (listen at 3.50 of tape) ‘మ’ ‘పూర్ణంగా’ ఉండాలి అంటే ఏమో నాకు అర్థం కాలేదన్నారు రాళ్లపల్లి. నేననుకోటం, దాని అర్థం, composer is instructing the musician to – Hold the note for its full value. (Tenuto.)
ప్రసంగం లో వసుచరిత్రలోనుంచి ఉదహరించిన పద్యం గురించి:
ఈ ప్రసంగం లో లాగే, చక్కని వివరణలు రాజన్నకవి – (వసుచరిత్ర కవితా విపంచి) వ్యాసంలోను, అలాగే వ్యాఖ్యాన సహితమైన వసుచరిత్ర డిజిటల్ వర్షన్ లోనూ గమనించ వచ్చును. రచయితల అభిప్రాయాలలో చిన్ని తేడాలున్నవి. అన్నీ చదువుకుంటే చాలా సరదా కలుగుతుంది. పద్యం లోని విశేషార్థము బాగా తెలుస్తుంది. సింధుకన్యకలు ఇందులో ముగ్గురు. సింధు ప్రాంతంలో పుట్టిన రాగం, లక్ష్మి, కావ్య నాయిక గిరిక కూడాను. కాని పద్యాన్ని సైంధవి/ సింధూర రాగానికి లక్షణ పద్యంగా ఎవరం అనుకోనక్కర్లేదు. (పాఠక మిత్రులు వసుచరిత్ర కావ్యంలో ఈ పద్యం కన్నా మరో రెండు పద్యాల ముందర, ఒక సీస పద్యంలో – గిరిక, వసురాజుల పెళ్లి అప్పటి ఆర్కెస్ట్రా, పెళ్లి కోలాహలం కూడా వినొచ్చు.)
సంగీత రాగాల పేర్లు, పుట్టుకలు, గుర్తించటాల గురించి:
ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి -అని, ఇప్పుడు ఖరారుగా బతికి ఉన్న ఒక్కొండు రచయితలు పన్నెండు సార్లు చెప్పేకన్నా, ( అదీ ఒక విషయమే అనుకోండి ) ప్రతి పిక్కి పిక్కి స్వర విభేదానికీ ఒక కొత్తపేరు తగిలించే కన్నా ( అదీ ఒక పనే అనుకోండి. ) నా ఉద్దేశంలో – ఏ శాస్త్రం లో నైనా, క్లాసిఫికేషన్స్ బేసిస్ తెలపగలగటం/తెలుసుకోటం ఎక్కువ ఉపయోగకరం. ఉంటాయి విభేదాలు. కాని ప్రతి సంగీతం విషయం గురించి సందిగ్ధతలు మాత్రమే ఉండటానికి సంగీతం రెలిజన్ కాదు కదా? సంగీతం శాస్త్రమయ్యె. ఈ సైన్స్ లోనూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ యా శాస్త్రజ్ఞులు సంభాషించుకోటం వెసులుబాటు కోసం, దానికో సాంకేతిక భాష, విభజన పథకాలుంటం, అవి అవసరాన్ని బట్టి అప్డేట్ చెయ్యబడటం జరుగుతుంది. సంగీత రాగాల ( అలాగే ఛందస్సు) విభజన పథకాల బేసిస్ ఏమిటి అని తెలిస్తే, ‘కొందరు’ ఎవరికి వారే రాగాలు, స్వర స్థానాలు డిరైవ్ చేసుకోగలరు. కొన్ని పాటలు (పద్యాలు) వారే డిజైన్ చేసుకోగలరు.
రవిశంకర్ My music, My Life అన్న పుస్తకం లో (109 వ పేజీ) హిందూస్తానీ రాగాలు (థట్) ప్రధానమైనవి పట్టుమని పది ఉన్నాయని, అవి బిలావల్, కళ్యాణ్, ఖమాజ్, కాఫీ, అసావరి, భైరవి, భైరవ్, పూర్వీ, మార్వా, తోడి – అని తెలిపాడు. ఇది 20 వ శతాబ్ది ‘వి. ఎన్. భక్తఖండే’ ప్రతిపాదించిన విభజన అనీ, దీనికన్న పదిహేడవ శతాబ్ది ‘వెంకట మఖి’ 72 మేళకర్తల విభజన ఉత్తమమైనదని అంటాడు.
In Ravi Shankar’s words (page 30):
“I myself however, as well as a number of other musicians, do not feel that these ten scales adequately accommodate a great variety of ragas. For there are many ragas that use notes not contained in these ten Thats. We therefore think it is more reasonable and scientific to follow the old Melakartha system of the south, because it can almost sustain any raga, no matter how unusual its ascending and descending structures.”
సంగీత విద్వాంసులు రచించిన సంగీతవిషయకమైన గ్రంథాలు, (జీవిత చరిత్రల పోసుకోలు కాదు) కొన్నైనా చదవటం నాకిష్టం. The next book in queue for me is – ‘The infinite variety of music’ by Leonard Bernstein.
అన్నమయ్య పాట గురించి:
అనంతకృష్ణ శర్మ గారు, సైంధవి రాగంలో అన్నమయ్య పాడినట్టు లేదన్నారు. పాడలేదేమో. కాని ఇక్కడ విజయవాడ రేడియోకేంద్రం వారి ఆర్టిస్టులు వినిపించారు.
There you go. Another feather in the cap of Bezwada. Thanks for the lovely broadcast! -Lyla
శ్రీనాథుని చాటుపద్యములు గురించి Bhadrachalam Jagadeeswara Rao గారి అభిప్రాయం:
04/28/2019 8:16 am
మీ సాహిత్య సేవ ఎంతో అభినందదాయకం. నా లాంటి సాహిత్యాభిమానులకు దాహార్తి తీర్చిన మీకు శతకోటి ధన్యవాదాలు. ఈ పద్యాలకు భావాలు కూడా చేర్చగలిగితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది.
మీకు వీలైతే క్షేత్రయ్య పదాలు, వాటి భావాలు కూడా అందిస్తే చాలా సంతోషం.
మీ సేవ గురించి ఎంతో వ్రాయాలని వుంది, కాని అధిక ప్రసంగం అవుతుందేమో…
మీ చిరునామా వివరాలేమైనా తెలియపరిస్తే సంతోషం.
నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
04/17/2019 5:54 pm
చాలా ఆసక్తికరంగా ఉన్నది రచన. పద్యాన్ని నచ్చుకుని మమ్మల్నీ మెచ్చుకోమంటూనే, దాని లోని ముఖ్యాంశం నుండి (భారతీయ మాతల మాతృప్రేమ నిరూపణకు మరో దక్షిణ భారతీయ రచయిత నుండి మరో తిరుగులేని తార్కాణం.) మనసు తప్పించి మరెన్నో ఇతర విషయ చర్చ చేసారు. అలానూ ఆకర్షించారు.
మీ రచన గురించి కొంత ఆలోచించాక, మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ఒక కథ మళ్లీ నిదానంగా చదివాను. కథ పేరు ‘రవిచంద్రిక’. ఆ కథ “ఇది శివుని కథ అనుకునేరు. శ్రీనాథుని కథ” అంటూ మొదలెట్టి ఒక పదిహేడు పేజీలు రాసుకుంటూ పోయి, ద్రాక్షారామం, రాజమహేంద్రవరం, శ్రీశైలం అంటూ, శ్రీనాథుని వ్యక్తిత్వ పరిచయం, చేశాడాయన.
మల్లాది ఆ కథలో – దాదాపు చివరలో, శ్రీశైలం లో ఒక యతీంద్రులు ‘ఈశాన సంహిత’ లోని ‘సుకుమారుని’ చరితం వినిపిస్తున్నప్పుడు శ్రీనాథుడు శ్రోతలలో ఉంటాడు. దాని సారాంశం నచ్చక “ చిత్తశుద్ధిగా చేసిన పాపం శివనామం తుడిచివేస్తుందా? పుణ్యాన బోయేందుకు పాపుల కథలు వినవలెనా?” అని శ్రీనాథుడు అడుగుతాడు.
యతీంద్రుడు అప్పుడు కొన్ని మాటలు సభ హర్షించేట్లు చెప్పి, “ఈ కథను కావ్యంగా రచించమని నీకు ఆదేశించమని శివాజ్ఞ అయినది” అని శ్రీనాథుడికి చెపుతాడు.
శ్రీనాథుడు శివుడు తనను కానిపనులు చెయ్యమని ఆదేశించడని, తరించటానికి కావ్యాలాపం అవసరమా? అని విముఖత చూపితే యతీంద్రుడు “ఇది శివాపరాధం” అంటాడు.
శ్రీనాథుడు మరికొన్ని మాటలు చెప్పి “నాకు పుట్టుకిచ్చినవాడు, నాచేత కవనమల్లించినాడే కాని పాపకర్ముని చెయ్యలేదు. పాపులను వర్ణించేందుకు పలుకీయలేదు. అందుకు తామే సమర్థులని తోస్తున్న”దంటాడు.
మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ఈ కథ నుండి – ‘సుకుమారుడు’ అన్న పాత్ర శ్రీనాథుడు కల్పించింది కాదు, అతని ప్రవర్తనను ఇష్టపడనూ లేదు, తనకూ సుకుమారుడికీ ప్రవర్తనలలో పోలిక ఉందనీ అనుకోలేదు, అతని చరిత (శివరాత్రి మాహాత్యం) మళ్లీ శ్రీనాథుడు రాయనూలేదని, – ఆయన (మల్లాది) చెప్పదలిచారని నాకనిపిస్తూంది. (Ref: రామకృష్ణశాస్త్రి కథలు, నవోదయ పబ్లిషర్స్, విజయవాడ. పేజీలు. 159- 176.)
శ్రీనాథుని పేరిట ఉన్న పుస్తకాలు మరికొన్ని చదవాలని ఉన్నా, అవి తెలుగు పాఠకులకు అందుబాటులో లేవు. విద్వాంసులకే అవి అందుబాటులో ఉన్నట్టు లేవు. మీ ఇక్కడి ఈ రచన చదివాను. ఏల్చూరి మురళీధరరావు గారు రచించిన -‘సిరిమల్లె’ అన్న ఈ-పత్రికలో ఈ నెలలో ప్రచురించబడిన- “శ్రీనాథుని కవిత్వాదర్శం:లక్షణపరిశీలన” – అన్న వ్యాసం చదువుతున్నాను. వారు మొదట్లోనే ‘భీమేశ్వర పురాణం’ అవతారిక నుండి ఒక పద్యం ఇచ్చినారు. నాకు ఆ భీమేశ్వర పురాణం వెంటనే చదవాలని ఉంటుంది. అది దొరకదు. అందువల్ల కొంచెం మనసు కుతకుతలాడుతున్నది. ఐనా సంబాళించుకొని, ఇంతమట్టుకు రాస్తున్నాను.
Thank you. Have a nice day! – Lyla.
వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
03/24/2019 10:59 am
శర్మ గారు మంచి ప్రశ్నే అడిగారు. నేనన్న పదివేల సంఖ్యకి ఆధారం వారిచ్చిన తొలి వచనానికి ముందున్న పద్యం –
“మీటు గల రాజరథికుల
నాటికి వేవుర వధింతు నరుశరములు నో
నాటి పడవైచునంతకు
వేటాడెద ప్రతిబలంబు వీరుల నెల్లన్ ”
రోజుకి వెయ్యిమందిని చంపుతానని స్పష్టంగానే చెప్పాడు భీష్ముడు. తను మొత్తం పదిరోజులు యుద్ధం చేశాడు. అలా పదివేల లెక్కయింది. తను పదిరోజులే యుద్ధం చేస్తానని భీష్ముడికి ముందే తెలుసా అనొచ్చు కాని అలా అంటే నరుడి శరాలే తనని పడవేస్తాయని మాత్రం ఎలా తెలిసిందన్న ప్రశ్న వస్తుంది. అలాగే మీటుగల రాజరథికులు వెయ్యిమంది, మీటులేని మిగతా వాళ్లు మరో తొమ్మిదివేలమందీ కలిపి రోజుకి పదివేలు అనొచ్చు కాని “అట్లుగా నాకయ్యంబు సేయుదివసంబులలోన” అన్న దానికి అన్ని రోజుల మీదా కలిపి పదివేలని నా అభిప్రాయం.
ఇంతటితో ఈ పిడకల వేటని చాలిస్తాను. అసలు విషయం మరుగున పడటం మంచిది కాదు.
త్వరలో మహా భారత నాగరికత పశ్వాధారితమని ఎందుకనుకోవచ్చునో నా ఆలోచనలు తెలుపుతాను. అలాటి విషయాల మీద చర్చ ఆహ్వానించదగింది.
ఈ కథ గురించి M.k.kumar గారి అభిప్రాయం:
03/04/2019 2:07 pm
కథ కాని కథ.
అమానుషి గురించి M.k.kumar గారి అభిప్రాయం:
02/11/2019 2:31 pm
1 కవిత్వం బాగుంది.
2 కంటిపాప దొన్నెల్లొ అని రావాలి.
3. 2 stanzas గందరగోళంగా వున్నాయు
4. చివరి 2 స్టాంజాలు బాగున్నాయి
5. కవిత్వంలో కంటిన్యూటీ దెబ్బ తింది
6. వేటికవే విడివిడిగా వున్నయ్
7. పొయెట్రీలొ లొతు వుంది కాని గతి సరిగా లీదు
8. ఆమనుషి అయున కాలం వెర్రివెంగళప్ప ఎలా అవుతుంది.
9. వెర్ర్రివెంగల్లప్ప పద ప్రయూగం కవితను నీరుగార్చింది.
మంటో కథలు: వంకర గీత గురించి Manohar గారి అభిప్రాయం:
02/05/2019 7:42 am
కాలీ సల్వార్ కధ కీ , ఈ కధకీ సంబంధమే లేనట్టుంది. చాలా మంది ఊహించుకునే, కాని ధైర్యం చెయ్యలేని జీవితం. కాలీ సల్వార్ కధలో అవసరమూ, ఎలాగోలా జీవించాలనే జీవితం చూపిస్తే, వంద వాట్ల బల్బు కధలో ఓపిక నశించిన ప్రతిచర్య (ప్రతీకారం కాదేమో) కనిపిస్తుంది. దీనిలో ఎలా అనుకున్నామో అలాగే బతికే ధైర్యం కనిపిస్తుంది. మూడు కధలూ మూడు రకాలుగా ఉన్నాయి.
thanks for the translation.
నాకు నచ్చిన పద్యం: వరూధిని వగపు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
02/04/2019 3:27 pm
పోతన భాగవతం లోని షష్ఠ స్కంధము పూరణ చేసే కవి, పోతన పద్యాలు మిక్కుటంగా చదివి ఉండాలికదా!
కాటుక కంటి నీరు చనుకట్టుపై పడంగ అన్న పద్యమే ఉండగా శ్రీనాథుడి సరళి ఎందుకతనికి!
(ఓ! అది చాటు పద్యమయ్యె! అది ఎవరి పద్యమో authorship మనకు తెలియదని ‘ఈ మాట’ లో తెలియ చెప్పారుకదా! ఈ, ఈ పద్యాలు ఇవెవరివో మనకు తెలియదు అంటూ జనాలకు కొందరి పద్యాలను -వారి ఆర్టికల్ లో పందేరం చేసిన ఆథర్లకి మాత్రం ఆథర్షిప్ క్రెడిట్ ఇచ్చితీరాలని, భీష్మించే కొందరి పేరడాక్స్ నన్ను నవ్విస్తుంది.)
ఏర్చూరి సింగయ పద్యము సమయం సందర్భం గురించి నాకు అర్థమైనంతవరకు – ఒక బాలుడు విషప్రయోగం వలన మరణించాడు. అది తెలిసిన దాది నేలమీద పొర్లి ఏడ్చి, కేకలు పెట్టింది, ఆ కేకలు విని వచ్చిన తల్లి గుండెలు బాదుకుని ఏడ్చింది.
ఆమె రాజుగారి భార్య. పెద్ద రాణి. మరి ఆమె కన్నులకు, రొమ్ములకు, చేతులకు అలంకారాలు చేసి ఉంటాయి. ఆభరణాలు ఉంటాయి. అకస్మాత్తుగా అవి ఎక్కడకు పోతాయి? ఆమె రొమ్ములు అంతకు ముందు ఉన్నవి అకస్మాత్తుగా మాయమై పోతాయా? అందరి కళ్లనీళ్లు పడ్డచోటే ఆమెవీ పడ్డాయి కదా? ఆమెగారి స్వరం మామూలుగా పంచమం లో ఉంటే, అది మరో మెట్టులోకి అప్పటికప్పుడు ఎలా పడిపోతుంది? బాగా ఏడ్చాక అప్పుడు కంఠం బొంగురుపోతుందేమో.
ఇంతకీ శృంగార సందర్భాలలోని పద్యాలను చదువుకుంటూ, ఎవరి నాయికలు ఎలా ఏడ్చారా అని పోలుస్తూ ఆ పోటీలో ఒక్క కవినే శృంగారపు ‘శిఖరాగ్రం’ ఎక్కించాలి అని రచయిత అనుకుంటున్నారు. మహ చక్కగా చెయ్యొచ్చు. కాని, స్త్రీ కుచములను కేవలం శృంగార భావనలకే వారు అంకితమిచ్చుకుని, పరిమితం చేసుకుని, అవి వేరేచోట్ల, ఇతర కవులు కనిపింపచెయ్యటం అనౌచిత్యం అంటే ఎలా? అది తప్పు ఆలోచన అని నాకు అనిపిస్తున్నది.
నచ్చిన పద్యం గురించి చెప్పే శీర్షికలో, నచ్చని పద్యాన్ని గురించి ఎందుకు చెప్పారా అని సంశయిస్తూ చదివిన నాకు, ఆ నచ్చని కారణాలు సవ్యంగా లేవనిపించినందువల్ల రాసాను, కొన్ని నెలలకిందటి మరో పద్య పరిచయంతో కొంత తగువు ఉన్నది. అక్కడ మరోసారి రాస్తాను.
ఈ శీర్షిక contributing writers ఎవరైనా కాని, చాలా రసవత్తరంగా నడుపుతున్నారు.
Thanks
Lyla
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:
01/21/2019 2:01 pm
మద్దిపాటి గారూ,
కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, డచ్ మొదలైన భాషలు మాట్లాడేవాళ్ళకి కూడా amphiphloic siphonostele అన్నది కొరకరాని కొయ్యే. ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, డచ్ వాళ్ళందరికీ గొప్ప గ్రీక్, లాటిన్ పాండిత్యం ఉందని కాదు. గ్రీక్, లాటిన్ వాడకపోతే వాళ్ళకి కూడా మొత్తం అర్ధాన్నిచ్చే సంక్షిప్తమైన పదం వాళ్ళ భాషల్లో లేదు. కాబట్టి, వాళ్ళు కూడా అవసరం కొద్దీ మాత్రమే వాడతారు. మెల్లమెల్లగా అలవాటు పడతారు. కొత్తపదాల్ని నేర్చుకున్నట్టే ఈ పదాల్ని కూడా నేర్చుకుంటారు. వీలైతే ‘pseudopodia’ లాంటి గ్రీక్ పదానికి సులువైన అనువాదం కుదిరినప్పుడు “False Feet” అని రెండో అర్ధం చెప్పుకుంటారు.
amphiphloic siphonostele లాంటి పదాలు యథాతథంగా తెలుగులో రాసెయ్యాలా? లేకపోతే సంస్కృతభాషలోకి తర్జుమా చెయ్యాలా? అన్నదానికి అప్పటి అకాడెమీ సభ్యులు సంస్కృతభాషలోకి తర్జుమా మంచిది అని ఆశించి ఉండవచ్చు.
యురోపియన్ భాషలవాళ్ళకి గ్రీక్ లాటిన్ గతి అయితే, మనకి సంస్కృతం గతి అయింది. అంతేకాని, ‘బద్ధకం, నిర్లక్ష్యం, అంతకు మించి తెలుగుకు చేసిన (చేస్తున్న) ద్రోహం’ ఏమీలేదు. తెలుగుకున్న పరిధులవల్ల ఇలా చెయ్యకతప్పలేదు. అంతకన్న బాగా చెయ్యలేమా అంటే, చెయ్యచ్చేమో. అకాడెమీ పుస్తకాల్ని విమర్శించినవాళ్ళే గాని, మంచి పదజాలంతో పుస్తకాలు రాసినవాళ్ళు లేరు. ఎందుకంటే వాటికి అమ్మకాలుండవని మనరచయితలకి తెలుసు.
మొదట్లో పరిభాషని standardize చెయ్యడానికి ఎన్ని కష్టాలు పడ్డారో గమనించగలరు.
ఎన్నో గ్రీక్ లాటిన్ పదాలు మనభాషలో సొగసుగా ఒదిగిపోతే అలాగే వదిలేసారు.
ఉదాహరణలు: రేడియో ధార్మికత, క్వాంటీకరణం etc.
ఏ శాస్త్రాధ్యయనంలోనైనా, పరిభాషని నేర్చుకోక తప్పదు.
బహుభాషారాష్ట్రాలున్న భారతదేశంలో మాతృభాషల్లో విద్యాబోధన జటిలమైన పని. 90% ఉద్యోగాల్లో మాతృభాషని వాడలేము. అందువల్ల ఈ ప్రక్రియకి ఆదరణ లేదు.
అన్నిటికన్నా విచారించవలసిన విషయమేమిటంటే, 70వ దశకం వరకూ, తెలుగువాళ్లకి పిండిపదార్ధం, మాంసకృత్తులు, జీర్ణకోశం, లాలాజలం, కాలేయం, ప్లీహం లాంటి పదాలు చక్కగా అర్ధమయ్యేవి. ఇప్పుడు మంచినీళ్ళు, ఉప్పు, చక్కెర లాంటివి కూడా కొందరికి అర్ధంకావటల్లేదు.
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి ఎన్. కుమార్ గారి అభిప్రాయం:
01/03/2019 8:47 am
ఈ వ్యాసమూ ఇంతకుముందు వచ్చిన వ్యాసమూ చదివాక ఇవి కొన్ని confused premises మీద కట్టినవని అనిపిస్తోంది. చదువుతుంటే నాకు స్ఫురించిన కొన్ని సంగతులు చెబుతున్నాను.
— తెలుగులో శాస్త్ర పరిజ్ఞానం వృద్ధి చెందటానికి తగిన వ్యాకరణయుక్తమైన ఆధునిక రచనా పద్ధతి అవసరాన్ని వ్యాస రచయితలు నొక్కి చెబుతున్నారు. అలాగే దాన్ని అడ్డుకొన్నది గిడుగువారి వ్యావహారిక వాదం అంటూ గిడుగును దించి చిన్నయను పైకెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగులో ఆధునిక శాస్త్ర పరిజ్ఞాన వృద్ధిని ఆపుతున్నది గిడుగు ఆదిగా మొదలైన వ్యవహారిక దృక్పథం కాదు కదా. గిడుగు తదనంతరం వ్యాప్తిలోకొచ్చిన వ్యావహారిక తెలుగు వచనానికి శాస్త్ర పరిజ్ఞానాన్ని వ్యక్తం చేయగలిగే చేవ ఉన్నది. ఈ విషయంలో ఇబ్బంది వాక్యరణం కాదు. అంతకుమించినది- పరిభాష లేకపోవటం. ఈ పరిభాషకూ, వ్యాకరణానికీ ఏమీ సంబంధం ఉన్నట్టు తోచటం లేదు. (ఉదాహరణకి, మాట్లాడే మామూలు భాషలోనే, పెద్ద పద్ధతైనదిగా ఏమీ తోచని వాక్య నిర్మాణంతోనే/ శైలితోనే ఈ వ్యాసం చక్కగా కొత్త ఆలోచనల ప్రతిపాదనకు పూనుకున్నది కదా–పోనీ ఇది పక్కనపెట్టి వెల్చేరు ప్రసిద్ధ గ్రంథమే తీసుకున్నా.)
— ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పొదువుకొనే వచనం తెలుగులో ఎదగకపోవటానికి కారణం గిడుగు మీదకు నెడుతున్నారంటే, వ్యవహారంలో వున్న భాషను రచనలోకి తెచ్చుకొనే స్వేచ్ఛను తప్పుబడుతున్నారని అనాలి (అదే గిడుగు చేసింది కాబట్టి).
— గిడుగు ఉద్దేశంలో మాట్లాడే తెలుగు వాడాలీ అంటే “What did you do” అన్నది “వాడ్డిడ్జుడూ” అన్నట్టు రాయమని కాదు, అంటే “పలికే తీరులో” రాయమని కాదనుకుంటాను. మాట్లాడే భాషలో ఉండే syntactic libertiesనూ, పదాలనూ రాసే భాషలోకి తీసుకోవచ్చని ఆయన ఉద్దేశం. ఆయన మాట్లాడుతున్నది- పదాలు పలికే తీరు గురించి కన్నా, పలుకుబడిలోని వాక్యాలకుండే syntax గురించీ, పలుకుబడిలో మాత్రమే వినిపించే (అప్పటిదాకా రాతలో కనిపించని) పదాల గురించీను. వాటిని రచనలోకి తీసుకురావాలన్నది ఆయన ప్రతిపాదన. మరి అదేమీ వ్యాస రచయితలు వాంఛిస్తున్న “ఆధునిక గ్రాంథికా”నికి అడ్డు కాదే? పైపెచ్చు దాని వల్ల ఆ రచనలోని ఆలోచనల వ్యాప్తికి అవకాశం విస్తృతమవుతుంది కూడాను.
— అసలు గిడుగు ఒక పూర్వనిర్దేశిత నియమాలు ఉండరాదూ అని చెబుతున్నది సృజనాత్మక రచనలకేగాని, శాస్త్ర గ్రంథాల విషయంలో కాదు కదా. ఇదే సంచికలో టేకుమళ్ళ పుస్తకానికి ఆయన రాసిన ముందుమాటలో: “కథలూ, నాటకాలూ, పాటలూ ఇంకా ఇటువంటి రసవద్రచనలు చేసేవారు, ప్రతిభావంతులైతే, పురాణపద్ధతులు అవలంబించరు. వారి రచనలో ‘వ్యక్తిత్వ’ముంటుంది. అద్దెచీట్లు, క్రయచీట్లు, ఒడంబడికలు, ప్రభుత్వంవారి శాసనాలూ, ప్రకటనలూ ఇటువంటివి Standard భాషలో ఉంటవి.” అని ఆయనే చెబుతున్నారు కదా. ఈ తోవలోనే కదా ఆ శాస్త్ర గ్రంథాలూ వచ్చేది. అయితే అదికూడా పూర్తిగా కాదు. శాస్త్ర గ్రంథాలకూ వ్యక్తిత్వం ఉండకుండా పోదు (పాఠ్యపుస్తకాలను, పరిశోధనా పత్రాలనూ మినహాయిస్తే.)
— అసలు ఇంగ్లీషులోనైనా మరే భాషలోనైనా తాత్త్వికులు, శాస్త్రవేత్తల గ్రంథాలు ఒకే స్టయిల్ మాన్యువల్‌ని పాటిస్తున్నాయని వ్యాస రచయితలు ముందు నిరూపించగలిగే బాగుంటుంది. సృజనాత్మక రచనలో రచయిత ప్రత్యేక శైలి ద్యోతకమైనట్టే తాత్త్వికుల, శాస్త్రవేత్తల రచనల్లోనూ ద్యోతకమవుతుంది. అదేమీ లేకుండా ఒట్టి స్టయిల్ మాన్యువల్ శైలిలో పొడిగా రాసే రచనలు బహుశా ఇక్కడ డాక్టరేట్ల కోసం రాసే గ్రంథాలలాగే ఉంటాయి తప్ప, వాటికి ఆలోచనల్ని ముందుకు తీసుకుపోయే చేవ ఉండదు. ఏ ఒరిజినల్ థింకర్ కైనా తన శైలి ఉంటుంది.
— చిన్నయసూరిని గిడుగు వ్యతిరేకించింది కూడా గ్రాంథికపు సింటాక్సు విషయంలో కాదు, గ్రాంథికపు పదజాలం విషయంలో అనుకుంటాను. దీనికి ఫలితరూపమైన వచనం ఒకవేళ గిడుగు దగ్గరే కన్పించకపోతే అందులో ఆయన వాదానికి వచ్చిన లోటేమీ లేదు. ఆయన ప్రయత్నాలు సఫలించిన వైనం మాత్రం తర్వాత తెలుగులో చలం ఆదిగా కొడవటిగంటి మీదుగా ఆ తర్వాతి రచయితలు, నేటి రచయితల ఎందరి రచనల్లోనో కనిపిస్తోంది. చలం వాక్య వైభవం చిన్నయసూరి నీతిచంద్రికలో వాక్యాలకన్నా మెరుగ్గానే ఉంటుంది. ఇక ఈ కథలూ, నవలలూ, కవితలూ రాసుకునే భాష ఆలోచనలు తయారు చేసుకునే భాషగా మారకపోవటానికి గిడుగు పెట్టిన అడ్డేమీలేదు. తెలుగు లోకంలో ఆలోచనాపామరత్వానికి మనం వేరే కారణాలు వెతకాలి. బహుశా విద్యా వ్యవస్థ, గ్రంథాలయ వ్యవస్థల వంటివి సరైన రీతిలో ఎదగకపోవటంలో వెతకాలి. వ్యావహారిక భాష అడ్డురాగా ఆలోచనలు కుంటుపడిపోయిన ఆలోచనాపరులు ఎంతమందో మరి నాకనుమానమే!
— మనక్కావాల్సింది సింటాక్టికల్ లెవెల్లో ఆధునిక గ్రాంథిక భాష అని అనుకున్నప్పుడు ఇక పదాల లెవెల్లో మాత్రమే వ్యాకరణం గురించి మాట్లాడాడని వ్యాస రచయితలే చెబుతున్న చిన్నయసూరి ఎందుకు పనికివస్తాడు? ఆ గ్రాంథికపు పదజాలం తీసివేస్తే చిన్నయలో ఉన్నపాటి సింటాక్టిక్ రిఫైన్మెంటు కొడవటిగంటిలో కనిపించదా? చిన్నయకు ముందువున్న నేపథ్యంలోనుంచి చూస్తే చిన్నయ ఎంతో ప్రకాశవంతంగా కన్పించవచ్చు. ఆయన పాదుకొల్పిన వాక్య నిర్మాణ ఒరవడికి గిడుగు ఇచ్చిన వ్యావహారిక పదజాల స్వేచ్ఛ తోడయ్యాకా, ఆ రెండూ కలిసి రియలైజ్ అయ్యాకా వచ్చిన వచనం ముందు చిన్నయ్య, గిడుగు ఇద్దరూ తేలిపోతారు–ఒకవేళ మనకు కొత్తేదైనా రోతే అన్న మౌఢ్యం అనాలోచితంగా ఉంటే తప్ప.
— “మేం సృజనాత్మక సాహిత్యం గురించి కాదు మాట్లాడుతోంది, ఇతర వచనం గురించి” అంటారా? గిడుగు ఆలోచనలు సృజనాత్మక వచనాన్ని ఎన్నో శృంఖలాల నుంచి తప్పించాయన్నది విశదమైన విషయం. ఆయన సంకెళ్ళు వదులు చేసాకనే భాష ప్రజాస్వామికమైంది. గత మూడు దశాబ్దాలుగా బ్రాహ్మణేతర, ముఖ్యంగా వెనుకబడిన కులాల సంస్కృతి రచనలో ఆవిష్కృతమవుతున్నదంటే గిడుగు తొలిచిన దారి మహిమే. నాగప్పగారి సుందర్రాజు ‘మాదిగోడు’ కథలు ఒక గొప్ప సంభవం కాదూ? అది అంతకుముందు అన్ని వందల ఏళ్ళ తెలుగు పుస్తకాల్లోనూ ఆవిష్కృతంకాని ప్రపంచం కాదూ? అదెలా సాధ్యమైందంటారు? విద్య గ్రాంథికాన్ని వీడి వ్యావహారికంవైపు మరలటం వల్ల కాదూ? మరి అదెలా సాధ్యమైందంటారు? గిడుగు వల్ల కాదూ? తెలుగు సాహిత్యం కొన్ని శతాబ్దాలుగా సాగుతూ వచ్చిన వైనానికి (ఒకే వర్గం చేతిలో చిక్కుపోయిన వైనానికి) స్పీడు బ్రేకులు వేసే సాహిత్యం గత రెండు దశాబ్దాలుగానే వస్తోంది. గిడుగు ప్రభావం అంచెంలంచెలుగా వెదజల్లిన ప్రభావానికి ఫలితమే అది.
— గిడుగు అందించిన స్వేచ్ఛని సృజనకారులు అందిపుచ్చుకున్నట్టు, ఇతరేతర విభాగాల్లోని (చారిత్రక, శాస్త్రీయ, తాత్విక) రచయితలు అందిపుచ్చుకోకపోవటానికి కారణం ఆయన కాదు. సృజన మనసులోంచి పుడుతుంది. దానికి వేరే వ్యవస్థల దన్నూ ప్రాపకం మరీ అంతగా అవసరం లేదు. శాస్త్రపరమైన ఆలోచనలకు విద్యా వ్యవస్థ, ముఖ్యంగా గ్రంథాలయ వ్యవస్థ, ఇతరేతర సంస్కృతీ దన్నుగా నిలవాలి. ముఖ్యంగా ఇప్పటిలా తుప్పుపట్టిపోకుండా స్వేచ్ఛగా ఆలోచనల మారకం జరిగే విశ్వవిద్యాలయాల్లాంటి ఆవరణలు కావాలి. అవి తగినవిధంగా లేకపోవటమే ఆలోచనారంగంలో తెలుగు వెనుకబాటుకి కారణం తప్ప, గిడుగు వ్యవహారిక వాదం కాదు.
వనమయూరము గురించి మోహన గారి అభిప్రాయం:
01/02/2019 12:55 pm
నాలుగు శీరుల (గణముల) వృత్తములయందలి ఒక ప్రత్యేకత వనమయూరమును బోలినది. దీనిని ఎనిమిదవ శతాబ్దములో తిరుజ్ఞానసంబందర్ తేవారములో కొన్ని పద్యములుగా వ్రాసెను. అందులో నొకదానిని క్రింద ఇచ్చినాను. ఇది చివరి క్షణములలో నేను చూచినాను. అందువలన వ్యాసములో ఉంచడానికి వీలు లేక పోయినది.
నాలుగు శీరుల వృత్తపు అమరిక – కూవిళంగాయ్/కూవిళంగాయ్ – కూవిళంగాయ్/తేమా
కూవిళంగాయ్ – నేర్-నిరై-నేర్ – గో-ధన-గో – UIIU, UIUU, UIII, UIUI
తేమా – నేర్-నేర్ – గో-గో – UU, UI
ఈ అమరికలో కూవిళంగాయ్ గణమునకు UIII, తేమా గణమునకు UU ఎంచుకొనబడినవి. అక్కడక్కడ ఇతర గణములు కూడ ఉన్నాయి. కాని పాడేటప్పుడు వనమయూరపు లయయే. పద్యమును చదివి (తెలుగులో కూడ), పాటను ఇక్కడ విన వీలగును –
முன்னிய கலைப்பொருளு மூவுலகில் வாழ்வும்
பன்னிய வொருத்தர்பழ வூர்வினவின் ஞாலந்
துன்னியிமை யோர்கள்துதி செய்துமுன் வணங்குஞ்
சென்னியர் விருப்புறு திருப்புகலி யாமே.
– திருஜ்ஞானசம்பந்தர் தேவாரம், 2.029
మున్నియ కలైప్పొరుళు మూవులగిల్ వాళ్వు’మ్
పన్నియ వొరుత్తర్బళ’ వూర్వినవిన్ ఞాలం
దున్నియిమై యోర్గళ్ తుది శెయ్దుమున్ వణంగుం
జెన్నియర్ విరుప్పుఱు తిరుప్పుగలి యామే
– తిరుజ్ఞానసంబందర్ తేవారం, 2.029
బహుపురాతనమైన చతుషష్టికళలయందలి సూక్ష్మమైన విషయములను, తీవ్రముగ ఆలోచించిన పిదప, ముల్లోకములను జీవమును పోసి, కాపాడి, అంత్యమున అంతమొందించి, పునరుద్ధరణచేయు విశిష్టమైన ఒకే ఒక్క దైవముగా విరాజిల్లు ఆ పరమేశ్వరుని ఊరు ఏదని ప్రశ్నించినచో, భూమికి దిగివచ్చి, తనను మొట్టమొదట కొనియాడి పూజించు దేవతలశిరస్సులపైనుండు ఆతడు మక్కువతో వెలసి అనుగ్రహించుచున్న తిరుప్పుగలి అనబడు స్థలమే అగును.
(శశికళ దివాకర్ అనువాదము)
విధేయుడు – మోహన
నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం గురించి indrakanti pinakapani గారి అభిప్రాయం:
01/02/2019 9:24 am
అంటే అర్థం కావడం కాకపోవడం అనేవి ఇటువంటి వ్యాసాలకు వర్తించవని మీ ఉద్దేశ్యమా నాగమురళి గారూ !వినేవాడికి చెప్పేవాడికి కూడా అర్థం కానిదే వేదాంతం అన్న నానుడి గుర్తొస్తూంది. కానీ భైరవభట్ల గారి “ఎడమ నేను” కు మాత్రం తాను చెప్పదలుచుకున్న విషయమ్లో చాలా స్పష్ఠత ఉన్నట్లు నాకు స్పష్ఠమైంది.
ఇక్కడ నాకు మరో రెండు లాజిక్కులు గుర్తుకొస్తున్నాయి. మా మేనల్లుడొకడు చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తను లేస్తే తన సీట్లో మరొకరు కూచోకుండా “ఈ సీట్లో కూచున్నవాడు పంది” అని ఒట్టు పెట్టే వాడు. వెంటనే వాడికి గుర్తుకు వచ్చేది తరవాత తనే అక్కడ కూచోవాలని ! కాబట్టి ఆ ఒట్టుకు “నా తప్ప” (నేను తప్ప) అని చేర్చేవాడు. మన నిత్యజీవన వ్యవహారాల్లో చాలా వాటికి ఇలా “నా తప్ప”ను అధ్యాహారం గా చేర్చుకోవాలనుకుంటాను. “మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్”అని గిరీశం అన్నప్పడు తానెప్పుడూ “మనవాడు” కాదని అతని ఉద్దేశ్యం స్పష్ఠం గా తెలుస్తూనే ఉంటుంది.
మరోటి నేను గవర్నమెంటులో పని చేస్తున్న నాటి సంగతి. ఒకతను నా సహోద్యోగి గవర్నమెంటు వాళ్ళందరూ అవినీతి పరులండీ అనేవాడు. మనం పొరపాటున అదేంటండీ అలాగంటారు ! మీరూ గవర్నమెంటు వాళ్ళే గదా అనో లేకపోతే వాళ్ళలో కూడ మహానుభావులుంటారు అని “బైరాగి” లెవల్లోనో మాట్లాడామా ! అతని ఉద్దేశ్యం లో మనం మొదటి గవర్నమెంటు వాళ్ళమైపోతాము ! అలా కాకుండా వినయంగా అవునండీ నిజమే ! అంటేనే మనకు ఈ గవర్నమెంటు ( e- government కాదండోయ్ !) వాళ్ళనుండి మినహాయింపు లభిస్తుంది. ఆయన ఏదో కనుక్కున్నట్లు మనకే వచ్చి చెప్తున్నాడంటేనే తననూ మననూ మినహాయించి చెబుతున్నాడనే కదా ! if you negate it, you will be it. అదన్నమాట లాజిక్కు.
తలుపు – ఒక ముగింపు గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
01/02/2019 6:04 am
ఇదొక చమత్కారము. తలుపు వాళ్లిద్దరి కధ చెప్పడం. గోడలు చెప్పిన కథలు కూడా ఉన్నాయి. కాని ఈ కధలో ఒక తాత్వికత ఉంది.
త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గానప్రతిభ గురించి తఃతః గారి అభిప్రాయం:
01/02/2019 5:41 am
1.”…. ‘సంగీత సాహిత్యములు’…….., ‘అనేక కృతులలో ‘ రెండును చేయి చేయి పట్టుకొని అపూర్వ సౌహార్దముతో ఏకాగ్రముగా రూపుగొన్న అద్భుత దృశ్యమును మనకు త్యాగయ్య ఎత్తి చూపఁగలిగినాఁడు’. ‘పలుకు పలుకులకు తేనెలొలుకు’ కృతులు అతనివెన్నో కలవు. ఆ తేనెలు మాటలవో, పాటలవో చెప్పలేము. ఎందుకనగా అవి రెండును మేళగించి దింపిన రసాయనములు”.
2. “కాని మొత్తముమీఁద త్యాగయ్య ‘నాద విద్యా మర్మములను’ గమనించినంత మెలుకువతో శబ్ద రచనా రహస్యములను గమనింపలేదనుట మనము కనుఁగొనఁగలము. భావముల గొప్పతనమునకు సరిరాలేక ఎన్నో చోట్ల అతని భాష తంటాలుపడుచున్నది”
1. 2. లలో గల వైరుధ్యాల తో ‘మొత్తము మీద’ ఈ వ్యాసము బాగుగా నున్నది.
తః తః
నాకు నచ్చిన పద్యం: ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం గురించి మోహన గారి అభిప్రాయం:
12/14/2018 9:38 am
నాకు నచ్చిన పద్యములలోని ఒకటైన ఈ పద్యముపై చాల చక్కని వ్యాసము. రచయితకు నమస్సుమాంజలులు. ఒకప్పుడు నేను ఈ పద్యమును గుఱించి వ్రాసినది –
నన్నయ భారతములో చివరి పద్యము శరత్కాలపు రాత్రుల సౌందర్యపు వర్ణన అయితే, ఎఱ్ఱన శరత్కాలములో ప్రాతఃకాలము ఏ విధముగా ఉంటుందని వర్ణిస్తాడు. నన్నయ భారతము ఉత్పలమాలతో అంతమయితే, ఎఱ్ఱన భారతము చంపకమాలతో ఆరంభమవుతుంది.
రాత్రి అంత్యాని సూచిస్తే ఉదయము వెలుగును, భవిష్యత్తును సూచిస్తుంది. ఎఱ్ఱన తన కావ్యాన్ని ఆశాజనకముగా ప్రారంభిస్తాడు. తిక్కన అరణ్యపర్వ శేషమును ముగించలేదు, విరాట పర్వముతో ఆరంభించాడు. కొందఱంటారు అరణ్య పర్వము కొనసాగిస్తే కీడు మూడుతుందేమో అని. అలా కాదని ఒక సంతోషముతో, ఆశతో ఎఱ్ఱన ప్రారంభిస్తాడు తన రచనను. అంతే కాదు అరుణాంశ అని ఎఱుపు రంగును తెలిపినపుడు తన పేరును కూడ తెలిపినాడని నా భావన. మిగిలిన కవులు పీఠికలో తమ పేరిని తెలుపుకొన్నారు. కాని మధ్యలో ఆరంభించిన ఎఱ్ఱనకు ఆ అవకాశము లేదు కదా? అందువలన పద్యములో స్ఫురదరుణాంశు అంటాడు, ప్రకాశించే ఎఱ్ఱన అని చెప్పుకొనక చెప్పుకొన్నాడు కవి. నన్నయ శైలిని కూడ అనుకరించడానికి ప్రయత్నిస్తాడు ఎఱ్ఱన ఈ పద్యములో. అందువలన చదువరులకు అది ఒక చక్కని కొనసాగింపు అవుతుంది.
నన్నయ చివరి పద్యాలను ఈ పత్రికలోని “నన్నయ హంసగీతికలు” అనే వ్యాసములో చర్చించి యున్నాను.
విధేయుడు – మోహన
అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
12/04/2018 10:48 pm
ప్రియమైన కొంపెల్ల భాస్కర్ గారు!
స్త్రీవాద రచయితలలో అగ్రగణ్యురాలు బెజవాడ పి. సత్యవతి అక్కయ్య గారు.
స్త్రీని, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని మనసును తాకి, మెదడును మేల్కొలిపే రచనలు (ఎంతో సమ్యమనంతో) రాస్తారు అని పేరొందారు కదా. (తన వాదనకు అడ్డొస్తే శ్రీశ్రీ, కొ.కు. నాయన, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గార్లనైనా దులిపేసే మా మరో అక్కలా కాదు తను). గుడిపాటి చలం, కొ.కు. నాయన, చక్రపాణి, త్రిపురనేని గోపిచంద్, ఆలూరు బైరాగి, జి.వి. కృష్ణారావు, హితశ్రీ, సంజీవదేవ్, శారద లాంటి వాళ్లనెందరినో మనకిచ్చిన తెనాలి ప్రాంత సాంసృతికిక, సాహిత్య వారసురాలు మన సత్యవతి అక్కయ్య.
స్వేచ్చ పేరిట, సమానత్వం పేరిట అనైతికతను, విశృంఖలతను పాటించవచ్చు అని పాఠకులకు (స్రీలకు కాని, పురుషులకు కాని) చెప్పే వారు కాదు అక్కయ్య.
కాని వారు రాసిన యీ క్రింది వాదనను ఎదిరించి చూపగల ప్రతివాదన నాశక్తికి మించిన పని.
“తరచూ చెప్పే ఒక సూక్తి ప్రకారం ఒక స్త్రీ బాల్యంలో తండ్రి అదుపులో వుంటూ రక్షణ పొందాలి. అట్లాగే యౌవ్వనంలో భర్తను, వార్ధక్యంలో కుమారుడిని అనుసరిస్తూ రక్షణ పొందాలి. స్త్రీకి స్వతంత్రంగా జీవించే అర్హత లేదు.(మను స్మృతి V.147 IX.3) అలాగని మంచి స్త్రీ ఎప్పుడూ ఆబల కాదు. శక్తిహీనురాలు కాదు. ఆమె శక్తిస్వరూపిణి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె పవిత్రతా, సంరక్షణ స్వభావాలే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కానీ, పురుషస్వామ్య సమాజ లక్ష్యాలను కాపాడుకోవాలంటే ఆమె శక్తిని అదుపులో వుంచాలి. ఆమె లైంగిక వాంఛలు భర్త ద్వారా కేవలం సంతానోత్పత్తి కోసమే తీర్చుకోవాలి. అది ఆమె ధర్మం. సాంస్కృతిక కోణంలోనుంచి చూసినట్లయితే, స్త్రీల లైంగికత పట్ల హిందూ వైఖరి, మంచి-చెడు, పవిత్రత-అపవిత్రత, శుభము-అశుభము, అనే ద్వంద్వాల మధ్య వుండే సంబంధం అర్థమౌతుంది”.
అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:
12/04/2018 8:39 pm
రామయ్యగారూ!
అది ప్రస్తుత పరిశోధనాంశానికి ముఖ్యమైన విషయం కాదు గాబట్టి అనిర్ధారితమైన దేశకాల సమాచారాన్ని ప్రచురించకపోవడమే మంచిది. కాని, ఈ తెగని సమస్యల పట్ల మన రచయితలకి ఎందుకో మక్కువ ఎక్కువ.
-BK
మంటో కథలు: కాలీ సల్వార్ గురించి Ramarao Kanneganti గారి అభిప్రాయం:
12/03/2018 9:49 am
చక్కగా మంచి అనువాదం లాగా ఉంది. నాకు ఆ రోజులు చరిత్ర చదువుకోవడం మూలాన మాత్రమే తెలుసు. యుద్ధం మూలాన ధరలు పడటం ఇటువంటి విషయాలు కొన్ని తెలుసు. ఇంకా అప్పడు ఉన్న రాజకీయ వ్యవహారాలు తెలుసు. తెలియందల్లా, మనుషుల గురించి ఒక్కటే. అందుకే మంచి కథ మిగిలిన సబ్జెక్టులకి complementary గా ఉంటుందంటారు.
దీనితో బాటు నేను ఆ వ్యాసం కూడా చదివాను. కాలమే కాకుండా, నేను దేశం కూడా మారడం మూలాన్నేమో, ఆ వ్యాసం ఒక historical interest లాగనే అనిపించింది. నాకు కథలో వేరే విషయాలు ఎక్కువ ఆకర్షించాయి — ఆ మాటలు, శంకర్, ఖుదాభక్ష్ లాంటి వాళ్ళు, ఆ ఫకిర్ మీద ఖుదాభక్ష్ ఆశలు. మధ్య తరగతి వాడినేమో గానీ, జీవితం మీద ముందు చూపు లేకుండా బ్రతకడం ఒక భయాన్ని, ఒక vicarious excitement నీ కలిగిస్తుంది.
మరి ఎందుకు మంచి అనువాదం అన్నాను? ఒక విధంగా చూస్తే, అనువాదం లో మూలం నుంచి ఏదో కొల్పొతామనే భయం ఉంటుంది జనాలకి. కానీ, అనువాదం అర్థం కాని దాని నుంచి, అర్థం అయె దానికి తెస్తుంది. నాకు పాలు పడవు. పెరుగు ఇష్టం. పాల నుండి పెరుగు మార్చె ప్రక్రియ, నాకు బాగ ఉపయోగం. అంతే కానీ పెరుగు పాల కన్నా తక్కువ కాదు. (Crude analogy. But faithfulness in translation is humbug. Nobody understands the original in exactly oneway. As long as the translation in the same ball park, it is a translation. As long as it achieves the objective that the original author hopes for, it is a good translation. The essay sort of tells what the original author hoped for; and the translation achieves that. That is why I called it a good translation).
Why do people think calling it as a translation is damning? Why is the translation’s ulimate compliment is “it does not read like translation”? Obviously, this story is not Telugu. It is written for and written by and written about non-Telugus. I do not know about you, but suppose we change the names khudaabhaksh to mastaan, and ambala to kakinaada and Delhi to Hyderabad, and payikhaana to marugudoddi, etc, and entirely transform it to Telugu land, how we would it look? While we are at it, change the references to the war as say, the post independence. And, devalue the rupee and move the story to 1970s.
I submit that in that case, the story loses its linguistic connection to the original. It will not read like a translation. It would be like a original story.
But, is that desirable? For me, this story managed to create a new world. Within the limited knowledge of that time, I could imagine the world (including the rail yard), which she inhabits. It not only has these three of four characters, but a rich history of the times. That goes with the geography and other minute details. If I were to lose those details, it may be a same story, but in spirit in dissimilar, as it paints a different picture. The background of the white Johns certainly adds a nuance to the story. Or, the history of migrants to Delhi adds an angle to the story. Heck, even the 3 rupee detail and the 20 rupee rent adds an angle to the story. If we were to transform it, it will lose the complete context.
That is why, I am thankful that it reads like a translation. I am thankful that it is good. I think that is the best compliment I can give.
(sorry for switching to English — Telugu typing takes too much time).
అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి వీరభద్రం గారి అభిప్రాయం:
12/03/2018 1:58 am
అభినవ గుప్తుడు వ్రాసిన “సంస్కృత సౌందర్య శాస్త్రం” అన్నారు కదా.ఈయన భరతముని నాట్యశాస్త్రానికీ, ఆనంద వర్ధనుడి ధ్వన్యాలోకానికీ వ్యాఖ్యానాలు కాకుండా, మరేదైనా aesthetics కు సంబంధించి, మనకు ప్రస్తుతం దొరుకుతున్న గ్రంథం వ్రాసారా? మీరుటంకించిన విషయం ఆయన వ్రాసిన ఏ పుస్తకంలోనిది?
చిత్రం – ‘బాపు’రే విచిత్రం! గురించి Venkata Ramam గారి అభిప్రాయం:
11/26/2018 5:14 am
వ్యాసం సోదాహరణంగా బాపుగారి గీతల పరిణతికి అద్దం పట్టింది. బాపుగారి బొమ్మలు తెలుగు వారికే స్వంతం. అవి మరి ఏ ఇతర బాషల సాహిత్యాన్ని గాని, ఇతర ప్రాంతాల జీవనాన్ని గాని ప్రతిబింబించలేదు. అందుకే ఆంధ్రేతరులకి వారు అపరిచితులు. బ్రహ్మానందంగారు రాసినట్టు గియ్యని గీతల్లో చిత్రాలకి కొత్త ఆందాల్ని, అనుభూతిని ఇచ్చినవారు బాపుగారు. కొంతవరుకూ లైలాగారు, కటకటాగారు అన్నట్టు, కొన్ని బాపుబొమ్మల్లొ జీవం కనపడకపోవచ్చు. కాని పరిణతి చెందిన బాపుగారి బొమ్మల్లో అన్ని రకాల భావాలు ప్రస్ఫుటం అవుతాయి. ఉదాహరణకి –సత్యం శంకరమంచిగారి “అమరావతి కథలు”లో ప్రతీ బొమ్మ కథ చదివే ముందే మీతో మాట్టాడుతుంది. వంశీగారి కథలకి బాపుగారి బొమ్మలు అన్ని భావాలూ ఒలకబోస్తాయి. లైలాగారన్నట్టు, రంగుల్లో వారి బొమ్మలు పేలవంగా ఉంటాయి. యేమైనా బాపు-రమణల జోడు తెలుగువాళ్ళకి రాత + గీతలతో కూడిన సాహిత్యాన్ని ఇచ్చింది. వారిద్దరికీ జోహార్లు.
ఏడు కవితలు గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
11/17/2018 3:55 pm
తః తః గారు “మళ్లీ ఒక సారి చదివాను, ‘ఏ వ్యక్తీకరణం ఎప్పుడు తప్పుచేయగలదు?’ ఈ వాక్యం మరీ faithful ఉన్నట్టుంది,” అని రాసిన తర్వాత, నేనూ నా తెలుగు అనుసృజన – ఒరియా మూలం మరోసారి చదివాను.
I hate to disappoint Sri తఃతః. That line is neither faithful nor beautiful. I wondered how my co-author,and I missed it. Here I give the two relevant lines from the original poem in diacritical Roman script.
ebe sēguḍikara artha nāhĭ, artha nathāe
keŭ bhāṣā bā ketebēḷe bhul karipāre?
‘ఇప్పుడు వాటికర్థం లేదు, అర్ధంలేకపోవచ్చు
కాని, ఏ మాటలు ఏ సమయంలో తప్పుటర్థం యిస్తాయో?’
అని రాసి వుంటే బాగుండేది.
This might come close to being faithful and closer to being beautiful.
Anyway, I do not subscribe to Sri Ronamki, or the un-named French writer, or for that matter Professor Google who credits Yevgeny Yevtushenko for the irrelevant, irresponsible and insensitive implication in the quotation that compares translations to women. Fortunately, the women I knew are beautiful and faithful. I have to pity those blessed scholars for their misfortune.
వేలూరి వేంకటేశ్వర రావు
సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి రాళ్ళపల్లి సున్దర రామ శర్మ గారి అభిప్రాయం:
11/12/2018 3:49 am
ఏల్చూరి మురళీధరరావు గారికి శత సహస్ర వందనాలు.
మీ వ్యాసం ఆసాంతం నన్ను కట్టి పడేసింది. గణపవరపు వారి ప్రబంధరాజము మీద ఇంత విస్తృతంగా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
ఇకపోతే, పద్య కవిత్వం బాగా అలవడి అదికాస్తా చిత్ర కవిత్వం పై మక్కువ గా మారింది. గర్భ కవిత్వం, ద్వ్యక్షరీ, త్ర్యక్షరి, ముక్త పదగ్రస్తం వంటి ప్రయోగాలు బాగానే చేయగలిగినా ప్రబంధరాజ కావ్యాన్ని దానిపై పరిశోధిత వ్యాసాలను చదివి మరిన్ని మెళుకువలు సాధించాలని ఆశ.
కాని ఆ పొత్తము అంగడిలో అలభ్యంగా ఉంది. అలాగే అంతర్జాలంలోనూ లభించుట లేదు. అది ఉపలబ్దమయ్యే మార్గము సూచించ గలరు.
భవధీయుడు
రాళ్ళపల్లి సున్దర రామ శర్మ
Akshara Vinyasam
Natelugu savvadi blogspot.com
+919440597260
పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
11/11/2018 10:24 pm
అడవితల్లి వొడిలో సేదతీర్చుకోవాలనే ధ్యాసే కాని, పురుగూ పుట్రా ఉంటాయ్ జాగ్రత్త జయతి బిడ్డా అంటే ( అదంతా మనమేర్పరచుకున్న భయాందోళనల తప్పు అభిప్రాయాలు అంటూ నవ్విన ); జీవితం సుఖంగా జరుగుబాటు కోసం నాలుగు రాళ్లు వెనకేసుకోవద్దా అని కేకలేసే ( “How Much Land Does a Man Require?” by Leo Tolstoy కధ సదివినావు గందా అంటూ నవ్విన ); జీవన సాయంసంధ్యలో పనికొస్తుంది డబ్బులు కూడబెట్టాల బిడ్డా అంటే (
ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి సంధ్యలను ప్రకృతి వొడిలోనుండి వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న జయతి బిడ్డ చిరునవ్వు తప్ప మారుమాట్లాడలేదు ).
అమరేంద్ర గారూ! కాలం నాడు ” భద్రం కొడుకో! నా కొడుకో కొమరన్న” అని విలపించిన గద్దరన్న చేత మళ్లీ భద్రం బిడ్డో! నా బిడ్డో జయతమ్మా అని సుద్దులు చెప్పించాలనిపిస్తోంది అని అన్నా సంటిబిడ్డలా నవ్వుతున్నది మీ జయతి బిడ్డ.
పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
11/05/2018 10:51 am
ప్రియమైన దాసరి అమరేంద్ర గారూ!
‘అడవి నుండి అడవికి’ పుస్తకం ఆవిష్కరణ సభలో మీరు చేసినది పరిచయంగా కాదు పున్నమి రేయి పోటెత్తిన సంద్రంలా మమ్మల్ని ముచ్చెత్తింది. “అడవి తల్లికి దండాలు, మా కన్నతల్లికి దండాలు, అడవి చల్లగుండాలా… మా బతు కులు చల్లగుండలా” ఆలాపనను గుర్తుకు తెచ్చింది.
జయతి లోహితాక్షన్ గారి ‘అడవి నుండి అడవికి’ పుస్తకం ప్రింటుకాపీ కానీ, e-బుక్కు కాపీ కాని ఎక్కడ దొరుకుతుందో తెలియజెయ్యరా? (నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారి వెబ్ సైట్ లో కాని, కినిగే వారి వెబ్ సైట్ లో కానీ పుస్తకం వివరాలు లేవు).
పోనీ యీ క్రింది అడ్రెస్ తో సంప్రదించి పుస్తకం తెప్పించుకునే సదుపాయం ఉన్నదా?
జయతి లోహితాక్షన్,
“మట్టిముద్రణలు”
ఆలగడప, మిర్యాలగూడ,
నల్లగొండ జిల్లా,
తెలంగాణా – 508 207
పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:
11/03/2018 6:45 pm
“ఈమాట”కి 20వ జన్మవత్సర శుభాకాంక్షలు.
ఆస్టిన్యా నగరే విరామసమయే యూటీతరౌ సన్నిధౌ … పత్రిక ప్రారంభదినాలూ, కేవీయస్ రామారావు, మరికొందరు సాహితీప్రియులూ, నేను, సాహిత్యపు ముచ్చట్లు.. ఎన్నో మరచిపోలేని ఆనుభవాలు.
ఈ సమీక్ష రాసిన మోహన గారికీ, దాన్ని తమ పరిశీలనల్తో వన్నెతెచ్చిన మిత్రులు మురళీధర, బీకే, శ్రీనివాస్, కేవీయస్ రామారావుగార్లకి నా అభివందనాలు.
మోహన గారు అనుమతిస్తే రెండు మాటలు..
ఈ పుస్తకం అశ్వఘోషుడి బుద్ధచరితానికి తెలుగు అనువాదమా అంటే అనువాదమే. కాని కాస్త ఎక్కువ. ప్రతిపదార్ధం కూడా ఉండడం వల్ల.
సాధారణంగా పేరుపొందిన పూర్వకావ్యాలకి ఉద్దండులు వ్యాఖ్యానాలు రాసారు. ఆ వ్యాఖ్యానాలవల్ల, ఆ కావ్యాలకి ప్రతిపదార్ధం రాసే పని సులభం అవుతుంది. అశ్వఘోషుడి బుద్ధచరితానికి అలాంటి పండితవ్యాఖ్యలేవీ లేవు. (మొదటి 5 సర్గలకీ మాత్రమే ఒక వ్యాఖ్య ఉంది. కాని, అది కూడా అసంపూర్ణంగా ఉంది).
ఇది 2000+ ఏళ్ళ క్రితం రచింపబడ్డ కావ్యం అయినా, మధ్యలో కొన్నివందల ఏళ్ళపాటు దాని సంస్కృతమూలం అందుబాటులో లేదు. అందుకే వ్యాఖ్యానాలు రాలేదేమో!
19 వ శతాబ్దంలో నేపాళదేశంలో ఒక కంచు గంగాళంలో 14 సర్గలు మాత్రమే దొరికాయి. ఆ 14 సర్గలే ఈ పుస్తకంలో ఉన్నాయి.
నేను జాన్స్టన్ పుస్తకాన్ని కేవలం సంస్కృతమూలం కోసమే వాడాను. దానిలో తాత్పర్యాన్ని అనుసరించలేదు. ఆ పుస్తకంలో ఉన్న Footnotes ఉపకరించాయి.
భాస్కర్
జీవనసంధ్య గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
11/02/2018 1:00 am
వాసన, అంతా పల్లెటూరి మట్టి వాసన. ఆ కోళ్ళూ, పిల్లులు, కుక్కలు,ఆ నాటకాలు, ఆడే ఆ మనుషులు, ఆ జీవితాలు, ఆ జీవితాల వాసన. హార్మోనియం తెలుసంటే ఏదో అనుకున్నాను కాని ఇంత బాగా దాని గురించి, వాళ్ల గురించి తెలుసనుకోలేదు. జీవనా కి జీవుడా కి తేడా.
బాగుంది.
ఈ ఆన్‍లైన్ ప్రపంచంలో, పట్టణాలలో ఉండి, దేహ భాషలు, వాటి రాజకీయాలు, ఒక నైంటీ వేసుకుని, జీడిపప్పు నములుతూ చర్చించే కథల నుంచి, ఆలా వసారాలో నులక మంచంమీద కూర్చుని, ఆ సుగుణమ్మ మొగుడు కథ, 16mm లో చూసినట్టే ఉంది.
పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి BK గారి అభిప్రాయం:
11/01/2018 11:03 am
మురళీధర రావు గారూ,
తిరుపతివేంకటకవుల బుద్ధచరితానికి ఆధారం Sir Edwin Arnold వ్రాసిన “The Light of Asia” అనే పుస్తకం. (ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఒక ప్రసంగంలో ఈ విషయాన్ని వివరించి చెప్పారు. యూట్యూబ్ లో చూడచ్చు).
స్వేచ్ఛానువాదకావ్యాలు తెలుగులో మరికొన్ని కూడా ఊన్నాయి. కరుణశ్రీ వ్రాసినది; అద్దంకి కేశవరావుగారి “తథాగతీయము”.
మోహనగారి వ్యాసాన్ని బట్టి చూస్తే ఈ పుస్తకం ప్రతిపదార్థతాత్పర్యాలతో వ్రాసింది. అశ్వఘోషుడి బుద్ధచరితానికి ఇప్పటివరకూ ప్రతిపదార్థతాత్పర్యాలు ఉన్న పుస్తకం నేను ఏ భాషలోనూ చూడలేదు (ఉంటే ఈమాట ముఖంగా తెలపండి). ఇంగ్లీష్, హిందీ భాషల్లో తాత్పర్యాలు మాత్రమే ఉన్నాయి. కాని ప్రతిపదార్ధం లేదు.
గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
10/31/2018 3:01 pm
నేను ఇంతకుముందు వరకు ఈ కథని వినలేదు – ఈ చివరి అభిప్రాయం చూశాక కుతూహలం కలిగి విన్నాను. తర్వాత మిగిలిన అభిప్రాయాలు కూడ చదివాను.
కొందరు పాఠకులు గోరంతని కొండంతలు చేస్తూ, సైకాలజిస్టుల వేషాలేసుకుని మరీ రచయిత్రి దీన్ని రాయటం వెనకున్న దురాలోచనల్ని పసిగట్టి కసిపెట్టి ఉతికి ఆరేశామని అనుకోవటం చూశాను.
ఎవరో ఒకరు ఏదో చిన్న ప్రయోగాత్మక కథ, అదీ ఒక మాదిరి కథ, రాసినంత మాత్రానే పోతన గారి భాగవతం అపహాస్యం పాలౌతుందని భావించే ఈ మహానుభావులకి భాగవతం మీద ఎంత గాఢనమ్మకమో అర్థం ఔతూనే వుంది వారి ఆవేశం బట్టి. ఒకరు భాగవతంతో సమానంగా రాస్తే కాని దాని జోలికి వెళ్లకూడదని రచయిత్రి మీదికి ఒంటికాలిపై లేచారు కూడ. ‘కాపీ – పేస్ట్ ‘ ఎంత తేలికో సెలవిచ్చిన వారు తాము చేసిన కాపీ-పేస్ట్ లో ఎన్ని తప్పులు చేశారో ఒకసారి చూసుకుంటే కాపీ-పేస్ట్ కూడ అంత తేలిక కాదని వారికే అర్థం ఔతుంది. ఈ రెంటిలోనూ తప్పులున్నయ్ – గమనించండి :
“మంధ దండాయమాన మంధర వసుంధరాధర పరిభ్రమణ వేగ వియన్మండల సుధారాసి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును…”
“సత్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగఛ్ఛటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండఛ్ఛటాంతర నిర్వక్రము బాలితాఖిల సుధాంశ్చక్రమున్ జక్రమున్…”
మీకు నిజంగా తెలుగు సాహిత్యాన్నీ సంస్కృతినీ నిలబెట్టాలనే దీక్షే వుంటే వాటిని బాగా చదవండి, అర్థం చేసుకోండి, ముందు తరాలు వాటిని గుర్తుంచుకోవటానికి మీరు చెయ్యగలిగిన కృషి చెయ్యండి – ముందు మీ పిల్లలు, పిల్లల పిల్లల్తో మొదలుపెట్టి.
పోతన గారు ఎవరో తెలియని వారు వారి భాగవతం మీద ఎవరో రాసిన ఏదో వ్యాసం వల్లో కథ వల్లో చెడిపోయి మన సంస్కృతినీ సాహిత్యాన్నీ మంటగలిపెయ్యరు. ఆ పోతన గారు ఎవరో ఆయన చేసిన గొప్పపని ఏమిటో ముందు వాళ్లకి తెలియాలి కదా ! మీరు ఆవేశంగా పేస్ట్ చేసిన పద్యాలు మీ ఇంట్లో ఎవరికైనా కంఠతా వచ్చేట్లు చేస్తే అప్పుడు మీరు పోతన గారి ఋణం తీర్చుకున్నట్టు, ఒక రచయిత్రి రాసిన ప్రసిద్ధ కథ చదివి ఉత్సాహపడి తెలుగువారికి ఆ విధానాన్ని పరిచయం చేద్దామని చిరుప్రయత్నం చేసిన వారిమీద మీ కుహనా విద్వత్ప్రతాపజ్వాలలు కురిపిస్తే కాదు. ఉతికాం, ఆరేశాం అని జబ్బులు చరుచుకుంటే అసలే కాదు.
ఇది ఏ ఒక్కరినీ ఉద్దేశించింది కాదు, కత్తులు నూరుతున్న అందరినీ.
బలిసిన మేకను పట్టుకుంటాను గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
10/09/2018 3:19 am
ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారు,
అమెరికా / కెనడా లాంటి దేశంలోకి కొత్తగా వచ్చే వలసదారులకి ఇమ్మిగ్రేషన్ నార్మ్స్, మోరల్ & ఎథికల్ బెహేవియర్ గురించి కలిగించే అవగాహన గురించి చక్కగా తెలియజేసారు. ధన్యవాదాలు.
కాని అంత మాత్రాన్నే అప్పాదురై ముత్తులింగంగారు రాసిన “బలిసిన మేకను పట్టుకుంటాను“ కథలో జరిగిన సంఘటన లాంటి వాటిని పూర్తిగా నివారించగలిగాయా అనేది ప్రశ్న.
కథలో శ్రీలంక నుండి ( ?? ) కెనడా వలసవచ్చిన గణేశరత్నం పాత్ర మనో వేదనే నాకు కనిపించింది. తను కావాలని ఏ సందర్భంలో కూడా అసభ్యంగా కాని, అవినీతిగా కాని ప్రవర్తించినట్లు కనిపించలేదు. రాళ్ళు మోసి అయినా తన కుటుంబాన్ని పోషించుకోవాలని తపిస్తున్న ఓ కాందిశీకుడి, ఓ వలసపక్షి ఆర్తనాదం ఇందులో నాకు వినిపిస్తోంది. మానవ నైజాలు, పరిస్థితుల ప్రభావాలు, బలహీనతలు వంటివాటిని రచయిత చిత్రీకరించారే కాని పనికట్టుకుని వాటిని సమర్థిస్తూ రాసినట్లు ఎక్కడా కనిపించలేదే. మానవ దౌర్భల్యాలనూ, ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కడైనా కనిపించిందా?
అన్నమయ సంకీర్తనల అభిమాని, అమాయక చక్రవర్తి అని తన మిత్రులు అభిమానంగా పిలుచుకునే అవినేని భాస్కర్ యీ కథను అనువదించారంటేనే దానికో విశిష్టత ఉన్నట్లు నాకనిపించింది.
ఇలాంటి కథను ఏ సోమర్సెట్ మాం కాని, ఏ హెమింగ్వే కాని, ఏ నబకోవ్ కాని, మరే గొప్ప రచయిత కాని రాసినా ఆ రచయితను ఇంతలా తూలనాడుతూ పాఠకులు స్పందిస్తారా అని నాకు ఓ చిన్న అనుమానం కలుగుతోంది. తప్పుగా అనుకోకండి.
బలిసిన మేకను పట్టుకుంటాను గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
10/08/2018 4:33 pm
మూల కథకుడు ఎన్నో దేశాలు చూసివుండొచ్చు కాని అక్కడి జీవితాల గురించి ఏమాత్రం తెలుసుకోలేకపొయాడనేది స్పష్టంగా చూపుతోందీ కథ. కాకుంటే అతను తనకెన్నో దేశాలు చూసిన పరిజ్ఞానం ఉందని చెప్పుకుని పాఠకుల్ని మోసం చెయ్యటంలో విజయం సాధించి వుండొచ్చు. ఈకథకో సంకలనానికో బహుమతులు కూడ వచ్చివుండొచ్చు. ఇలాటి వాళ్లకి కూడ కథకులుగా గుర్తింపు రావటం (లేకుంటే దీన్ని అనువదించి వుండేవారు కారని నా assumption; అది తప్పైతే, ‘ఇంత చెత్త కథలు కూడ రాసేవాళ్లున్నారు’ అని చెప్పటానికి దీన్ని అనువదించి వుంటే అనువాదకులు అభినందనీయులు) దౌర్భాగ్యం.
ఈమాటలో రాదగ్గది కాదు ఈ కథ.
నాకు నచ్చిన పద్యం: సోమన తెలుగు జాతీయాల సొబగు గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
10/07/2018 11:53 am
నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్దామని కానీ రచయితని కించ పరచడానికి కాదని మనవి.
సంతాన గోపాలం (అర్జునానుగ్రహము) లో విప్రుడికి పుట్టి చనిపోయిన పిల్లలు ఎనిమిది మంది. ఇది ఉషశ్రీగారి భాగవతంలోనూ (అంటే పోతన భాగవతంలోనూ), నారాయణీయంలోను (88 దశకం) ఉంది. వ్యాసంలో రాసినట్టు ముగ్గురు కాదు.
విప్రుడొచ్చినప్పుడు కృష్ణుడు ఏదో దీక్షలో ఉన్నట్టు ఎక్కడా లేదీ పుస్తకాలలో. అర్జునుణ్ణి పరీక్షించడానికి కృష్ణుడు ఊరుకుంటాడు ఏమీ మాట్లాడకుండా. ఈ లోపునే ‘నేనున్నానుగా’ అంటూ అర్జునుడు మాట ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కధ మామూలే – ఏమీ చేయలేక అగ్ని ప్రవేశం చేస్తాననడం, దాన్ని కృష్ణుడు వారించడం. దీనికి నారాయణీయం లో భట్టాత్తిరి గారి విశేష వివరణ ఏమిటంటే “పురుష ప్రయత్నానికీ, పౌరషానికీ దైవ బలం ఆక్కరలేదని అనుకున్నావు కదా అర్జునా, ఇప్పుడేమంటావు?” అని తెలపడానికి.
మూడో విషయం – అర్జునుడు ఏమీచేయలేక వెనక్కి వచ్చినప్పుడు అతన్ని రధం మీద కూర్చోబెట్టుకుని పెంజీకటికవ్వల కి వీసుకు వెళ్ళినది పై లోకమైన వైకుంఠానికి – పాతాళం కింది లోకం కనక దాని ప్రసక్తి రాదు.
ఆఖరి విషయం – విప్రుడి పిల్లలని తీసుకెళ్ళిపోయినది యమభటులు కాదు. వైకుంఠంలో ఉండే మునిగణం నా అంశ తో నిండిన నరనారాయణులని చూడాలని కోరితే నేనే విప్రబాలకులని మాయం చేసాను అని మహావిష్ణువు తన అంశ అయిన కృష్ణుడితో అంటాడు కధ సుఖాంతం అయ్యేముందు. యమ ప్రసక్తి ఇందులో రాదు. దేవకి కృష్ణుడికి ముందు పుట్టిన పిల్లలని చూడాలని ఉంది అంటే అప్పుడు కృష్ణుడు యమలోకానికి వెళ్తాడు. ఆ కధ వేరు. అది వ్యాసంలో ఉదహరించిన సంతానగోపాలం లోది కాదు.
గ్రంధ సూచిక: (1) నారాయణీయము – – కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు (తి.తి.దే 2003)
(2) ఉషశ్రీ భాగవతం – మహాలక్ష్మీ బుక్ ఎంటర్ ప్రైజెస్, సెప్టెంబర్ 1993.
నాకు నచ్చిన పద్యం: మారన వరూధిని కామన గురించి విశ్వం-విష్ణుర్వ -షట్కారో గారి అభిప్రాయం:
09/13/2018 10:57 am
అయ్యా మాగంటి గారు:
నేను మొదట్లో పెట్టిన వ్యాఖ్య రచయిత కి సంపాదకులకి చేసిన సూచన “మా-త్ర-మే.” ఎవర్నీ కించపరచలేదు. అటువంటి ఉద్దేశ్యమే లేదని చెప్పాను కూడా తర్వాత. ఎందుకు ఎలా వేళ్ల సందుల్లోంచి పదాలు జారిపోతాయో కూడా చెప్పాను. అది పట్టుకుని నా పేరు తో సహా అన్నీ ముక్కలు విరగ్గొట్టి, ఓ ఏపిల్ కంపెనీనీ, అందులో మరో పండితులవారినీ నా పండిత పుత్ర పరిజ్ఞానాన్నీ బయటకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినది, అసలు మొత్తం ఈ వ్యాఖ్య ఇంత పెద్దదవడానికి కారణం ఎవరండి? ఇప్పుడు నేను సమాధానం చెప్తే “ఠాట్ నువ్వింక ఏం చెప్పినా వినేది, చెప్పేది లేదు” అన్నదీ, ఇది చాలనట్టు నేను ఓ శ్లోకం రాయగానే, సంస్కృతంలో ఎంత గొప్పవాణ్ణో (అక్కడకి మీకు నాగురించి బాగా తెలిసినట్టు), ఇంకేం చేయచ్చో రాసినదీ ఎవరండి? మీరిచ్చిన ఉచిత అభిప్రాయం పట్టుకుని నేను రాస్తే ఎవరు, ఎక్కడ, ఎలా వేసుకుంటారో అనేది అసలు ఆలోచించారా?
అది కాక నాలిక బయటపెట్టి వెక్కిరిస్తున్నట్టూ పేరు మరో సారి విరగ్గొట్టి అబ్బే వెక్కిరించట్లేదని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చారు. మీరు దీనికి రచయిత కాదు, సంపాదకులూ కాదని ఈమాట పుటల్లో ఉంది. మరి మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో ఇలా శల్యపరీక్షలు చేసి?
అసలు ఈ వ్యాఖ్య కూడా రాయడం అనవసరం అనుకున్నాను కాని నా మీద ఓ అభిప్రాయం వెలిబుచ్చారు కనక సమాధానం చెప్పుకుందాం అనిపించింది. మొత్తానికి కాళ్ళు కడుక్కునే పరిస్థితి కల్పించారు. శుభాభినందనలు.
నాకు నచ్చిన పద్యం: మారన వరూధిని కామన గురించి విశ్వం-విష్ణుర్వ -షట్కారో గారి అభిప్రాయం:
09/12/2018 7:17 am
మాగంటి గారు
నేను రచయిత ని కానీ, వారి కవితా పటిమని కానీ పండిత విద్వత్తుని కానీ ఏమీ అనలేదండి. వారి ప్రచురణలు చదువుతూ ఉంటాను కనక ఆయన గురించి మాట్లాడలేదు. అయితే ఒక్కొక్కప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా వేళ్ల సందుల్లోంచి ఇలా పదాలు జారిపొతూ ఉంటాయి. రచయిత దిద్దినా ఇది సంపాదకుల చేతుల్లోంచి జారింది. చదువుతుంటే పచ్చడి మెతుకుల్లో పంటికింద రాయిలా తగిలింది. దీన్నే ఇంగ్లీషు వాడు “ఫాలింగ్ త్రూ క్రాక్స్’ అంటాడనుకుంటా. అదే చెప్పాను.
నేను నా కీబోర్డు మీదనుంచి వేళ్లతో “అక్కడకొట్టి ఇక్కడ అతికించే” పద్ధతిలో చేస్తాను కాబట్టి ‘రాయడం’ అనేది సరినదే అనుకుంటున్నాను. పెన్ను కానీ పెనిసిలు కాని వాడి “వ్రాయ” లేదు కదండి? అయినా తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు కనక అలా నేను ఎన్నిన తప్పుని – పెద్ద మనుసుతో – క్షమించి వదిలేయగలరు 🙂
పేరు గురించి – విశ్వం విష్ణర్వ షట్కారో అని రాయడనికి వేరే కారణం ఉంది. మరో విషయం, నా లాంటి మూర్ఖులు “విష్ణాయ” అంటారు. తెలుసున్న మీలాంటివారు, ఏపిల్ పండితులూ ‘విష్ణవే’ అంటారు. అయితే
మూర్ఖో వదతి విష్ణాయ విద్వాన్ వదతి విష్ణవే
ఉభయో సదృసం పుణ్యం, భావగ్రాహీ జనార్దన:
అని అనడం తెలుసు. అందువల్ల హనుమంతులవారిని దర్శించినంతటి మీకు ఎంత పుణ్యం వచ్చిందో నాకూ అంతే వచ్చిందని (మరియు వైస్ వెర్సా) జబ్బలు చరుచుకుంటూ నేను సంతోషపడిపోతున్నాను.
నమస్కారం
తా. క. పేరు దిద్దాను.
బేతాళ కథలు: కథన కుతూహలం – 4 గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
09/05/2018 1:21 pm
మీ సూచన బాగానే ఉంది కాని ఎంతమందికి ఆ ఓపిక ఉంది. ఎంత మంది సంపాదకులు తమవంతు కర్తవ్యంగా, బాధ్యతగా నిర్వహించగలరు!
సా.వెం రమేశ్ తన కథల గంపలో వాడిన పదాలు కొన్ని, మీరన్నట్టుగానే తెలుగు తెలుసు అనుకునే వారందరికి అర్ధం కావు. ఉదాహరణకి కొన్ని పదాలుః చనుప, నెరవు, తెరువు, దడము, బడిమి, పుంత, నడవ, మయి, జాడ, ఓణి, కంతి, చొప్పు.
అందరికి అర్ధం కావనుకున్న వాటన్నింటికి తనే అర్ధం ఇచ్చాడు.
మాండలీకంలో వ్రాసే రచయితలందరుఉ ఈ సూచనని పాటిస్తే బాగానే ఉంటుంది.
శోకము: ఒక పరిశీలన గురించి Sai Padma గారి అభిప్రాయం:
09/03/2018 11:01 am
పూర్ణిమా.. ఏం చెప్పాలో తెలీటం లేదు
మీరు ఎదురుగా ఉంటె …పట్టుకొని లేదా ముట్టుకొని శోకించేదాన్ని
అందరూ అడిగే ప్రశ్న..మనది కాని దుఃఖం మీద నీకు ఇంత ప్రేమెందుకు?
చాలా కదిలిపోయాను .. చాలా థాంక్స్
చాలా చాలా థాంక్స్
మళ్ళీ మందాక్రాంతము గురించి మోహన గారి అభిప్రాయం:
09/03/2018 10:07 am
దేశికాచారిగారికి, రాఘవగారికి, మీ స్పందనకు నా నమస్సులు.
1) నేను ఈ వృత్తములను సుమారు ఎనిమిది సంవత్సరాలుగా తోచినప్పుడు వ్రాస్తూ ఉన్నాను. అందువలన వాటిని ప్రత్యేకముగా ఒక అంశముపైన, ఇతివృత్తముపైన వ్రాయలేక పోయాను. ఇంకెప్పుడైనా ప్రయత్నిస్తాను.
2) భారా(వా)క్రాంత వృత్తము స్వయంభూ ఛందస్సులో ఉదాహరించబడినది. నాట్యశాస్త్రములో ఉన్నదని జయదామన్‌లో చెప్పబడినది. కాని నాకు కనబడలేదు. బహుశా ఇందులోని భారము అనే పేరు జ-గణము ఉండడమువలన వచ్చినది అనుకొంటాను.
3) శరభ వృత్తము నాట్యశాస్త్రములో పేర్కొనబడినది. ఇది 14 అక్షరముల శక్వరి ఛందమునకు చెందినది. ఇందులో చివరి భాగములో ఒక ర-గణము తక్కువ. దీనిని అశ్వఘోషుడు వాడినాడు, మఱి మందాక్రాంతమును ఎందుకు వాడలేదో?
విధేయుడు – మోహన
తెలుగు సాహిత్య విమర్శ: సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
08/27/2018 3:59 pm
ఈ వ్యాసకర్త గురించి నాకు ఇదివరకు పరిచయం లేదు. కాని బాగానే డొక్కశుద్ధి వున్న వారిలా కనిపిస్తున్నారు. ఐతే ఈ వ్యాసం మాత్రం ఉపరితలాన్ని స్పృశించిందే తప్ప ఏమాత్రం లోతుకి వెళ్లలేదు. నా అనుమానం వారు దీన్ని ఏ స్వాతి లాటి పత్రిక కోసమో (అంటే ఎలాగూ ఎవరూ చదువరులే అన్న భావనతో) రాశారని. ఈ సందర్భంగా వారికి మనవి – ఈమాటలో ప్రచురించే వాటికి లోతు తప్ప పొడవు గురించి ఆలోచించాల్సిన పని లేదు; మీరు ఎంత విశదీకరించదలుచుకుంటే అంతా చెయ్యవచ్చు; మీలాటి వారి నుంచి పాఠకులం మంచి బరువు, లోతు ఆశిస్తాం. మీ పాండిత్యాన్ని పూర్తిగా ప్రదర్శించండి. “ఒప్పు తప్పు లరయంగల పాఠకులు” ఇక్కడ కొందరైనా మీకు దొరుకుతారు. మీనుంచి ముందు ముందు ఎన్నో లోచూపుల్ని ఆశిస్తూ –
రామారావు
ఆగస్ట్ 2018 గురించి Chandra V గారి అభిప్రాయం:
08/01/2018 6:22 pm
దాడి కచ్చితంగా చెడ్ద పని. మాటతోనే తిప్పికొడితే అయిపోయేదానికి అనవసరంగా చేతులు ఉపయోగిస్తున్నారు.
అయితే అర్థం కానిదేమిటంటే అసలు ఎవరైన కూడ ఒక రచయిత, తనకు మాట అడ్వాంటేజ్ ఉంది కద అని వేరే వాళ్ళను సైకొలాజికల్‌గా దెబ్బతీస్తే, మాటలేని వాళ్ళు దొమ్మిలాటకు కచ్చితంగా దిగుతారు కద? గొడవ మొదలవుతుంది కదా? మరి రచయితది పాత్ర ఏమి లేదంటరా? రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది. రెండు వైపుల తప్పు ఉంది.
మా పీకల మీదుంచిన కత్తులు తీయండి గురించి lyla yerneni గారి అభిప్రాయం:
07/27/2018 11:52 am
“Ilango Krishnan, a well-known name in Tamil literary circles and an acclaimed poet, recently took to poetry to speak out against the killings. “How else can a writer express his extreme sadness?” he asks. “I do everything in my limits to express my anguish, and poetry is one of them. It is the medium I know. To me, this is almost like mourning.”
నాకు తమిళం రాదు. బహుశా ఇలంగో కృష్ణన్ తమిళ మూలంలో కవిత్వం చెప్పారేమో. ఇక్కడ ఇచ్చిన ఈ తెలుగు అనువాదములో శవాలు, గాయాలు, మనుషుల కేకలు, ప్రశ్నలు, పోలీసుల సమాధానాల నమోదు ఉంది. కవిత్వపు జాడ లేదు.
కృష్ణన్ Acclaimed poet అట. ఇప్పటి ప్రజలకు సంబంధించిన విషయాలు, రోజువారీ భాషలో చెప్పటం ప్రస్తుత కవిత్వ లక్షణం. అలాగే చెప్పనీ చదువుదాం, అని మళ్లీ చదివాను.
చదువుతూ, ఈ అనువాదపు ప్రచురణ -మరణాల ‘వార్త’, అందులో పోలీసుల పాత్ర- పాఠకులకు తెలియ చెయ్యటం కోసమైతే, దానికి నెలకోసారి వచ్చే ‘ఈమాట’ సాహిత్య పత్రిక సరైన మీడియమ్ కాదు. అందుకు బొచ్చెడు న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. సాహిత్య పత్రిక వార్తా పత్రిక కాదు. అబ్జెక్షన్! అని అందాం అనుకున్నా. కాని అది మాత్రం ఎందుకు! సంగతి ఏమిటో తెలుసుకుందాం. చూద్దాం, అని మరోసారి సాంతం చదివాను.
చూస్తే, కవిగారు, సంఘటన లోని నిజానిజాలు చిత్రించేందుకు, ‘killings’ జరిగినప్పుడు అసలుకి వారు అక్కడ లేరనుకుంటా. బ్రతికి ఉన్న మనుషుల గాయాలకు, రోడ్డు మీద కాని, హాస్పిటల్ లో కాని – మందు రాయటం, కుట్లు వెయ్యటం, వారి పని ఎలాగూ కాదయ్యె. ఈ కవి ఏంబులెన్స్ నడపరు. స్ట్రెచర్లు తొయ్యరు. హాస్పిటల్లో వాలంటీర్ పనైనా చెయ్యరు. ఎవరి శవాలు మోర్గ్ కి చేర్చరు. తన ఆవేదన, శోకం ‘కవిత్వంగా’ చెప్పటం మాత్రమే వీరు పూనుకొన్న పని. ఈ అనువాదపు మాటల్లో కవిత్వం ఏదీ? ఏమో, ఆ ‘almost like mourning’ ఫీలింగు ఈ అనువాదంలో ఉన్నదేమో. “It’s almost like mourning” అన్న emotion ఏమిటో తెలియని నేను, ఆ సంగతి ఆ తమిళకవికి వదిలి వేస్తాను.
ఇది కాల్పనిక విషయం కాదు. తమిళనాడులో ఇటీవలి ఒక నిజ సంఘటన నుంచి ఈ రాత వచ్చింది. సరే, ఆ వార్త వరకూ అందులో చెప్పిన విషయం నిజమై ఉండొచ్చు. ఐనా, అదొక్కటే కాక ప్రసిద్ధకవి గారు, ప్రజాస్వామ్య రాజ్యాలలో బతికే మామూలు ప్రజలం మనమూ, గుర్తించాల్సిన విషయాలింకా ఉన్నయ్యి. అందుకని ఈ కింది వాక్యాలు.
ప్రస్తుత కాలంలో స్కూల్, చర్చ్, కాన్సర్ట్, రోడ్, ఇల్లు- ఎక్కడైనా సరే, ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారు కాపాడమని పొలీస్ ని పిలుస్తారు. కవులను పిలవరు.
ఇటీవలే, అమెరికాలో ఒక వార్తా పత్రిక ఆఫీసు లో పని చేసే వారిని ఒక వ్యక్తి రైఫిల్ తో కాల్చి చంపుతున్నప్పుడు, వార్తాపత్రికలో పనిచేసేవాళ్లు భయంతో వెంటనే పోలీసులని పిల్చారు రక్షించమని. అదే సమయంలో ఇతర విలేఖరులను, ప్రమాదం నుండి దూరంగా ఉండమని, ఆ బిల్డింగ్ కు రావద్దని కూడా వారికి హెచ్చరికలు పంపారు. ప్రజాస్వామ్యంలో ‘పొలీస్ ఫోర్స్’ పౌర రక్షణ కోసం, ఎప్పుడూ సన్నద్ధంగా ఉండే ఒక శాఖ, అని జర్నలిస్టులకు నమ్మిక ఉంది కాబట్టే, రక్షించమని పొలీస్ ని పిల్చింది.
ప్రొటెస్ట్ కవులు, ఏడుపు కవులు, అన్ని రకాల పాప్యులర్ కవులు కూడా వారి రక్షణకు పొలీస్ నే వినియోగిస్తారు. కవి గాయకులు ఆపదలో ఉన్నప్పుడు పొలీస్ నే పిలుస్తారు.
ఏడవవలెననుకున్న కవులు తనివి తీరా ఏడవ వచ్చును. ఆవేశాలు, ఆవేదనలు, రోదనలు, ఇత్యాది ‘ప్రకటన’ లలో వారు మునిగి తేలవచ్చు. డబ్బుంటే ‘ఏడుపు ఏంథోలజీ’లు మూలాలు/ అనువాదాలు ప్రచురించుకోవచ్చు. కానీ, ఈ విశాల భూప్రపంచంలో డెమొక్రాటిక్ దేశాలలో ప్రజలకు నిత్యం చాలా ఆవశ్యకమైన సర్విసెస్ సమకూర్చేవారిలో, పౌరులను రోజువారీ ప్రమాదాలనుండి రక్షించే శాఖలలో కవులు లేరు. వారికి అలాటి శిక్షణ, స్కిల్స్ లేవు.
నిన్నగాక మొన్న థాయ్ లేండ్ లో underwater caves లో ఇరుక్కుపోయిన పిల్లలను ఎంతమంది divers, కలిసికట్టుగా పని చేసి రక్షించారు! That’s heroic. ప్రజలు చచ్చాక తీరుబాటుగా కవి కాళ్లారజాపుకుని, మైక్రొసాఫ్ట్ వర్డ్ లో మాటలు, శవాలు కుప్పలు పోసి, వెళ్లబోసే ఏడుపు కవిత్వం వల్ల వచ్చేదేంటి, పిడకలు.
If there is a rescuer and there is a weeper -who does nothing but weeping, who would you choose! I will choose the rescuer.
Lyla
గడినుడి – 21 గురించి తః తః గారి అభిప్రాయం:
07/27/2018 5:46 am
సుభద్ర గారూ! మరొక మాట:
నా అభిప్రాయం లో ‘కొమ్మలు’ అన్నది యెందుకు సరిగ్గా సరిపోయే సమాధానమో చెబుతాను: 23 నిలువుకి ఇచ్చిన ఆధారంలో మరొక స్త్రీ మూర్తి ఉన్నది గమనిస్తారు గదూ! అప్పుడు దానిని ‘పొద్దు తిరుగుడు గుమ్మ’ అని పూర్తి చేయవచ్చు. ‘కొమ్మలు’ లో ఉన్న ‘మ్మ’ తో కలుపు కుంటూ — పైగా 36 అడ్డం లో, ఉన్నది దానికి గూడా నేను విలువ ఉంటుందనే భావించాను.
మీరన్న పాట నాకు తెలియదు ఈనాటి (చాలా) పాటలు తర్కానికి నిలవవు. నుడికట్టు ఆధారాలు బుర్రకు పదును పెట్టాలి! తర్కానికి నిలవాలి! ఉదాహరణకు మీరిచ్చిన 17 అడ్డం చాలా బావుంది.
నమస్సులతో – తః తః
తా. క. ‘మీరన్నది కూడా బాగుంది.’ రచయిత్రి.
పెద్ద పెద్ద పరీక్షలకే తప్పులేని సమాధానాలు ఒకటికి మించి ఉంటున్నాయి. నిర్వాహకులు ‘ఏ తప్పూ లేకుండా’ అని అనకూడ దేమో. ‘మా దగ్గర ఉన్న సమాధానాల తో సరిపోయే’ అని మాత్రమే అనాలి.
1 + 1 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
07/04/2018 9:36 am
రాతల, వాట్సాప్ విషయాలలో మరోమాట: నాలుగేళ్ళు రూమ్మేట్స్ గా ఉండగానే తన స్పెర్మ్ కౌంటు గురించీ, పెళ్ళాం తనని పక్కలోకి ఎందుకు రానివ్వదు, అనేవి పురుషులు – నాకు తెల్సినంతలో – ఎవరికీ చెప్పుకోరు. మహిళలు చెప్పుకూంటారేమో మరి. పేరు బట్టి కధ రాసినావిడ మహిళ అనుకుంటున్నాను కనక ఇది కూడా చెప్పనివ్వండి: మహిళలు ఎలా ఆలోచిస్తారో అనేది పురుషులకి అంటగట్టకండి. కారు నడిపే పురుషుడు డేష్ బోర్డ్ కేసు చూస్తూ పెళ్ళాంతో మాట్లాడకుండా ఉంటే ఆయన ‘రాత్రి ఇవాళైనా ఈవిడ నన్ను పక్కలోకి రానిస్తుందా?” అని కాదు ఆలోచించేది, కారు కు చేయించాల్సిన రాబోయే ఆయిల్ చేంజ్ గురించి, క్రితం సారి ఆ విషయంలో మోసం చేసిన కారు మెకానిక్ గురించీను.
ఇంకో విషయం. ఇది నా స్వానుభవంతో చెప్తున్నది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఆహా ఓహో అనే చదువర్లతో ఏ రచయితకీ ఎంతమాత్రం ఉపయోగంలేదు. వాళ్లవల్ల ఏమీనేర్చుకోలేము. ఎవరైతే నా రచనని ఏకి ఎండగడతాడో వారి వల్లే నా రాతలు బాగుపడతాయి.
స్వస్తి!
[ఈ అభిప్రాయంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు, ఈ కథకు సంబంధం లేని వాక్యాలు తొలగించడమైనది. — సం.]
బేతాళ కథలు: కథన కుతూహలం – 2 గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
07/03/2018 5:06 am
జాలంలో వెలువడ్డ కథల మీద, మీ పరిశోధన, పరిశీలన, ఆ ఫలితాలతో ఒక కథకి వస్తువు చేకూర్చుకోవటం అభినందనీయం.
మూడు కొత్త పదాలు తెలుసుకున్నానండి ఇది చదివిన తరువాత. చి న
శిరోదీపాలు
చలిగాలి మరమీట
వేగనిరోధిని
వీటిల్లో చలిగాలి మరమీట మీద తోచిన ఒక చిన్న అభిప్రాయం. మరమీట అంటే ఆంగ్లంలో మెకానికల్ స్విచ్ అనుకుంటే, చలిగాలి యంత్రంకి ఒక మరమీట ఉండవచ్చనుకుంటాను.
రెండు ప్రశ్నలు గురించి మోహన గారి అభిప్రాయం:
07/02/2018 4:19 pm
పద్యములు రెండు విధములు – (1) కేవలము చదువుకొనుటకు మాత్రమే, (2) చదువుతోబాటు, పాడుకొనుటకు కూడ. అన్ని పద్యములను వారికిష్టమైన రాగములలో పాడుకొనవచ్చును. కాని వాటిలో కొన్నిటిని మాత్రమే తాళముతో పాడుకొనుటకు వీలవుతుంది. పాడుకొనేటప్పుడు పొల్లులు, ద్రుతములు శోభించవు, ఏ “సుధవోల్ సుహాసిని” లాటివి తప్ప. అప్పుడు పొల్లులను అజంతములుగా మార్చితే గానసౌలభ్యము లభిస్తుంది. అందుకే ఈ పరిష్కార మార్గాలు, మల్లేశ్వర రావుగారు. నా ఉద్దేశములో ఛందస్సుకు గానసౌలభ్యము లభిస్తే దాని విలువ ఇనుమడిస్తుంది. ఒక పద్యమునకు కావలసినవి – ఉచితమైన ఛందస్సు, భావము, పదముల ఎన్నిక, వాటి విఱుపులు, సులభముగా అర్థమయ్యేటట్లు ఉండే ద్రాక్షాపాకము. ఇవన్నీ చేరినప్పుడు పద్యము పాట అవుతుంది, పాట నోట మెదులుతుంది. ఛందస్సు కలకాలము నిలుస్తుంది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము మాత్రమే. అంగీకరిచడము, లేకపోవడము అన్నది పాఠకుల స్వంత అభిప్రాయము. నమస్సులతో విధేయుడు – మోహన
కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/21/2018 1:54 pm
పెరుమాళ్ మురుగన్ -బెంగళూరు పెన్ సంస్థలో ఏ భాషలో ప్రసంగించారో తెలియదు. అరవంలో ఉపన్యాసమిస్తే వీరు చెప్పినదానిలో ఏదో ఘనత వహించిన విషయం ఉందని అనువదించి, ఈ తెలుగు సాహిత్య పత్రికలో దించినారేమో, అని చదివాను. ఎంత మాత్రం లేదు.
ఎప్పటి కాలం మనుషుల గురించి ఈ మాటలు! ఏనాటి సంగతులు! ఈ ప్రసంగం ‘వక్త’ వారి తాతగారి తాళపత్ర గ్రంథం నుండి చదివి వినిపించిందా? ఇప్పటి చదువుకున్న పౌరుల కొరకు 2017 లో, ఆలోచించి రాసుకొచ్చి చదువుతున్నట్టు మాత్రం లేదు.
కుల మతాల గురించీ, కులమత వివక్షతలనేవి ఉన్నాయని, ముందు నేర్పించకుండా, ఇప్పటి కాలం మనుషులకు ‘వాక్స్వాతంత్రం’ గురించి తెలిసే విధానం లేదంటున్నాడీయన.
చదువుకున్నంత మాత్రాన జ్ఞానం రాదంట. ఉద్యోగాలు చేసినా రాదంట. పౌరహక్కుల గురించి, తెలియాలన్నా, స్వతంత్రించి మాట్లాడాలన్నా, ఎప్పుడో దేశంలో వర్తింపచేసిన కులమత తత్వాలు గురించి ఈనాడైనా తెలుసుకోపోతే ఎలా అంటున్నాడీయన.
కొన్ని ఆహారాలు కొందరికి సహించకపోటానికి ఉపన్యాసకుడికి కులమొక్కటే కారణంగా తోస్తుంది. ఏ రోజుల మాటలు? ఎప్పటినుండో హోటల్స్‌లో , సమావేశాల్లో, ఎయిర్ లైన్స్‌లో మీకు ఎలర్జీలున్న్నయ్యా, గ్లూటెన్ పడదా లాక్టోస్ పడదా, మాంసం పడదా, -ఇలాటి ప్రశ్నలడుగుతున్నారు, వంటలు వండి వడ్డించే వాళ్లు. పడని వస్తువులకు కొందరికి రకరకాల బాధలు. కొందరికి ప్రాణాపాయం. అందువల్ల ఈ జాగ్రత్తలు అవసరం. వీరెవరూ ఈ రోజుల్లో మీ కులమేంటి అని అడగరు.
ఎప్పుడో ఏదో రోజుల్లో కుల భేదాల బట్టి, కొందరు మనుషులను, మరికొందరు వారి ముందు వంగి మాట్లాడమన్నారేమో. ఇప్పడా అద్భుత చారిత్రక విషయం 2017లో, ఒక డెమొక్రాటిక్ దేశంలో పౌరులకు ఈ ఉపన్యాసంలో ఎందుకు చెపుతున్నట్టు.
ఇప్పటి కాలంలో, కొందరు మనుషులు పొట్టిగా ఉంటే, వారి ముందు ఎవరైనా పొడుగు వాళ్లు వంగి, చెవొగ్గి మాటలు వినాల్సొస్తే, వారు బహు మర్యాదస్తులు. ఎవరూ ఎవరికీ సేవకులు కారు.
ఫ్లూ సీజన్లో, దగ్గేప్పుడు తుమ్మేప్పుడు ఎవరి మీదా ఏ తుంపరలు పడకుండా, అవతలికి ముఖం తిప్పుకుని, చేతులు అడ్డు పెట్టుకోండి, మేస్క్ వేసుకోండి, చేతులు కడుక్కోండి అని సలహాలిచ్చే వాళ్లున్నారు. ఆ నిబంధనలు ఆచార వ్యవహారాల విషయంగా కాదు. కుల మత భేదాల గొడవ లేదు. ఇలాటి ప్రస్తుత ఆవశ్యక ఆరోగ్య కారణాలు వక్త ఉపన్యాసంలోకి రావు.
ఇది ఆలోచన పాలోచన లేని సోదిబుచ్చి ప్రసంగం. వక్తకు ఎప్పడూ తన ఆలోచనలను సవరించుకోటంలో సంసిద్ధత ఉండాలి. పాత ఆలోచనైతే గుడ్ బై చెప్పగలగాలి. సమాజం ముందుకు సాగింది. కాని ఈ ప్రసంగంలో వక్త -కులమతాల ఆలోచనలో కూరుకు పోయి ఉన్నారు. చాలా ఏళ్ల కింది కాలంలో కొంత relevancy, ఉపయోగం ఉన్న, ఆలోచనా పద్ధతులనే ఇప్పటికీ సాధనాలుగా వాడాలనుకుంటున్నారు.
To approach the present people’s education about much beloved, cherished – Freedom, Freedom of speech – thru caste and religion is perverse, divisive, old grudge propagating. It is counter-productive. To think it is essential to do so, in these times, is a corrupt, retrogressive thought. It is not necessary to know about religion and caste, to understand concepts of Freedom, the Freedom of speech.
-Lyla
రెండు ప్రశ్నలు గురించి రాఘవ గారి అభిప్రాయం:
06/11/2018 7:06 am
నమస్కారం మోహనరావుగారూ
1. ఛందఃపరిణామాలను ఆధారంగా చేసుకుని మీరు చేసిన ప్రతిపాదన తార్కికంగా చాల బాగుందండీ.
2. ఒక్కొక్క గుణంబు కల్గుదు — టంకణదోషమో ఏమిటో గణభంగమయ్యింది. గమనించగలరు.
3. అజంత-హలంతాల విషయం: పలికే భాషకీ వ్రాసే భాషకీ అంతరం నేటి కాలంలో మాదిరిగానే పూర్వకాలంలో కూడా ఉండే ఉంటుంది. అందువలన పదాన్ని అజంతంగా వ్రాసి హలంతంగా పలకటానికి కూడా అవకాశం ఉందనుకుంటానండీ. ఇది కేవలం నా ఊహ మాత్రమే.
4. నామటుకు నాకు ద్రుతాంతమైనా అజంతమైనా బాధ లేదనిపిస్తుంది. ఐతే ద్రుతాంతంకాని హలంతం కొన్నిచోట్ల కృతకంగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఇటులన్ అంటే బాగానే ఉంటుంది, కానీ అదే అర్థంలో ఇటుల్ అంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
5. అంచున్ + అల = అంచునల / అంచున్నల.
6. దంత్య చకారాన్ని త్స గా వ్రాయటం నేటికీ కొన్ని చోట్ల నేను చూచానండీ. ఉదాహరణకు, అమలాపురంలో చల్లా వారి వీథిని కొందఱు త్సల్లా వారి వీథిగా వ్రాస్తారు.
ఇట్లు
భవదీయుడు
జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
06/08/2018 11:15 am
మొదటి “మాధవ్” కామెంట్లో ఈమాట సంపాదకులని చెప్పే లింకు ఉంది. అందులో టోపీ తో ఇది. టోపీ లేకుండా ఇది అని రాసారు. రెండో “మాధవ్” కామెంట్లో సంపాదకుల టోపీని ఇక్కడ కోతులెత్తుకుపోయాయని ధ్వనించింది – అదే సంపాదకులు పాఠకులు రాసేది ఏమరుపాటుగా చూసీచూడనట్టుపోవడంవల్లా (దీన్నే కథలో టోపీ వ్యాపారస్తుడు పడుకున్నప్పుడు అని చదివినట్టు గుర్తు) టోపీ ఉంది లేదు అని పెట్టకపోవడం వల్లాను. వీరే వారా, వారే వీరా అనేది సందిగ్ధం. అసలు టోపీ ఉందా లేదా అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఆ టోపీ కత్తెరకి గురైందా, అసలు టోపీ రహస్యం ఏమిటీ అనేవి పాఠక లోకానికి తెలియవల్సిన అవసరం లేదా? మీరు కనక టోపీ పారేసుకుంటే చెప్పండి. మా ఇంట్లో కొన్ని ఉన్నాయి. అందులో ఒకదానిమీద ఇప్పుడే పెయింటింగ్ నేర్చుకుంటూ ఇల్లంతా అలికే కుర్రాడి చేత ‘ఈమాట సం.” అని రాయించి పంపిస్తాను. పోస్టు ఖర్చులు కూడా నావే. ఇంక నోరు మూసుకో అంటున్నారా? చిత్తం.
గౌరవనీయులైన మిగతా పాఠకులకి: ఈ వ్యాఖ్య ఈమాట ని జెనెరల్‌గా ఉద్దేశించి రాసినది. మిగతావాళ్ళు భుజాలు తడుముకోనవసరం లేదు.
జూన్ 2018 గురించి Madhav గారి అభిప్రాయం:
06/08/2018 8:58 am
అమరేంద్రగారూ,
Before I disagree with you, I need to clarify what I meant.
నేను తరగతులు, రకాలు, తరహాలు, వంటి పదాల బదులు కులాలు అన్నమాట ప్రత్యేకంగా వాడాను, ఎందుకూ అంటే వివక్షను సూచించడానికి. ఇది జాన్రాల మధ్య ఉండే తేడావంటిది కాదు. ఆంగ్ల సాహిత్యంలో ఎన్నో జాన్రాలున్నాయి. కానీ ఏ ఒక్క జాన్రాకూ వేరేవాటి పట్ల చిన్నచూపు లేదు. వివక్ష లేదు. అప్‌డైక్‌నూ, ఆట్‌వుడ్‌నూ, రాత్‌నూ సమీక్షించిన విమర్శకులే బ్రౌన్‌నూ, గ్రిషమ్‌నూ, క్లాన్సీనీ, కింగ్‌నూ కూడా సమీక్షించారు, అదే గౌరవంతో, అవే పత్రికల్లో, వాటి వాటి పరిథుల్లో. విమర్శకులు ఒక తరహా సాహిత్యం గొప్పదని, ఇంకొకటి తక్కువని సాహిత్యంలో నిమ్నౌన్నత్యవిభజన చేయలేదు. ఆరకమైన విభజన కనీసం ఆంగ్ల సాహిత్యంలో నాకు కనపడలేదు. ఇతర భారతీయ భాషల సాహిత్యం గురించి నాకు అంతగా పరిచయం లేదు కాని, తెలుగులో ఆ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది.
This is at best an idealistic notion, at worst a gross generalization. More over, this is a political distinction, not a literary characteristic. నేను అంటున్నది ఇదే. వ్యవస్థను ప్రశ్నించేదే సీరియస్ సాహిత్యం అని అనడంలోనే ఈ వివక్ష ధ్వనిస్తోంది కదా. So, what we have here is a political requirement masquerading as a literary definition. ఈ ధోరణి వల్లనే తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు ఉన్న భిన్నత్వం పోయింది అని నేను అభిప్రాయపడింది.
The problem is not with categorization, it is with value judgement and disregard.
జూన్ 2018 గురించి Madhav గారి అభిప్రాయం:
06/07/2018 11:31 am
(సందిగ్ధంలో ఉన్నాను, ఇలా చర్చ జరుగుతున్న సమయంలో నేను కామెంట్ పెట్టచ్చా? సాటి ఎడిటర్లేమనుకుంటారు? నేనుగా పెట్టాలా, ఎడిటర్‌గా పెట్టాలా? ఏ హ్యాట్ పెట్టుకోవాలి? అసలు పెట్టుకోవాలా? ఆ తేడా ఎవరైనా కనీసం గమనిస్తారా? అయినా సరే, ఒక రెండు ముక్కలు చెప్పకుండా ఉండలేక ఈ కామెంట్ రాస్తున్నాను. ఒకసారి పోస్ట్ చేసినాక దాన్ని ఏం చేస్తారో సంపాదకుల ఇష్టం. నేనైనా వారి నిర్ణయానికి కట్టుబడి ఉండవల్సిందే మరి.)
1. రామారావు గారూ, మీ సూచనలు ఎప్పుడూ విలువైనవే. మీకు కృతజ్ఞతలు. రెండు విషయాలు.
ఒకటి – I do not see any ‘escalation’ either from Lyla or from the editors. Initially the voices registered a slightly higher note, but then toned down. Looking at the published commentary, it appears to me that the problem here lies not with the decision but the execution of which, could have been a tad better. రచయితలకు, పాఠకులకు ఉన్నంత వాక్‌స్వేచ్ఛ సంపాదకులకు, నిర్వాహకులకు ఉండదు. వారికి నిగ్రహం మరింత అవసరం.
రెండు – [Editor hat ON]ఈమాట రెగ్యులర్‌గా చదివే మీరు కూడానూ ఎవరి “మనోభావాలు దెబ్బతింటాయనో” సంపాదకులు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనడం/అనుకోడం నిజంగా ఆశ్చర్యం. ఆమాట ఈమాట గురించి ఏనోటా వినలేదు ఇన్నేళ్ళలో నేను. పైపెచ్చు “మనోభావాలు” గాయపరుస్తున్నామని మమ్మల్ని తిట్టేవారే ఎక్కువ. That was, is and will be never our concern, but the standards and the etiquette of eemaata are. At times we err in our judgement. We learn from it and go on. కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపం. Our only job is to do our job the best we can.
2. ఈమధ్యనే ఒక స్నేహితునితో అన్నాను అతని రచన గురించిన ప్రస్తావనలో. “మాకు రచన ముఖ్యం, రచయిత ఎవరు అన్నది అనవసరం. మామెక్కడైనా మామే కాని మొక్కజొన్న చేనుకాడ కాదని తెలుగులో ఒక మొరటు సామెత ఉంది. మాకూ అలానే ఈమాట దగ్గర అందరూ పరాయివారే”, అని. ప్రత్యక్షానుభవంతో చెప్తున్నాను – సంపాదకులు కేవలం వారి రచనల నాణ్యత మాత్రమే పరిశీలిస్తూ (చాతయినంతగానే అనుకోండి), వారి మనోభావాలకు, అహంభావాలకు, స్థాయీపరపతులకు విలువనివ్వనందువల్లే ఈమాటకు తమ రచనలు పంపని రచయితలు ఉన్నారు. అదే సమయంలో, ఆ ప్రొఫెషనాలిటీ, సాహిత్యం పట్ల గౌరవం శ్రద్ధాసక్తులు ఆశించి, పొందినందువల్ల తమ రచనలు మొదటగా ఈమాటకే పంపే రచయితలూ ఉన్నారు. నాణేనికి ఒకేవైపు ఎలా ఉండదో అలానే విమర్శ లేకుండా సాహిత్యం ఉండదు. రచయిత నుంచి వచ్చినది వచ్చినట్టు ప్రచురించగల స్థాయి ఏ కొద్ది రచనలకో ఉంటుందేమో. మొదట్లో మా విమర్శ తీసుకోలేకపోయినా, మా పరిష్కరణలను సందేహించినా, ఒకసారి మాతో కలిసి పని చేసినాక, ఈమాటపై తమ అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్న రచయితలూ ఉన్నారు. ఇంకా మా పద్ధతుల పట్ల అపోహల్లోనే ఉన్న రచయితలూ ఉన్నారు. It is a diverse world out there. అందువల్ల, ఇక్కడ పారేది పన్నీరా మురికినీరా అనేది ఎవరి దృక్పథం బట్టి వారు నిర్ణయించుకునేది. [Editor hat OFF]
3. ఇకపోతే, I have known Lyla well and her wickedly sharp wit very well. I am sure, if their tone offended Lyla, she would have openly said so and the editors too would have offered her an unconditional apology. More importantly, what struck me here is the maturity and decorum she has shown. “సాహిత్యం మీదే ఆసక్తి. ఈ లోపల ఈ పత్రికలో వేరే ఆర్టికల్స్ చదువుతూనే ఉంటాను. వాటి మీద అభిప్రాయాలు ఈ మేగజీన్ లో రాస్తూనే ఉంటాను. ఎప్పటి మాదిరే. కొన్నేళ్లుగా ఈ పత్రికలో నేను రచన చేస్తూనే ఉన్నాగా. ఈ ఒక్క కామెంట్ మీద ఎక్కువ తక్కువ ఇంట్రస్ట్ ఏమీలేదు.” She didn’t take this episode personally. తన “మనోభావాలు” గాయపరచుకోలేదు.
తెలుగులో రచయితలు ఈ పరిణితిలో కనీసం సగమైనా కలిగివుంటే ఎంత బాగుండునోనని నేను కలగన్నదీ నిజం! అలాగే, ఇక్కడ కొన్ని వ్యాఖ్యలలో కనిపించిన సృజనాత్మకత చూసి కొంత ముచ్చట పడి, అది కథల్లోనూ కవితల్లోనూ కూడా కనిపిస్తే ఎంత బాగుండునోనని నేను అనుకున్నదీ నిజం!
4. చర్చ ఆ ముందుమాట మీద – కేవలం తెలుగులోనే ఎందుకు పాప్యులర్ రచయితలు, సీరియస్ రచయితలు అని రెండు కులాలు ఉన్నాయి అన్న విషయం మీద – జరిగి ఉంటే బాగుండేదని ఆశించాను. కాని, పక్కదారి పట్టింది. నెట్ స్వభావమే అంత. Personally I think it’s time for us to move on. (నేను చెప్పదలచుకున్న రెండు ముక్కలూ చెప్పేశాను కాబట్టి!)
I hope I did not disappoint any one with my uncharacteristic humility!
Regards
మాధవ్
జూన్ 2018 గురించి రాధిక గారి అభిప్రాయం:
06/07/2018 11:30 am
ఈమాట సంపాదకులకు:
ఇంతకు మునుపు వ్రాసిన నా అభిప్రాయంలో నా భయానికి కారణాన్ని (వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనన్నది నన్ను భయపెట్టిన విషయమని) నేను స్పష్టంగా వ్రాశాను.
అటువంటి భయం అర్థరహితం కాదనీ, అన్ని అభిప్రాయాల విషయంలో సంపాదకులు ఒకేరకంగా వ్యవహరించడం లేదనీ ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమయింది.
“సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచనని పాటించకుండా వ్రాసిన ఒక వ్యాఖ్యని – అది కూడా హుందాగా కాక అపహాస్యం చేస్తూ వ్రాసిన వ్యాఖ్యని – ప్రచురించడం ద్వారా మీరు ఆ విషయాన్ని స్పష్టం చేశారు.
అది అపహాస్యం కాదు కవిత్వం అనుకునేందుకు కూడా ఇపుడు అవకాశం లేదు. “మీ అభిప్రాయాలను కవితలుగా, ఆలాపనలుగా, కథానికలుగా రాయకండి. మీ సృజనకు అభిప్రాయాల పెట్టె వేదిక కాదు.” అన్న మీ కొత్త నిబంధనను అంగీకరిస్తూ వ్రాసినందువలన ఆ అభిప్రాయాన్ని సూటిగా చేసిన అవమానంగానే తీసుకుంటున్నాను.
ఇలా అవమానింపబడినందుకు బాధపడుతూ ఇకపై ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను.
అభినందనలు!
[క్షమించాలి. అది కేవలం సరదాగా అన్న మాట అని, “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచన ఉన్నప్పటికీ, కొన్నిసార్లు పాఠకుల మధ్య చర్చలో లైట్ బ్యాంటర్ వల్ల లాభమే కాని నష్టం లేదని అనుకోవడం చేత, ఆ వ్యాఖ్యలో మాకేమీ మీ పట్ల అవమానం కనిపించకపోవడం వల్లనే, ఆ వ్యాఖ్య ప్రచురించాం. -సం.]
జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
06/06/2018 8:13 am
బ్రహ్మానందం గారు, ధన్యవాదాలు. ఇతర రచయిత(త్రు)ల గురించి నాకు తెలియదు కానీ ఎప్పుడైతే నేను ఏదైనా రాసి పంపిస్తానో అప్పుడే దాని మీద విమర్శ కి సిద్ధంగా ఉంటాను. రచయితగా మీకు తెలిసే ఉండొచ్చు. “ఆహా, ఓహో” అనేవాళ్లతో మీకు ఏమీ ఉపయోగం లేదు – ఛాతీ అయిదంగుళాలు పెంచుకుని మరో కధో, కవితో రాయడానికి అది పనికివచ్చినా. అలా పెరిగిన ఛాతీ అక్కడే ఉండిపోదు కనక విమర్శ చేసేవాళ్లతోనే నాకు లాభం. వాళ్ళు సరైన విషయం, చేదు నిజం చెప్తారు. అయితే అందరూ ఒకేలాగ నెమ్మదిగా చెప్పరు కదా? ఒకరి భాష మరొకరికి రాకపోవచ్చు. కాని వాడిన భాష, వెక్కిరింపూ వదిలేసి అందులో అసలు ఏమి చెప్పదల్చుకున్నారు అనేది; వాళ్ళు చెప్పేది గ్రహించగలిగితే నా రచనలు మెరుగుపడతాయి. లేకపోతే మూసలో పొసినట్టు ఒకే రకం రచనలు రావడం తధ్యం. అంటే మొదటి రెండు పేరాలు చదవగానే ఇది ఫలానా శర్మ గారు రాసారు, చివర్లో ఇలా అవుతుంది గారంటీగా అని చెప్పేయవచ్చు. తెలుగు సినిమాల్లో లాగా మొదట్లో హీరో, నాలుగు గుద్దులూ, చివర్లో మళ్ళీ అందరూ ఒకోచోట ఫేమిలీ ఫోటో, శుభం కార్డు. ఓ సారి ఆ మూస పద్ధతీ, ముద్రా పడగానే ఇంక గొర్రె తోక రచనలు వస్తాయి. ప్రస్తుతం నావి అలాగే ఉన్నాయి కాబోలు.
ఎప్పుడైతే ఒక పత్రికకి రచన పంపించానో అప్పుడే- ఆయా సంపాదకులు విమర్శిస్తారనీ, అందులో తప్పులూ, ఒప్పులూ ఎత్తి చూపుతారని సిద్ధంగా ఉండాలి. నేను రాసిన పదహారు పేజీల కధ ఒక్కోసారి నాలుగు పేజీల్లో రాయొచ్చు. కన్నెగంటి చంద్రగారు దీనికో ఉదాహరణ అనుకుంటా. ఒక్కోసారి దాన్ని పద్ధెనిమిది పేజీలకి పెంచవచ్చు. అయితే “ఈ సంపాదకుడు నేను అమెరికా రాకముందు బొడ్డూడని బచ్చా గాడు ఇప్పుడు నా రచనలనే దిద్దే అంతవాడా?” అనుకుంటే ఆ పత్రిక మీరు చెప్పినట్టు మురికినీరు అయ్యి కడుక్కోవడానిక్కూడా పనికిరాదు. అప్పుడు మరో చెరువు వెతుక్కోవచ్చు. అయితే అక్కడ కూడా ఇదే విధంగా మురికి నీరు ఎదురవ్వొచ్చు కదా? మరో విషయం ఏమిటంటే ఒక సంపాదకుడికి నచ్చని రచన మరోచోట బాగుండవచ్చు (గ్రిషాం, హారీ పాటర్ లాంటి రచయితలకి ఇదే సమస్య మొదట్లో)
నేను రాసినది ప్రతీ అక్షరం పొల్లుపోకుండా వేసి తీరాలి అనుకుంటే బ్లాగు అంత ఉత్తమం మరోటి లేదు. అక్కడ కూడా మీరు మోడరేషన్ పెట్టుకోకపోతే ఎవరో ఒకరు ‘ఇది ఏడిసినట్టు ఉంది” అనడానికి అవకాశం ఉంది కదా? ఆఖరికి ఫేసు బుక్కులో కూడా లైకులు రాలేదంటే అర్ధం అది ఎవరికీ నచ్చకపోవడం కావొచ్చు – చదవక కాదు. అయితే ఆయా మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టూ రాస్తే ఏమౌతుందో రోజూ చూస్తూనే ఉన్నాం. అందువల్ల సంపాదకుల కత్తెర ఉండడం వల్ల లాభమే కానీ నష్టం లేదని నా అభిప్రాయం.
సంపాదకుల పని మూడో కంటితో చదివి ఎలా ఉందో చెప్పడం. దాన్ని వేసుకుంటారా లేదా అనేది వేరే విషయం. ఒకోసారి బూతు కధ, సాహిత్య లోకంలో ఎవరికీ నచ్చనిది పత్రిక లాభం కోసం వేయవచ్చు. అందులో ముఖ్య సంపాదకుడు ఎంత గింజుకున్నా మిగతా సహ సంపాదకులవల్ల కురదరక పోవచ్చు – అచ్చు పత్రిక మనుగడ డబ్బు మీద ఆధారపడి ఉంటుంది కనక. ఇంతకీ ఏమి చెప్పదల్చుకున్నానంటే సంపాదకుల దిద్దుబాటుకి సిద్ధంగా లేకపోతే ఫలానా పత్రికకి పంపడం మానుకోవడమే మంచిది. ఇదే మీరు చెప్పిన మురికినీరు వాడకపోవడం. అయితే దీనివల్ల ఎవరికి నష్టమో రచయితకే బాగా తెలుస్తుంది. నా ఉద్దేశ్యంలో మారవల్సినది రచయితే. అలాగని మొత్తం మారిపోయి సంపాదకుల తొత్తుగా ఉండమని చెప్పట్లేదు.
ఎప్పుడైతే “నేను షరతులకి కట్టుబడి ఉంటాను” అనే “ఆప్ట్ ఇన్” చెక్ బాక్స్ నొక్కి వ్యాఖ్య, కధా పంపించారో అప్పుడే మీరు సంపాదకుల కత్తెర కి ఒప్పుకున్నట్టు లెఖ్ఖ. అలాకాని పరిస్థితుల్లో వేరే చెరువు చూసుకోవడం ఉత్తమమే – రచయిత దృష్టిలో ఫలానా పత్రిక మురికినీరు కాబట్టి. దీన్నే అచ్చు పత్రికలలో ‘ఇందులో ఉత్తర ప్రత్త్యుత్తరాలకి తావు లేదు’ అని రాస్తారనుకుంటా. అయితే మూస పద్ధతిలోంచి బయటకి రావడం అసంభవం అనేది తెలిసి వస్తుంది త్వరలోనే – ఒక్కో చెరువూ మురికి అనుకుంటూ పోతే. మరో మాటండోయ్, నేను అంత పేరున్న రచయితనీ కాదు నన్నెవరూ “దయచేసి మా పత్రికకి రాయండి” అని అడగలేదిప్పటివరకూ. అందువల్ల ఆ విషయం నేను చెప్పలేను. నాకు తెలిసినంతలో సంపాదకులూ చదువరులూ చేసిన విమర్శల వల్ల (ఉదా: కవిత్వం మార్మికంగా ఉండాలి, ఓ చట్రంలోంచి బయటకి రావాలి, ఇందులో ఫలానా సన్నివేశం అనవసరం, ఆ మొదటిపేరా కంగాళీ తీసేయవచ్చు, ఫలానా వ్యాక్యం రాసాక మిగతా కధ అనవసరం, మీరు ప్రతి వ్యాఖ్యలు పెట్టి మరొకరెవరూ వ్యాఖ్య చేయకుండా చేస్తున్నారు [ఇంత ఆశ్చర్యం కలిగించిన కామెంట్ ఇప్పటిదాకా చూడలేదు]) నా రాతలు మెరుగుపడ్డాయని అనుకుంటున్నా.
మరో విధంగా బ్లంట్ గా చెప్పాలంటే నేను రాసిన కధో, వ్యాఖ్యో ఫలానా పత్రిక వారు ఎందుకు వేయాలి? ఆఖరికి నన్ను నిజంగానే “మా పత్రికకి ఏదో ఒకటి రాయండి” అని అడగగానే, నేను రాసినది “ఏది పడితే అది” వేయాలా? ఆహ్వానించారు కదా అని ఏదో ఒకటి రాస్తే అది వాళ్లకి నచ్చవద్దా? రాయడం నా విశేషాధికారం అయితే దిద్దడం, వేయాలా వద్దా అనేవి వాళ్ల ప్రత్యేధికారం కాదా?
చివరిగా, ఏదో చెప్దామనుకుని మరొకటేదో చెప్పినట్టు అనిపిస్తే క్షంతవ్యుడను. నమస్తే
సెలవు మాస్టారూ! గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
06/04/2018 11:28 am
సత్యవతి గారు,
మీరు ప్రస్తావించిన త్రిపుర గారి కవితని వారి అల్లుడు, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు మొన్నామధ్య ఫేస్‍బుక్ లో ఒక టపా ద్వార పంచారు. అది ఇక్కడ ఆసక్తి ఉన్న పాఠకుల కోసం ఇస్తున్నాను.
ఓ కాఫ్కా సుబ్బరామయ్య గారి యింగువ వృత్తాంతం – త్రిపుర
అతనిప్పుడు ఒక ఎముకల గూడు
ఎవరీ ప్రపంచంలో
తమ పాదముద్రలొదిలేసి పోయారు
ఎవరెవరో ఎందరెందరో ఎక్కడెక్కడికో
అనంత కాల ప్రవాహంలో కొట్టుకపోయారు’
అతనోసారి ఎన్నేళ్ల క్రితమో
రోడ్డుమీద నడుస్తూ
ఉన్నట్లుంది అన్నాడు నీతో
జీవితంలో ఎన్నో విషయాలు
తెలుసుకోకుండానే వెళ్లిపోతాం
నువ్వు రోడ్డు మీద పోతూంటావ్
అవతల దూరంగా వెళ్తున్న ఎవరినో
చూడాలనుకుంటావ్
కాని ఏ లారీయో ట్రక్కో అడ్డువస్తుంది
అంతే, ఆ మనిషిని ఎప్పటికీ చూడలేవు
ఏదో తెలుసుకోవాలనో చూడాలనో
అనుకుంటూనే
కాలం గడిచిపోతుంది
చివరకు అట్లాగా చచ్చిపోతాం
ఆఖరుగా ఒక ప్రశ్న:
యింతకీ ‘యింగువ’ ఏమిటి?
ఒక కుడివైపు చిన్నగదిలో
కిటికీ పక్కన నవ్వారు మంచానికి
అతడిపుడొక అంటుకున్న బల్లి
మగత లోంచీ దగ్గు లోంచీ
ఎప్పుడో ఒకసారి పైకి చూస్తూ
వచ్చిన వాళ్లందర్నీ
ఏదో అడుగుతున్నాడు
అతని గుండెలమీదికి వంగి విందామని
నువ్వు ఏమిటి కావాలని అడిగితే
ఆఖరి గరగర ఊపిరితో
యింగువ ఏమిటి అన్నాడు
తరవాత రెండుసార్లు తల ఎగరేసి
దేన్నో వెతుకుతున్నట్లు చూసి
అంతా అయిపోయిందనిపించాడు
యింగువ ఏమిటో అతనికి తెలియలేదు
సుబ్బరామయ్యగారు కూడా చెప్పలేదు
నీక్కూడా చాలా తెలుసు
కాని యింగువ ఏమిటో యిప్పటికీ తెలియదు
అదొక కుట్ర
అదొక విద్యుత్ రహస్యం
అదొక మాయావి చెలగాటం
అదొక పులులు తిరిగే రాత్రి
ఏదేనా అవవచ్చు
తెలుసుకోవాల్సిన అవసరం
వుందోలేదో కూడా తెలియదు
నవ్వారు మంచం మీదో
హాస్పిటల్ ఆక్సిజన్ టెంట్ లోనో
ఆఖరి శ్వాస విడుస్తున్నప్పుడైనా
(‘త్రిపుర కాఫ్కా కవితలు’, ప్రచురణ సాహితీ మిత్రులు, విజయవాడ, 2001)
కలలు ఇచ్చిన బలిమి గురించి నీలిమ గారి అభిప్రాయం:
06/03/2018 10:24 pm
యద్దనపూడి గారి సుపరిచితమైన రచనలన్నింటిని ఒక్కచోట గుదిగుచ్చి ఎంత చక్కగా విశ్లేషించారు !!!
ఆవిడిక లేరు అని తెలియగానే మనసంతా అలముకున్న ఒక తెలియని నిస్పృహ, వేదన, బాధ… నా ఇంటి పుస్తకాల సేకరణ లోంచి సెక్రెటరీ నవల తీసుకొని చదవడం మొదలెట్టాను…..అంతే అలా రాత్రి 2 గంటలకి మొత్తం పూర్తిచేసాక కానీ పుస్తకాన్ని మూయలేకపోయా. 52 ఏళ్ల క్రితం రాసిన నవలకి, ఈనాటికీ ఎంత చదివించే గుణం – అదీ ఇప్పటికే ఎన్నోసార్లు చదివిందైనా !! ఇదనే కాదు , ఆవిడ చాలా రచనలు అంతే.
మన తరువాతి తరాలు తెలుగు మీది మమకారాన్ని బ్రతికించుకోవాలే కాని, కొన్ని తరాలకి సరిపోయే రచనలని వదిలివెళ్లారు ఆ నవలారాణి 🙏🙏
జూన్ 2018 గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/02/2018 8:34 pm
[We refuse to entertain a dialogue with you further. And no! your previous comment will not be reverted to as sent by you. Ed.]
సంపాదకులు గారు: మీరు అసలు మొదటికే సమాధానం ఇచ్చి ఉండనవసరం లేదు. ఎవరేమంటారు. అది మీ ఇష్టం. కాని ఇస్తే గాని, నేను పొయట్రీ ఫార్మ్ లో రాసినది అలాగే ప్రచురించి మీకు తోచిన సమాధానం ఇచ్చి ఉండాల్సింది. మీరు వదిలేస్తే ఇంకెవరైనా పాఠకులు వారికి ఇంట్రస్ట్ ఉంటే, వారు వారికి తోచిన విషయాలు రాసేవారేమో.
మీరు ఇప్పటికీ ఎందుకు నా అభిప్రాయం పొయట్రీ ఫార్మ్ లో ప్రకటించటానికి అశక్తులో తెలియటం లేదు. అలాటి పద్యాలు ఎన్నో నేను ఈమాటలో చదివాను. ఉదాహరణకు ఈ సంచికలోనే ఈ పత్రిక ఎడిటర్ చేసిన అనువాదపు పద్యం ఉంది. పేరు: ” మా పీకల మీదుంచిన కత్తులు తీయండి”
నా పద్యం లోని భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. ఈ పత్రిక ఎడిటర్ రాసిన ఆ పై పద్యం లో భాష మీకు అభ్యంతరకరంగా లేదా? లేనందువల్లే వేసి ఉంటారు కదా. మరి చదివిన ఒక పాఠకుడు భలేగా ఉంది పద్యం అన్నారే. వారికి భాష, సబ్జెక్ట్ కూడా ఏమీ బాధ పెట్టలేదు మరి.
నా అభిప్రాయం పొయట్రీ ఫార్మ్లో ఏమిటని, వచనంగా పేర్చినారా? మరి ఎడిటర్ భాస్కర్ పబ్లికేషన్ వచనం లోకి మార్చలేదే? ఏమిటి తేడా? ఇతరులెందరో అభిప్రాయాలను పొయట్రీగా రాసారు. వాటిని అచ్చు వేస్తూనే ఉన్నారు కద.
ఏ రకంగా చూసినా నా అభిప్రాయాన్ని మీరు ఎందుకు మార్చారో, సరిగా వెయ్యక పోగా పైగా నాకు సలహాలిస్తూ ఆరోపణలు చేస్తూ సమాధానాలు ఇచ్చారో నాకు తెలియటం లేదు.
సరే మీరు నాతో ఇంక మాటలు ఆపివేయదలిచారు. అది మీ నిర్ణయం. నాకైతే ఈ ఉత్తరం మీరు ప్రచురించటానికీ ఇతర పాఠకులు చదువుకోటానికీ ఏమీ అభ్యంతరం లేదు.
Thanks for your time. -Lyla Yerneni
జూన్ 2018 గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/02/2018 4:12 pm
లేదంటారా సంపాదకులు గారూ? ఉందో లేదో తేల్చాలంటే, ముందుగా నేను రాసిన వాక్యాలు రాసినవి రాసినట్టుగా ప్రచురించాలిగా? మీరలా చెయ్యందే. అలా అని మీరు పూర్తిగా విరమించనూ లేదు. నే రాసింది, మీకిష్టమైనట్టు మార్చి ప్రచురించారు. ఎందుకని?
మీరు, నేను రాసిన మెటీరియల్ అంతగా మార్చదలుచుకుంటే, ఆ మార్పులు, చేసిన ఎడిటింగ్ ముందు నాకు పంపి నాకు సమ్మతమైతేనే ప్రచురించాలి. ఆ తర్వాతే సమాధానమివ్వాలి. మీరెంతో మార్చేసిన నా రైటింగ్ ను నేను రాసినదిగా చూపిస్తూ, దానికి మీ సమాధానం ప్రచురించటం సరికాదు. మీ నిడువైన సంపాదకీయం చివరలో రచయితల నుండి మార్పులు ఏవేవో ఆశిస్తున్నామంటూ రాసిన మీరు, నా కిచ్చిన సమాధానంలో, మా పంథా మారదు, you better get used it. -అన్నారు. అలాటి లొంగదీతల హెచ్చరికలు మీనుండి నాకు ఎంత మాత్రమూ సమ్మతం కాదు.
సంపాదకులు: మీరిచ్చిన సమాధానం లోని పదార్థం కూడా నాకు తెలియలేదు. నా రాతను మార్చేసి చదువుకున్నందున, మీకు సమాధానం ఇవ్వటం చేతకాలేదేమో. ఏవో అతురు బొతుకు మాటలున్నాయి. ‘అలా ఒకరిని నిందించటం మీకు తగదు. ‘అన్న వాక్యం ఒకటీ తెలిసింది కాని, మిగతాదంతా తెలియనప్పుడు, అదికూడా తెలియనట్టే.
అందువల్ల;
Please publish this letter of mine, in total. And, if only acceptable to you, in your response make it known that you have made substantial changes to my writing and published it without my consent. Therefore you will be removing all of the material, pertaining to these letters. Post it for all readers of magazine to read and understand what happened here. And if I see no problems, you can remove them from the magazine in a week. That works for me, hope it works for you. I reserve all my legal rights.Thank you.
Have a nice day! – Lyla Yerneni, M.D.
[Your comment is published in full as you asked for. For the record, we did edit your “గుంటకాడి నక్కలు గుర్తుకొస్తున్నాయి అసహ్యంతో కక్కులొస్తున్నాయి.” about other writers as we found it objectionable. And, to paraphrase from పాఠకులకు సూచనలు:”మీ అభిప్రాయాలని పరిష్కరించి ప్రచురించడానికి, అసంగతమైన అభిప్రాయాలు తొలగించడానికీ, సంపాదకులకు అధికారం ఉంటుంది. సంపాదకుల నిర్ణయాలపై ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.” It further talks about ఉత్తరాలలో వ్యక్తిగత నిందలూ, అసభ్యమైన భాషా. By the way, before posting your comment you did agree to “ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను” clause. So, we are the ones well within our legal rights here. – Ed]
జూన్ 2018 గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/01/2018 3:10 pm
పత్రిక మాసపత్రికగా మారింది, ఇండియా, ఔట్ ఆఫ్ ఇండియా రచయితలు పెరిగారు కామోసు! ఈ ఇంటర్నేషనల్ తెలుగు పత్రిక అమ్మయ్య! ఇక కక్కుర్తి నివాళి ఆచారం మాని, నిక్కపు సాహిత్య పత్రికగా మారుతుందని. అని నేనూ, మీలానే ఆశ పడినానేమో, No chance. పాత సంస్కారపు గ్రహచారం వదలదు. మూడు పువ్వులు, ఆరు కాయలు కాలేదు సరికదా, ఇప్పుడు One wedding and thousand funerals.
కొందరు సప్లైదారు రచయితలు- వారి అభిమాన సాహితీవేత్తల చావుకు ముందే ఆర్టికల్ రెడీ చేసి ఉంచుకుని మేక్సిమమ్ ఎఫెక్ట్ కోసం టైమ్డ్ రిలీజ్ చేస్తారో, మరి కొందరి సాహితీ-సంగీత వేత్తల చక్కని రచనలు సేకరించినా, వాటిని దొరికిన వెంటనే ప్రచురించకుండా వారు చనిపోయిన తరుణంలో వాటిని రిలీజ్ చేసి ఘనంగా ధాంధూంగా సాగనంపుదామని, ఫేమిలీ కాని, సప్లైదారులు గాని, రచనలను తొక్కిపట్టి ఆపి ఉంచుతారో తెలియదు.
ఇంతకన్నా అత్యాచారం సాహిత్యం పట్ల ఘోరాపచారం ఒక సాహితీజీవి పట్ల ఇంకోటి ఉంటుందా?
దయచేసి మీ సమాధానమివ్వండి. తప్పక మీ ఉద్దేశమేమిటో చెప్పండి.
Lyla
[As much as you hate to see it, we do believe it is better to celebrate than to ignore the life and works of one when departed. And, please get used to it because we are not changing any time soon about this. ఏదీ తొక్కిపట్టుకుని ఎవరుపోతారా అని ఏ “సప్లయ్ దారులూ” చూడరు. అలా ఒకరిని నిందించటం మీకు తగదు. When we celebrate, some may come and mourn.That’s their prerogative. చచ్చిపోయినవారిని తలచుకోడం మీకు అత్యాచారం ఎలా అనిపిస్తుందో అలా అది వారి ఇష్టం. బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు. – సం.]
కలలు ఇచ్చిన బలిమి గురించి B.V.S.Bhanusree గారి అభిప్రాయం:
06/01/2018 1:14 pm
చాలా చక్కటి విశ్లేషణ. ఆమె తన దారిలో తాను రాసుకుపోయేరు కాని, ఎవరితోనూ పోటీ పడలేదు. అవసరమైన వివరణలు ఇచ్చుకోలేదు. చాలా డిగ్నిఫైడ్‌గా ఆమె మార్గంలో ఆమె నడిచి పోయేరు!
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
04/14/2018 1:36 am
విజయ భాస్కర రెడ్డి గారూ, మనకి బడిలో వ్యాకరణం నేర్పే తీరు ఇలాంటి సందేహాలకు దారి తీస్తోంది! డు, ము, వు, లు అనేవి ప్రత్యయాలు. కొన్ని రకాలైన పదాలకు ప్రథమావిభక్తిలో ఆ ప్రత్యయాలు వస్తాయి. కొన్ని పదాలకు ప్రథమా విభక్తిలో ఏ ప్రత్యయాలు రావు. అంచేత డు, ము, వు, లు లేకపోయినా చెట్టు, చీర మొదలైన పదాలు ప్రథమావిభక్తిలోనే ఉంటాయి.
తఃతఃగారు,
1. నాకు తెలిసినంతవరకూ ఈ సూత్రానికి తత్సమ, తద్భవ, ఆచ్ఛికమనే భేదం లేదు. ఈ సూత్రం కారక పరిచ్ఛేదంలో వస్తుంది.
2. ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా?” – ఈ వాక్యాన్ని ఇంకొకరు కూడా ఈ వ్యాస సందర్భంలోనే నాతో ప్రస్తావించారు 🙂 నేను అర్థం చేసుకున్నంత వరకూ, పద్య సందర్భాన్ని బట్టి, ఇది పిల్లిని తిన్న కోడి కాదు, పిల్లి తినేసిన కోడి. కాబట్టి ఇక్కడ పిల్లి కర్మ కాదు. అంచేత ఇక్కడ ద్వితీయా విభక్తి అవసరం లేదు. అలాగే “పలుకునా” అనే క్రియకు కర్త కోడి. దానికీ ద్వితీయ రాదు. “పిల్లిని తిన్న కోడి” అనే భావం రావాలంటే అక్కడ కచ్చితంగా “పిల్లిఁ దిన్న కోడి” అని సరళాదేశం జరిగి అరసున్న రావాలి.
3. నేను వ్యాసంలో ప్రస్తావించినట్లు, ఒక సూత్రంలో, ‘వైకల్పికం’, ‘బహుళం’ అనే పదాలు ప్రయోగించకుండా ‘అగు’ అని ఊరుకుంటే అది నిత్యమనే అర్థం. ‘కర్మంబున ద్వితీయయగు’ అనే సూత్రం ప్రకారం కర్మ వాచకానికి నిత్యంగా ద్వితీయ వచ్చి తీరాలి. కాని అలా రాని సందర్భాలు ఉండబట్టే, ఏయే సందర్భాలలో రాకుండా ఉంటుందో చెప్పడానికి ‘జడంబు…’ అన్న సూత్రం అవసరమయ్యింది. సూత్రంలో చెప్పిన కార్యం, కొన్ని చోట్ల ‘వైకల్పికం’గా జరగడమూ, కొన్ని సందర్భాలలో ‘నిత్యంగా’ జరగడమో, లేదా అసలు జరగకుండా ఉండడమో జరిగితే దాన్ని ‘బహుళం’ అంటారు. ఒక సూత్ర కార్యం బహుళంగా జరిగేటప్పుడు, ఏయే సందర్భాలలో నిత్యమో, ఏయే సందర్భాలలో వైకల్పికమో, ఏయే సందర్భాలలో ఆ కార్యం జరగదో చెప్పి తీరాలి. కనీసం కొన్ని ఉదాహరణలిచ్చి ఇలాంటి సందర్భాలలో ఇలా జరుగుతుంది అనయినా చెప్పాలి. ‘జడంబు ద్వితీయ…’ సూత్రంలో కూడా ఏయే సందర్భాలలో ఈ సూత్ర కార్యం జరగదో, అంటే పదం జడమైనా ద్వితీయ కచ్చితంగా వచ్చి తీరుతుందో చిన్నయ్యసూరి వివరించాడు. అయితే అవి నేనీ వ్యాసంలో చెపుతున్న అపవాదాలు కావు కాబట్టి, అతను పేర్కొన్నవి సరికావని నేను భావిస్తాను కాబట్టి, దానికి ఈ వ్యాస విషయంతో సంబంధం లేదు కాబట్టి, వాటిని ఇక్కడ వివరించ లేదు. మీరు కారక పరిచ్ఛేదంలో ఈ సూత్ర వివరణ చూడండి.
4. భాషను పరిపూర్ణంగా ఒదిగించడానికి ఎన్ని సూత్రాలైనా ‘కొద్ది’ సూత్రాలుగా మిగిలిపోతాయని!
తజ్జనని లోగిటం గల
రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్
బొజ్జ దిరిగి రాదయ్యె జ
గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే? :-))
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి VSTSayee గారి అభిప్రాయం:
04/03/2018 11:22 am
దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారి “రమణీయము” (బాలవ్యాకరణసమీక్ష) నుండి ..
చిన్నయసూరి – ఉక్తిలాలిత్యము
చిన్నయసూరి మంచివివేచనముతోపాటు నిదానమగు చూపును, లౌకికానుభవ పరిణతియునుగలవ్యక్తి. శాస్త్రీయవిషయములు క్లిష్టములయి దురవగాహములయి యారంభదశలో నున్నవారికెంత విసువు జనింపఁజేయునో గుర్తించిన తత్త్వజ్ఞుఁడు. కనుకనే లోకవృత్తములను, మనోహరసన్నివేశములను, దన యుదాహరణములలో నతినిపుణతతోఁ బొదిగి చక్కని కావ్యలాలిత్యము గోచరించునట్లు వ్యాకరణము రచించెను.
కారకపరిచ్ఛేదమున “జడంబుద్వితీయకుఁ బ్రథమ బహుళంబుగా నగు” అను సూత్రమునకు
“వాఁడు పువ్వులు దెచ్చె” (వాఁడు పువ్వులను దెచ్చె)
“ఆకె సొమ్ములు దాల్చె” (ఆకె సొమ్ములను దాల్చె)
“వాఁడిల్లు వెడలె” (వాఁడింటిని వెడలె)
అను వాక్యములు ఉదాహరణములు.
ఈ యుదాహరణములను సామాన్యదృష్టితోఁ జూచినచో ‘పువ్వులను’ అను ద్వితీయకు ‘పువ్వులు’ అని ప్రథమ వచ్చుటమాత్రమే గోచరించును. కాని, యీ సూత్రమందలి పదములకూర్పును, ఉదాహరణవాక్యరీతిని, గలిపి నిదానముగా పరికించినచో, ఇది యొక చిన్న వినోదఘట్టముగా స్ఫురించును.
మనదేశమున సాధారణముగా సంసారభారమువహించుటలో భర్త మొదటివాఁడుగను, భార్య రెండవదిగను నుండుట పరిపాటి. దీనినిబట్టియే భార్యకు ‘ద్వితీయ’ అనుపేరుగూడ నేర్పడియుండును. కాని, జడసంబంధి ద్వితీయ (భార్య) ప్రథమగా మాఱును. అనఁగా సంసారనిర్వహణమున ప్రధానురాలు కావలసియుండును. భర్త జడుఁడు. సంసారమును జక్కదిద్దుకొననేరఁడు. ఆభారముసహితము తానే వహింపవలసివచ్చుటచే, ఆమెకుఁ గొంత విసుగును, భర్తపైని అలక్ష్యభావమును నేర్పడుట సహజము. అట్టిభార్యకు నేదేనొకమార్గమున నాతఁడు ప్రీతిని గలిగింప యత్నించుటయు సహజము. అందులకే గాఁబోలును, పాపము అమెయిచ్చకమునకై వాఁడు పూవులు దెచ్చెనఁట. ఆమె, అతఁడు తెచ్చినపూవులు ముడుచుకొన నిచ్చగింపక, తనకున్న మఱేవోసొమ్ములు దాల్చెనఁట. అతఁడెంత జడుఁడైనను, తాను దెచ్చిన పూవులు నిరాకరింటవలనఁ జిన్నవోక తప్పదుగదా! చిన్నవోయి, ఏమియుఁ జేయలేక, ఏమాటయుఁ బలుకలేక వాఁడిల్లు వెడలెనఁట.
—
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
నాకు నచ్చిన పద్యం : మెయి బూదిపూత మాగాణి గురించి VSTSayee గారి అభిప్రాయం:
03/04/2018 8:39 am
శ్రీ రావూరి దొరసామిశర్మగారి ”విశ్వనాథ-ప్రయోగ వైలక్షణ్య సమీక్ష” (భారతి, జనవరి 1962) నుండి..
పూర్తి సమీక్ష ఇక్కడ పుట72 (PDF page 79) నుండి.
“`హరిఓమ్మ’ని కల్పవృక్షములోని అవతారిక తీయఁగా తొలిపద్యములోనే రెండవ పాదములో ‘ప్రథమకబళేమక్షికాపాతః’ అన్నట్లు గణభంగ మెదురగును. … సంయుక్తాక్షరమునకు పూర్వాక్షరము గురువన్నమాట ఇంగ్లీషుబడులలో కుఱ్ఱకాఱునకు సైతము తెలిసిన చదువు” అంటూ “విశ్వనాథ – ప్రయోగ వైలక్షణ్యము” వ్యాసంలో (భారతి, సెప్టెంబరు 1961) ఆక్షేపించిన కొత్తవారు, పైన ఇచ్చిన ఉదాహరణను ‘కల్పవృక్షఖండనము’ పుస్తకము తెచ్చినప్పుడు, “సకృత్తుగా ఏ కొందఱో .. లఘువుగాఁ జేసిన కవులు లేకపోలేదు. అట్లని అది రాచబాటకాదు; అదే ప్రధానముగాఁ జూచుకొనిసాగిన కవిత, ప్రథమశ్రేణికి రాదు. అందు కొంత ‘కక్కుర్తి’ ఉన్నదనక తప్పదు.” అంటూ, వదలిపెట్టారు.
వాటిని భారతి, జనవరి 1962 సంచికకు అనుబంధం (PDF page 104 నుండి)గా ఇచ్చారు.
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:
03/02/2018 9:58 am
ఆ పులక్ బిశ్వాస్ బొమ్మలే నన్ను ఆకర్షించి ఆ సీ బి టి పుస్తకాలకి దగ్గిర చేసింది. నా ద్వారా కొన్ని వందల పిల్లలకి కూడా! కాని అప్పుడు తెలీదు ఈ పులక్ బిశ్వాస్ గురించి. ఇప్పుడు తెలిసింది.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి VSTSayee గారి అభిప్రాయం:
01/28/2018 9:02 am
Lyla gAru on January 26, 2018 at 4:40 pm said:
కర్ణుడిమీద జాషువగారి వ్యాసాలేమీ లేవు. ‘భారతవీరుఁడు’ అని రెండు ఖండకావ్యములు, ‘శల్యసారథ్యము’ అని ఒక ఖండకావ్యము ‘భారతి’లో ప్రచురించారు. అవి ఇక్కడ చదువుకొనవచ్చును. పుస్తకములుగా సంకలనముచేసినపుడు వీటికి కొలదిమార్పులు జరిగాయి.
నమస్తే,
శాయి.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/26/2018 4:40 pm
K.V.S. Ramarao on January 19, 2018 at 3:30 pm said:
Nice of you, to allow the readers here to examine your opinion. Ramarao garu. Here are my thoughts.
1.”ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”
జాషువా “ఫిరదౌసి” 1932 లో వెలువడింది.
‘ఫిరదౌసి’ రాస్తున్నప్పుడు ఆయన బడి పంతులు పని చేస్తున్నాడు. రచన సరిగా సాగటం లేదు. రాసింది ఆయనకే నచ్చటం లేదు. అచ్చుకు డబ్బు లేదు. ఆపివేసాడు. రాసిన రచన లో భాగాలు అక్కడక్కడా చదివి వినిపిస్తున్నాడు. హెడ్ మాస్టరు, జాషువా ఆందోళన, రచన – రెండూ విని తప్పక పూర్తి చెయ్యమనీ, జనులు ఆదరిస్తారనీ చెపితే,- మళ్లీ ఉత్సాహం కలిగి రచన ముగించాడు. (జాషువా రచనలు మూడవ సంపుటి. Page 268.)
జాషువా ఫిరదౌసి రాసేనాటికి, ఆయనకు 37 ఏళ్లు. అప్పటికి ఆయన ఎంతో కవిత్వం చెప్పి ఉండలేదు. ఎన్నో పబ్లికేషన్స్ లేవు. విలువలో Homer- Ilead తో తూగుతుందని, భారత రామాయణాల వంటిదని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షానామా రచయితతో తనను పోల్చుకోడు. తన కెంత ఖ్యాతి రావాలో, అది వస్తుందో రాదో ఊహ చేసే సమయం కాదు.
పైగా ఖ్యాతి, డబ్బు సంగతి పీడా పోయింది, ఫిరదౌసి కథలో కొడుకు పోవటం అన్న దుర్ఘటన ఉన్నది. అప్పట్టున మీ ఉద్దేశం భార్యాబిడ్డలు గల జాషువాకి వర్తింప చేయటం అసాధ్యం.
2.”ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక.”
జాషువా తనే రాసుకున్న జీవిత చరిత్ర ( నా కథ ) చదివితే, ఫిరదౌసికి ప్రతి పద్యానికి బంగారపు దీనారు ఇవ్వవలసి ఉండటమేమో గాని, గమనించండీ – ఒకచోట తన ప్రతి పద్యం లోనూ జాషువా నూటపదహార్ల వర్షం కురిపించాడు. సన్మానాలే సన్మానాలు. ఊరికే శాలువాలు కప్పి తాంబూలాలిస్తే ఆయనకు కుదరదు. డబ్బు ఇవ్వకుండా తన కవిత్వం వినటం ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాడాయన. జాషువాకి ప్రతిష్ఠ పుష్కలంగా లభించింది. ఊరూరా సన్మానాలూ గండపెండేరాలు తొడిగించుకోటం, శాసనసభకు ఎన్నికవటం, పద్మభూషణ్ రావటం. – ఇవన్నీ అతని కవిత్వానికి గుర్తింపూ, వ్యక్తిత్వానికి గుర్తింపూ, జీవితంలో upward moves కదా.
3.”బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం”
“ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా!” అనుకున్న చేమకూరి కవి మాటలు తన పట్ల వర్తించవని జాషువానే చెప్పుకున్నాడు. “నేనే గతి రచియింతునో చెప్పంజాలను కాని సమకాలీనుల వాత్సల్యమునకు గురియైతినని చెప్పుకొను పుణ్యము నాకు గల్పించిన తెలుగువారికి నేను కృతజ్ఞుడను..” అని చెప్పుకున్నాడు.
జాషువాకి తన జీవితకాలం లోనే కవిగా, వ్యక్తిగా సమాజంలోనూ, స్వకుటుంబంలోనూ కూడా ఖ్యాతి, ప్రేమాభిమానాలు లభించాయనే నాకు అనిపిస్తున్నది.
4.” అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”
Not at all. For the reasons already given. Here is what I think is possible at that time.
When he is dwelling on the story, I would say Joshua has made a silent vow to himself, not to be a loser ‘financially’, like the man in his story. Joshua did not want to make the foolish mistake of waiting around 30 years to collect on his poetry revenue. The story taught him financial prudence. If you notice, Joshua showed quite a bit of financial wisdom eventually. He was making sure he is paid every time he wrote. He was lining up his writings, and matching them up with his publishers, donors. He was motivated. He was continuously moving upwards.
Also, knowingly or unknowingly; He sent a message to the public, thru the publication of Firdaus.
జాషువా ఫిరదౌసిమీదున్న కథని కావ్య వస్తువు గా ఎన్నుకుని, కవిని గౌరవించాలనీ, కవిత్వం చాలా గొప్పవస్తువనీ, బంగారు నాణేలు ఇవ్వవచ్చనీ, అతనికి ప్రామిస్ చేసిన డబ్బిస్తేనే, షావుకారు మర్యాద నిలుస్తుంది – అన్న నీతిని ప్రజకు అందించాడు కదా. కవికి డబ్బు ఇవ్వకుండా మహమ్మద్ చచ్చాక – అతని తలకాయ రాత్రులలో గజనీపట్టణ వీధులలో ఆర్తనాదాలు చేస్తూ తిరుగుతుందన్న పద్యంతో ముగించాడు ఫిరదౌసిని. With that, He put God’s fear into people’s hearts.
ఫిరదౌసి కావ్యం రాయటం, జాషువాకి పై విధాలుగా లాభించింది.
Expanding the discussion a bit for clearer understanding, a little more writing on Joshua, based on my reading Joshua’s poetry in ‘జాషువా రచనలు.’
ఫిరదౌసి కావ్యం రాసాక, ఆ కావ్యం రాసిన కవిగా, ఇతరులు అతన్ని గుర్తించారు కాబట్టి, తరవాత తరవాత జాషువా ఆలోచనను ‘అతని ఫిరదౌసి’ కొంత ఆక్రమించాడు. సందర్భాన్ని బట్టి ఆ ఫిరదౌసితో identification వస్తుంది.
జాషువా, సుమారు తన 60 ఏళ్ల వయసులో రాసిన ‘నిర్వేదము’ అని ఒక చిన్నకవితలో అది చూడవచ్చు. (జాషువా రచనలు నాల్గవ సంపుటి. పేజీ 214.) ఆయన మీద ఏవో అభియోగాలు మోపినట్టున్నారు. ఆయనతో కలసి 40 ఏళ్లు పైన కాపురం చేసిన భార్య గతించింది. డబ్బు పొడిదుడుకులు అలానే ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో నేను ఫిరదౌసి కవి లాగానే, డబ్బు ఇబ్బందులతోనే చస్తాను కవీశ్వరేశ్వరీ! నీతో పాటు మట్టిలో కలుస్తాను, జీవితేశ్వరీ! – అనుకుంటాడు. It is momentary. At that point, it is apt. That grief passes. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్ళాడాడు. ఆ పైన ఇంకా చాలా జీవితం నడిచింది.
కవిత్వపు తొలిదినాల్లో జాషువా identification కర్ణుడితో ఉండింది.
తొలిరోజుల్లో, జాషువాని ఒకసారి కవిత్వ సభలో పోటీ చేద్దువు గాని అని స్నేహితుడు తీసుకువెడితే, అక్కడ అతడు పంచముడు అని కోపంతో కొంతమంది సభ లోంచి లేచి వెళ్లిపోతారు. అక్కడ కొందరి మాటలకు మనసు గాయపడి, ఇంటికి వెళ్లి ఏడుస్తాడు. అప్పుడు మనశ్శాంతి కోసం భారతం చదువుకుంటూ -నిద్రపడితే- కర్ణుడు ఎంతో ప్రకాశమైన రూపంతో కనిపించినట్టు తలుస్తాడు. కర్ణుడిని – నువ్వు సూతుడవు, నువ్వు రాజకుమారులతో విలువిద్యలో పోటీ చెయ్యటం వీలుకాదన్న ఆ సందర్భం తలుస్తాడు.
అక్కడ కర్ణుని గురించిన పద్యాలు చక్కగా ఉన్నవి.
Pretty easy to see similarity in situation, for any of us.
In his times Joshua is told many times by some people, he is not an equal. He cannot enter certain arenas. He cannot take up sports/studies or compete in certain things reserved only for others. But, truly, Joshua is also a son of India. He is an equal to others.
There is a great deal of truth, in Joshua’s identification with this powerful character from fiction. Karna who is kind and heroic in his spirit and in his suffering. Joshua became better than Karna, deciding in -not to hate others, more in the line of Gandhi, Christ. But, he does not become a sacrificial lamb either.
Thanks, Lyla
PS: నేను సాహిత్యం, సాహిత్య విమర్శ విషయాల ఆలోచనలోనే ఉన్నానని, ‘ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.
శాయి గారు కాని చదువుతుంటే, ‘భారతి’ పత్రికలో కర్ణుడి మీద జాషువా గారు రాసిన వ్యాసం దొరుకుతుందా? ఆ వ్యాసం నాకు చదవాలని ఉంది. Thanks.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి కోదాటి రమాకాంత రావు గారి అభిప్రాయం:
01/23/2018 8:16 am
మానస చామర్తి గారి వ్యాసానికి డెట్రాయిట్ వారి ప్రధమ బహుమతి లభించినందుకు సంతోషం. అభినందనలు..
వీరు ఇచ్చిన కొత్త ఆలోనలు ప్రత్యేకించినవేమీ కావు.
౧ వీరు చెప్పిన రచనా లోకానికీ జీవన వాస్తవికతకీ తేడాని గమనించలేదు సరికదా భావుకత పేరుతో నిరాకరణని శాస్త్రీకరించారు. ఉదా: రేవతీదేవి “దిగులు”నీ, రాజేశ్వరీదేవి “మార్కెట్ సమాజాన్నీ” వీరు సరిగ్గా అంచనా వేయలేక పోయారని తెలుసుసుకోవడం కష్టమేమీకాదు. వాస్తవం వద్దు రంగుల కలే ముద్దు అనడంలోని (సత్యం వద్దు స్వప్నమే కావాలి) సామాజిక సత్యాన్ని గుర్తించలేకపోవడమే కారణం.
౨ నువ్వు ఏమైనా చెప్పు ముందు అది కవిత్వమై ఉండాలి అన్నది పైకి చాలా సమంజసంగానే కనిపిస్తుంది. కానీ పైకి కనిపించే సామాజిక వాస్తవాల ముసుగు తీయడానికి భావవాద/రూపవాద విమర్శకుల శక్తికి మించిన పని అని వేరే చెప్పనక్కరలేదు.
౩ “సహృదయ విమర్శ” గోడ మీద పిల్లి. సాహిత్యానికీ దాని భూమికైన సమాజానికీ ఈ “రకం” విమర్శ ఏమాత్రం మేలుచేయకపోగా చదువరుల్ని మభ్య పెట్టి మబ్బుల్లో తిప్పుతుంది. కాకపోతే సృజకుడిని (కవి, రచయిత) తృప్తిపరచి పైమెట్టెక్కిస్తుంది.
౪ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు తెలుగులోసాహిత్య విమర్శ లేదనుకోవడానికి కూడా సవాలక్ష కారణాలు కనిపిస్తుండవచ్చు. విమర్శని కూడా ఒక సృజనగా భావించకపోవడం శోచనీయం.
౫ “గులక రాయి” దేనికి సంకేతమో తెలియక అస్పస్టత ఏర్పడిందని మానస గారు అనుకోవడంలో విఫలమైనారని అనుకోవాల్సివస్తోంది.
వీరి వ్యాసంలో కేవలం “వాచక” విమర్శకే పరిమితమైనారని సులభంగానే తెలుసుకోవచ్చు. అందుకే ఇది రూపవాద విమర్శకు సంబంధించిన ఆలోచనలుగానే మిగిలిపోయినాయి.
–కోదాటి రమాకాంత రావు
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/18/2018 11:52 am
“విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు.” డా. విజయ్ కోగంటి
Well and Good.
మానస గారి వ్యాసం ‘జాషువా –ఫిరదౌసి’ ఈ పత్రికలోనే ఉన్నది. చదివినారా? ముఖ్యంగా ఈ పై కారణం వల్లనే, చాలా పేలవమైన వ్యాసం అని నేను అనుకున్నాను.
జాషువా రచించిన ‘ఫిరదౌసి’ ఒక ఎన్నదగిన రచన కానే కాదు. ఆ ఖండకావ్యానికి మంచిపేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇంటర్మీడియేట్ విద్యార్ధులకు 1940 వరకు పఠనగ్రంధాలలో ఒకటి గా ఉన్నదని జాషువా కవి తెలిపారు. ఆ యా గురువులు ఆ కావ్యం గురించి ఆ రోజులలో వారి విద్యార్ధులకు ఏమి బోధించారో!
నా ప్రశ్న – జాషువా ‘ఫిరదౌసి’ లో ఒక పారశీక కవి రూపుగాని, మాటగాని, ఏ పారశీక కవిత్వపు తీరుగాని, అందునా ఫిరదౌసి కవిత్వ పరిచయం గాని ఉన్నదా? సమాధానం: శూన్యం. సున్నా. షానామా కవిత్వప్రఖ్యాతి వల్లే కదా జనులు ఫిరదౌసిని తెలుసుకోవాలనుకునేది? కాదా? స్వాతంత్ర పోరాటం, సత్యాగ్రహం గురించి కాపోతే, మోహనదాస్ కరంచంద్ గాంధీని గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటారు?
కవిత్వ ప్రియులు, కవిత్వం తెలుసుకోటం మాని, కవిని గురించిన కాకమ్మ కథలు వినటం – జాషువా ఫిరదౌసి చదవటం. ఫిరదౌసి అన్న పారశీక కవిని గురించి ప్రచారం లో ఉన్న ధన సంబంధమైన ఒక కథను గూర్చి మాత్రమే జాషువా రాసినాడు. (ఇలాటి చాటువు, చాటు గురించి ఈ పత్రికలో మాటికి ముమ్మారు చాటి చెప్పిగా విన్నాం కదా.) ఆ రచన ఎలాటిదంటే, ఒక సంగీతవేత్త గాని – భక్త రామదాసు జైల్లో ఉంటే రాముడు లక్ష్మణుడు వచ్చి, కప్పం కట్టి అతడిని చెర వినిపించటం కట్టుకథ మనకు చెప్పి, – రామదాసు కీర్తన ఒక్కటి తెలియచెప్పటం గానీ, పాడటం కానీ చెయ్యలేకపోటం వంటిది.
ఒక కవి, ఇంకో కవి కవిత్వం చదవకుండానో, ఆ ప్రసక్తి ఇంత తేకుండానో, మకుటం లో అతని పేరుతో అతని మీద ఖండకావ్యం రాయటమేమిటి?
జాషువా రాసిన ఫిరదౌసి కావ్యం పేరు మార్చి, కాళిదాసు, బమ్మెర పోతన అని పెట్టినా, కీట్స్ అని గాని, షేక్స్పియర్ అని గాని పెట్టి, లోపల పద్యాలలో పేరు మారిస్తే, చాలు. ఏం తేడా రాదు. ఆ ఏ ఒక్కరి specific జీవనం, విద్య, శైలి, ఆలోచన రీతి, సాధించిన పని, మనకింత కూడా తెలియదు. అలాటి generic రచన జాషువా చేసింది. ఫిరదౌసి పారశీకపు కవిత్వపు తీరు తెన్నులు జాషువాకు బహుశా తెలియవు. ఆయన చెప్పలేనందున ఈ ఖండకావ్యం ద్వారా మనకూ తెలియవు. కొంతమంది చదువరులకు మరి ఫిరదౌసి కవిత్వ పరిచయం జాషువా రచన ద్వారా, ఎలా కలిగిందో?
ఫిరదౌసి అన్న కావ్యంలో ఆ కవి లేనే లేడన్న విషయం మానస మాత్రం గమనించిందా? లేదు.
జాషువా రాసిన ఆ ఖండకావ్యము పేరుగొన్నదనే చదువుకుని, బాగున్నదనే నమ్మి, వాల్మీకి, నారాయణరావు, గురజాడ – ఇలా సాహిత్యంలో తెలిసిన కొందరిని, వారి మాటలను తన వ్యాసం లో ప్రస్తావిస్తూ రివాజు ప్రకారం ఒక సాంప్రదాయికమైన వ్యాసాన్ని, మానస తయారు చేసింది. ఆ ప్రస్తావనలు కూడా ఆమెకు ఈ రచన సందర్భంలో సొంత ఆలోచన లేకపోటాన్నే బలపరుస్తాయి. వాల్మీకి – సీతకు ఎడమ కన్నో, కుడి కన్నో అదరటానికీ, ఒక పారశీక కవి నమ్మికలకూ, మానసిక స్ధితిగతులకూ ఏమిటి సంబంధం?
ఫిరదౌసి గురించి జాషువా “ఏమని కవిత్వం వ్రాసినట్టు, ఎందుకు వ్రాసినట్టు” అని మానస ప్రశ్నించుకుంది. సాహితీ వ్యాసాల్లో – ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి? అని తమ వ్యాసాల్లో అనటం నేర్పిన సాహిత్య సైంటిస్ట్ ల నుండి ఆ వాక్యం రాయటం వరకు ఆమెకు వచ్చింది. మరి సంపాదించిన సమాధానం? అదసలు ఏమిటి? దొరికినది సజావుగా ఉన్నదా?
ఎన్నో విషయాల మీద ఆసక్తితో మనుషులు శ్రమిస్తారు. సైంటిస్ట్ లకు ఒక పరిశోధనలో ముఫ్పై ఏళ్లు శ్రమిస్తే, అందునుండి మనుషులకో, మరెవరికో ఉపయోగించే ఫలితం ఏదీ రాకపోతే ఆవేదన కలుగుతుంది. అనుకున్న ఆదాయం రాకపోయినా కష్టం కలుగుతుంది. నిజమే.. మరి, ఫిరదౌసి కవిత్వమైతే ప్రజలకు ఆనందించటానికి ఉన్నది. జాషువా కావ్యం రాసేనాటికి ఫిరదౌసి ప్రసిధ్ధుడైన కవే. ఆ కవిత్వం దొరుకుతున్నది. మరి జాషువా ఒక పాతకథను పట్టుకు ఎందుకు పాకులాడ్డం? ప్రపంచంలోనే పేరు పడిన కవిని, మరో కవి ముఖ్యంగా అతని కవిత్వాన్ని గుర్తిస్తాడా? కవిత్వాన్ని పరిచయం చేస్తాడా – లేక, అది మరచి, (నిజమో కాదో తెలియని) ఒక పరిదీన పరిస్థితిలో మనకు ఫిరదౌసిని చూపుతాడా? అది చేయదగ్గ పనిగా నాకు అనిపించటం లేదు.
జాషువా కావ్య వస్తువుగా తన తెలుగు జీవితం, తన నిజ పరిస్థితిని తనే వర్ణించి తన సమకాలీన పాఠకులకు చూపవచ్చు. “గబ్బిలము” లో ఎంతో కొంత చూపినాడు. కాని, ఏనాటి వాడో పర్షియన్ ఫిరదౌసిని జీవితంలో ఏదో అన్యాయానికి గురైన వాడుగా మాత్రమే నమ్మి మనకు కావ్యంలో చూపటం గాని, కవిత్వ ప్రస్తావనే లేని కావ్యం రాయటం కాని, ఫిరదౌసి జీవితం తో జాషువా జీవితానికి సాపత్యం ఉంది – అని అతనైనా, ఎవరైనా అనుకోటం కాని, అవి సరైన ఆలోచనలు కావు.
మానస – తన రచనలో 1. జాషువాకు ఫిరదౌసి కవిత్వం తెలుసునో తెలియదో చెప్పగలగాలి. 3. అందుకు స్వయంగా ఫిరదౌసి కవిత్వం కొంతైనా తను చదివి, చర్చించ గలిగి ఉండాలి. అప్పుడు గదా ఆమె ‘జాషువా- ఫిరదౌసి’ అన్న వ్యాసం రాయవలసింది. కాదా? Is it not?
(సమయం కొద్దీ, మానస చామర్తి కవితలు, కవిత పరిచయాల గురించి మరోసారి.)
Lyla
ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి Satish గారి అభిప్రాయం:
01/06/2018 3:56 am
వాడ్రేవు చినవీరభద్రుడు ఫేస్‌బుక్ లో పొస్టు చేసినది:
కొత్త సంవత్సరం అడుగుపెడుతూనే తెలుగు సమాజం గర్వించదగ్గ కానుకను తీసుకొచ్చింది. ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట వడ్డెర చండీదాస్ అనే తెలుగు తాత్త్వికుడు తనకోసం తాను రాసుకున్న ఒక సత్యమీమాంస ఇప్పటికి వెలుగు చూసింది. Desire and Liberation (2018) అనే ఆ గ్రంథాన్ని ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ ప్రచురించడంతో మొదటిసారిగా ఒక ఆధునిక తెలుగు తాత్వ్వికుడు ప్రపంచతత్త్వశాస్త్ర పటమ్మీద చోటు సంపాదించుకున్నాడు. ఒకవైపు సృజనాత్మక రచయిత, మరొక వైపు మౌలిక తత్త్వవేత్త అయిన ఆధునిక తత్త్వవేత్తల్లో జ్యా పాల్ సార్త్ర్ తర్వాత ఇకనుంచి ప్రపంచం వడ్డెర చండీదాస్ నే తలుచుకోవడం మొదలుపెడుతుంది.
అరుదైన,అపురూపమైన ఈ రచన వెలుగు చూడటం వెనక ఆచార్య అడ్లూరు రఘురామరాజు జీవితకాలం పాటు చేసిన తపసు ఉంది, భగీరథుడు గంగని భూమ్మీదకు తీసుకురావడంలాంటి కథ ఉంది.
ఆ కథ 1972 లో మొదలయ్యింది.
కాళిదాస్ భట్టాచార్య (1911-84) ప్రపంచప్రసిద్ధి చెందిన తత్త్వశాస్త్ర ఆచార్యుడు. శాంతినికేతన్ లో బోధించేవాడు. యు.జి.సి కోరికమీద, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రవిభాగం ఎలా పనిచేస్తోందో చూడటానికి ఆయన 72 లో తిరుపతి వెళ్ళారు. వారం రోజుల పాటు ఆ విభాగాన్ని కూలంకషంగా పరిశీలించటంతో పాటు,ఆ శాఖలో పనిచేస్తున్న ప్రొఫెసరల్నీ, రీడర్లనీ, లెక్చెరర్లనీ స్వయంగా కలుసుకోవాలనుకున్నారు. కలుసుకున్నారు, మాట్లాడేరు. ఒక్కరిని తప్ప.
డా.చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు అనే ముప్పై ఏడేళ్ళ వయసుగల లెక్చెరర్ ని మాత్రం అతని ముందు హాజరుపర్చడానికి ఆ శాఖాధిపతి సుతరామూ ఇష్టపడలేదు. ఇక భట్టాచార్య మర్నాడు వెళ్ళిపోతారనగా, ఆ లెక్చెరర్ ని కూడా ఆయనముందు హాజరు పరచకతప్పింది కాదు.
నిర్లక్ష్యంగానూ, అన్యమనస్కంగానూ తనముందు నిలబడ్డ ఆ యువకుణ్ణి ‘నువ్వేం చేస్తున్నావు? ‘ అనడిగాడు భట్టాచార్య.
‘ఏమీ చెయ్యను’ అన్నాడతడు.
‘ఏదో ఒకటి చెయ్యకుండా ఎలా ఉంటావు? యూనియన్లు నడుపుతుంటావా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటావా? సినిమాలు తీస్తుంటావా? ‘ అడిగాడు భట్టాచార్య.
‘లేదు, ఏమీ చెయ్యను.’ అన్నాడతడు మళ్ళా.
‘ఏమీ చెయ్యకుండా ఉండటం అంత సులభం కాదు, అది యోగులకే సాధ్యం. నిజం చెప్పు,ఇన్నాళ్ళూ నువ్వు నన్ను కలవలేదు. అసలు నువ్వు చేస్తున్న పనేమిటి?’
‘రాస్తుంటాను.’
‘ఏం రాస్తుంటావు?’
‘కథలూ, నవలలూ, అది కూడా తెలుగులో.’
‘తెలుగు నాకు రాదు. ఇంగ్లీషులో ఏమన్నా రాసావా?’
ఆ యువకుడు ఒక క్షణం పాటు ఆగాడు. అప్పుడు కూడా నెమ్మదిగా సందేహిస్తూ
‘ఒక రచన రాసాను. కాని అది ఫిలాసఫీ డిపార్ట్ మెంటు కి అర్థం కాదు, అంగీకరించదు.’
‘నాకు చూపించగలవా దాన్ని.’
ఆ యువకుడు తన ఛాంబర్ లో తన సొరుగులోంచి ఒక మాన్యుస్క్రిప్ట్ తీసి ఆయన చేతుల్లో పెట్టాడు. పట్టుమని ఇరవైపేజీలు కూడా లేని రచన.
భట్టాచార్య కుతూహలంగా మొదటి పేజీ తెరిచాడు. మొదటి వాక్యం చదివాడు.
“Contradictoriness is an inherent structural tinge of reality.”
ఆయన తనముందున్న యువకుణ్ణి ఎక్స్ రే కళ్ళతో చూస్తూ
‘మీ తండ్రితాతల్లో ఎవరన్నా శాక్తులా? ‘ అనడిగాడు.
‘కాదు. ఎవరూ లేరు.’
ఆయన నమ్మలేకపోయాడు.
‘మీపూర్వీకులెవరేనా రాసిన తాళపత్రాన్ని ఇంగ్లీషులోకి అనువదించావా?’
‘లేదు. ఇది నేనే రాసాను.’
‘నువ్వేం రాసావో నీకు తెలుసా?’
‘కొద్ది కొద్దిగా అర్థమవుతోంది’ అన్నాడా యువకుడు.
అంతే, భట్టాచార్య మర్నాడు రైలు టిక్కెట్టు కాన్సిల్ చేసేయమన్నాడు. నేరుగా గెస్ట్ హవుజ్ కి వెళ్ళిపోయాడు. ఎవరూ తనని కలవొద్దని చెప్పాడు. ఆ రాతప్రతినే అధ్యయనం చేస్తూండిపోయాడు. తాను శాంతినికేతన్ వెళ్తూ ఆ రాతప్రతిని టైపు చేసి ఒక కాపీ తనకి పంపించమన్నాడు.
శాంతినికేతన్ వెళ్ళాక కూడా భట్టాచార్య స్తిమితంగా ఉండలేకపోయాడు. ప్రాచీన భారతీయ దార్శనికుల పంథాలో సూత్రప్రాయంగా రాసిన ఆ ఇరవై పేజీల రాతప్రతి ఆయన్ని నిలవనివ్వలేదు. ఆయన ఒక ఏడాది పాటు ఉద్యోగానికి సెలవుపెట్టేసాడు. భిలాయిలో ఉన్న తన కూతురిదగ్గరకు వెళ్ళిపోయి, ఆ రచనను మరింత లోతుగా అధ్యయనం చేస్తూండిపోయాడు. ఏమైతేనేం, చివరికి, 1975 జనవరి నాటికి, ఆ రచనకు ఒక విపులమైన పీఠికను రాయగలిగాడు.
కాని, ఆ రచనను అట్లా ప్రాచీన సూత్రవాజ్మయం తరహాలో ప్రచురిస్తే ఎవరికీ అర్థం కాదనీ, దానికి కనీసం మూడువందల పేజీల భాష్యం కూడా రాయాలనీ చండీదాస్ ని కోరాడు. ఆ సందర్భంగా ఎనిమిది నెలలపాటు వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.
భట్టాచార్య సూచనను చండీదాస్ ఆదేశంగా స్వీకరించి తన రచనకు తనే వ్యాఖ్యానం రాయడానికి ఉపక్రమించాడు. కాని, ఆ దివ్యావేశం అతడికి మళ్ళా లభించలేదు. తాను రాసింది తనకే సంతృప్తికరంగా అనిపించలేదు.
18 ఏళ్ళు గడిచాయి.
ఆయన జీవితంలోకి రఘురామరాజు అనే తత్త్వశాస్త్ర విద్యార్థి ప్రవేశించాడు. తాను భట్టాచార్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోడానికి ప్రత్యక్షమయిన అవకాశంలాగా కనిపించాడతడు. తనకన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడు. 1993 లో, చండీదాస్ నోరుతెరిచి అతణ్ణి అడిగాడు.
‘ఈ రచనకు నువ్వు భాష్యం రాయగలవా?ఇంగ్లీషు పాఠకలోకానికి నువ్వు పరిచయం చెయ్యగలవా?’
ఆ తర్వాత 2004 దాకా వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.(ఆ లేఖల్ని ‘ప్రేమతో..చండీదాస్ ‘ పేరిట ఎమెస్కో ప్రచురించింది. అందులో కాళిదాసు భట్టాచార్య చండీదాస్ కి రాసిన లేఖలకు నా తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి.) రఘురామ రాజు చండీదాస్ ని చివరి సారి కలిసినప్పుడు ఆయన బయట గుమ్మం దాకా వచ్చి అతడికి వీడ్కోలు పలుకుతూ ‘నేను మరణించినా కూడా నువ్వు నన్ను చూడటానికి రానక్కర్లేదు. కాని నేను భట్టాచార్యగారికి ఇచ్చిన మాట మాత్రం మర్చిపోకు ‘ అన్నాడు.
ఆ రచన ని రఘురామరాజు 16 సంవత్సరాలు అధ్యయనం చేసాడు. దానికొక విపులమైన వ్యాఖ్యానం రాసాడు. వందమందికి పైగా ప్రచురణకర్తలకు పంపాడు. ఒక్కరు కూడా ప్రచురణకు అంగీకరించలేదు. మొదటిసారిగా, జాన్ హారిస్ అనే ఒక తత్త్వశాస్త్ర ఆచార్యుడు దాన్ని work of genius అన్నాడు. కాని అతడు యాక్సిడెంట్ లో మరణించడంతో ఆ పుస్తకం గురించి చెప్పడానికి మరెవరూ లేకపోయారు. చివరికి ఆశిష్ నందీ ఆ రచనని ఆక్స్ ఫర్డ్ కి పరిచయం చేసాడు. కాని ఆక్స్ ఫర్డ్ కూడా నిరాకరించింది.
‘రఘురామరాజు ఎవరు? చండీదాస్ ఎవరు?’ అనడిగింది ఆ ప్రచురణ సంస్థ.
అప్పుడు రఘురామరాజు తానెవరో తెలియచేసుకోడానికి Debates in Indian Philosophy: Classical, Colonial and Contemporary (2006) అనే పుస్తకం రాసాడు. ఆ రచన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ‘ఛాయిస్’ పత్రిక దాన్ని అత్యంత విశిష్ఠమైన రచనగా ఎంపికచేసింది. డా. రాధాకృష్ణన్ తర్వాత మళ్ళా ఆక్స్ ఫర్డ్ కి భారతీయ తత్త్వశాస్త్రం గురించి మాట్లాడగల రచయిత దొరికాడు.
అప్పుడు, చండీదా రచనకి డా. రఘురామరాజు రాసిన భాష్యాన్ని ఆక్స్ ఫర్డ్ Enduring Colonialism: Classical Presences and Modern Absences(2009) పేరిట ప్రచురించింది. ఆ రచన చదివిన తత్త్వశాస్త్రప్రపంచం ‘చండీదాస్ ఎవరు? ఆ మూల రచన ఎక్కడ? ‘అని రఘురామరాజు వెంటపడింది.
అదిగో, ఆ దాహాన్ని తీర్చడానికి, ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ చండీదాస్ రచనను Desire and Liberation:Biography of a text by Vaddera Chandidas (2018 ) పేరిట ప్రచురించింది.
1972 లో ఒక తెలుగు యువకుడు తనకోసం తాను రాసుకున్న ఒక రచన. 45 సంవత్సరాల పాటు దాన్ని ఇద్దరు మటుకే చదివారు. ఒకరు కాళిదాసు భట్టాచార్య, మరొకరు రఘురామరాజు. ఇప్పుడు యావత్ ప్రపంచం చదవబోతున్నది. తత్త్వశాస్త్రంలో metaphysics కి ఒకప్పుడు భారతదేశం పుట్టినిల్లు. కాని ఆధునిక భారతీయ చింతనలో మౌలికమైన metaphysical రచన ఏదీ ఇంతదాకా ప్రభవించలేదు. అరవిందులు, కె.సి.భట్టాచార్య ఆ దిశగా కొంత చింతనచేసారు. కాని ప్రధాన సూత్రగ్రంథమేదీ రాయలేదు. ఆ అవకాశం చండీదాస్ కి దక్కింది. ఆపస్తంబుడు, ఆచార్య నాగార్జునుడు, కుందకుందాచార్యుల తర్వాత ఇన్నాళ్ళకు తిరిగి ఒక తెలుగువాడి మౌలిక దార్శనిక గ్రంథం ప్రపంచం ముందు అవతరించింది.
మంచి కవి, మంచి స్నేహితుడు గురించి తః తః గారి అభిప్రాయం:
01/04/2018 11:30 pm
లైలా యెర్నేని: నిజానికి “‘తిలక్ చెప్పినట్లు’ అంటూనే తిలక్ మాటల్లోని ‘అందమైన’ ని ఎందుకు తప్పించేశావు తల్లీ!” అని సుధామాధురిని అడగాలని నాకూ కుతూహలంగా ఉంది.
‘అందమైన’ అనటంలో కవి లౌల్యానికి గురి అయినట్టుగా అనిపించింది. ఆ మాటతో తిలక్ వంటి కవి – తనకు తెలీకుండానే – అ(క్షరాలు), అం(దమైన), ఆ(డుకునే), ఆ(డపిల్లలు) వంటి అక్షర రమ్యత, శ్రవణ రమణీయతల కోసం – అందమైన వాళ్ళు కానివారికి తన ప్రపంచంలో చోటు లేదని చెపుతున్నాడా! తన ‘ఆనంద పరమావధిని’ విస్మరించాడా! అన్న బాధ కలిగింది.
నమస్కారాలతో
తః తః
పరిచయం: ఇంటివైపు – అఫ్సర్ కవితల సంపుటి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
01/01/2018 3:05 am
ప్రియమైన శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు,
ఒక ఆత్మగత ప్రపంచానికి ప్రతీకగా ఉన్న అఫ్సర్ గారి కవితల పుస్తకం “ఇంటివైపు”ను నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారు అందించారు కాని దాన్ని ఎలా ఆశ్వాదించాలో మీ యీ విశ్లేషణ వల్లే తెలుసుకున్నాను. (వాకిలి అంతర్జాల పత్రికలో స్వాతి కుమారి బండ్లమూడి గారు కూడా యీ పుస్తక పరిచయం చేసి సాయపడ్డారు). మీకు ధన్యవాదాలు.
“కణకణ మండే ఉద్యమ రక్తకాసారాల్లోకి
దేహాల్ని చితుకుల్లా విసిరేస్తున్న ప్రాణాలూ తెలుసు నాకు” అన్న అఫ్సర్ గారికి వొందనాలు.
కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి Chandra Sekhar Devarakonda గారి అభిప్రాయం:
11/17/2017 11:36 pm
మురుగన్ గారు సృజనాత్మక రచయిత. ఆయన వ్యాసం సాంస్కృతిక వ్యాసం. అటువంటి వ్యాసాలకు సాహిత్య పత్రికల్లో తప్పక చోటివ్వాలి. కళను సిద్ధాంతం మింగేయకూడదని ఈరోజుల్లో మార్క్సిస్టులు కూడా ఒప్పుకుంటారు. అలాగే కళ వెనుక ఏదో ఒక భావజాలం ఉండి తీరుతుందని మార్క్సిస్టులు కాని వాళ్ళు కూడా ఈరోజుల్లో ఒప్పుకుంటున్నారు. భారతరామాయణాలు రసవత్తరంగా రాయబడిన కారణం చేతనే అవి ప్రచారం చేసిన భావజాలాలు ఇప్పుడు కూడా ప్రభావితం చేస్తున్నాయి. కళ కళ కోసమే అన్న భావన మన సంప్రదాయంలో ఎప్పుడూ లేదని నా అభిప్రాయం. కవిత్వం విలువ నిర్ణయించడానికి ఆర్ద్రహృదయం ఒక్కటే చాలదు. ఆ కవిత్వం వెనుకనున్న రాజకీయాలు కూడా తెలియాలి. లేకపోతే అందమైన ప్రకటన చూసి కరిగిపోయి అది ప్రకటించే వస్తువు కొనుక్కొనే వినియోగదారుడిలా మిగిలిపోతాం. ప్రకటన అందాన్ని మెచ్చుకోవచ్చు. కాని వస్తువు నాణ్యతను ఇంకా ముఖ్యంగా పరిగణించాలి.
కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
11/15/2017 8:22 am
ప్రియమైన శ్రీ దేశికాచారి గారికి, శ్రీ నాగేశ్వరరావు గారికి,
“ప్రచారమే ధ్యేయంగా రాయబడిన వ్యాసము”, “సాహిత్యపు విలువలు” వంటి విషయాల గురించి మీతో వాదించాలనుకుంటున్నా కాని, బహుశా ఇది సమయం కాదేమో అని సందేహిస్తున్నా.
“భావవ్యక్తీకరణ విషయంలో జరిగే తిరుగుబాటుకీ కులవ్యవస్థకీ ఉన్న సంబంధం అతి కీలకమైనది” అంటూ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌గారు చేసిన ప్రసంగపాఠంలో నాకు యెలాంటి తప్పులు కాని, వాస్తవాలకు విరుద్ధమైన తప్పుడు ప్రచారం లాంటిది కాని కనబడుటలేదు. ఇది ఆర్ద్రహృదయముతో వారు చేసిన ప్రసంగంగా అనిపించటం లేదా.
మన కుల వ్యవస్థ, కులవిచక్షణ సాంఘిక రుగ్మతల వల్ల జరుగుతున్న అన్యాయాలు, అనర్థాలు మనకు తెలియని విషయాలా. దేశపురోగమనానికి ఇవి ఆటంకాలు కావా. దయచేసి యీ కోణంలో మరొక్కసారి ఆలోచించగలరు.
కథ, నవల, నాటకం, కవిత్వం ఇంకా అనేక ప్రయోగాలు సాహితీ ప్రక్రియలు అయినట్లే వ్యాసాలు కూడా సాహితీ ప్రక్రియ క్రింద రావా. యీ వ్యాసం ప్రచురించటం వల్ల ఉన్నత సాహితీ విలువలు కలిగి ఉన్న ఈమాట అంతర్జాల పత్రికకు యేవైనా అపకీర్తి చుట్టుకుంటుందా.
కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి desikachary గారి అభిప్రాయం:
11/13/2017 10:41 am
I stand by my word. Since it is propagandish devoid of any literary value I said this is not the right forum for that. There are other forums too willing to publish such stuff where it can go. As for the quote by Ramayyagaru, it is irrelevant, because it is not a piece of literature we are talking about. It is a pity that people are too willing to quote foreigners than Indian Laakshanikas on literature. Here is a quote from respected modern poet and scholar Sri Indraganti Hanumacchaastrigaru regarding the true nature of poetry, which, by extension is relevant to all literature.
“కవిత్వము సిద్ధాంతములను మ్రింగివేసి జీర్ణించుకొని తన జీవశక్తితో తాను నిలబడవలెను. కాని సిద్ధాంతములే కవిత్వమును మ్రింగి తూర్యారవములు ప్రారంభించినచో నాటితో ఆ సాహిత్యపు విలువ సరి. నాదములు, వాదములు తాత్కాలికములు. కవిత్వపు విలువ శాశ్వతము. తిక్కన భారతమును, పోతన భాగవతమును, పెద్దన మనుచరిత్రమును సమకాలిక సిద్ధాంతదర్శనమునకై చదువుట లేదు. వాని లోకోత్తర కవితాశిల్పము, వ్యంగ్యప్రభావము తరతరములనుండి చదివించుచున్నవి. కనుక కవిత్వపు విలువను నిర్ణయించుటకు వేరు పరికరములు కాక, ఒక్క ఆర్ద్రహృదయము మాత్రమే ప్రయోజకమని సమ్మతించినచో ఏ రచనకైనను న్యాయము జరుగును” – ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.
కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి Raghavendra గారి అభిప్రాయం:
11/02/2017 9:59 pm
అనువాదం అని చూసి చదువుతూ దశాబ్దాలక్రితం రాసినదేమో అని ఊహిస్తూ వచ్చాను. చివరలో ఈఏడాదే చేసిన ప్రసంగమని తెలిసి నిరుత్సాహం కలిగింది. తెలుగు/ తమిళ భాషలలో ధ్వన్యేకత కలిగి సమానర్ధకాలుకాని పదాలనేకం. విచారము అంటే సంతాపం పొందటమనే స్ఫురిస్తుంది. విచారణ క్రియావాచకం. విచారణా భాష అనివాడుంటే మేలుగా ఉండేది.
శిక్ష గురించి దాట్ల దేవదానం రాజు గారి అభిప్రాయం:
10/09/2017 5:40 am
చాలా ఆనందంగా ఉంది నీ కథ చదివి. పాత్రలన్నీ ఎరుగున్నవే కావడం వల్ల మరింత ఆయా వ్యక్తులు జ్ఞాపకానికి వచ్చారు. సంభాషణ శైలి గ్రామీణతను సంతరించుకుంది. కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు. కుర్రనాకొడుకు వల్ల లోకంలో ఎక్కడా లేని కనీ వినీ ఎరుగని గొప్ప శిక్ష పడింది తాతరాజుకి. చిరంజీవీ ఇక నీ కథన కుతూహలంకు అడ్దులేదు. నీదైన బాణీలొ దూసుకుపో. నీ బాల్యాన్ని తవ్వి పోగెట్టు. బొలెడన్ని కథలు పుడతాయి. కొంచం సీరియస్‌గా శ్రద్ధగా మనసు పెట్టు. నీకు కథాలోకం జేకొడుతుంది. అభినందనలు.
℞: మారేజ్ గురించి Madhu Chittarvu గారి అభిప్రాయం:
10/08/2017 1:22 am
నేను డాక్టర్‌ని, ఇంకా రచయితని కూడా కాబట్టి యెంత ప్రయత్నించినా నిశ్శబ్దంగా ఉండలేక రాస్తున్నాను. ప్రిస్క్రైబ్ మ్యారేజ్ అని గైనకాలజిస్ట్ రాయదు. రాయకూడదు. వ్యక్తిగతంగా సలహా ఇస్తే ఇచ్చి ఉండచ్చు. పెళ్ళి కాకపోవడం జబ్బులకి మూలమని ప్రి మెన్స్ట్రూల్ టెన్షన్ తగ్గుతుంది అని ఒక అభిప్రాయం ఉన్నది కాని అది కరక్ట్ కాదు. చీటి మీద బరువు యెత్తు జబ్బు వివరాలు రాయడం ఇండియాలో సాధారణం. అమెరికాలో అది గోప్యంకావచ్చు.ఈ వివరం తప్ప ఇక కథలో యే లోపం లేదు. ఇది ఆ వ్యక్తి మానసిక సాంఘిక సమస్య. కాని యెంతో మంది వివాహం కాని స్త్రీలు ఉన్నారు. వారికి ఇలా పెళ్ళీ పిల్లలు పరిష్కారం అని చెప్పి చీటి మీద రాయడం యే డాక్టర్ చెయ్యదు. చెయ్యకూడదు. మందుల చీటి చూసి నవ్వే మందుల షాపు వాడిని అసభ్యప్రవర్తనకి లైసెన్స్ తీసేయచ్చు. కాని, ఇది కథ కదా, అలా జరగకూడదని యేమీలేదు.
℞: మారేజ్ గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
10/05/2017 12:05 pm
రవి కారుమంచి: అడిగారు కనక చెప్తున్నా. కధా వస్తువు అద్భుతం. కానీ కధలో రాసిన పదాలు, కధలో ఆవిణ్ణి చూపించిన విధం నాకు పెర్సనల్ గా నచ్చలేదు. [డిస్-క్లైమర్ – నాకు నచ్చినవి అందరికీ నచ్చవు, వైస్ వెర్సా. :-)] ఈ కధలో ఆవిణ్ణి బేలగా చేతకానిదానిలా చూపించారు. రోజుకో రేప్ జరుగుతున్న ఈ రోజుల్లో అది మహిళలని అవమానించం అని నాకు అనిపించింది. మహిళలకి ఉండే పీరియడ్స్, హార్మోన్ గొడవలు, యువర్ లిబిడో, ఇంకా కొంచెం ముందుకి పోయి పోర్న్, మాస్టర్బేషన్ అనే పదాలు వాడి చెడగొట్టారు కధని. నిజమే అవన్నీ ఉన్నాయి కానీ ఆ పదాలు వాడక్కర్లేకుండా ఇంకా హుందాగా చెప్పొచ్చు కధని.
చివరిగా మనసులో అనిపించిన మాట – మహిళా రచయితలే మహిళలని ఇలా చూపిస్తే ఎలా? మహిళలకి ప్రోబ్లెంస్ లేవు అని నేను అనటంలేదు. ఉన్నాయి కానీ పెళ్ళే పరమావధి, హార్మోన్స్, డాక్టర్ ఇచ్చిన కాయితం మీద ఏమి రాశాడో చూసుకోలేనట్టి బేలతనం, బాస్ ఏదైనా అంటే నోరుమూసుక్కూర్చోవడం, తనకన్నా పదేళ్ళ జూనియర్ ఏదో అంటే పొనీలే అని ఊరుకోవడం ఇవన్నీ చూస్తే కధలో అమ్మాయిని చేతకానిదానిగా చూపించారు. పదో క్లాసు చదువుకోని అమ్మాయి కూడా ఎవరైనా ఇలా అంటే మహాకాళిలాగా విరుచుకు పడుతుంది.
కింది పోస్టులో మర్చిపోయిన మరో విషయం చెప్పడం – అమరేంద్ర గారు చెప్పినట్టు జీవితం ఎంత సింపుల్ గా కావాలిస్తే అంత సింపుల్ గా మలుచుకోవచ్చు. అది మనచేతిలోనే ఉంది. నిజం. ఓ సారి వెనక్కి చూసుకుంటే ఎవరికేనా సరే తెలిసేది ఏమిటంటే – ఈ జీవితం మనది. దాన్ని ఎలా కావాలిస్తే అలా మలుచుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా ఉంది అంటే దాదాపు 90% శాతం దానిక్కారణం మనమూ మనకి తీరిన/తీరని కోరికలూను.
మొదట్లో చెప్పిన డిస్ క్లైమర్ మరో సారి చదుకోమని చెప్తూ. 🙂 శెలవు.
℞: మారేజ్ గురించి Sivasankar Ayyalasomayajula గారి అభిప్రాయం:
10/05/2017 5:07 am
మనస్సులో ఒక పల్చటి పొరలో తనలో తాను సంభాషించుకున్నట్లు ఉంది. నవీన నాగరికతకు మానసిక రూపురేఖలు దిద్ది కథగా మలచి, అవ్యక్తము కాని చిత్రాన్ని చాలా బాగా చిత్రించడానికి ప్రయత్నించారు. కథ బావుంది. చదువుతూంటే తెలిసిన సన్నిహితురాలి కథ కళ్ళ ముందు ప్రతిబింబించింది.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి C. Chandrasekhar గారి అభిప్రాయం:
09/14/2017 6:22 pm
ఈ శ్లోకానికి సరియైన సాంకేతికార్థము విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య సురభి లోని వ్యాఖ్యానము చూడండి. విష్ణు పదానికి విశ్వవ్యాపకుడన్న అర్థమే చెప్పుకోవాలి.
గణపతి ఆరాధన తంత్ర శాస్త్రానికి సంబంధించినది. కుండలినీ శక్తి మూలాధారమునుండి ఊర్ధ్వగతిలో పయనించడానికి మొదట నున్న ఆటంకమునే గణపతిగా భావించి స్తుతించినారు. పార్వతి స్నానము చేయబోతూ గణపతిని ద్వారపాలకునిగా నియమించినదన్న కథ కూడా ఈ తత్త్వానికి సంకేతమే. (సరియైన వివరములు యోగా వ్యాసకులు, దేవీ ఉపాసకులు మాత్రమే చెప్పగలరు.)
శ్రీశంకరుల కాలానికే – అనగా 7వ శతాబ్దానికి పూర్వమే – గాణాపత్యము తాంత్రిక సాధనలలో సనప్రసిధ్ధమైనది. షణ్మత స్థాపకులుగా శంకరులు సంస్కరించిన ఆరు మతాలలో గాణాపత్యము కూడా ఉన్నది.
వేదాలలో సంగ్రహంగా చెప్పబడిన ఉపాసనలనుండే పురాణకాలంలో దేవతలకు మూర్తి కల్పన జరిగింది. అందులోనూ గణపతి, స్కందుడు, ఆంజనేయుడు, నరసింహస్వామి వంటి కొందరు కేవల మంత్ర స్వరూపులుగా ఉపాసింపవలసినవారు.
కథారూపంలో వ్రాసిన పై వ్యాసంలో సరియైన పరిశోధన చేసినట్లు కనిపించదు. It is not proper to deal with serious topics in a casual manner, without seeking guidance from the learned scholars in relevant field.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 2 గురించి భట్టారం రవీంద్ర బాబు గారి అభిప్రాయం:
09/12/2017 12:27 pm
ఈ శీర్షికలో ఎంత గొప్ప సాంకేతిక సహాయకాలని వాడకానికి మాకిచ్చారు!
భూమి చాలని మనిషి గురించి బి.వేణుగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం:
09/05/2017 2:48 pm
భూభ్రమణ కాంక్షను గొప్పగా పరిచయం చేశారు సార్. పుస్తకాన్ని చదవాలనే అతృతను సమీక్ష ప్రారంభంలోనే కలిగించారు. యాత్రా సాహిత్యం పట్ల గొప్ప అవగాహన ఉన్న మీరు పుస్తకాన్ని అద్భుతంగా పరిచయం చేశారు. భ్రమణం అందరికి సాధ్యపడదు. సాధ్యపడినవారి అనుభవాలు సాహితీ లోకానికి చాలా అవసరం. రచయుత ఆదినారాయణగారు అభినందనీయులు.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
09/04/2017 8:51 pm
శుక్లాంబరధరం అన్న శ్లోకానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యను ఈ అనుబంధం ద్వారా ఈమాట పాఠకులకు అందజేస్తున్నాము.
శుక్లాంబరధరం … (విశ్వనాథ వ్యాఖ్య)
‘సాహిత్య సురభి’ అన్న పుస్తకంలోని ఈ వ్యాఖ్యను మాకు స్కాన్ చేసి అందజేసిన మిత్రుడు హేలీ కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
సంపాదకుల తరఫున,
సురేశ్ కొలిచాల.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి గిరి గారి అభిప్రాయం:
09/02/2017 5:07 am
సురేశ్ గారు, చదువరులకు ఎర బాగా వేసారు. రెండవ భాగం కోసం ఎదురుచూస్తున్నాను.
ఒక ప్రక్క అమాయకపు భక్తి, మఱొక వైపు తార్కిక యుక్తిని తెలివిగా నిలిపారు. ఇందులో ఎవరి వాదన గెలుస్తుందనేది అప్రస్తుతం అని నేను భావిస్తున్నాను. శ్లోకాలు, అందునా బాగా ప్రాచుర్యం పొందినవి పూర్వపు కవులు తమ కావ్యాలలో అప్పుడప్పుడు వాడుకొనేవారో, లేక తరువాత తరం వారు జోడించేవారో నాకు తెలియదు. అయితే రామరక్షాస్తోత్రం చదివితే అందులో అందమైన కొన్ని శ్లోకాలు వేఱుచోట్ల కనిపిస్తాయి. శుక్లాంబరధరం, ఓం గణానామ్ శ్లోకాలూ ఇదే విధంగా ప్రయాణం సాగించి యుండవచ్చు. స్థూలభావానికి దూరం కానివి, కొన్ని సందర్భాలలో స్తోత్రానికి అందం తెచ్చేవి ఇలా పలుచోట్ల దర్శనమిచ్చేవిగా వెలసియుండవచ్చు. ఏది ఏమైనా, ఒక మహత్తరమైన ఊహాకారుని అంతర్మథనం నుండి వెలువడి, ఆకర్షణీయోచ్ఛారణ అందమై, ఛందోగమనము నడకయై, భక్తిభావము ఆత్మయై పుట్టిన అటువంటి శ్లోకాలు వందల సంవత్సరాలు నిలిచి మనకు చేరినాయి. అది మన భాగ్యము, పూర్వకవుల గొప్పదనము.
భూమి చాలని మనిషి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
09/01/2017 10:00 am
ఉత్తర భారత్ దేశం, హిమాలయాలు, అండమాన్, అమెరికాల మీ యాత్రానుభవం రచనల / పుస్తకాల ద్వారా మాకందించిన ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ!
విశాఖ వాస్త్వులు ప్రొఫెసర్ ఎం. ఆదినారాయణ గారి “భూభ్రమణ కాంక్ష” (యాత్రా అనుభూతుల పుట్ట, హృదయ స్పందనల పుట్ట) పుస్తకానికి మీ సవివరణ, సహృదయ సమీక్షకు కృతజ్నతలు. ఇది అందరూ తప్పక చదవవలసిన పుస్తకం.
ఆదినారాయణ గారిని “పాదాచారి” అని ఆప్యాయంగా పిలుచుకుంటారని త్రిపుర గారి సొదరతుల్యుడు విశాఖ డా. అత్తలూరి నరసింహరావు గారి ద్వారా తెలుసుకున్నాను.
“భూభ్రమణ కాంక్ష” పుస్తకం తెప్పించుకోవటానికి నవోదయా బుక్‌హౌజ్, కాచిగూడ, హైదరాబాద్ వారి వెబ్ లింకు యీ క్రింద :
https://www.telugubooks.in/products/bhramana-kamksha
https://www.telugubooks.in/
పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి VSTSayee గారి అభిప్రాయం:
08/12/2017 1:45 pm
“తః తః”
అంతర జాతీయం
క్యూబెక్‌లో పడుకున్నా
చెవుల్లో బంగాళాఖాతం రొద
మాంట్రియల్‌లో జెట్ దిగి
కాబ్ కోసం నడుస్తున్నా
ఎల్లమ్మ తోటలో మొదటిసారి బస్ దిగి
చిత్రాలయ వైపు టికెట్‌కోసం నడుస్తున్నట్టే
గతాగతాల మధ్య
గ్రంథులు విప్పలేనివాణ్ణి
నీవీ మోక్షణ వేళలో
వస్త్ర మూల్య పరీక్షణం నేర్పిన
పాఠశాల విద్యార్థిని
ఎన్ని సమ్మర్లపాటు
ఏడ్మాంటన్ చిన్నది ఎండలో తడిసినా
తెలుపు తెలుపేకాని నలుపుకానట్టు
‘బాన్ జోర్’ ‘బాన్ సాయిర్’ కరచాలనాల మధ్య
పరిచయానుద్రిక్త పరిరంభ సమయాలు
స్మరించి
చెమరించేవాణ్ణి
ఎంత చెడ్డా
తంతే
గారెల బుట్టలో పడేవాణ్ణి
—తః తః
(2-10-87 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, పుట 71.)
—
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి ‘తః తః గారి అభిప్రాయం:
08/12/2017 5:54 am
1987 జున్ జులై రొజుల్లో ఎడ్మంటన్‌లో ఒక సమావేశానికి వెళ్లి, వెనువెంటనే (ఫ్రెంచ్ కెనడా) లవాల్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ శాఖలో అతిథిగా గడిపాను. ఎండాకాలంలో అక్కడి పగళ్ళకు రాత్రంటూ ఉండేది కాదు. నిద్ర వచ్చేది కాదు. పైగా అటూ ఇటూ పరుగులు తీస్తున్న కార్ల చక్రాల చప్పుడు విశాఖ పట్నపు సముద్రపు రొదలాగా చెవులకు చుట్టుకొనేది. ఎడ్మంటన్, కుబెక్, మాంత్రేల్ అన్న మాటల్ని ఇంగ్లిష్ లిపి లోనే ఉంచుతూ “కుబెక్‌లో పడుకున్నా చెవుల్లో బంగాళా ఖాతం రొద, మాంత్రేల్‌లో జెట్ దిగి కాబ్ కోసం పరుగెడుతున్నా ఎల్లమ్మ తోటలో బస్సు దిగి చిత్రాలయకు పరుగెడు తున్నట్టే, ఎడ్మంటన్ చిన్నది ఎన్ని సమ్మర్ల పాటు ఎండలో తదిసినా తెలుపు తెలుపేగాని నలుపు కానట్టు గతాగతాల మధ్య గ్రంథులు విప్పలేనివాణ్ణి, నీవీ మోక్షణ వేళ వస్త్ర మూల్య పరీక్షణం నేర్పిన పాఠశాల విద్యార్థిని… అంతరిక్ష నౌక లోంచి అమాతం తన్నినా సూటిగా వచ్చి బూరెల బుట్టలో పడేవాణ్ణి” అంటూ ‘అంతర జాతీయం’ అని ఒక కవితతో – శ్రీ ఫురాణం సుబ్రహ్మణ్య శర్మ, సంపాదకులు, ఆంధ్ర జ్యోతి వార పత్రిక,విజయవాడ, ఏ.ఫ్. ఇండీయా. అన్న చిరునామాకు – తః తః గా ఒక ఎన్వలప్ పొస్ట్ చేశాను. ఈ విషయం మరిచే పోయాను. ఆగస్టు నెలలో అంధ్ర విశ్వకళా పరిషత్ టీచర్స్ క్వార్టర్స్ లో ఇంటికి వచ్చేశాను. ఆంధ్రజ్యోతి 1987 అక్టోబర్ 2 సంచిక పోస్ట్‌లో ఇటికి వచ్చింది అందులో -ఇంగ్లిష్ లిపి లోవన్నీ తెలుగు లిపిలోకి మార్చబడి- ‘అంతర జాతీయం’ తః తః*.
శ్రీరమణ గారికి నమస్కారాలతో
తః తః
* కవిత కేవలం గుర్తు మీద రాశాను . ఆ సంచికను పారేసుకుని దశాబ్దాలు గడిచి పోయాయి. తః తః గా రాస్తున్న నేను అక్టొబర్ 2-3ల మధ్య పుట్టాను. ఆశ్చర్యం! తః తః పుట్టుక కూడా అక్టొబర్ 2)
పాట ఒకటి… గురించి దడాల వెంకటెశ్వరరావు గారి అభిప్రాయం:
08/09/2017 7:02 am
మొదలూ చివరా కాని రెండు మూడు పదాల పరదా చాటు నుండి దొరికీ దొరక్కుండా దాగుడు మూతలాడుతూగుర్తుకొస్తున్న ఆ పాట ఒకటి ఏమిటొ వినాలని ఉంది.
మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం గురించి వేణు గారి అభిప్రాయం:
07/19/2017 7:41 am
మీరా (1947) సినిమా హిందీ వర్షన్ టైటిల్స్ లో సుబ్బులక్ష్మి పేరును ‘శుభలక్ష్మి’ అని మార్చి వేశారు. హిందీ ప్రాంతం వారికి ఆమె పేరును సన్నిహితం చేయటానికి అలా చేశారట. అలాగే ఈ పుస్తక రచయిత్రి పల్లవి కూడా తెలుగువారికి ఆత్మీయంగా ఉండటం కోసం ‘సుబ్బలక్ష్మి’ అని రాశారు.
నవల్లో ఆ పేరును అలా వాడటంపై విమర్శ/ అభ్యంతరం ఉంటే అది వేరే సంగతి. కానీ అంతమాత్రం చేత పుస్తకానికి రచయిత్రి పెట్టిన టైటిల్ నూ, కొటేషన్లలో వాడిన పేరునూ కూడా సంపాదకులు ఈ సమీక్షలో సవరించటం సరి కాదు కదా!
[పుస్తకం పేరు సవరించటం అనాలోచితంగా జరిగిన తప్పు. క్షమాపణలు. సరిదిద్దాము – సం.]
మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం గురించి garlapati pallavi గారి అభిప్రాయం:
07/13/2017 12:39 pm
వారి అసలు పేరు సుబ్బులక్ష్మే. కాని పలికేటప్పుడు ఏ కొద్దిమందో తప్ప, ఆమె భర్త తో సహా అందరూ ‘సుబ్బలక్ష్మి’ అనే పలుకుతారు.ఇక తెలుగు వారికి ఆమె సుబ్బలక్ష్మే. ఆమెను సుబ్బలక్ష్మి అని పిలుచుకునటములో వుండే ఆప్యాయత,చనువు, నాకు సుబ్బులక్ష్మి అనే పిలుపులో అనుభవం కాలేదు. అందుకే ప్రేమతో సుబ్బలక్ష్మి.
పుస్తకం లోపల కొన్ని చోట్ల వారి పూర్తి పేరు తెలుపుతూ సుబ్బులక్ష్మి అని వ్రాశాను.
పల్లవి,
రచయిత్రి.
సినారె: ఒక స్మరణ గురించి ఆరిఫ్ గారి అభిప్రాయం:
07/05/2017 7:42 am
చాలా బాగుంది. కాని చాలా.. తక్కువనిపిస్తుంది. ధన్యవాదాలు.
సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
06/29/2017 10:51 pm
శ్రీవిద్యా సరస్వతీ ప్రత్యక్షావతీర్ణమూర్తులైన డా. యెర్నేని లైలా గారు, శ్రీమదిత్యాది శ్రీమాన్ తిరుమల కృష్ణదేశికాచార్యులవారు, శ్రీ కల్లూరి భాస్కరం గారు నా యందలి దయతో వ్రాసిన అభిప్రాయవాక్యాలకు కృతజ్ఞుడనై వారి సహృదయతను అభిష్టుతింపగల తుల్యవచనికలు లేక – ఇంతకాలం సమాధానం వ్రాయక – మూకీభావం స్వీకరించి మనస్సులోనే వారికి వేవేల కైమోడ్పులను సమర్పించుకొన్నాను. ఏవేవో నైమిత్తికవికల్పాల వల్ల అప్పటి సమాధితోడి మనఆనుకూల్యం సిద్ధింపనందువల్ల వ్యాసాన్ని యథోద్దిష్టంగా పూర్తిచేయలేకపోయినందుకు వారికి, ‘ఈమాట’ పత్త్రికానిర్వాహకమండలికి నా క్షమార్పణను విన్నవించికొంటున్నాను.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
రామరసాయనము గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/24/2017 4:22 pm
“పరిమి శ్రీరామనాథ్ June 1, 2017 11:40 am – శ్రీ లైలా గారికి, ఈ చిత్రణ కి విశ్వనాథ వారి కల్పవృక్షం ఆధారము.”
Thank you.
విశ్వనాథ సత్యనారాయణ “నేను కల్పవృక్షంలో అచ్చంగా వాల్మీకినే అనుసరించాను” అంటారు. కానీ కొన్నిసార్లు అతిక్రమించాను అనీ అంటారు. వాల్మీకం తో విభేదించిన అట్టి ఒక సందర్భం ఇది కాబోలు.
విశ్వనాథ తను రాసిన రామాయణ బాలకాండలో, ధనుస్సు ప్రకరణంలో; బాల్య యౌవనాల సంధి (teenage) సమయంలో బాల బాలికల లో ఒకరి పట్ల ఒకరికి ఉండే సహజమైన కుతూహలం, శృంగార భావావిర్భావం, ప్రపంచంలో అన్ని ప్రాణులకూ అంతర్గతమైన మిధున కాంక్ష, అక్కడి రెండు మూడు పద్యాలలో చక్కగా చూపించాడు.
పన్నెండేళ్ల రాముడు సభలో విల్లు ఎత్తేముందే, మేడ పైన అలికిడి విని, అటు చూపు సారిస్తే, రామునికి పూర్ణ చంద్రుని వంటి సీత ముఖం కనిపించింది. ఆ పైన అతనికి బాహ్యస్పృహ లేదు. ఎప్పుడు హరుని విల్లు ఎత్తిందీ, నారి బిగించిందీ, పెట్టెలోంచి తీసిందీ, బాణం ఎక్కుపెట్టిందీ, అతనికి తెలియదు. అతని చూపు సీత ముఖం మీదే ఉండింది. విల్లుని కూడా తన చూపుకు అడ్డం రానీయడు. విల్లు ఫెళ్లున విరిగినాకే, ఆ ధ్వనికే రాముడికి పరిసరాలు తెలుస్తాయి. – అని విశ్వనాథ కవి వర్ణించినాడు.
Sure. I like that. My thoughts after reading:
1. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు శివుని విల్లు చూపించటానికే వారిని మిథిలకు తీసుకొస్తాడు. రామునికి శివుని విల్లు చూడాలనే ఉంది. విల్లు చూపించమని అడిగినప్పుడు, జనకుడు విల్లు ఎక్కు పెట్టినవాడికి సీతనిచ్చి వివాహం చేస్తాననటం రాముడు విన్నాడు కదా. ఆ రాత్రి విడిదికి తిరిగిపోయినప్పుడు అతని మనసంతా ఆ ఆలోచన ఉండదా? అతనికి కలవరం కలిగించదా? బాలుడు రాముడు శృంగార భావం అంకురించిన వాడే కాక, వివేకి కూడా అనిపించాడు.
Even though Rama is interested in the bow of Siva, as any sportsman does, it will be foolish to attempt the feat if he does not want to get married to Sita. If he does not like her, is there any point in competing? Just to show off his strength, why get stuck with a prize he does not want?
The fact Rama and Sita see each other, even if it is for an instant, is nice. Seeing Sita gives Rama the incentive to take the challenge. That Rama notices Sita’s interest in him, and he in turn is equally attracted, pleases the world that there is more than showing valor involved in stringing the bow of Siva. The world always loves Lovers.
శ్రీరామనాథ్ గారి పద్యం లోని ఊహలో – రాముడిని సీత తన ఆలోకనంతోనే ముందే గెల్చుకున్నది. ఆమె తనపై ఆసక్తి నేత్రాల ద్వారా ప్రదర్శించినందున, అతడు సభాసదులకోసం తన వీరత్వం చూపించి, సీతను గెలుచుకున్నాడు. ఆ సుందర దృశ్యాన్ని తాను చూస్తూ, అట్టి ఆనందరాముని ఇప్పటి ఈ కవి ధ్యానిస్తున్నాడు. How very nice!
With interest in sports, the following comment.
Sportsmen do want to show off their talents to entire audience. Often more to their fans in the audience. But sometimes, a single person in the audience may mean much more to a sportsman. It is said the Tennis player Jimmy Connors played so much better, when Chris Evert is in the audience. She was a rising young tennis star, and he a young player, was competing to rise in her eyes.
With interest in movies the following comment.
In the movie “A Good Year” (Based on Peter Mayle’s novel) there is a scene between two teenagers near the swimming pool in an Italian Vineyard home. The pretty young lady swims across the pool, to plant a kiss on the young hero, and says in his ear – “pardon my lips, they find pleasure in the most unusual places.” To me it is the best sensual scene of the movie. The thumping and heaving done in adult love scenes, did not gain them no.1 place, in my eyes.
Well, the readers of eemaata know already, I am a die-hard romance fan. And I love beautiful scenery, I love sport, so I love Ramayana, like I love the movie A Good Year.
2. హాస్య రసానికి ఉదాహరణంగా ఇచ్చిన శ్రీరామనాథ్ గారి 7 వ పద్యం లోని విషయం గురించి:
విశ్వనాథ తన ‘కల్పవృక్ష రహస్యములు’ పుస్తకం లో అనుకోటం; రాముడెప్పుడూ తన భార్యను జానకీ, వైదేహీ, మైథిలీ – ఇలా పిలుస్తాడే కాని ‘సీతా!’ అని పిలిచేవాడు కాడని. ఆమె బ్రహ్మర్షుల ఇంటి బిడ్డ అని రాముడు గౌరవిస్తాడు, అని ఆయన భావన.
మరి హాస్యానికైనా సీత జన్మ వృత్తాంతము రాముడు ఎత్తుతాడా? ఆమె జనకుడి కూతురు కాదనీ, ఎక్కడో దొరికితే తీసుకొచ్చి పెంచుకున్న పిల్ల అని ఆమెకు వ్యధ కలిగిస్తాడా? తన పద్యంలో, శ్రీరామనాథ్ గారు హాస్యానికి ఉదాహరణగా సీతారాముల పుట్టుకలే ఇస్తిరి. అలా ఒకరినొకరు వారి పుట్టుకల లోని unusualness/ aberrations ని గూర్చి దెప్పుకునే భార్యాభర్తలా సీతారాములు! అని విశ్వనాథ ధోరణిలో ఒక ఆలోచన కలిగింది.
ఆలోచించాక నాకైతే, బాగుందనుకోండి. ఎందుకంటే భార్యా భర్తలలో ఒకరికి నిక్కు, ఇంకొకరికి న్యూనత ఉంటే, అదెలాటి సంసారం? ఇద్దరూ సమాన ఫాయీగా ప్రవర్తించగలగాలి. ఎవరి లోనూ అంత ఘనమేమీ లేదని, ఇద్దరూ, తమను గురించి నవ్వుకోగలగాలి. కాదా!
SriRamanath, Thanks for giving the opportunity to read your poetry. Appreciate it. Have a nice summer!
Lyla
కోడ్ కూలీ గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
06/15/2017 3:34 am
కథ బాగుంది. అంతకంటే దీన్ని అనవసమైన విస్తరణలు లేకుండా సూటిగా చెప్పి ముగించటం ఇంకా బాగుంది. కాని కథలో కొంత వైరుథ్యం కనిపిస్తోంది. నోటిదురుసువల్ల ఉద్యోగం ఊడగొట్టుకున్న మనిషి ఆతరువాత ఏమీ మారలేదని సుస్పష్టంగానే కథలో కనిపిస్తోంది. కాని అంత తలబిరుసూ నోటిదురదా ఉన్న మనిషి ఒక ఉద్యోగంలోనుండి గెంటించుకొన్నాక ఎలాగ అమెరికాలో కుదురుకొని పైకి వచ్చిందని చెప్పటం ఆ పాత్రస్వభావానికి అస్సలు నప్పటం లేదు. అదొక చెప్పుకోదగ్గ లోపమేను.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి దే.రవి గారి అభిప్రాయం:
06/03/2017 5:28 am
కోయంబత్తూర్లో ఇలాగే వాడుతున్నాము.
తెలుగులో యాత్రాసాహిత్యం గురించి మోహన గారి అభిప్రాయం:
06/01/2017 3:47 pm
బావుంది. ఇంతవరకు ప్రచురించబడిన యాత్రా పుస్తకాల పట్టికను ఒక అనుబంధముగా ఇవ్వడానికి సాధ్యమవుతుందేమో?
తెలుగులో మొట్ట మొదట వ్రాయబడిన అసంపూర్ణ నవల కొక్కొండ వేంకటరత్నము పంతులుగారి “మహాశ్వేత”. పూర్తిగా ప్రచురించబడిన నవల నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టిగారి “శ్రీరంగరాజ చరిత్ర” (ఆధారము- గిడుగు సీతాపతి). కోరాడ రామచంద్రశాస్త్రిగారి “మంజరీ మధుకరీయము” తొలి నాటకము. కాని దీనిని ఎన్నో ఏండ్ల పిదప ప్రచురించినారు. మొట్టమొదట ప్రచురించబడిన నాటకము పంతులుగారి “నరకాసుర విజయము (లేక వ్యాయోగము)”. రాజశేఖర చరిత్ర, కన్యాశుల్కము వీటికి పిదప అని అనుకొంటాను.
విధేయుడు – మోహన
సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు గురించి desikachary గారి అభిప్రాయం:
05/29/2017 8:56 am
నేను ఉస్మానియాలో చదువుకునేటప్పుడు అసదృశవాఙ్మిశేఖరులు, త్రిభాషాపండితులు బ్రహ్మశ్రీ దివాకర్ల వేంకటావధానిగారు పాఠం చెప్పేవారు. వారు యశఃకాయులైన తర్వాత అట్టివారెక్కడను లేరే యను అసంతృప్తి నా మనస్సులో నొకమూల నెలకొని ఉండేది. కాని, మురళీధరరావుగారి వ్యాసపరంపరలను చూస్తున్నకొలది ఆ అసంతృప్తి క్రమక్రమంగా అపాకృత మగుచున్నది. శ్రీ మురళీధరరావుగా రీవ్యాసంలో చూపిన ఉపపత్తులకు మూలమైన నైకదేశస్థములైన ఇన్ని ముద్రితాముద్రితగ్రంథప్రతులను వారెట్లు సేకరించి చూచినారో నాకు అత్యాశ్చర్యకరముగా నున్నది. వివిధవిషయముల నిర్ధారణకు వారు చూపిన ఆధారముల పరంపరలు నాబోటి అజ్ఞానులకు కనువిప్పు కల్పించుటయే కాక, సాహితీరత్నాకరాన్వేషులగు ఇతరపరిశోధకులకు నౌకాదండములవంటివగు ననుటలో సందేహము లేదు. సుబంధుని ప్రభావము నన్నయశ్రీనాథాద్యనేకాంధ్రకవులపై నున్నట్లు తెలుపుట ఒక నూతనావిష్కృతి. ఉభయభాషాసాహితీపాండిత్యమున్న ఉత్తమపండితులకే ఇది సాధ్యమగును. అన్నిటికంటే ఈ ఆవిష్కరణము నా కత్యంత మనఃపరితుష్టికారకమైనది. ఇవి నేను పైపైన చదివి వ్రాసిన పంక్తులు. ఈ వ్యాసాన్ని ఇంకను ప్రగాఢంగా చదివి బాగుపడవలసిన అవసరం నాకున్నదని విన్నవించుకొనుచున్నాను.
సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
05/28/2017 9:41 am
I am so looking forward to the June issue of eemaata, and the next part of this essay.
మురళీధరరావుగారి ఇక్కడి రచనలకు ముందు నేను తెలుగు సాహిత్యం ఎలాటిది చదివాను, చదివినా అది ఎలా చదివాను అని నేను ఆలోచించుకుంటుంటాను. ఇప్పుడు మరోరకమైన సాహిత్యం చదువు మొదలయిందేమో. పోనీలే మొదలయ్యింది కదా అని సంతోషిస్తున్నాను.
ఈ వ్యాసం మొదటి భాగం నేను చాలాసార్లు చదివాను. చదివినప్పుడల్లా, వ్యాసాన్ని గురించి ఏదో ఒక అభిప్రాయం రాసుకుంటూనే ఉన్నా. నా ఆసక్తి, అభిప్రాయాలు నేను చదివే ఇతర పుస్తకాల వల్ల/పట్ల కూడా మారుతూ వచ్చాయి. ఉదాహరణకు రష్యన్ షార్ట్ స్టోరీ 150 సంవత్సరాల చరిత్ర చదువుతున్నప్పుడు – ఆఖ్యాయిక, కథ అన్న విషయం మీద, వాటి నిర్వచనాల మీద ఎక్కువ శ్రద్ధ కలిగింది. అందుకని మళ్లీ వచ్చి చదివాను.
I was learning the words – roman (novel), povest (tale), skazka (folk tale) rasskaz (short story), and their changing meanings, from Charles A. Moser (George Washington University,) who wrote a 24 page introductory essay – ‘Introduction: Pushkin and the Russian Short Story.’ He considers Alexander Pushkin’s year 1830 ‘Tales of Belkin,’ are the foundation for subsequent development of the genre of short story. He also indicates, Russian literature itself moved more towards ‘prose form’ from then on.
A partial quote of a 19th century critic, Vissarion Belinsky “for if there are ideas of time, there are also forms of time” grabbed me.
మురళీధరరావు గారు ఏం రాసారు ఈ వ్యాసంలో, ఆ విషయం ఇందులో ఉండొచ్చా, ఎందుకిన్ని విషయాలు ఒకచోట! అనేవి నా కొక సమస్య కాదు. ఏ రచన లోనూ నాకలాటి పట్టింపంత లేదు. It just does not bother me. Perhaps that is why I am a big fan of Milan Kundera. God bless him, M.K talks whatever he wants, breaks where ever he feels like. That’s perfectly fine with me. This essayist does not wander half as much as Kundera.
మురళీధర రావు గారి ఈ రచనలు కేవలం ఏదో ‘విషయానికి’ సంబంధించినవేనా? వారి భాష సంగతి ఏమిటి? ఆయన భాష, నాకు ప్రవేశం లేని ఒక మాయ భాష. ఐనా గాని, ‘ఏల్చూరి’ ని – అబ్బే! ఎవరికీ అర్థం కావటం లేదండీ. ఒక పది మందిని కనుక్కున్నా, వారికీ ఏం బోధ పడటం లేదట. అందరికీ అర్ధం అయేట్టు రాయండి – అని ఎవరైనా అన్నప్పడు నాకు మనస్తాపం కలుగుతుంది. ఈయన ఈ మాయ భాష రాయటం మానేస్తాడేమో, మేమంతా రాసే దిక్కూ దివాణం లేని భాషకు దిగిపోతాడేమో, దేవుడా! ఏమిటి దారి! అని నే చేతులు పిసుక్కుంటుంటాను. మరి, ఆయన భాష కోసం కూడా నేను చదువుతున్నా. చదవాలి. అర్థం చేసుకోగలగాలి. ఎన్నాళ్లకో కొన్నాళ్లకు. Hopefully.
కాని, గమనించుకుంటే, ఈ వ్యాసాల్లో (నా సాయంకాలం వ్యాహ్యాళి లాగానే,) మొదట్లో కన్నా తక్కువ సమయంలో ఎక్కువ దూరం నడవగలగుతున్నా. అంతగా రొప్పటంలేదు. ఆయాసపడటం లేదు. కొంచెం ఎక్కువ పరిసరాలు ఆనందిస్తున్నా. Sincerely, I am a better reader of this author than before.
ఈ రచయిత పాఠకులు ఏమీ తెలియనివారు అనుకోడు. అన్నీ తెలిసినవారు అనీ అనుకోడు. పాఠకులను బేరీజు వెయ్యటం ఈయన పని కాదు. ఏదో సెలెక్ట్ ఆడియన్స్ కోసం రాయడు. విశ్వనాథ లాగా, పాఠకుల మీద వ్యంగ్యాస్త్రాలు వెయ్యడు. పాఠకులూ, మీకన్నీ తెలుసు, ఇది మీకు చెప్పక్కర్లేదు అనడు. ఇక్కడ కాదు, ఈ విషయం మరెక్కడో చెపుతానని దాటవేయడు. ఎక్కడ వివరించితే సందిగ్ధం లేకుండా పాఠకుడు చదువుకోగలడో, అక్కడికక్కడే ఆ విషయ వివరణ జరుగుతుంది.
Elchuri explains sometimes a poem in great detail, breaking it down to word level. Sometimes opens up the meaning of the poetry, by putting it into context with other poets, others’ thoughts. Basic and advanced teaching is accomplished side by side. It is a very effective, intelligent teaching. His reader need not go down a long list of references at the end of the essay, either. All required material is integrated into the essay.
Pardon me for comparing this writing style, with a meticulous demonstrative dissection by an anatomy instructor, or vivisection by a skilled surgeon – wherein they lay open a nerve, or a vessel or a muscle which ever that particular lesson is supposed to lay bare, and display. I am partial to such clear studies.
Also bear with me, for bringing up the name of the multidimensional artist Salvador Dali, who gives us the stereoscopic vision as in the oil painting of “Dali’s hand drawing back the golden fleece in the form of a cloud, to show Gala the Dawn, Completely nude, very, very far away behind the sun.” It is not easy to give infinite depth to a drawing or writing.
ఉండాలి. ఏల్చూరి లానే, రచయితల్లోనే, రచయితలను Clarify చేసే వాళ్లుండాలి. Harold Bloom – Whitman, thru Emerson, Eliot thru Whitman and Tennyson, Dickenson thru Shakespeare, –ఎందరెందరి కవుల lineage లు, అమ్మా నాన్నల DNA తో సంబంధం ఇంత కూడా లేని, మరోవిధమైన వారసత్వాలు, మానసిక, మేధా బాంధవ్యాలు తెలుసుకోటంలో ఎంత సహాయం చేస్తాడు! బ్లూమ్ గాని వారి మాటలు విప్పి చెప్పకుంటే, ఆ రచయితలు ఆ రచనల్లో, ఏమంటున్నారో ఎందుకంటున్నారో, ఏమీ తెలియక, ట్రావెల్ గైడ్ లేని విదేశీ టూరిస్ట్ లాగా, ఎంత విజ్ఞానంతో వెళ్లానో అంతే సుజ్ఞానంతో మరలి వస్తాను గదా.
I will be so lost without good writers and critics! Luckily there are. Hence, Life is gorgeous. – Lyla.
[The second part of this essay will come in the July issue – Ed.]
రామరసాయనము గురించి తెలుగువాడు గారి అభిప్రాయం:
05/19/2017 7:29 am
ఇది అక్షరాలా నిజమండి. ఆ మధ్యన నేను కామెంటు పెడితే ఒకాయన అన్నారు “ఇలాంటి కామెంట్లకి సమాధానం చెప్పడం ఎందుకండీ, వాటి మొహం మీదే ‘నన్ను పట్టించుకోవద్దు’ అని రాసి ఉంటే?” ఆయనకి, ఆయన్ని కలిసిన, తెలిసిన వారికీ ధ్యాన భంగమైంది పాపం. ధ్యాన భంగం అయి ఏడిచినది ఒకరూ ఆయన కళ్ళూ ముక్కూ తుడిచేది మరొకరూ! డబ్బా కొట్టేవాళ్ళు “మా-త్ర-మే” కావాలనుకుంటే సరే. వేమూరి వారు ఓ సారి ఎక్కడో రాసినట్టు గుర్తు – నీ రాతల్ని చీల్చి చెండాడే వాడే నీ నిజమైన స్నేహితుడు అని వాళ్ళ గ్రాడ్యుయేట్ స్కూల్ ప్రొఫెసర్ గారు అన్నారుట. అవి వీళ్ళకి అఖ్ఖర్లేదు. ధ్యాన భంగం అయితే వారు మహా పురుషులు కనక విశ్వామిత్రుడిలా శపించనూ గలరు లేకపోతే వశిష్టుడిలా దిగమింగుకుని క్షమించనూ గలరు. లేకపోతే జాన్ గ్రిషాం రాసిన పెలికాన్ బ్రీఫ్ నవలకీ తెలుగులో మిస్సమ్మ సినిమాకీ పోలికలతో మరో ఖంఢకావ్యం రాసి సాహిత్యలోకం మీద వదలనూ గలరు. శెభాషు.
ఏది ఏమైనా మీరు నిర్భయంగా చెప్పినందుకు మిమ్మల్ని అభినందించవల్సిందే.
సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
05/18/2017 11:02 am
మాన్యమిత్రులు శ్రీ రవి గారికి
నమస్కారములతో,
వ్యాసాన్ని సవిమర్శంగా చదివి ఎంతో ఔదార్యంతో లేఖ వ్రాసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదృతి నిండిన మీ వాక్యాలు నాకెంతో ధైర్యాన్నిచ్చాయి.
మీరు పేర్కొనక మునుపు నేను An imperial history of India in a Sanskrit text ను చూడలేదు. ఇప్పుడు డౌన్ లోడ్ చేసికొన్నాను కాని, ఇంకా అధ్యయన చేయవలసి ఉన్నది. పైపైని చూస్తున్నప్పుడు ‘మంజుశ్రీమూలకల్పము’లో నేను వెతుకుతున్న మరొక సమాచారం కూడా లభ్యమై, ఎంతో సంతోషం కలిగింది. అందుకు కూడా మీకు హార్దిక ధన్యవాదాలు!
‘వాసవదత్తా కథ’లో “తత్ర కేచిత్ కలాఙ్కురా ఇవ విజితనగరమణ్డనా” అన్న ప్రస్తావన ఉన్నమాట నిజమే. శివరామ త్రిపాఠి తన వ్యాఖ్యలో దీనిని మూలదేవునికి అన్వయించి, “కర్ణీసుతో మూలదేవో మూలభద్రః కలాఙ్కురః” అని ఉన్న (పురుషోత్తమదేవుని) హారావళిని ప్రమాణీకరించాడు. ఇది నిమిత్తంగా సుబంధుని కాలనిర్ణయవిషయమై మీరు చేసిన సూచనను నేను తప్పక గుర్తుంచుకొంటాను.
ఈ మూలదేవుని గురించిన కొన్ని విశేషాలను ఈ వ్యాసంలో పేర్కొన్నాను.
“ఎక్కడ జూచినం జిలుకలు” అన్న దళాన్ని బట్టి చిలుక పలుకులు శ్రుతిమధురాలైనప్పటికీ ఉపాలంభనం కనుక కఠోరత ఆపాదింపబడి ఆ పలుకులు ములుకుల వంటివిగా ఆక్షేపతిరస్కృతాలైనాయని మూలానుసారితను ఊహించాను. తద్వ్యతిరిక్తమైన పక్షంలో చిలుకల సర్వాంతర్వర్తనీయతకు అన్యహేతువును నిరూపింపవలసి ఉంటుంది. కవినిబద్ధమైన కందర్పకేతుని ప్రౌఢోక్తి యందలి రోహిణీవల్లభాది స్మరణం అననురూపసంసర్గాత్మకం చేయబడి విరుద్ధకార్యోద్భావమైన ఇంద్రియక్వథనంగా పరిణమించటం వల్ల అర్థమూలకమైన అలంకారధ్వని ప్రతీయమానమని నా ఉద్దేశం. కాదు, మీరన్నట్లు అస్ఫుటవ్యంగ్యమని భావిస్తే – గాడ్పులకు ప్రాణభంజకత్వం, రోహిణీవల్లభునికి ఇంద్రియక్వథనస్వభావం ఇత్యాదిగా వాచ్య-వ్యంగ్యములు రెండింటికీ అభిన్నవాక్యగతహేతుమత్త్వం వల్ల తుల్యప్రాధాన్యాన్ని నిరూపింపవచ్చును.
ప్రవాహగతిని ఏకాంశంగా నిబద్ధమైన ఈ వ్యాసం మీ వంటి ఆత్మీయ సద్విమర్శకుల సుపరీక్షకు పాత్రమైనందున గ్రంథరూపాన్ని తాల్పక మునుపు దీనిని యథాయోగ్యంగా సవరించుకొనే సదవకాశం కలుగుతున్నది. అందుకు మీకు నా కైమోడ్పులు.
శూద్రకునిదని చెప్పబడుతున్న ‘వీణావాసవదత్తం’ అంతర్జాలంలో ఉన్నదేమో నాకు తెలియదు. దాని ఫొటోకాపీని త్వరలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వ్యాఖ్యలేవీ అచ్చుకాలేదనుకొంటాను.
అర్మిలి పెంపుతో,
ఏల్చూరి మురళీధరరావు
రామరసాయనము గురించి lyla yerneni గారి అభిప్రాయం:
05/16/2017 3:11 pm
హ. హ. తహ్! నమస్కారం.
You trumped Rama with Russell, Didn’t you!
Very fond of Russell’s books for general public – Marriage and Morals, why I am not a Christian, Religion and Science, etc.
The fact that I have four copies of “The conquest of Happiness” is a sure proof of my desperate need for Guru’s counsel on some sojourns away from home that I must have run to the nearest bookstore for a quick restorative.
Of course for mathematicians, it is always Nirvana, and all they need is a piece of chalk. Perhaps they don’t even need that. It was good to get a glimpse of Russell, in the movie ‘The man who knew infinity.’
About poetry “రామరసాయనము” -still struggling to understand. Almost there.
A few thoughts, before enlightenment occurs.
ఈ old style poetry కి రచయిత గాని , ఎడిటర్ గాని అర్థం విశదపర్చలేదు. పైగా ఒక్కో పద్యంలోని రసం పాఠకులను అర్థం చేసుకోమన్నారు. I think it is nice editors challenge readers to understand various hidden secrets in poetry. Certainly I like to stall my Alzheimer’s as long as possible.
అదీ కాక, సాహిత్యం చక్కగా అర్థం అయ్యేవారికి, ప్రతి సారీ అర్థాలిస్తే, అట్టి పాఠకులకు రసభంగమవుతుంది. చేయరాదు. పైగా, ప్రతిసారీ రచయితను ప్రశ్నించితే వారికి ధ్యానభంగమవుతుంది. అది మహాపరాధం. ససేమిరా చేయరాదు.
చూశారుగదా, నేను ఇక్కడ ప్రశ్నలు వేసిప్పుడు, పత్రిక మూలపురుషులు వచ్చి, రచయితలను వారి టైమ్ నాలాటి వారి మీద వేస్ట్ చేసుకోవద్దని చెప్పారు. రచయితల సమయం విలువైనదట! మరి నా సమయం? మరి కొందరు, ఆ రచయితలేదో తపస్సులో ఉన్నారనీ, వారు తలదించుకుని ఎత్తిన ఘంటం దించకుండా సాహిత్యం రాసేస్తుంటే నేనేదో వారి ధ్యానం భంగం చేసే . ..చలో జానే దో.
కాని, మళ్లీ ఈ రచయితలే దేవుడో! నా రచనలు ఎవరూ చదవటల్లేదు అని కుములుతుంటారు. వారికి మళ్లీ కళ్లూ ముక్కూ తుడిచి, ధైర్యం చెప్పటానికి కొందరొస్తారు. ఈ కొందరు రచయితలకు, బరాక్ ఒబామా లాగా వీరి legacy ఏదో భూమ్మీద వదిలేసి పోవాలనుంటుంది. వారు కారణ జన్ములనుకుంటారు. ఈ వేర్వేరు రచయితల మనోవైకల్యికామార్మికఛేదనభేదనాపేక్ష నాకెందుకు గాని, ఈ ‘రామరసాయనానికి’ వస్తే, ‘పివరే రామరసం’ అని ఎప్పుడూ తయారుగా ఉండే నేను, ప్రస్తుతానికి పద్యాలు అర్థం కానందున తన్మయం చెంది ఆంజనేయుడిలా గంతులెయ్యలేకపోతున్నా.
సాహిత్యం అర్ధ ప్రధానమైన మీడియమ్. సంగీతం ఐతే విన్న సౌండ్ కి మన ముందరి రెస్పాన్స్. భాష కూడా తెలిస్తే అప్పుడు దాని బాగు ఓగుల చర్చ. మనకు తెలియని భాషలో చెత్త రాసినా, విన్న మెలొడీకి మనం లోబడతాము. ఇతరులు కావాలంటే, మోసగించి బూతులు పాడించి నవ్వుకోవచ్చు. మనకు తెలిసిన భాష ఐతేనే, అందులో బూతు గాని, ఉచ్చారణ బాగులేదని కాని తెలిసేది. కాగితం మీద రాసి ఉన్న మాటలకు అర్థం ప్రధానం. అర్థం తెలియకపోతే చెప్పించుకుంటాము. సాహిత్యంలో అర్థాన్ని ignore చేసి, Form కి జేకొట్టే ప్రసక్తి లేదు. అంటే, పద్యం అర్థం తెలియకుండా, ఇది మంచి కంద పద్యము, ఇది చక్కని మత్తేభము అని అనే ప్రసక్తి లేదు.
నేను ఏ poetry groups లో లేను. కాని ఛందస్సు చర్చించుకునే వారు, ఒక పద్యం చదివి అందులో వస్తువు, రసం శృంగారమైతే, I feel horny, I feel like making love (not necessarily with the writer) అని ఒక్కమారూ అనకుండా, ఇందులో తతజజరభస గణాలకు నేను స్పందించి తతజజరభస లో రాస్తున్నా, అని భక్తి రస ప్రధానంగా రాస్తే , that blows my mind.
Is it humanly possible to ignore the meaning the language expresses, in whatever ‘Form’ it may be?
Lyla
సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
05/12/2017 11:27 pm
పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్కారములు. వ్యాసాన్ని ఆసాంతం చదివి, ఎంతో ఔదార్యంతో వ్రాసిన మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఒక్క చిన్నమాట: మహాకవులు తమ రచనలలో పూర్వులను అనుకరించిన సన్నివేశాలు విశ్వసాహిత్యమంతటా గోచరీభవించేవే. అది వారి కృతజ్ఞతకు, గౌరవభావానికి, వ్యుత్పన్నతకు, శీలితబహుకావ్యత్వానికి నిదర్శకమే గాని శక్తిలోపానికి ప్రదర్శకం కాదు. సభలలో విద్వత్సన్నిధిలో కావ్యపఠనవేళ “ఇది ఫలానా కవి శ్లోకానికి అనుసరణం” అనికూడా తప్పక పేర్కొనేవారనుకొంటాను. అందువల్లనే, అవతారికలోని పూర్వకవిప్రశంసలో తమకై వెలుగుబాటలను పరిచిన మహాత్ములను స్మరించటం జరిగేది. ఎవరి నుంచి మన మనోగతాన్ని మాటలుగా మార్చుకొనటం నేర్చుకొన్నామో, ఆ మహనీయుల ప్రభావం మనపై తప్పనిసరిగా ఉండితీరుతుంది కదా. పూర్వకవుల కవిత్వపు నీడల జాడలు తమ రచనలలో ఏ మాత్రం ప్రతిఫలింపకూడదని ప్రయత్నపూర్వకంగా అభ్యసించిన శ్రీ విశ్వనాథ వంటి మహాకవులే ఆ ప్రభావం నుంచి తప్పించుకొనలేకపోయారు.
సుబంధుడొక విశాలవటవృక్షం. ఆ నీడను ఆశ్రయింపని తెలుగు కవులు లేరు. ఆయన ఒక చల్లని ఊరబావి. అక్కడ ఊహాదాహార్తిని తీర్చుకొననివారు లేరు.
యుష్మన్నిరంతరాశీర్వచనకృతాభ్యుదయాభిలాషి,
ఏల్చూరి మురళీధరరావు
రామరసాయనము గురించి తః తః గారి అభిప్రాయం:
05/11/2017 12:04 am
“అందచందమన్న అంతలంతలు ప్రీతి
భోగమన్న నాకు భూరి వలపె;
తెలివితేటలన్న తీరనంతటి భ్రాంతి,
కాని, కరుణ కేను కరము మోడ్తు.”
Hats off Dr Yerneni : This stanza of yours ,a wonderful poem by itself,brings to my mind one of my very most favourite passages I ever read – the prologue of Bertrand Russell to his autobiography ,quoted here in appriciation of your ,let me say it again , wonderful poem !
“What I Have Lived For”
“Three passions, simple but overwhelmingly strong, have governed my life: the longing for love, the search for knowledge, and unbearable pity for the suffering of mankind. These passions, like great winds, have blown me hither and thither, in a wayward course, over a great ocean of anguish, reaching to the very verge of despair.
I have sought love, first, because it brings ecstasy – ecstasy so great that I would often have sacrificed all the rest of life for a few hours of this joy. I have sought it, next, because it relieves loneliness–that terrible loneliness in which one shivering consciousness looks over the rim of the world into the cold unfathomable lifeless abyss. I have sought it finally, because in the union of love I have seen, in a mystic miniature, the prefiguring vision of the heaven that saints and poets have imagined. This is what I sought, and though it might seem too good for human life, this is what–at last–I have found.
With equal passion I have sought knowledge. I have wished to understand the hearts of men. I have wished to know why the stars shine. And I have tried to apprehend the Pythagorean power by which number holds sway above the flux. A little of this, but not much, I have achieved.
Love and knowledge, so far as they were possible, led upward toward the heavens. But always pity brought me back to earth. Echoes of cries of pain reverberate in my heart. Children in famine, victims tortured by oppressors, helpless old people a burden to their sons, and the whole world of loneliness, poverty, and pain make a mockery of what human life should be. I long to alleviate this evil, but I cannot, and I too suffer.
This has been my life. I have found it worth living, and would gladly live it again if the chance were offered me.”
(I know this is a place is to write only on the poem,”రామరసాయనము” – my apologies to Sri Parimi )
నమస్కారాల తో
తః తః
రామరసాయనము గురించి lyla yerneni గారి అభిప్రాయం:
05/10/2017 3:02 pm
In response to above poetry, which is still not totally understood by me;
అందచందమన్న అంతలంతలు ప్రీతి
భోగమన్న నాకు భూరి వలపె;
తెలివితేటలన్న తీరనంతటి భ్రాంతి,
కాని, కరుణ కేను కరము మోడ్తు.
If you have the time, Read the following writing on రాముడు, who in my eyes is just a human being. Thanks.
*
While many events in Ramayana hold my interest, to me Ayodhya Kanda appears to be most dramatic.
It all hinges solely on one night, one night so powerful that changes the fate of an individual and thereby of several others’. In fact it could be that one dramatic night that set the tone to the entire epic and then the epic might have set a whole nation’s behavioral patterns for hundreds of years to come.
A seventeen year old Rama, the eldest son of a king is about to be the crown prince, which means he will be the future king of Ayodhya.
ఆ రాత్రి, తెల్లవారితే పట్టాభిషేకం. తండ్రి దశరథుడు – నాకు అశుభచిహ్నాలు చిహ్నాలు కనిపిస్తున్నాయి. నాకు ప్రాణాపాయం కలగొచ్చు. నేను బాగున్నప్పుడే నిన్ను యువరాజుగా చూడనియ్. – అని రాముడికి చెప్పి వసిష్ఠుడి ద్వారా సీతా రాములను ఆ రాత్రి ఉపవాసం చెయ్యమని నిర్దేశించుతాడు. నగరమంతా ఒక్క రాత్రిలో అలంకరించుకుని, జనులంతా ఎప్పుడు తెల్లవారుతుంది! ఎప్పుడు రామ పట్టాభిషేకం! అని ఎదురు చూస్తూ ఉంటారు. ఉత్సవాలకు కారణం కనుక్కున్నమంధర భగ్గున మండిపడి, కైకేయికి విషపు మాటలు చెప్పి మనసు విరుస్తుంది. రానున్న రామ పట్టాభిషేకం, ముందు శుభవార్తగా తీసుకుని మంధర మీదికి రత్నహారం విసిరిన కైక, మెల్లగా మంధర బోధనకు లొంగుతుంది. కోపగృహం చేరుతుంది. దశరధుడు కైకేయి మందిరానికి వెడతాడు. కైక అతనిని గుండె పగిలే వరాలడుగుతుంది.
ఒక్క క్షణంలో అంతా తారుమారు. రాజు కావలసిన రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చెయ్యవలసి రావటం. సుమంత్రుడు రాముడిని కైకేయి మందిరానికి తీసుకొని వస్తే దశరథుడు అతని వంకైనా చూడకుండా తలదించుకుని ఏడుస్తుంటే కైక రాముడు ఏం చెయ్యాలో చెపుతుంది.
ఎంతో విపులంగా వర్ణించబడిన ఈ ఘట్టం నాకిలా తోస్తుంది.
రాముడు అందరిచేతా ప్రేమించబడినవాడు. అతనికి ఆదరించబడటమే తెలుసు. పరుషపు మాటలు, దండన తెలిసినవాడు కాదు. అనుకోని కైక నిరాదరణ, స్వార్థం అతణ్ని గాయపరుస్తుంది. అతడు రాజ్యం కావాలనుకున్నవాడు కాదు. తలిదండ్రుల ఆనందం కోసం అతని విలువిద్యలు, చదువులు ప్రదర్శించి మెప్పించే చిన్నవాడతను. రాజకీయం మీద మోజు కలవాడు కాదు. వాత్సల్యానికి బద్ధుడు. తండ్రి నాకోసం నువ్వు రేపటికి రేపు యువరాజువు కావాలి అంటే సరే అన్నాడు. అది ఒక పెద్ద బరువు. ఎవరికి కావాలి ఆ వయసులో ఆ తగలాటం? తెల్లవారుతూనే మళ్లీ కైకేయి మందిరానికి రమ్మని తండ్రి పిలుపు. తీరా వెడితే, తల్లి కైకేయి- అబ్బే సింహాసనం కాదు, ఇప్పుడు నీకు నగర బహిష్కారం అంటే – ఇలాటి తల్లి తండ్రుల తలతిక్కల ఆలోచనలకు ఏ పిల్లవాని మనసు ముక్కలు కాదు?
Rama the favored son is repulsed by the sudden rejection by Kaika. He is repulsed by the fickleness of love. He is turned off by the sight of an old man who is controlled by a young wife. A man who could not even look his son in the face and tell him what happened. It is doubly hard for him to hear the insulting command -expulsion from the country- from Kaika instead of hearing it from his father. Kaika who says, she wants to use all the grand preparations done for his crowning, now for another son!
Rama all thru, speaks like a broken hearted youngster.
“Why are you sad father? Are you angry with me? Why would you not look at me? Have I done something wrong to displease you? Tell me what you want. I will do anything to please my father and mother.”
These are words of a broken hearted kid. What kind of a son will not be heartbroken if a parent turns against him and wishes him out of his sight and asks him to leave his house and not to return for fourteen years? He will simply do what is asked of him, out of deep hurt.
Rama then has to go to Kausalya and give her the shocking news. He then has to go tell his wife Sita who is preparing to be the future queen that he is no longer going to ascend the throne. Instead he is expelled from the country. He is quite embarrassed to give such humiliating news to his wife, who comes running to greet him as a future king. From prince to pauper in minutes. To shed all pomp and glory. To leave in shame and humiliation at the command of a step mother, to dwell in forests. Lakshmana who witnesses all, wants Ram to rebel and snatch the kingdom. But Rama won’t. He talks about Dharma, respecting his father’s command, his father’s obligation to keep his word. This and that moral and duty.
To me, all of it appears as a big show on part of Rama, who is really broken hearted by the totally unanticipated, sudden loss of affection, and horrid hostility from parents.
To me Ayodhya Kanda represents one of the great tragic life turning moments. That rejection of a parent, that broken heart of a child, that departure of Ram, Sita and Lakshman from Ayodhya – which in turn leads to the death of king Dasaradha and long miserable widowhood of repentant Kaika and other queens – is supreme pathos.
“ఎవరి మహా ప్రలోభము మంగళ తోరణములు తెగిపోయినవయ్యో!
ఆశామయ రాగాలాపనలే అంధకారమై పోయెనుగాదా! రఘురామా! రాఘవా!”
It is this young Rama, who had gripped my heart to begin with.
Lyla
P.s: The above excerpt is typed from my writing in Racchabanda – Yahoo groups dated Nov 7, 2006. These writings are done in RTS, as ground work for development of Telugu software, and to keep in touch with Telugu literature. Perhaps because of the mixed medium and upgrading of yahoo, a few writings are more unintelligible than before. Mission accomplished.
సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు గురించి గన్నవరపు నరసింహమూర్తి గారి అభిప్రాయం:
05/03/2017 11:09 pm
వాసవదత్త కధను సూక్ష్మముగా చిన్నతనములో చదివినా అది సుబంధ ప్రణీతమని నాకు తెలియదు. ఆధునిక విద్యాభ్యాసము వలన నా సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయము లోపభూయిష్ఠమే ! నేడు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వ్యాస పఠనము వలన సుబంధుని వివరాలు, వాసవదత్తాఖ్యాయిక పరిమళ విశేషాలు, నన్నయ శ్రీనాథ ప్రభృతుల సుబంధ కవితానుకరుణలు , వారి కవితా మాధుర్యములు తెలిసాయి. శ్రీ ఏల్చూరి వారి వ్యాసము చదివిన వెంటనే , పాండిత్యానికి అవధులు లేవని తెలియడమే కాక సాహిత్య మింత లోతయినదా, భావాంబర వీధి యింత విశాల మైనదా అని సంభ్రమము కలిగింది. శ్రీ మురళీధరరావు గారి పరిశోధన చాలా విస్తృతమైనది. వాసవదత్త ఆఖ్యాయికమా , కధా, కాక చంపూకావ్యమా అనే అంశము పై వివిధ కవివర్యులను, పరిశీలకులను, వ్యాఖ్యాతలను వారు విశేషముగా పేర్కొన్నారు. సుబంధుడి చారిత్రక వివరణ లుత్సాహముగా నున్నాయి.
వాసవదత్తను చదివి, నన్నయ శ్రీనాథుల భావానుసరణలు చూసి శ్రీ మురళీధరరావు గారు మందహాసమే , చేసారో, కొద్ది పర్యాయములు బిగ్గఱగానే నవ్వుకున్నారో వారికే తెలియాలి. చెప్పే విధానములో నూతనత్వము శోభిల్లు నపుడు , మధుర భావాల ననుకరించడములో తప్పు లేదనే తలుస్తాను. స్వచ్ఛానువాదములైనా, స్వేచ్ఛాను వాదాలైన శ్రీనాథుని అనుసరణలు, నన్నయ, తెనాలి రామకృష్ణుల ఆంధ్రీకరణలు విలక్షణతను పరిపోషించాయి. ప్రత్యక్షముగా సుబంధుని వాసవదత్తను కాని, విస్తృతముగా ఆంధ్రసాహిత్య పఠనమును చెయ్యలేని నావంటి వారికి శ్రీ మురళీధరరావుగారు ఆ కవితా మాధురిమలకు స్వీయ వాక్పటిమ, రచనా చాతుర్యములను చేర్చి చక్కని విందు సమగూర్చారు. వారి రచనలు, వ్యాసావళులు చదివే టప్పుడు చాలా క్రొత్త పదజాలము, విషయపరిజ్ఞానము కలుగుటచే నాలో విద్యార్థి భావన పెల్లుబుకుతుంది. వారికి నమోవాకములు!
వసంతతిలకము గురించి మోహన గారి అభిప్రాయం:
04/27/2017 7:00 pm
ఒక వైపు తెలుగు భాష అజంత భాష అని గర్వపడుతాము. కాని పదమును అజంతముగా ఉపయోగిస్తే అందులో తప్పేమి? వృత్తాలు అనేదానికంటె వృత్తములు అన్నప్పుడు విన సొంపుగా నుంటుంది అని నా భావన. దానికి/అందులకు కారణ మేమి 🙂 ఎందుకో పిల్లిని గుఱించిన ఒక nursery rhyme జ్ఞాపకమునకు వచ్చినది నిన్న.
విధేయుడు – మోహన
విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
04/15/2017 7:12 pm
ఈలాటి శబ్ద తరంగాలు ‘సెలెబ్రిటీ’ మోజు ఉన్నవారి కోసం. అంతే కాని ఇవి కవిత్వ ప్రియులను, సంగీత ప్రియులను రంజింప చేయలేవు.
ఉంటుంది, మనుషులకు కుతూహలం ఉంటుంది. అందమైన వర్ణ చిత్రాలను చూసినా, రచనలు చదివినా, ఆ కళాకారుడు ఎవరు, అతని ఫొటో చూడాలనో, స్వయంగా కలవాలనో ఉంటుంది. చూడొచ్చు, కలవొచ్చు. విశ్వనాథ సాహితీ ప్రియులకు కొందరికి ఆయన కంఠంలో ఆయన కవిత వినాలని ఉంటుంది. పాఠకుల విభిన్న మనస్తత్వాలను, ఇష్టాలను గ్రహించగలిగిన సంపాదకులు బహుశా ఆ కారణం చేత వీటికి ఈ పత్రికలో స్థానం ఇస్తూ ఉంటారు.
కాని, కవితా పఠనం బాగు ఓగుల దృష్యా చూస్తే, కిన్నెరసాని లోని ఊహకు, ఇక్కడ విశ్వనాథ కంఠం నుండి వెలువడే ధ్వనికి సమగ్ర సంయోగం లేదు. కవి -ప్రియురాలా! జవరాలా! అంటూ అస్పష్టపు కూనిరాగాలు తీస్తూ, కవిత చదువుతూ, ఆపుతూ, మధ్య మధ్యలో ఆ కిన్నెరసాని వాగు కథ చెపుతున్నారు. ఆయన మెదడులో ఉన్న ఆ దృశ్యం, ఆ ధ్వని, మన కళ్లకూ, చెవులకూ చేరే దృశ్యం, ధ్వనీ -ఒకటి కావు. మనలో చాలామందిమి, పాడుకుంటున్నప్పుడు జరిగేది ఇదే.
ఉదాహరణకు: నేను (లైలా)
“శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ
నీ శ్రీపాదమే శరణు ఊ…..”
అని పాడుతుంటే, నాకు మెదడులో అప్పటికే రికార్డ్ ఐపోయి ఉన్న నా కిష్టమైన శ్రీమతి సుబ్బులక్ష్మి పాట వినిపిస్తుంటుంది, నామటుకి నేను ఒక ఆనంద ప్రపంచంలో ఉంటాను. నా పాట వింటున్న పక్క వాళ్లు, ముందు నేలమీద మొదలై, అకస్మాత్తుగా ఆకాశాన్నంటి, మళ్లీ గబుక్కున పాతాళంలోకి పోయి, స్వరానికీ స్వరానికీ పొంతన లేని అపశృతి మయమైన కఠోర శబ్దాలు వింటుంటారు. సుబ్బులక్ష్మి పాటనే కాక, నా పాట కూడా రికార్డ్ చేసుకుని నేను వింటే తప్ప, ఆవిడ అత్యంత మధురంగా పాడిన ఆ అన్నమాచార్యుని కీర్తనకు నేను ఎంతదూరంలో ఉన్నానో తెలియదు.
అది తెలియక, ఇంకా అదే చాపల్యంతో;
“కమలాసతీ ముఖ కమల కమల హిత, కమల ప్రియే, కమలేక్షణా
కమలాసన హిత, గరుడగమన, శ్రీ కమల నాభ! నీ పదకమలమే శరణు ఊ….”
అని నే పాడేస్తుంటాను.
నా అదృష్టవశాత్తు, నే వినేది నా మెదడులో, సుబ్బులక్ష్మి పాటనే. సంగీతం లక్షణాలలో, దాని పుణ్యమా అని, అది ఒకటి.
అదే విశ్వనాథకు కూడా జరుగుతున్నది. ఆయన తన కాలంలో చాలా మధుర గాయకులను వినే ఉంటారు. తన కిన్నెరసాని కవితను ఈ సభలో అలా పాడుతున్నాను అనుకుంటున్నారు. వాస్తవం అది కాదు. ఆ పఠనం అంత గొప్పగా లేదు.
ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను. ఎప్పుడో ఒక సభలో ఆయనకు కవిత చదివే అవకాశమిచ్చారు. అప్పటి శ్రోతలు విన్నారు. దాని ఆవశ్యకత అంతటితో తీరిపోయింది. ఫేమస్ ఐన వాళ్ల ఒకప్పటి మాటలు పాటలు ఎట్లా ఉన్నాగాని కలెక్టబుల్స్ అనుకుని, ఆ route లో, నాస్టాల్జియా కలెక్షన్గా, ఇలా ఇప్పటి పత్రికలో వచ్చి చేరతాయి, కొన్ని గరగరల, అపశబ్దాల ఆడియోలు.
కళ మీద ఆసక్తి ఎక్కువ, వ్యక్తి మీద drooling తక్కువ ఉంటే, కిన్నెరసాని ఆకస్మిక కోపం, దు:ఖం, ఆమె నీరవటం, భర్త బండవటం, సముద్రుడు ఆమెకోసమై ఎగసిపడటం, ఆమె కళవళపడి గోదావరిలో లయించటం – ఈ గాథను ఇప్పటి గాన గంధర్వులతో పాడించి, లేదా మంచి వాయిద్యకారులతో సింఫొనీ మ్రోగింపచేయిద్దామని వారిని నియోగించి, ఆ కొత్త రికార్డింగ్ బాగుంటే విడుదల చెయ్యొచ్చు.
లేదూ, విశ్వనాథ కిన్నెరసాని దాని దోవన అది చదువుకుని, అప్పుడో మరోసారో, Edward Greg- Solveig’s song విన్నా. Svetlana – Moldau విన్నా, సుఖం ఉంది. ఆ సంగీత నదీ ప్రవాహాల చలనాలకి హృదయం కరిగి పోతుంది.
చక్కని శబ్దానికి, ఎక్కడిదైతేనేం మంచి శ్రోతగా మారితే చాలదా?
Lyla
నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి lyla yerneni గారి అభిప్రాయం:
04/15/2017 2:59 pm
“వెన్నెలలో చంద్రకాంతశిల ద్రవిస్తున్నట్లుగా కనబడటం అటువంటి లోకవిరుద్ధమైన కవిసమయం కాదు. ఆనుభవికమైన దృగ్విషయమే.”
చెప్పింది అర్ధమయింది.
ఐనా, నాకైతే ఈ వర్ణన కవి సమయమే అనిపిస్తుంది. చంద్రకాంతికి ఏ రాయీ కరిగి ప్రవహించదు కదా. Crystallographers, geologists ఉన్నారు పాఠకులలో – వారు మనకు ఇందలి నిజానిజాలు చెప్పగలరేమో. ఈ క్రింది పద్యము చాలా అందమైన కవి సమయము కాదా? ఇది ప్రకృతి సహజమా?
వసుచరిత్రము ద్వితీయాశ్వాసము; పద్యము 21
సీ. రేలెల్ల నమృతమరీచి నంటున నంట గరగి నిర్మలపయోఝరుల దొరగి
బలువిడి పెనులోయ బడిన క్రొన్నెలరాల చఱులలో నిరుగడ దఱచు మెఱచు..
అలాగే -కోయిల పంచమ స్వనంలో పాడుతుంది అనటం కవి సమయమే. కోయిల కూత – భారత కోకిల లతా మంగేష్కర్ कुहू कुहू बोले कोयलिया ( కుహూ కుహూ బోలే కోయలియా) అని పాడింది. అది అమృత వర్షమే. అందులో తడిసి తనిసినారెందరో. ఐనా, కు హూ లో – ‘కు’ కింది స్థాయిలో ఉంటే ‘హూ’ దాని కన్నా రెండు మెట్లో ఏమో పై స్థాయిలో పాడతారు లతా, రఫీ. నిజం కోయిల అలా పలకదు. కూహ్ కూహ్ అంటుంది. పశ్చిమ కోకిల ఐతే, ‘కుకూ కుకూ కుకూ’ లో మొదటి హ్రస్వ స్వరం పై మెట్టు, రెండవ దీర్ఘ స్వరం దానికన్నా దిగువన పలికిస్తుంది. ఎంత సేపూ రెండు స్వరాలు వరసొరసనే పలికిస్తుంది. ఈ రెండు స్వరాలే కోయిల పాట. దానికి కవులు దుంపలు తెంపలు చేసుకుని కోకిల మీద, కోకిల అన్న మాటను వాడుతూనూ వందల వందల గీతాలు రాశారు. కొంతమంది అదృష్టం అది. లోకంలో వారికి ప్రచారకులు ఉంటారు. కోకిలకు అంత ప్రతిభ లేకున్నా కాని, చాలా సమర్ధులైన ప్రచారకులు ఉన్నారు.
A segment (from Saint-Saens “The Carnival of Animals”) called ‘The cuckoo in the depths of woods’ is worth listening. It is easily found on the net. For this segment Roger Moore gives a beautiful narration poking fun at cuckoo –
“….
And so without a proper song
He just sings cuckoo all day long
He is not what you would call a star
With such a basic repertoire
And yet that simple two word phrase
Casts such a spell on summer days…”
There is more of these words. I don’t know whose charming words these are. I don’t think it is Ogden Nash’s poetry. The back drop of piano chords in the music recital is soothing. The sounds of cuckoo D & lower B-flat are played on clarinet. The clarinetist is placed somewhere outside the orchestra. The cuckoo sounds surprise and then on are eagerly anticipated both by musicians and listeners alike.
The whole composition of Camille Saint –Saens is marvelous and is an example of self-deprecating humor of a musician/s. The musician did not dare release this light hearted music of his, in his lifetime, for the fear of being considered a frivolous artist by his contemporaries.
(Dear Readers! By now you noticed I have not digressed one bit, but am only elaborating on relevant themes. i.e., the oppression of artists by fellow contemporary artists. And కవి సమయములు. Mine is never an erratic, all over the place writing. It is always under control delivery. Some contemporaries just can’t stand my scientific approaches and would rather read gossip as theses. )
Anyways, another favorite is Robert Schumann’s ‘Cuckoo in hiding.’ In this piano piece, he uses a combination of notes and chords in the left and right hands to produce the cuckoo sounds. Even though considered as a beginners’ piece, by the teachers, perhaps adults are more charmed by this composition than kids. I love it. Sure there is a G (పంచమము) somewhere in the cuckoo sounds, but that is not the only note he used.
Surprise. Surprise. I am hearing an anxiety inducing grating, two note sound now, in the airport as our boarding passes are being scanned. Cuckoo. Cuckoo. Got to go board the plane.
So Long. Happy Easter!
Lyla
విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:
04/14/2017 10:24 am
సురేష్ గారు,
నాకు నారాయణరావుగారి పరిశోధనల గురించి తెలియదు. నేనెప్పుడూ చదవలేదు. ఆయన ప్రతిభావ్యుత్పత్తుల మీద అనుమానం కాని, ఆయనకి వి.స. మీద అభిప్రాయాలేమిటన్నది కాని ఇక్కడ చర్చనీయాంశం కాదు. ‘ఆంగ్ల పాఠకుడికి ఏమి అందుతోంది ఇది చదివితే’ అన్నదే నేను చూస్తున్నది.
కాని, రెండు నవలల అనువాదం ముందు, రచయితని పరిచయం చేస్తూ, ఆయన వ్రాసినది కొంత అటూ ఇటూ పోయింది.
కవి, రచయిత అయిన వి.స ఏమిటో చెప్పడంకన్న మిగతా విషయాలు ఎక్కువ చెప్పారు. నేనే ఆంగ్లపాఠకుణ్ణయితే “ఈ సోది ఏమిట్రా. అసలీ రచయిత వి.స. ఎవరు? ఏమి రాసారు? కథాశిల్పాన్ని ఎలా పోషించారు? అసలు ఈ నవల ఎందుకు రాయబడింది? ” అన్నదే ఆలోచిస్తాను. నాకు శ్రీశ్రీ ఏమన్నాడు, జరుక్ ఏమన్నాడు అన్నది అవసరంలేదు. అసలు వి.స. యే ఎవరో తెలియదు. మిగిలినవాళ్ళంతా అప్రస్తుతం. ఉదాహరణకి “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు” తీసుకుంటే – ‘భాషల నిర్మాణంలో ఉన్న తేడాలు, తిక్కనగారి మనస్తత్వం, విష్ణుశర్మ చాకచక్యం, వాళ్ళు రచించిన గ్రంథాల ప్రభావం వాళ్ళ ప్రవర్తన తీరుతెన్నుల మీద ఎలా పడింది? తిక్కన గొప్పతనం’ … ఇలాంటివి ధ్యేయంగా వ్రాసిన నవల. (ఇంకా నాకుతెలియనివి చాలా ఉంటాయి). ఈ విషయాలు వె.నా.రా. ఆంగ్లపాఠకుడికి ముందుగా తెలియజెప్పాలి. అప్పుడే ఆ అనువాదితనవలలో ఒక అర్ధం పరమార్ధం చూస్తాడు పాఠకుడు. ఈ దిశగా వె.నా.రా ఏమీ చేసినట్టనిపించలేదు. మూడువందల పంక్తుల ఉపోద్ఘాతంలో “కట్టే – కొట్టె-తెచ్చె” అని మూడు ముక్కల్లో కథ రాసారు. ఇలాంటి అనువాదం చెయ్యడం రెండు సంస్కృతులకి వారధి కట్టడం. అందువల్ల పాఠకులకి మంచి పరిచయం కావాలి. ఊరికే “బోధకుడికీ విద్యార్థులకీ మధ్యన సంభాషణలు ఉల్లాసంగా నడుస్తాయి. ” అని చెపితే అనువాదం చదివినవాడికి ఉల్లాసం కలుగుతుందా? నాలాంటివాడు అనకాపల్లిలో కూర్చుని “Shakespearean Comedies” చదివినట్టుంటుంది.
ఆంగ్లపాఠకుడికి కావలసిన దినుసులకన్న, తెలుగు పాఠకులకి కావలసిన మసాలా ఎక్కువ కుమ్మారు వె.నా.రా. అని నాకు అనిపించింది. అది ఎంతవరకూ నిజమో ఆంగ్లపాఠకులే చెప్పాలి.
భాస్కర్
మనోరమ గురించి Gorusu గారి అభిప్రాయం:
04/07/2017 5:05 am
భాస్కరం గారూ , ధన్యవాదాలు.
మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. వాచికంలో సినిమా, రేడియో ఎప్పుడూ ఉత్తర దక్షిణాలే. అయితే మహానటి సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య గార్లు సైతం రేడియోల్లొ నటించారని లోకానికి చెప్పడానికే ఈ ప్రసారం.
సినిమా, రేడియో – ఈ రెండిటికీ మాడ్యులేషన్ లో కుదరదు. అంతెందుకూ రేడియోలో శారదా శ్రీనివాసన్ గారు ఒక హిమశిఖరం కదా – ఆమె “బంగారు కలలు” చిత్రం లో వహిదా రెహెమాన్ గారికి, “తోడు” (ఓల్గా గారి కథ) చిత్రంలో నటి గీత గారికీ డబ్బింగ్ చెప్పారు. అంతగా నప్పలేదని కొందరి అభిప్రాయం.
అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా శారద గారితో కలిసి “పరితాపం” అనే నాటకం లో నటించారు. పి.వి. నరసింహారావు గారికి శారద గారి వాచికం అంటే చాలా ఇష్టం. రంగస్థల నటుల పద్యాల ముందు ఘంటసాల గారి పద్యాలు తేలిపోయినట్టు అంపించడం సబబే. మీరు ఆన్నట్టు ఎవరి శిక్షణ వాళ్ళదే.
మీ స్పందనకు మారోమారు ధన్యవాదాలు.
మనోరమ గురించి kalluri bhaskaram గారి అభిప్రాయం:
04/05/2017 10:22 pm
గొరుసు జగదీశ్వరరెడ్డిగారూ……
అపురూపమైన రేడియో నాటికను అందించారు. మీకూ, ఈ మాట వారికీ కూడా అభినందనలు.
వింటుంటే నాకు అనిపించింది, రేడియో వాచికానికి, సినీ నటుల వాచికం నూటికి నూరుపాళ్లు నప్పలేదేమో నని. ఎంతైనా రేడియో, సినిమా వేర్వేరు మాధ్యమాలు కదా! ఎవరి శిక్షణ వాళ్ళదే.
పీసపాటి నరసింహమూర్తి, రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయరాజు వంటి రంగస్థల నటులు పాడిన రాయబారం పద్యాలు, ఘంటసాల తదితరులు సినిమాల్లో పాడిన రాయబారం పద్యాల మధ్య కూడా నాకు ఇలాంటి తేడాయే కనిపించింది. రంగస్థల నటుల పద్యాల ముందు ఘంటసాల పద్యాలు కూడా తేలిపోయినట్టు అనిపించింది. మళ్ళీ ఇక్కడా పైన చెప్పిన తేడాయే. పద్య నాటకాలు, సినిమా వేర్వేరు మాధ్యమాలు. ఏ మాధ్యమం గొప్ప దానిదే నని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.
ఏమో, నా ఇంప్రెషన్ తప్పైనా కావచ్చు.
నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
04/05/2017 10:04 pm
పద్యాన్ని అభినవంగా చదివినప్పుడు తోచిన భావం ఇది: ఆమని వేళ క్షితిపయి మోడువారిన వృక్షాలను చిగురింపజేయటంతోపాటు –
వసంతుఁడు దా రసోపగుంభిత పద వాసనల్ నెఱపన్ – వసంతుడు, తాన్ (తానై స్వయంగా పూనుకొని), రస (జలములచే) ఉపగుంభిత (పూర్ణములైన) పదముల నుండి (స్థానముల నుండి) = నదీ జలాశయాల నుంచి, వాసనల్ = పరిమళాలను, నెఱపన్ = వ్యాపింపజేయగా – అని ఒక అర్థం;
వసంతుఁ డుదార సోపగుంభిత పద వాసనల్ నెఱపన్ – వసంతుడు, ఉదార = విరివిగా, సా + ఉపగుంభిత = ఆ రసము అను శబ్దము ‘సా’ అను ముఖవర్ణముచే కూర్పబడినప్పటిదైన, పద = సారసము అను పదముయొక్క (పద్మముల యొక్క), వాసనల్ = సుగంధములను, నెఱపన్ = వ్యాపింపజేయగా – అని ఇంకొక అర్థం.
చంద్రుడు = చందమామ, మెచ్చక = సారసవైరి కాబట్టి ఆ పద్మగంధవ్యాపనకార్యాన్ని శ్లాఘింపలేకపోయాడు.
వసుచరిత్రలో ‘సారసలోచనలు’ రసభంగమై ‘సాలోచనలు’ అయినట్లే, విజయవిలాసంలో సోపగుంభితమైన రసము ‘సారసము’ అయింది.
కవనపరంగా వసంతుని రచనలో ఉదారత (శబ్దార్థముల పరస్పర ధ్వనన వ్యాపారము, వికటత్వము అనే కావ్యబంధం), స+ఉపగుంభిత+పద = పదగుంభనము అనే వాసనలు (శబ్దవృత్తులు) విలసిల్లాయి. ఇవి రెండూ కావ్యప్రౌఢికి అనువర్తించే అంశాలు. చంద్రుడు అంతర్గతమైన ఆ ప్రౌఢిని మెచ్చక ప్రసాదగుణము, సౌకుమార్యము అనే గుణాలను అభిమానించాడు.
జాగ్రత్తగా చూస్తే – చంద్రుని ప్రసన్నతా, సౌకుమార్యఫలాలు పైకి “కనబడేవే” కాని, కఠినమైన చంద్రకాంత శిల నిజంగా కరగటం జరగలేదు. పైగా, ఆ చంద్రుని యొక్క విలాసం వసంతకాలికమే గాని స్వతంత్రం కాదు. వసంతుని ఔదార్యం ముందు చంద్రుని శ్లాఘావిహీనత వెలవెలపోవటం సహజమే.
శోభాయమానమైన వసంతవర్ణనలో క్షితి (పృథివి), రసము (ఆపస్సు), గంధవ్యాపనము (వాయువు), చంద్రజ్యోత్స్న (తేజస్సు), మిన్ను (ఆకాశము) అన్న పంచభూతముల ప్రసక్తి కవ్యుద్దేశమే.
సమకాలం వారు మెచ్చుకొనకపోయినా, కాలాంతరంలో వారివారి గుణావగుణాల నిగ్గుతేరి సహృదయసదస్సులో గౌరవపాత్రత సిద్ధిస్తుంది. వట్టిమ్రాకులను చిగురింపజేసిన వసంతుడు చెరకువింటినీ, సారసవైరి తనకు నచ్చిన కలువబాణాన్నీ బహూకరించి మన్మథుని యింట ఇద్దరూ మన్ననలను పొందారు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
04/05/2017 1:28 pm
ఈ పద్యంలోని భావమూ సారమూ కూడా సమకాలపు సాహితీవేత్తల మధ్యనుండే స్పర్థ గురించేనన్నది స్పష్టమే. అయితే ఆ చెప్పడం వాచ్యంగా కాకుండా ప్రస్తావనగా చేప్పబడిందన్నది గమనించాల్సిన అంశం. అందుకే అది కవిత్వం అయింది!
వేదంవారి వ్యాఖ్యని ప్రస్తావించి వేలూరిగారి కోరికని తీర్చినందుకు ఏల్చూరిగారికి ధన్యవాదాలు! వేదంవారి వ్యాఖ్యలో “రసోపగుంభిత పదవాసనల్” అన్నదానికిచ్చిన అదనపు అర్థం, “కాళ్ళకు సిద్ధరసముఁ బూసికొని త్రొక్కడం”, నాకు పెద్దగా నచ్చలేదు. అది ఊహని మరీ ఎక్కువ పొడిగించినట్టు అనిపించింది. అందుకే నేను దాన్ని ప్రస్తావించ లేదు.
వసంతుని చేతను చంద్రుడు మెచ్చకపోవడానికి స్పర్థ తప్ప వేరే కారణం ఎందుకు? అకారణంగా స్పర్థబూనడాన్ని గురించే కదా కవి వాపోతున్నది! ఇక్కడ కవి వసంతుని కార్యాన్ని తక్కువచేసి చెప్పాడని వేదంవారు అభిప్రాయపడ్డారు. వసంతుని చేతకన్నా చంద్రుని కార్యమే గొప్పదని కవి భావిస్తే చివరి వాపోవడం సబబు కాదు కదా, అంచేత అలాంటిదేమీ లేదని తాపీవారు అన్నారు.
ఇద్దరి అభిప్రాయాలూ సమంజసంగానే ఉన్నాయి! వసంతుని తక్కువ చేయడం అనేది పద్యంలో స్పష్టంగా తెలుస్తోంది. కానీ అలా అనుకుంటే చివర వాపోవడం సరికాదు. ఇందుకు నా అన్వయం ఏమిటంటే – పద్యంలో వసంతుని చులకన చేస్తున్న గొంతు, కవిది కాదు చంద్రునిది – అని. సమకాలమువారు ఏ రీతిలో మెచ్చరో మాత్రమే అందులో ధ్వనిస్తోంది తప్ప, ఇద్దరి రచనల విషయమై కవి ఎవరి పక్షమూ తీసుకోలేదని నా అభిప్రాయం. ఇందులో ఎవరి రచన గొప్పదన్న అంశం యిక్కడ అవసరమే లేదు. ఒకరిని చూసి మరొకరు స్పర్థ పూనడమన్నదే ఇక్కడ చెపుతున్న విషయం.
ఈ పద్యాన్ని మరోసారి నెమరు వేస్తూంటే, మరొక సూక్షమైన అంశం కనిపించింది. ఇది భాషలోని వాక్య నిర్మాణానికి సంబంధించిన అంశం. ఈ రెండు వాక్యాలనూ గమనించండి:
అంతటా చికట్లు ముసిరేట్టు ఆకాశంలో మేఘాలు కమ్ముకొన్నాయి.
ఆకాశంలో మేఘాలు కమ్ముకొని అంతటా చీకట్లు ముసురుకొన్నాయి.
మొదటి వాక్యంలో మేఘాలు కమ్ముకోడం అనేది ప్రధానం (వాక్యం దానితో ముగుస్తోంది కాబట్టి), దాని ఫలితమైన చీకట్లు ముసరడం కాదు. కాని రెండో వాక్యంలో చీకట్లు ముసురుకోడం ప్రధానం.
వాక్యనిర్మాణంలోని ఈ ఒడుపు పట్టుకొని పద్యంలో చక్కగా సహజంగా కూర్చాడు చేమకూర. వసంతుని కార్యం గురించి చెపుతున్నప్పుడు ఫలితాన్ని ముందు చెప్పి, తర్వాత ప్రయతాన్ని చెప్పాడు. దానివల్ల చేసిన ప్రయత్నం ప్రధానమయింది (ఎక్కువగా చూపబడింది). చంద్రుని విషయంలో ప్రయత్నం ముందు చెప్పి, ఫలితం తర్వాత చెప్పబడింది. అంచేత ఫలితం ప్రధానమై, అందులోని ఆధిక్యం సహజంగా పాఠకులకి స్ఫురిస్తోంది. ఇన్ని రకాలుగా చంద్రునిది పై చేయిగా చూపబడినా, అది సమకాలము వారిని మెచ్చని చంద్రుని దృష్టినే సూచిస్తుంది తప్ప, కవి స్వంత అభిప్రాయం/నిర్ణయం కాదని నా అభిప్రాయం.
వేలూరి గారు,
కాళిదాసు వసంత వర్ణన గురించి – కంగారేం లేదు, ఇంకా బోలెడన్ని వసంతాలు మిగిలున్నాయి! ఎప్పుడో మరో వసంతానికి ముచ్చటించుకోవచ్చు 🙂
నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
04/04/2017 11:44 pm
శ్రీ కామేశ్వరరావు గారు అద్యతన వసంతోత్సవ స్మరణోత్సవంగా వెలుగులోకి తెచ్చి వివరించిన ఈ విజయవిలాస పద్యాన్ని చాలా రోజుల తర్వాత చదువుతున్నప్పుడు ఇంతకు మునుపెన్నడూ కలుగని సందేహాలు కలిగి, మళ్ళీ ఒకసారి 1911 నాటి వేదము వేంకటరాయశాస్త్రిగారి వ్యాఖ్యను, 1968లో అచ్చయిన తాపీ ధర్మారావుగారి వ్యాఖ్యను బయటికి తీసి సాకల్యంగా చదువుకొన్నాను.
క్షితిపయిన్ = భూమిమీఁద, వట్టిమ్రాఁకులున్ = కేవలంపు మ్రోడులు సయితము (రసజ్ఞత బొత్తిగా లేనివారు సయితము అని కవనపరము), చిగిర్పన్ = చిగిరించునట్లు (ఆనందించునట్లు అని క.ప.), వసంతుఁడు = ఆమని, తాను, రస ఉపగుంభిత పద వాసనల్ – పాలతో నిండిన (ఆకు పూవు కాఁడ మొద లగు) వస్తువులయొక్క పరిమళములను, – (రస = పాదలేపముతో – ఉపగుంభిత = పూయబడిన, పద – చరణములయొక్క, వాసనల్ = తాఁకులన్ అనియు) (శృంగారాది రసములతో నిండిన శబ్దములయొక్క భావములను అని క.ప.) నెఱపన్ = విస్తరింపఁగా, మెచ్చక, చంద్రుడు, మిన్నునన్ = ఆకాశమున, ప్రసన్నతయున్ = అనుగ్రహమును (విమలత్వము ననియు), – సౌకుమార్యమున్ = శ్రమపడనిమియును (కోమలత్వము ననియు) (ప్రసాద సౌకుమార్యము లనెడు కావ్యగుణములు), కనంబడన్ = స్ఫుటమగునట్లుగా, ఱాల్ కరఁగంగఁ జేసెన్ – (చంద్రకాంత) శిలలను = కరఁగించెను (వసంతుడు రంజించినవారికన్న నరసికు లగువారిని రంజింపఁజేసెను అని క.ప.) – అనఁగా – వసంతుఁడు భూమిలో కాళ్ళకు సిద్ధరసముఁ బూసికొని త్రొక్కి, కష్టముచేత భూమియందు వట్టిచెట్లు చిగిర్చునట్లు చేయఁగా, అదెంత లోనిదని చంద్రుడు శ్రమ లేకయే అనుగ్రహముచేతనే ఆకాశమునందుండి రాలు కరఁగునట్లుగాఁ జేసెనని అర్థము.
– అని వేదము వారి వివరణ. ధర్మారావు గారు దీనిని పూర్తిగా అనుసరింపలేదు.
మొత్తం మీద ప్రకృతమైన ఆమని వర్ణన, కవిత్వపరమైన తారతమ్యవర్ణన – రెండూ కవి దృష్టిలో ఉన్నాయన్నది స్పష్టం. వేంకటకవిని కవిత్వేతరకారణాల వల్ల ఎవరో, ఎందుకో నిరాదరించినందువల్ల బాధపడి ఈ పద్యాన్నిక్కడ సందర్భస్థగితంగా నివేశింపజేశాడని జనశ్రుతిలో ఉన్న కథ నిజమే అయివుంటుంది. అయితే, వసంతుని చేతను చంద్రుడు ఎందుకు మెచ్చలేదో వ్యాఖ్యాతలు వివరింపలేదు. మాత్సర్యమో, కీర్తికాంక్షో అందుకు కారణమై ఉండదు. “వసంతుడు ఎండిన మోడు చిగురించేట్లు కవిత్వం చెప్పాడు. చంద్రుడు దాన్ని మెచ్చక రాళ్ళు కరిగేట్లుగా కవిత్వం చెప్పాడు. ఎంత బాగా చెప్పినా సమకాలం వాళ్ళు మెచ్చుకోరు కదా!” అన్నప్పుడు – ఎవరిని విమర్శిస్తున్నట్లు? సండర్భాన్ని బట్టి కవియొక్క సానుభూతి వసంతుని మీదనే అన్నది స్పష్టం. వసంతుని చంద్రుడెందుకు మెచ్చుకోలేదు? అని పాఠకులు అడిగితే – చంద్రుడెందుకు మెచ్చుకోలేదో కల్పనలో సమాధానం తప్పక చెప్పబడాలి. చంద్రుని కవిత్వానికంటె తన కవిత్వమే మేలని వసంతుడు కూడా వాదిస్తే, దొందూదొందే కాబట్టి, “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అన్న అర్ధాంతరన్యాసం ఉభయతారకంగా ఉంటుంది. కాని, అట్లా జరగలేదు. వసంతుని మెచ్చుకోని చంద్రుని ప్రవర్తన మాత్రమే ఇక్కడ విమర్శకు గురైంది. వసంతుని చేతలో ఏదో లోపం ఉన్నందువల్ల చంద్రుడు వసంతుణ్ణి మెచ్చుకోకపోవటం జరిగి, చంద్రుని రచన నిజంగా వసంతుని రచనకంటె మేలుగా ఉన్నట్లయితే – ఆ గుణోత్కర్షను చూసిన వేంకటకవి “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అని బాధపడటం భావ్యం కాదు. తిరస్కృతుడైన వసంతుని రచన మేలైనదీ, తిరస్కరించిన చంద్రుని రచన దానితో సరితూగనిదీ కావటం వల్లనే వేంకటకవికి తన మనసులోని మాటను వెల్లడించే సదవకాశం ఏర్పడింది.
వసంత – చంద్రులిద్దరూ మన్మథుని ప్రియానుచరులే. పద్యంలో వారికి విరోధం చిత్రింపబడి ఉంటుందనుకోవటం సంభావ్యం కాదు. ఎందుకంటే, ప్రథమాశ్వాసంలో ఆ తర్వాతిదైన 211-వ పద్యంలో కవి ఉత్సవసమయంలో మన్మథునికి కానుకగా వసంతుడు చెరకువిల్లును, చంద్రుడు కలువబాణాన్ని బహూకరించి గౌరవాన్ని పొందారని ప్రశంసాపూర్వకంగా అభివర్ణించాడు. అందువల్ల వారిద్దరూ పరస్పరమాత్సర్యోపహతులు కారన్నమాట. వసంతుణ్ణి మెచ్చుకోకపోవటం ఎంత సమంజసమైనా, ఔన్నత్యచికీర్షతో ఆ చంద్రుడు చేసినది వసంతుని చేతకంటె గొప్పేమీ కాదని; కనుకనే, అనాదరింపబడిన వసంతునిపై సానుభూతి కలిగి అతనికి సమర్థనగా వేంకటకవి “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా!” అని వ్యాఖ్యానించాడని మనము ఊహించాలి.
అందువల్ల కవి హృదయావిష్కరణకై వేంకటరాయశాస్త్రి గారు, ధర్మారావు గారు చెప్పిన పద్యార్థాన్ని, చేసిన అన్వయాన్ని సహృదయులు పునర్విమర్శింపవలసి ఉన్నదని మనవి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి వేలూరి వేంకటేశ్వరరావు గారి అభిప్రాయం:
04/04/2017 5:34 pm
కామేశ్వర రావుగారూ!
మీరు మరీ బడాయికి పోయారు కానీ, ఆఖరి చరణం తీసేస్తే ఈ పద్యం కేవలం ఋతువర్ణన పద్యమేకదా! (Of course, give a little to the poet for drawing the contrast between the Lord of Spring and the satellite to the earth!)
అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ – ముఖ్యంగా తెలుగు సాహితీవేత్తలమనుకొనే ఈ నాటి కవుల్లో, విమర్శకులలో కొట్టవచ్చినట్టు కనిపించే ఒకానొకలక్షణం.
‘ఈ పద్యంలో ఉన్నది వసంతుడూ చంద్రుడే కాని కవులు కాదు. కవుల మధ్యనున్న స్పర్థ కేవలం పాఠకులకు స్ఫురించే అంశమే తప్ప నేరుగా కవి చెప్పింది కాదు,’ అని మీరు మొహమాటానికి అన్నారని నేను అంటాను.
కాకపోతే, తరువాత ఇలా ఎందుకు రాసారు?
“… అయినా ఒక కవిగా, ఎంత గొప్ప కవిత్వాన్ని రచించినా సమకాలము వారలు మెచ్చకపోవడాన్ని గూర్చి వాపోయాడు వేంకటకవి. మెచ్చకపోవడమే కాదు, ఏ రకంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతారో కూడా మనకీ పద్యంలో చూచాయగా తెలియజెప్పాడు.”
ఈ పద్యం మీద వేదం వారి వ్యాఖ్యకూడా జోడిస్తే ఇంకా బాగుండేది.
మరొక విషయం: కాళిదాసుని వదిలేయడం ఏమీబాగాలేదు. కుమార సంభవంలో వసంతుడి రాక పై శ్లోకాలు, అంతకన్న మరీముఖ్యంగా, ఋతుసంహారం లోని వసంతవర్ణన (They may be a little explicit, hence more likable!) వదిలేయటం ఏమీ బాగాలేదు, చెప్పొద్దూ!
అసలు విషయం: ఋతుసంహారం, నాలాంటి ‘ మీడియోకర్ల’ కి తేలిగ్గ అర్థమయే కావ్యం. ఎప్పుడో, ధాతనామసంవత్సరంలో, ఋతుసంహారంలో వర్ణనలతో, కన్నెగంటి చంద్ర కవితలని పోల్చానని, నన్ను ఆక్షేపించారు.
(ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!)
ఏది ఎలావున్నా, మంచి పద్యం; మరీమంచి వ్యాఖ్యానం. (I envy you!)
బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి vaadrevu chinaveerabhadrudu గారి అభిప్రాయం:
04/01/2017 9:33 pm
నూతిచుట్టూరా చెట్లు.
పాతవానల రహస్య నిద్రల్ని తట్టి
పాతస్మృతుల సుడిగుండాల్ని గాలించి
ఆ తపించే వర్తమానం కోసం
శైతల్యాన్ని తెస్తాయి, చెట్టూ, బావీ.
ఈ మధ్య సూర్యలంకలో కొందరు తెలుగు కథకులు ఒక శిబిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి నేను ఈ ఎక్ ఫ్రాసిస్ ని పరిచయం చెయ్యవలసి వచ్చింది. డొనాల్డ్ బార్తెల్మి రాసిన ‘టాల్ స్టాయి మ్యూజియం దగ్గర ‘అనే కథని పరిచయం చేసినప్పుడు. ఈ పదాన్ని తనంతట తనుగా మొదటిసారి వాడిన తెలుగు కవి ఇదుగో వేలూరి వారే కనిపిస్తున్నారు. చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని , శిల్పాన్ని కవిత్వంతో వివరైంచే ప్రయత్నం యూరోపియన్ కవులు చాలా తరచు చేసే పని. తెలుగు లో తక్కువ. ఒకరూ అరా రాసినా యూరోపియన్ చిత్రలేఖనాల్నో, కళాకృతుల్నో ఉద్దేశించి మటుకే చేసి ఉంటారు. కాని ఇక్కడ ఒక తెలుగు చిత్రకారుడి పదహారణాల తెలుగు బొమ్మని తెలుగులో చిత్రించిన కవిత. చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా పైన నేను మళ్ళా ఎత్తి రాసిన వాక్యాల్లో కవి అంతరంగమంతా బావిలో నీళ్ళల్లా లోతుగా, చల్లగా కనిపిస్తున్నది. వెంకటేశ్వరరావుగారు గొప్ప చిత్రరహస్యవేత్త కాబట్టి ఆయనిట్లాంటి కవితలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను.
వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు గురించి తెలుగు వాడు గారి అభిప్రాయం:
03/31/2017 9:04 am
ఈ పోలికల వల్ల ఏమిటండీ మీరు చెప్పదల్చుకున్నది? ఇది చూస్తే మోకాలికి బోడిగుండుకి సంబంధం పెట్టినట్టు ఉంది. అసలు ఇలా పోలికలు చూపించడం మొదలు పెడితే ఏ రెండు యాదృచ్ఛికమైన కధలో ఏరుకుని పోల్చవచ్చు.
గాంధీగారికి ద్వారం వెంకట స్వామి నాయుడు గారికీ పోలిక చెప్పొరే అంటే గాంధీ గారెప్పుడూ నాన్ వాయలెన్సు, ద్వారం గారెప్పుడూ వయలిన్సు అన్నట్టు ఉంది (భ.రా.గో మాటల్లో). మాటల గారడీకి, నవ్వుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు ఇలాంటివి.
ఇలాంటివి తీరిక ఉండాలే గానీ వందల కొద్దీ రాయొచ్చు లైబ్రరీలోకెళ్ళి కళ్ళు ముసుకుని ఏ రెండు పుస్తకాలు తెచ్చినా సరే. ఎక్కడి విశ్వనాధ, ఎక్కడి సినిమా సరుకూ పోల్చడానికి? విశ్వనాథ గారి పుస్తకానికీ ఆయన వేయించిన నాటకాలకీ పోలిక పెట్టినా బావుండేది. నాకేం నచ్చలేదు.
సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
03/17/2017 11:50 am
మాన్యులు శ్రీ వాడపల్లి శేషతల్పశాయి గారికి
నమస్కారములతో,
మీ సేకరణలో ఆనంద ముద్రణాలయం వారు అచ్చువేసిన అద్భుతావహమైన శ్రీ తంజనగరం తేవప్పెరుమాళయ్య (దేవరాజసుధి) గారి వసుచరిత్ర వ్యాఖ్యకు పిడియఫ్ ప్రతి ఉన్నట్లయితే తెలియజేయ ప్రార్థన.
శ్రీ తంజనగరం వారి వ్యాఖ్యకు మద్రాసు లోని రాయల్ అండ్ కో వారొక సుపరిష్కృత పునర్ముద్రణను ప్రారంభించి, మూడువంతులు పూర్తయాక దానిని అరుణా పబ్లికేషన్స్ వారికి ఇచ్చివేశారు. ఆ ప్రతులిప్పుడు దొరకటం కష్టం. 2001లో శ్రీ రామరాజభూషణ పరిషత్తు (భీమవరం) వారు పూర్తిగా పునర్ముద్రణను వెలువరించారు కాని, తొలినాటి ఆనంద ముద్రణాలయం వారి ప్రతివలె అది అంత సంతృప్తికరంగా లేదు. జూలూరి అప్పయ్యశాస్త్రి గారి వసుచరిత్ర వ్యాఖ్య ఎక్కడో ఒకటి రెండు చోట్లలో తప్ప అంత విశేషంగా చెప్పుకోవలసినది కాదు.
మీరు ఉదాహరించినట్లు సోమనాథకవి 1750 నాటివాడన్న శ్రీ నిడుదవోలు వారి నిర్ణయమే సరైనది. అయితే కవితరంగిణిలోని వివరాలు, వ్రాతప్రతులలోని వివరాలు, వావిళ్ళ వారి ప్రతిలోని వివరాలు ఒక తీరున లేవు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి lyla yerneni గారి అభిప్రాయం:
03/14/2017 12:44 am
రేడియో స్టేషన్ లో కొన్ని సంవత్సరాల క్రింద చేసిన ప్రసారం, ఎంతో ప్రేమతో దేశ దేశాల్లో ఉన్న తెలుగు వారిని, ఈ వక్త వినమని ఇచ్చారు. ఆ ఉదారతకు చాలా సంతోషం కలిగింది.
నాకు వీరి ఉపన్యాసం కన్నా, వీరి గానం ఎక్కువ నచ్చింది. మళ్లీ ఏమన్నా కమ్మగా పాడిన ఆడియోలు పత్రిక శ్రోతల కోసం పంపిస్తారేమో. తప్పక వేచి ఉంటాను.
ఉపన్యాసం లోని విషయాలకు వస్తే:
భట్టుమూర్తిని సంగీత కళా రహస్య నిధి అని ఎవరన్నారో, ఎందుకన్నారో మనకెలా తెలుసు? ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి. భట్టుమూర్తికి, సంగీతం ప్రావీణ్యతలో బిరుదులివ్వటం, అసలు ఒక కావ్యరచన పరిశీలించి చెయ్యటమెలా జరుగుతుంది? ఉపన్యాసకులు చెప్పిన ప్రకారం, కవి కాలానికి సంగీతం, సాహిత్యం (కవిత్వం) స్వంత ప్రతిపత్తి కలిగిన కళలు కదా. సంగీతం, సాహిత్యం లో ప్రజ్ఞలు విడిగా పరీక్షించడానికి సాధనాలున్నయ్యి కదా. సంగీతం పరీక్షలు పెట్టి, సంగీత స్వరకల్పనకు కాని, సాహిత్యం కూర్చినందుకో, పాడగలిగినందుకో, వాయిద్యం వాయించగలిగినందుకో గాని, అతడు మేటి ఐతే సంగీత కళానిధి అని సంగీత విద్వాంసులు బిరుదు ఇవ్వచ్చు. అతను అలాటి పరీక్షలు ఇచ్చి ఉన్నాడేమో, ఇచ్చి ఆ బిరుదు పుచ్చుకున్నాడేమో. మరి ఆ విషయం ఎక్కడా చదవటానికి కనపడదు. వసు చరిత్ర కావ్యం ద్వారా అతని సంగీత పాటవం ఎలా చెపుతారూ? అనేది నా సంశయం.
పైగా, కేవలం రెండు పద్యాల ద్వారా అతని సంగీత ప్రావీణ్యత ఎలా తెలుస్తుంది? అదీ సరి కాదు. వసుచరిత్ర రాసిన భట్టుమూర్తి సంగీత జ్ఞానం గురించి, ఎందుకు ఎవరైనా ఆ రెండు పద్యాలే ఉదహరిస్తారో నాకు అర్థం అవదు.
ఒక కవి పద్యాల్లో అక్కడో చోట ఇక్కడో చోట ‘వీణ’ అనో ‘మద్దెల’ అనో, లేకపోతే ‘నాట’ అనో ‘కల్యాణి’ అన్నంత మాత్రాన, ఎవరైనా సంగీత కళానిధి అని బిరుదు ఇస్తారా? ఊరికే, ఒక కథలో మలేరియా, టైఫాయిడ్ అన్నంత మాత్రాన కథా రచయితకు వైద్య శిఖామణి బిరుదు ఇచ్చిన తంతు ఎక్కడా వినలేదు.
సరే, కొంతమందిని కవి అని అంటే సర్లే పోనీలే అని నాలాటివాళ్లు సరిపెట్టుకుందామంటే, ఇంకా ఉద్రేకులు ఢమిక్కిన ఒక్కొక్కరిని మహాకవి, శతాబ్ది కవి అనేస్తారు. మార్క్సిస్టులు శ్రీశ్రీని ప్రజాకవి, మహాకవి అంటే వాళ్ల అభిమానుల గుంపులో చెల్లుబడి అవుతుందేమో కాని, ప్రపంచ కవులు ఎవరండీ ఈ శ్రీ శ్రీ! అంటే ఏం చెపుతారు? ఇదుగోండి ఈ మా గొప్ప తెలుగు కవి – ఈయన ‘ఆనందం అర్ణవమైతే’ అని ఒక పాట రాసాడు, ఆ పాటకి ‘కన్యాశుల్కం’ తెలుగు సినిమాలో మహానటి సావిత్రి ఇలా డాన్స్ చేసింది, ఈ విడియో బిట్ చూడండి అని గాని – ఎవరైనా డాన్స్ వచ్చిన వాళ్లకు చూపిస్తే, నిజంగా నృత్యం నేర్చిన వాళ్లు, వచ్చిన వాళ్లు – ఇది డాన్సా? ఇదేం పాట, ఇదెక్కడి డాన్స్ అయ్యా ఇదా తెలుగు నృత్యం అని వాళ్లు నవ్వి పోతారు.
ఇప్పుడా మధురవాణి, కుహనా కవిత్వం, కుహనా నృత్యం సంగతి నాకెందుకు గానీ, హిందోళ రాగం, వసంత రాగం గురించి, భట్టుమూర్తి ఒక పద్యం లో చమత్కరించి చెప్పినంత మాత్రాన, పద్యం మొదటి భాగం, హిందోళ లో, రెండో భాగం వసంత రాగంలో పాడమని కవి ఉద్దేశం కానే కాదు. అసలు ఏ రాగంలోనూ తన పద్యాలు పాడమని కవి ఆదేశమివ్వలేదు.
పద్యం కూర్చిన భట్టుమూర్తి అతడు ఉపయోగించిన ఛందస్సులు మాత్రమే ఇచ్చాడు. ఆ పద్యం మత్తేభము. అని మాత్రమే అతడు మనకు చెప్పింది. ఆ ఛందస్సులో ఎన్నైనా పద్యాలున్నయ్యి. ఆ ఛందస్సులు వేల మంది కవులు వాడినారు కదా. వారు కూడ అక్కడో పద్యం ఇక్కడో వచనంలో, నాట, కల్యాణి, వసంత, మోహన, కాంభోజి – అంటే ఇక వారికీ సంగీతం వచ్చినట్లేనా. ఆ లెక్కన తెలుగు సినిమా పాటలు రాసిన వాళ్లు వైణికులై కూర్చుంటారు. తకిట తకిట అంటే తబలా expert, ఓంకార నాదాలు సంధానమౌ గానమే – అంటే శంకరాభరణము specialist– ఐ పోతారు.
ఆ పద్యంలో మొత్తం మీద, కవి చమత్కారంగా ఉద్దేశించింది, తోటలో ఆడవాళ్ల ఉయ్యాల పాటలకు, కోయిలలు గొంతు కలిపినందున వసంతం పరిపూర్ణంగా శోభించిందని. అదే ఇంకోలాగా తిప్పి, గిరిక వీణా వాదనం విన్నప్పుడు, వసురాజు స్నేహితుడు – ఎవరో వీణ ఎంత బాగా వాయిస్తున్నారు, ఈ కొండ కోనలలో! కోయిలలు, నెమళ్లు తమ గొంతు కలిపి -పంచమ, షడ్జమాలు వినిపిస్తున్నాయి, అంటాడు. తెలుగు ( కర్ణాటక) సంగీతంలో, కోయిల స్వరం పంచమం కి సరిపోతుందని, నెమలి షడ్జమమని ఆ విషయాలు అలా రాసి ఉన్న సంగీతం పుస్తకాలు ఉన్నవి. ఒక్కొక్క సంగీత స్వరం ప్రకృతి లోని ఆ యా జంతువుల అరుపుతో సరిపోల్చటం పాతకాలంలో ఉన్నది.
అందువల్ల మహా అనుకుంటే మనం – భట్టుమూర్తి కవి సంగీతం పుస్తకాలు చదివాడేమో, పాట మీద అభిమానం ఉన్నట్లుంది, ఔరంగజేబు కాదు సుమా అనుకోవచ్చు.
హిందోళ రాగం వినాలంటే భట్టుమూర్తి పద్యం కష్టపడి పాడటమెందుకూ? – త్యాగరాజు ఆది తాళములో కూర్చిన ‘సామజ వర గమనా’ కృతి వింటే ధన్యులమై పోమా? సాహిత్యం లేకుండా స్వరం వీణ మీద పలికిస్తే, ముగ్ధులమై వినమా? సంగీత స్వరాలతో మనల్ని సమ్మోహితులను చేసి, ఈ త్యాగరాజు తన మాటలలో ఏమి చెప్పాలనుకుంటున్నాడు అని చూస్తే
సామజ వర గమనా సాధు హృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ..
అంటూ ఆ సాహిత్యం తోనూ మనల్ని రంజింప చేస్తాడు. సామజ వర గమనా సాధుహృ – అని అక్కడికి ఆపి, సంగతులు వెయ్యటం మొదలు పెడితే, కొంతమంది పట్టూ విడుపూ లేని వాళ్లకు, దొబ్బిడాయి వస్తుంది కాని సంగీత హృదయులు నొచ్చుకోరు. తన్మయులౌతారు. త్యాగరాజు తప్పకుండా సంగీత కళానిధి. సందేహం లేకుండా వాగ్గేయకారుడు.
ఉపన్యాసకులు మనకు ఆయా రాగాలు గురించి ఎంతైనా చెప్ప వచ్చు. కాలక్రమాన రాగాల స్వరాలలో వచ్చిన మార్పులు గురించి చెప్ప వచ్చు. అవి తప్పక శ్రోతలకు ఆసక్తికరంగా ఉంటాయి. ఆ ప్రస్తావనలు నాకు నచ్చాయి.
కాని, భట్టుమూర్తి కావ్యనాయిక గిరిక ఏడిస్తే కాంభోజీ రాగంలో మేళవించిన వీణలా వినిపించిందని -తన ఒక పద్యంలో అంటే ఉపన్యాసకులు ఆ పద్యాన్ని కాంభోజిలో పాడి వినిపించటం ఎందుకు? పద్యం అంతా గిరిక ఏడుపు కాదే. పద్యం ఒక విరహావస్థ వర్ణన. వెన్నెలలో ఒక సుందర స్త్రీ విలాప దృశ్యం. గిరిక ఎవరు? కోలాహలుడు అనే పర్వత రాజు కూతురు. కోలాహలుడు హిమవంతుడి కొడుకు. పార్వతికి సోదరుడు. గిరిక తల్లి నది. ఆ శుక్తిమతి గంగ లాగా స్వర్గంలో, భూమ్మీదా ప్రవహించే నదేమో మనకు తెలియదు. గిరిక దేవకాంత ఏమో. ఆమె నెత్తి మీద ముసుగు వేసుకు ఏడుస్తుందా? తెలుగు ఆడవాళ్ల లాగా, పమిట వెనక నించి ముందుకు లాగి, చెంగులోకి ముక్కు చీదుతుందా. దేవా! ఏమి దుస్థితి. విరహం లో కూడా వసురాజు ప్రేమిక గంభీర కాదా? ఆమెను ‘పటాగ్రంబెత్తి’ అని కవి ఎంత నాజూకుగా వర్ణించినాడు. గిరిక కట్టినది అది ఎంత నాజూకు దుకూలమో. ఆమె దానిని మునివేళ్ళతో ఎత్తి, తన ముఖానికీ, వెన్నెలకూ మధ్య అడ్డంగా ఎలా ఎత్తి పట్టిందో ఆ చిత్రం గొప్ప చిత్రకారుడు గీయాలి, మనం చూడాలి. భట్టుమూర్తి చాలా చక్కని వర్ణన చేసాడు. వడ్డాది పాపయ్య ఐతే బహుశా బాగానే చిత్రించ కలిగి ఉండొచ్చు.
గిరిక కాంభోజీ లో ఏడవటానికి అది సరైన రాగం కాదు, అలా సూచించటంలో భట్టుమూర్తి సంగీత పరంగా పొరపాటు చేసాడనుకోటం సరికాదు. భట్టుమూర్తి ఏదో మొదటి మూడక్షరాల కోసం కక్కుర్తి పడి, కాంభోజీ అన్న మాట వాడతాడా? అన్ని వందల తియ్యని పద్యాలు రాసినతడు, ఒక పద్యం అవతల పారెయ్యటానికి తిరగ రాయటానికి వెనకాడతాడా? ఏ కాలంలోనూ చూడండి, వందల పేజీలు తిరగ రాసే రచయితలుంటారు. వారి మనసుకే నచ్చక మళ్లీ మళ్లీ రాస్తారు. ఎడిటర్ కి నచ్చకపోతే, సలహాను గౌరవించి, తను చెప్పదలచింది సరిగా వివరించ గలిగే దాకా తిరగరాసేవి ఇక ఎన్నో.
కధా విషయం హిమాలయాల ప్రాంతంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఉత్తరాది కాంభోజీ రాగం ఎందుకు కవి ఉదహరించకూడదు? ఆ రాగం కాంభోజ ప్రాంతంకు చెందినందున ఆ పేరు వచ్చిందనీ, గంభీరం ఐన రాగం అని raga guide లో పేర్కొన్నారు. స్వరాలలో కైశిక నిషాదం ఉన్నది. విషాదం ఎందుకు పలకదు!
గిరిక సంగీతం దేవతల దేమో. మానవ సంగీతానికి అతీతమైన దేమో. సంగీతం పుస్తకాల్లో, రాసి ఉన్న ప్రకారం మంద్ర, షడ్జమ స్థాయి లే మానవులకు అందుబాటులో ఉన్నవి. గాంధర్వం దేవతలే పాడగలరు. కాళిదాసు కుమార సంభవం లో కూడా ఈ విషయ ప్రస్తావన ఉంది. భారతదేశంలో తయారయే తంజావూరు వీణలు, సరస్వతీ వీణల నాదం పక్కల కూర్చొన్న వాళ్లకే వినిపిస్తుంది. గిరిక వీణ వసురాజుకు, కొండమీద అడవులలో దూరానికి వినిపించిందంటే, అది మనుషులు చేసిన వీణ కాదు. వసురాజు ఇంద్రుని వరాలు పొందిన వాడు. వసురాజుకు స్వర్గానికి విమానంలో రాకపోకలున్నయ్యి. అతడి నర్మసఖునికి కూడా, స్వర్గానికి వీసా, పాస్పోర్ట్ ఉండి ఉండాలి. వారు గంధర్వ గానం విని ఆనందించి ఉన్నారు. అంతకన్నా ఎక్కువ ఆకర్షణీయంగా గిరిక వీణ పలికించిందని వసురాజు, అతని మిత్రుని సంభాషణలద్వారా కవి మనకు ముందే చెప్పి ఉన్నాడు.
భట్టుమూర్తికి సంగీత కళా రహస్య నిధి అని బిరుదు ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో? నాకు తెలియదు కాని, వసుచరిత్ర కావ్యం చదివి, అతడి సంగీత కళా పాటవం నిర్ణయించక్కర్లేదు. ఒకటి రెండు పద్యాల ద్వారా, అతడు చేయని తప్పులు సంగీత పరంగా అతని మీద ఆరోపించక్కర్లేదు. సంగీతజ్ఞులు ఆ ధోరణిగా ఆలోచించక్కర్లేదు, అని నాకనిపిస్తున్నది.
లైలా.
నాకు నచ్చిన పద్యం: రాజు – కవి – కావ్యం గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
03/10/2017 12:17 pm
మాన్యమిత్రులు శ్రీ కామేశ్వరరావు గారు ఎప్పటివలెనే ఒక అందమైన పద్యాన్ని పరిచయం చేసి ఈ వ్యాసంతో మరొక మంచి కవికి మరికొంతకాలం స్మరణీయతను కల్పించటం అభినందనీయమైన విషయం. వ్యాఖ్యానరీతితోపాటు వారి పద్యరథ్యాప్రయాణకథనం కూడా క్రమపరిగతితో ఆసక్తికరంగా సాగిపోయింది. తత్ప్రశంసానైపథ్యంతోనే రెండు మూడు ప్రాస్తావికాంశాలను ప్రస్తావిస్తున్నాను:
మొదటిది: మీరు పేర్కొన్నది కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసారసంగ్రహంలో స్వీకరించిన పాఠం. అంతకు మునుపు సకలనీతిసమ్మతములో మడికి సింగన నీతిభూషణములోనిదిగా ఉదాహరించినప్పటి పాఠమూ ఇదే. రెండూ సరిగా లేవు.
శ్రీరామచంద్రుడు శరసంధానం చేసినప్పుడు సముద్రం ఘూర్ణిల్లినదే కాని, ఇంకిపోలేదు. ఇంకినట్లయితే సేతుబంధనమహాకార్యం సంభవించేదే కాదు. “రాఘవు” అన్న షష్ఠీ విభక్తి మూలాన “శరాగ్రమునందు” అన్నదానికి భావార్థకప్రత్యయాంతములైన శోషణ సంహార ధాతువులు రెండింటితోనూ అన్వయం సాధ్యం కాదు. అందువల్ల ఇది అపపాఠం. 1929 నాటి భైరవుని శ్రీరంగమహత్త్వము పీఠికలో శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు ఉదాహరించినట్లు
ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందుఁ దృణాగ్రలగ్ననీ
రాకృతి వార్ధి నిల్చుట, దశాననుఁ డీల్గుట – మిథ్య గాదె వా
ల్మీకులు చెప్పకున్నఁ; గృతిలేని నరేశ్వరవర్తనంబు ర
త్నాకరవేష్టితావని వినంబడ దాతఁడు మేరు వెత్తినన్.
అన్నదే సరైన పాఠం. లంకానగరికి దారినివ్వలేదని ఆగ్రహించి, శరసంధానం చేసిన శ్రీరామచంద్రుని ఆ శరాగ్రమునందు (శరాగ్రమునందు – అన్నదానికి ‘శరాగ్రముచే’ అని తృతీయార్థకం చెప్పబడుతున్నది) సముద్రము (ఆకులవృత్తిన్=) వ్యాకులత్వాన్ని పొంది, తన క్షోభమును మాని, సర్వవస్తువులను తన గర్భంలోనికి విలీనం చేసికొనే స్వభావాన్ని మాని, గడ్డిపోచ కొసనున్న నీటిచుక్క వలె నిలిచిపోవటం; శరాగ్రముచే (అన్నది ఈ రెండు క్రియలతోనూ అన్వయిస్తుంది కనుక) రావణుడు మృతిచెందటం – వాల్మీకి గారే చెప్పకపోతే వట్టి మిథ్య కదా! అని సార్థకమైన క్రమాన్వయం.
ఇది శ్రీ రామకృష్ణకవిగారు సరిచేసిన పాఠమో, లేక వేరొక చోట ఈ విధంగా ఉదాహరింపబడినదో నాకు తెలియరాలేదు. ఏ తెలుగు పద్యాన్ని ఉదాహరింపవలసివచ్చినా విమర్శకులు ప్రామాణికస్థితి లేక స్వయంగా పాఠపరిష్కారం చేసికోవలసి ఉండటం మన సాహిత్యానికి పట్టిన శోచనీయమైన దుఃస్థితి.
రెండవ సంగతి: ఈ పద్యానికి మూలమైన బిల్హణుని విక్రమాంకదేవ చరిత్రలోని శ్లోకద్వయిని ముమ్మొదట జల్హణుడు తన సూక్తిముక్తావళిలో చేర్చుకొన్నాడు. బిల్హణుని రచనలను తొలిసారిగా శ్రీనాథుడు తన కృతులలోనూ, చాటువులలోనూ సమర్థంగా అనువదించుకొన్నాడు. అంతకు మునుపు తెలుగు కవులు తత్ప్రభావితులైనట్లు కనబడదు. చాటుకవులైతే సాధారణంగా సంధానగ్రంథాలలో నుంచి స్ఫూర్తిని పొందటం కనబడుతుంది. ఇదే భావంతో సంధానగ్రంథాలలో లభిస్తున్న బిల్హణుని శ్లోకాలను పోలిన మరికొన్నింటిని కూడా పరిశీలించి తెలుగు కవి తన పాఠాన్ని రూపొందించుకొని ఉండటం భావ్యమే. జల్హణుడిచ్చిన బిల్హణుని శ్లోకపాఠం ఇది:
లఙ్కాపతేః సఙ్కుచితం యశో యద్యత్కీర్తిపాత్రం రఘురాజపుత్రః
స సర్వ ఏవాదికవేః ప్రభావో న కోపనీయాః కవయః క్షితీన్ద్రైః.
పృథ్వీ(మహీ)పతేః సన్తి న యస్య పార్శ్వే కవీశ్వరా స్తస్య కుతో యశాంసి?
భూపాః కియన్తో న బభూవు రుర్వ్యా నామాపి జానాతి న కోఽపి యేషామ్.
మూడవ సంగతి: విక్రమాంకదేవ చరిత్రను తెలుగులో అనువాదం చేసినది శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, శ్రీ మాదిరాజు విశ్వనాథరావు గారలు. గొప్ప జంటకవులు. వీరి అనువాదం మొదట చిన్ని చిన్ని సంచికలుగా వనపర్తి సంస్థానం వారిచే ప్రకటింపబడింది. నా చిన్ననాడు వాటిని చదివాను. వాటిలో చాలా విలువైన సమాచారం ఉండింది. అది నేటి గ్రంథంలో లేదు. ఆ ప్రతులను సైతం ఎవరైనా సంపాదింపగలిగితే బాగుంటుంది. ఇప్పుడు అంతర్జాలంలో ఉంపబడిన 1974 నాటి ఆంధ్ర విక్రమాంకదేవ చరితములో పుటల క్రమం అవకతవకగా ఉన్నది. ఎవరైనా దయతో ఆ పుటల వరుసను సరిచేసి మళ్ళీ అందుబాటులోకి తేగలిగితే పాఠకులకు ఎంతో మేలు చేసినవారవుతారని విన్నపం.
శ్రీ మానవల్లి వారు ‘నీతిభూషణము’ను గురించి వ్రాసిన ప్రస్తావనలన్నీ జాగ్రత్తగా పరిశోధింపదగినవి. అది వేరే కథ.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
అతిథి గురించి Lakshmi గారి అభిప్రాయం:
03/04/2017 1:12 am
ఉహించిన మలుపు , కాని బాగుంది
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
03/01/2017 10:37 pm
మాన్యులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారికి
నమస్కారములతో,
శివాగ్నిలింగస్కాందాదిపురాణోపదిష్టమైన కథ ఒకటుండగా కాళిదాసు దానిని స్వాయత్తీకరించికొని ఆత్మీయమైన కావ్యశిల్పీకరణకౌశలంతో లోకోత్తరమైన అర్థపుష్టికి, ధ్వనివైభవానికి ఉదాహరణప్రాయంగా మలిచి చెప్పాడన్నది స్పష్టం. మన్మథుడు ధనుస్సుకు బాణాన్ని తొడిగిన సన్నివేశం మాత్రమే కథాగతంగా ఆవిష్కరింపబడింది. పరమశివుని ధైర్యాన్ని కించిన్మాత్రమైనా విలోపింపజేసినది, ఆయనకు ఇంద్రియక్షోభకారకమైనది ఆ మన్మథశరనిపాతమే అన్నది వ్యంజింపబడింది. ధనుశ్శబ్దం కేవలం వింటియందు మాత్రమే గాక ద్వాత్రింశదాయుధాలకు, అష్టావింశత్యుత్తరశతసంఖ్యాకములైన అస్త్రాలకు అనువర్తనీయమని ధనుర్వేదసూత్రం. మన్మథుడు తన ధనుస్సునకు సంధించినది పాణిముక్తాలైన బాణకోటిలోని సామాన్యశిలీముఖాన్ని కాదు. అది బ్రహ్మాస్త్రాదుల వలె ప్రయోగమే తప్ప ఉపసంహారం లేని మంత్రముక్తమైన సంమోహనమనే దివ్యాస్త్రం. శస్త్రాస్త్రములు రెండింటికీ బాణమన్నది వ్యావహారికబోధం. యుద్ధోపక్రమణాన స్వస్తికపాదావస్థితుడైన యోధుడు వామహస్తంతో ధనుస్సును చేతబూని, సప్తవింశత్యంగుళాలు ఉభయపాదాల నడుమనుండగా వైశాఖస్థానంలోకి వచ్చి, శరీరభారమంతటినీ కాలివ్రేళ్ళపై నిలిపి, వింటి క్రిందికొనను నేలకు మోపి, అల్లెత్రాటిని పైకొప్పుకు బిగించటం జరుగుతుంది. ఆ ప్రక్రియను కేవలసాంకేతికమైన ధనుశ్శాస్త్రపరిభాషతో వివరించి కావ్యార్థాన్ని భగ్నం చేయటం ఇష్టం లేక మహాకవి “హరబద్ధలక్ష్యః శరాసనజ్యాం ముహు రామమర్శ” అని దృశ్యాన్ని మాత్రం ప్రకాశింపజేశాడు. అది ప్రమార్జనమనే ధనుష్కరణం. “శరాసనజ్యాం ముహు రామమర్శ” అంటే లక్ష్యభేదనార్థం ఎక్కుపెట్టిన వింటిని, బిగించిన అల్లెత్రాటిని మళ్ళీ ఒకసారి సరిచూసుకొన్నాడని భావం. ఆ తర్వాత అమ్ములపొది నుంచి ‘ఆదానము’ అనే శరగ్రహణక్రియను – ఆ అవసరం లేదు కనుక – మహాకవి ప్రస్తావింపలేదు. నారిని బిగించిన తర్వాత వింటికి తిరుగులేని సంమోహనాన్ని తొడిగాడని శరవిన్యాసాన్ని మాత్రం వర్ణించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడని, సామాన్యబాణకోటికి వలె ఉపచ్ఛేదముతో గాక మంత్రముక్తమైన మహాస్త్రాన్ని విడిచిపెట్టాడని ప్రతీయమానం. అది ధనుఃసంహితలలో ఉపదేశింపబడిన ప్రయోగవిధానం.
అస్త్రప్రభావం వల్ల పరమశివుడు చంద్రోదయారంభం నాటి అంబురాశి వలె ఈషత్పరిలుప్తధైర్యుడు అయ్యాడు. సంమోహనప్రభావం వల్లనే ఆయన ధీరత్వం ఎంతో కొంత సడలిపోయింది. దొండపండు వంటి క్రిందిపెదవిని కలిగిన పార్వతీదేవి ముఖమండలమందు తన మూడుకన్నుల చూపులను నిగుడింపజేశాడు. ఇందుచే భగవంతుడైన పరమశివుని మనస్సులో రతిభావోదయం చెప్పబడినదని మల్లినాథ సూరి వివరించాడు. ఆయన చూపులు సోకి పార్వతీదేవి నిలువెల్లా పులకాంకురాలతో పూచిన లేతకడిమి లాగున కానవచ్చింది. ఆమె మనస్సులో సైతం రతిభావం అంకురించింది. “న కేవలం హరస్యైవ దేవ్యా అ ప్యుదితో రతిభావ ఇతి భావః” అని మల్లినాథ సూరి.
అప్పుడు పరమశివుడు ఎంతో ప్రయత్నం మీద మనస్సును నిగ్రహించికొని, తన ఇంద్రియవికారానికి (రతిభావోదయానికి) కారణమేమిటని నలుదెసల కలయజూశాడు. దండయాత్రను మొదలుపెట్టి, ఆలీఢస్థానంలో నిలబడి, వింటిని వలయాకారంగా ఆకర్షించి, శరమోక్షణానికి అభ్యుద్యతుడై ఉన్న మన్మథుని చూశాడు. ఇది పరమశివుడు వీక్షించిన దృశ్యం.
అయితే, చతుర్థసర్గంలో విలాపావస్థలో ఉన్న రతిదేవికి గుర్తున్న దృశ్యం వేరు. మన్మథుడు ధనుస్సును తొడయందు నిలిపి, ఒకవైపు శరానికి వంకతీర్చుతూ, మరొకవైపు వసంతునితో చిరునవ్వు నవ్వుతూ – అతనితో మాట్లాడుతూనే, నయనోపాంతవిలోకనాలతో (కడకంటి చూపులతో) ఆమెకేసి చూశాడు. ఆలీఢస్థానంలో ఉన్న మన్మథుడు దక్షిణపాదాన్ని కుంచితం చేసినప్పుడు ధనుస్సు ఒడిలో (ఉత్సంగమందు) ఉన్నట్లుగా ఆమెకు కానవచ్చినదన్నమాట. అది ప్రత్యాలీఢస్థానంలో ఉన్న మన్మథుని విక్షేపక్రియ. ప్రయోక్తచే శరమోక్షణం జరిగినదని ప్రతీయమానం. అప్పుడు మనస్సంచలనాన్ని పొందిన పరమశివుడు కన్నువిప్పి చూసే సరికి మన్మథుడు క్రీగంటితో ధనుస్సునకు బిగించిపట్టిన తన పిడికిటిని చూస్తూ (దక్షిణాపాంగనివిష్టముష్టియై), ఆకుంచితసవ్యపాదుడై, మండలీకృతచారుకోదండుడై, బాణం వేయటానికి మళ్ళీ ఆలీఢస్థానకంలో ఉన్నాడు. పునర్విక్షేపక్రియకు సంసిద్ధంగా నిలబడి ఉన్నాడన్నమాట. తపోభంగం చేయటానికి సాహసించాడని పరమశివుడు భ్రూభంగదుష్ప్రేక్ష్యముఖుడు అయ్యాడు. ప్రయోగింపబడినది అమోఘమైన సంమోహనం అయినప్పటికీ ఆయన ధనుర్వేదస్వరూపుడు కాబట్టి మోహావస్థ కలుగలేదు. ఇంద్రియవికారం మాత్రమే కలిగింది. దానినే “త్రినేత్రస్య స్మరశరనిపాతక్షోభః” అని క్షేమేంద్రుడు వివరించాడు.
క్షణలేశంలో మన్మథదహనం సంభవించింది. అది రతిదేవికి గుర్తుండిపోయిన దృశ్యం కాదు.
కాళిదాస మహాకవి అక్షరాక్షరం వాచ్యం చేయక, ప్రకాశ్యార్థప్రకాశకంగా దృశ్యాన్ని నిర్వహించినందువల్ల ఇన్ని రకాల ప్రతిపాదనలకు ఆస్కారం కలిగింది.
అన్నట్లు, శ్రీ దంతుర్తి శర్మగారు జరుగనున్న వ్యాజ్యంలో తమను ముద్దాయిగా భావించినట్లున్నది కాని, మౌలికమైన శివపురాణకథాప్రస్తావన వల్ల వారిని ముత్+దాయి (సంతోషకారకులు) గానే పరిగణింపవలసి ఉన్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నేలసంపెంగ గురించి అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:
02/14/2017 6:12 am
శ్రీమన్నారాయణ గారూ, మీరడిగిన చిన్న ప్రశ్న మిక్కిలియానందము కలిగించుచున్నది. ఇటువంటివి చూసే మరెందరికో తోచే తలపుని మీరు ప్రశ్నగా అడిగి నాకు జవాబు చెప్పే అవకాశం కల్పించారు 🙂
భాషా భోధకులైన మీకు తెలియంది కాదు. వ్యాఖ్యరాసే ముందు నాకూ ఈ అనుమానం కలిగింది. సంపాదకులుగా మా వ్యక్తిగతాభిరుచుల ప్రకారమే మేము పోలేము కదా? పత్రికకున్న ప్రమాణాలకు సరిపోయే రచన ఏదైనా, ఎవరు రాసినా ప్రచురించుతాము. మీరన్నట్లే బాగున్నవే పాఠకులకి అందించాలనుకుంటాము, అందిస్తాము!
పాఠకుడిగా చూస్తే కొన్ని నా అభిరుచికి నచ్చేవి ఉంటాయి. అలా నచ్చినపుడు ఆ భావాన్ని రచయితకీ, ఇతరప్రజానికానికీ తెలియజేయాలనుకోవడం తప్పుకాదు అన్న ఉద్దేశ్యంతోనే “చక్కని కథని తెలుగు పాఠకులకు అందించినందుకు ధన్యవాదాలు” అని వ్యాఖ్య రాశాను. బహుశా మీరు కూడా నానుండి ఇది రాబట్టడానికే ఈ ప్రశ్న అడిగారని అనిపిస్తుంది. ఈసారి నుంచీ ఒక పాఠకుడిగా అని చెప్పి మరీ నా స్పందన తెలియజేసుకుంటాను.
ఈ ఒక్క కథనే పైకి తేవాలన్నది నా ఉద్దేశ్యం కానే కాదు. ఒక పాఠకుడిగా నాకు నచ్చిన రచనలకీ, నాలో స్పందన కలగజేసే రచనలకీ వ్యాఖ్యలు రాస్తాను. మీ వ్యాఖ్యని అన్యధా భావించలేదని ఇందుమూలంగా తెలియజేసుకుకుంటున్నాను.
భాషా బోధకులని ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది.
ఇట్లు
భాస్కరం
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
02/12/2017 3:45 am
‘ఈమాట’ పత్రికా భూతపూర్వ సంపాదకదిగ్గజాయమానులు, సహృదయులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారు చమత్కారికగా ప్రస్తావించిన దిగ్గజద్వయీ పుంస్త్వ-పుంస్త్వేతరత్వనిర్దిదిక్షకు మునుపు సమాధేయాలుగా రెండు మనవి మాటలు:
దిగ్గజాలు పుంస్త్వభావాన్ని పొందినప్పుడు గజశాస్త్రంలో భద్రగజాలకు ఆవశ్యకమైన ‘మదము’ లేనందువల్ల ఆ ఇద్దరిలోనూ ‘ఉద్ధతులూ’ లేరు; విద్వన్మాన్యులైన మీకు తన్మధ్యోపగతమైన అల్పీయత్వమూ లేదు.
ఆ పద్యం అంతగా మీ అభిమానానికి నోచుకొన్న కృష్ణదేవరాయల కుమార్తె అని చెప్పబడే మోహనాంగి రచన కాదు; అది సంకుసాల నృసింహకవి రచించిన కవికర్ణరసాయనంలోని (3-25) వ పద్యం.
ఇక, అసలు సంగతి: శ్రీ కామేశ్వరరావుగారు నాకు అభిమానపాత్రులు. అద్యతనకాలంలో తమ వ్యాసాల ద్వారా (పద్య) కవిత్వాభిరుచిని బహుముఖీనం చేయటానికి ప్రయత్నిస్తున్న సాహిత్యికులుగా వారంటే అభిమానం నాకు. అందువల్ల ఎప్పుడైనా వారితో అభిప్రాయైకధ్యం విలోపించినా, దిగ్గజాష్టకంలో నా ‘వామనత్వ’మూ, వారి ‘సుప్రతీక’త్వమూ సార్వభౌమంగా తెలిసినవే కనుక “పోరు” నీరాట వనాటాల జోరుగా పరిణమించే అవకాశం లేదు. నేరమిని గూర్చిన చర్చ కాదన్న నేరిమితోడి కూరిమితోడి పోరిమి కాబట్టి నన్నెచోడుని మాటలలోనే చెప్పాలంటే, “అభిరామఘోరంబు” అని ఎవరైనా అనుకోవచ్చును. 🙂
అయినా, ఆత్మీయతానైమిత్తికమైన ముహూర్తకాలచక్రంలో షష్ఠాష్టకమేమీ లేనందువల్ల గాయనశాఫరికపాఠకులకు వాక్పుష్పాపచయం పరిహాసభాజకం కాగల ఆ మాత్రపు పోరు జరిగే అవకాశమూ కనబడటం లేదు. 🙂
నన్నెచోడుని కుమారసంభవంలో శ్రద్ధావైసాదృశ్యం కలరూపు ఎటువంటిదో ప్రతిపద్యాన్ని పరీక్షానిషోపలం పైని గీచి చూచినప్పుడు కాని తెలియదు. కామేశ్వరరావు గారు ప్రకటించిన పద్యం పరిశీలనీయం అని తోచి మైత్రీధర్మంగానే నేను ఆ వాక్యాలను, మరొక పద్యం క్రింద మరికొన్ని వాక్యాలను వ్రాశాను. నా అభిప్రాయం సమంజసం కాకపోతే సరిదిద్దుకోవటానికి నేనెప్పుడూ సిద్ధమే.
వెన్నుడును వెన్ను నితవరి
గున్నయేన్గుల జమ్ Eliot లుండ
ఎన్న నేటికి Pound రకేశుని
కున్న సత్త్వంబున్.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
మీకెప్పుడైనా వీలైనప్పుడు ఈ వ్యాసాన్నీ పరికింపగోరుతున్నాను: వాకిలి పత్రికలో “పోతన – నన్నెచోడులు చిత్రించిన మన్మథుని రథనిర్మాణం”
సాహిత్యం పట్టని క్షణం గురించి పద్మాకర్ గారి అభిప్రాయం:
02/09/2017 7:26 am
సన్నివేశం దాకా తెచ్చి వదిలితే మిగతాది పాఠకులు తమ ఊహాశక్తి పదును పెట్టుకుంటారు కదా! పెళ్ళి కాని వాళ్ళకి కూడా ఇట్టాంటి అనుభూతులు అర్ధం చేయించాలని రాజిరెడ్డి తపన కావచ్చు.
రెండు కవిత్వాలు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
02/05/2017 4:01 am
ఉన్నవాళ్ళ లేనివాళ్ళ బతుకు చిత్రాల మధ్యనున్న కాంట్రాస్టుని శక్తివంతంగా పట్టి చూపిన కవిత. బతకడానికి చెమటోడ్చే మనిషికి చెమట రొమాంటిక్‌గా ఉండదేమో కానీ, ఎండకన్నెరుగని సున్నితదేహాలకి అదికూడా రొమాంటిక్ దినుసే!
ఈ కవిత చదవగానే నాకు మొన్నీ మధ్యనే మళ్ళీ చదివిన పెన్నేటిపాటలో పద్యాలు గుర్తుకొచ్చాయి:
ఈ యింటనున్నట్టి యిటుకగోడల పాలగారలో అద్దాలు కలిసిపోవు
ఈ యింటి మహిడీల నెక్కిన చానల వేనలిలో మబ్బుసోన లూరు
ఈ యింట దిరుగాడు నింత పిల్లియు నూరిపెద్ద రైతుల నిలవేయ జాలు
ఇచట త్రేన్పులె కాని విన్పింప వూర్పు, లిచట రూకల గలగల లెత్తిపోవు
ఇచట లక్ష్మీసరస్వతులే వసింతు, రిచట లేనిది మానవహృదయ మొకటె
ఈ యింటి యజమాని ఎంత విద్యావంతు డెపుడు భాగవతమ్మునే పఠించు
ఈ యింటి యిల్లాలు పూయించు గన్నుల కొల్లలు కొల్లలు మల్లెపూలు
ఈ యింటి కొడుకొక్క డింగ్లాండులో ప్రజాస్వామ్యశోధన నెంతొ జరిపి వచ్చె
ఈ యింటి కూతురు పోయిన యేడె సాంఘికశాస్త్రమున పట్ట మొకటి గొనియె
ఎచట జూచిన చిత్రాలు నెన్నొ శిల్పఖండములు కనిపించు నెక్కడను మలిన
మన్నదేలేదు కాని సంపన్నగృహము చొచ్చి చూచిన నాత్మయే శూన్య మిచట
ఎటు చూచినా ప్రక్కలెండి యున్నారు
ఎటు చూచినా విలాపించుచున్నారు
ఎటు చూడలేక తమ కిటికీలు మూసుకొని
కటు జీవిత యథార్థ కథ చూడకున్నారు
అయితే, ఈ “రెండు కవిత్వాలు” కవితలో భావకవిత్వాన్నీ (“అన్నీ జాగర్తగా తుడిచి వుంచిన గాజు పదాలు”), భక్తికవిత్వాన్నీ (“దేవుడికీ భక్తుడికీ మధ్య రొమాన్స్ కవిత్వం”) ఒకే గాటకింద కట్టేయడం సబబుగా లేదు. భావకవిత్వంలో భక్తి ఒక భాగమయినా (ఏకేశ్వరోపాసన), భక్తికవిత్వం అంతకన్నా ప్రాచీనమైనదీ, ప్రత్యేకమైన ఉనికి కలదీనూ. ఆ భక్తికవిత్వం పాడిన భక్తులెవరూ చెమట మరకలంటని అందమైన భవనాల్లో ఉండినవారు కారు. అంతెందుకు, ఈ కవితలోనే ఉదాహరించిన ముగ్గురు కవులుకూడా అలాంటివారు కారు. అంచేత ఆ భాగం మిగతా కవితతో అతకలేదు సరికదా ఒక distraction అనిపించింది.
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
02/04/2017 12:56 pm
ముఖము దరహాసమును, చంద్రుడు వెన్నెలను విరియింపజేయటం లోకసహజం. కవి ఆ రెండింటిని కలగలిపి రూపకాన్ని సాధింపజూచినందువల్ల “రమ్యమైన ముఖమనెడి చంద్రునియొక్క దరహాసము” అన్న ఉత్తరోత్తరాన్వయాన్ని పద్యం ఉపక్రమణికలోనే మర్చిపోయాడు. రుచిర = రమ్యమైన, ఆనన = ముఖమనెడి, అబ్జ = చంద్రుని (రుచిరాననాబ్జ), దరహాస = చిరునవ్వు అనెడి, విలాస = లీలయొక్క, వికాస = వికసనముచే, భాసి = భాసమానుడైన, నీహారకర+అతిభాతి = చంద్రునియొక్క విశదప్రకాశముచే – అని అర్థాన్వయం. దీనికి తాత్పర్యం ఏమిటి? ముఖచంద్రదరహాసము అంటే ముఖ-దరహాసము, చంద్ర-దరహాసము అని రెండువిధాలుగా అన్వయిస్తున్నాడు. ఆ ప్రయత్నం వల్ల కల్పన స్వసమర్థకం కాలేకపోయింది. “ఆ రుచిరాననా(…) దరహాసవిలాసవికాసభాసి నీ,హారకరాతిభాతి” అని కాని, “ఆ రుచిరాననాబ్జ దరహాసవిలాసవికాస (…) అతిభాతి” అని కాని వ్రాసివుంటే అర్థం సరిపోయేది. ఇటు ‘అబ్జ’శబ్దాన్ని, అటు ‘నీహారకర’ శబ్దాన్ని ప్రయోగించటం వల్ల అన్వయం తప్పింది. రుచిరానన అయిన పార్వతీదేవి యొక్క దరహాసలీలచే వికాసమును పొంది భాసమానుడైన చంద్రుని వెన్నెలకు (మించిన) అతిభాతిన్ = అధికమైన కాంతిలో – అని ఎట్లాగో సరిపెట్టుకోవటం వీలుకాకపోయింది. ముఖాబ్జమన్న రూపకాన్ని చెప్పిన తర్వాత అదనంగా “భాసి (?) – నీ,హారకర – అతిభాతి” అన్నందువల్ల ప్రారంభంలోనే పద్యశిల్పం భగ్నమైపోయింది. ముఖచంద్రునియొక్క దరహాసమే వెన్నెల అని మర్చిపోయాడు.
పరమేశ్వరునికి “అమలాంగశరీరతుషారదీప్తికాం, తోరునగంబు” అన్న వ్యపదేశం ఎంత కృతకంగా ఉన్నదో చూడండి. ‘అమలాంగ’ శబ్దానికి ‘పరమశివు’ డనే అర్థంలో రూఢి లేదు. దానికి శిల్పశాస్త్రములో చెప్పబడిన అవయవప్రమాణసిద్ధమైన సౌష్ఠవమును కలిగినందువల్ల ‘దోషరహితాంగుడు’ అనే కాని, ‘తెల్లనివాడైన శివుడు’ అన్న ప్రసిద్ధి లేదు. వ్యుత్పత్తిని బట్టి ‘అమల+అంగ = స్వచ్ఛములైన (తెల్లని) కరచరణాద్యంగములు కలవాడు; అమలాంగుడు = శివుడు’ అని మనము చెప్పుకొన్నా, ‘అమలాంగశరీరము’ అన్న సమాసంలోని అంగ-శరీరముల పారస్పరికత (తెల్లని శరీరాంగములు కలవాని శరీరము) పదౌచిత్యము పట్ల కవియొక్క శ్రద్దధానత లేమిని సూచిస్తున్నది. అయశ్చంద్రసూర్యాదులు, వాటి పర్యాయపదాలు ‘కాంత’ శబ్దంతో సమసించినప్పటి అయస్కాంత చంద్రకాంత సూర్యకాంతములలోని ‘కాంత’ శబ్దానికి ‘ఱాయి” అన్న అర్థం ఏర్పడటం కారణంగా “చంద్రకాంతము” అనటానికి “తుషారదీప్తికాంతము” అనటం వ్యాకరణసాధ్యమే కాని, చంద్రునికి ‘తుషారకిరణుడు’ అనే కాని, ‘తుషారదీప్తి’ (మంచువెలుగు) అన్న వ్యవహారం లేకపోవటంవల్ల అది కావ్యదోషప్రకరణంలో చెప్పబడే ‘నేయార్థము’ అనే దోషం. ఏదో కల్పన నిమిత్తం సరిపెట్టుకోవలసినదే కాని, ‘పాలరాతితోడి కొండ’ ఒకటుండటం లోకసిద్ధమేనా? అని కవికి తోచలేదు.
పరమేశ్వరునికి సాత్త్వికభావోదయం ఎప్పుడు కలిగింది? “మదనపరవశయై యున్న పార్వతి ముఖాలంకారంబు”ను చూసినప్పుడు (5-42). ఆమె ముఖమునందు అభివ్యక్తమైన మన్మథపారవశ్యభావాన్ని కనుగొని ఆయన అంతఃకరణ ఆమెయందు సుముఖమైనదని ప్రతీయమానం. ఆ సూచన ‘అలంకారము’ అన్న ఆ బాహ్యచిహ్నంలో లేదు. రమ్యమైన ఆమె ముఖచంద్రదరహాసప్రకాశంలో మునిగి, వెన్నెలలో పాలరాతికొండ ద్రవిస్తున్నట్లుగా ఆయన శరీరమంతటా స్వేదం వెల్లివిరిసింది. అది హిమవత్పర్వతాన్ని ఆకాశగంగ కప్పివేసినట్లుగా ఊహింపబడింది. ఆ హిమవంతుడు పార్వతికి తండ్రి అని, ఆ ఆకాశగంగ పరమేశ్వరునికి భార్య అని; ఆ ఆకాశగంగ ఆయన జటాజూటంలోనిదే కదా! అని, ఆయన ఉన్నదే నీహారపర్వతసీమపైని కాగా నీహారకరాతిభాతి అన్న ప్రయోగానికి ప్రయోజనం ఏమిటని – సందేహపరంపర కలిగితే, అది రామాయణంలో పిడకలవేట వంటిదే అనుకొని, ప్రస్తుతానికి విడిచివేద్దాము.
శరీరమనే పాలరాతికొండ ఎప్పుడు పొల్పారింది? “ఆ … నీహారకరాతిభాతి”లో (సప్తమి); లేక, “ఆ … నీహారకరాతిభాతి”చే (తృతీయ) – పరమేశ్వరుని మనస్సు పారవశ్యాన్ని పొందినప్పుడు. “పరమేశ్వరుని మనస్సు సైతం పారవశ్యాన్ని పొందినప్పుడు” అన్న మాట పద్యంలో లేదు. అసలు హిమాచలాన్ని అమరాధిపవాహిని “పర్వి”, కప్పివేసినప్పుడు “పొల్పారటం” ఎందుకుంటుంది?
ఘర్మజలం పొంగినది పార్వతీముఖదర్శనపారవశ్యంలో ఉన్న పరమేశ్వరుని శరీరం నుంచి. చంద్రకాంతోరునగంబు నుంచి కాదు. చంద్రకాంతోరునగానికి ఘర్మజలోల్బణం ఉండదు. అయితే పద్యంలో, “అమలాంగశరీరతుషారదీప్తికాంతోరునగంబు సమ్మదరసోత్కటఘర్మజలంబు పర్వి” అనే ఉన్నది. సమ్మదరసోత్కటఘర్మజలం పర్వినది శరీరమనే చంద్రకాంతోరునగం నుంచి అని అన్వయం. ఈ సమాసం ‘సమ్మదరసోత్కటఘర్మజలం పర్వినది చంద్రకాంతోరునగం వంటి శరీరం నుంచి’ – అన్న సరియైన అన్వయాన్ని పరిహరిస్తున్నది. మళ్ళీ అమరాధిపవాహిని హిమనగాన్ని కప్పినట్లుగా పొల్పారినది శరీరం కాదు. శరీరమనెడి చంద్రకాంతోరునగం. ఎక్కడికక్కడ పదాలను తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని అన్వయించుకోవాలి. అన్వయమే లేనప్పుడు అలంకారాల చర్చ నిరాధారం అవుతుంది.
శరీరము నుండి కలిగే స్వేదరూపజలోద్గమం రతి వలన, ఘర్మము (వేడి) వలన, శ్రమము (అలయిక) వలన కలుగుతుందని లక్షణం. ఇతరకారణాలు కూడా ఉన్నాయి. సమ్మద రసము అంటే ఆనందరసం. వేదాంతశాస్త్రంలోనూ, అలంకారశాస్త్రంలోనూ అది మనుష్యానందం మొదలుకొని హిరణ్యగర్భానందం వరకు గల ప్రతిబింబానందాలకు బింబభూతమైన పరబ్రహ్మము యొక్క అనుభవము వలన కలిగే ఆనందరసం. అది గ్రీష్మకాలపు తాపాతిశయం వలన కలిగే ఘర్మజలం వంటిది కాదు. అందువల్ల ‘స్వేదము’ అన్న ఆలంకారికరూఢమైన పరిభాషాపదం (స్విద్యతే అనేన అఙ్గ మితి స్వేదః – దీనిచే మేను చెమర్చుతుంది కాబట్టి స్వేదము) తప్ప జిఘర్తీతి ఘర్మః – మాడ్చివేసే వేసవికాలపు ఎండలో కారే చెమట అన్న అర్థాన్ని కలిగిన పదం అక్కడ అనుచితమే అవుతుంది. సమ్మదరసం ఉన్నప్పుడు ఘర్మజలానికి స్థానం ఉండదు. పైగా నీహారకరాతిభాతి వల్ల ఘర్మజలం అసలే ఉద్గమింపదు.
ఇక రసభావాల చిత్రణ విషయం. ఇప్పటికే లేఖ పెద్దదైనందున కేవలం సూచించి, వదిలివేయక తప్పటంలేదు. కొద్దిసేపు క్రితం (5-38)లో కావ్యనాయిక పార్వతికి స్వేదోదయాన్ని వర్ణించాడు. దాదాపు అదే రకమైన భావంతో మళ్ళీ ఇప్పుడు నాయకునికి స్వేదోదయాన్ని చెప్పాడు. అదీ మరచి, (5-45)లో మళ్ళీ వెంటనే రోమాంచము, కంపము అన్న సాత్త్వికభావాలను అపక్రమంలో నాయకుని యందు చిత్రించాడు. పార్వతికి మేను చెమర్చినప్పుడు చిత్రింపబడిన రాగాతిశయం, భావదీప్తి పరమేశ్వరునికి స్వేదోద్గమం ఒళ్ళంతా కప్పివేసినట్లుగా (ముచ్చెమటలు పట్టినట్లుగా) చిత్రింపబడటంలో ఔచిత్యం లేదని కవి ఊహింపలేదు. ఏకకావ్యంలో నాయికానాయకులు ఇద్దరికీ రూపసామ్యోదిత సాత్త్వికభావాలను కాలాంతరసంక్రమితాలుగా వర్ణించటంలో ఉన్న విసంగతి కూడా కవి దృష్టికి రాలేదు.
మాన్యమిత్రులు మన్నించాలి. ఎన్ని విధాల చూచినా ఇందులో ఉత్తరోత్తరాన్వయంతోడి స్పష్టమైన అర్థస్ఫురణ కాని, సుభగమైన రసప్రతీతి కాని కనబడటం లేదు. ప్రాచీనుడైన మహాకవి రచన కాబట్టి సరసులు నెరసులను పట్టించుకోకుండా ఎక్కడికక్కడ సరిపెట్టుకొంటూ ముందుకుపోవాలి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
02/03/2017 12:04 pm
మొదటి సంగతి: ‘అనుక్త మన్యతో గ్రాహ్యమ్’ అన్నట్లు కాళిదాస కుమారసంభవాన్ని ముందుంచుకొని చదివితే గాని ఈ పద్యార్థం బోధపడదు. కాళిదాసు వర్ణించినది పార్వతీ మనోజ్ఞతనువుపై చిలికిన తొలకరి జలకణాల స్థితిగతులను. ఆ కల్పనలోని సౌందర్యాతిశయం, అభినవత్వం, భావధ్వని, ప్రతిపదాన్ని ఆచితూచి ఎన్నుకొన్నప్పటి పరికరాలంకారపు దివ్యశోభ – వ్యాఖ్యాతల మనస్సులనే గాక మహాలంకారికుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ గంభీరిమను వివరించేందుకు దానిపై లెక్కలేనన్ని వ్యాఖ్యలు వెలిశాయి. అనర్ఘమైన శ్లోకం అది.
తెలుగు కవి రూపిస్తున్నది అడరు నవాంబుధారలను. అంటే, వర్షర్తువేళ క్రమక్రమంగా విజృంభిస్తున్న నవాంబుధారల స్వస్థితిని. ఎంత నవంనవములైనప్పటికీ అతిశయిస్తున్నవి అంబువుల “ధారలు” కనుకనే అవి జటాటవిలో “విభ్రమించటం” (తిరుగుళ్ళు పడటం) సంభవించింది. తొలుకారు నాటి నీటిచుక్కలైతే జటాటవిలో విభ్రమించే అవకాశమే ఉండేది కాదు. బిందువులకు విభ్రమించటం ఉండదు. జలధారలు కాబట్టే విభ్రమణాన్ని పొందాయి. ఎట్లా పొందాయి? అంటే, పరమేశ్వరుని వలె పార్వతీదేవి కూడా కేశపాశాన్ని కపర్దజటాజూటోపమంగా బంధించి ఉన్నందువల్ల ఆ మహాజటాటవిలో అంబుధారలు చిక్కుకొని కేశావర్తాల వెంబడిని తిరుగుళ్ళుపడవలసివచ్చిందని భావం. దట్టమైన చుట్టుకురులకోసం పాపం పార్వతికి సైతం జటాటవిని కల్పింపవలసివచ్చింది. అంతకు ముందు పద్యంలోనే (6-108) పార్వతి అందమైన జడలపై తొలకరి నీటిబిందువులు ముత్యాల సేసల వలె మనోహరంగా ఉండటాన్ని వర్ణించాడు. అంతలోనే ఆ సంగతిని మర్చిపోయి, లేనిపోని జటాటవిని తెచ్చిపెట్టుకోవటం వల్ల – ఆ జటాటవిలో విభ్రమింపవలసివచ్చిన “అడరు నవాంబుధార”లను తెచ్చిపెట్టుకొని తబ్బిబ్బయ్యాడు. అంతకు క్రితమే నెఱిజడలతో ఉన్న పార్వతీదేవి అంతలోనే వేణీబంధకపర్దిని అయినప్పటికీ, అది సమున్నద్ధశిఖండకం కాక, ఆవర్తాకారంలో కుంభీబంధసంయుక్తమై సముల్లేఖ్యంగా ఉన్నప్పటికీ – దానికి జటాటవితో తాద్రూప్యం సరికాదని చూసుకోలేదు. అననురూపమైన ఆ జటాటవిలో వర్షానవాంబుధారలు విభ్రమిస్తుండటం పార్వతీ కేశవర్ణనకు శోభాహేతువు కాదని కవి గ్రహింపలేదు.
అంబుధారలు “వెల్వడి, చనుదెంచి” అంటే, పార్వతీజటాటవిలో విభ్రమించి విభ్రమించి, అక్కడినుంచి బైటపడి వచ్చి – అన్నమాట. “వెల్వడి” అంటే సరిపోయేది. “వెల్వడి, చనుదెంచటం” ఎందుకు? వెల్వడిన తర్వాత ఎక్కడికి చనుదెంచినట్లు? పోనీ, ఫాలాగ్రసీమకో ఎక్కడికో అక్కడికి చనుదెంచిన తర్వాత, “రాలుగొనటం” ఎట్లా సాధ్యమైంది? ‘రాలుగొను’ అన్న ఆ విచిత్రమైన ధాత్వర్థానికి కవి అనుకొన్న భావం ఏమిటో కవికే తెలియాలి. ఎంత సూర్యరాయ నిఘంటువు సర్దిచెప్పినా, ‘గళితమై, క్రిందికి జాఱి’ అన్న అర్థంలో ‘రాలు’ ధాతువుపై క్త్వార్థకమైన ‘కొను’ ధాతువు చేరి ‘రాలుగొని’ అని స్వార్థంలో రూపం ఎట్లా ఏర్పడుతుంది? నీళ్ళకు ‘రాలటం’ ఉండదు కనుక జలధారలకు ‘రాలుగొను’ అన్న భావార్థక స్వతంత్రక్రియాకల్పన సార్థకం కాదు. ఆముక్తమాల్యద (4-82) లో “నవమేఘపృథుకములకు రాలె నొయ్యన వడగండ్లు పాలపండ్లు” అన్నప్పుడు అక్కడ శిశువులకు పండ్లు రాలటమూ ఉన్నది; మేఘాల నుంచి వడగండ్లు రాలటమూ ఉన్నది. అది సార్థకమైన ప్రయోగం. ప్రకృతపద్యంలోని నీటిధారలు ‘రాలుగొనటం’ వ్యర్థకల్పితమని గ్రహించాలి. అందుకే దానికి ప్రయోగాంతరాలు దొరకవు.
కేశబంధం నుంచి (ఫాలస్థలికి కాబోలు) వెల్వడి, (అక్కడినుంచి) చనుదెంచి, రాలుగొంటూ – అంటే, రాలుకుంటూ (క్రిందికి జారుతూ) వచ్చిన జలధారలు కనురెప్పలపై పడి, ఆ పక్ష్మములు (కనురెప్పలు) పక్ష్మలములు (దట్టమైన వెంట్రుకలు కలవి) కావటంవల్ల “వెడ నిల్చి” = కొద్దిసేపు నిలిచిపోయాయన్నమాట. నిలిచినవి ప్రథమోదబిందువులు కాదని, అడరు నవాంబు“ధార”లని అంతలోనే కవి మర్చిపోయాడు. కాళిదాసు వర్ణనలో “ఉదబిందువు-లు” అని బహువచనం ఉన్నది కాబట్టి వాటికి అవిరళత్వం చెప్పబడిన మాట నిజమే. ఎంత అవిరళములైనా, అవి నీటిచుక్కలు. “అడరు నవాంబుధారలు” కావు. ఎంత దట్టమైన కనురెప్ప అయినా, ప్రథమోదబిందువులకు వలె అంబు“ధార”లకు ఆ రెప్పపై నిలుకడ ఎలా సాధ్యమని తెలుగు కవికి తోచలేదు. ‘స్థితాః క్షణం పక్ష్మసు’ అన్నది ‘పక్ష్మములన్ వెడ నిల్చి’ అని తెలుగయింది కాని, అది ఉదబిందువులకు అనువర్తించినట్లుగా అంబుధారలకు వర్తింపదు. “ధార” అన్న తర్వాత, అవిచ్ఛిన్నగతి మూలాన “నిలుకడ”కు వీలుండదు కదా.
‘తాడితాధరాః’ అన్న కర్మవాక్యం తెలుగులో ‘మోవిపై పడి’ అయింది. మోవిపై పడిన ధారలు ఏమైనాయో తెలుగు కవి చెప్పకపోవటం వల్ల – క్రిందిపెదవి యొక్క స్వాభావికమృదుత్వం వ్యంజింపబడిన సంగతి శ్లోకాన్ని చదవనివాళ్ళకు తెలియదు. అధ్యాహారవిషయస్ఫురణ కలుగదు. పయోధరముల ఉత్సేధం (ఉన్నతి, కాఠిన్యము), వాటిపై ఉదబిందువుల నిపాతం, తత్ఫలితంగా ఉదబిందువులు చూర్ణితాలు కావటం అన్న కాళిదాసు శ్లోకంలోని అద్భుతావహమైన పరిణామక్రమమంతా తెలుగులో “మోవిపైఁ బడి”, “కుచఘట్టనన్” అన్న కరుకు మాటలతో కుప్పకూలిపోయింది. ఆ కుచఘట్టన వలన – అంటే, స్తనములతోడి ఒరపిడి వలన ఆ అంబుధారలు చెదరి = చెల్లాచెదరై(నందువల్ల); పాఱి = పరువులెత్తి లేదా పునఃప్రవాహగతిని పొంది; రయంబునన్ = వేగంగా (?); ముత్తరంగలన్ = మూడు వళులనెడి విషమరేఖలయందు (తత్తన్మధ్యములందు); మడుగులువాఱి = నిమ్నోన్నతములందు చిక్కినవైనందున మడుగులు కట్టి (?) – అని భావం. ఒక్క వాక్యశకలంలో ఇన్ని అన్వయింపని వ్యర్థపదాలెందుకు?
కొందరు విమర్శకులు “నాభికిన్ + ఎడము + ఆనక + చొచ్చెను” అని పదచ్ఛేదం చేయటం సరికాదు. ఆ పక్షాన యతిభంగం. కొందరు వ్యాఖ్యాతలు “నాభికిన్ + ఎడ + మానక = చోటువిడువక” అని వ్రాసిన అర్థం కూడా సరిపడదు. నాభికి చోటువిడువకపోవటం ఏమిటి? దానికి ‘స్తనముల రాపుచే చెదరి, ప్రవహించి, మూడు వళులందు మడుగులుగా నయి, నాభియందు సంపూర్ణముగా ప్రవేశించెను’ – అని ముద్రితప్రతులలో ఉన్న తాత్పర్యం ఎట్లా సరిపడుతుంది? ‘మడుగు కట్టిన నీటికి’ అన్న అర్థంలో ‘మడుగులు వాఱటం’ అన్న క్రియారూపం ఎట్లా ఏర్పడుతుంది? “మడుగులుగా” అయిన తర్వాత, మళ్ళీ పాఱే ప్రవాహగతి ఎట్లా సిద్ధిస్తుంది? “చోటు విడువక”, “సంపూర్ణముగా ప్రవేశించటం” ఏమిటి? ఇన్ని వ్యర్థపదాలకు అర్థం ఎట్లా పొందుపడుతుంది?
అక్కడ నిజానికి, “నాభి + కెడ + మానక” అని చదువుకోవాలి. “కెడ” అంటే పార్శ్వసంగతి. “చెదరి తోఁ బఱతెంచు చెందమ్మిఱేకులు గెడగొని మొగుపుఁ గెంగేలు గాఁగ” అని కుమారసంభవం (9-72) లోనిదే మరొక ప్రయోగం. జలధారలు వళుల వద్ద మడుగులు కట్టి ఆగిపోక, నాభి వైపునకు సైతం పరువులువారటం మానక – అని కవిహృదయం.
నీటిచుక్కల నాభీప్రవేశాన్ని అభివర్ణించటం నాభియొక్క లోతును సూచించటానికి – అన్నది భావ్యమే. వళులలోనికి జారిన ఉదబిందువులు “చిరేణ” = నెమ్మది నెమ్మదిగా పొక్కిలిని చేరాయని మాత్రమే కాళిదాసు. “మానక చొచ్చెను” అన్నప్పుడు అంబుధారల ప్రవాహగతి అవిచ్ఛిన్నంగా కొనసాగి, శ్లోకభావం భగ్నమైపోయింది. ‘చేరెను’ అనక, “చొచ్చెను” అన్నందువల్ల, అంబుధారలు నాభిలోనికి ప్రవేశించి అంతర్ధానమైపోయినట్లు ఊహింపవలసివస్తుంది. అది నాభియొక్క ప్రకరణోచితమైన గంభీరిమకు తగని పదసంగతి. ఆ విధంగా జటారణ్యంలోనుంచి వెలువడి, చనుదెంచి, రాలుగొని, దట్టమైన కనురెప్పలపైని ఆగి, కుచఘట్టన మూలాన చెల్లాచెదరైన నవాంబుధారలు వళుల వద్ద మడుగులు కట్టి, ఆ మడుగులు మళ్ళీ ప్రవాహగతిని మానక నాభికి అభిముఖంగా పరుగులుతీసి, ఆ నాభియందు చొరబడటం ప్రకృతిసహజం కాదని, కవితాత్మకం అసలే కాదని, నాయికాసౌందర్యవర్ణనలో అనౌచిత్యాపాదకమని కవికి తోచలేదు.
అద్భుతావహమైన కాళిదాసు శ్లోకానికి అసమర్థమైన అనువాదం ఇది. ఇందులో ఏ అలంకారమూ లేదు. శ్లేష అసలే పొందుపడదు. స్వభావోక్తికి తావులేదు. పరికరం పద్యం మొదట్లోనే భగ్నమైపోయింది.
పెద్దలు ఈ మాటను అంటున్నందుకు మన్నించాలి. పూర్వకవుల పద్యాలలో ఈ విధంగా ఇన్ని సరిపెట్టుకోవలసిన అన్వయదోషాలు కనబడేది మచ్చుకు ఒకటి కూడా ఉండదు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాయం హంతి న హన్యతే గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
02/01/2017 10:29 pm
ఇటువంటిదే లోగడ ఒక కథను చదివాను. అందులో వేటగాడూ పులీ తారుమారు కావటం జరుగుతుందని గుర్తు.
ఈ సర్వవ్యాప్తమైన ఆత్మ అనే భావన భారతీయులకు ప్రత్యేకం కావచ్చును. ఇతర సంస్కృతుల్లో కూడా ఇటువంటి భావనలు అక్కడక్కడా తలెత్తినా ఒక సిధ్ధాంతస్థాయిలో అవి వృధ్ధి చెందాయని అనుకోను. భారతీయదృక్పథం ఈ భావనను ఒక సిధ్ధాంతంగా ఎంత ఉన్నతస్థాయికి చేర్చినదంటే ఆ ఆత్మనుండే దృశ్యభావ్యమానములైన సర్వమూ దృశ్యభావ్యమానేతరమైన సర్వమూకూడా అదే అని నిరూపించేంతగా.
అనువాదం బాగుంది. ఐతే అనువాదాల్లోనికి స్థానికతను మరింతగా చొప్పించవచ్చును, ముఖ్యంగా చిన్నచిన్న కథల్లో – పాత్రలపేర్లూ స్థలాలపేర్లూ కూడా మార్పు చేయటం ద్వారా. చివరలో విడిగా ఈ సంగతిని చెప్పవచ్చును. లేదా చివరన ఫలాని భాషలోని ఫలాని రచన ఆథారంగా అని చెప్పటం సరిపోతుంది. దానివలన కథలో చదివించేగుణం మరింతగా వృధ్ధిచెందుతుంది. అవేవో తెలుగులోనికి అనువదితమైన మతగ్రంథాల విచిత్రభాషలాగా కాక సహజసుందరమైన తెలుగులోనికి సాహిత్యానువాదాలు చేయటం వీలైనంతగా చేయాలి. ఇదంతా నా ఉబోస మాత్రమే రచయితకాని ఇతరసాహిత్యకారులు కాని పట్టించుకోవాలని వాదించటం కోసం చెప్పిన మాటలు మాత్రం కావు.
పాకశాలలో పాణినీయం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/29/2017 10:40 pm
పాణిని, ప్రోగ్రామింగ్
కథ రక్తి కట్టించింది, భాషపై రచయితకున్న పట్టు ఆకట్టుకుంది. కాని పాణిని సూత్రాలు ఓ పట్టాన అర్థం కాలేదు; అందుకు కొన్నేళ్ళ పాటైనా శ్రమ పడాలనుకుంటాను. నాకు C తెలుసు గాని సంస్కృతం తెలియదు, కథలోనూ వ్యాఖ్యల్లోనూ కంప్యూటర్ ప్రస్తావన ఉండటాన కొందరికైనా ఆసక్తిగా ఉండొచ్చని ఇది వ్రాస్తున్నాను.
గత శతాబ్దపు మొదటి భాగంలో గణిత పునాదుల మీద ముమ్మరంగా పరిశోధనలు జరిగాయి. 1920 ప్రాంతంలో పాతికేళ్ళయినా నిండని Emil Post అన్న గణిత తార్కికుడు ప్రిన్స్టన్ లో ఉండగా, ఓ production system ప్రతిపాదించాడు. పరిమితమైన గుర్తులని మార్చే సూత్రాల మూలంగా, మౌలికమైన గుర్తులతో మొదలెట్టి, అనేక రూపాలని ఎలా సృష్టించవచ్చో చూపెట్టాడు. మచ్చుకి, రెండు గుర్తులు ( a, b ), అయిదు సూత్రాలు (P->aPa, P->bPb, P->a, P->b, P-> ఎడమ చేతి వైపు ఉన్న దానికి బదులు కుడివైపు ఉన్న దానిని వాడవచ్చు); వీటితో, a, b, aaa, bbb, aba, bab, … ఎటువైపు నుండి చదివినా ఒకే విధంగా ఉండే a, b లతో ఉన్న మాటలన్నిటినీ రాబట్టవచ్చు.
1950ల మధ్యలో MIT కి చెందిన ముప్ఫై ఏళ్ళ లోపల వయసున్న Noam Chomsky భాషాశాస్త్రంలో పెద్ద దుమారం లేపాడు. సృష్టిలో భాష మానవులకి మాత్రమే ఉందనీ, రెండు మూడేళ్ళకే బడీ, వ్యాకరణ పాఠాలూ లేకుండానే, పిల్లలు మాతృభాష నేర్చుకుంటారనీ, అందుకు వాళ్ళకి సార్వత్రిక వ్యాకరణం (Universal Grammar) సహజ సంపత్తుగా ఉండి ఉండాలనీ, అందువలనే ఎక్కడ పెరిగితే అక్కడి భాషని నేర్చుకుంటారని ప్రతిపాదించాడు. మరి ఆ వ్యాకరణ సూత్రాలు ఎలా ఉండొచ్చు? భౌతిక శాస్త్రవేత్తలు కనుక్కునే సూత్రాలలాగే ఇవీ ఉంటాయని మొదలెట్టాడు. పాణిని ఘనతని ప్రశంసిస్తూనే, ఆధునికమైన Post పరిశోధనలను తీసుకొని ఆ సూత్రాల రూపాలలో ఉండే భేదాలని బట్టి నాలుగు వ్యాకరణాలని నిర్వచించాడు: Unrestricted (type-0), Context-Sensitive (type-1), Context-Free (type-2), Regular (type-3). సహజభాషలని దీంట్లో ఎక్కడ చేర్చవచ్చన్నది పరిశోధనకి వదిలివేశాడు. దీనిని Chomsky Hierarchy అంటారు.
John Backus (1977 Turing అవార్డు గ్రహీత) అన్న పాతికేళ్ళ కొలంబియా విద్యార్థి న్యూయార్క్ లో IBM కంప్యూటర్ ని చూసి ఉద్యోగం ఇస్తారా అని అడిగితే అప్పటికప్పుడు ఇంటర్వ్యూ చేసి చేరమన్నారు. దానిని ప్రోగ్రామ్ చెయ్యడం చాలా కష్టంగా ఉందని పై స్థాయి భాషలో ప్రోగ్రాములు వ్రాయాలని, యాజమాన్యాన్ని ఒప్పించి రెండేళ్ళలో 1954లో FORTRAN ని విడుదల చేసి, మనందరికీ మెషీన్ భాష లో ప్రోగ్రాం చేసే బాధ లేకుండా చేశాడు. ఈ భాషల వ్యాకరణాన్ని వివరించడానికి Chomsky Hierarchy లో Context-Free Grammar ఆధారంగా ఓ సంకేత పద్ధతిని ప్రవేశ పెట్టాడు. దానిని Backus Normal Form (BNF) అంటారు. అప్పట్లో ALGOL అన్న భాషని వివరించడానికి దీనిని Peter Naur వాడాడు. C, Java, Pascal, ఇలాంటి భాషలన్నీ ALGOL సంతతే. BNF కి Peter Naur (2005 Turing అవార్డు గ్రహీత) దోహదం చెయ్యటానా, దీంట్లో Normal అన్నదానికి అర్థం లేకపోవడానా, Backus Normal Form కి బదులు Backus Naur Form అనాలని Donald Knuth 1967లో ప్రతిపాదించాడు. కాని దీనిని ఎప్పుడో పాణిని కనుక్కున్నాడు కనుక Panini Backus Form అనాలని కొందరు వాదించారు. బహుశా పేరున్న కంప్యూటర్ సైన్సు వాళ్ళ సమర్థన పెద్దగా లేకపోవడాన అది నిలవ లేదు.
C లో సందిగ్ధానికి తావు లేదన్నారు వేమూరి. అది వాస్తవం కాదు. Dangling else ని ఉదాహరణగా ఇస్తారు: If a then if b then s1 else s2 అన్న దాంట్లో else లోన if కి చెందిందా బయట దానికా అన్నది వ్యాకరణ పరంగా చూస్తే తేలదు. పాణిని పద్ధతిలో అలాంటి అసందిగ్ధతకి తావు లేదని చదివాను [1][2]; రెండూ తెలిసిన చంద్రమోహన్ లాంటి వారెవరైనా వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.
ఏమైనా అంత పకడ్బందీగా ఓ సహజ భాషకి వ్యాకరణం రెండు వేళ ఏళ్ళ క్రితమే సృష్టించారంటే నమ్మలేని సత్యం. అది మన దేశంలో పుట్టిందన్నది గర్వించాల్సిన విషయం.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “On Panini and the Generative Capacity of Contextualized Replacement Systems,” by Gerald Penn and Paul Kiparsky, COLING 2012.
[2] “Panini’s Grammar and Modern Computation,” by John Kadvany, History and Philosophy of Logic, Jan 2016.
ఒకనాటి యువ కథ: గోల గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/26/2017 12:10 am
అసలేముందీ కథలో? అన్నారు.
అసలు కథలో ముఖ్యంగా ఉండవలసినవే పుష్కలంగా ఉన్నాయని సమాధానం.
ఏమిటవి? చదివించే గుణమూ, స్పందింపజేసే గుణమూను.
కథల్లో ఇజాలూ, నిజాలూ, వాదాలూ వివాదాలూ దృక్పథాలూ సిధ్ధాంతాలూ రాధ్ధాంతాలూ సందేశాలూ వంటివి కూరి వ్రాసినంత మాత్రాన అవి మంచికథలుగా తయారు కావు.
ఈమథ్యన చూస్తున్నాను చాలామంది ఏదో ఒక విషయం మీద చిన్నపాటి వ్యాసం ఒకటి తయారు చేసి ఆపైన ఆ విషయాన్నంతా ఒకటి రెండు పాత్రలనోట్లలో క్రుక్కివేసో ఒక లేఖాస్త్రంగా సంధించో అలాంటి మరేదో చిల్లరవేషం వేసి ఆ వ్యాసకళికను కాస్తా కథను చేసిపారేసి హమ్మయ్య అనుకోవటం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే అటువంటి దివ్యరచనలకు బహుమతులూ సంపాదించుకుంటున్నారు.
ఈ చిన్న కథలో తెలుగునాట ఒకనాటి పెళ్ళివారింటి వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అలనాటి మనుషుల తీరుతెన్నులన్నీ కళ్ళకు కట్టినటుగా చూపించారు.
మాటతీర్లూ పెళ్ళిలో జరిగే తంతుల్లో తేడాలు వచ్చి ఉండవచ్చును కాని, మనుష్యుల మనస్తత్త్వాలు అలాగే ఉన్నాయా ఏమన్నా మారాయా అన్న ఆలోచన కలుగుతుంది చదువరికి.
రాసక్రీడాష్టకము గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:
01/14/2017 9:52 pm
జెజ్జాల కృష్ణమోహన రావు గారు అనువదించిన రాసక్రీడాష్టకం చదివాను.
కర్ణామృతంలో చాలా శ్లోకాలు, అర్థం పట్టుపడకపోయినా, వ్యాఖ్యానం అంతుపట్టకపోయినా, పైకి గొంతెత్తి పాడుకోటానికి (చదువుకోటానికి) చాలా బాగా ఉంటాయని నా అభిప్రాయం. మీరు అన్నట్టు ఎందుచేతనో ఎవ్వరూ శ్రద్ధగా పాడి ‘రికార్డ్’ చెయ్యలేదు. తప్పుల తడకగా రకరకాల స్త్రోత్రాలు మాత్రం చేసిపెట్టారు.
మీరు చేసిన అనువాదాలలో చాలా భాగం, సంస్కృత శ్లోకాలలాగా, గొంతెత్తి పాడుకోటానికి (చదువుకోటానికి ) సులువుగా ఉన్నాయి. ఉదాహరణకి, ‘అంగనా మంగనా’ అనువాదం అద్భుతంగా ఉన్నది.
‘కేకి కేకాదృతానేక…’ శ్లోకం లో అనువాద లోపం ఏమీ అగుపడలేదు కాని, అనువాదం పాడుకోడానికి సులువుగా కనిపించలేదు. మొదటిచరణంలో రెండు లఘువులు గొంతుక్కి అడ్డుపడుతున్నట్టనిపించింది. అలాగే ‘చారుచామీకరా భాస భామా విభు,’ శ్లోకంలో మొదటిచరణం చివర ‘పలు’ కొరకరానిదిగా వినిపించింది.
మిగిలిన అనువాదాలన్నీ, నామటుకు నాకు, భేషుగ్గా కని(విని)పించాయి.
మీ శ్రమ అభినందనీయము.
అయితే ఏవిషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. నాకున్న చందోజ్ఞానం సున్న అయితే, నాసంగీత జ్ఞానం అరసున్న. ఇకపోతే, అనువాదపటిమ విసర్గ అని ఒప్పుకోక తప్పదు.
Frances Wilson translated all three SatakA-s into English. It is published by the University of Pennsylvania Press in 1975 as “The Love of Krishna.” Of course, he has paraphrased the SlOkA-s.
వేలూరి వేంకటేశ్వర రావు.
పాకశాలలో పాణినీయం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/05/2017 11:44 am
వాక్యకారం , భాష్యకారం, సూత్రకారం అందరూ కారాలవాళ్ళే. కాని మహానుభావులు. మంచి కథ వ్రాసినందుకు రచయితకు వంద సార్లు నా నమస్కారం.
ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి బి. పవన్ కుమార్ గారి అభిప్రాయం:
12/30/2016 2:54 am
ఔరంగజేబు గురించిన మనకు తెలిసినది పరమత సహనం లేనివాడని, హిందూ, సిక్కు చక్రవర్తుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడని ఆలయాల విద్వంసాలకు పాల్పడేవాడని. కాని ఈ లేఖలో అతని గురించి కన్నా అతను చెప్పిన విషయాలు చాలా వరకు మనకు ఉపయోగపడేవి, నిరుపయోగమైన విద్యను నేర్చుకొనుటకు కాలాన్ని, సమయాన్ని వెచ్చించనక్కర్లేదని మనకు తెలుస్తుంది.
తెలుగు కథల పోటీ గురించి సిరి .లాబాల గారి అభిప్రాయం:
12/17/2016 2:47 am
కధ, కవిత, వ్యాసం, విమర్శ విషయం ఏదైనా కాని వ్రాస్తున్న వాళ్లకు కనీసం చదివి ఓ చిన్న స్పందన ఇచ్చేవాళ్ళు ఎంతైనా అవసరం. కాని ఈ రోజుల్లో పత్రికల్లో ప్రచురణకు నోచుకోలేదే అన్న బాధ చాలా మందిలో ఉండనే ఉంటుంది. ముందుగా మనం చెప్పే విషయం కొంతమందికి అయినా చేరాలి అంటే ఎన్నో మరెన్నో ముఖ పుస్తక సమూహాలతో పాటు చాలా బ్లాగులు వెబ్ పత్రికలు ఉండనే ఉన్నాయి. మనం వ్రాసేదాంట్లో విషయం ఉంటే మనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడతారు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వ్రాస్తూ ఉంటేనే మనలో ఉండే నాణ్యత కూడా పెరుగుతుంది.
సిరి. లాబాల
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
12/02/2016 11:38 pm
మాన్యులు శ్రీ తః తః గారికి
నమస్కారములతో,
లేఖనవ్యతిక్రమం సవరణకు హృయదయపూర్వక ధన్యవాదాలు. ‘కలే శుక్రే’ అని రామాశ్రమి. ‘కలే రేతసి వ్రియతే ఉపయుజ్యతే’ అని అమరకోశ ముకుట వ్యాఖ్య. తెలుగు వాక్యంలో ‘ఉపయోజ్యము’ అన్నది సరైన రూపం. ఉపోపసర్గాత్మకమైన యుజ్యము కూడా సాధ్యమే కాని, నా ఉద్దేశం ఉపయోజ్యమనే. “కలేవరం, గాత్రం వపుః సంహననం శరీరం వర్ష్మ విగ్రహః, కాయో దేహః క్లీబపుంసోః స్త్రియాం మూర్తి స్తను స్తనూః” అని అమరకోశం. ప్రతిసంస్కృతములు (ఏకార్థవాచక పర్యాయపదములు) కాబట్టి కలేవర గాత్ర తను శరీరాదులన్నీ లోకమర్యాదానుసారం స్త్రీపురుషతిర్యక్కులకు పర్యాయత్వాన అనువర్తనీయములే కదా.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి కె. వి. ఎస్. రామారావు గారి అభిప్రాయం:
11/26/2016 3:58 am
శ్రీ రవి గారు:
కాని మీరిచ్చిన సూత్రం “అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగకారణమ్” అర్థం “రసభంగమే అనౌచిత్యం” అని కాదండి. రసభంగం ఐతే దానికి కారణం అనౌచిత్యమే తప్ప మరొకటి కాదు, అనండి. రసభంగం కానప్పుడు అనౌచిత్యం ఉండదని అది చెప్పటం లేదండి. మీరు కార్యకారణాల్ని సమీకరించేశారు. లాక్షణిక సాంప్రదాయంలో తర్కం వేరేరకంగా వుంటుందేమో నాకు తెలీదు కాని ఇక్కడ కార్యం రసభంగం, కారణం అనౌచిత్యం అండి. రెండూ ఒకటే కావండి. ఆనందవర్ధనుడికి తర్కశాస్త్రంలో మంచిప్రవేశమే వుండి వుంటుందండి. కనక ఆనందవర్ధనుడి ప్రకారం ఐనా రసభంగం లేనంత మాత్రాన అనౌచిత్యం లేదని సిద్ధాంతీకరించలేమండి.
శ్రీ రంగ గారు:
Narayana Rao & Shulman’s work has many more interesting, innovative insights about Srinatha and his inimitable art, in it. You’d be lending a helping hand in finding a right place for Telugu literature in the global literary criticism field by buying a copy of the book, and encouraging everyone else interested in this subject to do so.
ఈ వ్యాసం గురించి నేను చెప్పవలసిందంతా చెప్పేశానని అనుకుంటున్నాను. పైగా సాహిత్యం నా hobby మాత్రమే. చూసుకోవలసిన వ్యవహారాలు ఇంకా చాలా వున్నాయి. సెలవు.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి రవి గారి అభిప్రాయం:
11/22/2016 4:49 am
కె.వి.యస్. రామారావు గారికి,
ఏ విధంగా ఆలోచించినా మీరు ఉటంకిస్తున్న తర్కం సమగ్రంగా లేదని అనిపిస్తుంది.
ఆ మూడవ అడుగు తార్కికం అవునో కాదో కానీ అది లాక్షణిక సాంప్రదాయమండి. “అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగకారణమ్” – అని ఆనందవర్ధనుడు. తార్కికమా, అతార్కికమా అన్న విషయం శ్రీనాథుని కాలాన్ని బట్టి ఊహించాలి. ఈ కాలపు మన ఆలోచనలో తర్కాన్ని శ్రీనాథునిపై ఆరోపించటం సబబెలా అవుతుంది? ఆ కాలం నాటికి లాక్షణిక సాంప్రదాయం ప్రకారం రసభంగమే అనౌచిత్యం.
మూలభాషలో శబ్దసమూహాలు గమ్యభాషలో అనుచితార్థం అయే అవకాశాన్ని పురస్కరించుకుని, ఒక సరికొత్త లాక్షణిక సాంప్రదాయానికి, సరికొత్త మౌలిక ప్రతిపాదనకూ శ్రీనాథుడు నడుం కట్టడం అన్నది దూరాన్వయమైన విషయమండి. ఒక వేళ అలా ఊహించినా కొన్ని ఇబ్బందులు వస్తాయి.
మూలభాష, గమ్యభాష – అని కాకుండా సంస్కృతమైనా, ప్రాకృతమైనా, ఏదేని ఒక కావ్యానికి సంబంధించి ’అశ్లీలము, అమంగళకరమూ, వ్రీడాజనకము’ అయిన శబ్దాలు పరిహార్యాలు అని మమ్మటుడు కావ్యప్రకాశంలోని దోషప్రకరణం లో నిర్దేశించాడు. పైన మీరు చెప్పిన ’గమ్యభాషలో అనుచితార్థం” అన్న విషయం మమ్మటుని దోషనిర్వచనంలో (ఇంకా నేయార్థమూ ఇత్యాది దోషాదులలో) భాగమై విలీనమవుతుంది. లాక్షణికులు తమ ఉదాహరణలలో ప్రాకృత కావ్యాలనూ ఉదాహరించారు. అందువలన వారి నిర్దేశాలు సంస్కృతానికే కాక సంస్కృతేతర భాషల కావ్యాలకూ వర్తిస్తాయి.
మీరు చెప్పిన ఉదాహరణతోనే Acapulco ను తెనుగులో మూలభాషలో నాదానుగుణంగా యథాతథంగా అనువదించి తెలుగులో ఉపయోగిస్తే అది (సహృదయుడైన సామాజికుని దృష్ట్యా) అశ్లీలశబ్దమవుతుంది. ఇది కావ్యప్రకాశకారుడి ప్రకారం దోషం. అది వరకే ఏర్పడి ఉన్న లాక్షణిక సాంప్రదాయం.ఆ సాంప్రదాయాన్ని గుర్తుంచుకుని రచన చేసి ఉంటాడు కానీ, తిరిగి కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పే అవసరం శ్రీనాథునికి ఉండరాదు.
అందుచేత అనువాదం కోసం ప్రత్యేకమైన ’అనౌచిత్య నిర్వచనాన్ని’ తనకు తానే శ్రీనాథుడు నిర్దేశించుకునే అవసరం లేదు. ఒకవేళ నిర్దేశించుకున్నా అందుకు మూలం ఎక్కడో ఉండాలి. లేదా ఆ విషయం గురించి సమగ్రంగా ఒక లాక్షణిక గ్రంథాన్ని వెలువర్చి, ఈ ప్రతిపాదనను సాకల్యంగా చర్చించి ఉండాలి. ఎందుకంటే సంస్కృత అలంకారిక గ్రంథాలన్నీ ఆ ధోరణిలో రచింపబడినవే కాబట్టి. అలాంటివేవీ మనకు కానరావు.
మరొక పార్శ్వం. శ్రీనాథుని కంటే ముందు మూలఘటిక కేతన – దశకుమారచరితమ్ వచన కావ్యాన్ని తెనుగు పద్యానువాదం చేశాడు. మూలభాష సంస్కృతంలోని దండి దశకుమారచరితమ్ – పదలాలిత్యానికి, మాధుర్యాది గుణాలకు ప్రతీతి. నిజంగా అయితే శబ్దమాధుర్యాన్ని, సంస్కృతస్వరనాదాన్ని శ్రీనాథునికి ముందువాడైన కేతన పరిగణనలోనికి తీసుకొని ఉండాలని ఊహించటం తర్కబద్దం. ఎందుకంటే మూలకావ్యంలోని ప్రధానలక్షణమే ’పదలాలిత్యం’ అన్నారు కనుక. తద్వారా శ్రీనాథునికి కేతన మార్గదర్శకం కావాలి. అలా జరిగినట్టు లేదు. కేతనను శ్రీనాథుడు ఉదాహరింపలేదు.
శ్రీహర్షుని నైషధీయచరితమ్ – శృంగారరససంచితమైన ప్రౌఢకావ్యము. ఈ కావ్యం ప్రౌఢిమకు, పాండిత్యానికి పేరు పొంది “నైషధం విద్వదౌషధమ్’ అనిపించుకున్నది కానీ, దండి కావ్యంలా పదలాలిత్యానికి, జయదేవుని గీతగోవింద కావ్యంలా శబ్దసౌందర్యానికి పేరుపడిన కావ్యం కాదని పండితుల తీర్పు. నైషధాన్ని అనుసరించిన శ్రీనాథుడు – అందులో పాండిత్యాన్ని, రసనిర్భరతను, ధ్వని మార్గాదులను గుర్తెఱిగి తెనుగున అనువదింపడానికి పాల్పడ్డం ఔచిత్యం అవాలి కానీ మీరు చెప్పిన విధంగా మూలభాషపు శబ్దనాదాన్ని పరిగణనలోనికి తీసుకోవడం అన్నది అంతగా పొసగని కారణం. అదే కారణమని భావిస్తే కూలకంషంగా మూల భాషలో కావ్యాన్ని, అందులో శబ్దసౌందర్యానికి, స్వరమాధుర్యానికి ముఖ్యకారణాలు అయిన యమక, అనుప్రాసాది గుణాలను మూలకావ్యం యొక్క శ్లోకాలలో వెతికి వాటి తెనుగు అనువాదాలను సరి చూసి సాకల్యంగా విషయాన్ని ప్రతిపాదించి శ్రీనాథుడు చెప్పిన ’అనౌచిత్యంబు పరిహరించి’ అర్థం ఇదేనని నిరూపించాలి.(శ్రీ వేల్చేరు నారాయణరావు గారు, షూల్మన్ గారు అలా చేశారో లేదో నాకు తెలియదు.) తర్కబద్ధం అన్న ఒక్కమాట తర్కానికి సమగ్రత నివ్వదు.
ఏతావతా – ఈ విషయంలో శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వివరణయే సముచితమని నా వ్యక్తిగత అభిప్రాయం.
తన మాట కోసం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
11/21/2016 10:19 am
లక్ష్మీదేవిగారు నా అభిప్రాయాన్ని సానుకూలంగా తీసుకొన్నందుకు కృతజ్ఞుడిని. కథను తీసుకోండి. అవసరమైనట్లైతే కథనవిధానాన్ని కూడా తీసుకోండి. కాని మీరే మీదైన మంచి వ్యావహారికంలో మీశైలిలో వ్రాయండి. మీ కథలూ అనువాదాలూ మరిన్ని చదవాలని ఆశిస్తున్నాను.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి lyla yerneni గారి అభిప్రాయం:
11/17/2016 6:29 pm
సంస్కృతం లోని హర్ష నైషధం చదవలేను. కాని శ్రీ నాథుడి శృంగారనైషధము ఇదివరలో చదివాను. ఇప్పుడు ఇంకొంచెం మెరుగ్గా చదవగలను. ఎమెస్కో పుస్తకం అట్ట మీద శ్రీనాధుడు అని ఉంది. లోపల చాలా వరకూ శ్రీ నాథుడు అని ఉంది. ఈ రకం పొట్టలో చుక్కల అచ్చు తప్పులు నేను కనిపెట్టగలగటం, నా కంటి డాక్టర్లు మంచి కరెక్షెన్ చేస్తారని చెపుతుంది. ఈ తెలుగు మాటలు ఎలా రాయటం సరైనదో, నేను తప్పులు రాసినప్పుడు కొందరు స్నేహితులు చెపుతారు. కాని, నేనేం లెక్క చేసుకోను. వాదన సాగించి అలాటి అంశాల మీద చిన్న సైజు డిబేట్ లు నడపటం నాకు చాలా ఇష్టం. దరిమిలా కొన్ని తప్పులు సరిచేసుకుంటాననుకోండి.
చాలా డిబేట్ లలో ఎవరు గెలిచారనేది, స్పష్టం కాదు. ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల డిబేట్లు ఎవరు గెల్చారనేది, పోల్స్ ఐతే, ప్రతి డిబేట్ హిల్లరీ నే గెలిచిందని చెప్పాయి. ట్రంప్ తనే గెలిచాడని నిక్కచ్చిగా చెప్పాడు. (ఎలక్షన్ లో ట్రంప్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందేలా గెలిచాడు. నాకైతే సువర్ణ శ్రీ, బెన్ హర్ ఛారియెట్ రేస్ చూసినట్టనిపించింది. It is a fantastic drama. I am thrilled. I congratulate the victor.)
ఏ వివాదం లోనూ ఒకరు నిక్కచ్చిగా గెలిచారనే పరిస్ధితి ఇప్పుడు ప్రపంచంలో లేదు. ఈ వ్యాస విషయం లోనూ లేదు. పొట్టలో చుక్క ఉన్న/ లేని విషయం ఆధారంగా నేను ఇద్దరు శ్రీనాథులు ఉన్నారనొచ్చు. ముగ్గురు డింఢిమ భట్టులుండగా లేంది, ఇద్దరు సర్వజ్ఞ సింగభూపాలురుండగా లేంది ఇద్దరు శ్రీనాధులెందుకు ఉండరాదు?
అసలు, ఈమాటలోనే చూడండి, ఎందరో వేంకటేశ్వరరావులు. తెలుగు దేశంలో మనవడికి తాత పేరు పెట్టే సంప్రదాయంలో, దేవుళ్ల పేర్లుంచే వ్యాపకంలో, ఒకే పేరు వాళ్లు లక్షలు లక్షలు. ఇక ఆ పేరూ ఈ పేరూ పెట్టుకుని రాసే అలవాటు కూడా ఉన్నప్పుడు, వేమ భూపాలుడు, వీర భూపాలుడూ ఒకరా, ఇద్దరా అనేదే కాక, ఈ ఇద్దరి రాజుల బదులూ డబ్బు కోసం శ్రీ నాథుడే రకరకాల కావ్యాలు రాసాడేమో అని కూడా అనుకోవచ్చు. పోనీ కావ్యంలో కంటెంట్ చూసి, రచయితను గుర్తు పడదామంటే, ఐదుగురు నల మహారాజులను ఒకేసారి చూసిన దమయంతి అవస్థ. అన్ని ప్రబంధ కావ్యాలూ ఒకలాగే ఉంటాయి. అట్టలు చూసి గుర్తు పడదామంటే, అన్నమయ్యకీ, వీరేశలింగం గారి ఆంధ్ర కవుల చరిత్రకూ ఒకే లాటి బొమ్మ వేస్తాడు డా. బాపు. అన్ని తెలుగు పుస్తకాల మీదా ఆయన బొమ్మలేనయ్యె!
వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్రము లో ‘మాతృక’ లంటే ఏమిటో, ‘పుత్రిక’ లంటే ఏమిటో చెప్పారు. పాపం, పంతులు గారు తెలుగు కవులను గూర్చి రాయటానికి, మాతృకలను సంపాదించుకోటానికి చాలా ప్రయత్నించారు. ఐనా ఇతరులు ఆయనకు అందనీయకుండా తొక్కి పట్టినట్టున్నారు. మదరాసులో లైబ్రరీ లకు వెళ్లి కొన్ని మాతృకల నుండి ‘పుత్రిక’లను ఆయనే దత్తత చేసుకున్నారు. ఆ కష్టాలు చూస్తే, అప్పుడే దొరకని తాళ పత్ర గ్రంధాలు ఇప్పుడింకేం దొరుకుతాయీ అనిపిస్తుంది. ఆయన పీఠికలు, శ్రీనాథుడి పైన వ్యాసం చూస్తే, కొత్త మెటీరియల్ దొరికినప్పుడల్లా ఆయన వ్యాసాలు upgrade చేస్తూ వచ్చాడని తెలిసింది. కవుల కథలు చాలా వరకూ అతుకుల బొంతలనీ, ఇప్పటి వీకీపీడియాల లాగానే ఏదీ 100% నమ్మేందుకు వీలు లేదనీ తెలుస్తుంది.
అలాగే, అంతకు ముందు కావ్యాలలో కూడా మెటీరియల్ తర్వాత తర్వాత చేర్చి ఉండొచ్చు. నాకూ శృంగార నైషధం చివరి లోని ‘కావ్యోపసంహారము’ out of place లాగానే అనిపించింది. Insert లాగా అనిపించింది. వేమభూపాలుడో, అంకింతం పుచ్చుకున్న అమాత్యుడో, శ్రీ నాథుడి గొంతు మీద కూర్చుని, అక్కడో పద్యం, చివర్లో వచనం, ఇరికింప చేసారా అని సందేహం కలిగింది. అలా చేసే పవర్ వాళ్లకు ఉంది.
భాషను చూసి, శ్రీనాధుడి పద్యం ఏదో చెబుదామా అంటే, పొట్టకూటికై కవి వేషం మార్చుకుంటున్నాడు, పరగణా మారినప్పుడల్లా భాష, యాస మారక తప్పదే. భాష మీద భద్రిరాజు గారి రీసర్చ్ అయ్యే లోపల, తెలుగు వాళ్లు ఎన్నో సార్లు జిల్లాలు, రాష్ట్రాలు మారి ఉంటారు. అందుకని అలా చాలా స్లోగా సంవత్సరాల మీద సాగే ఆ రీసెర్చ్ మీద నాకంత నమ్మకం లేదు.
ఇక కావ్యంలో ఉన్న అశ్లీలం పట్టి రచయిత ఎవరో నిర్ణయం చేద్దామంటే, వీరేశ లింగం పంతులు గారే ఆ ప్రయత్నంలో పరాజయం పొందారు. పోతన కవి, భోగినీ దండకం రాస్తే -భాగవతం రాసిన పరమ భాగవతోత్తముడు, అలాటి రచన రాయటమేంటని, ఆయన కక్కా మింగా లేకపోయాడు. ఒక వేశ్య, రావు సింగభూపాలుని కామించటమేమిటి? ఆయన ఆమె ముద్దు చెల్లించట మేమిటి? పైగా వేశ్యమాతను ఏనుగు ఎక్కించి ఊరేగించటమేమిటని, ఆయన పళ్లు పటపటలాడినయ్యి. అలాటి బోగం stuff/అశ్లీలం? పోతన వ్రాసి ఉండడన్నారు. కానీ ఇతరులు మందలించాక, అప్పుడు మంచె దిగొచ్చి -తనది సైన్స్ దృక్పథం, నిజం చెప్పటమే తన ధ్యేయమని, మనకు సంజాయిషీ ఇచ్చి, పోతనకు pardon ఇచ్చారు.
ఐతే శ్రీనాధుడి విషయంలో వీరేశలింగం గారు నెగెటివ్ గా విజృంభించారు. ఆయన దృష్టిలో శ్రీనాథుడు చెడిపోయినట్టు లెక్క. వేశ్యా సంపర్కం ఆయనకు గిట్టదు. పంతులు గారు -ఈ శ్రీ నాథుడికి ద్రాక్షారామం నగరం లో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర కులస్థులెవరూ ఊళ్లో కనపడలేదు, భోగం స్త్రీలు మాత్రమే కనిపించారని – వారి గ్రంధంలో ఉడుక్కుంటాడు. ఆ కులాలు కల్పించిన మానవ సంఘమే కదా వేశ్యా కులం కూడా కల్పించింది. వేశ్యలు వారు వారంతట వారే మొలుచుకు వచ్చారా? ఆ విషయం ఆయన ఎందుకు గమనించడు?
జాషువా కవి ‘గబ్బిలం’ ఖండకావ్యం మొదట్లోనే – నేను కడజాతిలో జన్మించిన వాడిని, భారత వీరులకు చెప్పులు కుట్టేవాడిని అని ఆయన అన్నప్పుడు, ఆ కవికే న్యూనతా భావం ఉందా? తీరి కూర్చుని నేను ఇతర తెలుగువారి కంటే తక్కువ అని తనే ఊహించుకుంటున్నాడా? లేదు. వాళ్ల అమ్మా నాన్నా, ఒరే నాయనా, మనం మాల వాళ్లంరా మాదిగ వాళ్లంరా అని చెపితేనే జాషువాకి తెలిసింది. ఇతర తెలుగులు – నువ్వు మమ్మల్ని అంటుకోకూడదురా, నువ్వు ఎడంగా ఉండు అంటే జాషువాకి తెలిసింది. ఏ కులాల వాళ్లకు కూడా, వాళ్ల పెద్దలు చెపితేనే, వారు అగ్రవర్ణాల వారనో, నిమ్నవర్ణాల వారనో తెలిసింది. భోగం కులం అనేది ఒకటి ఏర్పడి పోయాక, అందులో పుట్టి పెరిగిన భోగం పిల్లకి, వేశ్యమాత -అమ్మా, నువ్వు ఈ టక్కులు వెయ్యాలి, విటులు వచ్చినప్పుడు ఐటమైజ్ చేసి ప్రతి సర్వీస్ కి ఇలా కలెక్ట్ చెయ్యాలి అని (ఇప్పటి డాక్టర్లకు, లాయర్లకు, వాళ్ల మేనేజింగ్ పార్ట్నర్ చెపితే తెలిసినట్టు) చెపితేనే గదా తెలిసింది. మరి ఆ పాక్షికతలు ఆయన గమనించడేం? సంఘాన్ని సంస్కరించాలనుకున్నవాడు, సంఘం సమగ్రావగాహన లేకుండా, ఆ ఏర్పాటుల ముందు వెనకలు తెలియకుండా, తన బయాస్ అలానే ఉంచుకుని, ఇతరుల నీతిమీద హేయత చూపటం సబబా?
అశ్లీలాలు – అవి ఏవో ఈ శృంగార కావ్యాల్లో నాకు తెలియదు. డాక్టర్లకు, బూతు perception ఇతరులకన్నా వేరుగా ఉండొచ్చేమో. వీరేశలింగం గారికి అనేక ఆసక్తులు. ఒకప్పుడు సైన్స్ మీద మోజు కలిగి, human body dissection చూడ్డానికి వెళ్లి, అక్కడ అమాంతం మూర్ఛపోతే అక్కడి వారు, వారిని బైటకు చేరేసారు. డాక్టర్లకు ఈ నాజూకులు ఒప్పవు. తెలుగు కవుల మీద, భాష మీద, పంతులుగారికి మరింత ఆసక్తి. భక్తి, నీతి విషయంలో ఆయనకు మధన జాస్తి. చాలా తెలుగు పుస్తకాల్లో ఆయన మోతాదు మించిన శృంగారం, ఉన్నదనుకున్న చోట్ల వాటిని ఎత్తి చూపారు. ఆ భాగం (అమ్మ బాబోయ్! పొరపాటున భగం అని రాసా. I think it is a dangerous word. Trump – grab her by the pussy- అంటే ఎంత గోలయ్యింది!). మాత్రమే చదివి, శృంగార ప్రియులు విరమించుకోవచ్చు. నిజంగా, ఈ బూతు/ శృంగారం distinction నాకు తెలియటం లేదు. భారద్దేశంలో శివలింగాలు చాలా చోట ఉంటాయి. ఆ రాతి స్కల్ప్చర్, స్త్రీ యోని, పురుష లింగమే కదా. అన్ని చోట్లా పబ్లిగ్గా, సెక్స్ ఆర్గన్స్ ని ఆరాధిస్తున్నప్పుడు, ఇదివరకటి, ఇప్పటి కావ్యాల్లో వాటిని వర్ణిస్తే మాత్రమేం?
ఈ నా కామెంట్ వీరేశలింగం గురించా, అశ్లీలం గురించా అంటే -కాదు కాని, తెలుగు అనువాదంలో ఏం అంశాలు ఎలా నిభాయించాడో, శ్రీ నాధుడు నైషధంలో కావ్యోపహారం లో చెప్పాడని, పంతులుగారు చెప్పగా, తర్వాత ఎందరో అదే ఆధారంగా తీసుకున్నందున, అసలు పంతులు గారి ఏ ఆలోచనలో సవ్యత లెంతెంత? అని నేను ఆలోచిస్తున్నా. అశ్లీలం అనేది ఉన్నదని, పరిహరించాలనీ అనుకోకుండా, మోరలిస్టిక్ హై హార్స్ ఎక్కకుండా, లింగ్విస్టిక్ వర్క్స్ వేరు భాష లోకి తర్జుమాలు చేసేవారు, వెనకటి వాళ్లు/ఇప్పటి వాళ్లు, ఏం రాసారో ఆ రాసింది రాసినట్లు ఇవ్వగలిగితే చాలు, అని నాకనిపిస్తుంది.
ఏల్చూరి వ్యాసం ఆసక్తికరంగా ఉన్నది. వ్యాసమే కాక మరిన్ని ఇతర పుస్తకాలు తీసి చదివాను. నారాయణరావు, షుల్మన్ ల వ్యాసం కూడా నాకు చదవాలని కుతూహలంగా ఉంది. ఇంకా చదవలేదు.
Thanks
Lyla.
PS: Acapulco ను నేను తెలుగులో రాస్తే, ఆకపూల్కో అని pronunciation.com లో విన్న విధంగా రాస్తాను. I remember reading about a young lady from Bombay who had problem correctly saying ‘José’, recognized the need, and created such a tool.
తెగులుకి శిక్ష గురించి మాగంటి వంశీ గారి అభిప్రాయం:
11/14/2016 7:15 pm
అయ్యా దంతుర్తి శర్మగారండి
బాగుంది. చాలా చక్కగా రాశినారు. బ్లాగు ప్రపంచం నశించి చాలా రోజులైపోయినా కూడా ఆ లోకానికి మళ్ళీ తీసుకుపోయినారు. చదివి సంతసించినాను. ధన్యవాదాలు.
పోతే, ఒక చిన్న మాట – ఎన్నో వందల సంవత్సరాలుగా మీ కామెంట్లు చదువుతున్నాను. మీరు ఏ కామెంటు రాసినా అందులో “నాకొచ్చిన తెలుగు అధమం. అన్ని తప్పులూ నావే. నాది మట్టి బుర్ర. నాకు పదో తరగతి తెలుగు మాత్రమే వచ్చు. నేను అమాయకుణ్ణి. నా రాతలు అమాయకత్వం. ఈమాటలో రాయటం నా భాగ్యం. వాళ్ళు అసలు ఎట్లా నా రాతల్ని అనుమతిస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి…” అంటూ డిప్రెషను టు ద పవర్ ఆఫ్ 501 డిటర్జెంటు సబ్బులా తళతళా చదివేవాళ్ళను తోముతున్నారు. ఎంత మిమ్మల్ని తక్కువ చేసుకుంటే అంత అవతలివాళ్ళు సంతోషపడి మళ్ళొక కామెంటు రాయకుండా ఉంటారని మీరేసిన కుంగుబాటు ప్లాను చాలా ఇదిగా ఉన్నది. దీనికన్నా మీరసలు ఏ కామెంటు రాయకపోటం మంచిది.
భవదీయుడు
వంశీ
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
11/13/2016 8:41 am
పూజ్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యులవారి సన్నిధిని
నమస్కారములతో,
వ్యాసప్రతిపాదితార్థం మీ అనుమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషం కలిగింది. కావ్యోపసంహారవచనం వేమభూపాలుని మాటకు అనువర్తనమే గాని ఆంధ్రీకరణపద్ధతికి సూచకం కాదన్న అంశాన్ని నొక్కిచెప్పేందుకు నైషధీయచరితంలో అనౌచిత్యదోషారోపణ సాధ్యం కాదని వ్రాసిన మాట నిజమే. శ్రీహర్షుడు క్షేమేంద్రుని ఔచిత్యసిద్ధాంతాన్ని గుర్తెరిగి, దానిని ఆమోదించినవాడని చెప్పేందుకు నైషధీయచరితంలోనే సాక్ష్యాలున్నాయి. ఆధునికదృష్టితో చూచినప్పటి నిర్వేలములైన శృంగారవర్ణనలు తప్ప – లాక్షణికదృష్టితో అన్వయింపదగిన అనౌచిత్యాలు అందులో లేవనే ఇప్పటికీ నా అభిప్రాయం. అందులోని కథ, కథనం, శైలి, కల్పనలు మొదలైనవానిని గూర్చి సుశీల్ కుమార్ దే గారి వంటి పండితుల తీవ్రవిమర్శలన్నీ వ్యాసప్రతిపాదితానికి సంబంధించినవి కావు గనుక నేను ప్రస్తావింపలేదు.
“చింతామణీ మంత్రచింతనఫలంబు” అన్న శ్రీ రావూరి దొరసామిశర్మ గారి పాఠస్వీకారం ఎట్లాగూ (8-203) లోని పద్యానికి విరుద్ధమే గాక శ్రుతకథావిరుద్ధం కూడా అవుతుంది. శ్రీహర్షుడు తన్మంత్రసిద్ధుడని నిరూపించే కావ్యభాగాలను జీవాతు వ్యాఖ్యలో మల్లినాథుడు వేయినోళ్ళతో మెచ్చుకొన్నాడు. వాటిని అన్వయించి చెప్పాడు. “అవామా వామార్ధే” శ్లోకానికి వ్యాఖ్యాతలు వివరించిన భాగాలన్నీ చూడదగినవే. ఆయన “చింతామణీ మంత్రచింతనపరుండు” కావటం వల్లనే ఆ రచన, ఆ అన్వయం సాధ్యమవుతాయి. “తల్లిదండ్రుల చింతనఫలం” అన్న అర్థంలో ఆ అన్వయం సార్థకం కానందువల్ల వేదం వారి పాఠమే స్వీకార్యమని చెప్పాలి. దురదృష్టవశాత్తు తెలుగుదేశంలో నైషధం వ్రాతప్రతులు ఎక్కువగా బ్రతికిలేవు. పరస్పరవిరుద్ధాంశాలు ఏ వ్రాతప్రతిలో ఏ విధంగా ఉన్నాయో సరిచూస్తే కాని ఈ సమస్యను పరిష్కరింపలేము.
మీవంటి ప్రామాణికులు ఈ వ్యాసాన్ని చదివి ఉండటమే నాకు గొప్ప విషయం. మీ స్పందన నన్ను ధన్యుణ్ణి కావించింది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి desikachary గారి అభిప్రాయం:
11/13/2016 2:42 am
పాండిత్యప్రకర్షతో తర్కకర్కశముగా సాగిన మురళీధరరావుగారి వ్యాసము ప్రశంసనీయము. ‘మాతృక’కు శ్రీనాథుని కుపలభ్యమానమైన తాళప్రతి యను అర్థమును జెప్పుట సమంజసముగానే యున్నది. కాని ‘ప్రమాదో ధీమతామపి’ అని యున్నదే కదా! శ్రీహర్షుని కావ్యము పరిపూర్ణముగా దోషరహితమను వాదన అంత బలముగా చేయవలసియుండినది కాదనిపించుచున్నది. ఎమస్కో శృంగారనైషధప్రతికి ఉపోద్ఘాతమును వ్రాయుచు విశ్వనాథవారు ‘నిజానికి, సంస్కృతకావ్యములో కొన్ని పచ్చి బూతులవలె కనిపించునవి యున్నవి. శ్రీనాథుడు వాని నన్నిటిని పరిహరించ లేదు. కొన్నిటిని శ్రీనాథుడును వ్రాసెను. ఎన్నని పరిహరించును?’ అన్నారు. కాని ఈదోషనిర్ణయము చేయు పండితు లీకాలములో నొక్కరైన ఉన్నారా అనునది సంశయాస్పదమే. ఎమెస్కో ప్రతి సంపాదకులైన శ్రీరావూరి దొరసామిశర్మగారు పూర్వముద్రితములైన 5 ప్రతులను, తమ యొద్ద నున్న తాళప్రతిని పరిశీలించి పాఠనిర్ణయము చేసినారు. వారు ‘కవిరాజరాజి’ అన్న ప్రథమాశ్వాసంలోని సీసపద్యంలో ‘చింతామణీమంత్రచింతనఫలంబు’ అన్న పాఠమునే గ్రహించినారు. దీనివల్ల దీనిని ‘చింతనపరుండు’ అని యెంచి చేసిన మురళీధరరావుగారి వివేచన కొంతవఱకు బలహీనపడుచున్నది. సంస్కృతనైషధములో ప్రతిసర్గ చివర ‘ఆనంద’ శబ్దయుతమైన శ్లోక మున్నమాట నిజమేకాని, గ్రంథాంతమున శ్రీనాథుడు వాడిన ‘పరమానందంబు నొందిరి’ అను పదమునుకు ఇది కారణమని ఇదమిత్థముగా చెప్పలేము. ప్రతి ఆశ్వాసాంతమునందును ఇట్టిపదము లేదు గదా! ఇతరకవులును (ఉదా: ప్రభావతీప్రద్యుమ్నము) గ్రంథాంతమున ఇట్టి పదమును వాడిరి. ఏమైనను ఈ వ్యాసము తర్కకర్కశముగా నున్న దనుటలో విప్రతిపత్తి లేదు.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
11/13/2016 1:27 am
మిత్రధేయులు శ్రీ అనామకుడు గారికి
నమస్కారములతో,
మీ లేఖలోని ఆరోగ్యశ్రేయోభిలాషిత ఆ అవసరం ఎంతో ఉన్న నా మనసుకెంతో ఆహ్లాదాన్ని కూర్చింది. వ్యాసాన్ని ఆసాంతం చదివి ఔదార్యంతో స్పందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మమ్మట-శ్రీహర్షుల బంధుత్వోదంత జనశ్రుతిని మొట్టమొదట 1877లో డా. బ్యూలర్ గారు తమ Kashmir Report లో వెలుగులోకి తెచ్చారు. అది ప్రసిద్ధికెక్కింది కాని, ఆయన దానిని చారిత్రికసత్యం కాజాలదని వ్రాసిన వివరాలు మాత్రం ఎందుకనో ప్రచారానికి నోచుకోలేదు. మమ్మటుని కావ్యప్రకాశాన్ని అధికరించి మాణిక్యచంద్రుని అద్భుతావహమైన సంకేత వ్యాఖ్య క్రీ.శ. 1159-1160 లో వెలువడింది. దాని సాక్ష్యాన్ని బట్టి కావ్యప్రకాశ రచనకు ఉత్తరావధి (terminus ad quem) క్రీ.శ. 1110 అని నిశ్చయింపబడుతున్నది. ఆధునిక విమర్శకులు ఆయన క్రీ.శ. 1050-1120 ల మధ్యకాలంలో జీవించినవాడని ఊహిస్తున్నారు. శ్రీహర్షుని జీవితకాలం క్రీ.శ. 1115-1185 (±) కాగా, నైషధీయ చరితం పన్నెండవ శతాబ్ది ఉత్తరార్ధంలో (బహుశః క్రీ.శ. 1165-1175 ల నడిమి కాలంలో) రచింపబడింది. మమ్మటాచార్యుడు క్రీ.శ. 1050 ప్రాంతాల జన్మించి ఉంటే తద్రచన నాటికి కనీసం 110-120 ఏళ్ళవాడై ఉంటాడు. గౌడదేశీయుడైన శ్రీహర్షుని కాశ్మీరకునిగా నిరూపింపదలచినవారెవరో ఈ కథను కల్పించి ఉంటారు. నైషధీయ చరితంలోని ‘తవ వర్త్మని వర్తతాం’ (2-62) అన్న శ్లోకాన్ని మమ్మటుడు, “నేనైతే ఈ విధంగా సవరించి ఉండేవాణ్ణి” అని చెప్పిన సవరణ కథ కూడా ఒకటున్నది. అదే నిజమైతే, మమ్మటునికి నైషధీయం అసలు అర్థమే కాలేదనుకోవాలి. అందువల్ల మేనల్లుని కృతిని చూసి దోషభూయిష్ఠమని వ్యాఖ్యానించటం, మినపరొట్టెల కథ వంటివన్నీ వట్టి కట్టుకథలు మాత్రమే అని మనము నిశ్చయింపవచ్చును.
సంస్కృత సాహిత్యశాస్త్రచరిత్రలో మమ్మటుని కావ్యప్రకాశం తర్వాత ప్రబలిన విద్యారణ్యంలో అంతటి తాలోత్తాలమూర్తులు లేక స్వతఃప్రమాణంగా కావ్యదోషనిర్ణయం చేయగలవారు తక్కువైన మాట నిజమే. మీరన్నట్లు దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం కావ్యగుణాన్ని ఉత్కర్షించే కారణం కాదన్నమాట కూడా నిజమే. అయితే, శ్రీనాథుడు నైషధీయ చరితంలో రసౌచిత్యదృష్టితో “అనౌచిత్యపరిహారం” అవసరమని భావించిన మాట సత్యమే అయితే లోకంలో అంతకు పూర్వం ఏదో ఒక ఆధారం ఉండే ఉండాలి కదా. తానై సాహసించి మొదటిసారి ఆ మాటను అన్నాడని ఊహింపలేము. వ్యాఖ్యాతలో, లాక్షణికులో, విమర్శకులో కనీసం ఒక్కరైనా ఆ మాటను ప్రసిద్ధంగా పేర్కొని ఉండాలి. ఏవో కొన్ని అనౌచిత్యాలు ప్రచారంలో ఉండే ఉండాలి. అటువంటివేవీ కనబడవు. వ్యాఖ్యాతలు – మరీ ముఖ్యంగా చాండూ పండితుడు, మల్లినాథుడు పదే పదే ఆ కావ్యంలోని ఔచిత్యాలను తమ వ్యాఖ్యలలో ప్రశంసించటమే గాని ఒక్కటైనా అనౌచిత్యాన్ని ప్రస్తావించి ఉండకపోవటం మనకు తెలుసు. ఏవో కొన్ని అనౌచిత్యాలు ఉన్నాయని కనీసం లాక్షణికులు గాని, విమర్శకులు గాని ఇంతకాలంగా ఆ మాటను అనలేదు కదా! అని చెప్పే సందర్భంలో ఆ వాక్యప్రసక్తి ఏర్పడింది.
శ్రీ అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులవారు ‘నైషధతత్త్వజిజ్ఞాస’లో అందులోని నాయికానాయకుల భౌతికశృంగారం, రతివర్ణన, రత్యంతచిత్రణ – అనుచితము, అశ్లీలము, అసభ్యము, గ్రామ్యము అని ఎన్నో ఉదాహరణలను చూపారు. ఆ ఉదాహరణలన్నీ మారిన దేశకాలపరిస్థితుల వల్ల ఏర్పడిన అభిప్రాయములే గాని వాస్తవంగా రసదోషవిమర్శకు ఉపకరింపవు. ఆధునిక కాలంలో నైషధీయ చరితం మితిమీరిన శృంగారవర్ణనల మూలాన అనౌచిత్యాలకు పుట్టినిల్లని వ్రాసినవారి వివరాలను నేను ప్రస్తావింపలేదు.
మమ్మటునికి తర్వాత కావ్యదోషాలను సవిస్తరంగా పేర్కొన్న లాక్షణికులు ఎవరైనా ఉన్నారా? అని మీరడిగిన ప్రశ్నకు సమాధానం: కనీసం 40-42 మందికి పైగానే ఉంటారని పేర్లు స్ఫురిస్తున్నాయి. వారందరూ తత్పూర్వుల వలె మౌలికప్రతిపాదనలు చేసినవారు కాకపోవచ్చును కాని, ఉన్నారు. వేమభూపాలుని సాహిత్యచింతామణి ముఖ్యమైనదే. దేశ్యదోషవిమర్శను కలిగిన విశ్వేశ్వర దేశికుని చమత్కారచంద్రిక ఉన్నది. సర్వజ్ఞ సింగభూపాలుడు రసార్ణవసుధాకరంలో “అత్ర నలస్య దమయన్తీ కరస్పర్శహర్షేణ” అని తనకు నచ్చినందువల్ల శ్రీహర్షుని సగౌరవంగా ఉదాహరించాడు కాని, అనౌచిత్యాలను చెప్పినప్పుడు వేరే కవులను ఉదాహరించాడు. అమృతానందయోగి అలంకారసంగ్రహంలో అనౌచిత్యాలను పూర్తిగా తనదైన ధోరణిలో వివరించాడు. ఉదాహరణలను ఇవ్వలేదు. నృసింహకవి నంజరాజయశోభూషణం పైకి విద్యానాథుని అనుసరణగానే కనుపించినా, జాగ్రత్తగా చూసినప్పుడు కావ్యదోషప్రకరణంలో మునుపు లేని ఎన్నో కొత్త విశేషాలను చెప్పాడు. జయదేవ భోజరాజాది తత్పూర్వుల వైశేషికగుణ నిబంధరాంతరస్థ దోషాంకుశాదులను తన మాటలలో వ్యాఖ్యానించాడు. శబ్దగ్రామ్యాన్ని, అర్థగ్రామ్యాన్ని, అశ్లీలతను, కావ్యదోషాల దోషత్వానిత్యతను, అదోషత్వాన్ని సరికొత్తగా వివరించాడు. ధర్మసూరి సాహిత్యరత్నాకరం, అజితసేనుని అలంకారచింతామణి, కందలయార్యుని అలంకారశిరోభూషణం, కృష్ణావధూత మందారమరందం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రసిద్ధులు కాకపోవచ్చును గాని ప్రతివారు ఎన్నో కొన్ని తమ మాటలలో కావ్యదోషాలను నిర్వచించినవారే. లక్షణగ్రంథాలలో మూలకర్త చెప్పకపోయినా, ఉదాహరణలను ప్రదర్శించిన వ్యాఖ్యాతలు కూడా నైషధీయచరితాన్ని ప్రస్తావించినట్లు కనబడదు. వ్యాసప్రతిపాదితానికి ఈ విశేషాలతో సంబంధం లేనందున ఇంతవరకే ప్రస్తావించాను.
మీ సహృదయస్పందనకు కృతజ్ఞుణ్ణి. శ్రీమతి లక్ష్మీదేవి గారి ఔదార్యపూర్వకమైన వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
తన మాట కోసం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
11/10/2016 10:49 am
మణి గారి అభిప్రాయంతో యేకోభవించలేక పోతున్నందుకు వారు మన్నించాలి. నాదృష్టిలో అనువాదం యేమంత బాగోలేదు. నిజం చెప్పమని నిలదీస్తే, అస్సలు బాగోలేదని అంటాను.
ఇందులో లక్ష్మి గారి పొరపాటు ఎక్కువగా లేదేమో అనిపిస్తుంది. ఇంచుమించి ఇలాంటి ధోరణి అనువాదకుల్లో సాధారణం!
ఒక అనువాదం చదువుతుంటే అది ఒక అనువాదం అన్న స్పృహ అనుక్షణం మనతో ఉండేలా ఉండేలా చేసే పరిస్థితి ఉండకుండా అనువాదకులు జాగ్రత వహించటం తక్కువగా కనిపించటం విచారపడవలసిన సంగతి. కృతకమైన పదవాక్యశైలీవిన్యాసాలతో అనువాదాలన్నీ సాగవలసిందేనా అని దుఃఖం కలుగుతూ ఉంటుంది. మూలరచనలోని ప్రతిపదమూ వాక్యమూ సాధ్యమైనంతగా అలాగే తెలుగులోనికి వచ్చితీరాలని ఆరాటపడటం వలన అనువాదం చాలా కృతకమైన -సూటిగా చెప్పాలంటే- అతితరచుగా నిర్జీవమైన భాషలోనికి జారిపోతుంది.
అనువాదకులు సహజంగా చేసే ఆ పొరపాటే ఇక్కడా ఉన్నది.
మూలంలోని భావరమ్యతనూ, కథాగమనాన్నీ, శైలీవిన్యాసాన్నీ — ఇలాంటీ గుణాలని వీలైనంతగా గమనించి అవలంబించి అనుకరిస్తూ వ్రాయటం తప్పక మంచి విధానమే. కాని యథామక్షికానువాదం చేయటం ప్రమాదం. అలాచేస్తే తెలుగుచదువుతున్నట్లు కాక విచిత్రంగా ఉండి విచారాన్నీ కొండొకచో వికారాన్నీ కలిగించే అవకాశాలే మొండు.
మూలకథను తీసుకొని తనదిగా ఆవష్కరించటం ముఖ్యం. అనువాదం అన్న భావన వెంటాడితే అనువాదం సరిగా లేనట్లే. కాబట్టి అనువాదకులు తెలుగుకు సహజసుందరమైన నుడికారంలో మూలాన్ని చెప్పటాని ప్రయత్నించాలని మనవి.
Yippee! I’m a poet, and I know it గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:
11/08/2016 2:41 pm
వేమూరి వేంకటేశ్వర రావు గారికి:
మీరు దయతో రాసిన అభిప్రాయం, నేను రాసిన అభిప్రాయం తరువాత రావల్సినది. ఎందుకు తిరకాసుగా వచ్చిందని అడిగితే, కంప్యూటర్ ఇంజనీర్లు
Software Glitch అని చెప్పుతారని మీకు నేను గుర్తుచెయ్యవలసిన అవసరం లేదు. నిన్ననే మీకు వందనాలని చెప్పుదామనుకున్నాను కాని, ఇప్పటివరకూ కంటి డాక్టరు నన్ను ఏకాక్షిగా పడి ఉండమని శపించాడు.
మీ సుహృద్భావానికి ఇప్పుడు వేలూరి వేంకటేశ్వర రావు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. (అన్ని అక్షరాలూ సరిగా అచ్చయ్యాయో లేవో చూసుకునే బాధ్యత సంపాదకులది!)
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి గన్నవరపు నరసింహమూర్తి గారి అభిప్రాయం:
11/06/2016 5:39 pm
శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి యీ ప్రసంగ సాంగత్యము వలన ఎప్పటి వలె నేను కొన్ని క్రొత్త పదాలు నేర్చుకున్నాను. అవి మస్తిష్కములో యెన్ని దినాలు నిలుస్తాయో తెలియదు కాని యా క్రొత్త పదాల కర్ధాలు మిగిలిన పాఠకుల సౌలభ్యము కొఱ కిక్కడ నిలుపుతున్నాను.
అనుష్ఠానము = నడవడి, ఆచారము ; ఉపలక్షించు = వీక్షించు, చూచు
అతిరిక్తము = మించినది, హెచ్చినది ;
అభిధేయము = శబ్దార్ధములు, గ్రంధ ప్రాతిపదిక విషయము, పేరు
అతివేలము = హెచ్చు ; ఉపస్కారము = సంబారము
సంతరించు = ఆదరించు ; ప్రకల్పించు = కలిగించు ; సుభగము = మనోహరము
ఆకీర్ణము = సంకీర్ణము , కలిసినది , వ్యాపించినది,
అధికరణము = ఆధారము ; నైయాయికుడు = న్యాయశాస్త్ర కోవిదుడు ;
ఆత్మప్రత్యయము = ఆత్మవిశ్వాసము ; (అ) సమీచీనము = ( అ ) పరిశుద్ధము
అధ్వము = త్రోవ ; వివక్షితము = చెప్పదలచిన విషయము
శీర్షణ్యము = శిరస్త్రాణము, తలమానికము ; వ్యపదేశము = కపటము, ఆంతర్యము ;
ముకుటము = మకుటము ; స్థగితము = కప్పపడినది
అనుస్యూతి = కూర్పు
Yippee! I’m a poet, and I know it గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
11/06/2016 12:21 pm
డిల్లన్ పేరు చాల రోజులబట్టి వింటున్నాను కాని ఇంత సమగ్రంగా తెలుసుకోలేదు. తెలుగు సాహిత్యకారుల గురించే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇతర భాషలలోని సాహిత్య చరిత్రని కూడ తెలుసుకోవడం మంచిది కదా! వ్యాసం బాగుంది.
తెగులుకి శిక్ష గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
11/02/2016 12:54 pm
ఈ రచనతో ఈమాట స్థాయి తగ్గినదన్న అభిప్రాయంతో ఏకీభవించలేక పోతున్నందుకు నాగమురళి గారు దయచేసి మన్నించాలి. కాని ఆ ముక్క వారు అనటం వెనుక వారి ఉద్దేశం ఇంతకంటే హుందాగా ఉండే రచనలకే పీట వేసి ఈమాట మరింత హుందాగా ఉండాలని కావచ్చు. కాని ఈరచనలో నేటి కాలపు వెకిలిహాస్యం యేమీ లేదు కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను.
ఐతే సాహిత్యపు విలువలని సంతరించుకోలేక పోయాయని నేను అభిప్రాయపడిన రచనలూ వచ్చాయి ఈమాటలో. ఇలా అన్నందుకు ఈమాట వారు మన్నించాలి. ఇప్పుడు నిలదీసి అవి యేయే రచనలు అని అడిగితే నావద్ద ఒక పట్టిక యేదీ సిద్ధంగా లేదు. కాని సభాముఖంగా ఆముక్కను ఇంతవరకూ నేను చెప్పలేదు. కాని సందర్భం యేర్పడింది కాబట్టి చెప్పవలసి వస్తోంది.
కాని ఈమాట వారు తమ పత్రికను ఒక చక్కని సాహిత్యప్రతికగా చాలా బాగా నిర్వహిస్తున్నారని చెప్పటానికి నాకైతే యేమీ సందేహంలేదు. అలనాటి భారతి సాహిత్యమాసపత్రిక తరువాత ఆ ఒరవడిలో సమర్ధంగా కృషిచేస్తున్నది ఈమాట పత్రిక అన్నదే ఒక సాహిత్యాభిమానిగా నా నిశ్చితాభిప్రాయం.
సందర్భం అంటూ ఒకటి వచ్చింది కాబట్టి ఈమాటను కూడా చెబుతాను. ఒకటి రెండు ప్రయత్నాలు చేసి కూడా ఈమాట పత్రికవారి స్థాయికి తగిన రచనను నేను పంపలేకపోయాను! శర్మగారన్నట్లు నాగమురళి గారి నుండీ వారితోపాటు దదితర రచయితల నుండీ మంచి సూచనలు వస్తే వాటి పుణ్యమా నాబోటి వాడికీ ఒక అవకాశం రావచ్చు ఒక్క రచనను ఐనా ఈమాటలో చూచుకుందుకు.
దంతుర్తి శర్మగారికి ఆరోజుల్లో నూటికి నలభైవస్తే అది ప్రశంశనీయమే. అప్పట్లో నన్నయ వచ్చి వ్రాసినా నలభైకి మించి మార్కులు రావటం దుస్సాధ్యంగా ఉండేది. నాకు కూడా ఎప్పుడూ ఆస్థాయికి దాటి మార్కులు రాలేదు. ఈరోజుల్లో ఐతే కనీసం ఎనభైమార్కులు పైనే వస్తాయి తెలుగుపరీక్షలో ఒక్కసమాధానమూ అస్సలు సరిగా వ్రాయకపోయినా శరే. చిన్నయసూరి పేరు కూడా వినకుండానే తెలుగులో ఎం.ఎ పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావచ్చును. కాని అధునికమైన వ్యావహారికభాషలో తెలుగువారు రచనలు చేసేందుకు భాషాపాండిత్యం ఒకమోస్తరుగా ఉన్నా దానికిన్నీ కించిత్తు న్యూనంగా ఉన్నా సరిపోతుందని అభిప్రాయ పడుతున్నాను.
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
09/22/2016 4:17 pm
పాఠక మహాశయులకి:
ఈ వ్యాసంతోపాటు, ఈమాటలో నేను ప్రచురించిన గణిత సంబంధమైన మరిన్ని వ్యాసాలని కూడగట్టి, “రామానుజన్ నుండి ఇటూ, అటూ” అనే ఇ-పుస్తకం ప్రచురించేను అని గతంలో ఒకసారి మనవి చేసేను కదా! ఇప్పటికి పాఠకులు 1000 ప్రతులు దింపుకున్నారు. అంటే వెయ్యి మంది ఏకైక (యునీక్) పాఠకులని నేను అనుకోను. ఒకొక్కరు పరాగ్గా దింపుకునే బొత్తాన్ని రెండు సార్లు నొక్కి ఉండవచ్చు. కనుక 500 వ్యక్తులు అయినా దింపుకుని ఉంటారు. వీరిలో కనీసం 50 మంది అయినా చదివి ఉంటారు. పరవాలేదు. లెక్కలమీద రాసిన పుస్తకానికి ఈమాత్రం ఆదరణ వచ్చిందంటే సంతోషించవలసిన విషయమే!
దీనిని ఈ దిగువ జాలస్థలి నుండి ఉచితంగా దింపుకోవచ్చు.
http://kinige.com/kbook.php?id=6975
భర్తృహరి అభాషితం గురించి పంతుల గోపాల కృష్ణ గారి అభిప్రాయం:
09/14/2016 12:39 pm
కథ చాలా బాగుంది.ఎందుకో నాకు ఎన్నో ఏళ్ళుగా ఈ పద్యాన్ని తలచుకున్నప్పుడల్లా గంగానదిని వివేకభ్రష్టురాలనడం నచ్చేది కాదు.ఈ కథలో చెప్పినట్లు గంగానదికి సముద్రంలో కలిసి ఆవిరై మళ్ళా వర్షరూపంలో హిమాద్రిని చేరుకునే అవకాశం ఉన్నా అలా చేయకుండా పాతాళానికి ఎందుకు వెళ్ళిందనే దానికి ఒక కారణం ఉంది.ఆకాశంలో పారే గంగ భూమి మీదకు రావడానికే ఇష్టపడదు. కాని భగీరథుని కోరిక మన్నించి బ్రహ్మగారు అతడితో వెళ్ళమని చెప్పిన తర్వాత అతడి వెనుకే పాతాళంలో ఉన్న సగరకుమారుల అస్థికలమీదుగా ప్రవహించి వారికి మోక్షాన్ని కలిగించడానికి అంగీకరించి వచ్చిన తర్వాత ఇంక మధ్యలో ఆగిపోయే ప్రశ్నే రాకూడదు. ఆరంభించరు నీచమానవులు ..అన్న పద్యంలో చెప్పినట్లు ధీరుల్ విఘ్న నిహన్యమానసుల్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ కావునన్..అనుకున్న ప్రజ్ఞానిధి కావుననే ధ్యేయాన్ని వదిలిపెట్టకుండా పాతాళానికే సాగింది అని సరిపెట్టుకున్నాను కానీ దీనిని వివేకభ్రష్టతగా చిత్రించడం మాత్రంనాకు ఇప్పటికీ నచ్చలేదు.
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/13/2016 6:13 am
శిష్టులు, ప్రామాణికులు అయిన పెద్దల రచనలో అనంగీకర్తవ్యములైన సంశయాంశాలు కనబడినప్పుడు విద్యార్థిత్వం ఉన్న విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుని అడిగినట్లే – విద్వాంసులైన రచయితలను పాఠకులు అడుగుతారు. విషయం చర్చలోకి ప్రవేశపెట్టబడినది కాబట్టే వ్యాఖ్యలు వస్తాయి. వ్యాఖ్య వల్ల వ్యాసవిస్తృతి కలుగదు. వ్యాసకర్తృకృతమైన సందేహనిరాసం మూలాననే వ్యాసవిస్తృతి, చిత్తవిస్తృతి కలుగుతాయి.
వ్యాఖ్యాపరిణామం ఏమిటో తెలిసింది కాబట్టి, ఈ చర్చనుంచి విరమించుకొనే ముందు నాలుగు మాటలు వ్రాయక తప్పటం లేదు: మాన్యులైన శ్రీ కె.వి.ఎస్. రామారావు గారు, వ్యాఖ్యాకర్తను గురించి – “చిన్నయసూరి ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది? అంటూ “అధిక్షేపించారు” – అని చేసిన ఆ నిరుక్తి మూలాన ఈ ప్రస్తావన నిమిత్తీకృతమైంది.
వ్యాఖ్యాకర్త విద్వన్మణులను, తనకు హితకర్మీణులను అధిక్షేపింపలేదు. వ్యాసగతమైన వాక్యాన్ని అధిక్షేపింపలేదు. “ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది?” అన్న ప్రశ్నలో ఏ అధిక్షేపణమూ, తిరస్కారభావమూ లేవు. వాగనుశాసనులు నన్నయ గారు కారా? వాగనుశాసన బిరుదధారి అయిన రెండవ వ్యక్తా? అని వ్యాఖ్యాకర్త అడగవలసి రాదు. వాక్యంలో ‘అన్నాడు’, ‘చెప్పాడు’, ‘పేర్కొన్నాడు’ అని గాక, “ఒప్పుకొన్నాడు” (=సమ్మతించాడు, అంగీకరించాడు) అని వ్రాసినప్పటి నిర్దేశాన్ని మాత్రమే ప్రశ్నించటం జరిగింది. ఆ ఒప్పుకోవటం ఆంధ్రశబ్దచింతామణి నన్నయకర్తృకం అన్న విషయాన్నే కదా. ఆంధ్రశబ్దచింతామణిని నన్నయే రాశాడు అని ఒప్పుకోవలసిరావటం చిన్నయ సూరి గారికి ప్రమేయం కాదు. ఆ ‘కర్తృత్వసమస్య’ అన్నది ఆ వ్యాస కాలపరిధిలో, ఆ సూత్రనిర్మాణపరిధిలో అసలు చిన్నయసూరి గారి దృష్టిపథంలో లేనే లేదు. ఆయన ఆ ఆలోచన చేసిన ఆధారాలు లేవు. చింతామణివిరుద్ధప్రయోగాలు నన్నయ భారతంలోనూ, నన్నయప్రయోగవిరుద్ధలక్షణాలు చింతామణిలోనూ ఉండటాన్ని వ్యాకర్తలు గుర్తించినా, తత్కర్తృత్వసందేహం వారికి కలుగలేదు. ఆనాటి విశ్వాసమల్లా అంతిమగద్యలో వ్రాసిన మాటే. ఆ సమస్యను తొలిసారిగా లేవనెత్తి, తమకాలం నాటి ఆధారాలతో తత్కర్త మహాకవి నన్నయ కాదన్న అంశాన్ని సర్వసమర్థనీయంగా నిరూపించినవారు శ్రీ కందుకూరు వీరేశలింగం గారు. అయినా అది ఆదికవి నన్నయకృతమే అని వాదించినవారు శ్రీ వజ్ఝల వారు. కర్త మహావైయాకరణి అయిన మహావిద్వాంసుడు కాబట్టి, ఆయన ఆదికవి నన్నయ గారు కాదని రూఢమైంది కాబట్టి – ఆ నన్నయభట్టు రెండవ నన్నయభట్టు కావచ్చునని ప్రతిపాదించినవారు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు. తమ కాలానికి అనంతరీయమైన ఆ వివాదంతో ఏ సంబంధమూ లేని చిన్నయసూరి గారు ఆ చింతామణిని (మహాకవి) నన్నయే రాసినట్లుగా ఏవార్థకంతో ఒప్పుకొన్నట్లు ఎట్లా రుజువు కాగలదు? “ఒప్పుకొనటం” అన్న పదం విషయం మాత్రమే చర్చకు వచ్చింది. అన్యవిషయాలు కావు. అది అధిక్షేపణం కాదు.
ఈ మాటలు శ్రీ కె.వి.ఎస్. రామారావు గారివి. దీనిని కొనసాగింపక, తిరుపతి వేంకటకవులు శాస్త్రపండితులమని చెప్పుకొన్న పద్యాలలోని కొన్ని ప్రసిద్ధవాక్యాలు ‘నానారాజసందర్శనము’లో నుంచి ప్రమాణీకరింపబడుతున్నాయి. వారి కావ్యాలలో నుంచి అంతకు పదింతలు ఉదాహరింపవచ్చును. ఔగాములను పాఠకులు నిర్ణయించుకొంటారు:
వేంకటగిరిలో చెప్పినవి: “…శబ్దశాస్త్రప్రశస్తప్రభావం బాతపత్రమ్ము దివ్యచారిత్ర! మాకు”; “…ధాతురత్నాకరోద్దామచంపు రచించి పాణినీయస్తుతుల్ వడసినాము”; “వేగ మా పాణినీయాగమమ్ము పఠించి, మించి, దేశికుల మెప్పించినాము”; “తిరుపతివేంకటేశకవిధీరుల మేము … శబ్దశాస్త్రధీ,వరులము”; “…గురువు నెన్నఁగ బ్రహ్మగురుపండితుండు, శాస్త్రమ్ము నెన్నంగ శాబ్దమ్ము మాకు”; గద్వాలలో – “…గురుపాదసేవనాలబ్ధ మగు విద్య నాగరాజముఖోదితాగమంబు”; విజయనగరంలో – “రా జతిపండితుం డఁట, బరాబరి యౌ నఁట మంత్రి రాజుతో, ధీజవ మొప్పునట్టి కవిధీరులు తిర్పతివేంకటేశు(లు)…”; “తిరుపతి వేంకటేశు లని పిల్తురు మమ్ము, బ్రహ్మసద్గురువరు పాదసేవన మకుంఠితసత్కృప మాకు నిచ్చె వ్యాకరణము”; కొత్తపల్లిలో – “భవదీయసత్రాన్నభక్షణమ్మునఁ జేసి చదివినారము శబ్దశాస్త్ర మెల్ల”; రాజమండ్రిలో దివాకరాస్తమయ సభలో – “”ఎవఁ డెన్నఁడును బాఠ మెలమి విప్పకయె వ్యాకరణపాండిత్యప్రకర్ష మూనె”; ఉర్లాములో – “వారుం బండితు, లేము పండితులమై వర్తించు టట్లుండఁగా…”.
ఇక, తిరుపతి వేంకటకవులు శ్రీ రామచంద్ర అప్పారావు గారికి విన్నవించిన ఈ మాట కూడా ప్రమాణం కాకపోతే, చేసేదేమీ ఉండదు: “చదివినారము శబ్దశాస్త్రమ్ము తుదముట్టఁ, జిరకాల మొక్క దేశికునియొద్ద” అని. శబ్దశాస్త్రం ‘తుదముట్ట’ (శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారి సన్నిధిని ఆసాంతం) చదివిన ఆ మహాత్ములు శాస్త్రపండితులని ఎట్లా తెలుస్తుందో ఒక పద్యాన్ని, ఒక శ్లోకాన్ని చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యాకర్త ఉదాహరించటం జరిగింది.
కవులు శాస్త్రపండితులు అవునో, కాదో వారి రచనలే నిర్ధారిస్తాయి. వారు చెప్పుకోనంత మాత్రాన వారు పండితులని నిర్ధారణ కాకమానదు. వాళ్ళే మేము శాస్త్రపండితులమని చెప్పుకొన్నాక కూడా వారు పండితులు కారంటే చెప్పగలిగినదేమీ ఉండదు.
ఈ పద్యనేపథ్యం చాలా మంది పాఠకులకు తెలిసి ఉండకపోవచ్చును. ఆత్మకూరు సంస్థానంలో తిరుపతి వేంకటకవులకు తీవ్రమైన ప్రతికూలవాతావరణం ఎదురైంది. శఠమర్షణం కృష్ణమాచార్యుల వారి మహాప్రౌఢమైన శ్రీనివాస విలాస చంపువును తెలుగు చేసినందువల్ల కవులకు సభలో కలిగిన ప్రశస్తిని చూసి ఆస్థానకవి తర్కతీర్థ తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు గారికి అసూయ కలిగింది. కవులకు శాస్త్రపాండిత్యం లేదని ప్రసంగించారు. ‘గుణాలయ’, ‘దేవతలు ధర్మవర్తులు’ అన్నవి అపప్రయోగాలని సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆస్థానవిద్వాంసులు ఒకటయ్యారు. కవులు ఆనాడు అసామాన్యమైన తమ వ్యాకరణపాండిత్యంతో విమర్శకులను నిరుత్తరులను చేశారు. భారత ప్రయోగాలను తవ్వి తలకెత్తారు. అప్పుడు శ్రీనివాసాచార్యులు చేసేదేమీ లేక, “మీసములం బట్టి చూడ మీరు పండితులు గారు” అని కుత్సితాక్షేపణ చేశారు. అందుకు సమాధానంగా కవులు జగదేకనుతిపాత్రమైన ఆ పద్యాన్ని చెప్పారు. “దుందుడు కొప్పఁగ” రెండు వైపుల మీసాలు పెంచినది రెండు భాషలలో మేము కవీంద్రులం అని చెప్పుకొనేందుకు (తండ్రిగారు జీవించి ఉండగా వైదికులు మీసాలు పెంచరాదన్న ఆనాటి సంప్రదాయం తెలియని ధర్మశాస్త్రపాండిత్యలోపం వల్ల కాదు, కవీంద్రత్వం మూలాన కలిగిన దుడుకుతనం వల్ల); ఏ పాండిత్యం మాకు లేదని ఆక్షేపించారో – ఆ శాస్త్రార్థంలో “కవివరుల్ (ఆస్థానకవి శ్రీనివాసాచార్యులు గారిని ఉద్దేశించి అన్నమాట అది) మము గెల్వుఁడు” – అని ఆ పద్యభావం. పాండిత్యంలో పోటీకి రమ్మనే ఆరోజు వారన్నారు. ఆత్మకూరు శాస్త్రవాదంలో గెలుపొందిన కొంతకాలానికి తర్వాత కూడా, “నీదు సంస్థానపండితుఁ డైన యల శ్రీనివాసాచార్యవర్యుండు సన్యాసి యయ్యె” అని కవులు ఆ పాండిత్యవిజయాన్ని నెమరువేసుకొన్నారు.
అందువల్ల ఆ నమ్మకం 19-వ శతాబ్దికి సంబంధించిన కాలంలో ఏ రూపంలో ఉన్నదో అన్వయించటమొక్కటే సమాధానం కాగలదు. పందొమ్మిదో శతాబ్దికి మునుపు, పందొమ్మిదో శతాబ్ది కాలంలో, పందొమ్మిదో శతాబ్దికి తర్వాత, ఆనాటికీ ఈనాటికీ ప్రయోగరక్షే వ్యాకరణప్రయోజనమని నమ్మకం.
“లక్షణోక్తమగు విషయము లక్ష్యమం దిమిడియున్నదే కాని వేఱు కాకపోయినను” … “నన్నయభట్టారకునకుఁ బూర్వము గాని యతనినాఁడు గాని తత్సమ భాషకుఁ గాదు కదా యాచ్ఛికభాషకే లక్షణము పుట్టలేదు” … “శబ్దస్వరూపవిజ్ఞానమును బ్రయోగవిజ్ఞానమును విశదీకరించు లక్షణములే మనభాష కిపు డావశ్యకము” … “ఈ భావముతోనే ‘ప్రయోగశరణం వ్యాకరణ’ మ్మనుచు నే నాంధ్రభాషానుశాసనము నిర్మించినట్లే యీ శాస్త్రిగా రీ తత్సమచంద్రికను నిర్మించినారు” అని 1954లో శ్రీ సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి గారి తత్సమచంద్రిక పీఠికలో శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు. 20-వ శతాబ్దిలోనూ ఈ భావమే ఉన్నది.
జిజ్ఞాస్యమైన సంశయప్రకాశానికి మూలం జిజ్ఞాస. సందేహనివృత్తి వ్యాసకర్తల కర్తవ్యం. వ్యాసంలోని ప్రత్యంగమూ వ్యాసంగానికి పాత్రమే. ఏ అధిక్షేపణమూ లేని ప్రశమితభావంతోనే విషయవిమర్శను వ్యాసరచయితల సహృదయత మన్నింపగలదన్న ఆకాంక్షతో వ్యాఖ్యను ప్రకటించటం జరిగింది.
వ్యాసరచయితలకు, శ్రీ రామారావు గారికి, శ్రీ వంశీమోహన్ గారికి, సంపాదకులకు ధన్యవాదాలు. ఈ మాటకు ఇంతటితో స్వస్తి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
[ఈ వ్యాసపు రెండవ భాగం ప్రచురించబడేవరకూ, ఈ మొదటి భాగంపై చర్చను నిలిపివేస్తున్నాము.అసౌకర్యానికి క్షమార్పణలు – సం.]
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి మాగంటి వంశీ మోహన్ గారి అభిప్రాయం:
09/12/2016 4:19 pm
ముందుగా, ఏల్చూరి వారికి నమస్కారాలతో కూడిన అభినందనలు – ఒక వ్యాసంలోని అతిముఖ్యమైన పలు సమస్యలని గుర్తించి, దానిని కూలంకషంగా విలోకించి, విచారించి, విశ్లేషించి, కొత్త ఆలోచనలకి దారి తీసే విషయాల్ని వ్యాఖ్యద్వారా ప్రతిపాదిస్తున్నందుకు. ఆ ఆలోచనల లోతులు ఎంతలో వున్నాయో అన్న సంగతి ఎంతమందికి అర్థమవుతుందోనని నాకు కుతూహలంగా వుంది.
“ఏవం విధ విషయవిమర్శ” అని ఒకవంక, “వ్యాసతాత్పర్యానికి భంజకాలు కావని” స్పష్టంగా అపార్థాలకు తావులేకుండా మరోవంక మురళీధరరావు గారు చేసిన వ్యాఖ్య బ్రహ్మాండంగా అనిపిస్తోంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే – వారన్నవి ఒక్కొక్కటి తీసుకుని, అందుట్లోని సారం సంగతి అర్థం కాక ఈ వ్యాస విషయాన్ని పరిష్కరించే ప్రయోజనం చేజార్చుకుంటారేమోనన్న భయం. ఈ రెండు పేజీల వ్యాసంలో చదవవలసిందేదీ లేదని వ్యాసం చదివిన తరువాత అనిపించిన మాట వాస్తవం. అయితే ఇది తర్వాత వచ్చేదానికి ఉపోద్ఘాతం లాటిదన్న రచయిత మాట వలన, ఊరుకొని దానికోసం ఎదురు చూడడమంత మంచి పని ఇంకోటి లేదు. ఇప్పటికయితే నా దృష్టిలో ఈ వ్యాసం చివరన ఇచ్చిన 30 + రెఫెరెన్సు పుస్తకాలు చదువుకోవటం ఉత్తమం. లిష్టు ఇచ్చినందుకు రచయితకు కృతజ్ఞతలు.
పోతే, ఏల్చూరి వారు రచయితను కొన్ని ప్రశ్నలు అడిగినారు. సమాధానం రచయిత ఇస్తే బాగుండును. రచయితకు పట్టనిదో, సమాధానం చెప్పలేని విషయమో, తర్వాతెప్పుడైనా చెపుదామని ఊరకున్నారో తెలియనైతే లేదు కానీ, ఏల్చూరి వారి కామెంటు మీద కె.వి.ఎస్ రామారావు గారనువారు చేసిన కామెంటు నాకు చాలా అనవసరమనే అనిపిస్తోంది. దాని వల్ల వ్యాసాన్ని విస్తృతపరిచే అవకాశమున్నదనుకొని రాసినారో ఏమో? అలా రాసి ఉంటే అది భ్రమగా మిగిలిపోకూడదన్న ఆశతో!
ఏల్చూరి వారి వ్యాఖ్య వల్ల రచయిత ప్రూఫు రీడింగులో చేసిన పొరపాటు బయటపడింది. రాసేవారు పొరపాటు చేసినపుడు చదివేవారు పొరపాటు పడకుండా సరిచెయ్యటమనేది మంచి విమర్శకుని లక్షణం. అది ఏల్చూరి వారిలో పుష్కలంగా ఉన్నదని పట్టవన్న పేర్లు ఇరికించి రాసిన వారి పద్యమే నిరూపించినది. అలాగే వారి వ్యాఖ్య లోని ఇతర విషయాలు కూడాను.
రామారావుగారి కామెంటు వలన ఇసుమంత కూడా ప్రయోజనమేమీ లేదని నాకు అనిపించిన మాట నిజమే కానీ, వ్యాసకర్త రామారావుగారి కామెంటు చదివి వ్యాసాన్ని విస్తృతపరిస్తే అంతకన్నా ఆనందమూ లేదు.
నేను రాసిన ఈ కామెంటు కూడా దేనికి ఉపయోగపడే అవకాశమూ లేదు. ఏమీ ఉపయోగాల్లేని వాటిని రాసుకొని ఆనందించటం కన్నా ఏల్చూరి వారి ప్రశ్నలు మరల చదువుకొని అర్థమూ ఆకళింపూ చేసికొని జ్ఞానసముపార్జన చేసుకోవటం ఉత్తమమని నమ్ముతూ
ఇంతటితో ఈ వ్యాసమునకు, వ్యాఖ్యలకు స్వస్తి
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
[ఎవరి అభిప్రాయాలు వారివి. విమర్శకు ఎవరూ అతీతులు కారు. అయితే ఆ విమర్శ అభిప్రాయం పైన కాక అభిప్రాయం వెలిబుచ్చిన వారిపైకి హేళనలతో మరలించడం వల్ల తాత్కాలికమైన ఉపశాంతి ఏదైనా మిగలవచ్చేమో కాని, అసాహిత్య వాతావరణం ఏర్పడి చర్చ స్థాయి దిగజారిపోతుంది. అది ఎవరికీ విజ్ఞానదాయకమూ కాదు, అందువల్ల ఏ లాభమూ లేదు. దయచేసి ఆసక్తికరము, అవసరము అయిన ఈ వ్యాసంపై చర్చను నిగ్రహంతో కొనసాగించవలసిందని మా మనవి – సం.]
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి కె. వి. ఎస్. రామారావు గారి అభిప్రాయం:
09/11/2016 9:04 pm
ముందుగా, నారాయణరావు, శ్రీనివాస్ గార్లకి అభినందనలు – అతి ముఖ్యమైన ఒక సమస్యని గుర్తించి, దానిని కూలంకషంగా విలోకించి, విచారించి, విశ్లేషించి, కొత్త ఆలోచనలకి దారి తీసే విషయాల్ని ప్రతిపాదిస్తున్నందుకు. ఆ ఆలోచనల లోతులు ఇంకెంత వున్నాయో రెండో వ్యాసంలో చదవాలని నాకు కుతూహలంగా వుంది.
ఐతే, “ఏవం విధ విషయవిమర్శ” అని ఒకవంక, “వ్యాసతాత్పర్యానికి భంజకాలు కావని” మరోవంక అంటూనే మురళీధరరావు గారు చేసిన వ్యాఖ్య మాత్రం నాకు అనవసరమనే అనిపిస్తోంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే – వారన్నవి ఒక్కొక్కటి తీసుకుని వాటివల్ల ఈ వ్యాస విషయాన్ని విస్తృతపరిచే ఏమన్నా ప్రయోజనం ఉందేమో చూస్తే నాకు అలా కనిపించటం లేదు.
మొదటగా – “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు” అన్న వాక్యం వారికి అభ్యంతరకరమైందన్నారు మురళీధరరావు గారు.. ఐతే వారు చూపిన తిరుపతివెంకట కవులు చెప్పిన శ్లోకాలు, వారి శిష్యుల సంస్కృత భాషాజ్ఞానం తిరుపతి వెంకట కవులు పండితులు ఔనని ఏ అర్థంలో నిరూపిస్తాయో నాకు బోధపడడం లేదు.
ఇక – “పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్లే” అన్న విషయాన్ని తీసుకుందాం. ఈ వ్యాసం మాట్లాడుతున్నది పందొమ్మిదో శతాబ్దపు చివరి భాగం, ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగాల్లోని పరిస్థితుల గురించి. ఆ కాలంలో ఎవరిని పండితులనే వాళ్లో చెళ్లపిళ్ల వారి ఆత్మకథ స్పష్టంగానే చెప్తున్నది. వ్యాసంలో, చెళ్లపిళ్ల వారి ఆత్మకథ నుంచి ఈ సందర్భంలోని కొన్ని విషయాల్ని తీసుకున్నామని వ్యాసకర్తలూ చెప్పారు. ఉదాహరణకి వారి “కథలు గాధలు” పుస్తకంలో “వెనకటి పండితులు” అన్న వ్యాసం చూడండి (అదృష్టవశాత్తు ఎవరో ఈ మధ్యనే ఈ పుస్తకాన్ని archive.org లో పెట్టారు. చెళ్లపిళ్ల వారి “కాశీయాత్ర” కూడ ఎప్పటినుంచో అక్కడ ఉంది.) అందులో వారు పండితులుగా చెప్పిన వారంతా వ్యాకరణ, తర్క, మీమాంస, వేదాంతాది శాస్త్రాల్లో పండితులే, ఎవరూ “తెలుగు పండితులు” కారు. వాళ్లలో కవిత్వం చెప్పగలిగిన వాళ్లు ఎవరైనా ఉన్నారేమో తెలియదు; ఉన్నా వాళ్లని వాళ్లు పండితులుగా భావించుకున్నారు తప్ప కవులుగా చూసుకున్నట్టు దాఖలాలు లేవు ఈ పుస్తకంలో. అలాగే, అప్పుడు పిల్లలెలా పాఠాలు నేర్చుకునేవారో చెప్పే ఈ వాక్యాలు చూడండి (పేజి. 301):
“తెల్లవారుజామున పాఠాలకు ప్రారంభం చేసేవారు. తక్కువ పాఠం వాళ్లకి ముందు ప్రారంభం. ఆ పాఠాన్ని పై తరగతివాళ్లంతా వినడం ఆవశ్యకం. యీ నియమం శాస్త్ర పాఠాలకి మాత్రమే. కావ్య పాఠాల వాళ్లకి గురువుగారు చెప్పడం లేదు. విద్యార్థులలో పెద్దతరగతివాళ్లే చెప్పేవారు. గురువుగారివద్ద చెప్పుకొన్న శాస్త్రపాఠాన్ని క్రిందితరగతి వాళ్లకి పై గ్రంథాలు చదువుకొనే విద్యార్థులు చింతన చెప్పేవాళ్లు. ఆయీ విధంగా కష్టిస్తేనే తప్ప శాస్త్రం స్వాధీనం కాదు. యీ విధంగా అభ్యసించినప్పటికీ యేకొందరికోతప్ప సర్వేసర్వత్ర శాస్త్రం స్వాధీనం కాదు.”
దీన్నిబట్టి కావ్యాధ్యయనం, శాస్త్రాధ్యయనం వేరువేరని, శాస్త్రాల్ని గురువుగారు చెప్తే కావ్యాల్ని ఇతర విద్యార్థులే చెప్పేవారని తెలుస్తుంది కదా!
“నేనూ – మా తిరుపతి శాస్త్రుల్లూ” అనే వ్యాసంలో చెళ్లపిళ్ల వారు తాము సంస్కృతంలో ఏమేం చదివిందీ చాలా విస్ఫష్టంగానే రాశారు. ఏ ‘శాస్త్రం’లోనూ తను పండితుణ్నయానని ఆయన ఎక్కడా చెప్పలేదు. తిరుపతిశాస్త్రి తనకన్న ముందుగా సిద్ధాంతకౌముది పూర్తిచేశాడని, వ్యాకరణంలో తనకంటె తిరుపతిశాస్త్రి గట్టివాడని మాత్రం అక్కడక్కడ అభిప్రాయపడటం కనిపిస్తుంది. వాళ్ల ప్రఖ్యాత పద్యంలో “దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ మీసము రెండుబాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా; రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు” అన్నారే కాని పాండిత్యంలో పోటీకి రమ్మనలేదు. ‘కవీంద్రులమని” చెప్పి ‘కవివరుల’తో మాత్రమే పోటీ పడ్డారు. ఈ వ్యాస కాలపరిధిలో కవులు వేరు, పండితులు వేరు. పండితులంటే తప్పక కనీసం ఏదో ఒక సంస్కృతశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారే. తిరుపతివెంకట కవులు కవులు; పండితులు కారు. కవిత్వం గురించే వారు పోటీ పడ్డారు తప్ప శాస్త్రాల గురించి కాదు. గీరతం, గుంటూరుసీమ, ఇంకా అనేకుల్తో వాదాలు ఇలాటివే.
ఇంతెందుకు – కథలు గాధలు, 18వ పేజీలో చెళ్లపిళ్ల వారు అతి స్పష్టంగానే చెప్పారు: “పండితులంటే ఆ కాలంలో ఆ బిరుదు రావడం సామాన్యంగా వచ్చేది కాదు. కావ్యనాటకాలంకారాలు పూర్తిగా చదివిన వారికి ఆ బిరుదు ఉండేదే కాదు. సాహిత్య గాళ్లనేవారు వాళ్లని. ఏదో ఒక శాస్త్రంలో పూర్తిగా పాండిత్యం సంపాదిస్తేనే పండితుడనడం.” ఇది సంస్కృతభాషా సందర్భంలోనేనని, తెలుగు గురించి కాదని చెప్పక్కర్లేదు కదా !
రెండవది – “‘ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయనే నమ్మకం’ మనవారికి ఎన్నడూ లేదు.” అంటూ ఏల్చూరి వారొక sweeping generalization చేశారు. ఇందుకు వారిచ్చిన ఉదాహరణలన్నీ పందొమ్మిదో శతాబ్దికి ముందువే. ఈ ప్రస్తుత వ్యాసానికి సంబంధించిన కాలంలో ఉన్న పరిస్థితికి ఈ ఉదాహరణలు ఎలా అన్వయిస్తాయి?
వారి ఈ వ్యాఖ్యలో మొదటిభాగం వ్యాసకాలానికి ముందుది. రెండోభాగానికి ఉత్తరం బాలవ్యాకరణమే ఇస్తుంది. (దీని గురించి కొంచెం ముందు మాట్లాడదాం).
“పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు.” అనే దానికి అభ్యంతరం వెలిబుచ్చుతూ మళ్లీ వ్యాసకాలానికి పూర్వుల్నే ఉదహరించారు కనుక దీన్ని చర్చించనక్కర్లేదు.
మూడవది – “ఆంధ్రశబ్దచింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణంలో ఒప్పుకున్నాడు.“ చిన్నయ సూరి గారు ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది? “ అంటూ అధిక్షేపించారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి “రమణీయము”లో సంధి పరిఛ్చేదంలో 13 వ సూత్రం, దాని సందర్భం చూడండి. “వాగనుశాసనులు యదా తదా యని గ్రహించుట ప్రపంచార్థమని యెఱుగునది.” అని ఒక వాక్యం కనిపిస్తుంది. ఈ వాగనుశాసనుడు నన్నయ కాదు, మరొకరికెవరికో కూడ ఆ బిరుదుంది, సూరి మాట్లాడుతున్నది ఆ రెండో వ్యక్తి విషయం, నన్నయ గారి గురించి కాదని అంటారా?
చివరగా వ్యాసకర్తల పేర్లు ఛందోబద్ధ పద్యాల్లో పడతాయా లేదా అనేది. వ్యాఖ్యకారులు ఒక ఉదాహరణ ఇచ్చారు వ్యాసంలో విషయానికీ దీనికీ ఎంతదూరమో చదివేవాళ్లకి వెంటనే తెలుస్తుంది.
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/10/2016 4:20 am
మాన్యులైన శ్రీ తః తః గారికి
నమస్కారములతో,
రచయితల నైకజమైన అభిప్రాయమే గాని, ‘నైజ’మేమీ తెలియవలసి రాలేదు. 🙂 “తెలుగులోనే పనిచేస్తున్నవాళ్లు … కవులే కానీ పండితులు కారు”, “పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే” అన్న నైపథ్యానుసంజనతో ఘట్టితాలైన “తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృతపండితులు కారు … అందుచేతనే … ఆశుకవిత్వా(వధానా)దివిద్యల వల్ల … వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు” ఇత్యాదివాక్యాలను పురస్కరించికొని మాత్రమే – తిరుపతి వేంకట కవులు సంస్కృతంలో శాస్త్రపండితులు ఎందుకు కారన్న సంశయాన్ని ప్రకటించటం జరిగింది. నారాయణరావు గారి గురుస్థానీయత, శ్రీనివాస్ గారి బహుముఖప్రామాణికత, ఆ ఉభయుల ప్రభావశీలితల నైజం ఆ ప్రకటనకర్తకు సుజ్ఞాతమన్నది ప్రతిజ్ఞాతమే.
అట్లాగే, తత్సమమైన ‘అయోమయ’ శబ్దానికి ‘ఇనుముతో నిండి(చేసి)నది’, అన్న ప్రాథమికార్థం తొలగిపోయి, ‘అస్తవ్యస్త పరిస్థితి’, ‘అర్థం కాని స్థితి’ అని తెలుగులో అర్థపరిణామం ఏర్పడిన తర్వాతి (ఇటీవలి?) కాలంలో ఎవరో తెలుగువారే, ఏ సమస్యను ఇచ్చినప్పుడో, ఏ చమత్కారవశాననో ప్రాసంగికంగా చెప్పిన శ్లోకమే గాని, “ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం” అన్నది తెలుగు పట్ల ఈసడింపుగా చెప్పబడిన చాటూక్తి భావమై ఉండదు. ఆ మాట శ్లోకపూర్వార్ధంలో ఆ విధమైన శ్లేషార్థంతో ఉండటమే అందుకు నిదర్శనం.
‘గీర్వాణ’ శబ్దం సంస్కృతంలో ‘గీర్బాణ’ శబ్దం నుంచి ఏర్పడినదని “గీరేవ (నిగ్రహానుగ్రహసమర్థా) బాణః అస్త్రం యేషామ్’ అని రామాశ్రమి. ఎవరి వాక్కులు బాణతుల్యములో, వారు గీర్బాణులు. గీరేవ శాపలక్షణా వాణో బాణో వా యేషాం తే వబయో రభేదః’ అని లింగాభట్టీయం. సంప్రదాయస్థమైన ఇదే తెలుగులో ఏర్పడిన అర్థచ్ఛాయకు మూలమని ఊహ్యం. ములుకుల వంటి పలుకులు (బాణతుల్యములైన కఠినోక్తులు) కలవాడు గర్విగా భావింపబడటం సహజమైన అర్థాన్వయమే. అది ఆధునిక సాహిత్యపరిణామగతమైన అర్థాన్వయమో, కాదో ఇంకా పరిశీలింపవలసి ఉన్నది.
ఇవన్నీ వ్యాసప్రతిపాదితానికి భంజకాంశాలు కావని ముందే విన్నవించటం జరిగింది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/08/2016 2:46 pm
మాన్యులు శ్రీ వెల్చేరు నారాయణరావు గారికి, శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
నమస్కారములతో,
వ్యాసం ఇంకా పూర్తికాలేదు కాబట్టి, ఇప్పుడే వ్యాఖ్యానించటం భావ్యం కాదు కాని, మీవంటి ప్రభావశీలి ప్రామాణికుల రచనలో అక్కడక్కడ కొన్ని అనంగీకారయోగ్యములైన భావాలను మాత్రమే – అవి మీ వ్యాసతాత్పర్యానికి భంజకాలు కాకపోయినా, కొంత సంబంధించినవే కనుక ఇక్కడ ప్రస్తావింపవలసి వచ్చింది:
ఎందుకు కారు? వ్యాకరణ తర్క వేదాంతాది శాస్త్రాలను గురుసన్నిధిని శాస్త్రీయంగా అధ్యయనించి, వేలూరి శివరామశాస్త్రి, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి గారల వంటి అసంఖ్యాతవిద్యార్థులకు సంస్కృతవ్యాకరణం నేర్పి మహావిద్వాంసులను కావించి, కావ్యనాటక ప్రకరణగ్రంథాలను బోధించి, సంస్కృతంలో ధాతురత్నాకర కాళీసహస్రాదులు గాక ఇతరానేకశతశః ప్రౌఢశ్లోకరచనలు చేసిన మహానుభావులు వారు. మామూలు తెలుగు పండితులు వ్రాయలేని ఒక పద్యం, సామాన్య సంస్కృతపండితులు అర్థతాత్పర్యాలు చెప్పలేని ఒక శ్లోకం ఇక్కడ చూపుతున్నాను. రెండూ వారివే. ఇటువంటి ఉదాహరణలను వారి రచనలలో ఒక్కొక్కదానిలోనుంచి ఎన్నింటినైనా చూపవచ్చును:
కొందరు పచాద్యజంతం
బందురు; మఱికొంద ఱర్శ ఆద్యంతం బే
యందురు; మే ముభయం బని
యందుము నీ నామధేయ మానందనృపా!
యః పశ్యతి జగత్సర్వం యో న పశ్యతి సర్వతః
తా వుభౌ పరమాత్మానం పశ్యాపశ్యౌ న పశ్యతః.
అప్పకవి వ్రాసిన ఆ పద్యమే – భారతంలో నన్నయ గారిచే చేయబడిన వ్యవస్థ తప్పించి, వ్యాకరణం పేరుతో సూత్రసంపాదనం అంటూ ఎవరూ చేయలేదు కనుక – అందులో ఉన్న తీరున మాత్రమే – అంటే, ఆ భారత ప్రయోగాలను అనుసరించి మాత్రమే – రచన చేయాలని ఆ కవిరాక్షసుని ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నది. అంటే, ఆ కవిరాక్షసునికి నన్నయగారి పేరిట వెలసిన ఆంధ్రశబ్దచింతామణి సంగతే తెలియదన్నమాట. ఆయన వ్యాకరణానికంటె నన్నయగారి ప్రయోగాన్నే శరణ్యమని భావించాడన్నమాట. (‘కవిరాక్షసుడు’ అన్న పేరే ఆయన సంస్కృత పాండిత్యాన్ని సూచిస్తున్నది; అంతటివాడు వ్యాకరణం కంటె కవిప్రయోగం శిరోధార్యం అన్నాడన్నమాట.)
“ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం” మనవారికి ఎన్నడూ లేదు. ‘ప్రయోగశరణం వ్యాకరణం’ అని ఉండనే ఉన్నది కదా. అతిప్రాచీనాచార్యులు, మునిత్రయం వారు ప్రయోగవిజ్ఞానమే వ్యాకరణానికి మూలకందమని (“అపదం న ప్రయుఞ్జీత” వద్ద వృత్తిని చూడండి) పదేపదే చెప్పారు. పాణిని మహర్షి అష్టాధ్యాయికి మునుపే జాంబవతీ పరిణయం చెప్పిన సంగతీ, అందులో పాణినీయానికే లొంగని ప్రయోగాలున్న సంగతీ సుప్రసిద్ధమే. కావ్యాలు ముందు పుట్టి, వాటిని అనుసరించి వ్యాకరణం వస్తుందనే మనవారి నమ్మకం.
ఆంధ్రశబ్దచింతామణి 16-వ శతాబ్ది చివరి కాలం నాటిది. అంతకు మునుపటి కవులకు దాని ఉనికి విషయం తెలిసివుండే అవకాశమే లేదు. ఆ తర్వాతి కవులు మాత్రం దానికి “బలమైన ప్రాధాన్యాన్ని” ఇచ్చారని చెప్పేందుకు ఆధారాలు ఏమున్నాయి?
ఏనాటి కవుల సంగతి? ప్రాచీనకవులు పాణినిని కంఠస్థం చేసేవారో, లేరో; ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరింపగలిగి ఉండేవారో, లేరో మనకు తెలిసే అవకాశం లేదు. వారి ప్రయోగాలే అందుకు సాక్ష్యాలు. సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంలోనే “శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు” అన్న కవి, “వక్షోముఖాఙ్గేషు” అని సమాసాంతవ్యవస్థ తెలియక అపాణినీయప్రయోగం చేశాడనుకోవాలా? పాణినీయాన్ని పుడిసిట పట్టిన మహాపండితు డనుకోవాలా? తిక్కన శ్రీనాథ పోతనాదుల మాటేమిటి? “యమునాద్గంగము, కృష్ణభూమదిలము” ఇత్యాదులున్న భాస్కర రామాయణం మాటేమిటి? ఆ రోజుల్లో సంస్కృతవ్యాకరణం కంఠగతం కాకుండా కవిత్వం చెప్పిన తెలుగు కవులు అరుదనే చెప్పాలి.
కాగా, అభినవగుప్తుని పరిచయం 20-వ శతాబ్దికి పూర్వం తెలుగు కవులకు లేకపోవటంలో ఆశ్చర్యం ఉండకూడదు. వ్రాతప్రతులు ఏనాటినుంచో దురుద్ధరంగా ఉండటమూ, తెలుగు కవిత్వం ప్రారంభమయే నాటికి సంస్కృతలాక్షణికులకే ఆ కృతి దుర్లభమైపోవటమూ, తెలుగు కవులెవరూ ఆయనను స్తుతించి ఉండకపోవటమూ అందుకు సాక్ష్యాలు. నాట్యశాస్త్ర ధ్వన్యాలోకాదులను చూసిన తిక్కన శ్రీనాథాదులు సైతం అభినవగుప్తుని వ్యాఖ్యలను చూసినట్లుగా నిరూపించటం కష్టం. “ఎక్కువమంది” కారు; అసలెవరూ ఉండి ఉండరు. ఆధునికకాలంలో మాత్రమే అది అచ్చైనాక ప్రచారంలోకి వచ్చింది. “మామిడి కొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిలస్వామికి మ్రొక్కి … ఈ యభినవధ్వనిధారణ కుద్యమించితిన్” అని రాయప్రోలు.
జగన్నాథ పండితరాయల వారు క్రీస్తుశకం 1674లో పరమపదించారు. 1700కు తర్వాతనే తప్పించి, తెలుగు కవుల్లో అంతకు మునుపు ఎంతమందికి ఆయన పరిచయం సాధ్యం? అనంతరీయాధునికాలంకారికులలో సైతం ఆయనతో చాలా మందికి తీవ్రవిభేదాలున్నాయి. సంస్కృతంలో ప్రసిద్ధవ్యాఖ్యలు లేకపోవటమే దేశమంతటా దాని వ్యాప్తిలోపాన్ని సూచిస్తున్నది. ఆధునికకాలంలో తాతా సుబ్బరాయశాస్త్రి గారు, గాజులపల్లి హనుమచ్ఛాస్త్రి గారు, వారి తర్వాత పంతుల లక్ష్మీనారాయణశాస్త్రి గారు, వేదాల తిరువేంగళాచార్యుల వారు, జమ్ములమడక మాధవరామశర్మ గారు కళాశాలలలో పఠనపాఠనాలలోకి తేక మునుపు తెలుగుదేశంలోనూ దానిలో కృషిచేసిన ప్రసిద్ధులు లేరు. తెలుగు కవులు ఎప్పుడు పడితే అప్పుడు దానిని ఎట్లా ఉదాహరింపగలరు?
చిన్నయ సూరి గారు ఆ విధంగా ఒప్పుకొన్నందుకు బాలవ్యాకరణంలో ఆధారం ఎక్కడున్నది?
ఎందుకు పట్టవు?
“పేరుఁగన్నట్టి వెల్చేరు నారాయణరావు సీసమ్ము నేర్పంగఁ బూని
పరుచూరి శ్రీనివాస్ పదము డుమంతంబు గామియు, స్వస్థితిన్ గారవించె”
అని?
ముందే వ్రాసినట్లుగా, ఇవి మీ వ్యాసప్రతిపాదితానికి భంజకాలు కాకపోయినా, కొంత సంబంధించినవే కాబట్టి ప్రస్తావింపవలసి వచ్చింది. ఏవంవిధ విషయవిమర్శను మీ సహృదయత మన్నిస్తుంది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/03/2016 4:22 pm
మాన్య మిత్రులు శ్రీ కామేశ్వరరావు గారికి
నమస్కారములతో,
మొదటి పద్యానికి మీ వ్యాఖ్య, పదప్రయోజనాన్ని వివరించిన తీరు – హృద్యంగా ఉన్నాయి. “దేవీసంతతి” అని మీ ప్రతిలో ఉన్నది కాబోలు. అది తప్పు కాదు కాని, ప్రసిద్ధప్రతు లన్నిటిలో దేవీసంహతి, దేవీసంఘము అనే పాఠాలున్నాయి.
రెండవ పద్యంలో “బాహుదుర్గములు” అన్న సమాసాన్ని మీరు బహువచనంగా గ్రహించి, ‘బాహువులనే కోటలు’ అని అన్వయించారు. అవి ఒకటి కాదు; రెండు దుర్గాలు అని కూడా వివరించారు. అయితే, ‘బాహువులనెడి దుర్గము’ అని రూపణను ఏకవచనంగా పఠించటమే సమంజసం. శ్రీకృష్ణుని బాహుమధ్యసీమ (విశాలమైన వక్షఃస్థలం) దుర్గోపమమై, దైత్యదానవదుష్ప్రాపం కనుక తనకు రక్షాకరమని సత్యభామ అంటున్నది. ఇక్కడ ఒక్కొక్క బాహువు ఒక్కొక్క దుర్గమన్న అర్థానికి అవకాశం ఉండదు. బాహువులు రెండైనా, నాలుగైనా రిపుదుర్గమమైన దుర్గం ఒక్కటే.
“త్వం త్వబ్జనాభాఙ్ఘ్రిసరోజకోశ, దుర్గాశ్రితో నిర్జితషట్సపత్నః” అని పంచమ స్కంధంలో (1-19) శ్లోకాన్ని చూడండి: “శ్రీ నారాయణ చరణారవిందంబు లను దుర్గం బాశ్రయించి, యరిషడ్వర్గంబు జయించి” అని గంగనామాత్యుని తెలుగుసేత (5-1-11). అక్కడ ఒక్కొక్క చరణం ఒక్కొక్క దుర్గం కాదు కనుకనే, “చరణారవిందములు అనెడి దుర్గము” – అన్నాడు.
“శ్రీరమణీ కుచదుర్గ విహారే” – శ్రీదేవియొక్క కుచములనెడి దుర్గమునందు (ఎత్తైన రెండు కొండలున్న గిరిదుర్గము వంటి వక్షఃస్థలమునందు) విహరణము కలవాడు – అని భావం. శ్రీదేవియొక్క కుచములనెడు రెండు దుర్గములందు విహరించువాడు అని చెప్పకూడదు. ఇది “మధుకైటభారేః వక్షోవిహారిణి” అన్న ప్రయోగం వంటిదే.
“బాహుదుర్గములు” అన్న అపపాఠం వల్ల ఈ అపార్థానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల పద్యాన్ని –
“దానవు లైన నేమి, మఱి దైత్యసమూహము లైన నేమి? నీ
మానితబాహుదుర్గ మను మాటున నుండఁగ నేమి శంక? నీ
తో నరుదెంతు” నంచుఁ గరతోయజముల్ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని, దన్ను భర్త బహుమానపురస్సరదృష్టిఁ జూడఁగన్. (దశమ: ఉత్తర భాగం-155)
అని సరిదిద్దుకోవాలి. నీయొక్క బాహుదుర్గసీమ అను మాటునన్ = రక్షణస్థానమున ఉండగా, నాకు ఏమి శంక? అని అన్వయం.
అంతే కాదు. ఆమె మ్రొక్కటమూ, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూడటమూ ఏకకాలంలో జరగలేదు. ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచిన తర్వాత ఆమె మ్రొక్కలేదు. ఆమె మ్రొక్కిన తర్వాత, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచాడని అన్వయించేందుకు వీలులేకుండా, “బహుమానపురస్సరదృష్టిన్ చూడఁగన్” – అన్న వెంటనే, “ఇట్లు మ్రొక్కిన” అన్న వచనం ఉన్నది. అప్పుడు “చూడఁగన్” అన్న అసమాపక క్రియకు ఆమె మ్రొక్కగా, ఆతడు చూడగా అన్న అన్వయమూ సరిపడదు.
వాక్యంలో “మ్రొక్కె” అన్న సమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “చూడఁగన్” అన్న అసమాపక క్రియను అన్వయించే వీలుండదు. “చూడఁగన్” అన్న అసమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “మ్రొక్కెను” అన్న సమాపక క్రియను చివరిదిగా అన్వయించాలి. తనను భర్త బహుమానపురస్సరదృష్టితో వీక్షింపగా, ఆమె కరతోయజములు ముకుళించి మ్రొక్కెను – అని మాత్రమే పద్యంలో వాక్యాన్వయం వ్యాకరణసిద్ధం. అప్పుడు అర్థం పొందుపడదు. నీతో నేను వస్తాను, నీవుండగా నాకేమి భయం? అని ఆమె అడిగినంత మాత్రాన ఆయన బహుమానపురస్సరదృష్టితో చూశాడనటమూ, అప్పుడామె నమస్కరించినదనటమూ కవి చిత్రణ అనుకోలేము. ఆ పక్షాన కవితాత్మకమైన అభివ్యక్తీకరణమే ఉండదు.
అందువల్ల, “చూడఁగన్” అన్న క్రియారూపానికి ఇక్కడ తుమున్నర్థంగా మాత్రమే అన్వయం. భర్త తన పలుకులను విని, బహుమానపురస్సరదృష్టితో చూసేందుకే ఆమె అంజలించినదన్నమాట. అది సత్యభామ స్వభావానికి తగిన చిత్రణమే. సాకూతమైన అంజలిబంధం. ముందు ప్రశంస, ఆ తర్వాత ప్రణమనం – రెండూ ఆయన మెప్పుకోసం మాత్రమే అన్నమాట. అదే కవి మనోగతం. “చూడఁగన్ = చూచుట కొఱకు” అని తుమున్నర్థకం.
ఆ జాణతనాన్ని గుర్తించాడు కనుకనే, ఇట్లు (ఈ విధమైన నేర్పరితనంతో) మ్రొక్కినన్ = ఆమె నమస్కరింపగా, ఆయన భావజ్ఞుడు కదా, దగ్గరికి తీసికొని కౌగలించికొన్నాడని తర్వాత అన్నాడు.
సహృదయత ఉట్టిపడుతున్న అమోఘమైన మీ వ్యాఖ్యకు పరిపూరకంగా మాత్రమే ఈ మాటలను వ్రాశాను. పోతనగారి భాగవతం ఎంత పరిష్కరణ సాపేక్షమో ఈ సన్నివేశం మరొక్కసారి నిరూపిస్తున్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
08/30/2016 1:59 pm
రామయ్య గారికీ, రజనీకాంత్ గారికీ ధన్యవాదాలు. రాజ్ రెడ్డి గారి గురించీ, చంద్రశేఖర్ గారి గురించీ రాయమని అడిగేరు. ప్రయత్నిస్తాను. ఫెర్మా గురించి రాయమని ఈమాట సంపాదకులు – మాధవ్ – అడిగి ఉండకపోతే రాసేవాడినే కాదు. మా అన్నయ్య స్నేహితుడు – సిరక్యుస్ యూనివర్శిటీలో ఉండేవాడు – పేరు వాలీ అనుకుంటాను, చంద్రశేఖర్ జీవిత చరిత్ర రాసినట్లు లీలగా జ్ఞాపకం ఉంది. అది సంపాదించి, చదివి, ఆ తరువాత ప్రయత్నిస్తాను. చంద్రశేఖర్ చేసిన పని చాలమట్టుకు నాకు పరిచయమే కాని ఆయన జీవిత విశేషాలు సేకరించాలి. చూద్దాం.
– వేమూరి
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
08/30/2016 10:34 am
“ఏ రామానుజన్ లాంటి వ్యక్తి అయినా తారసపడితే” … మాలాంటి సామాన్యులకి అదంత సులభ సాధ్యం కాదు. అందుకే తారసపడ్డ మీకే చేతులు ముకుళించేటందుకు నమస్సుమాంజలి అనేటందుకు, అనుమతి ఇవ్వరా ఆచార్యవర్యా.
Carnegie Mellon University ( Robotics Institute ) డా. రాజ్ రెడ్డి గారి గురించి కాని, Chicago University ఖగోళ శాస్త్రవేత్త “చంద్ర” ( సుబ్రహ్మమణ్య చంద్రశేకర ) గారి గురించి కాని మీ మరే రచనలైనా కాని చదవాలని కుతూహలంతో,
ఆ టాపిక్స్ అంత తేలిగ్గా అర్ధం అవుతాయని కాకున్నా, మీరు కదళీ పాకంలో చెపుతారనే ఆశతో
నాకు నచ్చిన పద్యం: మాధవపెద్దివారి మధుర స్మృతికావ్యం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
08/03/2016 7:01 pm
Thanks to the contributors, for making it possible to get to know the Telugu Poet మాధవపెద్ది సుందర రామశాస్త్రి. I did not know him before. I am glad, I do now.
I like to get into some discussion on the essay. Because genetically I am contentious. But first, in the same spirit of essayist – which is appreciation of poetry- I am presenting this writing on Duvvuri Ramireddy’s literary work/s. (I like Telugu Script. I feel some of the beauty of any language is associated with its script. So I typed this writing of mine – which is originally published in “RTS” in the racchabanda Yahoo groups, in Dec 2006, – now into Telugu, for readers of eemaata.) Please read on, if you wish.
At some point in my reading I have stopped looking at “పానశాల” as a translation and started looking at it as a love poem.
పానశాల ఒక ప్రేమ కావ్య ఖండిక. పానశాల ఒక విరహ గీతిక. పానశాల ఖయ్యాము అనువాదముగా భావించటం మాని చదివితే అందులో రామిరెడ్డి హృదయ సాక్షాత్కారం జరుగుతుంది. ఈ రామిరెడ్డి ఒక చక్కని స్వభావం కల యువకుడు. ఒక సంపన్నుడు. ఒక మోతుబరి రైతు. అన్ని విషయములయందు ఆసక్తి ఉన్నవాడు. సైన్సు, సాహిత్యము, సంగీతము, భాషలు, వ్యవసాయం, ఇతనికి ఇష్టంలేని వస్తువులేమున్నాయి. అందమైనవన్ని ఇతనికి ప్రియాలు. చక్కని మేడ కట్టుకున్నాడు. ఆ మేడను అందాల మందిరంగా అలంకరించుకున్నాడు. అందులో తన భార్యతో కాపురం ఉంటున్నాడు. ప్రపంచంలో కొందరు తెలివైన వారయ్యీ, ఆలోచనలో వక్రత లేకుండా పూర్తిగా మధుర భావనలతో నిండిన వారుంటారు. భార్య నిజంగా అందగత్తో కాదో కాని వీరికి అందంగా కనిపిస్తుందేమో. నిజంగా అందమైన భార్యలున్నవారుంటారు. సర్వ సమర్ధులైన భార్యలున్నవారుంటారు. ఐనా ఉత్తమ హృదయం లేని వాడికి భార్య అందం, గుణం మనసుకు పట్టదు. రామిరెడ్డి అలా కాదే! స్వచ్ఛ హృదయుడు. రామిరెడ్డి రాముని వంటి వాడు. తన భార్యను గాఢంగా ప్రేమించిన వాడు.
కొంతమంది జీవితంలో ప్రేమ అనే భావనే లేకుండా జీవితం గడుపుకోగలరు. వీరికి అన్నీ డబ్బులూ దస్కాలూ, లెక్కలూ డొక్కలూ, సంఘాలూ సంస్కరణలూ కనిపిస్తాయి. ఎవతికి ఎవడిని ఎలా కట్టబెట్టాలి అందులో బాధ్యతలు, బరువులు, లొసుగులు కిటుకులు, ఇదీ వీరి ఆలోచన. సంఘం నియంత్రిస్తే, ఆ చట్టానికి కట్టుబడి ఏదో కర్మకాండలు చేసుకుపోయేవారికి ఈ ప్రేమ సుఖం అనుభవంలోకి రాకపోవచ్చు. మనకు అనుభవం కాని సుఖం లేనే లేదనుకుంటారు కొందరు శుంఠలు. అసలు కొన్ని సుఖాలే దండగ అనుకునేవాళ్లు, అందరినీ బలిపీఠాల మీద కెక్కించగల సమర్ధులు. కొందరు ‘రోఠీ కపడా మకాన్’ మేధావులకు అదే పెద్ద సమస్య. ‘तेरी दो ढकिये की नौकरी में मेरा लाखों का सावन जाये’ ఆలోచన వీరి మెదడులోకి రాకనే పోవచ్చు.
కానీ ప్రేమికులకు సంఘమే లేదు. వారు ఒకరి కొరకు ఒకరి అందంలో, ఒకరి ఆనందంలో ఇంకొకరు జీవిస్తారు. వారు కలిసి ఉన్న సమయం వారికి స్వర్గం. ఒకరినుండి ఒకరు వేరు పడిన సమయం నరకం. అధిక తెలివితేటలు ప్రదర్శించకుండా, ధనమూలం జీవితం కాకుండా, ఆదర్శాల ప్రదర్శనమే జీవితం అనుకోకుండా, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే స్నేహం, ప్రేమ అనుభవించగల, సొంత జీవితం జీవించగల అదృష్టవంతులున్నారు.
రామిరెడ్డి అటువంటి అదృష్టవంతుడు. అటువంటి వాడికి చిన్న వయసులో భార్యా వియోగం సంభవించింది. భార్యతో గొప్ప ప్రేమ బంధంలో ఉన్నప్పుడు, వియోగం కలిగింది. ప్రేమ లభించినవాడికి గదా, ప్రేమ చెయ్యి జారినప్పటి బాధ అనుభవానికి వచ్చేది. సంయోగమే లేని వాడికి వియోగమెక్కడిది? దుర్భర దుఃఖంలో అల్లాడుతున్నప్పుడు అతనికి ఖయ్యాము రుబాయీలు సహాయమయ్యాయి. రిబాయత్ అతని శోకాన్ని అతని నుంచి బైటకు దొర్లించింది. “ ఘల్తాన్ ఘల్తాన్ హమీరవిద్ తా బెలగు” అని ఆటలాడుతూ అన్న ఒక చిన్ని బాలుడు పలికినది కవిత్వమై, ఆ పిదప నిర్దుష్టపు రూపు దిద్దుకున్న రుబాయీలు, ఖయ్యాం వంటి శాస్త్రజ్ఞుడు, కవి, మానవ జీవితానుభవమే కవితగా పలికించిన రుబాయీలు – ఎన్నో ఏళ్ల తర్వాత ఎక్కడో తెలుగు దేశం లోని ఒక్క తప్త హృదయాన్ని, ఒక మహా వేదన నుండి గట్టెక్కించాయి. పారశీకము నేర్చుకోడము, అన్ని వందల పద్యాలను మళ్లీ మళ్లీ చదవటము, అందులోని భావమును గ్రహించటము, ఆ చదువులు, ఆ తిరగరాసుకోటాలు, ఇవి అతని మేధకు ఒక పనిని కల్పిస్తాయి. అందులోని వేదాంతము – ఎవ్వరికీ ఏదీ శాశ్వతం కాదని, అన్నీ పోగార్చవలసిందే అనీ, ఏ దుఃఖమూ తనదొక్కడిదే కాదనీ – ఈ విషయాల స్మరణలో కొంత సాంత్వన లభిస్తుంది. పద్యాల లోని మధురతకు అతని మనసు లోని మధురతకు సమన్వయం కుదురుతుంది. అతని నైజం మార్చకుండా, అతను ప్రేమలో అనుభవించిన తియ్యదనాన్ని మళ్ళీ ఇంకోమారు తలపుల్లో నిలిపే, అతని దుఃఖాన్ని మళ్ళీ తియ్యగానే వెల్లడి చెయ్యగలిగే, తానై తలచని, విధి విధించిన అవకాశం అది.
ఖయ్యామును ఒక కవి ఒకలాగా భావించుకుంటే, ఇంకో కవి ఇంకోలాగా ఊహించుకోవచ్చు. లత ఖయ్యామును అందంగా సొంతగా భావన చేసింది అనిపించింది నాకు. ఆమె మోహనవంశి ఎప్పుడూ గొప్పగా వేరుగా పలుకుతుంది. రామిరెడ్డి ఖయ్యాము, చలం ఖయ్యాము అనుభూతి ఒకటి కాదు, కాలేదు. రామిరెడ్డి పానశాల చలం రాయలేడు. చెలంకు ఛందస్సుతో పద్యాలు రాయడము రాకపోవటమే కాదు. చెలం స్వభావం వేరు. ప్రపంచంతో, స్త్రీతో, అతడి సంబంధం అతడి ప్రేమ మార్గాలు, అనుభవాలు, ప్రకటనలు వేరు.
రామిరెడ్డి ఖయ్యాము లో, భోగ లాలసత కాదు. ప్రేమ, విరహము, బాధ ఎక్కువ ఉన్నాయి. పానశాల పద్యాలలో రామిరెడ్డి పగిలిన హృదయం ఉంది. పద్యాలు మొదలుకు ఖయ్యామువే కాని, రామిరెడ్డి పానశాల పద్యాలు కూరుస్తున్నపుడు అతని మనసులోని మూర్తి అతని భార్య. అతను కొన్ని కొన్ని రుబాయీలను అతికినప్పుడు, అందులో భావం వెలికి తెస్తున్నానని అనుకున్నప్పుడు వెలికి వచ్చినది అతని మనసులోని వియోగ విషాదమని నా మనసుకు తోస్తూ ఉంది.
చదువరులు మీరే కింది పద్యాలను చదివి నిర్ణయించండి.
చెలియ, మనోహర ప్రణయ శీతలతన్ సుఖించు నా మనం
బలమటతో తపించు నకటా! భవదీయ వియోగ కీలలన్;
దెలియదొ, సాఖి యార్తులకు తియ్యని మందని, ప్రాణముల్ తదం
ఘ్రుల విడిపింతు; రమ్ము, బ్రదుకున్ నిలబెట్టెద నెట్టి యాసలన్.
వలపుల దివ్వె, నీ మృదుల పాద లతాంతము ముద్దుగొందు; న
న్యల మధురాధరంబులయినం దులతూగవు దాని తోడ; రా
త్రుల సహవాసకామినయి రోసియు నిన్ గనలేక భగ్నవాం
ఛల చివురించు లజ్జ పెలుచం బవలెల్లను బుత్తు దీనతన్.
చెలియరో, నీ వియోగమున చిత్తము చీకి కృశించె; నీవు నే
వలనికి పోయినన్ విడువ పయ్యెదకొంగు; నిరంతరంబు ని
న్వలచినవార లెందఱొ వనారిలి కూలిరి నీవు పోవ; నే
డెలమి దొలంక వచ్చితివి; ఎందఱు నీ బలిపీఠి జత్తురో!
లలనా, కోమలమైన నీ తనువు నేలన్ లీనమై పోయి య
వ్వల నానావిధ భాండభాండికల రూపంబెత్తు; తత్త్వజ్ఞులీ
చల వృత్తంబును నమ్మబోరు; నిరయ స్వర్గాను సంధాన క
శ్మల చిత్తంబు పురాతనాసవమునన్ స్నానంబు గావింపుమా.”
All the above appears to me that he is in his own sorrow. He had slipped into his own life and is expressing his agony.
There are a set of poems he wrote separately on his wife – “భగ్న హృదయము,” “ప్రియా వియోగము” From them I quote:
కన్నులు విప్పి చూచితిని కాంతశవంబును, జేతితోడనే
యన్నులమిన్న కాష్టమున కగ్గి రగిల్చితి, నింత చేసియుం,
జన్న తెఱంగెఱింగియును సంశయమొందును బాడు బుద్ధి! యా
పన్నుల చిత్తవిభ్రమపు పాటులు నిట్టివియేమొ యెల్లెడన్!
కలలోన తలంపలేదు గద యో కల్యాణి, నీ కింత లో
పల నూఱేడులు నిండునంచు, విధి దుర్వారప్రభావంబు మ
ర్త్యులయత్నంబు నధ:కరించుగద! వైద్యుల్ దివ్యసంజీవి చెం
బుల త్రావించియు పూర్వ దుష్కృత ఫలంబున్ మార్చలేరైరిగా!
I see the same loving heart and no big difference in the poems. Do not fault me, if somewhere along the line, in my reading, I have stopped seeing Panasala as Rubaiyat’s translation and I have started seeing it as ప్రేమ కావ్యము. Every poem in Panasala is soft in sound, is singable. But, sorry! You cannot recite or read all of them because your eyes will brim with tears and you cannot read the page anymore.
ఎందుకో అసందర్భంగా నాకు పానశాలలో ఒక్కో పద్యమునకు, అడవిలో బృహత్కథా సరిత్సాగరము చదువుతూ గుణాఢ్యుడు, ఒక్కొక్క కాగితం మంటలో కాలుస్తుంటే, అడివి జంతువులు వింటూ కన్నీరు కార్చే దృశ్యం స్మృతిలో కనిపిస్తుంది.
Deeply saddening they are, sadly sweet they are an attempt should be made to sing the whole set of poems of Panasala. Hopefully someone with sweet voice that can speak out the anguish of loss of a love, will recite and record these poems.
Yes! I like a good singer to sing Duvvuri’s Panasala. Alternately, if one sings Panasala as Duvvuri’s love song, one may become a great singer.
Thanks,
Lyla
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి A S Murthy గారి అభిప్రాయం:
07/06/2016 7:45 am
వేమూరి వారికి నమస్సుమాంజలి,
ఒకప్పుడు Early 90’s లో నాకెంతో ఇష్టమైన/కష్టమైన టాపిక్ చాలా సులభంగా ఒక వ్యాసం లాగా రాసినందుకు అభినందనలు, కొంతకాలం నేనూ కుస్తీ పడదామని ప్రయత్నించి వదిలేసేను, రాత్రుళ్ళు చాలా వృధా అయ్యేయి, మళ్ళీ కాస్సేపు పృఅయత్నిద్దాం అని ఆశ. ఇంతలో వైల్స్ గురించి తెల్సి హమ్మయ్య అని అనిపించింది, కాని మీరు ఆఖర్లో 7.4 లో అన్నట్టు ఫెర్మా ఉద్దేశ్యంలో ఇంకా సులభమైన ఋజువు ఉందేమోని నాకనిపిస్తోంది.
ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి
బెంగళూరు
కాలిదాస – మాలవికాగ్నిమిత్రమ్ గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
07/05/2016 4:59 pm
మాలవికాగ్నిమిత్రమ్ చదివేముందు, ముందుగా కథ తెలుసుకుందామని, “అమరచిత్రకథ” లో బొమ్మల కథని చదివి చూసేను. ఇతివృత్తం చాల క్లిష్టంగా ఉందనిపించి నా ప్రయత్నం మానుకున్నాను. కాని, ఇక్కడ శ్రీ భుజంగరాయశర్మ గారి ప్రసంగం విన్న తరువాత ఈ నాటకం చదవాలన్న కోరిక మళ్లా పుట్టింది. తరువాత రేడియో నాటిక విన్న తరువాత ఈ కోరిక ఇనుమడించింది.
పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు!
వేమూరి వేంకటేశ్వరరావు
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
06/11/2016 10:52 am
శ్రీ వాసుదేవరావు గారికి
నా ‘ఎనాలజీల’తో మిమ్మల్ని బాధించినందుకు క్షమార్పణలు. ఈ ఎనాలజీలు అన్నివేళలలోనూ నప్పవు. పుస్తకం పేరు కూడ నచ్చలేదన్నారు. మీరు సూచించిన పేరు కాసింత మెరుగ్గానే ఉందనిపించింది కాని వేళకి ఆ పేరు నా బుర్రకి తట్టలేదు. మీలాంటి విజ్ఞులు నా పుస్తకం దింపుకుని చదివేరంటేనే అది నాకు ఒక కితాబు! నేను ఈ రకం రాతలు రాయడానికి ఒక కారణం ఉంది. ఇవి చదివి, స్పందించి, ఇంతకంటె బాగా రాయగలిగే వారు ముందుకి వచ్చి నా కంటె బాగా రాస్తారనే ఆశతోటే!
నమస్కారములతో
వేమూరి
ఒక్కతే… మృత్యువు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/01/2016 6:16 pm
ఒక చిన్న కథ:
ఒక అడివి లో, చింకిపాతల బక్క ఎముకలగూడు దరిద్రుడు, రోజూ పొట్ట పోసుకోటానికై, కట్టెలు కొట్టుకుంటున్నాడు. చెమటలు కారిపోతున్నాయి. కళ్లు తిరుగుతున్నయి. పగలే చుక్కలు కనపిస్తున్నయి. కట్టెలు ఎలాగో మోపు కట్టాడు. అడివి లోంచి బైట పడి ఇల్లు చేరే ఓపిక లేదు. యముడా! ఈ తిప్పలు నేను పడలేనురా. ఎత్తుకు పోటానికి రారా! – అని అరిచాడంట. వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమై, నన్ను తలిచావా? పిలిచావా? అన్నాడట. కట్టెలు కొట్టేవాడు, వెంటనే – ఈ కట్టెలమోపు ఎత్తి నెత్తిన పెట్టి పోతావని సాయానికి పిలిచానయ్యా, నేనే తంటాలు పడతాలే వెళ్లు, వెళ్లు, నీ పని చూసుకో -అన్నాడంట.
(ఈ కథ పల్లెటూళ్లో, ఇంట్లో పొయ్యి రాజటానికి,తన దొడ్లో,గొడ్డలి తో పేళ్లేసే మా అమ్మనాన నాకు చెప్పాడు. ఈ కథలో నీతి ఏమి టో, అది నాకు ఎక్కిందో లేదో, తెలియదు కాని, ఈ మాట లో ‘మృత్యువు’ గురించి జోరుదారుగా కథలు, కవితలు వచ్చినప్పుడు అవి క్లినికల్ గా సినికల్ గా లిరికల్ గా ఉన్నప్పుడు నాకీ డల్ కాటూరు కట్టెల కథ ఎందుకు గుర్తొస్తుందా? అనుకుంటాను.
లైలా
*Watching French Open Tennis Championships. Love human body and its mechanics. Love Neruda – when he opens his poetry with lines like:
“Body of a woman, white hills, white thighs,
you look like a world, lying in surrender.
My rough peasant’s body digs in you…”
తేలిక తెలుగు గురించి ముల్లా జలాలుద్దీన్ గారి అభిప్రాయం:
05/27/2016 5:54 pm
ఎడిటర్‌జీ:
సలామ్ ఆలేకుం.
ఎందరో పాఠకులు ఎన్నెన్నో విషయాలు ముచ్చటించిన తరువాత ఈ రెండు మాటలూ చెబుదామనిపించింది.
“నాకు తెలుగుమాట్లాడటం వచ్చు. నాకు తెలుగులో రాయటం, చదవటం కూడా వచ్చు.అప్పుడప్పుడు, ఏమీ తోచనప్పుడు, పిల్లి దొరకనప్పుడూ, కథలు, కాకరకాయలూ కూడా రాసేశా.”
అందుచేత,తెలుగురానివాడికి, తెలుగువాడు కానివాడికీ,తెలుగు రెండవభాషగా పాఠంచెప్పటం వచ్చనుకోవటం, ఆయనెవరో, మున్‌షీజీ అన్నట్టు, ‘దేశభక్తికన్నా హీనమైన పాపం.’
ఖుదా హఫీజ్
ముల్లా జలాలుద్దీన్
ఆశనిరాశలు గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
05/24/2016 7:37 am
కథ బాగుంది.
రెండు మూడు సార్లు అంతరంగ మృదంగనాద… అంటూ వస్తుంది. కాని అంతబాగా అది అతకలేదు కథనంలో.
తేలిక తెలుగు గురించి desikachary గారి అభిప్రాయం:
05/17/2016 12:07 am
వేమూరిగారూ,
మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. మీ బాలవ్యాకరణంలో నున్న సమాచారం సరియైనదే. శకటరేఫాన్ని అచ్చతెనుఁగు వర్ణమాలలో చేర్చుకొని 37 అక్షరాలుగా పరిగణించాలని కొందఱు, అది లేకుండ 36 అక్షరాలుగానే పరిగణించాలని కొందఱు సూత్రీకరించినారు. ఆంధ్రవైయాకరణమునిత్రయంలో పతంజలిస్థానీయులుగా భావింపబడుచున్న బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామిగారు వారి ‘బాలవ్యాకరణోద్ద్యోతము’ అనే గ్రంథములో శకటరేఫాన్ని పరిగణిస్తూ 37 వర్ణములని సూత్రీకరించినారు. వారు చిన్నయసూరిగారి సూత్రములను కొన్నిచోట్లను, సూరిగారి సూత్రములను సవరించి వారే సృష్టించిన సూత్రములను కొన్ని చోట్లను ఇస్తూ, విస్తృతమైన విశ్లేషణతో, విమర్శనాత్మకమైన వివరణతో నీగ్రంథమును వ్రాసినారు. ఇది తెలుగువ్యాకరణమునకు కూర్పబడిన ఉత్తమగ్రంథము. సందర్భానుసారముగా ఈగ్రంథములో బ్రాకెట్లలో సూరిగారి సూత్రసంఖ్యలను కూడ పేర్కొన్నారు. పై వర్ణమాలాసూత్రసందర్భంలోనూ వారు సూరిగారి సూత్రసంఖ్యను ఇచ్చినారు. కాని సూరిగారు 36 అక్షరములనే చెప్పినారని వారు చెప్పలేదు. నావద్ద కేవలము వజ్ఝలవారి గ్రంథమే ఉండుటవల్ల నేను సూరిగారి సూత్రమును చూడలేదు. ఇదియే ఈ అక్షరసంఖ్యలో గల వ్యత్యాసమునకు కారణము. 15వ శతాబ్దమునకు చెందిన అనంతామాత్యుని ఛందోదర్పణములోను ‘తెనుఁగున ఱళ లనఁగ రెండధికమండ్రు హరీ’ అని శకటఱేఫను వర్ణమాలలో చేర్చినట్లు వ్యాకరణవిద్వాంసులైన డా. అమరేశం రాజేశ్వరశర్మగారు తెలుపుతున్నారు. ఈవిధంగా కొందఱు శకటరేఫాన్ని గణించడం, లేక అపగణించడంవల్ల వర్ణముల సంఖ్య 37 లేక 36గా చెప్పడం జరుగుచున్నది.
మఱొకవిషయం:
తపఃఫలం > తపోఫలం
వయఃపరిమితి > వయోపరిమితి
తపోఫలం, వయోపరిమితి అనేవి అపశబ్దాలు. అట్లాంటివి భాషలో నుండవు. విసర్గకు ‘క,ఖ’లు, ‘ప,ఫ’ లు పరమైనపుడు విసర్గ అర్ధవిసర్గగానో (అంటే జిహ్వామూలీయంగానో, ఉపధ్మానీయంగానో), అట్లు గాకున్న యథాతథంగామారకుండానో ఉంటుంది. అందుచేత వయః+పరిమితి -> వయఃపరిపమితి, తపః +ఫలం ->తపఃఫలం అని ఔతుంది కాని, తపోఫలం, వయోపరిమితి అను రూపాలు సిద్ధింపవు. వివరములకు సంధిప్రకరణములో ‘విసర్గసంధి’ని చూడగలరు.
తేలిక తెలుగు గురించి మోహన గారి అభిప్రాయం:
05/15/2016 5:38 pm
శకట రేఫము (ఱ) య వ ల వలె ప్రయత్న భేదముచే మృదు కఠినత్వములయిన రెండు విధములు సిద్ధించును కావున అది ప్రత్యేక అక్షరముగా గ్రహింపబడలేదు. కాని ళ-కారమునకు స్వంతముగా నిర్దిష్టమైన శబ్దము ఉన్నందువలన దానిని ప్రత్యేక అక్షరముగా గ్రహించారు. అందుచేత తెలుగులో 36 అక్షరముల సంఖ్యనే చూపినారు.
విధేయుడు – మోహన
తేలిక తెలుగు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
05/14/2016 7:13 pm
శ్రీ తిరుమలకృష్ణ దేశికాచార్యులవారికి:
మీలోని సరస్వతీదేవికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీ వంటి పండితులు నా వ్యాసం చదవడమే ఒక అదృష్టం. చదివి స్పందించేరంటే అది నా వ్యాసానికి ఒక అలంకారం. మీకు సమాధానం రాస్తే హనుమంతుడి ఎదుట కుప్పిగంతులు వేసినట్లే!
నేను ఏయే నేపథ్యాల నుండి ఇక్కడకి వచ్చేనో కొద్దిగా వివరించనివ్వండి.
మొదటి కోణం: నేను చదువుకునే రోజులలో ఈ దిగువ వాక్యాన్ని నా బల్లకి ఎదురుగా పెట్టుకునేవాడిని.
“A man would do nothing if he waited until he could do it so well that no one could find fault.” – John Henry Cardinal Newman (1801-1890)
తప్పో, ఒప్పో, సమగ్రమో, అసమగ్రమో అని మీమాంస పడకుండా ప్రయత్నించి చూడడం, ఫలితం అనుకున్నట్లు లేకపోతే, లేచి, దుమ్ము దులుపుకుని, మళ్లా ప్రయత్నించడం. ఈ పద్ధతిలో నెట్టుకొస్తున్నాను.
రెండవ కోణం: గత 40 సంవత్సరాలుగా సైన్సుని నలుగురికీ అర్థం అయే రీతిలో, తెలుగులో, రాయడం నా ప్రవృత్తి. సైన్సులోని భావాలని సామాన్యులకి అర్థం అయే విధంగా రాయడం కష్టం; ఇంగ్లీషులోనే కష్టం, పదసంపద పుష్ఠిగా లేని తెలుగులో రాయడం ఇంకా కష్టం. ఈ సందర్భంలో సైన్సుని, జనరంజక శైలిలో అంగరంగవైభవంగా, సమగ్రంగా, సాధికారంగా రాయడం – ఏ భాషా మాధ్యమంలోనైనా సరే – కష్టం. అందుకని మూలంలో ఉన్న భావాన్ని సూక్ష్మీకరిస్తాం. ఆత్యవసరమైన అంశాలని ఉంచి, ప్రస్తుతానికి అవసరంలేని వివరాలని కత్తిరిస్తాం. అలా చెయ్యకపోతే నలుగురికీ అందుబాటులో ఉండేలా రాయలేము. అలా చేస్తే నిష్ణాతులకి కోపం రావచ్చు. “రావచ్చు” ఏమిటి? నేను ఈమాటలో రాసిన వ్యాసం ఒకటి పకడ్బందీగా లేదని గణితజ్ఞులు నా తోలు ఒలిచీసేరు. వారి స్పందనని చూసి కాసింత బిగించి రాసేసరికి “ఇది సామాన్య పాఠకులని ఉద్దేశించి రాసిన రాతేనా? గణితంలో పండితులని ఉద్దేశించి రాసేవా?” అంటూ మరొక పాఠకుడు మందలించేడు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం! అలాగని “పాపులర్ సైన్సు” కి స్థానం లేదనగలమా? సైన్సు ప్రభావం మనందరి జీవితాల మీద పడుతోంది కనుక సైన్సులోని మెలికలు అర్థం కాకపోయినా స్థూలంగా, చూచాయగా, అందరికి అర్థం అవాలి. అందుకని అసలు విషయాన్ని కాసింత తేలిక పరచే ధోరణి ప్రచారంలోకి వచ్చింది.
మూడవ కోణం: నేను కూడ బాలవ్యాకరణం, సంజ్ఞా పరిచ్ఛేదం, తోటే మొదలు పెడదామనుకున్నాను. నా దగ్గర ఉన్న బాలవ్యాకరణం అట్ట చిరిగిపోయింది కనుక ప్రచురణ తేదీ తెలియదు కాని దాని మీద నా అక్క పేరు, నా చెల్లెలి పేరు, నా తమ్ముడి పేరు కనిపించేయి కనుక ఇది ఏ 1945 ప్రాంతాలలోనో ముద్రణ పొంది ఉంటుందని ఊహిస్తున్నాను! ముట్టుకుంటే కాగితాలు విరుగుతున్నాయి, చిరగడం కాదు! ఇందులో సంజ్ఞా పరిచ్ఛేదం, 3 వ సూత్రం ఇలా ఉంది:
“తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు”
మీరు చెప్పినదానికీ, దీనికీ మధ్య లెక్క తేడా వచ్చిందేమిటా అని విచారిస్తే నా ప్రతిలో – అంతా మీరు సూచించినట్లే ఉంది కాని – శకటరేఫ లేదు. అంతే కాదు. ఋ, ౠ, ఒత్తు అక్షరాలు, విసర్గ, ఞ్, ఙ్, శ, ష లు అనే సంస్కృతసమంబులన్నిటిని కలుపుకుంటే తెలుగు అని వ్యవహరించబడుతోంది అని నాలుగవ సూత్రం.
బాలవ్యాకరణంలో మొదటి నాలుగు సూత్రాలూ చదివిన తరువాత మనం ఈ రోజుల్లో వాడుకునే భాష సంస్కృతమా? ప్రాకృతమా? తెనుగా? తెలుగా? అన్న అనుమానం నా బోంట్లకి వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులలో నాలాంటివాడు చెయ్యగలిగేది ఏమిటి?
నమస్కారములతో
వేమూరి
తేలిక తెలుగు గురించి desikachary గారి అభిప్రాయం:
05/13/2016 10:26 pm
లోపభూయిష్ఠమైన పునాది భవనానికే చేటు కాదా? ఇంగ్లీషులో ‘queue’ అనే పదాన్ని ‘q’ అని వ్రాయండని లోకంలో ఎవరైన నేర్పుతారా? ‘buy’, ‘by’ అనే పదాలను ‘bi’ అని వ్రాయండని నేర్పుతారా? తెలుగుకు మాత్రం ఎందుకీ అర్థరహితమైన అగచాట్లు?
1. అచ్చతెనుఁగునకు వర్ణములు ముప్పదియేడు (బాలవ్యాకరణము – సంజ్ఞాసూత్రము -3)
‘అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఎ-ఏ-ఐ-ఒ-ఓ-ఔ’ – అచ్చులు 12
ం, ఁ (పూర్ణానుస్వారము, అర్ధానుస్వారము – ఇవి ఉభయములు)
‘క-గ-చ-ౘ-జ-ౙ-ట-డ-ణ, త-ద-న-ప-బ-మ, య-ర-ల-వ-స-హ-ళ-ఱ’ – హల్లులు 23
వివరణ: తత్సమములు తెలుఁగే గాన ‘అచ్చతెనుఁగు’నకని సూత్రింపబడినది.
2. ఆచ్ఛికంబులందు ‘అయి-అవు’ అనువానికి వరుసగా ‘ఐ-ఔ’ అనునవి బహుళంబుగా నాదేశములగును (బాలవ్యాకరణము – క్రియాసూత్రము -103)
ఉదా: అయిరి-ఐరి, అవును-ఔను, అయిదు-ఐదు, అవుడు-ఔడు (పెదవి క్రిందిచోటు), గవుసెన-గౌసెన
వివరణ 1: ‘ఐ-ఔ’లకు ‘అయి-అవు’ అనునవి కూడ ఆదేశములగుటయుఁ గలదు. ఉదా:కై – కయి (చేయి), కైత-కయిత, కౌను-కవును, కౌఁగిలి –కవుఁగిలి
వివరణ2: ఆచ్ఛికంబులం దనుటచే నిది సంస్కృతసమములందు వర్తిల్లదు. ఉదా: దైవము దయివము, కైలాసము కయిలాసము, కౌమారము కవుమారము, గౌణము గవుణము – ఇటువంటి రూపములు సిద్ధింపవు. దీనికి కారణము ఈ సంస్కృతసమములకు మూలములైన సంస్కృతకృదంతములు ఆయాధాతువులపై పాణినీయవ్యాకరణప్రకారము వివిధప్రత్యయములు చేర్చుటచే ఏర్పడినవి. అట్టి పదములకు ఈ ఆచ్ఛికసూత్రమును వర్తింపజేసిన అవి అర్థరహితమగును. అందుచేత సంస్కృతసమములపై నిది సర్వదా నిషిద్ధము.
వివరణ3: ఛందోబద్ధపద్యములందు ఇటువంటి ఆదేశములు గణ,యతిభంగములకు కారణమగును. ఉదా:
‘నలువై యత్తఱి నత్తలోదరియు వీణావాదనప్రౌఢిచేఁ’-ఈ మత్తేభవృత్తపాదాన్ని ‘నలువయి యత్తఱి నత్తలోదరియు వీణావాదనప్రవుఢిచేఁ’ — అని మారిస్తే రెండు గణభంగములూ, యతిభంగము అగుట గమనింపవచ్చును. అందుచేత ఛందోబద్ధపద్యముల కీ సూత్రమును వర్తింపఁజేయరాదు. కాని మాత్రాసమకవృత్తములలో క్వచిత్తుగా గణభంగము, యతిభంగము కానిచో ఆచ్ఛికపదములకు మాత్రమే దీనిని వర్తింపజేయవచ్చును.
కాపరి భార్య గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
05/10/2016 10:40 am
కథా, దాని అనువాదమూ బాగున్నాయి.
“ఆ అంటుకున్న అగ్గి ఆర్పేసరికి బ్రహ్మ ప్రళయమైపోయింది తనకి” మంచి తెలుగునుడికారం బ్రహ్మప్రళయం ఐపోయిందీ అనటం.
కాని “మొసలి మూతి మీద ఒకట్రెండు దెబ్బలు తగిలాయి. వాడు పట్టించుకోలేదు.” అన్న చోట మాత్రం చిన్న పొరపాటు దొర్లింది. పాశ్యాత్యులు జంతువులను కూడా లింగబేధాన్ని బట్టి వాడు అది అంటారు కాని తెలుగు నుడికారంలో జంతువులను స్త్రీలింగపరంగానే సంబోధిస్తాం కదా. అది (మొసలి) పట్టించుకోలేదు అనటమే సహజంగా ఉంటుంది తెలుగులో.
తేలిక తెలుగు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
05/09/2016 7:29 pm
ఈ వ్యాసం చదివి మెచ్చుకున్నవారికీ, నచ్చుకోనివారికీ, వెక్కిరించినవారికీ – అందరికీ ధన్యవాదాలు. పూర్తిగా నచ్చుకోకపోయినా నా వ్యాసం యొక్క పరిమిత గమ్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని, వ్యాసంలోని మూల సారాంశాన్ని సంగహించి తిరిగి చెప్పిన మోహన్ గారికి మరొకసారి దండాలు.
దరిదాపు పదేళ్ల క్రితం చేసిన పని ఏమిటో చెప్పిన వ్యాసం ఇది; నేను చేయబోతూన్న ప్రణాళిక గురించి కాదు. ఇప్పుడు ఎందరు అరిచి మొత్తుకున్నా నేను చెయ్యగలిగేది ఏదీ లేదు కనుక చేసిన ప్రయోగం – మీకు నచ్చినా, నచ్చకపోయినా – కోరుకున్న ఫలితాన్ని ఇచ్చిందా? లేదా? అన్నది అడగవలసిన ప్రశ్న. ఎవ్వరూ అడగనేలేదు. ఇప్పుడు నా మీద కోపంతోటీ, ఆవేశం తోటీ విరుచుకుపడడం గతజలసేతుబంధనం.
నేనేదో పాపం చేసినట్లు ఆవేశపడుతూ కొందరు రాసేరు కనుక, వారి కొరకు నా ఆలోచనా సరళిని మరికొంచెం విపులీకరించి చెబుతాను. మీ మెప్పుకోలు కోసం కాదు. సమగ్రత కోసం. ఈ ప్రయోగానికి తయారయే ప్రయత్నంలో ముందు ఒక తెలుగు వ్యాకరణం (ఇంగ్లీషులో) రాసుకున్నాను. నా “వెబ్ సైట్” లో ఉంది. గూగుల్ చేస్తే దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రతి ఒకటి పట్టుకుని అంతర్జాతీయ భాషలు నేర్పే శాఖకి వెళ్లి, నా వ్యాకరణాన్ని వాళ్లకి చూపించి, “వ్యాకరణయుక్తంగా భాష నేర్పుతాను, ఈ పుస్తకం చూసి సలహా ఇవ్వండి” అని అడిగేను. అది తేలిక తెలుగు కాదు; మీరందరూ మెచ్చిన తెలుగే! తెలుగుని తెలుగు లిపిలోనూ, ఇంగ్లీషు లిపిలోనూ కూడ రాసేనేమో కనీసం నా ధోరణి వారికి అర్థం అయింది. వారు పెదవి విరిచేరు; పుస్తకం దోషభూయిష్టం అని కాదు, “వ్యాకరణయుక్తంగా భాష నేర్పుతాను” అన్న నా ధోరణిని. “ఈ రోజులలో కొత్త భాషలు నేర్పే పద్ధతే మారిపోయింది. నువ్వు పిల్లలకి తిన్నగా మాట్లాడడం నేర్పెయ్! సందర్భోచితంగా వ్యాకరణ అంశాలని ఎత్తి చూపు. ఆ పద్ధతిలో ఈ పుస్తకాన్ని తిరగరాయి.” అని సలహా ఇచ్చేరు. అందుకనే మూడొంతులు పూర్తయిన ఆ పుస్తకం అర్ధంతరంగా ఆగిపోయింది. ఆ సందర్భంలోనే అచ్చులు, హల్లులు, గుణింతాలు చూసి “అవి నేర్పేసరికి నీ పది వారాల పుణ్యకాలం పూర్తి అయిపోతుంది” అని హెచ్చరించేరు. ఎలా? ఇంగ్లీషు లిపి వాడి మన దేశంలో సంస్కృతం నేర్పుతూన్నట్లు నేర్పడమా? ఇలా వారితో కూర్చుని తంటాలు పడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చేను.
నేను విజ్ఞాన శాస్త్రం చదువుకున్నవాడిని. లెక్కలతో బాగానే పరిచయం ఉంది. ఆ పరిచయంలో ఒక అనుభవాన్ని ఇక్కడకి బదిలీ చేసి ఈ ప్రయోగం చెయ్యడానికి తలపెట్టేను. గణితంతో బొత్తిగా పరిచయం లేని వారికి క్షమార్పణలతో – గణితంలో రెండు రకాల సమీకరణాలు ఉన్నాయి: సరళమైనవి (linear), విరళమైనవి (non-linear). ప్రకృతిని వర్ణించేటప్పుడు సర్వసాధారణంగా ఎదురయ్యేవి విరళ సమీకరణాలు. కాని వీటిని పరిష్కరించడం కష్టం. అందుకని ఆ విరళ సమీకరణాన్ని ఒక అనంత శ్రేణి (infinite series) లా రాసి, అందులో మొదటి ఒకటో, రెండు పదాలని తీసుకుంటే అది సరళంగా కనిపిస్తుంది. మూడో పదం చేర్చేసరికి కొంచెం విరళం అవుతుంది, నాలుగో పదం చేర్చేసరికి మరింత విరళం అవుతుంది, అలా అనంతవాహినిలా ఉన్న ఆ పదాలని ఒకటీ, ఒకటీ చేర్చుకూంటూ పోతే మన విరళ సమీకరణం వచ్చెస్తుంది. తమాషా ఏమిటంటే మూడొంతుల సందర్భాలలో సరళ భాగంతో లెక్క ఆపేసినప్పుడు వచ్చే “రణ చిత్తు” సమాధానంతో మన అవసరం తీరిపోవచ్చు. తీరకపోతే మరొకటి కలుపుకుని, మరికొంచెం ఇబ్బంది పడి “చిత్తు పరిష్కారం” (రణ చిత్తు కంటె మెరుగైనది) సంపాదించాచ్చు. ఇలా చేసుకుంటూపోవచ్చు. ఇలా సరళీకరించిన బద్దింపు పద్ధతినే శత్రు సేనల మీదకి విసిరే కొన్ని రాకెట్లలో వాడేరు (స్వానుభవంతో చెబుతున్నాను).
ఇదే ధోరణిలో భాషలు కూడ విరళ లక్షణాలు కలవి. ఈ విరళత రకరకాల కోణాల నుండి రావచ్చు. కేవలం ఉపమానంగా చెబుతున్నాను. మనం రోజూ వాడుకుంటూన్న భాషని ఈ కింది సమీకరణంగా ఉహించుకున్నాను. (మీరు ఇలానే ఊహించుకోనక్కరలేదు):
ఇప్పటి భాష = తేలిక భాష + శకట రేఫ + ఋ + ఏ + ఔ + … + ః
అనుకుందాం. ఇప్పుడు ఎవరి అవసరాలకి కావలసిన మేరకి వారు పదాలు చేర్చి వాడుకోవచ్చు. ఎవరి భాష వారిదే. బండీరాలు వాడుకొండి, విసర్గలు వాడుకొండి, దంత్య చ జలు వాడుకొండి. మీ ఇష్టం.
గణితంలో “క్రమీకరించడం (?) (regularization) అనే ప్రక్రియ కూడ ఉంది. అవకతవకగా ఉన్న సమీకరణానికి కొన్ని బంధాలు వేసి పట్టాలు ఎక్కించడం లాంటి ప్రక్రియ ఇది. అమెరికా వాడు బ్రిటిష్ వాడి ఇంగ్లీషుని కొంత క్రమీకరించేడు (ప్రత్యేకించి వర్ణక్రమ, ఉచ్చారణ విషయాలలో, అక్కడక్కడ వ్యాకరణంలో కూడ). అయినప్పటికీ అమెరికాలో చదువుకుని, అమెరికాలో ఉద్యోగం చేసి, రిటైరు అయిన ప్రొఫెసర్ వీశ్వనాథం గారు ఇప్పటికీ బ్రిటిష్ వర్ణక్రమంలోనే రాస్తారు. వద్దన్నానా?
“విశ్వవిద్యాలయాలకు ఈ రకంగా మార్పులతో భాషను నేర్పుతున్నట్లు తెలుసా? వారి అనుమతి ఉందా?”
అని అడిగిన ప్రశ్నకి నాకు తెలిసిన సమాధానం. ఇండియాలో సంగతి నాకు తెలియదు కాని అమెరికాలో (కొన్ని తప్పనిసరి పాఠ్యాంశాలలో తప్ప) ఆచార్యుడికి పాఠం ఎలా చెప్పాలో, ఏ క్రమంలో బోధించాలో, వంటి విషయాలలో పరిపూర్ణ స్వతంత్రం ఉంది. అమెరికాలో పద్ధతి తెలియక అడుగుతున్నారేమోనన్న అభిప్రాయంతో (కొంచెం వ్యంగ్యం ధ్వనించింది కనుక) ఈ సమాధానం ప్రత్యేకించి ఇక్కడి పద్ధతి చెప్పేను.
మధుసూదన్ గారి ఒత్తక్షరాల సంగతి మీరు ఆయననే అడగాలి. కాని ఏమాటకామాటే చెప్పుకోవాలి. నా విద్యార్థులు నన్ను నిలదీసి అడిగిన ప్రశ్నలలో ఒకటి మీకు చెబితే మీరు మరి నాతో మాట్లాడరు. ఉండబట్టక చెబుతున్నాను: “కొన్ని సందర్భాలలో మామూలు హల్లుకి అడుగునో, పక్కనో ఒత్తు ఇస్తే సరిపోతుంది కాని (ఉ. ఛ్, ఢ) మరి కొన్ని సందర్భాలలో అక్షరం రూపు పూర్తిగా మారిపోతోంది (ఉ. ఖ, ఘ). హల్లుకి పక్కన చిన్న గీత గీసి అది ఒత్తక్షరం అనుకుంటే సరిపోతుంది కదా? అప్పుడు మేము గుర్తు పెట్టుకోవలసిన ఆకారాలు తగ్గుతాయి కదా!”
నిఝంగా! వీళ్లు పిల్లలు కాదు, పిట్టపిడుగులు. అప్పుడు వీళ్లకి బెర్నార్డ్ షా ఇంగ్లీషులో FISH వర్ణక్రమం ఎలాగుండాలో చెప్పిన వయినం వివరించి చెప్పేను.
–శలవ్
వేమూరి
తేలిక తెలుగు గురించి వంశీ గారి అభిప్రాయం:
05/09/2016 1:46 pm
వేమూరి వారూ, చాలా బాగా రాసినారు మీరు. మీ టీచింగులో సాధక”బోధకాలు” సాధక”బోదకాలు” కింద మారి మీకు చాలా వాచిపోయి ఉండుండవచ్చునని అనుకోలు. అయినా అన్నేళ్ళు చెప్పేరంటే మీ ఓపిక్కి వెయ్యి దండలు, దండాలు.
అయితే పాశ్చాత్యులకు అలానే, ఇలానే మీరు నేర్పినట్టు నేర్పితేనే బాగుంటుంది. ఉదాహరణకు మీరు వారిని, ఏవండీ నాయనా అమ్మా మీరు దే రాసి దాని పక్కన వి రాసి ఆ రెండిటినీ కలిపి ఆ పదాన్ని చదువు అంటే వారు డేవీజోన్స్ లాకరులా దానిని డేవి గానే పలుకుతారు కనక, దేవి డేవి అయినా ఇబ్బంది లేదు. అర్థం అర్థమవ్వాలి కాని, ఉచ్చారణతో పని ఏమిరా డింభకా అని గద్దిస్తూ పింగళి వారు చెప్పినట్టు దుసటచతుసటయమూ ఒకటే దుష్టచతుష్టయమూ ఒకటే.
ఇప్పటి తెలుగు మాత్రం బాగ ఏడ్చిందా ఏమి ? అంతో ఇంతో, ఎంతో కొంత మీబోటి పాతకాపుల వద్దే కాసింత బతికున్నది. మా దగ్గరికొచ్చేప్పటికే తిప్పటకాలు వేసుకుని తాటాకుల పాడె ఎక్కినది…. సహృదయులు కాబట్టిన్నూ, రెస్పాన్సిబిలిటీ ఉందనుకునేవారు కాబట్టిన్నూ – మీరు, దాన్ని ఆ పాడె మీంచి దింపి మళ్ళీ ప్రాణం పొయ్యాలని చూస్తున్నట్టుగా ఉన్నది….ఆ “ఇది” జనాలకు అర్థమైతే బాగుండును…
తెలుగు దేశాల్లో ఎట్లా ఉన్నదో పరిస్థితి తెలవదు కాని, ఇక్కడ ఇలాగన్నా బతికుండటం అవసరం! మా బూబమ్మ హిందీలాగున. 🙂
మరొక్కసారి ఈ దీర్ఘ వ్యాసానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలతో
భవదీయుడు
వంశీ
తా.క – ఉద్యాపనలో సారమంతా అంతా చెప్పేశారు కనక, అంతా నిరంజనమే
తేలిక తెలుగు గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
05/09/2016 11:04 am
గుడ్డివాడు మార్గం చూపమంటే వానిని రాజమార్గంనుండి గాక రాళ్లమార్గం దగ్గరని రాళ్లమార్గంద్వారా తీసికెళ్లినట్లుంది ఈవ్యాసకర్తయొక్క ‘vision’. ఇది వానికి మార్గమంటే అదే అనే అనుభవాన్ని, భావాన్ని కలిగించే అపచారమే కాని ఉపచారం కాదు. ప్రతిభాషకు ఒక పద్ధతి,సంప్రదాయమంటూ ఉంటుంది. ఏ మార్గదర్శియైనా ఈసంప్రదాయానికి విధేయమైన సులభమార్గములనే ప్రతిపాదించవలెను గాని, దుష్టవైద్యునివలె అనవసరమైన అంగచ్ఛేదనం చేయరాదు. ఇది విస్మరించి భాషకు మూలాధారమైన అక్షరమాలకు అగచ్ఛేదం చేయవలెనను తలంపు గలవారు భాషాపకారులే కాని భాషోపకారులని నేననుకోను.
తేలిక తెలుగు గురించి మోహన గారి అభిప్రాయం:
05/08/2016 11:47 am
ఆంగ్లమును ఎలా బోధించాలి అన్నది ఆంగ్లోపాధ్యాయులకు వదలండి. ఈ వ్యాసముతో నాకు కూడ అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. కాని వ్యాసకర్త ముఖ్యోద్దేశము అందరికీ అవగతమవుతుంది. ఈ course తీసికొన్న తఱువాత (1) ఒక రైల్వే స్టేషన్ పేరు, బస్సు బోర్డు పేరు, వీధి పేరు, హోటల్ (రెస్టొరాన్) పేరు విద్యార్థి చదువగలిగితే సంతోషము. (2) ఒక వార్తాపత్రిక headlines చదువగలిగితే సంతోషము. (3) ఒక వీధిలో ఎవరినయినా directions అడుగగలిగితే సంతోషము. (4) ఒక అంగడి లేక హోటల్‌కి వెళ్లి orders ఇవ్వగలిగితే సంతోషము. (5) చిన్న చిన్న వాక్యాలు వ్రాసి తమపేరును సంతకము చేయగలిగితే సంతోషము. ఈ ఆశయాలతో course ను పరిశీలించండి. ఇవ్వబడిన సమయములో పై ఆశయాలు నెరవేరినాయా లేవా అన్నదే ప్రశ్న. అంతకంటె ఎక్కువగా రంధ్రాన్వేషణ చేయ రాదు.
విధేయుడు – మోహన
ఇది చాలు నాకు గురించి అవినేని భాస్కర్ గారి అభిప్రాయం:
05/03/2016 2:19 am
వనజ గారూ, ధన్యవాదాలు.
కామేశ్వరరావు గారూ,
“బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు” — మీరన్నది సత్యం! ఈ కవితని మళ్ళీ ఎక్కడైనా reproduce చెయ్యవలసి వస్తే మీరిచ్చిన సూచనలు, మీరు చెప్పిన సవరణలు పాటిస్తానండి. ధన్యవాదములు.
~భాస్కర్
చిరంజీవి గురించి Velcheru Narayana Rao గారి అభిప్రాయం:
05/02/2016 10:35 pm
తెలుగు మాటలు మనస్సులో మెదిలేవాళ్లందరూ ఈ వేళ అదృష్టవంతులు, మానసగారి ఈ పద్యాన్ని చదవగలిగినందుకు.
మనసగారికి మాటలు అందించగల మెత్తదనం ఉన్నందుకు తెలుగు ఇవాళ మురిసిపోతొంది.
ఈతల్లితనం పిల్లలు ఉన్నన్నాళ్లు మనందరి మధ్యా ఉంటుంది. మనందరినీ పిల్లల్నిచేసి, మన తల్లుల్ని మనకళ్లముందు ఆడిస్తుంది.
ఇది గొప్ప పద్యం అనగానే సరిపోదు, ఆ మాటా అంత గొప్పది కాదు. కాని అంతకన్న పెద్ద మాటలు వాడి ఈ పద్యంలొ ఊహని చికాకు పెట్టలేను.
తల్లీ, ఇది గొప్ప పద్యం!
–వెల్చేరు నారాయణ రావు
ఇది చాలు నాకు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
05/02/2016 1:11 pm
చాలా బావుంది కవిత, అనువాదం! భావంలో సున్నితత్వాన్ని భాషలో చాలావరకూ జాగ్రత్తగా నిర్వహించారు. ఖయాము రుబాయీలు గుర్తుకొచ్చాయి.
రెండు మూడు చిన్న సూచనలు (బహుశా అనువాదాలు ఎప్పుడూ పూర్తికాని కవితలు, ఎంతో కొంత మెరుగుపెడుతూనే ఉండొచ్చు!):
దిక్కులు లేని అడవి – దిక్కులు తెలియని అడవి
మితంగా ఒక నవ్వు – సన్నగా ఒక చిరునవ్వు
కాసిని ఎండు పళ్ళముక్కలు – Dry fruits పదానికి అచ్చమైన తెలుగు అనువాదం లేదనుకుంటా. “కాసిని ఎండుద్రాక్షలు” అంటే బాగుంటుందేమో.
నాకు నచ్చిన పద్యం: శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం గురించి మోహన గారి అభిప్రాయం:
05/02/2016 12:12 pm
చాల బాగుంది కామేశ్వరరావు గారు! సామాన్యముగా కవులు తమ కావ్యములలో చిత్రకవిత్వాన్ని ఒక భాగముగా వ్రాస్తారు. కాని చిత్రకవిత్వమే కథలోని ఒక భాగముగా చేసిన ఘనత సూరనదే. కవికి గొల్లవానికి ఉండే పోలికలు ఉన్న ఈ పద్యమంటే కూడ నాకు ఇష్టమే –
విశ్రామ విహతి గావింపక, సార వ-
త్సాహిత్య సౌమనశ్యంబు లెఱిగి
సమయంబు దప్పక శ్రవణకఠోరంబు
లైన శబ్దము లత్యాకులాత్మ
జేయక సత్పరిచిత సుకుమార వా-
క్సరళి తాభిత్రాయగా నొనర్చి
పదబంధ శిథిలత వాటిల్ల గానీక
యే చందములయందు నేమరిలక
పరగు కవియు దోహకరుడును, యశము దు-
గ్ధమును బడయు, నట్లు గానివాడు
కృతి దురాస మొదవు, గీర్తియు బాలు నీ
కుంట గాదు, హాసయోగ్యు జేయు … (1.008)
శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఎలా కావ్యాలలో ఉండాలి అనే విషయముపైన ఈ పద్యమును చదవండి –
పొసగ ముత్తెపు సరుల్ పోహళించిన లీల
దమలోన దొరయు శబ్దములు గూర్చి
యర్థంబు వాచ్య లక్ష్య వ్యంగ్య భేదంబు
లెఱిగి నిర్దోషత నెసగ జేసి
రసభావములకు నర్హంబుగ వైదర్భి
మొదలైన రీతు లిమ్ముగ నమర్చి
రీతుల కుచితంబులై తనరారెడు
ప్రాణంబు లింపుగా పాదుకొల్పి
యమర నుపమాదులును యమకాదులు నగు
నట్టి యర్థ శబ్దాలంక్రియలు ఘటించి
కవిత జెప్పంగ నేర్చు సత్కవివరునకు
వాంఛితార్థంబు లొసగనివారు గలరె … (1.082)
విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
04/10/2016 1:34 pm
I guess ‘పిల్లగాలి’లో పిల్ల does not mean girl. I guess, పిల్లగాలి simply means breeze as opposed to a tornado, or typhoon. అలాటి విసురుగాలి ఐతే అక్కడ ఆ వసురాజు తోటలో పూలూ, ఆకులూ, చెట్లు, మహా వృక్షాలు కూడా ఉండవు.
కలకంఠి అంటే కల నాదములు చేయునది. మధుర స్వనములు చేయునది. అవ్యక్త మధుర స్వరము కలిగినది – ఇలాటి అర్ధములు చెప్పబడినవి. అని. స్త్రీ పరంగా ఎక్కువ వాడినా అందరు ఆడవాళ్ళూ కలకంఠులు కారు. కఠోర కంఠులుంటారు. కవి కలకంఠీ! అని వాడితే ఆ ఆడుది మృదుమధురంగా మాట్లాడుతుందని. అట్టి కలకంఠులను మీరు ఏ తోటలోనూ, వసంత సమయంలో కలిసి యుండలేదా?
అలాగే పక్షులన్నీ కలకంఠులు కావు. Singing birds ను సేకరించే వ్యాపారస్తులున్నారు. వారి వద్ద కొనుక్కుని, తమ తోటల్లో పెంచుకునే వారున్నారు. వెదురు గొట్టాలు, వీణలు, గంటలు ఇవి అన్నీ కలకంఠులుగా మారొచ్చు, గాలి తాకులకైనా, సంగీతకారుడు వాడినా.
ఇక్కడ చర్చిస్తున్న పద్యంలో -అది వసురాజు తోట. అది వసంత వర్ణనం. వసుచరిత్రలోని అక్కడి పద్యాలలో, కవి వసంతుడికీ, గాలికీ ఉండే సంబంధాలు మారుస్తూనే ఉన్నాడు. కలకంఠి ప్రయోగం లోని అర్థాలు కూడా మారుస్తున్నాడు.
నేనూ ఆంధ్ర భారతి చదువుతున్నాను. ‘చంద్రికా పరిణయము’ ఒక పీఠిక అక్కడ చదువుతున్నాను. అందులో చంద్రికా పరిణయం నుండి కొన్ని పద్యాలు, వసుచరిత్ర లో పద్యాలు కొన్ని, చాలా దగ్గర పోలికలున్నవి ఇచ్చారు. ఎవరు బాగా రాసారు అనేది పాఠకులనే తేల్చుకోమని. ఇచ్చిన పద్యాల వరకే చూసినా, నాకు ‘వసుచరిత్ర’ గెలిచినట్టనిపించింది. ఇక, ఈ మాట గ్రంథాలయంలో – దేశికాచారి గారుంచిన మరో పీఠిక, ‘చంద్రికా పరిణయం’ చదవాలి. అప్పుడు వసుచరిత్ర నాకింకొంచెం అర్థమవుతుంది.
ఆంధ్ర భారతికి వెళ్లినా, ఈ పద్యం కోసం, మరుత్తులు ఏడుగురు, అందులో ఏడు లోకాల్లో విహరించే మరుత్తుల లో ఏ మరుత్తు ఇక్కడ విహరిస్తున్నాడని ఏ పురాణ కథ లోకో వెళ్లి నేను వెదకలేదు. చర్చలోని ఈ పద్యంలో, కవి పిల్లగాలి, మంద మారుతం అని ఉండొచ్చు. అనలేదు. అని ఉంటే మనం పువ్వులు, ఆకులు, గాలి – అంటూ gender-less, age non-specific interaction చూస్తాము. కాని కవి అలా అనలేదు. The poet attributes masculinity to the wind here. మరుత్కుమారుడు అన్నాడు.
ఆ పవన కుమారు డొస్తే (హనుమంతుడు కాదు), వసంతుడితో పాటు తోటల్లో ఆడే స్నేహితుడు, పవనుడొస్తే –ఉయ్యాలూపుతున్నారు ఆ స్త్రీలంతా అని, కవి భావన. తేనెలు తాపినా, తేనెల్లో ముంచినా, పువ్వుల్లో పొదిగినా, ఆకుల్లో ఊపినా, ఉయ్యాల పాటలు పాడినా అన్నీ -చెట్లు, మొక్కలు, తీవెలు, పొదల సొంత మర్యాదలే, సయ్యాటలే. రసం శృంగారం. సలిపేవి వసంత సమయపు శృంగార క్రీడలు.
అడివి బాపిరాజు ‘అడివి శాంతి శ్రీ’ లో వసంత సమయం వేడుకలు ఎంత చక్కగా రచించాడు! అందులో, రాజకుమారుడిని, వసంతుడుగా (సంగీతం పోటీ పరీక్షలో గెలిచినందుకు) అక్కడివారు ఎన్నుకుంటే, అతడు మలయ పవన దేవుడిని, భృంగ దేవుడిని ఎన్నుకుంటాడు. ‘వనరమ’ గా ఒక రాకుమారిని ఎన్నుకుంటాడు.
జోల అంటే ఉయ్యాల. ఉయ్యాల పాటలన్నీ పసిపిల్లలకూ, వారిని నిద్ర పుచ్చటానికీ కాదు. Individual gardens లోనూ, పూర్వీకుల/ ఇప్పటి వారి ఇళ్ల లోనూ, బల్ల ఉయ్యాలలు adults కోసం ఉండవూ? What about those nice big hammocks in country houses and beach resorts? వసంత సమయంలో ఉయ్యాలలలో కృష్ణుడు, ఇతర వనితలు వర్ణ చిత్రాలెన్నో ఉన్నాయి. రాముడి కోసం బాలుడిగా ఉన్నప్పుడు పాడే జోలపాటలూ, రాజయ్యాక పాడే మేలుకొలుపు, శయనింపు పాటలు ఒకే లాగా ఉండవు కదా.’ జో! అచ్యుతానంద’ చిన్న పిల్లలకు పాడటం తెలుగు వాళ్లకు అలవాటై, అది పరమాత్ముడికి ఒక కవి రాసిన పాట అనే తలపు మరుపున పడి పోయి ఉండొచ్చు.
ఇంతకు ముందు నేనీ పద్యం గురించి రాసినప్పుడు, పాఠకులు ఒకరిద్దరు జోలపాటలని ఇక్కడా ఏవో సినిమా పాటలు వినిపించినట్టున్నారు. అన్నా చెల్లెళ్ల ఏడుప్పాటలు, పిల్లల జోల పాటలట!
ఆ సినిమా పాటల్లో సావిత్రులు, న్. టి. రామారావులు -ఇద్దరూ తెలుగులో, తమిళులో, అక్కడొకరూ ఇక్కడొకరూ చెరో చంటి పిల్లని భుజాన్ని వేసుకుని దబిడీ దిబిడీ చిచ్చి కొడుతూ, ‘చందురుని మించి అందమొలికించు చిట్టిపాపాయివే’ అని ఏడుపు పాటలు పాడితే, అవి జోలపాటలవుతాయా? How Sad! ఆ ఏడుపు స్వరం పిల్లలకు ఎంత వేదన కలిగిస్తుంది. ఆ అమ్మా నాన్నల కన్నీళ్లు పిల్లల మీదే కారి పడుతున్నయి. ఆ ఏడుపేదో అవతలికి పోయి ఏడ్చుకుని, ఆ పిల్లలకు ఆనందపు స్వరంతో, పిల్లల పాటలు పాడి, వారితో ఆటలాడే వారిని ఏర్పాటు చెయ్యటం మంచిది అనిపించింది.
తెలుగు సినిమాల్లో ఒక ఆనంద సమయంలో పాటనే, మరో విషాద సమయంలో టెంపో స్లో చేసి, ఏడుపు గొంతులతో పాడారు. అసహ్యకరమైన పని. పాటలకేదో కరువొచ్చినట్టు. Emotions, events, mess up చెయ్యటం. ఒక్క పాటనీ హాయిగా పాడుకోనివ్వరు. I really didn’t want to get in there. I don’t want to end my note on that kind of note. Leaves a bad taste in my mouth. అందుకని మధురంగా థ్వనించే పద్యాలున్న వసుచరిత్ర లోకే మళ్లీ వెళ్లి, ఇంకొన్ని పేజీలు తిప్పి వసురాజు వచ్చినపుడు ఆ తోట చేసిన మర్యాద ఎంత రమణీయంగా ఉన్నదో, ఇంకోసారి చదువుకుంటాను. ఎన్నో తెలివైన, అందమైన రచవలున్నయ్యి. ప్రపంచంలో ఇంకా చూడని సుందరత ఎంతైనా ఉంది. I am so eager to go get it.
A beautiful year to all!
Lyla
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన గారి అభిప్రాయం:
04/01/2016 12:44 pm
నమస్తే /\
అం, అ, ఆ, ….
కం, క, కాం, కా, …. , క్రం, క్ర, …. , క్రాం, క్రా, …
సామాన్యముగా నిఘంటువులలో ఈ విధముగా పదాల అమరికలు ఉంటాయి.
నాదగ్గర ఉండే నిఘంటువులు, కోశములు ఇట్టి అమరికలతోనే ఉన్నాయి.
కాని ఇటీవల నేను కొన్న ఒక కన్నడ పుస్తకములో మీరు చెప్పిన రెండవ అమరిక ఉన్నది. అనగా –
కం, క, క్రం, క్ర, … , కాం, కా, క్రాం, క్రా, …
ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నాకు మొదటి విధముగా చదివి వాడుక.
ఏ విధముగా అమర్చినా మీరు మొట్ట మొదట పీఠికలో స్పష్టము చేయాలి. ఇక్కడ వచ్చిన చిక్కల్లా అందఱు పీఠికను చదవరు!
విధేయుడు – మోహన
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తః తః గారి అభిప్రాయం:
02/24/2016 2:52 pm
శ్రీ సిద్దినేని:
తమిళుల సంస్కృతి ప్రముఖంగా రెండు భాగాలు. అయ్యర్ – అయ్యంగార్ లదీ, ఇతరులదీ. కర్ణాటక సంగీతం తమిళనాడులో మొదటి వర్గానికి చెందినది. – అందులో అయ్యర్ – అయ్యంగార్లు కాని వారు కూడా ఉన్నారు – వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చేసిన కృషిని చాలా impressive గా ప్రదర్శిస్తారు. దాదాపు ఒక సంవత్సరం క్రితం అనుకోకుండా టీవీ చానెళ్ళ మీద కప్పదాట్లతొ ఒక తమిళ చానెల్ దగ్గర ఆగి పోయాను. ఒక క్షణం చూసి నడుస్తున్నదేమిటొ గుర్తుపట్టేశాను – పసిరిక పొలాల్లో పరుగెడుతున్నాడు. గిరిక తపస్సు – విశ్వనాథను అక్షరం అక్షరం తెరకెక్కించేశారా అనిపించింది. ‘ఆయిరం శిరం’ సీరియల్. తర్వాత కథా భాగాలు చూడటం కుదరలేదు.
నాతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న తమిళ కుర్రకారుతో అంటూ ఉంటాను: “There is not much of a difference or gap between you Tamils and we, Andhras, what we call ‘cap’ you call it, ‘gap’, that is all.” అని.
నమస్కారాలతో
తః తః
మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి Siddineni Bhava Narayana గారి అభిప్రాయం:
01/24/2016 7:47 am
శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలు.
Streynsham Master పేరు, ఆయన రచనా మీరు చెబితేనే తెలిసింది . ఐంటర్నెట్ లో చూడడం నా వల్ల కావడం లేదు. శ్ame is the czse with the paper published by John Richards and Velcheru Narayana Rao (IESHR, 1980). Being computer illiterate, i consistently fail to retrieve archived documents on line. The task is more difficult without knowing the title of the book/paper.
నికొలో మనూచి Storia do Mogor, విలియం ఇర్విన్ అనువదంలో దొరికింది కాని, ముక్కలు గానే చదవడం వీలయ్యింది.అదీ చాలా కాలం క్రితం. ఇక్కడ ఇంకో రెండు ముక్కలు. తిరుమల రామచంద్ర గారి “హంపి నుంచి హరప్పా” యత్రా చరిత్ర కాదని చదివే వరకూ తెలియలేదు. దాశరథి గారి యత్రాస్మ్రుతి కూడా యత్రా చరిత్ర కాదట. దొరకలేదు.
We, when we were in lower classes of school, came across film artiste Akkineni Nageswara Rao’s “NaaAmerica Yatra”.The book was illustrated by Bapu, and accorded interesting reading . Word was that it had been ghost written by Mullapudi Venkata Ramana.
Did Kesari Narasimham of Kesari kuteeram publish a book in Telugu on his journey to Madras from his village in Addanki seema?
Narla Venkateswara Rao did undertake a tour of Europe, and stray references are cited from his experiences, especially in connection to his remarks about the Amaravathi sculpture he had found in the Louvre Museum, Paris. I do hope that there must be a compilation of his travel experiences in existence in print!
Warm Regards.
S.Bhava Narayana.
సన్మాన లాటరీ గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/22/2016 12:37 pm
నా అభిప్రాయం అనేదానికి ఎంతవిలువ ఉంటుందో తెలియదు కాని ఒకవేళ దానికి ఏ విలువా లేకపోయినా ఒక చెప్పవలసిన అబిప్రాయం అంటూ వచ్చిన తరువాత అది చెప్పటమే మంచిపని అనిపించి ఈ ఒక్క ముక్కా వ్రాస్తున్నాను.
ఈ కథ అనబడే ‘సన్మాన లాటరీ’ ఒక మరీపొడుగైన జోక్. అంతకంటే ఏమీ లేదు.
ఈ మాట అనటం నా అభిరుచిలోపమో మరొకటో అని ఎవరైనా అనుకుంటే దానికి నేనేమీ చేయలేను. నాకనిపించిన అభిప్రాయాన్ని చెప్పానంతే.
మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
01/21/2016 9:36 am
ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారూ, మీరు సాయంచేసి చూపిన దారిలో Universal Digital Library నుండి కురుమెళ్ళ వెంకట్రావుగారు గారి “మా మహారాజుతో దూరతీరాలు” పుస్తకం సంపాదించి దాని ప్రింటు కాపీని నాగపూర్లో ఉంటున్న మీ మిత్రులు (త్రిపుర గారికాప్తమిత్రులు) శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారికి చేరవేస్తే అందుకుని వారెంతో సంతోషించారు. కురుమెళ్ళ వెంకట్రావు గారి ఉత్తరాలు అందుకున్న పెమ్మరాజు వెంకట్రావు గారి మనుమడు (యీ వ్యాస రచయిత ) రిషీవ్యాలీ పిడూరి రాజశేఖర్ గారితో కూడా ముచ్చడించారు. యీ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన కాకినాడ వాస్థవ్యులు, అడ్వకేటు శ్రీ M.V. Saastry గారితో తనకున్న చిరు పరిచయాన్ని కూడా భజరా గారు తలపోసుకున్నారు.
“మా మహారాజుతో దూరతీరాలు” పుస్తకం తిరిగి ఏదైనా పెద్ద సంస్థ ద్వారా పునర్ముద్రణ పొందేలా చెయ్యాలనీ ప్రయత్నిస్తున్నాము.
మీరన్నట్లే గమ్మత్తుగా భమిడిపాటి జగన్నాథరావు గారు కూడా తెన్నేటి కోదండరామయ్య గారు రాసిన “మాబడి” (1950) పుస్తకం గురించి అడిగారు (భజరా గారూ తూర్పు గోదావరి జిల్లా వారే అనుకుంటా). నాలుగొందలు లేదా ఐదొందలు పేజీలుండే యీ “మాబడి” పుస్తకం చాలా బాగుంటుంది ఎలాగైనా సంపాదించమని, మిమ్మల్ని, మనసు రాయుడు గారు, శ్యామనారాయణ గార్లను అభ్యర్ధించమని చెప్పారు. ఆపై మీ దయ, మా ప్రాప్తమూ.
నాకు నచ్చిన పద్యం: లీలామోహనుని ముగ్ధ సౌందర్యం గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:
01/21/2016 12:30 am
మికిమోటో ముత్యాల్లాంటివి, మూడు పద్యాలున్నూ! పద్యాలు ఎన్నుకోటంలో మీకు మేరే సాటి. అయితే మీ ఏరికలో ఒక ప్రమాదం లేకపోలేదు; హరివంశం తిరగతోడటానికి ఆపుస్తకం మనవాళ్ళల్లో ఎంతమందిదగ్గిర ఉంటుందంటారు చెప్పండి?
నాకు తెలుసు. ఎవరో ఒకరు గూగ్లీకరించి చెప్పేస్తారు, ఈ పుస్తకం అంతర్జాలంలో దమ్మిడీ ఖర్చు పెట్టకుండా ఎల్లా కబ్జా చేసుకోవచ్చో! ఏదయితేనేం లెండి. హరివంశం చదవడానికి ప్రేరణ మీరెన్నిక చేసిన మెరికెలు!
అయినా మీకు ఇంత తెలుగు పక్షపాతం ఎందుకబ్బా? బాలకిష్టుడి చేష్టలకి పోతన, ఎర్రన లేనా? ఎంత అన్యాయం!
లీలాశుకుడి శ్రీ కృష్ణ కర్ణామృతంలో పద్యాలు లేవూ! చిన్ని క్రిష్ణుడి పోకిరి చేష్టలు సమర్ధిస్తూ! అవునులెండి; అవి పజ్జాలు కాదు, శ్లోకాలు, దేవభాషలోవి కూడానూ! కాని, తెలుగు వాళ్ళకి పోతన తరువాత, బిళ్వమంగళుడి కర్ణామృతమే బాగా తెలిసిన పుస్తకం, అని మా మేనమామ అనేవాడు. అని మాకు నూరి పోసాడు.
కృష్ణే నాంబ!…
రామో నామ భభూవ…
కస్త్యం బాల? బలానుజః … ఎట్సెట్రా ఎట్సెట్రా
పోతనతో పాటు ఇవ్వీ కంఠతా పట్టించే వాడు మా మేనమావ ! ఈ వయసులో హరివంశం పద్యాలు కంఠతా పట్టటం కొంచెం కష్టమే సార్!
కీపిటప్
వేలూరి వేంకటేశ్వర రావు
కోనసీమ కథలు: శిరోముండనం గురించి suresh babu గారి అభిప్రాయం:
01/14/2016 10:20 pm
శ్రీ రమణా గారిది ఒక్క మురుగె కాని మీ కథ మూడు మురుగులకి సమానం
అజంతా రెండు కవితలు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
01/09/2016 11:57 pm
ప్రియమైన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు, నమస్కారములు.
మీకు తెలిసే ఉంటుంది …. అజంతా గారి కవితలని పుస్తకంగా ప్రచురించటానికి త్రిపురని డిస్కవర్ చేసి తెలుగు పాఠకులకి అందించిన విశాఖ డా.అత్తలూరి నరసింహరావు గారు ఎంత ప్రయత్నించినా సాధించ లేక పోయారు కాని,వారి మేనల్లుడు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ ఆ ఘనకార్యం సాదించాడు. అజంతా గారిని ఒప్పించి “స్వప్నలిపి” కవితల పుస్తకాన్ని తన సొంత ఖర్చులతో ‘కవిత్వం ప్రచురణల’ ద్వారా ఎంతో అందంగా తీర్చిదిద్ది వెలుగులోకి తెచ్చాడు. ఈ కవితా సంకలనం 1997లో సాహిత్య అకాడెమీ కవిత్వ పురస్కారం అందుకుంది.”స్వప్నలిపి” ని అజంతా, త్రిపురల ప్రియనేస్తం ‘మో’ గారు “Dream Script” పేరిట ఇంగ్లీషులోకి ఆనువదించారు.
” అక్షరం నిండా అన్నీ అద్భుతాలే అని
శబ్ద శక్తి సార్వభౌమాధికారం అనాహాతం అని చెప్ప లేదా నేను చెప్ప లేదా”
“నేను ప్రతి మనిషిలో వుంటాను, నేను ప్రతి మనిషి స్వప్నంలో వుంటాను, స్వప్న సౌందర్యంలో వుంటాను … అధః పతితుడైన మనిషిని ఆప్యాయంగా లేవనెతుత్తున్న కారుణ్య హస్తాలలో వుంటాను ”
అన్న అజంతా “సజీవ స్వరం” ఈమాట ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ప్రవాసం లోని మీకు, విజయవాడ లోని శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు.
అక్కరలు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
01/06/2016 4:58 am
విషయసంపన్నమైన ఈ సుదీర్ఘవ్యాసాన్ని, ప్రస్తుతం మధ్యాక్కర వరకూ చదివాను. ఇందులో ప్రస్తావించిన కొన్ని విషయాలపై నా ఆలోచనలు:
1. “…గీతులలో పదములను గణములకు తగ్గట్లు ఎంచుకొంటే ఆ గీతి గానయోగ్యముగా ఉంటుందని”
ఇది పాక్షికసత్యం మాత్రమే అని నా అభిప్రాయం. గణాలకు తగ్గట్టుగా పదాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ గణాలలో “మాత్రా సమత” కూడా ఉండాలి. మచ్చుకి, మోహనగారు ఉదాహరించిన మహాక్కర పాదం పరిశీలిస్తే:
“నీవు లేనిచో జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము”
ఈ పాదంలో మొదటి దళం (నీవు లేనిచో జీవమ్ము లేదురా) కన్నా రెండవ దళానికి (నీవెగా నాజీవ రాజీవము) లయబద్ధత (దానివల్ల గానయోగ్యత) అధికంగా ఉన్నదన్న విషయం గమనించవచ్చు. దానికి కారణం రెండవ దళంలోని గణాలలో మాత్రా సమత అధికంగా ఉండటమే. మొదటి దళం “తాన తాననా తానాన తాననా” అయితే, రెండవది “తాననా తానాన తానాన న”. మొదటి దళంలో “తాన తాననా” అనేది లయని కుంటుపరుస్తున్నది. దీన్ని “తాన తానాన” అన్న రీతిలో మారిస్తే కొంత మెరుగైన నడక లభిస్తుంది. “నీవు లేకున్న జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము”. మహాక్కర పాదంలో మొదటి దళానికి ఇంకా మెరుగైన నడక నా దృష్టిలో ఇది: “తాననా/(తన తనన) తాననన తాననా తాన”
“నినువిడిచి జీవనము లేదురా నాకు – నీవెగా నాజీవ రాజీవము”
ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇది కూడా మహాక్కర పాదమే. కాని పదాలు గణాలకు తగ్గట్టుగా విడలేదు. అయినా ఖండగతిలో పాదం హాయిగా సాగింది.
సారాంశం ఏమిటంటే, అంశగణ ఛందస్సు పూర్తి మాత్రాబద్ధ ఛందస్సు కాదు. కాబట్టి అందులో గణాల సమత ఉన్నా, ఆ గణాలబట్టి పదాలను కూర్చినా, స్ఫుటమైన చక్కని నడక ఏర్పడుతుందని చెప్పడానికి లేదు. ఆ గణాలను అనేక రకాలైన మాత్రాక్రమాలుగా రచించవచ్చు. అందులో కొన్ని మాత్రాక్రమాల పోహళింపులే మంచి నడకని అందిస్తాయి. అంచేత గానయోగ్యంగా రాయాలంటే అలాంటి క్రమాలని గుర్తించి, వాటిని అనుసరించి పదాలను కూర్చాలి.
2. మధ్యాక్కర యతి గురించి
దీనిపై చాలా చర్చే జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా చాలావరకూ అందరూ అయిదవ గణం దగ్గర యతి సరి కాదనీ, నాల్గవ గణం దగ్గరదే సరైనదనీ భావించారు. త్రిపురనేని రామస్వామిగారైతే ఏకంగా “అప్పటి బహుళ ప్రచారములో నున్న యక్కరలను నన్నయ వాడినాడు కాని వాని తత్త్వమెరుగజాలక మధురగతి నంతయు మంటపాలు చేసి కుంటినడక యంటించినాడు” అని నన్నయపై విరుచుకుపడ్డారు. నన్నయ మధ్యాక్కరది కుంటినడకే అయినా, అది చేసినది నన్నయ కాదనీ, అంతకుముందు శాసనాలలో కూడా అదే నడక ఉన్నదనీ త్రిపురనేనివారు గమనించకపోవడం దురదృష్టం. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకొనో ఏమో కోవెల సంపత్కుమారాచర్యగారు నన్నయ మధ్యాక్కరలలో కొన్ని చోట్ల నాల్గవ గణంపై కూడా యతి ఉన్నదనీ అందువల్ల నన్నయకి నాల్గవ గణంపై యతి ఆమోదమేననీ సమర్థించడానికి ప్రయత్నించారు. కాని అది అంత సమంజసం కాదు. ఆ విషయాన్ని ప్రస్తావించి సంగనభట్ల నరసయ్యగారు తన “తెలుగులో దేశిచ్ఛందస్సు ప్రారంభ దశలు” అనే పుస్తకంలో దాన్ని సహేతుకంగా ఖండించారు.
“ఆ కాలములో ఈ కాలములో మధ్యాక్కరను నడిపించే విధానములో భేదమున్నదని అనుకొందును. మొదటి నాలుగు గణములు ఒక పట్టుగా ద్విపదవలె నడిపించి శేషించిన రెండు గణములను రెండవ పట్టుగా చదివిన యెడల వినసొంపుగానే యుండును”, అన్న గిడుగు సీతాపతిగారి అభిప్రాయమే నాకు మిగతావారి వాదనలకన్నా సమంజసంగా తోస్తోంది. నరసయ్యగారు కూడా దీనిని తన పుస్తకంలో సమర్థించారు. గిడుగువారు ఇచ్చిన బొబ్బిలిపాట ఉదాహరణతోబాటు, వారు బతుకమ్మపాట ఉదాహరణకూడా ఇచ్చారు:
శ్రీరామభూపాలుడూ పట్టాభి
షేకుడై కొలువుండగా
ఇక్కడ “పట్టాభి” అనేది అధికంగా వచ్చిన గణం. ఇలా ఒకే రకమైన మాత్రాగణాల మధ్యలో అదనంగా మరొక మాత్రాగణం చేరడం మరికొన్ని పాటలలో కూడా గమనించవచ్చు. ఉదాహరణకు
“కస్తూరి రంగరంగా మాయన్న
కావేటి రంగరంగా”
అన్న పాటలో కూడా “మాయన్న” అనేది “తానాన తాననానా” అనే రెండు సమ మాత్రాగణాల మధ్యలో వచ్చిన గణం.
అయితే, గిడుగువారు కానీ నరసయ్యగారు కానీ యిచ్చిన ఉదాహరణలు ద్విపద – మధ్యాక్కర ఉదాహరణలు కాదు. మధ్యాక్కరను ద్విపదలాగా నడిపించిన ఉదాహరణలు వారు ఇవ్వలేదు. వారు పైన సూచించిన అంశంకన్నా కూడా విశేషమైన మరొక ప్రత్యేకత మధ్యాక్కర – ద్విపద మధ్య నాకు కనిపించింది. అదేమిటంటే, “తననాన తానాన తాననా నాన” అనే దివపదలోని నాలుగు దళాలలో చివరి రెండు దళాలూ మళ్ళీ ఆవృత్తి అయితే అది మధ్యాక్కర అవుతుంది! మోహనగారు ఉదాహరించిన మధ్యాక్కర పాదం చూస్తే అది స్పష్టం అవుతుంది:
మనసెందుకో నేఁడు మైన-మై మారె – మౌనమై జారె
ఇక్కడ “మైనమై మారె”, “మౌనమై జారె” అనే రెంటి గణస్వరూపం సరిగ్గా ఒకటే.
దీనిబట్టి, నా ఊహ (లేదా అంచనా) ఏమిటంటే – పూర్వం ద్విపద పాటని ఒకరు పాడి, చివరి రెండు దళాలనూ వంత పాడేవాళ్ళు తిరిగి పాడే సంప్రదాయం ఉండేది. ఉదాహరణకు:
“అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు” అని ఒకరు పాడితే, మిగతావాళ్ళు “తమ్మిపూవుల్లు” అని వంతపాడేవారు. అది అంతా కలిసి ఒక వాక్యంగా రాస్తే సరిగ్గా మధ్యాక్కర పాదం అవుతుంది:
అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపూవుల్లు తమ్మిపూవుల్లు
అందువల్ల దీనికి అయిదవ గణం మొదట యతి (పదవిచ్ఛేదం) తప్పనిసరి!
నా ఊహకి సమర్థింపుగా, “లాలమ్మ గుఱ్ఱాలు లంకల్లొ మేసె – లంకల్లొ మేసె” అంటూ ద్విపద నడకలో సాగే జానపదగేయం ఆంధ్రభారతి సైటులో కనిపించింది (లింకు).
ఇది ఇంచుమించుగా మధ్యాక్కర ఛందస్సే (లాలమ్మ గుఱ్ఱాలు లంకలో మేసె – లంకలో మేసె – అని మార్చుకొంటే)!
చివరిగా, వేలూరివారు ఉదాహరించిన విశ్వనాథ మధ్యాక్కరని ఎలా “పాడూకో”వచ్చునో వారినోట కాని, మరెవరి నోటనైనా కాని వినాలనుంది! 🙂
అక్కరలు గురించి మోహన గారి అభిప్రాయం:
01/05/2016 2:30 pm
వ్యాసమును చదివి తమ అమూల్యమైన అభిప్రాయములను తెలిపిన శ్రీమతి సుప్రభ, శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారలకు నా నమస్సులు. ఇది అక్కరలపై వ్యాసము కాబట్టి ఒకటికన్న ఎక్కువగా ఉదాహరణములను చూపలేకపోయినాను.
శ్రీమతి దోనేపూడి లక్ష్మీకాంతమ్మ “తెలుగు కవిత్వంలో మధ్యాక్కర – ఒక పరిశీలన” అనే PhD సిద్ధాంత గ్రంథములో మధ్యాక్కరలను ఉపయోగించిన తెలుగు కవులపై ప్రత్యేకముగా కొన్ని ప్రకరణములను కేటాయించారు. అందులో ఆ కవులు వ్రాసిన కావ్యములనుండి ఎన్నియో ఉదాహరణములను కూడ ఇచ్చారు. క్రింది మొదటి ఏడు మధ్యాక్కరలను అక్కడినుండి గ్రహించి, ఉదాహరణములుగా ఇక్కడ పొందుపరచినాను. ఎనిమిదవది “వేదనామధ్యాక్కరలు” (లింకు) అనే పుస్తకమునుండి గ్రహించాను. తొమ్మిదవది శ్రీ రవిగారు నేను వ్రాసిన “ఛందస్సుకు ఒక కొండ – కొక్కొండ” (లింకు) వ్యాసమునకు ఒక అభిప్రాయములో తెలిపినారు. విశ్వనాథ మధ్యాక్కరలు ఇక్కడ లభ్యము (లింకు)
1) తుమ్మల సీతారామమూర్తి చౌదరి – మహాత్మకథ
ఓ యయ్య ప్రాయోపవేశమునకు – మూనకు, నీవు
పోయిన మాకు స్వాతంత్ర్య మేల ప్ర-భుత్వ మదేల
శ్రీయేల జీవిత మేల సౌహార్ద – సిద్ధికై శ్రమము
సేయుదుమని కమ్మ నంపి రా యోగి-శేఖరు కడకు
2) ఆరుద్ర – శుద్ధ మధ్యాక్కరలు
పదమూడు మాత్ర లున్నట్టె – పాదార్ధముల వళ్లు పెట్టె
తుది ప్రాస లందులో నిలుపు – తూకాన అవి రెండు కలుపు
మొదలట్లు తొలి ప్రాస వుంచు – ముద్దుగా నాల్గాలపించు
కుదురైన అందాల గములు – కొత్తవీ మధ్యాక్కరములు
3) నాయని సుబ్బా రావు – విషాద మోహనం
పోయిన సూర్యుండు వచ్చు – పోయిన చంద్రుండు వచ్చు
పోయిన పదునాఱు కళలు – పూర్తిగా విధునకు వచ్చు
పోయిన తారకత మినుకు – పూవుల గుత్తులు వచ్చు
పోయిన మోహనా వినయ – భూషణా తిరిగి రావేమి
4) కోవెల సుప్రసన్నాచార్య – పాంచాలరాయ శతకము
ఎన్నడు వినుటయే కాని – యెన్నడు కనుటయే లేదు
ఎన్నడు కాంచుట కాదు – యెన్న డూహించుట లేదు
ఎన్నాళ్ల కెన్నాళ్ల కయ్యె – యిట్టి మీ దివ్య దర్శనము
కన్నుల పండువు కాగ – కరుణాబ్ధి పాంచాలరాయ
5) దాశరథుల బాలయ్య – శ్రీవాసరజ్ఞానసరస్వతీ మధ్యాక్కరలు
ఒకచేత వీణ ధరించి చిరునవ్వు – లొలుకబోయుచును
నొకచేతఁ బొత్తమ్ము గొనుచు నంచపై – నొప్పారి రావె
ప్రకటింతు వేవేల నతులు సకల సౌ-భాగ్యంబు లీవె
యిక నాకు జ్ఞానసరస్వతీ వాస-రేశ్వరీ దేవి
6) జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి (శాంతిశ్రీ) – సత్యశాయి మధ్యాక్కరలు
తల్లి వందురు కొందరు మరి కొందరు – తండ్రి వందురు జ-
గల్లీల కాని స్త్రీపురుష భేదమ్ము – కలద నీయందు
తల్లివై లాలింతు వెంతొ తండ్రియై – దండింతు వంతె
చల్లని మా తల్లి తండ్రి జయ సత్య-శాయీ నమోస్తు
7) దోనేపూడి వెంకయ్య – చారిత్రకం
(ఇతడు మధ్యాక్కరను free verse రూపములో యతిప్రాసలను ఎల్లప్పుడు పాటించక వ్రాసినారు)
ఇష్టదైవము దేశమాత కావలె నీతరమ్మునకు
ఇష్టకామ్యార్థము లొసగు నీదేవి యీనాడు మనకు
సర్వ లోకము లేలు తల్లి స్వయముగా సాక్షాత్కరించె
సర్వావతారాల మూలమౌ పరమావతారమ్ము
శర్వాణి వాణి వైష్ణవి సకలదైవ సమ్మేళనమ్ము
ఉర్విలో భరతోర్వి, ఈమె సేవయే ఉత్తమ పూజ
8) జి. వి. సుబ్బా రావు – వేదనా మధ్యాక్కరలు
హేమంత మానంద భావ – హేలా మనోజ్ఞమ్ము నగుచు
చేమంతి విరబూచి నవ్వి – సీమంతినీ కేశ మొదిగి
భామాంతర ప్రణయ మధు-వాను ప్రియుని హర్ష మొలికి
హేమంత శీతల జ్యోత్స్న – యిముడదీ కవితాపథాన
9) పుట్టపర్తి నారాయణాచార్యులు – శ్రీనివాసప్రబంధము
పార్వతీ పరమేశ మదన – పరవశతావృత్తి జెల్లె
యోర్వంగ రాక బెక్కేడు, – లుద్రిక్తులై సురలెల్ల
శర్వుని భంగింపనెంచి, – శతధృతి తోడన గూడి
పర్వెత్తిరుత్తాల సాల-పంక్తి తుషారాద్రి గుఱిచి
విధేయుడు – మోహన
ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
01/05/2016 2:07 pm
మాన్యులు శ్రీ కృష్ణమోహనరావు గారికి
నమస్కారములతో,
ఆదరపూర్వకమైన మీ సహృదయ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు ప్రస్తావించిన విషయాలు:
మొదటిది: రాయలు ‘ఆంధ్రకవి’ అనటం సాభిప్రాయమూ, విశేష హృదయధర్మమే కాని, ఇతరభాషాకవుల మధ్య వ్యవచ్ఛేదకంగా అన్న మాట కాదు. అది పాదపూరకం కాదు. పరివృత్తిని ఎంతమాత్రం సహింపని భావభావన. తెలుగువారిని ఉద్దేశించి తెలుగులో పద్యం చెబుతూ, ‘తెలుగు కవి ధూర్జటి’ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. “ప్రౌఢకవి ధూర్జటి” అనవచ్చును కదా. అష్టదిగ్గజ కవులందరూ తెలుగువారే అయితే, “స్తుతమతి యైన ఆంధ్రకవి” (లేదా, ‘తెల్గు కవి’) అనవలసిన అవసరం అసలే ఉండదు. అక్కడ “ఆంధ్ర” శబ్దప్రయోగం కేవలం భాషాభిమానాన్ని మాత్రమే సూచిస్తున్నదన్నది ప్రతిపాద్యాంశం.
రాయాస్థానంలో ఉన్నది అష్టదిగ్గజములా? నవరత్నములా? వారిలో అందరూ తెలుగువారు మాత్రమేనా? ఇతరులూ ఉన్నారా? అన్న విషయాన్ని అధికరించి అనేకవాదోపవాదాలున్నాయి. సంస్కృతాంధ్రతమిళకన్నడ కవులవి ఏవేవో పేర్లు విమర్శకుల పరిశీలనకు వచ్చాయి. ఆ కవులలో సుప్రసిద్ధులూ, అప్రసిద్ధులూ ఉన్నారు. ఇదమిత్థమని తీర్పు చెప్పటం సాధ్యం కాదు. కనీసం అందుకు ఆవశ్యకమైన సాధనసామగ్రినైనా సమీచీనంగా సమీకరించటం ఈనాటికీ జరగలేదు.
రెండవది: ఆముక్తమాల్యదలో ఆ వాక్యం ప్రస్తావింపబడిన తీరును బట్టి “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న నిరుక్తికి రాజకీయ, సాంస్కృతిక కారణాలనేకం తప్పక ఉండి ఉంటాయని విశ్వసింపవచ్చును. అటువంటివేవో ఉండినందువల్లనే అదేదో తన మాటగా చెప్పక క్రీడాభిరామములోని ఆ మాటను త్రవ్వి తలకెత్తి, ప్రార్థితస్వప్నాన్ని భగవద్వాక్యంగా నిరూపింపవలసి వచ్చి ఉంటుంది. కారణం ఏదైనా, ఎంతో అభిమానం లేనిది అసలు ఆంధ్రకావ్యరచనకు ఉపక్రమణమే ఉండదు కదా.
మూడవది: కావ్యరచన సాగుతున్న కాలంలో కవులు తత్తత్సన్నివేశాలను నలుగురికీ వినిపించటం వింతేమీ కాదు. అది నాడూ, నేడూ జరుగుతున్న దృగ్విషయమే. నా మటుకు నేనే ఎంతోమంది ప్రసిద్ధుల రచనలను అవి సుపరీక్షితాలూ, సుపరిష్కృతాలూ కాకముందే ఉక్తలేఖనదశలో విన్నాను. చదివాను. కావ్యం మానవసమర్పితమైతే, ఆ కావ్యాన్ని నలుగురికీ నాలుగు చోట్ల వినిపిస్తూ, ఎవరికి అంకితం ఇవ్వాలో వ్యక్తిని కుదుర్చుకోవటానికి ఆ రోజుల్లో ఎంతో కాలం పట్టేది. ఆ ‘కృతిభర్త’కు నలుగురి చేత చెప్పింపవలసి వచ్చేది. అంకితం పుచ్చుకొని ఏమివ్వగలడో, ఏమిస్తానంటాడో; అది తనకు అంగీకార్యమో, కాదో తెలుసుకోవాలి కదా. కృతి పూర్తయిన తర్వాత ఒప్పందాలు కుదుర్చుకొని, వంశచరిత్ర సేకరించి, కృత్యాదిని వ్రాయటానికి పడే ఆ అవస్థనే ‘కృతాద్యవస్థ’ అనేవారు. కృతాద్యవస్థ అంటే రచన మొదలుపెట్టేందుకు పడే అవస్థ కాదు; కృతి పూర్తయిన తర్వాత అవతారికను వ్రాసేందుకు పడే అవస్థ.
శ్రీమహాభాగవతం రచన అద్భుతంగా సాగుతున్నదని విన్న తర్వాతనే కదా, రాజు పోతన గారిని దానిని తనకు అంకితం చేయాలని అడగటమూ, ఆయన ఇవ్వననటమూ జరిగింది? రచనాప్రక్రియ నిర్విఘ్నపరిసమాప్తి పర్యంతం రహస్యంగా ఉంటే ఈ వృత్తాంతాలే సంభవింపవు కదా.
కావ్యరచన ఎంత గజగర్భపద్ధతి అయినా, అదేమీ ఐకాంతికమైన రహస్యవ్యాసంగం కానేరదు. రచనా ప్రారంభానికి పూర్వపు కృషి మాత్రమే కవికి ఆంతరంగికం. రచన సాగుతున్న దశ, రచన పూర్తయాక అంకితోత్సవానికి లేదా భగవత్సమర్పణకు మునుపు సూర్యాలోకం అన్నవి బహిర్ముఖీనములే. నిండుసభలో ఇంకా పూర్తి కాని కావ్యమధ్యసన్నివేశాన్ని గానంచేయటం గుణగౌరవాన్ని, అందుకొనబోయే గౌరవాన్ని గౌణీకరింపదు సరికదా, రచన సవ్యంగా కొనసాగటానికి, కావ్యప్రశస్తికి మరింత ఉల్లాసదోహదం కాగలుగుతుంది.
కావ్యాన్ని పూర్తిచేసిన తర్వాతైనా, కావ్యరచనాకాలంలో నైనా కావ్యగానాన్ని కవి తానై స్వయంగా చేసి ఉండటమూ, ఇతరులు కోరగా చేసి ఉండటమూ రెండూ సహజమే. సాహిత్యసభ అన్నాక కొలువుతీరినవారు వారు వారు వ్రాస్తున్న విశేషాలనూ, నాటినాటికి వ్రాసిన విషయాలనూ తెలుసుకోక మానరు కదా. నిజంగా అష్టదిగ్గజాలలో ఉన్నవాడే అయితే, కావ్యాన్ని ఇంట్లో లేఖకులకు చెప్పి వ్రాయిస్తూ, రచన పూర్తయే దాకా శైలి, కథ, కవిత్వం, చమత్కారాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టటం అసలే వీలుకాదు. కావ్యగానాలు జరుగుతుండేవని, ధూర్జటి ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి కృష్ణరాయలు అప్పటికింకా సుముఖుడై ఉన్న 1523-1524 ప్రాంతాల కావ్యాన్ని మొదలుపెట్టి రచన సాగిస్తూ, అడిగినప్పుడు నలుగురికీ వినిపిస్తూ ఉండేవాడని, పరిస్థితులు తారుమారయిన కొంతకాలానికి పూర్తిచేసేనాటికి భవపరాఙ్ముఖుడుగా ఉన్నాడని ఊహ్యం.
ధూర్జటి గారు అష్టదిగ్గజాలలో ఒకరా? అన్న విషయం అనుమేయమే కాని, ఏ సంగతీ నిర్ధారించి చెప్పలేమని వ్రాశాను.
కందుకూరి రుద్రకవి సాహిత్యజీవితమంతా క్రీస్తుశకం 1550 తర్వాత ప్రారంభమయింది. తొలిరచన నాటికి నలభై యాభై యేళ్ళవాడనుకొంటే, అష్టదిగ్గజకవులలో కాదు సరికదా, మామూలు ఆస్థానకవి కూడా అయివుండడు. ఆయన ఈశాన్య సింహాసనాసీనుడన్నది విశ్వసనీయం కాదు. సంస్కృతంలో ‘రాష్ట్రౌఢ వంశకావ్యం’ ఆయన కృతి అని తెలుగు సాహిత్య చరిత్రకారులు వ్రాసినది సరికాదు.
ఈ లఘుప్రస్తావికను సహృదయంతో చదివి ఎంతో ఔదార్యంతో ఆశీర్వచస్సులను అందించిన పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి నమస్సుమాంజలి! _/|\_ !
సౌజన్యమూర్తులు శ్రీ రంగ గారికి, శ్రీ రవి గారికి – ప్రణామాలు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
సాహిత్యంలో వేశ్యా వృత్తి గురించి పి.మోహన్ గారి అభిప్రాయం:
01/02/2016 7:02 pm
కళ్యాణిగారూ ధన్యవాదాలు.
తెలుగు సాహిత్యంలో వేశ్యల జీవితచిత్రణ గురించి చాలా ఆలోచనాత్మకంగా, స్పష్టంగా, చెప్పారు. విశ్లేషణ బాధితులవైపు నుంచి సాగడంతో వాళ్ల గొంతుక బలంగా వినిపించింది. మీరు ప్రస్తావించిన రచన్లో కన్యాశుల్కం, అంధకారంలో వంటి ప్రముఖ రచనలు తప్ప చాలా వాటిని చదవలేదు. కొకువి మళ్లీ చదవాలి. పెద్దిభొట్ల సతీసావిత్ర కథను తప్పక చదువుతాను. పరిచయమే పొగిలే దుఖం తెప్పించింది.
మీ వ్యాసంతో కొన్ని సందేహాలు తీరాయి. సెక్స్ వర్కర్లు వాళ్ల మానాన వాళ్లు బతికితే ఎవరికేం నష్టమ అని నాలోనూ ఒక సందిగ్ధ రాజీ ఉండేది, ఈ సబ్జెక్టుపై లోతుగా ఆలోచించకపోవడం వల్ల. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ పురాతన వ్రుత్తి ఏదో ఇష్టంతో తీసుకున్నది కాదు. దాన్ని కొనసాగించాలనే అధర్మవడ్డీ వాదులు నాకు తెలిసి గతంలో కంటే ఎక్కువయ్యారు. ప్రగతివాదులం అని చెప్పేవాళ్లూ ఉన్నారు వీళ్లలో. వేశ్యా వ్యవస్థకు మూలమైన పరిస్థితులను మార్చకుండా ఆ వ్యవస్థను తీసేయలేమని చక్కగా విశ్లేషించారు.
డబ్బు కేవలం దానంతట అదే త్రుప్తి నివ్వదు. సుఖాలు కోరుతుంది. దాంట్లోంచి మొదలవుతాయి జాడ్యాలు. ధనవంతులకు సుఖం, పేదలకు దుఖం.
ఈ వ్యాసంలో మీరు ముఖ్యమైన చాలా రచనలకు కవర్ చేశారు. విస్త్రుతి పెరడగం వల్ల కొన్ని లేకపోవచ్చు. సీమవైపు కొన్ని మంచికథలు వచ్చాయి. చక్రవేణు కువైట్ సావిత్రమ్మ, నిర్మలారాణి గాజు కళ్లు వంటివి. మీకు దొరికి ఉండకపోవచ్చు. కరువుపీడిత కడప, అనంతపురం జిల్లాల్లో ఈ అభాగినులు ఎక్కువ. పైగా దేశంకాని దేశంలో హింస. ఇదో కొత్తకోణం. మన సమాజానికి పతనానికి ఎన్ని ముఖాలో…
ఈ వ్యాసం చాలా ఆలోచనలు రేకిత్తించింది. నా అభిమాన భావవిప్లవకారుడు వోల్టేర్ తన కాండీడ్లో ఈ వ్రుత్తిలోని బీభత్సాన్ని చూపాడు. కన్యాశుల్కం, కాండీడ్ లో చాలా పోలికలు ఉన్నాయి. ఈ నవల్లోని ఇలాంటి విధివంచితలు కథనాయిక క్యూనెగొండ్ సహా ముగ్గురు వున్నారు. పకెట్ అనే దాసి కథానాయకుడైన కాండీడ్తో ఏం చెబుతోందో చదవండి.
‘నా యజమానులకు, ఆ ముచ్చటైన క్యూనెగొండ్ చిన్నమ్మకు జరిగిన దారుణాల గురించి విన్నాను. అయితే నా పరిస్థితి అంతకంటే దారుణం. నేనప్పుడు చిన్నప్పుడు అమాయకురాలి కదా, అందుకే మన గురువు ననుశీ సులభంగా బుట్టలో వేసుకుని పాడు చేశాడు. మిమ్మల్ని అయ్యాగారు చావుదెబ్బలు కొట్టి తరిమేశాక నేనూ బలవంతంగా ఇంట్లోంచి బయటపడాల్సి వచ్చింది. ఓ పెద్ద వైద్యుడు నాపై జాలిపడకుండా ఉన్నట్లయితే నేనప్పుడే చచ్చిపోయేదాన్ని. ప్రాణాలు పోశాడనే కృతజ్ఞతతో కొన్నాళ్లు ఆయనతో గడపాల్సి వచ్చింది. అయితే ఆయన కఁళ్లుబోతు పెళ్లాం నన్ను రోజూ చావగొట్టి చంపేది. అబ్బ! ఎంత గయ్యాళిగంప! ఆ వైద్యుడు కురూపి. అతనిపై ప్రేమ లేకపోయినా, కృతజ్ఞతతో పడుండి అతని పెళ్లాంతో తన్ను తింటూ ఉండేదాన్ని. ఆ రాక్షసిముండ పీడ భరించలేక అతడు ఓ రోజు ఆమెకు చలిజ్వరానికి మందు వేశాడు. అది బాగా పనిచేసి రెండుగంటలు తిరక్కముందే ఆమె నరకయాతన అనుభవించి చచ్చిపోయింది. ఆమె బంధువులు అతనిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. అతడు పారిపోయాడు. అతనికి బదులు నన్ను ఖైదు చేశారు. అయ్యా! నేను గనుక కాస్త అందంగా లేకపోయినట్లయితే నా అమాయకత్వం నన్ను ఏమాత్రం కాపాడేది కాదు. వైద్యుడి స్థానాన్ని తాను తీసుకునే షరతుపై న్యాయమూర్తి నన్ను విడుదల చేయించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత మరొకామెను చేరదీసి నన్ను వెళ్లగొట్టాడు. చేతిలో చిల్లిగవ్వలేకుండా వీధిలో పడ్డాను. అప్పటినుంచి ఈ కంపరం పుట్టించే బతుకు బతుకుతున్నాను. అయ్యా! మీ మగవాళ్లకు ఇందులో ఏదో మజా ఉందఁపించవచ్చు కానీ మాకు మాత్రం యమకూపమే. ఈ దరిద్రపు బతుకు బతకడానికే వెనిస్ వచ్చాను. పడుపుగత్తె బతుకు ఎంత దారుణవెూ మీకు తెలుసకుంటా. కాళ్లు కాటికి చాపుకున్న ముసలి వ్యాపారి, న్యాయవాది, సన్యాసి, సరంగు, ఇలా ప్రతి అడ్డమైన వాడిమీదా ఒకే రకంగా ప్రేమ ఒలకబోయాలి. లెక్కలేనన్ని బాధలు, అవమానాలు పడాలి. తరచూ లంగాను అరువు తెచ్చుకోవాలి… మధ్యలో న్యాయాధికారుల, రక్షకభటుల వేధింపులు, దందాలు షరా మామూలే. చివరకు దుర్భరమైన ముసలితనం, తర్వాత శరణాలయాల్లో, చస్తే ఏ పెంటకుప్పలోనో తేలడం.. లోకంలో నాకంటే దౌర్భాగ్యురాలు లేదు బాబూ..’
పకెట్ గొంతులో మధురవాణి, శేషాచలాలు వినిపించడం లేదూ..
మీ వ్యాసం చదుతోంటే నాకు మహానది, సలాం బాంబే వంటి సినిమాలు, జోనా నానా, యమకూపం వంటివెన్నో గుర్తుకొస్తున్నాయి… మళ్లీ చదవాలి ఈ వ్యాసాన్ని.. మీరు ఇలాంటి మరెన్నో రాయాలని కోరుతూ…
పి.మోహన్
సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కటకటా! గారి అభిప్రాయం:
01/01/2016 5:49 pm
సంపాదకులకు:
రెండు విషయములపై నాగరికచర్చ అవసరము.
1. ” ఇది వ్యాసము రాయు తీరు కాదు కదా,” అని మీరు ఆఖరిమాటగా తీర్పునిచ్చి యున్నారు. వ్యాసము రాయు తీరు, ” ఈ విధము,” అని నిర్థారించుట కష్టమని మీకు తెలిసే ఉండును. వ్యాసము ఎట్లు రాయవలెను అనెడి మకుటముతో ఒక వ్యాసము రాయవలసి ఉన్నది. ( పుస్తకములు ఎట్ట్లు అచ్చు వేయవలెను, అనే శీర్షికతో మీ పత్రికలో వచ్చిన తీరు వలె!)
అటులనే కథ, నవల, విమర్శల తీరులపై పుస్తకములే రాసిన సాహితీవేత్తలున్నారు. అయిననూ, అవి Cast in Concrete అని చెప్పుట సమంజసమా?
2. కాల్పనిక సాహిత్యమంతయు కథ అన్న శీర్షిక కింద గోగోరా రచనని జమ కట్టడం ఆరోగ్యము కాదుకదా! కల్పనలో కథ ఉండవచ్చు; కాదనను. కాని, కథలన్నీ కల్పనలు కావుకదా? ఉదాహరణకి: దినపత్రికలలో సంపాదకుడు, Print the story or Kill the story అంటారని మీకు తెలియదా? వారి భాషలో వార్తలు కథలు. పోతే పేరడీలు కథలా? కాదని నేను అంటాను. కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే అని మీరు పాడుకొన్నచో నాకభ్యంతరము లేదు.
మీరు ఏర్పరచుకొన్న Template లోకి దీనిని బలవంతముగా తోసి మీ అభిరుచులు మా బోంట్లపై రుద్దుట అసమంజసము కదా!
ఒక ఉచిత సలహా. “అవీ, ఇవీ” అనో “కలగాపులగం” అనో “పేరడీలు” అనో, Not in A Serious Vein, అనో వేరొక శీర్షిక ప్రవేశపెట్టుట సమంజసము అని నా అభిప్రాయము. అయిననూ,మీ పత్రికకు ఉచితముగానైనా సలహా ఇచ్చుటకు నేనెవరిని గనుక?
విధేయుడు,
కటకటా!
వెంపరాల వారి సాహిత్య యాత్ర గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
01/01/2016 10:19 am
శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
నమస్కారములతో,
ముప్ఫైఅయిదేళ్ళ క్రితం విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగిస్తుండిన తరుణంలో ఢిల్లీలోని ఆర్కైవ్సుకోసం 1979లో నేను రికార్డు చేసిన ఈ అపరపతంజలి కంఠస్వనాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకు మీ పుణ్యాన వినటం సాధ్యమయింది. దీనిని వెలికితీసి సూర్యాలోకాన్ని కల్పించిన మీకు కృతజ్ఞతతో ఎన్ని మెప్పుల కుప్పలని చెప్పినా తక్కువే.
శ్రీ శాస్త్రిగారు సర్వం ఆశుగతిని చెబుతుంటే రికార్డు చేయాలని అనుకొన్నాను కాని, వాగ్ధోరణిలో వ్యర్థపదాలు దొర్లవచ్చునని, ఒక్క క్షణంకూడా వృధ కారాదని వారు దానిని ఆనాడు ముందుగా వ్రాసికొని చదవటం జరిగింది. అందువల్లనే వ్యావహారికంలో కొంత గ్రాంథికత తప్పలేదు. శ్రీవారి గురుదేవులైన పూజ్యపాదులు శ్రీ దర్భా సర్వేశ్వరశాస్త్రివరేణ్యుల చిట్టచివరి తరం శిష్యులు మా గురుదేవులైన శ్రీ తమ్మన వేంకటేశ్వరరావు గారు కావటం వల్ల ఆరోజు నేను వారింట శిష్యరూపునిగా వారి ఆతిథ్యానికి నోచుకోగలిగాను. నాకు చిత్రకవిత్వాభిమానం ఉన్నదని ఆరోజు వారు, “నేనూ ఒక నాగబంధమును వ్రాసితినండీ” అంటూ, అనర్ఘమైన ఈ నాగబంధపద్యాన్ని ధారణవశాన అలవోకగా వినిపించారు:
శివ పరమేశ పావన యజేయగతిక్రమ దాంతమోహనా
భవ నగచాప దేవబలపాలన భవ్యశరీరకాంతివై
భవజితపారదా వరకృపాకృతి ధర్మపరా రమాజశా
త్రవ గిరిజామనోవనజరంజదహస్కర నాగబంధనా.
అని. ఆ తర్వాత ఇది నాకు లభ్యపడిన వారి ముద్రితకృతులలో కానరాలేదు. ఎందులో ఉన్నదో ఇంకా అన్వేషింపవలసి ఉన్నది. వారి చాటుకృతులు సైతం అచ్చుకావాలి.
ఆ ఉచ్చారణను, ఆ పలుకుబడిని వింటుంటేనే వశీకృతపాణినీయులై సూత్రకార వృత్తికార భాష్యకార మునిత్రయచరిత్రను వ్రాసిన ఆ మహానుభావుని శబ్దాధికారం ఎటువంటిదో సువ్యక్తమవుతూ ఉన్నది. ఆ మూర్తిని మళ్ళీ మీరు శబ్దతరంగాల రూపాన కన్నులకు కట్టారు.
దీనిని అప్పుడే ఆకాశవాణి సరిక్రొత్తగా కొనుగోలుచేసిన స్విట్జర్లాండు నాగ్రా టూ ఛానెల్ స్పూలు రికార్డరుతో తొలి రికార్డింగును చేయటం జరిగింది. ఆరోజే శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి అనుభవాలను కూడా రికార్డుచేశాను. అప్పటి క్యూషీట్లు, వారి వారి వ్రాతప్రతులు ఇంకా ఉన్నాయో లేవో. ఇవి పూర్తయిన ఒక వారం రోజులకు అప్పికట్లకు వెళ్ళి శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారి ఇంట్లో రెండు రోజులుండి వారి అనుభవాలూ, జ్ఞాపకాలను రికార్డు చేశాను. మీ కృషిఫలంగా అవీ వెలుగులోకి రాగలవని ఎదురుచూస్తుంటాను.
అమేయశ్రద్ధతో శుభ్రపరచి దీనిని పునఃశాశ్వతీకరించిన మీకు ధన్యవాద సాహస్రితో,
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
12/29/2015 8:26 am
నేను: ఇక్కడ తఃతఃగారు దేని గురించి “కాదు” అన్నారో నాకు అర్థం కాలేదు. మోహనగారు లయ గురించి కాకుండా స్వరం గురించో, లేక రాగం గురించో చెప్పారని వారి అభిప్రాయమా? తఃతఃగారి మిగతా వ్యాఖ్యబట్టి అలా అనిపించడం లేదు. వారు ప్రస్తావించిన పాదాంత యతి కూడా లయకి సంబంధించినదే తప్ప రాగానికి సంబంధించినది కాదు. ముందుగా, మోహనగారు ప్రస్తావించిన “singability” లేదా “గానయోగ్యత” అనే అంశం లయ/తాళానికి సంబంధించినది అన్న విషయం స్పష్టమై, దానిపైన అంగీకారం కుదిరితే, చర్చను ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఇక పదచ్ఛేదయతి గురించి:
1. ఈ వ్యాసంలో ప్రధానమైన అంశం శ్రీశ్రీ గేయాలు. అవి చాలావరకూ స్పష్టమైన లయతో సాగుతాయనడంలో ఎలాంటి విప్రతిపత్తి లేదు. దీనికి పాదాంతర విరామమూ, పాదాంత విరామమూ చాలా ఉపయోగపడే లక్షణాలన్నది మోహనగారి ప్రతిపాదన. దీనిని నేను అంగీకరిస్తాను. ఎవరైనా అంగీకరించకపోతే, వారి వాదన వివరించవచ్చు.
2. పదచ్ఛేదయతి గురించి మోహనగారు వ్యాసంలో ప్రస్తావించిన మరొక అంశం – “సంస్కృతములో పాదాంతయతి పాటించబడుతుంది.”. “అదే విధముగా సంస్కృతములో శార్దూలవిక్రీడితము, స్రగ్ధరలవంటి వృత్తములకు పాద మధ్యములో కూడ పదముల విఱుపు ఉంటుంది”.
ఇవి సాధారణంగా (చాలా ఎక్కువ శాతం) కనిపించే లక్షణాలే తప్ప నూరుపాళ్ళూ నియతంగా పాటింపబడినాయని ఎక్కడా లేదు. బహుశా ఛందస్సులో ఏ నియమాలకైనా అపవాదాలు ఉండనే ఉంటాయి. అందుచేత ఇందులో కాదనడానికి నాకేమీ కనిపించడం లేదు.
3. మోహనగారు తన వ్యాఖ్యలలో ప్రస్తావించిన అంశం:
“ఉత్తర భారత భాషలలో, సంస్కృతములో, తమిళ, మలయాళములలో ఎక్కువగా పాదాంతయతిని వాడుతారు. అలా చేసినందువలన వాటికి గానయోగ్యత లభిస్తుంది. తెలుగు కన్నడ భాషలలో (ముఖ్యముగా తెలుగులో) సాహిత్యము రెండు భిన్న రీతులలో రూపొందినాయి. కావ్యములు పఠనీయములు మాత్రమే. అది సంగీతముతో ఎక్కువ సంబంధము లేకుండా రూపొందినది. వాగ్గేయకారులు రచించిన గీతులకు మాత్రమే గేయత్వము లభించినది. కవులు ఎక్కువగా ఈ వాగ్గేయకారులను, యక్షగాన కర్తలను సరకుగొనలేదు. ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.”
ఇక్కడ కూడా “గానయోగ్యత” అంటే లయాన్వితంగా పాడుకోడమనే అర్థం స్పష్టం. తెలుగులో కావ్యములు పఠనీయములనే మోహనగారు కూడా అన్నారు. అయితే తెలుగు పద్యాలు చదువుకోనేందుకు కాక పాడుకొనేందుకు వీలుగా ఉంటే బాగుంటుందన్నది మోహనగారి అభిప్రాయం. అది వారి అభిరుచికి సంబంధించిన విషయం. దానితో ఏకీభవించడమా లేదా అన్నది మన అభిరుచికి బట్టి ఉంటుంది తప్ప, అందులో చర్చించడానికి ఏమీ లేదు!
ఇక, తమిళ, మలయాళ భాషల విషయం నాకు ఎక్కువగా తెలియదు కాని, సంస్కృతశ్లోకాలలో పాదాంతయతి వాటి “గానయోగ్యతకి” కారణమయ్యిందా లేదా అన్నది చర్చనీయాంశం. అయితే అది యీ వ్యాసానికి అంతగా అవసరం లేని విషయం. కాబట్టి దాని గురించి యీ వ్యాసంలో/వ్యాఖ్యలలో ప్రస్తావించకుండా ఉండి ఉంటే, చర్చ మోహనగారు కోరుకున్నట్టు వ్యాసంలో అసలు విషయమ్మీద కేంద్రీకృతం అయ్యుండేదేమో!
అలాగే “ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.” అనే అభిప్రాయం కూడా (అది వ్యక్తిగతమే కావచ్చు!) చర్చనీయాంశమే. అది వ్యక్తిగత “అభిరుచి”కి సంబంధించినది కాదు. అయితే, ఇది కూడా ఈ వ్యాస విషయానికి సంబంధం లేని అంశం. పై రెండు చర్చనీయాంశాలకి సంబంధించి మోహనగారి అభిప్రాయాలను నేను పూర్తిగా అంగీకరించను. అయితే అది వేరే చర్చ కాబట్టి, దాన్ని యిక్కడ కొనసాగించడం నాకు యిష్టం లేదు.
చివరిగా, నేను నా అసమ్మతిని తెలిపినప్పటికీ ఏదో కారణాలవల్ల అశ్మాచంగారు నన్ను “అండు కో”లో కలపడం మానలేదు. సరే అది వారి ఆనందం! అయితే నేరుగా నన్ను మాత్రమే ప్రస్తావించి సూటిగా ఏదైనా అడిగితే తప్ప వారికి నా దగ్గరనుండి స్పందన/సమాధానం రాదని మాత్రం మనవి చేసుకొంటున్నాను.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:
12/28/2015 4:42 pm
సంస్కృతములో కూడ రెండు యతి (పదచ్ఛేదము) camps ఉన్నాయి. భరతాదులకు యతి పట్టింపు లేదు, పింగళాదులు యతిని పాటిస్తారు. వృత్తాదుల ముద్రణలో కూడ బేసి పాదముల అంతమును ఒక నిలువు గీతతో (|), సరి పాదముల అంతమును రెండు నిలువు గీతలతో (||) సూచిస్తారు. సరి పాదాంతములో యతిని almost విధిగా పాటిస్తారు. బేసి పాదాంతములో కూడ “సామాన్యముగా” (most of the times) పాటిస్తారు.
తమిళములో “సామాన్యముగా”, తెలుగులోకంటే ఎక్కువగా, గణములకు (శీరులు) తగ్గట్లు పదములను ఎన్నుకొంటారు. అదే విధముగా పాదాంత యతి కూడ.
తెలుగు దేశి ఛందస్సులో “సామాన్యముగా” పాదాంతయతి ఉంటుంది. ద్విపదలో, రగడలో ఇది తప్పని సరి (a must). కాని సూర్యేంద్ర గణములకు తగ్గట్లు, మాత్రాగణములకు తగ్గట్లు పదముల విఱుపులు తక్కువ. తాళబద్ధమైన రగడలు ఈ విషయములో కొద్దిగా మేలు. కాని అక్కడ కూడ రెండు మాత్రాగణములను కలిపి వ్రాసిన కవులు ఉన్నారు.
ఏ పద్యమునైనను, వచనమునైనను, తుదకు మాటలను కూడ రాగయుక్తముగా పాడుకొనవచ్చును. కాని అన్నిటిని తాళయుక్తముగా పాడుకోలేము.
అతి స్వేచ్ఛతో వ్రాసే చంపకోత్పలమాలలలో కూడ కొన్ని నియమములను పాటిస్తే వాటిని పాడుకొనడము మాత్రమే కాదు, తాళబద్ధముగా కూడ పాడుకొనవచ్చును. ఈ మాలికా వృత్తములలో 4,5,5 – 4,5,5 మాత్రలతో, 6,4,4 – 6-8 మాత్రలుగా పదముల విఱుపులున్నప్పుడు వాటిని తాళయుక్తముగా పాడుకొనవచ్చును. ఇలాటివి ఇతర వృత్తములకు కూడ సాధ్యము.
విధేయుడు – మోహన
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
12/28/2015 1:53 pm
సంస్కృతంలో పాదాంత యతి (విరామం) విషయకమైన శ్రీ మోహనరావు గారి వ్యాఖ్యను చదివి, దానిని గురించి ఈ నాలుగు మాటలు వ్రాయాలనిపించింది:
‘పాదాంత యతి’ అంటే ప్రతిపాదం చివర పదం పూర్తయి, మరొక కొత్తపదంతో మరుసటి పాదం ప్రారంభం కావటం అన్నమాట. ఒక పాదానికి, మరొక పాదానికి నడుమ సంధికార్యం జరిగే వీలుండదని దీని అర్థం. నిజానికిది సంస్కృతంలో బహుళంగా కనుపించే దృగ్విషయమే కాని, “లాక్షణికనియత” మైనట్లు లేదు. పాదాంత యతి భగ్నమైనందుకు వేద వాఙ్మయం నుంచి, లౌకిక సాహిత్యం నుంచి కొన్ని ప్రమాణాలు:
001.02 (a): agníḥ pū́rvebhir ŕ̥ṣibhir (+ +)
1.001.02 (b): ī́ḍiyo nū́tanair utá
1.001.02 (c): sá devā́m̐ éhá vakṣati.
(అగ్నిః పూర్వేభిరృషిభి (+ +)
రీడ్యో నూతనైరుత
స దేవానేహ వక్షతి.) – ఋగ్వేదం 1, 1-2.
*
1.024.11 (a): tát tvā yāmi bráhmaṇā vándamānas (+ +)
1.024.11 (b): tád ā́ śāste yájamāno havírbhiḥ
1.024.11 (c): áheḷamāno varuṇehá Bodhi
1.024.11 (d): úruśaṃsa mā́ na ā́yuḥ prá moṣīḥ.
(తత్ త్వా యామి బ్రహ్మణా వన్దమానస్ (+ +)
తదా శాస్తే యజమానో హవిర్భిః
అహేళమానో వరుణేహ బోధ్యురుశంస మా న ఆయుః ప్రమోషీః.) – ఋగ్వేదం 1, 24-11.
*
ఇది కాళిదాసు రఘువంశం నుంచి –
అనాకృష్టస్య విషయై
ర్విద్యానాం పారదృశ్వనః
తస్య ధర్మరతే రాసీ (+ +)
ద్వృద్ధత్వం జరసా వినా. (1-23)
ఇవి గాక ఇటువంటి ప్రయోగాలను శతశః ఉదాహరింపవచ్చును. (+ +) అని ఉన్నవి పాదాంతయతి లేనందుకు ఉదాహృతులు. నాకు ఇంటిలో వెంటనే యెదుట కనుపించినవి:
“పశ్యామ్యన్య ముదారభోగవిషయే తుల్యం న మే కఞ్చిద (+ +)
ప్యన్యః కోఽహ మివాస్మి భాజన ముమాపత్యాదరస్యాపి చ.”
“మడ్డాఽఽశాకర ఖణ్డనో వివిభునా క్షీరావసా తుల్యమా (+ +)
సాసుం చాలితడిన్నిభాఙ్గవసనోఽవ్యాత్ సేవకం సారవాన్.” – దుర్ఘట కావ్యం.
లక్షణశాస్త్ర చారిత్రిక పరిణామక్రమంలో తొలిరోజులలో నిజానికి 2 – 3 పాదాల మధ్య మాత్రమే పాదాంతయతి విధింపబడినదని; 1 – 3, 3 – 4 పాదాల మధ్య పాదాంతయతి లేదని భావింపవచ్చును. అందుకు సామవేదచ్ఛందోవిచితిలో చెప్పబడిన లక్షణం:
“అథ అవసానాని ఇతి.
ఏకపద – ద్విపదానాం అన్తతో విరామః.
త్రిపదాప్రభృతీనాం ద్వౌ ఉక్త్వా శేషం ఆహ ఆ షట్పదాభ్యః ఇతి.
త్రిపదా – అగ్న ఆయాహి వీతయే (1),
చతుష్పదా – యజ్ఞాయజ్ఞో (2) వో అగ్నయే.” – (సామవేద చ్ఛందోవిచితి)
అని. “అగ్న ఆయాహి వీతయే”, “యజ్ఞాయజ్ఞో” అన్నవి సామవేదంలో పాదాంతయతి లేనందుకు ఋగుదాహరణలు.
పాదాంతయతి పాటింపబడనందుకు ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ ఉదాహరణలున్నాయి.
సంస్కృతంలో 1-2; 3-4 పాదాల మధ్య ఆ పాదాంతయతి తప్పనిసరి కాదు అది కవిప్రయోగాలలో రూఢమై, శ్రావ్యసుభగమైన ఒక సమయగతపాలనమే కాని, శాస్త్రవిహితం కానేరదు.
ఒక పద్యమైనా, గీతమైనా, ప్రబంధ గద్యమైనా, కవి తనకు తెలిసి వ్రాసినా, తెలియక కూర్చినా “ఛందస్సు” అనే అతివిస్తృతమైన కట్టుబాటులోనికి (“ఛన్దోహీనో న శబ్దోఽస్తి, నచ్ఛన్దశ్శబ్దవర్జితమ్”) ఇమిడిన తర్వాత అది గానయోగ్యమే అవుతుంది. పాదాంతయతికి, ఎక్కడికక్కడ పదాల విరుపుకు ఆ గాన”యోగ్యత”తో లాక్షణికాన్వయం ఉండదు.
ఛందస్సులో ఉన్నదంటేనే అది తంత్రీలయసమన్వితమై, “పాఠ్యే గేయే చ మధురం” అవుతుంది. పాదాంతయతి, యతిస్థానం వద్ద పదచ్ఛేదం లేని తెలుగు పద్యాన్ని ప్రసిద్ధమైన గతిలోనే గాక వివిధగతులలో హాయిగా పాడుకోవచ్చును. ఏ భాషలోని పద్యానికైనా, గద్యానికైనా, తాళవృత్తానికైనా, గీతికైనా గానయోగ్యత ఉంటుంది. దానికి “రాగ-తాళనిర్దేశం” అన్నది స్వచ్ఛందమూ, ప్రాసంగికమే కాని, లాక్షణికనియతం కాదు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:
12/21/2015 9:33 pm
కొన్ని అక్షరాలు చేరితే పదములవుతాయి. కొన్ని పదములు చేరితే వాక్య మవుతుంది. కొన్ని వాక్యములు చేరితే ఒక paragraph అవుతుంది. అదే విధముగా సంగీతములో కొన్ని స్వరములు చేరితే స్వరపదములు అవుతాయి, ఆ స్వరపదములు కొన్ని చేరితే musical phrase అవుతుంది. స్వర పదముల మధ్య కాని, స్వరపదముల సముదాయముల మధ్య కాని ఒక విరామము (pause) ఉంటుంది. ఈ విరామము అన్ని విధములైన సంగీత శాఖలలో ఉంటుంది. సంగీతములో ఈ విరామము ఛందస్సులోని పదచ్ఛేదయతి వంటిది. ఉదాహరణముగా – తనతననా తనతననా తనతననా తానాతానా తనతననా అని ఉంటే దానికి బదులు సరిగరిగా సరిగరిగా సరిగరిగా సారీసారీ సరిగరిగా అని పాటలో ఉంచుకొనవచ్చును. అప్పుడు వీటి మధ్య విరామము ఉంటుంది. పదములు వీటికి సరిపోయినట్లుగా ఉండకపోతే వినడానికి బాగుండదనే నా ఉద్దేశము. ఒక భాషా-పదము రెండు సంగీతస్వరపదముల మధ్య వ్రేలాడుతూ ఉంటే దానిని ఉచ్చరింఛి రంజింప చేయుట కష్టమే. అందుకే పదచ్ఛేదయతి, పాదాంతయతి గేయములలో అత్యవసరము.
“పాయింటు ఒకటిన్నర రాగం, బిళహరి తాళం, ఇంద్రవజ్ర గతి”
ఇంద్రవజ్రగతి అన్నది serious గానా లేక అశ్మాచంగారి వేళాకోళమా? వారి కామెంటులు చదువుతూ ఉంటే నా బుఱ్ఱకు ఏది హాస్యమో కాదో అన్నది తెలియకుండా ఉన్నది. I am humor impaired, you see! ఇంద్రవజ్రకు ఒక గతి ఉన్నది. ఐదుమాత్రలు, నాలుగు మాత్రలు, ఐదు మాత్రలు, నాలుగు మాత్రలు –
మాణిక్య | వీణాం | ఉపలాల | యంతీం. ఈ 5,4,5,4 గతి ఖండజాతి త్రిపుట తాళానికి సరిపోతుంది, ఉదా. ఓ బాటసారీ నను మఱువకోయీ.
“పోనీలే రచయిత గారు చాంతాడంత కామెంటులో చిటికెడంతముక్క నా అభిప్రాయం అని కనీసం చెప్పినారు.”
అందులోని నిజానిజాలను విమర్శించి ఉంటే సంతోషపడి ఉండేవాడిని. ఏదో చాంతాడు, నైలాన్ తాడు, అని అంటే ఏమి అర్థమవుతుంది?
“ఇక ఈ వ్యాసానికి మీకు నాకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాం ఆనందార్ణేభ్య: అర్ణవమస్తు నిత్యం ఈమాటా: సమస్తా సుఖినోభవంతు!”
ఇలా వ్యాసాన్ని అపహసించకుండా స్వంత పేరుతో my dear friend శ్రీమతి లైలావలె వ్రాస్తే బాగుంటుంది కదా? Let us meet next time, lailA gAru!
విధేయుడు – మోహన
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి sundara ramaiah varanasi గారి అభిప్రాయం:
12/10/2015 2:55 pm
నీళ్ళకు నిర్రితొళ్ళకును నేతికరళ్ళకు దర్భముళ్ళకున్
…….పప్పుకూరపచ్చళ్ళకనిశమును మళ్ళకు —–
……దొడ్దయుత్తరెన్వెళ్ళకు …..రాగిబిళ్ళలకు….
……………..సంతసమందుదురాంధ్రవైదికుల్
పైచాటువుని ఎప్పుడొ చదివాను కాని యిప్పుడు గుర్తురావడం లేదు
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం గారి అభిప్రాయం:
12/09/2015 10:21 pm
ఛందస్సు “బంధనభ్రష్టో గృహకపోతః” వంటిదండి. ఆ కపోతం పండితులకు సంబంధించినదే, అయితే ఆ శ్రీశ్రీని గురించిన వినోదవిహారవ్యవహారచోద్యమంతా చూస్తూ ఉంటే – అది పోయిన కాలంలో కానివ్వుడు, ఈ కాలంలో కానివ్వుడు, రాబోయే కాలంలో కానివ్వుడు – ఆ కపోతమును ఎవరింట్లో బంధించి ఉంచాలనుదాని మీద గొడవలెక్కువగా ఉన్నట్లుగా నాకు అనిపించుచున్నది.
పోయిన ఆ శ్రీశ్రీ – కాపీ అయితేనేమిరా మరి కాఫీనైతేనేమిరానంటూ, నానారకాల కాపీలతో, విపరీత ప్రయోగాలతో ఛందస్సు లేదు దిక్కుమాలిన సంతా లేదు, నా వర్డ్ పవరే పెద్ద వింతా సంతా అంటూ పండితులను అలరించడానికి కాకుండగా పామరుల కోసమూ, సామాన్యుల కోసమును రాసి, తన మింతకకు వారిని చుట్టుకొని పోయినాడు.
ఆయనను, ఆయన రాతలను మోసుకు తిరిగినది, జనాల యందు పరుగులెత్తించినది ఆ పామరులేనన్నది జగమెరిగిన సంగతి సత్యము. పామరులు పరుగులెత్తించగా, బంధించగల శక్తిగల మాకేం తక్కువని ఇక ఆ భూతవర్తమానభవిష్యత్ కాలాల్లో ఛంద: పండిత బిరుదాంకితులు గృహాలొదిలి “బ్బొబ్బొబ్బో” అని ఆ కపోతము కోసము పోతరాజుల్లా బజారులో పడినదీ సత్యమే.
ఛంద: పరిఙానం వున్నా లేకున్నా ఆయా పండితులకు ఆలంబనమోతగా ఒక సమూహ చమూచరులు కొంతమంది కరతాళధ్వనులు చేస్తూ ఉండటమందు ప్రసిద్ధులు. ఈ చమూచరులను సోషలు మీడియానందు, బ్లాగులనందు, అండపిండ అంతర్జాలమునందు చక్కగా చూడవచ్చును. వారి వలయమందు చిక్కుకొని అసలు ప్రశ్నలు వదిలి వేసి, సరియైన సమాధానము చెప్పక తప్పించుకొను పండితులూ ఉండినారు, ఉన్నారు, ఉంటారు.
మొత్తానికి లైలా గారు మంచి ప్రశ్నలతో దుమ్ము దుమారం లేపినారు. వారు పండితులు కాదన్న సంగతి తెలిసినప్పుడు, పండితులు కాని వారి ప్రశ్నల్లోని జోరు అట్లాగే ఉంటుందన్న సంగతి తెలిసీ తెలియక, అద్దానిని సహించలేకో, సమాధానములు తెలియకనో వారు ఎగతాళిగా మాట్లాడినారు అన్న ముద్ర వేసుటకు ప్రయత్నించినారని అనిపింపు.
సమాధానము ఒక మెట్టు దిగి చెప్పే ప్రయత్నము చేయకుండగా ఆ దుమ్మును మరింత ఎగదోయుటకు ప్రయత్నములు మటుకు జరిగినవి. ఇక్కడ లైలా గారు నాకు తెలియదు. మోహనరావు గారు నాకు తెలియదు. మధ్యలో కామేశ్వరరావు గారనువారు వచ్చి, (ఈయనా నాకు తెలియదు) ఆవిడ ప్రశ్నలలోని సమాచారములో తనకు కావలసినదాన్ని, తనకు తెలిసినదానిని పట్టుకొని ఆ భాగమును మరింత ఆసక్తికరమైన రంభము దిశగా మరల్చినారు.
అంతా అయోమయముగానున్నది. అయము (ఇనుప) తెర చేదించటం చాలా కష్టము కావున, “తదో గణ్డస్స ఉవరి పిణ్డిఆ సంవుత్” కావున – స్వస్తి వాక్యము పలకవలెను. ఇపుడు నీకేమి అర్థమయినదో నీవు చెప్పు, వీలైతే నీవే సమాధానము చెప్పుమని, నీవునూ అపరిచితాపరిపక్వుడివని, నీవంటి పామరునకు సమాధానమేమియని రచయిత, ఇతరులు అనవచ్చును. దానికి నా సమాధానము ఒకటే. ఆవిడ వేసిన ప్రశ్నలు నిజసత్యసమంజసమైనవి. వాటికి జవాబు వెతకటము, ఇవ్వటము దాదాపు అసాధ్యం. ఆ సత్యాన్ని ఎవరికి వారు తెలుసుకొనవలసినదే!
ఆవిడ ప్రశ్నలు నాకు నచ్చినవి కావున, ఆవిడకు జోహారులు పలుకుతూ ఇంకొక వ్యాసము చదువుకొనెదను. మీకు నచ్చలేదు కావున మీ పని మీరు చేయుడు.
అశ్మాచం.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:
12/07/2015 8:56 pm
ఛందస్సు రెండు విధములు – వైదిక, లౌకిక ఛందస్సులు. వైదిక ఛందస్సులోని శ్లోకాలను పఠించేటప్పుడు ఊనిక, అనగా stress లేక accent అవసరము. అందుకే అవి శ్రుతులు అయ్యాయి. సామాన్యముగా వైదిక ఛందస్సు కనీసము half octave పరిమితిలో ఉదాత్త, అనుదాత్త, స్వరితములతో సాగుతుంది. గురువు (మనిషి) దగ్గర వీటిని నేర్చుకోవాలి. తరువాత లౌకిక ఛందస్సులో ఈ ఊనికకు బదులు గురు లఘువులు పుట్టాయి. ఈ గురులఘువులే ఇంద్రవజ్ర కాని శార్దూలవిక్రీడితము కాని, ఇతర వృత్తములకు కాని ఇవి ఇటుకరాళ్ల వంటివి. సంస్కృత కావ్యములన్నియు ఇట్టి వృత్తములతో వ్రాయబడినవి. నాటకయుగము వచ్చిన తరువాత నాటకములో జనరంజకత్వానికి గీతములు, గీతములవంటి పద్యములు పుట్టాయి. ఇవి మాత్రాఛందస్సుపైన ఆధారపడినవి. గాథా లేక ఆర్యా, వైతాళీయములు ఇట్టి కోవకు చెందినవి. అంతే కాక తోటకము, దోధకము, స్రగ్విణి, ఇంద్రవజ్రము లాటి తాళ వృత్తములను వీటిలో వాడారు. ఇవన్నీ పాడ దగినవి. గురువు రెండు మాత్రలకు లేక కళలకు సమానము, లఘువు ఒక మాత్ర. ఇవి ఉచ్చరణకు కావలసిన సమయము. కావున మాత్రను syllabic instant అని పిలుస్తారు. లౌకిక ఛందస్సులో accent or stress స్థానమును ఈ గురులఘువులు ఆక్రమించాయి. పాటలలో తాళవృత్తములలో ఊనికకు బదులు pitch or frequency ముఖ్యము. భారతీయులు ఆంగ్లమును మాటలాడు నప్పుడు కూడ ఒకే గొంతుతో మాటలో హెచ్చు తగ్గులు లేకుండ మాట్లాడుతారు. అందుకే పశ్చిమ దేశాలవారికి మన ఆంగ్లమును అర్థము చేసికొనడము కొద్దిగా కష్టమే. ఆంగ్లములో కవిత్వము ఈ ఊనికపైన ఆధారపడినది. భారతీయ భాషలలోని ఛందస్సు అక్షరముల కాల పరిమితి (హ్రస్వ దీర్ఘములు) పైన ఆధార పడి ఉంటుంది. సంగీతములో కూడ ఈ పరిస్థితియే. Decibels తేడా ఎక్కువ ఉండదు. Swinburne’s “A Match” లో మొదటి రెండు పంక్తులు –
If love were what the rose is, (7 syllables)
And I were like the leaf, (6 syllables)
పద్యమంతా ఈ 7, 6 syllables తో మాత్రమే అల్లబడినది. ఈ syllable గురువైనా, లఘువైనా కావచ్చు. ఈ పంక్తులను చదివేటప్పుడు మార్చి మార్చి ఊనిక ఇవ్వబడుతుంది. దీనిని శ్రీశ్రీ ఆనందార్ణవ ఛందస్సుతో పోల్చరాదు. అక్కడ పాదానికి 14 మాత్రలు, పాద మధ్యములో, పాదాంతములో విరామము ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష అందము, అంతే!
నేను ఈమాట పత్రికలో వ్రాసిన రెండవ వ్యాసము శంకరాచార్యుల స్తోత్రములలోని ఛందస్సుపైన, అందులో ఉపయోగించబడిన వృత్తములకు ఉదాహరణములను ఇస్తూ, వాటిని అర్థము చేసికొనుటకై నేను తర్జుమా చేసాను, అంతే. అది కవిత్వమని నేను చెప్పుకోలేదు, అందువలన అందులో కవిత్వము లేదని చెప్పడము చచ్చిన గుఱ్ఱాన్ని లాఠీతో కొట్టడమే!
శ్రీశ్రీ పాడుకోడానికి అనువుగా ఉండడానికే గేయ రూపములో నియమితమైన మాత్రల సంఖ్యతో వ్రాసినాడు. లైలాగారు అన్నారు – “Sri Sri is not thinking of 6-4-4.” On the other hand, SriSri IS THINKING of 6-4-4!
ఇది నాకు అర్థము కాలేదు, ఒక వేళ వేళాకోళమా? అనుబంధములోని నా ఉదాహరణములను గురించియా? శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో ఉండే వసంతతిలక వృత్తములు, తోటక వృత్తములు ఇవి పాడుకొన దగినవే. శ్రీశ్రీ చతుర్మాత్రా ఛందస్సులో తోటక వృత్తపు ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి.
విధేయుడు – మోహన
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
12/07/2015 2:23 pm
Interesting! “end rhymes” I understand, but not “stress”.
“ఆనందం అర్ణవమైతే” – ఇందులో ఉన్నవి four stresses ఎలానో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి “Stress” అన్నది అచ్చుపైనుండే ఊనిక. ఇంగ్లీషులో ఒక పదంలో సాధారణంగా రెండు syllables కన్నా ఎక్కువ ఉండవు. కాబట్టి ఒక పదంలో సాధారణంగా ఒకటే stress ఉంటుంది. కాని తెలుగు పదంలో ప్రతి అక్షరమూ ఒక syllable. “ఆనందం” అనే పదంలో మూడు syllables ఉన్నాయి. ఇందులో దేనిపై stress ఉన్నట్టు? నాకు తెలిసి తెలుగులో ఆ పదం పలికినప్పుడు మూడింటిపైనా సమానమైన ఊనికే ఉంటుంది. అందుకే తెలుగు భాష ఇంగ్లీషులా Stressed language కాదు. “ఆనందం అర్ణవ మై తే” అన్నదానిలో ఉన్నవి నాలుగు “stops” లేదా “breaks”. అంచేత దాన్ని నాలుగు “మాత్రాగణాల” వాక్యంగా పరిగణించవచ్చు. ఒకో గణమూ కొన్ని మాత్రల సమాహారం. 6-4-2-2 అనే గణాలు. ఇది 6-4-4 అని కూడా అనుకోవచ్చు. ఆ కవితలో తక్కిన పాదాలకి కూడా ఇదే అన్వయం. అదే మోహనగారు చెప్పింది కూడా.
తెలుగు భాషకి “stress”ని ఎలా అన్వయించవచ్చునో లైలాగారు వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.
“If you were queen of pleasure
And I were king of pain”
నాకున్న కొద్దిపాటి ఇంగ్లీషు పరిజ్ఞానంతో నాకు తోచినదేవిటంటే, యిందులోని రెండో వాక్యం Iambic tetrameter. మొదటిది మాత్రం – x / x / x / x” – tailless iambic pentameter? అనిపిస్తోంది. A Match కవితలో ఈ రెండు రకాల నడకలూ కనిపిస్తాయి. అయితే వాటికి కచ్చితమైన order అంటూ ఏదీ లేదు. శ్రీశ్రీ గేయంలో మాత్రం 99% పాదాలన్నింటా 6-4-4 నడక కనిపిస్తోంది. అలాగే మోహనగారు చూపించిన ఇతర కవితల ఉదాహరణల్లోనూ ఇదే ఛందస్సు ఉంది. మాత్రాఛందస్సు విషయంలో ఇంగ్లీషులో “stress” లాగా పెద్దగా ambiguity లేదు.
అంచేత “Sri Sri is not doing Traditional Telugu syllabic -One long, one short count.” అని ఎందుకన్నారో లైలాగారు వివరించాలి (లైలాగారి వ్యాఖ్యలో ఆ వివరణ ఉందేమో, నా బుఱ్ఱకి మాత్రం అర్థమవ్వలేదు!)
కృష్ణశాస్త్రి, విశ్వనాథల ప్రభావం నుంచి తప్పించుకొని గురజాడ మార్గంలో కవిత్వం వ్రాయడం మొదలుపెట్టానని శ్రీశ్రీ చాలాచోట్ల గర్వంగా చెప్పుకొన్నాడు. అలాగే “గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం నుండి మాత్రాబద్ధ ఛందస్సుల ప్రజాస్వామ్య యుగానికి ఆంధ్ర సాహిత్య చరిత్ర గమనాన్ని పరివర్తన చేసినవాడు గురజాడ” అని, గురజాడ ప్రత్యేకతను కూడా స్పష్టంగా చెప్పాడు. అంచేత శ్రీశ్రీ గురజాడ ప్రభావంతో తన కవిత్వానికి మాత్రాఛందస్సు స్వీకరించాడనుకోడంలో సందేహం అక్కరలేదు.
శ్రీశ్రీ పైన పాశ్చాత్యకవిత్వ ప్రభావం చాలానే ఉంది కాని, ఛందస్సు విషయంలో కూడా అది ఉంది అన్న లైలాగారి అభిప్రాయాన్ని ఒప్పుకోవాలంటే, దానికి మరింత విశ్లేషణ వివరణ అవసరం. ఆ దిశలో ఇప్పటికే ఎవరైనా విమర్శ చేసారేమో నాకు తెలీదు. చేసుంటే కనక, అది తెలిసున్నవాళ్ళెవరైనా ఇక్కడ పంచుకొనమని నా వేడుకోలు. లేదంటే, లైలాగారే ఆ పని చేపడితే బహుబాగుంటుంది!
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
12/06/2015 11:28 am
కొన్ని ఉదాహరణలు, నా ఆలోచనలు.
జె. కె. మోహన రావు గారి ఈ పద్య పాదాలను పరిశీలించండి.
1. కాదంబరిని త్రాగిన మదాలసవతిని
2. ఎడమ కుచమును తాకు వీణియను మీటెడు
3. శశికిని సుధకు నక్కా నీకు నా నమస్సులు
మదాల సవతిని, సుధకు నక్కా -అని చదివి ఆనందించలేము కదా. అసలు అందులో పొయట్రీ నూ లేదు. వాటి ఒరిజినల్స్ కింద చూడండి. ఎంతో వినబుల్ గా పాడబుల్ గా ఉన్నాయి.
1a. కాదంబరీపాన మదాలసాంగీం
2b. వామస్తనాలింగిత రత్నవీణాం
3b. నమోऽస్తు సోమామృతసోదరాయై
ఈ కింది అనువాదపు మాటలలో మాత్రా ఛందస్సు ఉందేమో కాని, కవిత్వం లేదు. తెలుగు కూడ రమారమి లేదనే అనాలి.
“తిండి విషము, సరము పాము,
బట్ట తోలు, బండి ఎద్దు
నాదు సేవ కొసగ దగిన
దేమి లేదు నీదు చెంత
నీదు పాద కమల భక్తి
నీయు మయ్య శంభు యెపుడు”
దానికి మూలం ఈ కింది సొగసు రచన అని ఎవరూహిస్తారు?
అశనం గరలం ఫణీకలాపే
వసనం చర్మ చ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజ భక్తిమేవ దేహి
ఐనా, ఆ తెలుగుసేతలు – ఆయన వ్యాసంలో రాసినపుడు, శంకరాచార్యుని అందమైన రచనలను, రకరకాల ఛందస్సులను పరిచయం చేస్తూ, ప్రతిదానికీ అర్ధం చెప్పక పోతే తెలియని నా లాటి మూఢమతులకోసం జె. కె. మోహన రావు గారు, పెద్ద మనసు చేసి, ఓపికతో, తేలిక భాషలో చెప్పినవి. వాటి ఉపయోగం అంతవరకే ఐనా, అది నా వంటి ఆరంభ దశలోని చదువరులకు చాలా మేలు.
త్యాగరాజు, అన్నమయ్య, రామదాసులలో, నాకు, సంగీతానికి, సాహిత్యానికీ, త్యాగరాజే గొప్ప. సింపుల్ గా “సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మాకు తండ్రి” అన్న దగ్గరే అది డిసైడ్ ఐపోయింది.:-) క్లాసికల్ సంగీతంలో ఏ మాటల వల్ల, గాయకులకు పాడటానికి ఏం బాధ? పాడ చేత కావాలి. కర్ణాటక సంగీతము పాడే వాళ్లకు, సాహిత్యం అర్థం చెప్పి, సరైన ‘voice training’ ఇప్పిస్తే, ఎన్నో మనసు రంజింప చేసే రచనలు ఉన్నయ్యి. I don’t know the current music publishing software status for Karnataka music. I like to find out.
Coming to Sri Sri’s poetry, అద్వైతం- The title and some stanzas reflect, he is taking some of the content and theme from Swinburne’s poem – ‘A match.’ For instance:
“If you were queen of pleasure
And I were king of pain”
Becomes
“హసనానికి రాణివి నీవై
వ్యసనానికి బానిస నీవై,”
“If you were April’s Lady
And I were Lord in May”
Perhaps becomes
“వాసంత సమీరం నీవై
హేమంత తుషారం నేనై”
In terms of metrics, I feel Sri Sri is thinking more along lines of stressed syllables and end rhymes, of English poetry. ఆనందం అర్ణవ మై తే has Four stresses. So does అనురాగం అంబర మై తే. ‘A match.’ Looks like an Iambic tetrameter to me. To sing somewhat upbeat like – ‘For he is a jolly good fellow, for he is a jolly good fellow.’ Sri Sri is not doing Traditional Telugu syllabic -One long, one short count. He is a beginner poet. All he is doing is trying out to write differently from before. His previously written classical Telugu poems are downright ghastly. He definitely needed something new, to stay in the game. He would not be chanting his poetry in -Venkateswara suprabhatam style, which every Telugu hears every Saturday morning. (A few lines partially randomly used. Don’t start counting syllables.)
ఆనంద మర్ణవ మైతే,
భుజాంతర దివ్య మూర్తే,
హిమాదిక మర్ద యంతే
జగదేక శరణ్య మూర్తే
Sri Sri is not thinking of 6-4-4, or, ధృవ తాళము. (He might have favored Gurazäda’s fourteen syllabic count lines. It’s a nice comfortable length.)
I really don’t like అద్వైతం. It’s poor poetry. Worse than ‘A match.’ The poet is just ‘working’ the words. (To take T.S. Elliot’s expression.) There is no cohesive meaning. Sometimes you get doubts whether there is a man and a woman – two lovers – in Sri Sri’s poem or whether he is addressing a group of people. వేస్తాం, తీస్తాం, పరిహాసిస్తాం, పరిపాలిస్తాం, ప్రపంచమును, భవిష్యమును, all so bombastic and pseudo grand. Well, as I grumbled a few times before, here and there, Sri Sri is not a favorite of mine. He will never be one.
(But if I sing వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై -my way, it is getting a new life. I would not mind editing the poem, giving it a track in ‘my Album’)
When it comes to Gurajada, in the context of this essay, yes, he really wrote a nice Telugu song. “దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” చక్కని తెలుగు పదాలు, చక్కని భావం. గేయము పాడేవారు పాట సొగసును పెంచవచ్చు. చేతకాకపోతే దించవచ్చు.
గురజాడ కవి తన ఛందస్సును గురించి చెప్పినాడు. (Thanks Sayee garu for providing an essay.) And I read some poetry of his. “మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కకు, మనుషులంటే రాయి రప్పల కన్న కనిష్ఠం గాను చూస్తావేల బాలా!” It’s nice work. Nice awakening thought. (Someone sang it on you tube. It is downright horrible.)
Reading this essay, lead me to re-read many more of J.K. Mohana Rao’s essays on chandassu, (I have been reading him for ten years now.) I checked on a few others, namely A.J. Swinburne, (a remarkable rhyming capacity, ‘The Roundel’ is a joy) Tennyson, Shakespeare, some criticisms of Ezra Pound, (beautiful translation by K.V.S. Ramarao, in this magazine.) And excerpts from T.S. Eliot -Sacred Wood. I enjoyed the whole process. (And more so conversations of literary friends in the magazine.) Gained more insights into music and poetry – writing, and reading. Thanks.
Lyla
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:
12/03/2015 6:36 pm
తహతహ గారు,
నేను మన కవులు పాటలను వాగ్గేయకారులకు వదిలారు, తాళ వృత్తములను అలా వ్రాయలేదని మాత్రమే. ఇకపోతే వాగ్గేయకారులు అలా పదములను విఱువకుండ పాడుటకు వ్రాసినారా అనే ప్రశ్నకు ఉత్తరము మీ వ్యాఖ్యలోనే ఉన్నది. కాని ప్రయత్నించారని చెప్పవచ్చును. నా ఉద్దేశములో అన్నమయ్య, రామదాసు ఈ విషయములో కృతకృత్యులయ్యారు.
లైలా గారు,
కారణములు – (1) అలా అడగవలసిన బాధ్యత రచయితది లేక సంపాదకులది. (2) ఒక శుభకార్యమునకై ఒక వ్యక్తి అడిగినపుడు, మనకు తెలిస్తే మనము సహాయము చేయాలి. (3) ఆ వ్యక్తి చిరునామా నాకు తెలియదు కావున ఇక్కడే ఆ అభిప్రాయమును చెప్పవలసి వచ్చినది. (4) ఇటువంటి సంబంధము లేని ప్రశ్నలకు సంపాదకులు మఱొక చోటు ఉంచితే బాగుంటుందేమో?
శుభలేఖలను తెలుగులో మాత్రమే కాకుండా ఆంగ్లములో కూడ ప్రచురిస్తారుగా, అందువలన దానిని కూడ జత చేసాను.
నా రచనలలోని విషయాలను అనవసరముగా sidetrack చేసినప్పుడు నేను అలా చేయకండని అభ్యర్థించడము సబబే అనుకొంటాను.
శ్రీశ్రీ చెప్పనంత మాత్రాన వ్యాసకర్త అభిప్రాయము తప్పు కాదు. Swinburne వ్రాసిన A match లో 7, 6 syllables ఉన్నాయి. అందులోని సారాంశమును శ్రీశ్రీ గ్రహించాడు, syllabic arrangement కాదు.
అది ఛందస్సు పేరు. నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, సుభద్ర, పూర్నమ్మ అనుబంధము ఇవన్నీ ముత్యాలసరాలు అనే పేరితో ఎమెస్కో వారు ప్రచురించారు. అందులో ముత్యాలసరాలపైన అప్పారావు వ్యాసము ఒకటి ఉన్నది.
ఈమాట శ్రీ వేలూరిగారిని కూడ అడగండి, వారు ఒకప్పుడు 20వ శతాబ్దములోని మహాకవులు విశ్వనాథ, శ్రీశ్రీ అన్నట్లు గుర్తు. జగద్గురు మధ్వాచార్యులు మాత్రాఛందస్సును ద్వాదశస్తోత్రములో వాడినారు. కాని జగద్గురు శంకరాచార్యులు మాత్రాఛందస్సును ఎన్నో స్తోత్రములలో వాడినారు, శ్రీశ్రీకి స్ఫూర్తి ఇచ్చినది ఆ రచనలే.
విధేయుడు – మోహన
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
12/02/2015 6:11 pm
In the comments essayist says: “ఇకపోతే లైలాగారు రెండవ అంశములో “2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”చెప్పినవి digression కాక మఱేమిటో?”
పక్కనే ఇంకో అభిప్రాయ వేదికలో, అశోక వనంలో సీత గురించిన పద్యం శీర్షికలో, విశ్వనాథ పద్యం గురించి వీరు ఏం చర్చ చెయ్యలేదు. పద్యం పైన వ్యాఖ్యను గురించి నోరు మెదప లేదు. కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం? పైగా, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో తనకు నచ్చిన పద్యం అంటూ రాసారు. తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?
వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression. ఈ మాట మేగజీన్ లో అన్ని అభిప్రాయాలూ అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. నిజంగా వేరు వేరు గదుల్లో, గోడలు అడ్డు ఉంటే, ఒకచోట డైగ్రెషన్ అంటూ, అవతలకు వెళ్లి వారు అదే పని చేస్తున్నట్టు అందరికీ తెలియదు కదా.
In the essay Essayist says: “మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే). ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి…”
భారతం, భాగవతం, ప్రబంధాల లోని పద్యాలు చదువుతున్నప్పుడు ఇది చంపకమాల, ఉత్పలమాల, సీసం, అని కవి చెపుతాడు. ఆ పద్య లక్షణాలు వారికి తెలుసు. మహీధర నళినీ మోహన్ –మాత్రా ఛందస్సులో మేఘసందేశం – అన్న తెలుగు పుస్తకంలో -మాత్రా ఛందస్సులో ఆయన ఎంచుకున్న గణములు, పాదములో గణముల సంఖ్య, పద్యం లోని పాదాల సంఖ్య ముందుగానే చెప్పారు. ఆ యా రచనలలో వారి కూర్పుల గురించి ఆ రచయితలు స్వయంగా సమాచారమిచ్చారు.
ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు. ‘అద్వైతం’ గేయం చివరి దాకా పఠించగలిగితే – అక్కడ ఏ. సి. స్విన్బర్న్ కవికి, ప్రత్యేకంగా A match అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో, 1936(?) – అని మహాప్రస్థానం పుస్తకంలో ముద్రించబడి ఉన్నది. ఏమి మార్గము శ్రీ శ్రీ కవికి -స్విన్బర్న్ నుండి లభించింది అన్న ప్రసక్తే తేలేదే ఈ వ్యాసకర్త? విచిత్రం. కవి చెప్పినది వ్యాసకర్త ఉపేక్ష చెయ్యటం. ఎందువల్ల? వ్యాసకర్త స్విన్బర్గ్ A match చదివారా? అతని ఇతర కవిత్వం చదివారా? శ్రీ శ్రీ కవితలోని వాక్యము -6,4,4 గానే ఎందుకు తను విభజించారో, అలా తీర్మానించుకోటానికి బేసిస్ ఏమిటో, ఈ వ్యాస రచయిత చెప్పాలి. అదంతే, అక్కడ అదే ఛందస్సు ఉంది అనేస్తే చాలదు.
మేగజీన్ చదువరులకు నా ప్రశ్నలు:
1. గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా? గురజాడకు సంగీతములో ప్రవేశముందా? అతని కవితలకు అతడు స్వరములు కూర్చాడా?
2. ఈ పత్రికలో ‘ముత్యాల సరాలు’ అన్న మకుటంతో ఒక కవిత ఉంది. అది కవి ఏ ఛందస్సులో వ్రాసారు? దాని పేరేమిటి?
Lyla
P.S: ఓరి నాయనో! మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
11/30/2015 6:50 pm
ముందుగా … నవంబరు 26వ తేదీన రాసిన అభిప్రాయంలో రెండు తప్పులు దొర్లాయి. 1. “… తలంబ్రాలుగా శిరమున మెరిసిన” అని ఉండాలి. 2. “సీతారామ కల్యాణం” లోని ఆ పాట సముద్రాల జూనియర్ రచన అన్నాను. కానీ సినిమా పాటల పుస్తకంలో సముద్రాల రాఘవాచార్యుల (సీనియర్) రచన అని ఉంది. [కొన్ని చోట్ల “సముద్రాల” రచనగాను, ఒక సందర్భంలో సముద్రాల జూనియర్ రచనగాను చెప్పబడింది.]
విశ్వనాథ రాసిన సొగసయిన పద్యాన్ని, బృందావనరావుగారి మంచి వర్ణనని వదిలేసి సినిమా కబుర్లు చెప్పడం భావ్యం కాదు కనుక “జానక్యాః కమలాంలాంజలిపుటే” శ్లోకానికి మరొక తెలుగు సినిమా 🙂 అనుసరణను ప్రస్తావించి ఈ చర్చనుండి తప్పుకుంటాను. ఆరుద్ర “సంపూర్ణరామాయణం”లో (1972) “ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు…” అని ఒక పొడుగాటి పాట రాసారు.
ఆయనే రెండేళ్ల తరవాత వచ్చిన “సీతాకల్యాణం”లో
“తెల్లని ముత్యములెర్రగ మారి
ఎర్రనివేమో నీలములవుతూ …” అని కూడా రాసారు.
భవదీయుడు,
శ్రీనివాస్
తా.క. “అందమె ఆనందం’గా ‘బ్రతుకు తెరువు’కి ఒకే పాటలో తెలుగు చేసినది తండ్రి గారా? తనయుడా?” అన్న ప్రశ్నకి నా వద్ద కచ్చితయిన సమాధానం లేదు. పాటల పుస్తకం, రికార్డులు, కొన్ని ఇంటర్యూలు .. వీటి ప్రకారమయితే అది తనయుడి పాట. అసలు తండ్రీ కాదు, తనయుడూ కాదు, రాసింది మరొక పెద్ద మనిషి అనే వాదం కూడా ఉంది.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:
11/29/2015 6:02 pm
“What does that mean? A misleading sentence right in the beginning of the essay. Neither Gurajada nor Sri Sri wrote poetry to show case matra chandassu.”
గురజాడవారు వాడుక భాషలో మాత్రాఛందస్సును ఉపయోగించి వ్రాయుమని చెప్పగా, తాను వ్రాసినానని శ్రీశ్రీ చెప్పాడు. అంటే అట్టి మాత్రాఛందస్సుకు అగ్రస్థానము నిచ్చాడనియే కదా దాని అర్థము? అంతకుముందు శ్రీశ్రీ వృత్తములలో, జాత్యుపజాతులలో తన కవిత్వమును వ్రాసియుండెను, అట్టి కవితలకు ఉదాహరణమును ఇక్కడ ( http://eemaata.com/em/issues/201001/1530.html?allinonepage=1 ) చదువ వీలగును. ఇట్టి ఛందస్సును త్యజించి, మాత్రాఛందస్సును మాత్రమే తఱువాత వాడియున్నాడంటే దానికి ఒక ఉన్నత స్థానము ఇచ్చాడనియే అని నేను అర్థము చేసికొన్నాను. ఇతరులు వేఱు విధముగా అర్థము చేసికొని ఉంటే దానిని విశదీకరించడము వారి కర్తవ్యము అవుతుంది.
ఇకపోతే లైలాగారు రెండవ అంశములో
“2. Now clarification about my previous words … Asshole … Dumbshit …”
చెప్పినవి digression కాక మఱేమిటో?
పాటలను పాడుకొనేటప్పుడు దాని నడక, లయ – వీటికి తగ్గట్లు పదములు అమరినప్పుడు మాత్రమే శ్రోతలకు గొప్ప అనుభూతి లభిస్తుంది. పదములను గాయకురాలికి తోచినట్లు ఎక్కడిక్కడ నఱికి పాడితే అనుభూతి కలగడము కాదు అసహ్యము కలుగుతుంది. అలా నఱికి పాడిన పాటలు బాగుండవని ఎన్నో మారులు ఎందఱో చేసిన విమర్శలను నేను చదివియున్నాను.
భారాతాది గ్రంథములలో ఉండే అర్థవంతమైన పద్యాలను చదివి ఆనందించ వచ్చును. అదొక అనుభూతి. కాని అన్నిటినీ పాడుకోలేము, ముఖ్యముగా తాళబద్ధముగా పాడుకోలేము. ఈ ఆనందార్ణవ ఛందస్సు తాళబద్ధమైనది. ఆఱు, ఎనిమిది మాత్రలకు విఱుగుతుంది. శ్రీశ్రీ అలా ఎందుకు వ్రాసినాడంటే, అప్పుడే గేయపు నడక, లయ వాటిలో ప్రతిబింబిత మవుతాయి. శ్రీశ్రీ పాదాంత విరామమును కూడ పాటించాడు. ఇవన్నీ ఆ మహాకవి ఎందుకు చేసినాడంటే, వాటిని జనులు పాడుకొని ఒక క్రొత్త ఉద్రేకాన్ని పొందాలని.
ఉత్తర భారత భాషలలో, సంస్కృతములో, తమిళ, మలయాళములలో ఎక్కువగా పాదాంతయతిని వాడుతారు. అలా చేసినందువలన వాటికి గానయోగ్యత లభిస్తుంది. తెలుగు కన్నడ భాషలలో (ముఖ్యముగా తెలుగులో) సాహిత్యము రెండు భిన్న రీతులలో రూపొందినాయి. కావ్యములు పఠనీయములు మాత్రమే. అది సంగీతముతో ఎక్కువ సంబంధము లేకుండా రూపొందినది. వాగ్గేయకారులు రచించిన గీతులకు మాత్రమే గేయత్వము లభించినది. కవులు ఎక్కువగా ఈ వాగ్గేయకారులను, యక్షగాన కర్తలను సరకుగొనలేదు. ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.
అందుకే నేను గానయోగ్యతకు అనువైన వృత్తములను అభ్యసించడములో కృషి చేస్తున్నాను. అంతే కాదు, మనమెఱిగిన మాలికా విక్రీడితములను కూడా తాళబద్ధమును చేయ వచ్చునని నిరూపించినాను.
ఇతరులు దీనిని అంగీకరిస్తారో, అనుమోదిస్తారో, కనీసము బాగుందని ఒక మాటైనా అంటారో లేదో అన్నది వారికే నేను వదలివేస్తాను. కాని నాకు మనఃతృప్తి లభించినది దీనివలన. అది చాలు నాకు. ఎందుకంటే నేను “ఈమాట”లో వ్రాసిన 50 పైన వ్యాసములను ఇతరులు మెచ్చుకోలేదని అనుకొని ఉంటే అర్జునునిలా అస్త్ర సన్యాసము చేయడానికి ఉద్యమించి ఉండేవాడిని.
లైలాగారికి, తహతహగారికి, వేలూరిగారికి, అశ్మాచంగారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు!
విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
11/28/2015 9:50 am
శ్రీ శ్రీనివాస్ గారికి నమస్కారములతో,
“జానక్యాః కమలాంలాంజలిపుటే” శ్లోకానికి మీరు ఉదాహరించిన శ్రీమాన్ సముద్రాల రామానుజాచార్యుల వారి అనురణనం భవ్యంగా ఉన్నది. ఈ విధంగా కర్ణామృతములైన సంప్రదాయశ్లోకాలను తెలుగుచేసి సందర్భోచితంగా చలనచిత్రాలలో ప్రవేశపెట్టటం వారికొక వైనోదికక్రీడ. ఇది శ్రీకృష్ణాంజనేయయుద్ధం లోనిది:
రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తౌ పితు
ర్వాచా పఞ్చవటీ వనే విహరత స్తా మాహర ద్రావణః
నిద్రార్థం జననీకథా మితి హరే ర్హుం కాతర శ్శృణ్వత
స్సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధను రితి వ్యగ్రా గిరః పాన్తు వః.
“ఇనకులవంశుఁడౌ దశరథేశుని పుత్త్రులు రామలక్ష్మణుల్;
జనకజ రామపత్ని; పితురాజ్ఞ (? పిత యాజ్ఞ) శిరంబునఁ దాల్చి మువ్వురున్
వనముల కేఁగ, జానకిని వైరముతోఁ గొనిపోయె రావణుం”
డనుచును నీవు చెప్ప – వినినంతనె యాగ్రహమంది, “లక్ష్మణా!
ధను విటుఁ దె” మ్మనంటిఁ గద, దాఁగునె పూర్వభవానుబంధముల్.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
11/26/2015 4:16 pm
మురళీధరరావుగారు: చేకూరి సిద్ధకవి అనువాదం గురించి నాకింతకుముందు తెలియదు. పూర్తి పద్యం అందించినందుకు నా ధన్యవాదాలు.
సినిమాపాట అయినందువల్ల పెళ్ళి శుభలేఖల్లో అచ్చు వేయడానికి సందేహిస్తారేమో కాని నాకు సముద్రాల జూనియర్ గారి “అనువాదం/అనుసరణ” అంటే చాలా ఇష్టం :).
జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరువురు మెరిసిన సీతారాముల కల్యాణము …
On a related note, there is a good translation (into English) of this popular Sanskrit chATu verse by Velcheru Narayanarao and David Shulman in: A Poem at the Right Moment – Remembered Verses from Premodern South India, Univ. of California Press, Berkeley, 1998.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన గారి అభిప్రాయం:
11/10/2015 11:44 pm
వేలూరి వెంకటేశ్వరరావు గారి ప్రోత్సాహమునకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
నేను వివరించిన ముఖ్యమైన విషయములపైన చర్చను జరుపక వేఱు విషయములపైన చర్చ జరిగినందులకై ప్రధానాంశములపై చర్చ జరుపమని ప్రార్థిస్తూ అవేవో అన్న విషయమును నేను నా అభిప్రాయములో తెలిపినాను.
This appears to me to be a condescending remark, quite unnecessary in my opinion.
325 విధములు వ్రాయవచ్చునని మాత్రమే తెలిపినాను. వాటినన్నిటిని శ్రీశ్రీ పరిశీలించి అందులో 78 ఎన్నుకొన్నాడని నేను ఎక్కడ చెప్పలేదు. అతని ఐదు కవితలలో ఉపయోగించబడినవి 78 ఛందస్సులు అని మాత్రమే తెలిపినాను.
నేను వ్యాసపు ముగింపులో ఇలా వ్రాసాను – “శ్రీశ్రీ నేను ఆనందార్ణవము అని పేరుపెట్టిన 6-8 మాత్రల ఛందస్సును ఏ విధముగా సృష్టించాడో మనకు తెలియదు. కాని అది చంపకోత్పలమాలలలో, శార్దూల మత్తేభవిక్రీడితములలో అంతర్లీనమై ఉన్నదని ఇక్కడ నిరూపించినాను.” ఇందులో శ్రీశ్రీ ఏ రీతిగా ఏ ఆధారముతో ఈ ఛందస్సును సృష్టించినాడన్న విషయము మనకు తెలియదని స్పష్టముగా చెప్పాను. అది శ్రీశ్రీ సంకల్పించాడని నేను చెప్పానా?
మొదటి అనుబంధములో ఇవి ఇవ్వబడినవి.
Thanks for the kind encouragement. Again, I don’t carry out my research keeping such opinions in my mind. Thank God, I am not receiving any grants for my research from such people!
విధేయుడు – మోహన
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
11/08/2015 10:06 pm
Thank you. When you are the lyricist, you can request your composer and singer, to sing it the way you like it to be sung. You can compel them, that they need you approval of the sheet music, and the recording, before it is released to the general public. I am sure it will be a smash hit in some circles.
అంటే శ్రీశ్రీ – ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను, display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా? ఛందస్సు వద్దు మొర్రో, నాకు నిబంధనలు వద్దంటున్న శ్రీశ్రీ అలాటి పని ఎందుకు చేస్తాడు? అది మీకు నచ్చిన ఊహ. ఆ ఊహను అతని ఛందోపరిజ్ఞానంగా గాని, అతని అభిలాషగా గాని రాయటం, అది true finding ఎలా అవుతుంది? అది మీరు ఎలా నిరూపిస్తారు? నేను ఈ విషయం నిరూపించి చూపాను, అని వ్యాసంలో మీరంటే, శ్రీశ్రీ పరంగా అది సరి ఎలా అవుతుంది? అతని గురించిన అతని మాటలనే ఖాతరు చేసుకోటం లేదే మీరు? ఎవరి మాటల ఆధారంగా ఏమి నిరూపిస్తారు?
మీరు చేయగలిగిన పనులు, మీ రచనలలో మీరు చేసి చూపి మెప్పించవచ్చును. ఇతరులు సంకల్పించని, చేయని పనులను, వారు చేసారని చెప్పి, ప్రజలను ఒప్పించ లేరు. No one needs that kind of research.
అంటే ఏమిటి? ఉదాహరణలు ఇచ్చి వివరించగలరా?
లైలా
పుల్లెల శ్రీరామచంద్రుడు గురించి తః తః గారి అభిప్రాయం:
10/11/2015 12:26 am
వేద భాష్యాన్ని రాసిన సాయణుల గురించి రాస్తూ పుల్లెల వారు సాయణులు తన గురించి తాను రాసుకున్న ” న ధ్యానం న వ్రతం నార్చా న సమాధిర్న వా జపః , సుప్రసిద్ధా బలం యస్య మతిరేవ మహీయసీ ” అన్న శ్లోకాన్ని ని పేర్కొని, తెనిగిస్తూ “ఏ సాయణాచార్యునికి సుప్రసిద్ధమూ చాలా గొప్పదీ అయిన బుద్ధియే బలమో, అంతే కాని ధ్యానం కాని, వ్రతం కాని, దేవతాది పూజ కాని, యోగం గాని, జపం కాని ఎవనికి బలం కాదో…” అని వివరించారు.
(పుల్లెల వారి ప్రస్తావనలు, సంస్కృత భాషా ప్రచార సమితి హైదరాబాద్- 500 001, జులై,2011, పుట 363.)
తః తః
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి ఈ వ్యాస రచయితలు గారి అభిప్రాయం:
10/03/2015 7:15 pm
మేం రాసిన వ్యాసం మీద రకరకాలుగా స్పందించిన వారందరికీ మా నమస్కారాలు. మా వ్యాసంలో మేం ప్రధానంగా ప్రస్తావించిన విషయం ఈ ఉత్తరాలు రాసినవారందిరిలో ఇద్దరో, ముగ్గురో గుర్తించారు. వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. తెలుగు ప్రచురణలో ఒక సంప్రదాయం ఏర్పడాలన్నా, ఒక ప్రామాణికత రావాలన్నా సంస్ఠలే పూనుకోవాలి. తెలుగులో ఇలాంటి సంస్థలు మూడు. లాభాపేక్షలేకుండా పనిచేసే తిరుపతి దేవస్థానం, తెలుగు సాహిత్య ఎకాడమీ, లాభాపేక్షతో పనిచేసే విశాలాంధ్ర, ఈ మూడింటిని సంస్థలుగా ఏర్పడిన ప్రచురణ కర్తలుగా మేం గమనించి వాళ్ళ ప్రచురణల గురించి చర్చించాం.
స్టైల్ మాన్యువల్ గురించి కొంతమంది మాట్లాడారు. స్టైల్ మాన్యువల్ ఒకరు ఏర్పరిచి బయటపెట్టినంత మాత్రాన అందరూ దాన్ని ఆమోదించరు, అలాటి ఆమోదానికి కూడా పెద్ద సంస్థల తోడ్పాటు కావాలి.
సంస్థలుగా ఏర్పడబోతున్న ప్రచురణకర్తలు మనకి లేకపోలేదు. అటువంటి ప్రయత్నాలు కొన్నింటిని ఈ వ్యాసంలో మేం ప్రస్తావించాం, ఇటువంటి ప్రయత్నాలు మరెందరో కూడా చేస్తున్నారు. కాని అవన్నీ ఇప్పటివరకూ ఒక వ్యక్తి బలంవల్ల నడుస్తున్నవి. అవి సంస్థలుగా ఎదగడానికి ఇంకా కొంత కాలం పడుతుంది.
వ్యాసంలో ఉన్న ప్రధాన విషయాన్ని ఆలోచనాత్మకంగా పొడిగించడానికి పనికొచ్చే ఉత్తరాల కోసం ఎదురుచూస్తాం. నమస్కారాలు.
టూఎయిటీన్ డీ గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
09/26/2015 11:06 am
పర్స్పెక్టివ్స్, హైద్రాబాదు వారు ప్రచురించిన ‘త్రిపుర కధలు’ మూడో ముద్రణ లోని ‘హోటల్లో’ అనే కధ అది. కినిగే సంస్థ వారి క్రింద ఇచ్చిన లింకు ద్వారా ప్రింటు కాపీ కాని, e-పుస్తకం కాని చెప్పించుకునే సౌకర్యం కలదు.
http://kinige.com/book/tripura+kathalu+print+book.
ప్రతిభావంతురాలైన కవయిత్రి, రచయిత్రి, త్రిపుర గారి వీరాభిమాని అయిన స్వాతికుమారి గారు కధా విషయం, విషయ పరిధి మీద ఇంకొంచం శ్రద్ద పెట్టలేదేమో అనే దుగ్ధతో; త్రిపుర గారి ‘హోటల్లో’ కధలోని అంతర్వాహిని లాంటి మానవత్వపు తడిచెమ్మ ( ‘గుడిసెలోని తన కొడుకు సివంచెలంకి మందెవరు తెస్తారు’ అని ఖాళీ కళ్లతో చూస్తున్న రాములు గురించిన సృహ; ‘వెధవ కమ్యూనిస్టులతో చేరి జండాలు అవీ పట్టుకు తిరుగుతూ అల్లరి పెడుతున్నాడు ధర్డ్ ఫెలో’ ఆకాలమే వేరు అంటున్న తండ్రి గురించిన సృహ ) యీ కధలో కనబడక కసితో అలా అవాకులూ చవాకులూ రాసాను. రచయిత్రి మన్నింపు దృష్ఠితో మిన్నకున్నారు. యీ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి లక్ష్మీదేవి గారి అభిప్రాయం:
09/17/2015 7:33 am
సారాలంకార విలక్షణత ను నిరూపిస్తూ సాగిన ఈ వ్యాసం పోతన గారి పద్యం వలెనే ఆకర్షిస్తున్నది.
జయరథుని వ్యాఖ్యలో ఉదహరించబడిన ఆ సంస్కృత శ్లోకం ఎక్కడి నుంచి తీసుకోబడి ఉంటుంది? లేక వ్యాఖ్య కూర్చినవారే వ్రాసి ఉండవచ్చునా?
జయరథుడు వర్ధమానం సారాలంకారంలోనే ఇమిడిపోతుందని అనడం, ఆ సంస్కృత శ్లోకంలో వర్ధమానః అనే పదాన్ని వాడడం చూసినపుడు నాకనిపించిందది.
పద్యంలోని ముఖ్యవస్తువు మహావిష్ణువు యొక్క ఉత్తరోత్తర వృద్ధియే కాని, రవిబింబం యొక్క వివిధ రూపత్వసిద్ధికాదన్నది తెలిసినవిషయమే కాన పద్యంలోని సారాలంకార నిరూపణ అర్థవంతంగా ఉంది.
వ్యాసకర్త అన్నట్టు పోతన గారి ప్రసిద్ధ పద్యంలో ఔచిత్యం నిండుగా ఉంది.
భాగవతగణానాధ్యాయి గారన్నట్టు ఇటువంటి వ్యాఖ్యానాలు మా వంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/16/2015 7:38 am
పదిహేను నెలల తర్వాత ఈ వ్యాసాన్ని మళ్ళీ ఈరోజు చదువుతున్నప్పుడు – ఇంత అన్వయక్లేశం కలిగిన పద్యం కాకపోయినా, 1893లో గురజాడ శ్రీరామమూర్తిగారు “తెనాలి రామకృష్ణుని చాటువులని వాడుక గల పద్యములు” అని తమ ‘కవిజీవితములు’లో చూపిన వేరొకటి గుర్తుకు వచ్చింది. విద్యార్థులు కొద్దిసేపు ఆలోచిస్తే అర్థస్ఫురణ కలుగుతుంది కాని, దీనికీ పూర్వోత్తరాలలోని పద్యాలు దొరకనందువల్ల – తొలిచూపులో ప్రతిపాద్యాంశం, ప్రతిపదార్థం, తాత్పర్యం బోధపడటం కష్టమే:
శైవాలంబును సైకతంబు లెదురై చంద్రప్రవాళాంబుజ
గ్రావాకాశభుజంగకూపములు దూరం బైన నేతత్పరీ
క్షావిద్యావిభవం బొనర్పఁగ దశాబ్జజ్యోత్స్నలో నర్ధచం
ద్రావిర్భావముఁ జూపినం గలిసెఁ దా నాత్మేశు భావజ్ఞయై.
అని.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/12/2015 2:04 pm
పూజ్యతములు శ్రీ కృష్ణదేశికాచార్యుల వారి సన్నిధికి
నమస్కారములతో,
రుయ్యకుని అలంకారసర్వస్వాన్ని వ్యాఖ్యానిస్తూ విమర్శినిలో జయరథుడు సారాలంకారానికి ఉదాహరించిన శ్లోకాన్ని చదువుకొన్న పోతన గారు దానిని సారాలంకారానికి అనురూపంగానే తెలుగుచేసి ఉంటారని భావించటం సులభం. అన్యధాకృతంగా అన్వయించేటపుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఆలోచింపవలసి ఉంటుంది.
తత్త్వతః అపహ్నవం, ఉల్లేఖం, పరిణామం, భ్రాంతిమంతం, రూపకం, సందేహం అన్నవి అభేదప్రాధాన్యం కలిగిన అలంకారాలు. ఏకావళి, కారణమాల, మాలాదీపకం, సారాలంకారం శృంఖలావైచిత్ర్యమూలకాలు. సారము, ఉల్లేఖము – రెండూ అస్ఫుటప్రతీయమానాలే. కాగా, రుయ్యకునికి పూర్వం భామహుని మొదలు మమ్మటుని వరకు గల ఆలంకారికులెవరూ ఉల్లేఖాన్ని ఒక అలంకారప్రభేదంగా గుర్తింపనే లేదు. రుయ్యకుడు తన ప్రతిభామూలాన గుర్తించి, దానికి అలంకారస్థాయిని కల్పించిననాటి నుంచి విద్యానాథాదులు, అమృతానందయోగి, తదనంతరీయులు అందరూ రుయ్యకుని సూత్రబోధనే అనుసరించారు.
రుయ్యకుడు గుర్తించిన ఉల్లేఖముయొక్క స్వరూపం ఇది: ఒక వస్తువు వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు తీరుల గోచరించి, అన్యవస్తుప్రతీతి వలని ఆ రూపబాహుళ్యం వారిచే పరిపరివిధాల ఉల్లేఖింపబడటం జరుగుతుంది. అనేకవిధాల చూచే అనేకులు లేకపోయినప్పటికీ ద్రష్ట ఒక్కడే వస్తువును అనేకవిధాల వర్ణింపవచ్చును. ఆ రాజును మన్మథుడని స్త్రీలు, కల్పవృక్షమని యాచకులు, సమవర్తి అని శత్రువులు చూస్తారు – అనటం మొదటి పద్ధతి. ఆ రాజు ధనుర్విద్య యందు భీష్ముడు, వాక్కున బృహస్పతి, కీర్తియందు అర్జునుడు – అనటం విషయభేదం వలని రెండవ పద్ధతి ఉల్లేఖం. ఇవి రెండూ చంద్రాలోకంలో జయదేవుని ఉదాహరణలు.
ఇది తొలినాటి ఉల్లేఖాలంకార చరిత్ర. ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు అలంకారసర్వస్వంలోని శోభాకర మిశ్రుని నిర్వచనాన్ని అనుసరించి శ్లేషమూలకమైన విషయభేదాన్ని ఈ శ్రేణిలో సరిక్రొత్తగా చర్చించాడు. శ్లేష ఉల్లేఖను పరిహరిస్తుందని కొందరంటారు.
కాలక్రమాన ఉల్లేఖలో శుద్ధోల్లేఖం, సంకీర్ణోల్లేఖం అని ప్రభేదాలు ఏర్పడ్డాయి. సంకీర్ణోల్లేఖంలో ఫలోల్లేఖం, హేతూల్లేఖం అన్న అంతర్భేదాలు; విషయభేదంతోపాటు అధికరణభేదం వల్ల ఉల్లేఖాలంకార ధ్వని అన్నవి లక్షణజాతంలో చేరాయి. అయినా, క్రొత్తను వెంటనే ఆహ్వానించలేని విశ్వేశ్వర పండితాదులు అలంకారకౌస్తుభాదులలో ఉల్లేఖానికి ప్రత్యేకమైన అస్తిత్వాన్ని తిరస్కరించి కేవలం అతిశయోక్తిప్రభేదంగా కొట్టిపారవేశారు.
కావ్యాలంకారసంగ్రహ వ్యాఖ్యలో శ్రీ సన్నిధానం సూర్యనారాయణశాస్త్రుల వారు పై పోతనగారి పద్యాన్ని ఉల్లేఖాలంకారానికి ఉదాహరణగా ఇచ్చిన మాట నిజమే కాని, అందుకు వారు ప్రమాణీకరించిన “గ్రహీతృభేదాభావేఽపి విషయాశ్రయభేదతః, ఏకస్యానేకోల్లేఖ ముల్లేఖం ప్రచక్షతే” అన్న శ్లోకం ఎక్కడిదో వారు చెప్పలేదు. ఆ శ్లోకం అప్పయ దీక్షితుల వారి ‘చిత్రమీమాంస’ లోనిది. అప్పయ దీక్షితుల వారు కువలయానందంలో విషయభేదంతోపాటు ఆశ్రయభేదాన్ని చెప్పిననాటి నుంచి అది పండితరాయాది ముఖ్యాలంకారికులచే ప్రచారంలోకి వచ్చింది. పోతనగారికి ఈ పరిణామక్రమం పరిచితమై ఉండదు.
ఒకవేళ పోతనగారు జయరథుని విమర్శినినే గాక అలంకారసర్వస్వానికి శ్రీవిద్యాచక్రవర్తి రచించిన సంజీవనీ వ్యాఖ్యను కూడా చదివారనుకొన్నా, దీనిని ఉల్లేఖరూపంగా అన్వయించారనుకోవటం సాధ్యం కాదు. శ్రీవిద్యాచక్రవర్తి “యదేకం తద్ధి నానేతి గృహ్యతే రుచిభేదతః” అని వ్రాసిన దళాన్ని పోతనగారు చూచి ఉంటే, ఒకే వస్తువులోని రూపగతభేదానికి “రుచ్యాదివశ”మైన నానాత్వదర్శనాన్ని ఇందులో కల్పించారనలేము. మహాకవి కదా, తమనాటికి లేని అలంకారప్రభేదాన్ని పోతనగారు ప్రయోగించి ఉండకూడదా? అంటే, జయరథుడు చూపిన సారాలంకారపు ఉదాహరణ ఎదుట ఉండగా దానిని అన్యధాకరించి ఉల్లేఖంగా అనువర్తించి ఉండరనే ఇప్పటి నా ఊహ. రుయ్యకుడే తొలిసారి చెప్పిన ఆ ఉల్లేఖాన్ని చదువుకొన్నవారే కద!
“రవిబింబంబు ఛత్రంబై ఉపమించుటకు పాత్రమగును” అన్న ఉపక్రమం ఎటుచూసినా విషయాశ్రయభేదతః ఉల్లేఖానికి అన్వయించేందుకు క్లేశకరమే. విషయమైన రవిబింబానికి ఏది ఆశ్రయమై ఛత్రంతో సాదృశ్యమూలకసిద్ధి కలిగింది? రవిబింబం శిరోరత్నమైనప్పుడు ఛత్రత్వకల్పన జరిగిందనీ అనుకోలేము. అందువల్ల విషయాశ్రయారోపం అక్కడ సాధ్యం కాదు.
అసలు “రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రంబై” అని రవిబింబానికి “ఛత్రోపమాన పాత్రత్వాన్ని” ఎందుకు చెప్పవలసి వచ్చింది? అంటే, పోతనగారు రవిబింబానికి రవిబింబపు వెలుగును, వేడిమిని అపవారించటానికే ఏర్పడిన ఛత్రాన్ని పోలికకు తెచ్చేందుకు కొంత సందేహించి, శిరస్సుపైని ఉన్నదన్నంతవరకే సరిపెట్టుకొని, సమర్థింపవలసి వచ్చిందని అనిపిస్తుంది. “ఛద = అపవారణే (ఆతపాత్) ఛాదయతి” అని రామాశ్రమి. రవిబింబం రవిబింబరశ్మిని అపవారించటానికే ఏర్పడిన ఛత్రము వలె ఉన్నదన్నమాట. లేకుంటే, “ఉపమింపఁ బాత్ర మగు” అన్న దళాన్ని విడిచి మూలశ్లోకాన్ని యథాతథంగానే తెలుగుచేసి ఉండేవారు. మరి “పాత్రత్వసిద్ధి” ఎలాగంటే, అది కేవలం రశ్మివారణోపయోగి కాదని, భగవదలంకారమైన మహైశ్వర్యలాంఛనం అని గ్రహించాలి. శ్రీమహావిష్ణువు యొక్క ఉత్తరోత్తరవృద్ధి మాత్రమే కవి మనస్సులో ఉన్నదని, తత్సమయంలో రవిబింబం సంకోచాన్ని పొందటం మాత్రమే ఉద్దిష్టమని ఊహించాలి. ఉల్లేఖానుప్రాణితమైన సారమని గాక ఒకవేళ సారముచేత అనుప్రాణితమైనప్పటికీ, ఉల్లేఖానికి పాత్రం కావలసినది శ్రీమహావిష్ణువు యొక్క బ్రహ్మాండాంత సంవర్ధనమే కాని రవిబింబముయొక్క నానారూపత్వసిద్ధి కాదు. ఇది శుద్ధోల్లేఖం కాదు. ఉల్లేఖం ధ్వనిస్తున్నదనటానికి ధ్వన్యంగత్వమూ లేదు. తత్తదవస్థలయందు వామనుని ఉత్తరోత్తరస్వరూపోత్కర్షమే చిత్రితమైనందువల్ల సారమే అలంకారం.
ఇది నా ఇప్పటి భావన. తప్పులేమైనా ఉంటే దయతో తెలియజేయగలరని ప్రార్థన.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి భాగవత గణనాధ్యాయి గారి అభిప్రాయం:
09/12/2015 1:02 pm
పరమ భాగవత శ్రేష్ఠులు, పండిత వరేణ్యుల, మా గురుతుల్యులు పూజ్యశ్రీ మురళీధర రావు మహోపాధ్యాయులకు పాదాభివందనలు. అవునండి తమరు శలవిచ్చినట్లు పోతనామాత్యుల వారు “జాతీయ మహాకవి” యే. దానికి సాధికార ప్రమాణీకరణగా తమ వాక్కు ధృవీకరించింది. మరొక్క మారు ప్రణామాలు. సంస్కృత భాగవతాతిరిక్తంగా వారు చేసిన అనువాదాల మూల శ్లోకాలను సేకరించటం; సాహిత్యారాధకులకే కాదు తెలుగు భాషకు బహుళ ప్రయోజనకరం కాగలదు అని నా భావన.
మా “జాలజనుల” పాలిటి కల్పవృక్షం అయిన “ఈమాట” వారికి ఈ ప్రచురణకు ప్రత్యేక ధన్యవాదాలు.
గురు వాక్యాలపై వ్యాఖ్యానించ గల వాడను కాను కాని, చిన్న మనవి చేసుకొంటాను. ఈ మహా విశ్వం పండిత పామర ఆస్వాదనీయం. ‘భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన’ కదండి. సర్వజన సౌకర్యార్థమై, మన బమ్మెర వారికి చెందిన సమస్తం ఏక స్థానంలో (లేదా లోనుండి) అందుబాటులో ఉండేలా ఉంచితే బాగుంటుంది అనే భావనతో, ఇట్టి భాగవతుల ఆశీర్వచన బలంతో, సామాన్య “జాలజనుల” వరకు అందించుటలో తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడు చేస్తున్న చిరు యత్నం తమకు తెలిసినదే అనుకోండి.. ఎలాగూ సంఖ్యాపరంగా కూడా “తెలుగు జాలజనుల”లో పండితజనులు, విజ్ఞాన విశిష్ఠులు కూడ వృద్ధిచెందుతున్నారు. ఇందు నిమిత్తం ఇట్టి విశిష్ఠతమ వ్యాఖ్యానాదులను కూడ ఒక ప్రత్యేక ఏక జాలగూడు వంటి స్థానంలో చదువరుల అనుకూల్యతతో అందిస్తే, సామాన్య జాలజనులకు కాకపోయినా, విద్యార్థులకు ప్రేరణగానూ, “భాషా పరిశోధక, పరమ భాగవత, జిజ్ఞాసా జాలజనుల”కు ప్రయోజనకారిగానూ ఉంటుందేమో.
జాలజనుల నోటిమాట అయిన ఈమాట వారికి వందనశతాలతో, తమ ఆదరాభిమానాలు ఆశ్శీస్సులు జాలగూడు తెలుగుభాగవతం.ఆర్గ్ కు అందించ మనవి
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి desikachary గారి అభిప్రాయం:
09/07/2015 11:41 pm
పోతనగారి బహుగ్రంథపరిశీలనానుభవంతో బాటు మురళీధరరావుగారి బహుగ్రంథపరిశీలనానుభవాన్ని కూడ ఈవ్యాసం వ్యక్తపరుస్తూ ఉన్నది. పోతనగారి ఈపద్యాన్ని ఉల్లేఖాలంకారానికి గూడ ఉదాహరణంగా చెప్పడం జరిగింది (ఉదా: సన్నిధానంవారి కావ్యాలంకారసంగ్రహవివరణము). ఇందులో రవిబింబము అనేది విషయము. అది అనేకవిధములుగా రూపొందిందని చెప్పడం మాత్రమే గ్రహిస్తే అది ఉల్లేఖమే ఔతుంది. ఛత్రం కంటె తిలకం గొప్పదని, కౌస్తుభంకంటె పాదపీఠం గొప్పదని సూర్యబింబానికి ఉత్తరోత్తరోత్కృష్టతను చెప్పలేము. అందుచేత సూర్యబింబవర్ణనలో సారాలంకారం లేదు. కాని ఒకే సూర్యబింబం ఇట్లు అనేకవిధములుగా రూపొందింది అని చెప్పడంవల్ల వామనుని ఉత్తరోత్తరౌన్నత్యము స్ఫురిస్తూ ఉన్నది. కావున ఇది ఉల్లేఖానుప్రాణితమైన సారాలంకారము కావలెననిపిస్తున్నది. నాదగు నీ అపండితాభిప్రాయమును సహృదయతో పరిశీలించి ఈవిచారమునందలి దోషమును ఎత్తిచూపగలరని ఆశిస్తున్నాను.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Anil అనిల్ అట్లూరి గారి అభిప్రాయం:
09/05/2015 7:31 am
మాధవ్ గారు,
మీరన్నది నిజమే! సంజ్ఞావాచకాలు, విరామ చిహ్నాల వాడనానికి కూడా ప్రమాణాలు ఉండాలి. అవి లేకుండా సాహిత్యం వెలువరిస్తే అవే ప్రమాణాలుగా చెలామణి అయిపోయ్యే ప్రమాదం కూడా ఉంది. మార్పు సహజమే. కాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న కథ పునరావృతం కాకుడదన్నదే ఇక్కడి ఆలోచన. ఇప్పటికే మీరన్నట్టు “ఆశ్చర్యార్థకాలు కూడా ఒకటీ రెండూ సరిపోతాయి, అవి ఎన్ని ఎక్కువ వాడితే అంత ఆశ్చర్యమని కాదు కదా. బహుశా కీబోర్డ్ మీద ఒకే మీట నొక్కిపట్టుకోటం తేలిక కావచ్చు. ఇన్‌ఫార్మల్గా ఈమెయిళ్ళూ చాట్ల వంటి వాటిలో వాడే భాష, ప్రచురణకు తగదని తెలియకపోవడమూ కావచ్చు.” తో సాహిత్యం వెలువడుతున్నది. మరీ ముఖ్యంగా వెబ్‌జైన్‌లలోను / ఆన్‌లైన్ టపాలలోను.
వ్యాసకర్తలు పేర్కొన్న పంక్తుల పోగు వచనం, పద్యమే కాక మిగతా అంశాలతో కూడ పరిచయం ఉంది. అంతే కాదు వారు ప్రస్తావించిన ప్రచురణకర్తలు / ముద్రాపకులందరితో కాకపోయిన చాలమందితో కనీసం ఏదో ఒక సందర్భంలో కలవడం, మాట్లాడడం జరిగిందే,గుజిలి పుస్తక ప్రచురణ కర్తలతో సహా.
మీరన్నట్టు ‘ఒయాసిస్సు’ లను ఏకరువు పెట్టడం ఈ వ్యాసం, వ్యాఖ్యల ముఖ్యోద్దేశం కాదు, కాకూడదు.
వేలూరి వారు కనీసం ఒక డిజిటల్ ఎడిషన్ ప్రచురించాలని కోరుకుంటూ, వేమూరి వారు కూడ అన్యధా భావించక తాము రాసుకున్న స్టయిల్ ‘పుస్తకాన్ని’ తెలుగువారికి అందించవలసిందిగా అభ్యర్ధిస్తూ, ఈమాట “స్టైల్ మాన్యూయల్” కోసం ఎదురుచూస్తూ,
(అంతకంటే ఇంకేమి కావాలి?)
ఉంటాను.
అనిల్
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Madhav గారి అభిప్రాయం:
09/04/2015 7:23 am
అనిల్ గారు,
1. సంజ్ఞావాచకాల వాడకం గురించి ఏ అనుమానం ఉన్నా సునాయాసంగా గూగుల్లో వెతుక్కోవచ్చు. ఉదా quotes in quotes అని వెతికాను. చూడండి. పైగా ఆంగ్లంలో స్టయిల్ మాన్యువల్స్ ఉన్నాయి. సాధారణ వ్యాకరణానికే కాకుండా, పత్రికలు తమకోసం తాము రాసుకున్న గైడ్స్ తో సహా. అందువల్ల వాటి వాడకం గురించి తీర్చుకోలేని సందేహం అంటూ ఏమీ లేదు.
తెలుగులో పూర్తిగా మానేయమనటం లేదు నేను. పొదుపుగా, పద్ధతిగా వాడమంటున్నాను చదివే సౌకర్యం కోసం. (అసలు వాడకపోయినా ఇబ్బంది లేదని అలనాటి తెలుసా చర్చల్లో పరుచూరి శ్రీనివాస్ నిరూపించినట్టు గుర్తు. ఈవ్యాసంలో రెండవ బొమ్మ – పంక్తులపోగు వచనం పెద్దది చేసి చదివిచూడండి.)
2. లీలాజనార్దనం ఉంది. బైండింగ్ కొంత బలహీనం తప్ప పుస్తకం నాణ్యత బాగుంటుంది. అదే రకం పుస్తకమైన తిరుప్పావై బైండింగ్ మరీ బలహీనం. ఒక పదిసార్లు తెరచీ మూస్తే తట్టుకోగలదో లేదో. కాని ఇలా ఒక్కో పుస్తకాన్నీ ఉదా. ఇవ్వడం వల్ల ఏమిటి ప్రయోజనం? వ్యాస రచయితలే చెప్పినట్టు ఇలా ఎన్ని ఒంటరి ఒయాసిస్సులను చూపించుకుంటూ పోతాం?
3. ఈమాటలో ఒక మాన్యువల్ చేసి పెట్టచ్చు కదా అంటే అవును అలానే పెట్టచ్చు. 🙂 ఆ దిశగా ఆలోచనలూ, చర్చలూ చేస్తూనే ఉన్నా ఇది ఇంకా పూర్తిగా రూపు దిద్దుకోలేదు. అది కొంత పకడ్బందీగా చేయవలసిన ప్రయత్నం. కానీ చేయాలన్న ఆశయం అయితే దృఢంగానే ఉంది.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Sivaraamaprasad Kappagntu గారి అభిప్రాయం:
09/04/2015 12:27 am
చాలా చక్కటి వ్యాసం. చౌదరి గారు అన్నట్టుగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్ళందరికీ గమనించి, ఏమీ చెయ్యలేక నిశ్శబ్దంగా బాధపడుతున్న ఫిర్యాదులు అన్నీ కలగలిపి ఒక్కచోట వ్రాయటం ఎంతయినా బాగున్నది. మనకు పుస్తకాలు ముద్రించేవారే కాని ప్రచురించేవారు లేరు అన్నమాట అక్షర సత్యం.
నేను చూసినంతవరకూ ముప్పాళ రంగనాయకమ్మ గారు తన పుస్తకాలను (ఇప్పుడు వస్తున్నవి, ఇంతకు ముందు తెలియదు) చాలా చక్కటి గట్టి అట్టతో, మంచి కాయితం మీద బుక్ మార్క్ కూడా ఉంచి, సరసమైన ధరతో, చదువుకోవటానికి వీలుగా ప్రచురిస్తున్నారు. ఆవిడ వ్రాసిన పుస్తకాల్లో ఉండే విషయం మీద నాకు ఆసక్తి లేకపోయినా ఆ పుస్తకాలు చూడ ముచ్చటగా, చక్కటి ఇండెక్స్, మంచి నాణ్యమైన ముధ్రణ ఉండి, అటువంటి ప్రచురణలను ప్రోత్సహిస్తే, మనకు ఇష్టమైన పుస్తకాలు కూడా ఆ విధంగా ప్రచురిస్తారన్న ఆశతో ఆవిడ పుస్తకాలు దాదాపుగా అన్నీ కొనుకున్నాను. హైదరాబాదులో టాప్ బైండర్ చేత ఆ పుస్తకాలు బైండ్ చేయిస్తారని వినికిడి.
ఎంతటి పల్ప్ ఫిక్షన్ ఐనా యండమూరి, మల్లాది వంటి రచయితలు తమ తమ పుస్తకాలు ఏ రూపంలో పాఠకులకు అందుతున్నాయో పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. చాలా చౌకబారుగా “గాడీగా” ఉండే ముఖ చిత్రాలతో, పరమ నాశిరపు పేపర్మీద ప్రింటవ్వటం వాళ్ళకే నామోషీ అన్న విషయం తెలిసినట్టు లేదు. దీనికి మరొక కోణం కూడా ఉన్నది. అవే పుస్తకాలు మంచి కాయితం మీద, చక్కటి బైండ్ చేసి,అర్ధవంతమైన చక్కటి ముఖచిత్రంతో ప్రచురిస్తే, ధర ఎంతవుతుంది, ఈ పల్ప్ పుస్తక పాఠకులు ఆ ధరతో ఆయా పుస్తకాలు కొంటారా అన్న ఒక భయం ప్రచురణ కరతల్లో ఉండటం సహజమే మరి. అన్నీ కలగలిపి ఒక బాలెన్స్ తీసుకు రాగలగటమే ఒక “పయనీర్” లక్షణం. అలాంటి “పయనీర్” పుస్తక ప్రచురణలో మనకు తెలుగులో ఒక్క రంగనాయకమ్మ గారే నాకు కనప్దుతున్నారు. కాని ఆవిడ పుస్తకాలన్నీ ఒకే “మార్క్స్” సారీ “మార్క్” పుస్తకాలు అవటం ఒకటి ఉన్నది.
ఏమైనా కూడా మన తెలుగు ప్రచురణా కర్తలు ఒకసారి తిరిగి చూసుకుని, తాము చేస్తున్న పని ఎంతవరకూ బాగున్నది తరచి చూసుకోవాలి. ఎంతసేపూ పుస్తకాదరణ తగ్గిందని, పుస్తక ప్రదర్శనల్లో విలపించటం మాని,తమ “వస్తువు” ఐన పుస్తకం కొనటానికి, పుస్తకాభిరుచి ఉన్న పాఠకుడికి అనుగుణ్యంగా కనపడుతున్నదా లేదా అని చూడాలి.
తరువాత రష్యన్ పుస్తకాలు చాలా అద్భుతమైన బైండింగ్ లో చక్కటి పేపరు మీద చూడ ముచ్చటి బొమ్మలతో 1970లలో ప్రచురణ జరిగింది. ఆ ప్రచురణా స్టాండర్డ్స్ కాపీ కొట్టినా చాలు, మన తెలుగు పుస్తక ప్రచురణ నాణ్యం పెరుగుతుందని నా అభిప్రాయం.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Anil అనిల్ అట్లూరి గారి అభిప్రాయం:
09/03/2015 10:47 pm
మాధవ్,
మీరన్నది పాక్షిక సత్యం.
బూదరాజు గారు ఈనాడు కోసం వెలువరించినది “ఈనాడు భాషా స్వరూపుం – గుణదోషాలు” అది అమ్మకానికి లేదు. కనీసం నాకు తెలిసి. ఇక “స్టైల్ మాన్యువల్ అవసరం చాలా ఉందనేది నిర్వివాదాంశం.” అది పాత్రికేయానికి మాత్రమే కాదు. తెలుగులో ప్రతి రచనకి కూడా అవసరమే.
ఇక సంజ్ఞావాచకాల గురించి.
“ప్రత్యేకించి కొటేషన్ మార్కుల వంటివి. ఇలా కామాలూ కొటేషన్లూ మాటకొకటి లేకుండా కూడా తెలుగు వాక్యం చదివి చక్కగా అర్థం చేసుకోగలం.”
మొన్నామధ్య ఖధీర్ కూడా టి వి ఇంటర్యూలో ఒక మాటన్నాడు, తెలుగులో విరామ చిహ్నాలు లేకపోయినా ఇబ్బంది లేదు. మన పాఠకులకి అర్ధం అవుతుంది అని. నాతో పాటు మరి కొందరి సాహితిమిత్రుల అభిప్రాయం ఇది: ఇబ్బందికరమే. మనకి కోట్‌లో కోట్ వంటివి వచ్చినప్పుడు ఎలా చెప్పాలి?
“సొంతడబ్బా అనిపించినా సరే, ఈమాటలో చిన్న అచ్చుతప్పు కనిపిస్తే మాకు కనీసం పదిమంది పాఠకులనుంచి ఈమెయిళ్ళు వస్తాయి. పోనీలే అనుకోకుండా వారు ఆ ప్రయాస తీసుకుని మాకు తప్పు ఎత్తిచూపడం వల్ల, వారు అలా ఆశించే స్థాయి ఒకటి ఏర్పరిచామని మాకు గర్వంగా ఉంటుంది, మా పొగరు కాస్త తగ్గి పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది కూడా.”
మరి ఈమాట వారు తమ స్టైల్‌గైడ్‌ని, లేదు వారు పాటిస్తున్నదానిని ఇక్కడే ప్రచురించవచ్చు కదా? ఆన్‌లైన్ ఎడిషనే. ఈమాట కి పంపే రచనలకి, రచయితలకి ఆ ప్రమాణాలు పాటించాలని చెప్పొచ్చు. అదొక పద్దతి. ఈమాట సంపాదక వర్గానికి కొంత శ్రమ తగ్గుతుంది కదా! ఏమంటారు? చి న
ఇక కందుకూరి రుద్రకవి ‘జనార్ధనాష్టకం'(వి ఎ కె రంగారావు, బాపు బొమ్మలతో) లాంటి పుస్తకం ఈ వ్యాసకర్తల దృష్టికి రాలేదనుకోవడం, కొంచెం ధైర్యం చేసి, మరో ముందడుగు వేసి, వారి personal library లో లేవనుకోవడం కూడా పొరబాటే అవుతుందనుకుంటాను. అలాగే మొన్నిమధ్యే మిత్రులు కాండ్రగుల నాగేశ్వర రావు ప్రచురించిన ‘సప్తపర్ణి’ కూడా ఈ వ్యాసకర్తల దృష్టికి రాలేదనుకోలేము.
రామారావు గారన్నట్టు ఫాంట్ (ఖతి)కూడా చాల పనిచేస్తుంది. He is right when he says, “Different fonts evoke different sensibilities.”
ఇక గొర్తి గారి మాట: ‘ముందు మాట’ సరిపోదా, preface కి సారు? ద హ
“నా పుస్తకం – నా మాట” అనుకునే వారితో ఇబ్బంది ఏముంటుంది? చి న.
ఇక వేలూరి వంటి వారే మనకి కావల్సింది. ఆ పట్టుదల కూడ ఉండాలి మరి.
వెడలెను కోదండపాణి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
09/03/2015 11:01 am
నమస్తే శ్రీనివాస్ గారు:
అసలు ఈ కధ రాయడానికి కారణం – కైకనీ మంధరనీ విలన్లు గా చూపించకూడదనే. ఏదైనా మనం అర్ధం చేసుకునేది మన మనః స్థితి మీదే కదా ఆధారపడేది? ఆదిన్ శ్రీపతి కొప్పుపై … అనే పద్యాన్ని బూతుగా చూడ్డం చాతనవ్వడం వేరూ, భైరవభట్ల గారో ఏల్చూరి గారో చెప్పినట్టు చూడ్డం వేరూను. ఎవరో గూని మనిషి రాముణ్ణి అంత పనిగట్టుకుని 14 సంవత్సరాలు అడవుల్లోకి ఎందుకు పంపిందో అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ రాముడంటే చూడగానే ఒళ్ళు మరిచిపోయేలా ఉండేవాడుట. అలాంటి వాడిమీద మంధరకి కోపం రావడం లేక పగ రావడం ఊహించడం కష్టం.
అవన్నీ అలా ఉంచండి. వెడలెను కోదండపాణి అనేది (నాకు తెల్సినంతలో) త్యాగరాజ కీర్తన. దాన్ని మన సినిమా వాళ్ళు ఎన్ని తికమకలు పెట్టి ఎలా సాగదీసినా సరే త్యాగరాజు త్యాగరాజే. త్యాగరాజ కీర్తన బదులు మీకు సినిమా పాట నచ్చడం అనేది మీ ఇష్టమే. కొంతకాలం పోతే త్యాగరాజునీ, అన్నమయ్యనీ మర్చిపోయి ఫలానా పాట విన్నావా అంటే, అదేనా, నాగార్జున సినిమాలో అనే దశకి చేరుకుంటున్నాం కాబోలు. నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి.
చంపేసారండి. నేను రాసేవి పోతననీ, వాల్మీకిని అనుసరిస్తాయా? మళ్ళీ ఎక్కడా అనకండి. మొహం మీద పేడ నీళ్ళు జల్లుతారు నాకు. ఎక్కడి పోతనా? ఎక్కడి వాల్మీకి? నక్కకీ నాకలోకానికి పెట్టారు పోలిక? నేను మహా అయితే గియితే ఓ కాపీ-పేస్ట్ ఆర్టిస్టుని. పైన అయ్యవారు గారికి ఇచ్చిన రెండో కామెంట్లో నా తెలుగు పాండిత్యం ఎంతో చెప్పాను. ఓ సారి చదవండి. అది చదివితే తెలియట్లేదా?ఈ కధలో మీరు చెప్పినట్టుగా మొదటి పదంలోనే అపశృతి దొర్లింది. హతోస్మి!
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:
09/02/2015 12:14 pm
పుస్తకాల్లో అచ్చు తప్పుల మీద శ్రద్ధ గురించి నా అనుభవంలో ఒక సంఘటన:
ఒకాయన తన కథల్ని పుస్తకంగా ఆయనే అచ్చు వేయించుకున్నారు. అచ్చు తప్పులు లేకుండా ఒకటికి వంద సార్లు అన్నీ వెయ్యి కళ్ళతో చూసినా, ఆయన పుస్తకానికి ముందు రాసిన ‘నా మాట’ లో ఒక చిన్న అక్షరం తప్పుపడింది. చదివితే అది తప్పని అనిపించదు కూడా! అప్పటికే ఆ పుస్తకం అచ్చులో వచ్చేసింది. దాదాపు 500 కాపీలు ప్రింట్ కూడా అయిపోయాయి. అది చూసి విల విల్లాడిపోయారాయన! పరవా లేదన్నా వినిపించుకోలేదు. మరలా ఇంకో మూడు వందల డాలర్లు ఖర్చు పెట్టి, ఆ అక్షరాన్ని సరిదిద్ది మళ్ళీ ముద్రించుకున్నారు, మరో 100 వంద కాపీలు. ఆయనెవరో కాదు – ఒకప్పటి ఈమాట సంపాదకులు వేలూరి గారు.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Anil అనిల్ అట్లూరి గారి అభిప్రాయం:
09/02/2015 3:32 am
“మనకి ప్రామాణికత మీద, పుస్తకాన్ని సుష్టుగా, పదికాలాలు ఉండేటట్టుగా నిర్మించుకోవాలనే పట్టుదల లేకపోవడమొక్కటే కారణం అని చెప్పుకోవాలి.” అన్న మీ మాటతో ఏకిభవిస్తునే అది కేవలం ముద్రాపకుడికి మాత్రమే పరిమితం కాదు అని కూడా అనుకుంటాను.
ప్రచురణకర్త / లు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి మీరన్నట్టు.
అంతే కాదు. పావలాకి, పది రూపాయలకి అమ్మకానికి వచ్చిన పుస్తకాలనుండి ఈ రోజు వందలలోను వేలల్లోను (ఉదా: త్రిపురనేని గోపిచంద్ సమగ్ర సాహిత్యం – పది సంపుటాలు (2009) అక్షరాలా రెండు వేల రూపాయలు )ఉన్నా కొనేపాఠకులున్నారు. కాని వారిని గురించి ఆలోచించే రచయిత కాని, ముద్రాపకులు గాని, ప్రచురణకర్తలు కాని లేరు.
సుమారు పది పన్నెండు కోట్ల వ్యాపారం జరుగుతున్నది అని ఒక అంచనా! కాని ప్రచురణకర్తలకి ఆ పట్టుదల లేదు.
కాబట్టి రచయిత తన పుస్తకాన్ని తనే ప్రచురించుకుంటున్నాడు. తనకి బాగున్న పద్దతిలోనే. వ్యాసకర్తలు అన్నట్టు ఈ రోజు చిన్న ఊళ్ళల్లో కూడా డి టి పి షాపులున్నవి. వారే డిజైనర్లు.
అంతే కాదు, మీరన్న కంపోజింగు దానికి అదనపు ఖర్చు అని అనుకున్న ప్రచురణకర్తలు పాత పేట్లనే వాడి లాభాలు ఆర్జించాలని అనుకోవడం మరో కారణం.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు లాగానే తెలుగు పుస్తక ముద్రణలో కాని ప్రచురణలో కాని ప్రామాణికతలు లేవు.
కాకపోతే పిల్లి మెడలో గంట కట్టేవారెవరు అన్నదే ప్రశ్న. ఇక వేమూరి వారి పెట్ పీవే, నాది కూడా! అసలు మన తెలుగు వారికి ఒక స్టైల్ గైడ్ అనేది ఉందా?
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
09/01/2015 8:10 pm
అన్నీ బాగానే ఉన్నాయి కాని నా “నిత్య నసుగుడు” (pet peeve) గురించి ప్రస్తావనే లేదు: విరామ చిహ్నాల వాడుక. అదేమిటో! ఒక్క తెలుగు వారిలోనే కాదు, భారతీయుల రాతలలో ఎక్కువగా కనిపించే దోషం ఒకటి ఉంది. ఉదాహరణగా – కామా పెట్టినప్పుడు అది మాట పూర్తయిన వెంటనే పెట్టాలి. ఫుల్ స్టాప్ వాక్యం పూర్తయిన వెంటనే పెట్టాలి. కాని చాల మంది కామా ముందు ఒక ఖాళీ వదిలేసి కామా తరువాత ఖాళీ లేకుండా రాస్తూ ఉంటారు. అదే విధంగా ఫుల్ స్టాప్ వాక్యం పూర్తి అయిన వెంటనే రావాలి. తరువాత ఒక ఖాళీ వదిలేసి రెండవ వాక్యం మొదలు పెట్టాలి. కాని మనవాళ్లు వాక్యం పూర్తి అయిన తరువాత ఒక జాగా వదిలేసి, చుక్క పెట్టి, అప్పుడు రెండవ వాక్యం మొదలు పెడతారు. ఈ పద్ధతి తప్పు. అలా కాకుంటే వరస చివర వాక్యం విరిగినప్పుడు ఇబ్బంది వస్తుంది. “ఈ పద్ధతి తప్పు,” అని నేను చెబితే “మేము ఇండియాలో ఇలానే రాస్తామండీ, కావలిస్తే చూడండి,” అంటూ ఉదాహరణలు చూపిన వాళ్లు ఉన్నారు. అందరూ చేస్తున్నారు కదా అని తప్పు ఒప్పు అయిపోదు. ప్రకాశకులని, ముద్రాపకులని తప్పుపట్టి ఏమి లాభం? రచనలు చేసేవాళ్లు కూడ తమ రాతలలో తప్పులు లేకుండా, లక్షణంగా ఉండడం కోసం శ్రమ పడాలి. అచ్చు కొట్టించడంలో ఉన్న సంబరం రుజువు పత్రాలు సరి చూడడంలో ఉండదు. ఏది ఏమైతేనేమి ఎంతో శ్రమ పడి, ఎన్నో విషయాలని సేకరించి, పాఠకలోకానికి అందించిన రచయితలని మెచ్చుకోక తప్పదు. – వేమూరి
వెడలెను కోదండపాణి గురించి Ayyavaru గారి అభిప్రాయం:
09/01/2015 2:48 pm
మంచి వర్ణన. నా రామాయణ పఠనం లొ అయోధ్యాకాండలో ఉండటం రాముడు భరద్వాజుడి ఆశ్రమం లో ఉండటం యాధృచ్చికం ఎమో?
ఒక సందేహం. ఈ కధలో (కొంత కల్పన ఉన్నా) రావణుడు మొదట మాంధత మీద తదుపరి అనరణ్యుడి మీద యుధ్ధం చేసినట్టూ అర్ధం అయింది నాకు. కాని ఇక్ష్వాకు వంశ చరిత్రలో మొదట అనరణ్యుడు తదుపరి మాంధాత వస్తారు. కింద ఇంగ్లీష్ లో (తెలుగు వి దొరకలేదు) ఉన్న శ్రీ వాల్మీకి శ్లోకాలు చూడగలరు. మాంధాత వరకు కాపీ చేశా. అలాగే ఒక చోటా (రెండవ పేజీ) లో విశ్వామిత్రుడు నా బాధ్యత తీరుచుకోడానికి వచ్చాను అని అన్నారు. మహర్షులు కర్తవ్యం నిర్వహిస్తారు కాని బాధ్యతలు నెరవేర్చుకోరు. రామయణం లో కూడ “కర్తవ్యం” అన్న పదమే ఉంటుంది ప్రతి చోటా!!
manuH prajaapatiH puurvam ikShvaakuH ca manoH sutaH |
tam ikShvaakum ayodhyaayaam raajaanam viddhi puurvakam || 1-70-21
“Manu is the earliest Prajaapati and Ikshvaaku is the son of Manu, and that Ikshvaaku is the first king of Ayodhya… know thus… [1-70-21]
ikShvaakoH tu sutaH shriimaan kukShiH iti eva vishrutaH |
kukSheH atha aatmajaH shriimaan vikukshiH upapadyata || 1-70-22
.
“The son of Ikshvaaku is the legendary Kukshi, thus he is renowned, and the famous Vikukshi is the son of Kukshi… [1-70-22]
vikuksheH tu mahaatejaa baaNaH putraH prataapavaan |
baaNasya tu mahaatejaa anaraNyaH prataapavaan || 1-70-23
“From that most brilliant and courageous Vikukshi, Baana emerged as son, and the highly refulgent and valinat Anaranya is the son of Baana… [1-70-23]
anaraNyaat pR^ithuH jaj~ne trishaMkuH tu pR^ithoH sutaH |
trishaMkoH abhavat putro dhundhumaaraH mahaayashaaH || 1-70-24
“Pruthu is the son of Anaranya, and Trishanku is Pruthu’s son, and the highly renowned Dhundumaara happened to be the son of Trishanku… [1-70-24]
dhundhumaaraat mahaatejaa yuvanaashvo mahaarathaH |
yuvanaashva sutaH asiit maandhaataa pR^ithivii patiH || 1-70-25
“Dhundumaara begot a highly glorious and a speediest charioteer Yuvanaashva as son, and Mandhaata emerged as the son of Yuvanaashva… [1-70-25]
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి somayajulu ch v గారి అభిప్రాయం:
09/01/2015 1:31 am
జ్యోతిషాన్ని నమ్మేముందు దాని ఫై కనీస అవగాహన ఉండాలి.
1. కృష్ణుడు లేదా క్రిస్ట్ లేదా గాంధీ వంటి వారు పుట్టే సమయానికి చాలామంది పుట్టి ఉంటారు ఆదే స్థలము లో , కాని అందరు వారంత గొప్పవారు కాలేరు. కారణం పాయింట్ అఫ్ ఎవల్యూషన్.
2 కొన్ని వేల మంది ప్రమాదాలలో పోయినపుడు జ్యోతిషశాస్త్రం తో బాటు ఇంకా కొన్ని తెలియాలి. అవి పూర్వ కాలం లో జ్యోతిష్యానికి ముందు నేర్పేవారు.
౩.వ్యక్తిగత కర్మ ఆధారంగా జ్యోతిష్య పలితాలు తెలుస్తాయి. కాని వ్యక్తిగత కర్మ 10% మాత్రమె.
4.ఒకరు లేదా ఈదరు వ్యక్తుల ఆధారంగా శాస్త్రాని అంచనా వేయరాదు.
5. నాది గ్రంధ అంటే ఏమిటి? అది ఎలా రాస్తారు అనే విషయం అవగాహన లేకుండా
అది వేస్ట్ అనరాదు.
6.పూర్వం గాని ఇప్పుడు గాని అర్హత , పాత్రత వల్ల పవిత్ర విషయాలు అంటే మానవాళికి ఉపయోగపడే విషయాలు తెలుస్తాయి. దానికి కారణం మన ద్వార సమాజానికి ఉపయగాపద్తాయి అని తెలిసినప్పుడే.
సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
08/06/2015 3:25 pm
మాన్యులు శ్రీమదిత్యాది శ్రీమాన్ కృష్ణదేశికాచార్యుల వారి సన్నిధికి
సప్రశ్రయ నమస్కారములతో,
సహృద్వాత్సల్యౌదార్యాలు ఉట్టిపడుతున్న మీ ఆశీర్మయవిలేఖితానికి ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని ఎంతో దీక్షతో అధ్యయనించిన మీరు అదొక కావ్యసామాన్యం కాదని, అపూర్వమైన వినూత్న లక్ష్యసాగరమని చేసిన ప్రతిపాదన మీ ఆమోదానికి నోచికొన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. గణపవరపు వేంకటకవి కృతులను పరిచయం చేసేటపుడు తత్తత్కాలాదికాన్ని విపులంగా సమీక్షింపవచ్చునని అనుకొన్నాను. అందువల్ల మీ ప్రశ్నకు సంక్షేపతః ఇక్కడ సమాధానిస్తున్నాను:
‘విద్యావతీ దండకం’ 1948లో Bulletin of Govt. Oriental MSS Library (సంపు – 1; సంచిక – 1) లో అచ్చయింది. అది ముద్దళగిరికి అంకితం. ప్రబంధరాజంలో కవి “చండ విద్యావతీ దండక”మని ప్రాసయతి నిమిత్తం అన్నాడే కాని, అది చండవృష్టి దండకం కాదు. నన్నయాదులు ప్రవేశపెట్టిన కామబాణ దండకమే. వీరేశలింగం గారు కవి 1750 నాటివాడనటం సరికాదని; ముద్దళగిరి 1674లో తంజావూరును పరిపాలించినందువల్ల కవి కాలం నిరూపింపబడుతున్నదని కె. వెంకటసుబ్బాశాస్త్రి గారు, నిడుదవోలు వేంకటరావు గారు విద్యావతీ దండకం పీఠికలో వ్రాశారు. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం కూడా తత్సమకాలికమని నిడుదవోలు వారి అభిప్రాయం. అప్పటినుంచి విమర్శకులు కవి కాలాన్ని ఆ విధంగా నిర్ధారించటం జరుగుతున్నది. అది సరికాదు.
1674లో ముత్తులింగ నాయకుడు (ముద్దళగిరి) తన సవతి అన్న చొక్కనాథ నాయకుని ప్రాపకంతో తంజావూరుకు రాజైనాడు. అప్పటికి అతని వయోవస్థాకాలం పాతిక – ముప్ఫై యేళ్ళకు దరిదాపులలో ఉండి ఉంటుంది. యౌవనోద్రేకం వల్ల, అన్నగారన్న చనవు మూలాన చొక్కనాథ నాయకుని ఏలుబడిలో ఉంటూనే, సమానుడైన స్వతంత్రప్రభువు వలె ప్రవర్తించాడు. శివాజీ సవతి తమ్ముడు ఏకోజీ దండెత్తి, ఒకటి రెండు పర్యాయాల విఫలయత్నం తర్వాత 1676 జనవరి 16-వ తేదీని విష్ణుచక్రం కోటను వశపరచుకొన్నాడు. ఏకోజీ తొలిదండయాత్ర నాటి పరాజయగాథ ‘పెదళ్గిరి విజయము’ మాలికా కావ్యంలో సవిస్తరంగా వివరింపబడింది. (‘పెదళ్గిరి విజయము’ నిడుదవోలు వారన్నట్లు గణపవరపు వేంకటకవి రచన కాదని నేను ఇతరత్ర వేరొక వ్యాసంలో నిరూపించాను.) అప్పటికే అతని ప్రవర్తనతో విసిగి ఉన్న చొక్కనాథుడు అతనికి అండరాలేదు. రాజ్యభ్రష్టుడైన ముద్దళగిరి 1678లో మళ్ళీ అన్నగారి వద్దకు చేరుకొని, అపార్థాలకు క్షమాభిక్షను అర్థించి మధుర వద్ద రాజప్రతినిధిగా ఉన్నాడు. 1678 (కాళయుక్తి)లో మధురలోనూ, 1679 (సిద్ధార్థి)లో శ్రీరంగంలోనూ అతని దానశాసనాలున్నాయి. 1682లో చొక్కనాథ నాయకుడు మరణించిన తర్వాత చిన్నచిన్న అధికారపదవులను చేపట్టి, 1700-1705 (±) ప్రాంతాల కర్ణాటకానికి వెళ్ళి సుమారు యాభై – యాభైఅయిదేళ్ళప్పుడు కుంతూరు దుర్గానికి రాజయ్యాడు. ఎంతకాలం ఉన్నాడో స్పష్టంగా చెప్పలేము. ఆ కాలంలోనే లింగనమఖి శ్రీకామేశ్వరకవి ధేనుమాహాత్మ్య రచన జరిగింది. శ్రీకామేశ్వరకవి ‘సత్యభామా సాంత్వనము’ ముద్దళగిరికి అంకితమైంది. ఈ చారిత్రిక పరిణామాలను గుర్తింపక నిడుదవోలు వారు శ్రీకామేశ్వరకవిని కూడా 1674కు పరిమితం చేశారు. వారిని అనుసరించి తర్వాతివారందరూ వ్రాస్తున్నారు.
అంతర్గతసాక్ష్యాల వల్ల గణపవరపు వేంకటకవి ‘సర్వలక్షణశిరోమణి’ క్రీస్తుశకం 1700కు పూర్వరచన కాదని నిశ్చయంగా చెప్పవచ్చును. తద్రచనాకాలం కొంచెం ఇంచుమించుగా 1705-1715 (±) కావచ్చును. అందులో ముద్దళగిరి ప్రస్తావన లేదు. అప్పటికి అతని ప్రాపకం లేదన్నమాట. ‘విద్యావతీ దండకం’ ముద్దళగిరికి అంకితం. దాని చివరను “మహాలక్షణగ్రంథ భాషాభిమానప్రథామాధురీసాధురీత్యర్థవ చ్ఛబ్దబంధానుబంధ ప్రబంధాధినాథాప్పయామాత్య రాడ్వేంకటార్య ప్రణీతంబైన” అని ఉన్నది. అంటే విద్యావతీ దండకం సర్వలక్షణశిరోమణికి అనంతరీయం అన్నమాట. ఆ తర్వాత ఒక దశాబ్ది కాలం కృషిచేసి, వందలాది గ్రంథాలనుంచి లక్షణలక్ష్యాలను సమీకరించుకొని ప్రబంధరాజ సంకలనాన్ని మొదలుపెట్టి ఉండాలి. తలకొక్కతీరుగా ఉన్న వ్రాతప్రతులలోని ప్రక్షిప్తాలను తొలగించి సుష్ఠుప్రతిని పరిష్కరింపగలిగితే ప్రబంధరాజ రచనాకాలం 1730 – 1755 (±) కావచ్చునని ఇప్పటి ఆలోచన. ప్రకృతవ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము యొక్క సర్వాంగీణవిమర్శ గాక, తెలుగు సాహిత్యచరిత్రకు అపరిచితమైన ఒక్క అపూర్వమైన విశేషం మాత్రమే అధికరింపబడుతున్నది. అందులో సంప్రయుక్తమైన లక్షణజాతాన్ని గురించి, చిత్రకవిత్వాన్ని గురించి ప్రత్యేకంగా పరిశీలింపవలసి ఉంటుంది.
వేంకటకవి రచనలో తుల్యసంవాదం ఉంటే ఆ రచన ప్రబంధరాజానికి పౌర్వికమని, వేంకటకవి దానిని పరిశీలించి తన సంకలనంలో చేర్చుకొన్నాడని గ్రహించాలి. ఈ పూర్వాపరాల నిశ్చయం అంత సులభసాధ్యం కాదని వ్యాసంలో నేను మనవిచేశాను. గ్రంథస్థపద్యాల పట్టికను తన్మూలపద్యాల గుర్తింపుతో ప్రకటిస్తేనే కాని అది సాధ్యం కాదు. తెలుగు సాహిత్యచరిత్ర చాల వరకు ప్రామాణ్యభావం లేని ప్రాథమికోహలతో సాగినందువల్ల కావ్యపీఠికలలో నిర్ణయింపబడిన కాలాదికాన్ని ప్రమాణంగా స్వీకరింపక చరిత్రనికషపాషాణపట్టికపై స్వయంగా గీచిచూచి తథ్యమిథ్యావివేకంతో పునారచింపవలసిన అవసరం ఉన్నది.
మీ ఆత్మీయతకు, ఆదృతికి నమస్సుమాంజలి.
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
08/01/2015 12:47 pm
భౌతిక శాస్త్రంలోను, ఖగోళ శాస్త్రంలోను, గతి శాస్త్రంలోను ప్రధాన సంఖ్యల ఉపయోగం ఉందని చెప్పి ఊరుకుంటే ఎలా? మాలాంటి సామాన్యులకి అర్థం అయే రీతిలో ఎక్కడెక్కడ ప్రధాన సంఖ్యల అవసరం వస్తుందో చెబితే బాగుంటుంది కదా? చాల రోజులు బౌల్య బీజగణితం ఎందుకూ పనికి రాదనుకునేవారు. కాని ఈ “కొత్త లెక్కలు” కలన యంత్రాల నిర్మాణానికి మూలం అయి కూర్చున్నాయి. అలాగే ప్రధాన సంఖ్యలు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసున్న వాళ్లు చెబితే బాగుంటుంది. – వేమూరి
సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
07/27/2015 12:07 am
అసాధారణమైన సూక్ష్మేక్షికతో ప్రబంధరాజవిజయవిలాసాన్ని పరీక్షించి, దానినొక లక్ష్యసంకలనగ్రంథంగా నిరూపించిన శ్రీమురళీధరరావుగారి అసమానశేముషిని కొనియాడకుండా ఉండలేము – ఏంత కొనియాడినను తక్కువే యని నా యభిప్రాయము. లక్ష్యములైన ఈపద్యములకు జనకమైన లక్షణముల స్వరూపమును వివరిస్తూ, ఈగ్రంథమునకు విపులవ్యాఖ్యానమును వ్రాయుటకు నాకు దెలిసినంతవఱకు ఈకాలములో వారొక్కరే సమర్థులుగా కనిపించుచున్నారు. సరస్వతీదేవి వారి కాయాదేశమును చేసి తనను తాను సన్మానించుకొనునని యాశించుచున్నాను. ఈ వ్యాసములను చదివిన పిమ్మట గణపవరపుకవియొక్కగారి కాలమును గుఱించిన కొన్ని విషయముల సమన్వయము నాకు కుదురకున్నది.
వేదం వేంకటరాయశాస్త్రిగారి అకాడమీప్రతిలో 1673లో తంజావూరును పరిపాలించుచుండిన ముద్దళగిరిమీద ఈకవి చండవిద్యాదండకమును చెప్పినాడనియు, అందుచేత ఈతడు 17వ శతాబ్దిలో నుండినవాడనియు నేలటూరి వేంకటరమణయ్యగారు వ్రాసినారనియు, ఆరుద్రగారును ఈకాలనిర్ణయమునే సమర్థించుచున్నారనియు వ్రాసినారు. కాని ఈవ్యాసములలో పేర్కొన్న కొన్ని గ్రంథములయొక్క గ్రంథకర్తలు 18వ శతాబ్ది చివర నున్నట్లు తోచుచున్నది. పేర్కొన్న గ్రంథములలో నాదగ్గర నున్న కొన్ని గ్రంథములను చూడగా వాటి కాలనిర్ణయ మీక్రిందివిధముగా నున్నది:
బిల్హణీయము – చిత్రకవి సింగరాచార్యులు – 1775 ప్రాంతం, స్వామి శివశంకరశాస్త్రిగారి పీఠిక
హంసవింశతి – అయ్యలరాజు నారాయణామాత్యుడు – 1800 ప్రాంతం, మద్దులపల్లి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రుల పీఠిక
కనుపర్తి అబ్బయామాత్యుని కాలం 1750 ప్రాంతం – వారణాసి వీరనారాయణశర్మగారి ‘కనుపర్తి అబ్బయామాత్యని కృతులు’ సిద్ధాంతవ్యాసం.
ముకుందవిలాసం, అచలాత్మజాపరిణయం – ఇవి రచించిన కవులిద్దఱూ గద్వాలసంస్థానాధీశుడైన చినసోమభూపాలుని కాలం (1764-1794) వారు, రవ్వా శ్రీహరిగారి ముకుందవిలాసం పీఠిక. (1700 ప్రాంతంలో గద్వాలను నిర్మించిన పెదసోమభూపాలునికి సంబంధించిన కథయే నా ‘హనుమప్పనాయకుడు’ కావ్యానికి ఇతివృత్తం.)
ఈవిధంగా నేలటూరివారు చారిత్రకాధారాలద్వారా నిర్ణయించిన కాలానికి, ఈవ్యాసంలో గణపవరపుకవి సంగ్రహించినాడని పేర్కొన్న కొన్నికావ్యాలకు వందసంవత్సరాల తేడా ఉంది. ఈవ్యాసంలో ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం గణపవరపుకవి 1800 తర్వాత ఉండి ఉండాలి. అట్టి స్థితిలో అతడు 1673 సంవత్సరానికి ముందే ఉన్న ముద్దళగిరిమీద చండవిద్యాదండకమును ఎట్లా చెప్పినాడు? దీనికి, ఈ వ్యాసంలో సాక్షీభూతమైన కాలానికి నామనస్సులో సమన్వయం కుదురుట లేదు. మురళీధరరావుగారు దీనిని విశదీకృతం చేస్తారని కోరుతున్నాను.
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
07/21/2015 5:30 pm
కృతజ్ఞతలు:
ఈ వ్యాసం ప్రచురణ అయే ముందు సంపాదకుడు అందించిన సహాయానికి. ప్రచురణ పొందిన తరువాత పాఠకుల నుండి వచ్చిన అనూహ్యమైన స్పందన నన్ను చకితుణ్ణి చేసింది. నా వ్యాసాన్ని చదివి మెచ్చుకున్నవారందరికీ ఒకొక్క నమస్కారం; తప్పులు ఎత్తి చూపిన పాఠక వర్గానికి వెయ్యి నమస్కారాలు! కేవలం భాషానువాదానికి సంబంధించిన తప్పులని ఎత్తి చూపిన వారు కొందరైతే, గణితపరంగా, మౌలికమైన తప్పులని పట్టి, సవరించిపెట్టినవారు మరికొందరు. వీలయినంత వరకు తప్పులని సరిదిద్దేను. గణితంలోని మూల భావాలని ఇంగ్లీషు నుండి తెలుగులోనికి దింపినప్పుడు నా తెలుగులో ఇంకా వెలితి కనిపించవచ్చు. రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోమని పాఠకలోకానికి మనవి. ఒకటి, ఇది గణితంలో నిష్ణాతులైన పండితులని ఉద్దేసించి రాసినది కాదు; సామాన్య పాఠకులకి అర్థం అయే రీతిలో పదార్థాన్ని పరిచయం చెయ్యాలని చేసిన ప్రయత్నం. రెండు, తెలుగులో ఇటువంటి వ్యాసాలు రాయడానికి ఒరవడి అంటూ ఒకటి స్థిరపడలేదు. కనుక చదువుతూన్నప్పుడు మీకు కనిపించే లొసుగులు రాస్తున్నప్పుడు నాకు కనిపించవు. ఇంకా అక్కడక్కడ తప్పులు ఉండొచ్చు. తొందరపాటుతో ఒక తప్పుని సరిచేస్తూ మరొక తప్పుని ప్రవేశపెట్టే ప్రమాదం ఉంది కనుక నెమ్మదిగా ఆలోచించి సరి చేస్తాను. అందుకని పాఠకులందరూ ఇదే నిష్టతో నా వ్యాసాలని చదివి మీమీ అమూల్య అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఈ వ్యాసాన్ని చదివి స్పందించినవారంతా ఒకొక్కరు ఒకొక్క తెలుగు వ్యాసం రాసి దీనిని నా ఒంటరి పోరాటంగా వదిలెయ్యకుండా సమష్టిగా ప్రయత్నం చేస్తే తెలుగు భాషని శాస్త్రీయ అవసరాలకి వీలుగా మలుచుకోవచ్చని నా అభిప్రాయం. ధన్యవాదాలు – వేమూరి
నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
07/18/2015 5:58 pm
మొదటి పద్యము తిక్కన ద్రోణ పర్వములో ఉండదగిన పద్యము. ద్రోణ పర్వము పైన థీసీస్ వ్రాసిన పండితులు ‘ఏల్చూరి’ చెప్పగలిగిన పద్యము.
ద్రోణాచార్యులు ఈ పద్యంలో ఉన్నంత/అన్నంత నిందా వాక్యములు పడవలసిన వాడా అంటే, నాకు కాదనే అనిపిస్తుంది. ఏల్చూరి మురళీధరరావు గురుభక్తి కలవారు. సమస్యా పూరణం సందర్భంగా నైనా, ఒక గురువు పై నిందా పద్యం, తన సొంత మాటలుగా చెప్పరు- అనిపిస్తుంది. ఈ శీర్షిక లోని రెండో పద్యంలో, తన గురువుగారి ముఖ సందర్శనం కొరకేగా వారు గూగులించింది!
మరి ఎవరు ఇలాటి మాటలు ద్రోణుని గూర్చి అనగలిగిన వారు? ఎప్పుడు అని ఉండవచ్చు? -అని ఆలోచిస్తే, ఈ మాటలు భారతం లోని ఏదో ఒక పాత్ర అన్నవి – అని తోస్తుంది. భారత యుద్ధంలో, ద్రోణుడి సైన్యాధిపత్యంలో, కొన్ని వ్యూహ రచనల తర్వాత నే అయిఉండాలి. ధర్మరాజును కాపాడటానికి, ద్రోణాచార్యుని అదుపు చేయవలసిన అవసరం పాండవులకు ఉన్నది. అది వారికి శక్యం కావటం లేదు. ఐతే, అట్టి సందర్భంలో కూడా పాండవులు తమ గురువును వారి కత్యంత అయిష్టులతో పోల్చరు. అర్జునుడు ద్రోణుడంటే చాలా భక్తి కలవాడు. ధర్మరాజు పాచికల సంగతి ఎత్తడు. భీముడు, కృష్ణుడు -మాట తూలే స్వభావం ఉన్నవారే. వారు వ్యూహాలు పన్ని, మోసాలు చెయ్యటానికి, మొహమాట పడరు. ద్రోణుడిని కడతేర్చటానికి భీముడు -అశ్వత్థామ చనిపోయాడని దొంగ అరుపు తను అరవటమే కాకుండా, ధర్మరాజుతో కూడా ద్రోణుడికి చెప్పించాడు. ఆ ఆలోచన చెప్పింది కృష్ణ భగవానుడేగా. అట్టి వారు ఆ పద్యం లోని తీరుగా ద్రోణుని గురించి ఆలోచించరు. సాత్యకి కూడా ద్రోణుని కించపరిచే ఊహ చేయడు.
ధర్మరాజు మాటల వలన, తన పుత్రుడు అశ్వత్థామ మరణించినట్టుగా నమ్మి, యుద్ధరంగంలో మారణ కార్యక్రమం చేస్తూనే, మనసులో క్రుంగిపోయి ఉన్న ద్రోణుడితో, అప్పుడు వచ్చిన, -విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతమాది మునులు – బ్రాహ్మణుడికి నీకింత యుద్థం దేనికయ్యా, (పద్యంలో మొదటి వాక్యం) చేసిన వరకూ చాలు, ఇక విడిచి పెట్టెయ్యి. – అన్నారు కాని, ఆ మిగతా దురూక్తులన్నీ వారు పలకరు. ద్రోణుని హీనంగా తలచరు.
ఒక్క ధృష్టద్యుమ్నుడు మాత్రమే, ద్రోణుని పట్ల చులకన, అగౌరవం, వైరం కలవాడు. ద్రోణుడిని అంతం చెయ్యటానికే జన్మించిన వాడతడు. ఇవి అతని మాటలుగా, వినిపిస్తున్నాయి. మునుల హితవు విని, యుద్ధ విరక్తుడై, ద్రోణుడు తనంత తానుగా, యోగశక్తితో తన ప్రాణం విడిచిపెట్టే ముందు, కడసారిగా దృష్టద్యుమ్నుడిని హింసించినప్పుడు, ఆ పాంచాలుడు ద్రోణుని గురించి ఇలా తలచి ఉండవచ్చు ననిపిస్తున్నది.
(చదవదలిస్తే, ద్రోణపర్వంలో శివుడిపై చక్కని పద్యాలున్నయ్యి. నాకైతే తిక్కన రచించిన ఆ పద్యాలను మించి, ఈ మధ్యనే, ఏల్చూరి, ఈ పత్రికలోనే, శివుని మీద చెప్పిన పద్యం -అదెంతో బాగుంది.)
నాలుగు పాదాలు గల సీసపద్యం, నలుగురు వ్యక్తులను గూర్చి చెప్పటానికి చక్కగా సరిపోయింది. విశ్వనాధ సీసపద్యం రాయటంలో అలాటి సదవకాశాలు చిక్కటం తక్కువన్నారు. నాలుగు చరణాలు సమానంగా నడపటం, సరైన పోలికలు కుదరటం కష్టమన్నారు. అది సీసపద్యం లోని దోషమన్నారు. ఆయన ‘కల్పవృక్ష రహస్యాలు’ పుస్తకంలో, ఒక సీసంలో, దశరధుడి ముగ్గురు భార్యల గురించి చెపుతూ, మొదటి రెండు పాదాల్లో, చివరి రెండు పాదాల్లో- సుమిత్రను రెండు, రెండు సార్లు చెప్పి, అలా తాను చెప్పటం, తరవాత కథలో, సుమిత్రకు ‘కవలలు’ కలుగుతారని సూచన అన్నారు. విశ్వనాథ ఏది చెపితే చెల్లుబాటు అవదు కనక! గణిత శాస్త్రజ్ఞులకు లేని సౌలభ్యాలు, సమర్థింపులు కవులకు ఉన్నాయి.
ఈ వ్యాసము లోని రెండో పద్యము కూడా, కవి ధారాళంగా నోరూరగ చవులు పుట్ట, నుడివినందున నచ్చింది. తమి, తమన్నా, ఆతురతన్ – ఓహో ఎవ్వరీ అతివ!
కామేశ్వరరావు గారూ, ఈ పద్య పరిచయము కూడా బాగుందండి. దేవకాంతల (సినిమా తారల) వయసు ముప్ఫైలు దాటదనటం – I love it.
Fans of Oscar Wilde cannot help recalling the words of ‘Lady Bracknell’, from the totally wickedly humorous play ‘The importance of being Earnest’: “Thirty five is a very attractive age. London Society is full of women of the very highest birth who have, of their own free choice, remained thirty five for years.”
In this Oscar Wilde’s writing, I kid you not, almost every sentence is quotable. And the whole delightful flimsy plot revolves around two men‘s assumed identities and pseudonyms. To watch two handsomest actors -Rupert Everett, Colin Firth, play these roles in a movie is – I have to stop my off track idle babble, before my honorable reliable reasonable editor, cuts me off.
– Lyla
నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి SeshaKumar KV గారి అభిప్రాయం:
07/17/2015 8:52 am
వెదుకడానికి ఇంటర్నెట్ లో ఉపయోగించే search engine, గూగుల్ ను “ఇంచుక్” అనే ప్రత్యయం తో కలిపి “గూగులించు” అనే క్రియని సాధించి పద్యం లో ప్రయోగించడం గమ్మత్తు గా వున్నా, శ్రోతకు వెంటనే బోధ పడదు. (మిగతా పద్యం లో పదాల పోహళింపు భిన్నంగా ఉంది కాబట్టి.) గతంలో వడ్డెర చండీదాస్ గారు తమ నవలలలో “స్నానం” అనే నామవాచకానికి ఇంచుక్ ప్రత్యయం కలుపుతూ “స్నానించి ” అనే క్రియా పదాన్ని విస్తారంగా ఉపయోగిస్తూ, పాపులర్ చేయడానికి ప్రయత్నించారు. పైగా, “స్నానం చేసి” అని వాడనక్కర లేదని కూడా తేల్చేశారు. ఇలాంటి పదప్రయోగాలు తాత్కాలికమే అని చెప్పక తప్పదు.
ఐతే, పద్యాలు రెండూ బాగున్నాయి. సీస పద్యం ఆణి ముత్యమే. కవి శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి, కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించిన శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారికీ అభివందన చందనాలు.
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
07/13/2015 8:17 pm
నేను రాసిన ప్రధాన (అభాజ్య) సంఖ్యల మీద వ్యాసం చదివి, తప్పులు ఎత్తి చూపిన వారందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. నేను విద్యార్హిగా ఉన్న రోజులలో నా గురువుగారు “pay attention to the harshest reviews of your paper” అనేవారు. అందరు సూచించిన మార్పులు, చేర్పులు చేసి ఈ వ్యాసాన్ని తిరగ రాయవచ్చు. రాస్తాను. కాని ప్రస్తుతానికి కొట్టొచ్చినట్లు కనిపించే రెండు మూడు తప్పులని సరిదిద్ది సంప్రదించవలసిన మూలాలకి ఒక అంశాన్ని చేర్చుతున్నాను.
1. ప్రధాన సంఖ్యలు అన్నీ బేసి సంఖ్యలు కావు. అలా రాయడం నా తొందరపాటే. “ప్రధాన సంఖ్యలు (2 ని మినహాయించి) అన్నీ బేసి సంఖ్యలే” అని ఉండాలి.
2. sexy కి “లైంగిక” అన్న అనువాదం బాగు లేదని నేనే ఒప్పుకున్నాను. యదుకులభూషణ్ గారు దాని లేటిన్ మూలాన్ని సూచించిన తరువాత sexy primes ని “షష్ఠ్యంతరములు” అని తెలిగిస్తున్నాను.
3. నేను వాడిన “కచిక ప్రధాన సంఖ్యలు” కి ప్రత్యామ్నాయాలు ఒకరిద్దరు సూచించేరు. ఈ “కచికలు” (palindromes) అన్న మాటని మొట్టమొదట 1985 లో గణితశాస్త్ర ఆచార్యులు శ్రీ ఉపాధ్యాయుల వేంకట సత్యనారాయణ గారు రాసిన ఒక వ్యాసంలో వాడేరు. ఆ వ్యాసాన్ని 1985 లో నా సంపాదకత్వంలో వెలువడిన తానా వారి సువనీర్ లో ప్రచురించేను. ఆ వ్యాసాన్ని ఈ జాబుకి జత చేసి పంపుతున్నాను.
ఎవ్వరూ చదవరేమో అని భయపడుతూ తెలుగులో రాసిన ఇటువంటి వ్యాసాన్ని చదివి, సహృదయంతో స్పందించి, సలహాలు ఇచ్చిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు.
– వేమూరి
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి K. Hanumantharao గారి అభిప్రాయం:
07/13/2015 9:08 am
వేమూరి గారి వ్యాసం ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకోవాలనే కుతూహలాన్ని రెట్టింపు చేసేదిగా ఉన్నా కొన్నిచోట్ల అసంతృప్తి కలిగించింది.
ఇక్కడేదో ముఖ్యమైన విషయమున్నట్లుంది కాని అదేమిటో తెలియడం లేదు. సగటు కుటుంబ ఆదాయం N డాలర్లు అయితే, దాదాపు ఏ కుటుంబ ఆదాయాన్ని చూసినా అది సగటు కన్నా ఎక్కువ గానో తక్కువ గానో, కొన్ని సార్లు విపరీతమైన తేడాతో కూడా కనిపిస్తుంది గదా. ఆ సగటుకీ ఈ సగటుకీ తేడా ఏమిటి?
ముఖ్య విషయాన్ని ప్రస్తావించిన రెండు పేరాలలోనూ ఇంగ్లీషులో చెప్పింది సరిగానే వున్నా తెలుగులో చెప్పింది కచ్చితంగా లేకపోవడాన తప్పుగా అర్థమొచ్చేటట్లుంది. (కామేశ్వరరావు గారి వ్యాఖ్య గందరగోళాన్ని తగ్గించడంలో సహాయపడింది.)
ఖాళీ పరిమితంగా ఉండే జంటలు అనంతంగా కనిపిస్తాయి కాని, ఖాళీ ఎప్పుడూ ఓ అవధిని దాటదనడం తప్పు.
జంటల మధ్య ఖాళీకి ఊర్ధ్వ అవధి లేదు. మీరు ఎంత ఖాళీ ఇచ్చినా అంతకన్నా ఎక్కువ ఖాళీ ఉన్న జంట సంఖ్యలున్నాయని (gap can be arbitrarily large) సులభంగా చూపెట్టవచ్చు. అక్కడ ఇచ్చిన సమీకరణం చెప్పేది greatest lower bound (infimum) <70M, అని not least upper bound.
ఈటాంగ్ జాంగ్ ఎలా నిరూపించాడన్నది చాలా ముఖ్యం కాని వేమూరి వ్యాసం అందు గురించి కాస్తయినా చెప్పలేదు. Erica Klarreich “Unheralded Mathematician Bridges the Prime Gap” లో అసలెలా నిరూపించాడో కొంతవరకైనా వివరించి ఆసక్తి పెంచింది. ఈ విషయంపై వచ్చిన పాపులర్ సైన్సు వ్యాసాల్లో కెల్లా అది చాలా మెరుగైనది. వేమూరి ఆవిడే రాసిన మరో వ్యాసాన్ని ప్రస్తావించారు కాని అది N కన్నా చిన్నవైన ప్రధాన సంఖ్యల మధ్య ఖాళీ ఎంత పెద్దదిగా ఉండవచ్చు అనే దాని మీద.
పరిమితమైన ఖాళీతో అనంతమైన జంటలు లేకపోతే ఆశ్చర్యపడాలి కాని ఉంటే కాదు, అంటూ వివరించిన ప్రొఫెసర్ Jordan Ellenberg (UW at Madison) వ్యాసం “The Beauty of Bounded Gaps” చదవదగ్గది.
కొడవళ్ళ హనుమంతరావు
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి Madhava Murthy Sankarabandi గారి అభిప్రాయం:
07/10/2015 10:53 am
కొప్పాక వారిని పరిచయం చేసినందుకు వేలూరి గారికి ధన్యవాదాలు. నయం, తెలుగతనె ఈ పని చేశాడు, ఎ అమెరికా వాడో తెలుగు నేర్చుకొని పెట్టలెదు. ఇద్దరు తమిళులు కాని, కన్నదిగులు కాని కలిస్తె వారి మాతృభాష లోనె మాట్లాడతారు. మన తెలుగు వాళ్ళకు ఆంగ్లమె ప్రీతి.
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:
07/07/2015 12:05 pm
పత్రిక స్థాయి పెంచే వ్యాసం అనడం లో సందేహం లేదు. ఎన్నో చక్కని విషయాలను పంచుకొన్నందుకు రచయిత అభినందనీయులు. అంతే గాక: ‘Bounded gap problemని తెలుగులో ఏమంటే స్వయంబోధకంగా ఉంటుందా నేనూ సంపాదకుడూ తర్జనభర్జనలు పడ్డాం. చివరికి సీమితపాత సమస్య అని అన్వయించుకుని సమాధానపడ్డాం. ఇంతకంటే మంచి మాట ఉంటే చెప్పమని పాఠకులని కోరుతున్నాం.’ అని ఒక శాస్త్రీయ దృక్పథం కనబరిచినందుకు కూడా.
‘సీమితపాత సమస్య ‘ అన్న పదబంధం అర్థబోధలో కొత్త సమస్యను సృష్టిస్తుంది. మనకు గణితం లో , ఇదివరకే అనుపాతాలు (proportions) ఉన్నాయి . మామూలు వాడుకలో (పాతము అంటే పడిపోవటానికి సంబంధించిన అర్థం లో) జలపాతం , రక్తపాతం అన్న పదబంధాలు ఉన్నాయి.
ఈ గణిత సందర్భంలో పాతం పొసగడం లేదు , ఎడం / విరామం అన్న పదాలు మెరుగు అలాగే సీమిత అన్న పదం కూడా ముక్కస్య ముక్క అనువాదమే , భావానుగుణంగా నియమిత అని వ్యవహరించడం మేలు.
ఆ ప్రకారం ‘The Bounded Gap Problem ‘ ని ‘నియమిత విరామ సమస్య ‘గా వాడుక చేయవచ్చు.
ఝాంగ్ ఉవాచః
‘ఒక ప్రధాన సంఖ్యకి, దాని తరువాత కనిపించే ప్రధాన సంఖ్యకి మధ్య వచ్చే పాతము పరిబద్ధమైనది లేదా ‘సీమితము’ (bounded) అని అన్నారు. అంటే, ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు. ఇంకా నిర్ధిష్టంగా చెప్పాలంటే, ఆ పాతపు విలువ 70,000,000 దాటదు’
అదే పంపిణీ మీద ఈ వాక్యాన్ని తిరగరాస్తే –
‘ఒక ప్రధాన సంఖ్యకి, దాని తరువాత కనిపించే ప్రధాన సంఖ్యకి మధ్య వచ్చే విరామం నియమితం ’ (bounded) అని అన్నారు. అంటే, ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు. ఇంకా నిర్ధిష్టంగా చెప్పాలంటే, ఆ విరామం విలువ 70,000,000 దాటదు.
మరి కొన్ని చిల్లర విషయాలు:
1. sexy prime numbers : ఆరు ప్రధాన సంఖ్యలుగా అనువదించుకోవచ్చు. లాటిన్ లో ఆరును sex అంటారు దాని మీద శ్లేష వేసి పుట్టించిన పదం ఇది. పోతే, తెలుగులో ఆరుకు సంఖ్యా పరం కాని అర్థాలున్నాయి : అలరారు, ఇంపారు, ఒప్పారు ఆరుకు శృంగార పరమైన అర్థం కూడా ఉన్నది , కాబట్టి ఆరు ప్రధాన సంఖ్యలు అనడం సులువు ; దీనికి బహువచన రూపం సాధించడం కూడా సులువు : ఆర్లు అంటే సరి. లైంగికాలు అనడం బాగాలేదు ( రా. రా అనువాద సమస్యల్లో దీన్ని గూర్చి పెద్ద చర్చ ఉంది)
2. కచిక (palindrome) ప్రధాన సంఖ్యకి ఒక ఉదాహరణ 700666007. ఇది ఎటు నుండి చదివినా ప్రధాన సంఖ్యే!
మన వికటకవి ని మరచిపోవద్దు ; సరదాగా లకోలకోల ప్రధాన సంఖ్యలు అంటే ఎలా ఉంటుంది ?? జంబీరబీజం , లకోలకోల లాంటి పదాలతో ఒక పద్యం ఉంది తః తః గారికి గుర్తుండవచ్చు . లేదా వీటిని వికట ప్రధాన సంఖ్యలు అనవచ్చు.
3. ఒక ప్రధాన సంఖ్యలో అంకెలని ఒకటీ, ఒకటీ మినహాయించుకుంటూ పోతూన్నప్పుడు మిగిలినది ప్రధాన సంఖ్యే అయితే దానిని మినహాయింపు (deletable) ప్రధాన సంఖ్య అంటారు. ఉదా: 1987. ఎడమ పక్క నుండి వరుసగా 1, 9, 8 మినహాయించగా మిగిలిన 987, 87, 7 ప్రధాన సంఖ్యలు. కానీ , 87 (29×3) ప్రధాన సంఖ్య కాదు కదా , కావున 1997 సరైన సంఖ్య
ఆశ్చర్యం గొలిపే విషయం, గతం లో ఈ గణితవేత్త మీద వచ్చిన ఒక అద్భుత వ్యాసంలో ఇదే తప్పు కనిపించింది నాకు:
“A prime from which you can remove numbers and still have a prime is a deletable prime, such as 1987.”
ఒక ఇరవై ఏళ్ళ క్రిందట ఈనాడులో సైన్సు కాలం కోసం వారిచ్చిన విదేశీ పత్రికనుంచి ఒక వ్యాసం అనువాదం చేసి తప్పులు దిద్దమని చిత్తు ప్రతి పట్టుకొచ్చాడు ఒక స్నేహితుడు .ఇలకోడి అనే పురుగు శృంగార జీవితానికి ప్రధాన సంఖ్యలతో ముడివడి ఉంది అన్న విషయాన్ని చర్చిస్తుంది ఆ వ్యాసం:(ఇటీవల న్యూయార్కర్ లో ఈ విషయం మీద మంచి వ్యాసం వచ్చింది )
తప్పు మీద తప్పు చేస్తూ పోయిన లక్ష్మన్న గారు గుణకారఫలం అనడం విచిత్రంగా తోచింది:
(లబ్ధం అంటే సరిపోదా ?? భాగఫలం అని వినడమే గాని ఈ పదబంధం నేను వినలేదు బహుశ వారు చదువుకునే రోజుల్లో ఉండి ఉంటుంది.)
“పైన ఉదాహరించిన సంఖ్య 175,828,273 ప్రధానసంఖ్యలయిన 17,179 X 10,247 గుణకారఫలం.” “ఈ విషయాన్ని వెలికితెచ్చి, ప్రాధమికసంఖ్యల ఉపయోగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళు ముగ్గురు అమెరికన్లు.ఆ ముగ్గురు, MIT లో కంప్యూటర్ సైన్సు విభాగంలో పరిశోధకులయిన Ronald Rivest, Adi Shamir, Leonard Adleman.”
లక్ష్మన్న గారు ఈ చర్చలో పై ముగ్గురిని ఉదహరించి గొప్ప మేలు చేశారు, వీరి పేరు మీద ఉన్నదే అందరికీ తెలిసిన RSA అన్న algorithm: “RSA is an algorithm used by modern computers to encrypt and decrypt messages. It is an asymmetric cryptographic algorithm. Asymmetric means that there are two different keys. This is also called public key cryptography, because one of them can be given to everyone. The other key must be kept private.”
గొప్ప వ్యాసం రాసిన రచయితకు, ప్రచురించిన సంపాదకులకు, అభిప్రాయాలు ఒసగిన పాఠకులకు తిమింగిలమంత లకోలకోల ప్రధాన సంఖ్య కనిపించు గావుత అని ఫలశ్రుతి చెప్పుకొంటూ, సందు చూసుకొని నియమితంగా విరమిస్తాను.
తమ్మినేని యదుకులభూషణ్
పుల్లెల శ్రీరామచంద్రుడు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
07/05/2015 10:55 am
ఎన్నో లక్షల లీటర్ల గంగా జలం ప్రతి క్షణం సముద్రం పాలవుతుంది. దానిలో ఏ కొంతైనా తెలుగువారికి అందించగలిగితే ఎంతో మేలు జరుగుతుంది, ఎన్నో తరాల తెలుగువారికి ఉపయోగపడుతుంది. కాని అది సాధ్యమయ్యే పనేనా? అయితే ఒక్క మనిషితో ఏ మేరకు సాధ్యం? ఆ ప్రశ్నలకు జవాబు ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామచంద్రుడుగారి జీవితం అనిపిస్తుంది. సంస్కృతగంగలో ఉన్న ఎన్నో గ్రంథాలు, వేలాది శ్లోకాలు కాలప్రవాహంలో తెలుగువారికి అందకుండా పోతూండడం చూసి, వాటిని తెలుగులోకి అనువదించి, అర్థతాత్పర్యాలు ఇచ్చి, సంస్కృతంలో ఉన్న సూక్ష్మాలకు “బాలానందినీ” అను పేరుతో వ్యాఖ్యానాన్ని వ్రాసి తెలుగు వారందరు వాటిని సుళువుగా చదువుకొని అర్థం చేసుకోవడానికి వారు జీవితాంతం అవిశ్రాంతంగా చేసిన కృషి ఇప్పటిదాకా ఎవ్వరూ చేయలేదేమో అనిపిస్తుంది. ఒక్కచేతితో వాల్మీకి రామాయణాన్ని ఎలా వ్రాసాడో తెలియదు, కాని ఒక్క చేతితో మొత్తం వాల్మీకి రామాయణానికి తెలుగులో అర్థ తాత్పర్యాలు, వ్యాఖ్యానంతో శ్రీ పుల్లెల వారు అందించడం ఈ తరం, రాబోయే తరాల తెలుగువాళ్ళ అదృష్టం. సంస్కృతంలో ఆది శంకరులు భగవద్గీతకు వ్రాసిన భాష్యాన్ని తెలుగులో అందించిన ఘనత కూడా శ్రీ పుల్లెల వారిదే.
ఎంతో సుదీర్ఘమైన కృషి తో వాల్మీకి రామాయణ వ్యాఖ్యానం అందించి చివరలో వారు చెప్పిన శ్లోకం
“దేవతానుగ్రహః పిత్రోస్తప శ్చాచార్యసత్కృపా
కర్తాస్మద్గ్రంథజాతస్య కరణం కేవలం వయం”
తను రచించిన కృతులకు దేవతానుగ్రహము, తల్లిదండ్రుల తపస్సు, ఆచార్యుల కృప కారణమని, తాను కేవలం ఒక పనిముట్టు ఉపకరణం మాత్రమే అని చెప్పుకోవడం వారి నిరాడంబరత.
వారి “వాల్మీకి రామాయణం”, “శ్రీ భగవద్గీతాశాంకర భాష్యం” ఎప్పుడు చదివినా, మూలం ఎప్పుడో వాల్మీకి, ఆది శంకరుల వైనా, ఇప్పుడు మన మధ్యలో ఉన్న శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారి అనువాదాలు అని అనుకునే భావం, భాగ్యం వారు లేరనే వార్తతో లోటుగా మారిపోయింది. వారిని తలుచుకున్నప్పుడు ఎన్నో గ్రంథాలకు ఒక్క మనిషి ఇంత కృషి చేసారా అని ఆశ్చర్యం కలుగుతుంది. సమాజ శ్రేయస్సుకోసం సలిపే ఏ కృషికైనా వారి కృషి ఒక ఆదర్శంగా ఎప్పటికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎన్నో వేల పేజీల బృహత్ రచనలు చేసినా, అక్షరదోషాలు, టైపోలు దొర్లకుండా శ్రద్ధ వహించడం వారి విశిష్టత. ఆచార్యుల వారు ఉదాహరణ పూర్వకంగా అందించే అదనపు పాఠం. వారి రచనలు అందించే వెలుగులను అందుకోవడం, మరింతగా మరెందరితోనో వాటిని పంచుకోవడం వారికిచ్చే నివాళి అని అనిపిస్తుంది. వారి ఆత్మకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.
———————-
విధేయుడు
-శ్రీనివాస్
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
07/04/2015 9:53 am
వాసుదేవరావుగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఇలాంటి వ్యాసాలలో భాషాంతరీకరణ గురించిన చర్చ అసలు విషయాన్ని దారి తప్పించినదే అవుతుంది. కానీ యీ భాషాంతరీకరణకి ఒక పద్ధతి అంటూ ఏర్పడేదాకా/ఏర్పరచుకొనే దాకా బహుశా అలాంటి చర్చ తప్పదు!
ఇలాంటి పాపులర్ వ్యాసాలు (ఈమాటలో లెక్కల గురించిన వ్యాసాలు పాపులర్ వ్యాసాల లెక్కలోకే వస్తాయని అనుకొంటాను) పాఠకులకి ఎంత సులువుగా అర్థమయితే అంత బాగుంటాయి. దానికి ఇంగ్లీషులోని పడికట్టు పదాలని డు,ము,వు,లు చేర్చి తెలుగులోకి తెచ్చుకోడం ఒక పరిష్కారమయితే అదే తక్షణకర్తవ్యం! బహుశా అలా చేస్తే ఎక్కువ తర్జనభర్జనలు పడే అవసరం కూడా ఉండదు. అసలు డు,ము,వు,లు చేర్చకుండా (అసలు అన్యదేశ్యాలు తెలుగులోకి వచ్చేప్పుడు హలంతాలు ఉకారాంతాలుగా మారడం తప్ప వేరే ప్రత్యయాలేమీ రావు) ఉన్నవున్నట్టుగా కూడా వాడుకోవచ్చు – హోల్ నెంబర్లు, ప్రైమ్ నెంబర్లు, పెర్ఫెక్ట్ నెంబర్లు – ఇలా. “least upper bound” వంటి పదబంధాల విషయంలో, తెలుగులో అర్థం మాత్రమే వివరించి ఇంగ్లీషు పదబంధాలని అలాగే ఉంచేయాలి.
ఇవి తెలుగు వాక్యాలలో ఒదిగిపోతాయా, పంటికింద రాళ్ళలా అడ్డు తగులుతాయా అనేది కొన్ని వ్యాసాల తర్వాత పాఠకులే తేలుస్తారు.
—
‘ఒక ప్రధాన సంఖ్యకి, దాని తరువాత కనిపించే ప్రధాన సంఖ్యకి మధ్య వచ్చే పాతము పరిబద్ధమైనది లేదా ‘సీమితము’ (bounded) అని అన్నారు. అంటే, ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు.
—
దీన్ని కొంచెం వివరించాల్సిన అవసరం ఉందని నాకనిపించింది.
లెక్కలలో “bounded”, “having limit” అనే రెండు పదాలు సమానార్థకాలు కావని తెలియకపోతే, ఇక్కడ చెపుతున్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది.
“ఎంత పెద్ద ప్రైమ్ నెంబర్ల జంటను తీసుకొన్నా, వాటి మద్య దూరం ఒక అవధిని దాటదు” అంటే
lim n->infinity, { p(n+1) – p(n) } < N
అని అర్థం వస్తుంది. ఇది తప్పు. ప్రైమ్ జంటల మధ్య దూరం అనంతంగా పెరుగుతునే పోతుంది!
అంచేత జాంగ్ నిరూపించింది అది కాదు.
ఒక కచ్చితమైన దూరాన్ని (అవధి) తీసుకొంటే, సంఖ్యలను ఎంత పెంచుకొంటూ పోయినా, తమ మధ్య దూరం ఆ అవధిని మించకుండా ఉండే ప్రైమ్ జంటలు దొరుకుతాయా లేదా అన్నది ఇక్కడి ప్రశ్న. దొరుకుతాయి అన్నది జాంగ్ నిరూపించారు. అది 70,000,000 కన్నా తక్కువని కూడా నిరూపితమైంది. ఆ తర్వాత 16 కన్నా తక్కువ అని కూడా నిరూపించారు! అంటే ఎంత పెద్ద సంఖ్య తీసుకొన్నా, ఆ సంఖ్య కన్నా పైన – "16 కన్నా తక్కువ దూరం ఉన్న" ప్రైమ్ జంటలు మనకి దొరుకుతాయి. బహుశా ఈ విషయం వ్యాసంలో స్పష్టంగానే ఉండి ఉండవచ్చు, అయినా నా అవగాహనకోసం మళ్ళీ ఇక్కడ నా మాటల్లో చెప్పానంతే!
సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి లక్ష్మీదేవి గారి అభిప్రాయం:
07/02/2015 9:59 pm
ఇంత సవివరమైన అభ్యాసగ్రంథమును గురించిన విస్తారమైన వ్యాసం బాగుంది. ప్రబంధాల్లోనూ, వ్యాకరణగ్రంథాల్లోనూ ఉన్న అభ్యాస రహస్యాలను ఆవిష్కరించడం వల్ల విద్యార్థిలోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. పద్యాలను, ఛందస్సును, శిల్పాన్ని, పర్యాయపదాలను, ప్రతీదాన్నీ అభ్యాసం చేయడానికి లోతులను తెలుసుకోడానికి ఉపయోగపడే ఈ గ్రంథానికి సమగ్ర వ్యాఖ్యానగ్రంథం కూడా రావలసి ఉందనిపిస్తుంది.
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
07/02/2015 2:00 pm
ఒకానొకడుగారూ, లక్ష్మన్నగారి వ్యాఖ్య చదవగానే నాకూ అదే అనుమానం వచ్చింది. కాని మళ్ళీ చదివితే అర్థమయింది – 61ని “2,3,4,5,6 చేత భాగిస్తే ఒకటి మిగిలే సంఖ్య”కి ఉదాహరణగా యిచ్చారు. రెండు నుండి ఆరు వరకూ ఉన్న సంఖ్యలచేత భాగిస్తే ఒకటి మిగులుతూ, ఏడు చేత నిశ్శేషంగా భాగింపబడే అతి చిన్న సంఖ్య ఏమిటి అన్నది ప్రశ్న. దాని సమాధానం మూడువందల పైచిలుకే! 🙂
లెక్కలమీద ఆసక్తి ఉన్నవాళ్ళకి వ్యాసం నచ్చుతుంది. కొన్ని సూచనాలోచనలు:
1. gap అంటే “పాతము” కన్నా “అంతరము” అంటే సులువుగా బోధపడుతుందనుకొంటాను. “సీమితాంతర సమస్య” అనవచ్చునేమో.
2. Conjecture అనే పదానికి “శిష్టాభిప్రాయం” కన్నా “ప్రతిపాదితము” వంటి పదం వాడితే అర్థానికి మరికొంత దగ్గరగా సులువుగా ఉంటుందేమో. “అభ్యూహ” అన్న పదం కూడా విన్నట్టు గుర్తు.
3. పూర్ణ – సంపూర్ణ పదాలు మధ్య తికమక పడే అవకాశం ఉంది. రెండిటికీ ఏదో సంబంధముందనే భ్రమ కూడా కలగవచ్చు. అంచేత “perfect number”కి వేరే పదం ఆలోచిస్తే బాగుంటుంది. పక్వ, పరిణత, పుష్ట లాంటి పదాలు చాలానే ఉన్నాయి. “నిధిసంఖ్య” అని కొందరు వాడారు. ఇలాంటి మాటలకి ఇంగ్లీషు పదాన్ని నేరుగా అనువాదించాలా లేదా ఆ పదాల అసలు గుణాల ఆధారంగా తెలుగు చేయాలా అనే ప్రశ్న వేసుకొంటే, రెండో దానికే నా ఓటు. Prime Numberని “ప్రధాన సంఖ్య” అనడం కన్నా “అభాజ్య సంఖ్య” అనడమే నాకు నచ్చుతుంది. ఆ రకంగా perfect numberని “కారణాంకయుతి సంఖ్య” అంటే?
సంస్కృత గణితవేత్తలు ఈ సంఖ్యల గురించి ఏమైనా చెప్పారా? వారు ఏ పదాలు వాడారు?
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి తః తః గారి అభిప్రాయం:
07/02/2015 11:54 am
“….భాగింపబడితే….” — విష్ణుభొట్ల లక్ష్మన్న.
‘భాగింపబడితే’అంటే శేషం సున్నా అని అర్థం. ఒక సంఖ్యను 2తో కాని, 3తో కాని, 4తో కాని, 5తో కాని, 6తో కాని భాగిస్తే మిగిలే శేషం/reminder 1 అయితే అని ఉండాలి.
తః తః
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
07/02/2015 3:49 am
నేను ప్రాధమిక సంఖ్యలు అన్నాను. అవి ప్రధాన సంఖ్యలుగా గుర్తించగలరు.
ఒక ప్రశ్న!
ఒక సంఖ్య 2 తో కాని, 3తో కాని, 4తో కాని, 5తో కాని, 6 తో కాని భాగింపబడితే శేషం 1. అంటే భాగాహరంలో మిగిలే reminder 1 అన్న మాట.
ఉదాహరణకు 61 సంఖ్య 2, 3, 4, 5, 6 అంకెలతో భాగింపబడితే శేషం 1.
కానీ, అదే అంకె 7 తో భాగింపబడితే శేషం మాత్రం శూన్యం.
అలాంటి సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏది?
విష్ణుభొట్ల లక్ష్మన్న
నాకు నచ్చిన పద్యం: అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/14/2015 12:39 am
అదంత పెద్ద శిక్షేం కాదండి.
ఏ. కె. రామానుజన్ వ్యాసాల సంకలనంలో (ఆక్సస్ ఫొర్డ్ యూనివర్సిటీ ప్రెస్, లావుపాటి పుస్తకం, అతి చిన్న అక్షరాలు, లెక్కకు మిక్కిలిగా కథలు. ఎన్ని గొఱ్ఱెలను లెక్కించినా నిద్ర రానప్పుడు చదువుతుంటాను.) వాల్మీకి రామాయణం బాలకాండ నుంచి చెప్పిన ఒక కథలో, ఇంద్రుడు అహల్యని మోసగించి భోగించిన సందర్భంలో, అహల్య భర్త గౌతముడు శపిస్తే, ఇంద్రుని testes/ ?scrotum ఊడి కింద పడుతుంది. (వీటికి తెలుగు మాటలు నాకు తెలియవు. విశ్వనాథ సత్యనారాయణ చెలియలికట్ట నవలలో, మనిషి ప్రతి అవయవానికీ/భాగానికీ పేరు ఉండి తీరుతుంది అంటారు. కాని లేవు. మగవాళ్ల private partsకి అసలు లేవు. ఉండి ఉంటే గాని ‘ఆంధ్ర భారతి’ నిఘంటువులలో ఎందుకు దొరకవు? పేర్లు లేకుండా మానవ దేహాన్ని గురించి ఎలా తెలుగులో రాయటం?) సర్లెండి, ఈ కథలో ఇంద్రుడు సహస్రాక్షుడు. ఇదే ఉదంతం కంబ రామాయణంలో వేరుగా ఉంది. గౌతముడు ఇంద్రుని శపిస్తే, అతని ఒంటి మీద వెయ్యి యోనులు (వెజైనా, vagina) మొలుస్తాయి. అవి తర్వాత వెయ్యి కళ్లుగా మారతాయి. అప్పటి నుండి అతను సహస్రాక్షుడు.
రామానుజన్ ఇలాటి చాలా కథలు చాలా ఓపిగ్గా విప్పి చెప్పాడు. పుస్తకంలోని ఆర్టికల్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే ఉన్నయ్యి. నేను చదివినంతవరకూ చాలా బాగా రాసాడనిపించింది.
ఈ శీర్షికలోని ఆయుతుని కధ లోని మరో విషయం, ఇంద్రుడు మారు వేషంలో రావటం. ఇండియన్, ఇతర మిధాలజీలలో, సైన్స్ ఫిక్షన్ సీరీస్ లో, -దేవుళ్లు, ఇతరులు మారు రూపు దాల్చటం, మారుపేర్లతో చరించటం, మాయమై పోటం, కనపడకుండా ఉండి మనుషులుతో మాట్లాడటం. చాలా ఎక్కువ కదా. మనుషులకు ఈ మాయల మీద ఇంత మోజు ఎందుకు అని చాలా సార్లు ఆలోచిస్తాను.
So, I was thrilled to see this recently published article “Sight Unseen, The hows and whys of invisibility” by Katheryn Schulz. (A critique on a book named “Invisible: the dangerous allure of the Unseen” by the British Science writer Philip Ball. (I have not read the book.)
The book apparently deals with not just the magical, and mythological, but also the technological, psychological aspects of invisibility. Not just in the kingdom of childhood, but as a grown up matter. The author apparently discusses the paradox of how invisibility can function both as a fantasy of empowerment and a nightmare of powerlessness.
I feel like getting this book. Besides other interesting things, this book may give me answers why so many people use pseudonyms on internet. I want to know if it is empowerment, powerlessness or something else.
లైలా
చంపకోత్పలమాలల కథ గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/13/2015 4:04 pm
“కాబట్టి, మోహన తాత్పర్యానికి చేటు లేదు.”
You Sure? పద్యంలో అక్షరాలు కొన్ని సరిగా కనపడటం లేదని చెపుతూనే, పన్నెండు రకాల సవరణలు ఇంకా చేస్తూనే, మోహన తాత్పర్యమునకు చేటు లేదంటున్నారు. ఒకవేళ పాత పద్యం కొత్త సవరణలు ‘మోహన తాత్పర్యం’ సహాయంతో గాని, ఆ తాత్పర్యముతో వ్యతిరేకత కలగకుండా కాని చెయ్యటం లేదు కదా.
ఏ మాటకామాటే చెప్పాలి. సదరు తాత్పర్యవేత్త పైని, ఇక్కడ రాసిన మెప్పుపద్యం, పసందుగా ఉంది. తెలుగు మీద, తెలుగు వారి మీద మెప్పు పద్యాలు, వ్యాసాలు రాయటంలో తెలుగువారు సిద్దహస్తులు. (Microsoft corrected word.)
ఇంతవరకూ తెలిపిన/నాకు బోధపడిన (అర్థమైన) back ground story: ఒకసారి కట్టిన గుడి పడిపోయింది. అమ్మన ప్రెగ్గడ పునరుద్ధరించాడు. ఇంకెవరో డబ్బిచ్చి కొంచెం భూమి కొని, అందులో ఒక రాయి పాతి, ఒక ఉత్పల మాల పద్యం చెక్కించి, అందరినీ అమ్మన ప్రెగ్గడ లాగా ఏమేమో చెయ్యమంటున్నాడు.
My thoughts after the recent discussion are: ఈ పద్యం అర్థం అశాశ్వతం. క్షణ క్షణ భంగురం. దీనిని నమ్మరాదు. “అర్థం” అన్న మాటకే నానార్థములు ఏ భాష లోనైనా పెట్టుకుంటారా? అట్టి భాష నిర్ద్వందతను ఆశించదు.
This Telugu language wants to jump onto either side of fence at moment’s notice. It’s always – it could be this, it could be that, it could be both, it could be many things or anything or nothing. It could be none of the above, some of the above or all of the above. All at the same time.
It’s non-committal. It wishes to pass off non-committal nonsense as complexity of thought. When asked to explain ‘the thought’ it fails. ఇరవైయవ శతాబ్దం వచ్చేసరికి, ఈ తెలుగు భాషలో (చెయ్యగలిగిన) double talk ఇంకా పెరిగింది. ధర్మం, అర్థం -పరమాత్మ జీవాత్మల్లా సంయోగం సాధించాయి.
“గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి బాబయా, గంజి కొక్క ధర్మమీ బాబయా” అన్న సినిమా పాటలో ధర్మం అంటే డబ్బే కదా.
Thank you all. So far, I see no point in asking this poem to take a stand and give a deposition.
లైలా
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
06/10/2015 3:09 pm
నమస్తే తఃతఃగారూ.
“కాబట్టి తెలుగు ప్రపంచ భాషే!” అన్న పేరా తర్వాత, దాని గురించే మరికొంత వివరిస్తూ రెండు పేరాలు రాసిన మీదట, “ఇది ఒక రకమైన అంతర్జాతీయత.” అన్నారు కదా. అంటే “ప్రపంచ భాష”, “అంతర్జాతీయ భాష” అనేవి పర్యాయపదాలే కదా. ఇక్కడ వ్యాసకర్తలు ముందు “ఒక రకమైన” అంతర్జాతీయత గురించి వివరించి, దానికి భిన్నమైన మరొక అంతర్జాతీయత గురించి మాట్లాడారు.
“ఉదాహరణకి, యూదులూ జెర్మన్‌లూ ఫ్రెంచ్ వాళ్లూ, తమ భాషలనీ సాహిత్యాలనీ అమెరికా లోని యూనివర్సిటీలలో ప్రవేశపెట్టి నిలబెట్టడం మూలంగా వాళ్ళ సంస్కృతికి ఒక అంతర్జాతీయ స్థితి సంపాదించగలిగారు. ఈ అంతర్జాతీయత ఎలాంటిది — అది తెలుగుకి వొస్తుందా అన్నది ప్రశ్న.”.
ఇక్కడ వాళ్ళు చెప్పదలుచుకొన్న రెండవ రకం అంతర్జాతీయత గురించి ప్రస్తావించి, ఆ తర్వాత పేరాలో దాన్ని నిర్వచించారు: “ముందు ఒక భాష అంతర్జాతీయ భాష ఎలా అవుతుంది అనే ప్రశ్న మరొకసారి వేసుకుని చూద్దాం.” అంటూ. వచ్చిన చిక్కేమిటంటే, అది ఆ పదానికి తామిస్తున్న నిర్వచనంలా కాకుండా ఆ పదానికున్న సార్వజనీనమైన అర్థాన్ని వివరిస్తున్నట్టుగా ఆ నిర్వచనం సాగింది. సహజంగానే అది పాఠకులను గందరగోళంలోకి నెడుతుంది.
ఇక చైనా విషయానికి వస్తే, చైనాలో రాజకీయశక్తుల కారణంగా ముందు ఇంగ్లీషు భాషా ప్రభావానికి ఆ సమాజం దూరంగా ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో తమ శక్తిని పెంపొందించేందుకు శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధి జరిగింది. అందువల్ల అక్కడ సహజంగానే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వారి భాషలోనే అభివృద్ధి చెందింది. అంతేకాని తమ భాషను ప్రపంచభాష చేయడం కోసం శాస్త్రసాంకేతిక అభివృద్ధి జరగలేదు. మన సమాజం విషయానికి వస్తే, ఇప్పటికే మనం ఇంగ్లీషు ప్రభావానికి చాలానే గురయ్యాం. ఇక్కడ ఆర్థిక కారణాలకోసం శాస్త్రసాంకేతికాభివృద్ధి జరగవచ్చు. కాని అది తెలుగులో ఎలా జరుగుతుంది? అన్నది ప్రశ్న.
***
నాగరాజుగారూ,
నారాయణరావుగారి పుస్తకాలను నేను ఎక్కువగా చదవలేదు కాని, చదివినంతలో వారంటున్న విజ్ఞానం గురించి నా ఊహ యిది:
మనకంటూ (తెలుగువాళ్ళకు అనుకోండి, లేదా భారతీయులకు అనుకోండి) ఒక ప్రత్యేకమైన ప్రాపంచిక దృక్పథం ఒకటి ఉండేది. సాంఘికవ్యవస్థ, ఆర్థికవ్యవస్థ, కళలు, శాస్త్రాలు, చరిత్ర – ఇలా అనేక విషయాలమీద మనకి యిప్పుడు పాశ్చాత్యదృక్పథమే సర్వేసర్వత్ర వ్యాప్తిలో ఉంది. వీటి గురించి దీనికన్నా విభిన్నమైన ఒక ఆలోచన, దృక్పథం మనకి ఉండేవి. అవి మన సాహిత్యంలో ప్రతిఫలించాయి. పాశ్చాత్యదృష్టితో కాకుండా, ఈ సాహిత్యాన్ని “మనదైన దృష్టితో” పరిశీలిస్తే, మనం పోగొట్టుకొన్న ఆ ప్రాపంచిక దృక్పథంలోని అనేక పార్శ్వాలను మనం గమనించ వచ్చు. తద్వారా ప్రపంచానికి ఒక కొత్త Alternate World View చూపించవచ్చు. అది మనం ప్రపంచానికి అందించే విజ్ఞానంలో భాగమవుతుంది.
ఇది చెయ్యాలంటే, తెలుగుసాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదిస్తే సరిపోదు. తెలుగుసాహిత్యాన్ని భిన్నమైన దృష్టితో పరిశోధించి, అందులోని Alternate World Viewని విశ్లేషించి ప్రపంచానికి అందివ్వాలి. ఇలాంటి పరిశోధన విశ్వవిద్యాలయాలలోనే కదా జరగాలి!
ఈ వ్యాసం, దానిపై చర్చలు చదివినప్పుడు, కొంతకాలం క్రితం చదివిన ఒక పేపరు లోని క్రింద వాక్యాలు గుర్తుకొచ్చాయి:
“In this context, it becomes important to distinguish between language maintenance (sustaining an ecology in which a population can continue to speak their language) and language preservation (recording texts from a particular language graphically or mechanically). If the current ecology cannot be changed, should not linguists be more realistic and focus on language preservation rather than on maintenance?” – Colonisation, Globalisation, and the Future of Languages in the Twenty-first Century by Salikoko S. Mufwene.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
06/10/2015 10:35 am
ఆంధ్రదేశంలో ప్రస్తుతం తెలుగుయొక్క అధ్వాన్నస్థితిని కండ్లకు గట్టే చక్కని పద్యం. ఆంధ్రదేశంలోనే తెలుగు అంతరించిపోతుంటే అడిగే నాథుడు లేడు. ఇక అంతర్జాతీయతనుగఱించి ఆలోచించడం ప్రస్తుతపరిస్థితిలో అప్రస్తుత మనిపిస్తుంది. ‘ఉట్టి కెగురలేని జెట్టి స్వర్గాని కెగుర గలడా?’ అన్న దానిని ఇది తలపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాల అధికారికచిహ్నాలను (official emblems) చూడండి. వానిలో ప్రధానంగా కన్పడేవి ఇంగ్లీషులో వ్రాసిన రాష్ట్రనామాలే. తెలుగులో వ్రాసినపేరు అప్రధానంగా ఒక మూలకు ఉంటుంది. ఇదొక్కటి చాలు తెలుగుపై ఆయా ప్రభుత్వాలకు ఎంత మక్కువ ఉందో గ్రహించడానికి.
తమ్మినేనివారు లేవనెత్తిన ‘కకుభ’పదవిచారం. కకుప్ అనునది స్త్రీలింగ భకారాంతపదం. కకుప్, కకుభౌ, కకుభః – అని ప్రథమావిభక్తిలో ఏక,ద్వి,బహువచనరూపాలు. అందుచేత కకుప్+అంత = కకుబంత అనే పదం నిర్దుష్టమైనపదం. ఐతే కకుభా అనే ఆకారాంతమైన స్త్రీలింగపదం కూడ ఉన్నది. అదివాడితే కకుభాంత అని కావాలి. కాని కకుబంత అనే పదం సాధువే కాక సౌమ్యంగా కూడ ఉన్నందున అది వాడటంలో పొరపాటు లేదు. కకుభశబ్దము పుల్లింగమైనప్పుడు వీణె కరివెకు, మద్దిచెట్టుకు, కకుభరాగానికి పేరౌతుంది. కకుప్ అని స్త్రీలింగమైనప్పుడు శోభ, దిక్కు, సంపంగిదండ ఇత్యాదుల కర్థమౌతుంది.
‘కకుభో రాగభేదేఽపి, వీణాంగే, అర్జునపాదపే’ అనియు, ‘కకుప్ శోభా, దిశోః ,శాస్త్రే, ప్రవేణ్యాం, చంపకస్రజి’ అని విశ్వకోశనిఘంటువు.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః గారి అభిప్రాయం:
06/10/2015 4:55 am
శ్రీ పప్పు :భారతాన అంగ్లేయుల పాలన అంతరించిన తర్వాత అనతి కాలంలోనే సైన్సూ టెక్నాలజీ ల తో ముడిబడ్డ విపణి తో పెనవేసుకు పోయిన ఒక కల్చురల్ హోమోజనై జషన్ ప్రపంచాన్ని కమ్మేసింది. దీని ప్రభావాన ఇంగ్లిష్ ను అమెరికన్ మింగేయటం జరిగింది. ఇల్లాలు ,హవ్స్ వైఫ్ , కాఫీ మేకర్ లాగా హోం మేకర్ అయింది .
యూరప్ మెల్లిగా వెనకపడి పోయి – ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో అరవై ఐదు వరకూ అంతకు కొన్ని సంవత్సరాలు ముందు నుంచీ సైన్స్ విద్యార్థులకు జెర్మన్ నిబంధన గా బొధించేవాళ్ళు- పైన చెప్పిన అమెరికన్ ప్రభావం దట్టంగా అలుముకుని అమెరికా కడుపుకు రొట్టె తో బాటు బుఱ్ఱ కు జామూ ఇచ్చే వితరణ శీలిగా అవుపడటం తో భారతీయ భాషలు ఈ వ్యాపార సాంస్కృతిక బానిసత్వ సంకెళ్ళలోకి తమ చేతులు జాచాయి. ఇప్పుడు ‘వగచిన వగచిన యేమి ఫలము’. మీరన్న ఆనువాదాలు కూడా ప్రపంచాన్నంతటినీ కాక ఎసెన్షియల్ గా అమెరికాని ఇంప్రెస్ చేయటానికే సాగినట్టు గా నాకు అనిపిస్తుంది
ఫ్రపంచం చిన్నదయి పోతోందంటే అమెరికా పెద్దదయిపోతోందనేనన్న నిజానికి పది పదిహేనేళ్ళ క్రితం కళ్ళు తెరిచిన వాళ్ళు చైనా వాళ్ళు. అర్జెంటుగా చైనీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా గుర్తించేటట్టు చేయగలిగారు. ఇక ముందు సైన్స్ – టెక్నాలజీలలతో ఆధిపత్యమే సాంస్కృతిక ఆధిపత్యమై తిష్టవేస్తుంది.
నమస్కారలతో
తః తః
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
06/08/2015 1:15 pm
చాన్నాళ్ళుగా యీ వ్యాసానికి స్పందించాలనుకొంటున్నా ఊరుకోడానికి కారణం, పై వ్యాఖ్యల్లో ఒకరన్నట్టుగా, ఇవి వట్టి మాటలుగానే మిగిలిపోతాయి కదా అనే నిరాశ. ఇప్పుడు స్పందించడానికి రెండు కారణాలు. ఒకటి, ఇది ఏభయ్యవ (స్వర్ణ) వ్యాఖ్య అవుతుందని! 🙂
వ్యాసాన్నీ వ్యాసంపై వచ్చిన స్పందనలనూ చదివిన మీదట, వీటిలో మూడు రకాల ఆలోచనాధోరణులు నాకు కనిపించాయి. వాటి గురించి వివరించే ముందు – ఈ వ్యాసంలో “అంతర్జాతీయ/ప్రపంచ భాష” అంటే ఏమిటన్నది స్పష్టంగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు. నేను అర్థం చేసుకొన్నంతలో నాకది స్పష్టంగానే ఉందనిపించింది.
ఇక్కడ “విజ్ఞానం” అంటే Knowledge అన్న అర్థంలో వాడారనుకొంటున్నాను. ఈ వాక్యాలలో “ప్రపంచ భాష” అంటే వ్యాసకర్తల ఉద్దేశం ఏమిటన్నది స్పష్టమే కదా. నాకు అర్థమైనంత వరుకూ “ప్రపంచ భాష”, “అంతర్జాతీయ భాష”ను పర్యాయపదాలుగానే గ్రహించారు. నాకీ వ్యాసంలో కనిపించిన ముఖ్యలోపం ఒకటే, అసలు తెలుగులో అలాంటి విజ్ఞానం ఉన్నదా, ఉంటే అది ఎలాంటిది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. అది వివరించకుండా, తెలుగులోని విజ్ఞానాన్ని ప్రపంచానికి ఎలా తెలియజెప్పడం అనే చర్చలోకి వెళ్ళిపోయారు. ఇక నేను గమనించిన ప్రధాన ఆలోచనా ధోరణుల గురించి:
1. తెలుగు “ప్రపంచభాష” కావడం కన్నా ముందు తెలుగువాళ్ళు “మాట్లాడే భాష”గా ఉండడం ముఖ్యం అనేది ఒక ఆలోచనాధోరణి. ఇది సహజంగా సబబైన ఆలోచనగానే అనిపిస్తుంది. ఇది వ్యాసానికి అంతగా సంబంధం లేని అంశం అన్నది అలా ఉంచితే, కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఇది ఎంతవరకూ సాధ్యం అనే అనుమానాలు ఎదురవుతాయి. నిక్కచ్చిగా ఆలోచిస్తే, ఏ భాష అయినా “అవసరం” అనేది కోల్పోయినప్పుడు అది మాట్లాడే భాషగా మనుగడ సాగించలేదు. కేవలం “అభిమానం”, భాషను ఉద్ధరించడం కల్ల. ఈ “అవసరం” కేవలం సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన “భౌతిక” అవసరమే కానక్కరలేదు. “సాంస్కృతిక” వ్యవస్థకి చెందిన, “మానసిక” అవసరం కూడా కావచ్చు. ఆ అవసరం వ్యక్తిగతం కాకుండా సంఘస్థాయిలో ఉండడం ముఖ్యం. అలాంటి సామాజిక, ఆర్థిక లేదా సాంస్కృతిక పరిస్థితులను కల్పించుకొనే వరకూ, కేవలం భాష వాడుకపైనా వ్యాప్తిపైనా మాత్రమే దృష్టి పెట్టడం పెద్దగా ప్రయోజనాన్ని యివ్వదు. అలాంటి పరిస్థితులను కల్పించడం ఎలా? రోజురోజుకి పెరుగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఇది అసలు సాధ్యమా?
2. పై ప్రశ్నలకు కొంత అనుసంధానమైనదే రెండవ ఆలోచనాధోరణి. ఆధునిక ప్రపంచానికి గణితం, సైన్సు మొదలైన శాస్త్రాలూ, సాంకేతికత, చాలా ముఖ్యం. వాటిలో తెలుగువాళ్ళు గొప్ప విజ్ఞానాన్ని సంపాదించి, దాన్నంతటినీ తెలుగుభాషలో మాత్రమే భద్రపరిస్తే, తెలుగువాళ్ళూ “తెలుగేతరులూ” కూడా తెలుగు నేర్చుకోవలసిన “అవసరం” ఏర్పడుతుంది – అన్నది. ఇదికూడా గొప్ప ఆశయమే! కానీ సాధ్యమవ్వడం ఎలా? తెలుగువాళ్ళు సాంకేతిక విజ్ఞానాలలో పట్టు సాధించాలంటే ముందు “తెలుగువాళ్ళు”గా మిగలాలి. అలా మిగిలినవాళ్ళు అలాంటి పట్టు సాధించగలిగే సాధనాలుండాలి. ఆ తర్వాత వాళ్ళు తెలుగులో మాత్రమే దాన్ని భద్రపరిచేందుకు సిద్ధపడాలి. ఇన్ని లికారాలు సాకారాలవ్వడానికి ఆకరాలేమిటి? దీని కన్నా మొదటి ఆలోచనాధోరణిలో దారి సులభం అనిపించడం లేదూ?
3. చివరగా మూడవ ఆలోచనాధోరణి. ఈ వ్యాసంలో నాకు కనిపించిన ఆలోచన యిదే. ఇప్పటికే తెలుగులో ఉన్న విజ్ఞానాన్ని ప్రపంచానికి ఎందుకు చాటిచెప్పకూడదు. ఎలా అయితే సంస్కృతం ఇప్పుడు వాడుకలో లేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల పరిశోధనాశాలల్లో కనిపిస్తున్నదో అలాగే తెలుగుభాష ఎందుకు ఉండకూడదూ? అయితే యీ వ్యాఖ్య మొదట్లో చెప్పినట్టుగా, ఆ విజ్ఞాన స్వరూపం ఏమిటో వ్యాసకర్తలు స్పష్టంగా చెప్పలేదు. అంతర్గతంగా, వారు తెలుగు సాహిత్యంలో అలాంటి విజ్ఞానం ఉన్నదని నమ్మినట్టుగా నాకనిపించింది. వారు చెప్పిన అంశాలన్నిటికీ యిది చాలా కీలకమైనది. దాని స్వరూపాన్ని మరికాస్త వివరించి ఉంటే బాగుండేది. ఈ నమ్మకాన్ని మనం ఆమోదిస్తే, అది ప్రపంచం వ్యాప్తం కావడానికి వారు చూపించిన మార్గాలు సమంజసంగానే తోస్తాయి. ఇది పైరెండు ఆలోచనా మార్గాల కన్నా కొంత సుగమమే అనిపిస్తోంది. అయితే, ఈ దృష్టి, తెలుగుభాషని ఒక సజీవభాషగా కాక, సంస్కృతంలాగా ఒక మ్యూజియంలో భద్రపరచదగ్గ భాషగానే చూస్తోందేమోనన్న అనుమానం కొంత గొంతుక్కి అడ్డం తగులుతోంది. తెలుగుభాషని “సజీవంగా”, అంటే జనాలు ఎక్కువగా మాట్లాడుకొనే భాషగా మిగల్చడానికి మార్గం యిది కాదని కచ్చితంగా చెప్పవచ్చు.
తెలుగు ప్రభుత్వం కాని ప్రజలు కాని, తమ శక్తియుక్తులనూ సమయాన్నీ, తెలుగుభాషని సజీవంగా ఉంచే ప్రయత్నానికి వినియోగించాలా (దానివల్ల ఫలితముంటుందా?), లేక ప్రపంచ విశ్వవిద్యాలయాలలో పరిశోధనా యోగ్యమైన భాషగా తీర్చిదిద్దాలా అనేది ప్రస్తుతానికి నాకొక భేతాళ ప్రశ్నే!
చర్చ ముగించానన్న తఃతః గారిని మళ్ళీ చర్చలోకి లాగాలన్న చిలిపి కోరిక యీ వ్యాఖ్య వ్రాయడానికి రెండో కారణం. 🙂
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
06/07/2015 3:09 pm
నిజమే తేడా ఉంది. కాని, ఇది ప్రస్తుత వ్యాసాంశానికి సంబంధంలేని విషయం కాబట్టి, ఇంకా కొనసాగించడం ఇంకో పక్కదోవలోకి దారితీయడం.
———
విధేయుడు
-శ్రీనివాస్
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
06/04/2015 3:49 am
బహుశా ఒక్క వెల్చేరు గారు తప్ప మనలో అందరమూ – రచయితలైనా పాఠకులైనా- తెలుగు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి తెలుగు చదువుకోలేదు, నేర్చుకోలేదు అనుకుంటాను. వెయ్యేళ్ళపై బడ్డ భాషను, ఎంతో మంది కవులు, కళాకారులు, మేధావులు, దార్శనికులు వాడిన భాషను “నేర్చుకోవడం” అంటే ఏమిటో కూడా మనం ప్రశ్నించుకోవాలేమో. ఇప్పుడున్నాయో లేదో కాని, కొన్నేండ్ల కింద వరకు రైల్వే స్టేషన్లలో పుస్తకాల బండి మీద “Learn Telugu in 30 days, Learn Tamil in 30 days” అన్నవి కనపడేవి. కేవలం నెల రోజుల్లోనే తెలుగు నేర్చుకోగలిగితే, అదీ ఒక చిన్న పుస్తకంతోనే సాధ్యమైపోతే ఇక వేరే పుస్తకాలు, కోర్సులు, టీచర్లు, విశ్వవిద్యాలయాలు ఎందుకు? నేర్చుకునేవాళ్ళు ఎట్లా నేర్చుకున్నా, నేర్పించడానికి, ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియనివి నేర్చుకోగలగడానికి వ్యవస్థలు అవసరం.
వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా, లోపాలు దిద్దుకుంటాం కాని వ్యవస్థలే అవసరం లేదు అనలేము. “విశ్వవిద్యాలయం” అన్న పదం పుట్టకముందే తెలుగు పుట్టింది, పెరిగింది. కాని, ఇప్పడున్న కాలంలో, తెలుగు నేర్పే వ్యవస్థల పేర్లేవైనా, నిర్వహించే సంస్థలేమైనా, కొంత నిలకడ, నిబద్ధత ప్రజల పైసలతో ప్రభుత్వ సహకారంతో నడిచే విశ్వవిద్యాలయాలలో కనిపించడానికే అవకాశం ఎక్కువుంది. అంటే చిత్తశుద్ధితో నడిచే, నడిపించే వేరే సంస్థలు తక్కువా అని కాదు.
రామానుజన్ యూనివర్సిటీకి పోకుండానే గణితంలో మేధావి అయ్యాడు అని మన పిల్లలను యూనివర్సిటీలకు పంపడం మానుకోము, మనం చదివిన బడులు, యూనివర్సిటీలలో లోపాలు బాగా మనకు తెలుసు కాబట్టి, వాటిని మూసేసుకోము. లోపాలు లేని వ్యవస్థలు లేవు. కాని తెలుగు భాషకు వ్యవస్థలే లేవు అన్న లోపం మాత్రం లేకుండా, రాకుండా చూసుకోవాల్సిన దార్శనికత, బాధ్యత తెలుగు వారందరిదేమో అనిపిస్తుంది.
———–
విధేయుడు
-శ్రీనివాస్
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
05/31/2015 3:18 pm
బ్రిటిష్ వాళ్లు ఇండియా వచ్చి తిష్ట వేసిన కొత్త రోజులలో వారికి ఒక సమస్య ఎదురయింది. “ఇంగ్లీషేతరులకి” ఇంగ్లీషు ఎలా నేర్పించాలి అని. వారి మాతృభాష ఇంగ్లీషే కాబట్టి ఎవ్వరూ నేర్పకుండానే వారికి ఇంగ్లీషు వచ్చేసింది. పాఠశాలకి వెళ్లి నేర్చినది రాయడం, చదవడం. కాని భారతీయులకి ఇంగ్లీషు నేర్పబూనుకున్నప్పుడు ఆ పని ఒక క్రమ పద్ధతిలో ఎలా చెయ్యాలో కనిపెట్టడానికి అప్పటి యూనివర్శిటీలు కష్టపడే ఉంటాయి. ఇండియా అంత పెద్ద మార్కెట్ లేకపోతే “రెన్” గ్రామరు వంటి పుస్తకాలు బ్రిటన్లో ఎవరికి కావాలి?
తెలుగు విషయం వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉంది. ఒకటి, ఇంగ్లీషుకి ప్రపంచం లోను, హిందీకి ఇండియాలోను ఉన్న “రాజకీయ బలం” తెలుగుకి లేదు. కనుక తెలుగు పరిస్థితిని లేవనెత్తడానికి చేసే ప్రయత్నాలన్నీ ఏటికి ఎదురీత లాంటివే. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ “ఈత”ని ఈదాలి. రెండు, మన పిల్లలకి, మనవలకి తెలుగు నేర్పి అదే మన గమ్యం అని ఊరుకోదలుచుకుంటే ఈ చర్చ అనవసరం. లేదు, కాదు, తెలుగేతరులు కూడ తెలుగు నేర్చుకోవాలని అనే గమ్యం కూడ ఉంటే తెలుగుని రెండవ భాషగా నేర్పడం ఎలా అన్న విషయం మీద పరిశోధన అవసరం. అటువంటి పనిని ఆదివారం పాఠశాలలు కంటె విశ్వవిద్యాలయాలు చేస్తేనే రాణిస్తుంది. – వేమూరి
కవికులగురువు గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:
05/30/2015 10:50 am
శ్రీమద్రామాయణం – శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు. ఆర్షవిఙ్ఞాన ట్రస్టు – హైదరాబాద్ (పది సంపుటాలు)
రఘువంశం – శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రీ. తెలుగు విశ్వవిద్యాలయం – హైదరాబాద్.
(ఇప్పుడు అమ్మకానికి ప్రతులున్నాయో లేదో తెలియదు. కాని అన్ని కాలేజ్ లైబ్రరీల్లో దొరకవచ్చు)
-భాస్కర్
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
05/26/2015 4:19 pm
శ్రీనివాస్ మంచి అంశాలు లేవనెత్తేరు. సాహిత్యేతర రంగాల్లో కూడ – అంటే, వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో, విపణి వీధులలో – తెలుగు వాడకం పెరగాలి. వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో రాసేవాళ్లని, రాయగలిగేవాళ్లని చేతి వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఈ దిశలో ఈమాట ఏదో ఉడతాభక్తితో చేయూత ఇస్తోంది కాని మన దేశంలోని పత్రికలలో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. తెలుగుని కొంచెం సరళీకృతం చెయ్యాలి కూడ. క్షమించండి. ఒక ఇంగ్లీషు పలుకుబడిని తెలుగుకి అనువర్తిస్తూ ఇంగ్లీషులోనే చెప్పనివ్వండి. Telugu is too important to be left alone in the hands of Telugu pundits.
– వేమూరి.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/26/2015 3:22 pm
చుట్టూ ఉన్న పరిస్థితులని జాగ్రత్తగా పరిశీలించి, పై పై పటారాలను తోసిపుచ్చుతూ, అవేశం ఆవేదనలకు లోను కాకుండా ఆలోచనతో విశ్లేషిస్తూ, అంతకు మించి సహృదయంతో ఉపయోగపడే సూచనలు అందిస్తూ సాగిన వ్యాసానికి వెల్చేరు పరుచూరి గార్లకు చాలా కృతజ్ఞతలు.
మొత్తం వ్యాసంలో ఎన్నో అంశాలు పూర్తిగానో పాక్షికంగానో అంగీకరించేవి ఉన్నా, చివరి వాక్యం మాత్రం అంగీకరించలేకపోతున్నందుకు క్షమించాలి.
నిస్సందేహంగా ప్రయాణం దూరం. ఇక, తెలుగు అంతర్జాతీయ భాష అవుతుందో, కాదో, అసలు అవ్వాలో లేదో అన్న విషయాలను పక్కకు పెడితే– సజీవ భాషగా తెలుగు పరిపుష్టం అవడానికి సాగే ప్రయాణం విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల్లో పుష్పిస్తుంది, విస్తరిస్తుంది, ఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది. కాని, ప్రయాణం అంకురించేది మొదలయ్యేది మాత్రం తెలుగు ఇళ్ళలో గళాలలో కలాలలోనే అని అనిపిస్తుంది.
రాజుగారి క్షీరాభిషేకానికి నావంతు నీళ్ళు పోస్తే ఏమవుతుంది అనుకొని అందరూ నీళ్ళే పోస్తే పాలు మిగలనట్లు, ఎన్నో రంగాలలో ఎన్నో విద్యలలో తెలుగువారికున్న విజ్ఞాన సాంకేతిక సంపద తెలుగు రూపంలో వ్యక్తీకరింపబడనంత వరకు భాషకు నీటి సహాయమే కాని, పాల సహాయం అందనట్లు అనిపిస్తుంది. చిన్న ఉదాహరణ మచ్చుకి- ఈ రోజు Computer Science విషయాలు వెతుకుతే చైనీసు భాషలో అక్కడక్కడా, German భాషలో అడపా దడపా articles కనిపిస్తాయి. కాని, తెలుగులో “లేవు” అనకుండా ఎంత తక్కువో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. Qualitative వ్యాప్తికి, వాడుకకు, విశ్వవిద్యాలయాల కన్నా జన చైతన్యమే ఎక్కువ దోహదం చేస్తుంది అనిపిస్తుంది.
అయితే, భాషకు సరళీకృతం కాని వ్యాకరణం, ముందుకు సాగడానికి కాళ్ళకు బంధనంగా అడ్డుపడుతుంది. తెలుగులో కనీసం వాడుకునే అక్షరాలు, చేస్తున్న లేదా చేయాల్సిన సంధులను సరళీ కృతం చేస్తూ సహాయపడే వ్యాకరణాంశాలను dry పొడిగా కాకుండా ఆకట్టుకునే రీతిగా విద్యార్థులకు ఎప్పుడు కూర్చుకుంటామో తెలియని స్థితి. తెలుగు చదివే విద్యార్థులు వ్యాకరణం అంటే “వాకరణా క్యా కరనా” అని తల పట్టుకునే స్థితి మారాలి. తెలుగులో చదివితేనే స్పష్టంగా హాయిగా ఉంటుందనే స్థాయికి రచనలు వచ్చిన నాడు తెలుగు తానంతట తనే అంతర్జాతీయ భాష అవుతుంది అని కూడా అనిపిస్తుంది.
===========
విధేయుడు
_శ్రీనివాస్
చంపకోత్పలమాలల కథ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:
05/23/2015 3:08 am
మీరన్న అవధారణార్థక ప్రత్యయం ఇక్కడ పొసగదు; (నీవు +అ =నీవ) లాంటి వాడుక కద్దు. పద్యంలో అన్వయ క్లేశమున్నది, కాదనను;దాన్ని దూరం చేసే మార్గాలు లేకపోలేదు. ఊహలు పారిన మేర అర్థాన్ని విస్తరించడం ప్రమాదం. భ్రమప్రమాదాలకు లోనయ్యే సందర్భాల్లో Hermeneutics (అర్థ మీమాంస) ఎంత గానో ఉపకరిస్తుంది.
అర్థము శాశ్వతమన్న భావము ఈ దాన శాసనం వచ్చిన చారిత్రిక సందర్భంలో ఇముడు తుందా ?? ఇమడదు, కావున దేశ్యమైన ప్రత్యయాన్ని తత్సమాలకు వర్తింప చేయడం దురన్వయం కాక తప్పదు. తావో తే చింగ్ అనువాదంలో eternal Tao అనడం తప్పు అంటాడు ఒక పండితుడు, కారణం eternal అని దేన్ని ఆధునికులు భావిస్తున్నారో ఆ ఊహే ఆ కాలానికి లేదు.కావున , ఊహా వృత్తానికి వ్యాసార్ధం చారిత్రిక సందర్భం కాక తప్పదు.
“ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. ” అన్న ప్రసాద్ గారి అభిప్రాయం సబబు :
నా అనుమానమల్లా వ్యర్థమటంచు అన్న పాఠం తప్పు . రత్తి గుఱించి అన్నదే సరయినదని.
ప్రాచీన కాలపు లేఖన పద్ధతుల్లో అత్థ౯ము = అర్థము ; రత్థి౯ =రర్థి ;
లేఖక ప్రమాదం థ వత్తు త వత్తుగా మారడం ( రత్థి౯ –>రత్తి౯ )
కాలక్రమేణా లిపి చెరిగి ౯ జారిపోవడం (రత్తి౯ –>రత్తి )
రత్తిగా మారడంతో అర్థావబోధ !!
———-మరో పాఠం —-
అర్థమశాశ్వతమ్ము యొడలన్నది తక్షణ భంగురమ్ము త
త్వార్థముగాదు జీవము కృతాంతక మారక మిట్టి దీని మీ
రర్థి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు చేటులేని ధ
ర్మార్థమ చేయుడీ మనుజులమ్మెన పెగ్గడ యట్లు వేర్మితో
(కడప జిల్లా శాసనాలు- మొదటి భాగం ( సం. పరబ్రహ్మ శాస్త్రి )శాసన పాఠం అనుసరించి ) ఇప్పుడు అర్థ బోధకు వచ్చిన చిక్కు లేదు, ఛందో భంగం లేదు
అర్థి =కోరిక , ఆసక్తి ;గుఱించి=ఉద్దేశించి , నిర్ణయించి ; నమ్మక పరాత్థ౯ము
నెన్నణ్డు చేటు లేని ధర్మాత్థ౯మ ( ధర్మాత్థ౯ము + అ ) చేయుణ్డి
(వర్గాక్షరంతో కూడిన వర్గానునాసికం , తేల్చి పలుక వలసినదే , ఇలాంటి రూపాలు అద్దంకి పద్య శాసనం నిండా కనిపిస్తాయి )
————-
కడప జిల్లా శాసనాలు సంస్కృతీ చరిత్ర అన్న పరిశోధనా గ్రంథంలో అవధానం ఉమా మహేశ్వర శాస్త్రి గారి పరిశీలన ఎన్న దగినది
” అనిత్యాని శరీరాణి విభవోనైవశాశ్వతః
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః
శరీరాలు అనిత్యమైనవి , సంపదలు అశాశ్వతమైనవి. మృత్యువు ఎల్లప్పుడు పొంచి వుంది. కాబట్టి, ధర్మసంగ్రహమే కర్తవ్యం. ఈ విధమైన ఆశయం ప్రాచీన కాలంనుండి భారత దేశంలో ధర్మానురక్తులైన వారందరూ పయనించిన ఘంటా పథమైంది.
పైన చెప్పబడిన శ్లోకానికి అనువాదమని చెప్పదగిన పద్యమొకటి క్రీ.శ 9 లేదా 10 వ శతాబ్ది నాటి చిడిపిరాల శాసనంలో వుంది. ”
ఆయన ఉదహరించిన పద్యం మన చర్చలోని ఉత్పలమాల అని వేరే చెప్పాలా??
కాబట్టి, మోహన తాత్పర్యానికి చేటు లేదు
“ధనము శాశ్వతమైనది కాదు. శరీరము నశ్వరమైనది. జీవము తత్వార్థము కాదు. యమునిచే దండనార్హమైనది. దీనిని నమ్మరాదు. పరార్థానికై, ఎన్నడు మాసిపోని ధర్మార్థమును అందఱు అమ్మన ప్రెగ్గడలా గొప్పగా చేయండి. ”
తమ్మినేని యదుకుల భూషణ్
శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:
05/22/2015 11:06 pm
* “శైలి అద్భుతం దమయంతీ.” –
🙂 ఎంత గొప్పేస్తోందో! మీ అంత సీనియర్ రచయిత్రి నించి ప్రశంస నందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా – లక్ష్మి అక్కా! నమస్సులతో..
* లతా, చాలా థాంక్స్ రా. మన వూరు ఎంత అందమైన వూరో కదూ? మన వాళ్ళు కూడా! 🙂
* “ఆతయ్య విషయానికొస్తె ఆ పాత్ర సజీవత్వంతొ మనసులొ ముద్ర వేసీంది.”
…లక్ష్మి మాధవ్! నాకు కూడా చాలా ఇష్టం ఆమె అంటే. చాలా దగ్గర్నించి చూశానేమో నా మనసులో ఆమె అలా.. ఒక చిత్రమై పోయింది. చిత్రమే! నాకు ఇప్పటికీ..ఎప్పటికీ అర్ధం కాని ఒక చిత్రమే.థాంక్సండి మీ స్పందన నన్నెంతగానో అలరించింది. చివర్లో ప్రశంస భలే థళుక్కుమందనుకోండి. నిజం. 🙂 థాంక్ యు సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ లక్ష్మి!
శుభాకాంక్షలతో..
అదే నేను గురించి Damu ndm గారి అభిప్రాయం:
05/22/2015 4:22 am
రాధా మేడం గారు, నాకు కవితలు గురించి అంతగా తెలియదు, కాని ప్రతిఒక్కరి మనసులో దాగివున్న “నేను” అనే విషయాన్ని ఈ కవిత ద్వారా తెలియచేసినందుకు ధన్యవాదాలు.
దాము
కురబలకోట రైల్వే స్టేషన్
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి మోహన గారి అభిప్రాయం:
05/12/2015 7:29 pm
“జాతీయ భాషగా తెలుగు” – నాకు అర్థము కాలేదు, తెలుగు ఆంగ్లము, హిందీల వలె అధికార భాష (official language) కాదు, కాని మిగిలిన చాల భాషలతో తెలుగు జాతీయభాషయే (national language) కదా? మఱి ఈ పరిరక్షణ సమితి ఉద్దేశము ఏమిటో బోధపడడము లేదు. ఈ ప్రవేశ రుసుము (registration fees) అన్ని సమావేశములకు ఉన్నాయి, అందులో ఆశ్చర్యము ఏమియు లేదు. 400 రూపాయలు చాల తక్కువే. విధేయుడు – మోహన
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Bhaskar గారి అభిప్రాయం:
05/09/2015 10:51 am
భాష అంతర్జాతీయమా కాదా అన్నది అంత ముఖ్యం కాదు. అది జీవభాషగా నిలుస్తోందా లేదా అన్నది ముఖ్యం. దానికై చేయబడుతున్న కృషి గురించి చర్చించలేదు.
ఉదాహరణకి సిలికానాంధ్రా మనబడి, పలు దేవాలయాల్లో, సాంస్కృతిక కేంద్రాల్లో ఎందరో శ్రమకోర్చి నడిపే తెలుగు బడులు కృషి ఎత్తిచెప్పబడలేదు.
ఇక్కడ విశ్వ విద్యాలయాల్లో నాలుగు “కుర్చీలు”, పత్రికలు నడిపి నాలుగు తెలుగులో శాస్త్రీయ వ్యాసాలూ వ్రాస్తే తెలుగు అంతర్జాతీయ భాష అయితే చప్పట్లు కొట్టుకుంటే సుఖమేమిటి? ప్రజలు మాట్లాడాలి.
ప్రజలు మాట్లాడాలంటే, చిన్నప్పటినుంచీ నేర్చుకోవాలి. తెలుగునాట బడుల్లో నేర్పాలి. ఇక్కడ కూడా బడిలో ఒక పాఠ్యాంశంగా నేర్చుకునే అవకాశం ఉండాలి.
ఈ దిశలో ఒక ప్రయత్నాన్ని ఈ లింక్ లో చూసి హర్షించండి.
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=107888&SupID=42
ఈ వ్యాసంలో సూచించినవి తెలుగు ఒకస్థాయికి చేరుకున్న తర్వాత జరవలసినవి. ఇవే సమస్యకి పరిష్కారాలు కావని నా అభిప్రాయం.
తెలుగులో సాంకేతిక సమాచార ప్రచారం గురించి చెప్పేవారికి విన్నపం.
నేను బి యస్సీ వరకూ తెలుగులోనే చదివా. ఎం ఎస్సీకి వచ్చి నానాపాట్లూపడ్డా.
నాలాంటివాళ్ళు కొన్నివేల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు (ఒక 45 సంవత్సరాలుగా చదివిన వాళ్ళు.)
సాంకేతిక విషయాలు చెప్పేందుకు ఒక నిర్దిష్టమైన పదజాలం కావాలి.తెలుగు అకాడమీ దాన్ని 10,15 సంవత్సరాల్లో తయారు చేసింది. అయినా ఎవరిష్టం వారిదన్నట్టు వ్రాస్తున్నారు. అంతవరకూ ఎందుకు? ఈ ఈమాటలోనే అనుకుంటా, ఒకాయన ఒకవ్యాసం వ్రాసారు. గొప్ప వ్యాసమే, కాని ఆయన స్వంత పరిభాషలో. ఏంచెప్తున్నారో తెల్సుకునే సరికే కష్టమైంది. నాలా తెలుగులో శాస్త్రాలు చదివినవాడికి, ఈ పునశ్చక్ర పరిశోధన దేనికి అనిపిస్తుంది. ప్రభుత్వం అది చెయ్యాలి, ఇది చెయ్యలని ప్రతిపాదించడమే కాని, ఇలా ఉన్నదాన్ని కూడా వాడుకోలేని పరిస్థితి మనది.
ఈ శీర్షికలో స్పందించే అందరికీ తెలుగుపట్ల అభిమానముంది. కాబట్టి మన అందరి శక్తినీ ఒక ఉపయోగకరమైన దిశగా తిప్పుకోవాలి.
చివరిగా ఒక ప్రశ్న: దీన్ని ఒక వ్యాసంగా కాకుండా, అతిథిసంపాదకీయం అనడంలో ఉద్దేశ్యమేమిటో అర్ధం కాలేదు.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి శివశంకర్ అయ్యలసోమయాజుల గారి అభిప్రాయం:
05/08/2015 6:28 pm
వేల్చేరుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుత ఆర్ధిక, సాంఘిక పరిస్థుతుల ప్రభావం తెలుగు భాషాభివృద్ధి పై ఎలా పడుతుందో చక్కగా చెప్పారు. కాని ప్రస్తుతం భారతదేశంలో నైతే నేమి, పాశ్చాత్య దేశాలలో నైతే నేమి, లేక అమెరికాలో నైతే నేమి -ఉన్న విద్యావిధానం అణుమాత్రమూ ప్రశంసనీయం కాదనే విషయాన్ని నిరాకరించే వారు ఎక్కువమందే ఉంటారు అని నా అభిప్రాయము. దీనికి కారణం మారుతున్న సాంఘిక వ్యవస్థలు, ఆర్ధిక పరిస్థితులు, రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు, అతలా కుతలముగా ఉన్న కుటుంబ జీవనాలు, దుర్హంకారాలతో నడుస్తున్న రాజికీయాలు, సంసారాలకు సంసారాలు కూలిపోతున్నాయి, వ్యక్తి జీవితానికి భద్రతలేని వ్యవస్థలు వీటివల్ల తరతరాలుగా మానవుడు మధించి అనుసంధానించిన ఆధ్యాత్మిక నైతిక భాషా నిపుణ్య విషయాలకు గౌరవం లేకుండా పోతుంది.
అందువల్ల, భాషాభివృద్ధి స్కూళ్ళ నుండి మొదలుకావాలి. అది మొదలు కావడానికి మంచి వేతనం, గౌరవంతో కూడిన ఉపాధ్యాయులను నియమించాలి. దానికి ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం. అటుపై, అది కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకు ప్రాకాలి, అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తెలుగు కు సంబంధించిన భర్తీలను పెంచాలి. అవసరం ఒక్క భర్తీ అయినా రెండు లేదా మూడు భర్తీలను నియమించాలి. ఉద్యోగం కొశం చదువుతారు అది వచ్చాక ఆ కొద్ది మందిలో కొదరైనా మీరు చెప్పిన విధానాలను పాటించవచ్చును.
వ్యాసకర్త చెప్పినట్లు విశ్వ విద్యాలయమల ప్రాముఖ్యత చాలా అవ్సరము. దానిని ప్రభుత్వము జీవనోపాధితో ముడిపెడితే గాని అభివృద్ధి జరుగదు. ఇంగ్లీషు విషయము తీసుకోండి, ఈరోజు ఎంగ్లీషులో ఎం.ఎ. లేదా పి.హెచ్.డి. చేస్తే చేసినవాడికి ఖచ్చితంగా తెలుసు ఏదో కార్పొరేటు కాలేజీలో నైనా లేదా బయట ఎక్కడైనా ఉద్యోగము దొరుకుతుందని నమ్మకము ఉండగానే ఉంది. తెలుగు అభివృద్ధి చెందాలంటే ప్రజలకి ఈ ఆశని కల్పించాలి.ఇక భాషమీద మక్కువ ఉండి విద్య నేర్చుకునే వారికి, మీరు చెప్పినట్లు పత్రికా సంస్కరణ ఖచ్చితముగా కావలెను.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి వాచస్పతి గారి అభిప్రాయం:
05/08/2015 8:49 am
ఈ వ్యాసంలో తెలుగు భాషాసారస్వతాల యొక్క ప్రాచీన మూలాల పట్ల గౌరవం లేకపోగా పైపెచ్చు చాలా నీచ/హీనభావమూ, చులకన ధోరణీ ధ్వనిస్తున్నాయి. అందుచేత దీని రచయితల కన్సర్నులలోని నిజాయితీ అనుమానాస్పదం కనుక అవి భాషాభిమానుల సానుభూతికి నోచుకోదగ్గవి కావు. ఒకవేళ తెలుగు నిజంగానే అంతర్జాతీయ భాష అయ్యే రోజొస్తే ప్రపంచం మనల్ని తప్పకుండా అడగబోయే ప్రశ్న: “మీ ఆదికవులెవరు?” అనే తప్ప “గురజాడ ఎవరు? శ్రీశ్రీ ఎవరు? తిలక్ ఎవరు?” అని కాదు. తమ పూర్వీకులకి గౌరవం ఇవ్వడం చేతకానివారు తమ తరువాతి తరాల నుంచి దాన్ని ఆశించడానికి అనర్హులవుతారు. అయిదో పండు తిన్నందువల్లనే ఆకలి తీరిందనీ అందువల్ల ముందు తిన్న నాలుగు పళ్లూ వేస్ట్ అనీ అనుకున్నాడట వెనకటికో ప్రబుద్ధుడు.
[వ్యాసం సరిగ్గా చదివి అర్థం చేసుకోకుండా వెల్లడి చేసే అభిప్రాయాలు కూడా సానుభూతికి నోచుకోదగ్గవి కావు, వాచస్పతి గారూ – సం.]
కవికులగురువు గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
05/07/2015 2:34 pm
శ్రీభాస్కర్ గారి వ్యాసం కాళిదాసంటే గొప్పకవి అని అందఱూ చెప్తున్నా, ఆయన ఎందుకు గొప్పకవియో అనే అంశాన్ని తెలియనివాండ్లకు ఈ అంశాన్ని కొంతవఱకు విశదం చేసే విధంగా సాగింది. దీనికి వారికి నా అభినందనలు. కాని కొంత సూక్ష్మంగా చూస్తే ఎందుకో ఏమో అనేకశ్లోకాలలో ముద్రారాక్షసాలు కనిపించినాయి. శరీరంలో పుండులాగ ఇవి పరిహార్యము లని తలచి, నాకు దట్టిన ఆ దోషములను, వాని సవరణలను ఇక్కడ పేర్కొంటున్నాను. అసందర్భం కాదు కనుక వారిచ్చిన ఋతుసంహారంలోని మూడు శ్లోకాలకు నా ఆంధ్ర ఋతుసంహారంలోని అనువాద రూపాలను కూడా ఇస్తున్నాను. దోషాల ప్రక్కనే సవరణలను బ్రాకెట్లలో చూపెట్టినాను.
సదా మనోఙ్ఞం స్వనదుత్సవోత్సుకం వికీర్ణ విస్తీర్ణ కలాపి(ప) శోభితం
ససంభ్రమాలింగనచుంబనాకులం ప్రవృత్తనృత్యం కులమద్యబర్హిణం(ణామ్)
చ.సతతము సుందరంబులయి,సంస్వనదుత్సవతత్పరంబులై,
వితతవిలోలవిస్ఫుటితపింఛములై,అనురాగసంభ్రమా
యతిఁ బరిరంభచుంబనసమాకులితాంగములై మయూరముల్
ప్రతినవనర్తనంబుల విరాజిలె నభ్రరవానుకారులై.
నితాంత లాక్షారసరాగరంజింతైః (రంజితైః)నితంబినీనాం చరణైః సనూపురైః
పదే పదే హంసరుతానుకారిభిః జనస్య చిత్తం క్రియతే సమన్మథమ్
తే.గీ. పదపదంబున హంసలపలుకు లూను
హంసకంబుల నందమై, యావరసము
చేత నరుణంబులై యున్న స్త్రీలపదము
లతనుసందీపన మొనర్చు నభికతతికి.
ఆమ్రీ మంజులమంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః
జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితం
మత్తేభో మలయానిలః పరభృతా యద్ద్వందినో లోకజిత్
సోఽయం వో వితరీతరీషు (వితరీతరీతు)వితనుర్భద్రం వసంతాన్వితః
ఉ. ఎవ్వని విండ్లు కింశుకము, లెవ్వని బాణము లామ్రమంజరుల్,
ఎవ్వని మౌర్వి తేఁటిగమి, యెవ్వని తెల్లని ఛత్ర మిందుఁడున్,
ఎవ్వని దంతి గంధవహుఁ, డెవ్వని బంట్లు పికాళి, లోకజి
త్తెవ్వఁడు తత్స్మరుండు ప్రజ కిమ్ము లొసంగుతఁ జైత్రయుక్తుఁడై.
అసంశయం క్షత్రపరిగ్రహక్షమా య దార్య మస్యా మభిలాషి మే మనః
సతాం పి (హి)సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః
ఇందీవరశ్యామతనుర్ నృపోఽసౌ త్వం రోచనాగౌరశరీరయష్టిః
అన్యోన్యశోభా పరివృద్ధయే వాం యోగస్తటిట్టో(త్తో)యదయో రివాస్తు
అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహై
రనావిద్ధం రత్నం మధు నవ మనాస్వ(స్వా)దితరసమ్
అఖండం పుణ్యానాం ఫలమివ అ (చ)తద్రూప మనఘం
న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః
[కృతజ్ఞతలు దేశికాచారి గారూ. ఆ తప్పులని వెంటనే సవరిస్తాము – సం.]
రీ యూనియన్ గురించి Nandamudi venkata subbaeao గారి అభిప్రాయం:
05/06/2015 11:12 pm
మేడం…కవిత వాస్థవికతకు దగ్గరె….కాని మా గుంటూర్ మెడికల్ కాలెజీ 40 సంవత్సరాల రి యూనియన్….నమ్మలెంత భిన్నం గా జరిగింది…అది అత్యంత అనందపు పండగ…..
అభినందనలతొ. ఏన్ వి యెస్.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి M.V.Ramanarao గారి అభిప్రాయం:
05/06/2015 2:18 pm
నాకెంత ఆసక్తి ఉన్నా ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్న ప్రముఖుల. పండితుల అభిప్రాయాలతో ఏకీభవించడం తప్ప మరేమీ చెయ్యలేను. వారంతా రాసిన వాటిని ఇంకా బాగా అద్యయనం చెయ్యాలి. ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాడకం బాగా అభివృద్ధి చెయ్యాలి. విదేశాల్లో ఉన్న తెలుగువారిలో కూడా కృషి చెయ్యాలి. ప్రభుత్వాలనుంచి వాగ్దానాలు, నామమాత్ర సహాయం తప్ప ఆశించలేము. పెద్దేత్తున ఆర్థిక సహాయం అవసరం ఉండాలి. కాని అది ఎలా సమకూడుతుందన్నది చిక్కు ప్రశ్నే. తెలుగు అంతర్జాతీయ భాష కాకపోయిన కొన్ని యూరప్, ఏసియా దేశాల భాషల్లాగ దాని అస్తిత్వాన్ని నిలబెట్టుకొంటే చాలు.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి పాలూరి వెంకట రామారావు గారి అభిప్రాయం:
05/04/2015 11:44 pm
పెద్దలకు వందనాలు, రచయితలకు అభివాదాలు.
పైన గన్నవరపు గారి అభిప్రాయ్ంతో నేనూ ఏకీభవిస్తాను. ప్రస్తుతం తెలుగు అంతర్జాతీయభాష కావలసిన ఆవశ్యకత ముందు మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. అసలే మన సాధారణ ప్రజానీకానికి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే భాషపట్ల మక్కువ, మమకారం కాస్త తక్కువే అని చాలాచోట్ల చర్చించుకోవటం పరిపాటి. చదువుకున్న వారూ మేధావులూ వ్రాసే భాషకూ దారినిపోయే వారు మాట్లాడే వాడుకభాషకూ కూడ వ్యత్యాసం ఎక్కువే! వ్రాయడానికి కూడ ఒక ప్రమాణికమైన తెలుగు భాష లేదని ఇతరభాషలతో తులన చేసిన మోహన గారి లాంటి పెద్దలు పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఇవన్నీ ఒక యెత్తైతే, అచిరకాలం క్రితమే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలూ తమ ఉనికినీ భాషాసంస్థలనీ పునర్నిర్మించుకోవడమే ఒక కొలిక్కి రాలేదు.
ఈ పరిస్థితులలో తెలుగును అంతర్జాతీయ భాషగా ముందుకు త్రోయడం దేనికి? ఎవరి ప్రయోజనం కోసం? ప్రాచీన భాష హోదా వచ్చి తెలుగుకు ఒరిగిందేమిటో మామూలు ప్రజలలో తొంభైశాతం మందికి తెలియనే తెలియదు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఎవరిస్తారో, అటుపిమ్మట ఎవరు నిర్ధారిస్తారో ఒకసారి వస్తే చాలునో, నిలబెట్టుకుంటూ పోవాల్నో దేనికీ స్పష్టమైన సమాధానం దొరకదు..
అసలే మన భాషలో అల్పసంఖ్యాక మేధావివర్గానికీ – మిగతా సాధారణ ప్రజలకూ అంతరం చాల అధికం. వీలైతే ఈ అంతరాన్ని తగ్గించి, తెలుగును మరింత ప్రజలభాషగా చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఊహాత్మక తులనలపై భాషాశాస్త్ర వేదికలలో తెలుగు జండాని ఎగురవేయడం కన్నా ఇది తక్షణ అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే రచ్చకెళ్ళె ముందర ఇంట గెలవడం చాల అవసరం..
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Gannavarapu Narasimha Murty గారి అభిప్రాయం:
05/03/2015 1:43 pm
శ్రీ వెల్చేరు నారాయణరావు గారు కొన్ని మాసములు నాకు ఏలురులో కట్టమంచి రామలింగారెడ్డి కళాశాలలో తెలుగు ఉపాన్యాసకులు.తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తెలుగుభాషా పరిశోధకులుగా తరలారు .అందుచే వారు నాకు గురువులు. వారికి నా నమస్సులు. వారికి , శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి అభినందనలు. నేను తెలుగు భాషాభిమానిని. తెలుగు ప్రజలు వివిధ దేశాలేగి తెలుగు మాట్లాడుటచే తెలుగు అంతర్జాతీయ భాష అవునో కాదో అనే చర్చ నాకు అనవసరము . తెలుగు ప్రపంచ భాష అవాలనే ఆశ కూడా నాకు లేదు . విద్యార్థి దశలో ఉన్నత పాఠశాల వఱకు ఆంగ్లము ,హిందీ తప్ప మిగిలిన విద్య అంతా తెలుగు మాధ్యమములో చదువుకున్నాను . గణితశాస్త్రము , భౌతికశాస్త్రము , రసాయనశాస్త్రము ,జీవశాస్త్రము తెలుగులో సునాయాసముగా నేర్చుకొన్నాను . కళాశాలలో ఆంగ్లమాధ్యమమవడముచే క్రొత్తలో కొంచెము యిబ్బంది అయినా త్వరలోనే సర్దుకుపోయాము . వైద్యకళాశాలలో విద్యంతా ఆంగ్లములో జరిగినా రోగులతో సంభాషణలు తెలుగులో జరిగేవి. వారి రోగ చరిత్రను ఆంగ్లములో అనువదించి వ్రాసుకొని , వారి రోగము గురించి ,అవసరమయ్యే పరిశోధనల గురించి , చికిత్స గురించి ఆంగ్లములో వ్రాసుకొన్నా వారికి తిరిగి తెలుగులో వివరించి బోధ చేసేవారము .ఆంగ్లభాష పై వ్యతిరేక భావము లేకపోయినా వైద్యశాస్త్ర గ్రంధాలన్నీ తెలుగు భాషలో మనము అనువదించుకుంటే బాగుంటుందనే ఆశ ఎప్పుడూ ఉండేది . ఇప్పుడు వైజ్ఞానిక గ్రంధాలు , న్యాయశాస్త్ర గ్రంధాలు సకలము తెలుగులో అందుబాటులో ఉండాలనే ఆశ ఉంది .
తెలుగు ఎనిమిది కోట్ల ప్రజానీకానికి మాతృభాష . సంఖ్యాపరముగా ఇటాలియన్ , ఫెంచ్ , జపనీస్, గ్రీక్ , జర్మను ,పోర్చుగీస్ , భాషలకు తీసిపోదు. సంస్కృత భాషా పదజాలము కూడా మిళితమగుటచే విశేషపదజాలము గల భాష .మరి పై భాషలతో సమానముగా తెలుగు ఆధునిక పరిజ్ఞానముతో ఎదగ పోవడానికి అనేక కారణాలున్నాయి. ఫ్రాన్సు ,ఇటలీ , జర్మను ,జపాన్ ల వలె తెలుగు దేశము ( అలాగే వంగదేశము , కర్ణాటక ,తమిళనాడు ) ప్రత్యేక దేశమయితే తెలుగులోనే పరిపాలన పూర్తిగా సాగడమే కాక తెలుగు భాష వికాసము చెంది తెలుగులో వైజ్ఞానిక గ్రంధాలు అనువదించబడి ఉండేవేమో !భారతదేశము విఛ్ఛిన్న మవడము నా ఉద్దేశ్యము కాదు, గాని హిందీతో సమానముగా భారతీయ భాష లన్నిటికీ సమాన ప్రతిపత్తి కలిపించి మాతృభాష లన్నిటినీ అభివృధ్ధి చేసుకో వాలని నా అభిలాష .
తెలివితేటలు నైపుణ్యములు వ్యక్తులలో విభిన్నముగా గోచరిస్తాయి . కొందఱికి గణిత మలవడుతే కొందఱికి భౌతిక శాస్త్రము, కొందఱికి తెలుగు , కొందఱికి సంగీతము , కొందఱికి నటన సులభముగా అలవడుతాయి . అష్టావధానము చేసే కవులకు గణితశాస్త్రము కొఱకరాని కొయ్య అవవచ్చు. పాండిత్యమున్నా కవిత్వము రాకపోవచ్చును . అందుచే తెలుగు నభ్యసించే వారికి తెలివి లేదని చెప్ప రాదు. తెలుగులో వివిధ గ్రంధాలు ప్రచురించుకోవాలనుకుంటే ప్రభుత్వ పరముగాను , స్వఛ్ఛంద సంస్థల పరముగాను , తెలుగు సంస్కృత పండితులు , తెలుగుపై అభిమానము గల శాస్రజ్ఞులు, వైద్యులు ,న్యాయశాస్త్రా కోవిదులు ,అందఱూ సమిష్టిగా కృషి చెయ్యాలి. దానికి తగిన ప్రణాళిక, నాయకత్వము కూడా అవసరము. ఉగ్గుపాలతో ఆంగ్లమును పోసి ,పాఠశాలలలో తెలుగు బోధనను కుంటుపరుస్తే మనము ఉట్టికెగురలేని అమ్మలమే అవుతాము. పోషణ అన్నిటి కంటే ముఖ్యము. ఒకప్పుడు మనదేశము పేదదేశమే గాని యిప్పుడు మనకు తగిన వనరు లుండడమే గాక సాంకేతికాభివృధ్ధి మాతృభాషల నభివృధ్ధి చేసుకొనుటకు సహకరిస్తుంది.తెలుగు నిఘంటువులు అంతర్జాలములో అందుబాటులో ఉన్నాయి. విశ్వనాథ వారు గొప్పా , శ్రీశ్రీ గొప్పా వంటి చర్చల వలన ప్రయోజనము శూన్యము. సకల సాహిత్య ప్రక్రియలు తెలుగు భాష విస్తృతికి ప్రమాణములు. శ్రీ యెల్లాప్రెగడ సుబ్బారావు గారు తమ ఫోలికామ్లపు పరిశోధనలు తెలుగులో ప్రచురించ లేదు. రవీంద్రనాథ టాగూరు గీతాంజలిని ఆంగ్లములో అనువదించక పోతే ఆయనకు నోబెల్ బహుమానము దక్కేది కాదు. నాకే అధికారముంటే రాచకొండ విశ్వనాథశాస్త్రికి , విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆ బహుమానాలు ప్రదానము చేసే వాడిని. తెలుగు ప్రపంచభాష కానవసరము లేదు గాని స్వంత గడ్డలలో వికాసము చెందవలసిన అవసరావకాశము లున్నాయి. అందఱికీ వందనములు.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి BhavabhUti. K గారి అభిప్రాయం:
05/01/2015 9:25 pm
రచయితలిద్దరికీ అభినందనలు
మీ అభిప్రాయాలూ, సలహాలూ సమంజసంగానే ఉన్నాయి.
కాని, అవి అమలు కావాలంటే మోహనగారు ఆఖరి పేరా అక్షరసత్యం కావాలి.
పరిశోధనా రంగంలో ఉన్న మీరు గట్టి పి హెచ్ డీ ఎలా ఉండాలో చిన్న ఉదాహరణని ఇవ్వవలసింది.కనీసం దానికి కావలసిన రెండు మూడు మూలవస్తువుల్ని సూచించినా బాగుండేది. అభిప్రాయముఖంగా సూచన చెయ్యండి.
ఈ మధ్యనే న్యూయార్క్ టైంస్ ప్రపంచంలోని “బలమైన” 20 భాషల్లో 15 వ దానిగా పేర్కొంది. ఆశాజనకమైన వార్త. ప్రణాళికాబద్ధంగా వెడితే సాధించగలం. మనం అందరం ముందు నేర్వవలసింది – ఈ “పూర్వ సాహిత్యం” “ఆధునిక సాహిత్యం” మీమాంసలో కొట్టుకును పోకుండా ఉండడం. అది ఈ వ్యాసంలో కూడా చోటుచేసుకోవడం విచారకరం. రామరాజభూషణుడి వసుచరిత్ర ఎన్ని భాషల్లో కవులు తర్జుమా చెయ్యలేదు?
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి మోహన గారి అభిప్రాయం:
05/01/2015 7:29 pm
అంతర్జాతీయ భాషలు ఎలా ఆ స్థాయిని అందుకొన్నాయి అనే విషయమును ముందు చర్చించాలి. ఆంగ్ల భాషను మాట్లాడే నేటి ఇంగ్లండ్ అమెరికా, కెనడా, నేటి కామన్వెల్త్ దేశములైన ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండములలోని వివిధ దేశములను ఒకప్పుడు జయించి పాలించింది. బ్రిటిష్ సామ్రాజ్యము 20వ శతాబ్దపు మొదటి భాగము వఱకు సూర్యుడు అస్తమించని రాజ్యముగా నుండినది. అందువలన ఆంగ్ల భాష ఆ దేశములలో రాజకీయ, సాంస్కృతిక, విద్యా రంగములలో ముఖ్యమైన భాషగా వెలుగొందినది. అదే విధముగా ఫ్రెంచి భాష ఆఫ్రికా, ఆసియా ఖండములలోని దేశములలో, రష్యన్ భాష రష్యా, తూర్పు ఐరోపా దేశములలో వ్యాప్తి చెందినది. ఒకప్పుడు (సుమారు పది శతాబ్దాలకు ముందు) భారతీయ సామ్రాజ్యము కూడ ఆసియా దేశములలో వ్యాపించి యుండినది. ఆ కాలములో సంస్కృతము ఈ నాటి తూర్పు ఆసియా ప్రాంతములలో ఒక అంతర్జాతీయ భాషగా వికసించినది. అందులకు సాక్షిగా ఎన్నో శాసనాలు ఆ భాషలో ఉన్నాయి. అదే విధముగా తమిళ భాష కూడ దక్షిణ, పూర్వా ఆసియాలలో వ్యాపారము ద్వారా వ్యాపించినది. అలా తెలుగు భాష ఎక్కువగా వ్యాపించలేదు. అందువలన ఆ అవకాశము తెలుగు భాషకు లభించలేదు.
ఫ్రెంచి, ఆంగ్లము, జెర్మన్, రష్యన్, చైనా, జపాన్ భాషలు మాట్లడే దేశాలలో ప్రాథమిక విద్యనుండి, కళాశాలల వఱకు బోధనా భాష ఆయా భాషలు. కాని భారతదేశములో, తెలుగు రాష్ట్రాలలో, తెలుగు మాధ్యమములో ఎందఱు చదువుతున్నారనేది అందఱికీ తెలిసిన విషయమే. ఉట్టికెక్క లేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు, ఆయా రాష్ట్రాలలో బోధనా భాషగ లేని తెలుగు అంతర్జాతీయ భాషగా మారబోతుందా అన్నది పెద్ద సందేహమే!
రాజకీయమును పూర్తిగా త్రోసి పారేయకండి. రేపు తెలుగు రాష్ట్రాలు దేశములో ఒక ఉన్నత స్థితికి వచ్చిందంటే, ఎందరో విదేశీయులు అక్కడికి వస్తారు. వారు భాష నేర్చుకొంటారు. అందుకు రాష్ట్రాల ప్రగతి ఒక ముఖ్యాంశమే.
బయటి దేశాలలో ఆచార్య పదవులు స్థాపించి పరిశోధనలు చేసి, పుస్తకాలను ఆంగ్లములో తర్జుమా చేసి పాఠకుల సంఖ్యను పెంచినందువల్ల తెలుగు అంతర్జాతీయ భాష అవుతుందని నేను నమ్మను. ఇప్పటి పరిస్థితులలో పరిశోధనలపై ఎవరికీ ఆసక్తి లేదు. పరిశోధకులు తమ ఆత్మ సంతృపికోసం చేసికొంటున్నారే కాని, దానివల్ల ఎవరికీ ఏమీ ఒరగదని వారికి తెలుసు.
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి జరిగి, లోటు లేని జీవనము ప్రజలకు అందితే అప్పుడు ఈ వ్యాసములో సూచించినవి వీలవుతుంది. ఇప్పటి పరిస్థితులలో నేను ఈ విషయములో నిరాశావాదినే.
విధేయుడు – మోహన
వచనానికి ఒక జాబు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం:
04/23/2015 2:48 pm
ఇది సరి కాదు. శ్రీ కొడవళ్ళ అలా చేయలేదు. సైన్టిఫిక్ కంప్యుటింగ్ లో న్యూమెరికల్ మెథడ్స్ మీద రాసిన చాలా ప్రసిద్ధమైన ఒక పుస్తకానికి, ‘Numerical Recipes’ అని రచయితలు పేరు పెట్టారు. అలా ఒక వంటకాన్ని తయారు చేయటాన్ని ఒక ‘పద్ధతి’ లొ శ్రీమతి చందూర్ చెప్పారని చెప్పటం మాత్రమే శ్రీ కొడవళ్ళ ఉద్దేశ్యం. శ్రీమతి చందూర్ ను ‘వంటలక్క’ ను చేయటం కాదు.
వాసుదేవరావు ఎరికలపూడి
వచనానికి ఒక జాబు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
04/22/2015 7:33 pm
“వయసులో పెద్దవారు, గంగా భాగీరథి సమానులు లైలా”
So are you, so are you Vamsi.
‘ओ गंगा तुम बहती हो क्यौ?’ By Bhupen Hazarika is so gorgeous. So is its predecessor song ‘The Old Man River’ by Paul Robenson in Show boat 1936. Two baritones, singing about humans. One uses the back drop of river Mississippi and the other of river Ganga. Yet, we hear the mighty rivers rolling.
గంగ వర్ణ చిత్రం మీరు ఇంకా వేసినట్టు లేరు. శివుడిని ‘వర్ణించి’ నంత తేలిగ్గా గంగ బొమ్మ వెయ్యలేరు. రవివర్మ వెయ్యలేకపోయాడు.
చేతిలో శూలం, మెడలో పాము, నెత్తి మీద గంగ వేసి చూపిస్తే – నర్సరీ పిల్లలు శివుడు, శివుడు అంటారు. ఆర్ట్ లో, ఆభరణాలు అలంకారాలుగా మొదలైనవి, కాలక్రమేణా అవే ప్రతీకలై, ప్రతీకల సహాయంతో మాత్రమే గుర్తించటం అలవాటై, మెల్లిగా అంతర్భావం నశించి, ప్రతీకలే మిగులుతాయి కొందరికి, కొంతకాలంపాటు.
“నమ్మితి నా మనంబున మిమ్ము సనాతనులైన ఉమా మహేశులన్” – అని పాడుకుంటున్నప్పుడు, అప్పుడు తెలుగు భాష ఎంత expressive అనిపిస్తుంది. అంతకన్నా గొప్ప బొమ్మ ఏ ఆర్ట్ మ్యూజియం లో ఎంత వెదికినా కనపడదు. మీరు చదివిన ఎన్నో మంచి పాత తెలుగు రచనలు నేనింకా చదవనే లేదు. చదవాలని కోరిక. మెల్లిగా చదువుతాను.
(విచిత్రం!) రాయప్రోలు ‘‘స్నేహలతా దేవి” లో “గంగ” ను గురించి 33, 34 పద్యాలు ఉన్నవి. కావ్యమంతా చదివాను.
శాయి గారు!
కొన్నేళ్లుగా, ఎంతో సాహిత్యాన్ని చదివింప చేసారు.
‘‘స్నేహలతా దేవి” కావ్యం, కావ్య పద్ధతి ప్రకారం, అన్ని మొక్కుబడులనూ చెల్లించింది. కధ ప్రారంభించక ముందే, కావ్య నాయిక మంటలకు ఆహుతి అవుతుందని, ఒక పద్యం ద్వారా కవి తెలిపినారు. నాకు అర్థమయ్యింది.
బంగారం లాంటి పిల్ల ఎందుకో స్నేహితురాలితో కలిసి, గంగా స్నానానికి వెళ్లింది. అయ్యో! అప్పుడు ఆ స్నేహితురాలు గంగ లో పడి చనిపోయిన అనేకుల విషాద మరణకథలు వినిపించి ఉండక పోతే, కావ్యంలో ఆ పిల్ల బ్రతికి ఉండేదేమో అనిపించింది.
ఏమి కావ్యం! ఏమి రచయితలు! దేవతలను, మానవులను కలగాపులగం చేసి, మనిషి చావును రొమాంటిసైజ్ చేసి, వాళ్లు కన్ఫ్యూజ్ ఐ, పాఠకులను కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తారు.
(ఇంతా చేసి, నేను గ్రహించుకున్న నీతి ఏంటంటే, నేను పరీక్షల్లో ప్రతి answer paper లోనూ ఎక్కడో ఒక చోట “నాకు జ్వరంగా ఉన్నది.” అని పేపర్ దిద్దే వానికి కనిపించే లాగా రాసి ఉండాల్సింది. నాకు ఎక్కువ మార్కులు ఇచ్చి ఉండేవారు. Many Telugu writers come across as sympathy mongers.)
“మరిక ఆయన యెంచుకొన్న అభినవ కవితామార్గం:” -కొడవళ్ళ హనుమంతరావు
H! అక్కడ మీరిచ్చిన ఉదాహరణ చూసి చాలా నవ్వాను. ఏం మార్పు. నా బొంద మార్పు. కాని అంత మాత్రం మారటానికి రాయప్రోలు ఎంత గజగజలాడి పోయుంటాడో, ఎన్నేళ్లు పట్టిందో.
నాకు, ‘పూర్ణమ్మ’, ‘స్నేహలతా దేవి’ ‘The Sorrows of Young Werther’ రాసిన కవులు, నమూనా లో ఒకేలాగా అనిపిస్తారు. వైతాళికులుగా కనిపించరు. I have a problem there.
Recipe చందమామ కధల్ని రాసిన కొ. కు. ను మీరు సైంటిఫిక్ ఆలోచనలకు ఉదాహరణ గానూ, (He is not a scientist.) “ఎన్ని మెట్లెక్కినా” అను చక్కని నవలనూ, చక్కని కథలు రాసిన రచయిత్రి మాలతీ చందూర్ ని, వంటలక్క గానూ, Alan Turing గురించిన మీరు, మీ వ్యాసం లో చూపినప్పుడు – “నర జాతికి నీతి యున్నదా?” అని తర్వాత అనుకున్నా గాని, ముందు బాగా నవ్వొచ్చింది. నచ్చింది. Couldn’t help it. It was very good.
లైలా
Ps: నేను ‘Werther’ అని రాస్తే – Microsoft Word, ‘Weather’ అని మార్చేసింది. నేను స్త్రీ నని నాకు చదువు రాదని పాతకాలం రచయితల రచనలు బాగా ఎక్కి పోయినట్టుంది.
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి p.s. rao గారి అభిప్రాయం:
04/10/2015 6:20 pm
తెలుగులో చెప్పినా, ఇంగ్లీషులో చెప్పినా, ఈమాట చదివేవారికి వార్త అందింది కదా! విషయం ముఖ్యం; ఆ విషయంలో ఉన్న విశేషం అంతకన్నా ముఖ్యం.
అటు బంగాలీవాడు,ఇటు అరవవాడు; ఎవడైతేనేం! వాడు, వాడి భాషలో గొంతు చించుకున్నంతమాత్రాన వాడికి వాడి భాషమీద ప్రేమ, గౌరవం ఉన్నాయని భ్రమపడి, మనని మనం కించపరుచుకోవడం ఒక రకంగా చేతకానితనం! అటు వాడికి, ఇటు వీడికీ — భాష ‘వాడి ‘ కన్నా, భేషజం, దానితో పుట్టిన వేడీ ఎక్కువ.
ఇది భ్రమ కాదు; స్వానుభవం!
మరొక చిన్న విషయం. ఒక్కొక్కసారి కొంతమందికి తెలుగులో చెప్పటంకన్నా ఇంగ్లీషులో చెప్పటం సులువుగా ఉండచ్చుకదా!
వచనానికి ఒక జాబు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
04/10/2015 6:05 pm
శాయి గారూ! మీరు గాని చదువుతూ ఉంటే, నా సందేహాలు తీర్చాలండీ.
‘ఈమాట’ లో వంశీ మాగంటి రాసిన “వచనానికి ఒక జాబు” చదివాక, నా లైబ్రరీ లో “చలం ఉత్తరాలు” కోసం వెదుకుతుంటే – ఆ పుస్తకం కనపడలేదు కాని “చలం ప్రేమలేఖలు” కనిపించింది. చదువుదామా అనుకుని, చలం కి ఎంత సేపూ ‘యావంటే’ అనటమే కాని ప్రేమంటే పెద్దగా తెలియదు అనుకుని, మానేసాను. ఇంతలోకి నేను ఇంతకు ముందు గమనించని “తెలుగులో లేఖా సాహిత్యం” అన్న డాక్టర్. సి హెచ్. సీతాలక్ష్మి గారి పిహెచ్. డి. సిద్ధాంత గ్రంధం కనిపించింది. చదివేశాను. మళ్లీ ఇంకోసారి చదువుతున్నాను.
వంశీ రచనలో ‘పద్యం,’ ‘వచనానికి,’ ఒక జాబు రాసింది. విడ్డూరమా, మరీ విడ్డూరమా. ఈశ్వరా! అని ఇరవై సార్లనుకున్నా. అనుకున్న కొద్దీ ఇంకా ఎక్కువ నవ్వొచ్చింది. (కొన్నాళ్లు పోతే ఈయన ‘ర’ తో ‘ఱ’ కీ, ‘అరసున్నా’ తో ‘గుండు సున్నా’ కీ ఉత్తరాలు రాయిస్తాడు.)
ఈ సిద్ధాంత గ్రంథంలో ‘లేఖా స్వరూపం’ అని ఒక చిన్న ఛాప్టర్ ఉంది. అందులో ఒక పేరాలో ఉన్న సమాచారం బట్టి లేఖ, జాబు ఒకే అర్ధంలో వాడినా, ‘జాబు’ సరైన అర్ధం జవాబు. అంటే, ఇంతకు ముందుగా వంశీ యొక్క-వచనం గారు పద్యానికి లేఖ రాసి ఉండాలి. ఆ లేఖను వంశీ బట్టబయలు చేస్తే బాగుండు. నాకు ఆ లేఖ చదవాలని ఉంది.
వేరే వాళ్ల మధ్య నడిచే ఉత్తరాలు చదవటం మర్యాదా అంటే -అవునూ. కాదూ. మరిప్పుడు పుస్తకాలలో నిజం మనుషులు, ఎవరికో, ఎప్పుడో ప్రైవేట్ గా రాసిన ఉత్తరాలు మనందరినీ చదవనిస్తున్నారుగా. నాకు పూర్వం ఇండియాలో ప్రేమలేఖలు వచ్చినప్పుడు, కొందరైనా నాకన్నా ముందు చదివేవారు. అది ఖచ్చితంగా అమర్యాద. ఆ అమర్యాద పోస్ట్ మేన్ దగ్గరే మొదలయ్యే దనుకుంటా. ఇన్ లాండ్ కవర్ లు ఎప్పుడూ తెరవ బడే ఉండేయి. ఎవరినని అడుగుతాం! మేనర్స్ లేని వారి దగ్గర నిజం మాత్రం ఉంటుందా.
ఇంతకీ శాయి గారండీ! మిమ్మల్ని అడగదల్చింది ఏంటంటే;
ఈ పుస్తకంలో 13వ పేజీలో ఒక పేరాలో, రచయిత్రి – “రాయప్రోలు సుబ్బారావుగారు జ్వరంలో ఉండి కూడా స్నేహలతాదేవి వృత్తాంతాన్ని విని కావ్యాన్ని రచించారు…” అని, ఒక లేఖ, కావ్యరచనకు హేతువైందనీ -అన్నారు.
ఇక్కడి విషయం నాకు సరిగా అర్ధం కాలేదు. స్నేహలతా దేవి వృత్తాంతమేమిటని? ఆ లేఖ ఏమిటి? రాయప్రోలు వ్రాసిన ఆ కావ్యమేమిటి? దయుంచి చెపుతారా?
Hope you are getting to watch the Netflix. I liked their “Blood Line.” Quite a complex family based psychological thriller.
Lyla
• “లేఖా సాహిత్యం” అన్న ఈ గ్రంథం లో తెలుగు సాహిత్యంతో సంబంధం కలిగిన పదముగ్గురి లేఖలను (ఇంతకు ముందే పుస్తక రూపంలో వెలువడిన సాహితీవేత్తల లేఖలు) డా. సీతాలక్ష్మి పరిశీలించింది. దాన్ని బట్టి మాగంటి వంశీ రచన, లేఖా సాహిత్యం లోకి రాదనుకుంటాను. ఐతే, ఆ రచన “పద్యం” గురించిన ప్రమోషనల్ రచనగా కూడా నేను చదవలేదు.
ఒంటరి విహంగం గురించి ramaadevi గారి అభిప్రాయం:
04/09/2015 7:28 am
ఇన్ని సంవత్సరాల తరవాత ఇప్పుడే ఈ కథ చదవటం /చూడటం జరిగింది.
కథ లో సంతానం లానే బయటి వారి లో కూడా చాలమంది అనుకుంటారని తెలుస్తొంది. రచయిత జరిగిన కథ అని ప్రత్యెకంగా చెప్పక్కర్లెకుండానే. అయినా old age home ల లో చేరితే వంటరితనం పొయేట్లైతే, అసలు అందరూ పెళ్ళి ఇల్లు జంజాటం లేకుండా వొకమనిషిని వంటకి, ఇల్లు చుసుకోడానికి వొక మనిషిని పెట్టుకుని వో అనాధ పిల్లనో పిల్లాడినో పెంచుకుని సెక్స్ కి ఇంకెదో సదుపాయాం చేసుకుంటే సరిపోతుందిగా.
ఎక్కువ మంది మగవాడు అనగానే ఆడ మనిషి అయితే అని ప్రశ్నించారు ఎంత అజ్ణానం. ఆడ మగ తేడా లేకుండా కలిగే బాధ ఇది. పార్క్ లోనో ఇంకెక్కదయినా కూర్చుంటే వొంటరితనం తగ్గుతుందేమో అసలు ఇలా పెళ్ళి చేసుకున్నా తగ్గక పొవచ్చు కాని వున్న వాటిల్లో నచ్చిన మార్గం ఎన్నుకునే హక్కు స్వతంత్రం ఆ తండ్రికి అంత వయసు వచ్చాక కూడా వుండద్దా ?
ప్రాధాన్యం గురించి ramaadevi గారి అభిప్రాయం:
04/09/2015 4:59 am
కథ బావుంది. కాని అన్నపూర్ణ కి అత్తగారో అన్నపూర్ణ భర్త కి కూడా తాతగారూంటే???? ఆయన తాత గారు పల్లెలో ఇలా అన్నపూర్ణ తాత గారు నాన్న పట్నం లో వుంటే ???? ఇవి చాలా frequent గా కనిపిస్తున్నాయి……..గమ్మత్తుగా బొలెడుసార్లు అబ్బాయిలకి భార్య బంధువులు ఇలా బోలెడంత గొప్పవాళ్ళ లా కనిస్తున్నారు ……
కథ చదివించింది …అభినందనలు …పైన రాసింది ఈ కథ తో పుట్టిన కథ కి సంబంధించని ప్రశ్న
చెప్పులు గురించి Damu ndm గారి అభిప్రాయం:
03/24/2015 7:41 am
ఎవరెవరో ఎమేమో కామెంట్స్ చేసారు. కాని గుడ్డు పెట్టే కోడిపెట్టకు తెలుసు ఎంత నొప్పో, దయచేసి గుడ్డు చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండ నొప్పిని గ్రహించండి. JUBV గారు మీ కథలోని సారంశం బాగుందండి.
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి జయ గారి అభిప్రాయం:
03/16/2015 5:24 pm
ఈమాట చాలా బాగుంది. కొన్ని requests:
1. రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకాలు గురించి కొంత రాస్తే బావుంటుంది.
2. మేఘదూతం, మనుచరిత్ర, గాథాసప్తశతి upload చేసారు బావుంది, కాని దాని అర్థం కానీ లేక తాత్పర్యం కానీ పెట్టి ఉంటే బావుండేది. అలాగే మిగతా కావ్యాలక్కూడా.
3. వేదాలమీద ఏమైన వ్యాసాలు ఉంటే ప్రచురించగలరు.
4. కల్హాణ [కల్యాణ] రాజతరంగిణి కథలు ..
కృతజ్నతలతో,
జయ.
మరోలోకం గురించి raamadass గారి అభిప్రాయం:
03/15/2015 1:18 am
చాలా బాగుంది. చాలా రోజుల తరవాత మంచి శైలి కనిపించింది. కథా వస్తువు, కథనం అన్నీ బాగున్నాయి కాని భావుకత ఎక్కువయి కొన్ని సందర్భాలలొ క్రుతకంగ అనిపించింది. చాలా మంచి రచన చదివాననే సంత్రుప్తి కలిగించినందుకుకు రచయతకి క్రుతజ్ఞతలు.
రామదాస్
సై కిల్ గురించి okAnokaDu గారి అభిప్రాయం:
03/10/2015 9:10 am
నమస్కారం వంశీ గారికి, లైలా గారికీను
కథ గురించి నేను మాట్లాడుతూంటే లైలా గారే మొదట్న ఆవిడ కలలోకి వస్తారేమో అన్నారు (సరదాగానే లెండి). నేనూ అలాగే సరదాగా అన్నాను. ఇంక అక్కడకీ సరదాగా తీసుకోరేమో అని (చురక అంటిస్తే… అనేది బుద్ధిలేక రాసాను). ఆవిడ సరదాగానే తీసుకుంటున్నట్టున్నారు. ఎందుకో సడన్ గా నా పేరూ, బొమ్మ, వ్రాతలూ అన్నీ మొదలెట్టారు. ఇక్కడ పేరు ప్రసక్తి దేనికో మరి. పోనీయండి.
నేను భ్రూణహత్యలు చేసేంత పాపాత్ముణ్ణి కాదు. ఎందుకంటారా? ఈ చిన్న కధ వినండి. ఇంజినీరింగ్ చదివే వేడి వయసులో (వయస్సు వేడి ఎలా అంటే మరో కథ రాయాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ మాత్రం ఈశ్వరానుగ్రహం ఉంటే నా బతుకు ఇలా ఏడిచేదా?) ఒక అమ్మాయిని ప్రేమించాను – దూరం నుంచే లెండి. మాట్లాడే అంత ధైర్యం ఏడిసిందా ఏమిటి? కూడా ఉండే స్నేహితుడు అన్నాడు,”నువ్వు అలా మాట్లాడకుండా చూస్తూ ఉంటే ఆ అమ్మాయ్ పెళ్ళైపోతుంది ఎవరితోటో.” నా సమాధానం -“ఏం చేస్తాం తమ్ముడూ. పోనీ ఆవిడకి పెళ్ళైపోయినా ఎక్కడో ఒక చోట సుఖంగా ఉంటే అదే చాలు.” అదండీ నా ప్రేమ విషయం. అలా ఉత్తరోత్తరా ఇంకో అమ్మాయిని (కాస్త వేడి తగ్గాక, ఉద్యోగం చేసే రోజుల్లో) ప్రేమించాను కానీ ఆవిడా కూడా అలాగే దూరమైపోయింది. ఇద్దర్లో ఎవరికీ కూడా కలలో కూడా హాని తలపెట్టలేదు; ఇంక భ్రూణ హత్యల సంగతి దేనికీ? మనలో మనమాట మహాలక్ష్ములు ఈమాట చూడ్డానికి వస్తూనే ఉన్నారు. కాని కామెంటరు అంతే. ఇది నా – పనికిరాని – ఉద్దేశ్యం.
ఇంక ఇక్కడివరకూ వచ్చాక తెలిసినది ఏమిటంటే, నేను ఇప్పుడు పానకం లో పుడక లాగా తయారయ్యాను; ఇక్కడతో మీ ఇద్దరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు ఇస్తూ తప్పుకుంటున్నాను.
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి bhaithi durgaiah గారి అభిప్రాయం:
03/10/2015 4:54 am
ఈ మాట సంపాదకుల గారికి
నమస్కారములు.
పత్రిక చాలా బాగున్నది.మీ కృషి ప్రశంషనీయం.నేను “అక్షర సేద్యం ” కవితా సంపుటి ని రచించాను.మీ గ్రంథాలయంలొ పుస్తకానికి అవకాశం ఉన్నదా?
ఉంటే ఎలా? దయచేసి తెలుపగలరు.
సై కిల్ గురించి lyla yerneni గారి అభిప్రాయం:
03/09/2015 1:27 pm
చురక ఫొటోకి అంటించినారా?
సంభాషణ కూడా మారుపేరుతో,ముసుగు లోంచి ఆ ఫొటోతోనే చెయ్యరాదా. మారుపేరుతో రాయటంలో ఏమైనా అదనపు లాభాలు ఉన్నాయేమో ఆ బొమ్మతోనే చెప్పండి. కథ! ‘బొమ్మలు చెప్పిన కమ్మని కధలు’ అక్కడే వినగలరేమో.
నిజానికి ‘చురక అంటించటం’ అనే ఎక్స్ప్రెషన్ నాకు నచ్చదు. మోటుగా, సేడిస్టిక్ గా అనిపిస్తుంది. నేను వాడలేను. కాని మీరు స్నేహపూరితంగా చేస్తున్నారు, అది నాకు తెలుసు. కాబట్టి, మీరు మార్చుకోనవసరం లేదు.
ఎంతమంది స్నేహితులుంటే జీవితం, అంత ఉత్సాహభరితంగా ఉంటుంది. రకరకాల కల్చర్స్ నుండి వచ్చిన నా ఫ్రెండ్స్ రకరకాలుగా నాతో మాట్లాడుతారు. స్నేహితుల సంఖ్య పెరుగుతూ ఉంది. నా సంబరం కూడా!
కాని, ఇలాటి సందర్భాలలో ఆ స్నేహం ఎవరితో చేస్తున్నానో తెలియకుండా ఎలా చెయ్యటమో తెలియటం లేదు.
ఇంతకు ముందు మీరు సూచించిన విశ్వనాథ కథలు బాగున్నవి. చిన్న కథలు కూడా బాగా రాశాడాయన. – లైలా
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి లక్ష్మీదేవి గారి అభిప్రాయం:
03/09/2015 12:15 pm
నమస్కారములండి.
మీరు ప్రకటించిన రోజే ఆ వ్యాసము (చిన్ని పుస్తకము) చదివి ఉన్నాను. మీ విశ్లేషణలో అన్ని రకాల కోణాలను చక్కగా మీరు నిరూపించడం ప్రతీ సారీ నన్ను ఆశ్చర్యానందాలలో ముంచివేస్తుందనడంలో ఎటువంటి రెండో అభిప్రాయం లేదు. బాగుందని చెప్పడం కన్నా ఎక్కువ వ్యాఖ్యానించగలిగే అర్హత గానీ, ప్రాచీన కావ్యాలతో పరిచయం గానీ నాకు లేకపోవడంతో నేను ఊరుకున్నాను. ఇదివరకటి మీ వ్యాసాలలో అర్థం చేసుకొనేంత పాండిత్యం లేక కొన్ని సంశయాలను ధైర్యం చేసి మీతో ప్రస్తావించడం జరిగింది.
ఈ వ్యాసంలో ఎక్కడా ఎటువంటి సంశయమూ కలుగలేదు.ప్రాచీన సాహిత్య పరిచయమూ, విమర్శనాత్మక ధోరణిలో రచనానైపుణ్యమూ ఉన్నవారు మీతో చర్చించడం చదువుతూ మురిసిపోతుంటాను. మీ రచనలను చదువకుండా వాయిదా కూడా వేయలేను. వెంటనే చదువుతూ ఉంటాను. మీ దగ్గర సాహిత్యంలో పరిశోధన చేయగలిగే భాగ్యం లేనందుకు చింతిస్తూ ఉంటాను. ఈ విధంగా ప్రాచీన కావ్యాలను వెలికి తీసి మా వంటి భాషాభిమానులకు నిధులుగా తోడి తీసి మీ విమర్శనాత్మక వ్యాసాలతో మెరుగులు దిద్ది సమకూర్చినందుకు మేము, ముందుతరాల వారు మీకు ఋణపడి ఉంటామన్న మాట తప్ప ఇంకేమీ చెప్పలేని అల్పురాలను.
మరొక్కమాట మాత్రం ప్రతీసారి మనవి చేయాలనుకుంటాను. మీ భాషాసంపత్తి ఈ కాలంలో అనన్యసామాన్యమైనదనే చెప్పుకోవాలేమో నాకు తెలిసిన పరిధిలో ఈమధ్య అప్పుడప్పుడూ మీరు జనసామాన్యమైన భాషలో వ్రాస్తున్నట్టనిపిస్తుంది. కానీ నా అభ్యర్థన ఏమంటే … దయచేసి మీ ప్రత్యేకతను మీరు నిలుపుకొనవలసినది. భాష సౌందర్యాన్ని ఇంత సమర్థవంతంగా చూపించే అలవాటు మానవద్దు. అర్థం కాని పదాలు, సమాసాలు ఉన్నంత మాత్రాన పరిశోధనాభిరుచులున్నవారు కొత్త(పాత) పదాలను పరిచయం చేసుకోకుంటే ఎలా కుదురుతుంది? ఇంక అది విద్యార్థిత్వం ఎలా అవుతుంది? కాబట్టి తప్పక ఇటువంటి మంచి తెలుగునే ఇక మీదట కూడా కొనసాగించవలసినదని మనవి.
నమస్కారములతో…లక్ష్మీదేవి.
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి Gannavarapu Narasimha Murty గారి అభిప్రాయం:
03/08/2015 4:46 pm
ఈ వ్యాసమును తొలుత పై పై చదివి మెచ్చుకోలు ప్రకటించినా ఇప్పుడే వారాంతపు ప్రణాళికగా పూర్తిగా చదివాను. ఈ వ్యాసముపై శ్రీ కామేశ్వర రావు గారి వ్యాఖ్యను ఇతర ప్రముఖుల వ్యాఖ్యలను కూడా చదివాను. ఈ విశ్లేషణను వ్యాసమనడము సమంజసము కాదు. ఇది ఒక చిరుగ్రంధమే ! అద్భుతముగా నుంది. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి విద్వత్తు తఱచు ప్రయుక్తమై యీ వయస్సులో కూడా మేధ నుత్తేజ పఱచింది. అందుబాటులో నున్న ఆంధ్రభారతి తెలుగు నిఘంటువును చాలా పర్యాయము లాశ్రయించినా వారి వాక్పటిమకు భాషాసంపత్తికి ముగ్ధుడ నయ్యాననే చెప్పుకోవాలి.
వా రుదహరించిన అన్ని పద్యాల విశ్లేషణ బాగుంది.
అంబరసీమఁ దారలు, జటాటవి మల్లెవిరుల్, భుజాంతరా
ళంబున హారసంతతు లిలాస్థలిఁ బువ్వుల వర్షముల్ ప్రసూ
నంబులు సత్కృతాంజలి ననం దగి మౌక్తికతుల్యమౌళిగం
గాంబుకణంబు లుట్టిపడ నాడెడు శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్.
పద్యమును నేను కూడా శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారి వలె శంభుని మౌక్తికతుల్య గంగాబుకణములే గగనసీమలో తారలు , మల్లెవిరులు, హారసంతతులు , ఇలాస్థలి పుష్పములు ,అంజలిలో ప్రసూనములైనట్లు అర్ధము చేసుకున్నాను. కాని శ్రీ ఏల్చూరి వారి వేమభూపాలుని వ్యాఖ్యావలంబనముగా నిచ్చిన వివరణ అర్ధవంతముగా నుంది. ఈ వ్యాసములో పుష్టి ఉంది. మరోసారి చదువుకోవాలి. మరో వ్యాసము వెలువడే లోపల ఒక నెల ఉందిగా !
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
03/07/2015 9:01 pm
చాలా అద్భుతమైన వ్యాసం. మురళీధరరావు గారి కృషి బహుధా ప్రశంశనీయం.
“తెలుగే సరిగా రాదు, ఇక సంస్కృతం నిల్లు” అని ముళ్ళపూడి ఓ సినిమాపాత్ర చేత అనిపించినట్టు ఏ ఏడాదికోసారో ఒక తెలుగు పద్యం చదివటానిక్కూడ తీరక లేని నాబోటి వాళ్లు సంస్కృతాంధ్ర ప్రాకృతాల్లో లోతైన పాండిత్యం అవసరమైన ఇలాటి వ్యాసాన్ని అర్థం చేసుకోవటమే గొప్ప విషయం. కనుక ఇందులో విషయాన్ని గురించి చర్చించే సాహసం చెయ్యను. ఐతే, ఒక పరిశోధకుడిగా నాకర్థమైంది ఇది –
1. కొన్ని పద్యాల్ని ఇదివరకు కొందరు శ్రీనాథుడి శాలివాహనసప్తశతి లోనివిగా “ఊహించారు”
2. ఇప్పుడీ వ్యాసంలో మురళీధరరావు గారు ఆ పద్యాల్ని ఒక్కొక్కటి తీసుకుని అవి అ) సప్తశతి కి చెందినవేనా? ఆ) ఐతే అవి శ్రీనాథకృతాలేనా? అని పరిశీలుస్తున్నారు.
3. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం – ఒక పద్యం సప్తశతిలోదైతే దానికి హాలుడి మూలం ఒకటుండాలి. ఉంటే అదేమిటి, మూలానికీ ఈ పద్యానికీ సామ్యాలు, తేడాలు ఏమిటి అని తరచి చూసి అది సప్తశతికి చెందిందా కాదా అని నిర్ణయించటం.
4. శ్రీనాథుడిదా మరొకరిదా అని తేల్చటానికి ముఖ్యంగా శ్రీనాథుడి శైలిని, శ్రీనాథుడి ఇతర ప్రయోగాల్ని పోల్చిచూసి నిర్ణయించటం.
వీటిలో నాకు సప్తశతి పద్యాలా కావా అనే పరీక్ష సమంజసంగానే అనిపించింది. కాని శ్రీనాథుడిదా కాదా అనే పరీక్ష మాత్రం కాదు. ఐతే ఒకటి చెప్పుకోవాలి, ఇంతకు ముందు ఎంతో లబ్ధప్రతిష్టులైన పరిశోధకులు ఇంతకన్నా చాలా తక్కువ తర్కంతో కేవలం వారి ఊహలే ఆధారంగా ఇంతకన్నా పెద్ద విషయాల్నే సిద్ధాంతీకరించారు.
ఉదాహరణకి మొదటి పద్యం తీసుకుందాం –
వారణసేయ దావగొనవా నవవారిజమందుఁ దేటి క్రొ
వ్వారుచు నంట నీ వెఱుఁగవా ప్రియ హా తెఱగంటి గంటి కె
వ్వారికిఁ గెంపు రాదె తగవా మగవారల దూఱ నీ విభుం
డారసి నీ నిజం బెఱుఁగునంతకు నంతకు నోర్వు నెచ్చెలీ.
ఇందులో ఒక విషయం చాలా తేలిగ్గా గమనించవచ్చు – ప్రతిపాదం లోనూ కనిపించే (17 – 19 శతాబ్దాల మధ్య పద్యాల్లో విపరీతంగా ప్రచారంలో వున్న) శబ్దాలంకారం. తొలిపాదంలో “గొనవా నవవా”, రెండో పాదంలో “తెఱగంటి గంటి”, మూడోపాదంలో “తగవా మగవా”, నాలుగో పాదంలో “నంతకు నంతకు”. నాకు తెలిసినంతవరకు ఇది శ్రీనాథుడి శైలి కాదు, బహుశ వసుచరిత్రకు ముందు లేనిది. ఈ తర్కం ప్రకారం ఇది శ్రీనాథుడి పద్యం కానేకాదు. ఎవరో పద్దెనిమిదో శతాబ్ది కవి రాసింది.
అలాగే ఉదహరించిన వాటిలో కొన్ని పద్యాలు కథాధారితాలు కావు. అలాటప్పుడు అవి సప్తశతికి అనువాదాలని చెప్పటమే సాహసం అని నా అభిప్రాయం.
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
03/07/2015 8:58 pm
మురళీధరరావు గారికి నమస్కారాలతో –
చాన్నాళ్ళుగా రాద్దామనుకుంటూ వెనకడుగు వేస్తూ వచ్చాను. మీరు ఆచార్యులు, పండితులు. ముఖ్యంగా తెలుగు చదువు చెప్పిన వారు.
మీ వ్యాసాలలో ముడి సరుకు చాలా గొప్పదయినా, అవి చదవడానికి చాలా కష్టంగా ఉంటోంది. ఒక్కోసారి మధ్యలో వదిలేయాల్సి వస్తోంది. దీనిక్కారణం మీ వ్యాసాలలో మీరు వాడే భాష. అది ఓ పట్టాన మింగుడు పడడం లేదు. సుదీర్ఘ సమాసాలూ, నోరు తిరగని సంధి ప్రయోగాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి.
ఉదాహరణకి – ఈ వ్యాసంలో ఒక చోట – ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షకు, గమ్యమానౌపమ్యంతో తుల్యయోగితకు స్వతఃప్రమాణమై హృద్యమైన ఈ పద్యాన్ని అధర్వణ భారతం విరాటపర్వం ప్రథమాశ్వాసం లోనిదిగా నేటికొక శతాబ్ది క్రితం ముమ్మొదటిసారిగా సుగృహీతనామధేయులు శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వెలుగులోకి తెచ్చారు.
అలాగే ఇంకోచోట: ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశాదినిర్వహణపూర్వకంగా – భరత నాట్యశాస్త్రానువాదం కాబట్టి కావ్యారంభంలో నాట్యాధిష్ఠానదైవతమైన శంభుదైవతస్తుతి భావ్యమే కాని, పైని పేర్కొన్న అంబరసీమఁ దారలు … పద్యాంతంలోని ‘శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్’ అన్న యుష్మదర్థకాశీర్వాక్యం ఇది భారతీయకావ్యం –
ఇలా ప్రతీ చోటా పాఠకుడికి (ముఖ్యంగా నాలాంటి పామరుడికి) చాలా కష్టంగా ఉంటోంది. మీరు చెప్పిన, లేవనెత్తిన అంశాలు చూస్తే చదవాలని రెండడుగులు ముందుకేస్తే, మీ వాక్యాలు పదడుగులు వెనక్కి నెట్టేస్తున్నాయి. మీ రచనల్లో సంస్కృత పదాలు ఉబ్బడిముబ్బడిగా వాడడం వలన అర్థాలు తెలీక నానా అవస్థా పడి చదవాల్సి వస్తోంది. నేను పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాసాలూ, విశ్వనాధవారి పీఠికలూ, రాళ్ళపల్లి వారి వ్యాసాలూ ఎంతో అపురూపంగా దాచుకుని తరచు చదువుకుంటూ ఉంటాను. వారి భాషతో ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. మీరా ఆ కాలం వారు కాదే? వస్తు పరంగా మీకూ ఆ స్థాయి ఉంది. తెలుగు చదివే వాళ్ళే పల్చబడి పోతున్నారని ఒక పక్క కొంతమంది గగ్గోలు పెడుతున్నారే? ఇలాంటి మంచి రచనలు కేవలం వాడే భాష వలన దూరం అయిపోతున్నాయి కదా అన్న బాధతో రాస్తున్నాను. అంతే తప్ప మరో దురుద్దేశం లేదు. మీ రచనల్లో ప్రస్తావించిన అంశాలు ఇష్టంగానే చదువుతాను. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.
(ఇది రాసే ముందు నాకు తెలుసున్న కనీసం పదిమందిని అడిగాక ఇది రాస్తున్నాను. మరోసారి ఇలా రాసినందుకు క్షమించేయండి.)
మీరు మంచి తెలుగు రాయలేక కాదు. వ్యాసం చివర్న మీరిచ్చిన సూచికల్లో అందరికీ అర్థమయ్యే అందమైన వాక్యమే రాసారు కదా? మరెందుకు అది వ్యాసంలో అవి తొంగిచూడడం లేదో అర్థం కావడం లేదు.
నమస్కారాలతో –
బ్రహ్మానందం గొర్తి.
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి డా. తాడేపల్లి పతంజలి గారి అభిప్రాయం:
03/07/2015 7:48 am
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన ”వ్యాసాన్ని చదివాను.
అసలు ఈ మధ్య కాలంలో ఇటువంటి కండ కలిగిన వ్యాసాలు చాలా తక్కువ వస్తున్నాయి.
వారణసేయఁ దావిగొనవా… పద్యాన్ని వారు శ్రీ నాథకృతముగా నిర్థారించిన తీరు బాగుంది.
ఈ సందర్భములో ఈ శ్లోకానికి రాళ్లపల్లి వారి ఈ అనువాద పద్యము కూడా గుర్తుకు వచ్చింది.
ఎవరి కలుక గలుగదే ప్రియురాలి కె
మ్మోవి కాటుగన్న? ముగుద! తేంట్లు
ముసరియున్న తమ్మి మూరుకొంటివి వల
దన్న వినక! సైపవమ్మ యిపుడు.
అరుదైన ప్రయోగాలతో, ప్రతిపాదనలతో వ్యాసాన్ని వివేచించిన మురళీధరరావుగారికి, ప్రచురించిన మీకు ధన్యవాదములు.
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
03/07/2015 2:17 am
ఆచార్యకమూ విద్యార్థిత్వమూ సంవాదంలో పరస్పరమూ విశేషింపదగినవి కావు. ఆ మాటకు వస్తే ఉద్యోగాంతంలో వచ్చే ఆచార్య పదవికంటె ఆజీవితం ఉండే విద్యార్థిత్వమే మిన్న. అయినా, ఆచార్య పదవి నాకెలాగూ లేదు కాబట్టి ఆ ఇబ్బందీ లేదు. పదవీబోధకం గాక కేవలవృత్తిరూపమైతే ఆచార్యకం అశ్వక భిషక్పాశ గ్రామటికాదుల వంటి తద్ధితాంతంగా నాకు అనువర్తించేదే.
తెల్లవారుజామున సహృదయులైన శ్రీ కామేశ్వరరావు గారు చూపిన ప్రయోగాలను చదువుకొనటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది మరీ సొగసుగా ఉన్నది. హరిభక్తికల్పలతికను నేనిదివరకు చూచి ఉండలేదు. ఇందులోని లంకెను బట్టి పూర్వోత్తరాలలో చదువుకొంటుంటే మాధుర్యధారగా ఉన్నది. అందుకు వారికి నా ధన్యవాదాలు.
శ్రీనాథుని ప్రయోగం వంటివి ప్రసిద్ధిలో ఉన్నవే: “ముక్తాభా … జటావల్లీషు మల్లీనిభా … హరమూర్ధ్ని పాన్తు గఙ్గాపయోబిన్దవః” అని. పరమేశ్వరుని శీర్షమందలి గంగాంబుకణాలు ముత్యాల లాగానూ, జటావల్లులలో మల్లెల లాగానూ ఉన్నాయని శ్లోకం. ఆభములు, నిభములు అన్న సాదృశ్యవాచకాలు అందులో సార్థకాలుగా ఉన్నాయి. తెలుగు పద్యంలో 1. “అంబరసీమలోని తారలు అనం దగి”, 2. “జటాటవిలోని మల్లెవిరులు అనం దగి”, 3. “భుజాంతరాళంలోని హారాలు అనం దగి”, 4. “ఇలాస్థలిపై పువ్వుల వర్షాలు అనం దగి”, 5. “సత్కృతాంజలిలోని పువ్వులు అనం దగి” అన్నంతవరకు ఉత్ప్రేక్షోపక్రమణిక భావ్యంగా ఉన్నది. ఆ “అనం దగి”నవి “మౌక్తికతుల్య-గంగాంబుకణాలు” కావటం వల్లనే అన్వయంలో ఇబ్బంది వస్తున్నది. జటాటవిలోని మల్లెవిరులతో పోలిక కేవలం గంగాంబుకణాలకు మాత్రమే. మౌక్తికతుల్యగంగాంబుకణాలకు కాదు. మౌక్తికాలకు దానితో సంబంధం ఉండదు. భుజాంతరాళంలోని ముత్యాలహారాలతో పోలిక మౌక్తికతుల్యగంగాంబుకణాలకే. కేవల గంగాంబుకణాలకు కాదు. ఇలాస్థలిపై పువ్వుల వర్షాల పోలిక మళ్ళీ కేవల గంగాంబుకణాలకు మాత్రమే వర్తిస్తుంది. మౌక్తికతుల్యగంగాంబుకణాలకు వర్తింపదు.
ఇలాస్థలిపై పువ్వుల వర్షాలు – అనకపోతే మౌక్తికతుల్యగంగాంబుకణాలతో అన్వయించి ముత్యాల జల్లు కురిసిందని చెప్పుకోవచ్చును. “ఇలాస్థలి పువ్వుల వర్షముల్” అన్నందువల్ల కవి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ‘ఇలాస్థలిపై పువ్వుల వర్షాలు అనదగిన మౌక్తికతుల్యములైన గంగాంబుకణములు’ అని గాని; ‘ఇలాస్థలిపై మౌక్తికతుల్యములైన గంగాంబుకణములు అనే పువ్వుల వర్షాలు’ – అని కాని చెప్పేందుకు వీలులేదు. వాక్యంలో ‘మౌక్తికతుల్యములైన’ అన్న వాచకౌపమ్యాన్ని విడిచివేసి ఏకదేశంగా ‘ఇలాస్థలిపై పువ్వుల వర్షాలు అనదగిన గంగాంబుకణములు’ అని చెప్పటం అన్వయపద్ధతి కాదు. సత్కృతాంజలిలో ఉన్నవి పువ్వులు గాక ముత్యాలయితే అది మౌక్తికాంజలి కాబట్టి మౌక్తికతుల్యగంగాంబుకణాలతో అన్వయించుకోవచ్చును. “ప్రసూనంబులు సత్కృతాంజలిని” అన్నందువల్ల కవి ఆ అవకాశాన్ని ఇవ్వటం లేదు. ‘మౌక్తికతుల్యములైన గంగాంబుకణాలు సత్కృతాంజలిలోని పువ్వులు అనదగి ఉన్నాయి’ – అన్నది ఎట్లాగూ అన్వయింపదు. ‘గంగాంబుకణాలు ముత్యాలు అనదగి, సత్కృతాంజలిలోని పువ్వులు అనదగి ఉన్నాయి’ అన్న ఉభయాన్వయార్థం ఆ సమాసానికి చెప్పదగినదిగా లేదు. “మౌక్తికతుల్యగంగాంబుకణంబులు” అన్న సమాసంలో ఒకసారి గంగాంబుకణాలను విడిచి మౌక్తికాలను, మరొకసారి మౌక్తికాలను విడిచి గంగాంబుకణాలను, ఇంకొకసారి రెండింటినీ నిలిపి మౌక్తికతుల్యగంగాంబుకణాలను చెప్పుకోవటం వ్యాకరణసమ్మతమైతే నాకూ సమ్మతమే. అయిదు దళాలలో ఉత్ప్రేక్షించి, ఒక దళంలో తుల్యత్వాన్ని చెప్పి, ‘మౌక్తికతుల్యగంగాంబుకణాలు’ అన్న సమాసంలో తుల్యత్వానికి ‘మౌక్తికములో అనదగిన గంగాంబుకణాలు’ అన్న గమ్యమానత ప్రతీయమానం అయితే అది సమర్థనీయమే. అప్పటికీ ఏకదేశాన్వయానికి సమాధానం లేదు.
శ్రీ కామేశ్వరరావు గారు వ్రాసినట్లు “శివుడు నాట్యం చేస్తున్నప్పుడు అతని శిరసుపైనున్న ము-త్యా-ల్లాం-టి గం-గాం-బు-క-ణం-బు-లు ఆకాశంలో తారకల్లాగా, శివుని జడలో మల్లెపూలలాగా, ఎడదపై ముత్యాలదండలలాగా, నేలపై పడేటప్పుడు పూలవానలాగ, అతను అంజలి పట్టినప్పుడు అతను విడిచే పుష్పాంజలిలాగా ఒప్పారుతూ ఉండగా, నాట్యం చేస్తున్న శివుడు మిమ్ములను రక్షించు గాక” – అన్న తాత్పర్యం కనుపిస్తుండటం వల్లనే పద్యాన్వయంలో విరోధం ఏర్పడుతున్నది.
ఈ విరోధాన్ని పరిహరించటంకోసమే అర్ఘ్యాంజలిలో పువ్వులను, పండ్లను నిక్షేపించాలన్న వేమభూపాలుని వాక్యంతో పరమేశ్వరుని సంధ్యావనితాప్రణామరూపమైన నాట్యంలో పుష్పాంజలిలో పువ్వులను, ముక్తాఫలాలను అన్వయించుకోవలసివచ్చింది. అది శ్రీనాథుని పద్యం కావచ్చునన్న ఊహ అందువల్లనే కలిగింది. ప్రతిపాదన స్వసమర్థకం కానట్లయితే ఉపసంహరించుకోవటానికి నేనెప్పుడూ సిద్ధమే. ఔగాములను నిర్ణయింపవలసినది సహృదయులైన పాఠకులే. నేనిక చెప్పవలసినదేమీ లేదు.
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి కామేశ్వరావు గారి అభిప్రాయం:
03/06/2015 2:05 pm
నేను సాహిత్యవిద్యార్థినే తప్ప నాకు ఆచార్యకము లేదు. కాబట్టి నా అన్వయంలోని గుణదోష విచారణ పెద్దలకే వదిలిపెడతాను. అయితే శ్రీ మురళీధరరావుగారు చూపిన అభ్యంతరాలు చర్చనీయములు కాబట్టి వాటిపై నా అభిప్రాయాలు మాత్రం ఇక్కడ పంచుకుంటున్నాను.
సంస్కృత తెలుగు సాహిత్యాలతో నా పరిచయం చాలా పరిమితం. కాబట్టి విస్తృతంగా కవిప్రయోగాలను ప్రదర్శించగల శక్తి నాకు లేదు. నాకు కనిపించిన రెండు మూడు ఉదాహరణలు మాత్రం ఇక్కడ చూపిస్తాను. ముందుగా గమనించాల్సిన ముఖ్యాంశం – ఇక్కడ పోలిక మామూలు నీళ్ళతో కాదు, గంగాజలాలతో.
పుట్టపర్తి నారాయణాచార్యులవారి శివతాండవ కావ్యంలోని యీ క్రింది శ్లోకాన్ని గమనించండి:
గంగాతరంగకణసంగ వికాసిజూటం
సంధ్యాంతరిక్ష మివతారకితం దధానః
నృత్యత్పదాగ్ర పరికల్పిత వేదజాతః
కుర్యాద్దయాం త్రిభువనాలయదీపఏషః
“గంగాతరంగ బిందువులతో కూడిన శివుని జటాజూటం చుక్కలు పొదిగిన సంధ్యాకాశంలా ఉన్నద”ని మొదటి రెండు పాదాల అర్థం. ఇక్కడ గంగాజలబిందువులకు నక్షత్రాలతో పోలిక గమనించవచ్చు.
ఇక గంగను మల్లెపూలమాలతో పోల్చిన ఉదాహరణలు:
కాశీఖండం పంచమాశ్వాసం 49వ పద్యం (ఇది గంగను వర్ణించే పద్యం) ఎత్తుగీతిలో శ్రీనాథుడు గంగను “మదనవైరి జటాటవీ మల్లికళిక” అన్నాడు.
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకుర రచించిన “హరిభక్తకల్పలతిక” అనే గ్రంథం రెండవ స్తబకంలో (యిది గూగులు పుణ్యమా అని దొరికింది!) మూడవ శ్లోకం:
ఆనంద నిర్బరమయీం అరవింద నాభ
పాదారవింద మకరందమయ ప్రవాహాం
తం కృష్ణభక్తిమివ మూర్తిమతీం స్రవంతీం
వందే మహేశ్వరశిరోరుహకుందమాలాం
ఇక్కడ కూడా చివరి పాదంలో గంగను మహేశ్వరుని శిరసుపైని మొల్లమాలగా వర్ణించడం జరిగింది.
గంగకు మల్లెమొగ్గతో, మొల్లమాలతో పోలిక ఉన్నప్పుడు గంగాజలాలను మల్లెపూలతో పోల్చడంలో అభ్యంతరం ఉండకూడదు కదా.
పద్యంలో కాని నా అన్వయంలో కాని యీ భావం లేదు. ఆడే శివునిపైనున్న గంగాజలశీకరాలు కొన్ని ఇలాస్థలి పై పూలవానగా కురుస్తున్నాయి. కొన్ని శివుని దోసిట పడ్డ పూలవలె ఉన్నాయి.
ఈ అభ్యంతరాన్ని గురించి బహుశా చర్చించి లాభం లేదు. ఇందులో ఔచిత్యానౌచిత్యాలు సహృదయవేద్యములే తప్ప హేతుపూర్వకంగా నిరూపింపదగ్గవి కావు. నాకిందులో అనౌచిత్యం కనిపించ లేదు. గంగాంబుకణాలను పూలతో పోల్చినప్పుడు, అవి – కొన్ని శివుని సిగలోపూవులుగా, కొన్ని నేలను కురిసే పూలవానగా, కొన్ని అంజలిలోని పుష్పాలుగా ఒప్పారాయని చెప్పడంలో పునరుక్తి ఏముంది. పోలిక ఒకటే అయినా స్థానాన్నిబట్టి వాటి అమరికలో మార్పు ఉంది కదా. అలాగే గంగాజలబిందువులు ముత్యాలవలె ఉన్నాయి కనుకనే అవి హరుని గళసీమలో హారాల్లా శోభిల్లాయి.
స్టార్‌బక్స్ కథలు: పచ్చబొట్ల కాఫీ కప్పు గురించి Anil అనిల్ అట్లూరి గారి అభిప్రాయం:
03/03/2015 8:53 am
స్టార్‌బక్స్ లో కథలు అని అనుకుని మీరు వ్రాస్తుంటే ఫరవాలేదు. కాని స్టార్‌బక్స్‌లో ఒక బారిస్టా అనుభవాలుగా వ్రాస్తుంటే మాత్రం, ఒక “స్త్రీ” గానో ఒక “పురుషుడు” గానో వ్రాస్తే బాగుంటుందేమో!
Esperanza is the Spanish word for “హొప్”. 🙂
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి మాగంటి వంశీ మోహన్ గారి అభిప్రాయం:
03/01/2015 11:27 am
భావాలు.
మనోభావాలు.
చెత్త భావాలు.
చిత్తు భావాలు.
ఉత్త భావాలు.
ప్రతి వాడికి ఒక భావం.
ఒక మనోభావం.
అందరివీ దెబ్బతినటమే.
స్త్రీల భావాలు దెబ్బతినటం.
కులాల భావాలు దెబ్బతినటం.
కవుల భావాలు దెబ్బతినటం.
సంపాదకుల భావాలు దెబ్బతినటం.
సంపాదకీయాల భావాలు దెబ్బతినటం.
ఓలు మొత్తంగా అన్నీ దెబ్బతినటం.
దెబ్బతినిపిచ్చుకోవటం.
ఒక్క సంప్రదాయవాదులవి తప్ప.
ఏం సంప్రదాయవాదులు మనుషులు కారా?
ఏమో కారేమో! ఎవడికి తెలుసు ?
వందల ఏళ్ళ నుంచి ఉన్న కట్టూబొట్టూ పాడైపోతే మనోభావాలు గాయపట్టం తప్పు.
వందల ఏళ్ళగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలు పాడైపోతున్నాయని మనోభావాలు గాయపట్టం తప్పు.
వందల ఏళ్ళ నుంచి ఉన్న కుటుంబ సంబంధాలు పాడైపోతే మనోభావాలు గాయపట్టం తప్పు.
వందల ఏళ్ళగా ఉన్న భాష ఆంగ్లంలోకి దిగిపోతోందని బాధ పట్టం తప్పు.
వందల ఏళ్ళగా లేని విచ్చలవిడితనం ఇప్పుడే రెచ్చిపోతోందని బాధపట్టం తప్పు.
పాత సాహిత్యం చదవండిరా, కొత్త సాహిత్యంలో పట్టండిరా అని నెత్తీ నోరు మొత్తుకోవటం తప్పు.
మనదాన్లో ఏవీ లేవని మనల్ని మనం తక్కువచేసుకుంటున్నామని, చేసుకోవాలని ప్రవచించే వాళ్ళను ఏం చెయ్యాలని బాధ పట్టం తప్పు.
వేల సంవత్సరాలుగా జీవితంలో భాగమైపోయిన రామాయణ, భారత, భాగవతాల్ని ఏ రచైత నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నా ఎవడు పట్టిచ్చుకోవట్లేదని మనోభావాలు గాయపర్చుకోటం తప్పు.
వీళ్ళెవరూ కాని సంస్కృతీ పరిరక్షకులు, ఆ పరిరక్షకుల మీద దాడి చేసేవాళ్లు కామోసు. విచిత్రమైన గీత.
ఈ గీత చతుర్ముఖుడు రాసాడని ఊరకోటమా!
లేక మిగతావాళ్ళంతా చేస్తున్న రివోల్టు ఈ సంప్రదాయవాదులెందుకు చేయట్లేదో మీకెవరికన్నా తెలుసా?
ఎవడి పాపాన ఎవడు పోతాడో తెలీక ఊరకుంటున్నారా?
ఎవడి పాపం వాడినే చుట్టుకుంటుందని ఊరకుంటున్నారా?
చతుర్ముఖుడు రాసాడే అనుకో, చిన్న గీతను పెద్ద గీత చేసుకోటం నీ చేతిలో పనే.
పండగలొస్తే సంప్రదాయవాదులు కావాలి.
పబ్బాలొస్తే సంప్రదాయవాదులు కావాలి.
పుడితే సంప్రదాయవాదులు కావాలి.
చస్తే సంప్రదాయవాదులు కావాలి.
అసలు సంప్రదాయవాది, వాడెట్లా చస్తే ఎవడిక్కావాలి ?
నైతిక భావాలు ఎట్లా చచ్చిపోతే ఎవడిక్కావాలి?
మంచి నేర్పే భావాలు చచ్చిపోతే ఎవడిక్కావాలి ?
అంతే! అంతే! అంతే!
ఇంతే! ఇంతే! ఇంతే!
కలికాలంలో అంతే!
అంతా పోయేదాకా ఇంతే!
ఇప్పటికి ఇంతే! అంతే!
అంపశయ్య: మరొకసారి కొత్తగా! గురించి అంపశయ్య నవీన్ గారి అభిప్రాయం:
02/14/2015 5:57 am
‘ఈమాట’మే, 2014 వెబ్ మ్యాగజైన్లో సుజాత గారు ‘అంపశయ్య మరోసారి, కొత్తగా’ పేరుతో రాసిన వ్యాసాన్ని నేను చాలా ఆలస్యంగా, ఒక వారం రోజుల క్రితమే సి.హెచ్.వేణు అనే సాహితీ మిత్రుడు నా ఐపాడ్ కు, నా ఇమెయిల్ ఐడికి పంపించటం వల్ల చూడగల్గాను. ఆ నవల వెలువడిన 45 సంవత్సరాల తర్వాత కూడా ఆ నవలను గూర్చి ఇలాంటి లోతైన విశ్లేషణాత్మక విమర్శా వ్యాసాలు రచింపబడ్తున్నందుకు ఆ నవలా రచయితగా చాలా సంతోషిస్తున్నాను.
అయితే సుజాత గారు ఆ వ్యాసాన్ని ముగిస్తూ ఆ నవల మీద చేసిన రెండు వ్యాఖ్యానాలు నన్ను చాలా ఆశ్చర్యపరచాయి.
అందులో ఒకటి: నవల ముగింపు నాటకీయంగా, బలవంతంగా జరిగింది; నవల మొత్తం వాతావరణంలో ఈ ముగింపు ఇమిడలేదని-
రెండవది: రమేష్ రత్తిని గురించి వివరంగా చెప్పడంలో కూడా ఈ బలవంతమే కనిపిస్తుంది.
1969లో అంపశయ్య వెలువడినప్పట్నించి ఈ నవలను గురించి చాలామంది చాలా విషయాల్ని చెప్పారు. కానీ సుజాత గారు చూపించిన ఈ రెండు అంశాల్ని ఎవరూ ప్రస్తావించలేదు.
నవలలో రవి అనేక మానసిక సంఘర్షణలకు లోనయ్యాడన్న విషయాన్ని సుజాత గారు కరెక్ట్ గానే చెప్పారు. అతడు ఒంటరిగా ఉన్నంతకాలం బలహీనుడే- సుజాత మాటల్లో దుర్బలుడుగానే కనిపిస్తాడు. అలాంటివాడు ఒక సమూహంలో ఉన్నప్పుడు ఎలా బలవంతుడుగా మారాడో చెప్పడానికే నవలను అలా ముగించాను. నవలలోని ఈ ముగింపు నాటకీయంగా కనిపిస్తుందన్నారు సుజాత గారు. ప్రతీ నవలలో అనేకచోట్ల ఎంతో కొంత నాటకీయత ఉంటుందని సుజాత గారికి తెలియని విషయం కాదనుకుంటా! ‘వైయక్తికమైన ప్రయాణం ఉన్నట్టుండి సామాజికం అవుతుంది’ అన్నారు సుజాత గారు. ఏ వైయక్తిక ప్రయాణమైనా సామాజికం కాక తప్పదు. పూర్వం ఎప్పుడో అరిస్టాటిల్ ‘Man is a social animal’ అన్నాడు. దీనికి సుజాత గారు నాటకీయమని అభ్యంతరపెట్టటం ఆశ్చర్యమే. నవలలో ఈ ముగింపు చాలా Spontaneous గా ఉత్పన్నమైనదేనని అనేకమంది పాఠకులు భావించారు.
ఇక రత్తిని గురించి రవి రమేష్ కు వివరంగా చెప్పడాన్ని సుజాత గారు బలవంతంగా జరిగిందని వ్యాఖ్యానించటం ఇంకా ఆశ్చర్యపరిచింది. నవల ప్రారంభం నుండి రత్తి ప్రసక్తి వస్తూనే ఉంది. నవల ముగిసేలోగా రత్తి ఉదంతాన్ని ఎక్కడో అక్కడ వివరంగా రచయిత చెప్పబోతున్నాడనే పాఠకులు అనుకుంటారు. రత్తిని గూర్చి రవి అనుక్షణం ఒక అపరాధ భావనకు లోనవుతున్నాడు. ఆ విషయాన్ని రమేష్ లాంటి అతని మిత్రునితో చెప్పుకుంటే తప్ప అతని హృదయంలో స్థిరపడిన ఆ అపరాధ భావన తొలగిపోయి అతని హృదయం తేలికపడదు. తన హృదయభారాన్ని తొలగించుకోవటం కోసమే రవి రమేష్ తో రత్తిని గురించి అంత వివరంగా చెప్పాడు. దీంట్లో ‘బలవంతం’ యేమీ లేదు.
ఆ తెలిసీ తెలియని వయస్సులో రవి రత్తిని ప్రేమించానన్న భ్రమకు లోనయ్యాడే గానీ ఆమెను నిజంగా ప్రేమించలేదని పాఠకులకు సులభంగానే అర్థమవుతుంది. నిజంగా ప్రేమిస్తే ఆమెను తన స్వంతం చేసుకోవడానికి రవి ఎంతకైనా తెగించేవాడు. కానీ రత్తి పట్ల అతనికి విపరీతమైన సానుభూతి ఉంది. ఆమెకు జరిగిన అన్యాయంలో తను కూడా భాగస్వామి అయ్యానేమోనన్న ఫీలింగ్ కారణంగా అతనిలో తీవ్రమైన అపరాధ భావం చోటుచేసుకుంది. రమేష్ కు ఈ ఉదంతాన్ని వివరంగా చెప్పుకోవడంతో ఆ అపరాధ భావన తొలగిపోయింది.
సుజాత గారూ ! నవలలో పాత్రలు తప్ప రచయిత కనిపించకూడదన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ముగింపులోనూ, రత్తిని గూర్చి రవి రమేష్ కు వివరంగా చెప్పిన ఘట్టంలోనూ రచయితే కనిపించాడని మీరంటున్నారు. కాని ఈ రెండు సందర్భాల్లోనూ రవే కనిపిస్తాడు తప్ప రచయిత కనిపించలేదే! ఒకవేళ మీరు రవే రచయిత అనుకుంటున్నారేమో దయచేసి ఆలోచించండి.
యేదేమైనా , మీరు ‘అంపశయ్య ’ మీద ఇంత లోతైన విశ్లేషణ చేసినందుకు మీకు కృతజ్ఞతలు.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/17/2015 4:49 pm
Taara గారికి (సూర్యుడి గారికి కూడా),
ప్రోత్సాహానికీ, సూచనలకీ కృతజ్ఞతలు.
1. Topology ని నిర్వచించడంలో నేను మరికొంత శ్రద్ధ పాటించాల్సింది. వస్తువులని చించకుండా పగలగొట్టకుండా, వంచినా సాగదీసినా, వాటిలో మార్పు చెందని లక్షణాలకి సంబంధించిన శాస్త్రం కాబట్టి స్థిరధర్మ శాస్త్రం అనడం ఘోరమైన తప్పనుకోను. సంస్థితి శాస్త్రం సరైనదా? ఓ గణితశాస్త్రజ్ఞుడి గా మీ సలహా ఏమిటి?
2. Goldbach Conjecture ని ఇలా సవరిస్తాను: రెంటి కన్నా పెద్దదైన ప్రతి సరి సంఖ్యా రెండు ప్రధాన సంఖ్యల కూడిక ఫలితం.
3. పూర్వం సహజ సంఖ్యలలో సున్నా ఉండేది కాదు కాని పందొమ్మిదో శతాబ్దం చివరలో వాడుక మారడం మొదలయింది. 1889 లో Peano సహజ సంఖ్యల మూల సూత్రాలని ప్రతిపాదించినపుడు 1 తో మొదలెట్టినా, 1898 కల్లా మార్చి 0 తో మొదలెట్టాడు. అందరూ ఒప్పుకోకపోవచ్చు కాని, ప్రస్తుతం 0 వాడటమే ఆధునిక పద్ధతి. From “the” book [1] on one of the most famous unsolvable problems, “Following the tradition in mathematical logic, … we shall consider 0 to be a natural number.”
4. రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు తర్కం మీద కాక ఇతర విషయాలపై చూశాను. వీలయితే మీరు ప్రస్తావించిన వాటి ప్రచురణ వివరాలు ఇవ్వండి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Hilbert’s Tenth Problem,” by Yuri V. Matiyasevich. The MIT Press, 1993.
కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు గారి అభిప్రాయం:
01/08/2015 4:01 am
ఎడిటర్ గారికి, కవిత్వం రాయటం ఎలా అనే విషయం ఇప్పుడే చదివాను. చాఆఆఆఆఆఆఆఆఅలా బాగుంది. కృతజ్ఞతలు.మొన్ననే ఒక కవిత మీకు పంపెను. కాని అది ప్రచురించలేమని మెయిల్ పెట్టేరు. పరవాలేదు. ఎందుకంటే నేను కవిత్వం నా సంత్రుప్తికి రాసుకుంటున్నాను. అదే సమయంలో మరి కొంత మందితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఏది ఏమైనా మీరూ పై వ్యాసంలో చెప్పిన చాల పాయింట్స్ నేను అనుకుంటున్నవే.అందుకే నాకు చాల సంతోషం వేసింది. మళ్ళీ ప్రయత్నం చేయడం తప్పుకాదని అనుకుంటున్నాను.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/06/2015 2:43 am
okAnokaDu గారికి,
శిక్ష కి సంబంధించి, నేను రాసింది కాస్త సవరించవచ్చు కాని మరీ సత్యదూరం కాదు.
Davis నుండి, “The judge before whom Turing’s case came, acting out of what he believed were humane motives, permitted Turing to escape prison if he would agree to be treated by hormonal injections …”
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/06/2015 2:09 am
భూషణ్ గారికి,
గణిత పదాల సూచనలకి చాలా కృతజ్ఞతలు.
గ.సా.భ. క.సా.గు. ల తప్పులు చూసి చాలా సిగ్గేసింది (very embarrassed).
ఈ క్రింది విధంగా మార్పులు చేస్తాను:
Distribution = విభాజనము, పంపకము
Central Limit Theorem = కేంద్రీయ అవధి సిద్ధాంతం
Number theory = సంఖ్యా గణితం
Model = నమూనా
Sample = మచ్చు
“ఏ నాటికైనా తెలుగు సైన్సు రచయితల సరసన చేరదలచుకొంటే పైన పేర్కొన్న దోషాలను దిద్దుకోవటం necessary and sufficient condition అని, మాథమాటిక్స్ లో మాలతీ చందూర్ వంటలు-పిండివంటలను కలిపి ఆసక్తి కరంగా వడ్డించిగల రచయితకు ఇది మంచినీళ్ళ ప్రాయమని నమ్ముతాను.”
పదాలకి సంబంధించిన దోషాలు దిద్దుకోవడం సులభమే; కాని అది necessary but not sufficient condition. 🙂 Thanks for the praise.
కంపెనీ లోగో లో ఉన్న apple న్యూటన్ ది, టూరింగ్ ది కాదు అని ఆ కంపెనీ వాళ్ళన్నారట.
కొడవళ్ళ హనుమంతరావు
సాహిత్యావగాహన: మరొక దృక్పథం గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:
01/05/2015 11:27 pm
కృష్ణారావుగారూ:
ఆలస్యంగా సమాధానం రాస్తున్నందుకు క్షమించండి.
మీరు చెప్పిన ఆ మా వూరు వాడెవరో నాకు తెలీదు. ఎవరో చెప్పితే సంతోషిస్తాను. ఎక్కడ ఎప్పుడు భావాలగురించి రాసారో కాస్త వివరంగా చెప్పండి. పోతే, “ఆకలి, నిద్ర, దాహం, ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం-అందరికీ ఇవి సమానమే.” కాదనుకుంటాను. ఇవి అందరికీ ఒకటే! కాని, అందరికీ సమానం (#equal#) కాదు. ఉదాహరణకి, ” ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం,” అందరికీ సమానమా? కాదేమో! అలాగే, అడుక్కొని తినేవాడికి, మూడుపూటలా మెక్కే అవకాశం ఉన్నవాడికీ, ” ఆకలి, నిద్ర, దాహం,” సమానం కాదనుకుంటా!
” భావాలు మానవుల్నందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు మానవుల్ని విడదీస్తాయి.” ఈ వాక్యం నాకు అస్సలు అర్థం కాలేదు. #Tower of Babel# కథ సరదాగానే ఉంటుంది కానీ, అది కట్టు కథ! కాస్త వివరంగా చెప్పితే మరీ సంతోషం.
విధేయుడు,
వేలూరి వేంకటేశ్వర రావు.
కోనసీమ కథలు: న్యాయవాదం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/05/2015 12:34 pm
పరమ ఆలస్యంగా వ్రాస్తున్న కామెంట్. ఏమీ అనుకోకండి.
మోహనగారు “ముగింపు ఎందుకో నన్ను ఆకర్షించలేదు. వాళ్లు చంపబడకుండా ఉండి ఉంటే బాగుండేది” అన్నారు. కానీ కథకుడు ఇచ్చిన ముగింపే సబబు. అది సహజమైన ముగింపు. మోహనగారు కోరిన ముగింపూ ఇవ్వవచ్చును. ట్రాక్టరు బోల్తా కొట్టి ఆ ముసలమ్మ కుటుంబం మొత్తం చనిపోయారన్న దానికి బదులుగా ముసలమ్మకుటంబాన్ని ఏదో చేయటానికి వెడుతూ సత్తిరాజే ట్రాక్టరు బోల్తా కొట్టి చనిపోయాడని వ్రాయవచ్చును. కాని అది వట్టి మెలోడ్రామెటిక్ ముగింపు ఐపోతుంది. ఈ విధమైన ముగింపు కథకుడికి తోచలేదని నేను అనుకోను. అందుచేత సహజమైన ముగింపు వైపుకే కథకుడూ మొగ్గినట్లు నా అభిప్రాయం.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి okAnokaDu గారి అభిప్రాయం:
01/05/2015 9:54 am
రామారావు గారు ‘ఈ వ్యాసం నాకు ముందు దొరికి ఉంటే’ అన్నారు కనక నా మనసులో ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నాను.
మనకున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రొఫెసర్లు ఎలా ఉద్యోగాలు సంపాదిస్తారో జనాలకి తెల్సిందే. అటు తూర్పులోనూ ఇటు పడమరలోనూ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసి చేతనైనంత దూరం రాళ్ళు విసిరినవాణ్ణే నేనూను; రామారావు గారంతటి పెద్ద స్కూల్లో చదువుకోకపోయినా. కంప్యూటర్స్ అనేసరికి రెండూ మూడు రకాల లాంగ్వేజస్ ఓ రకం డాటాబేస్ నేర్చుకోవడం అనే ముద్ర పడిపోయింది. కంప్యూటర్ ఇంజినీరింగ్ వేరూ, కంప్యూటర్ సైన్సు వేరూ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వేరూ అని చెప్తే నవ్వే రోజులొచ్చాయి. అదలా ఉంచి టీచింగ్ దగ్గిరకి వస్తే ఇండియాలో ఉన్న ఏవో కొద్ది కాలేజీలు తప్పితే మిగతా ఎక్కడా కూడా “మొదటి కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు?” అనే ప్రశ్న తర్వాత కానీ ముందు కానీ ఆలన్ టూరింగ్ పేరు వినిపించదు.
ఈ ప్రొఫెసర్లకే తెలీవు ఇక్కడ రావు గారు చెప్పిన విషయాలు. కుర్రాళ్లకేం చెపుతారు? ఆ మధ్య స్కూల్లో ఎలిప్స్ గురించి చెప్తూ (పడమర యూనివర్సిటీలో) ఆచార్యుల వారు చెప్పారు – దీని అప్లికేషన్ గురించి – అల్ట్రా సౌండ్ లో వాడతారు అని. మన ఇండియాలో అసలు ఇంజినీరింగ్ కాలేజీలో కానీ ఎక్కడా కూడా కాని వినం ఇవి. ఎందుకంటే వాళ్ళకే తెలియదు కదా? Straight line drawn from one of the focal points to any point on the curve and then back to the other focal point has the same length for every point on the curve అనేది మాత్రం మనచేత పిడి కొట్టిస్తూ ఉంటారు. ఓ కుర్రాడు – రామారావు గారు ఇండియాలో చదువుకున్న స్కూల్లోనే – మెకానికల్ ఇంజినీరింగ్ ఆచార్యుల వారిని ఎల్లిప్టికల్ షేప్ లో car engine సిలిండర్ కుదరదా అని అడిగితే క్లాసులో అందరిముందూ వెక్కిరించారని విన్నాను. అదే మోడల్ ఉత్తరోత్తరా ఏదో కార్ కంపెనీ వారు చేసారుట. అది విజయం సాధించిందా లేదా అనేది పక్కన పెట్టి, 18/19 ఏళ్ళ కుర్రాడి తెలివితేటలకి మెచ్చుకోవడం ఎందుకు చేయలేకపోయేరు ఆ ప్రొఫెసర్? ఏదో చెత్త కాలేజీలో అయితే అనుకోవచ్చు కానీ ఐ ఐ టి లో కూడానా అంటే సమాధానం సులభంగా చెప్పవచ్చు – అహంకారం – నువ్వెవడవోయ్ నాకు చెప్పడానికి? నువ్వు 18 ఏళ్ళ కుర్రాడివి నేను అమెరికాలో పీ. హెచ్. డి చేసొచ్చా అనే భావన. Holier than thou.
తప్పు పూర్తిగా మనది కాదు లెండి. డిగ్రీ అవగానే డబ్బులకి ఉద్యోగం వెతుక్కోవల్సిన పరిస్థితి మనది. Chemical Engineering ఉద్యోగం వస్తే మహా అయితే గియితే యాభై వేలొస్తాయేమో మొదట్లో. రెండు లాంగ్వేజెస్ నేర్చుకుంటే అదే డిగ్రీతో నెలకి మూడు నుండి నాలుగు లక్షల జీతం గేరంటీ. నాలుగేళ్ళు కష్టపడి చదివిన నా డిగ్రీ సంతకెళ్తే నాకేం? మరో విషయం మనకున్న రీసెర్చ్. హైద్రాబాద్ అంత ఉంటుందా తైవాన్ అనే దేశం? అక్కడ జరిగే రీసెర్చ్ మొత్తం మన దేశంలో ఎక్కడా లేదని నేను ఘంటాపధంగా చెప్పగలను. మొన్నటికి మొన్న ఒక ఆచార్యుల గారికి ప్రమోషన్ కోసం రికమెండేషన్ రాసిచ్చాము. ఆయన రాసిన పేపర్ల లాంటివి ఇండియాలో ఎక్కడా చూడలేదు. నీకేం తెలుసోయ్ చెవలాయ్ అంటారేమో అని చెప్తున్నాను కానీ స్వోత్కర్ష కోసం కాదు, నేనూ దేశంలో కొన్ని సంవత్సరాలు పాఠాలు చెప్పి పేపర్లు పబ్లిష్ చేసినవాణ్ణే.
అటు తూర్పు ఇలా ఉంటే పడమరలో కూడా రకరకాల ఏడుపులున్నాయి. ఓ ఆచార్యులవారి క్లాసులో నేను సోడియం పొటాషియం ఛానెల్స్ గురించి గుండెకి అవి ఎలా అవసరమో అనేది “Cardiovascular Engineering” course లో విన్నాను. కానీ ఆయన మైక్రోబయాలజీ మేజర్ అవడం వల్ల మొత్తం సెమెస్టర్ అంతా అదే చెప్పి ప్రాణం తీసేడు. సోడియం పోటాషియం చానెల్స్ గొప్పవే కాదనటంలేదు కానీ నాలుగునెలలు వారానికో రెండు గంటల క్లాసులో చెప్పక్కర్లేదు, మిగతా కోర్స్ అంతా వదిలేసి. ఉత్తరోత్తరా తెల్సినదేమిటంటే ఆయనకి ఈ కోర్సులో సోడియం పొటాషియం ఛానెల్స్ తప్ప మిగతా Engineering Principles of Blood Flow, Stress Tensor, Strain, Pressure differences అనేవి అర్ధం కావు. అందుచేత అవి మాకు చెప్పడు. కోర్సు అయ్యాకా దాదాపు అందరికీ ఒకటే గ్రేడ్ – బి. ఎందుకంటే ఒకటే దాన్ని దంచుతూ కూర్చున్నాడు మాకు బోరుకొట్టి వినడం మానేశాం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే పడమర స్కూళ్ళల్లో (వేమూరి వారు క్షమించాలి) – సబ్జెక్ట్ వచ్చినాయనకి క్లాసుకొచ్చి పాఠాలు చెప్పడానికి సమయంలేదు – టీచింగ్ అసిస్టెంట్ ని చూడమంటాడు. అధవా క్లాసుకి వచ్చినా నోటమ్మట మాట రాదు ఆయనకి. వచ్చినది చెప్పలేడు. రెండో రకం వాళ్ళు పైన చెప్పినటువంటి సోడియం పొటాషియం ఆచార్యులు.
ఇంకో కంప్యూటర్ సైన్స్ ఆచార్యులవారి పద్ధతేమిటంటే క్లాసులో టెక్స్ట్ బుక్కు చదవడం. అందరూ పుస్తకం పట్టుకుని రావాలి క్లాసుకి. ఓ పుస్తకం ఇద్దరు చూడడం నిషేధం. పుస్తకం కొనకపోయినా క్లాసుకి తీసుకురాకపోయినా మీ గ్రేడ్ బి. దిక్కున్న చోట చెప్పుకోండి. ఇలాంటి వాటి వల్ల ఓ కుర్రాడికి సెమెస్టర్ అంతా బుర్ర పాడయ్యి వాళ్ల మేజర్ ప్రొఫెసర్ దగ్గిర చివాట్లు తినడం నాకు తెలుసు.
ఎక్కడో ఓ ట్యూరింగ్ నిశ్శబ్దంగా తన పని చేసుకుపోతూంటాడు. ఓ రోజు ఆయన ప్రతిభ – సినిమా మూలంగా అయితేనేం, మరో విధంగా అయితేనేం – బయటకొస్తుంది. అలాగే కేన్సర్, ఎయిడ్స్ కి మందులు కూడా ఓ రోజు వెలుగు చూస్తాయి. ఈ నిశ్శబ్దంగా పనిచేసుకుపోయేవారు జ్ఞానజ్యోతులు. మనం వాటికి చమురు పోసినా పోయకపోయినా అవి వెలుగుతాయి ఏదో విధంగా.
మొదట్లో చెప్పవలిసింది గానీ చివరిగా చెప్తున్నాను. కొడవళ్ళ గారూ మీ వ్యాసం అద్భుతం.వ్యాసం మొత్తం అంతా లెక్కలు బోరుకొట్టకుండా టూరింగ్ ఎక్కడ పుట్టాడో, జీవితం ఎలా గడిచిందో చెప్తూ మధ్య మధ్యలో వివరాలు ఇవ్వడం వల్ల చదువుతున్నప్పుడు ఎక్కడా విసుగనిపించలేదు. ఎనిమిదేసి పేజీల పెద్ద వ్యాసం అప్పుడప్పుడు క్రమం తప్పుతూ రాయడం కంటే మూడు/నాలుగు పేజీలు క్రమం తప్పకుండా రాయడం సులభమేమో ఆలోచించగలరు – ఎందుకంటే ఒకేసారి ఈ ఎనిమిది పేజీలు జీర్ణించుకోవడం కష్టం. “తీరుబడి లేక” రాయట్లేదు అనకండి. మనసుంటే మార్గముంది అన్నారు కదా? రెగ్యులర్ గా రాస్తూ ఉంటారని ఆసిస్తూ.
యధుకుల భూషణ్ గారికి: ఇటువంటి వ్యాసం రాసినప్పుడు కొండకచో అనువాద తప్పులు రావడం సహజం. అవి పెద్ద లెక్కలోకి రావు. ఏపిల్ కంప్యూటర్స్ కీ ట్యూరింగ్ కీ ఏమిటి సంబంధం? నాకర్ధం కాలేదు. నాకు తెల్సున్నంతలో ఏపిల్ కంప్యూటర్స్ వినియోగదారులకి పనికొచ్చే పరికరాలు చేసే కంపెనీ – అవి కంప్యూటర్లు కానీయండి, ఫోన్లు కానీయండి. బతికున్నప్పుడు స్టీవ్ జాబ్స్ కి ఈ వ్యాసంలో రాసిన విషయాలు తెలిసి ఉంటాయంటే సందేహమే.
రామారావు గారికి: క్యూరియాసిటీ వల్ల అడుగుతున్నాను కానీ ఏదో మిమ్మల్ని ఛాలెంజ్ చేయాలని కాదు. మీకు ఇటువంటి వ్యాసం దొరికి ఉంటే మీ కెరీర్ ఏ విధంగా మలుపు తిరిగి ఉండేది?
స్టార్‌బక్స్ కథలు: కాఫీ బానిస గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/04/2015 10:41 am
వ్యసనం అంటే దుఃఖం. అది ఏదో రకంగా మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది. అప్పుడప్పుడు అది కొంచెం తక్కువస్థాయిలో ఉన్నప్పుడు ఆ కాస్త స్థాయీబేధాన్ని బట్టి మనకు సుఖభావన కలుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని బలహీనతలు దుఃఖానికి జన్మస్థానాలయ్యేసరికి బలహీనతలే వ్యసనాలుగా ఒక అభిప్రాయం ప్రపంచంలో స్థిరపడింది. కాని అలవాట్లన్నీ వ్యసనాలు కానక్కర్లేదు. వ్యసనస్థాయికి చేరినవి దురలవాట్లు అన్నమాట.
ఈ కథలో కాఫీ అనేది ఒక వ్యసనంగా చూపారు కాని అదంత బలంగా రాలేదు.అలాగే స్నేహం కూడా సూచనాప్రాయంగా ఒక వ్యసనంగానే చూపారు కానీ అదీ అంత బలంగా రాలేదు.
అన్ని జీవితాలలోనూ ఏదో రకమైన వెలితి ఉండనే ఉంటుంది. అది చాలా సహజం. ఆ వెలితిని కప్పిపుచ్చుకుందుకు మనుషులు ఏవో వ్యాపకాలను ఆశ్రయిస్తారు. అవి అలవాట్లుగా మారవచ్చును. కానీ అన్నీ దురలవాట్లుగా మారవు కాబట్టి అన్నీ వ్యసనపర్యంతం కాక దురలవాట్లూ దుఃఖకారకాలూ కావు. అందుచేత ఇక్కడ వ్యసనం అన్న భావనను కొంచెం అతిచేసి చూపటం జరిగిందని నా భావన.
కథను కాఫీకి ముడివేయటానికి గాని కథకుడు తానే కాఫీని సిప్ చేయటం అనేది దేనినీ సూచించినట్లు నాకనిపించలేదు.
కథనం మాత్రం బాగుంది. కథలో నాకేమీ విశేషం కనిపించలేదు. నా అవగాహనలో ఏమైనా పొరపాట్లున్నాయేమో తెలియదు!
ఎం. వీ. విందుడు గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/04/2015 10:28 am
తనదాకా వస్తే కాని తలనొప్పి తెలియదనే సామెతకు ఒక ఉదాహరణగా వ్రాసిన కథ. దేనికైనా సమయం రావాలి అన్న తెలివిడికల ప్రాప్తకాలజ్ఞుడి ముఖంమీద చివరకు మందహాసం వచ్చేసింది – హమ్మయ్య!
ప్రక్షాళన గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
01/04/2015 10:15 am
అనువాదపు కథ. బాగుంది. అనువాదపు వాసనలతో కాకుండా తెలుగువాతావరణంలో ఈ కథను నడిపి ఉంటే మరింత బాగుండేది.
పాత తెలుగుసినిమాల్లో బాలరాజుకథ అని ఒకటి దివంగత బాపూగారు తీసినది ఉంది. అందులో కొన్ని నీతిసూత్రాలు వరసగా ఒక ఫలకం మీద వ్రాసి ఉంటాయి. ఆ నీతులను ప్రబోధించే కథలు అదే వరుసలో కథానాయకుడైన బాలుడి జీవితంలో జరుగుతాయి. తప్పేమీ లేదు కాని ఎందుకనో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది అప్పట్లోనే. ఈ కథలో కూడా అటువంటి వరుసక్రమం ధోరణి కొంత ఉన్నట్లుంది.
ఇటువంటి తాత్త్వికచింతనకల కథలు చదవటానికి చాలా బాగుంటాయి, ముఖ్యంగా జానపదకథల ధోరణిలో నడచినప్పుడు.
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: కొత్త తరం గురించి ravi గారి అభిప్రాయం:
01/04/2015 2:18 am
చాల బాగుంది. తరుచు వస్తు పోతూ ఉన్న నాకు మొదట్లొ అంత తేడా తేలిసేది కాదు. కాని ఇప్పుడు మీరు రాసినది మాములు అయిపొయింది. పాత చింతకాయ అంటారు. మీరు రాసే వ్యసాలు చదివె వాళ్ళ వయసు చూస్తే మీకే తెలుస్తుంది. నిజం చెప్పాలంటె చాల బాధగా ఉంటుంది.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
01/01/2015 12:45 pm
చాల బాగుంది. నేను వైజ్ఞానిక విషయాలమీద వ్యాసాలు రాసినప్పుడు “ఇదంతా కంచి గరుడ సేవే” అని నన్ను ఆక్షేపించిన వారే ఎక్కువ; ప్రోత్సహించినవాళ్లు తక్కువ. నేనూ కంప్యూటర్ రంగంలో పని చేసిన వాడినే. కాలేజీలో టూరింగ్ మెషీన్ గురించి చదువుకున్న వాడినే. కాని అదే విషయాన్ని తెలుగులో చదువుతూ ఉంటే బాగా అర్థం అయినట్లు అనిపించింది. ఈ అనిపించడం మాతృభాషలో చదవడం వల్ల అనిపించిందో, రచయిత నేర్పు వల్ల అనిపించిందో చెప్పలేను.
అంతే కాదు. రచయిత ప్రయోగాత్మకంగా వాడిన ఎన్నో కొత్త మాటలు, పదబంధాలు ఈ వ్యాసంలో కనిపించేయి. ఇలా నలుగురూ ప్రయత్నం చేస్తేనే కదా భాష పెరిగేది!
– వేమూరి
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ఇండియా ప్రయాణం గురించి baatasaari గారి అభిప్రాయం:
11/28/2014 8:20 am
శ్యామలాదేవి గారు నాకు అసలు బ్లాగులు చదివె అలవాటే లేదండి. కాని మీ రచన చూసాక ఎందుకో బ్లాగు లోంచి వెళ్ళాలనిపించట్లేదు. చాలా బాగుంది. మంచి కాలక్షేపం.
నాన్నగారు కట్టిన ఇల్లు గురించి Sarepaka V RamaGopal గారి అభిప్రాయం:
11/26/2014 1:03 pm
కథ నచ్చిందనే బదులు మనసును తాకిందంటాను. ఈ కథ చదివేక చిన్నప్పటి జ్ఞాపకాలు తాజా అయినాయి. ప్రతీ కుటుంబం లోనూ, ఈ “ఇంటి” కథలు మామూలే. మనుషులు, ఊళ్ళు మార మారవచ్చు. కాని, సంఘటనలు పెద్దగా మారవు. పోతే, ప్రతీ పిల్లకాయకూ ఇలాంటి మామ్మ ఉంటే, పసితనం ఎప్పటికీ వసి వాడదు. మళ్ళీ ఎప్పటికి, ఇలాంటి మరో కథ చదువుతామో అనిపిస్తోంది.
రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి Pavan Santhosh.S గారి అభిప్రాయం:
11/24/2014 6:14 am
@శిరాశ్రీ గారూ,
ఆయన రాసింది 2008లో మీరు చూసింది 2014లో. ఆయన మీ పుస్తకానికి చాన్నాళ్ళ ముందే రాశారు. మీరు ముందుగా చూసి ఉండాల్సింది.
రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
11/14/2014 11:55 am
మురళీధరరావు గారి సాహిత్య వ్యాసములు అన్నీ నాకు క్లిష్టంగా ఉండి, ఎంతో ఇష్టంగా ఉన్నాయి. ఎంతో కొంత అర్ధమైతే అదే గొప్ప. ఒకసారి, వీరి ముందటి రచనకు ఈ పత్రికలో, గైడ్ తయారు చెయ్యబడినప్పుడు, అసలేం అర్ధం కాక, దారీ తెన్నూ తెలియక, దారుణ హృదయ వేదన కలిగింది. కాని పాఠకుల పల్స్ చదవగలిగే సంపాదకులు, వ్యాసం అసలు ప్రతిని త్వరలో అందించినందున, పరిస్ధితి వెంటనే మెరుగయ్యింది.
ఈ వ్యాసం లోని మొదటి పద్యం ఇంకా చదవాల్సి ఉంది. రెండవ పద్య సవరణ సరైనదిగా, నాకు అనిపించింది. What a beautiful step by step demonstration of restoration of an old poem. I love it.
ఈ పద్యంలో జింకలు, సింహాలు వంటి ప్రాణుల పోలికలు తెస్తూ, కంఠానికి మాత్రం inanimate శంఖం పోలిక ఎందుకు వాడినాడు ఈ తెనాలి రామలింగ కవి? అనుకున్నాను ముందు నేను ఒక క్షణం. పొరపాటు. నిజానికి శంఖం కూడా ప్రాణమున్న జంతువే. It’s a mollusc. It is a sea snail.
A pink sea shell tossing and turning on a grassy sea bed is so very alive. The poet won’t be thinking of dead, discarded shells on sea shore. The poet is using certain physical and behavioral traits, and natural habitats of four different live animals, to aggrandize a woman of intimidating beauty.
లైలా
(ఆఖరు పేరాలో వాక్యంలో వరుస శంఖం, పాము, జింక, సింహము… అని ఉండాలి గదా.)
రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
11/04/2014 1:55 pm
మాన్యులు, విద్వత్కవివరేణ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
ప్రణామములతో,
వ్యాసాన్ని ఎంతో సూక్ష్మేక్షికతో చదివి మీరు వ్రాసిన ఆదరవాక్యాలకు ధన్యుణ్ణి. మీ బోటి పెద్దల దృఙ్నివేశం దీనిపై ప్రసరించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది.
‘ఒడ్డియాణము’ విషయమైన నా పొరపాటును వ్యాసాన్ని ముద్రించేటపుడు మీకు కృతజ్ఞుడనై సరిచేస్తాను.
ఇక, ‘స్రవించు’ ధాత్వర్థాన్ని మీరు శంఖానికి అన్వయించిన తీరు ఆశ్చర్యకరంగా ఉన్నది. అది మీ వైజ్ఞానికదృష్టికి, లోకపరిశీలనకు నిదర్శకం. అయితే, ఎంత ఆలోచించినా అది ఆపాతరమణీయమే కాని, కవిసమయవిరుద్ధమని నాకు తోచింది.
కావ్యనాయిక గళశోభకు, కంఠస్వరమాధురికి ఎదురుకాలేక శంఖం వారిధిలో తలదాచుకొనవలసిరావటం, ఆ సమయంలో కవులు ప్రదక్షిణ – దక్షిణావర్తాది శబ్దచిత్రాలను ప్రయోగిస్తుండటం ప్రబంధసామాన్యమైన కవిసమయం. దరము అంటే భయము అనే అర్థంకూడా ఉన్నది కనుక వాసవదత్తా గళసౌందర్యలక్ష్మికి సాటిరాలేని దరము (శంఖము) దరమునొంది (భయపడి) వార్ధిపదంలో భ్రమింపవలసివచ్చింది. ఆ భ్రమణాల (తిరుగుళ్ళ) వల్ల దక్షిణావర్త వామావర్తాదులైన భేదాలేర్పడ్డాయని కల్పన తీగసాగుతుంది. పాము పుట్టలో నిక్కటం, జింక పూరిమేయటం, సింహం కొండగుహలలో తలదాచుకోవటం వలెనే ఇది నిత్యానువర్తనీయమైన క్రియావిశేషం. క్షణలేశప్రవర్త్యమానమైన తద్ధర్మం కాదు.
‘స్రవించు’ ధాత్వర్థం వారిధితటంలో ఉన్న శంఖానికే గాని వారిధిపదంలో ఉన్నదానికి అనువర్తింపదు. ఆ స్రావకత్వమైనా దినైక దినద్వయమాత్రం అనువర్తించేదే కాని శాశ్వతికం కాదు. అప్పుడు నాయికా గళాన్ని ఎదిరించినప్పటి ఓటమి వలని స్రవించటం తాత్కాలికం అవుతుంది. అందువల్ల ఆ శబ్దం అన్వయింపదని నాకు తోచింది.
పైగా, ‘స్రవించు’ అన్న నిశ్చయాత్మిక క్రియకు పరాభూతమైన శంఖము వార్ధిలో “దేనిని” స్రవిస్తున్నదో సూచింపగల కర్మార్థసమర్పకశక్తి లేదు. అందువల్ల కూడా అది స్వీకార్యం కాదని, ‘భ్రమించు’ అన్న ప్రసిద్ధార్థఘటనమే ఉచితమని నాకు తోస్తున్నది.
మీరొక్కసారి ఈ దృష్టితో పాఠాన్ని పరికించి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని ప్రార్థన.
మీ అభిమానాదరాలకు, నిరంతరాయితమైన విమర్శప్రోత్సాహానికి ధన్యవాదాలను విన్నవించికొంటున్నాను.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:
11/03/2014 7:09 pm
శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు ఓ రెండు తెనాలి రామలింగ కవి పద్యాల నెంచుకొని చక్కని పరిశీలనా దక్షతతో ముద్రారాక్షసములను సవరించి వాటికి అందమైన అన్వయమును సమకూర్చారు. వారి ప్రయత్నము వలన పాఠకులకు రెండు చక్కని పద్యాలు సుందరతర విశ్లేషణా భాగ్యముతో లభించాయి.
కందర్ప కేతు విలాసములో “మౌనిఁ గెంజడల జొంపము ఫాలపట్టికఁ దీండ్రించు భసితత్రిపుండకంబు” అనే పద్యానికి ఆధారముగా శ్రీ వామన భట్టబాణుని “పాణౌ వేత్రం పవిత్రం భసిత విరచితం పుణ్డ్రకం ఫాలదేశే” అనే సిధ్ధపురుషుని వర్ణన నుదహరించి తమ సవరణలను చక్కగా నిరూపించారు.
ఓడ్డియాణమునకు ఒడ్డాణ మనే అర్ధము ఆంధ్ర భారతి వారి తెలుగు నిఘంటువులో లభ్యమే ! ఆంధ్ర వాచస్పత్యము ,వావిళ్ళవారి నిఘంటువు , ఆంధ్ర శబ్ద రత్నాకరముల నుంచి వారా అర్ధమును గ్రహించారు. శ్రీ ఏల్చూరి వారెంచుకొనిన
దర, భజ, గేణ, సింహములు తద్గళ, వే, ణ్యవలోకనద్వయో
దరముల కోడి, వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులం గుహాం
తరముల పూన నిక్కఁ, దిన, దాఁగ, స్రవింప, నిటూర్పులూర్చ స
త్వరముగ నేఁగ, నీడఁగని తత్తరమందఁగఁ జేసి తౌ చెలీ.”
అనే పద్య మెంత బాగున్నదో! ఈ పద్యములో కూడా వారు సూచించిన సవరణలు సమంజసమే! కాని నా అభిప్రాయములో శంఖము భ్రమించడము కంటె స్రవించడమే సరి యని పిస్తున్నది. నా చిన్నతనమంతా సముద్ర తీరములో గడిచింది. ప్రతిదినము సముద్ర తీరానికి పోయి గవ్వలు, చందమామలు, శంఖములు సేకరించి యింటికి కొనిపోయేవాడిని. లవణ సంగత మవడముచే అవి మరునాడు కూడా తేమ నూరుతూ జిడ్డు జిడ్డుగా నుండేవి. పలు సారులు మంచి నీటితో కడిగి పొడి చేశాకే వాటికా తేమ పోయేది. వారిధి పదంబుల నుండుట చేతను, లవణ సాంగత్యము కలుగుట చేతను శంఖములు (గాలిలో తేమను గ్రహించి ) స్రవిస్తాయి. అంతెందుకు ? సముద్ర తీరములో నుండే మనుజులు కూడా తక్కువ శ్రమకే అధిక ఘర్మజలాన్ని స్రవిస్తారు. అందుచేతనే మా శ్రీశ్రీ సముద్ర తీరానుభవముతో ఘర్మజలానికి, ధర్మ జలానికి, కర్మజలానికి ఖరీదు గట్టే షరాబు లేడొయ్! అని కవిత చెప్పగలిగారు!
ఏమైనా శ్రీ ఏల్చూరి వారి విశ్లేషణ ఉత్సాహకరముగా, నాకర్షణీయముగా సాగింది.వారికి కృతజ్ఞతాభివందనములు!
నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:
11/02/2014 5:01 pm
కామేశ్వర రావుగారూ: మీరు రుచిచూపించిన మూడు పద్యరత్నాలూ, ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. అన్నమయ్య శతకం గురించి విన్నానే కాని, శ్రద్ధగా చదివి అనుభవిద్దామని ఇప్పటివరకూ అనుకోలేదు. ఇప్పుడు మీరు ప్రేరేపించారు. సంతోషం.
కవిత్వానికి,తాత్వికతకూ దీటయిన పద్యం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ క్రింది పద్యం — చాలా అందమైన పద్యం — అని నా
అభిప్రాయం.
తరగల్ పిప్పలపత్రముల్ మెఱుగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లేండమావుల తతున్ ఖద్యోతకీటప్రభల్
సురవీథీలిఖితాక్షరంబులసువుల్ జ్యోత్స్నాపయఃపిండముల్
సిరులందేల మదాధులౌదురొ జనుల్!శ్రీకాళహస్తీశ్వరా!
మరొక విషయం: ధూర్జటి కూడా”అద్వైతజ్ఞానుల”ను పరిహసించాడు.
వటవద్రజ్జు భుజంగవ ద్రజత విభ్రాంతి స్ఫురచ్చుక్తి వ
ద్ఘట వచ్చంద్ర శిలాజపాకుసుమ రుక్సాంగత్యవత్తంచు వా
క్పటిమ ల్నేర్త్తురు చిత్సుఖంబనుభవింపన్ లేక దుర్మేధనున్
చిటుకన్నందలపోయజూతురధముల్ శ్రీకాళహస్తీశ్వరా!
మీరు పరిచయం చేసే పద్యాలు, మీవ్యాఖ్యానం అత్యంత శ్రద్ధతో చదివి ఆనందించే వాళ్ళల్లో నేను ఒకణ్ణి.
Please continue the good work.
వేవేరా
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి rupadevi గారి అభిప్రాయం:
11/02/2014 11:48 am
మీరు ఈ వ్యాసం ద్వారా రజని గారు, వారి లలితసంగీత సేవ గురించి చక్కగా తెలియజేసారు అందుకు గాను మీకు ధన్యవాదాలు. ఇక, నేను లలితసంగీత పాఠం అనే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేదాన్ని కాని ఇప్పుడు ఆ అవకాశం నాకు కలగడం లేదు. ఐతె నేను ఆ కార్యక్రమాలను నా పిల్లలకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి 1980,1990ల ఆ కార్యక్రమాలను నేను ఒన్లినె లో పొందగలనా? దయచేసి వాటిని పంపగలరు.
-రూపాబాలకృష్ణ.
జ్ఞాపకాల వాసన గురించి srini గారి అభిప్రాయం:
10/28/2014 3:51 am
వాడు ఇంక తిరిగి రాకుండా తలుపులేసేశాను – అంటే ఈ భూమ్మీద తలుపులు మూసుకున్నవి అని; నేను కూడా తిరిగి రాకుండా తలుపులు తెరుచుకున్నాయి – అంటే నరకానికో స్వర్గానికో తలుపులు తెర్చుకున్నాయి అని అర్ధం కాబొలు.
మంజుఘోష గురించి arya marati balaji rao గారి అభిప్రాయం:
10/17/2014 2:35 pm
సమవర్తి గారూ,
మీ మంజులమైన హృద్ఘోష బాగున్నది. శ్రీ శ్రీ గురజాడలు వారి వారి దారిలో వారు ప్రయాణించారు. అయితే నేటి కవికపులు చాలమంది వారి అడుగులజాడలో నడుస్తున్నట్లు నటిస్తూ, పద్యాన్ని తిట్టి పోస్తూ, చేస్తున్న రచనలు మీరు చెప్పినట్లు వారి జీవితంలో వాస్తవాలు కాని వాస్తవాలే సుమా!
తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
10/07/2014 4:33 am
“లలితస్కంథము..”, “దుర్వారోద్యమ ..” పద్యాల విషయంలో నాది పొరపాటే. నేననుకుంటున్న పద్యాలు వేరు, రాసినవి వేరు (ఎర్రన గారి పద్యం అన్నది “శాతనఖాగ్రఖండిత ..”; అదీ ఇదీ కూడ ద్రౌపది మాటలే కనక ఒకటి అనుకుంటూ మరోటి రాశాను); ఏమైనా పొరపాటే.
ఐతే ఇదంతా రామాయణంలో పిడకల వేట. ప్రస్తుతవ్యాసానికి ముఖ్యాంగం కూడ కాదు. ఒక గ్రంథం తాలూకు అనేక ప్రతుల్ని సంగ్రహించినప్పుడు ఒక్కో ప్రతి గురించిన సమాచారాన్ని కూడ భద్రపరచనందువల్ల ఎంతో నష్టం జరిగిందన్నది వ్యాసం ముఖ్యవిషయం. పుస్తకాల గురించిన పాశ్చాత్య భావాలు ఇందుకు కారణం అని వారి వాదన. ఆ భావాలు తెలుగు సాహిత్య చరిత్రలో బలంగా నాటుకుపోయాయని, అందుకు బ్రౌన్ తదితరులు బాధ్యులని, ఆ భావాలు ఈనాటికీ వదలలేదని కాని మనం వాటిని వదిలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని వారి సిద్ధాంతం. పరిశోధకులెవరికైనా ఇది ఆహ్వానించదగ్గ విషయమేనని నా అభిప్రాయం. పాతవిషయాల్ని కొత్తచూపుతో చూడటం పరిశోధకుల గీటురాయి కదా !
నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
10/06/2014 4:04 pm
మాన్యులు శ్రీ సూరి సీతారాం గారికి
నమస్కారములతో,
మీరన్న ఆ భావాన్ని లాక్షణికులు ౧) శబ్దాపహారము, ౨) అర్థాపహారము, ౩) ఉభయాపహారము, ౪) ఛాయాపహారము, ౫) ప్రతిచ్ఛాయాకరణము, ౬) రేఖాపహారము, ౭) ప్రతినిర్మాణము, ౮) వర్ణనాగ్రహణము, ౯) సర్వగ్రంథచౌర్యము అని పరిపరివిధాల నిరూపించారు. రాజశేఖరుని ‘కావ్యమీమాంస’లోని ఒక ప్రకరణమంతా ఈ విషయవివేకానికే అంకితమయింది.
ఇది అనువాదవిషయమైనప్పుడు ౧) శబ్దానువాదం, ౨) అర్థానువాదం, ౩) భావానువాదం, ౪) మూలవిధేయం, ౫) మూలాతిక్రమణం అన్న స్వీకార్యాంశాలలో ఏది, ఏ సందర్భంలో, ఏ తీరున గ్రహణీయం అన్నది కవి ప్రతిభాపురస్కృతమై ఉంటుంది. ఆ పట్టువిడుపుల ఒడుపుకు ఉపదేష్టలు కనుకనే కవిత్రయం వారు మనకు ప్రామాణికులయ్యారు. రసప్రతీతి నిమిత్తం కథాసన్నివేశాల వైపుల్య సంక్షేపాదులకు కూడా మనకు వారు చూపినవే దారిదీపాలు. ఇక, ప్రౌఢి అన్నది కవి పాండిత్య(శక్తి)విలసనాన్ని బట్టి, ఔచితీపరిపాటిని బట్టి నిశ్చయింపబడుతున్నది.
ఈ వ్యాసంలో చర్చింపబడిన ప్రధానాంశం ఇది: వేర్వేరు కథలను కలిగిన కుమారసంభవ – కందర్పకేతువిలాస కావ్యాలలో నన్నెచోడ – తెనాలి రామకృష్ణకవులు కవులు సందర్భావశాన ఒకే భావభావనను, రూపధేయాన్ని కలిగిన పద్యకల్పనను చేశారు. తెనాలి రామకృష్ణకవి స్వయంగా భావనోద్బోధం లేక నన్నెచోడుని నుంచి అర్థచౌర్యం చేశాడని మానవల్లి రామకృష్ణకవి గారు తీవ్రంగా విమర్శించారు. రెండు పద్యాల తీరుతెన్నులు ఒకే ఛందంలో పూర్తిగా ఒకే పదపరిపాటితో ఉన్నందువల్ల, రెండింటి చివరి పాదాలూ పూర్తిగా ఒకటే కావటం వల్ల – అవి యాదృచ్ఛికాలు కావని, ఎవరో ఒకరు మూలకర్త, మరొకరు అనుకర్త అని అంగీకరింపక తప్పని పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణుని పద్యానికి మూలశ్లోకం ఒకటున్నదని, రామకృష్ణుని పద్యం ఆ శ్లోకానికి ఏ మార్పూ లేని సులక్షిత యథాతథానువాదమని ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడింది. వివిధచారిత్రికప్రమాణాల వల్ల ఆ శ్లోకం పూర్వుడైన నన్నెచోడునికి తెలిసి ఉండే అవకాశం లేదని కూడా ఊహింపబడింది. ఆ శ్లోకమొకటి ఉన్నదన్న విషయం తెలియని నన్నెచోడుడు వ్రాసిన దోషపూర్ణపద్యం నిర్దుష్టమైన రామకృష్ణుని పద్యానికి మూలం కాకపోగా దానికే ఒక అసమంజసానుకరణమని నిరూపింపబడింది.
కుమారసంభవ కందర్పకేతువిలాసాలు ఒకే కావ్యానికి అనువాదాలు కావు. అయినా, సందర్భస్థగితంగా ఒకరిని మించి ఒకరు వ్రాయదలచిన నేపథ్యం కనబడుతూనే ఉన్నది. తిరుగులేని పద్యసాదృశ్యం అందుకు కారణం. నన్నెచోడుని పద్యంలోని లోపజాతం వల్ల నన్నెచోడుడే అనుకర్త అని, ఆ కారణాన తెనాలి కవి కంటె ఆధునికుడని వ్యాసంలో ప్రతిపాదింపబడింది.
ఈ వ్యాసంలో కవి-కాలాదులకు సంబంధించిన ప్రతికూలసాక్ష్యాలు అన్నిటిని నేను వ్రాయలేదు కాని, కేవలం “అనుకరణ” విషయాన్ని మాత్రమే తీసికొన్నా సుమారు ౨౮౦ – ౩౦౦ నన్నెచోడుని పద్యాలను పదులకొద్దీ తెలుగు కవులు, కన్నడ కవులు (ఆ మాటకు వస్తే సంస్కృత కవులున్నూ) అనుకరించినట్లు కనబడుతున్నది. ఆ అన్ని చోట్ల నన్నెచోడుని పద్యంలో “ఎంతో కొంత లోపం” ఉన్నదని, ఆ అనుసరించిన కవులు దానికి “మెరుగెక్కించా”రని విమర్శకులు అంటున్నారు. ఇంతమంది బహుభాషల మహాకవులు ఆ స్వర్ణనిధి పేరయినా చెప్పకుండా ఆ మెరుగు తరుగున్న ముడిబంగారాన్ని కొల్లగొట్టి నాణ్యమైన నగలుగా మార్చుకోవాలని ఎందుకు ఉద్యమించారో ఊహించటం కష్టం.
ఇక్కడ వస్తువును, పద్యాన్ని మార్చి వ్రాయటానికి ఆస్కారం లేని నేపథ్యమేదీ లేదు. “అర్థచౌర్యం” నిస్సందేహంగా జరిగింది. అదే కవి కాలనిర్ణయానికి పరికరించింది. ఇప్పటి వ్యాసపరిధి ఇంత మాత్రమే.
మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
10/06/2014 1:03 pm
“తేలికైన” గురువులు అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు, రామారావుగారు వివరిస్తే బాగుంటుంది. ఆ చివరిపాదంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక అక్షరం ఎన్ని రకాలుగా గురువు కాగలదో అన్ని రకాల ఉదాహరణలూ ఆ పాదంలో చూడవచ్చు! (ద్విత్వ సంయుక్తాక్షరాలను నేను ఒకే కేటగిరీగా చూస్తాను) క్లిష్టాక్షరాలతో కూడిన గురువులను రామారావుగారు “బరువైన” గురువులుగా భావిస్తున్నారేమో (తద్విపులవక్షశ్శైల రక్తౌఘ నిర్ఝరముర్వీపతి… మొదలైన చోట్ల ఉన్నట్టు). కాని ఆ బరువు, గురువులకి కాక అక్షరాలకు మాత్రమే ఆపాదించడం సమంజసం. ఉదాహరణకు “నిర్ఝర” శబ్దంలో బరువైన అక్షరం లఘువైన “ర్ఝ”. గురువులలో తేడాలు తేలిక, బరువు అని కాక – “పొడుగు”, “పొట్టి” అనే విధాలుగా చూడవచ్చు. దీర్ఘాచ్చులతో కూడినా గురువులు “పొడుగు” గురువులు (ఆ దీర్ఘం సంబోధనైతే, అది మరీ పొడుగు!). మిగతావి “పొట్టి” గురువులు. పొడుగు గురువులతో పద్యమంతా నిడితే, అది సాగినట్టుగా ఉంటుంది.
పద్యం చదవడం గురించి గిడుగు సీతాపతిగారి వంటి కొందరు పూర్వం చర్చించారు. ఈ విషయమై చేరాగారి “వచన కవిత్వం – లక్షణ చర్చ:నిర్మాణ మూలాలు, నిర్వచన క్లేశాలు” కూడా చదవవలసిన వ్యాసం. అందులో వారు పద్యానికి మూడు స్థాయిలను చెపుతారు. నిర్వచన స్థాయి, నిర్వహణ స్థాయి, పఠన స్థాయి. ఇవి వృత్తాలలో, జాతులలో, ఉపజాతులలో, మాత్రాఛందస్సులో ఎలా ఉంటాయన్న సంగతి వివరిస్తారు. ఇది నాకు చాలా నచ్చింది.
వృత్తాలలో(ముఖ్యంగా మాలా విక్రీడిత వృత్తాలలో) పద్యం నడక ఎక్కువగా నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి చంపకమాల మొదటి నాలుగు లఘువులూ ఒకే పదం వాడితే ఆ పద్యానికి వేగం వస్తుంది. ఉదా: “కనుగొని కోపవేగమున”, “అటజని గాంచె” (అట, చని రెండు పదాలైనా సంధి కలిసి ఒకే పదస్ఫురణ అక్కడుంది). అదే రెండు లఘువుల తర్వాత పదం విరిగితే, మెల్లని నడక వస్తుంది. ఉదా: “నను భవదీయదాసుని”.
ఇది చంపకమాల కాదు మత్తేభం.
ఇది తిక్కనగారిది.
ప్రమాదో ధీమతామపి! 🙂
తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
10/05/2014 8:31 pm
శ్రీ శ్యామలరావు గారు తెలుగు సాహిత్యంలో మంచిపట్టు వున్నవారిలా కనిపిస్తున్నారు వారి లేఖల బట్టి. ఐతే వారు ఈ సందర్భంలో నారాయణరావు గారికి వృత్తగణాల గురించి తెలియదని ధ్వనించేలా రాయటం కొంచెం తొందరపాటేమో అనిపిస్తున్నది. వారు ఉదహరించిన పద్యం సందర్భం దాన్ని విశ్వనాథ ఎలా చదివేవారో చెప్పటం. వారు అంతకుముందు వరకున్న పదాల్ని విడివిడిగా విరిచి చదువుతూ చివరిపాదాన్ని మాత్రం మొత్తం ఒకటిగా పదాల్ని దగ్గరగా కుదిస్తూ (బహుశా ఒక గుక్కన) చదివేవారని వ్యాసకర్తలు అనటం. వారి మాటల్లోనే “ఆ పద్యం చివరి పాదం కుంచించుకు పోయి అన్నీ లఘువులతో భయం భయంగా ముడుచుకుపోతుంది. నాలుగు పాదాల్లో అచ్చయిన పద్యం చూస్తే ఈ విషయం బోధపడే అవకాశం లేదు.” ఇక్కడ “అన్నీ లఘువులు” శ్యామలరావు గారికి అభ్యంతరకరమైన పదద్వయం.
ఛందస్సులో అన్ని లఘువులు ఒకేరకంగా ఉంటాయి కాని గురువులు మాత్రం అనేకరకాలని విజ్ఞులకి చెప్పక్కర్లేదు. ఈ పద్యం చివరి చరణంలో గురువులన్నీ చాలా “తేలికైన”వని స్పష్టమే. ఇక్కడ వ్యాసకర్తలు లఘువు అనే పదాన్ని చందస్సుకి సంబంధించిన అర్థంలో వాడారని నేననుకోను. సభాసదులు ఎంత ముడుచుకుపోయారో ( ఇవి లఘువులైన గురువులు) అని చెప్పటానికి ఆ పదం వాడారని నా భావన.
—————————
మన పూర్వులు ముఖ్యంగా చంపకమాలా వృత్తాన్ని చాలా ప్రత్యేకశ్రద్ధతో వాడారని నేననుకుంటాను. ఒక evolving, dynamic situation ని చెప్పటానికి చంపకమాల సారళ్యం, గురువుల నిర్మాణంలో వున్న అనేక శైలుల్ని కొల్లగొట్టి (ఈ పదం సరిగా పడినట్టు లేదు, exploit చేసి అనటం నా ఉద్దేశం) వారు చెప్పదల్చుకున్న విషయానికి శిల్పపరిపుష్టతని సమకూర్చారు వారు. ఉదాహరణకి పెద్దన గారి “అటజని కాంచె” పద్యం తీసుకోండి. అదీ చంపకమాలే. ఐతే మెల్లగా మొదలై ప్రవరుడి విభ్రమాశ్చర్యాల్ని, వేగంగా వెళ్తున్న అతనికి దార్లో కనబడుతున్న అద్భుత ప్రకృతి రామణీయకతని చూపించటానికి గురువులు చాలా బరువెక్కుతాయి. తాపీగా సాగే చంపకమాల శార్దూలంలా పరుగులు తీస్తుంది. మనల్ని మనం ప్రవరుడి స్థానంలో ఊహించుకుంటే చాలా వేగంగా వెళ్తున్నట్టు, ఎదురుగా ఎన్నో వృక్షాలు, ఇతర అడ్డంకులు పక్కనుంచి దూసుకుపోతున్నట్టు అనుభూతి కలక్కమానదు. ఇలాటి దృష్టితో చూస్తే తిక్కన గారు భీముడి కోపాన్ని చూపటానికి “ధారుణి రాజ్యసంపద మదంబున..” అంటూ ఉత్పలమాలని, పోతన గారు “లలితస్కంథము ..” అని చంపకమాలని ఎందుకు ఎంచుకున్నారో తెలుస్తుంది. అదే, మొదటినుంచి చివరివరకు పద్యంలో ఒకే రసాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు శార్దూలం, మత్తేభం వాడారు (“కురువృద్ధుల్ ..”, “సింగంబాకటితో ..”, “దుర్వారోద్యమ బాహువిక్రమ ..” (ఇది ఎర్రన గారిది).
పద్యాలతో పెద్దలు చెక్కిన శిల్పాల గురించి అనంతంగా మాట్టాడుకోవచ్చును కాని ప్రస్తుతం కాదు.
కోనసీమ కథలు: రెండు ప్రేమ కాట్లు గురించి అనిల్ Anil Atluri గారి అభిప్రాయం:
09/26/2014 12:40 pm
“మీ అన్నయ్య.”
ఈ ట్విస్ట్ బాగుంది.
జీవితంలో ఒక కాలాన్ని గుర్తించడానికి “జయప్రద” ని మరో చరిత్రని వాడుకున్నారు. కాలేజి రోజుల్లో అందులోను ఆ రోజుల్లో అవి చరిత్రని సృష్టింనవే కదా! ఒక విధంగా ఆ రోజుల్లో అవి ఆ రోజుల్లో సాధారణమే! కాని ఈ రోజుల్లో అలా లేదు.
Times have changed. So did so called loving more of puppy love. Felt the story to be more cinematic.
కానీ ఆసాంతం చదివించింది. గుమ్మ్మంలో బొమ్మ కథ మలుపు తిప్పింది.
జ్ఞాపకాల వాసన గురించి ananth mallavarapu గారి అభిప్రాయం:
09/25/2014 1:00 pm
మనిషిలో ఉన్న “కామ పిశాచి” దాని తాలూకు చేదు అనుభవాలు/జ్ఞాపకాలు, తమల్ని తాము దహించుకుంటే కాని తప్పించుకోలేరన్నమాట! ఏమిటో ఈ కథ అంతరార్థం! అంతా మాయ!
తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు గురించి వెల్చేరు నారాయణరావు & పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
09/21/2014 7:21 pm
బొల్లోజు బాబాగారికి:
బ్రౌన్ మీద మేము చేసిన విమర్శని “విసుర్లు” అనుకోకండి. బ్రౌన్ వచ్చినప్పటి సందర్భాలు, పరిస్థితులు వివరించి, భారతదేశాన్ని ఉద్దరించడానికి వచ్చిన తెల్లవాళ్లకుండే దర్పం గురించి చెప్పి, తెలుగు గ్రంథ ప్రపంచం ఎలా వుందో తెలుసుకోవడానికి ఏ ప్రయత్నమూ చెయ్యకుండా అప్పటికి అమలులో వున్న పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలను తెలుగుకి పట్టించడంలో బ్రౌన్ చేసిన ప్రయత్నం వివరించి, అందువల్ల వల్ల తెలుగుకి జరిగిన అపకారం సహేతుకంగా మేము గుర్తించి రాసిన మా వ్యాసం బ్రౌన్ ని వ్యక్తిగతంగా అగౌరవ పరచడానికి రాసింది కాదు. మాకు బ్రౌన్ మీద మీకున్నట్లుగా భక్తి లేదు నిజమే. బ్రౌన్ మా దృష్టిలో ఒక వ్యక్తి కాదు. ఒక వలస ప్రపంచ భావాలకు ప్రతినిధి. ఆ భావాలు బోధపరుచుకోవడానికి మేమా వ్యాసం రాశాం కాని వ్యక్తిగతంగా ఆయన్ని అగౌరవ పరచడానికి కాదు.
మద్దిపాటి కృష్ణారావుగారికి:
మీరంటున్న “ప్రక్షిప్తము” అనే ఊహ బ్రౌన్ అనుసరించిన పాశ్చాత్య పరిష్కరణ విధానం లోంచి వచ్చింది. అంతకు ముందు భారతీయ గ్రంథ పరిష్కర్తలు కూడా “ప్రక్షిప్తము” అనే మాట వాడారు. ఈ రెండు రకాల ప్రక్షిప్తాలకి తాత్త్వికంగా తేడా వుందని మేము వివరంగా చెప్పలేదు. ఆ సంగతి ఈ వ్యాసంలో చర్చించడానికి అవకాశం లేదని మేము భావించాం. దాన్ని గురించి వేరే వ్యాసం రాయాలి. వేమన పద్యాలు, సుమతీ శతకం పద్యాలు, ఇలాంటి పద్యాలని దొరికినవి ఒక చోట పోగుచేసి ప్రకటించడం వల్ల జరిగిన నష్టాన్ని నారాయణరావు సుమతీశతకాన్ని గురించి రాసిన వ్యాసంలో చెప్పి వున్నాడు. అది మీరు చదివారనుకుంటాం. సుమతీ అనే మకుటంతో వున్న పద్యాలన్ని ఒక చొట పోగుచేసి ప్రచురించడం వల్ల కలిగిన నష్టం ఆ వ్యాసంలో నారాయణ రావు వివరించాడు. ఈ విమర్శ వేమన పేరుతో వున్న పద్యాలకి కూడ వర్తిస్తుంది. దొరికిన రాతప్రతులన్నిట్నీ వాటి లేఖక సందర్భాలతో సంబంధం లేకుండా పోగుచేసి పెట్టకూడదని మా ప్రతిపాదన. మీకు ఈ సంగతి ఇంతకన్నా వివరంగా చెప్పక్కరలేదు.
మంగమ్మగారి పుస్తకం తెలుగులో తొలినాళ్లలో అచ్చయిన తెలుగు పుస్తకాల గురించిన సమాచారాన్ని చక్కగా ప్రదర్శిస్తుంది. కానీ పుస్తక నిర్మాణ చరిత్ర వేరు. అది ఎవరూ రాయలేదని మేమన్నది. నిజానికి ఆ ప్రయత్నం పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో రెండు వ్యాసాలు ప్రచురించారు. మిగిలిన వ్యాసాలు ఇంకా రావలసివున్నాయి. నాగరాజు, శ్రీనివాస్ రాసిన రెండవ వ్యాసంలో మంగమ్మగారి పుస్తకాన్ని ప్రస్తావించారు. అయినా మా వ్యాసంలో కూడా ఆ పుస్తకాన్ని ప్రస్తావించి వుండాల్సింది. అది మా ఏమరపాటే కాని ఆ పుస్తకం ఉదహరించడానికి అర్హమైనదికాదు అని మా ఉద్దేశం కాదు.
మా వ్యాసాన్ని చదివి దాని మీద మీ అభిప్రాయాలు చెప్పిన మీ ఇద్దరికీ మా నమస్కారాలు.
నారా, శ్రీనివాస్.
త్రిపురతో పిచ్చాపాటీ గురించి Gopalakrishna Myneni గారి అభిప్రాయం:
09/14/2014 4:20 pm
మీరెవరైనా నాకు 2014 విజయవాడ బుక్ ఫైర్ లొ అల్బర్త్ కేము (French Algerian philosopher) పుస్తకానికి తెలుగు తర్జుమాను ఆవిష్కరిస్తూ పన్నాల సుబ్రహ్మణ్య భట్ గారి చేసిన ప్రసంగాన్ని పంపగలిగితే బహు కృతజ్ఞుణ్ణి.
పాలు తాగిన వినాయకుడు గురించి Hari గారి అభిప్రాయం:
09/12/2014 3:26 pm
నేను ఎక్కువ నీతులు చెప్పే వాడిని. కాని ఆ రొజు పాలు తాగటం చూసి మూర్ఛ ఒక్కటే తక్కువ నాకు.
నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/10/2014 2:28 pm
శ్రీ “బ్రాహ్మి” గారికి
నమస్కారములతో,
‘శార్ఙ్గధరపద్ధతి’ క్రీ.శ. 1363 నాటిది. 14-వ శతాబ్ది ఉత్తరార్ధం అన్నమాట. పీటర్ పీటర్సన్ ప్రకటించిన ప్రతిని సమీక్షిస్తూ శార్ఙ్గధరుని అవతారికలోని మూడవ హమ్మీర భూపతి చారిత్రిక విషయాలను బట్టి ఆ రోజుల్లో బ్యూలర్ గారు ప్రామాణికమైన కాలనిర్ణయం చేయగలిగారు. శార్ఙ్గధరపద్ధతి దేశవ్యాప్తం కావటానికి కనీసం అర్ధశతాబ్ది కాలం పట్టినదనుకొన్నా, 15-వ శతాబ్దికి పూర్వార్ధానికి గాని అది తెలుగువారికి లభించి ఉండదు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు ఆ సంధానగ్రంథం అవతారికలో చెప్పబడిన కృతికర్తను పోషించిన హమ్మీర భూపతి నామధేయులు చరిత్రలో ముగ్గురుండటం వల్ల అతను మొదటి హమ్మీరుడనుకొని కాలనిర్ణయంలో పొరబడ్డారు. వారు “శార్ఙ్గధరపద్ధతి భర్తృహరి నీతిశతకానికి అనుసరణ, విస్తృతీకరణ” అని చెప్పినది కూడా సరికాదు. (ఆ చర్చ ఇప్పుడు సంగతం కాదు.)
మీరిచ్చిన ఆ శార్ఙ్గధరపద్ధతిలోని పాఠమూ, ఆ ప్రశ్నార్థకాలూ ఎప్పటి ముద్రణ లోనివో నాకు తెలియరాలేదు. మీరిచ్చిన ఆ పాఠంలో ఇంకా దోషాలనేకం ఉన్నాయి. నా దగ్గరున్నది 1987 నాటి పునర్ముద్రణ ప్రతి. అందులో శ్లోకం సరిగానే ఉన్నది:
తామ్బూలం ముఖరోగనాశనిపుణం సంవర్ధనం తేజసో
నిత్యం జాఠరవహ్నివృద్ధిజననం దుర్గన్ధదోషాపహమ్
వక్త్రాలఙ్కరణం ప్రహర్షజననం విద్వన్నృపాగ్రే రణే
కామస్యాయతనం సముద్భవకరం లక్ష్మ్యాః సుఖస్యాస్పదమ్.
అని. ఇది కళావిలాస కర్తకు మూలం కాదని దీనిని, ఇటువంటివే మఱికొన్నింటిని నేను ఉదాహరింపలేదు. మీరిచ్చిన రెండవ శ్లోకం కూడా సరిగా లేదు. బహుశః ఈ ప్రకారంగా ఉండి ఉంటుంది:
తాంబూలం కటుతిక్తముష్ణమధురం క్షారం కషాయాన్వితం
వాతఘ్నం కఫనాశనం కృమిహరం దౌర్గంధ్యదోషాపహమ్
వక్త్రస్యాభరణం మలాపహరణం కామాగ్నిసన్దీపనం
తాంబూలస్య సఖే! త్రయోదశగుణాః స్వర్గేఽప్యమీ దుర్లభాః.
అని.
ఇది శ్లోకంలోని “సఖే” అన్న సంబోధనార్థం వల్ల తెలుగు పద్యానికి మూలం కాలేదు. అందులో చెప్పబడిన పదకొండు లక్షణాలకు యథాయథంగా సన్నిహితమైన మూలం ఇప్పటి వరకు నేను చూచిన 15-వ శతాబ్దికి మునుపటి సంధానగ్రంథాలలో లేనందువల్ల, తదనంతరం వెలసిన ఆయుర్వేదగ్రంథాలలో మాత్రమే కానవస్తున్నందువల్ల – పద్యపు కాలనిర్ణయం ఆ విధంగా చేయవలసివచ్చింది.
సాహిత్యచరిత్రలో విద్యార్థిత్వం కలవారికి తుదిమాట అనేది ఉండదు. నూతనాంశాల గవేషణతో వివిదిషువుల వ్యాసంగం అవ్యాహతంగా కొనసాగుతూనే ఉంటుంది. నా వ్యాసంలో ప్రతిపాదితమైనదానికి సుప్రమాతమైన విరుద్ధాంశం ఏది కనబడినా వ్యాసతాత్పర్యాన్ని మార్చుకోవటం నాకెప్పుడూ ఆనందదాయకమే. సత్యనిరూపణార్థమే తప్ప ఈ చర్చలో వినోదంకరణమన్నది నిర్నిమిత్తమని పెద్దలకు మనవి చేస్తున్నాను.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నన్నెచోడుని కళావిలాసము: కొన్ని చర్చనీయాంశాలు గురించి బ్రాహ్మి గారి అభిప్రాయం:
09/10/2014 12:13 pm
మీరేమీ అనుకోనంటే, తాంబూలమీమాంసను మరికొంత పొడిగిస్తున్నాను. (వినోదభాజనం మరొకకారణం. 🙂
మీరు ఉటంకించిన తాంబూల వర్ణన లలో లేని, సార్ఞదేవుడు అన్న కవి వ్రాసిన సార్ఞధరపద్ధతి కావ్యానికి చెందిన ఈ క్రింది వర్ణన ఇదీ.
తాంబూలం ముఖరోగనాశనిపుణం సంవర్ధనం తేజసః
నిత్యం జాఠరవహ్నిజనకం దుర్గంధదోషావహమ్ |
వదనాలంకరణం ప్రహర్షజనకం విద్వన్నృపాగ్నే (?) రణే
కామస్యాయతనం సముద్దవకరం (?) లక్ష్మ్యాః సుఖస్యాస్పదమ్ ||
(౧౪౧౬)
బహుశా దీన్ని మీరు చూచి ఉంటారు. భోజరాజు చారుచర్య కు దగ్గరగా ఉంది, పైగా తెలుగు అనువాదం దీన్ని అనుసరించలేదు కాబట్టి అనవసరం అని విడిచి ఉండవచ్చు. కానీ సార్ఞదేవుని సార్ఞధరపద్ధతి కావ్యానికి పాఠాలు అనేకం ఉన్నట్టు కనబడుతుంది. (ఈ మాటనే సార్ఙధరపద్ధతిని పరిష్కరించిన ఆంగ్లేయులు పీటర్సన్ ఆ పుస్తక పీఠికలో అన్నారు.) మరొక పాఠం క్రింద. (ఇది జాలంలో దేవనాగరిలిపిలో శోధిస్తే దొరికింది. దీని ప్రామాణికత ఎంతో నాకు తెలీదు.)
తాంబూలం కటుతిక్త మిశ్రమధురం క్షారం కాషాయాన్వితం
వాతఘ్నం కఫనాశనం కృమిహరం దౌర్గంధ్య దోషాపహమ్ |
వక్త్రస్యాభరణం మలాపహరణం కామాగ్ని సన్దీపనం
తాంబూలస్య సఖే! త్రయోదశగుణాః స్వర్గైపి అమీ దుర్లభః ||
(౧౪౧౬)
పైని తాంబూలవర్ణన మీరు ఉటంకించిన వాటితో కాస్త భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇక్కడ సఖే! అని సంబోధన ఉన్నది కాబట్టి తెలుగు అనువాదానికి ఇదే మూలం అయ్యే అవకాశం తోసిపుచ్చలేనిది. ఒకవేళ ఇది సార్ఞధరపద్ధతిలోనిదయితే ఆ కావ్యం ౧౩ వ శతాబ్దానికి చెందినది. (మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారు, సంస్కృత వాఞ్మయచరిత్ర, ద్వితీయభాగం, పుట ౩౩౯).
పైగా ఈ కావ్యం భర్తృహరి నీతిశతకానికి అనుసరణ, విస్తృతీకరణ కాబట్టి, ఇందులో అంతకు పూర్వం ఇతర కవులు రచించిన పద్యాలను ఇందులో గ్రహించి ఉండే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ తాంబూల వర్ణనను బట్టి తెలుగు అనువాదాన్ని 15 వ శతాబ్దపు తర్వాత కాలానికి ఈవలగా నిర్ణయించడానికి లేదేమోనని శంకా, ౧౩ వ శతాబ్దానికి పూర్వమే అయి ఉండవచ్చునన్న సందేహమూ కలుగుతున్నాయి.
భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/09/2014 2:26 pm
మాన్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
సప్రశ్రయంగా,
ఔదార్యపూర్ణమైన మీ స్పందనకు నా మనఃపూర్వక ధన్యవాదాలను తెలియజేసికొంటున్నాను. తత్త్వవిషయసంగ్రహం, పాఠపరిష్కారం మీ అనుమోదాన్ని పొంది ఉండటం నాకెంతో సంతోషాన్ని కూర్చింది. మీరన్నట్లు జడభరతుని కథ ఎన్ని పర్యాయాలు చదువుకొన్నా తనివితీరని గంభీరార్థసంభృతం. విష్ణుచిత్తీయంలోని జడభరతోపాఖ్యానం అన్వయాన్ని కూడా చేర్చాలని అనుకొన్నాను కాని, అప్పటికే సుదీర్ఘమైనందువల్ల విరమించుకోవలసి వచ్చింది. మీ ఆశీర్వచస్సుకు కృతజ్ఞుణ్ణి.
శ్రీలలితా సహస్రనామ వైశిష్య్టమ్ గురించి sivalenka ayyavaru గారి అభిప్రాయం:
09/08/2014 4:14 pm
వివరణ బాగుంది. కాని ఈ వ్యాసం లో విషయాలు యధాతధం గా శ్రీ జి.ఎల్.ఎన్.శాస్త్రి గారి పీఠికలోంచి స్వీకరించబడినట్లు భవదీయుడు భావన.
తుపాకి గురించి Rama గారి అభిప్రాయం:
09/05/2014 8:31 am
ఇన్ని సంవత్సరాల తరవాత నేను ఇప్పుడే చదవటం తటస్తించింది.
కధలో లా శంకర్ లాంటి నాన్నలున్నా జిమ్మి బ్రైన్ లాంటి ఇన్ఫ్లుఎన్స్ దాటి బయటికి రాలేని వాళ్ళు బోలెడుమంది. అది “నిగ్గర్స్” అనుకునే ఆలోచన కావచ్చు లేదా కులం కావ్చ్చ. అసలు కిరణ్ నాన్నే జిమ్మి బ్రైన్ లా వుండచ్చు. ఇది వొక్క NRI లకి మాత్రమే సంబంధించిన కధ అనుకొనక్కర్లేదు ఇండియాలో మనది కాని రాష్ట్రంలో కూడా కావచ్చు. ముంబైలో బిహారి పిల్లాడితో స్నేహం కూడా మాథ్యుతో స్నేహం కావచ్చు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా మాలవాడలు మాదిగ వాడలు వున్నాయి, హొనౌర్ కిల్లింగ్స్ ఇంకా జరుగుతున్నాయి.
కధలో చెప్పకుండా చెప్పిన బోలెడు విషయాలు ఇప్పటికీ అన్వయిస్తాయి. పర్యావరణ కాలుష్యం లాగా ఈ కాలుష్యం ఇంకా పెద్దదవ్వడానికి మన పాత్ర ఎంత?
ఇలాంటి సజీవమైన కధ రాసిన నారాయణ స్వామి గారికి అభినందనలు
రమాదేవి, హైదరాబాద్
జ్ఞాపకాల వాసన గురించి Rama గారి అభిప్రాయం:
09/05/2014 7:42 am
నాకూ అలానే ఎలా అర్ధం చేసుకోవాలో తెలీనట్లు… కాని జ్ణాపకాల గురించి రాసిన చాలా వాక్యాలు నాకెప్పుడూ అనిపించే వాటిలా అనిపించి బావున్నట్లు కూడా వుంది. మొత్తానికి మోడర్న్ఆర్ట్ లా నాకు అర్ధం కాకుండా పొయింది.
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు! గురించి Rama గారి అభిప్రాయం:
09/05/2014 6:45 am
“ఇంకొకళ్ళను కష్టపెట్టకుండా జాగ్రత్త పడాలి.” నిజం అందరు ఇలానే అనుకుంటుండచ్చు; కాని అందరికీ అన్నిసార్లూ సాధ్యం కాకపొవచ్చు. మన ప్రమేయం లెకుండానే బరువైపొవచ్చు. బరువయ్యాము అని మనకి తెలియకుండా బరువవ్వచ్చు ఆల్జిమర్స్ లాంటివాటితో…
చాలా చక్కగ చెప్పారు. మీ సుజనరంజనిలో “కల్చరు” హాస్య రచనలో లానే చాలా హృద్యంగా చెప్పారు.
కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి Dr. CBS Venkataramana గారి అభిప్రాయం:
08/30/2014 12:55 pm
కథ బాగాలేదు. జడ్జిమెంటల్ గా వుంది.
సామాజిక పరిణామక్రమం లో, కలసి ఒక చోట ఒక సమూహం లో జీవించటం, ఒకరికొకరు దైనందిన జీవితం లో సహాయపడటం, స్నెహం గా వుండటం, కలసి భోజనం చేయటం, వివాహ సంబంధాలు ఏర్పరుచుకోవటం, ఇవన్నీ ప్రొగ్రెస్సివ్ గా జరిగే విషయాలు. కుటుంబం లో వ్యక్తి లాగ కలసి మెలసి వున్నంత మాత్రాన వివాహ సంబంధాలకు వొప్పుకోవాలని అనుకోవటం ఇతరుల మీద మన అభిప్రాయాలను రుద్దటం మాత్రమే అవుతుంది. అవతలి వారికి అది ఇష్టం లేక పోతే ఆ అయిష్టత ను గౌరవించగలిగితేనే అది respect for human values అవుతుంది. ఏది మనం ప్రగతి అని అనుకుంటామో, దాన్ని ఇతరులు కూడా అంగీకరించాలి అని అనుకోవటం cultural imperialism అవుతుంది. ఇదే కథలో అబ్బాయి అమ్మాయి పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసికొని వుంటే, దానిని పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళ పై హింసాత్మకమైన పద్ధతి లో వారిని ఆపు చేయాలని ప్రయత్నించి వుంటే, వాళ్ళని తప్పు పట్టవచ్చు. పెద్దలను ఎదిరించలేక వేరు మతాలకు చెందిన అమ్మాయి అబ్బాయి లు పెళ్ళి చేసుకొన లేకపోతే, తప్పు వాళ్ళదే కాని పెద్దలది కాదు.
కోనసీమ కథలు: కాటికాడ రుణం గురించి chudamani గారి అభిప్రాయం:
08/27/2014 5:37 am
కధ బాగుంది. సూర్యం పాత్ర స్నేహానికి ఇచ్చిన విలువ బాగుంది. కాని., అతని స్టంట్ కి రాజు డబ్బు ఇచ్చిన సంగతి గోపాలానికి తెలిసినప్పుడు, ఆ సంగతి ముందే చెప్పవచ్చుగా…
చూడామణి.
బిల్హణీయము గురించి venkat.b.rao గారి అభిప్రాయం:
08/26/2014 3:34 pm
నా ఆక్షేపణలకు వివరణలను చదివాక, నా సందేహం ఇంకా అదే – ఆయా భాగాలలోని కవిత్వం, ఛందస్సు, వ్యాకరణ శాస్త్రాలలోని సూత్రాలకు పూర్తిగా దగ్గరగా వున్నా, నిత్య జీవితంలోని మానవ సహజమైన ఆలోచనలకు, అనుభూతులకు మాత్రం చాలా దూరంగా వున్నదని!
(తొలకరి) ‘ఆమబ్బులకై జనులు వేచి ఉంటారనేది ఇక్కడ పరిపూర్ణంగా అప్రస్తుతం, అనవసరం’– అన్నంత మాత్రాన ఆలోచన అటువైపు వెళ్ళకుండా ఆగుతుందా… ఆగదు! మానవ సహజమైన అనుభూతి ఆలోచనను మొదటగా అటువైపే తీసుకెళుతుంది. ‘ఆమబ్బుల యొక్క నల్లదనం మాత్రమే ఇచ్చట ప్రయోజనకరమైన అంశం’ అని అంటే… ఎంతమంది ‘తొలకరి’ అన్న మాటలో మబ్బుల ‘నల్లదనాన్ని’ మాత్రమే గణనలోకి తీసుకుంటారో నా ఊహకు అందని సంగతి.
ఎక్కడిదాకానో ఎందుకు వివరణలోని ‘అంతవరకు తెల్లగా ఉండే మబ్బులు తొలకరిలో నవ్యమైన నల్లదనాన్ని సంతరించుకొని ఉంటాయి’ అన్న అంతకు ముందు వాక్యంలోనే (బహుశా అసంకల్పితంగా చేయబడి) ‘నవ్యమైన నల్లదనాన్ని సంతరించుకుని’ అన్న ఆహ్లాదకరమయిన వర్ణన వుంది! అందులోని ఆహ్లాదాన్ని పక్కనబెట్టి కేవలం ‘నల్లదనాన్ని’ మాత్రమే తీసుకుని అలాంటి నల్లని మబ్బుల కలతలు అని అర్ధంచేసుకోవాలి పాఠకుడు అనడం… ఏమో? నాకు అర్ధం కాని సంగతి.
అలాగే, ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అనే మాటలలోని భావనలో (అంత) ఉత్కృష్టత్త్వం (నిరూపితమవుతూ ఉంటే) అభిలషణీయమే కాబట్టి, అది అక్కడితో వదిలెయ్యడమే శ్రేష్ఠం!
ఇక అవగాహనాలోపం/రాహిత్యం అన్న మాటలకొస్తే, “నిజమే, ‘మా కొలది జానపదులకు…’ అది సహజమే!” అన్నది నా విన్నపం.
బిల్హణీయము గురించి Desikachary గారి అభిప్రాయం:
08/24/2014 6:24 pm
బిల్హణీయమును చదివి, దీనిపై కొన్ని అనుమానములను వెలిబుచ్చిన వెంకటరావుగారికి కృతజ్ఞతలు. కాని ఈ అనుమానములునిరాధారములు, అవగాహనలోపంవల్ల స్ఫురించినవని తోచుచున్నది.
1. ‘కలతల తొలకరులు’ ఉండగలవా? అంటే ఉండవు. ఉండాలని నేననలేదు. కలతలను నల్లనివస్తువులతో పోల్చడం కవిసమయం. ఆమె ముఖము అచ్చంగా పున్నమిచంద్రుడే అనే రూపకంలో ముఖమునకు పున్నమితో గాదు పోలిక, చంద్రునితో. పున్నమిచంద్రునిలోని ‘పున్నమి’ చంద్రునియొక్క పూర్ణత్వప్రకటనమునకే కాని, ముఖము పున్నమిలాగ ఉందని చెప్పడానికి కాదు. అట్లే కలతలతొలకరిమబ్బులు అనే రూపకంలో, కలతలనే తొలివర్షా కాలపుమబ్బులు అని అర్థంకాని , కలతలనే తొలకరియొక్క మబ్బులు అని అర్థంకాదు. ఇక్కడ తొలకరి అనేది మబ్బుల నల్లదనాన్ని విశ్లేషించే పదం. అంతవరకు తెల్లగా ఉండే మబ్బులు తొలకరిలో నవ్యమైన నల్లదనాన్ని సంతరించుకొని ఉంటాయి, అట్లాంటి నల్లని మబ్బులవంటి కలతలు అని దీనికి అర్థం. ఆమబ్బులకై జనులు వేచి ఉంటారనేది ఇక్కడ పరిపూర్ణంగా అప్రస్తుతం, అనవసరం. ఆమబ్బుల యొక్క నల్లదనం మాత్రమే ఇచ్చట ప్రయోజనకరమైన అంశం.
2. ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అనే దానికి అర్థం దినప్రమాణం ఉండవలసిన సుఖం ఒక క్షణం మాత్రమే ఉండాలని కోరుకోవడం కాదు. కష్టాలలో ఉన్నప్పుడు కాలం మెల్లగా గడుస్తున్నట్టు అనుకోవడం, సుఖంగా ఉన్నప్పుడు కాలం కుంచించుకపోయి త్వరగా నడుస్తున్నట్టు అనుకోవడం మనోధర్మం. అందుచేత ‘యుగమే ఒక దివసోపమం’ కావాలి అనేదానికి యథార్థంగా ఒక దినం గడచినను, మనోధర్మంవల్ల ఆకాలం ఒకక్షణమాత్రమే గడచింది అనుకునేంతటి అత్యుత్కటమైన సుఖానుభవం కలగాలని కోరుకోవడం.
పై అనుమానాలు కూడ స్పష్టమైన అవగాహనరాహిత్యం వల్ల వెలిబుచ్చినవే.
అ) ‘స్యు రుత్తరపదేత్వమీ, నిభ సంకాశ నీకాశ ప్రతీకా శోపమాదయః’ – అని అమరకోశము. సమాసోత్తరపదములైనపుడు, నిభ, సంకాశ, నీకాశ, ప్రతీకాశ, ఉపమా శబ్దములు సదృశార్థము లగును అని దీని కర్థము. ఉపమ, ఉపమము అను రెండు రూపములును ఉత్తరపదములైనపుడు సదృశార్థము లని సూర్యరాయాంధ్రనిఘంటువు స్పష్టీకరించుచున్నది. ఉపమేయముయొక్క లింగమునుబట్టి ఈరెంటిలో నొకరూపము ఉపాదేయ మగును. రాజు ప్రతాపమున సూర్యోపముడు. రాణి అందమున రంభోపమ. రాజుకీర్తి చంద్రికోపమము – అని వరుసగా పుం, స్త్రీ,నపుంసకలింగములయందలి ఉపమేయములకు వర్తించు ప్రయోగములు. అందుచేత ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అనేది యుగము నపుంసకలింగ మగుటవల్ల నూటికి నూరుపాళ్లు సాధువే.
ఆ) ‘ఘస్రో దినాహనీవాతు క్లీబే దివస వాసరౌ’ అని అమరకోశము. ఘస్రము, దినము, అహస్సు /అహము, దివసము, వాసరము అనునవి పగటికి పేళ్లు అని దీని కర్థము. ‘దీవ్యన్తి జనా అస్మిన్నితి దివసః, దివు క్రీడాదౌ’ – ‘దీనియందు జనులు ప్రకాశింతురు’ – అని దివసశబ్దానికి వ్యుత్పత్తి. ఈశబ్దాన్ని సరియైనది కాదనుటకు గల ఆధారము తెలియుట లేదు.
ఇన్ని ఇబ్బందులున్న ఈ ప్రయోగాన్ని పక్కనబెట్టి, ‘యుగమే యొక దినసమాన మగుచును’ అని సరళంగా వ్రాసుకోవడంలో ఉన్న సౌకర్యాన్ని ఎందుకు వదులుకోవడం అన్న సందేహం కూడా కలుగక మానదు!
ఆగీతం పాదానికి నాల్గేసి చతుర్మాత్రాగణాలతో, మూడవపాదారంభంలో యతిని గాని, ప్రాసయతినిగాని పాటిస్తూ వ్రాసినది. ‘యుగమే యొక దివసోపమ మగుచును’ అను దానిలో పాదాదిలోని ‘యు’ తో దివస+ఉపమ అనేపదంలోని ‘ఉ’తో యతిమైత్రి. అందుచేత దీనిని ‘యుగమే యొక దినసమాన మగుచును’ అని మారిస్తే, యతిభంగమూ, లయభంగమూ అన్నీ కలుగుతాయి. ‘సమాన’ మనునది చతుర్మాత్రాగణమైనను, ఇది ఎత్తుగణం (జగణం) కావడంవల్ల గీతంలోని లయ నష్టమౌతుంది. అందుచేత ఇచట ఈగణం పరిహార్యము.
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి Jagadeesh గారి అభిప్రాయం:
08/14/2014 6:50 am
ఛాల బాగుంది. కవిత అందరు రాస్తారు కాని కొందరు అందముగా రాస్తారు.
ధన్యవాదాలు.
నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
07/29/2014 11:52 am
గోపాలకృష్ణగారు,
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మన చరిత్రలో పేర్లూ అద్భుతగాథలూ పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి యిలాంటి విషయాలపై కచ్చితమైన నిర్ణయాలు చేయబూనడం సాధ్యం కాదు. అసలు వేములవాడ భీమకవి చరిత్ర మనకి కథలుగా చాటువులుగా మత్రమే తెలుసు! ఇక మైలమ, చిక్క భీముల గురించి. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మైలమ, చిక్క, ఏరువ భీములు ముగ్గురూ ఒక్కరే అని అభిప్రాయపడ్డారు (మీగడతరకలు పుస్తకంలో వేములవాడ భీమకవి గురించిన వ్యాసంలో). అలానే “తెలుగుచాటువు” పుస్తకంలో బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారు కూడా అదే అన్నారు. వారే మైలమభీముడు పూసపాటివంశీకుడని “గజపతిరాజుల సాహిత్యపోషణ” అన్న పుస్తకం (బులుసు వేంకటరమణయ్యగారిది) ఆధారంగా చెప్పారు. ఆ పుస్తకాన్ని నేను చూడలేదు.
మీరు ప్రస్తావించిన “పూసపాటి అలక్ నారాయణ గజపతి శతజయంతి ఉత్సవ సంచిక”లోని పూసపాటివారి వంశవృక్షంలో కూడా మైలమభీముడు కనిపిస్తున్నాడు (ఇతను 1330 ప్రాంతంలో వానిగా అందులో ఉంది). “చిక్కభీముడు” పరిచ్ఛేదరాజ వంశానికి చెందిన రాజని (13వ శతాబ్దం) “The History of Andhra Country” (యశోదాదేవిగారిది) అనే పుస్తకంలో ఉంది. అందులోనే ఈ పరిచ్ఛేదవంశానికి చెందిన అమలరాజు “పూసపాటివారివంశావళి”లో కనిపిస్తున్నారని కూడా చెప్పారు. పూసపాటివారి వంశవృక్షంలో మరే భీముడూ నాకు కనిపించలేదు.
చిక్కభీముడు, ఏరువభీముడు ఒకరు అయ్యే అవకాశం లేదని ఒక journal (ఏదో ఇప్పుడు గుర్తుకురావడం లేదు) చదివాను. అయితే చిక్కభీముడు, మైలమభీముడు ఒకరేనా కాదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కాని చిక్కభీముని తల్లి మైలమ అని ఎక్కడా కనిపించడం లేదు. యశోదాదేవిగారు చెప్పినదాని బట్టి చూస్తే, చిక్కభీముడూ భీమకవీ ఒకే కాలానికి చెందినవారయ్యే అవకాశం ఉంది.
ఇంతకన్నా యీ విషయమై నాకు తెలియదు. ఇంకా తెలిసినవారెవరైనా చెప్తారేమోనని నేనూ ఎదురుచూస్తాను.
నీడ గురించి viswanaadh గారి అభిప్రాయం:
07/29/2014 10:48 am
తరాలు మారినాయి కాని పరిస్థితులు మారలే, చక్కని కధనం.
శార్దూలవిక్రీడిత వృత్తము గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
07/13/2014 7:08 pm
శ్రీమోహనగారికి, మీరు ఛందస్సునుగఱించి చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. కాని వృత్తలక్షణాలను లక్ష్యంగా నుంచుకొని కవి పద్యాలు వ్రాస్తాడని సాధారణమైన అపోహ ఉన్నది. కాని కవికి లయ ముఖ్యం. భావోద్వేగం కల్గినప్పుడు కవినోట ఏదో ఒక లయతో అది బహిర్గతమౌతుంది. అందుచేత లక్షణకర్తలు పనిగా కూర్చొని 26 ఛందాలలో వివిధవృత్తలక్షణాలకు తగిన వృత్తకల్పన చేసేదొక విధం. దీనితో నిమిత్తం లేకుండా భావావేశం దానికదే ఒక అపూర్వవృత్తమును సృష్టించుట రెండవరకం. ఈ రెండవవిధానంపై ఛందోవిశ్లేషణకర్తలు ఎక్కువగా వ్రాసినట్లుగా లేదు. ఈరెండవపద్ధతిద్వారా నేను నాకావ్యాలలో అనేక నూతనవృత్తములను సృష్టించినాను.వీని విషయంలో నేను ముందుగా పద్యాన్ని వ్రాసి తరువాత లక్షణాన్ని చూచుకొన్నాను. మీరిప్పుడు శా.వి. గుఱించి మాట్లాడుతున్నారు గనుక, దానికి అనురూపమైన గణాలుండేవి నాసృష్టిలోనివి ఈక్రింది రెండు వృత్తాలు.
వాచాతీతము నీమనీష, వంద్యంబు నీజ్ఞానమున్,
నీచే నాయెద నింతదాఁక నిద్రాణమై యున్న శౌ
ర్యాచారంబు ప్రబోధమొందె, ఆస్కందనోత్సాహపున్
వైచిత్రిం దగు నాదు మేనఁ బాటిల్లె రోమాంచముల్.
ఇది డయానావృత్తము. పద్యంవ్రాసిన తర్వాత లక్షణం చూచుకుంటే ఇది ఒక సగణం లోపించిన శా.వి.గా స్పష్టమైంది. దీనికి 4వగణారంభం (10వ అక్షరంయతి)
కోశాగారము గుల్లవాఱినను,ఘోరాపద ల్గూడినన్,
రాశీభూతము లౌచు యోద్ధలపురంబుల్ ధరం గూలినన్,
దేశం బెల్లను రక్తవాహినులఁ దేలించి యుద్ధంబునన్
నాశం బే నొనరింతు సోమనను నవ్యోరుదర్పంబునన్.
ఇది నయాగరావృత్తము. పద్యం వ్రాసిన తర్వాత లక్షణం చూచుకుంటే ఇది ఒక్క గురువు తక్కువైన శా.వి.గా భాసించింది. దీనికి12వ అక్షరం యతి. ఈరెండు వృత్తాలు మొట్టమెదట నాహనుమప్పనాయకకావ్యంలో వ్రాసినాను.ఆతరువాత ఇతరకావ్యాల్లో నయాగరావృత్తాన్ని తరచుగా వ్రాసినాను. ఈదీర్ఘమైన అభిప్రాయాన్ని వ్రాసింది స్వోత్కర్షకొఱకు గాదు, ఈరెండవ నూతనవృత్తనిర్మాణపద్ధతిని విశ్లేషించుటకొఱకే.
ఈమాట జులై 2014 సంచికకు స్వాగతం! గురించి radhika గారి అభిప్రాయం:
07/09/2014 1:32 pm
నమస్తే లక్ష్మన్న గారు. నా పేరు రాధిక. నేను మీ సంచికకు కొత్త పాఠకురాలిని, నాకు ఇందులో ప్రచురించిన ప్రతి ఒక్కటి బాగ మనసుకి హత్తుకున్నవి, ఐతె నేను ఒక వత్సర కాలంగ పిడేల్ నేర్చుకొనుచున్నాను. కాని నాకు దొంగ రాముడు (1955)నుంచి చిగురాకులలొ చిలకమ్మ పాటకు స్వరం మరియు సాహిత్యం కావాలి. దయచేసి పొందుపరచగలరని ప్రార్ధన మరియు విన్నపములు.
బిల్హణీయము గురించి Desikachary గారి అభిప్రాయం:
07/06/2014 10:14 pm
శ్రీకామేశ్వరరావుగార్కి వారి అభిప్రాయప్రకటనకై కృతజ్ఞుడను.
1.నాటికాంతంలో సూచించినట్లుగా నేను 3 పద్యాలను చిత్రకవి సింగరాచార్యులవారి బిల్హణీయకావ్యమునుండి ఇందులో వాడుకొన్నాను. అందులో ‘హాకవిరాజశిఖామణి’ అన్న పద్యాన్ని దోషయుక్తంగా ఇందులో నా అనవధానతవల్ల వ్రాసినాను. మూలంలో ‘హాకవిరాజరాజమణి! హానవ మోహన! హా మనోహరా!’ అని చక్కగానే ఉన్నది కాని, నా అనవధానతవల్ల ఈగణభంగదోషం సంక్రమించినది. 2.వ్యాకరణం మాట ఎట్లున్నను ‘పాండిత్యం ప్రదర్శించుకొంది’ అనేవాక్యం నీచపాత్రలు మాట్లాడుకొనే సందర్భంలోనిది. ఇది పాత్రకు తగినట్లే ఉన్నది. ఇది ‘వాడు ధనము నార్జించుకొన్నాడు’ అను వాక్యంవంటి ప్రయోగం.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి మోహన గారి అభిప్రాయం:
07/05/2014 6:48 am
ఈ వ్యాస రచయితలకు గాని, జయప్రభగారికి గానీ యోగ్యతాపత్రాలను ఇవ్వడానికి అర్హతలు, తాహతు నాకు లేవు. నేను చలం కాదు. కాని అచలముగా కూడ ఉండడము సాధ్యము కాదు. నా స్పందన క్రింది వాక్యముపైన మాత్రమే.
అదే విధముగా క్రింది వాక్యముపైన కూడ నేను స్పందించినాను –
పి.ఎచ్‌డి. డిగ్రీపైన నా ఉద్దేశములను వెల్లడించినాను; తఃతః గారు కూడ దీనిపైన వ్రాసియున్నారు.
నమస్సులతో విధేయుడు – మోహన
మైదానానికి చెలియలి కట్ట గురించి మోహన గారి అభిప్రాయం:
07/03/2014 8:45 pm
ఇది ఈ వ్యాసముపైన అభిప్రాయము కాదు. కాని వ్యాసమును తానా పత్రికలో ప్రకటించిన దానిపైన నా అభిప్రాయము. తానాలాటి సంస్థలు, వారి వార్షిక సమావేశాలలో ప్రత్యేక సంచికలను ప్రచురిస్తారు. తరువాత దానిని ఈమాట మున్నగు పత్రికలలో ప్రచురిస్తారు. ఇది బహుశా తానాకు ఆ పత్రికలకు మధ్యనున్న ఒప్పందము అనుకొంటాను. తానా పత్రిక జ్ఞాపికలను సభ్యులకు, సమావేశమునకు ఆహ్వానింపబడిన వారికి మాత్రమే అందిస్తారు. వారు మాత్రమే ఈ పత్రికలను చదువుటకు వీలవుతుంది. ఈమాటలాటి పత్రికలలో తరువాత అవి ప్రచురించబడినప్పుడు, అందరికి వీటిని చదువుటకు వీలవుతుంది. అందువలన పత్రికలలోని ప్రచురణలకు ఇంకను ఎక్కువ వాచకత్వము లభిస్తుంది. అది రచయితలకు మంచిదే. కాని ఈ విషయమును బహుశా ప్రచురణలను అంగీకరించే ముందే రచయితలకు తెలిపితే బాగుంటుందేమో? అప్పుడు ఇట్టి పరిస్థితులు రావు.
సమస్త సిద్ధాంతం అవసరమా? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
07/01/2014 10:47 am
వాసుదేవరావు గారూ:
మీ ఆక్షేపణ అర్థం అయిందనే అనుకుని మీరు “కోట్” చేసిన వాక్యంలో “గణితం” అనడానికి బదులు “శాస్త్రం” అనే మాట ప్రతిక్షేపిస్తున్నాను. నేను “గణితం” అనే మాటని గణిత శాస్తాన్ని కాని గణిత శాస్త్రవేత్తలని కాని ఎగతాళి చేసే ఉద్దేశంతో రాయలేదు. ఏ రంగంలో అయినా సరే మనం వాడే సమీకరణాలు, భిన్నాలు, నిష్పత్తులు వగైరా భావాలని వ్యక్తం చెయ్యడానికి మనం అంతా సామాన్యంగా వాడే “లెక్కలు” అనే భావనే. నేను వాడిన “మోసం,” “కిట్టింపు” వగైరా మాటలు దురుద్దేశంతో వాడినవి కావు. రిచ్ఛర్డ్ ఫైన్‌మన్ వాడిన “షెల్ గేమ్” కి నేను చేసిన తెలుగు సేత. “రెగ్యులరైజేషన్” వంటి మాటల వెనక ఉన్న భావాన్ని తేలిక తెలుగులో చెప్పేటప్పుడు అందరిని మెప్పించడం సాధ్యం కాదు. – వేమూరి.
సమస్త సిద్ధాంతం అవసరమా? గురించి వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం:
07/01/2014 9:41 am
శ్రీ వేమూరి: మాథమాటికల్ ఫిజిక్స్ కీ గణిత శాస్త్రానికీ (Pure Mathematics) మౌలికంగా పొంతన లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే – తార్కికమైన నిజానిజాలతో తప్ప భౌతికమైన నిజానిజాలతో గణిత శాస్త్రం ప్రమేయం పెట్టుకోదన్న విషయం మీకు తెలియనిది కాదు. పైగా,’లెక్కల’ ఇన్ఫినిటికీ ‘ఫిజిక్స్’ ఇన్ఫినిటికీ భేదాలు ఉన్నాయనిపింపజేసే సందర్భాలు ఉన్నాయి. ఒక మంచి వ్యాసంలో ఈ పైవాక్యాలలో ‘లెక్కలు’, ‘గణితము’ అన్న మాటలు సామాన్యపాఠకులలో ‘లెక్కల’ మీద ఎటువంటి అభిప్రాయాలను కలగచేయటానికి అవకాశం ఉన్నదో అన్న విషయాన్ని గురించి మీరు మరొక సారి ఆలోచిస్తారనుకుంటాను.
నమస్కారాలతో – వాసుదేవ రావు.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి మోహన గారి అభిప్రాయం:
06/30/2014 5:33 pm
మిగిలిన విషయాలు నాకు తెలియవు కాని జయప్రభగారికి కొత్త ఛందస్సులో మాత్రమే కాదు, ప్రాఛీన ఛందస్సులో కూడ ఆసక్తి, ప్రావీణ్యము, గరిమ ఉన్నాయి. ఆమె భావకవిత్వములో స్త్రీపైన మాత్రమే కాదు, అన్నమాచార్యుల రచనలపైన కూడ ప్రచురించియున్నారు. పద్యాలను జ్ఞాపకము చేసికొని అనర్గళముగా గంగాప్రవాహములా వల్లించగలిగే ధారణాశక్తి గలవారు. నా ఉద్దేశములో PhD అనేది ఒక శిక్షణ మాత్రమే. ఆ పట్టా విద్యకు అంతము కాదు, ఒక పునాది మాత్రమే. ఆ పట్టాను పుచ్చుకొన్న తరువాత ఏమి చేస్తారన్నదే ముఖ్యమైన విషయము. ఆ PhD పట్టా లేకుండా కూడ పరిశోధనలను ఇంతకు ముందు చేసారు, ఇప్పుడు చేస్తున్నారు, ఇకపైన కూడ చేస్తారు. PhD degree లేక ఎన్నో విద్యార్థులకు PhD పట్టంకోసం guide చేసిన వారు కూడ ఉన్నారు (ఉదా. రామన్, బోస్). విధేయుడు – మోహన
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి ravinder గారి అభిప్రాయం:
06/27/2014 1:57 pm
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం ఒక బ్లాగులో వెలుబుచ్చిన అభిప్రాయం ప్రకారం
జ్యోతిష్యం అనేది…..
ఎవరు చెప్పినదీ ఎవరూ నమ్మాల్సిన పని లేదు. మీరు జ్యోతిష్యాన్ని ఖండించే ముందు దాన్ని నేర్చుకుని ఫలితాలు సరిచూచుకుని ఖండించండి. జ్యోతిష్కులమని చెప్పుకునేవాళ్ళ వ్యక్తిగత లోపాలకు ఒక శాస్త్రాన్ని నిందించకండి. అలా నిందించాల్సి వస్తే ప్రపంచవ్యాప్తంగా అల్లోపతీ చికిత్స తీసుకుని మఱీ చనిపోతున్న కోట్లాదిమంది శవాల సాక్షిగా అల్లోపతీ వైద్యవిధానాన్ని కూడా నిందించాల్సి వస్తుంది. వాతావరణ శాస్త్రజ్ఞుల weather forecasts ని కూడా నిందించాల్సి వస్తుంది. ఏ శాస్త్రంలో నైనా సిద్ధాంతభాగం ఉన్నంత ఖచ్చితంగా ఫలితభాగం ఉండదు.
ఇహపోతే, రాహుకేతువుల సంగతి. భూమి orbit చంద్రుడి orbit తో సమద్విఖండన చేసే బిందువుల మధ్య కుడియెడమల దూరాలకు మన పూర్వీకులు రాహుకేతువులని పేరుపెట్టారు. వాటి వల్ల భవిష్యత్ ఫలితాల్లో తేడా వస్తున్నట్లు గ్రహించడం వల్ల వాటిని కూడా గ్రహాలన్నారు. గ్రహాలంటే planets అనుకోకండి. జ్యోతిశ్శాస్త్రం చెప్పే గ్రహాలు planets గుఱించి మాత్రమే కాదు, జాతకం మీద ప్రభావం కలిగించే యావత్తు జ్యోతిస్సుల (Luminary bodies) గుఱించి. మీరు జ్యోతిశ్శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తే ఇలాంటివన్నీ బోధపడతాయి. ఇలా కూర్చుంటే ఏమీ తెలియదు.
ప్రస్తుతం scientific పేరుతో చెలామణీ అవుతున్నది ఒక గూభ్యాలోచన విధానం. ఈ విధానంలో ఏ పదార్థానికా పదార్థం, ఏ వస్తువుకా వస్తువు ఇతర పదార్థాలతోను వస్తువులతోను సంబంధం లేనిదిగా భావించబడుతూ అపార్థం చేసుకోబడుతూ ఉంటుంది. వాస్తవానికి ప్రకృతి ఆ విధంగా నిర్మించబడలేదు. ప్రకృతిలో ప్రతిదానికీ ఇంకో విషయంతో గొలుసుకట్టు సంబంధాలున్నాయి. మనకు తెలియనంత కాలం ఏమీ లేదనుకుంటాము. ఇప్పుడు scientific అని భావించబడుతున్న అనేక విషయాల గుఱించి గతంలో అలాగే అనుకున్నాం. అయితే జ్యోతిష్యం మన పూర్వులు మనకంటే ముందే ఆలోచించినది కావడం వల్ల దాని క్లెయిములు, అన్నీ తెలుసుననుకుంటున్న మన అహంకారానికి గొడ్డలిపెట్టులా ఉన్నాయి. ఒకటి ఒప్పుకుంటే అన్నీ ఒప్పుకోవాల్సి వస్తుందనే భయంతో అన్నిటినీ ఊచమట్టుగా త్రోసిపుచ్చడానికి ఆధునిక మానవుడు అలవాటు పడ్డాడు. కాని నిజం నిప్పులాంటిది. ఒకప్పుడు మానవ నాగరికతలో జ్యోతిష్యం లేదు. తరువాత కొన్ని వందల సంవత్సరాల పరిశోధనా పరిశీలనా ఫలితంగా ఆ శాస్త్రం ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు “కాదు” అంటే తాత్కాలికంగా విజయం మీదే. కాని మానవ కుతూహలం “కాదు, కూడదు”ల దగ్గర ఆగిపోదు. కుతూహలాన్ని ఎవరూ నిషేధించలేరు. అది మళ్ళీ ఆవిర్భవిస్తుంది. మీరు ఆకాశాని కెత్తుతున్న so-called scientific people నుంచే పునర్జన్మ ఎత్తుతుంది.
“నాకు తెలియదు” అని ఒప్పుకోవడం ఒకప్పటి మర్యాద. “నేను నమ్మను” అనడం ఈనాటి ఫ్యాషన్. మన:స్థితి మాత్రం ఒకటే.
“అది వాడి రక్తంలోనే ఉందిరా !” అని వెనకటి తరం వాళ్ళు అంటే, మొన్నమొన్నటి దాకా నవ్వారు-రక్తంలోనే అన్నీ ఉంటాయా ? అంటూ ! ఇప్పుడు ప్రతిదానికీ జీన్సుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఎవరు గెలిచారు ?
అందుచేత, మన పూర్వీకుల్ని వఠ్ఠి వెధవాయిలుగా శుంఠలుగా త్రోసిపుచ్చకండి. మీరు అనుకుంటున్నట్లు కాదు. మీకు సంస్కృతం రాకపోవడం, ప్రాచీన గ్రంథాలు చదవకపోవడం-ఇలాంటి పొఱపాటు అభిప్రాయాలకు కారణం. ప్రతి వృద్ధుడూ ఒకప్పుడు మనలాంటి యువకుడేనని అర్థం చేసుకోండి.
విముక్తం గురించి chudamani గారి అభిప్రాయం:
06/20/2014 7:22 am
రాధగారు, కధావస్తువు బాగుంది. కాని,పద్మగారు చెప్పినట్టుగా, పాత్రలు అటు, ఇటు, అయి ఉంటే, కధ ఎలా మలిచేవారు?
మరొక మాట, అంత కాలంగా మెయిల్స్ పంపుకుంటున్నప్పుడు, మాటవరసకైనా, భార్యతో చెప్పవచ్చు కదా? ఇద్దరు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు కదా? ఆ మాత్రం సాహిత్యచర్చ భార్యా భర్తల మధ్య ఉండదా? నేను ఇలా రాసినందుకు తప్పుగా అనుకోవద్దు. దేనికీ ఒక్కరిని అనవద్దు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.
నమస్తే,
చూడామణి.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు గారి అభిప్రాయం:
06/14/2014 11:44 am
ఈ మాట సంపాదకులకి:
బ్రౌన్ గురించి మేం రాసిన వ్యాసం మీద ఈమధ్య ఆఖరుగా వొచ్చిన ఉత్తరాలు చూస్తే –- అందులో ముఖ్యంగా ఏల్చూరి మురళీధరరావు గారి ఉత్తరం చూస్తే — వివరాలు పక్కన పెట్టి ఒక ముఖ్యమైన విషయం మరొక సారి ప్రస్తావించవలసి వొస్తోంది. మురళీధరరావు గారి ఉత్తరంలో ముఖ్యమైన వాక్యం ఇది:
మాకూ మురళీధరరావుగారికీ వున్న అభిప్రాయ భేదం ఈ వాక్యంలో “విధానంలో లోపాలు కావు” అన్న ఆలోచన దగ్గిరే వుంది. గ్రంథ పరిష్కరణలో అంతర్జాతీయ విధానాలు వుండవు. ఫ్రతి సాహిత్య సంప్రదాయమూ, సాహిత్య ప్రపంచమూ వేరువేరుగా వుంటాయి. ఆ సాహిత్య ప్రపంచానికి అనువైన గ్రంథ పరిష్కరణవిధానాలు ఆ సాహిత్యం అనుసరిస్తుంది. కాని, తెలుగు సాహిత్య ప్రపంచ స్వరూపం ఏమిటి, అది తనకు తెలిసిన లాటిన్, గ్రీక్ సాహిత్య ప్రపంచం కన్న ఎలా భిన్నమైనది అని ఒక ప్రశ్న వేసుకుని తెలుగు సాహిత్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే ఆలోచన కాని, అవసరం కాని బ్రౌన్ కి లేకపోయాయని మేం మా వ్యాసంలో చెప్పాం. బ్రౌన్ ఏర్పరిచిన పరిష్కరణ విధానాలనే తెలుగు పండితులందరూ ఒప్పేసుకుని పనిచేస్తున్నారని మురళీధరరావుగారూ అంటున్నారు. ఈ విషయం అందరికీ గుర్తింపుకి వొచ్చి, అయితే మన సాహిత్య ప్రపంచం ఎటువంటిది, పాశ్చాత్య సాహిత్య ప్రపంచం కన్న ఏ రకంగా భిన్నమయినది అనే ఆలోచన వస్తేనే, బ్రౌన్ మార్గం వల్ల మనం చాలా నష్టపోయామేమో అనే ఒక స్ఫురణ కలుగుతుంది. అప్పుడు చెయ్యవలసిన పని చాలా వుందని ఒక ఉహకి జాగా దొరుకుతుంది. అప్పుడు మనం వేసుకోవలసిన కొత్త ప్రశ్నలు ఏమిటో వెతుక్కుంటాం.
మిగిలిన ఇద్దరి ఉత్తరాలలోని దూకుడు మాకు చాలా ముచ్చట కలిగించింది. ఎంత తక్కువ తెలిస్తే అంత ఉత్సాహంగా రాస్తారని మా అనుభవం. అయితే ఆ సంగతి ఇక్కడ నిజం కాకపోవచ్చు. అందుకని ఆ విషయం పాఠకుల అభిరుచికి వదిలేస్తున్నాం.
— శ్రీనివాస్, నారా
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తఃతః గారి అభిప్రాయం:
06/11/2014 5:47 pm
శ్రీ ఏల్చూరి:
నారాయణ రావుగారి వ్యాసం లొ పై వాక్యాల లొని ‘మనకి (స్పష్టంగా) తెలుసు’ గురించి ఒక విషయం మీకు చెప్పాలనిపించి ఈ అభిప్రాయం రాస్తున్నాను.
పైమాటలు ఊర్మిళాదేవి నిద్ర:ఒక ఆలొచన అన్న పేరుతొ జనవరి 2012 ఈమాటలొ వెల్చేరువారు రాసిన వ్యాసం లోవి. వీటిలొ కూడా వారి అలవాటేమో అనిపించే ‘మనకి తెలుసు’ను చూడవచ్చు. ఆ సందర్భంలో ఈ ‘hand waiving’ని నేను తప్పుపట్టటం ‘ఈ మనం లో నేను లేన’ని చెప్పటమూ గూడా జరిగింది.
-నమస్కారాలతో -తః తః
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
06/11/2014 4:22 pm
మాన్యులు శ్రీ శ్రీనివాస్ గారికి, నారాయణరావుగారికి, నమస్కారములతో,
సౌమ్య వి.బి. గారు మిమ్మల్ని తెలుగు కావ్యాల పరిష్కరణవిధానం గుఱించి అడిగిన ప్రశ్నకు నా వంటి విద్యార్థులకు ఉపకరించే సూత్రాలను కొన్నైనా నిర్దేశింపగలరని ఎదురుచూశాను. అందుకింకా వ్యవధి ఉంటుందని తెలిసి కొంత నిరాశ కలిగింది. మీ బ్రౌన్ దర్శనమీమాంసను అధికరించిన మాటలను ఇప్పటికి వాయిదా వేసి, కొన్ని లఘుప్రస్తావితాల గుఱించిన నా సందేహాలను మాత్రమే విన్నవింపదలిచాను.
(1)
ఈ మాటలను మీరు ఏ ఆధారంతో వ్రాశారో నాకు తెలియలేదు. బ్రౌను ‘పరిష్కరించిన ప్రతి’ అన్నారు కాబట్టి. ముఖ్యంగా మనుచరిత్రను, వసుచరిత్రను, ఆముక్తమాల్యదను అచ్చువేసిన వావిళ్ళ వారు; ఆముక్తమాల్యదను, శృంగారనైషధాన్ని ప్రకటించిన వేదం వారు ఆ, ఇంకా తదితరులు ఆయన ప్రతులను వాడుకోలేదని ‘మనకి’ ఎలా స్పష్టంగా తెలుసో నాకు తెలియలేదు.
1927లో ప్రకటితమైన వేదం వారి ఆముక్తమాల్యదా సంజీవనీ వ్యాఖ్యకు ప్రారంభవాక్యమే ఇది: “మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో ఆముక్తమాల్యదం గూర్చి వ్యాఖ్యలును సూచికలును కొన్ని కలవు. అవియన్నియు కొన్నిభాగములకే వివరణోద్యమములు.”
ఇందులో వేదం వారు పేరు చెప్పకపోయినా పేర్కొన్న వ్యాఖ్యలు – బ్రౌను హయాంలో సేకరింపబడిన గుడిపాటి వెంకటకవి తాత్పర్యబోధిని, జోగి జగన్నాథరాజు బుధమనస్తోషిణి, శ్రీనివాసకవి శ్రీనివాసీయ వ్యాఖ్య, అజ్ఞాతకర్తృకమైన ఒక టీక మొదలైనవి. అవి ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి. వేదం వారు ‘సూచిక’ అని పేర్కొన్నది బ్రౌను దొర సిద్ధం 1849లో చేసిన ఆముక్తమాల్యదా శబ్దసూచి. అది శబ్దరత్నాకర నిఘంటునిర్మాణంలో బహుజనపల్లి సీతారామాచార్యుల వారికి, సంజీవనీ వ్యాఖ్య నిర్మాణంలో వేదం వేంకటరాయశాస్త్రిగారికి ఎంత ఉపకరించినదీ ఆ గ్రంథాలలోని పాఠాలే మనకు సాక్ష్యామిస్తాయి. బ్రౌన్ ప్రతులు వారికి ఉపకరింపలేదనటం సరికాదు.
వావిళ్ళ వారు బ్రౌను మనుచరిత్ర ప్రతిని ‘వాడుకొన్నారని’ మనుచరిత్రలోని వారి పాఠనిర్ణయక్రమమే వేయినోళ్ళతో చాటుతున్నది. పాఠాలను స్వీకరించి, అర్థనిర్ణయంలో మాత్రం స్వతంత్రమార్గాన్ని అవలంబించారు. మనుచరిత్ర వ్యాఖ్యలో జూలూరి అప్పయ్య గారు ద్వితీయాశ్వాసం ఆఱవ పద్యంలో “పరిమళలహరీ+ హల్లోహల” అని పదచ్ఛేదం చేసి “హల్లోహల = తొట్రువడిన వాక్కులు గల” అని అర్థాన్ని వ్రాయగా, వావిళ్ళ వారు విభేదించి “పరిమళ+లహరీ+ఈహత్+లోహల” అని పదచ్ఛేదం చేసి అర్థాన్ని వ్రాశారు. ఇటువంటివి కోకొల్లలు. బ్రౌనుగారికి అభిమానపాత్రమై బ్రౌణ్యంలోనికి ఎక్కినంతమాత్రాన వావిళ్ళ వారు ఆ అర్థాలను గ్రహింపకపోయినా, చాలా వఱకు బ్రౌను ముద్రణలోని పాఠవ్యవస్థనే అనుసరించారు.
జాగ్రత్తగా చూస్తే, బ్రౌను మనుచరిత్ర ముద్రణలో తప్ప మఱెక్కడా కనిపించని ప్రయోగాలు (చూ. వెల్చ) శబ్దరత్నాకరంలోకి అడుగుపెట్టాయి. అది సీతారామాచార్యులవారు బ్రౌను ప్రతులను వాడుకొన్నారనటానికి నిదర్శనం. ఆయన స్వయంగా పరిష్కరించిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి ‘జైమిని భారతము’, యతిరాజులు నాయుడు గారి ‘జైమిని భారతము’ ముద్రణ – బ్రౌన్ సేకరించిన ప్రతుల మూలకంగా పరిష్కరింపబడినవని తెలుస్తుంది.
బ్రౌను ప్రతులను వాడుకొన్న ‘ఇంకా ఇతరులు’ అనేకులే ఉన్నారు. బ్రౌను ప్రతులను వాడుకొన్న విద్వాంసులందరూ ఆయన పేరును స్మరింపలేదనటం కూడా సరికాదు. 1895లో తొలిసారి ధూర్జటి కాళహస్తి మాహాత్మ్యాన్ని ప్రకటించిన క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రులవారు, ఆర్. వేంకటసుబ్బయ్యగారు తమ ‘పీఠిక’లో – “దొరతనమువారి లిఖితపుస్తక భాండారంబునందు మెస్తరు బ్రౌన్ దొరగారిచే సేకరింపబడి కడు హెచ్చరికతో వ్రాయింపబడిన ప్రతియొకండు మాకు దొరకె.” అని వ్రాశారు. ఈ మాటలు బ్రౌన్ గారి సేకరణపై వారికేర్పడిన కృతజ్ఞతాభావానికి సూచికలు. 1870లో కస్తూరి రంగకవి సాంబనిఘంటువు కర్నూలు జిల్లా రామళ్ళకోట నివాసి నన్నూరు వెంకటకృష్ణశాస్త్రి గారి టీకతోనూ; 1872లో ధనంజయ నిఘంటువు, 1897లో ఇరుగపదండేశుని నానార్థ రత్నమాల వాందారి పాపన్నశాస్త్రులవారి టీకతోనూ; 1898లో సుజనరంజనీ సీరీస్ వారి 4-వ సంపుటంగా గణపవరపు వేంకటకవి వేంకటేశాంధ్రము; 1898లో పైడిపాటి లక్ష్మణకవి ఆంధ్రనామసంగ్రహము వెలువడ్డాయి. ఇవన్నీ మద్రాసులోని బ్రౌను సేకరణ ప్రతుల ఆధారంగా వెలసినవే అని సులభంగా గ్రహింపవచ్చును.
1900లో వీటిని మళ్ళీ ఒక సంపుటంగా రూపొందించి కోటి వేంకనార్యుని ఆంధ్రభాషార్ణవముతో కలిపి అమ్మిన పరవస్తు వేంకటరంగనాథస్వామి గారు వీటిని బ్రౌను ప్రతుల ఆధారంగానే అచ్చువేశారని — “మఱియైదు తాటియాకు ప్రతులును, మఱియొక కాకితపు బ్రతియునుగూడ నున్నవి.” అని పేర్కొన్నది బ్రౌను సంచయంలోని అయిదు ప్రతులను గుఱించే. ఇప్పటికీ అవి మద్రాసులో ఆ ప్రకారంగానే ఉన్నాయి. అంతే గాక, ఆయన — “అకారాది శబ్దసూచి (Index) కూడ ద్వరలో ముద్రింప సమకట్టి యున్నాము” అని పేర్కొన్నది బ్రౌన్ దొర వ్రాయించిన ‘ఆంధ్రభాషార్ణవ శబ్దసూచి’ మూలకమే. బ్రౌన్ దొర వ్రాయించిన ఆ ‘ఆంధ్రభాషార్ణవ శబ్దసూచి’ 216 వరుస సంఖ్యతో ఇప్పటికీ అక్కడున్నది.
ఇవన్నీ బ్రౌను సంచయాన్ని మనవాళ్ళు వాడుకొన్నారనటానికి నేను ప్రస్తుతం నా దగ్గరున్న కొన్ని పుస్తకాలలోనుంచి మాత్రమే ఉదాహరించాను. నా దగ్గర లేనివి ఇంకా ఎన్నో ఉంటాయి.
(2)
బ్రౌన్ అనుసరించిన గ్రంథపరిష్కరణపద్ధతులేమిటో మీరు తర్వాత వివరిస్తానన్నారు. అప్పుడు వీళ్ళు దాదాపుగా అనుసరించారో లేదో నిర్ణయించటం సుళువవుతుంది.
(3)
బ్రౌను తన ముద్రణలలో శకటరేఫలను పూర్తిగా తీసేయించాడన్నది ఎంతవఱకు నిజమో నాకు తెలియదు. మనుచరిత్రలో శకటరేఫలు అసలు లేవనటం సరికాదు. మీరు ఉదాహరించిన ప్రతినే మళ్ళీ చూడండి. నా సొంత ప్రతి ఇప్పుడు హైదరాబాదులో మా ఇంట ఉన్నది కాని, అందులో ఉన్నాయనే నాకు జ్ఞాపకం. మీరు ఉదాహరించిన ప్రతిలోని ఆ తొలిపుటలో శకటరేఫల అవసరం లేదు కాబట్టి అవి అందులో లేవు. నేను నా దగ్గరున్న జూలూరి అప్పయ్య గారి వ్యాఖ్యతో ఉన్న నా సొంత వసుచరిత్ర ప్రతిని ఈరోజు పూర్తిగా పరీక్షించి చూశాను. అందులో నియత శకటరేఫలు నియమానుసారం ఉన్నాయి. కవిత్రయ భారతం తొలినాటి బ్రౌన్ ముద్రణలో ఎట్లా ఉండినదో నేను చెప్పలేను. నా దగ్గరున్న బ్రౌన్ మలిముద్రణలో శకటరేఫ, అరసున్న – రెండూ ఉన్నాయి. మీరు చూడదలచుకొంటే ఒకటి రెండు పేజీలు ఫోటో తీసి పంపించగలను.
ఈ వాక్యం నాకు బోధపడలేదు. “అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించటం” ఏమిటి?
బ్రౌన్ దొర బండి-ర లను పాటించినా, మనుచరిత్ర, వసుచరిత్రలలో అరసున్నలను తొలగించి అచ్చువేయించిన మాట నిజమే. అయితే, 1827లో అచ్చువేయించిన ‘ఆంధ్ర గీర్వాణచ్ఛందస్సు’లో అరసున్నలను పాటించాడు, మీరూ చూడండి. ఈ రెండింటి విషయమై బ్రౌన్ ఒక స్థిరనిశ్చయంతో లేరని, వివిధపద్ధతుల ప్రయోగాలను చేస్తూ వచ్చారని – ఈ ఉదాహరణలు వెల్లడిస్తాయి.
అరసున్నలు, బండి-ర లు తాళపత్ర ప్రతులలోనూ ఉండవు. బ్రౌన్ ప్రతులలో అవి లేకపోతే అదొక సమస్య కాదు. అదే సమస్య అయితే, వాటిని చేర్చటం ఒక రోజు పని. బ్రౌన్ ఎన్నుకొన్న పాఠాలకంటె తమకు లభించిన ప్రతులలో మేలైన పాఠాలున్నాయని అద్యతన పరిష్కర్తలు భావించటమే వాటిని ప్రమాణీకరించకపోవటానికి కారణం. ఎమెస్కో వారి కావ్యాల ప్రచురణకోసం పరిష్కర్త శ్రీ తీర్థం శ్రీధరమూర్తి గారు స్వీకరించిన మేలైన పాఠాలన్నీ బ్రౌన్ దొర సంచయం లోనివే. ఆ గ్రంథాలయంలోని నిబంధనల కారణంగా వారు ఆ కావ్యాలపై తమ పేరును వేసుకొనలేదు. ఆ విధమైన కారణం వల్లనే చాలామంది పరిష్కర్తలు, ముద్రాపకులు బ్రౌన్ సంచయాన్ని వాడుకొన్నా, ఆ రోజులలో ప్రాచ్యలిఖిత గ్రంథాలయం వారి ఏవేవో నియమాల కారణంగా ఆ విషయాన్ని పేర్కొనటం జరగలేదు. అది బ్రౌన్ కృషి స్వరూపం తెలియకా కాదు; వారి కృతజ్ఞతారాహిత్యమూ కాదు; బ్రౌన్ సంచయం నిరుపయోగం కావటం వల్లనూ కాదు.
(4)
ఆరుద్ర గారు ఈ విషయమై వ్రాసినది సరిగా లేదు. బుచ్చయ్యగారి వ్యాఖ్య అచ్చుపడకపోవటానికి కారణం ‘పరిష్కరణ పద్ధతి’ కాక ఇంకేదో అయివుంటుంది. జూలూరి వారి వ్యాఖ్య గ్రాంథిక-వ్యావహారికాల సమ్మిశ్రణగా, ఆరుద్రగారు అన్నట్లుగా కాక -– సలక్షణమైన అలంకారాది వివేచనతో, సంస్కృత లక్షణోదాహరణలతో భవ్యంగా, భావ్యంగా ఉన్నది. ఆ తర్వాత కాలంలో సోమనాథకవి విద్వజ్జనమనోరంజనీ వ్యాఖ్య, తంజనగరం తేవప్పెరుమాళయ్య గారి అద్భుతమైన వ్యాఖ్య, వావిళ్ళ వారి పరివర్ధిత వ్యాఖ్య మొదలైనవి వెలుగుచూశాక అంతగా రసాలంకారభావధ్వని వివృతులు లేని బుచ్చయ్యగారి వ్యాఖ్య ముద్రణ, జూలూరి వారి వ్యాఖ్య పునర్ముద్రణ అవసరం లేకపోయాయి.
బ్రౌన్ వ్యక్తిత్వాన్ని గుఱించి మీరు వ్రాసిన విషయవిస్తరణతో ఐకధ్యం లేని అంశాలను మఱొకసారి!
(5)
బ్రౌన్ పరిష్కరణ సంవిధానం మీరే ఉదాహరించిన ఆంగ్లవాక్యాలను బట్టి, అది సార్థకమై, అంతర్జాతీయప్రమాణాలకు సైతం అనుగుణంగా ఉన్నట్లే నాకనిపించింది. ప్రతులను సేకరించటం, పాఠాంతరాలను గుర్తించటం, కవికి అత్యంతసమీపకాలంలో వెలసిన పాఠాన్ని గుర్తించటం, భావప్రతీతికి దోహదంచేసే మేలైన పాఠాన్ని స్వీకరించటం అన్న ఆయన ‘విధానం’ మీరన్నట్లు ఈనాటికీ మనము అనుసరిస్తున్నదే. అందులో లోపాలుంటే, అవి పరిష్కర్త వైదుష్యలుప్తికి, పరిణతప్రజ్ఞ లేమికి, కావ్యానుభవరాహిత్యానికి మాత్రమే నిదర్శనలు. విధానంలో లోపాలు కావు.
ఈ విషయమై విద్యార్థిగా అభిమానమూ, జిజ్ఞాస ఉన్న నేను బ్రౌన్ మాటెలా ఉన్నా, ‘తెలుగు భాషకు అనువర్తించే ఆదర్శ పరిష్కరణవిధానం’ గుఱించి మీరు వ్రాయగల ప్రామాణికవ్యాసానికై ఆసక్తితో ఎదురుచూస్తుంటాను.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు గారి అభిప్రాయం:
06/10/2014 2:51 pm
మిత్రులు వురుపుటూరి శ్రీనివాస్ గారికి, మీరు ఉత్తరం రాసిననందుకు సంతోషం. మీరు చూపించిన దోషాలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం వుంది.
మొదటిది: ఓరియంటల్ లైబ్రరీలో పరుచూరి శ్రీనివాస్ ఏమి చూశాడో సాధ్యమైనంత స్పష్టంగానే చెప్పాం. ఆ లైబ్రరీలో ఎక్కువ సేపు గడపటానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో శ్రీనివాస్ అక్కడికి వెళ్లాడు. అప్పుడు ఆ లైబ్రరీలో రెనొవేషన్ జరుగుతోంది. అయితే అప్పటికీ రెండు రోజుల పాటు అక్కడ గడిపిన తరువాత శ్రీనివాస్ చూసిన విషయాలు మేము వివరంగానే చెప్పాం. మొదటిది మీరే గమనించారు. అక్కడ బ్రౌన్ రాయించిన కాగితపు ప్రతులు ఆలనా పాలనా లేకుండా పడివున్నాయి. రెండోది: ఆ ప్రతులు ఎవరన్నా వాడుకోదలుచుకున్నా పాఠపరిష్కరణ విషయంలో అవి పనికిరావని చెప్పాం. అందులో అర సున్నలు, బండి రలు పాటించక పోవటం, అందుకు ప్రధాన కారణం.
బ్రౌన్ వెళ్లిపోయిన తరువాత మన పాత పుస్తకాలు పాత తాటాకు ప్రతుల ఆధారంగానే చాలామంది పరిష్కరించి వ్యాఖ్యానించి ప్రకటించారు. వీళ్లందరికీ పాత తాళప్రతులు దొరికాయి. ఆ ప్రతులు బ్రౌనే సంపాదించి పెట్టినవో లేకపోతే వేరే రకాలుగా చేరినవో మాకు స్పష్టంగా తెలియదు. మేము చెప్పిందల్లా ఆ తాళపత్ర ప్రతులు నశించిపోలేదనీ, ఇంకా ఉన్నాయనీ, వాటి ఆధారంగానే మన పాత గ్రంథాల పరిష్కరణ చేసుకుంటున్నామనీ, బ్రౌన్ చేయించిన కాగితపు ప్రతులు మనకు ఉపయోగపడలేదనీ — అంత మాత్రమే. ఈ విషయమై ఇంకొంత శ్రద్ధగా పరిశీలించి ఒక నిర్ధారకమైన అభిప్రాయానికి రావడానికి తెలుగు దేశంలో ఉన్న పండితులు, పరిశోధకులు ప్రయత్నించాలి. తాళపత్రగ్రంథాలకు దూరంగా ఒకరం జర్మనీలోను, మరొకరం అమెరికాలోను కూర్చుని ఇంతకన్నా నిర్ధారకంగా చెప్పలేకపోయినందుకు విచారిస్తున్నాం. మా ప్రయత్నమల్లా బ్రౌన్ లేకపోతే తెలుగు సాహిత్యం చచ్చిపోయేదే, బ్రౌన్ చేసిన పునరుద్ధరణ వల్లే బతికి ఉంది అనే లాంటి నిరాధారమైన పొగడ్తలకి అభ్యంతరం చెప్పడమే.
ఇక పోతే బ్రౌన్ ప్రవేశ పెట్టాడని మేం అంటున్న గ్రంథ పరిష్కరణ విధానాలు ఆనాటి చదువుల కారణంగా ఏర్పడినవి, అప్పటి అవగాహనల వల్ల ఏర్పడినవి, అది అప్పటి పరిమితి — అని అనుకోవచ్చుకదా అని మీరు సందేహాన్ని వ్యక్తం చేశారు. బ్రౌన్‌కి పూర్వం తెలుగుదేశంలో ఇంగ్లీషు చదువులు బలంగా లేవు. అవి అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. మన గ్రంథ పరిష్కరణ విధానంలో బలంగా వున్నవి బ్రౌన్ మనకి అలవాటు చేసిన విధానాలే. అది ఎవర్నీ తప్పు పట్టడం కోసం రాసిన వాక్యం కాదు. తెలుగు పండితులు ఆతరవాత చాలాకాలం వరకూ కూడా ఇంగ్లీషు చదువుకోలేదు. వాళ్ల చుట్టూ వున్న ఇంగ్లీషు చదువులు ఈ విధానాలని విమర్శించడానికి కావలిసిన సాంస్కృతిక స్థైర్యం వాళ్లకి లేకుండా చేశాయి. మనకి ఇంగ్లీషు చదువుల వల్ల చాలా లాభాలు కలిగిన మాట నిజమే. అయినా నష్టాలు కూడా జరిగాయి. వాటిని గమనించడానికి, ఆ నష్టాలనుంచి మనం బయటపడడానికి, చాలా ఆలోచన, చాలా పరిశ్రమ కావాలి.
వేమన పద్యాల పట్ల బ్రౌన్‌కున్న అభిమానాన్ని బ్రాహ్మణ వ్యతిరేకతగా మేము చూపించటం కుదరదంటున్నారు మీరు. ఈ విషయాన్నే ఇంతకు ముందు వచ్చిన ఉత్తరాల్లో ‘ఒకడు’గారు కూడా ప్రస్తావించారు. బ్రౌన్‌దృష్టిలో హిందూ మతమంటే బ్రాహ్మణులు చెప్పేదే. బ్రాహ్మణులు కాని వారు అనుసరిస్తున్న అనేక మత విధానాల పట్ల, వాళ్ల సంస్కృతి పట్ల బ్రౌన్‌కేమీ శ్రద్ధ లేదు. అతనికి జంగమ సాహిత్యం, వేమన సాహిత్యం నచ్చటానికి అందులో అతను గమనించిన బ్రాహ్మణ వ్యతిరేకత మాత్రమే నిజమైన కారణం. అతనికి క్రిస్టియన్ మతం పట్ల పట్టుదల, అందులోనూ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మతం పట్ల పట్టుదల ఉందని అతను స్పష్టంగానే చెప్పుకున్నాడు. పోతే అతనిలోని బ్రాహ్మణ వ్యతిరేకతే అతని హిందూ వ్యతిరేకత. అది వ్యక్తులుగా బ్రాహ్మణుల మీద వ్యతిరేకత కాదు. అతను తన దగ్గర పనిచేసే బ్రాహ్మణ పండితుల్ని చవకగా వాడుకున్నా, గౌరవంగానే చూశాడు. అయితే వాళ్ల దగ్గరనుంచి అతను కొత్త ఆలోచనలేమీ నేర్చుకోలేదు. మాటలకి అర్థాలు మాత్రమే నేర్చుకున్నాడు.
మంచి ప్రశ్నలు అడిగినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు.
– శ్రీనివాస్, నారా
మైదానానికి చెలియలి కట్ట గురించి మాగంటి వంశీ గారి అభిప్రాయం:
06/05/2014 1:40 pm
ఇలాటి వ్యాసాలు కత్తి మీద సాములాటివి. ఉపోద్ఘాతం బాగున్నా, ఉపోద్ఘాతం అయిపోయిన తరువాత కొన్ని వాక్యాలు చదవగానే అనుకోకుండా ఘాతం తగిలింది. ఆహ్లాదంగా షికారుకెళుతున్న సమయంలో కనపించే మలుపు వద్ద కనపడని స్పీడు బంపు వచ్చి కీచు మని బ్రేకేసినట్టు ఆగవలసి వచ్చింది. అలా ఆగటం వల్ల ఈ వ్యాసరచయిత(త్రి)కి ఒక “ప్రెజ్యుడిస్”, అనగా పక్షపాతం, ఉన్నదన్న భావన వచ్చి చేరి, ఆ తర్వాత బలపడి, ఆ వాక్యాలు చదివాక నాకు అప్పటిదాకా లేని “ప్రెజ్యుడిస్” వచ్చి చేరింది. అలాటి ఎఫెక్టు కలగటం చాలా దరిద్రం ఏ పాఠకుడికైనా, ఏ వ్యాసానికైనా. ఇలా చెప్పడం వల్ల ఈ వ్యాసానికి, వ్యాస రచయితకు, పాఠకలోకానికి, ఈమాటకు ఉపయోగం ఉన్నా ఉండకపోయినా, మా గురువు గారు లైలా గారు లంకె ఇచ్చి మరీ ఇక్కడికి పంపించి చదివింపచేసారు కాబట్టి ఒక రెండు ముక్కలు రాయవలసి వచ్చింది.
ఆ “ప్రెజ్యుడిస్” అన్న సంగతికి చిన్నపాటి వివరణ – ఈ కింది వాక్యాల వల్ల వ్యాసానికి ఉపయోగం లేకపోగా చదవడానికి విముఖత కలిగిస్తై.
**** “పైన నేను పేర్కొన్న నవలల్లో లత నవలకు విమర్శార్హత కూడా లేదు. ఇక గోపీచంద్ నవలలు అటు రచనాపరంగానూ, ఇటు సిద్ధాంతపరంగానూ కూడా బలహీనంగా రాయబడినవి. “వెంకటచలం పాత్ర ” అంటూ గోపీచంద్ చేసిన మరొక గల్పిక లాంటిది మరీ కురచబారిన రచన.” *****
ఇది చదివిన తరువాత, నే చదివే తీరు, అభిప్రాయం మారిపోవటం మొదలుపెట్టింది. అనగా అప్పటిదాకా లేని “ప్రెజ్యుడిస్” వచ్చి చేరింది నాలో. చెలియలికట్టను తీసుకుని దాని మీద రాయడానికి స్వయంగా మనకు ఎంత అర్హత ఉందనుకుని రాసామో అంతే అర్హత పైన పేర్కొన్న నవలలకూ ఉన్నది అని ఈ వ్యాసరచయిత(త్రి)కి తెలియకపోవటం ఆశ్చర్యం. దీనివల్ల అభాసుపాలు కావటం తప్పితే ఉపయోగం నిల్లు.
అయితే వ్యాసంలోని మిగతా సంగతులు బాగానే ఉన్నా, ఇటువంటి వ్యాసాలు కత్తి మీద సాము అని చెప్పాను గాని, ఆ కత్తి పదునా, మొండా అన్నది తేల్చుకోవాలె ముందు. ఇక్కడ కత్తి మొండిగా ఉన్నట్టుగా నాకు కనపడ్డది. కాబట్టి సాము ఎట్లా చేసినా, ఎంత చేసినా పాఠకుడి మీద ప్రభావం లేదనే అనుకోవచ్చునేమో. అలా ప్రభావం లేకపోవటానికి, పదిహేనేళ్ళ క్రితం రాసిన ఈ వ్యాసానికి రెండు కామెంట్లు, ఇప్పుడు నాది మూడు మటుకే ఉండటం ఒక బలమైన సాక్ష్యమని నేను అనుకుంటున్నా.
అలాకాకపోయినా ఇంకో సాక్ష్యంగా చివరాఖరి రెండు పేరాలు చదివితే ఈ వ్యాసం పట్టు ఎంతో, ఏమిటో చప్పున తెలిసిపోయె. కాబట్టి, చదివి సమయం వ్యర్థం చేసుకున్నానో ఏమిటో అన్నది తెలియక, ఇదే వ్యాసం ఇదే వ్యాస రచయిత ఇప్పుడు తిరగ రాస్తే ఎట్లా ఉంటుంది చూడాలన్న ఆలోచన ఉద్భవిస్తున్న సమయంలో స్వస్తి…
లైలా గారూ క్షమించాలె… 🙂
భవదీయుడు
మాగంటి వంశీ
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి ఉష గారి అభిప్రాయం:
05/28/2014 8:53 pm
నమస్కారం, వ్యాసం చాలా ఉపయోగకరంగ, ఆలోచింపచేసేదిగా, పద్ధతిగ, మంచి రసవంతంగ ఉంది. ధన్యవాదాలు. మీ ప్రతి మాటలో అనుభవం ఉంది. అవగాహన ఉంది. అన్నింటికీ మించి భావాత్మకత ఉంది.
ఇదిగో నా ప్రతిస్పందన-
1. “‘లంగరమ్మలు, లంగరయ్యలు’” — హాస్యం కోసం వ్రాసినా బాగుంది. కానీ Anchor అనే మాటే చాలా పాక్షికంగ, స్వల్పపరిధిలోనే ఆ అర్థాన్ని ఇస్తుండటం గమనార్హం.
2. “కైపొత్తాలు (handbooks)”– ఇవి ముఖ్యంగ యంత్రాదుల వాడుక గురించి పరిజ్ఞానం ఇచ్చే పుస్తకాలు కనక సహాయపుస్తకాలని అనవచ్చేమో.
3. “ఇంగ్లీషులో నాలుగింట ఒక మాట ఫ్రెంచి భాష నుండి వచ్చి కలిసిందన్నది నమ్మశక్యం కాని నిజం”. — ఎనభైశాతం ఆంగ్ల పదాలు ఇతర దేశాల భాషలవే. జర్మన్, పోర్చుగీస్, గ్రీక్, లాటిన్, – ఇవే కాదు- చివరకు మన దేశంలో వివిధ భాషలన్నింటిలో నుంచి ఆ భాషలోకి పదాలు ఎగుమతి అయినవి. ఆ భాష అంత కలగాపులగమైన భాష వేరేది ఈ భూప్రపంచంలోనే ఉండదు.
4. “వెనుక తియ్యను.”– వెనుదీయను అనేది కదా సరైన ప్రయోగం.?
5. “‘క్రోమోజోము’ =‘వారసవాహికలు’” — అద్భుతంగ ఉంది. అయితే వారసత్వ వాహికలు అంటే బాగుంటుందా? ఇంక బణువుకన్నా బృహదణువు బాగానే ఉంది. లేదా గుర్వణువు/ మహాణువు అనవచ్చు.
6. “అణు బాంబులని మరొకసారి పరామర్శిద్దాం.” — హాస్యానికే- ఒక తెలుగు సినిమాలో హాస్యానికి దీన్ని ఢమాల్ ఉండ అని వాడారు. భలే నవ్వుకున్నాము. ఢమాల్ కూడా హిందీలో ధమాకా నుండి అనుకరణగా వచ్చినదే అయినా ఢమఢమలు అనేది తెలుగు శబ్దానుకరణ పదమే.
7. “దుర్నామాలే (మిస్‌నోమర్స్, misnomers).” — దీనినే తెలుగులోకి చేస్తే చెడ్డపేరు అవుతుంది. అంతకన్నా వేరే భావాన్ని అభివ్యక్తం చేయగలిగే స్థాయి తెలుగు భాషకు లేదు. కనక సంస్కృతపదమే బాగుంది. (చెడ్డపేరును సంస్కృతంలో చెప్పాల్సి వస్తే అపయశస్సు లేదా అపకీర్తి అంటారు. కనక భయం లేదు.)
8. “ఏదో ఇంగ్లీషువాడు పప్పులో కాలేస్తే వేసేడు, ఆ కాలు పట్టుకుని మనం ఎందుకు వేల్లాడటం? ఆలోచించండి.” — నిజంగా ఇది నేను చాలా దీర్ఘంగ ఆలోచించాను. మనం తెలుగులో ఒక పదాన్ని కోరి ఆలోచించేముందు కనీసం ఆంగ్లంలో ఆ పదం ఆ వస్తువును సరిగ్గ సూచిస్తున్నదా అని చూసుకుంటే ఎన్నో ప్రమాదాలనుంచి భాషాఘాతుకాల నుంచి తప్పించుకోవచ్చు. అంధానుకరణం ఎక్కడైనా ఎప్పుడైనా హర్షించదగినది కాదు.
9. “సభాపిరికితనం’ అనే పదాన్ని అవసరానికి అనువుగా మార్చి ప్రసంగభయం అనో, సభాభయం అనో వాడుకుంటాడు.” — పిరికి కన్నా బెరుకు, వెరుపు అంటే బాగుండేదేమో. కానీ తెలుగు పదం సంస్కృతపదం కలిపితే అంతగా రుచించదు కనక సభాభయం అనచ్చు. పోనీ రుచింపచేద్దామంటే వేదిక వెరుపు అనచ్చు. ఇప్పుడు సభాపిరికి అనే పదం వాడగా వడగా సామాన్యజనవాహినిలో కలిసిపోయి ఎంతో సహజంగ తెలుగువారు వాడుకోవటం లేదా. సామాన్య భాషలో భావం వ్యక్తమైతే చాలు- శాస్త్రీయ పదాల చిక్కు మాత్రం విప్పలేని ముడే.
10. “జపానీయులు తదుపరి ఇంగ్లిష్ నేర్చుకొటానికి ఎంత అవస్థ పడ్డారొ కూడా ఆయనకు తెలిసి ఊండదు. (వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం)” — వారు ఇంగ్లీషు నేర్చుకోవటానికి ఎంత అవస్థపడ్డారో అనేదానికన్నా సాంకేతికంగ, విజ్ఞానరంగంలో ఎంత పురోగతి సాధించారనేది ముఖ్యం. ఎందువల్ల అది సాధ్యపడింది.? మన పిల్లలు తెలుగులో విజ్ఞానాన్ని చదువుకుని, విషయాన్ని అవగాహన చేసుకుని కూడా విజ్ఞానంరంగంలో సాంకేతిక పరిశోధనలలో తెలుగును ఆశ్రయించి ఎందుకు వెనక ఉంటున్నారనేది ముఖ్యం. జపాను వారు తయారు చేసిన ఏ యంత్రమైనా దాని తాలూకు సమాచారమంతా తమ మాతృభాషలోనే పెట్టుకుంటారు. చివరకు అమెరికా వారు కూడా ఆ రహస్యఛేదన కోసం జపానీ భాష నేర్పించి తమ వైజ్ఞానికులను ఆ దేశం పంపి ఆ పరిజ్ఞానాన్ని పొందవలసిందే. వారు తమ వాడకాల కోసం తామే వస్తువును తయారు చేసుకుంటారు. అంత స్వాభిమానం మనకు ఉందా? మనం తయారు చేసే ఎన్ని మందులు, యంత్రాలు, పరికరాలు మన భారతీయ భాషలలో కనీస సూచనలు కలిగి ఉంటున్నాయో తరచి చూడండి. మనకు మనకన్నా ఆంగ్లేయులు లేదా ఆంగ్లం తెలిసినవారు దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం. ఇక్కడ శాస్త్రపదజాలం, వైజ్ఞానిక పారిభాషిక పదాల చర్చ వచ్చింది కనక చెప్తున్నాను- ఎంత సేపటికీ మన దృష్టి తరువాత ఆ పిల్లలు ఎదిగి దాన్ని ఆంగ్లంలో తెలుసుకుంటేనే కదా పురోగతి అనే భావనమీదే ఉంటుంది. నిజంగ ప్రతిభావంతులైన పిల్లలు ఉత్సాహంతో తెలుగు భాషతో విజ్ఞానాన్ని అర్థం చేసుకుని తెలుగులోనే విషయపరిజ్ఞానాన్ని వ్యక్తం చేస్తామని, తెలుగులోనే పరిశోధనలు చేస్తామని ముందుకు వస్తే దానికోసం కావాల్సిన ఏర్పాట్లు స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళకైనా మన వద్ద సిద్ధంగ ఉన్నాయా..? పోనా మన పిల్లలు విషయం తెలుసుకోలేని పనికిమాలినవాళ్ళా అంటే విదేశాలలో చక్రాలు తిప్పుతున్నారు. వారు విద్యాలయస్థాయిలో నేర్చుకునే ఆ పదజాలం, దాని ఉపయోగం విద్యాలయం దాటాక ఎంత ఉంటోంది అనేదాన్ని బట్టి మనం ఆ పదాలను తెలుగులో పెట్టుకోవాలా, ఆంగ్లంలో పెట్టుకోవాలా అని చర్చ చేసుకోవచ్చు. ముందసలు అటువంటి ప్రయత్నం చేసే ముందే వృథా అని తేల్చేయటం (అది కూడా సంస్కృతాన్ని ఆశ్రయించవలసి వస్తోంది కనక ఆంగ్లాన్నే యథాతథం ఉంచాలనటం అయితే సుతారమూ) సమంజసం కాదు. నిజానికి ఏ పారిభాషిక పదమైనా ఆ భాషలో తయారైనప్పుడు మాత్రం వారికి అది అలవాటయ్యేవరకు కొత్త కావటం లేదా? మొదటిసారి ఒక ఊహ చేసేటప్పుడు వారు మాత్రం ఆయా భాషలలో కొత్త పదాల కోసం వెతుక్కోవటం లేదా..? వివిధ భాషలలో ఉండే శబ్ద-అర్థాలకు నిజంగ ఎన్నో పరిధులలో తేడా లేదా..? వాటర్, నీరు, తన్నీ, పానీ.. అన్నీ నీటిని సూచించటం లేదా.. అటువంటప్పుడు continuous function అవిచ్చిన్న ప్రమేయమంటే వచ్చిన నష్టమేంటి?
11. “if ‘f ‘is a continuous function… తెలుగు మీడియం పుస్తకాల్లో దీని రూపం: f ఒక అవిచ్చిన్న ప్రమేయమైతే… ఇది- ఒక ‘ఒక’ మినహాగా – తెలుగా సంస్కృతమా అన్న సంగతి కాస్త పక్కనుంచితే ఇలా నేర్చుకున్న వారు ఎంత తెలివి గలవారయినా బయట ప్రపంచంలో చెల్లరు.” (వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం)– ప్రతివాడూ ప్రపంచంలో చెల్లాలనేది విదేశాలనో ఆంగ్లాన్నో దృష్టిలోనే పెట్టుకుని ఆలోచించవలసిన అవసరం మనకేంటి? ప్రపంచమంటే ఏంటి? మనం ప్రపంచంలో లేమా? మన దేశం మన పరిశోధన, మన పరిధి, మనకు ముఖ్యం కాదా? అటువంటప్పుడు continuous function ని అవిచ్చిన్న ప్రమేయమని విద్యార్థికి పరిచయం చేసి ఆ విషయావగాహనకు దోహద పడితే అది వాడికోసం అవిచ్చిన్న ప్రమేయంగానే మిగిలిపోతే మాత్రం తప్పేంటి? అందులో ఒక కొత్త క్షేత్రాన్నో, పరిధినో, లోతునో ఆ విద్యార్థి కనుగొనగలిగితే ఆ విజ్ఞానవిషయానికి (శాస్ర్తం ఏదైనా సరే) అతడు న్యాయం చేయటంలో ఏదైనా తక్కువ పడుతోందా?
12. “సంస్కృతం నుండి తెలుగులోకి ఎన్నో మాటలు వచ్చేయి కదా. ఈ ప్రక్రియ శృతి మించటంతో గ్రాంథికానికి ఆదరణ తగ్గి శిష్టవ్యవహారికానికి ఆదరణ పెరిగింది.” — సంస్కృతం ఆంగ్లం తెలుగులోకి చాలా విభిన్న రీతులలో ప్రవేశించాయి. వాటికి పొంతనే లేదు.
“ఈ అభిప్రాయంలొ నేను సరి గానో తప్పు గానో వాడిన సంస్కృత పదాలు నాకు ఇష్టమై మాత్రం కాదు. వాటికి తెలుగు తెలీక.” (వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం)– తెలియక కాదండీ.. లేక. సంస్కృతం తెలుగును ఏదో అన్యాయం చేసిందనే సిద్ధాంతం ఈ మధ్యకాలంలో ప్రబలమైంది. అదీ ఆర్యులదండయాత్ర సిద్ధాంతం–దాని పర్యవసానాన ఆర్య-ద్రావిడ-వేర్పాటు సిద్ధాంతం వల్ల ఆ ఘోరం జరిగింది. ఆర్యులూ లేరు, వారి దండయాత్రా లేదని ఎన్నడో సాక్ష్యాధారాలతో సహా నిరూపణమైనాక కూడా సంస్కృతాన్ని పరాయి భాష అనుకుని మనం ఆ భాషను ఆంగ్లంతో పోల్చటం సరికాదు. కావాలంటే ఈ వీడియో చూడగలరు. కల్యాణరామన్, ఎన్ ఎస్ రాజారామ్- ఈ పరిశోధనలో నాకు తెలిసిన ముఖ్యుల పేర్లు. వారి రచనలు చదవండి. దయచేసి ఆ బూజుపట్టిన సిద్ధాంతాన్ని రాధ్ధాంతం చేయకుండా పూర్వపక్షం చేసి వదిలించేసుకోండి. [https://www.youtube.com/watch?v=fu9Co8b-G1c]
“నా దృష్టిలో ఈ రెంటినీ పక్కపక్కన పెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే, సంస్కృతం తెలుగుపై చూసిన ప్రభావం – విధానంలోనూ, స్వరూపంలోనూ కూడా ఇంగ్లీషు చూపిన/చూపుతున్న ప్రభావం కంటే చాలా వేరయినది.” (కామేశ్వరరావు గారి అభిప్రాయం)– ఇది సరైన మాట. ఆయన చూపిన కారణాలే కాక ఇంకా సంస్కృతం మన దేశంలోది, మన సంస్కృతి నుండి వచ్చినది- వంటి ఎన్నెన్నో ఇతర కారణాలూ చెప్పవచ్చు. సంస్కృతం లేకుండా ఒక్క తెలుగు వాక్యాన్ని ప్రాథమికస్థాయి అవసరం దాటి మనం చెప్పలేమనేది అంగీకరించవలసిన వాస్తవం. అంతే కాదు- భాష అనే మాటకు తెలుగు పదమే లేదు అని ఒక ప్రముఖులు శెలవీయంగా వినటం తటస్థించింది. అట్ల ఎన్నో పదాలు తెలుగులో లేవు. రావు కూడా. సంస్కృతంలో అన్ని భాషలనూ పరిపుష్టం చేయగల శక్తి ఉంది. సంస్కృతాన్ని కాదనుకుని తెలుగువారు తమ భాషాపరమైన అస్తిత్వానికే మూలకుఠారం వేసుకుంటున్నారు. సంస్కృత ధాతువులను, నామపదాలను మనం తెలియకుండానే ఎంతో వాడేస్తున్నాము. అది అవమానజనకం ఏమీ కాదు. కనక కొత్త పదాల సృష్టి సంస్కృతంలో జరిగినా పిల్లలకు, పెద్దలకు ఆంగ్లం కంటే కూడా సులువుగా చక్కగ అర్థమైపోతాయి. భయమే లేదు. సంస్కృతాన్ని కాదనుకుంటే మనకు మిగిలేది పరదేశీయల భాషాపదాలే, దెబ్బతిని చితికిపోయే ఆత్మాభిమానమే.
13. “చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్న “బొగ్గుపులుసు వాయువు” లాంటి అనువాదాలు తెలుగుకి సహజం కావు కదా.” (జయప్రభ గారి అభిప్రాయం) సహజం కాకపోయినా మనం దాన్ని అంగీకరించి ఇవాళ కార్బన్ డయాక్సైడ్ అనే మాటకు సమానార్థకంగా హాయిగా వాడేసుకుంటున్నాము. సంగణకం (కంప్యూటరు) పరికరంగా వాడుక లోకి రాక ముందు ఆంగ్లంలో కూడా “మౌస్” అంటే ఎలుక మాత్రమే. వాళ్ళు చెప్పారు- దీన్ని మౌస్ అందామని.. మనం అంటున్నాము. వాడకంలోకి వచ్చాక ఎవ్వరూ దాన్ని తిరస్కరించరనే మాట మన తెలుగు మాష్టర్లు కాస్త నేర్పుతో ఉపయోగించుకుంటే బాగుండేది.
14. “విమర్శని భరించలేని స్థితికి సమాజం చేరుకోవడం కన్నా వెనకబాటుతనం ఇంకొకటి లేదు.” (జయప్రభగారి అభిప్రాయం)- ఇది అద్భుతమైన మాట. జోహార్లు. ఇందులో చాలా వాస్తవం ఉంది.
15. “ఇంగ్లీషుని తెలుగులోకి మార్చి రాయవలసిన అవసరం నోకియా వాడికీ, ఎమిరేట్స్ వాడికీ కనబడింది.” — అన్నింటికన్నా నాకు నచ్చిన విషయం ఇది మహాశయా. ఒకడిది వ్యాపారావసరం. మరొకడిది పరిశుభ్రతా అవసరం. మన భాష పట్ల మనకు రెండిటిలో ఏ అవసరం కలిగినా తప్పక మనమూ ఆ పంథాలో పోగలము. స్వాభిమానమనేది ముఖ్యం. అది ఉంటే దారులు వాటికవే దొరుకుతాయి.
మంచి వ్యాసం అందించిన రచయితకు, అభిప్రాయాలు వ్యక్తం చేసి నా అవగాహనకు దోహదపడిన వారందరికీ నా కృతజ్ఞతలు. హార్దికాభినందనలు. ఏవైనా తప్పులుంటే మన్నించవలసింది.
-ఉష
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి katha murali గారి అభిప్రాయం:
05/24/2014 9:59 am
సర్:
ఈ వ్యాసంలో నుంచి మొదట భట్రాజు అనే మాటను ఉపసంహరించండి. భట్రాజులు ప్రస్తుతం అంధ్ర ప్రదేశ్ లో బిసీలు. వారిని కించ పరిచేలా మాట్లాడడం సరి కాదు. మాయాబజార్ లో శర్మా శాస్త్రీలు వుంటారు. కవచమిది కవచమిది అని వుత్తర కుమారుణ్ణి తెగ పొగుడుతుంటారు. పక్కన సారథి (అంజి గాడు) కూడా పొగుడుతుంటాడు. ఇద్దరూ చేస్తున్న పని ఒకటే. కాని శర్మా శాస్త్రీలు బ్రాహ్మణులవుతారు. సారథి భట్రాజు అవుతాడు. brahmanism అంటే అదే.
రాజులనూ ప్రభువులనూ జమిందారులనూ నవాబులనూ పొగిడీ వాళ్ళ మీద కావ్యాలు రాసి అంకితం ఇచ్చీ తాము రాసి వారి పేరు పెట్టి శ్రమ తెలియకపొవడం వల్ల జీవితాంతం ఒకరిని పొగిడీ (ఆశీర్వదించి) అదే ఒక జీవన విధానం చేసుకున్న వారు బ్రాహ్మణులు. కాని నాలుగు మెతుకుల కోసం మారాజ ఓ రాజ అన్న పేదలు – భట్రాజులు.
ఈ భావజాలం నుంచి యెప్పుడు బయట పడతారు.
ఈమాట గురించి గురించి మోహన గారి అభిప్రాయం:
05/21/2014 3:06 pm
భారత దేశములో, ముఖ్యముగా ఉత్తర భాగములో, అక్కడక్కడ కర్ణాటకములో వ్యక్తి పేరు, ఇంటి పేరు లేక కులము పేరు ఆ క్రమములో మనకు కనబడుతాయి. కాని మిగిలిన చోట్లలో ఇంటి పేరు (సామాన్యముగా ఊరి పేరు) ముందు, తఱువాత స్వంత పేరు మనకు గోచరమవుతుంది. నెల్లూరు మోహన రావు అంటే అతడు కాని, అతని పూర్వులు కాని నెల్లూరికి చెందినవారో లేక నెల్లూరిలో పుట్టిన వారో అయి ఉంటారు. కాని మోహన రావు నెల్లూరు అంటే అన్వయము సరిగా నుండదు. కొన్ని నామములలో ఇది కొద్దిగా వేడుకగా కూడ ఉంటుంది. రాయవరపు రామనాథమును రామనాథం రాయవరపు అంటే ఏదో ఒక విధముగా ఉంటుంది. సంస్కృత వాక్యములలో సామాన్యముగా పదముల వరుస అంత ముఖ్యము కాదు. కాని ద్రావిడ భాషలలో ఇది చాల ముఖ్యము.
చివరి మాట – ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తికి చెందినది. అతడు / ఆమే దానిని ఏ విధముగానైనను అమర్చుకోవచ్చును, అది ఆ వ్యక్తి జన్మ హక్కు, స్వాతంత్ర్యము. కొన్ని సమయాలలో అది తమాషాగా ఉంటే ఉండనీ గాక! నా రెండు తామ్ర శతకములు 🙂
విధేయుడు – మోహన
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
05/15/2014 8:50 pm
ముందుగా, ఇంత విపులమైన పరిశోధనా పత్రాన్ని రాసిన శ్రీనివాస్, నారాయణరావు గార్లని మనసా అభినందించాలి. ఎంతో పరిశ్రమించారు, ఎన్నో ఆధారాల్ని పరిశీలించారు, మరెన్నో లోచూపుల్ని (insights) మనకందించారు. నాకు బాగా నచ్చిన విషయం – ఏయే ప్రశ్నలకి సమాధానాలు వెదికే ప్రయత్నం చేశారో స్పష్టంగా ముందస్తుగా చెప్పెయ్యటం. “ఇప్పుడు ఈ వ్యాసం ఉద్దేశం… బ్రౌన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు, అంత పండితులు కానివాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిమర్శకంగా పరిశీలించి సాధ్యమయినంత బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.”
ఇప్పటి వరకు అభిప్రాయాలు చెప్పిన చాలామంది అసలు ఈ భాగాన్ని చదివినట్టు లేరు. ఒకవేళ చదివినా అదంత ముఖ్యమైన విషయం కాదని వదిలేసినట్టున్నారు. ఇక్కడ ఒక general statement ఇవ్వాలనిపిస్తున్నది – నేను చూసినంతవరకు సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ, రచనల గురించి కాక వాటి రచయిత/త్రుల గురించి, వారి motivations గురించి, వారికున్న hidden agendaల గురించి విమర్శకుల అభిప్రాయాలు, ఊహలు, ఆలోచనలతో నిండిపోతున్నది. అదివరకు సంయమనంతో లోతైన సాహిత్యావలోకనం చేసిన వాళ్లు కూడ ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ సాహిత్యవిమర్శని నేతిబీరకాయగా మార్చెయ్యటం మన దౌర్భాగ్యం. ఇక అసలు విషయానికి వస్తాను.
వారు వేసుకున్న ప్రశ్నలకి ఈ వ్యాసంలో వ్యాసకర్తలు సమాధానాలు ఇచ్చారా? అని చూస్తే “బ్రౌన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు, అంత పండితులు కానివాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు?” అన్న ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు సాధించారని నా అభిప్రాయం. “బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది?” అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి చాలా విపులమైన సమాచారాన్ని క్రోడీకరించారు. ఐతే మరీ విపులం కావటంతో దీని సమాధానం విషయంలో నాకు కొంత గందరగోళం కనిపించింది. ఒక ఉదాహరణ: “ఫుస్తకాలు ఎలా పరిష్కరించాలో, దొరికిన తాళపత్ర ప్రతులన్నీ దగ్గర పెట్టుకుని ఏ రకంగా పాఠ నిర్ణయం చెయ్యాలో విశదంగా నిర్దేశించాడు బ్రౌన్. ఈ పద్ధతిలో అతను ఇంగ్లండు, ఇటలీ, జర్మనీలలో గ్రంథాల పరిష్కరణలో అనుసరించే విధానాన్నే తెలుగు పుస్తకాలకి వర్తింపచేశాడు. ఈ విధానంలో అతను కొన్ని సొంత అభిప్రాయాలు తెలుగు భాషలో ప్రవేశ పెట్టాడు…. కానీ ములుపాక బుచ్చయ్య వసుచరిత్రకి వ్యాఖ్యానం రాసినప్పుడు బ్రౌన్ నిర్దేశించిన పద్ధతుల్ని అనుసరించలేదు. ఆయన వ్యాఖ్యానం గ్రాంథికంలో ఉంది కాబట్టి ముద్రించలేదని బంగోరె మొదలుకొని ఆరుద్ర వరకు చాలా మంది అన్నప్పటికీ, ఆ వ్యాఖ్యానం కళ్లారా చూస్తే కానీ బుచ్చయ్యగారు అనుసరించిన పద్ధతులేమిటో మనకు స్పష్టంగా తెలియవు. ఈ కావ్యాలని తిరిగి అచ్చు వేసిన వాళ్ళు ఎవ్వరూ బ్రౌన్ నిర్ణయించిన పద్ధతుల్ని పాటించలేదు.” అని ఒక పక్క చెబుతూనే, మరొకచోట “ఇది ఇలా ఉండగా, అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే బ్రౌన్ తన పండితులచేత అనుసరింప జేసిన పరిష్కరణ విధానం — అరసున్నలు, బండి-రల విషయంలోనూ, అఖండయతి విషయంలోనూ, ఇతర వ్యాకరణ విషయాల లోనూ తప్ప — వావిళ్లవారు, ప్రభాకరశాస్త్రిగారు, ఇంకా ఇతర పండితులు, పరిశోధకులు దాదాపు పూర్తిగా అనుసరించారు.” అన్నారు. అదా ఇదా?
ఈ వ్యాసచర్చ నుంచి నాకు అర్థమైనదేమంటే బ్రౌన్ చేసిన పన్లన్నిట్లో కొంత ఉపయోగకరమైనది నిఘంటువుని తయారుచెయ్యటం, అనేది. మిగిలినవన్నీ వ్యాసకర్తల దృష్టిలో తెలుగు సాహిత్యానికి నష్టం కలిగించినవే. నామట్టుకు నాకు, వ్యాసాన్ని వారు ముందు వేసిన ప్రశ్నలకి సమాధానాలుగా విభజించివుంటే follow కావటం ఇంకొంచెం తేలిగ్గా వుండేది.
నాకు నచ్చని ఒక విషయం – వారు వేసుకున్న ప్రశ్నలకి సంబంధం లేని అనేక విషయాల్ని మధ్యలో తీసుకువచ్చి నారాయణరావు గారు ఇప్పటివరకు చేసిన చాలా పరిశోధనల సారాన్నంతటినీ ఈ వ్యాసంలో చొప్పించే ప్రయత్నం చెయ్యటం. ఒకవేళ ఇదంతా “బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా?” అన్న ప్రశ్నకి సమాధానం ఇచ్చే క్రమంలో జరిగిందనుకున్నా కందుకూరి, కట్టమంచి లాటి వాళ్లని ఈ కథనంలోకి లాక్కురావటం, colonialism గురించిన ఉపన్యాసాలు, పాండిత్యప్రదర్శనకి తప్ప చెప్పదలుచుకున్న విషయానికి అంతగా సహకరించాయనిపించవు. చివరగా, కేవలం ఒక bibliography కాకుండా, ఏ ఆధారాలు వ్యాసానికి ప్రత్యక్షంగా ఉపయోగపడ్డాయో ముందుగా ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన ఉపయుక్త గ్రంథాల పట్టిక విడిగా ఇస్తే చూసేవారికి మరీ భయం కలక్కుండా ఉంటుందనుకుంటాను.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి కే.లక్ష్మీధర్ గారి అభిప్రాయం:
05/15/2014 2:00 pm
గౌరవనీయులైన ఈ మాట పత్రిక సంపాదకులకు:
మీ పత్రికలో ప్రచురింపబడిన మనకు తెలియని బ్రౌన్‌దొర వ్యాసం పై నా స్పందనను వ్రాస్తున్నాను ప్రచురించగలరు. పై వ్యాసాన్ని ప్రదాన వ్యాసంగా గుర్తించి ప్రచురించిన సంపాదకులకు జేజేలు.
నా స్పందన రెండు భాగాలు:
1) వ్యాసం ఎంతో సంయమనంతోను పరిశోధనతోను వ్రాయడం జరిగినది జంట రచయితలు సత్యం తెలపటానికి పడిన శ్రమకు ఇచ్చిన ఆధారాలకు అభినందిస్తున్నాను. (ఆ రకమైన పరిష్కరణకి ఇంకా అవకాశం వుంది. తాళపత్ర ప్రతులు దొరికే జాగాలు, వాటిని ఉపయోగించిన వ్యక్తుల యొక్క సమాచారం మనం చాలా చోట్ల పోగొట్టుకున్నా ఇంకా చాలా సమాచారం మిగిలే వుంది.) వ్యాసంలోని పై వాక్యాలకు సంబందించి మరింత వివరంగా తెలిపి ఉంటే బాగుండేది.
2) వ్యాసం ఎంత బాగున్నా, సంపాదకులు ఎంత ప్రాదాన్యత ఇచ్చినా వ్యాసంపై స్పందనలు చూస్తే ఎంతో చింత కలుగుతున్నది. ఎంత వ్యంగ్యం, ఎంత వెక్కిరింపు. నాకు తెలిసి భారత సైనికుడ్ని భారతీయులు పొగడడం, పాకిస్తాన్ సైనికుడ్ని పాకిస్తానీలు పొగడడం ప్రకృతి అయితే భారత సైనికుడ్ని పాకిస్తానీలు పొగడడం, పాకిస్తాన్ సైనికుడ్ని భారతీయులు పొగడడం వికృతి. కానీ విశ్లేషకులు లేక విమర్శకుల తీరు నాకు అత్యంత బాధ కలిగించినది. ఏమో పాపం రచయితలను త్వరలో ఏర్పడే ఫాసిస్టు ప్రభుత్వ ప్రాపకాన్ని పొందడానికి వ్రాశారని, జర్మనీలో తిరుగు వారు కాబట్టి స్వయంగా ఫాసిస్టులని, అనలేదు. ఏ పాపం చేశారని రావణుడు సీతను చరబట్టాడు అంటే రావణుడు రోజుకు వెయ్య లింగాలకు అభిషేకం చేశాడన్నట్లు ఉంది వీరి తీరు. తెలుగు దేశంలో డప్పు వాదమని, కొప్పు వాదమని ఎన్ని వాదాలో లేక ఇజాలో ఉండవచ్చు కానీ పప్పు వాదం మాత్రం ఉండకూడదు లాగుంది (నిజంగా బ్రాహ్మణులే పండితులై ఉంటే వారి శ్రమను కష్టాలను బ్రాహ్మణుడు వ్రాయకూడదా ఇదేనా రాళ్ళెత్తిన కూలీల చరిత్ర వ్రాయడమంటే). రోగుల్ని, దొంగలని కూడా వాడుకున్నారు అంటే అందరు రాజులు అలాగే చేస్తారంటారు, మరి అందరి చరిత్రలాగే వీరి చరిత్ర కూడా వ్రాయాలిగా. ఎవరైనా స్వంతానికే చేసుకుంటారట అయితే దానినేగా చరిత్రగా వ్రాయాలి లేకపోతే లేనిది వ్రాయమనా విమర్శకుల అభిప్రాయం. హతవిథీ! ఎంత మొకాలే మినిట్ ఇచ్చినా అర్దంకాలేదా? లేక అడ్డగోలుగా వాదించాలనా? మొకాలే ప్రభావం అర్ద శతాబ్దం గడిచినా ఇంకా ఎంత బలంగా ఉన్నదో తెలుస్తున్నది.
నేను మొదటిసారిగా నా స్పందన ఈమాటకు వ్రాస్తున్నాను. నా స్పందనలో సత్యముందనుకుంటే సంపాదకులు ప్రచురించగలరు. నాకు చరిత్ర మీద ప్రేమేకాని పాండిత్యం లేనివాడ్ని.
ఇట్లు
కేతిరెడ్డి లక్ష్మీధర్‌రెడ్డి
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవరావు గారి అభిప్రాయం:
05/12/2014 6:20 pm
కామేశ్వరరావు గారూ: ఇడ్డెన / ఇడ్లీ, అట్టు/ దోశ, చారు/రసం, పప్పుచారు/సాంబారు — వీటిల్లో తెలుగు మాటలేవి? కానివేవి? వాడుకలో ఉన్నవేవి? మన రోజు వారీ బతుకులో మనం తెలుగుని పెంచుకున్నామా? తుంచుకున్నామా? తిర్యక్ ప్రకంపనలు, అవిచ్చిన్న ప్రమేయములు, మితులు వంటి శాస్త్ర పరిభాషా పదాలు తెలుగును పరిపుష్టం చేస్తున్నట్టా?
సాహిత్యభాషలో నేడు ఒక ప్రముఖ శాఖయై జనబాహుళ్యం లోకి తేలికగా చొచ్చుకు పోయే సినిమా భాషను తీసుకుంటే తెలుగు సినిమాలలో సంభాషణ లైనా, పాటలైనా ఆఖరికి తెలుగు సినిమాల పేర్లు అయినా తెలుగులో ఉన్నాయనగలమా? పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు అనువాదాల విషయంలో అవి శాస్త్ర సాంకేతిక విషయాలు కానివ్వండి, ఇతరములు కానీయండి ఏమి చెప్పి / చేసి ఎవర్ని ఒప్పించగలం? ఎవరికి ఉపయోగ పడగలం? అన్న నిస్పృహ వస్తుంది. అయినా తెలుగు పిల్లలు తెలుగులొ శాస్త్రాలను చిన్నతనం నుంచే తెలుగులో నేర్చుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందనిపించక మానదు. కానీ ఏ భాష కైనా ఒక మాతృభాషగా బుద్ధిని ప్రచోదన చేసే మౌలిక లక్షణాలనేవి ఏమైనా ఉంటే తెలుగు భాషకున్న ఇటువంటి లక్షణాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయనిపిస్తోంది. ఈ విషయం గురించి శ్రీ కొలిచాల వంటి పండితులు కొంత ఆలోచన చేసి నా వంటి వారికి తెలియజెప్పాలని అనుకుంటాను.
నమస్కారాలతో
వాసుదేవరావు
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
05/11/2014 1:33 pm
ఇంగ్లీషునుండి తెలుగు తర్జుమా విషయమై, వాసుదేవరావుగారు మొదటి వ్యాఖ్యలో చెప్పిన మూడు కోణాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అనువాదాల విషయంలో యీ మూడూ చాలా భిన్నమైనవి. అనువాద ప్రయోజనంలోనూ, విధానంలోనూ, రూపంలోనూ కూడా వీటి మధ్య చాలా తేడాలున్నాయి. తెలుగు తర్జుమాల విషయమై నేను చూసిన చర్చల్లో బహుశా తొంభైశాతం, యీ తేడాలు గమనించకపోవడం వల్ల గందరగోళానికి దారి తీసినవే. వేమూరిగారి వ్యాసంలో కూడా నాకు ప్రధానంగా కనిపించిన లోపం ఇదే. వ్యాస ముఖ్యాంశం వైజ్ఞానికి, సాంకేతిక రంగాలలో తర్జుమా అయినా, ఇందులో చర్చించిన విషయాలూ ఇచ్చిన ఉదాహరణలు, ముప్పాతికవంతు వైజ్ఞానికేతర రంగాల గురించే.
ప్రస్తుతం వైజ్ఞానికరంగానికి పరిమితమై చూస్తే, ముందుగా అసలు తర్జుమా అవసరం లేదా ప్రయోజనం ఏమిటన్నది తప్పక ఆలోచించాలి. ప్రయోజనాన్ని బట్టే, అనువాద విధానం, దాని స్వరూపం ఆధారపడి ఉంటాయి. రెండు ప్రయోజనాలు ఊహించవచ్చు. ఒకటి వైజ్ఞానిక విషయాలు తెలుగువాళ్ళకి సులువుగా బోధపడటం. రెండు, వైజ్ఞానిక పదసంపదతో తెలుగుభాష పరిపుష్టి కావడం. ప్రాథమిక పాఠశాలల్లో వైజ్ఞానిక విషయాలను తెలుగులో బోధించడంలో ఉన్నది మొదటి ప్రయోజనం. అలాగే వైజ్ఞానికవిషయాలను సామాన్యులకు పరిచయం చేయడానికి వ్రాసే జనరంజక వ్యాసాల వల్ల కూడా మొదటి ప్రయోజనమే చేకూరుతుంది. అంచేత, వీటి విషయంలో తర్జుమా ఒక పద్ధతిలో సాగాలి. ఇక ఉన్నతవిద్యలోనూ, పరిశోధనలోనూ తెలుగుభాషను వాడడం వల్ల ఒనగూరే ప్రయోజనం రెండవది, అంటే భాషాపరిపుష్టి. దీనికి అనుసరించాల్సిన మార్గం మొదటి దానికన్నా వేరుగా సాగాలి. ప్రాథమికవిద్య, జనరంజక వ్యాసాల విషయంలో అనువాదానికి ముఖ్యలక్షణం సులభగ్రాహ్యత. నిర్దిష్టత, క్లుప్తత అంత ప్రధానం కావు. అదే ఉన్నతవిద్యలో నిర్దిష్టత, క్లుప్తత ప్రధానం. సులభగ్రాహ్యత కాదు. ఏ భాషలోనైనా చాలావరకూ వైజ్ఞానిక పదాలు తమంత తాము అర్థస్ఫురణని కలిగించేవి కావు. నిత్యవ్యవహారంలో కాస్త సమీపంగా ఉన్న భావాలకు వాడే పదాలు తెచ్చి తమకు అనువుగా వాడుకోవడమో, కొత్త పదాలను సృష్టించడమో జరుగుతుంది. అలా వాడుకభాషలోంచి తెచ్చుకొన్న పదాలకు శాస్త్రరంగంలో తమదైన ప్రత్యేక అర్థం ఏర్పడుతుంది. ఆ భాషలో ఆ శాస్త్రాన్ని అభ్యసించిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. అంచేత, ప్రాథమికవిద్య అయినా, ఉన్నతవిద్య అయినా, శాస్త్రంలోని పదాలన్నీ చప్పున అర్థమైపోవాలని అనుకోవడం తప్పు. మన భాషలో ఎంత బాగా ఇమిడిపోయాయి, ఎంత సులువుగా పాఠకులు దాన్ని గుర్తుపెట్టుకోగలరు, మొదలైన అంశాలే ముఖ్యం. ప్రాథమికవిద్యలోనూ, జనరంజక వ్యాసాలలోనూ ఆయా పదాలకు సంబంధించిన భావాలను ఎంత సులువుగా తెలుగులో బోధపరచగలం అనేదే ముఖ్యమైన విషయం.
మరి అలాంటప్పుడు ఇంగ్లీషులో ఉన్న పారిభాషిక పదాలను అలాగే వాడితే వచ్చిన నష్టమేవిటి? అన్న ప్రశ్న వస్తుంది. నా ఆలోచనకి తడుతున్న ఒక ఇబ్బంది – అప్పుడలాంటి పాఠాలూ వ్యాసాలూ ఆంగ్లపదాలతో నిండిపోయి తెలుగు భాషా స్వరూపాన్ని మౌలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు “కంటిన్యుఅస్” అనేది ఏ కోశానా ఇప్పటి తెలుగుభాషాలో ఇమడలేని పదం. ఇలాంటి పదాలు ఉన్నవున్నట్టుగా తెలుగులో విస్తృతమైతే, తెలుగుభాషా స్వరూపం మారిపోతుంది (ఎందుకంటే, ఇక్కడ మనం మాట్లాడుతున్నది ప్రాథమికవిద్య, జనరంజక వ్యాసాలూ కాబట్టి). అయితే, ప్రాథమిక విద్య పూర్తిగా తెలుగులో తెలుగు పారిభాషిక పదాలతో సాగితే ఉన్నతవిద్య మాటేమిటి? బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పటి సంగతేమిటి? అన్న మరొక ప్రశ్న వస్తుంది. ఈ విషయంలో నాకు ఏ రకమైన అనుభవమూ లేదు కాని, తెలుగులోని ప్రాథమికవిద్యకూ ఇంగ్లీషులో ఉన్నతవిద్యకూ మధ్య వారధి కట్టడం అంత కష్టమైన పని కాదని నా ఉద్దేశం. అయితే దీనికి ఒక ప్రణాళిక తప్పనిసరి. అలా లేనప్పుడే అది వాసుదేవరావుగారు చెప్పిన యిబ్బందులకు దారితీస్తుంది. ఇక ఉన్నతవిద్య విషయానికి వస్తే, అందులో తెలుగు వాడడం వెనక ముఖ్యప్రయోజనం తెలుగు భాషని శాస్త్రభాషగా అభివృద్ధి చేయడం ఒక్కటే. అయితే, ప్రాథమికవిద్యలో తెలుగు విస్తృతంగా వ్యాప్తిలోకి వస్తే తప్ప యిది అసాధ్యం. అసలంతవరకూ దాని గురించి ఆలోచించడమే అనవసరం!
చివరిగా మరొక మాట. తెలుగుభాషపై ఇంగ్లీషు ప్రభావం గూర్చి వచ్చినప్పుడల్లా, సంస్కృతభాషా ప్రభావం గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. నా దృష్టిలో ఈ రెంటినీ పక్కపక్కన పెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే, సంస్కృతం తెలుగుపై చూసిన ప్రభావం – విధానంలోనూ, స్వరూపంలోనూ కూడా ఇంగ్లీషు చూపిన/చూపుతున్న ప్రభావం కంటే చాలా వేరయినది. ఈ తేడాలను గుర్తించడం చాలా అవసరం.
1. నిత్యవ్యవహారంలో సంస్కృత ప్రభావం ప్రధానంగా కనిపించేది తెలుగులోకి వచ్చి చేరిన అక్షరాలలో (మహాప్రాణాలు మొదలైనవి). పదాలు కూడా వచ్చి చేరాయి కాని, అవి తెలుగుభాషా స్వరూపానికి అనువుగా మారి వచ్చాయి. తద్భవాలు తెలుగుభాష ఉచ్చారణకు దగ్గరగా పదస్వరూపాన్ని మార్చుకున్నవి అయితే, తత్సమాలు తెలుగు విభక్తిప్రత్యయాలతో కలిసి తెలుగులోకి వచ్చినవి. ఇంగ్లీషునుండి తెలుగులోకి వస్తున్న పదాలలో ఇలాంటి మార్పులేవీ జరగడం లేదు (ఒకప్పుడు జరిగాయి, క్రమేపీ అది తగ్గుముఖం పట్టి ఉన్నవున్నట్టుగా వాడడం బాగా ఎక్కువయ్యింది).
2. తెలుగుభాషా స్వభావానికి కొంత పరాయిగా ఉండే సంధులు, సమాసాలవంటివి కూడా తెలుగుభాషలోకి వచ్చాయి. అయితే ఇవి చాలావరకూ కావ్యభాషకు మాత్రమే పరిమితం. ఆ కాలంలో కావ్యభాష అత్యల్పవర్గానికి మాత్రమే పరిచితమైన భాష. అంచేత వాడుకభాషపై దాని ప్రభావం పరిమితం. మూలమట్టంగా తెలుగుభాషా స్వరూపాన్ని అవి మార్చేయలేదు. కానీ ప్రస్తుతం ఇంగ్లీషు ప్రభావం అలాంటిది కాదు. ఇది నిత్యవ్యవహారంలోకి చొచ్చుకొనిపోతోంది. అంచేత దీనికి భాష మౌలిక స్వరూపాన్ని మార్చేసే శక్తి ఉంది. అలాంటి సమూలపరివర్తనను మనం ఆహ్వానిస్తామా లేదా అన్నది మనం తేల్చుకోవలసిన విషయం.
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి గారి అభిప్రాయం:
05/07/2014 1:37 pm
ఒప్పుకోవటానికి అవకాశం వుంది. అది పత్రికని బట్టి, వ్యాసం వస్తువు, దాని స్థాయి/ సీరియస్ నెస్ బట్టి, ఇంగ్లిష్ మాటలు కాని పదాలను – సందర్భానుసారం- అచ్చులో ఏ ఇటాలిక్స్ లొనొ కనబడేటట్టుగా ప్రకటించటానికి అవకాశం ఉంది.
అప్పన్న అనే ఆయన పేరు మనకి తెలియక ఆయన అందరికన్నా కాస్త పొడుగ్గా ఉండటం చూసి ఆయనకు మనం అమితాభ్ అని పీరు పెట్టుకుని అప్పన్న కన్నా అమితాభ్ పేరు బాగు లేదూ అంటె ఎలా ఉంటుందో అలా ఉంది. మరి కొన్ని విషయాల గురించి వీలైతే తర్వాత.
ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద గురించి dr pulipati guruswamy గారి అభిప్రాయం:
05/06/2014 9:11 am
ఎంత చెప్పను… ఎంత చెప్పినా చెప్పిందంతా చెప్పాల్సింది కానిదే. అయితె, చెప్పనివ్వనిదెదో ఓ మూల ఊరుకోదు. చూద్దాం ప్లాట్ఫాం మీదికి వచ్చినప్పుడు…
విముక్తం గురించి రాధ మండువ గారి అభిప్రాయం:
05/06/2014 1:51 am
ప్రసాద్ గారూ, బస్సుల్లో, రైళ్ళల్లో, విమానాల్లో పక్కపక్కనే కూర్చుని ప్రయాణాలు చేసే కాలం ఇది. క్లాస్ రూమ్స్ లో ఒకే బెంచీ మీద కూర్చుని చదువుకునే కాలం ఇది. ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్ట్ లు ప్రాజెక్ట్ పని మీదో, ఉద్యోగాలు చేసుకుంటూనో ఒకే కప్పు కింద నివసిస్తున్న కాలం కూడా ఇది. మా నాయనమ్మ చూస్తే అవ్వ! అని బుగ్గలు నొక్కుకుంటూ వాళ్లని _____ కింద జమ కట్టేస్తుంది. మా అమ్మ ఆ పిల్లల తల్లిదండ్రులని, సమాజాన్ని తిట్టుకుంటుంది. నేను పైకి ఏమీ అనను కాని లోపల ఏదో ఆలోచిస్తాను. నా పిల్లలకి అసలు అలాంటి ఆలోచనలే కలగవు. అయితే వీళ్ళు కూడా భర్త/భార్యల విషయం లో ఈగో, ఈర్షాసూయలతో నిత్యమూ ఘర్షణ పడుతుంటారు. పిల్లలని మధ్యలో నలిపేస్తుంటారు. పైగా ఆ పిల్లలు వినకూడదని పక్క గదిలోకి పంపించి మరీ వాదించుకుంటుంటారు. ఆ పిల్లల సర్వేంద్రియాలూ గోడలని దాటి వచ్చి వింటాయని, వారి చిన్ని హృదయాలు భయంతో వణికిపోతూ ఉంటాయని గ్రహించుకోరు. అయితే ఇదంతా కథకి సంబధించినది కాదు కాని (మీరన్న విషయం కూడా) కథలో అంతర్లీనంగా ఉన్న విషయం కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పాను.
ఈ కథ చదివి డాక్టర్ మహేంద్ర కుమార్ అంటారు “మేడమ్ అభినందనలు. చాలా సున్నితమైన అంశాన్ని చాలా చక్కగా fabricate చేసి అల్లారు. నిజానికి ఈ అంశం contemporary అని నాకు అనిపిస్తుంది. నేను విన్నాను, చూశాను, చూస్తున్నాను పిల్లలు కొంచెం పెద్దయ్యాక అభిరుచుల పట్ల interest పెరగడం, ఒక్కోసారి opposite genderలో ఆ అభిరుచుల వాసనలు ఉంటే వారి పట్ల స్నేహభావం పెరగడం, ఆ ఇద్దరూ వారి వారి ప్రాధమిక, కుటుంబ బాధ్యతలు, ప్రేమల పట్ల నిజాయితీగా ఉంటూనే ఒక emotional bonding కోసం, ఒక soulmate లాంటి బంధం కోసం ఏ వికృతమైన ఆలోచన లేకుండా ఉన్నారనిపిస్తుంది. మీరు answer చేసినట్లు మార్పు రావాలి. అందుకు ప్రయత్నించాలి. opposite gender స్నేహాలని నిజంగా శారీరక సంబంధంతోనే ముడిపడి ఉండవు – ఇది సమాజం తెలుసుకుంటే ముఖ్యంగా feminine genderకి విలువనిచ్చినట్లవుతుంది కూడా. చాలా bold subject ఎన్నుకున్నారు. దీని పట్ల విస్తృతమైన అభిప్రాయం రావొచ్చు”
విముక్తం గురించి రాధ మండువ గారి అభిప్రాయం:
05/03/2014 8:55 pm
ప్రసాద్ గారూ, (మీ ఉద్దేశం మైథిలి అనుకుంటా. పొరపాటున రాధిక అన్నారు) – మీరన్నది ఆలోచించదగ్గ పాయింటే. కాని ఇంకా ఈ రోజుల్లో కూడానా!? ఆడ మగ స్నేహం అంటే అలాగే ఎందుకు ఆలోచించడం? రోజులు మారలేదా? స్నేహాల్లో నిజాయితీ పాళ్ళు ఎక్కువవడం గమనించే రాశాను. పోనీ ఇలా మంచి మార్పు రావాలనే ఆశాదృక్పథంతో రాశాను. ధన్యవాదాలతో…
నా అమెరికా ప్రయాణం గురించి Venu గారి అభిప్రాయం:
05/03/2014 7:14 am
చాలా బాగుంది వేమూరి గారు. ముఖ్యంగా మీ తెలుగు వింటుంటే ఎంతో హాయిగా చెప్పలేనంత తీయ్యగా వుందండీ. మీ రచనలనీ మరియూ మీ తెలుగుని చాలా ఆస్వాదిస్తున్నామండి. కాని ఆలస్యంగా మీ రచనలు చదువుతున్నాను అందుకు కొంచెం బాధగానే వుందండీ కాని ఇప్పటికైనా మీ రచనలు చదవగలుగుతున్నందుకు చాలా సంతోషంగా వుందండి. ధన్యవాదాలు వేమూరి గారు.
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
05/02/2014 7:35 pm
ఈ వాక్యంలో చిన్న తప్పు దొర్లిందని ఒక స్నేహితుడు ఎత్తి చూపేడు. ముందుగా ఆ స్నేహితుడికి నా ధన్యవాదాలు. భాషకీ, భావానికీ మధ్య లంకె ఎంత ముఖ్యమో కాళిదాసుని అడగక్కరలేదు, ఈ వాక్యమే చెబుతుంది. ‘హీమ్’ లో వందల కొద్దీ అణువులు లేవు, 75 మాత్రమే ఉన్నాయి అని నా స్నేహితుడు నా తప్పుని ఎత్తి చూపించేడు. “ఎన్నో” అని రాయడానికి బదులు “వందలకొద్దీ” అని అజాగ్రత్తగా రాసేను.
ఎందుకైనా మంచిదని పుస్తకం తెరచి చూసేను. నాలుగు రకాల ‘హీమ్’లు ఉన్నాయిట. ఒక రకంలో వంద దాటి ఉన్నాయి, మరొక రకంలో వంద కంTE తక్కువ ఉన్నాయి. ఒక బణువులో 116 కాని 117 కాని అణువులు ఉంటే దానిని “వందలకొద్దీ” అనకూడదు. “వంద పైబడి” అనొచ్చు. సైన్సు రాసేటప్పుడు భాషలో ‘ఖచ్చితత్త్వం’ ఉండాలంటారు, అలంకారాలకి తావు లేదంటారు.
జానీ కార్సన్ కారల్ సేగన్ ని వెటకారం చేస్తూ “బ్బిలియన్స్” అని బిని వత్తి పలుకుతూ అనేవాడు. అదే ధోరణిలో “వ్వందలకొద్దీ” అని మీరు ఎవ్వరైనా వెటకారం చేస్తే నేను భరిస్తాను. పైన ఉదహరించిన వాక్యం ఇలా ఉంటే సరిపోతుంది: “రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు ‘హీమ్.’ ఒక్క హీమ్ బణువులో 75 నుండి 117 వరకు అణువులు ఉండొచ్చు.”
ఈ తప్పుని సరిదిద్దమని సంపాదకుడిని ప్రార్ధిస్తున్నాను.
శలవ్
వేమూరి
[02మే2014: పై వాక్యం సవరించాము – సం.]
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
05/02/2014 7:40 am
బ్రౌనుగారి సాహిత్యసేవను కేవలం వందిత్వదృష్టితోగాక యథార్థదృష్టితో పరిశీలించి వ్రాసిన ఈ వ్యాసం ఎంతో నూతనసమాచారాన్ని తెలుపుతూ ఉన్నది. ప్రపంచంలో ఏఫలాపేక్ష లేకుండ ఉత్తమకార్యాలు చేసే మహామహులు కొందఱుంటారు. ఏదో ఒక ఉత్తమమైన స్వార్థపరమైనలక్ష్యంతో గూడిన అభినివేశంతో మంచి కార్యాలు చేసేవారు కొందఱుంటారు. కొందఱు పూర్వపు జమీందారులు ఈరెండవకోవకు చెందిన వారనుట స్పష్టమైనదే. మీవ్యాసం చదివిన తర్వాత బ్రౌనుగారుకూడ ఈరెండవకోవకు చెందినవారనే అవగాహన నాకు కుదిరింది. ఒక చిన్న సవరణ. మీవ్యాసంలో తెలంగాణమునందలి సంస్థానాధీశులందఱు వెలమదొరలనే అర్థం స్ఫురిస్తున్నది. కాని తెలంగాణమునందలి సంస్థానాధీశులలో ఒక్క జటప్రోలు (కొల్లాపురము) వారు మాత్రమే రాచకొండ నేలిన సర్వజ్ఞసింగభూపాలుని సంతతివారైన పద్మనాయక (వెలమ)ప్రభువులు. మిగితా వనపర్తి, గద్వాల, గోపాలుపేట, ఆత్మకూరు(అమరచింత) ఈ సంస్థానాధీశులందఱు రెడ్డికులజులు.
మరి నువ్వేమో… గురించి అఫ్సర్ గారి అభిప్రాయం:
05/01/2014 8:23 am
నిషి: చాలా వున్నాయి నచ్చిన వాక్యాలు! వాక్యాలే కవిత్వం కాకపోవచ్చు కాని, ఎందుకో ముందు వాక్యాల దగ్గిరే ఆగిపోతాను. ఇదిగో, ముందు ఇక్కడ ఆగిపోయాను:
భద్రతలూ భరోసాల బరువు మాటలేమో కానీ
నాకోసమే మౌనంగా వెలిగే స్థిమితానివి నువ్వు
తరవాత మళ్ళీ మిగతా పోయెమ్ మొదటి నించీ చదువుకుంటూ వెళ్లాను. కవిత్వం ఫిలాసఫీ చెప్పడం నాకు అట్టే నచ్చదు. మీరు ఫిలాసఫీ చెప్పరు కానీ, కాసేపు ఆ తాత్విక ఛాయలో నిలబెడ్తారు చదువరిని తెరువరిని చేసి!
ఇటీవలి మీ కవితల్లో నాకు నచ్చిన కవిత ఇది!
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి lyla yerneni గారి అభిప్రాయం:
04/21/2014 8:56 pm
ఈ వ్యాసం చదువుతున్నానండి. అన్ని సంస్కృత శ్లోకాలకు అర్ధం చెప్పిన వారు, ఈ శ్లోకం అర్ధం మమ్మల్నే తెలుసుకోమన్నారు. ఎలాగండీ తెలుసుకోటం? కృష్ణుడొచ్చి చెపుతాడా?
ఇంతకు ముందోసారి విశ్వనాథ సత్యనారాయణ ఇలానే చేశారు. వసుచరిత్ర కావ్యం, విశ్వనాథ సాయంతో చదువుకుంటున్నప్పుడు, ఆ పుస్తకం మొదట్లోనే ఒక పర్వతం ఒక నదితో ప్రేమలో పడుతుంది. అక్కడి ఒక సన్నివేశం, కవి చమత్కారం, నే చెప్పేది కాదు, ఎవర్నైనా సంప్రదించి తెలుసుకోమని వి.స., ఆదేశం ఇచ్చారు. అది విశ్వనాధ లాటి పండితుడు చెయ్యాల్సిన పనేనా? ఎవరిని వెళ్లి అడగనండీ నేను, ఈ కధలో విషయమేంటి అని, ఇంటింటికీ వెళ్లి తలుపు కొట్టి అడగనా? విశ్వనాథ అంత విపులంగా, రసవంతంగా చెప్పే రచయిత, చెప్పకపోతే ఇంకెవరు చెపుతారు. ఏదో నా ఊహకు తగ్గట్టు ఊహించుకున్నా. అది తప్పో ఒప్పో చెప్పే గురువులేరీ?
అందుకని, ఈసారి ఇక్కడే అడుగుతున్నాను. ఒకరో, ఇద్దరో, ఇంకా ఎక్కువమందో, పై శ్లోకానికి అనువాదం, దయతో, తెలుగులోగాని, ఇంగ్లీషులో గాని “ఈమాట” పత్రికలో ఇస్తారా. అలాగే, ఈ పుస్తకం అట్ట మీది వర్ణ చిత్రం గురించి కూడా, తెలిసినవారు వివరాలు ఇవ్వండి. ఈ పెయింటింగ్ నాకు మహా ఆకర్షణీయంగా ఉంది.
లైలా
Ps: Isn’t it time to give page numbers to the opinions on a writing in eemaata? Looks like scrolling days are over for opinions. This e-Magazine needs to make browsing opinions, just as efficient as browsing articles. Who knows what gets read more in the long run?
అనగా అనగా ఒకరాత్రి గురించి G vijay Kumar గారి అభిప్రాయం:
04/19/2014 9:42 am
కథా కథనము బాగుంది. భావుకత్వము బాగుంది.కాని, సరైన పొందిక లేదు అనిపిస్తుంది.
బల్లి ఫలితం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
04/13/2014 6:03 pm
అమ్మా! డాక్టరమ్మగారూ,
నా కథ మీద మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.
మీరన్న విషయాలన్నీ నిజమే. నేను ఇంగ్లీషులో రాసేటప్పుడు ఆ రాతలో తెలుగు మాటలు వాడను. అలాగే తెలుగులో రాసేటప్పుడు ఇంగ్లీషు మాటలు వాడబుద్ధి కాదు – తప్పని సరి పరిస్థితులలో తప్ప. అది నా రాతకి “ట్రేడ్ మార్క్” అనుకొండి.
పోతే, బల్లి తోక విషయానికి వద్దాం. బల్లి తోకకి దారం కడితే ఆ తోక తెగిపోయి ఆ బల్లి పారిపోవచ్చు. ఈ దృగ్విషయం నిజమే కావచ్చు. కనుక ఒక బల్లి తోకకి దారం కట్టి దాని చేత విషం కక్కించడం అన్నది మూఢనమ్మకం అవుతుంది కదా. పైపెచ్చు నా పరిశోధన ప్రకారం బల్లి చొంగలో విషం ఉంటుందని ఎక్కడా నిర్ధారణ కాలేదు. అదీ మూఢ నమ్మకమే. అందుకనే బళ్లారి ఆసుపత్రిలో వైద్యులు రామయ్యగారు చెప్పిన ఈ కథకి విలువ ఇవ్వకుండా వారి వైద్యం వారు చేసుకుపోయారు.
హోమియోపతీ మందులు పని చేస్తాయన్న నమ్మకమూ మూఢనమ్మకమేనేమో. తెగించి చెప్పలేను. నా స్వానుభవంలో అవి పని చేసేయి – కాని పెద్దలంతా అది కేవలం “ప్లసీబో” అని నా మూఢ నమ్మకాన్ని కొట్టి పారేసేరు. నేను గతంలో రాసిన “పంటికింద పోక చెక్క” అనే కథలో ఒక జన్యు రోగానికి మందు లేదని తెలిసి కూడ ఒక హొమియోపతీ వైద్యుడు పంచదార మాత్రలు ఇచ్చి లక్షణాలకి ఉపశమనం కలుగజేస్తాడు. మందు లేని జాడ్యానికి మందు ఇప్పించి వైద్యం చేయించే ధైర్యం నాకూ లేదు – ఎంత కథలో అయినా సరే!
బల్లి ఫలితం కథలో మూఢ నమ్మకాలు చాల ఉన్నాయి. సీతమ్మగారు గోపాలకృష్ణని పసుపు తినమని సలహా ఇవ్వడంలో శాస్త్రీయత ఏది? పసుపు తినడం మంచిదని ఇప్పుడు అంటున్నారు కాని, పసుపు తినడానికీ మలేరియాని అరికట్టడానికీ మధ్య సంబంధం ఉందో లేదో ఇప్పటికీ నాకు తెలియదు. ఏది ఏమయితేనేమి, ఈ కథలో చెప్పిన సంఘటనలు అన్నీ నిజంగా జరిగినవే – ఊళ్ల పేర్లతో సహా. వ్యక్తుల పేర్లు మార్చేను. నా ప్రయత్నం అంతా “నిజం చెప్పడం” మీద కేంద్రీకరించబట్టి కథనం దెబ్బ తిన్నా తిని ఉండవచ్చు.
నమస్కారం.
వేమూరి
కోనసీమ కథలు: శిరోముండనం గురించి sri గారి అభిప్రాయం:
03/25/2014 12:33 pm
కథ బాగుంది. కాని కోనసీమకి కథకి లింక్ ఏం లేదు. మంచి కథ.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/24/2014 2:08 am
ఎంతో శ్రమతో ఎన్నో వివరాలతో అందించిన వ్యాసానికి, మిత్రుడు సురేశ్ కు చాలా కృతజ్ఞతలు.
రెండు మూడు అభిప్రాయాలను పంచుకోవడం.
“హిందూమత చరిత్రలో ప్రత్యమ్నాయ కథనాలకు ఆస్కారం లేదా” అన్న శీర్షికే కొంత స్పష్టపరుచుకోవాలి.
“హిందూమతం” అన్నదే సనాతనధర్మానికి కొత్త మాట, అతకని మాట. సనాతన ధర్మంలో శైవ మతం ఉంది, శాక్తేయ మతం ఉంది, వైష్ణవ మతం ఉంది అని అంటాం. కాని అదే కొత్తమాటను వాడుతూ “హిందూ మతం” లో శైవ మతం ఉంది, శాక్తేయ మతం ఉంది, వైష్ణవ మతం ఉంది, అని అనడం ఏదో అతకని మాటల గుంపు లాగ ఉంటుంది. సరే, సనాతన ధార్మాన్నే ఇవ్వాళ హిందూ “మతం” అంటున్నాం అనుకుంటే, “మతం” అన్నది కూడా విచారించుకోవాలి. “మతి”కి సంబంధించిందే మతం. ఇప్పటి తెలుగులో సైతం “అభిమతం” అని, ఫలానాది ఆయన మతం లెండి, అని, అభిప్రాయానికి “మతం” పర్యాయపదంగా వడడం ఉంది. మరి అటువంటి “మతం” కు చరిత్ర ఏమిటి అని ప్రశ్నించుకుంటే, మతులున్నప్పటినుంచీ చరిత్ర అనిపిస్తుంది కదా. సరే, “సనాతనధర్మాన్ని ఆచరించే మతుల యొక్క చరిత్ర” అని అనుకుంటే, చరిత్రలో “కథనాల” ఆస్కారం అర్థం కాదు. చరిత్ర అంటే కథనం కాదు, కథనం చరిత్ర కాదు. మరి ఈ హిందూమత చరిత్రలో కథనాలకు ఆస్కారం అసంబద్ధంగా కనిపిస్తుంది.
Wendy Doniger గారు పద్యం ఉటంకించారో లేదో కాని, పోతన పద్యం చూడగానే సంతోషం కలిగింది.
ఎబ్బెట్టుగా ఉన్న ముఖ చిత్రానికి పోతన పద్యం సమర్థనా కాదు, సమాధానమూ కాదు. ఆ పద్యం తరువాతనే పోతన భాగవతంలో
“ఇట్లు భగవంతుండైన కృష్ణుం డాత్మారాముండయ్యును గోపసతులెంద ఱందఱకు నందఱై నిజప్రతి బింబంబులతోడం గ్రీడించు బాలు పోలికె రాసకేలి సలిపిన” అని ఉంటుంది.
“ఈ విధముగా షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీ కృష్ణమూర్తి ఆత్మలయందు క్రీడించునట్టి పరమాత్ముడుగానుండియు, ఎందఱు గోపికాస్త్రీలో అందఱు కృష్ణులుగా తాను ఏర్పడి, సొంత నీడలనే చూచి ఇతర బాలురు అని అనుకొని ఆడుకొనునట్టి బాలురవలె, రాసక్రీడ చేయగా” అని తాత్పర్యం. అంతటి భావాన్ని ఇంతగా అందించిన పోతన వర్ణనకు Wendy గారి వట్టి రెచ్చగొట్టే తప్పుదోవ పట్టించే ముఖచిత్రానికి ఏ పోలిక లేదు. ఆ పాటి ముఖచిత్రానికి అంత పరిశోధనల పరిశ్రమల అవసరం లేదు. సరిగ్గా అర్థం చేసుకోవడనికే పరిశోధనలు, ఉడుకెత్తించడానికి కాదు.
అట్లాగే వేదాలు అపరవిద్యలు అని, వాటికి అవతల ఉన్న వేద-అంతంలోని, అక్షర బ్రహ్మ గూర్చి తెల్పేదే పరా విద్య అని ముండకోపనిషత్తు మంత్రం అన్నంత మాత్రాన వేదాలను నిరసించినట్టు కాదు.
జ్ఞానం గురించి ఒక మాట. Academic డిగ్రీలు, పరిశోధనలు ఆధ్యాత్మిక జ్ఞానానికి అవరోధాలు కాకపోయినా, ఏ మాత్రం అవసరం లేదన్నదే భారతీయ- “హిందూ” కాదు- “భారతీయ దార్శనిక సాంప్రదాయం” విశిష్టత. వేమన ఎంతో అందంగా అన్నట్లు
స్వానుభూతిలేక శాస్త్రవాసనలచే
సంశయంబు విడదు సాధకునకు
చిత్రదీపమునకు చీకట్లు పోనట్లు
విశ్వదాభిరామ వినుర వేమ ||
అందుకే, డిగ్రీలు కాదు, కనీసం kindergarten పోని అయిదేళ్ళ నచికేతుడి ప్రశ్నలకు చెప్పిన కఠోపనిషత్తు నుంచి, కబీర్ నుంచి, అక్షరాస్యతలేని రామకృష్ణ పరమహంస, డిగ్రీలులేని రమణ మహర్షి, ఇటీవలి పాన్‌డబ్బా వాలా నిసర్గదత్త మహరాజ్ దాకా – ఎందరివో మాటలు, చేతలు వెలుగులీనుతునే ఉన్నాయి.
చివరిగా, ఎట్లా రాసినా, ఎట్లా చిత్రించి అచ్చేసినా, పుస్తక నిషేధం, రోగాన్ని మించి బలహీనపరిచే మందు.
నిషేదిస్తే ఇంకొకరు, ఇంకో పేరుతో ఇటువంటిదే ఇంకోసారి మళ్ళీ రాయొచ్చు. మళ్ళీ కథ మొదటికే. కాని, పుస్తకాన్ని సమర్థవంతంగా విశ్లేషించి, విమర్శించి, లోపాలను ఎత్తి చూపితే, విషయ ఆవిష్కరణకు, సత్యాన్వేషణకు, సనాతన ధర్మ లక్ష్యానికి మేలే కలిగేది అనిపిస్తుంది.
==============
విధేయుడు
_శ్రీనివాస్
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి SriRam గారి అభిప్రాయం:
03/17/2014 2:48 am
ఈమాట వారు ఆనంద్ గుడ్లురు గారి వ్యాఖ్యను ఎలా ప్రచూరించారో వారికే తెలియాలి. ఆయనకి హిందు సంస్కృతి అన్నా, చర్చల అన్నా ఎంత గౌరవం ఉందో, ఈ క్రింది వ్యాఖ్య చాలు అర్థం చేసుకోవటానికి. *మొన్న ఆయనెవరో లండన్ల బాపనాయన, ఆయన టివిలో హిందూ సంస్కృతి తోలూ తొండం అని ఒకటే ఊదర,ఇప్పుడు మనం గూడా అదే దారిల పోదాం. బొమ్మలు చూడకుండ కాల్చేద్దాం, సినిమాలు జూడకుండనే రాళ్ళేద్దాం, పుస్తకాలు చదవ్కుండనే అరుద్దాం. తిరిగి ఏందిరా అయ్యా ఆ అఘాయిత్యం అంటే, నన్ను తాలిబనంటవా ? మంచికి గాని, చెడ్డకు గాని విమర్శ తీసుకోడం చాతకాని ఏబ్రాసోళ్ళం మనం. మన అజ్ఞానమె మనకు రక్ష. గురివింద గింజలం గద.*.
ఈ మాటవారు గమనించవలసిందేమిటంటే, రచయిత రాసిన దానిని తప్పులు పడుతూ, ఇతనికేమి తెలుసులే అని ప్రశ్నించి, రచయిత రాసిన దానిని ఖండిస్తూ, వ్యాఖ్యలు రాసేవారు తమ తెలివితేటలు ప్రదర్సించటానికో లేక టైం పాస్ కో వచ్చి ఇక్కడ వ్యాఖ్యలు చాలామంది రాయటంలేదు. ఆనంద్ గుడ్లురు గారి వ్యాఖ్యలు ఇప్పటివరకు జరిగిన చర్చ మొత్తం ఎగతాళి చేసే విధంగా ఉన్నాయి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Anand Gudlur గారి అభిప్రాయం:
03/16/2014 8:47 pm
రాజీవ్ మళోత్రా పేరొచ్చినాది గదా అని… ఆయన చెప్పేది చాలా కాలం వినుకున్నోణ్ణి ఓ రెండు ముక్కలు చెప్తా నాకు తోచింది.
రౌడీ మూకలు జేసే గలాటాలకీ, ఉద్యమాలకీ తేడా ఉళ్ళా? ఎందుకుళ్ళే, సుబ్బరంగా ఉన్నాది. ఏందబ్బా ఆ తేడా అంటే సిద్ధాంతం అని గదా. సైద్ధాంతిక నిబద్ధత అని గాన ఊతం ఉంతే చేసే అల్లర్లకి ఒక ప్రిస్టేజి వస్తాది. సమస్య ఒకటున్నాది, అది ఎంది, ఎందుకున్నాది, కారణాలేంది – దాని మీద తిరుగుబాటు జేస్తే అది ఉద్యమం అవుతాది. కానీ, లేని సమస్యను చూపించి గాని, చిన్నది పెద్దది జేసి గాని, కూడ ఉద్యమం లేపచ్చు, కాని అది ఎంతోకలం బతకుతాదా? అట్ల జేసేది స్వార్థం కోసరం గాని నిజం ఉద్యమం కాదు గదా. స్వాతంత్ర్యోద్యమం గానీ, తెలంగాణా ఉద్యమం గానీ, ఇంకోటింకోటి గానీ. ఐతె ఇందులొ ఒక తిరకాసున్నాది. తప్పుడు కూతల మీన, అఘాయిత్యం జేసి, అబద్ధాలు చెప్పి, మైకు పట్టుకుని ఊదరగొట్టి తిమ్మిని బమ్మిని జేస్తే అది లాహికి ఐన పద్ధతి గాదు గదా. పునాది దిట్టంగా ఉండాల. చూడ్డానికి దిట్టంగ కనిపిస్తే చాలదు గాదా.
రాజీవ్ మళోత్రా. ఆయన హిందూ సంస్కృతిని తెల్లొళ్ళ నుంచి వాళ్ళ పుస్తకాల నుంచి రక్షిచేటందుకు కష్టపడుతున్నడు. అదే మాట ఆయన ఆయన భక్తులు చెప్పుకుంటరబ్బా. కానీ ఆయన అంతా నిజమే చెప్తున్నడా లేదా? ఎంత నిజం ఉండాది, ఏది డబ్బా అని అది తెలుస్కోని గదా ఆయన మాటలు నమ్మాల్సింది. అది ల్యా. ఆయన మనోడు గాబట్టి, ఆయన మనం గొప్ప, మనం నష్టపోతున్నం అని చెప్తే అది మనకుళ్ళా చల్లగుంటుంది. మనకు నిజం నమ్మే ఓపిక ఉండాదా? యాడికి, మొన్నటికి మొన్న, మీ దేశంలో ఆడోళ్ళకు రేపులైతున్నై అని పేపర్లు రాస్తె, ఏం, మీ దేశంలో మాత్రం గాటల్లా? అని దబాయించుకున్నోళ్ళం.
రాజీవ్ మళోత్రా అనే ఆయన చేస్తుండదేంది? ఇంటర్నెట్ల, పుస్తకాలల ఇంకెక్కడ బడితె అక్కడ ఊదర మన సంస్కృతిని ఈ తెల్లోల్లు పుస్తకాలు రాసి అవమానం చేస్తున్నారు అని, వాళ్ళు చెప్పేది వినిపించుకోడు.
వింటే ఈయన అఘాయిత్యం మనకు తెలుస్తాది కదా. ఈయన అన్నదానికి క్రిపాల్ అనే ఆయన ఒక ఉత్తరం రాశినాడు. దానికి ఉలుకూ పలుకూ ఉన్నాదీ. లేదు. మీరే చదివి తేల్చుకోండి.
http://www.ruf.rice.edu/~kalischi/tantrictruth.html
వెండీని నిలదీసి పుస్తకాలల వాక్యాలు మార్చుకుంటదా? అని అడిగేటోళ్ళు రాజీవ్ మార్చుకుంటడా అని అడిగితే ఏంది చెప్పేది? కుంటి సాకులు. మొన్న ఆయనెవరో లండన్ల బాపనాయన, ఆయన టివిలో హిందూ సంస్కృతి తోలూ తొండం అని ఒకటే ఊదర. ఏందిరా అంటే ఆయన చెప్పిన తప్పుడు కూతలన్ని రాజీవ్ మళోత్ర దగ్గర ఇన్నవే. ఆ పెద్దమనిసి ఒక్క పుస్తకం చదివి ఏంది నిజం అని చూసుకున్న పాపాన బోతే ఒట్టు. మనల్ల కొంతమందికి, మన మతం అంటే పూనకం వస్తాది. వాళ్ళకి గావల్సింది నిజం గాదు. వాళ్ళనుకున్నట్టు ఉండేదే నిజం. దబాయించో, బెదిరించో మనమే గెలవాలె. అదీ ముఖ్యం.
క్రిపాల్ రాసినదాంట్లో ఉండ విషయాలకు, ఇక్కడ ఈమాటలో ఏసిన ప్రశ్నలు ఎంత పోలికలున్నయో నేను చెప్పకర్లా. ఇప్పటికి ఇదే రకంగా గొంతు పెంచుకుని అరిచి ఎవడేం చెప్పినా ఇనకుండానే ఉంటుళ్ళా, మనం? ఇయ్యన్ని ఎవడిక్కావల, తప్పుకో ఎహే, అనుకుంటిరా, అదీ సరే. పోయి ఆడపిలకాయలు జీన్స్ యేసుకున్నా, మన పిల్లగాళ్ళు వాళెంటిన్స్ డే జర్పుకున్నా పోయి వాళ్ళను కొట్టి రండి. ఒకప్పుడు బొట్లు పెట్టుకున్న మనోళ్ళని అమెరికాలో ఇట్లనే జేశినారు గాదా, ఖలిస్తానోళ్ళు ఆడోళ్ళని చీరలు కట్టుకోవద్దని కొట్టినారు గదా. ఇప్పుడు మనం గూడా అదే దారిల పోదాం. బొమ్మలు చూడకుండ కాల్చేద్దాం, సినిమాలు జూడకుండనే రాళ్ళేద్దాం, పుస్తకాలు చదవ్కుండనే అరుద్దాం. తిరిగి ఏందిరా అయ్యా ఆ అఘాయిత్యం అంటే, నన్ను తాలిబనంటవా అని ఎనక్కి తిరిగి దబాయిద్దాం. మనం గొప్ప అని ఎవరు చెప్తే వాళ్ళ మాటలే ఇనుకుందాం. నేను చెప్పేది అబద్ధంగా ఉన్నాదీ? ఈమాటోళ్ళు గాన, పుస్తకం చదివినోడే అబిప్రాయాలు రాయాల అని అంటే, 110 గాదు 10 గూడ ఉండేవి గాదు. పైన నేంచెప్పిన లింకు చూడకుండనే దాని మీద ఇక్కడింకో వంద కామెంట్లొస్తే గాన మనకేమి ఆశ్చర్యం అక్కర్లా. పదిమంది పదిసార్లు అరిస్తె అబద్ధం నిజం అవుతాది కదా. తాడును జూపించి పాము పాము అని పదిసారిస్తే అందరూ నమ్ముతుళ్ళా? ఇంటర్నెట్ పుణ్యమా అని ఎరిగి లేవలేని ప్రతోడూ పండితుడే. అందరూ ఫేస్బుక్ మేధావులే. చదువుకోడం ముఖ్యం గాదు, నేను చదువుతున్నా అని ముందు పదిమందికి తెలియాల. అదీ ముఖ్యం. స్పాము రాసేవాడొకడుండాలే గాని, దాన్ని ముందెనకలు చూడకుండా ప్రతోడికి ఫారర్డు చేసేటోళ్ళకేం తక్కువుండాది.
కాని, ఒక్కటి జెప్పేదీ? మనల్ని మనం తగలబెట్టుకోని బూడిద జేస్కునేదానికి ఇంకెవరో తెళ్ళోడొచ్చి చేయెయ్యకర్లా. వాళ్ళొచ్చి పుస్తకాలు రాయక్కర్లా. ఆపని మనకు మనమే మరింత సుబ్బరంగ జేస్కుంటున్నాం. వాదించేదానికేందబ్బా, ఎంతైన పెట్టుకోవచ్చు గడా. దానికి పోంతేది, అంతేది? అసలు నిజం ఎతుక్కుంటే మనందరికీ పొద్దు పోయేదెట్లా? మంచికి గాని, చెడ్డకు గాని విమర్శ తీసుకోడం చాతకాని ఏబ్రాసోళ్ళం మనం. మన అజ్ఞానమె మనకు రక్ష. గురివింద గింజలం గద.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga గారి అభిప్రాయం:
03/16/2014 10:04 am
అన్నయ్య గారూ మీరు చాలా గంభీరంగా వివరించారు. మీరు చెప్పిన పైన విషయాలలో (మొదటి రెందు పారాలలో) నాకు disagreement లేదు. చాలా చక్కగా క్లుప్తం గా వివరించారు. నేను మీతో ఏకీభవిస్తాను. ఇక్కడ మీ వాదనకి నాకు భేదం లేదు.
ఇక పోతే నాకు, మీకు (రచయిత గారికి) ఆ రెండో విషయమై disagreement. పైన నేను ముందే చెప్పినట్టు, నాగరాజు గారు వివరించినట్టు ఆ ముగింపు కి తగ్గ సాక్ష్యాలు లేవు. హిందుత్వా అంటే ఏమిటో నాకు తెలీదు (సవార్కరు వ్రాసినది నేను చదవలేదు). ఐతే ఆయన హిందుత్వా అంటే మనమేదో ఒకే దేవుడు, ఒకే పుస్తకం అని అన్నాడాని నేను అనుకోను, పైగా అలా అన్నాడాని చెప్పడానికి ఎక్కడా విశ్లేషణలు నాకు తారసపడలేదు. నా వైపు నుంచి అసలు మూల కారణమేమిటో కూడా పైన చెప్పాను.
పోనీ for argument sake బాత్రా గానీ, వెండీని వ్యతిరేకిస్తున్న మిగితా వారు (రాజీవ్ మల్హోత్ర కానీ, లేక ఆవిడ చేసిన అనువాదాల మీద తప్పులు చూపించిన రఘోత్తమ రావు గారు కానీ), వీళ్ళెవరూ కూడా మీరుటంకించినట్టు చెయ్యట్లేదే? పైగా పోనీ సంఘ పరివారే హిందుత్వా వాదులు అని ప్రస్తుతానికి అనుకుందాం. వీళ్ళు కూడా ఒకే దేవుడు, ఒకే పుస్తకం, ఇదే నిజం అని నొక్కి వక్కాడించినట్టు కూడా ఆధారాలు లేవు. ఇలా చేస్తున్నారు అన్నవి అభిప్రాయాలు మాత్రమే. ఇక్కడే మీకూ మాకూ (శ్రీరాం గారిని కలుపుకుని) disagreement. వీళ్ళెవరూ కూడా హుసైన్ విషయం లో శివసేన మూకలు చేసినట్టు ఆధారాలు లేవు. ఇక్కడ కేసుకు ముందు వాగ్వివాదాలు, సంవాదాలు జరిగాయి. ఒప్పుకోనందుకు కేసు వెయ్యడం జరిగింది. నిజానికి బాత్రా గారి కేసు లో కొన్ని విషయాలు హాస్యాస్పదం గా ఉన్నా ఎక్కడా “చాందస” ధోరణి అగుపడట్లేదే? ఈ ముక్క కూడా నేను పైన చెప్పాను.
నా గొడవంతా ఏమిటంటే (మీరన్నట్టే) సెక్యులారిజం ను, ఇలా “చాందస వాదమును” మనం ఆంగ్లం నుంచి తెచ్చిపెట్టుకున్న భావజాలం. ఇది ఒక గంభీరమైన సమస్య. దీన్ని ఇంకా offline చర్చించుకోవచ్చు. వ్యాసానికి పెద్దగా సంబంధం లేదు.
ఒక thought experiment చేసామనుకోండి. ఆంగ్లం తెలీని వాడు బాత్రా గారి హింది పెటీషను చదివితే ఒక వేళ ఎక్కడా “fundamentalism” అని మనం ఈ మధ్య అర్ధం వచ్చేలా అనుకోడు. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టు ఎక్కడా అది గోచరించట్లేడు.
ఐతే కొందరి సంఘ పరివారు లోనే కాదు కొందరు academicians కూడా మీరన్నట్టు మనది కూడా “Monotheistic” అని ఏదో వారితో సరితూగాలనే ఆత్మన్యూనతతో అనటం వాస్తవం. ఆ ఆత్మన్యూనత ను పోగొట్టుకోవాలంటే వెండీ లాంటి (so far unchallenged academic from insiders) ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. దానికి రోజులు వస్తున్నయనిపిస్తోంది. ఈ ఆత్మ న్యూనత మనకి పేదరికం నుంచి, పరపాలన పీడితులవటం వలన అని నా అభిప్రాయం. దీనికి ఆధారలను పరిశీలిస్తే empirical గా గమనించగలం.
ఈ పుస్తకం పుణ్యమా అని ఇప్పుడు ఒక సామన్యుడు (only in comparison to Wendy’s lofty degrees) కూడా చదివి విశ్లేషించగలడు. అందుకు ఈ పుస్తకానికి వచ్చిన పబ్లిసిటీ మంచిదే అనిపిస్తుంది. నాకు అబధ్ధపు, అసంబధ్ధపు, పక్షపాతపు విస్లేషణలతోనే చిక్కు…
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga గారి అభిప్రాయం:
03/15/2014 2:53 pm
@నాగరాజు గారూ: మీ విమర్శ చాలా బావుందండీ…Good writing.
@సతీష్ గారూ: నమస్కారం.
మీరు ఇలా విషయం లేకుండా, ఏవేవో ఊహించేసుకుని, (metaphor అంటే ఏమిటో తెలీకుండా – లేదా తెలీనట్టుగా) రాస్తూ ఉంటే నేను చర్చించలేను…చర్చించను.
వ్యాసానికి సంబంధించినవి, మిగితా కొన్ని చర్చనీయాశమైనవి చెప్పకనే చెప్పాను. మీ ఊహలతో, ఆపోహలతో నాకు సంబంధం లేదు. ధన్యవాదాలు. మన్నించగలరు.
చివరగా ఒక్క మాట: నాకు పేదరికం (దానికి కారణం అర్ధం చేసుకోవడం, ఆ పై నిర్మూలనకి నా వంతు కృషి ఏదో నేను చెయ్యడం) తోనే సంబంధం. పేదరికానికి కులం, జాతి, భాష తో సంబంధం లేడు. అందరినీ ఒకె కర్కశం తో వేధిస్తుంది, అందరినీ ఒకేలా కబళిస్తుంది. ఆ విధం గా పేదరికానికొక్కదానికే అస్మదీయభావాలు ఉండవు. అందుకే పేదరికం తో నే నాకు స్నేహం, శతృత్వం కూడా. కాబట్టీ మీరు ఏవేవో ఊహించుకుని, అనవసర ప్రసంగాలు చెయ్యడం సమయం వృధా చేసుకోవడమే.
సెలవు మరి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Nagaraju Pappu గారి అభిప్రాయం:
03/15/2014 12:46 pm
డానిగర్ పుస్తకంపై బాత్రా అభియోగాలు అర్థవంతంగాలేవని నిరూపించడానికి ఈవ్యాసంద్వారా రచయిత చేసిన ప్రయత్నం బావుంది. కానీ, ఒక లాయర్లా ఒక్కో అభియోగానికి సమాధానం చెప్పినట్టుగా కాకుండా, డానిగర్ పుస్తకంపై ఒక సమగ్రమైన సమీక్షరాసుంటే, పుస్తకం చదవని నావంటి పాఠకులకి ఇంకా ఉపయోగంగా ఉండేదేమో!
సురేశ్ ఈ వ్యాసంలో డానిగర్ పుస్తకంపై తన అభిప్రాయాలు, ఆయన ఉద్దేశంలో బాత్రా అభియోగాలు ఎందుకు హాస్యాస్పదంగా ఉన్నాయో పాఠకులముందుంచటం అనే పరిధిని దాటి మరెన్నో విషయాలు ప్రస్తావించారు.
1. ప్రత్యామ్నాయ కథలకి అస్కారం ఉండాలి అనుకునేటప్పుడు, అసలైన, ప్రధానమైన సంప్రదాయం ఒకటంటూ ఉండాలి కదా, ఉందని ఒప్పుకోవాలి కదా? ఆ సంప్రదాయం పిల్లలని నిద్రపుచ్చడానికి తప్ప మరిదేనికి పనికిరాదని తేల్చేకా, ఇంక ప్రత్యామ్నాయాల గురించి ఆరాటం ఎందుకు? ఆ ప్రత్యామ్నాయాలే అసలైన, విలువైన చారిత్రక రచనలని వాదిస్తున్నప్పుడు, పక్కకి నెట్టబడుతున్న ప్రధానమైన సంప్రదాయం కొంత తిరుగుబాటు దోరణి ప్రదర్శించటం సహజమే కదా?
2. చారిత్రక దృష్టితో ఈ విషయాలని చూడాలని వాదించిన రచయిత కొన్ని విషయాలలో చారిత్రక దృక్పథం ప్రదర్శించినట్టుగా నాకు అనిపించలేదు. ముఖ్యంగా:
అ. సిద్ధాంత చర్చలు, వాదవివాదాలతో భారతీయ తాత్వికత చరిత్ర అంతా నిండి ఉంది అని చెప్పడానికి ఏవో కొన్ని శ్లోకాలని ఉదాహరించడం ఎలా ఉందంటే, యత్రనార్యంతు పూజ్యంతే శ్లోకం కోట్ చేసి, భారత సంస్కృతిలో మహిళలకి ఎంత గొప్పస్థానం ఉందో ఊదరగొట్టే ఇంటర్మీడియల్ పరిక్షల్లో రాసిన వ్యాసంలా ఉంది. రచయిత భారత సంస్కృతిలో ‘డిబేట్’ గురించి చారిత్రకమైన ఆధారాలతో వాదించలేదు (ఉదా: న్యాయమతస్తులకి – బౌద్ధులకి మధ్య కొన్ని వందల సంవత్సరాలపాటు నడిచిన వాదనలు, అద్వైతులకి-బౌద్ధులకి మధ్య జరిగిన వాద/ప్రతివాదాలు మొదలైనవి.) ఈ వ్యాసంలో ఇదొక లోపం అని ఎందుకంటున్నానంటే, రచయిత హిందుత్వ-వాదులవల్ల, ఎంతో విలువైన ఈ సంప్రదాయం నాశనం అయిపోతోందని వాదించారు. కాని అందుకు తగ్గ సరంజామా ఈ వ్యాసంలో నాకు కనిపించలేదు.
ఆ. రచయిత ఒక వ్యాఖ్యలో, మధ్వాచార్యులు, శంకరుల వ్యాఖ్యానాలన్నీ సంస్కృతభాషలో ఒక పదానికి, సమాసానికి ఎన్నో అర్థాలు చెప్పగలిగే సౌలభ్యాన్ని వాడుకుని చేసే ద్రావిడ ప్రాణాయామాలే అని వాటన్నిటిని కొట్టిపడేశారు. సురేశ్ భగవద్గీతకి ఒక కొత్త వ్యాఖ్యానాన్ని రాయాడానికి పూనుకుంటే అలాంటి వాదనని ఎంచుకోవడంలో తప్పులేదు, కానీ చరిత్రకారుడికి అటువంటి సౌలభ్యంలేదు. చారిత్రక దృక్పథంతో చూడాల్సి వస్తే – “In the Indian Tradition, multiple interpretations of a text based on poetic-interpretations, and argument exploiting the inner, flexible structure of the Sanskrit Language are accepted and integral to the tradition” అని మాత్రమే చెప్పుకోవాలి గదా? వాటిని కొట్టిపడేస్తే ఎలా?
3. డానిగర్, పాశ్చాత్య-పక్షపాతం తన రచనలో చొరబొడే ప్రమాదం ఉందని ఒప్పుకున్నంత మాత్రాన, అది చొరబడలేదని చెప్పలేం కదా? భారతీయ సంప్రదాయలని, సయ్యద్ ఓరియంటలిజంని క్షుణంగా ఎరిగిన సురేశ్, డానిగర్ పుస్తకంలో ఈ పక్షపాతం ఏవరకూ ఉందో సమీక్షించి ఉంటే బాగుండేది.
4. వ్యాసం చివర్లో రచయిత, హిందుత్వవాదం వల్లే హిందూమతానికి ప్రమాదం అనే ముగింపుకి కావాల్సినంత ఆధారాలనిగానీ, “సోషియలాజిల్ ఆర్యుమెంటు”నిగాని ఈ వ్యాసంలో చూపించలేదు. పబ్లిషింగ్ చరిత్రని అధ్యయనం చేసిన వ్యక్తిగా, కేవలం ఇటువంటి చెదురు-మదురు వివాదాల ఆధారంగా ఇంత పెద్ద ప్రమాద సూచికలని ఎగరెయ్యలేం అని నా అభిప్రాయం. ఎందుకంటే..
There is a significant difference between how an academic publisher like Chicago University Press and a general publisher such as Penguin approach publishing.
Academic publishers generally don’t do much marketing since their main distribution channels are university and other academic libraries.
But, for a publishing house like Penguin, marketing and sales constitute large chunk of the overall cost.
So, if they get easy publicity, they will grab it with both hands. If a book can become a controversy, they will do everything in their power to make it so, they would love if somebody goes to court and tries to get a ban on the book.
In this case, Penguin did a brilliant job — they passed on the publicity cost to the public, they made an out of court settlement — which means they don’t have to pull the book out of publication, and they are laughing all their way to bank.
And, as Wendy herself said in her Op-Ed, she is also very happy with the court-case, and the out-of-court settlement — because, just because a radical, right-wing, Hindutva brigade was offended by her book, she gets more ‘academic milage’ in her career, and with her colleagues, and well — her book is selling. That attitude is definitely neither scholarly nor pursuit of truth.
ఇండాలజి అధ్యయనాల్లో ముఖ్యమైన సమస్య సయ్యద్ ఓరియంటలిజం ఒక్కటే కాదనుకుంటా, అంతకన్నా మౌలికమైన సమస్యలున్నాయి. ఇండాలజి పరిశోధనలని బాగా ఎరిగిన సురేశ్ దానిపై వ్యాసం రాస్తే చాలామందికి ఉపయోగపడుతుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/15/2014 10:11 am
మోహనగారూ
వేదాలకు ఛందములన్న వ్యవహారం ఉంది. ఇక్కడ ఛందము అంటే ఆరు వేదాంగాల్లోనూ ఒకటిగా కాక సాక్షాత్తూ వేదము అనే చెప్పుకోవాలి. ఛాందసుడు అంటే సమస్తప్రాంపంచిక వ్యవహారాలనీ వైదికదృష్టితో చూసే వాడు అని అర్థం. ఇంకా కొంచెం ముందుకు పోయి చెప్పుకోవాలంటే వేదంలో ప్రజ్ఞ ఉన్నవాడే కాని లౌకికవ్యవహారాల్లో నేర్పు లేనివాడు. ఛాందసుడు అన్న పదమే చాదస్తుడు అని వ్యవహారంలో మార్పుచెందింది. అర్ధచ్యుతి ఏమీలేదు. కొంచెం అర్థవిస్తృతి కలిగిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం చాదస్తుడు అంటే ఏదో కాలంతీరిన ఆలోచనాధోరణి తప్ప వాస్తవిక ప్రపంచజ్ఞానంలేని వాడు అన్న అర్థంలో వాడుతున్నారు ప్రజలు.
నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
03/14/2014 2:18 pm
అయ్యో ఈమాత్రం దానికి sorry ఎందుకండీ! చరిత్రలకే alternatives ఉన్నప్పుడు పద్యాలకు alternative interpretations ఉండడంలో ఆశ్చర్యమేవుంది! మనది కాని interpretation ఎప్పుడైనా ఎలానూ misinterpretation అయ్యే తీరుతుంది. ఎవరి interpretationకి వాళ్ళవాళ్ళ reasoning ఉండనే ఉంటుంది. ఉదాహరణకు నా interpretation వెనక నాకున్న reasoning ఇది – “పొత్తి” “పొత్తిలి” అనేది చిన్నపిల్లలకు వేసే గుడ్డ. అందుకే పసిపాపలను “పొత్తిళ్ళలో బిడ్డ” అని కూడా అంటారు.
ఎవరి మనోభావాలూ దెబ్బతిననంత వరకూ ఇందులో ఇబ్బందేమీ లేదు! 🙂
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి SriRam గారి అభిప్రాయం:
03/14/2014 1:08 pm
అన్నయగారు,
యోగ గారు చాంధస వాదం అంటే ఎమిటో వికీ లోని వివరణ ఇచ్చారు. మీరు చెప్పె ఛాందసవాదం ఎమీటో మీకే తెలియాలి. మీ లాజిక్ ప్రకారం, ఈ వ్యాస రచయిత కూడా పాండిత్యప్రకర్ష ప్రదర్శిస్తూ, అర్థ సత్యాలను అందంగా చెప్పారని అనవచ్చా? నాసదీయ సూక్తం ఋగ్వేదంతో వ్యాసం మొదలు పెట్టి, పద్నాలుగు పేజిలు రాసి, అటుతిప్పి ఇటుతిప్పి,పాఠకులను కంఫ్యుస్ చేసి, చెప్పిచెప్పనట్లు, చివరకు తేల్చింది హిందువులను తాలిబన్ లతో పోల్చటమా ఈ వ్యాసం యొక్క అంతిమ లక్ష్యం? మోడి సంగతి పక్కన పెట్టండి. ప్రగతి కాముక వామపక్ష వాదులు మమత బెనర్జి ముందు బెంగాల్ ను, సుమారు రెండున్నర దశాబ్దాలపైగా పాలించారే, కనీసం కుల వ్యవస్తను బలపరిచే ఖాప్ పంచాయితిని ఎందుకు నిషేదించలేకపోయారో ఎప్పుడైనా ఆలోచించారా? బెంగాల్ లో వారి పాలన మీరనే మత ఛాందసవాదుల పాలన కంటే భిన్నమైనదా? మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోండి.
వెండి గారి ఈ పుస్తకం గొడవకు, ఒక వారం ముందు తస్లీమా నస్రీన్ రాసిన టి వి సీరియల్ ని బెంగాల్ ప్రభుత్వం నిషేదించింది. ఆ వార్తను ఏ మీడీయా హౌస్ వారు గాని, మీరు చెప్పే ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్రవాదులు గాని,వెండి గారి పుస్తకానికి ఇచ్చిన అటెన్షన్ లో కనీసం సగం కూడా ఇవ్వలేదు. ఎందుకని? మీలాంటి ప్రగతి కాముకులు హుసేన్ గారి గురించి ఆలోచించే కన్నా, మధ్యతరగతి ప్రజల జీవితాలను గురించి ఆలోచించే తస్లీమ నస్రిన్ లాంటి వారికి మద్దతు ఇస్తే బాగుంట్టుందేమో!
నిర్మాతలకి మత ఛాందసవాదుల వలన వచ్చిన ముప్పేమిలేదు. మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. వారికి పూర్తి స్వేచ్చ ఉంది, మహేష్ భట్ ఇమ్రాన్ హష్మీ తో తీసిన మడ్డర్ 1 & 2 సినేమాలు చూడండి . భారతదేశం లో ఎంత స్వేచ్చ ఉందో మీకే తెలుస్తుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి భాను గారి అభిప్రాయం:
03/14/2014 11:17 am
@ Yoga గారు, “భారతీయ మహిళలు ఎప్పుడు అణగదొక్క బడ్డారు” అన్న విషయం తీర్మానించే ముందు, శుమారు రెండున్నర వేల సంవత్సరాల చరిత్రలో ప్రతి శతాబ్దంలో వివిధ రంగాలలో కృషి చేసిన మహిళలపై Wendy గారు ఒక సమగ్ర అధ్యయనం చేస్తే బావుండేది. కొన్ని శతాబ్దాలలో కాలమాన పరిస్థితుల ప్రభావంతో మహిళలు అన్ని రంగాలలో ప్రతిభ చూపక పోవటం లేదా కొన్ని సార్లు వారిని నిషేధించటం జరిగివుండవచ్చు కాని భారత సమాజంలో స్త్రీలు అణగదొక్కబడితే ఇలా వివిధ రంగాలలో కృషి చేసిన మహిళల పరంపర వుండదు. మహిళల విషయంలో ఇంత సుదీర్ఘ పరంపర వున్న సంస్కృతీ మరొక్కటి నాకు తెలియదు.
చాలామంది Indologists “సత్యార్థ ప్రకాశ” గ్రంధం చదివి వుండరు. స్వామి దయానంద సరస్వతి 18వ శతాబ్దం వాడు. ఆయన ఆర్య సమాజ పరంపర ఇప్పటికి కొనసాగుతూనే వుంది. మొట్ట మొదటగా కర్మ కాండలని ఒక సంస్థాగతంగా నిరసించి వేదాలు అందరు చదువవచ్చు అని చెప్పి వేదాలని సామాన్య మానవులకి అందింపజేసే ప్రయత్నం ఆయన చేసారు. 18వ శతాబ్దం లోనే ఆయనకి ఈ విషయం పై అవగాహన వుంది అంటే ఖచ్చితంగా అంతకు ముందు వేదాధ్యయనం పై తెచ్చిపెట్టుకొని సృష్టించిన ఆంక్షలు కొన్ని ఊండెవెమో అని నాకు అనిపిస్తుంది. మొల్ల (1440–1530) వరకు కూడా మనం స్త్రీలు సాహిత్యంలో ప్రతిభ చూపటం చదివాం. ఇదంతా చదివితే మనకి 1500 నుండి 1800 సంవత్సరాల మధ్య ఈ ఆంక్షలు లేదా, సమాజం లో మూఢనమ్మకాలు పెరిగి ఉండవచ్చు. నేను రెండు కళల గురించి ప్రస్తావించలేదు (సంగీతం, నృత్యం). ఈ రెండు కళలు స్త్రీలకి అట్టే అబ్బుతాయి. ఉత్తర భారతం లో వీటిపై ప్రతిభ చూపిన మహిళలు చాలా మంది వున్నారు.ముఖ్యంగా మొఘల్ పాలన తరువాత స్త్రీలు వేదాధ్యయనం, సాహిత్యం నుండి సంగీత నృత్యాల వైపు మళ్ళారనిపిస్తుంది. So the time it might have started is around 15th – 16th century. The first Panipat war coincides with the time frame. ఇది నా వ్యక్తిగత విశ్లేషణ.
All in all, its a can of worms. If the case went to trial, folks would have to answer many questions. Does suppression is limited to only Vedic Studies? or literature? does it include dance, music ? What about participating in wars ? Claiming women were suppressed in Hindu society is really a, “CLAIM” and will remain a “CLAIM”.
గౌతమి గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/14/2014 10:14 am
రాధగారూ,
నాకు బధ్ధకం చాలా ఎక్కువండీ. ఒక్కోసారి ఏకబిగిన గంటలకు గంటలు పనిచేస్తాను. ఒక్కోసారి రోజుల తరబడి స్థబ్దుగా కూర్చుంటాను. అలాగే నా ఆరంభశూరత్వం అనే అచ్చతెలుగులక్షణం పుణ్యమా అని నేను మొదలుపెట్టిన పనులు కూడా తరచుగా మధ్యలోనే పడకేసి అలా పడుంటాయన్నమాట. ఇలాంటి అనవసరమైన లక్షణాలు తగ్గటం లేదు కాని, చాదస్తం మాత్రం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఒక్కోసారి వీరావేశంతో వ్యాఖ్యానం చేసేసి, ఎందుకంత చాదస్తంగా వ్రాశానా అని ఆశ్చర్యపడుతూ ఉంటాను తీరిగ్గా.
మీ కథ దాకా వచ్చి కూడా మరి రెండు రోజులదాకా బధ్ధకించి చదవనే లేదు. తీరా చదివాక నాలుగు ముక్కలు గిలక్కుండా ఉండలేక పోయాను. నా మాటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
నా విమర్శలు కూడా రచయితలూ / రచయిత్రులూ గమనికలోనికి తీసుకోవటం అన్నది గమనించాను కాబట్టి, ఇకమీద మరింత బాధ్యతగా నా అభిప్రాయాలు చెబుతూ ఉండటానికి ప్రాయత్నిస్తాను.
గౌతమి గురించి రాధ మండువ గారి అభిప్రాయం:
03/13/2014 10:17 pm
శ్యామలరావుగారూ, నమస్కారం. మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీరు మేఘన గురించి ప్రస్తావించగానే ‘అరె! భలే! మేఘన అంటే సందేశాలు పంపించినట్లుంది కదా!’ అనుకున్నాను. మాధవ్ గారు గౌతమి అనే పేరుని కూడా అలాగే పెట్టానని అన్నారు. అయితే సర్ నిజంగా ఈ పేర్లు నేను అసలు అనుకోకుండా పెట్టినవి.
ఇక మీరన్న భర్త వాక్యం నిజంగా నేను మీరన్నట్లు రాయాల్సింది. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. అయితే కీలకమైన మాటలు టీచర్ అనినవి మాత్రం నాకు కూడా బాగా నచ్చాయి సర్. మాధవ్ గారు మార్చాలని అన్నారు కాని నేను ఒప్పుకోలేదు. ఆ డైలాగే కథకి అందం అని నేననుకున్నాను. మీరు ప్రతి కథనీ శ్రద్ధగా చదివి మీ అభిప్రాయాలు అందరికీ తెలియచేస్తున్నారు. శ్యామలరావు గారు నా కథకి కామెంట్ రాయలేదే అని కూడా అనుకున్నాను నాలుగు రోజుల క్రితం.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి SriRam గారి అభిప్రాయం:
03/12/2014 4:23 pm
ఈ వ్యాసం నిశితంగా పరిశీలిస్తే రచయితగారి అభిప్రాయలు, హిందూ పేపర్ లో వ్యాసాలు రాసే (లెఫ్ట్ లిబరల్స్ )శైలికి చాలా దగ్గరగా ఉన్నాయి. రచయితగారు ఇక్కడ గుర్తించనిదేమిటంటే తాలిబన్ల పుట్టుక, పాక్ మిలటరి ప్రభుత్వాల పాలసిలో ఒక భాగం (రచయిత చెప్పే హిందూమతోన్మాదం భారత ప్రభుత్వ పాలసిలో భాగం కాదు.హిందూమతోన్మాదులు తాలిబన్ల వలే పక్కదేశాలలో దూరి యుద్దాలు చేయటంలేదు). ప్రస్తుతం వారు ఆదేశంలో షరియా చట్టం అమలు జరపాలని పట్టుపడుతున్నారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి గత నెల 23 మందిని చంపి పారేశారు.
అంతేనా! ఆదేశంలో జరిగే సంఘటనలు ఒకసారి తొంగి చూస్తే, మా చరిత్ర వేరు, మతం వేరు, భాష, సంస్కృతి, సివిలైజేషన్ వేరు అని ద్విజాతి సిద్దాంతం ప్రతిపాదించి,వేరు పడిన మహానాయకుడు జిన్నా గారిని 60 సంవత్సరాల తరువాత వారు ఎలా సన్మానిస్తున్నారు! ఆ వార్త గత సంవత్సరంది. మరి ఈ సవంత్సరం ఆయనకు ఇంకొక కానుక ఇచ్చారు.
ఇటువంటి సన్మానం మన జాతిపిత గాంధీ గారికి కలలో కూడా ఊహించలేము. ఇక లెఫ్ట్ లిబరల్ వాదులు ఆశించినట్లు మనదేశ సంస్కృతిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనదేశంలో వస్తున్న మార్పులు ఈ క్రింది వార్తలు చదివితే తెలుస్తాయి.
“When you come across news that school managements have installed condom vending machines in the school and advice parents of girl students that there was nothing wrong in their daughters having sex with their friends, it is time for us to intervene. Otherwise this country will end up in ruins,” said the eminent danseuse. She declined to reveal the names of the schools.
India gets first radio station – Q Radio dedicated to LGBT community
హిందూమతోన్మాదానికి ప్రధాన కారణం తాలిబన్ల వలే మత చాంధసవాదం కాదు. బహుశా అది వారు అనుకొనే జాతీయ వాదంలో ఒకభాగం కావోచ్చు లేక కలోనైజేషన్ మైండ్ సేట్ నుంచి బయటపడాలనే చేసే ప్రయత్నం కావచ్చు. వారికి మత చాంధసవాదమే ఉంటే, పై రెండు సంఘటనలు చాలు, పాకిస్తాన్లో వారివలే మన దేశంలో ఎంతో గొడవ జరిగిఉండేది. కాని మనదేశంలో అలా ఎక్కడా జరగలేదు. అందువలన లిబరల్ మహాశయులు భారతీయ సమాజం మళ్లీ హిందువాదుల వలన మతమౌఢ్యాన్ని, ఆత్మన్యూనతను పంచి పెంచి పోషిస్తాయే మొన్న భావనను వదలి, వారిని వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే వారి శక్తి యుక్తులన్ని ప్రపంచంలో ఇతర మతాలలో ఉన్న మతోన్మాదులతో, హిందువులను పోల్చటానికి ఖర్చయిపోతాయి. అయినదానికి కానిదానికి హిందుత్వవాదం వల్లే హిందూమతానికి అత్యంతప్రమాదం అని ప్రచారం చేస్తే, అది సమాజంలోని వాస్తవికతకు సరిపోక, లిబరల్ మహాశయుల విశ్లేషణల మీద ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి okaDu గారి అభిప్రాయం:
03/12/2014 12:01 pm
The students take these courses to get more marks to get into top of class. The question papers are in sannskrit but the answers can be written in telugu or english. So nobody cares about sanskrit language. Only how many marks they get is important because that helps them get into front line for Engg/Medical admissions. It is no secret.
గౌతమి గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/12/2014 11:21 am
కొన్ని చిన్న చిన్న విషయాలు ప్రస్తావించాలని ఈ రెండవవ్యాఖ్య.
ఈ కథలో మేఘన అన్న చిన్నపాత్ర ఉంది. ఇది కేవలం ప్రాస్తావికపాత్ర. మొదటిగా “పెళ్ళి రోజు మాష్టారు ఇవ్వమన్నారంటూ మేఘన ఉత్తరం తెచ్చి ఇచ్చింది” అన్న వాక్యంలో వస్తుంది. కథనడపటానికి అవసరం ఐతె తప్ప ఒక పాత్రకు పేరు పెట్టటం అనవసరం అని నా మతం. ఉదాహరణకు, ఇక్కడ ఈ పాత్రకు మేఘన అన్న పేరును పెట్టకుండా కూడా సులభంగా పని జరుగుతుంది కదా. ఐతే, అతితరచుగా మనకథకులు ప్రతిపాత్రకూ పేరు పెడుతూనే ఉంటారు. ఇక్కడ రచయిత్రిగారు ప్రత్యేకంగా చేసిన పొరబాటేమీ లేదు. సందర్భం చూసుకొని నా అభిప్రాయం చెప్పటం. అంతే.
అలాగే సంభాషణల్లో వాడే మాటల సహజత్వం కోసం రచయితలు/రచయిత్రులు కొంచెం అదనపు శ్రథ్థ తీసుకోవాలని నా అభిలాష. ““వీడి కోసమేనా నీ భర్త దగ్గర నువ్వు పిచ్చిదానిలా నటిస్తుంది?” అని ఒక తల్లి అంటుంది గౌతమితో. భర్త అనే మాట పుస్తకాలభాషలో తప్ప సంభాషణల్లో తక్కువగా వినిపించే పదం. అదీ ఇక్కడి సందర్భంలో ఆవిడ నోట ““వీడి కోసమేనా నీ మొగుడి దగ్గర నువ్వు పిచ్చిదానిలా నటిస్తుంది?” అనిపిస్తే మరింత సహజంగా, సందర్భోచితంగా ఉండేది. తల్లి నిష్ఠురంగా మాట్లాడేటప్పుడు ఇక్కడ ‘నీ మొగుడు’ అనటమే ఉచితంగా అనిపిస్తోంది నాకు. రచయిత్రి వ్రాసినది తప్పు అని అనటం లేదు. అది ఎంతమాత్రం తప్పుకాదు. కేవలం నాకు తోచిన అభిప్రాయం చెబుతున్నానంతే.
కథచివరన కీలకమైన మేడమ్‌గారి మాటలు “యశోధరనీ, బిడ్డనీ నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళే బుద్దుడిని ‘పెళ్ళి అనే బంధనం నీకొక్కడికే సంబంధించినది కాదు, బాధ్యతని వదిలి ఇలా వెళ్ళడం నీకు తగునా!?’ అని ఈ జాలారి చెట్టు అడిగే ఉంటుంది – కదా గౌతమీ?” ఇక్కడ విషయంలో కొంచెం సాంద్రత హెచ్చుగా ఉంది. అంతా ఒక్కబిగిన ఏకవాక్యం చేయటంతో విషయం కొంచెం కషాయం ఐపోయింది. కాని చాలా బాగుంది. అదే సమయంలో పుస్తకాలభాష ఐపోయింది కూడా అని గమనించవచ్చును. రచయిత్రిగారు మరికొంచెం శ్రథ్థవహిస్తే, కొద్ది చిన్న వాక్యాల్లో మరింత సహజమైన సంభాషణాశైలిలో వ్రాసి ఉండేవారని నా అభిప్రాయం.
ఈ మాటలన్నీ నా చాదస్తం కొద్దీ వ్రాసాను కాని, ఇప్పుడున్నది ఉన్నట్లుగా కూడా కథ చాలా బాగుందని మరో సారి అంటున్నాను.
కోనసీమ కథలు: శిరోముండనం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/12/2014 10:26 am
లైలాగారి ఆవేశపూరితమైన వ్యాఖ్య (ఆంగ్లంలో ఉన్నా, కష్టపడి మరీ) చదివాను.
ఈ కథ సందర్భంగా ‘కందుకూరి వీరేశలింగంగారు ఒక పేద్ద సుద్ద మొద్దు తెలుగు మగాడు’ అని లైలాగారు ఎందుకు ఆక్షేపించారో తెలియదు. వీరేశలింగంగారు తన రోజుల్లో జీవించారు, అత్యంత అభివృధ్ధిచెందిన విశేషభావజాలం కలిగి ఉన్న (లేదా కలిగి ఉన్నా మనుకుంటున్న) మన రోజుల్లో కాదు. అది ఆయన తప్పు కాదు.
వైధవ్యం అనేది రెండు కారణాలుగా బాధించే విషయం స్త్రీలకు. ఒకటి తనది అని విశ్వసించదగిన ఆసరా కోల్పోవటం. రెండవది తనను సమాజం ‘చాకిరీకి తప్ప మరి దేనికీ పనికిరాని మనిషిగా’ మార్చి అవమానించటం. వీరేశలింగంగారు అనేక అవమానాలకు ఓర్చుతూ ఆసరా కోల్పడిన ఆ విధవలకు తిరిగి ఆ ఆసరాను కలిగించేందుకు చిత్తశుధ్దితో పాటుబడ్డారు. యావజ్జీవం వెట్టిచాకిరీ చేసుకుంటూ నిరాదరణకు గురి అయ్యే ఆ అమాయకురాళ్ళకు పునర్జీవనం కలిగించాలని తాపత్రయపడ్డారు.
‘ఓ విధవరాళ్ళలారా చూడండి, మీ చుట్టూ బోలెడు మంది బోడిగుళ్ళ మగాళ్ళున్నారు కాబట్టి మీ బోడిగుళ్ళగురించి విచారం వదిలేయండి’ అని వాళ్ళకు ఒక మహత్తరమైన దివ్యసందేశం ఇవ్వాలని ఆయనకు తట్టక పోవటం కారణంగా లైలాగారు పంతులుగార్ని సుద్దమొద్దు అని వెక్కిరించటం ఎంతవరకూ సబబూ?
ఆడపిల్లలూ చక్కగా చదువుకోవాలని పంతులుగారు ఆలోచించటం తెలుగునాట ఆడపిల్లలకు వరమైనదీ లేదా ఆయన ఒక సుద్దమొద్దుస్వరూపం కాబట్టి శాపమే ఐనదీ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా లైలాగారికి నా విజ్ఞప్తి.
స్త్రీలు నాడైనా నేడైనా శిరోముండనం అనేది తప్పకుండా ఘోరమైన అవమానంగానే భావిస్తారు. అది తప్పు భావన, వాళ్ళు అలా ఎందుకు భావించాలీ అంటే దానికి కారణం, ఇంకా ఈ దేశంలో స్త్రీలు సంప్రదాయపు గడపకు లోపల ఒక కాలూ వెలుపల ఒక కాలూగా ఉన్నారు కాబట్టి వారిలో సాంప్రదాయికమైన తప్పూ-ఒప్పూ, మంచీ-చెడూ, మంగళరూపం-అమంగళరూపం వంటి అనేకానేక భావనలు మన పోష్టుమోడర్నిజం రోజులకు తగినట్టుగా ఎగిరిచక్కాపోక పోవటం వలన.
కథకుడు మనకాలం వాడు. అయన అమ్మమ్మ చాలా పాతకాలం మనిషి. అప్పటి వారి బుఱ్ఱల్లో సంప్రదాయపు వాసనలు ఇంగువకట్టినగుడ్డవాసనలుగా కాక ఇంగువవాసనల ఘాటుతో ఉంటాయి. ఆవిడ తనకు జరిగిన శిరోముండనాదులను అవమానంగా భావించినా అసహాయంగా ఉండిపోయి మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక చింతనను ఆశ్రయించింది. ఆశ్చర్యకరంగా ఇది నాటికీ నేటీకి పెద్దవాళ్ళకు మనశ్సాంతి సాధనం అవుతునే ఉన్నది – మన ఆమోదమూ తిరస్కారమూ అనే వాటితో పని లేకుండానే. ఐతే, అమ్మమ్మగారి మనస్సులో ఉన్న వివేచనాజ్ఞానం ఒక మంచి సలహా ఇచ్చేందుకు గాను సంప్రదాయాన్ని బద్దలు కొట్టటానికి వెనుదీయలేదు. నోటి మాట సలహాకాకుండా, తనకు చేతనైన ద్రవ్యసహాయం కూడా చేసారావిడ.
ఇక్కడ అమ్మమ్మగారి పాత్రలో ‘మార్పు’ కోసం తపన చూడండి – స్వయంగా తను అది సాధించుకోలేకపోయినా, మరొకరికి సమాజాన్ని మార్చటానికి తోడ్పడాలన్న ఆమె తపనను గమనించండి.
ఇక్కడ ‘గుండు’ అనేది పదేపదే ఆవిడమీద రుద్దబడిన దురవస్థకు ప్రతీకగా ప్రస్తావించబడింది. ఆవిడ తన తలవెండ్రుకలను కొన్నింటిని దాచుకోవటంలో లైలాగారు ‘అనవసరమైన’ సౌందర్యదృష్టిని చూస్తున్నారని నాకు అనిపిస్తోంది. నేను దాన్ని ఆవిడ తాను కోల్పడిన అస్తిత్వానికి వాటిని ప్రతీకలుగా భావించటాన్ని అర్థంచేసుకున్నాను. ఈప్రపంచం తన అస్తిత్వాన్ని క్రూరంగా అణచి ఉంచినా, దాన్ని ఆవిడ తననుండి ఎన్నడూ దూరంచేసుకోలేదు అని కథ స్పష్టం చేస్తోందని ‘ఈ వెంట్రుకల’ సంగతి స్పష్టం చేస్తోందని అనుకుంటున్నాను. నేనేమీ కాకలు తీరిన విమర్శకుడను కాను కాబట్టి నా అభిప్రాయం తప్పంటే వాదించలేను.
ఒక ఉదాహరణ చెబుతాను, నా అనుభవం లోనిది. అమ్మమ్మల కాలందాకా ఎందుకు? మా అమ్మగారి కాలం చూసినా, ఆవిడ పాతరోజుల ఛాందసం దట్టంగా ఉన్న మనిషే. వివాహాల విషయంలో ఆవిడకు శాఖాబేధం కూడా సమ్మతంగా ఉండేది కాదు చాలాకాలం పాటు. అలాంటి పెద్దావిడ ఒక సందర్భంలో ఒక వితంతువు ఐన ఆడపిల్లకు ‘అమ్మా బొట్టూకాటుకా, పువ్వులూ అన్నీ పెట్టుకో, ఏమీ తప్పులేదు’ అని బోధించిటం ఎంతో ఆశ్చర్యానందాలు కలిగించింది. తమాషా ఏమిటంటే నా తరంవాడే ఐన ఆపిల్ల అన్నగారికి మా అమ్మగారి సలహా అంతగా నచ్చలేదు!
లైలాగారితో సహా ఏ స్త్రీమూర్తులకూ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్త్రీల మనస్సులు అగాథసముద్రాలు. సామాజికపరిస్థితుల కారణంగా వారు తమతమ అభిప్రాయాలూ అభిమతాలు హెచ్చుశాతం సందర్భాలలో వెల్లడించలేక పోవచ్చును. కాని సమయం వచ్చినప్పుడు అవి బయటకు రాకుండా ఎవరూ ఆపలేరు.
ఈ కథలో కథకుడి నమ్మకాలూ ఆలోచనలూ కాదు ముఖ్యం. ఆయన అమ్మమ్మగారి సంగతీ ఆవిడ రోజుల్లోని నమ్మకాలూ ఆలోచనలూ వాటి పరిణామాలూ ముఖ్యం.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/12/2014 9:32 am
చాలా సంవత్సరాల క్రిందట వార్తాపత్రికల్లో చదివిన సంగతి ఒకటి ప్రస్తావించటం అసందర్భం కాదని అనిపిస్తోంది.
ఒకాయన తనకు చదువుచెప్పి డాక్టరేట్ (సంస్కృతంలో) ఇచ్చిన విశ్వవిద్యాలయం మీద దావా వేశారు!
“నాకు సంస్కృతంలో అద్భుతమైన ప్రతిభ ఉందని ప్రోత్సహించి ప్రోత్సహించి పి.హెచ్.డి ఇచ్చారు. ఇప్పుడు నాకు మీరు చెప్పిన చదువు ఆధారంగా దొరికే ఉద్యోగం ఎంతప్రయత్నించినా ఏదీ చిక్కటంలేదు. నా దుస్థితికి మీ విశ్వవిద్యాలయంవారే బాధ్యులు. తెలిసీ తెలియని వయస్సులో ఉన్న నన్ను ‘ఇదేదో గొప్ప చదువూ’ అని మభ్యపెట్టారు. బోలెడు సంవత్సరాలు వృథాచేసారు. అంతేకాని ‘నాయనా, ఈ చదువుకు ఏ ఉద్యోగమూ దొరక్కపోయే ప్రమాదం మెండు సుమా’ అని ఎన్నడూ చెప్పక నన్ను చిన్నవాడిని చేసి మోసం చేసారు” అని ఆయన వాదన అట.
ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని అనిపిస్తోంది.
కొసమెఱుపు ఏమిటంటే, బోలెడు మంది విద్యార్థులు సంస్కృతం చదువుతున్నారు స్కూళ్ళల్లో. కాని వాళ్ళల్లో ముప్పాతికమువ్వీసం మందికి రామశబ్దం కూడా రాదు. తమాషాగా 95% పైనే మార్కులు వచ్చేస్తున్నాయి వాళ్ళందరికీ.
ఇ.బి. నాష్ పుస్తకాలూ, కెంట్ పుస్తకాలూ చదవకుండానే హోమియో డాక్టర్లైపోవచ్చును. కాళిదాసు ఎవరో తెలియకుండానే సంస్కృతం చదివేసి పరీక్షలిచ్చేయవచ్చును. హతవిధీ!
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు గారి అభిప్రాయం:
03/12/2014 5:45 am
ఎవరి రచన పై ఈ చర్చ జరుగుతుందో ఆ రచయితకు ముఖ్యంగా రఘోత్తమ రావు గారి వ్యాఖ్యలు (ఎందుకంటే ఆయన చర్చించిన తీరు, ఎంచుకున్న ఆధారాలు – భాషకు సంబంధించినవి నాకు సహేతుకంగా ఉన్నాయి కనుక; అలాగే భాష తటస్థమైనది; దానిని వాడే వారి మనసు అది అద్దం లా ప్రతిఫలిస్తుంది కనుక) పంపించాను. ఆమె వెంటనే తన జవాబు పంపింది అది క్రింది పొందుపరచాను చదువగలరు. మహోన్నతమైన భారత దేశ సంస్కృతి, సాంప్రదాయలు, భాష,ముఖ్యంగా సంస్కృత భాషపై వేద వాగ్మయం పై ఎవరు ఎప్పుడు తప్పు అన్వయాలను చేసినా దానిని ఖండించే హక్కు (అదే వాక్స్వాతంత్ర్యం) ప్రతి భారతీయునికీ ఉంది. భారతీయ తత్వ వాదాలు చెసిన త్రిమతాచార్యులు వారి వారి వాదాలను వారెంచుకున్న వేద ప్రమాణాలతో తెలియచేసారు మినహా ఎవరూ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు. ఇది వారు ఏర్పరచిన అత్యుత్తమ చర్చా/వాద ప్రమాణం. దానికి మనం వారసులం కాని క్రియలలో కాదు ని ఈ చర్చలో తెలిసింది.
———- Forwarded message ———-
From: Wendy Doniger
Date: 11 March 2014 19:25
Subject: Re: Humble submission.
To: ivns raju
dear dr. raju, many thanks for this; i’m always interested in responses to my work. thanks for taking the trouble to send this to me. yours, wendy
On Mar 11, 2014, at 2:20 AM, ivns raju wrote:
> Hi,
> A very good day ahead to you.
> Attached please find some of the excerpts from the discussion that took place in Face Book on your book.
> I thought that this would provide a different perspective of your work to you and you would benefit from gaining this perspective.
> Sanskrit is a Samadhi Bhasha, it needs to be understood based on the context by linking the Kartha, Karma and Kriya.
> I am sure you would appreciate this. I have shared this with one of the Daily News papers in India.
> Dr. IVNS Raju
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga గారి అభిప్రాయం:
03/11/2014 10:27 am
శ్యామలరావుగారు: దీనికి చాలా గంభీరమైన కారణాలు ఉన్నాయండీ. కొంత వరకూ సంసృత భారతి కృషి చేస్తోంది.
ఐనా మన దేశం ముందు దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తి చెందాలి. అప్పుడు మిగితావన్నీ. దేహం ఆరోగ్యంగా లేనప్పుడు ఎన్ని చేసి ఏమి లాభం? అలాగే పేదరికంలో అడుక్కు తింటున్న మనకి, ఏ పాటి గౌరవం లభిస్తుంది? ఏ మాత్రం అలౌకిక విషయాల పైన దృష్టి సారించగలము?
ఆ పేదరికానికి మూల కారణమేమిటో ముందు తెలుసుకుని దాని నుంచి ఎలా బైట పడాలా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పటి దాకా ఇలాటి వెండీ లాంటి వాళ్ళ బాధలూ, ప్రత్యమ్నాయ ప్రబుధ్ధుల బాధలూ తప్పవు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/10/2014 11:16 pm
నా ప్రశ్నలకు మంచి జవాబులు వచ్చాయి. అలవాటు కారణంగా నేను తెలుగుగులో కాస్త వేగంగా టైపు చేయ గలుగుతున్నానేమో కాని కొందరికి అదొక యోగాభ్యాసంలాగా ఉంటోందని అర్థమైంది.
ఈమాట పత్రిక పట్ల ఆసక్తి ఉండటం చేతనే, ఆంగ్లంలో వచ్చిన వ్యాఖ్యలను ముఖ్యంగా దీర్ఘవ్యాఖ్యలను చదవటం పట్ల నా మనస్సు యొక్క మొరాయింపు కారణంగా (అసమర్థత యేమీ కాదని తొలుతనే మనవిచేసాను) మంచి వ్యాఖ్యలను చదవలేకపోతున్నానన్న ఆందోళనతోనే నా ఆక్షేపణ తెలిపాను ఆంగ్లవ్యాఖ్యల పట్ల. ఇక్కడి వ్యాఖ్య డబ్బాలో వ్రాయటం, స్క్రోలింగ్ వగైరా ఇబ్బందులు ఉంటే విడిగా వ్రాసి ఇక్కడకు బదిలీ చేయవచ్చును కదా. ఏదిఏమైనా ఆంగ్లవ్యాఖ్యాతలు మాబోటివారి పట్ల కొంచెం కరుణచూపాలని మనవి. అంతే.
సంపాదకులకు ఒక మనవి. ఎలాగూ మా ఈ-మెయిల్ వివరం పొందుపరుస్తున్నాం కదా వ్యాఖ్యలతో. అందుచేత వ్యాఖ్యలకు వచ్చిన స్పందనలను మీరు మాకు సరాసరి మా మెయిల్‌కు అందించ గలిగితే, మా బోటి వ్యాఖ్యాతలకు మంచి సదుపాయంగా ఉంటుంది. స్పందన తాలూకు లింకు పంపితే సరిపోతుంది.
పొరబాటున స్పందనలను వెదకి ప్రతిస్పందించకపోతే ఆనక బాధపడవలసి వస్తుంది కదా ఆవలివారు ఏమనుకున్నారో అని.
రచయితలకు రచయిత్రులకు కూడా ఇదే విధంగా తమతమ వ్రాతలకు వచ్చిన స్పందనల లింకులు పంపుతూ ఉంటే వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది.
బల్లి ఫలితం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/10/2014 10:31 am
మీరు ప్రస్తావించిన పుస్తకం(చూ. డి. చంద్రశేఖరరేడ్డి, మన భాష, పుట 203, మీడియా హౌస్ పబ్లికేషన్స్, 2001.) నేను చూడలేదు. ఇటుపైన “ఎపాయంట్‌మెంట్” అన్న మాటకి తెలుగుమాట లేదని “డిసపాయంట్” అవకుండా మీరు కూడ ఈ మాట వాడి చూడండి అన్నారు. కాని అభిసారం అన్నది appointment అన్నమాటకు సరైన అనువాదం ఐనా కాకపోయినా అది సంస్కృతపదం కాని అది అసలు తెలుగు మాట కానేకాదు. ఒకవేళ సరైన పదమే ఐతే ఈ సంస్కృతపదం మనం హాయిగా వాడుకోవచ్చును. కాని ఇది సరైన అనువాదం కాదనే నా అనుమానం.
అభిసారం అనే మాట వినగానే అష్టవిధనాయికల్లోని అభిసారిక గుర్తుకువస్తుంది. (కొంచెం మంది ఇదేమిటండోయ్ ఇదేదో అతిసారం అన్నట్లుందే అనుకునే అవకాశమూ ఉందనుకోండి!)
ఈ అభిసారం అనే మాటకు అభిసారం = ప్రేమికులు సంగమార్థం చేసుకునే నిర్ణయం, ప్రేమికుల సంకేతస్థలం అని వికీపీడియా పేజీలో కనిపించింది కూడా. ఇక్కడ అభిసారిక లేదా అభిసారి లేదా అభిసారుడు అనే పదాల్లో ఒక రహస్యసంకేతస్థలంలో సమాగమనం కోసం పోతున్న వ్యక్తి అనే అర్థం వస్తున్నది.
రాజానం నిహతం థృష్ట్వా అభిసారం చ మారిష
అభ్యథ్రవన్త వేగేన చిత్రసేనస్య సైనికాః
అని కర్ణపర్వంలో ఒక శ్లోకం ఉంది పదవ అధ్యాయంలో. ఇక్కడ అభిసారం అనే మాట ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇది ఒక యుధ్ధరంగవర్ణనలో భాగం. శృంగారమూ చట్టుబండలూ ఏమీ లేదు. సరే, ఇక్కడ ఎవరికీ ఎవరితోనూ ఏవిధమైన appointment కూడా లేదు కదా?
అలాగే బౌధ్ధవాంగ్మయానికి సంబంధించిన త్రిపిటకంలో అసీతినిపాతో అనే అధ్యాయంలో ఈ అభిసారం అనే మాట తరచుగానే కనిపిస్తున్నది. ఉదాహరణకు ఒకచోట
న తే అభిసరం పస్సే న రథే నపి పత్తికే;
నాస్స చమ్మంవ కీటం వా, వమ్మితే చ ధనుగ్గహే
ఇది ప్రాకృతంలో ఉన్నది. మొదటిపాదం సంస్కృతంలోచూస్తే “న తే అభిసరం పశ్యే న రథే నపి పంక్తికే” అని అనివస్తుంది. రథాలూ సైన్యాలు ఏవీ నీ వెంటరావు సుమా అని అర్థం చెప్పుకోవచ్చును. ఇక్కడా ఏవిధమైన appointment ప్రసక్తీ లేదు.
అందుచేత అభిసారం అనేది appointment అన్నమాటకు సరైన అనువాదం కాకపోవచ్చని అనుకుంటున్నాను.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/10/2014 9:52 am
ఒక ఆంగ్లవ్యాఖ్య క్రింద, వేలూరి వేంకటేశ్వర రావు వ్రాలు అన్న సంతకం సంతోషం కలిగించింది. పోనీ లెండి కనీసం ఒక్క సారి తెలుగు సంతకం చేసి మమ్మల్ని ధన్యుల్ని చేసారు. శ్రీవేలూరివారు హాయిగా తెలుగులో వ్యాఖ్యను వ్రాయగలరని నా నమ్మకం.
‘ఈమాట’ పత్రికలో వ్యాఖ్యలు సాధారణంగా తెలుగులోనే ఉంటాయన్న మాధవ్‌గారి అభిప్రాయం నిజం కావచ్చు. ఆ విషయంలో గణాంకాలసంగతిచర్చలు వద్దు కాని, కేవలం తెలుగులో రాయమనడం కొందరికి తమ అభిప్రాయం వెల్లడించడానికి ప్రతిబంధకమౌతుందని వారెందుకన్నారో బోధపడలేదు. తెలుగువారికి తెలుగులో చెప్పటానికి ఏమి ప్రతిబంధకం ఉంటుందీ అని ఆశ్చర్యం కలుగుతోంది.
తెలుగువారు ఆంగ్లంలో వ్యాఖ్యలు వ్రాయటానికి కారణం ఏమిటీ అని ఆలోచిస్తే, మూడు సందర్భాలు కనిపిస్తున్నాయి. మొదటిది వ్యాఖ్యాతకు తెలుగులిపిలో వ్రాయటానికి తగినంత అభ్యాసం లేకపోవటం. రెండవది భావవ్యక్తీకరణకు తెలుగుభాషకు తగినంతశక్తి ఉన్నదన్న విశ్వాసం వ్యాఖ్యాతకు లేకపోవటం. మూడవది, తెలుగుకన్న ఆంగ్లం గొప్పభాష కాబట్టి ముఖ్యమైన విషయాలు ఆంగ్లం లోనే వ్రాయటం సబబు అన్న స్థిరాభిప్రాయం. నా చిట్టిబుఱ్ఱకు తట్టని యే యితర మహత్తర కారణాలైనా ఉన్నాయేమో సందర్భాన్ని బట్టి వ్యాఖ్యాతలో అనుభవాన్ని బట్టి సంపాదకులో సెలవియ్యాలి.
ఆంగ్లంలో ఉన్న వ్యాఖ్యలను చదవటం కంటే, మీరు నాది తెలుగుభాషా దురభిమానం అంటే నిస్సిగ్గుగా ఒప్పేసుకునని ఊరుకోవటమే నాకు సులభమూ సమ్మతమూ కూడా.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు గారి అభిప్రాయం:
03/09/2014 5:32 am
వెండీ రచనలో ఉన్న అతి అభ్యంతరకరమైన విషయాలను రఘోత్తమ రావు గారు, యోగా గారు చెప్పినట్లు భాష, వ్యాకరణం, నిరుక్తం, పద పరిచ్చేదం, సమన్వయం ఆధారం గానే వివరించినపుడు ఎందుకు అది చాందస వాదం గా కొందరికి అనిపించిందొ అర్ధం కాదు. సనాతన ధర్మాన్ని (హిందూఇజం అనే ఒక సంకుచిత పద ప్రయోగానికి సుతరమూ ఇష్ట పడని భారతీయుల్లో నెనూ ఒకడిని) తెలిపే వేద వాంగ్మయాన్ని ఇలాగే అర్ధం చెసుకొవాలి అని ఒక విధానాన్ని / పద్ధతిని మనకంటె కొన్ని వందల రెట్లు మెధావులైన మన పెద్దల మాటలను ఎందుకు ప్రశ్నించాలొ నాకు అర్ధం కాని విషయం. ప్రయోగ శాలలొ ఒక రసాయనాన్ని ఇలానే తయారు చెయాలి అనే నిర్దుష్టత మన వాగ్మయాన్ని అన్వయించుకొవడానికి కూడా ఉంది (బ్రహ్మ సూత్రాలు – తత్తు సమన్వయాత్తు వంటివి) అంటె మన మెధస్సు ఎందుకు ప్రశ్నిస్తొందొ అంతుపట్టని విషయం.
ఈ విదేశీ రచయితలు, ఎవరొ ఎందుకు వెండీ గారే హిందూఇజం అనే పదాన్నే వాడారు కాని సనాతన ధర్మం అనే పదాన్ని ఎందుకు వాడలేదు? కనుక విషయం విజ్నులకు విదితమె!
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రఘోత్తమరావు గారి అభిప్రాయం:
03/09/2014 4:14 am
చర్చలో భాగం వహించిన/వహిస్తున్న మిత్రులందరికీ ఓ విన్నపం.
భాషను వీడి ప్రతిపాదించే సిద్ధాంతాలు రాద్ధాంతాలే అవుతాయి.
వెండీ ప్రయత్నమంతా సనాతన ధర్మంకు సంబంధించి తనకు తోచిన alternative history ని వ్రాయడమేనన్న విషయంలో భేదాభిప్రాయం లేదు. కానీ తను ఎంచుకున్న విషయాన్ని నిరూపించే క్రమంలో మౌలికమైన కొన్ని సైద్ధాంతిక, పారిభాషిక పదాలకు/సందర్భాలకు/అంశాలకు ఆవిడ చేసిన వ్యాఖ్యానాలు, అనువాదాలు లోతైన విమర్శకు అర్హమైనవి. ఇది నిస్సందేహం.
ప్రతి భాషకు తనదైన వ్యాకరణం, ఛందస్సు, నిఘంటువులు, నిరుక్తాది విభాగాలు ఉంటాయి. ఇవేవీ మతపరమైన ఛాందసాలు కావనే నా విశ్వాసం. కనుక వాటిల్ని సమన్వయ పరుస్తూ చేసేదే సిసలైన వ్యాఖ్యాన మవుతుంది. వీటన్నింటినీ అతిక్రమించి స్వకపోలకల్పితంగా చేసేవన్నీ దుస్సాహసాలే అవుతాయి. సదరు రచనల్ని ఆయా రచయితల బుద్ధి బులపాటాలుగానే పరిగణించాల్సి వస్తుంది గానీ గంభీరమైన శాస్త్రీయమైన చర్చలు కాబోవు. సైద్ధాంతిక నిరూపణలు కాలేవు కూడా.
పై నేపధ్యానికి అనుగుణంగా నా వ్యాఖ్యలన్నీ భాష, వ్యాకరణం, అర్థ నిరూపణలోని వైవిధ్యాలన్న మూడు అంశాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది.
వ్యాకరణాధారంగా ధార్మిక గ్రంథాలలోని అంశాలపై విమర్శ అన్నది మతతత్త్వం కాబోదని భావించినందువల్ల సదరు వ్యాఖ్యలను చేసింది. అలానే ప్రతి పదంలో అంతర్హితమైవున్న పరమార్థాన్ని గ్రహించి ఆపై వాటిని వ్యక్తిగత దృక్కోణం నుండి వ్యాఖ్యానించడమన్నది సత్సంప్రదాయమని నేను భావించినందువల్లనే కొన్ని భగవద్గీత శ్లోకాలపై ఈ వ్యాసకర్త చేసిన వ్యాఖ్యానాలను కూలంకషంగా విశ్లేషించడం జరిగింది. ఇలా చేయడం కొద్దిమందిని దూషించినట్టుగానో లేక ప్రాచీనాచార్యుల మధ్య ఉచ్ఛనీచాలను ఎంచడమని భావిస్తే నేను నిస్సహాయుణ్ణి.
వెండీ పుస్తకానికి గాని, సురేశ్ గారు ప్రస్తుత వ్యాసానికి గానీ మూలాధారాలైన ధార్మిక గ్రంథాలలోని అసలు విషయాలను వ్యాకరణాది తటస్థ గ్రంథాల సహాయంతో తెలుసుకోవడాన్ని పక్కనెట్టి కోర్టులు, కచేరీలు, చట్టాలు, న్యాయాలంటూ మాట్లాడ్డమే ముఖ్యమైనప్పుడు….అస్తు….
“యాన్ యాన్ కామాన్ కామయంతే తాం స్తాన్…కరోతి” (ఆదిత్య పురాణ వాక్యం)
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి భాను గారి అభిప్రాయం:
03/06/2014 3:47 pm
సురేష్ గారికి,
మొట్టమొదట వేదాలు మౌఖికం, అవి పుస్తక రూపంలో చదవటం కన్నా ఒక గురువు దగ్గర నేర్చుకోవటం ఉత్తమం. ఇక వెండీ మరియు ఇతర యురోపియన్ / అమెరికన్ రచయితలు సంస్కృతాన్ని ఒక భాషగా అధ్యయనం చేసి అసలు సంస్కృతీ తెలియకుండా భారతీయ వేదాలు, ఇతిహాసాలు ఉపనిషత్తులపై పుస్తకాలు రాసిన వారు. భారతీయులు కాని హిందువులు భారత సంస్కృతిని పాటించి రాసే ఇలాంటి గ్రంధాలూ రాస్తే వాళ్లకి కొంత అవగాహన వుంటుంది, అది లేకుండా పెద్ద ఉద్గ్రంధాలని రాసిన వారు, ఒక వైద్యుడు కానివాడు నాలుగైదు వైద్య పుస్తకాలు చదివి ఒక కొత్త పుస్తకం రాసినట్టుగా వుంటుంది. మీకు కామ అన్న పదం కేవలం sex కాదు అన్న విషయం నేను చెప్పక్కర్లేదు. రామాయణంలో దశరథుడు కామం కొద్ది ధర్మాన్ని పక్కన పెట్టాడు అన్నది Wendy లాంటి వాళ్లకి కనిపిస్తుంది, వారు మరిచి పోయే విషయం ఏమిటంటే, అక్కడ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అన్న విషయం (for both Rama and Dasharatha). ఇక్కడ మాటని నిలబెట్టుకోవటం గురించి రాయకుండా, అప్పట్లో శృంగార విశృంఖలత వుంది దాంట్లో తప్పేముంది? అని వాదిస్తే, మనం ఎంత శాతం ప్రజలు అలా మాట్లాడేవారు/ వ్యవహరించేవారు? అది అత్యధికులా? లేక కొంత మంది చేసే పనా? ఇది తెలియనంత వరకు హిందూ మతంలో గొడ్డు మాంసం తినేవారట, లేక అప్పట్లో అంతా కామ చర్చలు బహిరంగంగా జరిపే వారట అని అనుకోవటం తప్పు. పరాయి దేశంలో 28 సంవత్సరాలకే సంస్కృతంలో డాక్టరేట్ పట్టా (in a questionable manner) పొంది విశేషంగా, స్త్రీ వాదం, sex ముఖ్యంగా Mythologies of Transvestism and Transsexuality లాంటి విషయాలని అమెరికాలో విద్యార్థులకి బోధించి దాన్ని ఒక వేరు దృక్పథం అని చెప్పటం వెనకాల ఒక ఉదారవదాన్ని రుద్దే ప్రయత్నం చేసిన Wendy భారత దేశంలో ఖచ్చితంగా సవాళ్ళు ఎదురుకుంటుంది.
సంస్కృత భాష ఆంగ్లము కన్న ప్రాచీనమయినది. భారతీయ చరిత్రకారులందరికి సంస్కృతం నేర్చుకోవటం కష్టం కాదు. సరిపడా పుస్తకాలు వున్నాయి, చెప్పే గురువులు వున్నారు. ఇన్ని ఉండగా పనిగట్టుకొని సంస్కృత గ్రంథాలను తర్జుమా చేసి పాశ్చాత్యులు రాసిన ఆంగ్ల పుస్తకం, దాన్ని ఆధారంగా తీసుకొని ఇంకొక వ్యక్తీ మరొక పుస్తకం, ఇక వీటిపై ఆధారంగా తీసుకొని రాసిన మరికొన్ని పుస్తకాలు, వాటిని ఆధారంగా తీసుకొని చరిత్ర రాసిన ఘనత భారతీయ చరిత్రకారులకె దక్కింది. ఒక హాస్యాస్పద విషయమేమిటంటే, భాష అందుబాటులో ఉండి కుడా ముక్కు ఎక్కడ వుంది అంటే తిప్పి చూపినట్లు, ఒక్కొక్క పుస్తకం వెనక ఒక వంద ఆంగ్ల తర్జుమా మూలసూచీల పునాదిపై రాసిన భారత చరిత్రకారులు ఒక ట్రైను టిక్కెట్ పెట్టి భారత దేశంలోని ఏ సంస్కృత అధ్యాపకుని దగ్గరకు వెళ్లి అడిగిన అంతకన్నా బాగా చెబుతారు.
ఇక వివాదం గురించి మాట్లాడాలంటే, అది ఒక కోర్టు కేసు, రెండు పార్టీల మధ్య జరిగినది. శాంతియుతంగా పరిష్కరించబడ్డది. అది కుడా మన జఠరాగ్నిలో జీర్ణించుకోలేక పొతే, ఈ క్రింది విషయం చూడండి:
ఇప్పటివరకు 50పై చిలుకు పుస్తకాలు 1924 నుండి వివాదం రేపాయి. అందులో 3 మాత్రమె సంఘ్ పరివార్ కు చెందిన సంస్థల నుండి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. మొన్నటికి మొన్న Air India మాజీ డైరెక్టర్ జితేందర్ భార్గవ రాసిన The descent of Air India అనే పుస్తకం నిరోధించడం జరిగింది. నిషేధించిన పుస్తకాలలో రెండు శాతం ప్రమేయం ఉన్న సంఘ్ పరివార్ తో ప్రమాదముంది అంటున్నారు, ఏడెనిమిది వరకు నిషేధించిన ఇస్లాం రచనలు, నాలుగు వరకు గాంధీ – నెహ్రులపై రాసిన పుస్తకాలు అన్ని సంఘ్ పరివార్ నిషేదించిందా? లింగం గురించి రాసిన పుస్తకం 1937 లో నిషేదించబడినది, దాని వెనుక సంఘపరివార్ ఉందంటారా? మరి Da Vinci Code చిత్రాన్ని మూడు నాలుగు రాష్ట్రాల్లో నిషేధించినప్పుడు ఆవిడ ఎక్కడికెళ్ళారు? నాగాలాండు, ప్రపంచంలో మేటి బాప్టిస్ట్ రాష్ట్రంగా పేరుపొందిన ఈ భారత దేశ రాష్ట్రం Da Vinci Code పుస్తకాన్ని కూడా నిషేదించింది. దాని వెనకాల సంఘ్ పరివార్ ఉందంటారా?
ఇది బాత్ర ఒంటరి పోరాటం చేసి గెలిచిన కేసు కాదు, అమెరికాలో స్కూళ్ళలో చాలా వివాదాలు జరిగిన తరువాత నిజానిజాలు నిగ్గు తేల్చి చరిత్రని రాసిన నేపధ్యంలో గెలిచిన కేసు. ప్రమాదం హిందూ సంస్థల నుండి లేదు, ఉన్న దేశంలో సంసృతం చదువకుండా ఇంగ్లీషు తర్జుమాని చదివి ఏరికోరి కొన్ని అవలక్షణాలపై పుస్తకాలు రాసి ఇదే హిందూ ధర్మం లేక ఇది హిందూ ధర్మానికి ఇంకొక కోణం అని తెలిపే భారత రచయితల నుండి, వారెక్కిన పల్లకీలపై ఊరేగి అసలు విషయం రాయక కొత్త దృక్కోణాలని రాసే పాశ్చాత్య రచయితల నుండి వుంది.
చివరిగా నేను ఈ విషయం పై వాదులాడదలచుకోలేదు. కోర్టు లో ఇరుపక్కల వారు లోతుగా చూసి సంధి చేసుకున్న దావా ఇది. All I can say is, opening other works of Wendy is like opening a can of worms.I guess the publishers don’t want to go there. Waste of Time and Money for them. From what I came to know from persons who have personally interacted with her, she collects ( I should say used to collect) an honorarium of $ 10K for each temple visit in the USA. I guess she made enough money from those visits to offset this book case.
http://en.wikipedia.org/wiki/List_of_books_banned_in_India
http://en.wikipedia.org/wiki/California_textbook_controversy_over_Hindu_history
http://divinity.uchicago.edu/sites/default/files/imce/pdfs/CVs/doniger%20VITA.academic.pdf
http://news.bbc.co.uk/2/hi/south_asia/5036094.stm
http://www.telegraphindia.com/1060524/asp/nation/story_6261949.asp
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
03/06/2014 2:38 pm
రఘోత్తమరావుగారికీ, సురేశ్‌గారికీ ఉన్నంత సంస్కృత జ్ఞానం కానీ, Wendy గురించీ, alternative history గురించీ సురేశ్‌గారి కున్నంత పరిచయం కానీ నాకు లేవు. ఈ వ్యాఖ్య నేనొక సామాన్య హిందువుగా రాస్తున్నాను. (పూర్వకాలంలో ఇలా సామాన్యులు పండితచర్చలలో తలదూర్చే అవకాశం ఉండేదా అనేది అనుమానమే, మంచికో చెడ్డకో యీ కాలంలో అది సాధ్యమయ్యింది!).
1. తాను రాసిన దానికి “Alternative” అనే విశేషణాన్ని స్పష్టంగా శీర్షికలోనే పెట్టారు వెండీ. ఇంక దాన్ని సంప్రదాయ భాష్యాలతో, వ్యాఖ్యానాలతో సరిపోల్చి తప్పుపట్టడంలో అర్థమేముంది? హైందవ వాఙ్మయంపై Wendy కాని, సురేశ్‌గారు కాని చేస్తున్న వ్యాఖ్యానాలు స్పష్టంగా – an alternative to the established or mainstream commentaries. ఇవి వైదిక ప్రామాణ్యాన్ని అంగీకరించని బౌద్ధ, చార్వాక వాదాలవంటివి. వాటిని శంకరుల, మధ్వాచార్యుల వంటి వారి భాష్యాలతో పోల్చి తప్పనడం ఎంతవరకూ సమంజసం?
2. వెండీ సిద్ధాంతాలను Galileo లేదా ఇతర scientific theoriesతో పోల్చడం సరికాదని నా బుద్ధికి తోస్తోంది. వైజ్ఞానికశాస్త్రం భౌతిక ప్రపంచానికి సంబంధించినది. అందులో సత్యాసత్యాలు భౌతిక ప్రయోగాల ద్వారా నిర్ధారించగలిగేవి. Wendy’s subject is not “science”. అంటే ఇందులో వైజ్ఞానికంగా నిర్ధారించగల సత్యాసత్యాల ప్రమేయం లేదు. వేదాలను కాని, స్మృతి పురాణ ఇతిహాసాలను కాని ఒక ప్రత్యేక కోణంలో చూసి, అన్వయించి, పరిశీలించడం మాత్రమే. కాబట్టి, ఇందులో సంప్రదాయ దృష్టే సత్యమైనదీ, లేదా Wendy దృష్టే సబబైనదీ వంటి నిర్ణయాల ప్రసక్తి అసలు వస్తుందా? కాకపోతే, పూర్వకాలంలో అవైదిక మత సిద్ధాంతాలు ఎదుర్కొన్న ప్రతిఘటనే ఇప్పుడూ ఇలాంటి సిద్ధాంతాలు ఎదుర్కొంటున్నాయని భావించ లేమా? పూర్వం ఆయా మతాలనూ మతసిద్ధాంతాలనూ నిజంగానే చాలా సంయమనంతోనూ ఉదారభావంతోనూ హిందువులందరూ స్వీకరించారా?
3. వెండీ పుస్తకాన్ని హిందువులు కానివారు చదివితే హిందూమతం మీద చాలా గౌరవం కలుగుతుందని సురేశ్‌గారు అన్నారు. ఇది నిజమే కావచ్చు. కానీ అది 1st person point of view కాదు. ఒక “సామాన్య” హిందువు దృష్టికన్నా అది వేరైనది. కాబట్టి వారికి గౌరవం కలిగించినంత మాత్రాన ఒక హిందువుకి కూడా అదే భావన కలిగించాలని లేదు. ఒక హిందువు అలాంటి దృష్టితో చూడాలంటే, తనని తాను alienate చేసుకొని తటస్థునిగా మారి చూడగలగాలి. బహుశా ఈ కాలంలో చాలామందికి అది అలవడినట్టుగా ఉంది. అయితే అది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని నా స్వానుభవం. నేను చదువుకున్న చదువు వల్లనో, ఇతర కారణాల వల్లనో నాకూ కొంత అలాంటి దృష్టి అలవడిందని నేను అనుకుంటున్నాను. కాని పూర్తిగా అలవడ లేదు. పూర్తిగా alienate అవ్వగలిస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు కాని, ఈ రెంటికీ చెడ్డ రేవడి స్థితి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఈ alienated viewకి కొన్ని ఉదాహరణలు చెపుతాను.
సురేశ్‌గారు రామాయణ, భాగవత కథలను “అల్లిబిల్లి” కథలు అన్నారు. నా దృష్టిలో యిది ఒక చక్కని ఉదాహరణ. చిన్నప్పుడు, నేను వీటిని విన్నప్పుడు, వీటిని “అల్లిబిల్లి” కథలుగా వినలేదు. నిజంగా జరిగిన కథలుగా విన్నాను. అదే నమ్మాను. పెరిగి పెద్దయిన తర్వాత అవన్నీ బహుశా కట్టుకథలు అనే విషయాన్ని విన్నాను. అలాంటి దృష్టి వచ్చిన తర్వాత, అవి నా హృదయంనుండి కొంత దూరంగా జరిగాయి. కేవలం వాటిని కట్టుకథల్లాగా చూసి, వాటిలోని కల్పనా చమత్కారం, శిల్పనైపుణ్యం, లేదా రసానుభూతి వగైరా వగైరాలను చూసి ఆస్వాదించవచ్చు గదా? వచ్చు, ఇప్పుడు నేనుకూడా చాలావరకూ అదే దృష్టితో వాటిని చూస్తున్నాను. కానీ అవేవీ ఇంతకుముందు అవి నిజమైన కథలే అన్న నమ్మకమున్నప్పుడు యిచ్చిన దగ్గరితనాన్నీ, అనుభూతిని ఇవ్వలేకపోతున్నాయి మనసుకు. ఇదే విషయం, భక్తి కీర్తనలకు కూడా వర్తిస్తుంది. చాలామంది వాటిలోని సంగీతసాహిత్యాలను మాత్రమే ఆస్వాదిస్తారు. నేనుకూడా వాటిని ఆస్వాదిస్తాను. అయితే, రామదాసు నేరుగా రామునితో పెట్టుకున్న మొర, లేదా త్యాగయ్య రాముని ఎదురుగా ఆలపించిన కీర్తన అనే నమ్మకం ఉండిన రోజుల్లో, ఆ పాటలను విన్నప్పుడు కలిగిన ప్రత్యేక అనుభూతి నేనిప్పుడు పొందలేకపోతున్నాను. ఇంకా చాలా ఉదాహరణలు ఇవ్వగలను. పండగలు జరుపుకోవడం కూడా అలాంటి alienated viewకి ఉదాహరణే. ఇదంతా “మానసికమైన ఎదుగుదల”లోనో లేదా “సమాజం ఎదుగుదల”లోనో ఒక భాగమా? అయ్యుండవచ్చు, నాకు తెలియదు. కాని ఏదో లోటు మాత్రం చాలా స్పష్టంగా కష్టపెడుతూ ఉంటుంది.
4. మళ్ళీ మొదటికి వస్తాను. పూర్వ కాలంలో సిద్ధాంత చర్చల్లో సామాన్యులు ఎంతవరకూ భాగస్వాములు? సామాన్యులపై వాటి ప్రభావం ఎంత? ఇవి పండితుల వాదప్రతివాదాలకూ, రాజాశ్రయాలకూ మాత్రమే పరిమితమయ్యేవని అనుకుంటున్నాను. అంచేత వాటివల్ల సామాన్యప్రజలకి (అంటే ఆయా సిద్ధాంతాలలో ప్రవేశం లేని వారికి) పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పుడలా కాదు కదా? ఈ గందరగోళానికి అదొక ముఖ్యకారణం కాదా?
ఆఖరిగా, ఈ వ్యాఖ్య నేను ఒకరిని సమర్థించడానికో మరొకరిని వ్యతిరేకించడానికో రాసింది కాదు. కేవలం, కొంత కాలంగా నాలో ఉడుకుతున్న అస్పష్టభావాలను వ్యక్తపరచడానికి మాత్రమే, జరుగుతున్న చర్చకి ఎంతో కొంత సంబంధం ఉందన్న ఉద్దేశంతో. దీని గురించి ఇంతకన్నా చెప్పే సామర్థ్యం నాకు లేదు. కాబట్టి దీనిపై ఇంకేవైనా వ్యాఖ్యలు వచ్చినా మౌనంగా చదువుకుంటాను.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
03/06/2014 1:47 pm
‘When I use a word,’ Humpty Dumpty said, in rather a scornful tone, ‘it means just what I choose it to mean — neither more nor less.’? 🙂
ఈ మధ్య ఒక సంస్కృత పండిత సభ జరిగితే, అందులో సౌమ్యుడు, వినయశీలి అయిన పండితుణ్ణి అధ్యుక్షునిగా ఎన్నుకున్నారట. అధ్యక్షుడు అన్న పదానికి అందరికీ తెలిసిన అర్థం అధి + అక్షః అంటే పైనుండి చూచువాడు, supervisor, పెద్ద- మొదలైన అర్థాలు మనకు తెలుసు కదా. ఆ వినయశీలి లేచి అధ్యక్షుడు అంటే అ + ధి (=బుద్ధి) + అక్ష (=ఇంద్రియాలు), అని చెబుతూ నాకు బుద్ధి, ఇంద్రియాలు లేవు కాబట్టి నన్ను అధ్యక్షుడిదిగా ఎన్నుకున్నారు అని చమత్కరించారట. పక్కనే కూర్చున్నా మహా పండితుడు లేచి “భగవద్గీతలో ‘అక్షరాణాం ఆకారోస్మి’ అని పరమాత్ముడు అన్నాడు కాబట్టి ఆ అ-కారరూపుమైన పరమాత్మ యందు బుద్ధి, ఇంద్రియాలు కలవాడు కాబట్టి ఆయనను అధ్యక్షుని చేయడం సబబే అని హర్షధ్వానాల మధ్య వివరించాడట.
పదనిర్మాణ రీత్యా (morphologically) సంస్కృత భాష ఒక సంలీన భాష (inflectional language). ఒక వాక్యాన్ని, వివిధ పదాలుగా; ఒక పదాన్ని భిన్నమైన పదాంశాలుగా ఎన్నో రకాలుగా విడదీయవచ్చు. ఈ రకమైన సౌలభ్యం వల్ల ఒకే శ్లోకాన్ని వివిధ రీతులుగా విడగొట్టి పరస్పరం వ్యతిరేకమైన అర్థాలు సాధించవచ్చు. ఈ రకమైన పాండిత్య ప్రకర్ష చమత్కారాలకు బాగానే ఉంటుంది కానీ, శాస్త్ర చర్చల్లో అంతగా పొసగదు. అయితే, గత కొన్ని వందల యేళ్లుగా మన పండితులు పదాలకు కొత్త, కొత్త అర్థాలు క్రోంగొత్త రీతిలో సాధిస్తూ మన గ్రంథాలకు సరికొత్త భాష్యాలు రాయడంలోనే తలమునకలయ్యారంటే అతిశయోక్తి కాదేమో.
ఉదాహరణకు, మధ్వాచార్యులవారు మహావాక్యాలలో ఒకటైన “తత్త్వమసి (that art thou)” అన్న దానికి భాష్యం చెబుతూ ఛాందోగ్యోపనిషత్తులో “శ్వేతకేతో తత్త్వమసి (O Svetaketu, thou art that)” అన్న దానిని “శ్వేతకేతో + అతత్త్వమసి = శ్వేతకేతోతత్త్వమసి”(O Svetaketu, thou art not that)” అని విడదీసి ద్వైత సిద్ధాంత అన్వయాన్ని సాధించాడు. ఈ రకమైన పదవిభజనలతోనే ఆయన ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వన్నీ తన సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయని నిరూపణ చేశాడు. ఈ రకమైన పదవిభజనలు శంకరాచార్యుల, రామానుజాచార్యుల భాష్యాల్లో కూడా కనిపిస్తుంటాయి. అందువల్లే వారు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలన్నీ తమ, తమ సిద్ధాంతాలను సమర్తిస్తున్నాయని చెప్పుకోగలిగారు.
అయితే, చారిత్రకంగా చూస్తే, వేదానంతర కాలంలో వైదిక కర్మకాండ పట్ల ఒక రకమైన నిరసన ఉండేదని, ఆ నిరసన భావం ఉపనిషత్తులలో, భగవద్గీత వ్రాయబడిన తొలిదశల్లో తీవ్రస్థాయిలో ఉండేదని మనకు లభిస్తున్న ఆధారాలను బట్టి ఊహించవచ్చు. ఆ వాతావరణంలోనే వైదిక కర్మకాండలకు తిరుగుబాటుగా భౌద్ధ మతం, జైన మతం, సాంఖ్య, యోగ, అజీవిక, చార్వాక మతాలు ప్రాచుర్యం చెందాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ దృష్టితో చూస్తే, భగవద్గీతలో నేను ఉటంకించిన నాలుగు శ్లోకాలలో వేదాలను తక్కువ చేసి “త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున” అని చెప్పడానికి సులభమైన వివరణ ఇవ్వవచ్చు. అంతేకాని, ఆ శ్లోకాలలో “వేదం” అంటే “వేదం” కాదు అంటూ వితండవాదన చేయడం వల్ల మనకు కొత్త విషయాలేం బోధపడవు.
అలాగే, ముండకోపనిషత్తులో వేదాలను తక్కువస్థాయి విద్యలుని, వాటిని అపరవిద్యలుగా నిర్వచించారని వ్యాసంలో అనుకున్నాం కదా. అదే ఉపనిషత్తులో ద్వితీయఖండంలో అపరవిద్యల గురించి ఇంకా ఇలా అంటారు:
ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా అష్టాదశోక్త మపరం యేషుకర్మ
ఏ తచ్ఛ్రేయో యేఽభినందంతి మూఢా జరామృత్యుం తే పునరేవాపి యంతి ||7||
అపరమైన కర్మ పదునెనిమిది అంగాలతో కూడిన యజ్ఞకర్మల పైన ఆధారపడి ఉండును. ఇవన్నియు వాస్తవానికి బలహీనమైన తెప్పల వంటివి. వీటి వల్ల పదే, పదే జరామృత్యువులు తప్పవు.
అవిద్యాయా మంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః
జంఘన్యమానాః పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః ||8||
అజ్ఞానములో చరిస్తూ, తామే ధీరపురుషులని, ప్రజ్ఞావంతులని ఆత్మస్తుతి ఒనర్చుకొను మందమతులు శోకగ్రస్తులై, అంధునిచే నడిపించబడు అంధునివలె దిక్కుతోచక పరిభ్రమిస్తుంటారు.
అవిద్యాయాం బహుధా వర్తమానా వయం కృతార్థా ఇత్యభిమన్యంతి బాలాః
యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్ తేనతురాః క్షీణలోకా శ్ఛ్యవంతు ||9||
అజ్ఞానముతో చరించు ఈ మూర్ఖులు తాము ఆప్తకాములైనట్లు చిన్నపిల్లల్లా భావిస్తుంటారు. రాగరతులై ఉన్నందున సత్యమును గ్రహించలేరు. అందువలన పుణ్యకర్మఫలముగా లభించిన స్వర్గాది లోకములు అనుభవించిన పిదప మళ్ళీ క్రిందికి జారుదురు.
ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠం నాన్యచ్ఛ్రేయో వేదయన్తే ప్రమూఢాః
నాకస్య పృష్ఠే తే సుకృతేఽనుభూత్వే మం లోకం హీనతరం వా విశంతి ||10||
కర్మపరులైన ఈ మూర్ఖులు యజ్ఞవిధులు, పుణ్యకార్యములు మాత్రమే శ్రేష్ఠమైనవని భావిస్తూ, అన్యమైన మరే శ్రేయోమార్గమును తెలియలేరు. వీరు ఉన్నతమైన స్వర్గలోకములో పుణ్యఫలము అనుభవించి మఱల ఈ లోకములో గాని, ఇంతకన్నా హీనమైన లోకములో గాని ప్రవేశించుదురు.
అలాగే బృహదారణ్యకోపనిషత్తులోనూ ఇటువంటి వేదనిరసన కనిపిస్తుంది. ఆదిశంకరుని భాష్యాల్లోనూ జ్ఞానాన్ని ఉగ్గడిస్తూ వేదాలను, కర్మకాండను నిరసించే శ్లోకాలు కనిపిస్తాయి. శంకరుడు వేదనింద చేశాడా లేదా అంటూ సుదీర్ఘ చర్చలు మన పండిత లోకంలో మామూలే.
అయితే, వెండీ డానిగర్ రాసిన పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మికం కాదు, చారిత్రాత్మకం. నా వ్యాస ప్రాధాన లక్ష్యం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక చర్చల గురించి కాదు. వేదంలో వర్ణించిన మతానికీ, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో అనుసరిస్తున్న హిందూ మతానికి చాలా తేడాలు ఉన్నాయని, అందువల్ల కేవలం వేదాల ఆధారంగా హిందూ మతం గురించి సంపూర్ణంగా వివరించలేమన్నదే నా వాదన. నా వ్యాసంలో బాత్రా అభియోగానికి బదులుగా ఇలా అన్నాను:
ఇప్పుడు వివిధ మానవీయ, సామాజిక శాస్త్ర (linguistics, epigraphy, archaeology, history, population genetics etc.) పరిశోధనల ద్వారా మనకు లభ్యమౌతున్న సమాచారాన్ని బట్టి మనం మన చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకొని, హిందూ మత చరిత్రలో పరిణామాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో వెండీ డానిగర్ రాసిన పుస్తకం ఒకటి. కొంత నిష్పాక్షిక దృష్టితో ఆమె పుస్తకాన్ని చదివితే హిందూ మతపరిణామం గురించి కొంతైనా అవగాహన కలుగుతుందని నా అభిప్రాయం.
ఆఫీసు పనుల ఒత్తిడిలో గత రెండురోజులుగా ఈమాటలో నా వ్యాసంపై వచ్చిన అభిప్రాయాలకు సమాధానాలు వెంటనే రాయలేకపోయినందుకు క్షంతవ్యుణ్ణి. ఇతర అభిప్రాయాలకు కూడా ఈ రోజు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తః తః గారి అభిప్రాయం:
03/06/2014 1:16 pm
ఒకే ఒక భరద్వాజుడు, ఒకే ఒక జనకుడు కాక పలువురు భరద్వాజులు, పలువురు జనకులు ఉన్నట్లే ఒకే ఒక శివుడు కాక పలువురు, అనేకులు, అనేకానేకులు శివుళ్లు ఉన్నారని నా అభిప్రాయం. లింగం ఊడిపొయిన శివుడూ, జంగం అయిపొయిన శివుడూ ఒకరు కాదన్నది (కాక పోవచ్చన్నది) నా ప్రతిపాదన. ఒకే ఒక ఒకే ఫిజిక్స్ లేదు ఒకే ఒకే మెకానిక్స్ లేదు. (ఒకదాంతో మరొకటి కలుపుకుని కషాయం చేసుకొవచ్చు, అది వేరే విషయం). కాబట్టి ‘శివుడి చరిత్ర’ అంటూ ఉండదు. కాబట్టి శివుడి చరిత్ర ఒకరికి తెలియటమూ, మరొకరికి తెలియక పోవటమూ అన్న ప్రసక్తి లేదు. అకడమీషియన్స్ సృష్టించిన మోడరన్ మిత్ లలొ ఇది ఒకటి. నా శివుడి గురించి నాకు తెలుసు.
“అమంగల్యం శీలం తవభవతు నా మైవ మఖిలం తథాపి స్మర్తౄణాం వరద పరమం మంగళమసి!”
బల్లి ఫలితం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/06/2014 12:00 pm
అభిసారం అని “appointment” అనే ఆంగ్లపదానికి భాషాంతరీకరణం అంత సబబుగా తోచదు.
కాని వైజ్ఞానిక కల్పన అని “science fiction” అనే మాటను భాషాంతరం చేయటం బాగుంది.
ఇటువంటి కథలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. ఐనా, ఇది కూడా చక్కగా ఉంది. ఇలాంటి కథ చదివినప్పుడు చలంగారి దోషగుణం కథ గుర్తుకు వస్తుంది.
కాని ప్రథానంగా ప్రస్తావించిన వైజ్ఞానిక కల్పన ఏమీ ఈ కథలో నాకు కనపడ లేదు మరి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
03/05/2014 4:40 pm
నా అభిప్రాయములు క్రింది అభిప్రాయములకు మాత్రమే పరిమితము –
1. దశరథునికి శ్రవణ కుమారు డిచ్చిన శాపం.
2. కైకేయికి దశరథుడిచ్చిన మూడు వరాలు.
కైకేయికి ఈ వరములను గురించి తెలుసు. ఆమెకు కూడ రాముడంటే ప్రీతి, వాత్సల్యము. పట్టాభిషేకమునకు ముందే పుత్రశోక శాపము దశరథుడు అనుభవిస్తే తరువాత రాజ్యపాలన ఎట్టి కష్టము లేకుండ సాగిపోతుంది కాబట్టి ఆ వరములను కైక అడిగినట్లు భాసమహాకవి ప్రతిమా నాటకములో, యజ్ఞఫలనాటకములో వివరిస్తాడు. తన తొట్రుబాటులో 14 రోజులు అనడానికి బదులు 14 ఏండ్లు అంటుంది ఆమె. The rest is history. కాని మునిశాపమును దశరథుడు అనుభవించడమును కైకేయి ఆపలేక పోతుంది. వాల్మీకి రామాయణములో సీత లక్ష్మణుని సందేహించడము ఆమె పాత్రలో లోపమా? విధేయుడు – మోహన
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి ..nagarjuna.. గారి అభిప్రాయం:
03/05/2014 1:17 pm
@రఘోత్తమరావు గారు, ప్రజ్ఞావాదం గురించి గీతలో మీరు ఉదహరించిన శ్లోకానికి ముందర శ్లోకం,
శ్లో: “తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత,
నేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః”
కు మధ్వాచార్యుల భాష్యం ఈ విధంగా ఉంది: జ్ఞానవంతుడైన నీ కిట్టి దుర్భుద్ది ఎట్లు కలిగెనని పరిహాసము చేయుచు అర్జునుని జూచి ఈ వాక్యమును పలికెను.
ఆ తరువాత వచ్చే శ్లోకం
శ్లో.అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భషసే,
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః
ఈ రెండింటినీ కలిపి చూస్తే, “బంధువులనూ పూజ్యులనూ ధర్మం నేర్పిన గురువులనూ చంపి రాజ్యం చేజిక్కించుకోవడం కంటే త్యజించి బిచ్చమెత్తుకోవడం శ్రేయస్కరం కదా, ఆలోచించు. ఏం చేయాలో నీవే చెప్పు” అన్న అర్జునుడితో కృష్ణుడు “పండితులైనవారు బ్రతికున్నవారిని గురించిగాని, చనిపోయినవారిని గురించిగాని దుఃఖింపరు. నువ్వు పండిత వచనాలు పలుకుతూ (పరిహాసంగా) కూడనివాటిని గురించి దుఃఖిస్తున్నావు” అన్నాడు. ఈ విధంగా చూసినపుడు కర్మధర్మాలలో అభిమానం కలిగి ఉండిన అర్జునుడు ఇతర శ్రుతులకు పలుకుతూ సందిగ్ద వాదన చేశాడుగాని మీరు అన్నట్టు అది అవాదం కాదేమో! నా ఈ అన్వయంలో ఏదన్నా తప్పుంటే చెప్పండి.
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥ (2-45)
గురించి శంకర భాష్యం ఇలా ఉంది: “అర్జునా! వేదములు ఈ సంసారమే విషయముగా గలవి. నీవు నిష్కాముడవును, ద్వంద్వములను వదలినవాడవును, నిత్య సత్వగుణము గలవాడవునూ, ఆత్మజ్ఞానము కలవాడవును కోరికలేనివాడవును నగుము.”
అయితే ఇదే శ్లోకానికి మధ్వాచార్యులు భాష్యం చేస్తూ ఆ త్రిగుణాలు వేదాలలో పైకి కనిపించే అర్దం మాత్రమే అన్నారు.
“యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే..” అన్న శ్లోకం గురించి మధ్వాచార్యులు ఇలా చెప్పారు: “వేదాలలో చెప్పిన ఫలమంతా బ్రాహ్మణునిలో నంతర్భవించును. బ్రాహ్మమును పొందువాడు బ్రాహ్మణుడు. బాహ్మపరోక్షజ్ఞానము గలవాడు బ్రాహ్మణుడు. అది జ్ఞానమువలన కలుగును”
దీనికే శంకర భాష్యం “సమస్తవేదములయందు చెప్పబడిన కర్మలననుష్ఠించడంవల్ల గలుగు ఫలము అంతకన్నను మిక్కిలి గొప్పదైన జ్ఞానముగల బ్రహ్మజ్ఞానికి గలుగు మోక్షరూపఫలములో నంతర్భావము నొందును” గా ఉన్నది.
***
@సురేష్ గారు,
నాకు రచయిత్రి భాషా పరిజ్ఞానం గురించి సందేహాలు లేవండి. ఉన్న సంశయమల్లా ఆమె అన్వయాలు సబబుగా ఉన్నాయా, వాటిని అన్వయించడంలో ఆవిడ నిజాయితీగా ఉన్నారా లేదా అని. రామాయణంలోంచి మీరు ఉదహరించిన శ్లోకాలలో చూసినా “మహారాజు నేడు దుఃఖం అనుభవిస్తుంటాడు”, “అర్థ, ధర్మాదుల కంటే కామమే బలమైనదని నాకనిపిస్తుంది” అని కోరిక (this need not necessarily be lust .. భార్యపై ఉండే సహజమైన ఆసక్తి ఇష్టం కావచ్చు) వల్లనే నేడు మహారాజు దుఃఖితుడై ఉన్నాడని చెప్పిన రాముడు/లక్ష్మణుడితో దశరథుడిని explicit గా sex-addict అని చెప్పించడం కరెక్టేనా అని.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/05/2014 4:58 am
ఈ వ్యాస రచయితగారు నన్నుద్దేశించి ‘మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. “త్రైగుణ్యవిషయా వేదా” అన్నప్పుడు వేద శబ్దానికి చతుర్వేదాలను ఆరోపించటం సబబు కాకపోవచ్చన్నారు. మరైతే, చతుర్వేదాలను పేర్లతో సహా ప్రస్తావించి వాటిని అపరా విద్యలుగా వర్ణించిన ముందకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తులలో శ్లోకాల గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? అని ప్రశ్నించారు.
ఛాందోగ్యోపనిషత్తు నాదగ్గర లేదు కాబట్టి దానిలోని శ్లోకాలను ఉటంకించి అభిప్రాయం చెప్పలేను. ముండకంలో మీరడిన శ్లోకం గురించి వ్రాస్తాను. ముండకోపనిషత్తులో ప్రథమముండకంలో
తత్రాఽపరో ఋగ్వేదో యజుర్వేద
సామవేదోఽథర్వవేదః శిక్షాకల్పో
వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి
అథ పరా యయా తదక్షరమధిగమ్యతే
అన్న మంత్రం నాలుగువేదాలనూ, వాటితో బాటుగా శిక్షాదిగా ఉన్న ఆరు వేదాంగాలనూ ప్రస్తావిస్తున్నది. ఈ మంత్రం తాత్పర్యం ప్రకారం ఇవన్నీ అపరవిద్యలునూ సనాతనమైన ఆత్మను గూర్చి తెలియజేసేది మాతం అపరవిద్యగానూ చెప్పబడుతున్నాయి. నాకున్న మిడిమిడి సంస్కృతభాషాజ్ఞానానికి అవగాహన ఐనదిది. ఈ సందర్భంగా నా అభిప్రాయం క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.
నాలుగువేదాలూ సమస్తమైన (వైదిక)కర్మకలాపానికీ మూలం. ధర్మం యొక్క స్వరూపంగా భాసిల్లే విధినిషేధాలనూ ఈ వేదం ఆధారాలుగానే తెలుసుకుంటున్నాము. సమస్తమైన ఆర్షజీవనానికి శ్రుతి అంటే వేదమే ప్రమాణం. శ్రుతివిరోధం లేనంతవరకూ ఉపనిషత్తులు కూడా ప్రమాణాలు. శ్రుత్యుపనిషత్ప్రమాణాలకు విరోధం కానంత వరకూ పురాణేతిహాసాలు కూడా ప్రమాణాలే. ఇదీ మనం ఆర్షవాంగ్మయం నుండి ప్రామాణికతను గ్రహించే విధానం. శిక్షాదిగా ఉన్న ఆరు వేదాంగాలూ, వీటిని సమగ్రంగా బోధించే సమస్తశాస్త్రాలూ కూడా శ్రుతిప్రామాణ్యతను అనుసరించే తగినంత ప్రమాణాలు. కాని ఇదంతా ఇహలోక వ్యవహారంలో ధర్మానుష్ఠానానికి సంబంధించినది. స్వర్గాదికామసుఖప్రదములైన యజ్ఞాదులన్నీ కూడా వైదికమైన వ్యవహారములే. వేదాధ్యయనం కావచ్చును, యజ్ఞాచరణం కావచ్చును కాని అవేవీ స్వయంగా మోక్షప్రదమైనవి కానేకావు. అందుచేత వీటికి సంబంధించిన సమస్తవ్యవహారమూ అపరవిద్య.
కేవలం ఆత్మాఽనాత్మవివేకసంపాదనా సాధనాలైన ఉపనిషత్తులు మాత్రము పరవిద్యను బోధిస్తున్నాయి. పునరావృత్తిరహితమైన పదమునకు చేర్చేది తత్త్వమసీతి వాక్యప్రబోధములను చక్కగా తెలుసుకున్నవాడే కాని ఏవిధమైన లౌకికవిద్యాభ్యాసం చేసినవాడూ కాడు.
అట్టి పరావిద్యను యెఱిగినవాడు దేహాభిమానం విడచి పరమాత్మతో సంయోగం చెందుతాడు. అనేక జన్మలసాథన పట్టవచ్చు ఒక జీవికి ఆ స్థితి రావటానికి. గీతలోనే, భగవన్ముఖంగా, యోగభ్రష్టుడు తిరిగి తన యోగాభ్యాసాన్ని కొనసాగించేందుకు తగిన ఉత్తమమైన జన్మను పొందుతాడని చెప్పబడింది. అందుచేత అప్పుడప్పుడు మనకు జన్మసిధ్ధులైనవారు కూడా లోకంలో దర్శనం ఇస్తారు. కాని వారు తాము లౌకికప్రపంచంలో పదిమంది దృష్టికి రావటాన్ని ఇష్టపడకపోవచ్చు తరచుగా. అందుచేత అటువంటి వారు మనమధ్యే ఉన్నా వారి సంకల్పం లేనిదే మనం వారిని తెలుసుకోలేము. ప్రాపంచికమైన విషయాలమీద వారికి ఏ విధమైన కోరికా ఉండదు కాబట్టి వారు ఏ విధమైన అపరవిద్యలను ఆశ్రయించరు. రకరకాల సౌఖ్యాలను అపేక్షించే మనకోసమే అపరవిద్యలు. కేవలం పరబ్రహ్మమును కోరిన వారు పరవిద్యను మాత్రం ఆదరిస్తారు.ఇంతకంటే చెప్పగల అధికారిని కాదు, క్షమించాలి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
03/04/2014 10:06 am
వేమూరి గారు: వెండీ డానిగర్ విదేశీ పరిశోధకురాలు కాబట్టి ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆక్షేపణలలా కనిపించాయన్నది వాస్తవమే కావచ్చు. నిజానికి హిందువులు కానివారు వెండీ డానిగర్ పుస్తకం చదివితే హిందూ మతంలో తొలినుండి కనిపించే భిన్నత్వంలో ఏకత్వం, కొత్త కొత్త ఆలోచనలను తనలో ఇమిడ్చుకోగలిగే విశాల దృక్పథం మొదలైన వాటి గురించి ఆమె వివరించిన విధానాన్ని బట్టి హిందూ మతంపై ఎనలేని గౌరవం కలుగుతుందనే నా అభిప్రాయం.
ఇక, బైబిల్ లోని కథల గురించి పలురకాల విశ్లేషణలతో క్రైస్తవులు, క్రైస్తవేతరులు రాసిన వందలకొద్ది పుస్తకాలు వచ్చాయి. నీషీ (Nietzsche) రాసిన The Antichrist (Der Antichrist), రసెల్ (Bertrand Russell) రాసిన Why I Am Not a Christian క్రిస్టియానిటీనీ తీవ్రంగా విమర్శిస్తూ రాసిన పుస్తకాలలో కొన్ని. మతాతీత/లౌకిక లక్ష్యాలతో ఐజక్ అసిమోవ్ రాసిన Asimov’s Guide to the Bible, అమెరికన్ ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్ రాసిన The Life and Morals of Jesus of Nazareth వంటి పుస్తకాలపై కొంతమంది మతఛాందసవాదులు విరుచుకుపడ్డా ఆ పుస్తకాలు ఏ నిషేధానికి గురికాలేదు.
విశ్వవిద్యాలయాల్లో బైబిల్ పై అధ్యయనాలు Textual criticism, Source criticism, Form criticism, Redaction criticism, Canonical criticism, Rhetorical criticism, Narrative criticism,Psychological criticism, Socio-scientific criticism, Postmodernist criticism, Feminist criticism అంటూ శాఖోపశాఖలుగా విస్తరిల్లినట్టుగా క్రిస్టియన్ స్టడీస్ పై కొన్ని పేపర్లు చూచాయగా చూసిన నాకనిపిస్తుంది. హిందూ మతానికి చెందిన వారిలో దీపక్ చోప్రా రాసిన The Third Jesus: The Christ We Cannot Ignore, Jesus: A Story of Enlightenment చూశారా? ఇందులో దేవదూతగా మనకు తెలిసిన జీసస్, చర్చి వారు వారి మతప్రచారానికి సృష్టించుకున్న వ్యక్తి అని, చరిత్రకారులు చెబుతున్న రెండవ జీసస్ కాక, అసలు జీసస్ కథ అంటూ ఊహాత్మకంగా మూడవ జీసస్ కథ చెబుతాడు. ఈ పుస్తకాలపై వివాదం కానీ, అనవసరమైన ప్రచారం కానీ జరగలేదు.
పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు భారతదేశానికి పక్కనే ఉండడం, అక్కడ ప్రబలంగా ఉన్న తాలిబన్ ఛాందస భావాలు, వారి మతంపై, మతగ్రంథంపై ఏమాత్రం కొత్తరకమైన విశ్లేషణను సహించలేని మూఢత్వం, మన దేశంపై కూడా పడి హిందూ మతస్థులను ఈ రకమైన మతమౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నాయని నా అభిప్రాయం.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Sravya V గారి అభిప్రాయం:
03/04/2014 9:35 am
సురేష్ గారు,
నాకు కొన్ని సందేహలు, ఇవి వెండీ పుస్తకం లోని అంశాలు గురించి కానీ, లేదూ పురాణాలు ఏమి చెబుతున్నాయి అని కానీ కాదు! కొంచెం టాపిక్ నుంచి పక్కకి పోయి అడుగుతున్నందుకు క్షమించాలి (మరీ out of context కాదులెండి).
1. ఇది మీ వ్యాసం లోని భాగం :
పెంగ్విన్ పబ్లిషర్స్ (ఇది ఏదో చిన్న పబ్లిషింగ్ సంస్థ కాదు కదా?) ఇది గమనించకుండా అది కూడా కోర్టు బయట ఒప్పందంతో కేసు నుంచి తప్పుకోవటం ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి కారణం ఏదన్నా ఉందంటారా?
2. పుస్తకం ఎవరూ ఇంత వరకు బాన్ చేయలేదు కేవలం పెంగ్విన్ పబ్లిషర్స్ వెనక్కి తీసుకున్నారు అంతే కదా? మరి వెండీనో లేదూ ఆ పుస్తకాన్ని సమర్దించేవారు చాలా మందే ఉన్నారు కదా, వీళ్ళు ఎవరన్నా వేరే పబ్లిషర్స్ నుంచి పుస్తకాన్ని రిలీజ్ చేయొచ్చు కదా?
3. ఇండియన్ లా, అమెరికన్ లా, కంపేర్ చేసి రాశారు. అమెరికాలో జెండాని కాల్చినా నేరం కాదు ఇది అందరికీ తెలిసిన విషయమే, అదే పని ఇండియాలో చేస్తే కేసు. అది కూడా అందరికీ తెలిసిన విషయమే కదా? వేరు వేరు దేశాలకి వేరే వేరే Law policies ఉండటం నేరమా? అయినా ఒక matured సొసైటీ Lawని ఇండియా లో కూడా implement చేయమనడం మనకి బావున్నా అది సాధ్యం కాదేమో. ఆ సాధ్యాసాధ్యాలు ఏంటొ తెలుసుకోవాలి అని ఉంది.
4. బాత్రా తనకున్న కోర్టులో కేసు వేసుకునే వెలుసుబాటు / అవకాశం ఏదో దాన్ని వాడుకుని లీగల్ గా ప్రొసీడ్ కావటంలో నేరం ఏంటి? అది అతను చేయకూడదు అని అనటం తన హక్కుని కాలరాయటం కాదా? ఇది violation of freedom స్పీచ్ కాదంటారా? ఆ లీగల్ నోటిస్ లో బుక్ ని బాన్ చేయమని లేదు కదా? ఏవో కొన్ని అంశాలు ప్రస్తావించారు. దానికి వెండీ ఎందుకు వివరణం ఇవ్వకూడదు? ఫిక్షన్ రాస్తే ఏమో కానీ, ఆల్టర్నేట్ హిస్టరీ అని చెప్తునప్పుడు వివరణలు, దానికి తగిన ఆధారాలు అవసరం కాదా?
5. మీరు The Satanic Versesని ఇక్కడ ప్రస్తావించారు. ఆ పుస్తకం విషయం లోను, ఈ పుస్తకం విషయం జరిగిన రభస ఒక్కటేనా? తేడా లేదంటారా?
మొత్తం మీద మాత్రం అమెజాన్.కామ్‌లో పదకొండు వేల రాంక్ ఉన్న పుస్తకం – (ఇది మీరు చెప్పినదే) మరి అంతగా పాపులర్ కానీ పుస్తకాన్ని పబ్లిషర్స్ వెనక్కి తీసుకుంటే నిజంగా చాలా నష్టం జరిగిపోతుంది అని ఇంత వాదనలు ఎందుకబ్బా వీళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారానే సమాధానం చెప్పి ఉండొచ్చుగా అని కూడా అనిపిస్తుంది. ఇది ఎంత వరకు కరెక్టో అది మాత్రం తేల్చుకోలేక పోతున్నాను.
ఈ పుస్తకానికి అస్సలు సంబంధం లేని ఇంకో సందేహం కూడా వస్తుంది — 200 / 300ఏళ్ళ తరవాత ఎవరన్నా తెలుగు వాళ్ళ చరిత్ర రాయాలని నిర్ణయించుకుంటే ఇప్పుడు వచ్చే సినిమాలు, టివిల్లో వచ్చే సీరియల్స్, తెలుగు బ్లాగుల్లో రాస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా సోర్సెస్ అవుతాయా అని. అవుతాయేమో!
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
03/04/2014 8:00 am
నాగార్జున గారు: మంచి ప్రశ్నే అడిగారు. వెండీ డానిగర్ రామాయణ,మహాభారతాలు క్షుణ్ణంగా చదువుకుందని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. ఫలానా పదానికి ఫలానా ఇంగ్లీష్ పదం వాడింది కాబట్టి ఆమెకు సంస్కృతం రాదు, రామాయణ, మహాభారతాలు ఆమెకు తెలియవు అన్న విమర్శలు వింటూవుంటాం. అయితే, ఆమెకు తెలిసినన్ని పురాణ కథలు, ఉపనిషత్తుల కథలు, అనేక రకాల రామాయణ, మహాభారత కథలు — వాటిలో కనిపించే సూక్ష్మ వ్యత్యాసాలు — ఆమెకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవని ఆమెను వ్యక్తిగతంగా ఎరిగిన వారు నాతో అన్నారు.
మీరు చూపిన శ్లోకంలో దశరథుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాటల్లో కామ- అన్న శబ్దానికి అర్థం ‘దేహ సంబంధమైన కాముకత్వం’ కాదు అన్నదే మీ ఆరోపణ, అవునా?
రాముడు, లక్ష్మణుడు అడవులకు వెళ్ళిన తరువాత అయోధ్యలో ఉన్న తల్లిదండ్రుల గురించి వారు మాట్లాడుకున్న విషయాలను వివరించే వాల్మీకి రామాయణపు శ్లోకాలు చూడండి (అయోధ్య కాండ, 53వ సర్గ):
స తు సమ్విశ్య మేదిన్యాం మహా అర్హ శయన ఉచితః |
ఇమాః సౌమిత్రయే రామః వ్యాజహార కథాః శుభాః || 2-53-5
గొప్ప శయనతల్పం పై పరుండడానికి అలవాటు పడిన రాముడు, మైదానంపై మేను వాల్చి సౌమిత్రితో ఇలా పలికాడు.
ధ్రువం అద్య మహా రాజో దుఃఖం స్వపితి లక్ష్మణ |
కృత కామా తు కైకేయీ తుష్టా భవితుం అర్హతి || 2-53-6
మహారాజు నేడు రాత్రి దుఃఖం అనుభవిస్తుంటాడు. కైకేయికి మాత్రం తన కోరిక (కామా) నెరవేరినందుకు తృప్తిగా ఉండి ఉంటుంది.
సా హి దేవీ మహా రాజం కైకేయీ రాజ్య కారణాత్ |
అపి న చ్యావయేత్ ప్రాణాన్ దృష్ట్వా భరతం ఆగతం || 2-53-7
భరతుడు తిరిగి వచ్చాక ఆ దేవి కైకేయి రాజ్యం కోసం ఆ మహారాజు ప్రాణాలను హరించదుకదా!
అనాథః చైవ వృద్ధః చ మయా చైవ వినాకృతః |
కిం కరిష్యతి కామ ఆత్మా కైకేయ్యా వశం ఆగతః || 2-53-8
వృద్ధుడు, అనాథ అయిన ఆయన, నేను లేకుండా ఉన్న వేళ, కామాత్ముడై, కైకేయి వశంలో పడిపోయి ఏం చేస్తాడో.
ఇదం వ్యసనం ఆలోక్య రాజ్ఞః చ మతి విభ్రమం |
కామఏవ అర్థ ధర్మాభ్యాం గరీయాన్ ఇతి మే మతిః || 2-53-9
మహరాజుకు కలిగిన సంకట పరిస్థితిని (వ్యసనం), మతిభ్రమణాన్ని చూస్తుంటే అర్థ, ధర్మాదుల కంటే కామమే బలమైనదని నాకనిపిస్తుంది.
కో హి అవిద్వాన్ అపి పుమాన్ ప్రమదాయాః కృతే త్యజేత్ |
చంద అనువర్తినం పుత్రం తాతః మాం ఇవ లక్ష్మణ || 2-53-10
ఎటువంటి అవిద్యావంతుడైన తండ్రి అయినా స్త్రీ కోసం నావంటి పుత్రుణ్ణి త్యజిస్తాడా?
సుఖీ బత సభార్యః చ భరతః కేకయీ సుతః |
ముదితాన్ కోసలాన్ ఏకో యో భోక్ష్యతి అధిరాజవత్ || 2-53-11
అయ్యో! కైకేయి సుతుడు, తన భార్యతో కోసల రాజ్యాన్ని అధిష్టించి ఒక్కడే సంతోషంగా భోగిస్తాడు.
స హి సర్వస్య రాజ్యస్య ముఖం ఏకం భవిష్యతి |
తాతే చ వయసాతీతే మయి చ అరణ్యం ఆశ్రితే || 2-53-12
తండ్రి వయసాతీతుడైనాడు. నేను అరణ్యాలపాలయ్యాను. ఇక భరతుడే సర్వరాజ్యానికి అధిపతిగా కాగలడు.
అర్థ ధర్మౌ పరిత్యజ్య యః కామం అనువర్తతే |
ఏవం ఆపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా || 2-53-13
దశరథ రాజులాగా ఎవరైతే అర్థాన్ని, ధర్మాన్ని పరిత్యజించి కామాన్ని అనువర్తిస్తారో, వానికి ఈ రకమైన కష్టాలు తప్పవు.
వాల్మీకి రామాయణంలో ఇంత వివరంగా చెప్పిన రాముని వచనాలు చదివాక కూడా కామ- అన్న పదం దశరథుని కాముకత్వాన్ని, స్త్రీలోలత్వాన్ని సూచించడానికి వాడిందని అనుకోవడంలో తప్పు లేదు కదా!
వెండీ డానిగర్‌ను విమర్శిస్తున్న వాళ్ళలో చాలా మంది వాల్మీకి రామాయణాన్ని, సంస్కృతమూలాలను చదవలేదు. వీళ్ళలో కొంతమందికి సినిమాల్లో, టీవీ సీరియళ్ళలోనూ చూపిందే వారికి తెలిసిన రామాయణము. వీరందరికంటే, పలు భాషల్లో, పలురకాల రామాయణాలను తరచి చూసి కొత్త కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న వెండీ డానిగర్ దృక్కోణం నాకు చాలా ఆసక్తికరంగాను, పరిశోధనాత్మకంగానూ అనిపిస్తుంది. ఆవిడ విశ్లేషణతో వీరు ఏకీభవించకపోయినా ఫరవాలేదు కాని, ఆమె పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా, సంస్కృత మూలాలతో పరిచయం లేకుండా ఆమె పాండిత్యాన్ని కించపరుస్తూ నానా మాటలు అనడం సమంజసం కాదని నా అభిప్రాయం. మీరేమంటారు?
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
03/03/2014 6:16 pm
సురేశ్ చాల శ్రమ పడి, పరిశోధన చేసి ఈ వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసం చదివిన తరువాత నాకు చిన్న అనుమానం వస్తోంది. వెండీ డానిగర్ హిందువు కాదు కనుక ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆక్షేపణలలా కనిపించాయా మనవాళ్లకి? ఒక క్రైస్తవేతరుడు ఇదే రకం పుస్తకం క్రైస్తవమతం మీద కాని, ఇస్లాం మతానికి చెందని వ్యక్తి ఇదే రకం పుస్తకాన్ని ఇస్లాం మీద కాని రాస్తే ఆయా మతాల వారి ప్రతిస్పందన ఎలాగుంటుందో? మన పిల్లలని మనం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం కాని అదే పని పరాయి వాళ్లు చేస్తే చాంతాడంత కోపం వస్తుంది. – వేమూరి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
03/03/2014 12:01 pm
నిస్సందేహంగా ఇది ఒక మంచి వ్యాసం.
అలాగే కొందరు కొన్ని మంచి సందేహాలనూ లేవనెత్తారు.
భగవద్గీత ప్రస్తావనకు వచ్చింది. భగవద్గీతకు ఇప్పటికే లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. అలా వస్తూనే ఉంటాయి రానున్నకాలంలో కూడా.
నేను ‘త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున’ అన్న దాన్ని వ్యాఖ్యానించగల పాండిత్యంకలవాడిని కాను. కాని గీతలో ఇక్కడ ‘వేదా’ అని చెప్పబడినది లౌకికమైన విషయజ్ఞానం గురించి. అది త్రిగుణాత్మకమైన సృష్టిని ఎరుకపరచేది మాత్రమే అనీ, నిస్త్రైగుణ్యుడవు కమ్మని భగవానువాచలోని అంతరార్థం బహుశః త్రిగుణాత్మకమైన ప్రకృతికి అతీతమైన స్థితినిని సంపాదించమనీ చెప్పటం అనీ అనుకుంటున్నాను. నామరూపాత్మకమైనది ప్రకృతి. నామరూపాలు లేకపోతే సృష్టి లేనే లేదు. నామరూపాలచేత తెలియబడే ప్రతిదానికి దాని అభావం కూడా అలాగే తెలియబడటం చేత సమస్తద్వంద్వాలూ ఎరుకలోనికి వస్తున్నాయి. ప్రకృతిని అధిగమించినప్పుడు నామరూపాలూ అధిగమించబడి సమస్తద్వంద్వాలకూ ఉనికి ఉండని ఆ స్థితిలో శుధ్ధసత్త్వం మాత్రమే ఉంటుంది. అందుచేత త్రిగుణాత్మకమైన ప్రకృతినీ దానివలన కలిగే ద్వంద్వాలనీ (వాటిలో సుఖదుఃఖాదులూ ఉన్నాయి) అధిగమించి కేవలం ఆత్మగా సుప్రతిష్ఠితుడవు కమ్మని భగవానుడి అభిప్రాయం. ఇది నా అవగాహన. దీనితో పండితులు ఏకీభవిస్తారో లేదో తెలియదు కాని ముఖ్యంగా ఈలాంటి శ్లోకాలలో వేద శబ్దం రాగానే చతుర్వేదాలకు ఆ శబ్దాన్ని అరోపించటం అన్నిసందర్భాలలోనూ సబబు కాకపోవచ్చునని చెప్పటమే నా వ్యాఖ్య ఉద్దేశం.
మన ప్రాచీన గ్రంధాల్లో శృంగారం గురించి వ్యాసకర్త అభిప్రాయం సమర్థనీయమే. మాటవరసకు జయదేవుడి అష్టపదులకు ఈ రోజున తెలుగుచేస్తే అవి బూతులే అనిపించుకొనే అవకాశం మెండు. అదేదో గుడిలో నగ్నపార్వతి శిల్పం ఉన్నదొక ఆలయస్తంభం పైన.
మరొక అభిప్రాయం వ్యాసకర్తది కూడా సమర్థనీయమే. ఈనాడు మన మతగ్రంథాల గురించి ఇతరులు వ్రాస్తే ఆమోదాక్షేపణాదులు చెప్పటం అటుంచి వాటిపైన సాధికారంగా సమ్యక్దృక్పధంతో వ్యాఖ్యానించగల వారెందరు?
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు గారి అభిప్రాయం:
03/03/2014 10:54 am
దురదృష్టవశాత్తు శన్కరులను, రామానుజులను అధ్యయనం చేసినట్లు మధ్వాచార్యులను చాల మన్ది అధ్యయనం చేయలేదు. వాస్తవిక ఆస్తికత కేవలం బ్రహ్మమ్ లో ఎలా సమస్త వాంగ్మయమ్ సమన్వయం ఔతుందో తెలుసుకున్నపుడే జిగ్సా పజిల్ సొల్వ్ చెసినట్లు ఆహా ఫీలిన్గ్ కలుగుతున్ది. రఘు గార్కి ధన్యవాదాలు.
అసలు త్రిమతాచార్యులు చెప్పిన్ది ఏమిటొ తెలియదు కాని మిడి మిడి జ్ఞానంతో వేద వాంగ్మయాన్ని చిత్తమ్ వచ్చినట్లు వ్యాఖ్యానిన్చడమ్ మూర్ఖత్వమ్ కాక మరొకటి కాదు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రఘోత్తమరావు గారి అభిప్రాయం:
03/03/2014 4:04 am
సురేశ్ గారు,
ఇతర విషయాల కంటే మీరుదహరించిన భగవద్గీత శ్లోకాలపై వివరణ ఇవ్వదల్చాను.
//భగవద్గీతలోనూ వేదవిద్యలను, కర్మకాండను నిరసిస్తూ శ్లోకాలు కనిపిస్తాయి. ప్రసిద్ధి చెందిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా’ అన్న శ్లోకానికి ముందున్న నాలుగు శ్లోకాలు, వేదాలలో ఉన్న జ్ఞానం పైపైన ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నా అది త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందిందని, ఆత్మజ్ఞానానికి పనికిరాదని ఖరాఖండిగా చెబుతున్నాయి.//
మీరు చెప్పిందే గనుక కృష్ణుడి ఉద్దేశ్యమైతే ఇక వేదాలకు విలువేమిటి? వేదవేత్తల అస్తిత్వమెక్కడ? వేదాలను విడిచిపెట్టిన ఆత్మజ్ఞానం అన్నది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. కనుక కృష్ణుని పై మాటలకు అసలైన అర్థాలను తెలుసుకోవాలి.
త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్య వ్రాసిన గీతాభాష్యం ఆధారంగా మీరుదహరించిన శ్లోకాలకు యథామతి వివరణనిస్తున్నాను.
యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః
వేద-వాద-రతాః పార్థ నాన్యదస్తీతి వాదినః (2.42)
//సురేశ్ వ్రాసినదిః పార్థా: అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు (వేద-వాద-రతాః) ఇంతకు మించింది వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.//
మధ్వాచార్య భాష్యంః
“ముక్తిని పొందడమనేది ’ఫల’మైతే స్వర్గాది భోగాలు పువ్వులవంటివి (పుష్పితాం). కేవలం వేద శబ్దాలను (వాచాం) మాత్రమే వల్లించేవారు కర్మలను, వాటి వల్ల లభించే సుఖాలను మాత్రమే తెలుసుకుంటారు. అలాకాక, ఎవరు వేదాలలోని అర్థాలను తెలుసుకొని మాట్లాడుతారో (వేదవాదరతాః) వారు ఫలం (ముక్తి) పట్లనే ఆసక్తి కలిగివుంటారు గాని పువ్వుల (కర్మజన్యువులైన స్వర్గాది సుఖాలు) పట్ల ఆదరం చూపరు.”
కామాత్మానః స్వర్గ-పరా జన్మ-కర్మ-ఫల-ప్రదాం
క్రియా-విశేష-బహులాం భోగైశ్వర్య-గతిం ప్రతి (2.43)
//సురేశ్ వ్రాసినదిః కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవీ, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైశ్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.//
మధ్వాచార్య భాష్యం: సుఖం, సంపత్తు (భోగైశ్వర్య) మొదలైన వాటిపైనే మనసు పెట్టిన వారు (కామాత్మానః) వాటిని ప్రసాదించే కర్మలందే ఆసక్తి కలిగినవారవుతారు. తద్వారా మళ్ళీ మళ్ళీ కర్మలను చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ చివరకు అనగా మహాప్రళయానంతరం అంధఃతమస్సును (గతిం) పొందుతారు (ప్రతి).
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥ (2-44)\
//సురేశ్ వ్రాసినదిః భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్చయ జ్ఞానం ఏర్పడదు.//
రఘుః పై పేర్కొన్న మధ్వభాష్యంలోనే ఈ శ్లోకాన్ని కూడా చేర్చడమైంది కనుక ప్రత్యేకంగా వ్యాఖ్యానించలేదు.
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్॥ (2-45)
//సురేశ్ వ్రాసినదిః అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి. నీవు వాటికి అతీతుడవై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యము శుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను వర్జించి ఆత్మజ్ఞానివి కమ్ము.//
మధ్వాచార్య భాష్యం: త్రిగుణాత్మకమైన (అన్ని) విషయాలను తెలిపేవే వేదాలు. (అంటే వేదాలు త్రిగుణాత్మకాలు కావని, కేవలం సంసారానికి మాత్రమే చెందినవి కావని అర్థం). బాహ్యదృష్టికి వేదాలు త్రిగుణాత్మకమైన కర్మల్ని, సుఖాలను చెబుతున్నట్టు కనిపించినా “పరోక్షవాది వేదానాం” అన్న వాక్కును అనుసరించి బాహ్యమైన వేదార్థాలను మాత్రమే తెలుసుకోకు. ఓ అర్జునా! వేదాలలోని త్రిగుణబాధితాలైన బాహ్యవిషయాలు విషం వంటివి కనుక వాటిని విడిచిపెట్టు (నిస్త్రైగుణ్యో భవ). వేదాలలోని అంతరార్థమైన, త్రైగుణ్యవిషహారిణియైన పరమాత్మతత్వాన్ని (కృష్ణతత్వం) తెలుసుకో. అప్పుడు నువ్వు ఆ పరమాత్మతో అనుసంధానింపబడగలవు, శుద్ధసాత్వికుడవు కాగలవు. విరుద్ధ యోగాల నుండి విముక్తుడవై క్షేమంగా ఉండగలవు. (నిర్ద్వంద్వ – నిత్యసత్వస్థ – నిర్యోగ – క్షేమ),
యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥ (2-46)
//సురేశ్ వ్రాసినదిః అంతటా జలం పొంగుతున్నప్పుడు బావి యొక్క ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.//
మధ్వాచార్య భాష్యం: బావి (ఉదప)లోని నీటి యొక్క ఉపయోగం, చుట్టూ విస్తారంగా నిండివున్న నీటి (సంప్లుత+ఉదక) ఉపయోగంతో ఎలా పోల్చవచ్చునో (యావన్ + అర్థ) అదేవిధంగా వేదాలలో (బాహ్యార్థంలో) తెలుపబడ్డ త్రిగుణాత్మకాలైన కర్మల్ని, సుఖాల్ని వేదవిదులు కూడా పొందుతారు. (అంటే వేదవిదులు ఆ సుఖాల కొరకు ప్రత్యేకంగా ప్రయత్నించరు అని అర్థం)
—–
ద్వితీయాధ్యాయారంభంలో కృష్ణుడు “ప్రజ్ఞావాదాంశ్చ భాషసే” అంటాడు. బుద్ధికి తోచినట్టుగా మాట్లాడ్డమే ’ప్రజ్ఞావాదం.’ ఇది నిజానికి ప్రజ్ఞ+అవాదం అన్న సంధితో వచ్చింది. ప్రజ్ఞ అంటే వేదవిహితమైన లేక శాస్త్రవిహితమైన ఆలోచన. దానికి విరుద్ధమైనది (అవైదికమైన/అశాస్త్రీయమైన) అవాద ప్రజ్ఞ.
గీతకు విరుద్ధమైన వ్యాఖ్యానాలను చేస్తే అది కూడా ’ప్రజ్ఞావాద’మే అవుతుంది.
ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద గురించి సాయి పద్మ గారి అభిప్రాయం:
03/02/2014 9:11 am
మార్మికత నాకు అర్ధం కాదు. చాలా సార్లు మర్మం లేకుండా ఒక వాక్యం రాయటం ఎంత సులభమో అంత కష్టం కూడా నాకు. అలాంటి ఒక వాక్యాల సమాహారం, ఒక జీవితకాలపు మధనాన్ని ఈ పిల్ల కొన్ని వాక్యాల్లో ఇంత నెప్పితోనో, లేకుండానో ఎలా రాసేస్తుందీ అని నాకెప్పుడూ ఆశ్చర్యమే! ఒక్కోసారి ఆ ఫిలసాఫికల్ డైలమా మీద విచారం కూడా. ఎలాంటి విచారం అంటే, ‘మల్లెపూవు ఎగిరిపోయాక రాయి మీద పడ్డ పగులంత’ ‘ఎదురుచూడ్డం చేతకాని రోజున ఏడవటం మర్చిపోతానేమోనన్న భయమంత…’
నిజమే. మిన్నాగుల్లాంటి మనిషి చేసే పనులకన్నా వానపాముల్లాంటి ఆలోచనలు ఎంత నెప్పో తెలిసినదాన్ని కనుక, స్వాతి మీద ఇష్టం లాంటి గౌరవంతో… వీలుంటే, తప్పక చదవాల్సిన మిస్టికల్ మ్యూసింగ్స్!!
ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద గురించి కె. కె. రామయ్య గారి అభిప్రాయం:
03/02/2014 6:33 am
త్రిపుర తండ్రితో మాకు దొరికిన, దొరికి చెయిజారిపోయిన అపురూప క్షణాల అలౌకికానందాలకు అక్షరరూపం ఇచ్చినట్లుగా భావన కలిగించిన రచయిత్రి స్వాతికుమారి గారికి (త్రిపుర గారి వీరాభిమానికి) కృతజ్ఞతలు.
About eemaata గురించి Rathnaji SV గారి అభిప్రాయం:
01/31/2014 7:09 am
నమస్తే, మీ పత్రిక చాల చాల బాగున్నది. అంతర్జాలం నందు ఈరొజే కొత్తగ చూస్తున్నాను. పాత సంచికలు అన్ని చదివితె కాని సంత్రుప్తి కలుగుతుంది.
మరొక్కసారి అబినందనలతొ
రత్నాజి యస్ వి, తిరుపతి
మంచు గురించి మెర్సి మార్గరెట్. గారి అభిప్రాయం:
01/27/2014 4:42 am
నిజం చెప్పమంటారా? ఆ పాత్రలోని వ్యక్తి గురించి నేను కూడా అంతవరకు ఆసక్తిగా చదువుతూ వస్తున్నానా, అలా ప్రశ్నించడం చదవగానే నాకూ నవ్వొచ్చింది.
చాలా మంది ఈ లోకంలో వాళ్ల కోసం కన్నా ఎదుటివాళ్ల గురించి ఆలోచిస్తూ సమయం గడిపేస్తారు. మొత్తానికి సమయం గడిపేసాము ఇవ్వాళ్టికి అన్నట్టుగా. కాని అనివార్య పరిస్తితుల్లో ఎదుటివ్యక్తుల గురించి తెలుసుకోవడంలో ఉండే ఆ త్రుష్ణే వేరేమో. మొత్తానికి కథలో పేర్లు లేకుండా, చివరి వరకు ఆసక్తిగా కథని నడిపించడం ఒక ఎత్తెతే ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండానే వెనుతిరగడం ఒక లాంటి వెలితి మిగిల్చింది. అదే కథని ఎక్కువ రోజులు గుర్తుంచుకునేలా చేస్తుందేమో.
మీ కవితలు చదివడం వళ్ల, మీరు రాసిన కథలో కూడా ఆ కవిత్వం నాకు అడుగడుగునా కనిపించింది. ప్రకృతిని మీరు వర్ణించిన తీరు అద్భుతం. నాకు కథ చాలా నచ్చింది. నేనే కథకి ముగింపు నిచ్చేసుకున్నా ఆ వ్యక్తి గురించి తెలుస్కోలేని వెలితితో అదే ఆలోచిస్తూ ఆత్మహత్య వాయిదా పడిపోయి ఉంటుందని. లేదా ఒక అద్భుతమైన కళాఖండం చిత్రించాక ఆ సఫలత విజయంలో తన ఆత్మహత్య మరిచిపోయాడని.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:
01/15/2014 8:25 pm
“కథని ఉత్తరం ద్వారా చెప్పడం చాలా బాగుంది ”-అనే మీ ప్రశంస నాకెంతగానో నచ్చింది సూర్య నారాయణ మూర్తి గారూ!
-ఫోన్ చేసి కాని,ఎదురయి కానీ మాటల్లో చెప్పలేని కొన్ని అతిసున్నితమైన హృదయ భావాలను – అవలీలగా వ్యక్తపరచగల ఒకేఒక్క సాధనం –‘ఉత్తరం’ అని నా నమ్మకం.భావోద్వేగపూరితమైన వాక్య విన్యాసానికి ఉత్తరం మాత్రమే ఓ గొప్ప శరణ్యం. ఇంకా చెప్పాలంటే,ఉత్తరాలు రాయడం ఒక కళ. అందుకే ఈ కథకింతటి కళని తెచ్చిచ్చిందనిపిస్తుంది నాకు.
నిజానికి ఇదొక ప్రేమలేఖ. మాటల్లో చెబితే మన్నిక పోతుంది. అది- అక్షరం లోనే నమ్మకాన్ని పొందుతుంది. అందుకే కామోసు -“A real love letter is made of insight, understanding, and compassion. Otherwise it’s not a love letter. A true love letter can produce a transformation in the other person, and therefore in the world. But before it produces a transformation in the other person, it has to produce a transformation within us. Some letters may take the whole of our lifetime to write.” అని అంటాడు ఒక జెన్ బోధకుడు. ఈ మాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి,మరెంతగానో ఆలోచింపచేస్తాయి- కదూ?
కథ ‘ఏకబిగిన చదివించిందనే’ మీ మరో ప్రశంసకి..ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ,
సంక్రాంతి పండగ శుభాకాంక్షలతో..
అసమయాల అమావాస్య గురించి Radha గారి అభిప్రాయం:
01/13/2014 3:11 am
సాయి పద్మగారూ, ‘భార్యాభర్తలు కొంత వయసు మళ్లాక పాత అనుభూతులను పంచుకుంటే జీవితోత్సాహం కలుగుతుంది’ అనేది కల ద్వారా చెప్పడం పాత కధే కాని మీరు కవితాత్మకంగా చెప్పడం వలన కథ బాగుంది. అయినా ఇలాంటి కథలు ఎన్ని వచ్చినా బాగుంటాయి. అభినందనలు
మంచు గురించి raju గారి అభిప్రాయం:
01/08/2014 6:11 pm
చావంటే ఏమీలేనితనమా? ఎవరు చెప్పారండీ? ఎవడైనా చచ్చిపోతే ప్రపంచంలో ఇంకేమీ ఉండదా? బెంగళూర్ లాంటి ఊళ్ళో ఉద్యోగం చేస్తూ వీకెండ్ కి విహారయాత్రలకి వెళ్లి చూసొచ్చిన రాళ్ళ మీద తొండల్నీ బట్టలు ఉతుక్కునే బండల్నీ బ్రహ్మాండంగా వర్ణించేస్తే కధ అయిపోయిందా?
చావు గురించే కధ అయితే ఏ వల్లకాణ్ణో వర్ణించొచ్చు. ఈ వల్లకాడు అనేది రచయిత వాడిన మాటే. ఈ కధకి తలా, తోకా, వల్లకాడు, ఏమీ లేవు. అయితే ప్రకృతి వర్ణన బాగానే ఉంది కాని కధకి అది సరిపోదు. చావంటే ముక్కూ మొహం తెలియని వాడింట్లో బంగాళా దుంపల వేపుడు అన్నం కడుపు నిండా తినడం కాదు. అది తిన్నాక దాన్ని జీవితాంతం (!) గుర్తుపెట్టుకుంటానని చెప్పడం అంతకన్నా కాదు.
[Comment edited – Ed.]
స్పందన: నన్నెచోడుడు ప్రబంధయుగానంతర కవియా? గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
01/08/2014 4:04 pm
ఏల్చూరివారి వ్యాసం వివిధవిషయసమన్వితంగా, పాండితీమండితంగా ఉందనుటలో సందేహం లేదు. వారునన్నెచోడుని, తెనాలిరామకృష్ణుని పద్యాలు రెండూ శృంగారతిలక మనే సంకలనగ్రంథస్థ ‘బాహూ ద్వౌ చ’ అనే శ్లోకానికి అనుసృజనలని నిరూపించడం గూడ చాలా గొప్పగా నున్నది. కాని శృంగారతిలకసంకలనాలను ఆధారంగా చేసుకొని నన్నెచోడుని కాల నిర్ణయం చేయడం సమర్థనీయంగా తోచుటలేదు.
పండితులవదనాలలో తరతరాలుగా మెదలుచున్న, లేక పూర్వగ్రంథాల్లో నున్న(అవి లుప్తమైనా నిలిచియున్న) చెదురుముదురు శ్లోకాల సంకలనమే శృంగారతిలక మని వారే నిరూపించినారు. అందులో కొన్ని శ్లోకాలు 9, 10 శతాబ్దాల నాటివే అనియు వారే తెల్పినారు. కాని నన్నెచోడునకు గాని, రామకృష్ణునకు గాని పరిచితమైన ఈశ్లోకానికి ఈసంకలనమే మూలమని ఇదమిత్థంగా నిర్ణయించలేము. కాళిదాసు, భోజరాజుల కాలంనాటి చాటువులు కేవలం జనశ్రుతివల్ల ఈనాటికీ నిలిచియుండుట మనం గమనింపవచ్చు. అట్లే జనశ్రుతిలో నున్న పైశ్లోకం నన్నెచోడుని పద్యానికి మూలమై ఉండవచ్చు ననే అంశాన్ని మనం త్రోసిపుచ్చలేము. అందుచేత నన్నెచోడుని కుమారసంభవం శృంగారతిలకానంతరగ్రంథ మని ఇదమిత్థంగా చెప్పలేము. ఈ నిర్ణయం కావ్యమందలి భాషాసంప్రదాయాలను, ఇతర చారిత్రకాధారాలనుబట్టి చేయడం సమంజసంగా ఉంటుంది.
ఏల్చూరివా రొకచోట నన్నెచోడుని పద్యంలో రామకృష్ణుని ఉద్భటారాధ్యచరిత్రలో నీశ్లోకానుకరణలో నున్న ‘అతిరిక్తభావాలు’ వచ్చిచేరాయని తెల్పినను, అది కాలనిర్ణయానికి సరియైన ఆధారంగా కన్పడదు. ఎందుకంటె మూలశ్లోకానువాదం చేసినప్పుడే, రామకృష్ణునితో ప్రసక్తి లేకుండ నన్నెచూడుని కిట్టి పదబంధములు దోచియుండుటలో ఆశ్చర్య మేమీలేదు. ఆమహాకవి కంతపాటి సామర్థ్యము లేకపోలేదు. ఏల్చూరివారి వ్యాసంవల్ల గ్రహింప వలసిన ముఖ్యవిషయం నన్నెచోడుని అనుసృజన రామకృష్ణునికంటె న్యూనంగాను, రసభంగకరంగాను ఉన్నదనుట. ఈవిషయాన్ని వారత్యంత విశ్వసనీయంగా, నిర్ద్వంద్వంగా నిరూపించినారనడంలో విప్రతిపత్తి లేదు. కాని ఈపద్యాన్ననుసరించి వారు చేసిన నన్నెచోడుని కాలనిర్ణయం సమర్థనీయంగా లేదని నాయభిప్రాయము.
మంచు గురించి రఘోత్తమరావు గారి అభిప్రాయం:
01/07/2014 6:41 am
“వచ్చిన పని కాకుండా చస్తానేమో అనుకుంటూ బాత్రూంలోకి నడిచాను.” — అన్న మాటల్లో ప్రధానపాత్రను అర్థం చేసుకునేందుకు మొదటి సంకేతం దొరుకుతుంది. పనిలో పనిగా “ఏమిటా పని?” అన్న ఉత్సుకతను పాఠకుల్లో రేకెత్తిస్తుంది కూడా.
“ఏమీ పట్టకుండా ఎవరుంటారు ఈ ప్రపంచంలో? ఏమీ లేని జీవితంలో ఏకాంతం ఉంటుంది. అదీ లేని మనసెలా ఉంటుంది?”ఎం> — ఇది రెండవ సంకేతం. కథలోని ప్రధాన పాత్ర చావడానికి వచ్చినట్టుగా ఇంకా పాఠకులకు తెలీదు. అంతే కాదు అతను కొండ మీది పల్లెను వెదుక్కుని చేయడానికి “వచ్చిన పని” ఏమిటో కూడా బోధపడలేదు. కానీ ప్రకృతి పట్ల అతని ప్రతిస్పందనలు, సాటి వ్యక్తి జీవనశైలిని చూసి ఉలిక్కిపడడాల వల్ల అతను ఓ గొప్ప పనికై వచ్చాడని ఊహించుకొనే అవకాశం ఉంది.
“ఇదేనా నా కాబోయే ఆఖరి అద్భుత కళాఖండం? మై స్వాన్ సాంగ్ టు దిస్ అన్‌డిౙర్వింగ్ వర్‌ల్డ్? పంతం కోసం కాదు. నిజమైన కళాకారుడికి చావంటే భయం ఉండదని లోకానికి నా వల్ల తెలియాలి.” — ఇక్కడ అతని పల్లెయాత్ర గురించి, అతను “వచ్చిన పని” గురించి ముఖ్యమైన విషయాల్ని అతని ద్వారానే చేరవేయిస్తాడు రచయిత.
నిజానికి, చావు = ఏమీలేనితనం. తను కోరి కోరి వచ్చింది ఈ emptiness/nothingness ను సాధించడానికి…అదీ ఆత్మహత్య ద్వారా. కానీ ఆసక్తికరంగా తను వచ్చిన పనిని మర్చిపోయి, “కుర్చీలో కూచున్నప్పుడు మీరేం ఆలోచిస్తారు? పోనీ, మీరు ధ్యానం చేసుకుంటారు కదూ. కనీసం ఈ విషయమైనా ఒప్పుకోండి,” అని అడుగుతాడు. ఇదీ అతని లోని జర్జరీకృత మనస్తత్వానికి (split personality?) అసలైన సంకేతం.
ఛస్తే తప్ప తెలిసిరాని తన అస్తిత్వాన్ని కొండమీది టీచర్ ద్వారా వ్యక్తపరిచింది మృత్యువు. ఆ మాత్రపు ప్రతీకదర్శనాన్నే తట్టుకోలేని వాడు కనుకనే పారిపోయాడు. మంచులాంటి వ్యక్తి నుండే కాదు, చావు నుండే కాదు “అత్యద్భుతమైన కళాఖండా”న్ని చిత్రించాలన్న ధృడ సంకల్పం నుండి కూడా పారిపోయాడు. అతను ఓ సంకల్ప వర్జితుడు. వ్రాత్యుడు. ఎత్తైన ఊహల్ని ఆశయాలుగా పెట్టుకుని ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేని ఆరంభశూరుడు. ఆనంద్ సాయ్ గారన్నట్టుగా ఓ సగటు జీవి.
అందుకనే ప్రథమ పురుష చక్కగా కుదిరింది. నా మనోవైకల్యాన్ని నేనుగా ఒప్పుకుంటే, చెప్పుకుంటేనే విలువ ఎక్కువ! ఐనా, రచయిత ఏ పురుషలో చెప్పాడన్నదాని కంటే కూడా చెప్పదల్చుకున్న విషయాన్ని సారభూతంగా చెప్పాడా లేదా అన్నదే ముఖ్యమని నా అభిప్రాయం. ఈ విషయంలో సుబ్బూకు 90/100 మార్కులు 🙂
తరగని దూరం గురించి Vani గారి అభిప్రాయం:
01/07/2014 3:04 am
సావిత్రిగారు,
నిజమే, దూరాలు పెరిగినా ఫోన్లో మాత్లాడుతున్నాం అనుకుంటున్నాము, కాని మనసుల మద్య అగాధాలు పెరిగిపోతున్నాయి. ఏ మాటా మనసులులో నుండి రాదు. అన్నీ పొడి మాటలే. కవిత చాలా బాగుంది
– vaaNi
మంచు గురించి anand sai గారి అభిప్రాయం:
01/06/2014 5:11 pm
గ్రాండుకేన్యను పోయేటేళ్ళు యావరేజిన అక్కడుండేది ఆరు నిమిషాలంట. అక్కడికి పోయేది, విస్టా పాయింట్ల ఒక ఫోటో దిగేది, మళ్ళా కారెక్కి ఇంకేడకో బోయేది. బతికినందాకా ఇట్లా అది చూసినా, ఇది చేసినా అని టిక్కులు గొట్టుకునే మనుషులు. లవరుతో తాజ్‌మహలు చూసేదానికి పోయి, ఉన్న కాసేపు ఫేస్‌బుక్కులో పెట్టుకునేటందుకు ఫోటోలు దిగేటోళ్ళు. ఈ కథలో ఉండేటోడు అట్లాంటోడు. మనందరి లాంటోడు.
ఈ కథలో వాడు నిజానికి చచ్చిపోదామని వచ్చినాడా? ఎట్లా నమ్మేది? నాకు నవ్వొస్తా ఉంది మీరంతా దానికి పడిపోతే. కథలో ఏమున్నాదో చూసి కదా కథ ఏం చెప్తావుందని ఆలోచించేది. కథలో ఏంది అనేది వాడు: “పంతం కోసం కాదు. నిజమైన కళాకారుడికి చావంటే భయం ఉండదని లోకానికి నా వల్ల తెలియాలి.” అంటే ఏమని? ఇదేమో వానికి సొంతంగా పుట్టిన బుద్ధి కాదని. వాని స్కాచీ, వాని కాష్మీరీ షాల్, వాని ఇంట్లో పెయింటింగులు, వాడు దిన్న రకరకాల తిళ్ళు గురించి మనకెందుకు చెప్పింది? వానికి పదిమందీ వాణ్ణి జూసి ఏమనుకునేదీ వానికి ముఖ్యమని తెలియట్లా? నా పేరు అడగద్దు అనె.అని నిమిషం గాకపాయె, నీపేరేంది, నీ ఉద్యోగమేందని మొదలెట్టినోడు కదా. వాడా చచ్చిపోయేది? వాడు కళాకారుడే. అడ్వర్టైజింగ్ అని యాడ చెప్పుకునండబ్బా? ఎలక్షన్ల బ్యానర్లు గీసేటోళ్ళు గూడ కళాకారులే. ఇంటినిండుగ ప్రకృతి చిత్రాలు పెట్టుకున్నోళ్ళందరు జిడ్డు కృష్ణమూర్తులా ఏంది? మనసుల లోతు లేకుంటే మల్లెపూలంత తెల్ల లాల్చీలు కట్టుకుంటే వస్తందా? పుస్తకాలు చదువుకున్నోళ్ళు చాలమంది, ఇంటర్నెట్ల వాళ్ళ జ్ఞానం జల్లుతుళ్ళా మనమీద? వాళ్ళల్ల ఎంతమంది నిజంగ చదువుతోటి మరింత మంచి నేర్చుకొన్నోళ్ళు? మనసు నిజంగ పెద్దది చేసుకున్నోళ్ళు? అందులోంచి నిజంగ నేర్చుకున్నోళ్ళు? చావాలనంటే బాత్రూము చాలదా ఏంది, అరకులోయే కావాల్నా? వాడు నాలాంటోడు నీలాంటోడు. పెద్ద ఫేకుగాడు. ఎప్పుడూ దేనికోదానెంబడి మనం పరిగెత్తుతుళ్ళా? మరి మనకి, డబ్బు, పేరు, గొప్ప, ఏదీ పట్టకుండ నిజంగ నిమ్మళంగ బతికేటోడు కనిపిస్తే ఏమనుకుంటం? నిజాయితీగ మీకు మీరే చెప్పుకునండి. ఒక్క నిమిషం ఖాళీగుంటె మనకి బోరు కొడతది. ఎందుకు అని ఒక్క పాలి ఆలోచించినామా? లే. I am feeling bore అని ఫేస్బుక్ల పెట్టి పదిమందికి మాత్రం చెప్పుకుంటం.
వాడేదో ఊడబీకి నేనింత గొప్పోణ్ణి అని అందరూ గుర్తు పెట్టుకోవాల అని వచ్చినోడే గానీ నిజంగా చచ్చేటోడు కాదు. అసలేం ఊడబీకాలనో గూడ వానికి తెలీకపాయె. ముందు నాలుగు రంగులు చాలనుకొనె. ఆపైన ఇంకా కావాలనుకొనె. వాణ్ణి అందరూ పట్టించుకోవాలె, వాణ్ణి గురించి ఆలోచించాల, అదీ వాని కోరిక. పైగా వాణ్ణి వాడు పెద్ద పోటుగాడనుకుంటన్నాడు గదా. మరి అట్లాంటోనికి, ఏమీ పట్టనోడు కనిపిస్తే ఎట్లుంటది? చావును జూసినట్లుంటది. అంతే. తోక కాళ్ళసందుల పెట్టుకొని సక్కంగ వెనక్కి పరిగెత్తిపోయినాడు. అంతే. ఈ కథ ఆ ఫేకు ఆర్టిస్టుగాడి మీద. దామోదర్ మృత్యువు గాదు, ఈ కథ నిజంగా చచ్చిపోదామనుకున్న గొప్ప కళాకారుడిది కాదు. ఈ కథల తాత్వికతా లేదు. గాడిదగుడ్డూ లేదు. తెలివిగ రాశినా కొన్ని చోట్ల డొంకతిరుగుడు మాత్రం ఉండాది. అందుకనే మనకి ఏమేమో కనిపిస్తాఉన్నాయి ఈ కథలొ లేనివన్నీ.
[దయచేసి వాక్యాలను రెండు చుక్కలతో (..) ముగించకండి. కామాల బదులు .. వాడకండి – సం.]
మంచు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
01/06/2014 2:36 pm
చివర వాడిన “ఆత్మహత్య” అనే పదం పాఠకుల్లో వ్యతిరేకభావాన్ని కలిగించినట్టుంది. దాని బదులు “నిర్యాణము” అనో, “సమాధి” అనో అని ఉంటే ఆలోచనలు మరోలాగా సాగి ఉండేవేమో! సాధారణంగా తీవ్రనిస్పృహ కాని, క్షణికావేశం కాని ఆత్మహత్యకు దారితీస్తాయన్నది బాగా తెలిసిన విషయం. ఇక్కడ కథకుని నిర్ణయానికి ఆ రెండూ కారణాలు కావన్నది స్పష్టమే. ఇంతకీ అతను ఆత్మహత్య చేసుకోలేదు. చేసుకోవాలనుకున్నాడు. ఎప్పుడు? ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించి. తనకి పూర్తి సంతృప్తినిచ్చే ఒక కళాఖండాన్ని ఏ కళాకారుడైనా సృష్టించగలడా అన్నది పెద్ద అనుమానం! అదే కాని జరిగితే, బహుశా ఆపై అతనికి బ్రతుకు కొనసాగించే అవసరం కనిపించదు. అలాంటి ఒక కళాఖండాన్ని సృష్టించి బ్రతుకు చాలించాలన్నది ఈ కళాకారుని వెఱ్ఱి ఆశ. తానొక చిత్రకారుడు కాబట్టి, ప్రకృతికి బాగా దగ్గరై, అందులోని వర్ణాలను తన కుంచెలో పట్టుకోవాలని నాగరికతకు దూరంగా కొండప్రాంతానికి వచ్చాడు. అలా వచ్చినవాడికి తనకు పూర్తిగా భిన్నమైన, వ్యతిరేకమైన వ్యక్తివం, దృక్పథం కలిగిన మనిషి తారసపడ్డాడు!
ప్రకృతిలాగానే, చిత్రకారునికి జీవితం కూడా రంగులమయంగానే కనిపిస్తుంది. రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, కోరికలు, సందేహాలు, అన్నీ అతనికి కావాలి. అలాంటి వాడికి ఒక నిజమైన సన్యాసి తారసపడ్డాడు. అతన్ని చాలా దగ్గరగా చూసే సందర్భం వచ్చింది. అతనో నిర్వికార నిరంజనుడు. జీవితం పట్ల ఎంతో పిపాస ఉన్న తను దాన్ని త్యజించాలని అనుకుంటూ ఉంటే, అసలు దానిపై ఎలాంటి కోరికా కనబరచని మరొకడు ఏమాత్రం విసుగూ విరామం లేకుండా జీవిస్తూ పోవడం అనేది ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అలా అని అతని బ్రతుకులో యాంత్రికత లేదు. జీవం (తడి) ఉంది. కాని అది నీటితడి కాదు, మంచు తడి! కాంతిహీనమైన నలుపు కాదది. అన్ని రంగులూ కలగలిసిపోయిన తెల్లదనం. అతను మూగవాడు కాదు, మౌని. కవి అయినవాణ్ణి భయపెట్టే మౌనం. చిత్రకారుణ్ణి బెంబేలెత్తించే తెల్లదనం!
నా యీ వ్యాఖ్యానమంతా కథలో ఉన్నదని నేననడం లేదు. ఇది కూడా పైన రఘుగారి వ్యాఖ్యానం లాంటిదే. ఇదా, అదా, రచయిత ఉద్దేశం ఏమిటన్నది స్పష్టంగా లేదు. ప్రతి కథలోనూ అలాంటి స్పష్టత ఉండలని నేననను. కాని యీ కథకి మాత్రం అది అవసరమని నా అభిప్రాయం. అది లేకపోవడం కథలో లోపమనే నేను భావిస్తాను. కథకుని వ్యక్తిత్వాన్ని, జీవితం పట్ల అతని దృక్పథాన్ని అంచానా వేసే అవకాశం పెద్దగా పాఠకులకి ఇవ్వలేదు. బహుశా అలాంటి అవకాశం ఇవ్వకూడదనే కథని ఉత్తమపురుషలో నడిపించారేమో తెలియదు కాని, పైన పూర్ణిమగారు అన్నట్టుగా, ప్రథమపురుషలో సాగి ఉంటే అందుకు మరింత అవకాశం ఉండేదని నేను అనుకుంటున్నాను.
మంచు గురించి పూర్ణిమ గారి అభిప్రాయం:
01/05/2014 3:28 pm
కథను గురించి నాదో ప్రశ్న. రచయితగానీ, ఎడిటర్లుగానీ అవసరమనిపిస్తే సమాధానాలు ఇవ్వవచ్చు.
ఈ కథకు first party narration సరిపోయిందని మీకు ఎందుకు అనిపించింది? ఇందులో అతడు పనిజేస్తున్న రంగం అడ్వర్టైజింగ్ అనీ, చిత్రాలు గీస్తాడో / తీస్తాడో అని చూచాయిగా చెప్పుకున్నాడు. అతడి మాటలే బోలెడంత కవితాత్మకంగా ఉన్నాయి. ఇంతిలా చెప్పగలిగినవాడి ఆర్ట్ పెయిటింగో, ఫొటోగ్రఫీయో ఎందుకు కావాలి? కళాఖండం సృష్టించడానికి, ఆపై ఆత్మహత్య ఆలోచన ఉన్నవాడు, వాటిని గురించి గట్టిగా ఆలోచించకుండా, కేవలం తనకు ఆశ్రయమిచ్చినవాడి దినచర్య గురించి అవసరానికి మించిన కుతూహలం చూపడం ఎలా జస్టిఫై అవుతుంది? ఈ కథ third party narrationలో ఉండుంటే కొంచెం మెరుగ్గా ఉండేదనిపిస్తోంది. మీరేమంటారు?
కథ ఆసక్తికరంగా ఉంది గానీ convincingగా లేదనిపిస్తోంది నాకైతే! జననం (life) లాగా చావుకి gestation period అవసరం లేదు కదా! ఒక్క క్షణం చాలు, దాని పని అది కానిచ్చుకోవడానికి. మరి అలాంటి మృత్యువుతో సావాసంలో అర్థమేమిటి? లేక, ఆ కొండపైన అతడున్న రెండురోజులు చనిపోయిన తర్వాత అతగాడి afterlife సూచిస్తుందా? అన్నది కూడా బోధపడ్డం లేదు. (ఈ పేరా కథపై నా ఆలోచనలు మాత్రమే! నేను అడగదల్చుకున్న ప్రశ్నలో భాగం కావు.)
గరళం గురించి bhaskar kondreddy గారి అభిప్రాయం:
01/04/2014 11:42 pm
battu vijaykumar గారు, నిజానికి పోటి అవసరం, లామార్క్ చెప్పినట్లు తట్టుకోగలిగినవే మనగలుగుతాయి, కాని ప్రస్తుతం కృత్రిమంగా సృష్టించబడుతున్న అనారోగ్య పోటీ వాతావరణం విషం లాంటిదేమోనని, అలా గరళం అని శీర్షిక పెట్టాను. ధన్యవాదాలండి.
మంచు గురించి Ravi Patnaik గారి అభిప్రాయం:
01/03/2014 5:58 pm
సో, చావు దగ్గిరకి వెళ్తే వేణ్ణీళ్ల స్నానం, మాంఛి రెసెప్షనూ, మళ్లీ వెళ్లిపోతాననే వరకూ ఏమీ అడగకపోవడం, వెనక్కి వచ్చేసేటప్పుడు బస్సుదాకా సహాయం. ఇందులో మళ్లీ తలుపు వేసేసిన రూమూ, పాస్టరు గారూ స్వర్గానికి చిహ్నమా? భలే, భలే. ఏదైనా సినిమా డైరక్టర్ దగ్గిరకి తీసుకెళ్తే బాగుంటుందేమో? చచ్చేవాడికి ఒక సూపర్ పైంటింగ్ వెయ్యాలనే కోరికెందుకో? వాడికి వేణ్ణీళ్లు పెట్టి ఇచ్చేది మృత్యువు! ఆహా ఏమి సూపర్ కధండీ!
దామోదర్ అనే పేరులో, ఆయన చేసే బడి పంతులు ఉద్యోగంలో కూడా ఏదో అర్ధం కాని లొసుగు ఉందేమో కాస్త వివరించి మా లాంటి అల్పులకి జ్ఞానోదయం చెయ్యండి మరి. ఏమో ఈ పేరుకి ఏ అర్ధం తీయగలరో?
చివరిగా ఒక మాట – please read about frost bite on Google before trying to educate other people. And those who decide to kill themselves are not afraid. Those who commit suicide are dare devil people. Anyways, au revoir to this discussion.
(Comment edited -Ed.)
కవిరాజశిఖామణి గురించి మోహన గారి అభిప్రాయం:
01/01/2014 9:28 pm
తెలుగు కావ్యాలలో మొట్టమొదట మనము కవి ఇష్టదేవతాస్తుతిని చదువుతాము. ఈ పద్యములు సామాన్యముగా త్రిమూర్తులపైన, లక్ష్మీ సరస్వతీ పార్వతులపైన, వినాయకునిపైన, తదితర దేవతల మీద ఉంటాయి. కాని కుమారసంభవములో మనము మన్మథునిపైన కూడ ఒక పద్యమును (హరుఁ డాదిగ సకల) మూడవ పుటలో చదివినాము. ఇలాటి పద్యమును పంపకవి వ్రాసినట్లు తెలిపినాను. ఆ పద్యము –
చ. సహజద చెల్వినొళ్ రతియ సోలద కేళికెయొళ్ పొదళ్దు స-
న్నిహితవెనిప్పపూర్వ శుభలక్షణ దేహదొళొళ్వనాళ్దు సం-
దహికటక ప్రసాదదె మనోజసమం గెలెవందనాగళుం
సహజమనోజ నెమగీగె విచిత్ర రతోత్సవంగళం
– పంప భారతము, 1.04
సహజసౌందర్యముతో రతీదేవితో ఓటమినొందని కేళికలలో మునిగి అపూర్వమైన శుభలక్షణాలతో విరాజిల్లుచు శివుని వరప్రసాదముచే సహజమనోజుడు విచిత్ర సంభోగోత్సవములను మనకీయు గావుత! అరికేసరికి సహజమనోజుడని ఒక బిరుదు గలదు.
నన్నెచోడుడు బహుశా పంపకవిని అనుసరించాడేమో ఈ విషయములో? దీనివలన మనకు నన్నెచోడుని కన్నడ భాషా పరిచయము అవగతమవుతుంది. అంతే కాక ఇతడు ఒక పురాతన కవి అని కూడ అనుకొనుటకు వీలగును.
విధేయుడు – మోహన
పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
01/01/2014 9:20 pm
ఈ పుస్తకం కినిగెలో ప్రస్తుతానికి దొరకదు. ఎమెస్కో వారి దగ్గర కాని, పుస్తక విక్రయశాలలో కాని దొరుకుతుంది. కినిగెలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను.
– వేమూరి
పలుకుబడి: రంగులు గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
01/01/2014 6:44 pm
1.అష్టదిగ్గజాలలో నొకఁడైన ధూర్జటి కాళహస్తిమాహాత్మ్యంలోని ఈక్రింది పద్యంలో నీటిబిందువులవల్ల విశ్లేషణంచెందే సూర్యరశ్మిప్రస్తావన ఈవిధంగా ఉన్నది.
ప్రాతఃకాలతుషారశీకరచయప్రాప్తిన్ లసన్మౌక్తికో
పేతాగారములట్లు చెల్వెసఁగి,తద్బిందుచ్ఛటాజాత ఖ
ద్యోతచ్ఛాయలఁ గొంతసేపు బహురత్నోదీర్ణగేహంబులై
లూతాకల్పితతంతుసద్మములు వొల్చుం, జెప్పఁ జిత్రంబులై.
ఈపద్యంలో తుషారబిందువులచేత విశ్లేషణం చెందిన (అంటే రంగులు రంగులుగా విడిపోయిన)సూర్యరశ్మివల్ల లూతాకల్పితతంతుసద్మములు బహు(వర్ణ)రత్నోదీర్ణమగునట్లు వెలుగొందుచున్నట్లున్నవని చెప్పడం జరిగింది. అంటే నీటిబిందువు పట్టకంలాగా సూర్యునిరంగులను విడగొట్టడం ఆనాటికే ఎందరో గమనించడంజరిగింది. కాని ఇందులో ఆవిడగొట్టఁబడిన రంగుల పట్టీలేదు గాని, అవి బహువర్ణములని గమనించినట్లు తెలుస్తున్నది.
2. గుప్తరాజులకాలంనాటిదిగా భావింపఁబడే అమరకోశంలో, తెలుపు, పసుపుతోఁ గూడిన తెలుపు (హరిణవర్ణము), ధూసర (బూడిదరంగు),నలుపు (కృష్ణే నీలాసిత శ్యామ కాల శ్యామల మేచకాః అని అమరం, ఇందులో నీలం అసితశబ్దానికి అంటే నలుపుకు పర్యాయంగా చెప్పఁబడింది), పీతము (పసుపుపచ్చ),హరితము (ఆకుపచ్చ), రక్తము (ఎఱుపు),శోణ, అరుణ, పాటల, కపిశ, ధూమ్ర,కర్బుర, పింగళవర్ణములకు పర్యాయపదము లున్నవి. నీలతివస్త్వన్తరమితి నీలః అంటే ఇతరవస్తువులను నల్లగఅంజేయునది అని నీలశబ్దమునకు వ్యుత్పత్తి. కాని ‘నీలీ’ ‘నీలినీ’ అని నిలిచెట్టుకు పేర్లు. అందుచేత మొదటినుండి నీలశబ్దం నలుపుకు, నీల(బ్లూ) వర్ణానికి వర్తించడం గమనించవచ్చు.
నాన్నగారు కట్టిన ఇల్లు గురించి Venkat గారి అభిప్రాయం:
12/30/2013 9:59 pm
మీ అనుభవాలు చాలా బాగున్నాయి .
మాది సురవరం , మీరు చెప్పే వర్ణన లో నేను కొన్ని మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నాను .
గోషా హాస్పిటల్ ఎదురుగా , దుర్గాదాస్ గారి హాస్పిటల్ వీధి,శ్రీ ప్రకాష్ స్కూల్ వీధి ( రెడ్ కాన్వెంట్ వీధి అనేవాళ్ళం ) , కొంచెం ఇవతల కి సురవరం వైపు వస్తే వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న వీధి ఉంది.
కాని ఆశ్చర్యం ఏంటంటే , కొత్తపేట నుండి తుని కి మధ్యలో ఇలా ఉండేదా ??, చాలా ఆశ్చర్యంగా ఉంది చదువుతుంటే ..
మీరు చెప్తుంటే లక్ష్మి దేవి చెరువు చాలా పెద్దగా ఉండేదని అర్ధం అవుతుంది .
ఇప్పుడు అంతా మారిపోయింది
చిలక – గోరింక గురించి Dr CBS Venkataramana గారి అభిప్రాయం:
12/03/2013 9:18 am
కథ పూర్తయిందా? లేదా, మిగతాది చదువరులను ఆలోచించుకొమ్మని వదిలేసేరా?
కథలో ఒక చోట “మొగుడు పెళ్ళాల మధ్య డైవోర్స్ వస్తే” అన్న టాపిక్ తెచ్చి, ఆదేదో ఒక భరింపరాని విషయమన్నట్లు వదిలేశారు. కాని, జీవితం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఏ విషయాన్ని కూడా తక్కువ చేసి వదలిపెట్టకూడదుకదా!
డైవర్సే కాదు, ఏ కారణం చేతనైనా భర్త చనిపొతే, భార్య దిక్కులేనిదై, పిల్లలతొ పడే అవస్థల గురించి కూడా ఆలొచించాలి కదా!
భార్యా-భర్తలు సమానమైనప్పుడు, ఒకరు ఇంటిపని ఒకరు వుద్యొగమూ చెయ్యాలి అని ఎందుకనుకొవాలి? ఇద్దరూ రెండు పనులూ ఎందుకు కలిసి చేసుకొకూడదు?
పిల్లలను చూసుకొవడమనేది పెళ్ళైన పదిహేను సంవత్సరాలవరకు మాత్రమే. ఆ తర్వాత ఉద్యోగం కావాలంటే భార్యకి దొరుకుతుందా? ఇవన్నీ కూడా చర్చిస్తే బాగుండేదేమో!!
డా. సి. బి. ఎస్. వేంకటరమణ
విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి ముత్తేవి రవీంద్రనాథ్ గారి అభిప్రాయం:
11/22/2013 3:32 am
ఇంత చక్కటి పద్యాల్ని ఇంతకాలం భద్రపరచి పాఠకలోకానికి అందించిన శ్రీ మురళీధరరావు గారికి ధన్యవాదాలు.
— ముత్తేవి రవీంద్రనాథ్.
ద్వితీయ కళత్రం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
11/14/2013 10:53 am
జాతకాలు మీద నమ్మకం కన్నా మానవప్రయత్నాన్ని నమ్మటం ముఖ్యం అన్న ఒక సిధ్ధాంతాన్ని ప్రతిపాదించే ఒక్క సంఘటనయే ఈ కధ. ఈ సందర్భంలో జ్యోతిషానికి సంబంధించిన మానవ బలహీనతలు కొన్ని ప్రస్తావించటం జరిగింది. సిధ్ధాంతాన్ని రచయిత తన స్వీయానుభవంతో సమర్థిస్తున్నారు. ఒక స్వీయానుభవంతో సత్యాసత్యాలు ప్రతిపాదించ వచ్చునా అన్న ప్రశ్న ఉంది. దానికేమి? ఒకే చేదు అనుభవంతో జ్యోతిషం పట్ల విరక్తి కలిగినవాళ్ళు ఉన్నారు. అలాగే ఒకే నిదర్శనంతో జ్యోతిషంపై గాఢమైన విశ్వాసం కల్పించుకున్నవాళ్ళూ ఉన్నారు లోకంలో. కధ ప్రతిపాదించిన దాన్ని ఆమోదించటం మానటం చదువరి ఇష్టం.
ప్రస్తుత కథలో, పాప జాతకం అంత వివరంగా విశ్లేషించవలసిన సందర్భం తెలుసుకునే వీలుంటే ఇంకా గొప్పగా వుండేది అన్న అభిప్రాయం ఒకటి వచ్చింది. కాని ఆ సందర్భం తెలుసుకోవటం వలన పాఠకుడికి కొత్తగా అందేది ఏమీ ఉండదూ, అది ప్రస్తావించటం వలన తాను చెప్పదలచిన పిండితార్థానికి చేకూరే బలమూ ఏమీ ఉండదూ అని రచయిత భావించి ఉండవచ్చునని నా అభిప్రాయం.
చాలా మంది కథ అనగానే దానికి కొన్న అంగాలు ఊహించుకుంటారు.
కథకు ఒక ప్రధానవిషయం ఉండాలి – అది మనం మాట వరసకు హృదయం అనుకోవచ్చును. ఆ ప్రథానవిషయం ద్వారా నిరూపితం కావలసిన లేదా ప్రతిపాదించబడ వలసిన లేదా స్పష్టపడ వలసినదైన సిధ్ధాంతమో, జీవనసత్యమో, దృక్పథమో ఉండాలి – అది ప్రాణం వంటిది. కథను నడిపించే సంఘటనలు జ్ఞానేంద్రియాల్లాంటివి. కథను నడిపించే పాత్రలు కర్మేంద్రియాల్లాంటివి. వీటన్నిటి సమాహారమైన ఒక స్వరూపమే కథ.
ఇలా అనుకున్నప్పుడు కథ అనేది సర్వాంగసుందరంగా కుదిరిందా అన్న విషయం ఆలోచించటం జరుగుతుంది సహజంగా.
ఈ దృక్కోణం కథలకూ నవలలకూ కూడా సమంగా వర్తింపచేసుకుని ఒక విలువైన జీవంగల సృష్టి జరిగిందా అని చూడటం ఒక పధ్ధతి.
కాని ఇంకొక విధంగా కూడా చూడవచ్చును.
జీవితం అనేది ఒక ప్రవాహం లాంటిది. ప్రతి జీవితమూ ఒక ప్రత్యేకమైన జీవనదీ ప్రవాహమే. మన జీవితమూ, మన దృష్టికి వచ్చిన ప్రతిజీవితమూ కూడా అంతే. మన జీవితమైనా, ఇతరుల జీవితాలైనా ఆ ప్రవాహాలని మనం సమగ్రంగా చూడలేం. మన దృష్టివైశాల్యానికి అందినంతగా మాత్ర్రమే చూడగలం. ఒక్కటి మాత్రం స్పష్టం – ఏ కొంచెంగా దృష్టికి వచ్చినా ప్రతి జీవన ప్రవాహమూ అద్భుతమే. ఏతజ్జీవి యొక్క అనంత సత్యాన్వేషణాప్రయాణంలో అది ఒక చక్కని భాగమే.
కాబట్టి పూర్వాపరాలు చర్చించి సమగ్రమైన విగ్రహం కుదర్చటానికి ప్రయత్నించకుండా సూటిగా తన దృష్టికోణానికి అందిన ఒక్క సంఘటనను అక్షరబధ్ధం చేసే ప్రయత్నంగా కూడా ఒక కథ అనేది ఉండవచ్చును. జీవికి అణువణువునా ప్రాణం ఉన్నట్లుగా ఏదో ఒక చిన్న సంఘటనలోనూ ఎంతో కొంత చెప్పదగిన విషయాన్ని సమర్థుడైన రచయిత ఆవిష్కరించవచ్చును.
పాత జానపద కథల్లో వినిపిస్తూ ఉంటుంది. ఒక చిత్రకారుడు ఒక గోరుముక్కనో తలవెంట్రుకనో ఆధారం చేసుకుని అందగత్తె బొమ్మను వేసాడని. అలాగే ఒక రచయిత ఒక సంఘటనను చెబితే అక్కడ ఉన్న సారాంశమే మనకు చెప్పటానికి రచయితకు సరిపోవాలి – అలా సరిపోతుంది అనుకున్న ఆ సంఘటనను అతడు సమర్థంగా నిర్వహించాలి. అంతే. కధావిగ్రహంలోని మిగతా సర్వభాగాలు చదువరులు అవసరమైతే స్వతంత్రంగా మనఃఫలకంలో చిత్రించుకోవాలి. అవన్నీ తాను చెప్పటానికి అముఖ్యమైనవి కాబట్టే రచయిత చెప్పలేదు కథలో. అంతేకాదు, అవన్నీ చదువరి సమగ్రంగా తెలుసుకో నవసరం లేదనీ కథకుడి అభిప్రాయం కూడా కాబట్టి వాటిజోలికి పోనవుసరం లేదు కదా ఏ చదువరికీ.
నాకు తోచిన రెండు ముక్కలు వ్రాసాను. నేను రచయితనూ కాను, విమర్శకుడనూ కాను. అది వేరే సంగతి.
జ్యోతిషం లాంటి వివాదాస్పదమైన విషయం పైన రకరకాల కథలు వ్రాయవచ్చును. అలాంటి వాటిలో ఇది కూడా ఒక కథ. ఈ కథ నాకు బాగా నచ్చిందనో నాకు అసలు నచ్చలేదనో నేను చెప్పటం లేదు. నాకు నచ్చటంతో సంబంధం లేదు – ఇది ఒక చక్కని కథ.
అదే నేను గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/11/2013 12:45 pm
రాధ గారు
“దొంగలా నవ్వుతూ” అనడం “దొంగ” దర్శనం అయినతరువాతనే సాధ్యం!
దర్శనం అయితేనే అసలు దొంగ ఉన్నాడో లేడో ఆపై నవ్వుతున్నాడో కాదో తెలుస్తుంది. దర్శనం కాకుండా చెప్పడం “దొంగ” సాక్ష్యం అవుతుంది కదా! ఇది చదివిన తరువాత దొరకని దొంగ గురించి దొరికిన ఊహ రాయాలి అనిపించింది.
దొంగ కోసం దేవులాడుతున్న నేను
నిలుచున్న నేల నాది అనుకుంటే
కాదు కాదు భూమి ఇచ్చిందే అనిపించింది
తాగే నీరు నాది అనుకుంటే
కాదు కాదు నదులిచ్చిందే అనిపించింది
పీల్చే ఊపిరి నాది అనుకుంటే
కాదు కాదు గాలిచ్చిందే అనిపించింది
కనీసం దేహం నాది అనుకుంటే
కాదు కాదు తల్లిదండ్రులిచ్చిందే అనిపించింది
ఏది పట్టుకొని నాది అనుకుంటే
కాదు కాదు పంచభూతాలు ప్రకృతిదే అనిపించింది
కనీసం ఆలోచనైనా నాది అనుకుంటే
కాదు కాదు ఆలోచించే శక్తిదే అనిపించింది
నాది కానిదంతా నాదే అనుకున్నందుకు
నేనే అసలు దొంగని తేలిపోయింది.
============
విధేయుడు
_శ్రీనివాస్
ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి బులుసు సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం:
11/08/2013 1:50 am
నాగార్జున గారికి,
దహా. ధన్యవాదాలు.
మల్లికార్జున శర్మ గారికి,
>>> ఇంటింటి ప్రభావతీ ప్రద్యుమ్నం! సరే, అలాక్కానివ్వండి!
అంతేనండి. ధన్యవాదాలు.
రాజ్ కుమార్ గారికి,
ధన్యవాదాలు.
praveen guttula గారికి.
ధన్యవాదాలు. బూరెల్లోనే చిల్లు చేసి నెయ్యి నింపి తింటాం. దహా.
గద్యములో పద్యములు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
11/06/2013 11:17 am
విద్వన్మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
నమస్కృతులతో,
ఈ శ్రీనివాస గద్యను ప్రతిరోజూ తెల్లవారుజామున నేను వింటూనే ఉన్నా, అనేకపర్యాయాలు తిరుమలలోని శ్రీవైష్ణవ విద్వాంసులు దివ్యోత్సవాలలో వాద్యసహకారంతో శ్రుతిమనోహరంగా పఠిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూచి ఆనందించినప్పటికీ – శబ్దసంయోజన వల్ల ఆ గద్యగంభీరిమ మనస్సును ఆకట్టుకొనటమే కాని, అందులోని ఛందోనిర్మాణరీతుల సంస్ఫురణ మనసుకెన్నడూ కలుగలేదు. ఒక శతాబ్ది మునుపటివారే కాబట్టి మహావిద్వాంసులైన పురిసై శ్రీనివాసాచార్యులవారి రచనలన్నీ అచ్చులో ఉన్నాయి కాని, దీని రచనావిశేషాలను గుఱించిన విమర్శనాత్మక పర్యాలోకనం తెలుగులో అంతగా జరిగినట్లు కనిపించదు. ఆ విధంగా ఒకానొక శ్రవణీయరచనను రమణీయసాహిత్యంగా దర్శించిన మీ ప్రజ్ఞాప్రతిభానతను మనసారా అభినందిస్తున్నాను.
భట్ట బాణుని కాదంబరిలో “పాతాలతలవాసిషు దానవేషు” వంటి చోట్ల వృత్తగంధం వినిపిస్తున్నదని వ్యాఖ్యాతలు వ్రాయటమే గాని, అంతకంటె ఎక్కువగా ఆ విశేషాలను పరిశీలింపలేదు. నన్నయ్య గారి గద్యాన్ని విద్యార్థులకు ఇచ్చి, అందులోని వృత్తాంశాలను గుర్తించి, ఆ పద్యాల పేర్లను చెప్పమని శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు శిష్యులకు ఛందస్సును నేర్పుతుండేవారు. అవి శిక్షాప్రణీతాలు.
లాక్షణికులు గద్యనిరూపణాధ్యాయాలలో చూర్ణకాన్ని లలితము, ఆవిద్ధము, అవృత్తిముగ్ధం, అత్యంతవృత్తిముగ్ధం అని; ఇంకా ఉత్కలికను, వృత్తగంధిని – పెక్కు అంతర్భేదాలతో వివరించారు. కవులు కావ్యగతంగా గద్యబంధలీనంగా కొన్ని కొన్ని సమ-విషమవృత్తాలను, అర్ధసమాలను, తాళవృత్తాలను ప్రయోగించినవన్నీ అందరికీ తెలిసిన సంగతులే.
అయితే, వీటి నిర్మాణరీతులను సూక్ష్మంగా అనుశీలించి, ఇంత విస్తారమైన పరిధిలో గద్యంలో సరిక్రొత్తగా నిక్షేపింపగల ఛందోగతులను ప్రస్తారించి, వాటిలో మునుపటి లాక్షణికులు చెప్పని అభినవరూపాలను ప్రకల్పించి, వాటికి లక్ష్యాలను శిల్పించి, ఆ రూపాలను సార్థక నామవృత్తాలుగా ప్రచారంలోకి తెచ్చినవారు మీరొక్కరేనని ఈ విధంగా ‘ఈమాట’ లేఖాముఖతః ఉచ్చైఃస్వనంతో నా బోటి సహపాఠకులకు చెప్పగలగటం నాకెంతో సంతోషంగా ఉన్నది.
శ్రీనివాస గద్యకు మీరు వృత్తపట్టికను అనుబంధించటం చమత్కృతంగానూ ఉన్నది. అది మీ అధికారపరిధిలోని విషయమే కదా! 🙂
అచిరకాలంలో మీ వ్యాసాలు అచ్చుకు వచ్చి, విద్యాస్థానాలలో పఠనపాఠనాలకెక్కి, విద్యార్థులకు ఉపాదేయాలు కావాలని నా శుభాకాంక్ష.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
పలుకుబడి: శషసలతో శషభిషలు గురించి jayaprabha గారి అభిప్రాయం:
11/04/2013 9:32 am
ఈసారి ఎందుకో కొలిచాల కొంచెం సమర్ధించుకోవడం మీదనే శ్రధ్ధ పెట్టారు. నా జవాబుకి ఇది నిజంగా ఆయన జవాబు కాలేదు. అన్నమయ్య మీద మీరు రాసిన వాక్యాన్ని మరోసారి చూసుకుని నా ప్రశ్న ని పరిశీలించండి. పెద తిరుమలయ్య రేఫ మీద ఖచ్చితమైన నియమాలని పాటించాలని చెబుతూ ఒక పుస్తకమే రాశారు. కానీ ఆయన రచనలలోనే “ర” ఉండల్సిన చోట ” ఱ” ఇంకా అటుదిటూ ఉండటాన్ని పండితులు చూపించారు. అలా ఎందుకు జరుగుతుందీ? నియమాలు పాటించిన పెద తిరుమలయ్యంగారికి అది తెలియకనా? 🙂 ఇవాళ మనం మన అక్షరాలని పెన్నుతో రాసినట్టుగానో.. టైపు చేసినట్టుగానో మనకి మనం రాసే విషయాల మీద ఉన్న అదుపు లాంటిది ఆ కాలంలో ఆశువుగా వాగ్గేయాలన ఆలపించిన కవులకో లేదా లేఖకులకి ఆశువుగా పద్యాలని ప్రబంధాలు గా అల్లి చెప్పిన ఇతర కావ్య కవులకో ఉందా? అందుకూ ఒక విషయం చెప్పే ముందు రవ్వంత సందేహం అవసరం! ” ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల” ప్రస్తావన మరి ఊరికే చేశారా పెద్దన గారు? మనకి పాత లేఖన పధ్ధతుల చరిత్ర తెలుసేమో గానీ పుస్తకాలని రాసిన లేఖకుల చరిత్ర తెలియదు. వారి ” ఊహ” వారి ” పాండిత్యం ” తెలియవు. ఆ కాలంలో వాళ్లకున్న డిమాండు ఇంకా వారి ప్రతిభ వ్యుత్పత్తుల వివరాలూ వగైరాలేవీ తెలియవు. అందువలన ఇవాళ రాగి రేకుల లో ఉన్న ప్రతీ శబ్దాన్నీ వ్యాకరణ దోషాలనీ తప్పుల్నీ తిన్నగా తీసుకుని వెళ్ళి కవికి అంటగట్టడం అంత వీలు కాదు. ఇది నా దృక్పధం. అన్నమయ్య తనకాలం నాటి వ్యవహార భాషని వాడాడని మాత్రం చెప్పగలం. ఎక్కువగా దేశి పద ప్రయోగానికి ఇస్టం చూపించాడని ఆయన వాడిన తెనుగు ఆధారం గా మాట్లాడగలం! కాని ఆయన భాషలో ఆయనకి ఇవి తెలుసుననీ ఇవి తెలియవనీ మాత్రం చెప్పలేం! అలాగే ఆయన రాగిరేకుల లిపి లోంచి అవన్నీ అన్నమయ్య భాషే అని కూడా ఖచ్చితంగా తీర్మానించలేం! మిగిలిన వాటిమీద నా భావనలు ఇంకా పై అభిప్రాయం లోనివే, కొలిచాలా!
జయప్రభ.
నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి Rallapalli Sundaram గారి అభిప్రాయం:
11/04/2013 5:57 am
మాన్యులైన ఏల్చూరి వారికి నమస్కారాలు.
నన్నెచోడుని గురించిన మీ వ్యాసంలో మీ పరిశోధన లోతుల్ని మెచ్చుకొని తీరాల్సిందే. కాని అది నన్నెచోడుని కాలనిర్ణయానికి ఏ మాత్రం ఉపకరించదని చెప్పడానికి చింతిస్తున్నాను. నన్నెచోడుని అనుకరించి తెనాలి కవి రాశాడని మానవల్లి వారు చెప్తే తెనాలినే అనుకరించి చెత్త పద్యాన్ని కుమారసంభవ రచయిత తయారుచేశాడని మీరు, కొర్లపాటి వారు అంటున్నారు. మానవల్లి వారే ఒక చెత్త పద్యం రాసి, దాన్నే విమర్శించుకొని, రామకృష్ణుడు దాన్నే అనుకరించాడని నాటకం ఆడారని అర్థం వచ్చేట్లు రాయటంలో అంతరార్థం స్పష్టమవుతూనేఉంది. మానవల్లి వారిని పాత తాటాకుల దొంగగా నిరూపించటానికి కొన్ని వందల పుటలు వ్యర్థం చేసిన వారిని ఏమని ప్రతివిమర్శ చెయ్యాలి? ఒక్క పద్యం పట్టుకొని నన్నెచోడుని కవితాసామర్థ్యాన్ని విశ్లేషించటం చాలా బాగుంది. తంజావూరి ప్రతిని గురించి తిరుమల రామచంద్ర గారు రాసిన విలువైన మాటలన్నీ గాలికి పోయాయి. కుమారసంభవం లోని ప్రతి పద్యాన్ని, పదాన్ని చదివి మాకు పాఠం చెప్పిన దేవళ్ళ చిన్నికృష్ణయ్య గారు నన్నెచోడుని అర్థం చేసుకోలేదనుకోవాలి. ఎవరు ఎవరిని అనుకరించారు, అనుసరించారు అనేందుకు ఒక శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉండాలి.కూట శాసనాలను నిర్ణయించేటప్పుడు లిపి పరిణామాన్ని ఆధారం చేసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ణయిస్తారు. కవుల కాలాదులు నిశ్చయంగా తెలిసినప్పుడు పరస్పర ప్రభావాలను నిర్ణయించాలి. ఒకటి రెండు ఉదాహరణలు: అరుద్ర గారు కందం తెలుగు వారి సృష్టి అని రాసినందుకు వారికి కన్నడంతో గాని, ప్రాకృతంతో గాని పరిచయం లేని విషయాన్ని సూచించి రాళ్ళపల్లి వారు పీఠికలో చురక వేశారు. అలాగే నక్షత్రకుణ్ణి తెలుగు వారే సృష్టించారని ఆరుద్ర రాశారు, కాని అంతకంటే ముందే రాఘవాంకుడు కన్నడంలో ఆ పాత్రను ప్రవేశపెట్టాడు. కాని ఈ రెండింటికి మూలం 10వ శతాబ్దికి చెందిన చండకౌశికమనే నాటకంలో ఉందని మరో పండితుడు వెలికి తీశాడు. కుమారసంభవం విషయంలో చాలాసార్లు కొర్లపాటి వారు నాతో చర్చించారు. 12వ శతాబ్దికి తర్వాతి విషయం (భాషాశాస్త్రానికి, వృక్షశాస్త్రానికి,అలంకారశాస్త్రానికి సంబంధించినవి) మానవల్లి వారు గమనించక పొందుపరిచారని నిర్ద్వందంగా నిరూపించగలిగితే మీ వాదం నిలుస్తుందని చెప్పేవాణ్ణి. నన్నెచోడుడు వాడిన ప్రతి పదాన్నీ గమనించి అది 12వ శతాబ్దానిదే అని తేల్చిన ఎల్. బి.శంకరరావు గారి సిద్ధాంత గ్రంథం,మహనీయులు నేలటూరివారు నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడని నమ్మిన అభిప్రాయం పూర్తిగా నిరాధారాలని నేననుకోను. పంప (10వ శ.) ప్రబంధం రాశాడని తెలియక నన్నెచోడుని తెలుగు ప్రబంధ కవులకు దగ్గరగా తీసుకు వచ్చిన వేదం వారి వాదాన్ని అంగీకరించడం కుదరదు.
ఒక అభిప్రాయాన్ని ముందే ఏర్పరుచుకొని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు అందరికీ నచ్చవు. కాలం విషయం వదిలేస్తే వ్యాసంలో చాలా విషయాలను సేకరించడం జరిగిందని ఒప్పుకోవచ్చు.
రాళ్ళపల్లి సుందరం
ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి mallikarjuna sarma గారి అభిప్రాయం:
11/04/2013 2:28 am
ఇంటింటి ప్రభావతీ ప్రద్యుమ్నం! సరే, అలాక్కానివ్వండి!
మల్లికార్జున శర్మ.
ఈమాట నవంబర్ 2013 సంచికకు స్వాగతం! గురించి మోహన గారి అభిప్రాయం:
11/03/2013 10:54 am
లైలాగారు, As they say, all are equal; but some are more equal than others 🙂 నన్నెవ్వరు అడగలేదు, కాని నా ఉద్దేశములో ఏ రచన ప్రత్యేకమైనదో కాదో పాఠకులు నిర్ణయిస్తారు. రచన అనేది ఒక ధనుర్ముక్త బాణములాటిది. అది దూసుకొనిపోయి ఎవరి హృదయాన్ని తాకుతుందో, ఎవరి కెరుక? విధేయుడు – మోహన
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
11/02/2013 9:18 pm
నేను ఆంధ్రా యూనివర్సిటీలోచదువుకునే రోజుల్లో మీనాక్షీసుందరం గారి పేరు అడపాదడపా విన్నాను కాని ఇలాటి వివరాలు కాని ఇంతటి విశేషాలు కాని ఎవరూ అనగా విన్లేదు. శ్రమతో ఎన్నో విషయాల్ని సేకరించి అందించిన వాసుదేవరావు గారికి కృతజ్ఞతలు. ఒక కుతూహలం: వాసుదేవరావు గారికి Applied mathematics department తో ప్రత్యక్షసంబంధం ఉన్నదా? తెలియజేస్తే ఆనందిస్తాం.
నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
11/02/2013 2:10 pm
మాన్య జయప్రభ గారికి
నమస్కృతులతో,
నన్నెచోడుని కుమార సంభవంలోని పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసంలోని పద్యానికి మూలం కాదని, పద్యశిల్పాన్ని బట్టి రామలింగకవి పద్యం సహజమై ఉండగా నన్నెచోడుని పద్యం కృతకంగా ఉన్నదని, అందువల్ల నన్నెచోడుని పద్యమే అనుకరణం కావచ్చునని మొట్టమొదటిసారి ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ‘నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?’ అన్న తమ గ్రంథంలో ప్రతిపాదించారు. దానికి చెప్పుకోదగిన, సమర్థమైన ప్రతివిమర్శ అంటూ ఏదీ ఇంతవరకు రాలేదు. ఆ తర్వాత నేను తెనాలి రామలింగకవి ‘కందర్పకేతు విలాసం’ సంస్కృతంలో సుబంధుని ‘వాసవదత్తా కథ’కు, కన్నడంలో నేమిచంద్రుని ‘లీలావతీ కథ’కు సంయుక్తానువాదమని గుర్తించి, ‘లలితాస్యాంబురుహంబు’ పద్యం తప్పక అందులోనిదే అయివుంటుందని తదితరవిశేషాలతో వ్యాసాలను ప్రకటిస్తూ వచ్చాను. తెనాలి రామలింగకవి పద్యం ‘శృంగార తిలకము’లోని శ్లోకానికి అనువాదమని గుర్తించాక ఈ విషయంలో మానవల్లి రామకృష్ణకవి గారు పొరబడ్డారని స్పష్టమైంది. రెండు పద్యాలలోనూ (1) కల్పన, (2) పూర్ణతయా నాలుగవ పాదం అన్నవి ఒకటే అయినందువల్ల – నన్నెచోడుడు, తెనాలి రామలింగకవి అన్న ఇద్దరిలో ఎవరో ఒకరే అనుకర్త కాబట్టి ‘శృంగార తిలకము’ కాలనిర్ణయం చేయవలసివచ్చింది. ‘శృంగార తిలకము’ 15-వ శతాబ్దికి పూర్వం ఉండిన ఆధారాలేవీ కనబడలేదు. అందులోని రెండు మూడు శ్లోకాలు తెనాలి రామలింగకవికి అభిమానపాత్రాలని, వాటిని విడివిడిగా ఎక్కడెక్కడో చూసి అనువాదం చేసి ఉంటాడని భావించటం కంటె 15-వ శతాబ్ది (±) ప్రాంతాల వెలసిన ఆ సంకలన కృతినే చదువుకొని అనువాదం చేశాడని భావించటం సమంజసం. అందువల్ల చర్చాసంగతంగా మధ్యలో ‘శృంగార తిలకము’ను గురించి కొంచెం ఎక్కువగా వ్రాయవలసివచ్చింది. అది మీటర్ గేజి పట్టాలమీదికి బ్రాడ్ గేజి పెట్టెను ఎక్కించినట్లుంటే వ్యాసరచనలో పొరపాటే.
వివాదాంశాలు మూడు: (1) పెదపాటి జగన్నాథకవి ‘ప్రబంధరత్నాకరము’లో స్పష్టంగా “లలితాస్యాంబురుహంబు” పద్యం కందర్పకేతు విలాసం లోనిదని పేర్కొనకపోయినా, బలమైన ప్రమాణాంతరాన్ని బట్టి అది అందులోనిదే అని నిశ్చయించటం మొదటిది. కందర్పకేతు విలాసం సుబంధుని ‘వాసవదత్తా కథ’కు అనువాదం కావటం ఆ నిశ్చయానికి దోహదం చేసింది. (2) ఆ పద్యం ‘శృంగార తిలకము’ లోని శ్లోకానికి అనువాదం కనుక, ఆ అనువాదాన్ని రామలింగకవి క్రీ.శ. 1525లో ‘ఉద్భటారాధ్యచరిత్రము’ నాటికే చేపట్టి ఉండటం మూలాన, వాటికి అనుకరణం అయిన నన్నెచోడుని “అలిధమ్మిల్ల” పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం రచనాకాలానికంటె (అంటే, సుమారు క్రీ.శ. 1565 కంటె) తర్వాతిదని నిర్ణయించటం రెండవది. ఒకవేళ కాలాంతరంలో ‘శృంగార తిలకము’ సంకలనం కాని, అందులోని “బాహూ ద్వౌ చ” అన్న శ్లోకం కాని క్రీ.శ. 10 – 13 శతాబ్దులకు మునుపే ఉన్నవని ఆధారాలు దొరికినా, నన్నెచోడుడే అనుకర్త అన్న నేటి మన నిశ్చయంలో మాత్రం మార్పుండదు. (3) దాదాపు కొంత అటూ ఇటూగా ఒకే కాలంలో ఇద్దరు తెనాలి రామలింగకవులు ఉండటం వల్ల – కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి హాస్యచాటువులను చెప్పినది, ‘శష్ప విజయము’, ‘ధీరజనమనోవిరాజితము’ కావ్యాలను చెప్పినది “మల్లికార్జున తనూభవుడు”, విశ్వబ్రాహ్మణుడు అయిన తెనాలి రామలింగకవి అని; ‘కందర్పకేతు విలాసము’, బహుశః ‘హరిలీలా విలాసము’ ఆయనవే కావచ్చునని శ్రీ కొడాలి లక్ష్మీనారాయణ వంటి చరిత్రకారులు భావించారు. ఇది మూడవ వివాదాంశం. ‘కందర్పకేతు విలాసము’, ‘ఉద్భటారాధ్య చరిత్రము’, ‘పాండురంగ మాహాత్మ్యము’, ‘ఘటికాచల మాహాత్మ్యము’ కావ్యాలలో “లలితాస్యాంబురుహంబు” పద్యం వంటి పద్యాలు అదే కల్పనతో విధవిధాలుగా ఉండటం వల్ల ఆ కల్పన రామలింగకవికి అభిమానపాత్రమని నిరూపించే ప్రయత్నం నేనిందులో చేశాను. ఏ మాత్రమూ ప్రామాణికం కాలేని ‘శష్ప విజయము’, ‘ధీరజనమనోవిరాజితము’ వంటి శిథిలబంధపు అప్రౌఢరచనలు చేసిన ఆ రెండవ తెనాలి రామలింగకవి సంస్కృతాంధ్రకావ్యసర్వస్వాన్ని మూదలించిన ‘కందర్పకేతు విలాసం’ వంటి అతిప్రౌఢరచనలను ఒకనాటికీ చేయలేడని – ఆ మొదలైన వివరాలను నేనిందులో విస్తరభీతి మూలాన వ్రాయలేదు. మీరన్నట్లు ప్రస్తావించి వదిలేశాను. ఒకవేళ కందర్పకేతు విలాసాన్ని ఆ రెండవ రామలింగకవే వ్రాసి ఉండినా, కాలాన్ని బట్టి నన్నెచోడుడు ఆయనకూ ఆధునికుడే కావలసి ఉంటుంది.
మీరు వ్యాసతాత్పర్యం ఇది – అని చెప్పినదంతా సవ్యమేనండీ! నన్నెచోడుడు తెనాలి రామలింగకవికంటె ఆధునికుడని మాత్రమే నా ప్రతిపాదన. మానవల్లి రామకృష్ణకవి గారు ఆ పద్యానికి మూలం ఒకటుండి, ఏదో ఒకనాడది నన్నెచోడుని కాలనిర్ణయానికి అవరోధం కాగలదని ఊహింపకపోవటం వల్ల ఈ చర్చ అంతా సంగతం అయింది. దీనిని సంక్షేపించి, ఇంకా స్పష్టంగా చెప్పలేకపోవటం నా లోపమే.
చారిత్రికంగా నన్నెచోడుడు అనే కవి లేడా? లేనట్లయితే, ‘కుమార సంభవము’ ఎవరి రచన? మానవల్లి రామకృష్ణకవి గారే దానిని వ్రాసి ఉండవచ్చునా? ఆ మహామహునిపై ఏర్పడినది వట్టి అపవాదేనా? నన్నెచోడునిదీ, ఆయనదీ కాకపోతే అది ఎవరి రచన? అన్నవి నిజంగా నిగ్గు తేల్చవలసిన ప్రశ్నలు. విశ్వవిద్యాలయాలకు ఎలాగూ అక్కరలేదు. పత్రికలు ప్రకటించవు. ఆ అతీతకాలయవనికను తొలగించి, ప్రతీతసత్యాలను ఆవిష్కరించేందుకు శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారి వంటి విద్వన్మార్గదర్శులు కొందరు ‘ఈమాట’ వంటి సమర్థసాధనాన్ని రూపొందించి ఉండటం ఎంతో అభినందనీయం.
‘శృంగార తిలకము’ను విశదపర్యాలోకనసమేతంగా ప్రకటించటం మంచిదే. వ్యాసాన్ని ఆసాంతం దయతో చదివి, సహృదయంతో స్పందించినందుకు మీకు నా ధన్యవాదాలు.
మాన్యులు శ్రీ NS మూర్తి గారికి, శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి, డా. యద్దనపూడి కామేశ్వరి గారికి – ధన్యవాదాలు!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి jayaprabha గారి అభిప్రాయం:
11/02/2013 3:01 am
ఇందులో మొదలు నన్నెచోడ, తెనాలిరామకృష్ణ కవుల పద్యాల లోని విషయాన్ని వివరించ పూనుకుని, ఇద్దరు తెనాలి రామ క్రిష్ణులని గురించి ప్రస్తావించి, మళ్ళీ ఆ విషయాన్ని వదిలేసి, నన్నెచోడకవి కృతమని అనుకునే తెనుగు కుమార సంభవం రచన కాలంలో రామకృష్ణ కవికి తరవాతదే నిజానికి అన్న అర్ధం వచ్చే లాగా తన విమర్శని కొనసాగించి, చివరికి దానినే స్థిరపరిచారు ఏల్చూరి. అంటే మానవల్లి రామకృష్ణ కవి గారే కుమార సంభవాన్ని రాసి నన్నెచోడకవి పేర దానిని ప్రకటించినారన్న అర్ధం రానే వస్తూంది కదా? విషయం బహుశా ఈ వ్యాసం లో ప్రముఖమైనది ఇదే కావలసి ఉండగా మధ్యలో “శృంగార తిలకం” వైపు గా చాలా సేపు వ్యాసం తీగసాగింది. ఇందువలన మొదలుపెట్టిన అసలు విషయం మధ్యలో కాసేపు [కాదు చాలాసేపే ]వెనక్కివెళ్ళింది.
ఇంతకీ ఈ వ్యాసం ప్రతిపాదించే సంగతి, రామకృష్ణకవి [తెనాలి] కల్పన ఆయనకి శృంగారతిలకం మీద ఉన్న ఆసక్తి ఆధారంగానే జరిగినది అనీ, నన్నెచోడకవి [:)] కాలానికి అసలు ఈ శృంగారతిలక రచనే జరగలేదనీ గనక తెనాలి రామకృష్ణ కవి పద్యమే తొలిది కాగా, నన్నెచోడుని వెలికి తెచ్చిన మానవల్లి రామకృష్ణకవిగారు తెనాలి రామకృష్ణ కవి గారి మీద చెసిన ఆరోపణ నిజమైనది కాదని– చివరికి ఈ వ్యాసం ఇచ్చిన అభిప్రాయంగా తేలింది. అంతేనా? లేక నేనేమన్నా పొరబడ్డానా ఏల్చూరిగారూ?? ఈ వ్యాసాన్ని ఇంతకన్నా క్లుప్తంగా చెప్పగలిగే వీలున్నదేమో ఒకసారి అచ్చుకి ఇచ్చేముందు ఏల్చూరి మురళి గారు మరొక సారి చూసుకుని ఉంటే బాగుండెదేమో కదా అని కూడా అనిపించింది సుమా! ఏదైనా సుదీర్ఘమైన తన ఈ వ్యాసంలో ఏల్చూరి శృంగార తిలకం లోని శ్లోకాలని మాత్రం విపులంగా పేర్కొనడం నాకు [ఇదివరకు చదవనందువలన ] లాభించింది.
మురళీధర రావు గారూ ! మీరే మరొక సంకలనం తెలుగులో” శృంగార తిలకానికి” చేయరాదో? బాగుంటుంది.
భవదీయ,
జయప్రభ.
విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి mallikarjuna sarma గారి అభిప్రాయం:
11/02/2013 2:23 am
మురళీధరునిపై ముచ్చటైన మూడు పద్యరత్నాలను పదికాలాలపాటు పదిలపరచి పాఠకులకు అందించిన మురళీధరరావు గార్కి ధన్యవాదాలు.
డబ్బు శాశ్వతం కాదనడానికి ఇదో ఉదాహరణ. కాని, మనం అత్యంత విలువైనదిగా భావించే అది తప్ప ఇంకేం ఇచ్చుకోగలం… సాక్షాత్తూ ఆ కృష్ణ భగవానుడే వచ్చినా, కవిసామ్రాట్టే వచ్చినా! నాకు తెలిసినంత వరకు అప్పటి మూడు వందలంటే ఇప్పటి పదివేలుపైనే!
మల్లికార్జున శర్మ దేవరకొండ.
నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి yaddanapudi Kameswari గారి అభిప్రాయం:
11/01/2013 2:58 pm
మురళీధర రావుగారూ,
ఎంతోకాలం తరువాత మంచి పరిశోధనాత్మక వ్యాసం చదివాను. ఇంత ఓపికగా, అవసరమైనన్ని , అంతకుమించి పుస్తకాలను చదివి వివరణాత్మకంగా, తార్కికంగా కొన్ని నిర్ణయాలను చేయటం ఇటీవల వ్యాసాలను వ్రాసిన వారు చేయగా చూడలేదు. ఇటువంటి బరువైన వ్యాసాలను ప్రచురించేవారు కూడా అరుదు. ఈమాట వారిని ఇందుకు అభినందిస్తున్నాను. మీకు నమస్కరిస్తున్నాను. ‘ఏకవీర నవలకు నవలానాయికకు ఆ పేరే ఎందుకు’ అనేవ్యాసాన్ని వ్రాయడానికి నాకు ఆరేడు నెలలు పట్టగా, అదృష్టవశాత్తు ప్రపంచతెలుగు మహాసభలు జరిగి, ప్రత్యేకసంచికలో ప్రచురింపబడటానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది. ఏ పత్రికవారైనా వ్యాసం బాగుంది అనటమే కాని, గంభీర పరిశోధనను ప్రచురించే సాహసం ఎవరికీ లేకపోయింది. చివరకు అది ఆ వ్యాసానికి వరమే అయింది.
అదే నేను గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
10/29/2013 2:46 pm
కవిత అరమరికలు, ఆడంబరాలు లేని సౌందర్యంతో సాగింది. ఎందుకో “దొంగలా నవ్వుతూ” అన్న పదాలే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఇతరులు ఆశ్చర్యపడితే దొంగలు నవ్వుతారో లేదో కాని, “వెన్నదొంగలా నవ్వుతూ” అనుకుంటే వచ్చిన సందేహం నిస్సం”దేహం”గా మారినట్టు అనిపించింది.
=======
విధేయుడు
_శ్రీనివాస్
ఈమాట గురించి గురించి kanaka Raju Tunga గారి అభిప్రాయం:
10/26/2013 12:24 am
నేను రామగుండం వాసిని. ఈ మధ్య శ్రీ పోతనచరిత్రమను శ్రీ వానమామలై వరదాచార్యుల విరచితంబైన పుస్తకం కొరకు ఎతుకుతున్న కాని దొరుకుత లేదు ఏవారైనా కలిగి యుండి వారు వద్దనుకున్న, లేక ఇంకొక పుస్తకమున్న యొడల తగిన ధర చెల్లించి కొనుక్కోగలను అట్టివారెవ్వరైనా యున్న ఎడల దయచేసి నా ఈ మైల్ చిరునామాకు తెలియ జేయగలరు నా ఈ మైల్ అడ్రస్సు tungakanakaraju@gmail.com
ధన్యవాదాలు
తుంగ కనకరాజు
సెల్ నెం 9032891593
పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి Sowmya గారి అభిప్రాయం:
10/18/2013 1:12 pm
పొరపాటన నాకిలా అనిపించింది అని చెప్పి ఈ కథను గురించి గాని, ఆ సినిమాని గురించి గాని రాస్తే ఏమవుతుందో నాకు అర్థమయింది. ఈ టైపు వ్యంగ్యాలని పట్టించుకోకపోవడమో, ధీటైన జవాబివ్వడమో చేతనయిన రోజున, వీటన్నింటికి కొంచెం సమయం చిక్కితే తప్పకుండా రాస్తానండి.
ఒక్క ముక్క మాత్రం చెప్పదల్చుకున్నాను, ఇటీవలి కాలంలో జాల గుంపుల్లో ఎవళ్ళో వెర్రి వెంగళప్పలు (అంటే ఇక్కడ నేను) వాళ్ళకి ఫలానా ఏదో నచ్చింది అనడము, టక్కుమని ఓ పది మందొచ్చి… మీ వివేచన మీద నాకు సందేహం అనో, నీకు చదవడం రాదనో…ఇలాంటి వ్యాఖ్యానాలు రాయడమూ చూస్తున్నాను. అసలుకి ఎవళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వెలిబుచ్చడానికి కాకపోతే, ఈ వ్యాఖ్యల డబ్బా ఎందుకండి? ప్రపంచాన్ని మార్చివేసే సునిశిత విమర్శలు ఉంటే తప్ప వ్యాఖ్యలు రాయకూడదా మొత్తానికైతే?
ఇందుకే ఈమాటలో వీలైనన్ని తక్కువ వ్యాఖ్యలు రాస్తాను..ఇంతమంది మేధావులను తట్టుకోలేక. ఒకవైపు నిజాయితీ గా సందేహాలు అడిగితే, వాటికి స్పందనలు సరిగా (వ్యంగ్యంగా ఏదో ఒకటి అనకుండా) ఇవ్వరు. ఒక వైపు ఏదో, నా మానాన నేను ఇంకోళ్ళ జోలికెళ్ళకుండా వ్యాఖ్యలు రాస్తే, ఏం మాట్లాడుతున్నారో నాకర్థం కాని స్థాయిలో జరిగే వ్యాఖ్యానాల్లోకి నన్ను లాగుతారు.
ఏమైనా, మీ ఇష్టం వచ్చింది అనుకోండి లైలా గారూ నా తెలివితేటల గురించి, నా అభిప్రాయాల విలువ గురించి. మీకు సమాధానాలు చెప్పేంత తెలివిడి నాకు లేదు. ఆపైన మిమ్మల్ని మెప్పించాలన్న/ఒప్పించాలన్న తాపత్రేయం అంతకన్నా లేదు. ఇకపై వ్యాఖ్యలు రాసేందుకు కూడా “నాకు సంబంధంలేని చర్చల్లోకి నన్ను లాగకండి” అని ఒక డిస్ క్లైమర్ పెట్టాలేమో అనిపిస్తోంది.
ఇక్కడి వరకు వ్యాఖ్యని చదివినందుకు, దీన్ని మాడరేట్ చేయకుండా అంగీకరిస్తే సంపాదకవర్గానికి – ధన్యవాదాలు.
పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
10/17/2013 9:04 pm
Sowmya అభిప్రాయం:
నా లైబ్రరీలో పాలగుమ్మి పద్మరాజు కధా సంకలనం ఉంది. పాలగుమ్మి పద్మరాజు, తెలుగు కథకు అంతర్జాతీయ స్థాయిని సాధించిన రచయితగా ఈ పుస్తకం అట్ట మీద ఉంది. లోన వీరి సమగ్ర సాహితిని గూర్చి కొంచెం, వీరి రచనల మీద, డాక్టరేట్ కోసం, పరిశోధనలు జరుపుతున్న విద్యార్ధులు ఉన్నట్టు మార్చి 1985లో అచ్చేసిన ఈ పుస్తకంలో ఉంది. పుస్తకం పేరు ఈ చర్చించబడుతున్న కధ పేరే. “పడవ ప్రయాణం”.
ఇంతకీ ఆ పడవ ప్రయాణం లో జరిగిందేమిటి? నాకు నా ఇప్పటి తెలివితేటల వల్ల అర్థమయింది ఏమిటి?
ఆ పడవ ప్రయాణం రాత్రిలో ఒక చిన్న స్కేలు దొంగతనం జరిగింది. పద్దాలు, రంగి ఇద్దరు దొంగలు. పద్దాలు is the muscle. రంగి is the accomplice, the decoy, the diversion. Both are con artists. ఇద్దరూ తాగుతారు. లేకుంటే, అవసరానికి, తాగకపోయినా తాగినట్టుగా నటిస్తారు. అబద్థాలు చెపుతారు. రంగి ఎప్పటి కప్పుడు కట్టు కథలు అల్లుతూనే ఉంది. పధకం ప్రకారం, సరంగుతో కబుర్లాడింది. చుక్కాని పట్టింది. అందరిని నిద్ర పుచ్చింది. అంత హస్కీ గొంతుతో, అంత సెక్సీ పాట పాడితే కొందరికి నిద్ర ఎగిరి పోతుంది. బెల్లం, చింతపండు యవ్వారాల వాళ్లు, తెడ్డులు వేసి, తాళ్లు లాగిన జీవులు కాబట్టి, వాళ్ళు జోగారు. ఆ పడవ లోనే ప్రయాణం చేస్తున్న మన కథకుడు కూడా నిద్ర పోయాడు. లేచాక, కథకుడు, పడవ టాపెక్కి, రంగిని, ఇంటర్వూ చేస్తాడు. ఈ పడవ ప్రయాణీకుడు, ఈ మగవాడు – పద్దాలు బోట్ మీద ఉన్నప్పుడు, పద్దాలుని గాని, రంగిని కాని, ఒక్క ప్రశ్న అడగడు. అడగటానికి అతనికి దమ్ముల్లేవు. ఎందుకంటే, పద్దాలు మక్కెలు ఇరగదంతాడు.
పడవలో జరిగింది దొంగతనమైతే, ఇతడి curiosity, interrogation, అంతా రంగికి పద్దాలుకి, పెళ్ళయిందో లేదో, పద్దాలు abusive, adulterous relationship ఆమ ఎందుకు భరిస్తోందో, ఈ విషయాల మీద. కథకుడికి, ఆ చీకట్లో ఆమె రవిక ఎత్తి చూపిస్తుందీ, ఆ చీకట్లో ఆమె వీపు మీద అతనికి తెల్లని మచ్చ కనిపిస్తుందీ! అతనికేం తెలుసనీ, అవి burns scars, అవునో కాదో. ఒక వేళ ఆమెకు బొల్లి ఉందో, చల్ది (Herpes zoster) వచ్చిందో? అసలు ఎప్పటి కప్పుడు రంగి అబద్ధాలు కల్పిస్తూనే ఉంది. పద్దాలు తనను విహారయాత్ర తీసుకెళ్ళటం అంతా ఉత్తదని చెప్ప లేదూ? తను, సవితి, వారి మధ్య ఈసులు, పద్దాలు తనను తన్నటాలు, గుడిసెకి నిప్పెట్టటాలు – ఇవన్నీ కూడా అంతకు ముందు పడవ సరంగుకు, (ఇప్పుడు మళ్ళీ, కథకుడికి,) రంగి కల్పించి చెప్పినవి అయ్యుండొచ్చు. ఆమె చెప్పే వాటిలో ఏది నిజమో, ఏది అబధ్ధమో.
రంగికి కావాల్సింది, తోడుదొంగలు వేసుకున్న ప్లాన్ ప్రకారం, ఆ దొంగసొమ్ము పద్దాలు అనుకున్న చోటికి జేరేసే దాకా, ఆ పడవ లోనే ఉండిపోయి, ఏదో సోది వినిపించటం. మరి మన బ్రిలియంట్ కథకుడు గారు, ఆమెకో చుట్ట ఇచ్చి, తనో చుట్ట వెలిగించి, వింటూ, రంగి అందరికీ అబద్దాలు చెప్పి, తనకు మాత్రం, అంతా నిజమే చెపుతుందని అనుకోటం? అంతటితో అయ్యిందా! ఆ దొంగ, అబద్ధాల కోరు రంగి ఇచ్చిన సమాచారాన్ని ఎడాపెడా ఎనలైజ్ చేసి, అతనికి తోచిన conclusions draw చేసి, మన అందరికీ సరఫరా చెయ్యటం. ఏమి విపరీతం! All of a sudden అతనికి, రంగి అంటే భయం, భక్తి, జాలి కలుగుతాయి. ఎందుకంటేనంట ఒక చెడ్డ మగవాడిని, ఆబిడ గారు -ఆ సుగుణాల రాశి, unconditionally ప్రేమించిందంట. (కధ చదువుతూ, “I Love You, just the way you are”, “Stand by your Man” అని పాటలు పాడుతున్నా నే నిక్కడ.)
1940ల్లోని ఈ కధని కొందరు బుద్ధిమంతులు ఎలా చదివినారో తెలిసింది. పాఠకులకు కూడా రంగి నచ్చటం, పైగా కొంతమందికి -బతుకంటే అదే, ప్రేమంటే అదే, మా లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటే బావుండును అని అనుకోటం, ఇదంతా నాకు వింత గా ఉంది. దొంగతనాలు చేస్తూ, తన్నులు తింటూ, పారిపోతూ, – పద్దాలు, రంగి – లాగా బతకటం, తమ సొంత బతుకుల కన్నా సుఖంగా అనిపించటం, నమ్మే మాటేనా?
రంగి గురించి, అంత fuddled, fuddy duddy ఆలోచన చేశాక, ఆ మాయదారి మహత్తర దేవత హుండీలో ఓ రూపాయ వెయ్యటం పడవ లోని కథకుడికి ఎంత పని. అప్పటిదాకా లేని, కొత్తగా వచ్చి పడే అసంబద్ధత ఏముంది?
సర్లెండి, ఆ తెలుగు సినిమా రచయిత, ఈ రంగి హృదయాన్ని, ఎలా గొప్పగా ఆవిష్కరించాడో, ఆ విషయం సౌమ్య ఈ పత్రికలో గానీ రాస్తే, తప్పక చదువుతాను. (ఆమెకు రాయాలని ఉంటేనే.)
లైలా
ఈమాట గురించి గురించి తుంగ కనకరాజు గారి అభిప్రాయం:
10/12/2013 9:39 am
కొన్ని రోజుల కింద ఈమాట అంతర్జాలం చూసినంక చాల సంతొషం కలిగింది. నేను పదవ తరగతిలొ నుండగా తెలుగు పధ్య భాగం నన్నెంతొ ప్రభావితుణ్ణి చేసింది. ఇది పంతొమ్మిది వందల డెబ్బైఐదునాడు. అప్పటి నుంది పద్యమంటె ప్రాణం. ఎక్కడ పద్య సాహిత్యం దొరికితే తప్పక కొంటాను. కాని శ్రీ వానమమలై వరదాచార్యుల పోతన చరిత్రము దొరకలేదు. ఒక రెండు రొజులు వివిధ పుస్తకాల దుకాణలల్ల ఎతికిన. పాఠకుల అభిప్రాయాలు చదివిన వారెవరైన తెలియ జేస్తె కొంటాను. ఇక కింది డబ్బాలోనున్న యు ఆర్ ఎల్ అంటె తెలియదు.
అదే నేను గురించి mallikarjuna sarma గారి అభిప్రాయం:
10/07/2013 3:39 am
ఆత్మ విచార మార్గం లో అసలు “నేను” ఎవరో తెలుసుకోవడమే ఈ దేహాన్ని ధరించిన వాళ్లు చేయవలసిన ఏకైక పని. కాని, అది తప్ప అన్నీ చేస్తూ, అన్నీ తెలుసన్న అహంభావం అనుక్షణం చేస్తున్న మాయలో పునరపి మరణం…పునరపి జననం…
మంచి ఆలోచనల్ని రేపిన రాధ గార్కి ధన్యవాదాలు.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ!
మల్లికార్జున శర్మ.
స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి V.Ch.Veerabhadrudu గారి అభిప్రాయం:
09/20/2013 4:54 am
ఈ చర్చ ముగిసిపోయిందనుకున్నాను గానీ, ఇంకా కొనసాగుతున్నందుకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకటి రెండు వివరణలు ఇవ్వవలసి ఉందనిపించింది.
1) బాల్యకాల అనే పదబంధంలో లోపమేమిటో నాకు తెలియలేదు. వైకం బహమ్మద్ బషీర్ గొప్ప మళయాళ రచయిత.ఆయన ఒక రచన పేరు బాల్యకాలసఖి. అది మళయాళ పదబంధమంటారా, తెలుగు మీద ఉన్నదానికన్నా సంస్కృత ప్రభావం మళయాళం మీద మరీ ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే.
2) మరువం, దవనం అనే పేర్లని నేను ఉద్దేశ్యపూర్వకంగానే వాడాను. కవి మాట్లాడుతున్న సుగంధం కేవలం పుష్పజాతుల సుగంధం మాత్రమే కాదు, అదీకాక, ఈ వ్యాఖ్యలు చదివి చింతిస్తున్న నన్ను రాళ్ళబండి కవితాప్రసాద్ ఇటువంటి పదప్రయోగాలు గతంలో కూడా ఉన్నాయని, వెంటనే తన ధారణలోంచి సురభి మాధవరాయకవి అనే 18వ శతాబ్దపు కవి తన చంద్రికాపరిణయం అనే ప్రబంధంలో నాయిక తన కొప్పులో మరువం తురుముకున్నప్పుడు దాని మీద తుమ్మెదలు వాలాయని రాశాడని అన్నారు.
3) ఇక తమ్మినేని యదుకులభూషణ్ గారికి నవ్వు తెప్పించిన నా పదప్రయోగం ‘పురాతమైన నీడ’లో నవ్వు తెప్పించిందేమిటో నాకు అర్థం కాలేదు. ఘోష్ట్ అనే పదానికి ప్రేతమనే అర్థమో, దెయ్యమనే అర్థమో గూగుల్ సెర్చ్ చూడకుండా కూడా స్ఫురించేవే. కాని కవి హృదయం అర్థమయితే తప్ప ‘పురాతనమైన నీడ’ అనే అర్థం స్ఫురించదు. కేవలం స్పానిష్ వాచకాన్ని ఇంటర్నెట్ ముందు కూచుని బాబిలోన్ ట్రాన్సలేటింగ్ టూల్ నొక్కితే వచ్చే అర్థం ప్రేతమని మాత్రమే ఉంటుంది. కాని మొత్తం కవిని చదివి కొన్నాళ్ళ పాటు మరే ధ్యాసా లేకుండా గడిపితేగాని ‘పురాతనమైన నీడ’ అన్న మాట స్ఫురించదు.నిజంగానే మహాప్రజ్ఞ చేసే మిరకిల్ ఇది.
ఇంతకీ తెలుగులో ఇందరు స్పానిష్ మహాపండితులు ఉండి కూడా నాకు ఇన్నాళ్ళ పాటు మచాడో పేరు ఎందుకు తెలియలేదో?
కినిగె.కాం తో నా అనుభవాలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
09/18/2013 5:15 am
అనుభవంతో కూడిన మరొక అభిప్రాయం.
కినిగె వారు నేను రాసిన మహాయానం అనే కథల పుస్తకం ప్రచురించేరు. రచయితని కనుక నాకు నాలుగు ప్రతులు ఉచితంగా దిగుమతి చేసుకుందికి “కూపాను” వంటి సదుపాయం కలిగించేరు. నా పుస్తకం దిగుమతి చేసుకుని, చదివి, దానిమీద వారి అభిప్రాయాన్ని రాసి పంపమని నలుగురు “పెద్ద”లకి ఈ విద్యుత్ కూపానులు పంపేను: నలుగురూ బాగా విద్యార్హతలు కలవారే. కాని ఒక్కరూ పుస్తకం ప్రతిని దిగుమతి చేసుకోలేక చేతులెత్తేశారు. ఆ నలుగురికి నా దగ్గర ఉన్న పి. డి. ఎఫ్. కాపీ పంపవలసి వచ్చింది. ఇ-పుస్తకాలని దిగుమతి చేసుకోవడం ఇంత కష్టం అయితే వీటిని ఎవ్వరూ కొనరు. ఈ రంగంలో నాకు అనుభవం తక్కువ. కినిగె సంస్థ ఈ విషయంలో కొంచెం శ్రద్ధ వహించి, వినియోగదారులకి తేలికగా ఉండే పద్ధతులని వెతకమని నా రెండు దమ్మిడీల విలువైన సలహా. – వేమూరి
నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల గురించి సంతోష్ గారి అభిప్రాయం:
09/18/2013 4:34 am
గురువు గారూ,మీరు అత్యద్భుతంగా పద్యాన్ని వివరించారు.నేను అఖిల భారత సర్వీసులకు సన్నద్ధమౌతున్నాను, మా తెలుగు మాస్టారు శ్రీనాధుని గురించి, ఆయన రచనా పటిమను గురించి చెప్పిన రోజు నుంచి నేను శ్రీనాధునికి పెద్ద అభిమానిని అయిపోయాను,ఈ గుణనిధి కధ మూలంలో హర్షుడు రాశారు కదా? కాని అది మన తెలుగు ప్రజలకు వంట బట్టదని శ్రీనాధుడు అర్థం చేసుకుని తదనుగుణంగా మార్పు చెయ్యటం తెలుగు పై ఆయనకు ఉన్న అభిమానానికి నిదర్శనం. యజ్ఞదత్తుడు సోమిదమ్మ గారిని ఇంటి నుంచి వెడలగొట్టి మరు నిముషమే మరో పెళ్లి చేస్కున్నాడు అని మూలంలో ఉండగా,”కొద్ది దినములు గడిచిన పిదప” అని మార్చి రాయటం శ్రీనాధునికే చెల్లింది. శ్రీనాధుని ఆత్మ ప్రత్యయం ఎక్కువ, ఈ విషయం ఆయన చాటువులతో ప్రస్ఫుటమౌతుంది. నాకు ఇప్పటి వరకు చదివిన పద్య సాహిత్యం లో నచ్చిన పద్యం మీతో పంచుకుంటున్నాను. “దివిజ కవివరుల్గున్డియలు దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాదుడమరపురికి”. నాకు ఎప్పుడైనా నేను సివిల్స్ సాధించాలేనేమోనని అన్పిచినప్పుడు ఈ వాక్యం చదివితే ఎంతో ధైర్యం వస్తుంది.నాకు ఈ సైట్ చాలా బాగా నచ్చిందండి. ఈ విషయంలో మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి Vadrevu Chinaveerabhadrudu గారి అభిప్రాయం:
09/15/2013 7:19 am
సురేశ్ కొలిచాలగారు — నా అనువాదం మీద జయప్రభ వ్యాఖ్యలు నాకేమంత ఆశ్చర్యం కలిగించలేదు గాని ఆ వ్యాఖ్యలకి జవాబు ఇవ్వడానికి మీరు తీసుకున్న శ్రద్ధకి నమోవాకాలు అర్పిస్తున్నాను. నేను ఆ కవితలని ఒక కవిగా గాని, లేదా అనువాదకుడిగా గాని అనువాదం చేయలేదు. ఆ కవిత్వం పట్ల ఆపుకోలేని తమకానికి లోనైన పాఠకుడిగా చేశాను. కాని మీరు రాసిన టీకా చదివాక ద్రోహవస్త్రం అనేమాట ఆ కవితలో మరీ బాగా అమరిందనిపిస్తోంది. మనం అనువాదం చేస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉండే ఒక మహాప్రజ్ఞ చేసే మిరకిల్ అది.
ఇక మరువం,దమనం పూలుకావు. కాని వేరే దేశాల పుష్పాల పేర్లు మన భాషకి సన్నిహితంగా లేనప్పుడు మనం మనకి సన్నిహితంగా ఉండే పేర్లనే వాడుకోవలసిఉంటుంది. మరువం, దమనం అనే పేర్లు పాఠకుడిలో రేకెత్తించగల సున్నితమైన సంవేదన ముఖ్యం తప్ప, వాటి బొటానికల్ ఆక్యురసీ కాదు. నిమ్మ పొద, కేశ రాశి, ఊట నీరు, వేన వేల జలాలు లాంటి పదాల్లో తెలుగు లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. కాని నేను నిస్సహాయుణ్ణి. ఆ కవితల్ని ఇప్పుడు అనువాదం చేసినా అలాగే అనువాదం చేస్తాను.
మరోమాట కూడా చెప్పాలి. నా దృష్టిలో ‘మరీముఖ్యంగా ఒక మాఘమాసపుగాలి’ని నేనేమంత గొప్ప అనువాదంగా పరిగణించలేను.
చినవీరభద్రుడు
తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
09/09/2013 3:07 pm
ఎంతో ఆలోచింపజేసే వ్యాసానికి, practicalగా ఉపయోగపడే సలహాలను అందించినందుకు వెల్చేరుగారికి చాలా కృతజ్ఞతలు.
తెలుగు ప్రపంచ భాష అనేది దేవుడెరుగు, కనీసం ఇంకొక తరానికైనా ఇప్పటి తరం వాళ్ళకున్నంత ప్రవేశం, పాండిత్యం, భాషపైన పట్టు గాని వెసలుబాటూ గాని- “నేర్చుకోవడానికి” అవసరమయ్యే అవకాశాలను అందించగలమా అనేది అనుమానమే.
సిలికానాంధ్ర వారి “మనబడి” ప్రయత్నాలు అభినందనీయం. కాని అందులో ఎందుకో “మన” అన్నదానికే కొంత లోటేమో అనిపిస్తుంది. వారు నిర్దేశించిన సంఖ్యలో విద్యార్థులను పోగుచేస్తేనే కాని వాళ్ళ పుస్తకాలు సైతం అమ్మడానికి నిరాకరించడం విద్యార్థులకు లోటే. అయినా ఎవరికి అమ్మాలో ఎవ్వరికి అమ్మకూడదో వాళ్ళ ఇష్టం. కాని వాళ్ళు ఎంచుకున్న భాషాసేవకు నష్టం.
అపార్థం చేసుకోరనే ఆశతొ, విన్నపంతో అడుగుతున్న ప్రశ్న మాత్రమే – ఎవరికి కావాలండి “ఊర్థ్వజ్ఞుడు” అనే పదం రాయడం? అంటే అది మంచిది కాదని కాదు, సాధారణ విషయాలను సైతం తెలుగులో సరిగ్గా చెప్పడానికి కష్టపడే పిల్లలచేత గహనమైన పదాలు, అసలెప్పుడూ వాడనివి నిఘంటువుల్లో మాత్రమే దొరికేవి (దొరకనివి!) వ్రాయిస్తే వాళ్ళకే కాదు సాటి పిల్లలకు మాత్రం ఏం మేలు ఒరిగింది అనే బాధతో అడిగింది. విమర్శ కన్నా ఇది ఆత్మ విమర్శ. అసలాపదం పెద్దవాళ్ళెంత మందికి తెలుసు, ఎన్ని సార్లు జీవితంలో రాశారు, చదివారు, వాడారు! కాదు, మా పిల్లవాడు ఊర్థ్వజ్ఞుడు అంటే చెప్పేదేమీ లేదు. వీలైనంతవరకు తెలుగులో సొంత భావ వ్యక్తీకరణకు సాయపడినప్పుడే తెలుగు శిక్షణకు, చదువుకు సార్థకత అనిపిస్తుంది.
విధేయుడు
శ్రీనివాస్
దశావతారస్తుతి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
09/04/2013 11:12 am
మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
నమస్కృతిపూర్వకంగా,
ఆనందరామ బారువా, నీలకంఠయ్య, నగరాజారావు, రావూరి దొరసామిశర్మ గారల తర్వాత ఛందశ్శాస్త్రంలో ఇంత విస్తృతంగా ప్రయోగాత్మక కృషిని చేస్తున్నవారు ఈ తరంలో మీరు తప్ప వేఱొకరు లేరనుకొంటాను.
మీ వరివస్యకు అభినందనలని చెప్పటం చాలా చిన్నమాట.
చంపకమాల, చంపకమాలిని, చంపకావళి, చిత్రలత, చిత్రలతిక, తుమ్మెదకంటు, ధృతశ్రీ, పంచకావళి, పూలపాన్పు, రుచిర, శశివదన, సరసి, సిద్ధి, సిద్ధక – అని మీరు గుదిగ్రుచ్చిన “చంపకమాల” నామాంతరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిలో “చంపకమాలిక”, “చంపకావళి”, “పంచకావళి” అని మూడు పేర్లతో దుఃఖభంజనుడు వాగ్వల్లభచ్ఛందస్సులోనూ; “చిత్రలత”ను హేమచంద్రాచార్యుడు తన ఛందోనుశాసనం టీకలోనూ; “చిత్రలతిక”ను శ్రీకృష్ణభట్టు వృత్తముక్తావళిలోనూ; “శశివదన”ను పింగళుడు ఛందస్సూత్రంలోనూ; “సరసి”ని గంగాదాసు ఛందోమంజరిలోనూ; “సిద్ధకము”ను చంద్రశేఖర భట్టు వృత్తమౌక్తికంలోనూ; “సిద్ధి”ని స్వయంభువు స్వయంభూచ్ఛందస్సులోనూ వాడిన విషయం నాకు తెలుసు. తక్కిన పేర్లను ఎవరు ఏ కావ్యంలో వాడారో తెలియరాలేదు. ఇంకా చంపకమాలను చంద్రశేఖర భట్టు వృత్తమౌక్తికంలో “సురతరు రి త్యన్యత్ర” అని ఎవరో “సురతరువు” అన్నారని చెప్పాడు కాని, ఆ అన్యత్ర ఎక్కడో తెలియదు. నారాయణభట్టు వృత్తరత్నాకరం టీక “సలిలము” అని, “శ్రీ” అని పేర్కొనటం కూడా జరిగింది.
రావూరి దొరసామిశర్మ గారు “సలిలనిధి” అని ఉదాహరించారు కాని, అదెక్కడిదో తెలియదు. మీరు పేర్కొన్న “తుమ్మెదకంటు”, “ధృతశ్రీ”, “పూలపాన్పు”లను ఎవరన్నారో తెలియరాలేదు.
మీరు రూపొందిస్తున్న వృత్తవిజ్ఞానసర్వస్వంలో ఈ విశేషాలన్నీ త్వరలో వెలుగు చూస్తాయనుకొంటాను.
ఔకారాన్ని రెండు గణాలకు వాడటం గుఱించి మీరు ప్రస్తావించారు. అది శాస్త్రపరిభాషాకృతం కాదనుకొంటాను. రెండు నగణాలు అని మాత్రమే అర్థం.
ద్వివచనం. సుబంతమైన న (గణాద్యక్షరం) పైని నామప్రత్యయాలేర్పడి నః – నౌ – నాః అని ప్రథమా విభక్తి రూపాలు సిద్ధించాయి. నః = ఒక్క నగణం; నౌ = రెండు నగణాలు అని. “నుర్గౌ” అని న వర్ణంపైని గుణితక్రమానుసారం తక్కిన గణసంఖ్య సూచిత మవుతున్నది మాత్రం నిస్సంశయంగా లాక్షణిక సంకేతితం.
సార్థక నామవృత్తాలన్న మీ అభిధేయకల్పన చాలా ఔచితీమంతంగా ఉన్నది. అందుకు మీరు దశావతార నామాలను సంకేతించి పద్యాలను వ్రాయటం సొగసైన ఆలోచన. మీ పద్యాలూ భావుకసుభగంభావుకంగా ఉన్నాయి. ఒక్క “హయవాహన”ను మాత్రం “వాహిని కాఁగన్ జగమ్ము” ఇత్యాదిగా భవిష్యదర్థకంలోకి మారిస్తే ఇంకా సమంజసంగా ఉంటుంది.
పరిశోధకుడే లక్ష్య-లక్షణ నిర్మాతృకవయిత కావటం అన్న ప్రాక్సంప్రదాయం మీ యందు పునారూఢమై తెలుగు ఛందశ్శాస్త్రచరిత్రలో మీ స్థితిని సుస్థితం చేస్తున్నది!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
08/13/2013 11:01 am
మాన్యులు శ్రీ వెల్చేరు నారాయణరావు గారికి
నమస్కృతిపూర్వకంగా,
అధీతిబోధానుభవసంక్షిప్తిగా మీరు వ్రాసిన వాక్యావళికి ధన్యవాదాలు.
ఇటువంటి అపురూపమైన గ్రంథాలకు తమిళ కన్నడదేశాలలో లేని దుఃస్థితి ఒక్క తెలుగుదేశంలో మాత్రమే ఉన్నదన్న విచారంతో పై మాటలను వ్రాశాను. అందులో పొరపాటున “మేకాధీశ శబ్ద శతకోటి” చర్ల భాష్యకారాచార్యుల వారి కృతి అని పేర్కొనటానికి మాఱుగా వాసుదేవ అద్వైత పరబ్రహ్మశాస్త్రి గారి కృతి అని వ్రాశాను. సవ్యాఖ్యానంగా ప్రకటితమైన ప్రశస్తమైన ఆ రచనను నలభై యేళ్ళ క్రితం చూచినపుడు అందులోని నవీన చిత్రబంధాల బొమ్మలను మాత్రం వ్రాసుకొన్నాను కాని, మొత్తం పుస్తకాన్ని వ్రాసుకోవటానికి అవకాశం లేకపోయింది. దాని వ్యాఖ్యానపంక్తులు ఎంతో అందంగా ఉండినవని మాత్రమే నాకు గుర్తున్నది. ఆ తర్వాత ఆ గ్రంథం ఇప్పుడెక్కడున్నదో ఆచూకీ చెప్పగలవారు కనబడలేదు. అటువంటి రచనను చేసిన విద్వాంసులు వేఱే భాషలోనూ లేరు. ఆ గుర్తింపైనా వారికి దక్కలేదని బాధ మాత్రం మిగిలింది.
పోకూరి కాశీపతి గారిది “త్రింశదర్థపద్యరత్నము” అద్భుతావహమైన రచనం. (నేను “త్రింశత్యర్థ” అని వ్రాసినది లేఖనదోషం) అటువంటివి ఎందరో వ్రాయలేరు. వారి “శ్ర్రీ శౌరి శైశవలీల” దశాక్షరీయ కావ్యం పీఠికలో వ్యాఖ్య లేకుండా అచ్చయింది. విడిగా అచ్చయిన లఘుప్రతి ఇప్పుడు లభిస్తుందనుకోను. ఆచూకీ చెప్పగలవారు లేరు. శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి గారి “కంకణబంధ రామాయణము” ప్రతికి ఒకప్పుడు మద్రాసు ఓరియంటల్ లైబ్రెరీలో వ్రాతప్రతులను సరిచూసి ఎవరో అద్భుతంగా పరిష్కరించిన కాగితం ప్రతి ఒకటుండేది. నేను దానిని చూసి 1971లో ముప్పాతిక భాగానికి పైగా ప్రతిని వ్రాసుకొన్నాను. ఆ తర్వాత చాలా కాలానికి వెళ్ళినప్పుడు వేఱే ప్రతులున్నాయి కాని, నేనొకప్పుడు చూసిన ప్రతిని తిరుపతికి తరలించామని చెప్పారు. అది తిరుపతికి చేరనే లేదు. ఇప్పుడేమయిందో తెలియదు. ఉన్న ప్రతులకు ఫోటోకాపీని సంపాదించగలిగినా, ఆ సుపరిష్కృతమైన ప్రతి ఆచూకీని కనుగొనటం సాధ్యం కాలేదు. పరిష్కరించినవారు ఏ వ్రాతప్రతిని చూసి సరిచేశారో కాని, ఆ వ్రాతప్రతి కూడా ఇప్పుడు మద్రాసు ఓరియంటల్ లైబ్రెరీలో లేదు. ఇప్పుడక్కడ తెలుగు పుస్తకాలకు దిక్కూ దివాణం లేని స్థితి. శ్రీమాన్ గోపాలాచార్యులవారి “గురుమూర్తి నాయని విలాస చిత్రప్రబంధము” అద్భుతమైన సుముద్రిత చిత్రబంధకృతి మైసూరు గవర్నమెంటు ఓరియంటల్ లైబ్రెరీలో ఉండేది. ఇప్పుడు లేదు. ఆంధ్రదేశం లోనూ లేదు. కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి కార్యాలయంలో పుస్తకాలన్నీ ఏటేటా కొన్ని కొన్ని “LOST” అన్న పేరుతో మాయమైపోతుంటాయి. ఆరుద్ర గారు ఎంతో శ్రమకోర్చి వెళ్ళి, చూసి, చదివి “సమగ్రాంధ్రసాహిత్యం”లో ఉదాహరించిన అక్కడి గణపవరపు వెంకటకవి గ్రంథాలు నేను వెళ్ళేనాటికి “MISSING” పట్టికలోకి చేరిపోయాయి. ఏమైపోయాయో వాళ్ళూ చెప్పలేకపోయారు.
ఇటువంటి దుఃస్థితిని తెచ్చుకోవటం ఒక్క తెలుగు జాతికి మాత్రమే సాధ్యమనిపించి ఏదో నా ఘోషను వ్రాశాను.
పోనీ, పై పుస్తకాలన్నీ రసవదర్థాలు కావా? అంటే, మహావిద్వాంసుల రచనలు కదా, శ్రద్ధగా పరికించి చూస్తే సరసకావ్యాలే అనిపిస్తుంది. మొన్నీ మధ్యనే నేను దైవజ్ఞ సూర్య పండితుని సంస్కృత కృతి “రామకృష్ణవిలోమ కావ్యం” చదివాను. నాకైతే అద్భుతంగా అనిపించింది. అనులోమవిలోమైక్యంతో ద్వ్యర్థికావ్యాన్ని ఇంత రమణీయంగా, ఇంత భావస్ఫోరకంగా వ్రాశాడే, ఏకార్థకావ్యమే వ్రాసివుంటే ఏ నారాయణీయం లాగా వ్రాసేవాడో! అనిపించింది. అరిశాణఫాల వేంకటాధ్వరి “రాఘవయాదవీయం,” వింజమూరి సోమేశ్వరకవి “రాఘవయాదవీయం,” కృతులకంటె వేయిరెట్లు మిన్న.
ఆధునికపాఠకులు చదివినా, చదవకపోయినా – ఈ మహనీయుల రచనలను తెలుగువాళ్ళు చదవాలని ఆశించటం భావ్యమే అనుకొంటాను. ఒక్క రామలింగారెడ్డి గారి కృషిఫలితంగా పింగళి సూరనకు తెలుగులో మునుపెన్నడూ లేని స్వస్థితి, సుస్థితి కలిగాయి. అందుకు దేశకాలమానపరిస్థితులు తోడయ్యాయి. ఈ రోజు పింగళి సూరన కృతులన్నిటినీ నిజంగా చదివేవారు ఉన్నా, లేకున్నా ఆయన స్థానం మాత్రం పదికాలాలకు పదిలమయింది. అలాగే, సాధనసంపత్తి, సాధికారత కలిగిన మీవంటి విదితవిద్వాంసులు, ఉత్తమ ఉపాధ్యాయులు ఈ శ్రేణి రచనలను అధికరించి ఆంగ్లానువాదపూర్వకంగా పరిచాయక వ్యాసాలను, గ్రంథాలను సహృత్ సుహృత్ శిష్యకృతంగా సర్వసమ్మతంగా వెలయిస్తే వాటికి అర్హగౌరవం లభించి, సమానహృదయులలో కొంతైనా ఆసక్తి జనించి, మళ్ళీ వాటికి కనీసం సూర్యాలోకభాగ్యమైనా దక్కుతుందని, ఆదరం ఏర్పడుతుందని నా దృఢవిశ్వాసం.
మీరూ ఆలోచింపగలరని ప్రార్థన. మీ వంటి పెద్దల వరివస్య మూలాన అనాదరం తగ్గి ఆదరం కలుగుతుంది.
నేనేమైనా అధికప్రసంగం చేసివుంటే, మన్నించండి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి మోహన గారి అభిప్రాయం:
08/04/2013 10:17 am
ఇన్నేళ్ల తరువాత ఈ వ్యాసముపైన అభిప్రాయాలు వస్తున్నందులకు ఆనందముగా ఉంది! దశశ్లోకి శంకరాచార్యకృతమని అభిప్రాయమున్నది. నేను ఈ వ్యాసమును వ్రాసినప్పుడు అలాగే ఉండవచ్చుననుకొన్నాను. కాని అది నిస్సంశయము కాదు కాబట్టి నేను దానికి ఉదాహరణను ఇవ్వలేదు. కాని ఇప్పుడు చెప్పగలను అది వారు వ్రాయలేదని. ఎందుకంటే అశ్వధాటి వృత్తము శంకరుల కాలములో లేదు. దానిని హేమచంద్రుడు తన ఛందోనుశాసనములో పేర్కొనలేదు. అశ్వధాటి మొట్టమొదట సుమారు 16వ శతాబ్దపు మందారమరంద చంపువులో కనబడుతుంది మనకు, అశ్వధాటి పేరుతో కాదు మత్తేభము అనే పేరుతో! ఈ విషయాలనుగురించి నేను ఒక ప్రత్యేక వ్యాసము వ్రాయబోవుచున్నాను, బహుశా అది జనవరి నాటికి తయారు కావచ్చును. కామేశ్వరరావుగారు, మీరు చెప్పిన కాలిదాసు ఎప్పటివాడో? విధేయుడు – మోహన
శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
08/04/2013 3:16 am
“కొందరు దేవీ అశ్వధాటిని శంకరులు వ్రాసినారందురు. కాని ఇది కాళిదాసకృతమని అధికుల ఊహ. నా ఉద్దేశ్యములో ఇది శంకరాచార్యవిరచితమని, ఎందుకంటే ప్రాసయతులు మున్నగు అలంకారములు కాళిదాసునకు పట్టవు.”
మోహనరావుగారు యీ వ్యాసంలో ప్రస్తావించిన పై వాక్యాలు “చేటీ భవన్నిఖిల” అని మొదలయ్యే దేవీ స్తోత్రం గురించే అనుకుంటాను. ఆ శ్లోకాలన్నీ అశ్వధాటి వృత్తంలో ఉంటాయి. చాటు సంప్రదాయంలో కనిపించే కాళిదాసులాగానే, (శాక్తేయ) మత సంప్రదాయంలో మరొక కాళిదాసు కనిపిస్తాడు. ఈ సంప్రదాయం ప్రకారం – దేవీ పంచస్తవి, సప్తరత్నమాలికాస్తోత్రం, పైన పేర్కొన్న దేవీ స్తుతి (దీనినే దేవీ దశశ్లోకీ అని కూడా అంటారు) – మొదలైనవన్నీ కాళిదాస కృతులే.
నిశ్శబ్దం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
08/03/2013 11:55 pm
ఎప్పుడో వెళ్ళిపోయిన ఆవెని, అందులోనూ తన లిబరల్ కవిత్వాన్ని, మరే రకవైన ముసుగులూ లేని తన కవిత్వాన్ని, మీరు వ్రాసిన పదాలలోనూ, వాక్యాలలోనూ తప్పులేవి లేవు, కానీ ఆ కాంటెక్స్ట్ లో కమలాదాస్ గారి ప్రస్తావన అసలు బాగలేదు.
అయినా ఈ విమర్శలు తెలుగు వ్రాతల్లో బూతు అనే దానిమీద ఒక వివరణ, ఒక సవరణ దిశగా పోతాయని నేననుకున్నాను. కానీ ఒకరిమీద మరొకరి కామెంట్లకే పరిమితం అవటం నిజంగా దురదృష్టకరం. అయినా ఎవరికి ఆశక్తి వుంది కనక, ఏ ముగ్గురు నలుగురో అంతే. కానివ్వండి ఈరోజు కాకపోతే, రేపు ఒక సహజవైన వ్యక్తీకరణని బూతని ఎంతకాలం ఆపగలరు.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
దైవం గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
07/23/2013 3:36 pm
“ట” వేదాంతం
———–
‘ఒక్క “ట” తో ఎంత పని చేయించుకున్నారు మీరు!’ — అని ఒక ప్రఖ్యాత ఆరోచకులు అన్న వెంటనే మరొక ప్రముఖ ఆరోచకులు అవును సుమా, ‘మంచి పద్యమేనని’ కితాబు ఇచ్చిన తదుపరి నాబోటి సాధారణ పాఠకుడు, ఒకరకంగా ‘సతృణాభ్య వ్యవహారి’ ఉద్ధతుల మధ్యకి దిగి, ’తగుదునమ్మా అని’ అభిప్రాయం రాయటానికి నిజంగా భయం వేస్తున్నదంటే నమ్మండి.
నామటుకు నాకు ఒక పద్యం చదవగానే మెరుపులా ఏదో, ఎక్కడో చదివినదో, ఎవరో చెప్పగా విన్నదో జ్ఞాపకాని కొస్తుంది. ఆజ్ఞప్తి నా బుర్రకి పనికల్పించి సాదృశ్యం కోసం వెతుకులాడిస్తుంది. ఆ సాదృశ్యత ఏదో తట్టగానే, ఆ పద్యం ఒకటికి పది సార్లు చదివి, ఆనందించడానికి తోడ్పడుతుంది. ఈ పద్యం, మరీ ముఖ్యంగా ఆ ‘ట’ మీద వివరణ నాకు ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం ( పది.129) జ్ఞప్తి కి తెచ్చింది. మరీ ముఖ్యంగా, ఆ సూక్తంలో ఏడవ ‘శ్లోకం.’
ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న ।
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ సో అంగ వేద యది వా నవేద ॥
This hymn has been translated, commented and critiqued by tons of scholars. It has been known as the Creation Hymn. It has been interpreted as one of the earliest accounts of skeptical inquiry and agnosticism. There was a Telugu translation by Vadlamudi Gopalakrishnayya from the Rigveda Samhita published by the Tirumala Tirupati Deevasthanam. It was more difficult than the original Rik. I will give one translation, I liked most. It was by Raimundo Panikkar. Here it goes:
“That out of which creation has arisen,
Whether it held it firm or it did not,
He who surveys it in the highest heaven,
He surely knows – or may be He does not.”
May be, it tells more than the alleged ‘ట’; or may be it does not. Who knows!
Whether Indrani Palaparthi has this స్మృతి when she was penning the poem would be a topic of discussion on her knowledge or association with Hindu Scriptures, Mysticism and even Psychoanalysis. And, that would be fodder for other comments and counter-comments.
I know, I have been accused of living in the 1980s, and did not ‘grow up.’ With this note I am afraid I would be condemned to be living some three thousand five hundred years ago! I would like to end my comment with a light hearted story.
Long long ago,there was a king by name Sisunaga. He had banned eight sounds in his kingdom because they were difficult to pronounce. They are :
ట ఠ, డ ఢ, శ ష, హ, క్ష. If this poem were to be written in Magadha during Sisunaga’s time, what could have happened to the, ‘ట,’ story?
Finally, Indrani garu! I loved reading your poems before publication in eemaaTa; and I love them more now after publication in eemaaTa.
Best Wishes, — Veluri Venkateswara Rao
తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
07/22/2013 10:15 am
వ్యాసాన్ని ఆసాంతం చదివి ఎంతో దయతో స్పందించిన శ్రీ కృష్ణమోహనరావు గారికి, రవి గారికి, పి. లలిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
శ్రీ కృష్ణమోహనరావు గారు! తుమ్మల వేణుగోపాలరావు గారి గూఢచిత్ర రహస్యప్రకాశిక భారతీయ భాషలన్నిటిలోని చిత్రరీతులను పరిశీలించి రూపొందించిన ఒక సమగ్ర విజ్ఞానసర్వస్వం. మొత్తం ఆఱు భాగాలుగా సంకల్పింపబడి, సగం మాత్రమే పూర్తయి అచ్చయింది. ఆ కూర్పు కాలంలో శ్రీ తుమ్మల వేణుగోపాలరావు గారు ఒక వారం రోజులు మా ఇంట ఉండి వారి సహృత్సల్లాపాలతో మా ఇంటిని ధన్యధన్యం చేశారు. పైపైని చదివేవారికి కొంత చాదస్తంగా అనిపిస్తుంది కాని, ఎంతో విలువైన సమాచారాన్ని మనకోసం సేకరించి శేఖరించిన మహానుభావులు వారు.
ఆధునికజీవితం ప్రకృతివిలాసానికి దవీయసమై కవిత్వం అంతర్ముఖీనత నుంచి బహిర్ముఖం కాసాగినపుడు మాఱిన కవిసమయాల నైపథ్యంలో ఇప్పుడు ఇటువంటి పద్యరచనమూ జరగటంలేదు; జరిగినవాటి పద్యార్థమూ తెలియటం లేదు. ఇటీవలి కాలంలో ఇటువంటి విషయాలపై గురుభావం సన్నగిల్లిపోయినందువల్ల చదివేవారూ లేరు; అచ్చువేసేవారూ లేరు.
గుడారు వెంకటదాస కవి గారి “ప్రబంధశిరోభూషణ ప్రకృష్ట బలరామ చరిత్రము”
శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారి “కంకణబంధ రామాయణము”
వఠ్యం పరబ్రహ్మశాస్త్రి గారి “చిత్రకంకణ రామాయణము”
శ్రీమాన్ గోపాలాచార్యుల వారి “గురుమూర్తి నాయని విలాస చిత్రప్రబంధము”
అల్లమరాజు రంగశాయి కవి గారి “చంపూ భారతము”
నాదెళ్ళ పురుషోత్తమకవి గారి “అద్భుతోత్తర రామాయణము”, “కృష్ణానదీ మాహాత్మ్యము”,
గాదె పాపరాజకవి గారి “చతుర్ముఖ కంద పద్య రామాయణము”
పోకూరి కాశీపతి గారి “దశాక్షర శ్రీ శేషశైలేలీల”, “త్రింశత్యర్థపద్యరత్నము”
శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారి “శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిరూష్మ నిర్వచనైకాదశాక్షర శకుంతలా చరిత్రము”
మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారి “ప్రబంధ సంబంధ బంధ నిబంధన గ్రంథము”
బండ్ల సుబ్రహ్మణ్యకవి గారి “విద్యుల్లతా బంధ ప్రబంధము”
వాసుదేవ అద్వైత పరబ్రహ్మశాస్త్రి గారి “మేకాధీశ శబ్ద శతకోటి”
తెలుగువాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఈ నిధులు ఎన్నని చెప్పను? ఇటువంటి కృతులకు కాలం చెల్లిందని, కాలస్రవంతి గతి మళ్ళిందని సమర్థించుకోవటం ఒక్క తెలుగువాళ్ళకే చెల్లింది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
07/20/2013 4:11 pm
మాన్యమిత్రులు శ్రీ కొలిచాల సురేశ్ గారికి నమస్కృతులతో,
భాషాశాస్త్రంలో శబ్దవ్యుత్పత్త్యధికరణమంటే నాకు అభిమానమే కాని అభినివేశం లేదు. మీ లాగా గాఢమైన కృషి చెయ్యలేదు. అందువల్ల ఈ నా మాటలు మీ నుంచి సమాధేయాలే కాని నా నుంచి సమాధానాలు కావు.
“పట్టణం” ద్రావిడ భాషామాతృకమై సంస్కృతంలోకి చేరినదన్న సాధ్యనిర్దేశానికి, మీ నిగమనానికి ఆధారాలు మీ వివరణ ద్వారా నాకింకా స్పష్టపడలేదు. అది సాంస్కృతికం కాదన్న నమ్మకం కలుగలేదు. సంస్కృతంలో “పట్టణం” కంటె “పత్తనం” ప్రాక్తనకాలికమైనట్లు కనబడుతుంది. క్ర్రి.శ. 4-వ శతాబ్ది నాటికే అమరసింహుడు తన నామలింగానుశాసనంలో – “పూః స్త్రీ పురీ నగర్యౌ వా పత్తనం పుటభేదనం, స్థానీయం నిగమః” అని పర్యాయపదావళిని ఇచ్చాడు.
ప్రాంతభేదాన్ని బట్టి వ్యాఖ్యాతలు “పట్టణం” పదానికి వివిధార్థాలను నిర్దేశించారు. “అమరకోశోద్ఘాటన వ్యాఖ్య”లో క్షీరస్వామి ప్రయాణాలు తక్కువగా ఉండి జనం స్థిరంగా ఒకచోట ఉండే ఊరు “స్థానీయ”మని, జనం తరచు వస్తూ పోతూ ఉండే ఆవాసం “పత్తన”మని వివరించాడు. సంస్కృతకృతులకు లభిస్తున్న దక్షిణదేశపు వ్రాతప్రతులలో “పత్తనం”, “పట్టనం”, “పట్టణం” అన్న మూడు రూపాలు కనబడుతున్నప్పటికీ, ఉత్తరదేశంలోనూ, తమిళ ప్రాంతంలోనూ అచ్చయిన సంస్కృతగ్రంథాలు అన్నింటిలో “పత్తనం” అన్న రూపమే కనబడుతున్నది. ఇదే నిజానికి ప్రాచీనరూపమేమో పరిశీలింపవలసి ఉన్నది.
అయితే, ఆంధ్రుడైన మల్లినాథసూరి తెలుగుదేశంలోని వ్యవహారాన్ని, తెలుగు కావ్యాలలోని ప్రయోగాలను గుర్తించినవాడు కనుక, తన “అమరపదపారిజాతం”లో –
“పట్టణం – నిగమః. నగరనామాని. పట్టణం పుటభేదనం. పత్తనం చ” ఇతి వైజయన్తీ పాఠాత్ పత్తన శబ్దోప్యస్తి.”
అని పట్టణం అంటే స్కంధావారమంతా అందుబాటులో ఉండే మహానగరమని, దానికి “పత్తనం” అన్న రూపంకూడా ఉన్నదనీ వ్రాశాడు. పట్టణం (City) అని, పత్తనం (Town) శాఖానగరమని వ్రాశాడు. యాదవ ప్రకాశుల వారి “వైజయంతి”ని ప్రమాణీకరించాడు.
లింగయ సూరి తన “అమరపదవివృతి”లో – పతన్తి జనా అత్రేతి పత్తనం. “‘పత గతౌ’. పట్టణమితి పాఠే పటన్తి జనా అత్రేతి పట్టణం. ‘పట గతౌ’ అని వ్రాశాడు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరేది “పత్తన”మని, దానిగుండా జనం ప్రయాణిస్తారు కనుక (floating population వల్ల) అది పట్టణమని – ఛాయాభేదంతో కొత్త అర్థాన్ని చెప్పాడు. ఆ అర్థనిర్ణయానికి శిక్షాప్రణీతంగా ధాతుప్రమాణాలను ఇచ్చాడు.
అచ్యుతోపాధ్యాయుని “వ్యాఖ్యాప్రదీపం”, ఆశాధరుని “క్రియాకలాపం”, నీలకంఠుని “సుబోధిని”, భరత మల్లికుని “ముగ్ధబోధ” – ఇదే తీరున అర్థనిర్ణయం చేశాయి. ఔత్తరాహుడైన కృష్ణమిశ్రుడు “పత్తన” శబ్దాన్ని మాత్రమే అంగీకరించి, “పతన్త్యత్ర” అని నిశ్చయించి, ‘విపతేర్ తనన్’ అని ఉణాది సూత్రం (3-150) ప్రమాణీకరించాడు. ఆయన అర్థం క్షీరస్వాంయాదులతో సంవదిస్తుంది. క్రీ.శ. 16-వ శతాబ్దం నాటి తాళ్ళపాక తిరువేంకటాచార్యులు ఈ అన్నింటినీ పరిశీలించి తన “లింగాభట్టీయం”లో –
“ఆపతన్తి వణిజోస్మిన్నితి పత్తనం. పత్ ఌ గతౌ.” వర్తకులు దీనినిగూర్చి వత్తురు గనుక పత్తనము. పట్టణమనియు పాఠము కలదు.”
అని మఱొక అర్థాన్ని వ్రాశాడు.
భానుజీ దీక్షితుడు తన “వ్యాఖ్యాసుధ” (రామాశ్రమి)లో “పత్తన” శబ్దాన్ని గ్రహించి, “పతన్తి జనా యత్ర” (జనం పెద్ద సంఖ్యలో వచ్చిపడుతుండే చోటు) అన్న భావంతో ‘వీ పతిభ్యాం తనన్’ ఆధారంగా పత్ + తన అని సాధించాడు. అంతటితో ఊరుకోక “పట్టనం ఇతి వాచస్పతిః” అని ఎవరో వాచస్పతిని ఉదాహరించి, అవి సమానార్థకాలని అన్నాడు.
అలాగే కాశీనాథుని “కాశిక”, గోస్వామి “బాలబోధిని”, నారాయణానంద రామచంద్రుని “అమరకౌముది”, బృహస్పతి “అమరకోశ పంజిక”, మధురేశ విద్యాలంకారుని “సారసుందరి” వ్యాఖ్యలన్నీ “వ్యాపారులు వస్తూ పోతూ ఉండే చోటు”, “జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతుండే ఆవాసం” అని చెప్పిన నిర్వచనాలు నిజానికి ఎంతో భావ్యంగానూ, అర్థవంతంగానూ, వ్యాకరణసాధ్యాలు గానూ, సప్రమాణంగానూ ఉన్నాయి.
ద్రావిడశబ్దమైన “పట్టు” నుంచి “పట్టణము”ను సాధించటానికి మీరు ఊహించిన “పట్టు” ధాత్వర్థరూపమైన వ్యుత్పత్తి మార్గాన్ని కూడా సంస్కృత లాక్షణికులు గుర్తింపకపోలేదు.
“పట్టుః – అయ మాన్ధ్రభాషాశబ్దః. తన్త్ర్యాస్ఫోటనే దృఢాస్ఫోటః”
అని దామోదరుడు తన “సంగీతదర్పణం”లో అన్నాడు. అయితే, అది వీణ తీగలపైని వ్రేళ్ళను మీటే సందర్భంలో వివరించిన భావచ్ఛాయ. జనస్థానమన్న భావంతో కాదు. “పట్టు” సంస్కృత లాక్షణికుల దృష్టిలో ఉన్నదని చెప్పటం మాత్రమే నా ఉద్దేశం.
“పట్టణము” ద్రావిడ భాషామాతృకమై సంస్కృతంలోనికి వెళ్ళినదని ప్రయోగకాల నిర్నిమిత్తంగా “పట్టిన” శబ్దానికి చెబుతున్న భావార్థమాత్రాన రుజువు చెయ్యటం కష్టం. ఇకపోతే, ఊరిపేర్లలోని “పట్నం” సముద్రతీర ప్రాంతమే. సముద్రతీరం కాకపోతే ఒకానొక పెద్ద జలాశయానికి సన్నిహితం. సముద్రతీర ప్రాంతమూ, జలాశయప్రాంతమూ – రెండూ కాని ఊళ్ళ పేర్లు కేవలం అనుకరణమాత్రాన వచ్చిన ఆధునిక నామధేయాలు. ఒకప్పుడు సార్థకంగా ఏర్పడిన పేర్ల వంటివి కావు.
ఈ మాటలన్నీ విద్యార్థిత్వంతో మీ అభిప్రాయాన్ని కోరుతున్నవే గాని, విద్యాధికత్వంతో మీకు చెప్పగోరినవి కావు.
“అనిపిండి” గృహనామ శబ్ద స్వరూపనిరూపణను గుఱించిన మీ చర్చను అధికరించిన నా సందేహాలను మఱొకసారి మనవిచేస్తాను.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
07/19/2013 10:22 am
రవికిరణ్ గారు: ఇంటిపేర్ల గురించి మీరు దాదాపు సరిగ్గానే ఊహించారు. ఇంటిపేర్లు మనకు కాకతీయులకు పూర్వం ఉన్నట్టు దాఖలాలు లేవు. కవుల విషయంలో నన్నయ్య (భట్టు బిరుదు కావచ్చు) నుండి శ్రీనాథుడి వరకూ ఉన్న కవుల ఇంటిపేర్లు మనకు తెలియవు. నాచన సోమన పేరులో నాచన తండ్రి పేరు అయితే, పాల్కురికి సోమనాథుడి పేరులో పాల్కురికి వారి ఊరుపేరు కావచ్చును. బమ్మెర పోతన, అష్టదిగ్గజాల కాలం నుండి మనకు ఇంటిపేర్లు అవిరళంగా కనిపిస్తున్నాయి.
ప్రాఙ్నన్నయ్య శాసానాలలో ఊరుపేరో, ప్రాంత నామమో తగిలించిన పేర్లు కొన్ని అరుదుగా కనిపిస్తున్నాయి; కాని, ఆ రోజుల్లో తెలుగు వారు కూడా ద్రావిడ సంప్రదాయంలో లాగా తండ్రి పేరు తగిలించుకొనే అలవాటు ఉందని కొన్ని శాసనాలలో పేర్లు సూచిస్తున్నాయి.
స్థూలంగా ప్రస్తుతం తెలుగువారి ఇంటిపేర్లలో ఊరిపేరే అధికంగా కనిపిస్తుంది. వృత్తినామాలు/పదవులు (ప్రగడ మొ.), ధాన్యాల పేర్లు, కుటుంబంలో పేరు పొందిన వారి పేరు ఇలాంటివి కూడా విరళంగా కనిపిస్తున్నాయి.
ఈ విషయంపై వేమూరి గారు రాసిన వ్యాసం, అలాగే, ఇదివరకు నేను ఇండో-యూరేసియన్ రీసర్చ్ వేదికపై చేసిన చర్చను మీరు చదవవచ్చును.
తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
07/18/2013 12:45 pm
సమావేశాల ప్రత్యేక సంచికలని ఈమాట తో జోడించడంతో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక సంచికలోని పదార్థం అందరికి అందుబాటులోకి వస్తోంది, నిజమే. కాని, ఈమాట లోని పదార్థం వడపోతకి గురి అయినట్లే ఆయా ప్రత్యేక సంచికలలో పదార్థం కూడ గురవుతోంది అనే భావం స్పురిస్తోంది. నాకు తెలిసినంతమట్టుకి సమావేశాల ప్రత్యేక సంచికల కూర్పులో అంత వడపోతకి, సంపాదకుల అభిప్రాయాలని గణనలోకి తీసుకొని రచయితలు తిరగరాయడానికి అవకాశాలు ఉండవు. కనుక ఇలా జోడించడంతో ఈమాటకి ఉన్న విలువ, గుర్తింపు ఆ ప్రత్యేక సంచికకి కూడ ఆపాదించబడుతోంది. ఇది ఎంతవరకు సమంజసమో పాఠకులే నిర్ణయించాలి.
తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
07/17/2013 9:58 pm
జయప్రభ గారూ,
ద్రావిడుల ప్రస్తావన తీసుకొచ్చేరు కనుక చెబుతున్నాను. చాల రోజుల క్రితం నేను రాసిన ఒక కథలో నాకు తెలిసినంతమట్టుకు ద్రావిడుల చరిత్ర ప్రస్తావించేను. శాస్త్రీయ పద్ధతులలో పరిశోధన చేసినది కాదు కాని కథలో వీరభద్రశాస్త్రి పుట్టుపూర్వోత్తరాలు చర్చిస్తూ ద్రావిడుల కథ కూడ చెప్పేను. సరదా ఉంటే నా “ఇంటిపుట” లో ఉంది. అంశం 17 చూడండి. కథ అంతా చదవక్కర లేదు – మరీ పొడుగెక్కువ.
అలిఖిత కఠిన శాసనం! గురించి naresh nunna గారి అభిప్రాయం:
07/05/2013 9:26 am
ఈ కవిత content వల్ల పాత జ్ఞాపకాలేవో రేగి, ఈ కవిత ఒక రచయిత్రిది కావడంతో మరింత ఎక్కవ connect ఐన ఒక మిత్రురాలు ఈ కవిత చదవమని లింక్ పంపారు. జ్వలించే ప్రేమల వల్ల కలిగే సంయోగ వియోగాలు అందరి జీవితాల్లో సహజమే కాబట్టి కవిత చటుక్కున బాగుందనిపిస్తోంది. కానీ, form దృష్ట్యా, అంటే నిర్మాణపరంగా కవిత అంత మంచి కవిత అనిపించడం లేదు.
ఈ పాదాలు ఈ కవితలో శిఖరాయమానమైనవి. దీని స్థాయిలో మిగతా కవితా పాదాలు లేవు. అయితే, శుద్ధ కవిత్వ వాదిలా, అక్షరమక్షరంలో కవిత్వాన్ని పొంగిపొర్లిస్తూ, సారాన్ని గాలికొదిలేయమని నా ఉద్దేశం కాదు. కదంబ మాల వంటి కవితలో కొన్ని prosaic వాక్యాలుండటం ఎంత కొమ్ములున్న కవికైనా సహజమే. ఆయితే, ఆ వాక్యాలు అందులో ఇమడకపోతేనే ఇబ్బంది. అలా ఇబ్బంది కలిగించిన వాక్యాలే…
…ఈ కవితకి శీర్షిక సరఫరా చేయాల్సి రావడం వల్ల ఈ కవిత బలహీన పడిందనిపించింది. ఇదొక మధురావస్థ. మిధ్య కాని తీపి మరణావస్థ. పాదానికి ముందు బొమ్మకట్టిన భావం వల్ల, ఈ పాదంలో ప్రాస చక్కగా అతికింది. కానీ, జాలి మాలిన కాలం ఓ కనికట్టు. ఏ ప్రేమ గాయాలకీ లేదు లేపనాల కట్టు.
వంటి చోట్ల ప్రాసకోసం ప్రయత్నించినట్టు తేలిపోతోంది.
వంటి వాటి ద్వారా కవితలో continuity కోసం చూసినట్టు అనిపించి నచ్చలేదు.
అన్న చివరి లైన్లు చూస్తే, కవిత ఎత్తుగడ, ఉపసంహారం వంటి ఎకడమిక్ సూత్రీకరణల స్పృహ ఏమైనా ఉందా అనిపిస్తోంది. ‘అనుభవించిన వారికే తెలుస్తుంది….’ అన్న కామెంట్ తో సహానుభవాన్ని పొందుతున్న ఒకానొక పాఠకుడి మమేకత మీద తగు జాగ్రత్తగా కుండెడు నీళ్ళు పోసినట్టు, అనుభవం సొంతం కావొచ్చు. ఊహా జనితమూ కావొచ్చు… అని దమయంతి గారు బదులివ్వడం ఒక slap on the face లాంటి కొసమెరుపు!
సిరినివాస వృత్తము గురించి మోహన గారి అభిప్రాయం:
07/04/2013 1:36 pm
పాదమునకు ఆఱునుండి పండ్రెండు అక్షరములు కలిగిన ఛందములకు వరుసగా గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుభ్, బృహతి, పంక్తి, త్రిష్టుభ్, జగతి అని పేరులు. సూర్యుని రథమునకు ఉండే సప్తాశ్వముల పేరులు ఇవి అని కూడ అంటారు. ఛందస్సు రెండు విధములు – వైదిక, లౌకిక. వేదములలోని ఛందస్సును వైదిక ఛందస్సు అంటారు. వేదములలో పాదమునకు 11 అక్షరములు ఉండే త్రిష్టుభ్ ఎక్కుబగా వాడబడినది. పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే ఛందస్సు మూడు పాదముల త్రిపదగాయత్రిగా, నాలుగు పాదముల అనుష్టుప్పుగా, ఐదు పాదముల పంక్తిగా, ఆఱు పాదముల మహాపంక్తిగా, ఏడు పాదముల శక్వరిగా వాడబడినది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. లౌకిక ఛందస్సులో పాదమునకు పది అక్షరములు ఉంటే అది పంక్తి అవుతుంది. కాని వైదిక ఛందస్సులో ఎనిమిది అక్షరములు గల ఐదు పాదములు పంక్తిగా పరిగణించబడును. పాదమునకు 12 అక్షరములు ఉండే జగతి కూడ చాల వాడబడినవి. ఇవి గాక, మూడు విధములైన త్రిపదలు (8,8,12; 8,12,8; 12,8,8) కూడ వాడబడినవి. జూలై సంచికలోని నా త్రిపదల వ్యాసములో ఇవి చర్చించబడినవి. ఇవి గాక 8-8, 12-8 అక్షరముల బృహతి, 12-8, 12-8 అక్షరముల సతోబృహతి, 8-8-8, 8-8, 12-8 అక్షరముల అతిశక్వరి, 12-12-8, 8-8, 12-8 అక్షరముల అత్యష్టి వీటిని కూడ వాడినారు. బృహతి + సతోబృహతి మనకు బార్హత ప్రగాథను ఇస్తుంది; కకుభ్ + సతోబృహతి మనకు కాకుభ ప్రగాథను ఇస్తుంది. ఈ ప్రగాథలకు మొత్తము 72 అక్షరాలు ఉండాలి. ఈ ప్రగాథలు త్రిపదలే. మీరు ఇచ్చిన శ్లోకములో అస్తు ను విడదీసి, ఓం, నమః కలిపితే మనకు 72 అక్షరాలు లభిస్తుంది. అయినా వాటిని 12, 8 అక్షరాలుగా విడదీయడము కష్టము అనుకొంటాను. వీటిని irregular ఛందములు అని మాత్రమే చెప్పవచ్చును. ఇది నాకు తెలిసిన వైదిక ఛందస్సు. నేను వేదాధ్యయనము చేయలేదు కాబట్టి ఇంతకన్న ఎక్కువ చెప్పలేను. విధేయుడు – మోహన
సిరినివాస వృత్తము గురించి Adinarayana గారి అభిప్రాయం:
07/04/2013 4:56 am
కృష్ణ మోహన్ గారికి నా నమస్కారములు,
జాబులో కొంచం బిజి అవడం వల్ల ఈ మద్యన ఆన్లైన్ రాలేక పోయాను. మీ రిప్లైని ఇవ్వాళనే చదివాను. చాలా ధన్యవాదాలు.
ఈ పై శ్లోకము యజుర్వేదములోని కృష్ణపక్షములోని రుద్ర ప్రశ్న (దీనినే శ్రీరుద్రం అని కూడ అంటారు) యొక్క మొదటి అణువాక యొక్క తుదలో వున్నది. ఎన్నొ గ్రంథాలలో దీనిగురించి అన్వేషణ చేశాను. అన్నిటిలో ఇది చతుష్పాదముగానే ఇవ్వబడింది. (చూడండి : రుద్రం).
మీరు చేసిన పద విభజన, అక్షర సంఖ్యలు కూడా చాల బాగుంది మఱియు విచారార్హనీయమైనది. కాని ఏ ఛందస్సో తెలియటం లేదు. నాకు ఇది ప్రగాథ గా తోచుచుంది.
ప్రగాథ :- నాలుగు పాదాలు గలదై, ప్రతిపాదానికి ఎన్నైనా అక్షరాలు వుండవచ్చునని వికిపీడియలో చదివాను. మీ అభిప్రాయము ఏంటిదో తెలుపగోరుతున్నాను.
మీ శ్రేయోభిలాషి,
గూడూరు ఆదినారాయణ
మఱోవిషయమేమిటంటే అన్ని గ్రంథాలలో “నమస్తే అస్తు” అని విడివిడిగానే వ్రాయబడి వుంది. ఎక్కడకూడ అవగ్రహయుక్తముగా ఈ రెంటిని కలిపి “నమస్తేऽస్తు” అని వ్రాయడం చూడలేదు. బహుశః అక్షరాలను ఛందస్సులో కూర్చోబెట్టడానికె ఆలా వ్రాయబడి వున్నదోనని కూడ అనుమానము వస్తున్నది. ఉదాహరణానికి ఈ క్రింది శ్లోకమును చూడండి. ఈ క్రింది శ్లోకము శ్రీరుద్రములోని మొట్టమొదటిది.
నమస్తే రుద్ర మన్యవ, ఉతోత ఇషవే నమః,
నమస్తే అస్తు ధన్వనే, బాహుభ్యాముత తే నమః
ఈ శ్లోకము అనుష్టుభ్ ఛందస్సులో వ్రాయబడ్డది. దీనిని 4 పాదాలుగా విభజిస్తే ప్రతిపాదానికి 8 అక్షరాలు వస్తాయి. ఇందులో “ఉతోత ఇషవే” ను గుణసంధితో కలిపి “ఉతోతేషవే” అని మఱియు “నమస్తే అస్తు” ను “నమస్తేऽస్తు” అని కలిపి వ్రాస్తే 2వ మఱియు 3వ పాదములో 7 అక్షారలు మాత్రము మిగిలి, ఛందస్సులో సరిపోదు.
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
07/03/2013 6:39 am
ఈ వ్యాసం చదవగానే వచ్చిన అనుమానం – దీన్ని వ్రాసిన నారాయణ రావుగారూ, కవితా విప్లవాల స్వరూపం వ్రాసిన నారాయణ రావుగారూ ఒకరేనా? అని. 🙂 అయితే యీ వ్యాసం మరో రెండుసార్లు చదివి, ఆ పుస్తకం మరోసారి తిరగేస్తే కాని నేను పొరబడ్డానా, లేక నా అనుమానం నిజమేనా అన్నది చెప్పలేను!
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి Velcheru Naraayana Rao గారి అభిప్రాయం:
07/02/2013 5:28 pm
నా వ్యాసం మీద ఆలోచనకీ, అంతర్దృష్టికీ పనికొచ్చే ఉత్తరాలు (జయప్రభ, సౌమ్య, భావనారాయణ గార్లవి) వొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాటికి సమాధానాలు నాకు నిబ్బరంగా తెలియవు. పదిమందీ ఆలోచనలూ కలబోస్తే నేను చెప్పే వాటికన్నామంచి సమాధానం దొరకొచ్చు. నాకు తోచిన మాటలు చెప్తాను.
విమర్శకులు విమర్శాతీతులు కారు. వాళ్ల దృష్టిలోపాలూ, సంస్కారపరిమితులూ అభిమాన దురభిమానాలూ, వాళ్లకి వుంటాయి. ఒక్కసారి నావ్యాసం మళ్లా చూడండి:
“… చదివేవాళ్ళు, వాళ్ళ మనసులో పొరలు అడ్డం పెట్టుకొని, వాళ్ళ రాగద్వేషాల దారిలో కవిత్వాన్ని చూస్తే దానికి ఇంకొక దుర్వ్యాఖ్యానం వస్తుంది. అందుకనే అచ్చమైన కవిత్వం అచ్చమైన సహృదయులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ బాధ్యత ఒక్క వ్యక్తి మీద పెట్టకుండా కొన్ని తరాల మనుషులు, కొన్ని సంవత్సరాల పాటు ఆ కవిత్వాన్ని చదువుతూ ఉంటే తాత్కాలిక రాగద్వేషాలు, వ్యక్తిగత వైమనస్యాలు క్రమక్రమంగా తొలిగిపోయి కవిత్వమే మిగులుతుంది అని ఒక ఆశ.”
సహృదయుడు ఒక వ్యక్తి కాదు. అచ్చమైన సహృదయులు కొన్ని తరాల విమర్శకుల సంపుటి. విమర్శకులు వేరే ఒక జాతి కాదు. ఇందులో కవులూ, రచయితలూ కూడా వుంటారు. పైగా, రాగద్వేషాలకి అతీతంగా కవిని/రచయితని అర్థంచేసుకోడం సాధ్యం కాదు. ఎందుకంటే కవిత్వమూ, రచనా రాగద్వేషాల లోంచే వొస్తాయి కాబట్టి. కాని, చదివేవాళ్లు తమ వ్యక్తిగత సంకుచిత రాగద్వేషాలకి అతీతంగా రచనని అర్థంచేసుకోడం సాధ్యం. వాళ్లు కొన్ని తరాల వాళ్లు అయితే ఇంకా తేలికగా సాధ్యం.
విమర్శకులు, అంటే సహృదయులు, కవుల్లాగ కథలు కట్టి చెప్పుకునే స్థాయికి ఎదగరు. వాళ్లెప్పుడూ అనామకులే, తెరవెనకవాళ్లే. ఎప్పుడో ఒక అభివగుప్తుడో, మమ్మటుడో, జగన్నాథుడో ఆ స్థాయికి వొస్తారు. అదీ వాళ్లు కవులు కూడా కాబట్టి. ఆధునిక కాలంలో కవి జీవిత చరిత్రల రచయితలు కవులకన్న, రచయితల కన్న, ప్రముఖ స్థాయికి రావడం, వాళ్ల వల్లే కవులూ, రచయితలూ అర్థం చేసుకోబడడం గురించే నా అభ్యంతరం.
కవి జీవితం గురించి తెలిస్తే కవిత్వం, రచయిత బతుకుని గురించి తెలిస్తే ఆ రచయిత రచనలూ ఎక్కువ బాగా తెలుస్తాయనేది ఆధునిక పెట్టుబడిదారీ సమాజం ఏర్పరచిన భ్రమ. కమలాదాస్ కవిత్వానికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇది మీకు రుజువు చెయ్యలేను.
ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను: 8వ శతాబ్దపు సంస్కృత ఆలంకారికుడు దండి తన కావ్యాదర్శపు ప్రారంభంలో సరస్వతీ ప్రార్థన చేస్తూ
చతుర్ముఖముఖాంభోజ కలహంసవధూ ర్మమ
మానసే రమతాం నిత్యం సర్వ శుక్లా సరస్వతీ
(బ్రహ్మ నాలుగు ముఖాలూ అనే పద్మాలలో (విహరించే) హంస, పూర్తిగా తెల్లగా వుండే సరస్వతి, నా మనస్సులో ఎల్లప్పుడు ఆనందంగా ఉండు గాక) అని రాశాడు.
ఇది చదివి, విజ్జిక అనే ఆవిడ ఇలా అందిట:
నీలోత్పలదలస్యామాం విజ్జికాం మా మజానతా
వృథైవ దండినా ప్రోక్తా సర్వ శుక్లా సరస్వతీ
(నల్ల కలువ లాగ (అందంగా) వుండే విజ్జిక అనే నన్ను గుర్తించక (ఎరగక) సరస్వతీ దేవి ఎప్పుడూ తెల్లగానే వుంటుంది అని దండి (తెలివి తక్కువగా) చెప్పాడు.)
దండిని గురించీ, విజ్జికని గురించీ మీ ఇష్టం వొచ్చిన కథ చెప్పుకోండి, కానివాళ్ల నిజ జీవితాలు తెలిస్తే ఈ శ్లోకాలు ఇంకా ఎక్కువ బాగ అర్థం అవుతాయా, లేకపోతే ఆ సమాచారం మీ ఊహకి అడ్డొచ్చి, ఈ శ్లోకాలు దెబ్బతింటాయా?
ఇకపోతే సూరన, సూరన్నల పేర్ల అక్షర నిర్ణయం గురించి: కళాపూర్ణోదయం, ప్రభావతీప్రద్యుమ్నం గద్యలో ఆయన పేరు సూరయ అని వుంది. అయ్య, అన్న, అప్ప, అయ, అన, అప – ఇవన్నీ సమానార్థకాలుగానే వాడారు. ఇందులో ఛందస్సుకి అనువైన రూపాలు ఆచరణలోకి వొచ్చాయి. పేరులో అక్షరబద్ధత మనకి పూర్తిగా ఆధునిక కాలం లోనే వొచ్చింది. అయితే సూరన పేరులో నకారద్విత్వం ఎంతముందు వాడుకలో కనిపిస్తుందో నేను పరిశీలించలేదు.
–నారా
అలిఖిత కఠిన శాసనం! గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
07/02/2013 11:49 am
అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ ఆ అనుభవాన్ని ఇంత చక్కగా అక్షరాల్లో మలచడం ఒక కవితా కనికట్టు. ఒక అత్యద్భుతవైన అక్షరాల మేజిక్కు.
అద్భుతంగా వుంది దమయంతి గారు.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి.
చంద్రుణ్ణి చూపించే వేలు గురించి pradeep గారి అభిప్రాయం:
07/02/2013 8:30 am
వ్యాసకర్తకి మనవి:
ఇదే వ్యాసాన్ని కొద్ది మార్పులతో wikipediaలో (తెలుగు) చేర్చగలిగితే మరి కొందరికి దీన్ని పరిచయం చేసినట్టు అవుతుంది.
[వ్యాసకర్త ఇస్మాయిల్ లేరు. ఇది ఒక పుస్తకానికి ముందుమాట అని మీరు గమనించే ఉండాలి. అందువల్ల ఏ రకమైన మార్పులు చేయగలరు? -సం]
సిరినివాస వృత్తము గురించి Adinarayana గారి అభిప్రాయం:
06/28/2013 2:44 am
కృష్ణ మోహన్ గారు,
మీకు మఱియు మీ ఛందస్శాస్త్ర జ్ఞానానికి నా నమస్కారములు.
నేను చాల రోజుల నుండి ఈ క్రింది శ్లోకము ఏ ఛందస్సులో వ్రాయబడ్డదోనని విచారిస్తున్నను, ఇంటర్నెట్ లో చాల వెతికాను కాని ఎక్కడ లభించలేదు. కనీసం మీరైన నాకు చెబుతారని ఆశిస్తున్నాను. కృతజ్ఞున్ని.
నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ |
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ||
మీ శ్రేయోభిలాషి,
గూడూరు ఆదినారాయణ
ఈ సంచిక గురించి… గురించి Akella suryanarayana murthy గారి అభిప్రాయం:
06/21/2013 2:57 am
వ్యాసాలు అంత జన రంజకంగా ఉండవు అనేది అంత నిజమనిపించదు, కొంచం స్టార్టింగ్ ట్రబుల్ తప్పకుండా ఉంటుంది నాలాంటి వాళ్లకి, కాని మొదలు పెట్టేక ఆపలేము, nothing less than a story or fiction, either English or Telugu. చడవాలని ఉండాలేకాని
నేను అన్నీ చదవలేదు కని, చదివినవన్నీ, Superb
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి chudamani గారి అభిప్రాయం:
06/20/2013 9:07 am
శ్రీ సాయి బ్రహ్మానందంగారికి,
మీరు సంగీత సాహిత్యాలలో గొప్ప పట్టు, విజ్ఞానం కలవారు. కాని మీరు కూడా ఎందుకు తెలుగువాళ్ళని మాటి మాటికి విమర్శిస్తారు? మీరే స్వయంగా కచేరికి వెళ్ళారు, మీరే తప్పు విన్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు వారికి తప్పుని చెప్పలేదు? ఎందుకు వారిని సరిదిద్దలేదు? సంగీతకచేరికి వెళ్ళిన మీరు కూడా తెలుగువారే కద… (కాదా?)
కనీసం మీలాంటి పెద్దవారైనా తెలుగువారిని తిట్టకండి. తప్పులు వారిలో లేవని కాదు. మన వాళ్ళలో తప్పులు మనమే సరిదిద్దటానికి ప్రయత్నించాలి కాని … విమర్శించి వదిలేస్తే ఎలా?
అధికప్రసంగం చేశానని అనుకుంటే, క్షమించాలి.
చూడామణి.
మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి chudamani గారి అభిప్రాయం:
06/17/2013 6:57 am
ఈమని గారి కచేరీలు ప్రత్యక్షంగా చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. మాది కాకినాడ దగ్గర రామచంద్రపురం. కాకినాడ, ద్రాక్షారామం వచ్చినప్పుడల్లా ఈమనిగారు మా ఊరిలో కూడా కచేరీ చేసేవారు. వారి కచేరీ గురించి కాని, వాదన గురించి కాని రాసే అంత అర్హత నాకు లేదు. కాని, ఒక్కటి తప్పక చెప్పాలి. వారి కచేరీ వింటూ చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని. ఇప్పటిలాగా రికార్డ్ చేసుకొనే సదుపాయం ఉంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు బాధపడుతుంటాను. వారి కచేరీలో నాకు బాగా గుర్తుండిపోయిన, మనసుకి బాగ హత్తుకుపొయిన సంగతి ఏంటంటే, ఈమనిగారు ఒక గాజుగ్లాస్ తీసుకొని, దానిని వేలితో కొట్టి, ఆ శబ్దాన్ని వీణమీద పలికించారు. అలాగే, చాలా శబ్దాలను పలికించడం అన్నది ఇప్పటికీ నేను మర్చిపోలేనిది.
త: త: గారు వాసాగారి కచేరి గురించి రాశారు. నేను ఆ గొప్ప విద్వాంసుని వాదన వినలేకపోయాను. కాని, నా పూర్వజన్మ సుకృతంచేత వారి వారసురాలైన శ్రీమతి ఆనందరాజ్యలక్ష్మిగారి శిష్యరికం చేస్తూ వారి వాదనను ఎంతో వివరంగా వినగలుగుతున్నాను.
ఈమనివారివలే, వాసాగారి లాగానే మా గురువుగారు కూడా చాలా కల్మషం లేకుండా కేవలం సంగీతం కోసమే సంగీతాన్ని / వీణని పలికించేవారగుటం వలని, వారు హైదరాబాద్ వంటి మహాపట్టణంలో ఉన్నా వారి పేరు వేరే వారి పేరులాగ వినిపించటం లేదు.
ఏది ఎమైనా, ఈమనిగారి రికార్డ్స్ ఎమైనా దొరికితే, ఈమాటలో ఇవ్వండి. బహుశా ఈమని కళ్యాణిగారు ఏమైన సాయం చేస్తారా?
చతురదూతిక గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
06/16/2013 11:20 am
లైలాగారికి, దగ్గుపాటిగారికి వారి అభిప్రాయములకై కృతజ్ఞతలు. దీనివల్ల కొందఱైనా ఈ కాలంలో పద్య కవిత్వంపై ఆదరం చూపుతున్నారని స్పష్టమైంది. లైలాగారు లేవనెత్తిన అంశాలకు ఈ క్రింద వివరణ లిస్తున్నాను.
1. అమరకోశమనేది సుప్రసిద్ధమైన శ్లోకరూపంలో ఉండే సంస్కృతనిఘంటువు. ఇందులో పదిహేను వందల శ్లోకాలున్నవి. సంస్కృతం నేర్చుకొనేవారు మొట్టమొదట కంఠస్థం చేసే గ్రంథమిది. తెలుగు పట్టుబడాలన్నా ఇది నేర్చుకొనవలసిందే.
2. పద్యాదిలో వ్యంజనముపై సంధివశమున వచ్చిన అచ్చుకే యతి చెల్లింపవలసి యుండగా, అట్లుగాక వ్యంజనమిత్రమైన యక్షరమునకు యతి చెల్లించుట ‘అఖండయతి’ అనబడును.
3. ‘విద్యుల్లతికను మేఘుఁడు హృద్యంబుగఁ బొదివినట్టు లెదలోఁ బొదివెన్’ అన్న భావం పునరుక్తం కాలేదు. అది ఖండికలో ఒకే ఒకసారి వెలిబుచ్చబడింది. ఈ పద్యంలో మఱొక విశేషం ఉంది. ప్రాసస్థానంలో ద్య అను సంయుక్తమైన శబ్దము, ద తో గాఢంగా కూడుకొన్న య ఒత్తు, ఆ గాఢాలింగనదృశ్యాన్ని వ్రాత ద్వారా, శబ్దం ద్వారా మనకు ప్రత్యక్షీకరిస్తున్నవి. పైగా పద్యంలో ప్రాసస్థానంలో, అంటే రెండవస్థానంలో ఉండే ఈ సంయుక్తాక్షరం, అది ఇర్వురు వ్యక్తుల మధ్య కూడిన గాఢాలింగనం అనే విషయాన్నీ సూచిస్తున్నది. ఇటువంటి కావ్యగుణానికి ‘ఔదార్య’మని పేరు.
4. శుకరాయబారాలు, హంసరాయబారాలు చర్వితచర్వణములే. అందులో నూతనత్వ మేముంది?
‘Where there is risk is there the reward’ దూతి నీవిధంగా పంపి అతని బలహీనతను కూడ ప్రత్యక్షంగా నిరూపించి అతనిని ప్రసన్నం చేసికొనడంలో క్రొత్తదనముంది. ఈ పథకానికి అనుగుణంగా నాయికాదూతికల మనఃస్థితులు ఈ ఖండికలో నిరూపింపబడ్డవి.
“సుందరదూతికాకృతియు..” అనే పద్యంలో దౌత్యాని కర్హమైన గుణవిశేషములు, అందులో గూఢంగా నిక్షిప్తమై యున్న పథకం వివరింపబడింది. కాని ఇందులో గల ప్రమాదం తరళికకు స్ఫురించకుండా ఉండలేదు. అందుచేతనే, ఆమె ‘ఏమె! జ్యోత్స్నాభిసారికాకృతినిఁ బూని..’ అన్న పద్యంలో ఈ పథకంలో గల ప్రమాదాన్ని నర్మగర్భితంగా వెలిబుచ్చింది. దానికి ‘అతని రాతిడెందము..’ అన్న పద్యంలో ముఖ్యంగా ‘నీదు మేలు గాదటె చెలి నాదు మేలు?’ అన్న వాక్యం ఆమెకు కొంత ఊరట కల్గించింది. పైగా, ‘ఐన మఱవకుము మననెయ్యంపు మాట!’ అన్న పద్యంలో పైమాటకు కట్టుబడి ఉండమని నాయిక దూతికను మెత్తగా హెచ్చరించింది. మొత్తానికి దూతికయందు నాయికకు అపనమ్మకం కంటె నమ్మకమే కాస్త అధికంగా ఉందనే అనుకోవాలి. దూతిక కూడ మానవసహజమైన లోభమునకు అతీతురాలు గాదనే విషయం ‘అదటున నాతఁ డా యువతి నక్కునఁ జేర్పఁగ …’ అన్న పద్యంలో వ్యక్తీకరింపబడింది. ఇది దౌత్యం చేసినందున దూతిక కబ్బిన విశేషఫల మనుకుంటే నష్టంలేదు. కాని దూతిక స్వార్థపరురాలు గాదు. ఈ విషయం ‘అట్లు పారవశ్యము నంది ..’, ‘అట్టు లుద్బుద్ధచిత్తయై..’ అన్న పద్యాల్లో వ్యక్తమైంది. తరళిక ఆమె అందచందాలు, విధేయత్వము తెలిసినది కావుననే ఆమె నీ కార్యమునకు నియోగించిన దని దీనివల్ల స్పష్టమౌతున్నది.
టోపీలు పెట్టబడును గురించి Muddu venkata lakshmi గారి అభిప్రాయం:
06/11/2013 3:20 am
ఈ వ్యంగ్య కవిత బాగుంది. కాని కల్లలు హాయిగా ఎగురుతున్న ఈ కాలం లో “నేల రాలిన కల్లలు” అని ఎందుకు అన్నారో అర్థం కాలేదు సామాన్యుడికి ప్రతి కాలమూ టోపీల కాలమే కదా అన్న పంక్తి వాస్తవికతకు అద్దం పట్టింది.
చతురదూతిక గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
05/25/2013 4:14 pm
ఈ ఖండికయందలి ‘నిగనిగన్నిగలాడు’ అనే సీసపద్యంలోని గిరిశిరంబులఁ దోఁచు మెఱుపుతీవెలచంద మురమందు ప్రాలంబములు ధరించి – అను నాల్గవ చరణాన్ని గిరిశిరంబులఁ దోఁచు మెఱుపుతీవెలచంద మురమందు ముత్యాలసరులు దాల్చి – అని మార్చడమైనది.
“ప్రాలంబ మృజులంబి స్యాత్, కణ్ఠాద్వైకక్షకం తు తత్” – అని అమరకోశము. ప్రలంబతే – ప్రాలంబి, లబి – లమ్బనే (వ్రేలాడునది)- అని దీనికి వ్యుత్పత్తి. అనగా కంఠమునుండి పొడవుగా నురస్సునందు వ్రేలాడు దండకు ప్రాలంబమని పేరు. ఈ ‘లబి’ధాతువునుండే వచ్చిన మఱొక పేరు ‘ప్రాలంబిక’. కాని ఇది కంఠమునుండి వ్రేలాడే బంగారుదండకు పేరుగా, “స్వర్ణెః ప్రాలంబికా” అని ప్రత్యేకంగా అమరకోశంలో చెప్పబడింది. పైపద్యంలో ఉపమేయమైన ముత్యాలదండ ఉపమానమైన మెఱుపుతీగకు అధికసదృక్షంగా ఉంటుందనియు, మునుపున్న అఖండయతిని పరిహరించుటకుగాను ఈమార్పు చేయడమైనది.
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
05/16/2013 1:53 pm
మాన్యులు శ్రీ మోహనరావు గారికి
నమస్కృతులతో,
శ్రీ పి.బి. శ్రీనివాస్ గారు సంఖ్యాశాస్త్రాన్ని, అక్షరసాంఖ్యాన్ని అభ్యసించి తమను సంప్రతించిన మిత్రులకు పేరును వ్రాయటంలో చిన్న చిన్న మార్పులు చేసుకొంటే మేలవుతుందని సూచనలు చేస్తుండేవారు. జన్మదినాన్ని బట్టి వారి వారి జాతకాలను గుణించి చెబుతుండేవారు. రేసుకోర్సులో వినోదార్థం లెక్కలు వేసి ఈ గుఱ్ఱం ఇప్పుడు గెలుస్తుందని చెబుతుండేవారు కాని, వారు స్వయంగా ఆడిన సందర్భాలు తక్కువ. వీరిది పాశ్చాత్య గణన పద్ధతి. ఆ రీతులను గుఱించిన ఒక వ్యాసంలో కొన్ని వివృతులను వ్రాశారు.
శ్రీనివాస్ గారు 1930 సెప్టెంబరు 22-వ తేదీనాడు (8 సంఖ్య) జన్మించారు. వారు ఆంగ్లంలో వ్రాసికొన్న Sreenivos (వారి పద్ధతి ప్రకారం) 8 సంఖ్య అవుతుంది. దానికి P B చేరిస్తే వచ్చే 9 కలిపినా మళ్ళీ 8 సంఖ్యే వస్తుంది. అది వారి జీవితగతికి నిర్ణాయకమైన అదృష్ట సంఖ్య అన్నమాట.
నేటి మన విశ్వాసావిశ్వాసాలతో నిర్నిమిత్తంగా విశ్వసనీయమని విశ్వసించినందున వారీ విధంగా తమ పేరును వ్రాసికొనేవారు. నేను నా వ్యాసంలో వారి అక్షరసాంఖ్య పరిశోధనలను గూర్చిన వివరాలను వ్రాయలేదు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన గారి అభిప్రాయం:
05/14/2013 8:34 pm
దమయంతి గారు, నాకు కూడ రేణుకగారి పాటలంటే ఇష్టమే. [మీరు ఉదహరించిన ఆ పాట ఒక ఓ పి నయ్యర్ హిందీ పాటకు అనుసరణ అనుకొంటాను, పాట జ్ఞాపకానికి రావడము లేదు, కాని కబ్ ఛాయె ఘటా ఘన్ ఘోర్ అని వస్తుంది అందులో.] అరవైలలో బెంగళూరులో ఉండేటప్పుడు ఆమె పాటలను కన్నడములో వినేవాడిని. ముఖ్యముగా ఆమె జానకి, లతాలతో పాడిన హూవతందు మారిదళు తరచుగా రేడియోలో ప్రసారము చేసేవాళ్లు. ఇది పిబిఎస్ పైన వ్యాసము గనుక, రేణుక, పిబిఎస్ యుగళగీతము నొకదానిని దుడ్డే దొడ్డప్ప అనే చిత్రమునుండి వినవచ్చును.
విధేయుడు – మోహన
పలుకుబడి – కాలమానము II గురించి మోహన గారి అభిప్రాయం:
05/14/2013 4:41 pm
బావుంది వ్యాసము సురేశ్ గారు! పూర్వులు వ్రాసిన కొన్ని గ్రంథాలలో సూర్యోదయమును ఉదయము ఆఱు గంటలుగా (by default) తీసికొనవలెను అని అంటారు. తరువాతి కాలములో సూర్యోదయ కాలమును కచ్చితముగా తీసికొనవలెనని అంటారు. కొన్ని సమయాలలో దీని వ్యత్యాసము సుమారు ఒక అరగంట కాలము ఉంటుంది. సామన్యముగా ఇది సందిగ్ధతను కల్పించదు. కాని తేడా అరగంటకన్న తక్కువైతే ఇది సందిగ్ధతను కల్పించవచ్చును. బహుశా 1901లో ఇలాటి సందిగ్ధత వచ్చిందేమో? జాతకములు వ్రాసేటప్పుడు కూడ లగ్న నిర్ణయములో ఈ సూర్యోదయకాలము మనకు కొన్ని సందిగ్ధ లగ్నములకు దారి తీస్తుంది.
మరో విషయము – కాల నిర్ణయము ఏ రేఖాంశము ద్వార నిర్ణయించారో అన్నది కూడ మనము తెలిసికోవాలి. ఇప్పుడు భారతదేశమునకంతటా ఒకే కాలమున్నను, ప్రతి చోటులో సూర్యోదయకాలము వేరు అనే సంగతిని మనము గుర్తులో నుంచుకోవాలి. కామరూపలో సూర్యుడు త్వరగా ఉదయిస్తే కచ్‌లో ఆలస్యముగా ఉదయిస్తాడు! అందుకే భారతదేశానికి రెండు time zones ఎంతైనా అవసరము, ఇది వేరే విషయము అనుకోండి. అధిక మాస నిర్ణయానికి ఈ శ్లోకమును ఉదహరిస్తారు – ద్వాత్రింశద్భిః గతైః మాసై దినై షోడశభిస్తథా ఘటికానాం చతుష్కేణ పతత్యధికమాసకః (33 నెలలు, 16 దినములు, నాలుగు ఘడియలకు ఒక మారు అధికమాసము వస్తుంది). అధికమాసమును పురుషోత్తమ మాసము, మల మాసము, మలిమ్లుచము అని కూడ పిలుస్తారు. మాసేషు ద్వాదశాదిత్యం తపంతే హి యథాక్రమం నపుంసకేஉధికే మాసి మండలం తపసే రవి (ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆదిత్యుడు (12మంది సూర్యులలో ఒకడు) ఉదయిస్తాడు, కాని అధికమాసములో ఇలాటి సూర్యోదయము లేదు, కావున సూర్యమండలమే ఈ పనులను కొన సాగిస్తుంది).
విధేయుడు – మోహన
పలుకుబడి – కాలమానము II గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
05/14/2013 12:40 pm
ప్రియమిత్రులు శ్రీ సురేశ్ గారికి
నమస్కృతులతో,
అధికమాస నిర్ణయాన్ని గుఱించి మీరు వ్రాసిన వివరణ చాలా బాగున్నది.
1901లో మన తెలుగు పంచాంగకర్తలకు “శ్రావణమాసం అధికమా? ఆషాఢమాసం అధికమా?” అన్న గొప్ప వివాదం ఏర్పడటమూ, చివఱికి రాజమండ్రిలో పండిత పరిషత్తు ఏర్పడి పరిష్కారాన్ని సూచింపవలసి రావటమూ, అది కోర్టుకు వెళ్ళటమూ – ఆ కథంతా మీరు వినే ఉంటారు.
నాకు ఎన్నాళ్ళుగానో ఉన్న సందేహం: కాల పరిగణన రీత్యా 1901లో పెద్దలకు అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చి ఉంటుంది? రెండు పక్షాల వారికి వారి వారి ఆధారాలేమై ఉంటాయి? అధికమాసం విషయమై చివఱికి ఏది సరైనదని నిర్ణయించి ఉంటారు? నేను ఈ కథను ఆ వివాదంలో పాల్గొన్న మహాకవి శ్రీ దాసు శ్రీరామకవి గారి మనుమరాలు డా. వైదేహి గారి ద్వారా నా చిన్నప్పుడు పూర్తిగా విన్నాను కాని, చివఱికి తీర్పు ఏమని జరిగిందో ఇప్పుడు గుర్తులేదు.
దయచేసి మీ నిర్ణయాన్ని వివరింప ప్రార్థన.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన గారి అభిప్రాయం:
05/13/2013 6:19 pm
భావనారాయణ గారు, నిర్మాతలు, దర్శకులు మాత్రమే కాదు, నాయకీనాయకులుగా నటించే నటులు కూడ ఈ (దు)స్థితికి ఒక కారణమే. పిబిఎస్ వంటి వారు నటులకు, గాయకులకు మధ్య ఉండే గాత్రముల సాదృశ్యము ఒక భ్రమ (illusion) అని చెప్పినా, నాయకీ నాయకులు కొందరు గాయకులనే తమకు పాడడానికి ఎంపిక చేసికొన్నారు. ఒక 15 సంవత్సరాలు తెలుగులో ఒక గాయకుడిని మాత్రమే నాయకులు గాత్రదానమునకు ఎంపిక చేసికొనడము జరిగినది, ఒక గాయకి మాత్రమే నాయకురాళ్లకు గాత్రదానము చేయడము జరిగినది. మిగిలిన భాషాచిత్రాలలో కూడా ఈ పరిస్థితియే. హీందీలో కొందరు నాయకురాళ్లు తమ ఒప్పందములో కూడ ఫలానా గాయకి పాడాలని వ్రాసికొన్నారు. బహుశా దక్షిణభాషా చిత్రాలలో కూడ ఇది ఉండి ఉంటుంది. ఈ పరిస్థితిలో కొందరు దెబ్బ తిన్నారు. పిబిఎస్ స్థితి మెరుగే, వారికి కన్నడములో పెద్ద పీట ఉండినది. కాని జిక్కి, జమునారాణి, ఈశ్వరి, బెంగళూరు లతా, సుమిత్ర మున్నగువారు ప్రధాన నటులకు పాడలేకపోయారు. ఇప్పుడు కూడ ఈశ్వరి నాయకికి తరచుగా పాడి ఉంటే ఎలాగుండేదో అని నేను ఊహిస్తుంటాను. కనీసము వీరందరు చిత్రాలలో పాడారు. మంచి శారీరము ఉండి అవకాశము లేకుండా ఎందరు పాడలేకపోయారో అన్నది కూడ గమనార్హమే. విధేయుడు – మోహన
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి velchEru naaraayaNa raavu గారి అభిప్రాయం:
05/12/2013 2:45 pm
నేను కథ కుదించి చెప్పడంలో పొరపాటున వొదిలేశాను, కాని రాముడు ప్రత్యక్షమై ” నీ భక్తికి మెచ్చితి. మచ్చరితంబు భవ్యంబగు కావ్యంబుగా నొనరింపుమని యానతిచ్చి చనియె.” అని రఘునాథ నాయకుడు రాసిన వాల్మీకి చరిత్రము లో వుంది. నావ్యాసాన్ని సూక్ష్మదృష్టితో చదివినందుకు తః తః గారికి కృతజ్ఞతలు. — నారా
సిరినివాస వృత్తము గురించి మోహన గారి అభిప్రాయం:
05/12/2013 2:07 pm
తఃతః గారు,
గుర్వంతమైనా కావచ్చును, లఘ్వంతమైనా కావచ్చును, ఏ పేరితోనైనా సార్థకనామవృత్తమును కల్పించవచ్చును. కాని లాక్షణికులు 20వ శతాబ్దపు మధ్యకాలము వఱకు సుమారు 1500 వృత్తములను మాత్రమే సృష్టించి యున్నారు. సంస్కృత ఛందస్సులో లఘ్వంతముగా పేర్కొనబడిన వృత్తములను వ్రేళ్లపైన లెక్కించవచ్చును. దీనికి కారణము సంస్కృత ఛందస్సులో పాదాంతములో విరామయతి ఉంటుంది. అందువలన చివరి అక్షరము గురుతుల్యమే. అందుకే గురువున్న చోటులో కూడ లఘువును వాడుతారు. ఉదాహరణకు వసంతతిలకవృత్తములో శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ / పూగద్రుమాది సుమనోహర పాళికానాం … ఇందులో నారికేళ లోని ళ లఘువు, కాని అక్కడ గురువు స్థానమును ఆక్రమించుకొన్నది (తరువాతి పాదమునందు నాం వలె). తెలుగు ఛందస్సులో కూడ ఉపజాతులైన సీసము, ఆటవెలది, తేటగీతి, జాతి యయిన ద్విపదలలో పాదాంతములోని అక్షరము లఘువే. సామాన్యముగా ఉపజాతులలో అన్ని పాదములు స్వతంత్రముగా నిలిచి ఉంటాయి. ద్విపదలలో ఇది తప్పని సరి నియమము. అంటే పాదాంతములో ఒక విరామయతి ఉంటుంది. అందువలన ఇవి నా ఉద్దేశములో గురుతుల్యమే.
తెలుగులో సామాన్యముగా లాక్షణికులు గుర్వక్షరముపైన యతి నుంచుతారు. ఇది యెల్లప్పుడు సరి కాదని నేననుకొంటాను. ఉదాహరణకు తోటక వృత్తములో (నాలుగు స-గణములు), తొమ్మిదవ అక్షరము యతి. కాని పాదములో నాలుగు చతుర్మాత్రలు ఉన్నాయి, అవి రెండు రెండుగా విఱిగితే శ్రవణసుభగముగా నుంటుంది. సంస్కృతఛందస్సులో నాకు తెలిసి ఒక సార్థకనామవృత్తము మాత్రమే ఉన్నది, దాని పేరు న-ర. పద్యాలు పఠనీయములు మాత్రమే కావు, వాటిని పాడుకోవాలి కూడ. అందువలన నేను సార్థకనామవృత్తములను సృష్టించినప్పుడు అవి మాత్రాగణములుగా విఱుగుతాయో లేదో అనే విషయముపైన దృష్టి నుంచుతాను. అటువంటి వృత్తములకే నేను ఉదాహరణలను ఇస్తాను. ఈ ఉపోద్ఘాతముతో సామజవరగమనను పరిశీలిస్తే, దాని స్వరూపము ఇలాగుంటుంది –
స-స-మ-జ-వ-ర-గ-మ-న అనగా IIU IIU UUU IUI IU UIU U UUU III. ఈ అమరికను ఆఱు మాత్రలుగా విడదీసి వ్రాసినప్పుడు దీనికి సంగీతసౌలభ్యము లభిస్తుంది. ఆ అమరిక IIUII UUU UIUI IUUI UUU UUIII, ఈ అమరికతో యతి స్థానము 9, 17 అక్షరాలతో చెల్లుతుంది. సామజవరగమనవృత్తమునకు నా ఉదాహరణ –
సామజవరగమన – స స మ జ య య మ న, యతి (1, 9, 17)
24 సంకృతి 14719516
వరగామిని నీవేనా – పాదమందు వయారాల – వచ్చేవా సొంపై నడచి
స్వరభారతి నీవేనా – పాటలందు విలాసాల – వంచేవా యింపుల్ మడచి
సురసుందరి నీవేనా – చుక్కలందు రవల్ దెచ్చి – చొక్కేవా దేవీ మురిసి
స్మరమోహిని నీవేనా – శయ్యయందు ప్రమోదాల – జల్లేవా పూలన్ గురిసి
విధేయుడు – మోహన
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి nagaraju raveender గారి అభిప్రాయం:
05/07/2013 11:14 am
పి. బి. శ్రీనివాస్ గారు ఒక మంచి గాయకుడనే తెలుసు ఇన్నాళ్ళూ. కాని ఆయన ఒక బహుభాషా కోవిదుడు మరియు పండితుడని మీ వ్యాసం చదివాకే తెలిసింది.
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన గారి అభిప్రాయం:
05/07/2013 10:29 am
పిబిఎస్ గారికి శ్రీమతి సుశీల తన ట్రస్ట్ తరఫున Lifetime Achievement Award రెండేళ్లకు ముందు బహూకరించారు. ఈ నెల మొదటి వారములో SPB బెంగళూరులో ఒక సన్మానాన్ని ఏర్పాటు చేశారు, కాని ఆ పురస్కారమును పిబిఎస్ అందుకొనటానికి విధి అడ్డు పడినది. తోటి గాయకులు వారిని గురించి తమ హృదయపు లోతులనుండి వివరముగా హిందూ పత్రికలో ఇచ్చిన సందేశములను, అదే విధముగా ఇండియాగ్లిట్జ్ లోని ఈ రెండు ( 1, 2) పేజీలను చదవండి, కొన్ని కొత్త విషయాలను తెలిసికొంటారు.
విధేయుడు – మోహన
రాగలహరి: సింధుభైరవి గురించి chudamani గారి అభిప్రాయం:
05/06/2013 7:20 am
విష్ణుభొట్ల లక్ష్మన్నగారికి,
నమస్కారం. మీరు రాగాలు పరిచయం చేస్తున్నపుడు సినీ గీతాల ఆడియో క్లిప్పింగ్ ఇవ్వకపోయినా పరవాలేదు కాని లలిత గీతాల లింక్ ఇవ్వమని ప్రార్ధన.
చూడామణి.
రచయితలకు సూచనలు గురించి SADHU MAHENDER గారి అభిప్రాయం:
05/05/2013 2:20 pm
గౌరవ ఎడిటర్ గారికి నమస్కారములు! ఈ మాటకు భావ గీతాలు, తెలుగు గజల్స్, ఎక్కడ ప్రచురితం కానివి తమ పత్రికకు పంపవచ్చునా ? తెలుపగలరు.
[పంపండి. పరిశీలించి ప్రచురణార్హం అనుకుంటే ప్రచురిస్తాము. – సం]
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి shankarvoleti గారి అభిప్రాయం:
05/05/2013 12:52 pm
మధుర గాయకుడు శ్రీ పి.బి. శ్రీనివాస్ గారిపై చక్కటి వ్యాసం రాశారు. అలాగే పాటల లింకులు ఇచ్చారు బావుంది. ధన్యవాదములు. శ్రమ పడ్డారు. పి.బి గారి పాటలంటే మాకు అభిమానమే. కాని మధ్య మధ్యలో శ్రీ ఘంటసాల గారిని తక్కువ చేస్తూ రాయడం, పి.బి. గారిని ఘంటసాల గారి కంటె ఎక్కువ చేస్తూ రాయడం, పోల్చడం బాగులేదు. ఒకరిని పొగడ డానికి వేరొకరిని విమర్శించనక్కర లేదు.. ఏనుగు విలువను సింహంతో పోలుస్తామా. అవి హీరో అభిమానులైన చౌకబారు మనుషులు చేసే పని. మీలా ఎంతో వున్నత చదువులు చదివిన వాళ్ళు చేయవలసిన వారు కాదు. ఘంటసాల గారు ఆ రోజుల్లో తన సమకాలీన గాయకులైన పి.బి, పిఠాపురం, మాధవపెద్ది వారిని ఎంత ప్రోత్సహించారో అందరికీ తెలుసు. అప్పటి ప్రేక్షకులు, నిర్మాత దర్శకులు, హీరోలు అంతా ఘంటసాల వారి పాటలను ఎంతో గొప్పగా ఆదరించారు, అభిమానించారు. అందుకే ఈనాటికీ ఏనాటికీ తెలుగు వాడు బతికి వున్నంత కాలం ఘంటసాల గారికి ఎదురులేని అభిమానులు వుంటారు.. ఘంటసాల వారి పేరున వున్నన్ని వెబ్ సైట్లు ఏ ఇతర గాయకునికి లేవు..
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
05/04/2013 11:43 am
జరిగిన కథ ఇది!
పిబియెస్ మరణవార్త విని కలత చెందిన అనేకుల్లో ఈ వ్యాసరచయితలు కూడా ఉన్నారు! నేను పిబియెస్ పై ఒక వ్యాసం రాద్దామనుకున్నాను. మధురగాయకుడైన పిబియెస్ జీవితంలో కన్నడ పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక మోహన రావు గారుతో సంప్రదించా! వారు ఎంతో సంతోషముగా ఈ ప్రయత్నాకినికి అంగీకరిస్తూ, మా అందరికీ మిత్రుడైన పరుచూరి శ్రీనివాస్ ని కూడా కలుపుకుంటే బాగుంటుందని సూచించారు. ఎన్నో పాత పాటల వివరాలు, వాటి సేకరణలో నిష్ణాతుడైన శ్రీనివాస్ లేకపోతే ఎలా అని ఆయన్ని కూడా కలుపుకున్నాం. ఇంతలో మురళీధర రావు గారు గురించి మోహనరావు గారు చెసిన సూచన మేరకి వారిని కూడా కలుపుకున్నాం కానీ, వారి రచనే స్వతంత్రంగా నిలబట్టం చేత అది ఒక ప్రత్యేక రచనగా రూపొందింది.
ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, పిబియెస్ యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని ఈమాట పాఠకులకి వీలైనంత ఎక్కువగా ఇవ్వాలన్న తాపత్రయం వల్ల! మోహనరావు గాౠ ఎంతో శ్రమకోర్చి రచన చేసాౠ. నేను పనివత్తిడిలో ఉన్నా! వారాంతరాలలొ కూడా పని చేసే పరిస్థితి నాది. పరుచూరి శ్రీనివాస్ యధాప్రకారం ఆఫీసు పని మీద దేశాలు తిరుగుతూ, వీలున్నప్పుడు మా ఈమైల్స్ చదువుతూ తన వంతు రాతకోతలు పూర్తి చేసారు. ఈ హడావిడిలో కొన్ని అచ్చుతప్పులు కూడా జరిగాయి.
ఈ మొత్తం తీసికెళ్ళి ఈమాట సంపాదకుడు మాధవ్ మాచవరం చేతిలో పెట్టీ “మీరు చూసుకోండి” అన్నాం!
ఆయన కష్టపడి పాటలకి, లింకులు, ఎం. పి 3 ఫార్మాట్‌లో మార్చటలు, టైపోలు దిద్దటాలు. వాక్య నిర్మాణాలు సరిగా ఉన్నవో లేదో చూసుకోటాలు జరిగాయి.
తెలుగులో “గ్రంధవిస్తరభీతి” అన్న పదం ఒకటి ఉంది. చదువరలకి ఎంతో చెప్పాలనే తాపత్రయంలో ఎంతో రాస్తాం! అప్పుడప్పుడు అది విసుగుకలిగించే ప్రమాదముంది. నేను 2, 3 పాటలకి సాహిత్యం కూడా ఇచ్చాను. అవి కత్తిరింపులకి గురి అయ్యాయి. ఆ పాటల సాహిత్యం ఇక్కడ ఇస్తున్నా!
*************
అతడు) మనసు మనసు కలిసే వేళా
మౌనమేలనే ఓ చెలియా
ఆమె) కలలు నిలిచి పలికే వేళా
(పలుక లేనురా చెలికాడా)2
అతడు) కన్నుల దాగిన అనురాగం
పెదవులపై విరబూయాలి
ఆమె) పెదవులకందని అనురాగం
(మదిలో గానం చేయాలి)2
ఆమె) పల్లవించు మన కలలన్ని
పరిమళించె విరజాజులుగా
అతడు) వన్నె వన్నె కోరికలన్నీ
(మిన్నుల కెగసెను గువ్వలుగా)2
ఇద్దరు) కన్నుల దాగిన అనురాగం
మన పెదవులకందని అనురాగం
అతడు) విరిసే నీ చిరునవ్వులలో
కరగిపోదునా కలకాలం
ఆమె) మెరిసే నీ కనుపాపలలో
(పరవసించనా చిరకాలం)2
*******************
Emi rAmakatha! SabarI, SabarI; EdI, mariyokasAri!
ఏమి రామకథ-రామకథా సుధ ఎంత తీయనిది!
రవికుల శశియై, రాఘవుడై;
రాముడయి, గుణధాముడయి;
అవతరించునట హరి మనకై… దాశరథీ దయాజలధి
వాలుకనుల ఆ జానకిని ఓరకనుల ఒకసారి గని,
కేల శివుని విల్లందుకొని, లీల విరిచెనట!
లీల నీరద శ్యాముడట, కల్యాణ రాముడట!!
మౌని భార్య మర్యాద చెడి, ధూళి పడి, శిలయైన: జాలిపడి,
దీనురాలి తన padamula తాకి, ప్రాణమొసగు
కారుణ్యధాముడట!!
కూరిమి తమ్మునితో, బంగారు బొమ్మ సీతమతో
నార చీరలూని అయ్య-కారడవుల కేగగా
రామచంద్రా, రాఘవేంద్రా! రామా, రామా, రామా, రామా!
రామభద్రా, గుణసముద్ర!
అని అయోధ్య ఏడ్చెనంట; అశ్రుధారలోడ్చెనంట!
ఏమి రామ కథ, వ్యధయై, సుధయై, ఏరై పొంగెడు మదిలో!
నావైనా, రేవైనా, నడిపే చుక్కానియైనా నీవేకద!
నీకు గుహుడు కావాలా, గంగదాట!
“అన్నా, వలదన్నా! అడవికి పోవలదు….”
అను తమ్ముని లాలించి, అయ్యమాట పాలించి,
పాదుకచే మహారాజ్య భారము మోయించితివా!
మరోసారి మరిన్ని వివరాలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన గారి అభిప్రాయం:
05/04/2013 10:00 am
సౌమ్య గారు,
1) ఈ వ్యాసము వ్రాయాలని ఏప్రిల్ 16, 17 తేదీలలో మేము తీర్మానించాము. సుమారు పది రోజులలో వ్యాసమంతటిని వ్రాసినాము. లక్ష్మన్నగారు, శ్రీనివాస్ గారు తెలుగు చిత్రగీతాల గురించి, శ్రీనివాస్ గారు అరుదైన లలితగీతాల, చిత్ర గీతాల గురించి వ్రాసినారు. నేను తమిళ, కన్నడ చిత్రసీమలలో పిబిఎస్ కృషిని గురించి వ్రాసినాను. నావరకు నాకు గీతముల ఎంపికకోసం, వాటిని గురించి వ్రాయడముకోసం సుమారు ఒక వారము రాత్రనక పగలనక కాలము వెళ్లబుచ్చవలసి వచ్చింది. తరువాత కూడ తప్పులను సరిదిద్దడానికి దీర్ఘకాలమును గడపవలసి వచ్చినది. త్వరగా వ్రాసినందువలన కొన్ని తప్పులు దొరలడము సహజమే. వాటికి నా తరఫున, నా తోటి రచయితల తరఫున క్షమాపణలను అందుకొనవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
2) పాటగురించి చర్చ ఉన్నప్పుడు ఆ పాటను వ్యాసములోనే ఉంచడము జరిగినది. వేరే లంకెకు వెళ్లితే చదవడములో అంతరాయము కలుగుతుందని ఈ ఏర్పాటు. మరి కొన్ని వేళలలో ఇక్కడి లంకెలో ఒక వీణ పలుకో, లేక ఒక గమకమో ఎక్కువగా ఉండి ఉంటుందని అలా చేయడమైనది.
3) తమిళ చిత్రగీతముల వివరాలు –
అత్తిక్కాయ్ కాయ్ కాయ్ – బలే పాండియా
మనిదన్ ఎన్బవన్, మయక్కమా కలక్కమా – శుమై తాంగి
అనుబవం పుదుమై, నాళాం నాళాం తిరునాళాం – కాదలిక్క నేరమిల్లై
ఇంద మండ్రత్తిల్ ఓడి వరుం, పొన్ ఎన్బేన్ – పోలీస్‌కారన మగళ్
నినైప్పదెల్లాం నడందు విట్టాల్ – నెంజిల్ ఓర్ ఆలయం
నిలవే ఎన్నిడం నెరుంగాదే – రాము
నాన్ ఉన్నై శేర్న్ద శెల్వం – కలైక్కోవిల్
కలైక్కోవిల్ పాటను గురించి ఒక మాట, ఈ చిత్రములో బాలమురళి గళముతో, చిట్టిబాబు వీణతో సరిసమానముగా పిబిఎస్ పాడినాడు, ఇక్కడ ఇవ్వబడిన యుగళగీతము నాకు నచ్చిన పిబిఎస్ యుగళగీతాలలో ఒక ముఖ్య స్థానమును ఆక్రమించుకొన్నది. మిగిలిన పాటల వివరాలు వ్యాసములోనే ఉన్నాయి.
4) ఓహిలేశ్వర చిత్రములోని పాటలోని తునకను సంపాదించుటకు చాల ప్రయత్నము చేసిన తరువాత ఇది దొరికినది. ఆ చిత్రములోని పాటలలో ఘంటసాల పాటలకు మాత్రమే లంకెలు ఉన్నాయి. ఒక టివి కార్యక్రమమునుండి దీనిని గ్రహించాను. అందువలన ఆ సంభాషణ అనివార్యము. ఉద్దేశము ఆ పాటను అందించడము కాబట్టి మాటలను మనము భరించాలి.
5) కూడి వాళ్‌న్దాల్ కోడి నణ్మై అనే చిత్రము remake, కాని ఇవ్వబడిన లంకె fusion. ఈ చిత్రమును youtubeలో చూడ వీలగును.
6) తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో పిబిఎస్ వేలకొలది పాటలు పాడారు. అందులో మాకు నచ్చినవి కొన్నిటిని పాఠకులకు పరిచయము చేసినాము. వాటికి లంకెలను ఇచ్చాము. అందులో ప్రతి భాషలో మూడో నాలుగో పాటలు దీర్ఘముగా చర్చించబడినవి. అందులో కొన్నిటికి అదే మెట్టులో అనువాదమును ఇవ్వడానికి ప్రయత్నించాను.
7) జెమినీ గణేశన్, రాజకుమార్ స్వతహాగా గాయకులు, అయినా వాళ్లకు పిబిఎస్ పాడాడు. మనము శ్రోతలు నటుడి, గాయకుడి గాత్రములు సరిపోయాయని అనుకొంటాము. ఇది ఒక ఊహ మాత్రమే అని అంటాడు పిబిఎస్. ఎందుకంటే అదే గణేశన్‌కు ఏ ఎం రాజా పాడాడు. శ్రోతలు ప్రేక్షకులు అది కూడ సరిపోయింది అన్నారు. రాజకుమార్ తరువాతి కాలములో తనకు తానే పాడు కొన్నాడు. చిత్రసీమలో ఎన్నో illusions ఉన్నాయి. అందులో ఈ గాత్రపు పొంతన కూడ ఒకటి అంటాడు పిబిఎస్, అంతే.
విధేయుడు – మోహన
Good Bye. గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:
05/04/2013 9:40 am
తొమ్మిదేళ్ళ కిందటి మాట:
మీరన్న మాటలు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుస్తుంది.
కొన్ని పదవులు శిరసున ధరించే ముళ్ళ కిరీటాలు. గులాబీలు పరచిన కుర్చీలు. విడిచెళ్తున్నప్పుడు హాయిలేని బాధగా వుంటుంది. బాధే కాని, బరువైన హాయీ వుంటుంది.
సంపాదకులుగా మీ అనుభవాలను హాస్యరచనలుగా అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
మీ సంపాదకత్వంలో నా రచనలిక్కడ చోటు చేసుకున్నాయి. అందుకు చాలా కృతజ్ఞతలు.
మేలైన మరిన్ని మంచి రచనల్ను మీ నించి ఆశిస్తూ,
శుభాకాంక్షలతో ..
-ఆర్.దమయంతి.
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి Velcheru Narayana Rao గారి అభిప్రాయం:
05/03/2013 11:56 pm
జంపాల గారికి మరో మాట.
చేకొని రాయనిబాచడు
కాకాలు గుణంచు పిన్న కాలము నాడే
లా కేత్వ మియ్యనేరడు,
దా కును కొమ్మియ్య డట్టి దాతలు గలరే
అనే చాటు పద్యం ఎప్పటిదో నాకు తెలియదు. కాని అప్పటికే లేఖన పద్ధతిలోగుణింతం చెప్పే అలవాటు వుంది. — నారా
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి Velcheru Narayana Rao గారి అభిప్రాయం:
05/03/2013 11:45 pm
జంపాల గారు చూపించిన లోపం నిజమైనదే. మొదటి రామాయణాన్ని కావ్య రామాయణం అనడం ద్వారా ఈ లోపాన్ని పరిహరించొచ్చు ననుకుంటాను. ఏమైనా వాల్మీకి రామాయణానికి రెండు రకాల పఠన మార్గాలున్నాయని చెప్పడం నా ఉద్దేశం.
ఇక పోతే కకార అకారాలు క, కకార ఆకారాలుకా — అని చెప్పే పద్ధతీ, కకు దీర్ఘం ఇస్తే కా, కకు కొమ్మిస్తే కు — అని చెప్పే పద్ధతీ, వేరు వేరు కాలాలకి చెందినవని నేను అనడంలో ఒక ఆంతర్యం వుంది. నేను గవర్నమెంట్ బళ్ళో చదువుకోలేదు. ఇంట్లో చదువుకున్నాను. మా ఇంటికీ బడికీ దూరం తక్కువే, కాని కాలం తేడా ఎక్కువ. నేను ఇరవయ్యో శతాబ్దంలోకి కొంచెం ఆలస్యంగా వొచ్చాను. — నారా
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి Gannavarapu Narasimha Murty గారి అభిప్రాయం:
05/03/2013 11:35 pm
ఆంధ్ర ప్రజానీకానికి మధుర గాయకునిగా శ్రీ పి.బి.శ్రీనివాస్ సుపరిచితులు. ఆయనను ‘ ప్రతివాద భయంకర శ్రీనివాసుగా ‘ కొంతమంది మాత్రమే ఎఱుగుదురు. వారి వంశము ప్రతివాద భయంకర వంశముగా ప్రాచుర్యము నొందిన వివరణ ఆసక్తిదాయకముగా నుంది. శ్రీ శ్రీనివాస్ గారు కవి అని, కొన్ని వృత్తాలు సృజించారని తెలిసినా ఇన్ని వివరాలు నాకు తెలియవు. ఒక మహనీయుని ప్రస్తుతించే టప్పుడు మరెంత మందో స్తవనీయులను కూడా స్మరించుకోవడము జరుగుతుంది. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి వ్యాసములో కూడా ఆ సత్ఫలసిద్ధి సమకూడింది.
వ్యాసకర్త శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి విజ్ఞానము, పాండిత్యము , పరిశీలనా పరిశోధన దీక్షలు, ప్రస్ఫుటము. సంస్కృతాంధ్రా భాషలలో కోవిదులైన వారు కవిపుంగవులు. ఇట్టి పండితులను చూస్తూంటే తెలుగు ప్రశస్తికి లోటు లేదని తృప్తి కలుగక మానదు. శ్రీ శ్రీనివాస్ గారికి చక్కని నివాళి నొసిగిన శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి అభినందనలతో బాటు ధన్యవాదములు.
గన్నవరపు నరసింహ మూర్తి
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి జంపాల చౌదరి గారి అభిప్రాయం:
05/03/2013 7:14 pm
పైన “రామాయణానికి వాల్మీకి అలాంటి వాడు. ” తరువాత ఉండవలసిన వాక్యం తప్పిపోయినట్లు అనిపిస్తుంది.
ఈ రెండు పద్ధతులూ వేరు వేరు కాలాలవి అనటానికి ఆధారమేమిటి?
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి మోహన గారి అభిప్రాయం:
05/02/2013 1:12 pm
పి బి శ్రీనివాస్ రచనలను చదివే అదృష్టము ఇప్పటివరకు నాకు దొరకలేదు. వారు మురళీధరరావుగారిని ఎలా ప్రశంసించి వ్రాసియుండేవారో అన్న విషయాన్ని ఊహించడము కష్టము. కాని మురళిధరరావుగారికి ఇలా ఒక మురళీవృత్తమును వ్రాసి ఉండేవారో అనే ఒక భావన కలిగినది. దాని ఫలితమే ఈ మురళీ వృత్తము. వరుసగా 16 గురువులు వస్తుంది ప్రతి పాదములో. ఇలాటి దీర్ఘాక్షరాలకు సంస్కృత పదాలు బాగుంటాయి. కాని నా సంస్కృతము దుష్కృతమే అవుతుంది. అందువల్ల నాకు తెలిసినట్లు వ్రాసినాను. తప్పులు ఉంటే నా అజ్ఞానానికి క్షమించాలి. పద్యములో నేకవచనముతో సంబోధించినంత మాత్రాన బహువచనశీలురైన వారిపై బహుళ గౌరవము లేక పోలేదు. ఏల్చూరి మురళీధరరావు గారి యత్నమునకు జోహారుగా మురళీ వృత్తము –
సార్థకనామ వృత్తము మురళీ – మ మ మ మ మ ర ల ల ల ల – UUUUUU UUUUUU UUUUIU IIII అనగా మ మ మ మ మ ర న ల గణములతో విరాజిల్లునది మురళీ(లీ)వృత్తము. ప్రతి పాదమునకు 22 అక్షరములు. ఇది సార్థకనామ వృత్తమే కాదు, పాదాంతములో లఘువు ఉండే అరుదైన వృత్తము కూడ.
మురళీవృత్తము – మ మ మ మ మ ర న ల, యతి (1, 7, 13)
22 ఆకృతి 3997697
ఆ సచ్ఛీలున్ సిద్ధున్ – హాసానందోత్సాహున్ –
హర్షిన్ శ్రీ శ్రీనివాసుఁ బొగడి
వ్యాస మ్మిట్టుల్ సొంపై – వ్రాయన్ నీకే జెల్లున్ –
పాండిత్య మ్మెంతయో జిలుకగ
నీ సచ్ఛైలిన్ భాషన్ – నేనేరీతిన్ జెప్పన్ –
నిస్సందేహమ్ముగా వెలిగెను
వ్యాసంగమ్మున్ సాహి-త్యమ్మున్ సంగీతమ్మో –
యంచున్ మ్రోగించు డా మురళిని
విధేయుడు – జెజ్జాల కృష్ణ మోహన రావు
హాయిగ పాడుదునా? గురించి M.V.Ramanarao గారి అభిప్రాయం:
05/02/2013 4:27 am
ఈ వ్యాసం శ్రీనివాస్ గారు కీ.శే. ఐన తర్వాత చదవడం బాధాకరం. ఆయన కన్నా సినిమా సంగీతం గురించి, అందుకు సంబంధించిన ప్రముఖుల గురించి సాధికారంగా ఎవరు రాయగలరు? నాకు కూడా రాజేశ్వరరావు సంగీతదర్శకత్వం అంటే చాలా ఇష్టం. ఆయన ప్రైవేటు రికర్డుల్లో ‘పాట పాడుమా కృష్ణా,’ ‘చల్లగాలిలో,’ ‘ఓహో విభావరీ,’ పాటలు, ‘ఆతోటలోనొకటి ‘ (బాలసరస్వతి) పాటలు చాలా ఇష్టం. కాని రాజేశ్వరరావు గొంతుక మరీ సున్నితంగా ఉండటం చేత హీరోలకు ప్లేబాక్ కి పనికిరాదు. కాని ఆయన genius, prodigy అని చెప్పవచ్చును. ఇంతకీ ‘రసాలూరు స్వరాజ్యేశ్వరరావు’ వంటి తమాషా పదాలు మొదట కాయిన్ చేసిందెవరు? ముళ్ళపూడి రమణ గారా, లేక పీ.బీ. శ్రీనివాస్ గారా? ఇద్దరూ అలాంటి epithetsని ఒకేలాగ వాడారు.
పుష్పవివేకము గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
05/01/2013 9:43 pm
మూలమే లోపభూయిష్ఠముగా నున్నచో బహుశః అది ముద్రణకారుని దోసమై యుండవలెను. అది ఎట్లున్నను, నాకు దోచిన సంస్కరణము లీక్రింద పేర్కొనుచున్నాను.
పద్యం పంక్తి ఉన్నది ఉండవలసినది
1 3 ప్రోదను ప్రోడను
1 4 గుమరైన గొమరైన లేక గుదురైన
(కుదురైన అనే పదం కొమరైన అనే దానికంటె అర్థవంతంగా ఉంటుంది)
2 3 ఆర్ద్రభావాత్త స్కృత పథానువర్తి
ఇందులో స్కృతపథానువర్తి అనునది అర్థరహితంగాను, గణభంగయుతంగాను ఉన్నది. దీనిని పూతపథానువర్తి అని సవరిస్తే బాగుంటుదనిపించింది. కాని ఇట్టి భావం కవిగా రుద్దేశిందో కాదో మరి!
3 1 చయాసుషక్త చయానుషక్త
4 1 మెత్తఁగ్రవ్వి మెత్తగఁ ద్రవ్వి
5 3 క్రియకో క్రియకొ (క్రియకో అంటే గణభంగం)
6 3 కొండలనో కొండలనొ (కొండలనో అంటే గణభంగం)
7 2 మెత్తకున్న మొత్తకున్న
7 2 గౌరవంబు నూ గౌరవంబు సూ (సూచి అంటే సూది)
9 4 ముద్ధుల్ బుద్ధుల్
10 4 జెడలేల జెడనేల
11 4 దలందురో దలంతురో
12 2 ముందపడుటే ముదంపడుటే
13 2 నిక్కును నిక్కుచు
(స్థూలంగా నా వైయక్తికాభిప్రాయం. ఇది నీరసమైన కవిత్వం.దీనిని పుష్పవిలాపంతో పోల్చడం తగదు.)
[అడిగిన వెంటనే తప్పులు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. – సం.]
రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి SRINIVAS గారి అభిప్రాయం:
05/01/2013 6:29 pm
మహేష్ గారు,
మీ ద్రుక్కోణం బాగుంది. వ్యక్తిగతం, వ్యవస్థలో భాగం, చివరికి వ్యవస్దని శాసించడం; వరుసగా శివ , గాయం, సత్యా ల్లోని పరిణామక్రమం అని నేను అర్ధం చేసుకున్నది . వీటిలో: శివలో ‘భవానిని ఒక్కడిని చంపితే కాదు. వ్యవస్దనే మార్చాలి ‘ అంటాడు కాని అ[ఇ]ప్పటి తెలుగు సినిమాల లానే విలన్ అంతంతొ ముగుస్తుంది. (అలజడి, తమ్మారెడ్డిగారిది చూడండి వీలైతే). ఇక గాయం మనిరత్నం కథ అని మరువకూడదు. గ్యాంగ్ స్టార్ trilogy; సత్య, కంపెని మరియు ఢీ [god father movie మర్వద్దు].
DR.K. SRINIVASARAO
ps; వర్మ నాకు చాల నచ్చే దర్శకులు ఎందుకంటే… మిమ్మ్మల్ని కలిసినపుడు చెపుతాను. [మిమ్మలని కలవాలంటే….?]
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Rallapalli Sundaram గారి అభిప్రాయం:
04/28/2013 10:26 am
సుమతి శతకం కాలాన్ని గురించి, రచయితను గురించి, అందులోని సమాజాన్ని గురించి ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎక్కువగా ఊహలే ఆధారంగా ఉన్నాయి.
నా అభిప్రాయాలు ఇవి:
1. పుస్తకాల పేర్లు సంబోధనను బట్టి. రావు. రచయితనిబట్టి, ఉద్దేశించిన వారినిబట్టి (అది ఆత్మసంబోధన కావచ్చు) వస్తాయి.
2. సుమతి శతకం భీమనదీ కాదు, బద్దెనదీ కాదు, సుమతి అనే జైన మునిది (నా అభిప్రాయం) అందువల్ల అది సుమతి శతకమే.
3. నాకు సంస్కృత సాహిత్య పరిచయం ఉంది కాని త: త: గారికున్నంత వ్యాకరణ పాండిత్యం లేదు. అందువల్ల. ఆ విషయాలను పొడిగించను.
4. నన్నెచోడుడు ఆధునికుడనేది అబద్ధం. మానవల్లి వారే రాశారన్నది దురుద్దేశపూరితమైన ఆపాదన. మానవల్లికంటే ముందే కందుకూరివారు తంజావూరులో ఆ ప్రతిని చూశారు. తెలుగు వారికి 9వ శతాబ్దం లోనే పంప ప్రబంధం రాశాడని తెలీక నన్నెచోడుణ్ణి తర్వాతి కాలానికి నెట్టివేశారు. నేలటూరి వెంకటరమణయ్య గారిలాంటి గొప్ప చరిత్రకారులే నన్నెచోడుడు 10వ శతాబ్దివాడన్నారు. నాదీ అదే అభిప్రాయం.
నా అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని నా ఉద్దేశం కాదు.
రాళ్ళపల్లి సుందరం
మరియ గురించి N.Venkateswararao గారి అభిప్రాయం:
04/26/2013 8:20 am
కధా రచయితకి ధన్యవాదాలు కధ చదువుతున్నప్పుడు నిజంగా సమాజంలో అందరిలాగే నాకూ అనిపించింది కాని చివరికి వచ్చే టప్పటికి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. పల్లెల్లో ఎన్నో కుటుంబాల చరిత్రలు ఈ రీతి గానె వుంటాయి. కుటుంబం గడవని స్థితి, తల్లి తండ్రి ఎవరి దారి వారిది అన్నట్టు పిల్లల్ని గాలికి వదిలేయడం సర్వ సాధారణం. అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు రచయిత. జోహార్.
కొత్త మలుపు గురించి ramaa devi గారి అభిప్రాయం:
04/26/2013 7:20 am
కధ రంగనాయకమ్మ గారి స్టైల్లో వుంది అన్నాను అంటే చిన్న కారణానికి కూడా బయటికి వచ్చేసి స్వతంత్రంగా బతకండీ అని మొన్నీమధ్యే వొక “కళ్ళూ తెరిచిన సీత” అని వొక నిజంగా జరిగేలా చేసిన వొక ఎక్స్పీరియన్స్ మీద ఆంధ్రజ్యోతి లో సీరియల్ వచ్చింది. బోలెడంత మంది అమ్మయిలు మాకు సీత(ఆ సీరియల్లో సీత) ఆదర్శం అన్నట్లు వుత్తరాలు కూడా రాశారు. ఇక్కడ కొత్త మలుపు అని పేరుకి మూలం అయిన సరోజ కొడుకుతో వెళ్ళిపోవడం సీత వెళ్ళి పోవడం లాగా వుంది అని ప్రస్తావించాను. కాని ఈ కధలో సరోజకి కనీసం సీత పాత్ర చేసినంత ఆలోచన కూడా చేసినట్లు అనిపించదు. పైగా మూర్తితో సరోజకి సీతకి భర్త మీద వున్న లాంటి అసంతృప్తి కూడా వున్నట్లు అనిపించదు. మరి అంత విప్లవాత్మకంగా, వెళ్ళిపొయేలా ఆ పాత్ర చిత్రణ జరగలేదు. కవన శర్మ గారు “ఆమె ఇల్లు” అని వొక కధ రాశారు. దాన్లో భార్య రిటైర్ అయ్యాక స్వంత ఇల్లు కొనుక్కుని వెళ్ళి పోతుంది. అప్పుడు ఆమె జవాబులో మనకి కొన్ని సంవత్సరాలుగా ఆమె అనుభవించిన వేదన సంఘర్షణ, ఆయనకి తెలియకుండా ఎంతగా గాయపరిచాడో. (అంటే ఈ కధలో మూర్తి లానే వొక మూస ధోరణి భర్తల స్వభావం, అహంభావం… దాన్ని బోలెడంత మంది ఈ సమాజంలో సమర్ధించేవాళ్ళున్నారు; నేను మూర్తి లేక ఆమె ఇల్లులో భర్తలని సమర్ధించట్లేదు; కాని అలాంటి స్వభావం ఇంకా బోలెడంత మంది అబ్బాయిల్లొ, భర్తల్లొ, కొడుకుల్లో కనిపిస్తుంది. అది “వో.కే అని ఎంత మంది అనుకుంటున్నారొ చూస్తుంటే ఆశ్చర్యంగా అసహనంగా అనిపిస్తుంది.) సమాజంలో బోలెడు భర్తలు వులిక్కిపడి తమని తాము చూసుకునేలా రాశారు.
రమాదేవి
కొత్త మలుపు గురించి ramaa devi గారి అభిప్రాయం:
04/26/2013 6:35 am
కధ కొంచెం రంగనాయకమ్మ గారి స్టైల్ లో వుంది. అమ్మానాన్నల మధ్య భార్య భర్తలుగా వున్న సంబంధం సరిగ్గ తెలియట్లేదు. భర్త ఈ వొక్క సారి మాత్రమే అమ్మ చెల్లిని పిలిపించాడా ఇలా ఇంతకు ముందు కూడా చేశాడా? సామాన్యంగా భర్త భార్యలలో వొకళ్ళు తన వారిని పిలిపించుకుంటే సంప్రదిస్తే రెండో వాళ్ళు ముందు లేక పోయినా అప్పుడు పిలుచుకుంటారు. ఇది సామాన్యంగా కనిపించేది జరిగేది ఎందుకంటే బయటి వాళ్ళకి ఎప్పుడు తమ అబ్బాయి అమ్మయినే సమర్ధించాలనుకుంటారు. అలా అనుకుంటారనే ధైర్యంతోనే మోరల్ సపొర్ట్ కోసం బయటి వాళ్ళని రప్పించుకుంటారు లేక పోతే సరోజ వెలిబుచ్చినట్లు తమ ముగ్గురు తేల్చుకోవాలనే అనుకోవాలి.
కొంచెం పోపులర్ కధల ధొరణి కనిపిస్తుంది. అంటే బొమ్మరిల్లులో సిద్దు లాంటి పాత్ర, హాపీడేస్ సినిమా లాగా అన్న మాట. సరొజ అత్త గారిని ఆడపడుచు గురించి “కట్టెలను ఎగదోసి నిప్పును ఇంకాస్త రాజుకునేటట్లు చేశారు” అని అనుకున్నట్లు మరి తను చేసింది ఏమిటి? భర్త నాకు ఇష్టం లేదు అన్నప్పుడు తను కొడుకు కనీసం కొన్ని రోజులు తండ్రి ఈగొ తగ్గి మనసు మారుతుందేమో అని ఎందుకు చూడలేదు? ఎలాగు ఆ కొడుకు అప్పుడే చెప్పాలనుకోలేదు అంటే అంత తక్కువ వ్యవధిలో చేసుకోవాల్సిన అగత్యం ఏమి కనిపించట్లేదు. కభి ఖుషి కభి గం అని వొక సినిమాలొ ఇలానే చూపించారు. కనీసం అక్కడ వొక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అలా ఏమీ కనిపించట్లేదు. ఆ భార్య అలా వెళ్ళి పోవాలనుకుంత క్రూరుడా ఆ భర్త? అలా కాని పక్షంలో భార్య భర్త సంభంధం అంత తొందరగా తెంచుకోవాల్సినంత చిన్న విషయం కాదు, తెంచుకోగలిగేంతదీ కాదు. అందుకే ఇది వొక పాపులర్ కధలా వుంది అన్నది వాస్తవికంగా లేదు.
ప్రసాద్ గారు అన్ని కధల లోనూ కొంచెం ఎక్కువ ఆవేశపడుతున్నారేమో.
“సంవత్సరం పైగా ప్రేమించినవాడికి ఇంట్లో ముందుగా చెప్పాలన్న సంస్కారం ఉండదు.” ఇక్కడ “సంస్కారం” పదం పక్కన పెడితే నిజంగానే కనీసం చూచాయగానయినా తన అభిప్రాయం వ్యక్తం చేసాడా? అసలు సామాన్యంగా ముందే కొంచెం తమషాకి అన్నట్లు ఇలాంటి విషాయాలు చర్చకి వస్తాయి. వాటిల్లొంచి వీడు ఇలా చేసేవాడే, అలా చేస్తాడని అస్సలు అనుకోలేదు, ఇలా అభిప్రాయ పడుతుంటాము. అలాటిది ఆ ఇంట్లో ఎప్పుడు జరగలేదా? కనీసం తల్లి తండ్రి ఇష్టాలు అభిప్రాయాలు ముందే అంచనా వుంటుంది కదా. అందుకయినా కొంచం సూచించచ్చు కదా? ఈ రోజుల్లొ కూడా గౌరవం కులం అంటూ మనుషుల్ని చంపేసే ఆచారాలు, వాటికి వొప్పుదలలు ఇచ్చే చుట్టు పక్కల మనుషులు వున్న నేపధ్యం లో స్నేహంగా ఇష్టంగా పంచుకోక పోయినా ఎక్కడే కొంచెం సూచనగా అయినా చెప్పాలి. లేదా అది మోసం కింద వస్తుంది. ప్రసాద్ గారికి ఇంకో కధలో తల్లి మీద తండ్రి మీద బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తించినవాళ్ళ మీద చాలా కఠినంగా “జాలి చూపించక్కర్లేదు” అన్నారు. మరి ఇక్కడ కొడుకుని సమర్ధిస్తున్నారు? నిజానికి కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో లాగా ఇద్దరు రెండు వైపుల వాళ్ళని వొప్పించటానికి కనీసపు ప్రయత్నం చెయ్యకపొవడం చెయ్యాలి అనుకోక పోవడం, మనం అలౌ చేస్తున్న సామాజిక రుగ్మత.
అసలు అలా అబ్బాయి కాని అమ్మాయి కాని ప్రయత్నించాలి అనుకోకపోతే వాళ్ళ ప్రేమ అసలు శంకించాల్సిన విషయం. ఈ రోజు అమ్మ నాన్న లతొ జరిగింది రేపు వాళ్ళ విషయంలో జరగదని గారంటీ ఏమిటి? సంప్రదాయంగా ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు? సంప్రదాయానికి విలువిచ్చాడు కాబట్టి. మరి అలాంటి మనస్తత్వం వున్నవాడు తండ్రితో అలా ఎలా మాట్లాడ గలిగాడు? తండ్రికి కొడుకుకి తేడా ఏమిటి? అలాటప్పుడు తల్లి కొడుకుని ఎందుకు సమర్ధించాలి? ఇది ఈ రోజు అన్ని సినిమాల్లోను కధల్లొను చూపించేస్తున్నారు + ఇది “తల్లి అంటే ఇలా కొడుకునే సమర్ధించాలి” అనే వొక తప్పు ఆలోచనని మనుషుల్లో పెరిగేలా చేస్తొంది. నాలాంటి సామాన్యురాలికే కళ్ళు మనసు తెరుచుకుంటే ఈ ద్వంద ప్రవృత్తి అర్ధం అయిపోతూ వుంటుంది. అసలు చాలా సార్లు ఇద్దరికీ ఇష్టం వుండదు కాని అలా జరగడానికి కారణం నువ్వంటే నువ్వు అని ఇద్దరు ఇద్దరిని దూషించుకోని పోట్లాడుకుంటరు.
కధ పాజిటివ్ గా కనిపిస్తున్న, అసంబద్ధం అయిన పాపులర్ కధ. ముందు చెప్పినట్లు హాపీడేస్ సినిమా లాంటి తప్పు ఆలోచనలని చొచ్చుకుపోయేలా ఆకర్షణీయంగా చెప్పిన కధ. ప్రసాద్ గారి పేద్ద అభిప్రాయం చదివాక నాలాంటి వాళ్ళు వొక్కళ్ళయినా చెప్పకపోతే అదేదో కొంచెం అటు ఇటూ వున్న వాళ్ళని తప్పు మార్గంలోకి వెళ్ళేలా చేస్తుందేమో అని ఇంత రాయడం జరిగింది. కోక్, పెప్సి పిజ్జా లాగా కొబ్బరి నీళ్ళు ఆకర్షణీయంగా నోటికి రుచిగా అనిపించక పోవచ్చు, పెద్ద పెద్ద సినిమా స్టార్లూ క్రికెట్ ఆటగాళ్ళు తాగండీ/నా సీక్రెట్ అంటూ అబద్దపు ఎండొర్స్మెంట్లు లేక పోవచ్చు. కానీ అది వొక మార్పుకి మొదలు పునాది లాంటి అసంగతమైన విషయాలని కాదు అని చెప్పకుండా వుండడం కూడా తప్పే అని…
మరియ గురించి krkreddy గారి అభిప్రాయం:
04/25/2013 2:01 pm
ఈ కథ చాలా బాగుంది. ఇక కొన్ని పదాలు ఆయా ప్రాంతాల బట్టి ఉన్నా విషయం అర్థం కావాలి కాని అవేమో పెద్ధ తప్పు కాదుగా. కథ నడిపిన తీరు చాల బాగుంది. నాకు కూడ ఈలాంటి student తగిలింది. ఆమెలో మార్పు వచ్చింది. కాని ఆమె సఫలీకృతం కావడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నా నాకు చివరికి happy అనిపించింది. చాలా thanks. ఇలానే మరిన్ని మంచి రచనలు అందించి తెలుగు వారికి ఎంతో ఆనందాన్ని ప్రాచుర్యాన్ని కలిగిస్తారని ఆశిస్తూ మీ కె.ఆర్.కె.రెడ్డి.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
04/20/2013 11:35 am
ఇక్కడ జరుగుతూన్న చర్చ ఆసక్తి కరంగానే ఉంటోంది కాని నావంటి అర్భకులకి భాష అర్థం అవటం లేదు. ఉదాహరణకి “ఉపస్కారకం” అన్న మాట నా దగ్గర ఉన్న ఏ నిఘంటువులోను కనిపించలేదు. చదివి నేర్చుకోవాలనే ఆసక్తి ఒక పక్క, అర్థం చేసుకోలేకపోవడం అనే అశక్తత మరొక పక్క లాగుతున్నాయి.
విధేయుడు, నమస్కారములతో – వేమూరి వేంకటేశ్వరరావు.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి భవదీయుడు గారి అభిప్రాయం:
04/19/2013 6:38 am
మాన్యులు శ్రీ రాళ్ళపల్లి సుందరం గారికి నమస్కారములు. సౌజన్యపూర్ణపూర్ణమైన మీ స్పందనకు ధన్యవాదాలు.
ఈ చర్చను ముగించేముందు మీరు ప్రస్తావించిన రెండు మూడు విషయాలను వివరించాలనిపించింది.
1. “సంస్కృతపదేన పరిమిత మాన్ధ్రపదం కర్మధారయో భవతి” అన్న ఆంధ్రశబ్దచింతామణి నిర్వచనాన్ని పురస్కరించికొని వ్యాకర్తలు “వాడి+మయూఖములు, వేడి+పయోధారలు (?)” వలె వికృతిపదం ఆఱక్షరాల వఱకు పరిమితి గల సంస్కృతపదంతో సమసించి కర్మధారయసమాసం అవుతుందని పేర్కొన్నారు. అయితే, వికృతివివేక అహోబలపండితీయాదులు ఆ సూత్రపరిధిని విస్తరించి “కలికిభుజంగకన్యకలు”, “వేల్పువీరభటవర్గము”, కఱకుదర్భపూరిపఱపులు” వంటి ప్రయోగాలను వ్యవస్థీకరించారు. అవి విరళంగా ప్రయోగింపదగినవే అని సూత్రీకరించారు. నిజానికి కేతనకు ముందే తిక్కనగారు “వేయుమున్నూరుదంతావళములు” వంటివి ప్రయోగించిన సంగతిని కేతన గమనించినట్లు లేదు. కేతన నియమనాన్ని ఆయనకు తర్వాతి వ్యాకర్తలు అంగీకరింపలేదు. తదనుసారం కవులు అవిరళంగా ప్రయోగించుకొన్నారు.
2. “ప్రౌఢవ్యాకర్త వ్యవహారంలో ఉన్న మరికొన్ని పదాలను సూత్రీకరించాడు. అంతమాత్రం చేత అన్ని చోట్లా అలాగే చెయ్యాలని సిద్ధాంతం కాదు.” అన్నప్పటి మీ భావం నాకు స్పష్టంగా బోధపడలేదు. మీ వాక్యం రామరావు, సుబ్బరావు మొదలైన రూపాలు ప్రామాణికాలని, రామారాయాదులు పరిమితంగా ప్రయోక్తవ్యాలని నిర్ణయించటానికి ఉపకరింపదు.
3. మతి సుమతి ఒకటే అని నేననలేదు. దీర్ఘాంతమైన మతి శబ్దం వైదికం ఒకటున్నదని, అది సుమతీ అన్న రూపసాధనకు ఉపస్కారకం కాగలదని సూచించాను. “సుమతి స్త్రీలింగం ఉన్నా సుమతి శతకంలో అది పుల్లింగమే.” అన్న మీ నిర్వచన నాకు బోధపడలేదు. “కుమార శతకం” మగపిల్లలను, “కుమారీ శతకం” ఆడపిల్లలను సంబోధించినట్లు “సుమతి శతకం” “పుల్లింగ”మే అయితే, పురుషులను మాత్రమే సంబోధించే శతకం అవుతుంది. తెలుగులో హ్రస్వాంతమైన “సుమతి” ఉభయలింగార్థకం కనుక “సుమతీ” అన్న సంబోధన వల్ల స్త్రీపురుషులు ఇరువురికీ సమానంగా శ్రోతృత్వం సిద్ధిస్తుంది. ఆ ఉభయలింగసాధన వల్లనే దీర్ఘాంతత్వం లోకంలో రూఢమయింది.
4. “కృష్ణా అని సంబోధన ఉన్నా కృష్ణాశతకం అనం.” అన్న వాక్యానికి ఇంతకు మునుపే సమాధానం చెప్పాను. శ్రీకృష్ణుని సంబోధించిన రచనమయితే, దానిని “కృష్ణ శతకం” అంటారు. ఏ ద్రౌపదినో ఉద్దేశించి వ్రాస్తే “కృష్ణా శతకం” అనే అంటారు.
5. “ఆధ్యక్ష్యం , ఆధ్వర్యవం లాంటి పదాలను గురించి దొరసామి శర్మ గారు, దొణప్ప గారు, తిరుమల రామచంద్ర గారు, రవ్వా శ్రీహరి గారు, శలాక వారు చెప్పినవి, రాసినవి చూచి నేను పొరపాటు పడ్డాను.” అని మీరు వ్రాశారు. “అధ్యక్షత” విషయంలో అసలు పొరబడటానికి, అందులో సందేహానికి అవకాశమే లేదు. “ఆధ్వర్యవము” అన్న రూపాన్ని వారు అభిమానించి తమ రచనలలో వాడుకొని ఉండవచ్చును కాని “ఆధ్వర్యము” అపప్రయోగం అని చెప్పి ఉండరు. “అధ్వర్యు” శబ్దం మీద భావార్థకమైన “అణ్” ప్రత్యయం వచ్చి “ఆధ్వర్యవమ్”, తెలుగులో “ఆధ్వర్యవము” అవుతాయి. “అధ్వరే సాధుః” అన్న అర్థంలో “తత్ర సాధుః” అన్న సూత్రం మూలాన “యత్” ప్రత్యయం వచ్చి “అధ్వర్య” అన్న రూపమూ; దానిమీద భావార్థంలో “తస్యేదమ్” అన్న సూత్రం వల్ల “అణ్” ప్రత్యయం విహితమై “ఆధ్వర్యం” రూపొందుతాయి. రెండు ప్రయోగాలూ సమంజసాలే.
6. “సుమతి శతకం”, “సుమతీ శతకం” రెండూ వాడుకోవచ్చునని నా ఉద్దేశం. “నేను భక్తచింతామణిని రచియించితిని” అని వడ్డాది సుబ్బారాయ కవిగారు (సుబ్బరాయ కవి కాదు!) వ్రాయగా, వారే అచ్చువేయించిన పునర్ముద్రణ పీఠికలో ముద్రాపకులు లోకప్రసిద్ధిని బట్టి “సుబ్బారాయకవిగారు రచించిన భక్తచింతామణీ శతకము” అనే వ్రాశారు. లోకం భక్తచింతామణీ శతకం అనే అంటున్నది. మడిగట్టుకొన్న పండితులెవరో ఒకరిద్దరు మాట్లాడేటప్పుడు కూడా “భక్తచింతామణి శతకం”, “సుమతి శతకం” అంటారేమో కాని నా వంటి సామాన్యులు మాత్రం భక్తచింతామణీ శతకం, సుమతీ శతకం అనే అంటారు. సామాన్య ముద్రాపకులు అనేకపర్యాయాలు బులుసు వెంకటరమణయ్య గారి వంటి పండితులు వ్రాసిన వ్యాఖ్యానాలతోనూ సుమతీ శతకం అనే అచ్చువేశారు.
అందుకే, కవిశిరోభూషణం
ప్రకృత్యుక్తప్రకారేణ రచనా రసరంజనీ
భవేదత్రాపి శబ్దస్య క్వచిద్యోగేన సాధుతా
భవేత్క్వచిదయోగేన క్వచిత్తు వచనశ్రుతేః
తత్తత్పదం పరిగ్రాహ్యం యద్యత్ సహృదయేహితమ్”
అన్నది. “సహృదయ ఈహితమ్” అన్నదే వ్యాకర్తల ఉద్దేశం!
లేఖ సుదీర్ఘమైనందుకు మన్నించండి. సుమతి (తీ) శతకకారుడు అన్నట్లు “పగ వలవదెవరితోడను” అన్నదే ఈ చర్చకూ మహావాక్యం.
“ఈమాట” కుటుంబానికి, మీ ఇంటిల్లిపాదికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి భవదీయుడు గారి అభిప్రాయం:
04/16/2013 2:28 pm
ఈమాట సంపాదక మిత్రులకు,
విషయం విషయాంతరంలోకి ప్రవేశించి శాఖాంతరచంక్రమణానికి దిగింది. “సుమతి శతకం” సుమతీ శతకం” అన్న ప్రయోగాలలో ఏది సరైనది? అన్న చర్చ బహుముఖీనంగానూ, వైయక్తికంగానూ విస్తరిస్తున్నది. అందువల్ల వ్యక్తివిమర్శను పరిహరించి విషయవిమర్శను సుందరంగా చేయాలని నా తహతహ.
ముందుగా శాఖాంతరాల విషయం:
(1) “వాడి మయూఖముల్” అన్నది వైరిసమాసం కాదు. పైగా నన్నయ్యగారు ప్రయోగించినది కనుక నిరాఘాటం. అందువల్ల కవులు యథేచ్ఛగా వాడుకోవచ్చును. “మయూఖవాడి” అన్నట్లయితే, అది వైరిసమాసం. ఇది సమాసవీధిలో అతిప్రాథమికమైన విషయం.
(2) వ్యక్తినామాలైన రామారావు, సుబ్బారావు మొదలైనవి రామరావు, సుబ్బరావు అని మాత్రమే ఉండాలని ఎక్కడా ఏ అనుశాసనమూ లేదు. పైగా, ప్రౌఢవ్యాకర్త “కర్మధారయం బిరుదాద్యుత్తరపదం అయితే అదంతములైన రెండక్షరాల స్త్రీ పుంస సంజ్ఞావాచకం అయిన పూర్వపదం చివరి అక్షరానికి అంతటా దీర్ఘం బహుళంగా వస్తుందని సూత్రీకరించి (సమాస. సూ. 2) రామారావు, సుబ్బారావు పదాలను వ్యవస్థీకరించాడు. నిజానికి దీర్ఘాంతాల ప్రాచుర్యమే భాషలో కనుపిస్తుంది. చిన్నదేవి, ఎఱ్ఱప్రెగ్గడ మొదలైనవే విరళంగా కనబడతాయి.
(3) అధ్యక్ష శబ్దానికి ప్రత్యయాంతవిధుల వల్ల అధ్యక్షత, ఆధ్యక్ష్యం భావార్థకాలుగా ఏర్పడుతాయి. రెండూ సరైనవే. అధ్వర్యు శబ్దం పైని అణ్, య ప్రత్యయాంతవిధుల విధానం వల్ల ఆధ్వర్య, ఆధ్వర్యవ అన్న రెండు రూపాలూ సాధ్యాలే. కనుక ఒకటి సరైనదని, ఒకటి అపకృష్టమని భావించటం వ్యాకరణముఖీనం కాదు.
(4) “సుమతీ శతకం” అంటున్నట్లు భక్తీ శతకం, నీతీ శతకం అంటున్నామా? అన్నది ప్రత్యుత్థాపిత సమస్య. భక్తి, నీతి ఇకారాంత స్త్రీలింగశాబ్దాలు. కనుక భక్తీ, నీతీ అన్న రూపవిధికి ఆస్కారం ఉండదు.
నీతిశాస్త్రం, సామదానాద్యుపాయవిధి అన్న అర్థంలో నీతీ అనే రూపం ఏర్పడదు కనుక నీతీ శతకం ఉండదు. “నీతి” అనే యువతిని సంబోధిస్తూ “నీతీ” అన్న మకుటంతో పద్యశతకాన్ని వ్రాస్తే, అది నీతీ శతకమే అవుతుంది. దేవీ శతకం అన్నట్లు. కనుక వ్యక్తి సంస్కారాన్ని బట్టి, విషయవివేకాన్ని బట్టి రూపభేదాలు, తద్విధులు విధింపబడుతున్నాయి. వీటిని స్థితగతిచింతనగా పరిశీలించటమే కాని ప్రభుసమ్మితంగా నిర్దేశించటం సాధ్యం కాదు.
“సుమతీ శతకం”, “నీతీ శతకం” ఒకతీఱు ఉదాహరణలు కావు. సుమతి ఇకారాంత స్త్రీలింగం. క్తిన్ ప్రత్యయాంతం కావటం వల్ల సుమతీ అనే రూపసిద్ధి ఉండదనుకోవటం సహజమే కానీ శతపథ బ్రాహ్మణంలో “మతీ” శబ్దంకూడా ఉన్నది. ఆ ప్రకారం సుమతీ సుష్ఠుప్రయుక్తమే కాగలదు.
సుమతీ శతకం ఏ పాఠకలోకంలోకి వ్యాపించిందో, ఆ పాఠకులలో అధికసంఖ్యాకులు సుమతీ శతకం అనే అంటున్నారు. అందువల్ల అది ప్రసిద్ధమైంది. చదువుకొన్నవారిలో కొద్దిమంది మాత్రమే సుమతి శతకం అంటున్నారు. అంత మాత్రాన అది ప్రమాణం కాదు.
అంతే కాదు. ఇకారాంతాలైన ఇతర శతకాల పేర్లను చూడండి. భక్తచింతామణీ శతకం, ఆర్తరక్షామణీ శతకం ఆ విధంగానే వ్యాప్తమై ఉన్నాయి. మణి శబ్దానికి ఈకారాంత రూపం ఉన్నప్పటికీ అది ఇక్కడ అన్వయింపదు. చింతామణి శబ్దం “మణి” అన్న అర్థంలో “చింతామణీ” అని ఏర్పడదు. అయినా, భక్తచింతామణీ శతకం అనే అంటున్నాము. చింతామణీ మంత్రమైనప్పుడు మాత్రమే దీర్ఘాంతం ఉన్నది. అది ఇక్కడ ఉద్దేశించిన అర్థం కాదు. ముక్తావళీ శతకం కూడా ఇటువంటిదే.
సుమతీ శతకం తెలుగులో తప్పు కాదు. ఇంకా వివరణ కావలసివస్తే, అహోబలపండితీయంలో “న నామ్ని” అన్న సూత్రం వృత్తిని చూడండి.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి RVS Sundaram గారి అభిప్రాయం:
04/16/2013 11:53 am
తఃతః గారూ దయచేసి మన్నించండి. మీరు అలా అన్నారని కాదు, ఏవైనా పొరపాట్లు దొర్లినప్పుడు మనం సంతోషించాలా అన్నదే నా మథన. దీన్ని పొడిగించటమే నాకు బాధగా ఉంది. ఇతర భాషలనుండి మనం తీసుకొనేటప్పుడు ఆ మర్యాదల్ని పాటించాలి. కాని మనం పాటించం. ప్రవహినీ దేశ్యా అని ఏనాడో ఆంధ్రశబ్దచింతామణికారుడు చెప్పాడు. రూఢిలో స్థిరపడిన ఎన్నో పొరపాట్లని మనం అంగీకరించి వాడుతున్నాం. కాని అలా వాడటంలో కూడా ఒక క్రమం ఉంటుంది. ఫలము అనేదాన్ని ఫలం అంటున్నాం. అది వ్యవహారంలో అన్నిచోట్లా వస్తోంది. సుమతీ శతకం అన్నట్లు భక్తీ శతకం, నీతీ శతకం అంటున్నామా?
రామారావు, సుబ్బారావు మొదలైనవి రామరావు, సుబ్బరావు అనే ఉండాలి. కానీ దాన్ని ఒప్పుకొని అన్నిచోట్లా అలాగే వాడుతున్నాము. అధ్యక్షత అన్నదాన్ని ఆధ్యక్ష్యం అనీ అధ్వర్యం అన్నదాన్ని ఆధ్వర్యవం అనీ అనాలి. కాని ఇలాంటివి వాడుకలోకి వచ్చాయి, అది కేవలం ఒక్క చోట కాదు, కాని సుమతీ శతకం లాగా పుల్లింగాలకన్నిటికీ సమాసంలో మనం దీర్ఘం వాడటం లేదు. మిమ్మల్ని విసిగించి ఉంటే మన్నించండి.
రాళ్ళపల్లి సుందరం
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Velcheru Narayana Rao గారి అభిప్రాయం:
04/06/2013 10:45 pm
నావి రెండు మాటలు.
ఇంత దీర్ఘంగా ఈ వ్యాసాన్ని చర్చించిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మీరు లేవదీసిన ప్రశ్నలకి నేను రాయబోయే వ్యాసంలో సమాధానాలు ప్రస్తావిద్దామని అనుకుంటున్నాను, అంచేత క్లుప్తంగా ఒకటి రెండు వివరణలు మాత్రం ఇస్తాను.
“ఈ వ్యాసంలో నారాయణరావుగారు, ఈ శతకం మౌఖిక సంప్రదాయంలో పుట్టి క్రమేపి లిఖిత స్వరూపం తీసుకుందని భావించినట్టుగా అనిపిస్తోంది.” అన్నారు కామేశ్వర రావు గారు.
ఇలాటి భావం కలిగించే మాటలు ఎక్కడ అన్నాను చెప్మా!
మనకి కనిపిస్తున్న సుమతీ శతకం పద్యాలలో రెండు రకాల శైలులు ఉన్నాయి, అందులో ఒకటి లిఖిత శైలి అనీ రెండోది మౌఖిక శైలి అనీ అంటూ ఇంగ్లీషులో రాసిన వ్యాసంలోదాన్ని oralized శైలి అన్నాను.
లిఖిత శైలిలో వున్న పద్యాలు మౌఖిక శైలి లోకి మారిన ఆచూకీలు కొన్ని చూపించాను.
ఇక పోతే ఈ రెండు రకాల శైలుల్లో వున్న పద్యాలు ఇద్దరు కర్తలకి ఆపాదించబడ్డాయని అన్నాను, కాని ఈ శతకాలు ఎవరు “రాశారో” నేను చర్చించలేదు.
ఈ విషయాలు మళ్ళా వివరించడానికి అవకాశం ఇచ్చారు, సంతోషం.
నారా
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
04/03/2013 12:28 pm
రామారావుగారూ, మీ వ్యాఖ్య నాకు సరిగా అర్థం కాలేదు. ఈ వ్యాసంలో ప్రస్తావించబడిన అంశాలు:
1. “నీతి” పద అర్థ విపరిణామం,
2. సుమతిశతక కాలము గురించిన ఆలోచన,
3. ఛందస్స్వరూపం దృష్ట్యా అచ్చులో లభిస్తున్న ప్రతులను మౌఖిక లిఖిత సంప్రదాయాలకు చెందిన రచనలుగా వర్గీకరించడం.
4. మౌఖిక లిఖిత సంప్రదాయాల్లో సుమతిశతకం చెందిన పరిణామాన్ని గూర్చిన ఆలోచన
5, కర్తృత్వ చర్చ (శతకం ఏ వర్గం నుండి వచ్చింది, బద్దెన, భీమన కర్తలుగా ఎందుకయ్యారు మొదలైనవి)
ఇందులో 1, 3 అంశాలలో నాకు చర్చనీయాంశమేదీ కనిపించలేదు. అందుకే అందులో ప్రతిపాదించిన అంశాలు విలువైనవని అన్నాను. ఇక మిగతా అంశాలు చర్చనీయాంశాలుగా అనిపించాయి కాబట్టి వాటి గురించి పట్టించుకొని చర్చ లేవనెత్తాను.
“నారాయణరావు గారు ఏ ఆలోచనామార్గం మారాలని ప్రతిపాదిస్తున్నారో సరిగ్గా ఆ మార్గాన్నే పట్టినట్టనిపిస్తున్నది.”
సుమతిశతకాన్ని గురించి నారాయణ రావుగారు ప్రతిపాదిస్తున్న ఆలోచనామార్గంలోని సామంజస్య ప్రయోజనాలే కదా అసలు చర్చనీయాంశాలు! తాను ప్రతిపాదిస్తున్న ఆలోచనామార్గానికి, నారాయణ రావుగారు ఈ వ్యాసంలో, సుమతిశతకం ద్వారా కొన్ని సమర్థనలు చేశారు. వాటి గురించే కదా చర్చ. వారి ఆలోచనామార్గాన్ని పూర్తిగా అంగీకరించేస్తే ఇక చర్చేముంది?
“ఇకపోతే, రెండు మాతృకలు ఎలా వచ్చాయి, ఆ రెంటికీ ఏమైనా జన్య జనక సంబంధం ఉన్నదా, వాటి పరిణామ క్రమం ఏమిటి అనే ప్రశ్నలు కుతూహలం కలిగించేవే ఐనా వాటికి సమాధానాలు చెప్పగలిగే సమాచారం అందుబాటులో లేదని ఈ వ్యాసం స్పష్టం చేస్తుంది.”
అంత స్పష్టంగా వ్యాసంలో చెప్పిన చోటు ఎక్కడా నాకు కనిపించలేదు. ఉన్న సమాచారాన్ని బట్టి వాటికి తమ ఆలోచనామార్గంలోనుండి సమాధానాలు వెతికే ప్రయత్నం వ్యాసంలో చేశారు. లేకపోతే వాటి గురించి అంత విసృతంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు కదా! పైగా నారాయణ రావుగారు ప్రస్తావించిన మార్గం సుమతిశతకానికి వర్తించవచ్చా లేదా అన్నదానికి, ఈ జన్యజనక సంబంధం అవసరం అని నేను భావిస్తున్నాను. ఎందుకో నా ముందరి వ్యాఖ్యలో వివరించాను.
“ప్రముఖంగా మౌఖిక మార్గాన ప్రచారమైన ఇలాటి రచనల విషయంలో అలాటి భావాలు అర్థవంతాలు కావని చెప్పటం, అందువల్ల ఆ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుననుకున్నవాళ్లు పప్పులో కాలేశారని చూపటం.”
పూర్తిగా మౌఖిక మార్గానికి చెందిన రచనల గురించి మీరన్నది సమంజసమే. ఉదాహరణకు, చాటువుల మొదలైన వాటి గురించి నారాయణ రావుగారు ఇంతకుముందు ఇలాంటి ప్రతిపాదనలు చేశారు. కానీ యిక్కడ సుమతిశతకం పూర్తిగా ఆ మార్గానికే చెందినదన్న నిర్ధారణ జరగకుండా, దాని గురించి ఎలాంటి విశ్లేషణ సరైనదని ఎలా నిర్ణయిస్తాం? పూర్తిగా లిఖిత సంప్రదాయానికి చెందినదని భావించి, ఆ రీతిలో మాత్రమే దాని గురించి విశ్లేషణ చెయ్యడం సరికాదన్నది ఒప్పుకోవలసిన అంశమే. అయితే దానికి ప్రత్యామ్నాయ విశ్లేషణా మార్గాన్ని (మౌఖికమార్గ రచనలకు నారాయణరావుగారు ప్రతిపాదించినది) ఈ వ్యాసంలో సుమతిశతకానికి కూడా వర్తింపచెయ్యాలని బలంగానే చెప్పారు. అది ఎంతవరకూ సమంజసం అన్నది ఇక్కడ చర్చనీయాంశం.
గాలి మళ్ళింది గురించి Mangu Siiva Ram Prasad గారి అభిప్రాయం:
04/03/2013 6:56 am
వృద్ధాప్యం కొందరికి ఒక వరం, కాని చాలామందికి అది ఒక శాపం. ఒంటరితనం పురుగులా తొలుస్తుంటే మాట్లాడడానికి ధైర్యం చెప్పడానికి తోడు ఒకరుండాలనే భావనని చక్కగా ఈ కవితలో చెప్పారు.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి భవదీయుడు గారి అభిప్రాయం:
03/28/2013 2:16 pm
ప్రియమిత్రులు శ్రీ కొలిచాల సురేశ్ గారికి,
అర్ధబిందుప్రాస విషయమై చర్చింపవలసినది ఏమిటో నాకు అర్థం కాలేదు. 1) అర్ధబిందు (లేదా) ఖండప్రాస 2) పూర్ణబిందు ప్రాస 3) ఈ రెండింటి సాంకర్యమైన ఖండాఖండ ప్రాసల అన్నవి లక్ష్య-లక్షణాలు రెండింటిలోనూ రూఢమై ఉన్నవే. అందులో చర్చనీయాంశమేమీ లేదు.
“చీకటి”, “మూడు” మొదలైన కొన్ని శబ్దాలలో అరసున్న ఉండాలో ఉండకూడదో అన్న విషయమై లాక్షణికులలోనూ, కవులలోనూ, నిఘంటుకర్తలలోనూ ఏకాభిప్రాయం లేదు. కనుక ఈ ప్రాసోదాహరణల మూలాన కవి కావ్య కాలనిర్ణయం సాధ్యం కాదు.
“వీండు”, “మూండు”, “పోండిమి” మొదలైన శబ్దాలలో ఒకప్పుడు పూర్ణబిందువు ఉండి, కాలక్రమేణ అది ఉచ్చారణలో నుంచి తొలగిపోయి ఆ శబ్దాలు “వీడు”, “మూడు”, “పోడిమి” అని పలుకబడిన రోజులలో ఒకనాటి ఆ పూర్ణబిందువుకు స్మారికగా ఎటువంటి ఉచ్చారణమూ లేని అర్ధబిందువు ఉచ్చారణ లేకపోయినా తత్తత్పదపూర్వస్వరూపసంకేతంగా లిఖితరూపాలలో మాత్రం “వీఁడు”, “మూఁడు”, “పోఁడిమి” అని నిలిచిపోయింది. భాషాశాస్త్రవిద్యార్థు లందఱికి ఇది తెలిసిన సంగతే.
అయితే కొందఱు కవులు పూర్ణబిందువు సహజంగా ఉన్న “పండు”, “నిండు”, “రెండు” వంటి పదాలతో ఒకనాటి “వీండు”, “పోండిమి” మొదలైన పదాలను ప్రాసస్థానంలో ప్రయోగించినప్పుడు మాత్రమే ఆ సాంకర్యంతోడి ప్రయోగం కవి కాలనిర్ణయానికి కొంతవఱకు సాధకం కాగలుతుంది. అదీ కొంతవఱకే. కవి తెలిసి తెలిసి కావాలని అటువంటి ప్రయోగం చేసి ఉంటే మనము దానిని బట్టి కవి కాలనిర్ణయం చేయలేము.
నన్నెచోడుడు ఆధునికుడా? నిజంగానే పూర్వుడా? అన్న సమస్య ఇదమిత్థంగా తేలలేదు. ఇరవయ్యవ శతాబ్దికంటె పూర్వుడు కాడని నాకూ అనిపిస్తుంటుంది. అటువంటప్పుడు వివాదాస్పదుడైన ఆ కవి ప్రయోగాలు కాలనిర్ణయానికి నిర్వివాదంగా పనికిరావు. నన్నెచోడ – బద్దెనల పౌర్వికతను నిర్ధారించటానికి ప్రామాణికాలైన సాధనాలు లేవు. బద్దెన “నీతిశాస్త్రముక్తావళి” సుమతి శతకం కాలనిర్ణయానికి ఉపయోగిస్తుందనుకోవటం పొరపాటు.
యతి విషయం కొంతవఱకు కాలనిర్ణయానికి పనికివస్తుంది. అది కూడా “నేను నన్నయగారి యతి పద్ధతిలోనే వ్రాస్తాను” అని ఒక ఆధునిక కవి వ్రాసి ఉంటే – అది కాలనిర్ణయానికి ఉపకరింపదు.
పార్యంతికంగా చెప్పదలచినది ఏమంటే – యతి-ప్రాసలు కొంత వఱకు భాషాపరిణామ పరిశీలనకు, సంఖ్యానకానికి దోహదం చేస్తాయి. వివాదాస్పదమైన విషయాలలో తథ్యమిథ్యావివేచనకు, కాలనిర్ణయానికి ఎంత మాత్రమూ పనికిరావు. సుమతి శతకం విషయానికీ ఇది అనువర్తిస్తుంది.
నిజానికి సుమతి శతకం విషయమై దాని ప్రచారవేళాగతంగా మౌఖిక – లిఖిత రూపాలని రెండు అవాంతర శాఖలు అనుశీలనీయంగా ఉండటం; “పేరణము” మొదలైన కొన్ని శబ్దాల అర్థనిర్ణయం ప్రయోగచరిత్రను బట్టి గాక నిఘంటువులను బట్టి చేయటం; వ్యాసముఖ్యోద్దేశం అది కానప్పటికీ శతకం బద్దెన రచనమా? భీమన రచనమా? అది ఒకరి రచనమైతే ఒక వర్గానికి అనుకూలంగా ఉండటం, వేఱొకరి రచనమైతే మఱొక వర్గానికి సహకరించటం; “నీతి” శబ్దార్థ పరిణామచరిత్ర – ఇత్యాదిగా శ్రీ వెల్చేరు నారాయణరావు గారు ప్రతిపాదించి చర్చించిన విషయాలలోని యుక్తాయుక్తాలు – ఈ వ్యాసంలో తప్పక పరిశీలించి నిగ్గుతేల్పవలసిన విషయాలు.
ఆ సమంజసమైన చర్చపై ఈమాట పాఠకులు దృష్టి నిలిపితే విలువైన అంశాలు వెలుగులోకి వస్తాయి.
ప్రేమతో,
భవదీయుడు
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
03/26/2013 3:06 am
వేఁడుకొనెద విబుధులనిక
వాఁడిమి మాటల లకోరి విసరక మీరీ
నాఁడిట యీవేదిఁ నిలుపు
పాఁడిని మర్యాదలఁ సరి పాటించండీ!
అర్ధబిందు ప్రాసతో ఉన్న ఈ కందం ఏ శతాబ్దానికి చెందిందంటారు? :-).
ఈ చర్చలలో లేవనెత్తిన భాషాశాస్త్ర సంబంధమైన విషయాల గురించి రెండు ముక్కలు:
1. కామేశ్వరరావు చెప్పినట్టు “సుమతీశతకం” వంటి మాటలలో దీర్ఘం నిజానికి సంస్కృత భాషా ప్రభావం వల్ల వచ్చినదే. భాషాశాస్త్రంలో ఇలాంటి రూపాలను అతిదేశ (analogy) రూపాలు అని అంటారు. అన్యభాషా వ్యాకరణం పూర్తిగా తెలియనప్పుడు కొత్త పదాలను, సమాసాలను తెలిసిన ఇతర పదాల సామ్యం ఆధారంగా నిర్మించే ప్రక్రియకు ఈ పేరు. ఇంకొన్ని ఉదాహరణలు:
“రఘోత్తమ” అని పలకడం తెలుగుదేశంలో చాలాచోట్ల కనిపిస్తుంది. త్యాగరాజ కృతిని “రమించువారెవరురా రఘోత్తమా నిను వినా” అని చాలా పేరుమోసిన గాయకులే పాడారు. రఘోత్తమరెడ్డి, రఘోత్తమరావు అన్న పేర్లుగలవారు ఆంధ్రదేశంలో కోకొల్లలు. అయితే, ‘రఘోత్తమ’ అన్నది కూడా అతిదేశ (analogical) రూపమే. నిజానికి రఘు + ఉత్తమ = రఘూత్తమ (సవర్ణదీర్ఘ సంధి) కావాలి. కానీ, సర్వోత్తమ-, నరోత్తమ- వంటి పదబంధాలకు సామ్యంగా ‘రఘోత్తమ’ అన్న నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు.
ఇటువంటిదే భానోదయం. నిజానికి ఇది భాను + ఉదయం = భానూదయం కావాలి. కానీ, చంద్రోదయం, సూర్యోదయం వంటి పదాల సామ్యంతో ‘భానోదయం’ అని పలుకడం కద్దు.
2. “-అక” “-అకుండా” ప్రత్యాయాల వాడుక గురించి నారాయణరావు గారు ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. భాషాపరిణామ దశలలో ఈ రకమైన మార్పు బహుశా మధ్యతెలుగు యుగంలో వచ్చిఉండాలి. అయితే, ద్రావిడ భాషలలో వ్యతిరేక ప్రత్యయం -అ-/-ఆ-. ‘నేను ఆడను’ అన్న వాక్యంలో ఆడను = ఆడు ‘to play’+ -అ- negative affix + -ను ‘ఉత్తమ పురుష ప్రత్యయం’. పూర్వకాలీనత్వాన్ని సూచించే క్త్వార్థక అసమాపక (non-finite) క్రియల్లో మాత్రం వ్యతిరేకార్థంలో -అ- తో పాటు -క- ప్రత్యయం తోడైతుంది. చెప్పక-, చేయక-, విప్పక-, తప్పక- మొదలైనవి ఉదాహరణలు.
మధ్య తెలుగుయుగంలో వాడుకలోకి వచ్చిన ‘చెప్పకుండా-‘ వంటి క్రియాపదాల్ని విభజన చేస్తే ఇలా ఉండవచ్చని నా ఊహ: చెప్పకుండా- = చెప్పు ‘to say’ + -అ- + -క- + -ఉండు- ‘auxiliary verb’+ -ఆ- శత్రర్థక durative aspect’. నారాయణరావుగారు ఇచ్చిన ‘చెప్పకుండా’ ‘చదవకుండా’ ‘పడిపోకుండా’ వంటి పదాల ప్రయోగాలకు ఉదాహరణలుగా ఇచ్చిన వాక్యాలను తుమున్నర్థక (gerund) రూపాలలో రాస్తే ఈ పదాలలో అంతర్లీనంగా ఉన్న -ఉండు- బహిర్గతమౌతుంది.
నా ఊహలో ఏదైనా పొరపాటు కనిపిస్తే, చెప్పకుండా ఉండకండి.
3. నారాయణరావుగారు “ప్రతి పుస్తకానికి చారిత్రకంగా గుర్తించదగిన ఒక కర్త ఉండాలి అనేది ఆధునిక విద్యావంతులకు అలవాటైపోయిన ఒక భావం” అని చెప్పిన తరువాత కూడా ‘సుమతిశతకం రాసింది భీమనా? బద్దెనా?’ అన్న అంశంపై ఇంత సుదీర్ఘమైన చర్చ ఆశ్చర్యాన్నే కలిగించింది. నాకు అర్థమైనంతవరకూ, ఆయన దృష్టిలో సుమతిశతకంగా కొంతకాలంనుండీ రెండు వేర్వేరు పాఠాలు అభివృద్ధి చెందాయని, వాటికి రెండు వేర్వేరు వర్గాలు తమ తమ అవసరాలకనుగుణంగా బద్దెనను, భీమనను గ్రంథకర్తలుగా ఆపాదించారని ఆయన వాదన.
మౌఖిక సంప్రదాయంలో సుమతిశతకానికి భీమనకు గ్రంథకర్తృత్వం ఆపాదించడంపై నారాయణరావు చెప్పిన ఈ కింది వివరణ కూడా సబబుగానే తోస్తున్నా, కామేశ్వరరావు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు నారాయణరావుగారో, ఆయన సిద్ధాంతం పూర్తిగా తెలిసిన వారెరైనా సమాధానాలు ఇస్తే చదవాలని ఉంది.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి మోహన గారి అభిప్రాయం:
03/24/2013 6:50 pm
(1) అర్ధబిందు ప్రాసను గురించి చర్చించునపుడు ఒక విషయము గుర్తుంచుకోవాలి. చీకటివంటి పదాలకు నన్నయ, తిక్కనల కాలములో క అక్షరానికి ముందు అరసున్న లేదు, తరువాతి కాలములో చేర్చబడినది. నన్నయభట్టు మాత్రమే సార్ధబిందుప్రాసను తప్పకుండ అనుసరించినాడని విజ్ఞుల అభిప్రాయము. తిక్కన కాలానికి ఇది కొద్దిగా సడలినది. ర,ఱలు ఉండే పదాలవలెనే అర్ధబిందువులు ఉండే పదాలలో కూడ నియమాలు తగ్గినాయి. ట, ప లకు ముందు అరసున్న ఉండే పదాలకు అలా లేని పదాలతో ప్రాస చెల్లుతుందని అనంతుని ఛందములో (ఛందోదర్పణములో) నున్నది. అట్టి పద్యమును సుమతిశతకమునుండి నేను ఉదహరించినాను. ఈ కారణములన వలననే నేను శతక రచయిత తప్పక నన్నయ నన్నెచోడుల తరువాతి వాడని తెలిపాను.
(2) తిక్కనకు 50 సంవత్సరాలు అటో యిటో అనడానికి మరొక కారణము. సుమతిశతకమును భీమకవి వ్రాసినాడాని అనుకొంటే ఈ భీమకవియే భీమనఛందము అని పిలువబడే కవిజనాశ్రయమును కూడ వ్రాసినాడని అనుకొంటే ఈ కవిజనాశ్రయ కాలమును మనము నిర్ణయించాలి. దీనిని నేను వివరముగా నా క్రౌంచపదము అనే వ్యాసములో వ్రాసియున్నాను. తెలుగులో ఉండే క్రౌంచపదము, మంగళమహాశ్రీ వృత్తపు లక్షణాలు నన్నెచోడుని కుమారసంభవపు ప్రభావము వలన వచ్చినవే. కాబట్టి భీమన కవిజనాశ్రయమును వ్రాసియుంటే అది నన్నయ, నన్నెచోడుల తరువాతనే, ముందు కాదు. ఇక పోతే ఎంత తరువాత అన్నది నన్నెచోడుని కాలమును బట్టి ఉంటుంది. నా ఊహలో నన్నెచోడుడు నన్నయ సమకాలికుడు, కాని చాలమంది అతడు నన్నయ తిక్కనల మధ్యకాలములో జీవించాడని అంటారు.
(3) ఇక్కడ మరొక చిక్కు ఏమనగా, సుమతిశతకములో పద్యాలు చాల తక్కువ, అందువలన మనకు తక్కువ దత్తాంశములతో ఎక్కువ ఫలితాలను ఆశించడము వీలు కాదు (ఉదా. నన్నయ వ్రాసిన రెండున్నర మహాభారత పర్వాలలో అరసున్న ప్రాస ఉండే పద్యాలు పదికంటె తక్కువ). నేను ఇక్కడ తెలిపినవి పూర్తిగా ఛందశ్శాస్త్రముపైన ఆధారపడిన నా ఊహలు మాత్రమే, మిగిలిన విషయాలపైన వ్రాయడానికి నాకు అర్హత లేదు.
విధేయుడు – మోహన
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
03/24/2013 1:10 pm
సుమతిశతక కర్త కాలాన్ని గురించి మోహనరావు గారి ఆలోచన ఆలోచించదగింది. ఐతే, ఆయన వాడిన తర్కం వల్ల అతను నన్నయ, నన్నెచోడుడుల తర్వాతి వాడని చెప్పొచ్చు కాని తిక్కనకి తర్వాతివాడు కాడని చెప్పటం సాధ్యం కాదు కదా! అతను తిక్కన లాటి ప్రయోగాలు చేసినంతమాత్రాన తిక్కనకి సమకాలికుడు కాడు, తిక్కన తర్వాతి వాళ్లు ఇంకెవరూ అలాటి ప్రాసలు పాటించలేదని రుజువు చేస్తే తప్ప. కవిత్రయం ప్రయోగాల్ని ప్రమాణాలుగా తీసుకుని తర్వాతి వాళ్లు చాలామంది వాళ్లు ముగ్గురు చేసిన ప్రాసలన్నిట్నీ అనుసరించారని నేను విన్నది. అది నిజమైతే సుమతిశతకం తిక్కన గారి తర్వాత వచ్చిందని తప్ప ఎప్పుడు వచ్చిందో ఈ ప్రాసల బట్టి చెప్పలేం.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
03/22/2013 12:32 am
వ్యాసంతో సంబంధం లేకపోయినా, భాష గురించిన చర్చ కాబట్టి, పిడకలవేటని కొనసాగిస్తూ :
“మన్మథుని భార్య రతిని గురించి చెప్పేటప్పుడు రతీదేవియే సరి. కాని రతికేళికి, ఆనందమునకు దేవి అన్నప్పుడు ఆ పదము రతిదేవి అవుతుంది.”
మోహనరావుగారూ, మరి “రతిపతి” అన్నప్పుడు అందులో రతి, మన్మథుని భార్యే కదా?
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి మోహన గారి అభిప్రాయం:
03/21/2013 8:10 pm
(1) భర్తృహరి సుభాషిత శతకములలోని పద్యాలు ఒకే ఛందస్సునకు చెందినవి కావు. కాని హాలుని గాథాసప్తశతిలోని పద్యాలన్నియు గాథాలక్షణములు కలిగినవి. దీనిని గురించి నేను ఇటీవల చర్చించియున్నాను. కందపద్యమునకు ఆధారము ఈ గాథయే. అందువలన సుమతిశతక కర్త హాలుని ఉదాహరణముగా నెంచుకొని ఒకే ఛందస్సైన కందమును మాత్రమే వాడియుండవచ్చును.
(2) సుమతిశతకమునుండి ఒక రెండు పద్యములు –
ఆఁకలి యుడుగని కడుపును
వేఁకటియగు లంజ పడుపు – విడువని బ్రదుకున్
బ్రాఁకొన్న నూతి యుదకము
మేఁకల పాడియును రోఁత – మేదిని సుమతీ
ఈ పద్యములోని ఒక విశేష మేమనగా – ఇందులోని అన్ని పాదములలో ప్రాసాక్షరమునకు ముందు అర్ధబిందువు (అరసున్న) ఉన్నది. ఇలాటి పద్యములు నన్నయ భారతములో కొన్ని ఉన్నవి, ఉదా.
వీఁకఁ బఱతెంచి నలుగడఁ
దాఁకిన గడు నలిగి ఘోర-తరశరహతి న-
మ్మూఁకలు విరియఁగ నర్జునుఁ
డాఁకరమున నేసె పెనుగురుఁ-డయి రణభూమిన్ – ఆది, 8.200
తిక్కన భారతములో ఇట్టి నియమమును పాటించని పద్యములు ఉన్నాయి. నన్నెచోడుడు అర్ధబిందు, పూర్ణబిందు ప్రాసలను కొన్ని చోటులలో సంకరము చేసెను. కావున సుమతిశతక కర్త నన్నయ తఱువాతి వాడనియు, తిక్కనకంటె ముందో లేక అతని సమకాలికుడో అని చెప్పవచ్చును. ఎందుకంటే ట అక్షరముముండు ఉండే అరసున్నను ప్రాససాంకర్యము చేయడము తిక్కన కాలములో అమలులో నుండినది. సుమతిశతకములో అలాటి పద్యము మాటకు ప్రాణము … పద్యములో బోఁటి పదమునకు అరసున్న ఉన్నది, మిగిలిన పదములకు (మాట, కోట, చీటి) అది లేదు.
(3) నన్నయ, నన్నెచోడుడులాటి కవులు బండి ర, గుండు ర లకు ప్రాస సాంకర్యమును చేయలేదు. సుమతిశతకములో ఱ ప్రాస పాటించబడినట్లే తోచుచున్నది. కొన్ని చోటులలో దాని లేమి తరువాతి కవులు పద్యసౌలభ్యమునకై చేసిన మార్పు అని అనుకొంటాను.
పై మూడు కారణములవలన సుమతిశతక కర్త బహుశా తిక్కనకంటె ముందు లేక తిక్కన సమకాలికుడో అయి ఉండవచ్చును.
(4) మన్మథుని భార్య రతిని గురించి చెప్పేటప్పుడు రతీదేవియే సరి. కాని రతికేళికి, ఆనందమునకు దేవి అన్నప్పుడు ఆ పదము రతిదేవి అవుతుంది.
విధేయుడు – మోహన
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి శ్రీ భువన్ గారి అభిప్రాయం:
03/21/2013 9:26 am
నేను ఇప్పుడు పదకొండవ తరగతి చదువుతున్నాను. పదవ తరగతి వరకు మొదటి భాష తెలుగు అవడం వల్ల ఇలా మాట్లాడగలుగుతున్నాను. నేను షేక్ స్పియర్ రాసిన నాటకాలు కొన్ని చదివాను. కాని మన అల్లసాని పెద్దన గారు మను చరిత్రలో వ్రాసిన ఒక పద్యం గుర్తువచ్చినప్పుదు మా స్నేహితుల కంటే నేను అదృష్టవంతుడిని అని అనిపిస్తుంటుంది. ఆ పద్యం…
అట జని కాంచె భూమి సురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కల్లపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్.
ఇప్పటికైనా నాకు ఒక తెలుగు బ్లాగు దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది.
మీ
శ్రీ భువన్.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
03/20/2013 12:29 pm
“సుమతిశతక”మని అనాలా “సుమతీశతక”మని అనాలా అనే చర్చలోకి నేను దిగదలుచుకోలేదు కాని ఆ శబ్దాల గురించి నాకు తెలిసిన రెండు విషయాలు మాత్రం చెపుతాను. “సుమతీశతకం”, “దాశరథీశతకం” వంటి మాటలలో దీర్ఘం నిజానికి సంస్కృత భాషా ప్రభావం వల్ల వచ్చినదే. సంస్కృతంలో చాలా ఇకారాంత పదాలు స్త్రీలింగాలు. అవి చాలా వరకూ దీర్ఘాంతాలు. అవి సమాసాలలో (తెలుగులోకి వచ్చిన తర్వాత కూడా) దీర్ఘంతోనే ఉంటాయి – పార్వతీపరమేశ్వరులు, ధరణీచక్రము, దేవీభాగవతం – ఇత్యాదిగా. అది అలవాటైపోయి, దీర్ఘాంతాలు కాని ఇకారాంత పదాలను కూడా సమాసాలలో దీర్ఘాంతాలుగా వాడేస్తూ ఉంటాం. సుమతీశతకం, దాశరథీశతకం వంటి పదాలలో దీర్ఘానికి కారణం ఇది తప్పిస్తే, అవి సంబోధనలు అయినందువల్ల కాదు. తః తః గారే యిచ్చిన “భాస్కరశతకం” అన్న ఉదాహరణలో, సంబోధనే అయినా “భాస్కరాశతకం” అని అనం కదా, ఎందుకంటే ఆ పదం దీర్ఘాంతం కాదు కాబట్టి.
అరుదుగా అకారాంత పదాలకి కూడా యీలా దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టెయ్యడం గమనించవచ్చు. అలాంటి దానికి ఒక ఉదాహరణ “ఊహ”. దీని చివర దీర్ఘం లేదు. కాని సమాసం చేసినప్పుడు “ఊహాశక్తి”, “ఊహాగానం” అని చాలామంది వాడుకలోకి వచ్చేసింది. వ్యాకరణ పరంగా చెప్పాలంటే “ఊహశక్తి” “ఊహగానం” అనేవి సరైన పదాలు. “రతీదేవి” అన్నది కూడా ఇలాంటిదే (“రతిదేవి” అన్నదే సరైన పదం), అయితే దీని గురించి కొంత వాదన ఉంది, వ్యాకరణ ప్రకారం రెండూ సరైనవే అని.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
03/19/2013 2:18 pm
తెలుగులో ప్రతి అడ్డమైనవాళ్ళూ అన్ని విషయాల గురించీ పరిశోధన పేరుతో తమ ఊహలు ప్రకటించేస్తారు, అని రామారావుగారు, ఇంత సూటిగా ఘాటుగా కాదు కాని, తనదైన రీతిలో మెత్తమెత్తగా వాత పెట్టిన (పోనీ నాకలా అనిపించిన!) తర్వాత కూడా యీ వ్యాఖ్య రాస్తున్నానంటే అది నా మూర్ఖత్వమూ, ముఖకండూతీ తప్ప మరొకటి కాదు. అంచేత పెద్దలు పెద్దమనసుతో మన్నించెదరు గాక!
ఈ వ్యాసంలో రెండు విషయాలు చాలా విలువైనవిగా నాకు తోచాయి. ఒకటి పద్యశైలీ ఛందోనిర్మాణమూ ఆధారంగా లిఖిత, మౌఖిక సంప్రదాయ లక్షణాలను గుర్తించడం. ఇది మరిన్ని యితర పద్యాల పరిశీలనకు కూడా ఉపయోగపడే పద్ధతి. ముఖ్యంగా, సంక్లిష్టశైలి కనబరిచే పద్యాలు మౌఖిక సంప్రదాయానికి చెందినవి కావని స్పష్టంగా చెప్పే వీలుంది. మరొక విలువైన విషయం, “నీతి” పదానికి ప్రాచీన ఆధునిక కాలాలలో వచ్చిన అర్థవిపరిణామం.
ఇక, సుమతిశతక కర్తృత్వం గురించి మాత్రం చాలా సందేహాలే మిగిలి ఉన్నాయి.
1. సుమతిశతక కాలం గురించి. ఇది పదిహేడవశతాబ్ది కాలంలో పుట్టిందని చెప్పడానికి బలమైన ప్రమాణాలేవీ నాకీ వ్యాసంలో కనిపించలేదు. సుమతిశతకంలో ప్రస్తావించిన కరణాల, కాపుల వ్యవస్థ ఆధారంగానూ, పద్యాల భాష ఆధారంగానూ, మరి కొన్ని విషయాల ద్వారానూ, వంగూరి సుబ్బారావుగారు దీని కాలాన్ని పన్నెండు, పదిహేను శతాబ్దాల మధ్యకాలంగా నిర్ణయించారు (గ్రంథకర్తతో సంబంధం లేకుండా). అతను చేసిన వాదనలో లోపాలేవీ యీ వ్యాసంలో చూపించ లేదు. అంచేత దాన్ని కాదని, ఇది పదిహేడవశతాబ్దిలో పుట్టినదని అనడానికి ఏమిటి కారణం? “పేరణము” అన్న పదమొక్కటే దీనికి ప్రమాణం అనిపిస్తోంది. అయితే, పేరణము అంటే, దర్జీలచే కుట్టబడిన రవికేనా, ముస్లిములు రాక మునుపు వేరే రకమైన ఆచ్ఛాదన ఉండేది కాదా అన్న విషయాల మీద నాకు అనుమానాలున్నాయి. కనీసం శ్రీనాథుని కాలానికే “ఱవికె” ఉందన్నది అతని రచన ద్వారా తెలుస్తోంది. ఈ “పేరణము” పదం పదిహేడవశతాబ్దికే చెందినదని అనుకున్నా, ఆ ఒక్కటీ ఆధారంగా మొత్తం శతకం ఆ కాలానికి చెంది ఉంటుందని నిర్ణయించడం సమంజసం కాదు. అలాగే, “సుమతీ శతకం ఈ వర్గం నుంచి వచ్చిన పుస్తకం అయ్యుండాలి. కరణాలు లౌక్యులు, రాజనీతిజ్ఞులు అయినా కూడా వాళ్ళు బాహాటంగా పేరు కోసం ప్రయత్నించలేదు. ఎప్పుడూ అణకువగా తెర వెనకనుండే కార్య నిర్వహణం చేసే తమ గుణానికి అనుగుణంగా ఈ సుమతీ శతక కర్త తన పేరు రాసుకోలేదు.” – అన్న వాదనలో కూడా పెద్దగా పస కనిపించడం లేదు. కర్త పేరు మకుటంగా కాని, మొదటి చివరి పద్యాలలో కాని ఎక్కడా పేర్కొనకపోవడం చాలా శతకాలకున్న లక్షణమే, సుమతిశతకానికి ప్రత్యేకం కాదు. శ్రీకాళహస్తీశ్వరశతకం, నారాయణశతకం మొదలైనవన్నీ వీటికి ఉదాహరణలే. అంచేత ఇందులో ప్రత్యేకించి కరణాల స్వభావానికి సంబంధమేమీ లేదు.
2. మౌఖిక, లిఖిత సంప్రదాయాలలో సుమతిశతకం గురించి. నారాయణరావుగారన్నట్టు, బ్రౌను పాఠమూ, వావిళ్ళవారి ప్రతి ఆధారంగా, సుమతిశతక పద్యాలు, రెండు సంప్రదాయాలలోనూ కనిపిస్తున్నాయని అంగీకరించడంలో ఎలాంటి విప్రతిపత్తీ లేదు. అయితే, ఇది రెండు రకాలుగా జరిగి ఉండే అవకాశం ఉంది. ఒకటి – మొదట లిఖిత సంప్రదాయంలో రచింపబడిన పద్యాలు కాలక్రమేణా ప్రజల నోళ్ళలో నాని మౌఖిక సంప్రదాయంలోకి రావడం. రెండు – మౌఖిక సంప్రదాయంలో పుట్టిన పద్యాలు క్రమేపీ లిఖిత స్వరూపాన్ని సంతరించుకోవడం. నాకు అర్థమైనంత మేర, మొదటి మార్గంలో కర్త > గ్రంథము > పాఠకుడు అనే క్రమం ఉంటుంది, రెండవదానిలో గ్రంథం ముందుపుట్టి, ఆ తర్వాత దానికి ఒక కర్త ఆపాదింపబడడం జరుగుతుంది. మనకి తెలుగులో ప్రచారంలో ఉన్న చాలా చాటువుల విషయంలో ఈ రెండవ పద్ధతి కనిపిస్తుంది. అయితే సుమతిశతకం ఈ రెండు మార్గాలలోనూ ఏ మార్గాన్ని అనుసరించిందని ఎలా నిర్ణయించడం? ఈ వ్యాసంలో నారాయణరావుగారు, ఈ శతకం మౌఖిక సంప్రదాయంలో పుట్టి క్రమేపి లిఖిత స్వరూపం తీసుకుందని భావించినట్టుగా అనిపిస్తోంది. దీనికి తగినంత బలమైన కారణాలేవీ వ్యాసంలో చెప్పినట్టుగా నాకు కనిపించలేదు. లిఖిత సంప్రదాయంలో ఉన్న ఒక సంక్లిష్టశైలి గల పద్యం, ప్రజల నోళ్ళలో పడి సులభశైలిని సంతరించుకొనే అవకాశమే నాకు ఎక్కువగా ఉందనిపిస్తోంది. మౌఖిక సంప్రదాయంలో పుట్టిన పద్యం యథాతథంగా లిఖిత రూపం పొందేందుకు పెద్దగా అభ్యంతరం ఏముంటుంది? వ్యాకరణపరమైన దోషాలని పరిహరించడం జరగవచ్చు కానీ ఛందస్సు నిర్మాణాన్ని తీరికూర్చుని సంక్లిష్టశైలిలోకి మార్చడమనేది జరుగుతుందని ఊహించడం నాకు కాస్త కష్టంగా ఉంది. అదికూడా ఒకటి రెండు పద్యాలు అలాంటి మార్పులు చెందాయంటే వేరే విషయం కాని, ఈ వ్యాసంలో ప్రస్తావించినదాన్ని బట్టి చూస్తే, ఇలాంటి క్లిష్టబంధం కలిగిన పద్యాలు బ్రౌను పాఠంలో చాలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అవన్నీ కూడా మౌఖిక సంప్రదాయంలోనుంచి మార్పు చెంది లిఖిత సంప్రదాయంలోకి రావడం నాకయితే సాధ్యమనిపించడం లేదు. నా దృష్టిలో, ఈ రెండు రకాల పాఠాలనుండి మనం చెప్పగలిగింది ఏమిటంటే – ఈ శతకం లిఖితసంప్రదాయంలో ఏక కవి కృతమైనవే. శతకంలో ఉన్న పద్యాలన్నిటిలోనూ సులువుగా చదువుకొని గుర్తుంచుకోడానికి వీలైనవే ప్రజాబాహుళ్యంలో ప్రచారమయ్యాయి. అలా కానివి లిఖిత రూపంలోనే ఉండిపోయాయి. ఈ క్రమంలోనే కొన్ని క్లిష్టశైలిలో ఉన్న పద్యాలు రూపురేఖలు మారి సరళరూపాన్ని పొందాయి.
3. బద్దెన, భీమన గురించి. లిఖిత సంప్రదాయంలో సుమతిశతకానికి బద్దెన, మౌఖిక సంప్రదాయంలో భీమన కృతికర్తలయ్యారని ఊహించడానికి, వ్యాసంలో యిచ్చిన వివరణ అంత నమ్మశక్యంగా అనిపించ లేదు. దానికి చెప్పిన కారణాలు కూడా అంత నమ్మదగ్గవిగా కనిపించ లేదు. అసలు తిమ్మకవి ప్రస్తావించిన, అలాగే ఒక సుమతిశతక పద్యంలో ఉన్న “భీమకవి”, “వేములవాడ భీమకవే”నా కాదా అన్నదే పెద్ద అనుమానం. ఇక దాని ఆధారంగా ఆ భీమకవిని మౌఖిక సంప్రదాయంలో సుమతిశతకానికి ఎందుకు కర్తగా సృష్టించారన్న ఊహలు సాగించడం మరీ దూరాన్వయం అనిపించింది. దీనికన్నా, బద్దెనకున్న బిరుదాలలో “భీమ” అన్నది ఒకటి కాబట్టి, ఇక్కడ పేర్కొనబడిన “భీమకవి” అతనే అన్న ఆలోచనే సజావుగా అనిపిస్తోంది నాకు. అలాగే బద్దెన గురించిన ఊహ కూడాను. ఈ వ్యాసం తెలుగు అనువాదంలో దొర్లిన ఒక పొరపాటు, “బద్దెన కర్త అని చెప్పే సుమతీ శతక పద్యం బిగువైన లిఖిత శైలిలో వుండడం,”. బద్దెన కర్త అని చెప్పే పద్యం సుమతిశతక పద్యం కాదు, నీతిశాస్త్రముక్తావళి లోనిది. తాము సృష్టించిన సుమతిశతకానికి బద్దెనను కర్త చెయ్యడం కోసం నీతిశాస్త్రరత్నావళిలో ఈ పద్యాన్ని కరణాలు ప్రక్షిప్తం చేసి ఉంటారా?! ఇక, శైలికి సంబంధించి నారాయణరావుగారు చేసిన పరిశీలనకు విరుద్ధమైన ఉదాహరణ ఒకటి వంగూరి సుబ్బారావుగారు తమ శతక కవుల చరిత్రములో చూపించి ఉన్నారు. దాన్ని నారాయణరావుగారు చూడలేదో, చూస్తే యీ వ్యాసంలో ఎందుకు ప్రస్తావించ లేదో తెలియదు. సుమతిశతకం (వావిళ్ళవారి ప్రతిలో) యీ పద్యం ఉంది:
పతికడకు, దన్ను గూర్చిన సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్
సుతుకడకు, రిత్తచేతుల మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ
ఆంధ్రపరిషత్తు పుస్తకభాండాగారంలో ఒక తాటాకు ప్రతిలో ఇదే పద్యం ఇంకొక రూపంలో యిలా ఉందని సుబ్బారావుగారు అన్నారు. అది:
సుతుకడకు, తన్ను గూర్చిన సతికడకును, వేల్పు కడకు సద్గురు కడకున్
మతియుతులు రిత్త చేతుల పతికడకుం బోవ జనదు బద్దె నరేంద్రా!
ఇది ప్రాచీన ప్రతి అనే సుబ్బారావుగారు చెప్పారు. ఇది అచ్చంగా ఆశు సంప్రదాయంలో ఉన్న పద్యమే. అంటే మౌఖిక సంప్రదాయంలో కూడా బద్దెన కృతికర్త అనే ప్రచారం ఉందని దీని బట్టి భావించ వచ్చును కదా?
అసలీ వివరణ అంతా, సుమతిశతకం మౌఖిక సంప్రదాయం నుండి లిఖిత సంప్రదాయానికి వెళ్ళిందన్న విషయంపై ఆధారపడినది. లిఖిత సంప్రదాయంనుండి మౌఖిక సంప్రదాయంలోకి వచ్చినది అనుకుంటే, అది బద్దెన కృతమనీ, బద్దెనకున్న ఒక బిరుదు “భీమ” కాబట్టి కొన్ని చోట్ల దీని కర్త భీమకవిగా పేర్కొనబడినదని భావించడం అన్నిటికన్నా సజావైన ఊహగా నాకు తోస్తోంది.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి RVS Sundaram గారి అభిప్రాయం:
03/18/2013 11:17 am
సుమతి శతకం గురించి విభిన్నమైన అభిప్రాయాలు రావటం బాగుంది.
సుమతీ శతకం అనకూడదని రాస్తే నేనొక పిచ్చివాడినని కొందరు భావించినట్లుంది. పండితులు తప్పు చేస్తే వందమంది దాన్నే అనుకరిస్తారు. రామ శతకం అనటానికి రామా శతకం అనటానికీ భేదం ఉంది. పుల్లింగాన్ని స్త్రీలింగంగా మార్చకూడదు. పండితులు అచ్చువేసిన ఏ పుస్తకం లోను సుమతీ శతకం అని లేదు.
తెలుగులో అచ్చు వేసిన మొదటి వాడు బ్రౌన్ కాదు. 1728 నాటికే తెలుగు ముద్రణ ఉంది. బెంజమిన్ షూల్జ్ తన వ్యాకరణాన్ని అచ్చుకు సిద్ధం చేశాడు. అతను కొన్ని కారణాలవల్ల అచ్చు వెయ్యలేదు కాని తెలుగు అచ్చుకు అప్పటికే అవకాశం ఉంది. దాఖలాల్ని బట్టి తెలుగులో అచ్చయిన మొదటి పుస్తకం శ్రీరాంపూర్ మిషన్ ప్రెస్స్ లో 1813లో అచ్చయిన తెలుగు వ్యాకరణం. కాని అంతకు ముందే తెలుగు పుస్తకాలు అచ్చయ్యాయి. బహుశా షూల్జ్ జర్మనీలోని హాలేలో మొదటి తెలుగు పుస్తకాన్ని అచ్చు వేశాడు.
సుమతి శతకం రాసింది భీమన లేక బద్దెన అనే రెండు అభిప్రాయాలు ఎక్కువగా ఊహలతో కూడినవే. సుమతి అనే జైన కవి రాశాడనే ఊహని ఎందుకు కొట్టిపడెయ్యాలో అర్థం కాదు. లౌకిక శాస్త్రాలను ఎక్కువగా రాసిన వాళ్ళు జైనులు. సుమతి, రత్నశ్రీ లాంటి పేర్లు జైనులవి,బౌద్ధులవి. సుమతి శతకం సుమతులకయితే నీతులు చెప్పాల్సిన పనిలేదు. అది ఆత్మ సంబోధన (వేమనలాగా) అయిఉండాలి లేదా గురువుని సంబోధించి ఉండాలి. శ్రీరాముని పద్యం తర్వాత చేరింది. సుమతి శతకం జైన రచన అనే అవకాశాన్ని కూడా పరిశీలించాలి.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
03/17/2013 1:14 pm
మూలం చదివాక ఇంతకు ముందు నేను వెలిబుచ్చిన తక్కువ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. నిజానికి దీని వాసి మిగిలిన రచనలకి ఏమాత్రం తీసిపోదు. “తెలుగులో కవితావిప్లవాల” నుంచీ నారా లిఖిత – మౌఖిక పరంపరల్లో ప్రచారమైన రచనల గురించి మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తటం, అనిదంపూర్వమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదించటం చేస్తూనే వున్నారు – ఉదాహరణకి చాటువులు, కాటమరాజు కథ, రామాయణాలు, ఇలా ఎన్నో. సుమతిశతకం విషయంలో ఒక ప్రత్యేకమైన సందర్భమూ, మౌఖిక – లిఖిత మార్గాల కలయికా వల్ల దొరుకుతున్న సమాచారం తనింతకు ముందు చేసిన సిద్ధాంతాలకి ఎలా బలం చేకూరుస్తుందో ఈ వ్యాసంలో చూపారని నా భావన.
ఒక రచన మౌఖికంగా లేదా లిఖిత మార్గాన మొదలౌతుంది. లిఖిత రచనలకి కర్తృత్వ విషయంలో సందేహాలు కలగటానికి అవకాశాలు తక్కువ. మౌఖిక రచనలకి కర్తృత్వం అనే భావనే పాశ్చాత్యభావాలకి లొంగదు. మౌఖికంగా మొదలైన రచన కొంతకాలానికి లిఖిత రూపం పొందొచ్చు. అలాగే లిఖితంగా మొదలైన రచన (పూర్తిగా కాకపోయినా కొంత భాగమైనా) మౌఖికంగా మారటం కూడ జరిగింది (లిఖిత రచనల్లోని పద్యాలు చాటు ప్రపంచంలోకి రావటం ఒక ఉదాహరణ). సుమతిశతకం విషయంలో ముందుగా ముద్రితమైన రెండు రకాల ప్రతులు, ఒకటి మౌఖిక మార్గం నుంచి, మరొకటి లిఖిత మార్గం నుంచి వచ్చాయని నారా ఈ వ్యాసంలో నిరూపించారు.
మౌఖిక మార్గం రచనల కర్తృత్వం ఆ రచన ప్రయోజనాన్ని బట్టి, ఆ రచనని తమ సొంతంగా స్వీకరించిన కులాల బట్టి మారుతూ వుంటుందని నారా ఇదివరకే ప్రతిపాదించారు. అది సుమతిశతకం విషయంలో ఎలా నిజమో మరోసారి చూపించారిక్కడ. రామాయణం ఇతిహాసంగా వున్నప్పుడు దాని కర్తగా ఒక ఋషి కావలసొస్తే, అది భక్తి రచన అయాక దాని కర్త దైవప్రేరితుడైన వ్యక్తిగా ఎలా మారాడో, భారత భాగవతాలకి, పురాణాలకి కర్త వ్యాసుడెందుకు అయాడో, ఆ తర్వాత వచ్చిన భక్తి రచనల కర్తలు చాలామంది చుట్టూ అల్లిన కథల్లో నారదాదులు, దేవుళ్లు ఎందుకు కనిపిస్తారో ఈ సిద్ధాంతం స్పష్టంగా వివరిస్తుంది. మౌఖిక సుమతిశతకానికి భీమన, లిఖిత సుమతిశతకానికి బద్దెన, ఎందుకు కర్తలుగా అంగీకరించబడ్డారో ఈ సిద్ధాంతం నిరూపిస్తుంది.
చివరగా ఒక్కమాట. సినిమా పాటలు ప్రస్తుత కాలంలో మౌఖిక మార్గంలో ప్రచారమయే రచనలకి మంచి ఉదాహరణ. ఒక పాట వినటం తోనే దాని కర్త ఎవరో ఎలా తెలుస్తుంది? ఎందుకు ఒకరు రాసిన పాటని మరొకరెవరో రాశారని అనుకోవటం జరుగుతుంది ? ఆలోచించండి. మౌఖిక రచనల గురించిన నారా సిద్ధాంతాలు వీటికీ వర్తిస్తాయి, పాతకాలపు రచనలకే కాదు.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి jayaprabha గారి అభిప్రాయం:
03/16/2013 12:39 am
ఈ వ్యాసం లోని సారాశం మరికొంచెం పొడిగించి చూస్తే … [తప్పని సరిగా ఛూడాల్సి ఉంటుంది. ఇది ఒక సిధ్ధాంత వ్యాసం, సాహిత్య విమర్శా గనుకాను కవిని గురించిన చర్చ అతడి కర్తృత్వాన్ని గురించిన మీమాంశ కూడా గనకాను!!] అప్పుడేమౌతుందంటే, రాబోయే మరి కొన్ని పదుల లేదా వందల ఏళ్ళ తరవాత పేరున్న ఒక పుస్తకానికి వారే అసలు రచయిత అని అంటేనో/లేదా అలా ఎవరన్నా అనుకుంటేనో అది నిజమే కానఖ్ఖర లేదని ఒక తప్పనిసరి ఆలోచన/ప్రతిపాదన వస్తోంది. ఈ వ్యాసంలో మాదిరే ఒక బద్దెన/ఒక భీమన పాత్రలోకి రేపు మరొక అసలు కవి నాలాంటి వారే ఎవరైనా ఒకరు కేవలం ఒక కల్పిత వ్యక్తిగా మారే/లేదా మార్చే వీలుందని సుమతీ శతకం మీద రాయబడిన ఈ భాష్యం ప్రకారం అర్ధం అవుతోంది. [నేను ఇంగ్లీషు వ్యాసాన్ని చదివే దీన్ని రాస్తున్నాను].
ఈ వ్యాసం లోని వాదనని అనుసరించి అసలు ఏ కవీ వారి కవిత్వానికి కర్తలు కాగలరా భవిష్యత్తులో? అని సందేహం రాక మానదు. అసలు బద్దెన/భీమన ఏమి, మన నన్నయ్య భట్టు మాత్రం మహాభారత ఆంధ్రీకరణ చేశాడని ఏమిటీ నమ్మకం? అదొక “విశ్వాసం” మాత్రమే కావాలి. ఎందుకంటే అతడి తరువాత కవులు “ఆదికవి” గా ఆయనని స్తుతిచేశారు గనకా?? అంతకు మించి ఆయనని గురించిన వివరాలు మన ముందు ఏమున్నాయీ?? తిక్కన మాత్రం ఎందుకని కల్పితం కాకూడదో?? మనుమ సిధ్ధి ఏమన్నా ఆయనని గురించి శాసనం చెక్కించాడా? లేదే? ఆ పాతవాళ్ళ ఫోటోలా లేవు. వేల తరాలు గడిచిపోయేయి గనక వారికి కుటుంబ వారసులా లేరు. ఇంక మిగిలిన ఆధారాలేమిటీ?? అది అటుంచితే మరి ఇవాళ రాస్తున్న ఈ కవుల సంగతి మాత్రం ఏమిటో?? ఏమిటీ రుజువూ?? అందుకోసం ఈ పుస్తకం నాదేనని “విల్లు” ఏమన్నా రాసి పెట్టుకోవాలా?? ఫొటొ తాలూకు కాలపరిమితి మాత్రం ఏమాత్రం?? కుటుంబపు కాలపరిమితి మాత్రం ఏమాత్రం?? అసలు నేను నేనే అన్న రుజువేదీ??
ఒక కౌటిల్యుడిని ఒక భరతుడినీ కాళిదాసునీ ఎటూ “కల్పితం” చేసేశాం. ఆ విధానం ప్రకారం రేపు ఈ జయప్రభ మాత్రం ఎందుకని కల్పితం కారాదో ఈ వ్యాస కర్త వివరించవలసి ఉంటుంది మరి. ఆయన వాదానికి గనక ఆయన బధ్ధుడైతే!
దాతలెవరన్నా విరాళాలిస్తే నాపేర నేనొక శిలాశాసనాన్ని వేయించుకోవాలి 🙂 దాన్ని తప్పని సరిగా నకళ్ళు తీయించి అన్ని అమెరికన్ యూనివెర్సిటీల్లోనీ నాటించుకోవాలి కూడాను. ఎందుకంటే భవిష్యత్తు లోని అపూర్వ పరిశోధనలకి ఉనికిపట్టులు అవే గనక!!
ఇట్లు,
కల్పితంకానిచ్చగించని వర్తమాన బద్దెనని అయిన నేను.
జయప్రభని.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
03/13/2013 3:15 pm
ముందుగా, ఈ వ్యాసం నారాయణ రావు గారి ఇతర పరిశోధనల స్థాయికి చేరుకోలేదని నా అభిప్రాయం. మరీ నీరసంగా వున్న అనువాదం కూడ ఈ అభిప్రాయం కలగటానికి బాగానే దోహదం చేసిందనిపిస్తున్నది. మూలం చదవకుండా అంటున్న మాట ఇది. మూలం కూడ ఇదే స్థాయిలో వుంటే అనువాదకులకి క్షమాపణలు.
ఇకపోతే, జయప్రభ గారి అభిప్రాయంలో వున్న తర్కం కొంత వింతగా అనిపించి దాని గురించి రెండు మాటలు చెప్పదల్చుకున్నాను. నారా కాని, ఆరుద్ర కాని, మరొకరు గాని చేసేపని ఒక విషయం గురించిన సమాచారాన్ని వాళ్లకి అందుబాటులో వున్నంతవరకు కూలంకషంగా సేకరించి, నిశితంగా పరిశీలించి, వాళ్లు పరిశోధిస్తున్న సమస్యకి ఒక సిద్ధాంతాన్ని తయారుచెయ్యటం. సమర్థుడైన పరిశోధకుడు తన ఎదురుగా వున్న సమాచారాన్నంతటినీ వివరించేగలిగే విధంగా ఆ సిద్ధాంతాన్ని తీర్చిదిద్దుతాడు. కనక ఒకే సమాచారం అందుబాటులో వున్న పరిశోధకులంతా ఒకే సిద్ధాంతాన్ని తయారుచేస్తారనటం లేదా ఒకేరకమైన సిద్ధాంతాన్ని తయారుచేస్తారనటం అతార్కికం. సిద్ధాంతాలు కేవలం ఊహలే అనుకున్నా ఇద్దరు పరిశోధకుల ఊహలు ఒకటే కావు. అలాగే, ఊహ ఐనది ఏదైనా సరే సమానంగా అనుమానాస్పదం అనటం కూడ అతార్కికం.
ఈ వ్యాసంలో గాని, మరో దాన్లో గాని తను చెప్పేది “సత్యం”అని నారా ఎప్పుడూ అన్నారనుకోను, ఒక కొత్తకోణంలో చూస్తున్నట్టో లేక ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నట్టో తప్ప మరెవరికీ తెలియని కొత్త నిత్యసత్యాన్ని కనుక్కున్నానని ఆయన అనుకుంటారని నేననుకోను.
పాశ్చాత్యులకు ముందు గ్రంథసంస్కరణ ఎలా చేసేవారు అనేది ఆసక్తికరమైన ప్రశ్నే. ఐతే పాశ్చాత్యప్రభావం వల్ల వచ్చిన గ్రంథసంస్కరణ పద్ధతుల్లో లోపాల్ని ఎత్తిచూపటానికి అంతకుముందున్న పద్ధతులు విధిగా తెలిసితీరాలనటం సమంజసంగా కనిపించదు. చివరగా, ఒక విషయం గురించిన ఒక వ్యాసం దానికి సంబంధించిన అన్ని విషయాల్నీ స్పృశించి తీరాలని, అలా చెయ్యకపోతే అది లోపభూయిష్టమని ప్రతిపాదిస్తే, ఇక లోపభూయిష్టం కాని పరిశోధన లోకంలో ఉండనే వుండదు కదా !
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి jayaprabha గారి అభిప్రాయం:
03/12/2013 3:28 pm
వలస పాలనే లేకపోతే తెలుగులో అసలు “అచ్చు పుస్తకమే” లేదు. అంతకు ముందు అంటే బ్రౌన్ కి ముందు ఏదో ఒక పధ్ధతిలో అయినా తెలుగులో “పుస్తక పరిష్కరణ” ఉన్నదా, ఉంటే అది ఏ పధ్ధతిలో ఉండేదీ అన్న విషయాన్ని కనీసం ఒక ప్రశ్నగా కూడా ఈ వ్యాసం సంధించదు. అటువంటప్పుడు ఇంక “ప్రభావం” అన్న ఊహకి అసలు ఆస్కారం ఏదీ? ఆధునిక పధ్ధతులు అన్నీ ఆ వలస పాలకుల ప్రభావమే! ఈ వ్యాసం ప్రతిపాదించే అనేకానేక ఊహలతో సహా! అంటే మౌఖిక సుమతీ శతకం, లిఖిత సుమతీ శతకం వగైరా మాటలతో సహా! ఇంక పరిష్కరణ అన్నది పాశ్చాత్యుల పధ్ధతి అని మనం అనుకుంటే- తత్పూర్వపు తాటి ఆకుల ప్రతుల లేఖన విధానాల ని గురించిన “మనదైన” ఒక పధ్ధతి, దానిని గురించిన ఒక సమాచారం భిన్నమైనది ఏమన్నా మరొకటి మనముందు ఉన్నదా అన్నది మరో ప్రశ్న. అందువలన ఈ వలస పాలనకి ముందు మనదేశం లోని అమలులో ఉన్న ఆ “ఆధునికత” పూర్వాపరాలని గురించిన ఒక స్పస్టమైన ఊహని వ్యాసకర్త పాఠకుల ముందు ఉంచవలసి ఉంటుంది. కానీ ఆ దిశగా ఒక్క వాక్యం కూడా ఈ వ్యాసంలో లేదు. అయితే ఈ వ్యాసం చూసేక ఆరుద్రది ఒక లాంటి “నమ్మకం” అయితే వెల్చేరుది మరొకలాంటి “నమ్మకం” అని మాత్రమే అనుకోవాలి. సరి అయిన ఆకరాలు లేనప్పుడు ఎవరు చేసేవైనా ఊహలే అవుతాయి అవి నిరూపించబడేదాకా!
బ్రౌన్ దొర ఏ కారణంగా ఏ నమూనాని తన ముందు పెట్టుకుని తెలుగు గ్రంధాల అచ్చు పని దాని పరిష్కరణనీ చేపట్టినా ఆ పని చేసిన తెలుగు లేఖకులూ ఆ కొద్దిపాటి తెలుగు పండితులూ ఉన్న “బ్రౌన్ యూనివెర్సిటీ వే అంతకు ముందు తెలుగు లో ఏ కొందరికో అందుబాటులో ఉన్న గ్రంధాలని తెలుగు సమాజం ముందుకి తెచ్చిందన్నది ఒక వాస్తవం! ఆ పనిని తెల్ల దొరే చేశాడు గానీ అప్పటికి ఇంకా చెల్లా చెదురుగా తెలుగునేలని బుక్కుతున్న ఏ పిల్ల జమీందారూ చెయ్యలా! మనం ఎలాగైతే ఎడ్లబళ్లని వదిలి రైలు బళ్ల బాట పట్టామో ఆ “వలస పాలన” ఆధారం గానే తాటాకులమీంచి బ్రౌన్ దొర ముద్రింపించి ఇచ్చిన పుస్తకాన్నీ దొరకపుచ్చుకున్నాం. లేకపోతే ఏ సరస్వతీ మహలు లోనో మరోచోటనో లేదా ఏ కొందరి రాజుల సొంత గూళ్లలోనో చెదలు పట్టి ఉండేది పాత సాహిత్యం! మరి బ్రౌన్ “ఉధ్ధరించకపోయి ఉంటే” మరి ఎవరు వచ్చి ఉధ్ధరించి ఉండేవారో మనకి తెలీనప్పుడు తెలుగు వాళ్లకి బ్రౌన్ దొరమీద గౌరవం ఉండటంలో అసహజం ఏమీ లేదు.
కొన్నాళ్ళు వేలం వెర్రిగా ఇంగ్లీషు పధ్ధతులని అనుకరించిన దశ నించీ ఇవాళ వాళ్ల శైలి లోనే వాళ్లకి మాత్రమే అర్ధమయ్యే రీతిలో మళ్ళీ ఆ ఇంగ్లీషు లోనే మరి కొన్ని “కొత్త మాటల” పట్టిక గా ఆధారాలు లేకుండా తయారవుతున్న కొత్త ఊహల వ్యాసాలు ఇవి. నిడదవోలు వెంకట్రావు, ఆరుద్రా ఇవాళ ఏం జవాబులు చెప్పుకోవాలీ ఈయన సందేహాలకీ? మౌఖిక లిఖిత సాహిత్య వర్గీకరణలు అన్నవి మాత్రం ఇంగ్లీషు ప్రభావం వల్ల తయారైనవే కదా ఆధునిక విమర్శలో! అది మాత్రం వలసపాలకుల ప్రభావం కాదా?
చివరగా- తెలుగు సాహిత్యం లో మధ్య యుగాల దాకా అంటే వలస పాలకుల ప్రమేయం లేక ముందు దాకా ఆ పురాతన కాలంలో మన కవి పండితులు ఆ తాటాకు పుస్తక నిర్మాణం లో అనుసరించిన ప్రత్యేకమైన లేఖన విధానాలూ అలాగే తాళపత్ర ప్రతులకి తిరిగి తిరిగీ పుత్రికలని పుట్టించుకోవడంలో వాటిని పరిష్కరణ చేసుకోవడంలో అనుసరించిన విధానాలూ అన్నవి [అసలు ఒకటి ఉంటే] ఆ పధ్ధతులూ ఏవో వాటిని కూడా సమగ్రంగా వివరించనిదే పట్టించుకోనిదే చర్చలో వాటినీ భాగం చేయనిదే వెల్చేరు చేసిన బ్రౌన్ ప్రమేయం లేకముందటి తెలుగు దేశంలో ఉన్న “ఆధునికత” అన్న తర్కానికి అసలు బలం లేదు. అలాగే “వలస పాలన ప్రభావం” అన్న ఒక్క మాట తోనే ఇప్పటివరకూ తెలుగులో వెలిబుచ్చిన ఇతర విమర్శకుల పాత పధ్ధతులనీ పాత ఊహలనీ కాదనీ తాను చేయబూనుకున్న ఈ “కొత్త విశ్లేషణకి” కూడా ఒక సాధికారత ఏదీ సమకూరనూ లేదు. ఈ వ్యాసం వెల్చేరు ఎంతగా అమెరికన్ విశ్వవిద్యాలయాల పరిశోధనా ప్రభావంలో ఇరుక్కుని ఉన్నదీ చెప్పడానికి ఒక ఉదాహరణగా మాత్రం పనికొస్తుంది. ఆయన పాఠక వర్గం ఎవరో కూడా స్పష్టం గానే ఈ వ్యాసం ద్వారా రూపుకడుతుంది.
జయప్రభ.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి s. kalanjali గారి అభిప్రాయం:
03/12/2013 1:24 am
గాయకుడు, స్వరకర్త, డాక్టర్ శ్రీపాద పినాకపాణి మృతి భరతావనికి, సంగీత లోకానికి తీరని లోటు. ఆయన కు నా నివాళి. ఆయన కుటుంబానికి, సంగీతాభిమానుల అందరి తరఫున నా సంతాపం తెలుపుకుంటున్నాను.
ఎస్. కళాంజలి.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
03/06/2013 6:05 pm
మురళీధరరావుగారు,
మీరు పై వ్యాసంపై వేరొక చోట వ్యాఖ్యానిస్తూ “అదీ గాక శ్రీ వెల్చేరు వారు 1868కి పూర్వపు ఏ సుమతీ శతకం ముద్రణా తమకు ప్రపంచంలోని ఏ గ్రంథాలయంలోనూ కనబడలేదు అన్నారు.” అని రాశారు.
But what he wrote is this: “కాని 1868 సంవత్సరపు ప్రచురణ నాకు ప్రపంచంలో ఏ గ్రంథాలయంలోనూ దొరకలేదు.”
He is referring to Vavilla/Adisaraswati’s edition, reported to have been published in 1868, not about any Sumati Satakam. And his distinction throughout the essay is between “Vavilla/Popular” and “Brown” editions. Perhaps Prof. VNR may comment himself, if he should happen to check this comments page.
Well, we all know that C.P. Brown apparently published his edition in 1842 itself (and VNR mentions it as well!), but there is no copy of it came to light so far. Even a person like late ban.gO.re could not locate a copy of it.
Regarding your reference to Barnett’s catalogue that work contains other verses as well. I can personally speak in detail about British Library Telugu collections, also the uncatalogued ones. But, I believe, its out of topic as the question is not about pre-1868 publications in which some verses from sumati Satakam appear.
Regards,
Sreenivas
అర్జున గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
03/06/2013 5:02 pm
విస్తారంగా వాడుకలో లేదు కాని wild she buffalo ని అడవి గేదె అనొచ్చు. దున్న అన్నా దున్నపోతు అన్నా he buffalo. ఈ రెండింటికి స్త్రీ లింగం గేదె అన్న మాటే. కాని నుడికారం కోసం తాపత్రయం పడేటప్పుడు, సందర్భానికి భంగం రానప్పుడు “అడవి దున్న” అన్నంత మాత్రాన వచ్చే నష్టమూ లేదు. ఇది తునిలో పెరిగిన వాడి “రెండు దమ్మిడీల” అభిప్రాయం.
బ్రహ్మ సృష్టి గురించి ఉష గారి అభిప్రాయం:
03/05/2013 11:12 am
మన దేవుళ్ళ గురించి, దేవర్షుల గురించి మనం కాబట్టి ఇంత చౌకగా వ్రాసుకుని ఆనందిస్తున్నామేమో.
ఈ కథలో కనిపించినంత చేత కాని వాడు సృష్టికర్త అని మనం నమ్ముతున్నామా?
ఇంతకూ అనవసరమైన విషయాలన్నీ వదిలేస్తే, కలిపురుషుడు సర్వ బలవంతుడని నిర్ణయించారు. అతను కాలు కూడా పెట్టలేని స్థలాలు భూమి మీద ఎన్నో ఉన్నాయని రచయిత మర్చిపోయారు. గురుస్మరణ జరిగే చోట, దైవపూజ, సత్కర్మలు, సద్-గ్రంథ పఠనం జరిగేచోట అతని గాలి కూడా సోకలేదని మన పెద్దలు చెప్పారు. కనక కథ చదివి ఇదంతా నిజమని బెదిరిన వారికి ఇది శుభవార్త.
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం:
03/04/2013 8:28 am
మాన్యమిత్రులు శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
అభినందనలు!
“ఈమాట” పత్రిక ఇదానీంతన సంచికలో శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారికి మీరు సమర్పించిన నివాళి ప్రస్తావిక వారి అమేయమైన ప్రతిభను, అపురూపమైన వ్యక్తిత్వాన్ని, అనర్ఘమైన కృషిసారాన్ని, నిరంతరాయితమైన వ్యాసంగాన్ని, వరివస్యను కన్నులకు కడుతూ చాలా బాగుంది. కొంతకాలం క్రితం అబ్బూరి రామకృష్ణారావు గారి పాటల కేసెట్టు రికార్డింగు సమయంలో నాకు వారితోడి పరిచయం పునరుద్ధృతమైంది. ఆ కేసెట్టు విడుదల వేళ సభాధ్యక్షుడిగా వారిని నేను సన్మానించిన సందర్భంలో కలుసుకోవటమే ఆఖరి సమావేశం. ఆ మధ్య ఫోనుచేసినప్పుడు వారు మా నాన్నగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు రేడియోకి వ్రాయగా తాము సంగీతాన్ని కూర్చిన పాటలు తమ వద్ద బయటపడ్డాయని, ఈ పర్యాయం హైదరాబాదు వచ్చినపుడు కలుసుకొంటే, ఆ వివరాలన్నీ మాట్లాడుకోవచ్చునని అన్నారు. అంతలోనే కాలం వారిని తన దురంతగర్భకుహరంలోకి లాక్కొంటుందని ఊహించలేకపోయాను. ఈ లఘువ్యాసముఖంగా ఇన్నిన్ని పాటలతో మీ జ్ఞాపకాలను పొందుపరిచి మీరు ఎంతో కొంత ఆ ఉత్తమఋషి ఋణాన్ని తీర్చుకోగలిగారు.
ఇదే సంచికలో “ప్రతిమా నాటకము” ప్రసారాన్ని గురించిన ఎన్నో అరుదైన విశేషాలను తెలియజేశారు. ఆ పరిచాయికలో మీరు “రజని గారు సంస్కృత చతుర్భాణీలను తెలుగులోకి అనువదించడం జరిగింది” అన్న ప్రయోగం చేశారు. “చతుర్భాణిని తెలుగులోకి అనువదించడం జరిగింది” లేదా, “చతుర్భాణిలోని నాలుగు భాణాలనూ తెలుగులోకి అనువదించడం జరిగింది” – అని ఉండాలి.
శ్రీ వెల్చేరు వారి సుమతీ శతకం గురించిన వ్యాసంలో “సుమతీ శతకం” తొలి ముద్రణ విషయమై నిడుదవోలు వారు ఆ వివరాన్ని ఎక్కడ చూసి ఇచ్చారో గుర్తింపకుండానే, సందేహించటం జరిగింది. అదీ గాక శ్రీ వెల్చేరు వారు 1868కి పూర్వపు ఏ సుమతీ శతకం ముద్రణా తమకు ప్రపంచంలోని ఏ గ్రంథాలయంలోనూ కనబడలేదు అన్నారు. 1912లో ఎల్.డి. బార్నెట్ ప్రకటించిన A CATALOGUE OF THE TELUGU BOOKS IN THE LIBRARY OF THE BRITISH MUSEUM అన్న సూచికలో
JOYES (Walter) and SESHACHARYULU, N. Ch. Telegoo Series. First Poetical Reader, being introductory lessons, with selections from the Vaymana pathyam and Sumathi Shuthagum, by Walter Joyes, and N. C. Sashacharloo, with the assistance of C. Rungiah, and S. Ramanoojiah . . . Pupil’s edition. (ప్రథమకావ్యపాఠము) pp. 44,5. S.P.C.K. Press: Vepery (Madras), 1859.
అని కనబడుతుంది. దీనిని బట్టి సుమతీ శతకానికి ఒకపాటి సంకలనం – అదెంత సమగ్రమైనా, అసమగ్రమైనా 1859 నాటికే వెలువడినట్లు స్పష్టపడుతున్నది. వాల్టర్ జాయిస్, శేషాచార్యులు జంట అందులో సుమతీ శతకం నుంచి ఎన్ని పద్యాలను గ్రహించారో; వాటిని ఏ రూపంలో పరిష్కరించారో, తమ పీఠికలో 1859 కంటె మునుపటి సుమతీ శతకం ముద్రణలను గురించి ఇంకా ఏవైనా వివరాలను ఇచ్చారేమో – ఆ పుస్తకాన్ని చూసి గాని చెప్పలేము.
శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు
అర్జున గురించి jayaprabha గారి అభిప్రాయం:
03/04/2013 5:18 am
ప్రసాద్ గారూ !! మొదట గా నేను మీ వ్యాఖ్యని శ్రధ్ధగా చదివేను. మీ వ్యాఖ్య నన్ను నొప్పించలేదు సుమా! మీ అభిప్రాయాలని నిర్మొహమాటంగా రాసే పధ్ధతి నాకు ఇష్టం.
కాకపోతే కల్పనకీ తర్కానికీ చుక్కెదురు. తర్కం ఎంత ప్రయత్నించీ కల్పనని లొంగదీసుకోలేదు. పక్షపాత దృష్టి ఈ సృష్టి లోనే ఉండగా ఆ సృష్టి మీద చేసే ఏ వ్యాఖ్యానమైనా అందుకు అతీతంగా ఉండలేదు. కదా? మనమందరమూ ఏదో ఒక పక్షం వేపుగానే ఉంటాం. అన్ని సార్లూ అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండకనూ పోవచ్చు. అయినా సరే అలా ఉండటం సహజం. Obviously its difficult to be objective towards nature and its laws.
ఇంక ప్రతీకలు అన్నవి సైతం అలాంటివే పాము ఎందుకని చెడ్దది కావాలో పక్షి ఎందుకని కాకూడదో స్పష్టం గా నాకు మాత్రం తెలుసునా 🙂 అబ్బే తెలీదు. అది అర్జున అభిప్రాయం. ఆ అభిప్రాయం మీద నాకేమంత అదుపు ఉండదని నేనంటే మీకు అర్ధం అవుతుందో లేదో మరి! కానీ ఇది సత్యం. చాలా సార్లు రచయిత కల్పనావరణాన్ని అతిక్రమిస్తాయి పాత్రలు. అన్నిసార్లూ రచయిత స్వతంత్రుడని / రాలు .. అని మాత్రం అనుకోబోకండి. అలా అంతా రచయిత స్చాధీనం లోంచే తయారయ్యే రచన ఉంటుందని చెప్పలేం కనీశం నావరకూ నేను అలా చెప్పలేను.
సాధారణంగా బలమైన వాటికన్నా vulnerable species వైపుగా మనసు పోవడం వలన కూడా అలాంటి ప్రతీకలు అలవోకగా చొరబడే వీలుంటుంది. లేదా మనసు లోలోతుల్లో ఎక్కడో పాము మీద ఉండే అయిష్టమో పోనీ పక్షి మీద ఉండే ఇష్టమో కూడా పనిచేసి ఉండవచ్చు 🙂 అప్పుడూ అది సహజమే! అలా ఎందుకంటే దాన్ని చెప్పడం కూడా కష్టమే 🙂
ఏం పిల్లడో ఎల్దమొస్తవా ? అన్న వంగపండు పాట మీకు తెలిసే ఉంటుంది. ఆ పాట లోని ప్రతీకలని గమనించండి. ఆయనకి మరి పులి మీద కోపం గొర్రెపొట్టేలు మీద ప్రేమ అని గభాల్న అనేయలేం. కవి చేసే పని ఏమంటే ఉన్న పరిస్థితి మీద వ్యాఖ్యానం చేయడం కోసం ఏ పోలికనైనా తన భావానికి అనువుగా మలుచుకోవడం. అంతే! కొన్నిసార్లు పులి మంచిది కావొచ్చు. కొన్నిసార్లు కాకపోవచ్చు. అంతిమంగా పులి పాము చెట్టు పుట్టా కధల్ని చెప్పవు గనక వాటిని చెప్పేది మనిషే గనక మనిషికున్న సకల భావ సంచలనాలకీ అవి నిర్నిమిత్తంగా కారణభూతమౌతాయి!
కల్పన మీద నేను ఎప్పుడూ వివరణనిచ్చే పనిచేయను. ఇకపోతే సాహిత్యప్రపంచాన్ని సమ్మోహన పరిచిన రచన చలం “ఒక పువ్వు పూసింది.” ఆ ఒక్క రచనే మిగిలీ మిగిలిన సాహిత్యం అంతా పోయినా పరవాలేదన్నారు చింతా దిక్షితులు గారు [కాబోలు]. దాన్ని తప్పక చదవండి. ఏ రచన మన మనసుని ఎలా మెలిపెడుతుందో మనకే తెలీదు. ద్వైదీ భావం కల్పనాపరులందరికీ సహజ గుణం. ” ఒకటికొకటికిని ఒడబడవు” అంటాడు అన్నమయ్య. పగలంతా రాముణ్ణి తిట్టి సాయంత్రం అయ్యేసరికి త్యాగరాజకీర్తనలని ఆస్వాదించే కొడవటిగంటి కుటుంబరావు… స్త్రీలవైపు ప్రాణం ఇచ్చి మాట్లాడి కూడా “ఒక పువ్వు పూసింది” లాంటి చెవనిస్ట్ కధని రాసిన చలం ఈ అంతరంగ గందరగోళాన్ని అధిగమించగలిగారా?? రసపట్టులో తర్కం కూడదు అని అంటారు పింగళి నాగేంద్రరావు కాబోలు. 🙂
అస్తు.
అర్జున గురించి మోహన గారి అభిప్రాయం:
03/01/2013 8:03 pm
వచనములో కూడ కవిత్వము ఉంటుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. దీనికే విరామాలు ఇచ్చి వ్రాస్తే ఇది ఒక దీర్ఘ కవిత అవుతుంది. ఇది కథ కాదు, కాని ఒక చెట్టు ఆత్మకథ అనుకోవచ్చు గదా! కాకుంటే ఇట్టి రచనలను ఒక మూసలో పెట్టడము కష్టము. ఇది కవిత కాదు, కాబట్టి దీనిని ఎక్కడ ఉంచడము, అందుకే ఇది కథగా మారినది. ఒకప్పుడు దమయంతిగారి ఒక రచనను గురించి కూడ ఇలాటి చర్చ జరిగినట్లు నాకు జ్ఞాపకము. జయప్రభగారికి అభినందనలు. విధేయుడు – మోహన
అర్జున గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:
03/01/2013 3:19 pm
ఇది కధా? ఈ వచనంలో చాలా అద్భుతమైన వర్ణనలు వుంటే వుండొచ్చు. ఎన్నెన్నో నిగూఢ పోలికలు జీవితంతోనో, మరోదాని తోనో వుంటే వుండి వుండొచ్చు. ఈ వచనాన్ని కధ అంటే, నాకు బొత్తిగా అర్థం కాలేదు. కధ అంటే ఏదో ఒక సంఘటన అయినా వుండాలి కదా? వర్ణనలు పూర్తయి, ఆఖరికి కధేదో మొదలవుతుందని ఎదురు చూస్తే, అంతా పూర్తయిపోయింది. కధేమిటీ అంటే, చెప్పడానికి ఒక్క ముక్క కూడా దొరకలేదు.
బహుశా, ఈ కధ లాంటిది గొప్ప మేధా వర్గానికి మాత్రమే ఉద్దేశించి రాసినది అయి వుండొచ్చును. నా లాంటి మామూలు పాఠకుల కోసం అయి వుండదు. అలా అయితే, నాకు ఏదో ఒక్క ముక్కన్నా కధ గురించి అర్థం అయి వుండేది కదా? “అలా కాదూ, నువ్వు మామూలు పాఠకుడి కన్నా కూడా తక్కువ స్థాయి వాడివీ, అందుకే ఈ కధ లోని కధా, గొప్పతనం, ఇందులోని విషయాలూ నీకర్థం కాలేదూ” అని ఎవరన్నా అంటే, “హతోస్మి” అని అనడం తప్ప, మరింకేమీ చెయ్యలేను.
సరే, ఇది కధ అవునా, కాదా, లేక ఇది మరొకటా అన్న విషయం వదిలేస్తాను. నాకు అర్థం కాని దాని గురించి చర్చ వ్యర్థం.
ఒక విషయం మాత్రం చెప్పాలని వుంది. పక్షి నది లోని చేపలని పట్టి తింటుంది. పిల్లలకి పెడుతుంది. పాము పక్షి పిల్లలని తింటుంది. ఇది ప్రకృతికి సంబంధించిన విషయం. జంతువులు ఆకలి తీర్చుకోవడం కోసం, ఒక దాన్ని ఇంకొకటి తినడం ప్రకృతి విషయం. ఇందులో, మంచీ, చెడూ అనేవి వుండవు. పాము చెడ్డది అయితే, పక్షి కూడా చెడ్డదే అవుతుంది. ఏవేవో పురుగుల్ని తినే చేపా చెడ్డదే అవుతుంది. చెట్టు, పక్షి పిల్లల్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తే, నది, చేప పిల్లల్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తుంది. అర్థం పర్థం లేని విషయం ఇది.
“పులి తినేయగా మిగిలిన కళేబరాన్ని ఆరగించేటందుకని మూకలుగా వచ్చిన రాబందులు ఆవేళ నా కొమ్మల మీదనే కూచుని దున్నని తలుచుకుని దుఃఖించాయి. అది చాలా వింతగా విశేషంగా అనిపించింది నాకు.” – ఈ రాబందులు కూడా మనుషుల్లాగా కపటత్వం (హిపోక్రసీ) కలిగినవై వుంటాయి. మరి మనుషులు కూడా, చేపల కూరా, చేపల పులుసూ హాయిగా, ఆనందంగా ఆరగిస్తూ, “ఫైండిగ్ నీమో” లాంటి సినిమాలు చూసి, కళ్ళ నీళ్ళు పెట్టేస్తూ వుంటారు కదా? అందుకని.
ప్రకృతినీ, సమాజాన్నీ కలగా పులగంగా కలిపేసి మాట్టాడ కూడదు. ఈ రెంటికీ చాలా తేడా వుంది. సమాజంలో మంచీ, చెడూ వుంటాయి. ప్రకృతిలో అలాంటివి వుండవు. ప్రకృతిలోని విషయాలకి లేని పోని ఉదాత్తత అంట గట్టేస్టే, కవిత్వానికి పనికొస్తుందేమో గానీ, అర్థం పర్థం లేనిదిగా వుంటుంది. ప్రకృతి లోని విషయాలు ఎప్పుడూ మారవు. అవి వాటి సూత్రాలతో సాగి పోతూ వుంటాయి. సమాజంలోని విషయాలని మార్చుకోవచ్చు.
ప్రసాద్
అనగనగా ఒక జైలు… గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:
02/26/2013 6:32 pm
“నీకు ఎలాంటి హానీ కలక్కుండా చూస్తాను. నీ భార్య ఆపరేషన్ కి కావలసిన డబ్బు రెండు లక్షలట కదా. మూడు లక్షలు ఇప్పుడే ఇస్తాను. అది కాక, నువ్ జైలు నుంచి విడుదలయ్యాక నీకో మంచి ఉద్యోగమో లేదా వ్యాపారం పెట్టుకోవడానికి మరికొంత డబ్బో ఇస్తాను. నీ గురించి శీను నాకు అంతా చెప్పాడు. అందుకే ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. కానీ ఏ సాక్ష్యమూ లేకుండా ఆ పాపారాయడ్ని పైలోకానికి పంపడం నీ పని!”
పై వాక్యాలు చదవండి. అర్థం కానిదేముంది? బహుశా చదువుతున్నప్పుడు కలిగిన విసుగు వల్ల, కొన్ని వాక్యాలు ఎగర గొట్టేశారేమో!
భార్యని బతికించు కోవడానికి డబ్బు కావాలి. జైలర్ పాపారాయుడిని చంపితే డబ్బిస్తానని హోం మినిష్టరు అన్నాడు. జైలు నించి బయటికి వచ్చాక (ఎప్పటికో మరి) ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాడన్నాడు. ఆ డబ్బు కోసం, జైలరుని చంపడం కోసం మళ్ళీ జైలుకు వచ్చాడు.
ఇదీ నాకర్థమయింది. ఇది తప్పయితే, “హతోస్మి” అని అనుకోవాలి.
మహా బోరైన కధ. కాలక్షేపానికయితే మాత్రం ఎవరయినా బోరు కధలు చదవ గలరా? రాసిన విధానం ఇంకా బోరు కొట్టించింది. కధ ఎలా అంతం అయిందో తెలియడం కోసం, చాలా కష్టపడి నాలుగు ఇన్‌స్టాల్‌మెంట్లలో చదివాను.
అన్నట్టు, ఇది అనువాద కధ కాదు. ఎవరో ఇంగ్లీషాయన ఏదో కధలో ఏదో రాస్తే, దాని వల్ల ప్రేరణ కలిగి, ఈ కధ పుట్టుకొచ్చిందట. సన్నివేశాల మధ్య సరైన విరామ చిహ్నాలు వాడక పోవడం వల్ల, ఏ సన్నివేశం ఎక్కడ పూర్తయి, ఎక్కడ ఇంకోటి మొదలయిందో తెలియలేదు. అంతా కలగాపులగం అయిపోయింది.
ప్రసాద్
[సన్నివేశాల మధ్య విభజన చిహ్నాలు జత చేసాం. — సం.]
తుఫాను ముగిసింది గురించి ravi గారి అభిప్రాయం:
02/22/2013 8:57 pm
మీరు చెప్పే ఆ కవిత్వ మూలాల్లోకి బహుశా నేను పోలేనేవో భూషణ్ గారు. నాకు కవిత్వం కొద్దో గొప్పో తెలుసు. కవిత్వం తెలుసంటే నాకు తెలుగు తెలుసని కాదు, నాకు బతుకు తెలుసని, అంతే. అనుమానం లేదండీ నాకు తెలిసిన తెలుగు పన్నెండో తరగతి వరకు నేను చదువుకున్న తెలుగే, అది కూడా లీలా మహల్ల్లో ఆంగ్ల సినిమా లేకపోతేనే, ఉంటే మా తెలుగు లెక్చరర్లు అదృష్టవంతులు. ఎందుకంటే మేవు క్లాస్ కి వస్తే పాపం వాళ్ళు చాలా దిగులు పడే వాళ్ళు. మా తెలుగు అంతవరకే పరిమితం. కాకపోతే బతుకు చాలా విస్తృతం కదండీ. కొందరు బతుకు ఒక వైపునే చూడగలరు, కానీ ఆ కొండనీ ఆ లోయనీ రెండిటినీ చూడగలగటం అందరకీ కుదరదు కదా.
నేను ఇంతకు ముందు వ్రాసిన కవితలు కానీ, ఒకే ఒక కథ కానీండి, అది నాకు తెలుగు తెలుసు అని వ్రాసింది కాదండీ భూషణ్ గారు. బతుకు తెలుసని వ్రాసినవండీ అవి. అయ్యో నాకు తెలుగులో ఓనమాలు, ఇవి కూడా తప్పుగా వ్రాస్తున్నాను, తెలియవండి. కానీ నాకు తెలిసింత వరకు నేను తప్పు కావచ్చు, కవితగానీ, కథగానీ భాషలోనించి రాదండి, అనుభవంలోనించి వస్తుంది, బతుకులోనించి వస్తుంది.
అమ్మా, కడుపులో ఎండకాస్తున్నట్టుందమ్మా అని వ్రాశాడు నామినీ ఒక కథలో. మిరక్కాయలు (మీరు మిరపకాయలు అంటారేవో) పచ్చడితిని, ఆ పిలగాడు బయట ఎండ కాసినట్టే ఆ కడుపులో మంటని అమ్మా కడుపులో ఎండకాసినట్టుందమ్మా అని చెప్తాడు అమ్మకి. ఇది తెలుగు భాష తెలుసు కాబట్టి రాదు, ఇది అనుభవం నించి వస్తుంది, ఇది బతుకునించి వస్తుంది. నాకు తెలియదండీ నాకు మాత్రం ఇంతగొప్ప వాక్యం, భాష మాత్రమే తెలిసిన వాళ్ళు వ్రాయలేరు, బతుకు తెలిసిన వాళ్ళు మాత్రమే వ్రాయగలరు. అమ్మా కడుపులో ఎండకాస్తున్నట్టుందిమా. కడుపులో ఎండకాస్తున్నట్టుందట. మీరు తప్పు పట్టదలచుకుంటే మొత్తం పచ్చనాకు సాక్షినే తప్పు పట్టేయ్యగలరు మీరు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, రచయిత వ్యక్తిగత జీవితం వాళ్ళ రచనలకి మూలం భూషణ్ గారు. తెలిసీ తెలియని అనుభవాల్ని, అనుభవం కాని బతుకుని కవిత్వీకరించడం కన్నా అబద్దం వుందా?
రవికిరణ్ తిమ్మిరెడ్డి
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి మోహన గారి అభిప్రాయం:
02/04/2013 11:18 am
ఆర్యా, స్పందించవచ్చును, కాని పది పన్నెండు సంవత్సరాల తరువాత స్పందిస్తే పునః స్పందించడానికి నాలాటి ముసలివాళ్లు బ్రదికి ఉంటారో ఉండరో? ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడితే బాగుంటుందేమో? విధేయుడు – మోహన
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి మోహన గారి అభిప్రాయం:
01/31/2013 11:56 am
స్వార్థిగా ఈ చర్చలో పాల్గొంటున్నాను. ఎన్నో ఏళ్లుగా నా ఇంటి పేరైన జెజ్జాలను గురించి వాకబు చేస్తున్నాను, కాని ఇంతవరకు ఫలితము శూన్యమే. ఈ జెజ్జాల ఎక్కడున్నది? తలిదండ్రుల ద్వారా నేను విన్నంతవరకు ఇది ఇప్పటి తెలంగాణాలోని ఒక గ్రామమని. కాని ఆ గ్రామము ఎక్కడుందో తెలియదు. గోల్కొండ వ్యాపారులైన నా పూర్వీకులు సుమారు 200-250 సంవత్సరాలకు ముందు ఇప్పటి ఆర్కాడు, చిత్తూరు ప్రాంతాలకు వలస వచ్చారు. ఇంటర్నెట్ ఫేస్‌బుక్కుల ద్వారా ఈ జెజ్జాల పేరితో ఇంకా కొందరు ఉన్నారని కనుగొన్నాను. వాళ్లకు కూడ ఈ విషయాన్ని గురించి తెలియదు. ఈ పేరు ఒక్క కులం వారు మాత్రమే ఉంచుకొన్నట్లు లేదు. అందువల్ల బహుశా ఇది ఒక గ్రామము లేక వాడ పేరై ఉండవచ్చును. అసలు ఇది జెజ్జాలయేనా లేక జజ్జాలయా అని కూడ ఒక అనుమానము. ఇంటి ఫేరును గురించి ఏమీ తెలియక జెజ్జాల ఇంటి పేరుతో చెలామణి అవుతున్న – మీ మోహన
పాఠకులకు సూచనలు గురించి కొండగుంట వెంకటేశ్ గారి అభిప్రాయం:
01/30/2013 6:18 am
ఎడిటర్ గారికి.
ఈ మాట పత్రిక చాల బాగుంది. కాని ఒక్కటే లోపం. మంచి సీరియల్స్ లేవు.
ప్రఖ్యాత రచయితలని కాకుండ కొత్త రచయితల రచనలు ప్రచురించండి. మీ పత్రిక
ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
ఇట్లు
కొండగుంట వెంకటేశ్.
God on the Hill, Goddess on the Plain, and the Space In-Between: Tirupati, South India గురించి మోహన గారి అభిప్రాయం:
01/05/2013 6:26 pm
చివర నుదహరించిన Distant Rivers Reach the Sea చదివినప్పుడు నాకు ఏక్‌నాథ్ ఈశ్వరన్ వ్రాసిన God makes the rivers to flow – Passages for meditation అనే పుస్తకము జ్ఞాపకానికి వచ్చినది. నదీనాం సాగరో గతిః అంటారు అందుకే. ఆ కవితకు ఖండగతిలో (ఐదు మాత్రలతో) సాగే నా తెలుగు సేత క్రింద ఇస్తున్నాను –
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
దూరముగ నుండుటయు దగ్గరగ నుండుటయె
దూరమున నుండియును దలతు నే నతనినే
దూర మా సూరీడు తామరకు గాదు గద
దూరములు హెచ్చగా ప్రేమయును హెచ్చు గద
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
నన్నతడు జూడగా నే నతని జూతుగా
నా మొగ మ్మతనిపై కేంద్రీకృతమ్ముగా
వనములో నెమలు లా మేఘముల జూచుగా
చూపులే నాలోని యాశలకు పాశములు
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
మదిలోని కోర్కెతో దగ్గరైనట్టులే
నేలపై నేనిందు కొండలకు ఱేడందు
మేమిర్వురము కూడి యేకమైనాముగా
అద్భుతము యీ వింత మేనిలో బులకింత
దూరమున బుట్టు నదు లంబుధిని జేరుగద
విధేయుడు – మోహన
ఒక నేను, కొన్ని నువ్వులు గురించి lilly గారి అభిప్రాయం:
01/03/2013 3:45 am
బాగుంది కాని అంతా ఒకే కథ లా ఉంటే బాగుండేది
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి anjani గారి అభిప్రాయం:
12/09/2012 7:26 pm
చాలా బాగుంది కాని శీనూ మంచితనం అర్దం చేసుకుని ఉంటే ఇంకా చాలా బాగుండేది.
ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
12/05/2012 4:52 am
అవధానాన్ని యిష్టపడే ఒక పామరునిగా నా అభిప్రాయాలివి:
1. కవిత్వం అనే బ్రహ్మపదార్థానికి కాలానుగుణంగా అర్థం మారుతూ వచ్చింది. అంచేత ఒకప్పుడు ఆశువు, అవధానమూ కవిత్వంగా, కవిత్వవిద్యగా చెలామణీ అయి ఉండవచ్చు, అందులో ఆశ్చర్యమూ అసంగతమూ ఏమీ లేదు. ప్రస్తుతం కవిత్వమంటే ఉన్న అవగాహన (“మేధావి” వర్గానికి) మేరకు అది కవిత్వం కాదన్నది కచ్చితమే. అయితే అందులో అక్కడక్కడా కవిత్వఛాయలు కనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది, అది వేరే సంగతి. అవధానికీ, పృచ్ఛకులకూ, ప్రేక్షకులకూ కవిత్వదృష్టి ఉంటే అందులో కొంత కవిత్వం పండే అవకాశం ఉంది. లేకపోతే లేదు. అయితే ఆ విద్య ప్రాధాన్యం అది కాదు.
2. అవధానానికీ దొమ్మరి ఆటకూ పోలికలుండడమూ వాస్తవమే, అందులో వాదనకి తావు లేదు. అయితే, దొమ్మరాటను “తక్కువ”గా చూడాల్సిన అవసరం ఏముందో నాకు బోధపడటం లేదు. అది కూడా కష్టించి సాధించాల్సిన ఒక విద్య. మనుషులకి ఆహ్లాదాన్ని కలిగించే ప్రక్రియ. దానివల్ల సమాజానికి నష్టమేమీ లేదు. అలాంటి ప్రక్రియ జనాదరణ పొంది అభివృద్ధి చెందితే మంచిదే కదా. అవధానమూ అంతే.
ఇక వ్యాసం చివరలో పేర్కొన్న కొన్ని విషయాల గురించి, పృచ్ఛకునిగా కొన్ని అవధానాలలో పాల్గొన్న అనుభవాల ఆధారంగా, నా అభిప్రాయాలు:
1. పృచ్ఛకులను గద్దించో బతిమాలో ఒక క్లిష్ట సమస్యని మార్చడం అనేది నేను చాలా కొద్ది సందర్భాలలో మాత్రమే చూసాను. అంచేత అది ఒక “టెక్నిక్”గా ఎక్కువ ఉపయోగపడక పోవచ్చు, కేవలం అరుదైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప.
2. “అవధాని గారికి కోపం వస్తే శాపం పెట్టేస్తారేమో!” అనే అనుమానం ఇతరుల మనస్సుల్లో కలిగించగలిగిన అవధానికి ఇంక ఎలాటి ఢోకా లేదు. – ఇలాంటిది నా కొద్ది అనుభవంలోనూ ఎప్పుడూ చూడలేదు.
3. “మొదటిది పృఛ్ఛకుల్ని మంచి చేసుకోవటం. అవధానం మొదలుకావటానికి ముందుగా వాళ్ళని పలకరించి ఎవరు తనని పరీక్షించటానికి వచ్చారో ఎవరు తన మిత్రులో తెలుసుకుని మొదటి వర్గంలోని వాళ్ళని తనకు అనుకూలంగా తిప్పుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి.” – ఇలాంటిది కూడా నేనుప్పుడూ చూడలేదు.
4. “అవధానం అయి వెళ్ళేప్పుడు “ఆహా! ఆ పద్యం ఎంత బాగా వచ్చింది!” అనుకునే ప్రేక్షకుల్ని ఇంతవరకు చూడలేదు నేను” – అలా అనుకున్న ప్రేక్షకులలో నేను ఉన్నాను. (వ్యాస రచయిత నన్ను “చూడలేదు” కాబట్టి అతనన్నది ఇప్పటికీ నిజమనే అనుకోవచ్చు :-)) నేనిచ్చిన ఒక సమస్యను గరికపాటివారు పూరించిన విధానమూ, న్యస్తాక్షరిని కడిమెళ్ళవారు పూరించిన విధానమూ చూసి, ఎంత బాగా వచ్చాయి పద్యాలు అని అనుకున్నాను.
6. “ఇటీవలి కాలంలో జరుగుతున్న అవధాన కార్యక్రమాల వల్ల భాషకు ఏమీ ఉపయోగం కలక్కపోగా ఒకరకమైన కీడు కూడ జరుగుతున్నదేమో అనిపిస్తున్నది.” – ఎలాంటి కీడు జరుగుతోందో వివరిస్తే బాగుంటుంది.
5. “ఏమైనా అవధాన ప్రక్రియ వల్ల భాషాసాహిత్యాల మీద ఉండే ప్రభావం గురించి ఎవరైనా సాధికారికంగా పరిశోధిస్తే బాగుంటుంది.” – అవును బాగుంటుంది. అలాంటి ప్రభావం (మేలు కాని, కీడు కాని) చాలా తక్కువ అని అభిప్రాయం. బహుశా ప్రేక్షకులకి పద్యాల మీద కొంత ఆసక్తిని పెంచే అవకాశం ఉంది, అంతే. అవధాన స్వరూపంలోనూ, సమస్యల పూరణల స్వరూప స్వభావాలలోనూ, కాలానుగుణంగా చాలా మార్పు వచ్చింది. అవధానం గురించిన ఏ పరిశీలన అయినా దీన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. గరికపాటివారి అవధాన పద్యాలు కొన్ని పుస్తకాలుగా వచ్చాయి. వాటిని పూర్వ కవుల అవధాన పద్యాలతో పోలిస్తే తేడా చక్కగా బోధపడుతుంది. వీటి ఆధారంగా యీ వ్యాసంలో పేర్కొన్న కొన్ని అంశాలని పునస్సమీక్షించు కోవలసిన అవసరం ఉంది.
ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
12/04/2012 3:48 pm
లక్ష్మన్న గారూ !!
ఇక్కడ చర్చ “అవధానాలలో కవిత్వం ఉందా లేదా” అన్నది కాదు. అవధానాల పరిమితీ ప్రయోజనమూ కూడా కాదు. అది దొమ్మరి ఆటే అయినా అందులో కవితా రసం చిప్పిల్లక పోయినా అది ఒక మేధో ప్రదర్శన. దాని సామాజిక ప్రయోజనం గురించి కాదు మనం చర్చించుకుంటున్నది. అది జెమినీ సర్కస్సే అయినా కూడా అందులో అందరూ పాల్గోలేరే? ఆ విద్యా ప్రదర్శనని అందరూ చేసెయ్యలేరే? ఆ “వీటి విద్యకి” కూడా దానిదే అయిన పరిమితీ ప్రయోజనమూ ఉన్నాయి. ఈ స్పష్టత దానిని గురించి చర్చ చేసేవారికీ దానిని విమర్శించే వారికీ దానిని అర్ధం చేసుకుని విశ్లేషణ చేసేవారికీ ఖచ్చితంగా ఉండాలి మరి.
అవధానాలలో వారు కవిత్వం చెప్పుతున్నట్టు మాట్లాడినప్పుడు మాత్రమే మీరన్న ఇటువంటి మాటలకి చోటు. కాని అది కేవలం “పామర” రంజన కోసమే అయినా అప్పుడు కూడా అది ఒక కళే! దానిని సైతం అందరూ చేయలేరు. దానికి పద్య విద్యలోని మెలకువలు తెలియాలి. సమయస్పూర్తి ఇత్యాదులు అవసరం! ఒక పక్క తెలుగు భాషే అనేకానేక పరిణామాలలో గిరిగిళ్ళు తిరుగుతూ ఉంటే ఆ అవధానాలు అన్నవి ఏవో అందరూ చేసేయగలిగినట్టు, అదేమంత బ్రహ్మ విద్య కానట్టు దానిని బహిష్కరించేటంతటి తీవ్రతని చూపనఖ్ఖరలేదు. వీరేశలింగంపంతులు గారు ఒక పాపులర్ ఆర్ట్ గా దానిని ప్రదర్శించబోయి దాని పట్ల విసుగొచ్చి మానేసి ఉండొచ్చు. దానిని” దొమ్మరి ఆటగా” చెప్పిన చెళ్లపిళ్ల కవిద్వయం (ఇవాళ్టి యెన్నారైలు అమెరికాకి టికెట్టు ఇస్తే నాలుగు డబ్బులకోసం అవధానులు వెళ్ళినట్టే…) ఆనాడు “నానారాజ సందర్శనం” చేసుకుంటూ ఆ విద్య ద్వారానే నాలుగు డబ్బులు గడించుకునే పని చేశారు మరి.
మనం వినోదం కోసం అని సర్కస్ చూసేందుకు పోమా? కానీ మనకి మనమే ఆ గెడ మీదికి ఎక్కి అదుపు తప్పకుండా నాలుగు అడుగులు వేయలేమే? ఆ అడుగులు వేసే అమ్మాయి కూడా సంవత్సరాలు శిక్షణ చేస్తేనే వచ్చిన వారికి ఇంత సంరంభాన్ని పంచగలదు. అందువలన మనం చేయలేని ఆ “దొమ్మరి ఆట” కూడా ఒక కళే. అక్కడ గడసానులున్నట్టే ఇక్కడ అవధానులూ ఉన్నారు అనే అనుకోండి పోనీ!! (ఆ గడసానులు) అదే ఆ అవధానులు ఆనాడు పంతులుగారు, వేంకటశాస్త్రి గారూ కావొచ్చు. ఈనాడు మరొకరు కావొచ్చు. దానివల్ల ఆనందం పొందే వారున్నారు కదా? అందులో “పండితులూ” “కవులూ” “మేధావులూ” లేకపోతే అక్కడ కూర్చుని ఆ అక్షర విన్యాసానికి అబ్బురపడుతూ వాటిని వీక్షించే వారికి కలిగే ఆనందానికి వచ్చే లోటేమీ లేదే? అలాంటప్పుడు ఆ “కవులూ మేధావులూ” వాటి పట్ల అంత గాఢమైన అసహనాన్ని మాత్రం ఎందుకూ కలిగి ఉండడం?
తెలుగులో ఎక్కాలూ కిందినించి పైకి అప్పచెప్పే వాళ్ళున్నారు. ఇంగ్లీషులో స్పెల్లింగులు చెప్పే వాళ్ళున్నారు ఒక్క తప్పు రాకుండా. అలాంటి వాళ్లకి మీ అమెరికాలో డాలర్లలో ప్రైజ్ మనీలు సైతం ఉన్నాయి. వాటికి ఇంగ్లీషులో మెప్పు కూడా ఉంది. రష్యాలో జిమ్నాసిజం ఎంతో ఆదరణ ఉంది. మరి అలాంటి ఒక పనిని భాషని వాహికగా వాడుకుని “పామరులని” రంజింపజేయడానికే అనుకుందాం పోనీ, ఆ అవధాని గనక ప్రయత్నిస్తే దాన్లో ఎవరికైనా ఏమిటీ ఇబ్బందీ? ఒక సర్కస్ చూసినట్టే ఒక అవధానాన్నీ చూడండి. ఆ కళ “మనలాంటి వాళ్ళకోసం కాదు” అని అనుకునే “మేధావులు” వెళ్ళకండి. అంతేగానీ అవధానాలలోని అక్షరాల గారడీ మీద “మేధావులకి” దేనికీ వైరం? అవధానులనీ వారి విద్యనీ ఎకసెక్కెం చేసి “అబ్బే అందులో ఏముందీ” అని అనుకునే ముందు, “నేర్చుకుని అందరూ ఆ అవధానాలని చేసేయగలరని” రాసేసే ముందు .. అసలు అలాంటి ఒక విద్య కేవలం తెలుగులోనే ఉందనీ అది తెలుగు భాషకి మాత్రమే సాధ్యమైన ఒక అక్షరాల గారడీ అని కూడా గుర్తించండి.
ఒకనాడు ఎంతో ఘనత వహించిన విప్రవినోదుల విద్యలు ఆదరణ లేకనే కదా కనుమరుగై పోయాయి! అలాగే ఎవరూ పట్టించుకోకపోతే ఈ అవధానాలూ కొద్ది కాలానికి కొట్టుకు పోవచ్చు. సూడో వెస్ట్రన్ ప్రభావంతో వాదనలు చేసుకుంటూ ఒక విద్యని పోగొట్టుకుని ఎవరైనా సాధించేది ఏముందీ? నిలుపుకోవడంలో గొప్పదనం ఉంది గానీ? ఆదరించడంలో ఘనత ఉందిగానీ! ఇలా మహా ఘనమైన పని చేసినట్టూ విద్యల్ని ఎగతాళి చేసే “మేధావుల” కన్నా విద్యల్ని తమదైన రీతిలో నిలుపుకునే “పామరులు” గొప్పవాళ్ళు కాదా? అలాకాదూ పోనీ అంతకన్నా మేలుగా ఆ విద్యని తీర్చి దిద్దుకోవడం ఎలాగో దాని గురించి ఆచరణ లో చేసికదా చూపాలీ? ఎప్పుడైనా ఒక మెరుగైన విమర్శ వలన ప్రయోజనం ఉంటుంది గానీ నిస్సారమైన విమర్శ వలన ఒక కళకీ మేలు లేదు. విద్యకీ లేదు. భాషకీ లేదు. అలాంటి విమర్శ దృష్టిలో వ్యతిరేకమైనది. దానివలన ఒరిగేదేమీ ఉండదు ఎవరికైనా!! ఆలోచించి చూడండి మీరు కూడా ఏ ధోరణి మంచిదో!!
రమ
ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/30/2012 12:46 am
సామెతల ఆమెతల ప్రస్తావనలు మీకే కాదు కేవీయెస్ రామారావు గారూ!! అది మీలాగానే తెలుగు భాష వచ్చిన వారికందరికీ తెలుసు. మీ నోటి జోరు చెబుతున్నది మీకు వచ్చిన అసహనం వెనక మీరు చేసిన హేళన ఎంతగా మీకు స్వాభావికమో !! అలాంటివి మీకు బహుశా సహజం కావొచ్చును. మీ వ్యాసం మీద ప్రతిస్పందించేందుకు కుదరదని ఈమాట వారు ఏమీ చెప్పలేదు గనక పాఠకురాలిగా నేను నాకు అనిపించిన సంగతులని రాసేను. మీవ్యాసం ప్రచురించేరూ అంటేనే దాని మీద మిగిలిన వారికి కలిగిన భావాలని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని. అయితే అవి మీకు నచ్చినట్టో… లేదా మీకు కావలసినట్టో ఉండvu కద? మీరు విమర్శని తీసుకోలేని అతి సున్నితమైన వారైతే అందుకు పాఠకులు ఏమి చేయగలరూ?? నా విమర్శ నా మాటలూ మీకు ఎలాగ అర్ధం అయ్యేయో అది మీ భావనలకి మీ సంయమనానికీ సంబంధించినది. ప్రతీ వ్యాఖ్యకీ ఒక సందర్భం ఉంటుంది. మీ వ్యాసమూ అక్కడే ఉంది. నా అభిప్రాయమూ అక్కడే ఉంది. కదా? “ఉలుకు” అంతగా మీరు పడనవసరము లేదు. నేను ఉన్న మాటే అన్నాను.
ఇంక నేను- కవిత్వమూ వగైరాలు అందరికీ నేర్చుకుంటేనే పట్టుబడతాయని విష్ణుభొట్ల లక్స్మన్న గారన్న మాట మీద నా అభిప్రాయంగా నా జవాబు లో స్పష్టం గానే చెప్పాను. లక్ష్మన్న గారి వ్యాఖ్య మీద అది నా అభిప్రాయం. దాని పట్ల మీ “ట..” లతో మీరు ఏవేవో వదిరితే అది మీ స్వభావాన్ని చెబుతుందే తప్ప మరింకేం కాదు. అటువంటి నీరసమైన జవాబుని నేను లక్ష్య పెట్టను. నాకు విషయం ముఖ్యం. అన్ని “విద్యలూ అందరికీ అబ్బవు.” ఇది వాదనతో తేలే సంగతి కాదు. మీరు దీన్ని నిరూపించదలుచుకుంటే వ్యాసాలు రాయడం మాని ముందు దాన్ని నిరూపించడానికి ఆ అవధానాలేవో చేసి చూపండి. అప్పుడు కదా తెలిసేది అది అందరూ చేయగలరో లేక అది కూడా కొందరు మాత్రమే చెయ్యగలరో!! ఇందుకు ఈ మిగిలిన మాటలెందుకూ? నేను నమ్మడం లేదు అన్ని కళల్నీ లేదా అన్ని “విద్యల్నీ” అందరూ చేయగలరూ “నేర్చుకుని” అని. కాని దాన్ని మీరు నమ్ముతున్నారు కదా? అందుకే కద ఆ వ్యాసం రాశారు. మరి మీరు వెనకాడ్డం దేనికీ మీ మాటల్ని నిరూపించుకోవడానికీ?? మేము కూడా ఎదురు చూస్తాం అమెరికాలో ఉన్న ఆ ఒక చిన్న తెలుగుదేశాన తయారు కాగల ఒక మేలైన అవధాని కోసం!! ఆయన చతురతా ఇంకా అందులో తొణికే ఆ సమయస్పూర్తిల కోసం! ఆయన నోట చిందబోయే ఆ భాషా పాటవం కోసమూను. కానివ్వండి మరి.
ఇంక, ఆ గురివింద సామెత అదేదో అది ఈ సందర్భంలో మీకే ఎక్కువ అతికినట్టు ఎక్కడా మీకు తెలియకపోవడం ఇంకా హాస్యాస్పదం కాదూ! మాటలు విలువైనవి. ఎప్పుడైనా వాటిని జాగ్రత్తగా వాడండి.
రమ.
ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/29/2012 1:28 pm
నాకు స్పష్టంగా అర్ధం కాని అనేక అంశాలలో ఇదీ ఒకటి లక్ష్మన్న గారూ!! “అమెరికా సందర్శన భాగ్యం”?? నాకు తిరుపతి వేంకట కవులన్న మాట “నానా రాజ సందర్శనం” గుర్తుకొస్తోంది. ఆ నానారాజ సందర్శన “భాగ్యాన్ని” ఇవాళ్టి ఈ యెన్ ఆర్ ఐ సంస్థలూ వ్యక్తులూ కాని ఆక్రమించలలేదు కదా ?? 🙂 రామారావు గారి గొంతు ఆ వ్యాసంలో ఒక హేళన ధ్వనితోనే ఉన్నదని ఒక పాఠకురాలిగా నేను చెప్పగలను. అదే నాకు అభ్యంతరకరం. ఇంక ఎవరో ఒకానొక అవధాని చేతల మీదా దాని పర్యవసానం మీదా మనం దానిని అవధాన విద్యకి అనుసంధానంగా చూడకూడదని అనుకుంటాను. మనం ఒక కళని ఒక కళగా మాత్రమే చూడాలి. అంతవరకే విమర్శకుని బాధ్యత. వ్యక్తుల మీద కలిగిన కోపాన్ని లేదా ఏహ్యతనీ ఆ కళారూపం మీద చూపడం సరి అయినది కాదు.
ఇంక “సంగీత సాహిత్యాలు కొందరికి మాత్రమే పట్టుబడతాయి అన్న వాదనను ఖండించడానికి” ఈ మీ మాట సైతం కేవీయెస్ రామారావు వ్యాసం లోని గొంతు లాగానే ఉంది. 🙂
నేను సంగీత సాహిత్యాలు అందరికీ పట్టుబడేవి కావని నమ్ముతాను. అవి నేర్చుకుంటేనే అబ్బేవి కావు కూడాను. పూర్వ జన్మ సుకృతమో కాదో నాకు తెలియదు గానీ 🙂 అందరూ ప్రయత్నం చేసేస్తేనే కవులూ గాయకులూ మాత్రం అయిపోలేరు. అలాగే విమర్శకులు కూడా! అది వ్యక్తిలో అంతర్లీనంగా ఉన్న ప్రజ్ణ, లేదా ప్రతిభకి సంబంధించిన విషయమే!! మనం ఒప్పినా మానినా ఇది నిజం!! మనకి నచ్చినా నచ్చకున్నా కూడా ఇది నిజం!! అందరూ పోటీపడితేనే అబ్బేవి కావు కళలూ కవిత్వాలూ సంగీతాలూను. అలా ఎవరన్నా భావిస్తే దానిని ఒక ఉడుకుమోతుతనం గానూ ఒక అసూయాపరత్వం గానూ మాత్రమే అనుకోవాలి తప్ప యదార్ధంగా నిరూపించలేము. అదే నిజమైతే తెలుగు దేశానా ఈ పాటికి అల్లసాని పెద్దనలూ కృష్ణ శాస్త్రిలూ పుంఖాను పుంఖంగా తిరుగుతూ ఉండేవారే 🙂 యుగానికి ఒక మహా కవి ఉదయిస్తాడు. సూర్యుని లాగే!! మిగిలిన వారు ఆ చాయాపహారులు మాత్రమే!!
ఇంక అవధానుల మీద కలిగిన కోపాన్ని అవధాన విద్య మీదికి మళ్ళించుకోవడం అర్ధం లేని పని. “రోషము కల్గినన్ మమ్ము గెల్వుడు” అన్న చెళ్లపిళ్ల కవుల పద్యమే అవధాన విద్యా గరిడీలో విసిరిన సవాల్! అలాంటి సవాల్ విసరకల్గిన అవధానులు ఇవాళ లేకపోతే అది అవధానుల సమస్య కానీ ఆ విద్యది కాదు. ఇంక అమెరికాకి ఆహ్వానాలూ వారికి “అబ్బిన” లక్ష్మీ కటాక్షాలూ వారిని పిలిచిన వారికి తెలిసిన విషయాలే!! అదేమన్నా సంభావనలా?? వారు [అవి ఎలా చేసినా సరే :)] అవధానాలు చేయించుకుని మెచ్చి ఇచ్చిన కానుకలే కదా?? అంత సునాయాసమైనదే అయితే ఆటాలూ తానాలూ ఆయా అవధాన్లని పిలవడం దేనికీ?? వారిలో ఎవరో ఒకరు అవధానాలు మొదలెట్టి అందరూ సునాయాసంగా అవధానం చేయవచ్చును అని నిరూపించి ఉండవచ్చును కాదా?
రమ.
ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
11/28/2012 2:48 pm
ఈ వ్యాసావళి రాయటం వెనుక, అప్పటి “ఈమాట” సంపాదకులమైన మా మధ్య జరిగిన చర్చల మూలంగా ఏ పరిస్థితుల్లో ఈ వ్యాసాలు రాయటం జరిగిందో ఇప్పుడు చెప్పటం అప్రస్తుతం కాదనుకుంటాను!
సుమారు 1980 దశాబ్దం మొదలు అమెరికాలో జరిగే తెలుగు సభల్లో అవధానాల జోరు ఊపందుకున్నాయి. అవధానులకు అమెరికా సందర్శన భాగ్యమే కాక లక్ష్మీ కటాక్షం కూడా దండిగా ఉండేవి. ఈ సందర్భంగా మా మిత్రుల మధ్య వచ్చిన సందేహం – “ఎందుకు అమెరికా తెలుగువారు అవధానాలపై ఇంత ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు?
ఈ ప్రశ్నకి సమాధానాలు ఎలా ఉన్నా, అవధానాలు చెయ్యటం బ్రహ్మ విద్య కాదు అన్న వాదన ఈ వ్యాసాలకు మూల కారణం. తెలుగు పద్య సాహిత్యంలో లోతైన అవగాహన లేని నాకు ఈ వాదన ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికే మేము “ఈమాట” పత్రికను స్థాపించాం! మరి అవధానాలు చేయటం అంత బ్రహ్మ విద్య కాకపోతే – అది ఎంత సులువుగా చెయ్య వచ్చో నిరూపించండి అన్న నాలాంటి మిత్రుల సవాళ్ళకి సమాధానమే ఈ వ్యాసాలకి మూలం అని నాకు గుర్తు.
నిజానికి తిరుపతి వేంకట కవులంతటి సాహితీ వేత్తలు, అవాధాన ప్రక్రియను దొమ్మరి ఆటతో పోల్చిన విషయం తెలుగు సాహితీ ప్రియులకు పరిచయమయే ఉంటుంది! ఈ వ్యాసాల్లో హేళణ ధ్వని కన్నా, తెలుగు పద్యరీతుల్లోని చిన్న మెళకువలు నేర్చుకుంటే ఎంత సులువుగా అవధానం చెయ్యవచ్చో చెప్ప ప్రయత్నించారు వ్యాసకర్త.
ఇటువంటి ప్రయత్నమే సంగీతం విషయంలో కూడా జరిగింది. ఈ మధ్యే అకాలమరణం చెందిన శ్రీ రోహిణీప్రసాద్ రచించిన సంగీతపరమైన వ్యాసపరంపరలకు కూడా ఇదే ధోరణి మూలం. అంటే, సంగీత – సాహిత్యాలు కొందరికి మాత్రమే పట్టుబడతాయి. మిగిలిన వారికి పూర్వజన్మ “సుకృతం” ఉంటే కాని పట్టుబడవు అన్న వాదనను ఖండించటానికి చేసిన ప్రయత్నాలే – ఈ సాహిత్య, సంగీత వ్యాసాలు.
అంతేకాని ఒకరిని కించపరచాలన్న దుగ్ధ ఈ వ్యాస రచయితకి ఉందని నేను అనుకోను.
చివరిగా ఒక సంగతి. అమెరికాలో అవధానాలు చేసి, అమెరికా తెలుగువారు తమ నెత్తి మీద పెట్టుకున్న ఒక అవాధాని అమెరికా తెలుగు ఆడపడుచుపై చేసిన అప్రాచ్యపు పనికి చావు తప్పి కన్ను లొట్టపోయి ఆ అవధాని తిరిగి ఆంధ్రదేశం చేరుకున్నాడు. ఇది మటుకు నిజంగా జరిగిన నిజం.
విష్ణుభొట్ల లక్ష్మన్న
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి kavita గారి అభిప్రాయం:
11/13/2012 11:37 pm
కథ చాల బాగుంది. అవును, సుబ్బారావు గారు చెప్పినట్టు మెచ్చుకుంటే బాగుండేది. కాని మెచ్చుకోడు. ఆ పాత్ర స్వభావం అలాంటిది. రచయితకు ధన్యవాదాలు, చక్కని ముగింపు.
స్వప్నభంగం గురించి prasad గారి అభిప్రాయం:
11/05/2012 9:53 am
పదాలు అర్ధమవుతున్నాయి. కాని భావం మాత్రం తెలియడం లేదు.
శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి Sowmya గారి అభిప్రాయం:
10/31/2012 3:51 pm
>> ‘శర్మిష్ఠ‘ (హైదరాబాదు కేంద్రంలో 1960 ప్రాంతంలో మరల రికార్డు కాబడినది. 1942 ప్రాంతంలో ప్రసారితమైన శ్రవ్య రూపకం మనకి ఈనాడు లభ్యం కాదు)
– అయితే అదే శర్మిష్ఠ నాటకానికి రెండు వేర్వేరు సమయాల్లో రజనీగారూ, విశ్వనాథం గారూ సంగీతదర్శకత్వం వహించారా?
ఇవ్వాళ రజనీభావతరంగాలు పుస్తకం చదువుతూంటే అందులో ఆయక “కృష్ణ-రజని” అన్న వ్యాసంలో “రజని సంగీతంతో తయారయి ప్రసారమైన కృష్ణశాస్త్రి తొలి సంగీత నాటకం శర్మిష్ఠ” అనీ, అది 1941 మార్చి 23న మద్రాసు కేంద్రం నుంచి ప్రసారం అయిందని రాశారు.
ఇటు నేనే – అటు నేనే గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
10/17/2012 12:30 pm
నా వ్యాఖ్య పానకంలో పుడకలా అనిపించొచ్చు కాని కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, కవితలోని “ఆచార్య సోమనాథ” ఎవరు? చుక్క గుర్తు పెట్టి మరీ యిస్తే ఆసక్తి కలిగింది.
మస్తానీ గురించి pavan santhosh surampudi గారి అభిప్రాయం:
10/14/2012 10:29 am
బాజీరావు-మస్తానీల అపురూప ప్రణయగాథ ఉత్తరభారతదేశవాసులకు పరిచయం ఉన్నంత దక్షిణాత్యులకు తెలియదు. కాని ఇదొక అపూర్వగాథ. అతను యుద్ధరంగంలో పోరాడిన ప్రతి పోరూ గెలిచిన జగదేక వీరుడు ఆమె అలౌకిక సౌందర్యం మూర్తీభవించిన అతిలోకసుందరి. నిజానికి ఈ గాథ షాజహాన్ ముంతాజ్ ల ప్రణయాన్ని మించి ప్రాచుర్యం పొందవలసింది. ఇద్దరి పరిణయాన్నీ చాలా చక్కగా వర్ణించారు.
రచయితలకు సూచనలు గురించి pavan santhosh surampudi గారి అభిప్రాయం:
10/14/2012 10:11 am
గత కొన్నాళ్ల నుండి ఈమాట చూస్తున్నాను. తెలుగు ప్రింట్ మీడియాలో గాని అంతర్జాలంలొ కాని ఈమాటకి సరితూగగల సాహిత్య పత్రిక లేదని నా అభిప్రాయం. ప్రత్యేకంగా నాకు ఇది ఒక నిధిలా ఉంది. పాత సంచికల ఖజానా ఎంత చదివినా మరిన్ని ఆణిముత్యాలు దొరికి నన్ను మురిపిస్తొంది.
వేనవేల ధన్యవాదాలతో,
సూరంపూడి పవన్ సంతొష్,
తాడేపల్లిగూడెం.
జీనో పేరడాక్సు గురించి తఃతః గారి అభిప్రాయం:
09/23/2012 9:56 am
కామేశ్వరరావు అభిప్రాయం”దీని వల్ల తెలుసుకోవలసిన నీతి: మాంత్రికుడితోనైనా పెట్టుకోండి కాని ఎప్పుడూ మేథమెటీషియన్ తో పెట్టుకోవద్దు! ”
కామేశ్వర రావు గారూ మీరాస్లోవ్ హొలూబ్ కవిత చెప్పన నీతిగూడా మహారాజశ్రీ మాంత్రికుడు గారూ పిల్లవాడైనా మథమాటిషియన్ తొ పెట్టు కొవద్దనే. మీరు డొమైన్ మార్చి ఆ బడి పిల్ల వాడికి తెలిసిన దాని కన్నాపెద్దలైన గణిత శాస్త్ర వేత్తల ను ఉట్టంకిస్తూ చెపుతున్న నీతి కూడా అదే. “ఆ మాయా జాలం తెలియాలంటే ” అని అంటం లొ మీరు మాంత్రికుణ్ణి సమర్ఢిస్తున్నారేమో నని భయం వేసింది. కాంప్లెక్స్ వేరియబుల్ మాంత్రికునికి తెలిస్తే ఆయన్ను అందులోనే ఓడించవచ్చు ఎందుకంటె అతని ప్రవృత్తి జాలం గానీ శాస్త్రం కాదు కాబట్టి. Thank God, you even with your counter example supported the spirit of Miroslav Holub’s poem.
నీతిని కొద్దిగా విస్తరిస్తే మాథమాటీషియన్ తొ నైనా పెట్టు కొవచ్చేమో గానీ అప్లయిడ్మాథమాటీషియన్ తొ అసలు పెట్టుకో కూడదు.
రిగార్డులతో
తఃతః
జీనో పేరడాక్సు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
09/23/2012 7:04 am
“అప్పుడు ఒక బడి పిల్లాడు “ఒకటికి మించిన విలువను Sine ఫంక్షన్ కి ఇవ్వగలిగిన తీటా ను సృష్టించమని అడుగుతాడు.”
పాపం ఆ మాంత్రికుడికి లెక్కలు బాగా రావు కాబట్టి ఓడిపోయాడు! Sin విలువ ఒకటికన్నా ఎక్కువయ్యే సంఖ్యలున్నాయి. అనంతం ఉన్నాయి! 🙂 ఆ మాయాజాలం తెలియాలంటే ఇది చదవండి:
దీని వల్ల తెలుసుకోవలసిన నీతి: మాంత్రికుడితోనైనా పెట్టుకోండి కాని ఎప్పుడూ మేథమెటీషియన్ తో పెట్టుకోవద్దు! 😉
ఛందస్సులో గణితాంశములు గురించి మోహన గారి అభిప్రాయం:
09/19/2012 8:52 pm
కామేశ్వర రావు గారు, మీరు తెలియజేసిన విషయాలకు కృతజ్ఞుడిని.
భ ర త నగ నల సలంబులు
వరుసనె యియ్యాఱు లెన్న వాసవ గణముల్
మరి న హము లిన గణంబుల్
సరవిం దక్కినవి యెల్లఁ జంద్ర గణంబుల్
– రేచన కవిజనాశ్రయము, సంజ్ఙాధికారము
మనకు దొరికిన తెలుగు ఛందోగ్రంథాలలో కవిజనాశ్రయము ప్రాచీనమైనది. పోతే ఎంత ప్రాచీనమైనదో తెలియదు. దీని కర్త 11వ శతాబ్దపు వాడంటాడు. ఇతడు తప్పక నన్నయ, నన్నెచోడుల పిదప వాడు (ఈ విషయాలను కొన్ని నా క్రౌంచపద వ్యాసములో వివరించి యున్నాను). కాని ఎఱ్ఱనకంటె ముందు వాడు (మధ్యాక్కఱ యతి). అంటే సుమారు 12వ శతాబ్దానికే సూర్యేంద్ర గణములు బ్రహ్మ విష్ణు గణములకన్న భిన్నమైనదని కవిజనాశ్రయము ద్వార మనకు విదితమైనది. సంగభట్ల నరసయ్యగారు చెప్పిన విధముగా సూర్యేంద్ర గణములు 14వ శతాబ్దము నాటిదంటే, కవిజనాశ్రయము ఎప్పుడు వ్రాయబడినది అనే ప్రశ్న ఉదయిస్తుంది. అదియును కాక భీమన ఛందము అని కూడ పిలువబడే కవిజనాశ్రయమునకు, తరువాత వచ్చిన అనంతుని ఛందము అని పిలువబడే ఛందోదర్పణమునకు మధ్య అంతరము అంత ఎక్కువగా ఉండదు. కాని యతుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతుని ఛందము ఒక రెండు శతాబ్దముల పిదప వ్రాయబడినదని భావించవచ్చును. నా ఉద్దేశములో నన్నయ నాటికి బ్రహ్మ, విష్ణు గణాలు, సూర్య ఇంద్ర గణాలు రెండు ఉండి ఉన్నా, తెలుగులో ఎక్కువగా సూర్యేంద్ర గణాలే వాడబడ్డాయి. అదియునుగాక పంపకవి వ్రాసినట్లు చెప్పబడే తెలుగు సీస పద్యాలలో సూర్యేంద్ర గణాలే ఉన్నాయి.
ఈ బ్రహ్మ విష్ణు గణాలు కూడ చాల ప్రాచీనమైనవి. సుమారు క్రీస్తు శకము 700 నాటికే బాదామి శాసనములో ఉండే కన్నడ త్రిపదిలో ఈ గణాలు వాడబడ్డాయి. మనకు లభ్యమైన కన్నడ పద్య శాసనములలో ఇది ప్రాచీనమైనది. అంటే ఆఱు, ఏడవ శతాబ్దముల నాటికే దేశి ఛందస్సు కన్నడములో నుండినది. సుమారు ఏడవ ఎనిమిదవ శతాబ్దపు ద్విపదలను పోలిన తెలుగు పద్య శాసనాలలో కూడ సూర్యేంద్ర గణములే వాడబడినవి, బ్రహ్మ విష్ణు గణములు కావు. అంటే ఈ రెండు భాషల మధ్య దేశి గణాలలో ఈ చీలిక నన్నయకంటె కొన్ని శతాబ్దాలకు ముందే ఉండినవి అన్నది నా ఉద్దేశము.
సాగించి పాడే గణాలకు ఒక పేరు కూడ ఉన్నది. చివర వచ్చే సూర్య గణములవంటి గణములను పద్మ గణములు అంటారు. అలా పొడిగించి పాడవలయు నన్నప్పుడు, దానిని ఒక S గుర్తుతో చూపిస్తారు. ఈ పద్మ గణములను గురించి నేను ఐదు సంవత్సరాలకు ముందు ఇక్కడ వివరించి యున్నాను.
విధేయుడు – మోహన
విలువలు: కథ నచ్చిన కారణం గురించి తః తః గారి అభిప్రాయం:
09/18/2012 11:35 am
ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు బసవ రాజు గారు. ఆయన సమవయస్కులైన సహాధ్యాయులైన ఇతర ఉపాధ్యాయులతో వాళ్ళ విద్యార్థి రొజుల్ని “మనం చదువుకోని రోజుల్లొ” అని గుర్తు చేసేవారు.
తఃతః
పురూరవ: శ్రవ్య నాటిక గురించి A R K NEOGI గారి అభిప్రాయం:
09/15/2012 2:59 pm
పురూరవ శబ్ద నాటకం రేడీయోలో ఏ సంవత్సరమో గుర్తు లేదు కాని ఇటీవల నా కజిన్ ఇచ్చిన cd ద్వారా viన్నాను. శ్రీమతి శారాద శ్రీనివాసన్, ఛిరంజీవి గార్ల నాటకంలో సంభాషణలు నన్ను ఏదొ వూహలొకాల లోకి తీసుకు వెళ్ళింది.
a r k neogi
secunderabad
కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
09/10/2012 6:37 pm
పోయిన ఏడే రోహిణీ ప్రసాద్ గారు న్యూయార్క్ కి వచ్చినప్పుడు కలవడం జరిగింది. ఆరోగ్యం గా ఉషారుగా ఉన్నేరు. ఇక్కడ హిందుస్తాన్నీ సంగీతం, సినిమా సంగీతం గురించి ఒక చిన్న సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఒక కీ బోర్డు ముందర పెట్టుకుని పాడుతూ, మాట్లాడుతూ, విపులీకరిస్తూ దాదాపు మూడు గంటల సేపు శ్రోతలని అలరించారు. మళ్ళా ఇండియా కి తిరిగిపోయేప్పుడు వస్తానన్నారు, కానీ రాలేకపోయేరు. ఇప్పుడిక ఎప్పటికీ రారు.
ఒక గొప్ప వ్యక్తికి కొడుకుగా వుండటం లో ఒక పెద్ద సమస్య వుంది. నాన నీడలోనుంచి బయటకు రావడం చాలా కష్టం. అది కూడా కుటుంబరావంత గొప్ప మనిషి నీడ నుంచి బయటపడి, తనకు తనుగా తన పేరు నిలబెట్టుకోవటం ఒక గొప్ప విషయం. సైంటిస్టుగా, సితార విధ్వాంసుడిగా, ఒక హేతువాదిగా, రచయితగా, సంగీతాన్ని, సైన్సు ని పామర లోకానికి పరిచయం చేసిన ఒక గొప్ప మనీషి శ్రీ రోహిణీ ప్రసాద్ గారు.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి మోహన గారి అభిప్రాయం:
09/08/2012 12:03 pm
హితుడు, స్నేహితుడు రోహిణీప్రసాద్ గారి ఆకస్మిక మరణము విభ్రాంతి కలిగించినది. హిందూస్తాని సంగీతముపైన, గాయకులపైన సామాన్య పాఠకలోకానికి అర్థమయ్యేటట్లు వ్యాసాలను వ్రాసినారు వారు. విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞులకు మాత్రమేకాక జనసామాన్యానికి తెలుగులో అందజేయాలని కృషి చేసినారు వారు. కుటుంబరావుగారి శతజయంత్యుత్సవ సందర్భముగా వారిని డిట్రాయిటులో ఒక మారు కలిసి సంభాషించినది నా మధుర స్మృతులలో ఒకటి. వారితో కలిసి ఒక వ్యాసము వ్రాయాలని అనుకొన్నఆశ ఈడేరక ఆలాగే ఉండి పోయినది. వారి ఆత్మ శాంతిల్లు గాక! విధేయుడు – మోహన
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Aruna గారి అభిప్రాయం:
09/06/2012 11:30 pm
ఇక్కడ అంతా పెద్దవారు సంగీత జ్ఞానం ఉన్నవారు మాట్లాడుతున్నారు. నాకు పెద్దగా సంగీత జ్ఞానం లేకపోయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. త్యాగరాజు, అన్నమయ్య ప్రస్తావన వచ్చింది, మరి వారు రచించినవి భగవంతుని కీర్తిస్తూ, పొగుడుతూ, తెగుడుతూ కూడా వ్రాసారు. శాస్త్రీయ సంగీతం లో దాదాపు ౯౦% రచనలు భక్తి సంప్రదాయాన్ని అనుసరించి ఉన్నవే. మరి అందులో భావము వదిలేస్తే పరిపూర్ణత ఉంటుందా? నేను చిన్నప్పుడు వీణ ఒక తమిళ్ టీచర్ దగ్గర నేర్చుకున్నాను. ఆమెకు తెలుగు రాదు కాని తెలుగు లోనే వ్రాసి ఇచ్చేవారు. కాని ఏ రోజు పాడనే లేదు.అర్ధం కూడా చెప్పలేదు. ఏమైనా చెప్పినా అర్ధం అయ్యే వయసు కాదు కూడా. ఇప్పుడు మల్లి ౩౫ వస్త్రాల తరువాత సంగీతం ఒక తమిళ్ టీచర్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఆమెకు తెలుగు వాళ్ళంటేనే చిన్న చూపు. ఆమె దగ్గర ఉన్న తెలుగు వాళ్ళకి కూడా అదే ఉద్దేశ్యం. సో వాళ్ళు ఆమె ఏది నేర్పితే అదే కరెక్ట్ అనే రకం. కాని ఏమైనా సాహిత్యంలో దోషాలు ఉంటే సరి చేస్తే నచ్చదు.
నాకు భావముతో కూడి పాడితేనే తృప్తి. లేదంటే ఏదో ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ తో పాడించవచ్చు కదా? భగవంతుని నామ స్మరణ మనస్పూర్తిగా అవగాహనతో చేయటం వేరు, కాసేట్ ప్లే చేయటం వేరు కదా? అందుకే త్యాగరాజు, అన్నమయ్య వంటి వాళ్ళతో కంపేర్ చేయటం మంచిది కాదు. టెక్నికల్ ఎక్సలెన్స్ ఉండవచ్చు. కాని నాద ఉపాసకులు కావడం కష్టం.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
09/06/2012 2:28 pm
నండూరి పార్ధసారధి గారు శ్రీపాద పినాక పాణి గారిని చేసిన ఇంటర్వ్యూ ఆసాంతం చదివాకా నాకు అర్ధమైన విషయాలు ఇవి. సాహిత్యం గురించి తక్కువగా శ్రీపాద వారు ఏమీ అనలేదు. ఆయన ఆ మాటల్ని అన్న సందర్భం అక్కడ పూర్తిగా వేరు. సంగీతకారులకి రాగం పాడేటప్పుడు దాని మీద ఎక్కువ శ్రధ్ధ ఉంటుందే తప్ప ఆ రాగానికి సహాయకారిగా ఉన్న అక్షరాల మీద ఏమాత్రమూ కాదు అన్నది శ్రీపాద పినాకపాణి గారి భావన. ఇది కృతుల లోని సాహిత్యానికి సంబంధించిన విషయమే గానీ విడిగా సాహిత్యం మొత్తానికి గానూ లేదా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులని గురించి గానీ ఆయన చేసిన వ్యాఖ్య కాదు. అలాగే సాహిత్య ప్రేమికులైన వారి అన్నగారు సైతం కావ్య సాహిత్యాన్ని కవిత్వాన్ని గురించి అన్నది కాదది. వాగ్గేయకారుల రచనలని మాత్రమే ఆయన ప్రస్తావన చేశారు “సాహిత్యం” అని అన్నప్పుడు. ఆయనకి కూడా – గానం లోని రాగ స్వరూపమే ముఖ్యం అంతే! అందుకు ఉపయోగపడే అక్షర సముదాయం కాదు. అందుకే సాహిత్యానికి ఎంతో అభిమాని అయిన ఆయనే వారి అమ్మాయి “డుబుక్కు” 🙂 లని పాడుతూ ఉంటే ఏమాత్రమూ పట్టించుకోలేదు. అందుకు ఇబ్బంది కూడా పడలేదు. “వాగ్గేయకారుల రచనలలో కవిత్వం గురించి వెతకడం దండగ” అన్న అభిప్రాయాన్ని ఈ శ్రీపాద బ్రదర్స్ వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు.
అందువలననే త్యాగరాజు మంచి సంగీతకారుడే గాని మంచి కవి కాదు అని వారు అనుకున్నారు. ఇందులో అంతగా విబేధించవలసిన అవసరం నా వరకూ నాకేమీ కనిపించలేదు. చాలా సార్లు ఆయన రచనలని విన్నప్పుడు అది నిజమే కూడాను అని నాకు అనిపించినది సత్యమే! అయితే అక్కడ త్యాగరాజు గారి ప్రధాన ఉద్దేశ్యం కూడా తన సంగీతమే తన రామ భక్తే! ఆయన కవిత్వం రాస్తున్నానని బహుశా అనుకోలేదేమో? లేదా ఆయనకి శక్తి చాలకనే కవిత్వం రాయలేదో లేక సంగీతానికి అవసరమైనంత అక్షరాలని చాలు లెమ్మని అనుకునే రాయలేదో మనం ఇవాళ చెప్పలేకపోయినా, సాహిత్యం దృష్ట్యా చూస్తే మాత్రం త్యాగయ్య తప్పక కిందిశ్రేణి కవి గానే అనిపించక మానడు. ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను శ్రీపాద వారి అభిప్రాయం కేవలం కృతులలోని కీర్తనలలోని సాహిత్యం మాత్రమే! ఆయనకి ఒక గాయకునిగా తాను పాడే కృతిలోని సంగీతమే ముఖ్యం గానూ సాహిత్యం ఆ తరువాతిది గానూ అనిపిస్తే అందులో విడ్డూరం నాకేమీ కనిపించలేదు మరి.
అయితే ఇది వాగ్గేయకారుల అందరి రచనలలోనూ పూర్తిగా నిజమా? అందులో కవిత్వం ఉండదా అంటే చాలాసార్లు ఉండకపోవడాన్నే మనం గమనించవచ్చు. ఒక్క అన్నమయ్య మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే ఒక సాహిత్య స్వరూపాన్ని సంపూర్తిగా ఆవిష్కారం చేయాలీ అంటే అది సంగీతపు జంజాటం లేని పక్షం లోనే సాధ్యం అని కూడా మనం చెప్పవచ్చు. అందువలననే సంగీతం కోసం పాడుతున్నప్పుడు సాహిత్యం గురించి పట్టించుకోనవసరం లేదని వారు అనుకున్నదీ, అన్నదీను. ఈ రెండూ రెండు రకాలైన విషయాలు.
ఐతే మరి మనకెందుకని సంగీతం పాడేవాళ్ళు అక్షరాలని చిత్రవధ చేసి పాడుతున్నప్పుడు చెప్పనలవి కాని బాధ కలుగుతున్నాదీ అంటే తెలుగు భాష లోని వాళ్ళకి ఆ భాష మీద ఉండే మమకారం అత్యంత సహజం! మనం దాని ఉచ్చారణలో ఎటువంటి అపసవ్యతనీ సహించలేం! కష్టం అది మనకి. అయితే అది సంగీతం పాడేవారికి మాత్రం సమస్య కావడం లేదు. అక్కడ వారి దృష్టి వేరు. గాయకులుగా వారు రాగానికే బాధ్యులు గానీ అక్షరానికి కాదలుచుకోవడం లేదు. వాళ్ళకి సంగీతపు పానం చేయడంలో రాగపు రసం గ్రోలాలి. సాహిత్యాన్ని పిప్పిగా పక్కకి పడేయడానికి వాళ్ళు వెనకాడటం లేదు అని మనకి పినాకపాణి గారి మాటలు తెలియజేస్తున్నాయి అయితే ఇక్కడ మళ్ళీ ఒక తేడా చాలా స్పష్టం గానే మనముందుకి వస్తూంది. అదేమంటే ఈ ఉచ్చారణా రీతి తెలుగు వచ్చిన వారిలో ఒక తీరుగా ఉండి మళ్ళీ పరాయి భాష వారి గాత్రంలో అదే కృతి మరొక తీరున పలకడం. ఇందుకు మాతృభాష అయిన వారు మరీ అంతగా తప్పులని పలకలేకపోవడాన్నే మనం కారణంగా అర్ధం చేసుకోవాలి.
అయితే ఇక్కడ భక్తి అన్న అంశం కూడా అంతే ముఖ్యమైనది. ఆ రామ భక్తే తనని నడిపించకపోయి ఉంటే అంతటి త్యాగయ్య కేవలం సంగీతం కోసమే ఏవో కృతులూ వర్ణాలూ అంటూ అల్లేవారా? త్యాగయ్య సంగీతానికి మూలమైన రామ భక్తిని మనం తక్కువ అంచనా వేయలేము. అయితే మళ్ళీ భక్తి భావం వేరు. సాహిత్యపు స్థాయి వేరూను. మనం ఈ రెండింటినీ కలిపి చూడకూడదనే నేననుకుంటాను.
అందువల్లనే “సాహిత్యం కావాలని అనుకునే వాళ్ళు సంగీతం వినడానికి రావడం దండగ” అని పినాకపాణి గారు అక్కడ అలా అన్నది. అది బయటకి కొంత కరుకుగా వినిపిస్తున్నా వారి సంగీతపు పరిమితి లోని సాహిత్యానికి సంబంధించి అది అక్కడ సత్యమే మరి. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తూందంటే వారన్న “సంగీతమూ సాహిత్యమూ రసమూ పిప్పీ” లాంటి పోలికలని ఒక విస్తృతార్ధంలో మొత్తం సాహిత్యానికి కాక పరిమితమైన అర్ధంలో కేవలం సంగీత రచనల వరకూ మాత్రమే అని మనం అర్ధం చేసుకోవాలి. అప్పుడు శ్రీపాద వారి అభిప్రాయం పట్ల అంత కోప ప్రకటన సాహిత్యం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేయనవసరం లేదని తెలుస్తుంది.
అయితే గాయకులు ఎక్కువాను కవులు తక్కువానా? అన్నారు మోహన గారు. మోహన గారూ! పినాకపాణి గారి మాటలని మీరు మిగతా చోట్లకి అంతగా విస్తృతపరిచి చూడనవసరం లేదు. వారు మంచి కవులు అయినప్పుడు వారు ఏది రాసినా బహుబాగుగా రాయగలరు. అక్కడ అది ఏ చోటైనా ఏ ప్రక్రియ అయినా ఎప్పుడైనా కవిత్వానిదే పై చేయి అవుతుంది. అలాంటి రచనల విషయంలో శ్రీపాద పినాకపాణి గారు కాదు కదా ఎవరేమన్నా అది ఒప్పదు. అలాగే ఆ రాసే వారి లోని ప్రతిభ అందుకు తగిన స్థాయిలో లేదంటారా అక్కడ అక్షరపు ప్రభావం ఏమీ ఉండదు. ఇంక సినిమా రంగమూ అక్కడి పారితోషికాలూ సంగీతపు సాహిత్యపు తూనిక రాళ్ళు కానేరవు. సినిమా రంగాన వారు ఉత్తమ కవులనైనా తక్కువగా కొనగలరు. డబ్బులు వస్తాయని అనుకుంటే ఒక డబ్బా సంగీత దర్శకుని ముందు డబ్బులు కుమ్మరించనూగలరు.
కాకపోతే పినాకపాణిగారు అన్నమయ్య విషయంలో మాత్రం అన్నమయ్య అక్షరం గురించి సరిగ్గా తెలియక నోరు జారారనే అనుకోవాలి. పినాకపాణి గారికి తెలుగు భాషా సాహిత్యాల గురించేమీ అంతగా తెలిసినట్టు లేదు. అన్నమయ్య గురించి అంటూ “ఆయన అచ్చతెనుగు రాసేడు” అనో లేదా త్యాగయ్య అక్షరాన్ని గురించి చెబుతూ ” త్యాగయ్య సంస్కృతమూ తెలుగూ కలిపి రాసేడు” అనో అన్నమాటలు మనకి ఏమీ ప్రత్యేకంగా చెప్పవు. దానికీ అన్నమయ్య గారి కవితా బలానికీ ఏమి సంబంధం? అన్నమయ్య గారు తన పద్నాల్గు లైన్ల పదాలలో అంత గొప్ప కవిత్వాన్ని పలికించడం అన్నది తప్పకుండా ఆయన అసమాన ప్రతిభకి తార్కాణమే! అన్నమయ్యకి బహుశా తన భావ ప్రచారం ప్రధానమూ సంగీతం అటు తరవాతా అయి ఉండాలి. లేదూ సహజం గానే కల్పనాచతురుడై ఉత్తమ భావుకుడైన ఆయన పరిమితమే అయిన తన పద చట్రంలోనే కవిత్వాన్ని అంత అలవోకగా ఒలికించి ఉండాలి. అన్నమయ్య గారి సాహిత్యం విషయం లో మాత్రం శ్రీపాద పినాకపాణి గారి అభిప్రాయం అయోమయంగానూ కాస్త తొందరపాటుగానూ అపరిపక్వంగానూ మిగిలిపోతుంది.
రమ
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి మోహన గారి అభిప్రాయం:
09/05/2012 4:16 pm
తః తః గారు,
సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం.
నేను నా అభిప్రాయాన్ని క్రింది శ్లోకముపైన ఆధారము చేసికొని వ్రాసినాను –
సంగీత మపి సాహిత్యం
సరస్వత్యా స్తనద్వయం
ఏక మాపాత మధురం
అన్య దాలోచనామృతం
నా ఉద్దేశములో ప్రజలు ఎక్కువగా సంగీతాన్ని ఎందుకు ఆదరిస్తారంటే, దానిని వినేటప్పుడు సామాన్యముగా మరే ఆలోచన చేయనక్కరలేదు. కాని సాహిత్యపు సంగతి అలా కాదు. చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని కొద్దిగానైన ఏకాగ్రత చూపాలి. లేకపోతే ఏమి అర్థము కాదు. నా ఉద్దేశములో కవిత్వము పాడుటకు ఉపయోగపడేటట్లు మాత్రమే వ్రాయాలి. సంగీతము ఆ పాటలోని భావాన్ని బాగుగా బహిర్గతము చేయాలి. అప్పుడే ఆ సరస్వతీదేవికి సంతృప్తి కలుగుతుంది. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అంటే ఆ తల్లిని అవమానించినట్లే. విధేయుడు – మోహన
ఛందస్సులో గణితాంశములు గురించి మోహన గారి అభిప్రాయం:
09/05/2012 3:43 pm
కామేశ్వర రావు గారు, అక్షర గణాలకు, అంశ గణాలకు గణ మేరువు ఒకటే, అనగా గురువులు లేని వృత్తము, ఒక గురువుతోటి వృత్తములు, రెండు గురువులతోటి వృత్తములు, ఇత్యాదులు. అక్షరమేరువులో ఒక గురువుతోటి వృత్తములన్నిటికి మాత్రల సంఖ్య ఒక్కటే. ఆ వృత్తాలలో వాటి స్థానములు మాత్రము వేరు, అంతే. కాని అంశగణములలో అలా కాదు. బ్రహ్మ గణములు ఉండే రెండవ ఛందములో గురువులు లేనిది III, ఒక గురువుతో రెండు UI, IIU, రెండు గురువులతో UU. ఒక గురువుతో ఉండే రెంటికీ మాత్రల సంఖ్య ఒకటి కాదు. ఒకే మాత్రల సంఖ్యతో ఉండే సంఖ్యలను కలిపినప్పుడే మనకు విరహాంకుని (ఫిబనాచ్చీ) అంకెలు లభిస్తాయి. అందుకే ఒకే మాత్రల సంఖ్యలు గల వృత్తముల సంఖ్యలను వేరుపరచవలసి వచ్చింది. అంశ గణములకు అక్షరగణములవంటి మేరువును నిర్మిస్తే అందులో గురులఘువుల సంఖ్య తప్ప యితరార్థములను ఇచ్చుటకు వీలు కాదు. విధేయుడు – మోహన
ఛందస్సులో గణితాంశములు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
09/05/2012 3:03 am
మోహనరావుగారు,
>>కాని దానిని సీసము అని చెప్పడము కష్టమే 🙂
అవి రెండు ఆటవెలదులు (ఎత్తుగీతితో కలిపి మూడు) అని మాత్రం సులువుగా చెప్పవచ్చు 🙂
మీరు వివరించాక ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యిందండి ఆ పేరా. అక్షరగణాలూ, అంశగణాలూ, సమరూపాలే (isomorphic)! లఘువుతో మొదలయ్యే ప్రతి అక్షరగణానికీ ముందొక లఘువు తగిలిస్తే చాలు. అందుకే ఈ రెండు రకాల గణాలకూ నిజానికి గణమేరువు ఒకటే. మీరు అంశగణమేరువులో గురువుల సంఖ్య బదులు మాత్రా సంఖ్య తీసుకున్నారు కాబట్టి అక్షరగణ మేరువుకు రెట్టింపు వచ్చింది. ఇక్కడా గురుసంఖ్య తీసుకుంటే రెండూ సరిసమానం!
మరొక విషయం, పాఠకులు గమనించే ఉంటారు – అక్షర, అంశ గణ మేరువులు సుష్ఠైనవి (symmetrical). మాత్రాగణ మేరువు కాదు. ఎందుకో ఊహించడం పెద్ద కష్టం కాదు!
నా కోరిక, నా ప్రార్థన గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:
09/05/2012 12:04 am
మోహన గారికీ, ఇంద్రాణి గారికి, రమగారికీ మీకు నా అనువాదం నచ్చినందుకు కృతజ్ఞతలు.
సాధారణంగా నేను అనువాదాలు చెయ్యడానికి ఇష్టపడను. అనువాదం ఒక ప్రత్యేక కళ. నాకది లేదని నా నమ్మకం.
ఈ బల్రాజ్ సహని వ్యాసం నాకు మిత్రుడు శ్యామ్ పంపిచారు. అది చదివాక ఆపుకోలేక ఎలాగయినా అందరికీ ఇది తెలియాలన్న తపనతో చేసిన అనువాదం.
ఎనభయ్యో పడిలో వున్నా, ఇంకా గెంతుతానూ, పలానా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుంది ( పెళ్ళి సభా మర్యాద, లోపల మాత్రం అనుభవించాలనే ) వంటి నటులున్న మనకి, ఇటువంటి ప్రసంగం వినే అదృష్టం ఎప్పటికయినా వస్తుందా? డాక్టరేట్లూ, బిరుదులూ అన్నీ అమ్మకానికి కొనుక్కునే నటచక్రవర్తులే నేటి యువతకి ప్రేరణ కలిగించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కనీసం నూటికొక్కరయినా ఇది చదివితే నా శ్రమ ఫలించినట్లేనని భావించాను.
రమగారూ, అనువాదం చేసేటప్పుడు సామ్యవాదమా, సమాజ వాదమాని కాస్త తర్జన భర్జన పడిన మాట వాస్తవం, సామ్యవాదం వాడకూడదని కాదు, సమాజవాదం బావుందనిపించింది. ముఖ్యంగా బల్రాజ్ సాహని చెప్పిన విషయాలకి. అంతకు మించి ఏవీ లేదు. మీరు చెప్పినదంతా నూటికి నూరుపాళ్ళూ వాస్తవం. రాజకీయ నాయకులు అన్ని రంగాలని ఆవరించుకోవడం వల్ల పట్టిన దౌర్భాగ్యం ఇది. ప్రజలు కూడా స్తబ్ధుగానే ఉంటున్నారు. ఎవరికి వారికి వారి పనయిపోతే చాలన్న ధోరణే ప్రస్తుత పరిస్థితులకి కారణం.
విజయ వర్ధన్ గారూ, మీరిచ్చిన లింకుకి థాంక్స్! భలే పట్టుకున్నారే!
తెలుగులో కంటే ఇంగ్లీషయితే బాగా ఎక్కుతుందనా?
-బ్రహ్మానందం
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి మోహన గారి అభిప్రాయం:
09/04/2012 3:34 pm
మంచి వ్యాసము, ఎన్నో క్రొత్త విషయాలు తెలిసినాయి. ఆసక్తి ఉంటే ఏ విభాగములోనైనా రాణించవచ్చును అనే నమ్మకము కలుగుతుంది ఈ వ్యాసము చదివిన తరువాత. ఆ కాలములో తిరుపతిలో పినాకపాణిగారి సంగీత కచ్చేరి విన్నట్లు గుర్తు. 50 ఏళ్ల విషయము, అంశాలు గుర్తుకు రావడము లేదు. బ్రహ్మానందంగారికి అభినందనలు.
తఃతః గారు తెలిపిన వ్యాసాన్ని చదివినాను – అందులోని కొన్ని చర్చనీయమైన అంశాలను క్రింద ఇస్తున్నాను –
పాణిగారు: చెరకు గడను మెషీన్‌లో పెడితే ఏం వస్తుంది? రసం వస్తుంది. ఆ రసం సంగీతం, పిప్పి సాహిత్యం.
సం: కీర్తన చెరుకుగడ అయితే, సాహిత్యము పిప్పి, సంగీతము రసమూను, కీర్తన ఒక వర్ణ చిత్రమనుకొంటే, సాహిత్యము వర్ణలేపనాని కాధారమైన పటము మాత్రమే అని రాశాడు గోపాలకృష్ణముర్తిగారు (పినాకపాణి అన్న). ఇది 1951 భారతిలోని వ్యాసమట. నా దగ్గర ఉందో లేదో చూడాలి.
పాణిగారు: అవును, అంతే.
సం. కాని అన్నమయ్య సాహిత్యంలో ఈ మాదిరి ప్రాబ్లం లేదు కదా?
పాణిగారు: అన్నమయ్య సాహిత్యము అంతేనండి, అది కూడ అంతే. అన్నమయ్య సాహిత్యంలో అచ్చ తెలుగు ఎక్కువ. త్యాగయ్య తెలుగుతోబాటు సంస్కృతం కూడా కలిపాడు. అంతే.
నా కచ్చేరి జరిగిన మరునాడు వారిని (మంగళంపల్లి పట్టాభిరామయ్య) సమీపించి సలహా అర్థించగా “నేను 50 అసంవత్సరాలనుండి పెద్ద విద్వాంసుల పాట విన్నాను, వారిలోనున్న గుణవిశేషాలన్నీ మీలో నున్నాయి” అని మూడు క్షణాలు ఆగి “మరెక్కడా లేవు” అని గొంతు రెట్టించి అన్నారు.
అప్పుడూ, ఇప్పుడూ, బహుశా ఎప్పుడూ ఇంతే. కవులకన్న గాయకునికే అందరూ పెద్ద పీట పెడుతారు. సాహిత్యానికి సంగీతానికి ఒకే స్థానము కల్పించబడినా, సాహిత్యాన్ని చిన్న చూపుతోనే చూస్తారు. చిన్న సందేహం, సినీరంగములో గాయకునికి, కవికి ఒకే విధమైన పారితోషికమా లేక తరతమ భేదము ఉన్నదా? సంగీతమే అంత ప్రధానమయితే మఱుగేలరా ఓ రాఘవా కు బదులు లలలాలలా లా లాలలా అని ఎందుకు పాడుకోరాదో?
విధేయుడు – మోహన
జీవిత నవల – 1 గురించి Rajesh Devabhaktuni గారి అభిప్రాయం:
09/04/2012 2:03 pm
అసలు వ్యాసం తర్జుమా చేయబడినది అనే సంశయమే కలగలేదు, బాగా వ్రాశారు.
ఈ విధంగా తను చెప్పదలచుకున్న కథాస్వరూపాన్ని ఆకళించుకున్నాక, రచయిత వీథిన పడాలి – తన నాయకుడు నివసించిన ప్రదేశాలు, అక్కడి నైసర్గిక, వాతావరణ పరిస్థితులు …
…కాని నైసర్గిక పరిస్థితులు, మనం ఎవరి మీద / గురించి వ్రాస్తున్నామో, వారి కాలానికి, ఇప్పుడు వ్రాయబడుతున్న కాలానికి చాల వరకు మారే అవకాశం ఉంది కదా, అలాంటప్పుడు ఆ ప్రదేశాలకు వెళ్లి కేవలం చూడడం, పరీక్షించడం ద్వారా ఆనాటి నైసర్గిక పరిస్థితులను మనం ఏమి అవగతం చేసుకోగలుగుతాము…?
ఛందస్సులో గణితాంశములు గురించి మోహన గారి అభిప్రాయం:
09/04/2012 10:10 am
నా వ్యాసమునకు స్పందించిన పాఠకలోకమునకు వినయపూర్వకమైన వందనములు.
ఛందస్సు నిజముగా ఒక మహాసాగరమే, అది సంగీత, సాహిత్య, గణితాదులవంటి ఎన్నో జ్ఞానస్రవంతులను కలుపుతుంది. చెలియలికట్టపై కూర్చుండి ఆ అలలను చూస్తూ, తీరములోని సైకతముపై ఇసుకతో ఇండ్లు కట్టుతూ, ఒక చిన్ని గవ్వను, ఒక నత్త గుల్లను చూసి ఆనందపడే స్వభావము నాది.
ఈ సమయములో న్యూటన్ విజ్ఞాని ఈ వాక్కులు స్మరణియము – I was like a boy playing on the sea-shore, and diverting myself now and then finding a smoother pebble or a prettier shell than ordinary, whilst the great ocean of truth lay all undiscovered before me.
వేలూరిగారు, భూషణ్ గారు, ఛందస్సుపైన పుస్తకాలు తేవాలనే నా ప్రయత్నము కూడ. మీ ప్రోత్సాహానికి, సహాయానికి సదా కృతజ్ఞుడిని. తప్పు నాదే. సమయాభావము, తాత్సారము, అనారోగ్యము ఇత్యాదులు ఎన్నో కారణాలు.
రమ గారు, నాకు కూడ ఛందశ్శాస్త్రాధ్యయనారంభములో అన్నీ అయోమయమే. కాలక్రమేణ అర్థమయి నేడు కొద్దిగా స్వతంత్రముగా ఆలోచించే అవకాశము కలిగినది. సంస్కృత ప్రాకృత ఛందస్సులలో జ-గణానికి పెద్ద పీట. నవవిధములైన ఆర్య మాత్రమే (అందులో కందము కూడ ఒకటి) కాదు, పజ్ఝటికవంటి పద్యాలలో కూడ జ-గణమునకు గొప్ప స్థానము ఉన్నది. అందుకే దానికి నరేంద్ర అని పేరు. పాదాంతమునుండి తరువాతి పాదమునకు పదములను లాగుకొని వెళ్లడము మొట్టమొదట కన్నడ కవులు ఆరంభించారు, తరువాత తెలుగు కవులు అనుసరించారు. అందుకే పంకరుహ దళేక్షణ పం కరుహ దళేక్షణ అయినది 🙂 దేశి ఛందస్సులో సామాన్యముగా ఏ పాదానికి ఆ పాదము స్వతంత్రముగా ఉంటుంది. రగడలలో, ద్విపదలలో ఇది ఒక నియమము కూడ.
నా ఉద్దేశములో మొదట లఘువు తరువాత గురువు ఉండినప్పుడు, పదముల ఉచ్చరణలో ఆ మొదటి లఘువు సరిగా వినబడని కారణమువలన ఎదురునడకను కవులు, సంగీతకారులు ఆచరించలేదు అనుకొంటాను. కాని సంస్కృతములో సుప్రసిద్ధ వృత్తములయిన పంచచామరము, భుజంగప్రయాతము, శిఖరిణి మున్నగునవి ల-గారంభమే.
కామేశ్వరరావు గారు, నా బాల్యములో తెలుగులో పద్యాలు వ్రాయడానికి ఆరంభించినప్పుడు గణభంగము కాకుండ కాపాడుకోవడము ఒక గొప్ప కసరత్తుగా ఉండేది, కాని వాటిని చదవడము నాకే కష్టముగా ఉండేది 🙂 పద్యములలో లయ ప్రధానము. మీరుదహరించిన సీస పాదములో ఎదురు నడక ఉన్నది, కాని మనకు సుపరిచితమయిన సీసపు నడక అందులో లేదు. రెండు ఇంద్రగణములకు బదులు మూడు సూర్య గణములను ఉపయోగించవచ్చును. దీనిని ఆధారము చేసికొని ఒకప్పుడు సీసపద్యమును త్ర్యస్రగతిలో వ్రాసినాను. కాని దానిని సీసము అని చెప్పడము కష్టమే 🙂 అది –
సీసము-
ఆకసమ్ము వెలిగె నాకు ముదము గల్గె
చీక టంత తొలగె శ్రీలు జెలగె
వేకువాయె గనర వేగ పాట వినర
కేకి నటన మాడె కేక తోడ
ప్రాకటముగ బూచె వనమునందు విరులు
మ్రాకునందు గదలె నాకు లెల్ల
తోక నూపుకొనుచు తొంగి చూచె గపులు
దూకి నడచె లేగ దూడ లెన్నొ
ఆటవెలది (సీసము)-
నీకు లేవ నిపుడు నిజము సమయ మాయె
స్వీకరించు ప్రణతు లో కళాత్మ
నీ కరాబ్జముల ననేక వరము లిమ్ము
మాకు నగును గాత మంగళమ్ము
ఏది ఏమైనా ముఖ్యముగా పద్యమునకు ఒక తూగు ఉండాలి. వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లు పద్యం లయాత్మకం ఛందస్ అని చెప్పవచ్చును.
కామేశ్ గారు, స-గణమును ఎదురు నడక అని చెప్పలేము. చతుర్మాత్రలలో రగడలాటి మాత్రాఛందస్సులలో జ-గణమే నిషిద్ధము.
అక్షర గణముల వృత్త సంఖ్య తెలిసికొనవలసినప్పుడు, అందులోని గురు-లఘువుల సంఖ్య ఆ వృత్తము ఎన్నవ ఛందములో పుట్టినదో అనే విషయమును తెలుపుతుంది. మాత్రా ఛందస్సు విషయములో ఆ వృత్తపు మాత్రల సంఖ్య గురులఘువుల అమరికనుండి తెలిసికొనవచ్చును. అంశగణముల విషయములో ఒక వృత్తములో మొదటి అక్షరము గురువైనప్పుడు కష్టము లేదు, అందులోని మొత్తము అక్షరముల సంఖ్య ఆ ఛందపు సంఖ్య తెలుపుతుంది. ఉదాహరణకు, UII UII UII UU వృత్తము 11వ ఛందములో జనించినది. అక్షరగణములైనా, అంశగణములైనా ఇది 11వ ఛందమే. కాని వృత్తము లఘువుతో ప్రారంభమయితే, గురులఘువుల మొత్తము సంఖ్యనుండి ఒకటి తీసివేయవలయును. ఇది ఎందుకంటే మనము ఈ గణముల ప్రస్తారమును అప్పకవి తెలిపిన ఆ విధముగా చేసియున్నాము. ఉదాహరణకు, వృత్తపు గురులఘువులు IIII UII IIII UU అయినప్పుడు, ఈ వృత్తము 12వ ఛందమునకు చేరినది (లఘ్వాదిగా గల ఈ వృత్తపు మొత్తము గురులఘువుల సంఖ్య 13నుండి ఒకటి తీసివేయగా వచ్చిన ఫలితము). అక్షరగణరీత్యా ఈ వృత్తము 13వ ఛందమునకు చెందినది, అంశగణారీత్యా యిది 12వ ఛందమునకు చెందినది.
మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. విధేయుడు – మోహన
ఛందస్సులో గణితాంశములు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
09/03/2012 1:35 pm
ఇలాంటి వ్యాసాలు, నాకు తెలిసినంతలో, తెలుగులో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి! చందో లక్షణ గ్రంథాలలో కూడా, సాధారణంగా, షట్ప్రత్యయాలు అక్షరగణాలకు మాత్రమే పరిమితం. వాటిని మాత్రాగణాలకే కాక, దేశీ ఛందస్సులో కనిపించే విశేష గణాలకు కూడా విస్తరించడం చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి, ఛందస్సూ గణితమూ – రెండిటి మీదా ఆసక్తి ఉన్న నాలాంటి వాళ్ళకిది మాంచి విందుభోజనమే! మన విద్యాలయాలలో Combinatorics పాఠం Coins, Cards బదులు ఈ షట్ప్రత్యయాలను ఉదాహరణలుగా తీసుకొని చెప్పే రోజులు వస్తే ఎంత బాగుణ్ణు!
“ఒక ఛందములో వృత్త సంఖ్య కావలసినప్పుడు, ముందు అది ఎన్నవ ఛందమో తెలిసికోవాలి. ఉదాహరణకు అది 12వ ఛందమనుకొందాము. …” అని మొదలయ్యే పేరా మాత్రం నాకు సరిగా అర్థం కాలేదు.
ఎదురునడక, దేశి గణాల గురించి. వ్యాసంలో చెప్పినట్టుగా ఒక లఘువుతో మొదలుపెట్టకుండా, ఒక గురువు లేదా రెండు లఘువులతో మొదలుపెట్టి ప్రస్తారం చెయ్యడం మూలంగా చాలా వరుకూ ఎదురునడక అరికట్టబడింది. అయితే, పద్యం మొదట లఘు గురువులు రాకపోయినా (అంటే త్రిశ్రగతిలో ఎదురునడక అనుకోవచ్చా?), IIU, UU వంటి గణాలవల్ల కూడా ఎదురునడకలాంటిది వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు రెండు సగణాలు వరుసగా వేస్తే (“అరెరే, అరెరే, వయసే” లాగ), అది ఎదురునడక లాగానే ఉంటుంది కదా (ఇది చతురశ్రగతిలో ఎదురునడక అనవచ్చా?). తెలుగులో యిది కూడా చాలా వరకూ పరిహరింపబడింది. అయితే తెలుగు గణాలను ఉపయోగించి కూడా ఎదురునడక రప్పించవచ్చు. ఉదాహరణకు:
ఎదలో పదేపదే మెదిలే వ్యథే కథై
ఇదిగో బయల్పడే నిపుడు చూడు
అన్నది అచ్చమైన సీసపద్య పాదం!
రావూరివారి పుస్తకం ప్రస్తుతం నా దగ్గర లేదు కాని, సంపత్కుమారగారి తెలుగు ఛందోవికాసం ప్రకారం, మధ్యాక్కరలో మాత్రమే సూర్యగణాలైన III, UI బదులు వేరే గణాలు నన్నయ్యగారి పద్యాలలో కనిపిస్తాయి. గగ, స గణాలే కాక, భ, జ కూడా కనిపిస్తాయి! అలాగే ఇంద్రగణాలలో కూడా తేడాలున్నాయి. అయితే అవి నడకకు ప్రత్యేకతనేమీ ఇచ్చినట్టుగా అనిపించవు. అవి లేఖక దోషాలే అయి ఉంటాయని సంపత్కుమారగారు అభిప్రాయబడ్డారు. పాదం/పాదభాగం చివర ఉండే సూర్యగణాల బదులు గగ, స గణాలు వేస్తే నడక బాగుంటుందని నేను అంగీకరిస్తాను. ఉదాహరణకు, “కవనాల వ్రాసేను నీకై – కావ్యమ్ము లల్లేను నీకై” అన్నప్పుడు మామూలు మధ్యాక్కర నడక కన్నా ధార బాగుంది. అలాగే,
ఎందుకే తహతహ – యెందుకే హృదిలో
ఎందుకే చెప్పవే – యెవ్వరే మదిలో
అన్న “ద్విపద” పాదాలు కూడా బాగున్నాయి.
వేరే చోట్ల మాత్రం నడక దెబ్బతింటుందని నా అభిప్రాయం. ఉదాహరణకు సీసపాదం చివర రెండు సూర్యగణాలకు బదులు స-స వస్తే నడక చెడుతుంది. అలాగే ఆటవెలది, తేటగీతులలో కూడా.
మోహనగారూ,
ఇంత అరుదైన, అద్భుతమైన వ్యాసాన్ని అందించినందుకు మనఃపూర్వక అభివాదనాలు, అభినందనాలు. మీ కృషికి జోహార్లు!
ఛందస్సులో గణితాంశములు గురించి ఊ. సాంబశివ రావు గారి అభిప్రాయం:
09/03/2012 1:32 pm
పండిత మహాశయా ఇదే నా పాదాభివందన శతం, అంగీకరించి నన్ను ధన్యుని చేయ ప్రార్థన. నిజమైన పండితుల రచన చూసే భాగ్యం ఇవాళ కలిగింది. భాషలోకాని ఛందస్సులో కాని గణితంలోకాని పిపీలకం కన్న కనాకష్టమైన వాడినే ఐనా మూటి మీద ఉత్తి ఇష్టం మాత్రం ఉన్న వాణ్ణి. అలాంటి నాకు మీ వ్యాసం అర్థంకాని మాట నిజమేకాని, చూసే అదృష్టం కలిగిందనే స్పృహ పాటి కలిగిన వాడిని. గణనాధ్యాయ మనే పేరు పెట్టేసుకొని ఏదో చేసేస్తున్నాననే ఆశ లావు పీక సన్నంగాడిని. ఐనా నా పాదాభివందనాలు స్వీకరించ మని అర్థిస్తున్న ఆశాజీవిని. తెలుగుకి తగిన ఉత్కృష్టత తేగలిగిన మీ లాంటి మహోన్నతులు మరెందరో రావాలని మా నల్లనయ్యను ఇందుమూలంగా ప్రార్థిస్తున్నాను.
చలంతో రజని ముఖాముఖి గురించి Tulasi Dadi గారి అభిప్రాయం:
08/29/2012 4:23 pm
చలం పుస్తకాలు, అవి సమాజం లో కలిగించిన సంచలనం మాట ఎలా ఉన్నా, ఆయన కూదా సగటు మాగవాడిలాగానే ప్రవర్తించాడు. భార్య అందరినీ, పుట్టింటిని, బంధువులని వదులుకుని తనకోసమే ఉంటే ఆయన మాత్రం శృంగారం, అదీ ఇదీ అంటూ ఇతర స్త్రీల వెనక తిరిగాడు. చివరికి ఆవిడ మనస్తాపం చెంది చనిపోయింది కాని, అసలు ఈ రాతలు చదివి ఆవిడే విముక్తి అనుకుంటూ ఇల్లు వదిలి వెల్లిపోయి ఉంటే ఎలా ఉండేదో?
ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:
08/23/2012 3:05 am
రంజని – విశ్వనాథ పద్య కవితా పోటీలు :2012.
అకౌంటేంట్ జనరల్ గా పదవీ విరమణ చేసి అమెరికాలో ఉంటోన్న శ్రీ ఎ.సత్యవర్ధన ఐ.ఎ.ఎస్. గారి సౌజన్యంతో రంజని, తెలుగులో ప్రథమ జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ పేరుతో 2008 నుంచీ ‘రంజని-విశ్వనాథ పద్య కవితా పోటీలు’ నిర్వహిస్తోంది. 2012 సంవత్సరానికి ‘నేటి నిజం’ దిన పత్రికతో కలసి ఈ పోటీలను సమ్యుక్తంగా నిర్వహిస్తోంది.
ప్రధమ బహుమతి 2,000 రూ.లు. ద్వితీయ బహుమతి 1,500 రూ.లు. మూడు ప్రత్యేక బహుమతులు 1,500 రూ.లు + యోగ్యతా పత్రాలూ.
నిబంధనలు:
*ఏ చందస్సులోనయినా ఒక అంశం మీదే 12 పద్యాలకు తక్కువ కాకుండా ఉండాలి.
* ఇంత వరకూ ప్రచురణ, ప్రసారం కానివై వుండాలి.
* ఎన్ని శీర్షికలైనా పంపొచ్చు.
* పద్య కవితని, హామీ పత్రాన్నీ వేరు వేరు గా రాసి పంపాలి. పద్య కవిత ఉన్న కాగితం పై పేరు, విలాసం ఏదీ రాయకూడదు.
ప్రధాన కార్య దర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, ఏ.జి. ఆఫీస్, హైదరా బాద్ – 500 004 అనే చిరునామాకి 31.8.2012 లోగా అందేలా పంపాలి.
చీకోలు సుందరయ్య (అధ్యక్షులు)
90300 00696
మట్టిగుంట వెంకట రమణ
ప్రధాన కార్యదర్శి
93968 40890.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి తఃతః గారి అభిప్రాయం:
08/15/2012 5:56 am
‘ఆధునికత’ అంటే ఎలాంటిది. అమ్మానాన్నల్ని లంగా, ఓణీలతో బడికి వెళ్తున్నప్పుడు చూసిన కళ్ళతో కాక కోకా రైకలతో ఇద్దరు ఎదిగిన పిల్లల్ని పక్కనుంచుకుని, వారసత్వపు చట్టాల పరిజ్ఞానంతో ఆస్తులు పంపకానికి వచ్చినప్పుడు చూసే కళ్ళతో చూడటం లాంటిదా? వాల్మీకినీ, నన్నయనీ ఇప్పుడు యెలా చూడాలి? ‘మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక’ అన్నాడు త్యాగరాజు. ఆయనని ఇప్పుడు యేం చేద్దాం?
హోమగుండం: కథ నచ్చిన కారణం గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:
08/15/2012 2:09 am
స్త్రీ సహనానికి అగ్ని గండం
ఈ హోమ గుండం!
ముందు మాట:
జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి గురించి నేనింతకు ముందు కొంత విన్నాను. కొందరు ప్రముఖులు ఆయన గురించి రాయగా చదివాను. కానీ, నేనెప్పుడూ ఆయన రచించిన పుస్తకాన్ని చూడలేదు. చదవలేదు.
అలాంటి జరుక్ శాస్త్రి గారు! ఎంత మంచి కథ రాసారూ!? అని ఆశ్చర్యమైంది, అబ్బురమైంది- నాకు. ఈ కథ పూర్తిగా చదివాక, నా మనసుకేమీ తోచనట్టైంది. ఉక్కపోతేసింది. కాసేపు చల్ల గాలి కావాలనిపించింది. కారణం -ఆ స్త్రీ మూర్తి నా కళ్ళ ముందే – మంటల్లొ పడి కాలిపోయిన భావన వల్ల కావొచ్చు. అలా అని ఈ కథ బాగుంది అని పొగిడినా, లేదా -, ఈ రచయిత ఆ కారెక్టర్ ని భలే అద్భుతంగా చిత్రీకరించాడని సంబర పడ్డా, అది చాలా దుర్మార్గ గుణమై పోతుంది.
కారణం – ఇది కథ కాదు. జీవితం. ఇందులోనివి పాత్రలూ కావు. అవి అచ్చు- పోత పోసిన మనం. మన్లోని మన మొచ్చి ఇక్కడ మనకెదురుగా కనిపిస్తున్నట్లుంటాయి. ఎప్పుడూ ఎవరమూ చూడని సంకుచితాలు హనుమంతునిలో తాండవమాడుతున్నట్టుంటాయి.
ఈ రచనలో పాఠకులని కదిలించే విషయం ఏమిటంటే: ‘పెళ్ళినాడే మొగుడు. ఆ తర్వాత యముడు..’ అనే పెద్దల పెద్ద సూక్తి మనకుచప్పున స్ఫూరణకొస్తుంది- ఈ రచన చదివాక! ఆనాటి హనుమంతరావు – అప్పట్నుంచీ కథలోనే కాదు, ఇప్పటికీ ఈ సమాజంలో (చావకుండా) ఇంకా ఇంకా బ్రతికే వున్నాడు. విషాదమేమంటే – అప్పట్నుంచి వరసగా చస్తోంది కేవలం నరసమ్మ లాంటి భార్యలు మాత్రమే! పెళ్ళి పేరు మీద హోమ గుండానికి ‘ పవిత్ర బలి’ అవుతున్న నరసమ్మ వంటి ఇల్లాళ్ళు నానాటికీ సంఖ్యా పరంగా పెరుగుతున్నారే తప్ప తరగడం లేదనేది అక్షర సత్యం. కాదు, అంకెల సాక్ష్యం.
అందుకే ఈ కథ 60 యేళ్ళ తర్వాత చదువుతున్నా, – ఈ రచన ఈ కాలందే అని తోస్తుంది. ఇప్పుడే తాజాగా రాసినట్టుంటుంది. రాతి యుగం నుంచి, నేటి యుగం దాకా మానవ జీవనం లో ఎన్నెన్ని ఆధునిక మార్పులు జరిగినా, మారంది మాత్రం ఒకటే – స్త్రీ సామాజిక స్థితి. “స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకానికి నిజమైన సమాధానం వుందా? వుంటుందా? ఈ అంశం మీద రాసిన కథే ఈ హోమ గుండం. కథకి భాష్యం ఈ వాక్యం.
‘కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి. – అని మీరన్నారు కానీ, నా కైతే ఈ కొటేషన్ ఆరంభం లో వుండటమే నూటికి నూరు పాళ్ళు సమంజసమనిపించిందండీ! (కారణం. వ్యక్తి గతం కావొచ్చు. నాక్కూడా ఇలా ప్రముఖుల జీవన సత్యాల సూక్తుల్ని ముందుంచి కథలు రాయడం అంటే ఎందుకో ప్రియం! కథకి మంచి పట్టు వుంటుందనిపిస్తుంది. ఇది కేవలం నా వ్యక్తిగత ఇష్టం మాత్రమే.)
ఇది మాత్రం నిజం: మీకు నచ్చిన కథగా ఇది ఈమాట లో చదవకుంటే అస్సలకీ కథ నేనెప్పటికీ చదివే అవకాశం నాకు వచ్చుండేది కాదు. నరసమ్మ- నా కళ్ళల్లో కన్నీరై మిగిలేదీ కాదు. ఇది మాత్రం నిజం.
ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే ఈ కథ మీకు నచ్చిన వైనాన్ని చదివి, ఇంప్రెస్సయి – అప్పుడు కథలోకి వెళ్ళాను. ఆ వివరణే లేకుంటే ఈ శాస్త్రి గారి కథ చదవడాన్ని పోస్ట్ పోన్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత చదవనూ చదివేదాన్ని కాదు. ఇంత గుర్తైన జ్నాపకం మిగిలేదీ కాదు. ఇది వాస్తవం.
అసలు కధ లో కొస్తే: హనుమంత రావు లాంటి మగాళ్ళు కొందరు గొప్ప కోసం ఇలాంటి సాహసాలు చేసి ఆ తర్వాత తెగ పశ్చాత్తాపంలో ముణిగి తేలుతారు. ఆ మూణ్ణాళ్ళ ముచ్చట తీరాక ‘ఆపరేషన్ తర్వాత వెన్నుకి పొడిచిన మత్తు వొదిలి, కేవలం నొప్పి మాత్రమే మిగిలిన పేషెంట్ లా గిలగిలా కొట్టుకుంటాడు. ఆశయం కోసం ప్రయాసగా ఆశ్రయించిన కరుణా, జాలి, ఉన్నత తత్వం అంతా కూడా దయ్యం వొదిలినట్టు వొదిలి, ఇహ అసలు స్వరూపం చూపిస్తారు. ఇట్లా! హనుమంతునిలా! ఇతగాడు పెళ్ళి చేసుకోకుంటే నరసమ్మ గారు ఏ పాచిపనో చేసుకుని హాయిగా బ్రతికుండేది కాదూ? ఈయనగారూ చేసుకున్న ‘వెధవ వివాహం వల్ల కాదూ’ దహనమై పోయిందీ!? అనే నిజాన్ని నిగ్గు తేల్చారు శాస్త్రి గారు!
ఏ కాలం కథా? ఇదెప్పటి కథా!? ఈ హోమ గుండం 1945 కాలం నాటిదైతే మాత్రమేం ఈ నాటి పురుషహంకార ప్రపంచానికి చక్కగా మచ్చ లేని అద్దంలా నిలుస్తుంది.
వేలూరి గారి మాటల మీద నాదొక మాట: ‘అయితే, హనుమంతరావులో నరసమ్మ పరంగా ఎందుకు అసహ్యం కలిగిందో చెప్పటం కష్టం. అతనికి చిరాకు పెరగటం, చివరకి నరసమ్మని కొట్టడం కూడా జరుగుతూంది; అనుమానంతో!‘ అని మీకు అనిపించింది కానీ నాకైతే ఆ కారణం శుభ్రంగా కళ్ళక్కట్టినట్టు కనిపించనూ కనిపించింది.
* ఎవరో దోస్త్ ఏదో అనుంటాడు. ‘తొందర పడ్డావురా. వ్రతం చెడ్డా ఫలం దక్కాలని. ఎలాగూ ఆదర్శ వివాహం చేసుకునే వాడివి. పెళ్ళం వెనక కాసింత వున్న దాన్ని చేసుకుంటే కష్టాలుండేవి కావుగా అంటూ ఫలానా వారమ్మాయిని ఉదహరించి వుండొచ్చు. లేదా ఆ బుధ్ధి హనుమంతుని లోనే కలిగీ వుండొచ్చు. (కోతి కదా!, పురుషుణ్ని కాదు నేనంటోంది. అతని బుధ్ధిని.)
‘ఆర్యసమాజపు సంస్కర్తలని విమర్శిస్తున్నాడో, సమాజంలో గొప్ప కోసం వేసుకున్న అభ్యుదయపు ముసుగులో ఇమడలేక నలిగిపోయే అసమర్థులను ఎత్తిచూపుతున్నాడో – రచయిత ఉద్దేశ్యం మనకు అర్థం కాదు. ‘- వేలూరి గారు.
* ఎవర్ని విమర్శించినా, ఇంచకున్నా ఒక కుత్సిత మనస్కుణ్ని మన ముందుంచారు రచయిత. ఇంకా నిజం చెప్పాలంటే – ఒక స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోగల మనస్తత్వం కేవలం ఒక పురుషునికి మాత్రమే సాధ్యం అనే నాలాంటి వారి ఒక అంచనాని, ఇక్కడ ఈ రచయిత అక్షర సాక్షిగా నిరూపించారు.
రచనలో రవ్వల్లాంటి మాటలివి:
* నా కోసం అనే ముక్క ప్రేమ ఉన్న చోట యెంత దివ్యాస్త్రమో, కాని చోట అంత విషం. (నాకెంతో అద్భుతం అ నిపించిన కొటేషన్ ఇది.)
* కోపం మీద ఉన్నప్పుడు సర్వేంద్రియాలు బెదిరిన ఫుర్రల్లాగా పనిచేస్తై.
* తాను ఏంచేసినా తప్పే అవుతోంది. పోనీ – యిది చెయ్యి. నాకు యిలాగ వుండాలి అనడు. తన బుధ్ధికి తోచినట్లు చేస్తే – పురుగేరినట్లు మాట్లాడతాడు. (దరిదాపు ఈ కథ రాసి అరవై యేళ్ళు కావస్తోంది. ఇప్పటికీ సగటు మగవాని మనస్థత్వం ఈ పంధా లోనే సాగుతోంది)
* బందిలి దొడ్లో పడ్డా ఆవులాగా ఆమె ఆ రాత్రి ఏమీ తినలేదు. సుఖపెట్టి సుఖపడదామంటే- లోకంలో చోటు తక్కువా.
* దేవుడి పఠాలకు హారతి వెలిగిస్తుంటే- చీర అంటుకుని నరసమ్మ చచ్చిపోయిందటా అనుకున్నారు! (భార్యని చంపేసిన – ప్రతి మొగుడూ చెప్పే కారణం ఇలాగే వుంటుంది.)
ముగింపు – స్త్రీ లోకాన్ని ఆవేశానికి గురి చేస్తుంది. ఆలోచింప చేస్తుంది. పొరబాటున హనుమంతుడి వంటి వాణ్ణి వివాహమాడినా నరసమ్మలా చావకూడదు అనే నిజాన్ని చెబుతుంది.
నా కితాబు: కథలందరూ రాస్తారు. అందరు రాసేవీ అవే అక్షరాలు. కాని, కొందరి చేతుల్లోనే అవి జీవితాలవుతాయి. గుండె మీద రాలి పడే కన్నీటి పుష్పాలవుతాయి.
ముగింపు: రచయిత శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ( జరుక్ శాస్త్రి ) గారికి అంజలి ఘటిస్తూ.. తనకు నచ్చిన ఈ అపురూప కథని ఈ మాట పాఠకులకందించి, సాహిత్య పిపాసుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు గారికి కృతజ్ఞాభినందనలు తెలియ చేసుకుంటూ,
నమస్సులతో –
అభిమాన పాఠకురాలు
-ఆర్.దమయంతి.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
08/14/2012 1:43 am
రామారావు గారూ!! దబాయించవలసిన అవసరం నాకేమీ లేదు. మీరు అంత ఎమోషనల్ గా మాట్లాడ వలసిన పని కూడా లేదు. ఇది విమర్శకి సంబందించిన విషయం. “ఆధునిక” దృష్టి కానిది అసలు ఎలా ఉంటుందో అన్న వెటకారపు గొంతుని మీరే ప్రదర్శించారు. అందుకు మనం ఎంతగా ఈ “ఆధునికత” ని నెత్తిన వెసుకుని మోస్తున్నదీ నేను చెప్పవలసి వచ్చింది. సమస్య నాకేమీ లేదు. ఆధునికంగానే క్లాసిక్స్ తాలూకు పరిశీలన ఉండాలని, ఉంటుందనీ మీ భావన కావొచ్చు. అందువలనే ఆధునికత లేనిది అసలు ఎలా ఉంటుందో కూడా మీరు ఊహించలేకపోయారు మరి. ఇంతకీ అది తెలియనిదీ అర్ధం కానిదీ మీకే గనక అది మీ సమస్య. నా సమస్య కాదు. ఇంక వ్యాసకర్తకి ఈ అనువాదకుని సహాయం అంత అవసరం లేదనుకుంటాను తన వ్యాఖ్యానానికి గానీ తన విశ్లేషణకి గానీ! బ్రిటీషు విద్యలు “ఆధునిక మైనవని” మనదేశం లోని “ఆధునిక” ప్రభావాలకి కారణం ఇంగ్లీషు విద్యలని నేనే చెప్పనఖ్ఖర లేదు. అది నారాయణ రావు వ్యాసమే చెబుతున్నది. ఆయన శీర్షికా అదే! విశ్లేషణా అదే!! విషయమూ అదే!! మీరు అన్నీ కట్ట కలిపేసి దెబ్బలాటకి దిగుతున్నారు మరి ఎందుకో?? నేను అన్న మాటలకి సంబంధించి మాత్రమే నేను మాట్లాడగలను గానీ మీరు చేసే రకరకాల వ్యాఖ్యానాలకి నేను బదులు ఇవ్వను. వ్యాసం లోని విషయాలకీ వివరాలకీ వ్యాసకర్త మాత్రమే భాద్యుడు గానీ అనువాదకుడు కాదు. అది మీ వ్యాసం కాదు కద.
మీకు ఆధునికం కాని విషయాలూ వ్యాఖ్యానాలూ ఉంటాయనీ వాటికి కూడా అంతే విలువ ఉంటుందనీ తెలిస్తే నా అభిప్రాయం అర్ధం అవగలదు. మీరు అన్నమాటకే నేను జవాబు ఇచ్చినది. మీరసలు ఆ మాటే అనలేదని అంటే అక్కడే అచ్చు అయి ఉంది మీ అభిప్రాయం. వెనక్కి వెళ్ళి మరోసారి మీ అభిప్రాయాన్ని చదువుకోగలరు.
రమ.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
08/13/2012 2:41 pm
రామారావు గారు పోలాక్ గారి ప్రస్తావన తెచ్చారు గనుక మాత్రమే నేను ఇది కూడా ప్రస్తావన చేస్తున్నాను. పోలాక్ గారి వ్యాసం “crisis in the classics” లో పోలాక్ తనని తాను “non-modernist” గా సంభావించుకుంటూ, ప్రపంచం మొత్తం మీద classics తాలుకు భవిష్యత్తు ని గురించి తన భావాలనీ తన ఆందోళననీ కూడా చెప్పారు. విశ్వవిద్యాలయాలలో classics ని బోధించగలిగిన వాళ్ళు క్రమేపీ తగ్గిపోతున్న వైనం గురించి ఆయన బాధ పడ్డారు. non-brahminism, islamophobia లాంటి ethno chauvinist movements ప్రభావాలని ఆయన ప్రస్తావన చేసారు.
నారాయణ రావు వ్యాసంలో పోలాక్ చూసే ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా అని రామారావు గారు అనుకోలేదు. మనకి “ఆధునికత” అంటే అర్ధం కాని ఒక మోజు, అలా మాట్లాడక పోతే ఏమన్నా వెనకబడిపోతామేమో అన్న భయం, అంధ విశ్వాసం లాంటి ఆరాధనా భావం [హీరో వర్షిప్] వెరసి విమర్శకి తలుపులు మూసేస్తున్న ధోరణి బాగా పెరిగి చివరికి ప్రతిదాన్నీ ఆధునికతా ముసుగు కప్పి మాట్లాడటాన్ని ఒక తప్పనిసరి విధానంగా చేసుకుంటున్నాం!
అసలిప్పటిదాకా మనం ఎవ్వరం కూడా “ఆధునికత” అన్నదానిని మన సమాజాలకి సంబంధించి ఇధమిథ్థంగా నిర్వచించి చూసుకున్న దాఖలా ఎక్కడా కనిపించదు. అది ఫలానాగా స్పష్టపడనిదే మన సాహిత్య విమర్శ గతి కూడా నిజం గా స్పష్టపడదు.
రమ.
నోట్ : పై అభిప్రాయం లో కలిపి రాయాలని అనుకున్నా అప్పటికే type చేసిందీ అచ్చు తప్పులు దిద్దుకున్నదీ కలిపి శ్రమ అవడంతో ఆపివేసాను. గనుక దీన్ని నా పై అభిప్రాయానికి కలగలుపుకుని చదువుకోమని మనవి.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి తఃతః గారి అభిప్రాయం:
08/13/2012 5:54 am
‘వాల్మీకమూ అవాల్మీకమూ అయిన రచనలని పోల్చి చూసి వచ్చిన మార్పులని సవివరంగా తెలిపే పరిశీలన మనకి రాలేదు‘: rama bharadwaj అభిప్రాయం.
ఈ విషయాన్నె నేను మరొక రకంగా చెప్పాను కొచెం తీవ్ర ధోరణిలో ఊర్మిళా దేవి నిద్ర, సీత గడియల మీద వ్యాసాలు చదివి అభిప్రాయాలు చెప్పినప్పుడు.
వాల్మీకి రాసిన దానిని మాత్రమే (సాంకేతికంగా) ‘రామాయణం’ అనాలి. గణిత శాస్త్రాలలో వాడే ‘దూర సూచి’ ‘Metric / Distance Function’ లాంటి ఒక సమంజసమైన కొలమాన పరికరాన్ని సాహిత్య విమర్శ కూడా తయారుచేసుకోవాలి. మూలం నుంచి అనువాదం గానీ, కొత్తగా ఆ పాత్రల పేర్లూ, వాతావరణమూ ఉంచుతూ రాసిన కల్పనలు గానీ, వాటి ఆధారమైన రచన నుంచి యెంత దూరంగా ఉన్నాయి అన్నది చర్చకు చాలా అవసరం. ఊర్మిళా దేవి నిద్ర, సీత గడియ లాంటి వాటిని రామాయణ పాటలని / కథలని/ గాధలని అనటానికి వీలు లేదు అని రాశాను [ఇక్కడ వాటిలొ ఉన్న రస విషయాలతో సంబంధం లేదు]. రచయిత తను రాసినదానికి ‘రామాయణ కల్పతరువు’ అని పేరు పెట్టుకొవచ్చు, వానికి ఆ స్వేచ్చ ఉంది. విమర్శకులు ‘దూరాన్ని’ ఎంచకుండా ఆ రచన కు ‘రామాయణ’ సంబంధం పెట్ట గూడదు. ఇది కొంచెం కష్టమైనదే గానీ అట్లా కాని పక్షంలో విమర్శకు శాస్త్రీయత ఉండదు. నేనొక ప్రశ్న అడిగాను – రామాంజనేయ నాటకం [గయోపాఖ్యానం] రామాయణ [మహాభారత] కథ అవుతుందా అని. మూలాన్నించి దూరాన్ని యెంచి ఈ విషయాన్ని గురించి చెప్పకుండా చెప్పే ‘రామాయణ రి టొల్డ్’,’ రామాయణ క్వస్చెండ్’ లాంటి వాటికి అర్ఠం లేదు. వాల్మీకి రామాయణాన్ని గానీ దానికి ‘తగినంత చేరువ’ లో ఉన్నవాటిని గానీ చేసిన శాస్త్రీయమైన యే రకమైన పరిశీలన అయినా అభిలషణీయమే. అటువంటి దానిని మాత్రమే ‘రామాయణ’ అన్న మాటతొ అభివర్ణించడం సబబు. ఇతరములకు వాల్మీకి అనే కవి రాసిన కావ్యంతొ ఏ రకమైన సంబంధమూ అంట కట్ట గూడదు. అలాచేస్తే దాన్ని ఒకరకమైన మోసం గానే అనుకోవాలి.
తఃతః
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
08/11/2012 1:22 pm
రామారావు గారూ! నా అభిప్రాయాన్ని కూడా నేను మరి కొంచెం వివరించి రాసి ఉండవలసింది. నేను ఎక్కువ సేపు టైపు చెయ్యలేకపోవడం ఒక కారణం కాగా అభిప్రాయాలనే వ్యాసాలుగా విస్తరించి రాసే ఆసక్తి లేకపోవడం మరొక కారణం కావడంతో క్లుప్తంగానే నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.
మీరే అన్నారు ” ఆధునిక” దృష్టి కానిది ఎలా ఉంటుందో నాకు అర్ధం కావడం లేదు అని. ఇది చెప్పడం లేదా మనం ఎంతగా ఈ “ఆధునిక ” స్పృహలో కూరుకుని పోయామో తెలుసుకోవడానికి? మీ ఉద్దేశ్యంలో “ఆధునికత”ని ముందు స్పష్టపరచండి. అసలు మనం ఏ పాటి “ఆధునికులమో” తెలుస్తుంది. అది అటుంచితే ఎందుకని మనకి విమర్శ తప్పనిసరిగా ఇంగ్లీషువారి మార్గాన్ని అనుసరించి వారిని ఉల్లేఖిస్తూ వారి మార్గంలో వారికి ఒప్పుదలగా సాగడం ఒక ఆనవాయితీగా మారిపోయింది? ఇది తప్ప వేరే మార్గం ఎందుకని లేదని మీరు అనుకుంటున్నారూ? మనకి ముందున్న ప్రమాణాలాన్నీ వట్టిపోయినవేననీ మన సమకాలంలోని అమెరికన్ విశ్వవిద్యాలయాలలోని విమర్శ మాత్రమే బలమైనదనీ ఎలా భావిస్తున్నారూ? దీన్నే “అంటగట్టడం” అని అంటాం. నాకు పోలాక్ ఏం చెప్పేరో ఎంతగా తెలియాలో అంతకన్నా ముఖ్యంగా భవభూతి ఏమని అనుకున్నాడో కూడా అంతే ముఖ్యంగా తెలియాలి. నాకు “కాలస్పృహ” లేదు. ఆ ప్రమాణంతో నేను ఆధునికతనే తప్పనిసరి కొలమానంగా ఎంచను. అందునా సాహిత్యంలో అసలే లేదు.
పై వ్యాసంలో ఎంతగా నారాయణ రావు తెలుగున వచ్చిన పాత రామాయణాల ప్రస్తావన తెచ్చినా ఆయన విశ్లేషణ చేసింది మొత్తంగా వలస పాలన ప్రభావంతో మారిన ఆధునికుల చూపుని గురించే! ఇది ఒక ఫ్యాషన్. ఇదేమీ సత్యమూ శాశ్వతమూ కానఖ్ఖరలేదు. నేను భాగవతం లోని కృష్ణుని ప్రస్తావన తెచ్చినది ఎందుకంటే ప్రతిలో లేని దానిని మనం వ్యాఖ్యానం చెయ్యడం కాదు. కవి చెప్పిన దాని మీద మాత్రమే మాట్లాడటం విమర్శకి ముఖ్యం గనక. ఆ వ్యాసంలో చేసిన పని అదే! అంతే గానీ రామాయణాన్ని ఆధునికంగా మార్చిన రచనల మీద ఆధునికతా దృష్టితో ఇతిహాసాలని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఏ రకంగా ఇంగ్లీషు చదువులు అందుకు ప్రేరణని ఇచ్చాయో మాత్రమే కాకుండా ఆయా భాషలలో వారు, వారి వారి ఇతిహాసాలని ఆధునికంగా మార్చుకున్నారా అన్నది సైతం చెప్పాలి. అందుకూ నేను ఆ దేశాలలో ఏం జరిగిందీ కూడా తెలిస్తే బాగుంటుందని అన్నది. ఎందుకంటే రామాయణాలలోని ఆధునికమైన మార్పు ఆధునిక విద్యల కారణంగా వచ్చింది గనుకా, అది “రాజకీయ పరిణామం” అని వ్యాస రచయిత చెబుతున్నారు గనకాను! ఏసు పాత్రని గురించిన ప్రశ్నని నేను అందుకనే వేశాను. అది ఈ వ్యాసపు పరిధిలోకి రానివ్వకపోవడం విమర్శకులకి ఒక సులువు. ఎందుకంటే తెలుగు పాఠకులకి తెలుగులో వచ్చిన రామాయణాల గురించి తెలిసే వీలుందేమో గానీ ఇంగ్లీషు వారి విద్యా విధానమూ వారి రాజకీయాలూ ఈ ఆధునిక రామాయణ రచనల మీద ఏ రకంగా ప్రభావం చూపాయో తెలిసే వీలు లేదు. అలా తెలియాలంటే అసలు ముందు ఆ భాషల్లో ఇటువంటి మార్పులు ఎలా పనిచేసాయో తెలియాలి. ఆ జోలికి మాత్రం పోకుండా ఒక్క ఇంగ్లీషు విమర్శకుల ధోరణిని పాటిస్తూ తెలుగు రచనలమీద వ్యాఖ్యానం చేయడం తెలుగు పాఠకులని అయోమయపరచడమే అని నేను అనుకుంటాను.
ఇంక అసలు ఈ ఆధునిక తెలుగు రామాయణాల గురించీ తెలియని వాళ్ళూ ఆ బ్రిటీషు వలస పాలనని గురించీ తెలియని వాళ్ళూ – ఇప్పటికీ రామాయణాలని అన్ని కులాల వాళ్ళూ కూడా సుబ్బరంగా పఠిస్తున్నారు. పఠిస్తారు కూడాను. వాళ్లకి చాగంటి కోటేశ్వరరావుల వ్యాఖ్యానం కావాలి గానీ, ఈ వ్యాఖ్యానాలతో పని లేదు. “ఆధునిక” కాలం లోనే ఆ ఇంగ్లీషు చదువులు చదువుకున్న వాళ్ళే ఆధునిక వేషధారణ తోనే ఈ మార్గం లో వెళుతూ కనిపిస్తూ ఉంటారు నిత్యమూ! అందువలన నాకు “ఆధునికత” తాలూకు పరిధి బోధపడలేదు. అటువంటి ఒక వ్యాఖ్యానమూ అంతే బోధపడలేదు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంగా మనం ఈ ఆధునికతని పాటిస్తూ ఉన్నట్టు ఉండటమే పెద్ద అబధ్ధం అని అర్ధం అవుతూన్నప్పుడు ఈ వ్యాఖ్యానాల పరిధి మాత్రం ఎంతా? ఏవో కొన్ని కొత్త తరహా మాటలు అంటున్నారు ఈ వ్యాస రచయిత అని అనుకుని మళ్ళి వాల్మీకీ రామాయణాన్నో కనీసం కంకటి పాప రాజు రామాయణాన్నో పఠించేందుకో వినేందుకో తెలుగువాళ్ళూ సిధ్ధపడుతూనే ఉంటారు. [అన్ని కులాల వాళ్ళూ సుమా!] ఎందుకూ? అంత మాత్రం చేత వారంతా వెర్రి వారని మనం అననూ లేము. అనుకోనూ లేము. కదా? ఈ “ఆధునికత” అన్నది సర్వే సర్వత్రా అమలు జరగదు. కావాలంటే ఎలా అమలు జరుగుతుందో మీరు చెప్పండి వింటాను.
రమ.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
08/09/2012 2:43 pm
దిలీప్ గారు: ఇది చాలాకాలం క్రితం (2003లో) ప్రచురితమైన వ్యాసం. అప్పట్నుంచి ఇప్పటివరకు “ఈమాట” సాంకేతిక పద్ధతుల్లో కలిగిన మార్పుల వల్ల మీకన్న ముందు వారు రాసిన అభిప్రాయాలన్నీ ఇప్పుడు కనుమరుగయ్యాయి.
— ————
ఇప్పుడు రమ గారి సందేహాలకి సమాధానాలివ్వటానికి ప్రయత్నిస్తాను. ఆవిడ ముఖ్యంగా రెండు విషయాలు లేవనెత్తారు. (అ) ఈ వ్యాసం “ఆధునిక” రామాయణాల మీదే కేంద్రీకరిస్తుంది, (ఆ) విశ్లేషణంతా “ఆధునిక” దృష్టితోనే జరిగింది.
వ్యాసం అంతా చదివితే తొలి ఆరోపణ నిజం కాదని ఇట్టే తెలిసిపోతుంది. వాల్మీకి రామాయణం చర్చించే సమస్య గురించి పోలాక్ చెప్పిన అభిప్రాయాన్ని ఈ వ్యాసరచయిత అంగీకరించారు. అంటే అది రాజ్యం ఒకతరాన్నుంచి మరో తరానికి సంక్రమించే పద్ధతుల గురించి ప్రధానంగా చెప్పిందని ఒప్పుకున్నారన్న మాట (వాల్మీకి రామాయణం చెప్పేది అదేనా లేదా మరోటా అనేది వేరే చర్చ, అది ఈ వ్యాసం scope లో లేదు). ఈ ప్రతిపాదన ప్రకారం రాముడు దేవుడు కాడు, ఆదర్శపురుషుడు మాత్రమే. అలాగే, వాల్మీకి రామాయణంలో రాజ్య సంక్రమణకి వున్న మిగిలిన నమూనాలు (ఉదా: సుగ్రీవుడు, విభీషణుడు) సరైనవి కావని, రాముడి మార్గమే అందరికీ అనుసరణీయమని చాటి చెప్తుంది వాల్మీకి రామాయణ కథ. ఇక తెలుగు రామాయణాల విషయానికి వస్తే, తెలుగులో తొలి రామాయణం వచ్చేనాటికే రాముడు దేవుడయ్యాడని ఈ వ్యాసం చేసే ప్రతిపాదన. కనక తెలుగులో ఇరవయ్యవ శతాబ్దానికి ముందు వరకు వచ్చిన రామాయణాలన్నీ రాముణ్ణి దేవుడిగా చూస్తూ ఆ దృష్టి నుంచి రామాయణ కథని ఆయా కవుల ప్రతిభలకి తగ్గట్టుగా, ఆయా కాలాల స్థితిగతులకి అనుగుణంగా చెప్పటానికి ప్రయత్నించాయన్నది corollary. ఐతే ఇరవయ్యవ శతాబ్దంలో కొత్త ఆలోచనలు వచ్చినయ్, రామాయణాన్ని కొత్త కోణాల్లోంచి చూడటం మొదలయ్యింది (స్త్రీల రామాయణాల్లాటి మౌఖిక సంప్రదాయపు కథనాలు అంతకు ముందు నుంచీ వున్నయ్ కాని అవి mainstream లోకి రాలేకపోయినయ్). ఈ కొత్తదారికి దారితీసిన మూల కారణాలేవో వివరించే ప్రయత్నం చేసిందీ వ్యాసం. ముఖ్యంగా అచ్చు యంత్రం, వలస పాలన, వాటి ద్వారా కలిగిన సామాజిక విప్లవం – వీటిని గుర్తించి, వీటి మూలాన ఈ కొత్తదారిలో వచ్చిన రచనల పరిణామాన్ని విశ్లేషించటం జరిగింది. కనక వ్యాసమంతా కేవలం “ఆధునిక” తెలుగు రామాయణాల గురించే అనటం అవాస్తవం.
ఇక రెండో విషయం. మొదటగా, ఈ point నాకు సరిగా అర్థం కావటం లేదు. “ఆధునిక” దృష్టితో విశ్లేషించటానికి అభ్యంతరం చెప్తున్నారు. అంటే ఆధునిక పూర్వ దృష్టితో విశ్లేషిస్తే బాగుండేదని దాని భావం అనుకుంటున్నా. ఐతే ఇప్పటి కాలంలో నివసించే ఒక వ్యక్తికి అలాటి దృష్టి ఎలా సాధ్యమో నాకు తెలియటం లేదు. బహుశ ఆవిడ reference ఇచ్చిన జయప్రభ గారి వ్యాసంలో అలాటి దృష్టితో చేసిన విశ్లేషణ వుందేమో చూడాలి. నాకు బోలెడంత కుతూహలంగా వుంది అలాటి విశ్లేషణ చూడాలని. ఎవరైనా దాన్ని చదివిన వాళ్లు ఆధునిక పూర్వ దృష్టి ఎలా వుంటుందో దయచేసి అందరితోనూ పంచుకోండి.
కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
08/01/2012 12:40 am
సౌమ్య గారు: ఆ లంకె పనిచెయ్యటం లేదు. కాని ఆ పద్యాల URL ఇది.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
07/21/2012 2:55 am
సురేశ్ గారు,
ఓపికతో వివరించినందుకు కృతజ్ఞతలు, దేశ్‌పాండేగారి వ్యాసం గూగులమ్మ ప్రసాదించినంత వరకూ చదివాను. 🙂 నాకు అర్థమైనంతవరకూ “ళ”కారానికీ యితర మూర్ధన్యాలకీ కొంత తేడా ఉంది. యితర మూర్ధన్యాలు ప్రధానంగా ఉత్తరభారతంలోని పశ్చిమభాగానికి చెందిన ఉచ్చారణ వల్ల ఏర్పడినవైతే, యీ “ళ”కారం తూర్పు భాగానికి చెందిన ప్రాంతాలలోని ఉచ్చారణ వల్ల వచ్చింది. ఆ ప్రాంతాలలో “డ”, “ఢ”లకు కొన్నిసందర్భాలలో “ళ”కార ఉచ్చారణ ఉండేదని, మనకు లభ్యమవుతున్న శాకల్యుని ఋగ్వేద పదపాఠం ఆ ప్రాంతంలో గ్రంథస్థమై ఉంటుందని, పాణిని పశ్చిమభాగానికి చెందిన వాడు కాబట్టి అతనికి లభించిన పదపాఠంలో “ళ”కారం లేకపోవడం వల్ల అతను తన శిక్షలో దాన్ని చేర్చలేదని దేశ్‌పాండే చెప్పినట్టుగా నాకర్థమయ్యింది. ఇది ఆసక్తికరమైన విషయం. తర్వాత కాలంలో తూర్పుభాగానికి చెందిన భాషలలో యీ “ళ”కారం ఎలా మాయమయ్యిందో మరి! బెంగాలీలో “డ”కారంలా వినిపించే “ర”కారం మాత్రం ఇప్పటికీ ఉంది! “హౌరా”లో “ర”కారం వాళ్ళు “డ”కారానికి దగ్గరగా పలుకుతారు (నా పేరుని కూడా వాళ్ళు కామేశ్ వడ రావ్ అని పలికేవారు! 🙂 , దీనికీ వేదవాఙ్మయంలో కనిపించే “ళ”కారానికీ ఏమైనా సంబంధముందేమో!
తెలుగులో “ల”కారం “ళ”కారంగా మారడం గురించి కూడా మీరిచ్చిన వివరణ బాగుంది. “ర”కారం ముందున్న పదాలలో “ల”కారం “ళ”కారంగా మారడం నేనుకుడా గమనించాను కాని అలా కాని సందర్భాలలో కూడా చాలాచోట్ల కనిపించడంతో అదిక్కడ వర్తించదేమో అనుకున్నాను. రెండు మూడు రకాలుగా మార్పు జరిగుండవచ్చునని తట్ట లేదు. సంస్కృతంలో (నతిసూత్రం ప్రకారం) “న”కారం “ణ”కారంగా మారడానికి అడ్డువచ్చే “ల”కారం తెలుగులో తానే “ళ”కారంగా మారడం ఆశ్చర్యం!
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:
07/17/2012 1:09 am
‘స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన.‘
* అదే బెటరనిపిస్తుంది మోహనగారూ!
మాకొక డ్రైవర్ వుండే వాడు. పేరు మునిరాజ్. ఎప్ఫుడూ టైం కి వచ్చేవాడు కాడు. ఫోన్ చేసి, ఎక్కడున్నావని అడిగితే, ‘ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా సార్..’ అనే వాడు. ‘ఐతే ఏం చేయమంటావ్’? ఆఫీస్ మానేయమంటావా? అని విసురుగా అడిగితే… ‘మానేయడం ఎందుకు సార్? మీరు బేగ ఫలానాచోటు కొచ్చేస్తే, నేనాడ్నుంచి తోలుకుపోతా’ అంటూ ఓ ఉచిత సలహా చెప్పేవాడు. పైగా, ‘అలా ఐతేనే, మనకు టైం కల్సొస్తుంద్సార్. మీరు త్వరగ ఆఫీస్ కి పోవచ్చు, (ఆలోచించుకోండి)’ అంటూ ఓ సూచన కూడా పడేసే వాడు.
చెబితే నవ్వుతారు కానీ, చివరికి అదే జరిగేది. అతను చెప్పినట్టే నడుచుకునే వాళ్ళం. అలనాడు – రథసారధి గీతోపదేశంతో అర్జునునికి జ్ఞానోదయమైనట్టు, మాకూ ‘కాల జ్ఞానం’ కలిగింది ఈ డ్రైవర్ల వల్ల! అందుకని, మేమే ఓ అడుగు ముందుగా బయల్దేరే వాళ్ళం. “ఏమిటీ! ఇంత త్వరగా,?” అని ఎవరైనా అడిగితే “డ్రైవర్ని పికప్ చేసుకోవాలి!” అంటూ మా జోక్ కి మేమే నవ్వుకునే వాళ్ళం.
ఇలాంటి ‘బద్ధకిష్టుల’ పట్ల మనకు – మానవతా దృక్పధం మెండుగా వుంటే తప్ప, భారత దేశంలో నవ్వడం సాధ్యం కాదని స్వానుభవంతో తెలుసుకున్నా.
థాంక్స్ మోహన గారూ! నా రచన బావుంది అన్నందుకు!
నమస్సులతో-
ఆర్. దమయంతి
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aaditya reddi గారి అభిప్రాయం:
07/16/2012 9:16 pm
ఎం కె రావు గారూ, ఏ లోపం లేకుండా, ఎక్కడా నూటికి నూరుశాతం పెర్ఫెక్షన్ ఉంటున్దని నేను అనుకోను. ఏ లోపం లేని వ్యక్తులెలా ఉండరో అలాగే లోపం లేని కధ ఉండకపోవచ్చు. కాని ఈ కధలో లోపాలు చాలా ప్రధానమైనవి. వాటిని పట్టించుకోకుండా ఈ కధకు గత యాబై ఏళ్ళుగా కొంతమంది వీరపూజ చేసారు. అదే నిజమని ప్రచారం చేసారు. యిప్పటికీ చేస్తునే ఉన్నారు. ఆ ‘అతి’ మీదనే నా వ్యతిరేకత.
యిక మీరన్నట్టు, మంచి అన్నది మల్లెపూల సువాసన లాంటిది దానిని వీలయినంత ఎక్కువ ప్రచారం చేయాలి. చెడు అన్నది మురిక్కాలవ వాసన వంటిది. దానిని వీలయినంత వేగంగా కప్పెట్టేయాలి. నేను అదే చేస్తున్నాననుకుంటున్నాను.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన గారి అభిప్రాయం:
07/16/2012 8:04 pm
రమ గారు,
“పుస్తక మేల” అని అనకుండా ” పుస్తక మేళ ” అని NBT వాళ్ళు అనడం. వాళ్ళు బహుశా తెలుగు నేలని గౌరవించి అలా పెట్టేరని అనుకోవాలి.
ఇక్కడ మేలా (పుస్తక్ మేలా, మేల కాదు) అనేది పండుగ లేక సంత అనే అర్థములో వచ్చే హిందీ పదము అని నా భావన. అది మేళ కాదు, తెలుగులో మేళము అంటే సమూహము, ముఖ్యముగా ఆటకత్తెల సమూహము అనుకొంటాను. పుస్తకము + ఏల = పుస్తక మేల అనలేదే, అందుకు సంతోషించాలి.
తమిళంలో “ఎ” కారం తెలుగు లోని అకారానికి సమానమా?? ఏమిటీ కారణం? వాళ్ళకి ఉ , ఎ లాంటివి లేవేంటి ?
అన్ని చోటులలో అలా వాడరు వాళ్లు. జ-కారముతో మొదలయ్యే సంస్కృత పదాలకు జె-కారమును తరచు వాడుతారు, ఉదా. జయం – జెయం. ఇలాటివి తెలుగులో కూడ కొన్ని ఉన్నాయి, ఉదా. చంద్రిక, చెంద్రిక; జలగ, జెలగ. ర-కారానికి బదులు రె-కారమును అరుదుగా వాడుతారు, ఉదా. రమ – రెమ. తమిళ ఛందస్సులో ఐ-కారమును లఘువుగా వాడడము నాకు తెలుసు. ఉ-కారము చివర వస్తే అది ఒక్కొక్కప్పుడు పరిగణించబడదు. కాని కొన్ని విషయాలలో వాళ్ల నియమాలు చాల కఠినమైనవి. మిగిలిన భాషలలో ఆ, అం, కల్ మున్నగునవి ఒకే విధమైన గురువుగా అంగీకరించినా తమిళములో వాటికి భిన్నత ఉన్నది. పాటలలో వీటిని గమనించవచ్చును. విధేయుడు – మోహన
ఉరుము ఉరిమి… గురించి మోహన గారి అభిప్రాయం:
07/15/2012 11:44 am
స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన
మత్తకోకిల కథ గురించి మోహన గారి అభిప్రాయం:
07/13/2012 4:14 pm
విశ్వనాథం గారికి, తఃతః గారికి నా వ్యాసము నచ్చినందులకు కృతజ్ఞతలు.
తఃతః గారు – 1962లో తిరుపతి, 1971లో బెంగళూరు వదలిన తరువాత నాకు దైనందినము తెలుగు మాటలాడే అవకాశము లేదు. ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు మాత్రమే అలాటి అవకాశము కలుగుతుంది. ఇదంతా ఎందుకంటే నా మాతృభాష తెలుగు కాదు, కన్నడము. మీరు చెప్పినది బహుశా సరియే అనుకొంటాను. అదలా ఉంచితే, బాలవ్యాకరణములో ఆచ్ఛిక పరిచ్ఛేదములో – ఇ, టి, తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు. ఇవి ద్వితీయాద్యేకవచనంబులు పరంబులగునపుడు నామంబులకుం గొన్నింటికిం ప్రాయికంబుగ నగు అనే సూత్రము క్రింద కాలు – కాలిని – కాలిచే, నాఁగలి – నాఁగటిని – నాఁగటిచే, నేయి – నేతిని – నేతిచే ఉదాహరణములుగా ఇవ్వబడినవి. అలాగే ఆలు (భార్య) కూడ. పాలు పదము కాలు, ఆలు వంటిదే కదా? కాని పాలు ఏకవచనము కాక నిత్యబహువచనమా? అది నిత్య బహువచనము అయితే అప్పుడు, చేలను (చేను – చేలు), ఆలను (ఆవు – ఆలు) వలె పాలు – పాలను అవుతుంది.
విధేయుడు – మోహన
ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల గురించి గంటి లక్ష్మీ నరసింహ మూర్తి గారి అభిప్రాయం:
07/13/2012 10:41 am
ఆంధ్రభాషలో చారిత్రక నవల అనే వ్యాసం చాలాబాగుంది. ఎన్నో చారిత్రక నవలలు వాటిలో విశేషాలు చాలా చక్కగా వివరించేరు నోరి వారు. వారి నవల కవిసార్వభౌముడు నా దృష్టిని శ్రీనాధుని వైపు మళ్ళించింది. పై వ్యాసంలో తెలుగులో వచ్చిన అద్భుత నవల ‘సత్యప్రభ’ గురించి ప్రస్తావన లేకపోవడానికి కారణాలు మనకు తెలియవు. ఈ నవల రచయిత కావ్యకంఠ వాశిష్ఠ గణపతిమునిగారు. ఇది 1937 లోనే భారతి మాస పత్రికలో ధారావాహికంగా వచ్చింది. తదుపరి వారి కుమారుడు కీ.శే. వాశిష్ఠ మహదేవశాస్త్రిగారు 1964లో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించేరు. పిదప ఈ నవలను విశాలాంధ్ర పుస్తక ప్రచురణలు, హైదరాబాదు వారు ముద్రించేరు. ఈ నవలను నా సోదరుడు కీ.శే. డా.గంటి శ్రీరామమమూర్తి, 1982లో ఆంగ్లము లోనికి అనువదించేరు. 2011 అక్టోబరు నుంచి “పొద్దు” అంతర్జాల పత్రికలో ధారావాహికంగా రావడం ముదావహం. కాని ఈ నవల తెలుగు, ఇంగ్లీషు కూడా ఇప్పుడు ఒకటి రెండు కాపీలు తప్ప ఆంధ్రదేశంలో ఎక్కడా దొరకక పోవడం ఆంధ్రుల దురదృష్టం.
ఈ నవల ఇతి వృత్తం అలనాటి ఆంధ్రసామ్రాజ్యమునేలిన శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ. ఆంధ్ర, మగధ రాజ్యాల రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల నాధారంగా జేసుకొని విస్తృతమైన తెరమీద ఎన్నో పాత్రలను సంధానం చేస్తూ ఆంధ్రమహావిష్ణువు యొక్క చారిత్రాత్మక ప్రణయగాధగా మలచిన శ్రీకావ్యకంఠ వాశిష్ఠ గణపతి మునిగారి స్వకపోల కల్పితం.చివరి కొంత భాగమ మాత్రం వారి కుమారుడు వాశిష్ఠ పూరించేరు.
భవదీయుడు
గంటి లక్ష్మీ నరసింహమూర్తి (బెంగుళూరు).
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aaditya reddi గారి అభిప్రాయం:
07/12/2012 7:46 pm
యశస్వి గారూ:మీరు యిలా అన్నారు “ఆదిత్య రెడ్డి గారి భావాలలో మరీ ఎక్కువ “ఎర్రతనం” తొణికిసలాడుతోంది” అని.కాని నిజానికి నేను చాలా నల్లవాణ్ణి, నా భావాలు కూడా నల్లవే. ఎర్రవాళ్ళు, ఎర్రచొక్కాల వాళ్ళు, ఈ కథని ఎర్రకథ అన్నారు,ఆకాశానికి ఎత్తేసారు, అదే నా బాధ. అలా కాకుండా ఈ కధని ఏ ఆర్ష ధర్మ ప్రచార సభ వారో ప్రచారం చేసుంటే అసలు గొడవే లేకపోను. నేను బాగా ఇష్టపడేవాణ్ణికూడా.
ఎం కె రావు గారూ: ఈ కధని గురించి సి.యస్.రావు గారు పైన ఏమన్నారో చూడండి. “ఈ కథ ద్వారా రామారావుగారు ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే అదేదో చెప్పటం కష్టం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా కథ సాగుతుంది.” అని. దాని పరమార్ధమేదో దానికే తెలియదు. యింక అదేం సాధిస్తుందంటారు.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aaditya reddi గారి అభిప్రాయం:
07/09/2012 8:15 pm
5) కధ ముగింపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సీతారాముడు లోకం తెలిసిన మనిషి. తన తండ్రి చేసిన పని తనకు నచ్చక పోతే, తండ్రిని, గ్రామపెద్దలని ఎదిరించలేని నిస్సహాయతకు లోనయితే, తన బిడ్డని తీసుకుని ఆ గ్రామం విడిచి పెట్టి పోతాడు. లేదు, ఆవేశానికి లోనయితే తనను తాను శిక్షించుకుంటాడు. అంతేగాని తన కొడుకుని ఏ తండ్రి చంపుకోడు. అందులోనా సీతారాముడు అస్సలు అలా చేయలేడు. తన భార్య మరొకరితో పోయినా తన బిడ్డ కోసమే మరో పెళ్ళి కూడా చేసుకోలేదు (చేసుకున్నట్టు ఎక్కడా లేదు.) అయినప్పటికీ, ఒక వేళ ఆవేశముతో కూడిన మూర్ఖత్వముతో చేసాడనే అనుకుందాం. కాసేపటి తరువాతనన్నా వాస్తవంలోకి వచ్చి భయపడతాడు. తాను చేసిన పనికి నిష్కృతి లేదని మనోవేదనకు గురి అవుతాడు.
కాని కధలో చాలా భిన్నంగా ఉంటుంది. – ఒక మాఫియా ముఠా వ్యక్తిలాగా, నిరంతరం హత్యలు చేసి కరుడు గట్టిన వ్యక్తిలాగ, తాను చంపిన వ్యక్తితో ఏమాత్రము సంబంధం లేని వ్యక్తి లాగ, చంపిన శవాన్ని బస్తాకెత్తి దానిని పంచాయితీ వరకు మోసుకు వచ్చి నిబ్బరంగా మాత్లాడుతాడు.
6)సీతారాముడు మూట భుజాన్న తెస్తుంటే జనమంతా అటు వైపు చూస్తారు ఆసక్తిగా. అప్పుడే చేసిన హత్య గదా శవం నుంచి రక్తం కారాలి గదా. అతని చేతులు, బట్టలు రక్తంతో కనపడాలి గదా, కాని అవేమి అక్కడ కనపడవు. (తెలుగు సినిమా హీరో లాగ చేతికి మట్టి అంటకుండా ఎంత చక్కగా చేస్తాడో హత్య!)
7)కధకు యజ్ఞం అని పేరు. ఆకధ ఒక బలితో పూర్తవుతుంది, అని ఆలోచించినపుడు హిందూ మత భావనలు పాఠకుడి మనసులోనికి రావా?
యిలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. కానీ యిక్కడికి ఆపేస్తున్నాను.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi గారి అభిప్రాయం:
07/08/2012 8:53 pm
3) సుందరం పాలెం గ్రామ రైతుల స్థితిగతులను చెప్పేటప్పుడు విరుద్ధభావాలు కనిపిస్తాయి రచయిత చెప్పినదానికి మరొకచోట పాత్ర చెప్పినదానికి చాలా వ్యత్యాసాలుంటాయి. ఎక్కడా నిర్దిష్టత ఉండదు. (అవన్ని పేరాలు పేరాలుగా ఉటంకిచాల్సి ఉంటుంది. నాకు టైపింగ్ సరిగా రాని కారణం చేత రాయటం లేదు.) అయితే రైతుల నష్టాలు కొంతవరకు ఎలా తీరాయంటే ఇళ్ళ జాగాలకి కల్లాలు అమ్మడం ద్వారా అంటాడు అప్పలరాముడు. ఇది ఎంతవరకు వాస్తవమో ఆలొచిద్దాం. కధాకాలం 1963 లేదా 1966. ఆనాటికి సుందరపాలెం అనే 400 ఇళ్ళు గల గ్రామంలో ఇళ్ళ జాగాల వ్యాపారం జరుగుతుందా. అదీ కేవలం ఒక హైస్కూలు వచ్చిన కారణంగా? 1982, 84 ప్రాంతానికి విశాఖపట్నం లోనే రియల్ ఎస్టేటు వ్యాపారం అంతగా లేదు. నేటి గురుద్వార జంక్షన్లో గల బాలయ్య శాస్త్రి లే అవుట్ లో గజం 4 రూ అంటే ఆలోచించవల్సి వచ్చేది అని స్థానికులు చెప్తారు.అలాంటిది ఎంత జాగా ను ఎంతమందికి ఏ రేటు చొప్పున అమ్మితే రైతుల అప్పులు తీరిపొయాయో అర్ధం కాదు.
4) రచయితలు, ముఖ్యంగా ప్రగతి శీల భావజాలం గల రచయితలు, ఆశా వాద దృక్పధం కలిగి ఉంటారు. తమ రచనలలొ దానినే ప్రతి ఫలింప జేస్తారు. అలా చెయాలి కూడా. కాని ఈ కధలో ఎక్కడా ఆశ అనేది మచ్చుకి కనబడదు.
శ్రీరాములు నాయుడు హైస్కూల్ కావాలంటాడు. దానికి ఎర్రయ్య అనే పాత్ర చదువుకునే కూలీలు కావాలి గదా అంటాడు. చదువుల పట్ల నిరసన వినిపిస్తాడు. రచయిత ఆపాత్ర ద్వారా తప్ప ఖండించడు. మరో చోట రోడ్డు వస్తుందంటే పాతిక మంది బళ్ళ వాళ్ళ వ్యాపారాలు పోతాయంటాడు. కరెంటు వస్తుందంటే దంపుళ్ళ కూలీలు పొతాయంటాడు. మరొక పాత్ర గాని రచయిత గాని ఖండించక పోవడం వలన కధలో అవే అభిప్రాయాలు పాఠకుడికి అందుతాయి గదా. ఇది పాక్షిక నష్టాలను చూపించి ప్రగతిని లేదా మార్పుని అడ్డుకోవడమేగదా. (యింకావుంది)
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi గారి అభిప్రాయం:
07/07/2012 8:51 pm
యజ్ఞం కధ తిరోగమన కధ ఎందుకయ్యిందంటే:
1) ఏ రచన కైనా వాస్తవమే పునాది. వాస్తవాలను విస్మరించి లేదా వాస్తవాలకు దూరంగా జరిగి చేసే రచన ఏదైనా అంతిమంగా సమాజానికి నష్టమే చేస్తుంది.యజ్ఞం కధలో దళితుడైన అప్పల రాముడి తండ్రికి 12 ఎకరాల భూమి ఉంటుంది.ఎప్పుడూ. కధా కాలానికి యాభై ఏళ్ళ క్రితమే, అంటే నేటికి వందేళ్ళ క్రితమే నన్న మాట. ఇది ఎంతటి సత్య దూరమయిన విషయమో ఏ దళితున్ని అడిగినా తెలుస్తుంది. లేదా నాటి ప్రభుత్వ గణాంకాలు చూసినా తెలిసి పోతుంది .ఆ రోజుల్లో దళిత స్త్రీలు వీసెల కొద్ది వెండి మోసేవారట! ఎంత అవాస్తవమో! తిండికి లేక ప్రతి దలితుడు పాలేరుగా ఉండే స్థితి. చిన్నపిల్లలని సైతం చిన్నపాలేరులుగా పెట్టి కుటుంబం మొత్తంగా ఆ రైతు పొలంలో కల్లములో పనిచేస్తూ పెట్టింది తిని అర్దాకలితొ కాలం గడిపే వారు. ఈ స్థితి 1975, 76 ల వరకు మన కళ్ళ ముందున్నది.
2)ఆదిమ కాలం నుండి మానవుడు అడవి నుండి గ్రామానికి గ్రామం నుండి పట్టణానికి ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఈరొజుల్లో నగరాలనుంచి మహానగరాలకు, విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకని? ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితితి ని పొందాలనే కదా. కధలో సీతారాముడు అలాగే పట్నం వెల్తాడు. అక్కడ బస్తాలు మోస్తాడు, రిక్షా లాగుతాడు. అయితే “వాడి పెళ్ళాం మరొకడితో లేచిపొయింద”ట . దానిని వెటకారంగా, వేళాకోళంగా చెప్తాడు రచయిత ఒక పాత్ర ద్వారా .(అక్కడికి పల్లెల్లొ ఎవడి పెళ్ళామూ మరెవడితొ లేచిపోదని గ్యారంటి నేమో మరి.) ఇక్కడ నూతన వృత్తులను వెతుక్కొవడాన్ని అంగీకరించలేక మళ్ళీ సీతారాముడ్ని వెనక్కి రప్పిస్తాడు. నిజానికి ఒకసారి పట్నం వెళ్ళిన వ్యక్తి అక్కడే క్రిందా మీదా పడతాడు గాని వెనక్కు రావటానికి యిష్టపడడు. పెళ్ళాము లేచిపోయినవాడు అసలే రాడు సి గ్గుపడి. కాని కధలో దానికి భిన్నంగా ఉంటుంది. బహుశా దళితునికి మానాభిమానాలు ఉండవేమో!? (యింకా ఉంది. దయచేసి రేపు యిక్కడే చూడగలరు)
[ఆదిత్య గారూ – దయచేసి మీ అభిప్రాయాలలో అచ్చుతప్పులు సరిదిద్దుకున్న తర్వాతనే పోస్ట్ చెయ్యగలరు. ప్రతీ వాక్యాన్ని ఇంచుమించు తిరగరాసి ప్రచురించడం అన్నిసార్లూ మాకు కుదరని పని. – సం.]
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి jayaprabha గారి అభిప్రాయం:
07/06/2012 4:56 pm
ఆదిత్యా! ఎప్పుడైనా ఎవరి మాటా చివరి మాట కాదు. ఏ విశ్లేషణలో బలముంటుందో అది తప్పక నిలబడుతుందనే నేను నమ్ముతాను. నేను విద్యాసాగర్ రాసిన విమర్శని, యజ్ఞం కధ మీద, చదవలేదు గనక దాని గురించి ఏమీ మాట్లాడలేను. చదివి ఉంటే తప్పక మాట్లాడగలిగి ఉండేదాన్ని. నిజానికి సి యెస్ రావు గారు రాసిన ఈ వ్యాసాన్ని తప్ప మిగిలినవాటిని వేటినీ నేను చదవలేదు. నా అభిప్రాయాలు కేవలం నా పఠనానుభవాన్ని ఆధారం చేసుకుని చెప్పినవే మాస్టారి కధ మీద. నాకు గుర్తున్నంత వరకూ ఆ కధని నేను చదివినప్పుడు అది నన్ను ఇబ్బంది పెట్టలేదని మాత్రం చెప్పగలను. ఆ కధని నేను అర్ధం చేసుకున్న తీరు వేరనుకుంటాను. బహుశా నా దృష్టికోణం వేరై ఉండవచ్చును కదా?? చర్చ సత్యాన్వేషణ కోసమే అయితే జరగవచ్చు దేనిమీదనైనా! సాధారణంగా తెలుగులో సాహిత్య చర్చల్లో అసలు విషయం మరుగున పడిపోయి అదేదో బలాబలాలు తేల్చుకోవడం లాగా మారిపోతూంటుంది చాలాసార్లు. ముఖ్యంగా భావస్పందనలు ముందుకు తోసుకుని వచ్చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఇంక విషయం మీద ఖచ్చితమైన అభిప్రాయాలు గనక ఉన్నప్పుడు కూడా చర్చ ఒక సంయమనంతో సాగే వీలుండదు. ఇదేమీ గోదాం లోని కుస్తీ పోటీ లాంటిది కాదు. ఒకరు గెలవడమో ఒకరు ఓడడమో ఖచ్చితంగా నిర్ణయింపబడదు. పాఠకులు కానివ్వండి, విమర్శకులు కానివ్వండి భిన్న దృష్టి కోణాలలో ఒక అంశాన్ని చూసే వీలుంది. అర్ధం చేసుకునే వీలూ ఉంటుంది. అందువలన ఎప్పుడైనా ఏ విమర్శా సంపూర్తి కాలేదు. అందులో ఎందరో పాల్గొని దానిని పరిపుష్టి చేయగలగడమే ఆ రచనకి ఉన్న బలం! అందువలన చర్చని దెబ్బలాట మార్గంలో నడపకుండా మాట్లాడుకోగలిగితే ఏ చర్చ అయినా ఒక విషయాన్ని పట్టి చూపించే వీలుంది. పాఠకులూ, విమర్శకులూ కూడా పొరపాటు పడే వీలు ఉంటుంది. అలాగే ఒక్కోసారి రచయిత తన రచనలో చూడలేని అంశాలని పాఠకులూ విమర్శకులూ చూసే సందర్భమూ ఉంటుంది. రెండూ సాధ్యమే సుమా! అయితే రచయిత తన రచనని గురించి అనుకునే మాటకి ఒక విలువ ఉంది. ఆ కధ అన్నది ఆయన సృష్టి గనక. దాన్ని చెరిపేసే తీరు విమర్శలో నిలబడదు. ఆయన మాటలు ముఖ్యమైనవే!! వాటిని ఎవరు ఒప్పినా మానినా!
ఇంక నావరకూ క్లుప్తంగా చెప్పవలసి వస్తే నాకు అహింసా మార్గం ఇస్టం . గాంధేయ మార్గం ఇస్టం. ఆ మనసుతోనే నేను ఈ కధని గురించి అనుకున్నది ఏమంటే, అర్ధం చేసుకున్నది ఏమంటే, కాళీపట్నం రామారావు గారు తన యజ్ఞం కధ ద్వారా ప్రత్యేకించి హింసా మార్గాన్ని ప్రోత్సహించారనో, లేదా దానిని ఒక ఆదర్శంగా చూపించారనో కాదు. అలా మరి నాకు అనిపించలేదు. ఆ కధలో తాను బానిసగా ఉండదలుచుకోనప్పుడు బహుశా అప్పల్రాముడి కొడుకు గనక స్వయంగా పోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే గనక అప్పుడది పాఠకుల మనసులలో సానుభూతిగా మిగులుతుంది . అయితే అది రచయిత ఉద్దేశ్యం కాదు (ఈ విషయాన్నే మాస్టారు చెబుతున్నారు.) అలాంటి సానుభూతిని చోటు లేకుండా చేయాలని రచయిత లక్ష్యం గనకే అక్కడ అతడు కొడుకుని చంపుకున్నాడు. ఇది అనైతికమనీ, అమానుషమనీ మీ చర్చ సారాంశమా? సి యెస్ రావు గారు అలాగే అనుకుంటున్నారు. చిన్నపిల్లడిని హత్య కావించడం అన్న అంశాన్ని కధ లోని ప్రధాన అంశంగా చూసి మనం మాట్లాడలేము. అది ఆ తండ్రి చాతకాని చర్య. అతడి లో జనించిన నిర్వేదం. ఒక నిస్సహాయత, మితిమీరిన ఆవేశం కలిసిన చర్య. కోపంతో వివేకం నశించి చేసిన చర్య. అది పాఠకులని “షాక్” చేయాలని అలా చేసానని కారా మాస్టారు అన్నమాటని నేను ముందటి అభిప్రాయంలో ప్రస్తావన చేసింది అందుకనే! ఎవరిని నెపం పెట్టాలో తెలియక, సంతకాలు చేసిన తన తండ్రిని ఏమీ అనలేక, పోయి బాలుడైన తన కొడుకుని చంపుకున్నాడు. అది సమర్ధనీయం కాదు “సభ్య సమాజానికి” (కానీ కోపం వచ్చినప్పుడల్లా ఇప్పటికీ మగవాళ్ళు వాళ్ళ భార్యలనో, వాళ్ల సంతానానినో చంపుకుంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయే మన వర్తమానంలోనూ?? అక్కడ అది మగవాడి హక్కుగా కదా ఈ సమాజం అర్ధం చేసుకుంటోందీ? వాటి పట్ల ఇవాళ్టికీ కోర్టులూ చట్టాలూ పెద్దగా స్పందించవని మీకు గణాంకాలు చూస్తే తెలుస్తుంది. గృహహింసలో మన తెలుగు వాళ్ళూ మొదటి స్థానం లోకి వచ్చిన విషయం మీకు తెలుసునా?) దీన్నటుంచితే, గమనించి చూడండి ఇంక యజ్ఞం కధలో. ఆ కొడుకుని చంపిన కోపమే అటు తరవాత పెరిగి విస్తరించి చివరికి “వర్గ శత్రు నిర్మూలన” వైపు మళ్ళింది కదా శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో? నేను చెప్పిందీ, ఆ కధ ద్వారా నేను చూసిందీ ఇది. ఈ చర్చని చూసేకనే నా సందేహాన్ని నివృత్తి చేసుకుందికనే నేను యజ్ఞం కధ వాటి పూర్వా పరాల మీద మాస్టారితో మొన్నీమధ్య మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలలో కొన్నింటిని నేను నా అభిప్రాయం లొంచి ఈమాట అభిప్రాయాలలో అవసరమని అనిపించి వ్యక్త పరిచేను. ఇంక ఈ కధ “తిరోగమన కధ “ఎలా అయ్యిందని మీరు భావిస్తున్నారో నాకు తెలియదు గనక దాని మీద నేను ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేను. హింస తాలూకు మూలాలని వదలి మనం బాలుని హత్యని కేంద్రంగా చేసుకుని యజ్ఞం కధని చర్చ చేయకూడదనుకుంటాను. అలా చేసినందువలన జరిగేదేమంటే సున్నిత స్వభావులకి అది ఇబ్బందిగా అనిపించి, తద్వారా కధ రాసిన రచయితని నెపం పెట్టి, నిందించడం జరుగుతుందే తప్ప మరో విషయం బహిర్గతం కాదు. యజ్ఞం కధ మాత్రమే కాదు తన మిగిలిన కధలలోనూ మాస్టారు ఎన్నుకున్న ఇతివృత్తాలనీ వాటి నిర్వహణనీ చూసినప్పుడు మాస్టారు హింసావాదిగా నాకు అనిపించలేదు. అందువలన యజ్ఞం కధ ముగింపు మీద నేను పాఠకురాలి గానూ విమర్శకురాలి గానూ నా విమర్శని ఎక్కుపెట్టలేను. అది దళితుల మీద భూస్వాముల ఆధిపత్యమూ హింసా అనే నేను ఇప్పటికీ అర్ధం చేసుకుంటాను. ఆ శ్రీకాకుళం లోనే, అదే తిరిగీ మళ్ళీ మొన్నటి మద్దువలస రిజర్వాయర్ భూముల దగ్గర బయట పడింది. లక్షింపేటలో మారణ హోమం అంత దారుణంగా జరిగింది. బొత్స వాసుదేవనాయుడు బహుశా ముదిరిన యజ్ఞం కధలోని శ్రీరాములు నాయుడేనేమో అని మీరెందుకని అనుకోలేదో? ఏం మారిందీ పరిస్థితి ఇవాళ్టికైనా? అని మాస్టారు అన్న ప్రశ్నకి ఏం జవాబు ఉంది గనకా తెలుగు మేధావుల ముందు? యజ్ఞం కధని ఎవరు ఏ దృష్టితో చూస్తున్నారు అనే దాన్ని బట్టీ ఆ కధ వారికి ఆ దృష్టి లోంచి అర్ధమవుతుంది.
చివరగా నేను బాలుని హత్యని సమర్ధించడం లేదు అని చెబుతున్నాను. అదే సమయంలో మాస్టారు పిల్లల్ని చంపుకోవడాన్ని ఆ కధలో సందేశం గానో సూచనగానో చెప్పారని కూడా నేను అనుకోవడం లేదనీ చెబుతున్నాను. ప్రస్తుతానికి ఇంతకు మించి ఈ విషయంలో నాకు మాట్లడవలసింది మరి లేదు.
సెలవు,
జయప్రభ.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi గారి అభిప్రాయం:
07/05/2012 9:18 pm
జయప్రభ గారూ: మీ పేరు తప్పుగా పడినందుకు క్షమించండి. మీ పేరు తెలియక కాదు. మీరు తెలుగులో మంచి కవయిత్రి అని తెలుసును. అన్నమయ్య సాహిత్యంపై పరిశోధన చేసారని తెలుసును. ఆ మధ్య విశాఖపట్నం సభలో పాల్గొనటమూ తెలుసును. కాకపొతే పొరపాటు పడింది. యిక విషయనికి వస్తాను.
1) మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారు. “విద్యాసాగర్ కి మాత్రమే నేను జవాబు రాసేను” అంటున్నారు. కానీ, పత్రికలొ రాస్తున్న విషయం మరిచిపోతున్నారు.
2) మీరు “యజ్ఞం కధ నాది కాదు. రామారావు గారిది. అందువలన ఆ కధని గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చెప్పిన మాటలు తప్పక వినవలసినవే అవుతాయి!“అన్నారు. తప్పక వినవలసిందే, వింటాం. కాని ఆయన (కా.రా) చెప్పారు గాబట్టి నమ్మవలసిందే అంటే మాత్రం నమ్మం.
3) లక్షిం పేట హత్యల ప్రస్తావన తెచ్చారు. అగ్ర వర్ణ దురహాంకారంతో చేసే హత్యలకు,కన్న బిడ్డను చేసే హత్యకు పోలికా…!
4) మీరు “మీకు ఆ కధ ఒప్పుదల కాకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన యజ్ఞం కధ ఉత్తమ కధా కాక పోదు.“అన్నారు. కాకూడదని మాకేమి కోరిక లేదు. ఎందుకంటే అది ఎలాగు ఉత్తమ కధ కాదు గనక. యాభయ్యేళ్ళ క్రితం నుంచి వేసిన వీరతాళ్ళు ఉన్నాయి గనక మరి కొన్నాళ్ళు వాటిని మోసే వీరాభిమానులు ఉంటారు. నిజానికి అదో పెద్ద తిరోగమన భావజాలాన్ని ప్రచారం చేసే కధ.
5) మీరు “ఒకవేళ ఈ నా అభిప్రాయం మీకు ఆమోదం కాకపోతే మీరు దీన్ని చదవకండి. చదివినా పట్టించుకోకండి. ఈ అభిప్రాయానికి మీరు పాఠకులు కారన్నమాట 🙂” అని అన్నారు. మీరు చర్చకు నిలబడరని అర్థమయింది. కాబట్టి, అనవసరమనుకున్న చోట నేనూ చర్చించను.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి vidyasagar గారి అభిప్రాయం:
07/05/2012 12:57 am
జయప్రభ గారు – మీ వ్యాఖానం చదివాను.
మీ ఉదాహరణలకి కాలరేఖ అక్కర లేదనుకుంటాను. కాని చరిత్రకి కావాలి. అందునా ఆ కధ శ్రీకాకుళం జిల్లా లోని భూసంభందాలకు కధారూపమని విమర్శకులు ప్రవచించారు. చరిత్ర గురించి మాట్లాడితే ఇప్పుడు చరిత్ర అడక్కు చెప్పింది విను అంటున్నారు. శ్రీకాకుళ ఉద్యమం 1968లో మాటవరసకి ప్రారంభం కాలేదు. అక్కడ ఉద్యమం 1959లోనే ప్రారంభం అయింది. కాకుంటే చావులుంటే తప్ప మనకి ఉద్యమం ఉన్నట్టు కాదు. కధ చెప్పినట్టు కాదు. దేశంలో కథ చదివినవాళ్ళంతా రచయితని కలవలేరు.
[అభిప్రాయాలు వెలిబుచ్చే వారు, చర్చించేవారు, దయచేసి అభిప్రాయం పంపే ముందు అచ్చు తప్పులు సరిచేసుకోమని సవినయంగా మనవి చేస్కుంటున్నాం. – సం.]
నైరూప్యచిత్ర కళాయాత్రికుడు గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:
07/04/2012 5:47 am
మా గురువు గారు సంజీవ దేవుల సమక్షంలో చిత్ర కళారంగంలో దిద్దుకున్న ఓనమాలు ఇంతకాలం వెన్నంటి ఉన్నాయంటే అది వారి గొప్పతనమే.వారి ముఖతః రామారావు గారి గురించి విన్నాను. మో మొదటి కవితా సంకలనం చితి- చింత ముఖచిత్రంగా వారి నైరూప్య చిత్రం ఆకట్టుకొనేది.ఇంత కాలానికి ఈ మాటలో గొప్ప చిత్రకారుల మీద ఇంత పెద్ద వ్యాసం ప్రకటించడం అభినందనీయం.వేలూరి వారు ముందు ముందు ఇంకొన్ని వ్యాసాలూ రాసి అలరించ బోతున్నందున ముందు జాగ్రత్తగా నాలుగు వాక్యాలు కుదురుగా రాయబోతాను.
అనువాదం ఎవరు చేశారో ఏమో గాని ఈ బృహత్ వ్యాసం కొరకరాని కొయ్య అయి కూచుంది. పీర్లు ఫకీర్లు వారి నెమలీకల మంత్రదండం ఏమైపోయింది ? అచ్చుతప్పులు కోకొల్లలు సరే! అవి అలా ఉండనిద్దాం. అక్కడక్కడ అన్వయం లేని వాక్యాలు (మచ్చుకు రెండు:)
“రామారావు చిత్రాలలో ఈ ప్రాక్పశ్చిమాలు కలిసి ఒకటిపోయాయి.” (ఇంకా నయం , ఒకటికి పోయాయి, అని పడలేదు, అదే జరిగుంటే , పాఠకుడికి పిచ్చి కుదిరేది )
“ఎంతటి చిత్రకారుడైనా తన చిత్రాల్లో నలుపుని నియంత్రించేటప్పుడు కొంచెం జంకుతారు.”
కాపీ ఎడిటింగ్ లోపాలు అని వీటిని సరిపెట్టుకుందాం. ఈ వ్యాసానికి ఆయువు పట్టు అన దగ్గ పారిభాషిక పదాల ఎంపికలో తబ్బిబ్బు కనిపిస్తుంది. వ్యాసంలో ఒక భావానికి ఒక పదాన్ని చివరి కంటా ఒకే విధంగా వాడితే కాని పాఠకుడికి అర్థబోధ జరగదు.
చిత్ర కళ ఎక్కువ సార్లు సారూప్యం (representive/figurative ), కొండొకచో వైరూప్యం (distortion), బహు సకృతుగా నైరూప్యం (abstraction) కావచ్చు. తెలుగులో చిత్ర కళా విమర్శకు ఆద్యులు సంజీవ దేవ్ గారు representativeను సారూప్యంగా అనువదించి వున్నారు. ఇంకా లోతుకు వెళ్లి, సారూప్యం, వైరూప్యం, నైరూప్యం రస శాస్త్రంలోని అభిద , లక్షణ, వ్యంజనలతో తూగుతాయి అని ఎంతో మీమాంస చేసి వున్నారు. చిత్రకళ రూపానికి సంబంధించినది, కాబట్టి, representative కు సారూప్యం అని ఇదివరకు ఉన్న పారిభాషిక పదాన్ని వాడటమే సబబు. ప్రాతినిథ్యం అనడంలో పాత మార్క్సిస్టు తొంగి చూస్తున్నాడు. అంతేగాక, సారూప్యం, వైరూప్యం,నైరూప్యం అన్నీ రూపంతో ముడివడిన రూపాలే., కాబట్టి, ఇది వరకు పెద్దలు ఏర్పరచిన పారిభాషిక పదాలను వాడటం వల్ల ఎంతో గందర గోళం తప్పుతుంది. ఇక్కడ తమాషా ఏమిటంటే , వ్యాసం చివరి పేజీలో ఒక వాక్యంలో ” నైరూప్యం నుండి సారూప్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలగక పోదు ” అన్న వాక్యంలో representative ని సారూప్యంగానే పట్టుకొచ్చారు. ఇదే , వాక్యాన్ని ” నైరూప్యం నుండి ప్రాతినిథ్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలుగక పోదు ” అని రాసి చూస్తే, మాట్లాడుతున్న విషయం చిత్రకళ కాదేమో అనిపించ వచ్చు.ఇటువంటి వాక్యం ఒకటి ఈ వ్యాసంలో ఉన్నది కూడా “రామారావుకు ప్రాతినిధ్య కళ నుండి నైరూప్య కళకు జరిగిణ పరిణామం ఖచ్చితమైన రూపు తీసుకున్నది అతను స్లేడ్ స్కూల్‌లో వున్న చివరి సంవత్సరం (1964) లోనే.”
మరో రెండు ముఖ్యమైన పారిభాషిక పదాలు: impression అంటే మానసిక ముద్ర , expression అంటే అభివ్యక్తి expression భావ ప్రకాశంగా అనువదించడం కొంత గందరగోళానికి దారి తీసే విషయమే. abstract expressionను నైరూప్య భావ ప్రకాశత గా పట్టుకు రావడం ఏమంత బాగాలేదు. నైరూప్య అభివ్యక్తి అంటే సరిపోయే దానికి ఇంత ద్రవిడ ప్రాణాయామం అవసరమా?
abstract painter (నైరూప్య చిత్రకారుడు) అంటే చాలు, నైరూప్య భావ ప్రకాశ చిత్రకారుడు అనడం దాన వీర శూర కర్ణ అనడం కన్నా వేయి రెట్లు బరువుగా ఉంది. అలాగే , ప్రతిమా రూప చిత్రాల్లో అనకుండా చిత్రాల్లో అంటే చాలు. ఆంగ్లం లా, తెలుగు విశేషణ బహుళమైన భాష కాదు. అనువాదకులు ఇంత ప్రాథమిక విషయాన్ని విస్మరిస్తే పని జరగదు.
‘భావ ప్రకాశత నుంచి నైరూప్యతకు సాగించిన యాత్ర’ అనడం కూడా trపొసగలేదు. సారూప్యం నుంచి నైరూప్యానికి సాగించిన యాత్ర అనడం అర్థవంతం. ప్రాథమిక భావనల పట్ల అవగాహన లోపిస్తే రచయిత / అనువాదకుడు ఏమి చెప్ప దలచుకోన్నారో ఒక పట్టాన అర్థం కాదు.
“1964లో అనామిక అన్న ఈ చిత్రం ప్రాతినిధ్య కళ నుంచి పూర్తిగా వైదొలగి తన అభివ్యక్తతకు ఒక రూపంగా రూపరాహిత్యాన్ని ఎంచుకున్న తీరును తెలియజేస్తుంది.”
“ఒక సృజనాత్మకుడైన వ్యక్తికి తన అంతరంగంలోని జ్ఞానిని ఏ విషయమైతే మరుగు పరుస్తుందో, మొదట దాన్ని అన్వేషించడం ప్రధాన లక్ష్యమౌతుంది. ఆ తరువాతే అతను తన మదిలోని శక్తిని కూడగట్టుకుంటాడు”
ఇవన్నీ తెలుగు వాక్యాలేనా ?? అన్న సందేహం రావడంలో అనుమానం లేదు. ఈ ఒక్క వ్యాసంతో, అయోమయంలో మూడు లాంతర్ల కనక ప్రసాద్ ను జయించ గలిగారు ఈమాట ప్రధాన సంపాదకులు.
“ఫిజిక్స్ డిగ్రీ వచ్చింతరువాత కొన్నాళ్ళపాటు నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం వచ్చి, ఊసుపోక ఆడిట్ చేసిన మోడర్న్ ఆర్ట్ అప్రీషియేషన్ కోర్సులు బహుశా ఇప్పుడు నాకు పనికి రావచ్చు. – వీవీఆర్”.
దీనికన్నా చిత్రకళా విమర్శ లో సంజీవ్ దేవ్ గారి వ్యాసాలను చదువుకొంటే రచయితకు, పాఠకులకు ఉభయతారకంగా ఉంటుంది అని ఈ బుధజన విధేయుడి అభిప్రాయం.
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు సర్వేజనా స్సుఖినో భవంతు!!
తమ్మినేని యదుకుల భూషణ్.
[ఒక అచ్చుతప్పుని పట్టిచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలు – సం.]
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి మోహన గారి అభిప్రాయం:
07/03/2012 10:58 am
ఈ కథను original రూపములో నేను చదువలేదు. కాని వ్యాసరచయిత వ్రాసిన దానిని బట్టి కథ అర్థము చేసికోగలిగాను. నేను సి. ఎస్. రావుగారితో ఏకీభవిస్తాను. కథలలోగాని, నవలలోగాని, చలనచిత్రాలలోగాని అనవసరముగా పాత్రలను “హత్య” చేయడము ఒక విధమైన జుగుప్సను కలిగిస్తుంది, మానవజీవితముపైన నమ్మకాన్ని తగ్గిస్తుంది. అందువల్ల వీటిని రచయితలు అనుసరించడము నా ఉద్దేశములో సరియైనది కాదనే తోస్తుంది. జీవితానికే అర్థము లేదు అని వాదిస్తే, అప్పుడు కథకు కూడ అర్థము లేదనే ప్రతిస్పందన కూడ ఉదయిస్తుంది. ఒక కథ మనసులో కలకాలం నిలబడాలంటే దారుణ మరణంతో కథను అంతము చేయడము మాత్రము ఒక మార్గము కాదు. విధేయుడు – మోహన
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన గారి అభిప్రాయం:
07/02/2012 9:02 pm
సురేశ్‌గారు, మంచి వ్యాసము, జోహారులు.
1. కవిచింతామణి – వెల్లంకి తాతంభట్టు – తరువాతి లాక్షణికులు ఎంతగానో ప్రశంసించిన ఈ గ్రంథం మనకు పూర్తిగా లభ్యం కాకపోవడం మన దురదృష్టం. ఇందులో ఐదు అధికారములు ఉన్నాయి. దొరసామి శర్మ పుస్తకములో పద్యములలో కొన్ని మార్పులు చేసినానని చెప్పారు. కాని ఈ ఐదు అధ్యాయాలకంటె ఎక్కువ ఉన్నట్లు తెలుపలేదు.
2. పుస్తకము యిప్పటిదే అయినా కూడ, క్రీ. శ. 1000 కి ముందటి కాలపు వ్యాకరణమును గురించి కోరాడ మహాదేవ శాస్త్రిచే వ్రాయబడిన Historical Grammar of Telugu with Special Reference to Old Telugu (200 BC to 1000 AD) ఒక అద్భుతమయిన గ్రంథము.
3) ఓగిరాల రంగనాథకవి ద్విరేఫ వర్ణ దర్పణము అనే పుస్తకము రేఫద్వయమును గురించి విస్తారముగా చర్చిస్తుంది.
విధేయుడు – మోహన
ఇటు నేనే – అటు నేనే గురించి మోహన గారి అభిప్రాయం:
07/02/2012 10:33 am
పఠించాను పఠాభి కూర్పుల నేర్పుల తీర్పులతో తహతహలాడుతూ తఃతఃగారి కడుపుబ్బ కవ్వించే విత కాని కత కాని కవితను. సులోచనాల లోచనాలతో చదివిన పదాల ఆ ముదాలు, ఆముదాలు, ఆసాముల ఆ సాములు, మాయల లోయలలోకి తీయగా తీసికొని వెళ్లింది. గ్రే ఫుల్లీ గ్రేస్‌ఫుల్లీ ఆర్ డై ఫుల్లీ – ఇవి రెండు చెయ్యలేను. బహుశా విత్ గ్రేస్ ఫుల్లీ డై ఫుల్లీ విల్లీనిల్లీ. మంచి కొమ్మంచి కవితకు జోహారులు. విధేయుడు – మోహన
బాల బేలవు ముద్దరాల గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:
06/19/2012 12:36 am
పేరి పద్మావతిగారి పాటలు డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉంటుందా? ఆడియో సీ.డీ.లు అమ్మకానికి ఉంటే వివరాలు తెలుపగలరా?
అలాగే కొడుకుల శివరాంగారి భాగవత గానం కూడా…
దీక్షా లాక్షా రాగ రేఖ గురించి తః తః గారి అభిప్రాయం:
06/15/2012 5:44 am
మోహనగారూ నమస్కారాలు. తెలుగు సాహిత్యంతో – ఇతరభాషా సాహిత్యాలతో మీ కున్న పరిచయాన్ని పక్కనబెట్టి – మీకుగల పరిచయం తలుచుకుంటే అసూయగా ఉంది. రవీ కవీ చూడలేని వాటిని కూడా మీలొ ఉన్న పరిశోధకుడు చూసేసి లొకానికి చూపిస్తున్నాడు.
మిత్రుడు
తః తః
దీక్షా లాక్షా రాగ రేఖ గురించి మోహన గారి అభిప్రాయం:
06/13/2012 7:57 pm
ఇక్కడ ఒక విషయాన్ని వివరించడానికి అనుమతి ఇస్తారనుకొంటాను. సెంటో పద్యాలలాగే సెంటో కావ్యాలు కూడ ఉన్నాయి. తెలుగులో అట్టి అపూర్వమైన గ్రంథము ప్రబంధమణి భూషణము. ఇది ఒక సంకలన గ్రంథము. దీని సంకలన కర్త ఎవ్వరో తెలియదు. ఇతడు బహుశా క్రీ. శ. 1700 కు ముందు వాడు. ఎన్నో సంకలన గ్రంథాలు ఉన్నాయి. కాని ప్రబంధమణిభూషణపు విశేషము ఏమంటే ఇందులో కథ కూడ ఉన్నది. ఒక కథను అల్లుతూ దానికి సరిపోయే పద్యాలను వివిధ కావ్యలనుండి ఎన్నుకొన్నాడు కర్త. దీనిని చదివితే యిది ఒక సరికొత్త ప్రబంధమని తోచుతుంది కాని సంకలన మనిపించదు. దీని వివరాలు – ప్రబంధమణిభూషణము – పూర్వకవిసంచితము – సం. నిడుదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1971.
విధేయుడు – మోహన
దీక్షా లాక్షా రాగ రేఖ గురించి rama bharadvaj గారి అభిప్రాయం:
06/12/2012 2:02 pm
వేలూరి గారూ !! మీరే కవిత్వం రాస్తానంటే ఇహనేం 🙂 తప్పక ఎదురుచూస్తాను . కవులని వెక్కిరిస్తూ..స్తూ.. స్తూ.. మీరు కవిత్వం వేపు మళ్ళడం, ఇలా మీరు కవిత్వానికి లొంగడం ..ఆసక్తి దాయకమైన విషయమే కదా !! రాయండి రాయండి. నాలాంటి వారికి కాస్త కవిత్వాన్ని గురించి కొత్త సంగతులని చెప్పిన వారవుతారు 🙂 ధన్యోస్మి !!
తహతహ గారూ !! నా ఉద్దేశ్యం లో ఏ కవిత అయినా దానికదే స్వతంత్రం గా నిలబడాలి. మంచికైనా ..కానిదానికైనా !! ఇంకొకరు మెచ్చినందువల్లా కాదు నొచ్చినందువల్లా కాదు. సమర్ధింపుకేమి . దేన్నైనా సమర్ధించవచ్చు. చివరగా ఏదైనా మాటల గారడీ వే కద 🙂 అందువలన మీ కవితలోని భాషా భేషజానికి తిరిగీ నేను సిఫార్సు చేసే పని పడదు లెండి. ఈమాట పత్రికే చాలు . అన్ని సిఫార్సులకీ !! వేలూరి ఆ పనిని అప్పుడే మొదలెట్టారుగా !!
ఇంతకీ , నాకు అనిపించిన అభిప్రాయం నేను రాసేను. అలా కాకుండా మీ” భావావేశం” నా” విమర్శకావేశా”న్ని గనక మించినదే అయితే మంచిదే కద !! ఇలాగే రాస్తూండండి. అయితే నా అభిప్రాయం మాత్రం ఇప్పటికీ ఇదివరకటిదే !!
రమ.
అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
05/24/2012 3:19 pm
వేలూరి కొంత కాలంగా -అపరాధులను క్షమించే అమెరికా ప్రెసిడెంట్ మోడ్ లో ఉన్నారు. ఒక్కో కథ, కవిత చదివి -వీరిని క్షమించాలి, వారిని అర్థం చెసుకోవాలి, ఈ కథలో వారిని సానుభూతితో చూడాలి, అని ఉదారులై పోతుంటారు. వేలూరి తరుణ హృదయులు. తరచి చూస్తే, ఉదారత ఎల్ల వేళలా మంచిదే. క్షమాగుణం సర్వత్రా మంచిదే.
కాని,
” దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది ” – అనే విప్లవకవి చెఱబండ రాజు కవిత ఆయనకు ప్రార్థనా పద్యంలాగా వినిపిస్తుంది.
‘వేలూరి’ ఉద్దేశంలో – ” విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు.” (చూడు: “మూడు ప్రార్థనా పద్యాలు” ఈ మాట)
That’s one hell of a topsy turvy hypothesis. – I think.
The utterly selfish, give me give me, irresponsible, సోంబేరి graffiti in this poem makes my skin crawl.
ప్రేమ, అనురాగం భాష అదేనా? దేశాన్ని తల్లిగా ఊహిస్తూ, మళ్ళీ ఆ తల్లిని వేశ్యగా ఊహిస్తూ బూతులు తిడుతున్నది, ఈ కవితలో ఉన్న వ్యక్తి -ఒక చిన్ని బాలుడు కాదు. (శైశవ క్రీడగా తల్లి స్థనాలతో ఆడుకునే చిన్ని mythological వినాయకుడు కాడు.) అసలు చిన్ని బాలుడికి తల్లి గురించి అట్టి ఘటియా ఊహలు రావు. ఆ కవితలో ఉన్నది నిజమైన దేశంలో, ఒక ఎదిగిన పౌరుడు. దేశం మట్టీ కాదు. మశానం కాదు. తల్లీ కాదు తండ్రీ కాదు. దేశం పౌరులే.
“Ask not what the country had done for you, Ask what you have done for the country” – అన్న ధోరణిలో ఆలోచించే పౌరుడు, ఈ కవి కాడు. Entitlement మరిగిన ఒక మనిషి. దేశ వ్యవహారాలలో తన బాధ్యత ఏమిటి అని ఆలోచించకుండా – కవిత్వం లో దేశాన్ని personify చేసి – అందునా ఒక స్త్రీగా, కులటగా ఊహించుకుని, నీ గమ్యం ఏమిటి తల్లీ? – అని విచారపడి పోతూ ఉంటాడు.
ఇది చదివే నాకు; తల్లి పడుపు వృత్తి చేస్తూ సంపాదించుకు వస్తుంటే, ఆ సంపాదనకోసం నోరు తెరుచుకుని ఎదురు చూసే బడితె, -వాడెలాటి కొడుకు? అతడే పని చేస్తున్నట్టు లేదేం, దుష్టపు ఊహలు ఊహిస్తూ తల్లి మీదే రాళ్ళు విసురుతూ నోరు పారేసుకోటం తప్పించి.- అన్న ఆలోచన వస్తుంది. నాకు ఈ కవి నచ్చడు.
వేలూరికి ఈ కవీ నచ్చుతాడు. తిలక్ కవీ నచ్చుతాడు. అదెలా? అది నా కర్థం కాదు.
గమనిస్తే ఈ దిగంబర కవికీ , తిలక్ కూ ఆలోచనల్లో ఎంతో తేడా ఉంది. పాఠకులు గమనించవలసినది ఆ మానవత్వపు తేడాలే. తిలక్ కథలు చదివిన వారికి సవ్యమైన ఆలోచన తెలుస్తుంది. సంస్కృతి. సంప్రదాయము , చట్టుబండలు ఆలోచనలు కావతనివి. తిలక్ కథలూ కవితలూ కొన్ని చదివాక – ఇది కథా, కవితా, ఎలాటిదీ శైలీ, అన్న మీమాంస కాదు, అతను రాసే విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు పాఠకులు. ఇవ్వాలి.
Ron Paul (నాయకుడిగా ఎన్నిక అవడు) ఇటీవలి రిపబ్లికన్ డిబేట్లలో -ఒక డాక్టర్గా, యుద్ధమ్లో స్వయంగా పాల్గొన్న వాడిగా – మనిషి జీవితం ఎంత విలువైనదో, పదే పదే చెప్పాడు. సంవత్సరాల తరబడి -పగ, విద్వేషాలూ, యుద్ధాలలో ఇరుక్కుని ప్రాణ నష్టం, అంగ వైకల్యం పౌరులకు జరగరాదు అని మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు. నిజంగా యుద్ధానికి పంపబడే యువకులు గమనిస్తున్నారు. ఆలోచించుకుంటున్నారు. వారు తప్పక ఆలోచించుకోవాలి. జీవించవలసిన వయసులో జీవించాలి. శృంగారం అనుభవించవల్సిన వయసులో, విడదీయబడి, విరహ కావ్యాలు రాసుకుంటే వారికేం లాభం? వికలాంగులైతే ఏంటి దారి? ఎంత పెన్షన్ ధనం ఆ లోటు తీరుస్తుంది?
కానీ, కొందరు నాయకులు, ఇప్పటికీ, యుద్ధ సైనికులు హీరోలనీ, వీరులనీ, వీర మరణాలనీ, అమరులనీ – అదో పిచ్చికవిత్వ భాష మాట్లాడుతుంటారు. తిలక్ రచనలు – అట్టి nonsensical talk and thought నుండి liberate చేస్తాయి. విభజించి ఆలోచించటాలు, నాయకులను వెర్రిగా నమ్మటాలు, తిలక్ రచయితగా మానేశాడు. యుద్ధాలు, మనుషులకు చేటని తిలక్ కు స్పష్టం.
రాజకీయ నాయకుడు అనే పాత్ర ధరించిన వాడి జీవితం, ప్రవర్తన, evolution, progression, ఎలా ఉంటుంది అన్న ఒక చక్కని study- ‘అద్దంలో జిన్నా’ అన్న రచన. జిన్నా గుండెపై రక్తపు మరకలు – Macbeth చేతులపై రక్తపు మరకలు లాగానే ఎంత కడిగినా పోవు. ఈ తిలక్ కథలు చదివాక, ఏ జిన్నాల -కోట్లు చూస్తానికి, ఊరికే దేశం మీద పడి అరిచే ‘ దిగంబర కవిత్వం’ వింటానికీ – కొందరు ప్రజలు పోరు.
ఇది కవిత్వమా? కథా? అన్న ప్రశ్న తిలక్ కధ విషయంలో, విమర్శకుడికి ఎందుకు? తోటి ప్రజలను గురించిన ఆలోచన మాని, నాయకుడి పై సానుభూతి చూపుదామా – అంటూ – ఆలోచన దారి మళ్ళించటం ఎందుకు? I am sorry. నా కర్థం కాదు. Pardon me too.
లైలా
నాకు నచ్చిన పద్యం: పోతనామాత్యుని జీవన దృక్పథం గురించి తః తః గారి అభిప్రాయం:
05/24/2012 2:29 pm
“Enough for us are fruits for food, tasty water to drink, the earth for a bed, and tree-barks for dress. I have no taste for the immodesty of the wicked, deluded by drinking the wine of wealth.” (ఈ అనువాదం Shaivam అన్న చోటు లొంచి తీశాను.)
నారాయణ బాబు గారూ – భర్తృహరి వైరాగ్య శతకం లోని 54వ శ్లోకానికి ఈ ఆంగ్లానువాదం చూడండి. గుహలలొ ఉండటం గురించి కూDA మరో శ్లొకంలొ చూడగలము.
మిత్రుడు
తః తః
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన గారి అభిప్రాయం:
05/18/2012 3:06 pm
కావ్యాల నాయకుడు ఎప్పుడూ ధీరోదాత్తుడే. ఈ ధీరోదాత్తుడు, అతని పేరులా ధీరుడు, ఉదాత్తుడు. గొప్ప వంశానికి చెందినవాడు, ఇట్టి నాయకులు విరహముతో బాధపడుతున్నా సామాన్య మానవునిలా నిగ్రహమును కోల్పోరు. కిష్కింధ కాండలో రాముడు సీత విరహముతో బాధ పడుతున్నప్పుడు కూడ దారిలో కనబడే ప్రకృతి దృశ్యాలను వర్ణించడము మరువలేదు. నా ఉద్దేశములో రామాయణములోని యీ ప్రకృతి వర్ణనలు నిజముగా చాల అందమైనవి. అదే విధముగా ఇక్కడ యక్షుడు కూడ నిగ్రహవంతుడై కనబడుతాడు. అదియునుగాక, అతని ప్రధానమైన గురి తన భార్యకు తన సందేశమును అందజేయడము. ఆ కార్యములో కృతకృత్యుడు కావాలంటే దారిని చక్కగా వివరణలతో మేఘునికి తెలుపవలెను గదా! అందువల్ల ఇది ఒక యాత్రా మార్గదర్శిలా అనిపిస్తుంది. కాని ఇందులో ముఖ్యమైన రసము విరహమే. కావ్య లక్షణాలు, ధీరోదాత్తుల లక్షణాలను గురించి క్లుప్తముగా ఇక్కడ చదువవచ్చును. ఇది పాత తెలుసా పాఠకులకు Down the memory lane లాటిది. – మోహన
కినిమా పత్రిక నుంచి – 3 గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారి అభిప్రాయం:
05/16/2012 8:39 pm
రోహిణీప్రసాద్ గారు,
మీరన్నది నిజమే గానీ ఆశ్చర్యం ఏమీ లేదు. అందులో, గత ఇరవైయేళ్ళలో సమగ్రమైన తెలుగు సినిమా సమీక్ష అన్నది నా కళ్ళబడలేదు. సమీక్షకులున్నారు కానీ పత్రికలకా అవసరం లేదు. ఇవ్వాళ తెలుగుదేశములో ఎన్ని సినిమా పత్రికలొస్తున్నాయన్నది ఎవరూ నికరంగా తేల్చిచెప్పలేని ఒక విచిత్రమైన ప్రశ్న. ఇవాళ వస్తున్న సినిమా పత్రికలు అభిమానుల కోసమే పాఠకులందరి కోసం కాదు. మిగతా వాటిల్లో అంటే సినిమా పత్రికలు కాని వాటిల్లో సినిమా వార్తలు, విశేషాలూ సచిత్రంగానే ఉంటాయి తప్ప సినిమా సమీక్షలు ఉండవు. ఈనాడు దినపత్రిక ప్రింట్ ఎడిషన్ లో ఇవ్వదు కానీ ఆన్ లైన్ ఎడిషన్ లో సినిమా సమీక్షలు ఇస్తుంది. ఆంధ్రభూమి వెన్నెల ప్రతి శుక్రవారం సినిమా అనుబందం ఉన్నవాటిలో చాలా మెరుగు.
రాష్ట్రంలో జర్నలిజం కోర్సు అందిస్తున్న యే విశ్వవిద్యాలయంలోనూ సినిమా అనేది ‘స్పెషలైజేషన్’ గా లేదు. పైగా యూనివర్శిటీ పట్టాలు పుచ్చుకున్నవారు దాదాపుగా ఎవరూ సినిమా జర్నలిజంలో స్థిరపడటం లేదు.కొ.కు, ఇంటూరి వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ నరసయ్య ప్రభృతులు రాసిన సినిమా వ్యాసాల గురించి ఇవ్వాళ దాదాపుగా ఎవరికీ తెలీదు. తెలియనప్పుడు ‘సినీజర్నలిజంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాలను గురించి కామెంట్లు రాయకపోవడం’ సామాన్యమైన విషయం. అయితే ఈ మాట పాఠకుల వరకూ మీపరిశీలన నిజమే.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన గారి అభిప్రాయం:
05/11/2012 11:09 am
తఃతః గారు,
రగడలు దేశి ఛందస్సు, అవి మొట్టమొదట రఘటాబంధమని నాగవర్మ ఛందోంబుధిలో పేర్కొన్నాడు. కన్నడములో వీటిని ఉత్సాహ (మూడు మాత్రలు), మందానిల (నాలుగు మాత్రలు), లలిత (ఐదు మాత్రలు) రగళె అంటారు. దాని సామాన్య లక్షణము –
కం. గణనియమ విపర్యాసదొ-
లేణెవడెదొళ్పెసెదు మాత్రె సమనాగె గుణా-
గ్రణియ మతదింద తాళద
గణనెగొడంబట్టు దదువె రఘటాబంధం (నాగవర్మ)
ఇవి మాత్రాగణాలతో ఉంటాయి, ప్రతి పాదములో మాత్రల సంఖ్య సమానము, ఇది ద్విపద, ఇది తాళబద్ధమైనది. చివరి గుణము అంటే రగడ తాళబద్ధమైనదని చెప్పడము చాల ముఖ్యము. జయకీర్తి ఛందోనుశాసనములో ఇలాగంటాడు –
స్వచ్ఛంద సంజ్ఞా రఘటా మాత్రాక్షర సమోదితా
పాదద్వంద్వ సమాకీర్ణా సూశ్రావ్యా సైవ పద్ధతిః
ఇది స్వచ్ఛందము, మాత్రాగణయుక్తము, ద్విపద, సుశ్రావ్యము, ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి పజ్ఝటికా (యశస్తిలక చంపువులో పజ్ఝటికా ఉన్నది) నుండి వచ్చినదని భావన. రగళెను (తెలుగులో రగడ) మొదట పంపకవి తన భారతములో ఉపయోగించాడు. కవిజనాశ్రయకర్త దీనిని ఉదహరించలేదు. అంటే తెలుగులో దీని వాడుక తరువాతి కాలములో. కానీ తెలుగులో రగడను పోలిన ఒక పురాతన శాసనము ఉన్నది. తెలుగులో తొమ్మిది రగడలు ఉన్నాయి. వృషభగతి రగడలాటి మిశ్రజాతి రగడ కన్నడములో లేదు, అది భామినీషట్పదిగా అందులో ఉన్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రగడలకు ముఖ్యప్రాణము అవి మాత్రాబద్ధము, తాళబద్ధము. అందుకే తెలుగులో ఇవి యక్షగానాలలో, ఉదాహరణకావ్యములలోని కళికోత్కళికలలో, కావ్యాలలో కొన్ని వర్ణనలలో వాడబడ్డాయి. త్యాగరాజకీర్తనలు మున్నగు వాటిని పదాలను విరిచి పాడితే బాగుండడము లేదని తరచుగా వింటూ ఉంటాము. రగడలు కూడ పాడదగినవే. అందుకే వీటిని విరిచి వ్రాయడము బాగుండదనే నా భావన. ముఖ్యముగా రెండు నాలుగు మాత్రలను ఒక ఎనిమిది మాత్రలుగా (ఉదా. IIIUIII) వాడడము సరికాదనే నా అభిప్రాయము. కవులు నిరంకుశులు, ఎలాగైనా వ్రాసికోవచ్చు. కాని అవి అన్నీ సరి కావు. ఉదాహరణగా, పాల్కురికి కొన్ని సంస్కృత ద్విపదలలో, విశ్వనాథ ఒక తెలుగు ద్విపదలో పాదాంత యతిని పాటించలేదు. వారిద్దరూ మహాకవులే. అంత మాత్రాన వారి ఈ దోషాన్ని గుణముగా అంగీకరీంచకూడదు అనే నా ఉద్దేశము. ఇవి వారి కవిత్వపు వాసినిగాని, వారి విద్వత్తును గానీ అవమాన పరచడము కాదు. వైయక్తికముగా, నేను కవిని గాను, ఒక లాక్షణికుడు మాత్రమే. లక్షణాలను వివరించడానికి పద్యాలను ఉదాహరణలుగా వ్రాస్తాను. మహాకవులను ఎత్తి చూపే పాండిత్యము, కవిత్వము నాలో లేవు.
విధేయుడు – మోహన
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన గారి అభిప్రాయం:
05/10/2012 2:13 pm
రవి గారు,
1) సంస్కృత కవులు ఒకే విధమయిన వృత్తముతో ఆశ్వాసాలను వ్రాసారు, తెలుగు కవులు ఎన్నో విధములయిన పద్యాలతో వ్రాసారు. రెండు భాషలలో మంచి కవులు తమ ధ్యేయాన్ని సాధించారు. ద్విపదలో వ్రాయబడిన ఏకాంతసేవ టాగూరు గీతాంజలికి సమానమైనది కాదా?
2) నాలుగు ద్రావిడ భాషలలో తెలుగు తమిళ భాషలలో మాత్రమే అక్షరసామ్య యతి లేక వడి ఉన్నది. తమిళములో నియమాలు తెలుగులోలా అంత కఠినమయినవి కావు. ఉదాహరణ – వ, మ లకు యతి చెల్లుతుంది. బహుశా మామ, మావ వంటి పదాలు దీనికి కారణము కావచ్చును. కన్నడములో విరామయతిని కూడ యతిని పాటించరు.
3) ద్రావిడ ఛందస్సులో ముఖ్యమైనది ద్వితీయాక్షర ప్రాస. ఇది అన్ని భాషలలో ఉన్నాయి, తెలుగులో మాత్రము ఉపజాతులలో యిది లేదు.
4) తమిళములో, కన్నడములో దేశి ఛందస్సులో కావ్యాలనే వ్రాసినారు. షట్పదులలో, సాంగత్యములలో (సీసములో చివరి సూర్యగణము సాంగత్యములో లుప్తము) సంపూర్ణ కావ్యములు ఉన్నాయి కన్నడములో. ఇది ఎందుకు చెప్పుతున్నానంటే వీటిని పాడుకోవచ్చును. అంటే కన్నడములో, తమిళములో పాడుకోడానికి అనుకూలముగా కావ్యాలు ఉన్నాయి. కాని తెలుగులో యిట్టివి అరుదు. తెలుగు కావ్యాలు చదువుకోడానికి మాత్రమే వ్రాయబడ్డాయి. పాడుకోడానికి ప్రాస బాగుంటుంది.
5) వేమన పద్యాలు అందముగా నుండడానికి కారణము పదాల విరుపు, అందరికీ అర్థమయ్యే భాష. పాదాంత యతి ఉపజాతులలో ఎప్పుడూ ఉంటుంది.
6) యతి తద్దినము మాత్రము కాదు. తెలుగుతో కూడ అన్ని ద్రావిడ భాషలలో సామెతలు ఆదినుండి ఉన్నవి. అవి మన సంస్కృతికి ఒక కాణాచి. ఈ సామెతలలో అక్షరయతియో లేక ప్రాసయతియో ఎప్పుడూ ఉంటుంది. యతి, ప్రాసయతి వీటినుండి పుట్టాయని ఒక ఊహ. ఈ సామెతలపైన సురేశ్ గారి వ్యాసాన్ని ఎదురుచూస్తున్నాను 🙂
విధేయుడు – మోహన
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన గారి అభిప్రాయం:
05/09/2012 6:54 pm
1) సంస్కృతములో కావ్యములను వ్రాసే పద్ధతి వేరు, తెలుగులో వ్రాసే పద్ధతి వేరు. సంస్కృతములో ఒక ఆశ్వాసాన్ని ఒకే వృత్తములో వ్రాస్తారు (ఉదా. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వీటి రెంటితో ఉపజాతులు, వియోగిని, శ్లోకము, స్వాగతము, ఇత్యాదులు). ఆశ్వాసాంతములో మాలిని మున్నగు విశేష వృత్తాలను వాడుతారు. సంస్కృతములో వృత్త వైవిధ్యాన్ని నాటకాలలో చూపుతారు, కావ్యాలలో కాదు. తెలుగులో సంస్కృతములా కాక ఒక ఆశ్వాసాన్ని అన్ని వృత్తములలో వ్రాసినారు.
2) కన్నడ భాషలో మొట్ట మొదట చంపూ సంప్రదాయములో కావ్యాలు వచ్చాయి, దానినే తెలుగులో కూడ అనుసరించారు. ఏవో కొన్ని నిర్వచన కావ్యాలు తప్ప తెలుగులో చంపూ కావ్యాలే ఎక్కువ. ఇందులో గద్యపద్యములు రెండూ ఉంటాయి.
3) కన్నడములో మొట్టమొదట అనుష్టుభ్ శ్లోకాలను వాడారు. కాని తెలుగులో పూర్వ కవులు శ్లోకాన్ని వాడలేదు. తెలుగు కన్నడ కవులు ఆ శ్లోకస్థానములో కందమును వాడారు. ఇది చిన్న పద్యము, కథను సాగించడానికి చక్కగా ఉంటుంది, అందువల్ల.
4) తరువాత ఎక్కువగా వాడిన వృత్తాలు చంపకమాల, ఉత్పలమాల, మత్తేభవిక్రీడితము, శార్దూలవిక్రీడితము – ఈ క్రమములో. అందుకే నేనొక చోట అన్నాను, తెలుగులో శార్దూలానికన్న మత్తేభాన్ని ఎక్కువగా వాడుతారు అని, ఎందుకంటే అందులో ప్రారంభములో శార్దూలములా మూడు గురువులు ఉండవు. సంస్కృతములో ఉపజాతుల స్థానాన్ని తెలుగులో తేటగీతి, ఆటవెలది ఆక్రమించాయి.
5) ఇక యతి విషయము. పదాన్ని యతి స్థానములో విరిచితే కొన్ని సమయాలలో బాగానే ఉంటుంది (ఉదా. లాస్యము లాడవా పలు వి-లాసములన్ …), కొన్ని చోటులలో బాగుండవు (ఉదా. టంగుమని మ్రోగె గంట ప-డతి వినంగ …). జాత్యుపజాతులలో సామాన్యముగా పాదాంత విరామమును వాడుతారు. ఇది ద్విపదలకు, రగడలకు తప్పక ఉండాలి.
6) తెలుగులో పాదాంత యతి ఎందుకు లేదన్నదానికి, కోవెల సంపత్కుమారులు ఇలాగన్నారు. తెలుగులో ప్రాస ఉన్నది, అందువల్ల ఒక్కొక్కప్పుడు, పదములోని రెండవ అక్షరము ప్రాసాక్షరముగా అమరకపోవచ్చు. ముందటి పాదమునుండి పదము ఆరంభమయితే ప్రాసకు సౌలభ్యము దొరుకుతుంది. పదాన్ని ఇలా విరిచినప్పుడు, నా ఉద్దేశములో ముందటి పాదములో చివర పదానికి ఒక అక్షరముకంటె ఎక్కువగా ఉంటే వినడానికి అంత బాగుగా నుండదు.
7) మొట్టమొదట ఉత్పలమాలను, మత్తేభవిక్రీడితమును సంస్కృతములో వ్రాసినప్పుడు వాటికి పాదాంతయతిని ఉంచలేదు మన కవులు. కొన్ని శాసనాలలో ఈ విషయాన్ని గమనించవచ్చును.
8) మాత్రాగణములతో ఉండే రగడలలో కూడ తెలుగు కవులు కొన్ని సమయాలలో పదాలను గణాలకు తగ్గట్లు విరిచి వ్రాయకుండడము నిజముగా ఒక పెద్ద లోటే.
విధేయుడు – మోహన
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
05/09/2012 2:35 pm
శ్యామలరావుగారు,
మీ వ్యాఖ్యలో కొన్ని విషయాలను మరికొంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
వృత్త వైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం సంస్కృత కవులలో కూడా ఉన్నదే. ఒక కావ్యంలో భిన్న భిన్న వృత్తాలు వాడడం సంస్కృత కావ్యాలలో కూడా కనిపిస్తుంది కదా. మీరన్న వృత్త చతుష్కం కన్నా కూడా కందాలు తెలుగు కవులు ఎక్కువ వాడారు. అలాగే ఆటవెలది తేటగీతులు కూడా. సందర్భానుసారంగానే సీస పద్యాలు, అక్కడక్కడ ఇతర దేశి ఛందస్సులూ కూడా వాడారు. ఇతర వృత్తాలను అరుదుగానే వాడారు. అయితే వాటిని విరివిగా ఎందుకు వాడలేదు అనే దానికి కారణాలను వెతికితే మనకి కొంత విషయ పరిజ్ఞానం కలగవచ్చు. కాని, వాళ్ళ తెలివితక్కువ తనం వల్ల, స్పృహ లేని కారణంగా మానేసారని సమాధాన పడితే దాని వల్ల ఒరిగే ప్రయోజనమేమీ లేదు. వాళ్ళు నిజంగా ఎందుకు వాడలేదో మనకి కచ్చితంగా తెలిసే అవకాశం ఎలాగూ లేదు.
వృత్తౌచిత్యమన్నది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి – చెప్పే విషయం, రెండు – చెప్పే భాష. ఉదాహరణకి మందాక్రాంత వృత్తాన్నే తీసుకుందాం. మొదటగా, చెప్పే విషయం. కాళిదాసు మందాక్రాంత వృత్తంలోనే మొత్తం ఒక కావ్యం వ్రాసాడంటే, ఆ కావ్యం ఎలాంటిది? అది కథా కావ్యమా? కాదు. అందులోని వస్తువూ, రసమూ, పాత్రలూ ఇంచుమించుగా మొదటి నుండి చివర వరకూ ఒకటే విధంగా ఉంటాయి. అంచేత ఆ కావ్యమంతా ఒకే వృత్తంలో రచించడంలో ఔచిత్యం ఉంది. అదే కాళిదాసు రఘువంశంలోనూ, కుమారసంభవంలోనూ అనేక వృత్తాలు ఎందుకు వాడవలసి వచ్చింది? అవి కథా కావ్యాలు కాబట్టి. అందులో వివిధ సన్నివేశాలు, పాత్రలు, రసభావాలు ఉంటాయి కాబట్టి.
కాబట్టి, తెలుగులో మందాక్రాంత విరివిగా ఎందుకు వాడబడ లేదు అనే ప్రశ్న వేసుకొనే ముందు, తెలుగులో మేఘదూతం వంటి కావ్యాలు ప్రాచీన కాలంలో ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకోవాలి. అది వేరే చర్చ, కాబట్టి దానిలోకి నేను వెళ్ళడం లేదు. అలాంటి కావ్యాలు రానందువల్ల, ఆ వృత్తం అంత విరివిగా వాడబడలేదు. అది మొదటి కారణం. ఇక రెండవ కారణం భాష. మోహనరావుగారు, మీరూ చెప్పినట్టుగా మందాక్రాంత వృత్తం మొదటి నాలుగు గురువులూ తెలుగుకి ప్రతిబంధకం. గురువు లఘువుల సంఖ్యే కాదు, వాటి క్రమంలో కూడా వివిధ భాషల స్వరూపంలో తేడా ఉంటుంది. వృత్త చతుష్కం కాక మిగిలిన వృత్తాలు తెలుగులో విరివిగా లేకపోవడానికి యిది కూడా కారణమేమో పరిశీలించాలి.
వృత్తాన్ని విరుపులతో వ్రాయాలనే తాపత్రయం లేదు కాబట్టే తెలుగులో యతి విరామ స్థానంగా కాక అక్షర సామ్యంగా మారింది. కావ్యం మొత్తమూ పద్యాల విరుపుల అందం ఒక్కటే ఉంటే సరిపోదని మీకు నేను చెప్పనక్కరలేదు. సంస్కృతంలో కూడా రామాయణ భారతం వంటి కావ్యాలు ఇంచుమించు పూర్తిగా, కేవల పాదాంత విరామం మాత్రమే ఉన్న అనుష్టుప్పుతో నడిపించారు. ఇతర కావ్యాలలో కూడా కథా గమనం కోసం అలాంటి ఛందస్సే వాడబడింది. మందాక్రాంత వంటి అనేక విరుపులున్న పద్యాలు మేఘదూతం వంటి కొన్ని కావ్యాలలో మాత్రమే ఇంత విరివిగా వాడబడింది. తెలుగులో కూడా సందర్భం వచ్చినచోట చక్కని విరుపులతో హొయలుపోయే కందాలూ, సీసాలు మొదలైన మన దేశి ఛందస్సులో వ్రాసిన పద్యాలు ఉన్నాయి. మందాక్రాంత, మత్తకోకిల, లయగ్రాహి మొదలైన పెద్ద వృత్తాలకి విరుపులు లేకుంటే పద్యం అందం చెడిపోతుంది. తెలుగు కవులు ఈ వృత్తాలను వాడిన కొన్ని చోట్ల యీ అందాన్ని దృష్టిలో పెట్టుకో లేదన్నది మాత్రం నిజమే. కథాగమనం కోసం వృత్త చతుష్కంలో పద్యాలు వాడినప్పుడు వాటికున్న ఒక్క విరామ స్థానం అవసరం మన కవులకి కనిపించ లేదు. అందుకే వాటిని పాటించలేదు. పైగా, వాటికి మందాక్రాంత వంటి నిర్దిష్టమైన (మూడు విరుపులతో కూడిన) నడక లేకపోవడం వల్ల, ఆ ఉన్న ఒక్క విరామాన్ని పాటించకపోవడం వల్ల పద్య సౌందర్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అలా విరామ స్థానంలో విరుపు పాటించనవసరం లేని వృత్తాలనే తెలుగు కవులు ఎన్నుకున్నారనీ, అవే వృత్తచతుష్కమనీ నా ఊహ.
కొంతమంది మరొక అభియోగం చేస్తూ ఉంటారు. కథా గమనానికీ సంభాషణలకీ సంస్కృతంలో లాగా చిన్న చిన్న పద్యాలు వాడకుండా యీ చాంతాడు వృత్తాలని తెలుగులో వాడారన్నది. ఇది కూడా అంత సమంజసంగా అనిపించదు. ఒకటి, తెలుగు కవులు కూడా చిన్న పద్యమైన కందాన్ని విస్తృతంగానే వాడారు. రెండు, సంస్కృతానికీ, తెలుగుకీ భాషా స్వరూపంలో చాలా తేడా ఉంది. పదాలలో, వాక్యాలలో సంక్షేపము (brevity) ఎక్కువగా సాధించే లక్షణం సంస్కృతానికి ఉంది. అది ఒక రకంగా formal language కాబట్టి దానికా గుణం ఉంది. తెలుగు భాషా స్వరూపం వేరు. ఇది పూర్తిగా వాడుక భాష. నిత్యవ్యవహారంలో సంక్షిప్తంగా మాట్లాడడం అన్నది సహజమైన విషయం కాదు. అందుకే సంస్కృత భాషలో సాధించ గలిగే సంగ్రహత్వం తెలుగులో సాధించడం సాధ్యం కాదు. అలా సాధించాలని చూస్తే అది సహజ సౌందర్యాన్ని కోల్పోయి కృతకంగా తయారవుతుంది. అంచేత కథ చెప్పడంలోనైతే నేమి, సంభాషణల్లోనైతే నేమి, కొన్ని చోట్ల మనకి పెద్ద వృత్తాలు అవసరం అవుతాయి. ఈ సంగతులన్నీ ఆలోచించకుండా, సంస్కృతంతో పోల్చి, తెలుగు కవిత్వంలో సంక్షిప్తత తక్కువ అని పెదవి విరిచెయ్యడం సరి కాదు.
వృత్త విరామాల గురించి పైన చెప్పాను. ఇక యతి ప్రాసల నియమాలు వదిలి పద్య రచన చేసే సాహసం గురించి. ఎందుకు చెయ్యలేదూ, అలాంటి సాహసాలు కవులు చేసారు! ఈ వ్యాసంలోనే మోహనరావుగారు పేర్కొన్నట్టు రాయప్రోలు సుబ్బారావుగారు మేఘదూతానికి అనువాదమయిన దూతమత్తేభమనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని మత్తేభాలతో రచించారు. అలాగే మల్లవరపు విశ్వేశ్వరరావుగారు చిత్రాంగద అనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని పద్యాలతో రచించారు. యతి ప్రాస నియమాలు పాటించని కందాలు శ్రీశ్రీ సిప్రాలిలో కూడా మనకి కనిపిస్తాయి. ప్రాచీన కవులు ఎందుకలా రాయలేదు అంటే, బహుశా వాళ్ళకా ‘అవసరం’ కనిపించకపోయి ఉండవచ్చు. యతిప్రాసల నియమాలు పాటించడం వల్ల కవిత్వం పలచబడడం, వాటిని పాటించకపోవడం వల్ల గొప్ప పద్యాలు సృష్టింపబడటం జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవు. అక్కిరాజు ఉమాకాంతంగారు అలా జరిగిందని అభిప్రాయపడ్డారు కాని, అది పైన చెప్పినట్టుగా సంస్కృతంతో పోల్చడం వల్ల ఏర్పడిన అభిప్రాయమే అని నేననుకుంటాను. యతిప్రాసల నియమాలు కవికి ఒకోసారి ఎలా ఉపయోగపడతాయో కూడా చక్కగా వివరించే వ్యాసం, ఈమాటలోనే యిక్కడ ఉంది.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
05/08/2012 12:16 pm
Kudos to Mohana Rao gaaru for a scholarly essay!
సముద్రగుప్తుని కొడుకైన రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించిన తరువాత ఉజ్జయినిని తన రెండవ రాజధానిగా చేసుకున్నాడని మనకు దొరికిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. కొన్ని బంగారు నాణేల మీద ఒకవైపు దేవశ్రీ మహారాజాధిరాజ శ్రీ చంద్రగుప్త అని మరోవైపు శ్రీవిక్రమాదిత్య అన్న ముద్రల ఆధారంగా రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడని చెప్పవచ్చు. రెండవ చంద్రగుప్తుని రాజ్యకాలం 380–413/415 CE అని కచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి కాళిదాసు 4వ శతాబ్దానికి చెందినవాడనే చెప్పడం సబబు. ఇది ప్రస్తుతం పండితులంతా (Indologists) ఒప్పుకున్న వాదం.
కాళిదాసు కాలనిర్ణయ వివాదంపై విస్తృత చర్చకు Kālidāsa: Date, Life, and Works (1969) by Vasudev Vishnu Mirashi, Narayan Raghunath Navlekar ను చూడవచ్చు.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి తఃతః గారి అభిప్రాయం:
05/07/2012 10:41 pm
జయప్రభ గారు అంత దీర్ఘం గా చెప్పింది ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ మీద చెప్పిన అభిప్రాయమేనా? ఒక రచన మీద వచ్చినట్లుగా ప్రచురిత మైన అభిప్రాయాల్లొ యెన్ని నిజంగా ఆ రచన మీద ఉంటున్నాయి?
అలా యేదైనా రచన మీద కాకుండా చెప్పే అభిప్రాయాలకు ‘ఈమాట’లో చోటు కలిగించే పద్ధతిని గురించి సంపాదకులు ఆలోచించాల్సిన సమయమాసన్న మైనదా?
తఃతః
[అటువంటి చోటు ఈమాట చర్చావేదికల పైన ఎప్పుడో కల్పించాము. కాని, పాఠకులు ఆ వేదికను సద్వినియోగం చేసుకోవడంలేదని చెప్పడానికి చింతిస్తున్నాము … సం]
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
05/07/2012 10:33 pm
మోహన రావు గారు: మీ అనుస్పందన హర్షణీయం. “ఈమాట” వ్యాసకర్తలు అందరూ మీదారిలో నడిచి ప్రతివ్యాసానికి మొదల్లో abstract రాస్తారని, అలా ఆ వ్యాసం లో వారేం సాధించదల్చుకున్నారో వారి సొంత contributions ఏవిటో స్పష్టంగా పాఠకులకు ముందుగానే తెలియపర్చే అలవాటుని పాటిస్తారని ఆశిస్తాను.
ఇక మీ వ్యాసం గురించి: నాకు ఛందస్సు ఏమీ తెలియదు కనుక దాన్లో ఒప్పుతప్పరయు రసజ్ఞుడిని కాను. ఐతే ఛందశ్శాస్త్రం మీద మీకున్న మక్కువ అభినందనీయం, మీ కృషి, పట్టుదల శ్లాఘనీయాలు. మీరు చెప్పినదాన్ని బట్టి ఈ వ్యాసం లో చాలా విశేషాలే వున్నట్టున్నాయి.
జయప్రభ గారు: రచయితలకు, పాఠకులకు ఉండవలసిన అర్హతల గురించి మీరన్న మాటల్తో ఏకీభవిస్తాను. ఐతే, “తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని.” అంటూ మళ్లీ “అరుదైన రచనల విలువనెరిగే” పని పాఠకుల మీదే వేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం తమ రచన అరుదైనదైతే అది ఎందుకు అరుదైందో, దాని విలువ ఏమిటో చెప్పటం లో రచయితా భాగస్వామ్యం వహించటం అవసరం. (ఈ అభిప్రాయం వ్యాసాలకే పరిమితం) అందుకే సాంకేతిక పత్రాలలోలాగా ముందుగా ఒక abstract రాయమని కోరటం.
కొత్త పాఠకుల విషయం లో మీ ఆవేదన న్యాయమైందే. ఐతే ఇంటర్నెట్ ఈ విషయం లో చాలా మేలు చేస్తున్నదని నేను భావిస్తాను. ఎందాకో ఎందుకు, మీ అభిప్రాయాల్నిప్పుడు ప్రపంచవ్యాప్తమైన తెలుగు జాతి అంతా చదవగలుగుతున్నది కదా. పదిహేనేళ్ల క్రితం వరకు ఇది అసాధ్యం. ఈ ఇంటర్నెట్ మూలాన ఇదివరకు ద్వీపాల్లా ఉండిపోయిన సాహిత్య ఔత్సాహికులు, professionals ఒకచోట అభిప్రాయాల్ని పంచుకోగలుగుతున్నారు కదా. ఎన్నో వెబ్ పత్రికలు, బ్లాగ్ లు వచ్చాయి. ఇవి తెలుగు సాహిత్యాన్ని బతికిస్తాయో లేదో తెలియదు కాని బతికే probability ని తప్పక పెంచుతున్నాయి.
ఆసక్తికరమైన రచనలు కనిపిస్తే వాటికి పాఠకులూ తయారౌతారు. సాహిత్యాన్ని బతికించటం లో ప్రధానపాత్ర రచయితలది. “మమ్మల్ని మెచ్చుకునే పాఠకులు వుంటేనే మేం రచనలు చేస్తాం” అని వారు భీష్మించుక్కూచుంటే పాఠకులు ఎక్కడినుంచి వస్తారు?
చివరగా – పుస్తకాల గురించి. నా ప్రగాఢ విశ్వాసం పుస్తక రూపానికి కాలం చెల్లిపోతోందని. బహుశా ముందుముందు “పుస్తకరచన” కూడ ఒక సామూహిక క్రియగా పరిణమిస్తుందని నేననుకుంటాను. ఒక పుస్తకాన్ని “రాసే” బాధ్యతని ఒకరే మోయాల్సిన అవసరం తీరిపోతున్నది. సైద్ధాంతికంగానే కాక ఆచరణలో సైతం పుస్తక రచయితా పాఠకుడూ రచనాబాధ్యతని సంయుక్తంగా నిర్వహించే రోజు వస్తుందని నా భావన. చూద్దాం.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి jayaprabha గారి అభిప్రాయం:
05/07/2012 3:41 pm
కె.యెస్. రామారావు గారూ – నిజంగా ఇది మీరు భావించేటంతటి “జటిల” సమస్య కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి నాకున్న అనుభవం పరిశీలన ఆధారంగా నాకు అనిపించిన విషయాలు ఇవీ! ఎప్పుడైనా కూడా ఏ రంగంలోనైనా పరిశోధనకి ఒక ప్రమాణం ఉండాలి. ఏది రాసినా అది పరిశోధన అవదు. దానికి సరి అయిన ఆకరాలు చూపిస్తూ ఆ పరిశోధన ఇతరుల దృస్టికన్నా ఎలా భిన్నమైనదో తన చూపు ద్వారా అదివరకూ తెలియని కొత్త విషయాలు ఏమున్నాయో అందుకు ఆ పరిశోధకురాలు/డు బాధ్యత వహించాలి. పరిశోధన చేసే వారికి అందుకు తగిన శిక్షణా, అలాగే చాలినంత అనుభవమూ ఉండాలి. తాను రాయదలుచుకున్న విషయం మీద అదుపు ఉండాలి.
ఇది అటుంచితే, పుస్తకాన్నీ దాని బాగోగులనీ ఎంచే వాళ్లకి కూడా తప్పకుండా ఒక స్థాయి ఉండాల్సిందే! ఒక పని లోని సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన వారూ అలాగే పరిశోధనా రంగమ్లో తగిన అనుభవం ఉన్న వారూ మాత్రమే కొంత వరకూ సరి అయిన అభిప్రాయాన్ని చెప్పగలరు. మిగిలిన వారి భావాలు లేదా స్పందనలూ వారికి ఆ వస్తువు నచ్చడం లేదా నచ్చక పోవడం, అర్ధం కావడం లేదా సరిగ్గా తెలియక పోవడం మీద ఆధారపడి బయటికి వచ్చేవే అవుతాయి చాలా సార్లు. అందుకు చేయగలిగింది ఏమీ లేదు. అయితే అభిప్రాయాలు చెప్పే వీలు ఉండాలి. ఎవరినించైనా మంచి సూచనలు లభించే అవకాశం సైతం లేకపోలేదు. వాటి సాధ్యాసాధ్యాలని బట్టి రచయిత వాటిని పాటించవచ్చు లేదా చదివి ఊరుకోవచ్చు. పుస్తక రచనలో ఎప్పుడూ కూడా రచయితదీ పరిశోధకులదే అంతిమ అభిప్రాయం అవుతుంది. అది తప్పదు. పుస్తకం బాగోగుల బాధ్యత వారిదే గనక!
ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, కనీసం తెలుగు భాషా సాహిత్యాల వరకూ అయితే, పరిశోధనా రంగంలో తగిన అనుభవమూ శిక్షణా ఉన్నవారు క్రమంగా తగ్గి పోతున్న కాలం ఇది. అందువలన వేరే రంగాలలో స్థిరపడి తెలుగు మీద ప్రేమ లేదా ఇస్టం ఉన్నవాళ్ళు రాయక తప్పని ఒక పరిస్థితి వచ్చింది ఇవాళ. వారి భావ ప్రకటనకి అనువుగా ఉండే మాధ్యమం సైతం అందుబాటులో ఉంది. “అంతర్జాతీయ ప్రమాణాలు” అంటూ ఒక కొలమానాన్ని తెలుగున తెచ్చి పెట్టిన వాళ్ళు ఇంగ్లీషులో వచ్చే పుస్తకాలలో ఎన్ని అచ్చుతప్పులు ఉంటున్నాయో, ఎన్ని విషయాలు దేశీయమైన వాటినించి గ్రహించి వేరే భాష వారి వారికి తగిన విధంగా రూపొందుతున్నాయో మాట్లాడక పోవడం విడ్డూరం. నా దృష్టిలో ఆసక్తికరమైన రచన కాని రచన అన్నవే చిట్టచివరికి ముఖ్యమైనవి అవుతాయి. అవి ఎవరు రాసినా అంతకన్నా మించిన ప్రమాణం ఏదీ ఉండదు ఎప్పుడైనా! మిగిలినవన్నీ ఊరికే చర్చిందుకుందికి పనికొస్తాయి అంతే!
తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని. సకాలంలో రాని స్పందన ఆ తరువాత వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే! మీనమేషాలు లెఖ్ఖించడాలూ లౌక్యాలు ప్రదర్శించడాలూ ఆ రంగానికి మేలు చేయగలిగిన అంశాలు కాలేవు. ఎందుకంటే తమ విలువైన కాలాన్ని ఎవరు గానీ ఒక క్రమంలో ఒక వస్తువు మీద పెట్టడం అన్నది మామూలు విషయం కాలేదు ఎప్పుడైనా కూడాను. అందునా ఏ డబ్బులూ రాని తెలుగు సాహిత్యమ్లో అంటే మరీను! అలాగే అందరూ అన్ని రకాల రచనలూ చేయలేరు. అందువలన కొన్ని తరహా రచనలు చేయగలిగిన వారే చేయాలి. అలాంటి రచనలు అంటూ అసలు వస్తే, వాటి పట్ల ఒక కుతూహలం పాఠకులకి కనీసం సాహిత్యం గురించి తెలిసిన పాఠకులకి ఉండటం సముచితం! అయితే పాఠకుల స్థాయి ఇక్కడ చాలా ముఖ్యం.
ఎందుకంటే ప్రతీ రచనకీ ప్రతీ వాళ్ళూ పాఠకులు కారు. ఆ వస్తువుని గురించి వారికి కనీశమైన స్పస్టత అయినా ఉండాలి. spoon feedingకి అలవాటు పడిన బధ్ధకస్తులైన పాఠకులు లాభం లేదు. కస్టపడగలిగిన స్వభావం ఉన్నవాళ్లై ఉండాలి పాఠకులు కూడా! అలాగే ఒక పుస్తకం అర్ధం చేసుకోవడం వేరు. అదే పుస్తకాన్ని గురించి వ్యాఖ్యానించడానికి తగిన పరిజ్ఞానం పుష్కలంగా ఉండి వారు ఆ పని చేయడం వేరు. రెండూ భిన్నమైన విషయాలు. దురదృష్టమైన విషయం ఏమంటే తెలుగున విమర్శ అరుదైన అంశం ఎలా అయిందో, అలాగే ఆ విమర్శ గురించి చేసే పాఠక వివేచన కూడా అరుదే అయిపోయింది. సూచనలు చేయడం రాసిన విషయాన్ని విశ్లేషణ చేయడం ఒకటి కాదు. ఎప్పుడైనా ఏ పుస్తకాన్నైనా ఎప్పుడూ అనేక తీరుల్లో రాసే వీలుంది. ఏదీ కూడా “perfect” కాదు. అవదు కూడా! ప్రతీ రచనకీ ఇది వర్తిస్తుంది. ఆ రాసిన వారెవరు అన్నదానితో సంబంధం లేకుండా! అందువలన అభిప్రాయాలు ఆ రచనని బేరీజు వేయడంలో అడుగు తప్పనివి అయి ఉండాలి. అంతే!
ఇంక చివరగా తెలుగు వరకూ పుస్తక ప్రచురణ, దానికి సంబంధించిన ఇతర అంశాలు అనేకం దుస్సాధ్యమైనవి. అయినా తెలుగున కస్టమైన అంశాల మీద ఇంకా పని చేయడం జరుగుతూ ఉందంటే, పుస్తకాలు అచ్చు అవుతున్నాయీ అంటే అది కేవలం రచయితలకి భాషా సాహిత్యాల పట్ల ఉండే ప్రేమ వల్ల మాత్రమే! మరొక్క పదేళ్ళాగండి అప్పుడు ఈ వచ్చే పుస్తకాలూ రావు. ఇంతపాటి మాట్లాడే వాళ్ళూ ఉండరు: కొత్త పాఠక వర్గం తయారైతే తప్ప.-అలా నిజంగా అయితే గనక అప్పుడు నాకన్నా సంతోషించే వాళ్ళుండరు. తెలుగు సాహిత్యం వరకూ రాసే వారిని నిలుపోగలిగితేనూ, పాఠక వర్గాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళ గలిగితేనూ తప్ప అది సాధ్యమయ్యే వ్యవహారంలా లేదు. కారణం తెలుగున ప్రవేశం ఉన్న వాళ్ళు క్రమంగా తగ్గిపోతున్నారు. దీన్ని ఏ రకంగా సరి చేయాలీ అన్నది ఆలోచించవలసిన విషయం. లేకపోతే తెలుగున పుస్తకాలు వచ్చే వీలే ఇటుపై ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే ఇందుకు రచయితా పాఠకులూ విమర్శకులూ వీరందరూ తమ పాత్రలని సక్రమంగానూ నిజాయితీ గానూ పోషించాలి. సరుకున్న రచనలని దూరం పెట్టి తేలిక పాటి రచనలని గురించి బాకా కొట్టే ఒక తప్పుడు పాత్ర పోషించకుండా ఉంటే చాలు. అందులో భాగంగానే మంచి రచనలని గురించి మాట్లాడ వలసిన బాధ్యతని సైతం సాహిత్యం పట్ల మమకారం ఉన్న వారందరూ చూపించవలసి ఉంది. ఇదే మీరు మరి “జటిల”మంటారా? అయితే మరి సాహిత్యాన్ని ఏకంగా అటకెక్కించేస్తే చాలు:)
జయప్రభ.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
05/07/2012 9:45 am
మోహనరావు గారి వ్యాసం చాలా బాగుంది నాకు.
శ్రీవక్కలంక లక్ష్మీపతిరావు గారు కూడా మేఘసందేశానికి ఒక తెలుగు అనువాదం వెలువరించారు. గత 70వ దశకంలో డిగ్రీ విధ్యార్థులకు అది పాఠ్యగ్రంథంగా కూడా ఉండేది. నేను కూడా అది అలా చదివాను. అయితే నాకు అందులో మూలకావ్యంలోని సొగసు కనుపట్ట లేదు. నాకు గుర్తున్నంత వరకు, వక్కలంకవారు ‘ఆ కాళిదాసు మన తెలుగువాడైతే యెట్లా వ్రాసి యుండేవాడో నని అట్లాగు వ్రాసాను’ అనటం నాకు రుచించ లేదు.
బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యిత వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది. అలాంటిదే మరొక తప్పుడు స్పృహ సంస్కృత పాండిత్య ప్రదర్శన యెంత హెచ్చుగా చేస్తే అంత మంచిదీ, సమాసదైర్ఘ్యంతో అదరగొట్టటం ద్వారా కవిత్వానికి అందమూ కీర్తీ వస్తాయని భావించటం. ఇటువంటి పనులవలన తెలుగు కవిత్వంలో తెలుగు తరచుగా చులకనయింది, ప్రజలకు ఆ తెలుగు(?)కవిత్వం దూరంగా జరిగింది!
మందాక్రాంతంలో పూర్వపాదాంత్యాక్షరంతో కలిపి వరసగా అయిదు గురువులు వచ్చేటట్లు తెలుగులో వ్రాయటానికి పెద్దప్రతిబంధకం. అలాగే మందాక్రాంతం అందమంతా పాదంలో నిర్దిష్టమైన చోట్ల మూడు విరుపులు రావటంలో ఉంది. మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?
తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు. అంతే. అలాగే కొన్ని మందాక్రాంతాలూ ఉన్నాయి.
అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన గారి అభిప్రాయం:
05/06/2012 7:20 pm
1) బ్రహ్మానందం గారు, నచ్చిన విషయాలను ఎప్పుడు నచ్చాయి అనే చెప్పాలి. అందువల్ల మనము తక్కువ కాము. నేను చిన్నప్పుడు Yussouf by James Lowell లో చదివిన క్రింది పంక్తులు మెదడులో తేలుతున్నాయి –
As one lamp lights another, nor grows less,
So nobleness enkindleth nobleness.
2) జయప్రభ గారు, మీరు చెప్పినది నిజమే. నాకు ఎంతో యిష్టము కాబట్టే, ఛందశ్శాస్త్రములో నేను పరిశోధనలు చేస్తున్నాను. ఇవి ఎవరు బావుంది, బాగా లేదు అని చెప్పినా, వ్యాసాలు వ్రాయకున్నా కూడ ఆపను. ఎందుకంటే ఈ శాస్త్రములో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థము చేసికోవడానికి, నన్ను జ్ఞానవంతుడిని గావించుకోడానికి. మీ సలహాలకు కృతజ్ఞుడిని.
3) లైలాగారు, కాళిదాసు నివసించిన కాలమునుగురించి ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఇతడు క్రీస్తు పూర్వమే ఉన్నాడంటారు. మరి కొందరు నేను తెలిపినట్లు నాలుగవ శతాబ్దపు వాడంటారు. ఇతని కవిత్వములో అశ్వఘోషుని కొన్ని అనుసరణలు, అనుకరణలు ఉన్నాయి. కాళిదాసులాటి కవికి మిగిలినవారిని ఎందుకు అనుసరించాలి అనే వాళ్లు ఇతడు అశ్వఘోషునికి పూర్వకవి అంటారు. నా ఉద్దేశములో మందాక్రాంతమును వాడిన మొట్టమొదటి కవి కాళిదాసు హరిసేనుడివల్ల ప్రభావితుడై ఆ వృత్తాన్ని మేఘదూత రచనకు ఎన్నుకొన్నాడని అనుకొంటాను. ఇక పోతే, సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి శిలాక్షరాలు కాబట్టి ఇందులో ఎట్టి సందేహము లేదు. కావున నేను కాలిదాసు నాలుగవ శతాబ్దపు వాడనే నమ్ముతాను. సముద్రగుప్తుడన్నది ఒక బిరుదు మాత్రమే. ఇతని అసలు పేరు వేరైనది.
కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు. మీరు ఉదహరించిన ఘటకర్పరునికి పేరు అది కాదు, అదేమో తెలియదు. కాని సందేశకావ్యములలో ఇతడు వ్రాసిన ఘటకర్పరము ఉన్నది. ఇది ఒక యమక కావ్యము కూడ. కొందరు దీనిని చూచిన తరువాతే కాళిదాసు మేఘదూతాన్ని వ్రాసినాడంటారు.
4) రవి గారు, రాజగోపాల శర్మ వ్రాసిన పుస్తకములో (గ్రంథసూచిలో ఎనిమిదవది, ఇది DLI – IISc లో లభ్యము) తెలుగులో కొటికలపూడి వేంకటకృష్ణ పండితులు 1790లో అనువదించారు, అది నేడు దొరకడము లేదు. లభ్యమయిన పుస్తకాలలో వడ్డాది సుబ్బరాయకవి 1884లో చేసిన అనువాదము మొదటిది. సుమరు 50 అనువాదాలు ఇందులో పేర్కొనబడ్డాయి.
5) నిడదవోలు వేంకటరావుగారికి కన్నడ ఛందస్సుతో బాగుగా పరిచయము ఉన్నది. ఆందువలన వీరు భామినీషట్పదిని ఎన్నుకొన్నారేమో లేక కామేశ్వరరావుగారన్నట్లు ఈ ఛందస్సు తెలుగులో కూడ పరిచితము కాబట్టి ఎన్నుకొన్నారేమో? మిశ్రగతిలో సాగే ఈ ఛందస్సుకు ఒక తూగు ఉన్నది. వ్యక్తిగతముగా నా ఉద్దేశములో అది వ్యధకు, బాధకు, విరహానికి సముచితము కాదేమో? దానికి బదులు ఖండగతిలో ఐదు మాత్రలతో ఉంటే అది బరువును సూచించగలదు. ఈ విషయాలను నేను చర్చించలేదు, ఎందుకంటే నా గురి మందాక్రాంతవృత్తము మాత్రమే కావడమువల్ల. నా ఉద్దేశములో పాదాలలోని పదాలకు సరిగా విరుపును కలిగించి ఉంటే మందాక్రాంతములో కూడ పై 50మంది కవులలో ఏ కొందరైనా దీనిని తప్పకుండ సాధించి యుంటారు. నావంటి అల్ప భాషాజ్ఞానియే దీనిని ప్రయత్నము చేసినప్పుడు, సంస్కృతాంధ్రములలో పాండిత్యము ఉన్నవారికి ఇది నల్లేరుపై బండి నడకే.
6) కామేశ్వరరావుగారు, సంస్కృత యతిని గురించి ఒక రెండు వాక్యాలు. నాట్యశాస్త్ర రచయితవంటివారు యతిని పూర్తిగా అంగీకరించలేదు. మిగిలినవారు కూడ మొట్ట మొదట తప్పకుండా పాటించినా, తరువాత పదాలను సంధితో యతిస్థానము వద్ద కలపడము ఒక ఆభరణములాటిది అనుకొన్నారు. దీనికి కాళిదాసాదికవులను పొగిడారు కూడ. నావరకు నేను యతి స్థానము వద్ద విరుపు లేక సంధి అవసరమని భావిస్తాను. పదాలను యతి స్థానములో దూసుకొని వెళ్లేటట్లు వ్రాయడము, పాదాంత యతి లేకుండ వ్రాయడము నాకు రుచించదు. పాదాంతయతి ఉపజాతులలో తప్పక అందరు పాటిస్తారు, కందములో రెండవ పాదానికి పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు యిది నియతము. ఇక పోతే ఆషాఢస్య ప్రథమదివసే అనేటప్పుడు స్య గురుతుల్యమే. ఉదాహరణగా సంస్కృతములో పాదాంత లఘువును గురువుగా అంగీకరిస్తారు, ఎందుకంటే అక్కడ విరామము వస్తుంది కనుక. విరామము ఉన్నప్పుడు సంస్కృతములో లఘువు సామాన్యముగా గురుతుల్యమే.
పాదాంత యతి ఉన్నప్పుడు, పాదారంభములో అచ్చులను వాడుతారు, సంధి లేకుండా కూడ. ఇక మధ్యలో సామాన్యముగా అచ్చులను య-కారముతో తెలుపుతారు.
7) కామేశ్వరరావు గారు, నేను ఇంకా మందాక్రాంత వృత్తరచనను అభ్యాసము చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 30 వ్రాసినాను, మందాక్రాంతపు లయతో సుమారు 15 పద్యాలు, జాతి పద్యముగా సుమారు 25 వ్రాసియున్నాను. ఇందులోని కిటుకులను ఇంకా నేర్చుకొంటున్నాను. వీలు దొరికినప్పుడు వీటిని అంతా ఒకే చోట ఉంచడానికి ప్రయత్నము చేస్తాను.
ఇదే ఒక చిన్న వ్యాసములా తయారైనందులకు సంపాదకులు మన్నిస్తారనే ఆశతో
విధేయుడు – మోహన
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
05/06/2012 6:13 pm
మోహనరావు, బ్రహ్మానందం, జయప్రభ పాఠకస్పందన గురించి చాలా లోతైన విషయావలోకనకి దారితీసే అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ వ్యాసానికి నేరుగా సంబంధించకపోయినా ఈ “పాఠకస్పందన” గురించి నాకు కలిగిన కొన్ని సాధకబాధకాల్ని “ఈమాట” పాఠకుల ముందుంచుతాను.
1. రచనలో రచయిత పాత్ర. మీరు ఒక సాంకేతిక పరిశోధనాపత్రం రాసి ప్రచురించదల్చుకున్నారనుకోండి. దాన్లో విధిగా మొదల్లోనో (కొన్నిట్లో చివర్లోనో) ఆ విషయం మీద అంతవరకు జరిగిన ముఖ్యమైన పరిశోధనల్ని క్లుప్తంగా వివరించి, మీరు చేస్తున్నపని వాటికన్నా ఏ విషయాల్లో భిన్నమైందో, ఎలా ఆ సమస్య పట్ల మన అవగాహనని విస్తృతం చేస్తుందో, మీరు చేస్తున్న ముఖ్యమైన contributions ఏమిటో ఏకరువు పెడతారు. అప్పుడు ఆ పత్రాన్ని పరిశీలించే పరిశీలకులు (reviewers) మిగిలిన వాళ్ల, మరియు మీసొంత contributions గురించి మీరు చెప్పిన విషయాలు ఎంతవరకు సత్యాలో కాదో నిర్ణయించి, మీ contributions విలువ మీరు ప్రచురించ ప్రయత్నిస్తున్న పత్రిక (journal, conference proceedings etc) స్థాయికి సరితూగుతుందా లేదా అని బేరీజు వేసి ఆ పత్రాన్ని ప్రచురణార్హమైందో కాదో తేలుస్తారు. ఆ పరిశీలకులు మీరు పనిచేస్తున్న అంశం లోనో, దానికి దగ్గరగా వుండే అంశాల లోనో ఉద్దండులు కనుక ఈ పని చెయ్యగలుగుతారు (ఎప్పుడూ కాకపోవచ్చు కాని అత్యధిక శాతం విషయంలో ఇది నిజం).
కవితల్నీ కథల్నీ బావుందనో లేదనో చెప్పటానికి విస్తృతమైన పాండిత్యం పనికొస్తుందేమో కాని అవసరం మాత్రం కాదు, ఎందుకంటే వాటిని బేరీజు వెయ్యటం హృదయసంబంధి విషయం. వ్యాసాలు అలా కాదు. అవి మేధోసంబంధితాలు. (చాలా మంది తెలుగు కవులు ఈ తేడా తెలియక వ్యాసాల్ని కవితల్లా రాయటానికి ప్రయత్నించటమూ కవితలరూపంలో అప్రయత్నంగానే వ్యాసాలు రాయటమూ మనకు కొత్తకాదు గాని, అది ప్రస్తుతం అప్రస్తుతం.) కనుక ఒక వ్యాసాన్ని చదివినప్పుడు ఆ రచయిత contribution ఏమిటో ముందు మనకు తెలియాలి. ఉదాహరణకు, (అ) ఎవరో రాసిన విషయాన్ని తన మాటల్లో మళ్లీ రాశాడా, (ఆ) రకరకాల పుస్తకాల్లో ఉన్న విషయాల్ని క్రోడీకరించి ఒకచోట చేర్చాడా, (ఇ) అదివరకు ఉన్న విషయాల్ని తీసుకుని వాటికి కొంత కొత్త అవగాహనని కలిపాడా, (ఈ) ఇదివరకు ఎవరూ చూడని ఒక కొత్త కోణం చూపిస్తున్నాడా, (ఉ) ఇదివరకు ఎవరూ ఊహించని కొత్త ఊహతో అదివరకున్న అవగాహనని తల్లకిందులు చేశాడా, (ఊ) అదివరకు అవగాహనే లేని విషయానికి ఒక సిద్ధాంత ప్రాతిపదికని కల్పించాడా,.. ఇలా ఎన్నో levels ఉన్నాయి. ముందే అనుకున్నట్టు సాంకేతిక రంగాల్లో ఐతే తను చేసిన పని ఏమిటో ఈ విశాల రేఖ మీద దాని స్థానం ఎక్కడని తను నమ్ముతున్నాడో చెప్పటం రచయిత పని. అతని ఆ అవగాహన ఖచ్చితమైందో కాదో నిశ్చయించటం పరిశీలకుల పని.
తను చేస్తున్న పని ఏమిటో చెప్పటం మన రచయితలకు అలవాటు లేదు. ఆ పని స్థాయి ఏమిటో చెప్పగలిగే పరిశీలకులు సాహిత్య ఔత్సాహికుల్లో చాలా కొద్దిమంది.
2. దేని గురించి రచయితని అభినందించాలి? ఒక వ్యాసంలో రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు ఆ రచయితని దేని గురించి అభినందించాలి? ఉదాహరణకి ఒక రచయిత చేసిన పని ఎన్నో చోట్ల ఉన్న విషయాల్ని సంగ్రహించి క్రోడీకరించి సంక్షిప్తీకరిచటం అనుకోండి. అప్పుడు అవసరమైన అన్ని విషయాల్ని సంగ్రహించాడా లేక ఏవైనా ముఖ్యమైన వాటిని సంప్రదించలేదా, క్రోడీకరణమూ సంక్షిపీకరణమూ సరిగా ఉన్నాయా లేవా అని వాటి గురించి అభినందనలో చీవాట్లో అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు. రచయిత పాత్ర ఏమిటో తెలియనప్పుడు, అది తెలుసుకునే జ్ఞానం పాఠకుడికి లేనప్పుడు, చేసే వ్యాఖ్యలు గుడ్డివాడి చేతిలోని రాయి వంటివే ఔతాయి కదా.
3. ఎవరు సరైన వ్యాఖలు చెయ్యగలరు? రచయితా, పరిశీలకులు పాఠకుడికి ఎలాటి సమాచారమూ ఇవ్వనప్పుడు బాధ్యతంతా పాఠకుడి మీదే పడుతుంది. పాఠకుడే ఆ రచనలో రచయిత తెచ్చిన కొత్త అవగాహన ఏమైనా వుందా? ఉంటే అదేమిటి? దాని విలువేమిటి? ఆ విలువ స్థాయి ఏమిటి? మిగిలిన వాటితో పోలిస్తే ఇది నేలబారుదా, సామాన్యమైందా, సగటుదా, ఉన్నతమైందా, అత్యున్నతమైందా, అద్భుతమైందా – అని బేరీజు వెయ్యగలగాలి. మామూలు పాఠకులకి ఇది సాధ్యం కాదు. కనుక ఏదో అనాలి కదా అనటమో లేకపోతే లేని పెద్దరికాన్ని మీద వేసుకుని తెలియని విషయాల్ని తెలిసినట్టు నటించటమో లేదా అలాటి నటన అలవాటైపోయి నిజంగానే పండితుణ్ణని భ్రమించటమో జరుగుతుంది.
4. అందరూ ఔత్సాహికులే ఐనప్పుడు. “ఈమాట” లాటి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు (ఏ నారాయణ రావు లాటి వారో తప్ప) ఔత్సాహికులు. అలాటి వారు తమకున్న అనేక ఇతర వ్యాపకాల నుంచి సమయం వెచ్చించి ఏదో ఒక విషయం మీద వ్యాసం రాయటమే గొప్ప విషయం. కనుక అలాటి వారు రాసే వ్యాసాలకి professional స్థాయి ప్రమాణాలు వర్తిస్తాయా? వర్తించాలా? అది సాధ్యమా? కొంత lenience అవసరం అని బహుశా అందరూ ఒప్పుకోవచ్చుననుకుంటాను. ఐతే, ఎంత? ఉదాహరణకు, ఒక professionalకి “ఉన్నత” స్థాయి ఔత్సాహికుడి “సగటు” స్థాయికి సమానం అనొచ్చా? అంటే, professional scale మీద “సగటు” స్థాయిని చేరే వ్యాసాన్ని ఒక ఔత్సాహికుడు రాస్తే, దాన్ని “ఉన్నత” స్థాయి అని లెక్కవెయ్యొచ్చా? మరోవిధంగా చెప్పాలంటే, professionalకి, ఔత్సాహికుడికి తేడా “ఒక స్థాయి” అన్నమాట. కాదు, అది మరీ దగ్గర, రెండు స్థాయిల తేడా ప్రమాణం ఐతే బాగుంటుంది అనొచ్చు. ఏదో ఒకటి, ఒక ప్రమాణం ఒప్పుకుంటే అప్పుడు professional scale ని కొలమానంగా తీసుకుని ఔత్సాహికుల రచనల విలువని అంచనా కట్టొచ్చు.
చివరగా: మంచి రచనల్ని, మంచివి కాని వాటిని విడదియ్యలేనప్పుడు ఇటు వాసి రచయితలకూ అటు నాసి రచయితలకూ మరోవైపు పాఠకులకూ మంచి జరగదు. నాసి రచయితలు గొప్పవాళ్లమని విర్రవీగి విజృంభించటం, వాసి రచయితలు నీరుగారి నీరసించటం, పాఠకులు చెత్తలో కూరుకుపోయి ఆక్రందించటం జరుగుతాయి. తెలుగు సాహిత్యరంగంలో అలా విడదియ్యటానికి ఇప్పుడు కాలం అనుకూలం కాదు. ఈ జటిలసమస్యకి పరిష్కారం నాకు తెలియదు.
ఎందరో పెద్దవాళ్లు చెప్పినట్టు, రాయగలిగిన వాళ్లు రాస్తూ వుండాలి. ప్రతివారు చేసే ప్రతి రచన కళాఖండం కాదు కాని అభ్యాసంతో ఎప్పుడైనా ఒకటి బయటకు వచ్చే అవకాశం వుంది. “అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు”. ఈ విషయం రచయితలూ పాఠకులూ గ్రహిస్తే అందరికీ హాయి.
వారి వ్యాసంతో సంబంధంలేని విషయాల్ని రాసే అవకాశం ఇచ్చిన మోహనరావు గారి వ్యాసానికి అభినందనలు.
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి Ramakrishna Reddy గారి అభిప్రాయం:
05/06/2012 6:00 pm
చాల ఆనందముగ వున్నది ఎందువలనంతటే శిశువు నా పదవ తరగతి పాఠ్యాంశము. అప్పుడు నాకు అర్దం అవలేదు కాని నాకు అబ్బాయి జన్మించిన తర్వాత తెలిసింది కవి గొప్పతనము. నిజముగ ఇలాంటి గొప్ప కవులు జన్మించిన ఈ తెలుగుగడ్ద మీద జన్మించినందుకు గర్వపడుతున్నాను.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
05/06/2012 1:03 pm
మోహనగారు,
సంస్కృత తెలుగు యతులను రెండిటినీ పాటిస్తూ మీరు వ్రాసిన తెలుగు పద్యాలు బాగున్నాయి. అయితే వాటిలో మీరు చేసిన యడాగమ సంధుల గురించి చిన్న అనుమానం.
“యలయై రావా – యలఘుతర మో – దాబ్ధిలో ముంచ రావా”
వంటి చోట్ల యడాగమం చెయ్యవచ్చా అని.
తెలుగులో మందాక్రాంతం ఎందుకు అరుదు అన్న మీ ప్రశ్నకి మీ, “వాణిశ్రీదా – వరము లొసగన్ – వందన మ్మిత్తు దేవీ” అన్న పద్యమే సమాధానం అని నాకనిపించింది. మిగతా మూడు పాదాలలో ఉన్న అందం మొదటిపాదంలో ఉందా?
సంస్కృత యతుల గురించి నాకు చాలా రోజులుగా ఉన్న ఒక సందేహం ఇక్కడ అడగడం అసందర్భం కాదనుకుంటాను. సంస్కృతంలో యతి విరామస్థానం కదా. అంటే పద్యం చదువుతున్నప్పుడు అక్కడ కచ్చితంగా ఒక క్షణం ఆగాలి కదా. మరి అలాంటప్పుడు యతి స్థానంలోని అక్షరం సంయుక్తమైతే దాని ముందరి అక్షరం గురువవ్వడం సమంజసమెలా అవుతుంది? ఉదాహరణకి, “ఆషాఢస్య ప్రథమ దివసే” అన్నప్పుడు “స్య” అన్న అక్షరం “ప్ర” అక్షరం సంయుక్తం కావడం వల్ల గురువవుతోంది. కాని “ఆషాఢస్య” అని ఆపి తర్వాత “ప్రథమ దివసే” అని చదివేటప్పుడు “స్య” లఘువే కదా అవ్వాలి?
రవీ,
మీరుదహరించిన షట్పదికి “ఆధునిక”నామం ఏమిటో గుర్తించారా?:-)
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి రవి గారి అభిప్రాయం:
05/06/2012 3:11 am
మోహన గారు, మీ వ్యాసాన్ని సమీక్షించి లేదా విమర్శించే స్థాయి నాకు లేదు. చక్కగా ఉంది అంటే సరిపోదు, ఈ వ్యాసం అలా ఉబుసుపోక చదివి అభిప్రాయం చెప్పేదీ కాదు, అంచేత నాకు కలిగిన కొన్ని ఆలోచనలు పంచుకుంటున్నాను.
>>కోపాన్ని, ధిక్కారాన్ని సూచించడానికి పృథ్వీవృత్తము ఉచితమైనది, అది ఈ భారాన్ని మోయగలదు. వర్షాకాలములో ప్రవాసములో విరహానుభవాన్ని వివరించడానికి మందాక్రాంతము చక్కగా శోభిస్తుంది.
మీరు ఉటంకించిన క్షేమేంద్రుని వ్యాఖ్య సంస్కృతానికి సరిగ్గా సరిపోతుంది. అయితే అదే విరహాన్ని తెలుగులో వర్ణించాలంటే మందాక్రాంతము సరిపోగలదా అన్న అనుమానం కలుగుతోంది. అందుకు కారణం యేభై పైగా తెలుగు అనువాదాలున్న ఈ కావ్యానికి ఒక్క అనువాదం కూడా తెలుగు మందాక్రాంతం లో లేదు.
భారతదేశంలో ఈ కావ్యానికి అత్యధికమైన అనువాదాలు తెలుగులోనే ఉన్నాయట. వీటిలో మొదటిది కొటికలపూడి వెంకటకృష్ణసోమయాజి గారి అముద్రితరచన (1864), మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తకాలయంలో ఉందట. అప్పటి నుండి నేటి వరకూ యేభై కి పైగా అనువాదాలు, గేయాలు, వచనాల రూపంలో కూడా వెలువడినాయి. వీటిలో కాస్త ప్రాచుర్యమైనవి రాయప్రోలు సుబ్బారావు గారి దూతమత్తేభము, విద్వాన్ విశ్వం గారి మేఘసందేశానువాదము, దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి రచనా మూడూ వరుసగా మత్తేభ, కంద, వృత్తాలలో వ్రాసి ఉన్నవి. ఇతర కవుల అనువాదాలు కూడా వృత్తాలలో, గేయాలలో ఉన్నవి. మందాక్రాన్తాన్ని యథాతథంగా తెలుగులో మేఘసందేశానువాదానికి వాడుకున్న కవులు కనిపించడం లేదు.
నిడదవోలు వెంకటరావుగారు ’షట్పదీ మేఘసందేశం’ అన్న ఒక అనువాదానికి పీఠిక వ్రాసి ఒకమాట ఇలా అన్నారు. “భామినీషట్పది వృత్తం మందాక్రాంత వృత్తముతో సన్నిహిత సంబంధమున్నది.” బహుశా మందాక్రాంతాన్ని అనువదించడానికి లేదా మంద్రాక్రాంతములో చెప్పగలిగిన భావానికి తెలుగులో సరిపోలగల వృత్తం షట్పదీ వృత్తం అయి ఉండవచ్చునని ఆయన అలా అన్నారేమోనని నా అనుకోలు. ఈ కావ్యంలో మొదటి పద్యాన్ని ఉటంకిస్తున్నాను. (కశ్చిత్కాన్తా … శ్లోకానికి అనువాదం)
“మునుపు యక్షుండొకఁడు తన ప్రియ
వనిత తోడుత నుండి యింటను
పనుపు సేయుట యందు నేమర వాంఛలకు లోఁగి
కనలి ధనదుఁడు శాపమిచ్చెను
వనజలోచనఁ బాసి వర్షము
వనములంబడి బ్రతుకు మంచును పవి కఠోరముగ
ఆననమ్మున గళలు దొరగఁగ
దీనుడై మిథిలేశ తనయా
స్నాన పుణ్యోదక వివర్ధిత సాంద్రతరుతతిని
మేని బడలిక మనసు సడలిక
మానుపంగల రామగిరిపై
పూనె నాతడు గడుప దినములు పోడిమిని వీడి.”
మీరు మందాక్రాంత లయకు దగ్గరగా ఉన్న మందాకిని అనువాదాలను సూచించారు. బావుంది. అయితే విరహానుభవం తెలుగులో ఉద్యోతించడానికి బహుశా షట్పదీ వృత్తం ఎక్కువగా పొసగవచ్చునన్న వెంకటరావు గారి అభిప్రాయం ఆలోచింపజేస్తున్నది.
జిజ్ఞాసువు,
రవి.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన గారి అభిప్రాయం:
05/04/2012 1:59 pm
బ్రహ్మానందంగారికి, వికాస్ గారికి, మీ అభిప్రాయలకు కృతజ్ఞతాపూర్వక వందనాలు.
వికాస్ గారు – మీరు ముందుంచిన విషయాలు చాల ముఖ్యమైనవి. నా అనుభవమువల్ల నేను నేర్చుకొన్న కొన్ని పాఠాలను మీముందు, అలాగే మిగిలినవారి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. (1) ప్రతిరోజు ఒక గంట లేక గంటన్నర ఏదో ఒక సాహితీ పుస్తకాన్ని చదివితే ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. ఒక గంట చాల తక్కువ సమయములా తోచవచ్చును. కాని 20, 30, 40 యేళ్ల కాలములో ఇది తక్కువ కాదు. ఎన్నో కొత్త పుస్తకాలు చదవడానికి వీలవుతుంది, ఎంతో నేర్చుకోడానికి వీలుపడుతుంది. ఇలా చేస్తే ఒంటరిదనము కూడ మరచిపోవచ్చును. (2) చదివేటప్పుడు అర్థము కాని పదాలు కనబడినప్పుడు, నిఘంటువును సంప్రదించి అర్థాలు తెలిసికోవాలి. సుమారు ఒక వేయి పుటలకన్న తక్కువగా ఉండే నిఘంటువు చాలు ఈ కార్యానికి. మిగిలినవాటికి ఆంధ్రభారతివారి నిఘంటువు సైటును చూడవచ్చును. మొట్టమొదట పదాలకు అర్థాలు వెదకడములోనే సమయమవుతుందని బాధపడవచ్చును. కాని కొన్నాళ్లకు చాలా పదాలకు అర్థాలు తెలియడమువల్ల ఇలా వెదకడము తగ్గుతుంది. (3) పాత కవిత్వమయినా, కొత్త కవిత్వమయినా దేనినయినా చదవడానికి ఎన్నుకోవచ్చును. శ్రీశ్రీ కవితలలోని కొన్ని పదాలకు నిఘంటువు తప్పని సరి ఇప్పటికీ. కావ్యాలకన్నా, అందులోని కొన్ని భాగాలను పఠనీయాంశాలుగా ఎన్నుకోవచ్చును, ఉదా. నన్నయ దుష్యంతుని కథ, తిక్కన ఉత్తరగోగ్రహణము, శ్రీనాథుని హంసదూతము, పోతన రుక్మిణీ కల్యాణము, శ్రీరామచరిత్ర,, పాపరాజు కుశలవుల రామాయణ గానము, మున్నగునవి. (4) అంతర్జాలములో ఎన్నో పుస్తకాలు ఉచితముగా లభ్యము. టీకాతాత్పర్యాలతో చాల పుస్తకాలు ఉన్నాయి. వాటిని సులభముగా ఇక్కడినుండి, ఇక్కడినుండి దిగుమతి చేసికొనవచ్చును. ఇవి కొన్ని సలహాలు మత్రమే. మిగిలినవి ఆసక్తిపైన ఆధారపడినవి.
విధేయుడు – మోహన
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి vikas,vinnakota గారి అభిప్రాయం:
05/04/2012 4:38 am
గౌరవనీయులు జెజ్జాల కృష్ణ మోహన రావు మరియు సంపాదకులకు నామస్కారం
నేను, అమెరికాకి వచ్చి రెండేళ్ళు అయ్యింది, చిన్నపుడు 10వ తరగతి నుంచి మొదలు పెట్టిన వృత్తి విద్యలొ పట్టా కోసం వేట ఈమధ్యే పూర్తి అయ్యింది. నాకు జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసాలు చదివినప్పుడు ఒక రకం ఐన depression వస్తుంది. Sir, మీ వ్యాసాలు నాకు అర్ధం కాక పోయినా, తెలుగు భాషలో నా తెలియనితనం అజ్ణానం తేటతెల్లం అవుతోంది. ఈమధ్య ఎందుకో, దూరంగా ఉంటున్నందుకో ఏమో భాష మీద మమకారం, నేర్చుకోవాలన్న తాపత్రయం పెరుగుతోంది, కాని మీరు రాసిన ఋతుపర్ణము, కామవేదం లాంటి కవితలు లేదా మీరు ఎంతో శ్రమకోర్చి, పరిశోధించి రాసే వ్యాసాలు ఐనా సరే, పూర్తిగా కాదు కదా పావు వంతు ఐనా నాకు అర్ధం కావడం లేదు. దయచేసి తప్పుగా అర్ధం చేసుకొకండి. భాష సంస్కృతి అంటూ పెద్ద మాటలు పక్కన పెడితే ఆఖరికి సినిమా పాటలు కూడా కొన్ని సార్లు అర్ధం కాని పరిస్థితిలొ ఉన్న నాలాంటి వాడు తెలుగు నేర్చుకోవాలి అంటే అసలు వీలు పడుతుందా?
ఈ ఒక్క సందర్భమే కాదు ఎప్పుడన్న పైత్యమో భక్తో ప్రకోపించి ఏ రుద్రమో, శంకర భాష్యాల అనువాదాలో netలో వెతికి పట్టుకున్నా నాలాంటి వాడికి ‘ఒం” ‘నమహ్’ తప్ప ఇంకో ముక్క అర్ధంకావు. వాటికి అర్ధాలు తెలియవు.
ఈసారి, India వెళ్ళినప్పుడు ఊరగాయలు కాకుండా, ఓ నాలుగు పుస్తకాలు కొనుక్కుంటే చాలు, కాని ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టలి అన్నదే ప్రశ్న? మీ వ్యాసానికి ఏరకంగాను సంబంధం లేక పొయినా దయచేసి నాకు దైవపరమైన పుస్తకాలు, భాష బాగు పడడానికి ఉపయుక్త కారమైనవి ఏమన్న సుచించమని మనవి.
అలాగే పత్రికా ముఖంగా మరొక్క మనవి, ఈ-మాట గ్రంధాలయంలో కొంచం పురాణ వాఞ్ఙయాలని చేరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, నాబోటి వాళ్ళు ఏమన్న అర్ధం కాక పొయినా అనుమానాలు, అర్ధం కాని విషయాల వ్యక్తం పెద్దలు వివరించగలరు అని ఆశ పడుతున్నాను.
పెద్దలు, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే అది నా చిన్నతనం అని మన్నించగలరు.
వికాస్ విన్నకోట
చందవరం, ప్రకాశం జిల్లా గురించి Aparna krishnavajhala గారి అభిప్రాయం:
05/02/2012 3:57 pm
పర్వత శేఖర్ గారు, చందవరంలో పెరగనవసరం లేదు కవి అవడానికి, కాని కవి చందవరం వెళ్ళాడంటే, కవి హృదయం దాగదు.
చందవరం, ప్రకాశం జిల్లా గురించి బొక్కా ప్రేమ్ కుమార్ గారి అభిప్రాయం:
05/02/2012 6:44 am
పురుగును పొడుస్తుంది
బిత్తర చూపుల కోడిపుంజు.
కోడిపుంజు బిత్తర చూపులు కూడా క్యాచ్ చేసి కవిత రాయడం కేక.
అత్తకు యముడు-అమ్మాయికి మొగుణ్ణి
తీరుబడిగా నెమరువేస్తుంది ఆవు.
రాయెత్తి కొట్టకుండా.. దీనికి అర్ధం ఏంటో వివరిస్తారా?
సాయంకాలం పూట
నాసిరకం పుణుగులు పొంగణాలకి
గలగల్లాడతాయి రూపాయలు
ఏసీ హోటల్లో కూకోని..కయితలు రాసేవారికి నాసిరకం ఏమో కాని, తినేవాళ్ళు నాసిరకం తింటున్నాం అని అనుకోరు.
ఇంకా ఏమన్నారు మీరు
పొద్దుటి పూట
పొగలు కక్కే చౌకరకం తేనీరు
ఆరారగా తాగుతుంది ఊరు
మీరు షుగర్-ఫ్రీ బూస్టు తాగుతూ రాసుంటారు ఈ లైను
మొత్తానికి మీ ఈ కయిత కెవ్వు కేక కేకస్యః
బ్రహ్మ సృష్టి గురించి మోహన గారి అభిప్రాయం:
05/01/2012 3:37 pm
వేలూరి గారు, కథ బాగుంది, కడుపుబ్బ నవ్వించారు. ఇంతకు బ్రహ్మ భారతదేశపు వాసియా లేక అమెరికాలోని దక్షిణ ప్రాంత వాసియా? ఇంతకూ నాలుగు తలల బ్రహ్మకు నాలుగు టిక్కెట్లా లేక బ్రహ్మ కూడ కామరూపుడా? లేకపోతే బ్రహ్మ నాలుగు తలలను ఒక బ్రహ్మాణీ మాత్రమే చూడగలుగుతుందా? అసలు బ్రహ్మకు సరిగా గూగుల్ చేయడము చేతనవుతుందా? నేను గూగుల్ చేసినప్పుడు, ఆఫ్రికాలో రెండు చోటులలో, అమెరికాలో ఒక చోట, ఇండియాలో ఒక చోట ఈ శంబళ ఉన్నది, కాని బ్రహ్మకు కావలసిన శంబళ లేదు కాబోలు. బ్రహ్మ ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఇంటిలో కుంపటి ఎలా వెలుగుతుందో? వ్రాయండి, వ్రాయండి, ఇలాగే వ్రాయండి. లాఫ్టర్ ఈస్ ది బెస్ట్ మెడిసిన్ కాబట్టి ఇక మీద మందులు వాడడము తక్కువ చేసికోవచ్చు 🙂 విధేయుడు – మోహన
వేటూరి పాట గురించి pradeep గారి అభిప్రాయం:
05/01/2012 5:47 am
“తెర చాటు చందమామ” బ్లాగ్ చర్చలొ చెప్పినట్టు అనువాద చిత్రాల గీతాలు రాయడంలొ వేటూరి గారు విఫలమయ్యారేమో కాని అనువాద చిత్రాలకి పాటలు రాసేపుడు చాల limitations ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి, చిత్రీకరణ కావచ్చు, లేదా సంగీత దర్షకుడి pressure కావచ్చు, పెద్దల అనుకరణ కావచ్చు. వీటిని కూడా మనము దృష్టిలొ పెట్టుకొవాలి కదా? చాల మంచి పాటలు రాసిన వాళ్ళు ఇందులొ విఫలం కావడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది.
ఇక్కడ ఇంకొ విషయం గమనించాలి, అనువాద చిత్రాలకి (Dubbing songs) విఫలమయిన వాళ్ళే remake movies songs బాగానే రాశారు కదా? ఉదాహరణకి “సీతాకొక చిలక” సినిమాలొ పాటలు బాగుంటాయి.
మూడు లాంతర్లు – 10 గురించి కనక ప్రసాద్ గారి అభిప్రాయం:
04/17/2012 12:49 pm
బ్రహ్మానందం గారు,
మీరు ప్రతిపాదించిన విషయం, చెప్పిన కారణాలు చాల సబబుగా ఉన్నాయి. ఇవి నేను ముందుకి రాయాలని అనుకున్నవి; మీరే అన్నారు. మీరు వర్ణిస్తున్నది లోకంలో సాధారణమైన మన:స్థితి. లౌక్యుల పద్ధతి అని నేనంటున్నది. మంచి పాఠకుడివి కావాలంటే ఇలాంటి పరిమితుల్ని అధిగమించాలి అని రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ అన్నారన్నాను కదా?! ఈ పరిమితుల వలన సంకుచితం కానివి, భిన్నమైన వ్యక్తిత్వాలుంటాయి. జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువారు వంటి ఊహలు అలాంటి మనుషుల్ని చూసి వచ్చి ఉంటాయి. వాళ్ళు వ్యక్తిగతమైన పరిమితుల్ని తమ వ్యక్తిత్వ బలం వలన అధిగమించగలుగుతారు. సుహృద్భావం, ప్రజాస్వామ్యం కోసం కాదు. Because of who they are. వాళ్ళకు మీరు వర్ణించే పరిమితులు వర్తించవు. అలాంటి మనుషుల్ని నేను ఎక్కడున్నా వేటాడి, వెంటాడి పట్టుకుంటాను. ఒదలను. అందుకే నాకు తెలుసు. త్రిపుర అలాంటి మనిషి. ఆయన కధలూ కవిత్వం అవీ నాకు అక్ఖల్లేదు. ఆయనకీ తెలుసు. ఆయన ఏది రాసినా నాకు ఒప్పుతుందని మీరనుకున్నది నిజం కాదు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. బ్రహ్మానందం గారు, కళలో తన్మయమైన కళాకారులకు ఎవరి అభిప్రాయాలతో ఖాతరు లేదు. లోకం అనుకునేది వాళ్ళకు ఈకముక్కా బరాబర్. నామిని ఉన్నారు కదా?
Art Spirit అని ఒక పుస్తకం ఉంది. Robert Henri రాసేరు. ఆయన ఈ మన:స్థితిని వర్ణిస్తారు.
నిఖిల్ బెనర్జీ అని ఒక సితార్ విద్వాన్. ఆయన ఇలా ఉండేవారట. లౌక్యం, తర్కం, మర్యాదా కళాకారుని మనసును అర్ధం చేసుకోలేవు. వాటికి అనుభవం లేదు, హంగులే ఉన్నాయి – social trappings. మీరన్న సుబ్బారావు గనక కళాకారుడైతే ఆయన కూడా అంతే. ఎవరి స్థిరాభిప్రాయాలు, చరాభిప్రాయాలూ ఖాతరు చెయ్యడు. అతనిలోని దయ్యం (సరస్వతీదేవి) అభిప్రాయం తప్ప. మీరు లేవనెత్తిన సంఘర్షణ ఆ ఒక్కలా తప్ప ఇంక ఎలాగూ, ఎవరి వలనా నివారణ కాదు.
కనకప్రసాద్
మూడు లాంతర్లు – 10 గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:
04/15/2012 2:56 pm
కనక ప్రసాద్ గారూ,
మీ మూడు లాంతర్లు చాలా బావుంది. Cognitive Scienceతో కళలకీ, సాహిత్యానికీ ఉన్న అనుబంధం చక్కగా వివరిస్తున్నారు. మా స్నేహితుడి అబ్బాయి ఈ మధ్యనే Congtive Scienceలో డిగ్రీ చేసాడు. ప్రస్తుతమిది కేవలం స్పోర్ట్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. మీ ఈ రచనని ఎంతో ఉత్సాహంగా చదువుతున్నాను. బాగా రాస్తున్నారు.
Cognitive Dissonance గురించి ప్రస్తావిస్తూ – “ఇది నచ్చినట్లు లేదు అనిపించిన రచనను, దాన్ని సమర్ధిస్తూ, మెచ్చుకుంటూ వచ్చిన సిఫారసులు ఎన్ని చదివినా, విన్నా ఆ అభిప్రాయం – అంటే ఫిర్స్త్ ఇంప్రెస్సిఒన్ మార్చుకోవటం దుర్లభం. అది ఎప్పుడు సాధ్యమౌతుందంటే, ఏవో బలమైన కారణాల వలన ఆ పాఠకుడు ‘మారు మనసు’ పొందినప్పుడు – అంటే తన నమ్మకాలు, లక్ష్యాలు, సంకల్పాలు, తన ఔద్వేగిక వ్యవస్థల్లోన అనుకూలంగా మార్పు వచ్చినప్పుడు.” అని రాసారు.
కేవలం ఒక రచనే మీదే ఆధారపడి అభిప్రాయాలు వుండవు. ఉదాహరణకి మనకి ఒక వ్యక్తి నచ్చడనుకోండి. రకరకాల కారణాలుండచ్చు. ఆ సదరు వ్యక్తి ఏం చేసినా అంటే ఎంత మంచి రచన చేసినా మనసు మార్చుకోవడం కాని పని. మిగతా ప్రపంచం మెచ్చుకున్నా మనం మెచ్చుకోలేము. ఎందుకంటే ఇక్కడ రచనని వ్యక్తిగత అభిప్రాయం ఆసాంతమూ ఆవరించుకుంటుంది. ఇదే ఆ వ్యక్తి పరిచయం లేడనుకోండి. రచనగానే పరిగణించి చదువుతాం. నచ్చిందీ, లేనిదీ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. బాగా నచ్చితే మరిన్ని సార్లు చదువుకుంటాం. ఇక్కడ రచనలో మనల్నీ, మన అభిప్రాయాలకి దగ్గరగా ఉన్న సంఘటనలనీ identify చేసుకోవాడానికి ప్రయత్నిస్తాం. ఒకసారి ఒక అభిప్రాయం వచ్చిన తరువాత దాని ప్రభావం అదే వ్యక్తి రాసిన మిగతా రచనల మీదా కూడా ప్రసరిస్తుంది. ఇది కేవలం సాహిత్యానికే సంబంధించిన విషయమే కాదు. మిగతా కళలకీ వర్తిస్తుంది. అందుకే క్రీడల్లో ప్రతీ ఆటగాడికీ అభిమానుల సమూహాలుంటాయి.
మనకి నచ్చని వారు ఏం చేసినా మనం మెచ్చుకోలేము. ఇక్కడ value judgement కంటే personal judgementకే ప్రాముఖ్యత ఉంటుంది. ఒకరికొకరు నచ్చడం, నచ్చకపోవడం సాపేక్షం. ఒక్కోసారి మనకి పరిచయమున్న వారి అభిప్రాయాలు మీద ఆధారపడి మన అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం. ఉదాహరణకి సుబ్బారావంటే నా స్నేహితుడికి మంచి అభిప్రాయం వుంది. అది అతను నాతో చెప్పినప్పుడు నా అభిప్రాయం మీద అతని ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం వుంది. తద్వారా సుబ్బారావంటే నాకొక స్థిరాభిప్రాయం ఏర్పడుతుంది. ఇది రచనలక్కూడా వర్తిస్తుంది. కాదంటారా? ఇంకా – మీకు త్రిపుర గారితో బాగా పరిచయం వుంది. ఇష్టం కూడా. కాబట్టి ఆయన రాసినవన్నీ మీకు నచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక రచనని విభేదిద్దామనుకున్నా ఆయన మీద మీకున్న పూర్వపు అభిప్రాయం ప్రస్తుత విభేధాన్ని మింగేయచ్చు. ఇలాంటి సందర్భాల్లో cognitive dissonanceని personal resonance డామినేట్ చేస్తుందని నా అభిప్రాయం.
మీరు జవాబు చెప్పరని తెలుసు. అయినా ఆత్రుత కొద్దీ రాస్తునాను.
-సాయి బ్రహ్మానందం
చేపలార్బరు దినాలు గురించి Dadala Venkateswara Rao గారి అభిప్రాయం:
04/06/2012 3:30 pm
‘పరలొక రాజ్యము మనది సిద్దంగాఉండు’
‘తలుపులను తట్టుము’ అవి తెరువబడును
‘వెతుకుము’ అది నీకు దొరుకును
‘అడుగుము’ అవి నీకు ఈయబడును
అంటాడు ఏసు తన జాలర్లతొ
చేపల హార్బరునుంచి జాలరి
ఇంటికి వట్టిచెతులతొ వస్తాడు
తన తల్లి, ఆలి, పిల్లజల్ల ఆశతొ
తెల్లవారుజాముదాకా ఎదురుచూస్తారు
ఎదురుచుస్తూనె ఉంటారు
ఇంటికి తిరిగి వస్తారొ లెదొ తెలియని జాలర్లకు
పరలొకానికి తలుపు ఎప్పుడు తెరచి ఊంటుంది
తనను నమ్మిన జాలర్లకు ఏసు ప్రభువు
ఇచ్చిన వరం పర లొకానికి మార్గం
శివోహం! శివోహం! గురించి Balakrishna Pillalamarri గారి అభిప్రాయం:
04/05/2012 12:23 am
ధన్యవాదాలు. ఉదయం భక్తిరంజని లొ వచ్చే “శివోహం శివోహం” Internet లో చాల వెదికాను. ఆ recording దొరకలేదు, మళ్ళి ఇప్పుడే వినటం.
వేరె వాళ్ళు ముఖ్యంగా హిందుస్తాని సాంప్రదాయం వాళ్ళు పాడినవి Internet లొ చాల ఉన్నాయి. మచ్చుకి ఇవి చూడండి.
పండిట్ జస్ రాజ్ గారి అద్భుతమైన Rendition. ఎవరు పాడారో తెలియదు కాని చాల మంచి rendition. Visuals are very good and add value to the song.
I think the opinion expressed by Srinivas Nagulapalli is that what I feel after listening to the older version of T Sooryakumaari. I feel a strong sorrow feeling when I here this song. All said and I would like to thank you very much for uploading this rare recording.
Balakrishna
పిలూ రాగం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
04/02/2012 1:33 am
ఓఓ వాలు కన్నుల దానా అనే పాట నాకు తెలియదు. నినుచేర మనసాయెరా పిలూ కాదు. నాకు సరిగా గుర్తు లేదుగాని భైరవికాని, ముఖారిగాని అయి ఉంటుంది.
మల్లెపూల మధూలిక గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:
03/27/2012 11:55 am
సురేష్ గారూ! మీ స్పందన మొత్తం చదివాను. చాలా బాగా రాసారు. అందుకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపనీయండి. మీరు విమర్శించినందుకో, ప్రశంసించినందుకో కాదు, కానీ, ఒక పాఠకుడిగా మీ అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచినందుకు సాటి తెలుగు వారిగా మిమ్మల్నిఆనందంగా – అభినందిస్తున్నా..(ఎందుకంటే చాలా మంది చదువుతారు..కాని చెప్పరు..హార్లిక్స్ ప్రకటనలో లా….) అందుకే మీ ఒకో సందేహానికి ఒక్కో సమాధానాన్నిక్కడ పొందుపరుస్తున్నాను.
@ ” మిమ్మల్ని కాని మీ కవితని కాని ఉద్దేశించి అనటంలేదు కానీ” …
*.. అంటూ ఆగారే! ఇందులో వెనకాడేందుకేముందీ?.. మీరు నా కవిత నుద్దేశించే ఇదంతా రాశారు. (లేకపోతే నేనింత గా ప్రతిస్పందించే అవకాశం నాకెక్కడిదనీ !?)
@ ‘ ఒకసారి మీ కవితని ‘చదివినవెంటనే ‘ అభిప్రాయాన్ని రాయటం మొదలుపెట్టాను. కానీ ‘ మరలా పైనుంచి కొసదాక చదివాను’ భావాన్ని ఎలా ప్రవహింపచేసారా అని.,,’
* చాలా తక్కువమందికి మాత్రమే అలవడే ఒక మంచి అలవాటు ఇది. (నాకు లేని మంచి లక్షణాలు ఎవరిలో వున్నా మెచ్చుకోకుండా వుండలేను మరి! .)
ముందొచ్చే ఆలోచన్లన్నీ – సముద్రపు తుఫాన్లు. ఆ వెనకొచ్చేవే అసలైన తేట తనపు ప్రవాహాలు. – ఇలా రెండో ఆలోచన దగ్గర ఆగి, ఆలోచించి రాసే వారి మాటలే నిజానికి – అందర్నీ ఆలోచింపచేస్తాయి. అందుకే మాట్లాడేటప్పుడు…తెలివైన వారు మాత్రమే – కాసేపాగి, నిదానించి సమాధానమిస్తారు.
@ ” మీ విధానం, పదాలు, అల్లిక బాగుంది.’
* నిజమే. కవిత్వం అంటే – మంచుదారాల పోగులు, మలయ పవనాల పరిమళాలు – కలిపి నేసిన విరిమబ్బుల కోక వంటిది. థాంక్యూ!
@ ‘చదువుతున్నపుడు ప్రతి పాఠకుడు తనకర్ధమైనంతవరకు వాక్యంలో రచయిత పొందుపరిచిన భావానికి లోనవుతాడు..’
* అప్పుడే రచయిత గుర్తుండిపోతాడు. మన తెలుగు లో అలాంటి వారిని వేళ్ళమీద లెక్కించొచ్చు.. (ఆ వరసలో చేరాలనుకోవడం – నా వరకు నాకు ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. కాదనను. కాని, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా అని..)
@ “ఒక వాక్యం నుండి మరో వాక్యానికి, ఒక పాదం నుండి మరో పాదానికి దాటుతున్న గ్రాహకుడికి, ఒక ప్రయాణీకుడు మజిలీలు మజిలీలుగా పల్లకిలో పయ నించి గమ్యాన్ని చేరుకున్న అనుభవం కలగాలి.”
* అంటే మీ వుద్దేశం లో – అక్షరాలు పల్లకీలు, భావాలు మనసుని మోసే బోయీలూ కా వా లంటారు.. అవునా!?
@ “ఒక్కోకవితలో నవరసాల్ని పండించవచ్చు ఐతే భాషతో పాటు భావాన్ని చక్కగా పరచగలిగితే. మన తెలుగు అందుకు ప్రసిద్ధం.”
* మీరంటోంది నిజమే! నేనూ ఒప్పుకుంటాను. మన తెలుగు భాషకున్న విశిష్టత ఏమిటంటే – రచనల్లో నవరత్నాల్ని గుమ్మరించ వచ్చు.. పున్నమి గుత్తులనూ పూయించనూవచ్చు..
@ ‘ఓ పాఠకుడిగా నా అభిరుచిని వ్యక్తపరుస్తున్నానంతే.’
* అంతే అనకండి. ఇంత అద్భుతంగా..అందరూ వ్యక్త పరచలేరు! మంచో, చెడో..తప్పో..ఒప్పో..నిష్టూరమో..నిగ్గదీయడమో..ఏదో ఒక దాని గురించి మన తెలుగు వాళ్ళం స్వేచ్చగా మాట్లాడుకోవాలి. సాహిత్యపరమైన విషయాలు చరిచించుకోవాలి. అభిప్రాయాలు, వ్యక్తపరచుకోవాలి. విస్తృత పరిధిలో వెల్లడించుకోవాలి. అసలిందుకే గా – ఈమాట నిర్వాహకులు మనకిక్కడ ఈ స్పేస్ ఇచ్చింది? మీకు దొరికిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అభినందనలు.
@ “తప్పులుంటే క్షమించాలి.’
* ఎందుకండీ..అంత పెద్ద మాట!..సాహితీ ప్రియుల అంచనా మేరకు రాయలేకపోతున్నందుకు.. ఇలా – నేనే అడగాలేమో! .( రాయకుండా నన్ను నేను బాధపెట్టుకుంటే సరిపోయేదానికి..రాసి అందర్నీ బాధిస్తు న్నానేమో ననే శంక కలుగుతూ వుంటుంది అప్పుడప్పుడు!
మూల్గుతున్న నక్క మీద తాటి పండు .. అన్న సామెత చందంలా..- ఈసారి సంపాదకుల వ్యాసం ‘ ఎమితిని సెపితివె.’. చదివాక నా భయం మరింత హెచ్చిందంటే నమ్మండి!)
సురేష్ గారూ! అందరి రచన్ల మీదా.. మీ అభిప్రాయాల్ని – నిర్భయంగా, నిర్మొహమాటంగా మీరిలాగే అభివ్యక్తీకరించాలని అభిలషిస్తూ…
ముందు కాలంలో కూడా మీ విలువైన అభిప్రాయాలను ఈ రీతిలోనే మాకందచేస్తారని ఆకాంక్షిస్తూ..
మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..మరి వుంటాను.
నమస్సులతో –
– ఆర్.దమయంతి.
మల్లెపూల మధూలిక గురించి సురేష్ గారి అభిప్రాయం:
03/26/2012 6:33 am
మిమ్మల్ని కాని మీ కవితని కాని ఉద్దేశించి అనటంలేదు కానీ అంటూ ఒకసారి మీ కవితని చదివినవెంటనే అభిప్రాయాన్ని రాయటం మొదలుపెట్టాను. కానీ మరలా పైనుంచి కొసదాక చదివాను భావాన్ని ఎలా ప్రవహింపచేసారా అని. మీ విధానం, పదాలు, అల్లిక బాగుంది. చదువుతున్నపుడు ప్రతి పాఠకుడు తనకర్ధమైనంతవరకు వాక్యంలో రచయిత పొందుపరిచిన భావానికి లోనవుతాడు. ఒక వాక్యం నుండి మరో వాక్యానికి, ఒక పాదం నుండి మరో పాదానికి దాటుతున్న గ్రాహకుడికి, ఒక ప్రయాణకుడు మజిలీలు మజిలీలుగా పల్లకిలో పయణించి గమ్యాన్ని చేరుకున్న అనుభవం కలగాలి. ఒక్కోకవితలో నవరసాల్ని పండించవచ్చు ఐతే భాషతో పాటు భావాన్ని చక్కగా పరచగలిగితే. మన తెలుగు అందుకు ప్రసిద్ధం.
ఓ పాఠకుడిగా నా అభిరుచిని వ్యక్తపరుస్తున్నానంతే. తప్పులుంటే క్షమించాలి.
సురేష్
About eemaata గురించి hari goodooru గారి అభిప్రాయం:
03/19/2012 6:04 pm
మీ పత్రిక చూసి చాలా సంతోషమయింది. కాని, నాకు సులభంగా దొరుకుందనుకున్న భక్త రామదాసు కీర్తన కనిపించక నిరుత్సాహ పడ్డాను. నా వెతకటంలో లోపమేమో అనుకుంటాను. నాకు కావల్సింది “అయ్యయ్యో రఘు రామయ్యా” అనే కీర్తన రచన,తెలుగులో. అన్నిటి కన్నా ముందు “రామదాసు” అని శోధిస్తే ఏమి దొరక్క చాలా బాధేసింది.
శోధన లో మార్పు కావాలనుకుంటాను.
నేను ఏ రకంగా నయినా సహాయపడ గలిగితే సంతోషం.
రమేశ్ హరి గూడూరు
మెల్బోర్న్,ఆస్ట్రేలియా
[మీ శోధనలో లోపమేమీ లేదు. ఈమాటలో కీర్తనల పూర్తి పాఠాలు సామాన్యంగా ఉండవు. మీకు కావలిసిన కీర్తన ఇక్కడ దొరుకుతుంది, lyric and audio కూడా. ..సం]
గంజి బువ్వ గురించి bathulaprasad గారి అభిప్రాయం:
03/16/2012 8:03 am
brother:
naa peru bathula prasad …nenu ganjibuvva katha rachayithanu. meru naa parmission lekundaa naa kathanu me sitelo pettadam entha varaku sababu…okka saari alochinchaqndi.
[మీ కథ ఎక్కడ ప్రచురించబడిందో ఆవివరాలన్నీ ముందు ఇచ్చిన తరువాత మాత్రమే, ఆ సాక్షి లింక్ ఎక్కువ కాలం పనిచేయదని తెలియడం వల్లనే, మీ కథను ఈమాటలో ఉంచాము. అది కూడా మీ కథ గురించి విస్తృతంగా మూడు లాంతర్లు వ్యాస రచయిత తన వ్యాసంలో చర్చించినందువల్లనే. ఇందులో సబబు కానిదేమీ లేదు. అయినా మీ అభ్యంతరం వల్ల మీ కథను ఈమాట నుంచి తీసివేశాము. మీకు కలిగిన ఈ అసౌకర్యానికి క్షమాపణలు. – సం.]
సీత గడియ గురించి తఃతః గారి అభిప్రాయం:
03/15/2012 9:07 am
‘సుమిత్ర కైక కూ సురటీలు వేసీ’ అని పాటలొ ఉన్నదని ఇంటర్నెట్లో ఉన్న ప్రతిలొ చూశాను. అయినా దశరథుని ముగ్గురు భార్యలూ పాటలొ ఉన్నారు. శ్రీ వెల్చేరు రాసిన వాక్యం పూర్తిగా ‘నిరర్ధకం’ కాదు అయినా వీటిని రామాయణ పాటలు అనడం సబబు కాదనే అనుకుంటాను. ఆ పాత్రలు ఉన్నంత మాత్రాన వాల్మీకానికి దూరంగా ఉన్నవాటిని అలా అనడం భావ్యం కాదనే నా అభిప్రాయం. వీటిని సీతారాముల పాటలనొ ఇతర పేర్లతోనో పిలవాలి.
నా interpretation పాటలొ ఉన్న [ఇతర] సౌందర్యాలను పక్కకు నెట్టినట్టు కాదు.
జనరంజని: మహానటి సావిత్రి గురించి Neeraja Somarouthu గారి అభిప్రాయం:
03/14/2012 7:35 am
అమేజింగ్. నా జీవితంలొ నేను సావిత్రి గారి వాయిస్ వింటానని అసలు ఊహించలేదు. ఏదొ సర్చ్ చేస్తుంటె ఈ rare ఆడియో విన్నాను. చాలా చాలా happyగా ఉంది. నా feelingsని మాటల్లొ చెప్పలేను. చాల థాంక్స్ అండి ఈ ఆడియో మాకు అందించినందుకు. పాత్ర ఏదైన దానికి జీవం పోయాలంటే సావిత్రి గారికే సాధ్యం అనడంలొ సందేహం లేదు. నేను సావిత్రి గారి సినిమాలు తక్కువే చూసాను. కాని ఆ మహానటి గురించి చాలా విన్నాను. ఆమె నటించిన మూగ మనసులు సినిమాలో పాటలా మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది, అన్న సాహిత్యంలా ఆమె మన మధ్య లేకపొయినా ఆ మహానటి మన మనసుల్లొ ఎప్పటికి నిలిచే ఉంటారు.
thanks a lot once again
Neeraja Somarouthu
ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/13/2012 12:01 pm
ఎంతో శ్రమతో, సాహితీ ప్రేమతో తెలుగు పత్రికనందిస్తున్న “ఈమాట” మిత్రులకు హార్థిక తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. వాళ్ళు శుభాకాంక్షలు చెప్పలేదని చదివి, మరి వాళ్ళకు కూడా ఎవ్వరు చెప్పలేదని చెప్పడం, ఆలస్యంగానైనా. వేరే వాటికి మరెవ్వరైనా మరెక్కడైనా మరెప్పుడైనా చెప్పుకోవచ్చు, కాని ఉగాది శుభాకాంక్షలను తెలుగులో తెలుగువాళ్ళు చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు ఇంకెవరికి చెప్తారు?!
విధేయుడు
_శ్రీనివాస్
ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి మోహన గారి అభిప్రాయం:
03/13/2012 11:37 am
ఉగాది ఏ మతస్థుల పండగ అవుతుందా అనే సందేహం ఇంకా మిగిలే ఉంది.
ఈ నా అభిప్రాయము పై వాక్యము పైన మాత్రమే. మౌలికముగా పరిశీలిస్తే ఉగాది ఒక మత సంబంధమైన పండుగే. ఇది తెలుగువాళ్లకు మాత్రమే పండుగ కాదు, కర్ణాటక (యుగాది), మహారాష్ట్ర (గుఢి పాడ్వా) గోవా రాష్ట్రాలలో కూడ ఇది పండుగే. ఇది హిందువులలో శాలివాహనశకమును అనుసరించే వారికి చాంద్రమాన సంవత్సరాది. ఉత్తరదేశములో విక్రమశకమును అవలంబిస్తారు, వారి సంవత్సరాది పౌర్ణమి తరువాతి దినము. కాని సాంస్కృతికపరముగా హిందువులు మాత్రమే కాదు మిగిలినవారు కూడ శుభాకాంక్షలను అందించవచ్చును, అంత మాత్రాన వాళ్లు వారి ఆలయాలలో పండుగను జరుపుకొంటారా అనే విషయము సందేహమే. ప్రథమముగా యిది హిందువుల పండుగ, కాని తెలుగు మాట్లాడేవాళ్లలో ఎక్కువ మంది హిందువులు కాబట్టి ఇది తెలుగువాళ్ల పండుగ అయినది. అలాగే యిది నాలా కన్నడము మాట్లాడే హిందువులకు, మరాఠీ మాట్లాడే హిందువులకు పండుగ అయినది. యూదులు వాళ్ల సంవత్సరాదిని సెప్టెంబరు నెలలో చేసికొంటారు, సుమారు ఆరు నెలల తరువాత. ఈ విషయాలను కొన్నిటిని కళావసంతము వ్యాసములో చర్చించాను.
విధేయుడు – మోహన
కొక్కొండ: అనుబంధం-1 గురించి మోహన గారి అభిప్రాయం:
03/05/2012 1:04 pm
తాడేపల్లి గారు, వ్యాసము చదివినందులకు సంతోషము. సామాన్యముగా వృత్తాలు చతుష్పాదులు. కొన్ని చోటులలో కవులు నాలుగు పాదాలు చాలక ఐదో పాదము ఒకటి జతచేసి పంచపాది అని వ్రాస్తారు. రెండు పాదాలతో వ్రాస్తే తప్పేమీ లేదనే నా ఉద్దేశము. ఎందుకంటారా? మీరు సులక్షణసారము, లక్షణశిరోమణి లాటి లక్షణ గ్రంథాలను పరిశీలిస్తే వాటిలో వృత్త లక్షణాలు రెండు పాదాలకే పరిమితము. అంతే కాక యక్షగానాలలో అర్ధకందము సర్వసామాన్యము. మూడో విషయాన్నిగురించి ఇంకా లోతుగా పరిశీలిస్తే తప్ప చెప్పలేను. పద్యాలను, జాత్యుపజాతులను మాత్రాగణాలుగా విరిచి వ్రాస్తే అవి చదవడానికి, పాడడానికి, వినడానికి బాగుంటుంది. కాని తెలుగు కవులు చాలమంది దీనిని ఆచరించలేదు. అందువల్లనే నేను వృత్తాలను ఎలా మాత్రాగణయుక్తములుగా వ్రాయవీలగునో అనే సంగతిని రెండవ పట్టికలో తెలిపినాను. నేను సుప్రభగారు ఛందస్సు, రచ్చబండ గుంపులలో వందలాది వృత్తాలను పరిచయము చేసియున్నాము. అందులో కొన్నైనా తప్పక మీకు, మీగురికి సరిపోతుందని నమ్ముతాను. విధేయుడు – మోహన
ఛందస్సు కొక కొండ కొక్కొండ గురించి మోహన గారి అభిప్రాయం:
03/03/2012 11:32 pm
1) కొక్కొండ వేంకటరత్నంపంతులుగారు సృష్టించిన రెండు పద్యములను ఇతరుల గ్రంథములలోని ఉదాహరణలుగా కవితాసాగరములో ఇవ్వబడినవి –
కల్యాణ –
పాపశిక్షకా నత భక్తరక్షకా పరాత్పరా వరాక్షరాకా పావశిక్షకా
ఆపదుద్వహా జగదాదిధూర్వహాహతారిగేహకోమలదేహా మహామహా
శ్రీపతీ సతీపతిసేవితోన్నతీ శ్రితార్తిభంజనేష్టమతీ శిష్టహృద్గతీ
దీపికోపమాధికతేజ ఉద్గమాస్థిరోద్యమాऽగమానుగమా తే నమోనమః
– శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి, శ్రీపాదభాగవతము
రత్నావళి –
అళుల లతాంత మధుర మధుపానము హాయిగఁ జేసి మదించె; లతా-
వళి నగవరయుతమై తనరారెను స్వాధీనపతికపగిది నహా
యిలాజాతములు కిసలయములతో నింపుగఁ గనుఁగొన నయ్యెను; గో-
కిలములు శ్రుతిహితముగఁ బాడఁ దొడంగెను జూతకిసలములఁ దినుచున్
– శ్రీవిక్రమదేవవర్మ, మానవతీ చరిత్రము
2) తెలుగు లాక్షణికులకు, కవులకు నచ్చనివి రెండు – చంద్రగణములతో పద్యములను వ్రాయుట, లఘువు పైన యతి నుంచుట. నేను ఎన్నో పుస్తకాలను వెదుకగా నాకు దొరకినవి వ్రేళ్లపైన లెక్క పెట్టగలిగిన అక్కరలు మాత్రమే. అందులో ఒక రెండు క్రింద ఇస్తున్నాను. మధ్యాక్కర తప్ప మిగిలిన అక్కరల ఉపయోగము శాసనయుగముతో అంతరించింది. నవీన యుగములో విశ్వనాథ సత్యనారాయణ అక్కరలను తమ కల్పవృక్షములో వాడారు. చంద్రగణములతోడి తెలుగు షట్పదలను కూడ కవులు వాడలేదు.
మధురాక్కర – సూ-ఇం-ఇం-ఇం-చం, యతి (1.1, 4.1)
తనర జనకుండు, నన్నప్రదాతయును, భయత్రాత
యును, ననగ నింతులకు మువ్వు రొగిన గురువులు, వీర
లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
ననఁగ బురుషున కియ్యేవు రనయంబును గురువులు
– నన్నయ, ఆదిపర్వము, 4.49
కలదు దేవగుహ్యం బని కమలబాంధవుఁడు గర్ణుఁ
బలికె నని చెప్పి తది యెద్ది, బలియుఁ దా సూరజుండు
లలితకవచంబు మణికుండలములు నెమ్మెయిఁ బడసి
వెలసె, నవ్విధ మింపుగ వివరింపవలయు నాకు
– ఎఱ్ఱన, అరణ్యపర్వము, 7.309
అల్పాక్కర – ఇం-ఇం-చం యతి (1.1, 3.1)
మీరిందు శంబరు మెచ్చిచూడ
నారూఢి నేనొక్క హయము నెక్క
చూరించి పోవన దుర్గభూమి
భారంబుగా జొచ్చె నాజి వేగ
– మడికి సింగన, వాసిష్ఠ రామాయణము
3) రావూరి దొరసామి శర్మ ఒక గొప్ప లాక్షణికుడు. వీరు ఎన్నో లక్షణగ్రంథాలను (ఉదా. సులక్షణసారము, కవితసాగరము) పరిష్కరించారు. ఛందస్సుపై వీరు వ్రాసిన “తెలుగు భాషలో ఛందోరీతులు” అన్న పుస్తకానికి గిడుగు సీతాపతి పుస్తకముతోబాటు ప్రథమ బహుమతి లభించినది. వీరి పలుకులను క్రింద వీరి వాక్యాలలోనే తెలుపుతున్నాను –
“సీసమేల సువర్ణసిద్ధి గలుగ నన్నారు కొక్కొండవారు. పరుసవేది సోఁకినఁ జౌకలోహము బంగారమగును. సీసమును బంగారముగా మార్చు స్పర్శవేధి చంద్రగణము. కాని సీసపు నడకలోని గాంభీర్యము బంగారు పద్యమునఁ గుంటువడినది. పద్యము పేరు బంగారే కని యందు సువర్ణత్వము ప్రకాశింపలేదని నా యభిప్రాయము. ఈ వెండి బంగారములకు (పద్యములకు) ధారాశుద్ధి శూన్యము.”
4) సూర్యగణము, చంద్రగణము విడివిడిగా నుండక ఒక పదము ద్వార చేరితే ఇలాగుంటుంది –
సుమపదైక భేద మమరు నంతనె వస్తువు మఱివేఱె
– బిల్వేశ్వరీయము – 6 తృతీయభాగము, కల్యాణరసజ్ఞ పర్వము, 83
ఇది ఒక తేఁటిబోటి (ఆటవెలది బేసి పాదముతో చంద్రగణము) పాదము. దీనికి గణవిభజన ఇలాగుంటుంది –
సుమప (సూ) దైక (సూ) భేద (సూ)
మమరు నం (ఇం) తనె వస్తు (ఇం) వు మఱివేఱె (చం)
వస్తువులోని మొదటి రెండక్షరాలు సూర్యగణములో తరువాతి వు చంద్రగణాదిలో ఉన్నవి యిక్కడ.
నా ఉద్దేశములో దేశి ఛందస్సులో ఇలా గణాలను ఇలా వాడితే సొగసు చెడుతుంది.
విధేయుడు – మోహన
శివోహం! శివోహం! గురించి Sambasiva Rao గారి అభిప్రాయం:
03/02/2012 1:05 pm
శ్రీనివాస్ గారు, ఈ శివోహం చాలా బాగుంది. దీనిని వినటము చాలా ఆనందము గా ఉంది. సాహిత్యం లొ నాకు అంత ప్రావీణ్యము లేదు కాని భక్తి పాటలు వింటాను. ఈ నిర్వాణ శతకాన్ని ఆందించినందుకు గాను మీకు కృతజ్ఞతలు.
సాంబశివ
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి మోహన గారి అభిప్రాయం:
03/02/2012 12:40 pm
ఈ వడుగు గురించి ఒక మాట. ఏది తెర్కు (దక్షిణము) ఏది వడక్కు (ఉత్తరము) అనేది సాపేక్షమైనది. ఇప్పటి కోయముత్తూరుకు (అప్పటి చేర రాజ్యము) కన్నడము మాట్లాడే మైసూరు ప్రాంతము ఉత్తరము, కాని ఇప్పటి చెన్నైకి అది దక్షిణపశ్చిమము. చెన్నై మదురైకి ఉత్తరము, కాని చెన్నైని ఉత్తరదేశము అని చెప్పలేము కదా? తిరుపతి ఉత్తరమే తమిళ ప్రాంతానికి, అందుకే వేంకటేశ్వరస్వామిని వడమలయాన్ అంటారు. కాబట్టి చేర ప్రాంతానికి మైసూరు వడుగు, చెన్నై ప్రాంతానికి తిరుపతి, నెల్లూరు వడుగు! ఈ వడుగు అనేది సంస్కృతానికి కూడ ఉపయోగిస్తారు. అందుకే వడగలై, తెన్గలై శాఖలు వచ్చాయి. మరాఠీ ప్రాకృతము కూడ వడుగే. కన్ఫ్యూస్డ్? విధేయుడు – మోహన
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/02/2012 4:22 am
తమిళం కూడా మాట్లాడగలిగిన తెలుగు పడుచులు అని మాత్రం ఎందుకని అనుకోకూడదూ కొలిచాలా? వారు కన్నడ స్త్రీలు అన్న ఊహకి అక్కడ ఆధారం ఏమి?? జయకొండర్ మూలభావం గానీ పుట్టపర్తి అనువాదం గానీ అందుకు ఆస్కారం ఇవ్వడం లేదే? సురేశ్ నమ్మకం లాంటిది నారాయణాచార్యుల వారికి సైతం ఎందుకని ఉండకూడదూ? “వడుగరు” అంటె తమకి “ఉత్తరాన ఉన్నవారు” అన్న అర్ధమ్లో తెలుగు వారిని గురించి తమిళులు భావించిన వారు. కరునాడు అంటే నల్లటి భూభాగం అని అనుకున్నా నల్లమలలు ఉన్న ప్రాంతం ఆంధ్రదేశమే కదా? నల్ల కొండలు అన్న అర్ధానికి వీలులేదా? అదటుంచి.. నారాయణాచార్యుల వారు విద్వత్తూ, అనుభవమూ కూడా మెండుగా ఉన్నవారు. పైగా భాషలో అఖండులూనూ! ఆయన అంత నిరాధారంగా మాట్లాడి ఉండరు. సంగీతంలో కర్ణాటకానికి ప్రాంతీయత కన్నా సంగీత పరంగా “శ్రావ్యత” కే పెద్ద పీట వెయ్యవలసి ఉంటుంది. పైగా దానిని గురించి ఎక్కడా అది “ప్రాంత సంబంధిగా” వాడిన ఉదాహరణ మనం ప్రాచీన సంగీత గ్రంధాల నించి ఒక్కటీ చూపించకుండా కేవలం భాషా పరిధిలోనే గిరిగిళ్ళు తిరుగుతూ వ్యాఖ్యానం చేసుకోవడం లో సంపూర్ణత గానీ, బలం గానీ లేదు. ఇన్ని వందల ఏళ్ళలో జరిగిన సంగీత పరిణామ దశలలో దీనిని గురించి ఒక్క ప్రస్తావనా లేకుండానే ఈ పదం సంగీత పరంగా ప్రాచుర్యానికి రాగల వీలులేదు. అందువలన మరిన్ని స్పస్టమైన ఆకరాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా భావనలు చేయడానికి ఇక్కడ శాస్త్రం ఒప్పదు. అది తేలేదాకా బాలమురళీ చెప్పినట్టూ సంగీతపరంగా శ్రావ్యమైన గానంగానే గ్రహించడం, కర్ణాటకం అనే అనడం ఇక్కడ సముచితం. మనకి సంగీత శాస్త్ర పరిణామం చెప్పే శాస్త్ర గ్రంధాల లిస్టు చాలానే ఉంది. అవన్నీ ఎంత దొరుకుతున్నాయివాళ అన్నది సంగీత రంగం లోని వారెవరన్నా చెప్పాలి. ఆ పుస్తకాలు ఏమైనా దీని గురించి చెప్పేయా? అన్నది కూడా తెలుసుకోవలసి ఉంది. కాకపోతే మన దగ్గర గాన విద్య తెలిసిన వారే తప్ప సంగీత శాస్త్రాన్ని గురించి విపులంగా విశదీకరించి చెప్పగల వారెవ్వరూ కనిపించడం లేదు. కనీసం పుస్తకాలని రాసిన వారు ఎక్కువలేరు. ఒకవేళ వీటిని గురించి రాసిన పుస్తకాలంటూ ఏమన్నా ఉన్నా అవి బహుశా చర్చింపబడక పోయి ఉండవచ్చు. వాటిని గురించిన చింత తమకు సంగీతం తెలుసని చెప్పుకునే వారికి ఉన్నట్టు కనిపించదు కూడా! ఇది చాలా విచారించవలసిన విషయమే! చాలా పెద్ద లోటు ఇది. కాకపోతే తెలిసినంత వరకైనా “సప్రమాణంగా” ముఖ్యంగా సంగీత రంగంలో ఇందుకు చాలిన వారెవరైనా మాట్లాడటమే ఎక్కువ బాగుంటుంది.
రమ.
ఎమితిని సెపితివె? గురించి కనకన ప్రసాదు గారి అభిప్రాయం:
03/01/2012 11:25 pm
బితిరీలకి జలుబు చేసి పదమూడేళ్ళు
పేరడీల్ని గురించి పేరడీలాంటి మాటల్లో తప్ప ఇంకోరకంగా మాట్లాడ్డం యమా యాతన. బహుశా అసాధ్యం. నాకు తెలిసిన పుస్తకాలన్నీ అవతలిసిరీసి ఉంచుకున్న రెండు పుస్తకాల్నే (An Anthology of Modern Telugu Poetry; బేంక్ ఆఫ్ అమిరికా పాస్‌బుక్) ఇలాగా అలాగా ఎన్నిసుట్లు ఎంత తిరగేసినా మిగిలింది ఇలాట ఇగటాలే. వీటిని మా సైడు – అంటే అంపఖండి, పురుషోత్తపురం అటీపు – బితిరీలు అంటారు. నీకు ఇగటాలాడ్డం తెలియకపోతే, ఇగటాలు తెలీదు. మనిషి నడకబట్టి ‘వీరు పూజ్యులు. పెద్దవారి బితిరీలంటే ఇలాగే గావాల!’ అనీసి నువ్వు పట్టీసుకోలేకపోతే నువ్వు ఇంక బితిరీలు పట్టుకోలేవు. అంటే, పెద్దవారి ఎచ్చులంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి అలాట పెద్దలే స్వయంగా చిలకట్లెగ్గట్టుకోనొచ్చి చెప్పకపోయినా తెలుసు. బితిరీలు పోల్చుకోలేని వారికి మరి ఎందరు పెద్దలొచ్చి ఉవాచ చేసినా మరింక తెలీదు. వారు పెద్దలు ఏ ముక్క చెప్పినా ‘మరే! మనందరి తరుఫునా మాష్టారు అధ్యయనీకరించేసారుగా! చారిత్రక సత్యాల్ని విస్మరిస్తే ఎట్లా?!…!!’ అని భక్తితో పల్లకుంతారు.
అయితే మరి ఇది ఎందుకు రాస్తున్నాను? నా కడుపుబ్బరం ఉగ్గబట్టుకోలేక. నాకు వేలూరి రాసిన పేరడీలు చదవగానే ‘మీకు అట్టాగనిపించిందీ? నాకూ అట్టాగే అనిపించింది!’ అనిపించింది. కాని ‘ఆఁ … ఎవరెట్టాపోతే నాకేం!’ అనిపించలా. ఎందుకట్టా అనిపించలేదు చెప్మా? అని నవ్వి నవ్వి లుమ్మచుట్టుకుపోయి నా నాభి లోపల్లోపలకి నేనే అస్తమానం చూసుకోలేక అవస్తలు పడుతుంటే బితిరీలు కితకితలుగా మారి ఎక్కిళ్ళలోకి దిగి ఇవి ఇలాటలాట బితిరీలు కావు, ఇగటాలకే మొగలాయీలు ఈ చెతుర్లనీసి పరమ నిదానంగా బోధపట్టం మొదలెట్టీసింది అనీసి నేనెరుగుదును. వేలూరి ఈ ప్రత్యేకత ఎలా సాధించుకున్నాడో నాకు తెలీదు. బహుశ వారి పెద్ద మేష్టారు నేర్పిన విద్యయే అయ్యుంటాది. కాని వారినుండి ఇలాట కులాసాలు చూట్టాలు, కవితా దేవర దేవతా వస్త్రాల్ని పోల్చుకోడాలు మాత్రం మాసైడు మరి ఇదే మొదటిసారి…!
నాలో ఉన్నాయని నాకే తెలియని ఫన్నీ బోన్స్ అన్నింటిలోకీ ఈ వేళాకోళాలు వేళాపాళా లేకండా ప్రవేశించీసి మాయావిడ ‘ఆపుబే నీ యబ్బా..! వాకింగ్కెల్దామా?!’ అని తిట్టడాలవరకూ వచ్చింది. నా కడుపులో ఇన్నిగటాలున్నాయనీసి నాకు ఇంతకుముందు తెలీదు. నిజంగానే భాషకి జబ్బు చేసి నలభయ్యేళ్ళు అయ్యిందనే నీను కూడా అనుకుని ఊరుకున్నాను. అంతేకాదు; ఆ మరుసట్నాడు వ్యాకరణానికి జలుబు చేసి పదమూడేళ్ళు అనీసి మాయావిడితోటి అన్నాను. అది “అక్ఖల్లేని బితిరీలన్నీ నీకెందుకురా? నోర్మూసుకుని చేతులు గట్టిగా ఊపుతూ, ఒక కన్ను సగం తెరిచి, ఒక కన్ను సగం మూసుకుని, మిగిల్నవన్నీ పూర్తిగా మూసుకుని, నిదానంగా వాకింగ్ చెయ్యి…!” అని వాకింగ్ ఎట్లా చెయ్యాలో ఉవాచల్లోకి దిగిపోయింది. ఆ బితిరీలు నేను ఒద్దంటున్నా వినకుండా ఎవరు పిలిచారని అడగడానికి వీల్లేకుండా నాలోపలికొచ్చీసేయి. ఎంతలా అంటే నా ఊహల్ని నిబ్బరంగా నిలబెట్టే వచనాన్నుండి తప్పించీసుకుని, జాగింగ్ ట్రెయిల్ చుట్టూ అడ్డంగా ఒకసారీ నిలువుగా ఒక సారీ ‘నడువూ నడువూ తిమ్మప్పా! నవ్వాకోయీ తిమ్మప్పా!! పెద్దావారు తిమ్మప్పా! పెదవికి చేటు తిమ్మప్పా!! ‘ అని మాష్టారు చెప్పినట్టు తలూపి బుద్ధిగా నడిచే కవితా బాల వలె!
మనస్సు, మెదడు, భాష, వ్యాకరణం బితిరీలకి బానిసలైపోతాయి. ఆ బితిరీల్ని వొదుల్చుకుని ఏ కొత్త గడుసు లోకాల్లోకీ మాటకారితనంగా పెత్తనం చెయ్యకుండా ఊరుకోడానికి ఒక పట్టాన మనం ఒప్పుకోం. ఒకవేళ మనం ఒప్పుకున్నా, మనలోని పెద్దవారికి ‘మనసు మాట వినదు.’ వేలూరిని వేలూరి అనీసే నేను ఎరుగుదును. కాని ఇలాగ వెవ్వెవ్వేలూరిగా తెలీదు.
ఈ పేరడీని పెద్దవారి ఎచ్చుల్నీ, వారి బితిరీలకి మనం నమస్కారం చెయ్యడాల్నీ, ఇంకా వారి ఉవాచల వెనుక సంకల్పాల వికల్పాలన్నింట్నీ తెలుసుకోకుండా గనక మీరు చూసారా, మీకు ఈ ఇగటం అర్ధం కాదు. పెద్దల్ని వొదిలెయ్యండి. పెద్దవారి ఎచ్చుల వల్ల వచ్చే ఇగటాల్ని ఎవరూ చూడకుండా దొంగచాటుగా ఎంజామెంట్ మాత్రం చేసుకోండి. పెద్దవారి ఎచ్చులు భాషంత అనాది అని, వారి ఆలోచనలకి కూడా ఎప్పుడే నా జలుబు చేస్తుంటుందనీ వారి ఉవాచలే మీలో కొన్ని ఇగటాల్ని పొగబెడతాయి. అప్పుడు వెవ్వెవ్వేలూరి ఇగటానికీ స్నేహానికీ పోషకుడూ విదూషకుడూ అయిన మనిషి కనిపిస్తాడు. ‘అబ్బ ఇదుగో ప్లీజ్! ఒద్దువై, వెవ్వె.. వెళిపోవై!’ అని చెప్పినా వినకుండా. ఆయన ఇగటాలకి అర్ధం పర్ధం ఏమైనా ఉన్నాయో లేవో మీ అంతట మీరు ఆలోచించుకోకుండా ఎవరైనా పెద్ద మేషార్ని కనుక్కోవాలని మళ్ళీ బూకరించుకుంటారు మీరు. భాషకి ఎన్నేళ్ళాయి జబ్బు చేసిందో, నెలకో దినం తక్కువ చేసి ఛందస్సుకి మేహవాతం ఒస్తునాదో లేదో, వ్యాకరణానికి జలుబు చేస్తే ఎట్లా ఒదలగొట్టాలో ఒక సుహృద్భావపూరిత మేధో ఆవరణంలో మీరు మర్యాదగా చర్చించ గలుగుతారు. అట్లా చర్చించినవన్నీ ఎవరైనా సాహితీ మిత్రులతో బుక్కుగా వేయించుకోండి. ఆ పని చాలా నిదానంగా, లేని పద్యాన్ని ఉన్నట్టు రూపించినంత నిబ్బరంగానూ చెయ్యాలి. దానికి ‘మధ్య మాట’ ఎవరు రాయాలో ఈ సుట్టు మొదట వేలూరినే అడగండి. ఎందుకేనా మంచిది …!
స్నానాల గదిలో గురించి మోహన గారి అభిప్రాయం:
03/01/2012 8:59 pm
గదిలో కలిగిన భావాలను మదిలో పదిలపరచుకొని, మదిలో మెదలిన భావాలను గదిలో పదిలపరచుకొని చక్కగా కవితను అల్లారు. మీ ఊహాగానానికి జోహారులు. కాని ఆవిరితో నిండిపోయిన నీటిని తేనీరనుకోకండి, నాలుక నల్లబడుతుంది 🙂 విధేయుడు – మోహన
శివోహం! శివోహం! గురించి మోహన గారి అభిప్రాయం:
03/01/2012 10:35 am
శ్రీనివాస్ గారు, చాల బాగుంది. దీనిని వినడం ఇదే మొదటిసారి.
ఒక్కొక్క వృత్తము వ్రాయడములో ఒక్కొక్క కవి కడు నేర్పరి. భారవి వంశస్థవృత్తమునకు, రత్నాకరుడు వసంతతిలకానికి, భవభూతి శిఖరిణికి, కాలిదాసు మందాక్రాంతానికి, రాజశేఖరుడు శార్దూలవిక్రీడితానికి ప్రసిద్ధులని క్షేమేంద్రుడు సువృత్తతిలకములో చెబుతాడు. భుజంగప్రయాత వృత్తములో చేసిన రచనలకు మాత్రము ఆదిశంకరులు సుప్రసిద్ధులు. ఈ నిర్వాణాష్టకము కూడ భుజంగప్రయాతములో వ్రాయబడినదే. శంకరుల రచనలో వృత్తవైవిధ్యాన్ని ఇక్కడ చదువ వీలగును.
విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
02/26/2012 11:56 pm
“Ode to the Medieval Poets”
ఎక్కడో ఇస్మాయిల్ గారనుకుంటా, మన పాత కవిత్వమంతా ఆర్భాటమయం, మామూలు మనుషులు అసలు కనిపించరు అన్నారు . కాని, ఈ పద్యం విని, మీ విశ్లేషణ చదివితే, మన భాష మీద గర్వంతో ఉప్పొంగి పోకుండా ఉండలేము.
నాకీ మధ్యనే Garrison Keillor పుణ్యమా అని తెలుసుకున్న Auden పద్యం గుర్తుకొచ్చింది:
“Chaucer, Langland, Douglas, Dunbar, with all your
brother Anons, how on earth did you ever manage,
without anaesthetics or plumbing,
in daily peril from witches, warlocks,
lepers, The Holy Office, foreign mercenaries
burning as they came, to write so cheerfully,
with no grimaces of self-pathos?”
…
“I would gladly just now be
turning out verses to applaud a thundery
jovial June when the judas-tree is in blossom,
but am forbidden by the knowledge
that you would have wrought them so much better.”
“కవిత్వపు తామరాకు మీద నీటిబొట్టు లాగా నిల్చిన కవి,” అన్నారు మీరు. “తిక్కన ప్రతిభ” అన్న ప్రసంగంలో, కృష్ణశాస్త్రి, “ఇది కవి కెంత కష్టమైన పనో తెలుసునా? తన్ను తాను పూర్తిగా లేకుండా తుడిచేసుకోవడమన్న మాట. లోకంలో వాడై కూడా దానిలో లేనట్లు తటస్థుడుగా, ఒడ్డున సాక్షిగా కూర్చోవడన్న మాట!” [1]. ఆ ప్రసంగాలు పుస్తకరూపంలో వచ్చినట్లే, మీ ఈ వ్యాఖ్యానాలు కూడా ఓ పుస్తకంగా వస్తే మరింక ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి మన పాతకవుల గొప్పదనం చాటినట్లవుతుంది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] కృష్ణశాస్త్రి వ్యాసావళి-1, కవి పరంపర. రాజహంస ప్రచురణలు, 1982.
ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి మోహన గారి అభిప్రాయం:
02/26/2012 7:03 pm
1) కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
ఈ పద్యము అందరికీ తెలిసినదే. ఇందులోని చివరి పాదము తీసికొందామా? తెలుగు వృత్తాలలో యతి తప్పక ఉండాలి. యతి స్థానములో ఉండే అక్షరాలు ర్ణా, క. ర-కారానికి లేక ణ-కారానికి క-కారముతో గాని అ-కారముతో గాని యతి చెల్లదు. కాని కమ్మ లోని క-కారము సంధి ద్వార వచ్చినది. కీచకులకు + అమ్మ = కీచకులకమ్మ. అంటే కమ్మలోని అ-కారానికి కర్ణాటలోని (కర్ణ + అట) అ-కారానికి యతి చెల్లుతుంది. అంటే కొన్ని శతాబ్దాలముందు తెలుగువాళ్లు ఇప్పటి కర్నాటక పదాన్ని కరు-నాడు అర్థములో కాక కర్ణాటక అనే వాడేవాళ్లు. ఈ కర్నాటక పదము కర్నాటక రాష్ట్రములో ఇటీవల చేసిన ఒక శాసనము అని చదివాను.
2) నా ఉద్దేశములో కర్ణాటకసంగీతములో మొదటి త్రయము అని చెప్పాలంటే అందులో అన్నమాచార్యులు, శ్రీపాదరాయలు, వ్యాసరాయలు వీరి ముగ్గురి పేరులు ఉంటాయి. కర్ణాటక రాష్ట్రములోని వారు కాబట్టి శ్రీపాదరాయలు మున్నగు కన్నడిగులను గురించి ప్రస్తావించాను. నాకూ అన్నమాచార్యులంటే ఎంతో యిష్టమే. నేను ఆద్యులు అంటే మొదటి తరము వాళ్లు అనే అర్థములో వ్రాసినాను. ఇది అన్నమాచార్యుల అసమాన సంగీత సంపత్తిని కించపరచడానికి మాత్రము కాదు. సంగీతము సాహిత్యము ఈ కళల అభివృద్ధికి ఎందరో పాటు పడ్డారు. కొందరిని గురించి మనకు బాగుగా తెలుసు, మరి కొందరిని గురించి అంతగా తెలియదు. ఈ విషయాలను తెలిసికోవాలన్నదే తహతహ. ఆ కారణమువల్లనే నాకు తెలిసినది (చాలవరకు ఒప్పులు, అక్కడా యిక్కడా తప్పులు) అందరితో పంచుకోవాలనుకొంటాను నేను. ఆ కారణమువల్లనే తెలుగువారికి నాగరత్నమ్మను గురించి, శ్రీపాదరాయలను గురించి నాకు తెలిసినది పంచుకొన్నాను.
విధేయుడు – మోహన
ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి మోహన గారి అభిప్రాయం:
02/24/2012 11:06 am
దీనినే కన్నడములో నొణ కాట (ఈగ బాధ) అంటారు. నొణ పదములో నకారము, ణకారము రెండూ ఉన్నాయి కదా! కర్ణాటకాన్ని ణకారముతోనే పలకాలి కాని హిందీ ప్రభావమువల్ల నకారముగా కూడ పలుకుతారు. ణకారము ఒత్తుతో ఉండే పదాలైన వర్ణము, స్వర్ణము, కర్ణము, చూర్ణము మొదలగు పదాల ఉచ్చరణలో కూడ ఈ దోషము సర్వసాధారణమే. కర్ణాటక సంగీతములో ఉండే కర్ణాటకము వేరు, ఇప్పటి కర్ణాటక రాష్ట్రము వేరు. కొన్ని శతాబ్దాలముందు ఇప్పటి రాయలసీమ, నెల్లూరు, ఆర్కాడు, చెంగల్పట్టు ప్రాంతాలన్నీ కర్ణాటకమనే వ్యవహరించబడేది. కర్ణాటక యుద్ధాలు జరిగింది కర్ణాటక రాష్ట్రములో కాదు, తమిళనాడు ప్రాంతాలలో. కర్ణాటక సంగీతానికి ఆద్యులైన శ్రీపాదరాయలు, వ్యాసరాయలు, పురందరదాసు, కనకదాసు, మున్నగువారు అందరూ ఇప్పటి కర్ణాటక రాష్ట్రానికి చెందినవాళ్లే. నా ఉద్దేశములో కర్ణాటకమే సరి. హిందుస్తానీ విషయములో హిందూస్థానీ, హిందుస్తాని రెండు సరియే, కాని సామాన్యముగా హిందుస్తాని అనే అంటారు. ఇది పారసీక భాషా ప్రభావమే, ఉదా. పాకీస్తాన్, హిందుస్తాన్, రేగిస్తాన్, ఇత్యాదులు. విధేయుడు – మోహన
మూడు వందల రామాయణాలు గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:
02/24/2012 2:19 am
ఫణీంద్ర గారూ,
“అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహాలను ఇస్లాం అంగీకరిస్తుంది”???
నాకు తెలిసి ఇస్లాం ఫస్ట్ కజిన్స్ (పెదనాన్నా, చిన్నాన్నా) పిల్లల మధ్య వివాహాలను అంగీకరిస్తుంది.
సురేశ్ గారూ,
వెస్సాంతర జాతకాన్నీ (VJ), అయోధ్య కాండ (AK) నూ, దశరథ జాతకాన్నీ (DJ) తులనాత్మకంగా పరిశీలించిన ఓ వ్యాసాన్ని చదివాను. రచయిత పేరు రిచర్డ్ గోంబ్రిక్ (Richard Gombrich, నా ఉచ్చారణ తప్పు కావచ్చును). ఇదీ లింకు. అయోధ్య కాండకూ, వెస్సాంతర జాతకానికీ మధ్య కథావస్తువులలో, కథనంలో, ఎంచుకున్న వర్ణనలలో చాలా పోలికలను చూపిస్తారా రచయిత.
దశరథ జాతకం అయోధ్య కాండనూ, వెస్సాంతర జాతకాన్నీ కలగలిపి రాసిన పేలవమైన కథ అని అభిప్రాయపడతారు. (రెండు జాతక కథల అజెండా – “హిందూ” సమాజాన్నీ/ఆదర్శాలనూ విమర్శించడమే అంటారు.)
Gombrich does not think much of DJ’s suggestion of the consanguineous relationship of Rama and Seeta. Unlike Arudra who read a hint of evolving social mores in it and unlike Jacobi who thought that this was consistent with the Sakya/Koliya traditions, Gombrich thinks that this could be just a minor (?) aberration resulting from the author’s attempt at replay of VJ’s sequence of events by AK’s characters.
As far as the timelines are concerned, Gombrich thinks that VJ’s verses might not have been later than 3rd century BC (earlier than any of the written Ramayanas) and its prose might date back to 5th century AD). He thinks that DJ could have been written in 5th century AD.
కిరానా సంప్రదాయపు భీమబలుడు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
02/20/2012 12:10 am
సంధ్యారాగ అనే కన్నడం సినిమాలో రాజ్‌కుమార్‌కు భీమ్సేన్ జోషీ పాడిన పాటలు ఇక్కడ వినవచ్చు. పురందరదాసు కీర్తన ఈ పరియ అనేది హంసానంది రాగం. రెండోది దేసీకాని ఆభేరికాని కావచ్చు. మూడోది కల్యాణి.
మధ్యలో బాలమురళి పాడినది కూడా ఉంది. సందర్భం ఏమిటో మోహనగారు వివరిస్తే బావుంటుంది.
మూడు వందల రామాయణాలు గురించి Phaneendra గారి అభిప్రాయం:
02/19/2012 8:16 am
సురేష్ గారూ…
మూల వ్యాసం చదవలేదు కానీ… స్వచ్చందంగా అనువదించిన మీరు ఆ రచయిత భావాలను ఆమోదిస్తున్నారని భావించి… నా సందేహాలు మిమ్మల్నే అడుగుతున్నాను. ఆలస్యంగా చదివి మరింత ఆలస్యంగా సందేహాలు అడుగుతున్నందుకు క్షమించగలరు.
ఒకటికి రెండు సార్లు చదవడానికి ప్రింట్ తీసుకుంటే మీ రచన 20 పుటలు వచ్చింది. దానిలో 3 పుటలు హనుమ పిట్ట కథ, 7 పుటలు వాల్మీకి ( మూలం అనకూడదు కదా మీ భావాన్ని బట్టి ), కంబ రామాయణాల్లో నుంచి ఒక ఘట్టపు వేర్వేరు చిత్రీకరణలు. మరో రెండు పుటలు వైదిక ధర్మాన్ని వ్యతిరేకించే జైనులు రాసుకున్న రామాయణాల ఉటంకింపులు, ఇంకో రెండు పుటలు కన్నడ జానపద కథ, తర్వాతి రెందు పుటల్లో థాయ్ రామాయణాల స్థూల పరిశీలన, చివరికి ఆయా రామాయణాల్లోని భేద సామ్యాలు.
అంతా బాగానే ఉంది. వాల్మీకి కథే మూల కథ కాదు అన్న విషయం ముందు ముందు గమనిస్తాం అని చెప్పారు కానీ… అనంతర వ్యాసంలో అలాంటి ప్రయత్నం ఎక్కడా కనబడలేదు.
వాల్మీకి రాసిన కథకూ, ఆయన తర్వాత రాసిన వారి కథలకూ మధ్య భేదాలున్నాయి అన్నారు. మూలం వాల్మీకి కాకపోతే ఆయనకు ముందు రాసిన కథనాలూ ఉండాలి కదా. ఇప్పటి వరకూ అలాంటివి ఎక్కడయినా దొరికాయా? వాటి రచయితలు ఎవరు? ఆయా రచనలకూ వాల్మీకానికీ ఉన్న భేదాలు ఏమిటి? అలాంటివి ఏమీ లేనపుడు వాల్మీకాన్ని మూల కథ కాదు అని అనడానికి ప్రాతిపదిక ఏమిటి?
నాకు తెలిసినంత వరకూ… దశరథ తనయుడు రాముడు జనక దుహిత సీతను పెండ్లాడడం, సవతి తల్లికి తండ్రి ఇచ్చిన వరం మేరకు అరణ్యాలకు వెళ్ళడం, అక్కడ సీతను రావణుడు అపహరించడం, వానర ( జాతి ) సాయంతో రాముడు యుద్ధం చేయడం, సీత అగ్నిప్రవేశం, రామ పట్టాభిషేకం…. మౌలికంగా ఇదీ రామాయణం, అంతేనా !
కంబన్, తులసీదాస్ తదితరులందరూ వాల్మీకి తరువాతి వారే అనడానికి మీకు ఏ అభ్యంతరమూ లేదని అర్ధమయింది. వారందరూ తమ తమ ప్రాంతీయ వాతావరణాలను బట్టి, స్థానిక ఆచార సంప్రదాయాలను బట్టి రామ కథలో మార్పు చేర్పులు చేశారు. మీరు ఉటంకించిన సందర్భాలు అలాంటివే కదా. అయితే మౌలికమయిన కథను వారు అతిక్రమించి వెళ్ళిన దాఖలాలు లేవే? భూమ్మీద ఉన్నంత కాలం మానవుడిగానే ప్రవర్తించినట్టు వాల్మీకి చిత్రించిన రాముడిని ఆయన గుణగణాలు ఆదర్శప్రాయమైనవిగా భావించి దైవాన్ని చేశాదు కంబన్ అని చెబుతున్నారు. తులసీ కూడా అలాగే చేశాడన్నారు. కానీ వారిద్దరూ వాల్మీకిని సైతం ( కవిగానయినా ) ఆరాధించిన వారే కదా. అంటే వారికి వాల్మీకమే మాతృక కాగలదు కదా. ఏమంటారు?
అన్నట్టు కంబ రామాయణానికి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారి తెలుగు అనువాద పద్యాలను ఉటంకించారు కదా. మీ సిద్ధాంతం ప్రకారం పూతలపట్టు వారి రచన స్వతంత్రం తప్ప కంబన్‌కి అనువాదం కాకూడదేమో!
జైన కథనాల విషయానికి వస్తే… వైదిక ధర్మాన్ని నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చిన జైనావలంబులు.. పరమ వైదికుడయిన వాల్మీకి కథను తమకు తగినట్టు మలచుకోడంలో విశేషం ఏముంది? అసలు వారు రామ కథను స్వీకరించడమే విశేషం. ఆ పని వారు చేయడానికి కారణం… అప్పటికే సమాజంలో విస్తృతాదరణ పొందిన గాధను వదులుకోలేకపోడమే అయి ఉండవచ్చని నా భావన. మీరేమంటారు?
ఇక జానపదుల పల్లీయుల మౌఖిక కథలు. అవీ సౌందర్యాలూ, రసపూరితాలూనూ. సీతమ్మకు అమిత ప్రాధాన్యతనివ్వడం అద్భుతం. కానీ అక్కడ కూడా వాల్మీకాన్ని అతిక్రమించిన ఘట్టం ఏదీ మీరు చూపలేదు. రవళుడి వృత్తాంతం ఆసక్తికరమే కానీ అది అసలు కథకు అనుబంధంగానే ఉంది తప్ప వ్యతిరిక్తంగా లేదు కదా.
థాయ్ రామాయణాల విషయంలోనూ అసలు కథకు చేర్చిన పిట్ట కథలనే చూపారు, దానికి చిన్న చిన్న మార్పులు చేసుకోడాన్నే ప్రస్తావించారు. అవి మూల కథకు భిన్నాలు ఎలా అవుతాయో చూపలేదు.
ఒక కథను ఒక రచయిత రాసిన తరువాత మరో రచయిత రాసేటప్పుడు కొత్త కల్పనలు చేస్తే… అది స్వతంత్ర రచన అయిపోతుందా? కథ ఎత్తుగడ దృశ్యాలు మారిస్తే రచన స్వతంత్రం అయిపోతుందా?
ఉత్తర రామాయణం వాల్మీకం కాదని సాధారణ భావన. పలు రామాయణాలు దాన్ని విస్తృతంగా రాసినా అవేవీ వాల్మీకాన్ని కాదనలేదు కదా. ఏదేమైనా పాత్రల ప్రవర్తన, కథా చిత్రణ గమనిస్తే ఉత్తర కథ వాల్మీకానికి భిన్నంగా ఉంటుందన్న మాట నిజమే.
వివిధ రామాయణాల పరిచయం చేసిన ఏ సందర్భంలోనూ మూలం వాల్మీకం కాదూ అని సహేతుకంగా నిరూపించలేకపోయిన మీరు… వడ్రంగి రంపం ఉదాహరణతో ముగించడం… రామాయణాన్ని అపహాస్యం చేయదలచుకోడమే. ఏ రెండు రామాయణాల్లోనూ ఒకే కథ లేదు అని చెప్పడానికి… ఆయా రచయితలు చేసిన చిన్న మార్పులను చూపిస్తే సరిపోతుందా? మూల కథను మార్చిన సందర్భాలు ఒక్కటయినా ప్రస్తావించకుండా… వాల్మీకం మూలం కాదనడం ఎంత వరకు సభ్యం?
ఇక అనువాదకుడికి చిన్న మనవి — బాస్ రిలీఫ్స్‌ని శిలా ఫలకాలు అని కూడా అనలేం. మరో కొత్త పదం వెతకండి. చూపించదలచుకున్న రూపాన్ని లోహ లేదా శిలా వృత్తంలో (బుడగలో గాలి ఊదినట్టు) ఊది నిర్మించే ఆకృతి… అని గుర్తు. పరిశీలించగలరు.
ఫణీంద్ర పురాణపండ
ఒక నేను, కొన్ని నువ్వులు గురించి Anusha గారి అభిప్రాయం:
02/15/2012 4:25 pm
శీర్షిక చాలా బాగుంది. కథ బాగుంది కాని వేరు వేరు సందర్భాలని వివరించారనిపించింది. కాని అంతా ఒకటే కథ అన్న భావం రాలేదు అని నా ఉద్దేశము.
కథ కథ గురించి harikiran గారి అభిప్రాయం:
02/14/2012 12:39 pm
మీరు చాల బాగా వ్రాశారు. కాని అంతా స్వగతం లా ఉంది.
వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
02/11/2012 10:37 pm
హిందుస్తానీ సంగీతంలో కృషి చేస్తున్న తెలుగువారు బాగా తక్కువేకాని కొందరి పేర్లు తెలుసుకోదగినవి.
రవిశంకర్ శిష్యుడు మిట్టా జనార్దన్ అనేక దశాబ్దాలుగా మద్రాసులోని వివిధభాషల సినీసంగీతంలో సితార్ వినిపించారు. వాటిలో మనసున మనసై, ఎవరివో నీవెవరివో, నీవురావు నిదురరాదు వగైరా పేరుపొందిన పాటలున్నాయి.
శాస్త్రీయగాత్రం వినిపిస్తున్న సుమిత్రా గుహా తెలుగుమహిళే. ఇంకా పేర్లు తెలియవలసినవి ఉంటాయి.
హిందుస్తానీ గాయకులుగా పేరుపొందినవారిలో ఎ. కానన్, ఎం.ఆర్. గౌతమ్, తమిళులు. వయొలిన్ వాయించే ఎన్.రాజమ్, సవ్యసాచిలాగా రెండుపద్ధతుల్లోనూ వయొలిన్ నైపుణ్యం కలిగిన ఎం.ఏస్. గోపాలకృష్ణన్ కూడా తమిళులే. ఇక కన్నడం సంగీతవేత్తలకు కొదవేలేదు.
నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి Satya గారి అభిప్రాయం:
02/09/2012 12:13 pm
చాల చక్కని విశ్లేషణ! అర్జునుడి వినయంతో కూడిన పరాక్రమం స్పష్టం అయిన సన్నివేశం. అయితే సినిమాలో పూర్తి గా చూపించబడనిది ఏమిటంటే, కర్ణుడు యుద్ధం నుండి అర్జునుడి ధాటికి భయపడి చేతకాని వాడికి మల్లే రారాజుని విడిచి పారిపోతాడు. స్నేహం కోసం ప్రాణం ఇస్తాను అన్న పెద్దమనిషి చివరకి చేసిన నిర్వాకం ఇదే. కర్ణుడి స్వభావం పరిశీలిస్తే, అతను చాల సందర్భాలలో నిజానిజాలని పరిశీలించకుండా రాజుని శత్రుత్వం వైపే ప్రేరేపిస్తాడు. కారణం అతనిలో ఉన్న మత్సరమే! కర్ణుని పరాక్రమం, శౌర్యం గుర్తెరిగే భీష్ముడు అతనిని మహా రధుడిగా నిర్ణయించడు. ఇదే విషయం కర్ణుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గర అంగీకరిస్తాడు కూడా. కాగా, ఖాండవ దహనంలో అర్జునుడికి ప్రాప్తం అయిన శత్రువుల ద్వారా కర్ణుడికి పరోక్షంగా కొంత బలం ఏర్పడింది. ఇదే కారణంగా అతనితో యుద్ధం కొంత కష్టతరం అయ్యింది.
కాల్వీనో కథల నుంచి – 1 గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:
02/05/2012 12:51 am
గుండె గోడల మీద వ్రేలాడే చిత్ర పటాలు ఈ చిన్ని కథలు!
****
అంతులేని శాఖోప శాఖలుగా భూమిన పరచుకున్న పేరు తెలీని ఓ మహా వృక్షం లాంటిది – ఈ సమాజము, ఈ జన సమూహమూ! విభిన్న మానవ మనుగడలను, జీవన వైవిధ్యాలను, విచిత్ర మనస్తత్వ విధానాలను గురించి తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ వుంటాం. ఐతే, ఈ అంశాలని రచయిత – ఏ దృక్కోణం నుంచి పరిశీలించి, పరిశోధించి, చెబుతున్నాడా.. అనేదే రచనలో ఆసక్తిని రేకెత్తించే అసలైన విషయం అవుతుంది. నిజమైన పాఠకుని ఉత్సకత, తపన కూడా ఇదే. సరిగ్గా ఇలాంటి సందర్భాలలోనే ఆ రచయిత సామాజిక శాస్త్రవేత్త గా మారిపోతాడు( మారాలి కూడా). ‘రచయిత కి సామాజిక బాధ్యత వుంటుంది.’ అనే ఒక నైతిక శాసనానికి బహుశా ఇదే పునాది అనుకుంటా!
ఈ కథలు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక గొంతు వినిపిస్తూ వుంటుంది. పూర్తిగా చదివాక అదొక మనిషిదని గుర్తిస్తాం.
మనం మనుషులం. సందేహాల చిచ్చులం. లేకపొతే – మనకింత జ్ఞాన, విజ్ఞాన శా స్త్ర భాండాగారాలు లభించి వుండేవి కావు. ఒక్కోసారి డౌటేస్తూ వుంటుంది. వాచీ సరిగ్గానే తిరుగుతోందా, లేదాని! అప్పుడప్పుడు ఓ గొప్ప చిక్కు ప్రశ్నెదురౌతూ వుంటుంది. అసలీ జీవితం నిజమా? అబద్ధమా? అని. నవ్వుతూ మాట్లాడుతున్న మన ఎదుటి వాడి మనసులో ఏముందో తెల్సుకోవాలనే కుతూహలం కలుగుతూ వుంటుంది. కానీ, ఎలా తెలుసుకోడం ఈ నిజాల్నీ? తెల్సుకోవాలనే జిజ్ఞాస, తెలియరాక నిరాశా కలుగుతూ వుంటాయి. ఐతే, మనిషికి ఈ తపనంతా ఎందుకంటే – ఒక నిజం తెలుసుకోడం కోసం. నిర్ధారించుకోడం కోసం. అంతే. అదెలాంటి విషయమైనా సరే మనకి సందిగ్ధాలుండకూడదు. సందేహాలకి శాస్త్రీయ పరమైన నిరూపణ వుండాలని కోరుకుంటాం.
మనిషి తన నీడని చూసి తాను మొదట భయపడి పోయాడుట. ఆ తర్వాత కొన్ని క్షణాలకి.. ఆలోచనలో పడిపోయాడట. ఏమనంటే – తనకు కనిపించని ఈ నల్ల మనిషి తన వెనక మాత్రమే వస్తున్నాడా లేక అందరి వెంటా వస్తాడా అని. ఆ తక్షణమే తన తోటి వాళ్ళని తన పక్కనే నిలబెట్టుకుని, అందరి నీడల్ని పరిశీలించి ‘నీడ సహజమైన గుణమనీ, అది మనిషినుంచి విడ దీయ లేనిది’ అనీ కనుగొని తేలిక పడ్డాడట.
బ్ర్హమల్ని తొలగించుకుని, వాస్తవాల్ని నిర్ధారించుకున్నాక, కలిగే స్థిమితం పేరే శాంతి! దీని వల్ల మనకేం తెలుస్తుందంటే – తను కలసి జీవిస్తున్న జాతి వారిలో ఏక గుణ లక్షణాలు, స్వభావాలూ (అవి సహజమైనవైనా సరె, అసహజమైనవైనా సరే ) వుండాలని – మనిషి వాంఛిస్తాడు. ఇప్పటికీ ఈ మనిషి వాంఛ తీరడం లేదు.
పట్ట పగలే – కాగడాలు పట్టుకు తిరుగుతున్న ఓ ప్రఖ్యాత తత్వవేత్తని ‘నీకిదేం పిచ్చయ్యా?’ అని అడిగితే చెప్పాడట. ‘ఎక్కడైనా మనిషి కనిపిస్తాడేమో వెతుకుతున్నానని. ఆయన మాటల్లో – ఎంత గొప్ప అర్థం ద్యోతకమౌతుందో కదూ!?
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మాధవ్ గారి కాల్వినో అనువాద కథలు చదువుతున్నప్పుడు – గుప్ఫున గుర్తొచ్చాయి నాకివన్నీ!
చిన్న చిన్న కథలెప్పుడూ పెద్ద పెద్ద సత్యాలే చెబుతాయి. ఇవీ అలాంటివే. మనకు అర్థమైనా, కాకున్నా – మన జీవితాలకున్న అర్థాలు కేవలం రెండు. రెండే రెండు. కథ కైనా అంతే. “The ultimate meaning to which all stories refer has two faces: 1. the continuity of life, 2. the inevitability of death.” అని అంటాడు ఈ రచయిత. ఎంత బాగా చెప్పాడూ!, అనిపించింది నాకు – చదవగానే!
నాకీ కథలు బాగా నచ్చడానికి మరో కారణం. ఇవి అనువాద కథల్లా లేకపోవడం! కథల్లొ పూర్తిగా తెలుగు వాతావరణం నెలకొని వుండటం వల్ల.. మంచి తెలుగు కథలు చదువుతున్నఅనుభూతి కలిగింది. ‘ఇవి అనువాదాలు’ అని చెపితే తప్ప తెలీనంత సహజంగా వున్నాయి. ముఖ్యంగా చదివింపచేసే చక్కని శైలి వల్ల ఆసక్తి కరంగా వున్నాయి. కథలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. మంచి కథలు – బాల్యం నాటి జ్ఞాపకాల్లా.. గుండె గోడల మీద ఫ్రేములు కట్టిన చిత్రాలై కూర్చుంటాయి. నిజానికి షార్ట్ స్టోరీస్ రాయడం కష్టం. చదవడం తేలిక. కాని, మర్చిపోవడం మాత్రం అంత సులభం కాదు.
మాధవ్ గారూ! మీరు పరిచయం చేయడం వల్ల నేనీ రచయిత గురించి మరింతగా చదివి తెలుసుకోగలిగాను. ఈ సందర్భంగా మీకూ, ఈ మాటవారికి నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను. మరిన్ని కాల్వినో రచనలతో బాటు, మరెందరో మంచి రచయితలని మాకు పరిచయం చేయగలరని ఆశిస్తూ…
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.
స్నేహితుడు, విమర్శకుడూ గురించి puttaparti anuuradha గారి అభిప్రాయం:
02/03/2012 2:16 am
అంత పాండిత్యం ఉండీ నేనీ లోకానికి అందివ్వ లేక పోతున్నానే..
వీరు నన్ను పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారే ..
అనే బాధ నిరాశ అయ్యలో ప్రగాఢంగా కనిపించేది..
రా.. రా ..
నీకు అరవిందుని ఊర్వశి చెప్తాను..
రా రా .. నీకు మిల్టన్ చెప్తాను ,.
అని తన చుట్టూ ఉన్న వారిని ప్రేమగా పిలిచే వారు..
రచయితలకు సూచనలు గురించి mallikarjuna గారి అభిప్రాయం:
01/19/2012 6:56 am
మీ ‘ఈమాట’ చాలా బాగున్నది. ఈ మార్గము తెలుగు బాషాభిమానులందరిని ఒక దగ్గర చెర్చెలా ఉన్నది. కాని ఇన్కా(iMkA) ఇక్కడ వ్రాయడము అలవాటు కావాలి. అక్కడక్కడ చిన్న తప్పులు వున్నవి, మన్నిMచగలరు.సున్న మరియు త(TA)ని ఎలా type చెయాలొ తెలియటM లెదు.
మల్లికార్జున కొంగాని.
[M వాడితే సున్నా వస్తుంది. త(ta) ట(Ta). తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
పొదుపు సమీకరణాలు గురించి రామ గారి అభిప్రాయం:
01/16/2012 2:53 pm
చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు. మీ బ్లాగు చదివాను కాని, మీరిలా కథలు కూడా ఆదరగొడతారు అని గ్రహించలేని వెర్రి నాగన్న నయ్యాను. ఇప్పుడు కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి :).
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/11/2012 3:44 pm
పాడండి. ఆకస్మిక ప్రసారం చెయ్యటం ఈ పత్రికకు సాధ్యమే అని తెలిసింది. కృష్ణారావ్! మీపాట ఎందుకు మమ్మల్ని విననీయరు. కవిత్వాలు వ్యాసాలు రాసుకుంటే, రాయటం వస్తుందేమో కాని సంగీతం రాదు. సంగీతం వింటే వస్తుంది. పాడితే వస్తుంది. అని రోహిణీ ప్రసాద్ చెప్పింది చాలా నిజమే.
మీరు పాడండి. నాకు వినాలని ఉంది.
కొత్త సంవత్సరం సందర్భంగా ఎక్కడో భారతంలో ఒక చలి ప్రాంతం నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆమె వైణికురాలు. ఏమి వాయిస్తున్నాదీ ఇప్పుడు అని నేను అడిగి తెలుసుకుంటుంటే, పినాక పాణి పుస్తకం నుంచి కొన్ని కీర్తనలు నేర్చుకుంటున్నా, నువ్వు రా, నేను వినిపిస్తానంది.
ఇప్పుడు ఫోన్లో వినిపించమన్నాను. అప్పుడు నాకు అర్థరాత్రి.
నీకు నిద్ర పోయే సమయం. ఇప్పుడు కాదు -అంది ఆమె.
లేదు నే వింటానన్నా.
ఆమెకు హఠాత్తుగా గుర్తు వచ్చింది. నా వీణకు ఒక తీగ తెగిపోయి ఉంది. మార్చాలి.-అంది
ఎంత సేపు పడుతుంది. తీగ మార్చటానికి? -నా ప్రశ్న
ఒక అరగంట ఇవ్వు. తీగ మార్చి కొంచెం సాధకం చేసుకుని వినిపిస్తా నంది.
నేను మళ్ళీ ఫోన్ చేసే లోపలే, తనే ఫోన్ చేసి,
“వందే వాసుదేవం, శ్రీ హరిం
వందే వాసుదేవం
బృందారకాధీక వందిత పదాబ్జం
వందే వాసుదేవం
ఇందీవరశ్యామ మిందిరా కుచకటీ
చందనాంకిత లసచ్చారు దేహమ్
మందార మాలికా మకుట సంశోభితం
కందర్ప జనక మరవింద నాభమ్…”
వీణతో, తన కంఠస్వరం కలిపి పాడితే, నే విని ఈమె నాకు తెలిసిన వ్యక్తేనా అని ఆశ్చర్య పోయాను. నిజంగా చెప్పాలంటే ఆమె నాకు తెలియదు. పదిహేను ఇరవయ్యి సంవత్సరాల పైగా సాధన చేసి వైణికురాలైన ఆమె నాకేం తెలుసు? ఏదో దగ్గిర చుట్టంగా ఆ చనువుతో తెలుసు. ఆమె ఇంకా ఏమేమిటో? నిజంగా నాకేం తెలుసు?
ఆమెకు తన వీణ నేను వినాలనీ, తను వేసిన బొమ్మలు నేను చూడాలనీ ఎంతో ఉబలాటం. ప్రకృతి అందమైన దృశ్యాలు తనతో పాటు నేను చూడాలని ఆమె ఆశ. వీణ వాయించుకోటం ఆమె నిత్యకృత్యం. ఆమెకు గుర్తింపు అంటే ఏమిటో తెలియదు. పద్మశ్రీల సెరిమొనీలు ఆమెకు పట్టవు.
మా సంభాషణలో, -అన్నమయ్య కీర్తనలలో మాటలు నాకు అన్నీ అర్థం కావు- అని తను అన్నప్పుడు, జయప్రభ రాసిన రెండు పుస్తకాలను నువ్వు తెప్పించుకుని చదువుకోవాలని తనకి చెప్పాను. తప్పకుండా చదవాలి. అప్పుడు నువ్వు ఇంకా బాగా వాయిస్తావు. నీ ఆనందం ఇంకా ఎక్కువవుతుంది, అని నేను చెప్పాను.
కృష్ణారావ్! మీ పాట “ఈమాట” లో ప్రసారం కోసం నేను ఎదురు చూస్తాను.
లైలా
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
01/11/2012 12:46 pm
రవి,
ఇక్కడ ఊర్మిళ ప్రశ్నలడగలేదే! లక్ష్మణుడిని భయపెడుతూ వాళ్ళ పేర్లు ప్రస్తావించింది. మళ్ళీ అదే వరసలో వారిని ప్రస్తావించడమే సహజం అనడం నా ఉద్దేశంలో సమంజసం కాదు.
దీనికి చాలా పాఠాంతరాలున్నాయి. ఈ “చెప్పుడీ” అన్న పదం మలయవాసినిగారు పాడిన పాటలో కాని, అక్కడిచ్చిన పాట సాహిత్యంలో కాని, ఇల్లిందిల సరస్వతీదేవిగారి పాఠంలో కాని లేదని గమనించండి. సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం. “అలనాటి పాట ఊర్మిళాదేవి నిద్ర”లో శ్రీమతి సుబ్బులు పాడిన పాటలో కూడా అక్కడ మాట్లాడేది ఒక్క లక్ష్మణుడే అన్నది స్పష్టంగా ఉంది.
స్త్రీలెప్పుడూ అలా ఉంటారని నేనెక్కడా అనలేదండి. మళ్ళీ నా వ్యాఖ్య ఒకసారి చదవండి. మీరలా స్త్రీలందరి గురించి సాధారణీకరించడం, దాని ఆధారంగా పాటని అన్వయించుకోడం సమంజసం కాదని మాత్రమే నేనన్నాను.
రెండూ కలిపి చెయ్యడంలో ఇబ్బంది ఉంది. అది circular inference అవుతుంది కాబట్టి. వ్యాసంలో చేసిన ప్రయత్నం మొదటిది కాబట్టి, దానితో రెండవది కలపడం సరికాదని నా ఉద్దేశం. అసలు రెండవ దానిలో విడిగా కూడా ఉన్న ఇబ్బంది “స్త్రీ మనస్తత్వము” అనే సాధారణీకరణ. మీరిచ్చిన విశ్వనాథ ఉదాహరణలో మారీచుడు ఒక పాత్ర. ఆ పాత్ర కల్పవృక్షంలో మనకి స్పష్టంగా గోచరిస్తుంది. ఆ పాత్ర చిత్రణకి అనుగుణంగా అక్కడ మారీచుని ప్రవర్తనని అర్థం చేసుకోడంలో ఇబ్బంది లేదు. కాని యిక్కడ మీరు చెపుతున్నది “స్త్రీ మనస్తత్వము” అనే ఒక బ్రహ్మపదార్థం (I mean an abstract thing) గురించిన సాధారణీకరణ! అదీ ఇబ్బంది.
ఇంతకు మించి యీ విషయంలో నేను చెప్పగలిగేదేదీ లేదు. చెప్పబూనితే, తెగే దాకా లాగడమే అవుతుంది. కాబట్టి యీ విషయంపై యిది నా చివరి వ్యాఖ్య.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి HaTaHaTa గారి అభిప్రాయం:
01/10/2012 12:35 pm
తహతహ గారు ఇలా అన్నారు:
ఇది వెల్చేరుగారు రాసిన ఈ వాక్యాల గురించి:
తహతహ గారు: “మనం”, “మనకు తెలుసు”, “మనకేమీ చెప్పలేదు” అనడం ఒక రకమైన రచనాశైలి (writing style). కథను స్థూలంగా చెబుతూ, పాఠకుకుని ఆసక్తి తగ్గిపోకుండా ఉండడానికి “We”, “We know that”, “We will find out” అని వాడడం ఇంగ్లీషులో రాసే చాలామంది పండితులు ఉపయోగించే టెక్నిక్.
ఇక్కడ “మనకి తెలుసు” అన్నది రాముడు, సీత, లక్ష్మణుడు మాత్రమే అడవికి వెళ్ళారని రామాయణం గురించి ఏ మాత్రం తెలిసిన పాఠకునికైనా అర్థమయ్యే విషయమని చెప్పడం. ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తాననడం వాల్మీకి రామాయణంలో లేదు. తెలుగువాళ్ళు అల్లిన కథలో “ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది” అని చదవగానే రామాయణం తెలిసిన పాఠకుడు “కానీ లక్ష్మణుడు ఒప్పుకోడు” అని ఊహిస్తాడు. పాఠకుడు ఊహిస్తున్న విషయాన్ని రచయిత బలపరచడం ద్వారా రచన పాఠకునికి చేరువౌతుంది. ఇది నాకర్థమైన విషయం.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
01/09/2012 12:56 pm
శ్రీనివాస్ గారు,
మీ వివరణకు కృతజ్ఞతలు.
1. “భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా?”
మా పెద్దవాళ్ళని అడిగాను. ఇలాంటి ఆచారమేదీ (భర్త తన పేరు భార్యకి చెప్పకపోవడం) వారికి తెలియదు. రాజులలో ఉందేమో, లేదా కొన్ని ప్రాంతాలలో ఉన్నదేమో. అయినా నా పాయింటు అది కాదు. అక్కడ లక్ష్మణుడన్న మాటలని వివరించడానికి అసలు దాని ప్రసక్తే అనవసరం అన్నది నా అభిప్రాయం. “దశరథకుమారుడను” అనో, “సుమిత్రానందనుడను” అనో చెప్పుకొని ఉంటే ఆ వివరణ అవసరముండేదేమో. కాని అతను చెప్పిన విధానం చూస్తే, కచ్చితంగా ఊర్మిళ ప్రస్తావించిన వాళ్ళనే తాను ప్రస్తావించడమన్నదే ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అది సంభాషణలో చాతుర్యం.
2. ఇక్కడ నేనిచ్చిన అన్వయం ఒక్కటే సరైనదని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. నారాయణరావుగారు కూడా తన అన్వయం గురించి అలా అంటారని నేననుకోను. ఎందుకంటే మీరన్నట్టుగా నేపథ్యాన్ని బట్టి, దృక్పథం బట్టి అన్వయించుకోడంలో తేడాకి చాలా అవకాశం ఉంది యిక్కడ. ఉదాహరణకి మీరు ప్రస్తావించిన ఇల్లిందుల సరస్వతీదేవిగారి పుస్తకంలో ఆ పాటకి వారిచ్చిన వ్యాఖ్యానం కూడా నారాయాణరావుగారి వ్యాఖ్యానం కన్నా చాలా వేరుగా ఉంది. 1940లో దేవేంద్ర సత్యార్థి యీ ఊర్మిళాదేవి నిద్ర పాటని ఇంగ్లీషులో అనువదించి Modern Review జర్నల్‌లో ప్రచురించారు (ఇల్లిందల సరస్వతీదేవిగారి పుస్తక పీఠికలో సురవరం ప్రతాపరెడ్డిగారు దీని గురించి ప్రస్తావించారు). ఆ అనువాదంలో వారు నాకు తోచిన అన్వయాన్నే తీసుకున్నారు. ఇది కూడా డిజిటల్ లైబ్రరీలో లభ్యమవుతోంది [ఈమాటలో అనుబంధంగా ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – సం.]
నేను చెప్పదలుచుకున్నదల్లా, సరళమైన అన్వయం ఉన్నప్పుడు దాన్ని కాకుండా క్లిష్టాన్వయాన్ని తీసుకోడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని. అందులోనూ అలాంటి అన్వయాన్ని ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగానో ఉదాహరణగానో తీసుకుంటున్నప్పుడు.
మీ 2A వివరణతో నేను ఏకీభవిస్తాను.
4. “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” అనే పదాల వాడుకలో నాకు బాధపడాల్సిన అంశమేదీ కనిపించడం లేదు. ఒకరి వివరణో వ్యాఖ్యానమో విపరీతమనో అతిశయోక్తి అనో అనిపించడం నేరం కాదు కదా. అది చెప్పడం వారిని కించపరచడమూ అవ్వదు. (ఆ మాటకొస్తే నా అభిమాన కవి విశ్వనాథవారి వ్యాఖ్యానం కూడా కొన్ని చోట్ల అతిశయోక్తి, విపరీతమూ అనిపిస్తూ ఉంటుంది!). నాకు చేతనైనంత వరకూ నా అభిప్రాయానికి కారణాలుకూడా చెప్పాను.
వాల్మీకి రామాయణం ప్రసక్తి వచ్చింది కాబట్టి, తహతహగారి వ్యాఖ్య చూసాక నాకు కనిపించిన మరొక చిన్న గందరగోళం: “మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హా లక్ష్మణా అని మాత్రమే అంటాడు.” అన్న వాక్యం. ఇక్కడ నారాయణరావుగారి ఉద్దేశంలో “మనకి తెలిసిన రామాయణం” ఏమిటో నాకు తెలియదు కాని, వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు “హా సీతా! హా లక్ష్మణా!” అనే అరుస్తాడు. అంచేత అది స్త్రీ హృదయానికి ఉదాహరణగా ఇవ్వడం సమంజసం కాదు. విశ్వనాథ కల్పవృక్షంలో మాత్రం మారీచుని పాత్రని ఔన్నత్యం పెంచడానికి, అతనికి అనృతదోషం కలగకుండా అతను “లక్ష్మణాగ్రజా!” అని అరిచాడనీ, అది దూరానికి “లక్ష్మణా” అని మాత్రమే వినిపించిందని ఒక తమాషా మార్పు చేసారు.
ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/07/2012 3:51 pm
I am having exactly the opposite reaction. I am downgrading it, based on added info.
ఒక పాత తెలుగుకథ చదువుతున్నాము. కాని అంతకన్నా ఎక్కువగా ఈ శీర్షికలో- కథ, ఎవరికి, ఎందుకు నచ్చిందో చదువుతున్నాము కదా.
పాతకధ ఎప్పుడు ఎవరికి నచ్చింది, ఎందువలన నచ్చింది? కధ ఏ కాలము నాటిది? చదివిన వారు ఏ కాలము నాటి వారు? ఏ వయసులో చదివారు? చదివేది ఆడవారా? మగవారా? ఇంతకు ముందు ఎప్పుడో చదివితే మళ్ళీ చదివినప్పుడు, అదే కారణాల వల్ల నచ్చిందా, లేక వీరి -అభిప్రాయాల్లో, అభిరుచుల్లో- మార్పు ఏమైనా వచ్చిందా? పాత చదువరి కధ చదివే విధానంలో గాని మార్పు వచ్చిందా? ఇప్పుడు మొదటిసారిగా చదివిన వారికి, ఈ కథ ఏ కారణాల వల్ల నచ్చింది? వీరి వయసు ఏమిటి? దేశ కాల పరిస్థితులు ఏమిటి? విమర్శకుల అభిప్రాయం ఊతంగా తీసుకుని వీరు కథను చదువుకున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి.
చౌదరి – ఇక్కడ మొదటి చదువరి, ఈ కధను మనకు పరిచయం చేసిన చదువరి అనుకుందాం. 1944లో చా. సో., రాసిన ఈ కథను, 1960ల్లో, సుమారు తనకు ఇరవయ్యిల వయసులో విద్యార్ది చౌదరి చదివాడు. చదివినప్పుడు ఇదే విమర్శ, అభిప్రాయం రాసుకుని ఉంటాడా? I doubt it. మరి ఇది ఇప్పటి డాక్టర్. చౌదరి ఇప్పటి అబిప్రాయమా? అంటే అలాగూ అనిపించదు.
ఈ విషయం ఆలొచిస్తూ ఉండగానే, ఇక ఈ కథ style ని గురించి ఇంగ్లీషులో నమ్రంగా తెలియచెప్పిన intellectual నీ, ‘మంచి కథ. సందేహం లేదు’ అని తెలుగు సర్టిఫికెట్టు ఇచ్చిన scholarని, ఇలా కొందరిని 🙂 ‘చదువుతూ’ ఉండగా, మళ్ళీ ఈ సంచిక, చా.సో., కథ గురించి మరికొన్ని విశేషాలు చెప్పింది.
దాన్నుంచి, నా ఆలోచనలు మళ్ళీ సాగాయి.
ఇక, ఈ కథ రాసినందుకు రచయిత తనే మురిసి మూర్ఛపోటమే కాక, ఈ కరుణా రస భరిత రచనను అలమూరు రాజగోపాలరావు చదివినట్లు, సాహిత్యంలో నిష్ణాతులైన నర్సింహాచార్యులు, రోణంకి అప్పల స్వామి, కధ చదివి గద్గదికమైన కొడవటిగంటి కుటుంబరావు, చుట్టలు మానెయ్యటం బాగా లేదనే నారాయణ బాబు, అబ్బే, అది మార్చక్కర్లేదనే జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి, ఈ కథ నీకెందుకు నచ్చింది నాన్నా? అని అడిగి వివరాలు సేకరించిన చాగంటి తులసి -ఇలా ఎందరో కథను పఠించినట్లు తెలిసింది.
ఇంతమంది చదువరుల endorsement. అబ్బా! నేను మొన్న తెల్లారుజాము దాకా చూసిన 2012 Iowa Caucuses కన్నా బలంగా ఉంది. ఇక నా రిపబ్లిక్ ఓటు ఈ డెమోక్రటిక్ కరుణకథకెందుకివ్వను? 🙂
ఇవ్వను. ఇవ్వను. ఎందుకంటే;
1.”కృష్ణుడి పేరు ముందు ‘డిస్కంటిన్యూడ్’ అని రాయబోతున్నారు. ఆ అన్యాయాన్ని తలచుకుంటే కోపం రాదూ?
ఈ కథ చదివాక గుండె బరువెక్కకుండా ఎట్లా ఉంటుంది? కళ్ళల్లో నీళ్ళు తిరిగితే ఆశ్చర్యమేముంటుంది?” – జంపాల చౌదరి అభిప్రాయం
2. “నాకు మాటలు రావడంలేదు. ఆ కుర్రవాడు నాకు కనపడుతున్నాడు. ఆ కుర్రవాడు ఎదురుగుండా వస్తే వాడికి స్కాలర్‌షిప్పు యిస్తాను.” రాజగోపాలరావు అభిప్రాయం. (వీరు హైస్కూలు ఉపాధ్యాయుడిగా, కాలేజీ అధ్యాపకుడుగా బహు సమర్ధుడు. – అని వ్యాసంలో చెప్పబడింది)
3. “భోజనం చేసి ఆ కథని బహుశా పది పదిహేను సార్లు నాకు నేను చదువుకుని ఉంటాను. ఎక్కడన్నా ఏ లోట్లన్నా ఉన్నాయేమోనని బహునిశితంగా విమర్శనాదృష్టితో పదం పదం వాక్యం వాక్యం పట్టిపట్టి చదువుకున్నాను.” – రచయిత చాగంటి సోమయాజులు అభిప్రాయం.
4. “మీరు కథలో మీరు ఒకమాట వెయ్యక్కర్లేదు. ఒకమాట తియ్యక్కర్లేదు.” – రాజగోపాలరావు
ఇట్టి పై ప్రగల్భపు, ఉబ్బేసే మాటలు ఈ కథను గురించి, చదివి, నేను (లైలా) ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యం ఎందుకంటే;
కథ చదివి, ఈ సాహితీపరులు, రచయిత తో సహా, వీరంతా ఉద్విగ్నులైతే, ఎందుకు కృష్ణుడిని చూసే అయ్యారు? ఏడవదలిస్తే ఎందుకు ఆఖరి వాక్యం దాకా ఆగవలిసి వచ్చింది చౌదరికి? మూడో వాక్యంలోనే ఏడవలేదేం? కథను ఏ ఒక్కరూ ఎందుకు వీధిలోకి విసిరి పారెయ్యలేదు? లేకుంటే సంపాదకుడుగా ఎందుకు సవరించలేదు? మూడవ వాక్యం చులాగ్గా అలాగ్గా దాటేసి, (Is it a done deal for all of them? A matter of fact?) అఖరి వాక్యాలకు మాత్రమే అసంకల్పితంగా ఏడ్చే అసమగ్రపు చదువరులుగా తెలుగు సాహిత్యం వీరిని మార్చివేసిందా? తీర్చిదిద్దిందా?
ఇంతోటి బోడి సన్నాసి, ముండమోపి చదువుకి కృష్ణుడు బడికి వెళ్ళక పోతేనేం? – అన్న సందేహాలు నాకు కలిగాయి గాబట్టి.
లైలా
గోమెజ్ ఎప్పుడొస్తాడో! గురించి మాలతి గారి అభిప్రాయం:
01/07/2012 3:31 pm
తెల్లవాళ్లూ కాని వేరు వేరు దేశాలవాళ్ళ మధ్య తెల్లవాళ్ళదేశంలో సఖ్య బాగా చిత్రించేరు. బాగుంది కథ.
ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి naren గారి అభిప్రాయం:
01/06/2012 10:55 pm
క్రిందటి సంచికలో ఈ కధను చదివాను. అప్పుడే ఉద్విగ్నానికి లోనయ్యాను.
కాని, ఈ వ్యాసం చదివాక అంతకంటే ఎక్కువ అనుభూతి పొందాను.
కధ వ్రాయడం వెనుక పురిటి నొప్పులంత జంఝాటం పడటం, వివేచన చెయ్యడం ఎంతో కదిలించాయి.
చాగంటి తులసి గారికి, జంపాల చౌదరి గారికి, ఈమాట సంపాదక వర్గానికి, రచయితలకోసం మరొక సారి విషయాన్ని సంగ్రహంగా ఎత్తిచూపిన భవానీ గారి అభిప్రాయానికి ధన్యవాదాలు.
నరేన్
మారిన కాలం మారిన మనుషులు గురించి మోహన గారి అభిప్రాయం:
01/06/2012 3:29 pm
కరుణ రసాన్ని చిందించే మంచి కథ, చక్కని అనువాదము. టరమ్ ఫీసుకోసం బంగారు గాజులు, గొలుసు బ్యాంకుకు వెళ్లిన రోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఫీసులు లేకుండా ఏ పరీక్షలైనా ఉన్నాయా అసలు? విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
01/06/2012 1:26 pm
మంచి పద్యానికి చాలా చక్కని వ్యాఖ్యానం అందించారు! ఈ పద్యంలో ధ్వనించే అర్జునుని మనస్స్థితిని అద్భుతంగా వర్ణించారు.
ఈ పద్యానికి ఒక చిన్న పాఠాంతరం కూడా ఉంది.
“కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర” బదులు
“కయ్యమున నోడి పాఱిన గౌరవేంద్ర” అని.
అప్పుడు దాని అర్థం –
ఓ కౌరవేంద్ర! యుద్ధంలో నువ్విలా పాఱిపోతే (పాఱిపోతూ ఉంటేనే కదా పిలిచి తూలనాడేది), ఆ అవమానభారంతో క్రుంగి కృశించడమే కాని, యింక ఏనుగులెక్కి రాజవీథులలో ఎలా ఊరేగుతావు? భూషణాలు ధరించి ఎలా కొలువుతీరగలుగుతావు? సుగంధ్రద్రవ్యాలు పూసుకొని ఎలా భోగిస్తావు? అంగనలతో ఎలా వేడుక చేసుకుంటావు? అందుకే ప్రాణత్యాగమే ఉత్తమం – అని.
పద్యంలో చిన్న అచ్చుతప్పు పడింది. “ఎడ్డోలగంబు” కాదు “ఒడ్డోలగంబు”.
రవీ, “ఔచిత్యం” గురించి క్షేమేంద్రునికి ముందు చాలామంది ఆలంకారికులే ఆలోచించారు. ఆనందవర్ధనుడు కావ్యానికి ఔచిత్యమనేది అవసరమైన లక్షణంగా పేర్కొన్నాడు. భాష, ఇతివృత్తము, పాత్రపోషణ విషయాలలో ఔచిత్యాన్ని గురించి చర్చించాడు. అతని స్ఫూర్తితోనే క్షేమేంద్రుడు ఔచిత్యానికి పట్టంగట్టాడు.
[అచ్చుతప్పు సవరించాము. కృతజ్ఞతలు – సం.]
కినిమా పత్రికనుంచి గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
01/06/2012 11:41 am
My apologies in advance for this nitpicking and ‘side-tracking’ the actual subject. Recently one columnist in The Hindu wrongly claimed that T.P. Rajyalakshmi (she acted in first Tamil-Telugu Talkie: kaaLidaasu-1931) is the first south-Indian woman director (Miss Kamala-1936), though most of the Tamil film historians rightly credit her being the first woman director in Tamil.
Well, I don’t believe in “who is first” debates, but chronologically speaking Fatima Begum directed a film way back in 1926: Bulbul-é-Paristan.
ఇంక తెలుగు విషయానికొస్తే: భానుమతి కంటే 15 సంవత్సరాల కంటే ముందే సురభి కమలాబాయి “భక్త జయదేవ” (1938) అన్న సినిమాకి దర్శకత్వం చేశారు (నటన, ఎడిటింగ్‌లతో పాటుగా …). ఇంకా అంతకు మూడేళ్ళ ముందే దాసరి కోటిరత్నం గారు అన్నీ తానై సతీ సక్కుబాయి (1935, తుంగల చలపతి రావు కృష్ణుడిగా – వీళ్ళిద్దరు జంటగా మైలవరం నాటకసమాజానికి సక్కుబాయి నాటకాన్ని ఆడేవారు. ఆ నాటకానికి, వీళ్ళిద్దరి గాత్రానికి తెలుగు చరిత్రలో చాలా గొప్ప పేరుంది.) చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. దర్శకుడిగా అరోరా అనే ఉత్తర భారతీయుడి పేరున్నా, చేసిందంతా కోటిరత్నం అనేది చారిత్రక సత్యం. (గిరిజ ఈవిడ కుమార్తె.)
– Regards, Sreenivas.
[That mistake is editor’s. The tidbit that Bhanumati was the first woman director was gleaned from the Web and added above. Thanks for the correction -Ed.]
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి TahaTaha గారి అభిప్రాయం:
01/04/2012 2:23 am
“ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు.
వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”
ఈ మనము ఎవరు? [ఈ మనము లోనేను లేను, ఎందుకంటే వాల్మీకి మనకేమీ చెప్పలేదు గనక] వారికి ఈ విషయము ఎలా తెలుసు? ఇది చూసింతర్వాత చదవ బుద్ధి వెయ్యలేదు గానీ చదివాను.
మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ గురించి Arunachala గారి అభిప్రాయం:
01/03/2012 10:23 pm
పాండురంగ మాహాత్మ్యం కావ్యాన్ని నారికేళ పాకానికి ఉదహరిస్తారు. మీ వివరణ తో నారికేళ పానీయ రసమాధుర్యాన్ని చవి చూచాం. ధన్యవాదాలు స్వీకరించండి. ఒకచోట “మట్ట” మధ్యాహ్నం అనేది మిట్టమధ్యాహ్నం అనే పదానికి పర్యాయ పదం అయివుండవచ్చని చదివి నప్పుడు దాని వెనుక కూడ ఏదైనా రహస్యం దాగి ఉన్నదా అనే సందేహం కలిగింది. కారణం, తమిళం లో “మట్ట” అనే పదాన్ని “పట్ట పైన” అనే వాడుక విన్నాను. ఉదాహరణకి “మట్టమాడి” ( పైన ఏ అంతస్తులూ లేని మేడ పై భాగము) అనే పదం తరచుగ విన్నాను. ఈ సందర్భంలో “ఏ ఆచ్చాదనా లేని తలమీద మధ్యాహ్నపు సూర్యరశ్మి పడటం వల్ల కలిగిన తాపం” అనే అర్థం చెప్పుకోవచ్చా అనే సందేహం. దక్షిణాంధ్ర జిల్లాలలో ఈ జాతీయం “మట్ట” అనేది వాడుకలో ఉన్నదేమో తెలిసికొన గోరుతూ — అరుణాచల.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
01/03/2012 9:45 am
మరుగున పడిపోయిన (పడిపోతున్న) యిలాంటి సాహిత్యాన్ని పదిలపరుచుకోవడం, కొత్తతరాలకి పరిచయం చెయ్యడం చాలా మంచి పని. ఈ సాహిత్యాన్ని గురించి కొత్తగా ఆలోచించడం కూడా అవసరమే. అయితే యీ వ్యాసంలో నారాయణరావుగారు చేసిన ఆలోచనలో కొన్ని అంశాలపై నాకు అనుమానాలు అభ్యంతరాలు ఉన్నాయి. విజ్ఞులు పరిశీలించగలరు:
1.
శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ
ఇక్కడ లక్ష్మణుడు ఊర్మిళ భర్తనని చెప్పకుండా “డొంకతిరుగుడుగా” చెప్పాడని దానికి కారణం తాను పెరిగిన కుటుంబ మర్యాదలని నారాయణరావుగారు అన్నారు. ఇది నాకు సమంజసమని అనిపించలేదు. నాకు కనిపించిన విషయం ఏమిటంటే – ఊర్మిళ నిద్ర మగతలో లక్ష్మణుడు పరపురుషుడని భ్రమపడినప్పుడు అతన్ని ఎలా భయపెట్టింది?
మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ
మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ
మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో
ఇక్కడ ఆమె ప్రస్తావించినది జనకుడు, రాముడు, సీత, సీత మరది అయిన లక్ష్మణుడు. అందుకే వారినే తన జవాబులో లక్ష్మణుడు పేర్కొన్నాడు. ఆమె మాటలే తీసుకొని తానెవరో వివరించాడన్న మాట. ఇది సహజ సంభాషణే కాని డొంకతిరుగుడు కాదు, కుటుంబ మరియాద కోసం చేసినదీ కాదు.
2.
పైనున్న లక్ష్మణుడి మాటల వాక్యాల చివరనున్న ప్రశ్నార్థకాలను నేను ఆశ్చర్యార్థకాలుగా చదువుకున్నాను (విన్నాను). నాకా వాక్యాలెలా అర్థమయ్యాయంటే – అవన్నీ లక్ష్మణుడు చెపుతున్నవే, వాక్యంలో సగభాగం లక్ష్మణుడు సగభాగం ఊర్మిళా అంటున్నవి కావు. నేను శ్రీరాముని తమ్ముడిని, శ్రీరాముడిలాంటి వారింకొకరు సృష్టిలో ఉన్నారా! నేను జనకుని అల్లుడిని. జనకులంటే ఎవరు, సామాన్యులా! అలాగే, సీతమ్మ మరదిని. ఆమెలాంటి స్త్రీని సృష్టిలో ఇంకెవిరిని నేనెరుగను!
నారాయణరావుగారి వ్యాసం చదవకముందు, చదివాక కూడా నాకలానే అర్థమయ్యిందా భాగం. ఆ అన్వయం చాలా సహజంగాను సరళంగాను ఉన్నట్టనిపిస్తోంది. నా పురుషాహంకారమేమైనా నేనలా అర్థం చేసుకొనేట్టు చేసిందేమోనని అనుమానం వచ్చి, నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు స్త్రీలనికూడా అడిగి చూసాను. నా అన్వయం కాని, నారాయణరావుగారి అన్వయం కాని చెప్పకుండా. వారికీ నాలాగనే అర్థమయ్యింది మరి! ఈ పాట గురించి వివరించిన మలయవాసినిగారు ఏ అర్థమిచ్చారో నాకు తెలియదు. అసలు నారాయణరావుగారికి నాకు తట్టిన అర్థం తట్టనే లేదో, తట్టినా అది తప్పనుకున్నారో తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ ఆ అర్థం తడితే, దాన్ని కూడా ప్రస్తావించి, తాను చెప్పిన అన్వయమే ఎందుకు సరి అనుకుంటున్నారో వివరిస్తే బాగుండేది.
అసలు ఊర్మిళ ప్రస్తావన లేకుండా హఠాత్తుగా అలా ఆమె మాట్లాడిందని అనుకోవడం నిర్మాణ పరంగానూ, అర్థంచేసుకోడంలోను కూడా సంక్లిష్టత కలిగిన అన్వయం. సరళమైన అన్వయాన్ని వదిలి దాన్ని గ్రహించాల్సిన అవసరం ఏమిటి? ఆ తర్వాత నారాయణరావుగారు తన అన్వయానికిచ్చిన వివరణంతా విపరీత వ్యాఖ్యానమే అని అనిపించింది.
2.
మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే
చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా
దీనికిచ్చిన వివరణ నాకు సంతృప్తిగా లేదు. “చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా” అంటే, ఇంకొకళ్ళ మీద మనసుపెట్టి నన్ను నలుగురిలో చిన్నబుచ్చారని అర్థం తీసుకోవచ్చా? లక్ష్మణుడు ఎవరిపై మనసుపెట్టాడు? ఊర్మిళని నలుగురిలో ఎప్పుడు చిన్నబుచ్చాడు? అన్నమీద మనసుతో తనని విడిచి అడవికి వెళ్ళడం తనని చిన్నబుచ్చడమా? మరి “సమయమున” చిన్నబుచ్చడమేమిటి? ఇందులో “మానవంతుడు” కాకపోవడమేమిటి?
3. ఈ పాట ఏ కాలానికి చెందినదో తెలియదు. ఆ కాలంలో సాంఘికపరిస్థితులు అసలు తెలియవు. అలాంటప్పుడు, ఇందులో యిది ఊహ యిది వాస్తవమూ అని ఎలా నిశ్చయించగలం. ఉదాహరణకి,
“తెలుగు ఆడవాళ్ళు బావగారి పేరూ, భర్త పేరూ చెప్పకూడదు. ఒక పక్క తాను హింసపడే ప్రమాదం ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా తెలుగు కుటుంబాల ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా మసలవలసిన నిర్బంధంలో ఉన్నారో ఈ పాట సున్నితమైన మాటల్లో, కొరడాతో కొట్టినంత చురుక్కుమనిపించేలాగా చెబుతుంది.” అన్నారు. అది చెప్పకూడదనే నిర్బంధమో, అలా వరసలు పెట్టి చెప్పే అలవాటో ఎలా నిర్ణయించగలం? ఇంకొకటి – ఇవి నిజంగానే అచ్చంగా ఊర్మిళ మాటలో, లేదా పాడుతున్న స్త్రీ మాటలో కూడా చెప్పలేం. ఊర్మిళ రావణాసురుడు సీతనెత్తుకుపోవడాన్ని ప్రస్తావిండం అది అచ్చంగా ఆమె మాటలు కావని, అది కథ పాడుతున్న ఆడవాళ్ళ మాటలని సమర్థించారు కదా (ఇంతకీ యిలా కాలక్రమాన్ని అతిక్రమించడంలో “నిర్మాణదక్షత” ఏమిటో నాకర్థం కాలేదు!). అలానే ఇక్కడ కూడా యిలా వరసలతో బావగారిని భర్తని ప్రస్తావించడం పాడుతున్న ఆడవాళ్ళు అలవాటుగా చేసిన ప్రయోగమని ఎందుకు భావించకూడదు?
అలాగే, “తమకి పురుష శాస్త్రాలే ఇచ్చిన గౌరవాన్ని స్త్రీ మర్యాదని కాపాడడానికి, కుటుంబాలలో మొగాళ్ల మాటున బతికే అబలలైన స్త్రీలు అవసరం వొచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలరని ఈ పాటల కవయిత్రులు ఊహించడం వాళ్ల భావనా దక్షతకి నిదర్శనం.” అన్నారు. అవసరం వచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలగడం ఊహో నిజమో ఎలా నిర్ణయించగలం? అలాగే, “ఆడబడుచు దెప్పడం పోయి, ఇలా గొప్పగా పొగడడం ఆడవాళ్ల ఊహల్లో ఉండే మాట.” అన్నది ఆ కాలంలో ఊహో నిజమో మనకి తెలియదు కదా!
4.
“రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది. ఊర్మిళ ఆ సందర్భంలో అనే మాటలు వింటే పరపురుషుడి చేత బలాత్కరించబడిన స్త్రీ ఎంత అసహాయ పరిస్థితిలో ఉంటుందో. తాను హింసకు గురై ఎలా చివరికి అపరాధిలా అందరిముందూ నిలబడాల్సి వస్తుందో గుండె చెదిరే లాగా బోధపడుతుంది.”
ఇక్కడ పటాపంచలమైన రామరాజ్య ధర్మమేమిటో నాకు బొత్తిగా బోధపడలేదు! అలాగే ఊర్మిళ మాటల్లో బలాత్కరింపబడిన స్త్రీ అసహాయ స్థితి కూడా నాకు కనబడలేదు. పరాయి పురుషుడు తన పడకమీదకి వచ్చాడని ఆమె భ్రమించింది. అందుకతన్ని నయానా భయాన పొమ్మని చెప్పింది. “హెచ్చయిన…” అనే రెండు వాక్యాలని పట్టుకొని ఆమె అపరాధిలా అందరిముందూ నిలబడాల్సిన పరిస్థితి గుండె చెదిరేలాగా చిత్రింపబడింది అనడం నాకు అతిశయోక్తిగా తోచింది.
5.
“సుగ్రీవుడు రాముడికి బహుమానంగా ఇచ్చాడు ఈ నగలని. ఎందుకంటే ఆయన కౌసల్యాపుత్రుడు కాబట్టిట. ఒక తల్లికి కొడుకుగా రాముణ్ణి గౌరవించడం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాట.”
ఇది కేవలం విమర్శకుని ఊహ మాత్రమే. ఆ ఉద్దేశంతోనే ఆ మాట వాడబడినదని అనుకోడానికి ఎలాంటి బలమైన కారణమూ లేదు. ఈ పాటలో రామునికి చాలా పేర్లు వాడబడ్డాయి. కనీసం మరికొన్ని చోట్ల యిలా సార్థక ప్రయోగం జరిగిందని స్పష్టంగా తెలిస్తే అప్పుడీ ఊహకి కొంత బలం చేకూరుతుంది.
ఒక నేను, కొన్ని నువ్వులు గురించి మోహన గారి అభిప్రాయం:
01/02/2012 6:43 pm
మంచి రచన, ఒక చక్కని వచన కవితలా ఉంది. కాని ఒక కథ చదివినప్పుడు కలిగే అనుభూతి కలుగలేదు. విధేయుడు – మోహన
ఈమాట నవంబర్ 2011 సంచికకు స్వాగతం! గురించి హెచ్చార్కె గారి అభిప్రాయం:
12/25/2011 2:58 am
‘ఈమాట’తో ఒక రాత్రి
భల్లే. నెట్గేర్ రూటర్ను సంధించి, మోడెమ్ సమస్యను దాటేసి, ఇపుడెంచక్కా ‘ఈమాట’ చదివేస్తున్నా. పత్రిక చాల రిచ్ గా వుంది. నవంబర్ సంచికలో సంపాదక వ్యాఖ్యలో ఇచ్చిన దారాలు పట్టుకుని వెళ్లి, ఎకె రామానుజన్ వి రెండు మంచి వ్యాసాలు చదివేశా. నిజ్జంగా చదువుకున్న మనిషి, తన చదువు లోంచి మాట్లాడితే ఎట్టా వుంటుందో తెలిసొచ్చింది. ‘Is There an Indian Way of Thinking?’ (భారతీయ చింతన అంటూ ఒకటి వున్నదా?) ను ఇంగ్లిష్ లో, ‘మూడొందల రామాయణాలు’ (Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translation) ను కొలిచాల సురేష్ గారి తెలుగులో చదువుతూ నిన్న నా రాత్రిని వెలిగించుకున్నా.
మొదటి వ్యాసంలో కాంటెక్స్ట్ సెన్సిటివ్, కాంటెక్స్ట్ ఫ్రీ (సందర్భ గ్రాహ్యం, సందర్భ స్వతంత్రం) అనే భావనలను వివరించి, భారతీయ చింతన ఎక్కువగా ‘సందర్భ గ్రాహ్యం’ అంటారు రామానుజన్. (అంటే ఒక విషయాన్ని ఒక సందర్భంతో ముడిపెట్టి మాత్రమే చూడడం. అన్ని కాలాలకు అన్ని స్థలాలకు పనికొచ్చే సాధాణీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.) ఆయన చెప్పినట్లు ఈ వైఖరులు ప్రాంతీయమా (పశ్చిమం, ప్రాచ్యం), కాలీయమా (మునుపు, నేడు)? నాలో మొలకెత్తిన ప్రశ్నను తడుముతూ నిద్దరోయా. ఆధునిక (అర్బనైజ్డ్) భారతీయుల సంగతి వేరనుకోండీ అన్నట్లు మాట్లాడుతారాయన. కాని ఇదే కదా మన వర్తమానం. ‘పట్టణం’ ప్రవేశించని ప్రదేశం ఎక్కడుందిప్పుడు, (కవులు కథకుల మూర్ఖ స్వప్నాలు మినహా). పశ్చిమం మన కంటె ముందు యంత్ర విప్లవాన్ని ఆవిష్కరించడానికి కారణాలేమిటి? వాళ్లు మన కంటె తెలివైన వాళ్లు కావడం వల్ల మాత్రం కాదు. మరి? కేవలం మానస వీధులలో వెదికితే కారణాలు దొరుకుతాయా? అలాగని, కేవలం విపణి వీధులలో వెదికితే దొరుకుతాయా? రెండూ ముఖ్యమే. మానస సంచారానికి మంచి సందర్భం రామానుజన్ మరో వ్యాసం: ‘మూడొందల రామాయణాలు’
రామాయణాలు… మనల్ని ఏం చేశాయి. భారత కథ చాల డైనమిక్ గా వుంటుంది. వింటున్నా చదువుతున్నా కళ్ల ముందు బతుకు కదులుతుంటుంది. భారతం చలనానికి, మార్పులకు మానసిక ప్రేరణ ఇస్తుంది. రామాయణం మనుషులను ప్రేక్షకుల్ని చేస్తుంది. ధర్మాన్ని నాటకీకరిస్తుంది. ధర్మం అంటే వున్న వ్యవస్థను కాపాడేది. ఉన్న వ్యవస్థను కాపాడడం ద్వారా అది మనల్ని కాపాడుతుందని తరతరాల నమ్మకం. మరో మాటలో ఇది యథాతథ వాది. హెయిరార్కియల్ గా ఒకరి మాటకు ఒకరు తలొంచడం సారాంశం. అలా వ్యవస్థను ఉన్నదున్నట్టు కాపాడుకుంటే నీ జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని ఆశ పెడుతుంది. ఎంచక్కా మొగుడు మొగుడుగా, రాజు రాజుగా, చాకలాయన చాకలాయనగా, శూద్రుడు శూద్రుడుగా, సేవకుడు సేవకుడుగా వుండొచ్చు. అలా వుండడమే ధర్మం. వీళ్లలో ఎవరికైనా అది ఇష్టం లేకపోతే, ఆ ‘అయిష్టం’ తప్పు అని వాల్యూ జడ్జ్మెంటు ముందే తయారైపోయి వుంది. ఆ ‘అయిష్టం’ తప్పు కాదు అనే విలువకు విలువ లేకుండా చేయడం వినా రామాయణం ఇంకేంచేస్తుంది? దీని గురించి అసలేమీ మాట్లాడని ‘రామాయణాల’ చర్చ వల్ల ప్రయోజనం ఏమిటి? వ్యవస్థ యథాతథంగా వుండడం ఎవరికి అనుకూలమో వారిని అలా వుంచుదాం. మిగిలిన వారికి రామాయణం స్థిరీకరించే ధర్మం వల్ల ప్రయోజనం ఏమటి? రామాయణం ఆదర్శీకరించే జీవన వైఖరిని వదిలించుకోనంత వరకు మన గురించి ఎలా ఆలోచించగలుగుతాం? ముందున్న ఆల్టర్నేటివ్స్ అన్నిటినీ చూసి, మన ఇష్టాన్ని మనం ఎన్నుకుని ఎలా అమలు చేయగలుగుతాం? మనలోని పలువురి ఇష్టాలలో ఏది ఎక్కువ న్యాయబద్ధమో, ఏది ఎక్కువ మందికి ఉపయోగకరమో ఎలా తెలుసుకోగలుగుతాం? ఉన్న చోట వుండడాన్ని ఆదర్శీకరించేది ఏదయినా అది (తప్పని సరిగా) మంచిది ఎందుకవుతుంది?
రామానుజన్ గారి వ్యాసాలు ఇలాంటి ప్రశ్నలను తాముగా లేవనెత్తవు. ఆయన వ్యాసాల్ని మన వర్తమానం లోంచి మనం చదువుతాం. ఆయన తన విమర్శనాత్మకతో మొదలెట్టిన చింతనకు మనం మన విమర్శనాత్మకతను కలుపుకుని చదువుకుంటాం. గ్రంథంలో ఏమి చెప్పారనేదానితో పాటు, చెప్పాల్సి వుండి చెప్పనిది కూడా పఠనంలో భాగమవుతుంది. థాంక్ గాడ్, దీన్ని ఎవరూ నిషేధించలేరు.
కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి TahaTaha గారి అభిప్రాయం:
12/12/2011 7:22 am
koteswararao గారికి
ఒక నవ్వూసు [‘నవ్వూసు’ జొక్ కు -నేను చేశానని నేననుకుటున్న- తెలుగు]
చాలా కాలం క్రితం ఒక పత్రికలో చదివినది జ్ఞాపకానికొస్తున్నది.
ఒక స్కూళ్ళ ఇన్స్‌పెక్టరు ఒక బళ్ళో ఒక తరగతిలో తెలుగు ఉపాధ్యాయుని సమక్షం లోనే పిల్లలను పరీక్షిస్తున్నాడు.
“హరిశ్చంద్రు డెవరు?”
పిల్లలు ఆనందంగా ముక్త కంఠంతో “NT రామారావు.”
“తప్పు, మీకు హరిశ్చంద్రు డెవరో గూడా తెలియదు.”
ఆ తెలుగు పంతులు గారందుకుని “పిచ్చి వెధవల్లారా ఆమాత్రం తెలియదూ, హరిశ్చంద్రుడు SV రంగారావు.”
స్కూళ్ళ ఇన్స్‌పెక్టరు కోపంతో ఊగి పోతూ “అయితే మీకూ తెలియదు, హరిశ్చంద్రుడు అద్దంకి శ్రీ రామమూర్తి.”
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
12/08/2011 3:59 pm
ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందించినందుకు కృతజ్ఞతలు.
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.
త్యాగరాజు కృతుల్లో కాదు, త్యాగరాజు మనసులో (రామ) భక్తి తప్ప ఇంకేమీ లేదనిపిస్తుంది. తనకుతాను తాదాత్మ్యం చెంది పరవశంతో పాడినవే గాని, ఫలానాది రాయాలన్న తహతహ గాని సంకల్పంగాని కనీసం రాసానన్న కర్తృత్వ భావం సైతం కనిపించదు. కీర్తనలలో కనిపించే “త్యాగరాజనుత” ముద్ర సైతం తనను తానే సాక్షీభావంతో third person గా చూస్తూ విన్నవించుకుంటున్నట్టు గానే ఉంటుంది, ఎక్కువ చేసుకున్నట్టుగా ఉండదు.
చిన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు తల్లి పాత్రలో ఉన్న గొప్ప నటి, అనుగుణమైన దుస్తులు జోడించి, తగిన అలంకారాలు, ఆభరణాలు తొడిగి ముచ్చటపడడం ఒక ఎత్తు. కన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు సాదాసీదా తల్లి సైతం అంతే ఎరుకతో, అనుగుణమైన దుస్తులు జోడించి నప్పిన అలంకారం ఆభరణాలు తొడిగి ఎత్తుకోవడం ఇంకో ఎత్తు, ఏదో గమ్మత్తు. మొదటి సందర్భంలో బట్టలు నగలు పెట్టాననే స్పృహ ఎంత ఎక్కువో, రెండవదానిలో అంత తక్కువగా, అసలు పెట్టాననే భావంకన్నా బిడ్దకు తాను పెట్టుకున్నాననే సంబరమే ఎక్కువ, అసలు బిడ్డ పైనే మక్కువ. అంటే మిగితావి లేవనికాదు, అంతగా ప్రేమించే బిడ్డకు మంచి బట్ట నగ ఎందుకు పెట్టుకోదు, తనివితీరా పెట్టుకుంటుంది, అయినా బిడ్డే ప్రధానం. అట్లే ఆశ్చర్యమో లేక అంత ఆశ్చర్యం కానిదో- నిజమైన భక్తితో పలికిన కృతులలో కవిత్వం, విప్లవ సందేశాలు, స్ఫూర్తి సందేశాలు అవంతట అవే పెట్టని ఆభరణాలుగా చేరుతూండడం ఎప్పటికప్పుడు అబ్బురపరచే అంశం. అందుకే ఎన్ని ఏండ్లు గడిచినా, కాలం, పరిస్థితులు, భాష సైతం ఎంతగా మారినా, ఆ పదాలలో ప్రతి గుండెను ఇప్పటికీ తాకే ఏదో గమ్మత్తు సజీవంగా ఉందేమో అనిపిస్తుంది.
_____________
విధేయుడు
_శ్రీనివాస్
ఈమాట నవంబర్ 2011 సంచికకు స్వాగతం! గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:
12/06/2011 7:50 pm
ఒక వేడుకైన జ్ఞాపకం..
********
ఆమె కన్నుల్లో మిస మిసలేవో తొణికిసలాడతాయి
ఆమె చూపుల్లో తారకలు తారట్లాడతాయి
ఆమె నవ్వుల్లో విరజాజులు సరికొత్తగా విచ్చుకుంటాయి
ఆమె నడకల్లో రాజహంసల సొగసులుంటాయి
ఆమె ఎదురైతే..పగలు – పండువెన్నెలౌతుంది. ఒక దేవత లా అగుపిస్తుంది.. వెనక జన్మ బాసల్ని గుర్తుకు తెస్తుంది. తీయని ఆనందానికి గురిచేస్తుంది.
ఆమె వంటి సుందరి కాని..దివ్య స్వరూపిణి కాని ఎందెందు వెదికినా కనిపించదు.
ఆమె సౌందర్యానికే – సౌందర్యవతి. వెరసి ఆమె ఒక వేయి శరత్పూర్ణిమల తేజస్విని.. నిండు నూరు పాళ్ళూ మన తెలుగింటి పడతి.
నటనలకే నటన నేర్పిన మహానటి.
ఆ అభినేత్రి – సావిత్రి..
ఈరోజు ( డిసెంబర్,6) ఆమె పుట్టిన రోజు! తెలుగు వారందరూ వేడుకగా గుర్తు చేసుకుంటారని..
అందరికీ అభిమానంతో –
ఆర్.దమయంతి.
నయాగరా గురించి TADEPALLI గారి అభిప్రాయం:
12/03/2011 10:52 am
నా మనస్సులో మీరిపుడుమరచిపోలేని జ్ఞాపకానివి
శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి sridevi గారి అభిప్రాయం:
12/02/2011 10:26 pm
శ్రీనివాస్ గారికి
నమస్కారములు. ఎన్నో రోజుల నుంచి ఈ పాటలు వినాలనుకున్నాను. కాని దొరకలెదు. మీకు చాలా కృతజ్ఞతలు.
శ్రీదేవి
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి rohini గారి అభిప్రాయం:
11/27/2011 4:20 am
మీ ఆలోచన బాగా ఉన్నది. కాని దీనిలొ ఉషశ్రీ గారి ప్రస్తావన లెదు. దయచెసి పరిశీలించగలరు.
మూడు వందల రామాయణాలు గురించి ramaadevi గారి అభిప్రాయం:
11/24/2011 9:20 am
గౌరవనీయులైన అందరికీ
నమస్కారము
సురేష్ గారు మీరు రాసిన కారణాలు – ముఖ్యంగా 5వది నిజమే కదా, ఎందుకు దానికి ఇంత వ్యాఖ్యలు?
మళ్ళీ ఇందులోని వారే (అంత వివాదాస్పదం కావాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు అన్న వారి లాటి వారు ఎడిటోరియల్ లో “కుహనా సాంప్రదాయాన్ని కొనసాగించింది” లాంటి అభిప్రాయాలని వెల్లడించిన వారే) చాలా మంది “ద్రౌపది” కి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం గురించి బాధ పడతారు.
అసలు రామాయణమే కాదు హిందు మతధర్మ ఆచారాలలో చాలా ప్రాంతీయపరమైన భేదాలు కన్పడతాయి. సూర్యమానం చంద్రమానం కానీ సుర్యమానం ప్రకారం నడిచే అందరికీ వొకే సారి వొకే నెలలు రావు. జ్యోతిర్లింగ క్షేత్రాలు చాలా వరకు వొకటే (కొన్ని క్షేత్రాల గురించి వివాదం వుంది) కాని వాటిలో పాటించే పూజా పద్ధతులు వొకటి కాదు. ఉత్తరంలో వొకటి అయితే దక్షిణంలో ఇంకొకటి. వేదాలు ఉత్తర భారతీయులకీ దక్షిణ భారతీయులకీ వొకటే అయినప్పుడు వొకటే పద్దతి వుండాలి కదా!
ఈమాట చదువరులందరూ కనీసం 90 శాతం అంగీకరించేది హిందూ ధర్మఔన్నత్యాన్నిఅనుకుంటే దాని గురించి వదిలేసి, ప్రతిసారి ఇలా ప్రతిసారి “కుహనా సాంప్రదాయాలు, రాజకీయాలు” అంటూ వాటికి లేని ప్రాముఖ్యత కలిగేలా ఇలాంటి చర్చలే తప్ప నిజంగా ఏమీ చెయ్యట్లేదు. వొక సినిమా చూస్తేనే హీరో లాగా తామూ చెయ్యాలని, నాయిక అంటే పాటలకే పరిమితం అనేలా చేసే దర్శక నిర్మాతలని, హీరోలని, అవి చూపించే ప్రభావాలని వదిలేసి ఎక్కడో ఢిల్లీ యూనివర్సిటీ లో జరిగిన వొక చిన్న సంఘటనకి ఇంత చర్చ అవసరమా? ఈ రోజు, సర్దార్ పటేల్ స్టాట్యూల కంటే గాంధీ కాలనీల కంటే రాజీవ్ గాంధీ స్టాట్యూలు నగర్లూ కాలనీలూ ఎక్కువ. ఎందుకంటే అలా కాకుండా చెయ్యగలిగిన చాలామంది ఇలాంటి చర్చలలో లేక తమ పనులలో బిజీ గా వున్నారు. తెలుగు అకాడెమీ నాటక పోటీలలో సీత కి రావణాసురుడి మీద ఇష్టం తో నే వెళ్లింది అన్న నాటకం చూపిస్తే నేను మా పిల్లలకి సీతారాముల గొప్ప దనం ఏ విధంగా చెప్పగలనూ? అసలు రామాయణం గొప్పదనం తెలియని చాలామంది ఆ వయసు పిల్లలు ఈ వ్యాసం చదివి రామాయణం గొప్ప సాంస్కృతిక ప్రతీక అని ఎలా అభిప్రాయ పడగలరు?
మీరు మీ మానసిక పరిపక్వతతో కాక ప్రస్తుతపు విద్యార్థి మనస్తత్వాన్ని దృష్టి లో పెట్టుకుంటే ఈ నిర్ణయం వెనుక సమంజసత్వం అర్ధం అవుతుందేమో!
ప్రజాపతి గురించి as గారి అభిప్రాయం:
11/23/2011 8:54 pm
somehow telugu typing is not working on my machine.
కధనం బాగుంది. కాని అసలు బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమే కాదే!!!
తిక్కన భారతంలో పలుకులపొందు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/22/2011 2:04 pm
మంచి వ్యాసం! మనకి “దీపకళిక” అనడమ్ తెలుసు. కానీ తిక్కన “ఘర్మాంబుకళిక” అని వాడటం అపురూపమే!! పొడవు కొండ అని ఉండటం బహుశా అచ్చుతప్పు కావొచ్చు. అది పొడుపుకొండ ఏమో? “పొడుపుకొండమీద పొడుచుటమొదలుగా పరువుపెట్టి ఇనుడు పశ్చిమాద్రి… అన్న పద్యం లోనూ ఈ ప్రయోగం ఉంది. “ఆవులనేయి” లాగే ఆ అర్ధంలో లక్ష్మణ వజ్జల ఇంట ఒకరూకకి దొరికే భోజనాన్ని గురించి రాస్తూ, క్రీడాభిరామ కర్త “ఆలనేయి” అని వాడాడు.
భాషా శాస్త్ర పండితులు రాయవలసిన వ్యాసాలు ఇలాంటివి చాలా బాకీ ఉన్నాయి. తెలుగు వాడకానికి సంబంధించి అన్నమయ్య సంకీర్తనల భాష మీద కూడా ఈ తరహా వ్యాసాలు చాలా రావాల్సిఉంది. క్లుప్తత కలిగిన వాక్యాలూ ..స్పష్టమైన వాక్యాలూ ఉన్న ఈ వ్యాసం చదవడానికి బాగుంది కూడా!
అమూర్త మైన ఊహలు చేసిన ఆధునిక కవులూ ఉన్నారు. కానీ సంఖ్యలో బహుతక్కువే! వాల్మీకి చేసినపోలికలు చాలా గొప్పవి.
ఇంక బాగులేని దానిని చెప్పడం కోసమ్ వారు చేసిన విమర్శ ఆ పోలికలూ కొంచెం కటువైనవే అయినా ఆలోచించవలసినవే! మగవారు గనక వారు నిస్సందేహంగా చెత్త రాసిన కవులని పోలికలతో చెండాడారు. ప్రాచీన కాలంలో ఒక్క కవులే ఎక్కువ ఉండటం అసలు కవిత్వమే రాయని స్త్రీలు ఉండగా అందునా చెత్త కవిత్వం అన్నదానికి మరివీలే లేదుగనక కాబోలు కుకవులని విటులతో పోల్చిన ఉదాహరణలున్నాయి. కానీ కవయిత్రులని వాళ్ళు వదిలేసేరు. మరి ఇవాళ ఈ ప్రజాస్వామిక యుగంలో .. కవిత్వం పేర చెత్త రాసే వారిని సంబోధించడానికి ఏ కొత్త పోలికలు చేయాలో ..అదీ కాక “కు విమర్శక” వర్గం కూడా పుష్కళంగా ఉన్న ఇవాళ ఒక తీరూ తెన్నూ లేకుండా మెచ్చుకుంటూ … ఓహోహో !! అనే బాకాసుర విమర్శకవర్గాన్ని ఏ రకమైన సంబోధనతో సంభావించాలో మనకి ఈ కాలపు భాష చెప్పడంలేదు. దూర్జటి “చదువులునేర్వని పండితాధములు” అని అన్నాడు. గనక ప్రస్తుతానికి దానితో సరిపెట్టుకోవాలి.
రమ.
ప్రజాపతి గురించి Dr. Estari Mamidala గారి అభిప్రాయం:
11/16/2011 5:29 pm
మీ కథనం బాగుంది. కాని భావని అభిప్రాయం బాగాలేదు. హిందూ సామ్రాజ్యవాద ధోరణి అని అనడం సరి కాదు. బౌద్ధాన్ని హిందూ ధర్మం లాక్కున్న విషయం తప్పు. బుద్ధుడు అంటే శ్రీమహావిష్ణువే కదా. వీరందరు హిందూ దేవతలే ఐనప్పుడు బౌద్ధం వేరు హిందూ ధర్మం వేరు ఎలాఅవుతుంది అని భావని గారు గ్రహించాలి.
దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/16/2011 12:06 pm
ఎప్పుడూ చూసే పోస్టర్ల వెనుక ఎప్పడూ చదవని విషయాలు అందించినందుకు కృతజ్ఞతలు.
ఎందుకో అవసరాల రామకృష్ణారావుగారి మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఉందో లేదో కాని కొన్ని యేండ్ల క్రితం వరకు సినిమా పోస్టర్ల మీద “నేడే చూడండి” అని కనిపించేది. నేడే చూడండి, ఎందుకంటే రేపు ఉండదేమో అన్నారట వారు!
పోస్టర్లు ఇంకొక విషయం కూడా చెప్తాయేమో అనిపిస్తుంది- వేసే వారివే గాక చూసే వారి అభిరుచులను.
— ——–
విధేయుడు
_శ్రీనివాస్
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Paramjyothi Kompella గారి అభిప్రాయం:
11/09/2011 3:52 pm
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.”
సాయి గారు,
త్యాగరాజ కృతులలో భక్తే ప్రధానం. అదే ఆయన ఎన్నుకున్న మార్గం. చేతకాక కాదు. (నిజానికి అందరు వాగ్గేయకారుల కృతులలో నూ ఇదే పరమప్రయోజనం). సాహిత్య పరంగా చూసినా కొన్ని కృతులు “జగదానందకారకా”, “బాల కనకమయ చేల” మొదలైనవి ఎన్నో కనిపిస్తాయి. త్యాగరాజ సాహిత్యం అంతా రామ మయం, ఇంకొక రామాయణం. అందంగా అనిపించడానికి , “భలే వేసారు ఇక్కడ ఈ పదాల కూర్పు” అనిపించుకోడానికి చేసిన ప్రయోగాలు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోతన గారి అంత్యానుప్రాస ప్రయోగ్రం ఎక్కువగా త్యాగరాజ కృతులలో కనిపిస్తుంది. ఎన్నో కావ్యాలు, కీర్తనలు అనేకమంది ప్రభువుల మీద, వారి భార్యల మీద, వారి ప్రేమికుల మీద రచించారు, సాహిత్య పరంగా మంచి విలువలు ఉన్నవి, రాగాలపరం గా వినసొంపుగా ఉండేవి. కాని అవేవి నిలబడలేదు. భారతీయ సంగీతానికి లక్ష్యం పరమాత్మని అందుకోవడమే. దానికి నవవిధ భక్తి ని ప్రమాణం గా తీసుకున్న వారి కృతులే అజరామరం గా నిలుస్తాయి. ఒక అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు మొదలైనవి. కవిత్వం ఎంత గొప్పగా ఉన్నా, భక్తి లేనిది కేవలం వ్యర్ధమే….
బాలమురళి గారి గానం నాకెంతో ఇష్టం. కొన్ని కీర్తనలు భావం ఎరిగి ఆయన పాడినట్లు ఇంక ఎవరూ పాడ లేరేమో అని అనిపిస్తుంది. ఆయన కృతులు కూడా చాల బాగుంటాయి, బాలమురళి గారు కేవలం భక్తే కాకుండా విప్లవం, స్ఫూర్తి కూడా జోడించాను అన్నారు. నిజానికి వెతికితే త్యాగరాజ కృతులలో అవి కూడా కనిపిస్తాయి. “యజ్ఞాదులు సుఖమనువారాల” , “తెలియలేరు రామ”, మొదలైనవి. భక్తి ప్రధానం గా ఉండి మిగిలినవి అంతర్లీనం గా ఉంటె అది గొప్ప సంగీత సాహిత్యం అవుతుంది. కేవలం సాహిత్య విలువల కోసం ఒకరి కీర్తన కంటే ఇంకొకరిది బాగుంది అని, వీరి కృతులలో కంటే వీరి కృతులలో సాహిత్యం బాగుంది అని ఎలా అనగలం?
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/08/2011 11:47 pm
మొదటి వేంకటమఖి నాయక రాజుల కాలం లోని వాడు కాగా ముద్దు వేంకటమఖి మరాఠా రాజుల కాలం వాడు. చరిత్ర వీరికి సంబంధించినది ఇంకా మొన్నటి కాలమే గనక ఎంతోకొంత స్పష్టం గానే ఉంది. పైగా మనకన్నా తమిళదేశస్థులు ఈ విషయంలో శ్రధ్ధ చూపించారు. పరిశ్రమ చేయగలిగిన వారికి సంగతులు తెలుస్తాయి.
ఇంక సంగీత లక్షణ గ్రంధాలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సంగీతం + సంస్కృతం రెండూ బాగా తెలిసిన వారు వీటిని గురించి మాట్లాడగలిగిన వాళ్ళు. చర్ల గణపతిశాస్త్రి గారిలాంటి వాళ్ళు సంగీత రత్నాకరం వంటి గ్రంధాలని తెలుగు చేసారనుకుంటాను. ఎవరన్నా ఇటువంటి పనులు చేయడం లో శ్రధ్ధ చూపించగలగాలి. మన వాళ్ళు పైపై విషయాలు మాట్లాడేసి బతికేయడానికి అందులోంచి అరకొరగా విషయాలని వివరించడానికి అలవాటు పడిపోయి ఉన్నవాళ్ళు మరి:)
మిగతా ఇతర శాస్త్రాలకి ఎలా అయితే లక్షణ గ్రంధాలున్నాయో, వాటి అనువాదాలున్నాయో సంగీతానికి సైతం ఉన్నాయి. ముందు తరాలు కృషి చేసి పెట్టాయి. మనం వాటిని నిలబెట్టుకోవడం లేదు.
సంకీర్తనా లక్షణం సంస్కృతంలో అన్నమయ్య రాసినట్టూ దానిని పెద తిరుమలయ్య వ్యాఖ్యానం రాసినట్టూ దానిని అనుసరించి సంకీర్తనా లక్షణాన్ని తాను తెలుగు చేసినట్టూ అన్నమయ్య పెద్ద మనవడైన చిన తిరుమలయ్య చెప్పాడు. అందులో ఆనాటి సంగీత లక్షణ గ్రంధాల ప్రస్తావనలున్నాయి. ఈ పుస్తకం ఒకప్పుడు టిటిడి అచ్చువేసింది. ఇవాళ ఆ ప్రతులు సైతం లేవు. వాళ్ళు మళ్ళీ దీనిని కూడా తిరిగి ప్రచురించలేదు. టిటిడి కి మరి డబ్బులకి కొరత. పనిచేసేవాళ్ళకి కొరత. విశ్వవిద్యాలయాలు తెలుగున పనిచాతకాని వాళ్ళతోనీ ముందుచూపు లేని వాళ్ళ తోనీ కదా నడుస్తున్నాయి. అంచేత వాటినించీ మనం ఏదీ ఆశించడానికి వీలేలేదు.
రమ.
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:
11/06/2011 12:49 am
కొండంత కృషి చేసిన తెలుగువారు ప్రస్తుతం శాస్త్రీయ సంగీతంపై పట్టుకోల్పోతున్నారన్న బాధే, నేను వ్యక్తపరిచిన నిరాశా, నిస్పృహాలకి కారణం రమగారూ! సాహిత్యంలో పసవుంటే దాని కాళ్ళమీద అదే నిలబడుతుంది. ఎవరి భుజాల ఆసరా అవసరం లేదు. కాదనను. అన్నమయ్యని మినహాయిస్తే, మిగతా వాగ్గేయకారులు ఎంతో కొంత భావ సౌందర్యం సంగీతంలో చూపించారనే నా భావన. అవి అత్యంత రమణీయాలు కాకపోయినా పాడుకుంటూ భావాన్ని అస్వాదించడానికి ఆస్కారం ఉన్నాయి. కేవలం వచనం ఒక్కటే ఇరికించ లేదు. బాలమురళిగారి రచనలు చూసాకా నాకలా అనిపించలేదు. అదే రాసాను. ముందు కాలాన్ని నిర్వచించలేమని తెలుసు. త్యాగరాజు తర్వాత అంత ప్రతిభగల మరో తెలుగు విద్వాంసుడు పుట్టడానికి వందేళ్ళ పైనే పట్టింది. రాను రానూ సంగీతం పట్ల తెలుగువారికి శ్రద్ధ తగ్గుతోంది. మరలా పుడితే మంచిదే! నా నిస్పృహా కాలం ఎంత సాగుతుందో చూద్దాం. అంతవరకూ బాలమురళే మనుకున్న వాగ్గేయకారుడు. ఇది చెప్పడానికి సంకోచించనవసరం లేదు.
ఇహ అన్నమయ్య సాహిత్య స్థాయి వేరన్నది అందరికీ తెలుసున్నదే! నా పోలిక మిగతా వాగ్గేయకారుల గురించి: వేంకట మఖి తెలుగువాడేనని చెప్పడానికి కొన్ని ఆధారాలున్నాయి. ఆయన రచనలు “చతుర్దండి ప్రకాశిక”, “రాగలక్షణమ్” సంస్కృతంలో రాయవచ్చుగాక. కానీ ఆయన తండ్రి గోవింద దీక్షితులది తిరుపతి సమీపంలో ఉన్న గ్రామం. ఆయన సుమారు 1575 ప్రాంతంలో అచ్యుతప్ప నాయకునికి మంత్రిగా చేసాడు. తరువాత రఘునాధనాయకుడి వద్ద కొంతకాలం చేసాక చనిపోయాడు. తదనంతరం ఆయన కొడుకులెవరూ మంత్రి పదవులు చేపట్టకపోయినా రాజాస్థానంలోనే గడిపారు. వేంకటమఖి 1620 ప్రాంతంలో చత్రుర్దండి ప్రకాశిక రాసాడు. సుమారు ఆ కాలానికే రఘునాధ నాయకుడు రాజయ్యాడు. ఆయన పేరున వేంకటమఖి ఒక వీణ కూడా చేసాడు.
కానీ మీరు చెప్పిన శరభోజి ఆ కాలంనాటి వాడు కాదు. మరాఠా నాయకులు 1675 ప్రాంతంలో తంజావూరుని పాలించారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, వేంకటమఖి లక్షణ గీతాలు రాసాడు. ఇవి కొన్ని సంస్కృతంలోనూ, తెలుగులోనూ ఉన్నాయి. లక్షణ గీతాలు పిళ్లారి గీతాల తరువాత అప్పట్లో నేర్పేవారు. ఇప్పుడు సరిగమలు వచ్చీ రాగానే, సరాసరి కృతుల్లోకే దూకేస్తున్నారనుకోండి. అది వేరే విషయం. వేంకటమఖి తెలుగువాడని చెప్పడానికింకో ఆధారం కూడా వుంది. ఆయన సంగీతం మీద చేసిన కృషికి వాళ్ళ వంశీకులు ఆయన మీద కొన్ని పాటలు రాసారు. అందులో “ముద్దు వేంకటమఖి” ముద్రతో కొన్ని తెలుగు పాటలు కట్టారు. ముద్దు అన్నది తెలుగు పిలుపే కదా? ఇవన్నీ చూసాక ఆయన తెలుగువాడనే చెప్పవచ్చు? అలాగే నాయకరాజుల కాలంలో తెలుగు, తమిళం రెండూ అధికార భాషలే కూడా!
ఇహ మన తెలుగు వారి గౌరవాలూ, పురస్కారాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అర్హులకి దండేయడం మనకి చేతకాని పని.
-సాయి బ్రహ్మానందం
కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి Raja Piduri గారి అభిప్రాయం:
11/04/2011 12:49 pm
శైలి పరంగా చూస్తే ఈ వ్యాసం (కనీసం చాలా భాగం) కొ. కు. వ్రాసిందే అనిపించకమానదు. కేతు వారు చెప్పినట్లు “ప్రథమ పురుష లో.. ఆత్మీయంగా.. చెప్పే ..జానపద కథకుడి అలవోక ధోరణి ” చాలా వాక్యాలలో చూడవచ్చు. ఇది కాక కొ. కు. కే ప్రత్యేకమైన పద ప్రయోగాలకీ, వాక్య నిర్మాణాలకీ ఉదాహరణలు కూడా ఈ వ్యాసం లో చాలానే ఉన్నాయి.
“పని పెట్టుకుని అభ్యసించలేదు”
“చేరినాక…..చదువుకోసాగింది”
“చాలించి, … ఉంచి, … వెతకసాగారు. ”
“లేదుపొమ్మన్నారు”
“కాంచన మాలచిత్రమైతే, అడిగారూ ? ”
శక్తి “ఇంత” ఉన్నది గనక
“కొంత నటించి ఉన్నది”
“గుప్పెడు పొట్టి”
బరువు “దిగిపోయిన దానల్లే”
“హీరో ఉండరాదు ! ”
పాత్ర “కు” నటించేసింది
“వేషం వెయ్యనన్నావటనే ? ”
పుచ్చుకున్నది
హెచ్చు గా వుంటుందని అప్పుడే తెలుసు
“ఇంకేం ! ”
పెళ్ళాడదలచలేదు
పెళ్ళాడగోరుతున్నట్లు
మనసు రాయి చేసుకుని కూర్చున్నది
“ఇట్లాగుటే జరగవలసింది ? ”
వాక్యాలనీ, శైలి ని అటుంచి, వ్యక్తి లోని అత్యంత కీలకమైన, ముఖ్యమైన లక్షణాన్ని సూటిగా చెప్పగలగడం కొ.కు. కు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. -“అయిన దానికీ కానిదానికీ ఉబ్బి తబ్బిబ్బు అయే అలవాటు ఆమెకు లేదు. .. తనను చూసి తానే విస్మయంచెందే మనస్తత్వం ఆమెకు లేదు. “- ఈ వాక్యం భానుమతి వ్యక్తిత్వానికి దర్పణం. ఆయువుపట్టు.
ఇందులో వ్యక్తం చేసిన భావాల లో కొ. కు. కి పేచీ ఉండే వే మీ లేవ నే అనిపిస్తోంది, – వ్యాసం చివరలో సెప్టెంబర్ నెల లో పుట్టిన వాళ్ళను గురించి రాసింది తప్ప.
ఈ ఒక్క పేరా లో మాత్రం ఇంకెవరో ఈ రచనలో ” చెయ్యి చేసుకున్నా”రనిపిస్తుంది. కానీ, వేరే వాళ్ళ వత్తిడుల వల్లా, బలవంతం వల్లా కొ. కు. కొన్ని సినిమా సమీక్షలు రాసారని విన్నాను. ‘చంద్ర హారం’ లో కత్తి యుద్ధాలు బాగున్నాయనీ, “అ. చే. ప. కూ.” ఒక సమగ్ర హాస్య చిత్రమనీ ఇత్యాది – వాటి జాబితా లో దీన్ని (కనీసం సెప్టెంబర్ నెల లో పుట్టిన వాళ్ళని గురించిన ప్రస్తావన) వేసుకోవచ్చేమో !
ఇంత విలువైన వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
మూడు వందల రామాయణాలు గురించి V R Veluri గారి అభిప్రాయం:
11/03/2011 5:21 pm
హంత తే కథయిష్యామి శృణు తత్త్వేన రాఘవ |
యస్య ఏతత్ ఆశ్రమ పదం శప్తం కోపాన్ మహాత్మనా |౧-౪౮-౧౫|
ఈ శ్లోకానికి పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ప్రతిపదార్థము, తాత్పర్యమూనూ!
ప్ర. అ. రాఘవ = రామా! మహాత్మనా = మహాత్ముడైన, (ఎవనిచేత) కోపాత్ = కోపమువలన, శప్తమ్ = శపింపబడిన, ఇదమ్ = ఈ, ఆశ్రమపదమ్ = ఆశ్రమము, యస్య = ఎవనిదో, తత్త్వేన = యథా ర్థముగా, తే = నీకు, కథ ఇష్యామి = చెప్పగలను, శృణు = వినుము, హంత =ఎంత ఆనందము .
తా. రామా! చాలా సంతోషము! ఈ ఆశ్రమము ఎవ్వరిదో, ఏ మహాత్ముడు కోపముచే దీనిని శపించెనో యథార్థముగా, చెప్పెదను, వినుము.
తిక్కన భారతంలో పలుకులపొందు గురించి వేమూరి గారి అభిప్రాయం:
11/01/2011 10:31 pm
అద్భుతం. తిక్కన గొప్ప కవి అని నాకు తెలుసు. కాని, ఎందుకు అంత గొప్ప కవి అయాడో ఇప్పుడు తెలిసింది.
అపరాధి గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
10/17/2011 3:58 am
కథ బాగుంది. మంచైనా చెడైనా మనసులో మాట మనసులోనో యెన్నాళ్ళు యేకారణం వల్ల దాచినా, చివరికి దానిని ఆప్తహృదయంతో పంచుకోకుండా వెళ్ళిపోవటం కష్టం. అదే జరిగింది. చాలా సహజంగా ఉంది. ఒక సంఘటనలో తమ ప్రవర్తన తప్పా ఒప్పా అన్నది యెవరికి వారికి మనస్సాక్షికి తెలుస్తుంది. అయితే సానుకూలంగా ప్రతిస్పందించే పరిపక్వత గల హృదయంకోసం చిచ్చొడి గట్టుకున్నట్లు బహుకాలం వేచి ఉండవలసి వస్తుంది. ఒక్కొకసారి అటువంటి అవుకాశం జీవితకాలంలో రాకపోవచ్చును కూడా. అదృష్టవశాత్తు అన్నపూర్ణకు ఆమె తమ్మడు అనే వ్యక్తిని చివరి రోజుల్లో భగవంతుడు చూపించాడు. ఆ ఆత్మకు అదే గొప్ప వరం. ఏక్సిడెంట్ కాదని , తన వలనే తండ్రి మరణించాడని తనను తాను దోషిలా అన్నపూర్ణ భావించుకో నవుసరంలేదు. చిన్నతనంలో తల్లిని రక్షించుకునేందుకు తండ్రైనా గాయపరచింది. చనిపోవచ్చన్న అవగాహన కలుగక పోవచ్చును చిన్నతనం కారణంగా. ఆత్మన్యూనతా భావంతో విచక్షణ తరచు కోల్పోయే తండ్రికి జరిగన సంఘటనలో పిల్ల తప్పు యేమీ లేదని తప్పక అనిపించి ఉండవచ్చును తన చివరి క్షణాలలో. శ్రీరాం జీవితంలో యీ నిజం గొప్ప కుదుపు. కాని అతడు పరిణతి చెందిని వ్యక్తి. శుభం.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
09/23/2011 11:22 pm
పెసరు (=పేరు), పెసఱు (పెసలు = greengram) ఒకే ధాతువు నుండి రాలేదు. ఉత్తర ద్రావిడ భాషలైన బ్రాహియిలో పిన్, మాల్తోలో పిన్జె అంటే పేరు. మధ్య ద్రావిడ భాషలైన పర్జీ, గదబ, ఒల్లరీలో పిదిర్ అంటే పేరు అని అర్థం. తమిళంలో పెయర్, కన్నడలో పెసరు/హెసరు. ఇవన్నిటి ఆధారంగా పేరు *పిచర్/*పిసర్- నుండి వచ్చిందని నిరూపించడం సులభం.
పెసఱు (greengram) మాత్రం తమిళంలో పయఱు అని, కన్నడలో పెసఱు/హెసరు అని, నాయికీలో పెసళ్ అని అంటారు. దీనికి పచ/పచ్చ- = green అన్న ధాతువుకు ఏమైనా సంబంధం ఉండవచ్చునేమో కాని పేరుకు సంబంధించింది కాదు.
తెలుగులోని పెసఱు, ఉసిరు/ఉసురు మూలద్రావిడ మాతృకల నుండి కాకుండా కన్నడ నుండి వచ్చాయని మోహనరావు గారు అనడానికి ఆధారాలేమిటో నాకు బోధ పడటంలేదు. అచ్చుల మధ్య స- కార లోపం తెలుగులో సంపూర్ణమైన ధ్వని పరిణామం కాదు. ఒకే ధాతువుకు సంబంధించిన కొసరు, కోరు అన్న పదాలు కూడా తెలుగులో ఉన్నాయి.
సంఖ్యావాచకాల విషయంలో *చయ్‌న్ అన్న మూల ద్రావిడ ధాతువు తెలుగు శాసనాల కాలంలో ఏనుగా మాత్రమే కనిపించి, తరువాత ఆ రూపానికి ఏ మాత్రం సరిపోని అయిదు గా కనిపిస్తోంది కాబట్టి ఆ అయిదు తరువాతి రోజుల్లో కన్నడ నుండి అరువు తెచ్చుకున్నదిగా వివరించరించాల్సివస్తుంది.
తెలుగులో పెసఱు, ఉసురు,కొసరు మొదలైన పదాలు పుట్టుకతోనే తల్లి ద్రావిడభాష నుండి సంక్రంచిన పదాలుగా కాక, తరువాతి కాలంలో కన్నడ నుండి స్వీకరించిన పదాలుగా ప్రతిపాదించడానికి ఆధారాలు ఏవైనా ఉంటే వివరించగలరు.
శ్రీపాదరాయలు గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:
09/19/2011 12:03 am
జడమైన గుండె కి ‘స్పర్శ’ మణిప్రభవం – సంకీర్తనం!
**********
గౌరవ నీయులైన శ్రీ మోహన గారికి !
నమస్తే.
హరి నామ సంకీర్తనములకు మూల పురుషు డైన శ్రీ పాద రాయలు గురించి మీరు వ్రాసిన వ్యాసాన్ని పొల్లు పోకుండా చదివివించిందీ.. అంటే అందుక్కారణం -. మీ రచనా విధానం! ఆ వాగ్గేయ కారుని భక్తి, తత్వజ్ఞాన పద సంపదాసమూహం, సమ్మోహనం!
శ్రీ పాద రాయల బాల్యం, ..అతర్వాత సంఘటనలు ..అంతా కళ్ళ కట్టినట్టు ఒక కథలా చెప్పారు. కన్నడంలో రాసిన ఆ మహానుభావుని కృతులకు మీ తెలుగు అనువాదం రస రమ్యంగా వుంది. అక్షరాలు చక్కని సొగసు తేలాయి. మనసుని భక్తి భావంలో ముంచి తేల్చాయి. భగవంతుని పట్ల జడ మైన గుండె కి ఒక స్పృహని, స్ప ర్శ ని కలిగించే వైద్యం – వాగ్గేయ కారుల భక్తి పదం, పథం – హరి నామ సంకీర్తనం!
హరిపాదోదక మీ కావేరి
విరజానది స్నానముజేసి
అని చదవంగానె, భక్తి నదిలో మునకేసినట్టుంటుంది. అక్షరాల అంచుల్లోంచి ఒక పవిత్రతా భావం జాలు వారుతూ… తీపితేనెవాన తుంపరలు చిమ్ముతున్నట్టు… అనిపిస్తుంది. ఎంత మధురంగా వుందీ భావం!
కాలికి యందము హరియాత్రలె
ఆలయపు టందము తులసి బృందావవనము
చాల యందము చెవికి విష్ణు కథలు
ఇక్కడ ప్రహ్లాదుడు కనిపిస్తాడు..చేతులు జోడించి హరిని సంకీర్తిస్తున్నట్టు! ‘మస్తకమున పర వస్తు’ అని అంటున్న ఈ వాగ్గేయ కారుని మాటలకు ప్రత్యేక విశ్లేషణ ఏదైనా వుండి వుండాలేమో ననిపిస్తుంది. అలాగే.. ‘మనసిజపితునికై..’ అంటున్నప్పుడు కూడా!
దయకై తనుమనధనమ్ము లన్నిటి
నీదు పదకమలములం దుంచితిని
మఱిక నన్ను మాయ జేసెదవె
సరకు నొసగితిని పిదప సుంక మేల నయ్యా..
చదువుతూ వుంటేనే, కళ్ళు చెమ్మ గిల్లుతాయి. భగవంతుని పాదారవిందాలు దర్శనమౌతాయి. భక్తుని ఆవేదన, గళం లో ఆర్ద్రత అంతా కలసి ‘ సరుకు నొసగితిని కదా, మరి సుంకమేల నయ్యా!’ అని బేలగా అడుగుతున్నప్పుడు..ఆయన గొంతు జీర బోయి వుండెనేమో!…అన్న భావన నాకెంతో గొప్ప అనుభూతినిచ్చింది. భగవంతుణ్ని ప్రేమించి , తపించి, వెత చెందే హృదయం లోంచి పొంగే భక్తి రస భావ తరంగా లే.. వాగ్గేయ కారుల కీర్తనలు. అవి సజీవ నదులు. సంగీత స్వరాలను దారులు గా చేసుకుని, అమృత ధార లై ప్రవిహిస్తూ వుంటా యి ! అందుకే, ఎంత పానం చేసినా గానాన్ని, ఇంకా దాహం గానే వుంటుంది. కారణ జన్ములు. తపో ధనులు, భక్తి జ్ఞాన సంపన్నులు – వాగ్గేయ కారులు. సృష్టి కర్తకు, సంసార బంధులకు,బందీలకు మధ్య వారు సంధాతలు!
కాకుంటే, ఎంత తపిస్తే దక్కేను సామాన్యులకు! ఈ కావేరినది తీరాన ఈ విఠలుని సందర్శనం !?
మీ రచనలో మరి కొన్ని సరి కొత్త విషయాలను కూడా చదివి తెలుసుకోవచ్చు. ‘సావి రహే..’ పాటకి ముందు యమునా తీర.. శ్లోకాన్ని పాడాలని మీరొక నిజాన్ని తెలియ చేసారు. (కాని,సినిమా పాటలో ఈ సాంప్రదాయం అనుసరించినట్టు లేదు. కదూ!) అలాగే, ఉగా భోగము అంటె ఒక రాగా లాపన అని, ఐతె, అది అర్థవంతమైన పదాలతో కూడి వుంటుందనే కొత్త విషయం కూడా తెలుసు కోవచ్చు.
ఇక వృత్త మాలిక, దండకము, భ్రమర గీతం, వేణు గీతము.. వీట్లకి తెలుగు అనువాదం చాలా బాగుంది.
నిజమే! కన్నడం వచ్చిన వారికి శ్రీపాద రాయల వారు రాసిన కన్నడం సులభంగానె వుండొచ్చు! అయితే, ఆ భాష రాని మన వారికి మాత్రం, తెలుగు లో మీ అనువాదాలు రసరమ్యంగా వున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరిక్కడ పేర్కొన్న సంగీత సూచనలను అనుసరిస్తూ.. కీర్తనలను ఆలపించే అవకాశాన్ని ఈమాట పాఠకులకు కలగ జేసారు. స్వరార్చన చేసుకునే హరి గాన ప్రియులు – ఇదొక అదృష్టంగా భావిస్తారు.
సొంపుచూపుల సొబగు సోగ కనులకు శరణు
సంపంగి కుసుమంపు నాసికకు శరణు
గుంపు రత్నపు కర్ణకుండలములకు శరణు
ఇంపుటద్దమొ యను కపోలములకు శరణు
ఇక్కడ నాకు అన్నమాచార్యుల కీర్తన లోని పదాలు చటుక్కున గుర్తుకొచ్చాయి
కులికెడి మురిపెపు కుమ్మరిపు తన
సళుపు చూపులకు చాంగు భళా
పలుకుల సొలపుల పతితో కసిరెడి
చలముల యలుకకు …” .
‘కర్ణాటక సంగీతానికి పటిష్ఠ మైన పునాది వేసిన వారు శ్రీపాదరాయలు’ అని అన్నారు. నేనూ కర్ణాటక సంగీతం వింటూ వుంటా అప్పుడప్పుడు.! మీరన్నట్టు వాగ్గేయకార త్రయం లా.. వీరి పేరు ఎక్కువ గా నేను విన లేక పోయా మరి!
ఈ సాహిత్య వ్యాసాన్ని విపులీకరించి, విశదీకరించి రాయడంలో గల మీ కృషిని, శ్రధ్ధా సక్తులను మనఃస్ఫూర్తి గా ప్రశంసిస్తూ… కర్ణాటక సంగీత సాహిత్య పద పితామహుడైన శ్రీ పాద రాయల వారికి వందనములిడుతూ…
గౌరవాభినందనలతో –
ఆర్.దమయంతి.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/14/2011 6:52 pm
సాహితీప్రియుడైన నా తమిళ స్నేహితుడు సుబ్రమణ్యంగారని ఒకాయనను ఈ విషయాన్నిగురించి అడిగాను. అతడు http://dsal.uchicago.edu/dictionaries/tamil-lex/ నుండి కావలసిన విషయము సేకరించి నాకు ఉత్తరము వ్రాసినారు. అతడు ఇచ్చిన విషయము ప్రకారము నూగారు నూంగు + కారు లేక నూఁగు + కారు లేక నూన్ + కారు అవుతుంది. కారు అంటే సామాన్యమైన అర్థము నలుపు. కాని కారు అనే పదానికి మగవారి వెండ్రుకలు, ఎలుక వెండ్రుకలు అని కూడ అర్థము ఉన్నది. కాబట్టి నూఁగారు అంటే రోమావళి అని అర్థము వస్తుంది. కాలక్రమేణ అది కొన్ని చోటులలోని రోమావళికి మాత్రమేఎ పదము అన్వయించిందేమో? నేను తొడల రోమావళిని కూడ నూగారు అని చదివియున్నాను (చీమలబారులాటి నూగారు :-).
நூங்கு²-தல் nūṅku- v. intr. 10. Men’s hair; ஆண்மயிர். (பிங்.) 11. Rat’s hair; எலிமயிர். (பிங்.) 12. Black leprosy; கருங்குட்டம். காரக்குறைந்து (கலித். 65). 13. Darkness, gloom of night; இருள். காரடுகாலை (பரிபா. 12, 85). 14. Ignorance, illusion; அறிவு மயக்கம். களவென் னுங் காரறிவாண்மை (குறள், 287). 15. Rancour, deepseated and implacable hatred; ஆறாச் சினம். (பிங்.) 16. Freshness, greenness; பசு மை. காரார் குருந்தோடு (திணைமாலை. 112). 17. Beauty; அழகு. (பிங்.) 18. Ripeness, maturity, flowering period, as of a plant; செவ்வி. கார்க் குவளை காலுங் கனல் (பு. வெ. 12, பெண்பாற். 11).
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
09/14/2011 2:11 pm
“తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది” అని అన్నది చిన్నయసూరి, చెళ్ళపిళ్ళ కాదు. ఇకపోతే నేను “నునుపారు” లోని ఆరు కి అర్ధం చెప్పలేదు. నునుపు+ ఆరు అని విరిచినట్టుగానే నూగు+ఆరు ని విరవమని సూచన చేసాను. కామేశ్వర రావుగారి వివరణ మరీచులు అన్నది ఒప్పు. మనం నిఘంటువులని అర్ధ వివరణ కోసం మాత్రమే చూస్తున్నాం తప్ప వాటిని సవరించుకోవడమ్ దిశగా గాని, పదాల సంఖ్యని పెంచుకోవాలని గానీ ప్రయత్నమ్ పెద్దగా చెయ్యలేదు. అదునా ఆధునిక కాలంలో ఆసక్తీ అర్హతా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వేరే వృత్తులకి బతుకుతెరువుకి వెళ్లడమూ. ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ పనులకి సరిపడా శ్రధ్ధా సామర్ధ్యాలను చూపకపోవడమూ కారణంగా ఉన్న నిఘంటువులతో కుస్తీలు పట్టుకోవలసి వస్తోంది.
పాత తెలుగుతో పనిచేసే క్రమంలో నిఘంటువులతో పనిచేసే వారికి అందరికీ కొలిచాల లాగే ఈ విషయాలు అనుభవంలోకి వస్తాయి. కవిత్వం విషయంలో మనం కవి హృదయాన్ని అనుసరించాలి తప్ప ముక్కస్యముక్కహ అన్న రీతిలో అర్ధాలని చూడకూడదు కూడాను. అక్కడ ఒప్పైన అర్ధాన్ని మనం తీసుకోవాలి. నూగారు లోని ఆరు సంఖ్యా పదం లోని ఆరు ఒకటి కావు గనక ఇది వేరే విషయం. నూగు అన్నదానికి నేను నూగు+ఆరు గానే విభజించుకుంటాను. మనకి ఇవాళ అరసున్నలూ.. ఖండబిందు పూర్ణబిందులూ.. మామూలు ర బండి ర లూ చాలా తికమకతొ కలిసిపోయి ఉన్నాయి. అందులో సరైనవి ఏవో కానివి ఏవో నిఘంటువులూ ఇవ్వడం లేదు. ఎవరి తోవని అనుసరించి దేన్ని సాధించాలో స్పస్టమైన రీతి ఒకటి ఉన్నట్టు కనబడని సందర్భాలు చాలా ఎదురౌతాయి. చూద్దాం ఇతరులు ఇంకేమంటారో??
రమ.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
09/14/2011 1:39 pm
“పయిఁ బ్రాకుమరీచుల నూఁగు నూఁగు లేఁ
గొమ్మలు వట్ట”
ఇక్కడ మరీచులు అంటే కిరణాలు. మిరియాలు కాదు. మరీచము, మరిచము అంటే మిరియము. దానికి బహువచనం మరీచములు అవుతుంది కాని మరీచులు కాదు. పైగా ఇక్కడసలు మిరియపు తీగల, కొమ్మల ప్రసక్తి అవసరమే లేదు! మరీచి – కిరణము. మరీచులు – కిరణాలు. చకోరాలకి చంద్రకిరణాలు ఆహారమని కవిసమయం కదా. పైన ప్రాకే చంద్రకిరణాలనే లేలేత కొమ్మలని (అన్నిసార్లు లేత ఎందుకంటే వెన్నల కిరణాలు అంత సన్నగా ఉన్నాయి కాబట్టి). వాటిని పట్టుకోడానికి తమ చంచువులని కదులుస్తున్నాయి. నూగు అంటే ఆకులమీద, కాయలమీద ఏర్పడే చిన్నచిన్న ముళ్ళు అనే అర్థం దగ్గర యీ పద్యం ఎందుకిచ్చారో నాకు తెలియడం లేదు. అది పొరపాటే అయ్యుండాలి.
ఇక ఇక్కడ “నూగు” అంటే “లేత”, “నునుపు”, “సన్నని” అన్న అర్థాలేమైనా తీసుకోవచ్చు. సన్నని అన్న అర్థమే నాకు సబబుగా తోస్తోంది. నూగుకి సన్నని అనే అర్థం తీసుకున్నా నూగు+ఆరు అన్న విరుపుకి అభ్యంతరమేమీ లేదు. “ఆరు” అన్న పదానికి వెంట్రుకలన్న అర్థం ఎలా వచ్చిందన్నది పరిశీలించవలసిన అంశం.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
09/12/2011 2:18 pm
@కామేశ్వర రావుగారు: మగధీర, మగమహరాజు ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. అలాగే మహాతల్లి, మహమ్మారి, అతిచిన్న, అతిగారాబం అన్న ప్రయోగాలు వాడుకలో ఉన్నాయి. నా దృష్టిలో రాజ్యపుసిరి అన్నది రాజ్య, సిరి అన్న రెండు పదాంశాలు ‘పు’ అన్న ప్రత్యయంతో కలిసి ఏర్పడిన పదబంధమే కాని ఒక సమాసం కాదు. నేను మాట్లాడుతున్నది ఒకే పదబంధంలో ప్రత్యయ రహితంగా చేరి సమాసంగా వచ్చేవి. కనుగవ, నేత్రద్వయం అంటామే గానీ, కనుద్వయం, నేత్రగవ అనంకదా! పెనుచీకటి = పెంజీకటి అంటాం, లేదా, గాఢాంధకారం అంటాం; కానీ, గాఢచీకటి, పెనంధకారం అని అనలేము కదా! అట్లాగే ముల్లోకాలు, ముజ్జగములు అన్న ప్రయోగాలు ఉన్నా, మున్నేత్రాలు, మున్నదులు, ముస్సాగరాలు అన్న ప్రయోగాలు ఒప్పవు గదా!
అవునండీ. సంస్కృతంలో పాదిక అంటే నాలుగోవంతు. పశువులకు, పద్యాలకు నాలుగు పాదాలుంటాయి కాబట్టి పాదిక అంటే నాలుగోవంతు!
మోహనరావుగారి అభిప్రాయం:
ఆరు అంటే నిండు. ఆఱు అంటే ఉపశమించు. నూగారులో ఆరు లేదు (కొన్ని నిఘంటువులలో ఆరుకు ఆ అర్థం ఇచ్చినా). ద్రావిడ భాషలలో నూన్-అంటే సన్నని, అతిచిన్నని అన్న అర్థాలు ఉన్నాయి. కారు- అంటే నలుపు. నూగారు = నూన్ + కారు అనే నా అభిప్రాయం.
వేమూరి గారు అన్నారు:
ఇప్పటికీ ఈ ప్రయోగం ఉందో లేదో ఎవరైనా విశాఖా జిల్లా వారు చెప్పగలరా? ఈ అర్థంలో ముచ్చిలకకు వ్యుత్పత్తి ఏమై ఉంటుందంటారు?
రాగలహరి: ఆభేరి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/12/2011 10:14 am
మోహనరావుగారూ,
మీరన్నది నిజమే. చాలా సైట్లలో అలాగే రాశారు. కానీ అది తప్పు.
స్వరాల రీత్యా మధ్యమావతి (లేదా మేఘ్ మల్‌హార్)లో పడని పెద్ద నిషాదం అందులో వినిపిస్తుంది. అలాగే గ1 కూడా.
మధ్యమావతి స రి2 మ1 ప ని1 స. అంతే.
కానడా బహార్ స్వరాలు స రి2 (మ1) గ1మ1 ని1ధ2ని2 స, స ని1ప మ1 ప గ1మ1రి2స.
ఇది నేను ఎవరూ పాడగా వినలేదు కాని స్వరాలను బట్టి ఆ పాటకు ఇది సరిగ్గా సరిపోతుంది.
విశ్వనాథన్ కాఫీకానడా వంటి రాగాలను కూడా ఎక్కడో విని ఉపయోగించాడు కనక అతని ప్రయోగాలు అంత సులువైనవిగా ఉండవు.
కానడా బహార్ సంగతి నాకు బి. సుబ్బారావు రాసిన రాగనిధి వాల్యూంలోనే తెలిసింది. అది హిందుస్తానీ, కర్నాటకరాగాల వివరాల పుస్తకం. 4్ సంపుటలతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రచయిత కన్నడిగుడు కనక రెండు పద్ధతులూ తెలిసినవాడై ఉంటాడు.
పెండ్యాల తెలుగులో మార్చిన తీరు నాకంతగా నచ్చలేదు. గుడ్డిగా కాపీ కొట్టడం ఆయన పద్ధతి కాదనేది సుగుణమే అయినప్పటికీ తమిళ వెర్షన్ బావుంటుంది.
రాగలహరి: ఆభేరి గురించి మోహన గారి అభిప్రాయం:
09/10/2011 11:05 am
నాకు సంగీతం ఎక్కువగా తెలియదు. కాని కర్నాటిక్ సైటులో ముత్తుక్కళో కణ్గళ్ రాగము మధ్యమావతి అని ఉన్నది. ( విన్నానులే ప్రియా ) ఈ సైటులో మధ్యమావతి హిందుస్తానీ సారంగ్ రాగము లాటిది అని ఉన్నది.
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/10/2011 10:46 am
ఆరు అంటే నిండు, ఉపశమించు, వెండ్రుకలు (నూగారులాటి పదాలలో) అని అర్థము. సంఖ్యను సామాన్యముగా ఆఱు అని వాడుతాము. కాని యిప్పుడు బండి ఱ వాడడము లేదు కాబట్టి ఈ సందిగ్ధము, సందేహము కలుగుతుంది. రాణి తెలుగు పదము, రాజ్ఞి సంస్కృతపదము. అందువల్ల తెలుగు సంధితో పట్టపురాణి. సంస్కృతములో పట్టరాజ్ఞి అని అనుకొంటాను. పాదము అంటే ఈ సుభాషితము నాకు జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞానసముపార్జన ఎలాగవుతుంది అనేది ఇందులోని అంశము.
ఆచార్యాత్ పాదమాదత్తే
పాదం శిష్యః స్వమేధయా
పాదం సబ్రహ్మచారిభ్యః
పాదం కాలక్రమేణచ
గురువువద్ద ఒక నాల్గవ వంతు, (teaching)
స్వయంకృషివలన నాల్గవ వంతు, (effort)
సహచరులతో నాల్గవ వంతు, (discussion)
మిగిలినది కాలక్రమేణ (experience)
విధేయుడు – మోహన
మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి kavitha గారి అభిప్రాయం:
09/06/2011 10:29 pm
గౌరి గారు, మీ కథలు అనువాదాలు కొన్ని విపుల మాస పత్రిక లొ చదివాను.
ఇది అన్నిటి లోకి మర్చిపోలేనిది! అనువాదం కాకపోయినప్పటికీ…..
పైన మోహన గారు చెప్పినట్టు బిడ్డలను వదలి వేయటము అన్ని చోట్లా ఉన్నదే, కాని ఆడపిల్ల అనే కారణం తో వదలి వేయటము కేవలము మన సంస్కృతి లోనే!!
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/06/2011 8:36 pm
1) కేతన తరువాత సుమారు ఏడు శతాబ్దాలు గడిచాయి, మధ్యకాలములో వచ్చిన ఎందరో కవులు ఎన్నో సమాసాలను ప్రయోగించి ఉంటారు గదా? మూడు నేత్రములు, మూడు మూర్తులు సరియైన సమాసము, కాని మున్నేత్రుడు కాదు, ఎందుకంటే నేత్రుడు మహద్వాచకము, నేత్రము అమహద్వాచకము. కొన్ని సమాసములు వైరి సమాసములవలె కనబడవచ్చును, కాని అవి అలాటివి కాదు. ఉదాహరణకు లక్ష్మిమగడులో లక్ష్మి సంస్కృతపదము, మగడు తెలుగు పదము, రాజ్యపు సిరి లాటిదే ఇది కూడ. సంబంధ షష్ఠీవిభక్తి ఉన్నప్పుడు ఇలాటివి చెల్లుతాయి. అదే విధముగా ఆ కాంత అక్కాంత, నాదు శిరము నాశిరము సరియైనవే. వేయిపద్మాలు కూడ సరియైనదే. ఇట్టివి కోరాడ మహాదేవశాస్త్రి Historical Grammar of Telugu, గణపవరపు వేంకటపతికవి ఆంధ్రకౌముదిలో చర్చించబడినవి.
2) నన్నయగానీ, తిక్కనగానీ దీర్ఘముపైన అరసున్నను నిండుసున్నగా ఉపయోగించలేదు. ఎందుకంటే అలాటి ప్రయోగము వారి కాలములో, అప్పుడు వారుండిన ప్రాంతములో లేదు. కాని నన్నెచోడునికి అవి సుపరిచితములు, అందుకే వాడాడు అలా. మదరాసులో ఆండవాళ్లు అని వాడుతారు, కాని ఆంధ్రదేశములో అలా వాడరు. అందువల్ల చెన్నై తెలుగు మాండలికములో వ్రాస్తే కూంతురు, ఆండవాళ్లు సహజముగా ఉంటుంది. కాని ఆంధ్ర మాండలీకాలలో అవి ఎబ్బెట్టుగా ఉంటుంది.
విధేయుడు – మోహన
తెలుగుదనం (not in lighter vein) గురించి రాజేష్ దేవభక్తుని గారి అభిప్రాయం:
09/06/2011 3:03 am
వెంకటేశ్వర రావు గారు, నమస్కారం.
మీరే అన్నట్లుగా ” పెసరట్టే తెలియని, తినడానికే ఇష్టపడని జనాభా ఉందంటే ” ఆ ప్రాంతంలో తెలుగుదనం తగలపడిపోయినట్లే కదండీ. ఇంకా దేని గురించి మీ కోపం. మీరు అమెరికాలో ఉన్నందున…. మీ ఒక్కరికో , ఇంకోతమందికో పెసరట్టు చేసే విదానం తెలిసినందున, అక్కడ తెలుగుదనం బ్రతికే ఉంది అనుకోమంటే , అనుకుంటాం…! నేను 1984 లో పుట్టాను, నాకు పెసరట్టు తెలుసు , స్వతహాగా చేసుకోగలను కుడా (కావాలని మా అమ్మతో కుర్చుని నేర్చుకున్నాను), అంటే దాన్ని అంత ఇష్టపడ్డాను. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో చాలా మంది దీనిని ఎరుగుదురు కుడా..!
ఇదే కాకుండా దిబ్బరొట్టె , జోన్నరోట్టే కూడా నా చిన్న వయసులో తిన్నాను. అయితే ఇప్పుడు అవి అంతగా లేవు, ముఖ్యంగా జోన్నరోట్టే. మీరు చెప్పిన తరువాతే ” పెసరట్టు ” తెలుగు వారిదని నాకు తెలిసింది. కాని నాకు ఇష్టమైన ఉపహారం ఏది అని ఎవరైనా అడిగితె నేను చెప్పేది పెసరట్టు, పూరి.
ఈమాట సెప్టెంబర్ 2011 సంచికకు స్వాగతం! గురించి lyla yerneni గారి అభిప్రాయం:
09/05/2011 3:46 pm
సెప్టెంబర్ 2011 సంచిక ముందుమాట రాసినదెవరు?
రచన: పక్కన పేరు లేదు.
దాని కిందే చూస్తే ఒక చిత్రం, ఒక రచయిత వివరాలు ఉన్నాయి. ఈ సంచికకు, ఈ ముందుమాట గాని, వారు రాసినారా? కాని మరణ తేదీ చూస్తే అది సంభవమా? కాదు.
మరి ఆయన గురించిన వివరాలు అక్కడ ఉంటానికి కారణం?
ఇంకా కొంచెం కిందికి వస్తే – ఈ సంచికలో మీకోసం: అని ఒక రచయితల – రచనల చిట్టా ఉంది.
అవి మాకోసం ఐతే, మరి దానికి పైన ఉన్న సమాచారం ఎవరికోసం? మో కోసమా?
ఆ రచన ఎవరిది?
అసలెవరికీ ముందుమాట? ఎవరికి ఈ స్వాగతం? పత్రిక ఎన్నో సంచికో చెపితే చాలు. ఈ పేజీ తెల్లగా వదిలేసినా, పాఠకులు ఎడమ పక్కకి వెళ్ళి సంచిక ఎంచుకుంటారు. కుడిపక్క స్పష్టంగా రచనలు కనిపిస్తున్నాయి. రచయితల పేర్లు అక్కడే ఉన్నయి కూడాను.
ఈ పత్రికలో, నిజంగా ఆ జాగాను తాజా మరణాలకు ఎలాట్ చేశారని, ఎవరికో, ఏదో ఒక మూఢ నమ్మకం ఉంది, అందువల్ల ఆ పేజీ Template మార్చలేకపోతున్నారనీ నాకనిపిస్తున్నది.
Is a break thru possible? can we have a simple ‘table of contents’ page like any other modern magazine?
లైలా
జపనీస్ పైన్ చెట్టు గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:
09/03/2011 10:49 pm
.
ఎంత ఎదిగి పోయావయ్యా !
***
మార్చ్ 11 న జపాన్ లో జరిగిన బీభత్సం తర్వాత..ఆ వూళ్ళో ఏమీ మిగ ల్లేదు. ప్రాణ నష్టం, తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు నిరాశ్రయులయ్యరు. ఇల్లూ వాకిలీ లేదు. వర్తకాలు లేవు, వుద్యోగాలూ లేవు. పరిస్థితి ఎప్పుడు కుదుట పడుతుందో తెలీదు. కాలూ చేయీ ఎప్పటికి కూడుతుందో తెలీదు. సునామీ సృస్ఠించిన విధ్వంసానికి ప్రత్యక్ష మూగ సాక్షి లా మిగిలింది ఆ వూరు.
నిజమే, ఆ వూరు వూరంతా నీరవుతోంది. కన్నీరు మున్నీరౌతోంది. ఐతే, వాళ్ళు విలపిస్తోంది. తమకు జరిగిన అన్యాయానికి కాదు!
సముద్ర తీరాన వందడుగుల ఎత్తులో రెండొందలేళ్ళ చరిత్ర గల్గిన డెభై వేల దేవదారు వృక్ష సమూహాల చిక్కని తోపుని – సునామీ వొచ్చి ఆ పళంగా తుడుచిపెట్టుకు పోయినందుకూ కాదు!
మరెందుకంటే- తమను సైనికుల్లా కాపాడిన దేవదారు సైన్య దళం మొత్తం ప్రాణ త్యాగం చేసి పోతూపోతూ సెల్యూట్ గా మిగిల్చి పోయిన ఒకే ఒకే ఒక్క చెట్టుని..చూస్తూ..దుఖిస్తున్నారు.
తమ ప్రాణాలు ఒడ్డి ఐనా సరే దాన్ని బ్రతికించుకోవాలని తపిస్తున్నారు. అందుకు ఒక రిటైర్డ్ మాస్టారు తన సర్వ శక్తిని ధార పోస్తున్న వైనం..ఈ వ్యాసం.
ఎంత అద్భుతం! ఇంతద్భుతమైన సజీవ కథని ఈ మధ్య కాలం లో విని వుండం!
ఇన్ని వేల కళ్ళ చెమరింపుకి… ఇన్ని కోట్ల హృదయ స్పందనలకి అతని గుండె చప్పుడొక్కటే కారణం.. అంటే అతిశయోక్తి కాదు.
ఈ వొంటరి వృక్షాన్ని చూస్తూ వుంటే. రణ భూమిలో అయిన వారందర్నీ పోగుట్టుకున్న అర్జుని విలాపం గుర్తోస్తోంది.
దాని దుఖాన్ని చూస్తే – ఆత్రేయ తన సాహిత్యాన్ని తిరగ రాసుకునే వాడే మోననిపిస్తుంది. (మానూ, మాకును కాను..అనే పాట)
కష్టాలు కుంగదీయడం, దుఖాలు కమ్ముకోడం..హఠాత్తుగా ఒక్కరమై మిగిలిపోడం…అసలివేవి కావు విషాదకరాలు..అలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం పక్కనెవరూ లేక పోడమే నిజమైన విషాదం మనిషికి! అలాంటి దుర్దశకు, దురవస్థకు, నిరాశకు, నిస్పృహ కు లోను కాకుండ అతను- ఆ చెట్టు కి చేయూత నివ్వడమే ఇక్కడ మనల్ని కదిలించే విషయం, సన్ని వేశం!
ఇప్పుడా చెట్టుకి అతనొక సేవకుడు. ఒక తండ్రి. ఒక నేస్తం. ఒక ఆయువు. ఒక ఆత్మీయుడు. ఒక మానవుడు. ఒక దేవుడు. అదిన్నాళ్ళు తన ఎత్తు చూసి మురిసింది కానీ, తనకంటే ఎత్తైన మనిషి ఒకడున్నాడనీ, అతని హృదయ వైభవాన్ని చూడ్డం కోసమే తను మిగిలున్నాని అనుకుంటుందేమో ఆ చెట్టు !
ఈ ఒక్క చెట్టే కాదు, హృదయమున్న ప్రతి వారూ ఆ మాష్టర్ గార్ని అభినందిస్తారు.ఆ ఊన్నత హృదయానికి వందనమంటారు.
కొన్ని ప్రత్యేకమైన్ శాస్త్రీయ పద్ధతుల ద్వారా..ఈ వృక్ష జాతి మొక్కలు నాటుకుంటున్నాయి నర్సరీ లో. కొత్త ప్రాణాలు పోసుకుంటూ, కొత్త మొక్కలవుతున్నాయి. వాటిని మళ్ళీ ఈ తీరాన నాటి, దట్టమైన దేవదారు వనం చేయాలని అక్కడి ప్రజ కంకణం కట్టుకుని వుంది.అది అడవిలా విస్తరిస్తుంది. పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఐతే, ఇదంతా జరగడానికి మరో ఇరవై యేళ్ళు పడుతుంది. సందేహంలేదు. కాని, జపాన్ చరిత్ర లో మాత్రం జరిగిపోయిన విషాద సంఘటన కంటే, మాస్టారి మానవత్వపు విలువే గొప్పదిగా నిలిస్తుంది అని చెప్పాలి. !
ఆ దుర్ఘటనలో తాను ఇల్లూ, కారూ , సర్వం కోల్పోయినా…నిలువ నీడ లేకున్నా…..ఆ చెట్టు క్షేమం కోసం నిలువునా కృషి చేస్తున్న ఆ మాస్టారి సేవకు అందరూ జోహార్ అనక తప్పదేమో!మనిషి హృదయ వై శా ల్యాన్ని కొలిచేం దుకు ఒక్కో సారి ఆకాశం కూడా వెనకాడుతుంది . లేకుంటే, వందడుగుల దేవదారు, వొంగి వందనం చేయగలదా ఆ మాష్టారికి!?
ఇన్నాళ్ళు ఆ భూమి – నూరడుగుల చెట్లతో ఆకాశం మీద కవితలు రాసుకునేదిట! ఇప్పుడతని పేరు రాస్తుందేమో!!
నిజానికి ఈ జపాన్ పైన్ ఒక చిన్న వార్త. మన వార్త పత్రికలోమహా ఐతే ఒక బాక్స్ ఐటం కూడా కాదేమో! ‘ఒక వార్తని వార్త లా చెప్పడం వల్ల అది కేవలం చదివించడం వరకే పనికొస్తుంది. కాని, అదే ఒక కధ లా చెప్పడం వల్ల, ఆ వార్త ఎంతమందినో కదిలిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ప్రతిస్పందింపచేస్తుంది..సమాజ ప్రయోజనానికి ఉపకరిస్తుంది’ అని చెబుతూ వుండే వారు జర్నలిజం క్లాస్ లో మా మాస్టార్! ఆయన మాటలు అక్షర సత్యాలులా తోస్తున్నాయి ఇప్పుడిది చదువుతూ వుంటే!
మీ జపాన్ పైన్ చదివుతూనే..జపాన్ ని నాలుగు చెఱగులా చదివొచ్చా. పని లో పని గా ‘క్లబ్బు చప్టా సమాధి’ లో ఇంకా సజీవంగా వున్న ‘నిద్ర గన్నేరు నీ’ చూసొచ్చా. బావుంది. కొత్త పాఠకులకు మీరిలాంటి సౌలభ్యాన్ని కలిగిస్తున్న ఈ ప్రయోగమూ బావుంది. !
ఒక నిజ సమాచారం తో బాటు ఒక సందేశాత్మక మైన వ్యాసాన్ని అందించిన సంపాదకులకు అభినందనలతో..
– ఆర్.దమయంతి.
మాతృత్వానికి మరో ముడి గురించి మోహన గారి అభిప్రాయం:
09/03/2011 2:52 pm
మీకు మాత్రమే కాదు అంఅదరికీ నచ్చే కథే యిది. హృదయాన్ని పిండించే మంచి కథ. కథకోసం కొన్ని coincidences ఉన్నాయి. అవి కథ కనుక సమర్థించుకోవచ్చు, కాని నిజంగా అలా అవుతుందో లేదో తెలియదు. కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ, భారతదేశంలో మాత్రమే కాదు, అన్ని దేశాలలో బిడ్డలను వదలడము సామాన్యమే. దీనికీ సంస్కృతికీ పెద్ద లంకె లేదు. వదలినవాళ్లందరూ ఈ కథలోని నాయికలా బాధపడరు కూడా. ఇలాటి సంఘటనతో సింధుభైరవిలాటి చలనచిత్రాలను కూడ తీసారు. విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/02/2011 1:32 pm
పాదారంభములో మూఁడు పదమున్న మరొక పద్యము నాకు కనబడలేదు. కాని, లోఁగు పదాన్ని లోఁగు, లోంగు గాను ఉపయోగించిన ఒక పద్యము దొరికింది. అంటే కావలసినప్పుడు, అర్ధానుస్వారము, లేకపోతే పూర్ణానుస్వారమును ఉపయోగించాడు నన్నిచోడుడు. అంటే ఆ పదాలను రెండు విధాలుగా ఉచ్చరించాడు. ఆ పద్యాలు –
లోఁగుఁ దరమైన పొదరుల
నాఁగిన శకునంబ తలఁచు నడుగడుగునకున్
డాఁగఁ గెల నరయుఁ బ్రాణము
లీఁగుట కొడఁబడక మదనుఁ డెంతయు భీతిన్ – కు.స. – 5.13
(ప్రాససాంకర్యము చేయలేదు ఇక్కడ)
(దట్టమైన పొదలలో అణగిఉంటాడు, దుశ్శకునాలనుగురించి తలబోస్తాడు, దాగుకోడానికి పక్కల చూస్తాడు, ప్రాణాము విడువడానికి మనసొప్పక మన్మథుడు భయపడుతాడు)
వీంగు నపారసత్త్వగుణా విస్ఫురణం బరమేశ్వరోరు వా-
మాంగమునందు మున్నుదయమై నియమస్థితిఁ గొల్చి తద్దయున్
లోంగొని పేర్మితో నఖిలలోకములుం దగఁ గాచుచున్న వే-
దాంగు ననంతు విష్ణుఁ గమలాధిపు సంసుతిఁ దేల్తు సమ్మతిన్ – 1.4
ఇందులో వీఁగు, లోఁగొని అనేవి సామాన్య ప్రయోగాలు. వాటికి బదులు వీంగు, లోంగొని అని ప్రాసకై ఉపయోగిస్తాడు చోడుడు.
(విజృంభించిన గొప్ప సత్త్వ్వగుణశక్తితో ఈశ్వరుని పెద్దదగు ఎడమవైపు శరీరములో ఉద్భవించి నిష్ఠతో సేవించి శివుని అనుగ్రహముతో సకల లోకములను లొంగదీసికొని ప్రేమతో రక్షించు అనంతరూపుడైన లక్ష్మీపతి విష్ణువును నా స్తోత్రముతో సంతోషింపజేస్తాను)
వాఁడు, వీఁడు కు బదులు వాండు, వీండు అని ఉపయోగించిన ఒక పద్యము –
వీండేమి సేయుఁ బంచిన
వాండుండంగ నిక్కమునకు వధ్యుఁడుగా నా
ఖండలుఁడు గాక, యేసిన
వాండుండఁగ నేమిసేయు వరశర మనిలోన్ – 10.155
(నిజముగా పంపినవాడు ఉండగా వీడేమి చేయును? ఇతడిని పంపిన ఇంద్రుడిని చంపాలి. ప్రయోగించినవాడు ఉండగా బాణము ఏమి చేస్తుంది యుద్ధములో?)
ఇప్పుడు కూడ తమిళనాడులో ఆడవాళ్లను ఆండవాళ్లు అని అంటారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేది ఆండవాళ్ల మాటలకు అర్ధాలే వేరులే అవుతుంది 🙂
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/01/2011 1:05 pm
వ్యాసం బాగుంది, కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఒక రెండు విషయాలు –
1) నన్నెచోడుని పద్యము – పోడి, మూడు అనే పదాలలో డి కి ముందు, డు కు ముందు అరసున్న ఉన్నది. తెలుగులో సామాన్యముగా హ్రస్వాక్షరమునకు తరవాతున్న అరసున్నను నిండుసున్నగా వాడవచ్చును. ఉదా. తెలుఁగు – తెలుంగు, అనఁగా, అనంగా, ఇత్యాదులు. కాని దీర్ఘముపైని అరసున్నను నిండు సున్నగా వాడరు. కాని నేటికీ తమిళనాడులో ఇలాటి ప్రయోగాలు సామాన్యము. ఉదా. కూంతురు, రోంకలి, వాండు, ఇత్యాదులు. నన్నయ ప్రాససాంకర్యము చేయలేదు. అంటే అరసున్న ఉన్న పదాలను లేని పదాలను ప్రాసలో వాడలేదు. కాని తమిళ సంపర్కము ఉన్న నన్నెచోడుడు దీర్ఘముపైని అరసున్నను ప్రాసకై సున్నగా వాడాడు. అందువల్ల పోఁడి పోండి, మూఁడు మూండు ఐనది.
2) మిశ్రసమాసాలలో తెలుగు పదము ముందు, సంస్కృతపదము తరువాత వస్తే అది దుష్టసమాసము కాదు. సంస్కృతపదము ముందుండి తెలుగు పదము తరువాత వస్తే అది దుష్ట సమాసము. ముజ్జగములు సరియైనది, కాని మహాతల్లి సరియైంది కాదు. కాని ఇతర ద్రావిడ భాషలలో ఇలాటివి ఉన్నాయి.
విధేయుడు – మోహన
వేటూరి పాట గురించి మోహన గారి అభిప్రాయం:
09/01/2011 8:30 am
ఊషా అనే పదము సంస్కృతములో, తెలుగులో కూడ ఉంది. కాని దాని సామాన్యార్థము చవిటి నేల అనే, ప్రత్యేకార్థమే వేకువ అని. విధేయుడు – మోహన
గానభారతి గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
08/12/2011 5:08 pm
గానభారతి ఇటువంటి చర్చలకు మూలం కావడం ముదావహంగానే ఉన్నది. నేను పేర్కొన్నట్లుగా కాల మేదైనా మానవుల ప్రకృతులు కాలాతీతములు. యశస్వివంటివారు ఇటువంటి ఇతివృత్తం గల కథను ఇంకా వివరంగా “తెల్గీషు” గద్యంలోవ్రాస్తే ఆనందిస్తారనటంలో సందేహంలేదు. కాని ఒకవిషయం గమనించాలి. తెల్గీషులో చదివి ఆనందించవలసిన భాషా సౌందర్యం గాని, పదశిల్పంగాని, ఆలంకారికప్రయోగాలు గానీ, వర్ణనావైదగ్ధ్యం గాని, లయవిన్యాసాలు గాని వెతకడం పొరపాటే ఔతుంది. అట్లాగే గానభారతివంటి కవితా కథానికలలో ఈ అంశాలను విస్మరించి, తెల్గీషుభాషలో పద్యం వ్రాయలేదే అని వాపోవడంకూడ పొరపాటే ఔతుంది. అందుచేత వ్రాసిన మాధ్యమంలో ఆ మాధ్యమానికి లక్షణభూతమైన అంశాలను దృష్టిలో నుంచుకొని అందాన్ని ఆస్వాదించడం సహృదయుల ధర్మం. ఉదాహరణానికి పొడిమాటలతో సాగే డ్రామాను ఓపెరాగానో, బ్రాడ్వే సంగీతరూపకంగానో వ్రాసినప్పుడు వీనిని ఆస్వాదించే ప్రేక్షకులు, వాటిని తోలనంచేసే ప్రమాణాలూ వేఱుగా ఉంటాయి. గద్యేతర కవితామాధ్యమంలో కథను వ్రాసినప్పుడు (ఈనాటి వ్వవహారికభాష వాడటం లేదే అని వాపోకుంటే) ఈనాటి వచనకవిత్వంకంటె పద్యమే కథాకథనానికి సమర్థంగా, హృద్యంగా ఉంటుందనటంలో సందేహం లేదు. నేను వ్రాసినది సమర్థంగా ఉన్నా లేకున్నా ఇటువంటి కవితాకథానికా ప్రయోగాలు ఇంకా విరివిగాసాగాలనే ఉద్దేశ్యంతోనే నేనీ ప్రయోగాన్ని చేస్తున్నాను.
లైలాగారి సందేహాలకు సమాధానాలు:
1. రోమంథము = నెమరువేయుట . పోతనభాగవతంలోను, ముక్కుతిమ్మనగారి పారిజాతాపహరణంలోను ఈ పదం థకారయుక్తంగా ఉన్నది గాని సూర్యరాయాంధ్రనిఘంటువులో రోమంధము అని ధకారయుక్తరూపమున్నది. ఈ పదాన్ని వాడిన శ్రీకృష్ణమురళీగానపరవశములైన గోవులను వర్ణించే పోతనగారి పద్యం:
మమతన్ మోములు మీఁది కెత్తుకొని, రోమంథంబు సాలించి, హృ
త్కమలాగ్రంబులఁ గృష్ణు నిల్పి, మురళీగానామృతశ్రేణి క
ర్ణములం గ్రోలుచు మేఁతమాని, గళితానందాశ్రులై చిత్రితో
పమలై గోవులు చూచుచున్న వదిగో పద్మాక్షి! వీక్షించితే!
2. సత్సంప్రదాయముకురాయితమైన = సత్సంప్రదాయమునకు అద్దమువలె నాచరించుచున్న, అనగా సత్సంప్రదాయమునకు అద్దము బట్టినట్లున్న, ముకుర మనగా అద్దము.
3, గానభారతిలో దౌహృదవర్ణనపద్యాన్ని మార్చి నేను మాదవ్ గారికి సంస్కృతప్రతిని జూలై సంచిక రాకముందే పంపినాను గాని, ప్రాతప్రతియే అంతర్జాలంలో వారు ప్రచురించినారు. ఈ సంస్కృతపద్యరూపాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో దౌహృదవర్ణన వాచ్యంగా కాక చాలా మట్టుకు సూచ్యంగా మార్చబడ్డది.
ఆ మఱునాఁటినుండియె మదంగమునం దెవొ నూత్నచిహ్నముల్
గోముగఁ గాననయ్యెఁ, బలుగొంచెపుఁగౌఁను క్రమక్రమంబుగా
లేమినిఁ బాయఁజొచ్చె, లవలీదళపాండురమయ్యె గండముల్,
కామవరప్రసాదమనఁగన్ సమకూడిన గర్భమందునన్.
4.విశ్వనాథవారు చెప్పినది అక్షరాలా నిజం. “తినగ తినగ వేము తియ్యనగును” అనే వేమనలైనుకూ ఇదేఅర్థం.
గానభారతి గురించి lyla yerneni గారి అభిప్రాయం:
08/11/2011 12:51 pm
విశ్వనాథ సత్యనారాయణ వసుచరిత్రము (ఎమెస్కో ప్రచురణ) కు పీఠిక రాస్తూ, వసుచరిత్ర కావ్యము చదవటానికి ఇప్పటి పాఠకులు అధ్యైర్య పడనక్కరలేదనీ, – “మానవజాతిలో నది యొక అవివేకము. ప్రతివాడును తనకేమియు తెలియదనుకొనును. ఆ యనుకొనుట మానివేసినచో మన కావ్యములు కూడ చాలవరకు మనకు తెలియగలవు. నాల్గు మాటలు చదివిన తరువాత నైదవమాట కర్థము తెలియదు. నాకు తెలియుటే లేదని యా పుస్తకము నవతల పారవేయును. ఆ మాట యర్థము కానిచో తక్కిన మాటల కర్థమేమి? పద్యమంతయు చదివినచో నేదో కొంత తెలియదా? ఒక పద్యము తెలియలేదు. రెండవ పద్యము తెలియదా?” – అంటూ కావ్యాలు తప్పక చదవమని సలహా ఇస్తారు.
విశ్వనాథ సలహా నాకు నచ్చింది. ఆయన ఎంతమంది విద్యార్థులకో చదువు చెప్పిన పంతులయ్యె. నేను పద్యాలు అలాగే చదువుతున్నాను. చదివిన కొద్దీ అర్థమవుతున్నయి.
దేశికాచారి గారి పద్యాలు మధురంగా ఉంటాయి. నేను చదువుతున్నా. ఇందులో అన్ని పద్యాల్లో అన్ని మాటలూ అర్థం కాకపోయినా, కథ అర్థమయ్యింది. ఇది ఇప్పటి కాలపు కథ కాదంటానికి వీల్లేదు.
కొంచెం బాగోనట్టు ఎక్కడ అనిపించిందంటే; 🙂 కవితో కథానాయిక .. ఆమె… ఆమె…. – O! What the hell. I will say that horrible word in Telugu – ఆమె తన గర్భిణీ చిహ్నాలను వర్ణించి వర్ణించి చెప్పినప్పుడు. ఈ కాలపు స్త్రీ, ఆ సోదంతా అంత వివరంగా కవికి ఒక లతా నికుంజంలో ఎందుకు చెపుతుంది? అంతకు ముందెప్పుడో తన గైనకాలజిస్ట్ కి హాస్పిటల్లో చెప్పి ఉండొచ్చు.
అంతే. అందుకని. అంతకు మించి నచ్చనిది ఏం లేదు.
ఒంటరిగా, విచారంగా, ఉన్న ఒక స్త్రీని “ఏమిటమ్మా నీ కష్టం?” అని ఒక మగాడు కల్పించుకుని అడగటం ఈ రోజుల్లో జరగదా? అంటే జరుగుతుంది. సరే, కవి తర్వాత కుంచెం, వైద్యుడు, సలహాదారుగా ప్రవర్తించాడు అనుకోండి. అది ఈ రోజుల్లో ఆశ్చర్యం కలిగించే విషయమా అంటే అదీ కాదు. అలా రోజూ ఎడా పెడా లక్ష సలహాలు ఇస్తూనే ఉంటారు చాలామంది మనుషులు. కాని ఇక్కడ ఇచ్చిన సలహా అంత చచ్చుగానూ లేదు. నా కర్థమైనంత వరకూ ఆ కవి, ఆమె మనసు నొచ్చుకునే మాటలు అన్నట్టు లేదు. ఆమెను ఏ చెరువులోనూ దూకించలేదు. పైగా ఆమె కిష్టమయ్యి, ఆమె అదే పొదరింట్లో మరొకరితో సంభోగించితే , కవికి కష్టం కలిగేట్లూ లేదు.
అందువల్ల కవి సహృదయుడు అనిపిస్తున్నది.
అరే! ఒకటి రెండు కూజితాల్లోనే ఆమె కోయిల అని కవికి ఎలా తెలిసింది? అంటే – అదీ అంత నమ్మలేని విషయంలా అనిపించటం లేదు. 🙂 “తాళ్” సినిమాలో ‘మానవి’ /ఐష్వర్యారాయ్ సందేహిస్తూ “జీ. మై క్యా బోలూ” అనంగానే ఆ ధ్వనికి మురిసి ఆమె బాగా పాడుతుందని, స్టార్ క్వాలిటీ అని అనిల్ కపూర్కి తెలిసిపోయి, తన సంగీతం డాన్స్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చెయ్యమనలా:-)
ఐతే ఈ కథలో కవి, తన సలహానే ఆ స్త్రీ పాటించి, అందువల్లే ‘గానభారతి’ ఐపోయిందని, మనసులో అనుకున్నాడా? ఏమో మరి. తెలియదు. కానీ, సలహా ఇచ్చినప్పుడు సంగీతం ఆవిడకు మర్నాటికల్లా వస్తుందని అపోహ మాత్రం పడలేదు. కడుపొచ్చినంత సులువుగా సంగీతం రాదు. సంవత్సరాలు పడుతుందనే అనుకున్నాడు. “ఈ మాట” లో సంగీతం వ్యాసాలు రాసే రచయితలు మాత్రం, – వద్దులెండి, ఇక్కడ ఆ సంగతులు – వాళ్ళు రెండు దరువులు వేస్తే, నే బేరుమంటే, మళ్ళీ సుకవులు … 🙂 ఎందుకు గానీ ‘రోమంధము’, ‘ముకురాయితమైన’ అన్న మాటలకు అర్థాలు చెపితే, ప్రస్తుతానికి చాలు.
లైలా
గానభారతి గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
08/09/2011 7:37 pm
చెప్పొద్దూ – వరూధినీ, ప్రవరుడు అని వినిపించేసరికి కుతూహలం కలిగిన మాట వాస్తవం. ఎత్తుగడ అలా అనిపింపజేస్తుంది కూడ. ఐతే మిగిలిన ఏ విషయాల్లోనూ ఎలాటి పోలికా లేదని మనుచరిత్ర తొలి రెండు ఆశ్వాసాలూ చదివిన వారు ఇట్టే పోల్చుకోగలరు (నిజానికి నేను ఆ రెండు ఆశ్వాసాలు “ఈమాట”లో చాలాకాలం క్రితం పెట్టిన గుర్తు, ఇంకా ఉండి ఉండవచ్చు).
ముందుగా, ఇంకా పట్టుపట్టి ఛందోబద్ధమైన పద్యాల్ని రాస్తున్నందుకు తిరుమల దేశికాచార్యుల్ని అభినందించాలి.
ఐతే ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు భాష విషయంలో ఏమైనా కొత్తదనాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తే ఇంకా పాఠకులకు అందుబాటులో వుండే అవకాశం ఉంటుందేమో ! సమకాలీన పాత్రలు సంస్కృతసమాసభూయిష్టమైన సంభాషణలు చేస్తుంటే తమాషాగానూ ఎబ్బెట్టు గానూ ఉంటుంది. అంతే కాదు సంప్రదాయ భాషలో సమకాలీన భావాల్ని చెప్పలేరు కూడ. అందుకే భావకవులు వస్తువుకి అనుగుణమైన భావజాలాన్నీ భాషనీ తయారుచేసుకున్నారు (వసుచరిత్ర తర్వాత వచ్చిన ఏ రచననీ చదివే ఉద్దేశం లేదని కవిగారు ఇదివరకు అన్నగుర్తు; కాబట్టి ఈ మాటలు వారిని ఉద్దేశించినవి కావు – ఇంకెవరన్నా పద్యాలు రాద్దామనుకుంటే వారికీ ఈ మనవి.) తర్వాత పద్యాలు రాసిన నండూరి వారు కాని, కోవెల వారు కాని భాషని ఆధునీకరించటానికి బాగానే ప్రయత్నించారు వస్తువు పౌరాణికమైనదైనా (ఉదాహరణకి నండూరి “శీర్ణమేఖల”). రామాయణాన్ని రాసిన విశ్వనాథ కూడ చాలా ఆధునిక భాషని భావజాలాన్ని వాడాడు. శ్రీశ్రీ, ఆరుద్ర లాటి వాళ్లు సంప్రదాయ ఛందస్సుల్లో అధునాతన భావాలని చెప్పగలిగారు, అందుకు అనుకూలంగా భాషనీ మలుచుకుని. ఎంతోమంది “సెటైర్లు”, “పేరడీ”లకు ఛందోపద్యాల్ని బాగానే ఉపయోగించుకున్నారు.
ఇప్పటికీ చారిత్రక పౌరాణిక నాటకాలకు కొత్త తరం కవులు పాతరకం పద్యాలు రాస్తున్నారు; శ్రోతలూ వింటున్నారు. చిక్కల్లా సమకాలీన పాత్రలు అదే ఒరవడిలో నడవబోయినప్పుడే. కొత్తభాషని తయారుచేసుకోవటం మాటలు కాదు; కాని కష్టే ఫలిః .
గానభారతి గురించి దేశికాచారి గారి అభిప్రాయం:
08/08/2011 10:20 am
తమ వంగ్యాత్మకమైన సమీక్షను ఓపికతో వ్రాసినందుకుశ్రీ యశస్విగారికి ప్రశంసలు. నేను మనుచరిత్రను నెమరు వేసుకుంటూ వ్రాయకున్నా మనుచరిత్రరోమంథాన్ని మీకది కలిగించిందంటే నే నాశించినదానికంటె అధికప్రయోజనమే చేకూరింది!! ఇంతకంటె కావలసిన దేముంది? మీకు మనుచరిత్రతో నున్న పరిచయం మాట అటుంచి, మానవప్రకృతులు, విభావానుభావాలు కాలాతీతములూ, అందుచేత 15వ శతాబ్దిలో వ్రాసినా 25వ శతాబ్దిలో వ్రాసినా ఈ అనుభావాల, ప్రకృతుల సారూప్యత ఉంటుందనే అంశం ఈ రోమంథానికి మూలమనేది మీరు గ్రహించవలసిన విషయం. కథను ఏదో 70% ఇంగ్లీషుపదాలతో గూడిన “తెల్గీషు” భాషలో వ్రాస్తే కాని శంఖులోతీర్థం పోసినట్లు కానేరదనే అపోహ మీ వ్రాతలో చూచాయగా స్ఫురిస్తూ ఉన్నది. ఈ అపోహను తొలగించడానికే లాక్షణికమైన ఛందోబద్ధమైన శైలిలో నేనీ కథను వ్రాసినాను. ఇట్టి ఛందోబద్ధమైన సత్సంప్రదాయ ముకురాయితమైన రచనలకు 15వ శతాబ్దియే కాని 21వ శతాబ్ది తగదని మీ అభిప్రాయమా? మీరేమన్నను ఈమాట సంపాదకులకు మాత్రం ఇటువంటి భావం లేకపోవడం నావంటివారి అదృష్టం. అభినందనీయం.
ఏదైనా ఒక వేడి వస్తువు గురించి రాణి. గారి అభిప్రాయం:
07/20/2011 5:42 am
స్వామిగారూ,
మాండలికం అనేది ట్రాష్ కాదు.
అది జీవద్భాష.
నామిని డొల్ల కాదు. ఆయన తనని తాను అద్దంలో చూసుకున్నారు. దాన్ని యథాతథంగా రాయగలిగారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం ఒకవేళ జూటాతనం అనడం అంటే అది వాస్తవాన్ని నిరాకరించడమే అవుతుంది.
త్రిపురకీ మాండలికానికీ సంబంధం ఏమీలేదు.
నిజాయితీ నిబద్ధతలుంటే చాలు. సంపాదకులతో పరిచయాలు అక్కరలేదు. ఆపరిచయాలవల్ల చెత్తా చెదారాలన్నీ సాహిత్యంగా చెలామణీ కావడం తప్ప మరో ప్రయోజనం లేసదు.
ప్లీజ్! అర్ధం చేసుకోండి గురించి మోహన గారి అభిప్రాయం:
07/08/2011 10:54 am
మంచి ప్రయత్నం, కాని కథ చదివినట్లు లేదు, ఒక వ్యాసం చదివినట్లు అనిపిస్తుంది. విధేయుడు – మోహన
ఏదైనా ఒక వేడి వస్తువు గురించి yasasvi గారి అభిప్రాయం:
07/06/2011 1:48 pm
కనక ప్రసాద్ గారూ !! ఒక మాట ..నాకు చెప్పొద్దు . మీకు మీరు చెప్పుకోండి చాలు. “జూటా” కానిదేదీ ? మన మనసు కన్నా జూటా ఏదీ? మనకి మనమే అర్ధమ్ కామే చాలా సార్లు. జీవితమే సత్యం కాదు. దాన్ని ఆవిష్కరించే కల్పన ఉన్నదున్నట్టే ఎలా ఉంటుందీ?? అలా రాయపూనుకుంటే అసలది కల్పన ఎందుకు అవుతుందీ?? కల్పన కానప్పుడు దాన్ని రాయాలనీ..దానికో రచయితా ఒక పాఠకుడూ ఉండాలనీ తపన మాత్రం ఎందుకూ?? అందుకోసమ్ ” గుద్దుకోడం” ఎందుకూ?? మీ సమస్య ఏంటో పూర్తిగా మీకు చెప్పడమ్ అన్నా కస్టమ్ అయిపోయి ఉండాలి. చదివే పాఠకులందరూ వర్గభేదం వల్లమాత్రమే అర్ధంచేసుకోవడం లేదా చేసుకో లేకపోవడం జరగదు కదా?? అలా అయితే ఏ వర్గం వారి రచనలు ఆ వర్గమ్ వాళ్ళూ ఏ ప్రాంతం వాళ్ళ రచనలు ఆ ప్రాంతం వాళ్ళూ మాత్రమే అర్ధం చేసుకోవాలి. అలా అనడమ్ లెదా అనుకోడంలో నిజమ్ లేదు. మనకి సొమ్ములుపోనాయండి.. యజ్నం లోని విషయం ఎంతో బాగా అర్ధమ్ అయ్యిందే?? అది ” జూటా” కాదే??
మీరు త్రిపుర ప్రభావం లో ఉన్నా..ఇంకెవరి ప్రభావమ్ లో ఉన్నా మీ అక్షరమ్ మాత్రమ్ మీ ప్రభావమ్ లోనూ మీ అదుపులోనూ ఉండాలంటారా? కాదంటారా?? అలా లేకపోతే అది పాఠక వర్గమ్ తప్పు మాత్రమ్ కాదు. మీ ఆలోచనలూ ఊహలూ తగిన భాష లోంచీ..తగిన వాక్యం లోంచీ అంతకన్నా ముఖ్యమైన తగిన కధనమ్ లోంచీ రావడమ్ లేదు. ఇందుకు లోపం మీది గానీ ఇంకెవరినీ నెపమ్ పెట్టే పని లేదు. లెదూ మీ శైలే ఇంత అని అనుకుంటే మీ పాఠకులు మరి ఎవరో వారు మాత్రమే మిమ్మల్ని మెచ్చుకోగల్గిన వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా “జూటా” గాళ్ళే నని అనుకుంటే గనక ఒకవేళ ఝూటావే నిజం అన్నమాట వేరే నిజం లేదన్నమాట. అదో వేదాంతం అసలు సత్యాసత్యాల నిగ్గు తేల్చేదెవరో ముందు ముందుకి వస్తే.. అప్పుడు చూదాం.
యశస్వి
ఏదైనా ఒక వేడి వస్తువు గురించి kanakaprasAdu గారి అభిప్రాయం:
07/06/2011 3:20 am
ఈ కధతో గుద్దుకున్నట్టు అనిపించింది. కాని మీరన్న కారణాల వల్ల కాదు. వేరే అనుకున్నాను. దానిగురించే మూడు లాంతర్లు – ఆరో భాగం అని రాసింది ఉంది. అది ప్రచురణకు పరిశీలిస్తున్నారు. దాన్లో ఈ గొంతు సంగతే చాల చెప్పుకున్నాను. సుధాకర్ అని ఒకాయనున్నారు. మా ఫ్రెండు. నాలుగేళ్ళుగా ఈ కధలో సంగతుల్తో ఒక వేదనలాగ కొట్టుకుంటున్నాను. దీన్లో మనుషులందరితో, వాళ్ళ జీవితాలకి నా బతుక్కి రాజీ చేసుకోలేక చాల యాతనగా ఉండి, ఈ కష్టం ఎవరికీ చెప్పుకోలేకుండా. అందుకే గిరిగారు ఏదైనా రాయమన్నప్పుడు గొప్ప అవకాశంలాగ వచ్చింది ఇది రాసేస్తే చాల తెరిపిగా అయ్యింది, ఓదార్పులా ఉంటుంది. రాసింది ఇంక దాన్ని మళ్ళీ చదవటం, చర్చించటం ఎంతమాత్రం సాయించదు. ‘అదంతా ఒక పీడకలలా మర్చిపో బాబూ!’ అని గుమ్మడి గారంటారు కదా?! టిబెటన్ మంక్స్ ముగ్గులు వేసి చెరిపెస్తారు. అలాగే ఇది చెరిగిపోవాలి, దీనికి గౌరవం, సంరక్షణ ఒద్దు. ఈ కధకి ఉంటే గనక సుధాకర్ – ఆయనొక్కరే చదువరి అనుకున్నాను. బైటికి పంపించే ముందు ఆయన్నడిగేను. ఎందుకంటే – సుధాకర్ ఒక్కడికే ఈ పిల్లల్తో, ప్రపంచంతో యదార్ధంగా పరిచయం ఉంది; ఒక్క ‘మేడమ్ ‘ తో తప్ప బహుశ. నాకైతే వీళ్ళందరూ తెలుసు, మేడమ్ తో సహా. ఈ భాష మాట్లాడే పిల్లల్తో ఇలా బతికే పిల్లల్తో వాళ్ళ ఊళ్ళలో ఆయన బతికేడు, నాలాగ. అంతే కాదు, ఆయన కూడా వాళ్ళలో ఒక గుంట్నాకొడుగ్గా బతికేడు, నాలాగనే. సుధాకర్ ని ఎన్నిసార్లో గుచ్చి గుచ్చి అడిగేను – దీన్లో ‘జూటా ‘ ఉన్నట్టుందా, అదేంటో చెప్పమని. అన్నిసార్లూ ఆయన ఏమన్నారంటే ‘పిల్లలందరూ ప్రాణం పోసుకున్నారు ‘ ఏ అభ్యంతరం తోచదని. మేడమ్ ఒక్కరితోనే ఆయనకు ఇబ్బంది వచ్చిందని. కొండబాబు భాషతో, గొంతుతో ఇప్పటికీ ఏ మాత్రం ఇబ్బంది తోచదు నాకు. వాడు నాకు ఎంత తెలుసంటే ఆ వయసులో అతనితో అలాంటి వాళ్ళందరితో అబేధం. అంత తెలుసు. సుధాకర్ ఒక్కరే అది అర్ధం – అంటే అనుభవం – చేసుకున్నారు. అబ్బ దీనికి ఒకే ఒక్క రీడర్ ఈయనే అని అనుకున్నాను, అలాగే అవుతుందే అనుకున్నాను. సుధాకర్కు రాయించిన దుఖ్ఖం అర్ధం అయ్యింది. ఆయన కూడ సారగారుగా అవతరించిన ఒకనాటి కొండబాబు. ఆయన చాల నచ్చుకున్నాడు ఈ కధని అలాగ ఇలాగ అని. దీని మొదటి చివరి చదువరి. వాళ్ళ గొంతు, లోకాన్ని కధలు కధలుగా చెప్పి వెక్కిరించే తీరూ ముమ్మాటికీ అలాగే ఉంటావి. అందరికీ కాదు. అవే ఊళ్ళు, అదే భాష, ఆ మనుషులూ అనుభవమ్లో ఉన్నవాళ్ళలో ఏ కొందరికోనేమో. ‘మ్రోగింది ‘ వంటి మాటలే కాదు, అంతకంతే ‘శుద్ధం ‘ అయిన మాటలూ, గ్రామ్యం అయిన మాటలూ వాళ్ళ మాటల్లో ఇబ్బంది లేకుండా కలిసుంటాయి. అవి మన, అంటే సంస్కారుల expectationsను అనుసరించి రావు. స్వయంగా దగ్గిరసా చూస్తే అనుభవమౌతాయి. ఇబ్బంది వేరే. మా ఆవిణ్ణి అడిగేను – రాజాతల్లి! దీంట్లో అబద్ధంగా ఉందా చెప్పమని. అది ‘ఏదో అబద్ధం లాగా ఉందిరా’ అన్నాది. ‘నువ్వు బతుకుతున్న బతుక్కీ ఈ కధలో విషయానికీ ఏదో తేడా ఒచ్చిందీ’ అన్నాది. అది కరక్టుగా పట్టుకున్నాది. మళ్ళీ అంది – ‘నాకైతే నీ జీవితం తెలుసు. అందరికీ తెలీదు కదా!’ అని ఊరుకోబెట్టింది. మూడులాంతర్లు ఆరో భాగంలో ఇదే ఇంకా ఉంటుంది – గొంతు సంగతి. మురళి అని ఉన్నారు. ఇంకో ఫ్రెండు. ఆయన్నడిగేను. ఆయన ఏమన్నారంటే narrative by a man torn between the two worlds …. mildly inauthentic.. అని. ఆ mildly inauthentic.. నేను ఒప్పుకున్న జూటా. అది సత్తెం చేసుకొవాలంటే నేను మళ్ళీ కొండబాబుని అయిపోవాలి. అలాగ కధల్లోనే కాగలను – కనీసం జూటాగానైనా. ఆ ఓదార్పు కోసమే కధ – రచయితకు. ఆ తరవాత వాంతిని ఊడ్చి పారీసినట్టు దాన్ని. మురళీతొ నేను “..it is a lie, but to me a very comforting lie, as all lies are.” అప్పటికి నాకలా బాగుంది. ఇప్పటికీ ఏ ఒక్క ముక్కా మార్చాలనిపించదు. జూటా textలో నిర్మాణంలో లేదు. రచయిత బతుక్కీ కధలోని సంగతికీ సమన్వయంలో ఉన్నాది. అది third person narrativeతో పూడ్చేది కాదు సరి కదా మరింత దూరమౌతుంది. గొంతునే చెరిపెయ్యటం ఒక తోవ. Beckett త్రిపుర అలా చేసేరు. వాళ్ళు ద్రష్టకు, దృశ్యానికీ మధ్య దూరం చెరిపెస్తారు. సుధాకర్ అలా చెరిపేసుకుని కధలోకి ప్రవేశించేడు, ప్రయత్నించి కాదు – ఇదంతా ప్రత్యక్షంగా, నిజంగా అతనికి తెలుసు, ఇదివరకే. అతని గొప్ప కాదు, వేరొకరి తక్కువ కాదు. అలా స్వీకరిస్తున్నారు, తమ అనుభవాల వల్ల అనుకుంటాను. అందరికోసం రాయాలి, అందరికీ ఒప్పుకోలుగా ఇలా అయితే బావుండేది ఇలా అంటే ఆ should నాకు మనస్కరించదు. ఇంతకంటె చెప్పాలని, చర్చించాలని లేదు. ఇది వాదించి ఒప్పించగలిగేది కాదు. మీరు లేవనెత్తిన విషయం చాల ముఖ్యమైనది, ఆసక్తి ఉంటే ఎంతో ఉపయోగంగా ఉండే చర్చ, అదంటే విముఖత, అగౌరవం లేదు. మనం Fiction అనేది సాంతం, అంతేగాక Science అనేది, అంతేగాక దైనందిన జీవితం అంటే Life అనేది ఈ మూడూ కూడా ఏదో ఒక స్థాయిల్లో నిజమే కావు – అంటే ఇవన్నీ కూడా జూటా. ఇలాగని చాల చర్చ ఉన్నాది – వేదాంతంలో కాదు, సైన్స్ లోన! ఇది సందర్భం కాదు, వేదిక కాదు, నా వలన కాదు.
[మూడు లాంతర్ల ఆరోభాగం జులై1 న ప్రచురించాము. కానీ ఒక చిన్న తప్పు వల్ల ఆ వ్యాసం ఈమాటలో కనిపించలేదని తెలిసి తప్పు సరిదిద్దాము. మా అలక్ష్యానికి క్షమాపణలు. – సం.]
పదకవితా సార్వభౌముడు: క్షేత్రయ్య గురించి మోహన గారి అభిప్రాయం:
07/05/2011 4:12 pm
బాలాంత్రపు రజనీకాంతరావుగారి ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము (విశాలంధ్ర పబ్లిషర్స్, 1975) పుస్తకానికి పరిచయ వాక్యాలు వ్రాస్తూ శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు ఆగస్టు 1, 1958 నాడు క్షేత్రయ్యను గురించి ఇలా అన్నారు –
“నేటి కర్ణాటక సంగీతపు రాగా లెన్నో స్పష్టరూపం దాల్చినది క్షేత్రయ్య పదాలలోనే” (పుట 210), “అనుపల్లవికి క్షేత్రయ్యే మార్గదర్శి” (పుట 232) ఈ యభిప్రాయాలు క్షోదక్షమంగా కానరావు. క్షేత్రయ్య వాడిన రాగాలు తాళాలు అన్నీ పురందరదాసాది ప్రాచీనుల రచనలలో నున్నవి. ఆ పదాలు పాడినట్టే వీటినీ పాడవచ్చును. నా గురువుగారు శ్రీ బిడారం కృష్ణప్పగారు దేవరనామాలు పాడునట్లే క్షేత్రయ్యాదుల పదాలూ అద్భుతంగా పాడేవారు. భక్తి శృంగారరూప భావ భేదమే తప్ప పాట శైలిలో ఏమీ భేదం మా యనుభవానికి అందులో రాలేదు. పదాలను రాగప్రధానంగా తెగయీడ్చి వాగర్థాల భావమే అవగతం కాకుండా పాడే పద్ధతి ఈవల వీణ ధనమ్మాళ్ ప్రచారంలోకి తెచ్చిందని నా ఊహ. ఆమె త్యాగరాజాదుల కీర్తనలు గూడ ఆ శైలిలోనే పాడేది. అందలి రాగమాధుర్యానికి లోగి ఎందరో గాయకులు – వాగర్థాల దృష్టి లేనివారు – దక్షిణదేశంలో ఆ శైలినే అక్షరశః అభ్యాసం చేసి పాడుచున్నారనేది వేరుమాట. క్షేత్రయ్యే యీ శైలిని తెచ్చి పెట్టినాడనేది న్యాయం కాదేమో. అట్లే అనుపల్లవి పురందరదాసుల కీర్తనలలో ఎన్నిటికో యున్నది. కనకదాస కృతులలో కలదు. ఇంతెందుకు? ఈ క్రింది అన్నమయ్య సంకీర్తనలోనే కలదు:
శ్రీరాగం –
“ఇతరులకు నిను నెరుఁగ తరమా
సతత సత్యవ్రతులు – సంపూర్ణ మోహ విర-
హితు లెరుంగుదురు నిను – నిందిరారమణా”
దీనికి తర్వాత నాల్గు పంక్తుల చరణాలు మూడున్నవి. పైమూడు పంక్తులును ఒక పల్లవిగా కలిపికొట్టి పాడేది యెట్లో నా కర్థంకాదు. అట్లే,
“పరిపూర్ణుఁడవు నీకుఁ బరాకున్నదా, నిన్ను
మరిగి వుండనిదే – మావల్ల తప్పుగాక,”
అనే తిరుమలయ్య సంకీర్తనలో రెండవ పంక్తిని అనుపల్లవిలో అమర్చుకొనకపోతే రెంటినీ ఒక రూపంగా భైరవి రాగంలో పాడే రీతి దుర్గ్రహం కనుక దీని బరువంతా క్షేత్రయ్యమీదనే వేయడం నా దృష్టిలో న్యాయం కాదు.
….
ఇట్లే క్షేత్రయ్య వాడిన ‘మోవనాడు’ అనే పలుకుబడిలో ‘మువ్వనాడు’ అనే యెవ్వరూ కనివిని యెరుగని కొత్త నాడుగాని … నా చూపు కందని విషయాలు. మోవన్ ఆడు = నామీద తప్పు మోచునట్లుగా ఆడుము అని మోవనాడు కర్థం.
నా తానా వ్యాసములో 53వ పుటలో త్రిపుట తాళానికి ఏడు అక్షరాలు అని ఉండాలి. తప్పు దొర్లినందుకు క్షంతవ్యుడను.
విధేయుడు – మోహన
కినిగె.కాం తో నా అనుభవాలు గురించి శరత్ గారి అభిప్రాయం:
07/05/2011 2:04 am
ఈపుస్తకానికి ప్రింటు-రవాణా ఖర్చులు వగైరా ఉండనప్పుడు అదే ధర ఎందుకుండాలి?
మంచి ప్రశ్న.
వేటూరి పాట గురించి telugodu గారి అభిప్రాయం:
07/04/2011 3:20 pm
విశ్లేషణ బావుంది. కాని, చాలా చోట్ల, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుంది.
‘చంటి’ పాటలో, లక్ష్మి మేనకగా మారలేదు. మేనక అనేది, ఉపమానం అంతే. తకిట తదిమి పాటలో భావము లేకుండా, కేవలం భావ భ్రమ కలిగించింది అంటే, ఆశ్చర్యంగా ఉంది.
ఇప్పటిదాకా వేటూరి ని పొగుడుతూ చాలామంది వ్రాశారు. ఇదో కొత్త రకం విశ్లేషణ.
రాగలహరి: మోహనం గురించి పి.వి.గోపాలకృష్ణ గారి అభిప్రాయం:
07/04/2011 1:44 am
లక్ష్మన్న గారూ,
మీ వ్యాసాలు దశాబ్దం క్రితంవి. నేను రాద్దామనుకుటున్న విషయం మూడు దశాబ్దాలక్రితం నేను అనుకున్నది. ఇప్పుడు మీ రాగలహరి – మోహనం చూసాక రాయాలనిపించి రాస్తున్నాను.
ఏ వృత్తికైనా – మీ ఇంజినీరింగ్, మా లాయరీ(?), మరెవరి మెడిసిన్ – ఏదైనా ఆ వృత్తికి సంబధించిన జార్గన్ ఒకటి ఉంటుంది. సామాన్యులకి అది పట్టబడకపోవచ్చు. అనవసరం కూడా. అది ఆ వృత్తికి సంబంధించిన అసామాన్యుల భాష. కాని కొన్ని పదాలు ఈ ఇద్దరికి సమానమైనవి ఉండొచ్చు. సామాన్యులు ఆ వృత్తిపరంగా ఆ పదాలని సామాన్యార్ధంలో వాడకూడదన్నది గుర్తుంచుకోవాలి. కానీ విశేషార్ధం ఒకటి ఉంటుందన్నది తెలియక సామాన్యులు ఆ తప్పు చేస్తుంటారు.
ఉదాహరణకి – లీడింగ్ క్వొశ్చన్ – అన్న పదం చాలా మంది వాడుతుంటారు. దేన్ని లీడింగ్ క్వొశ్చన్ అనాలి అని ఎవిడెన్స్ ఆక్ట్ చెబుతుంది. ఏ పశ్నకైతే జవాబు అవును లేదా కాదు అని వస్తుందో అదే, అది మాత్రమే లీడింగ్ క్వొశ్చన్. కేవలం క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యడానికి మాత్రమే ఈ ప్రశ్న అడగాడానికి అవకాశం ఉన్నది. ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు లీడింగ్ క్వొశ్చన్ అడగకూడదు. వాది, ప్రతివాది అడ్వొకేట్లిద్దరికీ లీడింగ్ క్వొశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, ఎదుటివాడి సాక్షిని క్రాస్ చేస్తున్నప్పుడు. దాని అవసరం ఆ వృత్తిలోని వారికి తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు ఆ పదాన్ని వాళ్ళకి తోచిన రీతిలో వాడితే అసందర్భంగా ఉంటుంది. ఇప్పుడు నేను తెలుసుకదాని ప్రతివాదిని సంవాది అన్నానుకోండి కోర్టులో, వీడే మార్సునుంచి వచ్చేడ్రా అన్నట్టు చూస్తారు. ఇది కేవలం ఉదాహరణకి చెప్తున్నది. అసలు విషయం –
సంగీతం విషయంలో. ‘శుధ్ధ’ అన్న పదం కొన్ని రాగాలకే పరిమితం. కారణం నాకు తెలీదు. సామాన్యులు శుధ్ధ పదాన్ని pure, pristine అన్న అర్ధంలో వాడతారు. రాగాల విషయంలో – శుధ్ధ సావేరి, శుధ్ధ ధన్యాసి, శుధ్ధసీమంతిని, *శుధ్ధ బంగళా (ఈ ఆఖరిది కర్ణాటక రాగమో కాదో మరి) – ఉద్దేశం అదేనో కాదో నాకు తెలీదు. ఒకే పేరుతో రెండు రాగాలున్నప్పుడు, సావేరి, ధన్యాసిలాంటివి, ఒక దానికి శుధ్ధ prefixతో differentiate చేసినట్టు కనిపిస్తుంది. అవి ఒకే మేళకర్తజన్యాలు కాకపోవచ్చుకూడా. మరే రాగానికి ఈ prefix ఉండదు. శుధ్ధ పదాన్ని లూస్ గా వాడితే ఈ రాగమెక్కడిదీ అని సంగీతం వాళ్ళు అడిగే అవకాశం ఉంది.
ఇక స్వరాల్లో కూడా రిషభ, ధైవతాలు, మొదటివి, రి1, ధ1 శుధ్ధ స్వరాలు. రెండోవి చతుర్ శ్రుతి. నాట రాగంలోని షట్ శ్రుతి రిషభ ధైవతాలు నిజానికి సాధారణ గాంధారం, కైశికనిషాదాలు. స్వరస్థానాలని ఒకటి కంటె ఎక్కువ పేర్లతో గుర్తించడానికి కారణం – నాట లాంటి రాగంలో రెండు గాంధారాలు, రెండు నిషాదాలు ఉన్నప్పుడు వాటిల్లో ఒకటి రిషభం, మరోటి ధైవతంగా గుర్తించి సప్తస్వరాలూ ఉన్నట్టు చూపించడానికేమో? అలాగే కర్ణాటక, హిందుస్థానీ పద్ధతుల్లో ‘శుధ్’ పదం కలిగినవి సమాన స్వరస్థానాలని అనుకోలేం. అంటే హిందుస్ధానీ శుధ్ధ రిషభం కర్ణాటక సంగీతంలో చతుర్ శ్రుతి రిషభం. చతుర్ శ్రుతి రిషభాన్ని శుధ్ధ గాంధారం అన్నా తప్పులేదు. 22 శ్రుతుల ఆధారంగా స్వరస్థానాలని నిర్ణయించినప్పుడు తయారయినది ఈ nomenclature అనుకుంటాను. అందువల్లే చతుర్శ్రుతి, షట్శ్రుతి ఇట్లాంటి పదాలు. నాలుగోది, ఆరోది అని. ఇవన్నీ నాకు తెలిసి అంటున్న విషయాలు కావు. నాన్నగారు చెప్పగా అర్ధంచేసుకుందుకు ప్రయత్నించినవి.
ఈ బాధెందుకు వచ్చిందంటే – శంకారభరణం సినిమా చూసే రోజుల్లో మా ఫ్రెండ్ ఒకతను “శుధ్ధ హిందోళం అన్న రాగం లేదండీ” అని అంటూండే వాడు. ఆ సినిమాలో శంకరశాస్త్రి గొప్ప సంగీతం విద్వాంసుడు – “శుధ్ధహిందోళం లో రిషభం ఎలా వచ్చిందే” అంటాడు హీరోయిన్ని గదామాయించి. ఆయన శంకరాభరణంలోని శంకారాభరణం గురించి అసామాన్యుల అభిప్రాయం apart – వృషభం అంటే రంకెలేస్తాడు, కాని శుధ్ధ హిందోళంలాంటి పదాలు వాడతాడు. అసలు సప్త స్వరస్థానాలు పశుపక్ష్యాదుల శబ్దాలనుంచే వచ్చాయన్నది జ్ఞానుల అభిప్రాయం, వృ(ఋ)షభం సరైనదేనని వాదన. హీరో సమ్మోహనంగా ‘మాణిక్యవీణా’ పాడగానే అంతటి విద్వాంసుడూ మూర్ఛపోతాడు.
ఈ పరిస్థితి ఎందువల్లా అంటే –
రచయిత (అసామాన్యుడు కాని) – ముఖ్యంగా సినిమా అన్న మాస్ మీడియం తీసుకున్న రచయిత ఒక వృత్తికి సంబంధించిన పాత్రచేత ఏం మాట్లాడిస్తున్నాడు అన్నది ఎంతో మంది చూస్తుంటారు. వృత్తిపరమైన పాత్రలని సమగ్రంగా – ఆ వృత్తికి సంబంధించిన సంఘటనలతో – చూపించాలన్న కోరిక ఓపిక ఉన్న రచయితలని, సినిమాలనీ తెలుగులో చూడలేం. జస్టిస్ చౌదరి అని అంటాడు – ఆయన కోటు గౌను వేసుకుని ఇంట్లోనే కనిపిస్తుంటాడు. వీలైతే హీరోయిన్ తో గెంతుతుంటాడు. పైలట్ ప్రేమ్ నాథ్ అని అంటాడు – ఏనాడు ఏరోప్లేన్ లో కూర్చోగా చూడం. ఆ వృత్తికి సంబంధించిన విషయాలేవీ ఉండవు. మనం ఫ్లైట్ ఇన్టు డేంజర్, ఏర్ పోర్ట్ లాంటి థ్రిల్లరేమో అనుకుని వెళతా…మా(?). అబ్బే మనకీ తెలుసు.
మన రచయతలకి బాగా కొట్టిన పిండి – human relations, emotions. మన ఒంట్లో, ఇంట్లో పుట్టిందగ్గర్నుంచి అనుభవిస్తున్నది. పేరేదైనా, పాత్రేదైనా, ఆవు వ్యాసంలాగా చివరకి (కాదు ముందునుంచే) ఈ రెండింటి చుట్టూ తిరగుతుంటుంది కథ. శంకరాభరణం అయినా అంతే. వృత్తిపరమైన విషయాలు convincing గా చెప్పాలంటే కష్టం. ప్రేమలు, అనుమానాలు, ఏడుపులు చుట్టూ తిప్పడం అంటేనా చిటికలో పని. నచ్చిన హీరోయిన్ తో గెంతుతూ ‘నటించ’డానికి హీరోకి స్కోప్ ఉండాలి. రచయితకి ప్రత్యేకంగా ఓ వృత్తికి సంబంధించిన జ్ఞానంతో పనిలేనిది.
సరే ఎందుకింత రాయల్సి వచ్చిందీ అంటే – మీవ్యాసంలో శుధ్ధమోహన అన్న పదం చూసి.
మరోటి – నిర్దిష్టం, నిర్దుష్టం సమానార్ధకాలు కావేమో.
పి.వి. గోపాలకృష్ణ
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాద్ కప్పగంతు గారి అభిప్రాయం:
07/03/2011 1:04 am
ప్రశాంత్ గారూ,
మూడు మూడున్నర దశాబ్ధాల క్రితం వరకూ కూడా రికార్డ్ చెయ్యటం అనేది సామాన్యుడి చేతిలోలేదు. ఒక్క ఆకాశవాణి వారికే అది కుదిరే పని. ఎక్కడో డబ్బున్న వాళ్ళ దగ్గర స్పూల్ టేఫ్ రికార్డర్ లు ఉండి ఉంటే ;ఉండి ఉండవచ్చు. కాని వాళ్ళకు అభిరుచి కూడా ఉండాలికదా. ప్రస్తుతం సాంకేతిక అభివృధ్ది పుణ్యమా అని నాలాంటి సామాన్యులు కూడా స్వంతంగా రికార్డ్ చేసుకోగలుగుతున్నాము. ఈనాటి మహనీయులు వారి వారి గోంతులు, వీడియోలు ఎన్నెన్నో కలెక్షన్లలో తయారవుతున్నాయతంఎతోమది ఔత్సాహికులు ఎవరి పరిధిలో వారు ఈ కలెక్షన్లు తయారుచేసుకుని, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వారి వారి సేకరణను పరిపుష్టం చేసుకుటూనే ఉన్నారు.
నా బాధ ఒక్కటే అలనాడు ఆకాశవాణి అధికారులకి కొద్దిగా ముందు చూపు ఉండి వాళ్ళు తయారు చేసిన టేపులను భధ్రపరచి ఉండి ఉంటే, ఈ రోజున మనకు ఎన్నో ఆణిముత్యాలు దొరికేవి. అది జరుగలేదు. అదే బాధ.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి k.Raja Sekhara Raju గారి అభిప్రాయం:
07/02/2011 4:24 pm
“ఇప్పుడున్న ఈ వివాహవ్యవస్థ గొప్ప మార్పులకు లోనయితేనే గానీ స్త్రీపురుషుల సమానత్వం సాధ్యం కాదు. ఇప్పుడు వారి మధ్యనుండే అసమానత కేవలం వ్యక్తిగతమైనది కాదు… సామాజికమైనది”
“ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్ళుగా పుడతారు”
”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుడ్ని చేసుకోను… పుణ్యం లేకపోతే పీడాపాయ… ఎవరు పడతారమ్మా ఈ తిట్లూ, దెబ్బలూనూ?”
“భారత నారీత్వం స్పెషల్ రబ్బరులాంటిది… ఎంతలాగినా తిరిగి యథాస్థితికి వచ్చి ఏమీ జరగనట్టుగా మసులుకుంటుంది. దాన్నే మనవాళ్ళు ఆకాశానికెత్తారు… ఇంకా ఎత్తుకున్నారు”
”రంకుతనాల గురించి రాద్ధాంతాలు చేస్తారెందుకూ? మగ వాళ్ళకు లేని పవిత్రత ఆడదానికెందుకు?… పురుషులకు నిజంగా పాతివ్రత్య విశ్వాసముంటే ఇతర భార్యలతోనూ, సానులతోనూ ఎందుకు పోతారు. చూడగా చూడగా నీతి అన్నది ఆడదాన్ని చిత్రహింస చేయడానికి మగాడు సృష్టించిన నరకంలాగ అన్పిస్తోంది”
”ఆడదానికి ప్రకృతి అన్యాయం చేసిందంటారు. కానీ అన్నిటికన్నా ఆడదానికి హెచ్చు అన్యాయం చేసింది వివాహవ్యవస్థ… వివాహవ్యవస్థ ననుసరించి వచ్చిన సామాజిక పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ లేకుండాచేశాయి.”
కొకు గారు రాసిన పై వ్యాక్యాలన్నీ భూమిక వెబ్‌సైట్‌లో ప్రతిమ గారు పేర్కొన్నవి. ఆయన పుస్తకాలు నాకు తక్షణ అందుబాటులో లేకపోవటం చేత భూమిక వ్యాసాన్నే ఆధారంగా తీసుకుంటున్నాను.
నా ఉద్దేశంలో “ఆధునిక మహిళలు భారత దేశ చరిత్రను తిరగరాస్తారు” అన్న గురజాడ భావన కంటే “ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్లుగా పుడతారు” అన్న కొకు భావనే మరింత ప్రాసంగికతను, విప్లవాత్మకతను కలిగి ఉంది. గురజాడను మించిన క్రాంతదర్శనం ఈ చిన్న వాక్యంలో కనబడుతుంది.
రోహిణీ ప్రసాద్ గారి వ్యాసానికి వ్యాఖ్యానాలు రాసిన వ్యక్తుల జోలి నాకు అనవసరం కాని కొకు పరిమితుల గురించి, ఆయన సిద్ధాంత పరిమితుల గురించి ఈ వ్యాఖ్యానాలలో జోడించిన వారు కొకు రచనలలో కొన్నయినా నిజాయితీగా చదివారా అని నా సందేహం. ఎవరయినా దేన్నయినా విమర్శించవచ్చు.. కొత్త కళ్లతో పాత సిద్ధాంతాలుగా కనిపిస్తున్నవాటిని అంచనా వేయవచ్చు.. తప్పేమీ లేదు. కాని ఏ సిద్ధాంతం పట్ల అయినా పూర్వ నిర్ధారిత అభిప్రాయాల ప్రాతిపదికన గుడ్డిద్వేషం, సంపూర్ణ వ్యతిరేకత ప్రకటించడం ఆ సిద్ధాంతం గొప్పతనం మాటేమో కాని మన అల్పత్వం మాత్రం నడిబజారులో ప్రదర్సితమవటం ఖాయం.
“కొద్దిపాటి అభిప్రాయ ప్రకటనలు కాకుండా ఆయన సాహిత్య విశ్లేషణని వివరంగా చేయాల్సివుంది”
ఇది నూటికి నూరుపాళ్ళూ సత్యం.అందరూ ముందుగా ఈ పని చేసి తర్వాత మాట్లాడితే, రాస్తే బాగుంటుంది. ఇది మినహాయింపు లేకుండా మనందరికే వర్తించే సత్యం.
మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
07/01/2011 10:53 am
అరచేతిలో ఇమిడే ఎంపీత్రీ రికార్డర్లున్న ఈ రోజుల్లో పెద్దవారి మాటలను సభల్లోనూ, టీవీ, రేడియో ప్రసారాల్లోనూ భద్రపరచడం కష్టమేమీ కాదు. ఇవన్నీ ఇంకెవరో చెయ్యటంలేదని ఫిర్యాదుచేసే బదులుగా ఆసక్తి ఉన్నవారు రికార్డ్ చేసి జాగ్రత్తచెయ్యడం మంచిది.
నేను బొంబాయిలో 1970నుంచీ డజన్లకొద్దీ శాస్త్రీయసంగీత కచేరీలకు హాజరవుతూ ఉండేవాణ్ణి. వాటన్నిటినీ ఒక వయసుమళ్ళిన సింధీ (?) ఆయన తన స్పూల్ రికార్డర్‌లో టేప్ చెయ్యటం గమనించాను. అదంతా బాహాటంగానే జరిగేది కనక ఆయనకు అనుమతి లభించే ఉంటుందని అనిపించింది. ప్రస్తుతం public domain లో లభ్యంకాని ఈ అరుదైన రికార్డింగులన్నీ విడుదల అయిన తరవాత డబ్బు తెచ్చిపెట్టగలిగినవే.
తెలుగువారి విషయంలో అటువంటిది జరగడం దాదాపు అసంభవమే. చారిత్రక దృక్పథం ఉన్నవారు వ్యక్తిగతంగా ఇటువంటి పనులు చేపట్టాలి.
నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి గురించి narayanababu vedula గారి అభిప్రాయం:
06/11/2011 3:06 am
చీమలమర్రి వారికి అనేక ధన్యవాదాలు. ఈ పద్యము ఘంటసాల కర్ణ్ సినిమాలో పడేరు. బాలమురళి కూడ పాడినట్లు గుర్తు. తాత్పర్యం మీరు రాసేక మద్విసిఖ వృష్టి కి చక్కగా అర్ధం తెలిసింది.
నాకు నచ్చిన మరొక పద్యం మీరు వివరిస్తే ధన్యుడనుగతాను.
ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మర్గ నిరూఢులై కంటిమందురు కాని నిత్యము (నిక్కము??)కానరీ భవదాకృతిన్ నే కంటి మాంసపు కన్నులన్ నీ తొంటి రూపము తొలంగ బెట్టుము తోయజాక్షణ్ మ్రొక్కెదన్
ఇట్లు విధేయుడు
నారాయణ్ బాబు వేదుల, జంషెడ్ పూర్ (టాటా నగర్ )
భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి jayaprabha గారి అభిప్రాయం:
05/29/2011 3:27 pm
లవణరాజు కల లోని భోజనమ్ గురించి వ్యాసకర్తల ప్రస్తావన అయినప్పటికీ… అప్పారావు గారి తోకచుక్క లోని “చాపకూటి” ప్రస్తావనని అలాగే తోకచుక్క లోని యువకుని భార్య అన్న మాటల ప్రస్తావననీ నేను గుర్తు చేయడం – మార్పులని వాళ్ళు పైపైననే కాక వాటీ మూలాలని గురించి కూడా ప్రస్తావన చేసారు సుమా అని చెప్పడానికి మాత్రమే!! రాయప్రోలు సుబ్బారావుగారు రాసిన లాంటి దేశభక్తీ అప్పారావుగారు రాసిన దేశభక్తీ ఒక్కలాంటివి కావు. వాళ్ళ గొంతుకలు వేరు. వాళ్ళ ఊహలు వేరు. వాళ్ల ఆదర్శాలూ వేరు. అప్పారావు గారు భావకవిత్వానికి ప్రేరకుడూ కాడు. ఆద్యుడూ కాడు.
మనవాళ్ళు కాశీమజిలీకధలూ ..హంసచెప్పినకధలూ చిలకచెప్పినకధలూ ఇవన్నీ జానపద విభాగంలో భాగంగా చేసి ఉండకపోవచ్చు. ఈ రకమైన పేర్లు ఇంగ్లీషు వాళ్ళు ఆ తర్వాత పెట్టినవి కావొచ్చు. కానీ ఆ తరహా సాహిత్యం మనకి కొన్ని వేల ఏళ్లుగా ఉన్నప్పుడు తిరిగీ దానిని గురించి మాట్లాడటమ్ కేవలం ఇంగ్లీషు ప్రభావం వల్లనే జరిగిందని అనడం పరిధిని కుదించి వ్యాఖ్యానించడమే!!. ఇందుకు అలాంటి మాటలు ఇంగ్లీషువాళ్లకి ముందులేవని చెప్పే ఆధారాలు ఏమన్నా ఉండాలి. సాహిత్యం ఉండీ దానికి ఒక ప్రత్యేకమైన పేరు లేకపోతేనే అంతమాత్రానికే అది ఇంగ్లీషు ప్రభావమ్ అని అనేయగలమా?అన్నది ఒక ప్రశ్న.
మనవాళ్ళు సంధ్యావందనమ్ చేస్తూ చెప్పే సంకల్పమ్ ఏళ్ల వెనకటిది. ఇటీవలది కాదు.అప్పుడు వాళ్ళు “భరతఖండే” అని అన్నారు కద. అంగ ఖండే వంగఖండే కాశ్మీర ఖండే అని సంకల్పం చెప్పలేదు కద? ఇది ధార్మికంగా హిందూ సంస్కృతి ఏకమన్న నమ్మకానికి మంత్రరూపమేనని అనుకోకపోడానికి ఏమి కారణం?? వేమన బ్రౌన్ దొర మెచ్చుకుంటాడని శతకం చెప్పలా! వేమన హిందువులనీ ..ముఖ్యంగా భ్రాహ్మలని వారి ఆచారాలనీ విమర్శించినందుకు మాత్రమే క్రైస్తవుడైన బ్రౌన్ కి ఆ శతకం ఎక్కువ నచ్చింది. ఆయన వేమనని అనువాదం చేయపూనుకోడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం.
రాయవాచకలోకాబోలు ఒకచోట పురుషోత్తమ గజపతిని తిమ్మరుసు సాటి హిందూ రాజుగా ఆయన ధర్మనిరతిని గురించి రాయల దగ్గర మెచ్చుకున్నట్టూ… నరపతులకీ గజపతులకీ వైరం ఉన్నా అది సుల్తానులతో ఉన్న వైరంలా ఉండకుండా ఉండాలని కాంక్షించి అలా రాయలు ప్రవర్తించేలా ప్రేరేపించినట్టు ఒక ప్రస్తావన ఉండటం గమనించ వలసిన అంశమే!! హిందూదేశ ఏకతకి బ్రిటీషు వ్యతిరేకత ఎంత పనిచేసిందో ఈ దేశంలో ఉన్న సంస్కృతీ ఏకత కూడా అంతే పనిచేసిందన్నది అంతే ముఖ్యమైన అంశం అవుతుంది. అందునా రాజుల కన్నా ప్రజల మధ్య ఈ ఏకత వివాహాది విధానాల ద్వారా ఇచ్చిపుచ్చుకోవడాల ద్వారా బలపడింది. భాస్కర్ గారన్నట్టు అంగవంగకళింగదేశాల లోని పిల్లలపట్ల వివాహాలకి లేని అభ్యంతరం మ్ళేచ్చజాతుమ్ళేచేయడం పట్ల ఉండటం భరతఖండంలో ఉన్న ఏకత కి నిదర్శనమే కద.
ఇకపోతే కాశ్మీరం నించి కేరళ దేశం దాకా పదకొండవ శతాబ్దం లోనే జయదేవుని అష్టపదులకి నకళ్ళు రాయిచుకుని ప్రాంతీయ భాషలలోకి తర్జుమా చేసుకుని ఆనందించినట్టు మనకి సంస్కృత సాహిత్య చరిత్ర చెబుతోంది. నేపాల్ తో సహా! ఇలాంటి సారస్వత ఆదాన ప్రదానమ్ ఇంగ్లీషు వారి రాకతో సంబధం లేకుండానే జరిగింది. మనకి ఉన్న ఒక సమైక్యత ఇంగ్లీషువాళ్ళ వల్లనే వచ్చిందని అనుకోవడం మనకి ఉన్న సంస్కృతీ నేపధ్యాన్ని కాదనడమే ఒకరకంగా !! అలా భావించడం బహుశా ఇటీవలి మార్పేమో !!
నిన్న విపులంగా రాయడానికి కుదర లేదు. అందుకు మళ్ళీ ఈ మాటలని జోడిస్తున్నాను.
జయప్రభ.
మేఘాంగన గురించి మోహన గారి అభిప్రాయం:
04/18/2011 12:44 pm
చర్చ రసవత్తరముగా ఉన్నది. కొలోన్ నిఘంటువులొ కేలిక అనే పదానికి ఇవ్వబడిన అర్థాలు – kelika mfn. sporting , sportive W. ; the tree Jonesia As3oka L ఆప్తే నిఘంటువులో అశోక వృక్షము అని మాత్రమే అర్థము ఉన్నది. కొలోన్ నిఘంటువు ప్రకారము కేలిక పుంలింగము, స్త్రీలింగములలో ఉపయోగించవచ్చును. తాల(ళ)మునుండి తాలి(ళి)క అనే పదము కూడ వచ్చింది అనుకొంటాను. బాలికా తాలి(ళి)కా అనే రాసక్రీడ పద్యము జ్ఞాపకానికి వచ్చింది నాకు.
విధేయుడు – మోహన
రాగలహరి: ఆభేరి గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:
04/18/2011 10:52 am
రోహిణీ ప్రసాదు గారి లాంటి పెద్దమనిషి నుండి వచ్చిన వ్యాఖ్య బాధ కలిగించింది.
ప్రసాదు గారూ, మీకు తెలుసున్న సంగీత విషయాలని మీరెలా పదిమందికీ చెప్పాలనుకున్నారో, తరచూ రాసే మిగతా వారూ అనుకోడంలో తప్పులేదనుకుంటాను. అంతేకానీ, ఎదుటి వారిని ఎకసెక్కం చేయడం భావ్యం కాదు.
మీ తరువాత సంగీతం గురించి ఈ మధ్య రాస్తున్నదీ నేనే. నన్ను దూషించడమే మీ లక్ష్యం అయితే కానివ్వండి. మీరు తప్ప సంగీత విషయాలు రాయకూడదంటే చెప్పండి. రాయడం మానేస్తాను. సంగీతం గురించి రాసిన ప్రతీవాళ్ళూ విద్వాంసులు కాలేరన్న జ్ఞానం నాకుంది. విద్వాన్లు అన్న బిరుదులు ఇంకెవరికయినా కేటాయించండి.
“నావంటివాడికి దాని పేరుకంటే అదెలా మోగుతోందనేదే ముఖ్యం!” అని రాసిన మీరే గతంలో రాసిన ఒక వ్యాసం మీ సమాధానానికే సమాధానం చూపిస్తుంది.
-బ్రహ్మానందం
మేఘాంగన గురించి GSCS Siddhartha గారి అభిప్రాయం:
04/17/2011 12:50 pm
చాలా బిజీగా ఉండడం వల్ల ఆలస్యం అయింది
సీరియల్ గా స్పందిస్తా
1. “ప్రాంతవనాంతరానఁ జివురాకులయాసవమూని” అన్నపాదములో “ఆసవమూని” అన్నది “ఆసవమాని” గా సరిదిద్దాలి. ఊని అంటే ధరించు, అదుము అని అర్థాలు. ఆను అంటే త్రాగు అని అర్థము (నాకు తెలినానంతవరకు).
వివరణ: “ఆసవమాని” అన్నదే సరియైనది. “ఆసవమూని” అన్నది వ్రాతదోషం.
స్పందన: కారణమేదైతేనేం తప్పు తప్పే. ఒప్పుకున్నారు సంతోషం (ప్రమాదో ధీమతామపి) లేకపోతే ఊను శబ్దమేసరైనదని తెలయనివారు భావించే ప్రమాదం తప్పింది.
2. “సాంయాత్రికోపమానం సరిగ్గా అతకలేదు. గగనంలో మేఘాలకీ అభ్దిలో సాంయాత్రికులకీ మధ్య సామ్యం బాగా కుదరలేదని నా అభిప్రాయం. ఆ పద్యనిర్మాణంలో లొసుగు కూడా అక్కడే ఉంది.
వివరణ: ఈ పద్యాన్ని సరిగ్గా అన్వయం చేసుకొనలేకపోవడంవల్ల జనించిన సంశయమిది. “గగనాబ్ధిలో న సాంయాత్రికులట్లు” – అంటే ఆకాశమనే సముద్రంలో చరించే మేఘాలు సముద్రంలో చరించే సముద్రవర్తకులలాగా ఉన్నాయని ఉపమానం. “సాంయాత్రికః పోతవణిక్” – అని అమరం. ఆకాశం సముద్రాన్ని పోలితే అందులో చరించే మేఘాలు ఆ సముద్రంలో ఓడలపై చరించే వర్తకుల లాగ ఉన్నాయని భావం. గగనాన్ని అబ్ధితో పోల్చడం సర్వసామాన్యం. “పోతవణిక్” అనే వివరణ ఇక్కడ ముఖ్యం. వర్తకులు లోనున్నా, పైకి కనపడేవి ఓడలే. అట్లాగే మేఘాలున్నాయని లక్షితార్థం.
స్పందన: సముద్రంలో సాంయాత్రికుల్లా గగనంలో మేఘాలు కదులుతున్నాయి అని ఉండాలి. అంతేగాని గగనాబ్ధిలోన సాంయాత్రికుల్లా మేఘాలు కదులుతున్నాయడంతో అలంకార నిర్వహణ దారితప్పింది. ఇది అటు ఉపమా కాకుండా, ఇటు రూపకం కాకుండా ఏదో ఆయ్యింది.
3. “లేఖకాపేటి” పద స్వరూపం, దానికీ చిత్రకారుడికీ సంబంధం ఏంటో అర్థం కాలేదు.
వివరణ: పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది. ఆలేఖ్యము = చిత్రము, ఆలేఖకుడు = చిత్రకారుడు, ఆలేఖనము = చిత్రరచనము,ఆలేఖకాపేటి = painter’s toolbox. కాని ఆలేఖకపదం పుల్లింగంలో అకారాంతం కావడంవల్ల, ఆలేఖికా అనే స్త్రీలింగరూపం ఆకారాంతం కావడంవల్ల పై సమాసాన్ని ఆలేఖికాపేటి అని మారుస్తే వ్యాకరణ సమ్మతంగా ఉంటుంది. అప్పుడు చిత్రకారిణి toolbox, or painter’s toolbox in general అని జాతివాచకంగా చెప్పుకోవచ్చు.
స్పందన: దీన్ని కిట్టింపు వాదమని అంటారు. ఆడా మగా కాని పదం వాడి, “పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది” అని రొక్కించడం దబాయింపు అవుతుంది. అంతేకాకుండా అప్రసిద్ధ పదం వాడి సరిగా అర్థం చేసుకోలేదని రుసరుసలాడితే ఎలా? వ్యాకరణ సమ్మతం అనే ముసుగులో ఒక పదం రాబట్టి అర్థం కిట్టించేసి నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నట్టుంది ధోరణి.
4. బ్రతిరచించు అనేది ప్రామాణిక శబ్ద ప్రయోగమేనా –
వివరణ: నిస్సందేహంగా. ప్రతిరచనము అంటే ఉన్న రూపానికి ప్రతిగా, అంటే దాని ప్రతిబింబంగా రచించడం. “ప్రతిసృష్టి” వంటి పదం. ప్రతి అనే అవ్యయానికి అనేకార్థా లున్నాయి. ఈ “ప్రతిరచన” “ప్రతిసృష్టి”, “ప్రతిబిమ్బం” వంటి పదాలలో ఇది సదృశార్థంలో, అంటే తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన, తత్తుల్యమైన మూర్తి అనే అర్థాలలో వర్తిస్తుంది. “పరిజ్ఞానే, పదప్రాప్తౌ, కాలహృత్యాం, నివారణే, వ్యళీకావిష్కృతౌ, తుష్టౌ, సేవాయాం, నిష్క్రమేపి చ, ప్రోత్సాహే చా వినాభావే, విఘ్నాఙ్గీ కారయోరపి, వ్యావర్తనే, వినిమయే, పునరావర్తనేపి చ, వైపరీత్యే, వినిద్రత్వే, అవేక్షాక్షేపయోరపి. సంక్షేప స్పర్ధ సాదృశ్యే, స్వీకారాభ్యవహారయోః, ఉత్తరస్తోకయత్నేషు” – అని “ప్రతి” అను అవ్యయం వివిధపదాలకు చేర్చినపుడు కలిగే అర్థపరిణామాలు చెప్పబడ్డవి.
స్పందన: తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన అనే అర్థంలో వాడానంటున్నారు. ఇది క్లిష్టాన్వయార్థ సంపాదనం. వివరణే ప్రత్యక్ష ప్రమాణం.
5. క్రింది పద్యభావం అసమగ్రం (తరువాతి పద్యంతో అన్వయం క్లిష్టం)
అమరగఁ గేశపాశముగ శ్యామలనీరదఖండమొండు వ
క్త్రమువలె నొక్క శ్వేతజలదంబు రహింపఁగ గాత్రవల్లిపై
నమరిన పీతవర్ణకలితాంచలశోభితరోహితాంశుకో
పమమయి మిశ్రవర్ణయుతవారిద మొక్కటి తారసిల్లఁగన్.
వివరణ: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ యిది. ఈ పద్యానికి ముందు గల పద్యంలోని
“కొన్ని మబ్బు లూయలరూపు గొనుచు నలర
మఱొక కొన్ని యూయల నూఁగు తరుణికరణి
నమరుచుం గననయ్యె నయ్యంబరాన.”
మేఘవిద్యోతితమైన తరుణీరూపాన్ని “అమరగఁ గేశపాశముగ” అనే ఈ పద్యం విస్తరించి, మేఘాలవల్ల ఆ స్త్రీరూప మెలా ఏర్పడిందో రమ్యంగా తెలుపుతుంది. దీని తరువాతి పద్యం
పరమేష్ఠినిఁ బనిగొనకయె
పరమాద్భుతముగ సృజింపఁబడిన తదీయాం
బరవిలసితవరవర్ణినిఁ
బరికించుచు నక్కజంబు పర్విన మదితోన్.
పై రెండు పద్యాలలోని భావాలను సంక్షేపిస్తుంది. ఈ మూడుపద్యాలను సక్రమంగా అన్వయించుకొనకపోవడమే పై ఆక్షేపణకు కారణమైంది.
స్పందన: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ కాదిది. కర్త, కర్మ, క్రియల సమన్వయాన్నిబట్టి అన్వయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అటువంటి సమన్వయం లేనే లేదు. క్లిష్టాన్వయ దూరాన్వయాలే దోషాలు. అన్వయరాహిత్యం గురించి ఇక చెప్పాలా! ఇక దబాయింపులేమైనా ఉన్నాయేమో చూడాలి.
6. “కాలాఖ్యబాలక కేళికాతాడిత” లో కేళిక వైకృత పదం. తెలియడం లేదు. ఈసమాసానికి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి?
వివరణ: ఇది వైకృతపదం కాదు. శుద్ధమైన సంస్కృతపదం. కేళీ – కేళికా, అట్లే కాశీ – కాశికా, మల్లీ – మల్లికా, ఝిల్లీ – ఝిల్లికా, కాళీ – కాళికా . “కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి” – అని శ్రీనాథప్రయోగం. ఆకారాంతమైన కేళికాపదానికి (హ్రస్వ) అకారాంతమైన కేళిక వైకృతరూపం. అందుచేత ఈ ఆక్షేపణ నిరర్థకం. అన్వయం: కాలాఖ్య= కాలమనెడి, బాలక = బాలకునియొక్క, కేళికా= (బంతి) యాటవలన (యందు) , తాడిత= కొట్ట (తన్న)బడిన, కమనీయ = అందమైన, రోహిత = ఎఱ్ఱనైన, కందుకంబొ = బంతియో! అనగా, కాలమనెడు బాలకుడు బంతియాట ఆడుచు దిశాంతమునకు తన్నినట్టి ఎఱ్ఱని బంతివలె అస్తంగతుడగుచున్న సూర్యు డున్నా డని భావము. కొట్టి (తన్ని)నపుడు బంతి పైకెగిరి ఆ తర్వాత భూపతితమైనట్లు, అప్పు డాకాశంలో కొంత ఎత్తుగా నున్న రవి త్వరలో పశ్చిమాబ్ధియందు బడనున్నాడని ఇందులో ధ్వని.
స్పందన: ఇది ఒక అభినవ పాణినీయం. ఈ వాదన శబ్దస్వరూప విషయిక భ్రాంతి జన్యం. ఇచ్చిన ఉదాహరణాల్లో రెండు రకాల శబ్దాలున్నాయి. కొన్ని ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు, కొన్ని ఇకారాంత ఉభయలింగ శబ్దాలు. కాళీ – కాళికా వంటి శబ్దాలు “కాల”వంటి ప్రథమావిభక్త్యంతమైన అదంత శబ్దాలకు మత్వర్థంలో “ఇని”, “ఠన్” ప్రత్యయాలు వస్తాయి. (సూ. అత ఇనిఠనౌ). కాలః్ అస్య అస్తి కాల శబ్దం పైన “ఇని” ప్రత్యయము చేరి కాళీ (కాలీ) రూపం సిద్ధిస్తుంది. అదే “ఠన్” ప్రత్యయము చేరినప్పుడు “కాలిక” రూపం సిద్ధించి దానిమీద టాప్ వచ్చి కాలికా అవుతుంది. ఇక కేళి శబ్దము కిల శబ్దభవం (కిలంత్యనేనేతి కేళిః కిల క్రీడాయాం). ఇది ఇకారాంత పుల్లింగశబ్దం. దీనిమీద “ఙీప్” ప్రత్యయము వచ్చి కేళీ అనే స్త్రీలింగ శబ్దం ఏర్పడి ఉండవచ్చు (అక్తిన్నంతాలకి ఇ కారం దీర్ఘం వైకల్పికం). ఇక కాళికా శబ్దంలో కనిపించే అంత్య క కారం కేళికా శబ్దంలోని అంత్య క కారం ఒకే విధంగా నిష్పన్నమైనవిగావు. కేళికా లోని అంత్య క కారం స్వార్థమందు కా వర్ణం పరమైనప్పుడు నిష్పన్నం అయిన శబ్దం (కేళీ + కా). కేళీ సంబంధమైనది కేళిక. ఈ పదం విస్తృత వ్యవహారంలో లేదు. ఆంధ్ర శబ్ద రత్నాకరం దీన్ని వైకృత పదంగా పేర్కొని నాట్యం అనే అర్థాన్ని ఇచ్చింది. కొన్ని నిఘంటువులు sportive (కేళీ భావం) అనే అర్థాన్ని ఇచ్చాయి. ఏది ఏమైనా కేళిక పదానికి ఆట అనే అర్థం చెప్పడం కుదరదు. అంతే కాదు “కాలాఖ్యబాలక కేళికాతాడిత” అనే సమాసంలో యోగిత లోపించింది. కర్తృ క్రియా పదానుక్రమాన్ని పాటించి సమాసార్థాన్ని చెప్పాలి. ఇష్టానుసారం విభక్తుల్ని చేర్చి విగ్రహవాక్యాలు చెప్పేస్తే సరిపోదు.
మిగతా విషయాలు ఒకటి రెండు రోజుల్లో…………………………….
రాగలహరి: ఆభేరి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
04/17/2011 3:58 am
భావనారాయణగారూ,
వాద్యాలు, వాయిద్యాలు అనేవాటికి మధ్య గల తేడాలను ఈమాటలో నిత్యమూ రాసే విద్వాన్లు చెప్పగలరేమో. నావంటివాడికి దాని పేరుకంటే అదెలా మోగుతోందనేదే ముఖ్యం!
ఓ నెలరాజా ఎక్కువగా శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. దీన్నే హిందుస్తానీలో ధానీ అటారు. అక్కడక్కడ భీంపలాస్ ఛాయలు కనబడటానికి కారణం రెండిటి ఆరోహణా ఒకటే కావడం. భీంపలాస్‌లో అవరోహణలో రి2, ద2 కూడా వస్తాయి. అది మాల్కౌఁస్ కాదు. శుద్ధధాన్యాసిని ‘గ్రహభేదం’ చేస్తే (పంచమాన్ని షడ్జమం అనుకుంటే) అలా అనిపిస్తుంది అంతే.
సడిసేయకో గాలి శుద్ధధన్యాసి రాగం మీద ఆధారపడినది. (సినిమా పాటలన్నిటి గురించీ అలాగే రాయాలి. ఎదుకంటే రాగ స్వరూపం పూర్తిగా ప్రకటితం అవాలంటే గమకాలూ, వాదిసంవాది స్వరాలూ అన్నీ పలికించాలని పండితులంటారు).
కాలం కాని కాలంలో పాట భీంపలాస్ ఆధారంగా చేసినదే.
రాగలహరి: ఆభేరి గురించి S.bhavanarayana గారి అభిప్రాయం:
04/16/2011 1:51 am
dear Lakshmann garu,
namaskaram,
not only in typing and in internet ,but also in matters realted to music im an illiterate.My doubts are in sync with my limtations of m y acqisance with music an dwith telugu language. Kindly verify if i stand an y chance to be excused to harbour the following doubts.
1. which form is free of jarring common vulgarity in usage…………………..’ వాయిద్యాలు’ లెక ఆద్యాలు?
2 i am acustomed to hear from music jousnalists the song
ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్.. (భట్టి విక్రమార్క) has a base of malkons!
3.The other song”’సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
has tuned been tuned [by [ Rajani] on the Rga base of Dhanyasi
3.and the basi tune of the song కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు) is almost identical with raga Bhimplasi o f hindushani music.
you may take the trouble , fo r which favour i shud be tahnk ful . to clear m y doubt, iyou reaally feel i deserve a response, i reitearte that my doubt is not to intiate a challenge and ,neither is it meant for a discussion in to the veracity of your conclusion , as iknow well im not equipped to prove contrary to your conclusions.
yours lovingly
S B N
కథ కథ గురించి రాణి గారి అభిప్రాయం:
04/11/2011 8:23 am
కథ గురించి చాలా కాలం క్రితం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చదవడం ఎలా అని ఒక వ్యాసం రాశారు. కొంతకాలం క్రితం ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డిగారు కూడా చదవడం గురించి ఒక వ్యాసం రాశారు. కానీ ఇంత వరకూ ఎవరూ కథ గురించి కథ రాసినట్టు లేదు. ఇందులో కథ గురించిన కథనం కొత్తగా వుంది. కథ స్వయంగా తనగురించి ఒక కథ రాయడం అనే ఆలోచనే చాలా బాగుంది. అయితే ఇటువంటి కథ రాయడానికి కేవలం కథా కథన శిల్పాలతో బాటుగా చాలా అధ్యయనం కూడా అవసరమౌతుంది. ఆ విషయంలో కొంత అసంతృప్తి కలిగినప్పటికీ, కథగా చాలా బాగుంది.
ఇంతవరకూ పాఠకులు కథలు చదవడమేగానీ ఒక కథే స్వయంగా పాఠకుల్ని చదవడం అనే ఆలోచన రావడమే అపూర్వం. దాన్ని అందమైన కథగా మలచడంలో రచయిత విజయం సాధించారు.
దీన్ని కథ గురించి రాసిన కథ కాని కథగా సాహిత్యంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.
రచయిత చంద్ర కన్నెగంటి గారికి అభినందనలు.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/29/2011 2:01 pm
మనకి అన్ని కాలాల్లోనూ popular art forms ఉన్నాయి. అలాగే fine arts ఉన్నాయి. ఈవ్యాసంలో మొదలుపెట్టిన గొంతు వ్యాసం మొత్తం మీద లేదు. సినిమా పాటల విషయంలో కాలాన్ని గురించి అంత సానుకూలతని ప్రదర్శించిన వీరే గ్రూప్ డాన్స్ ల విషయాని కొచ్చేసరికీ చాదస్తపు గొంతుని విన్పించారు.
ఎప్పుడైనా ఒకే కాలంలో జనసామాన్యపు అభిరుచి [డబ్బులొస్తుందనుకుంటే..] popular art forms లో ఎక్కువ చోటు చేసుకుంటుంది, mass media ల్లో! సినిమా ఎప్పుడూ మాస్ మీడియానే. పైగా డబ్బులు సంపాదించుకుందికి అత్యధిక మొత్తంలో సొమ్ములని వెచ్చించి జూదం ఆడిన పధ్ధతిలో ఒక మూసలో నడిచే కళ కూడా!! అక్కడ డబ్బు మాత్రమే ప్రధానం మిగతావాటికన్నా!! ఆత్రేయ రాసినా, వేటూరి రాసినా, సీతారామ శాస్త్రి రాసినా.. ఇంకా మిగిలిన సినిమా కవులెవరన్నా రాసినా డబ్బుకోసమే!! అంచేత డబ్బులు తెచ్చే విధంగా మాత్రమే రాయమని వారిని ఆ నిర్మాతలు అడగడం తప్పదు. వీరు రాయకా తప్పదు. అందులో మంచివీ జనరంజకమైనవీ ఉంటాయి. కానివీ ఉంటాయి. డబ్బులు ఎక్కువ వచ్చేది నాటు శృంగారంలోనే గనక చినమా కవులు ఎక్కువగా ఆయా అర్ధాలని వచ్చే విధంగా రాయడం తప్పనిసరి. ఈ విషయం ఆ రాయమనే వారికీ తెలుసు. ఈ రాసే వారికీ తెలుసు. ఇక్కడ ఎవరూ అమాయకులు కారు.పాతకాలంలో కేతిగాడూ, బంగారక్కా లాంటి వీధిబాగోతాల పాత్రలు సినిమాల్లో సమకాలీన అవసరాలని తీర్చేలాగా రూపొందాయి. అయితే సినిమా మాధ్యమం targeted audience ఎవరు అన్నదాని ఆధారం గానే వాడే భాషా, పాటల్లోని అర్ధాలూ, సంగీతమూ ఉంటాయని ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. ఎలాగైతే సినిమాలోని హీరోయిన్ వాడే సంభాషణలూ, వొలకబోసే వయ్యారమూ ఆమె అవన్నీ నచ్చి చేస్తోందని మనం చెప్పలేం. అది ఆ సినిమా దర్శక నిర్మాతల అభీష్టం బట్టి రూపొందుతుంది.
పాపులర్ కళ ఉన్నా సమాంతరంగా మనకి ఇతర కళలు కూడా అవసరమై ఉంటూనే ఉన్నాయి. వాటిలో డబ్బుకి ఉండే స్థానం రెండవదీ, కళాత్మకత మొదటిదీ. అందువలన ఇతర లలితకళలన్నీ అన్నికాలాల్లోనూ కొనసాగుతూనే ఉన్నాయి. సమకాలము మాత్రమే సాహిత్యానికీ సంగీతానికీ కొలమానం అయితే “ఈమాట”లో త్యాగరాజు మీద వ్యాస పరంపర అవసరం ఉండదు. అలాగే గడిచిపోయిన రచయితల రచనలని గురించిన చర్చా ఉండదు. ఇవాళ్టి వాళ్ళ కవిత్వం మాత్రమే వేసుకుని పత్రిక నడుపుకోవచ్చు కదా? కానీ అలా చేయడం లేదెందుకనీ? చాదస్తం వల్లనేనా? కాదే? అలాగే సినిమాల విషయంలో సైతం అభిరుచి అన్నది ప్రమాణం అయితే ఇవాళ్టి సినిమా ఎవరి అభిరుచిని ప్రతిబింబిస్తోంది అన్నది ముఖ్యమైన ప్రశ్న అవుతుంది. ఈ వ్యాస రచయితా త్రయం చదువుకున్నవారే అయి ఉండి సినిమా పాటకి “సామాజిక అంతరాలూ, ఆడామగా తేడాలూ లేవు” అని చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. ఎందుకు లేవూ? ఖచ్చితంగా ఉన్నాయి. ఏ ఆడపిల్లా వేటూరి గొంతు పెట్టుకుని “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ” అని పాడదు. అలాంటి పాట వేటూరిది. అమ్మాయిల మనోభావాలని అనుసరించి వచ్చింది కాదు. అమ్మాయికి స్వేచ్చ ఉండి పాడుకోగలిగితే మరి ఇంకెలాగైనా పాడుకునేదేమో గానీ.. వేటూరి సుందర్రామ్మూర్తి రాసినట్టు కాదు. అలాగే ఇతర వర్గాల తేడాలు కూడా!! సినిమాల్లోని భాష ఏ వర్గపు అవసరాలు లేదా ఆశయాలూ ముఖ్యమో వాటిని నెరవేర్చడానికే తయారైనది. అమాయకంగా ఏమీ రూపొందింది కాదు. త్యాగరాజ కీర్తనలకి డిమాండ్ ఉండి డబ్బులొస్తాయని అనుకుంటే మన డిస్ట్రిబ్యూటర్లూ మన ఫైనాన్సర్లూ దానికే డబ్బుపెడతారు. డబ్బులకోసం రాసే పాటలో ఎప్పుడూ ఉత్తమ విలువలు ఉండలేవు. దీనికి కాలం కాదు ప్రతిబంధకం! సమకాలపు అభిరుచి కూడా కాదు. వీళ్ళు ఇన్ని సినిమా పాటలని వివరించి రాసేరు. నేను మరి ఇవాళ్టి కాలానికి చెందిన దాన్నే గానీ వీళ్ళ లిస్టులోని చాలా పాటలు మరి నాకు తెలీదు. నేను సినిమాలని తెగ చూసే అలవాటున్నదాన్నీ కాను.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే జనం అభిరుచి అంటూ ఉండదనీ వాళ్ళు తీసేది వాళ్ళు రాసేదీ జనం అనబడు వారు తమ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చూడటమో వినడమో చేయవచ్చు కానీ అవన్నీ “సమకాలము వారి అభిరుచిని” ప్రతిఫలిస్తున్నాయని మనం సాధికారంగా ఏమీ చెప్పలేమనీ నా ఉద్దేశ్యం. తాడేపల్లి హరికృష్ణ గారన్నట్టూ పద్యనాటకాలకీ ఇతర కళారూపాలకీ వచ్చే జనమూ ఇవాళ్టి కాలం వాళ్ళే!! చాయిస్ అని ఒకటుంటుంది మరి. దాని ప్రకారమే బతకడానికి సమకాలం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పుడూ కూడా ఈ “చాయిస్” అన్నది తక్కువగా దొరుకుతుంది ఏ కాలంలో బతికిన వారికైనా!! సినిమా పాటా మాటా ఆటాతో సహా!
రమ.
మేఘాంగన గురించి desikachary గారి అభిప్రాయం:
03/23/2011 10:19 pm
జి.సి.యస్.సిద్ధార్థగారు నా పద్యాలనుగుఱించి అనేకవిమర్శనాత్మకాభిప్రాయములను వెలిబుచ్చినారు. ఇవన్నీ పదస్వరూపం గ్రహించకనో, పద్యాలను జాగ్రత్తగా చదివి సరిగా అర్థం చేసికొనక పోవడంవల్లనో జనించిన అసమం జసమైన విమర్శనలని నా అభిప్రాయం. ఈవిధమైన విమర్శనలును విస్మరించితే వారి దృక్పథమే సరియైనదనే అభిప్రాయం ఇతర పాఠకులకు కలిగే ప్రమాదమున్నది. అందుచే వారి విమర్శలకు తగిన వివరణ నిక్కడ నేనిస్తున్నాను.
వివరణ: “ఆసవమాని” అన్నదే సరియైనది. “ఆసవమూని” అన్నది వ్రాతదోషం.
వివరణ: ఈ పద్యాన్ని సరిగ్గా అన్వయం చేసుకొనలేకపోవడంవల్ల జనించిన సంశయమిది. “గగనాబ్ధిలో న సాంయాత్రికులట్లు” – అంటే ఆకాశమనే సముద్రంలో చరించే మేఘాలు సముద్రంలో చరించే సముద్రవర్తకులలాగా ఉన్నాయని ఉపమానం. “సాంయాత్రికః పోతవణిక్” – అని అమరం. ఆకాశం సముద్రాన్ని పోలితే అందులో చరించే మేఘాలు ఆ సముద్రంలో ఓడలపై చరించే వర్తకుల లాగ ఉన్నాయని భావం. గగనాన్ని అబ్ధితో పోల్చడం సర్వసామాన్యం. “పోతవణిక్” అనే వివరణ ఇక్కడ ముఖ్యం. వర్తకులు లోనున్నా, పైకి కనపడేవి ఓడలే. అట్లాగే మేఘాలున్నాయని లక్షితార్థం.
వివరణ: పదాలను సరిగా అర్థం చేసికొననందువల్ల కలిగిన సంశయమిది. ఆలేఖ్యము = చిత్రము, ఆలేఖకుడు = చిత్రకారుడు, ఆలేఖనము = చిత్రరచనము,ఆలేఖకాపేటి = painter’s toolbox. కాని ఆలేఖకపదం పుల్లింగంలో అకారాంతం కావడంవల్ల, ఆలేఖికా అనే స్త్రీలింగరూపం ఆకారాంతం కావడంవల్ల పై సమాసాన్ని ఆలేఖికాపేటి అని మారుస్తే వ్యాకరణ సమ్మతంగా ఉంటుంది. అప్పుడు చిత్రకారిణి toolbox, or painter’s toolbox in general అని జాతివాచకంగా చెప్పుకోవచ్చు.
వివరణ: నిస్సందేహంగా. ప్రతిరచనము అంటే ఉన్న రూపానికి ప్రతిగా, అంటే దాని ప్రతిబింబంగా రచించడం. “ప్రతిసృష్టి” వంటి పదం. ప్రతి అనే అవ్యయానికి అనేకార్థా లున్నాయి. ఈ “ప్రతిరచన” “ప్రతిసృష్టి”, “ప్రతిబిమ్బం” వంటి పదాలలో ఇది సదృశార్థంలో, అంటే తత్తుల్యమైన రచన, తత్తుల్య మైన సృజన, తత్తుల్యమైన మూర్తి అనే అర్థాలలో వర్తిస్తుంది. “పరిజ్ఞానే, పదప్రాప్తౌ, కాలహృత్యాం, నివారణే, వ్యళీకావిష్కృతౌ, తుష్టౌ, సేవాయాం, నిష్క్రమేపి చ, ప్రోత్సాహే చా వినాభావే, విఘ్నాఙ్గీ కారయోరపి, వ్యావర్తనే, వినిమయే, పునరావర్తనేపి చ, వైపరీత్యే, వినిద్రత్వే, అవేక్షాక్షేపయోరపి. సంక్షేప స్పర్ధ సాదృశ్యే, స్వీకారాభ్యవహారయోః, ఉత్తరస్తోకయత్నేషు” – అని “ప్రతి” అను అవ్యయం వివిధపదాలకు చేర్చినపుడు కలిగే అర్థపరిణామాలు చెప్పబడ్డవి.
వివరణ: పద్యాల పూర్వాపరాలను సరిగా సమన్వయం చేసికొనకపోవడంవల్ల చేసిన ఆక్షేపణ యిది. ఈ పద్యానికి ముందు గల పద్యంలోని
“కొన్ని మబ్బు లూయలరూపు గొనుచు నలర
మఱొక కొన్ని యూయల నూఁగు తరుణికరణి
నమరుచుం గననయ్యె నయ్యంబరాన.”
మేఘవిద్యోతితమైన తరుణీరూపాన్ని “అమరగఁ గేశపాశముగ” అనే ఈ పద్యం విస్తరించి, మేఘాలవల్ల ఆ స్త్రీరూప మెలా ఏర్పడిందో రమ్యంగా తెలుపుతుంది. దీని తరువాతి పద్యం
పరమేష్ఠినిఁ బనిగొనకయె
పరమాద్భుతముగ సృజింపఁబడిన తదీయాం
బరవిలసితవరవర్ణినిఁ
బరికించుచు నక్కజంబు పర్విన మదితోన్.
పై రెండు పద్యాలలోని భావాలను సంక్షేపిస్తుంది. ఈ మూడుపద్యాలను సక్రమంగా అన్వయించుకొనకపోవడమే పై ఆక్షేపణకు కారణమైంది.
వివరణ: ఇది వైకృతపదం కాదు. శుద్ధమైన సంస్కృతపదం. కేళీ – కేళికా, అట్లే కాశీ – కాశికా, మల్లీ – మల్లికా, ఝిల్లీ – ఝిల్లికా, కాళీ – కాళికా . “కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి” – అని శ్రీనాథప్రయోగం. ఆకారాంతమైన కేళికాపదానికి (హ్రస్వ) అకారాంతమైన కేళిక వైకృతరూపం. అందుచేత ఈ ఆక్షేపణ నిరర్థకం. అన్వయం: కాలాఖ్య= కాలమనెడి, బాలక = బాలకునియొక్క, కేళికా= (బంతి) యాటవలన (యందు) , తాడిత= కొట్ట (తన్న)బడిన, కమనీయ = అందమైన, రోహిత = ఎఱ్ఱనైన, కందుకంబొ = బంతియో! అనగా, కాలమనెడు బాలకుడు బంతియాట ఆడుచు దిశాంతమునకు తన్నినట్టి ఎఱ్ఱని బంతివలె అస్తంగతుడగుచున్న సూర్యు డున్నా డని భావము. కొట్టి (తన్ని)నపుడు బంతి పైకెగిరి ఆ తర్వాత భూపతితమైనట్లు, అప్పు డాకాశంలో కొంత ఎత్తుగా నున్న రవి త్వరలో పశ్చిమాబ్ధియందు బడనున్నాడని ఇందులో ధ్వని.
వివరణ: ఈ అనుమానం నిరర్థకం. ఉపమాన, ఉపమేయాలకు సమానధర్మం చలనం. అన్యవస్తుప్రేరణ ఈ చలనానికి ఉభయత్రాకారణం. ఉపమానం మారుతచాలితమైనది. వనసందర్శనకుతూహలచాలితమైనది ఉపమేయం. ఈరెంటికీ అన్యవస్తుప్రేరితమగుట, చలించుట సమానధర్మములు. అంతే కాని, “తరుశాఖ” కూడ మనిషివలె నడువడం లేదే అని శల్యపరీక్షచేయడం విరసత్వానికి నిదర్శనం.
వివరణ: ఈ అనుమానం నిరర్థకం. ఇది అల్పపుమేఘమే కాని నల్పగు మేఘము కాదు. “స్తో కాల్ప క్షుల్లకా స్సూక్ష్మం శ్లక్ష్ణం దభ్రం కృశం తను” – అని అమరం. అల్పము + మేఘము = అల్పపుమేఘము – కర్మధార యంబులందు “పు, ంపు “లగు – అను సూత్రప్రకారము “అల్పము” “అల్పపు”గా మారినది. ఇక్కడ దీనికి సూక్ష్మమైన మేఘము, అంటే – ఆచ్ఛాదితవస్తువును పూర్తిగా తిరోహితం చేయకుండా, మసకగా కనపడేట్టు కప్పిన పలుచనైన మేఘము అని అర్థం. అట్లే ఆ స్త్రీముఖం గూడ విచారగ్రస్తమై, కొంత కళ దప్పియున్న దని భావము.
వివరణ: పై అనుమానం నిరర్థకం. “ఈ గతి” అంటే “వక్ష్యమాణప్రకారం” ముందు చెప్పే ప్రకారం అని అర్థం. ఆగతి యేదో అనుస్యూతంగా తరువాతి పద్యంలో చెప్పనే చెప్పబడింది.
వివరణ: పద్యాన్ని అర్థంచేసికొనక చేసిన ఆక్షేపణ ఇది. “ఒక గంధర్వుడు అని ముదలైన వాక్యం “గెడపం బూనం గలాడు” – అనే క్రియతో అర్థవంతంగా సమాప్తమైంది.
వివరణ: దేనికైన పెడ అర్థం తీయవచ్చును. ఎదుట గన్పడినది పురుషుడు గావున పురుషునితో మాట్లాడి బహుకాలమైనది అన్నది. అట్లే పురుషుని బదులు స్త్రీ కనపడి ఉంటే స్త్రీతో మాట్లాడి బహుకాలమైన దని ఉండేది. అంతేకాని ఆ మాటకు వక్రభాష్యంచేయడం అనవసరం.
వివరణ: ఆ సంఘటన యాదృచ్ఛికంగా, దైవికంగా జరిగిందని సరిపెట్టుకోవాలి గాని, దానికీ వక్రభాష్యం చెప్ప రాదు. ముందే గంధర్వుడు పతి అని చెప్పితే కథలోని Suspence , పట్టు పూర్తిగా తప్పిపోతుంది.
వివరణ: కథలో కొన్ని అంశాలు గుప్తంగా ఉంచుతేనే Suspenseful గా ఉండి కథ రాణిస్తుంది. ఐనా ఆ గంధర్వునికి పూర్వజన్మపరిజ్ఞానం ఉందనికూడ అనుకోలేము. “ధాతృకుటుంబిని మాదుమేలుకే యీ పథకంబుఁ బన్నెనని యెంచి” –అన్న వాక్యంలోని ఆంతర్యం సరస్వతీదేవి ముందుగా కోపగించినా, శాపానంతరం హంస మిథునం కలిసి ఉండాలనే పైవిధమైన శాపవిమోచనపథకం కల్గించిందని, అందుచేత దైవికమైన ఘటనగా ఆమె ఆ గంధర్వునిఆశ్లేషించిందని, ఈ విషయం సర్వజ్ఞురాలైన సరస్వతీదేవికి తెలిసినా, హంసమిథునానికి అంతవఱకు తెలియదని . భాగవతంలో చెప్పినట్లుగా, నవవిధభక్తిస్వరూపాలలో ప్రముఖమైన “తదంఘ్రి” సేవాభాగ్యము మఱల కలిగిందని ఆ హంసమిథునం తృప్తి. ఇదియే లైలాగారు లేవదీసిన అంశానికి గూడ జవాబు.
మేఘాంగన గురించి desikachary గారి అభిప్రాయం:
03/23/2011 9:57 pm
‘కఱ్ఱచట్రంబుపై” అన్న పద్యం తేటగీతి. ఈ పద్యానికి ప్రాసనియమం లేదు. పద్యచ్ఛందస్సును సరిగా గుర్తించలేక పొరపడుతున్నారు మీరంతే కాని, పద్యరచనలో దోష మేమీ లేదు.
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి Murthy Akella గారి అభిప్రాయం:
03/21/2011 4:08 am
కథ బాగంది, కాని ఎందుకో డ్రై గా, కృతకంగా అనిపించింది,బహుశా సత్యవతి పాత్ర చిత్రణలో, పాప్యులర్ తెలుగు సీరియల్ ఛాయలున్నాయేమో !
ఈమాట జనవరి 2008 సంచిక విడుదల గురించి MVR Murty గారి అభిప్రాయం:
03/19/2011 1:01 pm
మొదటిసారిగా ఈ సైట్ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. కొడవళ్ళ హనుమంతరావు గారి వ్యాసానికి, ఆయనకి శతకోటి వందనాలు.
ప్రస్తుత్తమో అప్రస్తుతమో తెలీదు కాని, ఒక విన్నపం. వ్యక్తుల పేర్లలో surnames ని తగ్గిద్దాం, వీలయితే వదిలేద్దాం. ఏమంటారు ?
-యమ్.వి. ఆర్. మూర్తి .
బెంగళూరు
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
03/18/2011 4:53 am
శ్రుతపేయం తప్పు, శ్రుతిపేయం ఒప్పు. శ్రుతపేయం అని ఎక్కడైనా ఉంటే అది అచ్చుతప్పై ఉండవచ్చు. శ్రుతి అంటే చెవి. శ్రుతము అంటే వినబడునది (heard about or of).
ఈ రెండు చోట్ల ఉన్నది “శ్రు” కాని “శృ” కాదు.
మేఘాంగన గురించి GSCS Siddhartha గారి అభిప్రాయం:
03/17/2011 1:30 pm
“కాలాఖ్యబాలక కేళికాతాడిత” లో కేళిక వైకృత పదం. ఈ సమాసంలో కేళిక పదౌచిత్యం ఏమిటో తెలియడం లేదు. ఈసమాసానికి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి?
క్రింది ఉపమానం సరైందేనా? ఊగడానికి తిరగడానికీ లంకె ఒప్పుతుందా?
“మందమారుతచాలితామ్రతరుశాఖ
కరణి నల్లన నేనందుఁ దిరుగుచుండ.”
“ముఖేందుబింబమును నల్పపు మేఘములట్లు గ్రమ్మె” – ఇందులో అల్పపు మేఘాలా? నల్పగు మేఘాలా? అల్ప శబ్దాన్ని పరిమాణార్థంలో కవి విరివిగా వాడుతున్నారు. అది సరికాదేమో!
“వినిపించెను తత్కారణ
మును నీగతి నక్కజంబు వొడమఁగ నాకున్.”- ఏ గతి?
ఈ క్రింది పద్యం మొదలుకు తుదిలేదు అని నాకనిపిస్తుంది.
“ఒక గంధర్వుఁడు మేఘమాలికలలో నూహించి నీరూపమున్
బ్రకటోత్సాహముతోడ నీవు గల యారామస్థలిం జేరి నీ
మొకమం దావృతమైన వంత గెడపం బూనం గలా డప్పుడే
వికలంబౌను మదీయశాప, మిటకు న్వీతెంతు వీ వంచవై”
“ఎన్ని యేఁడులు గడచెనో యెఱుగనైతి
అన్యపురుషునితోడ మాటాడి నేను” – ఇది సాంకేతికంగా ఒప్పే కాని ఆడ హంస అలా అంటే పెడార్థం తీయడానికి ఆస్కారం కలిగించడం లేదూ?
గంధర్వపతియే తన పతి అని నిర్ధారణ కాకుండానే అతని కౌగిల్లో వాలిపోతుంది హంసి – అన్య పురుషుని కోసం మొహం వాచినదానిలా. ఎందుకో?
“నాకుఁ దెలియ దేరీతి గంధర్వరూప మబ్బెనో కాని” అని భలేగా కవికి కారణం చెప్పకుండా తప్పించుకున్నాడు హంసవతంసము.
ఎన్నో సందేహాలున్నాయి ఇంకా – సమయం దొరికితేఅడిగి తెలుసు కొంటాను.
జగదఖిలమసారం
మాయికమేవేతి మనసి మనన్వా:
పర్యటతి పాటితాశః
ప్రగలిత మదమాన మత్సరః కో2పి.
మూడు లాంతర్లు – 3 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/16/2011 2:36 pm
కరటకశాస్త్రి శిష్యుని భాషలో చెప్పాలంటే, “వీని శిగ్గోసిరి..ఎంతబాగా అన్నాడండి ఈ huge harry గాడు. వీని తస్సాగొయ్యా ఆ అలంకారికులంతా పనీపాటాలేకుండా ఒక వెయ్యేళ్లపాటు అదేంటో ఒకటే తెగ హైరానా పడిపోయి ధ్వన్యాలోకాలన్నీ రాసేసి మా గురువుగారి లాంటి వాళ్లచేత నా నెత్తిన రుద్దేస్తున్నారే!! హారిదేవుడో!! ఈ హారీ గాడెవడో ఒక కంప్యూటర్ తెచ్చి నాకిచ్చినట్టాయనా.. ఆ వెంకటేశం గాడి పనిపట్టనూ? వాడిదగ్గరే కంప్యూటర్ ఉందని ఏం గర్రాగా ఉన్నాడూ?? మా ఈ గురువుల సృజనంతా కలుషితం అయిపోయింది.” వాడెవడూ? ఆ కాళిదాసు కావ్యాలన్నీ ఆ కల్పనలన్నీ వట్టిబూజు! ఒక్క కంప్యూటర్ మాత్రమే “స్వచ్చమైన” సృజనని కల్పిస్తుంది. అంతేకదా మరి ..దానికదే విడిగా డబ్బు సంపాదించనఖ్ఖరలేదు. పేరు సంపాదించనఖ్ఖరలేదు. శృంగారపు జంఝాటం దానికి అసలేలేదు. నాకు కూడా ఒక కంప్యూటర్ గురువైతే ఎంత బాగుండూ?!! కనీశం నేను వచ్చేజనమలో అయినా ఇలా ఈ సుబ్బిలాంటి వేషం కట్టి గురువుగారి కూతుర్ని పెళ్ళాడకుండా నాకు నచ్చిన కంప్యూటర్ ని ఎన్నుకుందును కదా?? సృజన అంటే మధురవాణిలా ఉంటుందని అనుకున్నానే ఇన్నాళ్ళూ నేను. చీచీ !! మధురవాణి ఏం బాగుండదన్నమాట. అది కల్తీ సాని!! ఈ కంప్యూటర్ ఉందే!! ఇదొక్కటే మా నికార్సైన “స్వచ్చమైన “సాని!!
ఇట్లు శ్రీ వేంకటేశం స్నేహితుడుకాని “సుబ్బి”వ్రాలు
రమ.
పి.యస్ . అదేంటోగానీ నాకు అన్నిటికీ డు లు పెట్టి పాఠకుడు..విమర్శకుడు అంటూ “డు” “డూ” అని చదూతుంటే కూడా ఒహటే గుద్దుకుంటున్నట్టూందేంటీ?? ఏంటో? “అహం” వల్ల కాబోలు! మరి నేను ఇంతే ఎప్పటికీ కంప్యూటర్ ని కాలేను కాదు. చస్తే కాను కూడాను. నాకు కల్తీ కల్పనే బాగుంటుంది. కల్తీలేని యంత్రమ్ కల్పించే కల్పన కాదు. అలాంటి కల్పన గిరీశాలకి బాగుంటుంది కాబోలు.!!
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:
03/15/2011 5:18 pm
వినీల్ / మోహన గార్లకి,
నాకు తెలుసున్నంత వరకూ తాళ గతికీ అంత్య ప్రాసకీ సంబంధం లేదు. అంత్యప్రాస పాదం ముగించేటప్పుడు అందంగా ఉంటుంది. మీరు చెప్పినట్లు కేవలం రూపకాది తాళాలకే అంత్యప్రాసుండాలన్న నియమమూ లేదు. ఉండకూడదన్న సూత్రమూ లేదు. ఈ క్రింది త్యాగరాజ కీర్తన రూపకతాళంలో వుంది. ఇందులో రెండో అక్షర ప్రాసొక్కటే కనిపిస్తుంది.
భక్తి బిచ్చమియ్యవే
భావుకమగు సాత్వీక (భ)
ముక్తికఖిల శక్తికి త్రి-
మూర్తులకతి మేల్మి రామ (భ)
ప్రాణము లేని వానికి బంగారు పాగ చుట్టి
ఆణి వజ్ర భూషణమురమందు పెట్టు రీతి
జాణలకు పురాణాగమ శాస్త్ర వేద జప ప్రసంగ
త్రాణ కల్గియేమి భక్త త్యాగరాజ నుత రామ (భ)
అయితే సాధారణంగా చాలా భజన పాటలు రూపక తాళంలోనే స్వరపరుస్తారు. మోహనగారు చెప్పినట్లు ఆరేసి మాత్రలకి సమన్వయం కోసం అత్యప్రాస్తలు వాడుతారు. ఖండచాపులో వున్న “నాదుపై పలికేరు నరులు” కృతిలో ఒక చరణంలో ఏ ప్రాసా లేదు. మిగతా చరణాల్లో ద్వితీయాక్షర ప్రాసుంది.
దినము నిత్యోత్సవమునకాస జెందితి
నా మనసున ఇల్లు ఒకటియనియుంటి కాని
అనుదినమునొరుల మేలును జూచి తాళ
లేకను రెండు సేయ వలెననుచు పల్కితినా
ప్రాసుంటే వినడానికి బావుంటుంది. లేకపోయినా పాట వినసొంపుగా ఉన్నంత వరకూ అభ్యంతరం లేదని నా అభిప్రాయం.
-బ్రహ్మానందం.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి మోహన గారి అభిప్రాయం:
03/14/2011 2:30 pm
వినీల్ గారు, నాకు సంగీత జ్ఞానము లేదు కాని, నాకు తెలిసినంతవరకు తాళం గతి (నడక) పైన ఆధారపడి ఉంటుంది. గతి మాత్రలపైన (దీనినే కళలు అని కూడ అంటారు) ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పిన రూపక తాళానికి ఆధారం ఆరు మాత్రలు. అంత్య ప్రాస పదాలు కనరావా, వినలేవా లాటివి ఉంటే రూపక తాళానికి సరిపోతుంది. విధేయుడు – మోహన
సిరుల సంక్రాంతి గురించి అచంగ గారి అభిప్రాయం:
03/07/2011 11:26 am
నేను పుట్టింది పట్నవాసములో అయినా పెరిగింది అమ్మమ్మగారింట. నా వయసులో ఓ 17 యేండ్లు తగ్గించి చూసుకుంటే కృష్ణవేణమ్మ గలగలలు, రావిచెట్టు ఆకుల బూరలు, మరీ ముఖ్యంగా మా అమ్మమ్మ నాకోసం దాచే మొదటి అరిశె ఇలా ఎనెన్నో జ్ఞాపకాల దొంతర. కాని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను బహుశా నాదే ఆఖరి తరమేమో అచ్చ తెలుగు సంక్రాంతిని మనసారా ఆస్వాదించినది. దేశాంతరవాసములో రేపు నాపిల్లలు వచ్చిపోయే అతిథులే కాని వారి సొంతము కాదేమో. కాసుల వేటకి దేశాంతరం వచ్చినా నాకు వెంటనే తెలిసిపోయింది నేను తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ సంస్కృతి నాది కాదని. ఏది ఏమైనా మరోసారి నా మనసుని మా ఊరి పోలిమేరకి తీసుకెళ్ళారు. ధన్యవాదాలు.
అరుణ్ చంద్ర గడ్డిపాటి.
తవ్విపోత గురించి మోహన గారి అభిప్రాయం:
02/26/2011 7:06 pm
బాగుంది కనుమూరి గారూ, ఆటోగ్రాఫ్ సినిమా జ్ఞాపకానికి వచ్చింది ఈ కవిత చదివేటప్పుడు.
– మోహన
విశ్వనాథ కోవెల గురించి lyla yerneni గారి అభిప్రాయం:
02/13/2011 4:19 pm
రామాయణం కథ నాలాటి అపండిత పల్లెటూరి ఘటం చదువుకుంటే, ప్రతి పాత్ర దేనికదే స్పష్టంగా ఉంటుంది. ఎన్నో పేర్లు వస్తూ ఉంటాయి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు – అందరూ విడివిడిగానే కనిపిస్తారు. ఋషులుంటే వశిష్టుడు, విశ్వామిత్రుడు, ఋష్యశృంగుడు. ఇలా ఎవరికి వారే. ఎవరి పాత్ర వారిదే. మనుషులకేనా అంటే కోతులకు కూడా వారి ఐడెంటిటీలున్నయ్. వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు – ఇలా ఎన్ని పేర్లు గుర్తుంచుకోటానికీ ఏం ఇబ్బంది లేదు.
కధలు ఇష్టపడేవాళ్ళు నాలాటి వారు అనేక రకాల పాత్రలను ఇష్టపడతారు. ఆ పాత్రల వైవిధ్యం లోంచి, వారి సంభాషణల నుంచీ, స్నేహాల నుంచీ, ఘర్షణల్నుంచీ, వినోదం కలుగుతుంది. ఆ జరిగే సంఘటనల మీదా, రాబొయే ఘట్టాల మీదా నాకు ఆసక్తి. అది నా తెలియనితనం లో నుంచి వచ్చిన రక్తి.
కాని పండిత వ్యాసులకు, ఇట్టి మామూలు కథల మామూలు మానవులకుండే అట్టి ఎదురు చూపుల అమాయకమైన ఆనందాలు లేవు. Scholars ఉన్నవీ లేనివీ అర్థాలు తీసుకుని, ప్రతిదీ లోతుగా తవ్వుకుని పోతూ, ఆ గూఢార్థాల గోతిలో పడి చివరికి -అన్నీ ఒకే అర్థం చెప్పుకుని, అన్నీఅంతకు ముందే తెలుసుననుకుని, అంతా ఒకటై పోయి- నిరవధిక, నిరామయ, నిర్గుణ సుఖం అనుభవిస్తూ ఉంటారు.
ఆ సుఖం నాకొద్దండి.
రామాయణంలో సీతా రాముడూ ఒకరే అంటే, ఆ మతమేంటో నాకు మాత్రం అంటించకండి. పైగా శబరి పాత్ర కల్పనకు కారణం ఏంటని ఆలోచన చెస్తూ, సీతా, శబరీ కూడా రాముడికి ఒకటేనంటే, ఇక నేను ‘ఏమి రామ కథ! శబరీ, శబరీ’ – అని లబలబలాడాల్సిందే.
రామా=సీతా= శబరి= బ్రహ్మ పదార్థం.
రాముడు = సీత = విశ్వనాథ = you know who= you know why.
Satan = Milton = T.S. Eliot = H. Bloom=
ఈ వ్యాసంలో ఎవరి అభిప్రాయాలు ఏవో విడదీయటం, ఎవరి తరం?
రెండు నెలలకోసారి ఒక సాహిత్య పురుషుడిపై ప్రేమ ప్రకటనలు చెయ్యమని సంపాదకులు అడిగితే, రాసే ‘మధుర భక్తి’ వ్యాసాలు ఇలాగే గజిబిజిగా ఉంటాయి. అప్పటి వరకు బాగున్న నాకు ఇట్టి ‘కోవెల’ లోకి అడుగు పెట్టగానే ‘జీవుని వేదన’ ఆరంభమవుతుంది.
లైలా
చేరా కు ఒక శతమానం గురించి మోహన గారి అభిప్రాయం:
02/09/2011 4:10 pm
లైలా ఉవాచ-
(’ఆచార్యులు’ ‘ఆచార్యులు’ -అంటున్నారు మాటల్లో అక్కడక్కడా. అది ‘డా’ కి పర్యాయపదమనీ, ఈ రచయిత పేరులో భాగం కాదనీ, నా ఊహ. తప్పైతే, చెపుతారుగా.:-))
నా ఊహలో రావు, శర్మలా ఆచార్య కూడా అతని పేరిలోని ఒక భాగమే. వైష్ణవులలో మతాచార్యుల వంశములో పుట్టిన వాళ్లు ఇలా పేరులుంచుకొంటారు. తరువాతి కాలంలో సంపత్కుమారులు నిజంగా ఆచార్యులయ్యారు. కాని ఆ ఆచార్య పట్టము పేరుకు ముందు వస్తుంది, తరువాత కాదు. మనకు స్వాతంత్ర్యము సిద్ధించిన తరువాత ఎన్నో కారణాలవల్ల శర్మ, ఆచార్య, భట్ట, అయ్యంగారు లాటి పేరులు వాడుకలో తగ్గిపోయింది. రావు, రెడ్డి ఇత్యాదులు మాత్రము ఇంకా వాడుకలో ఉంది. – మోహన
చేరా కు ఒక శతమానం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
02/08/2011 7:54 pm
…సంపత్కుమార రాసిన పద్యాలు కవిత్వమని ఎవరూ అనుకోరనుకుంటాను.
రమ.
… సంపత్కుమారులే ఇది సరదా రచన అని చెప్పుకొన్నారు. …ఈ పుస్తకాన్ని ఆచార్యులు చేరాగారి సతీమణి శ్రీమతి రంగనాయకికి అంకితమిచ్చారు. ఈ శతకాన్ని ఆధారం చేసికొని ఆచార్యులను అంచనా వేయడము తప్పని నా వైయక్తిక భావన. విధేయుడు – మోహన
రమ, మోహన, -విషయాలు కొన్ని తెలియ చెప్పినందుకు సంతోషం.
Reading in between the lines, I get the impression neither of the two, think much of these poems.
నాకు ఈ పద్యాలు బాగున్నయ్యి. సరదాగా ఉన్నయ్యి. పండితులకు ‘సరదా’ ఉండకూడదని నిషేధం ఏం లేదు కదా. కంద పద్యానికి విధించుకున్న నియమాలు ఉల్లంఘించారో, లేదో – అది నాకెలాగా తెలియదు. కాని సం -లు ఎంచి ఇచ్చిన ఈ పద్యాలలో నవ్వు ఉంది. నిజమూ ఉంది. మకుటంలో ‘దోస్తూ’ ‘నేస్తూ’ అన్నా, ‘చేరా’ ‘యారా’ అన్నా, పద్యంలో విషయముంది. చెప్పదల్చుకున్న విషయాలు పద్య్ర రూపంలో సంపత్ చెప్పగలిగారు. మేధావులనుంచి ప్రజలకు వచ్చే బాధలూ చెప్పారు. సమకాలీన కవులను గురించీ నవ్వారు. పిల్లలు వేళకు తిన్నారో లేదో అని పట్టించుకోక, బహుమతుల మోజులో, పిల్లల్ని ప్రైజు పిగ్గు ల్లాగా పెంచుకొనే రివాజు గురించీ చెప్పారు. అట్టి అమ్మానాన్నల పాలనలో పిల్లలకన్నా దళితులెవరురా నాయనా! -అన్నారు. మీవారూ మావారూ సాంబారు కాసుకోటానికి తప్ప నీ నా రాతలు ఎంత చేసేను – అని నవ్వుకుంటూ అంటున్నారు.
నవ్వుతూ నవ్వుతూ రాసిన ఈ పద్యాలు నాకు బాగున్నయ్యి.
పద్యాల్లో మైత్రి గురించి:
ఈ పద్యాలు, ఒక మగవాడు ఇంకో మగవాడికి రాసినవి. వీరి మైత్రి ఒకటో రెండో పద్యాల్లో సూచితము. సంపాదకులు, ఇతరులు కూడా, వీరి మైత్రిని కొంత కవిత్వీకరించారు.
Jumping to a generalisation quickly (fortified from prior reading of a few other writings in this magazine,) my impression is, friendships mostly existed ( and exist ) between ‘male’ writers. What I mean is -they are unisex friendships. There are no cross gender friendships among writers.
డాబా మీద కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్నా, కాలవ గట్టులకు షికారెల్లినా, ఒక కవి ఇంకో యువక కవిని రిక్షా కట్టించుకుని చూస్తానికి వచ్చినా, ఇవన్నీ మగ-మగ స్నేహాలే. (ఈ పత్రికలో ఏ రాతల్లోనూ, మగ ఆడ రచయితల మధ్య సాహిత్యపరంగా, స్నేహం వ్యక్తం చెయ్యబడలేదు.)
What prevails is ‘homophilia’ among male writers and poets. Telugu (Indian) people are very comfortable with such social behaviours. In life. In portraying them in arts. They understand and accept these ‘male’ friendships. There is never any suspicion of homosexuality. నేను అపోహ ప్రవేశపెడుతున్నానని అనుకోకండి. I don’t have the slightest inclination to do so. I really don’t expect it of Telugu. తెలుగులో చెప్పాలంటే – అంత సంబడం కూడానా.:-) I don’t think in Telugu, there are or there will be love sonnets from one male to the other, like from Shakespere to his young friend.
In these Telugu poems, from one male to the other, there are no homoerotic overtones. In this set of poems, there is a sexual void.
Overall, I am making an observation of prevalance of male friendships in Telugu writers and absence of sexuality in their writings.
పుస్తకాల్లో, పత్రికల్లో, అంకితాల సంగతి, మరెప్పుడైనా.
మళ్ళీ రాస్తాను.
(‘ఆచార్యులు’ ‘ఆచార్యులు’ -అంటున్నారు మాటల్లో అక్కడక్కడా. అది ‘డా’ కి పర్యాయపదమనీ, ఈ రచయిత పేరులో భాగం కాదనీ, నా ఊహ. తప్పైతే, చెపుతారుగా.:-))
లైలా
బాలమురళీకృష్ణ సంగీతం గురించి narayan babu vedula గారి అభిప్రాయం:
02/08/2011 6:48 am
త్యాగరాజు కృతులు గాని శ్యామశాస్త్రి కృతులు గాని మొదట్లొ తమిళ,కన్నడ విద్వాంసులెవరు పాడినా సాహిత్యం తెలుసుకోడానికి చాలా కష్టపడినా గానీ బోధ పడేది కాదు. తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి కొఱకరాని కొయ్య గా ఉంటుంది. కాని బాలమురళి పాడినది విన్నపుడు ఈ సమస్య ఎదురయ్యేది కాదు. దీని వల్ల ఆయా కీర్తనలూ, కృతులూ వినాలనే అభిలాష కూడా పెరిగి అందులొ అభిరుచి పెరుగుతుదని నీను నా స్వానుభవంతొ చెప్పగలుగుతున్నాను. నాకు కించిత్తు స్వరజ్ఞానం లేదు గాని త్యాగరాజు పంచరత్న కీర్తనల్ని ఇంచుమించు బాలమురళి పాడినట్లుగానే పాడేస్తున్నాని నా మిత్రబ్రుందం అని మెచ్చుకోగా విని ఆనందపడిపొతూ ఉంటూ ఉంటాను. పరోక్షంగా నే బాలమురళి గారి “వీరాభిమానిని” ఐపోయాను కూడా.
నారాయణంబాబు వేదుల జంషెడపూరు.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:
01/29/2011 7:34 am
ఈ విషయం మీద నేను చాలా చోట్ల చర్చించాను కాబట్టి చర్విత చర్వణం అవుతుంది అని చర్చలోకి ప్రవేశించ లేదు.
కవిత్వ మీమాంస అన్న వ్యాసంలో రెండవ భాగం కవిత్వ మీమాంస అన్న శీర్షిక కింద నా ఆలోచనలు చూడగలరు.అలాగే ఈ సంభాషణలో మూడవ ప్రశ్నకు నేనిచ్చిన జవాబు కొంతవరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.
చేరా ఆచార్యుల గారి చర్చ గురించి నేను చాలా విన్నాను. కానీ, ఆ పుస్తకం సంపాదించి చదివినప్పుడు (1990 లలో) నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ‘vers libre ‘(free verse) గురించి వీరిద్దరూ పట్టించుకోక పోవడం. చారిత్రక నేపథ్యాన్ని విస్మరిస్తే చర్చలో పదును పోతుంది, ఎన్ని విలువైన విషయాలను ప్రస్తావించినా. సమస్య మూలాలను వదిలి అనేకానేక విషయాలు చర్చించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఏది ఏమైనా ఈ చర్చ చరిత్రలో భాగమే కనుక తప్పక చదవ వలసిందే.
శుష్క వచనాన్ని, శుద్ధ కవిత్వాన్ని విడదీసేది భావనా శక్తి. వచనంలో మామూలు తర్కంతో బండి నడుస్తుంది.ఎక్కువ ఖాళీలు ఉండవు. పాఠకుని ఊహా శక్తికి మేత వేయడు రచయిత. దానికి భిన్నంగా కవి పాఠకుని భావనా శక్తిని పరీక్షిస్తాడు. కవిత్వంలో తర్కం లేదు అన్న వితండ వాదం చేయడం లేదు నేను. తర్కాన్ని మించిన భావనా బలం కవితకు ప్రాణం. దాన్ని పాఠకునిలో స్ఫురింప చేయడానికి పాదకల్పన అవసరమవుతుంది. పాదకల్పన కంద పద్యాల్లోనో ఆటవెలదిలోనో ఉన్నట్టు కాకుండా స్వేచ్చగా ఉంటుంది. పాఠకునికి కవి తాను చూసిన జగత్తును చూపి తద్వారా తాను పొందిన అనుభవాన్నిసూచించడానికి సాధనం పాదకల్పన. పాద కల్పన లేకుండా , వాక్యం తరువాత వచ్చే వాక్యం ఒక తర్క ధోరణిలో పడి పోతుంది. వాక్యాల మధ్య అన్వయం హేతుబుద్ధికి అందుతుంది. కవిత్వంలో వాక్యాల మధ్య అన్వయం
హేతుబుద్ధిని దాటిన భావనా శక్తికి సంబంధించినది.దాన్ని సాధించడానికి ఒక సాధనం పాద కల్పన.కవితకు ఒక క్రమం, నడకా,నిర్మాణం ఉన్నాయి మరి. అంతేకాదు,పాదకల్పన లేకుండా కవితలోని ఎత్తుగడ అర్థం కాదు.లయ అవగతం కాదు.
చివరికి చెప్పేదేమిటంటే వచనం రేఖీయం(linear). కవిత వృత్తం. అది ఎలాంటి వృత్తం? దాని గణితం జోలికి పోవడం అభిప్రాయాన్నిమించిన చర్చ.
ఈ విషయంలో ఇస్మాయిల్ గారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉపయోగిస్తుంది.
“ఆధునిక కవిత్వానికి వచన కవిత్వ మనే దౌర్భాగ్యపు పేరు ఎవరు పెట్టారో కాని,నిజమే ననుకొని శుష్క వచనం రాసేస్తున్నారు చాలామంది.వచనంలాగే కవిత్వానికి ఒక క్రమం, నడకా,నిర్మాణం అవసరం లేదని వీళ్ళ అభిప్రాయం.ఆ మాట కొస్తే,వచనానికి కూడా క్రమం, నిర్మాణం కావాలి కదా!మనం మాట్లాడే భాషే మన అనుభవాన్ని,ఆలోచనల్నీ క్రమబద్ధం చేసే ఉపకరణం.కవిత్వం జీవితానుభవాన్ని క్రమబద్ధం చెయ్యటమే కాదు, వాటి చాటునున్న అర్థవత్వ్తాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.” (నిశ్శబ్దంలో నీ నవ్వులు, నా కవితా సంకలనానికి రాసిన ముందుమాట , భూషణీయం నుంచి.)
కామేశ్వర రావు గారూ ,
ఇప్పటికి మీ మొదటి ,మూడవ ప్రశ్నల కు సమాధానం వచ్చిందే అనుకొంటున్నాను. ఇక మిగిలింది రెండవ ప్రశ్న.
౨.
” అ.ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని,
ఆ. పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?”
( అ. ఆ లు నావి , స్పష్టత కోసం )
‘vers libre ‘(free verse ) స్ఫూర్తితో ఆలోచిస్తే (ఆ )సమంజసం కాదు. కానీ, ‘vers libre ‘(free verse ) పాద కల్పనకు వ్యతిరేకం కాదు. ఫ్రెంచి కవులు బిర్ర బిగుసుకుపోయిన ఛందో నియమ నిబంధనలను అతిక్రమించి వాటిని పాటించడమే కవిత్వం కాదు వాటికి బయట కూడా కవిత్వం ఉంటుంది అని చెప్ప దలుచుకున్నారు. (మోహన గారి విలువైన అభిప్రాయం చూడండి పద్యం కూడా ఒక రకమైన వచనమే).ఈ స్ఫూర్తిని గ్రహించిన కవులు చాలా వరకు అన్ని భాషల్లోనూ వారికి తోచిన రీతిలో పాద కల్పన పాటించారు. జర్మన్ , రష్యన్ లో అంత్య ప్రాసలు వదులుకో లేదు అక్కడి కవులు.(ఈ విషయంలో ఈ నాటికీ రష్యన్లు అమెరికన్ లను ఎద్దేవా చేయడం నేను ప్రత్యక్షంగా చూసిన విషయం.) సారాంశం ఏమంటే ఈ స్ఫూర్తిని గ్రహించి, నీ భాషకు ఏది అందమో దాన్ని వదలకుండా కవిత్వ రచన చేయాలి.
ఇక మిగిలింది prose -poem . కవిత్వాన్ని బహువచనాల బారీ నుండి కాపాడడానికి పుట్టుకొచ్చింది అంటారు Robert Bly. శ్రీ శ్రీ కవిత్వం తీసుకోండి పతితులారా భ్రష్టులారా ..అన్నీ బహువచానాలే. రాజకీయ కవిత్వంలో ఇది తప్పదు. కానీ , ఇది కవిత్వానికి చేటు చేస్తుంది. మనం చూసేది ఒక్కొక్క వస్తువునే. వస్తు సముదాయాలను కాదు. ఈ ఎరుకతో రాసేది prose -poem ఇది కూడా ముందు ఫ్రెంచి కవులే సాధించి చూపారు. ఎక్కువ వివరాలకు Talking All Morning, పుస్తకంలో On Writing Prose Poems అన్న ఇంటర్ వ్యూ (1975 లో వచ్చింది.). అలాగే తొలినాటి ఫ్రెంచి కవుల కవితా సంగ్రహం సవిమర్శకంగా చదవాలి.
మన విమర్శకులకు పరభాషా సాంగత్యం లేక చాలా చేటు జరిగింది. పట్టు మని పది భాషల్లో వచ్చిన విమర్శలు చదవరు. అనువాదాల మీద శ్రద్ధ లేదు.చరిత్ర తెలుసుకోరు.ఆధునిక కవిత్వం దాని విమర్శ ఒక ప్రత్యేక విభాగం అన్న స్పృహే లేదు. పిండి కొద్దీ రొట్టె. శుష్క వాదాలు శూన్య హస్తాలు. ఇక జాలింతును; స్వస్తి.
తమ్మినేని యదుకుల భూషణ్.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/28/2011 2:20 am
రమగారూ,
నేనసలు కవుల జోలికే పోలేదండి! తమ కవిత్వంలో పదాలని రకరకాల అర్థాలలో ప్రయోగించే స్చేచ్ఛ కవులకి ఎప్పుడూ ఉంది. అది లేకపోతే కవిత్వమే లేదు. నేను చెప్పినది విమర్శలు, లక్షణ చర్చల విషయంలో. అందులోని పరిభాషకి స్పష్టత నిర్దిష్టత అనివార్యం కదా.
ఈ చర్చని ఈనాటి వచన కవులు చదవలేదంటే అది ఆ కవుల తప్పు కాదా? ఇందులోని అభిప్రాయాలని పరిగణించాల్సిన అవసరం లేదు. కాని విషయం ముఖ్యమైనది అనుకున్నప్పుడు, దాని గురించి తమ అభిప్రాయాలని చెప్పాలి కదా. వచనకవిత్వ రూపాన్ని గురించి, పాదవిభజన గురించి మరింత అవగాహన కవులకి, పాఠకులకి అవసరమని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు కనీసం ఈ చర్చ ద్వారానైనా కవులు ముందుకువచ్చి తమ అనుభవాలనూ, ఆలోచనలనూ పంచుకుంటే బాగుంటుంది కదా?
మాధవ్ గారూ,
పద్య నిర్మాణపు చట్రం గురించి మీరు ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. పాటకి స్వరం మౌలిక లక్షణం. మీరు చెప్పిన ఇతర “గీత” లక్షణాలు “పాట”లన్నిటికీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ దాన్ని పాటగా “స్ఫురింప”జెయ్యడం అంటూ ఏమీ లేదు. అది ముమ్మాటికీ సిసలైన పాటే! పాదవిభజన కవితకి అలాంటి మౌలిక లక్షణం కాదని నేను భావిస్తాను. అయినా మీరు “స్ఫురణ” విషయంలో చెప్పింది నాకు అర్థమయ్యింది. పాదవిభజన చెయ్యడం వలన అది కవిత అన్న స్ఫురణ ఎందుకు కలుగుతోంది అన్న విషయమై ఆలోచించాలి. కేవలం పరంపరగా కవిత్వం పాదబద్ధం కావడం మూలాన ఆ స్ఫురణ కలుగుతోందంటే, అది అంత విలువైన విషయం కాదు. కాలాగతిలో అది చెరిగిపోతుంది. అంతకన్నా విలువైన ప్రయోజనం ఉందా అని ఆలోచించాలి.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/27/2011 5:37 am
రమగారూ,
“పద్యం” అన్న పదాన్ని “కవిత” అనే అర్థంలో కొంతమంది కవులు, విమర్శకులు వాడారన్న విషయం నాకు తెలుసు. అయితే అది శాస్త్రీయం కాదన్నదే నా అభిప్రాయం, దానికే నా ముందు వ్యాఖ్యలో హేతువులు చూపెట్టాను. ముఖ్యంగా అలాంటి వాడుక అయోమయానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటి చర్చాంశమైన వ్యాస పరంపరలో, “వచన పద్యం” అన్న పదంలో పద్యం అంటే పాదబద్ధత ఉన్న రచన అనే ఉద్దేశ్యంలోనే తీసుకున్నారు కాని కేవలం “కవిత” అనే అర్థంలో తీసుకోలేదు. వచనకవితలని వచనపద్యాలు అనుంటున్నాం కాబట్టి అవి కచ్చితంగా పాదబద్ధం కావలసిందేనని సంపత్కుమారగారన్నారు. దాన్ని చేరాగారు కూడా ఖండించ లేదు! కవిత అనే అర్థంలో మాత్రమే “వచనపద్యాలు” అని, అవి వచనపద్యాలు కాబట్టి వాటికి పాదబద్ధత ఉండాలనడం సరైన వాదన కాదు కదా!
వచనకవితా స్వరూపాన్ని గురించి వచనకవులు మరింతగా చర్చించాలన్న విషయమై మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నా వ్యాఖ్యలోకూడా అదే అన్నాను. అలాంటి చర్చ చెయ్యడానికి అడ్డంకి ఏముంది? ఈమాటలో వ్రాసే/ఈమాటని చదివే వచనకవులు/కవయిత్రులు ఇప్పటికీ ఈ చర్చలో ఎందుకు పాల్గొనటం లేదో మరి!
మాధవ్ గారూ,
“ఎంత అకవిత్వమైనా, పద్య నిర్మాణపు చట్రంలో ఉండటంతో దానికి కొంత కవితాలక్షణం వస్తుంది.” ఇక్కడ “పద్య నిర్మాణపు చట్రం” అంటే ఏమిటన్నది నాకు పూర్తిగా అర్థమవ్వలేదు. పాదబద్ధతా? లేక అక్షర, గణ, మాత్రా ఛందస్సా? అలాగే ఆ చట్రంలో ఉండటం వల్ల వచ్చే “కవితాలక్షణం” ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు.
“పాఠకుడికి ఒక విరామం ఇవ్వడం గురించే, అది ఎలా ఇవ్వాలనే గదా భావగణాల ప్రస్తావనంతా!”. రెండిటికీ తేడా ఉంది. ఎక్కడ విరామం ఇవ్వాలన్నది కవి ఊహబట్టి, కవిత బట్టి ఉంటుంది. దాన్ని భావము, భావాంశము అనే చట్రంలో బిగించడం సాధ్యం కాదు. ఒక కవితలో ఒక భావం పూర్తి కాకుండానే సగంలో పాఠకుణ్ణి హఠాత్తుగా ఆపాలని కవి అనుకుంటే, అక్కడ మధ్యలో పాదాన్ని ఆపవచ్చు. అది సంపత్కుమారగారు నిర్వచించిన “భావాంశం” అని చెప్పలేం. ఉదాహరణకి ఈ నెల ఈమాటలో వచ్చిన భూషణ్ గారి “శిశిరచిత్రాలు” కవితలో ఈ పంక్తులు చూడండి.
కలిసిన రోజుల
రంగురంగుల
జ్ఞాపకాల ఆకులను
పెళుసు కొమ్మలతో
దులుపు కోవడమే
మేలు.
…
ప్రేమగా వీచినా అసలు
ఆకులు రాల్చనంది
ఇక్కడ “రంగురంగుల” అన్నది ఏ కోశానైనా భావాంశం అవుతుందా? “ప్రేమగా వీచినా అసలు” అన్న వాక్యంలో భావం కాని భావాంశం కాని పూర్తయ్యిందా? అయినా కవి పాదాలని అక్కడ విరిచాడంటె ఎందుకు? సంపత్కుమారగారు ఇలాంటి వాటిని exceptionsగా లేదా ఛందోదోషాలుగా పరిగణించారు. ఒక చట్రాన్ని ఊహించి దానికి లొంగని వాటిని దోషాలుగా పరిగణించడం కన్నా, ప్రతి కవితకీ తనదైన చట్రం కవి గీసుకుంటాడని అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీరు ప్రస్తావించిన సౌష్టవం విషయమై కూడా నాదిదే అభిప్రాయం. సాధారణీకరణ గుఱించి ఆలోచించే కన్నా, ఒక కవితలో సౌష్టవం తగినంత పాళ్ళలో ఉందా లేదా, కవితా నిర్మాణం అందులోని భావాన్ని పాఠకులకి అందిచడానికి సహాయపడుతోందా లేదా అన్నదే ఆలోచించడం మేలని నేననుకుంటున్నాను. ఇంగ్లీషు సాహిత్యంలో కవితా నిర్మాణం గురించి సాధారణీకరణలేమైనా చేసారేమో అందులో పరిచయమున్నవారెవరైనా చెప్పాలి. అది మనకి ఉపయోగపడే అవకాశం ఉంది.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/25/2011 9:15 am
సంపత్కుమార, చేరాగార్ల యీ చర్చ కొద్ది కాలం కిందటే నేను చదివాను. దాని వల్ల అసలు విషయం కన్నా కొసరు విషయాలు అనేకం తెలుసుకున్నాను. ముఖ్యంగా, వృత్తాలకి “భరనభభరవ – ఉత్పలమాల” అన్నట్టుగా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న లక్షణం, ఈ వ్యాసాలు చదివాకే అనుకుంటాను, అది కేవలం వెసలుబాటుకే తప్ప అసలు లక్షణం గురులఘు క్రమమే అన్న realization కలిగింది! అలానే మరెన్నో ఛందోవ్యాకరణాంశాలు కూడా తెలిసాయి. ఇక అసలైన, “వచన పద్య లక్షణం” విషయానికి వస్తే, దాని గురించి నా అభిప్రాయాలివి:
1. అన్నిటికన్నా ఈ చర్చలో నన్ను ఆశ్చర్యపరచిన విషయం, “వచన పద్యం” అన్న పేరుకి చేరాగారు కాని నాగరాజుగారు కాని పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం. నాకున్న పెద్ద అభ్యంతరం ఆ పేరు! “పద్యం” అన్నది ప్రక్రియా రూపాన్నే కాని కవిత్వాన్ని సూచించే పదం కాదన్నది అందరూ అంగీకరించే విషయమే. ప్రాచీన సాహిత్యంలో కూడా పద్యాలలో శాస్త్రాలవంటి కవిత్వేతర రచనలూ, అలాగే గద్యంలో కావ్యాలూ ఉండనే ఉన్నాయి. మరి “వచన” అన్న పదం కూడా అది కవిత్వం అన్న విషయాన్ని సూచించదు. అది దేన్ని సూచిస్తుందో ఈ వ్యాసాల్లో స్పష్టంగా ఎవరూ నిర్వచించినట్టు లేదు. వాడుకలో “ఛందోబద్ధము కాకుండా మాటలుగా వ్రాసినది, గద్య” అన్న అర్థం ఉంది. అంటే ఇది కూడా రూపాన్నే సూచిస్తోందన్న మాట. ఇందులో “కవిత్వం” అని సూచించే పదమే లేకపోతే ఈ ప్రక్రియకి కథ, నవల మొదలైన ఇతర ప్రక్రియలతో ఉన్న తేడా ఎలా తెలుస్తుంది? అంతే కాదు, “వచన”, “పద్యం” అనే పదాలకున్న వ్యతిరేకార్థాల వల్ల ఆ రెండూ కలిపిన పదం ఒక oxymoron అవుతుంది! వచన కవిత్వానికి పాదబద్ధత మౌలికమైన లక్షణం అనుకుంటే, అది ఇప్పటి వరకూ ఉన్న ఛందస్సు కన్నా విభిన్నమైనది అనుకుంటే, అలాంటి ఛందస్సుకి ఒక కొత్త పేరు పెట్టుకోవాలి – వృత్తాలు, జాతులు, ఉపజాతులు, గేయాలు (మాత్రా ఛందస్సులోని పద్యాలు) అన్న పేర్ల లాగా. ఉదాహరణకి భావుకములు అందాం (భావ ప్రాధాన్యం కలిగినవి కాబట్టి). ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన పద్యాలు కలిసి పద్య కవితా ఖండిక అయినట్టుగానే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువైన భావుక పద్యాలు కలిస్తే మనం మామూలుగా చెప్పే “వచన కవిత” అవుతుంది. అందువల్ల, “వచన కవిత”కి “వచన పద్యం” అన్న పేరు సమంజసం కాదు.
2. నాకు ఆశ్చర్యంగా తోచిన మరొక విషయం అందరూ ఆధునిక వచన కవిత్వానికి పాదబద్ధతని అంగీకరించడం. వచన కవిత్వంలో కనిపించే పాదా విభజన ఐచ్ఛికమా, నియతమా అని ఎవరూ ప్రశ్నించినట్టు లేదు! పాద నిర్మాణానికి నిర్దిష్ట నిర్వచనం సాధ్యమవ్వదు అన్న చేరాగారు కూడా, పాదవిభజన మాత్రం తప్పనిసరే అనుకున్నట్టుగా నాకు అనిపించింది. బహుశా అప్పట్లో వచ్చిన కవిత్వం (ఇప్పటికీ కూడా) చాలా వరకూ పాదాలుగా విభజించబడే ఉండడం దీనికి కారణం కావచ్చు. నా దృష్టిలో అలంకారాల మాదిరిగానే, పాద విభజన కూడా వచనకవిత్వంలో ఐచ్ఛికమే తప్ప కచ్చితంగా పాటించాల్సిన నియమం కాదు. కాబట్టి వచన కవితలు అసలు పద్యాలు అవ్వాల్సిన అవసరమే లేదు. ఆధునికంగా వచ్చిన వచన కవిత్వానికి ఊపిరే స్వేచ్ఛ. ఛందస్సు (కొండొకచో వ్యాకరణ) శృంఖలాలను తెంచుకోడమే వాటి వెనకనున్న స్ఫూర్తి. కాబట్టి, ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని, పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?
3. నా ఉద్దేశంలో ఈ చర్చలో ప్రస్తావనకి నోచుకోని అతిముఖ్య విషయం ఒకటుంది. వచన కవితల్లో పాదవిభజన ప్రయోజనం ఏమిటి అన్నది. వచన కవితలు చాలా వాటిల్లో పాదవిభజన కనిపిస్తుంది. దానికి నిర్దిష్టమైన సూత్రాలు లేకపోయినా, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించి కవులీ పాదవిభజన చేస్తారు? పాదవిభజనతో కూడిన రూపం, కవితకి ఎలాంటి అదనపు విలువని చేకూరుస్తుంది? వచన కవిత్వ రూపానికి సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు విమర్శకుల దృష్టికి అంతగా వచ్చినట్టు లేదు. దీనివల్ల అటు వచనకవిత్వం రాసే కవులకి గాని, దాన్ని చదివే పాఠకులకి గాని ఈ విషయమ్మీద సరైన అవగాహన ఏర్పడ లేదనిపిస్తుంది. వచనకవిత్వ రూపమ్మీద జరిగిన ఈ చర్చలో ఈ విషయాన్ని పరిశీలించడానికి చక్కని ఆస్కారం ఉన్నా, కేవలం లక్షణ నిరూపణ వైపే దృష్టంతా కేంద్రీకరించడం వల్ల, అది జరగలేదు. ఇప్పటికైనా దీనిపై ఎవరైనా, ముఖ్యంగా వచనకవిత్వం రాయడంలో చెయితిరిగిన కవులు, దృష్టి పెడితే బాగుంటుంది. అప్పుడు వచనకవితా రూపంలో పాదవిభజన ఒక శక్తివంతమైన పరికరంగా మారే అవకాశం కలుగుతుంది. పాదవిభజన వల్ల నాకు కనిపించే రెండు సాధారణ ప్రయోజనాలు ఇవి:
ఒకటి, ఆ పాదంలో చెప్పిన విషయం పాఠకుడి మనసుకి పట్టేందుకు ఒక విరామం ఇవ్వడం. ఇది పాదవిభజన లేకుండా కామా, ఫుల్స్టాప్ వంటి గుర్తులతో కూడా చెయ్యవచ్చు. అయితే, అచ్చులో కవితని చదివేటప్పుడు, ఈ రెండు చిహ్నాలు కన్నా కూడా మొత్తం వాక్యాన్ని ఆపి వేస్తే చదువరి మరింత ఎక్కువసేపు అక్కడ విరామమిచ్చే అవకాశం ఉంటుంది.
రెండు, సాధారణ వచనంలోని వాక్యాలు వ్యాకరణబద్ధంగా ఉంటాయి. కాని, ఆధునిక కవిత్వంలో వ్యాకరణ అతిక్రమణ చాలా చోట్ల కనిపిస్తుంది. అంచేత అది మామూలు వచనంలాగా రాసుకుంటూ పోతే చదివే పాఠకునికి చిరాకు కలిగే అవకాశం ఉంది. అదే పాదవిభజనతో రాస్తే, అవి వాక్యశకలాలుగా అనిపించి పాఠకుడికి చిరాకు కలగదు.
ఈ సాధారణ ప్రయోజనాలు కాకుండా కవి ప్రత్యేకమైన ప్రయోజనం కోసం పాదవిభజనని వాడుకోవచ్చు. అలాంటి సందర్భాలుంటే వాటిని పాఠకులు, విమర్శకులూ గుర్తించగలిగే మార్గాలు అన్వేషించాలి.
కమాండో: డా. నిసి షామల్ నొవెల్లా గురించి v.s.pani గారి అభిప్రాయం:
01/25/2011 6:40 am
నేను ఈ కథ చదివాను.. కథ లో సస్పెన్స్ ఉంది.. కాని పాత్రలు కొన్ని గజిబిజిగా వున్నట్టు అనిపించింది. దీనిక్కారణం అవి ఫారిన్ పేర్లు అవడం అనుకుంటున్నా.. కథ పెద్దగా ఉంది..కాబట్టి చదువరి కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది..
మూడు లాంతర్లు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/21/2011 1:26 am
కనక ప్రసాద్ గారూ !!
“ఇంకా ఉంది ఇంకా ఉంది ” అన్న మీ మాట వల్ల అంతా ఒక సారే చదవొచ్చు లెమ్మని ఊరుకుంటూంటే మీరు నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. మీ మొత్తం చదివినా నాకు కలిగే సరికొత్త జ్ఞానమ్ ఏదో ఒహటి ఉంటుందనే నమ్మకం నాకైతే కలగడం లేదు గనక నాకు మీ అభిప్రాయాలు చదువుతూంటే కల్గిన అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పడం ఉచితం అని అన్పించింది. గనక ఈ నాలుగు మాటలూను.
దేవుడి సృష్టి ని గురించిన ప్రశ్నలకి మనకి దొరికే జవాబుల్లో ఎంత స్పష్టత దొరుకుతుందో కవి సృజన వెనుక లోపలి కారణాలని వెతికి పట్టుకునే పని లోనూ అంతే దొరుకుతుంది. కవి తనకే స్పష్టంగా తెలియని తన సృజన కార్యాన్ని గురించి ఇధమిథ్థంగా చెప్పగలుగుతారన్నది [ఇది వరకు కవులంతా మగవాళ్ళే గనక “డు” వాడేయడం సాధ్యమయ్యేది. ఇప్పుడది అసాధ్యం. గనక “కవి” శబ్దాన్నిక్కడ బహువచనంగా స్వీకరించండి వాక్యంలో!!:)] ఎదురు చూడగలిగే విషయం కాదు. మీరు రాసిన పాటల్లోని వాక్యాలతో పోలిస్తే మీ వచనంలోని వాక్యాలు చాలా మేలు! కనీసం అర్ధమయ్యేలా ఉన్నాయి మీ ఊహలు. మీ కవిత్వం “బొమ్మకన్నో” మరో కన్నో గాని పాఠకుల కన్నుకి కూడా అందితే బాగుణ్ణు.
దీన్ని అలా ఉంచితే ఇంగ్లీషు వాడికి మార్మికత తెలీదు. “పెంజీకటికావల” ఒక మూర్తిని అతగాడు రాయనూ లేడు ..ఊహించనూ లేడు. గనక వాళ్ళది మేలైన కవిత్వమో మనది మేలైన కవిత్త్వమో చెప్పడం ఎప్పుడూ కుదిరేది కాదు.
మీరే అన్నట్టు ఇవన్నీ “భాషంత పాతవే”!! వీటికి జవాబులు త్రిపురా నారాయణరావు లు గానీ మీ స్నేహితుడు బిపిన్ గానీ నిజంగా తీర్చగలవి అవునని నాకు అన్పించదు. అయితే ప్రశ్నలు అనాదిగా కలుగుతూంటాయి. వాటికి జవాబులు సైతం మీరంతా అనాదిగా వెతుక్కుంటూనే ఉన్నారు.
ఈ ప్రశ్నల కన్నా మనసు దానిదైన ఒక వివేకంతో తనకి బాగున్న కవిత్వాన్నీ అలాగే ఏమీ పసలేని భావాన్నీ కూడా చప్పున పోల్చుకుంటుంది సహజంగానే !! అందుకే ఎక్కడైనా ఏ కాలంలోనైనా మనకి కవిత్వం అన్నది మిగిలే ఉంది. కవిత్వం కానిది సహజంగానే జారిపోతుంది. గనక మనకి కవులైన అన్నమయ్యలు శతాబ్దాల తరబడి మిగిలి ఉన్నారు. ఉంటారు కూడాను. ఉన్నతమైన సృజన అనేక కారణాలకి బాగుంటుంది. ఏ ఒక్క కారణానికో కాదు.
రమ.
రమ.
ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి మోహన గారి అభిప్రాయం:
01/05/2011 1:35 pm
ఇలాటి ప్రత్యేక సంచికలు ఉండాలా ఉండకూడదా అనే దానిపైన కాదు ఈ అభిప్రాయం. పాత సంచికలు తిరగవేసి అందులో ఇలాటివి ఎన్ని ఉన్నాయో అనే విషయాన్ని తెల్పడమే దీని ఉద్దేశం. జనవరి 2007 నుండి విడుదలయిన ఈమాట సంచికలను ఇందుకై ఎన్నుకొన్నాను. జనవరి 2008లో భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినోత్సవము సందర్భముగా దీనిని ప్రచురించారు. చనిపోయినవారిపయిన మాత్రమే కాదు బతికిఉన్న వాళ్లపయిన కూడ సంచికలను ప్రచురిస్తారు అన్నదానికి ఇది నిదర్శనము. తరువాత నవంబరు 2008లో స్మైలుపైన ఒక సంచిక వచ్చింది. నవంబరు 2009 నుండి ప్రత్యేక సంచికలు కొన్ని ఎక్కువే. అయితే దానికి ఒక కారణము ఉంది. నవంబరు 2009 సంచిక కొ.కు.ను, జనవరి 2010 సంచిక శ్రీశ్రీని వారి శతజయంతి సందర్భముగా సంస్మరిస్తూ ప్రచురించినవి. జూలై 2010 సంచిక శ్రీకృష్ణదేవరాయల సింహాసనారోహణమయి 500 సంవత్సరాలు కాలం గడచిన సందర్భముగా వెలువడింది. కృష్ణరాయలను కన్నడిగులకన్న తెలుగువారు “మనవాడు” అనుకొంటారు, అందులకు ఇది నిదర్శనము. ఈ నెల సంచిక దివంగతులు సంపత్కుమారులను సంస్మరిస్తూ వెలువడింది. సామాన్యముగా ఇటువంటి పండితులను పండితులు, పరిశోధకులు తప్ప మిగిలిన వారెవ్వరూ పట్టించుకోరు. అట్టివారు కూడ తెలుగు భాషకు గొప్ప సేవ చేస్తూ ఉన్నారని ఈ సంచికను చూస్తే మనకు విదితమవుతుంది. అదీ కాక ఇందులోని వచన కవిత పద్యమా కాదా అన్నది ఇప్పుడు కూడ ఒక పెద్ద ప్రశ్నే. పై సంచికలకు భిన్నముగా ఊహించని కారణముగా వెలువడిన ఒకే ఒక సంచిక సెప్టెంబరు 2010 సంచిక. ఇది మహాకవి తిలకును గురించినది. ఈ నా అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయమని అడుగలేదు. నేనే వెదకి వ్రాసినది. మరో విషయం – ఈమాటలోని అన్ని విషయాలు అందరికీ నచ్చక పోవచ్చు, కాని ఇందులోని ఒక్కొక్కటి కొందరి కయినా తప్పక నచ్చుతుంది అనుకొంటాను. ముఖ్యముగా తెలుగుజాతి మరచిపోయిన, మరచిపోతున్న కొన్ని సాహిత్య, సంగీత, లలితకళల విలువలను వీరు ప్రోత్సాహం చేయడము ఎంతో ముదావహము. ఇది ముత్యాలసరము అంగడిలో కొనుక్కోవచ్చు అనుకొనే కాలం వాళ్లకు ఎంతో ఉపకరిస్తుంది.
విధేయుడు – మోహన
విశ్వనాథ కోవెల గురించి మోహన గారి అభిప్రాయం:
01/05/2011 10:39 am
కామేశ్వర రావుగారూ, ఐదవ అక్షరము లఘువు మాత్రమే కాదు, ఆరవ ఏడవ అక్షరాలు గురువుగా కూడ ఉండాలి. మీరు చెప్పిన ఉదాహరణలో అనేకదంతం లోని తం గురువే ఐనా, భక్తానం లోని మొదటి రెండు అక్షరాలు గురువే కనుక శ్లోకాన్ని పాడేటప్పుడు గురువును లఘువుగా పాడుకోవచ్చు. కాని ఇక్కడ సా జయతి లోని జయ అక్షరాలు రెండూ లఘువులే. అందువల్ల ఇది పద్యము కాదని నేను చెప్పలేదు. సామాన్యముగా మనము అర్థము చేసికొనే శ్లోకములా లేదు ఇది అని మాత్రమే అన్నాను. విధేయుడు – మోహన
ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/01/2011 4:30 pm
ఈ ‘ముందుమాట’ పైనే నా అభిప్రాయం.
‘ఈ మాట’ ప్రతి రెండు నెలలకూ వస్తుంది. అందులో ఎన్నో రకాల -పాత, కొత్త రచనలు- ఉంటాయి. అది పత్రికకు ఎంతో వెరైటీని ఇస్తుంది. మంచిది.
కాని ప్రతి సంచికను ఎందుకు ఒక స్మారక సంచికగా తయారు చేస్తున్నారు? వెలువరిస్తున్నారు?ఒకవేళ మీకు ‘మరణించినవారిని స్మరించటమే’ ముఖ్యోద్దేశమైతే అది మీ పత్రిక ఆశయంగా ఎందుకు నిర్మొహమాటంగా చెప్పరు? మీ పత్రిక పేరు -స్మారకం, మాసోలియం, ట్రిబ్యూట్ , నివాళి. పేంథియాన్ – ఇలాటి పేరు పెట్టుకోవచ్చుగదా?
ఈ పత్రిక సంపాదకులకు – ఎందరో జీవించి ఉన్న మానవులు ఆహ్వానించే ప్రతి ఒక నూతన సంవత్సరాన్ని, ఒక ఋతువును, ఒక నెలను, ఒక రోజును , వేలాదివేల మనుష్యులకు సంబంధించిన కాలాన్ని, సంపాదకులు ఎన్నుకున్న ఒకేఒక్క రచయితకు గుర్తుగా వారి స్మారకంగా నిబంధించటానికి, వారికి హక్కు ఎవరిచ్చారు?
తమ రచనలను పంపిస్తున్న ఇప్పటి రచయితలకు , వారి రచనలు ఎవరికో సాంబ్రాణి కడ్డీలవుతున్నాయనీ, ఎవరి ఫొటోలకో దండలవుతున్నాయనీ, ఎవరికో అంకితమైపోతున్నాయనీ, తెలియదు.
ఇప్పటి పాఠకులు, ఇప్పటి రచయితలపై -ఇట్టి అత్యాచారం మీ సంపాదకులచే చేయబడటం, మీరు ప్రతిసారీ స్మరిస్తున్న ఆ గతించిన రచయితల స్పిరిట్ కే విరుద్ధం. వారు బ్రతికి లేనందున మీ ఈ చర్యలను వారు నిరోధించలేరు.
నిరభ్యతరంగా ఒక్కో సంచికలో ఒక రచయిత ( జనన మరణాల ప్రసక్తి దేనికి?) రచనలను ఫోకస్ చేసి చూపవచ్చు. వారి మీద ఒక అనుబంధము ఆ ఇస్స్యూలో ఉంచవచ్చును. ఒక రచయిత గురించి విశదంగా తెలుసుకోవాలి అనుకున్న వారు, చదువుకుంటారు.
పత్రిక సంపాదకులు ‘రిచ్యుయల్ ఓరిఎంటెడ్’ కాక ‘జవరాలైన’ కొత్త పత్రికను ప్రతిసారీ పాఠకులకు అంద చెయ్యాలనుకుంటే, ఈ మార్పు మీరు వెను వెంటనే చెయ్యవచ్చు. ఇప్పటి ఈ పత్రిక పరమపదించిన ‘ముందుమాట’ చదివి – ఉస్సురనక ముందే చెయ్య వచ్చు. కొద్ది చలాకీ మార్పులతో, వేలాది మంది పాఠకులకు ఆనందం కలిగేలాగా, వెంటనే పత్రికకు ప్రాణమివ్వవచ్చు.
మార్పులు చెయ్యగలుగుతారో, లేక ఈ ఉత్తరము ప్రచురించదలుస్తారో, సంపాదకులుగా, ఏది మీ నిజకర్తవ్యంగా భావిస్తారో , మీ శక్తి సామర్ధ్యాలకు ఏది నిదర్శనమనుకుంటారో- మీరే నిరూపించుకోండి.
నమస్కారములు
లైలా.
రాగలహరి: సింధుభైరవి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
12/24/2010 7:46 am
దక్షిణాదివాళ్ళు సింధుభైరవి అని పిలిచే రాగాన్ని ఉత్తరాదిలో భైరవీ అంటారు. వాళ్ళ శైలిలో దాన్ని రకరకాల పోకడలతో పాడతారు. కర్నాటక నఠభైరవి (స రి2 గ1 మ1 ప ధ1 ని1 స) అనే పోకడ ఉన్నదాన్ని జంగ్లా భైరవీ అంటారు. ఉదాహరణకు తలత్ పాడిన సినిమాపాట యే హవా యే రాత్ లేదా రఫీ పాడిన తుఝే క్యా సునావూ అటువంటిదే. వాడినపూలే కూడా ఆ కోవదే కాని మధ్యలో తిలంగ్ తదితర రాగాలు కూడా వినిపిస్తాయి.
అరుదుగా, అచ్చగా కర్నాటక హనుమతోడిలా పాడినప్పుడు దాన్ని శుద్ధ భైరవీ అంటారు. ఠుమ్రీ, గజల్ లేదా భజన్ వినిపిస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి 12 స్వరాలూ పలికించడం కూడా ఉంటుంది. మామూలుగా అయితే రెండు రిషభాలూ, రెండు ధైవతాలూ వేస్తారు. చాలా జనాదరణ పొందే రాగం కనక ఎలా పాడినా దాన్ని పోల్చడం సులువే.
జయప్రభశబ్ద కవిత్వం గురించి అనురాగ్ శర్మ గారి అభిప్రాయం:
12/13/2010 8:40 pm
అయిదు పేరాల అభిప్రాయాన్ని, అవతలి వారి తప్పులెన్నడానికి గుప్పించిన రమ గారికి, రెండు లింకులు క్లిక్ చేసేందుకు తీరికా, ఆసక్తి లేవట. ఆసక్తి తప్పక ఉండదు కొంతమందికి తమ తప్పులు తెలుసుకునేందుకు.
ఎవరో భూషణ్ ఎవరో ప్రభ కవిత్వం మీద వ్యాసం రాస్తే, ఎంతో ఆసక్తితో, తీరికతో అభిప్రాయలిచ్చిన రమ గారు. లాజిక్కు మాట్లాడేప్పటికి “అత్తా కోడళ్ళ మధ్య సంభాషణ” ( మనది ప్రజాస్వామ్యం గనక అందరూ అభిప్రాయాలు చెప్పేయవచ్చును. కాదన్నదెవరూ?? పైగా అదుపులేనంత చోటొకటి ఉండనే ఉంది కూడా కదా?? బోలెడంత రాయడానికీ!! రాసుకుపోతే సరి!! భూమ్మీద ప్రతివారికీ చోటుందాయె !) వంటి సూటిఫోటి వ్యాఖ్యలకు దిగారు.
సరే రమ గారికి కాకపోయినా పాఠక లోకానికి నిజాలందించానన్న తృప్తి నాకు మిగిలింది. “ఈ భూమ్మీద కాసింత చోటిచ్చిన” ఈ మాట సంపాదకులకు కృతజ్ఞతలు.
అనురాగ్ శర్మ
గుర్తుందా గోదారీ? గురించి Raghu గారి అభిప్రాయం:
12/13/2010 5:28 pm
యేమీ కాని నేనే చదివి ఇంత మురిసిపోతుంటే, సాక్షాత్తు గోదారమ్మ తానెంత మురిసిపోతుందో?? ఇసుక కోవలో నేనూ చేరిపోతున్నానేమో అని భయమేస్తుంది, ఎందుకంటే నాకూ కుళ్ళుగా ఉంది..ఈ ఆలోచనా ప్రవాహం నన్నెందుకు తాకలేదని..
జయప్రభశబ్ద కవిత్వం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
12/04/2010 1:12 am
రాజకీయాతీతమైన దృష్టి ఉన్నవాడు అరాచకీయమైన తూకానికి పూనుకుంటే సరిగ్గా ఇదిగో ఈ విమర్శ లాగే ఉంటుంది. జయప్రభ కవిత్వం మీద ఇలాంటి వ్యాఖ్యానాలని చేసిన వాళ్ళలో ఈ యదుకుల భూషణ్ మొదటివాడేమీ కాదనుకుంటాను. జయప్రభ కవితాసంకలనాల మీద మగవాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుని ఇలాంటి రాతలు రాసి ఏదో ఒక తరహా గుర్తింపుకోసం ప్రయత్నించడం చాలాసార్లు జరిగింది కూడా !! ఈయనకి స్త్రీవాదమో లేక మరో వాదమో నచ్చలేదు గనక వాటిని కవిత్వంలోంచి ఎంచి ఖండించడానికి పూనుకుంటే ఆ విమర్శ ఏ తోవలో సాగాలో ఆ తోవలోనే సాగింది ఇది కూడా !! జ్వాలాముఖి మొదలుకుని మరి కొందరు కుర్ర జ్వాలాముఖుల దాకా ఈ తరహా గొంతు ఆమె కవిత్వం విషయంలో “విమర్శ” పేరున రావడం కొత్త ఏమీ కాదు కూడాను. అయితే అవన్నీ ఎంతమేరకి నిలబడ్డాయో దీనికీ అంతే స్థానం ఉంటుంది.
ఆవిడ కవిత్వాన్ని విమర్శ పరిధిని కూడా దాటిపోయి ఆరుద్ర రివ్యూ పేర బోలెడంత తిట్లు కుమ్మరించిన సందర్భమ్ ఉంది. ఆరుద్ర దృష్టి ఏ తోవలో నడిచిందో అది చూపించి ఆయన నీరస దృష్టికి ఆ రాత నిదర్శనంగా నిలిచిందే తప్ప ఆ అభిప్రాయం జయప్రభ కవిత్వాన్ని తక్కువ చేయలేకపోయింది. పాక్షిక దృష్టితో రాసిన ఎన్నో రాతలు ఆవిడ కవిత్వం మీద ఇదివరలో కూడా రాకపోలేదు. ఆ తరహా రాతల్లో ఇది ఒకటి. ఐతే స్త్రీవాదులు ఇటువంటి రాతలని పరిగణన లోకి తీసుకుంటారా?? అన్నదానికి సైతం వాళ్ళ అనేక ప్రతిస్పందనలు జవాబులుగా ఉన్నా ఇంకా ఇటువంటి స్త్రీల రాజకీయ కవిత్వాలని వ్యతిరేకించే వాళ్ళున్నారంటే ఇంకా తెలుగు సాహిత్య రంగంలో తరవాతి తరాలలో సైతం ఎంత వెనకబాటుతనం ఉందో స్పస్టపడుతోంది.
మనకి అన్నా అఖ్మతోవా నచ్చుతుంది. కానీ మన సమకాలంలో మనతో పాటు నడిచే ఒక అన్నా అఖ్మతోవా, ఒక మాయా యాంజిలో నచ్చలేదు. అది తెలుగువిమర్శలో ఉన్న ఒక జాఢ్యం. పేరొచ్చిన వారిని విమర్శించి తానూ పేరు తెచ్చుకోవాలన్న ఒక అతి పాత పాత జాఢ్యం. అందుకు అనేకసార్లు అనేక మందికి జయప్రభ కవిత్వం ఎంతో ఉపయోగపడటం అన్నదే ఆమె కవిత్వానికి ఉన్న బలాన్ని చెప్పకనే చెబుతోంది. ఏమీ లేని పుస్తకాన్ని చదివి అవతల పడేయాలి. కానీ దాన్ని అంత సుదీర్ఘంగా అంత బలంగా కాదని అనవలసి రావడమ్ అంటేనే అందులో ఉన్న విశిష్టతని ఒప్పుకోవడం అన్నమాట. పండితుని వేషం వేసుకున్న వాడు పండితుడు కానట్టే ఈ తెచ్చికోలు హడావిళ్ళూ ఈ డొల్లమాటలూ సైతమ్ అతుకులబొంతలాంటివని అర్ధమ్ అవుతుంది. రాజకీయాతీతమైన జీవితమూ లేదు. రాజకీయాతీతమైన కవిత్వమూ ఉండదు. అది అఖ్ఖరలేని వాళ్ళు ఆ తరహా కవిత్వాన్ని విమర్శించపూనుకోవడం లోనే వారి చూపు లోని అంతరార్ధమ్ అర్ధమవుతుంది ఎవరికైనా !!
అయితే ఈ పరిస్థితి ప్రపంచ సాహిత్యంలో స్త్రీల వ్యక్తీకరణల మీద నిందాపూరిత స్వరాలతో విమర్శ పేరు పెట్టుకుని జరగడం అనేకసార్లు జరిగింది. ఇక్కడ మళ్ళీ జరిగింది. పురుష సాహిత్య ప్రపంచంలో మళ్ళి మళ్ళీ జరుగుతూనే ఉంటుంది కూడాను. ఈ తరహా సాహిత్యమ్ వచ్చిందీ అంటేనే దాని అవసరమ్ ఉందీ అని అర్ధం ! అది ఈ అరాజకీయ వాదులకి ఒప్పుదల అయ్యిందా కాదా అన్నదానితో కవయిత్రులకి ఏమీ ప్రమేయం లేదని వాళ్ళు ముక్తకంఠంతో ఇదివరకే చెప్పేసారు కూడా !!
కవిత్వం అనేక తరహాల్లో బయటికి వస్తుందని ..”శిల్పం” సారంలోనూ రూపం లోనూ భిన్నం గా ఉంటుందనీ కవితా శిల్పం నిజంగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకు సహృదయతా ఉండాలి. సంయమనమూ ..సహనమూ ఉండాలి. కానీ ఈ విమర్శలో అది కొరవడింది. ఇందులో యదుకుల భూషణ్ కి నచ్చినవి కొన్ని ఉన్నట్టే మిగతా తరహా వ్యక్తీకరణలు నచ్చిన వాళ్ళూ మరికొందరుంటారు. విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కవులు వారి తోవన వారు పాడుతూనే ఉంటారు.
రమ.
ఒకే ఒక్క ఇస్మాయిల్ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:
12/01/2010 4:49 pm
ఈ అభిప్రాయంలో ఆధారం లేని వ్యాఖ్యలు అనేకం. మచ్చుకి రెండు :
౧. ఇస్మాయిల్ ఇంగ్లీషు లెక్చరర్ గనక ఆ ప్రభావం అతని కవిత్వం మీద ఉండే వీలుంది.
ఆయన జీవితకాలం బోధించింది తత్వ శాస్త్రం. ఆయన సన్నిహితులకు , ఆయన కవిత్వం సీరియస్ గా చదివిన అందరికీ ఇది తెలిసిన విషయమే.
మరిన్ని వివరాలకు ఇంద్రగంటి గారి అమ్మాయి ఇస్మాయిల్ గారు బ్రతికుండగానే చిత్రీకరించిన ఆయన ఆత్మకథ DVD చూడండి. లేదా ” కవిత్వంలో నిశ్శబ్దం” వ్యాస సంపుటిలో రమణారెడ్డి గారికి ఇచ్చిన బదులు చూడండి.
౨. ఇస్మాయిల్ కవిత్వం అంతగా ఆస్వాదయోగ్యమ్ కాలేని కారణమ్ ఈ లక్షణమే!! అందులోనే గొప్పదనం ఉందని ఒక విమర్శకుడు అనవచ్చు. కానీ పాఠకుడు అలా అనుకోలేకపోయినట్టున్నాడు మరి. శ్రీశ్రీని చదివి సంతోషించ గలిగినట్టు.. కృష్ణశాస్త్రిని ఆస్వాదించగలిగినట్టు.. తిలక్ ని అంత సమాసాల పోగులలోంచి కూడా… మెచ్చుకోగలిగినట్టు ఇస్మాయిల్ ని స్వీకరించడం జరగకపోడానికి కారణమూ ఇదే!! అతని అనువాదాలకి వచ్చిన ప్రతిస్పందనతో తెలుగు కవితాప్రియులని అంచనావేసి తక్కువచేయడానికి కుదరదు.
ఎవడా పాఠకుడు? ఏమా కథ ?? సదరు పాఠకునికి ఇతర కవులు ఆమోద యోగ్యమన్న విషయం మీకెలా తెలిసింది ?? మీకేమైనా కర్ణ పిశాచి ఉందా ?? పై అభిప్రాయం మీ అభిప్రాయం లాగే ఉంది. తప్పు లేదు.పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
ఇక అసలు వ్యాసం విషయానికొస్తే -పొసగని విషయాలు అనేకం , మచ్చుకు రెండు :
౧.ప్రసార మాధ్యమాల పాత్రను అతిగా అంచనా వేశారు.
౨. శబ్దార్థాలను అర్థం చేసుకున్న తీరులో గందరగోళం ఉంది.,
” పద్యం రాతలో కనిపించడానికీ మాటల్లో వినిపించడానికీ మధ్య చాలా తేడా వుంది. ఆనందవర్ధనుడి కాలంలో పద్యం ప్రధానంగా మాటల్లో వినిపించేది. అచ్చుయంత్రం వచ్చేదాకా పద్యం రాతలో కనిపించలేదు. చప్పుడు వినకముందే మాటని కాగితం మీద చూడడం మనకి మాత్రమే సాధ్యపడింది. అచ్చుయంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వంలోనే శబ్దం అప్రధానమయ్యే పరిస్థితికి అవకాశం ఏర్పడింది. అవకాశం ఏర్పడింది కదా అని దాన్ని వెంటనే అందరూ అందిపుచ్చుకోలేదు. కావ్యంలో శబ్దాన్ని వదిలెయ్య వచ్చునని తెలిసి, అందులో ప్రయోజనం వుందని గమనించి, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కవి మనకి ఇస్మాయిల్ ఒక్కడే.”
ప్రాచీన కాలం నుండి నానా విధాల మాధ్యమాలు వచ్చాయి: వెదురు బద్ద, గట్టి ఎముక,మట్టి పలక, పట్టు వస్త్రం ,తాటాకు..నానా రకాల కాగితాలు ,ఇప్పుడు ఈ రీడర్లు. మాధ్యమాలు కవికి ఎటువంటి
అవకాశాన్ని ఇవ్వవు.అవి కేవలం మాధ్యమాలే.పద్యం రూపు దిద్దుకోనేది కవి మనసులో.ఆ తర్వాత, ఏదో ఒక మాధ్యమం ద్వారా అది పాఠకుని మనసు చేరుతుంది. అంతవరకే దాని పాత్ర.పద్యం చేరవలసిన చోటు చేరిన తర్వాత మాధ్యమంతో ఇక పని లేదు. అది , పాఠకుని మనసులో స్వతంత్రంగా మనగలదు అన్నది మనకు అనుభవంలోని విషయం. ఆసక్తి ఉండాలే గాని, ఎన్నో పద్యాలు గుర్తుంటాయి.
కాబట్టి శబ్దం అప్రధాన మయ్యే ప్రసక్తే లేదు. అచ్చు యంత్రం రాక ముందు కూడా లేఖకులు ఉండే వారు , కావలసినన్ని ప్రతులు తయారయ్యేవి , చలామణీ లోకి వచ్చేవి. చైనా లోని సమాధులు తవ్విన ప్రతి సారి సదరు వ్యక్తికీ ఇష్టమైన పుస్తకాలూ పట్టు వస్త్రం పై రాసినవి దొరుకుతూనే ఉన్నాయి. ( క్రీ.పూ రెండవ శతాబ్దం నాటి ప్రతులు లభ్యం ) ఇంకా ముందుకు వెళితే వెదురు ( క్రీ.పూ నాల్గవ శతాబ్దం )కూడా వాడారు.( వాటి పరిష్కృత ప్రతులు నా దగ్గరున్నాయి.)
” తన కవిత్వంలో, శబ్దప్రమేయం లేకుండా కాగితం మీద రాసిన అక్షరం తిన్నగా అర్థానికి దారి తీయగల విలక్షణమైన ప్రజ్ఞని ఆయన సంపాదించారు. ఆయనపద్యం చదువుతుంటే మన కంటికి అక్షరాలు కనిపించే మాట నిజమే. కాని ఆ అక్షరసముదాయం శబ్దసముదాయంగా మార్పుచెందక ముందే మన కళ్ళ ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ అర్థాలు గీసిన బొమ్మే కాని శబ్దాలు గీసిన బొమ్మ కాదు. భాషకి వున్న శబ్దశక్తిని నిశ్శబ్దంగా వాడుకోగల సామర్య్థాన్ని ఇస్మాయిల్ అపూర్వంగా సాధించారు “
ఇస్మాయిల్ శబ్దానికి పట్టం కట్ట లేదు అంటే నిలువునా నిశ్శబ్దంలోకి దూకారని కాదు.మాటలు ఎక్కడ ఆపాలో గ్రహించారు. అక్కడి నుండి మౌనం ప్రవేశిస్తుంది.( అది తూర్పు దేశాల కవులు వేల ఏళ్లుగా
చేస్తున్నదే.). శబ్దాన్ని అనుసరించే ఉంటుంది అర్థం. కాబట్టే, ఇమేజ్ ని పదచిత్రం అన్నారు కాని అర్థ చిత్రం అనలేదు.
తమ్మినేని యదుకుల భూషణ్.
జీవితం గురించి naren గారి అభిప్రాయం:
11/17/2010 10:33 pm
రాత్రిని రెండు తరాల కోణాల్లోంచి చూస్తూ జీవితాన్ని బాగా నిర్వచించారు.
ఈ కవిత కి టైటిల్ జీవితం-1 అని అనుకుని మిగిలిన పార్శ్వాలని కూడా ఆవిష్కరించవచ్చు.
ఉదాహరణకు, పిల్లల భవిష్యత్ గురించి పెద్దలు తపిస్తారు. కాని పెద్దైన పిల్లలు
కన్న వాళ్ళను భారంగా భావిస్తున్నారు. ఇది కూడా నిత్య పరంపర, జీవితానికి మరో నిర్వచనం.
రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి jagadeeshwar reddy గారి అభిప్రాయం:
11/16/2010 7:34 am
శ్రీవెంకటేశ్వరరావుగార్కి –
మీరు పరిచయం చేసిన పూసపాటి కృష్ణంరాజుగారి ‘రెండు బంట్లు పోయాయి’ కథని (మరోసారి), కథ మీకు నచ్చడం వెనకున్న కారణాల్ని చదివాను. రాజుల జీవితాల్ని దగ్గర్నుంచి చూసినవాళ్లకు, పతంజలిగారి రచనల్ని ఔపోసన పట్టిన వాళ్లకూ ఈ కథ బాగా నచ్చుతుంది.
ఇక ‘రెండు బంట్లు పోయాయి’ అనే దానికి అర్థం – కథలోనే ఉంది.
పెళ్లికూతురు తన చేతిలోని పరదాని పెళ్లికొడుకు ముఖాన కొట్టి వెళ్లిపోగానే … తాతగారు ‘ఇంతమంది రాజుల్లోనూ రాజుల పరువూ, మర్యాదా మంటగలిసేయి’ అని గొణుక్కుంటాడు. తాతగారు చదరంగం ఆడే మనిషి కాబట్టి అదే భాషలో చివర్లో అల్లా అన్నాడన్నమాట. ‘పరువూ, మర్యాదా’ ఆయన ఉద్దేశ్యంలో రెండు బంట్లని.
1994లో కారా మాస్టారు సప్తతి సభని విశాఖపట్నంలో జరిపినప్పుడు కొందరు సాహితీ ప్రముఖులతో పాటు అనుకోకుండా నేను కూడా హైద్రాబాద్‌నుండి వెళ్లాను. ఆ సభలో పూసపాటిగారు మాట్లాడ్డం చూశాను. కాని ఆ సభ జరిగిన పది, పదిహేను రోజుల్లోనే ఆయన పోయారనే వార్త విని చాలా బాధపడటం ఒక విషాద జ్ఞాపకమైతే… పదేళ్లక్రితం వంశీ (దర్శకులు) గారు ‘సీతాలు జలుపడ్డది’ పుస్తకాన్ని నా దగ్గర్నుంచి తీసుకొని అన్ని పేజీలూ జిరాక్సు తీసుకోవడం రెండో జ్ఞాపకం.
కృష్ణంరాజుగారి మరోకథ ‘దివాణం సేరీ ఆట’ చదివి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్న సందర్భమూ ఉంది.
– గొరుసు
కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి Madhav గారి అభిప్రాయం:
11/14/2010 10:06 am
ఈ శీర్షిక ప్రకటనపై ఇప్పటిదాకా వచ్చిన అన్ని అభిప్రాయాలూ కేవలం ఒకే విషయంపై రావడం మాకు కొంచెం విడ్డూరంగానే ఉంది. పాతకథలకి ప్రాధాన్యం ఇవ్వడాన్ని కొత్త కథలను నిరుత్సాహపరచడంగా భావించడం ఎందుకో మాకు అర్థం కాని విషయం. ఇప్పటి కథలు చాలా మటుకు అందరికీ అందుబాటులో వున్నవి. వాటిపై చర్చలూ, సమీక్షలూ జరుగుతూన్నై. సంకలనాలూ వస్తున్నై. ప్రస్తుత వ్యవస్థ పైనో, సమాజం పైనో, పోయిన వారమో, నెల్లోనో అచ్చై మీరు చదివిన కథను పరిచయం చేయించడం ఈ శీర్షిక ఉద్దేశం మాత్రం కాదు. వాటి గురించి ఈ శీర్షికలో రాయాలనే ఎందుకు? మీరు ఒక వ్యాసంగా కూడా ఈమాటకు రాయవచ్చు కదా. ఒక కథ, మీరెప్పుడో చదివింది, ఇన్నేళ్ళూ మిమ్మలనంటిపెట్టుకున్నది – ఆ కథ ఉందే, దానిని మీచేత పరిచయం చేయించటం ఈ శీర్షిక లక్ష్యం. పాత కథకులు, కథలు ఇప్పటి తరాలకు విస్మృతులు. వారిని మళ్ళీ పరిచయం చేయడం, తద్వారా ఆనాటి ప్రపంచాన్ని, అందరికీ తెలిసిన ప్రపంచం గురించే కాక, మనకు తెలీని ఇంకో ప్రపంచాన్ని పరిచయం చేసుకోడం ఈ శీర్షిక ఉద్దేశమని స్పష్టంగానే ఉంది కదా. లేదా?
ఏ ఒక్క శీర్షిక తోటో సాహిత్యం మొత్తం చుట్టబెట్టలేం. కేవలం మీకు నచ్చిన కథ అంటే మరీ విస్తారంగా ఉండి, అందరికీ తెలిసిన కథలనే మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తారనే భయంతో, ఈ శీర్షికకు కొన్ని సరళమైన నియమాలు, జనరల్ గైడ్‌లైన్స్ రాశాం. అంతమాత్రం చేత, పైన కామెంట్లలో రాసినట్టు, మాకు లేని అభిప్రాయాలని మాకంటగట్టి, మమ్మల్ని దీవిస్తే మేమేం చేయగలం? చెప్పండి :-). ప్రముఖుల కథలే పరిచయం చేయమని చెప్పామా? కొత్త కథలంటే చిన్నచూపు అన్నామా? (ఉదాహరణకిచ్చిన పేర్లలో ప్రముఖులే ఎక్కువ. అది మా తప్పే!)
పైన అభిప్రాయాలు చెప్పిన వారంతా ఈమాటకి ఆప్తులు. మీ సలహాలు మాకు శిరోధార్యం. ఇంత కష్టపడి, ఈ శీర్షిక ఎలా ఉంటే బాగుంటుందో చెప్పారు కాబట్టీ, అదే శ్రమతో ఓ కథను గూడా పరిచయం చేయండి. సరే, కొత్తదో, పాతదో, మీకు బాగా నచ్చి మిమ్మల్నంటి పెట్టుకుని ఉండిపోయిన ఒక కథ గురించి, ఆ కథ వినూత్నంగా పరిచయం చేసిన ప్రపంచాన్ని గురించి వ్రాయండి. ఆ ప్రపంచాన్ని అందరికీ చూపించండి. కేవలం ఈ శీర్షిక ఎలా ఉండాలో చెప్పి మౌనంగా మాత్రం దయచేసి ఉండకండి.
– సంపాదకులు
కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/14/2010 1:30 am
మంచి ప్రయత్నం. కాని పేరు నిరపేక్షంగా (impersonal గా) ఉంది. “నాకు నచ్చిన కథ” అంటే క్లుప్తంగా బాగుంటుంది. పాత కథలయినంత మాత్రాన అందరూ పదే పదే చెప్పే గొప్ప పేరున్న కథకులవే అయి ఉండాలని లేదు. పూసపాటి గారి గురించి ఎంతమందికి తెలుసు?
నచ్చిన కారణంతో కేవలం పరిచయం చేసేదిగా కాక, వ్యాసం కథకి వన్నె తెచ్చేదిగా ఉంటుందని ఆశిద్దాం. నేను కొన్నేళ్ళ క్రితం షాపులో చూసి వెంటనే కొన్న పుస్తకం, Touchstones [1] గుర్తొచ్చింది. ఈ కాలపు కవులు, బాగా పేరున్న వాళ్ళూ, అంతగా లేని వాళ్ళూ, ఒక్కొక్కరు తమకి నచ్చిన ఓ కవిత, వేరే వాళ్ళు రాసినది, పాతదైనా కొత్తదైనా, ఎందుకు నచ్చిందో రాశారు. కవితలే కాక వ్యాసాలు కూడా గుర్తుంచుకోదగ్గవి. పుస్తకం అంతా ఒక్క పట్టున చదవనవసరం లేదు.
ఇవాళ దాంట్లో Maxine Kumin వ్యాసం చదివాను. తన భుజాల్లో, వెన్నుపూసలో బాధ ఎందుకో కనుక్కోడానికి ఆవిడని డాక్టర్లు MRI scan కి పంపించారు. ఆ పరీక్ష చావుకి దరిదాపుల్లో ఉంటుంది. దాన్ని భరించడానికి తను కంఠస్థం చేసిన కవితలని గుర్తు తెచ్చుకున్నాననీ, వాటన్నిటిలోకీ బాగా పనికొచ్చినది AE Housman కవిత “XXVII,” అన్నది. “We are all mortal, but it is the poet who shivers most articulately under the thin blanket of mortality,” అని ముగించిన వ్యాసం, “Trochee, Trimeter, and the MRI,” నన్నాకట్టుకుంది. నేనూ ఒకసారి MRI తతంగం పాలయ్యాను, అప్పటికిది చదివుంటే బాగుండేది.
తెలుగులో Touchstones లాంటి పుస్తకాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Touchstones: American Poets on a Favorite Poem,” edited by Robert Pack and Jay Parini. Middlebury College Press, 1996.
జీవితం గురించి c.shantha kumar naik గారి అభిప్రాయం:
11/03/2010 10:07 am
ఇది ఎందుకు నచ్చిందో అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాని ఇలాగే మంచి మధురమైన జీవితమునకు ఉపయూగపడే ఎన్నో కథలు పంపిస్తారని అనుకుంటూ మీ అభిమాని.
ఆర్ యూ రెడీ? గురించి lyla yerneni గారి అభిప్రాయం:
10/25/2010 11:17 pm
“ఆర్ యూ రెడీ?”
మంచి తమాషాగా రాశారు కథ.
నేటి కాలం లావణ్యతో -ఆడవాళ్ళు మగవాళ్ళతో కలిసి తిరగటంలో, ప్రత్యేకంగా ఆడవాళ్ళే ఎందుకు జాగ్రత్తగా ఉండాలో, ఎలాటి జాగ్రత్తలు వహించాలో, రివర్సు డైలాగులు చెప్పించిన తీరు గమనీయం.
‘అరిటాకు మీద ముల్లు పడ్డా, ముల్లు మీద అరిటాకు పడ్డా అరిటాకు కే నష్టం.’
‘ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు’ – ఇలాటి పాక్షికమైన పాత తెలుగు డైలాగులు, కొత్త యూనివర్సిటీ కేంపస్ నుండి ఈ యుగం అమ్మాయితో చెప్పించటం – నాకు బాగా నవ్వొచ్చింది.
సెక్స్ -ఆడ మగా ఇద్దరికీ సమానంగా ఇష్టమైన విషయం కాదూ? ఇద్దరికీ అవసరమైనది కాదూ? ఆడ, మగ -జీవితంలో సమ ఉజ్జీలు కారా? ఈ ‘ప్రేమ’ వ్యవహారం లో వారికి లాభనష్టాలు సమం కాదా? ఈ కథలో ఉన్న పాత్రలకు అలా అనిపించటం లేదు.
ఆడది మోసగించబడేదీ, నష్టపోయేదీ. మగవాడు మోసం చేసేవాడు. ఎప్పటి అభిప్రాయాలు ఇవి?
ఆడవారు లొంగదీయబడేవారు. మగవారు లొంగదీసే వాళ్ళూ- అని ఈ కాలపు అమ్మాయితోనే చెప్పిస్తున్నారు, ఈ కథలో ఏమి చమత్కారం. లావణ్య ఇలా అంటుంది కథలో;
”
కాని, అభ్యంతరం చెప్పకుండానే లొంగిపోయిన అమ్మాయిని ‘లూజ్ కారెక్టర్’ అని అపార్థం చేసుకునే మనస్తత్వమే అబ్బాయికి ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి అతను వెనుకంజ వేయవచ్చు.”
What an Amazingly twisted complex bamboozling sentence!
For a contrast, hear what this simple man is saying from three centuries back, in this poem,
”
Darling, do not regret the promptness of your surrender!
I think no less of you now, you have not lost my respect” _ Goethe.
In this poem, a male is addressing a woman, who was willing to go to bed with him. Even though he uses a word such as ‘surrender’ -still this man of 18th century , comes across as much more of a man, of natural human impulses and normal desires. The man in Goethe’s poem is Way Way different from Vasu, the hero in this Telugu story.
కథ చివరలో వాసు అయోమయ పరిస్థితి, అతడు 🙂 ఉడాయించిన రీతి అమోఘం.
ఈ కథలో ఉన్న ముగ్గురు పాత్రలకూ ఇక ముందు ముందు, వారి పవిత్ర్తతకు ఎట్టి భంగమూ రాదు, అని అనిపిస్తున్నది. They will all be so very careful, and remain pure, and celibate. What an achievement!
మరెందుకో, ఈ కథలో పాత్రల వలె ఆలోచించటానికి, నాకు ఏ మాత్రం మనస్కరించదు.
నమస్కారాలు.
లైలా
Edward Hirsch, “How to read a poem” గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/23/2010 2:15 am
“Mere Air, These Words, but Delicious to Hear”
మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు రామారావు గారికి కృతజ్ఞతలు. పండితులూ (అరవై పేజీల glossary ఉంది) పామరులూ కూడా చదివి ఆనందించవచ్చు. ముందుగా తెలుగు కవులని ప్రస్తావించి, వారి స్థాయి అధోలోకానికి చేరిందని వాపోయారు. ఎలాంటి ఆధారాలూ, ఉదాహరణలూ చూపకుండా చేసే ప్రకటనల వలన ఏమిటి ఉపయోగం? సౌభాగ్య, “ఈ కాలం కవులు,” [1] చూస్తే, మన కవుల స్థితి రామారావు గారన్నంత దౌర్భాగ్యంగా అనిపించలేదు. అయితే, కవితా సంపుటాలకి సంబంధించి నేను అల్ప సంతోషిని – గుర్తుంచుకోదగ్గ కవితలు రెండు మూడున్నా చాలు నాకు.
అసలు విషయానికొస్తే, Hirsch కవితలని వివరించే తీరూ, సందర్భోచితంగా చెప్పే ఇతర విషయాలూ నాకు నచ్చాయి. Elizabeth Bishop, “One Art,” ని విశ్లేషిస్తూ, అదొక villanelle అని దాని లక్షణాలు వివరించాడు: పందొమ్మిది పాదాలతో ఆరు భాగాలుగా, అయిదు భాగాలు మూడు పాదాలతో, మిగిలినది నాలుగు పాదాలతో … అవన్నీ ఆరితేరిన పాఠకులకే గాని, నాకు ఒంటబట్టవు. ఆధునిక vilanelles అంటూ మరికొన్ని చదవదగ్గవి ఇచ్చాడు.
కవితలో Bishop తాళం చెవి మొదలు ఖండాల దాకా వెళ్ళి, చివరకి ప్రేమతో ముగించే తీరు చాలా బాగా విశ్లేషించాడు. ఈ కవితలో ఉన్న ఆశ్చర్యార్థకాన్ని పట్టుకొని, William Maxwell, రచయిత ఆ సూచికని రెండు సార్లు మాత్రమే వాడవచ్చు – తన జీవిత కాలంలో, అని చెప్పాడన్నాడు. ఈ Maxwel ఎవరో మరీ నిరంకుశుడు అనుకున్నాను.
మార్చి “The New Yorker” లో Patricia Marx, “Four Eyes,” అని కళ్ళజోళ్ళ మీద సరదా కాలమ్ రాసింది. అయుదు పేజీల చక్కని రచనలో ఒక్కసారి కూడా ఆశ్చర్యార్థకాన్ని వాడినట్లు గుర్తు లేదు. ఈవిడ ఎవరో Maxwell సూత్రాన్ని ఒంటబట్టించుకున్నదే అనుకొని, అసలీ Maxwell ఎవరా అని వెతికితే తెలిసింది: నలభై ఏళ్ళ పాటు ఆ పత్రికకి సంపాదకుడుగా పనిచేశాడని. ఇప్పుడు నేనా సూచికని వాడాలంటే భయం. Maxwell ని గుర్తుచేసుకుంటూ [2] Updike కవిత, “Stolen”:
“The boat tilts frozen on the storm’s wild wave.
The concert has halted between two notes.
An interregnum, sufficiently extended,
becomes an absence. When wise
and kindly men die, who will restore
disappeared excellence to its throne?”
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఈ కాలం కవులు,” సౌభాగ్య, 2006.
[2] “A William Maxwell Portrait: Memories and Appreciations,” Edited by Baxter, Collier and Hirsch. WW Norton & Company, 2004.
వెన్నెల – తిలక్ కవిత గురించి lyla yerneni గారి అభిప్రాయం:
09/20/2010 5:31 pm
బాగుంది. పుస్తకంలో చదవటానికీ, పైకి చదివితే వినటానికీ కూడా బాగుంది.
ఐతే, దాదాపు చివరి ఇరవై పంక్తులు – ఇంకో కవితను తెచ్చి అతుకు వేసిట్లుగా ఉంది. కవిత లయ మారింది. లయ మారితే మారింది. కవిత విషయం కూడా మారింది.
అప్పటివరకు వెన్నెలను ప్రయివేటుగా అనుభవిస్తున్న మానవుడు, అకస్మాత్తుగా 🙂 “ఎవరో” – వెధవా! నీ ఒక్కడి కోసమే నీ దొడ్లోనే కురుస్తాందా వెన్నెల? వెన్నెల అందరిదీ కాదూ. అది అన్నిచోట్లా కురవదూ? అని కొరడా పెట్టి కొట్టినట్లు; సన్నాసీ! కవిత్వంలో ఏవి తప్పక రాయాలో మర్చిపోయావా -అని కోప్పడితే ఢమిక్కిన గుర్తుకు వచ్చినట్లు; అక్కణ్ణుంచీ కవితలో -“ధనికులు, నిరుపేదలు, ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ములు, ఊరి బైట కాలీకాలని చితికీలలు” -వచ్చి పడ్డాయి.
నా ఉద్దేశంలో, ‘వెన్నెల’ ఇతివృత్తంగా తీసుకుని రాసిన రెండు వేరు కవితలు ఒకదాని తర్వాత ఒకటి పేర్చబడి – ఒకటి చేయబడ్డాయి. ఆ పని కవి సొంతగానే చేసుకున్నాడో, లేక ఇతరుల ప్రోద్బలం వల్ల జరిగిందో, ఊరికే పోనివ్వడమెందుకు ‘వెన్నెల’ మీద ఉన్న బంతులన్నీ ఒక కవితలోనే ఒక ప్రసారంలోనే వినిపించేద్దాం, పనై పోతుంది – అని ప్రసారకర్తలో, ప్రచురణకర్తలో అనుకున్నారో మరి.
ధోరణి వేరైన -రెండు రచనలనూ విడగొట్టి -మొదటి కవిత ధనికుల పెట్టెలోనూ, రెండోది పేదల పొట్టలోనూ వేస్తే రెండూ నిండుతాయి. 🙂 కాదా.
కవితలో కొన్ని పంక్తులు తిలక్ రెండుసార్లు చదవటం నచ్చలేదు. అవి సంగీతంలో సంగతుల వంటివి కావు. రెండో సారి చదివినంతనే వాటి రుచి పెరగలేదు. ఏ వాక్యానికీ రెండో సారి చదవవలసిన అదిక ప్రాముఖ్యతా లేదు.
తిలక్ – హాయిగా వెన్నెల అనుభవించటం అర్ధాంతరంగా మానేసి – హడావిడిగా పెన్నూ కాగితం తెచ్చేసుకుని-
” నా రచనగా తానై పోయింది
వెన్నెల వంటి నా ఉద్రేకానికి
తెలుగు భాష శరద్వియ
ద్విహార వనమై నడచిపోయింది ”
అని రాయటం కూడా మానేసి ఉండాల్సింది.
ఏమంటారు చదువరులు? శ్రోతలు?
లైలా
“అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ గురించి C.S.Rao గారి అభిప్రాయం:
09/17/2010 11:30 pm
కామేశ్వరరావు గారూ,
రారా విమర్శపై నేను వ్రాసిన ప్రతివిమర్శ, ఆయన విమర్శకు మాత్రమే పరిమితమై వ్రాసినది.అభ్యుదయ కవిత్వాన్ని తన “అమృతం కురిసిన రాత్రి” పై సమీక్ష లోకి లాగింది రారానే, నేను కాదు. విమర్శ లో చెప్పిన విషయాలపై స్పందించటమే కదా ప్రతివిమర్శ. నేను చేసింది అదే. దానిని మీరు అసమంజసం అన్నారు. ఇది అసమంజసం ఎలా అవుతుంది?
భావుకత్వం పరిపుష్టంగా ఉన్న కవి ఏ అనుభూతిని కవిత్వీకరించినా అది కదిలించే శక్తిని సంతరించుకుంటుంది. తరతరాలుగా సాహిత్యంలో స్థిరపడిన విషయాలమీద మనం పునరాలోచన చేస్తూనే ఉన్నాం కదా. భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే వర్గీకరణ కృత్రిమమైనదే. నినాదప్రాయాలైన రచనల నాధారంగా కవులు కానివారికి కవులుగా అస్తిత్వాన్ని చేకూర్చాలనే వ్యర్ధప్రయత్నం అని నేను నమ్ముతున్నాను. ఒకవైపు మీరు ఈ వర్గీకరణను అంగీకరిస్తూనే, ప్రతి కవినీ, ప్రతి కవితను వర్గీకరణలలోకి బలవంతాన ఇరికించటం సమంజసం కాదు అంటున్నారు. ఇందులో నాకు వైరుధ్యం కనబడుతుంది . అంతేకాక, పదిమంది మెప్పుకోసం పాప్యులర్ విషయాలమీద కవిత వ్రాసినంతమాత్రాన అది కవి యొక్క హృదయతత్వంగా తీసుకోవటానికి వీలు లేదని నా అభిప్రాయం.కారణం, తాను కవిత్వం లో వెలిబుచ్చే అభిప్రాయాల యెడల తన నిత్యజీవితంలో నిబద్ధత కనిపించినపుడే అది అతని “హృదయతత్వం” అవుతుంది.
అందంగా వ్రాయటమంటే ఆకట్టుకునేలా ఏ రకమైన అనుభూతినైనా వ్యక్తీకరించటం అనేది నా నిర్వచనం అన్నారు.అందానికి రారా నిర్వచనం వేరన్నారు.అదేమిటో చెప్పలేదు.
నిజమే ,ఆకట్టుకునేలా వ్రాయకపోతే ఉత్తేజితులెలా అవుతారన్నాను. ఆకట్టుకున్నంతమాత్రాన ఉత్తేజితులని చెయ్యలేదని రారా ఉద్దేశ్యమన్నారు మీరు. బ్రతకాలంటే పుష్ఠికరమైన ఆహారం తినాలి. తిన్నాక కూడా బ్రతకకుండా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు.
నా నిర్వచనం ప్రకారం అభ్యుదయ కవులు, విప్లవకవులు అందానికి వ్యతిరేకులు కాదన్నారు. సంతోషం. వారు అందానికి వ్యతిరేకులయ్యేంత సంకుచితమైన నిర్వచనం రారా “అందానికి” ఇచ్చారా ?
కవిత్వానికి,సాహిత్యానికి అలంకారికులు చెప్పే రసానందమే అస్తిత్వాన్ని ఇస్తుంది. ఆకట్టుకోవటానికి ,ఉత్తేజితులను చేయటానికి ప్రేరకాలు ఆహ్లాదం,ఆనందం.
“నా గీతం గుండెలలో……..” నేననేదీ అదే . ఆయన చెప్పవలసినది తోటి జనుల ఆశలను, ఆశయాలను,ఆకాంక్షలను తన గీతం లో ప్రతిఫలింపచేస్తానని. కానీ ఆయన చెప్పింది తన గీతం జాతి జనుల గుండెలలో మ్రోగాలని. తనకు ప్రాధాన్యత ఆపాదించుకోవటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందే! తనకు నమ్మకంలేని ‘మంత్రం’ ప్రస్తావన ఎందుకు ?త నను తన జాతి జనులు అనుసరించటం కాదు, వారిని తాను అనుసరించి వారి ఆకాంక్షలు తన గీతం లో ప్రతిబింబించి, వారిని ఉత్తేజితులను చేయటం. ఆ విధంగా తన గీతాన్ని వినిపించడం జరగాలి.
కవిత్వం వాస్తవ జీవితానికి దూరమవ్వటంలోనే, దాన్ని(వాస్తవజీవితాన్ని) విస్మరించటం ఇమిడి ఉంది.ఇంక మరలా ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను.
ఆనందం (కవిత ఇచ్చే రసానందం), ఉత్తేజం ఒకే అనుభూతికి రెండు పార్శ్వాలుగానూ, పరస్పరాశ్రయాలు గానూ ఉండవచ్చు. ఒక చిన్న వివరణ: ఏ బలీయమైన అనుభూతి అయినా, ఉత్తేజానికి ప్రేరకంగా ఉండవచ్చు. ఏదో చేయాలని పురికొల్పటం కాన్షస్ గా చేసే ప్రయత్నం. ఇది కళకు విరుద్ధం. కవి బలీయంగా అనుభూతిని వ్యక్తీకరించటం మాత్రమే చేయాలి. “ఆర్ట్ లైస్ ఇన్ కన్సీలింగ్ ఆర్ట్”.
రుచి,శుచి విషయంలో కూడా పైన చెప్పిన విషయమే వర్తిస్తుందనుకుంటాను: బ్రతకాలంటే తినాలి.కానీ తిన్నాక కూడా బ్రతకకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి.
“వెన్నెల సముద్రాలు” మొదలగునవి అందంగా వ్రాయటానికి సంకేతాలు అని స్పష్టంగా తెలుస్తుంది.వాటిలో అన్వయకాఠిన్యం లేదు. మరి రాబందుల రెక్కల చప్పుడు వగైరాలు దేనికి ఏది సంకేతం? ఎలా వీటిని అన్వయించటం? వీటిగురించి ప్రస్తావనకు కారణం, మీరనుకుంటున్నట్లు అసంగతంగానేనైనా రారా, శ్రీశ్రీ కవితా పంక్తులని కోట్ చేయటం. దీనిలో అర్ధం కాకపోవటానికేముంది?
ఇక లాలిత్యాన్ని గురించి:ఇది కడుపు నిండినవాళ్ళ కవిత్వంలోనే ఉంటుందని అనుకుంటే, అభ్యుదయభావాలతో కవిత్వం వ్రాస్తున్నవారందరూ పస్తులు పడుకుంటున్నవాళ్ళా? పీడితప్రజల విముక్తి పోరాటాలకు కలంతో పాటు కత్తిపట్టి దన్నుగా నిలుస్తున్నవారా? ఎవరో చెరబండరాజు లాంటి వారు కోటికొకరు మినహా!
“వచనగేయపు శైలి లలితమైన (లిరికల్) ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని,గంభీరమైన ఇతివృత్తాలకు సముచితంగా ఉంటుదని స్పష్టంగా అర్ధమవుతుంది” – లలితమైన అన్నమాటకు సమానార్ధకంగా లిరికల్ అనే మాటను బ్రాకెట్లో వాడారు, రారా. వచనగేయపు శైలిని గురించి, రెండు రకాల ఇతివృత్తాల గురించి మాట్లాడారు. మీరనుకున్నట్లు రెండు రకాల శైలీ విశేషాలగురించి మాట్లాడలేదు.
మీరు ఆరోపించినట్లు, భావకవుల వేదనను నేను సాంద్రత లేనిదనికానీ, కృత్రిమమైనదని కానీ అనలేదు.వారి వేదనా ప్రియత్వాన్ని మాత్రమే కృత్రిమం అనడం జరిగింది. వేదనలో అనుభూతి సాంద్రత తప్పనిసరిగా ఉంది, కృత్రిమత్వం లేదు. వేదనా ప్రియత్వంలో కృత్రిమత్వం ఉంది,అనుభూతిసాంద్రత లేదు. పాక్షికదృష్టి ఎవరిలో ఉన్నా, బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఎవరు చేసినా అభిలషణీయంకాదు. ఇవి సాహిత్య విమర్శకు వన్నె తెచ్చేవి ఎంతమాత్రమూ కావు.
మంచి కవి, మంచి స్నేహితుడు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
09/17/2010 1:50 pm
నారాయణరావ్!
నీకు మంచి స్నేహితులు ఉన్నారయ్యా! నువ్వదృష్టవంతుడివి.
“నా కవిత్వంలో నేను దొరుకుతాను” అన్న తిలక్ కవితలో :
“నీ కవిత్వం పుస్తకానికి ఎవరిచేతా పీఠికా పరిచయమూ
వగైరాలు రాయించవద్దు అన్నాడు-
నాలుగేళ్ళక్రితమే నా చిరమిత్రుడు శ్రీపాదకృష్ణమూర్తి
సరీగా అలానే అన్నాడు నా యువమిత్రుడూ కవీ
వెల్చేరు నారాయణరావు కూడా…”
“పైగా నా మీద నన్నే రాసుకోమన్నారు..”
అని ఉన్నది.
మంచి సలహా ఇచ్చారు. పీఠికలు, సమీక్షలు ఇత్యాదులు లేనప్పుడు, కవి, శ్రోత ఒకరికొకరు దగ్గరగా వస్తారు. అది middle man లేని ఒక చక్కని direct transaction. ఏ మనిషిని అర్థం చేసుకోవాలన్నా ‘one on one’ సంభాషణ ఉత్తమం.
ఐతే నేను – పీఠికలు, పరిచయాలు, ముందుమాటలు, సమీక్షలు… – చదవనా అంటే చదువుతాను. చాలా ఆసక్తితో చదువుతాను. అవి రాసినవారిని అర్థం చేసుకోటానికి అవి పనికొస్తాయి.:-)
లైలా
“అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
09/17/2010 10:19 am
సి. ఎస్. రావుగారూ,
మీ ప్రతివిమర్శపై కూడా నాకు కొన్ని అభ్యంతరాలున్నాయండి. ఎలా అయితే రారా విమర్శలో పాక్షిక దృష్టి కనిపించిందో, అంత మోతాదులో కాకపోయినా, కొంత మీ ప్రతివిమర్శలోనూ కనిపించింది. దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు రారాని అర్థం చేసుకోడంలో కొన్నిచోట్ల పొరపాటుపడ్డారని కూడా అనిపించింది. నేనెలా అర్థం చేసుకున్నానో కూడా వివరిస్తాను.
“భావుకత్వం ఏ ఉత్తమ కవికైనా ఉండవలసిన ముఖ్యలక్షణం అని అన్న తరవాత మరలా ఎవరినో భావకవి అనడం ఏమిటి? భావుకత్వం లేనివాడు కవే కాడుగా?”
– ఇక్కడ “భావకవి” అంటే “భావుకత్వం” ఉన్న కవి అన్న ఏకవాక్య నిర్వచనం మీరు తీసుకున్నారు. రారా ఉద్దేశం ఇది కాదు. ఈ రెండు పదాలనీ రారా వాడారు కాని స్పష్టం చెయ్యలేదు. శ్రీశ్రీ తర్వాత అంత భావుకత్వం ఉన్న కవి తిలక్ అని రారానే అన్నారు. అయినా శ్రీశ్రీ “భావకవి” కాదు అన్నది స్పష్టం కాబట్టి ఈ రెంటి మధ్యనున్న తేడా మనం గమనించాలి. “భావకవి” అనేది ప్రధానంగా “భావకవిత్వం” వ్రాసిన కవి అని అర్థం చేసుకోవాలి. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్ళలో వచ్చిన ఒక రకమైన కవిత్వానికి “భావకవిత్వం” అన్న పేరు సాహిత్యంలో స్థిరపడిన విషయం ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చాలా మంది విమర్శకులు దాని లక్షణాలను వివరించారు. దాన్ని కూడా ఇక్కడ నేను ఉటంకించక్కర లేదనుకుంటాను. అలా స్థిరపడిన రూడ్యర్థంలోనే రారా కూడా “భావకవి”, “భావకవిత్వం” అన్న మాటలు ప్రయోగించారు కాని “భావుకత గల కవి” అన్న అర్థంలో కాదు అన్నది సుస్పష్టం.
“కవిత, వస్తువు ప్రాతిపదికగా, లేదా కవి హృదయతత్వం మీద ఆధారపడి వర్గీకరించటం ఏ మాత్రం సబబు? ఇన్ని విభజనలు చేయాలా?”
– కొన్ని సందర్భాలలో అలాంటి విభజనలు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలని చేకూరుస్తాయి. కాకపోతే ప్రతి కవినీ, ప్రతి కవితనీ అలాంటి వర్గీకరణల్లోకి బలవంతాన ఇరికించడమే సమంజసం కాదు.
“అందంగా వ్రాయటం అంటే”, “ఆకట్టుకునేలా అనుభూతిని, ఏ రకమైన అనుభూతినైనా వ్యక్తీకరించటం.”
– అని మీ నిర్వచనం. అందానికి రారా నిర్వచనం వేరు.
“రారా అన్నట్లు పాఠకులను ఉత్తేజితులని చేయాలన్నా, వారిని ఆకట్టుకునే విధంగా వ్రాయకపోతే ఉత్తేజితులెలా అవుతారు?”
– ఉత్తేజితులని చెయ్యాలంటే ఆకట్టుకోవాలి. కాదని రారా అనలేదు. ఆకట్టుకున్నంత మాత్రాన ఉత్తేజితులని చెయ్యలేదు అన్నది రారా ఉద్దేశం.
“తిలక్ తన కవిత్వం గురించి వ్రాసిన పంక్తులలోని వెన్నెల సముద్రాలు, మణిస్తంభాలు, అత్తరు దీపాలు కేవలం అందంగా వ్రాయటానికి సంకేతాలు.”
– నిజమే. కాని “అభ్యుదయ” కవిత్వపు సంకేతాలు ఇవి కావన్నది రారా పాయింటు.
“అభ్యుదయ కవులనబడే వారు, విప్లవకవులనబడే వారు అందానికి వ్యతిరేకులా? చెప్పదలచుకున్న విషయం, వ్యక్తీకరించదలచుకున్న అనుభూతి అందంగా వ్యక్తీకరించక పోయినా వారు పాఠకులని ఉత్తేజితులని చేయగలరా?”
– మీరు అందానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం వ్యతిరేకులు కారు. రారా దృష్టిలో “అందానికి” కచ్చితంగా వ్యతిరేకులు. రారా దృష్టిలో మనసుకి ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ(ఇక్కడ ఆనందం అంటే మన అలంకారికులు చెప్పిన “రసానందం” కాదు) ఇచ్చేదే అందం. అభ్యుదయకవిత్వం పాఠకులని ఆకట్టుకోగలదు, ఉత్తేజితులనీ చెయ్యగలదు. కాని అది ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ ఇవ్వలేదు.
“నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని” అభ్యుదయకవి తనకు ఇంతటికి ప్రాముఖ్యతను కోరుకుంటాడా?”
– మీకీ వాక్యాల్లో కవి తన ప్రాముఖ్యాన్ని కోరుకోవడం కనిపించిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది! తన జాతి జనుల స్పందనలని తన గీతంలో పలికించాలనీ, ఆ గీతం జనులు పాడుకుని వాళ్ళు మరింత శక్తివంతులు అవ్వాలనీ నాకు అర్థమయ్యింది. కవి తన జాతి జనులతో మమేకమై ఆ ఏకత్వంలోంచి తనలోంచి వచ్చిన గీతం తిరిగి జనాలకి అందివ్వాలన్నది కవి ఆకాంక్షగా నేను అర్థం చేసుకున్నాను. “మంత్రం” ఎందుకంటే అది వాళ్ళని శక్తిమంతం చెయ్యాలన్న ధ్వని కోసం. అలాగే మీరుదహరించిన మరో వాక్యమూను. జాతి జనుల అవసరాలు తనలో మాత్రం మ్రోగి ఊరుకుంటే సరిపోదు, అది తిరిగి జనాలలో మార్మ్రోగాలన్నదే కవి ఆశయం. అప్పుడే అభ్యుదయం సాధ్యమవుతుందన్నది కవి విశ్వాసం.
ఇంతకీ ఈ ప్రతి విమర్శలో అభ్యుదయ కవిత్వాన్ని లాగడం పూర్తిగా అసమంజసమని నా అభిప్రాయం. ఇది రారా చేసిన పొరపాటును కొనసాగించడమే!.
“వాస్తవ జీవితానికీ,కవిత్వానికీ మధ్య అఖాతం విస్తరించేకొద్దీ జీవిత వాస్తవాన్ని విస్మరించటమే కవిత్వధ్యేయం అవుతుంది”
– ఇందులో నాకెలాటి లాజికల్ తప్పూ కనిపించలేదు. ఎప్పుడైతే కవిత్వం (తన వస్తువులోనూ, రూపంలోనూ) వాస్తవ జీవితానికి దూరమవ్వడం మొదలుపెడుతుందో, అప్పుడు క్రమేపీ ఆ కవిత్వ ధ్యేయమే జీవిత వాస్తవాన్ని మరిచిపోవడం అవుతుందని అంటున్నారు. ఇది “తిలక్ భావనలో అభ్యుదయవాది, శైలిలో భావకవీ” అన్న కుందుర్తి అభిప్రాయాన్ని ఖండించడానికి చెప్పిన మాట. “జలుబు తలనొప్పి మొదలైతే అది క్రమేపి జ్వరంగా మారుతుంది” అనడం లాంటిది. లేదా “జలుబు తలనొప్పి – జ్వరం రాబోతోందనడానికి సూచనలు” అనడం.
“ఉత్తేజంలో ఆనందం అంతర్లీనంగా ఉండి తీరుతుందే? ఆనందం అంటే ఇక్కడ కవిత ఇచ్చే ఆనందం. అది వ్యక్తీకరించే అనుభూతి స్వభావం ఏదైనా హృదయానికి హత్తుకునే విధంగా, హృదయం ఆర్ద్రమయ్యే విధంగా చెప్పటంద్వారా కలిగించే ఆకర్షణ. ఆ ఆకర్షణే ఆనందం. ఇది లేనప్పుడు ఉత్తేజం సాధ్యం కాదు. ఆనందం, ఉత్తేజం వేరు వేరు అనుభూతులుగా సిద్ధాంతీకరింపబూనటం గందరగోళానికి గురిచేయటమే.”
– ఆనందాన్ని, ఉత్తేజాన్ని ఒకే అనుభూతిగా సిద్ధాంతీకరింప బూనారు మీరు. అదే గందరగోళానికి దారితీస్తుందని నా అభిప్రాయం. “ఉత్తేజం” అంటే రారా తన వ్యాసంలో చెప్పకనే చెప్పారు. మనిషిలో ఏదో చెయ్యాలనే ఒక బలమైన కోరిక పురికొల్పడం ఉత్తేజం. ఆనందం అంటే రారా దృష్టిలో ఆహ్లాదం, సంతోషం కలిగిన మానసిక స్థితి. ఈ రెంటికీ తేడాని గుర్తిస్తేనే, అంగీకరిస్తేనే రారా చెప్పిన విషయం అర్థమవుతుంది. ఆ దృష్టితో కాక రెండూ ఒకటే అన్న దృఢ నిశ్చయంతో రారా విమర్శని వ్యాఖ్యానించడం – కేవలం మన దృష్టితో రారా విమర్శని చూడ్డమే అవుతుంది కాని రారాని అర్థం చేసుకునే ప్రయత్నం అవ్వదు.
“ఆహారం ఆరోగ్యం కోసం, బలం కోసం. సందేహం లేదు. కానీ అది చక్కగా తినాలంటే రుచి, శుచి ఉండాలి కదా!”
– నిజమే. కాదని రారా అనలేదు. రుచి, శుచి ఉన్నంత మాత్రాన అది ఆరోగ్యం బలం ఇవ్వాలని లేదు అన్నదే రారా చెప్పింది.
“రాబందుల రెక్కల చప్పుడు…”
– రారా ఎలా అయితే “వెన్నెల సముద్రాలు, మణిస్తంభాలు,…” మొదలైనవాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదో, అలానే మీరుకూడా ఈ సంకేతాలని సరిగా అర్థం చేసుకోలేదని నాకనిపించింది. దాని గురించి ఇక్కడ వివరణ అనవసరం. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు, తిలక్ కవిత్వం గురించి మాట్లాడుకొనేటప్పుడు మధ్యలో శ్రీశ్రీ కవిత్వాన్ని గురించిన చర్చ పూర్తిగా అనవసరం.
“కవిత్వం హృదయసంబంధి: లాలిత్యం హృదయాహ్లాదకరమైనది. దానిమీద తిరుగుబాటు దేనికి? లాలిత్యంలో దుర్మార్గపు దోపిడీగుణం ఏమైనా అంతర్లీనంగా ఉందా?”
– నాకర్థమైనంతవరకూ, లాలిత్యం కడుపునిండిన వాళ్ళ కవిత్వంలోనే ఉండగలదనీ, వాళ్ళే లలితమైన భావాలతో, పదాలతో జీవితమెంతో అందమైనదని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని అలా మభ్యపెట్టే నిరుపేదలని దోచుకుంటారనీ రారా (అభ్యుదయ, విప్లవ వాదాల) సిద్ధాంతం. ఇందులో కొంచెం నిజం దాగి ఉంది. ఇది తిలక్‌కి వర్తిస్తుందా లేదా అన్నది వేరే విషయం.
“వచన గేయపు శైలి లలితమైన (లిరికల్)ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని, గంభీరమైన ఇతివృత్తాలకు సముచితంగా ఉంటుందని స్పష్టంగా అర్ధమవుతుంది”.
– ఇక్కడ రారా వచనగేయపు శైలినీ, “లిరికల్” శైలినీ వేరుగా చూపించారన్నది స్పష్టం. మీరు వచనగేయపు శైలి అంటే, ఛందస్సు లేకుండా రాయడమన్న అర్థాన్ని తీసుకున్నారు. కాని రారా తీసుకున్న అర్థం అది కాదు. అయితే అది రారా ఈ వ్యాసంలో పూర్తిగా స్పష్టం చెయ్యకపోవడం బహుశా అతని లోపమే. లేదా అప్పట్లో ఇవి విమర్శకులకి బాగా తెలుసున్న పదాలన్న ఉద్దేశంలో రారా వివరించకపోయి ఉండవచ్చు. వచన కవిత్వపు శైలీ భేదాలని “కవితావిప్లవాల స్వరూపం”లో నారాయణరావు గారు వివరించినట్టు గుర్తు.
“భావకవుల వేదనా ప్రియత్వంలో అనుభూతి సాంద్రత ఎక్కడుంది? అది ఒకరకంగా కృత్రిమమైనది.”
– ఇది మీ పాక్షిక దృష్టినే సూచిస్తోంది కాని సరైన విమర్శ అనిపించుకోదు. అనుభూతి సాంద్రమైన భావకవిత్వం నేను చదివాను. మొత్తం భావకవుల వేదనా ప్రియత్వాన్ని కృత్రిమం అనడం అసమంజసం. కవిత్వం విషయంలో ఇలాంటి blanket statements ఎప్పుడూ తప్పే అవుతాయి.
ఇవి తప్ప మీ వ్యాసంలో మిగతా అన్ని విషయాలతోనూ నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
09/07/2010 5:57 am
హెచ్చరిక: రారాగారి వ్యాసంలాగానే, నా యీ పొడుగాటి వ్యాఖ్యలోనూ తిలక్ కవిత్వం గురించి ఏమీ లేదు. కాబట్టి తిలక్ కవిత్వాన్ని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు దీన్ని చదవనక్కర లేదు.
తామొక చట్రంలో ఇరుక్కోడమే కాక తాము చదివిన కవులనీ కవిత్వాన్నీ కూడా అలా చట్రాల్లోకి ఇరికించే ప్రయత్నం చేస్తే అది ఎంత వెగటుగా ఉంటుందో రారాగారి ఈ విమర్శ నిరూపిస్తుంది. అంత మాత్రం చేత రారా అంటే నాకు గౌరవం లేదనీ కాదు, ఇదొక చచ్చు విమర్శ అనీ కాదు. కవుల్లాగే విమర్శకులు కూడా కాలానికీ, ఆయా కాలాలలో ప్రాచుర్యం పొందిన భావజాలాలకీ ప్రభావితులవుతారు. ఆ కాలంలో పాఠకులకి అది గొప్ప విమర్శగా అనిపించవచ్చు, వారూ చాలావరకూ ఆ చట్రాల్లోనే ఉంటారు కాబట్టి. తర్వాత కాలాల్లో అలాంటి చట్రాల్లో లేని వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఈ వ్యాసంలో నాకు తిలక్ కవిత్వం కంటే కూడా అభ్యుదయ కవిత్వం గురించిన వివర విశేషాలే ఎక్కువగా కనిపించాయి. తిలక్ అభ్యుదయ కవి కాడు అని నిరూపించడానికి అభ్యుదయ కవిత్వం గురించి అంత వివరణ అనవసరం అని నాకనిపించింది. అది కాక మిగిలినదంతా, తిలక్ భావకవి అని అంతకన్నా కూడా అథమస్థాయికి దిగజారాడని, నిరూపించడానికే సరిపోయింది. ఎంతసేపూ “అభ్యుదయ”, “భావ” కవిత్వాలు అనే చట్రాల్లోకి తిలక్ కవిత్వం ఒదుగుతుందా లేదా అనే తపనే కాని, ఒక కవిగా అతని కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ధ్యాస లేకపోవడం దురదృష్టకరం.
“శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి బహుశా లేడేమో” అని అన్నారు కాని, శ్రీశ్రీ కున్న భావుకత్వానికీ తిలక్ భావుకత్వానికీ మధ్యనున్న ఆంతర్యం ఏమిటన్న ఆలోచన చెయ్యలేదు. ఇద్దరూ గొప్ప భావుకులే. ఇద్దరికీ గొప్ప శబ్దశక్తి ఉంది. కాని వాళ్ళిరువురూ అంత భిన్నమైన కవిత్వాన్ని ఎందుకు రాసారు?
“దుఃఖితుల పట్లా బాధితుల పట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట ఎవరూ కాదనరు. కాని ఆ కరుణ అభ్యుదయ హృదయ స్పందనగా కనిపించదు. ఆ కరుణ దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురనూ, కర్యవ్యోన్ముఖులనూ చేసేది కాదు. కనీసం వాళ్ళకు ఊరట కలిగించేది కూడా కాదు.” అన్నప్పుడు దుఃఖితులనూ బాధితులనూ క్రియాశీలురని చేసేది మాత్రమే “అభ్యుదయ స్పందన” అవుతుందనే ఒక prejudice అందులో దాక్కుంది. పైగా “ఆ కరుణ కేవలం భావకవి కుమారుని ఏకాంత సౌందర్యంగా, కవితానంద హేతువుగా మిగిలిపోయింది” అని అన్నప్పుడు ఆ కరుణ అభ్యుదయం కాకపోతే భావుకవిత్వమే అవ్వాలన్న సంకుచిత దృష్టి కనిపిస్తోంది. తిలక్ కరుణ భావకవులకి మల్లే పూర్తిగా వ్యక్తిగతమైనది కాదు. భావకవుల్లా దుఃఖంలో అతను సౌందర్యాన్ని చూసాడనడమూ సహేతుకం కాదు. తిలక్ శ్రీశ్రీలా ఆవేశపరుడు కాదు. అందుకే అతను ఎంత భావుకుడైనా అతని కవిత్వంలో మృదుత్వం తప్ప రారా అన్న “ఉత్తేజం” కనిపించదు. శ్రీశ్రీ ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అతన్ని మరింత ఆవేశపరుణ్ణి చేసి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు తిలక్ కి లేనందువల్ల అతనిలో ఆ ఆవేశం కలిగే అవకాశమూ రాలేదు. అంత మాత్రం చేత తిలక్ కరుణని ఆవేదనని భావకవుల ఏకాంత సౌందర్యంగా జమకట్టెయ్యడం తప్పు. తిలక్ పీడితతాడిత జనాలని క్రియాశీలురని చెయ్యడానికి కంకణం కట్టుకోలేదు. వాళ్ళ బాధలకి నిజాయితీగా స్పందించాడు. అది భావకవిత్వంలో ఎక్కడా మనకి కనిపించదు.
“ప్రజాశక్తుల పట్ల భావకవి హృదయంలో స్వచ్ఛందమైన సానుభూతి ఉంది కానీ, ప్రజాశక్తులతో తాదాత్మ్యం చెందే అభ్యుదయకవి హృదయం కాదది” అన్నారు. తిలక్ భావకవి అని ముద్రవేసి అతని కవిత్వంలో ప్రజాశక్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ సానుభూతిని భావకవులందరికీ కట్టబెట్టేసారు. కాకపోతే, అసలు అంతకుముందు వచ్చిన భావకవిత్వంలో “ప్రజాశక్తుల” ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఇక ప్రజాశక్తులతో “తాదాత్మ్యం” అభ్యుదయ కవుల్లో ఏ కొద్దిమందికో మాత్రమే ఉన్నది. అభ్యుదయ కవిత్వం పేరుతో వచ్చిన చాలా కవితల్లో ఆ తాదత్మ్యం లోపించే అవి శుష్క నినాదాలుగా మిగిలిపోయాయి.
స్త్రీ గురించి “పెద్దపులి” అనడమూ, “ప్రవహ్లిక”తో పోల్చడమూ ఏ ఇజాలకీ లొంగక పాపం రారాగారికి అస్సలు మింగుడుపడలేదు! ఆఖరికి ఏదో తనకి తెలిసిన ఒక ఆర్యోక్తితో ముడిపెట్టే ప్రయత్నం చేసారు. ప్రతిదాన్నీ ఏదో ఒక ఇజంతో ముడిపెట్టాలన్న ఈ తహతహ ఎందుకసలు? ఒక పురుషుడిగా స్త్రీ వ్యక్తిత్వంలో తనకి తెలియని లోతులు కనిపిస్తే దాన్ని కవిగా తనదైన రీతిలో వ్యక్తం చేస్తే ఆ కవిత్వాన్ని కవిత్వంగా ఎందుకు అర్థం చేసుకోకూడదో నా మట్టి బుఱ్ఱకి తట్టటం లేదు.
ఇక స్త్రీల వర్ణన గురించి ప్రస్తావించి, అది భావకవిత్వం కన్నా దిగజారి ప్రబంధకవిత్వ స్థాయికి చేరుకుందని కొన్ని కవితలు ఉదహరించారు.తిలక్ చేసిన అంగాంగ వర్ణనలని ఆక్షేపిస్తే నాకు పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కాని భావకవిత్వంతో పోల్చి, అంతకన్నా దిగజారిందనడం పూర్తిగా అనవసరం, అర్థ రహితం. భావకవుల కవిత్వంలో కూడా మనకి ఇలాంటివి కనిపిస్తాయి. బాపిరాజుగారి “నగ్న” కవితాఖండిక దీనికి మంచి ఉదాహరణ. ఇంకా కాళ్ళకూరి గోపాలరావు కవిత్వం, కవికొండల గీతాలు మొదలైనవాటిల్లో స్త్రీ అంగాంగ వర్ణన కనిపిస్తుంది. “భావకవిత్వంలో స్త్రీ” పుస్తకంలో జయప్రభగారు దీని గురించి వివరించారు. అంచేత స్త్రీల వర్ణన విషయంలో తిలక్ భావకవిత్వం కన్నా దిగజారుడుతనం చూపించాడన్నది అర్థం లేని ఆక్షేపణ.
అలాగే స్త్రీ పురుష సంబంధాల గురించి, భావకవులది “ఉదాత్త ప్రణయమ”నీ, ఇంద్రియవాంఛ, శరీరదాహం సిగ్గుమాలినతనమనీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చదివితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే “అమలిన శృంగారం” అన్న “ఉదాత్తమైన” ప్రణయాన్ని భావకవుల్లోనే అందరూ ఆదరించిన దాఖలాల్లేవు. అభ్యుదయవాద చట్రంలో ఇరుక్కున్న రారాగారికి అది “ఉదాత్తంగా” కనిపించడంలో వింతలేదు, కాని తర్వాత వచ్చిన స్త్రీవాదులు దాన్ని పూర్తిగా ఖండించడం ఒక విశేషం!
రారాగారు ఎంతగా సిద్ధాంత సర్పపరిష్వంగంలో ఇరుక్కుపోయారంటే, సూత్రాలకీ సిద్ధాంతాలకీ కట్టుబడని తిలక్ మనస్తత్వాన్ని “మానసిక అరాజకత్వం” అనేంతగా! అల్లాంటి ఇరుకుదనమే సంకుచితత్వానికీ, నిరంకుశత్వానికీ దారితీసింది . కలల గురించి కవిత్వం రాసిన కారణానికి తిలక్ ని పిచ్చాసుపత్రికి దగ్గరగా ఉన్నాడని అనేంతగా అతని విమర్శని దిగజార్చింది!
ఇది ఏదైనా కావచ్చును కాని తిలక్ కవిత్వాన్ని గురించిన “సమీక్ష” మాత్రం ఖచ్చితంగా కాదు.
నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి గన్నవరపు నరసింహ మూర్తి గారి అభిప్రాయం:
09/05/2010 7:38 pm
అపారమైన తెలుగు సాహిత్య చరిత్రలో కొద్దిమంది కవులు ,బహుశా ఒక కవయిత్రి పేరు మాత్రమే ప్రసిద్ధి కెక్కాయి. కవిత్రయము,పోతన,శ్రీనాధుడు,అష్టదిగ్గజములు,మొల్ల పూర్వకవులలో ఆ అదృష్టమునకు నోచుకొన్నారు. వైయాకరుణులు పోతన కవిత్వంలో కూడా బోలెడు దోషాలు పట్టారు. నన్నయ, తిక్కనల భాషలో కూడా తప్పులు పట్టి ‘ఆర్యదోషంబు గ్రాహ్యంబు’ అని ఓ వ్యాకరణ సూత్రము తగిలించారు. అందుచేత కవయిత్రి మొల్లను స్త్రీ అనో అగ్రకులమునకు చెందక ఫొవటము వలననో ఆ కాలపు పెద్దలు గౌరవించ లేదని చెప్పడము భావ్యము కాదేమో. అది నిజమయితే అగ్రకులస్థులే ఎక్కువగా సాహిత్య పఠనం చేస్తున్న కాలంలో ఆవిడకు ఆ ఖ్యాతి ఎలా వచ్చింది?
మొల్ల సహజ కవయిత్రి. భాషాధ్యయనము చేయలేదని, ఈశ్వర ప్రసాదముచే కవిత్వము వచ్చినదని ఆవిడ చెప్పారు. నిఘంటువు అవసరము ఎక్కువగా లేని రీతిలో తేనెసోకునటుల తియ్యని మాటలతో కవిత్వము వ్రాసారు. రాజుల వర్ణన బాగుంది. కాని నన్ను ఆకట్టుకొన్న పద్యము
చం. కదలకుమీ ధరాతలమ, కాశ్యపి బట్టు ఫణీంద్ర ,భూవిషా
స్పదులను బట్టు కూర్మమ ,రసాతల,భోగి ఢులీ కులీశులన్
వదలక పట్టు ఘృష్టి, ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచు బట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కెడిన్ .
శ్రీరాముడు శివధనస్సు ఎత్తుతుంటే భూకంపము రాకుండా చూడమని లక్ష్మణుడు చెప్పిన పద్యము నాకు నచ్చినది. (మూడవ పాదములో యతి కలసి నట్లు లేదు. పెద్దలు వివరించ గలరు. మనకు నచ్చినప్పుడు యతి కలవక పోతే యేమి ? )
మహామంగళప్రవచనము గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
09/02/2010 10:19 am
చిక్కని పద్యాలలో చక్కని కవిత్వం, చాలా బాగుందండీ!
“అంభోవాహస్వనితానుకూలనటనంబూనె న్మయూరంబులున్” : మేఘధ్వనికి నెమళ్ళు నాట్యం చెయ్యడం మామూలే, ఆ ధ్వనికి అనుగుణంగా నాట్యం చేసాయనడం విశేషం!
“తారలు క్షపాకరుడుం గనరాకయుండఁ గాలయవనికాంతరస్థనటులం బలె” : కొత్త ఊహ!
“కరుణానిధి”, “కరుణాంబుధీ” లాంటి పదాలు వినివిని అరిగిపోయాయి 🙂 “అనుకంపాబ్ధీ!” : చాలా బాగుందీ పదం!
“రస” విషయికంగానే కొంత నిరుత్సాహం కలిగింది. కథ తెలిసినవాళ్ళకయితే ఫరవాలేదు కాని, తెలియని నాలాంటి వాళ్ళ విషయంలో చివరకి వచ్చేసరికి హఠాత్తుగా ముగిసిపోయినట్టనిపిస్తుంది. అంత గొప్ప వర్ణనలతో ఆ వాతావరణాన్నీ, ఆ సురాంగన దిగిరావడాన్ని వర్ణించిన తీరులో అద్భుత రసాన్ని పోషించి, వెనువెంటనే శాంత రసస్ఫోరకాలయిన బుద్ధుని మాటలు వచ్చెయ్యడం ఒక రకంగా రసభంగమైనట్టు అనిపించింది. అక్కడ మరికొంత కల్పన ఉంటే మరింత రక్తి కట్టి ఉండేదని అనుకుంటున్నాను.
ఏదైనా ఈ కాలంలో ఇంత మంచి పద్యకవిత్వాన్ని చదవడం అదృష్టమే! వీటిని దేశికాచారిగారి గళంనుంచి కాని, లేదా వేరెవరి మధుర గళంనుంచైనా కాని వినగలిగితే మరింత ఆనందంగా ఉంటుంది. ఇది ఈమాటలాంటి ఇంటర్నెట్ పత్రిలలకి పెద్ద పనేం కాదు కదా!
శతకందసౌరభము గురించి mOhana గారి అభిప్రాయం:
09/01/2010 2:58 pm
మనోహర్ గారూ,
1. రెండవ పాదము గంధము అనే పదమునుండి ఆరంభమవుతుంది. సంపాదకుల సహాయముతో దానిని సరి దిద్దుతాను. నేను పద్యాలను మొట్టమొదట ద్విపదరూపములో వ్రాసి తరువాత నాలుగు పాదాలుగా విడదీసినాను. అప్పుడు జరిగిన తప్పు ఇది. చెప్పినందులకు కృతజ్ఞతలు.
2. అతి అతి అనే పదాలు సంధి రీత్యా అత్యతి అవుతుంది. అంటే చాల చాల అని అర్థము.
3. పదము అంటే పాట అని కూడ అర్థము ఉంది.
4. రాగవతి అంటే రాగము ఉండే స్త్రీ అని అర్థము. రాగము అంటే ఎరుపు రంగు అని కూడ అర్థము. దీనికి మూలమైన సంస్కృత పద్యము రామాయణములో ఉందని కొందరు, లేదని కొందరు అంటారు. కియోటో ప్రతిలో లేదు ఇది. తి.తి.దే. సంక్షిప్త రామాయణములో ఉన్నది. ఆ పద్యము.
చంచ చ్చంద్ర కరస్పర్శ హర్షోన్మీలిత తారకా
అహో రాగవతీ సంధ్యా జహాతి స్వయ మంబరమ్
ఇందులోని అలంకారము స్వభావోక్తి., శ్లేష. సంధ్యను సాయంకాలముగా, ఒక స్త్రీగా ఈ పద్యములో వర్ణిస్తాడు కవి. స్త్రీపరముగా రాగవతి అంటే రాగము గలది, సంధ్య పరముగా ఎరుపుదనము కలిగినది, అంబరము అంటే ఆకాశము, వస్త్రము అనే రెండర్థాలు సరిపోతాయి. కరము అంటే చేతులు, కిరణాలు.
5. చైత్ర మాసానికి మరొక పేరు మధు మాసము (నేను వ్రాసిన కళావసంతములో దీనిని గురించి చర్చించాను). మదనుని మాసము అంటే కామదేవుని మాసము. అది మనిషికి ఒక ప్రత్యేకమైన నెల కాదు గదా, అన్ని నెలలలో అది ఉంటుంది, అంటే ప్రతి నెలా కామదేవునిదే కదా?
6. సంస్కృత సమాసాలలో ద్విత్వాక్షరానికి ముందు ఉండే అక్షరము ఎప్పుడూ గురువే. కాని తెలుగు పదాలకు ఈ నియమము వర్తించదు. ఉరికెను త్వరగా అనేటప్పుడు ను అక్షరాన్ని ఊది పలుకడము లేదు, కాబట్టి అది లఘువే. అచ్చ తెలుగు పదాల మధ్య కూడా ఇదే నియమము. అద్రుచు వంటి పదాలలో అ లఘువే, గురువు కాదు. అఆ అనే అక్షరాలను పక్కపక్క రాస్తే, చదివేటప్పుడు అ అక్షరము గురువే లఘువు కాదు!
విధేయుడు – మోహన
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/25/2010 4:06 pm
నచ్చిన దాని గురించి కాక నచ్చని వాటి గురించి మాత్రమే మాట్లాడటం భావ్యం కాదని మరో నాలుగు మాటలు. నాకు నచ్చిన కవిత సరిగంగ స్నానం. అసలా మాట విని శతాబ్దాలయింది; పల్లెటూరి జీవితం గుర్తుకి తెప్పించింది:
“తానే మనసారా వొక ఏరయి పోయి
చిన్న చిన్న వూళ్ల
పక్కటెముకల్నించి ప్రవహిస్తున్నాడు ఈ కవి హఫీజ్.”
పర్షియన్ మహాకవి హఫీజ్ కవితకి అనువాదం అని ఉన్నది కాని మూలం లేదు. “ఉప్పొంగి వస్తోంది గంగానమ్మ తల్లిలా,” అన్నది చూసి, మూలంలో ఏముందో తెలుసుకోవలని కుతూహలం కలిగింది.
అదీగాక, నేనింతకు ముందు హఫీజ్ కవిత్వమేమీ చదవకపోయినా, గతనెలలో ఓ సగం ధర పుస్తకాల షాపులో తచ్చట్లాడుతూ, అందంగా ఉన్న అట్ట బొమ్మని చూసి,
“The stuff produced in the factories of space and time
Is not all that great. Bring some wine, because
The sweet things of this world are not all that great.”
అన్నది చదివి, హఫీజ్ కవితల పుస్తకం [1] కారుచవగ్గా వస్తుంటే కొన్నాను. దాంట్లో సరిగంగ స్నానం ప్రస్తావన లేదు కాని డెక్కన్ సుల్తాన్ ఆహ్వానం మీద హఫీజ్ మన దేశం రావాలని బయల్దేరి, దారిలో తుఫాను రావడంతో మానుకున్నాడట:
“Hidden inside the crown of a king there’s always
A fear of assassination; a crown is a stylish hat,
But a head is too much to pay for it.
It seemed quite easy to put up with the ocean
And its torments to receive a proft, but I was wrong;
A hurricane is too much to pay for a hundred pearls.”
— Deciding Not To Go To India.
వేరే అనువాదాలేవైనా ఉన్నాయా అని నిన్న వెతికితే, ఓ షాపులో Daniel Ladinsky అనువాదం “Like the Ganges” [2] కనబడింది. దానికి సరిగంగ స్నానం చాలా దగ్గరగా ఉంది. Ladinsky మన దేశంలో మెహర్ బాబా ఆశ్రమంలో గడిపినప్పుడు హఫీజ్ ప్రభావంలో పడ్డాడట. ఓహో అనుకొని ఈ విషయాన్ని పక్కన పెట్టబోతుంటే ఓ చిక్కు వచ్చి పడింది. Ladinsky చేసినవి అనువాదాలు కాదు, ఆయన సొంత కల్పనలు అన్న వివాదం ఉందట!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “The angels knocking on the tavern door : thirty poems of Hafez,” translated by Robert Bly and Leonard Lewisohn. HarperCollins, 2008.
[2] “The Subject Tonight Is Love, 60 Wild and Sweet Poems of Hafiz,” Daniel Ladinsky (Translator). Penguin Group, 2003.
సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి hareesh గారి అభిప్రాయం:
07/16/2010 1:49 am
వేటూరి మరణానంతరం ఈమాట వారు ఒక ప్రత్యేక సంచిక గాని, ఒక ప్రత్యేక సంస్మరణ వ్యాసం కాని వెలువరించకపోవడం చాల ఆశ్చర్యంగాను మరియు చాల బాధగాను అనిపించింది. ఇప్పటికైన వేటూరి సంస్మరణార్థం వేటూరి గురించి తెలిసిన విజ్ఞులెవరి చేతనైనా ఒక ప్రత్యేక వ్యాసం రాయించాలని ఈమాట వారికి నా విజ్ఞప్తి.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
07/15/2010 2:07 pm
కొడవళ్ల హనుమంతరావు గారి కామెంట్ సూటిగా, సరళంగా, నిరావేశంగా, బాగుంది. వారు Web 2.0 గురించి అన్న మాటకు చిన్న స్పందన: వారన్నది “పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.” అని. ఇందులో చివరివాక్యం నేనన్న దానికి సంబంధం లేనిది. రచనాసందర్భం మారటం వల్ల కొత్తరకమైన కవిత్వం వస్తుందనే prediction సాధ్యం తప్ప అది ఉత్తమకవిత్వానికీ సృజనతీరులో మార్పులకీ దారితీస్తుందన్నది కాదు. ఏ కవితామార్గం లోనైనా ఉత్తమకవిత్వం రావొచ్చు. ఉదాహరణకు పురాణమార్గంలో వచ్చిన ఉత్తమకవిత్వంగా కొందరు “రామాయణ కల్పవృక్షా”న్ని ఎంచవచ్చు, అది వచ్చింది భావకవిత్వం/అభ్యుదయ కవిత్వం ప్రధానకవితామార్గాలుగా వున్న రోజుల్లోనైనా. అలాగే, “కళాపూర్ణోదయం” సృజనతీరులో మార్పుని చూపే కావ్యంగా నేను భావిస్తాను, అది ప్రబంధమార్గం లోని ఉత్తమకావ్యం కాకపోయినా. ఒక కొత్తకవితావిప్లవం రావటానికి, ఉత్తమ కవిత్వము, సృజనతీరులో మార్పులకీ పరస్పర ఆధార సంబంధం లేదనటానికి ఇవి ఉదాహరణలని నా ఉద్దేశ్యం.
రమా భరద్వాజ్ గారి most recent comment గురించి ఒక చిన్న observation తో ముగిస్తాను. వారు ప్రతిస్పందించిన నా కామెంట్ లో నేను ఎక్కడా “తిట్టు” లేదా “తిట్లు” అనే పదాల్ని వాడలేదు. విమర్శకుల్ని వారు విమర్శించారన్నాను. వారన్నదాన్ని బట్టి ఇప్పుడు తెలుగుకవిత్వానికి సంబంధించిన వాడుకలో “విమర్శ”, “తిట్టు” పర్యాయపదాలుగా వాడుతున్నట్టు (కనీసం వారనుకుంటున్నట్టు) అర్థమౌతున్నది. ఇది నేను ఇప్పుడే తొలిసారిగా తెలుసుకుంటున్న విషయం. ఐతే, దీంతో నాకున్న ఒక సందేహం నివారణ అయింది – అది తెలుగుకవులు, విమర్శకులు “విమర్శ” కు దూరంగా ఎందుకు పారిపోతున్నారనేది. విమర్శ, తిట్టు ఒకటైనప్పుడు అలా జరగటం సహజమే కదా ! అలా ఐతే “విమర్శకుడు” అంటే “తిట్టేవాడు” అనే అర్థం రావటం తప్పదు కాబట్టి, వారు నేను విమర్శకుణ్ని కానని స్పష్టం చేసి పుణ్యం కట్టుకున్నారు. ఇందుకు వారికి ఇంకా థేంక్స్.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/15/2010 2:34 am
సమీక్ష నచ్చింది. కాని 48 కవితల్లో నన్నాకట్టుకున్నవి నాలుగయిదు మాత్రమే. ఎక్కువ భాగం నచ్చకపోవడానికి ఓ ముఖ్య కారణం పదేపదే కనిపించే కొన్ని పదాలు. అఫ్సర్ పదాల ప్రాముఖ్యత తెలియని కవి కాదు:
“చిత్రిక పట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా శవానికి సైతం కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.”
“మరీ ఇంత సున్నితంగా మాట్లాడకు ఈ పూట … కాసింత ముల్లు గుచ్చుకున్నట్లుగా వుండాలి ఈపూట.”
ఎంత గరుకు మాటలు వాడినా చివరకు కవిత చదివేవానిలో సున్నితత్వాన్ని పెంచాలి కదా. “నెత్తురంటిన మాటలు” కవితల్లో చాలా ఎక్కువై పోయి నాకు వెగటు కలిగించాయి. నిజానికి నెత్తురు మాట చదివినప్పుడల్లా, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం చదివిన నెరూడా చెప్పిన మాటల ప్రాముఖ్యత గుర్తొచ్చి, “నెత్తుటి కడవల” దోషం కొట్టొచ్చినట్లయింది:
“I leave them in my poem like stalactites, like slivers of polished wood, like coals, pickings from a shipwreck, gifts from the waves. Everything exists in the word.” [1]
ఇటీవలే తిరిగి ప్రచురితమైన వెల్చేరు పుస్తకానికి [2] KVS రామారావు గారు ఇచ్చిన కితాబు: “నాకెంతగానో నచ్చిన మరొక అంశం, రచయిత రాసిన వచనం. శాస్త్రీయ, విశ్లేషణాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా, పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు.” నేను కొన్ని భాగాలే చదివాను. ఈ విషయంలో నేనూ మెచ్చుకుంటాను.
వెల్చేరు సిద్ధాతం ప్రకారం, రచనా సందర్భం, సామాజిక సందర్భం మారినప్పుడు కవితా స్వరూపం కూడా మారుతుంది. ఆశు రూపం నుంచి శ్రవ్య రూపానికీ, పిదప పాఠ్య రూపానికీ మారడానికి కారణం – రచన చేసే పరికరాల్లో మార్పు రావడమే. (పదో అధ్యాయం)
KVS రామారావు గారుWeb 2.0 కూడా కొత్త రచనా సందర్భమనీ, దీని మూలంగా కొత్త కవితా రూపాలొచ్చే అవకాశముందనీ అంటున్నారు. దానితో నేను విభేదిస్తాను. పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.
ఈ సందర్భంలో Richard Rorty గుర్తొచ్చాడు:
Question: The Internet, and in general the information revolution, has already revolutionized our world, and it will continue to do so in even more radical ways, as … suggest. Do you think that philosophy, or let us say, critical thinking, will have a whole new spectrum of questions to deal with, and that we might have to begin a new sub-discipline named something like cyber-philosophy?
Rorty: Maybe, but I see no special reason to think so. The telephone and telegraph didn’t create a tele-philosophy, so I am not sure that the Internet will produce a cyber-philosophy. I think a lot of the stuff about the information revolution is media hype.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Memoirs,” Pablo Neruda.
[2] “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం,” వెల్చేరు నారాయణరావు. తానా ప్రచురణ, 2008.
[3] “Take care of freedom and truth will take care of Itself: interviews with Richard Rorty,” edited with an Introduction by Eduardo Mendieta. Stanford University Press, 2006. Page 111.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
07/14/2010 1:49 pm
రామారావు గారూ!! నా ఆ అభిప్రాయాన్ని ఎడిట్ చేసి వేయడం కారణంగా మీకు కలిగిన పొరపాటు అభిప్రాయం మాత్రమే అది. అందుకు నా బాధ్యత ఏమీ లేదు. గమనించండి. నేను మిమ్మల్ని ఒక “విమర్శకునిగా” ఆ నా అభిప్రాయంలో పేర్కోలేదు. నాకు తెలీదు మీరు విమర్శ ఏమన్నా రాసేరని. అభిప్రాయాలు మీరు ఒక పుస్తకం మీద చెప్పినట్టే అందరికీ ఉంటాయి. నా అభిప్రాయం మీకు ఒప్పుదల కాకపోయినంత మాత్రాన దానిని “తిట్టుగా” భావించనక్కరలేదు. నేను పేర్కొన్న అభిప్రాయం అభిప్రాయం మాత్రమే . “తిట్లు” కావు. నేను రాయని అభిప్రాయాలని నాకు ఆపాదిస్తే అందుకు నేను ప్రతిస్పందించనక్కర లేదు. నా భావం వీళ్లకి అర్ధం కాలేదు అనుకుని ఊరుకుంటాను.
చర్చని “కవితావిప్లవాల స్వరూపం” మీదకి మళ్ళించవలసిన ప్రశ్నలని మీరు వేసేరు. అది వేరే చర్చ అవగలదు. ఆ చర్చని చేసే ఆసక్తి మిగిలిన వారికి ఉండాలి. కదా? మీరు వేసిన అన్ని ప్రశ్నలూ సమంజసగానే ఉన్నాయి. ఆలోచనాత్మకమైన అభిప్రాయాలని గుర్తించగలిగిన మీకు వాటికి జవాబులు అన్వేషించడమూ ఏమంత కస్టం కాకపోవచ్చు. నేను ఇదివరకూ చెప్పిన అభిప్రాయామూ..మీకొచ్చిన సందేహాలతో సహా ఆ పుస్తకానికి సంబంధించి మరోసారి ఒప్పుకుంటున్నాను. నేను తొందరపడి అభిప్రాయాలు ఏర్పరుచుకోను. ఏర్పడిన అభిప్రాయాలని సరైన మరొక కారణం లేకుండా మార్చుకోను.
రమ.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
07/13/2010 2:43 pm
“తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” గురించి రమా భరద్వాజ్ గారి వ్యాఖ్యలు ఆలోచనాత్మకాలు. ఐతే వారు ఆ గ్రంథం నుంచి ఆశిస్తున్నవి దాని పరిథిలోవి కావనుకుంటాను.
1. వారు ““రచనా సందర్భం” మారితే వచ్చే అవకాశాలనీ.. అంటే వీలూ సాలూ అంటాం తెలుగులో వాటి గురించి మాట్లాడుకుందికి ఉపకరిస్తుందేమో గానీ అది మంచి కవిత్వమా కాదా అని గుర్తించడానికి ఎందుకూ ఉపకరించదు.” అన్నారు. నాకు అర్థమైనంతవరకు ఏది మంచి కవిత్వమో ఏది కాదో గుర్తించటం కాదు ఆ పుస్తకం చేస్తున్న పని; తెలుగు కవిత్వంలో పెనుమార్పులు ఏవో, వాటి వెనక వున్న కారణాలు ఏమిటో గుర్తించటానికి ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించి ఆ సిద్దాంతం ద్వారా వేటిని పెనుమార్పులుగా గుర్తించవచ్చో చూపించింది, అంతే.
2. మరో చోట “కవితావిప్లవాల స్వరూపాన్ని దాటి ముందుకెళ్ళవలసిన “సందర్భం” కూడా ఏనాడో వచ్చింది. నారాయణరావు గారి థియరీ భాషలో చెప్పాలీ అంటే విమర్శా సందర్భం ఏనాడో మారింది. ఆ దృష్ట్యా కవితా విప్లవాల స్వరూపం ఒక పాత పుస్తకం. ఇవాళ్టికాలపు అవసరానికి అది ఎందుకూ ఉపయోగపడదు. ” ఇక్కడ వారు వాడిన తర్కమార్గం సుగమంగా లేకపోయినా, దీన్ని నేను ఇలా అర్థం చేసుకుంటున్నాను (ఇది పెడదారైతే అసలు దారేదో తెలుసుకోవాలని వుంది): ఇది ఒక విమర్శాగ్రంథమనీ, కవిత్వానికి లాగానే విమర్శాసందర్భంలో మార్పు వల్ల విమర్శలో కొత్తవిప్లవం వచ్చిందనీ, ఈ గ్రంథం పాతవిప్లవం తాలూకుదనీ. విమర్శకు సంబంధించి అలాటి సిద్ధాంతం ఒకటి వున్నట్టు, దాని ప్రకారం ఈ పుస్తకం ఒక పాతవిప్లవంలోదని ఆ తర్వాత మరొక రచన లేదా రచనలు కొత్త విప్లవం లేదా విప్లవాలకు దారి తీసినట్టు నిరూపణ అయిందని నాకు తెలియదు; కాని ఈ చర్చ కోసం అలా జరిగిందని ఒప్పుకుందాం. అలా ఒప్పుకున్నా, ఈ పుస్తకం చదవవలసిన అవసరం తీరిపోయిందని దాన్నుంచి ఎలా నిర్ధారణ చెయ్యటం? ఇక “ఇవాళ్టికాలపు అవసరం” అనేది. ఈ అవసరం ఏమిటో ఎక్కడా స్పష్టంగా చెప్పకుండా దానికి ఇది ఎందుకూ ఉపయోగపడదు అంటే అర్థం చేసుకోవటం కష్టం. ఈ వాక్యసందర్భాన్ని బట్టి ఆ అవసరం సైతం ఏదో ఈ పుస్తకపరిథిలో లేనిదే అయుంటుందని అనిపిస్తున్నది. నాకు మూడు సాధ్యమయే అర్థాలు కనిపిస్తున్నాయి:
అ) “చాలా కొత్త విప్లవాలు వచ్చాయి, వాటిని ఈ పుస్తకం లోని సిద్ధాంతం గుర్తించలేదు”
ఆ) “ఈ పుస్తకంలో చెప్పిన కారణాలు కాకుండా కవితావిప్లవాలకి ఇంకొన్ని కొత్తకారణాలు కనుక్కున్నారు”
ఇ) “ఈ సిద్ధాంతం తప్పని నిరూపించబడింది”
వీటిలో ఏది జరిగివున్నా, అలా జరిగినట్టు నాకు తెలియదు. దయచేసి అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో ఎవరైనా చెప్తే తెలుసుకుంటాం.
చివరగా, నేను చేసిన పాడు పనికి విమర్శకులందర్నీ విమర్శించటం ఎందుకు? (అలాగే, నన్నొక విమర్శకుడిగా లెక్క వేసినందుకు రమ గారికి థేంక్స్, నేను కాకపోయినా.)
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి srinivas kandaalam గారి అభిప్రాయం:
07/12/2010 10:09 pm
బ్రహ్మానందం గారు:
నేను చర్చని తప్పు దారి పట్టించడం లేదు. అందులో అనుమానమే లేదు. అఫ్సర్ ని అమెరికా తెలుగు కవి అన్నది మీరె కదా?! ఇదిగొ ఇదీ మీ మాట:
చివరగా పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరూ అమెరికన్ తెలుగు రచయితల కోవలోకే వస్తారని నా నమ్మకం.
అమెరికన్ తెలుగు రచయిత అనే మాట మీది కూడా. కాదని ఎలా అంటారు? పైగా, ఆ “శతకోటి నమస్కారాల” వెటకారం హేమిటో నాకు అర్ధం ఆవలేదు.
అది అవతల పెట్టండి. కాని, కవిత్వ విమర్శకుడిగా మీ ఆలోచనల మీద ఇష్టం వుండబట్టే, నెను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను తప్ప మిమ్మల్ని గిచ్చి సంతసిద్దామని కాదు. రమా భరద్వాజ గారి లాగానె నాకూ మీ రచనలు అంటే ఇష్టమే. అఫ్సర్ గారి కవిత్వం గురించి మీ మాట వినాలన్న వుత్సుకతతో మాత్రమే అడిగాను.
నా ప్రవర అడిగారు కదా మీరు? మారుపేర్లతో రాసే అందరినీ కూడా అలా ప్రవర అడిగే సాహసం చెయ్యగలరా, మీరు గానీ, ఈమాట సంపాదకులు గాని?
గత పదేళ్ళుగా నేనూ, నా మిత్రులం ఈమాట చదివి, అందులో విషయాలు చర్చించుకునే అలావాటు చేసుకున్నాం. చదవడమే గాని, ఎప్పుడూ ఒక ముక్క రాసే సాహసం చెయ్యలేకపొయాము. ఇప్పుడు ఈమాటలో కామెంటడానికి అర్హత ఏమిటో ఇక్కడ కొందరి వ్యాఖ్యలు చదవిన తరవాతే తెలిసింది. అంతకు ముందు ఈమాట లో ఒక్క అక్షరం పడ్డా కళ్ళకి అద్దుకుని చదువుకునే వాళ్ళం నేనూ, నా నిజామాబాద్ మిత్రులం! అలాంటిది, ఇప్పుడు ఈ రాతలకి అర్ధమే లేని స్థితి వచ్చే సరికి బాధ పడి, ఇక తప్పని సరయి రాస్తున్నాను.
అయినా మీరు అడిగారు కాబట్టి, మీ మీది గౌరవంతో ఇదీ నా ప్రవర. నా పేరు శ్రీనివాసాచార్యులు కందాళం. నేను ఒక కాలేజీ లెక్చరర్ని. సాహితీ చైతన్య స్రవంతి సభ్యుడిని. ఈమాట పాఠకుడిని అని చెప్పుకోవడం నాకు ఒక ఇష్టం. నేను నా విద్యార్ధులకి కూడా ఈ వెబ్ పత్రిక గురించి చెబుతూ వుంటాను. కవిత్వం రాయను కాని ఇష్టంగా చదువుతాను, విద్యార్ధులకి వినిపిస్తాను. నా చిరునామా ఇతర వివరాలు కూడా కావాలా?
[Post edited – Eds.]
[ఈమాటలో కామెంట్లు అసభ్యంగా ఉంటున్నాయని బాధపడుతూనే, వ్యక్తిగత దూషణలకి పూనుకోడంలో అంతరార్థం మాకు అంతుపట్టడం లేదు. దయచేసి ఎవరికి వారు, వారి కామెంట్లను నియంత్రించుకోండి. – సం.]
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి Brahmanandam Gorti గారి అభిప్రాయం:
07/12/2010 9:47 am
శ్రీనివాస్ గారూ,
మీరు అఫ్సర్ గారి వ్యాఖ్యా, ఆ తరువాత నే చేసినదీ మరోసారి చదవండి. నేను ఊరిచివర కవిత్వంపై విమర్శ చెయ్యలేదు. అఫ్సర్ గారు రాసిన వ్యాఖ్య దురుసుగా అనిపించి దానిపై రాసాను. మీరు అది వదిలేసి, కొత్త కొత్త తెలివైన ప్రశ్నలేస్తే జవాబిచ్చే సత్తా, ఓపికా నాకు లేవు.
అఫ్సర్ గారు అక్కడ కవిత్వం రాసినా, ఇక్కడ కవిత్వం రాసినా నాకభ్యంతరం లేదు. నాకొరిగేదీ ఏమీ లేదు. బావుంటే చదివి ఆనందిస్తాను. లేదంటే చదివినంత వేగంగానే మర్చిపోతాను. అక్కడా, ఇక్కడా అంటూ గీత గీసింది అఫ్సర్ గారు. ఆయన్నొదిలేసి నన్నడిగితే నా దగ్గర సమాధానం లేదు. కాబట్టి మీరు ఆయన్ని సంప్రదించాలి. నన్ను కాదు.
మీరిచ్చిన వలస కవులూ, రచయితల లిస్టు నాకూ తెలుసు. వారందరూ ఇక్కడే ఉండిన అక్కడి వారయితే, ఇక్కడే ఉండిన ఇక్కడి తెలుగువారెవరూ ఉండరు. ఈ వసుధైక కుటుంబంలో వలస పక్షులు కానిదెవరు?
మీరు చర్చని తప్పుదారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు.
చివరగా – గతంలో ఆంధ్రాలో ” సుబ్బారావూ” అని రోడ్డు మీద అరిస్తే కనీసం పదిమందైనా వెనక్కి చూసేవారు. ప్రస్తుతం సుబ్బారావుని శ్రీనివాస్ పేరు ఆక్రమించుకుంది. మీ పూర్తిపేరుతో వ్యాఖ్య రాస్తే పలానా అని తెలిసేది. :)- ఆ అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలేసి తప్పించుకున్నారు. :)-
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి afsar గారి అభిప్రాయం:
07/12/2010 9:01 am
రామారావు గారికీ, బ్రహ్మానందం గారికీ:
మంచి మాటలకు ధన్యవాదాలు.ఆలశ్యానికి మన్నించండి. మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ “ఊరి చివర” చర్చలో ఒదగవు కాబట్టి, అది వేరే వ్యాసం రాస్తున్నాను. కొంచెం ఓపిక పట్టండి. కాని,తెలుగు పాఠకుల సంఖ్య ఎక్కడ పెరుగుతూందో, ఇప్పటి అమెరికా తెలుగు రచయితల పరిమితులేమిటో ఆ వ్యాసం చర్చిస్తుంది. కాని, అమెరికా తెలుగు రచయిత/ అమెరికా తెలుగు పాఠకుడు అనే పదాలు ఇంకా కొన్ని ఏళ్ళు మాత్రమే బతుకుతాయి అనిపిస్తోంది, అని ప్రస్తుతానికి చెప్పగలను, ఈ తరం అమెరికా తెలుగు వాళ్ళు తెలుగులో రాస్తే తప్ప, కనీసం చదవాలి అనే ఆసక్తి చూపిస్తే తప్ప.
“ఈమాట” లాంటి వెబ్ పత్రికలు క్రమంగా ఆంధ్రా పాఠకులు/ రచయితల మీదే బతకగలవు. లేకపోతే, వాటికి రచనలు కూడా పుట్టవు.
ఇవి చిలక జోస్యాలు కావు, చేదు నిజాలు. ఇప్పటికీ అమెరికాలో తెలుగు సాహిత్య సభలకి వస్తున్న వాళ్ళలో ఈ తరం తెలుగు వాళ్ళు ఎంత మంది వున్నారు? ఆలోచించండి.
వ్యాసం వచ్చే “ఈమాట” కోసం అనుకుంటున్నా. చూద్దాం.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
07/10/2010 5:13 pm
వెల్చేరు నారాయణరావు గారు “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” అనే గ్రంథంలో కొత్త రకమైన కవిత్వం రావటానికి “రచనా సందర్భం” అనే అంశాన్ని ఒక మఖ్య ప్రేరకంగా గుర్తించారు. (ఈ పుస్తకాన్ని చదవమని ఈమాట పాఠకులందరికీ నిస్సంకోచంగా విన్నవిస్తున్నాను.) ఉదాహరణకు, ప్రింటింగ్ ప్రెస్ రాకతో ఓ పుస్తకాన్ని ఎవరికి వారు ఓ కాపీ కొనుక్కుని చదువుకునే అవకాశం కలిగింది; ఆంగ్లవిద్యా విధానాలతో విద్యార్ధులు తమ కుటుంబాల నుంచి దూరంగా వెళ్లి ఉండటం జరిగింది; ఈ రెండూ కలిసి ఏకాంతంగా ఎవరికి వారే చదువుకుని ఆనందించగలిగే కవిత్వానికి (భావకవిత్వం) దారి తీశాయి. ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ , ఆంగ్లవిద్యాలయ వ్యాప్తి – వీటి నుంచి ఒక కొత్త రచనా సందర్భం తయారైందన్నమాట.
ఇప్పుడూ ఒక సరికొత్త రచనా సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది Web 2.0 వల్ల కలిగింది. ఎవరికి వారు ఓ కవితని చదువుకున్నా, దాని గురించిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా వున్న పాఠకుల మధ్య జరగటమే కాదు, కవికి కూడ అవి ఎప్పటికప్పుడు అందుతున్నాయి. సాహిత్యచరిత్రలో ఇదివరకు ఎప్పుడూ ఇది సాధ్యపడలేదు. ఈ కొత్త రచనా సందర్భం తెలుగులో ఎలాటి కొత్త కవిత్వానికి దారితీస్తుంది అనేది ఇంకా స్పష్టంగా లేదు. అలాగే అందులో పాఠకుల, వారి చర్చల పాత్ర ఏమిటనేది కూడ తెలియదు. ఐతే ఈ కొత్త కవితాప్రపంచంలో పాఠకులకు ఇదివరకెప్పుడూ లేని పెద్దపాత్ర వుంటుందనిపిస్తున్నది.
ఒక ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే – ఈ కొత్త రచనాసందర్భం, నాకు తెలిసినంతవరకు, ఆంగ్లసాహిత్యం మీద పెద్ద ప్రభావం చూపలేదు; ముఖ్యంగా అమెరికాలో ఇంటర్నెట్ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుంటున్న కవులు చాలా తక్కువగా కనిపిస్తారు. (ఈ విషయం నాకన్నా బాగా తెలిసిన వారు ఎందరో వుంటారు. వారి నుంచి ఇంకా అధికారికమైన సమాచారం వినాలని వుంది)
నారాయణరావు గారి సిద్ధాంతం ప్రకారం రచనా సందర్భాల మార్పుని గమనించలేని తక్కువరకం కవులు పాతకవిత్వమే రాస్తారు. నిశితదృష్టి వున్న కవులు ఈ మార్పుకి అనుకూలమైన కొత్తరకం కవిత్వం సృష్టిస్తారు.
ఇలా ఒక విప్లవాత్మక సమయంలో పాఠకులం కావటమే కాదు, నారాయణరావు గారి కవితావిప్లవకారకాల సిద్ధాంతం భవిష్యత్తుని ఎంతగా predict చేస్తుందో చూసే ఒక ఆసక్తికరమైన కాలంలో వున్నాం మనం.
ఈ సంధికాలంలో రకరకాల ప్రయోగాలు తప్పవు. వాటిలో చాలాభాగం విఫలం కావటమూ తప్పదు. ఇప్పుడు ఈమాట లోనూ, ఇతర వెబ్ పత్రికలలోనూ జరుగుతున్నవి ఇలాటి ప్రయోగాలే. నా ఉద్దేశ్యం – వీటిలో ఫలానావి మంచివీ ఫలానావి కావు అని చెప్పగలిగే స్థితి ఇంకా రాలేదు గనుక, తొందరపడి పాఠకులు కాని సంపాదకులు గాని వేటినీ ఆపటం, అడ్డుపెట్టటం మంచిది కాదేమో (వ్యక్తిగత దూషణలు మరీ శృతి మించుతుంటే తప్ప).
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
07/10/2010 4:38 pm
మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.
నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..
సెలవు,
భవదీయ..
రమ.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కృష్ణ గారి అభిప్రాయం:
07/09/2010 6:45 pm
ఉష గారి బాధ అర్ధమవుతున్నది. కాని, కొంచెం స్పష్టంగా చెప్పవచ్చు కదా అనిపించింది. ఈమాటలో అందరి వ్యాఖ్యలూ కాదు, రమా భరద్వాజ పేరిట వస్తున్న వ్యాఖ్యలు మాత్రమే పెడసరంగా వుంటున్నాయి. ఆవిడ గారు పనికట్టుకుని కొందరి మీద రాళ్ళు రువ్వే పని పెట్టుకున్నట్టు, ఆ రాళ్ళన్నీ ఈమాట వైపే రువ్వుతున్నట్టు అనిపిస్తున్నది.ఆవిడ ఇంకెక్కడా కనిపించరు కనుక ఈ మాట అనవలసి వస్తున్నది. అన్యధా భావించరాదు.
చర్చ అఫ్సర్ పుస్తకం “వూరి చివర” గురించి. పుస్తకం చదివిన వేలూరి గారు ఆయనకు తోచింది రాసారు. అందులో విమర్శ కూడా వుంది. రమా భరద్వాజ గారికి ఆ విమర్శ కనిపించలేదు. అఫ్సర్ ని వేలూరి పొగిడారో అని చిన్న పిల్లలాగా ఉక్రోషం పట్టలేక యాగీ చేస్తున్నారు. రమ గారూ: చర్చని పుస్తకం మీద పెట్టి, అందులో అకవిత్వం ఏదో చెప్పగలిగితే బాగుంటుందేమో చూడండి. ఆ విధమ్మున అఫ్సర్ ని అకవి అనాలన్న మీ వుద్దేశం తీరుతుంది. ముందు అఫ్సర్ ని శుభ్రంగా వుతికి ఆరేసిన మీదట ముకుంద రామారావుకి మహాకవి అన్న అచ్చోసి వదులుదాం.
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
07/08/2010 9:43 pm
రామారావుగారూ,
ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి మళ్ళీ మళ్ళీ అవే విషయాలు చర్చించడం అనవసరం అన్నాను కాని దాని గురించి కొత్త మార్గంలో పరిశోధించడమే అనవవసరమని నా ఉద్దేశం కాదు. “కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప” అన్న కొసరు అందుకే 🙂
అలాగే ఇలాంటి పరిశోధనకి statistical techniques ఉపయోగపడవని కూడా నా అభిప్రాయం కాదు. వాటిని తెలుగు సాహిత్యంలో ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ ఉపయోగించలేదు కాబట్టి, ఎంతవరకూ ఎలా ఉపయోగపడతాయో ప్రయోగాల ద్వారా పరిశీలించిన తర్వాత ఉపయోగించడం సమంజసమని నా ఉద్దేశం.
“ఏ కారణం చేత ఐతేనేం తెలుగులో ఆముక్తమాల్యద రాయటానికి పూనుకున్నాడు కాని సంస్కృత శ్లోక రచనా పథకాలే ఎక్కువగా ఈ పద్యాల్లోనూ వున్నాయి.” నాది కూడా సరిగ్గా ఇదే అభిప్రాయం. తెలుగు మాట్లాడని వాడు కావడం వల్లనే అలా రాసేడని నా ఉద్దేశం. ఇంతకుముందు చాలామంది విమర్శకులు దీనిని ప్రౌఢశైలి అని, క్షాత్రశైలి అని, క్లుప్తత అని అన్నారు. భావాలలో ప్రౌఢత్వాన్ని పక్క పెడితే, భాషలోని ప్రౌఢత్వం మాత్రం కవి తెలుగువాడు కాకపోవడం వల్లనే వచ్చిందని నాకనిపించింది. అయితే పూర్వకవి ప్రయోగాలు కనిపించనంత మాత్రాన అతనికి తెలుగు సాహిత్యంతో చెప్పుగోదగ్గ పరిచయమే లేదు అని చెప్పలేం. తెలుగువాడు కాకపోవడం వల్ల ఆ ప్రయోగాలు సహజంగా అతని మనసులో ముద్రపడలేదని అనుకోవచ్చు కదా.
సరళంగా ఉండే పద్యాల విషయంలో – we have to look at how they are distributed across the kavya. Only then we can decide on whether they are part of the inherent variability or written/modified by someone else. నేను చదివినంతలో అవి కావ్యమంతా అక్కడక్కడా ఉన్నాయనిపించింది. రాయల కలలో విష్ణువు చెప్పిన మాటల్లోనే, “ఎన్నిను…” అన్న పద్యంలో రాయల ముద్ర చాలా బలంగా కనిపిస్తుంది. వెంటనే “తెలుగదేలయన్న…” పద్యం. “బాసాడి” అన్న పదం ఇతర తెలుగు కవులెవరైనా ప్రయోగించారేమో నాకు తెలియదు. అలాగే రాజనీతి చెపుతున్నప్పుడు కాని (ముఖ్యంగా కందపద్యాలు), విష్ణుస్తుతి చేసేటప్పుడు కొన్ని చోట్ల, ఇలా అక్కడక్కడ కావ్యమంతా సరళమైన, సహజమైన తెలుగు పద్యాలు కనిపిస్తాయి, రెండుమూడు ఉదాహరణలు:
ఏపట్టున విసువక ర
క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్ను
ల్గూపెట్టిన విని తీర్పుము
కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్
ఎక్కడి రాజ్యవైభవము? లెక్కడి భోగము? లేటి సంభ్రమం?
బక్కట! బుద్బుదప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి, యుగసంధుల నిల్చియు గాలు చేతి బల్
త్రొక్కుల నమ్మను ప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే
ఎవ్వని చూడ్కిచేసి జనియించు జగంబు, వసించు నిజ్జగం
బెవ్వనియందు, డిందు మరి యెవ్వనియందిది, యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడ నే
నెవ్విధియైన నిన్గదియ నేని యనన్ విని బంధమూడ్చినన్
(పోతన్నని కచ్చితంగా చదివే (వినే) ఉంటాడనడానికి ఈ పద్యమే సాక్ష్యం 🙂
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి C.S.Rao గారి అభిప్రాయం:
07/07/2010 7:54 pm
ఒక కవిత ఏ విషయం మీద వ్రాసినా ,వ్యక్తీకరింపబడిన అనుభూతి ఏదైనా ,మహాబలీయమైన ముద్ర పాఠకుడి మీద వేసి “ఎంత బాగుంది” అని పదే పదే పలవరించేట్లు చేయాలి. అనేక మార్లు తరగని ఆనందంతో చదువుకునేటట్లు జేసి, దాన్ని కంఠవశం చేసుకోవాలనే తపనను కలిగించకపోతే ఆ కవిత కవితే కాదు.దాని ఆయుఃప్రమాణం అతి స్వల్పం: దాని ఎఫెక్ట్ , ఎఫిమిరల్. కవిత గొప్పదా,కాదా అనే విషయానికి సంబంధించి ఇది నిజమైన టెస్ట్ లా భావించవచ్చుననుకుంటాను.
వ్రాసేది కవిత కావాలి. అంటే పైన చెప్పిన శక్తిని అది సంతరించుకోవాలి. వ్రాసే వ్యక్తి కవి కావాలి. అంటే కేవలం మాటలు పేర్చటం మాత్రమే తన పనిగా భావించే వ్యక్తి కాకూడదు. ఒక బలమైన అనుభూతికి లోనై వ్రాయాలి.
ప్రాచీన ఛందో రీతులలో వ్రాసిన పేరడీ పద్యాలు కూడా కంఠవశం అయ్యే గుణం కలిగి ఉంటవి. అంత మాత్రం చేత అవి కవిత్వం అయిపోవు. ఆ కంఠవశం అయ్యే గుణాన్ని అవి కలిగి ఉండటం మన ప్రాచీన ఛందో రీతుల గొప్పదనం, వాటి వైశిష్ట్యం. కంఠవశం అయ్యే గుణం లేకపోతే మంచి కవిత్వం కాదన్నాము గానీ, కంఠవశం అయ్యే ప్రతిదీ మంచి కవిత్వం అనటం సాధ్యం కాదు.
వచనకవితలో కంఠవశం అయ్యే గుణం సాధించటం చాలా చాలా కష్టం. వచన కవి చాలా ప్రజ్ఞావంతుడై ఉండాలి. కవితా రసవిద్యా రహస్యం తెలిసినవాడై ఉండాలి. శక్తిమంతమైన,రసస్ఫోరకమైన పదచిత్రాలను,వైరుధ్యాలు లేని మెటఫర్ల సమాహారాలను, సంకేతాలను తనదైన, ప్రగాఢమైన అనుభూతిని ఆవిష్కరించటానికి, కవిత్వీకరణ మాధ్యమాలుగా సున్నితంగా మలచుకోవాలి. అంతేకాదు, కవితా పంక్తులలో ఒక మనోజ్ఞమైన, లయబద్ధమైన నడకను, పదబంధప్రయోగంలో శబ్దసారూప్యత వల్ల జనించే రమ్యమైన రిధంను అతను సాధించాలి. అప్పుడది గొప్ప కంఠవశమయ్యే గుణాన్ని, ప్రబలంగా ఆకట్టుకునే శక్తిని సంతరించుకుని ఎప్పుడూ మన మనస్సుని అంటిపెట్టుకుని ఉంటుంది. గొంతెత్తి పరవశంతో చదువుకునేటట్లు చేస్తుంది.
నాకు తెలిసినంతవరకు,నా అనుభవంలోకి వచ్చినంతవరకు వచనకవిత సమగ్ర సర్వాంగ సుందరంగా వ్రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మాత్రమే. వేరే వాళ్ళ కవితాపంక్తులు మూడు నాలుగు కంటే ఎక్కువ గుర్తు ఉండవు. తిలక్ కవితలు మనసులో మార్మోగుతూనే ఉంటవి. చాలా వరకు వారికవితలు ఆమూలాగ్రం ఇట్టే అవలీలగా కంఠవశం అవుతవి. పలుమార్లు పంక్తులకు పంక్తులు, కవితలకు కవితలు గొంతెత్తి చదువుకుంటూ పులకింతలు పోవటం నా స్వానుభవం.ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం.
కవిత్వం వ్రాసే వాళ్ళు మానవ జీవితానుభవాలలో దేనిమీదైనా వ్రాయవచ్చు. ఒక తాత్విక చింతనను కానీ,సామాజిక స్పృహను కానీ సాంఘిక,ఆర్ధిక,రాజకీయ దురన్యాయాన్ని కానీ దోపిడీని కాని కవితలో ఆవిష్కరించవచ్చు. కానీ అది కవితామయం గానే జరగాలి. కవిత యొక్క వస్తువిశేషము కవిత యొక్క గొప్పదనం మీద ప్రభావాన్ని చూపలేదు. కవిత రచనా రీతికి సంబంధించినది; వస్తుప్రాధాన్యతకు సంబంధించినది కాదు. అయితే, కవిత్వానికి సాహిత్యానికి సామాజికప్రయోజనం లేదని కానీ, ఉండకూడదని కానీ కాదు. కవిత్వం, తక్కిన సాహిత్య ప్రక్రియలన్నీ రససిధ్ధి ద్వారా పాఠకులని ఉత్తమ మానవీయత వైపు నడిపించాలి. పునరుక్తి దోషంగా భావించవద్దు :ఇది రససిద్ధి ద్వారానే జరగాలి.
ఇకపోతే కవిత్వ విమర్శ కవితల గుణదోషపరిశీలనకు మాత్రమే పరిమితమై ఉండాలి. అటువంటి పరిశీలన ఇంటలెక్చువల్ లాంగ్వేజ్ లో ఎనలిటికల్ గా మాత్రమే జరగాలి. వ్యక్తిగత విమర్శలకు, అవహేళనలకు, నిందలకు దిగజారకూడదు. కవిత కవితై ఉండాలి; సాహిత్యవిమర్శ సాహిత్యవిమర్శ మాత్రమే అయి ఉండాలి. అలా మన స్థాయిని పెంచుకునే సామర్ధ్యం మనకు ఉంది, ఆ అవసరం కూడా ఉంది.
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
07/07/2010 7:05 pm
కామేశ్వరరావు గారు “ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి ఎప్పుడో ముగిసిపోయిన చర్చని మళ్ళీ లేవనెత్తడం అనవసరం, కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప” అని తేలిగ్గా కొట్టిపారేశారు. తెలిసిన ఫలితాన్నే ఐనా కొత్త మార్గాన సాధిస్తే దాన్ని స్వీకరించటం, మెరుగులు పెట్టటానికి ప్రయత్నించటం శాస్త్రీయ పరిశోధనల్లో సర్వసాధారణమే. ఇకపోతే, కర్తృత్వం, ముఖ్యంగా ఆముక్తమాల్యద విషయంలో, అంత black and white అని నేను అనుకోను. నన్నయ గారి విషయంలోనే భారతావతారిక పద్యాలు బహుశ నన్నయ గారు రాసినవి కావు, నారాయణభట్టు రాసివుండొచ్చు అన్న పరిశోధకులు ఎందరో వున్నారు. ఇక రాయల విషయంలో కనీసం కొన్ని పద్యాలు మరెవరైనా రాసి వుండటానికి బాగా అవకాశం వుంది. ఉదాహరణకు బాగా ప్రాముఖ్యత సంతరించుకున్న –
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొ కండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స
అన్న పద్యం రాయల పద్ధతిలోది కాదు. ఇంత సరళమైన అన్వయం వున్న పద్యాలు ఆముక్తమాల్యదలో చాలా అరుదు; ఇంత సహజమైన తెలుగు ఇక ఏ పద్యంలోనూ కనిపించదు. నాకు అనిపించేది రాయలకి తెలుగు సాహిత్యంతో పెద్దగా పరిచయం లేదు అని; ఆయన నన్నయాదుల రచనల్ని చదివాడని నేననుకోను. ఆముక్తమాల్యదలో పూర్వ తెలుగు కవుల ప్రభావం కనిపించదు (ఒక్క కనియెన్ వైష్ణవుడు అన్న పద్యం మాత్రం అటజని కాంచె పద్యానికి కొంత దగ్గరగా వున్నట్లనిపిస్తుంది; అది పెద్దనదే కనుక రాయలు దాన్ని విని మెచ్చుకుని వుండటానికి బాగా అవకాశం వుంది; అలాగే కొంత అనుసరించటానికీ.). రాయలు ముఖ్యంగా సంస్కృతాన్ని ఆపోశన పట్టినవాడు. ఏ కారణం చేత ఐతేనేం తెలుగులో ఆముక్తమాల్యద రాయటానికి పూనుకున్నాడు కాని సంస్కృత శ్లోక రచనా పథకాలే ఎక్కువగా ఈ పద్యాల్లోనూ వున్నాయి. తెలుగు మాటలు వాడినప్పుడు అవి సానబట్టిన గ్రాంథిక పదాలు కావు, గ్రామీణ వ్యావహారికాలు. వాక్య నిర్మాణం సహజమైంది కాదు, ప్రయత్నపూర్వకం, clumsy గా వుండేది.
నా ఉద్దేశ్యం ఆముక్తమాల్యద మొదల్లో కొన్ని పద్యాలు, మథుర నగర వర్ణన పద్యాలు బహుశ రాయలవి కావు. టూకీగా చెప్పాలంటే, తేలిగ్గా అన్వయం ఉండి, ఇట్టే అర్థమయే పద్యాలు ఇంకెవరన్నా కొంత ఎడిట్ చేసినవో లేక పూర్తిగా రాసినవో.
ఇలాటి విషయాల గురించి పరిశోధించటానికి statistical techniques ఎంతగానో ఉపయోగిస్తాయని నేననుకుంటున్నాను.
పసిఁడిపల్లకి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
07/07/2010 12:24 pm
మంచి ధారతో మాధుర్యంతో పద్యాలందించినందుకు కృతజ్ఞతలు.
ఇంత పెద్ద పద్యకవిత “ఈ మాట”లో చూడడం ఇదే మొదటిసారి,నాకైతే. ఇటువంటివి అందుకొని ఆనందించే అదృష్టవంతులకన్నా అందుకోలేని ఈనాటి ఈమాట పాఠకులే ఎక్కువేమో అని అనుమానం.
ఎన్నో ఇతర ఉపమానాలు వాడినప్పటికీ, వరుసగా మూడు పద్యాలలో పెద్దనను కవిచంద్రుడు కవిసింహుడు కవివృషభుడు అనడం వర్ణన అందాన్ని అతిశయోక్తి కబ్జా చేసినట్టుంది.
వ్యాసునితో పోల్చిన బ్రహ్మగా తోచిన పెద్దన, కృష్ణరాయలే చతురవచోనిధి ఆంధ్రకవితాపితామహ అనిపిల్చిన కవి, రాయల అస్తమయంతో తనకు యిచ్చిన పైసలు,సంపద, చేసిన సన్మానాలే తలుస్తూ రాయలతో పోలేక జీవచ్చవంబుగా బతుకుతున్నాననడం పెద్దన తనను చిన్నగ చేసుకున్నట్లుంది.
ఆ పద్యం పెద్దననే కాదు ఖండికను సైతం నీరుగార్చిన ముగింపు. నాకింత చేసాడనే కాని,రాజ్యానికి ప్రజకు కల్గిన లోటు ఊసెత్తకపోవడం సామాన్యులకు అలంకారమే కాని కవిచంద్రునకు మచ్చ.
పసిడి పోయె వెంట పల్లకియును పోయె
రాజ్యమంతరించె రాజుతోడ
కావ్యపరిమళాలు కాంతులీనుచు నిల్చె
పసిడి కబ్బి నట్లు పరిమళంబు
===========
విధేయుడు
_శ్రీనివాస్
నువ్వు గురించి Meghadhutha గారి అభిప్రాయం:
07/07/2010 4:30 am
బాగుంది. కాని అది విరహమా, వ్యామోహమా, వైరాగ్యమా, విరక్తా, ప్రేమా, పారవశ్యమా లేక యీ అన్ని భావనలు కలబోసుకున్న అయోమయమా అన్నది మాత్రం తెలియడంలేదు. కవిత్వం లోతయిన భావాలను సరళతరం చేయాలని నా అభిప్రాయం.
విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Syamala Rao గారి అభిప్రాయం:
07/07/2010 3:59 am
వ్యాసం బాగుంది. శ్రీకృష్ణదేవరాయలు గురించి గాని, విజయనగరసామ్రాజ్యం గురించి గాని తెలుగు వాళ్ళలో విపరీతమైన ఆరాధనాభావం ఉండటంలో వింతలేదు కాని, ఈమధ్య కాలంలో ఈ విషయాలలో యేమీ పరిశోధన జరగక పోవటం చాలా విషాదకరం.
టీనేజ్ ప్రాయంలో (తూ.గో.జిల్లా) కొత్తపేట గ్రంధాలయంలో పదహరు సంపుటాలుగా ఉన్న ‘విజయనగర సామ్రాజ్య నవలామాలిక’ చదివాను. అది కన్నడ మూలానికి తెలుగుసేత. అనువాదకులు యెవరో సరిగా గుర్తుకు రావటంలేదు. నాకు తట్టినంతవరకు కేవలకాల్పనిక చారిత్రక దీర్ఘనవల. సత్యాసత్యాల పాళ్ళ సంగతి పక్కన పెడితే యేకబిగిని చదివించే రచన.
తాడిగడప శ్యామలరావు, హైదరాబాదు.
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana గారి అభిప్రాయం:
07/06/2010 11:17 am
సౌమ్యగారూ, అన్ని ద్రావిడ భాషలలో పద్యాలు ఉన్నాయండీ. తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో సంస్కృత దేశి ఛందస్సులు రెండూ ఉన్నాయి. మలయాళ భాషలో తమిళ ఛందస్సు కూడా ఉన్నది. కాని తమిళ భాష ఛందస్సు సంస్కృతముతో సంపర్కము లేకుండా స్వతంత్రముగా వెలిసింది. అది సంస్కృత ఛందస్సంత ప్రాచీనమైనదే. మనము తెలుగులో వాడే కొన్ని వృత్తాలు తమిళ ఛందస్సునుండి గ్రహించబడియుండవచ్చు. తమిళ పద్యాలలోని మరొక విశేషము ఏమంటే వాళ్లు సంస్కృతములా పాదచ్ఛేదయతిని, తెలుగులా అక్షరసామ్య యతిని రెంటినీ పెట్టుకొన్నారు. తెలుగులోని అక్షరసామ్య యతి బహుశా తమిళమునుండి వచ్చినదనే నేను అనుకొంటాను. అన్ని ద్రావిడ భాషలలో ప్రాస ఉన్నది. ఇది కూడా మొట్టమొదట తమిళ ఛందస్సులో వాడబడినది. తాళవృత్తాలు కూడా తమిళ ఛందస్సులో ఎక్కువ. నేటిలా కాక పూర్వకాలములో ఒక భాషలోని గొప్పదనాన్ని మరొక భాష గౌరవించి అందులో కొన్నిటిని అనుసరించడానికి వెనుకంజ వేయలేదు. అందుకే కృష్ణరాయలను తర్కించేటప్పుడు తెలుగు కవుల, చరిత్రకారుల అభిప్రాయాలను మాత్రమే తీసికోక అందరి అభిప్రాయాలను జల్లించాలి.
విధేయుడు – మోహన
విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి mOhana గారి అభిప్రాయం:
07/06/2010 10:58 am
మంచి వ్యాసము. ఆసక్తి ఉన్నవారికి ఇందులోని సూచికలు ఎంతో ఉపయోగపడుతాయి. సుమారు 70, 80 వ దశకాలలో “రాయన దినచరి” అనే ఒక రాయల డయరీని కన్నడములో కనుగొన్నారట. అందులో ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయని చదివాను. దానిని గురించిన పరిశోధన వివరాలను ఎవరైనా తెలిపితే బాగుంటుంది. ఈ పుస్తకాన్ని బహుశా రాయలు వ్రాయలేదు, కాని ఇందులోని సమాచారాలు చారిత్రక సత్యాలనే అంటారు.
విధేయుడు – మోహన
పసిఁడిపల్లకి గురించి ధేశికాచారి గారి అభిప్రాయం:
07/05/2010 9:39 pm
ఈ ఖండికను నిశితంగా పరిశీలించి ఇందులోని కించిద్దోషాల నెత్తిచూపిన కామేశ్వరరావుగారికి నా కృతజ్ఞతలు. ఇట్టి సద్విమర్శలవల్ల రచయితకూ, పాఠకులకూ మేలే జరుగుతుందని నా అభిప్రాయము.
1. పట్టః అనే సంస్కృతపదానికి పట్టు అనేది వైకృతరూపం. సిద్ధసమాసంలో ధవళపట్టాంబరంఅనే ఉండాలి. వ్రాతదోషంవల్ల ఇది పట్టంబరంగా దొరలింది.
2. సీసపద్యంలో “కంఠీరవోజస్సు” అనేది అసాధువు. పద్యధారలో ఈ అసాధురూపం దొరలిపోయింది,నేను తిరిగి చూచుకొనలేదు. కామేశ్వరరావు సూచించినట్లుగా ఇది కంఠీరవౌజస్సనే ఉండాలి. ఇదిదోషంగా నేనంగీకరిస్తాను. వృద్ధిసంధినిగుఱించి మాట్లాడుతున్నాం గనుక, ఈ సంధికి అపవాదాలను కూడా ఇక్కడ పేర్కొంటాను. ఓతుః(పిల్లి), ఓష్ఠః శబ్దములకు సిద్ధసమాసంలో గుణ,వృద్ధిరూపాలు రెండూ వస్తాయి – ఉదా- స్థూలౌతుః,స్థూలోతుః, బిమ్బౌష్ఠః, బిమ్బోష్ఠః. అట్లాగే అక్ష+ఊహినీ అనేచోట గుణసంధికిమారుగా అక్షౌహిణీ అని వృద్ధి వస్తుంది. ఐతే ఆంధ్రభారతంలో అక్షోహిణీ అనే రూపంకూడ వాడబడింది. కాని సంస్కృతవైయాకరణుల ప్రకారం ఇది అసాధువు. ఇట్లాంటివే గుణసంధికి మరికొన్ని అపవాదాలున్నవి, వాని నన్నిటినీ నేనిక్కడ పేర్కొనడం లేదు.
3. పై సీసపద్యంలోనే “కంఠీరవౌజస్సు”, “నళినజుతేజస్సు” అన్నచోట్ల క్షత్రియుడైన రాజుయొక్క ఓజస్సుకు (బలానికి – అంటే రాజు సింహబలుడని చెప్పడం), బ్రాహ్మణుడైన కవియొక్క బ్రహ్మవర్చస్సుకే ప్రాధాన్యంగాని, వారిని సింహంతోగాని, బ్రహ్మతోగాని ప్రత్యక్షంగా పోల్చడంలేదు. సింహ,నళినజపదాలు ఈ ఓజస్తేజస్సులకు పరోక్షాధారములు మాత్రమే. అందుచేత, ఈ రెండు సీసపాదాల ఉద్దేశ్యం రాజుయొక్క క్షాత్రతేజాన్ని, కవియొక్క బ్రహ్మతేజాన్ని ప్రకటించడమే కాని, రాజును సింహంతో, కవిని బ్రహ్మతో పోల్చడం కాదు. అందుచేత, ఇక్కడ వాడబడిన పదాలు ప్రకృతార్థప్రయోజనకారులుగా నున్నవనుటలో సందేహము లేదని నా అభిప్రాయము.
కృష్ణదేవరాయలు గురించి Sowmya గారి అభిప్రాయం:
07/05/2010 9:34 pm
ప్రతి చరిత్ర పుస్తకానికి ఇలా వాళ్ళు చెప్పిన మూలగ్రంథాల గురించి ఒక ముందుమాట రాస్తే ఎంత బాగుంటుందో!
ఇంతకీ – ఒక చిన్న సూచన: ఈ పోర్చుగీసు వారి పేర్లు, పుస్తకాలు: వీటికి ఆంగ్ల స్పెల్లింగులు బ్రాకెట్ల లో ఇస్తే, మాకు వెదుక్కోడానికి సులభం అవుతుందేమో! (కష్టే ఫలీ! మీరే కనుక్కోవాలి! అంటారా?)
[ఈ పేర్లన్నీ మిగతా వ్యాసాల్లో ఇంగ్లీషులో కూడా ఇవ్వడము, నేలటూరి ప్రకరణాన్ని ఏ మార్పులూ లేకుండా ప్రచురించడము – ఈ ఉద్దేశాలతో పోర్చుగీసు పేర్లు ఇంగ్లీషులో ఈ వ్యాసంలో ఇవ్వలేదు. సారీ. – సం.]
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana గారి అభిప్రాయం:
07/05/2010 9:00 am
నేను ఈ వ్యాసం వ్రాయడానికి పూనుకొన్నప్పుడు నాకు కూడా కామేశ్వరరావుగారిలాగే ఊహ జనించింది. కన్నడరాజ్యరమారమణుడు ఎందుకు కన్నడములో వ్రాయలేదని. దానికి నేను ఊహించిన కారణాలను ఇక్కడ ఇస్తున్నాను.
1) కన్నడ పద్యరచనా సాహిత్యము రాయలనాటికే ఉచ్ఛదశను అందుకొన్నది (It has already peaked). వాళ్లు కీర్తనా సాహిత్య ప్రక్రియను కొనసాగించడానికి ఉద్యుక్తులయ్యారు. తెలుగు సాహిత్యపు ప్రబంధయుగపు ఔన్నత్యానికి కాలము రాయల నాటిది.
2) కన్నడములో వ్రాయడము తెలుగుకన్నా తేలిక, ఎదుకంటే కన్నడములో అక్షరమైత్రి యతి లేదు. కన్నడములో మొట్టమొదట తెలుగులాగే సంస్కృత వృత్తాలతో నిండిన చంపూ కావ్యాలు నాంది పలికినా, తరువాత వచ్చిన కవులు షట్పదలు, సాంగత్యములాటి దేశి ఛందస్సులో (నా ఉద్దేశములో సరియైన నిర్ణయము, ఇలా తెలుగు కవులు అందరూ ఎందుకు ఉద్యమించలేదో అని ఎప్పుడూ నేను విచారపడుతాను) వ్రాసారు. సంస్కృత సందీర్ఘ సమాసాలతో వృత్తాలలో వ్రాసే రాయలకు ఇలా దేశి ఛందస్సులో వ్రాయడము రుచించలేదేమో? లేక challenging గా తోచలేదేమో?
3) తెలుగులో బాగుగా వ్రాసి తెలుగువారిని మెప్పిస్తే తన రాజ్యములోని ఎక్కువ పాలైన తెలుగు ప్రాంతాలు అలజడి లేక ఉంటాయనే రాజకీయ కారణాలు కూడా రాయలకు కలిగిందేమో? అందుకే ఆంధ్రవిష్ణువు తన కలలో వచ్చాడంటాడు.
తెలుగు నేర్చుకోక తెలుగులో కావ్యాలు వ్రాసేటంత జ్ఞానము అబ్బడము సామాన్యము కాదు. కాని రాయలు సామాన్యుడు కాడు. వీరుడు, సాముగరిడీలు, కసరత్తు చేయడములో దిట్ట, రాజనీతిజ్ఞుడు, వీణావాదననైపుణి గలవాడు. సంస్కృతములో అసాధారణ పాండితీ ప్రతిభను ఆర్జించుకొన్నవాడు. In theory, it is possible for SrIkrishnadevaraayalu to excel in Telugu.
రాయలు కన్నడమును మాత్రమే కాదు, తన మాతృభాష ఐన తుళును కూడా ఉద్ధరించలేదు. రాయలవంటి చక్రవర్తి తుళు భాషకు మద్దతును ఇచ్చి ఉంటే నేడు తుళు భాష కన్నడముతో సమానముగా శోభించి ఉంటుంది. నా ఉద్దేశములో రాయలు వ్రాసిన సంస్కృత కావ్యాల (మనకు లభించినవి) శైలికి ఆముక్తమాల్యద శైలికి మధ్య ఉండే సాన్నిహిత్యము, భేదము గమనించాలి.
విధేయుడు – మోహన
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhan గారి అభిప్రాయం:
07/04/2010 9:50 pm
ఈ వ్యాసపు ముఖ్య విషయం రాయల కొలువులో తెలుగు కాని ఇతర భాషలలో సాహిత్యం ఎలా వర్ధిల్లిందో అన్న విషయాన్ని వివరించడమే. కాని అభిప్రాయాలు ఆముక్తమాల్యదపైన వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక విషయం మనవి చేస్తున్నాను. తెలుగు కవులు సామాన్యముగా ఆశ్వాసాంతములో ఒక గద్యం వ్రాస్తారు. ఉదాహరణకు పెద్దన ఇలా వ్రాసారు –
ఇది శ్రీమదాంధ్రకవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్షపాదాంబుజాధీనమానసేందిందిర నందవరపురవంశోత్తంస శఠకోపతాపసప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లి కాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్యప్రణీతంబైన స్వారోచిషమనుసంభవం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము
(ఇది శ్రీమదాంధ్రకవితాపితామహుడని బిరుదుగలవాడు, సర్వతోముఖాంకుడనే బిరుదుగలవాడు, విష్ణుమూర్తి పాదపద్మాల మకరందాన్ని గ్రోలె తుమ్మెదవలె నుండువాడు, శఠకోపయతిచే ప్రసాదించబడిన శ్రేష్ఠమైన చతుర్విధ కవిత్వములు అభ్యసించినవాడు, అల్లసాని చొక్కయమంత్రి కుమారుడు ఐన పెద్దనార్యుడు వ్రాసిన స్వారోచిషమనుసంభవము అనే మహాకావ్యములో రెండవ ఆశ్వాసము.)
కాని ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంతములు గద్యాలు కావు, పద్యాలు. ఉదాహరణకు –
ఇది సింహాచలదంభకేసరిపదాభీష్టార్చనాపుణ్యల-
బ్ధదురుట్టంకణ పొట్టునూరివిజయస్తంభోపలోట్టంకితాం-
కదృఢేష్టాక్షర కృష్ణరాయనృపసంజ్ఞాన్మత్కృతాముక్తమా-
ల్యద నాశ్వాసవరంబు నాలవది హృద్యంబై మహిం బొల్పగున్
– శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద, 4.289
(ఇది సింహాచలములో ఉండే మాయనరసింహస్వామి పాదాలను కొలువగా సంక్రమించిన పుణ్యఫలమువల్ల పొట్టునూరి జయస్తంభములో పేర్కొనబడిన కృష్ణరాయనృపతి వ్రాసిన ఆముక్తమాల్యద కావ్యములో నాల్గవ ఆశ్వాసము అందరికి ప్రీతిగా విరాజిల్లును.)
సంస్కృతకవులు ఇలాగే వ్రాసేవారు. ఉదాహరణకు నేను వ్యాసములో పేర్కొన్న రుక్మిణీశవిజయమునుండి ఒక సర్గాంత పద్యము –
రోమ్ణాం హర్షణకారిణీ శ్రవణతః పాపౌఘవిధ్వంసినీ
ప్రేమ్ణా చింతయతాం విచిత్రవిమలశ్లాఘార్థసందాయినీ
సంజాతే భువి రుక్మిణీశవిజయే సద్వాదిరాజోదితే
సంజాతః సురమండలీషు మహితః సర్గో ముదాం సప్తమః
(రోమాంచితమయ్యేటట్లు సంతోషమిచ్చేది, వినగానే పాపాలను నిర్మూలించేది, విచిత్రమైనది, నిర్మలమైనది, అర్థవంతమయినది అయి వాదిరాజయతిచే వ్రాయబడిన రుక్మిణీశవిజయ కావ్యములో ఏడవ సర్గ సురమండలముచే పొగడదగినదైనది.)
ఆముక్తమాల్యదలో ఉపయోగించబడిన చాల సంస్కృతపదాలకు సామాన్యమైన అర్థాలు ఉండక కొద్దిగా మామూలుగా లేని అర్థాలు ఉంటాయి. రాయలే వ్రాసారో, మరెవరు వ్రాసారో కాని రచయితకు మాత్రం కొబ్బరికాయలంటే ఎంతో ఇష్టమనిపిస్తుంది 🙂
విధేయుడు – మోహన
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి అఫ్సర్ గారి అభిప్రాయం:
07/03/2010 9:46 am
రామారావు గారంటే నాకు గౌరవం వుంది, ఆయన కొంచెం ఆలోచించి రాస్తారని. ఆ గౌరవానికి భంగం కలగకుండానే, ఈ నాలుగు మాటలూ రాస్తున్నా.
ఈమాట తరఫు నించి ఆయన చెప్పిన మాటలతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఈమాటకి సంబంధించిన విషయం.
కాని, రచయితలూ, “ఉహా” పాఠకుల గురించి ఆయన చేసిన ఊహలు నాకు కొంచెం ఆశ్చర్యంగా వున్నాయి. మీరు ఏ శాస్త్రీయ సర్వే ప్రకారం ఈ ఊహలు చేశారు, రామారావు గారూ? ఆంధ్ర దేశంలో వొకే రకం పాఠకులు వున్నారన్న ఈ అంచనా ఎక్కడినించి వచ్చింది?
అక్కడి రచయితలకూ, పాఠకులకూ అమెరికాలోని తెలుగు రచయితలకూ, పాఠకులకూ నిజంగా తేడా వుందా? అమెరికాలోని తెలుగు రచయితలూ, తెలుగు పాఠకులూ వొక “ఫ్రోజెన్”తెలుగు సమాజంలో ఇప్పటికీ బతుకుతున్నారు. అది అరవయి, డెబ్బయిల ఆంధ్ర.
అమెరికాలోని తెలుగు వాళ్ళకి మల్లెనే, అక్కడా కొందరు ఫ్రోజెన్ తెలుగు వారు వుండవచ్చు. వారికి విప్లవ రచయితలని తిట్టడమే ఏకైక పని.
నాకు తెలిసీ ఆంధ్రాలో పాఠకుల స్వభావం మారింది, ఇటీవలి ఉనికి చైతన్యమూ, రాజకీయాల తరవాత.
దళిత, ముస్లిం, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర రచయితల ప్రభావం అమెరికాలోని ఈ ఫ్రోజెన్ తెలుగు సమూహాలకు ఇంకా అర్ధం అవుతున్నట్టు లేదు. అవి అందరూ అనుకుంటున్న “విప్లవ” లేదా వామ పక్ష కక్కులు కావు. అమెరికాలోని వివిధ భాషీయుల, జాతుల వేదన కూడా అ.తెలుగులకు అర్ధం అవుతున్నట్టు లేదు. అది వేరే మాట్లాడుకుందాం. అక్కడి ఉనికి వేదనకూ, ఇక్కడి అనేక భిన్న జాతుల వేదనకూ కొంత చుట్టరికం దూరంగానయినా వుంది. కాని, ఆంధ్రాలో ఉనికి చైతన్యం రాజకీయ పరంగా ఎటు మళ్ళినా, సాహిత్య, సాంస్కృతిక రంగాల పరిధిని విశాలం చేసింది. ఆ విశాలమయిన పరిధిలోంచి కొత్త పాఠకుడిని చూడాలని నా అభిప్రాయం.
రామారావు గారి “ఊహా పాఠకులు” ఎవరో , వారి వర్తమానం ఏమిటో తెలుసుకోవాలని వుంది. అలాగే,”అక్కడి” తెలుగు రచయితలు చేయలేకపోతున్న సాహసాలు / విదేశీ తెలుగు రచయితలు సేయంగల సాహసాల భోగట్టా కూడా.
ఇప్పుడు అక్కడి సాహిత్య సాంద్రతని అందుకోడానికి అమెరికన్ తెలుగు రచయితలకు ఇంకో తరం పడ్తుందేమో! (కొంత మంది అ.తెలుగు రచయితలు క్షమిస్తే, ఈ నిజం చెప్పక తప్పదు. లైలా లాంటి వారి కామెంట్లు చదువుతున్నప్పుడు అది ఇంకా మూడు నాలుగు తరాలు కూడా పట్టవచ్చని దిగులుగా వుంది)
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి mOhana గారి అభిప్రాయం:
07/03/2010 9:14 am
కన్నడములో దేవరనామ వైష్ణవభక్తిగీతాలను వ్రాయడము మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడైన నరహరితీర్థులతో ప్రారంభమయిది. మధ్వాచార్యులు కూడా వ్రాసినరని అంటారు, కాని కన్నడములో వారి పాటలు దొరక లేదు. కాని సంస్కృతములో వారి ద్వాదశస్తోత్రము పాడడానికి ఎంతో బాగుంటుంది. నేడు కూడా ఈ ద్వాదశస్తోత్రాన్ని నైవేద్య సమయములో పాడుతారు. వ్యాసరాయలపైన దీర్ఘంగానే చర్చించాను. అక్కడ వారి గురువులైన శ్రీపాద రాయలనుగురించి కూడా వ్రాసాను. ఈ శ్రీపాదరాయల మఠము ముళ్బాగలులో ఉంది (బెంగళూరు తిరుపతి బస్సు మార్గములో). కానీ స్థలాభావమువల్ల అదంతా కత్తెరవేటుకి పడ్డది. పురందరదాసు కనకదాసులతో సహా శ్రీపాదరాయలు, వ్యాసరాయలను హరిదాసకూటానికి పితామహులని అనుకొంటారు. శ్రీపాదరాయల ఆనతిపైననో లేక తనంతట తానో చాలా యేళ్ల శిష్యరికం పిదప వ్యాసతీర్థులు ముళ్బాగలునుండి చంద్రగిరికి వెళ్లారు. అక్కడ సాళువ నరసింహరాయలకు రాజగురువుగా ఉన్నారు. శ్రీపాదరాయలు కూడా రాయలకు గురువే. ఆ సమయములో తిరుమలపైన అర్చకులు లంచగొండితనంవల్ల తీవ్రశిక్షకు పాల్పడ్డారు. స్వామివారి అర్చనకు ఎవ్వరూ లేనందువలన నరసింహరాయలు వ్యాసతీర్థులను శ్రీవారికి పూజ చేయమని అడగ్గా, అలాగే సుమారు 12 సంవత్సరాలు పూజ చేసారు ఇంతలో పూజారి వంశపు పసివాళ్లు పెద్ద వాళ్లయ్యారు. వారికి పూజా భారాన్ని అప్పగించారు వ్యాసతీర్థులు. సాళువ నరసింహరాయలతో ఇతడు కూడా విజయనగరానికి వెళ్లారు. తిరుపతిలో ఉన్నప్పుడు వ్యాసతీర్థులు బహుశా అన్నమయ్యను కలిసుంటారనే నా ఊహ. కృష్ణరయలపైని గౌరవము, వాత్సల్యము వలన తన పాటలకు వ్యాసరాయలు కృష్ణ ముద్రను ఉంచారని కొందరు అంటారు. శ్రీపాదరాయలు రచించిన కొన్ని దేవరనామాలు – పోపు హోగోణ బారో రంగ, బారో మనెగె రంగ నిన్నంఘ్రికమలవ తోరో, ఇక్కో నోడే రంగనాథన పుట్టపాదవ, నా నినగేను బేడువుదిల్ల, భూషణకె భూషణ ఇదు భూషణ, ఆవ జనుమద తాయి ఆవ జనుమద తందె మున్నగునవి. నాకు భూషణకె భూషణ ఎంతో ఇష్టం. అతని ఒక పాట కింద ఇస్తున్నాను –
మనెయింద సంతోష కెలవరిగె లోకదల్లి
ధనవింద సంతోష కెలవరిగె లోకదల్లి
వనితెయిం సంతోష కెలవరిగె లోకదల్లి
తనయరిం సంతోష కెలవరిగె లోకదల్లి
ఇనితు సంతోష అవరవరిగాగలి నిన్న
నెనెవో సంతోష ఎనగాగలి నమ్మ రంగవిఠల
( గృహమందు ముదమగును కొందరికి లోకమున
ధనమిచ్చు మోదమును కొందరికి లోకమున
వనిత లిత్తురు ముదము కొందరికి లోకమున
తనయు లిత్తురు ముదము కొందరికి లోకమున
ఎవరి యానంద మవి వారి కగును నిన్ను
తలచు యానంద మది నాకగు స్వామి రంగవిఠల )
విధేయుడు – మోహన
నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
07/03/2010 3:23 am
ఈ పుస్తకం గాని, అఫ్సర్ గారి పుస్తకం గాని చదవకుండా రాస్తున్న అభిప్రాయం ఇది. లైలా, రమ గార్ల అభిప్రాయాలు ఆలోచనా ప్రేరకాలుగా వుండటంతో చేస్తున్న సాహసం.
మామూలుగానే కవిత్వసమీక్ష కత్తిమీద సాము. దానికితోడు ఒక పత్రిక సంపాదకుడే ఆడా పాడా మద్దెల కొట్టా అన్నట్టు ఆ పని కూడ చెయ్యాల్సి వస్తే ఇంకా ఇరకాటం. చూస్తూ చూస్తూ బాగా తెలిసిన, తమ పత్రికలో అప్పుడప్పుడు ప్రచురిస్తున్న, ఒకరి రచనని గురించి ప్రతికూలంగా రాయలేరు. అదీ లబ్ధప్రతిష్టులైన రచయితలైతే మరీ కష్టం. ఇది వేలూరి గారి పరిస్థితిలో ఉన్న చిక్కు.
సాధారణంగా సమీక్షకులెవరైనా ఒక రచన గురించి వాళ్లు చూపే సానుభూతికీ, వాళ్లకీ ఆ రచయితకీ ఉన్న ప్రత్యక్ష పరిచయానికీ డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ (తెలుగు పదాలు గుర్తుకురావటం లేదు) ఉంటుందని నా నమ్మకం. అలాటి సానుకూల సమీక్షలలో నిజంగా అర్హమయే రచనలే లేవని అనలేము కాని చాలా తక్కువ శాతం. ఐతే మనకు తెలియని వారి గురించి ప్రతికూలంగా అనటం తేలిక కదా !
ఎవరి మెప్పు కోసమో రాసే కవిత్వంలో నిజాయితీ ఉండదని, అది మాటలపేర్పు తప్ప గుండెలోతుల్లోంచి వచ్చి పాఠకుల మనసు పొరల్ని స్పృశించలేదనీ చెప్పనక్కర్లేదు. అలా ఇతరుల మెప్పుని ఆశించకుండా రాసుకోగలిగే అవకాశం విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో వుండే రచయితలు/కవులకు ఉన్నది. (అలాటి వారిని ప్రోత్సహించటం “ఈమాట” మౌలికలక్ష్యాల్లో ముఖ్యమైందని మరోమారు గుర్తుచేసుకోవటం తప్పుకాకపోవచ్చు.) ఐతే దురదృష్టం ఏమిటంటే చాలా కొద్దిమంది – మహా ఐతే ఒక చేతి వేళ్లమీద లెక్కించగలిగేంత మంది – మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు భౌతికంగా ఎక్కడ వున్నా వాళ్ల ఊహాపాఠకులు మాత్రం ఆంధ్రదేశంలో వున్నవారే. వాళ్ల మెప్పు కోసమే వీళ్ల రాతలు. అందుకే వీటికీ అక్కడ వస్తున్న వాటికీ తేడా వుండదు – అవే భావాలు, అవే బాధలు, అవే విప్లవాలు, అవే వాదాలు, అవే నినాదాలు. అదే గాడి, అదే వేడి, అదే ఒరవడి.
ఎవరికోసమో కాకుండా వాళ్ల కోసం వాళ్లు రాసుకునే గుర్తింపు, సాహసం మన విదేశ తెలుగురచయితలు / కవులకు ముందుముందైనా వస్తాయని ఆశ.
ఆంధ్రదేశంలో వున్న వారు ఎలాగూ రమ గారు చెప్పిన నానా ఒత్తిళ్ల మూలాన ఈ పని చెయ్యలేరు. ఆ ఒత్తిళ్లు లేని వారు వాటిని కొనితెచ్చుకుని మరీ ఆ ఇరుకు పరిధుల్లోనే గుడుగుడు కుంచాలాడుకోవటం ఎందుకు? విశాల ప్రపంచాన్ని చూశాక కూడ రచనలు చెయ్యబోయేసరికి ఉష్ట్ర దృష్టి ఎందుకు?
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
07/02/2010 2:10 pm
లైలా గారూ !! భలే రాసారు మీరు. మీతో నా గొంతు కలుపుతున్నా!! అయితే ఆంధ్రదేశంలో ఇలా బలవంతపు విప్లవ కక్కులు ఒక తప్పనిసరైపోయిది. మీకు తెలుసోలేదో గానీ మీలా ఎవరన్నా ఉన్నమాట అన్నారో వారికి రకరకాల బిరుదులు రెడీ. మిమ్మల్ని వారి తిట్ల తో “ఎండగడ్తారు” మీకు సరైన “సామాజిక స్పృహ” లేదని తీర్మానించేస్తారు. వెంకటేశ్వర రావు గారు కవిత్వంలో ఎక్కువ పుస్తకాలు రావడానికి కవిత్వం కాదు కవిత్వాన్ని “డెమోక్రటిసైజ్ ” చేయడం అని ఎవరో చెప్పేరని విని హాశ్చర్య పడ్డారా? ఆ అభిప్రాయం పచ్చి నిజం. ఎందుకూ ఏమిటీ అన్న ప్రశ్నలు అడిగే వాళ్ళు లేరు. అలా వచ్చే కవిత్వాన్ని ఎవరూ పట్టించుకోరు. పుస్తకాలు ఎన్నైనా అచ్చుకానివ్వండి వాటిని గురించి ఆ కవులు పంచిపెట్టుకోవడమే తప్పించి అమ్ముకుని ఎరగరు. అంతా తీవ్రాతితీవ్రమైన పదాలతో “విప్లవాల” రాతలు రాసేసేవాళ్ళే!! కానీ సుఖంగా బతుకుతూనే ఈ కడుపుమంట రాతలన్నీ రాస్తారు.
కాదంటే తిడతారు. సాహిత్య రౌడీయిసమ్ లాంటిది. మీకు విసుగు కలిగిందీ అంటే అది సమంజసమే!!
మీరు జీవితాన్నీ అనుభవస్తానూ అని అన్నారా అంటే మీరు వట్టీ “బూర్జువా” అన్నమాట . ఇది మరొక తిట్టూ. ఒక వేళ మీరేమన్నా కొన్నాళ్ళూ విప్లవాలు రాసి మానేసి ఇలాంటి మాట గాని అన్నారా మీరు ” రెనగేడ్ “. అపుడే భయపడకండి. మా బాధలు ఏం చెప్పమంటారు?? ఇక్కడ ఎంత తిట్టూ కవిత్వం రాస్తే వారికి అంత సదుపాయం. అది ఒక షోకు. ఇలా తగలడింది ఎక్కువ శాతం “వచన కవిత” ఎక్కడా వస్తు వైవిధ్యం ఉండదు. వ్యక్తీకరణలూ అంతే. భాష పదబంధాలూ మరి అడక్కండి. కావాలంటే ఓపిక ఉన్న ఎవరన్నా ఒక పుంజీడూ పుస్తకాలని చదివి చూడండి. నాలాగే లైలా తో మీరుకూడా అవునంటూ గొంతు కలుపుతారు. మేం రకరకాల గ్రూపుల రకరకాల భావజాలాల బాధితులం!! కవితా సంకలనాలలో కవిత్వమ్ తప్ప ఇంకేదైనా ఉన్నా దాని గురించి ఎక్కడా మాట్లాడలేని వాళ్ళం!! మెరమెచ్చు మాటలు అనడానికీ వినడానికీ అలవాటు పడి ఉన్నవాళ్ళం. ఉన్నమాట అనడం ఎలాగో కూడా మరిచిపోయిన వాళ్ళం!! మేం తెలుగు కవితా పాఠకులం!! మాయదారి రాతల తలరాతల బరువుని మోస్తూ నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఎన్ని పుస్తకాల మోతని మోస్తున్నామో ఆ జగన్నాధునికెరుక. ఇంక కవిత్వమ్ ఏ సన్నటి గొంతుతోనో ఉన్నా ఈ మోతలో పడి అది చాలా దూరంగా పారిపోతూంటే పట్టి తెచ్చుకోలేక నిస్సహాయంగా చూస్తున్నవాళ్ళం!! బతుకు రుచిని వీళ్ళు మరిచిపోయి అలాంటి ఆనందం జీవితంలోంచి పోయినట్టూ బొల్లేడ్పులు ఏడుస్తున్నారు. అదువల్ల మీ ఉన్నమాట మీరన్నమాట నాకు మహా సుఖంగా ఉంది సుమా!!
రమ.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
07/02/2010 12:40 pm
ఈ సంకలనానికి ఉద్దేశించిన అఫ్సర్ కవితలన్నీ తను చదివి -ఈ పుస్తకానికి, ముందుమాట రాసేసరికి నెల్లుట్ల వేణుగోపాల్ అన్న వ్యక్తికి అప్పటికే ఆంధ్రాలో ఉన్న కష్టాలు చాలక , ఇప్పుడీ పద్యాలన్నీ చదివి బాధ పడగలనా -అని అనిపించినట్లూ, అతని మనసు ఇంకా పాడయినట్లూ నాకు తోచింది. ఆ ముందుమాట అతి దీనం గానూ, ఎంతో భారంగానూ, ఘోరంగానూ, నాకెందుకు అప్పచెప్పారు సంపాదకులీ పని, దీని నుండి నన్ను విముక్తుడిని చెయ్యండి బాబూ -అని వేడుకున్నా, ఆయనకు తప్పనట్లుగా ధ్వనించింది.
అరే, అఫ్సర్ ఏం రాసిఉంటాడు, ఈయనకు ఇంత డిప్రెషన్ రాటానికి- అనుకున్నా.
ఆ ‘ముందుమాట’ చాలా బాగా రాశారనీ, అసలు బాగా రాయలేదనీ, బాగాలేదు అన్నవాళ్ళు సంస్కారం లేని వారనీ, అసలు కవీ, ముందు మాట రాసిన జర్నలిస్టూ ఎన్నేళ్ళనుంచో స్నేహితులు – స్నేహితులు స్నేహధర్మం నెరపుకుంటుంటే మధ్యలో బైటి వాళ్ళు మాట్లాడటమేంటనీ – ఇలా చాలా ఆశ్చర్యకరమైన కామెంట్లు నేను పుస్తకం.కమ్ లో కొన్ని నెలల క్రితం చదువుకున్నాను.
ఇప్పుడు వేలూరి సమీక్ష – మచ్చుకి పరిచయం చేసిన కవితలు చదివితే- ఈ కవితల సంకలనం నాకు చదవబుద్ది కాదు. అప్పటి ఆ ముందుమాట, ఈ సమీక్ష చదివినందువల్ల ఇప్పటికిలా అనిపిస్తున్నది.
ఇందులో
ప్రతి ఆలోచనా గరళం
ఎవరో గిచ్చారంటు గిలగిలలాడె గళం
తన్ను తాను తన్నుకుంటూ
ఓదార్పుకై అందరి కాళ్ళ చుట్టూ
చేతుల సంకెళ్లెందుకో మెలెయ్యటం
ఎందుకో ఇతనికి
ఏదీ నచ్చదు
ఎవరూ నచ్చరు
ఏదో వేదన ఏదో నిస్పృహ
ఎవరిమీదో కక్కలేని మింగలేని ద్వేషం
తనపై ఇంకొందరిపై ఎంతో ఎంతో జాలి, సానుభూతి.
ఇలా సొంతంగా వెలి వేసుకుంటూ, దుఃఖాలని పోగేసుకుని
మెలివేసుకుని మెడకు వయొలిన్ తీగల్లా
ఉరేసుకుంటే చస్తే సైగల్ సంగీతం పలకదు,
పంకజ్ మల్లిక్ “ఎ రాతే ఏ మౌసమ్ ఎ హసనా హసానా
ముఝే భూల్ జానా, ఇన్హేనా భులానా భులానా భులానా”
మృదుత్వాన్ని ప్రేమించి తరించే భాగ్యం అబ్బదు
గరుకు మాటలు, గరుకు గడ్డం, నిజమే అవీ బాగుంటాయ్
ఎప్పుడంటే అతని కళ్ళూ, పెదాలూ, మనసూ ప్రేమను వర్షిస్తున్నప్పుడు.
బార్లనుండీ , పీర్లనుండీ, వార్తాలయాలనుండీ బార్బర్ పార్లర్ల
నుండీ కవిత్వానికి గరుకు పదాల కోసం కవి వెదక వచ్చునా.
యక్, షరమ్. షరమ్.
ఊరి మంగలాడి మొద్దుకత్తి లోతుకు, గడ్డం తెగి ఏదో ఇంత నెత్తురు రావచ్చు
తుప్పుకోతకు టెటనస్ రావచ్చు
కవిత్వపు నాజూకు మెహబూబా రాదు కాక రాదు.
శరీరం బైట ప్రవహింపజేసే రక్తంలో శక్తి లేదు. ఆకర్షణ లేదు.
జీవితం మధురిమను ప్రేమించేవారికి నల్లనెత్తురు రోత సుమా!
రోజూ రాతల్లొ చచ్చేవాడికి ఏడ్చేదెవడు
నవనవలాడే బ్రతుకుకూ, కవితకూ
ఊరి చివర ఏం పని
కనిపించే దక్కడ కట్టెలూ, కాష్టాలూ,
ఏడుపు సంకేతమిస్తే చాలు ఎగిరొచ్చే కాకులూ
వినిపించే దక్కడ కుళ్ళు రుచి మరిగిన
రాబందుల రెక్కల తటతటలు.
క్షమా కీజియే. It is a matter of life and death. వెంటనే నా ‘పూలరధం’ మళ్ళించి, ఎక్కడ ఉద్యానవనాలు, ఎక్కడ సితారు ధ్వనులు, సుందర భావనలు ఉన్నవో అక్కడికి వెళ్ళి పూలగాలులు పీల్చి జీవించాలి.
లైలా
అ, న్యాయం గురించి jagadeeshwar reddy గారి అభిప్రాయం:
07/02/2010 1:54 am
ఇప్పుడే అ.న్యాయం చదివాను.
ఆ మధ్య ఆరిసీతారామయ్యగారి ‘పరివర్తన’ కథ చదివినప్పుడే అమెరికా జైళ్ళల్లో మగ్గుతున్న తెలుగువాళ్ల దీన పరిస్థితి తలచుకుని భయమేసింది. ఇప్పుడు ఈ కథ చదవగానే ఆ భయం మరింత పెరిగింది. ఆ భయంతో కథని ఎలా విశ్లేషించాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉన్నాను. కాని ఒకటి – కథని క్యాబేజీ ఒక్కో పొర వలిచేసినట్టు చెప్పి మంచికథగా మలిచారు. అదే కొంత బిగితో అల్లివుంటే గొప్పకథ అయ్యేదనిపించింది.
– గొరుసు
About eemaata గురించి shiva గారి అభిప్రాయం:
06/25/2010 2:02 pm
మీ పత్రిక చాలా బావుంది. ప్రాంతాలకు అతీతంగా ఇందులొ అందరు తమ అబిప్రాయాలను పంచుకోవడం చాలా సంతొషం కలిగించిన విషయం. కాని ఇప్పుడు మన తెలుగు ప్రజలు గొడవలు పడుతూ మన అభివృద్ధినిని మనమె నాశనం చేసుకుంటున్నాం. ఒకప్పుడు తమిళుల వలన సగం నష్టపోయాం. ఇంకా వద్దు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
06/19/2010 2:36 am
నాగమురళి గారూ!! మీ విషయం నా అనుభవానికి మించినది గనక దాని గురించి నాకు తెలియలేదు గానీ ఆ విషయాన్ని మీరు విశదీకరించిన విధానం మాత్రం చాలా బాగుంది. మీ వచనం చదువుతూంటే సుఖంగా ఉంది.
ఇహ.. నాకు అర్ధం కాని విషయాలు ఎప్పుడూ కొన్ని ఉంటాయి. పరస్పర భిన్నమైన నమ్మకాలు కలిగిన వాళ్ళు వాదించుకోడం అన్నది నాకు చాలా ఆశ్చర్యంగా అన్పిస్తుంది. ఈ వాదనలు బ్రహ్మపదార్ధాన్ని మించినవి. ఎటూ తేలేవి కావు. అయినా మనుష్యులకి తమ నమ్మకమే గెలవాలన్న పట్టు ఎక్కువ. హేతువాదులుకూడా వాళ్ళవాళ్ళ నమ్మకాన్ని గెలిపించుకోడంలో అంతే చాదస్తులు మరి.
గమ్మత్తేమంటే గతితార్కిక భౌతిక వాదాన్ని అనుసరించే కమ్యూనిస్టులు చాలా పట్టుదలగా నిరీశ్వర వాదులుగా ఉండటం భారతదేశంలోనే ఎక్కువ. తూర్పు ఐరోపా దేశపు కమ్యూనిస్టులు ప్రొటెస్టెంట్ చర్చి కి వెళ్ళి హాయిగా ప్రార్ధనలు చేసుకుంటారు. వాళ్ళకి పార్టీ రాజకీయాలు వేరు..వ్యక్తిగత విశ్వాసాలు వేరూనూ!! అలాంటి పరిస్థితి ఇండియాల్లాంటి దేశాల్లో చాటుమాటుగా సాగుతుందే గానీ బయటికి కన్పించేలా జరగదు. మనదగ్గర అంత నిజాయితీ ఈ తరహా మార్గంలో నడిచేవారిలో ఉండదు. నమ్మకంలేకపోవడం కూడా చివరికి ఒక నమ్మకం లో భాగమే అని వీళ్ళు అనుకోరు.
ఇంక చాలా పాతకాలంనాటి శాస్త్రాలు, ఉదాహరణకి ప్రాచీన శిల్పశాస్త్రాలు..నౌకా శాస్త్రాలూ వంటివి ఆయా కాలాల్లో ఎంతో ఉన్నత ప్రమాణాలతో నడిచినట్టు మనకి ఉదాహరణ పూర్వకంగా తెలుసు. ఇవాళ ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు లేరు కాబట్టి అవన్నీ అశాస్త్రీయ మైనవని అనలేము కదా?? అలాంటివి ఎలా కట్టేరో కూడా ఇదమిథ్థంగా ఇవాళ స్పస్టంగా మనం అర్ధం చేసుకోలేము కూడా!! అంత ఘనమైన నాగరికతని సాధించిన వెనకటి తరాలు మరికొన్ని విషయాల్లో నేర్పరులు కారని మనకి ఎలాతెలుసూ?? కేవలం హేతువాదమే అన్నిటికీ జవాబుదారీ కాలేదు. గందరగోళం ఉంటే ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యతలేని వారిది కావొచ్చునేమో గానీ శాస్త్రానిది ఎలా అవుతుందీ??ఆధునిక ప్రమాణాలే అన్నిటికీ కొలమానం అన్న నమ్మకం కూడా ” అన్నీ వేదాల్లోనే ఉన్నాయష” అన్న అప్పారావు గారి వెక్కిరింతకి ఒకరకంగా కొనసాగింపే!! ఆధునికమైనదంతా హేతువుకి లొంగనిదంతా ..సత్యమే అన్న భ్రమ..అది మాత్రమే వాస్తవం అన్న భ్రమ మరొకటి లేదు. నాగ మురళి గారూ మీ శైలి బాగుంది. అందుకు మరోసారి మీకు అభినందనలు.
రమ.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
06/18/2010 3:57 pm
వ్యాసం సరళంగా వ్రాసినందుకు అభినందనలు.
హనుమ గారి కామెంటు మిస్సయ్యాను.“The Physics Teacher” పేపరు “Myths about Gravity and Tides” లింకు
చూపినందుకు హనుమగారికి చాలా కృతజ్ఞతలు. అలల తోపుదలకు భూమిపై దినపరిమాణం ఎట్లా పెరగడం, ఆ లెక్కచొప్పున ఎప్పుడో 484లోని సూర్యగ్రహణం స్పేయిన్ లో కాక గ్రీసులో ఎందుకు కనపడిందో విప్పి చెప్పడం అద్భుతం, అనూహ్యం, ఆనందం.
హేతువాదమేమో కాని హేతువులు అర్థంచేసుకోవడమే అద్భుతం అనిపిస్తే, చూపించడానికి ఎంత జాగ్రత్త, పరిశీలన, పరిశ్రమ, పరిశోధన, సృజనాత్మకత కావాలో!
=======
విధేయుడు
శ్రీనివాస్
శరణాగతి గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
06/07/2010 3:52 am
చాలా కాలం తర్వాత భావకవిత్వపు పోకడలతో మళ్లీ ఇలాటి పద్యాలు రావటం ముదావహం. వెల్చేరు గారు నన్నయ గారి నుంచి నేటి వరకూ వచ్చిన అన్ని రకాల పద్యరచనా ప్రక్రియలు ఏకకాలంలో కనిపించే సాహిత్యం బహుశా తెలుగుభాషలోనే వున్నదని ఒకచోట అన్నారు. ఈ పద్యాలు చదువుతుంటే “వైతాళికులు” సంకలనం లోని అనేక ఖండికలు గుర్తుకొచ్చాయి. ఐతే ప్రస్తుత ఖండికలో వాడిన సాధనాలలో కొత్తదనం లోపించిందనే అనిపిస్తున్నది. ఉదాహరణకు, ప్రేయసి కోసం ప్రకృతి లోని వృక్ష పక్ష్యాదులని అర్థించటం, అవి ఆమె మాకన్నా సుకుమారి అని, కళామూర్తి అని బదులివ్వటం, కథంతా గడిచాక అది కల అని ముగించటం – ఇది ఎన్నో సార్లు నడిచిన దారే. ఛందస్సులో ప్రయోగాలు చెయ్యటం కూడ అలాటిదే. భావాలు కూడ పాతవే అనిపిస్తున్నాయి. అంటే, అవే కవిసమయాలు, పద సంపుటుల ప్రయోగాలు. ఈ ఖండికను తక్కువ చెయ్యటం కాదు కాని ప్రతిభావంతులైన దేశికాచారి గారు భావ కవితా మార్గాన్ని ఇంకొన్ని కొత్త పుంతలకు విస్తరిస్తే ఇంకా బాగుంటుందేమో !
శరణాగతి గురించి ధేశికాచారి గారి అభిప్రాయం:
06/01/2010 12:08 am
లక్ష్మీప్రసాదుగారికి,
సీసపద్యం ఛందస్సు తెలియక,లేదా సీసపద్యం వ్రాసే సామర్థ్యం లే క అట్లా వ్రాయలేదు. ఇది బుద్ధి పూర్వకంగా సీసపద్యంలోని ఉత్తరార్థంలో 3 ఇంద్రగణాలపైన ఒక సూర్యగణం వేసి, ద్విపదలాగా నడిపించాలని చేసిన ప్రయోగం. ఈ విధంగా సీసపద్యంపై కొద్దిపాటి మార్పులతో సీసపద్యం లాగ నడిచే ఛందస్సులకు నేను పెట్టుకున్న పేరు సీసతుల్యములని. మీకు ఓపిక ఉంటే ఇట్లాంటి నూతనచ్ఛందో ప్రయోగాలు నా వెబ్ సైటులో నా జక్కనచరిత్ర కావ్యంలోచూడగలరు. పైగా అది సీసపద్యమని నేను పైఖండికలో దానిని లేబుల్ చేయలేదు. ఒకవేళ అట్లా చేయాలంటే దానిని సీ.తు. (సీసతుల్యము) అని నా జక్కనచరిత్రలో చేసిన విధంగా చేస్తాను కాని, సీ (సీసము) అని చేయను. మీరు సూచించిన “సొంపుల” అనే మార్పు బాగుందని అంగీకరిస్తాను. కాని రెండవ సూచనతో నేనంగీకరించలేను.”నిధులీనుచు” అనేప్రయోగం అఖండయతిని తొలగించుకొనడానికి చేసిన కృత్రిమయత్నం లాగ ఉంటుందే కాని పద్యం యొక్క సొగసును గాని, అర్థాన్నిగాని పెంపొందింపజేయదు. ఇక్కడ అఖండయతి పడుతున్నదని గుర్తున్నా, దానిని తొలగించడానికి చేసే వికృతయత్నాలకంటే దానిని ఉంచుకోవడమే ఉత్తమపక్షమని నేను ఆవిధంగా వ్రాసినాను.
ఉత్తమాయిల్లాలు గురించి Satya గారి అభిప్రాయం:
05/29/2010 11:53 am
మాలతి గారూ,
మీరు చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పారు.మీకు శ్రీరంగశయనం పైకోపమేమో గాని, ఆ పాత్రపై ఖచ్చితమైన అవగాహన ఉంది. నిజ జీవితంలో తారసపడిన ఒక పాత్రలాగా ‘చిత్రీకరించారు’.
70-80 ప్రాంతాల్లో ఇటువంటి మనస్తత్వాలు ఇట్లా ఉండేవేమో నాకు తెలీదు కాని, ఈ కాలం చెత్త సినిమాలు చూసి మనసులు పాడు చేసుకొని…భార్య ఉండగానే కలల్లో తేలిపోయే వాళ్ళు, భార్య పోయిన తర్వాత ఆ కలల్ని నిజం చేసుకోవాలనుకవడంలో నాకేమీ అసహజమనిపించలేదు.
–సత్య
ఉత్తమాయిల్లాలు గురించి lyla yerneni గారి అభిప్రాయం:
05/19/2010 6:26 pm
“శ్రీరంగశయనం” ఉత్త వెర్రి పుచ్చకాయ. అగ్నిహోత్రావధానులుకి, ఒకటో రెండో స్టెప్పులు తక్కువలో ఉన్నాడు. అతనికి శాలువా ఎందుకు కప్పారో బెజవాడలో. ఏం ఘనకార్యం చేసి ఉంటాడు? ఆ సభలో గంగిరెద్దులా ప్రవర్తించాడేమో, అసహ్యం పుట్టి ఇంటికి వచ్చి తన శాలువాని ఎద్దు మీదకి విసిరింది వేదవల్లి. ఎందుకు విసిరిందో కూడా గ్రహించుకోలేని మొద్దు మొగుడు.
ఇక ఆమె చనిపోయాక -వేదవల్లి identity ని తన ఇష్టారీతిగా మార్చేసి , చుట్టూ ఇతరులకు ఏమి ప్రదర్శన చేస్తున్నాడీ శ్రీరంగశయనం. పూర్తిగా తన సేవకురాలిగా, భక్తురాలిగా తనలో ఐక్యం చేసేసుకోటంలో ఏమి ‘లాయరు చాకచక్యం’. దానికి తోడ్పాటు నిచ్చే పొరుగువారు కొందరు. అదేంటండీ అని ఏ ఒక్కరో అనబోయినా లాయరు -తన వెధవ ఆలోచన, ఆర్గుమెంట్ తనదే.
ఫిజిక్స్ లెక్చరర్, రచయిత్రి ఐన, -వేదవల్లి ఎఛీవ్మెంట్స్ తన ఖాతాలోకి transfer చేసేసుకుని కేవలం వంటపుట్టిగా, తన caregiver గా ఆమె స్వరూపాన్ని తన మాటల్తో క్విక్ గా మార్చేసి, తను ఇకపైన ఎంచుకున్న కాబొయే భార్య లక్షణాలు, డ్యూటీలు చనిపోయిన ఆమెకు transfer చేసేస్తున్నాడు. ఏం తెలివి! కొడుక్కు దిమ్మ తిరిగి పోయి ఉండాలి, తండ్రిగారు తల్లిని అంత fast గా efface చేసేస్తుంటే. నాకే ఆశ్చర్యంగా ఉంది శ్రీరంగశయనం సంభాషణలు వింటే. శ్రీరంగశయనం దృష్టిలో ఆ పక్కింట్లో ఉన్న స్త్రీకి కూడా identity లేదు. ఆమె ఎప్పుడో చచ్చిన ఎవరో మొగాడి విడో. ఇతడు నిత్య పెళ్ళికొడుకు. భలె. భలే.
ఈ కథ అర్థం కాకేం. 🙂 నాకు బాగా అర్థమయ్యింది.
‘చావు’ ఒక కాలక్షేపంగా పరిగణించే ఒక తెలుగు సమాజ కాలము, ప్రైవసీ అనేదే లేకుండా, తెలిసిన వాళ్ళూ తెలియని వాళ్ళూ ఎవరు పడితే వాళ్ళు వచ్చి, – కట్టెగా పడిఉన్న స్థితిలో ఒక మనిషిని చూసిపోటమూ, -ఆ వ్యక్తిని గూర్చి ఆ క్షణాన తమ కేది నోటికి వస్తే అది మాట్లాడటమూ – ఆ “పరామర్శ” అనే సామాజిక అమర్యాద, కథ చిన్నదైతేనేం నాకు స్పష్టంగా అర్థమయ్యింది.
వేదవల్లికి, గౌతమికి పరిచయం -గౌతమి ఇంటర్లో చేరినప్పుడు జరిగింది. కాలేజీల్లో 1960 తర్వాత ఇంటర్ లేదు. P.U.C. వచ్చింది. కాబట్టి వారి పరిచయం అంతకు ముందే అయ్యుండాలి. కాని ఆంధ్రా కాలేజీల్లో ఇంటర్ ఏ సంవత్సరంలో మొదలయ్యిందో నాకు తెలీదు. కథాకాలం 1920- 1980ల మధ్యన అనుకుంటున్నాను. ఆ కాలంలో ఒక స్త్రీ మరణిస్తే, భర్త, కొడుకు, బోడిగుండు చేయించుకునే వారా? అది నిజమా? లేక కల్పనా? రచయిత్రికి ఇష్టమున్నచో తెలుపగలరు.
లైలా
ఉత్తమాయిల్లాలు గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
05/19/2010 3:01 am
మాలతి గారూ,
నేను శ్రీరంగశయనం పాత్రని పోలి ఉంటానా అని మీరు అనుకోవటంలో అన్యాయం ఏమీ లేదు. 🙂 పాత్రకి సార్వత్రికమైన పార్శ్వం లేక పోతే అది నమ్మదగ్గదిగా మాత్రం ఎట్లా అవుతుంది? (నమ్మనలవి కాని పాత్రలతో కథ చెప్పలేమా అన్నది వేరే విషయం.)
సంచారి గారు చెప్పినది రూపం గురించి. నేను చెప్పినది సారం గురించి. ఎటు నించి నరుక్కు వచ్చామన్నదే తేడా – ఎంత వరకు ఎట్లా ఉపయోగ పడగలిగాము అన్నదానికి అవధి మీరే.
మీరు రాసినది మీకు తృప్తిగా ఉంటే అంతే.
ఉపేంద్ర
ఉత్తమాయిల్లాలు గురించి సంచారి గారి అభిప్రాయం:
05/15/2010 5:46 pm
ఎలానూ మిగతా పాఠకులతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టీ ఇక పొడిగించనును, కానీ…
1. మీ బ్లాగుపాఠకులంతా మీ పీర్లనే మీకు అనిపిస్తే మరీ మంచిది. మీ బ్లాగు చదివేవాళ్ళంతా క్రిటికల్గా చదవరేమో అన్నాను. దానితో, పీర్ల గురించి నా నిర్వచనం ఏవని మీకు తెలిసిందో నాకు తెలవడం లేదు. అయినా పర్లేదు.
2. మీ కథను ఎలా మార్చాలో పాఠకులకు ఇవ్వకుండానే వచ్చే హోంవర్క్ మీ కథలు రాయడములో మీరాశించే ఒక ప్రయోజనమని నాకు నిజంగా తెలియదు. ఇప్పుడర్థమయింది, మీరు కావాలనే అపరిపక్వత (raw ness)ని కొంత ఒదిలిపెడుతున్నారని మీ కథల్లో.
3. కథ మెరుగు పెట్టడానికి ఖచ్చితమైన కొలమానాలు ఉన్నాయి. ఉంటాయి. అవి సాపేక్షికమైనవి కావు. ఏ కథకు ఆ కథ, ఆకథ చుట్టూ అల్లబడివున్న వాతావరణం అంతర్లీనంగా వాటిని నిర్దేశిస్తూ ఉంటాయి. వాటి ఆధారంగానే ఆ కథాకథనశైలీశిల్పాల్లో హెచ్చుతగ్గుల్ని అంచనా వేస్తారు.
నేను మెరుగు పెట్టడం అన్నదానికి మీరు తీసుకున్న అర్థమ్ సరి అయినది కానే కాదు. మీ శైలిలోనే, మీ భాషలోనే మీరు చెప్పిందే మరింత బాగా పాఠకులు ఎక్కువమందికి మీరనుకున్న అర్థంలోనే చేరడానికి చేసే మార్పు మెరుగు పెట్టడం అంటే. మిమ్మల్ని నా భాషలో మాట్లాడమని కాదు. (పెళ్ళికి మీ అమ్మాయిని నేను అలంకరించటం అంటే మీ అమ్మాయిని మా అమ్మాయిగా చేసుకోడం కాదు. చాలా మంది, చాలా మంచి అమ్మలకి కూడా కూతుళ్ళకి పెళ్ళి ముస్తాబు రాక, వేరేవారితో చేయిస్తారు. చిన్నపట్నించీ మొఖం కడిగి జడేసి బడికి పంపాను కాబట్టీ పెళ్ళి ముస్తాబు కూడా నేనే చేయగలను అనుకోడమే కాదు, నాకంటే నా కూతురిని ఇంకెవరూ ఇంత బాగా అలంకరించలేరు అని కూడా అనుకోడం సరి అయినది కాదు. అలంకరణలో లోపాలుంటే పెళ్ళాగిపోదు కదా, పెళ్ళయింది కదా అని అలంకరణ గొప్పగా ఉన్నట్టూ కాదు, కథలూ అలాగే. అలంకరణ చక్కగా ఉండటం ఆ కళాకారుడికి కళకు ఉన్న బంధం మీద ఆధారపడి ఉంటుంది… కదా?)
పాఠకులు చదివే కథని తమ భాషలోకి మార్చుకోడమూ, కథని అలా తమ లోకానికి అన్వయించుకోడమూ అనె ప్రక్రియ చాలా లోతైన విషయం. కథని మెరుగు పెట్టడం చాలా మొదట్లో జరిగే (ప్రిలిమినరీ) తంతు. ఇదే తేలుతున్నట్టులేదు సరిగ్గా, అంతదాకా ఎందుకు లేండి.
శైలి అంటే నాకు తెలుసనే అనుకుంటాను. మళ్ళి చెప్పినందుకు కృతజ్ఞతలు.వినదగు నెవ్వరు చెప్పిన… ముందే చెప్పాను గదా నా చాదస్తాలు చాలా ఉన్నాయని. మీకేమో చాలా అధునాతన భావాలు ఉన్నై, ఈ తరంలో చాలా మందికి మల్లే. తాను ముణిగిందే గంగ, తాను వలచిందే రంభ తరహాలో. శుభం. అలానే కానీయండి, ముణిగిపోయిందేమీ లేదు ఎలానూ.
ఇంక ఎలతానండీ, మీరు చెప్పినట్టుగానే “… పెరవారికి చోటొసంగుచున్”
సంచారి.
ఉత్తమాయిల్లాలు గురించి సంచారి గారి అభిప్రాయం:
05/13/2010 11:47 am
దానిక్కారణం మీ బ్లాగు పాఠకులు మీ పీర్లు కాకపోడమేమో. ఒక కథని చులాగ్గా చదివి పడేసే వాళ్ళకీ, దాన్ని క్రిటికల్గా చదివేవాళ్ళకీ తేడా లేకపోతే సమీక్ష అనే ప్రహసనానికి అర్థం ఉండదు.
ఉదాహరణకి ఈ కథలోనే:
అంటే నెలరోజులూ మాట్లాడకుండా ఉన్న కొడుకూ కోడలూ అనా?
మాసికానికి అన్న వాక్యం ఒక్కటి చేర్చడం వల్ల తేడా ఏమీ కనపడలేదా?
ఇంప్లిసిట్ గా పాఠకులు భావాలని అర్థం చేసుకోడం వేరు, ఇలా తప్పుల్ని సరిదిద్దుకుని చదువుకోడం వేరు. రాశేటప్పుడు శ్రద్ధగా రాయడం ముఖ్యం. అతిచిన్నదిగా కనపడే ఈ తప్పుని ఎత్తిపట్టింది ఇలాంటి చిన్న చిన్న సవరింపులూ, మెరుగులతోటి కథకు పెట్టే నగిషీ రచయిత గురించి చాలా చెపుతుంది. ఏం?
రచయితలు ఒకటి గుర్తెట్టుకోవాలి – వారు చెప్పదలచుకున్న కథ, వారు చెప్పిన కథ వేరు వేరని. చెప్పదలచుకున్నది వారి మెదడులో ఉంటుంది, దానిలో ఏ తప్పులూ లోటుపాట్లూ ఉండవు. చెప్పింది కాగితం మీద ఉంటుంది, అన్ని అవలక్షణాలతోనూ. రచయితకు ఆ రెండు ఒకేలా కనపడతై. అది మామూలే, రాసింది వారే కదా. కానీ అందరూ చదివేది కాగితం మీద ఉన్న కథని. వారి విమర్శ ఆ చెప్పిన కథ మీదే ఉంటుంది. విమర్శని తీసుకోలేకపోతున్నప్పుడు జరుగుతున్నది ఏమిటంటే రచయిత తను “చెప్పిన కథ”ను కాకుండా తను “చెప్పదలచుకున్న కథ”ను విమర్శిస్తున్నారనే అపోహలో పడి తన రచనను వెనకేసుకురావడం, విమర్శను ఒదిలిపెట్టి విమర్శకుల ఉద్దేశాలపై తీర్పు చెప్పుకోడం. (చెప్పదల్చుకున్న కథని ఏమీ చెడకుండా చెప్పడం రచయితలు అందరూ చేయగల్గే పని కాదు. చేయగలమనే భ్రమ కూడా మామూలే. సంపాదకులు చేయాల్సిన పని – చెప్పిన కథ ఆధారంగా చెప్పదల్చుకున్న కథను అర్థం చేసుకుని చెప్పిన కథకు మెరుగులు దిద్ది ఆ రెండిటినీ వీలైనంత ఒకటిగా చేయడం, రచయితకు ఆ రచనలో సహాయపడ్డం. ఇది కూడా అందరూ చేసే చేయగల్గే పని కాదు మరి.)
కథలో క్లుప్తత ముఖ్యం అన్న మీరే ఈ కథలో ఆఖరి వాక్యం ఆ క్లుప్తతను దెబ్బతీసిందని గమనించకపోడం ఆశ్చర్యమే. అంతకు ముందు మీర్రాశిన ఆ వైజాగు బీచిలో అక్కాతమ్ముళ్ళ కథలోనూ ఇలాగే చివరి వాక్యం ఆ కథని చంపేశింది. ఈ చివరి వాక్యాలు పాఠకుల మేథకి వదిలిపెట్టాల్సినవి. నిజానికి చదివినప్పుడల్లా మీ కథల్ని చాలానే సాన పట్టాలని నాకనిపిస్తుంది. ఇదంతా నా చాదస్తేమేనేమో. పోనిద్దురూ..
మీ బ్లాగులోనే ఎప్పుడో రాశేరు కాదూ… అసలీ కథలు ఏదో ఊసుపోక రాశేవి వాటి కింత శ్రద్ధ అవసరమా అనీనూ, నిజంగా సంపాదకులకి ఇంత టైమ్ ఉంటుందా, వారు నిజంగా ఇవన్నీ ఇంత శ్రద్ధగా చదువుతారా అనీనూ. మీరే నిజమేమో, సంపాదకులు మీ కథని చదవకుండానే అచ్చేసినట్టున్నారు, ఊసుపోకకి రాసిందనేమో 🙂
ఏమాటకామాటే – ఈ కథ మీ మిగతా కథలు చాలావాటికంటే బాగా రాశేరు. (ఇంకొంచెం నగిషీ పెట్టి ఉండాల్సింది.) ఇదేదో మెచ్చుకోలుకి అంటున్న మాట కాదు.
(మీ కథ గురించి కదా అని మీరింకెక్కడో రాసిన కామెంటుకి ఇక్కడ ప్రతిస్పందించాను. ఏవనుకోకండి).
గుండుగొమ్ములనుమానం – 3 గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
05/08/2010 6:15 pm
నాకు చాలా నచ్చిన అతికొద్దిమంది తెలుగు కథకుల్లో కనకప్రసాద్ ముఖ్యులని ఇదివర్లో చెప్పాను. అదేమాట మరోమారు అనేందుకు ఇది అవకాశంగా తీసుకుంటాను. అతని సునిశిత పరిశీలన, దాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించటానికి అతను ఎంచుకునే భాష మిరుమిట్లుగొలిపిస్తాయి. తొలిసంచిక లోని “బర్సాత్ మే బిల్లీ” నుంచి నేటివరకూ అతని కథల్లో పాత్రలు, వాటి పరిసరాలు ఎంత పరిపూర్ణంగా, మల్టీ డిమన్షనల్ గా వుంటాయో ! అలాగే అతని కవితలూ. ముచ్చటగొలిపే పదాలు, పదబంధాలు, భావాలు.
ఇక ప్రస్తుతానికి వస్తే – బహుశ సాహిత్యం మొదలైనప్పట్నుంచీ వున్న ప్రశ్నేనేమో “ఏది నిజమైన సాహిత్యం? ఏది ఉత్తమం? ఏది కాదు?” అనేది. నా మట్టుకు నా అనుభవం ఉన్నతసాహిత్యసృష్టి ఒక అలౌకికక్రియ అని, అలా సృష్టి ఐన సాహిత్యాన్ని అనుభవించటానికి పాఠకుడు కూడ ఎంతో కొంత అలాటి స్థితిని పొందాలని. అలా సృష్టికర్తా సృష్టిద్రష్టా ఒకే అనుభూతిస్థితిని కొంతవరకైనా కొన్నిక్షణాలపాటైనా పంచుకుంటారని. ఇలా సృష్టి ఐన సాహిత్యం నా దృష్టిలో “అప్రయత్నపూర్వకంగా” వచ్చినది, అలా కానిది “ప్రయత్నపూర్వకంగా” వచ్చినది. మొదటిది బుద్ధిజనితమైతే రెండోది మేధోజనితమో మనోజనితమో ఔతుంది. ఈ చివరి రెంటిలోనూ మేధోజనితం మనోజనితం కంటే ఉన్నతంగా వుంటుందని నేను అనుకుంటాను.
కనుక, పాఠకుడిగా ఒక రచనని చదువుతున్నప్పుడు ఎవరికి వారే బహుశ అసంకల్పితంగా ఎక్కడెక్కడ అది ప్రయత్నపూర్వకమో ఎక్కడెక్కడ అప్రయత్నపూర్వకమో “గ్రహిస్తారని” నా నమ్మకం. (కనకప్రసాద్ అనే జూటాకోరుతనం ప్రయత్నపూర్వకంగా ఎవరి మెప్పు కోసమో లేక మరెవరి భయం వల్లనో లేక తలియని విషయాన్ని తెలిసినట్టు బుకాయిస్తూనో రాసేరాతలలో కనిపిస్తుందని నేననుకుంటాను.) అలాటి గ్రహింపు నుంచే ఎవరికి వారు ఆ రచన గుణాగుణాల గురించిన అభిప్రాయాలు ఏర్పాటుచేసుకుంటారు. అనుభవజ్ఞులైన విమర్శకులు, నిశితశోధన వున్న పాఠకులూ అలా గ్రహించిన రచనాభాగాల గురించిన వారి అనుభూతిని మామూలు భాషలోకి తర్జుమా చేసి ఇతరులతో పంచుకోగలుగుతారు (సోమరిపోతులు ఇతరుల అభిప్రాయాలు విని వాటినే మళ్లీ తమ భాషలోనో లేక అంత ఓపిక కూడా లేకపోతే ఇతరుల భాషలోనో వెళ్లగక్కుతారు).
ఏతావాతా ఏ రచనా సార్వత్రికంగా సార్వకాలికంగా పాఠకులందరికీ ఒకే విధంగా అనుభూతినివ్వటం అసాధ్యం అని నేను అనుకుంటాను. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక రచనకి “నిజమైన” – అంటే దాని సృష్టిస్థితితో కొంతైనా తాదాత్మ్యం చెందగలిగిన – పాఠకులు చాలా కొద్దిమందే. కొండొకచో ఎవరూ లేకపోవచ్చు కూడా – ఓ కవిగారు తన కవిత గురించి వ్యాఖ్యానిస్తూ “అది రాసినప్పుడు ఇద్దరికి అది తెలుసు – ఒకరు నేను, మరొకరు దేవుడు; ఇప్పుడు ఒకరికే తెలుసు, అది నేను కాదు” అన్నట్టు. ఒక రచన విషయంలోనే ఇలా వుంటే ఇక ఒక రచయిత లేదా కవి తన జీవితకాలంలో చేసే రచనలన్నింటినీ కలిపి టూకీగా గుణనిర్ణయం చేసెయ్యటం దుడుకుతనం అని నా ఉద్దేశం. అలా చేసెయ్యటమే కాకుండా మిగిలిన పాఠకులంతా ఆ నిర్ణయాన్ని ఆమోదించి తీరాలనీ, ఆమోదించకపోవటం వాళ్ల సాహిత్యాస్వాదనాదారిద్ర్యానికి నిదర్శనమనీ తిట్టిపొయ్యటం ఘోరం, దౌర్భాగ్యం, దౌర్జన్యం.
ఒక చక్కని విషయాన్ని లేవనెత్తి దాని గురించి అద్భుతమైన వ్యాసాన్ని రాసిన కనకప్రసాద్ ని ఎంతగానో అభినందిస్తూ –
రామారావు
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి lyla yerneni గారి అభిప్రాయం:
05/08/2010 2:36 pm
“అంటే నాబోటి రచయితల రచనలు ఎవరూ చదవడం లేదన్న మాట, చదవరన్న మాట. మరి నేనెందుకు రాయడమో?”
విధేయుడు – మోహన
రచయితలు తమ కోసమే తాము రాయాలి. తమకేవి ఇష్టమో వానిని గురించి రాయాలి. పబ్లిష్ చెయ్యవచ్చు, ఇతరులు కూడా ఆనందిస్తారనుకున్నప్పుడు. కాని పబ్లిష్ అయ్యాక ఇక స్పందన కోసం ఆందోళన పడటం, ఆశించిన స్పందన లేకుంటే విరమించటం దేనికి. అంతగా రచయిత వేరే వారి అభిప్రాయానికి తలఒగ్గటం దేనికి?
స్పందన కోసం వెనువెంటనే రొక్కించటం పాఠకునికి విసుగు కలిగించవచ్చు. రచయిత ఇప్పుడు రాసినా ఎప్పుడు రాసినా, ఏ కాలంలో పాఠకులు చదువుకుంటారో, చెప్పలేం. ఎన్నేళ్ళ క్రిందో రాసిన వారిని ఇప్పుడు చదవటల్లేదా? ఇప్పుడు రాసిన వారిన కొందరిని వెనువెంటనే చదువుతాము కూడా. పాఠకులెప్పుడూ ఏ శతాబ్ది రచయితలనైనా వరుస క్రమంలో చదువుతారనుకోటం భ్రమ. పబ్లిషర్లు మేగజీన్లు, ఏంథొలొజీలు, గ్రంధాలు వేస్తూ పోవచ్చు. కాని ఏ పాఠకుడు ఏ సంచికతో, ఏ రచయితతో చదువు మొదలెడతాడో, ముందుకే వెడతాడో, వెనక శతాబ్దులలొకి పయనిస్తాడో చెప్పలేం. అదంతా అతని ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇష్టాలు మారుతుంటయ్.
పాఠకుల టేస్ట్ ననుసరించి రచయిత రాయటం అనే ఘోర గెస్సింగ్ గేం రచయితను గోతిలోకి లాగుతుంది. విమర్శకుల మాటలు, వారి టేస్ట్ సరేసరి. ఇదిగో, కాఫ్కా రచనొకటి మళ్ళీ చదువుకుంటున్నా. దాన్ని రచయితే స్వయంగా తగలపెట్టమన్నాడు. బహుశా అప్పటి సమాజం లోని వేరేవారి ఆలోచనలతో అతని రచనకు సామీప్యం లేదు – దానిని వారు appreciate చెయ్యలేరు అని అతడు భావించి ఉండొచ్చు. అప్పుడది నిజమే కావచ్చు. కాలక్రమాన అలా జరగలేదు. కాఫ్కా నేనెన్నోసార్లు చదువుతాను.
కొన్ని రచనలు ఒక్క సారే చదువుతాను. ఒక్కసారే అనుభవించినంత మాత్రాన అది తక్కువ ఆనందమా? ఆ అనుభవాన్ని గురించి మళ్ళీ మాటల్లో చెప్పకపోతే, ఏం నష్టం. ఫీడ్ బేక్ కి కట్టుబడి రచయిత ఉండనేగూడదు. రచయిత స్వతంత్రుడుగా ఉన్నప్పుడే, ఎవరికైనా గాని ఎక్కువ interesting గా ఉండేది.
లైలా
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి మోహన రావు గారి అభిప్రాయం:
05/07/2010 4:47 pm
శ్రీనివాస్ గారు చెప్పారు –
రచయితలకు ఉపయోగమో కాదో కాని పాఠకులకు కామెంట్లొక సౌలభ్యం. అన్నీ చదివే తీరిక,కోరిక లేనప్పుడు ఏం చదవాలో అన్నది కామెంట్లను చూసి నిర్ణయించుకోవడం ‘ఈ మాట’ brand సౌకర్యం.
అంటే నాబోటి రచయితల రచనలు ఎవరూ చదవడం లేదన్న మాట, చదవరన్న మాట. మరి నేనెందుకు రాయడమో?
విధేయుడు – మోహన
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/07/2010 2:43 pm
కామేశ్వరరావుగారు ఎన్నో మంచి పాయింట్లు చెప్పారు. సైన్సు వ్యాసాలను కొనసాగించడం సంతోషకరం. వివిధ రంగాలలో నిష్ణాతులు చాలా మంది వున్నా,రాయడం రాయించుకోవడం పిల్లికి గంట కట్టడం లాంటిదేమో!
అయినా ప్రయత్నించాలి. రెండు పాయింట్లు చెప్పాలనిపించింది.
1. బహుమతులు పురస్కారాలు ఇవ్వడం మంచిదే. కాని ఇప్పట్లో అది అనవసర భారాన్ని’ఈ మాట’ నిర్వాహక మిత్రులపై పెడుతుందని చెడ్డ అనుమానం.పత్రికనడపడమే పెద్ద పని. దానికి తోడు ఈ బహుమతుల ఎంపిక, నిర్ణయ పద్ధతులు, జడ్జీలను పె(ప)ట్టడం, నిర్వహణ,ప్రదానాలు – అసలే మంచి రచనలకోసం ఎదురుచూస్తుంటే ఇప్పుడు దేనికేమివ్వాలో అని తలపట్టుకోవడం అంతా పత్రిక ముఖ్యలక్ష్యానికి ప్రత్యక్షంగా ఏ మాత్రం సాయపడని లంపటమేమో!
2.రచయితలకు ఉపయోగమో కాదో కాని పాఠకులకు కామెంట్లొక సౌలభ్యం. అన్నీ చదివే తీరిక,కోరిక లేనప్పుడు ఏం చదవాలో అన్నది కామెంట్లను చూసి నిర్ణయించుకోవడం ‘ఈ మాట’ brand సౌకర్యం. చర్చావేదికలున్నా, తీసేస్తే బాగుంటుందీ కామెంట్లు అన్నది సైతం మనం కామెంట్లలోనే చెప్పుకోవడం దాని ఉనికికి ఎంత అలవాటుపడ్డామో అని ఆశ్చర్యం.
====
విధేయుడు
శ్రీనివాస్
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
05/07/2010 5:59 am
“పాడిందే పాడరా…” అన్న శీర్షిక వ్యాసానికే కాకుండా కామెంట్లకి కూడా సరిపోయింది! 🙂 చాలావరకూ అందరూ ఒక్క “పీర్ రివ్యూ” విషయం మీదనే ఎందుకంతగా మల్లగుల్లాలు పడుతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి ఇంటర్నెట్లో ఒకటిరెండు ఇతర తెలుగు పత్రికలు కూడా ఈ పీర్ రివ్యూ పద్ధతిని పాటిస్తున్నాయి. ఇది ఈమాటకే ప్రత్యేకమైన విషయం కాదు.
ఆలోచించాల్సిన ముఖ్యవిషయాలు మరికొన్ని కూడా ఉన్నాయ్. నాకు తోచినవి కొన్ని ఇక్కడ వివరిస్తాను. కిందనంచి మొదలుపెడతాను. వేలూరిగారు చెప్పిన కథ తమాషాగానే ఉన్నా, దానిబట్టి నాకర్థమైనదేమిటంటే, కొత్తదనమంటే వారి దృష్టిలో వాంతి మందులాంటిదని! నిజంగా వారికిలాంటి దృష్టి ఉండకపోవచ్చు. కాని ఆ కథని, దాన్ని చెప్పిన సందర్భాన్ని బట్టి నాకదే అనిపించింది. నాకే కాదు చాలామందికి అలా అనిపించే అవకాశం ఉందని నా బలమైన అనుమానం. ఇందులో సంపాదకుల నిరంకుశ ధోరణి తొంగిచూస్తోంది.
ఈమాటకి కొత్త రచయితలు కొరవడడానికి ఈ ధోరణి ముఖ్యకారణమని నేననుకుంటున్నాను. దీనికి సహేతుకమైన కారణాలు నేనిక్కడ వివరించలేను. దీనికి ఈ వ్యాసంలోనే మరో ఉదాహరణ, “బొబ్బర్లంకనుంచి ప్రచురించబడుతున్న పత్రికలా ఉన్నదికాని,” అన్న వ్యాఖ్యపై స్పందన. ఈ వ్యాఖ్య ఆంతర్యమేమిటో నాకు స్పష్టంకాలేదు. సంపాదకులకి కూడా లేకపోతే అది చేసిన సదరు వ్యక్తిని అడిగి తెలుసుకుంటే బాగుండేది. అంతేకాని గోదవరి జిల్లాల్లోని వేదపండితుల ప్రసక్తి తెచ్చి వారి ఆదరణగురించి చెప్పడంలో సంపాదకుల ఆంతర్యమేమిటో అసలే బోధపడలేదు. నేనా వ్యాఖ్యని అర్థం చేసుకున్నది పత్రికలో “సమకాలీనత” కొరవడిందని. పత్రికలోని కంటెంట్ విషయంలో ఇది నిజమనే నాకూ అనిపిస్తోంది. గత రెండు మూడేళ్ళగా ఈమాటలో వచ్చిన వ్యాసాల్లో ఎంత శాతం ప్రస్తుత తెలుగు సాహిత్యానికి (పోనీ 1980 తర్వాత వచ్చినది) సంబంధించినవి ఉన్నాయో లెక్కకడితే ఈ విషయం స్పష్టమవుతుంది. దీనికి ఏమిటి కారణం? ఈమాట పాఠకులకి సమకాలీన సాహిత్యం మీద అంతగా ఆసక్తి లేకపోవడమా? ఆ సాహిత్యమ్మీద రాయగలిగే రచయితలు ఈమాటకి రచనలు చేయకపోవడమా? ఈ విషయంపై సంపాదకులు దృష్టి పెడితే బాగుంటుంది. నాకు తోచిన మరికొన్ని విషయాలు:
1. గ్రంధాలయం, శబ్దతరంగాలు ఈమాటకే ప్రత్యేకమైన అంశాలు. వీటిని ఇలాగే కొనసాగించాలి. ఈమాటలో వచ్చే వ్యాసాలలో సాహిత్యంతో పాటు సైన్సు, సంగీతం మొదలైన విషయాలపై కూడా ఉంటున్నాయి. ఇదికూడా తప్పకుండా కొనసాగించాల్సిన అంశమే.
2. సమకాలీన భారతీయ/విదేశ సాహిత్యాన్ని పరిచయం చేసే వ్యాసాలు, అనువాదాలు రెగ్యులర్ ఫీచర్‌గా ఉంటే బాగుంటుంది.
3. ఒకటే పత్రిక ఉన్నప్పుడు దాని పరిధి చాలా విసతృతంగా ఉండవచ్చు. కాని ఇప్పుడు ఇంటర్నెట్లో అనేక పత్రికలు వచ్చాయి. ఒకో పత్రికపైనా ఒకో రకమైన రచయిత/పాఠకులు మొగ్గుచూపుతారు . కాబట్టి, ఈమాట ఆశయాలని మరొకసారి సమీక్షించుకొని, ఎలాంటి అంశాలకి ఫోకస్ ఇవ్వాలి, ఎలాంటి పాఠకులకోసం పత్రిక నడపాలి అన్న విషయం పునర్నిర్వచించుకుంటే మంచిదేమో.
4. పాపులర్ పత్రికగా కాక తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక అంశాలలో ఒక ఉత్తమ స్థాయి పత్రికగా నడపడం ఆశయమైతే, ఇందులో తెలుగు విశ్వవిద్యాలయమూ, ఇతర విశ్వవిద్యాలయాలలో తెలుగుశాఖల వారితో ఈమాట వర్గం ఏమైనా ఇంటరేక్టవ్వగలిసి, ఆదానప్రదానాలు(వారు ఈమాటలో రచనలు చెయ్యడం, వారూ వారి విద్యార్థులు ఈమాట పాఠకులవ్వడం వంటివి) జరిగితే చాలా బాగుంటుంది.
5. మంచి రచనలని, రచయితలని ప్రోత్సహించడానికి, ఏడాదికొకసారి, ఆ ఏడు ఈమాటలో ప్రచురించిన కవిత, కథ, వ్యాసాలలో ఒకో ఉత్తమమైనదాన్ని ఎంచి బహుమతులు ప్రకటిస్తే బాగుంటుంది. బహుమతి మంచి పుస్తకాల రూపంలో ఉంటే మరీ బాగుంటుంది! దీని ఖర్చు ఈమాట అభిమానులు తప్పక భరించవచ్చు. ఇచ్చే బహుమతి ముఖ్యం కాదు, ఈమాట బహుమతి గెలవడం ఒక గౌరవంగా చెప్పుకొనే స్థాయి దానికి ఉంటే బాగుంటుంది.
6. ఈమాటలో రచనలపై కామెంట్లు, రచయితలకి ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయో నాకు చాలా అనుమానం. వాటివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోదేమో అని నాకనిపించిన విషయం. ఎలాగో చర్చా వేదికలున్నాయి కాబట్టి, ఇలాంటి విషయాలు ఏమైనా చర్చించ వలసినవి ఉంటే వాటిలో చర్చించ వచ్చు. పాఠకులకి ఏమైనా తీర్చుకోవలసిన సందేహాలు కాని, అవసరమైన సమాచారం కాని కావలసినా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా వ్యాసంపై ప్రత్యేకమైన చర్చ అవసరమనుకున్నా (రచయిత కాని సంపాదకులు కాని) చర్చావేదికనే ఉపయోగించుకోవచ్చు. అంచేత కామెంట్ల సౌకర్యం తీసి వేస్తే బాగుంటుందని నా (చివరి) సలహా.
ఈమాట మే 2010 వసంత ఋతు సంచికకు స్వాగతం గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:
05/07/2010 5:45 am
మే నెల లో వసంతమా? వికృతి ప్రభావమా? ప్రస్తుత మే లో సగం అధిక వైశాఖం, సగం నిజ వైశాఖం ఉన్నాయి. వాన కారుకై ఎదురు చూపులే అంతటా. అయితే మా మహా నగరం లో ఇప్పుడిప్పుడే కోయిల, అదీ మిట్ట మధ్యాహ్న వేళ తెగ కూస్తోంది. ‘కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో?’ అని పింగళి వారన్నట్టు ఆశ్చర్య పోతూ ఆనందించాల్సిందే.
-తాతిరాజు వేణుగోపాల్
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/06/2010 4:28 pm
పీరు రివ్యూలగురించి ఇంతగా చర్చిండం కాబట్టి “ఈ మాట”మిత్రులకొక ప్రశ్న, సహృదయంతోనే. పీర్ రివ్యూలను ఎవరు రివ్యూ చేస్తారు?రచనలకు రివ్యూలు లాగా,పీర్ రివ్యూలకు feedback పేరుతో అవి ఆ రచయితలకు ఏ విధంగా ఉపకరించాయో లేదో, పేరుతో కాని పేరుచెప్పకుండానైనా అభిప్రాయ సేకరణ, పూర్తిగా కాకపోతే periodical or random గానైనా సేకరిస్తే ఆ పద్దతిలో ఉన్న లోపాలు తెలుసుకోవడానికి మార్చుకోవడానికి సాయపడుతుంది.సాయపడేవి గుర్తించి పెంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాక, దీనితో అపోహలుంటే దిద్దుకోవడానికి అవకాశం కూడా కలుగుతుంది.
ఏదేమైనా, నిస్వార్థంతో సమయాన్ని శ్రమను కొంత ఖర్చునూ భాషా సేవ కోసం అందిస్తున్నఅందరికీ కృతజ్ఞతలు. అవకాశం,సందర్భం వచ్చింది కాబట్టి, సంపాదక బాధ్యతను,సాంకేతిక బరువునూ ఎంతగానో మోసిన వేలూరి, కొలిచాల గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
______
విధేయుడు
_Srinivas
పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
05/05/2010 4:46 pm
“పియర్ రివ్యూ” ని ప్రవేశపెట్టిన ఇంతకాలానికి దానిగురించిన సుదీర్ఘచర్చ ఆసక్తికరంగా వుంది. నాకు తెలిసిన చరిత్రని కూడ ఈ చర్చలోకి ప్రవేశపెడితే ఇంకొంత మంచి జరుగుతుందేమోనన్న కుతూహలంతో ఈ చిన్నప్రయత్నం.
“ఈమాట” తొలిసంచిక నుంచీ పియర్ రివ్యూ అమలులో వుంది. కథల విషయంలో అప్పటి సంపాదకులం – నేనూ, కొంపెల్ల భాస్కర్ , విష్ణుభొట్ల లక్ష్మన్న, కొలిచాల సురేశ్ – ఎవరమూ నిష్ణాతులం కామని మాకు స్పష్టమే కనుక చాలా మంది రివ్యూయర్లు చేయూత నిచ్చారు. నాకు బాగా జ్ఞాపకం వున్న పేర్లు – జంపాల చౌదరి, కన్నెగంటి చంద్ర, మాచిరాజు సావిత్రి, నాసీ, వేలూరి వేంకటేశ్వరరావు, విప్లవ్ ,వేమూరి వేంకటేశ్వరరావు. ఇంకా భట్టిప్రోలు అక్కిరాజు, డొక్కా ఫణికుమార్ కూడ చెయ్యివేసిన గుర్తు. ఆ రోజుల్లో కొందరు కథల్ని “స్నెయిల్ మెయిల్ “లో పంపడంతో రివ్యూలు కష్టమయేవి కూడ. ఐతే మా సంపాదకవర్గానికి కొంతవరకు నచ్చితే వాటిని ముందు తెలుగులో టైప్ చేసి ఎలెక్ట్రానిక్ కాపీలు రివ్యూయర్లకి పంపేవాళ్ళం. ఇక కవితల విషయంలో కన్నెగంటి చంద్ర, నందివాడ ఉదయభాస్కర్ , విన్నకోట రవిశంకర్ , మాచిరాజు సావిత్రి, విప్లవ్ , కనకప్రసాద్ , (మరొకరు – పేరు గుర్తు రావడం లేదు, మైక్రోసాఫ్ట్ లో పనిచేసేవారు), తమ్మినేని యదుకులభూషణ్ నాకు గుర్తున్నవారు. ఇంకొందరు కూడ సహాయం చేసిన గుర్తు. వ్యాసాలకు వస్తే “బరువైన” వాటి భారం వెల్చేరు నారాయణరావు గారి మీద వేసేవాడిని. వేలూరి వేంకటేశ్వరరావు, జంపాల చౌదరి, ఇండియా నుంచి వచ్చిన వాటిని ద్వానా శాస్త్రి, ఇక్కడ విన్నకోట రవిశంకర్ , తమ్మినేని యదుకులభూషణ్ చాలా రివ్యూ బాధ్యతల్ని మోసినవారు. కొందరి పేర్లు నేను మర్చిపోయే వుంటాను, వారు నన్ను క్షమిస్తారని ఆశ.
మరీ పత్రిక రిలీజ్ కి ముందురోజు వస్తేనో, లేక స్పష్టంగా ప్రచురణార్హంగా కనిపిస్తూంటేనో రివ్యూయర్లకి పంపకుండా సంపాదక వర్గమే నిర్ణయించిన సందర్భాలు వున్నాయి కాని అంత ఎక్కువ కాదు. అలాగే స్పష్టంగా నేలబారుగా కనిపించిన వాటిని కూడా మేమే నేరుగా తిరస్కరించటం అప్పుడప్పుడు జరిగాయి.
తొలిసంపాదకవర్గం లోని నేనూ, భాస్కర్ , లక్ష్మన్న – మాకు అంతకుముందు ఎన్నో ఏళ్లుగా టెక్నికల్ పబ్లికేషన్ , దాని మెలకువలు అనుభవమే కనుక పియర్ రివ్యూ “ఈమాట” పునాదుల్లో ఒకటిగా ఉండాలని ఎలాటి చర్చా లేకుండానే నిర్ణయించుకున్నాం. దాని కారణంగా ఏ కథా లేకుండా ఒకటి రెండు సంచికలు వచ్చిన గుర్తు కూడ. “ఎక్కువమంది రచనలు చేసేవారు లేనప్పుడు పియర్ రివ్యూ అనవసరం” అన్నవాదన అందువల్ల నాకు సమంజసంగా తోచదు. అలాగే, ఇది ఇక్కడి పత్రికలను అనుసరించాలనీ అనుకరించాలనీ చేసిన నిర్ణయం కాదు, ఇక్కడి టెక్నికల్ పబ్లిషింగ్ లో పియర్ రివ్యూ వల్ల జరిగే మంచిని చూసి, అప్పట్లో ఇక్కడ వస్తున్న ఇతర పత్రికల, ప్రచురణల గుణహీనతకి కారణం పియర్ రివ్యూ లేకపోవడం అన్న ప్రతిపాదన తోటి, ఇలా చేస్తే మంచి రచనలు వస్తాయనే భావనతో చేసిన పని. అందువల్ల తిరస్కరించిన రచనలకి, అలాగే మార్పులు చెయ్యవలసిన రచనలకి రివ్యూయర్ల అభిప్రాయాలని పంపేవాళ్లం.
ఇదంతా 2006 వరకు, నేను సంపాదక బాధ్యతలు వహిస్తున్న కాలంలో విషయం. ఇప్పుడు రాసేవారు చాలా పెరిగారు గనుక రివ్యూయర్ల సంఖ్య కూడ పెరిగేవుంటుంది. ఐతే ప్రత్యక్షంగా నాకు తెలియని విషయాల్లో తలదూర్చటం సాహసం గనుక అటు వెళ్లను.
త్రిల్ గురించి PVSMURTHY గారి అభిప్రాయం:
05/03/2010 3:32 am
కథ బాగా ఉంది, కాని , ముగింపు సరిగా లేదండీ. శేఖర్ ఎవరితో తిరిగాడో రాధ తెలుసుకుంటీ త్రిల్ ఉండేది. ఇంకో మాట. రాథ ని చెడ్డదాన్ని చెయ్యడం అనవసరం. ఒకవేళ చెయ్య దల్చుకొంటే రాధను కూడా శేఖర్ని లాగా చంపాల్సింది.
‘వికృతి’ ఉగాది గురించి mOhana గారి అభిప్రాయం:
05/02/2010 7:48 pm
బాగుంది కవిత! ఈ వి పదాలతో వచ్చిన గొడవే ఇది. మల అంటే కుళ్లు, కాని విమల, అమల రెంటికీ ఒకటే అర్థము. అదే విధంగా వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. కానీ కృతికి వి చేరిస్తే విశిష్టమైన కృతి కాక వికారమయింది. కానీ జ్ఞానికి వి చేరిస్తే వచ్చిన విజ్ఞానము విశేషమైన జ్ఞానమే. ఒహొరే ఒహొరే బ్రహ్మ దేవుడా, నీవెంత బుద్ధిశాలివయ్యా బ్రహ్మదేవుడా! విధేయుడు – మోహన
తెలగాణెము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
04/22/2010 10:54 am
రమగారూ,
కవుల పట్ల నా “భయం” గురించి మీకు ఎటువంటి భయం అవసరం లేదు. ఇదివరకు చెప్పినట్లే అది కూడా కవిసమయం లోనిదే. అభిప్రాయాన్ని అందించడమే కదా మనం చేసేదిక్కడ. అయినా తెలంగాణపట్ల అన్యాయాలను మన ప్రజాస్వామ్యంలోని అవ్యవస్థను ఎత్తిచూపడానికి ఎటువంటి వకాల్తా పుచ్చుకోవడం కాని, అసలక్కడ పుట్టడం సైతం అనవసరం, అప్రస్తుతం.
====
విధేయుడు
_Srinivas
తెలగాణెము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
04/22/2010 10:38 am
దేశికాచారిగారు
నేను రాసిన భయం కూడా కవిసమయంలోనిదే. మంచి పద్యాలు చదువుతూ “ఈ మాట”లో ఎవరికైనా ఎప్పుడైనా ఎందుకైనా ఏం భయముంటుంది!
వట్టి మభ్యపెట్టే ప్రసంగాలే ప్రస్తుత సమస్యకు కారణమైతే, వాటికి విరుగుడు మరో ప్రసంగాలతో పోయేది. కాని మీరన్న “పార్టీరథచోదకుల”స్వార్థం ముమ్మాటికీ సత్యం. ఎన్నికల ముందు అన్ని ప్రధాన పార్టీలకు గుర్తుకు
రాని “సమైక్యం”, ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చి ఓట్లు పడ్డాకనే, మాట మార్చి బాట మార్చడం మన ప్రజాస్వామ్యంలో చూస్తున్నదే. “సమైక్యం” నినాదం చాటున దాగిన, దాచిన “పార్టీరథచోదకుల”స్వార్థం కూడా చూస్తున్న పర్వమే. సత్కవుల మాటలకన్నా మంచి (నాయకుల) చేతలే ఎక్కువగా ఊరటను ఇస్తాయేమో అనిపిస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజానీకానికి.
========
విధేయుడు
-Srinivas
సా విరహే తవ దీనా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
04/22/2010 1:08 am
తెలుగు పాఠకులని గురించి వదిలేయండి రోహిణీప్రసాదు గారూ!! అసలు సంగీతపు టీచర్లు గా చెప్పుకుంటున్నవాళ్ళకే సంగీతపు పూర్వాపరాలని గురించి ఏ పరిజ్ఞానమూ ఉన్నట్టు కనబడని రోజులివి. ప్రొఫెసర్ సాంబమూర్తి గారి వ్యాసాలనీ ..పుస్తకాలనీ సంగీతంమీద ఆసక్తి ఉన్నవాళ్ళు చదవడానికైనా వీలుండాలి. ఆ లోపం అంటూ ఉంటే అది సంగీతరంగం లోని వారిదే కద?
ఇక కేవలం సంగీతాన్ని గురించే అంటే అది హిందుస్తానీ పధ్ధతిలోనే సాధ్యం! కర్నాటకానికి సాహిత్యమే ప్రధానమైనది. దక్షిణాదిన సాహిత్యంలేని సంగీతానికి ప్రాముఖ్యత లేదు. ఇదిమీకు తెలియని విషయమూ కాదు. అయినా మీ అసంతృప్తి సాహిత్య పాఠకులమీదికి మళ్ళుతూంటుంది.
రమ.
తెలగాణెము గురించి ధేశికాచారి గారి అభిప్రాయం:
04/21/2010 9:55 pm
శ్రీనివాసుగారూ,
మీరు భయపడవలసింది కవులకు గాదు, కేవల స్వలాభాపేక్షతో, అధికారదాహంతో ప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రసంగాలూ, కృత్రిమనిరాహారదీక్షలూ చేసే “మతిం దలక్రిందుగ నూహసేయు పార్టీరథచోదకుల”కు. వారి ముందు కవులేపాటి? “కవయః క్రాంతదర్శినః” – అని పెద్దలు పలికిన వాక్యం సత్కవుల పట్ల సర్వదా సత్యం నేటి “పార్టీరథచోదకులు” చేసే స్వార్థపూరితప్రసంగాలు వారి కండ్లముందే బుగ్గిపాలౌతాయి గాని సత్కవుల వాక్యాలు సర్వదా జీవించి సమాజాన్ని సత్పథగామిని చేస్తాయనడం నిర్వివాదాంశం. సత్కవుల సద్వాక్యాలు . సనాతనంగా సమాజాన్ని ఉత్తేజపరుస్తాయనడంలో సందేహం లేదు. వీటికి వెఱవడం ఆత్మభీరుత్వమే కాని అన్యధా కాదు.
సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి శ్రీహర్ష గారి అభిప్రాయం:
04/21/2010 2:46 pm
చక్కటి వ్యాసం. మొదలుపెట్టాక చివరకంటూ అలా చదువుతూనే వున్నాను. శైలి, విషయం రెండూ బావున్నాయి.
మొబైల్ ఫోనులు రాని క్రితం నాకు బాగా గుర్తుండే ఫోను సంగతి – STD కి రోజులో ఒక్కో సమయంలో ఒక్కో రేటు వుండడం – సగం రేటు, పావు రేటు ఇలా. సరిగ్గా గుర్తులేదు కాని, పొద్దున్న ఐదున్నర లేక ఆరు ముందర పావు రేటు వుండేదనుకుంటా. మా అమ్మ వాళ్ల అక్కచెళ్లల్లందరూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండగ శుభాకాంక్షలు వగైరా వగైరా… ఆ పావు రేటు వున్న సమయంలోనే చెప్పేసుకునేవారు. పొద్దున్నే ఆ ఫోనులో గట్టి గట్టిగా చెప్పుకునే పండగ పలకరింపులూ, కుశల ప్రశ్నలతోటే మాకు శుభోదయమయ్యేది, పైగా ఎవరయినా ఫుల్ రేటు లో ఫోన్చేసి మాట్లాడుకుంటుంటే, “వీళ్ళు ఎంత దుబారా చేస్తారు? ఎంచక్కా పొద్దున్నే పావు రేటులో మాట్లాడుకోవచ్చు కదా” అని అనేవారు.
సా విరహే తవ దీనా గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
04/21/2010 2:17 pm
బ్రహ్మానందంగారూ,
ఈ చర్చలో అందరూ ఉదహరిస్తున్న పాటల్లో చాలామటుకు నాకు తెలియవు కనక రాగాల పేర్లు చెప్పలేను. ఎటొచ్చీ ఏ మాత్రమూ పోలిక లేని రాగాల విషయంలో కనబడుతున్న వ్యాఖ్యలను చదివాక నేను వాటి సంగతి వదిలెయ్యమన్నాను. ఈమాట పాఠకులకు సాహిత్యం మీదున్న అభిమానం, ప్రవేశం సంగీతంలో కనబడటంలేదు కనకనే నేనలా చెప్పాను.
ఓపిక ఉన్నప్పుడు ఈమాటలో ఒక సంగీతపు విభాగాన్ని మొదలుపెట్టవచ్చునేమో ఆలోచించాలి. నిజమైన సంగీతాభిమానులెవరూ సాహిత్యపత్రికల జోలికి రాకపోవడం కూడా బాధాకరమే. రాగాలనూ, స్వరాలనూ గుర్తించే పద్ధతుల గురించి నేను గత వ్యాసాల్లో కొంత ప్రస్తావించాను కాని మనవాళ్ళకు సాహిత్యం లేని సంగీతం ఒకంతట అర్థం అవుతున్నట్టుగా అనిపించలేదు. పాట గురించి రాయగానే సాహిత్యం గురించిన చర్చ మొదలవుతుంది.
పబ్లిక్‌గా కాకపోయినా వ్యక్తిగతంగా నాకు ఎవరైనా సందేహాలు పంపితే నాకు తెలిసినంతవరకూ వాటికి సమాధానాలివ్వగలను.
తెలగాణెము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
04/21/2010 12:58 pm
“కవులు తమకు వెన్నెముక ఉందని వానపాములకూ తమకు భేదం ఉందని నిరూపించుకునే తరుణం ఆసన్నమయింది.”
పద్యాలొదిలేసి, పదకొండు లైన్ల సత్యనారాయణగారి అభిప్రాయానికి యాభైలైన్లకు మించిన భూషణ్ గారి స్పందన ఆశ్చర్యం విస్మయం కలిగించింది.
అసలు కవులంటే నాకు భయం. కవులు కూడా నిరూపించుకోవడం మొదలుపెడితే ఇంకా భయం.కవి వర్ణనలంటేనే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఉపమానాలు,అతిశయోక్తులు,అలంకారాలు వగైరా. ఇక వాటితో కవులు నిరూపణలు సైతం మొదలుపెడితే కవితాసౌందర్యం మాటేమో కాని, వాస్తవాలు నిజాలు హుష్ కాకి అని చచ్చేంత భయం. అయినా కవులను ఆదరిస్తున్నారంటే తెలుగువాళ్ళు ఎంత మంచివారో లేక ఎంతటి అమాయకులో!
======
విధేయుడు
_Srinivas
సా విరహే తవ దీనా గురించి Tatiraju Venugopal గారి అభిప్రాయం:
04/20/2010 3:55 pm
చాలా చాలా బావుందండీ రచన.అయితే 10 వ రిఫరెన్సుగా -టిటిడి వారి ప్రచురణ ‘శ్రీ జయదేవ కవి కృత గీత గోవింద కావ్యము’ (2000 ) కూడా చేర్చ దగ్గదే.డాక్టరూ,చిత్రకారుడూ అయిన చెలికాని మురళీ కృష్ణా రావు ఇందులో 24 అష్ట పదులకి చక్కని బొమ్మలు గీసారు. అసలు గంటకో అష్టపది చొప్పున ఎవరైనా పాడి గిన్నీస్ రికార్డుకి ఎక్క వచ్చునేమో! ఇక-టంగుటూరి సూర్య కుమారి గారు పాడిన ‘సా విరహే’ యమన్ కళ్యాణ్ రాగమా? కాదేమో? పీలూ అనిపిస్తోంది. రమతే యమునా(ఘంటసాల), అజహున్ న ఆయే బాల్మా(రఫీ, సుమన్),మాధవా మాధవా నను లాలించరా (సుశీల,ఘంటసాల)-ఒక్కొక్కటీ గుర్తుకొస్తున్నాయి. సాలూరు వారు స్వర పరిచిన జయ దేవ అష్ట పదులు (సినిమాలోనివీ , ఆ తరువాత సుశీల గారి చేత పాడించిన లలిత లవంగ, నాథ హరే-లు) మొత్తం దేశమంతటా తెలియాలి. పద్మా సుబ్రహ్మణ్యం పాడినా ఏదో లోపం ఉంది. గానం- మళయాళ చిత్రంలో దక్షిణా మూర్తి బాల మురళి గారి చేత ‘యా రమితా వన మాలినా ‘ భలే అద్భుతంగా పాడించారు. కన్నడ ‘హంస గీతె’ చిత్రంలో ఉన్న అష్ట పదులన్నిటినీ టి జి లింగప్ప స్వర పరిచారు. వాటిని బాల మురళి ఆలపించారు. ‘నిజగాద సా యదునందనే’ మొదలైనవి బాల మురళి పాడిన సినియేతర అష్టపదులు. తెనాలి రామ కృష్ణ లో విశ్వనాథన్-రామమూర్తి స్వర సంపద -‘చందన చర్చిత’ , స్వర్ణ కమలంలో ఒరియా వారైన అక్షయ మహంతీ ట్యూన్ కట్టగా తృప్తి దాస్ పాడిన ‘సఖీ హి కేశి మథన’ -ఇవన్నీ నిజంగానే ‘ఇష్ట పదులు’. అష్ట పదులకి నాట్య గౌరవం తెప్పించినది -సదా స్మరణీయుడు కేలూ చరణ్, ఆయన కుటుంబం –ఇలా చెప్పుకుంటూ పోతే 24 అష్ట పదుల కాలమవ్వొచ్చు.
మీ రచనలో సహోదరులు – దాని పైన వివరణ ముచ్చటగా ఉన్నాయి. సినిమా బండి వాడు ‘సోదర సోదరీ మణులారా- నేడే చూడండి మీ అభిమాన ధియేటర్ జ్యోతిలో’ అన్నా ఈ బహు వచన బెడదే! , ఆత్మ గౌరవంలో ఆరుద్ర ‘ఓ సోదర సోదరీ మణులారా– అని బహు వచనం ప్రయోగించి ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ అని ఏక వచనంలో పల్లవి కూర్చారు. బహుశః ఓ సోదరా, ఓ సోదరీ మణీ అని ఒక్కో ఏక వచనంగా విరుచుకోవాలేమో?
తెలగాణెము గురించి ధేశికాచారి గారి అభిప్రాయం:
04/19/2010 11:19 pm
సత్యనారాయణగారు, శ్రీనివాసుగారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఉత్తరాలు నా పద్యాలలోనే ఉన్నవి. నేను సిసలైన తెలంగానావాడినే ఐనా ముమ్మాటికి త్రికరణశుద్ధిగా సమైక్యవాదినే కాని వేర్పాటు ప్రతిపాదకుని కాను. వారి భావాలతో ఏకీభవించవలసిన అవసరం నాకు లేదు. వారి కెంత వాక్స్వాతంత్ర్య మున్నదో నా అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు,ఇట్టి వ్యక్తీకరణద్వారా వీలైన కొందరి మనసులు వేర్పాటు ధోరణినుండి మళ్లించుటకు నాకు అధికారము, పైపెచ్చు బాధ్యతా ఉన్నాయని నా అభిప్రాయము.
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:
04/08/2010 6:09 pm
ఈ కథాసంకలనం ముందుమాట చదవాలంటే ఇక్కడ చూడచ్చు. 12వ పేజీలో వుంది.
http://www.rachana.net/March_10_Web_Pages.pdf
సాధారణంగా పుస్తకం అచ్చు వేసేటప్పుడు చిట్టచివర ముందుమాట రాస్తారు. ఈ పుస్తకంలో కథలన్నీ 2000 కి ముందు వచ్చిన కథలనే ప్రచురించామని చెప్పారు.
కానీ ఈ పుస్తకానికి ముందుమాటే చాలా ముందుగా తయారయ్యిందన్న అనుమానం కలుగుతుంది.
అమెరికా రచయితల మంచికథలూ అంటూ పధ్నాలుగో పేజీలో కొన్ని కధల పేర్లు ఉటంకించారు. ఆ కథలన్నీ 2000 తరువాత రాసినవే! ఉదాహరణకి విదేశ గమనే విద్యా పరాదేవతా కథ” అయిదేళ్ళక్రితమే అచ్చయ్యింది. ఈ కథ ఈ సంకలనంలో లేదు.
పుస్తకంలో ప్రచురించిన కథల గురించి కాకుండా వారికి తెలుసున్న కథల పేర్లు నొక్కి వక్కాణించడం ఆశ్చర్యం కలిగించింది. కధలన్నీ చదివి ముందుమాట రాసినట్లుగా ఇది చదివితే అనిపించదు.
ఆఖరి పేజీల్లో పాఠకుల సౌకర్యార్థం ఇండియా రచయితల మంచి కథల లిస్టు కూడా ఇచ్చారు. అవన్నీ మంచి కథలు కావన్నది నా వుద్దేశ్యం కాదు. కానీ రాస్తున్న సందర్భం అమెరికా కథ గురించి. అది తప్ప మొత్తం కథా ప్రపంచమంతా ఇరికించారు.
పది తరాలకి పనికొచ్చే గ్రంధాలు చేస్తున్నామనుకునేటప్పుడు మొదటి పేజీల్లోనే ఇలాంటివి రాకుండా శ్రద్ధ చూపాల్సింది.
నేను ఇంతకు ముందు రాసిన కామెంటు చూసి నన్ను హేళన చేస్తూ, ఓ పెద్దాయన ఈ-మెయిలు పంపారు. నేను వ్యక్తిగతంగా ఎవర్నీ దూషించలేదు. నిందించ లేదు. పుస్తకం బాగోగులు మాత్రమే చెప్పాను. గమనించగలరు.
ఇతిహాసాలూ, ప్రబంధాలూ గురించి DR.Jonnalgadda Markandeyulu గారి అభిప్రాయం:
04/05/2010 7:24 am
రసతంత్రులను మీటి సర్వాత్మాన పాత్రలొ లీనమై సభ్య సమాజాన్ని దాటిపోని రచన ఉత్తమరచన అనిపించుకుంటుంది. ద్రౌపది నవలలో ఈ ఉత్తమరచనకు ఆస్కారము లేదని విమర్శించినవారిది కుసంస్కారమనే వారికి నమస్కరించడము తప్ప చేయగలిగిందేమీలేదు. డా.వెన్నావల్లభరావు మొదలైన 19మంది రచయితలు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ద్వారా సంయుక్త ప్రకటనలొ ఇది దుష్టసంప్రదాయమని భావప్రకటన స్వేచ్చను అవహేళన చేశారు.
రచయిత సమర్థతను,అంతరంగభావాలను మనోహరంగావెల్లడించిన ద్రౌపదికి… యార్లగడ్డ శైలిపట్ల విరుచుకుపడే ప్రయత్నము కోసము రచయితలెవరూ కంకణము కట్టుకోలేదు. మరోనవల సత్యభామను రాయకుండా అడ్దుకునే ప్రయత్నమూ చేయలేదు. “రామాయణ కల్పవృక్షము” జ్ఞానపీఠము నెక్కింది. హేతు దృక్పధంతొ,అవ్యక్త అంతరంగభావనతో మానసిక విశ్లేషణ దృష్టితొ, స్త్రీవాద దృక్కోణంతో, రామాయణ విషవృక్ష రచన కూడ చదివి ఆనందించినవారున్నారు. పవిత్రతకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి దుయ్యబట్టిన వారున్నారు. ఆ నవల చదివి రామాయణ కల్పవృక్షమును జ్ఞానపీఠమునుండి దింపేయాలన్న సంయుక్త విమర్శలు రాలెదు.
ద్రౌపది మహారాణి. తన్నోడినన్నోడెనాలేక నన్నోడితన్నోడెనా అన్న ప్రశ్నకు గుడ్డి దృతరాష్ట్రుడు కూడ చలించాడు కనుకనె పుత్ర వ్యామోహాన్ని విడిచి ద్రౌపది మహారాజ్నీత్వాన్ని ఉత్తమ కోడలివని అభినందించి తిరిగి ఇచ్చేశాడు. మరి తిరిగి జూదమాడి అడవులు పట్టిపోయిన పాండవులకు రాజ్యమెక్కడిది? అందుచేతనె కుంతి హస్తినలొ ఆగిపొయి రాజ్యభాగ సమస్యను సజీవంగా నిలిపే ప్రయత్నము చేసింది. పాండవులమీది ద్వేషము తప్ప దుర్యోధనుడిది దుష్ట పరిపాలన అనేపిర్యాదు భారతంలో కనబడదు.
రాజ్యభాగము ఇస్తే మంచిది అన్నారుకాని …ఇవ్వకపొతే అంటూ పాండవుల తరపున కురుగురు వృద్ధులెవరూ ఆకారణంచేత దుర్యొధనుని విడిచి పెట్టకపోవడము గమనార్హము. కాని పాంచాలికి జరిగిన పరాభవము ద్రౌపది ప్రశ్నలొ వెన్నాడి ఆ మహాఇల్లాలికి మహారాణిత్వము సిద్దించాలని కర్ణుడితొసహా మన:స్ఫూర్తిగ యుద్దము చేయలేక నేలకొరిగారు. భీముడంతటి భర్త ప్రతిజ్ఞలు మర్చిపోయాడు. ఒక ఆడదానికి జరిగిన పరాభవము ఏయుగములోను జరగకూడదని ఆశించి భర్తల కనుసన్నలలొ ఉండి గొప్పయుద్దము జరిపించి పుత్ర విహీనయై కూడ అపాండవము కోరుకున్న అశ్వథ్థామను క్షమించి మహారాణీత్వాన్ని చాటుకుంది. ఆ మహారాణిలొని నవలా నాయికలక్షణాలు “‘కొత్త అవిష్కరణగ” రచించిన యార్లగడ్డ రచన అభినందనీయము. అంతేతప్ప సాహిత్య అకాడమీ అవార్డు నిబంధనలకు తగినట్లు లేదన్న వారు ద్వేషంతొ పనిగట్టుకుని విమర్శించి రచ్చకీడ్చారన్న ధోరణితొ విమర్శించేవారిని బుద్దిహీనులనడము బుద్దిగలవారు వేసుకోవలసిన ప్రశ్న. డా.జొన్నలగడ్డ మార్కండేయులు.
అసమర్థుని జీవయాత్రేనా? గురించి lyla yerneni గారి అభిప్రాయం:
03/24/2010 11:31 pm
> 1950 -60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన
ఆ వాక్యంలో 1920 నుండి 1960 మధ్య ప్రాంతాలలో అని వుండాలి. -Sreenivas Paruchuri
Thanks to Srinivas for correcting the error. -Maddipati Krishna Rao
మన్నించాలి. ఇంకా అర్థం కాలేదు. ఏమి పొరపాటును సరిదిద్దారో కూడా తెలియలేదు.
“అసమర్థుని జీవయాత్ర” నవలలో -సీతారామారావు కాని, అతని పూర్వీకులు కాని, కోస్తాజిల్లా కమ్మ కులస్థులు అని ఎక్కడ ఉన్నది. ఏ పేజీలో ఉన్నది? ఎందుకు నేను ఈ పుస్తకంలోని పాత్రలు ఆ కులస్థులలో వచ్చిన మార్పులను గాని, వారి ప్రవర్తనలను మాత్రమే సూచిస్తునట్లుగా గాని అర్థం చేసుకోవాలి? మీకు అలా అర్థమవ్వటానికి కారణాలు ఏమిటి?
మీ వీలును బట్టి వివరించండి.
లైలా
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి Kameswari. Bhamidipati గారి అభిప్రాయం:
03/24/2010 8:11 pm
”ఇరవయ్యవ శతాబ్దములో అమెరికా తెలుగు కధానిక మరియు అమెరిక తెలుగు సాహితీ వేత్తల పరిచయ గ్రంధము” పై ఈమాట, కౌముది వెబ్ సైట్ల వారి సమీక్షలు చదివిన నాకూ కొన్ని మాటలు రాయాలనిపించింది. నేను అతిరధ మహారధ కవయిత్రుల కోవలో దాన్ని కాను.ఏదో రాయాలనిపించి రాస్తున్నాను, నేనేమైనా పొరపాటు చెప్తే మన్నించి అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను.
కధానికలు ,కవితలు వ్రాయడానికి అందరూ పండితులే కానక్కరలేదేమో ,శాస్త్రబద్ధ్హంగా ఛందస్సు, యతి ప్రాసలతొ కావ్యములల్ల గలిగిన వారూ, తేలికపాటి భాషలో తమకు తోచిన భావాలు, చూసిన సంఘటనలు, స్వానుభవాలు కొన్ని ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు పాఠకులతో పంచుకోవాలని కుతూహల పడతారు. పత్రికలకి పంపుతారు, పాఠకులతో వారి భావాలను పంచుకుంటున్నారు. అప్పుడప్పుడు కొందరికి బహుమతులు కూడా వస్తాయి వారికధలలోని చిత్ర విచిత్ర మలుపులు, సారాంశము గ్రహించి కొంతమంది వాటిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాలను సుగమ మార్గాల మలుచుకునే వీలు కలుగుతూంది. అందుచేత వీలయితే చెయ్యగలిగితే ప్రోత్సహించాలి, వారిని ప్రోత్సహించి వెలుగులోనికి తెచ్చి మహాత్తరకార్యముల చేయువారి చిన్నతప్పులు వుంటే చెప్పవచ్చు కాని మరీ అంత దుయ్యబట్టడము సమంజసము కాదని నాభిప్రాయము. నేటి మహా,మహా కవులు కవయిత్రులూ ఒకనాడు ఓనమాలతో మొదలెట్టినవారే.
అమెరికా, అయినా ఆముదాలవలసైనా, ఆంద్ర ప్రదేశైనా అలవాట్లు , ఆచార వ్యవహారాలూ మారిన ప్రతీ మనిషికీ కష్ట సుఖాలు, మనోభావాలు ఒకే తీరున వుంటాయి. ఏ సంఘటన కధగా మలచినా చదవడానికి బాగానే
కాలక్షేపమవుతుంది. ఇంకొక విషయము – వంగూరి ఫౌండేషన్స్ వారు ఎన్నో శ్రమలకోర్చి ఒక్కోసారి కుటుంబ భాద్యతలను కూడా విస్మరించి సంవత్సరాల తరబడి కావ్య సీమకు చేస్తున్న సేవాకార్యక్రమాలు అపురూపం. ఈ గ్రంధప్రచురణకు వచ్చిన కధలను ఎందఱో ఎడిటోరియల్ కమిటి వారు రాత్రింబగళ్ళు శ్రమించి సమీక్షించి ఈ గ్రంధానికి రూపు దిద్ది 2010లో మరొక పుస్తక ప్రచురణ సన్నాహాల వేళ, అంతటి భుహత్తర కార్యం సాధించడము సామాన్యముకాదు. అయినా ఒక మ౦చి కార్యము చేసినప్పుడు కొన్ని ఘాటైన విమర్సలూ ఎదురు దెబ్బలూ ఎదుర్కోక తప్పదు. అయినా ధీరో దాత్తు లెవరూ విమర్శలకు లొంగి భ్రుహత్కార్యముల వీడి వెనుదిరగరు. అన్ని శ్రమలూ విమర్శలూ ఎదుర్కొని ఈ పధకాన్ని అమలు చేస్తున్న చిట్టెన్ రాజు గారికి అభినందనలు. నిజంగా కిరణ్ ప్రభ గారు పేర్కొన్నట్టు ఈ గ్రంధము తరతరాలకు పదిల పరచవలసిన గ్రంధము.
తప్పులున్న మన్నించగలరు.
కామేశ్వరి భమిడిపాటి
ఛందోధర్మము గురించి Geddapu Lakshmi Prasad గారి అభిప్రాయం:
03/24/2010 8:10 am
అభిప్రాయాలన్నీ చదివాను.సవినయంగా ఒక విషయం చెప్పాలనిపించి చెప్పే ధైర్యం చేస్తున్నాను. మనం ఎన్ననుకున్నా ఏమనుకొన్నా ఒకటి మాత్రం నిజం. మనకి నచ్చింది మంచిది. మనం దక్కించుకోలేనిది మనకు దక్కంది చెడ్డది. మన అర్హతనిబట్టి మన మనస్తత్త్వాన్ని బట్టి మనకు అర్ఠం అయ్యేది మంచిది, అర్థం కానిదీ అర్థం చేసుకోలేనిదీ చెడ్డది. ఇది మంచి, ఇది చెడు అనేవి సార్వజనీనాలూ కావు, సార్వకాలికాలూ కావు.అయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా వ్యక్తులు తమ మానసిక పరిపక్వతా స్థాయులను బట్టి, వివిధాంశాలను దర్శించి వాటిని స్వాభిప్రాయనుగుణమూల్యాంకణం (value judgement) చేస్తారు. అన్నిటినీ ఆయా కోణాల్లోనే దర్శించి ఆస్వాదించే వారు ధన్యులు. ఇతరులు అన్యులు.
ఆవో భద్రాః క్రతవోయంతు విశ్వతాః
మీ
లక్ష్మీ ప్రసాద్ గెడ్డాపు
అసమర్థుని జీవయాత్రేనా? గురించి lyla yerneni గారి అభిప్రాయం:
03/22/2010 2:16 pm
“మద్దిపాటి కృష్ణారావు నవల నేపథ్యం గురించి నాకు చెప్పారు. 1950 -60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన – లోకజ్ఞానం తో సమన్వయం లేని ఆదర్శాలూ, కొత్తగా వచ్చిన భేషజాలు, బ్రాహ్మినైజేషన్ ఆఫ్ కమ్మా కేస్ట్ లాంటివి – మార్పులను సీతారామారావు తాత తండ్రుల ప్రవర్తన ఎలా పట్టుకోగలిగిందో కూడా చెప్పారు.” -మాధవ్ మాచవరం.
మద్దిపాటి కృష్ణారావు మీకు చెప్పిన ఆ విషయాలేమిటో మాక్కూడా చెపుతారా. మీరు గాని, మద్దిపాటి గాని, పైన దశాబ్దం ఇవ్వటంలో పొరపడ్డారా? లేక వారు ఉద్దేశించిన దశాబ్దమదేనా?
ఎందుకంటే;
నవలలో -సీతారామారావు, అతని తాత తండ్రుల జనన మరణ తేదీల్లేవు. వారి ఫేమిలీ మెడికల్ హిస్టరీ రచయిత చెప్పకపోతే పోయే, 🙂 రామయ్య తాత కూడా చెప్పలేదు. కాని ఈ నవల గురించి కొంత, నవల రచనాకాలం 1945-1946 అని నవల వెనకఅట్ట మీద చెప్పబడింది. నవలా రచయిత గోపీచంద్ 1910లో పుట్టి, 1962లో మరణించినట్లు వెనకఅట్ట మీద చెప్పబడింది.
సీతారామారావు అసమర్థుడో, ఉన్మాదియో, రెండూ కాడో;
“ఏది ఏమైనా, తుది తీర్పు ……”నా?:-)
లైలా
PS:
Articles by Madhav Machavaram and Krishna Rao MaddipaTi – both are interesting to me.
“Head Case – Can Psychiatry be a science?” – By Louis Menand ( The New Yorker, March 1, 2010) too, is an interesting article.
సా విరహే తవ దీనా గురించి mOhana గారి అభిప్రాయం:
03/07/2010 3:29 pm
బాలవ్యాకరణములో తత్సమ పరిచ్ఛేదములో 45వ సూత్రము – ఇత్తునకు బహువచనంబు పరంబగునపుడు డుత్వంబగు. దానికి ఇచ్చిన ఉదాహరణలు: హరులు – గిరులు – కవులు – రవులు – యామినులు – భామినులు . కాని పదము ఈ-కారముతో అంతమయినయెడల దీర్ఘంబున కుత్వంబు లేదు. ఉదా: శ్రీ – శ్రీలు, స్త్రీ – స్త్రీలు. మీరు చెప్పిన మణి పదము కూడా ఇ-కారాంతమే. కాని సహోదరికి ఒక శ్రేష్ఠత్వాన్ని ఇచ్చే పదము అది. నేను మొట్టమొదట సహోదరీమణులు అని వాడాలని అనుకొన్నా, సహోదరులు అనే పదమే సరియైనదని భావించి దానిని వాడాను. ఈ పదము కూడా భామినిలాటి పదమే. మీ ప్రశ్నకు సమాధానము పై సూత్రములో ఉన్నది. విధేయుడు – మోహన
సా విరహే తవ దీనా గురించి nagaraju raveender గారి అభిప్రాయం:
03/07/2010 12:37 pm
మీ “సా విరహే తవ దీనా” వ్యాసం చాలా బాగుంది. ముఖ్యంగా వివిధ గాయక గాయకీ మణులు పాడిన పాటలను ఒక చోట చేర్చిన మీ కృషి అభినందనీయం. కాని ఒక చిన్న అచ్చుతప్పు దొర్లింది. బాంబే సోదరీమణుల అనడానికి బదులు బాంబే సహోదరుల అని అచ్చయింది.
వానకూడా వింతే! గురించి మారేపల్లి భిక్షం గారి అభిప్రాయం:
03/07/2010 6:21 am
నేను ఒక సాహిత్యాభిమానిని.ఎంత కాలమో ఈ అన్వేషణ ఇలాంటి వెబ్ సైట్ కోసం అనుకున్నాను .కాని చాల అ తొందరగా లభించింది.నేను ఇలాంటి సుందర వర్ణణాతితమైన కవితల కోసం ఎదురుచూస్తున్నాను.
వాన గురించి వర్ణన ఒక వింతగా అనిపించింది.చాలా చక్కటి వర్ణనలతో వర్ణించారు.
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
03/07/2010 5:02 am
రమ గారూ,
విషయం సరళంగా క్లుప్తంగా సోదాహరణంగా చెప్పుకోవలసిన అవసరం వుంది కానీ చాలా అడ్డంకులున్నాయి. వొక్క మాటలో చెప్పాలంటే – క్లిష్టమైన విషయాన్ని చెప్పటానికి కావలసిన వాడుక భాష లేదు. వాడుకగా క్లిష్టమయిన విషయాలను వోపికగా చర్చించే సంప్రదాయం మనం పోగొట్టుకున్నాము. దాని స్థానంలో మాయాబజారు సినిమాలో రాక్షస గురువు బోధించిన అస్మదీయులా తస్మదీయులా అన్న వొక్క విషయం తేల్చుకుంటే సరిపోతుందనే సిద్ధాంతం మనలో చాలా మందిమి ఫాలో అవుతున్నాము. మహా అయితే పవర్ పాయింటు బుల్లెట్ల రూపంలో విషయం అర్ధం చేసుకుంటాము. దాని నించి బయట పడి కొత్త సాంప్రదాయాలను నిర్మించుకోవటం ఒక్కరితో, ఒక్క రోజులో అయ్యే పని కాదు.
అయినా ప్రయత్నం చేయవచ్చును కానీ, నా వుద్దేశ్యం పూర్తి స్థాయి వ్యాసం వ్రాయటం కాదు. వేలూరు గారు వ్రాసిన వ్యాసం మీద ఆలోచించ వలసిన కొన్ని విషయాలను హైలైట్ చెయ్యటమే కాబట్టి, పెద్దగా టైమ్ వెచ్చించకుండా రాసేశాను.
తెలుగు డయాస్పోరా జీవితాన్ని అర్ధం చేసుకోవాలంటే – తెలుగు భాష మాట్లాడే వాళ్లంతా ఒక జాతికి చెందిన వారు అన్న అభిప్రాయం ఎక్కడినించి వచ్చింది – అన్న దగ్గర మొదలు పెట్టుకోవచ్చును అని అన్నాను నేను. దీనికి సమాధానం చెప్పడం చరిత్రలు రాసే వాళ్ళూ, సాహిత్య విమర్శలు వ్రాసే వారూ చేయ వలసిన పని. విశాలాంధ్ర రాష్ట్రావతరణకి అటూ ఇటూగా జరిగిన సామాజిక చరిత్ర గురించి కథలు ఎవరూ రాయలేదు. పాటలూ పద్యాలూ రాసినట్టు కనపడుతోంది. అవి కూడా వాద ప్రతివాదాల్లో ప్రత్యర్ధులని అవహేళన చేయటానికి మాత్రమే. ఆ సమయానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ ఇప్పుడు జరుగుతున్నా , అస్మదీయులూ తస్మదీయులూ అన్న ప్రశ్నకి అతీతంగా మాట్లాడే వారు వేళ్లమీద లెక్కించడానికి కూడా ఎవరూ లేరు. ఇదంతా తెలుగు భాష గురించి ఆలోచించే వాళ్ళు భాషనీ దాని వుపయోగాలనీ చాలా ఇరుకుగా అర్ధం చేసుకోవటం వలన వచ్చి పడిన నష్టం అని నాకనిపిస్తుంది. ఈ సందర్భంలో సాహిత్య పరంగా నిర్మాణాత్మకమైన పని చేయవలసిన అవసరం ఎంతో వున్నా చేయగలిగిన మనుషులు ప్రస్తుతానికి లేరు. అటువంటి మనుషులు రావటానికి కావలసిన మార్గాలు ఏర్పాటు చేయవలసిన పని ఈ రోజున పాఠకుల బాధ్యతే (పాఠకులు కాకుండా ఎవరూ రచయితలు కాలేరు కాబట్టి – రచయితలను ఇందులోంచి వదిలెస్తున్నాననుకోనవసరమ్ లేదు. చెప్పొచ్చిందేమంటే, క్రిటికల్ రీడింగ్ స్కిల్స్ వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళలో చాలా తక్కువ వుంటారు అని. )
నేను మొదటిసారి రాసినప్పుడు వుదాహరణలు చెప్పకపోవటానికి ఇదీ ఒక కారణమే. సరళంగా, వుదాహరణలతో వున్న వ్యాసాలు చదవటం అలవాటయిపోయిన చాలా మంది చదువరులు ఇన్స్టంట్ జడ్జ్ మెంటులకి అలవాటు పడి పోయారు. చదివిన తరువాత కొంచెం ఆలోచించి చదివిన దాన్ని స్వంతం చేసుకునే ఓపిక ఎవరికీ లేక పోవటంతో — వుదాహరణల మీదే దృష్టి కేంద్రితమైపోయి రెడీ మేడ్ అభిప్రాయాలతో టేబుల్ టెన్నిస్ ఆట మొదలవుతుంది. అది జరగకుండా ఎట్లా రాయాలి అన్నది నాకూ తెలియదు.
వుదాహరణకి – సిద్ధాంతాన్ని సృజనలోకి యధా తధంగా తీసుకు రాకూడదు అన్న మీ అభిప్రాయమే తీసుకుందాము. నిజానికి మీరు మంచి కథల్లో లెక్క వేసిన కాళీపట్నం రామారావు గారు యజ్ఞం కథలో చేసినది – ఒక మార్క్సిస్టు సిద్ధాంతాన్ని యధా తధంగా కథ రూపంలో చెప్పటమే. కథకుడిగా ఆయనకి వున్న నైపుణ్యం వల్లనా, పాఠకులలో ఆ సిద్ధాంతమేమిటో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది వుండటం వల్లనా ఆ విషయం ఎవరికీ తెలియక పోయి వుండవచ్చు. ప్రీమిటివ్ అక్యూములేషన్ – అంటే ఫ్యూడల్ సంబంధాల ద్వారా పోగు పడిన వ్యవసాయరంగంలోని మిగులు ధనం పెట్టుబడిగా మారే క్రమం – అందులో మన స్థల కాల పరిస్థితులలో ఏ భావజాలాలు ఏ పాత్ర వహిస్తున్నాయి – ఎక్కడ నించి మొదలు పెట్టుకుంటే ఈ క్రమాన్ని విరగకొట్ట వచ్చును అన్న ఆలోచన ఆ కధ రాసే నాటికి – సీపీయెమ్ పార్టీలో నాయకత్వానికీ కార్యకర్తలకీ మధ్య తీవ్ర వైరుధ్యాలకి దారి తీసింది. రామారావు గారు – ఆ వైరుధ్యాలలో ఒక పక్షం వహించి – ఆ సిద్ధాంతానికి కధ రూపం ఇచ్చారు. కాబట్టే, ఆ కధకి పెద్ద యోగ్యతా పత్రం ఇచ్చింది కథకులో సాహిత్య విమర్శకులో కాదు. ఆ పని చేసినది ఆ సిద్ధాంతాలను బలంగా నమ్మిన ఆర్ధిక శాస్త్రవేత్త – ఆర్ ఎస్ రావు గారు. అంటే – కధ వెనకాతల పరిణతి చెందుతున్న ఒక రాజకీయ లక్ష్యమూ, ఒక తాత్విక దృక్పధము వున్నాయి. మొగ్గ తొడుగుతున్న మావోయిస్టు సిద్ధాంతం వుంది (అది పుబ్బలో మాడి పోయిందన్నది వేరే విషయం).
ఈ కధ గురించి, కధకుడి గురించి తెలుసుకోవలసిన విషయం మరొకటుంది. రామారావు గారు, ఈ కధ వ్రాసిన తరువాత ఇరవయ్యేళ్లు పైగా మళ్ళీ ఒక్క కధ కూడా రాయలేదు. ఆ వ్యవధిలో ఆయన వ్రాసిన వాటిలో చెప్పుకోదగ్గదేమయినా వుంటే , అది – ‘నేనేందుకు వ్రాయటం లేదు’ అన్న వ్యాసమే. అందులో కూడా ఆయన ఏవో వ్యక్తిగతమైన కారణాలు చెప్తారే కానీ నమ్మదగిన కారణమేమీ స్పష్టంగా చెప్పరు. ఇరవయ్యేళ్ళ తరువాత, మావోయిస్టు వుద్యమంలో మళ్ళీ నాయకత్వం- కార్యకర్తల మధ్య వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయని అనిపిస్తున్న రోజుల్లో ‘సంకల్పం’ అనే కధ రాశారు. ఈ కధకి సన్నివేశం ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెద్దరికం చేతులు మారటం. యజ్ఞమ్ కధ సిద్ధాంతాన్ని కధలోకి అనువదిస్తే, సంకల్పం కుటుంబంలో జరిగే ఘర్షణలో ఒక వ్యక్తి సమాధాన పడిన తీరు చెప్పటం ద్వారా వుద్యమంలో వస్తున్న ఘర్షణకి పరిష్కారం సూచిస్తుంది. యజ్ఞమ్ కధకి వచ్చినంత ప్రాచుర్యం సంకల్పానికి రాలేదంటే దానికి కారణమేమిటో మనకి వివరించి చెప్పిన వారెవరూ లేరు.
ఈ రెండు కధల మధ్య వ్యవధిలో — యజ్ఞమ్ లాంటి కధలు చాలా వచ్చాయి కానీ, అదే పరిణతి చెందిన రాజకీయ లక్ష్యం, తాత్విక చింతనతో వ్రాసిన కధ గా చెప్పుకోదగినది — అల్లం రాజయ్య వ్రాసిన ‘మనిషిలోపలి విధ్వంసం’. యజ్ఞమ్ లో లాగానే — ‘మనిషి లోపలి విధ్వంసం’లో కూడా వస్తువు – తండ్రి కొడుకుల మధ్య సంబంధం. వేయి తలల రాక్కసిగా ఎదిగి పోయిన ప్రీమిటివ్ ఎక్యూమూలేషన్ — మనిషి పరాయీకరణకి సమాధానం చెప్పలేని వుద్యమ నేపధ్యం – ఇవీ ఈ కధకుఉన్న రాజకీయ తాత్విక నేపథ్యాలు. యజ్ఞమ్, మనిషి లోపలి విధ్వంసం – ఈ రెండు కథలలో మొదటిది తెలుగు కథా సాహిత్యగమనంలో ఒక అంకానికి తెర తీస్తే రెండోది తెర వేయటంగా అర్థం చేసుకోవచ్చును. ఈ మధ్యలో తెలుగు కధా సాహిత్యంలో చిన్న చిన్న అంతర్నాటకాలు చాలానే జరిగాయి. యండమూరి వీరేంద్రనాథ్ అనే ఒక కామిక్ రిలీఫ్ చాలా సంవత్సరాల పాటు సాగింది. అది అటు సాగుతుండగానే, యజ్ఞమ్ లాటి కథలని ఫార్ములాగా తీసుకుని రాసేసిన సాహిత్యం ఒక పక్కన సాగింది. మధ్యలో కొన్ని సంవత్సరాలు బాలగోపాల్ సాహిత్య విమర్శ చేసినా — పౌరహక్కుల కార్యకర్తగా ఆయన పేరు పడిపోవటం వలన ఆయన రచనల్లో వున్న సాంస్కృతిక విమర్శని ఎవరూ పట్టించుకోలేదు.(ఎవరూ పట్టించుకోలేదు అంటే లిస్టు చెప్పుకోవాలంటే — ముఖ్యంగా విప్లవ రచయితల సంఘం వారే పట్టించుకోలేదు అని చెప్పుకోవాలి). ఆ ఇరవై ఇరవయ్యయిదు సంవత్సరాలలో విరసం సాహిత్యానికి రాజకీయానికి మధ్యన వుండే సున్నితమయిన సంబంధాన్ని మొరటుగా బండగా ట్రీట్ చేసి పెద్ద నేరమే చేసినట్టు కనపడుతోంది కానీ ఇదమిత్థంగా తేల్చి చెప్పిన వాళ్లెవరూ వున్నట్లు కనపడదు.
జరిగిన చరిత్ర గురించి రాయవలసిన కథలు ఎందుకు రాయబడలేదు అన్నది ఒక కీలకమైన ప్రశ్న అయితే ప్రస్తుతానికి పైన చెప్పిన మూడు కథలూ – యజ్ఞమ్, సంకల్పం, మనిషిలోపలి విధ్వంసం — గ్రామీణ వాతావరణం లోనే చెప్పబడ్డాయి అనిన్నూ, మొదట కాళీపట్నం రామారావు గారు, తరువాత అల్లం రాజయ్య కథకులుగా విజయవంతులు కావటానికి వెనక – రచయితలను సోషలైజ్ చేసే సామాజిక నిర్మాణాలు వున్నాయి అనిన్నూ గుర్తు పెట్టుకుంటే, ఆ ప్రశ్నకి సమాధానాలు మళ్ళీ ఎప్పుడయినా వివరంగా చెప్పుకోవచ్చును.
ఇక పోతే, తెలుగు కథల్లో గ్రామీణ వాతావరణం వాసనలు పోక పోవటానికి పెద్ద కారణం – విశాలాంధ్ర రాష్ట్రావతరణ తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో నిజానికి నగర జీవితం – నగర సంస్కృతీ పెద్దగా ఎవరికీ అనుభవం లోకి రాక పోవటమే అని నాకనిపిస్తుంది. కాలాతీత వ్యక్తులు, హిమజ్వాల ఇలా ఒ కటో రెండో తప్ప ఎవరూ ఆంధ్ర ప్రదేశ్ లోని నగర జీవితాన్ని తరచి చూసిన వారు లేక పోవటానికి కారణం రచయితల్లో వ్యక్తిగతంగా వూహా శక్తి లోపించటమే అంటే నేను నమ్మలేను. నగర జీవితాన్ని తరచి చూసి కధలు నవలలూ రాయటానికి కావలసిన సామాజిక సందర్భం లేక పోవటం కూడా వొక పెద్ద కారణం. అటువంటి సందర్భాన్ని నిర్మించుకోవటానికి కావలసిన సరంజామా రెండవ ప్రపంచ యుద్ధానికి అటూ ఇటూగా కొడవటిగంటి కుటుంబ రావు గారి సృష్టించిన సాహిత్యంలో పుష్కలంగా వున్నప్పటికీ, ఎవరూ ప్రయత్నం చేయక పోవటానికి కారణం పాఠకులు లేక పోవటమేనని కూడా నేనంటాను.
సినిమా నిర్మాణం హైదరాబాదుకి వచ్చిన తర్వాత పైకి నగరంలాగా ఎంత కనపడినా, హైదరాబాదు లో సామాజిక జీవితం పూర్తిగా గ్రామీణ జీవితానికి ఒక ఎక్స్ టెన్షన్ మాత్రమే. హైదరాబాదులో పేరున్న రచయితలెవరూ కూడా ఈ నగరంతో చాలా కాలంగా సజీవ సంబంధాలున్న వారు కాదు. ఇందులో తెలుగు భాష ప్రాంతీయతా పలుకుబళ్ళకి సంబంధించిన రాజకీయాలు చాలా ప్రముఖ పాత్రే వహించాయి.. హైదరాబాదులో వుండి రచయితలము అని చెప్పుకునే వాళ్ళలో ఎంత మందికి వాళ్ల వార్డు కార్పొరేటర్ మొహమయినా తెలిసి వుంటుందా, హైదరాబాదులో వాళ్ళు వుండే ప్రాంతం పేరు ఒక పాతిక సంవత్సరాల క్రితం ఏమయి వుంటుందో, ఆ పక్కనే వున్న గుడిలో దేవత పేరయినా తెలుస్తుందా అని ఆలోచిస్తే సమాధానం తేలికగా దొరకదు. అంటే వొక రకంగా చెప్పాలంటే – డయాస్పోరా జీవితం గురించి వేలూరు గారు చెప్పిన అంశాలలో ముఖ్యమైనవి – హైదరాబాదులో వున్న తెలుగు వారికి కూడా వర్తిస్తాయి.
నగర జీవితాన్ని పూర్తి గా వంట పట్టించుకుని రాసిన రచయితగా కనపడేది – కుప్పిలి పద్మ వొక్కతే. అది కూడా , వస్తువు, సన్నివేశమూ ఒక యువతి అంతరంగానికి మాత్రమే పరిమితమయి వుండటంతో ఎంతో ముందుకు పోలేక ఆగి పోయింది. అక్కడినించి ముందుకు వెళ్ళటానికి దారి చూపించే తాత్విక దృక్పథమో, నిర్మాణ రూపమో ఇచ్చే బాధ్యత ఎవరిదయినట్టు?
మొత్తమ్మీద క్లుప్తంగా – పవర్ పాయింటు బుల్లెట్ల రూపంలో చెప్పుకోవాలంటే — మీరు కధలు రాయండి – మేము వొడ్డున కూచుని ఎవరు బాగా ఈత కొడుతున్నారో మార్కులేస్తాము అనే పద్ధతిలో విమర్శ సాగుతుండటం తెలుగు కథ ఈడిగిల పడటానికి ఒక పెద్ద కారణం. వూహా శక్తిని ఛాలెంజీ చేసే విమర్శకులూ, భాష్యకారులూ, దానిని పదును పెట్టే సామాజిక నిర్మాణాలు తయారు చేసుకోవటం అన్నది పాఠకులకీ , విమర్శకులకీ, రచయితలకీ ఒక ఉమ్మడి బాధ్యత.
వాల్ స్ట్రీటు లో అంతర్జాతీయ బాంకు కుప్ప కూలితే, కువైట్ ఎయిర్ పోర్టులో తారస పడ్డ పని పిల్ల తమ్ముడు నర్సీ పట్నంలో గొల్లు మంటాడు. టాంకు బండ్ మీద సాయంత్రం ఆరుగంటలకి మనమల్ని తీసుకుని వచ్చే వృద్ధ దంపతులకి అల్లుడు కొత్త సాఫ్టువేర్ నేర్చుకోకుండా టైం వేస్టు చేస్తున్నాడేమో నని అనుమానం వస్తోంది. ఆకలేస్తోందని అత్త మామలకి ఎట్లా చెప్పాలో తెలియడం లేదని అమెరికాలో వుద్యోగం చేస్తున్న మొగుడికి చెప్తే కోపం వస్తుందేమోనని కొత్త కోడలు భయ పడుతోంది. అపార్టుమెంటు కాంప్లెక్సులో పొరుగువాళ్ళ గొడవలు పట్టించుకునే పిన్ని గార్లు కూడా దొరకటం లేదు. ఆ కోడలు ఏదో ఒక రకంగా బతకడం నేర్చుకుంటోంది. లేక పోతే బుద్ధ పూర్ణిమ ఆఫీసు పక్కనించో సంజీవయ్య పార్కు మూలనించో హుసేన్ సాగర్లో దూకేస్తోంది. మూసిన తలుపుల వెనక అమెరికన్ సబర్బియాలోనూ, ఐటి కంపెనీల హెడ్ క్వార్టర్లలోనూ, హైదరాబాదు ఫిలిం నగర్లోనూ, ఋషికొండ వెనక రిసార్టు లోనూ ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. వీటన్నిటిమీదా బహిరంగంగా భాష్యం చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. బాపట్ల నించో, జనగామ నించో , సంతనూతల పాడునించో రక రకాల మనుషులు చేసే ప్రయాణాలకధలు ఎన్నయినా చెప్పవచ్చును. కానీ వినే వారిని తయారు చేసే బాధ్యత కూడా ఎవరో వొకరు తీసుకోవాలి కదా ? చెప్ప గలిగే రచయితలకి కావలసిన ధైర్యాన్ని ఇచ్చి, సోషలైజ్ చేసే నిర్మాణం ఎవరో ఒకరు చేయాలి కదా ?
వుదాహరణలు ఇస్తే ఇంకా బాగుండేదన్నారు కాబట్టి — ఒక పుస్తకం పేరు చెప్తున్నాను. “Global Bodyshopping An Indian Labour System in the Information Technology Industry”
Author : Xiang Biao Publisher: Princeton University Press. ఈ పుస్తకం చదవడానికి క్లిష్టంగా అనిపించినప్పటికీ ప్రయత్నం చేసి చదవ దగిన పుస్తకం. ఈ పుస్తకం జియాంగ్ బియావ్ మొదట పీహెచ్ డీ థీసిస్ గా వ్రాసినది. హైదరాబాదు నించి –ఒక వైపు ఐటి వుద్యోగుల సొంత వూళ్ళకీ , మరొక పక్క వాళ్ళు విదేశాలలో వాళ్ళు వుద్యోగాలు చేసుకోవటానికి వెళ్ళే వూళ్ళకీ ప్రయాణం చేస్తూ, ఈ వుద్యోగుల జీవితాలు ఎట్లా మారుతున్నాయో వివరించే పుస్తకం ఇది. నాకు తెలిసినంతలో తెలుగు వారి జీవితాలలొ 1995 తరువాత వచ్చిన మార్పులని ఈ మాత్రంగానయినా పరిశీలించిన పుస్తకం ఈ కోణం నించి పరిశీలించే పుస్తకం మరొకటి లేదు.
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/06/2010 1:03 am
ఉపేంద్రగారూ!! మీ అభిప్రాయం మరికొంచెం క్లుప్తం గానూ..సరళమైన వాక్యాలతోనూ ఉండిఉంటే ఎక్కువ బాగుండేదనుకుంటున్నాను. మీరు వేసిన ప్రశ్నల ననువర్తిస్తూ కనీసం ఒకటి రెండు కధలని పేర్కొని [ప్రవాసాంధ్రులవే కానఖ్ఖరలేదు..ఇటీవలి తెలుగు కధలైనా గానీ..మీ అభిప్రాయాలకి బలాన్నిచ్చేవిధంగా ] ఉంటే మరింతవీలుగా ఉండి ఉండేది కూడా!!
పొగాకు వ్యాపారస్తుల మిగులుధనం[ surplus economy] మీడియాలో చేరి చేసిన నష్టం ఎలాంటిదో మనకి కధలు వచ్చాయా? అసలు సినిమాని నేపధ్యంగా చేసుకుని రాసినవి. ముళ్ళపూడి వెంకట రమణ, రావి కొండలరావు, ప్రసన్న కుమార్ సర్రాజు వంటి వాళ్ళు రాసిన కధలు ఉన్నా ఈ కోణం అందులో లేదనుకుంటాను. ఈ మధ్య సినిమా పెట్టుబడిలోని విధ్వంసాన్ని గురించి కూడా వచ్చిన కధలు అరుదే!!
బయటి దేశాలకి పిల్లలు వెళ్తూ అక్కడినించి రాకపోకలు తగ్గి క్రమేణా కుటుంబ సంబంధాల్లో వస్తున్న ఒంటరితనాల మీద కధలు బాగానే వచ్చినట్టున్నాయి, కానీ చప్పున అందులోంచి గుర్తుపెట్టుకోగల కధ ఏమన్నా ఉందా అంటే మాత్రం జవాబు కన్పించడంలేదు. తెలుగుదేశాన “కధ” ఇంకా గ్రామీణ వాతావరణమ్ లోంచి వస్తున్న వైనమ్ మనమ్ గుర్తించవచ్చు. ఒక మూసధోరణి లో కధలు ఉండటం ..కధానిర్మాణలో గానీ..శైలీ సంవిధానంలోగానీ చెప్పుకోతగ్గ కధ రాకపోవడమూ కూడా ఉంది. మీరు చెప్పినట్టూ ” ఉద్యమాల” ప్రభావం ఈనాటికీ తెలుగు కధ మీద బలంగానే ఉంది. సిధ్ధాంతాలు సృజనమీద యధాతధంగా వ్యక్తీకరణలోకి చొచ్చుకురాకూడదని తెలుగులో కధలు రాసే వాళ్ళు ఇంకా నమ్ముతున్నట్టు కనబడదు. అది ఒక బలమైన కారణమే తెలుగు కధలో పస చావడానికి.
ఇంక ప్రవాసాంధ్ర కధ విషయానికి వచ్చినాకూడా జీవితలో ఉన్న సంక్లిష్టత కధనలోకి రాగా నేను చూడలేదు. అందుకు కధకుల ఊహాలేమిని నెపమ్పెట్టక తప్పదు. కధరాసే వాళ్ళు ఏ పాఠకుల కోసం రాస్తున్నారూ..ఏం చెప్పాలని రాస్తున్నారూ అన్నది కూడా అంతే ముఖ్యం. కాళీపట్నమ్ రామారావుగారు “యజ్నం” లో ఆర్ధిక సంబంధాలు మనిషి జీవితాన్ని ఎంతగా విధ్వంసమ్ చేసిందీ గాఢంగా చెప్పారు. ఆ కధని మరిచిపోలేకపోవడమ్ అందువల్లనే! అలాంటి గాఢత ఉన్న కధలు అటు తర్వాతి కాలంలో అస్సలు లేవని కాదు కానీ సంఖ్యలో తక్కువ.
కన్నడిగుడైన రాజారావు తన ప్రపంచానుభవాన్ని వ్యక్తీకరించిన వైనం డయాస్పోరా సృజనకి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. జీవితాన్ని ఆయన చూసిన తీరూ..దాన్ని తన నవలల్లో చూపించినతీరూ గొప్పగా ఉంటాయి. వాళ్ళకి పేరు ఊరికే రాలేదు. అలాగే ఎ.కె.రామానుజన్ కూడా! అలాగ తెలుగులో ఎవరూ ఇవాళ్టిదాకా అమెరికానించి గానీ..లేదా ఇతర యూరోప్ దేశాలనించిగానీ మనకి కన్పించడలేదు. ఒక్క విమర్శలో మాత్రం వెల్చేరు నారాయణరావు చెప్పుకోతగ్గ కృషిచేసారు.
ఏతావాతా చెప్పేదేమంటే రాస్తున్నవాళ్ళు ఆ ప్రక్రియకి తగినవాళ్ళు కాకపోవడమో..లేదా రాయతగిన వాళ్ళు ఇంకా ఈ ప్రక్రియ వైపు చూపుతిప్పక పోవడమో జరుగుతున్నట్టు అర్ధమ్ చేసుకోవచ్చు. ఎవరెంత చెప్పుకున్నా ఒక ఇతివృత్తమ్ మీద పట్టూ ..దాని నిర్మాణపు విషయంలో సామర్ధ్యం రెండూ పుష్కలంగా లేనిదే కధలు పుట్టవు. అందువలన మీడియోకర్ రచనలే వస్తాయి. వాటిని పెద్దగా పాఠకులు గుర్తించరు. ఎన్ని సంకలనాలు రానీ గాక ఫలితమ్ ఒకటే! బహుశా ఉత్తరోత్తరా తరువాతి తరాల్లో ఇంకెవరైనా కాల్పనిక సాహిత్యం పట్ల నిజంగా శ్రధ్ధ కలిగిన వారు మంచి సృజన కల్గిన వారూ ఇందులోకి అడుగిడితే తప్ప.
రమ.
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
03/05/2010 2:26 am
ఈ సంకలనాన్ని నేను ఇప్పట్లో చదివే అవకాశం లేదు. నేను ఈ క్రింద రాసినది కేవలం ఈ సమీక్షా వ్యాసానికి స్పందన మాత్రమే. అది కూడా, బ్లాక్ అట్లాంటిక్ , తెలుగు డయా స్పోరా, హెమింగ్వే మూడూ ఒకే వ్యాసంలో చోటుచేసుకోవటం ముచ్చటగా అనిపించినందు వల్లనే.
వెబ్ పత్రికల్లో స్థలాభావం అన్న సమస్య వుండదు కాబట్టి వెంకటేశ్వరరావు గారు కొంచెం వివరంగా చెప్పి వుండవలసిన ది . బ్లాక్ అట్లాంటిక్ పుస్తకం , ‘దేశము’ అనే భౌగోళిక ఎల్లలను దాటే జీవితానుభవాలలో ( బానిస వ్యాపారాల ద్వారా నయితేనేమి, బానిసత్వాన్నించి బయట పడటంలో నయితేనేమి), నల్లజాతీయులు పడిన ఘర్షణలో చైతన్యపు పొరలు ఎట్లా ఏర్పడ్డాయి అన్నది తవ్వి తీసే పుస్తకం. జాతి, దేశము ఈ రెండూ కూడా చరిత్ర గమనములో ఏర్పడిన శిలాజాలే తప్ప వాటికి కాలాతీతమైన వునికి ఏమీ వుండదు అన్న జ్ఞానం , బ్లాక్ అట్లాంటిక్ పుస్తకానికి వుపోద్ఘాతంగా చెప్పుకోవచ్చును. అక్కడినించి ఎత్తుకుని, పాల్ గిల్రాయ్ ఈ నల్లజాతి చైతన్యపు పార్శ్వాలను తడుముకుంటూ దాని రూపు రేఖాలను పునర్నిర్మిస్తాడు. ఇక్కడ ‘పునర్నిర్మిస్తాడు’ అన్న మాట కావాలని వాడుతున్నదే. సాంస్కృతిక విమర్శ అయినా సాహిత్య సృష్టి అయినా మనిషి చైతన్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలే — ఒక్కొక్క సారి అవి విజయవంతంగా, అందరికీ పనికొచ్చేలా జరిగితే, ఒక్కొక్క సారి ప్రయత్నం కూడా చేయకుండా విఫలమైపోతాయి.
పాల్ గిల్రాయ్ రాసిన బ్లాక్ అట్లాంటిక్ పుస్తకాన్ని కానీ, హెమింగ్వే కధల్లోనూ, జర్నలిస్టుగా నూ ఆవిష్కరించిన సత్యాలను కానీ, మనకి పనికొచ్చేలా అన్వయించుకోవాలంటే, ప్రయత్న పూర్వకంగా మనం చేయాల్సిన పని చాలా వుంది. వేంకటేశ్వర రావు గారు, చూచాయగా చెప్పి వదిలేసిన విషయాన్నే తీసుకుందాము. తెలుగు వారు అమెరికాలో వుంటున్నా ఆంధ్రలో వుంటున్నట్టే ఎందుకు కనపడతారు ? ఇది తెలుగు వారో, వారి తరఫున , తెలుగు కథలూ కవిత్వమూ రాసే వారో తమ ధోరణి కొంచెం మార్చుకుంటే మారిపోతుందా ? తెలుగు లో అమెరికా లో వస్తున్న కథలూ, ఆంధ్ర ప్రదేశ్ లో వస్తున్న కథలూ ఒకేలా వుండటానికి కారణం కేవలం వూహా శక్తి లోపించటమే మరేమైనా వుందా ?
ఇలాటి ప్రశ్నలకు తెలుగు భాష మాట్లాడే వాళ్లంతా ఒక జాతికి చెందిన వారు అన్న అభిప్రాయం ఎప్పుడూ ఎలావచ్చిందో అన్న దగ్గర మొదలు పెట్టుకోవచ్చును. ఈ తెలుగు జాతి అన్న శిలాజంలో జిల్లాల వారీగా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఏ యే సంఘర్షణల చిహ్నాలు కనిపిస్తాయి అన్నది కూడా ఆలోచించ వలసిన విషయమే. వేంకటేశ్వర రావు గారు సూచించిన కాల పరిధి లో ఆంధ్ర ప్రదేశ్ లో సాంఘిక జీవనంలో చాలా పెద్ద ఎత్తున తుఫానులు వచ్చాయి. నాగార్జున సాగర్ కట్టడంతో – గుంటూరు జిల్లా గుర్తు పట్ట రానంతగా మారిపోయింది.
కొద్ది రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లా జంగా రెడ్డి గూడెం నించి, మద్రాసు పాండీ బజారు వరకూ, గుంటూరు జిల్లా పిడుగు రాళ్లనించి హైదరాబాదు శివార్లలో ఈ మేడ్చల్, హైదరాబాదులోనే ఏ యెస్ రావు నగర్ నించి యెల్బీ నగర్ వరకూ ఇటు తిరిగి ఇటు తిరిగీ అమీర్ పేట నించి డెట్రాయిట్ వరకూ ఈ మార్పుల తాలూకా ప్రభావం కనిపిస్తుంది.(ఇక్కడ శిలాజం అన్న మాట ఇంగ్లీషులో ఫాసిల్ అన్న మాటకి తత్సమంగా వాడుతున్నట్లు అనిపించొచ్చు. సామాజిక రూపాలు పూర్తిగా ఫాసిల్స్ గా ఎప్పుడూ వుండవు. పొలం గట్ల లాగా అవి నీరు పారటానికి మార్గాలు చూపించినా ఎప్పటికప్పుడు ప్రయత్న పూర్వకంగానో అప్రయత్నంగానో మారుతూనే వుంటాయి. )
అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవన చరిత్ర వేంకటేశ్వర రావు గారు చెప్పినట్లు – అంతా కలిపి నలభై ఏళ్లు కూడా వుండదు. అమెరికాలో పంజాబీల చరిత్ర దాదాపు వంద సంవత్సరాలుంటుంది. అమెరికాలో గుజరాతీల రోజు వారీ జీవితం , వ్యాపార రంగం ద్వారా అమెరికన్ నాగరికుల రోజు వారీ జీవితంతో కలిసి వుంటుంది. బెంగాలీల సాంస్కృతిక జీవనం – అమెరికన్ యూనివర్సిటీల మేధోత్పాదనలో — ప్రత్యేకించి – లిటరేచర్ , హిస్టరీ , ఇలాటి డిపార్టుమెంట్లలో పెద్ద పాత్ర వహిస్తుంది. ఈ భాషలు మాట్లాడే వాళ్లంతా ఈయీ పనులే చేస్తుంటారని కాదు కానీ, వారి చైతన్యంలో ఈ అనుభవాల ప్రభావం చాలానే వుంటుంది. వేంకటేశ్వర రావు గారు సూచించినట్లు – అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవనంలో ఆఫీసుల్లో , ప్రత్యేకించి ఐటి రంగంలో పనులు చేసుకోవటం, గ్రీన్ కార్డు సంపాదించుకోవటం, కట్నం మాట్లాడుకోవడం , పెళ్లిళ్లు చేసుకోవడం, హైదరాబాదులాంటి చోట ఇల్లో స్థలమో కొనుక్కోవడం, తెల్ల అమెరికన్ సబర్బన్ లైఫ్ లో ఒక చిన్న చోటు వెతుక్కోవటం, ఇలాటివి చాలా ముఖ్యమైన ఘట్టాలు. ఇక్కడా అక్కడా కూడా నగర జీవితంతో సంబంధం లేకుండా , పెళ్లిళ్లూ కట్నాల ద్వారానో , వ్యవసాయమూ – దాన్ని అంటుకునుని వుండే ఇతర రంగాలనుండి కుటుంబాలు మిగుల్చుకున్న డబ్బులతోనో – తల్లి తండ్రులు గుట్టు గా సర్కారీ వుద్యోగాలు చేసుకుని మిగుల్చుకున్న డబ్బులతోనో, అమెరికాకి పోవటం అన్నది సర్వత్రా జరిగింది.
హైదరాబాదు లో ఏదో కొన్నేళ్ళు వుండి , అక్కడ కొంత ఆధారం సంపాదించుకున్నాకూడా, ఇలాటి ప్రవాసులలో ఎవరూ కూడా – తమ చుట్టూ కమ్ముకు వస్తున్న పెను మార్పులని గమనించేటంత వోపిక వున్న వాళ్ళు కాదు. అమెరికా దాకా ఎందుకు – గ్రామం వదిలి, చిన్న పట్టణం, చిన్న పట్టణం వదిలి హైదరాబాదు నగరం , హైదరాబాదు నగరం నించి అమెరికాకో, యూరప్ కో ఎగిరి వెళ్ళటం — ఈ క్రమంలో కూడా ఎక్కడా కూడా కొంచెం వూపిరి పీల్చుకుని, తమ చుట్టూ ఏమీ జరుగుతోందో తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ముందు పరిస్థితి ఇంత ఇరుకుగా వుండేది కాదనుకుంటాను. తెనాలి లో వున్నా, విజయవాడలో వున్నా, వరంగల్లు లోనో , హైదరాబాదులోనో వున్నా తమ చుట్టూతా ఏమి జరుగుతోందో తెలుసుకోక తప్పేది కాదు. బతుకు తెరువుకోసమే అయినా బొంబాయికో, మద్రాసుకో వెళ్ళే వాళ్ళు. ఆ వెళ్లిన అనుభవానికి కేవలం వ్యక్తిగత పరిధిలో కాకుండా పెద్ద కాన్వాసులో భాష్యం చెప్పుకునే వాళ్ళు.
ఎమెర్జెన్సీ తరవాత – ప్రత్యేకించి, ఈనాడు పత్రిక బలంగా ఎదిగిన తర్వాత, తెలుగు దేశం పార్టీ ఉవ్వెత్తున వచ్చిన తర్వాత దేశ రాజకీయాలలో తెలుగు సాంఘిక జీవనమూ, ఆంధ్ర ప్రదేశ్ లో కుటుంబ జీవనమూ పూర్తిగా అంతర్ముఖమైపోయినాయి. జీవితాన్ని , సాహిత్యాన్ని అనుభవించడం కాకుండా వినిమయం చేసుకోవటం పాతుకు పోయింది. సినిమాలు ఈ విషయంలో చాలా కృషి చేసాయనే చెప్పుకోవాలి. ( గుంటూరు జిల్లా వ్యవసాయపు మిగులు ధనం మద్రాసు వెళ్ళి పనికిమాలిన చెత్త ఎట్లా ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిందో – బాలగోపాల్ ఎక్కడో చాలా చక్కగా చెప్పినట్టు గుర్తు). తెలుగు మాట్లాడే వాళ్ళ జ్ఞానేంద్రియాలకి ఆవకాయకీ, ఆత్మకధకీ తేడా తెలియకుండా అయిపోయింది. ఒకే తూనిక రాయి — ఎంత మంది కొన్నారు, ఎంత మంది ఆమోదించారు, ఏ సెలెబ్రిటీ ఎండోర్స్ చేశారు – ఇదీ లెక్క.
అది జరుగుతుండగానే విప్లవ రాజకీయాల పట్ల ఏదో ఒక రోమాంటిక్ వూహాలుండటమూ , అలా మాకు వున్నాయని – అది లేని వాళ్ళందరూ ఉదారవాద మూర్ఖులో, వర్గ శత్రువులో అయి వుంటారని బూకరించటం లోనే సాహిత్య విమర్శకులకు తీరిక లేకుండా పోయింది. మొదట్లో విమర్శకులు చేసిన ఈ పనిని, తరవాత తరవాత రచయితలూ, రచయిత్రులూ, కవులూ, కవయిత్రులూ వాళ్ళని సమర్ధించే వాళ్లూ కూడా అలవాటు చేసేసుకున్నారు. ఇటువంటి సంస్కృతిలో ఎవరికీ దేని పట్లా జవాబు దారీ తనం వుండదు. కష్ట పడి పని నేర్చుకోవలసిన అవసరమూ వుండదు. బుకాయించటం, బూకరించటం వస్తే చాలు. మహా అయితే, తమ కులానికో, తమ వీధికో, తమ జిల్లాకో సంబంధించిన కొంత పనికి మాలిన జ్ఞానం సంపాదించుకుంటే చాలు.
బతకడానికి సరిపోయే దినుసులే ఇట్లా వుంటే ఇందులోంచి సాహిత్యం పుట్టించాలంటే దానికి కావలసిన పనిముట్లు ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సిన అవసరం వుంది. విమర్శకులు చేయ వలసిన పని అది.
తెలుగులో మంచి కధ ఎట్లా వుండాలి అని చెప్పే కన్నా, మనకు కనపడుతున్న సాహిత్యంలో ఏవి మంచి ధోరణులు — అన్నది చెప్పుకోవలసిన అవసరం వున్నది అని మాలతి గారు అడగటం సబబే. కానీ , దానికి సమాధానం ఇప్పుడు వస్తున్న తెలుగు కధల్లోనించే వెతుక్కో నవసరం లేదు. తెలుగు సాహిత్యం మొత్తం నించే కాక ఇతర భారతీయ భాషలనించో ప్రపంచ సాహిత్యంలో ఎక్కడినించో నయినా చూపించుకోవచ్చును. అసలు కధల వూసే ఎత్తకుండా తెలుగు వారి సంస్కృతులని నిర్మొహమాటంగా విమర్శించి చెప్పుకున్నా చాలు.
రోజు వారీ జీవితంలో లేని లోతుని పాఠకులకి అందు బాటులోకి తేవటం రచయిత చేయవలసిన పని. దానికి కావలసిన నైపుణ్యం షెల్ఫ్ మీద దొరకదు. తయారు చేసుకోవాలి. తెలుగు డయాస్పోరా రూపు రేఖలూ, దాని చైతన్యానికి ఆయువు పట్లూ ఇలాటి వాటి గురించి మాట్లాడుకోవటం ఆ దిశగా ఒక మంచి అడుగే. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. సమస్యకి మూలం ఎక్కడో స్థూలంగానానయినా గుర్తించ గలిగితే, ఆ తరువాత దానికి పరిష్కారాలు అందులోంచే దొరుకుతాయి.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/01/2010 8:50 pm
లతా మంగేశ్కర్ పాటలు పాడడం మొదలుపెట్టాక మహిళల గొంతులకు character అనేది లేకుండా పోవడం “మంచి” లక్షణంగా రూపొందింది. అద్భుతమైన కంఠంతో ఏ హీరోయిన్‌కైనా, ఏ సందర్భానికైనా సరిపోతుందనిపించే శైలి ఆమెకు ఉండడం అన్నివిధాలా లాభించింది. ఈ లాభం ఆమెకూ, హీరోయిన్లకూ, వినేవారికీ అందరికీ ఉపయోగపడింది.
లతాకన్నా ఎక్కువ “పర్సనాలిటీ” ఉన్న గొంతుతో ఆశా భోంస్లే రెండోస్థానంలోకి వచ్చింది.
ఆ తరవాత అంతకు ముందునుంచీ పాడుతున్న శంశాద్, నూర్జహాన్, సురైయాలూ, తరవాత వచ్చిన గీతాదత్ మొదలైనవారికీ పాడే శైలిలో ప్రత్యేక వ్యక్తిత్వం ఉండడం కాస్త ప్రతిబంధకంగా అనిపించసాగింది. అందుకే వారంతా ఒక్కో రకం పాటలకే పనికొస్తారనే భావన బలపడింది. తెలుగులో సుశీల సరిగ్గా లతా పద్ధతిలోనే తయారయింది.
నూర్జహాన్, సురైయా ఇతరులకు ప్లేబాక్ పాడలేదు కనక వారికి ఇది పెద్ద సమస్య కాలేదు. మనవారిలో భానుమతిదీ, ఎస్ వరలక్ష్మిదీ కూడా అదే పరిస్థితి. వీరిలో వరలక్ష్మి మరెవరికైనా పాడడానికి సిద్ధపడేదేమో తెలియదు కాని ఆమెకు కూడా “ప్రత్యేకంగా” వినిపించే గొంతు ఉండేది. అయితే ఆమె గానపటిమ అసామాన్యమైనదని ఏ పాట విన్నా తెలిసిపోతుంది. ఆమె చివరి రోజుల ఆర్థిక ఇబ్బందుల గురించి రావి కొండలరావు బాగా రాశారు.
ఆమెను తలుచుకునే అవకాశం కల్పించిన శ్రీనివాస్ అభినందనీయుడు.
తెలుగు వీర లేవరా గురించి ఒక అజ్నాత(న) పాఠకుడు గారి అభిప్రాయం:
02/28/2010 6:11 pm
“ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి..చురకత్తులు పదును పెట్టి…”
అ. ప్రప్రథమంగా విన్నవించవలసింది, తెలుగు భాష వ్యాకరణం ప్రకారం, “తొడలు”, “శృంఖలాలు”, “చురకత్తులు” అనేవి విశేషణాలు కావు. అవి కర్మలు (direct objects). ఇది ముందుగా అర్థం జేసుకోవలయును. “గొట్టి”, “పగులగొట్టి”, “పదును పెట్టి” అనేవి క్రియలు. ఒకే కర్తకు బహు క్రియలు గలవు. ఇది చాలా సరి అయిన విషయమే. అటులనే విశేషణానికి ఏకవచనం, బహువచనం అనేవి వుండను. వచనం అనేది నామవాచకానికి (noun) మాత్రమే ఉండుని. కర్త యొక్క వచనాన్ని అనుసరించి, క్రియా రూపంలో తేడా ఉండును. “రాముడు అరటిపళ్ళు తినెను”, “రాముడూ మరియూ కృష్ణుడూ అరటిపళ్ళు తినిరి” అనే వాక్యములో కర్త వచనము బట్టి, క్రియా రూపములు, “తినెను”, “తినిరి” అని వుండును. గావున విశేషణానికి వచనం లేదు.
ఆ. ఒక వాక్యములో కర్త ఏక వచనంలో వున్నప్పుడు కర్మ అదే వచనంలో వుండనక్కర లేదు. కర్తా, క్రియా రూపం మాత్రమే ఒకే వచనంలో వుండవలయును. “రాముడు అరటిపళ్ళు తిన్నాడు” అన్న వాక్యంలో వున్న కర్మ బహువచనంలో వుంది. అది సరి అయినదే. తప్పు ఎంత మాత్రమూ కాదు. “రాముడూ మరియూ కృష్ణుడూ కలిసి ఒక బొమ్మను తయారుజేసెను” అన్న వాక్యంలో కర్త(లు) బహువచనం. కర్మ (బొమ్మ) ఏకవచనం.
ఇ. ఒక మనిషికి రెండు తొడలు గలవు. ఒక మనిషికి కాళ్ళకూ, చేతులకూ వేరు వేరు శృంఖలాలు వుండగలవు. ఒకే ఒక చురకత్తి బదులు, బహు చురకత్తులు పదును బెట్టవచ్చును ఒక దాని తరువాత ఒకటిగా. ఏకవచనంలో వున్న కర్త (మనిషి)కి బహువచనంలో కర్మలు వుండటం తప్పు కాదు.
ఈ. ఇచ్చట ఉదహరింపబడిన వాక్యంలో ఎటువంటి తప్పూ లేదు. వాక్యం చక్కగానే వున్నది. నేను వ్యాకరణం ప్రకారం “ప్రతి మనిషి” అనేది ఏకవచనం మాత్రమే ననియూ, బహువచనం ఎంత మాత్రం కాదనియూ మాత్రమే ఉటంకించాను. ఇది ఒక భాషకు సంబంధించిన విషయం గావున, భాషా జ్నానం ప్రకారం నేనట్టు చెప్పి ఉంటిని.
ఉ. మీరు, “శ్రీశ్రీ ఆంగ్ల వ్యాకరణముననుసరించి తెలుగు వాక్యములు రాసిన కవి కాడు గావున ఆయనని తెలుగు భావుకునిగా గ్రహించి మీరు తరింతురు గాక! ” అని అని ఉంటిరి. ఆంగ్ల వ్యాకరణం అనుసరించి తెలుగు వాక్యములను కవి రాయవలెను అని నేను ఉటంకించలేదు. మీరట్లు అపోహ పడి నా మీద ఇటువంటి ఆభాండములు వేయుట విజ్నులయిన మీకు భావ్యము కాదు. అర్థము తెలియజేయగలందుకు మాత్రమే ఆంగ్ల వ్యాకరణం కూడా ఉదహరించితిని. అంతెయును గాక, కర్త, క్రియ, కర్మ, విశేషణం, వచనం వంటి విషయాలలో రెండు భాషల వ్యాకరణం ఒకదానిని ఒకటి పోలి ఉండును. సులభంగా గ్రహించుటకు మాత్రమే అంగ్ల భాషా వ్యాకరణమును వివరించితిని. అందువలన ఇటువంటి వ్యక్తిగత దూషణలు మీకు శోభ నివ్వవు. సాహిత్య చర్చలో కొంచెం సంయమనం అవసరం.
ఊ. ఆఖరుగా మీరు, “మీకు వ్యాకరణమ్ మీద చాలా పట్టు ఉన్నట్లైతే మీరు కవిత్వాన్ని చదవడమ్ మానేసి చిన్నయ సూరి గారిని అను నిత్యమూ పఠింతురు గాక!!” అని నన్ను వ్యక్తిగతంగా దూషించితిరి. ఇది నాకు మిక్కిలి ఖేదము కలిగించెను. నా వ్యాఖ్యానంలో నేను మిమ్ములను ఒక చిన్న మాట చేత కూడా దూషించలేదు. నన్ను దూషించుటకు మీకు ఎటువంటి హక్కు కలదో నాకు ఈ జన్మమున అర్థము కాదు. నాకు సలహా ఇచ్చే ఆగత్యం మీకు ఎంత మాత్రమూ లేదని నేను ఎంత గానో నమ్ముతూ ఉన్నవాడను. మీరు సాహిత్య సంయమనం పాటించకుండా, ఇటుల రహాదారి మీద ఒకరితో ఒకరు కలియబడి, కలహించుకున్నట్లు చర్చించిన, మీ మీద ఈమాట సంపాదక వర్గానికి ఆరోపణ చేయడం తప్ప వేరే మార్గము లేదు.
ఋ. అజ్నాత పాఠకులకు కూడా అభిప్రాయములు ఉండుననియూ, అవి వెలిబుచ్చు హక్కూ, అర్హతా వారికి ఉండుననియూ మీరు గమనించకపోవుట బహు శోచనీయమైన విషయము. ఒకరిని అవమానించే హక్కు ఎవరికీ ఎంత మాత్రమూ లేదు. కావున మీరు ఇక మీ వాఖ్యలు విషయమునకు మాత్రమే పరిమితం జేయగలరని ఆశిస్తున్నాను. ఒకరు తమకు ఎంత జ్నానం కలదు అని నమ్మినా, లేని జ్నానం ఎంతో ఉండి ఉంటూనే ఉండును. ఏ ఒక్కరూ సర్వ జ్నాని కాలేరు అని నేను బాగుగా నమ్మువాడను. ఎవరి జ్నానమునకు తోచినట్టు వారు వారి అభిప్రాయములను వెలిబుచ్చుట, అటులనే ఇంకొకరు వెలిబుచ్చిన అభిప్రాయములను గౌరవించుట నాగరీక లక్షణమని నేను వేరే నొక్కి ఒక్కాణించవలసిన ఆగత్యం ఎంత మాత్రమూ లేదు. ప్రతి ఒక్కరి వాఖ్యలూ విషయమునకు మాత్రమే పరిమితం అయి ఉండవలయు. అది వ్రాసిన వారికి సంబంధించి ఉండి ఉండకూడదు. ఇది మీరు గ్రహించగలరని ఆశిస్తున్నాను.
ఇట్లు,
నమస్కారములతో
అజ్నాత(న) పాఠకుడు.
తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
02/28/2010 6:51 am
రమగారూ,
తనమీద తనకు నమ్మకం లేని వాళ్ళు, ఇతరుల మీద పువ్వులు వేసి పూజించో, రాళ్ళు వేసి నిరసించో తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవటానికి తాపత్రయపడతారు. ఎవరు ఏమి చేస్తున్నారో సర్వే చేసి నిరూపించటానికి సాధ్యం కాని విషయం కాబట్టి వదిలేస్తే మంచిది.
నటశేఖర కృష్ణ , టికెట్లు కొనుక్కుని సినిమా చూసిన ప్రజలు – ఈ రెండు కాగడాల మధ్యన ప్రజ్వరిల్లుతున్న అఖండ జ్యోతి శ్రీ శ్రీ రాసినపాట అనటమే తప్ప, ఈ పాట గురించి మీకున్న అవగాహన ఏమై వుంటుందా అని ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. మహాకవి సృష్టిని బేరీజు వేయటానికి మీరు వాడే కొలమానాలు ఇంత పేలవంగా వుంటే ఏమి మాట్లాడాలో తెలియక, మీరు కిందటిసారి రాసిన అభిప్రాయానికి నేను జవాబు చెప్పలేదు. ఇంకొంచెం వూరుకుంటే అన్నమాచార్యుల దగ్గర నించి ఇంకా వెనక్కి వెళ్ళేటట్లున్నారు కాబట్టి మాట్లాడ వలసి వస్తోంది.
తెలుగు వీర లేవరా అన్న పాట తెలుగు భాషా పరమైన జాతీయతని వు ద్బోధించే గీతం. ఆ పాట రాసే నాటికి ఆయన తెలంగాణ ప్రాంతంలో వావిలాల గోపాల కృష్ణ గారితో కలిసి తెలంగాణ వుద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వున్నారు. విరసం సంస్థకి అధ్యక్షుడైనాడు. ఈ కారణాలన్నిటి వలనా, ఆ పాటని ఆనాటి రాజకీయ నేపథ్యంనుంచి వేరు చేసి చూడటం నా వల్ల కాదు. అలాగచూడమని ఆయన కూడా కోరుకునే వాడు కాదనుకుంటాను. మీరు అలాగని కోరుకోక పోవటమే కాక, అట్లా చూడటానికి నిరాకరించిన వాళ్లంతా నిరక్షర కుక్షులయి వుంటా ర నుకుంటున్నారు. అంధకారం కమ్ముకుని వస్తున్న రోజులు అవి. వచనంలో 1970 ల వరకూ కుటుంబరావు గారి లాంటి వాళ్ళు నిర్వహించిన పాత్ర ఆ తరువాత దాదాపుగా మాయం అయి పోవటం ఆ అంధకారంలో ఒక భాగమే. కొత్త దీపాలు వెలగలెదని కాదు కాని ఆ చీకట్లలో ఎవరు ఎలాటి దీపాలు వెలిగించారు అన్నది అడగడానికి ఇప్పటికింకా చాలా మంది తటపటాయిస్తారు. ఇన్నేళ్ల తరవాత రాళ్ళు విసరడమా అన్నది కాదు. అలాటి లెక్కలు కట్టడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది అన్నది .ఆలోచించ వలసిన విషయం అని నేనను కుంటే ఆలోచించ వలసి రావటమే మీకు వింతగా వున్నట్లుంది. కనుకనే సంభాషణ ముందుకి సాగడం లేదు.
మీ అభిప్రాయాలు చూసిన తరువాత దేశమంతా ఇన్ని సాయిబాబా గుళ్ళుండగా లేనిది , శ్రీ శ్రీ కి కూడా ఒక దర్గా కట్టి మొక్కుకునే భక్తులుంటే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి లే అనిపిస్తోంది.
విషయం సజావుగా సాగి వుంటే, శ్రీశ్రీ కవిత్వాన్ని అప్పుడప్పుడు తెలుగు రాని వాళ్ళకి వినిపించి సంతోష పడి వూరుకునే వాడిని. నా కర్మ కొద్దీ, ఆయనకి సమకాలికులైన ఇతర భాషల్లోని కవులు కొంత మందిని చదివాల్సి రావడమూ, ఏవో కారణాల వలన ఎప్పుడో కంఠస్థం చేసి వదిలేసిన తెలుగు ప్రబంధాలలోనివీ, తమిళ దివ్య ప్రబంధంలోనివీ ముక్కలు తెరలు తెరలుగా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవలసి రావటం, ప్రత్యేకించి తెలుగు భాషలో దేశభక్తి గురించి, సంకుచిత ధోరణులూ, అభ్యుదయ ధోరణుల గురించి అడపా దడపా ఏదో చర్చ రావడం ఇలాటి వాటి వలన శ్రీశ్రీ గురించి మళ్ళీ ఆలోచించ వలసి వచ్చింది.
ఈలోపల, తెలుగు భాష ఏనాటికైనా జాతీయ అధికార భాషగా గుర్తించబడుతుందని ఆయన చెప్పిన మాటలు కూడా కళ్ళ బడ్డాయి. (అది చదివి కళ్ళు తిరిగాయి అని కూడా చెప్పాలి. నా మాతృభాష జన జీవనానికి చలన సూత్రం కావాలి అని ఒక కవి అంటే సంతోషించాలి కానీ, నా మాతృ భాష ఇతర మాతృ భాషలు మాట్లాడే వాళ్ళ జీవితాలను కూడా శాసించాలి అని ఒక కవి కోరుకుంటే ఆయన కవిత్వాన్ని ఆమోదించే ముందు కొంచెం జాగ్రత్త గా చదవాలి అని నా గుండె చెప్తుంది. )
కాల క్రమేణా, నేను నిర్మించుకున్న మనో ప్రపంచంలో శ్రీ శ్రీ ని ఒక పది మెట్లు కిందికి దించక తప్పలేదు.
నేను రాసిన మొదటి సారే స్పష్టంగానే చెప్పానని అనుకున్నాను. సరిపోలేదోమో నని వివరించి మళ్ళీ చెప్పాను. ఏకవచన బహు వచనాలూ, వాస్తవికతా ఇట్లా తప్పులు లెక్కించు కుంటూ పోతే ఎప్పటికీ తేలదు కానీ, ఈ పాటలో వున్న అసలు సమస్య ఇందులో వున్న భావజాలంలోని సంకుచితత్వం. ఆ సంకుచితత్వానికి పూర్తి కారణం శ్రీశ్రీ కాదు. ఆయన పాఠకులూ, ఆయన శ్రోతలూ , ఆయనని అభిమానించినవారూ, ఆయన పాటలు రాసిన సినిమాల నిర్మాతలూ కూడా పెద్ద ఎత్తున బాధ్యత వహించ వలసి వస్తుంది. అందుకే నేను వేసిన ప్రశ్నలకి ఆయనే సమాధానం చెప్పుకోవలసిన పని లేదు. తప్పు మీది. మీరు జవాబు చెప్పలేక ఆయన మీదికి తోసేస్తున్నారు.
కేవలం నా వునికిని నిరూపించుకోవడానికి సాహిత్య రంగంలో చెయ్యి చేసుకునేంత వెసులుబాటు వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా కూడా రొజు వారీ జీవితంలో వుండని వాళ్ళలో నేనూ ఒకడిని. రాయక తప్పని పరిస్థితి వచ్చిన రోజు, రాయ వలసిన పద్ధతిలో, బాధ్యతగానే దీస్ని గురించి మళ్ళీ రాస్తాను. అప్పటివరకూ, సెలవు.
శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/29/2010 2:33 am
రెండు మూడు తెలిసీ తెలియని విషయాల గురించి నాలుగు మాటలు.
శ్రీశ్రీ మీద థీసిస్ చేసింది మిరియాల లక్ష్మీపతి గారన్నారు; రామకృష్ణ గారని గుర్తు.
“నిరాశ అన్నది తాత్కాలికమైన మానసిక పరిస్థితేగాని, కవులతోబాటు ప్రతిఒక్కరు దీనికి లోనుకావటం సహజమే. మహాప్రస్థానం తరువాతి శ్రీశ్రీ పద్యాల్లో ఎక్కడా ఇటువంటి ఉదాహరణలు కనిపించవు. ఎప్పుడైనా నిరాశ వ్యక్తిగతమే.”
శరచ్చంద్రిక రాసింది మహాప్రస్థానం తర్వాతేననుకుంటాను. దాంట్లో నిరాశ తోనే మొదలెడతాడు కాని ఆశాభావంతో ముగిస్తాడు. ఇక్కడే కాక కొన్ని ఇతర పద్యాలలో కూడా ఈ నిరాశా నిస్పహలకి కారణం తన వ్యక్తిగత జీవితం కాదు, సామాన్యుని వాస్తవ జీవితం.
“నువ్వో … కావాలంటే ముందుగా కమ్యూనిస్టువి కావాలి,” అన్నదానిని చవకబారు కవిత్వమంటే ఒప్పుకోవచ్చు కాని, “నిజానికి ఏ సందేహానికైనా నిశ్చయమైన, ఖచ్చితమైన సమాధానం లభించిందని సంతృప్తిపడితే రచన ఆగిపోవటమే జరుగుతుంది,” అన్నదానికి ఇంకాస్త ఆధారాలు కావాలి. “కలడు కలండెడు వాడు కలడొ లేడో” అన్న కవి “ఇందుగలడందు లేడను సందేహము వలదు” లాంటిది రాస్తే అది కవిత్వం కాకుండా పోతుందా?
శ్రీశ్రీ జీవితాంతమూ కవిగా అన్వేషణ తోనే గడిపానని చెప్పుకున్నాడు. ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మినంతనే, ఇక తన జీవితంలో వేరే అన్వేషణే లేదనడం సరికాదు.
ఇస్మాయిల్ గారు కూడా, మహాప్రస్థానంలోని గీతాలన్నీ శ్రీశ్రీ మార్క్సిజం గురించి తెలుసుకోక మునుపు రాసినవే నన్నారు. కాపిటల్ చదవలేదేమో కాని, 1930 ప్రాంతాల్లో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలో చదవదగ్గ పుస్తకాలన్నీ చదివానని చెప్పుకున్న కవికి మార్క్సిజం గురించి తెలియదంటే నమ్మడమెలా? కాస్తోకూస్తో తెలియకుండానే “దేశచరిత్రలు” రాసి ఉంటాడా?
మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ రాసినవన్నీ మరీ దసరా పద్యాల స్థాయిలో ఉన్నాయనుకోను. వాటిల్లో చెప్పుకోదగ్గవీ, మహాప్రస్థానం గీతాలతో పోల్చదగ్గవీ, వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చునంటే ఒప్పుకంటాను. మరి డెబ్భై ఏళ్ళకి పైగా బ్రతికి, చివరిదాకా ఏదో ఒకటి రాస్తూ ఉన్నశ్రీశ్రీ కవిత్వంలో చెప్పుకోదగ్గది దాదాపు అంతా మూడు పదులు నిండక ముందే రాయడానికి కారణం, ఆ తర్వాత ఆయన మార్క్సిజం తీర్థం పుచ్చుకోవడమేనని రవిశంకర్ గారు స్పష్టంగా చెప్పకపోయినా సూచనప్రాయంగా అన్నారు.
సృజనా శక్తి వయసుతో, అనుభవంతో, జ్ఞాన సముపార్జనతో పెరుగుతుందా? ఇది సాహిత్యంలోనేనా, అన్ని రంగాల్లోనూ సహజమా? అన్న సందేహముంది నాకు. హార్డీ తన “సంజాయిషీ” లో [1] రామానుజన్ ముప్ఫై రెండేళ్ళకే చనిపోవడాన గణితానికి వచ్చిన నష్టమేమీ లెదన్నాడు! ఆ వయసు తర్వాత ఏ గణితవేత్తయినా పెద్దగా సాధించేదేమీ లేదని హార్డీకి గట్టి నమ్మకం.
S. చంద్రశేఖర్ కి సృజన తీరు మీద కుతూహలం కలిగి ఓ మంచి ఉపన్యాసం [2] ఇచ్చాడు. షేక్స్పియర్, బీథోవన్ ల సృజనా కౌశల్యం పెరుగుతూ జీవిత చరమదశ దాకా పరిపక్వత చేరిందంటాడు. వాళ్ళతో పోలిస్తే, సృజనా పరంగా మహోన్నతమైన గురుత్వాకర్షణ సూత్రాల ని న్యూటన్ కనుగొన్నది పాతికేళ్ళ వయసు లోపలే!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “A Mathematician’s Apology,” by G. H. Hardy. Cambridge University Press, 1967. గణితమంటే ఇష్టమున్నా లేకపోయనా, కవత్వమంటే ఆసక్తిగల వాళ్ళు చదవాల్సిన పుస్తకం.
[2] Shakespeare, Newton, and Beethoven, or Patterns of Creativity. Nora and Edward Ryerson lecture delivered at the University of Chicago, Center for Public Policy on 22 April 1975. Published in “Truth and Beauty: Aesthetics and Motivations in Science,” by S. ChandraSekhar. The University of Chicago Press, 1987.
శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి mOhana గారి అభిప్రాయం:
01/10/2010 2:02 pm
జగన్నాధంగారూ, ప్ర, త్ర్య లాటి అక్షరాలవలెనే క్ష అక్షరం కూడా ఒక సంయుక్తాక్షరమే. నిఘంటువులలో క్ష-కారముతో ఆరంభమయ్యే పదాలు క అక్షరం కిందే ఉంటాయి. ప్ర అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు క్ష అక్షరంతో ఆరంభమయ్యే పదాలకంటే ఎక్కువే. కాని దీనికి కొందరు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడానికి కారణం బహుశా క్ష అక్షరం పలికేటప్పుడు, క కు ష ఒత్తు ఇచ్చి పలికేటప్పుడు ఉచ్చరణలో కొద్దిగా భేదం ఉండడంవల్లనేమో? లేకపోతే మతపరంగా (చక్రాలు ఇత్యాదులు) మరేమైనా కారణం ఉందేమో? యూనికోడ్‌లో ఈ అక్షరానికి ఒక ప్రత్యేక స్థానం లేదు అనే అనుకొంటా. విధేయుడు – మోహన
శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
01/04/2010 3:47 pm
“కవికి ఒకరి మరణం కంటే ఆ మరణంపై ప్రపంచం కనబరచిన ఉదాసీనత ఎక్కువ బాధకలిగిస్తుంది.” దానికి రవిశంకర్ గారిచ్చిన ఉదాహరణలు చక్కగా ఉన్నాయి. ఐతే రవిశంకర్ గారు వారి పరిశీలనని అక్కడతోనే ఆపెయ్యకుండా మరికొంచం ముందుకుపొయ్యుంటే, శ్రీశ్రీ గారి మరో కోణం, సహజంగా కవులని చెప్పుకునే వాళ్ళలో కనపడని మరో ఒకట్రెండు లక్షణాలు తెలిసుండేవి. అవేవిటంటే శ్రీశ్రీ ప్రపంచపు ఉదాసీనత వల్ల మనిషిగా తనకు కలిగిన బాధని కవిగా వ్యక్తం చెయ్యడంతోనే ఆగిపోకుండా, ఆ వ్యక్తం చెయ్యడంలో కూడా ఆ బాధమీద సున్నితవైన కవిత్వపు మేలిముసుగులు కప్పకుండా, చావు ఎంత భయంకరవైనదో తన కవిత్వంలో చూపించాడు. ఆ చావుకన్నా భయంకరవైన ఆ ఉదాసీన ప్రపంచాన్ని, చొక్కా పట్టుకుని ప్రశ్నించాడు. ఆ చావుకి కారణవెవరో చెప్పమని, ఆలోచించమని తన కవితని పెనుప్రశ్నగా మలచాడు.
“కొంపెల్ల జనార్ధనరావు కోసం” లో
మా బురద రోజూ హాజరు
మా కాళ్ళకు డెక్కలు మొలచాయి
మా నెత్తిన కొమ్ముల లాగే!
…….
నిన్న వదిలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు!
కావున ఈ నిరాశామయ లోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను!
“అట్లాగే భిక్షు వర్షియసి” లో
ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి”దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళ్ళిపోయింది
అని చెప్పడంలో ఉదాసీన లోకానికి తన కవిత్వపు షాక్ ట్రీట్మెంట్ రుచి చూపించాడు. అందువలననే గురజాడ రచనలో మీక్కనిపించిన గోప్యత శ్రీశ్రీ బాటసారిలో కనిపించదు.
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకొంటుంది
పల్లె టూళ్ళో తల్లికేదో
పాడు కలలో పేగు కదిలింది.
రవిశంకరు గారు చెప్పినట్టు శ్రీశ్రీ మరణాన్ని ఎక్కడా కీర్తించలేదు. “ఊగరా, ఊగరా, ఉరికొయ్య నందుకుని ఊగరా” అన్న కవితలో వీరుని మరణాన్ని సందేహం లేకుండా కీర్తించారు. ఐతే ఆ వీరుని మరణం పదిమంది బతుక్కోసం చేసిన త్యాగవని మనం గుర్తుంచుకోవాలి. ఆ రకంగా అది బతుకుని కీర్తించడం గానే నాకనిపిస్తుంది. పదిమందికి మంచి బతుక్కోసం తపనగానే నా మనసుకి తెలుస్తుంది.
చేదుపాట, కేక, దేనికొరకు గీతాల్లో శ్రీశ్రీ వ్యక్తిగత ఆశ, నిరాశల దోబూచులాట కనిపిస్తుందని చెప్పేరు రవిశంకర్ గారు. నాకు మాత్రం ఆ గీతాలు ఆ కాలపు (ఈ కాలం కూడా) ఒక సామాన్యుడి, బతుకుబాటలో నడుస్తూ, ఆ బాట, తనలాటి సామాన్యులకి ముళ్ళబాట ఎందుకైందో తెలుసుకునే నేపధ్యంలో, ఆ కారణాలేవో తెలుసుకుని వాటిని మార్చే పోరాటానికి సమాయత్తవయ్యే తరుణంలో ఆ కాలపు కవి శ్రీశ్రీ నే కాదు, ఏ కవిత్వం వ్రాయని సామాన్య శ్రీశ్రీలు మార్పు కోసం, మంచి కోసం, పదుగురి మంచికోసం స్టేటస్ కోను ప్రస్నించపూనుకున్న ఇకనోక్లాస్ట్ మనస్తత్వవే నాక్కనిపిస్తుంది.
శ్రీశ్రీ కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళల గురించి కవిత్వం వ్రాయలేదన్నారు మీరు. కానీ శ్రీశ్రీ వ్రాసిన కవిత్వం దాదాపు అంతా కూడా వాటి గురించే కదా రవిశంకర్ గారు. సమాజంలో హీనాతి హీనవైన బతుకు బతుకుతున్న సామాన్యుడి గురించే కదా ఆయన కవిత్వవంతా, ఆయన తపనంతా. తమలోతు కనుక్కోమనే ఆ అత్యంత హీనవైన బతుకు నిజాల్ని ఆవిష్కరించడవే కదా ఆయన కవిత్వం చేసింది.
వాక్యం వాక్యం విమర్సించడం నా ఉద్దేశం కాదు. ఆఖరగా ఒక విషయం, అన్వేషణ కట్టిపెట్టి, ఒక ఖచ్చితత్వం వైపు ప్రయాణిస్తే కవిత్వం దెబ్బతింటుందన్నారు మీరు. కానీ ఒక ఖచ్చిత తత్వం వైపు ప్రయాణించడవంటే కళ్ళకు గంతలు కట్టుకోవడం కాదు కదా. ఆ ప్రయాణపు బాట పట్టడానికి, ఎంత అన్వేషణ, ఎంత సంఘర్షణ, ఎంత పరిశీలన, ఎన్ని ప్రశ్నలు, ఎంత ప్రయత్నం. నిస్చయత్వం అనేది ఒక సాపేక్షవైన విషయవే కాదా? కవి కూడా సంఘంలో ఒక మనిషే, అందరితోబాటూ కవిక్కూడా, కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, మంచిచెడులుంటాఅయి. నిశ్చితానిశ్చయాలుంటాయి. బతుకుబాటలో అందరిలాగే అన్నిరకాల సంఘర్షణలుంటాయి. రాజకీయాలు, రాజకీయ తాత్వికత కూడా అందులో భాగవే. అవి లేని కవి కవి కాలేడేవో. నాలుగు పదాలని నగిషీచెక్కడం నేర్చుకోవటవే కవిత్వవయితే మీరు చెప్పింది నిజవే, కానీ నలుగురు మనుషుల మనసుల్నిచెక్కాలంటే కవి మనిషై వుండాలి, ఒపీనియేటెడ్ అయ్యితీరాలి. అందువలనే మిగిలిన వాళ్ళు కవులయ్యేరేవో గాని శ్రీశ్రీ అసంఖ్యాక కవుల్ని సృష్టించ గలిగేడు, మహా కవికాగలిగేడు.
శ్రీశ్రీని చూడడానికి అద్దాలెందుకు సార్ మనచుట్టూ మనం కళ్ళు తెరిచి చూస్తే శ్రీశ్రీ కనిపిస్తాడు. మనం పుట్టిపెరిగిన ఊర్లని, మనతో పెరిగిన మనషుల్ని చూస్తే మనకు శ్రీశ్రీ కనిపిస్తాడు. శ్రీశ్రీ నిశ్చితాభిప్రాయాలు ఆయన కవిత్వాన్ని అపేయోలేదో గాని, మన కళ్ళ గంతలు తీస్తే శ్రీశ్రీ కపడతాడు. శ్రీశ్రీ కవిత్వాన్ని, శ్రీశ్రీ కవిత్వంలో వ్యక్తవైన తాత్వికతని, ఆ తాత్వికతకి కారణవైన దేశకాల పరిస్థితుల్ని వదిలేసి, శ్రీశ్రీ ని మాత్రం వేరుచేసి చిన్న అద్దం ముక్కలో ఆయన్ని మీరు చూపించ ప్రయత్నించారు. కానీ ఆ అద్దం ముక్క మసిబారి, మకిలిపట్టిపోయింది మీరు గమనించలేదేవో రవిశంకర్ గారు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
శ్రీశ్రీ ఉపన్యాసం గురించి mOhana గారి అభిప్రాయం:
01/02/2010 8:19 pm
శ్రీశ్రీ చేసిన ఈ ప్రసంగము అందరూ తప్పక విని, ఆనందించి, ఆలోచించవలసినట్టిది. వారు ఆధునిక కవియైనా, ప్రాచీన సాహిత్యాన్ని కూలంకషముగా చదివి, అందులోని విషయాలను అవగాహన చేసికొని ముందడుగు పెట్టారు. భారత కవులు రాసిన పద్యాలను ఉత్సాహంతో చదివి అందులోని లోతులను తెలియ బరచారు. కాని తన దృష్టిలో తిక్కన, వేమన, గురజాడలే కవిత్రయమని వివరించారు. తిక్కన నాటకీయత, వేమన అప్పటి సమాజములోని కుళ్ళును చూపి తన పద్యాలతో ప్రజలను చైతన్య పరచుట, గురజాడ పాత జమిందారి కవిత్వపు ఛాయలను త్యజించి ప్రజల వాడుక భాషలో పాడుకోతగ్గ మాత్రా ఛందస్సులో వ్రాయుట ఇందులకు కారణాలు. తాను కూడా భావ కవిత్వం వ్రాసిన తరువాతే అభ్యుదయ కవిత్వం రాశానని, ఆ కాలపు పరిస్థితులు (ఆర్థిక మాంద్యము, స్పానిష్ సివిల్ వార్, ఫాసిసం) తన్ను ఉద్రేక పరచాయని వివరించారు. వారి గళములో పొలాలనన్నీ హలాల దున్నీ … గేయాన్ని విని ఉప్పొంగిపోవచ్చు. ఈ కానుక నందిచ్చిన మద్దిపాటి కృష్ణారావుగారికి, వడ్లమూడి బాబుగారికి మనం ఋణపడి ఉన్నాము.
విధేయుడు – మోహన
కృష్ణం వందే జగద్గురుం గురించి mOhana గారి అభిప్రాయం:
01/01/2010 2:56 pm
నాకు కూడా ఈ ఆల్బం అంటే చాలా ఇష్టం. Music India online లో దీనిని విన్నాను. మామియం చలితా అష్టపదిని సుశీల గళంలో నేను విన్నది లేదు. గీతగోవిందములో వదసియది దంతరుచి తరువాత నాకు నచ్చిన అష్టపది ఇది. ఈ అస్టపదిలోని కొన్ని చరణాలు మహాకవి కాళిదాసు భావాలవలె ఉంటాయి. ఈ మధ్య దీనిని నిత్యసంతోషిణి కంఠంలో విన్నాను. చక్కటి సంగీతవ్యాసాన్ని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి వందనాలు. లలితలవంగలతా అష్టపదిలో ఎందుకో రాజేశ్వర రావు గారు విహరతి హరిరిహ సరస వసంతే అనే ధ్రువమును (పల్లవిని) వాడలేదు. సంస్కృతగీతాలలో పల్లవి చరణము తరువాత వస్తుంది. సువ్వి పాటలలో, లాలి పాటలలో పాత పుస్తకాలలో (అప్పకవీయము లాటిది) సువ్వి, లాలి అని వ్రాయరు. కాని పాడేటప్పుడు ఆ పదాలను ఉపయోగించాలి.
ఇందులో చాలా అచ్చు తప్పు లున్నాయి. నా కంటికి కనబడ్డ కొన్నిటిని కింద జత చేస్తున్నాను.
శ్లోకం – సంకాశం (శంకాశం కాదు)
2) కుంద రదన అని ఉండాలి, తాండవ లీలా అని ఉండాలి.
4) త్వరిత ముపైతి అని ఉండాలి.
5) నళిన వదన, మండిత గుణశీల అని ఉండాలి
6) వాసుదేవం తరువాత బృందాలోలం అని పాటలో ఉంది.
9) దుండగంపు అని ఉండాలి.
విధేయుడు – మోహన
రెండు శ్రీల కవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/01/2010 2:38 pm
రేఖామాత్రంగా నారాయణరావు గారు శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ కవిత్వం గురించి చేసిన కొన్ని ఊహలమీద రేఖామాత్రంగా నాలో కల్గిన సందేహాలు క్లుప్తంగా ఇలాంటివి.
ఇటీవల హైద్రాబాద్ లో పుస్తకప్రదర్శన జరిగింది. అందులో నా దృష్టిలో పడిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇలా ఉన్నాయి.
తెలుగు సరిగ్గా చదవనుకూడా తెలియని..అర్ధంకాని కొందరు కుర్రకారు పనిగట్టుకుని పుస్తకాల షాపుల్లో అడిగి మరీ శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని కొనుక్కోవడం. నేను వారిని ఆ పుస్తకాన్ని ఎందుకు కొంటున్నారని అడిగాను. అందులో మెడిసన్ ఆఖరు సంవత్సరం చదివే ఒక అమ్మాయి నాతో చెప్పిన జవాబు ఇదీ!! “మామ్ నాకు మహాప్రస్తానం భాష ఏమీ బోధ పడదు. కానీ ఆ పోయెమ్స్ చదివితే నాకు బాగుంటుంది. ఒక ఆకర్షణ ఏదో ఆ మాటల్లో ఉంది. అందుకని కస్టపడి అయినా నేను మహా ప్రస్తానాన్ని చదవాలని అనుకుంటున్నాను అంది.
నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి విప్లవ సంస్థల్లో పనిచేసే అమ్మాయి కాదు. మహాప్రస్థానపు పూర్వాపరాలేవీ ఆ అమ్మాయికి తెలియవు. ఆ అమ్మాయి ఆరుద్రని గాని విరసం ఆవిర్భావాన్ని గానీ ఎరగదు. వాటివేటిమీదా ఆ అమ్మాయికి ఆసక్తి కూడా ఉన్నట్టు లేదు.
ఒకానొక రాజకీయ సంక్షుభిత కాలం గడిచిపోయేకా నారాయణ రావు అభిప్రాయం ప్రకారం మహాప్రస్థానం నాటి ఆవేశాలు సంపూర్తిగా చల్లారాకా నిజానికి ” మరోప్రపంచం” లాంటి కవిత్వపు అవసరం లేని కాలానికి ఆ కవిత్వం మీద ఆసక్తీ లేదా అనురక్తీ కలగడానికి మరి వీలు లేదు. చాలావరకూ “అభ్యుదయ కవిత్వపు స్పందనలు అలా ఎన్నో అలా చల్లారిపోయినవి ఉన్నాయి కూడా!! కానీ మహాప్రస్థానం విషయంలో ఆనాటి రాజకీయ సందర్భం ప్రపంచంలో మారిన ఈనాటికీ ఆ సంకలనం మీద మాత్రం ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేక పోవడాన్ని మనంచూడవచ్చు.
నారాయణరావుగారు ఏ వయసులో శ్రీశ్రీ మహాప్రస్థానం చేత ప్రేరణ పొందారో ఆ వయసులోని యువతీ యువకులు ఈనాటి తరం వాళ్ళు సైతం ప్రేరణపొందటం వెనక గల కారణాన్ని కేవలం “జాంతవమైన ప్రేరణ గా మాత్రమే” క్లుప్తీకరించి మాట్లాడలేం!! ఈనాటి తరానికి కూడా ఆ పుస్తకంలో కావలసినదేదో ఉందన్న అంచనాకి రావాల్సి ఉంటుంది.
శ్రీశ్రీతో తన నడివయసు దాకా సరిపడా పరిచయం కల్గిన నారాయణరావు సూటీగా తనకి కల్గిన అనుమానాలనీ..లేదా తన పరిశీలననీ శ్రీశ్రీతోనే ఎందుకు ప్రస్తావన చేయలేకపోయారన్న ప్రశ్నకి ఇక్కడ చోటుంది. అది అటుంచితే.. శ్రీశ్రీ జతించిన ఒక పాతిక ఏళ్ళకి నారాయణరావుకి మహాప్రస్థానం లోని గేయాలు రష్యా మీద రాసిన దానితో సహా ” నవ్వొచ్చేలా ఉండి ఉండొచ్చు”. కానీ ప్రపంచానికి రష్యా ఒక కాల్పనికమైనదే అయినా ఒక స్వప్నాన్ని అందించిన మాట వాస్తవం. ప్రపంచ సాహిత్యానికి రష్యన్ రచయితలు ఎన్నో రకాలుగా ప్రేరణని ఇచ్చారన్నది ఒక వాస్తవం. ఇక్కడ రష్యా అన్న దాని ఉథ్థాన పతనాలు మనం చూసాము గనక ఆ మాట అనగలుగుతున్నాం!! అది మనకి సమీప కాలంలో జరిగిన రాజకీయ ఘటన. అదే మనకి సుదూరమైన రోమన్ గ్రీక్ రాజకీయ సాహిత్య ఘటనల మీద మనం ఇలాంటి వ్యాఖ్యానాలు చేయగలమా?? రాజకీయ సంక్షోభం సంభవించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆనాటి కాలంలో దానికి సంబంధించిన సాహిత్య స్పందనలు వస్తాయి.ఆనాటికి అవి సత్యం అవి ఆనాటికి ఒక ఆదర్శం! శ్రీశ్రీ మహాప్రస్థానం తో సహా!!
ఇంక శ్రీశ్రీ సృజనలోని నిజాయితీని మనం ఇవాళ శంకించడంలో అర్ధంలేదు. ఆయన మార్క్సిస్ట్ గా మారి వాటిని రాసాడా లేదా కేవలం నిబధ్ధత లేని ఉత్తుత్తి తెచ్చుకోలు ఉద్రేకాన్ని ప్రదర్శంచాడా అన్నది ఏ రుజువులకీ దొరకనిది.అలాంటి ప్రకటనలకి ఏ చెల్లుబాటూ ఉండదు . అలాగే ఆయన నాయకత్వం మీద కూడా!!
శ్రీశ్రీ ప్రభావం అన్నది ఒక వాస్తవం. శ్రీశ్రీ సాహిత్యం ఒక అవసరం అయిన మాట వాస్తవం.ఒక తరానికి కాదు రెండు తరాలకి కాదు. ఈనాటికీ ఆయన సాహిత్యంలో ఉత్తేజ పూరితమైన ఒక ప్రాణశక్తి కవిత్వ పిపాసువులకి దొరుకుతోంది. నారాయణరావుగారికి అర్ధ రహితంగా కన్పించి ” నవ్వుతెప్పిస్తూన్న’ విధానంలో కాకుండా శ్రీశ్రీ గేయంలోంచి తమతమ ఆవేశాలకి తమతమ ప్రేరణలకి మార్గాలు వెతుక్కుంటున్న ఈనాటితరం శ్రీశ్రీలో చూస్తున్నదేమిటి అన్నది అర్ధం చేసుకోవాల్సి ఉంది.
శ్రీశ్రీ కాలంనాటి వ్యక్తిగత స్పర్ధలతో సంబంధం లేని తరాలు ఆయన కవిత్వంలో ఏమిటి వెతుక్కుంటూ ఇవాళ్టికీ మహాప్రస్థానాన్ని కొనుక్కుంటున్నారో గమనించవలసి ఉంది. అది తెలియందే అతి సునాయాసంగా శ్రీశ్రీని అంచనా వేయడం కస్టం. కవితాస్పందన వేరు. అకడమిక్ విశ్లేషణ వేరు. శ్రీ శ్రీ కవిత్వం మెదడు పైపై పొరలనే తాకిందో..మరింతగా ఇంకి ఈనాటికీ మనసులోతులనే అంటిందో తెలుసుకోగల కొలమానం ఒక్క శ్రీశ్రీ కవిత్వమే!! దానికి సాటి అయినది అది మాత్రమే!! ఆకాశానికి సాటి అయినది ఆకాశమే అయినట్టూ..సముద్రానికి సాటి అయినది ఒక్క సముద్రమే అయినట్టు!!
రమ.
సువర్ణభూమిలో … గురించి lyla yerneni గారి అభిప్రాయం:
12/10/2009 5:20 pm
“సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు…. ”
“ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.”
ఆరి సీతారామయ్య అభిప్రాయం: December 2, 2008 3:11 pm
ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ ఈ కవిత, ఈ అభిప్రాయాలు చదువుకుని, ఈ పై అభిప్రాయం వెలిబుచ్చినవారికి, ఈ నా ప్రశ్న.
ఈ కవితలో, ఏ పంక్తుల్లో ఉన్న సమాచారాన్ని వాడి, పాఠకులు ఈ కవితను అర్థం చేసుకోవాలో మొదట్లో చెప్పి, చివరికి ఆ పంక్తులే ఈ కవితకు అనవసరమని చెప్పి ముగించారు.
గమనిస్తారా?
పొరపాటా? కాదా?
సమాధానం చెబితే, అప్పుడు నా రెండో ప్రశ్న అవసరమైతే ఆడుగుతాను.
లైలా.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
12/09/2009 3:12 am
” కొకు” అన్నపేరు విరసం వారి పుణ్యం!! వారి భావనల్లో రసం ఉండదన్నది సాహిత్య విదితం!! ఇహ రేరాజు గారు చెప్పింది ముఖ్యమైన విషయం ఒకటుంది.అదేమిటంటే “థియరీని మార్చుకోవడం”. ఆ దృష్టితో చూసి ఉంటే..మోహనగారికి చాలా సామాజిక మార్పులు స్పస్టంగానే కన్పించేవి. అర్ధమూ అయ్యేవి కూడా!! కొడవటిగంటి కుటుంబరావు గారు కధలు రాసిన కాలం నాటి సమాజమూ..ఇవాల్టి సమాజమూ ఒక్కలా లేదు. ఈ మధ్య కాలంలో తెలుగు సమాజమూ బాగానే మారింది. తెలుగు సాహిత్య సమాజమూ ఆ అన్ని మార్పులనీ తనలో ప్రతిఫలించింది.అనేకానేక అస్థిత్వ ఉద్యమాలానేపద్యం కుటుంబరావుగారు ఎక్కడా ఊహించినట్టు కనబడదు.కానీ అదే గురజాడ చాలా స్పష్టంగా ఊహ చేయగలిగారు.”modern women will rewrite history” అని గురజాడ అన్నది ప్రపంచవ్యాప్తంగా నిజమైంది. ద్రష్ట అంటే ఆయన. కానీ కుటుంబరావు ఏకోశానా అలాంటి దృశ్యాన్ని ఆధునిక కాలానికి మరింత దగ్గరివాడై కూడా చూడలేకపోయాడు. శ్రీశ్రీ సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. రావిశాస్త్రీ..కాళీపట్నం కూడా కారు. ఇందుకు కారణం వాళ్ళ”థియరీ” లోపమే!!వాళ్ళ్ “ప్రాక్టీస్ ” లోపంకూడానూ!!
ప్రపంచంలో వచ్చే మార్పులని కొలిచి చూసే సిధ్ధాంత పరికరాలు పాతబడిపోయే స్థితి ఒకటి వస్తుందని ఈ రచయితలు ఊహించలేదు. అది వీరి దృస్టి దోషమే!! ఆనాటి యువత ఇవాళ లేరు. ఆనాటి ఆర్ధిక పరిస్థితిలు అలాగే ఇవాళ లేవు. ప్రపంచీకరణ నేపధ్యంలో..కుటుంబరావు కధల్ని లక్ష్మన్న చూడలేదు.”ఎక్కడవేసిన గొంగళీ అక్కడే ఉన్నట్టు”గా ఇవాళ్టికీ సామాజిక పరిస్థితులు ఉన్నాయని మోహన గారు భావించడాన్ని కూడా చాదస్తపు..వెనుకబాటుమాటగానే చూడాల్సి ఉంటుంది. “మంచిగతమున కొంచమే” నని అప్పారావుగారన్నది ఈనాటికీ ఈ తరహా చదువుకున్నవారికి అర్ధంకాలేదని అన్పిస్తుంది ఇటువంటి ప్రకటనలు చూసినప్పుడు.పరిస్థితులు ఎక్కడా మారనే లేదనీ..బహుసా మరి మారవనీ మోహన గారు అనడం నిజంగా ఆశ్చర్యపడవలసిన విషయం!! మార్పుని వీళ్ళూ గమనించరనీ..గమనించినా కూడా దాన్ని ఏకోశానా ఒప్పుకోరనీ తెలియజెప్పేలా ఉంటాయి ఇటువంటి అభిప్రాయాలు. ప్రతి సమాజంలోనూ మంచి మార్పులూ ఉంటాయి..కానివీ ఉంటాయి. ఆ కాలానికి చెందిన సాహిత్యం వాటిని బొమ్మ కట్టి చూపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కూడా!! మనం చేయవలసిందల్లా ఉత్తుత్తి నిట్టూర్పులు విడవకుండా వాటిని గమనించటమూ..వాటిని విశ్లేషించటమూనూ!!
రమ.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Jagannadham Alapati గారి అభిప్రాయం:
12/09/2009 1:12 am
ఇంత చర్చ జరిగాకైనా, చాలామంది తెలుగులో శాస్త్ర లేఖనం, పఠనం జరగాలని కోరుకోవడం శుభపరిణామం. రమగారన్నట్లుగా, విజ్ఞానశాస్త్రం సైతం ఎక్కువ తెలుగువారికి చేరువకావాలంటే మొట్టమొదటగా కనీసం మనం మాతృభాషలో బోధించాల్సిన అవసరాన్ని బలంగా గుర్తించాలి. దానికి అవసరమైనన్ని తెలుగు పదాలు కొరవడితే, ఇతర భాషలనుండి-అది సంస్కృత మైనా, ఆంగ్లమైనా-దిగుమతి చేసుకోవాలే కాని, తెలుగే పనికి రాదనడం సరికాదని, వేమూరి వారి ఈ వ్యాసాన్ని చూశాకైనా అర్థం చేసుకోవచ్చు.
పదాల్ని దిగుమతి చేసుకొనేటప్పుడు, తెలుగు నుడికారానికి అనుగుణంగా శాశ్వతంగా దిగుమతి చేసుకుంటే బాగుంటుంది. అలాకాకుండా, ఆంగ్ల పదాలకి విభక్తులు చేర్చి, ” ఫోను చెయ్యి ” అని చెప్పడానికి, ఇప్పుడు ఎక్కువమంది అంటున్నట్లుగా ” కాల్చెయ్యి “, ” కాలియ్యి “, చెయ్యియ్యి అని సంకరం చేస్తే అసహ్యంగా ఉంటుంది.
ఇప్పటికే వేమూరి, కొడవటిగంటి వంటి వారలెందరో వారి వారి శాస్త్ర రచనలు తెలుగులో చేసి, అసంభవమనుకొంటున్నదాన్ని-“సంభవం” చేసి చూపించారు.
ఇది శాస్త్ర పరిజ్ఞానం కోసమేగాని, కావ్యరచనకోసం కాదని అందరూ సహృదయంతో అర్థంచేసుకొని, లేనిపోని శంకలకి పోకుండా, తెలుగు వైభవానికి తెర ఇకనైనా తీయడానికి స్వాగతిద్దాం!
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి mOhana గారి అభిప్రాయం:
12/07/2009 4:20 pm
రాయ్‌రాజుగారూ, నాకు కూడా పేరులను క్లుప్తం చేయడం పట్టదు. కొకుకు బదులు కుటుంబరావు అన్నదే అందంగా ఉంది. కాని మీరు మేకు అనే పదాన్ని వాడడం అంతగా బాగు లేదు అనుకొంటాను. మీకు ఇష్టమైతే గ్యాస్ స్టేషన్ కథలు చదువుకోవచ్చు, కొత్త జీవితం చదవనక్కర్లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం అది కాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్నట్లు, ఇన్ని దశాబ్దాలైనా మన సామాజిక పరిస్థితులు మారలేదన్నదే ఇందులోని చర్చనీయాంశము, బహుశా మారదేమో? విధేయుడు – మోహన
విశ్వాంతరాళం: పుస్తక పరిచయం గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:
11/23/2009 4:01 pm
రోహిణీ ప్రసాద్ గారు,
మీ పుస్తకాలు అందాయి. ఆకలిగొన్న పులిలా మీద పడ్డాను. తెలుగు మాధ్యమంలో చదువుకున్న నాకు విందు భోజనంలా అనిపించింది. ముఖ్యంగా విశ్వాంతరాళం లో బొమ్మలు కూడా చేరడంతో చాలా శోభనిచ్చింది.
ఆంగ్ల పదాలను ఆచి తూచి వాడడం వలన తెలుగు మాధ్యమంలో చదువుకునే విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా తెలుగులో ముందుగానే ఉన్న పదాలకు కొత్త పదాలు సృష్టించి గందరగోళం చెయ్యకుండా చక్కగా రాసినందుకు వీటి విలువ మరింత పెరిగింది.
కొన్ని చటుక్కున తట్టిన ఆలోచనలు:
1. ఇంత మంచి పుస్తకానికి ముద్రించిన ప్రతులు వెయ్యేనా? ప్రతి
గ్రంధాలయంలో ఉండవలసిన పుస్తకం. దీనికేమైనా మార్గాలు లేవా?
2. పుస్తకానికి కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు అర్థాలు వివరిస్తూ
అనుబంధం వేస్తే బాగుండేదని అనిపించింది.
3. మొన్న మా అమ్మాయికోసమని “Solar System” అని ఒక
పుస్తకం తెచ్చాను. చాలా చిన్న పుస్తకం, ఒకటవ రెండవ తరగతి పిల్లలకు చదవడం అభ్యాసం చెయ్యడానికని (ఆంగ్లంలో ఉంది) అటువంటి పుస్తకాలు తెలుగులో కూడా వస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ ఆంధ్రాలో అర్థ వ్యవస్థ అటువంటి పుస్తకాలు పిల్లలకి కొనిపెట్టేటంత ఎత్తుకు ఎదగలేదేమో.
ఎంతైనా మీ పుస్తకాలు చాలా బాగున్నాయి. ఈ మాత్రమైనా తెలుగు పుస్తకాలు వస్తున్నాయంటే అదంతా మీ వంటి పెద్దల వలనే.
మీ దగ్గర ఇంకా ఏమన్నపుస్తకాలు ఉన్నాయా? తెలుపగలరు.
ఇట్లు
గరికపాటి పవన్ కుమార్
“ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి kavitha గారి అభిప్రాయం:
11/21/2009 3:37 pm
చాలా బాగున్నది. సున్నితమైన,మ0ద్రమైన కథ! కాని అతనెవరొ నాకు తెలియలెదు?
అమ్మ ఉత్తరం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/15/2009 1:05 am
JL గారూ!!
మీ వయసు ఎంత ఉంటుందో..నాకు తెలీదు. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే..
ఉత్తరాల అనుభవం దాటిన తరాలకి మాత్రమే వచ్చే సందేహం మీది. ఈ కధలోని అమ్మ తాలూకు పరిస్థితి నిజంగా తెలియని..అర్ధం చేసుకోలేని వాళ్ళకి
వచ్చిన వాళ్ళ సందేహం ఇది.
మీకు ఒక అమ్మ ఉంటే..ఆ అమ్మకి ఇవాళ్టి ఈ ఆధునిక పరికరాలు ఈ మైళ్ళూ..ఆమైళ్ళూ దాటడం రాకపోతే..ఆ అమ్మ తనలోని అనేకానేక భావాలని చెప్పుకోలేక తనలో తనే మిగిలి పోతే..అప్పుడు ఆ అమ్మ పరిస్థితిలోంచి మీరు ఈ మాటల్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేసి ఉంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నని అడగడానికి మరొక్కసారి ఆలోచించగలిగేవారు.
అప్పుడెప్పుడో ఒకసారి పామర్తి సత్యానారాయణ గారు పుస్తకాల విషయంలో ఆధునిక్ పరిజ్నానం నేర్చుకోని రచయితలు కాలంతో వెనకబడిపోవలసిదే అన్నారు. మరి ఆధునిక పరిజ్నానం వాడటం రాని..చాతకాని..లేదా అఖ్ఖరలేని
అమ్మలు కూడా ఆగిపోవలసిందేనని వాదన కోసమైనా ఎవరూ అనలేరు కదా!! మీరే అయినా కూడా అనలేరు కదా!!
అందువల్ల ఈ మైళ్ళూ..టెలిఫోన్లూ..కూడా లోపల్లోపలి మనసుపొరల్లోని మమతని..ఖేదాన్నీ..చెప్పుకుందికి చాలడం లేదని గనక గమనించగలిగితే [ఇవి వాడటం తెలిసిన వారు]..ఉత్తరాలు రాసుకోడంలోని..వాటిని మనసారా
చదువుకోవడంలోని రహస్యాన్నీ..ఆ అవసరాన్నీ కూడా గమనించగలరు.
పాతకాలంలో చదువురాని వారు రాయడం చదవడం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని అభ్యర్ధించేవారు.[welcome to sajjanpur అన్నshyam benegal సినిమాని చూడండి వీలైతే!!] మరి ఈమైళ్ళు ఇవ్వడంరాని అమ్మలు
ఇన్ని మనోభావాల్ని ఎవరి సహాయంతో కొడుకులకి పంపించాలీ?? అన్నది మీరు ఎందుకని ఆలోచించలేకపోయారో!! అంతా బహిరంగమే అయిన ఉమ్మడి
కుటుంబాల కాలంనించి ఒకరూ ఇద్దరూ పిల్లల్ని పెంచి పెద్దచేసి ఒక్కళ్ళూ అయి మిగిలిన ఈ సంధి తరాల వారిని గురించీ..వారి వంటరితనాలని గురించీ ఎవరు మాట్లాడేదీ?? అలా ఆలోచించి చూడండి మీరు. ఆ అమ్మ ఆ ఉత్తరం ఎందుకని రాసిందో..ఆ ఉత్తరంలో చెప్పకనే ఏమేం చెప్పిందో మీకు మరింత స్పస్టమౌతుంది.
రమ.
అమ్మ ఉత్తరం గురించి JL గారి అభిప్రాయం:
11/13/2009 10:02 am
కధ చాలా బాగా రాసారు.
“పోస్టుమేన్ చేతికి ఒక ఉత్తరం అందిస్తే ఎంత బాగుంటుందీ!”
నిజమే!!
కాని చివరలొ ఈ వాక్యము అవసరమా?
” కంప్యూటర్ యుగంలో ఫోన్ల తోటీ, ఈమెయిళ్ళ తోటీ మనుషుల మధ్య ఎంత దూరం ఏర్పడుతోందో అర్థమవుతోంది. ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోనూ, ఫోన్లలోనూ సాగవు ఎప్పటికీ. మనసు పంచి రాసుకోలేక పోతే, ఏం సంతోషంగా వుంటుందీ?”
ఫోన్ల తోటీ, ఈమెయిళ్ళ తోటీ మనుషుల మధ్య దూరం ఎలా ఏర్పడుతోందో నాకు అర్దము కాలేదు.
ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోను ఎందుకు సాగవు?
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
10/29/2009 2:11 pm
నాగులపల్లి శ్రీనివాస్ గారి ప్రతి అక్షరం తోనూ ఏకీభవిస్తున్నాను. తెలుగు దేశం లోని జిల్లా స్థాయి లోని ఒక ప్రైవేటు పాఠశాల లో చిన్నపిల్లలు స్కూల్లో తెలుగులో మాట్లాడితే అక్కడి టీచర్లు ఆ చిన్నపిల్లల మెళ్ళో క్రిమినల్స్ మెళ్ళో వేల్లాడదీసినట్టుగా ఒక పెద్ద అట్ట మీద తాటికాయంత అక్షరాలతో ఇంగ్లీషులో..” I NEVER SPEAK IN TELUGU ” అని రాసి తగిలించి అందరూ చూసేలా నిలబెట్టారు. ఆ పసిపిల్లల వయసు ఆరేడేళ్ళు. వాళ్ళకి వాళ్ళ తప్పేంటో కూడా తెలీని వయసు. అంత చిన్న వయసులో ఆ పిల్లల మనసులో మాతృభాష మీద చులకననీ..ఇంగ్లీషు మీద ఆలవికాని వ్యామోహాన్నీ..కల్గిస్తున్నారు వాళ్ళ టీచర్లూ ఆ పాఠశాల యాజమాన్యం. ఇందుకు ఆ పసివాళ్ళ తల్లితండ్రుల పూర్తి అంగీకారం ఉన్నట్టే తెలుస్తోంది.
ఒక రెండు తరాలు నిర్లక్ష్యం చేస్తే ఆ భాష నశించిపోయే అవకాశం ఉంది. తిరిగి దాన్ని ఉద్ధరించడానికి తాతలు దిగివచ్చినా లాభం లేదు. వెయ్యేళ్ళ మన తెలుగు గురించి అందులోని అనేక రకాల పదజాలం గురించి తెలుసుకోకుండానే..అందులోంచి అధ్యయనం కష్టం అంటున్నారు. శాస్త్రీయ సంబంధమైన పారిభాషిక పదజాలాన్ని మనం సంస్కృతం నించి గ్రహించి వాటిని తెలుగులో చొప్పించాం..ఎలాగైతే ఇంగ్లీషు లాటిన్ నీ గ్రీకు నీ సైంటిఫిక్ పరిభాషగా గ్రహించిందో అలాగ!! అక్కడ ఇంగ్లీషులో ఉన్న అన్య భాషాపదాలు ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే వాళ్ళకి అదే తెలుగు వాక్యాల్లో ఉన్న సంస్కృత పదాలు ఎబ్బెట్టుగా అన్పిస్తున్నాయి. పోనీ అని మిగతా భాషల వాళ్ళు చేసినట్టుగా చక్కని తెలుగు పదాలని తిరిగి వాడకం చేసే ప్రయత్నం చేసామా అంటే తెలుగుని ఉచ్చరించటం కూడా మరిచిపోతున్నారు. నిత్యవ్యవహారంలో ఉండే ఎన్నో మాటల్ని జారవిడిచేసాం!! వేలయేళ్ళ చరిత్రని కలిగి ఉండటం ఒక్కటే కాదు ఆ వెయ్యేళ్ళ కిందటి పద్యం చదివితే మనకి ఇంకా అర్ధమవుతూంది.అంటే తెలుగు ఇంకా సజీవంగా ఉందని అర్ధం. ఈ స్థితిని అనుభవంలో చూస్తూ కూడా తెలుగునించి పదసేకరణ చేసి వాటిని బోధనాభాషగా తిరిగి వాడుకోలేక ఇలా ఇంత మంది అదేదో అన్ని సమస్యలనీ పరిష్కరించేయగలిగినది అన్నట్టుగా అందరూ అతిగా ఇంగ్లీషు వేపు చూడటమూ..ఆ పదజాలం సహజమూ..తెలుగులో ఉన్న సంస్కృతం ఆసహజమూ..అన్నట్టుగా అనుకోవటమూ జరుగుతూంటే ఈ చర్చల్లో..మీ అభిప్రాయం చదివి ప్రాణం లేచొచ్చింది. అందుకు మీకు వందనాలు.
రమ.
About eemaata గురించి Mahendra గారి అభిప్రాయం:
10/25/2009 2:12 pm
సాహితీ మిత్రులందరికీ వందనాలు,
నేను చాలా కాలంగా ఇటువంటి వేదిక కోసం చూస్తున్నాను. కొంత ఆలస్యంగా నైనా ఈరోజు “ఈమాట” చూడడం జరిగింది. చాలా సంతోషం వేసింది. ఇంతమంది సాహితీ మిత్రులని ఒకచోట చూడడం చాలా సంతోషంగా వుంది. మన మాతృభాష ఇంకా పదికాలాలపాటు జీవిస్తుందని ధైర్యం కలిగింది. ,
నేను చిన్నతనం నుండి తెలుగు సాహిత్యం ఇష్టంగా చదివేవాడిని. కొంతకాలం కవితలు కూడా రాశాను. గత కొద్ది కాలంగా పలు కారణాల వల్ల సాహిత్య లోకానికి దూరంగా వున్నాను. ఈరొజు “ఈమాట” చూసిన తరువాత నేను కూడా ఈ సాహితీస్రవంతిలో భాగం కావాలని అనుకున్నాను.
ఇది నేను తెలుగులో రాసిన మొట్టమొదటి ఈమెయిల్. చాలా సంతోషంగా వుంది.
నేను రాసిన కొన్ని కవితలు మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఎలా పంపాలో తెలుపగలరు.
ధన్యవాదాలు,
మహేంద్ర గొట్టిపాటి
[దయ చేసి ఈమాట ముందుపేజీలో రచయితలకు సూచనలు చదవగలరు – సం.]
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
10/22/2009 9:32 pm
సమంజసం కానిది విశ్వనాథ వారి కవితావైభవాన్ని చెప్పడానికి ఎన్నో గొప్ప పద్యరత్నాలున్న కావ్యంలోనుంచి “చున్‌కే చున్‌కే” ఈ పద్యాన్నేఎన్నుకోవడం. సమంజసం కానిది, సరదాకో దురదకో ఎక్కడో ఉన్న ఇట్లాంటి పద్యాన్ని పట్టుకొని విశ్వనాథ కవిత్వాన్ని, చాతుర్యాన్ని తెలుసుకోవడానికి ఇదొక మెతుకువంటిదని ఎత్తిచూపడం. సమంజసం కానిది, “నిర్వీర్యం” అన్న పదానికి లింగవివక్షతను ఆపాదించడం. సమంజసం కానిది, పద్యాన్ని వొదిలేసి ఇంకొకరి బుద్ధి ఎటు పారలేదో, పారాలో చర్చించడం.
“తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచు బ్రదుకులు తనవిగాన
చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెదనేనును, నా భక్తి రచనలు నావి గాన”
అని పదికాలాల పాటు గుర్తుండేటట్లుగా చెప్పిన విశ్వనాథ గారి పద్యం చదివిన తరువాత, అంతకంటే సమంజసమైనది,తలచినప్పుడల్లా పరవశింపజేసేది, ఆలోచనామృతాన్ని అందజేసేది, కలకాలం నిలిచిపోయే “రామచరితమానస”లో తులసీదాసు చెప్పిన మాటలు.
“నిజ గిరా పావని కరన కారణి రామ జసు తులసీకరో
రఘువీర చరిత అపార వారధి పార కవి కౌనేరయో””
నా వాక్కును (గిరా) పావనం చేసుకోవడం కోసమే రాముని చరితను చెప్పడం. అపారమైన సముద్రం వంటి రఘువీరుని చరితను ఏ కవి అయినా, కాదు, ఎందరు కవులైనా సరే, (వర్ణించి) దాటగాలరా?!”
__________
విధేయుడు
-Srinivas
కుతంత్రం గురించి Vasu గారి అభిప్రాయం:
10/18/2009 5:43 am
బావుంది కథ. కాని ముగింపు నచ్చలేదు. ఇంకా ఎదో ఉందనుకుంటూంటే సడన్‌గా ఐపొయింది.
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి సర్పవరపు రమణి. గారి అభిప్రాయం:
10/17/2009 12:30 pm
ముక్కుకోయడమంటే లైలా గారు “ఊహించినట్టు” మొదలుకంటా నరికిపారేయడము కాదు.దానికి ఒక పద్ధతి పాడూ ఉన్నాయి.మనతెలుగులో సామెతకూడా ఉంది.ముక్కు కోసి సున్నం పెడతాను అని;మొదలు కంటా నరికితే ఇంక సున్నం ఎక్కడ పెడతారు?? అంతే గాక Rhinoplasty (తెగిన ముక్కునతికే శస్త్ర చికిత్స) ప్రాచీన భారతంలో ప్రచలితమైన శస్త్రచికిత్సల్లో ఒకటి.(శుశ్రుత సంహిత లో విపులంగా వర్ణించారు). రావణుడు కూడా శూర్పణఖకు అటువంటి ముక్కు పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేయించాడు. ముక్కు పుటాలు లేకపోతే ఈ చికిత్స కుదరదు అన్న విషయం స్వయాన వైద్యులైన లైలా ఎర్నేని (ఈ పేరు చూసి గాభరా పడతాను. లైలా శుద్ధంగా హీబ్రూ పదము ,ఎర్నేని తెలుగు ఇంటిపేరు) గారికి తెలియని విషయం కాదు.
“ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.) “
కావున ,లైలా గారి రాతల్లో పసలేదు. ఏదో “ఒక ఠస్సా వేసి రంజింపజేద్దామనుకొన్నారు” కానీ అది కుదరలేదు. కామేశ్వరుల వ్యాఖ్యల్లో పొసగనిది శూర్పణఖ నిర్వీర్యురాలు (వీర్యముండేది పురుషులకు; నిశ్చేష్టురాలు అంటే బాగుండేది) కావడం,ఒక డాక్టర్గా లైలా గారు దీన్ని ఎత్తిచూపవలసింది.కానీ వితండవాదంలో తర్కం వెనుకబడుతుంది.కావున వారి బుద్ధి అటు పారలేదు.
సర్పవరపు రమణి.
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి lyla yerneni గారి అభిప్రాయం:
10/15/2009 11:37 am
విశ్వనాథ తరఫునో లేదా బృందావనరావుగారి తరఫునో వకాల్తా పుచ్చుకొని వాదించడానికి నేను రాలేదు. లైలాగారి అభిప్రాయాన్ని తప్పుపట్టాలన్న ఉద్దేశమూ లేదు. -Kameswara Rao
ఈ పై వాక్యాల నిర్మాణం నాకు ఆసక్తిని కలిగించింది.
విశ్వనాథ, బృందావనరావు, లైలా – వీరెవ్వరి తరుఫున నేను వాదించటానికి రాలేదు. ఎవరి అభిప్రాయాన్ని తప్పు పట్టాలని లేదు – అని వీరు వ్రాసి ఉండవచ్చును. కాని వారు అలా అనలేదు. ఎందువల్ల అలా అనలేదు. ఇలానే ఎందుకు అన్నారు? అన్న అనుమానం లీలగా కలుగుతుంది నాకు. 😉 కామేశ్వరరావు లాటి భాషాప్రవీణులు ఆషామాషీగా రాయరు. అంచేత నాకు అలాటి అనుమానం వస్తుంది.
ఐతేయేం, పద్య సందర్భం విపులంగా వర్ణించారు. శూర్పణఖ, ఖరుని మనస్థితులను (పుస్తకంలో లేకున్నా) తెలియజెప్పారు. సంతోషంగా చదువుకున్నాను.
కానీ, “శూర్పణఖని చూసిన ఖరుడు మొదటగా అనే పద్యం ఇది:” అంటూ ఇవ్వబడిన విశ్వనాధ ఈ క్రింది పద్యం కూడా నాకు నచ్చలేదు. 😉
“ఇటులిది యేమమ్మా! ముకు
పుటముల నెత్తురులు గారు? ముక్కుం జెవులుం..”
ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.
లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.)
లైలా
తెలుగు నిఘంటువు గురించి… గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
10/11/2009 5:42 am
పదాల ప్రయోగానికి ఉదాహరణలు కొన్ని కొన్ని పదాలకి బ్రౌణ్యంలో కనిపిస్తాయి. శబ్దరత్నాకరం ప్రధానంగా ప్రాచీన కావ్య భాషని దృష్టిలో పెట్టుకొని తయారుచెయ్యబడింది కాబట్టి కావ్యాలలోని ప్రయోగాలు కొన్ని పదాలకి అందులో ఉన్నాయి. ప్రతి పదానికీ ప్రయోగాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే చాలా పెద్ద నిఘంటువు తయారవుతుంది. నేను మళ్ళీ అడిగిన మొదటి ప్రశ్ననే అడుగుతాను. అలాంటి నిఘంటువు ఎవరికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది?
పర్యాయపదకోశాలు పెద్దవేమైనా తెలుగులో ఉన్నాయా అన్నది నాకు తెలియదు కాని “విద్యార్థికల్పతరువు”లో పర్యాయపదాలూ, నానార్థాలూ ఉంటాయి. ఇంటర్నెట్లో Search సౌలభ్యం ఉన్న నిఘంటువులు ఇంచుమించు Thesaurus ప్రయోజనాన్ని అందిస్తాయి. ఏదైనా పదానికి సంబంధించిన పర్యాయపదాలు కావలిస్తే ఆ పదంతో Search చేస్తే సరిపోతుంది. పదకేళి నింపడానికి ఇంటర్నెట్లో ఉన్న బ్రౌణ్యం ఉపయోగించేవాళ్ళకి ఈ విషయం అనుభవమే. అంచేత ప్రత్యేకించి పర్యాయపదకోశాలు ఇంటర్నెట్లో అవసరం లేదనుకుంటాను.
ఇంటర్నెట్లో బ్రౌణ్యం కాకుండా మరో రెండు ఉపయోగకరమైన సైట్లు:
ఈ రెంటికీ Search సౌలభ్యం ఉంది.
నా దృష్టిలో ముఖ్యంగా డిజిటైజ్ చెయ్యాల్సిన నిఘంటువులు మాండలిక పదకోశాలు, వృత్తిపదకోశాలు. వీటి ద్వారా ఈ లాభాలుంటాయి (ముఖ్యంగా ఇంటర్నెట్లో వస్తున్న సాహిత్యానికి):
మాండలిక, వృత్తి పదకోశాలు కొన్ని Digital Libraryలో ఉన్నాయి కాని వాటికి Search సౌలభ్యం లేకపోవడంతో వాడటానికి అనువుగా లేవు. వాటిని యూనీకోడీకరించి Searchable చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీని గురించి నలుగురూ ఆలోచిస్తే మంచిది.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
10/10/2009 5:14 am
ఈ మధ్య నా బ్రతుకు “సత్రవ భోజనం, మఠం నిద్ర” లా తయారయింది. అందువల్ల నా వ్యాసం మీద వచ్చిన అభిప్రాయలనీ, విమర్శలనీ చదివినా సమయపాలనతో స్పందించలేకపోతున్నాను. తెలుగులో ఆధునిక అవసరాలకి సరిపోయే సమగ్రమైన పదసంపద లేదని నాకు తెలుసు. Coordinate అన్న మాటకి సరి అయిన మాట కోసం తడబడ్డాను, నిజమే. అది నా తప్పే. మరికొంచెం జాగ్రత్త తీసుకుని ఉండవలసింది. ఇలాంటి చిక్కులు వస్తాయనే ప్రత్యేకమైన మాటలన్నిటికీ పక్కన కుండలీకరణాలు వేసి ఇంగ్లీషులో వాటి సమానార్ధకాలు రాయటం జరిగింది. వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా.
తెలుగు అకాడమీ వారు ప్రచురించిన మాటలు వాడలేదని నన్ను నిందించవద్దు. తెలుగు అకాడెమీ వారు హుకుం జారీ చేసినట్లు సమానార్ధకాల పట్టికలు ఇచ్చేరేమో కాని వాటి వాడకం సోదాహరణంగా చూపించినట్లు లేదు. నేను నా రాతలలో ఏ కొత్త ప్రయోగం చేసినా అది సోదాహరణంగా వాడి చూపించేను.
పోగా, ప్రోటాన్, నూట్రాన్ మొదలైన మాటలని అలా వదిలెస్తేనే బాగుంటుందని రోహిణీ ప్రసాదు సూచించేరు. నిజమే. ఆ మాటలు వాడవలసి వచ్చినప్పుడు మూడొంతులు ఇంగ్లీషు మాటలే వాడతానేమో. అనవసరంగా, సందర్భశుద్ధి లేకుండా పిల్లిని మార్జాలం అన్నా, కోతిని మర్కటం అన్నా బెడిసికొడుతుంది. కాదనను. కాని “”మేనిఫోల్డ్” ని మేనిఫోల్డు అంటే ఎంతమంది తెలుగువారికి అర్ధం అవుతుంది? బిందుసమూహం అంటే ఎంతమందికి్ అర్ధం అవుతుంది? ఆలోచించండి.
“ఇంగ్లీషు ప్రపంచ భాషలన్నిటి నుండి మాటల్ని స్వీకరించి తనలో కలుపుకుంటోంది. అలాగే ఇంగ్లీషు వృద్ధి చెందుతోంది. మనం మాత్రం ఎందుకు అలా చెయ్యకూడదు?” అని అడిగేవారున్నారు. తప్పకుండా. ఇంగ్లీషులా మనం ప్రపంచ భాషలన్నిటినుండి స్వీకరించి, వాటికి తెలుగుతనం ఇచ్చి స్వీకరిస్తే నేను ఆక్షేపించను. అంతేకాని “హోలుమొత్తం” మీద ఇంగ్లీషుమాటలని దిగుమతి చేసేసి, ఇంగ్లీషు వ్యాకరణం రాక ఈ ఇంగ్లీషు మాటలకి తెలుగు విభక్తులని, క్రియలని చేర్చి సంకర భాష చేస్తే అటు ఇంగ్లీషూ రాక, ఇటు తెలుగూ రాక రెండింటికీ చెడ్డ రేవడులమవుతున్నామేమో అని నా బెంగ.
రోహిణీప్రసాదు చెప్పిన మరొక అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. జనరంజక శైలి (popular style) లో రాసేటప్పుడు పాఠ్యపుస్తకాలలా “జోకొట్టి నిద్రపుచ్చే” శైలిలో రాయక్కరలేదు. ఇక్కడ పాఠకుDiని ఆకట్టుకోవటం ముఖ్యం. ఈ విషయం కూడ ఆలోచించండి.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
10/08/2009 12:58 pm
ఇంటర్నెటులో నిఘంటువులుంటే నిజంగా ఎంతో మేలు. బ్రౌన్ నిఘంటువు (అసమగ్రమైనా) తెలిసిందే.
అర్థాలు చెప్పి వాటికి పద్యాలనుదహరించే నిఘంటువులున్నాయి. కాని, పదాలు సరిగ్గా, అందంగా, స్పష్టంగా వచనంలో వాడడానికి సూచనలిచ్చే నిఘంటువులు లేవు, English లో usages చెప్పినట్లు. చిన్ని ఉదాహరణ: చెరువుకు “గండి” పడి వరదలు అని వార్త. “గండి” కి 1)బిలము 2) రంధ్రము 3) సందు 4)నీళ్ళు ఎక్కువైనప్పుడు కట్ట తెగుట అర్థాలు ఉన్నాయి(శబ్దరత్నాకరములో) . 4వ అర్థమే ఎక్కువగా వాడడం తెలుసు. ఒక గోడకో, బట్టకో రంధ్రం పడితే “గండి పడింది” అనడం వినలేదు_అనొచ్చో లేదోతెలియదు. Usages ఇస్తే ఇట్లాంటివి మెరుగ్గా తెలుసుకునే అవకాశం ఉందనిపిస్తుంది.
తెలియని పదాల అర్థాలనే కాక, తెలిసినట్టు అనిపించే పదాలు సైతం సార్థకంగా వాడడానికి నిఘంటువులు ఉపయోగపడుతాయి కదా. ఆ దృష్టితో ఇంకొంత సాయం చేయడానికి, భాష వాడుకను మరింత పటిష్టపరుస్తూ చేయూత నివ్వడానికి మార్గదర్శకంగా కొత్త నిఘంటువులు ఉంటే లాభం అని కూడా అనిపిస్తుంది.
_________
విధేయుడు
Srinivas
తెలుగు నిఘంటువు గురించి… గురించి అనిలు గారి అభిప్రాయం:
10/04/2009 10:41 pm
“తెలుగుఁ వారికిఁ జాలినంత తెలుఁగుబాస కలదు; వారు పరభాషా దాస్యమునకుఁ జేతులొగ్గవలసినది లేదు” అంటు, “అచ్చతెలుగు కోశము” (రెండు సంపుటాలు) ని 1979 లో పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి (శ్రీ శ్రీనివాస భవనశ్రీ – నెం 22-7-7, మోటుపల్లి వారి వీధి, కొత్తపేట, తెనాలి-522 201, గుంటూరు జిల్లా, ఆం. ప్రదేశ్ ) గారు వెలువరించారు. ఆవుల సాంబశివరావు గారు కృతికర్త. ధర (50+50) వంద రూపాయలు.
మనకి నిఘంటువులు లేకపోలేదు. కాని వాటిని పట్టించుకుంటున్నామా అన్నది ప్రశ్న.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
10/01/2009 8:52 am
ఇంత చర్చా అయ్యాక ఇప్పుడు నేనడిగేది చొప్పదంటు ప్రశ్నలా ఉంటుందేమో కాని, అడక్కుండా ఉండలేకున్నాను. ఇక్కడ చర్చిస్తున్న ఈ నిఘంటువులు అసలు ఎవరికోసం?
బడిలో పిల్లలకోసమా? వాళ్ళకి తెలుగు నిఘంటువు చూసే అవసరమూ తీరికా రెండూ లేవు.
తెలుగు చెప్పే పంతుళ్ళకీ, తెలుగు సాహిత్యాభిమానులకీనా? వీళ్ళకైతే ప్రాచీన కావ్యాలని అర్థం చేసుకోడానికి తప్పిస్తే వేరే ఏమైనా అవసరం ఉంటుందా? దానికి ఇప్పటికే ఉన్న శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువు సరిపోతాయి కదా? (పరుచూరిగారు చెప్పినట్టు, సూ.ని. అచ్చులోనే ఉంది నాలుగేళ్ళ కిందటివరకూ)
పోనీ తెలుగు టీవీ, పేపర్ల జర్నలిస్టులకా? హహహ 🙂
ఇక మిగిలింది తెలుగురాని వాళ్ళు తెలుగు నేర్చుకోడానికి. సాధారణమైన తెలుగు పదాలకి అర్థాలు కావాలంటే బ్రౌణ్యం 90% వరకూ సరిపోతుందనే అనుకుంటాను. బ్రిటిషు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత, తెలుగులో సృష్టించబడ్డ కొత్తపదాలన్నీ ఇంచుమించుగా ఇంగ్లీషునుంచి వచ్చినవే కాబట్టి వాటిని అర్థం చేసుకోడం పెద్ద కష్టం కాదు. మరీ సంస్కృత పదాలైతే సూ.ని సరిపోతుంది. మాండలిక పదాలైతే ఆయా పదకోశాలు తిరగెయ్యాలి.
ఇంకా కొత్త నిఘంటువులు ఎవరికోసం చెప్పండి?
అంచేత నా ఉద్దేశంలో కొత్త నిఘంటువు కోసం ఆలోచించే కన్నా, ఉన్నవాటిని డిజిటైజ్ చేసి ఇంటర్నెట్లో పెట్టే ప్రయత్నం అత్యుత్తమమైంది. దీనికి నేను సైతం ఏమైనా చెయ్యడానికి సిద్ధం.
తరగని దూరం గురించి D.V.N.Sarma గారి అభిప్రాయం:
10/01/2009 4:35 am
“ఇల్లు కదిలామని గానీ
ఇంటివారినొదిలామని గానీ
ఎడబాటే అనుభవంలోకి రాదు
అందుకే … అందుకే…
ఇంట్లో ఉన్నప్పటి లాగే
ఎప్పటి ధోరణే కొనసాగిస్తారు”
శరీరమైతే విదేశానికి వెల్లిందికాని
లోపలఉన్న ఆసామీ కాదనుకుంటా.
శర్మ.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/23/2009 2:52 am
ముందు రమ గారు, రవికిరణ్ గారు, పురాణాల, కవిత్వాల ప్రస్తావనపై లేవనెత్తిన అభ్యంతరాల గురించి ఓ రెండు మాటలు. విశ్వం గురించి మానవుడు అనాదిగా ఆలోచిస్తూ ఉండాలి. ఆ భావనలు కొన్ని పురాణ గాథల్లో, మత గ్రంథాల్లో ఏదో ఒక రూపంలో ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాటి పరిణామం గురించి రాసేటప్పుడు ఆ కథలని ప్రస్తావించడంలో తప్పు లేదు. వాస్తవానికి ఇది పాపులర్ సైన్సులో వాడుక కూడాను. కాల స్వరూపం గురించి రాస్తూ Hawking ఏమంటాడో చూడండి [1]:
“In Newtonian theory, where time existed independently of anything else, one could ask: What did God do before He created the universe? As Saint Augustine said, one should not joke about this, as did a man who said, “He was preparing Hell for those who pry too deep.” It is a serious question that people have pondered down the ages. According to Saint Augustine, before God made heaven and earth, He did not make anything at all. In fact, this is very close to modern ideas.”
అంత మాత్రాన Saint Augustine సైంటిస్టయిపోడనుకోండి. కాని చరిత్రా, చమత్కారమూ కలిస్తే సైన్సు మీద ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది.
అదే పుస్తకంలో, విశ్వానికి అనేక చరిత్రలు, ఒక దానిలో మరొకటి ఇమిడి ఉన్నాయనే సిద్ధాంతాన్ని వివరించడానికి, Hamlet మాటలు వాడుకున్నాడు: “I could be bounded in a nutshell and count myself a king of infinite space.” ఆ అధ్యాయాన్ని ముగిస్తూ, “In this chapter we have seen how the behavior of the vast universe can be understood in terms of its history in imaginary time, which is a tiny, slightly flattened sphere. It’s like Hamlet’s nutshell, yet this nut encodes everything that happens in real time. So Hamlet was quite right. We could be bounded in a nutshell and still count ourselves kings of infinite space.”
Shakespeare కి modern physics తెలుసని కాదు; భావాల్లో కొంత సారూప్యం ఉంది; మనసుకి హత్తుకునేట్లు కవులకి మించి మరెవరూ చెప్పలేరు కనుక వాళ్ళ భాష వాడుకోవడం మంచిదే. ఏమాటకామాటే చెప్పాలి, వేమూరి గారిచ్చిన మన పురాణాలలోని వివరాలు Hawking సోదాహరణాల్లా హత్తుకునేటట్లు లేవు.
ఇక అసలు విషయానికొస్తే, సైన్సు విషయాలని ఆసక్తికరంగా చక్కటి తెలుగులో రాసేవారిలో చెప్పుకోదగ్గవారు వేమూరి. ఈ వ్యాస విషయం సైన్సు చదివిన వాళ్ళకి కూడా అంత సులభంగా కొరుకుడు పడేది కాదు. అంత క్లిష్టమైన దానిని వివరించడం మెచ్చుకోదగ్గ ప్రయత్నం. దానిపై ఇంకాస్త విపులంగా తీరిక దొరికినపుడు రాస్తాను.
కొడవళ్ల హనుమంతరావు
[1] “The Universe in a Nutshell,” by Stephen Hawking. Bantam Books, 2001.
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/20/2009 2:43 am
[ఈ పొరపాటుని సరిదిద్దాము. –సంపాదకులు]
రాగాల గురించి నాకేమీ తెలియదు. పాటలు వింటానికి చాలా బావున్నాయి. జాషువా పద్యాలు అమోఘం. పరిచయం చేసినందుకు లక్ష్మన్న గారికి కృతజ్ఞతలు. “శిశువు” లోని పద్యాలని ప్రస్తావిస్తూ, ముఖ్యంగా కొన్ని సీస పద్యాలు శ్రీనాథుడి పద్యాలకి సమవుజ్జీలని జయప్రభ కొనియాడారు [1].
పై పద్యాల్లో ఒకటి రెండు పొరబాట్లు దొర్లినట్లుంది. విశాలాంధ్ర ప్రచురణ ప్రకారం, “రసవార్ధి తరియించ వచ్చిన పరదేశి,” కి బదులు “ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి,” అని ఉండాలి. రెండోదే సబబనిపిస్తోంది.
“ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని, ఇప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు!” అన్న జాషువానే మరికొన్నేళ్ళకి, “పసితనము” ను [2] తలపోస్తూ,
“మాది గొప్ప జన్మ నావంశమే దొడ్డ
వంశమన్న అహము బలిసె నిపుడు
యెంత చదువుకొన్న నీ భేద భావం
వదల దేమి చేయ వలయు నేను.
అపుడెరుగని అపరాధము
లిపుడెన్నో చేయుచుంటి యిహ పరముల యం
దపరాధినైతి, కపటపు
జపములు దేవాలయములు శరణములయ్యెన్.
పూచిన వనముల జూచిన
పూచెన్నా మనసు బాల్యమున, నా కిపుడా
పూచిన వనముల కాలన్
రాచెడు నీర్ష్యానలంబు రగలు నదేమో.”
కొడవళ్ళ హనుమంతరావు
[1] జాషువా ని మెచ్చుకుంటూనే లోపాలు చూపెట్టిన “పద్యానికి…అభ్యుదయానికి పర్యాయం జాషువా,” అన్న మంచి వ్యాసం. (ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట ఆశ్చర్యార్థకం పెట్టడం మాత్రం చదివేవాళ్ళలో అసహనాన్ని కలిగిస్తుంది.) “మార్గము – మార్గణము (సాహిత్య వ్యాసాలు),” 2003.
[2] “జాషువా రచనలు – నాల్గవ సంపుటం. ఖండ కావ్యాలు, ఏడు భాగాలు”, విశాలాంధ్ర, 2008.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:
09/18/2009 1:18 pm
నేను కూడా పదవ తరగతి వరకు తెలుగు మీడియమ్ లోనే చదివి, పదకొండో తరగతినించి ఇంగ్లీషు మీడియంలో చదివేను. కళాశాలలోనూ, ఆ తర్వాత మదరాసులో ఉద్యోగంలోనూ భారతీయ భాషలతో అంత అవసరం లేకుండా ఆంగ్లంతోనే పనిజరిగిపొయ్యేది. ఐనా కూడా పదానికి పదం తెలుగు నుంచి ఆంగ్లానికి తర్జుమా చేసుకోకపోయినా, కాన్షియష్ ఆలోచనలు మాత్రం తెలుగులోనే వుండేవి ఈ అమెరికాకొచ్చిందాకా. బహుశా ఆ కారణం వలననే మాతృభాషలో విధ్యా భోదన అవసరవని నా అభిప్రాయం. తను చదివేది, తరగతిలో అయ్యవారి ముఖతా తనువినేది, ఆ రెండింటిని సమన్వయం చేస్తూ తను అర్థంచేసుకుని ఆలోచించేది ఒకే భాషలో జరిగితే విద్యార్థికి అవగాహన మరింత విశాలంగానూ, లోతుగానూ వుంటుందనేది వాస్తవం. ఆ దిశలో పాఠశాలల్లో తెలుగు భోధన అవసరం.
ఐతే మన తెలుగు భాషాభివృద్దిలో ఒక భాగం కాని శాస్త్రాలెన్నో ఈరోజు పాఠశాల సిలబస్ లో భాగంగా వున్నాయి. ఆ కారణం వలన ఆ శాస్త్ర పఠనానికి సంబందించిన పదాలు తెలుగులో లేవు. వాటిని అచ్చతెలుగులో సృష్టించినందువలన అవి మన అవగాహనని సరళతరం చెయ్యవు. నలుగురూ వాడే సాధారణ తెలుగు నుంచి డిరైవ్ చేసిన పదవైతే ఖచ్చితంగా అవగాహనని సరళం చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడో అదృశ్యవైపోయిన తెలుగు పదాలనించి ఉత్పత్తి చేసిన అధునిక శాస్త్ర పదకోశం ఆ దిశలో ఏవీ ఉపయోగ పడదని నా అభిప్రాయం.
ఇప్పుడు మన తెలుగు అకాడమీ శాస్త్ర పదకోశం ప్రచురించినవి పోనీ తెలుగు పదాలు కావు (ఆ విధంగా తెలుగు చావనిజమ్ కూడా తమిళ మూర్ఖత్వంతో పోటీ పదడానికి), సంస్కృత పదాలు. నాకు తెలిసినంతవరకు (ఎక్కడన్నా, అక్కడక్కడా మార్పులుండొచ్చు) అవి తెలుగు పదకోశాలే కాదు, ఒరియా మొదలైన పదకోశాలు కూడా. నా అనుమానం (దీనిమీద ఎవరైనా ఒక వ్యాసం వ్రాస్తే బాగుండు) అవి భారతీయ భాషలన్నిటిలో అవే సంస్కృత పదాలు. అందువలన ఆ సంస్కృత పదాలని తెలుగులో తెలుగు అకాడమీ చేత బలవంతంగా చొప్పిచ్చినందువలన చదువుకునే పిలకాయల అవగాహనలేవీ ఆకాశంలోకి పోవు. వర్టీబ్రా, ఇన్ వర్టీబ్రా అని చదువుకుంటే ఆ పదాల రూట్ మరికొన్ని ఆంగ్ల పదాలని అర్థం చేసుకోడానికి వుంటుంది. కానీ సకసేరుకాలు, అకసేరుకాలు అనే తెలుగు కాదు సంస్కృత పదాలవలన జరిగే మంచి ఏవిటి? గిరీశం అన్నట్టు ఆంగ్లపదం ఎంత అర్థవవుతుందో, తెలుగు (సంస్కృత) పదం కూదా అంతే అర్థవవుతుంది అనాలుంది. కానీ నిజవేవిటంటే ఆంగ్ల పదం అర్థం తెలుసుకుంటే దాన్నుంచి మరిన్ని ఆంగ్ల పదాలు అర్థవవుతాయి సాధారణ సంభాషణలో ఉపయోగానికి, సంస్కృత పదం కనీసం ఆమాత్రం ఉపయోగాన్ని కూడా ఇవ్వదు. ఆంగ్లపదం ప్రపంచ వ్యాప్తంగా (కనీసం మెజారిటీ భాషల్లో) వుంది ఆయా శాస్త్రాల్లో, సంస్కృత పదం సకసేరుకాలకి మరో ఉపయోగవేవీ లేదు. తెలుగు టెక్స్టు బుక్కుని దాటి, మరో స్టాండర్డ్ ప్రచురణ ఏదన్నా చదవాలంటే తెలుగు మీడియం స్టూడెంటు నానా కష్టాలు పడాలి, ఆ శాస్త్ర పదకోశాన్ని నేర్చుకోవడానికి.
ఏదో ఒకదగ్గరనుంచి, తెలుగు కాని మరో భాషనించి తెలుగులోకి పదాల్ని అరువు తీసుకునేప్పుడు, ఆంగ్లం అంత అంటరానిది, సంస్కృతం అంత అణకవైనది ఎలాగయ్యిందో. ఆంగ్లం కూడా వాటిని చాలావరకు లేటిన్ నుంచి అరువు తెచ్చుకున్నదే కదా. పోనీ సంస్కృతంలో ఆ శాస్త్రాలన్నీ ఇంతకుముందే అభివృద్ది చెందున్నాయా, ఆ శాస్త్ర పదకోశవంతా విరివిగా వినియోగంలో వుందా? లేదు కదా, అక్కడకూడా నానా రకాలుగా సంకరంచేస్తే తప్ప ఆ పద స్రృష్టి కాదు కదా. ఎందుకా ప్రయాస, దానివలన తెలుగు భాషకొచ్చిన ఉపయోగవేవీ పెద్ద లేదుకదా. తమిలమోళ్ళు మడి కట్టుకున్నారా, కట్టుకున్నారు కాబట్టే పదహారు అక్షరాల్తో ఆగిపొయ్యారు. కట్టుకున్నారు కాబట్టే బేంక్ ఆఫ్ బరోడాని, పేంగ్ ఆఫ్ పరోటా అనికూడా అనగలరు. ఆ ఖర్మ తెలుగుకి కూడా అవసరవా? అరవోళ్ళ ఆగాన్ని చూసి ముచ్చట పడే తెలుగు ప్రేమికులు, తెలుగుని కూడా ఆవిధంగా దిగజార్చదలుచుకున్నారా?
నా మనసులో వున్నది, ఇప్పుడా, రేపా అనుకునే నా మెమొరి సెల్స్ లో మిగిలున్నదేదో పెట్టి ఒక్కలు ముక్కలుగా ఈ అభిప్రాయం వ్రాయడం జరిగింది. భాష మీదే కాక, భాషా శాస్త్రం మీద కూడా పట్టున్న కొలిచాల సురేశ్ లాంటివాళ్ళో, ముప్పై రెండు, అరవై నాలుగు రెఫెరెన్సులు చూసి, సరళవైన తెలుగులో చులాగ్గా వ్రాయగల్గిన బ్రహ్మానందం గోర్తి (త్యాగ రాజు మీద మీ వ్యాసాలు బ్రంహ్మాండం సార్ ) లాంటి వాళ్ళో, కాకపోతే ఆంధ్రాంగ్లాల్నే కాక భౌతిక శాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టిన వేలూరి లాంటి వాళ్ళో ఈ తెలుగు పదకోశం పుష్ చేసే సంస్కృత పదాల మీద ఒక పరిశోధక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది కదా అని ఆశ.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
09/15/2009 2:51 pm
చాలా మంచి అంశం, అవసరమయ్యే విషయంపై వ్యాసం. చాలా కృతజ్ఞతలు.
తెలుగు నిఘంటువు అంటే ఒకే రకం font, style లో అచ్చేసిన అక్షరాల కుప్ప అనుకునే నాకు, తూమాటి దొణ్ణప్ప గారు పిల్లలకోసమని చేసిన కృషి బాగా నచ్చింది. పదాలకు సరళమైన అర్థాలేకాక, వీలైనన్ని బొమ్మలు ఇవ్వడం వారి నిఘంటువులో మాత్రమేనేమో తెలియదు. ఇంకా మెరుగైన నిఘంటువులు కావాలి, రావాలి. ఏది బాగుందో తేల్చుకోవడం, పోల్చుకోవడం choice ఉంటేనే! చెట్లు లేని కాడ ఆముదం చెట్టే గొప్ప చందాన దొరికిందే భాగ్యం ఇప్పటి స్థితి.
ఇంగ్లీషు సామెత “Use it or lose it” అన్నది ఒక్క physical abilities, mental abilities కు మాత్రమే కాదనిపిస్తుంది. పదాలు జనాలు వాడితేనే నిలుస్తాయి. సరిగ్గా వాడడానికి మంచి నిఘంటువుకు మించిన సాయం లేదు. తెలుగు భాషాజ్ఞానం ఎక్కువగా ఉన్న తక్కువమంది తోనే ఇది సాధ్యం. సంస్థలు సంఘాలు, ఎకాడమీలు ప్రోత్సాహం, డబ్బు ఇచ్చినా_ అసలు ఇంకే పని చేసినా ఎక్కువ డబ్బులు, పేరు వచ్చే రోజుల్లో_ ఈ పని నెత్తుకెత్తుకునే తెగువ, స్ఫూర్తి, దానికోసం సుధీర్ఘంగా శ్రమించే శక్తి, పూర్తికాకుండా పంచుకోవడానికి వీలుకాని ప్రాజెక్టు వ్రతం_ అంతా నిస్వార్థ భాషాసేవ అని కూడా అనిపిస్తుంది!
_____
విధేయుడు
_Srinivas
భయం! గురించి రాకేశ్వర రావు గారి అభిప్రాయం:
09/11/2009 4:37 am
నా జీవితాశయాల చిట్టాలో ఒకటి ఇఞుఇట్టు వారి నునావట్టులో ధృవరేఖ పైన ఒక రోజు గడపడం. వేసవిలో సుమండి! కాబట్టి ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది.
‘కథ’ అద్బుతంగా వుంది. ఇది కథ మాత్రమే అవ్వడం నన్ను కాస్త నిరాశ పఱచింది. వ్యాఖ్యలు చదివే వఱకూ ఇది కథ కాదేమో అనుకున్నాను. అలా అనుకుంటూనే ఇంకో ప్రక్క ఇలాంటి సాహసం చేసి బ్రతికి బట్ట కట్టడం, లేదా బ్రతికి తెలివిలో వుండడం అన్నది అసంభవం అని తెలుస్తూనే వుంది. అంతటి నిత్యనిశిలో ఏకాంతాన ఎవ్వరూ ఎవ్వరూ వుండలేరు! సదా చీఁకటిలో! ఇక్కడ మీరు బయటకి వెళ్ళి శబ్దం కోసం అన్వేషించడం కథనంలో ఇమడలేదనిపించింది. అంత చీఁకటిలో మీరు ఎలా అన్వేషిస్తారు? ఏదైనా మీకు ఎలా కనబడుతుంది? శబ్దం మీలోవుంది సరేఁ, కానీ బయటకు వెళ్ళి చీఁకటి వల్ల శోధించలేక పోయానంటే కుదిరేదేమో.
మేరు పర్వతం వంటి వాని గుఱించి, బృహదృక్షము వంటి వాని గుఱించి మీరు చేసిన ప్రస్తావన ఈ కథకు మూలం (నా దృష్టిలో అది లేకపోతే ఈ కథే లేదు). పథం అని వ్రాసేదానికి పధం అని వ్రాసారు. నేను నిఘంటువు వెదకి మోసపోయాను.
ముగుంపు గుఱించి మీ అభిప్రాయమే నాదీను. ఆఖరు వాక్యం వుండరానిది. బయట గోకుడు అనగానే నేనూ ఎలుగుగొడ్డే అనుకున్నాను. వాటి శీతనిద్ర గుర్తుచేశాక అది అసంభవం అని తేలిపోయింది. పైపెచ్చు బృహదృక్ష ప్రస్తావన అప్పుడే తెచ్చారు కాబట్టి, ఇది ఖచ్చితంగా మీ మనసులోని ఎలుగుబంటేనని తేలికగానే గుర్తించ వచ్చుఁ!
ఈ కథలో మనుషుల మానసికాంశాలకు పెద్ద పీట అన్నది కొందరు పాఠకులు గుర్తించలేరేమో. తెలుఁగులో సైకలాజికల్ థ్రిల్లర్ల అవసరం వుంది 🙂
తెలుఁగులో లోకానికి సుదూరమైన లోకాల గుఱించి అచ్చ తెలుఁగులో మీరు వ్రాసే అద్భుతమైన కథల పుస్తకం త్వరలో లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
ఇలాంటి కథతో Into the Wild అనే మంచి సినిమా సైతం వున్నది.
రాకేశ్వర
అందం బ్లాగు.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/04/2009 5:02 pm
నేను ముసునూరివారి లఘుశబ్దార్థదీపికతో ప్రస్తుతం పనికానిస్తున్నాను. ఇది నాకు హైదరాబాద్‌లో 1982లో 20 రూపాయలకే దొరికింది. ఆ తరవాత 1997లో తెలుగు యూనివర్సిటీతో సంబంధం ఏర్పడినప్పుడు సూర్యారాయాంధ్ర నిఘంటువు ఆరు సంపుటాలూ కొనుక్కున్నాను. అక్కడి మిత్రులు మంచి డిస్కౌంట్ కూడా ఇప్పించారు. సూర్యారాయాంధ్ర నిఘంటువు చూస్తున్నప్పుడు మనం కొన్ని పదాలకి మామూలుగా అనుకునే అర్థాలు తప్పనీ, అసలు అర్థం వేరే ఉందనీ తెలిసేది. ఇవికాక చిన్నవి thesaurus వంటివి కూడా దుకాణాల్లో దొరుకుతున్నాయి. కొంతవరకూ వీటితో పని జరిగిపోతుంది. నిఘంటువులు దగ్గరుండడం తెలుగు రాయడం, చదవడం చేసేవారికి చాలా ఉపయోగకరమే. ఆన్‌లైన్ సదుపాయం ఎప్పుడో ఒకప్పుడు ఏర్పడుతుందనే అనుకుంటున్నాను. సామాన్యంగా రచయిత మరణించిన 50 ఏళ్ళ తరవాత కాపీరైట్ ఉండదు. అంతవరకూ రచయిత వారసుల హక్కులను గౌరవించడంలో తప్పులేదనుకుంటాను.
నేను కాలనిర్ణయ్‌లో ప్రచురించే వ్యాసాలకు రచయితలకూ, వారి వారసులకూ అడ్రస్ కనుక్కుని తప్పక పారితోషికం అందించే ఏర్పాట్లు చేస్తూ ఉంటాను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకసారి నేను పి.వి.నరసింహారావుగారి వ్యాసానికి అలా చెయ్యబోతే ఆయన జవాబు రాసి, సున్నితంగా అవసరం లేదని అన్నారు.
తెలుగు నిఘంటువు గురించి… గురించి జవిక్ శాస్త్రి గారి అభిప్రాయం:
09/04/2009 12:29 pm
రమగారు, వేలూరిగారూ, పరుచూరిగారూ ఒక విషయం అర్థం కాదండీ – సంస్థల దగ్గర జనాల దానం డబ్బులున్నాయనా, లేక మన డబ్బులు ఖర్చు కాకూడదనా – చిన్నపనికీ, పెద్దపనికీ వాటి ప్రస్తావన ఊరకే ఎందుకు ? మన జేబులో డబ్బులు ఖర్చు కాకూడదు అని నియమం ఉన్నట్టయితే గాడిద కాళ్ళు కూడా పట్టుకోవచ్చు…..ఏ పనయినా ఒక వ్యక్తి మొదలెట్టాల్సిందే, సంస్థలు కాదు. అలా సంస్థలకోసం చకోర పక్షిలా ఎదురు చూడ్డం ఎక్కువయిన రోజు, కురిసే వానలు తక్కువైపోతాయి. సారాంశం అర్థమయ్యిందనే అనుకుంటున్నాను.
అసలు పనంటూ మొదలెడితే ఆసక్తి ఉన్న జనాలు, మీలాటి వారో, మరెవరో జేరతారూ. పనీ ఆటంకాలెదురయినా సాగుతుందీ. ముసునూరి వారు డబ్బులకోసం చూసుకుని ఉంటే, నిఘంటువూ ఉండేదీ కాదు -మీరు ఇప్పుడు ఆయన్ని తలచుకునేవారూ కాదు. ఒక వేళ మన సామర్థ్యం మీద మనకే నమ్మకం లేకపోతే – అంటే తగిన “టెక్నాలజీ” బలం లేదూ అనుకుంటే, చేసిన, చేస్తున్న పనిని ప్రూఫ్ రీడింగో ఏదో ఒకటి చేసి ఆ పనికి సాయపడొచ్చు. ఇంతలేసి దస్త్రాలు దస్త్రాలు కామెంట్లు రాసేవాళ్ళకు ఆమాత్రం సమయం దొరకకపోదు అని అనుకోను, అసలు సాయం చెయ్యాలి అనే తపనే లేకపోతే తప్ప.
దుమారాలు, గాలివి కానివ్వండి, ఇసుకవి కానివ్వండి, టెంటులో దూరిన ఒంటెల సంగతి పక్కన బెట్టి, ముందు కాపీరైట్ల సంగతి చూడాల్సిందే. ఎవడు కనిపెట్టాడో కానీ, ఈ కాపీరైట్లు (ఆపైన “ఇంటలెక్చువల్” మోసగాళ్ళనుంచి కాపాడుకోటానికి అని దానికో మేలిముసుగు) – సిద్ధాంతం, శాస్త్రం ప్రకారం ఒక అవిడియా తమరి బుర్రలో ఉన్నంతవరకే తమరిది, ఒకసారి దాన్ని బయటకు తోలేసాక ప్రపంచానిది. ఏం సిద్ధాంతమో, ఏం శాస్త్రమో ఆ ఏడుకొండలవాడికే తెలియాలె అంటే మటుకు, ఇక్కడ చిద్విలాసమే! సరే ఎలాగూ ఒకడు ఈ కాపీరైటు అనేది కనిపెట్టి గొర్రెల మంద మీదకు తోలాడూ, గొర్రెలు తలూపాయి, వాటివెంటే నడుస్తున్నాయి. మరి నాణ్యమయిన ఉన్ని కావాలంటే, ఆ గొర్రెల తోలు తీయాల్సిందే. అంటే కాపీరైటు తోలు తీయాల్సిందే. అంటే ఆ కాపరి వెనక పడాల్సిందే, ఊలు తెచ్చుకోవాల్సిందే.
ఉపయోగం సంగతి తరువాత, కొండెక్కినా, చెట్టెక్కినా చేసేదేమీ లేదు. కాపోతే ఓ పని చెయ్యచ్చండోయి, మన ఈమాట సంపాదక వర్గంలోని సభ్యులు, పెద్ద తలకాయలు పూనుకుంటే, పర్సనల్ ఇంఫ్లుయెన్సుతో , కాపరికి ఆశచూపో, అది కుదరకపోతే వాతలెట్టో దారికి తీసుకురావచ్చు. పూనుకోవాలి మరి. చెప్పొచ్చావులే ఆ పని చేసి చేతులు మూతులు ఇక్కడ కాల్చుకున్నోళ్ళు ఉన్నారు అంటే చేసేదేమీ లేదు. నాకు తెలిసిన వారితో ప్రయత్నం ఆరంభించాను. ఎంతవరకూ సాగ దీయగలనో చూస్తాను. ఆపైన ఒక గుంపులాటిదేదయినా మొదలెడితే రోజుకో గంట సమయం వెచ్చించగలను.
అదండీ క్ఌప్తంగా సంగతి (ఇదేంటీ ఇలా క్లుప్తం ఇలా రాశాడనుకుంటున్నారా? నేను ఎప్పుడూ ఇలానే రాస్తాను, మర్చిపోయిన ” ఌ ” ని గుర్తుచేసుకుంటూ) . ఇది రాయటానికి పట్టిన సమయం సుమారు 4 నిముషాలు. 4 నిముషాల్లో ఇంత రాయగలిగితే అరగంటలో ఏ పనికయినా ఇంకెంత సాయం చెయ్యొచ్చో అని అబ్బురపడవచ్చు. ఇంతే సంగతులు చిత్తగించవలెను. రేపు ఇదే టపాని మళ్ళీ వీక్షించి, ఎవరయినా సమాధానమో కార్యాచరణప్రణాలికో రాస్తే, దానికి సంసిద్ధత వ్యక్తం చేయటానికి సదా సిద్ధం అని తెలియచేసుకుంటూ
జవిక్ శాస్త్రి (జలసూత్రం విక్రమార్క శాస్త్రి )
తెలుగు నిఘంటువు గురించి… గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
09/03/2009 5:45 pm
ఆకారాదిక్రమంలో వచనంలో తెలుగు నిఘంటువు అవసరాన్ని పరవస్తు (BTW his three mss were never published!), బహుజనపల్లిల కంటే ఒక 60-70 ఏళ్ళ ముందే గుర్తించిన మనిషి మామిడి వెంకయ్య. ఆయన తయారు చేసిన “ఆంధ్ర దీపిక” 1816 నాటికే అచ్చయ్యింది. Probably this is the first alphabetical dictionary in Indic languages.
తెలుగు నిఘంటువుల చరిత్రపైన చాలా పొడుగాటి వ్యాసమే రాయవచ్చు. A good summary is provided in: వెలగా వెంకటప్పయ్య “తెలుగు నిఘంటువికాసం” (తె.సా.అ,, హైదరాబాదు, 1975). This book also provides an extensive list of various dictionaries published in Telugu over 150 years.
“[సూర్యరాయాంధ్ర నిఘంటువు] ఆ తరువాత మళ్ళీ అచ్చువేసినట్టుగా లేదు” అన్న మాట కూడా నిజం కాదు. 1987 ప్రాంతం వరకు 8 సంపుటాలుగా, తరువాత 6 సంపుటాలుగా (కేవలం 300 రూపాయిలకే, దానిపైన మరల 10 శాతం రాయితీతో!) తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించి అమ్ముతున్నారు. గత 2-3 సంవత్సరాలలో చెప్పలేం కాని 2005-06 వరకు పూర్తి సెట్ మార్కెట్‌లో అందుబాటులో వుంది.
ముసునూరి వారి నిఘంటువులన్నీ (ఆయన 1971లో 2 భాగాలుగా చేసిన “ఆంధ్రనామ సర్వస్వము – అచ్చతెనుగు నిఘంటువు” కలుపుకొని) 2035 వరకు కాపీరైట్ చట్టం క్రిందకొస్తాయి. “కాపీరైటు వ్యవహారాలు పరిష్కరించడం మరీ కష్టమైన విషయం కాదు.” లాంటి వాక్యాలు రాయడం తేలిక. కొన్ని నిఘంటువులకి, చాలా పుస్తకాల పునర్ముద్రణకి హక్కుదారులను సంప్రదించిన అనుభవంతో చెప్తున్న మాటలివి!
శ.రత్నాకరం “మ ద్రాసు మిషనరీ సంస్థలు ప్రచురించిన కారణాన దాని ప్రతులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి.” అన్న మాట నిజం కాదు. శ.ర, దానిని అసలు కూర్చినదెవరు, దాని మూలాలేమిటి, రాస్తూ పోతే మరో పెద్ద వ్యాసమవుతుంది.
“ఆంధ్ర నిఘంటుత్రయము – సటీకము” అన్న పేరుతో “ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్రనామ శేషము, సాంబ నిఘంటువు” ఇప్పటికీ ముద్రణలో వున్నాయి. అలాగే విద్యార్థి కల్పతరువు లాంటి నిఘంటువులు కూడా.
Theres no copyright on CPB’s dictionary. Nor on Bahujanapalli’s. The copyright for సూర్యరాయ… is claimed by Telugu university.
చివరిగా వేలూరిగారు ప్రతిసారి తానా, ఆటాల మీదెందుకు పడతారో అంతు చిక్కని విషయం.
Here is an open request to one and all. Get us the CR permission from TU and we will put సూర్యరాయాంధ్ర on-line in one year’s time. For other dictionaries that don’t fall under CR law, watch these pages.
— పరుచూరి శ్రీనివాస్
— వాడపల్లి శేషతల్పశాయి
మిగారమాత గురించి mOhana గారి అభిప్రాయం:
09/03/2009 12:41 pm
కథ బాగుంది. ఇలాటి జాతక కథలంటే నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ చెప్పబడిన ఉదంతం మిగారుడి ఇంటిలోనే జరిగిందని ఒక కథలో ఉంది. బుద్ధుడిని విశాఖ ఇంటికి ఆహ్వానించిందని, మిగారుడు తెర వెనుకనుండి బుద్ధుడి పలుకులను విన్నాడని ఆ కథలో ఉంది. ఒకప్పుడు విశాఖ బుద్ధుడిని చూడడానికి జేతవనానికి వెళ్లింది. ఆమె రత్నఖచితమైన ఒక కంబళిని కప్పుకొని ఉండిందట ఆరోజు. అది కొద్దిగా బరువుగా ఉండడంవల్ల దానిని తనతో వచ్చిన పరిచారికకు ఇచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు పరిచారిక ఆ శాలువాను మరచిపోయిందట. ఇంటికి వెళ్ళిన తరువాత ఆమె పరిచారికను మళ్ళీ పంపిందట. ఒక వేళ ఆనందుడు (బుద్ధుని ప్రథమ శిష్యుడు) దానిని జాగ్రత్తపరిచి ఉంటే తీసికొని రావద్దు, అలాగే అది అక్కడే పడి ఉంటే తీసికొనిరా అని పంపిందట. ఆనందుడు అలవాటు ప్రకారం దానిని భద్రపరిచి ఉంచాడు. వద్దన్నా ఆనందుడు తిరిగి ఇచ్చాడట. దానిని అమ్మి ఆ డబ్బుతో విహారం కట్టిద్దామనుకొన్నది విశాఖ. కాని దాన్ని కొనేటంత డబ్బు ఎవరివద్ద లేకపోయింది. చివరకు విశాఖ తానే దానిని కొని ఆ డబ్బుతో విహారమొకటి కట్టించింది. తరువాత విశాఖ తన కుటుంబం లోని వారందరినీ పిలిచి నా కోరికలు ఈడేరాయి. నాకింకేమి అక్కరలేదు అని చెప్పి బుద్ధ విహారానికి వెళ్లి ప్రదక్షిణం చేస్తూ పాడుతూ ఆడుతూ ఉండిందట. ఈ దృశ్యాన్ని చూచిన కొందరికి ఆమె కేమైనా పిచ్చి పట్టిందో ఏమో అని అనుకొన్నారు. బుద్ధుడికి ఈ విషయం చెప్పగా అప్పుడు బుద్ధుడు తాను పూర్వజన్మలో ఒక బోధిసత్త్వుడుగా ఉన్నప్పుడు విశాఖ మరొక భక్తురాలిని చూచి ఆమెలా నేను కూడా ఉండాలనుకొన్నదట. దాని ఫలితమే ఈ జన్మలో ఆమె మంచి కార్యాలు చేసి ఈ స్తాయికి చేరింది అని బుద్ధుడు శిష్యులకు వివరించాడు. ఇది తరువాతి కథ. విధేయుడు – మోహన
తెలుగు నిఘంటువు గురించి… గురించి mOhana గారి అభిప్రాయం:
09/02/2009 5:29 am
మంచి నిఘంటువు ఎంతైనా అవసరమే. నేను సూర్యాంధ్రరాయ నిఘంటువును
నా కళ్లతో ఇంతవరకు చూచింది లేదు 🙂 కాని ఎనిమిది సంపుటాల నిఘంటువు సామాన్య విద్యార్థులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో? సామాన్య విద్యార్థికి కావలసింది చేతిలో పెట్టుకొని తిప్పి చూసికొని పదాలకు అర్థాలు తెలిసికొనేటట్లు ఉండే ఒక నిఘంటువు. అలాటిది ఎక్కడైనా ఉందేమో? జీ. ఎన్. రెడ్డిగారిచే పరిష్కరించబడి 1989లో తెలుగు విశ్వవిద్యాలయంచే ప్రచురించబడిన 868 పుటల “తెలుగు నిఘంటువు (విద్యార్థులకోసం)” బహుశా ఈ కొరతను తీరుస్తుందేమో?
విధేయుడు – మోహన
తెలుగు నిఘంటువు గురించి… గురించి Sowmya గారి అభిప్రాయం:
09/01/2009 11:30 pm
ఆహా…మంచి తెలుగు నిఘంటువు ఆన్లైను లో దొరికితే ఎంత బాగుండు… ఎంచక్కా నెట్లో చదువుతున్నప్పుడు అర్థంకాని పదం కనబడ్డ ప్రతిసారీ ఆ నిఘంటువుకు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న వాటిలో ఏదీ నా సందేహాలను పూర్తిగా తీర్చడంలేదు 🙁
మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి lyla yerneni గారి అభిప్రాయం:
08/23/2009 4:04 pm
“ఇందువల్న తెలిసిన నీతి ఏమన్ గా……కాపీలుకొట్టుడు. కావల్సినంత దొంగ
పేరు కొట్టుడు.” -rama bharadwaj అభిప్రాయం
‘దొంగ పేరు’ కాపీలు కొడితే వస్తుందా. మీరు చెప్పబట్టి ఈ రహస్యం ఇప్పటికి తెలిసింది. :-):-)
“రేప్పోద్దుట “తందనానాహి” అంటూ మరో కామ్రేడ్ పదం అందుకోవచ్చు.అబ్బే అదేమన్నా అన్నమయ్య కాపీరైటా?”-rama bharadwaj
తందనాహి లాటి మాటలు, తందనాలు, తదన్నానాలు, తన్నా మన్నాలు, లాటి పదాలూ, మరికొన్ని ఎన్నో పదాలూ ఉపయోగిస్తూ ఎందరో రాయవచ్చు. రాశారు. రాస్తారు. అన్నమయ్య కాని, ఇతర రచయితలు కాని రాసినవి రాసినట్లు భద్రంగా అలాగే ఉంటాయి. అన్నమయ్య రచనలకు వీటి వల్ల ఏం లోటు జరగదు.
పైగా రచనల్లో భావ సామ్యతలు, పద సామ్యతలు చూపిస్తూ -విమర్శకుల/ కవుల వ్యాసాలొస్తే, అన్నమయ్య పాటలు ఇంకా ఎక్కువ ప్రచారం లోకి వస్తాయి. నాకు లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మీకు నష్టాలు తోస్తే చెప్పండి.
[లైలాగారి లాంటి వాళ్ళు..ఎటూ రెడీ గానే ఉన్నారు గన్క..కాపీదారుల హక్కుల్ని కాపాడ్డానికి]-rama bharadwaj
మీరు ఈ మాట పత్రికలో కామెంట్ల మినహా, ఇతర ఏ రచనలు ఎప్పుడు, ఎక్కడ , చేశారో ఇంతవరకూ మీరు చెప్పందే.
ఒకవేళ మీరు రచయితలై ఉంటే అందులో మీరు కాపీ చేసినవి సందేహించకుండా చెప్పండి. 🙂
ప్రస్తుతానికి మీ identty loss, property theft ఇలాటివేవీ జరగకుండా, మీ ఆస్థులు, హక్కులు భద్రంగా ఉన్నాయని, మీరు క్షేమంగా, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని ఆశిస్తాను. 🙂
ఒక ప్రశ్న- “సీతమ్మ మాయమ్మ – శ్రీ రాముడు మా తండ్రి” అన్న కృతి త్యాగరాజు లలిత రాగములో రాస్తే ఇప్పుడు వసంత రాగంలో పాడుతున్నారన్న విషయం ” కొత్త సంగీత విద్యా దర్పణములో చదివాను. ఎందుకలా పాడుతున్నారో వివరించి ఆ కృతిని ఆ రాగాలను musicians వినిపించగలరా?
లైలా
మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి lyla yerneni గారి అభిప్రాయం:
08/19/2009 10:51 am
“మన దేశంలోని జర్నలిస్టులకు జీతాలూ తగినంతగా ఇవ్వరు. ఒత్తిడికూడా ఎక్కువే.”
“చందమామ గురించీ, రజనిగారి గురించీ నేను రాసినవి వాళ్ళకి inspirationగానో, ఇతర పద్ధతుల్లోనో పనికొచ్చాయి.” -Rohiniprasad
మన దేశమంటే? 🙂
రజని అంటే? ఆ రజనిని గురించి ఒక్కరే ఎలా రాయగలరు? ఇతరులెవ్వరూ ఎందుకు రాయలేరు?
చందమామ అంటే -ఆకాశంలో పెరుగుతూ తరుగుతూ ఉన్నట్లు భ్రమపెట్టే గోళమేనా? చందమామ అని మొదటిసారిగా అన్నవారెవరు? చందమామ అన్న ఆ పేరు ఒక మాస పత్రికకు పెట్టుకోవచ్చునా? అది కాపీనా ? ఇన్స్పిరేషనా? చంద్రుడికి రాయల్టీ లిచ్చారా? ఏ చందమామను గురించైనా ఎవరైనా ఎన్ని సార్లైనా ఎందుకు రాయకూడదు?
మీ రచన నిజంగా ‘వాళ్ళకి’ ‘పనికొస్తే’ రచయితగా మీకు వచ్చిన నష్టమేమిటి? మీరు రాసిన రచనకు నష్టమేమిటి? ఘనత పెరగాలే కాని తగ్గదే? ఒక వేళ మీకన్నా బాగా కాని ఇతర రచయితలు రాసారా ఏం? 🙂 రాస్తే గనక పాఠకులకు అది మంచిదేగదా? “మంచి యన్నది పెంచుమన్నా” అన్నారుగా.
రచయితలూ!
త్యాగరాజు మీదో ఇంకే రాగరాజు మీదొ రాసిన ఓ నాలుగు మాటలు ఏ వరసలోనైనా ఓ రచయిత రాయనీయండి, అవి ఆ ఒకరి సొంతమై పోతాయా? ఎలా అవుతాయి? ఎందుకు అవ్వాలి? మీకున్న అభిప్రాయాలూ, ఊహలూ, అనుభవాలను, పోలినవి ఇంకెవరికీ ఉండవా? రావా? కలుగవా?
ఏదీ మీకు ఒక్కరికే వచ్చి, ఇంకెవ్వరూ మానవులకూ ఇంతకు పూర్వమూ ఇక ముందూ రాని, రాబోని, విశేష అభిప్రాయాలు కొన్ని చెప్పండి.
రాముడి మీదో, సోముడి మీదో మా నాన్నగారో, మా నాన్నమ్మో ఇంకెవరో ఏమైనా అనేశారోమో, అని నాలాటివాళ్ళు ఇంకేం అనకూడదా? రాయ కూడదా? రోజూ నేనేదైనా రాసే ముందు, నాకన్నా ముందు ఎవరేం రాశారో అని గూగులించాలా? ఒకవేళ ఎవరైనా రాస్తే, ఇక ఆ విషయం జోలికి పోగూడదా? మెల్లిగా అసలు రాముడిని వదిలి తర్వాత త్యాగరాజును, త్యాగరాజును వదిలి ఆయన గురించి రాసిన ఆ తర్వాతి రచయితను భజించాలా?
ఆ త్యాగరాజు, ఆ అన్నమయ్య -మాకు ఈ ప్రపంచంలొని మనుషులతో వారి గుర్తింపుతో పని లేదు -అని రాముడి మీదో, వెంకటేశ్వరుడి మీదో ఏవో అల్లిబిల్లి పాటలు రాసుకున్నారు (?అట-నిజం ఎవడికి తెలుసు గనక?)
కాని ఈ కళాకారుల సంగీతంలోని తీపి గురించో, వారి జీవిత నిరాడంబరత గురించో రాసే ఇప్పటి రచయితలకు (ఆ రచనల మీద) ఇంత డబ్బూ, డంబరమూ, గుర్తింపు, గుత్తాధిపత్యాల తాపత్రయమెందుకు? 🙂
‘మన’ దేశంలో ఇప్పుడు సోషలిజం రాలా? 🙂
సెప్టెంబరులో DTLC సమావేశానికి వెళ్ళి – “నీదీ నాదని భేదం లేద” నే ఇద్దరో ముగ్గురో తెలుగు ప్రజా కవులూ, రచయితలను స్మరించి, భక్తితో పూజించి, 🙂 రచన చేయటం మీద ప్రజల హక్కులు గురించి తిన్నగా తెలుసుకోవాలి.
లైలా
అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి lyla yerneni గారి అభిప్రాయం:
08/05/2009 11:24 am
పత్రిక/పుస్తక ప్రచురణ భవిష్యత్తుపై ఆసక్తి ఉన్నవారికి –
http://www.neh.gov/news/humanities/2009-07/WhatIf.html
-Chandra
Below is an excerpt from the artcle.
“The result was a dynamic read for participants and onlookers. A rolling margin for commentary remained in place next to the page of text being commented on. It also allowed further remarks, comments on the comments, to be added, all next to the relevant passage. One of the collaborating readers said of the experience, “It was those lengthy, sometimes tangled conversations in the margins which were the most exciting feature of the project.”
ఆర్టికల్ బాగుంది. చాలా పెద్దది ఇంకా అంతా చదవలేదు. కాని అందులోని ఈ పై విషయం గమనిస్తారని రాస్తున్నాను.
ఈ మాట మేగజీన్లో, పాఠకుల అభిప్రాయాల్లో కొన్నాళ్ళ క్రితం జరిగింది ఇదే. పాఠకులు కొందరు -పత్రికలో ప్రచురించిన రచనల కన్నా కొన్నిసార్లు వాటి మీద రాసిన అభిప్రాయాలు ఇంకా సరదాగా ఉన్నాయన్నారు. అది నిజం.
కొత్త ప్రచురణ మీడియంలో అనుకోని లాభాలు మనకు లభిస్తాయి. అవి మనకు అక్కర్లేదా? అనుకోకుండా పెనిసిలిన్ కనిపెడ్తే, అలెక్సాండర్ ఫ్లెమింగ్ -అబ్బే దీని కోసం కాదు నేనీ ఎక్స్పెరిమెంట్ మొదలెట్టింది అని చెప్పి ఆ మందుని తీసికెళ్ళి అవతల పారెయ్యలేదు. సైంటిస్టులూ కోప్పడలేదు. అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ మాట ఇప్పటి కొత్త పాఠకులు మరింత తెలివైన వారై, వారి కామెంట్లు, కామెంట్ల మీది కామెంట్ల వల్ల పత్రికలో రాతలు పదునెక్కితే పత్రిక చదివేవారు ఎక్కువవుతారు. రాసే వాళ్ళూ ఇంకా ఆసక్తి కలిగించేలా రాస్తారు.
లైలా.
కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Sowmya గారి అభిప్రాయం:
07/16/2009 2:48 am
“అనగలనా..దిగులు లేదు…అని
అలవాటు కాని చీకటిలో
నిలబడి. ”
-బాగుంది.
అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి K. V. S. Ramarao గారి అభిప్రాయం:
07/13/2009 10:02 am
వేలూరి గారు ఇలాటి వ్యాసం “ఈమాట” లో రాయటం ఆశ్చర్యకరం. ఐతే ఇది “వెబ్ కల్చర్ ” మన జీవనవిధానాన్ని పూర్తిగా మార్చేస్తున్న సంధి సమయం గనుక ఈ సందర్భంలో ఈ విషయం గురించిన చర్చ సమంజసమే నేమో.
కాగితపు పత్రికలకు కాలం చెల్లిందన్న విశ్వాసమే “ఈమాట” ఆవిర్భానికి మూలం అని పదేపదే చెప్పనక్కర లేదు. వేలూరి గారు వారి వ్యాఖ్యలో ఉట్టంకించిన “న్యూయార్కర్ ” లోని పుస్తకపరిచయం కూడ వెబ్ మీద అప్పనంగా దొరుకుతుంది – దానికి పుస్తకం అక్కర్లేదు – ఇక్కడ క్లిక్ చెయ్యండి – http://www.newyorker.com/arts/critics/books/2009/07/06/090706crbo_books_gladwell .
వెబ్ మీద ఉన్న “కంటెంట్ ” ఏదైనా సరే ఫ్రీ గా దొరకాలి అనేది దాదాపుగా అందరూ అంగీకరించిన సత్యం ఐపోయింది. ఎక్కడిదాకానో ఎందుకు, “ఈమాట” ఫ్రీ పత్రికే కదా ! ఈ “సత్యం” వల్ల ఇప్పటికే కలిగిన ఉపయోగం ముందు కొందరికి కలిగిన “నష్టాలు” చాలా తక్కువ అని నా అభిప్రాయం. అంతేకాదు, అలా నష్టపోతున్నా మనుకునే వారు ఇంకెవర్నో నిందించటం ఆపి కొత్త మార్గాలు వెదుక్కోవటం అవసరం. వెబ్ విప్లవం రాకముందు ఏదైనా జర్నల్ లో వచ్చిన ఒక టెక్నికల్ పేపర్ కాపీ సంపాయించాలంటే ఎంత భగీరథయత్నం అయేదో చాలా మందికి స్వానుభవమే. అదే ఇప్పుడు ఎలాటి టెక్నికల్ పేపర్ ఐనా (కనీసం నాకు ప్రత్యక్షంగా తెలిసిన కంప్యూటర్ సైన్స్ రంగంలో) పట్టుకోవటానికి ఒక నిమిషం పట్టదు. అలాగే, మనం ఏదైనా ఒక కొత్త విషయం గురించి పరిశోధన చెయ్యాలన్నా అదిప్పుడు ఎంతో తేలిక. ఇలాటివి ఇదివరకు అసాధ్యాలు.
రమ గారు లేవదీసింది దీనికి లంబంగా (“అర్థాగొనల్ ” కి అనువాదం) ఉన్న విషయం. రచయిత్రులకు పారితోషికం విషయం. పత్రికల మనుగడే ప్రశ్నార్థకం ఐతే ఇక వారిచ్చే పారితోషికాల మాట చర్చనీయమా అని సందేహం కలగొచ్చు కాని ఇవి రెండూ వేర్వేరు విషయాలు. ఆర్థికంగా సామర్థ్యం వున్న పత్రికలు తప్పక పారితోషికాలియ్యవలసిందే. కాని పత్రికే ఫ్రీ అయి, మరే విధమైన ఆదాయమూ ఆ పత్రిక్కి లేకపోతే వారు పారితోషికాలు ఎలా ఇవ్వగలరు? ఒకవేళ ఎవరో దానం చేసో లేక సంపాదక వర్గమే సొంత డబ్బు వేసో ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలబడే పద్ధతి కాదు. పత్రికల వారి లాగానే రచయిత్రులు కూడ ఆర్జనకి ఇతర మార్గాలు కనుక్కోవాలి.
ఇది సంధి కాలం కనుక అలాటి మార్గాలు ఇంకా స్పష్టంగా లేవు. ఐతే సినిమాల దెబ్బకు తోలుబొమ్మలాటలు ఎలా మూలబడ్డాయో వెబ్ దెబ్బకు కాగితపు పత్రికలు, వాటికి సంబంధించిన వారూ దెబ్బతినటం తప్పదు. ఎంత త్వరగా ఇది గుర్తించి ఎవరికి అనుకూలమైన మార్గం వారు చూసుకుంటే అందరికీ అంత మంచిది – అని నా అభిప్రాయం.
కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
07/09/2009 12:24 pm
మంచి వ్యాసం, ఏన్నో విషయాలను తెలియజేసారు.
ఒక్క మాట, వ్యాసం ఉద్దేశానికి సంబంధించింది కాబట్టి ప్రస్తావించడం.
“ఒక కవి పెద్ద కవో, చిన్న కవో నిర్ణయించడానికి సాహిత్య విమర్శ పరిభాషలో ఏర్పడిన లాంఛనాల కోవలోకే వస్తాయి- స్వతంత్ర రచన, ప్రభావం, అనుకరణ, అనువాదం, కాపీ, ఫోర్జరీ- ఇలాంటి మాటలన్నీ” అని అన్నారు. విమర్శలు కవిత గొప్పదో చిన్నదో అనే కాని, రాసింది పెద్ద కవో, చిన్న కవో అని కాదనుకుంటాను. అవార్డులు, పురస్కారాలు ఫలానా కవితకు, కథకు, నవలకు ఇస్తున్నామనే చెప్పుకుంటాం, ప్రకటించుకుంటాం కదా, వ్యక్తికి ఇచ్చినప్పటికినీ.
“‘ప్రభావం’ అంటే కవిత్వానికి సంబంధించినంత వరకూ ఉపయోగపడే అర్థం” అన్నది కవిత్వానికే కాక జీవితానికి కూడా వర్తించే మంచి మాట.
===========
విధేయుడు
-Srinivas
అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
07/07/2009 6:03 pm
‘తెలుగునాడి’ ఆగిపోవడానికి కారణాలను మన దగ్గరే ఉన్న చెట్టంత మనిషి, జంపాలగారు వివరిస్తే బాగుంటుంది. కాని, ‘తెలుగునాడి’ నడవడానికి, అంటే కనీసం వెయ్యి మంది చందాదారులతో నడవడానికి, చిన్న కారణం చెప్పగలను. ఏమీ లేదు- marketing! వజ్రమైనా, గిట్టుబాటుధరకు వ్యాపారికావాలేమో!
మొత్తం అమెరికా దేశంలోని భారతీయ కూరగాయల దుకాణాలలో cashier దగ్గర కాపీలు పెడితే, ప్రతిపది మందిలో ఒక్కరైనా, తెలుగు రానివారైనా సరే, అట్టచూసో, అందం చూసో(అదే బాపుబొమ్మల అందం!), మొహమాటపడో- కొన్నా, వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం, పత్రిక నడవడం పెద్ద విషయం కాదు. పత్రిక నడవడం కాదు, నడవకపోవడానికే పెద్ద కారణాలు వెతకాలనుకుంటాను, ఆర్థిక మాంద్యం ఇవ్వాళున్నస్థితి కాని, ఐదు ఏళ్ళుగా చందాదారుల సంఖ్య పెరగకపోవడానికి అది కారణం కాదనే అనిపిస్తుంది.
==========
విదేయుడు
-Srinivas
ఈ కానుకనివ్వలేను గురించి Kumara Swamy గారి అభిప్రాయం:
07/03/2009 8:56 pm
ఈ కథలో feelings బావున్నాయి. కాని సంఘటన ఏది? మనసును గాయపెట్టే అనుభవం ఉంటే సరిపోతుందా. కథకి ఫార్ములా / ట్విస్ట్ / సర్కిల్ – పరిపూర్ణం కావించబడిన సంఘటన ముఖ్యం. ఈ సంవత్సరం అరుణ గారు రాసిన నాలుగు కథలూ చదివాను. చాలామంది అనుభవజ్ఞులైన మూసకొట్టుడు కథకులకంటే ఆమె బాగా రాస్తున్నారు. ఈ ఒక్క లోపాన్ని అధిగమిచగలిగితే ఆమె నుంచి మరిన్నిమంచికథలను ఆశించవచ్చునేమో.
Anyway best of luck to Aruna.
కుమారస్వామి
ఫాదర్స్ డే గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
07/02/2009 10:20 am
నమస్కారం
కదిలించింది. మానవసంబంధాలు సైతం వేగవంతమైన జీవిత పరుగుపందెంలో ఎన్ని పోకడలు పోతుందో కూడా గమనించే తీరిక, స్థైర్యం లేని సమయంలో, సమాజంలో, ఇది ఆలోచింపజేసింది.
మీరు క్షమిస్తే, చిన్న మార్పుతో,
“భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు, పిల్లలు
ఆ భగవంతుని వరశాపం” అనిపిస్తుంది.
========
విధేయుడు
-Srinivas
ఫాదర్స్ డే గురించి రాఘవ గారి అభిప్రాయం:
07/02/2009 2:23 am
కన్నీళ్లు తెప్పించారండీ. ముఖ్యంగా ఈ పంక్తులైతే మఱీనూ…
కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి hrk గారి అభిప్రాయం:
07/01/2009 5:08 pm
ఏడుస్తూ వుండిపోయాను పద్యం చదివి చాల సేపు. ఇన్ని మరణాలూ ఏమీ నేర్పవు మనకు. ఎప్పటికప్పుడు ‘అలవాటు కాని చీకటిలోనే, కొత్త కొత్త చీకట్లలోనే నిలబడ’క తప్పదు. మరణించిన వాళ్లూ ఏమీ నేర్పరు మనకు. చనిపోని ప్రేమను రగిల్చి వెళ్లడం తప్ప. అఫ్సర్, నీతో నొప్పిని పంచుకుంటున్నా, పంచుకోడానికి నొప్పి మాత్రమే వుంటం వల్ల.
హెచ్చార్కె
శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి kasi viswanadham yeelswarapu గారి అభిప్రాయం:
06/27/2009 8:34 am
ఈ వ్యాసం చాల బాగుంది. ఆదిశంకరుల రచనలు భక్తిని, ఆ మీదట ముక్తిని ఒసగే మంత్రములే కాని, మామూలు పదజాలముల కూర్పు కాదు.
శారదా మాత తన దివ్యవాక్కును శంకరుల ద్వార మనకు అందించి మన మూఢత్వమును
పారద్రోలిన ‘ అమ్మ’
జుగల్‌బందీ కచేరీలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/19/2009 1:55 pm
పాశ్చాత్య శాస్త్రీయసంగీతం గురించిన సమాచారం చాలానే దొరుకుతుంది. ఉదాహరణకు ఈ వెబ్ సైట్ చూడవచ్చు:
http://w3.rz-berlin.mpg.de/cmp/musical_history.html
మన దేశపు సంగీతాభిమానులకు రెండిటినీ పోల్చ బుద్ధి అవుతుంది కాని ఈ రెండు పద్ధతుల పరిణామమూ వేరువేరు వైఖరులతో సాగింది.
పాత తరానికి చెందిన బాఖ్ సంగీతం ఇక్కడ వినవచ్చు:
http://www.jsbach.net/audio/index.html
తరవాతివాడైన మోత్సార్ట్ స్వరపరిచిన అద్భుతమైన 40th symphony ని సినిమా కోసమని సలీల్ చౌదరి అనుకరించిన సంగతి తెలిసినదే.
http://www.archive.org/details/Mozart_Symphony_40
మరొక మేధావి బెథోవెన్ :
http://www.lvbeethoven.com/Oeuvres/Music-RealAudio.html
ఈనాడు పాశ్చాత్య శాస్త్రీయసంగీతమంతా polyphonic గానే అనిపిస్తుంది.
ఒకప్పుడు అలా ఉండేదికాదట.
మన సంగీతానికీ (ముఖ్యంగా హిందూస్తానీ), పశ్చిమదేశాల సంగీతానికీ ఉన్న తేడా ఏమిటంటే వారి సంగీతానికి స్వరరచయితా (కంపోజర్), నిర్వాహకుడూ (కండక్టర్), వాయించేవారూ (ఆర్క్కెస్ట్రా) వేరువేరు వ్యక్తులు. మనకు అలాకాదు. ఏ సంతూర్‌నో పట్టుకుని స్టేజి ఎక్కిన కళాకారుడు మూడూ తానే అవుతాడు. వారిలాగ కచేరీల్లో మనకు ‘రాసిపెట్టిన’ స్వరాల అవసరం ఉండదనేది తెలిసినదే.
శ్రోతల స్పందనకూడా కాస్త వేరుగా ఉంటుంది. ప్రసిద్ధుల symphony లన్నీ వినడానికి నాకు చాలా బావుంటాయి. అనేక ‘పొర’లలో చేసిన ఆ స్వరరచనలు ఎంతో అద్భుతమైనవి. మనకు సంగీతంలో individuality ఎంత ముఖ్యమో, వారికి విధేయత, నిబద్ధత అంతే ముఖ్యం.
హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/19/2009 2:53 am
బడే గులాం అలీ, బిస్మిల్లా ఖాన్ వంటి ఒకరిద్దరు ముస్లిం సంగీత విద్వాంసుల గురించి తప్ప వేరే ఏ ముస్లిం విద్వాంసుల గురించి తెలియని నాకు హిందుస్తానీ సంగీత సామ్రాజ్యానికి వీరే మకుటం లేని సమ్రాట్టులై అత్యున్నత ఆచార్యస్థానాలలో ఉన్నారని మొదటి సారిగా మీ వ్యాసం ద్వారానే తెలిసింది. మత వివక్షత లేకుండా ఆ కాలంలోనే అనేకులైన ముస్లిమేతరులు వారివద్ద శిష్యరికం చేసి సంగీత విద్యను సాధించారని, వారితో వివాహాది సంబంధ బాంధవ్యాలు కలుపుకున్నారని తెలిసి ఆనందం కలిగింది. జాతి మతవిభేదాలు సామాన్య జనానీకానికే గాని సరస్వతీ పుత్రులైన కళా పిపాసులకు ఉండవు.
సంగీత రసాస్వాదనని స్కాచ్ తో పొల్చడం నాకు సంబంధించినంతవరకూ అత్యంత నీచోపమానమే కాక అత్యంత గర్హణీయం/శొచనీయం. మీ ఈ ఉపమా పదార్ధంతో సామ్యం భావించిన ఏ పదార్ధాన్నైనా, భావానైనా, తద్భావ సంబంధితమైన జుగుప్సతో తత్క్షణమే త్యజించే వారుంటారనుకుంటే మీరంత నీచోపమానం వాడేవారు కాదు. చందన కర్దమాలు (ఒక్క అద్వైతికి తప్ప) ఎప్పటికీ సమం కావు.
భవదీయుడు
నౌషాద్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/17/2009 9:55 am
ప్రసాద్‌గారూ,
మీకు వ్యాసాలు నచ్చినందుకు సంతోషమేగాని మరీ నా మీద పద్యాలు రాసెయ్యకండి.
నాకు అభిమాన సంగీతదర్శకుడు నౌషాద్‌తో ఇంటర్వ్యూ అయిదు భాగాలలో లభిస్తోంది. http://www.youtube.com/view_play_list?p=DC113E4207FDE09D&search_query=Naushad+interview
సంగీతం ఎవరిదైనా అది విని ఆనందించవలసిందే. సంగీతాన్ని గురించి ఎవరు ఎంత రాసినా అవన్నీ పరిచయవ్యాసాలే.
కీబోర్డుతో స్వరాలూ, రాగాల సాధన గురించి నేను చెప్పిన విషయాలను చదివి కొందరు కీబోర్డు మెట్లమీద స్టికర్లు అతికించుకుని ప్రయత్నిస్తున్నారు. అవి వారికి కొంత ప్రేరణనిచ్చి ముందుకెళ్ళేలా చెయ్యవచ్చు.
కాని మొత్తంమీద తెలుగువారికి సంగీతం వినడం, సాధనచెయ్యడంలో చాలా తక్కువ ఆసక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిత్రుల ఎదుట నేను ఎప్పుడైనా చిన్న సోదాహరణ ప్రసంగంవంటిది చేస్తే కాస్త ఆసక్తి కనబరిచేది మగవారే. మహిళలు ఏ మాత్రం ఆసక్తి చూపరు. తెలుగు పిల్లలకు సంగీతం రాకపోవడానికి ఇదొక ముఖ్య కారణం అనిపిస్తుంది. (ఇలా అన్నందుకు నన్ను MCP అని తిట్టుకోకండి!)
సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/13/2009 7:22 am
రాగం అంటే ఏమిటో తెలిసినదే.
ఖచ్చితంగా చెప్పలేను కాని, తానం ఉత్తరాదినుంచి సంక్రమించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి ఖయాల్ శైలికన్నా పాతదైన ధ్రుపద్ గాత్రంలో నోమ్ తోమ్ ఆలాపన, జోడ్ పాడతారు. నోటితో వీణలాగా పాడడానికి కారణం అప్పటి సంగీతంలో (రుద్ర) వీణకు ఉండిన ప్రాముఖ్యతే అంటారు. రుద్రవీణను సోలో వాద్యంగానూ, గాత్రానికి వంతగానూ ఉపయోగించేవారట. హార్మోనియంవంటిది లేని ఆ రోజుల్లో గాయకుణ్ణి ఇబ్బంది పెట్టాలంటే వైణికులు కష్టసాధ్యమైన శ్రుతిని అందించడం మొదలైన పనులు చేసేవారట. మొత్తంమీద వీణదే పైచెయ్యిగా ఉండేదట. అందుకని ధ్రుపద్ గాయకులు చాలావరకు వీణని అనుకరిస్తూ పాడడం చూస్తాం. రాగప్రస్తారం మధ్యలో ఆపినప్పుడు పాడే మొహ్రా (ముద్ర) కూడా అటువంటిదే. ఇదే తరహాలో దక్షిణాది గాయకులు కూడా తానం పాడతారు. నిజానికి జోడ్ లాగే తానం కూడా వీణవంటి వాద్యాలమీదనే అన్నిటికన్నా బావుంటుంది. ఇందులో లయ ఉంటుంది కాని తాళం ఉండదు.
1565లో జరిగిన తళ్ళికోట యుద్ధానికి పూర్వం ఉత్తర, దక్షిణ సంగీతపద్ధతులకు ఇప్పటికన్నా దగ్గర సంబంధం ఉండేదనీ, ఆ తరవాత రెండూ క్రమంగా విడిపోయాయనీ కొందరంటారు.
పునరపి గురించి ramaadevi godugula గారి అభిప్రాయం:
06/13/2009 2:55 am
నిజం గా ఇది ఆలోచించాల్సిన విషయం. రమాదేవి గారు రాసినట్లు పెళ్ళిని పక్కన పెట్టేసే రోజు తొందరలోనే వస్తుందేమో! అప్పుడు కుటుంబం అంటే తెలియకుండా పోతుందేమో! “సేవ్ ఎర్త్ ” ఆర్గనైజేషన్స్ ఇంక మొదలెట్టాలేమో! కధలో గమనించాల్సింది భార్య భర్త ఫ్రెష్ గా కోరుకుటాడని, దోశ ఇడ్లి లాటివి కావాలనుకుటాడని దాని పై స్థాయి అసలు తను మాత్రమే వంట గురిచి టిఫిన్ గురిచి పట్టించుకోవాలి అని అనుకోకపోవడము……..హనుమంత రావు గారు హాస్యం గా రాశాననుకుంటున్నారేమో కాని అది చేదు నిజం. పచ్చిపాలు etc తో చాలా మంచి భర్త అయిపోయాననుకునే అలాంటి భర్తలే చాలా ప్రోగ్రెస్సివ్ అనుకోవాలేమో! కాలేజీల్లో కంప్యూటర్ ప్రోగ్రాములూ, వేవ్ ఈక్వేషన్స్ తో బాటు సాటి మనిషితో ఎలా బతకాలి, అసలు కుటుంబం ప్రారంభించగల స్కిల్స్ నేర్పించి, సర్టిఫికేట్ ఇచ్చే వ్యవస్థ కావాలేమో! రమాదేవి గారు చెప్పినట్లు పిల్లవాడు అరుణ్ వాళ్ళ నాన్నలా కాకుండా వేరే విధం గా వుండే అవకాశాలు తక్కువ. We are half genetic and half from environment. Here both are suggesting that the child becomes another raaghava!!!!!!!!!! But what is the solution? How to change this? How many legal changes can bring a change in this sort of mentalities? 90% of the society expects a woman to be with the husband since as Mr Hanumantha Rao expressed ” కొట్టడు, వేరే హింస లేదు కదా, భరించవచ్చు.” కానీ సంసారమంటే ఇదేనా! చలం మైదానం రాసి ఎన్ని యేళ్ళు గడిచాయి? కానీ ఇంకా అదే వుపేక్ష స్త్రీ కి వుహూ, భార్యకి ఏమి కావాలో అర్ధం చేసికోవడంలో! ఇది ఫామిలీ/కుటుంబ వ్యవస్థని వాతావరణం లో ఓజోన్ రంధ్రం కంటే పెద్ద హాని కలగచెయ్యగలదని ఎందుకు అనిపించట్లేదో అని దిగులేస్తోంది.
తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్ థిరక్వా గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/10/2009 3:02 am
మరొక్క మహోన్నత కళాభాస్కరుని అంధత్వంలో వున్న మాకు పరిచయం చేస్తూ స్ఫూర్తి దాయకమైన సమాచారాన్ని అందజేసినందుకు హార్దిక ధన్య వాదాలు.
ఏ తాళ వాద్యకారుని గూర్చిన ప్రశంస విన్నా లేక వారి వాదనాన్నివినే భాగ్యానికినోచుకున్నా నా చిన్నతనంలో (1962-64మధ్యలో) మా ఊరి త్యాగరాజోత్సవాలలో విన్న ఒక మహా విద్వాంసుని తబలా వాదన ఇప్పటికీ స్మృతిలో చిరనూతనంగా ఉంటూ గుర్తుకు వస్తుంది. ఆనాదు ఆ 90 ఏళ్ళ వృద్ధ విద్వాంసుడు ఒక గంటసేపు తబలా వాదనతో మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేయడమే కాక చివరలో ఒక అద్భుత ప్రక్రియ (నైపుణ్యం) ప్రదర్శించాడు. విఘ్నేశ్వరుని సంస్తుతించే సంస్కృత శ్లోకానికి ఒకరు రాగ యుక్తంగా ఒక్కొక్క పదం పాడుతూంటే ఆ పదాలని ఆయన తన తబలా పైన పలికించారు. తంత్రీ వాద్యాలకు, గాత్రానికి మాత్రమే సాధ్యమైన రాగాలను ఒక తాళ వాద్యంపై పలికింపజేసే ఆ ప్రక్రియ ను నేను మళ్ళీ ఎక్కడా వినలేదు. కనలేదు. ఐతే నేను వేరే ఏ తాళ వాద్య కచేరి ఇంతవరకు వినలేదని చెప్పడం కూడా ఈ సందర్భంలో అత్యవసరం. నేను చూసిన ఈ ప్రక్రియ/నైపుణ్యం ఒకింత ప్రతిభ గల వారెవరైనా చేయగలుగుతారా లేక ఇది ఒక అసాధారణ నైపుణ్యమా చెప్పగలరా. ఎందుకంటే మీ వ్యాసంలో ఇటువంటి చాతుర్యంపై ప్రసక్తి రాలేదు.
భవదీయుడు
స్త్రీ పర్వంలో గాంధారి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
06/08/2009 9:32 pm
ఎప్పటిలాగానే, మంచి పుస్తకాన్ని భద్రిరాజుగారి వ్యాసవిశేషాలగురించి తెలిపినందుకు హనుమగారికి కృతజ్ఞతలు.
పండితులుచేసే వ్యాఖ్యానాలగురించి ఒక్క మాట. భాషలో నుడికారాలు, సమాసాల సొగసులు, ఉక్తివైచిత్రి వగైరాల గురించి ఎంత చెప్పినా, అసలు చెప్పాల్సినదేదో ఎందుకో వదిలేసిన భావం, కొరత. అంటే వాటి ప్రాముఖ్యతను కాదనడం కాదు. కానీ అవన్నీ వాటికవే సొంతంగా ఎంతవరకు సాధారణ పాఠకులను పుస్తకానికి దగ్గరచేస్తాయి అని, అసలు అవేనా తిక్కన కవిత్వం అంత సొగసుగా అందిస్తున్నది అని కూడా అనిపిస్తుంది.
నెత్తిమీదున్న బతుకు బరువుకు, ప్రస్తుత పరిస్థితులకు తిక్కన రచన ద్వారా ఏమైనా లబ్ధిపడే అవగాహన, నిశితమయ్యే దృక్కు, స్పష్టతనిచ్చే అభివ్యక్తి లాంటివి కొంతైనా, ఎంతైనా, వడలి మందేశ్వరరావు, జీ.వి.సుబ్రహ్మణ్యం గార్ల వలె అందించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఆ demand ఎప్పుడూ ఉంటుందని కూడా అనిపిస్తుంది. అట్లా కాకుండా వొట్టి పాండిత్య ప్రకర్షగా, భాషాశాస్త్రం, పద సంపద వివరించడం, వ్యాకరణ అంశాలతో
వూదరగొట్టడం- రుచికర ఆహారపదార్థాలను scientists వాటి పుట్టుపూర్వోత్తరాలు, చెట్ల పేర్లు, వాటి రసాయనాలు, అవి జీర్ణించబడడానికయ్యే reactions- మొత్తం వాళ్ళకు తెలిసిన శాస్త్రమంతా పేజీలలో గుమ్మరించినట్లుంటుందేమో అని అనుమానం. తీరా ఇదంతా మనకు రుచి, బలం ఇచ్చే ఆహారం గురించే(నా) అన్నది కూడా మరిచిపోయేటట్లు చెప్తారేమోనని కూడా భయం! కుయ్యోమంటున్న పాఠకులను చూసి అయ్యో ఇంత పాండిత్యంతో రాసిన వ్యాఖ్యానాలు చదువుకొ(న)డం లేదని వాపోవడం కూడా అతిశయోక్తి కాదేమో అని కూడా అనిపిస్తుంది.
———-
విధేయుడు
_Srinivas
స్త్రీ పర్వంలో గాంధారి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/06/2009 10:11 pm
“తిక్కన పదసంపద”
“ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన యాచేయి దొలుతగాఁ బోరిలో దుస్ససేను
తనువింత లింతలు దునియలై చెదరి రూపఱియున్నఁ గని యుడుకాఱుఁగాక!
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది;”
అని చదివితే, అబ్బ! ద్రౌపది కసి ఏం కసి, అనిపించింది. చిన్న చిన్న తెలుగు మాటలతో తిక్కన లెక్కలేనన్ని కొత్త కొత్త సమాసాలూ నుడికారాలూ మన భాషకి చేర్చాడట . ‘నెత్తురు మడువు’, ”కయ్యపునేల’, ‘మెత్తనిపులి’, ‘పెట్టనికోట’, ‘గుండెకాయ’, ‘చెలియలికట్ట’, ‘చిందరవందర’, ‘తేనె పూసిన కత్తి”, ఇలా అనంతం – అని భద్రిరాజు గారి వ్యాసంలో [1] చదివాను. తిక్కన కవితా శిల్పంలో సొగసులు చూడాలంటే, దగ్గరికిపోయి నిలకడతో చూడాలన్నారు. దానికి నాకింకాస్త తీరిక దొరకాలి.
ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి వ్యాఖ్యానాల అవసరం ఉంది కాని దాని గురించి కేవలం చదువుకున్న వాళ్ళు ఆలోచించి చేసేదేముంది? వాటిమీద పండితులు పని చెయ్యాలి. అందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు సాయం చెయ్యాలి. “దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు…”
కొడవళ్ళ హనుమంతరావు
[1] భద్రిరాజు కృష్ణమూర్తి “భాష, సమాజం, సంస్కృతి”, పుస్తకంలో “తిక్కన పదసంపద” అన్న వ్యాసం.
స్త్రీ పర్వంలో గాంధారి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
06/03/2009 7:06 am
మంచి వ్యాసం. చక్కని పద్యాలను ఎన్నో విషయాలను గుర్తుండేలా చెప్పారు.
ఇది ఇటీవల మృణాళిని గారి “గాంధారి” వ్యాసాన్ని (“అంధ్రజ్యోతి”లో)గుర్తుకుతెచ్చింది. ఆ వ్యాసం కూడా గాంధారి గురించి ఆలోచనాత్మకంగా, మంచి పరిశీలనతో వ్రాయడం ఆకట్టుకుంది. మా అమ్మకు ఫోనులో పూర్తి వ్యాసం చదివి వినిపించాను, కాని కాపీ చేద్దామనుకొని చేయాలేకపోయాను.
గాంధారి కృష్ణుని శపించడం అమెరికాలో tongue_in_cheek అనడానికి నిలువెత్తు దర్పణంలాకా తోస్తుంది. వేలూరి గారు వివరించినట్లు “ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు” _”ధర్మం ఎటు వుంటే అటే జయం” అన్న గాంధారి, ధర్మము యొక్క అవగాహన, స్పృహ స్పష్టంగా తెలిసికూడా, దాని పర్యవసానంగా వచ్చే పరిణామాలు అంతకంటే బాగా “చూడగలిగి” కూడా, బిడ్డలను కట్టడి చేయలేకపోవడం, చూసే కళ్ళున్నా గంతలు కట్టుకొన్న చందాన సాక్షాత్కరింపచేసిన వ్యాసుని brilliance ఊహించినప్పుడెల్లా అద్భుతమనిపిస్తుంది! యుద్ధాన్ని కృష్ణుడు ఆపగలిగి కూడా ఆపలేదని రగిలిన గాంధారికి, తను ఇవ్వబోయే, లేదా ఇచ్చిన శాపాన్ని సైతం కృష్ణుడు ఆపగలగికూడా, ఆపలేదనే స్పృహ తట్టకపోవడం, కాదుఆమెకు
తట్టకుండా ఉండేటట్లు చెప్పడం, ఆ పాత్రకు ఎంతో సహజత్వాన్ని ఆపాదిస్తూ
వ్యాసుడు చేసిన అమేయ రూపకల్పన అనికూడా అనిపిస్తుంది!
_____
విధేయుడు
_Srinivas
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
06/01/2009 2:46 pm
> ఘంటసాల, రాజాలు ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల (శొభ చిత్రానికి) పాడారు.
ఈరోజు పి.బి.శ్రీనివాస్ 1964-65 ప్రాంతంలో “జ్యోతి” మాసపత్రికలో వివిధ సంగీతదర్శకులపై రాసిన వ్యాసాలు చదువుతూ తెలుసుకున్న విషయం: ఘంటసాల నిర్మించి, సంగీత దర్శకత్వం వహించిన “పరోపకారం” (1953) చిత్రంలో రాజా పాడారని. పాటల పుస్తకం చూసి ఒకటి కాదు రెండు పాడారని నిర్ధారించుకునడమైనది.; “తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనెలూరు…” (A.P.కోమలతో), “హృదయము ఊగిసలాడే…” (ఘంటసాల, A.M.రాజా, P.లీల, A.P.కోమల)
— శ్రీనివాస్
రాగాలూ స్వరాలూ గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
05/30/2009 10:30 am
సంగీతంలో సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే నని ప్రసాద్ గారు అంటున్నారు. కానీ మన దేశాన సంగీతపు వృధ్ధి..వికాసమూ బాగా తెలిసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు మాత్రం ఇలా అన్నారు.”మన దేశమున సంగీత సాహిత్య రచనలు అనాదిగా అవినాభూతముగా కలిసి న డుచుచున్నను సంగీతము సాహిత్యమునకు శోభాకరము మాత్రముగానే వెనుకనుండి న డచిదనియు వట్టి నాద రచనలు అంతగా పూర్వకాలమున లేవనియు చెప్పవచ్చును.ఎట్లును దక్షిణ దేశమున భక్తి,శృంగారము,వీరము
మొదలగు భావములను భగవద్విషయముగాగాని, ప్రభువులను గూర్చి కాని
వెలువరించు రచనలు చాలవరకు నిబధ్ధగేయములేయైనను వాని భాషా రచన
కు దేశములోనున్న విలువ నాద రచనకు లేదు గావుననే ఆ గానపధ్ధతులు నశించినవి.”
అనంతకృష్ణశర్మ గారి అభిప్రాయము ప్రకారము..సంగీతమే సాహిత్యాన్ని అనుసరించి న డిచిందిగానీ..సాహిత్యం సంగీతాన్ని అనుసరించలేదు..అన్న ది
విస్పష్టమౌతోంది. సాహిత్యం సంగీతానికి ఉపాంగం కాదనీ..ప్రధానాంగమేననీ కూడా ఇందువలన తేటతెల్లమౌతోంది.
రమ.
పాటల్లో లయవిన్యాసాలు గురించి mOhana గారి అభిప్రాయం:
05/26/2009 11:01 am
తాళం గురించి చదివిన తరువాత రెండు విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి.
1. పురందరదాసు కింది కీర్తన –
తంబూరి మీటిదవ భవాబ్ధి దాటిదవ
తాళవ తట్టిదవ సురరొళు సేరిదవ
గెజ్జెయ కట్టిదవ ఖలరెదె మెట్టిదవ
గాయన పాడిదవ హరి మూర్తి నోడిదవ
విఠలన నోడిదవ వైకుంఠ సేరిదవ
(తంబురాను మీటినవాడు భవాబ్ధిని దాటినవాడు,
తాళాన్ని వేసినవాడు సురులలో చేరినవాడు,
అందెలను ధరించినవాడు దుష్టులను అంతము చేసినవాడు,
గానాన్ని పాడినవాడు హరిమూర్తిని చూచినవాడు,
విఠలుని చూచినవాడు వైకుంఠాన్ని చేరినవాడు)
2. హంసగీతె చిత్రంలో శిష్యుడు గురువుతో శ్యామశాస్త్రి పాటను
మరొక తాళంలో పాడటానికి వీలవుతుంది అని నిరూపించాడు.
గురువు ఓటమిని అంగీకరించి ఆత్మహత్య చేసికొంటాడు.
ఒకే గురులఘువుల అమరికతో వేరువేరు గతులలో రాయడానికి
వీలవుతుందని ఛందస్సు రచ్చబండ వేదికలపైన ఎన్నో ఉదాహరణలతో
నేను నిరూపించిన సంగతి కొందరికి గుర్తు ఉందనుకొంటాను. ఇది
కూడా ఒక చిత్రకవిత్వమే.
((పగలే వెన్నెల చరణం నింగి పైన చందమామ … మాత్రలు త్ర్యస్ర గతియే)
విధేయుడు – మోహన
చలంతో రజని ముఖాముఖి గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:
05/24/2009 6:23 pm
అద్భుతం పరమాద్భుతం. చలం గారి గళం వినాలని నాకు ఎప్పటినుండో కోరిక. రేడియో కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారని తెలుసు కాని, ఇంతకాలానికి వినే అవకాశం దొరికింది. పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
ఇదే విధంగా శ్రీ విశ్వనాధ సత్యనారాయాణ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రానికి ఒక గంట నిడివి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది వినే భాగ్యం నాకు దాదాపు పాతిక సంవత్సారాల క్రితం కలిగింది. అప్పట్లో నాదగ్గర రికార్డు చెయ్యటానికి సదుపాయం లేక భద్రపరచలేకపొయ్యాను. శ్రీనివాస్ గారూ ఈ ఇంటర్వ్యూ కూడ సంపాయించి తెలుగు లోకానికి అందిగలిగితే ధన్యులం.
ఇంకా ఇలాంటి నిధులు ఆకాశవాణి వారి మట్టి బీరువాల్లో ఎన్ని ఉన్నాయో,ఇప్పటి వారి అయోమయ, అజ్ఞాన ఉద్యోగులకు వాటి విలువ తెలుసో లేదో, వాళ్ళు బీరువాల ఖాళీ ఉద్యమంలో ఈ నిధుల్ని ఎక్కడ పారేస్తారో లేక ఇప్పటికే పారేశారో తలుచుకుంటే నే దుఖం కలుగుతున్నది. ఆకాశవాణి వారు ఈ పాత రికార్డింగులన్నీ కూడ వారి నెట్ లో పెట్టేట్టుగా చెయ్యటానికి ఇన్ఫర్మేషన్ ఏక్ట్ కింద ఏమైన చెయ్యగలమా అని సాహిత్య సంఘాలన్ని సమకూడి చెయ్యవలసిన పని అని నాకు అనిపిస్తున్నది.
పునరపి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/24/2009 10:22 am
ఈ కథ చదివిన వెంటనే, అనేక సంవత్సరాలుగా ప్రొద్దున్నే లేచి, పచ్చి పాలూ, corn flakes కలుపుకొని తిని పనికి పరుగెట్టే నేను, అమావాస్యకీ పౌర్ణమికీ మా ఆవిడ ఇచ్చే ప్రియా ఇడ్లీలనే ప్రసాదంగా తినే నేను, ఎంత ఉన్నతుణ్ణి, అనుకోడంతో నాఛాతీ పెరిగింది. ఇక ఉండబట్టలేక, మా ఆవిడని పిలిచి, “ఈ కథ చదువు. అప్పుడన్నా తెలుస్తుంది నీవెంత అదృష్టవంతురాలివో, నాలాంటి ఆదర్శప్రాయుడైన భర్తని పొందినందుకు,” అన్నా.
“నీ బడాయి కేమిలే,” అంటూ కథ చదివి, తను, “ఈ కాలంలో అమెరికాలో weekdays ప్రొద్దున్నే లేచి దోసెలు వేసే వాళ్ళున్నారంటే నేను నమ్మను. ఉంటే, నూటికి కోటికి ఒకరున్నారేమో. మన స్నేహితులలో ఎవరన్నా ఉన్నారా అసలు?” అని నన్నొక సామాన్యుడిగా చేసేసింది. “ఏమో! మన స్నేహితుల్లో తెలుగు వాళ్ళు తక్కువ కదా,” అన్నా.
సాయంత్రానికల్లా ఓ తెలుగు స్నేహితురాలితో email సంభాషణ సాగించి, తన కోలీగ్ భర్త రాఘవ లాంటి వాడేనట, అని చెప్పింది. మరి ఎలా ఎందుకు వేగుతోంది అని అడిగితే, “కొట్టడు, వేరే హింస లేదు కదా, భరించవచ్చు” అన్నదట కొలీగ్!
ఇలాంటి కథల అవసరం ఉంది కాని, మృణాళిని రాసిన “కోమలి గాధారం” లాంటి కథల అవసరం ఇంకా ఎక్కువనిపిస్తుంది.
కొడవళ్ళ హనుమంతరావు
ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/17/2009 8:32 pm
వేమూరి గారి అభిప్రాయం చదివి ఆశ్చర్యపోయాను. తెలుగులో భాషాపరమైన డిగ్రీ ఏదీ లేకుండానే ఆయన నలుగురికీ ఉపయోగపడే నిఘంటువు నొకదానిని నిర్మించారు. మరి ఎవరో ఏదో అంటారని భయపడి శైలి మిద రాసిన పుస్తకాన్ని అచ్చువెయ్యకపోవడమేమిటి? అనుభవజ్ఞులు కూడా ఇలా వెనుకంజ వెయ్యడం చాలా నిరాశ కలిగిస్తుంది.
ఇక్కడ ప్రస్తావించిన – రంగనాయకమ్మ, బూదరాజు, దుర్గెంపూడి ల – పుస్తకాలు చెప్పుకోదగ్గవే కాని, అవేవీ, ఒంటిగా కానీ జమిలిగా కానీ, క్లుప్తత, సమగ్రత లలో Strunk and White కి సాటిరావు. కావాలంటే, “Elementary Principles of Composition,” కి సమాంతరమైనది ఈ పుస్తకాలలో ఏమైనా ఉందేమో చూడండి. వారి ప్రయత్నం ఎంతో మెచ్చుకోదగ్గదే అయినా, దానిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
అఫ్సర్ గారి లాంటి విద్యావేత్తలు, అలాంటి పుస్తకాలకి ఆదరణ ఉంటుందా లేదా అని అనుమాన పడకుండా, వాటి అవసరాన్ని గుర్తించి దానినో కర్తవ్యంగా తీసుకొని రాయాలి. ఫ్రొఫెసర్ Strunk చేసిందదే.
కొడవళ్ళ హనుమంతరావు
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి mOhana గారి అభిప్రాయం:
05/16/2009 12:30 pm
సదసత్కళా… పద్యంలో మరొక దానిని గమనించవచ్చును. అదేమంటే ఆ స్వరాల పాదాలు వచ్చేదానికి ముందు ఆ స్వరాలు కూడా నేపథ్యంలో వినబడుతాయి. నాకు తెలిసిన ఇలాటి అంశమున్న మరొక పాట – మలయమారుత అనే కన్నడ చిత్రంలో వల్లభాచార్యుల మధురాష్టకములో ప్రతి శ్లోకానికి ముందు సరిగమపధనిస స్వరాలు వస్తాయి. దీన్ని వాణీ జయరాం పాడగా బాలసుబ్రహ్మణ్యం ఊకొడుతారు. పాడబడిన మధురాష్టకాలలో ఇది చాలా మధురమైనది.
విధేయుడు – మోహన
ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి afsar గారి అభిప్రాయం:
05/16/2009 11:58 am
అనేక వెబ్ పత్రికలు, ఇతర కొత్త ప్రచురణ సాధనాలు పెరుగుతున్న ఈ కాలంలో తెలుగులో వొక శైలీ పుస్తకం చాలా అవసరం. ఈ అవసరాన్ని గుర్తించే విలువయిన వ్యాసం రాసినందుకు వేలూరి గారికి ధన్య వాదాలు. రచన – సృజనాత్మకమయినా, విమర్శ నాత్మకమయినా – కొన్ని సూత్రాలకు, నియమాలకు కట్టుబడి వుండడం వల్ల రచనకి అది బలమే. తెలుగు వాళ్లు సహజంగా ఆవేశజీవులు, ఆగ్రహ భావుకులు. విపరీతంగా పొగడ్డమో, తెగడ్డమో అలవాటయిన వాళ్లం. అందుకే, విమర్శ పేరిట వచ్చే చాలా రచనలు చివరికి కేవలం అర్ధ రహితమయిన ప్రశంసలుగా మిగిలిపోతుంటాయి. ఇక తెగడ్డం తూలనాడ్డంతో సరితూగుతుంది.
రాత అనేది సాధనతో సాధించుకునే విద్య. అది అచ్చు కావడానికి ముందే నలుగురు చదవడం వల్ల, నాలుగు మాటలు సరిదిద్దుకోవడం వల్ల మెరుగుపడుతుంది. తెలుగులో ఈ సాంప్రదాయం లేదు. చదివిన నలుగురూ మెచ్చుకుని తీరాలన్న పసితనపు ఉబలాటం తప్ప. పొరపాటున ఎవరయినా వేరే అభిప్ర్రాయం వ్యక్తం చేస్తే, ఇక ఆ వ్యక్తిని మన చదువరుల జాబితాలోంచి తీసి పడేస్తాం. దిద్దుబాట్లు, సరిదిద్దుబాట్లు మనకి నచ్చేలా వుండాలి. తెలుగు రచయితలు, కవులు చాలా మటుకు నిరంకుశ అధికారాల్ని కోరుకుంటారు. కొన్ని తరాలుగా ఇవి మొద్దు బారిన చర్మాలు. వీటి మీద చర్నాకోల లాంటి పదాలూ, వాక్యాలు తప్ప ఇంకేవీ పనిచెయ్యవు. అందుకే, సున్నితమయిన శైలీ పుస్తకాలు ఇక్కడ పనికి రావు.
తెలుగులో అచ్చు అనేది అచ్చోసిన ఆంబోతు లాంటిది. మనకి అచ్చు యంత్రాలు వచ్చాయి గాని, అచ్చు నియమాలు ఏమీ రాలేదు. అచ్చుకి సంబంధించిన భౌతిక ఏర్పాట్లు తప్ప నిజంగా అచ్చు సంస్కృతి రాలేదు. ఆ మాట కొస్తే, తొలి తరం ప్రచురణ కర్తలకి వున్న పాటి సంస్కృతి కూడా ఇవాళ మిగల్లేదు. ఒక రచన అచ్చుకి పంపడానికి ముందు ఏ ఏ దశలు అవసరమో ఆ ఆ దశల పట్ల మనకి శ్రద్ధ లేదు. అందుకే, రంగుల మయంగా కనిపించే ఇవాళ్టి ప్రచురణల కన్నా, ఆ నాటి వావిళ్ల, దేశి, ఆదర్శ, దక్షిణ భాషా సంస్థ ప్రచురణలు అందంగా కనిపిస్తాయి. ఆ అందం వాటి భౌతికత నించి రాలేదు, నిస్సందేహంగా అవి పాటించిన శైలీ నియమాల నించి వచ్చిందే అనుకుంటాను. అచ్చు తప్పులు లేక పోవడం కూడా ఆ నియమాల్లో భాగమే. ముందు తరాల సంపాదకులకు కూడా శైలి పట్ల ఆ గౌరవం వుండేది. ఈ తరంలో ఆ గౌరవాన్ని నిలిపే సంపాదకులు లేరు. అసలు సంపాదకుడి పాత్ర మీదనే ఇప్పుడు గౌరవం లేదు. ముఖ్యంగా అచ్చు గౌరవాన్ని పోగొట్టడంలో తెలుగు దిన పత్రికల పాత్ర పెద్దది. తెలుగు దిన పత్రికలన్నిటికీ నిజానికి శైలీ పుస్తకాలున్నాయి. అవి ఎవరూ పాటించిన పాపాన పోరు. అసలు అక్షరం ముక్క రాయడం వస్తే చాలు అనే స్థితికి దిన్ పత్రికల మార్కెట్ దిగజారి పోయినప్పుడు నిజమే, శైలి ఆందని ద్రాక్ష పండు మాత్రమే ! ఇప్పుడు సాహిత్యాన్ని పోషించేది కూడా ఈ దిన పత్రికలే కాబట్టి, సాహిత్య శైలి కూడా అంతే!
ఈ స్థితిలో వేలూరి వ్యాసం ఒక చూపుడు వేలు. అది కొందరి కళ్ళల్లో గుచ్చుకోవడం సహజమే! కాని, కాస్త నిగ్రహంగా ఆలోచిస్తే, ఈ వేలు ఒక మంచి రచనా సంస్కృతి వైపు దారి చూపిస్తుంది. మంచి ఆలోచనల్ని అక్షరాల్లోకి అనువదించే మంచి రాత ఆ సంస్కృతికి పునాది. ఇది నేర్చుకుంటే వచ్చేది తప్ప సహజ పాండిత్యం మాత్ర) కాదు. ఆ మాటకొస్తే, సహజ పాండిత్యం ఒక ఆత్మ వంచన, భ్రమ. అలా నేర్చుకోవడానికి మన తెలుగు వాళ్లు సిద్ధంగా వున్నారా అన్నది ప్రశ్న. అసలు నేర్చుకోవడం అనే ప్రక్రియ మీద మనకి గౌరవం వుందా? ఆ గౌరవం లేకపోతే , రాత నియమాలు మనకి పనికి రావు.
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
05/12/2009 11:15 am
పొరపాటుగానే అయినా ఒక ముఖ్య విషయం ప్రస్తావనకు రావటం మంచిదే అయింది. అది “సంపాదన”.గురించి. లోకం మొత్తంమీద తన శ్రమకి తగిన “కూలి” ఏ కోశానా.. గిట్టనిది ఒక్క తెలుగు రచయితకే… అన్న ది జగద్విదితం!! తెలుగుదేశంలోని పత్రికల్లో మంచి కవితకీ.. కాని కవితకీ కూడా ఒకటే రేటు. మీరు ఎంత గొప్ప కవితనైనా రాయండీ..మీకు వారిచ్చేది..ఒక 150రూపాయలు మాత్రమే!! గొప్పవ్యాసం రాసినా అంతే పారితోషికం.!! మరి ఇది రచయిత బుధ్ధి పరిశ్రమని కారుచౌకగా దోచుకోవటమే కదా? ఈమాట లో అచ్చయ్యే వాటికి “అంతర్జాతీయ ప్రమాణాల”కి ధీటుగానే ధర చెల్లిస్తారేమో..నాకు తెలీదు మరి.
నా ఉద్దేశ్యంలొ మంచి రచనలు రావాలంటే మంచి పారితోషికం చాలా ముఖ్యం. అక్కడ మార్పు లేకుండా..ఏమీ కిమ్మనకుండా.. “పెద్ద రచయితలు” రాయడంలేదని ఊరికే వగచినా..అనవసరంగా రచనలు పంపని వారిని ఆడిపోసుకున్నా… లాభం ఏముంటుందీ??
రచనలు కావాలీ..కానీ వారి అక్షరానికి కిట్టుబాటు ధర కల్పించం..అన్న వైఖరి అయాచితంగా రచయితల కల్పనాశక్తిని దోచుకోవటమే అవుతుంది. అందుకే పత్రికలకి అరుదుగా తప్ప చెప్పుకోదగ్గ రచనలు రానిది.ఈపాటి భాగ్యానికి వచ్చిన రాతల్తో సరిపెట్టుకుని నడుపుకోవటమే పత్రికని. అందుట్లో పస లేదని అనుకున్నా ఫలితమేముందీ?? ఊరికే వచ్చింది ఉత్తమం కాదా?!ఆలోచించండి.
రమ.
[విస్తృత చర్చకు వీలుగా ఈ అభిప్రాయం చర్చావేదికలో కూడా వుంచబడింది.]
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/11/2009 6:47 am
రచయితలకు, పాఠకులకు సూచనలు already ఇచ్చారు కదా!
నచ్చనివి, నచ్చినవి ఎన్నైనా ఉండొచ్చు. అసలు అనవసరంగా రచయితల ఇష్టాలు, అహాల ప్రస్తావనతో దారితప్పిన రచనలాగే, దమ్మిడీ ఆదాయం లేకుండా ఎంతో శ్రమ, పరిశ్రమ, సమయంతోనే సాధ్యమయ్యే పత్రికా నిర్వహణను కాదని దుమెత్తిపోయడం కూడా ఎందుకో మనసొప్పడం లేదు.
రాజుగారి క్షీరాభిషేకానికి నావంతు నీరిస్తే లోటేముందంటే నీరే మిగిలినట్లు, సంపాదకులు, పాఠకులు, రచయితలందరూ తలుస్తే, చేయేస్తేనే పత్రికకు
వైవిధ్యం, వైభవం అనిపిస్తుంది.
____________
విధేయుడు
-Srinivas
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/06/2009 8:40 pm
ప్రసాదం గారికి,
నా వ్యాసాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం; శ్రమకి ఫలితం దక్కినట్లే. మీరు వీటిని కాపీ చేసి పిల్లలకి పంచి పెడతానంటే నాకానందమేగాని ఎలాంటి అభ్యంతరమూ లేదు; ఈమాటకీ ఉండదు. మీ ఉదారతకి కృతజ్ఞతలు. ఈపనిలో నేను చేయూతనివ్వగలను. (మా హైస్కూలు మాస్టార్లకి పంపిస్తానని మాటిచ్చాను కాని, ఇంకా పంపలేదు. పంపాలి.)
వ్యాసాలన్నీ పూర్తయింతర్వాత, సవరించి పుస్తకంగా ప్రచురించే ఆలోచన చేస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
రామన్న గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/04/2009 10:04 am
వినీల్ గారు
కవిత నచ్చిందందామనుకున్న కాని గుచ్చింది, car accident లో పోగొట్టుకున్న దోస్తు యాదికొచ్చి. చివరి లైను కొసమెరుపు.
______
విధేయుడు
-Srinivas
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/02/2009 10:08 pm
నమస్కారం
చమత్కారంగా చక్కగా తెలిపారు, ఒక్కటి మాత్రం అర్థం కాలేదు.
“ముఖ్యంగా కవితలలో పునరుక్తి పనికిరాదు. కత్తిరించేయండి.”
అన్నదొక్కటి వ్యంగ్యమో హాస్యమో నిజమో తెలియని (దు)స్థితి.
వచనంలో పునరుక్తి వద్దనేది అర్థంచేసుకోగల్గినా, కవితలలో_ మనకున్న ఎన్నో తెలుగు, తెలుగేతర కవితలలో, అందంగానే కనబడుతుంది, స్పష్టంగానే వినపడుతుంది, సమంజసంగానే అనిపిస్తుంది కదా పునరుక్తి! అపార్థం చేసుకున్నాననేమో అని అనుమానం, అంతకన్నా దాన్ని సరిచేసుకోడానికే ఈ ప్రయత్నం.
To be or not to be: that is the question” అనే అంటాం కాని ఎంత Elements of Style ఘోషించినా To be or not: that is the question” అని అనం కదా! “మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది” అనీ, “భజ గోవిందం, భజగోవిందం, గోవిందం భజ” అనీ, “సంభవామి యుగే యుగే” అనీ, “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ” అనీ, “వాగర్థావివ సంప్రృక్తౌ” అని తిరిగి “వాగర్థ ప్రతిపత్తయే” అనీ, “దేశమంటే మట్టికాదోయ్ దే శమంటే మనుషులోయ్”-పునరుక్తులు లేక్కపెట్టుకుంటూపోతే, కత్తిరిస్తూవుంటే మిగిలేదేమిటో conclusion ఏమిటో తెలియదు!
ప్రార్థన చివర్లో కూడా పునరుక్తే ఓం శాంతిః శాంతిః శాంతిః !
“And miles to go before I sleep, And miles to go before I sleep”
—–
విధేయుడు
-Srinivas
[శ్రీనివాస్ గారూ: మీరు పైన ఉదహరించిన వేటిల్లో కూడా పునరుక్తి దోషం లేదు. -సం.]
ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/01/2009 8:39 pm
నాకు తెలిసి, అటువంటి ప్రయత్నమే ఒకటి డాక్టర్ చంద్రశేఖరరెడ్డి గారు కొన్నేళ్ళ క్రింద “వార్త” పత్రికలో “మన భాష” శీర్షికగా వ్రాసిన వ్యాసపరంపర అనిపిస్తుంది.
సాధ్యమైనంత ఎక్కువ మందికి సాధ్యమైనంత తక్కువ వెలతో అందించే విధంగా నూరు వారాలపాటు ధారావాహికంగా సాగిన ప్రయత్నం, రచయిత పరిశ్రమకూ, అప్పటి “వార్త” సంపాదకులైన శ్రీ కె.రామచంద్రమూర్తి గారి దార్శనికతకూ, ఇప్పుడు కూడా ఆశ్చర్యపడుతుంటాను. ఆ నూరూ వ్యాసాలను సంకలం చేసి “మన భాష” అనే పేరుతో 2001 లో పుస్తకంగా ప్రచురించారు. అది భాషా పరిజ్ఞాన సాధనకు చాలా ఉపకరమైన రచన అని బూదరాజు రాధాకృష్ణ గారు బహుధా ప్రశంసిస్తూ “పరిచయం” వ్రాసారు. భాషాపరంగా, వాడుక పరంగా అది తెలిపిన ఎన్నో విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి.
Elements of Style లో అన్య భాషాలోనుంచి ఇంగ్లీష్లోకి చేరిన పదాలను ఎట్లా ఏ రూపంగా వాడాలి అన్న ప్రస్తావన లేదు, సంశయాలు లేవు కాబట్టి! కాని తెలుగుకు సంస్కృతానికి పెద్ద సంబంధమే ఉంది. “ఏది తెలుగు – ఏది సంస్కృతం”,
“తద్భవాలా – తత్సమాలా”, “శషలు తెలుగులో లేవు”,
“తత్సమాలు ఏర్పడే పద్దతి” “భాషల పరస్పర ప్రభావం” మొదలగు ఎన్నో అంశాలు, పొరపడే ప్రయోగాలు, పదాలు
ఉన్నాయందులో.
ముఖ్యంగా, పత్రికలో వచ్చింది కాబట్టి సాధారణ పాఠకులకు అందుబాటులో ఉండి, ప్రతి అంశం రెండు పేజీలకు మించకుండా (రెండువైపులున్న ఒక్క పేజీనే!) ఒక చక్కని Style లో ఉంది.
ఎప్పుడు చదివినా ఏవో కొత్త అంశాలు (నాకు!) నేర్పే పుస్తకం. సందర్భం వచ్చింది కాబట్టి దాని ఉనికిని తెలియజేసే ప్రయత్నం
మాత్రమే. ఆ పుస్తకమొక్కటే సరిపోతుందని కాదు. ఆ కృషి మాత్రం గుర్తించదగింది, ఇంకా విస్తరించదగింది అనుకుంటాను.
———
విధేయుడు
-Srinivas
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/01/2009 7:44 am
తోచిన సూచనలిచ్చింది నిజమే కాని, ముఖ్యంగా నేను చెప్పిన దొక్కటి మాత్రం పూర్తిగా వదిలేసారు సురేశ్. అందుకే చెప్పుకోవడం.
సంస్కృత శ్లోకాలు, పోతన పద్యాలు మొదలగునవేవీ ఇంటెర్నెట్టులో లభించని రోజుల్లో వాటిని అందించి, అర్థ వివరాలను తెలిపి, అన్వయించుకోవడానికి ఆనందించడానికి అప్పట్లో సాయపడిన వారిలో గుర్తున్నంతవరకు సురేశ్ పేరే మొట్టమొదటిగా తడుతుంది. అంతే గాక, సురేశ్ అప్పట్లో SCIT కి “తెలుసా” గ్రూపులకు bridge తయారు చేసారు. దాన్ని వాడినవారికి కూడా తెలుసో లేదో.
WordPress ద్వారా “ఈ మాట” ను ప్రచురించే సాంకేతికపరమైన వివరాలను ఇంకెంతోమంది తెలుగు వారికి కూడా ఉపయోగపడాలనే పెద్ద మనసుతో, “పొద్దు”, “భూమిక”, “ప్రాణహిత” మొదలగు సైట్ల నిర్మాణానికి కూడా దాచుకోకుండా అందజేయడం, వారు చెప్పడం దాచారు కాబట్టి చెప్పడం. శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!
జ్ఞాపకాలు తెలుపుకోవడంలో ఒక ప్రమాదం ఉంది. రాసిన గంటకో రెండ్రోజులకో అయ్యో ఫలానా సంగతే చెప్పడం ఎట్లా మరిచాను అనిపించడం. అట్లా అని చాంతాడంత రాస్తూపోతే మొహమెత్తవచ్చు, తీపి కూడా ఎక్కువైతే అయినట్లు. గుర్తుకొచ్చినవాటికీ, రానివాటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.
______
విధేయుడు
-Srinivas
“అంటరాని వసంతం” నవల గురించి దుప్పల రవికుమార్ గారి అభిప్రాయం:
04/30/2009 9:25 pm
పుస్తకంలో ఇదే నవలపై రచయిత రాసిన కామెంట్ లోని లింక్ ద్వారా ఇక్కడకొచ్చేను. వ్యాసమ్ చదివాను. ఎంతో సానుభూతితో రాసిన పరిచయం బాగుంది. కాని, నాకనిపించింది ఏమిటంటే మన చూట్టూ మనల్ని నిండా ముంచీసేలా వున్న బ్రామ్మన సాహిత్యం మన మనసులను ఎలా ఆక్రమించిందో చూడండి. ఈ వ్యాసంలొనే ‘పురాణం’, ‘భారత భాగవతాల్ని సూతుడు శౌనకాది మునులకి కూర్చోబెట్టి చెప్పినట్టు’, ‘ఉప్మాలో జీడిపప్పు పలుకుల్లా’ లాంటి మాటలు.. నాకెందుకో ఇక్కడ ఎబ్బెట్టుగా అనిపించాయి. ఎందుకిలా అనిపించిందంటే ఈ నెల “అరుణతార” చదవడం వల్లనా? లేదంటే ప్రస్తుతం బి.ఎస్. రాములుగారి “కన్యాశుల్కంను ఇప్పుడెలా చూడాలి” వ్యాసం చదువుతున్నందుకా? వీరి వ్యాసం నిజానికి నాకు నచ్చింది. గానీ, ఎందుకో పదజాలంలో మరో వాసన కనిపిస్తోంది. ఈ విషయంలో నా ఆలోచనలు అస్పష్టంగానే వున్నాయనుకోండి. అదే ఇక్కడ చెప్పాలనిపించింది. తప్పయితే మన్నించండి.
శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి hEma vempaTi గారి అభిప్రాయం:
04/29/2009 2:40 pm
ఆర్కే గారూ! శ్రీనివాస్ గారూ! మీ అభిప్రాయమే నాకూ వచ్చింది. కాని నా మనసు వ్యతిరేకిస్తున్నా ఇలా రాయడమ్ జరిగింది. ఎందుకంటే, నేటి ప్రపంచం తీరును బట్టి చూస్తే, చాలామంది ఎత్తుకి పై ఎత్తు వేసి గెలవాలని చూసే వాళ్లే కదా! ఈ నాటి “ట్రెండ్”నే కొలికి ముత్యంగా ఉంచడం బాగుంటుందనిపించి అలా వ్రాశా. అలా రాస్తేనే సహజంగా ఉంటుందని మిత్రుల సలహా. ఎంత చెడ్డదైనా, చేతికి చిక్కిన అవకాశం జారవిడుచుకునే వారు చాలా కొద్దిమంది ఈ కాలంలో. ఏది యేమైనా, మీ సలహాకు కృతజ్ఞతలు.
శ్రీనివాస్ గారూ! ఆలస్యం- అన్న మాటను నేను తప్పుగా వ్రాశాను. కాని ఉద్దేశ్యం – అన్నది తప్పు కాదు. టైపోలను ఇక నుంచీ ఎప్పటికప్పుడు సరిచేస్తాను. తెలుగును ఇంగ్లీషులో వ్రాయడం కొత్తగా నేర్చుకున్నాను. అక్కడక్కడ తప్పులు అనివార్యం ఔతున్నాయి. మన్నించండి.
నెనరులతో
వి. హేమ.
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి baabjeelu గారి అభిప్రాయం:
04/26/2009 8:33 am
పిండంతే నిప్పటి యన్నట్లు అంటే పిండికొద్దీ రొట్టె యన్నట్లు అని అనుకుంటున్నాను. నిప్పట్టు రాయలసీమ కారపు అప్పచ్చి. మొదటిసారి పుంగనూరు నుంచీ “బిన్నీగాడు” తీసుకొస్తే “మద్రాసు” లో రుచి చూసేను. అచ్చు సేమ్ డిటో చేగోడీ. మెటీరియలూ అదే, వేయించడవూ అదే. కనస్ట్రక్షన్ లో తేడా, అంతే. చేగోడీలు నలుపుతారు. జబ్బలు పడిపోతాయి. అదీ గాకుండా చక్కగా వ్రుత్తాల్లా చుట్టకపోతే తిట్లు తప్పవు. గొళ్ళేల్లా చుట్టెస్తే ఇంకా తిట్లు. నూనె ఎక్కువ పీల్చకుండా ఏదో టెక్నిక్ తో మా మేనత్త చేగోడీలు చేసీదికాని అవి “కటక, పటక్” మంటాయి. కరకరలాడవు. బావుండవు. అన్నట్టు నూనె బాగా పీల్చి కరకరలాడీ చేగోడీల్ని జేబులో వేసుకుని ఆడుకుందుకి వెళ్ళకూడదు. ఆ రాత్రి ఎలకలు జేబులు కొట్టెస్తాయి. నిప్పట్లు అప్పచ్చుల్లా చేస్తారు. నలపరు. బహుశా నిప్పట్లని ఉండలా చుట్టిన పిండిని అరచేతిలో పల్చగా అప్పచ్చిలా చేసి వేయిస్తారు కాబోలు. చిన్న ఉండయితే చిన్న నిప్పట్టు, పెద్ద ఉండయితే పెద్ద నిప్పట్టు.
పిండికొద్దీ రొట్టె అన్న ప్రయోగం “పిండంతే నిప్పటి” ముందుదా వెనకదా? రొట్టెలు అన్నమయ్య టైములో లేవా? వున్నా లేకపోయినా నిప్పట్ల వల్ల చేగోడీలకోసం ఏడవడం తప్పిపోయింది నాకు. చిన్నప్పటి పోగుట్టుకున్నాననుకున్న, మరి దొరకదు గాక దొరకదనుకున్న “బంతి” దొరికిందినాకు. అన్నమయ్య పాటల్లో ఇన్ని మంచి వూసులున్నాయా?
వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/25/2009 12:01 am
తెలుగు వారందరికి
వాడుక భాషా ప్రయోగం వలన కవితా వికాసం పక్కనుంచితే, భాషా వికాసం జరిగిందాలేక వినాశం జరిగిందా అనేది ఆలోచించదగిన విషయం. నాకైతే వినాశం జరిగినదనిపిస్తోంది.
దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించి
ధీరుడై నన్ను బాధించు నొకడు
పాదాంబులోపల పాదంబు లిమిడించి
వీరుడై నన్ను నొప్పించు నొకడు
ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లడరించి
పోటుబంటయి నన్ను పొడుచు నొకడు
బెండు పల్కులు గూర్చి నిండైన నగలంచు
దిట్టయై చెవులు వేధించు నొకడు
ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి
వర్ణముల్ మార్చి నను చిక్కుపరచు నొకడు
కుమతు లొడ లెల్ల విరిచి ప్రాణములు తీయు
ఒడలి పస లేక శుష్కించియున్న దాన
రసజ్ఞులను ఆకట్టుకొనే రసాన్ని అలక్ష్యం చేసి కేవలం అద్భుతం విస్మయం కలిగించే పై దిక్కుమాలిన సర్కస్ ఫీట్ల పై దృష్టి పెట్టిన ఆనాటి కవుల ధోరణిని నిరసిస్తూ చేసిన సరస్వతీ దేవి విలాపం సరి ఐనదే. కానీ దానికి స్పందన, విస్పందన, ప్రతిస్పందన, విపరీత స్పందన బాగా ఎక్కువై ఈనాటి స్థితికి కారణమైనది. నాకైతే ఇప్పుడు మాత సరస్వతి మన ముందు నిలబడి ఈ విధంగా ఆక్రందిస్తున్నట్లు అనిపిస్తుంది.
ప్రాస, యనుప్రాస, బహు ప్రాస, యంత్యను
ప్రాస నా బడు నగల్ దీసినారు
శ్లేషోప మాది విశిష్టార్ధ భూషల
పాత పెట్టెల పార వైచినారు
లలిత నారీకేళ రస రమ్య పాకాల
చీనాంబరాల్ చింపి చీల్చినారు
కంద మత్తేభాది కమనీయ గతులిచ్చు
మంజీరముల హత మార్చినారు
తిలక, మంగరాగము, కురుల్ తీర్చి దిద్దు
సరణి, పారాణి, ప్రాతని పరిహరించి
అన్ని దిగలాగి నగ్నతా ఖిన్న జేసి
నిలిపి నారయ్యయో వీధి నేటి కవులు
పలుభూషణంబులు వలదంటి నే గాని
తల శిరోమణి నైన దాల్పనొక్కొ?
నగలిన్ని మోయంగ జగడమాడితి గాని
ఒకపేట గొలుసైన నొల్లనొక్కొ?
పట్టు జరీ చీర పెట్టెలొల్లను గాక
వస్త్రమే వలదని పలికితొక్కొ?
పలుగతులను నృత్యముల సేయ భరమంటి
నడవనే నని సుడి వడితి నొక్కొ?
భావ భాషాది భూషల బార వైచి
యమక గమకాదిగతులెల్ల యణగ ద్రొక్కి
రస విలాసాఖ్యమౌ యంబరముల నూడ్చి
నిలిపి నారయ్యయో మది తొలచినారు
నేను మీ వ్యాసంలో ఉదహరించిన పేరెన్నిక గన్న మహా కవుల గురించి గానీ జనాదరణ పొందిన వారిఉదాహృత కవితల గురించి గానీ పై అభిప్రాయాన్ని వెలువరించ లేదు. ఈ మహా కవులందరు అద్భుత ప్రతిభా వ్యుత్పత్తి గలవారు. భాషలో అనంత పద పరిజ్ఞానం గలవారు. జనరంజకమైన భావాభి వ్యక్తికై ఛందో బంధనాలనుంతెగద్రెంచిన వారు. కావలసి వస్తే గర్భ కవిత్వాన్ని గానీ బంధ కవిత్వాన్ని గాని అలవోకగా నిర్మించగల భాషా శెముషి గలవారు.
నేను చింతించేది తామర తంపరలుగా అనేక పత్రికలలో వచన కవిత అనే పేరుతో కవితా సరస్వతిని గాయపరచే వారి గురించి. ఈ తరహాలో నాకు తెలిసిన చాలా కవులకు 100 -150 కన్నా తెలుగు పదాలు రావు. ఒక ఆట వెలదిలో పద్యం వ్రాయగలిగే పద సామర్ధ్యం లేదు. అసలు వారికి ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి తెలిసిన పదం ఒకటే, అదీ అన్య భాషా పదం ఐనపుడు ఛందస్సు అనేది తెగగొట్టలేని అయోమయ శృంఖలగా అనిపించడంలో వింత లేదు. కనీసం ఒక లయ (మాత్రా ఛందస్సులో) ప్రకారం కూడా వ్రాయలేక ఈ నియమాలేవీ లేని వచన కవితనిఎన్నుకోవడం శొచనీయం. జన సామాన్యానికి అర్ధం అయే భాషలో వ్రాయడం మాత్రమే ముఖ్యం కాదు, జనరంజకంగా వ్రాయగలగాలి. అందుకు భాషలో పద పరిజ్ఞానం ఉండాలి. అది మృగ్యం ఔతోంది.
ఇంకొక సంగతి. జనసామన్యానికి అర్ధం కాని సాహిత్యం నిరర్ధకమైనదనే దానిని ఎవ్వరూ ఇష్టపడరు, దానిపై మా కసహ్యం లేదు. మానేశాము అనే వాదన ఈ వ్యాసంలో బయట కూడా కర్ణతాడితమౌతోంది. జనసామాన్యానికి అర్ధం కాలేని వన్నీ పరిత్యజించాలంటే, ఒక గణితం, సర్వ విజ్ఞాన శాస్త్రాలు పరిత్యజించి గుహలలో ఉండాల్సి వస్తుంది. క్లిష్టమైన దాని ఆలోచించి అర్ధం చేసుకోవడం ద్వారానే విజ్ఞానం పెరుగుతుంది. భాషకు కూడా ఇది వర్తిస్తుందని తెలుసుకోక పోవడం వలన మన భాష ఇప్పటికే చాలా నష్టమైంది. వ్యాసకర్తగారు వొక చోట వేమన గారు జనసామాన్య భాషలో వ్రాశారన్నారు. ఆ మాట కు కాలదోషం పట్టిందని తెలుసుకుంటే వారు తమ మాటను వెనక్కు తీసుకుంటారేమో. ఎందుకంటే ఇప్పటి తెలుగు వారికి వేమన సుమతీ శతకం లు అర్ధం కావడం లేదు. ఆ గ్రాహ్య శక్తి 100-150 దాక పద పరిజ్ఞానం గలిగిన కవులకే పరిమితం. ఈ విధంగా భాష ఒక్కొక్క తరంలో క్రమక్రమంగా వినష్టమైపోతోంది. ఛందో బద్ధమైన కవిత్వం వ్రాయడం వలన కవి పద పరిజ్ఞానం పెరుగుతుంది. భాష విస్తృతమౌతుంది. తన అధీనంలో వున్న అనంత పదరాశిలో జనరంజకమైన పదాన్ని ఎన్నుకోడానికి కవికి వీలుంటుంది. నియమ బద్ధంగా ఆరంభించినవారికే ఆ నియమాలను ఎట్టి సందర్భాలలో ఎలా అతిక్రమించి జనరంజకమైన కవిత్వం వ్రాయడం సాధ్యమౌతుంది.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Dr Tatiraju Venugopal గారి అభిప్రాయం:
04/24/2009 12:03 pm
తెలుగు సినీ సంగీతంలో రెండు యుగాలున్నాయి. ఒకటి ఘంటసాల యుగం. ఇంకొకటి బాలు యుగం. దేనికదే ప్రత్యేకమైనది. ఘంటసాల వారిది 30 యేళ్ళ యుగం. బాలు వారిది కూడ ఇంచుమించు అంతే. ఒక యుగం మరొక యుగానికి స్వాగతం పలికే యుగ సంధి కాలంలో వారిద్దరూ కలసి పాడిన పాటలు- ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ‘ అనే ఉదయ గీతం మొదటిదైతే ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అనే రేయి గీతం రెండవది. ఇక ఆ తర్వాత వచ్చినవి-‘భలే మజాలే భలే ఖుషీలే టయిము రోజాలే మనం రాజాలే’, ‘దేవుడు చేసిన మనుషుల్లారా …. వినండి’. ఈ రెండు యుగాల్లో మంచి పాటలూ వచ్చాయి, ‘అయ్యో ఖర్మ’ అనుకునేలా చెడ్డ పాటలూ వచ్చాయి. ఇప్పుడు కేవలం మంచి పాటలే ముందు తరాలకు అందేలా చూడాలి. అందుకు అద్భుతమైన సాధనం- కంప్యూటరే. కంప్యూటర్ ఘంటసాల యుగంలో అంత అందుబాటులో లేదు. అందాక ఎందుకూ? క్యాసెట్లే లేవు. కాని కంప్యూటర్ యుగంలో ఘంటసాల పాట ఇంకా ఉంది. బాలు చాలా అద్రుష్టవంతులు. సాంకేతిక ప్రగతిని అంచెలంచెలుగా చూస్తూ తన గొంతును రక్షించుకుంటున్నారు. తెలుగు మాట కరువైపోతున్న ‘కన్ ఫ్యూజన్ యుగంలో తెలుగు పాట ‘రస హీనమై పోతోంది’, పాడేవారి విషయంలో ‘వారస హీనమై పోతోంది’.
– డా. తాతిరాజు వేణుగోపాల్
అల్లాష్టకము గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/23/2009 1:41 am
ఏ కరీముద్దీన్ గారి కలం నుండి గాక ఒక కృష్ణ మోహనుని కలం నుండి వచ్చిన ఈ అల్లా స్తుతి అభినందనీయం.
శివుడెంచగా కాళి, శ్రీ పతి కాళి, పవనాత్మజుడు విఘ్న పతియును కాళి
నవగ్రహ దేవతల్ నారాయణుండు, వివరింప వేంకట విభుడును కాళి
నరసింహదేవుండు నాకెంచ కాళి, గురు రామకృష్ణుండు కొండంత కాళి
శిరిడీ నివాసుండు శ్రీకరి కాళి, అరయ దోచెడు విశ్వమంతయు కాళి
ధరియించు వస్త్రంబు తగ కాలిజోడు, ధరనూడ్చు చీపురు, తట్టయు కాళి
తిరువళికయు కాళి, దీపంబు కాళి, బరగ గూర్చొను గోనె పట్టయు కాళి
అభీష్ట దైవాన్నే అంతటా చూసే వారికి నామ రూపాలతో పని లేదు. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు (న ఏసు అనేసు = ఏసు కానిది)
అనేది ప్రపంచంలో లేదు.
చంపకోత్పలమాలల కథ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/20/2009 1:37 am
లైలా గారికి
అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్
పై పద్యంలో ధార, భావం అన్నీ బాగా వున్నాయనే నేను కూడా అనుకుంటున్నాను. మీకీ పద్యం అవగతం కాలేదన్నారు లేదా భావోత్కృష్టత అంత ప్రశంసనీయం గా మీ కనిపించలేదన్నారు కనుక, నా అల్ప మేధస్సుకి అది ఎందుకు అనర్ఘంగా తోచిందో వివరింప ప్రయత్నిస్తాను.
ధనము శాశ్వతము కాదు. శరీరం క్షణ భంగురము. జీవనము తత్వార్ధముల వలె (అహమ్ బ్రహ్మస్మి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి వగైరా) నిత్యము కాదు. కాల పాశానికి ఏ నిముషమైనా చిక్కవచ్చు. కావున మనుషులైన వారు దీని వ్యావృతిని నమ్మక, మహాత్ముడైన అమ్మెన ప్రెగ్గడ వలె పేర్మితో వరార్ధము (భగవచ్చింతన), ఎన్నడునూ చేటు లేని ధర్మార్ధము (ధర్మ నిరతి) చేయవలయును.
ఈ పద్యంలో ఛందో భంగమే కాక సమన్వయానికి లొంగని ఒకటి-రెండు పదాలున్నట్లు ( రెండవ మరియు మూడవ పాదారంభంలో) తోస్తుంది. అవి తప్పక వ్రాయసకాని లోపమో, పురాతనమై అనేక వాతావరణ మార్పులకు లోనై వ్యగ్రమై పఠన యోగ్యం కానీ శిలాక్షరాల వలననో, ప్రాచీన లిపి ఐ వుండడం వలననో సంభవించివుండవచ్చు. మిగిలిన పదాలు, ధార అవధరిస్తే కవి అసమర్ధుడుగా భాసించడు. ఆ లోపాలు సమ్యగ్రీతిని సంస్కరిస్తే ఈ పద్యం మీకు కూడా హృద్యంగానే వుంటుందని అనుకుంటాను. ఆ విధంగా సంస్కరింపబడినా కూడా అది అంత మంచి పద్యం అని మీకనిపించక పోతే అది మీ అభిరుచి. లోకో భిన్న రుచిః నాలాంటి కొందరికి నచ్చిన దాన్నే ఉత్తమ సాహిత్యమని పలకడం దుస్సాహసమౌతుంది గదా.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి Vijaya KLNR Pingali గారి అభిప్రాయం:
04/18/2009 10:49 am
మీరు బి.వి.రామన్ గారు గాంధి గురించి వ్రాసిన దానిని ఎగతాళి చేసారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చి పోతున్నారు. జాతకము లోని వివిధ కాంబినేషన్ల బట్టి వివిధ విషయములు చూడాలి. ద్వాదశం, శయ్య సుఖము, మోక్షము, వ్యయము లను సూచించును. ఆత్మ కారకుడు మోక్షస్థానములో ఉండటము వలన అధ్యాత్మికత గురించిన ప్రస్తావన సరియేగదా. ఇది మీరన్నట్లు 2+2=4 లాగా కాదు కదా. వివిధ సిధ్ధాంతములు మనకు సూచకములే (గైడులైనులే).
ఇంకొక సంగతి: డీన్ చేసిన ప్రయోగం చాలా సరళమైనది. ఒక జాతకం సరిగా చెప్పాలంటే, వివిధ వర్గ (రాశి, నవాంశ, దశాంశ, …), ఏ విషయము కావలయునో ఆ దశ భుక్తి తదితర విచారము, గోచార, తిథి ప్రవేశ ఫల నిర్ణయము ఇటువంటి వివిధ ప్రకార చింతనము ఆవశ్యకము. అంచేత, డీన్ ప్రయోగ ఫలితము నాకు అంత ఆశ్చర్యము కలిగింపలేదు. అదీ కాక, ఆయన నమ్మకము అధికమని నిరోపించాడే కాని జ్యోతిష్యము పని చేయదని నిరూపించలేదని నా అభిప్రాయము.
నా అభిప్రాయము ఏమన జ్యోతిష్యము ఎడ్యుకేటెడ్ గెస్ చేయటానికి సాయం చేస్తుంది.
అతడు, నేను, అతడి కథ గురించి B H A G A V A N T A M గారి అభిప్రాయం:
04/16/2009 11:00 pm
మాధవ్ గారికి
స్పందన తెలుపమన్నందుకు ఈ క్రింది రెండు మాటలు…
“కొందరు శబ్దాలకు తలూపుతారు. కొందరు శబ్దాలకు నాట్యం చేస్తారు. కొందరు శబ్దాలకు ‘చెవి’ విరుస్తారు. కాని కొందరు నిశ్శబ్దసౌందర్యాన్ని దర్శించడం కోసం శబ్దలోకయాత్ర మొదలుపెడతారు.
చివరివారికి లోయలు స్వాగతం పలుకుతాయి. మీకు స్వాగతం పలికిన లోయల్ని పరిచయం చేసుకున్నాను. సంతోషం.
ఈ కథ గురించి రచయితగా చెప్పడానికి ఏమీలేదు. ఎవరి లోయల మీద ఎగురుతొన్న పక్షుల రెక్కల చప్పుళ్ళని వారి రక్తంలోకి అనువదించుకుని ఆనందించడమే…
భగవంతం
16.04.2009.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana గారి అభిప్రాయం:
04/16/2009 7:20 am
ప్రసాద్ గారికి నమస్కారం – మీరు రాసింది బాగానే ఉంది. చివరి పాదంలో దురితలోని రితో యతి సరిపోదు. సామాన్యముగా శ్రీకు రికు యతి చెల్లుతుంది. కాని పాదంలో ఒక యతికంటె ఎక్కువగా ఉంటే, మొదటి
అక్షరము సంయుక్తాక్షరమయితే అందులో ఒక అక్షరంతోనే పాదమంతా యతి చెల్లించాలి. అంటే దురితలోని రికు బదులు శీ అక్షరముతో యతి చెల్లించాలి. నా ఈమెయిలు చిరునామా jkmrao@yahoo.com
అక్కడికి మీరు రాస్తే మిగిలిన విషయాలను చర్చించుకోవచ్చు.
విధేయుడు – మోహన
నన్నెచోడుని క్రౌంచపదము గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
04/15/2009 10:36 pm
మోహన రావు గారికి,
మీ సద్యో ప్రత్యుత్తరానికి కృతజతలు. ముఖ్యంగా పద్య లక్షణాలను సరిగా తెలియజేసినందుకు. నాకు ఇవి వ్యాసం చదివినపుడు అవగతం కాలేదు. సరిచేసిన పద్యాన్ని క్రింద వ్రాసాను నా అవగాహన పూర్ణమేనా చూడండి
దేవగణేశా!భావజ నాశా! స్థిరమత! సురభృత! త్రిగుణ వినాశా!
భావభవారీ! శ్రీవర ధారీ! భవహర! పురహర! వరగుణ హారీ!
పావన మూర్తీ! హే విహృతార్తీ! పరమపద భవన పరిచిత కీర్తీ!
శ్రీవర వంద్యా! దేవ! యనింద్యా! శివమయ!విహృత దురిత ఘన మాంద్యా!
మీకున్న చందో పరిజ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత ఒక చిన్న సంశయం తీర్చుకోవాలనుంది. దండకానికి లక్షణం తెలియచేయ (గల)రా. అనేక త గణాల తరువాత కొన్ని (ఒకటో రెండో) న గణాలు కనబడతాయి. న గణ ప్రయోగమే లేకుండా కేవల త గణాలతో దండకం వ్రాస్తే తప్పవుతుందా?
ఈ మాట సంపాదకులకు – అయ్యా ! ప్రచురితమైన వ్యాసాలతో సంబంధం లేకుండా మా వ్యక్తిగతమైన సంశయాలకు సమాధానం పొందాలంటే మేము ఏమి చెయ్యాలో తెలియపరచగలరు.
[ఈమాటలో ఇటువంటి ప్రశ్నలకూ, అభిప్రాయ చర్చలకూ ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పాఠకులకు త్వరలోనే తెలియజేయగలం. – సం.]
అతడు, నేను, అతడి కథ గురించి Meher గారి అభిప్రాయం:
04/08/2009 5:50 am
మంచి కథను పరిచయం చేసినందుకు మాధవ్‌గారికి నెనరులు. నేను యిటీవలే అరకు వెళ్ళాను. అంత విశృంఖలమైన ప్రకృతి ఎవరినైనా కదిలిస్తుంది. రచయితలకైతే సహజంగానే ఏదో ఒకటి రాయాలన్న ఉద్దీపన కలిగిస్తుంది. నేనూ ఏదో ఒకటి రాయాలనుకున్నాను. కానీ నేనేం రాసినా ఇందులో శతసహస్రాంసమైనా అయ్యుండేది కాదు. ఆ నేపథ్యాన్ని ఇంత అద్భుతమైన ఉద్దేశ్యానికి వాడుకోగలిగేవాణ్ణి కాదు. కథ అర్థం అవడమూ అర్థం కాకపోవడమూ తరువాతి సంగతి; ముందు చదువరి ఈ కథని పూర్తిగా ఆస్వాదించాలంటే, విశాఖపట్నం నుంచి అరకుకి రైలు మార్గంలో ఒక్కసారైనా ప్రయాణించి వుండడం అతని కనీస అర్హత. మాధవ్‌గారు చూడలేదు కాబట్టే కథని ఒక పార్శ్వం లోంచే ఆస్వాదించగలిగారు. నేనైతే ఆ టన్నెల్స్‌లోంచి కూడా నడిచాను. అదో వింత అనుభవం.
“ఇదంతా నాన్సెన్స్ అంటే ఏం చెప్పను? అర్ధం కాని వన్నీ గొప్పవేనా అంటే ఏం చెప్పను? ‘పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ’ మనకు ఉంటుందని నేననుకుంటాను.”
ఇది నిజం. కొన్ని కళరూపాలు అర్థం కాకపోతే అది వాటి తప్పే అనిపిస్తుంది. మరికొన్నింటి విషయంలో మాత్రం, మనం సరైన దృక్పథం లోంచి చూడలేదు కాబట్టి అర్థం కాలేదనిపిస్తుంది; మనదే లోపమనిపిస్తుంది. ఈ “పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ” మనకు సాధనతోనే సంక్రమిస్తుంది.
బోడి పద్యం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
04/07/2009 2:11 am
అభిప్రాయం స్పష్టంగా లేదేమో అని ఇంకొక్క మాట. మసీదైనా, మందిరమైనా, Golden Temple గురుద్వారా అయినా, ప్రార్థించే ప్రదేశమేదైనా పవిత్రమే, ఎల్లప్పుడూ అందరికీ. మతమేదైనా పవిత్రత ఒక్కటే. కాని ఆ పవిత్రతకు కారణమైన ప్రార్థన, నమాజు అన్నవే లేనప్పుడు వాటిని పూర్వ గౌరవంతో ఆదరించడం ఎంత వరకు సబబు అన్నది కవులు, విజ్ఞులే కాదు మేధావులూ, పౌరులందరూ ఆలోచించి అభిప్రాయాలు పంచుకోవడం ఎంతో ఘర్షణను, రక్తపాతాన్ని నివారించడానికి సహాయం, కాదు- నేటి అవసరం అని కూడా అనుకుంటాను. హింసకు దారితీసిన, తీస్తున్న విషయాలు చర్చలకు దారితీసి వెలుగును వెత్తుక్కోవడం అన్నివిధాల మేలు చేస్తుందని కూడానమ్ముతాను.
________
విధేయుడు
-Srinivas
బోడి పద్యం గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
04/04/2009 9:03 am
సమాజంలో బతకడం నేర్చుకోవాలట ఈ కవితనర్థం చేసుకోవడానికి. సమాజంలో బతకడవే సరిపోదట, వెనుకనున్న చారిత్రక సంఘటనల సారస్వం తెలిసుండాలట. కాకపోతే మరేదో వ్యాసం చదివి ఈ కవితని అర్థం చేసుకోవాలట. లేకపోతే, అర్థం లేకుండా గొప్పగా ధ్వనించే ఈ పదాల పజిల్ ని, ఒకదానికొకటి సంబంధంలేకుండా వున్న ఈ పదచిత్రాల ముక్కల్లో, నేలని విడిచి సాముచేసి, తెగిపడివున్న చర్మపు ముక్కనుంచి భూత, భవిష్యత్, వర్తమానాల్ని అన్వయించుకునే (పచ్చ, పచ్చటి డాలరు రంగులో, పడిపోతున్న అమెరికా హంగులో) ప్రత్యేకవైన రంగుల కళ్ళద్దాలన్నా కావాలట.
ఎవరికోసం ఈ కవిత? ఎందు కోసం ఈ కవిత? కొద్దో, గొప్పో చదవనేర్చిన వాళ్లకి కూడా అర్థం కాని ఈ కవిత. పాఠకుల ప్రయత్నంలో మాత్రవే విచ్చీ విచ్చకుండా విచ్చుకునే ఈ కవిత. కవితని చదివి అర్థం చేసుకోడానికి ఒక ప్రత్యేకవైన స్థాయి కావాలని కవిగారనుకునుంటే ఇక పేచీనే లేదు. మా పత్రిక ఆ స్థాయిగల పాఠకుల కోసవే అని సంపాదకులనుకుంటే కూడా పేచీ లేదు. కానీ ఇది సర్వ తెలుగు జనుల కోసం అనే అభిప్రాయం వుంటే మాత్రం కవి(తన కవితకి తానే వివరణ ఇచ్చుకోవడం కష్టవే), వివరణ ఇవ్వడం అవసరవేవో.
రవి
బోడి పద్యం గురించి ravinder posani గారి అభిప్రాయం:
04/01/2009 1:13 pm
ఈ పద్యాన్ని నిజంగా అర్ధం చేసుకోవాల్నే అని వుంటే అన్ని ఆధారాలు, సమీక్షకుల సర్టీఫీకెట్లు అక్కర లేదు. లైలా గారి విశ్లేషణ చాలు…
కాని, అర్ధం చేసుకోవాలన్న తపన కన్నా, తప్పులెన్నాలన్న తాపత్రయం ఎక్కువ కనిపిస్తోంది.
ఈ పద్యాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు మీరు ఈ సమాజంలో బతుకుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోగలిగిన వాళ్లకి ఈ కవిత తేలికగానే అర్ధం అవ్వాలి.
రవి
బోడి పద్యం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/31/2009 6:31 am
నర్సింహన్న మాటలు చాన్నాళ్ళకింద ఆల్ఫా హోటల్్ కాడ చాయ్్ తాగినట్లనిపించింది. సుట్టుపక్కల ఎవరి మాటలు వారివి. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, కప్పు సాసర్ల చప్పుడు, ఆటోరిక్షాల అరుపులు, సిగరెట్ల కంపులు, అయినా దిల్ ఏక్దం ఖుషీ! ఆ చాయ్ లెక్క ఏ చాయ్ లేదు.
“తెల్ల పొగరు” అంటే సరిగ్గా ఎరుకగాలె. రంగు తక్కువయితే మాత్రం పొగరు తక్కువయితదా అనిపించింది.
“సగం కూలిన మసీదు గోడలు” అన్న లైను కూడా కొంచెం అర్థం కాలేదు.
నమాజు చేసేచోటే మసీదు. నమాజు లేకుంటే మసీదెట్లయితదో తెలవదు.
అట్లనే ప్రార్థనచేస్తే మందిర్్ కాని, పంచాయితీ చేస్తే అయితదా అనిపించింది.
చిన్నప్పుడు కవిత్వం చదవాలంటే భయమయితుండె, అర్థం కావేమో అని. ఇప్పుడు కూడా భయ మయితది, ఎక్కడ అర్థమయిపోతదేమో అని.
========
విధేయుడు
-Srinivas
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి sudha గారి అభిప్రాయం:
03/31/2009 2:15 am
జ్యోతిష్యంపై ఎవరి అభిప్రాయము వారికి ఉంటుంది. కాని దానిలో వారికి సంభందించి మంచి జరుగుతాయి అనే విషయాలు ఉంటేనే వారు దాని ఇష్టపడతారు. చెడు జరుగుతుందేమో అని ఉంటే వారు నమ్మాలి అనుకోరు. మనస్సులో భయం ఉన్నప్పటికి ఇదంతా వట్టిదే అంటారు. వారికి జాతకాలు కావాలి కాని వారికి అనుగుణంగా మాత్రమే కావాలి.
బోడి పద్యం గురించి Shankar గారి అభిప్రాయం:
03/28/2009 6:33 am
బాగుంది. నేను బాగుందన్నది ‘బోడిపద్యం’ కవిత గురించి కాదు. ఆ కవిత మీద జరుగుతున్న చర్చ గురించి. వారపత్రికల్లో, దినపత్రికల సాహిత్యానుబంధాలలో కనిపించే కవితలను ఒకటి, రెండు లైన్లు చదివి నచ్చితే చివరంటా చదవడం, లేకుంటే వదిలేయడం ఆ తర్వాత మరచిపోవడం ఇదీ ప్రస్తుత (నా) పరిస్థితి. కాని కవితల గురించి ఇంత విస్తృతంగా, సాధికారంగా, సమర్థంగా, సమగ్రంగా చర్చ కొనసాగడం చాలా బాగుంది. తెలుగు భాష, తెలుగు కవిత్వం, సాహిత్య విమర్ష కలకాలం సజీవంగా ఉంటాయన్న నమ్మకం కలిగింది. అందరికీ ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బోడి పద్యం గురించి sreelata raavuri గారి అభిప్రాయం:
03/26/2009 11:56 am
http://www.pranahita.org/2009/03/nallanallani_navvu/
ఈమాటలో సురయ్య మీద, కొత్త ప్రాణహితలో నవ్వు మీద అఫ్సర్ గారి కవితలు చదివాను.
ఆ రెండిటికీ చాలా తేడాగా వుంది ‘బోడి పద్యం”
ఈ తేడా గురించి అసలు చర్చ జరగాలి.
ఒకే కవి రాసిన మూడు కవితలు ఇంత భిన్నంగా ఎందుకు వున్నాయి? ఏ కవితలో కవి ఆత్మ దొరుకుతుంది? (ఈ ఆత్మల గొడవ నాకు నచ్చలేదు కాని, కొద్దిసేపు ఆలోచిద్దాం)
ఆ కవితలు సుతారంగా వున్నాయి, ఈ కవిత మోటుగా వుంది. అసలు కవిత్వ లక్షణం ఏమిటి? ఒకే కవి రెండు రకాలుగా రాసినప్పుడు ఆ కవిని ఎలా అర్ధం చేసుకోవాలి?
శ్రీలత
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/26/2009 9:09 am
త్యాగరాజుల వారి సాహిత్యం మీద చర్చ సరైనదేనా? చర్చించవలసినంత సాహిత్యం త్యాగరాజుల వారిదా? త్యాగరాజ సాహిత్యం, సంగీతానికి poor cousin ట గదా? త్యాగరాజుల వారి సాహిత్యాన్ని శిష్యులూ వగైరాలు సరిగ్గా రాసుకోలేదుటగదా? ముందు సాహిత్యాన్ని సరిగ్గా రాసుకోపోవడం గురించి:
కర్రపలక మీద గంటంతో మహీధర రామశాస్త్రి గారు వ్రాసుకొన్న ప్రతిని చూసి పెనుమర్తి రామశర్మ గారు వ్రాసుకొన్న పాట.
నగుమోముఁ గనలేని
నగుమోముఁ గనలేని
నా జాలిఁ దెలిసి
ననుఁ బ్రోవగ రావ,
నా రఘువర! నీ //న//
నగరాజధర!నిన్నుఁ
బొగడు వారెల్ల
ఒగి బోధనలనుఁ జే
యగ రాలేదే!
మొగమోడితిరేమో! నీ //న//
ఖగరాజు నీ యానతి
దిగనాడి, చనలేదో!
గగనానికి ఉర్వికిని
తెగ దూరంబని నాడో!
జగమేలే పరమాత్మ!
తగ నీతో మొరలిడుదు
వగఁ దీర్పుము, తాళను,
వేగనేలు కోరా!
రఘువర! శుభచరిత!
త్యాగరాజనుత! నీ //న//
దీనికీ ఇప్పుడు పాడుతున్న సాహిత్యానికీ తేడా గమనించాలి. అలాగే ఇంకో క్రుతిలో:
తప్పకనే వచ్చు! నా
తనువుకు లంపట, నీ కృపఁ
దప్పగనే వచ్చు!
మెప్పులకై, కొప్పులుగల
మేటి జనులఁ జూచి, భజనఁ //దప్పఁగఁనే//
రూకలకై, పైకి మంచి
కోకలకై, కూటి కొరకు
నూకలకై ధ్యానించితి!
నుతుని త్యాగరాజ భజనఁ //దప్పఁగనే//
“తప్పకనే అంటే తప్పకుండా అని, భజనఁ దప్పఁగనే అంటే భజన తప్పిపోగానే అని త్యాగరాజు చమత్కార ప్రయోగాన్ని పాట వ్రాసుకున్న వారు గమనించలేదు. ఆఖరి పాదంలోని poetic order తెలుసుకోలేదు. అందుచేత మూలంలోనున్న నుతుని త్యాగరాజ భజనఁ మార్పు చేయబడి త్యాగరాజ నుతుని భజన గా కనిపిస్తుంది. సి.రామానుజాచారి “తప్పగనే వచ్చునా తనువుకు లంపట?” అని ప్రశ్నార్థకచిహ్నం పెట్టేరు. త్యాగరాజు ప్రశ్న వేయలేదు, సందేహించనూ లేదు.
ఇదంతా నా ప్రతిభ గాదు. ఎక్కడో చదివినది.
ఇదంతా ఒకెత్తు, శ్రీపాద పినాకపాణి గారూ, వారి అన్నగారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారూ సంగీతంలోని సాహిత్యం గురించి:
శ్రీపాద కృష్ణమూర్తి గారు: When I listen to music, I care a damn for poetry…. సాహిత్యం కావాలంటే యింట్లో కూర్చుని చదువుకో. సంగీతమునకు ఔన్నత్యము చేకూర్చిన కారణము చేతనే త్యాగరాజునకు గౌరవము వచ్చినది కాని అందమైన సాహిత్యభావములను వెలిబుచ్చినందుకు కాదు.
శ్రీపాద పినాకపాణి గారు: పొయెట్రీ లేదు. బెగ్గింగ్ ఫర్ మెర్సీ అంతే…. హి ఈజ్ నాట్ ఎ గ్రేట్ పొయెట్. తెలుగు సంస్కృతం అద్భుతంగా వచ్చు, అంతే తప్ప కవి అంటే ఒప్పుకోను.
రసం సంగీతం. సాహిత్యం పిప్పి. ( ఇద్దరూనూ)
ఇది కూడా ఎక్కడో చదివింది. అతడు – ఆమె లో కూడా “లక్ష్మి గారు” శాస్త్రి తోనూ, శాంతం తోనూ మంచి చర్చ చేస్తారు త్యాగరాజుల వారి సాహిత్యం గురించి.
సెబితే సానా వుంది/యింటే ఎంతో వుంది/సెబుతా, యినుకోరా యెంకట సావిఁ ( టియెమ్మెస్సో, శీర్కాళో గుర్తులేదు. డబ్బింగ్ సినిమాయేననుకుంటున్నాను. వావివరసలెవరవో కూడా తెలీదు)
బోడి పద్యం గురించి sarma rallapalli గారి అభిప్రాయం:
03/26/2009 8:39 am
అయ్యా, నేను ముస్లింని కాను. నాకు ముస్లిం సంప్రదాయాల గురించి అసలు తెలియదు కూడా. కాని, కవి ఈ కవిత ‘సుంతీ’ గురించి రాశారనీ, ఆ చిన్న అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ మత విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడుతున్నారనీ నా కొద్దిపాటి జ్నానం చెప్పింది. కాని, అంతకంటే బలమయిన అనుభూతి/ ఉద్వేగం (దీన్ని బాబా కవితా ధార అన్నారేమో!) ఈ కవితలో నన్ను కట్టి పడేశాయి.
ఇది నాకు తెలియని అనుభూతి (భవిష్యత్తులో తెలిసే అవకాశమూ లేదు). అయినా, కవిత నన్ను చాలాసేపు ఆలోచింప జేసింది. చాలా విషయాలు , మతానికి సంబంధించినవి ఉదా:
దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
అన్నప్పుడు దర్గాలకి వెళ్లే నేనే గుర్తు వచ్చాను.
మా నెల్లురు , ఒంగోలు జిల్లాలో మస్తానయ్య, నాంచారయ్యని ఎవరిని అడిగినా ఈ పంక్తికి అర్ధం చెప్పగలడు. నా బ్రాహ్మణత్వం గాయత్రీ మంత్రం. కాని, దర్గా దగ్గిర మా అమ్మ మన్నతు చేసుకుంటుంది. అంత వరకే నాకు తురక మతం తెలుసు.
మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
సగం దళితం సగం ఖండితం
పల్లెల్లో తురకల్ని ఎవరిని అడిగినా, వాళ్ల బతుకు పద్ధతి సగం కింది కులాల వారితో కలుస్తుంది.
ఇంకా నా జీవిత అనుభవంలో నేను గమనించి కూడా గుడ్డితనం నటించే సంగతులు అఫ్సర్ గారు గుర్తు చేసారు. అట్లా గుర్తు చెయ్యడమే నాకు మంచి సాహిత్యం చేసే పని అనిపిస్తుంది. లైలా గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవి వారి పఠనం. నాకు ఆ విషయాలు తెలియవు. ఈ కవితని నేను ఒక పల్లెటూరి వాడిగా చదివాను. ఇందులో అశ్లీలం ఎమిటొ నాకు తెలియదు.
ఈ కవిత రాసినందుకు కవికీ, వేసినందుకు ఈమాటకి ధన్యవాదాలు. ఈ కవితకి ముందు అఫ్సర్ అనే పేరు నాకు తెలియదు. వెనక్కి వెళ్లి, ఆయన రాసిన్ కవితలు చదివాను. సురయ్య గురించి కవిత చదవండి. ఆర్యులకు అది బాగా నచ్చె పద్యం.
రాళ్లపల్లి
నాచన సోమన చతుర వచో విలాసం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/25/2009 10:16 am
ఆ. నచ్చినట్టి వనిత మెచ్చినట్టి కవిత
దృష్టి బట్టి యుండు సృష్టి లోన
కొత్త దృష్టి చూపి కొత్త స్ఫూర్తిడు రాత
రాత కాదు నుదుటి రాత మార్చు!
ప్రసాదు గారు మీరుదహరించిన శ్రీ సుబ్బన్న గారి పద్యాలు ఆసక్తితో చదివాను. అదృష్టం కొద్ది అందిన వారి ‘అవధాన విద్య’ పుస్తకంలో ఇందులోదేదైనా చదివానేమో గుర్తురావడంలేదు. వారి వచనం, వివరించే శైలి కూడా నన్ను ఆకట్టుకుంది.
అది చదివిన తరువాత, వారి రచనలేమైనా ఉన్నాయేమో అని ఇంకా వెతుకుతునే ఉన్నాను. మంచి, కాదు, గొప్ప రచయిత, (గొప్ప వక్త అని కూడా విన్నాను కాని చూసే భాగ్యం లేదు), కూడా అయిన వారి రచనల వివరాలేమైనా ఉంటే చెప్ప మనవి.
========
విధేయుడు
-Srinivas
బోడి పద్యం గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:
03/25/2009 7:42 am
అశ్లీలం గురించీగొడవేవిటి. కవిత నచ్చిందో, నచ్చలేదో అంటే సరేగానీ, కవిత అశ్లీలవటవేవిటి? అలా అనేవాళ్ళు ఎందుకో కూడా చెబుతే బాగుండేది. రహశ్యాంగాన్నో (ఏవిటో అందులో అంత రహశ్యం), దానికి జరిగే వొక ప్రక్రియనో అశ్లీలవని అనగలవా? పోనీ అంత అభ్యంతరవనుకుంటే ఆ కొన్ని పదాల్ని పరాయి భాషలో అనుకోని చదివేసుకుంటే సరిపోతుంది కదా. ఆ పదాల్ని మాత్రం చక్కగా, ఏ ఆంగ్లంలోనో, సంస్కృతంలోనో అనువదించేసుకుని చదివేస్తే అసలు బాధే లేదు. ఆ భాషల్లో ఈ అశ్లీలవైన(?) పదాలు, ప్రక్రియలు చదవడం మనకి అలవాటే కదా.
ఇప్పటికి నేనో అరడజను సార్లు చదివేనీ కవితని, నాకేం బోధపడలా కవితాత్మో, కవితార్థవో దాన్ని మీరేవన్నా సరే. కవిత్వంలో abstraction అవసరవే. కానీ దాన్ని వొక పెయింటింగ్ స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం వుందా? మనిషి మెదడుకి రంగుల చిత్రాలు, పద చిత్రాలు అర్థవయ్యే తీరు వేరు, వేరని నా అభిప్రాయం.
పెయింటింగ్ ని కళ్ళతో చూడంగానే మనసులోకి దూకే ఆ పచ్చి ఎమోషనల్ abstraction, కవితని చదివి దాన్ని అర్థం చేసుకుని అనుభూతించగలిగే ప్రక్రియ వేరు వేరని నా అభిప్రాయం. నక్కని చూసి వాతలు పెట్టుకున్నట్టు, అవకాశం ఉందికదా అని, భాషకున్న (పెయింటింగ్ కి లేని, అందుకనే పెయింటింగ్లో ఆ abstraction అవసరవేవో) ఒక విసృతవైన వ్యక్తీకరణని ఉపయోగించుకోకుండా మామూలు మనుషులకి అర్థంకాని కవిత వల్ల ఉపయోగవేవిటి. పోనీ ఆ కవిత వ్రాసిన వారో, లేకపోతే ప్రచురించిన సంపాదకులో ఆ కవితతోబాటు ఆ కవితార్థాన్ని కూడా ప్రచురించుంటే బాగుండేది.
సాధారణ ప్రచురణలకి లేని ఒక గొప్పతనం వెబ్ ప్రచురణలకుంది. ఇక్కడ కవిత, కథ, వ్యాస కర్త తన అభిప్రాయాల్ని పాఠకులతో ఏక్టివ్ గా పంచుకునే అవకాశం వుంది. I do not know the reason why, here in “eemaata” writers, most of the times do not participate in the debate. Though they are the instigators of the debate by mare act of writing that poetry, story, or an essay, they shy away from the debate. Many times even our editors do the same. I hope they utilize the opportunity of this facility, and participate in this live discussion and help readers like us to a better understanding.
మరో విషయం అభిప్రాయలు రాసే వాళ్ళ పేర్లతో ఆ ఆటలేవిటండి. పేర్లను వక్రీకరించినంత మాత్రాన ఒరిగేదేవిటి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana గారి అభిప్రాయం:
03/23/2009 10:02 am
కలింగత్తుప్పరణిలోని నీడలపైన రెండు పద్యాలను కింద ఇస్తున్నాను. అందులో రెండవది బ్రహ్మానందంగారు ఉదహరించిన నన్నెచోడుని పద్యానికి సరిపోతుంది. కలింగత్తుప్పరణిలోని మొదటి రెండు అధ్యాయాలను ఆరుద్రగారు వెన్నెల – వేసవి అని తెనిగించారు. బాపు బొమ్మలు ఈ పుస్తకానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. వారి తర్జుమాను కింద ఇస్తున్నాను –
ఆడుగిన్ఱ శిఱై వెంబరుంది నిళల్ అంజి యక్కడువనత్తై వి-
ట్టోడుగిన్ఱ నిళలొక్కుం నిఱ్కుం నిళల్ ఓరిడత్తు ముళవల్లవే
– జయంగొండన్, కలింగత్తుప్పరణి (80)
జ్వలియించు దినకరుని చరపు లోర్వగలేక
పులుగుగమి మేతకై పోవు నీడలు తక్క
నిలకడగ నిగిడారు నీడ లీ కానలో
కలయ జూచినమేర కనిపించ నేరవు
ఆదవంబరుగు మెన్ఱు నిన్ఱ నిళల్ అంగు నిన్ఱు కుడి పోనద-
ప్పాదవంబునల్ పెఱా దుణంగువన పరుగుం నమ్మైయెన వెరువియే
– జయంగొండన్, కలింగత్తుప్పరణి (81)
తీక్ష్ణాంశు వాకలిచె తినివేయునని వగచి
వృక్షపాదము లంటి వేడుకొన్నది నీడ
అక్షీణ క్షుధచేత ఆ తరువు త్రావునని
వీక్షించుచుండగనె వెడలి పోయినది
ఉత్తర కళింగాధిపతి అనంతవర్మ కప్పమును చెల్లించని కారణాన వానిని యుద్ధములో పరిమార్చమని కులోత్తుంగచోడుడు పల్లవరాజు కరుణాకర తొండమానుని ఆజ్ఞాపించెను. అతడు తన సైన్యముతో పాలేరు,
స్వర్ణముఖి, పెన్న, మన్నేరు, కృష్ణ, గోదావరి, పంప, గౌతమీ నదులను దాటి కళింగ దేశాన్ని చేరి చేసిన యుద్ధములో కళింగ చక్రవర్తి అపజయుడై పారిపోయెనట. ఆ కరుణాకర తొండమాను శౌర్య పరాక్రమాలను
వర్ణించే కావ్యం ఇది. ఇట్టి వీర కావ్యాలను తమిళములో పరణి అంటారు. పరణి కావ్యాలలో ఇదే మొదటిది, దాని రచనలో జయంగొండాన్ దిట్ట. నన్నెచోడుడు ఈ కవిని అనుసరించాడంటే అతని కాలం క్రీ.శ. 1118 తరువాత. కాని జయంగొండాన్ కూడా ఇతర కవులను అనుకరించి రాసిన పద్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయని ఆరుద్రగారు అంటారు. అందువల్ల నేను ముందు చెప్పినట్లు రెండు పద్యాలు ఒకే విధంగా ఉంటే ఏది ముందో ఏది వెనుకో చెప్పడం కష్టం.
గ్రంథసూచి – వెన్నెల – వేసవి, ఆరుద్ర, నవోదయ పబ్లిషర్స్, విజయవాడ, మొదటి కూర్పు 1968.
విధేయుడు – మోహన
బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/21/2009 8:39 am
యుగంధర్ మహాశయా!
కందపద్యములూ, సీస పద్యములూ వ్రాయగలిగిన మీరు ఈ వచన కవిత గురించి ఎందుకు వ్రాయరు? మిగిలిన శీర్షికలలో చక్కని అభిప్రాయములు వ్రాసిన మీరు ఇచ్చట ఎందుకిటుల వ్రాయుట? మొదటి అభిప్రాయము నాది. అందు నాకవగతమవని వాటిని గురించి అడిగితిని. కవి గారెటూ జవాబివ్వజాలరు. కవితని ఆనందించి, అనుభూతించి అనుభవించిన వారుకూడా కవితని విపులీకరించకపోవడం మా దౌర్భాగ్యం. బొల్లోజుబాబా గారి అభిప్రాయమునకు జవాబుగా నాఅభిప్రాయమందు “ధార” గురించి ప్రశ్నించితిని. ఆయనా తదుపరి మీరునూ కవిత గురించి తప్ప మిగిలిన విషయముల గురించి విశ్లేషించినారు. మీరన్నట్టు కవిగారు రాసేసి జనం మీదకొదిలేస్తే సరిపోదు. ప్రతీ కాళిదాసుకీ ఓ మల్లినాథ సూరి వుంటేనే కాని కుదరదు. “అఫ్సరుడు” (మళ్ళీ వరదలో కొట్టుకొచ్చిన ప్రయోగం”) గారికి మీరో, సూర్య గారో మల్లినాథ సూరనుకుని అడగడం నా తప్పు. క్షమించండి. ఇదే “అఫ్సరుడి” గారి కవిత ఈ మధ్య సోమవారం సాహిత్య పేజీల్లో పడింది. అది లక్ష రెట్లు నయం ఈ బోడి పద్యం కన్నా. బహుశా ఈ బోడి పద్యం ఈమాట కోసం ప్రత్యేకించి రాసేరేమో? One more thing whoever punches some trash in this area are not critics. అభిప్రాయాలు రాసే వారు విమర్శకులు కారు. అంచేత పుంజీడు అభిప్రాయాలు పుంజీడు విమర్శలు కాదు. “మీ అభిప్రాయం తెలియ చేయండి” లో అభిప్రాయం తెలియచేయడం ఎందుకు? ఎవర్నుధ్ధరించడానికి? తెలుగు భాషనుధ్ధరించడానికా?
కథ దేని గురించి? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/21/2009 7:15 am
లేదు బాబ్జీలు గారూ మీ అభిప్రాయం సహేతుకమైందే! సాహిత్యానికి తన నిరంకుశ వైఖరి ద్వారా విరసం సరిపడా అపకారం చేసింది. స్వతహాగా మంచి కవి రచయితలైన..శ్రీశ్రీ..కొకు..రావిశాస్త్రి..కాళీపట్నం..లాం టి వాళ్ళూ..అలాగే మిగిలిన మరి కొందరు..వారి విశ్వాసాలకి కట్టుబడి విరసంలో కొనసాగారు.కానీ విరసానిది ధృతరాష్ట్ర కౌగిలి. అందువల్ల అందులోకి వెళ్ళాకా కవిత్వం తగ్గి..కొత్తవి చెప్పుకోదగ్గవేవీ రాయలేక..విరసానికి పబ్లిసిటీ ముఖంలాగా మిగిలేడు శ్రీశ్రీ. కాళీపట్నం రామారావు గారు “యజ్నం” లాంటి గొప్ప కధని విరసం రాజకీయాలతో సంబంధం లేకుండానే రాసి కూడా..అందులో సభ్యులయ్యాకా..మళ్ళీ అంత బలమైన కధ ఏదీ రాయలేదు.విరసానికి పెద్ద దిక్కుగా పెద్దమనిషి పాత్రలో మిగిలారు. వీరి సంగతే ఇలా ఉంటే ఇహ మిగతా వాళ్ళ మాట చెప్పేదేముందీ??
విరసం ఏనాడూ తన సంస్థలో భాగం కాని కవి రచయితల విషయంలో కొంచెం కూడా సానుకూల వైఖరిని చూపించలేదు సరికదా..తనకి పనిపడినప్పుడు మాత్రం..తెనుగుదేశం లోని సకల కవి,రచయిత విమర్శక శిఖామణులంతా..”మేధావులు” అందరూ..తమ వెనకే ఉన్నారని చెప్పడానికి సదా ప్రయత్నించింది. రచయితలే కాని వారికి సంస్థ పగ్గాలు అప్పజెప్పింది.వాళ్ళూ రచయితలకీ..సాహిత్యానికీ నిరభ్యంతరంగా నాయకత్వం వహించేయగలిగేరు. దీన్ని ప్రశ్నించే వీలుని గానీ..ఇందుకు జవాబు చెప్పే పూచీ గానీ ఆ సంస్థ ఏనాడూ తీసుకోలేదు. అందులో ఉన్న కవి ..రచయితలు సైతం ఈ పరిస్థితిని భరించేరు గానీ..ప్రశ్నించినట్టు కన్పించదు. అందులో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందన్న విషయం బహిరంగ రహస్యమే!! విమర్శకి చోటు తీసేసి..అడిగిన ఎవరినైనా దబాయించడంలో చూపిన శ్రధ్ధ..ఆత్మ విమర్శలో చూపక..దాని పరిధిని సంకుచితం చేసుకుంది….రచయితలు లేని రచయితల సంస్థ అది. ప్రాపగాండా లిటరేచర్ కీ..ఆ తరహా సాహిత్యానికీ మాత్రమే దాని ప్రాపు. గనక మీ పరిశీలన సరైందే!!
రమ.
కథ దేని గురించి? గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
03/19/2009 9:55 am
సీతారామయ్య గారు,
ఇప్పటివరకు, ఏ విశ్వబడుల పరిశోధక వ్యాసాల్లో కథల వర్గీకరణ మీద ఎవరూ ప్రచురించకపొయ్యుంటే మీ వ్యాసం ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముందడుగే. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిన అవసరం వుంది. ఈ వర్గీకరణ ఎంత ప్రాధమిక స్థాయిలో వున్నా, ఆ దిశలో అదొక ముందడుగే నని నా అభిప్రాయం.
“మన కథలన్నీ ఎదో ఒక విషయం (వస్తువు, కథాంశం) గురించే ఉంటాయి.” మన కథ కానీ, ఇంకేదైనా కథ కానీండీ, కథే ఎందుకు, ఏరకవైన కళ కానీయండి, ఏదో ఒక అంశం గురించే కదా ఉంటాయి. అవి భౌతికం కానీయండి, మానసికం కానీయ్యండి, సిద్దాంతాలు కానియ్యండి. జీవితానుభవం, సంఘటన వస్తువుకి భిన్నవైనవా? భిన్నవైనవే అయితే ఏవిధంగా భిన్నవైనవో కూడా మీరు తెలిపితే బాగుండేది. ఆ తెలుపడానికి ముందు, మీరు ప్రస్తావించిన వస్తువు లేదా కథాంశాన్ని నిర్వచించి వుంటే బావుండేదేవో. మీరు చెప్పిన అనుభూతి, కథాంశం, లేదా వస్తువు కాదా? ఆ ఫలాని బావ, ఆయన మరిదితో తిరిగిన చెట్లూ, పుట్తలు, చూసిన పూలు, బండలు అవన్నీ కథలో ఏవి చేస్తున్నట్టు. కథా వస్తువో, కథాంశాలో ఏవైనా అవి పాఠకుడిలో నిద్రపోతున్న ఎప్పటి గుర్తుల్నో, లేకపోతే పాఠకుడిలో ముడుక్కుపోయున్న ఎప్పటి కలల్నో తట్టి లేపడానికే కదా ఆ కథ. ఇక్కడ వస్తువు లేకపోవడవెక్కడ. కళ్ళకు కనిపించి, స్పర్శకు తెలిసే వస్తువయితేనేం, మనసుకు వినిపించి, గుండెకు తెలిసే వస్తువయితేనేం. వస్తువులో చిన్న, పెద్ద బేధాలు చూడాలా?
ఎప్పుడో అప్పుడు, ప్రతి ఇల్లు ఒక కథల ఖార్ఖానా అయ్యుంటుంది. ప్రతి అమ్మ, అక్కడక్కడా కొందరు నానలు కూడా లెక్కలేనన్ని కథలు కల్పించుంటారు. ఇంకెన్నో పాత కథల్ని చిత్రికపట్టి కొత్త కథలుగా మార్చుంటారు. వీటిలో రెక్కల గుర్రాలు, మాట్లాడే జంతువులు, పోట్లాడే కపాలాలు, మాంత్రికులు, రాకుమారులు, చూడ చక్కని రాకుమార్తెలు వుంటారు. ఈ కథల్లో వస్తువు లేదా? ప్రపంచం తెలియని పిలకాయలకి, అసలలేని కలల ప్రపంచం ఈ కథల వస్తువు కాదా? కలలు, ఊహలు, కథాంశాలు కావని, వాటి చుట్టు అల్లిన కథల్లో కథా వస్తువు లేదని మీ వర్గీకరణ బట్టి అర్థంచేసుకోవలసి వుంటుంది.
కలలైనా, ఊహలైనా, జీవితానుభవాలైనా, మీరు చెప్పిన సంఘటనలైనా, సిద్దాంతాలైనా, ఇంకా వాటి రాద్దాంతాలైనా, అన్నీ బతుకులో ఒక భాగవే సీతారామయ్య గారు. అసలు వస్తువు లేని కథంటూ వుండదు. ఆ వస్తువు కల కావొచ్చు, శిల కావొచ్చు, మనసుకి మాత్రవే తెలిసే అనుభూతుల అల కావొచ్చు. ఆ వస్తువు, సిద్దాంత రాద్దాంతం కావొచ్చు, సామాజిక స్పృహ కావొచ్చు, సందేశం కావొచ్చు, స్వంత వ్యాఖ్యానం కావొచ్చు అన్నీ బతుకులో ఒక భాగవే కదా.
కథ అనేక కోణాలనుండి బతుకుని ప్రతిఫలిస్తుంది. కథ బాగుండడానికి ,బాగలేకపోడానికి, కథా వస్తువు చుట్టూ అల్లడవా, అల్లకపోవడవా కారణం కాదు, కథ చెప్పడంలో పాఠకుడిని ఆకట్టుకుందా లేదా అనేదే ముఖ్యం. అదికూడా, పాఠకులందరూ ఒకటి కాదు. రకరాకాల మనుషులు, రకరకాల పాఠకులు. ఏ కథా కూడా అందర్నీ స్పర్శించలేదు. ఏ కథా కూడా భౌగోలికవైన, సామాజికవైన, మానసికవైన, కాలానుగుణవైన పరిధులకిలోబడి మాత్రవే మంచి కథ అనిపించుకుంటుంది.
మీరు ఉదాహరణలుగా ఇచ్చిన కథల్లో లోపాలు, ఆ కథ చెప్పడంలో లోపాలే గాని, కథలో వస్తువు వల్ల వచ్చిన లోపాలు కాదు. సూటిగా చెప్పదలచుకున్నప్పుడు వ్యాసాలు రాసుకోవచ్చు కదా అన్నారు, వ్యాసాలు రాసుకోవచ్చు, కానీ కథలు కూడా సూటిగా చెప్పడానికి ఉపయోగించే మాద్యమాల్లో ఒకటని నా మనవి. చక్కగా అరటిపండొలచి చేతులో పెట్టినట్టు సూటిగా సిదాంతాన్ని వివరించే కథలు చాలానే వున్నాయి (పిపీలకం). ఎటూ చెప్తాం కదా అని కథని సరిగ్గా అల్లకపోవడం, కథకు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధంలేకపోవటం, స్వయం వ్యాఖానంతో పాఠకుడ్ని బోరు కొట్టించడం ఇవన్నీ కథకునిలోపాలే గాని, దానికి, కథాంశానికి, కథకుడు చెప్పదలుచుకున్న సందేశానికి సంబంధం వుందని నేననుకోను.
కథ నచ్చకపోవడానికి కథకుని లోపవే కాదు, పాఠకుల పరిధులు కూడా (సామాజికవైన, సిద్దాంతపరవైన, కాలాణుగుణవైన) ఒక అంశవే. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు, అప్పుడు అడిగి అడిగి మరీ చెప్పించుకున్న కథలు ఈరొజు ఈ వయసులో మనసుకి అంత పట్టకపోవచ్చు. దాచుకుని, దాచుకుని చదివిన డిటెక్టివ్ నవలలు ఇప్పుడు చెత్త బోరుకొట్టొచ్చు, ఆవురావురు మంటూ ఎదురు చూసిన ప్రేమ కథలు ఇప్పుడు తమాషాగా అనిపించొచ్చు. కొందరు మహానుభావులకి కన్యాశుల్కం అనవసరపు రాద్దాంతంలా కనిపించొచ్చు. గోవులొస్తున్నాయి జాగ్రత్త సిద్దాంత రగడలా స్పురించొచ్చు. వీటిల్లో కలలు, కల్పనలు, సంఘ సంస్కరణలు, సిద్దాంతాలు అన్నీ వున్నయి వాటితోపాటు చదివించే గుణం ఈ వీటన్నికీ వుంది. కాబట్టి కథ చెప్పడానికి వస్తువు అడ్దం కాదు. ఏ వస్తువైనా చేవ వున్న కథకుడు మంచి కథగా అల్లగలడు. అంతే కాదు, కవితల్ని స్పురింపజేసే కథలు, కథల్ని చెప్పే కవితలు, రెంటినీ గుర్తుతెచ్చే కరపత్రాలు వీటి సంగతేవిటి?
బాబ్జీ,
ఇదేవిటి, విరసం వల్ల కథలు వ్యాసాలైపోవటవేవిటి. విరసం ముందు అరసం, దాని ముందు సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటం, దాని ముందు మరింకేదో మార్పు, ఆ మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు వుండడవనేది సహజం కదా. విరసం మాత్రమే కథనెందుకు నాశనం చేసింది, లేకపోతే మూసలోకెందుకు నెట్టింది. ఐనా నువ్వుదాహరించిన రావీ శాస్త్రి, కోకు, కారా విరసంతో సరసం చేసిన వాళ్ళే కదా! రచయితల నిజాయితో నీకేం పని, వాళ్ళు వ్రాసిన కథలతో పని కాని. దీనికి వ్యతిరేకంగా ఈ నడవ నువ్వే ఒక అభిప్రాయం వ్రాసినట్టు గుర్తు.
కళ, కళకోసవే అనే వాదాన్ని తమ్మినేని గారు మరొక అడుగు ముందుకి తీసుకెళ్ళేరు, కళలో కల తప్ప నిజం (బుద్ది) వుందకూదదంటున్నారు. కథ బుద్దిని తాకకూడదంటారు. ఐతే మీరు చెప్పింది మాత్రం బాగుంది, సరి ఐన వాతావరణం లేని కథ, నిజవే పాఠకుడ్ని తాకదు. బుద్దిని తాకే కథల్లో ఆ వాతావరణం ఉంటే అవి మంచి కథలే కదా తమ్మినేని గారు.
మీతో ఏకీభవిస్తాను రమ గారు, గురూ గారన్నట్టు, నవ్వేది, నవ్వించేది, కదిలేది, కదిలించేదే కదా, కవితైనా, కథైనా.
కోడవళ్ళ గారు, మీ అభిప్రాయాల్లో, పెద్ద, పెద్ద పేర్లినిపిస్తాయి, చాలా కోట్స్ కనిపిస్తాయి, కానీ మీరు మాత్రం మీ మాటల్లో కనిపించరు ఎప్పుడో తప్ప. పుస్తకాల్లేకపోతే హాయిగా వుండగలవా? తెలీదు, కానీ పుస్తకాల్లేందెప్పుడు? కాగితం లేనప్పుడు, తాటేకులో, మరో చెట్టు బెరళ్ళో, లోహాలో, అవీ కానప్పుడు, నోటిమాటగా తరాన్నుంచి తరానికి సాగే కథలు, పాటలు అవన్నీ ఏవిటి? మనిషి మాటల్తోబాటు కథ కూడా పుట్టుందడంటారా. అది ఏరూపంలో భద్ర పరిస్తేనేవి.
గడ్దగట్టిన సముద్రాలెక్కడవి, ప్రవహించే నదులు తప్ప, అప్పుడప్పుడూ ఆ నదులెండి పోవచ్చు, గడ్డకట్టి పోవచ్చు. కానీ కొద్ది కాలవే. మార్పు మనిషికి సహజ గుణం కదా. కథ, కవిత ఇవేవి గొడ్డళ్ళు కావేవో, మహా అయితే మట్టి బెడ్డలాగా కాసేపు నదిలో చిన్న అలల్ని రేపుతాయేవో. కాఫ్కానే చెప్పుండొచ్చు గానీ గడ్డకట్టిన సముద్రవే అయితే మెటామార్ఫొసిస్లో ఆ గుమస్తా అంత హింస పడివుండడు కదా?
రవికిరణ్ తిమ్మిరెడ్డి
About eemaata గురించి RANGANATH MIDDELA గారి అభిప్రాయం:
03/19/2009 9:39 am
వరంగల్లు
సాహితీ బంధువులకు నమస్సుమాంజలి.
మీరు వెలువరిస్తున్న ఈ మాట చూస్తుంటేనే కనువిందుగా ఉంది. మీ సైటుకు పుస్తకాలు ఎలా పంపాలి.. తెలుగు సాహిత్య లోకానికి అవసరమైన మరింత సమాచారాన్ని పొందుపరిస్తే బాగుంటుందని నా ఆలోచన.. ఇంత మంది సాహితీ మిత్రులు కలిసి చేసే సమిష్టి యాగంలో మీకు పూర్ణ ఫలం అందాలని నా ఆకాంక్ష..
ధన్యవాదాలతో,
రంగనాథ్ మిద్దెల
ఎన్ టీవి
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
03/17/2009 8:44 pm
మోహనగారు చక్కగా వివరించారు. ఇది చదవగానే నాకు శంకరాభరణంలోని “బ్రోచే వారెవరురా…” అన్న పాట గుర్తుకువచ్చింది. అందులో కూడా యిలాగే ప్రాస ఉంది కాని పొడవైన పాదాల వల్ల గుర్తించడం కష్టం.
“ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా
నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములిచ్చి వేగమె రా”
ఇలా ప్రతి చరణంలోనూ ప్రాస ఉంటుంది. ఈ విషయం గమనించకుండా పాట చివరి చరణంలో మార్పు చేసారు.
“ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా! నా
పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయిబట్టి విడువకు” అన్న సాహిత్యాన్ని
“భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు” అని మార్చారు. బహుశా ఇక్కడ “వాసుదేవుడవు” అన్న పదంతో యతి/ప్రాస కోసం ఈ మార్పు చేసారేమో!
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
03/15/2009 4:48 pm
ప్రశంసించినందుకు అందరికీ కృతజ్ఞతలు. కాని నేను పెద్దగా చేసిందేం లేదు. జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్, నవోదయ రామమోహనరావు, వెల్చేరు – తెర వెనుక ఉండి శ్రమ చేసిన వారు వీళ్ళు.
మూడు నాలుగేళ్ళ క్రితం, నేను కొత్తగా తెలుగు సాహితీ ప్రపంచంలో తలదూర్చి, రచ్చబండలో, తెలిసీ తెలియని సాహితీ జ్ఞానంతో హేమాహేమీలతో తగాదాలు పడేవాణ్ణి. అప్పుడే వేలూరి గారి ఓ ఈమాట వ్యాసం పై గొడవపడ్డాను. ఆ సందర్భంలో ఆయన ఓ పొడవుపాటి జవాబు రాస్తూ, మధ్యలో ఇలా అన్నారు:
“My second assertion, or call it a plea, that we badly need word meanings, paraphrases, and commentaries of their works to better appreciate them, and not to lose them!”
నా ప్రమేయానికి కారణం అదన్న మాట. చాలా సమయం పట్టినా, కార్యరూపం దాల్చినందుకు సంతోషం. అప్పట్లో, అంటే ఆస్తులన్నీ హరించుకుపోక ముందు, ఆయన ఇంకాస్త ఎక్కువ విరాళం అడగనందుకు చాలా విచారపడుతున్నాను.
బాబ్జీలు గారి మంచీ చెడుల మాట చదివి, ఇది రావిశాస్త్రి మాటల్లా ఉందే అనిపించింది. వెతికితే, రావిశాస్త్రి మీద కె. కె. రంగనాథాచార్యులు రాసిన పుస్తకంలో రచయితల కర్తవ్యం గురించి రావిశాస్త్రి అభిప్రాయం కనిపించింది: “అందుచేత రచయిత అయిన ప్రతివాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను తలుస్తాను.” [1]
చిత్రంగా, జనవరి 9న విజయవాడ లో పుస్తక ప్రదర్శనావరణలో విశ్వగుణాదర్శాన్ని విడుదల చేసిన సభలో ప్రసంగించిన వారిలో ముఖ్యులు KKR. సభలకి దూరంగా ఉండే తాను, ఈ పుస్తకం గురించి ప్రసంగించమంటే ఎంతో ఉత్సాహంతో వచ్చానని చెప్పి గ్రంథ ప్రాముఖ్యతని వివరించారు. ఆ ప్రసంగాన్ని ప్రచురిస్తే బావుంటుంది.
KKR, VNR లు సరే, నా అభిప్రాయం ఏమిటి అంటే, నేనీ పుస్తకాన్నింకా పూర్తిగా చదవలేదు. పైపైన తిరగేసినంతలో హానికరమైనదిగా కనిపించలేదు. దాని ప్రచురణకి సాయం చెయ్యడంలో తప్పుందనుకోను.
చదివింతర్వాత వెల్చేరు గారి పరిచయంపై నా అభిప్రాయం చెప్తాను. రవికిరణ్ గారూ, ఆయన పేరు వెల్చేరు; వేల్చూరి కాదు. మనకి యేల్చూరి సుబ్రహ్మణ్యం అని ఓ కవి ఉన్నారనుకుంటా.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “భారతీయ సాహితీ నిర్మాతలు: రాచకొండ విశ్వనాథశాస్త్రి,” కె. కె. రంగనాథాచార్యులు. సాహిత్య అకాడమీ, 2000. పేజి 87.
కథ దేని గురించి? గురించి ఆరి సీతారామయ్య గారి అభిప్రాయం:
03/14/2009 5:32 am
ఈ వ్యాసం మీద అభిప్రాయం వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు.
బాబ్జీలు గారూ, మంచి కథలు రావిశాస్త్రి, కుటుంబరావులతోనే ఆగిపోయాయనీ, తర్వాత మంచి కథలు రాకపోవటానికి కారణం విరసం అనే అభిప్రాయాలతో నేను ఏకీభవించను. మంచి కథలు ఇప్పుడూ వస్తున్నాయి. విరసానికి ముందుకూడా వ్యాసాల్లాగా కథలు రాసిన వారున్నారు. ఎప్పటికప్పుడు పాతరోజుల్లో మంచి కథలుండేవి అనుకోవటం మనకే కాదు, ఇతర భాషల్లో కూడా కనిపిస్తుంది. అది మానవ సహజమేమో.
వంశీ గారు, ఈ వ్యాసం “రంజింప చేయటంలో కొద్దిగా వెనక పడింది” అన్నారు. సహృదయంతో కొద్దిగా అన్నారు! మీ అభిప్రాయం నాకు అర్థమయింది. నిజానికి ఈ వ్యాసం మీకు కొద్దిగా నచ్చినా దానికి కారణం ఈమాట వారి రివ్యూవర్సే. లోపాలు మాత్రం నావి.
సాయి బ్రహ్మానందం గారూ, నేను పొరపాటు చేసి ఉండవచ్చు, కాని, నాకు తెలిసినంతవరకు, ఇంగ్లీషులో ఫస్ట్ పర్సన్ లో చేసే కథనాన్ని తెలుగులో ఉత్తమ పురుష అంటారు. అలాంటి కథల్లో కథకుడి ఆలోచనలు తప్ప ఇతర పాత్రల ఆలోచనల గురించి రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రథమ పురుష కథనంలో రచయితో లేక మరో కథకుడో కథ చెప్తాడు కాబట్టి అన్ని పాత్రల ఆలోచనల గురించీ రాయటానికి అవకాశం ఉంటుంది. పాత్రల ప్రవర్తన చిత్రించటం ద్వారా కథ నడపాలనీ, వాళ్ళ మనోగతాల గురించి ఎక్కువగా రాయటం అంత మంచిది కాదనీ నా అభిప్రాయం. అదీగాక, నేను ముఖ్యంగా చెప్పదలిచింది, స్వంత అభిప్రాయాలను వ్యక్తీకరించటానికే కథ నడిపినట్లు బాహాటంగానే కనిపిస్తే, వీలయిన (కాకపోయినా) ప్రతిచోటా రచయితే వ్యాఖ్యానం చేస్తే, కథ పేలవంగా ఉంటుందని.
భూషణ్ గారూ, ధన్యవాదాలు. అవును, వాతావరణ కల్పన ఉజ్వలంగా ఉన్న కథలు చదవటం ముగించిన తర్వాత కూడా మనసులో ఉంటాయి.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి పవన్ కుమార్ గరికపాటి గారి అభిప్రాయం:
03/13/2009 6:50 pm
అభిప్రాయాలకు చర్చలకు మధ్య చాలా తేడా ఉంది.
పాఠకులు వ్యక్తం చేయవలసింది వ్యాసం మీది అభిప్రాయాలను,
అంతేగాని, ఇతరుల అభిప్రాయాల మీద అభిప్రాయాలను కాదు.
ఖండన ముండనలు అంతకన్నా కాదు.ఇది అభిప్రాయ వేదికే కాని చర్చా వేదికని నేననుకోను.ఈ మాట సంపాదకులు రచయితకు సూచనలు లాగానే అభిప్రాయాల ప్రకటనలకు కూడా సూచనలు చేయడం వల్ల ఈ ఆరణ్యకాండ (ఒకరినొకరు వేటాడుకోవడం ) సుందరకాండగా (ఒకరితో ఒకరు మాటాడుకోవడం) మారుతుంది.
అస్మదీయుని సూచనలు (నాకు ఏ వీరతాళ్లు అవసరం లేదు)
1.అభిప్రాయం రచనకే పరిమితం కావాలి.
2.ఇతరుల అభిప్రాయాల్లోకి వెళ్ళరాదు.
3.చర్చలకు వేరొక వేదిక పెట్టుకోవచ్చు.
(అందులో కొంత వేడి పుట్టినా ఫర్వాలేదు,ఒకరినొకరు
సమర్థించుకోవడం,ఖండించుకోవడం గట్రా ఉండవచ్చు)
గరికపాటి పవన్ కుమార్.
[మీ సూచనలకు కృతజ్ఞతలు. పాఠకుల అభిప్రాయాలు ప్రకటించే విధానంపై కొంతకాలంగా ఈమాట సంపాదకులలో చర్చ జరుగుతున్నది. త్వరలోనే కొన్ని మార్పులు ప్రవేశపెట్టబోతున్నాం. – సం.]
నన్నెచోడుని క్రౌంచపదము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/12/2009 6:12 am
వ్యాసం పైన గాక, ఇంకొకరి అభిప్రాయాలపైనే ఎక్కువగా రాయడం చూసిన తరువాత వ్యాసం చదవడానికి కొంత ధైర్యం, కాదు కొత్త కారణం దొరికింది. పదాల వాడుకను బట్టి మాత్రమే కాక, ఛందస్సును బట్టి కాలాన్ని, అనుకరణలను బేరీజువేసే పద్దతి చాలా సకారణంగా, ఆసక్తికరంగా ఉంది. ఇటువంటి యత్నం ఇంతకుపూర్వం ఎవరైనా చేసారో లేదో తెలియదు.
మోహనగారూ, మీ వ్యాసం పుణ్యమా అని ‘కుమారసంభవం’ చదవాలనే కోరిక సంభవించింది. మళ్ళీ కృతజ్ఞతలు. ద్వా.నా.శాస్త్రి గారు నన్నెచోడుడు పది (or 12?) లయగ్రాహి, లయ* (?), మరియు ఒక కందంలో ఎంతో ఆవేశంతో శివున్ని స్తుతించాడు అన్నారు. నా దగ్గరున్న రెండవ భాగం (7 నుంచి 12 ఆశ్వాసాలవరకు) లో అది కనబడలేదు. మొదటి భాగంలో ఉందనుకుంటాను. ఆ ప్రతి నా దగ్గర లేదు, దాని వివరాలేమైనా తెలిస్తే దయ చేసి చెప్ప మనవి. దశమాశ్వాసంలోని దారిద్రావణాదశకం పద్యాలు బాగున్నాయి.
శివ కథాపరమైన వ్యాసం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో, చివరగా అభిప్రాయాలపై చిన్న అభిప్రాయం. శివుడు అందరిలోనూ ఉన్నాడు, కాని తెలుగువారిలో కొంచెం ఎక్కువున్నాడనిపిస్తుంది. ఎందుకంటే మనం తొందరగా శివమెత్తిపోతుంటాం కనుక. అనుగ్రహిస్తే అవధులులేవు. ఆగ్రహించినా అడ్దులేదు. నిలకడగ ఉండే శక్తి, అదే శక్తిరూపిణి, కూడా మనతోడే ఉండాలనుకుంటూ,
విధేయుడు
-Srinivas
నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana గారి అభిప్రాయం:
03/11/2009 11:03 am
వ్యాసం నచ్చినవారికి నా నమస్సులు. నచ్చనివారికి ఇక మీద బాగుగా రాయటానికి ప్రయత్నిస్తా. ఒక రెండు విషయాలు. ఈ వ్యాసరచనకు ప్రోత్సాహం శ్రీ బ్రందావనరావుగారి పద్యం. నన్నెచోడుని విపులంగా ఎందుకు పాఠకులకు పరిచయం చేయరాదనే భావం నాకు అప్పుడు కలిగింది. మొదటి భాగంలో అతని కవిత్వాన్ని గురించి వివరించాను. రెండవ భాగం నా అభిప్రాయాలు. పాఠకుల అభిప్రాయాలకు జవాబు ఇవ్వరాదనే
భావం నాకు లేదని వినయపూర్వకంగా విన్నవించుకొంటున్నాను.
కలింగత్తుప్పరణి మదురై ప్రాజెక్టులో దొరుకుతుంది. బ్రహ్మానందంగారు చెప్పిన పద్యం చూడగలిగాను. దాని అర్థపర్థాలు అడిగి తెలుసుకోవాలి. ఒక పద్యం ఎవరు ముందు రాశారో ఎవరు అనుకరించారో
చెప్పడం సులభం కాదు. భూషణ్ గారు నాగేంద్ర చోడుడు 940 కాలం వాడన్నది బహుశా కవిగారి సిద్ధాంతాన్ని ఉద్ఘాటిస్తున్నారని అనుకొంటాను. రెడ్డిగారు కూడా నన్నెచోడుడు శాలివాహనశకం కాక విక్రమశకం వాడాడని అనుకొన్నారు.
శ్రీనివాస్ గారూ, నాకు నన్నయ లేక నన్నిచోడులలో ఒకరు ముందు మరొకరు వెనుక అనే స్థిరమైన అభిప్రాయం లేదు, అట్టి అభిప్రాయాన్ని బలపరచాలని ఈ వ్యాసం రాయలేదు. నేను చెప్పిందల్లా రేచన నన్నెచోడుని పిదప అని మాత్రమే. నన్నయ నన్నెచోడులకు ముందు గ్రంథాలు ఉన్నాయని పంపడు తెలుగులో రాశాడని వేంకటరావుగారు అభిప్రాయ పడ్డారు. ఇక పోతే నన్నెచోడులు ఎందరో ఉన్నారు. బద్దెనకు కూడా నన్నెచోడుడని పేరుందని చదివాను. నా ఆశయం ఛందస్సు కొన్ని సంశయాలను తీరుస్తుందేమోననే. చరిత్రగురించి చర్చించడానికి నాకు అర్హత లేదు. ముఖ్యంగా కొత్త వృత్తాల ఉపయోగం, వాటి పేరులు, చిత్రకవిత్వం ఇత్యాదులను చోడుడు ఉపయోగించాడు. వీటిని కన్నడం నుండి గ్రహించి ఉండాలి. కవిరాజమార్గములో చిత్రకవిత్వం ఉంది.
శ్రీనివాస్ గారూ, ఆదిదంపతుల శృంగారాన్ని వర్ణించేటప్పుడు కాలిదాసుకు కూడా సమస్యలే వచ్చాయి. ఈశ్వరునిపై ఎన్నో భక్తిభరితమైన పద్యాలు కుమారసంభవంలో ఉన్నాయి. బహుశా నేను బాగా ఎత్తి చూపలేదేమో, అందుకు నన్ను క్షమించాలి. నన్నెచోడునికి సంగీతంలో కూడా బాగా పరిచయము ఉండి ఉండాలి. అతడు ఒక తరువోజలో ఎన్నో రాగాలను (సాహురి, ఫలమంజరి, పౌరాలి, ఆందోలి, భైరవి, నాట రాగాలను) పేర్కొన్నాడు. ఇవన్నీ పురాతన రాగాలు, అపూర్వ రాగాలు. అందులో కొన్ని బృహద్దేశిలో కూడా ఉన్నాయి. సంగీతజ్ఞానము ఉన్న వాళ్లు పరిశోధనలు చేయవచ్చు. వ్యాసం అచ్చవడానికి ముందు విజ్ఞుల క్రిటిసిసం తీసికోవాలని ప్రయత్నించాను, కాని సఫలీకృతుడిని కాలేక పోయాను.
విధేయుడు – మోహన
కవిరాజశిఖామణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/11/2009 7:42 am
నమస్కారం. ఎంతో పరిశ్రమతో ఎన్నో విషయాలను అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మూడవపేజీలో, “తరువాతి కాలంలో తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని *తిక్కనకు* అంకితము చేసి..” అని ఉంది. Typo అనుకుంటాను.
తట్టిన కొన్ని ఆలోచనలు.
కవి తామరలు విష్ణువు, లక్ష్మీదేవి కన్నులలా ఉన్నాయనడం చాలా అసహజంగా, కృత్రిమంగా ఉంది. తెలియని దానిని, తెలిసిన దానితో పోల్చడం, లేక తెలిసిన దానిని సైతం ఇంకో తెలిసిన దానితో పోల్చడం చూస్తాం. ఇక్కడ కళ్ళకు కనబడే తామర పూలను కనిపించని లక్ష్మీనారాయణుల కళ్ళతో పోల్చడం కవిత్వం కన్నా, పాపము శమించుగాక, పైత్యం లాగా అనిపిస్తుంది.
ఎవరి పద్యం ముందో తెలియదుకాని, పోతన గారి “అడిగెదనని కడువడి జను” పద్యం లక్ష్మి తడబడ అడుగులను ఎంతో సహజంగా, సుందరంగా సర్వ లఘు కందంలో అందంగా అనిపిస్తుంది, వినిపిస్తుంది. దాని ముందు “తగుదగదని మనమున” అన్న నన్నెచోడుని పద్యం, కాపీ కొట్టింది కాకపోయినా, వెలవెల పోయినట్లే అనిపిస్తుంది.
పాండిత్యం గురించి కాదు కాని, హృదయాన్ని తాకే భక్తి భావం మాత్రం ఇన్ని పద్యాలను చదివినా ఎందుకో, పోనీ పోతన ధూర్జటి స్థాయిలను అందుకోకపోయినా, ఏ మాత్రం కూడా అనుభవంలోకి రావడం లేదు. కవిరాజశిఖామణికైనా కూడా, కామున్ని స్తుతించిన కలంతోనే కామేశ్వరున్ని గొప్పగా స్తుతించడం కష్టమేనేమో!
విధేయుడు
-Srinivas
[టైపో సరిదిద్దాము. చూపినందుకు కృతజ్ఞతలు – సం]
నన్నెచోడుని క్రౌంచపదము గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
03/10/2009 3:27 pm
నన్నెచోడుని మీద జరుగుతున్న చర్చ చూస్తున్నాను. చర్చలో మంచిచెడ్డల గురించి చెప్పబోయేముందు చర్చకు వాడుతున్న భాషను గురించి ఒక మాటచెప్పాలనుకుంటున్నాను. ఆ చర్చల్లోని కొన్ని వాక్యాలలో స్పష్టత కన్నా ఆవేశం ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకి భూషణ్ గారి మొదటి వాక్యం: “అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం.” ఈ వాక్యం వల్ల చర్చకు ఏ రకమైన ఉపయోగం జరగదు సరికదా అనవసరమైన ఆవేశం పెరుగుతుంది. మనం ఎవరినీ చెంపదెబ్బలు కొట్టనక్కరలేదు. ఎవరి పాండిత్యాన్నీ ఈసడించుకోనవసరం లేదు. “ఈమాట” చదువుతున్న వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళు. వాళ్ళంతట వాళ్ళు మంచి అభిప్రాయాలు ఏర్పరుచుకోగలిగినవాళ్ళు. అందువల్ల “ఈమాట”లో చేస్తున్న చర్చల్లో ఆవేశాలు ఎంత తక్కువుంటే అంత మంచిది.
ఇక నన్నెచోడుని మీద మోహనరావుగారు రాసిన వ్యాసం నిజంగా బాగుంది. అయినా ఆ వ్యాసంలో కూడా సమాచారం కొత్తదే కానీ సమన్వయం కొత్తది కాదు. ఆయన ఛందస్సుని వాడుకున్న పద్ధతి అయన వ్యాసానికి చాలా బలానిచ్చింది. కాని ఆయన వేసుకున్న ప్రశ్న; నన్నెచోడుడు, నన్నయ వీరిద్దరిలో ముందెవరు, తరువాతెవరు అనేది. అయనిచ్చిన సమాచారంలో ఏదీ కూడా ఈ ప్రశ్నకు నిష్కర్షగా జవాబివ్వదు. దానికి కారణం ఆయనిచ్చిన సమాచారంలో లోపం కాదు. ఆ సమాచారాన్ని ఆయన విశ్లేషించిన తీరులో లోపం కూడా కాదు. లోపమల్లా ఆ ప్రశ్నలోనే వుంది. అది సమాధానం దొరకడానికి వీల్లేని ప్రశ్న. ఇంకొక మాటల్లో చెప్పాలంటే అది పరిశోధకులు వేసుకోవలసిన ప్రశ్న కాదు.
నన్నెచోడుడు, నన్నయ రెండు భిన్నమైన సంప్రదాయాలకు చెందినవాళ్ళు. నన్నయది పురాణ సంప్రదాయం, నన్నెచోడుడిది కావ్య సంప్రదాయం. ఇద్దరూ తెలుగులో రాస్తున్నారు అన్నమాట మినహాయిస్తే వీళ్ళిద్దరి మధ్య పోలికలు లేవు. మోహనరావుగారు చేసిన ఉపకారం ఏమిటంటే నన్నెచోడుడు దాదాపుగా నన్నయ కాలానికి చెందినవాడే అని ఛందస్సులో ఋజువులు చూపించి చెప్పగలగడం.
అయితే ఆ కాలంలో నన్నెచోడుని కావ్యంలాంటి కావ్యం ఎలావచ్చిందో చెప్పడానికి కావలసిన సమాచారమేదీ మోహనరావుగారి వ్యాసంలో కనిపించదు. నన్నెచోడుడు ఏ పరిస్థితుల కారణాల వల్ల అలాంటి కావ్యాన్ని తెలుగులో నిర్మించాడో కానీ, ఆ తరువాత అతనికి దరిదాపు అయిదు వందలేళ్ళపాటు ఆయనకు అనూయాయులెవ్వరూ లేకపోయారు. ఎంతగా లేకపోయారంటే తరువాత వచ్చిన కవులెవ్వరూ ఆయన పేరుకూడా చెప్పలేదు. ఆయన రాసిన పుస్తకానికి ఒక్కటే ప్రతి దొరికింది. అంటే ఆ పుస్తకానికి ప్రతులు రాసుకున్నవాళ్ళు కూడా తక్కువేనన్నమాట. దీనితో పోల్చి చూస్తే నన్నయ భారతానికి ప్రతి తరంలోను కొన్ని వందల ప్రతులు రాసుకున్నారు. నన్నయ సంప్రదాయాన్నీ, దానికి తిరుగుబాటుగా వచ్చిన శివకవుల మార్గాన్నీ కలుపుకొని తిక్కన “ఉభయకవిమిత్రుడు” అనే పేరుతో నన్నయకే ఎక్కువ మిత్రుడై తెలుగులో పురాణ సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఆ తరువాత ప్రబంధం అని ఆధునిక విమర్శకులు అనే కావ్య సంప్రదాయం పెద్దన నాటికి కాని నిక్కచ్చయిన రూపు కట్టుకోలేదు. నన్నెచోడుడు ఆయనకు సుమారు 500 ఏళ్ళ ముందే కావ్యసంప్రదాయాన్ని తెలుగులో మొదలు పెట్టాడని తనకి తెలియకుండానే పెద్దన ప్రబంధ సంప్రదాయాన్ని మొదలు పెట్టి “ఆంధ్రకవితాపితామహుడ”యినాడు.
ఇంతగా తెలుగు సాహిత్య సంప్రదాయంతో సంబంధం లేకుండా ఏకాకిగా నన్నెచోడుడు మిగిలిపోయాడు. నన్నెచోడుడిమీద చర్చంతా మానవల్లి రామకృష్ణకవిగారు కుమారసంభవాన్ని బయటకు తెచ్చిన తరవాతే మొదలయ్యింది. నన్నెచోడుడి భాషలో చాలా మాటలకి అర్థాలు అందుకే ఇప్పటికీ మనకు తెలియవు. ఉదా: వస్తుకవిత, జానుతెలుగు అనే రెండు మాటలు చూడండి. వాటికి తెలుగులో వాడుక లేకపోబట్టి ఆయన ఏ అర్థంలో ఈ మాటలు వాడాడో స్పష్టంగా చెప్పడం కష్టం అవుతుంది. ఈమాటలకు అర్థాలు మోహనరావుగారి వ్యాసం చదివిన తర్వాత కూడా అస్పష్టంగానే మిగిలిపోతాయి.
నన్నెచోడుడు, నన్నయ దాదాపు ఒక కాలం వారయినప్పటికీ భిన్న సంప్రదాయాల వాళ్ళు అనేమాట గుర్తిస్తే ఈ యిద్దరిలో ఎవరు ముందు, ఎవరు తరువాత అనే ప్రశ్న తప్పేది. తారీఖులు మాత్రమే సాహిత్యచరిత్ర అని మనం 19వ శతాబ్దం చివరిలో నేర్చుకున్న పాఠాలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం. మనకు కావలసింది ఋజురేఖలాగా నడిచే తారీఖుల సాహిత్యచరిత్ర కాదు, సంప్రదాయాల చరిత్ర కావాలి.
ఇకపోతే ఈ చర్చలోకి Caldwellని, Brownని తీసుకురావడం స్పష్టత తీసుకురాదు సరికదా ఇంకా గజిబిజికి కారణమవుతుంది. ఈ చర్చకు సంబంధించిన విషయం కాదు కాబట్టి Caldwell, Brown తెలుగు సాహిత్య చరిత్రకు కానీ, తెలుగు భాషకు కానీ చేసిన ఉపకారమేమిటి, అపకారమేమిటి అన్న విషయాలు వేరేగా చర్చించాలి.
— శ్రీనివాస్
కొండ నుంచి కడలి దాకా గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/05/2009 7:35 am
శ్రీనివాస్ గారికి,
వుభయకుశలోపరి.
అర్థం కాని భాషలో వ్రాసిన దానిని, అర్థం కాదని వదిలెయ్యడం, ఎవరి mail వల్లో కష్టపడి చదవడం, చదివి దానికి సమాధానమీయడం మీ సహృదయతకు తార్కాణాలు. మరేట్లేదుకానండీ. మా మంచిపని చేసేరండీ. ఈ మాట ప్రతీ సంచికలోనూ ఏదో వొహటి పెట్టాల మీరు. లేకపోతే వొల్లకోం.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి Akeela Ramakrishna గారి అభిప్రాయం:
03/03/2009 9:35 am
ఈ సమీక్ష లో శ్రీకాంత్ శర్మ గారి కంటే కూడా నారాయణ్రావు గారి సొంత అభిప్రాయాలు ఎక్కువున్నట్టు అనిపించింది.. ఈ ఎడమచేతి కుడిచేతి కులాలను గూర్హి తెలుగులో విన్నట్టు లెదు. “గ్రంథం ద్వారా. ఒక భాష బతికి వుందా, చచ్చిపోయిందా అన్న విషయం భాషాగతమైనది కాదనీ, ఆ భాష వాడేవాళ్ళ సామర్థ్యానికి సంబంధించిన విషయమనీ బోధపడుతుంది ఈ పుస్తకం చదివితే.” హిందీ ఎక్కువ వెలుగులో వుండడానికి గల ముఖ్య కారణం వాడుక భాషకి పుస్తకాల భాషకి దూరం తక్కువ వుండడమె అని నా అభిప్రాయం. ఆ దృష్టితో ఆలొచిస్తే తెలుగు సాహిత్యం మామూలు ప్రజలకి దూరమవ్వడా నికి గల కారణాలు ఎమిటి అనేది బొధపడవచ్చు. తెలుగు వెలగాలని ఎంత్ మంది కొరుకుంటున్నారో ఇన్ని వ్యాఖ్యానాలు చూస్తే తెలుస్తోంది. ఆధునిక కవుల వలన తెలుగు పాడయ్యింది అనడం సమంజసం కాదు. పైన కామేశ్వర రావుగారు రాసినట్టు కాలాణుగుణం గా వచ్హే మార్పులను గ్రహించలేక పోవడం మన పాత తరం తప్పు.కొత్త అవసరాలకు సరిపడా మాటలు తయారుచెయ్యాల్సిన భాధ్యత మీరనే పండితులదే. వాళ్ళు తెలుగు కొత్త పదాలకు బదులు సంస్కృతాన్ని వాడడం వల్లె ఈదుస్తితి తలెత్తింది. పాత కవులు గొప్ప వాళ్ళే కాని జన నాడి గ్రహించలేదనిపిస్తోంది.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:
03/02/2009 9:12 pm
ఇది పదుహేడవ శతాబ్ధపు కావ్యమని వేల్చూరి గారు చెబుతున్నారు. ఆ కాలంలో దక్షిణ భారత దేశంలో, తమిళనాడులో అధికారంలో వున్న నాయక రాజులు విజయనగర ప్రభువుల వారి రాజ్యంలో వారి ఆస్థాన వుద్యోగులుగా, తమిళ దేశంలో రాయల వారి ప్రతినిధులుగా, రాయల వారితో బంధుత్వాలు వున్నటువంటి తెలుగు నాయక రాజులు కదా. వారు సామాజికంగా పెద్ద ప్రాధాన్యత లేని కులాల వారవటం ఏవిటి? రాజాస్థానోద్యోగులు, రాజ బంధువులు, రాజ ప్రతినిధులు ఊరూ పేరూ లేని కులాల కి చెందిన వారని చెప్పటం సబబా? వొకవేళ మీరు మాట్లాడే నాయక రాజులు వేరు అని అనుకుందాం. అయినా సరే పదిహేడవ శతాబ్ధంలో పెద్దగా ప్రాధాన్యం లేని కులాల వాళ్ళు, సమర్ధులైన వ్యాపారులుగా మారటానికి ఎన్ని తరాల సమయం పడుతుందో ఆలోచించారా. ఎవరో ఒకరో ఇద్దరో కాదు వొక కులవంతా సామాజిక, ఆర్ధిక పరిస్థితులని (భూమి ముఖ్య ఆదాయ వనరుగా వున్న సమాజంలో, ప్రాధాన్యత లేని కులాలకి వున్న ఆర్ధిక బలం అతి బలహీనంగానే వుంటుంది) తమకనుకూలంగా మార్చుకుని, సమాజంలో వ్యాపార పరంగా గానీ, సామాజికంగా గాని, రాజ్యాలు స్థాపించే స్థాయికి ఎదగడం వొకరోజులో, ఒక జెనరేషన్లో అయ్యే పని కాదు కదా. భూమే ప్రధానమైన ఆదాయ వనరుగా, రాజుకైనా, సామాన్యుడికైనా వున్న సమాజంలో, భూస్వామ్యంతో సంబంధం లేకుండా రాజ్యాధికారానికి రావడం, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకోవడం ఎంత వాస్తవవిరుద్దంగా వుందో చూడండి. ఒకవేళ ఆ ప్రాధాన్యత లేని కులాల వారె, పరిణామ క్రమంలో, వ్యాపారులుగా, భూస్వాములుగా, రాజ ప్రముఖులుగా, రాజ ప్రతినిధులుగా ఎదగగలిగినప్పుడు, వారి కులం ప్రాధాన్యతని సంతరించుకుని ఒక ప్రముఖ కులంగా, సామాజిక వర్గంగా మార్పుచెందుతుంది కదా (ఇక్కడ ఏ వొక్క వ్యక్థి అభివృద్దో కాదు, మొత్తం కొన్ని కులాల సామాజిక పరిణామం). కాబట్టి అప్పటి వరకు పెద్ద ప్రాధాన్యం లేని కులాల వారు కాదు, అప్పటికే ప్రాధాన్యతని సంతరించుకున్న కులాలు అయ్యుండాలి వాళ్ళవి.
ఇక ఎడమ చేతి కులాలు, కుడి చేతి కులాల ప్రశక్తి ఒకటి తెచ్చారు. వీరి ఆచార వ్యవహారాలు పరస్పర విరుద్దాలన్నారు. అసలు భావ మాత్రమైన, ఎప్పుడూ జన బాహుళ్యం అనుసరించని, శాస్త్రాలకి, సాహిత్యానికి పరిమితవైన చాతుర్వర్ణ వ్యవస్థ, మీరు చెప్పిన ఎడమ చేతి కులాలు అధికారంలోకి వచ్చేప్పటికి కుప్పకూలి పొయ్యె పరిస్థితి ఎందుకు తలెత్తిందో మీరే చెప్పాలి. అసలు సమాజం పాటించని భావం సమాజంలో ఒక సాజిక వర్గం ఎదుగుదలతో కుప్పకూలి పోవటవేవిటో మీరే వివరించాలి. అసలు కుల వ్యవస్థతో జన్య జనక సంబంధం లేనటువంటి, ఆకాశంలోనో, పాతాళంలోనో, ఉత్తుత్తి ఊహల ఉయ్యాలల్లోనో వుండే చాతుర్వర్ణ వ్యవస్థకి ఎడమ చేతి కులాలతో ఎందుకు తంటానో మరి?
పెద్ద బ్రామ్హలైనా, చిన్ని బ్రామ్హలైనా, ఒక్క బ్రామ్హణులకే వేదాధ్యాయన అర్హత అని కాదనలేని సత్యం. శారీరకవైన, ఆర్ధికవైన స్వశక్థి లేని సామాజిక వర్గం, దాతల మీద, దానాల మీద అధార పడ్డ కులం అధికారాన్ని సంపాదించి, దాన పత్రం చేత పట్టిన ఎవిరినైనా ఆశీర్వదించడానికి, వారికి క్షాత్రపు పోగు తొడగడానికి లైన్ కట్టి వుంటారనడానికి అభ్యంతర వుండదనుకుంటాను. దానికి పైనుంచో, క్రింద నుంచో పిలిపించుకోవాల్సిన అవసరం వుందని నేననుకోను. అందువలననే, రాజ పీఠం ఎక్కిన ప్రతి వక్కరు క్షత్రియులయ్యారు. భారత దేశంలో నానా కులాల వాళ్ళు, బయటనుంచి వచ్చిన, శకులు, గ్రీకులు, తురుష్కులు, ఆంగ్లేయులు, మన దక్షిణంలో రెడ్లు, బలిజలు, వెలమలు, నానా రకాల రాజులు అందరూ క్షత్రియులై, క్షాత్రం ఒలకబోసిన వాళ్ళే. ఐతే ప్రాచీన రాజ్యాల నుంచి, బ్రిటీషు క్షత్రియుల వరకు, వారు బౌద్ద మతావలంబులు కానీ, తురుష్కులు కాని, సముద్రాలవతల నుంచి వచ్చిన మ్లేచ్చులు గానీయండి దేవుడిని, బ్రామ్మడిని తోసిరాజని, తమని తామే దేవుళ్ళుగా ప్రకటించుకుని, పూజలందుకున్న రాజులు కూడా కావ్యాల్లో, కథల్లో వున్నరేవోగాని, చరిత్రలో వున్నట్టు తోచదు.
రాజు సామాజిక వర్గం పూర్వవెప్పుడో వర్తక వ్యాపారాలు చేసున్నా, వ్యవసాయాలే చేసున్నా, వేదాలే చదివున్నా, కర్రసాములే చేసున్నా, రాజుకి ఎప్పుడూ ధనం ప్రాధాన్యవే. ప్రత్యేకంగా ఎడమచేతి కులపు రాజులే విత్త ప్రాధాన్యాన్ని పెంచి పోషించేరనడం మీ స్వకపోల సిద్దాంతవేనని నా నమ్మకం. నూటికి తొంభైతొమ్మిది శాతం ప్రజలు భూమి మీద ఆధార పడిన పదిహేడో శతాబ్ధంలో, వ్యాపారం చేసి హటాత్తుగా పైకొచ్చి రాజ్యాలు చేపట్టిన కులాలు కూడా మీరు నమ్మినట్టు చాతుర్వర్ణ వ్యవస్థ లాగే ఊహల్లో వుండి వుంటే వుండి వుండొచ్చు.
ఇటువంటి కుల సంఘర్షన కాలంలో వ్రాసిందే వేంకటాధ్వరి గారు వ్రాసిన కావ్యమని చెప్పేరు. కావ్యం నేను చదవలేదు. ఐతే మీరు పరిచయం చేసిన కావ్యాంశాలని ఒక సారి పరికిద్దాం. మీ పరిచయం ప్రకారం అప్పటి సమాజంలో పెద్ద మార్పు సంభవించింది. ఎడమ చేతి కులపు వాళ్ళు రాజ్యాధికారం సంతరించుకున్నారు. వాళ్ళు రాజ్యాధికారంతో ఆగిపోకుండా తమని తాము భగవంతులుగా ప్రకటించుకున్నారు. వాళ్ళు పూర్వాశ్రమంలో వ్యాపారులుగుట చేత, సమాజంలో డబ్బు ప్రాధాన్యత పెరిగిపొయ్యి, కులం కాకుండా, దబ్బు సంపాదన అనే గుణం సమాజంలో ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది (బలవంతులవుతున్ననవాబులు, అప్పుడప్పుడే దోపిడికి మార్గాలేస్తున్న బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ తప్ప ఆ కాలంలో అంత సమాజాన్నికల్లోలం చేసిన మార్పులేవీ జరగలేదు చరిత్ర ప్రకారం). కాబట్టి ఆ డబ్బు సంపాదన కలిగిన (ఎలా సంపాదించారో మరి, భూమి పుట్ర లేని క్రింది కులస్థులు) క్రింది కులస్థులు కూడా సమాజంలో గౌరవమైన స్థానం సంపాదించ గలిగేరు. ఎలాటి స్థానం, బ్రామ్హణులు కూడా అసూయ పడగలిగే గౌరవ స్థానాన్ని పొందగలిగేరు. దానికి చారిత్రక ఋజువు ఈ సుమతీ శతక పధ్యం. సుమతీ శతక పధ్యం ఆ కాలానిదని చెప్పడానికి, ఏకాలానిదో చెప్పడానికి ఏ ఋజువులు లేవు, కాబట్టి దాన్ని వదిలేస్తాం.
అటువంటి సంఘర్షణల సమాజంలోంచి వచ్చిన కావ్యం, ఆ సంఘర్షణని వివరించే కావ్యం ఈ విశ్వగుణాదర్శం. ఈ కావ్యంలో అధునికులు అనుకునే విమర్శనాత్మక దృక్పథం ఆ కాలానికే వుందనివేల్చూరిగారి ఉవాచ. ఎలా? ఇద్దరు గంధర్వుల సంభాషణని రెండు విరుద్ద అభిప్రాయాలుగా మలచడం ద్వారా, ఆ విమర్శనాత్మకథని రచయిత నెలకొల్పుతాడు. కాకపోతే రెండు అభిప్రాయాలుకూడా తురకలు వీరులని చెప్పటంలో, ఆంగ్లేయులు నీతివంతులని వొప్పుకోవడం లాంటి కొన్ని విషయాల్లో వేరైనా, నారాయణ రావు గారి ఉదాహరణల్లో ఇద్దరి అభిప్రాయాలు కూడా, తరిగిపోతున్న బ్రామ్హణ ప్రాబల్యాన్ని గురించి చింత పడటవే కనిపిస్తుంది. పెరిగిపోతున్న శూద్ర కులాల ప్రాభల్యానికి విచారించడవే గోచరిస్తుంది. పాపం తురుష్కులలో, తెల్లొళ్ళల్లో వీరత్వాన్ని, నీతిని చూడ గలిగిన గాంధర్వులకి, క్రింది కులాలు రాజ్యాధికారానికి రావటం మాత్రం అంత నచ్చినట్టు లేదు. ఇదేదో అప్పుడే మొదలయ్యినట్టు, భూసురులు ఇంతకుముందెప్పుడూ లౌకిక వృత్తుల్లో లేనట్టు, ఎప్పుడూ అగ్రహారం కోసం దోసిలి పట్టనట్టు గాంధర్వులు యమ బాధపడిపోతారు.
ఇంకా విచిత్రవైన విషయం ఏవిటంటే, గంధర్వుల విమర్శనాత్మక దృక్పథాన్ని మరింత ఎత్తుకి తీసుకపొయ్యే ఉద్దేశంతో ఇచ్చిన ఉదాహరణ. వీరు సంస్కృతాన్ని కూడా విమర్శించడానికి కాదు ఈసడించడానికి కూడా వెనుదియ్యరు. నారాయణ రావు గారు, బాపనోళ్ళలో కూడా మహాత్ములుంటారంటే ఉద్దేశం బ్రామ్హణులు మహాత్ములని కాదండి, వాళ్ళు జనరల్ గా మహాత్ములు కాకపోయినా, ఎక్కడో ఎప్పుడో వాళ్ళలో కూడా మహాత్ములుంటారని అర్థం, కాదనగలరా. ద్రవిడ భాషల్లొ మంచి వుంటే పరిగ్రహించవలసిందే, చెడ్డ విషయం సంస్కృతంలో చెప్పినా పరిహరించ వలసిందే అంటే ద్రవిడ భాషలు ప్రామాణికవైనవి, గౌరవించవలసినవి కాకపోయినా, మంచి చెప్తే తీసుకోవలసిందే, సంస్కృతం దేవ భాష, ప్రామాణికవైన భాష అయినప్పటికి చెడ్ద చెప్తే ఆచరించనవసరం లేదు అనే కదా. ఇందులో ద్రవిడ భాషల్ని సున్నితంగా (సున్నితవేం సున్నితం, అదేదో అదైనప్పటికి అది అదే కదా అన్నడట వాడెవ్వడో) కించపరచడవే కదా.
మీరిచ్చిన ఉదాహరణలన్నీ బ్రామ్హణ కుల సంబంధవైనవే, పొనీ అగ్రకులాల అలజడి గురించి ముచ్చటించారు, అప్పుడైనా మరోకుల ప్రశక్తి లేదుకదా. మీ పరిచయం చదివిన తర్వాత ఇది ఒకే ఒక్క అగ్రకులపేడుపని నేననుకుంటే నా తప్పుందని నేననుకోను.
ఇంత నిస్సంకోచంగా మీరెలాగ అసత్యాన్ని సత్యంగా చేయబూనుకున్నారు? కులాలతో సంబంధం లేకుండా వున్నటు వంటి చాతుర్వర్ణ వ్యవస్థ, వేదం చదవడం ద్వారానే కులలతో సంబంధం లేకుండా వర్ణ వ్యవస్థలోకి
ఎదిగిన పెద్ద బ్రామ్హణులు (పాపం బ్రామ్హణ కులంలో చిక్కు పడిపోయిన చిన్న బ్రామ్హణులు) ఇలా అందంగా పుట్టే తక్కువ కులాల ఆడవాళ్ళని చూసి ఏడవడంవవేనా ఆధునికత? సంస్కృత సాహిత్యం ఆధునికం, ఆధునికత్వానికి దూరం కాదని చెప్పడానికి ఇవా మీ ఉదాహరణలు. సమాజంలో మరేరకవైన ఘర్షణ, మార్పు కనిపించలేదా ఉదాహరించడానికి, లేకపొతే కవి గారి ఆధునికత, ఆయన విమర్శనాత్మక దృక్పథం ఆయన ముక్కు దగ్గరే ఆగిపోయిందా? కవిత్వ శొభగుల సంగతి నాకు తెలీదు, మీరు ఏవీ చెప్పినట్టు లేరు, కానీ మీరిచ్చిన ఉదాహరణలే ఆ కావ్యానికి వస్తువైతే, ఆ గంధర్వుల, వారి ద్వారా మీరు పరిచయం చేసిన విమర్శనాత్మక దృక్పథం నిజంగా విచారింపదగిన విషయం. ఐతే అందులో నాకేవీ ఆశ్చర్యం లేదు, మీ కన్యాశుల్కానువాదానికి మీ వెనుక మాట మీద వేలూరివారిచ్చిన పరిచయం చదివేను (కన్యాశుల్కాన్ని మళ్ళీ ఎందుకు చదవాలంటే, వేలూరి వెంకటేశ్వరరావు – సెప్టంబరు 2007), కన్యా శుల్కాన్ని అంతగా వక్రీకరించగలిగిన మీనుంచి మరొకటి ఆశించటం తప్పే కదా.
చివరగా కొడవళ్ళ హనుమంత రావు గారు, అది ప్రాచీనవైనా, అధినికవైనా, అధునికాంతరవైనా మరేదైనా, సాహిత్యాన్ని పదుగురికి అందుబాటులోకి తేవాలనే మీ సంకల్పం అనుమానం లేకుండా అభినందించదగినది. ఐతే బాబ్జీలు తన అభిప్రాయం చివర్లో చెప్పిన విషయం కూడా మనసులో పెట్టుకోదగినదని నా అభిప్రాయం.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/02/2009 9:01 pm
మోహన్ గారూ !!
నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను నిన్న చెప్పిన అభిప్రాయానికి ఇది కొనసాగింపు. ముందుగా మీ observation సరైంది. ఇవాళ ఇంగ్లీషులో ఎంతపాటి పాండిత్యం మనవాళ్ళు సంపాదించారో నాకు తెలీదుగానీ..దేశిభాషల్లోనూ..సంస్కృతంలోనూ..మాత్రం్ చాలా నష్ట పోయేరు.ఇలా నష్టపోవడానికి..రెండు కారణాలు. మొదటిది. ఆధునికంగా కన్పించడం్ ..అలాంటి వేష భాషలు ధరించడం్ గొప్ప గా చలామణీ కానిచ్చారు. కన్యాశుల్కం్ లోనే ఈ పరిస్థితి మీద ప్రస్తావన ఉంది.దేశీయ పాండిత్యాన్ని చిన్న చూపు చూసేరు ఆధునికులు. ఆధునికమైన చదువులు
చదివిన వాళ్ళతో పాలన జరిపించుకునే ప్రభుత్వాలూను. రాజుల పోషణ పోయింది. ప్రజల్నించి ఆదరణ కరువైంది. మన తెలుగునేల ఈ భాషల్లో విశ్వవిద్యాలయాలు చేవ ఉన్నవాళవానీ..సామర్ధ్యం ఉన్న వాళ్ళనీ కాక..ఎక్కువశాతం mediocres తో నింపేసేరు. చాటపెయ్యల్లా తయారుచేసేరు వాటిని. పైరవీగాళ్ళూ..పలుకుబడి గల్గినవాళ్ళూ..మాత్రమే అక్కడ చొరబడ్డారు. కాదు అలాంటి వాళ్ళని చొరబడనిచ్చేరు.జో హుజూర్ గాళ్ళు అన్నమాట. ఒకసారి తెలుగుశాఖల్ని వెళ్ళి చూడండి. ఇంక సంస్కృతం వచ్చి డొక్కశుధ్ధి ఉన్న వాళ్ళు సంఖ్యలో తక్కువ. ఉన్న కాసింత మందీ తెలుగు టీవీ చానళ్ళలో “పురాణ ప్రవచనాలు” చెప్పుకు కాలక్షేపం చేసుకుంటున్నారు.
ఏ కాలంలోనైనా పాండిత్యానికి కొనసాగింపు ఉండాలీ అంటే..ముందు నేర్పేవాళ్ళుండాలి. మనం గురువుల్ని గౌరవించుకోలేదు.వాళ్ళ పేదరికాలకి కారణం అయ్యేం. శిష్యుల్నీ తయారుచేసుకోగల వీలు వాళ్ళకి మనం కల్పించలేదు. వాళ్ళ బతుక్కి ఎటువంటి ఆధారమూ ఈ సమాజం చూపించలేదు. ఏ ఉగాది సమయాల్లోనో పిలిచి ఒక శాలువా కప్పి వెయ్యినూట పధార్లు చేతిలో పెట్టి పంపించాం!!. పాశ్చాత్య భాషల మీది మోజుతో..వాళ్ళకి అనుకరణల్తో ఇప్పటికి ఒక 50 ఏళ్ళు గడిపీసేము. ఇవాళ కళ్ళుతెరిచి పాండిత్యం కోసం వెతుక్కుంటే ఎక్కడ కన్పిస్తుందీ??తెలుగులో మంచి పుస్తకాలు రాస్తున్న వాళ్ళు చాలా మంది ఏ ఉద్యోగాలూ లేని వాళ్ళు. యూనివర్సిటీల్లోంచి చెప్పుకోదగ్గ పరిశోధన ఏదీ?? పనిచెయ్యని వారికి అవకాశాలూ..పనిచేసేవాళ్ళకి కష్టాలూను. అసలు ఇలాటి చోట పాండిత్యాన్ని గురించిన పరితాపంలో అర్ధం ఉందా??…రమ.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి mOhana గారి అభిప్రాయం:
03/02/2009 12:46 pm
నా ఉద్దేశంలో ఆ సామర్థ్యం చాలావరకు అంతరించి పోయిందనే అభిప్రాయం. అంతెందుకు, ఈమాటనే ఉదాహరణగా తీస్కోండి. అందులో పాఠకులు అందించే అభిప్రాయాలను ఒక కొలబద్దగా ఎంచుకొంటే, అభిప్రాయాలు ఎక్కువగా కథలపైన, తరువాత కవితలపైన. ఆ తరువాత సంగీతం, సినిమా వ్యాసాలపైన. తరువాతే సాహిత్యం వ్యాసాలపైన. ఈమాట రీడర్షిప్ చాల ఎలీట్. మరి ఇక్కడే ఇలా ఉంటే సాహిత్యంపైన, పుస్తకాలపై వ్యాసాలపైన దృష్టి ఎలా పోతుందండీ జనానికి? ఇలాగున్నా రచయితలు రాస్తున్నారంటే ఆ రచనలు వాళ్లకు ఒక తృప్తి కలిగిస్తుందేమో కాని అందరూ చదువుతారనే ఆశతో కాదని అనుకొంటాను నేను. విధేయుడు – మోహన
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/02/2009 11:50 am
అచ్చేసిన తానాకు, అందుకు విరాళమిచ్చిన హనుమగారికి కృతజ్ఞతలు.
వెల్చేరుగారన్నట్లు పూర్వ గ్రంధాలకు ఇప్పటి భాషలో వ్యాఖ్యలు కావాలి. తేవాలి. మరి అట్లా చేసే సామర్థ్యం అంతరించిపోతుందనుకుంటున్నప్పుడు, దాన్ని మాత్రం ఎట్లా కాపాడుకోవాలి అని ప్రశ్న. వ్యాఖ్యానాలు చేసే సమర్థత, అన్వయించే చతురత ఉంటే ఈ రోజుకాకపోతే రేపైనా వ్యాఖ్యలు రాసి అచ్చేసుకుంటాం. కాని ఆ సమర్థత, పాండితి కోల్పోతే తిరిగి వాటిని పోందడం సాధ్యమేనా! ఇక దాన్ని కాపాడుకోవడం పిల్లి మెడలో గంట కట్టే పని లాగుంది.
భాషలో బలమైనదేదైనా నిలుస్తుంది అని అనుకోవడానికి ఈ కృషి నిదర్శనం కాకపోయినా కొంతైనా ఊరట అనిపిస్తుంది.
===
విధేయుడు
-Srinivas
అతడు, నేను, అతడి కథ గురించి afsar గారి అభిప్రాయం:
03/02/2009 11:12 am
Dear Madhav:
ఇలాంటి కథల గురించి మాట్లాడ్డం కష్టం. తీరా మాట్లాడ్డం మొదలెడితే అది కాస్తా కవిత్వమయి కూర్చుంటుంది. మీరూ అలాంటి ప్రమాదం లొ కాస్త పడ్డారు కాని. వచనానికీ- కవిత్వానికీ మధ్య అంచు పట్టుకుని జారిపొకుండా, పైకి వచ్చెశారు.
విశ్లేషణ బాగుంది, త్రిపుర కథలు కొత్తగా, ఇష్టంగా చదివె వొకానొక కాలం లొ ఇలాంటి వాక్యాల కథలు బాగా నచ్చేవి. త్రిపుర తర్వాత, చంద్రశేఖర రావు, తుల్లుమిల్లి విల్సన్, అనిసెట్టి శ్రీధర్, మధ్యలొ కాస్త సుమనస్పతి రెడ్డి ఇలాంటి వచనంలోకి వెళ్ళి కథల్ని రాబట్టారు.
మీ విశ్లేషణ ఆ అరుదయిన సాంప్రదాయానికి కొండంత బలం…మీ విమర్శ ఆ కథల చీకట్లో గొరంత టార్చ్ లైట్.
అఫ్సర్
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి baabjeelu గారి అభిప్రాయం:
03/02/2009 9:31 am
వెల్చేరు నారాయణ రావు గారికి నమస్కారములు.
ఆధునికత గురజాడతో మొదలవలేదు, వెంకటాధ్వరి గారి లాటి వారితోనో ఇంకా ముందుగానో మొదలయ్యుండొచ్చు లాటి వాదన నిజవేఁ కావొచ్చు. కాకనూ పోవచ్చు. ఆధునికత ఎక్కడ మొదలైతేనేం? ఆధునికం అంటే ఇప్పటికీ వుండాలి. బహుశా అన్నమయ్యని “నొక్కీసినట్టు” వెంకటాధ్వరి గారినీ “నొక్కీసుంటారు” అప్పటి తరం వాళ్ళధ్వనిజం నిలకడ మీద తెలిసిపోతుంది కదూ?
ఈ పుస్తకంలో పరమ రమణీయకరవైఁన కవిత్వం వుందన్నారు. దాని గురించి ఎక్కువ రాయలేదు మీరీ వ్యాసంలో. పోన్లెండి ఎలాగోలాగ చదివి చూస్తాం.”రీడబిలిటీ” వున్న వాళ్ళందర్నీ సామాన్య పాఠకులు నెత్తిన పెట్టుకున్నారు. వుదాహరణకి యం.వీ.నాథ్, మ.వెం.కృష్ణమూర్తి, “షాడో” మధుబాబు వగైరాలు. ఈ పుస్తకం కూడా అలాటిదే అయితే, ఇన్నాళ్ళకి దొరికింది కాబట్టి తప్పకుండా నెత్తిన పెట్టుకుంటాం.
ఇహ భాష విషయం: జనజీవనంలో వుపయోగపడని భాషని ఆ జనులు వదిలేస్తారు. దీనికి అమెరికాలూ, యూరోపులూ వెళ్ళక్కర్లేదు. ఖర్గ్ పూరూ, కలకత్తా, తమిళ్నాడూ, బొంబాయీ వగైరాలు వెళ్తే తెలుస్తుంది. అందులో వాడి, వేడి ఆధునికత్వంతో నిండిపోయిన కవిత్వం రాసినా ఎవరూ పట్టించుకోరు. అంతేకాని సమర్ధులయిన కవులు లేరని ఏ భాషా ఆత్మహత్య చేసుకోదు.
కొడవళ్ళ వారికి: పుస్తక ప్రచురణకి భూరి విరాళం ఇవ్వడం “జయ హో” అని “డేంచు” కట్టవలసిన విషయం. అయితే ఏ మంచికి హాని చేస్తున్నావోఁ, ఏ చెడుకి మంచి చేస్తున్నావోఁ తెలుసుకుంటే హాయి హాయి గా సాగుతుంది ఆమని.
చాటుపద్య రూపకం గురించి రాఘవ గారి అభిప్రాయం:
02/26/2009 2:51 am
ఇలాంటివి వేరే రూపకాలు కూడా ఈమాటలో ప్రచురించారా? వీలుంటే ఈ రూపకానికి అనుబంధంగా ఆ లంకెలు కూడా ఇవ్వగలరు.
నందిని గురించి మురళి గారి అభిప్రాయం:
02/07/2009 10:33 pm
‘గేటెడ్ కమ్యునిటీ’ చదివాక అక్కిరాజు భట్టిప్రోలు పేరు బాగా గుర్తు పెట్టుకున్నాను. కాని చదివిన కథలు తక్కువే..రాసినవే తక్కువని ఇప్పుడే తెలిసింది. కొత్తపాళీ గారి వల్ల ఈ కథ చదవగాలిగా. నేను ఊహించినట్టుగానే బాగుంది కథ. రాస్తూ ఉండండి..
బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
02/04/2009 10:18 am
సంపాదకులకు,
నాటకం గురించి వచ్చిన మంచి పుస్తకం జయప్రభ గారి “నాలుగో గోడ”. తెలుగు నాటకం మీద వచ్చిన మంచి పరిశోధన ఇది.. తెలుగు నాటకరంగం మీద అదివరకు ఎవరూ చేయని కొత్త చర్చలన్నీ… మొదటగా 91 ప్రాంతాల్లోనే ఈ పుస్తకం లో చోటుచేసుకున్నాయి. మరి నాటకం గురించి మాట్లాడేవారెవ్వరూ ..ఈ పుస్తకం ప్రస్తావనే చేయడం లేదు.?? తొలిగా వచ్చిన పుస్తకాన్ని గురించి పేర్కొన టం…ఒక మర్యాద కదా? మీ webzine అభిప్రాయాల్లో… ఇటువంటి వాటికి ఏమంత ప్రాముఖ్యతని ఇవ్వరు కాబోలు!.నాకు తెలిసినంతలో ఒక అంశం మీద మాట్లాడేవారు..ఆ అంశం మీద వచ్చిన ముఖ్యమైన పుస్తకం నించి..విషయాన్ని కోట్ చేయటం అన్న ది ..ఆ విషయానికి ప్రామాణికతని ఆపాదిస్తుంది. కన్యాశుల్కం గురించి చర్చించేటప్పుడు అప్పారావుగారి ప్రసక్తి తెచ్చిన ట్టుగా అన్నమాట.ఆ పుస్తకానికి ఆంధ్రదేశంలో అభిమానులు మెండు. అమెరికా తెలుగువారికి తెలియదేమో ఇంకా అని …చెప్పాలనుకున్నాను.
రమ.
ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
02/03/2009 9:20 pm
సంపాదకులకి,
మీరు, “ఒకటీ, రెండు పదాల కామెంట్లు (అద్భుతం, బాగుంది, నాకు నచ్చింది, వగైరా) ఇకముందు నుంచీ ప్రచురించబడవు. … వీటివల్ల రచయితకైనా, తోటి పాఠకులకైనా ఏ ప్రయోజనమూ లేదని మా అభిప్రాయం,” అన్నారు.
కొత్తగా రాసేవాళ్ళు తమ రచనలన మీద ఎలాంటి స్పందనా లేకపోతే అసలెవరైనా చదివారా అని మధనపడి నిరుత్సాహపడవచ్చు. “నాకు నచ్చింది” అని ఒక్కరన్నా అంటే అది కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. చెయ్యి తిరిగిన రచయితలకి ఇలాంటి వాటి అవసరం లేకపోవచ్చు కాని మిగిలినవాళ్ళలో కొందరికైనా వాటివలన కాస్త ప్రయోజనం ఉంది.
మీ పద్ధతి మార్చుకోమని కోరడం లేదు; రచయితలందరూ వీటికి అతీతులు కాదని చెప్పడానికే.
కొడవళ్ళ హనుమంతరావు
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Malika గారి అభిప్రాయం:
01/28/2009 3:47 pm
నాకు కూడా సంగీతం కాని, సాహిత్యం గురించి కాని ఎమి తెలియదు. Comment చెయడానికి అర్హత లెదు అనుకుంటాను ఎప్పుడు, కాని మీ వ్యాసం చాలా intresting గా ఉంది. త్యాగరాజు గురించి ఇంకా తెలుసుకొవాలని అనిపించెలా చెసారు.
Thanks
స్మైల్ – ఓ జ్ఞాపిక గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/27/2009 6:44 am
మోహన గారికి,
1985లో వడ్డెర చండీదాస్ “ప్రియమైన మో” అని సంబోధిస్తూ ఉత్తరం రాయడంతో వేగుంట మోహన ప్రసాద్ కేవలం ‘మో’ గా స్థిరపడిపొయ్యాడు. తెలుగు, పాశ్చాత్య సాహిత్యాలని లోతుగా అధ్యయనం చేసిన కవి. మొదటి కవితా సంపుటి, చితి-చింత, తోనే పేరు తెచ్చుకున్నాడు. ఇతర దేశాల కవులని “కరచాలనం” వ్యాసాల ద్వారా తెలుగువాళ్ళకి పరిచయం చేశాడు. ఇంకా చాలా రాశాడు. పోయిన సంచికలోనే ఆయన “నిరాకారుడు” కవితని వేలూరి చవకరకం జిన్ అండ్ టానిక్ గా అభివర్ణిస్తే నేను మంచి కవితగా సమర్థించాను.
మో కి విమర్శకులు ఎక్కువే. కాని, “ఈ కవిత్వ కషాయం వికటిస్తుంది,” అని విమర్శించినాయనే “నిరంతర ‘మో’హనరాగం” ఆలాపించే ఈ కవి మన మధ్యనే ఉన్నందుకు గర్వపడాలనడం గమనార్హం. [1]
కొడవళ్ళ హనుమంతరావు
[1] “వ్యాసాలు, ద్వేషాలు,” సౌభాగ్య. 2004.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/27/2009 6:14 am
సూర్యుడు గారికి,
మీ వ్యాఖ్య చదివి, హమ్మయ్య, ఒక్కరైనా నా వ్యాసం చదివారు, శ్రమ నిరర్థకం కాలేదు, అన్న సంతోషం కలిగింది.
వాస్తవానికి, నేనీ వ్యాసం ముగించి, గత శతాబ్దంలో గణితశాస్త్రంలో వచ్చిన మూడు విపత్తులని సగటు పాఠకునికి వివరించడంలో విఫలమయ్యాననే నాకు నేను బేరీజు వేసుకున్నాను. మరీ మిక్కిలి అమూర్త (abstract) విషయాలని వివరించడంలో కలిగే చిక్కులు నాకెక్కువే ఎదురయ్యాయి. అయినా దీని వలన కొంత మేలు జరిగిందనీ, ముందు ముందు మీలాంటి వారెవరైనా ఇంకా సరళంగా చెప్పగలరనీ ఆశ.
మీరు ప్రస్తావించిన పుస్తకం నేను చదవలేదు కాని చదవదగ్గదిలా ఉంది. అందరూ మీరిచ్చిన లింకులోని పరిచయం అన్నా చదువుతారని ఆశిస్తాను. నేనీ వ్యాసం రాసే సమయంలోనే, గణితంలో నోబెల్ బహుమతి లేదని తెలిసి ఒకరు నా ముందర విస్మయపడితే, ఆమాత్రం తెలియని ఇంజనీర్లు ఉన్నారా అనుకొని అవాక్కయ్యాను.
కొడవళ్ళ హనుమంతరావు
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/27/2009 5:42 am
అరుణ గారికి,
శిలాలోలిత పుస్తకంలో రేవతీదేవి ఇంటి పేరివ్వనందున నేనూ దానిని ప్రస్తావించలేదు. కాని మీరన్న విన్నకోట ఆవిడ పుట్టింటి పేరూ కాదు, మెట్టింటి పేరూ కాదు – పుస్తకాన్ని అంకితం చేసింది తండ్రి యన్. సి. రాజారెడ్డి గారికి; భర్త డి. రఘురామిరెడ్డి. ఈ మధ్యనే నిడదవోలు మాలతి గారు మన దృష్టికి తెచ్చిన ఒక పుస్తకం [1] లో ఆవిడని నిడుమానూరి రేవతీదేవి గా పరిచయం చేశారు.
రమ గారికి,
మీ అభిశంసనా పూరక ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. రచ్చబండలో అప్పట్లో కాస్త ఎక్కువగానే వాదోపవాదాలు చేసి ఘర్షణ పడేవాణ్ణి. వాటిల్లో ఒకదానిని, వ్యాసంగా రాసి మాకు పంపగూడదా అని వేలూరి, కొలిచాల అడిగితే హడావిడిగా పంపిన రచన ఇది. నాలాంటి పాఠకులు రాయగలరేమో కాని, సాహిత్యంలో కొంత సాధికారికతగలవాళ్ళు రాస్తేగాని ఈ కవయిత్రులకి న్యాయం జరగదు.
బంగారమ్మని ప్రస్తావించారు కనుక ఓ ముచ్చట చెప్తాను. ముద్దుకృష్ణ మూలంగా ఆవిడ పేరు తెలుసు కాని, ఈ వ్యాసం రాసేముందర నేనావిడ కవిత్వాన్ని అంతగా పట్టించుకోలేదు, వెల్చేరు గారి Hibiscus చూసింతర్వాతే నాకావిడ మీద ఆసక్తి కలిగింది. దాంట్లోనే ఉన్న My Brother మూలం వెంటనే దొరకలేదు. తర్వాత కొన్నాళ్ళకి జనవరి 2006లో శేషశాయి గారు ఆవిడ కవితా సంచికని ఆంధ్రభారతిలో పెట్టి రచ్చబండలో చెప్పారు. అందుమూలంగానే ఆవిడ కొంపెల్ల జనార్దనరావు సోదరి (అక్కో చెల్లెలో ఎందుకు చెప్పరు?!) అని తెలిసింది. అప్పుడు మా ఆవిడ నన్నడిగింది – “మరి శ్రీశ్రీ అనంతంలో ఆ విషయం చెప్పలేదా?” అని. “జనార్దనరావు జ్ఞాపకాలు” అంటూ శ్రీశ్రీ చాలానే రాశాడు కాని ఈ విషయం చెప్పిన గుర్తులేదు.
జ్ఞాపకాలంటే, ఆచంట జానకిరామ్ [2] కొంపెల్ల జనార్దనరావు స్వగ్రామం, అమలాపురం దగ్గర గంగలకుర్రు వెళ్ళి, ఆ ఊరిని వర్ణించి బంగారమ్మ కొత్తగా రాసిన “నీడ” (Hibiscus on the Lake) ఆవిడ చదివితే విని పరవశించడం గుర్తొస్తుంది. ఆవిడ జనార్దనరావుకి అక్క అన్నారు ఆచంట. My Brother కి మూలం “మా అన్న.” పేరుకి తగ్గ కవయిత్రి బంగారమ్మ.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Women Writing in India: 600 BC To the Present,” Volume II: The 20th Century. Edited by Susie Tharu and K. Lalita. Oxford India Paperbacks, 1993.
[2] ఆచంట జానకిరామ్ “సాగుతున్న యాత్ర.” దీనిని “నా స్మృతిపథంలో” తో కలిపి జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు వారు 2008లో ప్రచురించారు. పేజీలు 230-231.
రాగలహరి: మోహనం గురించి K. Rohiniprasad గారి అభిప్రాయం:
01/18/2009 10:54 am
ఈ శ్రు అనే విషయంలో చాలా ఏళ్ళ క్రితం నేను చేసిన పొరబాటును గురించి ఈమాట సంపాదకులకు ఎప్పుడో చెప్పాను కాని వారింకా నా పాత వ్యాసం శీర్షికను సరిదిద్దలేదు.
[రోహిణీ ప్రసాద్ గారు, మీ వ్యాసం శీర్షికను సరిదిద్దాము. ఈమాటలో మరికొన్ని చోట్ల ఉటంకించిన “శృతి” అన్నమాటను కూడా “శ్రుతి” గా సరి దిద్దాము. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. -సం.]
రాగలహరి: మోహనం గురించి Pavan Kumar Hari గారి అభిప్రాయం:
01/18/2009 9:39 am
లక్ష్మన్న గారూ,
కొంత మంది పండితుల అభిప్రాయసేకరణకు సమయం పట్టింది.
సంస్కృతంలో ” శృతి ” అన్న పదం అసలు లేదు. ” శ్రుతి ” యే సరియైన పదము.
“శృ” మరియు “శ్రు” – ఈ రెంటికీ ఉచ్చారణ ఒకే విధంగా ఉండదు.
ఎందుకంటే “శృ” అనే అక్షరంలో ఒక హల్లు + ఒక అచ్చు ( శ్ + ఋ ) ఉన్నాయి. ఇది ” శ ” గుణింతములో వస్తుంది.
కాని ” శ్రు ” లో రెండు హల్లులు, ఒక అచ్చు ఉన్నాయి ( శ్ + ర్ + ఉ ). ఇది సంయుక్తాక్షరము. కనుక దీని ఉచ్చారణ వేరు.
మూలమైన ధాతువు ” శ్రు – శ్రవణే ” అనేది. అందులో కేవలం వర్తమాన కాలంలో ప్రయోగింపబడే రూపములు ” శృణోతి ” మొదలైన వాటిలో మాత్రమే “శృ” అనేది కనిపిస్తుంది. ఇదొక విలక్షణమైన రూపము.
” అమరకోశం ” లో కూడా దీనిని గురించి మంచి వివరణ ఇవ్వడం జరిగినది.
కాబట్టి ” శ్రుతి ” అన్నదే సరియైనదని పండితుల అభిప్రాయము.
నేనూ సంగీతాభిమానినే. ఈ విషయం ఎందుకు వ్రాశానంటే, సంగీతశాస్త్రం గురించి వ్రాసేటప్పుడు సంస్కృత వ్యాకరణశాస్త్రం కూడా ప్రధానమైనదే కదా.. అందుకని.
అన్యథా భావించవలదని మనవి.
బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:
01/17/2009 9:23 pm
క్రితం ఏడాది అక్టోబర్ లో నాటక రంగ ప్రముఖ వ్యక్తి దుగ్గిరాల సోమేశ్వరరావు 77వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యూనివర్శిటీ ప్రాంగణంలో రావికొండల రావు స్వీయరచన దర్శకత్వంలో “బాంబు పేలింది” అని ఓ నాటకం వేస్తే నేను చూసాను. వయసు శరీరానికి కానీ మనసుకి కాదు అని నిరూపిస్తూ ఇరవై ఏళ్ళ వ్యక్తిలా ఎంతో ఉత్సాహంతో రావి కొండల రావూ, ఆయన సతీమణి రాధా కుమారీ నటించారు. ఇద్దరికీ నటనలో, ముఖ్యంగా హాస్యం పండించడంలో బ్రహ్మాండమైన టైమింగ్ వుంది. ఈ నాటకానికి పట్టుమని పది పుంజీల జనం కూడా లేరు. వచ్చిన వారిలో దాదాపు సగానికి పైగా దుగ్గిరాల వారి అభిమానంతో వచ్చిన వారే! ఇది చూసి పక్కనే ఉన్న నాటకరంగంలో మరో ప్రముఖ వ్యక్తి చాట్ల శ్రీరాములు గార్ని మొత్తం హైద్రబాదులో తెలుగు నాటకరంగానికి చెందిన కళాకారులెంత మందని అడిగితే, దాదాపు రెండు వేల పైగా ఉన్నారని చెప్పారు. అంతమంది ఉంటే అదేమిటి పట్టుమని పదిమంది కూడా లేరేమిటని అడిగితే, ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వులో నిరాశా, నిర్వేదం కనిపించాయి. ఆ ప్రాంగణంలో ఖాళీ కుర్చీల సంఖ్యే నాటక రంగంలో ఉన్న ఐకమత్యాన్ని చెప్పకనే చెప్పింది. హైద్రాబాదు నగరంలో ఉన్న రెండు వేలమంది కళాకారులూ రావాలని ఆశించక పోయినా, కనీసం అందులో పదో వంతుకూడా రాకపోవడం విచారించదగ్గ విషయం. నాటకం పూర్తయ్యాక నటీనటుల పరిచయ కార్యక్రమంలో పరిచయమక్కరలేని రావికొండల రావు గారికి ఓ నలుగురు అతి బలవంతమ్మీద తప్పట్లు కొట్టారు. ఈ తప్పట్ల శబ్దం పాత్రల సంఖ్య పెరిగే కొద్దీ క్షీణిస్తూ వచ్చింది. ఆఖరి నటుని పరిచయమొచ్చేసరికి ఒక్కటంటే ఒక్కటి వినిపించింది. అదీ ఆ సభకు విచ్చేసిన వారి గోలలో కలిసిపోయింది. ఇదీ నేటి నాటకరంగ పరిస్థితి. ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే, అసలు కమిట్మెంట్ లేనిది నాటక రంగంవారికని ఇలాంటి సంఘటనలు మరింత బలపరుస్తాయి. ఈ విషయంపై నేను స్పందించి రాసిన వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చింది. చాట్ల వారు ఓ పది కాపీలు తెలుగు యూనివర్శిటీ ధియేటర్ ఆఫ్ ఆర్ట్స్ కి పంపానని చెప్పారు. ఇలాంటిదే జి.ఎల్.ఎన్. మూర్తిగారు ఇవాళ ఆంధ్రజ్యోతి లో రాసిన “మంచి నాటకం ఎక్కడ?” వ్యాసంలో రాసారు.
కావలెను గురించి అళక్కి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
01/16/2009 1:20 am
ఎంచుకున్న వ్యాస విషయం సార్వ జనీనమయింది. ఎదురు దెబ్బల బాధని వ్యంగం జోడించి వ్యక్తీకరించడం భేషైన ప్రక్రియే! కాని ఎక్కుపెట్టిన బాణాలే కొన్ని గురి తప్పినట్టనిపించింది. వ్యాసకర్త తనని తాను నిర్వాహకుని (ఉత్తమ పురుష లోనున్న వ్యాసంలో) గా పరిచయం చేసుకుని నిర్వాహకులమీదే వేసిన విసుర్లు నన్ను విస్మయానికి లోను చేసేయి. ఇంత సమస్యకి అద్దం పట్టిన వ్యాసకర్త “నివాసి” కాదు ప్రవాసి అని నా నమ్మకం. మరిన్ని జన రంజకమైన రచనలు చేస్తారని ఆశిస్తాను.
తరవాణి కేంద్రం గురించి నెటిజన్ గారి అభిప్రాయం:
01/13/2009 7:03 am
రోజు మిగిలిన ‘రసం’ ని ఒక కుండలో మూడు, నాలుగు రోజులపాటు చేర్చి తరువాత దాన్ని అన్నంలో కలుపుకుని తమిళ బ్రాహ్మలు తింటారు అని తెలిసినప్పుడు ఒకింత ఆశ్చర్యం వేసింది.
ద్రవ పదార్ధం పేరు తెలియకుండా ఒక రోజు వారింట్లో భోజనం చేస్తున్నప్పుడు దాన్ని అస్వాదించడం జరిగిన తరువాత అది ఆ ‘రసం’ అని తెలిసినప్పుడు “నిజమా, బాగానే ఉందిగా”అని అనుకోక తప్పలేదు.
అది వారి ‘తరవాణి’ నా? ఏమో, పేరు గుర్తులేదు.
మిగిలిన అన్నాన్ని మరుసటి రోజు భిక్ష ఇవ్వడం ఒక పద్దతి. కాని ఆ మిగిలిన అన్నాన్ని ఎండ బెట్టి, వేయించి, దానికి కొంచెం ఉప్పు కారం జల్లి తింటే రుచిగా ఉంటుందన్నది తెలంగాణ వెళ్ళినప్పుడు తెలిసింది.
బహుశ అదేనేమో cultural preservation లేదా cultural evolution అంటే!
జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/13/2009 3:13 am
రమగారికి రవిగారికి ధన్యవాదాలు.
రమగారు,
మీరు చెప్పిన “ముక్తాఫల” వ్యాఖ్యలో కొన్ని భాగాలు Digital Libraryలో ఉన్నాయి చూసాను. కాని కొన్ని చోట్ల తప్పులున్నాయి. అంచేత అది ఎంతవరకూ సాధికారికమైనదో తెలీదు. మీరన్న జయప్రభగారి కవిత నేను చదవలేదు. ఆ పుస్తకాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాను.
రవిగారు,
మీరన్న ఆ రెండు పద్యాలు ఇవి:
సోమనది:
అరిజూచున్ హరిజూచు జూచుకములందందంద మందార కే
సరమాలా మకరంద బిందు సలిలస్యందంబులందంబులై
తొరుగం, బయ్యెదకొం గొకింత దొలగన్ దోడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్
పోతనది:
పరుజూచున్ వరుజూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్ గన్నుల గెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచున్ జంద్రాస్య హేలాగతిన్
ఏది ఎక్కువ భావస్ఫోరకమూ అని చెప్పడం కష్టం (అనవసరం కూడా). దేని ప్రత్యేకత దానికుంది. సోమన పద్యంలోని ప్రత్యేకతంతా “చూచుకములందు మందార కేసరమాలా మకరందపు నీటి బొట్లు స్రవించడం”లో ఉంది. దాన్ని చిత్రించడంలో సోమన ఉద్దేశం ఏమిటన్నది పాఠకులెవరికి వారు ఊహించుకోవలసిందే.
పోతన పద్యం చిత్రాన్ని స్పష్టంగా రూపుకడుతుంది. రోషము – రాగోదయమూ, అవిరత భ్రూకుటి – మందహాసము, కెంపు – సొంపు ఇలా వీర శృంగార రసాలు స్పష్టమైన జంటగా కనిపిస్తాయి. పైగా వాచ్యంగా కూడా కనిపిస్తాయి. సోమన పద్యంలో అది లీలగా మాత్రమే గోచరిస్తుంది. “సరసాలోక సమూహము” కన్నా “దరహాసామృతపూరము” నాకు అందంగా అనిపించింది. సోమన సత్యభామ పయ్యెదని ఒకింత తొలగించాడు, పోతన ఆ పని చెయ్యలేదు. ఈ ఒకింత తొలగిన పయ్యెదని కృష్ణుడా తర్వాత సరిజేస్తాడు. ఆ పద్యం వ్యాసంలో పేర్కొన్నాను. వ్యాసంలో చెప్పినట్టుగా, సోమన ఈ ఘట్టంలో శృంగార రసాన్నే ఎక్కువగా ధ్వనించాడు అని నాకనిపిస్తుంది. పోతన రెంటినీ సమానంగా పోషించాడు.
సత్యభామ యుద్ధానికి లేచి నిలుచున్న తీరుని వర్ణించిన యీ పోతన పద్యం చక్కని చలనచిత్రాన్ని మన కళ్ళకి కట్టిస్తుంది.
వేణిం జొల్లెము వెట్టి, సంఘటిత నీవీబంధయై, భూషణ
శ్రేణిం దాల్చి, ముఖేందుమండల మరీచీజాలముల్ పర్వగా,
బాణిం బయ్యెద జక్కగా దుఱిమి, శుంభద్వీర సంరంభ యై
యేణీలోచన లేచి నిల్చె దన ప్రాణేశాగ్ర భాగంబునన్
పోతన భాగవతంలో సత్యభామ కృష్ణుని యుద్ధానికి తీసుకువెళ్ళమని మురిపెంగా అడుగుతుంది. కృష్ణుడు ముందు వారించినా చివరికి తన మాట చెల్లించుకుంటుంది. అది యీ కథలో పోతన ప్రవేశపెట్టిన అందం.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/08/2009 11:24 am
To be fair to literary enthusiasts, సంగీతాభిమానులు కొందరికి నా వ్యాసాల గురించి చెప్పాను కాని వాటిలో వారికి ఎక్కువ ఆసక్తి కలిగినట్టుగా అనిపించలేదు. ‘వినేవాళ్ళూ చదవరు, చదివేవాళ్ళు వినరు’ అనుకోవాలేమో. వెబ్ పత్రికలో రెండు పనులూ ఒకేసారి చెయ్యవచ్చు కనక వీలున్నప్పుడల్లా నాకు audio links ఇవ్వబుద్ధి అవుతుంది.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/07/2009 8:30 pm
రోహిణీ ప్రసాద్!
సంగీత జ్ఞానము, భక్తి -రెండూ లేని పాఠకులము కొందరము ఉంటాం కదా! :)మీకు ఐతే రెంటిలో ఒకటైనా మస్తుగా ఉంది. కాని మీరు పాఠకులు కారయ్యే! మా బోంట్లకు – అంటే సైన్సు, ఆర్ట్సు అసలు ఏవీ రాని, మామూలు పాఠకులకు- అందునా ఆడవాళ్ళకు, అర్థమయ్యేట్లు తేలిక మాటల్లో వ్యాసాలు రాసి, చదువు చెప్పి, సన్మార్గంలో పెట్టే రచయితలు మాత్రమే మీరు.
దుడుకు గల లైలాను ఏ దొర బ్రోచురా – అని నవ్వుకుని ‘వీణ తీగల గురించిన చర్చ’ ఎటువంటిదో చెప్పగలరు. నాకు ఏమీ అర్థం కాలేదు.
పోనీ త్యాగరాజు సంగీతములో ఎందుకు అద్వితీయుడో , ఈ ఒక్కసారికి పాఠకుడి స్థానానికి దిగజారి మీరే స్వయంగా ఒక్క కామెంటైనా చెయ్యరాదూ.
అందరు మహామహోపాధ్యాయులూ – ఎవరికి వారే -ఇతరులకు ఉపయోగించే విషయాలు పరాపరా రాసేస్తూ, బిజీగా ఉండి, వేరేవారి రచనలు, పుస్తకాలు చదవ(లే)క పోయినా, అలాటి పరోపకార బుద్ధి ఏ మాత్రం లేని నేను చదువుకుంటాను. తెలియని విషయాలు కొంచెమైనా తెలుసుకుని ఆనందిస్తాను. కోరిక మన్నించి రాస్తారుగా.
మీరు రాసే లోపు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ సాధన చేస్తూ ఉంటాను. ఎంత గింజుకున్నా రాదనుకోండి.:) ఐతే ఏం.
లైలా.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/07/2009 2:45 pm
పాఠకుల సాహిత్యాభిమానం ఎక్కువ కావడం వల్లనో, సంగీతాభిమానం తక్కువ కావడం వల్లనో తెలియదు కాని, త్యాగరాజు సృష్టించిన అద్వితీయమైన సంగీతం గురించి మటుకు ఒక్క కామెంటు కూడా కనబడటం లేదు! వీణ తీగల గురించిన చర్చ కూడా అటువంటిదే.
స్నేహితుడు, విమర్శకుడూ గురించి baabjeelu గారి అభిప్రాయం:
01/07/2009 9:45 am
నిన్ననే వల్లంపాటి వారు రాసిన “విమర్శా శిల్పం” కొన్నాను. చాలా బావుందనుకున్నాను పేజీలు తిరగెయ్యగానే. జీవితం, సాహిత్యం & సాహితీ విమర్శ మొదట్లో సమబాహు త్రిభుజం అనీ, తరవాత కాదనీ మొదటి పేజీ లోనే ఆయన రాయడం (మొదట రాసిన వ్యాసానికీ, ఈ పుస్తకానికీ “ఇంప్రూవ్ మెంట్”) ముచ్చటేసింది. ఈయనెక్కడ దొరుకుతారో, కలిసి బోల్డన్ని అడగాలనుకున్నాను. “యాదృచ్చికంగా” ఈ వ్యాసం చూసేను. అయ్యో రాతా అనిపించింది.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి mOhana గారి అభిప్రాయం:
01/05/2009 10:03 am
నేను ఇంకా వ్యాసాన్ని సంపూర్ణముగా చదవలేదు. కాని ఈ వట్టి – పట్టి గురించి ఒక రెండు మాటలు. పట్టి తమిళ పదము మాత్రమే కాదు, తెలుగు పదం కూడా, పట్టి అంటే బిడ్డ అని అర్థము. పట్టి గొడ్డు అంటే చిన్న గొడ్డు అని కూడా అనుకోవచ్చు. ప అక్షరానికి వ అక్షరానికి యతి చెల్లుతుంది ఎప్పుడూ! త్యాగరాజు మంచి తెలుగు కవి కూడా, యక్షగానాలను రాశారు. పద్యాలను ఎన్నో రాశారు. ఇక పోతే ప అక్షరానికి వ అక్షరానికి తెలుగు వ్రాతలో సరిగా కొమ్మును కలపక పోతే సందేహం కలగవచ్చు. కానీ తమిళంలో వ-కారానికి, ప-కారానికి ఇలాటి సందేహం లేదు. త్యాగరాజుగారి శిష్యులు కీర్తనలను ఏ భాషలో రాసుకొన్నారో అనే విషయం నాకు తెలీదు.
విధేయుడు – మోహన
‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి mOhana గారి అభిప్రాయం:
01/05/2009 5:56 am
మళ్ళీ ఈ చిత్రాన్ని చూడడానికి ఈ మంచి వ్యాసం ఒక
అవకాశం కలిగించింది. చిత్రంలో ఎక్కడా హరిహర్
పేరు వినబడలేదు. కాని Satyajit Ray – The Inner Eye
పుస్తకంలో అపూ ట్రిలజీ ప్రకరణంలో, అందులో ఇచ్చిన
ఛాయాచిత్రాలలో హరిహర్ అనే రాయబడింది, హరిహరన్
అని కాదు. విధేయుడు – మోహన
పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/02/2009 4:52 am
>>ఇప్పుడు గ్రంధాల్లో వున్న భాష గ్రాంధిక భాషా? ఇవి గ్రంధాలు కావా? గ్రాంధిక భాష కాలమహిమవల్ల ఎలా మారిపోతుంది?
“గ్రంధాలలో ఉండేది గ్రాంధికభాష” అన్న నిర్వచనం తీసుకుంటే ఇప్పుడు గ్రంధాలలో వాడే భాషకూడా గ్రాంధికభాషే అవుతుంది. అందులో సందేహం ఏవుంది? కానీ నేను నా వ్యాసంలో ఉద్దేశించింది అది కాదు. అందుకే ఆ పదాన్ని ఏ ఉద్దేశంలో వాడేనో వ్యాసంలోనే పేర్కొన్నాను.
>>తెలుగు గ్రాంధిక భాష ఎలా పుట్టింది? ఆ మాటకొస్తే ఏ భాషలోనైనా గ్రాంధిక భాష గ్రాంధిక భాష ఎలా తయారవుతుంది? ఎవరూ “వాడని” భాషని ఎవరైనా ఎలా తయారుచెయ్యగలరు?
నాకు భాషాశాస్త్రంతో పెద్దగా పరిచయం లేదు కాని, నాకు తెలిసినంతవరకూ తెలుగులో గ్రాంధిక భాష సంస్కృత భాషా సాహిత్య ప్రభావంతో రూపొందిందని అనుకోవచ్చు. ఇది నన్నయ్యో మరే ఒక్కరో కూర్చుని చేసిన పని అనుకోవడం సరికాదు. నన్నయ్యకి ముందున్న తెలుగుశాసనాలలోనూ, కన్నడ సాహిత్యంలోనూ కూడా ఈ భాష కనిపిస్తుంది. ఎలా అయితే వ్యవహారంలోని భాషని ఒకరు సృష్టించరో, అలానే గ్రాంధికభాషాను. ఎలా అయితే వాడుకభాష మారుతూ వస్తుందో అలానే గ్రాంధిక భాష (అంటే గ్రంధాలలో వాడే భాష) కూడా మార్పుచెందుతూనే ఉంటుంది. గ్రాంధిక వాడుక భాషలు ఒకదాన్ని మరొకటి ప్రభావితం కూడా చేసుకుంటూ ఉంటాయి. పూర్వం సాహిత్యమూ, గ్రందాలూ కొన్ని వర్గాలకి పరిమితమవ్వడం వల్ల వాళ్ళకి నచ్చిన, వాళ్ళు వాడడానికి ఇష్టపడిన భాషలో గ్రంధాలు వెలువడ్డాయి. నిత్య వ్యవహారంలో భాషకీ ఆ భాషకీ కొంత స్పష్టమైన భేదం కనిపించేది. ఇప్పుడు మారిన పరిస్థితులలో సాహిత్యం, గ్రంధరచన అన్ని వర్గాల ప్రజలూ చేస్తునారు కాబట్టి, దానికి ఇంతకు ముందున్నంత నిర్దిష్టమైన రూపం లేదు. వ్యవహార గ్రాంధిక భాషల మధ్య తేడా ఇంచుమించు చెరిగిపోయింది.
>>కాలమహిమవల్ల మారిపోయే గ్రాంధిక భాషకి ఈ ధూపదీపనైవేద్యాలెందుకు?
తమకి ఇష్టదైవానికి పూజ చేసుకొనే హక్కు ఈ సెక్యులర్ దేశంలో ప్రతివాడికీ ఉందికదండీ 🙂 నాస్తికుల చెవి మెలిపెట్టి మీరుకూడా పూజ చెయ్యాల్సిందే అనే హక్కు ఆస్తికులకి లేదు. అలానే ఆస్తికులని పూజలు మానుకోండనే హక్కు నాస్తికులకీ లేదు, ఏవంటారు? ఇంతకీ నా వ్యాసంలో నేనెలాంటి పూజా కార్యక్రమమూ పెట్టలేదే!
>>అందులో పచనం కాని పద్యాలైనా, వచనాలైనా పట్టించుకోడం ఎందుకు?
పైన నేను చెప్పినట్టు, ప్రస్తుతం గ్రంధాలలో వాడే భాషకి ఒక నిర్దిష్ట రూపం అంటూ నాకు తెలిసి ఏవీ లేదు. ప్రాచీన కావ్యభాష కావచ్చు, అందరికీ అర్థమయ్యే సామాన్య వాడుకభాష కావచ్చు, ప్రాంతీయ/మాండలిక భాష కావచ్చు, జానపదభాష కావచ్చు ఇలా ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళా భాషలో రాస్తున్నారు. దాన్ని ఇష్టపడే వాళ్ళు చదువుతున్నారు. ఒకో రకమైన భాషలో ఒకో అందం ఉంది, ఒకో శక్తి ఉంది. కాబట్టి ప్రాచీన కావ్యభాష ఇష్టమైన వాళ్ళు, దాని శక్తి తెలిసినవాళ్ళు ఆ భాషలో సాహిత్యం వెలువరించడంలో తప్పేముంది? దాన్నిష్టపడి చదివే వర్గమే దాన్ని పట్టించుకుంటుంది. అలాటి వర్గం అంతరించిననాడు అది సహజ మరణం పొందుతుంది. అది సమాజానికి హాని చెయ్యనంత కాలం దాన్ని బతికించుకోవాలనుకోవడంలో తప్పులేదు, హత్య చెయ్యాలనుకోవడం అన్యాయం.
>>మీరేమో వాడుక భాషలో ఉత్పలమాల, చంపకమాల, పులులూ, ఏనుగులూ కుదరవంటారు. అవును కాబోలు అనుకునే లోపునే, మరో గురు తుల్యులు, కృష్ణమోహన్ గారు వాడుక భాషలో పద్యాలు అంటారు. ఏం దారి?
మేవిద్దరం రెండు కోణాలని చూపించే ప్రయత్నం చేసేమనే నేననుకుంటున్నాను కాని తగువులాడుకోటం లేదు. మీరు మా మధ్య లేని తగువుని సృష్టించకండి 🙂 పద్యాలలో వాడుకబాష వాడకంలోని పరిమితులని నేను విశ్లేషించేను. అంతేకాని వాడుకభాషలో పద్యాలు రాయలేమని కాని, రాయకూడదని కానీ నేననలేదు. పద్యాలలో వాడుక భాషని ఎలా వాడవచ్చో కూడా నేను నా వ్యాసంలో ప్రస్తావించాను. అలానే వాడుకభాషలో పద్యాలు ఎలా రాయవచ్చో మోహనగారు మరో రకంగా వివరించారు.
పద్యాలు – వాడుకభాష గురించి baabjeelu గారి అభిప్రాయం:
12/31/2008 8:54 am
కావేఁశ్వరరావు గారికి,
తెలుగు గ్రాంధిక భాష ఎలా పుట్టింది? ఆ మాటకొస్తే ఏ భాషలోనైనా గ్రాంధిక భాష గ్రాంధిక భాష ఎలా తయారవుతుంది? ఎవరూ “వాడని” భాషని ఎవరైనా ఎలా తయారుచెయ్యగలరు?
నన్నెచోడుడో, నన్నయో ఆదికవి ఎవరెనే గొడవ వద్దు (ప్రాచీన/క్లాసికల్ భాష స్థాయి తెలుగుకి వచ్చీసింది కాబట్టి) వీళ్ళైనా గ్రాంధిక భాషని ఎలా తయారుచేశేరు? అసలు గ్రాంధికాన్ని ఎందుకు తయారు చెయ్యవలసి వచ్చింది?
ఇప్పుడు గ్రంధాల్లో వున్న భాష గ్రాంధిక భాషా? ఇవి గ్రంధాలు కావా? గ్రాంధిక భాష కాలమహిమవల్ల ఎలా మారిపోతుంది? కాలమహిమవల్ల మారిపోయే గ్రాంధిక భాషకి ఈ ధూపదీపనైవేద్యాలెందుకు? అందులో పచనం కాని పద్యాలైనా, వచనాలైనా పట్టించుకోడం ఎందుకు? వ్యాకరణం భాషని శాసించదు, “రికార్డ్” చేస్తుంది. కాదా? రేపు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ “అమ్మ వొచ్చేడు, నాన్న వొచ్చింది” అని వాడితే భాషా శాస్త్రవేత్తలు/వ్యాకరణ పండితులు – ఆ పుంజీడు మందీ – అదే “రికార్డ్” చేస్తారు తప్ప ఇంకేం చేస్తారు?
ఇన్ని “కొశ్చిన్ మార్కులా?” అని అనుకోవచ్చు. అవును “ప్రశ్నార్ధకాలే?”
“తెవికీ” సభ్యులకి: అయ్యలారా! అమ్మలారా! తెవికీ అంటే తెలీదు నాకు. కానీ ఇదేదో తెలుగు భాషనుధ్ధరించడానికి చేసే పనని అనిపిస్తోంది. అయితే ఈ విషయంలో తెలుగు భాషా శాస్త్రవేత్తల్నీ, తెలుగు భాషా పండితుల్నీ సంప్రదించకండి. తెలుగు మాట్లాడే ప్రజల్ని సంప్రదించండి. మీ శ్రమకి ఫలితం, మీ శ్రమకి కృతజ్నత, మీ శ్రమకి తెలుగు ప్రజల జేజేలు అందుకోవచ్చు. మీకవక్కర్లేదని అందరికీ తెలుసు. అయినా సరే.
కావేఁశ్వరరావు గారికి: మీరేమో వాడుక భాషలో ఉత్పలమాల, చంపకమాల, పులులూ, ఏనుగులూ కుదరవంటారు. మీరు గురు తుల్యులు. అవును కాబోలు అనుకునే లోపునే, మరో గురు తుల్యులు, కృష్ణమోహన్ గారు వాడుక భాషలో పద్యాలు అంటారు. ఏం దారి?
అందరికీ “అమ్మ(భాష)” రాణెమ్మలా బతకాలనే దుగ్ధ. అయితే అది సమకూర్చడానికి పిల్లలు తగవులాడుకున్నట్టు లేదూ ఇదంతా?
చందోబధ్ధమైన పద్యము వ్రాయగల్గిన కుర్రాళ్ళూ, నియమాలేవీఁ లేని శ్రీశ్రీ “తిలకా”లూ, ఆయమ్మకి మనకాడ పూసిన పూలనే “ఒట్టుకెళ్ళిచ్చి, ఇయెట్టుకో కొప్పులో, ఎంత బాగుంటావో తెల్చా” అనే చాత్రిబాబులూ, అన్నీ తెలిసిన రవఁణలూ, ఏవీఁ తెలీని నామినులూ, తెలిసీ తెలీనట్టుండే శ్రీశ్రీరవఁణలూ, అన్నీ తెలుసు మాకన్నీ తెలుసు అని “రికార్డింగ్ డేంచు కట్టే” నాలాటి వాళ్ళూ వీళ్ళందర్నీ “బజ్జో, మళ్ళీ పొద్దున్నే లెగాల” అని దెబ్బలాడతాదాయమ్మ్మ. కాదా?
స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి rama గారి అభిప్రాయం:
12/30/2008 10:30 pm
తప్పకుండా హనుమంతరావు గారూ !
smile “గౌరవ సంపాదకత్వం” వహించిన “వతన్” ముస్లిం కథలు…అలాగే “అజాఁ” అన్న గుజరాత్_ముస్లిం కవిత్వం కి 23/9/2002 న,రాజమండ్రి నించి స్మయిల్ రాసిన ముందుమాట చదవండి.
“వీళ్ళేం ‘దండోరా’ లు వేయించుకుంటారు. వీళ్ళేం వీధుల్లోకి వచ్చి ఊరేగింపులు జరుపుతారు అంటూ, … బ్రాహ్మణుల మీద…వాళ్ళని soft target చేయడం చాలా తేలిక అన్న సానుభూతితో మాట్లాడిన smile ‘వతన్’కి ఖాజా రాసిన దాన్ని (ఆ పుస్తకానికి “గౌరవసంపాదకుని”గా ఖాజా రాతల్లోని) బ్రాహ్మణ నిందని ఒప్పుకోవడంతో పాటు, తానుగా ‘కౌన్ సునే ఫర్యాద్? కౌన్ కరే ఇన్సాఫ్?’ అని రాసిన దాన్లో అయితే ఖాజాని మించి ‘అగ్రవర్ణాల’పై కోపం చూపించే దిశగా కదలడాన్ని గమనించవచ్చు.
Gujarat riots గానీ …మొన్న తాజ్..నారిమన్ హౌస్ ల మీద ముస్లిం terrorists దాడి గాని ఎవరూ మెచ్చగలిగినవి కాకపోయినా, గుజ్రాత్ హింస మీద అచ్చులో వచ్చినన్ని పుస్తకాలు terrorists హింసని వ్యతిరేకిస్తూ ఒక్క పుస్తకమూ కనీసం తెలుగులో వీళ్ళెవ్వరూ ప్రచురించకపోవడం కూడా మనం గమనించవలసిన విషయాలే !!
రమ.
మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
12/26/2008 1:46 pm
వీణకు ఎలెక్ట్రికల్ పికప్ ఉపయోగించడం అనేది ఈమనివారికన్నా చిట్టిబాబు ముందుగా మొదలుపెట్టారని ఎవరో అన్నారు. దాని సహాయంతో అతిసున్నితమైన గమకాలను శాస్త్రిగారు అద్భుతంగా వాయించేవారు. కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది. ఆయన బొటనవేలితో మూడో తీగను మీటితే సుర్ బహార్, గోటువాద్యం తరహాలో పలికేది.
తన సంగీతాన్ని గురించి ఆయన స్వోత్కర్ష ధోరణిలో ‘మనదంతా చిన్నప్పటినించీ రిసెర్చ్ ధోరణే’ అని ఒకసారి అన్నారు కాని అదేమీ అతిశయోక్తిగా, అతిశయంగా అనిపించలేదు. కచేరీకి ముందు ఆయన బాగా సాధన చేసేవారనీ, ఆయన కచేరీకై ప్రేక్షకులు ముందుగానే వచ్చి కూచునేవారనీ తెలుసుకోవడం సంతోషకరం.
నాకు సరస్వతీదేవిలోనూ, నారదుళ్ళోనూ నమ్మకం ఏమీలేదుగాని ఉంటేగింటే వాళ్ళు శాస్త్రిగారి కన్నా బాగా వీణ వాయించారని మాత్రం నేను నమ్మను!
మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
12/23/2008 7:47 pm
నేను పెద్దయేటప్పటికి శాస్త్రిగారు మద్రాసు వదిలివెళ్ళారు. 1966లో మేము సకుటుంబంగా ఢిల్లీలో ఆయనింటికి వెళ్ళాము. ఆ తరవాత శాస్త్రిగారిని నేను కలుసుకోవడం, మాట్లాడడం కొన్ని సందర్భాల్లో జరిగింది. ఆయన కాస్త అమాయకుడు. ఆయన సంగీతపు మహోన్నత వ్యక్తిత్వంతో పోలిస్తే అటువంటి చిన్న విషయాలను పేర్కొనడం అన్యాయం అనిపించడం వల్ల నేను వాటిని ప్రస్తావించలేదు. ఆయన వీణ ఎప్పుడు విన్నా నా అభిమాన వాయిద్యం సితార్ కన్నా వీణ కాస్త గొప్పదని ఆయన ‘నిరూపించాడని’ నా కనిపిస్తుంది. (అయిష్టంగానైనా నేనా సంగతి ఒప్పుకోవాలి). నా లెక్కన ఆయన Vilayat Khan of Veena.
జెమినీ చిత్రం అవ్వయార్ లో ఆయన సుందరాంబాళ్ చేత మంచి సంగీతం పాడించాడని విన్నాను కాని ఆ సినిమా పూర్తిగా చూడలేదు.
ఆయన కచేరీలు చాలాసార్లు విన్నాను. కర్నాటక సంగీతంలోని సంప్రదాయపు ‘పట్టు’లోని అందాలు ఆయన చూపినట్టుగా మరెవ్వరూ చూపించలేదని నేననుకుంటాను.
పురూరవ: శ్రవ్య నాటిక గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
12/19/2008 9:29 am
సేకరణ అద్భుతం. ధ్వని కూడా బహు నాణ్యంగా వుంది. రచన పూర్తి పాఠం విడిగా ఇవ్వడం చాలా బాగుంది.
అప్పట్లో రేడియో నాటకాలు ఆదివారం మధ్యాహ్నం రెండూ మూడూ మధ్య వచ్చేవి. అన్ని కేంద్రాల్లోనూ (హైదరా, విజయ,, విశాఖ, కడప) ఒకేసారి ప్రసారమయ్యేవి. ఏ కేంద్రం వారు నిర్మిస్తే వారి పేరు ముందొస్తుంది. సినిమాకి ముందు పేర్లేసినట్టు, రేడియో నాటకానికి ముందు పేర్లు చదివేవారు. ” ఇందలి పాత్రలూ, పాత్రధారులూ… ” అంటూ “శబ్ద” దానం చేసిన వారి పేర్లూ, అటు వెంబడి “నిశ్శబ్దంగా” వెనుక పనిచేసిన వారి పేర్లూ చదివేవారు. వాటిలో ఎక్కువగా వినిపించి నాకు జ్ఞాపకమున్న పేర్లు – శారదా శ్రీనివాసన్ (పాత్రధారి), వాడ్రేవు పురుషోత్తం (నిర్వాహకులు).
శ్రోతల ఆదరణ పొందిన మరో నాటకం “దీక్షాంతం”. ఇందులోనూ ఊర్వశి పాత్ర వుంటుంది. ఎవరి గొంతో జ్ఞాపకం లేక పోయినప్పటికీ, నిర్వాహకులు మాత్రం శ్రీ వాడ్రేవు పురుషోత్తం.
మీ కృషి శ్లాఘనీయం. మరిన్ని అజరామరమైన రేడియో నాటకాలని వినిపిస్తారని ఆశిస్తాను.
తెలుగు భాష వయస్సెంత? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
12/18/2008 8:08 am
చాల బాగుంది. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ లో తెలుగు బోధించే ప్రయత్నాలు చేస్తూన్నప్పుడు (ఇంకా ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి) మమ్ము తరచుగా ఎదుర్కున్న ప్రశ్న “మనం తెలుగు భాషని ఎందుకు నేర్చుకోవాలి?” అన్నది. మొదట్లో విరాళం ఇవ్వకుండా తప్పించుకుందికి ఈ ఎదురు ప్రశ్న వేస్తున్నారనుకున్నాను. కాని ఈ వ్యాసం సందర్భంలో రమేష్ బాబు కూడ ఈ ప్రశ్న అడిగేరు కనుక దీనికి సాలోచనగా సమాధానం చెప్ప వలసిన అవసరం ఉన్నట్లనిపిస్తున్నాది. సురేశ్ కి ఈ సామర్ధ్యం ఉంది కనుక నేనూ అడుగుతున్నాను. తెలుగుదేశంలో ఉన్న తెలుగువారు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? ప్రవాసాంధ్రులు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? అన్న ప్రశ్నలని కూలంకషంగా ఎవ్వరయినా చర్చించండి. నేను నా బ్లాగులో ప్రయత్నించేను కాని బాగా రాలేదు.
రావు వేమూరి
http://latebloomer-usa.blogspot.com/
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి lyla yerneni గారి అభిప్రాయం:
12/17/2008 10:35 am
బృందావన రావుగారి పద్య పరిచయం జనవరి సంచికలో ఉంటుందని, కొత్త సంవత్సరం కోసం సంబరంగా ఎదురుచూస్తున్నాను.
ఈ పద్య వివరణా వ్యాసం, వారిచ్చిన సమాధానాలు, మరోసారి చదువుకుని రాస్తున్నాను.
నా దగ్గర నన్నెచోడుని తెలుగు పుస్తకం లేదు. కాని కోలాచల మల్లినాథ సూరి తెలుగు టీకా తాత్పర్యంతో -కాళిదాసు కుమార సంభవం ఉంది.
ప్రధమ సర్గలో పార్వతిని పాదాల దగ్గరనుండి తలవరకు వర్ణించారు కాళిదాస కవి. దేవతలను కిందినుండి పైకి, మానవులను పైనుండి కిందకు వర్ణించడం ఆచారమట. ఆ వర్ణన ” మధ్యేన సావేదివిలగ్నమధ్యా వళి త్రయంచారు బభార బాలా..” నుండి -త్రివళులంటే నడుము మీద ఉండే మూడు మడతలని తెలిసింది. అవి నాభికి పైభాగంలో ఉంటాయనీ నాకు తెలిసింది. ( ఎందుకంటే అంతకు ముందు పద్యంలో అప్పటికి నాభి వరకూ వర్ణన ఐపోయింది కాబట్టి. అప్పుడే పార్వతి నతనాభి అని కూడా తెలిసింది. “తస్యా ప్రవిష్టా నతనాభి రంధ్రంరరాజ తన్వీ…” )
తర్వాత పంచమ స్సర్గములో పార్వతి తపస్సు ఘట్టములో కాళిదాసు శ్లోకానికీ, మీరిచ్చిన నన్నెచోడుని పద్యమునకూ గల పొలికలు చూచాను. తేడా అల్లా కాళిదాసువి గ్రీష్మం తర్వాతి తొలి నీటి చుక్కలు. నన్నెచోడునవి నవాంబు ధారలు. కాబట్టి ఇంకా వేగంతో ప్రవహించాయి. (ఐనా కాళిదాసు ముందరి పద్యము లోనే పార్వతి అప్పటిదాకా చెట్లలాగానే వర్షపు నీరుతో మాత్రమే బ్రతికిందంటారు. మళ్ళీ అంతలోనే మరిచి, గ్రీష్మం వెళ్ళిపోయి మొదటి వానకు తడిసి పార్వతి శరీరంలోచి, భూమి లోంచి సెగలుపైకి లేచాయని రాశారు. 🙂 ఆ తర్వాత పద్యమే ఆ వాన పార్వతి మీదుగా ఎలా జారిందొ చెప్పే పద్యం. ) పద్యములు అతి చక్కనివి. కవులు బాగా రాశారు.
కానీ వాన ( ప్రకృతి )సామాన్య విషయమూ, కవులది సుందర కళాసృష్టి అనుకోటానికి నా మనసొప్పదు. కవులు తలకిందులుగా తపస్సు చేసినా భగవంతుని సృష్టిని మేచ్ చెయ్యలేరు. ఒక సౌందర్యవతిని, ఆమె చిత్రాన్నీ చూసి ” జో బాత్ తుఝ్ మే హై, ఒ తేరీ తస్ వీర్ మే నహీ ” అన్న కవిరాజుకి నా నమస్కారము. పకృతి అందాన్ని, ప్రకృతిలో మానవ సౌందర్యాన్ని, చూసి ముందస్తుగా పరవశించని హృదయం, కవి రాసే మాటలకు ఉబ్బిపోటం ఉత్తిమాట. అసలు సౌందర్య స్పృహ, సౌందర్య కాంక్ష లేనివాడు కవే కాడు.
ఒక కవి నుంచి ఇంకొక కవి సంగ్రహించటం, ఒకరిని ఇంకొకరు అనువదించటం , అనుకరించటం -విద్యాభిలాషతో, కళపై కాంక్షతో, చేసే పనులు. కళాకారుడు అనుకరించడం మానడు. మానలేడు. అలా చెయ్యటం అవసరము. ముందు అనుసరించినా, కొన్నాళ్ళ తర్వాత కొత్త కళా స్రష్ట అవుతాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు నాకు నచ్చాయి. ఒకరి చక్కని భావాన్ని ఇంకో భాషలో, ఇంకో సమయంలో, -తన ఆనందం కోసం, పలువురి ఆనందం కోసం- కవి వాడటం, మీరన్నట్లు కవి పాండిత్యాన్నీ, రసికతను, చెపుతుంది. పాఠకులు కూడా ఎంత ఎక్కువగా చదివి ఉన్నవారైతే, ఏ రచనలోనైనా, అన్ని ఎక్కువ మూలాలు గుర్తించగలుగుతారు.
లైలా
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి బృందావన రావు గారి అభిప్రాయం:
12/16/2008 4:11 pm
(ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి).
లైలా గారూ:
1. పద్యం లోంచి శ్లేషను మనం లాగవచ్చు. కానీ కవి ఉద్దేశించి వున్నట్లు అనిపించదు. (మాధవ్ అన్నట్లు ఈ ఊహ కవిదో మనదో చెప్పడం కష్టం).
2. కుమార సంభవం సర్వస్వతంత్ర కావ్యం. అనువాదం కాదు. ఎంత స్వతంత్ర కావ్యమైనా, కవి అదే విషయం మీద అంతకుముందే వెలువడిన ఒక ప్రసిద్ధ మహాకవి కావ్యాన్ని చూడకుండా ఎలా ప్రారంభిస్తాడు? అందులో కన్పించిన అందమైన ఊహలను ఎలా వదిలి వేయగలడు? పై పద్యం మాత్రం కాళిదాసు శ్లోకానికి ఖచ్చితమైన అనువాదమే. ఒక మంచి భావాన్ని వదిలివేయలేని రసికతగా దీన్ని భావించవచ్చు.
కామేశ్వర రావు గారూ:
పద్యాన్ని విశ్లేషించేటప్పుడు తెలుగు పద్యాన్నే పరామర్శించాను కానీ దానికి మూలమైన సంస్కృత శ్లోకం నా దృష్టిలో లేదు. ఐనా, తరంగ అంటే వళి అనే అర్ధం నాకు కన్పించలేదు. అందుకని ముత్తరంగలు అంటే మూడు ధారలనే ఉద్దేశించాను. అలాగే, ‘మడుగులు వారి’ అనే పదానికి గూడా ముడుతలు పడి అనేదానికన్నా హ్రదాలై ప్రవహించి అనే అర్ధమే న్యాయంగా వుంటుందనుకుంటాను. కానీ, సంస్కృత శ్లోకం చూసింతర్వాత – నన్నెచోడుడు కూడా త్రివళులనే ఉపలక్షించి వుంటాడని అనిపిస్తున్నది. మీకు కృతజ్ఞతలు.
స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
12/09/2008 10:43 pm
ఖాళీ సీసాల స్మైల్
స్మైల్ చనిపోయారంటే, చాలా కాలం తర్వాత మళ్ళీ “ఖాళీ సీసాలు” చదివాను. అది స్మైల్ రాయడం మొదలెట్టిన ఒకటి రెండేళ్ల లోపునే, 1965లో రాసిన కథ. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా, సాహిత్య అకాడెమీ (వాకాటి, వేదగిరి) కూర్చిన “బంగారు కథలు” లో పొందుపరచిన కథ. బెడ్ టైమ్ రీడింగ్ కి పనికిరాని కథ!
స్మైల్ కవిత్వం ఏమీ నేను చదవలేదు కాని, ఆ కథ ముగింపు:
చదివిన వెంటనే రెండేళ్ళ క్రితం ఓ సైన్సు వ్యాసంలో చూసిన ఒమర్ ఖయ్యాం కవిత గుర్తొచ్చింది:
2006లో ఇండియా వెళ్ళినప్పుడు, అప్పుడే మో, స్మైల్ ఇరువురి సంపాదకత్వాన వెలువడిన “కొమ్మలు రెమ్మలు” చూశాను. “ప్రపంచీకరణ, వాణిజ్యీకరణలకు బలయిపోతున్న ఆంధ్రదేశపు యువతీయువకులకు వారి తెలుగు నేలలో మొలిచిన మహా వృక్షాలనీ, వాటి కొమ్మల్నీ రెమ్మల్నీ పిందెల్నీ పువ్వుల్నీ కాయల్నీ,” పరిచయం చేసే పుస్తకం. స్మైల్ కొమ్మని కూడా వారి మిత్రులు మిగిలిన వాళ్ళకి అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.
చివరగా, పాశ్చాత్య పత్రికల్లో లాగా మరణ వార్తలో వయసు ఇవ్వడం మనకు ఆనవాయితీ కాదు లాగుంది. స్మైల్ మరణం గురించి నాలుగయిదు చోట్ల చదివాను. ఎక్కడా ఆయన వయసు ఇవ్వలేదు. “బంగారు కథలు” ప్రకారం స్మైల్ పుట్టింది 1942లో. పండు వయసు రాకమునుపే ముగిసిన జీవితం.
కొడవళ్ళ హనుమంతరావు.
స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి gorusu jagadeeshwar reddy గారి అభిప్రాయం:
12/08/2008 10:43 pm
శ్రీవెంకటేశ్వరరావుగారికి, నమస్కారాలు.
స్మైల్‌గారికి మీరందించిన నివాళి చదివాను. ఈ సందర్భంగా వారితో గడిపిన కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవాలనిపించింది. నా చిన్నతనంలో స్వాతి మంత్లీలో “నాకు నచ్చిన కథ” అనే పరిచయం వచ్చేది. అందులో అత్తలూరి నరసింహారావుగారు పరిచయం చేసిన “ఖాళీ సీసాలు” కథ చదివి ఆ స్మైల్ అనేవాడు కనిపిస్తే కాళ్లపైన పడిపోవాలనే ఆవేశం కల్గింది. ఆ తర్వాత కొన్నాళ్లకి నేను హైద్రాబాద్ వచ్చేశాక మా కాలేజి లెక్చరర్ వివిఎస్‌ఎన్ మూర్తి అనే ఆయనతో మాటవరసకి ఆ కథ గురించి అంటేం ‘వాడు నా క్లాస్ మేటయ్యా. వాడిక్కడే కమ్మర్షియల్‌టాక్స్‌లో పనిచేస్తున్నాడు’ అంటూ అప్పటికప్పుడు నాతో ఫోన్‌లో మాట్లాడించాడు. అది మొదలు స్మైల్‌గారి ఇంటికి తరచూ వెళ్తుండేవాడిని. వాళ్ల ఇల్లు క్రాస్‌రోడ్స్‌లో సప్తగిరి టాకీస్ దగ్గర ఉండేది. ఇది 1992 లోని సంఘటన. తర్వాత భరాగోగారు వచ్చి వాళ్లింట్లో ఉండి “ఖాళీ సీసాలు” పుస్తకానికి కావలసిన మెటీరియల్ సమకూర్చుకుంటూ ఉండగా స్మైల్‌గారు అనువాదం చేసిన “చుగ్తాయ్” “కంబలి” కథ దొరకలేదు. నాకు మొదట్నుంచి మంచి కథల్ని కుట్టుకోవడం అలవాటు. అలా నా దగ్గరున్న ఆంధ్రప్రభలో వచ్చిన కంబలి కథని తీసుకెళ్లి ఇచ్చాను. ఆ పుస్తకం ముందు మాటలో తనని పుస్తకం వేయమని సతాయించిన వారిలో నన్ను కూడా చేర్చారు స్మైల్‌గారు. ఆ పుస్తకావిష్కరణ 1995లో ప్రెస్‌క్లబ్‌లో ఎంతో నిరాడంబరంగా, ఇంటి పండగలా జరిగింది. రబ్బరుని చెక్కి బొమ్మలుగా మలిచే ఆర్ట్ కూడా వారికి ఉందని నేనా సభలో చెప్పాను. (ఈ విషయం నాకు మా మూర్తి సార్ చెప్పారు)
ఆయన్ని చివరి సారిగా పోయిన ఏడాది అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీకె.రామచంద్రమూర్తిగారి వారబ్బాయి పెళ్లిలో హైదరాబాద్‌లో చూశాను. నా పుస్తకాన్ని అక్కడే ఇచ్చాను – వారు రాజమండ్రి వెళ్లాక ఫోన్ చేశారు. నా ”ఉసుళ్లు” అనే కథకోసం వారి “తూనీగ” కవితలోంచి కొన్ని పదాలు వాడుకున్నాను. వారి “ఖాళీసీసాలు” కథలోని “పాడు పిల్లల”తో నేను “జగదాంబ జంక్షన్” అనే కథ రాశాను. (ఈ కథ ఆంగ్లానువాదం టెక్సాస్ యూనివర్సిటీ వారేసిన “సాగర్”(2002)లో వచ్చింది) అవన్నీ నా పుస్తకంలో ఉటంకించాను. స్మైల్‌గారు ఎంతో సంతోషించారు.
వారి పెద్దమ్మాయి పెళ్లి హైద్రాబాద్‌లో పింగళి వెంకట్రామారెడ్డి హాల్లో అయినప్పుడు అందరం వెళ్లాం. అది పెళ్లిలా జరగలేదు. ఏదో మహా ఉత్సవంలా అనిపించింది. ఆ పెళ్లి విందుని మా అమ్మాయి ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది, జరిగి పుష్కరం దాటినా.
ఆయన అందం పున్నమి చందమామ – ఆయన మాట్లాడినా, నవ్వినా కురిసేది వెన్నెలే!
అశ్రునివాళితో – గొరుసు జగదీశ్వరరెడ్డి.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాగమురళి గారి అభిప్రాయం:
12/07/2008 7:49 am
ఉపేంద్ర గారూ, నాడ్యంశ గురించి నేను విన్నాను. జన్మ సమయాన్ని అతి సున్నితమైన ఖచ్చితత్వం ప్రకారం నమోదు చేస్తేగానీ ఇటువంటి విభాగాలమీద ఆధారపడలేము. ఇటువంటి సూక్ష్మ విభాగాల వల్ల మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అని భావిస్తే, ఈరోజు ప్రపంచంలో వ్యవహారంలో ఉన్న జ్యోతిషంలో అత్యధికశాతం నిజం కాదని అంగీకరించాల్సి ఉంటుంది.
అది అలా ఉంచితే, సెకన్లతో సహా ఖచ్చితమైన జన్మ సమయాన్ని తెలుసుకుని, నాడ్యంశ మొదలైన విభాగాల్ని ఉపయోగించి, జ్యోతిషం నిజమే అని శాస్త్రీయంగా ఋజువు చెయ్యగల అవకాశం ప్రతిభావంతులైన జ్యోతిష్కులకి ఎప్పుడూ ఉంటుంది కదా. అలా చెయ్యగలమని నమ్మేవాళ్ళు ముందుకు వచ్చి, అందరూ అంగీకరించగల ఋజువుల్ని చూపించడానికి గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నదనే నా వ్యాసంలో ముక్తాయించాను.
ఈ వ్యాస పరంపరలోని రెండో భాగంలోని కామెంట్లలో కవలల గురించి లక్ష్మన్నగారితో నేను చేసిన చర్చ ఒకసారి చూడండి. సదుపాయం కోసం అందులోని కొంత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను –
ఇక కవలల సంగతి. ఏ జ్యోతిష గ్రంథంలోనైనా సరే దీని గురించి చర్చ జరగకుండా ఉండదు. భూమియొక్క దైనందిన చలనం (Diurnal Motion) ప్రకారం సుమారుగా ప్రతీ నాలుగు నిమిషాలకీ ఒక డిగ్రీ చొప్పున తూర్పున ఉదయించే బిందువు (లగ్నం), అలాగే మిగతా భావాలూ మారుతూ ఉంటాయి. చాలా మంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఈ బిందువుల్లో ఎంత సూక్ష్మమైన తేడా వచ్చినా సరే ఫలితాలు మారుతాయి. మరీ ముఖ్యంగా భారతీయ జ్యోతిషంలో రాశి చక్రాన్ని చాలా సూక్ష్మ భాగాలుగా చేసి ఫలితాలు చూసే సాంప్రదాయాలు (నవాంశ, దశాంశ, త్రింశాంశ మొదలైన విభాగాలు) ఉన్నాయి. వాటి ప్రకారం జన్మ సమయంలో ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే ఫలితాలు మారిపోతాయిట. అయితే ఆచరణలో మాత్రం అత్యధికశాతం జ్యోతిష్కులు అంత దగ్గరి జాతకాలకి భిన్న ఫలితాలు చెప్పలేరు. అంతేకాదు, చాలా మంది జాతకుల జన్మ సమయాలు కూడా నిమిషంతో సహా ఖచ్చితంగా ఎవరికీ తెలియవు. అందుచేత ఎవరికైనా చెప్పిన ఫలితాలు తప్పిపోతే, ’జన్మ సమయం తప్పై ఉంటుందమ్మా, అది చాలా ఖచ్చితంగా తెలియాలి’ అని జ్యోతిష్కులు తప్పించుకుంటూ ఉంటారు.
కొన్ని పుస్తకాల్లో ఒక్క నిమిషం ఎడంగా పుట్టిన కవలల జాతకాలని ఉదాహరణగా ఇచ్చి, ‘చూశారా ఒక్క నిమిషమే తేడా ఉన్నా, ఫలానా సూక్ష్మాంశం మారిపోవడం వల్ల అసలు ఇద్దరి జీవితాలకీ పొంతనే లేదు!’ అని రాస్తూ ఉంటారు. అయితే ఆ కవలల విషయంలో అన్వయించిన అదే సూక్ష్మాంశం మరొక మామూలు జాతకానికి ఎందుకు అన్వయించరో బోధ పడదు. అంతే కాకుండా అటువంటి సూక్ష్మాంశాలవల్ల నిజంగా మిగతా జాతకాల్లో కూడా ఫలితాలు ఎలా తేడాగా వస్తున్నాయో వివరణలు ఉండవు. వాటికి మాత్రం ఎక్కువ కాలావధిలో మారిపోని అంశాలనే పరిగణనలోకి తీసుకుని ఫలితాలు చెప్పేస్తూ ఉంటారు.
సువర్ణభూమిలో … గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
12/06/2008 9:30 pm
భూషణ్ గారి కవితా దృక్పథం గురించి కామేశ్వరరావు గారన్నది సరిగానే ఉంది. అయితే కవిలో థాయిలాండ్ యాత్ర కలిగించిన గొప్ప అనుభూతిలో అణుమాత్రమైనా చాలా మంది పాఠకులకి కలగడం లేదు. గొప్ప హృదయకంపన కలగకపోతే ఈ కవి రాసి ఉండేవాడు కాదు:
“కవిత్వం భూకంపం లాంటిదే. పునాదులతో సహా పెళ్ళగించివేయడం దాని స్వభావం. నీ అస్తిత్వ మూలాలు కదిలితే గాని కవిత్వ ప్రకంపన నీలో మొదలు కాదు. వెరసి ప్రపంచాన్ని చేరదు. ఏ కారణాల వల్ల లోపలి పొరల రాపిడితో ఆవని హృదయం బద్దలవుతుందో ఇదమిత్థంగా చెప్పలేకున్నాం. నేడు వెలువడుతున్న కవిత్వాలు రోకలి పోటు లాంటివి. వాటి అదుటు పక్కింటి వసారాను కూడా తాకదు. నీలో భూకంపం వుందా? కలం పట్టు.. ఆదిమోద్రేకాల శిలాద్రవాలను ప్రవహించనీ .. ఘనీభవించనీ .. ఆత్మను భస్మీపటలం చేయగల భయానక సౌందర్యాన్ని ఆరాధించగల చేవగలవాడే కవిత్వం చెప్పగలడు .. తతిమ్మా అందరూ ఆటలో అరటిపళ్ళు .. పనికిరాని దండుగ్గణాలు .. హృదయ పరిపాకం లేకుండానే రచనకు ఉపక్రమించిన కరటకదమనకులు.” [1]
అందుకనే గూడార్థం ఏదన్నా ఉండి ఉంటుదని వెతుకుతున్నారనుకుంటాను.
మొదటి మూడు కవితలలో బుద్ధుని గొప్పతనం కళ్ళకు కట్టినట్టున్నదనీ, ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేని పిల్లి, కుక్క (మనలాటి పాఠకుల్లాగే) కూడా ఉన్నారనీ, నాలుగవ కవితని, మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చనీ అన్నారు గరికపాటి. సముద్రం అడుగున చేపల్ని చూసి ఆనందించమన్నది కవిత్వం ఎలా చదవాలి అన్నదానికి ఉపమా? దీనికి చాలా బుద్ధి బలం కావాలనిపించింది నాకు. అది భూషణ్ తత్వానికి వ్యతిరేకం:
“పుస్తకానికి, జీవితానికీ మధ్య దూరం పెంచేది కవిత్వం కాదు. సరైన కవిత్వం చదివాక నీవు పఠిస్తూ వచ్చిన వంద పుస్తకాలను గోదాట్లో గిరవాటు వేయగల తత్వ నిశ్చయం కలగాలి. అంతరాత్మను ముంచెత్తేదే అసలు సిసలు కవిత్వం. హృదయవర్తనను సాకల్యంగా ఎరిగిన వాడే పదహారణాల కవి. బుద్ధి బలంతో మిడిసి పడేవాడు పుస్తకాలను మోసే గాడిద .. అధముల్లో అధముడు. గణుతి కెక్కడు, పైగా వాడికి కవిత్వం నిషిద్ధం.” [1]
పాత కవిత్వంలో పదాల అర్థాలు తెలియకా, కొత్త కవిత్వంలో పద చిత్రాల అనుభూతి చేరకా, నలిగిపోయే వాళ్ళలో నేనొకణ్ణి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] గరికపాటి పవన్ కుమార్ కవితా సంపుటి, “ఆ సాయంత్రం,” కి తమ్మినేని యదుకుల భూషణ్ రాసిన ముందుమాట, “ఒక్క క్షణం …” నుండి. 2003.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Upendra గారి అభిప్రాయం:
12/03/2008 10:54 pm
నాగ మురళీ గారు,
మీ వ్యాసం ఆసాంతము చదివాను. చాలా బాగుంది.
కాని నాకు తోచిన విషయాలను చెప్పాలనే అత్యుత్సాహాన్ని మన్నిస్తారని ఆశిస్తూ
1) చాలా మంది జ్యోతిష్యులు కేవలం రాశి, నవాంశ చక్రాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. కాని రాశి చక్రము లోని లగ్నము దాదాపు 2 గం|| , మరియు నవాంశ లగ్నము 13 ని|| పాటు మారకుండా స్ఠిరము గా ఉంటాయి. బృహత్ పరాశర హోరా శాస్త్రము లో వివిధ అంశ చక్రముల ప్రస్తావన మరియు ఏ ఏ సమయములలో ఏ చక్రమును ఉపయోగించాలి అని వివరణ ఉంది. ఆ అంశ చక్రాలలో నాఢ్యంశ ( 30 డిగ్రీలను 150 భాగాలు గా చేసి ఈ చక్రమును తయారు చేస్తారు) చక్రము ఒకటి. ఈ చక్రము లోని లగ్నము 1 ని|| కన్నా తక్కువ వ్యవధి లో మారిపోతుంది.
నాకు తెలిసి ఈ ప్రపంచములో జాతకములను నాఢ్యంశ స్థాయి లో పరిశీలించేవారిని వేళ్ళ మీద లెక్కించవచ్చేమో?
కవలల జాతకములను ఏ విధము గా పరిశీలించాలో ఈ వ్యాసం లో ఇచ్చారు http://www.vedicastrologer.org/050200.htm
మరోసారి కలిసినప్పుడు మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం.
ధన్యవాదములతో
-మీ ఉపేంద్ర
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
12/03/2008 9:04 pm
కామేశ్వరరావు గారికి,
సోదాహరణంగా విపులీకరించినందుకు థాంక్స్. నా శీర్షిక మో “పోలికలు” కవితని ఉద్దేశించి, సరదాగా పెట్టింది. పాత కవిత్వంతో పోల్చడానికి కాదు.
వినీల్, శ్రీనివాస్ గార్లని ఉద్దేశించి మీరు రాసిన అభిప్రాయంలో, తనకర్థం కాని కవితని విమర్శించే హక్కు పాఠకుడికి లేదన్నారు. నా ఉద్దేశంలో పాఠకుడికి విమర్శించే హక్కు ఎప్పుడూ ఉండాలి, అర్థం కావడం లేదన్నదీ ఓ విమర్శే. కవిత్వం లో సత్తా ఉంటే ఆ విమర్శల ధాటికి నిలుస్తుంది.
భూషణ్ గారికి,
నేను ప్రస్తావించిన పొరబాట్లు ఎవరివల్ల జరిగినా చివరకి రచయితే బాధ్యుడు. నాకు ఇస్మాయిల్ వ్యక్తిగతంగా తెలియకపోయినా, ఈమధ్య ఆయన రచనలని చదివి, వాటితో పూర్తి అంగీకారం లేకపోయినా, ఉన్నత వ్యక్తిత్వం కలవాడన్న భావన కలిగింది. ఒక్క పొరబాటు మూలాన ఆయన మీద ఉన్న నా అభిప్రాయం మారదు.
మో గురించి కూడా ఒక విషయం. “నిరాకారుడు” ఆయన మొదటి సంపుటి, “చితి-చింత” లోనిది. తరవాత వచ్చిన “రహస్తంత్రి” లో చాలా చోట్ల పాశ్చాత్య కవుల ప్రేరణ సూచిస్తాడు.
కొడవళ్ళ హనుమంతరావు
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
12/03/2008 6:51 am
హనుమగారు,
ప్రాచీన ఆధునిక కవిత్వాలలోని అస్పష్టతని పోల్చడం నా ఉద్దేశం కాదు. రెండూ వేరువేరు తరహాలకి చెందినవి కాబట్టి వాటిని పోల్చలేము కూడా. ప్రాచీనకవిత్వంలో కూడా అస్పష్టత ఉందని, అది మీరన్న ఆధునికకవిత్వంలోని అస్పష్టతకి భిన్నమైనదని చెప్పడమే నా ఉద్దేశం. ఆధునికకవిత్వంలో అస్పష్టతకి మీరిచ్చిన ఉదాహరణ నేనన్న వాక్యగత అస్పష్టతకి మంచి ఉదాహరణే. ఇక్కడ వాక్యాలు అర్థ రహితం (వ్యాకరణ రీత్యా) కావడం మూలాన అస్పష్టత ఏర్పడుతోంది. ప్రాచీనకవిత్వంలో ఇలాటిది దాదాపుగా కనిపించని మాట వాస్తవమే.
ప్రాచీనకవిత్వంలో అస్పష్టతకి ఇంకా మంచి ఉదాహరణలు ఉన్నాయి కాని ప్రస్తుతానికి ఇది:
“ఈ కలహంసయాన నను నెక్కడి కెక్కడ నుండి తెచ్చె! నా
హా! కడుదూరమిప్పు”డని యక్కున జేర్పక జంపుమాటలన్
వ్యాకుల పెట్టుటేల? విరహాంబుధి ముంపకపోదు నన్; జలం
బేకద నీకు; మంచిదిక నీతకు మిక్కిలి లోతు గల్గునే!
ఇందులో అస్సలు అర్థంకాని పదాలు కానీ, అర్థంలేని వాక్యాలు కానీ ఏవీలేవు. అయినా కవి ఇక్కడ ఏవిటి చెప్పదలచుకున్నాడో స్పష్టంగా తెలియటంలేదు. ఇది విజయవిలాసంలో ఉలూచి అర్జునునితో అనే మాటలు. అర్జునుడు తనని పెళ్ళిచేసుకోడానికి ఒప్పుకోకపోతే అంటున్న మాటలు. సందర్భాన్ని బట్టి ఈ పద్య తాత్పర్యం చూచాయగా తెలుస్తున్నా, దీనికి సంతృప్తికరమైన వివరణ ఎక్కడా నాకు కనిపించలేదు. హృదయోల్లాస వ్యాఖ్య రాసిన తాపీవారు కూడా ఈ పద్యంలో కవి చెపుతున్న “ఎక్కడినుండి ఎక్కడకి” తేవడం, విరహ అంబుధిలో “ముంచడం”, “ఈతకు మిక్కిలి లోతుగల్గునే” అనే జాతీయాన్ని ప్రయోగించడం మొదలైన విషయాల్లో కవి ఆంతర్యం స్పష్టం కాలేదని ఒప్పుకున్నారు. “ఈతకు మిక్కిలి లోతు చావుకి మిక్కిలి చింత ఉండవు” అనే జాతీయాన్ని ఇక్కడ ప్రస్తావించి, తనకి చావే శరణ్యం అని ఉలూచి అంటోంది అని అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన చిక్కల్లా, ఈతవస్తే సముద్రంలో మునిగిపోవడం ఉండదు కదా, మరి విరహాంబుధిలో ముంచడం గురించి ఎందుకు ప్రస్తావించినట్టు?
ఇంతకీ నేను చెప్పదలచుకున్న సారాంశమేమిటంటే, ప్రాచీన కవిత్వంలో కూడా కొన్ని చోట్ల అస్పష్టత కనిపిస్తుంది. అయితే, అది మీరు ఆధునిక కవిత్వంలో చూపిన అస్పష్టత లాంటిది కాదు. ఏది స్వచ్ఛమైనది, గాఢమైనది అన్న ప్రశ్న అనవసరం.
( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి gorusu jagadeeshwar reddy గారి అభిప్రాయం:
12/02/2008 11:17 pm
శ్రీ లక్ష్మన్నగార్కి నమస్కారాలు.
మీ స్పందన ఇప్పుడే చదివాను – గొప్ప భావోద్వేగం కల్గింది. ఎంచేతంటే “కన్నుల దాగిన అనురాగం” పాటకి రావలసిన పేరు రాలేదని నేనెప్పుడూ బాధపడుతుంటాను. ఆ పాట మీకూ ఇష్టమని తెలిసి చాలా ఆనందించాను. ఆయన పాటల్లో ముఖ్యంగా “కాలంకాని కాలంలో” (అప్పు చేసి పప్పుకూడు), “సఖీ శకుంతలా” (కులగోత్రాలు) పాటలు కూడా నన్ను ఎంతో పరవశున్ని చేస్తాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన నా వ్యాసం “చల్లగాలిలో యమునాతటిపై” చదివిన సింగీతం శ్రీనివాసరావుగారు ఆ మర్రోజు సోమవారం ఉదయమే నా ఫోన్ నంబర్ దొరకబుచ్చుకుని నాతో మాట్లాడ్డం నా స్వీట్ మెమోరీస్‌లో ఒకటి. ఆయనే నన్ను గుర్తు పెట్టుకుని ఈ మధ్య అమీర్‌పేట్ గ్రీన్‌పార్క్‌లో జరిగిన సాలూరి వారి సిడీ విడుదలకు ఆహ్వానించారు. ఆయన సినిమాల మాదిరే ఆదీ ఓ ప్రయోగం. రాజేశ్వరరావు పాడిన పాటల పల్లవులతో మొదలెట్టి చరణాల్ని మార్చి రాయించి, బాలసరస్వతి, సుశీల, వాణీ, జానకి, బాలు, సింగీతం, కీరవాణిలతో పాడించారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మిమ్మల్ని రావుబాలసరస్వతిగారికి గుంటూరులో అభో-విభో పురస్కారం సందర్భంలో చూశాను.
సాలూరి రాజేశ్వరరావుపై ఇప్పటిదాకా సావనీరు రాకపోవడం వల్ల ఆయన సంగీతం నిర్వహించిన సినమాల లిస్టు దొరకటం లేదు. ఆయన “ఫోక్” మ్యూజిక్‌పై ఉదా: “బొంగారల బుగ్గలున్న” (డా.చక్రవర్తి), “చెట్టులెక్కగలవా” (చెంచు.లక్ష్మి), “సన్నజాజి సొగసుంది, జున్నులాంటి మనసుంది” (కాలంమారింది)లాంటి ఎన్నో పాటలపై ఎవరైనా రాస్తే బాగుండేది.
ఒక్కటి చెప్పనా లక్ష్మణ్ణగారూ, మనిషిగా పుట్టినందుకు రాజేశ్వర్రావు పాటల్ని వినగలిగే అదృష్టం కల్గింది కదా అనుకుంటాను.
ధన్యవాదాలతో – గొరుసు
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:
12/02/2008 5:08 pm
పోతన భాగవత ప్రభావం త్యాగరాజుపై ఖచ్చితంగా ఉంది. స్వదస్తూరీతో రాసిన ప్రతి తంజావూరు సరస్వతీ మహల్లో ఉంది. రాజాస్థానం వద్దనడానికి భక్తే కారణం అని చెప్పలేం. తుల్జాజీ ఆస్థాన విద్వాంసుడిగా మొదటి సారి పిలుపొచ్చింది. అప్పటికే అక్కడ 300 మంది పైగా విద్వాంసులున్నారు. గుంపులో గోవిందా లా ఉండడం ఇష్టం లేదు. తన స్వేఛ్ఛకి భంగం అని భావించాడు. అందుకే ఒప్పుకో లేదు. రెండో సారి పిలుపులో శరభోజి తనపై కీర్తనలు కట్టమన్నాడు. అది ఇష్టంలేక వెళ్ళ లేదు. కానుకలు పంపినా ఫలితం లేక పోయింది. ఇక్కడ భక్తొకటే కాదు, ఆత్మాభిమానం కూడా ఉంది. రాముడిపై తప్ప వ్యక్తులపై కీర్తనలు కట్టడం నచ్చక వెళ్ళలేదు. ఒకే విషయం భక్తి కోణం లోంచి చూస్తే ఒకలా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా చూస్తే ఇంకోలా తోస్తుంది.
మీరనుకున్నట్లు కృతుల్లో చివర ముద్ర అనేది పేరుకోసం కాదు. అనాదిగా శాస్త్రీయ సంగీతంలో కృతికర్త పేరు ఉండడం రివాజుగా వస్తోంది. అన్నమయ్య తిరు వేంకట ముద్రా, క్షేత్రయ్య మువ్వ గోపాలుడి ముద్రా ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇది కేవలం ఒక పద్ధతిగానే తీసుకున్నారు తప్ప, పేరు కోసం కాదని నా అభిప్రాయం. ముద్రకీ, Modesty కీ సంబంధం లేదు. మరీ రెట్టిస్తే, తిరువారూరు త్యాగరాజ స్వామి ముద్ర అని అనుకోవచ్చు కదా?
ఇహ ఆధ్యాత్మికత అంటారా, అది వయసు పెరిగే కొద్దీ మారుతూ వస్తుంది. మనసు కి చెప్పుకోడం అనే ప్రక్రియని మాత్రం త్యాగరాజు చాలా ఎక్కువగా ఉపయోగించాడు. మనసుకి గోడు చెప్పుకున్నంత మాత్రాన దేముడు ప్రత్యక్షమయ్యాడనే ఊహ సరికాదు. ఒకవేళ అలానే జరిగితే, త్యాగరాజొక్కడే దేముణ్ణి చూసుండాలి. ఆయనకి ప్రత్యక్ష మయ్యాడని మనం అనుకొని చెప్పడం కాదు. తను దేముణ్ణి చూసానని త్యాగరాజు ఎక్కడా చెప్పలేదు. భావనకీ, నిజానికీ చాలా తేడా వుంది.
సంగీత సృజన పరంగా మీరు వాడిన పోలిక అస్సలు ఒప్పదు. మీ అభిమాన సంగీత కారులు ఇళయ రాజా, రహమాన్ ఉన్న రాగాల్ని వాడుకుంటూ సంగీతం ఇస్తున్నారు. త్యాగరాజు అలా కాదు. కొత్త కొత్త రాగాల్ని కనుక్కున్నాడు. సంగీతానికొక వొరవడి కూర్చాడు. రెంటికీ నక్కకీ, నాకలోకానికీ ఉన్నంత తేడావుంది.
సువర్ణభూమిలో … గురించి ఆరి సీతారామయ్య గారి అభిప్రాయం:
12/02/2008 3:11 pm
సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు.
ఈ కవితలో మూడు దృశ్యాలున్నాయి. మొదటిది ఒక కొండమీది (ఒక భక్తుడు ఎన్నో మెట్లెక్కి వచ్చాడు కదా) బౌద్ధ దేవాలయం. బౌద్ధ మతాన్ని అభ్యసిస్తున్న విద్యార్ధులు ఎదురెదురుగా కుర్చోనున్నారు. దేవాలయం లోపలికి వెళ్ళేముందు భక్తులు కాళ్ళుకడుక్కోవటానికి ఒక పెద్ద నీళ్ళతొట్టె ఉంది. అందులో కలువలున్నాయి. ఒక కలువ మీద తేనెటీగ వాలి ఉంది. అగరొత్తుల పొగ దేవాలయం అంతా వ్యాపించి ఉంది. ఎర్ర చారల పిల్లి ఒకటి ఉంది ఆ దృశ్యంలో. కవి చూస్తుండగానే కొండ పైదాకా వచ్చిన భక్తుడొకడు పైకప్పుకు అంటుకొనిఉన్న గబ్బిలాలను అదలించాడు. మన కవి, అతని భార్య (మేము అన్నాడు కదా? అరుంధతి గారికి కవితను అంకితం ఇచ్చాడు) బంగారు బుద్ధుడికి కలువలు సమర్పించారు.
రెండో దృశ్యం పర్యాటకులు చూసే ఒక శిధిలమైన దేవాలయం. ఒక పర్యాటక బృందానికి మన కవికి తెలియని ఏదోభాషలో గుడి గురించి చెప్తున్నాడు గైడ్. దేశం మీద జరిగిన దాడుల్లో దేవాలయంలోకూడా విధ్వంసం జరిగింది. విగ్రహాల తలలు తెగిపోయాయి. దేవాలయపు గోడలమీద ఇప్పుడు పెద్దపెద్ద చెట్లున్నాయి. వాటి వేళ్ళలో ఒక బుద్ధ విగ్రహానికి చెందిన తల ఇరుక్కుపోయి ఉంది. మొండెం మాత్రం ఇంకా ధ్యానం చేస్తున్నట్లే ఉంది. మామూలు కవికీ మంచి కవికి తేడా – ఆ పర్యాటకుల బృందంలో ఒకావిడ అక్కడకొచ్చిన కుక్క పిల్లని ఒడిలోకి తీసుకున్నది అని చెప్పటం. చరిత్రలోనుంచి మనల్ను బయటకు తీసుకొచ్చాడు కవి.
మూడో దృశ్యం సముద్రపు నీళ్ళలోతుల్లో జంతుజాలాన్ని చూడటానికి వెళ్ళే పర్యాటకులు. కొంచెం అటూ ఇటూ అయితే ప్రమాదం. బాగా ఈత వచ్చిన వాళ్ళు పర్యాటకులను రక్షించాల్సి వస్తుంది.
ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
12/01/2008 5:51 am
“భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు.”
అని హనుమగారన్నది సరి కాదు. భావకవిత్వం ముందర వాక్యగతమైన (వ్యాకరణ ధిక్కారంతో వచ్చే) అస్పష్టత చాలా వరకూ లేదు. కాని భావగతమైన అస్పష్టత ఉంది. వాక్యగతమైన అస్పష్టత కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అంతకన్నా పై మెట్టు మరొకటి ఉంది! అది కవిత్వంలో పొరలు (layers). అంటే పైకి స్పష్టంగా ఒక అర్థాన్నిస్తూనే అంతర్గతంగా మరొక (మరికొన్ని) అర్థాన్ని స్ఫురింపజెయ్యడం. ఇక్కడనేనంటున్నది శ్లేష గురించి కాదు.
“కవి అమూర్త భావాలు వాడటం వల్ల కలిగిన అస్పష్టత. ట్రాన్స్పరెంట్ చీకట్లు, చంద్రుణ్ణి తాగడాలు లాంటి expressions ఐతే I can empathize with you.” అని వినీల్ గారన్నారు.
But I cannot! ఒక పాఠకుడికి, తనకి అర్థం కాని కవిత్వాన్ని అర్థం కాలేదని చెప్పడానికి అధికారం ఉంది కానీ, దాన్నసలు కవిత్వమే కాదనడానికీ, విమర్శించడానికీ హక్కు లేదని నా ఉద్దేశం. ఆ కవిత్వం వేరెవరికైనా అర్థం కావచ్చు, వాళ్ళా కవిత్వాన్ని అనుభవించవచ్చు. ఏదైనా కవిత్వం ఎవరికీ అర్థం కాకుండా పోతే, దానికి ఆదరణ లేక అది సహజమరణం పొందుతుంది. దాని గురించి విమర్శించడం అనవసరం.
ఈ వ్యాసంలో వేలూరివారు ప్రస్తావించిన కవిత్వానికి కొలమానాలు కాని, టెక్నిక్కు కానీ మొత్తం కవిత్వానికంతకీ వర్తించేవి తయారుచెయ్యడం అసాధ్యం, అనర్థం కూడా. ఒకో “రకమైన” కవిత్వానికీ (కొన్ని ప్రత్యేక కొలమానాలతో) ఒకో టెక్నిక్కు సృష్టించుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. ఒక రకమైన కవిత్వానికి సంబంధించిన టెక్నిక్కుని మరొక రకమైన కవిత్వమ్మీద ప్రయోగించడం పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం వెయ్యడమవుతుంది!
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/30/2008 11:16 pm
To Give Credit Where It Is Due
సంపాదకులకి: ఈ అభిప్రాయాన్ని “గ్రంథచౌర్యం గురించి,” అన్న మే 2008 సంపాదకీయం కింద వెయ్యవచ్చు కాని, ఇక్కడే ఉంచమని మనవి.
గట్టు వినీల్ నా కొటేషన్స్ ని ప్రస్తావించి సమర్థించినందుకు థాంక్స్. ఆ సందర్భంలో రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. మొదటిది అల్పమైనది, రెండోది ముఖ్యమైనది.
మొదటిది: కొటేషన్స్ ఇవ్వడం నా బలహీనత. సృజనా లోపమని భావిస్తాను. సాహిత్యం నా వృత్తీ, ప్రవృత్తీ కానందుకు బతికిపోయాననుకుంటాను. 🙂 పదే పదే నేను కోట్ చెయ్యడం విమర్శించదగ్గ విషయమే.
రెండోది: అయితే అది నేనేదో గొప్పవాణ్ణని చూపించడానికో ఇతరులని భయపెట్టడానికో కాదు. భావమో, వ్యక్తీకరణో మనది కానపుడు, ఎవరిదో సూచించడం నైతిక బాధ్యత. సైన్సు రంగంలో ఉండటానో, పాశ్చాత్య ప్రభావమో నాకిది దాదాపుగా అలవాటు. అలా చెయ్యని సందర్భాల్లో తప్పు చేశానని చానాళ్ళు మనసులో పీకుతుంటుంది.
ముఖ్యమైన విషయాలు ప్రస్తావించినపుడు, మూలం మనది కాకపోతే విధిగా కారకులని గుర్తించాలి. మొన్ననే ఇస్మాయిల్ పుస్తకాన్ని ప్రస్తావించాను. దాంట్లోనే “ఇద్దరు భాష్యకారులు,” [1] అన్న 1980లో రాసిన వ్యాసం ఉంది. చలం “మ్యూజింగ్స్” ప్రస్తావనతో మొదలయిన వ్యాసంలో రెండో పేరా చూడండి:
“అప్పుడప్పుడూ రంగులు లేతగానో, ముదరగానో మారుస్తుండటమూ, లేదా ఎడమొహం పెడమొహం వేసి రెంటిగా చీలిపోవటమూ మార్క్సిస్టు ఉద్యమాలన్నిటికీ సామాన్య లక్షణమనుకుంటాను. మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం.”
వెంటనే పక్కా ఇస్మాయిల్ అనిపిస్తుంది కదూ. 🙂 మార్క్సిస్టు విమర్శకుల్లో రెండు రకాలు – ఛాందసులు, అఛాందసులు – అని వాళ్ళలో తేడాలని వివరించే వ్యాసం. నాకు చాలా నచ్చింది. కాని అఛాందసుల మీద మామూలుగా ఇస్మాయిల్ మార్క్సిస్టుల మీద వేసేటన్ని వాతలు పడనందుకు ఆశ్చర్య మేసింది. తెలుగు వాళ్ళు కానందువల్లనేమో నని సమాధానపడ్డాను. వాళ్ళ గురించి ఏమన్నా తెలుసుకుందాం అని వెతికితే ఓ George Steiner పుస్తకం [2] కనబడింది.
నేనీ Steiner వేమీ చదవలేదు. ఆదివారం కదా అని లైబ్రరీకెళ్ళి తెచ్చుకొని తిరగేశాను. దాంట్లోని “Marxism and the Literary Critic,” అన్న వ్యాసం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఇస్మాయిల్ వ్యాసం దీనికి సంక్షిప్తానువాదం! మంచి అనువాదం, సందేహం లేదు. కాని మూలంలో లేనిది ఒక్క అక్షరం కూడా లేదు, దాంట్లో అనుమానం లేదు. మరి ఇస్మాయిల్, “ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం,” అన్న దాంట్లో ఆవగింజంతయినా ఔచిత్యం ఉందా? తను సొంతంగా ఏం ఆరా తీశారు?
ఇస్మాయిల్ ప్రతిభావంతుడైన కవి, విమర్శకుడు. సాహిత్యం, తత్వశాస్త్రాల్లో విద్యాధికుడు. సొంతంగా ఇలాంటి వ్యాసం రాసే సత్తువ ఆయనకుంది, నాకెలాంటి సందేహం లేదు. కాని ఈ వ్యాసం మూలం మాత్రం ఇస్మాయిల్ ది కాదు. Steiner పేరు ప్రస్తావించకపోవడం పెద్ద నేరం.
ఆ రీతిలో కాకపోయినా, ఇక్కడే ప్రస్తావించిన మో “నిరాకారుడు” కవితని చూద్దాం. మొదలొకటే అయినంత మాత్రాన “The Listeners,” తో పోల్చకూడదన్నాడు మో. అది ఒక పేజీ, ఇది ఆరు పేజీలు, అనువాదం కాదు. కాని కవితలోని వాతావరణం అదే, అనుమానం లేదు. మో ఆంగ్ల సాహిత్యం విస్తృతంగా చదివిన వాడు. స్పూర్తి దానినుండే వచ్చి ఉండాలి. పేరు చెప్తే సొమ్మేం పోయింది? సాధారణ పాఠకులకి ఆ కవిత చేరేదేమో కూడాను.
చివరగా, మరో విషయం. మూలాలు చెప్తే, పాఠకులు పోయి ఇంకాస్త చదువుకొని లాభించే అవకాశం ఉంది. చెప్పకపోతేనే నష్టం.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “కవిత్వంలో నిశ్శబ్దం,” ఇస్మాయిల్. పేజీలు 102-106.
[2] “George Steiner: A Reader,” Oxford University Press, 1984. పేజీలు 37-53. “Marxism and the Literary Critic,” వ్యాసం మొదట ప్రచురించింది 1958లో.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి e.bhaskaranaidu గారి అభిప్రాయం:
11/30/2008 2:20 am
1965 లో ఎస్సెసెల్సి లో ప్రవరాఖ్యుని పాఠం ఉండేది. పరీక్షల్లో తెలుగులో ఒక ప్రశ్న వచ్చింది. అది: ప్రవరాఖ్యుడు హిమాలాయాలకు వెళ్ళి ఏమి చూసాడు? అని. దానికి సమాదానంగా నేను అందులోని పద్యం “అటజనికాంచె భూమిసురుదడంబరచుంబి…” అనే పద్యము రాసాను. సమాదానము గద్యంరూపములో రాయ కుండా పద్యంలో రాస్తె మార్కులు వేస్తారో లేదో అనే భయం వుండేది. కాని ఆ పద్యం మీద అభిమానంతో సమాదానం పద్యరూపంలోనే వ్రాసాను. ఆపద్యం అంటే అంత అభిమానం ఆనాడు నేర్చుకున్న్ ఆ పద్యం ఈనాటికి నాకు కంఠతా వచ్చు. ఆ రోజుల్లోనే తెలుగులో నాకు చాల ఎక్కువ మార్కులు వచ్చాయి.
మను చరిత్రలోనె ననుకుంటా…. ఒక వచనం వుండేది అది….విద్యగొనుటయె గాక గుటగుటకు గురుతోనా యని……..” అని వుండేది. అది ఏ అస్వాసంలో వుందో ….
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/29/2008 3:52 pm
హనుమ గారు
Thanks for the reference.
ఇది రాద్దామనుకోలేదు, కాని నేను రాసింది అస్పష్టంగా ఉందేమోనని అనుమానం వచ్చి రాయడం. “ఈ మాట” యొక్క అభిప్రాయవేదిక చర్చావేదిక గా మారకుండా ఉండాలని గింజుకుంటూ కూడా రాయడం.
గ్లోబలైజేషన్్ ఉన్నా లేకపోయినా, “నారికేళపాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టమే కాదు, నిజాయితీ అని కూడా అనిపించడంలేదు నాకు.
వినీల్్ గారు “అస్పష్టతకు కారణాలేమిటి?” అని చాలా మంచి ప్రశ్న వేసారు. రెండు పాయింట్లు చెప్పి నా అభిప్రాయంతో ముగిస్తాను.
1. అస్పష్టత చాలా సార్లు subjective అనిపిస్తుంది.
2. అస్పష్టత వేరు complexity వేరు.
ఒకరికి అస్పష్టంగా ఉన్నది ఇంకొకరికి ఉండకపోవచ్చు. లోకం మొత్తానికి అస్పష్టంగా ఉన్నది కవికి స్పష్టంగా ఉండొచ్చు, hopefully! Subjective అన్నప్పుడు, అస్పష్టతకు సవాలక్ష కారణాలుండొచ్చు. పాఠకుడు సరిగ్గా చదవకపోవడం నుంచి, భాషా పరిచయం లేకపోవడం నుంచి అచ్చుతప్పులు గ్రహించకపోవడం దాకా ఎన్నో కారణాలుండొచ్చు. వాటికి కవిత మాత్రం కారణం కాదు. కాబట్టి వాటి గురించి, అంటే “1” గురించి కాదు ఈ చర్చ అని అనుకుంటున్నాను.
ఇక “2” వ అంశం. ఆలోచనా విస్తృతి పెరిగినప్పుడు complexity తగ్గిపోతుందని కాదు కాని, complexity పట్ల స్పష్టత పెరుగుతుంది. వీటి ఉదాహరణలు అందరి దగ్గరా ఉంటాయి.
నేను సమర్థించని “అస్పష్టత” పై రెండు కోవలకు సైతం చెందనిది, ఇతరమైనది! కవిత అర్థం కాకముందు కాదు, దాని అర్థం తెలుసుకున్నాక కూడా అది అస్పష్టంగా కనిపించడం గురించి. అప్పుడు ఆ “కవిత” అనే రాతలో ఏముంది డొల్ల అని ఎందుకు నిలదీయకూడదో తెలియదు, నిజాయితీగా. నేనన్న “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టం అని అన్నది దీని గురించి మాత్రమే.
==================
విధేయుడు
-Srinivas
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి mOhana గారి అభిప్రాయం:
11/29/2008 1:14 pm
కవిత్వం చదువగానే ఒక అనుభూతి కలగాలి అని చదివిన తరువాత నాకు నన్నెచోడుడుగారు వ్రాసిన క్రింది పద్యం గుర్తుకు వచ్చింది –
ముదమునఁ గవికృత కావ్యము
నదరున విలుకాని పట్టినమ్మును బర హృ-
ద్భిదమై తల యూఁపును, బెఱ
యది కావ్యమె చెప్పఁ, బట్ట నదియున్ శరమే
– కుమారసంభవము (1.41)
మంచి కవిత హృదయాన్ని తాకి సంతోషాన్ని కలిగిస్తుంది, విలుకాడు పట్టిన బాణము భయము కలిగించి శత్రువు గుండెను తాకుతుంది. కవిత అంటే అది, బాణమంటే అది.
మిగిలిందంతా కవిత అవుతుందా, బాణమవుతుందా అని దీనికి అర్థము.
విధేయుడు – మోహన
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/29/2008 12:13 am
ఆధునిక కవిత్వంలో అస్పష్టత
నాగులపల్లి శ్రీనివాస్ గారికి,
మన భాష ఉనికికే ముప్పు కలిగితే, పాఠశాలల్లో, ప్రజల లావాదేవీలలో తెలుగు వాడకం ఎక్కువ చేస్తే ఫలితం ఉంటుంది కాని, కవులని స్పష్టంగా రాయండర్రో అని మొరెట్టుకున్నా, ఒకవేళ వాళ్ళు దానిని పాటించగలిగినా, ఒరిగేది మాత్రం సున్నా!
సాహిత్యానికీ సమాజ స్థితిగతులకీ పరస్పర సంబంధం ఉంది. కాని కార్యకారణ సంబంధాలు చూపకుండా ప్రతిదానికీ గ్లోబలైజేషన్ పేరెత్తడం వలన సాహిత్య వివేచన పెరగదు.
భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు. ఆధునిక కవిత్వంలో అస్పష్టతని వర్ణించడానికి నారికేళ పాకం అన్న పదమే అనుచితం కావచ్చు. వర్తమాన కాలపు కవిత్వంలో అస్పష్టత స్వభావం ఏమిటి? అది ఎన్ని రకాలు? ఏది అనివార్యం? ఏది అవాంఛనీయం? ఇది రావడానికి అసలు కారణాలు ఏమిటి? అని పాపినేని శివశంకర్ [1] తన సిద్ధాంత గ్రంథంలో కాస్త వివరించాడు. మనమాయనతో ఒప్పుకోనవసరం లేదు కాని చర్చలోకి తీసుకోవాలి.
సామాన్య పాఠకులు తెలుగు PhD థీసిస్ లు చదువుతారా? కవిత్వం ఆస్వాదించడానికి సిద్ధాంత గ్రంథాలు చదవాలా? అంటే అక్కర్లేదు. కాని గ్లోబలైజేషన్ ప్రభావంలో తెలుగు ఉనికికే ఆపద ముంచుకొచ్చిన తరుణంలో నారికేళ పాకం ముసుగులో అస్పష్టతని సమర్థించకూడదన్నప్పుడు – దీంట్లో సాహిత్య ప్రభావం గురించి చాలా గంభీరమైన భావాలున్నాయి కనుక – కాస్తో కూస్తో సిద్ధాంతపరమైన విచారణ చెయ్యాలి. PhD థీసిస్ లు కాకపోతే మరేదో, మనదో మరెవరిదో, కాస్త లోతుగా ఆలోచన చేసిన రచన ఆధారంగా.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “సాహిత్యం – మౌలిక భావనలు,” పాపినేని శివశంకర్, 1996. పేజీలు 139-146.
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి ravi గారి అభిప్రాయం:
11/28/2008 1:55 am
చాలా బావుంది. కాని, రక రకలా మతాల గురించి కొన్ని కీర్తన ల్లొ ప్రస్తావిస్తారు. ఉ: “కొనియాడె నాయడ” చరణంలో చూడండి.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/27/2008 6:19 pm
బాబ్జీలు గారు
నిజమే మీరన్నట్లకు బోలెడు నిర్వచనాలున్నాయి. పంచుకున్నవి నాకు తెలిసిన కొంచెం మాత్రమే.
కవిత్వాన్ని నిర్వచించడం కుదరదు అని అనుకున్నా, చేసిన వాళ్ళు చేసారు, చేయని వాళ్ళు ఆగకుండా చేస్తున్నారు, ఇంకా ముందుకు చేయకుండా ఆగుతారనీ లేదు.
ఇక మీరడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానమే నాది కూడా అని అనుకుంటాను. విశ్వశ్శ్రేయం కావ్యం అంటే విశ్వశ్రేయం కానిదేదీ కావ్యం కాదని కాదు. తీపి మంచి రుచి అంటే తీపి కానిదేదీ మంచి రుచి కాదని అననట్లు.
మీరన్న ఒక మాట మాత్రం చాలా సత్యం. కవిత చదవగానే చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి అన్నది పాఠకుని పట్ల సహాయమే కాదు, అవసరం కూడా అనిపిస్తుంది. తెలుగు భాష ఉనికే సవాలుగా మరుతున్న సమయంలో “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టంగా అనిపిస్తుంది.
————————–
విధేయుడు
-Srinivas
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/27/2008 1:32 pm
బాబ్జీలు గారికి,
బాధేం లేదు. మో నిరాకారుడి లాగే నేనూ అడివిలో చిక్కుకుపోయాను. 🙂
ఇస్మాయిల్ చెప్పేదేదో ఈ సందర్భంలో ఆలోచించదగ్గదనిపిస్తోంది కాని, అది అభిప్రాయాల పరిథి దాటిపొయ్యేటట్లుంది. ప్రస్తుతానికి అంతటితో ఆపేస్తాను.
వేలూరి గారికి నిరాకారుణ్ణి ప్రస్తావించినందుకు కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/27/2008 1:31 am
“నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.” – మో
బాబ్జీలు గారికి, (కొంత వైదేహి గారికి),
“ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి,” అన్నారు మీరు. కవిత్వానికి సంబంధించినంతవరకు నాలాటి వాడు ఏమీ తేల్చలేడు. (నాలుగేళ్ళ క్రితం గట్టు వినీల్ నో పార్టీలో కలిసి, సాహిత్యం గురించి ముచ్చటించుకున్నాం. వినీల్ ది ఈ తరం. నేనో ఇరవై ఏళ్ళు సాహిత్యాంధకారంలో ఉండటాన ఈ తరం రచయితల పేర్లు కూడా తెలియలేదు. ఆ ఖాళీ పూరించుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాలుగు పుస్తకాలు చదివి, నలుగుర్ని కోట్ చేసినంత మాత్రాన పండితులవుతామన్న అపోహ లేదు.)
మో గురించి చేరా “ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవి కాడు … అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచం తిక్క చూపిస్తాడు” అన్నాడు. సామాన్య పాఠకులయినంత మాత్రాన ఆషామాషీగా చదవాలని లేదు కదా. లోతు ఉంటే తెలుసుకోడానికి కష్టపడితే ఏం?
కొన్ని కవితలు వెంటనే మనసుకు హత్తుకుపోవు. అందీ అందక ఉంటాయి. వాటిని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వివరిస్తే అప్పుడు మామూలు పాఠకులకి కూడా గాఢమైన అనుభూతి కలుగుతుంది.
వేలూరి గారి వ్యాసంలో మో కవిత మీద వ్యాఖ్యానం చూసి, చితి-చింత తీశాను – ఎవరన్నా ప్రస్తావిస్తేనే కాని ఇలాటివాటి జోలి కెళ్ళను నేను. వేలూరి గారు కోట్ చేసిన పాదాలు నాకూ అర్థం కాలేదు. “ఎర్ర ద్రాక్ష పళ్ళూ, తెల్ల అన్నం,” ఏమిటీ గొడవ? అనుకున్నాను.
కాని ఇది దీర్ఘ కవిత. ఇంకా ముందుకు పోతే, నిరాకారుడు, తలుపుతో,
“నీకు నిద్ర వృద్ధాప్యంలా ముంచుకొచ్చినపుడు
చలి కొణుకుతూ రాంకీర్తనలు గొణుగుతూన్నపుడు
నన్ను తలుచుకొని నీ పుస్తకం లోపల్లోపల చదువుకో,
…
మూసేసిన వెన్నెలమాసికలేసిన తలుపూ
నేనెళ్ళొస్తా గడేసుకో.”
అనేటప్పటికి, అయ్యో! ఇది మన గురించే, అని తెలిసింది, విషాదమావరించింది. అందుకే నా మొదటి అభిప్రాయం రాసింది. ఇవాళ మీరు మో మీద రాసింది చదివి, మో తన మీద తనే అన్న మాటలు గుర్తొచ్చాయి [1]:
“నా కవిత్వానికి ఎంతమంది అభిమానులున్నారో అంతేమంది విమర్శకులూ ఉన్నారు. అది అర్థం కాదనేది ప్రధాన విమర్శ. దాన్ని నేను ఖండించను. ఎందుకంటే నిజంగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరిదాకో ఎందుకు… చలసాని ప్రసాదరావు గారే నాకు రాసిన ఆఖరి లేఖలో, ‘మీ కవితా సంకలనాలన్నీ మీరు అరబ్బీలోనో పార్శీలోనో లేదా ఆఫ్రికా ఖండపు బురుండీ దేశభాషలోనో రాశారని ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు,’ అంటూ హాస్యమాడారు. నేనెన్నుకున్న వస్తువు నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ ఇంగ్లీషు కవి ప్రభావమో నామీద పడవచ్చు. ఆ భావాలతో బొత్తిగా పరిచయం లేని వ్యక్తికి… నేను రాసిన కవితలోని మూలం అందకపోవచ్చు. అలాగని నేను రాసిందంతా సంక్లిష్టమైన కవిత్వమంటే మాత్రం ఒప్పుకోను. నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.”
నిరాకారుడి లాంటి కవితలకి చేరానో, మరో పండితుడో కాస్త వ్యాఖ్యానం ఇవ్వాలి. వెతికితే, వడాలి [2] లో కాస్త ఉంది: “Walter de la Mare’s poem The Listeners opens with a traveller “knocking on the moon-lit door”. MO’s Nirakarudu has a similar opening, but he cautions us against reading too much similarity between the two poems.”
“The Listeners” బాగా పేరున్న కవిత అట. ఆ కవి మీద TS Eliot చక్కటి కవిత రాశాడట. ఇవేవీ నాకు తెలియవు. ఇప్పుడవి చదివి, మళ్ళీ “నిరాకారుడు” చదివాను. ఈ వ్యాసంలోని మిగతా కవితలూ చదివాను.
“అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు,” అని చదివితే నాకూ చిన్నప్పటి మాఊళ్ళో బంతి భోజనాలు, గాడిపొయ్యులు, వాటితో పాటు వంటసాల చేసి పొగకి మండిన కళ్ళూ – అవన్నీ గుర్తొస్తాయి. మిగిలిన కవితలు గూడా మరికొన్ని జ్ఞాపకాలని తలపుకొస్తాయి. కాని అవేవీ మో కవిత అంతగా కదల్చడం లేదు. దానికి ఫలానా జ్ఞాపకం కారణం అని చెప్పలేను. నిరాకారుడు గొప్ప కవిత. కాస్త చెయ్యిస్తే సామాన్య పాఠకులని కూడా విషాదంలోనూ మోదంలోనూ ముంచెత్తేది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఏకాంతం నుంచి ఏకాంతంలోకి,” ఈనాడు ఆదివారం, మార్చి 27, 2005.
[2] “Modern Poetry in Telugu,” by V. Mandeswara Rao.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/24/2008 8:52 am
ఒక కవిత పాత జ్ఞాపకాల పుట్ట అని వేలూరి గారు అంటే, పాత జ్ఞాపకాలు, కాదు గాయాలు, మానిపోయాయని మన హనుమగారు ఆశిస్తున్నారు. రెండూ సహృదయంతో చెప్పినవే కాబట్టి, దేన్ని కాదనగలం?
షడ్రుచులున్నాయి అని మన వాళ్ళంటే, “లోకో భిన్న రుచిః” అని అంతకంటే ముందే అన్నారు. ఎంత మధురమైనా మోతాదెక్కువైతే మొహమెత్తిపోతుందని చుట్టున్నవాళ్లు గుర్తుచేస్తూనే ఉంటారు. ఈ రుచి బాగుంది, ఆ రుచి గొప్పది అని వెలకట్టబోతుంటే, “అన్నేసి చూడు, నన్నేసి చూడు” అన్న ఉప్పును మాత్రం ఎవ్వరు తక్కువ చేయగలరు!
రుచులు, వాసనలు అందరికీ సాధారణంగా అనుభవంలోకి వచ్చినట్లు, అన్ని కవితలు అర్థమయి, అనుభవంలోకి వస్తాయి అనలేం. పెళ్ళిచేసుకోవడం, ఇల్లుచూసుకోవడం సంగతేమోకాని, పింగళిగారెప్పుడో “భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్” అనేసారు. పాటలేకాదు, ఏవో కవితలు రాయాలోయ్ అని కూడా అన్వయించుకోవచ్చేమో.
కొన్ని కవితలు మిగిల్చిన జ్ఞాపకాల గురించి రెండు లైన్లు రాయాలనిపించింది.
ఎన్నో జ్ఞాపకాల నిధులున్న మనసే ఒక కోట
ఎన్నో శబ్దాలు నింపుకున్న కవితే ఒక ఫిరంగి
ఇది కూలదు
అది పేలదు!
ఏది ఏమైనా కవులూ, పాఠకులూ, పాఠకులు కానివారుతో సహా
“ఎల్లరు హాయిగ ఉండాలోయ్” అన్న పింగళిగారి కాంక్షనే ఆకాంక్షిస్తూ
===========
విధేయుడు
– Srinivas
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/23/2008 9:40 pm
“కవిత్వం ఒక ఆల్కెమీ”
Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాల సాహితీ సిద్ధాంతాలని పేర్కొనేవారు తాము సాధారణ పాఠకులమంటే, ఇక “సాధారణ” అన్న మాటకి అర్థమేముంది? “Oh, Lord Venkateswara! If you are only a stone, what are we?” అని ఎక్కడో ఎవరినో అన్నది గుర్తొస్తోంది. 🙂 అల్ప విషయంగా వదిలేద్దాం.
వేలూరి గారన్న దాంట్లో ఓ చిన్న సందేహం: “వాన ఏ రకమైన వెనకటి జ్ఞాపకాలని గుర్తుకి తెచ్చినా, కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి.”
కొత్త జ్ఞాపకం అంటే ఇటీవలిదనా (recent memory)? మంచి కవితకి అదెందుకు ఉండాలో వివరిస్తే బావుండేది.
హార్డీ Apology లో Housman పేరు చూశాను. పోయినేడే ఆయన 1933లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసం, “The Name and Nature of Poetry,” [1] చదివాను. కవిత్వ స్వభావం గురించి Housman చెప్పింది నాకు నచ్చింది. దీనినే రచ్చబండలో కాస్త ఘాటుగా ప్రస్తావించి, ఘర్షణ పడ్డాను. (పడిన గాయాలు అందరిలోనూ మానిపోయాయని ఆశిస్తాను.)
వేలూరి గారు పాఠకుని జ్ఞాపకాలు కవిత్వాన్ని ఆస్వాదించడానికి కావలసిన పరికరం అంటే, Housman, భావోద్వేగాన్ని కలిగించడమే కవిత్వ విశేష లక్షణం అన్నాడు:
“And I think that to transfuse emotion – not to transmit thought but to set up in the reader’s sense a vibration corresponding to what was felt by the writer – is the peculiar function of poetry.”
ఉద్వేగం వేలూరి/Benjamin అన్నట్లు జ్ఞాపకాల వలనే వస్తుందనుకుందాం. అయితే ఒక సందేహం వస్తుంది. మన జ్ఞాపకాలని మనమే గుర్తు తెచ్చుకోడానికి వేరేవాళ్ళ కవిత్వం ఎందుకు? దీనికి సమాధానంగా నాకు రెండు విషయాలు గోచరిస్తాయి.
ఒకటి, కొన్ని జ్ఞాపకాలు గుప్తంగా ఉండొచ్చు; మనకంతుపట్టని అంతర్గత మానవ స్వభావానికి చెంది ఉండొచ్చు. Housman మాటల్లో;
“But in these six simple words of Milton –
Nymphs and shepherds, dance no more –
what is it that can draw tears, as I know it can, to the eyes of more readers than one? What in the world is there to cry about? Why have the mere words the physical effect of pathos when the sense of the passage is blithe and gay? I can only say, because they are poetry, and find their way to something in man which is obscure and latent, something older than the present organisation of his nature, like the patches of fen which still linger here and there in the drained lands of Cambridgeshire.”
రెండోది మనలో ఉద్వేగం కలిగించాలంటే ఆ భావాలని వ్యక్తీకరించే భాష ప్రత్యేకమైనదిగా ఉండాలి. Housman అన్నట్లు, “Poetry is not the thing said but a way of saying it.”
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తన వేమన ఉపన్యాసాలలో అన్నారు: “తీవ్రమైన భావములు మనుష్యులు కందరికిని కలవు, కాని ఆ భావములను బైట పెట్టవలసినప్పుడు మన కందరికిని వచ్చునది కవిత్వం గాదు; నత్తి. కొందరికది నాలుకకే అంటియుండును. మరికొందరికి వ్రాతలోను కలదు. కవులనబడే వారిలో ననేకులిట్టి నత్తివ్రాతవారే. బుద్దిమంతులైన వారి కీరెంటికిని మందొకటే; చేతనైనంతవరకు మౌనము వహించుట.”
(1929లో కన్నా ఇప్పుడు కవుల్లో నత్తి ఎక్కువయిందా?:-))
పైదీ, వేలూరి గారన్నదీ నాకు చాలావరకు సమ్మతమే. కాని నేనిది రాయడానికి కారణం, ఆధునికులు ఇదంతా పాత చింతకాయపచ్చడి, అని కొట్టిపారేస్తారేమోనని. మన ప్రముఖ కవి ఇస్మాయిల్ మాటల్లో [2]:
“మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో కవి చేసే ఎక్స్ ప్లొరేషనే కవిత్వం. అందరికీ తెలిసిందాన్నే అందంగా చెప్పడం కాదన్నమాట కవిత్వం. ఇది సంప్రదాయవాదులిచ్చిన నిర్వచనం. దీన్ని ఆధునికులు ఒప్పుకోరు. కవిత్వం ఎక్స్ ప్లొరేషన్ కనక, కొత్త సత్యాలని ఆవిష్కరిస్తుందని వీళ్ళంటారు. అందుకే, అస్పష్టం అనే ఫిర్యాదు ఆధునిక కవిత్వం గురించి అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అస్పష్టమంటే కొత్త అని అర్థం చేసుకోవాలి, చదువరికి ఇంతవరకూ అనుభవంలోకి రాని విషయమన్న మాట.”
మో ఆధునిక కవి. ఆయన కవిత్వం అస్పష్ట పాకమా? లేక మనకింతవరకూ అనుభవంలోకి రాని సరికొత్త పాకమా?
ఎప్పటికైనా మో “కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం” చేస్తుందని నా ఆశ. అప్పటిదాకా “శాంతి ఒక్కొక్క బొట్టూ పడ్తుంది వేకువ కళ్ళల్లోంచి. కట్టేసిన కన్నీటి మేలిముసుగు కుళాయిల్లోంచి.” అన్న నిరాకారుణ్ణి “లైఫ్ బాయ్ సబ్బుతో కడిగిన గ్లాసులో తాగిన చవకరకం జిన్ అండ్ టానిక్” తో పోల్చడం మాత్రం అన్యాయమే!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “The Name and Nature of Poetry and Other Selected Prose,” by AE Housman. Cambridge University Press, 1961.
[2] “కవితా విహంగానికి స్వేచ్ఛ ఊపిరి,” అన్న ఇస్మాయిల్ 1981 వ్యాసం. “కవిత్వంలో నిశ్శబ్దం,” నుండి.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/21/2008 9:18 pm
కామేశ్వరరావు గారికి,
శుద్ధ తర్కం/గణితం ఆధారంగా వాదిస్తున్నప్పుడు కొలవగలమా లేదా అన్న ఆచరణపరమైన ఇబ్బందిని తీసుకురాకూడదు కదా.
జీనో ప్రకారం (మీ ప్రకారం కూడా) అకిలీస్ కీ తాబేలుకీ మధ్య దూరం సున్నాకి అతి దగ్గరగా వస్తుంది కాని, ఎప్పటికీ సున్నా కాదు. సున్నా కానిది అకిలీస్ తాబేలుని అందుకోలేడు!
మిమ్మల్ని Stanford ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో వదిలి నేను సెలవు తీసుకుంటాను. 🙂
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/21/2008 11:21 am
ఆ మాటని తార్కికంగా కూడా అన్వయించకోవచ్చు అని నా ఉద్దేశం, ఇంగ్లీషులో “tends to zero” అన్నదానికి సమానార్థకంగా. సున్నకి ఎంత దగ్గరగా ఉన్న చిన్న కొలతనిచ్చినా, అంతకన్నా దగ్గరగా ఉందని నిరూపించడమే కదా “tends to zero”కి అర్థం. జీనో అనంత శ్రేణిని గురించి మాట్లాడాడు కాబట్టి అతనిచ్చినది గణిత సంబంధమైన వివరణ. అంచేత దానికి గణితసంబంధమైన పరిష్కారం చూపిస్తే వైరుధ్యం తొలగి పోయినట్టే కదా. ఇందులో ఇంకా తీరని సమస్య ఏవిటి?
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/20/2008 11:42 pm
విప్లవ్ గారు,
మహరాజులా నవ్వుకోండి! ఈ ప్రజాస్వామ్య స్వతంత్ర భారతదేశంలో ఎవరికి వారు, భాషకి తమకి నచ్చిన నిర్వచనాన్ని ఇచ్చుకొనే స్వాతంత్యం ఉంది 🙂
నా వ్యాఖ్యలో Proof of Contradiction గురించిన చెప్పిన కీలక అంశాన్ని ఒకసారి (మరోసారి) చదవండి.
ఇక్కడ మాట్లాడుతున్నది స్థలాన్ని గురించైతే మధ్యలో మీరు కాలాన్ని తెచ్చి మరింత గడబిడ చెయ్యడం భావ్యమా!
బాగా పట్టేరు సుమండీ! లెక్కలపేపరులో స్పెల్లింగు మిస్టేకు దిద్దిన మా లెక్కల మాస్టారు గుర్తుకువచ్చారు 🙂 ఏదైనా, తప్పు తప్పే!
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/20/2008 11:07 pm
జీనియస్ జీనో
సూర్యం గారికి,
ద్విభాజక విరోధాభాస: సాధ్యమైనంతవరకు ఇంగ్లీషు వాడకూడదు అన్న సదుద్దేశం చాలా వరకు మేలు చేసినా కొన్ని వేళల్లో కీడు చేస్తుందనడానికి ఇది ఓ నిదర్శనమని ఒప్పుకుంటాను.
సున్నా విషయం: పూర్ణ సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు, అప్రధాన సంఖ్యలు, అని చదువుకోండి. సరిపోతుంది.
“పూర్ణ సంఖ్యల(Integers) సమితి సైజు వర్గ సంఖ్యల సమితి సైజు కన్నా చిన్నదా పెద్దదా సమానమా?” అని కామేశ్వరరావు గారు అడిగిన ప్రశ్నకి మీరు, “అనంతాలని పోల్చకూడదని హనుమంతరావు గారు రాశారు కదా?” అన్నారు. గెలీలియో అన్నడా మాట. కేంటర్ వచ్చి అవి రెండూ సమానమేనన్నాడు. వ్యాసంలో ఒకదానికొకటి జత చేసే విధానం మీద ఉదాహరణలతో వివరాలిచ్చాను. దీని గురించి ఎలాంటి సందేహమూ ఉండకూడదు.
“అనంతాల మధ్య కూడికలూ, గుణకారాలూ వుంటాయన్నారు. ఒక వుదాహరణ ఇచ్చి వుంటే బాగా అర్థం అయ్యేది,” అన్నారు. నిజమే. n సహజ సంఖ్య అయితే, అనంత సంఖ్యల (transfinite numbers) తో కూడికలకీ, గుణింతాలకీ కొన్ని ఉదాహరణలు:
א0 + n = א0
א0 x n = א0
א0 + א0 = א0
א0 x א0 = א0
కామేశ్వరరావు గారు చక్కగా విశదీకరించారు. థాంక్స్. కాని వారు చివరలో, “మనం కొలవలేనంతగా సున్నకి ఎప్పుడైతే దగ్గరవుతుందో,” అని వాదించి వైరుధ్యం తొలిగిపోయిందన్నారు. అయితే జీనో దీనిని చాలా సులభంగా తిరస్కరిస్తాడు! కొలవడం, కొలవలేకపోవడం అన్నవి తర్కానికి చెందవు.
సూర్యం గారూ, మీరు జీనో పారడాక్స్ లు గందరగోళంగా అర్థం పర్థం లేకుండా ఉన్నాయన్నారు. కామన్ సెన్స్ కి విరుద్ధంగా ఉన్న మాట వాస్తవమే. మీరు ఈ మధ్యన కనుక్కున్న గణిత సూత్రాల మూలంగా సాధించినదీ నిజమే. కాని జీనో వాదనలో తప్పు ఎక్కడ ఉందో మీరు చూప లేదు. నిజానికి అది అంత సులభం కాదు. అతని పారడాక్స్ లు సూక్ష్మం గానూ లోతుగానూ ఉంటాయి.
అనాది నుండి అనంతం గురించిన ఆలోచనలని స్థూలంగా వివరించి కేంటర్ ని ప్రవేశపెట్టాను. జీనో గురించి మరీ లోతుకు పోయే స్థాయి నాకు లేదు. కాని రస్సెల్ మాటలని మననం చేసుకుంటాను:
“In this capricious world nothing is more capricious than posthumous fame. One of the most notable victims of posterity’s lack of judgement is the Eleatic Zeno. Having invented four arguments all immeasurably subtle and profound, the grossness of subsequent philosophers pronounced him to be a mere ingenious juggler, and his arguments to be one and all sophisms. After two thousand years of continual refutation, these sophisms were reinstated, and made the foundation of a mathematical renaissance, by a German professor, who probably never dreamed of any connection between himself and Zeno”
“Although they have often been dismissed as logical nonsense, many attempts have also been made to dispose of them by means of mathematical theorems, such as the theory of convergent series or the theory of sets. In the end, however, the difficulties inherent in his arguments have always come back with a vengeance, for the human mind is so constructed that it can look at a continuum in two ways that are not quite reconcilable.”
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
11/20/2008 10:36 am
“ద్విభాజక విరోధాభాస” తెలుగు అవొచ్చేమో అనుకుంటే నవ్వొచ్చింది.
కామేశ్వర రావు గారు రాసింది:
నాకు తెలిసి, ఇది మాత్రం కరెక్టు కాదు. అట్లా అనిపిస్తుందేమో, కాని కాదు. Do you remember, “Good Scientific Hypotheses Can NOT Be Proven Correct!” ఇది నాది కాదు, ఒక ఫిజిసిస్ట్ ఉవాచ :).
కొడవళ్ళ గారి వ్యాసం చదవాలంటే భయమేసి ఆగాను. కానీ ఈ చర్చ మాత్రం చదివాను. Please Continue.
అన్నట్టు కామేశ్వర రావు గారూ:
ఒకవేళ తాబేలు తానున్న చోటు నుండి అసలు కదలదు మెదలదు అనుకుందాం (కాలం అనే ఒక డైమెన్షన్ దాన్ని ఒక చోట ఉండనీయదు అనుకోండి.) “అకిలీసు” ఒక వేళ పడీ పడీ ఎంతో వేగంగా తిరుగుతుందే అనుకుందాం. అప్పుడు కూడా “అకిలీసు” తాబేలు ను దాటుకుని వెళ్ళే ప్రసక్తే ఉండదు. కాంతి (కాలం) వేగంతో పోటీ పడితే తప్ప అకిలీసు తాబేలును దాటే ప్రసక్తే ఉండదు. ఒక వేళ కాంతి వేగాన్ని గనుక అనుకరిస్తే అకిలీసు తమ మధ్య ఉన్న దూరాన్ని పెరక్కుండా చూసుకోగలదేమో. లేకపోతే తాబేలెప్పుడూ ముందే 🙂 –[“ఎక్కడో ఒక చోట” లాంటి కండీషన్స్ వేరే చెప్పాలా!].
పార్వతి వినాయకుడిని తన చుట్టూ తిరిగి పందెం గెలవమనటానికి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి, అవిడకి లెక్కలు వచ్చినా రాకపోయినా! Somehow, Indian Economists are vindicated against their western counterparts who argued in favor of a rapid pace in reforms comes to my mind too.
“ఏ రకంగా చూసినా అకిలీసు తాబేలుని చేరుతుందన్నది స్పష్టం.”
అన్నట్టు, ఇది అసత్యం అని ప్రూవ్ చేసినంత మాత్రాన నేను చెప్పిందే సత్యం అవదు కదా! 😉
విప్లవ్
P.S. పదేళ్ళ “ఈ మాట” ప్రజల బుర్రలకు పని పెట్టే యాగాన్ని కొనసాగించాలని కోరుకునే వాళ్ళలో నేనూ ఒకడిని.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/19/2008 10:43 pm
Proof by Contradiction
సూర్యం గారికి,
నా వ్యాసాలు నచ్చాయని చెప్తే నాకు ప్రోత్సాహం కలుగుతంది. అర్థం కాలేదంటే, ముందు ముందన్నా ఎలా వివరించాలా అని ఆలోచన మొదలయి, అదీ ప్రోత్సాహాన్నే ఇస్తుంది. ఏ స్పందనా లేకపోతే, వీటివలన ఉపయోగమేమన్నా ఉందా అన్న సందేహం కలుగుతుంది. కాబట్టి మీరు మీ అభిప్రాయాలు నిష్కర్షగా చెప్తే లాభమే కాని ఏమాత్రం నష్టం లేదు. విరుద్ధ నిరూపణా విధానం అర్థం చేసుకోవడం అత్యవసరం కాబట్టి మరోసారి వివరించడానికి ప్రయత్నిస్తాను.
“అసత్య ప్రతిపాదనలు వైరుధ్యాలకి దారి తీస్తే, వాటిని అసత్యాలు కావు అని అనడంలో వున్న ఔచిత్యం అర్థం కాలేదు,” అన్నారు. మళ్ళీ మీరే, “ఒక ప్రతిపాదన సత్యం అని ప్రతిపాదించి, అది వైరుధ్యాలకి దారి తీస్తే, అప్పుడు అది సత్యం కాదు అని అనొచ్చు. అది అర్థం అవుతుంది,” అన్నారు. నిజానికి ఈ రెంటికీ విధానంలో తేడా లేదు! రెండిట్లోనూ ఓ ఊహ (assumption) తో మొదలెట్టి ఓ వైరుధ్యాన్ని చేరుకున్నాం కనుక ఆ ఊహ తప్పు అని తీర్మానిస్తున్నాం. మనం నిరూపించదలచుకున్నదానికి వ్యతిరేకమైనదానిని ఊహ గా తీసుకోవడమే ఈ నిరూపణా విధానం.
దీనికి ఓ మంచి ఉదాహరణ ఇస్తాను. అందరూ, ముఖ్యంగా కవులు:-), చదవాల్సిన పుస్తకం, మన రామానుజన్ ప్రతిభ ప్రపంచానికి వెల్లడి చేసిన GH Hardy రాసిన “A Mathematician’s Apology,” లోనిది. నిరూపించి రెండు వేల ఏళ్ళు దాటినా చెక్కు చెదరని అందం, కొత్తదనం కలిగి, అందరికీ సులభంగా అర్థమయే సిద్ధాంత నిరూపణ అని Hardy దీనిని వర్ణించాడు.
సంఖ్యలు రెండు రకాలు: ప్రధాన సంఖ్యలు (prime numbers), అప్రధాన సంఖ్యలు (non-prime numbers). ప్రధాన సంఖ్యని అదీ, ఒకటీ తప్ప మరే సంఖ్యా నిశ్శేషంగా విభజించలేదు. ఉదాహరణకి 2, 3, 5, 7, 11. ప్రతి అప్రధాన సంఖ్యా (ఒకటిని మినహాయించి) కొన్ని ప్రధాన సంఖ్యలని గుణిస్తే వచ్చే ఫలితమే. ఉదాహరణకి 6 = 2 x 3, 8 = 2 x 2 x 2, 9 = 3 x 3, 10 = 2 x 5. అంటే ప్రతి అప్రధాన సంఖ్యనీ కనీసం ఒక ప్రధాన సంఖ్య అయినా నిశ్శేషంగా విభజిస్తుంది.
ప్రధాన సంఖ్యలు అనంతమా? కాదా? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, … ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. ఈ శ్రేణి అనంతంగా కొనసాగుతుందా? లేక కొన్ని సంఖ్యల తర్వాత అంతమవుతుందా? అనంతం అని ప్రతిపాదిద్దాం. ఇది నిజమో కాదో నిరూపించడం ఎలా?
అనంతం కాదు అనే ఊహతో మొదలెడదాం. అనంతం కాకపోతే, అన్నిటికన్నాపెద్దదైన ప్రధాన సంఖ్య ఒకటుండి తీరాలి. దానిని P అందాం. అంటే ప్రధాన సంఖ్యల శ్రేణి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, … P తో ఆగిపోతుంది. ఇప్పుడో కొత్త సంఖ్య Q ని తయారుచేద్దాం:
Q = (2 x 3 x 5 x 7 x 11 x 13 x 17 x …x P) + 1
అన్ని ప్రధాన సంఖ్యలనీ హెచ్చించి, ఫలితానికి ఒకటి కలిపితే వచ్చే సంఖ్య Q. ఈ కొత్త సంఖ్య P కంటె పెద్దది; కాని P ప్రధాన సంఖ్యలలో కెల్లా పెద్దది కావడాన, Q ప్రధాన సంఖ్య కాదు. అలాగని Q అప్రధాన సంఖ్య కాదు; ఏ ప్రధాన సంఖ్యా దానిని నిశ్శేషంగా విభజించలేదు – శేషం ఒకటి వస్తుంది కనుక! Q ప్రధాన సంఖ్యా కాదు, అప్రధాన సంఖ్యా కాదు! అది వైరుధ్యం. ఈ వైరుధ్యానికి దారి తీసినదేమిటి? ప్రధాన సంఖ్యలు అనంతం కాదు అన్న ఊహ. ఆ ఊహే తప్పు. అంటే ఆ ఊహకి వ్యతిరేకమైనది ఒప్పు. అనగా ప్రధాన సంఖ్యలు అనంతం అన్నది రుజువయింది!
కొడవళ్ళ హనుమంతరావు
చంపకోత్పలమాలల కథ గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/19/2008 7:01 pm
“అర్థమశాశ్వతమ్ము” అనే ఉత్పలమాల వెయ్యేళ్ళ కింద శిలాశాసనం లో కాక, మూడేళ్ళ కింద “ఈ మాట” లోనో ఇంకో చోటనో ఎవరైనా వ్రాసివుంటే దానికి ఏ మాత్రం ప్రాముఖ్యం వచ్చేది అని సందేహం. శిలపైన కాబట్టి నిలిచింది కాని, జనాల నాలుకపై అది ఇంత పాతది అని చెప్పినా కూడా నిలుస్తుందా అని చెడ్డ అనుమానం. ఏదో మనకూ పాత పద్యాలున్నాయి, vintage wine లాగా అని చెప్పుకోవడానికి తప్ప, ఒక్కరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా దీనిని ఉదహరించి ఉటంకించే అవకాశం ఉంటుందా అని కూడా అనుమానమే.
ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. అటువంటి సందర్భమే వస్తే, పద్యమే చెప్పవలసి వస్తే దీన్ని వదిలి “కారే రాజులు రాజ్యముల్ గెలువరే.. వారేరీ సిరి మూటాగట్టుకొని పోవంజాలిరే..” లాంటి వెన్నో రసవంతమైన, బలవంతమైన వి స్ఫురిస్తాయి కాని ఇది తట్టుతుంది అనే ఆశ మాత్రం లేదు. కాదంటారా?
——-
విధేయుడు
-Srinivas
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/19/2008 8:47 am
సూర్య గారూ,
అసలేమీ అర్థం కాలేదా? కామన్ సెన్స్ కి విరుద్ధంగా ఉండటాన అనంతం తో కూడిన వ్యవహారం ముందర నమ్మబుద్ధి కాదు. అలాగని వదిలెయ్య కూడదు. “పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు” అని వేమన చెప్పినట్లు, మీరు చదవడానికి ఉపక్రమించారు కనుక అర్థమయిందాకా వదలకూడదు:-). ఈ వ్యాసంలో ఉన్నవి నాలుగు అంశాలు:
1. ఎన్ని సహజ సంఖ్యలు ({1, 2, 3, …}) ఉన్నాయో అన్నిసరి సంఖ్యలు ({2, 4, 6, …}) ఉన్నాయి! ఇది “మొత్తం, భాగం కన్నా పెద్దది” అన్న సామాన్య భావానికి విరుద్ధంగా ఉండటాన చాలా ఆశ్చర్యమయినది. ఒకదానికొకటి జతపరచే విధానం ద్వారా వివరించాను. దీనినే సంభాషణల ద్వారా తెలుసుకోవాలంటే గెలీలియో డయలాగ్స్ చదవండి. ఇది అర్థం అయేదాకా ముందుకు వెళ్ళకండి.
2. ఎన్ని సహజ సంఖ్యలున్నాయో, అన్ని సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, వర్గ సంఖ్యలు, … ఉన్నాయని తెలుస్తుంది. అంతే కాదు, భిన్న సంఖ్యలు కూడా సహజ సంఖ్యలన్నే ఉన్నాయని కేంటర్ చూపాడు. దీనితో అనంతం ఒకే ఒక సైజులో (సహజ సంఖ్యలెన్ని ఉన్నాయో ఆ సైజులో) ఉన్నదన్న అనుమానం వస్తుంది. అలా కాదు, వాస్తవ సంఖ్యలు (real numbers – వీటిని దశాంశ పద్ధతిలో రాస్తాం) సహజ సంఖ్యల (natural numbers) కన్నా ఎక్కువ ఉన్నాయని కేంటర్ రుజువు చేశాడు – వికర్ణ విధానం (diagnonal proof) ద్వారా. (ఇది మీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్తే, మళ్ళీ ప్రయత్నిస్తాను.)
3. దానితో అనంతం కనీసం రెండు సైజుల్లో ఉందన్నది విశదమయింది. కేంటర్ అంతటితో ఆగక అనంతం అనంత సైజుల్లో ఉన్నదని power sets ని తీసుకొని మళ్ళీ వికర్ణ విధానం ద్వారా నిరూపించాడు. (దీనికి అవసరమయిన సమితుల సిద్ధాంతాన్ని క్లుప్తంగా పరిచయం చేశాను.)
4. కేంటర్ నిరూపణలకి విరుద్ధాలని (proof by contradiction) వాడుకున్నాడు. A అన్న ప్రతిపాదన ఉందనుకోండి. మనకి తెలిసిన, అంతకు ముందే నిరూపించిన వాటి ఆధారంగా A ని రాబట్టితే, దానిని నిర్మాణాత్మక నిరూపణ (constructive proof) అంటారు. మనం హైస్కూల్లో నేర్చుకున్న చాలా రేఖా గణితపు సిద్ధంతాలు అలాంటివే. proof by contradiction వేరే విధానం: A అసత్యం అని మొదలెట్టి, మనం అంతకు ముందే నిజమని తెలుసుకున్న దానికి విరుద్ధమైన దానితో ముగించడం. అంటే ఏమిటి? మనం మొదట్లో అనుకున్నది – A అసత్యం – తప్పన్న మాట – అదే విరుద్ధానికి దారి తీసింది; అది తప్పయితే A నిజమని ఒప్పుకొని తీరాలి! కాని ఈ విధమైన నిరూపణని అనంత సమితులకి వర్తించడాన్ని చాలా మంది గణిత మేధావులు ఖండించారు. ఆ విధంగా గణితంలో కలహాలొచ్చాయి. చిత్రంగా అవి కంప్యూటర్ కనుక్కోడానికి కారణమయ్యాయి.
అదీ విషయం. 1, 4 సులభంగానే అర్థం అవుతాయి; 2 కూడా అర్థం కావాలి – మళ్ళీ ప్రయత్నించండి. 3 కి చిన్నప్పుడు చదివిన వాటిని కాస్త గుర్తు తెచ్చుకోవాలి.
కనీసం చదివి అర్థం చేసుకోడానికి ప్రయత్నించినందుకు కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
చంపకోత్పలమాలల కథ గురించి lyla yerneni గారి అభిప్రాయం:
11/19/2008 8:07 am
‘అర్ధ మశాశ్వతమ్ము…’ పద్యం అర్థం తెలుపమంటే, మీరు ఎందుకో నన్ను గురించి ఆలోచిస్తున్నారే. 🙂 మీ పై మాటలు ఈ పద్యం అర్థం తెలుసుకోటానికి, ఎవరికీ (నాతో సహా) ఉపకరించవు. మీకు పద్యం అర్థం తెలిస్తే ఇప్పటికీ చెప్పవచ్చు. మరి నాకిప్పటికీ ఈ ఉత్పలమాలకు అర్థం లేదనే అనిపిసున్నది.
ఈ రచయిత వ్యాసం నేను చదివాను. చదువుతున్నాను. ఎన్నో విషయాలు తెలిసికుంటున్నాను. తరువాత అభిప్రాయాల్లో – ఈ పద్యం, తొలి ఉత్పలమాలల్లో ఒకటి ఐవుండవచ్చునని చారిత్రక పరమైన కుతూహలంతో దీన్ని మనకు ఇప్పుడు తెలిపారు. చరిత్ర మీద దృష్టితో కొందరు చర్చ సాగించుకోవచ్చు. ఈ సందర్భంలో పద్యానికి వివరణ ఇవ్వటం వ్యాస రచయిత ఉద్దేశం కాదనుకుంటాను. వారు, పద్యం లో ఉన్న మాటలను వచనంలో పేర్చారు. వాడిన కొన్ని మాటలు పద్యం లో ఉన్న మాటలంత కఠినంగానూ ఉన్నాయి. ఈ వచనము పద్యభావాన్ని తెలుసుకోటానికి పనికి రాలేదు.
కుతూహలంతో, వేమన శతకం తీసి మొదటి పేజీ చూశాను. అందులో మొదటి పద్యము 🙂
ఆ. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళ్కుబెళ్కు రాళ్ళు తట్టెడేల?
చదువు పద్యమరయ జాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ.
ఈ పద్యానికి నా వద్దనున్న పుస్తకం లో ముందు టీక ఇచ్చారు. అందువల్ల పద్యములోని ప్రతి పదమునకు గల అర్థము తెలిసినది. తర్వాత ఈ కింది విధంగా తాత్పర్యము ఇచ్చారు.
తా. అన్నియును ఇచ్చునట్టి పరమాత్మ యందు ఒప్పిన వేమన్నా వినుము. ఏ రీతిగా వట్టి రంగులు కల మట్టిరాళ్ళు గంపెడయినను ఇంద్రనీలమణితో సాటిగావో ఆ రీతిగానే, మంచిపద్యము ఒక్కటి యయినను చాలును అని భావము.
ఈ వేమన పద్యపు భావము నాకు తెలిసినది. మరి ఇప్పుడు మనము చర్చిస్తున్న పద్యము ఒక పాత ఉత్పలమాల. ఆ పాత దనానికి “antique value” ఉందేమో. ఉండొచ్చు. కాని ఇది గులక రాయా? ఇంద్రనీలమణియా ? అని నేను అడుగుతున్నాను.
చిత్తము. నేను ఇక్కడ చేస్తున్న పనే అది. ఈ ఉత్పలమాల పద్యము భారతీయ సాహిత్యము లోనిదే గదా. ఈ పద్యం తెలుసుకుంటే కొంత చదివినట్లే. మరి నా అనుమానం ఈ పద్యానికి అర్థం లేదని. అర్థరహితమైన పద్యము ఎప్పుడైనా కాని గణనీయమెలా అవుతుంది?
ఈ ఉత్పలమాల పద్యానికి టికా తాత్పర్యాలు ఇచ్చి, పద్య చర్చకు దోహదం చెయ్యండి. చక్కని భావమున్నదా పలువురు ఆనందిస్తాను. లేదా ఈ పద్యం అందంగా వినవస్తుంది కాని, అసలు అర్థం పర్థం లేదు అన్న విజం నిరూపించబడుతుంది. నిదానంగానే చదువుకుంటాను సాహిత్యాన్ని. నాకు తొందరేం లేదు. ఒకవేళ నాలో ఉన్న దోషాల వల్ల నాకు తెలియక పోయినా – పద్యానికి అర్థమంటూ ఉంటే, వేరే కొందరికైనా తెలుస్తుంది కాదా.
లైలా
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/16/2008 12:58 pm
మాలతి గారికి,
కల్పన గారు “మైలురాయిగా పొగిడారు” అని రాయడంలో నేను వ్యంగ్యాన్ని సూచిస్తే అది నా తప్పే. మైలురాయి అవునో కాదో తెలుగు సాహిత్య చరిత్ర లోతుపాతులు తెలిసిన వాళ్ళు నిర్ధారించాలి, నేను కాదు. నా దృష్టిలో మీ పుస్తకం కొత్త వెలుగుని ప్రసరించేదీ, కొంత వివాదాస్పదమైనదీ, తెలుగు సాహిత్యాభిమానులు చదవ్వలసినదీ. తగిన ప్రాచుర్యం వస్తుందనీ, విస్తృతంగా చర్చిస్తారనీ ఆశిస్తాను.
పుస్తక ప్రచురణలో సాధక బాధకాలు నాకు తెలియవు. సాహితీ చరిత్రకి గిరాకీ లేకపోవచ్చు కాని అవసరం ఉంది. ఇలాంటి పుస్తకాలని తెలుగులో ప్రచురించడానికి సహాయం కావలసిన వాళ్ళు తానా ప్రచురణ వాళ్ళని సంప్రదించండి; రచ్చబండ లోనో, ఈమాట లోనో, మీ వెబ్ సైటులోనో ఓ మాట వెయ్యండి. ఓ చెయ్యిచ్చే వాళ్ళుండకపోరు. పరపతి ఉంటేనే ప్రచురించుకునే దుస్థితికి తెలుగు సాహిత్యం దిగజారకూడదు.
మీ పుస్తకం మీద “చిరు సమీక్ష” లాంటిది రాయాలనే ఉద్దేశం ఉంది. వీలు చూసుకొని రాయాలి.
కొడవళ్ళ హనుమంతరావు
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి malathi nidadavolu గారి అభిప్రాయం:
11/16/2008 5:12 am
హనుమంతరావు గారు,
అయితే మీరు దోషాలు అన్నది కేవలం మీడియమ్ విషయంలో అని అర్థం అయింది. నా పుస్తకం ప్రధాన భాగంలో కూడా మీకు దోషాలుగా తోచినవి చెప్పండి.
మీరు అన్న incongruity నాకు తోచలేదు. తెలుగువాళ్లకే “ప్రతిపాదనలని చర్చించి, విమర్శించవలసిన అవసరం ఎక్కువ“ అన్న మాట కొంతవరకూ నిజం కావచ్చు. నా అభిప్రాయాలు మరోసారి చెప్తాను.
1. తెలుగు పరిశోధకులూ, విమర్శకులూ, నాపుస్తకం స్థాయి పుస్తకాలు చదివేవాళ్లూ ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదువుతున్నారు. మన తెలుగు పరిశోధకులు, విమర్శకులు ప్రచురించిన పుస్తకాలలో ఉపయుక్త గ్రంథాల జాబితా చూస్తే ఇది స్ఫష్టం.
2. తూలిక 8 ఏళ్లగా నడుపుతున్నాను. తూలిక పాఠకుల్లో సగం మంది తెలుగువాళ్లే. — ఇంగ్లీషుబళ్ళలో చదువుకున్న తెలుగువాళ్లూ, ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు అయిపోయిన తెలుగువాళ్లూను. అంచేత నిజంగా చదవాలనుకుంటే భాష అడ్డు వస్తుందనుకోను.
3. నాపుస్తకం ఇండియాలో ప్రచురించడానికి నానా విధాలా ప్రయత్నించాను. దేశవ్యాప్తంగా, ఇతర భాషలలో స్త్రీల రచనలు పరిశీలించేవారికి కూడా ఉపయోగంగా వుంటుందని నా అభిమతం. కాని అది జరగలేదు.
4. పోతే కల్పన నాపుస్తకాన్ని “మైలురాయిగా పొగిడారు“ అన్నారు. ఇంతకుముందు ఈ విషయంమీద ఇంత వివరంగా చర్చించిన పుస్తకాలు ఏమైనా దృష్టికి వచ్చివుంటే చెప్పండి. మరి.
5. ఇంక అందుబాటు మాట అంటారా. నాకున్న పరపతీ, నేనున్న పరిస్థితుల్లో తెలుగులో రాసినా ఎవరూ కొనరు. ఆవిషయంలో నేను చేయగలిగినది ఏమీ లేదు.
6. మీరు చెప్పిన ఇండెక్స్, వేలూరి సలహా వివరణలు చివరికి మారిస్తే బాగుంటుంది లాటివి నాకు createspace.com ఒప్పందం ప్రకారం సాధ్యం కాదు. అక్షరదోషాలు దిద్దడం మాత్రమే సాధ్యం.
పుస్తకం తిరిగి మార్కెట్ లో వుంది. కావలసినవారు నాకు రాయండి. లేదా ఎమెజాన్.కామ్ లో చూడండి.
మీ ఆదరణకి ధన్యవాదాలు.
మాలతి.
రామా కనవేమిరా! గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/15/2008 2:29 pm
“కలడు కలండనెడు వాడు కలడో లేడో?”
ఆధునిక సాహిత్యంలో దేవుళ్ళూ దయ్యాలూ ఉంటే అభ్యంతరం లేదు కాని, మనుషుల్ని దుర్బలులుగా చూపెడితే ఏమిటి ప్రయోజనం? మానవ ప్రయత్నానికి కదా విలువ నివ్వమని ఘోషించేది – ఆస్తికులూ, నాస్తికులూ కూడా.
నిష్ట పాటించని భక్తుని కాళ్ళు బొబ్బలెక్కేలా వేన్నీళ్ళతో కాల్చి, కేవలం సాంబారుతో కడుపు కాల్చి, కార్ల టైర్లు పగలగొట్టి, దేవుడు బుద్ధి తెప్పిస్తే, భక్తుడు చెంపలేసుకొని సన్మార్గుడవుతాడు – ఇక జన్మలో ప్రదక్షిణం చేసికాని ప్రసాదం పుచ్చుకోడు! దీంట్లో ఆస్వాదించాల్సిందేమిటి? హాస్యమా?
కొడవళ్ళ హనుమంతరావు
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/15/2008 1:03 pm
మాలతి గారికి,
నేను మేధావినీ కాదు, పండితుణ్ణీ కాదు. అందుకు కావలసిన అర్హతలు నాకు తెలుసు – దీంట్లో false modesty ఏమీ లేదు. నేను రాసేవి కాస్త చదువుకున్న పాఠకులు చర్చించగల విషయాలే కదా.
పుస్తకం తెలుగు రానివారి కోసం రాస్తున్నానని మీరు ముందుమాటలో చెప్పారు, నిజమే. కాని దాని ముందర మీరీ పుస్తకం రాయడానికిచ్చిన కారణాలు చదివితే ఇది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.
ముఖ్యంగా, మీరు తీసుకున్న రచయిత్రుల మీద సమగ్రమైన సాహిత్యవిమర్శ రాలేదన్నారు – తెలుగులోనే రాలేదని నేనర్థం చేసుకున్నాను; ఇక ఇంగ్లీషు గురించి చెప్పేదేముంది? అకడెమిక్ వాళ్ళు పాత సాహిత్యం మీదా, పత్రికల వాళ్ళు ప్రస్తుత సాహిత్యం మీదా కేంద్రీకరించడాన, ఈ మధ్య చరిత్ర నెవరూ పట్టించుకోలేదని విచారించారు. మీరీ కార్యం తలపెట్టకపోతే అసలీ సాహిత్యమే కనుమరుగైపోయే ప్రమాదముందన్నారు. మీరు మొదలెట్టిన పనిని తెలుగు పండితులు ముందుకు తీసుకుపోవాలని అభిలషించారు. ఈ కారణాలన్నీ ఇచ్చి వెంటనే ఇది తెలుగు రానివాళ్ళ కోసం రాస్తున్నానడం విరుద్ధంగా (incongruent) అనిపిస్తుంది.
కల్పన గారి ముందు మాటలో కూడా మీ కృషిని మన సాహితీ చరిత్రలో ఓ మైలురాయిగా, ఇప్పటివరకూ వచ్చిన మూస చరిత్రను ఛేదించేదిగా పొగిడారు. ఇది ముందర చేరవలసింది తెలుగు వాళ్ళకేనని నా అభిప్రాయం. పరులకి తెలపడాన నష్టమేమీ లేదు కాని మీ ప్రతిపాదనలని చర్చించి, విమర్శించవలసిన అవసరం ఎక్కువ ఎవరికి? తెలుగు చదివే వాళ్ళకి. మరి వాళ్ళలో ఎంతమందికి మీ పుస్తకం చేరుతుంది?
అందుబాటులో ఉన్న ఇంగ్లీషు వచ్చిన తెలుగు వాళ్ళయినా చర్చిస్తారని ఆశిద్దాం.
మార్కెట్ లో ఉన్న పుసకంలోని తప్పులు దిద్దడం కోసం తాత్కాలికంగా అమ్మకాల్ని ఆపడం, మీ అంకిత భావానికి మరో తార్కాణం. వీలయితే, సమయం మించిపోకపోతే, పుస్తకానికి ఇంగ్లీషు పుస్తకాలలో చాలా సామాన్యంగా ఉండే పద పట్టిక (index) ని చేర్చమని మనవి.
కొడవళ్ళ హనుమంతరావు
బాలమురళీకృష్ణ సంగీతం గురించి Rao Pamganamamula గారి అభిప్రాయం:
11/13/2008 9:57 am
సరిగ్గా నలభై సంవత్సరాల క్రిందట బాలమురళిగారి కచేరిని నేను దెహ్రాదూన్ లోవిన్నాను. అక్కడకు వచ్చేముందు ఆయన ఢిల్లీలో కూడా కచేరి చేశారు. అప్పుడు హిందూ పత్రికలో వచ్చిన తమిళ రసికుని విమర్శేమిటంటే బాలమురళి రెండవ స్థాయి వాద్యకారులను పెట్టుకొని తాను వెలిగిపోయే ప్రయత్నాలు చేశారని. ఆకారణంగానో మరెందువల్లనో గాని ఆయన దెహ్రాదూన్ చేరుకొనేసరికి వాయులీన సహకారుడు లేకుండాపోయాడు. స్థానిక ఆహ్వానసంఘంవారు అక్కడే హిమాలయన్ రేడియో ప్రోపగేషన్ సెంటరు లో పనిచేస్తున్న శ్రీ ఎ వి యస్ కృష్ణారావు గారిని యేర్పాటు చేశారు. కృష్ణారావుగారి వయొలిన్ వాదనను అంతకు ముందు ఆంధ్రాయూనివర్శిటీ రోజులనుంచీ విన్నవారెందరో సభలో వున్నారు. ఆనాటి చాలామంది శ్రోతలలో యేర్పడిన అభిప్రాయమేమిటంటే బాలమురళి గాత్రంకన్నా వాయులీన సహవాద్యమే ఒకమెట్టుపైనవుందని. ఒకటి రెండు సార్లు కృష్ణారావుగారిని పక్కకునెట్టే ప్రయత్నంచేసి సఫలంకాకపోగా చివరకు వారిని అభినందించక తప్పని పరిస్తితి యేర్పడ్డది. అమెరికాలో గత పుష్కరకాలంలో ఆయనను చాలా కచేరీల్లో చూశాను, విన్నాను. కాని ఆ నాటి ధోరణి కనపడలేదు. మరి అప్పటి ప్రవర్తనకు వర్ధమాన గాయకులకుండే భద్రతారాహిత్యమేనా కారణం? లేక తోటి కళాకారులపట్ల గౌరవంపెరిగిందా?
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
11/12/2008 10:44 am
సాయి బ్రహ్మానందం గొర్తి గారూ:
మీ వ్యాసం చాలా బాగుంది. ఎన్నో పుస్తకాలను తిరగేసి, చాలా మందిని సంప్రదిస్తే తప్ప ఇటువంటి మంచి వ్యాసం రాదు.
త్యాగరాజుపై ప్రజాభిప్రాయం మీరు రాసిన దానికన్నా ఎందుకు భిన్నంగా వస్తూ ఉందో తెలియదు. త్యాగబ్రహ్మ కటిక పేదరికం అనుభవించాడని అందరిలాగే నేనూ అనుకొనేవాడిని. కాని, దానికి భిన్నంగా తగినంత ఆస్తిపరుడేనని మొన్న మొన్న తెలిసింది.
త్యాగరాజు మీద నాకు చాలా ఎక్కువ గౌరవం. అయితే, నన్ను ఎప్పుడూ ఒక్క విషయం కలవరపెడుతుంది. సంగీతంలో అనుమానం లేకుండా అసామాన్య ప్రతిభ కలవాడైనా, సాహిత్యకారుడుగా ఈయన గొప్పతనం ఎంతవరకు పెద్దలు ఆమోదించారు? భక్తి రసం పోషణ ఈయన సాహిత్యం అంతా అతి చక్కగా తెలుస్తూనే ఉంటుంది. కానీ, సాహిత్యంలో భక్తి రసం పోతన తీసుకెళ్ళిన ఎత్తులు, మరెవరూ చేరలేరేమో!
సాహిత్యంతో బాగా పరిచయమున్న విజ్ఞులు దీనికి సమాధానం చెప్పగలరేమో!
అభినందనలతో,
లక్ష్మన్న
పదేళ్ళ “ఈమాట” మాట గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/08/2008 11:49 am
వ్యాసాల్లో వైవిధ్యం
ఈమాట జన్మానికి కారకులైన రామారావు గారికి అభినందనలు, కృతజ్ఞతలు. “వ్యాస విభాగం రాశిలోనూ, వాసిలోనూ పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా వుంది… వస్తువైశాల్యంతో పాటు …,” అని వారు అన్న దానితో నాకు భేదాభిప్రాయం ఉంది.
వ్యాసాల్లో ఎక్కువ భాగం సంగీత, సాహిత్య, విజ్ఞాన శాస్త్రాలకి పరిమితం. అది చాలదా, అంతకన్నా వైవిధ్యమేముంటుంది? అనిపించవచ్చు. కాని ఇవి ‘విషయభారమైన’ వ్యాసాలు; కొన్నయితే, జర్నల్స్ పేపర్లలాగా రెఫరెన్సుల జాబితాలతో సహా ఉంటాయి. 🙂 మహానుభావులు, విజ్ఞానవేత్తలు, కళాకోవిదులు – వీళ్ళ ప్రస్తావన లేని వ్యాసం అరుదు. ఇది ప్రవాసాంధ్రులలో ఉన్న లోపమా అన్న అనుమానం వచ్చింది.
కాని తన వచనం తన కవితలకే మాత్రమూ తీసిపోదని గర్వంగా చెప్పుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాసావళిని చూస్తే వాళ్ళ ఊళ్ళోని రావిచెట్టు మీద చెప్పిన ఓ అమూల్యాభిప్రాయం లాంటి ఒకటి రెండింటిని మినహాయిస్తే, మళ్ళా మహావ్యక్తులు, కవుల పరంపర, కవితా ప్రశస్తి – వాటికే ప్రాధాన్యత. వచనం చెప్పుకోదగ్గదేగాని, వైవిధ్యమెక్కడ?
కుప్ప తెప్పలుగా వ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబరావు ని తిరగేస్తే, “కళలు-శాస్త్రీయ విజ్ఞానం,” “సాహిత్య ప్రయోజనం,” “చరిత్ర వ్యాసాలు,” … – మళ్ళా అన్నీ విషయభారమైనవే!
సాహితీ ప్రక్రియలన్నిటిలోకీ సుళువైనదీ, అనేకానేక విషయాలకి అనువైనదీ, వ్యాసం: “There are as many kinds of essays as there are human attitudes or poses, as many essay flavors as there are Howard Johnson ice creams. The essayist arises in the morning and, if he has work to do, selects his garb from an unusually extensive wardrobe: he can pull on any sort of shirt, be any sort of person, according to his mood or his subject matter — philosopher, scold, jester, raconteur, confidant, pundit, devil’s advocate, enthusiast.” — EB White.
ఈమాట వ్యాసాల్లో కూడా వైవిధ్యం పెరగాలి. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు వేరే విషయాల మీద కూడా దృష్టిసారించాలి. రాయనివాళ్ళు ఇదో బ్రహ్మవిద్య కాదని గ్రహించి ప్రయత్నించాలి.
అలాగని వ్యాసాలు రాసి పేరుప్రతిష్టలు గడించాలనుకుంటే అది దురాశే. ఆ భాగ్యం కలగాలంటే కవితలూ, కథలూ, నవలలూ రాయండి. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అన్న పాదం మన భాష ఉన్నన్నాళ్ళూ నిలుస్తుంది. పూలు పూసినంత కాలం “ఓ పువ్వు పూసింది” చదువుకుంటాం. “అతడు-ఆమె,” మనం, మధ్య సంబంధాల మాటొచ్చినపుడల్లా శాంతం గారు మన మనసులో మెదులుతూనే ఉంటారు. అందుకే వాటికున్న యోగ్యత వ్యాసాలకి లేదు, ఉండబోదు.
అందుకే సాహిత్యకారుల్లోకెల్లా కవులకీ, కథకులకీ, నవలాకారులకీ పెద్ద పీట. అందుకు తగ్గట్టుగా ఈమాట రచయితలు ఎదుగుతారని ఆశిస్తూ,
కొడవళ్ళ హనుమంతరావు
సువర్ణభూమిలో … గురించి lyla yerneni గారి అభిప్రాయం:
11/07/2008 4:57 pm
“కాని కవికి గౌరవం చూపాలి, కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు….
“సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు,వాటిని చదివి ఆనందించవచ్చు…”
-mOhana అభిప్రాయం
కవిత్వంలో పొరలు ఉన్నట్లే, ఈ మాటలలో కూడ ‘ధ్వని’ ఉన్నది. An implied meaning. అది మీరు ఏ మాత్రం ఉద్దేశించి ఉండరు. కాని వేరే చెవులకు అలా వినిపిస్తుంది. అది ఏమిటంటే – చర్చలలో – ప్రశ్న అడిగినప్పుడల్లా, కవితో వ్యతిరేకించినప్పుడల్లా, ఇది మాకు నచ్చలేదు -అని ఒక పాఠకుడు వ్యక్త పరిచినపుడల్లా, మరొక పాఠకుడు వచ్చి -కవిని గౌరవించాలనీ, కవి మనకు తెలియని విషయాలు పరిచయం చేస్తున్నందుకు ఋణపడి ఉండాలనీ – ఇలాటి మాటలు మళ్ళీమళ్ళీ రాయటం.
ప్రశ్నలు అడిగిన వారికి కవిమీద గౌరవం లేదు – అన్న ధ్వని ఈ మాటలలో వినిపిస్తుంది. అది మంచిది కాదు. చాలా పాత పద్ధతి. సత్వరం మానివెయ్యాల్సిన పద్ధతి. ఈ పద్ధతి ప్రశ్నలు రాసే వాళ్ళను విముఖులను చేస్తుంది. విషయాలు నేర్చుకోటానికీ, తమ అభిప్రాయాలు వ్యక్త పరచటానికీ ప్రతిబంధకమవుతుంది. మనుషులు అందరూ ఒకరినొకరు గౌరవించుకోవలసిన అవసరం ఎప్పుడూ ఉంది. ఆ ఆదరానికి నోచుకోటానికి కవులూ, పండితులే కానక్కర్లేదు. కాబట్టి కవితలని గూర్చిన వాదాల్లో- కవులను గౌరవించాలి అని బోధలు అవసర్ల్లేదు.
మనకు అర్థం ఐన కవితలను గురించి అభిప్రాయాలు రాసుకుని, అర్థం కాని వాటిని గురించి మౌనంగా ఉంటే, కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటాము? అర్థం కాని వాటిని గురించి ఎందుకు అడగ్గూడదు? చేతనైన వాళ్ళు చెపుతూనే ఉండాలి. చెప్పినందువల్ల ఈ కవిత కొంతైనా అర్థమయిందికదా.ఈ కవి రచనలు మరింత చదివిన కొద్దీ, ఇంకా ఎక్కువ అర్థమయ్యే అవకాశం ఉంది.
ఐనా, కవులు, పాఠకులు, అని వర్గాలు -అన్ని వేళలా లేవే. పండితులూ, కవులూ సర్వ వేళలా గురువులే కారే. వారు శిష్యులు కూడా. ఒకరి ప్రశ్నలూ, అభిప్రాయాలనుంచి ఇంకొకరు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు కాదా.
కవిని గౌరవించక పోతే కవిత్వం మనుషులకు అర్థం కాదా ఏమిటి? ఈ కవి చెప్పిన ప్రకారం ఒక్క ప్రియురాలి మనసు తప్ప అందరికీ అన్నీ అర్థం అయ్యే అవకాశం ఉన్నట్లే ఉంది మరి.
లైలా
సువర్ణభూమిలో … గురించి mOhana గారి అభిప్రాయం:
11/07/2008 3:29 pm
మొన్న డెట్రాయిట్లో జరిగిన సమావేశంలో (నా సమీక్ష చూడండి) కవితల పైన ఒక సదస్సు ఉండింది. అందులో కవితలో పొరలు పొరలుగా అర్థం ఉండాలి అన్నారు ఒకరు. కాని అలా రాస్తే పాఠకులకు అర్థం అవుతుందా అనే ప్రశ్నకు ఈ చర్చ జవాబు అనుకొంటాను. ఇందులో ఎన్నో పొరలు ఉన్నాయి. ఎవరికి కావలసిన అర్థాలు వారు కల్పించుకోవచ్చు. కొన్ని రచయితకు కూడా తోచిఉండక పోవచ్చు. ఉదాహరణకు బుద్ధుని శిరస్సు, మొండెము. దీనిని చదువగానే నాకు తోచింది ఎప్పుడో చదివిన షెల్లీగారు రాసిన ఓజిమాండియస్ అనే సానెట్. అందులో కూడా విరిగిన ఓజిమాండియస్ శిలావిగ్రహం ఎడారిలో ఉంటుంది.
My name is Ozymandius, King of Kings,
Look on my works, ye Mighty, and despair!
అని అంతమవుతుంది. నిరంకుశుని ఎవరూ తలచుకోరు. ఆ విగ్రహంలోని కళను తప్ప, దాని కారకుడు శిల్పి. బుద్ధుని విగ్రహం విరిగి ఉన్నా, బుద్ధుని ఇప్పుడు కూడా పూజిస్తూనే ఉన్నారు కలువలతో. మనం ఎలా జీవిస్తున్నామో అన్నదే ముఖ్యం అనే ఒక భావన కలుగుతుంది ఈ పంక్తులు చదివిన తరువాత. ఈ ఊహ అందరికీ కలుగకపోవచ్చు. కాని పొరలు పొరలుగా ఉండాలి కవిత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక కవిత మంచిదో కాదో అనే దానికి తూనిక రాళ్ళు ఎలాగ ఉండాలో చెప్పలేము (వేలూరిగారి వ్యాసం చదవండి). కవిత మంచిదైతే కలకాలం నిలుస్తుంది, లేకపోతే తెలుగు సినిమాలా ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కాని కవికి గౌరవం చూపాలి,
కవితను చదవాలి, అర్థం చేసికొనడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని కష్టలు పడ్డా ఒక్కొక్కప్పుడు అర్థం కాదు. అది మన దురదృష్టమే కాని కవి తప్పు కాదు. సులభంగా అర్థమయ్యే కవితలు కూడా సంచికలో ఉన్నాయి, వాటిపైన వ్యాఖ్యలు రాయవచ్చు, వాటిని చదివి ఆనందించవచ్చు. నేను పారిస్ వెళ్లినప్పుడు పోంపెదూ మ్యూసియంకి వెళ్లాను. అది మాడర్న్ ఆర్ట్ పైన. అందులో కొన్ని నాకు ఇంకా అర్థం కాలేదు. కాని ఉత్తమ కళాకారులచే సృష్టించబడినవి అవి. దానిని రసాస్వాదన చేయలేకపోవడం నా తప్పే గాని మ్యూసియం వారిది మాత్రం కాదు. విధేయుడు – మోహన
సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/07/2008 1:15 pm
కామేశ్వరరావు గారు
ముందుగా, నచ్చనిది మర్యాదగా, అవహేళన చేయకుండా చెప్పడాన్ని పూర్తిగా అంగీకరిస్తాను. నేను రాసింది, రాస్తున్నది అది కాదనే ఆశిస్తాను.
ఇక ఈ చర్చ, కవిత ఎంతమందికి అర్థం అవ్వాలి అని opinion poll లో తూచి వెలకట్టడం కాదనుకుంటాను. సొంతంగా ఎంతవరకు కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడానికి వీలవుతున్నది అన్నదే ప్రశ్న అనిపిస్తుంది. కనీసం దేనిగురించో అన్నదైనా తెలియవీలవుతుందా అని కూడా.
కవిత యొక్క శీర్షిక “సువర్ణ భూమిలో…” అన్నారు. థాయలాండ్్ ని “సువర్ణభూమి” అని అంటారని చదవలేదు, వినలేదు. తెలిసిన వారు చెప్ప మనవి. థాయ్లాండ్్ పూర్వనామం సియాం. సియాం కు సంస్కృతంలో ఉన్న “శ్యామ” కు సంబంధం ఉంది. “శ్యామ” అంటే నలుపు, నీలం కాని సువర్ణమని తోచడంలేదు. ఇదంతా ఎందుకంటే, థాయలాండ్్ గురించి ఎక్కువగా తెలియని వారికి, ఈ కవిత అందించిన సామగ్రితోనే దానిని ఆస్వాదించడం కష్టం. మోహనగారు, మీరూ, చెప్పింతర్వాత కొంత background తెలిసి ఇది అసలు దేనిగురించో అన్న చిక్కుముడి వీడింది. అది చాలు పాఠకునికి ఊరటనివ్వడానికి.
కవితను ఆస్వాదించడం పక్కకు పెట్టి, అసలు దేనిగురించి చెబుతున్నారో కూడా తెలియని అయోమయ స్థితిని నివారించడం రచయిత బాధ్యతే కాదు, politeness to readers అనిపిస్తుంది. ఏం చెప్పారో అని కాదు, దేని గురించి చెప్పారో అన్నదే తేలకపోతే గందరగోళం. సమయం వెచ్చించి, కష్టపడి చదివితే, దేనిగురించి చెప్పారో కూడా తెలియని స్థితిలో ఉంటే ఆ రచనను rude to readers అని ఎందుకు అనుకోకూడదో తెలియదు. That is no reason to be rude to writer in turn.
=============
Regards
-Srinivas
సువర్ణభూమిలో … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/07/2008 12:26 pm
ఇక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే మనుషుల్లో ఇంతటి అసహనం ఉంటుందా అన్న ఆశ్చర్యం కలుగుతోంది, బాధేస్తోంది. ఎందుకంటే,
1. మనకి ఒక కవిత నచ్చకపోతే (అర్థంకాకపోతే) అది నచ్చలేదని (అర్థం కాలేదని) మర్యాదగా చెప్పవచ్చు, అవహేళన చెయ్యాల్సిన అవసరం లేదు.
2. సరే కొంతమందికి అర్థం కాలేదని, మాకు అర్థమయిందేదో నేను, అలానే మోహనగారు చెప్పాం. మేమేమీ కొమ్ములు మొలిచిన పాఠకులం కాదు, మామూలు పాఠకులమే. మేమర్థం చేసుకున్నట్టుగా తక్కిన వాళ్ళు అర్థం చేసుకోవాలని రూలేం లేదు. అయితే దీన్నేదో కవితకి సమర్థింపుగా అనుకోవడంలో అర్థమేముంది? నాకు భూషణ్ గారు చుట్టమేమీ కాదు, అసలు నాకతనితో పరిచయమే లేదు, అతను నా అభిమానకవి అంతకన్నా కాదు. మరి దేనికి ఉట్టినే సమర్థిస్తాను? అసలు అతని కవిత బాగుంది అని కూడా నేననలేదే! మరి సమర్థింపు ఏమిటి?
3. ప్రతికవితా మనకి అర్థం అవుతుందన్న నమ్మకమూ లేదు, అవ్వాల్సిన అవసరమూ లేదు. మనకి అర్థం కాని కవితకి వేరెవరైనా తమకి తోచిన అర్థాన్ని చెపితే, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉచితమైన పని. “నేనలా అర్థం చేసుకోడానికి ప్రయత్నించను, నాకు ప్రతీదీ అప్రయత్నంగానే అర్థమవ్వాలి, అలా అవ్వకపోతే అది కవిత కాదు” అని అనుకోవడం మొండితనమే అవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు?
బాబాగారు, శ్రీనివాస్ గారు, బాబ్జీలు గారు,
కవితని ఒక పాఠకునిగా మనం అర్థం చేసుకొని ఎంతవరకూ ఆస్వాదించేం అన్నది ముఖ్యం కాని, అది ఎంతమందికి అర్థం అవ్వాలి? ఎక్కువమందికి అర్థమయ్యేట్టు కవి రాసాడా? అలా రాయకపోవడం కవి దోషమా ఇత్యాది వాదోపవాదనలు అవసరం అంటారా?
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/07/2008 7:19 am
మాధవ్ గారు,
మీరు మంచి లా పాయింటే లాగేరు కాని, మీరా ప్రశ్నవేసింది నన్నూ నన్నెచోడుణ్ణి కాదు, కాళిదాసుని 🙂 ఎందుకంటే ఈ పద్యానికి మూలం సంస్కృత కుమారసంభవంలో ఉన్న ఈ శ్లోకం:
స్థితాః క్షణమ్ పక్ష్మసు తాడితాధరాః
పయోధరోత్సేధ నిపాత చూర్ణితామ్
వలీషు తస్యాః స్ఖలితాః ప్రపేదిరే
చిరేణ నాభి ప్రథమోదబిందవః
కాకపోతే కాళిదాసు “చిరేణ” అంటూ నీటిబిందువులని నాభి దగ్గరకి కాస్త నెమ్మదిగా తెస్తే, నన్నెచోడుడు “రయంబున” పరిగెట్టించాడు.
అందమైన ఆడవారి సుందరాంగాలలో ఈ వళులు ఒక భాగం, కాబట్టి ఆ స్థితిలో కూడా పార్వతి తన సహజమైన అందాన్ని కోల్ఫోలేదని అనుకోవాలి!
సువర్ణభూమిలో … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/07/2008 6:22 am
బాబా గారు,
మీరు యదుకులభూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తర్వాత కవిత అర్థం కాకపోయినా ఏదో ఉండి ఉంటుందిలే అని అనుకున్నానన్నారు. నేను కూడా భూషణ్ గారి కవిత్వం, అతనికి కవిత్వంపై ఉన్న దృక్పథం రుచి చూడడం మూలానే, ఆ కవితలో చెప్పిన విషయం కాకుండా అంతర్గతంగా మరేదీ దాగి ఉండదని నిర్ణయించుకున్నాను!వినీల్ గారు గణితంతో చెప్పిన పోలికా, కవితలోంచి తీయడానికి ప్రయత్నించిన అర్థమూ చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నా అవగాహన మేరకు భూషణ్ గారు సరిగ్గా అలాటి దానికి వ్యతిరేకి! క్లుప్తత విషయంలో అతనన్నది నిజమే కాని, కవితలకి అస్పష్టతని తెచ్చి పెట్టే సాంకేతికత (symbolism) అంటే, నాకు తెలిసి భూషణ్ గారికి అసలు నచ్చదు.
చివరిగా మీరడిగిన మిలియన్ డాలర్ల ప్రశ్నకి నా రెండు సెంట్లు: మనవాళ్ళు “సహృదయత” అన్నది పాఠకుల విషయంలోనే చెప్పారు కాబట్టి, కవి హృదయాన్ని తెలుసుకోవలసిన బాధ్యత పాఠకులదే అని నా ఉద్దేశం. అది ఎక్కువమంది పాఠకులు చెయ్యగలిస్తే ఆ కవికి ప్రాచుర్యం లభిస్తుంది. ఎవరూ అర్థం చేసుకోలేకపోతే, ఆ కవి ఒంటరిగా మిగిలిపోతాడు!
సువర్ణభూమిలో … గురించి bollojubaba గారి అభిప్రాయం:
11/07/2008 12:01 am
పైన నేను చేసిన కామెంటుకి కొంత వివరణ
కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో సాధారణంగా పాఠకుడు ఉండటంలో తప్పుకాదుగా. ఎందుకంటే యదుకుల భూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తరువాత, కొంత ఎక్స్పెక్టేషన్ తో కవిత ను చదవటం, కొంత అర్ధం కాకపోయినా ఎదో ఉండి ఉంటుందిలే, అని సరిపెట్టుకోవటం, తోచిన రీతిలో అన్వయించుకోవటం సహజమే.
ఏది ఏమైనా ఈ పద్యాలు ఈ క్రింది ఇవ్వబడిన లింకులోని వారి కవితా సంపుటిలోని పద్యాల వలేకాక, కొంత అస్ఫష్టంగానూ, ప్రతీ ఒక వాక్యానికీ ఏదో ఒక భాష్యం చెప్పుకొంటే తప్ప అర్ధంకానట్లు గానూ ఉన్నాయన మాట వాస్తవం.
http://www.eemaata.com/em/category/library/nnn/
ఇక పోతే కవి పాఠకుని స్థాయికి తగినట్లుగా వ్రాయాలా, లేక పాఠకుడే కవి స్థాయికి వెళ్ళి చదవాలా అనేదీ ఎప్పటికీ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నే.
బొల్లోజు బాబా
సువర్ణభూమిలో … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/06/2008 12:09 pm
కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో ప్రతి కవితనీ శల్యపరీక్షకి గురిచేస్తే ఇలాటి అవస్థే ఏర్పడుతుంది కాబోలు!
నాకు చదవగానే కవిత చాలా తేలికగానే అర్థమైందనిపించించి! కవి థాయిలాండు యాత్ర చేసాడు. ఆ యాత్రలో అతని మనఃఫలకంపై బలంగా ముద్రపడిన కొన్ని దృశ్యాలను, మిగిల్చిన అనుభూతిని యథాతథంగా పదాలలో చిత్రించే ప్రయత్నం ఈ కవిత అని నా కనిపించింది.
ఆ తర్వాత వెతికితే ఈ లంకె కనిపించింది:
http://www.pbase.com/ratluk/allofthailand
ఈ కవితలో ఉన్న కొన్ని పద చిత్రాలకి చాయా చిత్రాలని ఆ లంకెలో చూడవచ్చు.
సువర్ణభూమిలో … గురించి mOhana గారి అభిప్రాయం:
11/06/2008 11:30 am
నా ఉద్దేశంలో ఇది రచయిత తాయిలాండు దేశం వెళ్లినప్పుడు అక్కడ బుద్ధుని విగ్రహాలను చూచి వ్రాసిందనుకొంటాను. అక్కడ సుఖాసీనులైన బుద్ధుల చిత్రాన్ని ఇక్కడ చూడగలరు. బంగారు బుద్ధ విగ్రహాలు కూడా ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి . సముద్రం అడుగులో బహుశా రచయిత అండర్ వాటర్ డైవింగ్ చేశారేమో? ఆ అనుభూతిని వ్రాసి ఉంటారు. తాయిలాండు సముద్రతీరాలు దీనికి ప్రసిద్ధమైనవి. మన సినిమావాళ్లు కూడా ఇలాటి షూటింగులను ఎన్నో చేశారు గదా! చివరగా భాషలను త్వరగా నేర్వగలము, కాని మనుషులు, వారి మనసులు అర్థం చేసికోవడం కష్టం అని తెలిపారు. రచయితకు చాలా భాషలు వచ్చు, తాయిలాండుకు విహారయాత్రకు వెళ్లినప్పుడు వ్రాసినది అని నా భావన. కవుల మనసులో ఏముందో మనకేం తెలుసు?
విధేయుడు – మోహన
సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/06/2008 9:21 am
I say, not just poem, but any writing starts only in writers mind and ends in reader’s. Probably with the exception of one’s shopping list.
గణితం నేర్చుకున్న ప్రతి విద్యార్థికి Fermat Theorem’s proof అర్థం కాకపోవచ్చు. కాణి, గణితం కూడా రానివారు సైతం అది Fermat Theorem’s proof గురించి అని మాత్రం తెలుసుకోవచ్చు, సుళువుగా.
మరి రచన అర్థం కాకపోయినా, అసలు అది దేని గురించి అన్నది కూడా స్పష్టంగా తెలియకపోతే ఆ రచన పాఠకులను చేరుతుందే కాని, తాకదు. రచన అనే అన్నాను, కవిత అని అనలేదు. ముందు రచన అర్థం అయితే, అది కవితో కాదో కూడా తెలుసుకోవచ్చు.
చివరలో చెప్పింది “దూరమైన థాయ్ భాష నేర్చుకున్నా కూడా, దగ్గరున్న ప్రియురాలు మనసు తెలుసుకోలేకపోయాను” అన్న contrasting తో చేసిన
వ్యక్తీకరణ బాగుంది.
అది తప్ప మిగితాది ఏది కూడా దేన్ని గురించి చెపుతున్నారో, ఏం చెప్పదలచుకున్నారో, ఏమీ అర్థం కాని (దు)స్థితి, interpretation ఇచ్చినప్పటికినీ. Interpretation తెలిసినదానికి లోతును, వైవిధ్యాన్ని ఇవ్వగలదేమో కాని, తెలియని దానిని పరిచయం చేయలేదు అనిపిస్తుంది.
May be better to study about Fermat Theorem’s proof, even if not totally understood _ it only widens one’s understanding.
====
Regards
Srinivas
సువర్ణభూమిలో … గురించి vineel గారి అభిప్రాయం:
11/05/2008 1:39 pm
[ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది. — సం]
తెలుగులో ఉండి, అన్నీ తెలిసిన పదాలే ఉన్నంత మాత్రాన ప్రతి కవిత మనకి అర్థం కావలనుకోవడం, కాస్తో కూస్తో గణితం నేర్చుకొన్న ప్రతి విద్యార్థికి, ఫెర్మాట్స్ థియరం ప్రూఫు అర్థమవ్వాలనుకోవడం లాంటిది.
ఈ సంచికలోనే వేలూరి గారి “నేనొక సాధారణ పాఠకుణ్ణి” వ్యాసంలో ఈవాక్యాలు బాగా పనికొస్తాయి ఈ కవిత గురించి రెండు మాటలు చెప్పడానికి. “… ఇలా అనుభవ పరిథి పెరిగి, జ్ఞాపకాలు పెరగడంతో, నీవు విద్యాధికుడవవుతున్నావు. అది మంచిదే. కానీ, దీనితో ఒక చిక్కు లేకపోలేదు. నీకు సరికొత్త పదజాలం అబ్బుతుంది అన్నాం కదూ! దానితో, నీ స్నేహపరివారం తగ్గుతుంది. ఎందుకంటే, నీ పరిభాష అర్థం చేసుకొనే వాళ్ళు, సరిగ్గా నీకు మల్లే అనుభవించి, ఆనందించిన వాళ్ళే అవుతారు. మిగిలినవాళ్ళకి నీ పరిభాష పరమ అరుచి కలిగిస్తుంది…”
భూషణ్ కవిత్వం ఇలాగే ఉంటుందనిపిస్తుంది నాకు. ఈ కవి కవితల్లో క్లుప్తత తారాస్థాయికి చేరి ఒక గణిత సమీకరణమంత క్లుప్తంగా తయారవుతాయి, కవితలు. గణితంలో ఏమో కానీ, కవిత్వంలో ఇలాంటి క్లుప్తత వల్ల కవితలు డేవిడ్ లించ్ సినిమాల్లాగా open to reader’s interepretation అవుతాయి. ఉదాహరణకు సువర్ణభూమి కవితకు నాకు తోచిన ఒక ఇంటర్ ప్రెటేషన్.
“ముఖా ముఖి సుఖాసీనులై బుద్ధులు ( చక్కని కవిత్వం వ్రాసే కవి, అస్వాదిస్తున్నపాఠకుడు)
వాడని కలువలు ( మంచి కవితలు)
అలముకున్న ధూపం (పాఠకుని మదిలో ఆవరించిన కవిత్వ సౌందర్యం)
ఎదురెండలో ఎర్రచారల పిల్లి,
చెలగాట మాడుతుంది
తలపాదాలమీదుంచి.
(కొన్ని కవితలు కదళీ పాకాలైతే, కొన్ని నారికేళ పాకాలు. తమకు అర్థం కాని కవితకు అర్థమే లేదని కుప్పిగంతులు వేసే పాఠకులే ఈ ఎర్రచారల పిల్లులు)
ఎన్నో మెట్లెక్కి/గర్భ గృహంలో/గబ్బిలాలను/అదిలిస్తున్నాడు/విహార భిక్షువు ( ఉచ్ఛస్థాయిలో ఉండే కవిత్వమనే ఆలయపు పవిత్రతను, గబ్బిలాలను పారద్రోలి కాపాడే విమర్శకుడు).
As some wise soul once said, A poem starts in writers mind and ends in readers mind. To conclude, for some one who is used to Van Gogh’s impressionistic paintings, Picasso’s Guernica might be pointless. That does nt reduce the essence of Guernica by an ounce.
వినీల్.
అరణ్య కవితలు గురించి A. KISHORE BABU గారి అభిప్రాయం:
11/05/2008 1:07 am
సుబ్రహ్మణ్యం గారు
మీకు మొదట నా అభినంధనలు.
మీ కవితలు చాలా ఆలస్యంగా చదివాను.నేను కవితలు రాయను కానీ బాగా చదువుతాను. ఎక్కడైనా ఒక మంచి కవిత చూసినా హాయిగా చదువుకొని హృదయంలొ దాచుకొంటాను. ఇక్కడ కొంతమంది చేసిన విమర్శల గురించి ఎమీ పట్టించుకోకండి.అసలు ఏ కవి కూడా కవిత్వం కేవలం తనకోసం రాసుకొంటాడనేది నా అభిప్రాయము. ఆ సమయంలో కవి తాను పొందిన అనుభూతిని అక్షరాల్లో ఆవిష్కరించుకొంటాడు. అది మీరైనా, ఎవరైనా కావొచ్చు. మీ కవితల్లో ఎంతో అనుభూతివుంది.
“ఎంత దారి తప్పి
ఎక్కడెక్కడో తిరిగినా
ఎట్టకేలకు నీటి జాడ
అడవిలో మరొకసారి
తప్పి పోవాలని ఉంది”
ఎంత గొప్ప అనుభూతి. ఇది అనుభవించినవారికే తెలుస్తుంది. మరి కొన్ని కవితల్లో మీరు..
“సముద్రం నుంచి
పల్చటి నీటి పొర
రెక్కలు కట్టుకొని
రెప్పల కిందకి చేరుతుంటే
మౌనంగా
ఆ తీరాన ఆమె
ఈ తీరాన నేను”
…
“….
ప్రకృతి రంగులన్నిటిని
దోచెసుకొని రాత్రి
తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడి చేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదిస్తాడు”
ఆదునికత కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఇప్పుడెలాగు ఆ ప్రకృతి రమణీయతకు దూరమవుతున్నాము.పచ్చటి పైర్లు, పల్లె లోగిళ్ళ అందాలు ఎక్కడా. ఆ ప్రకృతి వొడిలో తిరిగి తిరిగి అలసి సొలసి, సేదతీరి తమని తామె మైమరచిపోయే అదృష్టాన్ని కోల్పోతున్న కాంక్రీట్ జంగిల్ పక్షులం. కనీసం ఇలాంటి కవితలు చదివినప్పుడైనా మళ్ళి ఒకింత సేపు మనసు ఆ ప్రకృతి వొడిని ఊహించుకొని సేద తీరుంది. ఇక్కడ విమర్శకులను నేనేమీ అనడం లేదు. కాకుంటే ఒక మనవి..
నేడు తెలుగు అంతరించి పోతోందని, ముఖ్యంగా ఇంగ్లీషు మోజులో నేటి తరం తెలుగు భాషా సౌందర్యాన్ని మరచి పోతున్నారని బాధపడుతున్న తెలుగు లోకం ఒకసారి ఇలాంటి యువ కవులను వెన్ను తట్టి ప్రోత్సహించండి.ఇది మరికొంతమంది నవ కవులు పుట్టుకు రావడానికి దోహదపడుతుంది. కవులు కాక పోయినా ఫరవాలేదు, కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మార్చే వారైనా పుట్టుకొస్తారు.
ఈ స్పూర్థితో మరికొంత మంది నవ కవులు (మీ దృష్టిలొ కవులు కకున్నా ఫరవాలేదు) కనీసం తెలుగులో తమ భావావేశాన్ని అక్షరాలుగా మర్చే వారైనా పుట్టుకొస్తారు..
“నేను బతకటానికి ఏమి కావాలి
ఒక్క చిరునవ్వు చాలు
ఆమె నవ్వింది
నేను బతికాను”
ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం దారిలొ దొరికిన కాగితంలో కవి ఆశారాజు రాసిన కవితలో చివరి వాక్యలు ఇవి..
ఎంత తృప్తి కలిగించే కవితా ప్రయోగం, (వచనా ప్రయోగం అని కూడా అనుకోండి ఇబ్బంది లేదు).
“తెలుగు బతకడానికి ఏమి కావాలి
చక్కటి భావాన్ని వొలికే
నాలుగు కమ్మని
పదాలు తప్ప”
మంచి కవిత రాశారు
తెలుగు తల్లి నవ్వింది
అమృతంలాంటి తెలుగు
కవితా లోకానికి
మీకు ఇదే
నా చిరునవ్వుల స్వాగతం.
కవితాభినందనలతో
మీ
కిషోర్ బాబు
రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
11/04/2008 11:08 am
PP Rao గారూ,
మంచి ప్రశ్న వేసారు. నాకో సందేహం.
విలువలు / Ethics కేవలం రచయితలకే సంబంధించిన విషయమా? సంపాదకులకది వర్తించదా? ఎందుకిలా అడుగుతున్నానంటే, గతంలో ఒక వెబ్ పత్రికలో వచ్చిన కొన్ని కథలూ, వ్యాసాలూ ఇంకో పుస్తకంలో రచయితల ఆమోదమం లేకుండా వేసేసారు. ఆ పుస్తకాలు అమ్మకానికీ పెట్టారు.
గతంలో నేనొక పత్రికకి కాలమ్ రాసేవాణ్ణి. నాకు ఏ రకమైన సమాచారం ఇవ్వకుండానే ఓ రెండు రోజులుంచి, ఆ మర్నాడు తీసేసారు. గట్టిగా అడిగితే మళ్ళీ పెట్టారు. అందుకే చాలా పత్రికలు హామీ పత్రం తీసుకుంటాయి. అది పాటిస్తే సంపాదకులకీ, రచయితలకీ ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం, ఏ పత్రికయినా రచయితలకి పారితోషికం చెల్లిస్తున్నారా? అదుంటే పత్రిక వాళ్ళు అడగడంలో అర్థం ఉంది. ఎదో ఒక వెబ్ పత్రిక పెట్టుకొని అందులో వచ్చే వ్యాసాలూ, కథలూ వేరే చోట ప్రచురణ కాకూడదని ఆ పత్రిక వారికనిపిస్తే అది చెప్పాలి. గతంలో ఈ మాటలో వచ్చిన కథలు కొన్ని ఆంధ్రజ్యోతిలోనూ, విపుల లోనూ వచ్చాయి. అలాగే అమెరికాలో అనేక సావనీర్లలో కథలు తిరిగి ప్రచురించబడుతున్నాయి. ప్రస్తుత సాహితీ రంగంలో Ethics నిర్వచనాలు ఎవరికి తగ్గట్లు వాళ్ళు చెప్తున్నారు. అంతే!
ఇందులో రచయితల్ని Ethics అంటూ నిలదీయడం ఎంత వరకు సబబు? Ethics అందరికీ వర్తిస్తాయి కదా?
రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి narusu గారి అభిప్రాయం:
11/04/2008 12:14 am
రచయితకి ధన్యవాదాలు. ఈసినిమా వచ్చి చాలా కాలంఅయినా, మా చిన్నతనంలో అంటే 60 దశకాల్లో ఆ సినిమా గురించి చెప్పుకునె వాళ్ళు. నేను సినిమా చూడ్టం జరిగింది. కాని ఏమి అర్ధం కాలేదు. అప్ప టికే నలుపు తెలుపు సినిమా క్లియర్ గా లేదు. ఇన్నేళ్ళ తరువాత ఆ సినిమా గురించి విపులంగా తెలిసింది. నాకు నచ్చిన సినిమా ఇది.
ఈమాట – నామాట గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/02/2008 8:11 pm
ఈమాట సంపాదక, రచయిత, పాఠక వర్గానికి పదో జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు కాలాల పాటు ఈ పత్రిక వెలగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంచికకీ రాత్రింబవళ్ళూ శ్రమించే సంపాదకులకి, ముఖ్యంగా నాకెక్కువ సాయపడే సురేష్ కీ, పద్మ గారికీ, కృతజ్ఞతలు. ఎంత చిన్న విషయాన్నయినా తేలిగ్గా తీసుకోకుండా ఉన్నత స్థాయిలో ప్రచురించాలనే వారి దీక్ష మెచ్చుకోదగ్గది. వాళ్ళు మార్చినది బాలేదని నేను పేచీ పెడ్తే ఓపిగ్గా సమాధానం ఇచ్చి సామరస్యంగా పరిష్కరించడం సంతోషకరం. వారి ఉద్యోగ బాధ్యతలని నిర్వర్తిస్తూ, బహుశా కుటుంబ బాధ్యతలని కొంతవరకు నిర్లక్ష్యం చేస్తూ ఈమాట కోసం పాటుపడుతున్న సంపాదకుల అంకిత భావం స్ఫూర్తిదాయకం.
Peer Review గురించి: సంపాదకులకి తలకి మించిన పనిభారం వలన గానీ, పరిమిత విషయ పరిజ్ఞానం వలన గానీ, కొన్నిటిని వేరే వాళ్ళని సమీక్షించమంటే సరే, కాని అది పత్రిక పద్ధతిగా పెట్టుకుంటే, నాదొక సందేహం. ఇది సాహితీ పత్రికలలో సాధారణంగా చేస్తారా? ఉన్నత ప్రమాణాలున్న, తెలుగులో లేకపోతే ఇంగ్లీషులోనే తీసుకోండి, ఇతర సాహితీ పత్రికలలో ఇదేనా ఆనవాయితీ? నాకు నిజంగానే తెలియకే అడుగుతున్నాను.
ఈమాట సంపాదక వర్గం అంతా, రచయితల్లో చాలా మందీ, బహుశా పాఠకుల్లో కూడా చాలా వరకూ, విజ్ఞానశాస్త్రాల్లో విద్యాధికులూ, నిష్ణాతులూనూ. కాని సాహితీ పత్రిక అన్ని రంగాల వాళ్ళనీ ఆకర్షించేదిగా ఉండాలి. ఈమాటని Physical Review ప్రమాణాలతో నడుపుతాం అంటే శాస్త్రరంగాలలో లేనివాళ్ళకి కాస్త “భయం” కలగొచ్చు. The New Yorker పద్ధతిన నడుపుతాం అంటే బహుశా అందరికీ ఆమోదయోగ్యం కావొచ్చు.
కొడవళ్ళ హనుమంతరావు
ఈమాట – నామాట గురించి mOhana గారి అభిప్రాయం:
11/02/2008 12:16 pm
ఈమాటకు జన్మదిన శుభాకాంక్షలు. నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకొంటున్నాను. పీర్ రెవ్యూ గురించి ఒక రెండు మాటలు. నా తలలో ఏముందో ఎంత ఉందో తెలియదు, కాని నాకు తలేమో పండిందని ఒప్పుకోవాల్సిందే! సంపాదకుల, సమీక్షకుల సలహాలు రచన అందానికి మెరుగు తెస్తుంది కాని దానికి మసి పూయదు. రచయిత తన రచనను తన దృష్టినుండి మాత్రమే చూడడానికి అవకాశం ఉంది. కాని సంపాదకుల దృష్టి, సమీక్షకుల దృష్టి ఆ రచన పత్రికకు ఎలా సరిపోతుందో, పాఠకులను ఎలా ఆకర్షించ గలుగుతుందో అనే దానిపైన ఉంటుంది. ఈ రెంటికి మధ్య ఒక ఘర్షణ ఉందనుకోవడం పొరబాటు. “మంచి” సంపాదకత్వంవల్ల సామాన్యమైన రచన మంచి రచన అవడానికి, మంచి రచన ఇంకా మంచి రచన అవడానికి అవకాశం ఉంది. అన్ని రచనలను సంపాదకులు మాత్రమే సమీక్షించడానికి వీలుకాదు. వాళ్లకు పని ఉంది, కుటుంబం ఉంది, సరదాలు ఉన్నాయి. అది కాక బయస్ కూడా కలగడానికి అవకాశం ఉంది. కొన్ని రచనలలో వాళ్లు ఎంతో ఓపికతో తమ కాలాన్ని వినియోగిస్తారు. ఇది నాకు బాగా తెలుసు. కాని నాదొక కోరిక. ప్రతి ఏడాది చివర సమీక్షకుల పేరులు తెలియజేస్తే బాగుంటుంది. కొన్ని విజ్ఞాన శాస్త్ర పత్రికలకు ఈ వాడుక ఉన్నది. దీనివల్ల రచయితలకు, పాఠకులకు పత్రిక standard తెలుస్తుంది. పత్రిక ఔన్నత్యము పత్రిక రచనలపైన, రచయితలపైన, సంపాదకులపైన, సమీక్షకులపైన ఆధారపడి ఉంటుంది. వీటిలో మొదటి మూడు మనకు తెలుసు. నాలుగవది మాత్రం తెలియదు. అందుకే ఈ చిన్న సలహా.
విధేయుడు – మోహన
ఈమాట – నామాట గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
11/02/2008 12:03 pm
ఈ మాట సంపాదక వర్గాన్ని ప్రచురణ ముందు “సమీక్ష” విషయంలో అభినందించాలి. ఇందులో రాసినట్లుగా తెలుగు వారికీ, ముఖ్యం గా రచయితలకి మూడో సమీక్ష ( “peer review” ) అనేది కొత్త విషయం. మొదటి సమీక్ష రచయితెలాగూ చేసుకుంటాడు. రెండోది సంపాదకులది. మూడోది చెయ్యడం వల్ల నిష్పాక్షిక అభిప్రాయం వచ్చే అవకాశముంది. రచయిత పేరు తెలీదు కాబట్టి వస్తువు మీదే గురి వుంటుంది. ఒక్కోసారి ఈ మూడో సమీక్షలు స్పష్టంగా ఉండవు. ఒక్కోసారి ఉపయోగపడతాయని నా అభిప్రాయం.
అమెరికా యూనివర్శిటీల్లో ఏదైనా టెక్నికల్ పేపర్ని పదిమందీ రివ్యూ చేస్తే కాని ప్రచురించరు. అలాగే కంపెనీల్లో కూడా రాసిన ప్రతీ టెక్నికల్ పేపర్నీ పదిమందీ రివ్యూ చేస్తారు. అందువల్ల నాణ్యత పెరుగుతుంది. ఒక జత కళ్ళకంటే పది జతలెప్పుడూ మేలే!
ఈ సమీక్ష అనేది తెలుగు వారికి కొత్త. తెలుగు రచయితలకి అహం ఎక్కువ, ఈగో ఇంగువ లాంటిది. ఎంత మూసినా వాసన వదల్దు. శృతిమించనంత వరకూ రివ్యూ అవసరమనే నా అభిప్రాయం.
అనేక వెబ్ పత్రికలొచాయి. వస్తున్నాయి కూడా. రంగులతోముస్తాబవుతాయి. కొన్ని వ్యాసాలూ, కథలూ చదివాకా, అందులో వుండే తప్పులూ తడకల్లో సంపాదకుల అశ్రద్ధ వద్దన్నా కనిపిస్తుంది. కొన్నయితే మరీ గాసిప్ వ్యాసాలు. ఇవన్నీ చూసాకా ఈమాట చాలా బెటరనిపిస్తోంది నాణ్యత విషయంలో. కాకపోతే గత రెండేళ్ళల్లో ఈ మాటలో వచ్చిన కొన్ని వ్యాసాలూ, కథలూ చూసాక ఇవి సంపాదకుల సమీక్షనెలా తప్పించుకుని వచ్చాయాయన్న అభిప్రాయం వుంది.
పత్రికలకి పైపై రంగులు కాదు కావల్సింది. లోపల రుచి నోరూరించాలి. పదిమందికీ పళ్ళెంలో పంచే ముందు, వండిన వస్తువుకి ఉప్పెక్కువా తక్కువా చూస్తే, అది వండిన వాళ్ళకీ, తినే వారి ఆరోగ్యానికి మంచిది. అభిరుచిని బట్టి ఆస్వాదిస్తారు.
ఈమాట – నామాట గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
11/02/2008 9:31 am
ఈ మాట సంపాదకులకి చేకూరిన అనుభవం commendable అని నా ఉద్దేశం. ఈ నేపథ్యంలో Peer Reivew చేయించడం ఎంతవరకూ అవసరమో రచయితలూ, సంపాదకులూ జాగ్రత్తగా ఆలోచించాలి. తక్కిన వెబ్ పత్రికలూ, మామూలు పత్రికలూ ఏం చేస్తున్నారు? దీనివల్ల ‘తలపండిన’ రచయితలు కొందరు వెనక్కి తగ్గుతున్నారు. Brain storming sessions జరిగి ఉంటే వాటి వివరాలు dispassionateగా నమోదు కావాలి. ఈ కామెంటుని తీసేసినా పరవాలేదు కాని వెంటనే కాకపోయినా ఈ చర్చ జరగాలి.
వాడుక భాషలో పద్యాలు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/01/2008 5:24 am
బాబ్జీలు గారు,
మస్తు ఉపకారం చేసారు గా ప్రశ్న అడిగి. నా పాయింటుకు సూ…….టితనం తెచ్చారు.
వాడుక భాషలో పద్యాల గురించే మన ముచ్చట. మస్తుగా సదివినోళ్ళు, సూసినోళ్ళు, వాడుక భాషలోని పదానికే అర్థం తెలియక తటపటాయిస్తే, ఇక అందులో పద్యాలు రాయడం, చదవడం, అవి సులభంగా, సవ్యంగా పాఠకునికి అర్థమవడం- అంతా అయ్యే పనేనా అని పెద్ద, చెడ్డ అనుమానం. కారణం? మన సక్కని భాషకు సక్కని dictionaries సామాన్యులకు అందుబాటులో లేకపోవడం.
అదృష్టం బాగుండి Brown Telugu-English dictionary లో “మస్తు” అంటే “సమృద్ధి, plenty, abundance” అని ఒక అర్థం ఉంది. మనకున్న ఎన్నో dictionaries లో అది ఉంటుందని ఆశైతే లేదు. మనకాడ పుట్టిన bazaar పదానికి అర్థం వ్యుత్పత్తులు మన కాడ కన్నా English dictionaries లోనే మంచిగా దొరుకతయి. మనదైపోయిన పదానికి అర్థం, మరో భాషలోని పాటను చెప్పుకొని వివరించుకుంటేనేగాని అర్థం కాని దుస్థితిలో ఉన్నాం. వాడుక భాష వాడితేనే సదువుకున్నోళ్ళు పరేషానైపోతే, వేరేవాళ్ళ పరిస్థితి దేవుడెరుగు.
==============
విధేయుడు
-Srinivas
వాడుక భాషలో పద్యాలు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
10/30/2008 8:23 am
బాబ్జీలు గారికి నమస్కారం.
మోహనగారు వాడుక భాషలోనే కాదు, కొత్త ఛందాలలో కూడా పద్యాలు వ్రాస్తూనే ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా, ఎవరైనా ప్రయత్నిస్తే
సాయం కూడా చేస్తున్నారు. మనమే చదవట్లేదు!
సీ. పద్యమా! యెందుకు పాతి పెట్టెదనని
ప్రతినబూనిరిమన రచయితెపుడొ
పద్యమా! కాదది పామని కొట్టెద
కర్రతో యనెమన కవియె నొకరు
పద్యమా! నీయొక్క పాడు శృంఖలములు
పగులగొ ట్టెదనని పల్కె నొకరు
పద్యమా! నీవొట్టి పాతకా లపురోత
క్రొత్త కావాలనె క్రొత్త కవులు
తే. కాని భాష నిలబడి పకపక నవ్వె
సొంత రూపాల పైచిచ్చు వింత గొలుప
తనదు బిడ్డల మేలునె తలచి పలికె
మస్తు శుభమస్తు యారోగ్య మస్తు యనుచు!
========
విధేయుడు
-Srinivas
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి mOhana గారి అభిప్రాయం:
10/28/2008 7:13 am
త్యాగరాజుగారికి తమిళం బాగానే వచ్చి ఉంటుంది. కాని వారికి అందులో కవిత్వం వ్రాయగలిగిన శక్తి లేదేమో? ఆ కాలంలో దక్షిణదేశంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది సాహిత్యభాషగా. అదీకాక వారి మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాషలోనే తమ పాటలను వ్రాసి వాటికి స్వర జీవాన్ని పోశారు. ఆత్మ పొందే అవస్థను మాతృభాషలో కాక మరే భాషలో సులభంగా చెప్పగలం? ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మణిప్రవాళ కీర్తనలు కొన్ని తెలుగు తమిళ భాషలలో ఉన్నాయి. విధేయుడు – మోహన
తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
10/26/2008 10:58 pm
“మంచి గతమున కొంచెమేనోయ్”
చంద్రశేఖర రెడ్ది గారి వ్యాసంలో భాష చక్కగా ఉంది. పల్లె జీవితం కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అయితే జీవితం బహుముఖమైనది. వారి వ్యాసం చదివి, పల్లెటూళ్ళ గురించి బొత్తిగా తెలియని వాళ్ళు, “గుప్తుల కాలం స్వర్ణయుగమందురు” అన్నట్లు, ఒకప్పటి పల్లెలు స్వర్గసీమలని భ్రమపడే ప్రమాదముంది. దానిక్కాస్త విరుగుడుగా నా చిన్నతనంలో, స్వాతంత్ర్యం వచ్చిన పాతికేళ్ళకి, మా ఊళ్ళో జీవితం ఎలా ఉండేదో కాస్త రాస్తాను.
కాలకృత్యాలకీ, బర్రెగొడ్లని కడగడానికీ, చాకిరేవుకీ – అన్నిటికీ ఊరిచెరువే! జబ్బునపడితే మాఊళ్ళోనయితే కనీసం మంచి వైద్యులున్నారు. పొరుగు ఊళ్ళ వాళ్ళకి నాటువైద్యులే దిక్కు.
అతివృష్టీ,, కాకపోతే అనావృష్టీ. ఎండాకాలంలో రెండు మూడు మైళ్ళు పోయి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళం.
ఈ వ్యాసంలో పెద్దగా కనబడని వాళ్ళు మాలమాదిగ వాళ్ళు. ఊరికి వెలిగా ఉండేవాళ్ళు. కూలీలుగా రైతుల ఇళ్ళలో పాలేర్లుగా, జీతగాళ్ళుగా పనిచేసేవాళ్ళు. వీళ్ళని అన్ని కులాలకన్నా అతి హీనంగా చూసేవాళ్ళు.
బళ్ళో “ఆంటరానితనం మహా పాపం,” అని వల్లె వేసేవాళ్ళం. బడి బయట విధిగా అంటరానితనాన్ని పాటించేవాళ్ళు! నాకిప్పటికీ గుర్తు; పెద్ద బజార్లో హోటల్లో పెద్ద మనుషులంతా పేపర్లు చదువుతూ, అన్ని వ్యవహారాలూ మాట్లాడుకునే వాళ్ళు. వాళ్ళెదుటనే, గూట్లో వేరేగా గ్లాసులుండేవు. పబ్లిక్ ప్రదేశాలలోనే అలా ఉంటే ఇళ్ళల్లో విషయం చెప్పేదేముంది? నేను కాలేజీ సెలవులకి ఊరికెళ్ళినప్పుడు, ఓ పెద్దమనిషి, మాలా మాదిగోళ్ళని “ఒరేయ్” అనడానికి జంకాల్సొస్తుందని వాపోయాడు.
బాబాయ్, పిన్నాం, ఇలా వరస పెట్టి పిలుచుకునేవాళ్ళు – వేరే కులమయినా. కాని ఎవరి స్థాయి ఏమిటో అందరికీ తెలుసు. కుల ధర్మం తప్పక పాటిస్తారు. కులాంతర వివాహాలు అసంభవం; కులాంతర వివాహేతర సంబంధాలు మాత్రం అతి సామాన్యం!
ఊరి ప్రెసిడెంటుకి ఎన్నికలు జరిగేవి. రెండు పార్టీల వాళ్ళూ ఒకరికొకరు దాయాదులే. ఎన్ని తరాలు గడిచినా వేరే వాళ్ళు నిలబడే ప్రసక్తే లేదు. అసలా మాటే ఎక్కడా రాదు. ఈ మధ్యనే ఓ మాల ఆయన ప్రెసిడెంటు అయ్యాడు – రిజర్వేషన్ మూలాన. పెద్దమనుషుల చెప్పుచేతల్లో ఉండకుండా పోలేడు.
ధర్మవ్యాధుణ్ణి ప్రస్తావించారు కనుక చెప్తాను. మన సంస్కృతిలో కింద వర్ణాల వారిని పైవారు హీనంగా చూస్తే ఆశ్చర్యం లేదు – అది సంస్థాగతం. కాని తమని తామే హీనంగా భావించుకోవడం – “హీన యోనిజుండనయ్యును నిర్మలుండనైతిం” అని ధర్మవ్యాధుడు సగర్వంగా చెప్పుకోడంలో ఉంది విషాదమంతా.
చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు – వీళ్ళంతా పండక్కీ పబ్బానికీ ఆసాముల ఇళ్ళకి బుట్టతో పొయ్యేవాళ్ళు. “వండుకున్న అమ్మకి ఒక్కటే కూర; అడుక్కునమ్మకి అరవై కూరలు,” అన్న సామెతని బట్టి ఇదెంత గౌరవప్రదమైనదో తెలుస్తుంది. లాండ్రీ షాపో, బార్బర్ షాపో, గిన్నెల కొట్టో, లేకపోతే ఆ దిక్కుమాలిన వృత్తులకి సంబంధించకుండా కాస్త చదువుకొని నాలుగు రాళ్ళు సంపాదించుకుంటే గాని ఆ జీవితాలకి విముక్తి లేదు. అందుకు పల్లెటూళ్ళని వదిలి పారిపోతే విచారమెందుకు?
“మాలపల్లి” లో సంగందాసు అన్నట్లు, “సర్వేగుణాః కాంచన మాశ్రయంతే అని ధనాకర్షణ మార్గాలు చూపించందే, తక్కిన మంచి గుణాలు అలవాటుపడవు.”
కొడవళ్ళ హనుమంతరావు
అలుసవుతోన్న అమ్మ భాష గురించి rahamthulla గారి అభిప్రాయం:
10/20/2008 7:37 pm
ఇంటి భాషంటే ఎంత చులకనో!
భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మాగ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథంస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కత గని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండ గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు. మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం. కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగు తుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షులపేర్లు చెప్పారో చూడండి: మట్టగిడస, కర్రమోను, బొమ్మిడయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….. పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపుచిలుక, నత్తకొట్టుడు…. భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం అన్నారు నెహ్రూ. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా ఇండియాలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005) అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్నత విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించు కుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి. తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడ వెళ్ళారు. కొద్దిరోజులకే జార్జిబుష్ హైదరాబాద్ రావటం, సివికాన్ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‌కు చెందిన వారేనని తేల్చటం, దిల్‌కుష్ అతిథి భవనంలో అమెరికా వెళ్ళ టానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారు: ఆంగ్లమేరా జీవితం- ఆంగ్లమేరా శాశ్వతం ఆంగ్లమే మనకున్నది- ఆంగ్లమేరా పెన్నిధీ ఆంగ్లమును ప్రేమించు భాయీ- లేదు అంతకు మించి హాయీ ||ఆంగ్ల|| తెలుగును విడిచీ- ఆంగ్లము నేర్చీ అమెరికా పోదామూ- బానిసలవుదామూ డాలర్లు తెద్దామూ ||తెలుగు|| అంటూ పాటలు కూడ పాడుతున్నారు.
తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణా లతో సహా వివరిస్తున్నారు:
1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనను పెద్దగా ప్రోత్సాహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు.
2. పెద్ద కులాలవాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండ చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు.
3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవా లని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండి తులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.
4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డులపేర్లు చద వాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడ అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సుల భంగా వస్తుంది.
5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్ను లెత్త బ్రహ్మవశమే?
6. కంప్యూటర్‌కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్ నేర్వాలి.
7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్య మాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి.
ఇక మనం తెలుగువాళ్ళం అనీ, మన తెలుగును రక్షించుకుందాం అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?:
1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా?
2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన
3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సుళువుగా వస్తుంది. మన లిపిని కంప్యూ టర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమయితే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం.
4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడ తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి?
5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండ అమ్మా అని ఎందు కరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం.
6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండలి. కంప్యూటర్ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషు లోకి అనువదించుకున్నారు. అవసరం అటు వంటిది.
7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం చెయ్యడమే. తెలుగులోనే ఇంజనీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందు లకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృ భాషకు ప్రాథంమిక విద్యలోకూడ స్థానం లేకుండ చేసే వాళ్ళది ఇంటి కూడు తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా? మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిర స్కారం అన్నారు మహాత్మాగాంధీ. మాతృ భాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడ సరిగా రావు అన్నారు జార్జి బెర్నార్డ్‌షా. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారు: మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయ స్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినపుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం. (అమ్మనే మరుస్తారా! ఈనాడు 27-2-2006)
అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథల మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ డానియల్ నెగర్స్ ఇలా అంటున్నారు: తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకో డానికి సీఫెల్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయు లకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించ లేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషాసంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాష లున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులు తాయి. భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచిభాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడు కోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు. (ఆంధ్రజ్యోతి 22-2-2006) ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషాశాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవ సరమైన పదాలను రాయడంలో, చదవ డంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు.
మెదక్ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్ పూర్ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోం దట. విత్తనాల పేర్లు చూడండి: తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డ జొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ. (వార్త 6-3-2006) ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవ సాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్ పదాల కిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడ ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయాని కొచ్చారు. బాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యంకాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది.
తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించు కోవాల్సిన పదజాలం ఎంతోఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగు తుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచి నపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథంమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు. ప్రైవేట్ స్కూళ్ళు తెలుగు నేర్పవు.
మార్కుల కోసం కళాశాల విద్యార్ధులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో? కర్నాటకలో కన్నడం లేకుండ హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమి ళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్ స్కూళ్ళమీద కర్నాటక, తమిళనాడు ప్రభు త్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి. భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారుకూడ వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్.
గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవం గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 19ని తెలుగు మాండ లిక భాషా దినోత్సవం గానూ జరుపుకుంటు న్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.
నూర్‌బాషా రహంతుల్లా
ఈమాట గురించి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
10/01/2008 10:32 pm
బాబ్జీలు గారికి,
పల్లెటూరి నుండి వచ్చిన వాణ్ణి కాబట్టి బీడీల గురించి సందేహాలేం లేవు; ఖానా గట్టు గురించి ఉన్నాయి. మీ రాతల్లో నిగూఢంగా ఉన్న పద సంపద చెప్పుకోదగ్గది; మూడు నిఘంటువుల్లో వెతికినా “సబూరి” కనపడలేదు!
(2005 లో పదవీ స్వీకారం సందర్భంగా, ఆవుల మంజులత గారు అకుంఠిత దీక్షతో కృషి చేసి అయిదేళ్ళలో సమగ్ర నిఘంటువుని తయారుచేస్తామని హామీ ఇచ్చారు. పదవీ విరమణ సమయంలో దాని గురించి ఎవరైనా అడిగారా? ప్రభుత్వరంగంలో పలుకుబడి గల వాళ్ళెవరైనా కనుక్కుని వివరాలు తెలపమని మనవి.)
చలం ఇంటర్వ్యూ వినలేదు కాని మ్యూజింగ్స్ (పేజీలు 68-74) చదివాను. అది చదివితే మామూలు వాళ్ళకి ఇక రాయాలంటే భయం! ఆయన మహానుభావుడని ఒప్పుకోవాల్సిందే – ఆఖర్న అష్టగ్రహ కూటాల్ని నమ్మి ఆముష్మిక చింతనలో మునిగినా.
తనని తాను తిట్టుకోడానికి మాత్రమే అయితే చలం పుస్తకాలు రాసి ప్రపంచం మీద వదిలి నానా దుమారం లేపాల్సిన అవసరం లేదు కదా! బీడిలు కాల్చేవాడు కాదు గాని ఎప్పుడూ నోట్లో పైపుతో కనబడే ఒకాయన అరవై ఏళ్ళ క్రితం మాటల్లో :
“Thus, the author writes in order to address himself to the freedom of readers, and he requires it in order to make his work exist. But he does not stop there; he also requires that they return this confidence which he has given them, that they recognize his creative freedom, and that they in turn solicit it by a symmetrical and inverse appeal.” [1]
ఇంతకు మించి రాస్తే వ్యాసమవుతుంది. అది నా అర కొర జ్ఞానంతో కన్నా కాస్త లోతుగా తెలిసినవాళ్ళు రాస్తే బావుంటుంది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] From “Why Write?” in “What Is Literature?” and Other Essays, by Jean-Paul Sartre.
[ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]
తెలుగు సినిమాలు స్త్రీ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/28/2008 2:24 pm
గురివింద గింజ, చక్కెర గుళిక
జె. యు. బి. వి. ప్రసాద్ గారు చేరా ని ఇప్పుడు తప్పు పడుతున్నారు కాని రంగనాయకమ్మ “ఇదంతా డిగ్రీల అహంకారమే!” అని చేరా ని ఘాటుగా విమర్శించింది. ఎప్పుడు? 1991 లో. ఇన్నేళ్ళ తర్వాత గూడా చేరా తను ఒకప్పుడు చేసిన తప్పును ఇతరులు చెయ్యొద్దని చెప్పకూడదు! ప్రసాద్ గారి ప్రపంచంలో చేరా కి నిష్కృతి లేదు.
“ఇది ఎలా ఉంటుందంటే,” అంటూ మనకి సులభంగా బోధపడటానికన్నట్లు కుటుంబరావుని లాక్కొచ్చారు. చేరా అన్న దానికీ కొకు అన్న దానికీ ఏమిటి లంకె? రంగనాయకమ్మని వేర్వేరు సందర్భాల్లో విమర్శించడం తప్ప.
విషవృక్షానికి సమీక్ష రాస్తూ (1974-75) కుటుంబరావు సోషల్ ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంథం కాదన్నాడు. అన్న తర్వాత “ఆశోక వనం” రాయలేదు – ఆకథ 1937లో వచ్చింది. రామాయణంలో ఆర్యులూ అనార్యులూ గురించి, “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం,” అని రాసింది 1944లో. “నా కథా రచన” అన్న వ్యాసంలో తను మార్క్సిజం చదివింతర్వాత గాని సంఘం వ్యాధిని అర్థం చేసుకోలేదనీ, ఆపాటి జ్ఞానోదయం కలిగిన తర్వాత రాసిన మొదటి రచన “కులంగాడి అంత్యక్రియలు,” (1945) అన్నారు. కాలానుక్రమాన్ని పాటిస్తూ కుటుంబరావుని విమర్శిస్తే సరిగా ఉంటుంది.
కుటుంబరావు రాసిన సమీక్షలో కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి – ఎపిక్ లక్షణాలు, నాటి ఆచార వ్యవహారాలని నేటి విలువలతో అంచనా కట్టటం. వీటికి రంగనాయకమ్మ దీర్ఘమైన ఘాటైన జవాబే ఇచ్చింది. ఇద్దరు చెప్పినవీ కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయాలే.
లోతుగా పోవడానికి ఎవరికి టైముంది? అని నిరాశ పడొద్దు. వాటి సారాంశాన్నంతా, ప్రసాద్ గారు గురువింద గింజంత చక్కెర గుళికగా ఇచ్చారు. మింగి చైతన్యవంతులమవుదాం.
కొడవళ్ళ హనుమంతరావు
ఈమాట గురించి గురించి baabjeelu గారి అభిప్రాయం:
09/23/2008 9:12 am
రోహిణీ ప్రసాద్ గారికి,
పాలూ నీళ్ళూ వేరు చేసీసేరు. ఖచ్చితంగా చెప్పేరు.
అయితే, పడక్కుర్చీ విమర్శకుల విలువ, informed (?) public opinion, సాహిత్య సేవ, ఎక్కువ తక్కువలయినా, ఎలాగో విపులీకరించి విశ్లేషించాలి దయచేసి.
కొడవళ్ళ హనుమంతరావు గారికి,
“ఎడ్మెంటు” సంగతి వదిలెయ్యండి. అది మీరెవరూ చూసే చాన్సు లేదు.మీకు చికాకు కలిగించినట్టు రాయడం నా చేతకాని తనం. “శ్రధ్ధ” “సబూరి” లేకపోతే ఇన్ని ఇబ్బందులు.మొదటి సారి రాసినపుడు, సరిగ్గా రాయలేకపోడానికి, కర్ణుడి చావుకున్న కారణాల్లా లక్షాతొంభైయున్నాయి. వాటినొదిలెయ్యండి.
క్షమించాలి.
రోహిణీ ప్రసాదు గారు సరిగ్గా పట్టీసేరు. అదే నా “ప్రెశ్న”?
ఖానా గట్టు మీద బీడీలు కాల్చుకుంటూ “ప్రెపెంచకాన్ని” గుప్పు గుప్పు మని విమర్శంచడం రైటేనా? ఖానా గట్ల గురించి, సందేహం వుంటే, భైరవభట్ల వారు పూర్తిగా తీర్చగలరు. బీడీల గురించి సందేహంవుంటే, నాలాటి వాడెవడైనా తీర్చగలడని అనుకుంటున్నాను.సాఫ్ సాఫ్ గా అడుగుతున్నాను. ఎవరైనా ఎందుకు రాయాలి? ఎందుకు రాస్తారు?
రజనీ గారడిగిన ప్రశ్నకి చలం గారు సమాధానమిస్తూAIR ఇంటర్వ్యూలో:
“నన్ను, నాలో ఏఏ మచ్చలున్నాయో, వాటిని నేను గట్టిగా తిట్టుకోడంతో, వాటిని గట్టిగా గోక్కోడంలో, ఆ పుస్తకాలు-నేను వ్రాసిన పుస్తకాలన్నీ బయలుదేరాయి. అవి మిమ్మల్ని అనుకుని మీరు చాలా కోప్పడ్డారు. మిమ్మల్ని కాదు- నన్ను నేను తిట్టు కున్నది.”
ఇందుకేనా రాస్తారు? ఇందుకేనా రాయాలి? ఇలా రాయకపోతే విమర్శకులు “కోర్ కోర్ శరణు కోర్” అని గగ్గోలెట్టడం రైటేనా? అలా గగ్గోలెట్టకపోతే తప్పా?
ఈ మాట రచయిత(త్రు)లకీ, అభిప్రాయాలు రాసీవాళ్ళకీ వున్న సుఖం మిగిలిన పత్రికలకి రాసీ వాళ్ళకి లేదు. మా బతుకులు మేం బతుకుతూ, తీరికున్నపుడు “బాగా రాసేరు” అని అభిప్రాయమ్ముక్క పడేస్తే ఈ మాట వాళ్ళు, చక్కగా వేస్తారు. కొంపదీసి ఇదా సాహిత్య సేవ?
కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
09/14/2008 5:57 pm
[ఈ అభిప్రాయం కొద్దిగా రీఫార్మాట్ చేయబడింది. — పద్మ]
హనుమ గారూ:
మిమ్మల్ని అలాగే పిలవాలనిపిస్తుంది.
కొకు రచనల పునః ప్రచురణల గురించి తెలియ చేసినందుకు సంతోషం!
తన రచనల గురించి కొకు తన మాటల్లో: (‘కారుణ్యం’ 1937, ముందు మాట)
తమ కథలు చదివి, ‘బాగున్నాయని’ విమర్శించమనే కథకులున్న ఈ రోజుల్లో, పైన చెప్పిన మాటలు ఆలోచించ తగ్గవి.
సమాజంలో (ఏ సమాజమైనా) సాహిత్యానికి ఉన్న స్థానం సరిగ్గా గమనించిన వారిలో కొకు ఒకరు. సాహిత్య ప్రయోజనాలు గురించి కొకు అవగాహన అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికైనా సరేనని నాకు అనిపిస్తుంది.
నేను TIFRలో Ph.D చేస్తున్న రొజుల్లో, J.R.D.Tata అధ్యక్షతన MGK Menon 60వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చెయ్యబడ్డ సభలో, అప్పటికి “భారతరత్న” రాని J.R.D. Tata మాట్లాడుతూ, “60వ పుట్టిన రోజుకే ఇంత హడావిడా! ఇలాంటి పుట్టిన రోజు నాకు 20 ఏళ్ళ క్రితం వచ్చింది. ఈ సభ అయిన వెంటనే మనం వెళ్ళి ఎవరి పని వారు చేసుకోవాలి” అన్నాడు
కొడవళ్ల వారికి నమస్సులతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి mOhana గారి అభిప్రాయం:
09/13/2008 8:10 am
కర్ణాటకమా లేక కర్నాటకమా అనే దానిని గురించి ఒక కన్నడ కవి (బహుశా కువెంపు కాబోలు) అది “నొణ (నకార ణకారాలు) కాట” (ఈగ పోరు) అని అన్నారు. ణ-కారాన్ని న-కారంగా పలకడం సర్వసామాన్యం. హిందీ వంటి భాషలో ఇది వ్యాకరణరీత్యా సరియైనదే. అందుకే తెలుగులో ఈ రెండు అక్షరాలకు ప్రాస (యతి) సరిపోతుంది. కాని నాకు నచ్చనిది కర్నాటిక్ అనడం! – మోహన
పుస్తక సమీక్షల గురించి… గురించి vElUri VEMkaTESvara raavu గారి అభిప్రాయం:
09/11/2008 1:46 pm
—రామ (రమ) భరద్వాజ్ గారికి:
మీరు ఉదహరించిన రెండు సమీక్షలు/విమర్శలూ నాకు తెలుసు. వాటి ప్రతులు నా దగ్గిర లేకపోవటంతో, నేను వాటి ప్రస్తావన తేలేదు. నా సంపాదకీయం/వ్యాసం (?)(సరేనా విప్లవ్ గారూ! మీకు అభినందనలు) లో నేను ఉదహరించిన వాటన్నిటికీ నాదగ్గిర ప్రతులున్నాయి! మీరు ఆ రెండుసమీక్షలూ గుర్తుకితెచ్చి నన్ను మందలించినందుకు కృతజ్ఞుడిని.
—రోహిణీప్రసాద్ గారికి:
ఈ మాట గురించి మీరు చెప్పిన రెండు మంచి మాటలు మాకెంతో ఆనందం; గర్వకారణం. మీకు నా నమస్సులు.
—కొత్తపాళీ గారికి:
నిష్పాక్షికము అన్న మాట నేను without bias కి అనువాదంగా వాడాను. నా ఉద్దేశంలో విమర్శలలోసాధ్యమైనంతవరకూ ఏవిధమైన bias (పక్షపాతం అన్న మాట ఒప్పుకుంటారా?) ఉండకూడదు. అంటే విమర్శకుడి biases సమీక్షలోను, విమర్శలోనూ కనపడకూడదు, అని! తన భావస్పందన స్పష్టం గా ఉండకూడదనే అర్థం నావ్యాసం(?)/సంపాదకీయంలో వచ్చిఉంటే, రచయితగా అది నా చేతకానితనం. క్షమార్హుణ్ణి.
హనుమంతరావుగారికి:
కొ.కు. చెప్పినా, రా .రా. వ్రాసినా, తా.ధ. మందలించినా; — అసలు నిజం ఇది: కీట్స్ మరణానికి కారణం అతని క్షయ వ్యాధి. తన క్షయ వ్యాధి, దరిమిలా తన రాబోవు మరణం గురించి కీట్స్ చాలా మథన పడ్డాడు. కీట్స్ apothecary గా ( అంటే, మన భాషలో కాంపౌండర్ అనవచ్చనుకుంటా!) శిక్షణ పొందాడు!
1821 లో (కీట్స్ మరణానంతరం) ఈ కథ / రూమర్ మొదలయ్యింది. క్వార్టర్లీ రివ్యూ పత్రికలో ఒక “కర్కోటక” విమర్శకుడు(విమర్శకురాలు?) వ్రాసిన సమీక్ష కీట్స్ మరణానికి కారణం అని! ఈ రూమర్ కి ఆజ్యం పోసిన వాడు షెల్లీ. మీరు చదివే ఉంటారు; షెల్లీ వ్రాసిన Adonais. అది కీట్స్ పై elegy అని మీకు నేను చెప్పనక్కరలేదు. పోతే, బైరన్ వ్రాసిన Don Juan పద్యంలో, ఈ రూమర్ని కాస్త తక్కువ పాళ్ళల్లో పాడాడు:
‘Tis strange the mind, that very fiery particle,
Should let itself be snuffed out by an Article.”
Stanley Plumly ఈ మధ్యనే Posthumous Keats ( Norton, 2008) ప్రచురించాడు. అందులో ఈ కథ/రూమర్ ప్రస్తావన దొరుకుతుంది.
విధేయుడు, — వేలూరి వేంకటేశ్వర రావు.
నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
09/11/2008 11:47 am
నమస్కారం.
నేను వ్రాసిందాంట్లో తప్పేమన్నా ఉంటే దయ చేసి క్షమించమని మొదటగా మనవి. మహా కవి తిక్కన కవిత్వాన్ని గాని, ప్రతిభను గాని విమర్శించే తాహతు కాదు కదా, పూర్తిగా గ్రహించి గుర్తించడం కూడా నాకు మించిన పనే. కేవలం ఈ పద్యం చదివిన తరువాత కలిగిన ఆలోచన మాత్రమే ఇది. తిక్కన రచనను బేరీజు వేసే దుస్సాహసం కాదు.
ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ద్రౌపది కోపంగా దుశ్శాసనుని వొళ్ళు ముక్కలైపోనీ, భీముని బలం, అర్జునిని గాండీవం తగలబడడానికా, దుర్యోధనుని పీనుగెల్లనీ, అని వొళ్ళు మండి చెప్పడాన్ని సీస పద్యంలో, సహజత్వానికి దగ్గరగా చెప్పినట్టున్నది. అంత మాత్రం చెప్పడం న్యాయమూ, అవసరమే కాని గొప్ప విషయంగా కనిపించడం లేదు. వీధిలో మంచినీళ్ళ కోసమో, ఇంకదేనికోసమో తెలుగులో కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు ఉన్నట్టుగా అనిపించింది, కాకపోతే సీసం, ఆటలెదులలో. అట్లా కాదు, అసలు అదే ఆ పద్యం గొప్పతనం అంటే చెప్పేదేమీ లేదు, విని ఊరుకోవడం మాత్రమే, ఆ వీధిలోని తిట్లు విని ఊరుకున్నట్లుగా.
అదే తిక్కన గారిదే, “వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి” అన్న పద్యం ఎంతో రసవంతంగా, పదాల ప్రవాహ ధారతో, మనకు గుర్తుండే విధంగా, ఆకట్టుకునే పద్యం ఉంది కదా!
పోనీ, ఈ పద్యం కంటే సహజంగా, సరళంగా, రుసరుస సాగే ధారతో, “గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకంజెండుచున్నప్పుడొక్కండును నీ మొఱ నాలకింపడు” అని బెదిరించే తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ పద్యాలు కూడా ఉన్నవి కదా! తిట్లు, బెదిరింపులు, శపథాలు, ఆవేశపరమైన ఘట్టాలలో ఉన్న పద్యాలెన్నో ఉన్నాయి మనకు. వాటన్నింటి backdrop లో ఈ పద్యం గొప్పగా ఆకట్టుకుంటూ నిలబడుతుందని మాత్రం అనిపించడంలేదు.
***
విధేయుడు
Srinivas
బాలమురళీకృష్ణ గురించి mOhana గారి అభిప్రాయం:
09/09/2008 9:10 am
నా వరకు అన్ని నిర్వచనాలకు బద్ధులైన చివరి క్లాసికల్ వాగ్గేయకారులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ మరియు వారి శిష్యులైన మైసూర్ వాసుదేవాచార్యులు. మిగిలినవారు ఆ ఔన్నత్యాన్ని అందలేదు అని నా భావన. అందులో వాసుదేవాచార్యులు సుమారు వంద సంవత్సరాలు జీవించారు. చివరి వరకు గాన విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు. వీరి మాతృభాష కన్నడము అయినా కూడా తెలుగులోనే రాశారు. వీరికి సంస్కృతములో ఎనలేని పాండిత్యము. వీరి గురువుగారే వీరివద్ద సంస్కృతములో రాసినది చదివిచూడమనే వారట! బాలమురళిగారి పాటలను మిగిలిన గాయకులు తమ కచేరీలలో ఇప్పుడు కూడా పాడుతున్నారా, ఈ విషయం నాకు అంతగా తెలియదు. గాయకులందరు వీరి పాటలను “బ్రోచేవారెవరురా..” లేక “రఘువంశ సుధాంబుధి..” లా పాడుతుంటే వీరు కూడా వారిలాటి మహనీయ వాగ్గేయకారులే. అందరూ వాగ్గేయకారులే. కాని Some are more equal than others అని అంటారు గదా! విధేయుడు – మోహన
పడవ మునుగుతోంది గురించి viswam గారి అభిప్రాయం:
09/08/2008 3:21 pm
చక్కటి కథ చదివిన అనుభూతి కాదు కాని, ఒక వాస్తవిక అంశాన్ని ఎంత బాగా చెప్పారు అని అనిపించింది. వారికి రోజు గడవటమే జీవన్మరణ సమస్య ఐతే, పాపం, ఏ పాస్పోర్ట్, వీసాలు వారిని ఆదుకొంటాయీ? ఏ మానవహక్కులు వారికి రక్షణ కల్పిస్తాయి?
బాలమురళీకృష్ణ గురించి mOhana గారి అభిప్రాయం:
09/08/2008 8:10 am
వాగ్గేయకారులపైన చర్చ జరుగుతుంది కనుక ఇక్కడ
కొన్ని విషయాలను గురించి చెప్పాలి. కాకి నలుపే,
కోకిల నలుపే, కాని వసంతఋతువులో కాకి కాకే, కోకిల
కోకిలే అన్నట్లు, ఒక పాట వ్రాసి దానికి ఒక వరుస
కట్టినంత మాత్రాన ఒక వ్యక్తిని వాగ్గేయకారుడు అనలేము.
వాగ్గేయకారునికి సాహిత్యం బాగా తెలిసి ఉండాలి. భాషలలో
ప్రజ్ఞ ఉండాలి. ఛందస్సు, వ్యాకరణం తెలిసి ఉండాలి.
అలంకారాల ఉపయోగం తెలిసి ఉండాలి. సంగీత శాస్త్రంలో
గొప్ప ప్రతిభ ఉండాలి. మూడు కాలాలలో పాడే శక్తి ఉండాలి
అతని కంఠానికి. సంగీతశాస్త్రంలోని వివరాలను చక్కగా
ఎరిగి ఉండాలి. రాగ తాళ లయాదుల జ్ఞానం క్షుణ్ణంగా
అవగాహన చేసికొని ఉండాలి. రసానుభూతిని కలిగి
ఉండాలి. స్వరాల ఉపయోగాన్ని తెలిసికొని ఉండాలి.
వివిధ విధాలైన కృతులను వ్రాసి వాటిని సంగీతంతో
జీవంతం చేసి ఉండాలి. ఉదాహరణకు, త్యాగరాజు
పాటలను మాత్రమే కాదు, రెండు యక్షగానాలను
కూడా వ్రాశారు. ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్లు ఏ
కొందరు మాత్రమే నిజంగా వాగ్గేయకారులు.
మిగిలినవారు “నేను కూడా వాగ్గేయకారుడినే” ఆని
అనుకొన్నవారు. విధేయుడు – మోహన
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి ramadevi గారి అభిప్రాయం:
09/07/2008 10:41 am
బాబ్జీలు గారు,
ఇలా మనము ఈ వ్యాసం అభిప్రాయాల శీర్షిక కింద ఇన్ని సార్లు రాసుకోవచ్చో లేదో తెలియదు క్షమించాలి.
మీరు మీ ఈమైల్ ఏదీ ఇవ్వలేదు.
సాహిత్య సేవ చెయ్యక పోయినా ఫరవాలేదు కానీ సాహిత్యం కనీసం అర్ధం చేసికొగలిగితే బాగుండును అని కోరిక. “ఇక్కడ” అని మీరు అన్నది ఎక్కడో అర్ధం కాలేదు. నేను ఆంధ్ర ప్రదేశ్ లో ఇంగ్లీషు మీడియం పిల్లలగురించే చెప్పాను. వీళ్ళకి చదవటం రాయటం మాట్లాడడం వస్తాయి కాని పదవ తరగతి తరవాత తెలుగుకు ఎంత సాధ్యమయితే అంత దూరంగా వుండడానికి ప్రయత్నిస్తారు.
మీరు నా ఆఖరి పేరా చదివారా? గ్లామరైజు చేస్తే, పాపులరైజ్ చేస్తే పిల్లలు ఎంత కష్టానికి కూడా వెనుకాడరు. మా పెద్ద బాబు ని వాడి పుస్తకం కాక CBSE లేక lCSE పుస్తకాలు చదమంటే అవసరం లేదు అనేవాడు. అదే IIT FOUNDATION Classes పేరుతో మిగిలిన పిల్లలు వెళుతుంటే నేనూ అని తయారయ్యాడు.
There is something called Peer group influence.
కాశీనాధుని గారన్నట్లు పిల్లలు ఏది నేర్పితే అది తక్కినవాళ్ళతో కలిసి అయిన పక్షంలో తొందరగా మన కష్టం ఎక్కువ లేకుండా తక్కువ వ్యతిరేకతతో నేర్చుకుంటారని అభిప్రాయం.
విఠ లాచార్య సినిమా ట్త్రాష్ , హేరీ పాటర్ నవల అద్భుతం.
మరీ ఎక్కువ ప్రాచీన సాహిత్యం కాకపోయినా కనీసం ఒక ఆరుద్ర, అత్రేయ పాట, ఒక శ్రీశ్రీ కవిత ని ఆనందించేలా అభిమానం పెంచాలని అసలు మాతృభాషని చులకన చేయడం అంటే తల్లిని కించపరచడం అని వాళ్ళూ అనుకోవాలని ఓ ఆరాటం.
ఆజో ఇభొ ఫౌండేషన్ల లాగ సామాన్య ప్రజానీకం లో ఈ తపన, కనిసం ఒక ఫాషన్ గా ఫీల్ అయ్యేలా చెయ్యగలగాలని. యోగా కంటె Slimming centres fitness centres ఎక్కువ popular అయినట్లు ఒక Brand Image వచ్చెలా ఏమైనా చెయ్యలేమా?
రమాదేవి గొడుగుల
బాబ్జీలు గారు: మీ ఈమైలో, మీ ఫోను నంబరో ఇవ్వగలరా?
email: rd6219@yahoo.com
ధార గురించి అక్షర గారి అభిప్రాయం:
09/06/2008 11:54 pm
కొన్ని వూహలు బాగున్నాయి. గులాబీ కుండీలో కూర్చోవడం, స్థానిక వనరులు – లాంటివి.
కథ అనుకోవాలంటే కష్టంగానే ఉంది!
సంబంధంలేని సంఘటనలను సమన్వయించాలి. అలా సమన్వయించి సమర్ధించాలంటే – కాస్త లోతుగా చూస్తే గానీ కనిపిచని సంబంధమన్నా సంఘటనల మధ్య ఉండాలి. లోతుగా చూడాలి అన్న స్పృహను పాఠకులకు కథే కలిగించాలి!
రచనలో మొదటి ముప్పావు భాగానికి (ఇంకా పైనే) చివరి పావు భాగానికి సంబంధం కనిపించదు.
కొత్తపాళీ గారి ‘పాయింట్’ ను ఆమోదించాలంటే, కథలో(కథ అనుకుంటే) ముప్పాతిక భాగం పైనే noise (అనగా చెత్త) ఉందని ఒప్పుకోవాలి. ముగ్గురు మగవాళ్ళు అందమైన అమ్మాయి ఏడుపుకు చలించారని (లేక ఏడుపు వాళ్ళ హృదయాల్ని సున్నితంగా తాకింది అని) చెప్పడమే రచయిత ఉద్దేశ్యమైతే, మొదటి ముప్పావు భాగం – అనగా అంత సుదీర్ఘమైన పాత్రల/పరిసరాల పరిచయం అనవసరం!
‘బార్’లో మసక చీకట్లు మాయమయ్యాక కూడ “గులాబి” కళ్ళలో సన్నటి నీటి తెర “కొంచెం” దగ్గరలోనే కూర్చున్న మగవాళ్ళకు కనిపించడం-వాళ్ళ పరిశీలనా శక్తితో పాటు, కళ్ళ పవర్ కి కూడా సంకేతమా?! ఇంకా ఈ రచనలోపొడవైన వాక్యాలు, వాక్యాల్లో గజిబిజితనం కాస్త చికాకు పెట్టే అంశాలు.
కథలో సంఘటన ఒక అంగం కావాలి, అంతే కాని సంఘటన చిత్రణ మాత్రమే ఎన్నటికీ కథ కాలేదు!
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/04/2008 8:19 pm
సూర్యుడు గారూ,
తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలేవీ నాకు అందుబాటులో లేవు కాని ప్రవచనం అంటే గొప్ప మాట, ప్రవక్తలు చెప్పేది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది Propositional Logic – ప్రతిపాదనల తర్కం.
ప్రమేయం (function) అంటే మీ ఆలోచన సరయినదే. నేనో ఉదాహరణ ఇచ్చాను – Square(x). అలాగే Sum(x, y). Sum(4, 5) విలువ 9. ఇది గణితంలో మనకందరికీ తెలిసినదే.
తర్కం మన వివేచనకి సంబంధించింది. అంటే గణితం కన్నా కూడా మౌలికమైనది. అన్ని రకాల భావనలకీ, అన్ని రంగాల్లోనూ వర్తిస్తుంది. ప్రమేయాన్ని Frege కొంచం మార్చి తర్కంలో భావనకి సంకేతంగా వాడుకున్నాడు.
దానిని గణితంలో లాగా సంఖ్యలకి పరిమితం చెయ్యకుండా అన్ని రకాల వస్తువులకీ వాడాడు. RedColored(x) అన్న ప్రమేయం x మనిషైనా, జంతువైనా, వస్తువైనా వర్తిస్తుంది – ఎర్రగాఉందన్న భావనకి సంకేతంగా.
తను రూపొందిస్తున్నది ప్రతిపాద తర్కం కనుక ప్రమేయం తిరుగు ఇచ్చే విలువని రెండు విలువలకే పరిమితం చేశాడు. అలాంటి ప్రమేయాలని Truth-value functions అన్నాడు. ఆ రెండు విలువలు – True, False.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి sUryuDu గారి అభిప్రాయం:
09/04/2008 10:01 am
కొడవళ్ళ హనుమంతరావు గారు,
ప్రమేయం అంటే ఒక ఫంక్షన్ కదా, ఫంక్షన్ అంటే కొన్ని విలువలని ఇన్పుట్ గా తీసుకుని ఒక అవుట్పుట్ ఇచ్చేది కదా, ఆ అవుట్పుట్ కి అవును కాదు అని ఎందుకు అవ్వాలి, అది బూలియన్ ఫంక్షన్ అయితే అయ్యే అవకాశం ఉంది కాని. మీరు చెప్పిన సూత్రం ప్రవచనాలకి సరిపోతుంది, ఏదైనా ప్రవచనం అవును కాని లేదా కాదు కాని తప్పక అయితీరాలి.
నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా?
సూర్యుడు 🙂
ధార గురించి జె.యు.బి.వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
09/04/2008 9:44 am
శ్రీనివాస్ గారన్నట్టు, నాక్కూడా అసలు స్టోరీ మీనింగ్ ఏమిటో తెలియలేదు. ఆ అందమైన అమ్మాయి ఏడ్చే సీనుకీ, వీళ్ళ పార్టీకీ ఏమిటీ సంబంధం? ఏదో వుంది రచయిత దృష్టిలో. అది నాకర్థం కాలేదంతే అని అనిపిస్తుంది. ఒక పురుషుడి పెత్తనం వల్ల ఆ అమ్మాయి ఏడ్చిందని మాత్రం అర్థం అయింది. అయినా ఎవరన్నా అలా రెస్టారెంట్లో అంత బావురుమని ఏడుస్తారా? ఆ పురుషుడి పెత్తనం గురించి అప్పుడే మొదటిసారిగా తెలిసిందా, ఏమన్నానా?
ఆ కోటీశ్వరులకీ, ఆ పేద పంతులికీ మధ్య వున్న స్నేహం కూడా విచిత్రంగానే వుంది. ఆ తాగుళ్ళకీ, తిండికీ బిల్లు కట్టేది ఆ కోటీశ్వరులే కదా ఎప్పుడూ? ఇదేదో డబ్బున్న వారి వెంట లేని వారు తిరగడం లాగానే వుంది తప్ప, స్నేహం లాగా లేదు. ఇక, “దానికీ కారణం కేవీఆర్ మేష్టారే, మా నాన్న, మాస్కూల్లో టీచరు.” అన్న వాక్య నిర్మాణం వల్ల, విషయం మొదట్లో అర్థం కాలేదు.
ఈ కధని మెచ్చుకున్న వాళ్ళెవరైనా, దీనర్థం కాస్త విపులీకరిస్తే, బాగుంటుందనుకుంటున్నాను.
ఖరీదైన రెస్టారెంట్లో పడ్డ ఆ అమ్మాయి కష్టానికి వీళ్ళు చలించలేదనా?
రచయితా, ఈ కధని ఇష్ట పడ్డవాళ్ళూ క్షమించాలి. విషయం అర్థం కానివారు వుంటారని మాత్రం గ్రహించాలి.
– జె. యు. బి. వి. ప్రసాద్
బాలమురళీకృష్ణ గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
09/04/2008 8:46 am
శ్రీ బాలమురళి పై ఇంత సాధికారంగా రోహిణీప్రసాద్ గారు రాయగలరని నాకు తెలుసు. అయినా, “ఈమాట” కోసం రాసినందుకు ధన్యవాదాలు.
ఈ వ్యాసంలో ముచ్చటించిన ఒకటి, రెండు విషయాలను మళ్ళీ మీ ముందుంచాలని:
1. “గాయకుడిగా శ్రీబాలమురళీ దరిదాపులకు వచ్చేవాళ్ళు లేకున్నా, శ్రీ బాలమురళీకి మరిన్ని సుగుణాలు ఉంటే బాగుండేది” అన్న వ్యాసకర్త మాటలు, గమనించతగ్గవి. ఆలోచింపతగ్గవి. సంగీతంతో (పుస్తక జ్ఞానమేకాక) అన్ని రకాలుగా ఎంతో గాఢమైన పరిచయం, అనుభవం ఉంటే కాని ఇటువంటి వాక్యాలు రాయలేరు.
2. శ్రీ బాలమురళి సంగీతం, జీవితం తరవాత తరాల కోసం డాక్యుమెంటేషన్ విషయమై, రోహిణీప్రసాద్ గారు చేసిన సూచనలు ఆలోచించి, ఆచరణలో పెట్టవలసినవి. నాకు ఉన్న పరిచయంలో, తెలుగు సంఘాలకి గాని, సంస్థలకి గాని అటువంటి దమ్ము, ఆసక్తి ఉన్నాయని నే అనుకోను.
మోహనరావుగారికి:
మీ అభిప్రాయంలో, మీరిచ్చిన లింకులకి ధన్యవాదాలు.
విష్ణుభొట్ల లక్ష్మన్న
మరో గుప్పెడు మొర్మొరాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
09/04/2008 8:13 am
బాబ్జీలు గారూ:
“ఈమాట రచయిత” గా మీకు స్వాగతం!
అడిగిన వెంటనే, “చెయ్యి” చేసుకున్నందుకు చాలా సంతోషం.
మీరు ఈ రచనకి ఎన్నుకున్న వస్తువు బాగానే ఉంది కాని, మీ సమర్ధత ఇంతకన్నా ఎక్కువ కాబట్టి, వచ్చే సంచికల్లో మరిన్ని మీ “రాతలు” కోసం ఎదురు చూస్తూ, అంత వరకు ఒక్క సిటం ఆగుతాను.
విష్ణుభొట్ల లక్ష్మన్న
గుప్పెడంత మనసు గురించి sathya గారి అభిప్రాయం:
09/04/2008 12:11 am
చాలా బావుంది, కాని మనసు అదుపులొ వున్నా ఎందుకంత అలజడి?
మనసు సున్నితం కాబట్టి !
కొత్తవి ఇంకా రాయండి.
వాడుక భాషలో పద్యాలు గురించి Vamsi M Maganti గారి అభిప్రాయం:
09/03/2008 10:12 pm
JKM garu
As usual wonderful piece from you. Thankyou.
Might be off the track conversation but for some strange reason, your post here brings back memories of the following….Thanks to Dr Dwa.na.Sastry gari sAhitya kaburlu book –
“మున్ పటి రూల్సుకు కట్టుపడమ”ని చెప్పినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు భావకవిత్వంపై ధ్వజమెత్తారు. బహుధాన్య సంవత్సరంనాటి “అభినవ సరస్వతి” పత్రికలోని ఈ రచన చదివితే చెళ్ళపిళ్ళవారి భావాలు తెలుస్తాయి.
పుస్తక సమీక్షల గురించి… గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
09/02/2008 7:14 am
డియర్ ఎడిటర్,
ఇది పూర్తి నిడివి వ్యాసమే! సంపాదకీయం లోకి ఎందుకొచ్చి పడింది? వేలూరి గారికే ఎరుక :).
భారతి, స్వతంత్ర, జ్వాల, వీణ ఇవన్నీ TIFF Files గానో మరో రకంగానో ‘ఈమాట’ వారందించగలరా? ఉన్నంత వరకే, ఒక డంపింగ్ గ్రౌండొకటి తయారు చేసి మిగతా పాఠకులను కూడా వాళ్ళ దగ్గరున్నయి శేర్ చేయమంటే సరిపోతుందేమో (పాతవి కనుక కాపీ రైట్స్ పెద్దగా అడ్డురావేమో).
ఏవో ఒకటీ అరా చూడటమే కాని అంత పాతవి నేను పెద్దగా చదవలేదు, అప్పటి పత్రికల్లో విమర్శకూ సమీక్షకూ పెద్ద తేడాలేదా?
రచనలో సారం లేకున్నా అది నిలవటానికి (వేరే కారణాలతో) ఇదో ఉదాహరణ అనుకుంటాను.
విప్లవ్
సాయము శాయరా డింభకా! గురించి ramani గారి అభిప్రాయం:
09/02/2008 6:32 am
రామ గారు!
మీరెవరో నాకు తెలీదుకాని, మీ వ్యాఖ్యకి నేనెందుకు జవాబు ఇస్తున్నాను అన్నది మీకు తెలియాలి.
నేనో బ్లాగర్ని. ఇంతకుముందు ‘రమ’ అన్న పేరుతో టపాలు రాసేదాన్ని. ఇక్కడ నేను 30 వ తేదీ నాడు వ్యాఖ్య రాస్తే, మీరు 31 వ తేదీ నాడు రాసారు. మన ఇద్దరి పేర్ల దగ్గరి సామీప్యమం వల్ల నయితేనేమి, ఒక రోజు తేడా వల్ల నైతేనేమి, ఇతరులు అపార్ధాలు, అపోహలు కలుగజేసుకొనే అవకాశం వుంది. కాబట్టి, మీ వివరములు తెలియజేయాలని మా విన్నపం.
ఇహ వ్యాఖ్య గురించి: రచనలో విషయంలో, మీకు శ్రీ నారాయణ స్వామి గారి గురించి తక్కువ తెలుసని అనుకొంటున్నాను. ఒకసారి http://www.kottapali.blogspot.com బ్లాగు ని దర్శించండి. చక్కటి శైలి, నిరాడంబరత, చక్కటి విశ్లేషణ కనిపిస్తుంది ఆయన రచనల్లో. ఆయనకి ‘రాదు’ అనడం లేదా ఆయనకి నేర్పుదామనుకోడం “తాతకి దగ్గులు నేర్పడం లా” ఉంటుందని నా అభిప్రాయం.
ఇహ చివరిగా ఏ రచయిత కథ నన్నా విమర్శించండి, అలాగే ఎందుకు విమర్శిస్తున్నారో విపులీకరించండి. అంతే కాని రచయితని వ్యక్తిగతంగా విమర్శించడం (మీ పరిచయంలో…) చదివేవారి మనసు నొప్పిస్తాయి.
“గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొంటున్నా అనుకోవద్దు, అసలు “దొంగ” అనే అవకాశం ఇవ్వకూడదన్నది నా ఆలోచన. మరి మన్నించి మా అపోహలు తొలగిస్తారని ఆశిస్తున్నాము.
దేశమును ప్రేమించుమన్నా గురించి kalyani గారి అభిప్రాయం:
09/02/2008 5:36 am
మీ సొంత అనుభవాన్ని జోడించి మరీ రాసి నట్టు ఉన్నారే. కాని కథలో ఆ captivation లేదు. ఎదో ఒక discussion లా, అలా చప్పగా నడిచింది
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి Ramadevi గారి అభిప్రాయం:
09/01/2008 12:32 am
ఇప్పటికే ఇక్కడ చాలా మంది చాలా విషయాలు ప్రస్తావించేసారు కానీ తెలుగు మీడియం లో చదివి (1979 ముందు) ఇప్పటి తెలుగు మీడియమ్ పుస్తకాలు చదివి, మా ఇద్దరి పిల్లలు, ఇంగ్లీషు మీడియమ్ లో తెలుగు మీడియమ్ లో చదివిన మిగిలిన పిల్లలని చూసి, నాకు కలిగిన కొన్ని అభిప్రాయాలని వెలిబుచాలని ఈ మాటలు.
తెలుగు మాధ్యమానికి తెలుగు భాష సజీవ స్రవంతి లా వుండడానికి తేడా వుంది. నేను నేర్చుకొన్నప్పుడు ఇన్ని కష్టమైన తెలుగు పదాలని సృష్టించే ఈ పద్ధతి లేదు. హాయిగా అటమ్ అంటె ఆటమ్ అనే చదువు కొన్నాం కానీ ఇప్పుడు పరమాణువు అని ఒక కొత్త పదాన్ని నేర్చుకోవాలి, ద్రావణి, ద్రావణేయత అని నేర్చుకొని, మళ్ళీ ఇంగ్లీషులో తర్జుమా చేసుకొవాలి . ఎన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి వెళ్ళినా కష్టమే. కాబట్టి తెలుగు లో చదివిన వాడు తనకి అవకాశాలు వుండాలి పెరగాలి అనే వుద్దెశం ఎక్కువ కనిపిస్తోంది. బాబ్జీలు గారన్నట్లు రేపు చైనేస్ నెర్చుకొంటే అవకాశాలు ఎక్కువ అనిపిస్తే అదే నేర్చుకుంటాము. ఇది పరమ సత్యం – తెలుగు కీ దీనికీ సంబంధంలేదు.
భాష కి సాహిత్యమంతో పరిచయం ఎక్కువ బలాన్నిస్తుంది. విస్తృతమైన పఠనతోనే ఇది సాధ్యమవుతుంది. కాని ఇప్పుడు తెలుగు సాహిత్యంతో పరిచయం తక్కువ అయిపోయింది. తెలుగు పఠనం చాలా తగ్గిపొయింది. ఈ రెండు అంశాలు ప్రోత్సహిస్తే చాల బాగుంటుంది
( Sorry it is taking too long to type in Telugu. So please excuse me for this switch )
Nowadays everything is glamorized and popularized. Including PETA sort of activism. So there should be a popularization spiced with some glamor. Like Indina idol , KBC sort.
Sankaraabharanam undoubtedly made more people start learn classical music. It compeled people to taste the classical music. I feel sad for my not able to share the the beauty in the telugu literature with my sons. But they feel that I am silly and crazy to expect them so. They don”t mind taking extra efforts to learn about space shutles and moon rovers since it gives them identity. and recognition. we had a small quiz comepetition in Ramayanam charecters on our corporation day. Even small questions were not known to many or most were indifferent to show their knowledge. But the same gathering was asked on something more popular subject everybody was curious or showed interest. The question here is not about Ramayanam It is about the subject being a popular one or “in-thing”. So
Please note that even people who studied in telugu medium are not very comfortable when it comes to enjoying a small story in telugu or small kavitha. There are so many telugu medium students who have not read anything other than their text books. If you ask them if they have read anything other than their text books the answer one gets is no. So what exactly is our aim and objective?
I went to telugu university to ask for some help in popularizing telugu among school going children. But the people who are ready to spend lacs on popularizing to foreign nationals had no interest in this particular thing. The teachers are helpless but to teach children who feel that it is just for 10th percentage which can be dumped once exam is over. Many times the teachers themselves will not have any enthusiasm to enthuse any interest.
If any body who is really interested to promote the language other than writing or taking in elite platforms I will be most happy to work along with them. I am desperately looking for someone to help me.
Bujjilugaaru or Rama gaaru or someone who are able to understand my point if you can give your email ids I will be most happy.
Ramaadevi
rd6219@yahoo.com
ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ గారి అభిప్రాయం:
08/30/2008 5:31 am
సాయి గారికి:
బాబ్బాబు, నా సందేశం లోని చివరి పేరాని ఏరి పారేసి మిగిలినవి చదువుకుందురూ. మీకు పుణ్యం వుంటుంది. అక్కడ కాస్తంత కవి హృదయాన్ని ప్రదర్శిద్దామని ప్రయత్నించాను. క్షమించండి. 🙂
హనుమంతరావు గారు ఇలా అన్నారు:
“సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.”
దీనితో నేను ఏకీభవిస్తున్నాను. నేను సాధారణ పాఠకుణ్ణే. ఆస్కర్ వైల్డ్ ఏకవాక్యాలు (one-liners) నాకు బాగా నచ్చేవి. ఆ తర్వాత అతని జీవిత చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం తెచ్చి చదివితే తెలిసింది అతన్ని రెండు సంవత్సరాలు అప్పట్లో ఒక చెప్పుకోదగని నేరానికి చెరసాలలో పెట్టారని.
అది చదివి హతాశుణ్ణయ్యాను. కానీ అతని వాక్యాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. అతని నేరం (?) ఏమాత్రమూ నచ్చదు. 🙂
నమస్కారములతో
పామర్తి సత్యనారాయణ
సాయము శాయరా డింభకా! గురించి ramani గారి అభిప్రాయం:
08/30/2008 3:50 am
ఈ బాదరాయణ సంభంద బాంధవ్యాలేమిటో కాని, ఒక్కమాట నిజం. మనకోసమంటూ లేదా మనమెలా ఉన్నామో అని ఒక్కసారన్నా ఆలోచించేవాళ్ళే మనవాళ్ళు. ఇది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. మన అవసరానికి అప్పటికప్పుడు మనదగ్గరికి వచ్చేవారే మనకి సహాయకులు గాని, మన సహాయం అడిగితే మటుకు ఎవ్వరైనా కాదనేవారే.
ఈ కథ లో నైనా ఆ సమయంలో అండ్రియా , హార్లీ , ఇంకో తెల్ల జంట అక్కడికి వచ్చారు కాబట్టి ఆ సమయంలో సహాయకంగా చేయి అందించగలిగారు కాని, లేకపోతే వాళ్ళు కూడా అక్కరికి రాని మిత్రులే కదా!
” నమ్మితే ప్రాణాలైనా ఇస్తాము, నమ్మడమేరా కష్టం
ముక్కుసూటిగా ఉన్నది చెప్తాము నచ్చకుంటే మీ ఖర్మం
కష్టమొచ్చిన కన్నీరొచ్చిన
చెదరని కదలని ఇంధ్రధనుస్సులం మేమే ఇండియన్స్ ”
అన్నది గుర్తోస్తోంది. కథలో ‘మన ‘ అనుకొనేవాళ్ళని విలన్ గా(అక్కరకి రాని నేస్తం గా) చూపించడం కొంచం బాధగానే ఉంది.
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/29/2008 11:43 pm
సాయి గారికి,
మీ పురోహితుడి ఉదాహరణ నాకర్థం కాలేదు. కుటుంబరావుది ఉద్యోగధర్మమూ, శ్రీశ్రీది మరొకటీనా? ఎలా? ఇద్దరూ బతుకుతెరువు కోసం తమ నమ్మకాలతో కొంత రాజీపడినట్లుంది. మహాకవులూ, మేధావులూ కూడా రాజీ పడితే ఎలా? అని ధర్మజీవులడగొచ్చు. కాని, రాజీపడకపోతే, మన సమాజంలో అలాంటి నమ్మకాలున్నవాళ్ళకి సరయిన ఆస్తిపాస్తులుంటే తప్ప ఇల్లు గుల్లవచ్చు. ఏం? ఆ మాత్రం త్యాగం చెయ్యలేరా? అంటే, ఏమో, అది కడుపులో చల్ల కదలని నాలాంటి వాళ్ళు చెప్పడం ధర్మం కాదు.
పరిమితమైన నా సాహితీ పరిధిలో చండీదాస్ లా ధైర్యంగా చెప్పే రచయితలెవ్వరూ లేరు – చలం తప్ప.
మీరు “సాధారణ పాఠకులు హంసలు కారు. వ్యక్తినీ, రచన్నీ, వ్యక్తిగత సిద్ధాంతాలనీ దేనికది వేర్వేరుగా తూకం వెయ్యరు. వెయ్యలేరు,” అన్నారు. మీరే సమర్థించిన ప్రసాదు గారి ఆక్రందన – ప్రజలు వేర్వేరుగా తూకం వేస్తున్నారనే గదా?
హంసలంటే చలసాని ప్రసాద్ రాసిన “అనంతం” ముందుమాట గుర్తొచ్చింది: “ఏ ముసుగులూ, దాపరికాలు లేకుండా ఉన్నదున్నట్టు రాశాడు శ్రీశ్రీ. … మింగలేని చేదునిజాలూ, వినలేని సంగతులూ, చూడలేని దృశ్యాలూ … ఏదిఏమయినా ప్రజలు హంసల లాంటివారు…”
సామాన్య పాఠకులకి హంసలతో కాస్తో కూస్తో చుట్టరికం లేకపోతే, అనంతం వెలువడిన పాతికేళ్ళ తర్వాత కూడా మహాప్రస్థానం ఎందుకు నిలుస్తుంది?
సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.
(నేనీ లాంగ్ వీకెండ్ ని సద్వినియోగపరచుకుంటే, వచ్చే వారం అలాంటి ఒక ద్రష్ట గురించి నా కంప్యూటింగ్ వ్యాసంలో చదవచ్చు. విషయం, సందర్భం, మన రచయితలతో పోల్చదగ్గది కాదు కాని నేను పైన అన్న దానికి ఓ ఉదాహరణ.)
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
08/28/2008 11:32 am
It is unfair to take a dig at Vemana’s past. He wrote padyams after, not before, overcoming his past. Same thing with Valmiki et.al.
శ్రీశ్రీ భక్తి రచనలు ఉపాధికోసం రాసాను అనడం వాస్తవికతనే కాక అతని నిజాయితీని కూడా చెప్పుతుంది. అయితే ఈ చర్చ కేవలం రచనలు, రచయితలకే పరిమితం చేయడం అన్యాయం!
“తిట్టొద్దు, కొట్టొద్దు, (లేదా మీకిష్టమొచ్చిన తప్పిదాన్ని ఇరికించండి)
అని చెప్పుతూ, నువ్వు అవ్వే చేయొచ్చు, కాని నేను అవి చేస్తే తప్పేంటి నాన్నా” అని అనడం, వినడం తెలియని వారెవ్వరు! మాటకు, చేతకు అదే సంబంధం. చేత మనిషి వ్యక్తిత్త్వం అయితే మాటలు ఆ వ్యక్తి రచనలు కావచ్చు.
తప్పిదాలగురించి కాదు, వొప్పిదాల గురించి అయితే కూడా ఇదే పరిస్థితా అని అడుగొచ్చు.
అందరికి తెలిసిన కథ గుర్తుకొచ్చింది.
గాందీజీ దగ్గరకు ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి వీడికి చక్కెర ఎక్కువ తినొద్దని చెప్పమని వేడుకుందట. తల్లి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి గాంధీజీ దగ్గరకు తీసుకొచ్చింది ఆయన చెపితేనన్నా వింటాడేమో అని ఆశతో.
ఏముంది! ఇప్పుడు కాదు, వారం రోజులయింతరువాత తిరిగి రమ్మన్నారట గాంధీజీ. మళ్ళీ వారం తరువాత వెళ్ళితే, గాంధీజీ పిల్లవాడిని ప్రేమతో దగ్గరకు చేర్చుకొని చక్కెర ఎక్కువగా తినకు అని చెప్పాడట. ఈ మాత్రం ముక్క చెప్పడానికి వారం తరువాత ఎందుకు రమ్మన్నారు అని ఆ తల్లి ఆడిగిందట. వారం రోజుల క్రితం వరకు నేను కూడా చక్కెర ఎక్కువగా తినేవాడిని. నేను తగ్గించిన తరువాత ఇప్పుడు చెప్పాను అని వివరించాడట గాంధీజీ. కథ కంచికి.
రచయిత అకారణంగానో, సకారణంగానో, ఒకరి దుకాణంకోసమో,లేక సవాలక్షల కారణాలతో రాయొచ్చు. ఎందుకు రాయకూడదు? అందంగా, అధ్భుతంగా కూడా ఆ రచనలు రావొచ్చు. అవార్డులు కూడా పొందొచ్చు. అయితే నిజాయితీ లోపించే రచనలు ఆ తల్లి చెప్పిన మంచి మాటల్లాగానే మిగిలిపోతాయేమో.
నిజాయితీతో చెప్పిన మాటలు పెద్ద రచయితవి అయినా కాకపోయినా, అవార్డులు రివార్డులేవి వచ్చినా రాకపోయినా, అసలు రాయడం చదవడం కూడా రాని వాడివైనా కూడా గుండెకు తగులుతాయి. మార్పుకు ఊపిరి ఇస్తాయి.
విధేయుడు
-Srinivas
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/27/2008 11:30 pm
నమ్మకాలు – బ్రతుకుతెరువు
సాయి గారికి,
చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.
రేపో మాపో చండీదాస్ స్వీయచరిత్ర వెలువడితే, ఆయనొక యోగిలా బ్రతికాడని తెలిస్తే, అనుక్షణికం విలువ ఓ పిసరు పెరగొచ్చు. భ్రష్టుడనిపిస్తే ఓ పిసరు తగ్గొచ్చు. కాని మౌలికంగా నవల విలువలో మార్పుండదు. ఉంటే మనం సాహిత్యాన్ని వెలకట్టడానికి వాడే తూనికరాళ్ళని తనిఖీ చెయ్యాలి.
శ్రీశ్రీ భక్తి రచనలు జీవనోపాధి కోసం రాశానన్న సమర్థన దబాయింపు గానూ లేదు, సంజాయిషీ గానూ లేదు. కఠోరమైన వాస్తవికతతో కూడి ఉంది. మహాప్రస్థానం తోనో విప్లవ రచనలతోనో వచ్చే డబ్బుతో పొట్ట గడుస్తుందంటారా? గడవకపోతే ఏమాయె, “సతుల్, సుతుల్, హితుల్ పోతే పోనీ, … తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ,” అన్న కళా రవి, ఆ మాత్రం నిజజీవితంలో ఆటుపోట్లకి తట్టుకోలేనివాడు, కవిత్వం, కాకరకాయా రాయడమెందుకు అంటారా?
నాస్తికులు పురాణకథని చెప్తే ప్రశ్నించే హక్కు పాఠకులకుండొచ్చు. కొడవటిగంటి కుటుంబరావుకి నివాళులర్పిస్తూ చలసాని ప్రసాదరావు చందమామ నిర్వాహకులు సమర్పించిన శ్రద్ధాంజలిని ప్రస్తావించారు:
“తన విశ్వాసాలు, నమ్మకాలూ ఎలాంటివైనా చందమామ పాఠకుల కోసం ఆయన విశేషమైన కృషి చేసి, సేకరించి, అందజేసిన ప్రాచీన ఇతిహాసాలూ, పౌరాణిక గాథలూ, ఆ శైలీ మరువరానివి. స్వర్గీయ శ్రీ చక్రపాణి ఆశయాలకు రూపం కల్పించి, తన శైలితో పాఠకలోకాన్నీ, తక్కిన పత్రికలనూ ఆకర్షించిన మేధావి శ్రీ కుటుంబరావు.”
అంటే కుటుంబరావు తన నమ్మకాలతో సంబంధంలేని రచనలకి మెరుగులు దిద్దే పనికి అంకితమయ్యేడనే కదా! ఎందువలన? అని చలసానే కుటుంబరావుని సూటిగా ఆయన బ్రతికుండగనే అడిగారు:
“మీరు – నేనూ ఒకే వృత్తిలో ఉన్నాం. ఎడిటర్ గిరీ అనేది ఒక వృత్తి. బతుకుతెరువు. మనం ఎడిటర్లగా కాక ఏ ఆఫీసర్ గానో, లెక్చరర్ గానో, బ్యాంకు ఉద్యోగిగానో వుంటే, ఆఫీసులో మనం చేసే పని గురించిగానీ, దాని స్వభావం గురించిగానీ ఎవరూ ప్రశ్నించరు, విమర్శించరు. కానీ, ఎడిటర్ అనీగాన అందరూ అతను పనిచేసే పత్రికలోని భావాలన్నింటికీ అతన్నే బాధ్యుడిగా భావిస్తారు, విమర్శిస్తారు. మీరు చందమామ లో వేసే కథల స్వభావం గురించి, వాటిలో రాక్షసులు, భూతాలు, దయ్యాలు, దేవుళ్ళు మున్నగు వాటిలో గల ఔచిత్యాన్ని గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు…. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?” (రసన, పేజీ 133.)
కుటుంబరావు దీనికి సమాధానం ఇవ్వలేదు కాని, నేనూహించుకోగలను – కుటుంబరావుకీ పోషించాల్సిన కుటుంబమొకటుంది. శ్రీశ్రీ, కుటుంబరావు, ఇంకా అనేకమంది, పొట్టపోషణ కోసం తమ నమ్మకాలతో పూర్తిగా కాకపోయినా కొంతయినా పొసగని పనిలో ఉండి ఉండొచ్చు. వాళ్ళు తమ నమ్మకాలని వదిలెయ్యాలా? లేక వేరే బ్రతుకుతెరువు చూసుకోవాలా? మీరయితే ఏం చేస్తారు?
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
08/27/2008 2:17 pm
మంచిది నీతిమంతులారా, మహా ప్రస్థానాన్ని విశాఖ సముద్రంలోకి విసిరెయ్యండి, గుయెర్నికాని కాల్చెయ్యండి. అక్కడతో ఆగకండి, ప్రాచీన కళా కారులు, సాహితీకారులేం మడి కట్టుకోని కూర్చోలేదు వారి చిత్రాల్ని, రచనల్ని సైతం సమిధలు చేసెయ్యండి. ఐతే వొక మనవి ఆ మంట వెలుగులో మీవెనక భాగాలు మాత్రం ఎవరికీ కనపడకుండా కప్పి పెట్టుకోండి, లేకపోతే ఎవరో మిమ్మల్ని కూడా ఆ మంటల్లోకి దోశెయ్యగలరు.
నీతులు చెప్పడం సాహిత్యం కాదు. బ్రతుకుని చిత్రించడం సాహిత్యం. ఆ జీవిత చిత్రణ ఎవరి కలంనుంచొస్తేనెవి. అక్ష్రర రూపం తీసుకున్న ఆ అంతరంగ వుప్పెన కి దానికంటూ వొక అస్థిత్వం ఏర్పడుతుంది. రచయితతో సృష్టికర్తతో సంబంధంలేని వ్యక్తిత్వం ఆ రచనకి అబ్బుతుంది. రేఖా మాత్రంగా రచయిత రచనలో కనిపడొచ్చేవో but by itself it will be an independent entity. Like any of us who inherited a few characteristics from our parents. Still we grow up to be independent human beings and we will not and do not want to be judged by personalities of our parents. రచనలు, రచయితల మధ్య కూడా అదేవిధవైన సంబంధం వుందని నా నమ్మకం.
ఛందోధర్మము గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
08/27/2008 1:06 pm
మై డియర్ బాబ్జీలు,
జారుడుబండ మీద కాలేస్తే ఏమవుతుందో తెలిసీ, పెద్దగా పట్టించుకోని రచయితలు మనకు కావాలని ఎవరైనా కోరుకుంటే ‘చదివే సమాజం’ పరిధి పెరగాలి. మనమున్న బావి, కాదు ఇంకుడు గుంత, లోంచి కనీసం తలైనా పైకెత్తి ప్రపంచాన్ని చూద్దాం అని చదివే వాళ్ళకుండాలి. చదివే వాళ్ళకు అర్హత అవసరం అన్నది కొంతవరకూ కరెక్ట్. అది ఎట్లాంటి అర్హత అనేదగ్గరే కొద్ది పేచీలు. వాటిని తీర్చడానికి కొంత అర్హత కలిగిన వాళ్ళే రాయాలి. వాటి మీద మళ్ళీ చదవటానికి, రాయటానికి “క్వాలిఫై” అయిన వాళ్ళే కావాలి.
విషయం తీవ్రబడి, చిక్కబడ్డప్పుడు అర్హత అనేది ముఖ్యమవుతుంది. కొడవళ్ళ కోట్ చేసిన, ఆయన ఫేవరైట్ రచయిత మాటలు ఆ దాంట్లోకే వస్తాయి. అది డిఫెండ్ చేయగలిగే మాట.
విషయానికున్న తీవ్రతను రచయితకన్నా అర్హత కలిగిన పాఠకుడే బాగా గ్రహిస్తాడేమో అని నా అనుమానం.
ఇక మళ్ళీ ఒకసారి ముందునించే మొదలు పెడితే:
సరే, మీరన్న రాయటానికి అర్హత అక్కర్లేదు అన్నది “ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి” అయినా కూడా ఆయా విషయాలకు ఉన్న తీవ్రత ఏ అర్హతా లేని వాళ్ళకు తెలవదు, రాయలేరు. (తెలుస్తుందని, రాయగలరని మీకు అనిపిస్తే, “ప్రూఫులు కావాలి” బాబ్జీలు గారూ అంటాన్నేను :)). “తెలవటం” ఒక అర్హత.
ఇది గుడిపాటి అడిగిన “మన కవులు అక్షరాస్యులేనా!” దగ్గరికే తీసుకు రావచ్చు. లేదా “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్న దగ్గరే మొదలు పెట్టొచ్చు. “కవికి కావలసిన కనీస అర్హత గురించి కవులే చెప్పాలి” అని నేనూ ఒక పెద్ద సారును తల్చుకుని ఇప్పటి మటుకు వదిలించుకోవచ్చు. ఇవి రాయటానికి నాకేం అర్హత ఉందీ అని నన్నే అడిగితే మాత్రం జవాబు “అది చదివే వాళ్ళు డిసైడ్ చేయాల”ని చెప్పటం తప్ప మరో మాట లేదు.
అర్హత కలిగిని చదివే వాళ్ళు, రాసే వాళ్ళ అర్హతను నిర్ణయిస్తారు అని మరోవిధంగా చెప్పొచ్చేమో, మన ఆంజనేయ స్వామి గుడిమెట్ల మీద — చెప్పుకునే విషయంగా. “రచ్చబండ” అయితే మాత్రం ఇంకా స్పష్ఠంగా చెప్పాల్సి ఉంటుంది.
అసలు నేను రాసింది వెనక్కు తీసుకుందామనుకున్నాను. కానీ కాలు పెట్టింతర్వాత అది తీయటం కష్టం అనిపించి మాట్లాడలేదు. ఒక కాలే కదా అని ఊరుకుంటే ఇప్పుడు రెండోది కూడా పెట్టి చూడమన్నందుకు మీకు ధన్యవాదాలు.
ఇక ముందుకెళ్ళి, మిగతావి కూడా చూద్దాం:
(వీటిని పెద్దగా కాంటెక్స్ట్ లో పెట్టి, అంటే వెనక్కెళ్ళి, భూతద్దం అప్పుతెచ్చుకుని, చూడకండి, దేనికదే అన్నట్టు చదవండి, వీలైతే)
“రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.” కాదు, చదివే వాడి అర్హత ఇక్కడ ప్రశ్నార్ధకం.
“నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.” వొల్లకుంతానికి నానేవన్నా పెండ్లి సేసుకున్న సీతాల్నా! అవుసరవైతే అయిదారుగురికి ఒక్క సారే గురెట్టి, ఒకల సిగలొకలకు ముడివెట్టి కొత్త భారతవేదైనా పుట్టి చస్తుందేవో అని సూసే వోడికి ఇదేం లెక్క?
నీతులు చెప్పటానికే కాని వినటానికి బాగుండవు అని ఎవరో పెద్దతలకాయ అనగా విన్నాను. నిజాయితీ అనే అర్హత మాత్రం ఏది రాయాలన్నా కావాలి.
వేమన గురించి “అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి?” అని అడిగినందుకు: కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి ‘నీతి’ మారుతుంది. ‘నిజాయితీ’ మారదు. ఇవాల్టి నీతి రేపుండక పోవచ్చు. నేను రాసిన ఒక బేవార్స్ ఎక్సాంపుల్ ‘నిజాయితీ’ గురించి, నీతి గురించి కాదు. మన దగ్గర (ఇప్పటికీ) పది పదమూడు ఏండ్ల పిల్లలను పెండ్లీలు చేసుకునే వాళ్ళున్నరు, వాళ్ళంతా ఛైల్డ్ మాలెస్టర్సే మరో ప్రాంతపు నీతిని బట్టి చూస్తే. అట్లాంటి క్వాలిఫికేషన్స్ కాకుండా, నిజాయితీ గురించి మాత్రమే నేను రాసింది.
నిజాయితీ మరో అర్హత రాయటానికి.
సెలవ్.
విప్లవ్
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
08/26/2008 8:49 pm
రచయితలు, శ్రీరంగనీతులు
ఇది జె.యు.బి.వి. ప్రసాద్ గారి అబిప్రాయంపై నా స్పందన. పాతికేళ్ళ క్రితం ఆంద్రజ్యోతిలో అనుక్షణికం సీరియల్ చివరకొస్తుండగా, పాఠకులతో ప్రశ్న-జవాబుల ముచ్చట ముగిస్తూ, వడ్డెర చండీదాస్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి:
“చాలా మంది పాఠకులు నా గురించి (‘పర్సనల్’ విషయాలు) అడుగుతూ వొచ్చారు. మీరు మీ నవలలో కులాలను కులాలుగా స్పష్టంగా చిత్రించారు కదా. మీది యే కులం. మీ సొంత కులాన్ని మీరు ఏ విధంగా చిత్రించారో తెలుసుకోవాలనుంది / మీ భార్య చనిపోయినప్పుడు “హిమజ్వాల”, ప్రేయసి చనిపోయినప్పుడు “అనుక్షణికం” రాశారట కదా / మీరు కన్వెర్టెడ్ క్రిస్టియన్నట కదా / మీ జీవితంలో కులతత్వాల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ వొచ్చారు / మీరు తిరుగుబోతట కదా / మీది కులాంతరమట కదా / మీరు తిక్కమనిషట కదా / మీరు దేవుడిలాంటివారట కదా / మీరు అవివాహితులట కదా / మీకు ఇద్దరు భార్యలట కదా / మీరు బ్రహ్మచారులట కదా, యిలా యెన్నో. వాటికి వేటికీ జవాబు లివ్వలేదు. నచ్చితే నా రచన చదవండి. నా జీవితాన్ని అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ కలిపి పరిశీలించతగిన రచయితనైతే అందుకు యింకా వ్యవధి వుంది….
ఐతే. నా జీవితం – అందులో అల్పత్వాలున్నా మహత్వాలున్నా అసహ్యతలున్నా అభినందనీయాలున్నా అభిశంసనీయాలున్నా నా జీవితం నా జీవితంగా యధాతధంగా పరిశీలించాల్సిన వేళ వొస్తే ఆనాడు తప్పక అలా యధాతధంగా లభ్యమవుతుంది.”
చండీదాస్ లాంటి రచయితలు అరుదు. కాని ఆయనన్నది అందరికీ వర్తిస్తుందనుకుంటాను. యండమూరి, శ్రీశ్రీ, శివారెడ్ది, పసంద్ రెడ్డి (?) – వాళ్ళ రచనలు అసలు ముందర చదవదగ్గవో కావో పరిశీలించండి. చదవదగ్గవి కాకపోతే, వాళ్ళ జీవితం లో కెళ్ళడం వ్యర్థం. చదవదగ్గవే కాక, ఉన్నతమైన రచనలైతే, వాళ్ళ జీవితాల్లో కెళ్ళండి. వారి అల్పత్వాలని బయల్పరచి వాటి మూలంగా ఒకప్పుడు విలువైనవనుకున్న రచనలు ఇప్పుడు పాఠకులు ఎందుకు విసిరి పారెయ్యాలో వివరించండి. వెంటనే పాఠకులలో మార్పు వచ్చి సమాజంలో నీతీ న్యాయం పెరుగుతాయనుకోను గాని, మీ ఆక్రోశానికి మాత్రం సాహితీ గౌరవం లభిస్తుంది.
కొడవళ్ళ హనుమంతరావు
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి ravindraBabu గారి అభిప్రాయం:
08/26/2008 7:49 pm
జ్యొతిష్యము గురించి డిస్కషను బాగుంది కాని జ్యొతిష్యము నమ్మాలి అనే వారికి ఒక్ ప్రశ్న ఒకే రొజు ఒకే time ఒకే place లొ పుటిన వాళు ఒకె రకమయిన జాతకమ్ ఉండదు యెందుకు.
ఛందోధర్మము గురించి mOhana గారి అభిప్రాయం:
08/25/2008 12:41 pm
నన్నయ కాలములో ఋ-కారాన్ని రి-కారముగా పలికేవారు.
అందుకే ఆ కాలపు శాసనాలలో కూడ ఋణము అనృ దానికి
బదులు రిణము అని వాడారు. కాని తిక్కన కాలానికే ఋ-కారాన్ని
రు-కారముగా పలకడానికి ఆరంభించారు. తిక్కనగారు కొన్ని
చోటులలో ఋ-కారానికి రు-కారానికి యతి కూడ చెల్లించారు.
సామాన్యముగా ఛందస్సులో ఇది నిషిద్దము. ఋ-కారానికి
రి-కారానికి, ఇ, ఈ, ఎ, ఏ, హి, హీ, హె, హే, యి, యీ, యె,
యే, ఋ-కారము ఉన్న అన్ని హల్లులకు యతి చెల్లుతుంది.
కాబట్టి అమ్రుతము అని పలికేటప్పుడు, వ్యావహారిక భాషలో
అమృతమునకు బదులు అలా రాయడములో తప్పు లేదని
నా భావన. గ్రాంథికముగా మాత్రము అది సరి కాదు, అంతే.
తెలుగువారు మాత్రమే కాదు, కన్నడ, మరాఠీ, ఒరియా భాషలలో
ఋ-కారాన్ని రు-కారముగా పలుకుతారు. మిగిలిన ఉత్తర
భాషలలో రి-కారముగా పలుకుతారు.
విధేయుడు – మోహన
తడి గురించి Tarakaram గారి అభిప్రాయం:
08/23/2008 8:18 pm
మాస్టారూ,
ఇలాంటి కథలు మా univలో సహాయాన్ని పొంది, అన్నీ మరిచిపోయి, US వెళ్ళి సెటిల్ ఐనవాళ్ళు కాస్త చదివితే, ఒకరిద్దరికైనా సహాయం చేస్తారేమో.
కాని, వాళ్ళు గొప్పవాళ్ళు … తెలుగు చదువుతారా?
ఛందోధర్మము గురించి baabjeelu గారి అభిప్రాయం:
08/21/2008 10:24 am
సాయిగారూ,
రాసేవాళ్ళకి అర్హత అక్కర్లేదు.
ఎందుకంటే వాళ్ళు రాసిన దాని “అర్హత” మీద అది బతికితే బతుకుతుంది, లేకపోతేలేదు. రాసినవాళ్ళు “మలబారు పోలీసు గేంగీల్నెట్టి, రాసింది బాగోలేదని రాసిన వాళ్ళందర్నీ సితక్కొంటీచిసినా” దాని అర్హత మారదు.
రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు “రత్తాలు రాంబాబు” నవల విషయంలో చెప్పింది, రాసే వాళ్ళందరూ ఆచరించదగ్గది.
“కథ రాసేక, దాన్ని మరింక విడిచి పెట్టక, దాని మానాన్న దాన్ని బతకనివ్వక (లేదా చావనివ్వక) ఆ రాసినవాడు, దాన్ని సాకుతూ, సంరక్షించుకుంటూ, సమర్థించుకుంటూ, నెత్తిని పెట్టుకొని తిరగడం నాకు ఇష్టం లేదు.
నిజానికి దగ్గరగా వుంటే కథ కొన్నాళ్ళు ఉండవచ్చు. సత్తువుంటే ఉంటుంది, లేకపోతే పోతుంది.
“రత్తాలు రాంబాబు” నవల గురించి ఏమైనా తెలియాలంటే, అది నవల వల్లే తెలియాలి కాని నా వల్ల కాదు.”
అందుచేత, రాసిన ప్రక్రియకి అర్హత ఉండాలి, చదివే వాళ్ళందరిచేతా “సెబాస్” అనిపించుకునే అర్హత. చదివే వారికి అర్హత కావాలి. అర్థం చేసుకునే అర్హత. “సెబాస్” అనగలిగే అర్హత. రాసే వాళ్ళకి ఏ అర్హతా అక్కర్లేదు. రాయగలిగే అర్హత తప్ప.
ఈమాట గురించి గురించి baabjeelu గారి అభిప్రాయం:
08/21/2008 9:50 am
క్రుష్ణమోహను గారూ,
మిమ్మల్నీ, భైరవభట్ల కామేశ్వర రావు గారినీ, రోహిణీప్రసాదు గారినీ, వైదేహీ శశిధర్ గారినీ, పామర్తి వారినీ, రవికిరణ్ గారినీ, మురళి గారినీ, మూలా సుబ్రహ్మణ్యం గారినీ, లక్ష్మన్న గారినీ మీ అందర్నీ మించి ఉదయకళ గారినీ, వగైరాలతో పోలిస్తే మీ పక్కన నిలబడ గలిగే అర్హత లేదు నాకు. అది నాకు తెలుసు. ఎందుకంటే, ఈ అభిప్రాయాలు రాయకముందు “నథింగ్ టు రైట్ అబౌట్”.
కావాలని మారు పేరుతో అభిప్రాయాల్ని రాయటం లేదు.
2006లో ఈమాట ని మావగాడు పరిచయం చేసినా పట్టించుకోలేదు. అది నా దురద్రుష్టం. ఈ ఏడాది మళ్ళీ న్యూయార్క్ నుంచి వచ్చి తిట్లుతిట్టి “మీ అభిప్రాయం తెలిచేయండి” ని చూపించేడు, మావ గాడు. వున్న వ్యసనాలని మించి ఈమాట చదవడం, అభిప్రాయాలు రాయడం వ్యసనవైపోయింది.
నా ప్రవర చెప్పమని “జయప్రభ” గారన్నారు. ఇదీ వరస.
నా మట్టుకి నేను, నా గురించి “సహస్ర శిరఛ్చేద అపూర్వ చింతామణి” లో దొంగ సన్యాసిననీ, “ఆషాఢభూతి” గురువుగారిననీ, “మందుల భీముడి” మేనల్లుడిననీ, “ముంగేరీలాల్ కె హసీన్ సప్నే” లోని రఘువీర్ యాదవ్ ననీ, “బైరాగినా, అసిరిగాడినా” అన్న సందిగ్ధంలో వున్నవాడిననీ, “సింహాచలాన్నా,అడ్డబుర్రనా” అన్నఅనుమానంలో వున్నవాడిననీ ఖచ్చితంగా నమ్ముతున్నవాడిని. “ధర్మవ్యాధుడిలా” బతకాలని తెలిసికూడా అదెలాగో తెలియనివాణ్ణని అనుకుంటున్నాను.
“రాయని భాస్కరుణ్ణని” మొదట తెగ ఫీలయిపోయీవాడిని.ఎందుకంటే “క్రుశా” గురించి శ్రీశ్రీ అలా అన్నాడు కాబట్టి. తరవాత తెలిసింది రాయడం “చేతకాని” భాస్కరుణ్ణని.
నా పేరు భాస్కర్. సివిల్ ఇంజినీర్ని, మూడేళ్ళయి హైద్రాబాదులో వుంటున్నను. అంతకుముందు, దేశం అంతా తిరిగేను. బొంబాయిలో పదకొండేళ్ళు వున్నాను. చదవడం ఎంత వ్యసనం అంటే, బొంబాయి లోకల్ ట్రైన్లో కూడా, క్రిక్కిరిసిన జనం మధ్య కూడా నిలబడి చదివీ వాడిని. ఇది నా “స్ట్రెంగ్త్” అని నా అనుమానం.
ఈ మాట “ఫార్మాట్” లో వున్న సులువువల్ల తెగించి అభిప్రాయాలు రాసేస్తున్నాను, అంతే.
ధర్మవ్యాధుడిలాటి కొడవళ్ళ హనుమంతరావు గారిని, మీ అందరితో పాటూ స్మరించకపోవడం నా తప్పు.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి పాఠకుడు గారి అభిప్రాయం:
08/20/2008 12:24 pm
మొద్దబ్బాయి గారూ,
అసలు పేరు చెప్పకపోవడానికీ, అసలు ఇంటి పేరు వేరే వాళ్ళు మార్చేయడానికీ తేడా తెలుసుకోకుండా, మోకాలికీ, బోడిగుండుకీ ముడి పెట్టి, సార్థకనామ ధేయులనిపించుకున్నారు.
ఒక మనిషి తన అభిప్రాయంలో రాసిందే ముఖ్యం. ఆ మనిషి ప్రవర సెకండరీ. శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు అని మీరంటే, అది మీ అభిప్రాయం అవుతుంది. ఎవరి వ్యంగ్యాలు వారికుంటాయి.
ఈమాట వారు వ్యక్తిగత వ్యంగ్యాలకి చోటు ఇవ్వం అంటూనే, ఇలాంటీ వ్యక్తిగత వ్యంగ్యాలని అనుమతించడం భావ్యంగా లేదు. ఎవరి స్వేచ్చ వారికుండాలి. “నీ పేరు చెప్పూ, నీ పేరు చెప్పూ, అప్పుడే నువ్వన్న విషయాలు పట్టించుకుంటాము” అని అనడం భావ్యం కాదు. ఒకవేళ అలాగే వుండాలీ అని అనుకుంటే, ఈమాట వారు ఆ రూలే పెట్టాలి.
నా అబిప్రాయంలో విషయానికే ప్రాధాన్యత ఇచ్చాను. వ్యాసకర్తని ఒక్క మాట అనలేదు.
అభిప్రాయాలతో ఎవరూ మారరు సాహిత్యానికి సంబంధించిన వరకూ. కానీ అలాంటి అభిప్రాయాలు వుంటాయి అని తెలియడం కోసమే ఈ అభిప్రాయ వేదిక. ఆ పైన సెన్సార్ చెయ్యడానికి పెద్దలున్నారు.
పేరు చెప్పకపోవడం వల్లనే, నా అభిప్రాయానికి విలువ లేదని మీరంటే, అలాగే కానియ్యండి.
పాఠకుడు
కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
08/20/2008 10:05 am
అయ్యా బాబ్జీలుగారు కవిత్వం, సాహిత్యం గురించి కాదు కాని, నాకు తెలిసిన విషయంలో మాత్రం మీరు పొరబడ్డారేమో అని భయం!
పిల్లల “హోం వర్క్” (సొంతంగా) చేయడం సులువంటే ఒప్పుకోవచ్చేమో కాని, “చేయించడం సులువు” అంటే నిజమేనా అనిపిస్తుంది. చేయించడానికి కనీసం పిల్లలను ఒక్కచోట కూచోబెట్టాలి. కాళ్ళు కట్టేసినా, పిల్లకాయల మనసులను కట్టేయడం, కాదు ఆకట్టుకోవడం, ఒక చాలెంజ్. ఇంతా అయింతర్వాత మన ధిమాక్ లోకెక్కింది వాళ్ళ ధిమాక్ లోకి ఎక్కించడాన్ని ఏమన్నా అనొచ్చు కాని సులువు అని మాత్రం అనగలమా అని డౌటు. ఈ తిప్పలంతా చూసే గురువుగారిని “గురు బ్రహ్మ” అనికూడా అనేసారేమో అని అనుమానం కూడా. దీనికంటే ఒకచోట కూర్చోని, అక్షరాల ఒక కావ్యమో, విమర్శో, గేయమో, వచనమో, కథనో, నవలనో, లేకపోతే ఇప్పటి దాక పుట్టని ఒక అపూర్వ సాహితీప్రక్రియనో ఈ తిప్పలగురించే వ్రాసేయడం సులువేమో అని కూడా చెడ్డ అనుమానం. కాదంటారా?!
విధేయుడు
-Srinivas
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
08/15/2008 1:08 pm
పువ్వుల దండలో దారం దాగున్నట్ల నేను చెప్పబోయేది అంతర్లీనంగా కృష్ణమూర్తి గారిచ్చిన సలహాలలో ఉంది కాని, మరి కొంచెం విపులంగా చెబుతున్నాను, అంతే.
7. ప్రతి విద్యార్ధీ పాఠశాలలో మాతృభాషతో పాటు మరొక్క భాష నేర్చుకుంటే చాలు. ఆ రెండవ భాష ఎవరెవరి అవసరాలకి అనుకూలంగా వారు ఎన్నుకో వచ్చు. ఈ రెండవ భాష సర్వసాధారణంగా ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషలలో ఏదో ఒకటి అవటానికి సావకాశాలు ఎక్కువ.
మూడు భాషలు నేర్చుకోవాలనే నిబంధన అనవసరం.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
08/08/2008 7:00 am
నేను పండితుణి కాను కాబట్టి ఏమీ తెలియనట్లు ఉండలేక…
బాబ్జీలుగారు,
ముందుగా, “మిగిలినవాటిగురించి రాసి మీ సమయం వ్రుధా చేసుకోకండి.”, అన్న మీ సలహాకి ధన్యవాదాలు, ఎంతవరకూ పాటిస్తానో చెప్పలేను కాని. అది నా చేతుల్లో ఉంటేకదా!
అభ్రతపతి కాదు అభ్రగపతి. అభ్ర = ఆకాశం; అభ్రగ = ఆకాశంలో తిరిగేది = పక్షి; అభ్రగపతి = పక్షుల రాజు = గరుత్మంతుడు
ఆకర్ణికాంతరథమిల్లము; కర్ణిక = చెవి కమ్మ; అంతర = మధ్యలో; ఆకర్ణికాంతర = చెవి కమ్మ మధ్యలో చిక్కుకున్న; ధమ్మిల్లము = కొప్పు
చక్కనొత్తక = సరిచెయ్యక
విష్ణుమూర్తికి కొప్పుంటుంది కాబోలు!
ఈ పద్యాన్ని చదవడం గురించి ఇంతకు ముందొక వ్యాసంలో (ఈమాట లోనే) రాసిన గుర్తు.
దీనికి నేను విన్న పాఠం “పర్ణాని, స్వర్ణ వర్ణాని, కర్ణాంతాకీర్ణ లోచనే”. ఒక అణా ఎక్కువుంది 🙂
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాగమురళి గారి అభిప్రాయం:
08/07/2008 11:07 am
రవి గారూ, జ్యోతిషాభిమానులకి కొన్ని సూచనలు అన్న అంశంలో నేను చెప్పదలచుకున్నది కొంతమటుకు మీ ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తుంది. అయినా మీరు అడిగారు కాబట్టి కొన్ని సూచనలు –
1) ఎవరైనా జ్యోతిష్కులని భవిష్యత్తు కాకుండా ఇదే విధంగా గతాన్ని గురించి చెప్పమనండి.
2) ఒక పదీ, ఇరవై జాతకాలకి ఒక్కో జాతకానికి పదేసి చొప్పున ఖచ్చితమైన ఫలితాలు రాసి ఇమ్మనండి. (మీ కామెంటులో రాసిన ఫలితాలు అన్నీ ఖచ్చితమైనవే, ambiguity లేదు అని మీరు భావిస్తున్నారా?)
3) చెప్పిన వంద, రెండువందల ఫలితాల్లోనూ ఎన్ని సరైనవో లెక్కపెట్టండి. దాన్ని బట్టి జ్యోతిషం ఎంతవరకు పని చేస్తుందో మీరే నిర్ణయించుకోవచ్చు.
4) ఏదైనా పత్రికలో ఇదే విధంగా గతానికి సంబంధించిన విషయాలు చెప్పి, తరవాత సంచికలో పాఠకులచేత ఆ ప్రిడిక్షన్సు తప్పో, ఒప్పో చెప్పించే శీర్షిక ఒకటి పెట్టడానికి వీలవుతుందో లేదో చూడండి. కనీసం ఇటువంటి ప్రతిపాదనకి పేరుప్రఖ్యాతులున్న జ్యోతిష్కులెవరైనా అంగీకరిస్తారేమో చూడండి. (ఆ శీర్షిక ద్వారా జ్యోతిషం నిజమని నిరూపితమైతే, జేమ్సు రాండీ బహుమతిని గెల్చుకోవడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.)
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu గారి అభిప్రాయం:
08/05/2008 7:45 am
నాలుగవ తరగతి చదువుతున్న మా అమ్మాయికి, తెలుగు “రెసిటేషన్” పోటీకి, మూడు పెద్దన గారి పద్యాలు, మనుచరిత్రము నుండి, వాళ్ళ తెలుగు “మేమ్” ఇచ్చేరు.
“మేమ్” గారూ శిష్యురాలూ కలిసి, మూడు పద్యాలూ వచన కవిత్వంలా రాసేరు.
వచనకవిత్వాన్ని ఛందస్సర్పపరిష్వంగంలోకి తీసుకెళ్ళాలి. పగవాడికి కూడా వద్దు ఈ బాధ.
“… ప్రాలేయ (కామా) రుణ్మండలీ..” అని రాసేరు “తెలుగుమేమ్ గారు”.(నా యూనీకోడ్ చేతకాని స్పెల్లింగ్ “రుణ్మండలీ”)
మూడవ తరగతి లో “అల వైకుంఠపురములో..” పద్యం, “సిరికింజెప్పడు..” పద్యం “రిసైట్” చేసి “ఫస్ట్ ప్రైజ్” “కొట్టేసిన” విద్యార్ధినిని, “నాలుగోక్లాసు మేమ్” “బాగా చెప్పి ప్రైజ్ రాకపోతే వుంది నీ పెళ్ళి” అని భయపెట్టి మరీ పంపించింది.
మనుచరిత్ర(ము, ప్రథమా విభక్తి????) ఇప్పుడెక్కడ దొరుకుతుందిరా “దేవుడా” (ప్రథమా విభక్తి కాదు) అని అనుకుంటూంటే, “ఈమాట” “గ్రంధాలయం” గుర్తొచ్చి బతుకుజీవుడా అనుకున్నాను.
“ఈ మాట” చలవ వల్ల పద్యాలు, పద్యాల్లా దొరికేయి. “ప్రైజ్” మాట దేవుడెరుగు, “ప్రైజ్” రాకపోతే “నాలుగోక్లాసు మేమ్ చేతిలో మా అమ్మాయి పెళ్ళి దేవుడెరుగు.”
“ఈ మాట” నామాం మరువాం, మరువాం.
చిన్న పిట్టకథ: కిందటేడాది నాకు “ఈ మాట” పరిచయం లేక, “సిరికిం..” పద్యం కోసం, తెలిసిన వాళ్ళిళ్ళకి తిరిగేను. ఓ ఇంట్లో, ఓ ఐటీ అమ్మాయి, ఏడాది కొడుక్కి అన్నం పెడుతూ “అంకుల్, అది శ్రీరామదాసు సినిమాలోది” అంది. ఆ పిల్ల తల్లితండ్రులు చాలా గర్వంగా చూసేరు నావేపు. “ధన్యోస్మి” అని మనసులో అనుకుని, “థేంక్సు సుజాతా” అని బయటకని, బయటపడ్డాను.
గణవిభజన చేసి “అల వైకుంఠపురములో…” “సెట్” చెయ్యగలిగేను. “సిరికింజెప్పడు..” మాత్రం “శ్రీరామదాసు సినిమా సిడిలో” బాలసుబ్రహ్మణ్యం పాడినదే దిక్కయిపోయింది.
[బాబ్జీలు గారు: అభిప్రాయాలు రాసే పెట్టె పైన ఉన్న “కీబోర్డు మ్యాపింగ్ చూపించండి” అన్న లింకు నొక్కితే మీకు R.T.S. (Rice Transliteration Standard) కీబోర్డు మ్యాపింగ్ ప్రత్యక్షమవుతుంది. ఋకారానికి “ru” బదులు “R” అని టైపు చెయ్యాలి. ఉదా: కృష్ణుడు (kRshNuDu), సంస్కృతం (samskRtam). వర్గాల వారీగా అనునాసికాలు: ఙ (~ma), ఞ్ (~na), ణ (Na), న (na), మ (ma). మరికొన్ని ఉదాహరణలు: జ్ఞానము (j~nAnamu), ప్రాలేయరుఙ్మండలీ (prAlEyaru~mmanDalI) ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. — పద్మ, ఈమాట సంపాదక వర్గం.]
సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
07/26/2008 10:45 am
శ్రోతలని కట్టిపడేసేలా మాట్లాడే నేర్పు మృణాళినిగారి గొప్పదనం. మంచి ఉపన్యాసాన్ని అందరికీ అందించిన సాయిగారికి ఈమాటకీ ధన్యవాదాలు. శీర్షిక మాత్రం కాస్త తప్పుదోవపట్టించేదిగా ఉంది. ఇది “తెలుగు నవలా చరిత్ర” గురించిన ఉపన్యాసం కాని “సాంఘిక నవలల్లోని కథన శిల్పా”న్ని గురించి కాదు కదా.
ఉపన్యాసం, తర్వాత ప్రశ్నలకిచ్చిన జవాబులూ విన్నాక వచ్చిన అనుమానం. మృణాళినిగారు తెలుగులో హాస్యరచనలకి ప్రాముఖ్యం ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. మరి తన ఉపన్యాసంలో హాస్య నవలలని ఆవిడ పేర్కోకపోవడానికి కారణం ఏమిటి? అలానే, ఈ కాలంలో ఉద్యమాలకతీతమైన నవలలు మంచివి వస్తున్నా వాటికి గుర్తింపు రావడం లేదని కూడా చింతించారు. అటువంటి వాటి గురించి తన ఉపన్యాసంలో ఎందుకు ప్రస్తావించలేదు? ప్రశ్నకి సమాధానంగా అంపశయ్య నవీన్ మొదలైనవాళ్ళని గురించి చెప్పారు. అది తన ఉపన్యాసంలోనే ప్రస్తావించి ఉంటే బావుండేది.
శ్రుతిలయల నందనవనం గురించి baabjeelu గారి అభిప్రాయం:
07/17/2008 10:06 am
గురువుగారూ,
ఇంతకుముందు తెలీక అవాకులూ, చవాకులూ వ్యక్తీకరించాను. ఈ వ్యాసంలో మీరు రాసిన “కంక్లూడింగ్ పేరాగ్రాఫ్” చదివేక తెలిసింది లోతైన వేళ్ళు గురించి.
సంగీత్ సరితా గురించి చిన్న ముచ్చట. లేకపోతే వివిధ్ భారతి గురించి:
మా పిల్లలు, అందరి పిల్లల్లాగే, పొద్దున్న స్కూలుటైముకి తయారవడానికి చాలా ఇబ్బంది పడుతుంటే, ఏందారిరా “బగమంతుడా” అని తెగ ఆలోచించి, వివిధ్ భారతి టెక్నిక్ కనిపెట్టేను. సరిగ్గా ఏడు గంటలకి “భూలేబిసరే గీత్”. భూలేబిసరే గీత్ మొదలయిపోయింది లేవండి, లేవండి అంటే, అదేదో ఆటనుకుని లేచీ వాళ్ళు.
అమ్మో సైగల్ పాడేస్తునాడు, ఏడున్నరయిపోయింది. సంగీత్ సరితా అయిపోయింది పావుతక్కువ ఎనిమిది. సంగీత్ సరితా ట్యూను మా పిల్లలిద్దరికీ కంఠతా.
ఇప్పుడు వాళ్ళే “నాన్నా ఇంకా సైగల్ మొదలెట్టలేదు, నువ్వుండు” అంటున్నారు.
దీనివల్ల ఇంకో ఎడ్వాంటేజ్ లేక డిసెడ్వాంటేజ్ ” అదేంటి, సైగల్ సైగలంటావు, మై క్యాజానూ క్యా జాదూ హై.. అలా పాడతాడు? అంటారు వాళ్ళు. “తప్పు, అలా అనకూడదంటే”, ఓకే అనేస్తారు.
నాకే సైగల్ తెలీదు, ముఖేష్ తప్ప.
అయితే “అప్పట్లో సైగల్ షాన్ లేపోతే కైలాష్ ఖేర్” అని నేను చెప్పినప్పుడు “అవునా” అని వాళ్ళు విచిత్రంగా నా వేపు చూస్తారు. అప్పుడు నాకు వేగుంట మోహన్ ప్రసాదు గారు మిగిలిన వాళ్ళు కలిసి ఎప్పుడో ఎనభైల్లో తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీషు లోకి తర్జుమా చేసి ఆ పుస్తకానికి “టెన్స్ టైంస”ని పేరు పెట్టేరు. అద్భుతవయిన పేరు.
వీళ్ళకి బాలసుబ్రహ్మణ్యవే పాత. ఘంటసాల దాటి, నాగయ్య, సైగల్ అంటే ప్రెజెంట్ టైం కాదు, ప్రెజెంట్ టెన్స్ కాదనిపించి ఏడవాలో నవ్వాలో తెలీక వెర్రి నవ్వు నవ్వేస్తాను.
టెన్స్ టైం గురించి మాట్లాడండి
రాగాలూ స్వరాలూ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
07/17/2008 6:34 am
శాస్త్రీయసంగీతమంతా ఆత్మానందం కోసమే అని చెప్పినవారు డా. నేరెళ్ళ వేణుమాధవ్. దాన్ని కాదనడం కష్టమని నాకూ అనిపించింది. ఒకప్పుడు ‘మార్గ’ సంగీతానికి సోషల్ రెలెవెన్సు ఉండే ఉంటుంది కాని ఈరోజుల్లో అటువంటిదేమీ కనబడదు. సాహిత్యం, నాటకం, కొంతవరకూ చిత్రకళ సమకాలీన సమాజానికి సంబంధించినవిగా ఉంటాయనేది తెలిసినదే.
పిల్లలూ, పెద్దవారూ కూడా సంగీతానికి ‘సహజం’గా స్పందించడం స్వాభావికమే. సాహిత్యప్రధానమైన గద్దర్ పాటలవంటివి vibrantగా అనిపించడానికి కారణం వాటికి సమాజంతో ఉండే సంబంధమే కదా.
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి pedaraydu గారి అభిప్రాయం:
07/16/2008 3:54 am
పందెం కాస్తున్నానండి, నేను తెలుగులోనే పది వరకు చదివాను, విషయ పరిఙ్ఞానంలో, గ్రాహ్యతలో, బుద్ది కుశలతలో నేను ఏ ఆంగ్ల మాధ్యమ విధ్యార్థికన్నా తీసిపోను. తెలుగుని అభివృద్ది చేయడం మన కర్తవ్యం. కాని ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే మన భాషా సంస్కృతులు నశించటానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు.
సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/12/2008 2:47 pm
తెలుగు నవల బాగోగులు
మృణాళిని గారి విలువైన ఉపన్యాసాన్ని సేకరించినందుకు బ్రహ్మానందం గారికి చాలా కృతజ్ఞతలు. ఒక మనవి. సాహితీవేత్తలైన వక్తలు అమెరికా వచ్చినప్పుడు, వారికి అభ్యంతరం లేకపోతే ఈమాటలోనో రచ్చబండలోనో ఓ చిన్న ప్రకటన వెయ్యండి. వీలయితే వాళ్ళని సాహితీప్రియులు తమ తమ ఊళ్ళకి పిలిపించుకోవచ్చు.
మృణాళిని ఉపన్యాసం కేవలం డాక్టరేటు కోసం చేసిన పరిశోధన నుండి వచ్చినట్లు లేదు. లోతైన పరిశీలనతోబాటు తాదాత్మ్యంతో కూడిన విస్తృత పఠనంతో చేకూరిన అనుభూతితో సాధికారంగా మన నవలా చరిత్రని చెప్పి రక్తి కట్టించారు. ఎటు చూసినా కవితలూ, కథలూ, వాటి మీద చర్చావేదికలే కాని నవల గురించి మాట్లాడే వాళ్ళే తక్కువ. గత పాతికేళ్ళుగా స్తబ్ధుగా ఉండిపోయిన తెలుగు నవలా రంగానికి విశిష్ట చరిత్ర ఉందనీ, పాఠకుల సంస్కారానికి కథా కవితలకన్నా నవలలే ఎక్కువ దోహదిస్తాయనీ, ఆవేదనతో కూడిన ఉత్సాహంతో గంటన్నర పైగా అనర్గళంగా ఉపన్యసించి ఆకట్టుకున్నారు. గురజాడా, శ్రీశ్రీ రచనలకి సముచిత ఆదరణ వచ్చినా వారికే మాత్రమూ తీసిపోని నవలా రచయితల పేర్లన్నా ఇప్పటి వాళ్ళకి తెలియదే, కనీసం వారి రచనల ప్రస్తావన గూడా సాహితీ చర్చల్లో లేశమైనా కనబడదే అని గట్టిగా విమర్శించారు – ఎందువల్ల ఈ చిన్న చూపు?
ఇలా పారంభమైన ఉపన్యాసం వినడంతోటే నాకు ప్రముఖ కవి Auden రాసిన “Letter to Lord Byron” అన్న కవిత గుర్తొచ్చింది:
I don’t know whether
You will agree, but novel writing is
A higher art than poetry altogether
In my opinion, and success implies
Both finer character and faculties
Perhaps that’s why real novels are as rare
As winter thunder or a polar bear.
…
The average poet by comparison
Is unobservant, immature, and lazy.
You must admit, when all is said and done,
His sense of other people’s very hazy,
His moral judgements are too often crazy,
A slick and easy generalization
Appeal too well to his imagination.
కందుకూరి తో మొదలైన మన నవలలు సంఘ సంస్కరణకీ, భావ విప్లవానికీ, మానసిక వికాసానికీ బాట వేశాయనీ, దాదాపు వందేళ్ళ క్రితమే ఉన్నవ రాసిన మాలపల్లి ని ఆకాశానికెత్తేశారు. అసలాకాలానికి మన దేశభాషలు వేటిలోనూ అంతటి గొప్ప నవల రాలేదని ఇతర రాష్ట్రీయులు మెచ్చుకున్నా, తెలుగువాళ్లలో చాలా మందికి ఉన్నవ పేరు కూడ తెలియదని బాధపడ్డారు. చలం నవలలు చదిలోతే చెడిపోతారన్నవాళ్ళు ఆయనని సరిగా అర్థం చేసుకోలేదనీ, ఆయన రాసిన స్త్రీ, బిడ్డల శిక్షణ చదివితే గాని చలం భావ విప్లవం అర్థం కాదన్నారు. మైదానం కి వ్యతిరేకంగా విశ్వనాథ రాసిన చెలియలికట్ట ని ప్రస్తావిస్తూ, వీరిద్దరూ గొప్ప ప్రతిభావంతులనీ, వాళ్ళ మధ్య పోటీ సాహిత్యానికి మేలుచేసిందే కాని కీడు చెయ్యలేదన్నారు.
పల్లెటూరి జీవితాన్ని మరీ ఆదర్శప్రాయంగా కాక రాజకీయాలతో ఎలాముడిపడి ఉందో చిత్రీకరించిన జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు, మొట్ట మొదటిగా విశాలమైన ఉన్నతభావాలతో స్త్రీ పాత్రని ప్రవేశపెట్టిన ఉప్పల లక్శ్మణరావు అతడు-ఆమె, ఒక్క వ్యర్థ పదం కూడా లేకుండా గోపీచంద్ రాసిన గొప్ప మనోవైజ్ఞానిక నవల అసమర్థుని జీవయాత్ర, మనిషి జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనా సంస్కార పరిణామానికి ఎలా దారితీస్తుందో చిత్రీకరించిన బుచ్చిబాబు చివరకు మిగిలేది, ఇలా అనేక పేరున్న తెలుగు నవలల గురింఛి, క్లుప్తంగా నయినా మనసుకి హత్తుకు పొయ్యేట్లు చెప్పి, అవి చదివిన వాళ్ళకి మరోసారి ఉద్విగ్నత కలిగించారు.
ఇంతటి ప్రాభవం ఉన్న నవలా ప్రక్రియ ఎనభయ్యో శతాబ్దం నాటికి వ్యాపార నవలలు విజృంబించడంతో ఓ ఊపు ఊగి, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాల వరవడిలో చదివే పాఠకులు లేకా, పాఠకులేరని రాసే వాళ్ళు లేకా కుంటుబడిందన్నారు. ఉద్యమాల ప్రభావం గురించి మృణాళిని చేసిన వ్యాఖ్య చాలా ఆలోచించదగ్గది: ఉద్యమాల మూలంగా వచ్చే రచనల్లో ఆవేశం పాలెక్కువ. అందుకు కవిత్వానికి మించిన సాహితీ ప్రక్రియ లేదు. అయితే నవలకి కావలసింది స్పష్టతతో కూడిన ఆలోచన, మానవజీవితం గురించి సమగ్రమైన పరిశీలన – వీటితో రసవంతంగా ఏవో నాలుగు పాదాలు కాక కట్టదిట్టంగా నాలుగయిదొందల పేజీల సాహిత్యం సృష్టించాలంటే మాటలు కాదు. మరలా Auden రాసిన “The Novelist” అన్న కవితొకటి గుర్తొస్తుంది:
Encased in talent like a uniform,
The rank of every poet is well known;
They can amaze us like a thunderstorm,
Or die so young, or live for years alone.
They can dash forward like hussars: but he
Must struggle out of his boyish gift and learn
How to be plain and awkward, how to be
One after whom none think it worth to turn.
For, to achieve his lightest wish, he must
Become the whole of boredom, subject to
Vulgar complaints like love, among the Just
Be just, among the Filthy filthy too,
And in his own weak person, if he can,
Must suffer dully all the wrongs of Man.
ఉపన్యాసం అయింతర్వాత చాలా మంది మంచి ప్రశ్నలే వేశారు. మన సాహిత్యం ఉద్యమాలకే ఎందుకు పరిమితమైందని ఒకరడిగారు. మృణాళిని ఉద్యమాల వలన కలిగిన మంచిని గుర్తిస్తూనే, ప్రస్తుత సాహితీ వాతావరణంలో ఏదో ఒక గ్రూపుకి చెందకుండా మనడం కష్టమయిందన్నారు. చంద్రలత రాసిన రేగడివిత్తులు మంచి నవలే అయినా అది రచయిత కోస్తా ప్రాంత దృష్టితో రాసిందని విమర్శించి, సాహితీపరమైన విలువలకి విమర్శకులే తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి వాతావరణం నెలకొని ఉండటం చాలా విచారకరమన్నారు.
ఇది సాహితీ అభిమానులందరూ తప్పక వినవలసిన ఉపన్యాసం. ఇచ్చిన మృణాళిని గారికీ, సేకరించిన బ్రహ్మానందం గారికి మరోసారి కృతజ్ఞ్తలతో,
కొడవళ్ళ హనుమంతరావు
వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి baabjeelu గారి అభిప్రాయం:
07/12/2008 9:40 am
kRష్ణమోహన్ గారూ,
మరొక సంగతి. శనగన నరసింహస్వామి, ఈయన వివరాలు నాకు తెలీవు, కానీ ఈయన ప్రతీ పండక్కి అయిదో ఆరో పద్యాలు రాసి ఆంధ్రపత్రిక్కి, ఆంధ్రప్రభకీ పంపీవారు. వాళ్ళు వేసీవారు. అంతే వాటిగురించి ఎవరూ మాటాడీ వారు కాదు. మీరెవరూ ఆయన ఛందోబధ్ధవయిన పద్యాల్ని ఉదహరించరు. ఆ పద్యాల్లో భక్తి తప్ప కవిత్వం వుండీదికాదు.
శనగన నరసింహస్వామి గారికి క్షమాపణలు.
కరటకశాస్త్రి చేత గురజాడ చెప్పించినట్టు చదువు పొట్టపోషించుకోడానికే..సంస్కృతం నుంచి తెలుగు నుంచి ఇంగ్లీషు కి పొట్ట నింపీ భాష మారిపోడంవల్ల, ఇంగ్లీషు లోని పద్యరీతులు తెలియడంవల్ల, అవి తేలికగా వుండడంవల్ల, వాటిని ఛందోబధ్ధవయిన కవిత్వం రాసీ ఛాందసులు ఏవీ చేయలొకపోవడంవల్ల, తెలుగు కవిత్వం ఇటు మళ్ళింది. ఇండియా ట్రాఫిక్, ఇండియన్ పోలిటిక్స్ ప్రవాసాంధ్రులికి, ఎంత అసహ్యం కలిగిస్తాయో, బహుశా గురజాడకి, ఛాందసుల స్టాండర్డ్ ప్రకారం కవి, పండితుడు, కానివాడికి, అప్పటి అన్ని విషయాలూ అసహ్యం కలిగించేయి. అందుకే ముత్యాల సరాలు సృష్టించబడ్డాయి, పాత వాసన వదల్లేక. లేక పాతకొత్తల మేలుకలయిక కోసం. పాత వదులుకోలేక. పాత వదులుకోడం, మూలాల్ని తెగ్గొట్టుకోడవేకదా?
కవిత్వాన్నికానీ, సంగీతాన్నికానీ, మిగిలిన కళారూపల్ని కానీ అప్పటి కాలపరిస్తుతులు నిర్ణయిస్తాయి తప్ప ఇంకేవీ ఏవీ చెయ్యలేవు. ఈ కాల పరిస్థితులే విశ్వనాధ వార్ని కూడా మార్పు వేపు ఈడ్చుకొచ్చేయి. కాదని పురాణం సుబ్రహ్మణ్యం గారన్నా, పురాణం సీతన్నా, పి.ఎస్ అన్నా,”చేరా” అన్నా, వేగుంట మోహన్ ప్రసాద్, “మో” అన్నా, భగవంతుడే అన్నా అది ఒప్పుకోకూడదు..
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి mOhana గారి అభిప్రాయం:
07/10/2008 11:45 am
మీ వ్యాసం బాగుంది.
0.04 కారిలేషన్ కొయెఫిషిఎంట్ అనంగీకృతమండీ. ఒక ప్రయోగాన్ని పరిశీలనకు తీసికోవాలంటే ఇది కనీసం 0.2 నుండి 0.3 వరకు ఉండాలి. ఈ 0.2 నుండి 0.3 వరకు గల పరిమితి సుమారు మూడు స్టాండర్ద్ డీవియేషనులకు సమానము. అప్పుడే ఫలితాలను ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రారంభిస్తాము. లేకపోతే దానిని చెత్తబుట్టలో వేయాల్సిందే. అంటే అది తప్పని కాదు. కాని అది సరి అని ఒప్పుకొని ముందంజ వేయలేము. స్టాటిస్టిక్స్ అబద్ధం కాదు. దానిని సరిగా అనలైస్ చేయకపోతే అబద్ధంలాగ కనిపిస్తుంది.
– మోహన
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నరేంద్ర భాస్కర్ S.P గారి అభిప్రాయం:
07/10/2008 7:47 am
భయ్యా నమస్కారములు.
నేను బ్లాగు లొకానికి కొత్త; జ్యోతిషం మీద తెలుగు బ్లాగు లేదెమో, మొదలెడదాం (నేనో ఔత్సాహిక జ్యోతిష్కుణ్ణి లెండి) అనుకున్నాను. మీరు రాసిన మూడు భాగాలూ ఎంతో ప్రేమతో చదివాను, చదివింతర్వాత నోరు వెళ్ళబట్టాను. ఇంత జ్ఞానం ఉండీ విస్పష్టమైన నిర్ణయం తీసుకోలేక ఉన్నారంటే, మీరు మిధున జాతకులు కామోసు. ఏది ఏమైనా ప్రశ్న అనే తీగను పట్టుకొని లాగితే ఇంత విషయం బయటకు (పనికి వచ్చిందో , పనికి రానిదో) వచ్చిందన్నమాట!
నెనర్లు & ధన్యవాదములు
నరేంద్ర భాస్కర్ S.P.
సార్థక నామధేయుడు సంగీతరావు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
07/09/2008 3:11 am
నేనుకూడా బాలమురళి అభిమానినే.
కర్ణాటక గాత్రసంగీతం వింటున్నప్పుడు తెలుగు సాహిత్యం ఏ కారణంవల్లనైనా చెడితే తెలుగువారికి కలిగే బాధను అర్థంచేసుకోవచ్చు. అయితే శైలి ఏదైనప్పటికీ శాస్త్రీయసంగీతంలో సాహిత్యానికుండే విలువ చాలా తక్కువ. ముఖ్యంగా హిందుస్తానీ పద్ధతిలో పదాలు ఒకంతట అర్థం కావు కూడా. రాగప్రధానంగా, గమక విన్యాసాలతో సాగే శాస్త్రీయసంగీతంలో మనం ఎక్కువగా విని ఆనందించవలసినవి సాహిత్యేతర అంశాలే. భావగీతాల్లోనూ, లలితసంగీతంలోనూ మాత్రం సాహిత్యభావం ముఖ్యమైనదిగా ఉంటుంది.
కొన్ని త్యాగరాజ కీర్తనల్లో ట్యూన్ ముందుగా చేసి తరవాత పదాలను కూర్చినట్టుగా అనిపించే ఉదాహరణలు కనిపిస్తాయి. దీన్నిబట్టి చూస్తే పెద్ద వాగ్గేయకారులు కూడా కొన్ని సందర్భాల్లో సాహిత్యానికి చిన్నపీట వేశారనిపిస్తుంది.
ఇవన్నీ వింటున్న మనవంటి పామరులు సాహిత్యం అందంగా వినిపిస్తున్నప్పుడు సంతోషిస్తూ, వినిపించనప్పుడు సంగీత అంశాలను ఆస్వాదిస్తూ ఉండాలే కాని పరిష్కారాలు వెతకడం వృథా ప్రయాస కావచ్చు.
రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి sasank గారి అభిప్రాయం:
07/08/2008 2:14 am
మహేష్ గారూ, మీ విశ్లేషణ చాలా బాగుంధి. కాని ఇంత క్లిష్టంగా రాయడం అవసరమా అని నా అభిప్రాయం.
88 ఏళ్ళ యువకులు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
07/07/2008 5:54 pm
వ్యాసం పేరు నాకూ అంత నచ్చలేదు. Deadline దృష్ట్యా రాసేసి పంపాను. అయితే ఇప్పటికీ ఇంతకన్నా మంచి శీర్షిక నాకు తట్టలేదు. (కథల, పాత్ర పేర్ల విషయంలో మా నాన్నగారికి కూడా అంత పట్టింపు ఉండేది కాదు!)
యవ్వనమే గొప్పదని నేననను కాని అది మనం ఎన్నుకున్న మార్గంలో క్రియాశీలంగా ఉండేందుకు అనువైన వయసు. ఇక్కడ నేను ఉద్దేశించినది మానసిక యవ్వనమే అని తెలుస్తూనే ఉంది కదా. ఎంత అనుభవం ఉన్నప్పటికీ కొత్తవి తెలుసుకోవాలనే కుతూహలం ఉండడం ఆ వయసులో అరుదైన విషయం.
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి సుధాకర బాబు గారి అభిప్రాయం:
07/03/2008 11:10 pm
నేను, నాలాంటి ఎందరో చాలా తీవ్రంగా ఆక్రోశించే సమస్య ఈ ఆంగ్ల భాషా మాధ్యమం బోధన – ఈ వ్యాసంలోని విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నాకు అనిపించిన మరికొన్ని విషయాలు-
1) “ఇంగ్లీషులో చదువు”ల వల్ల కలుగుతున్న ప్రయోజనాలు – అని చాలా మంది అనుకొనేవి నిజానికి “చదువు” వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రమే. ఇంగ్లీషు మీడియం వల్ల అవి కలుగుతున్నాయన్న భ్రమ వ్యాపించింది.
2) అసలు తెలుగు మీడియంలో అధికంగా చదువడం వలన సమాజానికీ, వ్యక్తికీ కలిగే ఉపయోగాలు ప్రస్తుతం దాచిపెట్టిన నిధిలాంటివి అనుకొంటాను. దేశంలో కోటి మంది (అ)విద్యావంతుల బదులు నూరుకోట్ల విద్యావంతులు ప్రభవించే అవకాశాన్ని మనం గొయ్యి తీసి కప్పెట్టి ఉంచేసుకొంటున్నాము.
3) ఒక సినిమా చూసి వచ్చిన చిన్నపాటి పట్టణంలోని కుర్రవాడిని ఆ సినిమా కధ ఆంగ్లంలో చెప్పమనండి. ఇంగ్లీషు మీడియం అనేది వట్టి మాయ అని క్షణాలలో తేలిపోతుంది.
4) ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో కృతనిశ్చయం లేకుండా పోయింది. ఇక ముందు కలుగుతుందన్న ఆశ లేదు.
5) నేను పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను. ఇంటర్‌లో రెండవ భాషగా తెలుగు చదివాను. నేను చాలా తెలుగు పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలూ చదివాను. దేని గొప్పతనం దానిది. కాని నేను చదివిన తెలుగు రచనలు ఈనాటికీ నా మదిలో ఉన్న నేస్తాలు. ఇంగ్లీషు పుస్తకాలు ప్రయాణంలో కలిసి విడిపోయిన పరిచయాలు.
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
07/02/2008 3:14 am
ఇంతకన్నా సమగ్రంగా, విపులంగా, సెన్సిబ్‌ల్ గా ఈ విషయాన్ని ఎవరూ వివరించలేరేమో.
నేను మద్రాసులో 1964లో 11వ తరగతి పూర్తి చేశాను. మాకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ (ఇందులో సున్నా మార్కులొచ్చినా పరవాలేదు కాని ఫయినల్ పరీక్ష రాసి తీరాలి). తెలుగు గ్రాంథికంలో ఉండేది కనక కాస్త ఆముదం తాగిన మొహంతోనే చదివాననుకోండి. అయితే అప్పట్లో ఆ మాత్రమైనా క్లాసిక్స్ చదవడం మంచిదని ఆ తరవాత గ్రహించాను. కాలేజీ స్థాయిలో తెలుగు కన్నా హిందీ ‘సులభం’ అని అనుభవజ్ఞులు చెప్పిన మీదట బీ.ఎస్ సి దాకా హిందీ చదివాను. గ్రామరూ, ఛందస్సూ, సాహిత్యచరిత్రా చాలా నేర్పేవారు. ఫిజిక్స్ మెయిన్ అయినప్పటికీ. ఇంగ్లీషులో షేక్స్పియర్ నాటకాలు రెండేసీ, మిల్టన్ పేరడైజ్ లాస్ట్, బోలెడంత ప్రోజూ వగైరాలుండేవి. సైన్సుతోబాటు ఇంత ‘లాంగ్వేజి బరువు’ ఉన్నా ఇబ్బంది అనిపించలేదు.
ఈమధ్య విశాఖలోనే ఇంజనీరింగు దాకా చదువుకున్న ఒకతను తాను తెలుగు గబగబా చదవలేనని చెప్పుకున్నాడు. నా మద్రాసు తెలుగే నయమనిపించింది.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/28/2008 10:12 pm
రోహిణీప్రసాద్ గారూ,
పొరబాటయింది. మీ బ్లాగు చూశాను కాని, ఏపీ వీక్లీ చదివే అలవాటు లేక, అభాసు పాలయ్యాను. మూడు వందల వ్యాసాలే?! మీ పుస్తకం తెప్పించుకుంటున్నాను. మీనుంచి మరిన్ని పుస్తకాలొస్తాయని ఆసిస్తాను.
నేను హాల్డేన్ మాటలు ఉటంకించింది ఆయన వ్యాసం, “How to Write a Popular Scientific Article,” నుండని చెప్పడం మరిచాను.
కొడవళ్ళ హనుమంతరావు
చాదస్తం గురించి Bhushan గారి అభిప్రాయం:
06/27/2008 10:19 pm
కథ నాకు బాగా నచ్చింది. ఎటొచ్చీ కామేశ్వర్రావుగారి అభిప్రాయం్ “ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు” – ఆవిడ జీవితం మాత్రమే కాదు, ఆవిడ భర్త జీవితం ఈవిడతో ముడిపడలేదా? ఆవిడ స్నేహాలు తన భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని ఆలోచించే మనిషి, తన భర్త స్నేహాలు కూడా తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని అనుకోదా? అది అహంభావమా? ఆత్మోన్నతా ?
రంగనాయకమ్మగారు తన పేరు ముందు ఇంటి పేరు వొదిలేసి చాలా కాలమైంది. ఈ విషయం రచయిత్రి తన ఒకానొక వ్యాసంలో కూడా చెప్పారు.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/24/2008 11:07 pm
నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకి కృతజ్ఞతలు.
నాగమురళి గారూ,
మిమ్మల్ని ఏకబిగిన చదివింప చేసిందన్నారు. సంతోషం. నా తెలుగు మూలన పడిందని నాకు భయం. రోజూ పది నిముషాలు మా ఆవిడతో తెలుగులో మాట్లాడటం మినహా, నిత్యజీవితంలో నా తెలుగు వాడకం పుస్తకాలు చదవడానికే పరిమితం.
ప్రస్తుతానికి వేరే విషయాల మీద రాసే ఆలోచన లేదు. ఆయా రంగాలలో అనుభవం ఉన్నవాళ్ళు తెలుగువాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొందరైనా పూనుకొని రాస్తే ఎంతో సేవ చేసిన వారవుతారు.
లక్ష్మన్న గారూ,
నేను ఇంజనీరింగులో అత్యుత్తమ స్థాయికి చెందినవాడిని కాదు. మీరన్నట్లు మన దేశంలో విజ్ఞానశాస్త్రాలలో నిష్ణాతులైన వారు చాలా మంది ఉన్నారు. కాని వాటిని సామాన్యప్రజలకి పరిచయం చేసినవాళ్ళు తక్కువ. తెలుగులో మహీధర నళినీమోహన్ చెప్పుకోదగ్గవాడు. బహుముఖ ప్రతిభావంతులైన కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఇంకా ఎక్కువ రాస్తే బావుంటుంది.
ఈ వ్యాసాలు తెలుగు దినపత్రికలలో వస్తే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయన్నది నాఆశ కూడా. ఆంధ్రజ్యోతి కి రాశాను – జవాబు లేదు!
సిలికాన్ మహత్యం మీద మీరు రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రాయండి.
సాధ్యమైనంతవరకు కవితలకు దూరంగా ఉండమని సూచన ఇచ్చారు. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, నా విభేదాన్ని తెలుపుతాను. కవితయినా, మరేదయినా, అసందర్భంగా ఉటంకిస్తే తప్పుపట్టాల్సిందే. కాని సైన్సు వ్యాసాలలో కవితలుంటే నష్టం లేదు. ఆలోచనకి అడ్డురావనీ, ఆసక్తి కలిగించి అవగాహనని పెంచుతాయనీ నా విశ్వాసం. దీని మీద గతంలో నాగులపల్లి శ్రీనివాస్ గారికి సమాధానమిస్తూ పలుగురు పేర్లని వాడుకున్నాను. ఇప్పుడూ మరొకరి పేరు చెప్పి సమర్థించుకుంటాను.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జీవశాస్త్రవేత్త, తెలుగువాళ్ళకి కాస్త దగ్గ్గరయిన (మరణానంతరం ఆయన దేహాన్ని పరిశోధనలకై కాకినాడ లోని రంగరాయ వైద్య కళాశాల కిచ్చారు), జె బి యస్ హాల్డేన్ అన్న మాటలు:
“In my last book on genetics, there are seven quotations from Dante’s Divine Comedy. I have been criticized for ‘dragging in’ Dante. But I think it worthwhile to show the continuity of human thought. I don’t agree with Dante’s theory that mutations are due to divine providence, but I consider it desirable to point out that he had a theory on this subject. I think popular science can be of real value by emphasizing the unity of human knowledge and endeavor, at their best. This fact is hardly stressed at all in the ordinary teaching of science, and good popular science should correct this fault, both by showing how science is created by technology and creates it, and by showing the relation between scientific and other forms of thought.” [1]
చివరిగా, నా వ్యాసాలని గడువు దాటి పంపినా, తామెంత పని వత్తిడిలో ఉన్నా, ఓపిగ్గా చదివి, ప్రశ్నలేసి, సరిదిద్ది, సాయం చేస్తున్న సంపాదకులకి, ముఖ్యంగా ఇంద్రగంటి పద్మగారికీ, కొలిచాల సురేశ్ కీ కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “On Being the Right Size and other Essays,” by J.B.S Haldane. Edited by John Maynard Smith. Oxford University Press, 1985.
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
06/21/2008 1:42 am
శ్రీనివాస్ గారు,
మంచి విషయాలని ప్రస్తావించారు. నేనన్న వాటికి కాస్త వివరణ అవసరమే.
1. వ్యావహారిక భాషోద్యమ మూలాలు: నిజమే, మీరన్నట్టు బోధనాభాష విషయం ఒక ముఖ్య చోదకమే కాని మూలాలు ఇంకా ముందే కనిపిస్తాయి. తూమాటి దోణప్పగారు “వ్యావహారిక భాషోద్యమ నేపథ్యం, గిడుగువారి సారథ్యం” అన్న వ్యాసంలో దీన్ని కొంత ప్రస్తావించారు. ముందుగా ఆంగ్లేయుల హయాంలో పరిపాలనాభాషగా వ్యావహారిక భాష ప్రవేశించించడం, ఆ తర్వాత ముద్రణా యంత్ర ప్రభావం వల్ల పుస్తకాలూ, పత్రికలూ సామాన్యజనులకి దగ్గరవ్వడం మొదలైన అంశాలని అతను పేర్కొన్నారు.
2. పాఠ్యపుస్తకాలలో శృంగార ప్రధానమైన కావ్యభాగాల గురించి: వ్యావహారికభాషా వాదుల వ్యాసాలలో కూడా యీ విషయ ప్రస్తావన చదివినట్టుగా గుర్తు. కానీ మీరన్న తర్వాత తిరిగి వెతికితే ఎక్కడా కనపడలేదు. కాబట్టి నేనీ విషయంలో పొరబడినట్టే ఉన్నాను.
3. కందుకూరి మధ్యేమార్గం: “గ్రామ్యదేశ నిరసన సభ”లో జయంతి, కందుకూరి ఉపన్యాసాలని గమనిస్తే ఈ విషయం కొంత స్పష్టమవుతుంది. చిన్నయ్యసూరి రాసిన వ్యాకరణం ముఖ్యంగా పద్యకావ్యాల ఆధారంగా రాయబడిందనీ, దానిననుసరించి రాసే గద్యశైలి చాలా కఠినమైనదనీ అతను ఆనాడే గుర్తించారు. నన్నయ్య కాలమునుండీ గ్రాంధిక భాష మారలేదన్న దురభిప్రాయమూ అతనికి లేదు. అతను వ్యావహారికవాదంతో (మొదట్లో) విభేదించినది, నియమ రాహిత్యం గురించే. వ్యాకరణం లేని వాడుకభాషని రచనకి వాడకూడదని అతని అభిప్రాయం. గ్రాంధికవాదం నుంచి, వ్యావహారికవాదం వైపు అడుగువేసిన తర్వాత కూడా, రచనలో వ్యావహారికభాష వాడినా, అది వ్యాకరణ బద్ధమై ఉండాలనే అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వ్యావహారికభాషకి వ్యాకరణం రాయడానికి పూనుకున్నారు కూడా. వ్యావహారికభాషా వాదుల్లో, ఇది కనిపించదు. గిడుగువారికికూడా వ్యావహారిక రచనా భాషకి వ్యాకరణం ఉండాలా లేదా అన్న విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉన్నట్టు కనిపించదు.
4. గురజాడ “పాతకొత్తల మేలికలయిక”: “పాతకొత్తల మేలికలయిక” అంటే ఆశు, లిఖిత సంప్రదాయాలన్నది వేల్చేరువారి interpretation. అది సమంజసమైనదే కావొచ్చు. కాని, గురజాడ ఉద్దేశం కూడా అదే అనడం సరికాదేమో. గురజాడకి ఆ స్పృహే కనక ఉండి ఉంటే, ముత్యాలసరాల గురించి, రగడలూ లేదా మన జానపద పాటల వరసుంచి తీసుకున్నానని అనకుండా పారశీ గజల్ ప్రేరణ అని ఎందుకంటాడు? “ప్రక్రియ”, “భాష”కి సంబంధించే గురజాడ ఆ మాట అన్నాడని నే ఉద్దేశం. గురజాడ కవిత్వంలో, శ్రవ్య కథాకావ్యం, దృశ్య కావ్యం, జానపద గేయం వంటి పాత ప్రక్రియలూ కనిపిస్తాయి; కొత్తవైన భావగీతాలూ, ఇతర పాశ్చాత్య ప్రక్రియలూ కనిపిస్తాయి. అలాగే అతను వచనరచనలో పూర్తిగా వాడుకభాష వాడినా, కవిత్వంలో గ్రాంధిక పోకడలని గమనించవచ్చు.
5.భావ కవుల “పాతకొత్తల మేలికలయిక”: ఇంతకీ నేను గురజాడని కోట్ చెయ్యడం, అతని పాతకొత్తల మేలికలయికే భావకవులది అని చెప్పడానికి కాదు. భావకవులు వ్యావహారికభాషా వాదాన్ని నెత్తిన పెట్టుకొన్నా, వారి కవిత్వంలో ఎక్కువగా కనిపించేది పూర్వ కావ్యాలలోని భాషే, వాడుకభాష కాదు. “ఎంకిపాటలు”లాంటివి అక్కడక్కడే కనిపిస్తాయి. నేనన్న పాతకొత్తల కలయిక, యీ ఉద్దేశంతో. వీళ్ళతో పోలిస్తే, గురజాడ ఇంకా ఆధునికుడుగా కనిపిస్తాడు. కవిత్వంకూడా వాడుకభాషలో రాయవచ్చని, కాకపోతే దానికి పద్యాలు పనికి రావని అతను గుర్తించాడు. పద్యాలు కూడా వాడుకభాషలో రాయడానికి గిడుగు సీతాపతిలాంటివారు విఫల ప్రయత్నం చేసారు.
6. తిరుపతివేంకటకవులు: వ్యావహారికభాషా వాదానికి వీరు అనుకూలురు కాకపోయినా, వ్యతిరేకులు మాత్రం కాదని అనిపిస్తుంది. ముఖ్యంగా భాష మార్పు చెందే విషయమై, వ్యాకరణాల పరిమితి విషయమై, వ్యావహారికభాషా వాదులతో వీరు ఏకీభవించారు. “కాలముబట్టి దేశమును గాంచి ప్రభుత్వమునెంచి దేశభాషా లలితాంగి మారుటది సత్కవి సమ్మత”మని గుర్తించారు. వాళ్ళ పద్యాలలో లక్షణ విరుద్ధ ప్రయోగాలూ, అన్యభాషా పదాలూ వాడడం ప్రసిద్ధమే కదా. కొంత అధిక్షేపం ఉన్నా, “గిడుగా? పిడుగా?” అన్న వ్యాసంలో గిడుగు గురించి చెళ్ళపిళ్ళవారన్నదాంట్లో నిజాయితీ ఉందని నాకనిపించింది. అందులో, ఈ వాదాలగురించి వారు స్పష్టంగా చెప్పారు:
ఇక, గురజాడ మధ్యేమార్గస్థుడెలాగో వివిరించడం మీ వంతు 🙂
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/18/2008 10:34 pm
లైలా గారు శ్రీశ్రీ మీద వేసిన పై విసురులో వేడెక్కువ, వెలుగు మాత్రం శూన్యం! కంఠస్థం చెయ్యడం సులభం అని మహాప్రస్థానాన్ని కంఠస్థం చెయ్యరు; గొప్ప కవిత్వం అంతా కంఠస్థం చెయ్యదగ్గది కనుకే చేస్తారు. శ్రీశ్రీ బండెడు సాహిత్యం రాసినా రాయకపోయినా మహాప్రస్థానం ఒక్కటే చాలు తనని నిలపడానికి. అయినా ఈ పోలిక వలన ఒరిగేదేముంది – సాహితీ చర్చల స్థాయిని దిగజార్చడం మినహా!
మన సాహిత్య చరిత్రలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ – ముగ్గురూ మూడు మార్గాలకు ప్రవర్తకులంటూ కాస్త వెలుగు ప్రసరించిన వడలి వ్యాసం [1] చదవదగ్గది.
విశ్వనాథ వ్యాసం బావుంది. కాని, భాషా సంపర్కం కలచోట నివసించే వాళ్ళు మార్పుని సంబాళించుకోలేరు అని ఆయన అన్నదానికీ, భాషాశాస్త్రవేత్తలు చెప్పేదానికీ పొంతన లేదు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “సాహిత్య ప్రస్థానం – కొన్ని మజిలీలు” లో వ్యాసం, “క్లాసిక్ – రొమాంటిక్.” వడలి మందేశ్వరరావు.
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
06/17/2008 9:33 pm
కామేశ్వరరావు గారు:
ఇది మీరు 06/12/2008 నాడు రాసిన వ్యాఖ్యకు followup.
పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమన్నది ఈ వాదులాటకి ఒక catalyst లాంటిది మాత్రమే. నా దృష్టిలో యీ ఉద్యమానికి మూలకారణాలు వేరే చోటున్నాయి (ఒక ముఖ్య కారణం అచ్చుయంత్ర ప్రవేశం). మీరు మొదటి పేరాలో చెప్పిన మిగిలిన విషయాలతో అందరూ (నేనైతే) ఏకీభవిస్తారు (ను). కాకుంటే ఈ కింది వాక్యమెందుకు ప్రస్తావించారో బోధపడలేదు. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి. ఈ రెండు చర్చలకు ఎలాంటి సంబంధం లేదు. వీటిలో పాల్గొన్న వ్యక్తులు/సంస్థలు (వావిళ్ళ వారినొక్కరిని మినహాయిస్తే!) కూడా వేర్వేరు అని మీకు నేను చెప్పనవసరం లేదు.
కందుకూరి మధ్య మార్గం పాటించిన మనిషిగా ఎలా చెప్తున్నారో అర్థం కాలేదు. వివరించగలరు. గురజాడ “కొత్తపాతల మేలు కలయిక” అన్నప్పుడు ఆశు (/మౌఖిక), లిఖిత సంప్రదాయాల్ని కలుపుకుంటూ అన్న అర్థంలో వాడాడు. భావకవులకు ఆశుకవిత్వం పట్ల, “గ్రాంథికం” పట్ల వున్న అయిష్టత తెలిసినదే.
అలాగే తి.వెం.కవులు గ్రాంథికవాదాన్ని తిరస్కరించారని ఏ ఆధారంతో చెప్తున్నారో కూడా నాకు బోధపడలేదు. తిరుపతిశాస్త్రి గారు జీవించి వున్న కాలంలో వారిద్దరూ “వ్యావహారిక వాదానికి” అనుకూలురు కాదు. నిజానికి చాలకాలం (అంటే జమీందారుల పోషణ పొందినంతకాలం), వారే చాలాచోట్ల చెప్పుకున్నట్లు, తెలుగంటే చిన్నచూపే (చూ: కథలు-గాథలు, మూడు భాగాలూ). వెంకటశాస్త్రి గారు చివరిరోజుల్లో కూడా “వ్యావహారికానికి” అనుకూలుణ్ణని చెప్పుకోలేదు. ఒక ఉదాహరణ:
“నేనీ పొత్తమును సర్వసాధారణమయిన వ్యవహారిక భాషలోనే వ్రాస్తాను. 64 వత్సరములు నిండు వయస్సులో వ్రాస్తూ వున్న దీనిని చూచి, నన్ను “తుద కబ్బెరా తురక భాష” అని నా మిత్రులూ, శిష్యులూ లోనగువారు కొందరు నిందింతురని నక్కు తెలిసిన్నీ, నేనిట్టి భాషను సమర్థించు వారిలో చేరినవాడను కాక యుండిన్నీ, ఇందులో వ్రాయుటకు కారణము, నాకు ఈ భాష అంటే అంతగా యిష్టం లేకపోయినా, ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయటమే నా ముఖ్యోద్దేశ్యము.” (చూ: కాశీయాత్ర, 1942)
ఏమయినా, వాళ్ళు, ముఖ్యంగా చెళ్ళపిళ్ళ, ఏ గాటానా కట్టడానికి లొంగని వ్యక్తులు :-). వాళ్ళ Cultural Biography ఎవరైనా రాయవలసిన అవసరం యెంతైనా వుంది.
సంస్కృత ప్రభావంతో “తెలుగుకున్న వ్యాకరణదీపం చిన్నదనే” భావన పండితలోకంలో చాలాకాలం బలంగా వుంది. అది చెళ్ళపిళ్ళవారి అభిప్రాయం మాత్రమే కాదు.
#[…] All Telugu courtly poets proudly proclaimed that they commanded scholarship in Sanskrit, Prakrits of different varieties, Puranas, Sastras and a host of related subjects like meter. While they composed poetry almost entirely in Telugu, they did not have to support their Telugu by texts of grammar or dictionaries: Telugu was a language of poetry, not of scholarship. When challenged, the court poet supported the Sanskrit words he had used in his poem by quoting the great Sanskrit lexicographers of the past, but for his Telugu words, he only needed the approval of past usage by an earlier court poet. There was also a long and sustained effort on the part of grammarians and lexicographers to produce a set of rules and dictionaries for the Telugu used in courtly poems. None of them however had the status of the famous Sanskrit grammarians and lexicographers.[…*] #
నాకు తెలిసి మధ్యేమార్గస్తుడెవరైనా వుంటే అది గురజాడ మాత్రమే.
చివరిగా మీరు ముగింపులో ప్రస్తావించిన రెండు విషయాలపై మాత్రం యెంతైనా చర్చ జరగవలసిన అవసరం వుంది.
— శ్రీనివాస్
* V. Narayanarao, Print and Prose: Pundits, Karanams and the East India Company in the Making of Modern Telugu. In _India’s Literary History: Essays on the Nineteenth Century_, S. Blackburn (Ed). Delhi: Permanent Black. 2004. pp. 146-66.
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
06/16/2008 10:28 am
I concur.
కామేశ్వర రావు గారి “సనాతనవాదం” మీద ఉన్న అవగాహనతో నేనేకీభవిస్తాను కనుక, ఆయనకు “తర్కానికి అందినట్టుగా అనిపించని” వాక్యాలను అదే సనాతనవాదాన్ని ఉదాహరణగా చేసుకుని రాసుకుంటే, భాష గురించి విశ్వనాధ రాసిన మాటలు కొంత వరకూ అర్ధం చేసుకోవచ్చేమో!, అప్పుడవి (భాష గురించిన మాటలు) తర్కానికి అందుతాయనే అనుకుంటున్నాను.
మీరొకసారి ఇది చదవండి:
ఆయన, భాష గురించి రాసిన ఈ పేరా చాలా సున్నితమైన, నిర్దుష్టమైన academic ప్రశ్నకు ఒక సమాధానం అనుకుంటాను. ఆయన ఈ వ్యాసంలో కొన్ని చోట్ల ‘అకడమిక్’ వ్యవహారాన్ని సామాన్య దృష్టితో చెప్పిన వాటితో సంపర్కించి రాయటం వల్ల వచ్చిన పేచీ ఇది, ఒక్కోదాన్ని అర్ధం చేసుకోవటానికి వాడాల్సిన అద్దాలు మార్చి చదువుకోవాలి. ఇది తనకు తాను “అసలు విషయం” అర్ధం చేసుకోవటానికి రాసుకున్న వ్యాసం అయిఉండొచ్చు.
— ——————
ఈ వ్యాసంతో “ఈమాట” ప్రాశస్త్యం పెరిగింది. ఈ మాటలు విశ్వనాధ 1920ల్లో రాసారంటే నమ్మడం కష్టం, అప్పట్లో ఎవరైనా
ఈవ్యాసం మీద మరెవరైనా రాసారా, ఎవరి ఎరుకలోనైనా?
విప్లవ్
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
06/16/2008 9:05 am
ఇక్కడొక విశ్వనాథ అభిమాన సంఘం ఏర్పడేట్టుందే:)
విశ్వనాథ కల్పవృక్షం కేవలం గ్రాంధికభాషకే కట్టుబడి రాసారన్న మాట నిజం కాదు. అందులో వ్యావహారిక భాష పుష్కలంగా కనిపిస్తుంది.
విశ్వనాథ ఖచ్చితంగా సనాతనవాదే. మార్పుకి వ్యతిరేకి అన్నది మాత్రం సరికాదు. సనాతనవాదమంటే మార్పుకి వ్యతిరేకం అనుకోవడం తప్పు.
విశ్వనాథవారిలో తర్కంపాలు ఎంతో ఆవేశంపాలూ అంతే ఉంటుంది.
ఉదాహరణకి ఈ మాటలు తర్కానికి ఎంతవరకూ నిలుస్తాయి?
గ్రామ్యమా? వాడుకభాషా? గురించి lyla yerneni గారి అభిప్రాయం:
06/16/2008 7:51 am
విశ్వనాథ రచనలు ఎన్నోచదివాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. స్కూల్లో రోజూ పాఠాలు చెబుతూనే అన్ని గొప్ప రచనలు ఎలా చేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో తెలుగు వారు ఒక్క పద్యం రాసినా ఒక పేజీ వచనం రాసినా ఒక సంవత్సరం పాటు దాని గురించే మాట్లాడుతారు. అందులో ఏం ఉండదు కూడా. ఆ రాసిన ఒక్క పెజి చదవమని వంద లింకులు. హంగామా. 🙂
విశ్వనాథ పాండిత్యం, కవితాశక్తి, తర్కం, తాత్విక భావాలు, ఆలోచనలో విశాలత్వం, పాతబడని ఆధునికత – అన్నీ నన్ను మెప్పిస్తాయి. విశ్వనాథకు ఆయన సమకాలంలోనూ, ఇప్పటివరకూ పోటీనే లేదు. కాని ఈయన కన్నా ఎంతో తక్కువ రాసి, తోటి మనుషులమీద సానుభూతి నాలుగు గేయాల్లొ కుమ్మరించేసి (అందులొ కొన్ని వేరే దేశపు కవుల పాటల అనువాదాలు) ప్రజాకవులై పోయారు కొందరు. తడి తక్కువ. బడాయి ఎక్కువ. 🙂 కవి ఒక్కటో రెండో చిన్న పాటల పుస్తకాలు రాస్తే, వాటినుండి రోజూ ఉదహరించటం తేలిక. మనకీ కంఠతా వస్తాయి. కంఠతా వచ్చాయి కాబట్టి, పద్యాలు గొప్పవీ, కవి గొప్పవాడు అని ఒక వాదం లేవదియ్యొచ్చు.
విశ్వనాథ వ్యాసం నాకు నచ్చింది. ఈ ప్రత్యేక వ్యాసాలు అన్నీ చదివాను. మళ్ళీ చదవాలి. ఈమాట పత్రిక చాలా ఉల్లాసం కలిగిస్తున్నది.
లైలా.
వ్యవహారిక భాషా వికాసం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
06/12/2008 8:56 am
ఇది గ్రాంధికమో వ్యావహారికమో తెలీదు కాని నాకు మాత్రం మింగుడు పడకుండా ఉంది!
ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి అక్కిరాజు భట్టిప్రోలు గారి అభిప్రాయం:
06/07/2008 1:16 am
ఈమాట చదవటమే ఓ ఎడ్యుకేషన్!!
బహుశా నా తరమంతా వ్యావహారికమే అభ్యుదయమని నమ్ముతూ పెరిగామంటే అతిశయోక్తి కాదేమో! ఇప్పుడీ నాలుగు వ్యాసాలు చదివి ఆ నమ్మకాలన్నీ మార్చేసుకున్నానని చెప్పను కానీ, ఓపెన్ మైండ్ తో చదివితే వీరి వాదంలో కూడా వ్యావహారిక భాషావాదులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే అని పిస్తుంది. ఇంత చదువూ చదివి కనీసం పోతన భాగవతం కూడా సొంతగా చదువుకోలేక పోవటం అంతకంటే షేక్స్పియర్ నాటకాలనే సులభంగా చదువుకోగలగటం చూస్తుంటే వీరి వాదాలు మరింత అర్థవంతంగా తోస్తున్నాయి.
అదే సమయంలో సాహిత్యాన్ని జన బాహుళ్యానికి దగ్గరగా తెచ్చి, ఇన్ని వేల సంవత్సరాల్లో జరగని సామాన్యుల జీవన చిత్రణ గత వందేళ్ళలోనే జరగటానికి వ్యావహారిక భాషని ఆశ్రయించటం వల్లనే సాధ్యమయుంటుందనే నా అమాయక మయిన నమ్మకానికి ఏమన్నా ఆధారం ఉందోలేదో పెద్దవాళ్ళే చెప్పాలి.
ఇలా రెంటినీ బాలెన్స్ చేసే మార్గం చెప్పే మోడరేట్ గ్రూప్ ఎందుకు ఏర్పడ లేదు? ఏర్పడినా అది నా బోంట్లకు తెలీదా?
ఏమయినా ఈ వ్యాసాలకి ఆనాటి వ్యావహారిక వాదులు ఏం సమాధానం చెప్పారో, ఆ తర్వాతి కాలంలో ఏంజరిగిందో చెప్పాలి.
అలాగే ఈ ఉత్తరాలనీ, వ్యాసాలనీ ఈమాట ఎక్కణ్ణించి సేకరించిందో చెపితే బావుంటుంది.
అక్కిరాజు భట్టిప్రోలు
సడిచేయకే గాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/27/2008 7:17 pm
“జయభేరి”
JUBV ప్రసాద్ గారి వ్యాఖ్య నుండి:
సుద్దాల అశోక్ తేజ అనే సినీ పాటల రచయిత, శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధార పోశాను” తీసుకుని, దాన్ని మూడు లైన్ల పల్లవిగా చేసి, సొంత చరణాలు రాసుకుని, ఠాగూర్ సినిమాకి ఇచ్చారు.
సినిమాలో ఏముందో నాకు తెలియదు కాని ఆ శ్రీశ్రీ గీతం ప్రారంభం ఇది:
“నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!”
కొడవళ్ళ హనుమంతరావు
పేరులేదు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/27/2008 12:09 am
వరూధిని అందం, సరస్వతి సౌందర్యం
సంప్రదాయ సాహిత్యాన్నీ, అభ్యుదయ సాహిత్యాన్నీ జమిలిగానే కాదు, విడిగా నయినా విమర్శించడానికి నాకు కనీస యోగ్యత కూడా లేదు. కాని డాక్టర్ స్మైల్ గారి అభిప్రాయం రెండురోజుల నుండి నా మనసును పట్టి వదలకపోవడాన ఇది రాస్తున్నాను. ఇది వారిపై విమర్శ కాదు. దీంట్లో సాహిత్యాభిమానులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉండొచ్చనే ఆశ.
పాతసాహిత్యం సామాన్యప్రజల జీవితాన్ని కావ్యవస్తువుగా తీసుకోలేదనీ, అభ్యుదయసాహిత్యానికీ సంప్రదాయ సాహిత్యానికీ గల ముఖ్యమైన తేడా అదేననీ అంటే నేనొప్పుకుంటాను.
వరూధిని సంప్రదాయసాహిత్యానికి ప్రతీక అయితే నష్టం లేదుగాని, “భిక్షువర్షీయసి” అభ్యుదయసాహిత్యానికి ప్రతీక అయితే మనకి లోటుగానే ఉంటుందనుకుంటాను. “భిక్షువర్షీయసి” మంచి కవిత కాదని కాదు, ప్రతీక కాకూడాదనే నాఉద్దేశం.
వరూధిని ప్రవరులది ప్రేమకథ. ప్రేమకథల్లో అందానికి ప్రాముఖ్యత ఉంటుంది. అందం బాహ్య సౌందర్యం గురించీ, హృదయ సౌందర్యం గురించీ కూడానూ. అయితే ఎవరికైనా మనిషిని చూడటంతోటే ఆకట్టుకునేది బాహ్య సౌందర్యమే. నాభి లోతు దాకా పోవాలో లేదో నాకు తెలీదు కాని, వరూధినిని పరిచయం చేసిన విధం ఆకర్షణీయమే. “మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్,” అన్న మాటలు కవితా సౌరభం తో నిండినవే. ఈతరం కవులు కూడా స్వీకరించదగ్గవే.
ఆ పద్యాల వెనువెంటనే వరూధినిని మన కళ్ళముందట నిల్పే పద్యమిది:
“తతనితం బాభోగ ధవళాంశుకములోని
అంగదట్టపు కావిరంగువలన
శశికాంతమణిపీఠి జాజువారగ కాయ
లుత్తుంగ కుచపాళి నత్తమిల్ల
తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో
జిలిబిలిపాట ముద్దులు నటింప
ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి
రతిపారవశ్య విభ్రమము తెలుప
ప్రౌఢి పలికించు గీతప్రబంధములకు
కమ్ర కరపంకరుహ రత్న కటక ఝణఝ
ణధ్వనిస్ఫూర్తి తాళమానములు కొలుప
నింపు తళుకొత్త వీణ వాయింపుచుండి.”
తిక్కన, సూరన లను మించి ఇంత సుకుమారమైన పద్యం మన భాషలోనే లేదన్నారు పుట్టపర్తి [1]. అదెందుకో తెలుసుకునే పరిజ్ఞానం నాకు లేదు కాని, “ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమము తెలుప,” అన్నది నన్నాకర్షించింది.
కారణం దానిపై రారా ఇచ్చిన వివరణలు. ఆయన దానిని “రసపారవశ్య” మని చదువుకున్నాడు. సుకుమార హృదయం గలవాళ్ళే సాహిత్యంలోనైనా ఏకళలోనైనా పారవశ్యం చెందుతారనీ, “కవితా! ఓ కవితా!” లో శ్రీశ్రీ చెప్పిన “క్షణికమై, శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం,” పెద్దన చెప్పిన పారవశ్యమూ ఒకటేననీ అన్నాడు. నాకది నచ్చింది.
ఇంతకీ రారా ఈ మాటలన్నది కొడవటిగంటి కుటుంబరావు రాసిన కొన్ని ప్రేమకథలను విశ్లేషించే సందర్భంలో [2]. కుటుంబరావు రాసిన పెద్దకథ “కురూపి” లో అనాకారిగా కనకం ప్రపంచంలోకి ప్రవేశించిన సరస్వతి అతనిని తన హృదయసౌందర్యం ద్వారా చివరికెలా వశం చేసుకుంటుందీ వివరిస్తూ శిల్పానికి గల ప్రాముఖ్యతని వివరించాడు.
సమాజంలో అందవిహీనమైన స్త్రీ పురుషులు ఉండితీరతారు. మరి వాళ్ళ ప్రేమా పెళ్ళీ లాంటి చిక్కు సమస్యలు తీరేదెలా? దీనికి కుటుంబరావు ఇచ్చిన సమాధానం – ఆధ్యాత్మికం. అంటే అదేదో పరలోకానికి సంబంధించిందని కాదు. మనిషి నుండి వేరే మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటేననీ, అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా ఉంటాయనీ, వీటి మూలంగా ప్రేమా పెళ్ళి సఫలం అవుతాయనీ వ్యక్తం చెయ్యడనికే “కురూపి” రాశానన్నాడు.
“అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలున్నట్టు నాకు చిన్నతనం నుండి కూడా తెలుసు. నాకు తెలియనిదల్లా నేటి మన సమాజం కిందకే దిగుతున్నదో, మీదికో ఎక్కుతున్నదో, నేటీ యువకులు పైనే చూస్తున్నారో, కిందకో చూస్తున్నారో … అది మాత్రమే,” అని కొంత నిరాశపడ్డాడు.
కుటుంబరావువి చదవ్వలసిన ప్రేమకథలు. అవి అభ్యుదయసాహిత్యాన్ని “భిక్షువర్షీయసి” కవితా పరిమితుల్ని దాటి విస్తరింపచేస్తాయి.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1]. “వ్యాసవల్మీకం” లో “వరూధిని” అన్న వ్యాసం. పుట్టపర్తి నారాయణాచార్యులు, 2004. “వరూధిని హృదయమున రససముద్రమున్నది. మాటలలో కవిత యున్నది. ప్రకృతి యొక్క విచికిలస్వరూపము వరూధిని…” అని ముగించారు. ఈయనా, రారా, ఇద్దరూ ప్రొద్దుటూరు వారే! వాళ్ళూ, శ్రీశ్రీ, కొకు, ఇంకా కొందరు అభ్యుదయరచయితలూ కలిసి “సంవేదన” ఆవిష్కరణ సందర్భంగా తీయించుకున్న ఫొటొ ఈ పుస్తకంలో ఉంది.
[2] “కుటుంబరావు సాహిత్యం,” అయిదవ సంపుటం లో “భావుకుల రచయిత కొకు,” అన్న వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి. 1983. కవులలోకెల్లా అల్లసాని పెద్దన తన అభిమాని కవి అని చాటుకుని, “కవిత్వానికి కావలసింది ఆవేశబలం కాదు, అనుభూతి సౌకుమార్యం,” అన్న విలక్షణ విమర్శకుడు రారా.
పేరులేదు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/23/2008 9:29 pm
“ప్రశ్నలే శాశ్వతం”
శ్రీశ్రీ షష్టిపూర్తికి ఇస్మాయిల్ రాసిన “శ్రీశ్రీ జన్మ వృత్తాంతం,” అన్న వ్యాసంలో, “కవిత్వమైనా తత్త్వమైనా సందేహాల్లోంచి, ఆందోళన నించి, తిరుగుబాటు నించీ పుడుతుంది. ప్రశ్నలే శాశ్వతం. సమాధానాలు కావు. సమాధానాలతో సంతృప్తి పడితే వెంటనే చస్తుంది కవి ప్రతిభ,” అన్నారు.
ప్రశ్నలతో కూర్చిన పదచిత్రాలతో నిండిన కవిత మనసుని పట్టేసింది. తూచేరాళ్ళని కాదు గాని, నేను స్థూలంగా కవితలని – అర్థంకాని, మామూలు, మంచి, గొప్ప అని – నాలుగు రకాలుగా చెప్పుకుంటాను. ఇది నిస్సందేహంగా మంచి కవిత. నా దృష్టిలో గొప్ప కవిత్వానికున్న ఒక గుణం – కంఠస్థనీయం కావడం. ఈ కవిత గొప్పది కాగలిగి ఉండీ కాలేదనిపించింది. అందుకు అక్కడక్కడా అనవసరంగా వాడిన మాటలే కారణం. క్లుప్తత ముఖ్యం అంటారు, ముఖ్యంగా కవిత్వానికి.
తనకి పేరులేకపోయినా కవికి పేరుతెచ్చే కవిత.
కొడవళ్ళ హనుమంతరావు
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి నాగమురళి గారి అభిప్రాయం:
05/22/2008 1:09 pm
లక్ష్మన్న గారూ,
నిజమే, జ్యోతిషం చాలా ఆసక్తికరమైన విషయం. ఈ ఆసక్తికి ప్రధాన కారణం నా ఉద్దేశ్యం ప్రకారం ఇదీ – చాలామంది మనుషులకి తమకి తెలియకుండానే కొంత ‘అధి భౌతిక దృక్పథం’ (Mystical లేక Magical Thinking అనడం సరైనదేమో) ఉంటుంది. నా జీవితంలో పరిస్థితులు ఇలా ఉండడానికి ఏదో పైకి కనిపించని కారణం ఉండి ఉంటుంది (పూర్వ కర్మ లాంటివి). ‘నాకే ఇలా ఎందుకు జరుగుతోంది’ అని మనలో చాలామందిమి ఏదో ఒక సందర్బంలో ప్రశ్నించుకునే ఉంటాము. ఏదో ఒక కారణం వల్లనే మన గతమంతా అలా జరిగింది అనీ, ఏదో ఒక హేతువు ప్రకారమే భవిష్యత్తు కూడా జరుగుతుంది అనీ చాలా ఎక్కువ శాతం మందికి ఒక సహజమైన అభిప్రాయం ఉంటుంది. మన పరిధిలో లేకుండా జరిగే విషయాలని అర్థం చేసుకోడానికి, సర్దిచెప్పుకుని సమాధానపడడానికి ఈ విధమైన దృక్పథం ఒక సహజాతం (instinct) లా పనిచేస్తుంది (చాలా మందికి) అని నా అభిప్రాయం. దాన్ని నేను దుర్బలత్వంగా భావించను – ‘అతి’ లేనంతవరకూ.
జ్యోతిషానికి పునాదులు ఇటువంటి సహజాతాల్లో ఉన్నాయి కాబట్టి అది ఇంకా అనేక సంవత్సరాలపాటు నిలబడి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళూ, అధ్యయనం చేసేవాళ్ళూ కూడా దాన్ని ఒక ఖచ్చితమైన శాస్త్రంగానే (Deterministic అనే) భావిస్తారు. అయితే అధ్యయనం చేసేవాళ్ళు అది ఖచ్చితంగా పని చెయ్యాలి అని పట్టుబట్టి, లోతుగా పరిశీలించదలచుకుంటే మాత్రం అంతిమంగా నిరాశ పడక తప్పదు. అది నా స్వంత అనుభవం. అయితే అది ఖచ్చితంగా పని చెయ్యకపోయినా, పని చేస్తున్నట్టు ఉభయులకీ అనిపిస్తుంది అనడంలో మాత్రం నాకు సందేహం లేదు. తమవద్దకు వచ్చినవాళ్ళనీ, వాళ్ళ సమస్యల్నీ లోతుగా అర్థం చేసుకుని, పరిష్కారాలు చూపించి, సంతృప్తిపరచగల వ్యక్తిత్వమూ, చాతుర్యమూ, వివేకమూ గలవాళ్ళకి జ్యోతిషం చాలా ఉపయోగకరమైన పనిముట్టు. అయితే వ్యక్తుల ప్రతిభతో ప్రమేయం లేకుండా ఒక పనిముట్టుగానే దాని సామర్థ్యాన్ని పరిశీలించదలచుకున్నవాళ్ళకి మాత్రం అది ప్రస్తుతానికి ఎండమావి లాంటిదే.
ఇక కవలల సంగతి. ఏ జ్యోతిష గ్రంథంలోనైనా సరే దీని గురించి చర్చ జరగకుండా ఉండదు. భూమియొక్క దైనందిన చలనం (Diurnal Motion) ప్రకారం సుమారుగా ప్రతీ నాలుగు నిమిషాలకీ ఒక డిగ్రీ చొప్పున తూర్పున ఉదయించే బిందువు (లగ్నం), అలాగే మిగతా భావాలూ మారుతూ ఉంటాయి. చాలా మంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఈ బిందువుల్లో ఎంత సూక్ష్మమైన తేడా వచ్చినా సరే ఫలితాలు మారుతాయి. మరీ ముఖ్యంగా భారతీయ జ్యోతిషంలో రాశి చక్రాన్ని చాలా సూక్ష్మ భాగాలుగా చేసి ఫలితాలు చూసే సాంప్రదాయాలు (నవాంశ, దశాంశ, త్రింశాంశ మొదలైన విభాగాలు) ఉన్నాయి. వాటి ప్రకారం జన్మ సమయంలో ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే ఫలితాలు మారిపోతాయిట. అయితే ఆచరణలో మాత్రం అత్యధికశాతం జ్యోతిష్కులు అంత దగ్గరి జాతకాలకి భిన్న ఫలితాలు చెప్పలేరు. అంతేకాదు, చాలా మంది జాతకుల జన్మ సమయాలు కూడా నిమిషంతో సహా ఖచ్చితంగా ఎవరికీ తెలియవు. అందుచేత ఎవరికైనా చెప్పిన ఫలితాలు తప్పిపోతే, ’జన్మ సమయం తప్పై ఉంటుందమ్మా, అది చాలా ఖచ్చితంగా తెలియాలి’ అని జ్యోతిష్కులు తప్పించుకుంటూ ఉంటారు.
కొన్ని పుస్తకాల్లో ఒక్క నిమిషం ఎడంగా పుట్టిన కవలల జాతకాలని ఉదాహరణగా ఇచ్చి, ‘చూశారా ఒక్క నిమిషమే తేడా ఉన్నా, ఫలానా సూక్ష్మాంశం మారిపోవడం వల్ల అసలు ఇద్దరి జీవితాలకీ పొంతనే లేదు!’ అని రాస్తూ ఉంటారు. అయితే ఆ కవలల విషయంలో అన్వయించిన అదే సూక్ష్మాంశం మరొక మామూలు జాతకానికి ఎందుకు అన్వయించరో బోధ పడదు. అంతే కాకుండా అటువంటి సూక్ష్మాంశాలవల్ల నిజంగా మిగతా జాతకాల్లో కూడా ఫలితాలు ఎలా తేడాగా వస్తున్నాయో వివరణలు ఉండవు. వాటికి మాత్రం ఎక్కువ కాలావధిలో మారిపోని అంశాలనే పరిగణనలోకి తీసుకుని ఫలితాలు చెప్పేస్తూ ఉంటారు.
పాశ్చాత్య జ్యోతిషంలో భూమి యొక్క దైనందిన చలనం (Diurnal Motion) ప్రకారం ప్రిడిక్షన్సు చెప్పే పద్ధతి ఒకటి బహుళ ప్రాచుర్యంలో ఉంది. దానిలో జన్మ సమయం ఒక నాలుగు నిమిషాలు తేడా వస్తే, ఫలితం జరగాల్సిన సమయం ఏడాది దాకా మారిపోతుంది. కాబట్టి ఈ పద్ధతిని రివర్సులో ఉపయోగించి జన్మ సమయాన్ని సరిచేస్తూ ఉంటారు. అంటే, మొదట ఒక జాతకాన్ని చూసి, పెళ్ళి జరిగే తేదీని లెక్క వేశాము అనుకోండి. జాతకుడికి పెళ్ళి ఎప్పుడైందో కనుక్కుంటే, మనం కట్టిన తేదీకి సరిగ్గా ఒక ఏడాది తరవాత పెళ్ళి అయిందనుకోండి. అంటే, మన లెక్కలో ఒక డిగ్రీ తేడా వచ్చింది అన్నమాట. భావ బిందువు ఒక డిగ్రీ జరగడానికి పట్టే కాలాన్ని (నాలుగు నిమిషాల్ని) జన్మ సమయానికి కలిపేస్తే, లెక్క సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా జన్మ సమయాన్ని సరి చేస్తూ ఉంటారు.
సరదాగా ఒకసారి పరిశీలించి చూసుకోండి – మీకూ, మీ అన్న గారికీ వివాహం, ఉద్యోగం, సంతానం ఇలాంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ప్రతీవాటికీ సుమారు ఒక ఏడాది తేడా వస్తూ ఉంటే, ఈ పద్ధతి నిజమేనేమో అని మీరూ అనుమానించవచ్చు.
కవలల జీవిత విశేషాలు తెలుసుకుని, వాళ్ళ జాతకాలని సరిపోల్చడమనేది అనేకమంది జ్యోతిష్కులకి చాలా ఆసక్తికరమైన, కూతూహలమైన పని. కాబట్టి మీ ఇద్దరి జన్మ వివరాలూ ఏ జ్యోతిష విద్యార్థికి ఇచ్చినా వాళ్ళు ఎగిరి గంతేస్తారని ఖచ్చితంగా చెప్పగలను.
ఇక మీరు లేవనెత్తిన మరొక ప్రశ్న – విభిన్న ప్రాంతాల్లో పెరగడం వల్ల మా జీవిత విశేషాల్లో తేడాలు వస్తాయా? అని. ఈ ప్రశ్న కవలలకే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఒక జ్యోతిషాంశం అన్ని దేశాల, సమాజాల వాళ్ళకీ ఒకే రకంగా పని చేస్తుందా ? దీని గురించి ’జ్యోతిషమూ – కొన్ని సూక్ష్మాంశాలూ’ అన్ని అధ్యాయంలో నేను కొద్దిగా చర్చించదలచుకున్నాను కాబట్టి ఇప్పటికి వదిలేస్తున్నా.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
05/20/2008 7:25 am
హనుమ గారూ:
మీ సుదీర్ఘమైన వ్యాసాన్ని చదవటం ఇప్పుడే పూర్తి చేసాను. ఈ వ్యాసం రాయడానికి వెనక ఉన్న మీ కృషి, “ఈమాట” సంపాదకుల సంపాదకత్వం మెచ్చుకోవాలి. తెలుగులో ఇటువంటి వ్యాసాలు అరుదు. మీ లాగ సైన్సులో కాని ఇంజినీరింగులో కాని అత్యుత్తమ స్థాయిని చేరుకున్న తెలుగు వారు చాలా మంది ఉన్నా, తెలుగులో ఇటువంటి రచనలకి శ్రీకారలోచుట్టిన వారు తక్కువ. ముఖ్యంగా సైన్సు, ఇంజినీరింగు విభాగాల్లో అతి క్లిష్టమైన భావాలను తేలిక తెలుగులో రాయటం అంత తేలిక కాదు అన్న విషయం, అది ప్రయత్నించిన వారికి అనుభవమే!
ఇటువంటి రచనల్లో ఎదుర్కొనే చిక్కుల్లో రెండు విషయాలు ప్రస్తావిస్తాను. మొదటిది: అత్యుత్తమ స్థాయిలో, సాంకేతికమైన పదజాలం తెలుగులో ఎక్కువ లేకపోటం. రెండవది: తేలికగా చదవటానికి వీలైన తెలుగు భాష. ఈ రెండు కష్టాలని దాటటం అంత సులభం కాదు. మీరు సమర్ధవంతంగా ఈ రెండు కష్టాలని ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ముందు, ముందు మీ రచనల్లో మరింత పరిణితి వస్తుందని నేను నమ్ముతున్నాను.
రెండు చిన్న సూచనలు: (1) ఎంతో అవసరమైతే తప్ప, తెలుగు కాని ఇంగ్లీషు కానీ కవితలని ఇటువంటి వ్యాసాల్లో ఉల్లేఖించకండి. చదువరుల ఆలోచనలను, ఇవి అసలు విషయం నుండి పక్కదారి పట్టిస్తాయి. (2) ఇంటర్నెట్ అందుబాటులో లేని సైన్సు లేక ఇంజినీరింగ్ చదువుతున్న తెలుగు విద్యార్ధుల కోసం, మీ రచనలను ఆంధ్ర దేశంలో ప్రచురిస్తున్న దిన, వార, మాస పత్రికల్లో ప్రచురిస్తే, అక్కడి వారికి సాయపడినవారు అవుతారు. ఇందులో కస్టాకస్టాలు నాకు తెలిసినా, ప్రయత్నించమని మనవి.
ఈ వ్యాసాలు చదువుతుంటే, వృత్తి రీత్యా నాకు బాగా పరిచయమైన సెమికండక్టర్సు సిలికాన్ ఛిప్స్ తయారీ వెనుక ఉన్న ‘సిలికాన్ మహత్యం ” పై ఈమాట కోసం వ్యాసాలు రాయాలని అనిపిస్తోంది. వీలు చూసుకొని ఎప్పుడైనా…
మంచి వ్యాసాలను అందించినందుకు, ధన్యవాదాలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
నన్నయ హంసగీతికలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/17/2008 11:24 am
పాత సాహిత్యాన్ని చదివించడం ఎలా?
భరద్వాజ గారూ,
మీ సూచనలకి కృతజ్ఞతలు. మీరు చెప్పిన పుస్తకాలు కొనే శక్తీ, చదవాలనే ఆసక్తీ ఉన్నాయి. కాని అవి చాలవు; చదవాలనే దీక్షా, పట్టుదలా కావాలి! నేను పాత సాహిత్యాన్ని సులభంగా ఆకళింపు చేసుకోలేకపోవడానికి కారణం నా ఇంగ్లీషు చదువు కాదు. నేను ఇటివలి వాణ్ణీ కాదు.
పదో తరగతిదాకా తెలుగు మీడియం లోనే చదివాను. ఇంటర్ ఇంగ్లీషు మీడియం అయినా తెలుగు కూడా ఒక సబ్జెక్ట్. కాలేజీ చదువుల తర్వాత గత పాతికేళ్ళుగా సాహిత్యపరిచయం తక్కువ. వావిళ్ళా, దేవస్థానం వాళ్ళూ చేస్తున్న కృషి చెప్పుకోదగ్గదే కాని, సామాన్య పాఠకుడు తనంతటతాను మన కావ్యాలు – వ్యాఖ్యానాలున్నా – చదవడం శ్రమతో కోడిన వ్యవహారం అన్నది నాకు అనుభవపూర్వకం.
అయితే ఎవరైనా సందర్భోచితంగా ఏదన్నా పద్యాన్ని ఉదహరిస్తే, దాని గురించి ఇంకాస్త తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అందుకు స్వానుభవం నుంచి ముచ్చటగా మూడు ఉదాహరణలు :
1.. ఉప్పల లక్ష్మణరావు రాసిన “అతడు-ఆమె” నవలలో ‘కమ్యూనిస్టు’ చెల్లి అక్కదగ్గర కెళ్ళి పెద్దన మీద ఫిర్యాదు చేస్తుంది – వరూధిని, “నిన్ను వలచి వచ్చాను,” అని ప్రవరుడితో అంటే చులకనయిపోతుందా? అని:
“అనుటయు మాటలేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
కనలుచు నీరుదేరు తెలిగన్నుల నాతనిఁ బుల్కుపుల్కునం
గనుఁగొని మాటలంబొదువుగద్గదికందలయూచి యక్కటా
వనిత తనంతఁ దా వలచి వచ్చినెఁ జుల్కనగాదె యేరికిన్.”
నేను మనుచరిత్ర కాస్తయినా చదవడానికి ఇదే కారణం!
2. తానా 2005 సూవనీర్లో వెలగా వెంకటప్పయ్య వ్యాసం, “తెలుగునాట చదివే అలవాటు పెంచిన గ్రంథాలయోద్యమం,” లో మనరాష్ట్రంలో ప్రస్తుత గ్రంథాలయాల దుస్థితిని వివరిస్తూ ఈ పద్యం ఉదహరించారు. “యుద్ధం ఆపడం నీ చేతిలో ఉంది,” అని ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు హెచ్చరించే సందర్భం:
“సారపు ధర్మమున్ విమల సత్యము బాపముచేత బొంకుచేఁ
భారము బొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.”
“సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే శక్తి కలిగి ఉండి, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికి, సర్వ అనర్థాలకు కారణం అవుతుంది.”
3. సైన్సూ, సాహిత్యాలలో ప్రతిభావంతుడైన మహీధర నళినీమోహన్ రాసిన “కేలెండర్ కథ” లో మన దేశంలో కాలాన్ని ఎలా విభజించారో విశదపరుస్తూ, క్రీడాభిరామంలో ఇద్దరు మిత్రులు ఓరుగల్లు వీధుల్లో తిరుగుతూ నగర విశేషాలని వర్ణించిన పద్యం ప్రస్తావన ఉంది:
“ఉడువీథిన్ శిఖరావలంబియగు నంధ్రోర్వీశు మోసాలపై
గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్ ఘంటా ఘణత్కారముల్
సడలెన్ భానుడు పశ్చిమంబునకు వైశ్యా! పూటకూటింటికిన్
కడువుం బోదమె లెక్క యిచ్చి? కడు నాకొన్నార మిప్పట్టునన్.”
అది చదివి క్రీడాభిరామం ఇంకాస్త చదవాలనే ఆసక్తి పెరిగింది.
ఈ రీతిన అప్పుడప్పుడు అరా ముక్కా చదివితే ఎన్నేళ్ళకి ఏ కావ్యమైనా గట్టెక్కుతుంది? నిజమే, బహుశా ఇది కావ్య పఠనా మార్గం కాదు. కాని యుక్త వయసులో ఇలా పాత సాహిత్యంతో పరిచయం పెరిగితే కొన్నాళ్ళకి తమంతట తామే చదువుకోగల స్థాయికి చేరుకోవచ్చు. అందుకు తెలుగునాడి లో “రసధుని” శిర్షికా, ఈమాటలో పాత సాహిత్యంపై వచ్చే కొన్ని వ్యాసాలూ సహాయపడతాయి.
ఇది నేను రాయడానికి కారణం మిమ్మల్ని ఖండించడానికి కాదు; నా అనుభవం మిగిలినవాళ్ళకి కొంత ఉపయోగపడుతుందేమోనని ఆశతో.
కొడవళ్ళ హనుమంతరావు
మదర్స్ డే గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/17/2008 8:55 am
రవికిరణ్ గారూ,
కథనంలోని లోపాలకి బాధ్యుడు రచయిత. వాటిని పాత్రకి ఆపాదించడం భావ్యం కాదేమో. దానివలన మన దృష్టి కథ ముఖ్యోద్దేశం మీద కాక వేరే వాటి మీదకి మళ్ళే ప్రమాదం ఉంది.
సుందరం ముందర మదర్స్ డే అంటే అనుమానంగానో తృణీకారంతోనో చూసినా, ఆరోజు ఎలా గడపాలి అన్న చర్చలో అతని వాదన సవ్యంగానే ఉంది.
మీకు సుందరం, వరలక్ష్మి, జీవితంలో అనేక సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద చాలా అనుమానాలుండొచ్చు. కాని ఇది కథానిక – ఓ సంఘటన ఆధారంగా ఒక జీవిత కోణంపై వెలుగు చూపే ప్రయత్నం. పాత్రల విస్తార జీవితాన్ని విశ్లేషించడానికి నవల కాదు.
బ్రతుకలా తయారుకావడానికి పిల్లల బరువూ, ఇంటి పనీ మగవాడి కంటె ఆడదే ఎక్కువ భరించడాన కాదా? ఈ కథ మనం మదర్స్ డే జరుపుకునే తీరులోని అసంబద్ధతని చూపెడుతున్నా, దీని ప్రాధాన్యత నిత్యజీవితంలో మన ఇంట్లో కళ్ళెదుటే సాగే అసమానత గురించి కాస్తన్నా ఆలోచింపచేయడమే.
కొడవళ్ళ హనుమంతరావు
లింకన్ తో ఓ రాత్రి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/13/2008 11:22 pm
“తెలుగులో సాహిత్య విమర్శ”
మాలతి గారి కథ మీదా, సౌమ్య గారి కథ మీదా నేను నాలుగు మాటలు రాయడాన, మాలతి గారు నన్ను కూడా దృష్టిలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వారికి జవాబుగా ఇదిగో మరో ముక్క.
నచ్చిందనో నచ్చలేదనో ముక్తసరిగా చెప్తే, ప్చ్, నిర్మాణాత్మకంగా లేదు, అని పెదవి విరుస్తారు సంపాదకులు. ఇది ఇందుకు నచ్చింది, ఇది ఇందుకు నచ్చలేదు అని సామాన్య పాఠకుడు తన స్థాయికి తగ్గట్టుగా రాస్తే, పీకి పాకాన పెడుతున్నాడని కళెర్ర చేస్తారు రచయితలు. ఎలా చావడం?!
ఈ సందర్భంలో బూదరాజు రాధాకృష్ణ మన విమర్శ గురించి అన్న మాటలు ఆలోచించదగ్గవి: “గ్రంథానికి లేని విలువ దాని విమర్శకు రాదు; విమర్శకు లేని విలువ గ్రంథానికీ రాదు. ఈ రెండూ అన్యోన్యాశ్రితాలు. ఈ రెంటికీ విడదీయరాని పరస్పర సంబంధముంది. ఒకటి పేలవమైతే రెండోది అప్రశస్తమవుతుంది. ఒకటి దురభిమానభూయిష్ఠమయితే రెండోది నిస్సారమవుతుంది. ఉన్నత సాహితీ సృష్టికి విమర్శలను తట్టుకొని పదికాలాల పాటు బతకాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉండాలి. ఉత్తమ విమర్శకు గుణదోష పరీక్షణ శక్తి కావాలి.”
అయితే రచయితలొక విషయం గుర్తుంచుకోవాలి. నాలాంటి పాఠకులు వృత్తిరీత్యా, కనీసం ప్రవృత్తి రీత్యా నయినా విమర్శకులు కారు. వాళ్ళ పరీక్షణ శక్తి చాలా పరిమితం అని గ్రహించాలి. ఆ పరిమిత శక్తితో వాళ్ళు చేసే విమర్శకు కించిత్ విలువన్నా ఉందో లేదో రచయితలే పరామర్శించుకోవాలి.
ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఈమాట లాంటి పత్రికలో ప్రచురించినందుకు రచయితలు గర్వపడొచ్చు. వాటిని కొందరు పాఠకులు మెచ్చుకున్నందుకు పొంగిపోవచ్చు. అది సహజమే. కాని విమర్శించిన సామాన్య పాఠకుల అమాయకత్వానికి జాలిపడకుండా, విమర్శలో తమ రచనలు ఇంకా పైస్థాయికి చేరే సూచనలుంటే స్వీకరించడం, లేకపోతే మర్యాదగా తిరస్కరించడం – అది బాధ్యతగల రచయితల విధి అని నాఉద్దేశం.
కొడవళ్ళ హనుమంతరావు
మదర్స్ డే గురించి Bhushan గారి అభిప్రాయం:
05/11/2008 10:15 pm
‘మదర్స్ డే’ కథ మీద రవికిరణ్ తిమ్మిరెడ్డిగారి అభిప్రాయం చదివాక రాయాలనిపించింది.
రవికిరణ్ గారి ప్రకారం స్వాతంత్ర్యం రోజున జెండాలు పట్టుకు తిరగా అక్కర్లేదు. మదర్స్ డే నాడు మదర్స్ లానూ వుండక్కర్లేదు. మరి వాటిని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఎలా చేసుకోవాలి?
కథలో సుందరం మొదట మదర్స్ డే కి కొంచెం వ్యతిరేకంగానే వున్నాడు. కాని ఆ వ్యతిరేకత దేని పైన? ఒక్క రోజు తల్లుల్ని గౌరవించే పద్ధతుల మీదా, బహుమతుల మీదా. బహుమతులివ్వలేని పిల్లలూ, మీకు మదర్స్ డే వున్నట్టేనా ! పండగలకి గుడ్డ ముక్క పెడితేనే అక్కా, చెల్లీ.
తల్లులందరూ పిల్లలకి దగ్గరగా వున్నప్పుడూ తల్లులే, దూరంగా వున్నప్పుడూ తల్లులే, సరే. మరి మదర్స్ డే ని ఫాలో చేసేవాళ్ళు, ఆ రోజు ఎలా గడపాలి? వినాయక చవితి నాడు వినాయకుడితోనూ వొద్దు, మదర్స్ డే నాడు పిల్లలతోనూ వొద్దు, రవికిరణ్ గారి ప్రకారం.
సుందరానికి తనతో విభేదించే వాళ్ళ పైన కాదు అగౌరవం. దేన్ని ఫాలో చేస్తారో, దాన్ని సరిగా అర్థం చేసుకుని ఫాలో చెయ్యనివాళ్ళ పైనే అగౌరవం.
అసలు, కథని రవికిరణ్ గారు సరిగా అర్థం చేసుకున్నట్టు లేదనిపిస్తోంది నాకు.
( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి rao గారి అభిప్రాయం:
05/10/2008 6:16 pm
అంతా బాగుంది, కాని ఫొటొ లేదు. … .. ఆర్టికిల్ చప్పగా ఉంది.
నన్నయ హంసగీతికలు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
05/10/2008 9:00 am
ఈ వ్యాసము నేను ప్రచురించిన రోజు నుండీ, రోజూ చదువుతున్నాను. మరి ఎంచుకున్న పద్యాలు అంత అందమైనవి. వ్యాసకర్తకు విషయం పైన అధికారము, అభిమానము, పాఠకులమీద ప్రేమతో, ఓర్పుతో విషయాన్ని విశదీకరించటం, భాషమీది మమకారం గౌరవంతో చక్కని (మధ్యలో ముక్కలు కాని, చివర్లో తునిగిపోని) వాక్యాలు రాయటం – ఇవి కొన్ని నాకు నచ్చిన గుణాలు. ఈ రచయిత వ్యాసాలు నాకు ఒయాసిస్సులు.
హంస గీతికలు అన్న శీర్షిక ఎంతో బాగుంది. కాని ఇంగ్లీషు సంగతి ఎత్తినప్పుడు ‘swan song’ అన్నమాటే వ్యాసము లో ఉండాలని నా అభిప్రాయం.
కామేశ్వర రావు వివరణ కూడా ఎంతో ఎంతో బాగుంది. మళ్ళీ భారతంలో ఈ ఘట్టంలో ముందు వెనుకల పద్యాలన్నీ చదివాను. నాకు మీకున్న పాండిత్యం లేదు. చాలా పద్యాలు అర్థం చెప్పి, వివరణలిస్తేనే చదువుకోగలను.
ఐనా, “అబ్జజు యానముతో సమానమై” అన్నచోట ఆ హంస బ్రహ్మ వాహనమైన హంస కాదా? అబ్జజుడు బహ్మ కదా?
లైలా
నన్నయ హంసగీతికలు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
05/09/2008 10:56 am
మంచి పద్యాల గురించి మంచి వ్యాసం!
ఈ పద్యాల కథ, ధర్మరాజు సారస్వత యాగం జరిగిన తీర్థంలో స్నానమాడి పొందిన మహానుభూతి దగ్గర మొదలౌతుందని “నన్నయ్యగారి అక్షర రమ్యత”లో వి.వి.ఎల్. నరసింహారావు గారి అభిప్రాయం. ఇక్కడ నన్నయ్యగారు పేర్కొన్న “ప్రసన్న సరస్వతీకము” రాబోయే కథలోని సరస్వతీ గీతకి (తార్క్ష్యునికి సరస్వతి చెప్పిన గీత) సూచన అని అతనుద్దేశం. అయతే ఆ భాగాన్ని ఎఱ్ఱన పూరించాడు.
ఈ భాగం చదువుతూ ఉంటే నాకూ, అంతర్లీనంగా సాగే ఏదో అంతస్సూత్రం కనిపించీ కనిపించకుండా కనిపిస్తుంది.
ఎఱ్ఱన చేసే సరస్వతీ నది వర్ణనకీ నన్నయ్య “భూసతికిన్…” పద్యానికీ చాలా సామ్యం కనిపిస్తుంది. ఈ పద్యంలో, భూమినీ ఆకాశాన్నీ హంసతో పోల్చినట్టుగా మీరన్నారు. కానీ ఇక్కడ శరత్కాలాన్ని సరస్వతీ బ్రహ్మల సమేతమైన “శారద”హంసతో పోల్చినట్టు నాకనిపిస్తోంది. శారద రాత్రులు, సరస్వతీ ఒకదానికొకటి విడదీయలేనంతగా అనిపిస్తాయి. ఇది ఎఱ్ఱన సరస్వతీ గీత తర్వాత చేసిన సరస్వతీ స్తుతి “అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ! శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి!” అనడంతో పరిపూర్ణమైనట్టుగా తోస్తుంది.
ఈ మొత్తం భాగంలో (నన్నయ్య శరత్కాల వర్ణన మొదలు ఎఱ్ఱన సరస్వతీ స్తుతి వరకూ), చాలా పద్యాల్లో తిరిగి తిరిగి కనిపించే పదాలూ పదబంధాలూ కూడా ఈ ఏక సూత్రతని స్ఫురింపజేస్తాయి.
నన్నయకి హృదయఘాతం వంటిది సంభవించి ఉంటుందని కన్నా, శారద హంసనెక్కి బ్రహ్మలోకానికి ఎగిరిపోయి ఆ సరస్వతిలో కలసిపోయాడని ఊహిస్తే మనకి ఆత్మసంతృప్తి కలుగుతుంది కదా!
మధునాపంతుల వారు ఇంచుమించు ఇలాగే ఊహించారు. ఊహించడమే కాక, దానికి ఈ వ్యాసంలో మీరిచ్చిన ఈ నన్నయ్య చివరి పద్యాలని ఆధారం చేసుకొని ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు, “నన్నయ్య భారతి” పుస్తకంలో “నన్నయగారి వెన్నెల రేయి” అన్న వ్యాసంలో.
లింకన్ తో ఓ రాత్రి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/07/2008 9:32 pm
“సత్యజిత్ రాయ్ ఎవరు”
నాకు సత్యజిత్ రాయ్ సాహిత్యంతో పరిచయం లేదు; డాన్ బ్రౌన్ ఎవరో తెలియదు. నీల్స్ బోర్ principle of complementarity గురించి కొంచం తెలుసు. ఈ కథ సారాంశం నాకర్థం కాలేదు. వింత మనుషులతో కాపురం/స్నేహం ఎలా ఉంటుందనా? దీనికి ప్రేరణ ఇచ్చిన రాయ్ సాహిత్యం చదువుదాం అన్న ఆసక్తి నాకు ఎంతమాత్రమూ కలగలేదు.
పోల్చి కించపరిచే ఉద్దేశం లేదు కాని, రాయ్ పుట్టినరోజన్నారు కనుక చెప్తాను. నిన్న రాత్రి ఎందుకో శ్రీపతి కథలు చదువుతుంటే, ఒకటి నన్ను గట్టిగా కదల్చింది. ఇవాళంతా నా ఆలోచనల్లోనే ఉంది. కథ పేరు, “సత్యజిత్ రాయ్ ఎవరు.” అది చదివి, నేను రాయ్ చిత్రాలు మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది అని తీర్మానించుకున్నాను.
కొడవళ్ళ హనుమంతరావు
ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా గురించి mOhana గారి అభిప్రాయం:
05/06/2008 6:31 pm
చారులతను గురించి చక్కగా రాసిన రచయితకు అభినందనలు, ధన్యవాదాలు. నాకు నచ్చిన చలనచిత్రాలలో చారులత ఒకటి. ఈ కథను చిత్రం చూడడానికి ముందే కన్నడములో చదివాను. ఇది ఒక పెద్ద కథ లేక నవలిక. కొద్దిగా రవీంద్రుని జీవితంలోని సంఘటనలపైన ఆధారపడిందే. చారులతలాగే కాదంబరీదేవికి కూడా బంకించంద్రునిపై మక్కువ ఎక్కువ. చారులత బొంకిం, బొంకిం అని పాటలా కూడా పాడుతుంది ఈ చిత్రంలో. కాదంబరీదేవికి రవీంద్రుని ముద్దు పేరు హెకేట్ (ఒక నిగూఢ దేవత). ఆమె రవీంద్రుని భాను అని పిలిచేది. తన మొదటి రచనలను రవీంద్రుడు భానుసింహుని పేరుతో రాశాడు. చిత్రంలోని ముగింపు కథకు విరుద్ధమైనది. కథలో భూపతి మైసూరికి వెళ్తాడు. నేను కూడా రావచ్చా అని చారు అడిగితే మాట్లాడ లేదు భూపతి. ఆమె సరే ఇలాగే ఉండనీ అంటుంది. కానీ చిత్రం ఫ్రీజ్ షాట్తో సందిగ్ధంగా అంతమవుతుంది. భారతీయ చిత్రసీమలో ఇదే మొదటి ఫ్రీజ్ షాట్ అట. ఇందులో అమల్ చారుల మధ్య ఆకర్షణ క్రమేణా వస్తుంది. అతని చనువు, భర్త అశ్రద్ధ, ఆమె ఒంటరిదనం దీనికి దారి తీసింది. భర్తకు చివర తాను అశ్రద్ధ చేశాననే పశ్చాత్తాపం, అమల్కు హద్దు మీరరాదనే భావం, కాని ఆమెకు ఇట్టివి ఏమీ లేదు. అందువల్ల ఆమె చివర రాజీ పడటానికి సంసిద్ధురాలైంది. రాయ్ గారు ఇందులో మొట్ట మొదట నేపథ్య గాయకుని ఉపయోగించారు. కిశోర్ కుమార్ గంగూలీ పాడిన ఆమి చినిగొ చిని తుమారే ఆ పాట. దీనికి బ్యాక్ గ్రవుండ్ మ్యూసిక్ కూడా ఉంది. సామాన్యంగా రాయ్ గారి చిత్రాలలో ఇది అరుదు. ఆ పాటను ఇక్కడ చూచి, విని ఆనందించగలరు –
http://www.chakpak.com/video/ami-chini-go-chini—charulatha/25532
ఆ పాట, అదే మెట్టులో దానికి నా తెలుగు భావానువాదం కింద –
ఆమి చిని గొ చిని తొమారే, ఓగొ బిదేశినీ
తుమి థాకొ సింధు పారే, ఓగొ బిదేశినీ
నిను తెలుసు తెలుసు నాకు ఒహో విదేశినీ
ఆ సంద్ర మావ లున్న నిన్నో విదేశినీ
తొమాయ్ దేఖేచి శారద ప్రాతే
తొమాయ్ దేఖేచి మాధవి రాతే
తొమాయ్ దేఖేచి
హృది మాఝారే, ఓగొ బిదేశినీ
నిను జూచేను శారద వేళ
నిను జూచేను ఆమని రేయి
నిను జూచేను
హృది లోలోన, ఒహో విదేశినీ
ఆమి ఆకాశే పాతియ కాన్
సూనేచి సూనేచి తొమారే గాన్
ఆమి తొమారే సోంపేచి ప్రాణ్, ఓగొ బిదేశినీ
నే నాకాశ మంత చెవులై
విన్నాను విన్నాను త్వదీయ గీతి
నే నిచ్చేను ప్రాణమ్ము నీకు, ఒహో విదేశినీ
భూబన భ్రొమియ శేషే
ఆమి ఏసేచి నూతన దేశే
ఆమి అతిథి తొమారి ద్వారే, ఓగొ బిదేశినీ
భువన మెల్ల వెదకి
నిను గంటి క్రొత్త చోట
నే నతిథి నీ గృహాన, ఒహో విదేశినీ
ఈ పాటను 1895లో కవిగారు రాశారట. దీని తన స్వంత అనువాదాన్ని ఆర్జెంటీనాకు చెందిన విక్టోరియా ఒకాంపోకు ఆ దేశాన్ని సందర్శించినప్పుడు కవిగారు ఇచ్చారట. ఆమెయే టాగూరు విదేశిని! చిత్రంలో ఈ పాట చివర అమల్ బౌ ఠాకూరాణీ అని తన వదినగారిని ఉద్దేశించి అంటాడు.
చారులతను గురించి రాయ్ గారి కుమారుడు సందీప్ చెప్పినవి కింది లింకులో రొష్మీలా భట్టాచార్య రచనలో చదువగలరు –
http://www.screenindia.com/old/fullstory.php?content_id=15822
ఇందులోని మిగిలిన పాటలు ఎలా ధ్వనిస్తాయో అని మీకు ఆసక్తి
ఉంటే కింది లింకులలో వినవచ్చు –
మమ చిత్తే, నితి నృత్తే – ఇక్కడ
ఫూలే, ఫూలే ఢోలే ఢోలే – ఇక్కడ
ఈ ఫూలే ఫూలే పాట ఛాయలు ఈ మధ్య వచ్చిన పరిణీత చిత్రంలోని పీయూ బోలే, జియా డోలే అనే పాటలో ఉన్నవి అని గమనించగలరు.
– మోహన
అక్షరం పరమం పదం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/05/2008 9:57 pm
Life and IT
మాలతి గారూ,
ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్ళి ఓ చేత్తో దానిని ఉయ్యాలూపుతూ ఇంకో చేత్తో ఓ తెలుగు పుస్తకం పట్టుకొని చదువుతున్నా. అంతలో ఓ పెద్ద కంపెనీలో IT విభాగంలో పనిచేసే తెలుగాయన ఒకాయన పలకరించాడు. ఈ upgrades, patches తో చచ్చిపోతున్నామన్నాడు. “మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి!” అనుకున్నాను. 🙂
IT వాళ్ళ గతే అలా ఉంటే మిగిలినవాళ్ళు కంప్యూటర్లతో పడే అగచాట్లని ఊహించుకోగలను. కాని అవే ఈ కథకి మూలమయితే అవి ముఖ్య పాత్ర జీవితాన్నెలా ప్రభావితం చేశాయో చూపాలి – చెప్పడం కాకుండా.
సంగాలు జీవితం గురించి తెలిసినంత మాత్రం పధానపాత్ర గురించి తెలియలేదు. ముప్ఫై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నదనీ, కథలు రాస్తుందనీ, తెలియక ఓ డొక్కు ఉద్యోగంలో పడిందనీ తెలుసనుకోండి. కథ ఉత్తమ పురుష దృక్కోణంలో చెప్పడానికి ముఖ్యకారణం పాఠకులకి నమ్మకం పెంచడానికని విన్నాను. దీంట్లో “నేను” ఔట్సోర్సింగ్, ప్రపంచీకరణ, కంప్యూటర్ టెక్నాలజీ, తెలుగు భాషా దుస్థితి, శ్రీశ్రీ కవిత్వం, జీవిత పరమార్థం – ఇలా అనేక విషయాల మీద అభిప్రాయాలు చెప్పేటప్పటికి, మూడు పేజీల కథలో జీవితానికి చోటు తక్కువయి పాఠకుణ్ణి స్పందించే అవకాశం సన్నగిల్లింది.
వారసత్వపు హక్కుగా మిద్దె జీవితాన్ని అనుభవించలేకపోయానే అని వగచే విద్యావంతురాలి పట్ల సానుభూతి ఎలా పుడుతుంది? కూరలమ్ముకొని బ్రతికిన సంగాలుకి తన ‘డూటీ’ పట్ల నిర్లిప్తత లేదు. “నేను” కి తన ‘డూటీ’ ఒక శాపం. అలా ఎందుకు పరిణమించిందో చిత్రించక పోవడం, దాన్నుంచి విముక్తి లేనట్లు చిత్రించడం, ఈ కథలో లోపం.
కొడవళ్ళ హనుమంతరావు
సడిచేయకే గాలి గురించి Sai Brahmanandam Gorthi గారి అభిప్రాయం:
05/03/2008 12:27 pm
లైలా గారూ,
వేలూరి గారి వ్యాసం రాయకపోయినా ఇలాంటివి కనిపిస్తే రాస్తాను. మీకందరికీ తప్పులేదనిపించింది. సంతోషం.
ప్రేరణకి కొత్త అర్థాలూ, అన్వయాలూ చెప్పినందుకు ఆనందించాను. ఇప్పుడే పాత సినిమా పాటలన్నీ ముందేసుకూర్చున్నాను. ఎంత ప్రేరణ దొరుకుతుందో చూడాలి.
మీరు రాసిన –
“కవి ఎవ్వరికీ తెలియదు, కాపీ కొట్టేద్దాం అని కాదు ఈ పాట రాసేది. చాలామందికి ఈ పాట చాలా ఇష్టమనే. ఈ కవి ముందు పాటకి పొంగిపోయాడు. ఇంకో చక్కని విషయానికి దాన్ని అన్వయించి మరో చక్కని పాట రాశాడు. దీనితో మన ఆనందం ఎక్కువ అయ్యింది కాని తగ్గదే.”
అన్న ఈ మాటలు కవి గారంటే ఇంకాస్త అనందించేవాణ్ణి.
-సాయి బ్రహ్మానందం గొర్తి
సడిచేయకే గాలి గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
05/03/2008 8:56 am
పాట చాలా చక్కగా ఉంది. ఆ పాట సాహిత్యంలోని మృదుత్వాన్ని ఆనందించాను. ఇదివరకటి సినిమా పాట లాగానే పాడుకుని కూడా సంతోషిస్తున్నాను. చేతైతే ఈ కొత్త పాటను పాడించి ‘యూ ట్యూబ్” లో కూడా పెట్టించి వింటాను.
కవి ఎవ్వరికీ తెలియదు, కాపీ కొట్టేద్దాం అని కాదు ఈ పాట రాసేది. చాలామందికి ఈ పాట చాలా ఇష్టమనే.
ఈ కవి ముందు పాటకి పొంగిపోయాడు. ఇంకో చక్కని విషయానికి దాన్ని అన్వయించి మరో చక్కని పాట రాశాడు. దీనితో మన ఆనందం ఎక్కువ అయ్యింది కాని తగ్గదే.
అంతకు ముందు ఒక పాట ఉంటే, అది మిగతా మనుషులందరినీ బతికున్నంత కాలం ఆ పాటే పాడమని బంధించటానికి కాదు. ఈ పాట వచ్చినందువల్ల అంతకు ముందు పాటకు హాని ఏమిటి? ఏం లేదు.
వేలూరి వ్యాసం లేక పోతే ఈ పాట మీది కామెంట్లు ఇంకో ధోరణిలో ఉండేవా కావా? అంటే ఆ వ్యాసం ప్రభావం చదివిన వారి మీద పడింది. ఆలోచిస్తున్నారు. మరి అంత చక్కని పాట ప్రభావం శ్రోతను నోరు మూయించలేదు. కవిని చేసింది. ఇంకో చక్కని పాట రాయించింది.
నేనైతే:
సడి చేయకే గాలి సడి చెయ్యకే
సవ్వడి చేసి మా పాప కునుకు చెడనియ్యకే
అని పాడుకుంటున్నాను.
ఫాడనివ్వరా ఏమిటి?
లైలా
అక్షరం పరమం పదం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/02/2008 9:04 pm
సంద్రాలూ, శ్రీఫాంట్లూ
గలగల పారే గోదారిలా సవ్వడి చేస్తూ సాగిన సంద్రాలు సంభాషణల్లో నుండి హఠాత్తుగా ఫ్లాపీలూ, సీడీలూ, పిడియఫ్ ల గందరగోళంలో పడి సజీవంగా సాగుతున్న కథ కాస్తా నిర్జీవమైన సాంకేతిక వ్యాసంగా మారిపోయింది!
“చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా బట్టీపట్టిన గీతం పాడుకోవాలనిపిస్తోంది. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు, … చక్రవర్తి అశోకుడేడీ, … జగద్గురు శంకరుండేడీ”. నిరుడుకురిసిన హిమ సమూహములని వదిలిపెట్టి, పద పదమంటూ ముందుకు తోసుకుపోయాడు శ్రీశ్రీ మరోప్రపంచానికి.”
“మహాప్రస్థానం” ముందో “ఏవి తల్లీ!” ముందో నాకు గుర్తు లేదు కాని,
“చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?”
మాత్రం కలకాలం నిలిచే కవిత.
కొడవళ్ళ హనుమంతరావు
చెప్పులు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
04/30/2008 6:43 pm
“. ..కాబట్టి, లైలా యెర్నేని గారి పాయింటు ఈ విషయంలో కరెక్టే. అయితే తోలూ, సూదీ, దారం లాంటివి సంపాదించి, చెప్పులు స్వయంగా కుట్టుకోవాలి అనేది అర్థం లేని విషయం.”
ఎందుకు కుట్టుకోకూడదు. చాలమంది చొక్కాలూ, జాకెట్లూ, కుట్టుకుంటూనే ఉంటారుగా? కరెక్టే అంటూనే మళ్ళీ కాదంటారు. అంతా రైటే అంటే మనమిద్దరం స్నేహితులమై పోతామని భయమా ఏమిటి?
“రెండవ విషయం – ఒక మగ పిల్లాడు, ఆడవాళ్ళ కష్టం, అదీ తన తల్లీ, సోదరిల కష్టం తింటే, అది అతనికి అవమానమా? అదే ఒక ఆడపిల్ల, మగ వాళ్ళ కష్టం, అదీ తన తండ్రీ, సోదరుల కష్టం తింటే, అది ఆమెకి అవమానం కాదా? లైలా గారి అభిప్రాయం ప్రకారం కాదు మరి!”
రామ రామ! నెనెక్కడన్నాను అవన్నీ.
రచయిత కథలో ఒక అమ్మాయి సంపాదన మీద నలుగురు బ్రతుకుతున్నట్లు రాశారు.
అబ్బ! ఆమెకు ఎంత కష్టమైన పనో అని నేను అనుకోకూడదా?
రచయిత ఆమె గురించి పెద్దగా చెప్పరు. ఎందుకో మరి. సంపాదనపరులైన ఆడవాళ్ళను రచయితలు ఫోకస్ లోకి తేరు. ఏం చెయ్యను. నేనే ఊహించుకోవాలి.
ఆడవాళ్ళు పని చేస్తుంటే మగవాళ్ళు , తమ మీదే కథలూ కవితలూ రాసుకుని మరోమారు – అదేంటీ ఆ మాట – తేజో మూర్తులై పోతారు.
అందుకని నెను కూడా – ఆమెను ఇగ్నోర్ చెయ్యాలా? ఆమె, బాథ్యతను , బరువును, ఆమె త్యాగాన్ని. ఎందుకని?
రచయిత కు మస్తుగా చెప్పులు లేని కుర్రాడి మీద జాలి ఉంది. అందుకని నేనూ ఆయన జాలిపడిన వాళ్ళమీదే నా జాలి చూపాలా? వేరే వాళ్ళను గురించి తలచకూడదా? నిషేధమా?
కథలో ఒక్క స్త్రీ సంపాదన, నలుగురి నోట్లోకి ముద్ద వెళ్ళటం కదా రాసిన విషయం? రచయిత ఒక పురుషుడి సంపాదన మీద నలుగురు బ్రతుకుతున్నట్లు రాస్తే, నేను అయ్యో! ఒక్క మగవాడి రెక్కల కష్టం మీద అంతమందా? అతనికి ఎంత కష్టం! అంటానే. అన్నాను ఎన్నోసార్లు.
కాని ‘చెప్పులు’ కథలో అది రాయందే. రాయకపోయినా అది అన్న ఐతే, తమ్ముడైతే , తాతైతే – వారు వీరైతే వీరు వారైతే – ఈ కాంబినేషన్లన్నీ నన్నెందుకు ఆలోచించమంటారు.? ముందు సంపాదించి నలుగురికి తిండి పెట్టిన అక్క మీద కథ రాయండి. గొప్పగా రాయండి. నెగెటివ్ గా రాయకండి. అప్పుడు ఆమె శ్రమ సార్థకమౌతుంది.
“వయసులో పెద్దవాళ్ళు, అంటే అన్న చెల్లెలి కష్టం తింటే, తప్పు పట్టొచ్చు. అది తమ్ముడి కష్టం తిన్నా తప్పే మరి. అన్న వుద్యోగం చేస్తూ, చెల్లెలిని పోషిస్తూ, చదివించుకోవడంలో లేని అవమానం, ఒక అక్క వుద్యోగం చేస్తూ, తమ్ముడిని పోషిస్తూ, చదివించుకోవడంలో ఎందుకు వుందీ? ఆడవాళ్ళ కష్టం తినడం అంత హీనమయిన విషయమా? అలా అని ఆడవాళ్ళే అనడం ఏం అర్థమయిన విషయం? ”
అవమానం లేదు. అవమానాలు – కాలం నీతిని బట్టి ఊహించుకునేవి. రుక్మిణి కృష్ణుడితో వెళ్ళి పోతే ఇంట్లో వాళ్ళకి కలిగే తలవంపుల వంటివి. శ్రమ అంటారా అది నిజం. ఉంది. మనిషికి మానసికంగా గాని, శారీరకంగా గాని శ్రమ లేకపోతే ఒక మనిషి ఎంతమందినైనా పోషించవచ్చు. అసలు ఆ పోషించే వాళ్ళు బంధువులే ఐ ఉండవసరం లేదు. ఎవరికైనా సాయం చెయ్య వచ్చు.
కుటుంబంలో పెద్ద సంతానమైనంత మాత్రాన, అమ్మా నాన్నా కన్న మిగతా సంతానాన్ని, వాళ్ళెందుకు సాకాలి. అమ్మా నాన్నా వాళ్ళను అడిగి, ఒప్పందం మీద కన్నారా మిగతా వారిని. మనకు ఏ నీతి ఉపయోగం గా ఉంటే అది వాడేసి, మన బాధ్యతను వేరే వాళ్ళ మీదకు నెట్టటమే కదా?
కథలో హీరో అక్క మనసు బాథ పడుతుందేమో అని సంపాదించుకోటం మానేస్తాడు. అందులో అతనికి నష్టం ఏముంది. తనే పని చెయ్యగా లేంది తన తమ్ముడు గారు పని చేస్తే అక్కకు ఎందుకు కష్టం. తల్లి -తండ్రికి కూతురు పనిచేస్తుంటే బాగానే ఉండి, కొడుకు పనిచెయ్యకుండా చదువుకుంటే వాళ్ళకు అప్పుడు అవమానం ఎందుకు కలగటం లేదు? దీనివల్ల అవమానాలు మనకు ఇస్టం వచ్చిన రీతిగా మార్చుకుంటాం అని తెలుస్తూంది కదా?
“ఆడవాళ్ళ కష్టం, మగవాళ్ళ కష్టం అనే వేరు వేరు పదాలే అర్థం లేనివి.”
అది నిజమే. ఆడ పని, మగపని అని లేదు. మీకూ, నాకూ లేదిప్పు డు. కాని కథా కాలం నాటికి రచయితకు, ఆ కథలో అబ్బాయి మీద ఎక్కువ సానుభూతి ఉంది. అంత మాత్రం చేత అది మంచి కథ కాకుండా పోదు. అది అప్పటి కథ, అప్పటి అవగాహన.
J.D. Salinger రాసిన The Catcher in the Rye చదివి నా మేనల్లుడు , ‘చెప్పులు’ హీరో వయసప్పుడే – Self pitying selfish brat. What is Holden Caulfield’s problem? Why do you like this book? అని అడిగాడు నన్ను.
The characters don’t have to be perfect to like a book 🙂
“ఒక ఆడపిల్ల కుటుంబ భాధ్యతని తీసుకుంటే (జీవితాంతం తన జీవితాన్ని సినిమాల్లో లాగా త్యాగం చేసి కాకుండా), ఆ కుటుంబంలో వున్న చిన్నవాళ్ళకి సిగ్గు పడాల్సిన విషయం కాదు అది.”
కానీ ఆడపిల్ల గర్వ పడవచ్చుగదా? ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు కదా, అవునా? సంపాదించే మగవాళ్ళూ బాగా గర్వ పడుతారేమో. ‘నేను ఆమెవ్వరో డబ్బు ఇబ్బందిలో ఉన్నపుడు డబ్బు పంపాను’ – అని రాయగలిగిన మగవాడు, ‘నాకు ఆమె ఎంతో సాయం చేసింది’ అని అంతే నిజాయితీతో చెప్పవద్దా? అలాగే ప్రతి సంపాదించే స్త్రీ కూడా నా సంపాదన మీదే ఈ ఇల్లు గడుస్తూంది అని చెప్పవచ్చు. చెపితే వేరే వాళ్ళ మనసుకు కష్టం, అవమానము కలుగకూడదు. అవునా? అవును. ఎందుకంటే అది నిజము కాబట్టి. నిజం మనం చెప్పగలగాలి కాబట్టి.
“ఇంతకన్నా చెప్పడానికి ఏమీ వుంటుందని నేననుకోను.”
‘ఈ మాట కథల’ పరిథి దాటి మాట్లడనిస్తే – చాలా ఉంటాయి చెప్పటానికి. కాని మనం రాస్తున్నది రచనల మీద పాఠకుల అభిప్రాయ వేదికలో కదా. ఇంతింత పొడుగు రాస్తే పత్రిక వారికి, పాఠకులకు ఇబ్బంది కలగవచ్చు.
ముగించే ముందు – మీరు నాతో మాట్లాడటం నాకు చాలా సంతోషం కలిగించింది ప్రసాద్!
లైలా
మీరు నవలలు రాయాలి ఇక. కథ పరిథి ఇక మీకు చాలదు జె.యు.బి.వి. 🙂
పిచ్చి నాన్న గురించి bollojubaba గారి అభిప్రాయం:
04/30/2008 11:26 am
మూర్తిగారికి
చాన్నాళ్లతరువాత ఒక మంచి కవిత చదివాను,
మీ కవితలొ చక్కటి పదచిత్రాలు ఉన్నాయి
ఉదా:టీ డికాషనై మారటం, పత్తికాయలా పగలటం, ఆకాశానికి బెలూనై వేలాడటం మార్వలెస్ ఇమేజెస్.
నవ్యంగానూ, హృద్యంగానూ ఉన్నాయి.
కాని చిన్న అబ్యంతరం
ఆ అమ్మాయికి ఇపుడు అద్దంలో తనబొమ్మ తప్ప ఏమీ పట్టదు అని చెప్పటం అంత అందంగా లేదు. అది పెంపక లోపంగా అనిపించదూ. యవ్వనంలో యువత అద్దానికి అంటుకుపోవటం సహజమైనా, సత్యమైనా మీ కవితమొత్తం ఒక మూడ్ లో ఉంటే ఆ రెండు లైన్లు మిస్ ఫిట్ అయినట్లు గా అనిపిస్తూంది. తప్పైతే క్షమించండి.
మరోచోట పిచ్చినాన్న అనిపించటం వ్యంగ్యంగా కాక ప్రేమగానే తీసుకున్నాను సుమా!
నా బ్లాగును విసిట్ చేసి, దయచేసి మీ కామెంట్శ్ వ్రాయండి.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
04/27/2008 10:29 am
ఫిలాసఫీ, సైన్సూ, సాహిత్యం
నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు.
శ్రీనివాస్ గారూ, లైబ్నిజ్ పేరిట ఉన్న పురస్కారాల గురించి నాకు తెలియని వివరాలు తెలిపినందుకు కృతజ్ఞతలు. ఒక్క విషయం: బ్రతుకుతెరువు కోసం లైబ్నిజ్ నానా కష్టాలు పడ్డట్లు నేను వర్ణిస్తే అది నాతప్పే. జీవితాంతమూ రాజుల పంచన బ్రతికిన లైబ్నిజ్ జీవనోపాధికి రాజుల వంశ చరిత్ర రాయవలసి వచ్చినా, బ్రతుకు బాగానే గడిచింది.
బెర్ట్రాండ్ రస్సెల్ ఎత్తుకోవడమే లైబ్నిజ్ సార్వజనిక జీనియసే కాని స్పినోజా లాగా ఉదాత్తమైన జీవితం గడిపిన వాడు కాదని ఎద్దేవా చేశాడు! లైబ్నిజ్ చనిపోయినప్పుడు సంక్రమించిన ఆస్తి చూసి మేనల్లుడి భార్య తన్మయంతో మూర్ఛపోయిందట. ఆసక్తి కలవాళ్ళు “The Courtier and the Heretic: Leibnitz, Spinoza, and the Fate of God in the Modern World,” by Matthew Stewart చదవచ్చు.
రాజాశంకర్ గారూ, నిజం చెప్పాలంటే, ఈ వ్యాసం తలపెట్టేముందర నాకూ లైబ్నిజ్ గురించి తెలిసింది చాలా తక్కువ. వ్యాసం పంపే గడువు దాటిపోయిందని ఓ రోజు పనికి సెలవు పెడితే, తోటి పనివాళ్ళు ఎక్కడికన్నా వెళుతున్నావా? అన్నారు. లేదు, లైబ్నిజ్ మీద వ్యాసం పూర్తిచెయ్యాలి, గడువు దాటిపోయిందన్నాను. లైబ్నిజ్ ఎవరు? ఆయనకూ కంప్యూటర్లకూ సంబంధమేమిటి? ఇంగ్లీషులోకి అనువదిస్తే మేమూ చదువుతామే అన్నారు. సైన్సు వాళ్ళకి ముందుచూపే కాని వెనుకచూపు తక్కువ.
మీరన్న (నేనూ అలా స్ఫురించి ఉండొచ్చు) – 12వ శతాబ్దం తర్వాత, అంటే భాస్కరుడి తర్వాత, మన దేశంలతోమధ్య యుగాల్లో చెప్పుకోదగ్గ గణిత శాస్త్రవేత్తలు రాలేదు, అన్నదాన్ని సవరించాలి. అంత పెద్ద దేశంలో కనీసం ఒక మూలన, కేరళలో, గొప్పవాళ్ళు కొందరుద్భవించారు. వాళ్ళలో మాధవుడు (1340-1425) చెప్పుకోదగ్గవాడు. కలన గణితానికి న్యూటన్ కన్నా, లైబ్నిజ్ కన్నా రెండు మూడు వందల ఏళ్ళ ముందరే బీజాలు వేశాడు. అయితే అవి వెలుగులోకి రాలేదు. అమర్త్య కుమార్ దత్త రాసిన Mathematics in Ancient India వ్యాసాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి..
లక్ష్మన్న గారు తెలుగులో సైన్సుకి సంబంధించిన నవలలు, కథలు తక్కువన్నారు. నిజమే. సైన్సు, సాహిత్యం కలవకుండా మన సైంటిస్టులూ సాహితీకారులూ తగిన శ్రద్ధ తీసుకుంటారనిపిస్తుంది. “ఆమె కన్నులలో ననంతాంబరంపు నీలినీడలు కలవు,” అంటే ఆమె ముసిముసి నవ్వులు నవ్వుకొని ప్రేమిస్తుందనుకుంటాం కాని, “విపర్య సిద్ధాంతాన్నెరిగిన మిలమిల లాడే కన్నులు గలదానా, ఈ సంఖ్య ఏదో చెప్పగలవా?” అంటే భ్రుకుటి ముడి వేస్తుందని మనకి భయం. అయితే ఆర్యభట్టు బీజగణితం లోని విపర్యం గురించి అలాగే బోధిస్తాడు. “ఎక్కడ బయలుదేరాం మనం? కడ కెక్కడ చేరాం మనం?” అన్నాడు బైరాగి.
అలాగని అసలు సైన్సు ప్రస్తావనే లేదనను. వాస్తవానికి నా వ్యాసాన్ని ముందర ఇలా మొదలెట్టాను:
“తెలుగు సాహితీవేత్తల్లో విశిష్టమైన వ్యక్తిత్వంగల డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు రాసిన ఉత్తమ నవల “అతడు-ఆమె.” ఆ నవల మూడో భాగం లో శాంతం గారి అమ్మాయి సుభకి ఇంట్లో అమ్మా నాన్నలిద్దరూ రాజకీయాల్లో ఉండటాన ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ. ప్రేమలోపడే వయసు కూడాను. అవి క్విట్టిండియా ఉద్యమరోజులు. అమరవీరులనందరినీ స్మరించుకుంటూ, తనుగూడా మద్రాసులో మెరికల్లాంటి నలుగురు తెలుగు అమ్మాయిలని తీసుకొని అహింసాయుతంగా తెల్లవాణ్ణి భయపెట్టి పారద్రోలే సాహసమేదన్నా చెయ్యాలనే కోరిక సుభకి గాఢంగా కలుగుతుంది. మనుషులెవరూ లేనప్పుడు ఏదన్నా వంతెనని పేల్చేయ్యాలని నిర్ణయించుకుంటుంది.
వంతెనని పేల్చడమంటే మాటలా? దానికి కావాల్సిన ప్రేలుడు మందు సేకరించడానికి, సివిలింజనీరయిన జనార్దనాన్ని పాత వంతెనలు కూల్చి కొత్తవాటిని ఎలా కడతారు? అని నర్మగర్భంగా అడుగుతుంది. సుభని ప్రేమిస్తున్న జనార్దనం, తన పని గురించి ఆవిడ అన్ని వివరాలు అడుగుతున్నందుకు పొంగిపోయి, వివరాలు చెప్తాడు. కాని పెద్ద పెద్ద కాంగ్రెసు నాయకులు తమ కూతుర్ని వారాలు చెప్పుకొని పైకొచ్చి గవర్నమెంటుద్యోగం చేసుకునే తనకిస్తారా అని సందేహిస్తాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, తన బ్రిడ్జీలున్నాయని సరిపుచ్చుకుంటాడు. ఓ వర్తుల పరిధి లేని డెక్ వైశాల్యం ఎలా కనుక్కోవాలా అని, ఓ క్షణం పాటు తెలియక తికమకపడి, ప్రేమలో పడి మరిచిపోయాను గాని, ఏముంది, సింప్సన్స్ ఫార్ములా పెట్టి కొట్టడమే అని వెంటనే తేరుకుంటాడు.
“జామెట్రీ కాలెక్యులస్ / అక్కయ్యకి రెండో కానుపు / తమ్ముడికి మోకాలివాపు / … / గోరుచుట్టులా సలిపే లక్షల సమస్యల” నుండి దూరంగా “ఒకరి నడుం ఒకరు చుట్టి / ఉల్లాసంగా తిరుగుదాం,” స్వేచ్ఛగా విహరిద్దాం అన్న కవులున్నారు కాని, ప్రేమ ఫలించకపోతేనేమాయె, నా వంతెనలూ, నా కాలెక్యులస్ ఫార్ములాలు ఉన్నాయన్న కథానాయకులు అరుదు. ఏకంగా ఇంటెగ్రల్ కాలెక్యులస్కి ఓ పేజీ కేటాయించిన సాహితీ రచన బహుశా మన భాషలోనూ మరే భాషలోనూ కూడా లేదనుకుంటాను.”
వ్యాసం దారి తప్పుతుందేమోనని తొలగించాల్సొచ్చింది. ఈ అభిప్రాయం నా వ్యాసంలాగే చాంతాడంతయింది. ఇక ముగిస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sai Brahmanandam Gorthi గారి అభిప్రాయం:
04/15/2008 11:23 am
ఏప్రిల్ 16 వ తేదీ “ఆంధ్ర నాటక దినోత్సవం“. ఇది కేవలం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి తెచ్చుకున్న రోజులా అనిపిస్తుంది. కనీసం ఒక్క తెలుగు పత్రిక కూడా తెలుగు నాటక రంగం గురించి రాయవు. కనీసం నాటక రంగంలో జీవితాన్ని వెళ్ళబుచ్చే మహామహులైనా “”ఆంధ్ర నాటక దినోత్సవం” అనేది ఒకటుందనీ గ్రహించరు. దాని గురించి ప్రజలకి తెలిసేలా కనీసం ఒక్క నాటక ప్రదర్శన అయినా చేయరు. ఎవరిదైనా ప్రోద్బలం ఉంటే ప్రోత్సాహం అదే వస్తుంది. అది ఎక్కడనుండో రావాలనుకోవడం అవివేకం. అది నాటకరంగం నుండే రావాలి. ముందుగా దాన్ని నమ్ముకొని జీవనాన్ని వెళ్ళబుచ్చే వాళ్ళే స్పందించాలి.
తెలుగు నాటక రంగలో ఓ ప్రముఖ వ్యక్తి నా ఈ వ్యాసం చదివి, తెలుగు నాటకం వెలిగిపోతోంది, మీరు రాసినట్లుగా లేదు అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో నిజం దివిటీలా కనిపించింది.
ఏదేమైనా తెలుగు నాటకానికి మంచి రోజులు వస్తాయన్నదే నా అశ ! చక్రం క్రింది భాగం పైకి రావడానికి కాస్త సమయం పడుతుంది.
– సాయి బ్రహ్మానందం గొర్తి
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
04/08/2008 6:45 am
వ్యాసకర్త ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. మల్లియ రేచనవంటి ప్రాచీన నామాల్లో తల్లిపేరును చెప్పే మాతృస్వామ్య పద్ధతి ఉండేదని ఆరుద్ర రాశారు. ఈనాటికీ వినబడే చలసాని, మేడసాని, ముద్దసాని మొదలైన ఇంటిపేర్లు స్త్రీలను సూచించేవిగా అనిపిస్తాయి.
తెలుగు బ్రాహ్మణుల ఇంటిపేర్లు కొన్ని మహారాష్ట్రకు సంబంధించినవిగా అనిపిస్తాయి. ప్రసిద్ధికెక్కిన అప్పాజోస్యుల (అప్పాజోషీ) విష్ణుభొట్ల (విష్ణుభట్) అనే పేర్లూ, వల్లభజోస్యుల (వల్లభజోషీ) మొదలైనవి ఇటువంటివే. ఇది నిజమైతే ఇందులో మరాఠీ పద్ధతిలో అప్పా అనేది వ్యక్తిగతనామం అనీ, జోషీ మాత్రమే ఇంటిపేరనీ గమనించాలి. అలాగే శ్రీధర్, మనోహర్ అనే ఇంటిపేర్లున్న మహారాష్ట్ర బ్రాహ్మణులున్నారు. శ్రీధర అనేది తెలుగు బ్రాహ్మణుల్లో వినబడే ఇంటిపేరు. వీళ్ళంతా తెలుగుప్రాంతాలకు వలసవచ్చారేమో.
మహారాష్ట్రులకీ, రష్యన్లకీ పేర్ల క్రమంలో ఒకే పద్ధతిని పాటించే సంప్రదాయం ఉంది. లక్ష్మణ్ రఘునాథ్ కేళ్కర్ అనే పేరులో వ్యక్తిగత నామం లక్ష్మణ్. అతని తండ్రి వ్యక్తిగతనామం రఘునాథ్. వారి ఇంటిపేరు కేళ్కర్. అలాగే మిఖయీల్ సెర్గియేవిచ్ గోర్బచోవ్ అనే పేరు మూడు భాగాలుగా ఉంటుంది. మిఖయీల్ అనే వ్యక్తి సెర్గేయ్ అనే అతని కొడుకు. వారి ఇంటిపేరు గోర్బచోవ్.
పంజాబీల్లో కొందరు సర్దార్లు గుర్మీత్ సింగ్ అని రాసి ఊరుకుంటారు. మన ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అంతే. కొందరు మాత్రం బ్రార్, భాటియా మొదలైన ఇంటిపేర్లను కూడా ఉపయోగిస్తారు. మా కొలీగ్ ఒకాయన (సర్దార్ కాని పంజాబీ) ను ఆయన ఇంటిపేరు గ్రోవర్ అనేమాటకు అర్థం ఏమైఉంటుందని అడిగాను. ఆయనకు తెలియలేదు. గురువర్ (గురువర్యుడు) అనేమాటకు అది రూపాంతరం అయిఉంటుందని నేనన్నాను. ఆయన కాదనలేదు.
మలయాళీల్లో కొందరు మాత్రమే ఇంటిపేరు వాడతారు. ఉదాహరణకి పి.టి.ఉష పేరులో పిలాఉళ్ళకండి అనేది ఇంటిపేరు. బెంగాలీలు తమపేరుకు ఇంటిపేరు తగిలించేస్తారు.
లిటిల్‌సైంటిస్టు గురించి రానారె గారి అభిప్రాయం:
04/03/2008 8:08 am
“ఒక సంఘటనా, ఒక ఘర్షణా, ఒక మలుపూ లాంటి కధా ప్రక్త్రియలకి అలవాటు పడి పోవడం వల్ల, ఇటువంటివి కధలుగా అనిపించడం మానేశాయేమోనని అనిపిస్తోంది.” అన్నారు జె.యు.బి.వి ప్రసాదుగారు. ఇలా కాని కథాప్రక్రియ గతంలో వుండేదా? చిన్నప్పటినుంచి నేను చదివిన పిల్లల మాసపత్రికలు, బాలల రామాయణ భారత భాగవతాలు, పంచతంత్రం మొదలు ఈనాటిదాకా ఒకటీ అరా ఆంగ్ల కథలతో కలుపుకున్నా నేను చదివిన కథలు చాలా తక్కువే వుంటాయి. వీటన్నిట్లోనూ దాదాపు ఇదే ప్రక్రియ. ఈ మూసను అనుసరించకుండా ఎక్కువ కథారచనలు చేసి ప్రత్యేకత సంతరించుకొన్నవారెవరైయినా వుంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన భాషలో.
చెట్టు కూలిన వేళ గురించి kosyasura గారి అభిప్రాయం:
03/30/2008 7:22 am
పూకొమ్మలతో, లేరెమ్మలతో, కొమ్మలలో గిజిగాడి గూళ్ళతో, నిలువనీడలేని నిర్భాగ్యుల పాపల ఊయలలూగిస్తో, మనిషి పోయినా, తరం పోయినా నిరంతరంగా నిలబడేవి చెట్లు..
కాని రాను రాను నిర్దాక్షిణ్యంగా మూగ వృక్షాలను నరికివేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేని ఝాన్సీ గారి బాధ వర్ణనాతీతం.
ఇక తను పట్టుకున్న చెట్టూ లేదని, కట్టుకున్న గూడూ లేదని తెలియని వెర్రి పిచుక రోజూ వచ్చి వెతుకుకుని నిరాశతో వెనక్కి తిరిగిపోవడం కళ్ళకి కనిపిస్తూనేవుంది.
లేదు కన్పించడంలేదు. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి కంటిలో తడితో.
కొ స్యా సు రా
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/25/2008 11:25 pm
సంపాదకులకు నమస్కారం.
తెలుగు నాటకం మీద నాకు తోచినవి రెండు మాటలు.
మనం ఎన్ని పోలికలు ఎవరితో తెచ్చుకున్నా ఏమి ప్రయోజనం? తెలుగులో నాటకరంగంలో క్రియేటివిటీ శూన్యం. ఎక్కడా ఒరిజినాలిటీ లేదు. అందుకని తెలుగు నాటకం చస్తోంది. దీనికి సృజనని గౌరవించే సంప్రదాయం తెలుగువాళ్ళకి చాలినంత లేకపోవటమే ముఖ్య కారణం. అందువల్లనే తెలివైన, సృజనాత్మకులైన రచయితలు నాటక రంగం వేపు ఏనాడు కూడా రాలేదు. నాటక రంగంలో వున్న అనేకమంది క్రియేటివిటీ మీడియోకర్ స్థాయిలోనే వుంటుందని తెలుగు నాటకపు ఇతివృత్తాలనీ, వాటిలోని సంభాషణలనీ చూసిన ఎవరైనా ఇట్టే గ్రహించగలరు. నిష్ఠూరంగా ఉన్నా ఇది పరమ సత్యం.
అందువల్ల క్రియేటివ్ పెర్సన్స్ కాని రచయితల, దర్శకుల చేతిలో ఒక కళారూపం తయారైతే ఎలా వుండగలదో – సరిగ్గా అలాగే వుంది మన నాటకం ఇవాళ. ఇందులో ప్రేక్షకుల తప్పు ఏమిటి? బాగులేని నాటకాన్ని వాళ్ళు కష్టపడి, ఊరికే వేసినా, ఫ్రీగా చూపించినా కూడా ఎందుకని చూడాలి? మిగతా భారతీయ భాషలలో ఇలా లేదు నాటకం పరిస్థితి. కనకే మరాఠీ లొనూ, బెంగాలీ లొనూ ఇవాళ్టికీ నాటకానికి ఆదరణ ఉండటం.
చెప్పుకోవలసిన మంచి కవి, రచయిత ఒక్కరైనా ఇవాళ తెలుగు నాటక రంగం వైపు చూశారా? లేదే! ఎందుకని, అన్నదే ముఖ్యమైన ప్రశ్న. మనకి మంచి విమర్శ లేనందువలన, మొహమాటం సాహిత్య రంగం లోనూ, ఇతర రంగాల లోనూ రాజ్యం ఏలుతుండటం వలన- ఇలాంటి దుస్థితి వచ్చిపడింది. తెలుగు సినిమా, తెలుగు నాటకం, సృజన లేని వ్యక్తులతో నిండిపోయి ఉన్నాయి. అందువల్ల అసలు సమస్యని వదిలేసి మనం కారణాలని ఇంకెక్కడ చూసినా లాభం ఏమిటి? సమాధానం ఎలా దొరుకుతుంది?
దీనికి పరిష్కారం తెలివైన వాళ్ళు, సృజనలో్ మేటిగా వున్న వాళ్ళు, ఈ రంగాలలోకి రావాలి. అందుకు తగిన వాతావరరణం ఇవాళ ఈ రంగాలలో కనిపించడం లేదు. డబ్బు కొందరి చేతులలో చిక్కుకుని వుంది గనక ఇవన్నీ ఇంటర్‌లింక్‌డ్ ఇష్ష్యూస్. అందువలన తెలుగు వారు ముందు తమ భాషలో వున్న ఇవాళ్టి మేటి కవులనీ, రచయితలనీ, విమర్శకులనీ ఆదరించాలి. వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళకి సరైన ప్రోత్సాహం వుంటే, బహుశా వాళ్ళు తమ శక్తి యుక్తులని ఈ రంగాలల వైపు మళ్ళించడానికి ఆసక్తి చూపురేమో! ఏమో??
rama.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:
03/25/2008 6:29 pm
బ్రహ్మానందంగారు తెలుగు నాటకం గూర్చి, ఈ నాటక పరిస్థితి గూర్చి చాలా విశదంగా ఈ వ్యాసంలో చర్చించారు. ఇంకొక్క మూడు విషయాలు ఈ వ్యాసంలో చేరిస్తే దీనికి సంపూర్ణత చేకూరేదనిపించి ఈ వ్యాఖ్యను వ్రాస్తున్నాను.
దీనిలో మొదటిది, నటీనటులకు ముట్టే ప్రతిఫలం. అమెరికా నాటకరంగంలో నటీ నటులకేగాక ఆహార్యాన్ని సమకూర్చేవారందరికీ ప్రతిఫలం ముడుతుంది. Professional నటులు వారానికి నలభై గంటలు రిహార్సల్సుతో బిజీగా వుంటారు. వాళ్ళు ఒకేసారి రెండు నాటకాలల్లో కూడా నటించవచ్చు. వారికి ఈ నాటకాలే జీవనభృతిని కల్పిస్తాయి. ప్రస్తుతం న్యూయార్కులో Tennessee Williams వ్రాసిన Cat on a hot tin roof నాటక ప్రదర్శన జరుగుతోంది. దీనిలో, దాదాపు ఏడేళ్ళు Bill Cosbyతో TV లో నటించిన Phylicia Rashad, సినిమా నటుడు James Earl Jones నటిస్తున్నారు. ఈ నాటకం దాదాపు మూడు నెలలపాటు ప్రదర్శిస్తారు. Londonలో ఈమధ్య Equus నాటకంలో Daniel Radcliffe (Mr. Harry Potter) నటించాడు. ప్రతిఫలం లేనిదే పేరెన్నికగన్న నటులు రంగస్థలంమీదకు ఎందుకు వస్తారు?
మరి తెలుగు నాటకరంగంమీద నటీనటుల పరిస్థితేమిటి? ఒక్క నటీమణులకే కొంతైనా డబ్బు ముడుతుంది. నటులు, దర్శకులు, రచయితలు, ఆహార్యం సమకూర్చే వారు, అందరూ కూడా ఏదో పరిషత్తులో బహుమతిని పొందితే తప్ప వారి చేతి డబ్బు పెట్టుకునే rehearsalsకే కాక వేరే వూళ్ళో ప్రదర్శనకై టిక్కెట్టు కూడా పెట్టుకుని వెళ్ళాలి. అంటే, భుక్తికై వారందరికీ పగలంతా వేరే వుద్యోగం వుండాలన్న మాట. ఆంధ్రజ్యోతిలో రాళ్ళపల్లిగారు సినిమాల్లో వేషాలకై వెడితే వారి మేనేజరు వుద్యోగంలోనుంచీ తీసేస్తామని బెదిరించారని రాయగా చదివిన గుర్తు. తెలుగు నాటక రంగానికి చేయూత నందించాలనుకునే వారు ముందు నాటకరంగంతో ముడిపడ్డవాళ్ళకి నాటకరంగమే జీవనభృతిని ఎలా సమకూర్చగలదో ఆలోచించాలి.
రెండవ అంశం: ఆంధ్రాలో గానీ అమెరికాలో గానీ, తెలుగు నాటకానికి ప్రతిబంధకాలు మైకులు. పాతకాలంలో పద్యనాటకాలను ఆహార్యాన్ని చూడడానికీ, పేరెన్నికగన్న నటుడు పద్యం పాడడంలో చూపించే నేర్పరితాన్ని చెవులారా విని ఆనందించడానికీ ప్రజలు వెళ్ళేవాళ్ళు తప్ప, పాత్రల మధ్య movements ఎలా వున్నయ్యోననీ, నటులు మొహంలో ఎలాంటి భావాలు చూపిస్తున్నారనీ పరిశీలించడానికి కాదు. అందువల్ల కలిగే సౌకర్యం ఏవిటంటే, ఆ నటులు మైకుకు ఎదురుగా నుంచుని పద్యం పాడడం. అక్కడక్కడా గాలిలో మైకులను వేలాడదీసేవాళ్ళు. (ఒకసారి గుంటూర్లో మా హైస్కూలు మాస్టారు భీముడి వేషం వేసి విసురుగా గదని భుజానికి ఎత్తుకోబోతుంటే ఆ గద పైన వైరుకు చిక్కుకుంది!) ఈ కాలపు సాంఘిక నాటకాలకు పూర్తిగా మైకు ముందు నిలబడి డైలాగులు చెప్పడం బావుండదు. పోనీ clip-on microphones try చేద్దామా అంటే నాలుగు మించి స్టేజీ మీద ఒకేసారి వాడారా, interference problems వచ్చి గోల గోల అవుతుంది. నేను Washington, DC ప్రాంతంలో చూసిన ఏ నాటకంలోనూ మైకులు వాడలేదు. చూసిన auditoriums లో కెపాసిటీ, 50్ నించీ 2000్ (కెన్నెడీ సెంటర్) దాకా. 300్ కెపాసిటీ వున్న చోట, live musicతో, 14్ ఏళ్ళ పాప గొంతెత్తి పాడిన Seussical Musical లో కూడా! వేలమంది మధ్యలో నాటకం వెయ్యడం వేసేవాడికి అద్భుతంగా వుంటుంది సరైన auditorium వున్నప్పుడు. లేకపోతే, మైకుల, మైకులను కంట్రోల్ చేసేవాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పదు.
మూడవ, ముఖ్యమైన అంశం – ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులగూర్చి పరిషత్తులు పట్టించుకుంటున్నాయా? ఈ నాటి నాటకాలను చూసేది ఎవరు? ఆనాటి రాజుల దగ్గరినించీ ఈనాటి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా కళలను పోషించిన వారు ఎప్పుడూ కూడా డబ్బున్న వారే! వాళ్ళు ఈ పరిషత్తు నాటకాలు ఎన్ని చూస్తున్నారు? ఎంతమంది ఇంజనీరులు, డాక్టర్లు, లాయర్లు ఈ నాటకాలకు వస్తున్నారు? వారిమాట అటుంచి, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు సతీ సమేతంగా వీటికి వస్తున్నారు? వారందరి మాట అటుంచితే, ఈ నాటకరంగానికే జీవితాన్ని అంకితం చేసినవాళ్ళే ఎంతమంది సతీ సమేతంగా ఈ నాటకాలను చూస్తారు? జనాదరణకు కరువైన కళ పరిస్థితి ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాలా? అమెరికాలో బ్రాడ్వే నాటకాలకు టిక్కెట్లు $200్ దాకా కూడా వుంటాయి. అయినా కూడా Phantom of the Opera is the 2nd longest running opera in New York (just behind the all-time record holder Cats). అదీ, ప్రతీ రోజూ కనీసం ఒక షో వేస్తూ! ప్రస్తుతం తెలుగులో పరిషత్తు నాటకాలంటే కరుణ రసం అధికంగా వుండేవని బ్రహ్మానందం గారనడంలో ఏమాత్రం్ అబధ్ధం లేదు. అంటే, ఎవరైనా ఒక సాయంత్రం ఏడవాలనిపిస్తే పరిషత్తు నాటకాలకు వెళ్ళచ్చునన్నమాట.
అమెరికాలో, మరాఠీ నాటకాల విడియో కాసెట్లని అద్దెకు తెచ్చుకునల్లా చూస్తారు మహారాష్ట్ర నుండీ వచ్చిన వాళ్ళు. తెలుగు నాటకాన్ని ఉచితంగా స్టేజీ మీద చూపించినా చూసేవాళ్ళకు కొదువ. తెలుగు నాటక రంగాన్ని నేడు నడిపిస్తున్నవాళ్ళు అమెరికాను చూసి నేర్చుకోకపోతే పాయె. కనీసం మన ఇరుగు పొరుగు రాష్ట్ర సోదరులను చూసైనా నేర్చుకోవచ్చుగా?
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
03/22/2008 9:45 pm
వెన్నెల, వెర్రి
KS హరీష్ కుమార్ గారి అభిప్రాయం చదివితే చంద్రుడికో నూలు పోగని శ్రీశ్రీ సమర్పించిన దారంలాంటి తేలికైన దీర్ఘమైన కవిత “శరచ్చంద్రిక” గుర్తొచ్చింది.
“అందుచేత ఓ చందమామా!
అందమైన ఓ పూర్ణసోమా!
సముద్రం మీదా అరణ్యం మీదా
సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా!
…
చెప్పొచ్చిందేమిటంటే
చెప్పడనికేమీ లేదని!
అంతమందికీ అన్నీ తెలుసు
అదే మన అజ్ఞానం.
ఎవడో చెబితే వినే రోజులు
ఏనాడో వెళ్ళిపోయాయి
ఇంకా ఏదో చెప్పాలని
ఎందుకీ ఉబలాటం?
అసలు నిజం ఏమిటంటే
ఎవడికీ ఎమీ తెలియదు
ఇలా ఎందుకొచ్చామో
ఇక్కడెంత సేపుంటామో
ఇక్కడనుంచి వెళ్ళేదెక్కడికో
ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో
ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి.
చెబితేమాత్రం నమ్మకండి.”
నిరాశగా కాస్సేపు మాట్లాడి, మరో వైపు నుంచి చూస్తే వెలుగు కనబడుతుందంటూ:
“పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలూ
మహాకాశ వాతావరణంలోని
మర్మాలూ తెలుసుకున్నాక
సరాసరి నీదగ్గరకే
ఖరారుగా వస్తాంలే
అప్పుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావుకదూ నువ్వు?”
అని జోస్యం చెప్పి, మానవుడి progress report చదివాడు.
సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమ్మీద వచ్చే సముద్రాల ఆటుపోట్ల గురించి లోతుగా తెలియాలంటే కష్టమేకాని స్థూలంగా అర్థం చేసుకోవడం సులభమే. చంద్రునికి అభిముఖంగా ఉన్న భూమి ఉపరితలంపై ఒక బిందువు A, దానికి ఎదురుగా భూమ్మీద అవతలివైపు B, భూకేంద్రం C అనుకోండి. చంద్రుడు భూకేంద్రం C కన్నా A ని ఎక్కువ గానూ B ని తక్కువగానూ ఆకర్షిస్తాడు — దూరాల్లో ఉన్న తేడా బట్టి. అందుమూలంగా A, B రెండూ కూడా కేంద్రానికి దూరంగా వెళ్తాయి. కాని అవి భూమిలో భాగం కావడాన, భూమి సాగినట్లవుతుంది. దాని ప్రభావమే సముద్రాల్లో ఆటుపోట్లు.
భూగోళం చాలా పెద్దది కావడాన చంద్రుడికీ A, B, C లకీ మధ్య ఉన్న దూరాల్లో చెప్పుకోదగ్గ తేడా ఉంది – ఆ తేడానే ఆటుపోట్లకి కి కారణం. భూమితో పోలిస్తే మాఊరి చెరువు చాలా చిన్నది – దానిపై అన్ని బిందువులూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చెరువుపై చంద్రుడి ప్రభావం ఉండదు. అలాగే మన శరీరంలో ఎక్కువ వున్నది నీళ్ళే అయినా శరీరంలోని అన్నిభాగాలూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చంద్రుడి ప్రభావం మనపై ఉండదు. (ముఖం పాదాలకన్నా దగ్గర ఉంటుంది కాని, మనిషి పొడవు భూమితో చంద్రునితో పోలిస్తే అతి తక్కువగా ఉంటుంది కనుక ఆ తేడాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.)
సమీకరణాలంటే భయం లేని వాళ్ళు ఈ “The Physics Teacher” పేపరు – “Myths about Gravity and Tides” – చదివి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే వెన్నెల ప్రభావాన్ని సమీకరణాలతో అంచనా వెయ్యలేం. అందుకు కవిత్వమే సాక్ష్యం:
“వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ
మనోహరమైన సంగీతం వినిపిస్తూ
ప్రయాణించు శశీ ప్రయాణించు.
…
ఇదిగో జాబిల్లీ నువ్వు
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలిదాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే.”
కొడవళ్ళ హనుమంతరావు
“చందమామ” జ్ఞాపకాలు గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:
03/19/2008 11:11 am
చందమామ గురించి ఆసక్తి ఉన్నవారు తెలుగు విఇకిపీడియా లూ ఈ క్రింద ఉన్న లింకు ద్వారా ఒక వ్యాసము చూడవచ్చును, మరియు వారికి తెలిసిన వెశేషాలు ఆ వ్యాసంలొ చేర్చవచ్చును.
అలాగే, చందమామలోని బేతాళ కథలగురించి కూడా ఒక ప్రత్యేక వ్యాసము తెలుగు వికీపీడియాలో ఉన్నది, ఈ లింకు ద్వారా అక్కడకు వెళ్ళవచ్చు.
బేతాళ కథలు ఒరిజినల్గా ఎవరు వ్రాసారో, ఎక్కడనుండి ఈ కథలు ప్రారంభమైనాయో, అన్ని కథలుగా ఉన్నయో, చివరి కథ య్క్కడన్న దొరుకుతుందా. ఇటువంటివంటి ఆసక్తికర విషయాలు తెలిసినవారు ఈ వేదికమీద కాని, తెలుగు వికీపీడియాలో వ్రాసి గానె తెలియ చేయగలరు.
కప్పగంతు శివరామప్రసాదు
ముంబాయి
రచయితలకు సూచనలు గురించి dresudhakar గారి అభిప్రాయం:
03/17/2008 3:32 am
ఈ మాట మీ మాట కాదు, మా మాట .మనందరిమాట ప్రజల మాట కాలం మాట కలకాలం కలాలమాట.
కాలంమీద మీసంతకానికి
అభినందనలతొ……….
మీ… డా.ఈదూరు. సుధాకర్
అద్యక్షులు
నెల్లూరు జిల్లా రచయితల సంగం
నెల్లూరు
లిటిల్‌సైంటిస్టు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/15/2008 6:03 pm
ప్రచురించిన రచనను ఇంకొక చోట ప్రచురించబడ్డది అని పూర్తిగా తొలగించడం, జరిగిన పొరపాటుకు మించిన తప్పిదం లాగా అనిపిస్తుంది. పెట్టుకున్న నియమాలను ఉల్లంఘించినా అది దురభిప్రాయంతోనో, దురుద్దేశంతోనో చేసినట్టుగా కనిపించదు. అయినప్పటికినీ, మన్నించమని అడగడమో, ఇక ముందు జాగ్రత్తగా ఉంటామని విన్నవించడమో సరిపోయేదేమో.
ఏ రచయితైనా తన రచనను ప్రచురించకపోతే కొంత నిరుత్సాహపడవచ్చేమో కానీ, ప్రచురించిన తర్వాత తొలగించడం నొప్పి కలిగించేదే. అదీ రచనయొక్క గుణాల గురించిగా కాక, తెలిసో తెలియకో ఇంకో చోట ప్రచురింపబడ్డందుకే అని గుర్తిస్తే సంపాదకుల నిర్ణయం అర్థంచేసుకునేదే అయినా, సహృదయంగా మాత్రం అనిపించడంలేదు. పాఠకులకైతే ఇది వడ్డించిన విస్తరి తీసేసినట్టుగా ఉంది. ఏన్నో ప్రచురించి ఉండొచ్చు, ఈ రచయితవే కూడా, కాని ఇలా వేసి తీసిపారేసారు అన్న మాటే ‘ఈమాటకు’ అన్నింటికన్నా ఎక్కువగా నిలిచిపోతుందనే అనుమానం కలుగుతుంది. సంపాదకులు కొంత సహృదయంతో పునరాలోచించి తీసేసిన రచనను, వారికిష్టమైన, తోచిన గమనికతోనైనా, పునర్ముద్రించాలనీ, ఈ తీసివేతకు తొందరగా తెరదించాలని కోరుకుంటున్నాను, కాదు అర్థిస్తున్నాను.
విధేయుడు
Srinivas
లిటిల్‌సైంటిస్టు గురించి kosyasura గారి అభిప్రాయం:
03/15/2008 9:44 am
ప్రసాదు గారూ
ఏమాట కామాట చెప్పు కోవాలి. అన్నికధలూ కూలంకషంగా చదివి అభిప్రాయాలు రాస్తారు. అది నాకు నచ్చినవిషయం.
ఇహ మిగతా విషయం. వేళాకోళము, వెక్కిరింత వగైరా. ముందే ప్రస్తావించేను. రిచ్ డాడ్ లు తప్పసాధారణ సగటు నాన్న లు, నాన్నగార్లు కూతురొచ్చి “నాన్నా వైటు కోటు” కొడుకొచ్చి “నాన్నా, ఎర్ర బూట్లు” “రేపుదయం వేసుకురమ్మన్నారు”, “రాకపోతేక్లాసులోకి రానివ్వరుట”, “బెంచీ ఎక్కంచీస్తారుట” అంటూంటే ముందు విసుగు పిల్లల మీద తర్వాత తెమ్మన్న ఆ టీచరు మీద ఆనక ఆస్కూలు మీద ఏదో విధంగా మనసులో అనుకోవడమో, గొణుగుకోవడమో, మరీ ఒళ్ళు మండితే బయటకి అనుకోవడం సహజం. ఆతర్వత కాస్తా నిమ్మళించినాక నాలిక కరుచుకోవడం (అది సంస్కారం) సహజం అన్నాను (చూడుడు: పేరా ఒకటి, పంక్తి ఆరు )!
ఇక పోతే “వలంపాటి పిన్నిగారు”, వగైరా డొక్కా వారి హాస్య పాయసం లో సన్నగా తరిగి వేయించిన కొబ్బరి ముక్కలుగా వేస్తే బాగుంటుందన్న సదుద్దేశం. కాని పాయసం మరో మారు “మారు” వేయించుకునేలోపలే అటకెక్కించేసారు సంపాదకుల వారు.
కొ స్యా సు రా
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Keshava Swamy గారి అభిప్రాయం:
03/10/2008 11:02 pm
నాగ మురళి గారికి కృతజ్ఞతలు. మీరు ప్రచురించిన ఈ బ్లాగు చాలా ఉపయుక్తంగా ఉంది. ఎన్నో ప్రాధమిక సందేహాలకు చాలా చక్కటి వివరణ ఇచ్చారు.
ఇక చాలా మంది హేతువాదులు అంటే నాస్తికులు అని అనుకుంటారు, అది ఎంతమాత్రము సమ్మతం కాదు. హేతువు అంటే కారణం, కారణం లేకుండా దేనినీ నంమ్మని వారిని హేతువాదులు అంటారు.
నావికులు సముద్రంలో ప్రయాణించేటప్పుడు గాలివాటం అనుకూలంగా ఉందా లేదా అని చూసుకుని ప్రయాణిస్తారు, అలాగే జ్యోతిష్యం కూడా, మనకు రాబోవు కాలం అనుకూలంగా ఉందా లేదా, దాన్ని బట్టి మన కార్యాచరణను నిర్దేశించుకునే వీలు కల్పిస్తుంది.
జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తు ఖచ్చితంగా తెలుసుకునే వీలుందా అనే ప్రశ్నకు సమాధానం చేప్పాలంటే, ముందుగా అండం తల్లి కడుపులో ఎప్పుడు ఫలదీకరించిందో తెలుకుంటే, ఆ సమయాన్ని బట్టి గణించిన జ్యోతిష్య ఫలితాలు 100% ఖచ్చితంగా ఉంటాయి, కాని అది అసాధ్యం కాబట్టి తల్లి బిడ్డను ప్రసవించిన సమయాన్ని బట్టి గణిస్తాము. అది కూడా చాలా మంది ఖచ్చితమైన సమయాన్ని తెలుపరు దాని వల్ల గణించడంలో తేడాలు ఉంటాయి.
తిరునగరి కేశవ స్వామి.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2 గురించి mOhana గారి అభిప్రాయం:
03/07/2008 11:49 am
మంచి వ్యాసము. సాయి గారికి అభినందనలు. మేము చిన్నప్పుడు
బడిలో చదువుకొంటున్న రోజుల్లో ప్రతి సంవత్సరము ఒక నాటకము,
ఒకటో రెండో నాటికలు వేసేవాళ్లము. మా బడి పక్క సౌందర్యమహలు
అనే నాటకప్రదర్శనశాల ఉండేది అప్పుడు. శ్రీ కృష్ణ లీలలు, కరుణామయి
అనే రెండు నాటకాలు జ్ఞాపకానికి వస్తుంది. తిరుపతిలో ఆ కాలంలో
నాటకాల పోటీలు ఉండేవి. మంచి నాటకాలు, నాటికలు
ప్రదర్శించే వాళ్లు. సురభి నాట్యమండలివారిని గురించి ఈ పుస్తకములో చదువవీలగును. తెలుగు సాంఘిక నాటకాల పరిణామము, వికాసము అనే పుస్తకం కూడా చదవతగినది.
పై పుస్తకాలను డవున్లోడ్ చేసికోవచ్చు.
ఆ కాలపు నాటకాలు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని గురించి నేను కన్నడములో ఒక మంచి సినిమా చూసియున్నాను. దాని పేరు రంగనాయకి. కన్నడములో గిరీశ్ కర్నాడ్ వంటివారు నాటకాల ద్వారా చిత్రరంగం ప్రవేశించారు. గుబ్బి వీరన్న కూడ నాటకాల పురోభివృద్ధిలో చాల ముఖ్య పాత్ర వహించారు. ఇక విజయ్ తెందుల్కర్ వంటి వారిని గురించి చెప్పనక్కరలేదు. చలం రాసిన కొన్ని కథలలో కూడ నాటక రంగం ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకొన్నది.
కావ్యేషు నాటకం రమ్యం అనే మాట మరువరాదు. – మోహన
వినినంతనె వేగ పడక గురించి anu గారి అభిప్రాయం:
03/06/2008 7:16 am
బాగుంది.కాని మధ్యలో ఆపేసినట్లు అనిపించింది.
ఆహా గురించి aswartha గారి అభిప్రాయం:
03/06/2008 12:50 am
చెప్పిన పదాలన్ని నీవే
అవి చెప్పే అర్థాలన్ని నీవే
కాని ఆ భావాలు మాత్రం మాలోనే నింపుకున్నాం.
కల్యాణి రాగం – అనుబంధం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
03/04/2008 5:01 pm
రోహిణీప్రసాద్ గారూ,
రాగాలని పరిచయం చేస్తూ మీరు, లక్ష్మన్న గారూ వ్రాసిన వ్యాసాలు బాగున్నాయి. ఇవి సంగీతం నేర్చుకుంటున్నవాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. కాకపోతే వచ్చిన చిక్కల్లా నాలాటి వారితొనే. సంగీతాన్ని విని ఆనందించడం తప్ప దాని గురించి ఓనమాలు తెలియని నాలాంటి వాళ్ళకి కలిగే చొప్పదంటు అనుమానాలు ఎన్నెన్నో. ఉదాహరణకు, కేవలం స్వరాలవలనే పాట Tune తయారవుతుందా? (కాదని నేననుకుంటున్నాను కాని స్వరాలు కాక ఇంకా ఏమి కావాలన్నది నాకు అంతు బట్టని విషయం, బహుశా ఊనికా?). ఆరోహణ, అవరోహణ అనేవి దేనికోసం ఉపయోగిస్తారు? అంటే, ఒక రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరరచన చేసేటప్పుడు ఇవి స్వరాల క్రమాన్ని నిర్దేశిస్తాయా? ఫలానా వారి పాటలో ఎన్నో సంగతులున్నాయి అంటారు, ఈ సంగతులు ఏమిటి? ఈ సంగతులు లేకపోయినా, అపస్వరం రాకుండా పాడితే సరిగ్గా పాడినట్లే (గాత్ర సంగీత విషయంలో) లెక్కా? గమకాలు మళ్ళీ వేరుగా ఉన్నాయా? ఇలా వ్రాసుకుంటూ పోతే విసిగించే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అంచేత, మీరు సంగీతంలో ఉన్న ప్రాథమికాంశాలన్నిటినీ వివరిస్తూ నాలాంటి వారికోసం ఒక వ్యాసం వ్రాస్తే, మీ తక్కిన వ్యాసాలని కూడా చదివి ఆనందించే అవకాశాన్ని మాకు కలగజేసిన వారవుతారు.
ధన్యవాదాలతో,
రాజాశంకర్ కాశీనాథుని
కల్యాణి రాగం – అనుబంధం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/04/2008 2:24 pm
తెలుగు అభిమానిగారు కొత్త సినిమాపాటల రాగాలని గుర్తుచేసి నా లోపాన్ని చక్కగా సవరించారు. ఈమధ్య ‘హృదయం ఎక్కడున్నది’ అనేపాట విన్నప్పుడు అందులో ఖరహరప్రియ నాకు వినబడింది. అలాగే ‘నవమన్మథుడా’ అనే పాట శుద్ధధన్యాసి రాగం. కొత్తపాటలు విని వాటి రాగాలను ఉదహరించేంత ఓపికా, వ్యవధీ, ఆసక్తీ లేకపోవడమే నా లోపం.
శాస్త్రీయసంగీతం వెంట విధిగా ఉండే కొంత ‘చాదస్తం’ ప్రతివారికీ రుచించకపోతే వారిని తప్పుపట్టలేం. మెలొడీని విని ఆనందించేందుకు సరిపోయేంత మటుకు కొంత గ్రామరును పరిచయం చేస్తే తెలుగువారిలో సంగీతం మరింత బలపడుతుందని ఆశ. ఈ ప్రయత్నం చాలా గొప్పదని కాని, తద్వారా కీర్తిప్రతిష్ఠలు వస్తాయనిగాని కలలో కూడా అనుకోను.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/04/2008 7:56 am
వ్యాసం పూర్తవలేదు కాని నాకు మొదటినుంచీ కొన్ని సందేహాలున్నాయి. గ్రహాలను భూమినుంచి వీక్షించినప్పుడు వాటి వెనకాల ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రరాశులు కనబడతాయి. చూస్తున్న కోణాన్నిబట్టి ఆ నేపథ్యం మారుతుంది. గ్రహాల ప్రభావం జరగబోయే సంఘటనలమీద ఉంటుందని అనుకున్నా కిటికీ చువ్వలకూ, కిటికీనుంచి కనబడే దూరపు కొండలకూ ముడిపెట్టినట్టు ఈ రాశుల ప్రమేయం ఏమిటో అర్థం కాదు.
బ్లాగుల గురించి – నా మాట గురించి జ్యోతి గారి అభిప్రాయం:
03/04/2008 5:51 am
బావుందండి వెంకటేశ్వర రావుగారు మీ బ్లాగవతం. నేను మొదటిసారి ఈమాట లోవ్యాఖ్య రాయడం. మరి మా(మన) బ్లాగ్లోకానికి ఎప్పుడొస్తున్నారు?
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి KRISHNA RAO JALLIPALLI గారి అభిప్రాయం:
03/02/2008 3:26 am
నమ్మడమునమ్మకపొవడం అనేది ఎవరి ఇష్టం వారిది. కాని కొంత మంది భయపెట్టీ తమ పబ్బం గడుపు కుంటారు. వారిని మాత్రం ఇరగ దీయాలి.
ఓ చందమామ గురించి mOhana గారి అభిప్రాయం:
03/01/2008 1:48 pm
ఆకాశంలో ఒకే చందమామ, కాని మంచు బిందువులు ఎన్ని
చందమామలను ప్రతిఫలనము చేస్తుందో! అలాగే జీవితంలో
ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చందమామ!
చక్కని హృదయంగమమైన కవిత – మోహన
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
02/19/2008 8:37 pm
లక్ష్మన్నకు:
“అసలు విషయం ఏమిటంటే, ప్రవాసంలోని జీవితం తెలియాలంటే, ప్రవాసంలో బతకటంలో తప్ప వేరే దారి లేదు. నివాస ఆంధ్రుడు ఎన్ని సార్లు అమెరికాకి వచ్చి వెళ్ళినా, అమెరికాలో తెలుగు వారి జీవితాన్ని అర్ధం చేసుకోటం, వీలు పడదు.”
మీరు చెప్పిన పై విషయం నిజమే ననిపిస్తున్నది.
పై విషయం నిజమైతే, మీరు స్త్రీ ఐతే తప్ప స్త్రీ జీవితం మీకు అర్థం కాదు . మీరు పాఠకురాలికిచ్చిన ఈ కింది సమాధానం చూస్తే మీకు స్త్రీలలో ప్రతిభావంతులున్నారన్న సంగతి అసలు తెలియదేమో అనిపిస్తున్నది.
లక్ష్మన్నా! మీరు, మీ వ్యాసంలో మొదటి పేరాలొ ఉదహరించిన తెలుగు తేజోమూర్తులను, మీరు క్రింద చెప్పిన విధంగా వృద్ధిలోకి తెచ్చినవారిగా స్త్రీలను గుర్తిస్తున్నారు కాని స్త్రీలు స్వయంగా తేజోమూర్తులని, మీకు అనిపిస్తున్నట్లుగా లేదు.
“పాఠకురాలికి: మీరు చెప్పే దాకా, ప్రతిభావంతులైన తెలుగు స్త్రీలను మర్చిపోయాన్నన్న విషయమే తెలియలా! అసలు నేను ఆ కోణం నుంచి తేడాగా ఎప్పుడూ చూడలా. ఒక్క మనవి. ఎంతో మంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, మరెంతో మంది స్త్రీమూర్తుల ప్రేమా, దయ, వాత్సల్యం లేకుండానే తెలుగు తేజోమూర్తులు వృద్ధి లోకి వచ్చారని నేననుకోను. దయచేసి ఇటువంటి తేడాలు మరి తీసుకు రావద్దు.”
పాఠకురాలిని ఇంకెప్పుడూ ఇలాటి తేడాలు తీసుకురావద్దంటున్నారు. ఎంచేత? పాఠకురాలు మీరు మర్చిపోయిన ఒక ముఖ్య విషయం గుర్తు చేశారు. మంచిదేగా! కాదా?
లైలా.
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి JP గారి అభిప్రాయం:
02/16/2008 5:29 am
తెలుగుని మన తెలుగు వారికి తెలుగు కాని వారికి నేరుపుటకు ఇంటరునెటుని మాధ్యమంగా ఎందుకు ఉపయొగించరాదు? అన్ని ముఖ్య బాషలలొ interactive WEBSITE should be there to learn Telugu. I have seen lot of discussion on extinction of Telugu but I don’t believe it. Because of development of INTERNET medium, we have a good opportunity to teach the language all over the world. Language is also getting richer by adding lot of new words by bloggers all around the world.
I am able to see lot of rich content, thoughts, affection for the language in blogs. But i have not come accross when web site solely dedicated for learning Telugu. All should start to contribute to develop such a rich and multi media site. This will help every Telugu who don’t know the language to learn language. The site should be developed in such a way that any non-telugu who learns the TELUGU should immediately realise the SWEETNESS of Telugu.
Sorry, For typing in English as this is 1st time for me to use RTS.
చిలక – గోరింక గురించి sai గారి అభిప్రాయం:
02/16/2008 3:10 am
కధ బావుంది కాని ఆంగ్లము ఎక్కువ అయింది. ముఖ్యంగా పాత్రలు వాటి గమనము బాగుంది. ఎంత బావా మరదళ్ళు అయినా వాళ్ళ అభిప్రాయాల్లో తేడాల వలన విడి పొవటమే మంచి ముగింపు.
నా జ్ఞాపకం గురించి yasasvi గారి అభిప్రాయం:
02/15/2008 8:15 am
డియర్ వేలూరి,
అనుకోకుండా మీ సైట్ లోకి రావటము, కొన్ని రచనలని చదవటము జరిగింది.
congratulations చెప్తాను ముందు. ఎందుకంటే పత్రిక అన్నది – అదీ ఈ formలో కానివ్వండి – నడపటం కొంచెం కష్టమైన విషయమే గనక. అందునా మీరు “ఉత్తమ సాహిత్యం” తెలుగులొ ప్రచురిస్తామని మీ ధ్యేయం గ చెప్పేసరికి కొంచెం ఆసక్తి గ మీ పత్రిక ని browse చేసాను.
నన్ను మరీ నిరాశ పరిచింది మీరు అచ్చు వేసిన కవిత్వం. బహుశా మీరు మంచి సాహిత్యాన్ని తెలిసిన వారే అయి వుంతారు. మంచి కవిత్వాన్ని కూడ. మీరు ప్రకటించిన ఉత్తమమైన అనే standard లోకి రాకపొతే పొయే, గాని మరీ నేలబారు గ వుంటే ఎలాగండీ?? పద్మలత అయల సొమయాజుల గారి ది కవిత్వమా? భాష లేదు. భావం లేదు. మిగతా వాళ్ళవి కూడ బొత్తిగా బాగులేవు. జంధ్యాల సినిమా లో “తవిక” అని వెక్కిరించిన స్థాయి లొ వున్నాయి. ఉదయకళ అన్న ఆవిడవి కాస్త మెరుగు.
మీరు ఒక standard ని ప్రకటించాక అంతకు తగ్గ కుండా వుండక పోయినా అసలు కవిత్వం రాయటం రానివాళ్ళవో… రాయలేని వాళ్ళవో ప్రచురించటం poetry కి ద్రోహం చేయటం కాదా??
am sorry to say this.. కవిత్వం రాయటం చాత కాని వాళ్ళు .. తమ హద్దులు తెలుసుకుని ఆగిపోవటం మంచిది. తెలుగు కవుల మీద గౌరవం వుంటేనూను, తెలుగు పాఠకుల మీద ప్రేమ కాకపోయిన కనీసం జాలి లాంటిది ఉంటేనూను.
అనేక నమస్కారాలతో,
యశస్వి
తీన్ కన్యా గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
02/06/2008 11:54 am
అమెరికా వెళ్ళగానే పెళ్ళికాని కుర్రాళ్ళ విలువ “మార్కెట్లో” పెరిగిపోతుంది. అమెరికావంటి ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ వారు సీదాసాదా కోరికలతో మామూలు జీవితాలనే గడుపుతూ ఉంటారు. ఇండియాలో మాత్రం వారి తాహతుకి సరితూగగల సంబంధాలు చూడాలనే ప్రయత్నాలు జరుగుతాయి. అటువంటి హైలీ క్వాలిఫైడ్ పెళ్ళికూతుళ్ళని చూసినప్పుడు కుర్రాళ్ళకి కలిగే అయోమయమే ఈ కథకి ప్రధానవస్తువుగా అనిపిస్తుంది. కథలో వాస్తవికత ఏమీ దెబ్బతినలేదు.
కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి Tadepalli Hari Krishna గారి అభిప్రాయం:
02/03/2008 12:44 pm
కన్యాశుల్కము కొన్ని నిర్ణీత దేశకాలపరిమితుల్లో ప్రబలంగా ఉన్న సంఘదురాచారాలకి స్పందిస్తూ అప్పారావుగారు వ్రాసిన నాటకం. వితంతు వివాహాలూ, బాల్యవివాహాలూ, కన్యాశుల్కాలూ అనేవి 19వ శతాబ్దమధ్యంలో విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో _కొన్ని_ బ్రాహ్మణ వర్గాలకి మాత్రమే పరిమితాలైన దురాచారాలు. సమకాలంలో ఈ దురాచారాల వ్యాప్తి, విస్తృతి, సందర్భత ఎంతమాత్రం? గురజాడ కాలంలో కూడా ఈ సమస్యలు ఆయా స్థల,కుల, వర్గ పరిమితులు దాటితే, కన్యాశుల్కానికున్న సమాజప్రయోజనం అంతంతమాత్రం. ఇదేరకంగా బెంగాలులో రాజారామ్ మోహన్ రాయ్ వంటి వాళ్ళు బాల్యవివాహాలకీ, సతీ దురాచారాలకీ వ్యతిరేకంగా ఘోషించారు. కానీ అవెంతవరకూ సమకాలికసమస్యలు? అయినాకూడా, కన్యాశుల్కాన్ని నిత్యనూతనంగా పున:పఠించుకోడమూ, మంగళస్తోత్రాలు పాడుకోడమూ, ఏటేటా పందిళ్ళు వేసుకుని వడపప్పు పానకాలు సేవించడాలూ, కొందరు సాహిత్యపిపాసువులకి ఈనాటికీ పవిత్రవంశాచారం.
షేక్స్పియర్ నాటకాలకులాగున, కాళిడాసు నాటకాలలా, లేదా ప్రబంధకావ్యాలలా – కన్యాశుల్కం కూడా ఈనాడుఈఒకానొక సాహిత్యరత్నం. కన్యాశుల్కానికి సాహిత్యవిలువే తప్ప ఏవిధమైన సామాజిక విలువా లేదని ఈ ప్రస్తుత లేఖరి గాఢవిశ్వాసం.
విపరీతంగా పెచ్చరిల్లిన పెట్టుబడిదారి తనము, హేయరాజకీయాలు, ప్రపంచీకరణ పేరిట అరుగుతున్న అల్పవర్గాల దోపిడీ, విద్యోపాధులపేరిట జరుగుతున్న బాలల చిత్రవధ, బతుకంతా రెక్కలువిరుచుకు పెంచిన సంతానాలు ఆకస్మికంగా విదేశాలకి వలసపోయి మరి తిరిగిరాకపోడం, భూమి విడిచి సాముచేసే ఆర్థికవిధానాలు, కూలిపోయిన ప్రభుత్వాంగాలు, అవయవవ్యాపారాలు చేసే కార్పరేట్ హాస్పిటళ్ళూ, ఏనాటికీ మారని చిరుద్యోగుల జీవితాలూ, కులప్రాతిపదికాలైన రాజకీయాలూ, …ఇవీ ఈనాటి సమాజం పడే ఈతి బాధలు. వీటికీ కన్యాశుల్కానికీ ఉన్న సాహిత్య సంబంధమల్లా సమకాలసమస్యలని తవ్వి తలకెత్తడం మాత్రమేను. గ్రహించిన కన్యాశుల్కప్రియులందరూ 1950 దశకానికిటుపక్కికి ఉత్తిష్ఠులై సమకాల సంఘదురాచారాలకి కూడా తమ రెటినాల్లో కొంత చోటిస్తే బాగుంటుంది. అటువంటి సాహిత్యాన్ని పఠనీయంగా విమర్శింఛి చూపిస్తే మరింత ప్రయోజనకరం.
– తాడేపల్లి హరికృష్ణ
తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి Satya గారి అభిప్రాయం:
02/03/2008 10:03 am
వ్యాసం చాలా పరిశోధనాత్మకంగానూ, చాలా విషయాలను తెలియబరిచేదిగాను వుంది.
కాని, అందరూ భయపడుతున్నట్లుగా సినిమా కారణంగా నాటకం చనిపోయే స్థితిలో వుందని నేననుకోను. అయినా సినిమా నాటకానికి ఒక రూపం. సినిమా నాటకంనుండే పుట్టింది. రంగస్థలం నుండే ఓనమాలు నేర్చుకుంది. పరుగు నేర్చుకున్నామని, నడక మానేస్తామా?
సమాచార విప్లవంతో పోటీ పడలేక నాటకరంగం అన్ని వర్గాలవారినీ అలరించలేకపోతోందని అంతగా భయపడాల్సిన అవసరం లేదేమో? నాకు తెలిసీ, నాటకం ఇంకా నమ్మశక్యం గాని పనులను చేస్తోంది. పల్లెల్లో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ప్రజాసంఘాలు నాటకాలనే నమ్ముకున్నాయి గాని. పండుగలకు, ఇంకా ఏమైనా ఇతర సమయాలలో గుడిలో నాటకాలు వేస్తాం. బడిలో పిల్లల సాస్కృతిక కార్యక్రమాలు అంటే నాటకాలే ముందు వరసలో వుంటాయి. పట్టణాల విషయానికొస్తే నేను తప్పు కావచ్చు. ఆక్కడి పరిస్థితులు వేరు. అక్కడి సంస్కృతులేమారిపోయాయి. కారణం, తీరికలేని జీవితాలు కావచ్చు, లేదా డబ్బు మహిమ కావచ్చు. పట్టణాలు మాత్రం మన సంస్కృతిని ప్రతిబింబించవు.
ధన్యవాదములతో
సత్య
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
02/02/2008 7:58 pm
పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలపై రెండు పుస్తకాలు
వెంకటేశ్వర రావు గారూ,
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీరు కేవలం ఆసక్తితో కంప్యూటర్ భాషలు నేర్చుకున్నారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయమే! ముందు ముందు అవసరం కలిగినప్పుడు ఇద్దామనే ఉద్దేశంతో నేను చదవదగ్గ పుస్తకాల పేర్లివ్వలేదు. నాకు అమితంగా నచ్చిన పుస్తకాలు రెండు:
1. కంప్యూటింగ్ పూర్వాపరాలకు సంబంధించి Martin Davis రాసిన “The Universal Computer: The Road from Leibniz to Turing.”. గత యాభై అరవై ఏళ్ళలో కంప్యూటర్లు అనూహ్య రీతిలో అభివృద్ధి చెందాయి. అందుకు అభినందించాల్సింది నిస్సందేహంగా కంప్యూటర్ ఇంజనీర్లనే. కాని అప్పటి హాలునిండే కంప్యూటర్ల నుండి ఇవాళ్టి సెల్ ఫోనూ, లాప్ టాపూ, సూపర్ కంప్యుటర్ దాకా, అన్నిటికీ ఆధారం ఒకేరకమైన మూలసూత్రాలే! వాటిని కనుక్కోడానికి మూడొందల సంవత్సరాలు పట్టింది. ఆ సూత్రాలని కనుగొన్న వాళ్ళు ముఖ్యంగా ఇంజనీర్లు కాదు, తార్కికులు! వాళ్ళ జీవిత కథల్నీ, ఆలోచనలనీ కలిపి రాసిన పుస్తకం ఇది. దీనిలో వట్టి కథలయినా ఉత్కంఠతో చదివిస్తాయి. వాళ్ళ ఆలోచనలని అర్థం చేసుకుంటే కంప్యుటర్ లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది; అమూర్తపుటాలోచన (abstract thought) మీద గౌరవం పెరుగుతుంది.
2. సాధ్యాసాధ్యాల గురించి David Harel రాసిన “Computers Ltd. What They Really Can’t Do,” చదవదగ్గది. 1984లో TIME పత్రికలో వచ్చిన ఒక కవర్ స్టోరీ లో్ “కంప్యూటర్ సాఫ్ట్ వేర్ తో సాధ్యం కానిది లేదు,” అన్నది చదివి, సామాన్య ప్రజానీకంలో ఉన్న అపోహలని తొలగించడానికి రాసిన పుస్తకం.
వీళ్ళిద్దరూ లెక్కలు, కంప్యూటర్ సైన్సుల్లో ప్రపంచప్రసిద్ధిగాంచిన ప్రొఫెసర్లూ, శాస్త్రవేత్తలూ. “మనకున్న విజ్ఞానాన్ని కాస్తో కూస్తో సామాన్య జనానికి చేరువగా తీసుకొచ్చి అజ్ఞానపు చీకటిని తొలగించడం మన బాధ్యత,” అనే ఆలోచన పాశ్చాత్య శాస్త్రవేత్తల్లో అతిసామాన్యం గానూ, మన “పుణ్యభూమి”లో పుట్టిన శాస్త్రవేత్తల్లో అపురూపంగానూ కనిపించడం విశేషం.
కొడవళ్ళ హనుమంతరావు
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/26/2008 1:07 pm
వికటకవి గారూ,
ఆ సూత్రం ప్రవాసంలో ఉండి వచ్చినవాళ్ళకి వర్తించదని నేననలేదు. తప్పకుండా వర్తిస్తుంది. నిజానికి, నేను లక్ష్మన్న గారితో కొంతవరకే ఒప్పుకుంటాను అంటూ, ఆయన అన్నదాంట్లో నేను అంగీకరించని విషయమొకటుందని ఓ ఉదాహరణతో పాటు వివరించాను. (పేరివ్వడం మర్చిపోయాను – పి. సత్యవతి గారి “మంత్రనగరి”)
మరో ఉదాహరణ ఇచ్చి విరమిస్తాను. ఉన్నవ రాసిన “మాలపల్లి” కి ఇతివృత్తం పల్లెలో ఉండే ఓ దళిత కుటుంబం. ఉన్నవ దళితుడు కాడు; వాళ్ళ జీవితానికీ ఆయన జీవితానికీ చెప్పుకోదగ్గ తేడా ఉంది. అయినా గూడా వాళ్ళ జీవితం గురించిన ప్రత్యక్ష అనుభవం ఆయనకుంది – ఎందుకంటే వాళ్ళూ ఆయన ఉండే సమాజంలో భాగమే. ఎంత ఊహాశక్తి గల రచయిత అయినా తను వేరే సమాజంలో ఉంటూ “మాలపల్లి” లాంటిది రాయలేడు అని నా నమ్మకం. రాస్తే అది కత్తిమీదసాము లాగుంటుంది.
“మనం ఇంటర్నెట్ యుగంలో కొచ్చాం, ప్రపంచమంతా ఒక చిన్న కుటుంబం,” అంటే నేనొకటడుతాను. గత వంద సంవత్సారాలలో అనేక దేశాల్లో అనేక మార్పులొచ్చాయి. ప్రచార సౌకర్యాలలో ఊహించలేనంత మార్పులొచ్చాయి. కాస్త విద్యావంతులైన వాళ్ళకి వేరే దేశాల్లోని జీవితాల గురించి కొంతవరకైనా తెలుసుకోడానికి అవకాశం కలిగింది. కాని రచయితలెవరైనా కేవలం తమ ఊహా శక్తి నుపయోగించి తామెప్పుడన్నా నివసించిన దేశంలో కాక వేరే దేశంలో ఉన్న మనుషుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకొని గొప్ప సాహిత్యం సృష్టించారా? సృష్టిస్తే, తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ, దయచేసి కొన్ని పేర్లివ్వండి.
కొడవళ్ళ హనుమంతరావు
ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids) గురించి mOhana గారి అభిప్రాయం:
01/14/2008 9:45 am
వ్యాసాన్ని చదివి సలహాలిచ్చిన పాఠకులకు వందనాలు.
ఇంకా మీకు తోచిన సలహాలను అందరూ ఇయ్యండి. శాస్త్ర రంగంలో
ఇంకా వ్యాసాలను రాయాలనే నా అభిలాషకు అవి తోడ్పడుతాయి.
1) అన్ని ఘనస్వరూపాలను గురించి ఒకే వ్యాసములో రాయాలనేదే
నా ముఖ్యమైన ఉద్దేశము. దానిని విరిచి రాస్తే కంటిన్యుయిటీ
ఉండదు. అందుకే ఐదు ఘనస్వరూపాలను గురించి కుదించి
ఒకే వ్యాసములో వివరించవలసి వచ్చింది.
2) నేను చదివిన, చూచినా పదకోశాలలో నేను ఉపయోగించిన
టెక్నికల్ పదాలే ఉపయోగించారు. పదాలు అచ్చ తెలుగు పదాలు
కానంత మాత్రాన వాడడానికి వెనుదీయరాదు. సాంకేతిక
పదాలకు సంస్కృతము నిజంగా ఒక కాణాచి వంటిది.
నాకు తెలిసి తెలుగు అకాడెమి వారు స్ఫటిక శాస్త్రముపై
ఒక పుస్తకాన్ని ప్రచిరించారు. ఉదాహరణకు అందులో
సమతల ముఖానికి పార్శ్విక అనే పదాన్ని ఉపయోగించారు.
octahedronను అష్టపార్శ్విక అని అన్నారు.
నా భావనలో దానికంటె అష్టముఖి అనే పదము బాగని
తోస్తుంది. సుబ్బరామయ్యగారి పుస్తకాన్ని ఇక్కడ చూడవచ్చు –
http://www.archive.org/details/SphatikaShastramu
3) సౌష్ఠవమును గురించి ఇంతకు ముందే నేను రాసిన
ముగ్గులు అనే వ్యాసాన్ని చదువమని వ్యాసములో, సూచికలో
తెలిపి ఉన్నాను. ఇందులో ప్రతియొక్క అక్షానికి ముగ్గుల
ఉదాహరణ ఉన్నది. తీరిక ఉన్నప్పుడు సౌష్ఠవము 101
అఏ వ్యాసాన్ని రాస్తా.
4) హెర్మన్ వేల్ పుస్తకము నన్ను ప్రాభావితము చేసిన
పుస్తకాలలో ఒకటి. దీనిని అందరు అర్థము చేసికోవచ్చు.
నా దగ్గర ఈ పుస్తకపు pdf file ఉంది. కాని అది పెద్దది.
దానిని కావలసిన పాఠకులకు ఎలా అందజేయాలో తెలియలేదు.
5) ఇక బొమ్మలను గురించి. ఇవి పారదర్శకము కనుక
ఫోటో తీయడము చాల కష్టమయ్యింది. flash
ఉపయోగిస్తే reflect అవుతుంది. flash లేక తీయవలసి
వచ్చింది. Internetలో కొన్ని ఉన్నాయి కాని ఇలా చేసినవి
లేవు.
6) ప్లేటో ఆపాదన రావుగారు చెప్పింది సరియే. Detailsతో
వ్యాసాన్ని పొడిగించడం ఇష్టంలేక వాటిని గురించి
రాయలేదు.
7) dual అంటే twin అని అర్థము, అందుకే కవల అని
ఉపయోగించా. నా ఉద్దేశములో ఇది తప్పు అని అనుకోను.
8) చిన్న భూషయ్య ప్రస్తావనకు కారణాలు రెండు – (1)
pentagonతో ద్వాదశముఖి చిత్రాన్ని కింది లింకులో
చూడగలరు.
http://www.flickr.com/photo_zoom.gne?id=1414071323&size=o
(2) కొద్దిగా హాస్యాన్ని ఒలకబోద్దమనే నా విఫల ప్రయత్నము.
విధేయుడు – మోహన
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/12/2008 9:35 pm
వైజ్ఞానిక వ్యాసాల కథా కమామీషు
రాజాశంకర్ గారూ, శ్రీనివాస్ గారూ,
మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు. మీరిచ్చిన కొన్ని సలహాలు పాటిస్తాను. మీరు వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలతో విభేదిస్తాను.
ఎందుకు రాయాలనిపించలేదో తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నానో వివరించి digress అయ్యానన్నారు రాజాశంకర్ గారు. “నరావతారం” కి పరిచయం రాస్తూ నార్ల విష్ణావతారాలవి రాసేవాళ్ళ మీద ఎందుకు విసుర్లు వెయ్యడం? పండిత పురస్కారం గురించి ప్రకటన చేస్తూ తమ్మినేని కవుల మీద ఎందుకు చురక వెయ్యడం? వాళ్ళ వాళ్ళ దృక్పధాన్ని బట్టి తమకి ముఖ్యమైన వాటి గురించి ప్రస్తావించారు. నేను మన భాషలో సైన్సుగా చలామణి అవుతున్న వాటిని చూసి కొంత “కడుపు మండి” నాలుగు మాటలు రాశాను. రాస్తున్నది పాపులర్ సైన్సు గురించి కాబట్టి అవి అసందర్భం కాదు. నిజానికి నాదృష్టిలో చాలా అవసరం. అలాగే ప్రేరణ కలిగించిన వాటిని ప్రస్తావించడం కూడా మామూలే.
కాని అందు మూలంగా అసలు విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, అది తప్పే. ముందు ముందు ఎలాగూ లోతుగా వివరిస్తాను కనుక, అది సరిదిద్దుకునే అవకాశం వుంది.
నేను రాయాలనుకున్నదంతా ఒకే వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు. ఖగోళ శాస్త్రం మీదా, కాలెండర్ మీదా మనకి వ్యాసాలు పరంపర గానే వచ్చాయి. అవి వచ్చింది వారపత్రికల్లో కాబట్టి గత వారం విషయం గుర్తుండటం సులభం కావొచ్చు. ఈమాట, రెండు నెలలకోసారయినా, ఇంటర్నెట్ పుణ్యమా అని పాత సంచిక పక్కనే ఉండటాన పాఠకులు దారితప్పరనే నా ఆశ. కాని శ్రీనివాస్ గారన్నట్లు, ప్రతి వ్యాసమూ సాధ్యమైనంతవరకు సమగ్రంగానూ సమైక్యంగానూ ఉండాలి. మొదటి వ్యాసం కాస్త కలగాపులగంగా వున్న మాట నిజమే. ఈ విషయంలో నేను జాగ్రత్తపడాలి.
ఇకపోతే ఈ వ్యాసాల్లో దొర్లే కవితల వలన ఉపయోగమేమిటి? పాఠకుల ఏకాగ్రతకు భంగం కావా? అన్నదానికి నా సమాధానం: కొడవటిగంటి కుటుంబరావు, “తెలుగులో ఏదన్నా వైజ్ఞానిక రచన, కథలాగా చక్కగా హృద్యంగా, ఆపబుద్ధి పుట్టకుండా రచించినది కంటపడితే పర్వం లాగుంటుంది,” అన్నాడు.
కాని పాత్రలు, సంభాషణలు, ప్రకృతి వర్ణనలూ లేకుండా కథలా హృద్యంగా నడిపించడం ఎలాగ? అందుకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తారు – కవిత, జీవిత చరిత్ర, పురాణ కథ, నవ్వుతెప్పించే సంఘటన, ఇలా ఏది చాతనయితే అది.
“విశ్వరూపం,” తెలుగు వైజ్ఞానిక సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడుతుందన్నాడు కొడవటిగంటి. నా ఉద్దేశంలో మైలురాయే కాదు, ఉత్తమ రచనకి గీటురాయి కూడాను. దాంట్లో, నండూరి, “సాధారణభాషలో సాపేక్షసిద్ధాంతం,” అధ్యాయాన్ని చార్లెస్ లాంబ్ పలుకులతో మొదలెట్టి, మధ్యలో కీట్సు ప్రేమగీతాన్నొకదాన్ని ఉటంకించి, షెల్లీ పద్యాన్ని పఠాభి తెనిగింపుతో సహా ఇచ్చి, పోతన భాగవతాన్నెలా మొదలెట్టాడో వివరించాడు! వాటికితోడు బాపూ కార్టూన్లు!
సాపేక్ష సిద్ధాంతం వివరించడానికి ఇవన్నీ అవసరమా అంటే, బహుశా కాదేమో! కాని అవన్నీ ఉంటే గాని హృద్యంగా ఉండదనీ, అవి వ్యాసాన్ని మళ్ళీ మళ్ళి చదివించేలా చేస్తాయనీ రచయిత ఉద్దేశం.
దీంట్లో ఏకాభిప్రాయం ఉండాలని లేదు. Feynman ఉపన్యాసాల్లో కవిత్వం ఎక్కడా కనిపించదు. కవిత్వం లేకుండా Brownowski ఉపన్యాసం ఉండదు. నాకు Brownowski అంటే చాలా ఇష్టం. మన ఇష్టాఇష్టాలు మన రచనల్లో వ్యక్తం అవతాయి.
చాలా మంది పేర్లని వాడాను. వారి ప్రజ్ఞా పాటవాలు నాకున్నాయనే అపోహ నాకేమాత్రమూ లేదు. వాస్తవం చెప్పాలంటే, పులిని చూచి నక్క వాతబెట్టుకున్న ట్లవుతుందేమోనన్న భయం కొంత వుంది. కాని, చుక్కలదాకా నిచ్చెనేస్తే చూరు దాకానన్నా చేరతాం, అన్నది మన సూక్తి.
కొడవళ్ళ హనుమంతరావు
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/12/2008 1:59 pm
శ్రీనివాస్ గారిచ్చిన స్త్రీల, పేదల, రోగుల గురించి రాయడానికి సంబంధించిన పోలిక ఈ సందర్భంలో సమంజసంగా లేదు. ఎందుకంటే వీళ్ళ గురించి రాయడానికి వాళ్ళ జీవితంతో కావలసిన ప్రత్యక్షమైన అనుభవం వేరే వాళ్ళకుండే అవకాశం వుంది. అమెరికా జీవితం గురించి అలాంటి ప్రత్యక్షానుభవం అమెరికాలో ఉంటే తప్ప అసాధ్యం.
“ఇంటర్నెట్ తోనూ, ఈమాట తోనూ, ఇరవై నాలుగ్గంటలూ ప్రసారమయ్యే టీవీ షోల తోనూ వేరే వాళ్ళ జీవితం గురించి తెలుసుకోలేమా? సృజనాత్మక సాహిత్యం సృష్టించలేమా?” అంటే ఎక్కడో కొడవటిగంటి కుటుంబరావు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి: సాహిత్యం జీవితవృక్షాన పూసే పువ్వు అనే ఉపమానం వాస్తవమనుకుంటే, సాహిత్యాన్నించి సాహిత్యం పుట్టడం, పువ్వునుంచి పువ్వు పుట్టడం లాంటిది – అసంభవం.
అసాధ్యం, అసంభవం అన్నవి పెద్ద మాటలనుకోండి. ఎక్కడన్నా మినహాయింపులుండొచ్చు.
కాని లక్ష్మన్న గారితో నేను కొంతవరకే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన నివాసాంధ్రులు ఎన్నిసార్లు ఇక్కడకొచ్చి వెళ్ళినా అమెరికాలోని తెలుగు జీవితం అర్థంచేసుకోలేరన్నారు. జీవితం, తెలుగు వాళ్ళదే అయినా, చాలా విశాలమయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకయినా అది అర్థమయ్యేది అసంపూర్తిగానే.
రెండు మూడు నెలలు వాళ్ళ పిల్లల్ని చూడటానికి వచ్చినవాళ్ళు, తాము చూసి అనుభవించినంతలో అర్థం చేసుకొని రచనలు చెయ్యొచ్చు.
మొన్నో కథ చదివాను: అమెరికాలో తెలుగు వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఎంత ఘనంగా – మీగడలతో భోజనం, తాంబూలంతో ఫాటు వెండిగిన్నె ప్రదానం – చేసుకుంటున్నారో, ఒకరింట్లో స్వామి వారొకరు యజ్ఞం ఎలా జరిపించారో చెప్పి, ఇండియాలో లక్ష వత్తుల నోము ఎవరూ చేస్తున్నట్లు లేరు; అది కూడా ఇక్కడ చూసే భాగ్యం కలుగుతుందేమో అన్నారు.
అలాంటి కథలు విలువయినవే; నిజానికి చుట్టపుచూపుగా వచ్చిన నివాసాంధ్రులే అవి మిన్నగా రాయగలరేమోమో. అవి చదివి, అక్కడ కంటే ఇక్కడే మన సంస్కృతి గురించి ఎక్కువ పట్టించుకుంటూన్నామని సంబరపడొచ్చు; లేదా, పెరిగిన ఆర్థిక స్తోమతుతో పాటు పెరగకూడనవేవో మనలో పెరుగుతున్నాయని విచారించనూ వచ్చు – చదివే వారి దృష్టిని బట్టి.
కొడవళ్ళ హనుమంతరావు
తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి mOhana గారి అభిప్రాయం:
01/09/2008 7:03 pm
మంచి వ్యాసము వ్రాసినందులకు అభినందనలు.
తెలుగులో నాటకాలు లేవని అనుకోకూడదు. ఎందుకంటే యక్షగానంతెలుగుభాషకు ప్రత్యేకమైనది. తెలుగులో ఉన్నన్ని యక్షగానాలు మరే భాషలో లేదంటే అతిశయోక్తి కాదు. కాని ఈ నాడు వాటిని గురించి తెలిసినవారు అరుదు.పొరుగు భాష ఐన కన్నడములో, తుళు భాషలో అవి మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. తెలుగు నాటకము గురించిన ఒక మంచి పుస్తకము Surabhi Theatres by Sri Rama Sastri.
– mOhana
============================================
మంజరీమధుకరీయమును గురించిన ప్రస్తావన వచ్చింది కనుక ఆ నాటికను గురించి కొద్దిగా తెలుసుకుందామని పుస్తకాలు తిరగవేస్తుండగా కింది పుస్తకము కనబడింది. దాని నుండి ఈ నాటిక వివరాలు కొన్ని. దీని కర్త కోరాడ రామచంద్ర శాస్త్రిగారు మరొక మహా కావ్యాన్ని రాశారు. అది ఘనవృత్తము. ఇది మేఘదూతపు తరువాతి కథ. అదే మందాక్రాంతములో రాశారు దీనిని. దీనిని ఒకప్పుడు రచ్చబండలో నేను పరిచయము చేశా.
శ్రీ కోరాడ రామకృష్ణయ్య శతజయంతి సాహితీనీరాజనం
సంపాదకుడు – కోరాడ మహాదేవ శాస్త్రి
ప్రచురణ – సీతా ట్రస్ట్, విశాఖపట్ణం,
మరియు శ్రీ ఫవుండేషన్, ఇల్లినాయ్, 1992
అందులో పుటలు 12, 13 నుండి.
ఇది ఒక తెలుగు నాటిక. దీనిని కోరాడ రామచంద్ర శాస్త్రి గారు 1860 ప్రాంతంలో రచించారు. దీని ఇతివృత్తం అపూర్వం. స్వకపోల కల్పితం. పురాణాదులనుంచి సంగ్రహించింది కాదు. దీని కథ సంగ్రహంగా ఇది.
రాజకుమారి మంజరి నవయౌవనవతి అవుతుంది. ఆ సమయంలో శరీరంలో కలిగిన నూతనమైన మార్పులు ఆమెకు అర్థం కాలేదు. పొటమరించిన పాలిండ్లు మొదలయిన వాటిని ఆమె కంతులని భావించింది. మందు ఇప్పించమని తల్లి అయిన సంతానవల్లిని కోరుతుంది. ఆమె సిగ్గుతో తన కుమార్తెకు వాస్తవ విషయం చెప్పలేక పోయింది. తన పుట్టింటినుంచి మంజరి చెలికత్తె ఆమోదరేఖను రప్పించి, రాజకుమారికి ఆమె యౌవనం వివరించమని చెబుతుంది.
ఆమోదరేఖ సకల విద్యాప్రవీణ. ఆమె వల్ల వాస్తవం తెలుసుకొని మంజరి సిగ్గు పడుతుంది. రాజకుమారి ఆమె వల్ల గానకళ నేర్చుకుంది. ఒకనాడు వారిద్దరు ఉద్యానవనంలో ఉండగా కుంభస్తని అనే చేటిక వచ్చి, చండయోగిని అనే యోగినిని చూడ్డానికి మంజరిని అంతఃపురానికి పిలుచుకొని పోతుంది. చండయోగిని క్షుద్ర మంత్రోపాసకురాలు. సామంతరాజకన్యలకు గురువు. మంజరి ఇద్వాంసురాలని ప్రసిద్ధి పొందినందున, ఆమెను వాదంలోనో మరే విధంగానో ఓడించడానికి చండయోగిని వచ్చింది. వారిద్దరికి వాదం జరుగుతుంది. చండయోగినితో ఆమోదరేఖ ఆమె గురువైన రాజయోగిని కూడ వాదించారు. చండయోగిని ఓడి పోతుంది.
ఆమోదరేఖకు సంయమి అనే స్నేహితురాలు ఉంది. ఆమె స్నేహితురాలు సుమతి. విరిద్దరూ తపస్వినులు. వీరు ఆమోదరేఖా మంజరులకు వచ్చిన ఆపదను గురించి చర్చించుకుంటారు. ఆ ఆపద ఇది: మంజరి ఒక రాత్రి కలలో ఒక రాజచంద్రునితో రతి సుఖ మనుభవించి ఆ పారవశ్యంతో అతనిని గురించి ఆశువుగా పద్యాలు చెబుతుంది. అందుకు అందరూ కలత పడుతారు.
ఒకనాడూ మంజరి ఆమోదరేఖలు ఉద్యానవనంలో ఉండగా, చండయోగిని నియమించిన ఒక రాక్షసుడు హరిణ రూపంలో వచ్చి వారిని తన కొమ్ముల సందులో ఇరికించుకొని ఆకాశానికి ఎగిసి పోతాడు. తపస్విను లిద్దరూ ఇలా మాట్లాడు కుంటుండగా, ఒక కాపాలిక వచ్చి, కలలో మంజరిని కలుసుకున్న మధుకర రాజపరమేశ్వరుడు విరహి అయి అరణ్యంలో తిరుగుతూ, ఆకాశంలో ఎగిరిపోతున్న హరిణాన్ని బాణంతో కొట్టాడని, హరిణ రూపంలో ఉన్న రాక్షసుడు నిజరూపంతో తాను అపహరించుకొని పోతున్న ఇద్దరిని ఒక ఇనుప పెట్టెలో బంధించి దాచి, మధు
కరునితో పోరాడి మరణించాడని చెప్పింది. పెట్టె ఏమైందో మధుకరునికీ తెలీలేదు.
మంజరి వార్త తెలియక విలపిస్తున్న, అగ్నిప్రవేశం చేయనున్న రాజమాతకు కాపాలిక మాయతో ఒక మణిఘంటికను ఒక లేఖతో సహా అందజేస్తుంది. అవి రాజమాత చేతిలో పడుతాయి. మంజరి క్షేమంగా తిరిగి వస్తుందని, రాజయోగిని శాపంతో హండయోగిని పిచ్చిదై పోయిందని ఆ లేఖ వల్ల తెలిసింది. రాజమాత మనసు ఊరట చెందుతుంది.
మధుకర చక్రవర్తి భార్య హేలావతి ఎదుట మంజరి ఆమోదరేఖ ఉన్న ఇనుప పెట్టె పడుతుంది. ఆమె ఆ పెట్టె తెరిపించి, దానిలో ఇద్దరు సుందరులు ఉండడం చూచి ఆశ్చర్య పడి వారిని అంతఃపురంలో రాజు కంట పడకుండా దాచింది. రాజు విచారంగా ఉండడానికి కారణమేమో ఆమెకు తెలియలేదు. ఈ విషయాన్ని
కుంభస్తని అనే చేటి విదూషకునికి తెలుపుతుంది. విదూషకుడు రాజును కలిసినప్పుడు రాజు, తన చింతకు కారణం చెబుతాడు.
విదూషకుడు కుంభస్తనితో చెప్పిన దానితో రాజు చెప్పిన దానిని సరిపోల్చుకుని రాణి, రాజును ప్రసన్నుని చేసుకొనేట్టు యుక్తి చేస్తాడు. విదూషకుని భార్య యుక్తితో ఒక విప్రశ్నిక వచ్చి ఖేచరస్త్రీ సందర్శనంవల్ల రాజు స్వస్థ చిత్తుడవుతాడని
ప్రశ్న చెబుతుంది. ఇనుప పెట్టెలో నుంచి బయటపడిన మంజరి, ఆమోదరేఖలు ఖేచర స్త్రీలని రాణి భ్రమపడి ఆమోదరేఖను రాజు కనబడేట్టు చేస్తుంది. మంజరిని చూస్తే రాజు మనస్సు మారుతుందని ఆమెను రాజుకు కనబడానీలేదు.
రాజు, విదూషకుడు మంజరిని చూడడం ఎట్లా అని ఆలోచిస్తూ క్రీడాశాలకు రాగా,
అక్కడ మంజరి కనిపిస్తుంది. మధుకరుడు మంజరిని గాంధర్వ విధితో వివాహం చేసుకుంటాడు. ఇంతలో రాణి వచ్చి అల్లరి చేయగా రాజు వెళ్లి పోతాడు. రాణి కోపంతో ఆమోదరేఖను, మంజరిని చెరసాలలో పడేస్తుంది. రాజు చర్యకు రాణి చింతిస్తుండగా, ఆమె తల్లినుంచి ఒక లేఖ వస్తుంది. దానినిబట్టి మంజరి రాణి
పినతల్లి కుమార్తె అని స్పష్టమవుతుంది. రాణి పశ్చాత్తాప పడుతుంది. రాజు వద్దకు క్షమాపణ కోరుతుంది. మంజరిని రాణిని చేసి, తాను భట్టిని కావడానికి సమ్మతిస్తుంది. పిదప రాణే మంజరిని పిలుచుకొని వచ్చి రాజు చేత పాణిగ్రహణం చేయిస్తుంది.
మచ్చుకు మొదటి అంకములో ఆమోదరేఖామంజరుల సంభాషణ –
ఆమో – హళా మంజరి, సుమాళంబుగా నుంటివి గదా
మంజరి – అత్తికా, నీవు వచ్చుట నింక నింక యద్ది కలుగునని
నెమ్మనంబున నమ్మెదనే.
ఆమో – హళా ఇట్లుంటివేమే
మం – అత్తికా, నీవు నా చెంగట నుంటివే
ఆమో – హళా, నీ కురంగట నవ్వ మొదలుగ వారంద రున్నారు
గదా
మం – అత్తికా, యీ యవ్వ తొంటి యవ్వ యనుకొంటివే
ఆమో – యిప్పుడు గ్రొత్తగ మరి యొకతె యేతెంచెనే
మం – కాదే యవ్వ యనిన యద్దియే కాని దాని యాత్మ మారినదే
ఆమో – ఓసీ చెలియా, కాదే, తొల్లిటికంటె నీ యాత్మ మారిన
దాని నెరుంగక యమ్మను వింతగ దూరుచున్నావు
మం – అత్తికా నీవు కొన్ని నాడులు దడవున నుండుట
నీ యాత్మయుం దారుమారయ్యెనని దలంపనగునే
=========================================
నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో చిక్కులో పడిన పల్లెపడుచులు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/06/2008 3:18 pm
ఆముక్తమాల్యదతో నా అగచాట్లు
ఆముక్తమాల్యదతో నాకున్న అష్టకష్టాలు ఇవాళ్టివి కాదు. పెద్దలు దీన్ని ప్రౌఢ కావ్యం అన్నారు. మామూలు కావ్యాలని అర్థం చేసుకునే స్తోమతే నాకు లేకపోతే ప్రౌఢ కావ్యాల జోలికెళ్ళే ధైర్యం ఎక్కడుంది? అయినా సాహసం చేసి ఎప్పుడో ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో కొన్ని పేజీలు చదివాను. రాయలు James Joyce కోవలో వారన్నారాయన. నా గుండెలో పెద్ద రాయి పడింది.
కాలేజీ రోజుల్లో బుచ్చిబాబు రాసిన “చైతన్యస్రవంతి” చదివి, ఎప్పటికయినా Ulysses చదవాలని నిశ్చయించుకున్నా. నాలుగు రాళ్ళు సంపాదించే స్థికి రావడంతోటే మద్రాసులో మూర్ మార్కెట్ కెళ్ళి Ulysses కొన్నా. పది పేజీలు గూడా చదవలేకపోయా! ఇప్పటికీ ఇండియాలో ఓ స్నేహితుడింట్లో పెట్లో భద్రంగా ఉందది.
కె. వి. యస్. రామారావు గారి సులభ అనువాదం చదివా. అది మొదటిమెట్టుగా ఉపయోగపడి స్వయంగా చదువుకోడానికి ప్రోత్సాహమిస్తుందని భావించారాయన. అయినా నేను కనీసం రెండో మెట్టుకి కూడా చేరుకోలేకపోయాను. లోపం నాదే కాని వేదం గారి సంజీవనీ వ్యాఖ్య దొరకలేదనే వంకతో సరిపెట్టుకున్నా.
తర్వాత, మెచ్చుకోదగ్గ విస్తృత చదువరి పరుచూరి శ్రీనివాస్ పెట్టిన ‘వాత’ చదివి, కనీసం వావిళ్ళ వారి టీకా తాత్పర్యాలతో నన్నా ఓ మెట్టు ఎక్కగలనేమో అని ఆశ పడ్డా. ఊహు, కదలదే!
ఇప్పుడీ పద్యం చదివాను. వెంటనే అనిపించిందేమిటంటే, “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్న రాయలు వారు రాసిన తెలుగు నాకెందుకందుబాటులో లేదా అనే విచారం! చిన్నగా చీమలమర్రి గారి వివరణ చదివాను. ఓహో అనుకున్నా. కాని “జలరుహనాభగేహ రురుశాబము” లో జింక దాక్కొని ఉందంటే నమ్మశక్యం కాలా!
ఈ కష్టాల్లో నాకింకో పద్యం కనిపించింది. ఇది నాఅష్టకష్టాలకీ ప్రతిఫలం అనిపించింది. వానాకాలంలో ఆడవాళ్ళు పడే అగచాట్లని వర్ణించేది:
ఇల్లిల్లు దిరుగ నొక్కిం తబ్బు శిఖి, యబ్బెనే నింటిలో బూరి యిడి విసరక
రాజదు, రాజిన రవులుకొల్పాసలెగాని కల్గదు గూడు దాన, గలిగె
నేని కూరగుట మందైన బెన్పొగ సుఖ భుక్తి సేకూర, దాభుక్తి యిడిన
బ్రాగ్భోక్తలకె తీరు బహుజనాన్నము, దీర నారుల కొదవు పునఃప్రయత్న
మాజ్యపటముఖ్యలయ మెన్న, రాలయాంగ
దారులయమెన్న, రంతిక కారజనిక
పచన నాంధోగృహిణి రామి బడక మరుడు
వెడవెడనె యార్వ నొగిలి రజ్జడిని గృహులు.
ఆముసుర్లో ఇంటింటికీ తిరిగితే కాస్త నిప్పు దొరుకుతుంది. దొరికినా, ఇంట్లోని ఎండుగడ్డి పెడితేగాని రాజుకోదు. రాజుకున్నా, రగులుకోవాలనే ఆశే కాని రగుల్కోదు. రగుల్కొన్నా అన్నం ఉడకదు. అన్నమయినా కూర గాదు. అయినా, ఇల్లంతా పొగతో నిండి, సుఖ భోజనం కాదు. తిన్నా, ఇంట్లో అందరికీ వండిన అన్నం, మొదటి బంతి వాళ్ళకే సరిఫోతుంది. ఆడవాళ్ళు మళ్ళీ వంటకి తయారు. అప్పుడు నేతిలో తడిపిన కోకలూ, ఇంట్లోని వాసాలూ గూడా పొయ్యిలో వెయ్యడానికి వెనుకాడరు. రాత్రంతా వండుతూ, అన్నం లేని గృహిణి, ఎంతకీ పక్కలోకి రానందుకు ఇంటాయన చిందులేస్తాడు!
ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే, ఇదెప్పుడో రాయల కాలంనాటి ఆడవాళ్ళ అగచాట్లు కాదు; నా చిన్నతనంలో మా ఇంట్లో, రావినూతలలో ప్రతి ఇంట్లో, వానాకాలంలో జరిగే తంతు కవితాత్మకంగా చెప్పాడు కనుక.
చివరికే మనిపించిందంటే, రాయల్ని అర్థం చేసుకోవాలంటే నాలాటి సగటు పాఠకుడికీ అగచాట్లు తప్పవు. కాని పడితే, కె.వి.యస్., పరుచూరి, చీమలమర్రి, ఆరుద్ర, వావిళ్ళ వగైరాల సాయం వుంటే, కొన్ని రత్నాలు దొరక్కపోవు!
కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు
ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids) గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
01/06/2008 12:02 pm
“Polynomial ని తెలుగులో ఏమనాలో తెలియక అలాగే ఉంచాను,” అని రాసారు హనుమంతరావుగారు.
“Polygon” ని “బహుభుజి, బహుకోణి” అని తెలిగించే సంప్రదాయం ఉంది కదా.
“Poly” ని బహు, అతి అని తెలిగించవచ్చు
అలాగే astronomy లో “నొమీ” అంటే లెక్కపెట్టటం.
కనుక Polynomial అంటే రెండు కాని, అంత కంటె ఎక్కువ కాని పదాలు ఉన్న గణిత సమాసం కనుక దీనిని “బహునామి” అనో “బహుపది” అనో అనొచ్చు.
ఈ సంప్రదాయం తెలుగులో అప్పుడే వాడుకలో ఉంది.
ఉదా.
polyandry = బహుభర్తృత్వం
ployglot = బహుభాషాభాసి
ployhedron = బహుఫలకం
ploymer = బహుభాగి
ploynomial = బహుపది, బహునామి
Poly ని అతి అని తెలిగిస్తే వచ్చేవి
ploydipsia = అతిదాహం
ploypleagra = అత్యాకలి
plourea = అతిమూత్రం
పిండి కొద్దీ రొట్టె!
సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/05/2008 6:37 am
వెబ్ పత్రికల కొత్తదనం మూలానో, ఏమో, వ్యాసాల స్పందనలో ఒక ధోరణి కనబడుతోంది. రాసిన విషయం గురించి కాకుండా రచయిత గురించో, శైలిని గురించో పొగడ్తలూ, విమర్శలూ చూస్తున్నాం. నా లెక్కన ఇటువంటి వ్యాసాలు పాఠకుల ఆసక్తిని చెపుతున్న విషయంకేసి మళ్ళించేవిగా పనిచెయ్యాలి. శైలి వగైరాలను మెచ్చుకుంటే రచయితలకు ఉత్సాహం పెరిగేమాట నిజమే కాని, అది అంత ముఖ్యం కాదని నాకనిపిస్తుంది. ఇలాటివి చదివి విలాయత్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరుల గురించి తెలుసుకునేందుకు ఎవరైనా మొదటిసారిగా ప్రయత్నిస్తే రాసిన ఉద్దేశం నెరవేరినట్టే. తక్కినవన్నీ సెకండరీ విషయాలు.
తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:
01/05/2008 5:55 am
Wonderful and admirable effort.
Look forward to the rest in the series.
నాటిక – నాటకం అంటే .. కేవలం పాత్రలు డయలాగులు చెప్పడం అన్న తీరులో రాస్తున్నారు. నాటకానికి ఉండాల్సిన స్వంత రూపం గురించి ఎవరికీ అవగాహన ఉన్నట్టు కనబడదు. గత పదేళ్ళలో తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి కొన్ని మంచి నాటికలు నాటకాలు రాశారు.
ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids) గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/03/2008 9:46 pm
లెక్కల్లో అందచందాలు
బహుముఖప్రజ్ఞావంతులైన మోహనరావుగారి వ్యాసం చాలా విజ్ఞానదాయకంగా ఉంది. నేను ఇరవైరెండేళ్ళ క్రిందట Harvard Square లో కొని కొంత చదివిన Hermann Weyl పుస్తకం, “Symmetry,” మరలా కాస్త చదివింపజేసింది. అది ఆయన Princeton నుండి 1951లో రిటైరయిన సందర్భంలో ఇచ్చిన ప్రసంగాల సంకలనం. సగమన్నా సామాన్యులకి అందుబాటులో ఉన్నదే.
కొన్ని చిన్న చిన్న సలహాలు:
అయిదింటినీ పరిచయం చేసి, పిండికీ శక్తికీ కొరతలేదు గనక, ఒక్కోదాని మీద ఒకటి రెండు వ్యాసాలు రాసి సగటు పాఠకుడికి వివరిస్తే ఇంకా బాగుండేది. సంకేతాలూ సిద్ధాంతాలతో మొదలెట్టకుండా, ఇవి అసలెలా వస్తాయో బొమ్మలతో చెప్తే సులభంగా అర్థమవుతుంది. ఒకే కొనకి మూడు త్రిభుజాలు కలిపితే చతుర్ముఖీ, నాలుగయితే అష్టముఖీ, అయిదయితే వింశతిముఖీ, ఆరయితే అసాధ్యం! ఒకే కొనకి మూడు చతురస్రాలు కలిపితే cube, నాలుగయితే అసాధ్యం! ఒకే కొనకి మూడు పంచభుజాలు కలిపితే … … ఇలా నెమ్మదిగా ఇవి ఎందుకు అయిదుకి మించవో చెప్తే బావుంటుంది.
పారదర్శకమైన ప్లాస్టిక్ రేకుతో శ్రమతో బొమ్మలు తయారుచేశారు కాని అంత లాభకరంగా లేవు నాకు – స్పష్టంగా లేకపోవడాన. వెబ్ లో ఇంకా మంచివి దొరకవచ్చు.
“ప్లేటో వీటికి పంచభూతముల గుణాలను ఆపాదించాడు” అన్నారు. గ్రీకులకున్నది మొదట్లో నాలుగేనట! “To the earth then, which is the most stable of bodies and the most easily modelled of them, may be assigned the form of a cube; and the remaining forms to the other elements, to fire the pyramid, to air the octahedron, and to water the icosahedron,–according to their degrees of lightness or heaviness or power, or want of power, of penetration.” ప్లేటో అయిదో రూపం గురించి తెలుసుకొని ఏం చెయ్యాలో తెలియక, దానిని విశ్వానికి ఆపాదించాడట! దానికి విశిష్టమైన గుణాలున్నట్లుంది.
dual అంటే “కవలలు” అన్నారు. వెంటనే నాకా మాట నచ్చింది, కాని మళ్ళీ ఆలోచిస్తే ఈ సందర్భంలో సరికాదేమోననిపిస్తుంది. తెలుగులో సాంకేతిక పదకోశం లాంటిదేమన్నా ఉందా? Polynomial ని తెలుగులోకి తర్జుమా చెయ్యలేక నేనలాగే ఉంచాను!
“చిన్న భూషయ్యగారి పంచభుజికి ఏ సంబంధము లేదని మీతో మనవి చేస్తున్నాను!” అన్నారు. నాకయితే వెంటనే తట్టలేదు. తర్వాత George Bush Jr. కీ Pentagon కీ సంబంధించిందని ఊహించాను. ఈమాట లో రెండు మూడు సార్లు ఈ చిన్న భూషయ్య పేరు చూశాను. సాహిత్యం సంగతెలా ఉన్నా, సైన్సు వ్యాసాల్లో, విమర్శించొచ్చు కాని, పేరుని వక్రీకరీంచకూడదేమో.
లెక్కల చరిత్రలోనే ఆయిలర్ సిద్ధాంతం చాలా అందమైనదంటారు. నా వ్యాసంలో మూడు-రంగుల-ముగ్గుల గురించి ముచ్చటించాను. నాలుగు-రంగుల-మ్యాప్ సమస్య ఇంకా బాగా పేరున్నది: ఎలాంటి మ్యాప్ అయినా సరే, ఎన్ని దేశాలయినా, వాటి సరిహద్దులనెలా మార్చినా, నాలుగు రంగులతో, పక్కపక్క దేశాలకి ఒకే రంగు లేకుండా వెయ్యచ్చని ప్రతిపాదన (conjecture) ఉండేది.
ఆరు రంగుల కంటె ఎక్కువ అవసరం లేదని ఆయిలర్ సిద్ధాంతం ఆధారంగా చక్కగా నిరూపించారు. నాలుగు రంగులు చాలని నిరూపించడానికి వందేళ్ళకు పైగా అనేకమంది జీవితాలు వెచ్చించారు. చివరకి 1976లో నిరూపించారు – కంప్యూటర్ తో!! అందంలో అది టెలిఫోన్ డైరెక్టరీ కేమీ తిసిపోదన్నారు గణిత సౌందర్యాన్వేషకులు. 🙂
మొత్తానికి ఇది నా ఆసక్తి దీపాన్ని వెలిగించింది. కృతజ్ఞతలు.
కొడవళ్ళ హనుమంతరావు
కోవెలలో పకపకలు గురించి mOhana గారి అభిప్రాయం:
01/02/2008 10:22 am
రచయిత తమాషాకు అన్నారు, బాగానే ఉంది.
కాని తమిళములో కూడ పదమధ్యములో ఉండే పరుషములే
సరళములుగా మారుతాయి. ముందు ఉన్న అక్షరము
ఎప్పుడూ పరుషమే. తెలుగువారు కూడ కొన్ని అక్షరాలను
సరిగా పలుకలేరన్న విషయాన్ని మరువరాదు. ఉదా.
దంత్యాలను తాలవ్యాలుగా, త్యాగాన్ని చాగముగా ఉపయోగిస్తారు.
ఇక పోతే థ-కారము తెలుగులో లేదంటే అయోశయోక్తి కాదేమో.
రామనాథము ఎప్పుడు రామనాధమేగా తెలుగులో. ఒక్కొక్క
భాషకు ఒక్కొక్క విధమైన ఆచారము ఉంది. తప్పుగా
ఉచ్చరించినా కర్ణాటక సంగీతానికి తమిళులే జీవగఱ్ఱ అన్న
నిజాన్ని అందరూ అంగీకరిస్తారనుకొంటా.
విధేయుడు – మోహన
చిలక – గోరింక గురించి Sathibabu గారి అభిప్రాయం:
12/16/2007 4:26 pm
నేను రఘోత్తమ రావు గారి తోనూ, రఘు గారి తోనూ ఏకీవభిస్తున్నాను. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కాని రచ్చగెలిచి ఇంట గెలవమనలేదు. ఇంట్లో పని అనుత్పాదకము కాదు! అది ఉత్పాదకమే! భార్యాభర్తలకు పరస్పర సహకారం ఉంటేనే అది మంచి దాంపత్యం అవుతుంది. శశాంక్, కళ్యాణి ఇరువురూ సబబే! శశాంక్ ఎటువంటి ఉత్పాదనకైనా సిద్ధమే కాని కళ్యాణి మాత్రం తను సామాజిక వ్యవస్థ నుంచి వచ్చే గుర్తింపు కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నది. ఇటు వంటిది తప్పు అని నేను అనటం లేదు. ఎప్పటి కైనా గంతకి తగ్గ బొంతలు దొరుకుతారు. అప్పటి దాకా ఇరువురూ వేచి చూడాల్సిందే! (ఇక్కడ నేను వాడిన నానుడి ని తప్పు పట్టవద్దు, మనకి తగ్గవాళ్ళు మనకి దొరుకుతారన్న సందర్భం లో వాడాను అంతే! ఎవరికైనా వారి భావాన్ని వ్యక్తీకరించే అధికారముమ, హక్కూ ఉన్నాయి).
తెంపుకోవే బంధనాలు గురించి Ravikiran Timmireddy గారి అభిప్రాయం:
11/17/2007 6:34 pm
మాచిరాజు సావిత్రి గారి విమర్శని చదివిన తర్వాత, మహే జాబీన్ గారి “తెంచుకోవే బంధనాలు” కథని కూడా చదివేను.
గొప్ప కథగా నా కనిపించలేదు. కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు ఏ పాత్ర కూడా సరిగ్గా ఎష్టాబ్లిష్ కాలేదని నా అభిప్రాయం. చెప్పాలనుకున్న కథ వొకటికి పదిసార్లు చెప్పిన కథే ఐనా, వర్తమానానికి సంభందించిన అంశం కాబట్టి చెప్పిన పద్దతి బాగుంటే కథ కూడా బాగుండేది. తనకు సరిగా తెలియని దేశంలో, గబ, గబా నాలుగు పాత్రల్ని కలబోసి, కాగితం మీద కుమ్మరించినట్టుంది. సావిత్రి గారి విమర్శ చదవకపోతే, మహే జబీన్ గారి పేరు తెలియకపోతే, ఈ కథని కడ వరకూ చదవడం కష్టవే. కథ గొప్పగా చెప్పలేదు కాబట్టి, కథ వ్రాసింది గొప్ప పేరున్న రచయిత్రి కాబట్టి, కథని భూతద్దంలో చూసి, లేని లోపాల్ని కూడా కల్పించి విమర్శించాల్సిన అవసరం వుందని నేననుకోను.
సావిత్రి గారు అంతగా మదన పడిపోయ్యే విశేషాలేవీ నాకు కథలో కనపడలేదు. సఖి గురించి, అమెరికాలో గృహ హింస ప్రాసిక్యూషన్లో వున్నటువంటి రూల్స్, రెగులేషన్స్ గురించి రచయిత్రికి అవగాహనా లోపం వుందనడంలో అబద్దవేవీ లేదు, but there is nothing in this story that is so appalling, that requires such a libelous comment from Ms. Machiraju Saavitri.
సఖి సంస్థ సభ్యులు చారుమతి ఇంటికి పోవటం అంత పెద్ద తప్పుగా సావిత్రి గారికి ఎందుకు కనపడిందో మరి. నిజవే చారుమతికి సఖి గురించి తెలియదు, కానీ మదుబనికి చారుమతి గురించి తెలుసు కదా. గృహ హింస నుంచి దక్షణాసియా ఆడవాళ్ళకి విముక్తి కోసం స్థాపించబడిన సంస్థ, “Sakhi for South Asian Women is a community-based organization in the New York metropolitan area committed to ending violence against women of South Asian origin.” అని చెప్పుకునే సంస్థ, ఫలాని ఇంట్లో వొక అభం శుభం తెలియని ఆడపిల్ల, కనీసం తన బాధల్తో తండ్రికి వ్రాసిన వుత్తరం తను పోస్ట్ కూడా చేసుకోలోని స్థితిలో వున్నటువంటి అమాయకపు పిల్ల విషయం తెలిసి కూడా మౌనంగా వుంటారని నేననుకోను. ఫిర్యాదే అంత ముఖ్యవైతే మదుబనికి దొరికిన ఆ వుత్తరవే ఫిర్యాదుగా స్వీకరించడానికి వెనుకాడుతారని నేననుకోను. ఫిర్యాదే ముఖ్యవైతే చారుమతి ఇంటికి పోయిన తర్వాత తను చెప్పిన విషయాలే ఫిర్యాదుగా పరిగణించడాని వెనుకాడుతారని నేననుకోను. సఖి స్వంత మాటల్లోనే వారి మిషన్ గురించి, “Sakhi structured its programming to follow a two-pronged approach in addressing domestic violence within the South Asian community:
1. We create a safe place with support, friendship, and a full range of culturally-sensitive, language-specific information, services, and advocacy to South Asian women facing abuse in their lives; and,
2. We work to inform, actively engage, and mobilize the South Asian community in the movement to end violence against women forever.”
సావిత్రి గారి మరో ఫిర్యాదు, చారుమతికి ఎలాటి కన్సలింగ్ సఖి ఇచ్చిందో రచయిత్రి విపులంగా వివరించలేదని. ఇది లోపవే, కథలో చారుమతికి, ఆమె భర్త కి సఖి ఇచ్చినటువంటి కన్సెలింగ్ గురించి రచయిత్రి సూచనమాత్రంగానైనా చెప్పి వుండాల్సింది. ఇతే సావిత్రి గారు ఈ లోపాన్ని ఫెమినిస్టులని వ్యంగంగా వ్యాఖ్యానించడానికి వుపయోగించుకోవడం చాలా అసభ్యంగా వుంది. సావిత్రి గారు చెప్తారు, సఖి తన కన్సలింగ్ తో చారుమతిని ఫెమినిస్ట్ గా మలచేరంట. ఎలాటి ఫెమినిస్ట్, చారుమతి అనిరుధ్ ని తన భర్త గా కోరుకోవటం. తాళి కట్టిన మొగుడు ధనుంజయ్ కన్నా ముందు, అనిరుధ్ పరిచయం అయ్యుంటే ఇతనే తన భర్త అయ్యేవాడు కదా అని చారుమతి అనుకోవటం సావిత్రి గారు వొక నేరంగా పరిగణించారు. పెళ్ళి వలన కన్నీళ్ళు తప్ప మరోకటి పొందని ఆడకూతురు, తనంటే ఇష్టం చూపించే మరో వ్యక్తి తారస పడినప్పుడు, అతన్ని గురించి తలపొయ్యడంలో, అతన్ని కోరుకోవడంలో నేరపూరితవైన ఆలోచనని, ఆ రకవైన ఆలోచనలే (ఈ ఆలోచనకి ఫెమినిజానికి నిజానికి ఏ సంబధం లేదు) సఖి నుంచి చారుమతి నేర్చుకున్న ఫెమినిజం అని సావిత్రి గారు మరో నేరాన్ని మహె జబీన్ గారి మీదకి తోస్తారు. వాడు కట్టిన ఆ తాళిని తెంచటాన్ని వ్యంగంగా వ్యాఖ్యానిస్తారు.
సావిత్రి గారి మరో ముఖ్యవైన ఫిర్యాదు, మధుబని పెళ్ళితో సంబంధం లేకుండా ఇంద్రనీల్ తో కలసి వుండటం. ఇంద్రనీల్ పెళ్ళికి సుముఖంగా వున్నా, మధుబని కి పెళ్ళిమీద సద్భావం లేకపోవడం. అందరూ మదుబని ఆలోచనని హర్షించాలని లేదు, కానీ ఈ రోజుల్లో, అమెరికా దేశంలో ఆ ఆలోచనా సరళిని అంత ద్వేషించాల్సిన అవసరం నాక్కనిపించడం లేదు. సావిత్రి గారూ, మదుబని ఎప్పుడూ కథలో చారుమతి సమస్యలకి మరో పెళ్ళి పరిష్కారంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇంద్రనీల్, అనిరుధ్ ఆలోచనల తీరుతో చారుమతికి సహాయం చేసిన మదుబనికి, సఖి సంస్థకి, లేకపోతే ఫెమినిజానికి సంబంధం లేదు. కథలోనే వున్న ఈ చిన్న సత్యం మీ మసుకెందుకు ఎక్కలేదో మరి.
చారుమతి స్వయంగా పోలీస్ కి ఫిర్యాదు ఇచ్చేరని కథలో చెప్ప లేదు, సఖి సంస్థే ఫిర్యాదు చేసినట్టు రచయిత్రి వ్రాసేరు. నిజవే, కానీ చారుమతి ఫిర్యాదు లేకుండా ధనుంజయని పోలీసు అరెస్ట్ చేయగలదా? రచయిత్రి ఈ ముక్క చెప్పనందువలన కథకి, సఖి సంస్థకి అంత నష్టం వాటిల్లిందా, సావిత్రి గారు?
“Aside from the domestic violence issue, the story also abounds in cliché and stereotypes.” అని చెప్పేరు. మొత్తం కథలో వున్న వొకే వొక తెలుగు కాని పాత్ర పీటర్. అయన ట్రేష్ కలక్టర్ అనిచెప్పటం మీకు జాతి వివక్షగా కనపడింది. పోనీ పదిమంది నల్ల వాళ్ళు ఈ కథలో వుండుంటే, అందరినీ ట్రేష్ కలక్టర్లు గా చూపించుంటే మీ అభ్యంతరానికి వొక విలువుండేది. మీరొప్పుకున్నా వొప్పుకోక పోయినా చిన్న, చిన్న వుద్యోగాలు చేసే వాళ్ళు ఆఫ్రికన్ అమెరికన్సే అనేది సత్యం. వున్నదాన్ని వున్నట్టు చెప్పటం జాతి వివక్ష కాదు సావిత్రి గారు, లేని దాన్ని వున్నట్టు ప్రచారం చెయ్యడవే వివక్ష. నాకు మీ విమర్సలోనే వివక్ష కనపడుతుంది. ఆచారాల్ని తోసిరాజనే వాళ్ళమీద వివక్ష, మదుబని లాటి వెన్నెముక కలిగిన ఆడవాళ్ళ పట్ల వివక్ష, మన వెనుకనున్న మన నలుపుని ఎత్తిచూపే మహ జాబీన్ లాంటి రచయిత్రుల పట్ల వివక్ష.
అభం, శుభం తెలియని అమాయక ఆడపిల్లలు, తమకు ఈ దేశంలో ఎదో గొప్ప బతుకుందని, పుట్టి పెరిగిన దేశాన్ని, నా అనుకునే నా వాళ్ళని, కష్టం సుఖం చెప్పుకోడానికి తన వాళ్ళంటూ ఎవరూ లేని దేశానికి, భాషా, సంసృతి గురించి ఏ మాత్రం అవగాహన లేనటువంటి ఈ దేశానికి మొగుడనే వాడ్ని నమ్ముకోని వస్తే, వాడు శారీరకంగానూ, మానసికంగానూ పెట్టె హింసని కనీసం చెప్పుకోడానికి కూడా మనిషి, మార్గం తెలియని దేశంలో చారుమతిలాంటి వారి బాధలు మీకు స్టీరియో టైపుగా, వొక క్లిషే లాగా కనపడటం నిజంగా దురదృష్టం. సఖి వారి వెబ్ ప్రకారం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 393 కాల్సు, ఈమైల్సు సఖికి వచ్చాయ్. ఇందులో 355 ఫిర్యాదులు గృహ హింస గురించే. అందులో మెజారిటీ ఫిర్యాదులు న్యూయార్క్ మెట్రోపోలిటన్ ఏరియానుంచే, కానీ దాదాపు 9% ఫిర్యాదులు న్యూజెర్సీ నుంచి కూడా వున్నయని తమరు గమనించాలి. How many women have resources and inner strength to break the mold of conventional beliefs to complain to sakhi? Very few, very few. Imagine majority of women that are victims of domestic violence silently undergoing that torture, because either they have no courage to break the mold of convention or they were deprived of the resources or not aware of the institutions like SAKHI. It is not a cliché Ms. Savitri. If the story failed in literary circles, but if it has informed one woman about the help that is available (like SAKHI), it is a successful storey in my opinion.
మహ జాబీన్ గారు హైదరాబాద్ లో నిర్వహించే సఖిలాంటి సంస్థమీద మీరు ఈ కథని కారణంగాతీసుకోని వ్యాఖ్యానించడం సభ్యతకాదేవో ఆలోచించారా శ్రీమతి మాచిరాజు సావిత్రి గారూ?
ఆఖరుగా ఇది 2007 కాబట్టి సరిపోయింది. ఇదే కాని 1950ల మెకార్థి కాలం అయ్యుంటే, సావిత్రి గారి లాంటి విమర్శకుల చలవ వల్ల “cell”(cell అనే ఆంగ్ల పదం కమ్యునిష్టు తాత్వికతని సూచిస్తుందని తెలియని నా అజ్ఞానానికి చింతిస్తూ) లాంటి కమ్యునిష్టు పదజాలం వున్న కథని ప్రచురించినందుకు, ఈమాట పత్రిక, సంపాదకులు, రచయితలు, రచయిత్రులు, పాఠకులూ అందరూ బ్లాక్ లిస్ట్ లో నమోదయ్యుండే వాళ్ళు. ముఖ్యంగా సంపాదకులు, మహ జబీన్ లాంటి రచయిత్రులూ, క్రిష్ణ జన్మస్థానాన్ని పావనం చేసుండే వాళ్ళనడంలో కోంత అతిశయోక్తి వుంటే వుండొచ్చేవోగాని, కించిత్తు నిజం కూడా వుందని నా అబిప్రాయం.
ఫాంటసీ — రియాలిటీ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/10/2007 2:26 am
తెలుగు భాషా బోధన వల్ల భాషాభివృద్ధి జరుగుతుందన్నది అందరికీ సులువుగా అర్థమయ్యే విషయమే. అలానే సాహిత్య అనువాదాల ద్వారా భాషకి కలిగే వ్యాప్తికూడా అందరికీ తెలిసినదే.
కాని విశ్వవిద్యాలయాల్లో పరిశోధన భాషాభివృద్ధికి ఎంతవరకూ దారితీస్తుందన్నది సామాన్య ప్రజలకి (అంటే నాలాంటి వాళ్ళకి) చప్పున బోధపడే విషయం కాదు. కాబట్టి, తెలుగు భాషా సాహిత్యాల గురించి విదేశాలలో జరుగుతున్న పరిశోధన, అది తెలుగు భాషాభివృద్ధికి ఎట్లా దోహదం చేస్తోందీ అనే విషయాలపై “ప్రవాసంలో తెలుగు పరిశోధన” వంటి వ్యాసం ఒకటి తెలుసున్న వారిచేత రాయించి ప్రచురిస్తే బాగుంటుంది.
అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి మురళి గారి అభిప్రాయం:
11/06/2007 6:23 am
జిమ్ గ్రే సముద్రంలో తప్పిపోయినప్పుడు ఆయన గురించి వికీపీడియాలో చదివాను. కాని మీరు వ్రాసింది మనసుకు హత్తుకునేట్టు ఉన్నది. మీ ప్రయత్నానికి ధన్యవాదాలు, అభినందనలు!
సందుక గురించి C.S.Rao గారి అభిప్రాయం:
10/15/2007 3:11 pm
స్వగతంగా సాగిన “సందుక” కవిత లో తెలంగాణా మాండలిక భాష వ్యక్తీకరణ మాధ్యమంగా ఎన్నుకోబడిందని మొదటి కొద్ది పంక్తులలోనే అర్ధమవుతుంది.అంచేత స్వగతం గా సాగిన కవిత మొత్తం ఆ మాండలిక భాషా పదజాలంతోనే సాగుతుందని ఆశించటం అసమంజసం కాదనుకుంటాను.
అసలు ఈ కవిత ప్రత్యేకమైన సొగసు ఆ పదజాల ప్రయోగం లోనే ఉంటుంది కూడాను. ఈ కవిత ఎంత కవితా శక్తిని సంతరించుకున్నదనే విషయం నా ఈ అభిప్రాయం లో సమీక్షాంశం కాదు.కాకపోతే చాలా తక్కువ శాతం తెలంగాణా మాండలిక పదాలను మాత్రమే ఈ కవిత లో వాడటం చూసి నిరుత్సాహ పడ్డాను.
“అర్ర” లో మాండలిక భాష పదాల్ని వాడినంతగా కూడా ఈ కవితలో (సందుక) వాడలేదు.రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారైనా బాగా చదువుకున్నవారు వ్రాసే సంపాదకీయాల వ్యావహారిక భాషే ఈ కవితలో అధికాధికం గా వాడబడటం కనబడుతుంది. ఆ మేరకు ఈ కవితలోని సౌందర్యాన్ని ,ఔచితిని అది బలహీన పరుస్తుంది.
ఈ క్రింది పంక్తులలో తెలంగాణా మాండలిక భాషా పద ప్రయోగం లేకపోవటం
గమనించండి.
” ముదురు రంగులోకి
జీర్ణమవుతున్న
అట్టలు లేని పుస్తకాలు…”
“ఊపిరి పోసిన
ఒక్కో వాక్యం క్రింద
అరిగిన పెన్సిల్ తో…”
“తెరలు తెరలుగా
బాగా పరిచయమున్న
ఒక కొత్త సువాసన
చుట్టుముడుతుంది”
“చెంపకానించుకున్నపుడు
వెచ్చని వాగు నీటి కింది
గరుకైన ఇసుక
మెత్తదనం ఆపేక్షగా తగులుతుంది”
“(ఎట్లా పారేసుకుంటాం)
మన తొలి యవ్వనాల
రంగురంగుల
ఉద్రేకాల్ని?”
మరొక విషయం.పైన ఉదహరించిన మూడవ స్టాంజా లో “బాగా పరిచయమున్న”దంటూనే ,మరలా దాని”నొక కొత్త సువాసన “ననడం లో వైరుధ్యం లేదూ?
C.S.Rao
కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
09/27/2007 8:33 pm
వేలూరి గారూ, మన దేశంలో అధునికత బ్రిటీష్ వారి రాకతోనే మొదలైందని కోందరు, రాకకు మునుపే పదహారవ శతాబ్దంలోనే మొదలైందని, పలాని వాళ్ళెవరో వారి పరిశోధనల ద్వారా మనకి తెలియ చెప్పడానికి ప్రయత్నిస్తునారని మీరు చెప్పేరు. అధునికత వలస పాలనతోనో, పదహారవ శతాబ్ధంలోనో మొదలు కావటవేవిటండి. పోనీ ఆ పలాని అధునికతకి మీరేవైనా నిర్వచనం చెప్పేరా అంటే అదేంలేదు. మానవ జీవన విధానంలో అభివృధ్ధి, అధునికత వొక విడదీయలేని విషయం. అభివృద్ధి, అధునికత అనేవి రెండు ఒకే నాణానికి వున్న రెండు ముఖాల లాంటివి. ఇవి రెండూ కూడా కాలంతో పాటూ మారేవే, ముందుకు సాగేవే, అప్పుడప్పుడూ కోచేం డిప్ ఐనా. జీవనంలో (బయలోజికల్ లైఫ్ లో), జీవన విధానంలో అభివృధ్ధి ఒక అంతర్భాగం. ఆ అభువృధ్ధితో వచ్చే అధునికత ఒక continuous process. ఐతే వొక సమాజానికి సహజవైన ఈ అభివృధ్ధి, జీవన విధానంలో అధునికత, బయట శక్తుల వల్ల కూడా మార్పుకి లోనవుతాయ్. అది సముద్రాలవతల నుంచి వచ్చిన వలస పరిపాలన కావొచ్చు, సముద్రాలకివతలనుంచే వచ్చిన ఇస్లాం పాలన కావొచ్చు, పొరుగు హిందూ రాజ్యాలతో కలహాలు, విజయాలూ, అపజయాలు, లక్షా సవాలక్ష కారణాల్లో అన్నీ కావొచ్చు, ఏ వైనా కావొచ్చు.
సమాజం అనేది వొక ఓపెన్ సిస్టమ్ లాంటిది. సమాజం లోపలి ఆటుపోట్లతో పాటు, సమాజం బయట ఆటుపోట్లు కూడా సమాజస్థితిని, గతిని నిర్దేశిస్తాయ్. సంస్కృతి, సాహిత్యం అనేవి సమాజం యొక్క అట్రిబ్యూట్స్ ఐనప్పుడు అవికూడా సమాజంతో పాటూ మార్పు చెందటం సహజం కదా. ఐతే ఏవిటీ మార్పు, వొక సాపేక్షంగా నిశ్చలవైనటువంటి సాంప్రదాయ సమాజంలో, ఈ కనిపించీ, కొన్నిసార్లు కనిపించని (cause is separated in time and space from the effect) శక్తులు సృష్టించేటువంటి అనిశ్చల స్థితి. Some times this change in society’s status may be temporary, some times the society may change and move into a state that is relatively different. అంటే ఏవిటి సాంప్రదాయ సమాజం, తన పాత సాంప్రదాయాన్ని, విదిలించుకోని, వదిలించుకోని, వొక క్రొత్త సాంప్రదాయం నెలకోల్పుతుందనమాట. ఈ క్రొత్త సాంప్రదాయ సృష్టికి, సమాజం బయటనుంచి వచ్చే శక్తులే కాణంకాదు, సమాజంలో వున్నటువంటి అంతర్గత శక్తులు కూడా పాత సాంప్రదాయాన్ని మార్చి క్రొత్త సాంప్రదాయాన్ని సృష్టించగలవు. అంటే అధునికత అనేది, పాత సాంప్రదాయాన్ని పాక్షికంగానో, సంపూర్ణంగానో మార్చి వొక అధునిక సాంప్రదాయాన్ని సృష్టించటం.
“వాడికి పూర్వమే అధునికత ఉన్నది” అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ ప్రక్రియ పదహారు, పదిహేడు శతాబ్ధాలనుంచి, వొక్క ఆంద్రదేశంలోనే కాదు, మానవ సమాజపు పుట్టుకనుంచి ఈ విధంగానే సాగుతుందని చెప్పదానికి నూతన పద్దతుల్లో పరిశోధనలవసరం లేదు.
“వలస రాజ్యం తరువాత వచ్చిన అధునికత సాంప్రదాయ విరుద్దం అని చెప్పవచ్చు”, “బ్రితీషు వలస విధానం వలన వచ్చిన అధునికత, చారిత్రకంగా సంప్రదాయంగా వచ్చిన అధినికతని అణగ దొక్కింది” అధునికత అనేదే దేశీయమైన, విదేశీయమైనా సాంప్రదాయాన్ని త్రోసిరాజని క్రొత్త సాంప్రదాయాన్ని సృష్టించడమైనప్పుడు ఈ మాటలకర్థం ఏవిటి? ఆ మారిన సమాజంలో వచ్చిన క్రొత్త సాంప్రదాయంలో వుండే తప్పొప్పులకు బయటిశక్తులను కారణంగా చూపించి, ఆ తప్పులకు ముసుగు కప్పాల్సిన అవసరం లేదు. ఆ తప్పులకు, క్రొత్త సాంప్రదాయంలో పతనమైన విలువలకు, కారణం వలస రాజ్యవైనా, ఆ తప్పులని సంస్కరించుకునే భాద్యత మన సమాజానిదే.
“అప్పారావుగారు తన నాటకంలో దిగజారిపోతున్న సమాజాన్ని, నైతికంగా పతనమవుతున్న సమాజాన్నీ సమర్పించలేదు. నైతిక వైరుధ్యం సమాజంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా తలయెత్తితే ఆ సమాజం తనకు తానుగా మార్పు తెచ్చుకోగల స్థితిలో ఉన్నది కాని, సాంఘిక సంస్కరణకోసం ఎదురు చూడలేదు.” నిజవేనండీ, ఏ సమాజవైనా తన నడకలో, అప్పుడప్పుడూ ఒకటి రెండడుగులు వెనకకు వయ్యడం సహజవే, ఆ అడుగుల్ని సరిచేసుకోని ముందుకు పోవడం సహజవే. కాకపోతే ఆ సరిచేసుకునే క్రమంలో, సంఘసంస్కరణ, సంఘసంస్కర్తలు అనే అంశాలు కూడా సహజవైనవే. సంఘసంస్కరణ సమాజం తనని తాను సరిచేసుకునే క్రమాన్ని మరింత వేగవంతం చేయడం కోసం, సమాజంకన్నా ఒకటిరెండడుగులు ముందుకు చూడగలిగిన (అన్ని విషయాల్లో కాకపోవచ్చు, అన్ని కాలాల్లో కాకపోవచ్చు) వ్యక్తుల ప్రయత్నం. ఆ సంస్కర్తలు తమకన్నా వొకడుగు వెనకబడిన వాళ్ళని సంస్కరించడానికి, తమకన్నా వొకడుగు ముందరున్న వాళ్ళని వెలివేయడానికి (మిగిలిన చాంధసులలాగానే) చూస్తారు. అప్పారావుగారి సౌజన్యారావు పంతులు ఈ సంస్కర్తలలో వుండే ఈ ద్వందాన్ని చూపించడానికేనని నా అభిప్రాయం. ఐతే వొక్కడుగు ముందుచూపున్న ఈ సంస్కర్తలని మనవీరోజు వాళ్ళకి రెండడుగుల ముందుచూపు లేదని విమర్శ చేయాల్సిన పనిలేదు, అసలు ముందుచూపే లేని సమాజంలో కనీశం ఆ మాత్రంముందుచూపు కలిగిన సంస్కర్తలు ఆ సమాజ మార్పుకి కేటలిస్ట్లాగా ఎంతో ఉపయోగపడ్డారు. అప్పారావు గారికి ఈ విషయం తెలుసుగాబట్టే సౌజన్యారావు పంతులుగారిని సృష్టించారని నా అభిప్రాయం. ఈ వొక్క పాత్ర చిత్రణలోనే అప్పారావు గారు అప్పటి సమాజానికాన్నా ఎంత ముందున్నారో మనకర్థవవుతుంది. లోపాన్ని ఎత్తి చూపించటం సంఘ సంస్కర్తలని తేలికపరచడవో, అగౌరపరచడవో, లేకపోతే ఆ సంఘసంస్కరణని గేలిచేయడవో కాదు.
“ఈ సమాజం తనపై తనకి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేటంత వత్తిడి బ్రిటీషు వలస విధానం తెచ్చిపెట్టిన ఉధృతం. ఇందుచేత పైకులాలు తమ ప్రాథమిక యోగ్యతలని మరిచిపోవడం జరిగింది.” అంటే పై కులాలు తమ ప్రాధమిక యోగ్యతలని మరచిపోకపోవడవే మన హిందూ సమాజాన్ని సరిఅయిన దారిలో వుంచుతుందా? అసలు ఏ సమాజం తెచ్చిన వత్తిడి పైకులాల్ని సృష్టించిందో మరి. ఏ వుధృతి, ఏ వత్తిడి సమాజాన్ని కులాలుగా విభజించిందో? ఆ యోగ్యతలని మరచిపోయి దిగజారిన పైకులాల్ని కొంచం పైకి లాగి పూర్తిగా కాకపోయినా కొంచంగానైనా మిగిలిన కులాల సరసన కూర్చోబెట్టింది ఆ వలస పాలన వత్తిడేనేవో.
నాటకంలో ఏడవ అంకం ఆఖరి రంగాన్ని క్లుప్తంగా వివరించిన తర్వాత, వేలూరిగారు, ఆ అంకంలో మధురవాణి పాత్ర మీద తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వివరించారు. “సౌజన్యా రావు కున్న అమాయకత్వపు సంస్కరణాభిలాష దెబ్బతియ్యడానికి మధురవాణి బృహన్నాటకం ఆడుతూ వుండవచ్చు. ఆధునికుడు, పాశ్చాత్య ప్రాభవంలో పెరిగిన పెద్దమనిషి, నీతులు వల్లించే వాడికి గుణపాఠం చెప్పడానికి మధురవాణి వచ్చి వుండవచ్చు. లేదా, కాలం మారుతున్నది; తన దగ్గిరకి గౌరవనీయులైన వాళ్ళెవ్వరూ రారేమో నన్న భయం పుట్టి వుండవచ్చు. — ఏది ఏమో? వీటికి సమాధానం అప్పారావుగారికే తెలియక పోవచ్చు!” ఇన్ని రకాలుగా విశ్లేషించగలిగిన వేలూరిగారు, ఆ అంకాన్ని చదవగానే, మనసుకి తోచే అత్యంత సరళవైన, సహజవైన, నాటకంలో చెప్పిన కారణాన్ని మాత్రం మర్చిపొయ్యారు. వయసు పైబడిన, చేయనినేరానికి శిక్ష పడే అవకాశమున్న, ఆ చెయ్యని నేరం ఆ బాపడి తలమీద పడటంలో తన పాత్ర గురించి తెలిసిన వొక మంచి మనిషిగా లుబ్ధావదాన్లుకి సహాయం చేయడం కోసవే మధురవాణి పంతులుగారింటికి వెళ్ళిందనే విషయం. ఇంత సరళవైన, సహజవైన విషయం వేలూరిగారికి ఎందుకు తట్టలేదో మరి. వెళ్ళిన తర్వాత, పంతులుగారి వెనకనున్న నలుపు, పంతులుగారికి కనిపించకపోతే దాన్ని తెలివిగా ఎత్తిచూపించటం, పంతులుగార్ని అవమానం చెయ్యడానికి కాదని తిరిగి చెప్పల్సిన అవసరం లేదు. వేశ్యని చూడటానికి, మాట్లాడడానికి కూడా విముఖుడైన పంతులు గారు, మధురవాణికి భగవత్ గీతని బహుకరించి, తనతో షేక్ హేండ్ చేయటంలోనే, తన తప్పుని గ్రహించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వేలూరిగారు ఇంత అసహజవైన విశ్లేషణ ఎందుకు చేశారో తరువాతి పేరాలో అర్థమవుతుంది. వేలూరిగారి మాటల్లోనే వారి వివరణ ఇలా సాగుతుంది. “ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ; ఆ సంస్కరణలో నిజమైన సాంఘిక విలువ ఏమీ లేదు. ఈ సంస్కరణ ఘోష కేవలం వలస రాజ్య విధానం వల్ల ఏర్పడ్డ బూటకపు మాయ అని బోధపడుతుంది.” ఇదండీ అప్పారవుగారు కన్యాసుల్కం నాటకం వ్రాయడంలో ఉద్దేశం, వీరేశలింగం పంతులుగారిని వేళాకోళం చేయడానికే. అప్పారవుగారి ఉద్దేశం సంఘసంస్కరణ కాదట, సంఘంలో వుండే నీచ సాంప్రదాయాల్ని పైకెత్తి చూపించడం సంస్కరణాకాంక్ష కాక మరేవిటో. ఆ సంస్కరణలో నిజవైన సాంఘీక విలువ లేదుట. ఏ సంస్కరణలో వేలూరి గారూ? తెలిసీ తెలియని లేత వయసులోనే ఆడ కూతుళ్ళని, చావుకి జానెడు దూరంలో వున్న ముసలాళ్ళకిచ్చి కట్టబెట్టటలో వున్న నీచత్వాన్ని చూపించడంలోనా? లేకపోతే, పరిష్కారం చూపించకుండానే, మూర్ఖంగా మరికొందరాడ కూతుళ్ళని పొగపెట్టి తరివెయ్యడం అనే సంస్కరణలో వుండే మూఢత్వాన్ని బహిర్గతం చెయ్యటంలోనా? మీకు దేంట్లో సంఘసంస్కరణాభిలాష కనపళ్ళేదు సార్.
ఈ అసహజ విశ్లేషణ తర్వాతి కొద్ది పేరాల్లో అబద్దాల జాతరగా పరిణితి చెందుతుంది. “నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. పూజారి, పోలీసు, సేవకులు, స్కూలు పిల్లడు, పెళ్ళికొడుకు కూతురు (మీనాక్షి) అంతా ఈ పెళ్ళి కుదిర్చిన జిత్తులమారి రామప్పంతులునీ, పెళ్ళికొడుకుని మూర్ఖులుగా బయట పెడతారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ఎవరో, సౌజన్యారావు లాంటి అమాయకులు, సమాజం కుళ్ళిపోయిందని భ్రమించి, ఆ భ్రమని నమ్మి, సంస్కరించేద్దామన్న కుతూహలంతప్ప?”
మీరే కన్యాశుల్కాన్ని విశ్లేషిస్తున్నరో అని అనుమానంగా వుంది వేలూరి గారు. గురజాడ గారి కన్యాశుల్కంలో మీరు మీ మనసులో ఏఏ మార్పులు చేసుకున్నారో, ఏఏ చేర్పులు చేసుకునారో! నే చదివిన కన్యాశుల్కంలో, పెళ్ళీ ఆపడం కోసం బావిలో దూకి ప్రాణం తీసుకోడానికి సిద్ద పడిన సుబ్బి అమ్మ, మేన కోడలు బతుకు బండలై పోకుండా వుండాలని కరటక శాస్త్రి, చెల్లెలి బతుకు తన బతుకులా నాశనవై పోకూడదని లేచిపోవడానికి తెగించిన బుచ్చమ్మ, కరటక శాస్త్రితో వున్న పరిచయంతో, తోటి మనిషికి తనవంతు సహాయం చెయ్యడానికోచ్చిన మధురవాణి, తెలొసో తెలియకో కరటక శాస్త్రి చెప్పేడు కాబట్టి శిష్యుడు మహేశం తప్ప సుబ్బి బాగు కోసం పెళ్ళి అపాలనుకున్న వాళ్ళు మరెవరూ నాకు కనపడలేదు సార్. తన సౌభాగ్యం ఎంత బాగుందో ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మీనాక్షి కూడా పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేసిందని చెప్పలేం ( తన పరిస్థితిలో తన పరిధికి మించిన విషయమే కాదనలేం).
ఇంతకాలం ఈ నాటకాన్ని విమర్శకులు సరిగా అర్థం చేసుకోలేక పోయారట, పసిపిల్లకి వైధవ్యాన్ని తెచ్చిపెట్టే సంస్కృతి, కుళ్ళిపోఇందని భ్రమ పడ్డారట, ఈ పరిస్థితిని సంస్కరణల ద్వార మార్చాలని ఈ నాటకం భోధిస్తున్నదని ఆపోహ పడ్డారట. ఈ ఆపోహకి వేల్చేరు నారాయణరావు గారు నాలుగు కారణాలిచ్చారట. వేల్చేరు గారి కారణాలేవో నేను చదవలేదు, అందుకని వారి కారణాల గురించి నేను మాట్లాడటం పద్దతికాదు.
ఏ వలస సమాజపు విలువలు, మరే మత విలువలతోనూ సరి చూసుకోనవసరం లేకుండానే, చిన్న పిల్లలని అమ్ముకునే సమాజపు విలువలు అతి నీచవైనవని చెప్పోచ్చు. ఐతే ఆ నిజాన్ని త్రొక్కి పట్టడానికి, పద్దెనిమిది, పంతొమ్మిదో శతాబ్దపు బ్రాహ్మణవర్గ సమాజాన్ని పైకెత్తటానికే కన్యాశుల్కానికి, ఈ అసంబద్దవైన, అసహజవైన, అశాస్త్రియవైన విశ్లేషణల అవసరంపడిందని నా అభిప్రాయం.
ఈ వ్యాసానికి ఆలంబనలుగా పలు రెఫరెన్సులు, ఆ తర్వాత అనుభంధంలో పలువురి అభిప్రాయాలు ఇవ్వడం జరిగింది. ఐతే ఇక్కడొక్క విషయం చెప్పదలుచుకున్నను. ఈ నాటకవేవీ అతి క్లిష్టవైన scientific concept కాదు. ముందు వెనుకల చరిత్ర పఠనం, క్రొత్త పరిశోధనా పద్దతులు, కనీసం పాత పరిశోధనా పద్దతులు, గతితార్కిక భౌతికవాదం, మాక్సిస్టు వివరణలు, హైజాకులు, ఇవేవీ అవసరం లేకుండానే గురజాడ వారు ఏంచెప్పేరో, ఎందుకు చెప్పేరో, ఏ తప్పుల్ని హైలైట్ చేయదలుచుకున్నరో, ఏ వాస్తవాల్ని, ఏ మూఢత్వాల్ని, ఏ నీచాల్ని, ఏ అవినీతిని, మనుషుల్లో వుండే ఏ మంచి చెడుల్ని, మంచి మనుషులనబడే వాళ్ళలో ఏ చెడ్డని, చెడ్డవాళ్ళనబడే వాళ్ళలో ఏ మంచిని, ఆ కాలపు సంఘానికి తలమానికవనబడే కులంలో కనపడే నీచ సాంప్రదాయాల్ని, అతి సళంగా, అతి మెలుకువగా, ఎక్కడా ఏ విమర్శకుల, విశ్లేషకుల అవసరంలేకుండా, అతి సామాన్య పాఠకుడికి సైతం అర్థవయ్యేరీతిలో చెప్పేరు. ఈ నాటకంలో, అక్షరంలో కనపడని వివరణలకోసం, విశ్లేషణలు చేయడవంటే, చురుక్కుమనే నిజవేదో కన్యాశుల్కంలో మనకి తగిలిందనమాట.
మూడో ముద్రణ గురించి vamshi గారి అభిప్రాయం:
09/24/2007 1:01 am
చాలా బాగుంది. కాని చాలా ఆలస్యంగా చదివాను.
కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి Krishna Rao Maddipati గారి అభిప్రాయం:
09/21/2007 11:02 am
కన్యాశుల్కం నాటకం గురజాడ వారు నిజంగా సంఘసంస్కరణోద్దేశంతోనే వ్రాశారో లేక వీరేశలింగం పంతులుగార్ని ఆట పట్టించడానికే వ్రాశారో ఆ చరిత్రనధ్యయనం చేసినవారు చెప్పాలి గాని నాలాంటి వాడి వల్ల కాదు. నేనీ నాటకాన్ని మొట్టమొదటిసారిగా 1970లో చదివినట్టు గుర్తు. నాటకం చదివే ముందు ఆ నాటకం గురించి ఒకటి రెండు వ్యాసాలు కూడా చదివినట్టు గుర్తు. ఈ నాటకం చదవడానికి ప్రేరణ ఆ వ్యాసాల్లో చదివిన విషయాలు – ముఖ్యంగా సాంఘిక దురాచారాల్ని రూపుమాపడానికి ఈ నాటకం ఎంతగా ఉపయోగపడిందో, చెప్పదల్చుకున్న విషయాన్ని హాస్యరసభరితంగా చెప్పాడో రచయిత అని చదవడంవల్ల. సరే నాటకం చదివితే కలిగే అనుభూతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే అప్పట్లో నన్ను కొంచెం తికమక పెట్టిన విషయం, మధురవాణి, సౌజన్యారావు పంతులు మధ్య జరిగిన సంభాషణ. సౌజన్యారావంతటి ఆదర్శ న్యాయవాది, మధురవాణి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక పోవడం. ఇందులో ఏదో నాకు తెలియని అంతరార్ధం ఏదో ఉందని అనిపిస్తున్నా, అది ఇదమిద్ధంగా తేలలేదు. సౌజన్యారావు చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదేమోననిపించినా, ప్రశ్నించడానికి ధైర్యం, అనుభవం చాలలేదు. దానిక్కారణం చాలావరకు అంతకు ముందు చదివిన వ్యాసాలు కూడా కారణమనుకుంటాను (వ్యాసకర్తలు గురులేరు). ఆ తర్వాత సినిమా చూడడమేగాని మళ్ళీ పుస్తకం చదవలేదు. ఇన్నాళ్ళ తర్వాత వెల్చేరు గారి అనువాదంలో ఉన్న మలిపలుకు చదువుతున్నప్పుడు ముప్పైయేడేళ్ళనాటి ప్రశ్నలు మళ్ళీ గుర్తుకు రావడం, వాటికి సమాధానాలు దొరకడం కూడా జరిగింది. కన్యాశుల్కం నాటకానికి అప్పట్లో సామాజిక ప్రయోజనం ఉన్నా, రచయితకు సంఘసంస్కరణోద్దేశం ఉన్నా, సంఘసంస్కర్తల్లో ఉన్న హిపోక్రసీని మాత్రం చక్కగా అద్దంలో చూపిస్తుంది. పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్న వారిలోని ద్వంద ప్రవర్తనలకి (అగ్నిహోత్రావధాన్లు, రామప్పంతులు, వగైరా) అద్దం పట్టడం సరేసరి. సౌజన్యారావుకి మిగిలిన పెద్దమనుషులకీ ఆట్టే తేడాలేదనిపిస్తుంది, చివరి ఘట్టం చదివేటప్పటికి. ఇది నాటకం చదివినప్పుడు అర్ధంకాకుండా కుమ్మరి పురుగు తొలిచినట్టు వేధించి, ఇన్నాళ్ళకి వెల్చేరు గారి మలిపలుకుతో తేలికపడింది. ఇంతవరకు ఈ నాటకంపై ఎంతమంది వ్యాఖ్యానాలు చేసినా, ఇంత సమగ్రంగా మొత్తం నాటకానికి సరిపడే విశ్లేషణ వ్రాసిన వెల్చేరు గారికి ధన్యవాదాలు. ఈ నాటకంపై ఉన్న రకరకాల వ్యాఖ్యానాల దృష్ట్యా వెల్చేరు గారు ఈ విశ్లేషణను తెలుగులో కూడా ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అరణ్య కవితలు గురించి Alok గారి అభిప్రాయం:
09/19/2007 4:04 am
అయ్యా తిమ్మిరెడ్డిగారు…అసలు విషయాని మీరిట్టా బమ్మిని చెయ్యడం సమయోచితంగాలేదు. మీలెక్కన రారా, చేరా వగైరాల్ని తోసవతల పారేద్దాం. ప్రతి దద్దమ్మనీ కవిత్వం గురించి రాసేయమనేద్దాం. కత్తెర పట్టుకొన్నాడుగదాని దర్జీని కూడా ఆపరేషను ధియేటర్లోకి వొదిలేద్దాం.
పాఠకుడిగా విఫలమైన క్రిష్న గారు విమర్శకుడిగా అవతరించడంతోనే సిసలైన అసంబద్ధత బయలుదేరింది. సదరు అసంబద్ధత మాబాదిగ గారితో పరుగులెట్టడం మొదలెట్టింది. చివరకు క్రిష్నగారు ఆవకాయ గురించి అనర్గళంగా ప్రసంగించడంతో శిఖరాగ్రం చేరింది. హమ్మయ్య అక్కడితో అసంబద్ధం శాంతించిందని సంతోషించేలోగా మీతో మళ్ళీ మొదలైంది. ఈ విపరీత అసంబద్ధత ముందు మీరు నాకు ఆపాదించిన “అసభ్యత” యేపాటి?
//కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం// అని అనడం మీ సభ్యతేవో !! కానివ్వండి.
రవిశంకర్ గారి కవితలో విస్తరణ దోషముంది. సాగతీత వుంది. మీరన్నట్టు సూపర్ కండక్టివిటీ, రేడియోయాక్టివిటీ గట్రా యేవీ లేవు. మీరుత్తినే ఆపాదించేస్తే సరిపోదు. మీమాటల్లోనే చెప్పాలంటే “కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని వానపాట ద్వారా రవిశంకర్ గారు నిరూపించారనే నేననుకుంటునాను”
మఠాధిపతులు, పీఠాధిపతులు,ముఠాధిపతులు వీరంగం జేస్తున్న వర్తమాన తెలుగు సాహిత్య ప్రపంచంలో స్వచ్ఛమైన అక్షరం కోసం తపించడం నేరం.భుజకీర్తులు భజనబృందాలు లేకపోవడం లోపం.వాదాలు బూజులు దులుపుకోవడం ద్రోహం.
అరణ్య కవితలు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
09/16/2007 12:35 pm
కవిత్వం గురించి ఫలాని, ఫలాన వాళ్ళు ఏం చెప్పేరో, విమర్శ గురించి, విశ్లేషణ గురించి ఏఏ పెద్ద తలకాయలు ఏం చెప్పెయో తెలుసుకున్న వాళ్ళే విమర్శ చేయదగ్గ వాళ్ళనే స్వరం వొకటి ఈ కవిత మీద వచ్చిన అభిప్రయాల్లో వినిపిస్తుంది. ఐతే వాళ్ళు చెప్పిన కవిత్వ లక్షణాలు కానీ, వాళ్ళు కవిత్వానికిచ్చిన నిర్వచనాలుగానీ, వాళ్ళు స్థిరీకరించిన విష్లేషణా పద్దతులు కానీ తెలీకుండానే, తెలుసుకోవాల్సిన అవసరంలేకుండానే, తెలుగొచ్చిన ప్రతివాడికీ, ఫలాని కవిత తనకు నచ్చిందో, నచ్చలేదో, నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పగలీగే ఙ్ఞానం వుందని నా నమ్మకం.
కృష్ణ గారి అభిప్రాయంతో మొదలైన ఈ చర్చ, మూలా సుబ్రహ్మణ్యం గారి జవాబుతో దారి తప్పిపోయి, అలోక్ గారి అభిప్రాయంతో అసభ్యత వైపు జారిపోయిందేవో అనిపిస్తుంది. “మీకు కనబడనంత మాత్రాన అసలు నీరే లేదనేంత అవివేకులు కారని,” కృష్ణ గారికి మూలా గారు జవాబియ్యటంతోనే అసంబద్దవైన వాదం మొదలైందనిపిస్తుంది. ఒక కవితలో వుండేటటువంటి అందాన్ని, అర్థాన్ని, అనుభవాన్ని, అనుభూతిని కష్టపడి తవ్వితీయవలసిన అగత్యం, అవసరం పాఠకుడికి లేదనే నేను భావిస్తాను. రచయిత తన అనుభవాన్ని, తనలోని ఉద్వేగాన్నీ కవిత ద్వారా పాఠకుడికి ట్రాన్ఫర్ చేయలేకపోవటం ఆ రచన బలహీనతని సూచిస్తుందే తప్ప పాఠకుడి అవివేకాన్ని కాదు. ఉదాహరణల కోసం ఎక్కడకో పోవాల్సిన అవసరం లేదు, ఇదే సంచికలో ప్రచురించబడినట్టి విన్నకోట రవిశంకర్ గారి “వాన-పాట” నే ఉదాహరించ వచ్చు. అందం, భావుకతా రెంటిలోనూ వుండొచ్చు, కానీ వాన-పాటలో వున్నటువంటి కవితకి ఆత్మలాంటి ఆ సూపర్కండక్టివిటి, రచయిత ఎమోషన్ ని పాఠకుడి మనసులోకి ట్రాన్ఫర్ చేసి, కవిత చదివేసిన తర్వాత కూడా, మనసుని వదలిపోని వొక ఉద్వేగాన్ని సృష్టించగలిగే ఆ శక్తి మూలా గారి కవితలో లేదు. కొందరు మూలా గారి కవిత చదివి అడవికి పోయినంత అనుభూతి పొందగలిగేరని తెలుస్తుంది. అంత అద్రుష్టం నా బోటి సామాన్య పాఠకులకి లేదేవోనని నా అభిప్రాయం. దళిత కవిత్వం, లేక అయావాద కవిత్వాలని తలకెక్కించుకోని ఈ అభిప్రాయం చెబుతున్నానని, లేక ఫలాని వారి విమర్శనాత్మక పుస్తకం చదవకపోవటం వలననో, లేకపోతే నా సహజవైన అవివేకంవలననో ఈ కవితమీద ఈ అభిప్రాయానికి వచ్చానని ఎవరైనా భావిస్తే వారి వివేకానికి సంతోషిస్తాను. కొంచం భావుకత, నాలుగు సున్నితవైన, అందవైన పదాలు కవిత కాలేవని అరణ్య కవితల ద్వారా మూలా గారు నిరూపించారనే నేననుకుంటునాను.
సాయము శాయరా డింభకా! గురించి sujatah Srinivas గారి అభిప్రాయం:
09/15/2007 7:17 am
మన పిల్లకు ప్రాణం మీదకు వచ్చినప్పుడు, మనకు ఆసరాగా నిలబడ్డవాళ్ళు కాకపోతే, మనోళ్ళు ఇంకెవరండీ? వాళ్ళకు సాయం చేసే అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అంతే! బావమరిది వస్తే? వుంటాడు! నవీన్ వాళ్ళు వీళ్ళకు ఎంత పెద్ద help చేశారో, చెప్పి మరీ వెళ్లాలి. నా ఉత్తమార్థభాగం సతీష్ స్థానంలో ఉంటే, airport నుండి, సరాసరి నవీన్ వాళ్ళింటికే వెళ్ళి,అక్కడ్నించి నాకు ఫోన్ చేసి, వాళ్ళ పని పూర్తి అయ్యాక ఇంటికొస్తాడు. అవసరమైతే నన్ను కూడా రమ్మంటాడు. అందుకు నేనేం అభ్యంతరం చెప్పను. నేనేదో గొప్ప చెప్తున్నాననుకోకండి! మేము USA లో ఉన్నప్పుడు, నవీన్ లాంటి అనుభవాలే మాకూ కొన్ని ఎదురయ్యాయి.కాని మేము మాత్రం, reviev గారు చెప్పినట్టు,
సాయం చెయ్యడమే మన ధర్మం,
మనకు అక్కరకు రావడమా, మన కర్మం..
అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నాం! అవుతూనే ఉంటాం!
ఎదుటి మనిషి అవసరానికో, కష్టానికో, స్పందించలేకపోతున్నామూ..అంటే, మానవత్వం నెమ్మదిగా మనలోంచి జారుకుంటోందన్నమాట! (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం)
కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
09/11/2007 7:56 am
న్యాయంగా, వేల్చేరు వారి పుస్తకం చదవకుండా నేనేమీ comment చెయ్యకూడదు. కానీ ఈ సమీక్షలోని కొన్ని విషయాలు ఆసక్తిని కలిగించడం వల్ల ఇది రాస్తున్నాను.
“ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ;”
ఇది వేల్చేరువారి ఊహో వేలూరివారి ఊహో తెలియదుకాని వీరేశలింగాన్ని వేళాకోళం చెయ్యడంగా ఊహించడం కొంత అతిశయంగా తోస్తోంది. గురజాడకి కందుకూరి మీద గౌరవం ఉందన్న విషయం అతని డైరీలూ, ఉత్తరాలూ చదివితే తెలుసే విషయమే. అందుచేత అతన్ని వేళాకోళం చేసేడని నేననుకోను. అతను చేపట్టిన సంఘ సంస్కరణలోని పరిమితులని వ్యంగ్యంగా సూచించేడని మాత్రమే చెప్పగలం. అలాగే రచయిత ముఖ్యోద్దేశం సంఘసంస్కరణ కాదు అనడం కూడా పూర్తిగా సమంజసం కాదు. ఇక్కడ సంఘసంస్కరణ అంటే వీరేశలింగంగారు చేపట్టిన సంఘసంస్కరణ అన్న ఉద్దేశంలో అన్నారా? సంఘంలోని లోటుపాట్లను ఎత్తిచూపడం ద్వారా కూడా సంఘాన్ని సంస్కరించే ప్రయత్నం చెయ్యవచ్చు అని ఒప్పుకుంటే, గురజాడ కన్యాశుల్కంలో ఆ ప్రయత్నం చేసాడన్నది ఒప్పుకోవలసిన విషయం.
“నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ”
ఒక్క మధురవాణి పాత్ర తప్ప, మిగతా అందరూ తమ తమ స్వార్థం కారణంగానే సుబ్బి పెళ్ళి ఆపడానికి సాయపడతారు. ఇందులో ఆనాటి సమాజం అటువంటి పెళ్ళికి వ్యతిరేకం అన్న విషయం ఎక్కడా కనిపించదు.
లుద్ధావధానుల పాత్రలోని పరివర్తన ద్వారా ఆనాటి ప్రజలలో రావల్సిన మార్పును సూచించాడు. చివరికి బుచ్చమ్మను కూడా సంస్కరణోద్యమంలో భాగమైన విధవల పునరావాస కేంద్రంలో చేర్పించడం ద్వారా తన సంఘ సంస్కరణాభిలాషని చాటుకున్నాడు.
అసలు గురజాడే స్వయంగా ముందుమాటలో
“When I wrote the play, I had no idea of publication. I wrote it to advance the cause of Social Reform and to combat a popular prejudice that the Telugu language was unsuited to the stage. ” అని చెప్పుకున్న తర్వాత, సంఘసంస్కరణ అతని ముఖ్యోద్దేశం కాదని అనడం చాలా సాహసమే! మరి అతనన్న “Social Reform” ఏమిటి?
నా ఉద్దేశంలో. కన్యాశుల్కం రచనా ధ్యేయం, ముమ్మాటికీ, సంఘంలోని లోటుపాట్లని ఎత్తిచూపడం ద్వారా సంఘసంస్కరణకి దోహదం చెయ్యడమే. ఐతే గురజాడ ఆధునిక నాటకాలలోని వాస్తవికతా లక్షణానికి ప్రభావితుడై, తన నాటకంలోపాత్రలని మూస పాత్రలుగా కాక, సమాజంలోని వివిధ రకాల మనుషులని వారి సహజ స్వాభావాలకి దగ్గరగా తీర్చిదిద్దాడు. ఈ కారణం వల్లనే మనకి నాటకంలో అటు మత మౌఢ్యంతో దురాచారాలకి పాల్పడే వారూ కనిపిస్తారు, ఇటు ఆధునికత/సంస్కరణ పేరుతో మోసాలుచేసే ఆసాములూ కనిపిస్తారు.
కన్యాశుల్కంలో మచ్చలేని (ఆ కారణంగా పూర్తిగా కాల్పనికం అనుకోదగ్గ) ఒకే ఒక పాత్ర మధురవాణి.
Velceru garu might have given more explanation on his proposition in the book and thus answers to my above questions/argument. But as I said, my curiosity has prompted me to put my comments here.
అరణ్య కవితలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
09/10/2007 4:55 pm
ఈ కవితను చదవగానే, ప్రత్యేకముగా చివరి పంక్తులను,
ఎందుకో నాకు విల్లియం వర్డ్స్‌వర్త్ వ్రాసిన క్రింది పద్యము
జ్ఞాపకానికి వచ్చింది. చాల మంది ఈ పద్యాన్ని బడిలో
చదివే ఉంటారు. ఆ పద్యము –
She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love:
A violet by a mossy stone
Half hidden from the eye!
Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!
మోహన
అరణ్య కవితలు గురించి Alok గారి అభిప్రాయం:
09/07/2007 10:42 pm
ఓహో మీరు క్రిష్న గారు కాదా? కానీ మీరిద్దరూ గుంటూరు శేషేంద్రశర్మ గారినే ఉటంకిస్తారా? “వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? ” అని క్రిష్న గారంటే “అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా” అని మీరడిగారు. ఇద్దరి వాదనలూ అర్ధరూపాయి గాదు రెండు పావలాలన్నట్టే వుంది !! సర్లేండి మీరిద్దరూ ఒకటా వేరా అన్నది దండగమారి విషయం.
“కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ”
మీలాంటి లోతైన అధ్యయనశీలి కం పాఠకుడు ఇట్టాంటి ఉబుసుపోని ప్రశ్న వెయ్యడం విచారకరం. లాజిక్కు లేనిదంతా కవిత్వమా అన్న ప్రశ్నలో మీ భోళాతనం, నేటి తెలుగు సాహిత్య పాఠకుని దివాలాతనం కనపడుతోంది. సంతా సింగు బంతాసింగు జోకుల్ని కూడా అద్భుతమైన కవిత్వం అనే మరో తరం త్వరలోనే పుట్టుకొచ్చే సూచనలు కనపడుతున్నాయ్.
కవిత్వానికి లాజిక్కు బద్ధశతృవు. సృజనాత్మకతకు లాజిక్కే పునాదైతే క్రిష్న గారు ఇక్కడే వున్న రవిశంకర్ గారి కవితలో “అద్భుతమైన చిత్రా”న్ని ఎట్లా చూడగలిగారో లాజికల్ గా చెప్పమనండి. పూలదోసిళ్లతో చెట్లు నీళ్ళు పట్టుకోడమేవిటి? చలిగాలి మనసుని కోయడమేవిటని కవిగారు వచ్చి లాజికల్ గా వివరించనివ్వండి. ఇంత లాజికల్ సర్కసూ జరిగాక కవిలోనూ, పాఠకునిలోనూ సున్నితత్త్వం, సృజన బతికుంటుందో లేదో మీరొచ్చి చెప్పండి.
“ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది” అని క్రిష్న గారు అసంబధ్ధంగా బాధ పడగాలేంది నేనేసిన ప్రస్న ఎట్లా అసంబద్ధం మాబా గారూ? ఈ కవితలో కవెక్కడా భాషని చట్టుబండలు కానివ్వలేదే? ఇక్కడెవరో “అల్లాష్టకం” అని రాస్తే గౌ. సంపాదకులు గారు దాన్ని కవిత్వం కింద జమకట్టారు. ఆ అల్లాష్టకం కంటే ఈ కవితేమీ ఘోరంగా లేదే? మరి క్రిష్న గారు సడెన్ గా భాష గురించి కిందా మీదా పడ్డం అవసరమేనా? సంబద్ధమేనా?
ముందు వీటికి సూటిగా ఇద్దరూ కూడబలుక్కుని సమాధానాలివ్వండి. సెలయేటి అలల గురించి చెప్పడం ఆనక….
చివరగా, రాగాల గురించి తెల్సుకొన్నవారు సంగీతాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలరు. పాడాలని వుంది కార్యక్రమంలో పాల్గొన్న 10 ఏండ్ల పాపకు కూడా ఈ సంగతి తెల్సును.
కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/04/2007 10:30 am
కన్యాశుల్కం గురించి ఎందరో ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు, చేస్తున్నారు. రచయితగా, నాటకకర్తగా ఎంతో ప్రతిభావంతుడైన అప్పారావుగారు ఈ నాటకం చదువుతున్నప్పుడు మనకు సంఘసంస్కర్త రూపంలో కాక తీవ్రమైన విమర్శకుడుగానూ, వ్యాఖ్యాతగానూ కనిపిస్తాడు. ఆయన విమర్శించిన విషయాల్లో సంఘ దురాచారాలూ ఉన్నాయి; సంఘసంస్కర్తలుగా చలామణీ అవుతూ పబ్బం గడుపుకునే దగాకోర్ల వ్యవహారాలూ ఉన్నాయి.
ఈ రోజుల్లో అనాథాశ్రమాలు నిర్మించి డబ్బులు దండుకునేవాళ్ళున్నట్టే ఆ రోజుల్లోనే వీరేశలింగంగారు సదుద్దేశంతో తలపెట్టిన మంచి పనులను దుర్వినియోగం చేసుకునేవారూ ఉండేవారనే సంగతి ఈ నాటకంవల్ల మనకు తెలుస్తుంది. ఎటొచ్చీ ఇటువంటి ఆషాఢభూతుల వల్ల కలిగే హానికన్నా సంఘంలో ప్రవర్తిల్లుతూ ఉండిన దురాచారాలు ఎక్కువ ప్రమాదకరం కనకనే కన్యాశుల్కం నాటకాన్ని వాటిని ఎత్తిచూపినదిగా అందరూ గుర్తించారు.
నాటకమంతా డామినేట్ చేసిన గిరీశం కుయుక్తులను ఎవరూ మిస్ అవరు. సంఘసేవను తప్పుదోవ పట్టించ ప్రయత్నించినవాడుగా అతను కనబడుతూనే ఉంటాడు. అయితే అతని వ్యక్తిగత దోషాలూ, బలహీనతలూ సంఘ దురాచారాలంత తీవ్రమైనవిగా అనిపించవు. అందుకే మనం అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతులు తదితరుల వైఖరిని ఎంతో గర్హనీయంగా పరిగణిస్తాం. గిరీశాన్ని చూసినప్పుడు మాత్రం ‘బాగా అయింది శాస్తి’ అని నవ్వుకుంటాం. పై వర్గంతో పోలిస్తే గిరీశం అంతటి దుర్మార్గుడుగా మనకు అనిపించడు. పైగా నాటకంలో గిరీశం ఒక్కడే ఆధునికుడు. అయితే ఆధునికతలోని ఇతర లక్షణాలతో బాటు దాని అవలక్షణాలూ అతనిలో ఉంటాయి. పాతుకుపోయిన దురాచారాలకు ప్రతీకలు వారైతే వారి అవివేకాన్ని ఆసరాగా చేసుకుని లాభం పొందేవారికి ప్రతీక గిరీశం.
మొత్తం మీద అన్నీ వాస్తవికత ఉట్టిపడే పాత్రలే. సజీవమైనవే. అందుకే కన్యాశుల్కం అందరికీ ప్రీతిపాత్రమైంది. మార్క్సిస్టులు కనాశుల్కాన్ని హైజాక్ చేశారని నేననుకోను. (వారికి నచ్చింది కదా అని దాన్ని మరికాస్త అనుమానంతో చూడాలనీ అనుకోను). ఎవరికి నచ్చిన అంశాలను వారు మెచ్చుకుంటారు. ఈ నాటకానికి వీరాభిమానుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు వంటి ఉద్దండులుండేవారు. మనకన్నా అప్పటి పరిస్థితులు వారి తరంవారికి మరింత బాగా తెలుసు. తక్కినవన్నీ పక్కన పెట్టినా కేవలం భాష, యాసల విషయంలో కూడా చాలామందికి అదెంతో ఆహ్లాదకరమైన రచన.
అప్పటి సామాజిక సమస్యలు ఈనాడు లేకపోవచ్చు. ఇప్పటికీ మనలో ఎందరిలో అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతుళ్ళు, లేదా వారి లక్షణాలు, కనబడుతున్నాయనేదే ముఖ్యం. అందువల్లనే ఈనాటికీ కన్యాశుల్కం రెలెవెంట్ గా అనిపిస్తుంది.
చిలక – గోరింక గురించి Raghu గారి అభిప్రాయం:
08/29/2007 1:43 am
కథ లో సమస్య వివరించారు కాని పరిష్కారం చూపలేదు.ఆర్దిక స్వాతంత్ర్యం లేనపుడు బానిస బతుకు కింద లెక్క. కాని వ్యవస్త తీరు లో మహిళ బానిస కు బానిస మాత్రమే. మగవాళ్ళ జీవితం కూడా కార్యాలయాలలొ బానిస జివితమే కాదంటారా. ఇరువురి మద్య వ్యక్తిత్వ పోరాటం లో పిల్లల విషయం సమస్య గా మారుతుంది. నేను కథ చదువుతున్నపుడు అలాగే వెలుతుంది అనుకున్నాను. శశాంకె బాల్యంలో తను కొల్పోయిన ఆత్మీయత గురించి చెపతాడనుకున్నాను. ఉత్పత్తి కంటే పునరుత్పత్తి గొప్పది. పిల్లలని వుంచె క్రెచెస కి వెల్లి చూస్తె సంపాదన, వ్యక్తిత్వం, హక్కుల పోరాటం లో మద్యలో నిజంగా నలిగి పోతుంది వాళ్ళే అనిపిస్తుంది. కథలో చివరికి నలుగురిలో గుర్తింపు కోసమే ఉద్యోగం అనడం సమస్యను పక్కదారి పట్టించినట్టు అయింది. స్వేచ్చ కోసం చేసే పోరాటం గుర్తింపు కోసం చేసే పోరాటం వేరు. హక్కుల కోసం పోరాటం చెసేటపుడు ఇతరుల పట్ల బాద్యతను గుర్తెరుగుతారు. ఉమ్మడి కుటుంబాలను హొల్డ్ చెసే ఓపిక, బాద్యత తక్కువ అవుతున్నపుడు మద్యలో నిజంగా కొల్పోతుంది పిల్లలే. బ్లాగ్ గురించి తెలిసి ఈ రొజే ఒపెన్ చేసి నా అబిప్రాయం చెపుతున్నాను. మొదటి సారి తెలుగు లో వ్రాయడం (టయిప్ చేయడం ఇబ్బంది ఐంది) స్పష్టంగా చెప్పలేకపొతే అన్యద బవించకండి.
“చందమామ” జ్ఞాపకాలు గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
08/10/2007 6:44 pm
చందమామ మా నాన్నగారు కొని తెచ్చేరోజున దాన్ని మొదట చదవటానికి మా ఇంట్లో మేమంటే మేమని కొట్టుకొన్న రోజులున్నాయి. ఆ పత్రిక పిల్లలకు మంచి బుధ్ధులు నేర్పే మరో ఉపాధ్యాయుడితో సమానం. పత్రికను గురించిన మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు. కాని కే.వి.రెడ్డి మరియు చక్రపాణి లాంటి వారు అసలు రచయిత పేరు లేకుండా కథలు రాయించేవారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
న త్వం శోచితుమర్హసి గురించి Dileep గారి అభిప్రాయం:
08/06/2007 3:00 pm
ఏమి చెప్పావుబ్బా భలే చెప్పావు, ఈ కథకు కథలోని పాత్రకు అలాగే నా నిజ జీవితంలోని సంఘటనకు చాలా దగ్గరి సంబంధం వుండాది. ఇది చదివినంత సేపు నాకు మావాడు కళ్లలోనే కనిపించాడు. మాకు వందపైనే అవులు వుండేవి కాని వాటికి పుట్టిన వాటిని నాటు గిత్తలు అనేవారు. వాటికంటే దేశపు ఎద్దులు బాగా నాజుకుగా వుంటాయి. అలాగే పనికూడా బాగ తొందరగా చేస్తాయి. అందుకని మా నాన్న ఒక కాడి అవి ఒక కాడి నాటు గిత్తలు పెట్టేవాడు. అందరి అలోచన కూడా అదే. అందుకే వ్యాపారము చేసే వాళ్ళు మా పక్క ఊరైన నీలకంఠరావు పేటకు ఈ దేశపు దూడలను తెచ్చి అమ్మేవారు, మా అమ్మ నాన్న కూడా ఉదయాన్నే పాలు పోయడానికి ఆ ఊరు వెళ్ళేవారు. అక్కడ మావాడి అందం, కాళ్ళు, కొమ్ములు, రంగు నచ్చి తీసుకొచ్చారు. మావాడు అన్నిటితో పాటే చాలా తెలివైన వాడు, చలాకి గాడు. మా ఇంటి కొచ్చిన కొన్ని రోజుల్లోనే మాతో బాగా కలిసి పొయాడు. వీడిని చిన్న పిల్ల వాడిలా చూసుకొనే వాళ్ళు. అన్ని అవులున్నా వాటితో పాటు మందలో తోలేవాళ్ళు కాదు, మా అమ్మ దుల్ల కు గరిక తేవడానికి మా గదగుండ్లబావి దగ్గరికి వెళ్ళేటపుడు వీడిని కూడా తీసుకెళ్ళి మేపుకొచ్చేవాళ్ళు. అలా అల్లారు ముద్దుగా పెంచాము. వీడిని మా గదగుండ్ల బావి దగ్గరికి తీసుకొని పోవడానికి పగ్గము అవసరము లేదు బుద్ధిగా మా వెనకాలే వచ్చేవాడు. నాక్కూడా తెగ నచ్చాడు. నన్ను చూస్తే అలా మెడ పైకి ఎత్తుకొని దగ్గరికి వచ్చేవాడు, ఎందుకంటే మెడ కింద నెమరించుకొవడము చాలా ఇష్టం వాడికి.
నేను కూడా అల్లరే, చదువు అంతగా ఎక్కేది కాదు, పొలం దగ్గరకు వెళ్ళడము మహా ఇష్టం. అందులొ ఆ మధ్యే మా లెక్కల్ మాస్టారును తిట్టానని మా నాన్న చెవిలో పడింది. నేను ఏమి తిట్టలేదండి – మా మాస్టారు రెండు మూడు గైడులు ముందరెట్టుకొని బోర్డు పైన అన్ని విధాల సమాధానాలు వ్రాసేవాడు. అందులో ఆ రోజు అతను ఏదో తికమక పడ్డాడు, అందుకే మార్చి మార్చి సమాధానాలు చెప్పాడు. సరే అని నేను వూరుకోకుండా నా పక్క వాడితో “ఈ గుడ్డి సారుకు కనిపించి సావలేదు అందుకే మార్చి మార్చి సమాధానాలు చెపుతున్నాడు” అన్నా నా పక్క వాడితో. అంతే, ఇంక వాడు మంచిగా చేతులు కట్టుకొని నేను అన్నమాటలు మాస్టారుకు చెప్పెసాడు. మనకు వల్లు వాగింది, విషయం ఇంటిదాక తెలిసింది. ఇంక లాభం లేదని చదువు మానిపించారు.
అప్పుడు మావాడు మంచి రంజుమీదున్నాడు, ఆ నడక ఆ ధీమా, ఎకర పొలం ఇరసాలు ఏమిటి, నాలుగు సాల్లు ముల్లు కర్ర లేకుండానే దున్నేస్తా అనేటట్టుగా. అయితే మాది రాళ్ళ చేను (అందుకే దాని పేరే “రాళ్ళచేను “). అందుకే పని ఎక్కువ అవడంతో మనవాడికి ఒక తెల్లదొర గాడిని జత తెచ్చారు. వీడు కూడా మంచి ఆరు అడుగుల అందగాడు, నాకు వీళ్ళంటే ఎంతో ఇష్టం. ఆ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. మావాడికి, ఈతెల్లదొరగాడికి, నాకు బాగా షాడకేసే పని వచ్చి పడింది. మా నాన్న సామాన్యంగా ఒప్పుకోడు. బాగా పొలం దుక్కి పట్టాలంటాడు. ఆవిధంగా ఒక నెల రోజులు రోజూ బురదలో పనే. వరి నాట్లు వేసారు. పని అయితే అయింది కాని మా వాడు బాగా మెత్తపడ్డాడు (“మెత్త కాళ్ళు పడ్డాయి”). మామూలుగా అలా బుడదలో పని వస్తే ముందే లాలాలు (కాళ్ళకు కిందా ఇనుప ముక్కలు) కొడతారు చెప్పులు లాగా. అవిలేకపొవడం వల్ల గట్టలు బాగ మెత్తపడ్డయి. ఇద్దరు నడవలేక పొతున్నారు, నాకు చాలా బాధేసింది. సరే అని ఎవరికి చెప్పకుండా నాతో వున్న డబ్బులతో మా ఊరికొచ్చిన సాయిబు దగ్గర లాలాలు కొట్టించడానికి తీసుకెళ్ళాను.
మా అమ్మ ఒక వైపు చెపుతూనే వుంది (వాటికి లాలాలు కొట్టాలంటే బలవంతంగా కింద పడుకోబెట్టాలి) ఇంతకు ముందు అవి ఎప్పుడు లాలాలు తొడిగించుకోలేదు, వద్దు నాయనా అని. కాని అప్పుడు మా అమ్మ చెప్పేదానికంటే నాకు వాటిమీద ఉన్న ప్రేమతో లేదు ఎలాగయినా కొట్టించాలని తీసుకెళ్ళాను. మన వాడు బుద్ధిగా తొడిగించుకున్నాడు. ఇంకా తెల్లదొరగారికి కొంచం భయం ఎక్కువ, పడుకోలేదు. సాయిబు, మాఊరిలో వేమయ్య ఇద్దరు కలిసి బలవంతంగా పడుకోబెట్టారు. అంతా అయిపోయింది. లేపితే లేచి ముందు కాళ్ళపైనే నిల్చుకుంది. నాకు తెలియలేదు ఎమి అయిందో. ఇంటికి తీసుకెళ్ళాను. అందరు చూశారు కాలు బెసికింది అన్నారు. మా రామయ్య పెద్దనాన్న ఏవో పసుర్లు పూసాడు. ఏమి లాభం లేదు. ఇంక ఎవరిసలహాతోనో కలిపైన వాత పెట్టారు. అయినా బాగా కాలేదు. జోడు తప్పింది. ఇద్దరినీ విడదీసారు. మా వాడిని అమ్మేసారు ఎవరికో. చాలారోజులు నేను బాధపడ్డాను, నా మూలంగానే కాలు పోయిందని. చాలాకాలం వరకూ ఇవి నా కలల్లో ఎక్కువగా కనిపించేవి. మీరు మీ కథ తో మళ్ళీ వాటిని గుర్తు తెచ్చి నా కళ్ళలోకి నీళ్ళు తెప్పించారు.
దిలీప్.
గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
07/31/2007 6:29 am
సి.ఎస్.రావుగారి ప్రోత్సాహానికి కృతజ్ఞత చెప్పాలి.
సంగీతంలోని నా వ్యక్తిగత అభిరుచే కాక ఈ వ్యాసాలకు మరొక ప్రేరణ కూడా ఉంది. ‘హిందూస్తానీ సంగీతంలో ఇందరు గొప్పవారు ఇంతటి కృషి చేస్తూ ఉంటే విని మెచ్చుకున్న తెలుగువారే లేరా?’ అంటే ఉన్నారనే చెప్పాలి. ఎటొచ్చీ సదాశివ, నండూరి పార్థసారథి మొదలైన కొద్దిమంది తప్పిస్తే ‘రాసేవాళ్ళు ఆ సంగతి పట్టించుకోరు; సంగీతాభిమానులు రాయ (లే) రు’ అని నా కనిపిస్తుంది. అందుచేత తెలుగువారి తరఫునా (‘వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను’ అంటే అతిశయోక్తి అవుతుందేమో కాని) ‘వాహ్, ఉస్తాద్’ అనాలని నా కోరిక.
కారణం తెలియదుగాని సంగీతం విషయంలో తెలుగువాళ్ళు కాస్త ‘అణగిమణగి’ ఉండడం కనిపిస్తుంది. కర్ణాటక కచేరీల్లో తమిళులు పంచెలు కట్టుకుని హడావిడిగా, అట్టహాసంగా తిరుగుతారు కాని ప్రేక్షకుల్లో 30 శాతం ఉండే తెలుగువారు మటుకు చడీచప్పుడూ కాకుండా హాజరయి వెళిపోతూ ఉంటారు.
ఇక రచన మాటకొస్తే ఇందులో అమీర్ ఖాన్ ప్రతిభే ప్రధానం. నేను పంపిన ఆడియో లింకులు వింటూ తాను చేపట్టిన ప్రూఫ్ రీడింగ్ సంగతే మరిచిపోయానని సంపాదకులు అన్నారు. అంతకన్నా మంచి నిదర్శనం అనవసరం.
గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి C.S.Rao గారి అభిప్రాయం:
07/30/2007 6:26 pm
ఖండాంతరాల లో సాంకేతిక పరమైన ఉద్యోగాలు చేస్తూ తెలుగు సాహిత్యంలో, సంగీతం లో వివిధ సాంస్కృతిక కళా రూపాలలో,సంప్రదాయ రీతులలో అభిరుచి,అభినివేశం కలిగి సాధికారికంగా రచనలు చేస్తున్నవారిని చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతుంది,ఆనందం వేస్తుంది.వీరికి ఇంత తీరిక ఎక్కడదా అన్పిస్తుంది.బహుశా వారి కృషిని సులభతరం చేస్తున్నది వారి expert computer access capabilities అయి ఉండవచ్చుననుకుంటాను.
ప్రఖ్యాత హిందూస్తానీ గాయకులు ఉస్తాద్ అమీర్ ఖాన్ గారి మీద రోహిణీప్రసాద్ గారి వ్యాసం చాలా బావుంది.దానికి కారణం రచయితకు సంగీతం పైన ఉన్న గాఢమైన ప్రేమ ,విషయ పరిజ్ఞానం,సరళమైన ,నిరాడంబరమైన,ఆకర్షణీయమైన భాషలో స్వానుభవం లోంచి వచ్చిన తులనాత్మక విశ్లేషణ.We find a blend of narrative and analytical elements which lends a pleasing comprehensiveness to the article.
వ్యాసం లో పేర్కొనబడిన సంగీత విద్వాంసులందరూ హిందూస్తానీ శాస్త్రీయ సంగీత సాధన ఒక తపస్సుగా సాగించటం భారతీయ సాంస్కృతిక ఔన్నత్యానికి అద్దం పడుతుంది.
వ్యాసమంతటా విషయ విపులీకరణ,విశ్లేషణే కాని రోహిణీప్రసాద్ గారు కనిపించరు.అది ఆయన egoless exposition ని ,openmindedness ని సూచిస్తవి.
రోహిణీప్రసాద్ గారు విషయపరమైన మౌలిక శోధనలో ,బాహిరమైన ఇతరేతర ప్రభావాలకు తాను లోను కాకుండా ఉండటం గమనార్హం,హర్షదాయకం.
అభినందనలు
C.S.Rao
నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/28/2007 10:56 am
రూపాల్లో భేదం – ఓ సందేహం
ముందుగా, తానా అవార్డు అందుకున్నందుకు వెల్చేరు గారికి అభినందనలు. తెలుగు భాష, సాహిత్య, చరిత్రలపై వారు చేస్తున్న నిర్విరామ కృషి ముందుతరాల వారికి మార్గదర్శకం. వేలూరి గారి వ్యాసం వెల్చేరు గారి బహుముఖ పాండిత్యానికి అద్దం పట్టేటట్లుంది..
కాని వ్యాసం మొదట్లో అన్న మాటలు – “వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది” – నన్ను చాలా తికమక పెట్టాయి. కాల్పనిక కథకి ఒక్క రూపమే ఉండటమేమిటి? దానిని అంత నొక్కి చెప్తున్నారంటే గొప్ప ప్రాధాన్యత ఉండాలి – అదేంటో నాకర్థం కాలేదు, వేలూరి గారివీ విప్లవ్ గారివీ ఉదాహరణలు సాయపడలేదు.
సరే, David Shullman అంత పండితుడికే అంతుపట్టని విషయం నాకు అవగతం కాదులే అని సమాధానపడ్డాను. ఇంతలో Dr. Mittapalli వ్యాసంపై నేను వెలిబుచ్చిన అభిప్రాయనికి బదులు రాస్తూ ఓ మిత్రుడు, చెప్పుకోదగ్గ చదువరి, వెల్చేరు రాసిన ఒక వ్యాసం – “When Does Sita Cease To Be Sita? Notes Toward a Cultural Grammar of Indian Narratives” – చదివారా అని అడిగారు. రామాయణం గురించి లవకుశ లాంటి సినిమాలు చూడటం వలన కలిగిన జ్ఞానం కన్నా మించి నాకు లేదు; అలాంటి లోతైన వ్యాసాలు నేనేమీ చదవలేదు మహానుభావా అనుకొని, ఆమధ్య Berkeley వాళ్ళు చవగ్గా అమ్ముతున్నారు కదా అని కొని చదవని ఓ రామాయణం పుస్తకం [1] ఇంట్లో ఉంటే దాంట్లో దీనికి సంబంధించినదేమన్నా ఉండొచ్చు అని తీశాను. దాని మొదటి పేజీలో ప్రస్ఫుటంగా వేసిన వెల్చేరు వాక్యం నన్నాకర్షించింది:
“Fiction has only one form. True story has inevitably many.”
దీన్ని నేను తెలుగులోకిలా తర్జుమా చేసుకున్నాను: “సామాన్య కథకి ఉండేది ఒకటే రూపం. కాని సజీవ కథకి సహజంగానే అనేక రూపాలుంటాయి.” నేను పైపైన చదివిన ఆ పుస్తకంలో రామాయణ కథకి గల అనేక రూపాలని వివరించారు. కాలం మారేకొలదీ, సామాజిక పరిస్థితుల్ని బట్టి ఈ కథ కెన్ని మార్పులూ చేర్పులూ చేరాయో విశ్లేషించారు. ఇది నాకర్థమయింది.
కాని ఆ తిరుపతి మండుటెండలో గంగమ్మ జాతర ఊరేగింపు చూస్తూ వెల్చేరు అన్న మాటల్లో అంతరార్థం ఏమిటో నాకింకా బోధ పడలేదు. అక్కడ అన్నదీ, ఇక్కడ [1] అన్నదీ ఒకటేనా? వేరా?
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “Questioning Ramayanas: A South Asian Tradition,” Edited by Paula Richman. Univesity of California Press, 2001. దీంట్లోని వెల్చేరు వ్యాసం, “The Politics of Telugu Ramayanas: Colonialism, Print Culture, and Literary Movements,” చదవదగ్గది. గత శతాబ్దంలో మన సాహిత్యంలో రామాయాణం మీద వచ్చిన అనేక రకాల రచనల్ని వాటి వెనకవున్న సామాజిక కారణాలపరంగా విశ్లేషించారు.
Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/21/2007 12:09 am
Indian Complex – ఆధారం లేని సిద్ధాంతం
ఆసక్తి కలిగించిన వ్యాసమే కాని రాజేశ్వర్ గారితో నేను అంగీకరించే వాటికన్నా అంగికరించని విషయాలే ఎక్కువ వున్నాయి. సాహితీ విమర్శ కానీ, మానసిక విశ్లేషణ కానీ నా సబ్జక్ట్స్ కావు – నేను రాసేదానికి ఆధారం ఓ శనివారపు సాయంకాలపు చదువు వలన కలిగిన అవగాహన మాత్రమే. ముందుగా రాజేశ్వర్ గారన్న రెండు మూడు స్వల్ప విషయాలు:
“Alpajeevi, together with Buchibabu’s Chivaraku Migiledi (That Which Remains at the End), heralded modernism in Telugu fiction by lending it a new psychological depth. Prior to their publication Telugu novels tended to be patently romantic in orientation and thus hardly served the purpose of truth—psychological or social.”
“చివరకు మిగిలేది” 1946లో, “అల్పజీవి” 1956లో వచ్చాయి. వీటికి ముందర తెలుగు నవలోద్యానవనం మూడుఫువ్వులూ ఆరు కాయలుగా వికసించిందని ఎవరూ అనరు కాని అది బీటలు బారిన బీడు నేల మాత్రం కాదు. చలం రచనల్ని (మైదానం, 1926) వట్టి రోమాన్స్ అని కొట్టిపారేసినా, ఉన్నవ “మాలపల్లి” (1926), విశ్వనాథ “వేయిపడగలు” (1939), గోపీచంద్ “అసమర్థుని జీవయాత్ర” (1945), కొడవటిగంటి చదువు (1946), ఉప్పల “అతడు-ఆమె” (1950) – ఇవన్నీ “అల్పజీవి” కన్నా ముందర వచ్చినవే! అవేవీ “ఆధునికత”ని ఆవిష్కరించలేదనడం వాస్తవం కాదు. దాదాపు అదే కాలంలో వచ్చిన శ్రీదేవి “కాలాతీత వ్యక్తులు” (1958) కూడా చెప్పుకోదగ్గ నవల.
“The term [Inferiority Complex] was originated by Alfred Adler, the onetime disciple of Sigmund Freud and the founder of Individual Psychology.”
మనం “వేలు చీకడం లో సెక్స్ ఉందన్న” ఫ్రాయిడ్ సిద్ధాంతానికీ ప్రతి ఒక్కరి జీవితమూ ఆత్మన్యూనతతోనే మొదలవుతుందన్న ఆడ్లర్ సిద్ధాంతానికీ చాలా తేడా ఉంది. గత శతాబ్దపు మొదట్లో ప్రాచుర్యంలోకొచ్చిన “Psycho Analysis” శాస్త్రానికి ఆద్యుడైన Freudకి ఆడ్లర్ సహచరుడు కావచ్చు కాని అనుచరుడు మాత్రం కాదు. అలా అన్నవాళ్ళ పట్ల ఆడ్లర్ చాలా చిరాకుపడ్డాడు [1].
రాజేశ్వర్ గారు చెప్పే ముఖ్య విషయానికొద్దాం:
”[Subbayya’s] inferiority complex is however not the same as propounded by Adler. Society as a whole, and his own wife as well, regard Subbaiah as a feckless fellow. But in reality he is a law-abiding and god-fearing man, even if unabashedly pusillanimous.”
సుబ్బయకున్న ఆత్మన్యూనతకీ ఆడ్లర్ ప్రతిపాదించినదానికీ తేడా ఏమిటో వివరించలేదు. చుట్టూ వున్నవాళ్ళు అతన్ని తేలికగా చూసిన మాట నిజమేకాని, వాళ్ళలా చూడటానికి కారణం కేవలం అతని స్వభావం – వ్యక్తిత్వం లేని స్వభావం. ఆ స్వభావాన్ని మార్చడానికి వాళ్ళు ప్రయత్నించకపోగా దానిని మరింత తీవ్రం చేశారంటే ఒప్పుకోవచ్చుకాని, వాళ్ళ ప్రవర్తన అతని ఆత్మన్యూనతకి మూలకారణం గానీ ముఖ్యకారణం గానీ కాదు.
సుబ్బయ్య “ఒట్టి చచ్చు దద్దమ్మ” కావడానికి కారణం అతని జీవితంలో మాతృప్రేమ మృగ్యం కావడమే. తల్లి మరణం, సవతి తల్లి క్రూరత్వం అతన్ని తండ్రి ప్రేమించినా అతనూ సుబ్బయ్య సరిగా పెరిగి పెద్దయేలోగానే చనిపోవడం. వీటికితోడు, తండ్రిని కొట్టిన సంఘటన సుబ్బయ్య మనసులో చెరగని ముద్రవేసి, భయానికి కారణమయింది. ఇలా చూస్తే, సుబ్బయ్యకున్న ఆత్మన్యూనత ఆడ్లర్ చెప్పినదానికి చాలా దగ్గరగా ఉంది.
కోస్తా ప్రాంతాల్లో అగ్రకులాల్లో ఆడవాళ్ళకున్న ఆధిక్యత కి, అది నిజంగా ఉన్నా లేకపోయినా, ఈ వ్యాసంలో రాజేశ్వర్ అనవసరమైన ప్రాముఖ్యత కల్పించారు.
”Like Subbaiah, the other important male characters of the novel too had gone through traumatic experiences early in their lives. For example, Venkat Rao was robbed of whatever material wealth he could have inherited from his spendthrift father by his own maternal uncle and a long-standing employee of his zamindari household, and Gavaraiah suffered the ignominy of his wife cheating on him. These experiences, devastating as they are, instead of psychologically destabilizing these two men, only transformed them into hardened individuals. Subbaiah’s experiences, naïve by comparison, have made him only a weakling and psychological wreck. There is thus certainly something innate, and something very ‘Indian’ in him that has subjected him to inferiority complex and made him the man he is”
వెంకటరావు, గవరయ్య, సుబ్బయ్య – వీళ్ళ ముగ్గురి బాల్యం ఒకే విధంగా లేదు. చిన్నతనంలో పెరిగిన వాతావరణం ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్నాడు ఆడ్లర్. గవరయ్య పేదవాడయినా, తండ్రి చిన్నతనంలో రంగూన్ పోయి తిరిగిరాకపోయినా, తల్లి గంగమ్మ కష్టపడి పోషించింది, చదివించింది. ప్రేమతో పెంచింది. ఇది మనిషి వ్యక్తిత్వం పెరగడానికి చాలా ముఖ్యమని ఆడ్లర్ చెప్పాడు. నవలలో వీళ్ళిదరి బాల్యంలో తేడా స్పష్టంగానే ఉంది. సుబ్బయ్య స్వభావానికి ప్రత్యేకంగా “భారతీయ”మైన సహజ కారణాలేమీ నాకు కనిపించడం లేదు.
“Critics, including the perceptive R.S. Sudarshanam, have famously misread the novel and hastily concluded that Subbaiah finally overcomes his inferiority complex due primarily to Manorama’s love for him.”
విమర్శకుల [3] గురించి అన్నది వాస్తవమే కాని, అది రాజేశ్వర్ గారి తీర్మానానికి గూడా వర్తిస్తుంది:
“In all probability Subbaiah will continue with his vacillation, indecisiveness and unfounded fears because, among other things, he is a moral coward, and has been so all his life.”
నాకు మాత్రం నవల ముగించేటప్పటికి సుబ్బయ్య ఏ దారిన వెళ్తాడో స్పష్టంగా తెలియలేదు. రావిశాస్త్రి కావాలనే అలా ముగించాడు. తన “ఆఖర్నో మాట”లో:
“ఈ నవల చివరి భాగాలు రాస్తున్నప్పుడు నాకు సుబ్బయ్యంటే అసహ్యం వేసింది. … అయితే, దేముళ్ళూ, రాజులూ, రచయితలూ మంచిగా ఉండాలనీ, సంతానానికి సన్మార్గం చూపించాలనీ విన్నాను. అందుచేత పత్రిక లోంచి పుస్తకంలోకి వచ్చినప్పుడు సుబ్బయ్యకీ ఆత్మ విమర్శనాజ్ఞానం కలిగింది. తన దుస్థితినీ దుర్బుద్ధినీ కొంతగా గుర్తుంచుకుని, మంచి మార్గాన వెళ్ళేవాళ్ళా కనిపిస్తాడు., నవల చివర్న. ఛివరకి అతనా దారంట వెళ్ళొచ్చు. మానొచ్చు. అతని యిష్టం.”
“In the final analysis it would be better not to accord undue importance to this theory and its operation in the novel. Much of aesthetic value would emerge if the novel is studied on its own terms, as a work of art, and without elaborate reference to Adler and his theories.”
లేని ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు కాని ఆడ్లర్ మన జీవితంలో ముఖ్యమైన సమస్యలన్నీ సమాజం, మనం చేసే పని, ప్రేమ – ఈ మూటితో ముడిపడి వున్నాయన్నాడు [2]. అది గుర్తుంచుకుంటే “అల్పజీవి” లో మరికొన్ని లోతులు కనిపించవచ్చు.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
[1] “Although individual psychology had obviously diverged from psycho‐ analysis since Adler’s break in 1911, Adler continued to be incensed by popular references to his having once been a “disciple of Freud.” In 1928, when “The Neurotic Constitution” went into a fourth German edition, Adler took the occasion to publish his most explicit denial to date about their nine-year relationship as recounted by Freud in his 1914 monograph, “The History of the Psychoanalytic Movement.”
“Mr. Freud has bad luck with [the interpretation of] my spoken word…. My mild rejection, ‘it was no pleasure to stand in his shadow’—i.e., to be made an accomplice to all the absurdities of Freudianism, because I was a co-worker in the psychology of the neuroses—he at once interprets as a confession of my revolting vanity to put before unsuspecting readers. Since to date none of those who know wanted to admit this bad luck of their teacher—not mine, as is often erroneously maintained—I see myself forced to destroy the formation of a legend.”
From, “The Drive for Self: Alfred Adler and the Founding of Individual Psychology,” by Edward Hoffman, 1996. Page 214.
[2] “For a long time now I have been convinced that all the questions of life can be subordinated to the three major problems—the problems of communal life, of work, and of love. These three arise from the inseparable bond that of necessity links men together for association, for the provision of livelihood, and for the care of offspring.” From “The Individual Psychology of Alfred Adler: A Systematic Presentation in Selections from His Writings,” Book by Heinz L. Ansbacher, Rowena R. Ansbacher; Harper & Row, 1967. Page 131.
[3] కోడూరి శ్రీరామమూర్తి “తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ” అనే మంచి పుస్తకం రాశారు. దాంట్లో “అల్పజీవి”ని ఆడ్లర్ సిద్ధాంత దృష్టితో పరిశిలించారు. “శత వసంత సాహితీ మంజీరాలు: వంద పుస్తకాలపై విశ్లేషణ,” లో అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు “అల్పజీవి” పై రాసిన వ్యాసం కూడా చదవదగ్గది.
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
07/18/2007 11:38 am
తెలుగుదేశములో తెలుగు మాతృభాషగా ఉన్నవారు సుమారు
90% ఐనా ఉంటారు. ఇతర భాషలు మాతృభాషగా గలవారు,
కేంద్ర ప్రభుత్వములో ఉద్యోగము చేసేవాళ్ళు, ఇతర రాష్ట్రాల
నుండి వచ్చినావాళ్ళు 10% ఉంటారేమో. ఈ 90% తెలుగు
వాళ్ళకు తెలుగును తప్పని సరిగా బోధించడములో తప్పేమి
లేదు గదా! వాళ్ళు ఆంగ్లము నేర్చుకోనీ, కాని తెలుగును
ఎందుకు నిరసన చెయ్యాలి? ఇక తమిళనాడులో తమిళమును
రుద్దలేదనుట అతశయోక్తి అవుతుంది. మదరాసు మాత్రమే
కాదు, హొసూరు, సేలం, ఉత్తర ఆర్కాడు, మదురై,
కోయముత్తూరు జిల్లాలలో తెలుగు మాటలాడేవారు చాల
మంది ఉన్నారు. ఎక్కడో తప్ప వారికి తెలుగు బడులు లేవు, ఇతర
భాషల బడులు లేవు, ఒక్క తమిళము తప్ప. మదరాసులోనే
50లలో స్థితికి, ఇప్పటి స్థితికి ఎంతో తేడా ఉంది. అప్పుడులా
ఇప్పుడు తెలుగు తమ మాతృభాష అని జనాలు ప్రకటించుకొనుట
అరుదే! – మోహన
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
07/18/2007 7:24 am
తెలుగు భాషని తెలుగువాళ్ళ మీద ఎందుకు రుద్దాలి (ప్రభుత్వం ప్రజలమీద కాని, బడులు బడి పిల్లలపై కాని, తల్లిదంద్రులు పిల్లలపై కాని) అన్నది చాలా మౌలికమైన ప్రశ్నే (అయినా, చాలా దురదృష్టకరమైన ప్రశ్న)!.
ప్రభుత్వం అధికార భాషగా తెలుగుని సరిగా అమలు చెయ్యడం, ఆ భాషని ప్రజలపై రుద్దడం అవదు.
ఇంగ్లీషుని, అది చదువుకోలేని ప్రజలపై రుద్దకుండా ఉండడమౌతుంది. ఈ మధ్య ఈనాడులో ప్రచురితమైన ఈ వ్యాసం చదివితే అధికారభాషగా తెలుగుని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుపరిస్తే ప్రజలకి కలిగే వెసలుబాటు చక్కగా అర్థం అవుతుంది.
ఇక బడిలోనూ, ఇంటిలోనూ పిల్లలపై రుద్దడం విషయానికి వస్తే:
1. ప్రతి మనిషి తనకి ఇష్తమైన భాషని నేర్చుకోవచ్చనడం సబబుగానే తోస్తుంది. అయితే, సమాజంలో వ్యవహారానికి, ఇతర వ్యక్తులతో సంభాషించడానికి, ఒక సామాన్య భాష అవసరం ఉంది కదా. అది అందరికీ రావాల్సిన అవసరం కూడా ఉంది కదా. అది ఇంట్లో మాట్లాడుకునే భాషకి ఎంత దగ్గరైతే అంత సులువుగా నేర్చుకోవచ్చు. ఎంత ఎక్కువమందికి ఆ భాష ఇంటి భాష అయితే అంత సులువు. ఈ దృష్ట్యా మన రాష్ట్రంలో తెలుగు అందరూ నేర్చుకోవాలి అనుకోవడంలో తప్పేమీ లేదు.
2. పై కారణం కన్నా బలమైనది సాంస్కృతిక కారణం. ఇది ప్రవాసాంధ్రులకి కూడా వర్తించేది. ప్రాణులలోకెల్ల మనిషి పురోగమనానికి ప్రధానమైన కారణాలలో ఒకటి సమాజాలుగా ఏర్పడడం అన్న విషయం శాస్త్రీయమైనది. సమాజాలు ఏర్పడడానికీ, నిలబడడానికీ సంస్కృతి ఒక ప్రధాన సాధనం. భాష సంస్కృతిలో భాగం. అయితే ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులలో సంస్కృతిని నిలబెట్టుకోవడం ఎంతవరకూ అవసరం అన్న విషయం శాస్త్రీయంగా ఎవరైనా పరిశోధించారో లేదో నాకు తెలియదు. దాని అవసరం ఇంకా ఉన్నది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ దృష్టితో చూసినా తెలుగు భాషని కాపాడుకోవడం అవసరం.
ఇక, రాజకీయ నాయకులపై మనమందరం చాలా తేలికగా, హాయిగా తప్పు(ల)ను నెట్టేస్తాం.
నిజమే, రాజకీయనాయకులు స్వార్థపరులే (ఏం మనం కామా?)! వాళ్ళకి ఓట్లువేసే జనాలకి తెలుగు భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం అయితే, వాళ్ళు దానిగురించి పట్టించుకోక ఏం చేస్తారు? ఓట్లు వేసే ప్రజలోఅత్యధిక శాతం సామాన్య ప్రజలు (చదువులేనివాళ్ళు, పేద వాళ్ళు). సహజంగా వాళ్ళకి భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం కాదు. కాబట్టి రాజకీయ నాయకులకి దానిగురించి పట్టదు.
అంచేత తెలుగు భాషాభివృద్ధి జరగాలంటే, అవసరమైనవి రెండు పనులు:
1. చదువుకున్నవాళ్ళు ముందు తెలుగు భాషాభివృద్ధి తాలూకు (శాస్త్రీయమైన) అవసరాన్ని గుర్తించి, దాన్ని తమ పరిధిలో అమలు పరచడం.
2. సామాన్య ప్రజకి దీని అవసరాన్ని తెలియజెప్పడం. సామాన్య ప్రజలకి తెలియాలంటే అది శాస్త్రీయ విధానంలో సాధ్యపడదు. ప్రజలలో భాష పట్ల (దుర)అభిమానం కలిగించడమొక్కటే సాధనం. దీనికి ఒక ఉద్యమం అవసరం.
తమిళభాషాభివృద్ధిలో ఈ పై విషయాల పాత్రని గుర్తించవచ్చు.
In this context, I have recently come across a link on “Orality to literacy: Transition in Early Tamil Society” by IRAVATHAM MAHADEVAN. It contains interesting points on Popular versus elitist literacy, comparing Tamil and Upper South India (Telugu and Kannada) in the ancient period.
నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?) గురించి జె. యు. బి. వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
07/17/2007 10:31 am
వేలూరిగారూ,
మీ సంపాదకీయం చదివాను. నాకు నచ్చింది. అందులో మీరు తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. అంతర్జాతీయ భాష గురించి కొన్ని చక్కటి ప్రశ్నలు వేశారు. భాషా దురభిమానాన్ని వ్యతిరేకించారు. ఇదంతా వుత్త రాజకీయం అని కూడా తేల్చారు. అంతా బాగుంది. అయితే నాకో ప్రశ్న. మనం మన ఈమాట ముందు పేజీలో, “ఇంటర్నెట్టులో తెలుగుకు మొదటి తరగతి పౌరసత్వం కావాలంటే యూనీకోడ్ వాడకం తప్పనిసరి అని మా నమ్మకం” అని రాసుకున్నాం కదా? యూనీకోడ్‌ని నేను కూడా ఇష్టపడతాను లెండి. కానీ ఈ “మొదటి తరగతి పౌరసత్వం” ఏమిటీ? కొన్ని భాషలకి “రెండవ తరగతి పౌరసత్వం”, ఇంకొన్ని భాషలకి “మూడవ తరగతి పౌరసత్వం” వున్నాయా? మొదటి తరవతి గొప్పదనుకుంటే, మూడవ తరగతి అధమం అనేగా అర్థం? భాషకి సంబంధించి ఈ పౌరసత్వ తరగతుల మీద వ్యతిరేకత మనకు లేదా? ఈ ఇంటర్నెట్టు తరగతి పౌరసత్వానికీ, అంతర్జాతీయ భాషకీ ఏదో రక్త సంబంధం కనబడుతోంది. తప్పంటారా?
మీరు మీ సంపాదకీయంలో, “మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలు అల్లేశారు, వల్లించేశారు. అది కొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరి కొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది.” అని స్పష్టంగా తెలుగుని ప్రాచేన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. కొంత మందికి ఇది అర్థం కాక, మీ సంపాదకీయాన్ని మెచ్చుకుంటూ, సమర్థిస్తూ, “కనీసం ప్రాచీన భాషా ప్రపత్తే మనం సాధించుకోలేక పోయాం” అని వాపోయారు. మీ సంపాదకీయం ప్రకారం ఈ వివాదాలన్నీ వుత్త రాజకీయాలు మాత్రమే అయినప్పుడు, ఇలా వాపోవడంలో అర్థమే లేదు. తెలుగుకి “ప్రాచీన భాషా ప్రపత్తి” ఎందుకు సాధించుకోవాలి? ఆ ప్రపత్తి వల్ల బోలెడు డబ్బు శాంక్షను అవుతుంది. అందుకోసమేనా? మీ సంపాదకీయంలో ఈ డబ్బు సంగతి మీరెత్తలేదు గానీ, అటువంటి ప్రపత్తి గోలని మీరు వ్యతిరేకించారు. అది జనాలకి అర్థం కాకుండా పోయింది.
భాషని ఒకరి మీద రుద్దడం ఏమిటీ? పాఠశాలల్లో హిందీని బలవంతంగా రుద్దినప్పుడు వ్యతిరేకించలేదా? “నిజంగా అన్ని రాజకీయ పక్షాలు తలుచుకుంటే, తెలుగు ప్రతీ స్కూలులోనూ తప్పని సరి (కనీసం పదవతరగతి వరకూ) అన్న జీ. వో రావడం అంత కష్టమైన విషయం కాదు” అంటూ తెలుగుని అందరి మిదా రుద్దడం ఎందుకు? ఒక రాష్ట్రంలో వేరే రాష్టాల నించీ వచ్చిన పిల్లలు ఎందరో వుంటారు. అంతేకాదు ఏ విషయమూ ఎవరిమీదా రుద్దకూడదు. వాళ్ళకిష్టం అయితే వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. లేకపోతే లేదు. “మాతృభాషలో విద్యాభోదన”లో వున్న మంచి విషయాలు తెలిస్తే నేర్చుకుంటారు. లేకపోతే లేదు. ఈ బలవంతంగా రుద్దడం అనే అభిప్రాయం మీరు మీ సంపాదకీయంలో ఎక్కడా రాయలేదు.
భాషాభిమానం వుండొచ్చు గానీ, దురభిమానం వుండకూడదు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని గర్వంగా చెప్పుకోవడం మిగిలిన భాషలని కించపరచడమే.
ఈ రకరకాల హోదాల వల్ల ధన ప్రాప్తి కూడా వుంటుంది మరి. ప్రాచీన భాష అనే ప్రపత్తి వల్ల అనేక లక్షల రూపాయలొస్తాయంట. వాటికోసం బోలెడు మంది తాపత్రయపడటం సహజమే మరి.
ఇక రాజకీయనాయకుల సంగతి. మన లాంటి “మేధావులు” ఈ రాజకీయ నాయకులని ఎంత తక్కువగా చూస్తామో, వాళ్ళు కూడా మన లాంటి “మేధావుల్ని” అంతే తక్కువగా చూస్తారుట. ఓట్లు వేసి వాళ్ళని గెలిపించేదీ, వాళ్ళకి అధికారం కట్టపెట్టేదీ మన లాంటి వాళ్ళు కాదుట. అందుకే వారు మనలాంటి వారి ఘోష పట్టించుకోరుట. ఇలా అని తెలుగు సంస్కృతి కోసం ఒక తెలుగు సంస్థలో పని చేసే ఆయన అన్నారు. ఆయన మాటలు వింటుంటే, ఇదంతా కంఠ శోషన్న నిరుత్సాహం కలుగుతుంది. ఆయనే మళ్ళీ, “అరకొరగా చదువుకున్న వారిలోనే ఈ విభేదాలన్నీ, బాగా చదువుకున్న వారికిగ్గానీ, బొత్తిగా చదువుకోని వారికిగ్గానీ విభేదాలుండవు” అని అన్నారు. హతోస్మి అనుకోవాలి మరి.
మొత్తానికి మీ సంపాదకీయంలో ఏ విషయం తేల్చకుండా వదిలేశారు. ఏం చెయ్యాలో స్పష్టంగా చెప్పలేదు. దాంతో కొంతమంది మీరు సంపాదకీయంలో బాధ పడిపోయారని, బాధ పడిపోయారు. ఒక్కో విషయం ఒక్కక్కరికి ఒకలాగా అర్థం అవడంలో ఆశ్చర్యమేమేమీ లేదు. ముందుగా మనమే భాషని సరిగా వుపయోగించుకోవాలీ అనిపిస్తుంది. దీర్ఘాలూ, ఒత్తులూ, కామాలూ, గట్రా లేని జనాలు రాసే తెలుగు చూస్తే నిరుత్సాహం కాక ఏం కలుగుతుందీ? ఒకరైతే ఏది కర్తో, ఏది కర్మో, ఏది క్రియో బొత్తిగా అర్థం కాని వాక్యాలు రాస్తారు. కొంతమంది అకర్మక క్రియలతో కర్మణి వాక్యాలు రాస్తారు. వాడుకలో లేని కర్మణి వాక్యాలు అప్పుడప్పుడు తెచ్చేసుకుని మురిసిపోతూ వుంటారు. ఇంకొకరైతే, మీరేం రాసినా, వాళ్ళకిష్టమైన అర్థం తీసేసుకుంటారు, మీరు రాసింది మెచ్చుకుంటూ. తెలుగు భాషలోనేనా ఇంత గందరగోళం అని అనిపిస్తుంది.
ప్రసాద్
గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
07/04/2007 7:35 am
లైలా గారూ,
లయలో వైవిధ్యం సాధించడం కష్టమే కాని అసాధ్యం కాదు. ఆదిభట్ల నారాయణదాసుగారు పంచముఖి అని వినిపించేవారట. తలొక చేత్తోనూ రెండు వివిధ తాళాల్లో చిడతలు వాయిస్తూ, తలొక కాలితో మరి రెండు విభిన్న తాళాల మీద నర్తిస్తూ, నోటితో అయిదో తాళంలో కీర్తన పాడేవారట. 5, 6, 7, 8 అక్షరాల తాళాలు వేరువేరు కదా. అయిదోది తొమ్మిదక్షరాల తాళమేమో. మరెవరూ చెయ్యలేని ఈ ఫీట్ ఎల్ సీ ఎం పద్ధతిలో సాగేదని స్వయంగా చూసిన సంగీతరావుగారు నాతో అన్నారు. కలిపి ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని ఆవృతాల తరవాత అన్నిటికీ కామన్ ‘సమం’ వస్తుందనుకోవచ్చు. ఇటువంటిది చెయ్యడానికి అంతులేని మనో నిగ్రహమూ, అవయవాల మీద కంట్రోలూ అవసరం.
సంగీతంలో విన్నదేదైనా సరే నోటితో అనగలనని నాకో నమ్మకం. అయితే అమీర్ ఖాన్ పాడిన మార్వా ద్రుత్ ఖయాల్ పల్లవిని అచ్చం ఆయన లాగే లయ మీద పలకాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అవుతున్నాయి. ఆ టైమింగ్ ఎంతకీ అంతుచిక్కదు. రికార్డు వినమని అన్నది అందుకే. ఆయనవి తక్కిన రాగాలు ఎన్నో మ్యూజిక్ ఇండియా ఆన్ లైన్ డాట్ కామ్ లో ఉన్నాయి.
గురువాయూర్ దొరై వంటి ప్రసిద్ధ విద్వాంసులు ఒక చేత్తో మృదంగం మీద నిశ్శబ్దంగా ఒక చేత్తో తాళం చూపుతూ రెండో చేత్తో వివిధ విన్యాసాలతో మృదంగం వాయించడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. Brain and motor nerves మధ్య ఎంతో సమన్వయం ఉండాలి. సితార్ సాధన చేస్తున్నప్పుడు కుడి పాదాన్ని ఒకటో కాలంలో లయబద్ధంగా కదిలిస్తూ, మెదడుకీ, చేతులకీ రకరకాల లయల్లో స్వరకల్పన చేసే పనిపెట్టడం తప్పనిసరి అవుతుంది. ఇదంతా క్లాసికల్ మ్యూజిక్ సర్కస్ లోని భాగమే. కాని ఎంతో exciting వ్యవహారం.
నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
07/02/2007 11:14 am
‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’
it is with pure coincidence i happen to listen to Aminatta Forna, writer of “Ancestor Stones” on NPR on this morning drive (July 2, 2007). She was asked a similar question by Renee Montagne: ‘what is it that can be said … in a novel/fiction that you could not say in a work of non fiction’.
Forna answered, there is depth that is added in fiction which comes from ‘inhabiting people’s lives and speaking directly to the reader’.
కాల్పనిక కథ ఒకే రూపంతో కనిపించినా దానికుండే Depth వాస్తవానికుండదేమో మరి.
ఈ రెండిటినీ కలిపి చూస్తే నాకనిపించింది: ఒక కథకు ఉండే ఆ ఒక్క లక్షణం చేతనే దానికుండే మిగతా రూపాలేమైనా (ఒకవేళ) ఉంటే అవి అదృశ్యమై పోతాయని. ఇక, వాస్తవం చాలా రూపాల్లో ఉంటుంది అని చెప్పటానికి పెద్దగా కథలక్కరలేదేమో, ఫాక్స్ న్యూస్ చానెల్ చూస్తే చాలనుకుంటా (అన్నట్టు Wall Street Journal ఇకపై in depth fiction రెపోర్ట్ చేస్తుందా?)
ఏదేమైనా, వెల్చేరుకు లైఫ్ టైమ్ అఛీవెంట్ అవార్డు ఇచ్చి ‘తానా ‘ వాళ్ళు ఒక మెట్టు ఎక్కినందుకు తానా వాళ్ళకు నా అభినందనలు.
ఈ అవార్డు గురించి వెల్చేరు గారేమంటారో వినాలనుంది.
ఒక వైపు బాలకృష్ణ, ఇలియానా ఇంకో వైపు చంద్రబాబు ఆయనకంటే ఎత్తున ఏడుకొండల వాడు గ్లామర్, పలుకుబడి లేక కళ్యాణం పేరు చెప్పి తెలుగు వాళ్ళ ను తేరగా దోచుకుందామని (మనసులనే అనుకుందాం) వచ్చిన వీళ్ళందరినే కాక చివరి నిమిషంలో వచ్చి ఓ మిలియన్ డాలర్ల కు టెండరు పెట్టిన బిల్ & హిల్లరీలను దాటుకుని వెళ్ళి ఈ తెలుగు వాళ్ళిచ్చే అవార్డు అందుకుంటారా లేక ఆ కాగితమ్ముక్కేదో చెక్కుతో పాటు మెయిల్లో పంపండి అంటారా వెల్చేరు గారు?
విప్లవ్
కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి Jaydev Mettupalli గారి అభిప్రాయం:
05/14/2007 12:56 pm
కడప ప్రాంతం లో కనిపించే అతి అరుదైన పక్షి గురించి వ్యాసం ప్ర చురించిన మీకు కృతఙ్ఞతలు. వ్యాసకర్త శ్రీ కోనేటిరావు గారికి అభినందనలు. సుమారు 20 సంవత్సరాల క్రిందట నేను లంకమల్ల అడవులకు వెళ్ళినపుడు ఈ అరుదైన పక్షి ని చూసే అవకాశం దొరకలేదు. బట్టమేక లు కనపడ్డాయి కాని కలివికోడి కనబడలేదు.
జయదేవ్ మెట్టుపల్లి
చికాగో
జుగల్‌బందీ కచేరీలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
05/07/2007 7:59 am
శ్రోతలకూ, పాఠకులకూ అంత ఆసక్తి ఉండకపోవచ్చుగాని జుగల్బందీల్లో ఎన్నో టెక్నికల్ కాంప్రొమైజులు ఉంటాయి. ఉదాహరణకు మొదటినుంచీ బాలమురళిగారిది ఒకటి శ్రుతి. జోషీగారు మొదట్లో 2 , 3 శ్రుతుల్లో పాడుతూ ఉండేవారు. అలాగే వీణ 3, 4 శ్రుతుల్లో ఉంటుంది. సితారుది 1, 2 మధ్యలో ఉంటుంది. నేను సరోద్ తో సితార్ వాయించినప్పుడు ఇబ్బంది కలగలేదు కాని హిందూస్తానీ వేణువుతో (అతనికి 3 శ్రుతి అలవాటు) తేడా వచ్చింది.
ఇక ‘కృతి’ విషయంలో కూడా స్వల్పమైన తేడాలుంటాయి. సితార్, వేణువు రెండూ హిందూస్తానీ వాయిద్యాలే అయినప్పటికీ ‘గత్’ ఎంపికలో వ్యత్యాసాలుంటాయి. అలాగే వేగంలోని ‘కంఫర్ట్ జోన్లో’ కూడా తేడా ఉంటుంది. ఇవన్నీ ముందుగా ప్రాక్టీసు చేసుకుంటునప్పుడు పరిష్కరించుకోవలసిన సమస్యలు.
పెద్ద కళాకారులైతే ఒక్కొక్కరికీ ‘ప్రసిద్ధమైన’ శైలి కూడా ఉంటుంది. అయితే ఒక్కొక్కప్పుడు ఒక కళాకారుడు రెండో వ్యక్తిని ‘హైజాక్’ చేసినట్టనిపిస్తుంది. అంజద్ అలీ ఖాన్ సరోద్ మీద వేగంగా ‘ఝాలా’ వాయించి హంగామా చేస్తున్నప్పుడు లాల్గుడిగారి వాయింపుకి సరైన న్యాయం జరగలేదని అనిపించింది.
ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోతోందన్న ఆదుర్దాతో కాస్త జనరంజకంగా ఉండడానికి ఈ యుగళ కచేరీలను ఏర్పాటు చెయ్యడమూ కద్దు. అంతగా ప్రసిద్ధులు కానివారిద్దరు కలిసి కాస్త ఆకర్షణ పెంచడానికి ప్రయత్నించడమూ చూస్తాం.
చాదస్తం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
03/28/2007 7:34 pm
కథలో ఇంత తర్కం గూటించడం అనవసరం. పాత్రలన్నీ analysis paralysis తో బాధ పడుతునట్టనిపించింది. పాత్రలని సరిగా చిత్రించడానికి వాటితో ఇంత in-depth analysis చేయించవలసిన అవసరం లేదు. ఉదాహరణకి బొమ్మరిల్లు సినిమా గురించి అంత analysis, reasoning, logic అనవసరం. ఆ సినిమా గురించి పాత్రతో తన అభిప్రాయాన్ని సరళంగా చెప్పించి పాఠకుడికి ఆ పాత్రంటే సరైన అవగాహన కల్పించవచ్చు. కథ సజావుగా సాగిపొతే చదువుకోడానికి పాఠకుడికి సుళువుగా ఉంటుంది. దానికి విరుధ్ధంగా ఇంతింత logic గుప్పించేస్తే పాఠకుడికి ఈ తర్కం అంతా follow అవ్వాల్సిన దుస్స్థితి ఏర్పడి ఎందుకొచ్చిన తలనొప్పి అని అనిపించే అవకాశం ఉంది.
కథ మొదలైన వైఖరిని బట్టి సమాజంలో మనకి తరచు తారసపడే మనస్తత్వాలని ఆధారం చేసుకుని అల్లిన ఒక మంచి కథ చదవబోతున్నానని అనుకున్నాను. కాని మొత్తం చదివాక చాలా disappoint అయ్యాను.
అంతరం గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:
03/28/2007 1:29 pm
ఎదో అక్కడక్కడ కాస్త హాస్యం ఉండటం వలన తోసుకుపోయింది కాని అసలు విషయం సున్న. అసలు సమస్య గురించి ఎక్కువ చర్చ లేకపోవటం ఈ కథలో చాలా పెద్ద వెలితి. పాఠకుడికి వింధ్య కష్టం ఏవిటో తెలియచెప్పి వెంటనే కథను ముగించడంతో అర్ధాంతరంగా కథను ఆపివేసినట్లనిపించింది. మొత్తం మీద below average అని చెప్పాలి.
చాదస్తం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
03/15/2007 9:45 am
రవికిరణ్ గారన్నట్టు, కథలో ఆవిడ పాత్ర బాగానే ఎస్టాబ్లిష్ అయ్యింది. కాకపోతే అది two-dimensional అయ్యి కూచుంది. ఎంతసేపూ తన ఆలోచనలే తప్ప ఎదుటివాళ్ళ అభిప్రాయాలగురించి ఆలోచించే అలవాటు బొత్తిగా కనిపించదు.
ఉదాహరణకి “నీ భర్త నిన్ను అర్థం చేసుకున్నంత వరకూ, ఎవరూ మీ స్నేహం గురించి ఏమనుకున్నా లెక్క లేదులే” అని ఇంకొకావిడ అన్నప్పుడు భర్త తనుచేసే ప్రతి స్నేహాన్ని ఆమోదించితీరాలన్న ఆలోచనే తప్ప, అతనికీ స్వంత అభిప్రాయాలు ఉండవచ్చునని గాని, జీవిత భాగస్వామిగా తన స్నేహాలతో అతనికి ప్రమేయం ఉంటుందన్న ఆలోచనగానీ లేకపోయింది.
“మా ఆయన కర్థం అయ్యే స్నేహాలు మాత్రమే నేను చెయ్యాలట!” – అని ఆ ఇంకొకావిడ అనలేదే!
“అతని కర్థం కాకపోతే అది అతని చేతకానితనం అవుతుంది గానీ, నా స్నేహం తప్పెందుకవుతుందీ?” – అతనికర్థం కానంత మాత్రాన తన స్నేహం తప్పవుతుందని ఎవరన్నారు? అతనికి అర్థం కాకపోయినంత మాత్రాన అది అతని చాతకాని తనమూ కాదు.
“అయినా భర్త దయాదాక్షిణ్యాల మీదా, అతను విషయాలనర్థం చేసుకునే చాకచక్యం మీదా ఆధారపడి లేవు నా స్నేహాలు.” – ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు.
పెళ్ళి భారీగా చేసుకోకూడదన్నది ఆవిడ స్వంత అభిప్రాయం. అది తన స్నేహితుడిమీద రుద్దడానికి తాపత్రయ పడిన ఆవిడ, ఒకవేళ తన స్నేహం తన జీవితభాగస్వామికి ఇష్టం లేకపోతే దానిగురించి ఆలోచించాలన్న సహనం కూడాచూపలేదు!
ఆవిడ వ్యక్తిత్వమే ఈ కథ శీర్షికకి సరిగ్గా సరిపోతోంది!
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:
03/08/2007 7:52 am
కనక దుర్గ వ్యాసాలు, ఇంకా నాలాంటి సాధారణ వ్యక్తి తర్కానికే నిలవని వ్యాసాలు ఎందుకు ప్రముఖ పత్రికలలో ప్రచురిస్తారో అర్థం కాదు.
మొత్తానికి గడ్డి బాగా పెట్టారు. అలాంటి వాదన ఎక్కడ తలెత్తినా ఇదిగో అంటూ చూపించడానికి మంచి వ్యాసం రాశారు. ధన్య వాదాలు.
వ్యాసానికి మరిన్ని హంగులు దిద్దిన, శోభ చేకూర్చిన ఈ అభిప్రాయమాలకు అభినందనలు.
–ప్రసాద్
http://blog.charasala.com
రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Nagaraju Pappu గారి అభిప్రాయం:
03/07/2007 1:31 pm
అందరి అభిప్రాయాలూ చదివేక, ఈ వ్యాస కర్త గా నేను కొంత వివరణ ఇవ్వవలిసిన ఆగత్యం నాకుందనిపించింది. ఈ వ్యాసం రాయడం వెనకాల రెండు ముఖ్యమైన ఉద్దేశ్యాలున్నాయి:
౧. చాలమంది మన వాళ్ళే – పాశ్చాత్య సంగీతంలో ఏముందండీ – అంతా రణగొణి ధ్వనులు తప్ప అంటూ ఉంటారు. అలాటి వ్యాఖ్యలు విన్నప్పుడల్లా చాలా బాధగాను, కోపంగాను ఉంటుంది. మన సొంతడబ్బా కొట్టుకోడానికి ఇంకొకర్ని నిందించనక్కరలేదు. పాశ్చాత్య సంప్రదాయం కూడా మహోన్నతమైనదే అని నాకు వీలయినంతలో వివరించడం ఈ వ్యాసం యొక్క ప్రథమోద్దేశ్యం. మన సంగీతంతో కొన్ని సారూప్యతలు చూపడం కూడా అందుకే.
ఈ వ్యాసంలో నేను “కాస్పిరసీ-థియరీ” ఏదీ ప్రతిపాదించలేదు. ఇది ఒక గొప్ప పరిశోధన వ్యాసం అని కూడా నేనెక్కడా చెప్పలేదు. ఇది కేవలం సాహిత్య వ్యాసం – పొయటిక్-రెఠోరిక్ ఉపయోగించి, పాఠకుడిని త్యాగయ్య ముందు, దీక్షితార్ ముందు కూచోబెట్టడానికి, మిమ్మల్నోసారి నా వీపున కట్టుకొని వియన్నా నగరం అంతా తిప్పితీసుకొని రావడానికి చేసిన ఓ చిన్న ప్రయత్నం – అంతే. నేనందుకే, వ్యాసం ప్రారంభంలోనే – అష్టదిగ్గజాల కథ చెప్తానన్నానుగాని, వారి గురించిన చారిత్రక సత్యాలు మీముందు ఆవిష్కరిస్తానని చెప్పలేదు. ఈ పోపులడబ్బాతో ఒక ఇడ్లీ-సాంబారు వండిపెట్టే ప్రయత్నం చేసేసు. వీలైతే ఇడ్లీని సాంబారులో ముంచుకొని ఆస్వాదించండి. దీక్షితార్ గారికి ఓ పాట రాయడానికి పదిరోజులు పట్టేదేమో అనంటే – ఆయన పాటతో నాకున్న అనుభూతి అలాటిది, నా అనుభూతిని మాటల్లో చెప్పడానికి చేసిన ప్రయత్నం – అంతేకాని, అది ఆయనకు అవమానం ఎలా అవుతుంది? ఆశువుగా ఆయనో నాలుగు కృతులు చెప్పలేరూ? ఎందుకు చెప్పలేరూ? తప్పకుండా చెప్పగలరు. ఆయన చేతికి గండపెండేరాలేసుకొన్నారో లేదో నేనేమైనా చూసేనా? దానికి, చారిత్రక ఆధారాలు తెమ్మంటే నేనెక్కడనుంచి తేగలను?
ఈ వ్యాసానికి లేని “శాస్త్ర” స్థాయిని మీరే దీనికి ఆపాదించేసి, మీరే దీన్ని దుయ్యబట్టనక్కరలేదు. అది సమంజసం కాదు. పరిశోధన వ్యాసాలు, పాండిత్య చర్చలకి ఈ పత్రిక వేదిక కాదేమో కూడా. పరిశోధన వ్యాసాలని – నిష్ణాతులు, పండితులూ చదివే “సైంటిఫిక్-జర్నల్స్”లో ప్రచురించుకోవాలి. అక్కడ పండితులందరూ మనం ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఒప్పుకొంటే, అప్పుడు – సామాన్య పాఠకుడిముందుకి రావొచ్చు.
ఇక, ఒకరు – ఈ వ్యాసంలోవన్నీ యాధృచ్చికాలేగాని, నిజమైన సారూప్యతలు కావన్నారు. ఒక రకంగా చూస్తే నిజమే. నేను చూపించిన సారుప్యతలన్నీ – స్ట్రక్చురల్-సారూప్యతలు. ఎక్కడైనా, ఏ శాస్త్రమైనా – పరిణామం చెందే దశలు ఒక్కలాగే ఉంటాయి. ఎవరో ఒక మహానుభావుడు ఒక విత్తనం పాతుతాడు, ఇంకొకాయన, దానికి కంచెవేసి, నీరుపోసి మొక్కగా ఎదగడానికి తోడ్పడతాడు, దానికి వేర్లు పాతుకుపోయేక, కాండం బలపడేక – అది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఇందులో యాధృచ్చికమేం లేదు, అలాగని ప్రత్యేకమైన, చెప్పుకోదగ్గ సారూప్యతాలేదు. అయితే, ఇలా తోలు తిత్తిలోంచి గాలి తీసేసినట్టు చెప్తే అందులో మజా ఏముంది? దానికే, కొన్ని రంగులు, రెక్కలు అదిమి – ఓ మధురమైన కథగా చెప్తే రంజుగా ఉంటుంది. చదివేవాడి మదిలో ఒక అందమైన ముద్ర పడే అవకాశం ఉంది.
కూలంకుషంగా ఇలాటి పరిశోధన చెయ్యాలంటే – శాస్త్రాలనీ, విజ్ఞానాన్ని క్రోడికరించిచిన పద్దతులు మనకి తెలియాలి. రెండు శాస్త్రాల్లో క్రోడీకరించడానికుపయోగించిన పద్దతుల్లో మౌలికమైన తేడాలుండొచ్చుకదా? రెండురకాల ఒంటాలజీ పద్దతులున్నాయనిన్నీ – అరిస్టాటిల్ ప్రతిపాదించిన ఒంటాలిజికల్ పద్దతి – ఎనలిటికల్ మెథడ్ ఆధారంగా ఉంటుందని, అదే, మన ఫిలాసిఫీలో వైశేషిక దర్శనంలో ప్రతిపాదించిన ఒంటాలిజీ దానికి చాలా భిన్నంగా ఉంటుదనిన్నీ ఈ మధ్యనే కంప్యూటింగ్ శాస్త్రజ్ఞులూ, భాషా శాస్త్రవేత్తలూ ప్రతిపాదిస్తున్నారు. ఒంటాలజీ తయరు చేసే పద్దతులని “శాస్త్రీకరిస్తే” – ఎవైనా నిర్వచనాల మధ్య అన్యోన్యాశ్రయ దోషాలాటి సమస్యలని చాలా తేలికగా పరిష్కరించుకోవచ్చని అంటున్నారు. అయితే, ఈ చర్చలన్నీ ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. వీటిమీద పరిశోధన వ్యాసాలు ఇంకా రావలసి ఉంది. అవి ప్రచురితమైన తర్వాత – ఆ రంగాల్లో నిపుణులూ, పండితులూ చర్చలూ, చెడుగుడాటలూ, యుద్దాలూ ఇంకా చెయ్యవలసి ఉంది. అవన్నీ అయ్యి, వీటిని సిద్దాంతీకరించడానికి చాలా సమయం పడుతుంది. అది అయితే, ఏ రెండు శాస్త్రాల్లో ఉన్న సిమంటిక్-సారూప్యతలూ, విభేదాలు అర్ధం చేసుకోవటంగాని, సమన్వయించడం గాని చాలా సుళువైపోతుంది. (ఉదాహరణకి, ఈ మధ్యనే – మెత్తం వేదాంతంలోని కాన్సెప్టన్నింటీనీ, వాటి మధ్యనున్న సిమంటిక్-రిలేషన్సుని ఒకే పేజీలో పట్టేటంత ఒక చిత్రపటం తయారు చేసేం. ఎవరికైనా కావాలంటే – నాకు ఈమైల్ చేస్తే – మీకు అందచేస్తాను.) ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే – రెండు సంప్రదాయల్లో సారూప్యతలూ, తేడాలూ చూడాలంటే – దానికో శాస్త్రీయమైన ఆధారం కావాలి కదా? నాకు తెలిసినంత వరకూ – అది సిమాంటిక్సుకి సంభందించిన విషయం. ఈ రాగాలూ అవీ – ఒంటాలజి, సిమాంటిక్స్ పరంగా చూస్తే – కోడెడ్-ఇన్-ఫర్మేషన్-స్ట్రక్చర్స్ – విభిన్నమైన సంగీత రీతుల మధ్య సిమాంటిక్-స్టడీస్ చేసి, వాటి గుట్టు విప్పాలంటే మరి ఒంటాలజి లాటి శాస్త్రాల సహాయం కావాలి. ఇప్పటిదాకా – వీటికి థియరిటికల్-బేసిస్ ఇంకా లేదనుకుంటాను. భాషా శాస్త్రానికి ఎలాగైతే ఒక థియరిటికల్-ఫ్రేమ్-వర్క్ ఉందో అలాటి బేసిస్, క్రోడికరించిన ఎటువంటి విజ్ఞానాన్నైనా విశ్లేషించడానికి కూడా కావాలి కదా? అది ఒంటాలజి, సిమాంటిక్స్ ద్వారా సాధ్యపడుతుందని ఈ రచయిత విశ్వాసం.
అది కుదిరేదాకా – ఇలాటి పోపుల డబ్బా వ్యాసాలు రాసుకోవడమే.
ఇకపోతే – ఈ వ్యాసం ప్రేరణతో ఎవైనా శాస్త్ర చర్చలు ఈ పత్రికలో జరిగితే మంచిదే, కాని వాటిని ఈ వ్యాసానికి గాని, దీన్ని రచించిన రచయితకి గాని అంటగట్టకండి. ఇది కేవలం సాహిత్య వ్యాసం – ఇందులో చాలావరకూ పొయటిక్ -రెఠోరిక్ తప్ప ఇంకేం లేదు. దీనిలోంచి గుడ్డుమీద వెంట్రుకలు పీకటం అనవసరం. ఎవరో ఇండో-యూరోపియన్ భాషలదాకా వెళ్ళిపోయేరు. సురేష్ గారు చెప్పినట్టు – పిడుక్కీ, తద్దినానికి ఒకే మంత్రం వేస్తే ఎలాగ? లేనిపోని “కాస్పిరెసి-థియరీలు” ప్రతిపాదించి పాఠకులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం నేను చెయ్యలేదు. సైంటిఫిక్ విలువలు వేటికీ నేను తిలోదాకాలివ్వలేదు, అలాగే సాహిత్య విలువలు వేటికీ ద్రోహమూ చెయ్యలేదు. తులనాత్మక పరిశీలనలాటి వాటి ఛాయలకి కూడా నేను పోలేదు.
త్యాగయ్య సంగీతంలోనూ, దీక్షితార్ సంగీతంలోనూ ఉన్న ‘స్టైలిస్టిక్’ తేడాలు కూడా – వారిద్దరి సంగీతం విన్నప్పుడు నాలో కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పే ప్రయత్నమేగాని, అందులో వేరే “శాస్త్రీయ”మైన అధారమేమీలేదు. అందరికీ అలా అనిపించకపోవచ్చు – ఇలాటివి మీరు కేవలం వ్యక్తిగతమైన అనుభవంగానే పరిగణించాలని నా మనవి. ఎవరికైనా అవి ఉపయోగపడితే అంతకన్నా కావల్సిందేముంది?
ఆఖరుగా – ఏ రచనలోనైనా కొన్ని తప్పులుంటాయి. షేక్సిపియర్ అంతటి వాడి నాటకాల్లోనే – వెతికితే వ్యాకరణ దోషాలుంటాయి. సర్వజ్ఞత ఎవరికుంటుంది? స్వరసాహిత్యం అనే మాట నాకు సమయానికందలేదు. అది ఆధారంగా చేసుకొని, మెత్తం రచనంతా తప్పులతడకలంటూ ఎండగట్టటం, రచయితకేం తెలీదనటం – అంత సమంజసం కాదు. ఒక రచన ఆధారంగా రచయిత పాండిత్యాన్ని అంచనా వెయ్యగలరా?
రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
03/05/2007 5:32 pm
వ్యాసము బాగుంది. బాఖ్ కాలములో పియానో లేదనుకొంటాను. అప్పుడు హార్ప్సికార్డ్ ఉండేది. క్రింద ముత్తుస్వామి దీక్షితులపై కొన్ని వివరాలు. శ్రీ ముత్తుస్వామి దీక్షితులు మూడు సంగీత పద్ధతులలో ఆరితేరినవారు. వారి తండ్రి రామస్వామి దీక్షితులు కూడ సంగీత విద్వాంసులే. వీరు హంసధ్వని రాగమును కనుగొన్నారు. ముత్తుస్వామి గాత్ర సంగీతమును మాత్రమే గాక వీణను కూడ నేర్చుకొన్నారు. వారు పాడునప్పుడు వీణను కూడ వాయించెడివారు. వీణతో కలిపి పాడుచుండుటచే వారు చౌక (లేక విలంబిత) కాలమును ఎక్కువగా వారి కీర్తనలలో వాడెడివారు. చివర మధ్యమకాలము సామాన్యముగా కీర్తనలలో నుండును. వీరు ఐదారు ఏళ్ళు కాశీలో గడిపినారు. కావున వీరికి హిందూస్తానీ సంగీతముతో బాగుగా పరిచయము. హిందూస్తానీ రాగములను తన కీర్తనలలో వాడియున్నారు (జంఝూటి, జయజయవంతి, యమన్, సారంగ, బృందావనసారంగ, ఇత్యాదులు). వీరు వీరి తండ్రిగారితో మదరాసు సమీపమున నున్న మణలిలో కొన్ని సంవత్సరములు ఉన్నారు. మణలికి నాయకుడు వేంకటకృష్ణ ముదలియార్. వీరు దుబాసి, సెయింట్ జార్జ్ కోటలో పని చేసెడివారు. అప్పుడప్పుడు ముత్తుస్వామిని, వారి తమ్ముడైన బాలాస్వామిని కోటకు తీసికొని వెళ్ళేవారు. ఆ సమయములో అక్కడ పాశ్చిమాత్య బ్యాండ్ మేళమును వినేవారు. సి మేజర్‌కు సరిపోయే
శంకరాభరణములో నోటు(ట్టు) స్వరములను వ్రాసినారు. సుమారు నలభైకు పైన సంస్కృతములో వ్రాసినారు. నేడు కూడ ఇట్టి నోటుస్వరాలు కచేరీల చివరలో తుకడలుగా పాడుతారు. ఇంగ్లాండ్ రాష్ట్రగీతమైన గాడ్ సేవ్ ది కింగ్ మెట్టులో సంస్కృతములో వ్రాసినారు! వీరి తమ్ముడు బాలాస్వామి ఒక ఆంగ్లేయునిచేత ఫిడేల్ నేర్చుకొన్నారు. వారి తండ్రిగారి సలహా ననుసరించి ముత్తుస్వామి కచేరీలలో వయలిన్ వాయించేవారు. ఇదే కర్ణాటక సంగీతములో మొట్టమొదట వయలిన్‌ను పక్కవాద్యముగా ఉపయోగించుట. అంతకు ముందు వీణను ఉపయోగించేవారు. మూడు సంగీత సంప్రదాయాలను అవగాహన చేసికొని అందులో ఘనతను సాధించారు దీక్షితులవారు.
వీరి సంస్కృత కృతులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస, యతి, గోపుచ్ఛయతి, బీజాక్షరములు, ముద్రాలంకరము (రాగము పేరు పాటలో వచ్చుట), ఇత్యాదులు ఎక్కువ. వీరికి భక్తి మాత్రమే కాదు, విభక్తి అంటే కూడ ఇష్టమే. వీరి విభక్తి పాటలు ఒక ప్రత్యేకత. ఒక్కొక్క పాటను ఒక విభక్తిలో వ్రాయుట ఇందులోని విశేషము. ఎనిమిది విభక్తులలో వీరు ఎన్నియో పాటలను వ్రాసియున్నారు. పాటలలో ఉదాహరణ లనవచ్చును వీటిని.
మాత్రుష్కా బొమ్మలాగు పదములలో పదములుంచి వ్రాయుట వీరి కృతులలోని మరొక విశేషము. శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం, వసుప్రదే, శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే పదే, ఇత్యాదులు. దీనికి గోపుచ్ఛయతి అని పేరు.
ఇవన్నీ రచయితకు తెలిసియుండవచ్చు. స్థలాభావమువల్ల వ్రాసియుండక పోవచ్చు. కాని అందరికీ ఇవి తెలిసిన మంచిదని నేను తెలియజేయుచున్నాను.
విధేయుడు – జెజ్జాల కృష్ణ మోహన రావు
రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/05/2007 9:13 am
వివిధ సంగీతకారులని పరిచయం చేసేందుకు ఈ వ్యాసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే వారి బొమ్మలను కూడా చూపడం మంచి ఆలోచన.
ఎటొచ్చీ ఈ సంగీతకారుల మధ్య పోలికలనూ, సామ్యాలనూ వెతకడం అనవసరమేమో అనిపిస్తుంది. వివిధ దేశాల్లో, రకరకాల పరిస్థితుల్లో, వేరువేరు ప్రేరణలకు లోనై జీవించిన ఈ ప్రతిభావంతులు తమ ప్రాంతాల సంగీతానికి ప్రభావితులయిన మాట నిజమే కాని ఈ రెండు విభిన్న సంప్రదాయాల మధ్య పోలికలేవైనా ఉంటే గింటే అవి యాదృచ్ఛికమే.
ఒక చారిత్రక నేపథ్యంలో, ఒక ఆర్థిక, సామాజిక పునాది రూపొందిన తరుణంలో ఒక్కొక్క సంస్కృతి విలసిల్లుతుందనేది తెలిసినదే. రాజులూ, నవాబుల ప్రాపకం ఉన్న రోజుల్లో కొన్ని రకాల లలితకళలూ, సాహిత్యమూ వర్ధిల్లుతాయి.
ఆసక్తికరమైన సంగతేమిటంటే పదిహేడో శతాబ్దం అంతం నుంచి పంతొమ్మిదో శతాబ్దం మొదలైన నాటి దాకా కర్ణాటక, పాశ్చాత్య సంగీతంలోనే కాక హిందూస్తానీ పద్ధతిలో కూడా విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి. (సమకాలీన సంఘటనలుగా వీటిని ప్రస్తావించవచ్చు గాని సామ్యాలను వెతకడం వ్యర్థ ప్రయత్నమని నా అభిప్రాయం)
1719-1748 మధ్య కాలంలో రాజ్యం చేసిన మహమ్మద షా రంగీలే అనే ముగల్ చక్రవర్తి ఆస్థానంలో నియామత్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ అనే ఇద్దరు ప్రసిద్ధ సంగీతకారులు (వీణ, గాత్రం) సదారంగ్, అదారంగ్ అనే కలం పేర్లతో కొత్త ఒరవడి సృష్టించారు. అప్పటిదాకా జనాదరణ పొందిన ద్రుపద్ శైలికి భిన్నంగా వీరు ఖయాల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈనాటికీ అదే కొనసాగుతోంది.
మొత్తం మీద ప్రపంచంలోని మూడు సుదూర ప్రాంతాల్లో ఒకే యుగంలో మూడు ముఖ్య శాస్త్రీయ పద్ధతుల్లో కొత్త పోకడలు మొదలవడం, ప్రఖ్యాత సంగీత రచయితలు ఆవిర్భవించడం ఆసక్తికరమైన విషయం.
తక్కిన సాంస్కృతిక అంశాల్లాగే కళల చరిత్రలో కొన్నిటిని విస్మరించడం జరుగుతుంది. టర్కీ, మధ్యధరా ప్రాంతాలూ, చైనావంటి తూర్పు దేశాలూ అన్ని చోట్లా సంగీతం ఉంటూనే ఉంది. ప్రతిచోటా గొప్ప సంగీతకారులు ఉండే ఉంటారు. అయితే వారి గురించి చెప్పుకోవడం తక్కువగా జరుగుతుంది. ఇదొకరకమైన కల్చరల్ ఇంపీరియలిజం అనిపిస్తుంది. దీన్ని గురించి ప్రత్యేకంగా పరిశోధన చేసి వ్యాసాలు రాయవచ్చు.
ఈ మధ్య నేను గ్రీక్ సంగీతంలో సరిగ్గా కర్ణాటక సంగీతాన్ని పోలిన రాగాలున్నాయని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోవడం జరిగింది. వాటిని గురించి మరికాస్త తెలుసుకుని ఒక చిన్న వ్యాసం రాసే ఆలోచన కూడా ఉంది. నిజమైన పోలికలంటే ఇటువంటివే.
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
03/03/2007 4:50 pm
ఒత్తున్న విలేఖరి ఒప్పే!
నేను చాలాకాలంగా అమెరికాలో ఉండటాన, మన దినపత్రికలు చదివే అలవాటు పోయి, సాహితి గారు సవరిస్తే, భయమేసి తప్పు ఒప్పేసుకున్నాను. కాని “శబ్దార్థ రత్నాకరము” లో వెతికినా, “బ్రౌన్” లో వెతికినా ఆ రెండు మాటలూ కనిపించక ఏది తప్పో ఏది ఒప్పో నిర్ధారణగా తెలియలేదు. బూదరాజు ఏ సందర్భంలో విలేకరులు అన్నది వాడారో వారి పుస్తకాల్లో కనబడలేదు.
లేఖలు రాసే అలవాటు తప్పినా, చలం రాసిన “ప్రేమలేఖలు” ఇంకా గుర్తున్నాయి. ప్రాచీన కవిత్వంతో పరిచయం లేకపోయినా, కవిత్వం రాయడానికి నిరుపహతిస్థలమూ, ఉయ్యాల మంచమూ, ఊహ తెలిసిన లేఖకులూ, వగైరా అవసరం అని పెద్దన చెప్పిన ఆశుపద్యమొకటి నోటికొచ్చు.
మరి మన పత్రికల్లోకి విలేకరులు ఎలా జొరబడ్డారా అని నా మనసులో తీరని సందేహం ఉండిపోయింది. ఈవిషయంలో పత్రికల వాళ్ళకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అని సరిపుచ్చుకోలేకపోయాను. అల్పప్రాణమా, మహాప్రాణమా అని నాప్రాణం రెంటి మధ్యా చానాళ్ళు ఊగిసలాడింది. చివరకి రాత్రి ఇది నాకంటబడింది. ప్రాణం లేచి వచ్చింది:
“పత్రికలలో విలేకరి, విలేఖరి అనే మాటలు విస్తృతంగా కనిపిస్తుంటాయి. బహువచనంలో విలేకరులు – విలేఖరులు. విలేఖరుడు వంటి ఏకవచనరూపం కూడా ఉండవచ్చు. ఇక్కడ లిఖ్ అన్నది ధాతువు. అందువల్ల విలేఖరి అనే రూపం ఏర్పడుతుంది. దీనిలో ఖర శబ్దాన్ని విరిచి గాడిదలని చమత్కరించడానికి వీలుంటందన్న భయంతోనేమో కొంతమంది విలేకరి అనేమాటకు ప్రచారం కలిగించారు. చంద్రశేఖర, రాజశేఖర, గుణశేఖర వంటి పేర్లలో కూడా ఈ విధమయిన విరుపునకు అవకాశం ఉంది. అట్లా అని ఈ పేర్లు పెట్టుకోవడం మానలేదు కదా. ఈ భయం తప్పితే విలేఖరిని విలేకరి అనడానికి కారణం కనిపించదు. ఖ-క అయి విలేకరి అనే తద్భవపదం ఏర్పడడంలో అసహజమేమీ లేదు. కాని, ఆధునిక రచనా భాషలో విలేఖరి అని రాయడానికి సందేహించ వలసిన అవసరమేమీ లేదు.”
— “మన భాష,” డి. చంద్రశేఖర రెడ్డి, పేజీ 28.
హమ్మయ్య! ఇప్పుడు ప్రాణం కుదుటబడింది.
ఈ సంచిక సంపాదకీయం లో ప్రస్తావించారు కనుక మరో మాట చెప్తాను. విద్యావంతులు తమ మాతృభాషలోనే స్పెల్లింగు తప్పులు చెయ్యటం చాలా సిగ్గుచేటయిన విషయం. కాని ఇలాంటి తప్పులని సవరించుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకన్నా సహాయపడే సమగ్రాంధ్ర నిఘంటువు మనకి లేదు. కవిత్వ భాషకి కాకపోయినా వాడుక భాషకన్నా మంచి నిఘంటువు లేకపోవడం మనకున్న పెద్దలోటు. ఇంతకన్నా శోచనీయమైనది మరేముంది? ఈ లోటు తీర్చడం కన్నా ముఖ్యమైన వేరే పనేముంది?
ఆవుల మంజులత గారు అధికారంలోకి వచ్చినప్పుడు దీనికోసం తప్పక కృషి చేస్తామని మాట ఇచ్చారు. ఆవిడ కార్యదక్షురాలని కూడా విన్నాను. కాని ఆ ప్రాజెక్టు ఏస్థితిలో ఉందో ప్రకటించినట్లు లేదు!
ఇదేదో కొందరు ఔత్సాహికులు చెయ్యగలిగింది కాదు. అనేకమంది పండితులు దీక్షతో చాలాకాలం కలిసి పనిచేస్తేగాని ఫలితం ఉండదు. దీని కోసం తానా, ఆటా సంస్థలు కృషి చెయ్యాలనీ, అందరూ తమ వంతు సాంకేతిక, ఆర్థిక సహాయం అందజెయ్యాలనీ నా కోరిక.
అంతవరకూ, భాషావ్యాసాల ద్వారా నాలాంటి సామాన్య పాఠకులకి ఉపయోగపడే రచనల్ని చేస్తున్న భాషావేత్తలకి కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు
[విలేకరి, విలేఖరి అన్న పదాలలో ఏది సరైనదో నిర్ణయించడం అంత సులభం కాదు. -అరి అన్న తెలుగు ప్రత్యయాన్ని సుంకరి, కుమ్మరి, కమ్మరి మొ॥ తెలుగు పదాల్లో వాడితే, -కర/కరి /కార అన్న సంస్కృత ప్రత్యయాలను సుధాకర, అహంకారి మొ॥ సంస్కృత ప్రత్యయాల్లో వాడుతాము. లెక్క ప్రకారం విలేఖ(సంస్కృతం) లను సృష్టించే వాడు విలేఖకరుడు, విలేఖకరి అవ్వాలి. అయితే, రెండు సన్నిహిత ధ్వనులు పక్కపక్కనే ఉన్నప్పుడు, రెండు ధ్వనులకు మారుగా ఒక్క ధ్వనిని మాత్రమే పలకడం అన్ని భాషలలో జరిగే ధ్వని పరిణామమే (ఈ ధ్వని పరిణామాన్ని సదృశ వర్ణలోపం (Haplology) అని అంటారు). ఈరకమైన ధ్వని పరిణామం వలన విలేఖకరి అన్న పదం విలేఖరి/విలేకరి గా మారిందని చెప్పుకోవచ్చు. లిఖించేవాడిని (రాసేవారిని) అచ్చతెలుగులో “లేకరి” అనేవారు (మహాప్రాణాలు అచ్చతెలుగులో అల్పప్రాణాలు అవుతాయి కదా!). విలేఖలు రాసేవాడు, విలేకరి అయినా కావాలి, లేదా విలేఖకరి అయినా కావాలి. బూదరాజు గారెప్పుడూ విలేకరి అనే రాసేవారు – సం.]
నామాట గురించి lalitha గారి అభిప్రాయం:
03/02/2007 5:44 pm
నేను నా వైపు ప్రయత్నంగా పిల్లల కోసం తెలుగు (నా బ్లాగు లింకు) మొదలు పెట్టాను. మెచ్చుకోళ్ళు బాగానే వస్తున్నాయి. అవి నాకు ఉత్సాహాన్నీ ఇస్తున్నాయి. నిజంగా ఎంతమంది ఎంత తరచుగా అందులోని అంశాలు గాని దాని వల్ల స్ఫూర్తినందుకొని ఇతరం ఏవైనా గాని తమ పిల్లలకు తరచుగా పరిచయం చేస్తున్నారు అని నాకు అనుమానంగా ఉంటుంది. కాని నేను సందేహంతో ఆగదల్చుకోలేదు. ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతూనే ఉంటాను. నా పిల్లలకైతే ఉపయోగపడుతోంది. ఇంకొంచెం విస్త్రుతంగా పరిచయమైతే చేసుకుంటూనే ఉంటాను. ఒకే లాంటి అభిరుచులూ, ఆశయాలూ ఉన్న వాళ్ళు కొందరు తప్పని సరిగా ఉంటారు. వారు కొందరూ కలిసినా చాలు. ఇది నా వైపునుంచి నా ప్రయత్నం.
ఇక, రచ్చబండ లో చాలా మంది చాలా advanced భాషా విషయాలు చర్చిస్తారు, మంచి అనువాదాలు, కవితలూ రాస్తూ ఉంటారు. ఎవరైనా పూనుకుని వాటిని compile చేసి ఒక బ్లాగులో కాని వెబ్సైటు లో కాని పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకెప్పుడూ.
ఈ రోజున internet లో తెలుగులో రాయ గలుగుతున్నాము, చాలా మంచి బ్లాగుల్లో మంచి తెలుగు ఉపయోగింప బడుతోంది. తెలుగు భాషకు సంబంధించిన విషయాలు తెలియజేయబడుతున్నాయి. ఈ రాస్తున్న వారిలో చాలా మంది యువకులు కూడ ఉన్నారు. ఇవన్నీ ఆశాజనకమైన విషయాలు అనిపిస్తుంది నాకు. ఏమి లేకున్నా, పిల్లలకు తెలుగుని పరిచయం చెయ్యాలన్నా, వాళ్ళకు కుతూహలం కలిగించాలన్నా, వాళ్ళని తెలుగుతో “touch” లో ఉంచాలన్నా, ఇప్పుడు చాలా సమాచారం అందుబాటులో ఉంది. ఉన్న మంచిని పెంచుకుంటూ ముందుకి సాగుతూ ఉందాము.
ఇది నా అభిప్రాయం.
లలిత.
నామాట గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
03/02/2007 1:17 pm
రోహిణీప్రసాద్ గారూ:
సుమారు పది సంవత్సరాలుగా ఛందస్సులో శాస్త్రీయముగా
పరిశోధన చేస్తున్నాను. దాని ఫలితాలను ఛందస్సు, రచ్చబండల
మూలముగా అందరికీ తెలియజేస్తున్నాను. సుమారు 300
పద్యాలను గర్భ, బంధ తదితర చిత్రకవితలను వ్రాసియున్నాను.
కాని ఇందులో జనులకు అంతగా ఆసక్తి లేదండీ. దేనికీ ఫీడ్ బ్యాక్
ఉండదు. కొన్నిటికి పవర్ పాయింట్ ప్రెసెంటషన్లు కూడ ఉన్నాయి.
నా ఉద్దేశములో ఇంటర్నెట్ ద్వార తెలుగు నేర్చే ప్రయత్నాలను
ఎక్కువగా చేయాలి. విశ్వవిద్యాలయాల ద్వారా నేర్చుకోవడం
కొద్దిగా కష్టమేమో? కాని ఈ విశ్వవిద్యాలయాలు ఆన్ లైన్
డిస్కషన్లకు వినియోగిస్తే బాగుంటుందేమో?
ఆలోచనలకు ఆసక్తికరమయిన మాటను శ్రీ వేలూరి గారు
అందజేసినందులకు వారికి హార్దిక వందనములు.
– మోహన
నామాట గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/02/2007 12:43 pm
తెలుగు సంఘాలని గురించి పెద్ద ఎత్తున చర్చించటానికి ఇది సరైన వేదిక కాకపోవచ్చు గాని విహారిగారు రాసినది చదివాక లోగడ నేను చేసిన ఒక సూచనను మళ్ళీ ప్రస్తావించా లనిపిస్తోంది.
టీనేజర్లకు తెలుగు గురించి చెపుతున్నప్పుడు మన చిత్ర కవిత్వం గురించీ, బంధ కవిత్వం, అష్టావధానాలను గురించీ తెలిసినవారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చెయ్యగలిగితే వారికి కొంత ఆసక్తి కలిగే అవకాశం ఉంది. భాషని పెర్ఫార్మింగ్ ఆర్ట్ గా ప్రదర్శించడం సరికాకపోవచ్చు కాని దాని శక్తుల గురించి తెలియజేస్తే కొన్నేళ్ళకైనా బాపూ, సినారె తదితరులను గురించి తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తారేమో.
తరవాతి తరాలు సంస్కారపరంగా ఆటవిక దశకు చేరుకోకుండా చూడాల్సినది మనమే కదా. అందుకని నిరాశపడకుండా ప్రయత్నాలు చెయ్యాలి. ఏ ప్రోగ్రాములకు ఎంతమంది వస్తున్నారనేది ముఖ్యం కాదు. మంచి ప్రోగ్రాములు నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగి తీరాలి. కేవలం అంకెలనే ప్రామాణికంగా తీసుకుంటే అర్ధనగ్న రికార్డు డాన్సులు పెట్టించాలి. అప్పుడు చిరంజీవి పాటల కన్నా హెచ్చుగా జనం వస్తారు. అందుకని జనం రావడం ఒక్కటే కొలమానం కాదు. ఆడియన్స్ సంస్కారం కంటే కార్యకర్తల సంస్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది మరిచిపోకూడదు.
భయం! గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/02/2007 12:10 pm
చాలా మంచి రచనే కాని పర్యవసానం తేలకుండా ఆగిపోయిన ట్టనిపించింది. జీవితానుభవాలని విస్తృతం చెయ్యగలిగిన రచనలు తెలుగులో ఇంకా రావాలి. దీనికి తరువాయి భాగం ఉంటుందని ఆశించవచ్చా?
నామాట గురించి విహారి గారి అభిప్రాయం:
03/02/2007 11:50 am
వేంకటేశ్వర రావ్ గారూ,
మీరన్న మాటల్లొ ఎంతో నిజం వుంది. ఎన్ని సంఘాలు వున్నా వాటి ఆదర్శాలు పూర్తిగా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. అలా అని అవి లేకుండా పోతే మొదటికే మోసం వస్తుంది. ఇవన్నీ కంటికి రెప్ప ఇస్తున్నంత రక్షణ అని నా అభిప్రాయం. ఇవి కూడా లేకపోతే మన సంప్రదాయాలు పూర్తి అంతరించే ప్రమాదమున్నది. ఇక్కడే నేను కూడ తెలుగు సంఘం లో వున్న ప్రధాన కార్య వర్గ సభ్యుణ్ణే. దీని గురించి చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. మొన్న మేము చేసిన దీపావళి సంబరాల్లో గాయకులు కొన్ని చిరంజీవి పాటలు పాడారు. దానికి పిల్ల పీచు అందరూ పెద్ద ఎత్తున స్టేజ్ ఎక్కి డ్యాన్సులు చేశారు. తరువాత ఒక “రామ దాసు” సినిమాలోని పాట డ్యాన్సులు చెయ్యడానికి ముందుకు రమ్మంటే ఒక్కరు కూడా రాలేదు. అలాగే ఈ కార్యక్రమాల్లో సినిమా పాటల మీద మసాల మాటల కామెడీల మీద చూపించే ఇంట్రెస్ట్ మిగతా వాటి మీద వుండదు. సినిమా పాటంటే హాలు ఫుల్లు త్యాగరాజ కీర్తనంటే హాలు నిల్లు. అంత మందిని ఒక చోటకు తీసుకు రావడానికి ఎన్నెన్నో తంటాలు పడాల్సి వస్తోంది.
శ్రీ శ్రీ గారు చెప్పింది కరక్టే. శంకరాభరణం సినిమా చూసి హిట్ చేసిందీ తెలుగు జనులే…మంగమ్మ గారి మనవడు, అల్లుడా మజాకా లాంటి డబుల్ మీనింగ్ డైలాగుల సినిమాలను హిట్ చేసింది అదే తెలుగు జనులే. మన కీర్తిని చెప్పడానికి ప్రతి సారీ బాపు నో, సి.నా.రె. నో, ఆత్రేయ నో, బాల మురళీ కృష్ణ నో తీసుకు వస్తే ఇప్పుడున్న నలభై ఏళ్ళ లోపు వాళ్ళలో థొంభై శాతం మంది గుర్తుపట్టలేక పోవచ్చు. అదే ఏ సినిమా వాడినో పట్టు కొస్తే సులభంగా పబ్లిసిటీ వస్తుంది. పనిలో పనిగా ఆ తెప్పించిన వాళ్ళకూ పబ్లిసిటీ వస్తుంది.
అలాగే విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధన మొదట్లో బాగానే వుంటుంది. తరువాతే సమస్య అంతా. కొంత మంది దాతలు డబ్బు ఇచ్చినా అందులో చేరే వారు కరువవుతారు. రోహిణి ప్రసాద్ గారన్నట్లు అర్థ కాని ఫుట్ బాల్ మ్యాచ్ ను అర్థం చేసుకోవడానికి వెచ్చించే సమయాన్ని తెలుగు బాష మీద సంస్కృతి మీద పెడితే మనం తెలుగు ను ఇంకొంత కాలం బతికించుకో గలుగుతాము.
ప్రమంచంలో వున్న తెలుగు సంఘాలన్నీ తెలుగు వాళ్ళ కోసం కాకుండా తెలుగు మీద అభిమానమున్న వాళ్ళకు మాత్రమే పనిచేస్తాం అనే ఆదర్శం తో ముందుకు పోతే కాస్త సఫలమవుతారు.
పద్యాలు – వాడుకభాష గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
02/14/2007 12:18 am
“ఛందస్సు లేకుండా కవిత్వం లేదు” – వరద
కామేశ్వరరావు గారూ,
కందకీ గీతకీ తేడా తెలియని ‘విద్యావంతుణ్ణి’ నేను. అదేదో గొప్పగా చెప్పుకోడం లేదు; ఉన్న విషయం చెప్తున్నా. అయినా మీ వ్యాసం నాకు బాగా నచ్చింది.
విశ్వనాథ కవిత్వంలోని తెలుగు వెలుగులు చూపినందుకు సంతోషం. మీరు చెప్పింతర్వాత కొన్ని పద్యాలు చదివి “ఓహో” అనుకున్నాను – “ప్రొద్దుననే లేచి పులికాపు పెట్టును” అంటూ మొదలైన సీసం!
మధ్యాక్కర వాడుకభాషకు వీలుగా ఉంటుందన్నారుగాని “విశ్వనాథ మధ్యాక్కరల” నీ ఆరుద్ర “శుద్ధ మధ్యాక్కరల”నీ ప్రస్తావించలేదు. ఆరుద్ర రాసినది వాడుక భాషగానే కనపడుతుంది.
అబ్బూరి ‘చెరకాలం’ రాస్తున్నప్పుడే శ్రీశ్రీ ‘కలకాలం’ తలపెట్టి, ‘చెరకాలం’ కోసం ఉపోద్ఘాతం రాస్తూ,
“కలకాలం చెరకాలం
సిలువై తుదికావ్యమై స్పృశించెను వరదా!”
అని అన్నాడట. అని ‘చెరకాలం’ వ్రాతప్రతిని పట్టుకెళ్ళి పోగొట్టుకున్నాడు! అబ్బూరి దగ్గర మరో కాపీ లేదు! ‘తెలుగు స్వతంత్ర’ లోనూ “అందాకా” లోనూ ప్రచురితమైనవీ, అముద్రితమైనవీ, దొరికినంతవరకు వీళ్ళదగ్గరా వాళ్ళ దగ్గరా సేకరించి, లండన్ వాస్తవ్యులైన పరకాల ప్రభాకర్ 1993లో “కవితా సంచిక” గా ప్రచురించారు. దాంట్లో దాదాపు డెబ్భై పేజీలు ‘చెరకాలా’ నివే! దాని చివర్లో అబ్బూరితో “కవిత్వం అంటే…” అన్న పేరుతో పరకాల జరిపిన ఆసక్తికరమైన ఇంటర్వ్యూ కూడ వుంది.
విశ్వనాథ వారు అబ్బూరి ప్రయోగాలని చూసి, “నీ స్నేహితులంతా ఛందస్సు మీద విరుచుకు పడతారేం? వాళ్ళకి చాతకావాలి కాని అందులో రాయటానికేం బాధ? నువ్వు రాసి చూపించావు కదా – యింకా యేం కావాలి వాళ్ళకి?” అని మెచ్చుకున్నాడు.
చెదురుమదురుగా వున్న మరికొన్ని అబ్బూరి రచనల్ని ఒకచోట చేర్చి, వారి కుటుంబసభ్యులు 1995లో “సామిధేని” పేరిట మరో పుస్తకాన్ని ప్రచురించారు. దాంట్లో చేకూరి రామారావు గారి వ్యాసం, “నిరంతరాన్వేషి, నిత్యప్రయోగశీలి వరద,” కోవెల సంపత్కుమారాచార్య గారి వ్యాసం, “ఛందో వరదస్మృతి,” వున్నాయి. నిజం చెప్పాలంటే, ఆ పండితుల వ్యాసాల్లో కన్నా మీ వ్యాసంలో “ప్రవాహ గుణం” బాగుంది.
ఈ పుస్తకాలు నేను గత రెండేళ్ళ లోపునే కొన్నాను కనుక ఇంకా దొరుకుతున్నాయనుకుంటాను. మీ వ్యాసానికి అవి ఉపయోగపడొచ్చు.
కొడవళ్ళ హనుమంతరావు
పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/31/2007 8:24 am
భాషకి అనువుగా ఛందస్సు మారాలని మొదట గుర్తించింది గురజాడ. అతని అడుగుజాడలో నడిచిన వాడు శ్రీ శ్రీ (ఆ విషయంలో). గురజాడ, శ్రీ శ్రీ సాంప్రదాయిక ఛందస్సులలో రాసిన పద్యాలలో భాషనీ, మాత్రా ఛందస్సుల్లో రాసిన పద్యాలలోని భాషనీ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికున్న కవితత్వం ప్రథానంగా పద్యరూపం కావడం మూలానా, పద్యాలకి వ్యవహార భాష తగదని తెలుసున్న కారణానా, ఆనాటి వ్యావహారిక భాషా వాదులు వచన సాహిత్యం గురించే పోరాడారుగాని పద్యాలజోలికి, కవిత్వం జోలికీ పెద్దగా పోలేదు. గురజాడ ఒకడుగు ముందుకు వేసి కవిత్వంలో కూడా వ్యవహార భాష తెచ్చే ఉద్దేశంతోనే మాత్రా ఛందస్సులని స్వీకరించాడు. ఐతే మాత్రా/దేశి ఛందస్సులలో కథా కావ్యాలని సృష్టించగలమా, సృష్టించినా అవి ఎంత వరకూ జన రంజకం అవుతాయీ అన్నది పరిశీలించాల్సిన విషయం. పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యాలుకాని, రంగనాథ రామాయణం కానీ అంతగా ప్రసిద్ధి చెందకపోవడానికి కారణం కేవలం రాజకీయమనో, పండితుల నిరాదరణ అనో కొట్టి పారేశాం కానీ, వాటిని ఒక పోతన భాగవతం తోనో, మొల్ల రామాయణంతోనో పోల్చి వాటి అనాదరణకి కారణాలు వెతికే ప్రయత్నం జరగలేదు.
భాషా శాస్త్ర పారిభాషిక పదాలపై నాకు పెద్ద అధికారం లేదు కాని, agglutination, inflection, vowel harmony మొదలైన లక్షణాలన్నీ కలిసి తెలుగు భాషకి ఆ ప్రవాహగుణాన్ని స్తున్నాయి, బహుశా.
“జ”కి “శో” కి హల్ మైత్రి కుదిరినా అచ్చుల మైత్రి కుదరదు (“అ”కి “ఒ”కి). కాబట్టి ఆ రెండక్షరాల మధ్య యతి సాధ్యం కాదు. అలాగే “వ”కి “వి”కి కూడా కుదరదు. కొంత అరుదైనా నన్నయ్య “ప”కి “వ”కి, “బ”కి “వ”కి యతి వేసాడు. ఉదా:
“నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూరిటికంటె నొక్క స
త్క్రతువది మేలు…”
“ప్రల్లదుడైన యొక్క కులపాంసను జేసిన దాన దత్కులం
బెల్లను దూషితంబగుట యేమి యపూర్వము గావునన్ మహీ
వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలో
…”
పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/30/2007 11:27 am
నిజమే, గ్రాంధిక భాషకీ వాడుకభాషకీ మధ్యనున్న భేదాన్ని వివరించడం శ్రమతో కూడుకున్న పనే. అసలు గ్రాంధిక భాషనీ, వ్యావహారిక భాషనీ సరిగ్గా నిర్వచించాలంటేనే అనేక సమస్యలున్నాయి. వాడుక భాషకి ఒక కాలపరిమితిలోనే లక్షణాలు చెప్పుకోగలం, అది నిత్యం మారుతూ ఉంటుంది కాబట్టి. గ్రాంధిక భాష అంటే, గ్రంథస్థమైన భాష అన్న నిర్వచనం చెప్పుకుంటే, అదీ కాలంతోపాటు మారుతూ ఉంటుంది. గాంధిక వ్యావహారిక భాషా వాదాలు నడచిన కాలంలో, గ్రాంధిక భాషంటే ప్రాచీన కావ్యాల ఆధారంగా రూపొందించిన కొన్ని వ్యాకరణాలకి బద్ధమైన భాష అనీ, వ్యావహారిక భాష అంటే ఆ వ్యాకరణాలకి బద్ధం కానిదనీ నిర్వచించుకున్నారు. ఐతే అటువంటి వ్యాకరణాలకి విరుద్ధమైన ప్రయోగాలు కావ్యాలలో ఉండడం అటు గ్రాంధిక భాషా వాదులు, ఇటు వ్యావహారిక భాషా వాదులూ కూడా గుర్తించారు. ఐతే గ్రాంధిక భాషంటే కేవలం సంస్కృత పదభూయిష్టమైన రచనే కాదన్నది నిర్వివాదం. శివుడిని “అరపదిమోముల దయ్య”మనడం వ్యవహార దూరమే కదా, అంచేత అది గ్రాంధిక భాషే అవుతుంది. ఒక రకంగా ఆలోచిస్తే వాడుకభాష ఎప్పుడైనా గ్రాంధిక భాష కావచ్చు. కానీ గ్రాంధిక భాషలో కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ ఉంటాయి.
గ్రాంధికభాష అంటే గ్రంథస్థమైన భాష అని చెప్పుకుంటే, అది వ్రాసే భాష అవుతుంది. అప్పుడు వాడుకభాషంటే మాట్లాడుకునే భాష అని నిర్వచించుకోవాలి. ఐతే ప్రాచీన కాలంలోని కావ్యేతరమైన లిఖిత సాహిత్యాన్ని పరిశీలిస్తే, అది కావ్య భాషకి భిన్నంగా కనిపిస్తుంది.
ఈ రకంగా గ్రాంధిక, వ్యవహార భాషల నిర్వచనాలగురించే చాలా చర్చ చెయ్యవచ్చు. భాషా శాస్త్ర అభిమాన్లు గ్రాంధిక, వ్యవహార భాషల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులని పరిశీలించ వచ్చు.
ఇవన్నీ నా వ్యాసానికి ముఖ్యం కాదని నేననుకోవడం వల్ల ఈ విషయాల్లోకి వెళ్ళలేదు. నేను ప్రథానంగా చర్చించాలనుకున్నది – ఈ కాలంలో పద్య కవిత్వం రాయాలంటే, ఇప్పటి వాడుకభాషను ఎంతమేరకు ఉపయోగించ వీలవుతుంది? ప్రాచీన కావ్య భాష అనువైనంతగా నేటి వాడుక భాష పద్యాలకి తగుతుందా? దీనికోసమే వాడుక భాష అంటే గత వంద సంవత్సరాలుగా వాడుకలో ఉన్న భాష అని అన్నాను. గ్రాంధిక భాషకి తాత్కాలిక నిర్వచనం (ఇది చేరాగారి దగ్గరనుండి నేనరువుతీసుకున్న పదం) మాత్రమే ఇచ్చి, ఆ భాషలో కనిపించే లక్షణాలని ప్రస్తావించాను. ప్రాచీన కావ్య భాష కూడా నన్నయ్య నుండి, విశ్వనాథ వరకూ మార్పులు పొందుతూ వచ్చినా కొన్ని ప్రధానమైన లక్షణాలను మాత్రం కోల్పోలేదు. వాటినే నా వ్యాసంలో ఉపయోగించుకున్నాను. అధికమైన పద సంపద, “-న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి. అలాగే వాడుక భాషలోని ప్రధానమైన లక్షణాలని ప్రస్తావించాను – నామవాచకాలలోని “ము” సున్నాగా మారడం, విసంధి మొదలైనవి.
ఆధునిక పద్య కవిత్వాన్ని పరిశీలించి, వాడుక భాష పద్య కావిత్వంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అన్న విషయమ్మీద ఇంకా పరిశోధన చెయ్యవచ్చు.
“నేనొక పూలమొక్క….” పద్యం మనసుకి హత్తుకోవడం వెనుక వాడుకభాష సహాయం తగినంత ఉందని తెలుస్తుంది – “చివాలున” కొమ్మ వంచడం, “జాలిగ నోళ్ళు”విప్పడం, “బావురు”మనడం వంటి పదాలని గమనిస్తే.
సురేశ్ గారూ, “అడవికి బువ్వులు దేరగ వడి నరిగిన కచుని జంపి…” అన్న నన్నయ్య గారి పద్యాన్ని బాగానే పట్టుకున్నారండీ!
వారిజములంటే తామరపువ్వులుకాబట్టి ఆ పదం సరిపోదు. “ప్రసవమ్ములొగిన్” అంటే సరిపోతుంది:-)
అలాగే చివరి పాదంలో యతిభగం జరిగింది, “జాలింబడగన్” అని మార్చుకోవచ్చు.
పద్యాలు – వాడుకభాష గురించి Raja Sankar Kasinadhuni గారి అభిప్రాయం:
01/29/2007 3:05 pm
కామేశ్వరరావుగారి వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే, గ్రాంథికానికి వాడుక భాషకి తేడా చెప్పడం ఒక పరిథి దాటిన తరువాత చాలా కష్టం అని నాకనిపిస్తుంది.
ఉదాహరణకు ఒక పద్యంలో “అరపది మోముల దయ్యము” (ఐదు ముఖముల దైవము, అనగా శివుడు) అని అచ్చ తెలుగులోని మాటలతో ఈశ్వరుడిని వర్ణిస్తాడు కవీశ్వరుడు. ఈ పద్యం ఏ కోవలోకి వస్తుంది?
సంస్కృత పద భూయిష్టమైన రచనలే గ్రాంథికమని రచయత అభిప్రాయామా?
ఏది ఏమైనా రచయత విషయాన్ని చెప్పిన శైలి చాలా బాగుంది. కామేశ్వరరావుగారి కలంనుంచి మరిన్ని మంచి వ్యాసాలు రావాలని కోరుతున్నాను.
కొలిచాలగారి క్రింది అభిప్రాయంలో ఎదో self-contradiction కనిపిస్తోంది:
“పండితుల పట్టుదల వల్ల, లాక్షణీకుల వ్యాకరణ సూత్రాల వల్ల గ్రాంథిక భాష కొంత జడత్వం చూపినా, “ప్రాఁతవడ్డ మాటలను” పరిహరించడంలో, కొత్త మాటలను, ప్రయోగాలను ఉపయోగించడంలో నన్నయ్య, తిక్కనల నుండి విశ్వనాథ వరకూ, మహాకవులెవ్వరూ సందేహించలేదని నాకనిపిస్తుంది.”
1. పూర్వ కవుల ప్రయోగంబులు గ్రాహ్యంబులని కదా వ్యాకరణ సూత్రం? మరి పై ఆక్షేపణ (వ్యాకరణం వలన భాషలో జడత్వం) ఎంత వఱకు సమంజసం?
2. నన్నయ, తిక్కన, విశ్వనాథ ఇత్యాదులంతా పండితులు కారా?
ధన్యవాదాలతో,
కాశీనాథుని రాజాశఙ్కర్
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
01/26/2007 10:04 am
సురేష్,
వొక అద్భుతవైన రచన, పాఠకుల్ని ఎంత ప్రభావితం చేస్తుందో మీ వ్యాసం మీద వెల్లువెత్తిన అభిప్రాయాలే వొక వుదాహరణ. శ్రీశ్రీ కవిత్వం చాలా మంది సాధారణ పాఠకుల్ని కవులుగా మార్చింది అన్నది వొక అభిప్రాయం. మీ వ్యాసం కుడా కొందరు పాఠకుల్ని భాషాశాస్త్ర దిశలో ప్రయాణం కట్టిస్తుందని నా అబిప్రాయం.
పత్రికలు చదివే చాలామంది పాఠకులు నాలాగే, ప్రత్యేకవైన భాషా, సాహిత్య పరిఙ్ఞానంలేని సాధారణ పాఠకులే. సాధారణ జీవితం ఇచ్చిన కొద్దిపాటి లోకఙ్ఞానం, పాఠశాలల్లోనో, కళాశాలల్లోనో నేర్చుకున్న కొద్దిపాటి శాస్త్ర పరిశీలనా పరిఙ్ఞానం, ఈ రెండిటి కలబోతలోంచి అలవరచుకున్న కొద్దిపాటి తర్కఙ్ఞానం ఇవే మాకున్న అతి సరళవైన logical skills, నిజాన్నిఅబద్దంలోంచి వేరుచైడానికి, తప్పుని వొప్పులోంచి చెరిపేయడానికి. ఐతే ఈ nascent rational attitude lives along with irrational emotional beliefs about race, language, nationality in our minds. తెలుగు ప్రాచీనత మీద ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఆ నాలుగు వ్యాసాలు చదివేక మనసుకెంత ఆనందవేసిందంటే, ఎక్కడో కుర్చోని ఎదో చదువుకుంటున్న నా ఏడో తరగతి కుతుర్ని పిలిచి, చదివి వినిపించి, చుశావా, మన తెలుగు జాతి, తెలుగు భాష గొప్పదనం, ఎప్పుడో సుమేరియన్ నాగరికత కాలంలోనే మన roots వున్నయ్ అని డబ్బా కొట్టి మరీ చెప్పెటంత ఆనందం. తర్వాత మళ్ళా నా కుతురుతో కుర్చోని అ తప్పుని సరి చేసుకోవటం సురేష్ రచన చదివేకే సాధ్యపడింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సురేష్ గారి వ్యాసం ఇంతకుముందు వచ్చిన వ్యాసాలమీద విమర్స లేకుండా వొక్క భాషా శాస్త్రం 101 కే పరిమితవైయ్యుంటే బావుండేది అనే అభిప్రాయం ఈమాట అభిప్రాయాల్లో వ్యక్తం కావటం వలనే. మేవు అతి సాధారణ పాఠకులం, మా బుర్రలో వుండే సవాలక్ష తర్కానికి నిలవని నమ్మకాల్ని తొలగించుకొని, ఎక్కడో, మనసులో ఏ ములో నక్కి నిద్రపోతున్న శాస్త్రియ పరిశీలనని నిద్రలేపాలంటే సురేష్ వ్యాసంలో వున్నటువంటి juxtaposition అవసరవని నా ఉద్దేశం.
విప్లవ్ చెప్పినట్టు ఏ కళ్ళంలో గింజలు ఆ కళ్ళంలో నే నూర్చుకోవటం సహజవే. చేనైతే చాలానే వుంది. కానీ అదేం యదకొచ్చిన చేనేం కాదు. నిదర్శనం కావాలంటే మన ఘనత కెక్కిన విశ్వవిధ్యాలయాల భాషాశాస్త్ర శాఖల వెబ్ సైట్లకెళ్ళి వొకసారి చూడండి. పెట్టుబడైతే చాలానే పెడ్తున్నరు గాని, చేన్ని మాత్రం చవుడు నేల చేస్తున్నారు. కాబట్టి దుక్కి దున్ని, నారేతలేసి, కోసి, నూర్పులు చేసే మెళుకువలు, వోపికలు లేని నాలాటి పాఠకులకి శాస్త్రం తో పాటు, అశాస్త్రియతని వేలెత్తి చూపే సురేష్ గారు వ్రాసిన వ్యాసాలే ఉపయోగకరం.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
వర్షానంతరం గురించి viswamitrudu గారి అభిప్రాయం:
01/24/2007 10:49 am
మొదటి మూడు పాదాలతో మొదలుపెట్టిన పద్ధతి బాగుంది
కాని
పరవశపు పారిజాతాలు
చిరునవ్వుల సన్న జాజులు
సౌఖ్యపు సంపెంగ మొగ్గలు
?? ?? ??
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/24/2007 12:06 am
“శాస్తవేత్తలకే గోచరించని Kuhn శాస్త్రీయ స్వరూపం!”
”The Structure of Scientific Revolutions” అంటే “శాస్త్రీయ విప్లవాల స్వరూపం” అన్నది నచ్చింది. ”Paradigm Shift” అంటే “రూపావళి మార్పు” అన్నది శ్రావ్యంగా ఉంది గాని, మాట వివరిస్తే తప్ప మనసుకి తట్టదు. ప్రతిమానం అంటే పరవాలేదేమో. ఆలోచించే తీరు, దృక్పథం అంటే సులభంగా అర్థమవుతుంది నాకు. ”Post-positivist” అంటే “ప్రత్యక్ష్యోత్తర” అన్నది మాత్రం ఇంగ్లీషులోనూ అంతకంటే మిన్నగా తెలుగులోనూ కర్ణకఠోరంగా ఉంది. ఆధునికోత్తర వాదం లాంటిదా ఇది? ఇవి పంటికింద పడిన రాళ్ళలా బాధిస్తాయి.
ఇంతకీ నేను చెప్పదలచుకున్నది అనువాదాల గురించి కాదు. సురేష్ తన వ్యాసంలో అన్న మాట:
ఒక శాస్త్రవేత్త తయారు చేసిన సిద్ధాంతానికి తరువాతి తరం శాస్త్రవేత్తలు మెరుగులు దిద్దటం కానీ, లోపాలు సవరించడం గాని శాస్త్రపరిశోధనారంగంలో ఎల్ల కాలాల్లోను జరుగుతున్న పని.
దానికేననుకుంటాను, బాపారావు గారు కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు:
Kuhn పండితుడు Structure of Scientific Revolutions వెలయించి అరశతాబ్దం కావస్తోంది. “Paradigm Shift” అని ఇప్పుడు కాకపోతే కాసేపటికి అనేసేవాడే ప్రతివాడూనూ. ఇప్పటికైనా శాస్త్రీయ పరిశోధన అనేది క్రమపద్ధతిలో, మునుపటి తప్పులని దిద్దుకుంటూ అలాగ్గా పురోగమిస్తుందనే అపప్రథని ప్రచారం చెయ్యడాన్ని నిషేధిస్తే మంచిది. స్థూల స్థాయిలో చూస్తే సైన్సు తన సిద్ధాంతాల్ని ఒక పట్టాన మార్చుకోదనీ, వస్తేగిస్తే అలాంటి సైద్ధాంతి పరిణామం విలయానికేమీ తక్కువకాదనీ ఒప్పుకుతీరాలి. కుశాస్త్ర తరీఖాలని చెండే వ్యాసంలో శాస్త్రగతి తీరుగురించి పాతరోజుల పడికట్టురాళ్లనే తిరగదోడటం అభ్యంతరకరం. .
వారిద్దరి రాతల్ని బట్టి వాళ్ళు నాకన్నా ఈవిషయాల్లో బాగా తెలిసినవాళ్ళని తెలిసినా, బాపారావు గారు అన్నదానికి అభ్యంతరం తెలపక తప్పడం లేదు. వారు Kuhn గురించి అన్న నాలుగు మాటలకి నేనింత చాటభారతం రాయడం అసందర్భం అనిపించవచ్చు. కాని శాస్త్రీయ పద్ధతులూ స్వరూపం ఈ వ్యాసానికీ జరుతున్న సంభాషణకీ ముఖ్యమనిపించి, మిడిమిడి జ్ఞానంతోనే సాహసిస్తున్నాను. ఎందుకంటే:
శాస్త్ర చరిత్రకారుడైన Thomas Kuhn సైన్సు స్వరూపాన్నీ స్థితిగతుల్నీ బట్టబయలు చేసి శాస్త్రీయ అవగాహనలో ఓ నూతనోధ్యాయాన్ని సృష్టించాడంటారు కొందరు. సైన్సు “వాస్తవికత”కి దగ్గరగా రావడమన్నదాంట్లో అర్థం లేదనీ, ఓ ప్రతిమానాన్ని నమ్మిన శాస్త్రవేత్తలు దానికి లోబడి వున్న సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారనీ, కాని కొన్ని చిక్కువిడని సమస్యల్ని తీర్చడానికి కొత్త ప్రతిమానాన్ని ప్రతిపాదిస్తారనీ, కొన్నాళ్ళకి దాంట్లోనూ తీర్చలేని సమస్యలుండి, మరో కొత్త ప్రతిమానాన్ని ప్రవేశపెడతారనీ, అది పాతదాన్ని స్థానభ్రంశం చేస్తుందనీ, ఇదే శాస్త్ర స్వరూపం – ఇది Kuhn సారాంశం అనుకుంటాను.
ఒక ప్రతిమానం మరొకదానికంటె మిన్న అని చెప్పడానికి వాస్తవమైన ఆధారమేమీ లేదు, మిగిలిన శాస్త్రవేత్తలని నమ్మించగలిగితే చాలు అదే నెగ్గుతుంది, అన్నది ఆయన భావన అని అర్థం చేసుకున్నాను. సైన్సు, శాస్త్రవేత్తలు చేసే వ్యాఖ్యానం మాత్రమే, అదొక రకమైన “భాషా క్రీడ”; అంతేగాని కాలం గడిచేకొలదీ సైన్సు “సత్యానికి” దగ్గరగా వస్తుందనటంలో అర్థం లేదన్నది Kuhn వాదన.
అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే Kuhn తో అంగీకరించరు [1]. Structure లో చెప్పిన ప్రతిమానాల చిత్రీకరణతో ఒప్పుకునే శాస్త్రజ్ఞుల పేర్లివ్వమని బాపారావు గారిని కోరుతున్నాను.
శాస్త్రవేత్తల కన్నా Kuhn ప్రభావితం చేసింది ఓ తరహా తత్వవేత్తలనీ, సాహిత్యకారులనీ. వాళ్ళకీ శాస్త్రవేత్తలకీ చుక్కెదురు! ఒక తత్వవేత్త అయితే, భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజేకాదు, ఆశాస్త్రంలో వాళ్ళ పేరుమీద కొన్ని సూత్రాలున్నా కూడా, వాళ్ళకి జ్ఞానమీమాంస (epistemology) గురించి ఏమీ తెలియనప్పుడు నోటికొచ్చినట్లు వాగకూడదని Kuhn ని విమర్శించినందుకు కొందరు శాస్త్రవేత్తలని అమర్యాదగా తిట్టిపోశాడు [2].
నా ఉద్దేశంలో శాస్త్రవేత్తలు కాని వాళ్ళు సైన్సు గురించి రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. Quantum Mechanics మూలంగా సైన్సు సత్యాన్ని నిశ్చయంగా తెలుసుకోలేదని రుజువయింది కనుక సైన్సుకి ఆధునికాంతర కాలంలో వేరే అర్థం, ప్రాముఖ్యతా ఇవ్వాలనే వాళ్ళు వాళ్ళ పరిథిని దాటి పోతున్నారని నా అనుమానం [3].
నామటుకి నాకు ఇవన్నీ అర్థమయానని అనలేను కాని, ఇవి చదవడం వలన ఎవరికీ ఎలాంటి హానీ కలిగిందనుకోను. ఈ భిన్నాభిప్రాయాలలో వేటినీ నిషేధించాల్సిన అవసరం కనబడటం లేదు. నిజం చెప్పాలంటే, Kuhn భావనలని వక్రీకరించి కుశాస్త్రానికి దోహదం చేస్తున్న వాళ్ళు మిక్కిలి హానికరమనుకుంటాను [4].
బాపారావు గారు, తిరుపతిరావు గారు, Thomas Kuhn, Richard Rorty – వీళ్ళనెవరినీ నేను హానికరమైన వాళ్ళ జాబితాలో చేర్చడం లేదని మనవి.
కొడవళ్ళ హనుమంతరావు
నోట్స్:
1. “The Revolution That Didn’t Happen,” Steven Weinberg, The New York Review of Books, Volume 45, Number 15, October 8, 1998. ఈయన University of Texas at Austin లో Physics professor. చాలా పేరున్న శాస్త్రవేత్త, 1979 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత. తన నలభై-ఏభై ఏళ్ళ శాస్త్ర పరిశోధనా జీవితంలో ఎన్నో విప్లవాత్మకైన మార్పుల్ని చూసినా, సిద్ధాంతం సరైనదా కాదా అని పరిశీలించే తీరులో పెద్ద మార్పేమీ లేదనీ, Kuhn ప్రకటించిన Paradigm Shift లాంటివేమీ జరగలేదనీ వాదించాడు.
2. ”Thomas Kuhn, Rocks and the Laws of Physics,” an essay in “Philosophy and Social Hope,” by Richard Rorty. ఈయన సాహిత్యం, ఫిలాసఫీలో Stanford లో Emeritus professor. Kuhn ని మార్గదర్శకుడిగా గుర్తించిన సమకాలీన తత్వవేత్తలలో ముఖ్యుడు.
3. “పోస్ట్ మోడర్నిజం,” బి. తిరుపతిరావు. ఈయన విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులు. క్వాంటం సిద్ధాంతం ఎలక్ట్రాన్ స్థలమూ వేగమూ ఒకేసారి నిశ్చయంగా తెలుసుకోలేమని నిరూపించింది గదా. అణుప్రపంచంలో సాధ్యం కానిది స్థూల ప్రపంచంలో ఎలా సాధ్యమవుతుందంటూ, సైన్సులోకానీ సామాజిక శాస్త్రంలోగానీ నియతివాదానికి చోటులేదనీ, ఇదే ఆధునికాంతర సైన్సు ప్రాముఖ్యత అనీ, అందుకు Kuhn రచనల్ని ఆధారంగా చూపెట్టారు. శాస్త్రవేత్తలు వీటికి ఒప్పుకున్న దాఖలాల్లేవు. వీరి అభిప్రాయాలతో అంగీకరించినా లేకపోయినా, తెలుగులో ఆధునికోత్తర వాదాన్ని పరిచయం చేస్తూ ఈ పుస్తకం రాసినందుకు వీరిని మెచ్చుకోవాలి.
4. “Pseudoscience and Postmodernism: Antagonists or Fellow-Travelers?” by Alan D. Sokal. ఈయన New York University లో Physics professor. పోస్ట్ మోడర్నిజం పేరుతో అన్ని రకాల మూఢత్వమూ సైన్సులోకీ చరిత్రలోకీ జొరబడిందనీ, దురదృష్టవశాత్తూ జాతీయవాదులేకాక వామపక్షవాదులూ దీనికి దోహదం చేస్తున్నారనీ, భారతదేశంలో ఈమధ్యకాలంలో సాగుతున్న శాస్త్రీయ అవగాహనని ఉదాహరణలతో విశ్లేషించి ఖండించాడు.
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/23/2007 10:54 am
సురేశ్ గారూ,
విశ్వనాథ వారు భాషా చరిత్రపై రాసిన వ్యాసాలు గురించిన వివరాలు కొంచెం ఇస్తారా? అతని వ్యాసాలలో అక్కడక్కడ కొన్ని భాషా చరిత్రకి సంబంధించిన విషయాలు ప్రస్తావనకి రావడం తెలుసుకాని, భాషా చరిత్ర గురించిన వ్యాసాలు నాకు తెలీదు. అతన్ని భాషా శాస్త్రవేత్తగా ఎవరూ పరిగణించినట్టుగా కూడా నాకు తెలీదు. భారత దేశ చరిత్రగురించి అతను పాశ్చాత్యులతో విభేదించడం తెలుసు. అదికూడా అతను శాస్త్ర పద్ధతిలో కాక, తన అభిప్రాయాలను నవలల రూపంలోనే ప్రకటించారు. అంచేత విశ్వనాథ కూడా తనకి తాను చరిత్రకారుడినని భావించలేదనే అనుకోవాలి. మరి మీకా అనుమానం ఎందుకొచ్చింది?
విప్లవ్ గారు నా మొదటి అభిప్రాయంలో అన్న మాటలని కొంత అపార్థం చేసుకున్నారేమో అనిపించింది. సురేష్ గారన్న దాంట్లో “చాలా మంది” సాహిత్య కారులు అన్న దానితోనే నేను విభేదిస్తున్నాను కానీ ఒక్కరూ సాహిత్య కారులు కాదు అన్నది నా ఉద్దేశం కాదు. పైగా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కాబట్టి దీని గురించి చర్చ కొనసాగించడం అనవసరం.
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
01/22/2007 10:40 am
భాషా చరిత్రల పై నాకున్న ఆసక్తి వ్యాపకంగా మారటానికి ప్రేరకులు, కారకులైన కొద్ది మంది వ్యక్తులలో బాపారావు గారొకరు :-]. గత కొంత కాలంగా తెలుగు చర్చావేదికలకు దూరంగా అజ్ఞాతంలో ఉంటున్న బాపారావు గారు ఈ వ్యాసం కారణంగానైనా మరుగుదాటి తెర ముందుకు రావడం నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా ఈమాటలోనూ, మిగిలిన చర్చావేదికలలోనూ ఆయన తన విలక్షణమైన విశ్లేషణా శైలిని ప్రదర్శిస్తూ తిరిగి వ్యాసాలు రాయాలని, రాస్తారని నా ఆశ.
ఇక ఈ వ్యాసాన్ని మెరుగు పరచడానికి ఆయన చేసిన సూచనలు:
1. భాషాశాస్త్రం 101 కి పరిమితం చేసి ఉంటే బాగుండేది.
నిజానికి ఈ వ్యాసంలో “తెలుగు పత్రికల్లో భాషావ్యాసాల తీరు” అన్న విభాగం ఆఖరి నిమిషంలో కూర్చిందే. కుతర్క వాదాల గురించి కొంతైనా విపులంగా ప్రస్తావించక పోతే, తెలుగు పత్రికలు అంతగా చదవని పాఠకులకు భాషాశాస్త్రం-101 యొక్క ఆవశ్యకత అర్థం కాక ఈ వ్యాసం పరమ బోర్ గా తయారవుతుందని ఒక సమీక్షకుడు చేసిన సూచన, నాకు కూడా సబబే అనిపించి ఆ విభాగం చేర్చాను.
2a. కూన్ పండితుని “శాస్త్రీయ విప్లవాల స్వరూపం” గురించి, సామాజిక-విజ్ఞాన (Social Sciences) రంగాలలో ప్రత్యక్ష్యోత్తర (అంటే Post-Positivist:-)) వాదం గురించి గానీ ప్రస్తావించడానికి భాషాశాస్త్రం-101 సరైన చోటు కాదేమో. అయినా ఒక విప్లవాత్మకమైన కొత్త ఆలోచనా-రూపావళి (Paradigm) ద్వారా ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలకైనా పరిష్కారం చూపించేంత వరకూ ప్రస్తుత రూపావళి చట్రంలోనే (within the frame of the current paradigm కి వచ్చిన తిప్పలు) ఇతర పరిశోధనలను విమర్శంచడం కద్దు. అంతేగాక, శాస్త్రగతిలో రూపావళి మార్పు (Paradigm-shift) ని ప్రస్తావిస్తూ భాషాశాస్త్రం-301 రాయడానికి అవసరమైన శిక్షణా, సామర్థ్యాలు నాకు లేవు.
2b. భారతీయ భాషలపై పరిశోధన చేసిన పాశ్చాత్య పండితులందరూ ఏ రకమైన జాత్యంకారము, దురభిమానాలు లేని మహానుభావులని కీర్తించడం నా ఉద్దేశ్యం కాదు. మానవ సహజమైన అభిజాత్యం అందరిలోను ఉండి ఉండవచ్చు. అదీకాక, వారు ప్రతిపాదించిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలను అప్పుటి ఆంగ్ల ప్రభువులు, క్రిస్టియన్ మిషినరీలు, స్వాతంత్ర్యానంతరం మన తమిళ నాయకులు, తమ తమ ప్రయోజనాలకోసం వాడుకోని ఉంటే ఉండవచ్చు. కాని పాశ్చాత్య శాస్త్రజ్ఞులందరూ ఎంత దురభిమానులైనా వారి పరిశోధనల్లో శాస్త్ర ప్రమాణాలను పాటించడంలో ఒక రకమైన చిత్తశుద్ధి, నిబద్ధతా చూపించారని నాకనిపిస్తోంది.
3. పాండిత్యం రాణించాలంటే ప్రతిభతో పాటు వ్యుత్పత్తి, అభ్యాసాలు అవసరమని మన లాక్షణికులు చెప్పారు కదా. వనరులు అంటే నా దృష్టిలో training and infrastructure: అత్యుత్తమ స్థాయిలో పరిశోధనలు చేయడానికి తగిన శిక్షణ, ప్రోత్సాహం (grants, సంఘంలో గుర్తింపు), వాతావరణం (నిరుపహతి స్థలంబు, తప్పు మెప్పరయు లేఖక పాఠకోత్తముల్ వగైరాలు మాత్రమే కాదు) లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా అది మట్టిలో మాణిక్యమే. నా దృష్టిలో భద్రిరాజు, చేకూరి గార్లు భాషా శాస్త్రజ్ఞులుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి వారు అమెరికా విశ్వవిద్యాలయాల్లో పొందిన శిక్షణే కారణం (ఎమెనో గారి వద్ద శిష్యరికం వల్లే తను ఇంతవాడయ్యాడన్న భద్రిరాజు గారి మాటల్లో అతిశయోక్తి లేదు). అద్వితీయమైన ప్రతిభ ఉండీ కూడా బూదరాజు గారు అంతగా శాస్త్ర పరిశోధనలు చేయ(లే)కపోవడానికి కూడా ఈ శిక్షణ లేమి కారణమని నా అనుమానం.
4. ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే భాషా సంబంధ నిరూపణకు ధ్వనులు (phonemes), శబ్దాలు (morphemes), పదజాలం (vocabulary) తోడ్పడినంతగా వేరే వ్యాకరణాంశాలు ఉపయోగపడవు. కాలగతిలో ఒక భాషలో లింగ (gender), కాల (tense), వాక్య నిర్మాణాది (syntax) వ్యాకరణాంశాలలో ఎన్నో మార్పులు సంభవించినప్పటికీ ప్రాథమిక శబ్దాలు మాత్రం అంతగా మార్పు చెందవన్న అంశం తులనాత్మక పద్ధతి (Comparative Method) కి మూలాధారం. అందుకే అంతకు ముందు పద్ధతులైన Comparative Philology, Comparative Grammar లను తోసిరాజని గత శతాబ్దంలో చారిత్రాత్మక భాషా పరిశోధకుల అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రంగా మారిన ఉపకరణం ఈ Comparative Method. Agglutinative భాషలైన తెలుగు, తమిళాదులలో సంధుల గురించి నాకు వేరే అభిప్రాయాలున్నాయి. వాటి గురించి వేరే ఎప్పుడైనా ముచ్చటిద్దాం.
5, 6. తదుపరి వ్యాసాల్లో మీ సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాను.
ఇకపోతే విప్లవ్, కామేశ్వర రావు గార్లు “సాహిత్యకారుల” గురించి చెప్పింది కొంతవరకు కరెక్టే. కానీ ఈ వ్యాసాలు రాసిన వారందరికీ తెలుగు సాహిత్యంతో పరిచయమున్నంతగా విజ్ఞానశాస్త్ర రంగంలో పరిశోధనకు కావల్సిన అవగాహన, శిక్షణ లేవనే నా అభిప్రాయం. అదీ కాక నేను ఆ వాక్యం రాస్తున్నప్పుడు మనసులో అనుకున్న మాట చెప్పేస్తున్నాను: “నాటి కవి సామ్రాట్టు నుండి నేటి నవలా చక్రవర్తి వరకూ భాషా చరిత్రలపై వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు.” సాహితీ క్షేత్రంలో విశ్వనాథ సత్యనారాయణ గారు సామ్రాట్టులే గాని, చరిత్ర అధ్యయనం లో కాదని నా చిన్ని అభిప్రాయం.
“ఏ కల్లంలో గింజలు అక్కడే తూర్పార పట్టాలి” అన్న విప్లవ్ కోరిక ప్రకారమే నా వ్యాసాన్ని తెలుగుదేశంలోని ఓ పత్రికకు పంపించాను. ఈ కోణానికి మెయిన్ స్ట్రీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/15/2007 10:32 pm
శ్రీనివాస్,
1. పుస్తకం చదవకుండానే పేరాలు కోట్ చెయ్యడానికి నేనేమీ స్వాములవారిని కాదుగదా! మీరు చదివినంత లోతుగా నేను చదివుండకపోవచ్చు. మీదృష్టీ నాదృష్టీ ఉత్తర దక్షిణ ధ్రువాలు కావచ్చు.
2. నేను రాసినదాంట్లో చివరి వాక్యం తప్ప మిగిలినదాంట్లో వెనక్కి తీసుకోవాల్సిందేమీ కనబడలేదు. శ్రుతి మించిన స్తోత్రాలకూ, సంయమనం లోపించిన “శాస్త్రీయ” విశ్లేషణకూ విరుగుడుగా కాస్తంత వ్యంగ్యం వాడాను. భావ్యం కాదంటారా?
3. ఇవి రెండే ముఖ్యమైన విషయాలని గానీ, అదొక చెత్త పుస్తకమని గానీ నేనన లేదు. అక్బరు అంతఃపురం ఎంత వ్యభిచార కేంద్రమో, తాజమహల్ అసలు ఎందుకు హిందూ రాజ్ మహలో, … లాంటి వేడి వేడి కబుర్లనొదిలేసి, నేను అప్రధాన విషయాలని పట్టించుకున్నాననా మీ ఆక్షేపణ? ఇప్పటి వరకూ వచ్చిన చరిత్ర అంతా తప్పుల తడిక, అందుకు ఈ కుహనా చరిత్రకారులే కారణం, మన పురాణాల్లో వున్నవాటిని (కనీసం కాలానికి సంబంధించినంత వరకు) శాస్త్రీయంగా కోటా వెంకటాచలం గారు ఏనాడో నిరూపించారు, అంతకన్నా ఇంకేం కావాలి? అన్నవి రచయిత ఉద్ఘాటించిన ప్రధానాంశాలలో కొన్ని. నేను అసందర్భంగా కోట్ చేస్తే మీరు తప్పు పట్టండి.
4. ఏదో ఒకటి రెండు పేరాలను తీసుకుంటే చాలదు, పుస్తకం మొత్తం మీద అభిప్రాయం వెలిబుచ్చాలంటారా? దానికి వేరే సందర్భం కావాలి. చరిత్ర గురించి మన జాతి అలవరచుకోవాల్సిన దృక్పధాలని ఆకాశానికెత్తేసే ప్రశంసల్ని చదివి, ఉండబట్టలేక ఒకటి రెండు రచయిత దృక్పధాలని ఉదాహరణలగా ఇచ్చాను.
5. ఇంకా చాలా రాయొచ్చు కాని, దీనిని పొడిగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అదీగాక దీనికి సురేష్ వ్యాసంతో కొంత సంబంధమున్నా కాస్త దూరమైన విషయం. చరిత్ర మీదా, “ఏది చరిత్ర?” మీదా కూడా వ్యాసాలు రావాలి. ఆ విషయంలో మీతో ఒప్పుకుంటాను. ఎందుకంటే, కొడవటిగంటి కుటుంబరావు అన్నట్లు, “చరిత్ర గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల గురించీ శాస్త్రీయంగా ఆలోచించగలుగుతాం.”
కొడవళ్ళ హనుమంతరావు
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/15/2007 2:35 pm
సురేశ్ గారి వ్యాసంలో భాష గురించిన పరిశోధనలన్నీ శాస్త్రీయ దృక్పథంతోనే జరగాలనీ, అందులో రాజకీయ ధోరణులకూ, ప్రాంతీయ దురభిమానాలూ, కక్షలూ, కావేషాలకూ తావుండకూడదనీ చక్కగా చెప్పబడింది.
తెలుగు ద్రావిడభాష అనేది మద్రాసులో పుట్టి పెరిగిన నాలాంటివాళ్ళకు బాగా అనిపిస్తూ ఉండేది. తమిళంలోని కొన్ని పదాలే కాక త్రికసంధి పద్ధతిలో వాళ్ళు మాటలను ముడిపెట్టడమూ ఇత్యాదులన్నీ తెలుగులాగే అనిపిస్తాయి. పాత శాసనాల్లో ఇమ్మడి (రెండో), ముమ్మడి (మూడో) వగైరా విశేషణాలు కూడా ద్రావిడభాష మూలాలనే సూచిస్తాయనిపిస్తుంది.
ప్రాంతీయంగా సురేశ్ గారు చెప్పినట్టు కన్నడిగులు ప అనేదాన్ని హ అని (తప్పుగా?) పలికినట్టే మలయాళంలో వత్స అనే మాటను వల్స అని తప్పుగా పలుకుతారని నాకు తెలుసు. ఎందుకంటే త్ అనే అక్షరం ల్ లాగా ఉంటుందట.
మధ్య ఆసియాతో వేదకాలానికి వేల ఏళ్ళ మునుపే సింధు నాగరికతకు సంబంధాలుండేవనేది నిజమే. అక్కడి నిప్పూరు మొదలైన స్థలాల పేర్లు తెలుగులా అనిపిస్తాయి కాని కొందరు పరిశోధకులు చెపుతున్నది సింధు నది నాగరికతలో ప్రజలు మాట్లాడినది ద్రావిడ కుటుంబానికి చెందిన భాష అయి ఉంటుందనే. దానికి తిన్నగా తెలుగుతో ముడిపెట్టడం సబబుగా తోచదు. ఆ కాలంలో (క్రీ.పూ.2400-2000 ప్రాంతాల) అక్కడివారు మాట్లాడినది ద్రావిడ భాషే నని తేలితే అది తెలుగు, తమిళం మొదలైనవాటికి మాతృక అయి ఉండే అవకాశం ఉంటుంది. సంస్కృతం, ప్రాకృతం, పాలీ మొదలైన భాషలూ, బ్రాహ్మీ లిపీ అన్నీ తరవాతి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఇది నిరూపణ అయితే ద్రావిడ భాషలన్నీ (ఒక్క తమిళమే కాదు) అతి ప్రాచీనమైనవేనని తేలుతుంది. ఎందుకంటే సింధు నాగరికతకు బీజాలు బలూచిస్తాన్ లో క్రీ.పూ. 6500 నుంచీ ఉన్నాయట. అప్పటి నుంచి వేదకాలం (క్రీ.పూ. 1400 తరవాత) దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగిన సమాజ జీవితంలో కొన్నయినా ద్రావిడ భాషల మాతృకలు ఉండి ఉంటాయని అనుకోవచ్చు.
మంచి వ్యాసాన్ని అందించిన సురేశ్ అభినందనీయులు.
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Srinivas vurupuTuuri గారి అభిప్రాయం:
01/14/2007 6:03 pm
హనుమ గారికి
మీ పొడవాటి వ్యంగ్యభరితమైన జవాబు చూసాక…
మీరు ఆ పుస్తకం చదివారా లేదా తేల్చుకోలేకపోయాను. పురాణాల నుంచి చారిత్రిక ఆధారాలను సేకరించారని,సుప్రసిద్ధ చరిత్రకారులను (“మార్క్సిస్టు వర్గానికి చెందిన కుహనా మేధావుల”ను) ఆక్షేపించారని మీరు సూచించిన రెండు విషయాలే, ఈ పుస్తకానికి సంబంధించినవి గా తోచాయి.
నేను, కొంతకాలం క్రితం “ఏది చరిత్ర?” చదివాను.హోల్ మొత్తంగా కాకపోయినా, మరీ బేసబబుగా అనిపించలేదు నాకు (అఫ్ కోర్స్, ఉత్సాహం కొద్దీ చదవటమే కానీ, చరిత్రగురించి నాకు పెద్దగా తెలీదు.మూల గ్రంథాలు చదివి నిజానిజాలని బేరీజు చేయటం నాతో అయ్యే పని కాదు). ఎప్పుడో,తీరిగ్గా ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాను. అందాకా…
ఈ పుస్తకం ఉత్తి చెత్తే అనుకుందాం. కానీ, నా లాంటి uninitiated (I can’t think of the right word) పాఠకులను, నా లాంటి వారి నుంచి సెకండ్ హాండ్, థర్డ్ హాండ్ గా విని తెలుసుకునే వారిని ప్రభావితం చేయగలుగుతుంది అని అనుకుంటాను. ముఖ్యం, ఈ వాదనలు మళ్ళీ, మళ్ళీ వినిపిస్తూ ఉండటం వల్ల. ఆ ప్రమాదాన్ని నివారించేందుకైనా సరే,ఎవరైనా ఓ “చరిత్ర 101” రాస్తే బావుంటుందని అనుకుంటాను. ఏవంటారు?
శ్రీనివాస్
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Sai Brahamanandam Gorti గారి అభిప్రాయం:
01/07/2007 9:31 pm
మనకంటూ శాస్త్ర పరిశోధనా పద్ధతి, ముఖ్యంగా భాష పుట్టు పూర్వోత్తరాల గురించి మొదలైంది 20 వ శతాబ్దం లోనే. పైగా ఈ పరిశోధనలకి మూల గ్రంధాలు సాహిత్యమే కదా! పలానా కావ్యంలో ఇలా రాసినట్లుగా ఉంది కాబట్టి ఆ కాలంలో పదాల వాడుక నిర్ధారించి కాల క్రంలో అవి ఎలా రూపాంతరం చెందాయో భాషా కోవిదులు వివరణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది మీరంటునట్లుగా వారు చదివిన, విన్న వాటి నాధారంగా వాళ్ళ సొంత కవిత్వం కలిపి ప్రజల మీది రుద్దేస్తున్నారు. దానికి తోడు ఈ మధ్య రాజకీయం ప్రవేశించి సాహిత్యం కూడా కలుషితం అయిపోతోంది. మాండలికానికి, మూలానికి అర్ధం తెలియని వారికి ఈ వ్యాసం కాస్త కనువిప్పు కలగజేసే అవకాశం ఉంది.
ఆ మధ్య ఇంకో తర్కం చదివాను. మహమ్మదు ప్రవక్త భార తీయుడే ఆయన పేరు మహామతి అని, ఏసుక్రీస్తు పేరు ఈశు కృష్ణ అనీ, ఇలా చాలా కల్పిత తర్కాలు రాసేస్తునారు. పత్రికలవాళ్ళూ పంపిందే తడవుగా ప్రజలందరికీ అచ్చులో అందిస్తున్నారు.
మంచి వ్యాసం. ఈ మధ్య వచ్చిన కొన్ని మంచి వ్యాసాల్లో ఇదీ ఒకటి.
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
01/05/2007 11:28 pm
భాషావేత్తల సరదా తగాదా ప్రయాణం
వార్తాపత్రికలలో మన భాష మీద వచ్చే ఊహాగానాల వలన ఒక ఉపయోగముంది – “ఔత్సాహికులు” వాటిని చదివి నిరాశపడి ఊరుకోకుండా వాటిలోని నిజానిజాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాయడం. సురేష్ ఇంతకుమునుపూ, ఇప్పుడూ రాసిన వ్యాసాలు భాషాశాస్త్రంలో ప్రవేశం లేని నాలాంటి వాళ్ళకి సులభంగా అర్థమవడమేకాక ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం కలిగిస్తున్నాయి. ఇవి 201, 301, … సీరీస్ లా కొనసాగుతాయని నా ఆశ.
స్వల్ప లోపాలనిపించిన రెండు విషయాలు:
1. అందుబాటులో లేని ఉపయుక్త గ్రంథాలు: గంటి గారి పుస్తకం అరవై ఏళ్ళనాటిది, అది దొరకడం కష్టం. భద్రిరాజు గారి పుస్తకం ఖరీదు డెబ్భై అయిదు డాలర్లు! అమెరికాలో ఉన్న భాషాభిమానులైనా కాస్త వెనకాడతారు. ఇంతకన్నా అందుబాటులో ఉన్నవి ఏవైనా ఉంటే చెప్పండి.
2. పేరులేని విమర్శలు: “సాహిత్యం కళ, భాషాశాస్త్రం విజ్ఞాన శాస్త్రం” అన్నారు, బావుంది. చరిత్రకారుడిగా పేరున్న ఓ ప్రముఖ రచయిత, తెలుగు పైశాచి భాష నుండి పుట్టిందనీ, అర్జునుడు అమెరికా వెళ్ళొచ్చాడనీ ఘంటాపథంగా చెప్తున్నారనీ విమర్శించారు. సాహిత్యరంగంలో సంప్రదాయాలెలా వున్నా, శాస్త్రీయరంగంలో వేరేవాళ్ళని విమర్శించేటప్పుడు వారి రచనని ప్రస్తావించడం ఆనవాయితీ. కనీసం రచయిత పేరన్నా చెప్తే వారి రచనలని పరిశీలించే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఆ రచయిత గూడా “ఈమాట”లో తనని తాను సమర్థించుకోడానికీ లేకపోతే సరిదిద్దుకోడానికీ వీలవుతుంది.
అర్జునుడు అమెరికా వచ్చాడనడం హాస్యాస్పదం కావచ్చు గాని, పైశాచీ ప్రాకృతమే తెలుగుకు మాతృక అని పేరున్న పండితులే వాదించారని చదివాను. అదీ Caldwell శాస్త్రీయంగా నిరూపించిన వందేళ్ళ తర్వాత గూడా! మన సాహిత్యంపైనేకాక మన భాష మీదకూడా విస్తృతమైన పరిశోధనలు చేసిన చిలుకూరి నారాయణరావు గారు Caldwell తో విభేదించారట. మిడిమిడి జ్ఞానంగల వాళ్ళనీ రాజకీయ ప్రయోజనాల దృష్టి తో చేసే వాదనలనీ వదిలేద్దాం. చిలుకూరి లాంటి గొప్ప పండితుడు గూడా ఒప్పుకోలేదంటే, మనం తెలుసుకోదగ్గ కారణాలు ఏవో ఉండి ఉండాలి. వాటిని స్థూలంగానయినా చెప్తే బావుండేది.
ఇది చదువుతుంటే, శిథిలావస్థలో ఉన్న తిరుమల రామచంద్ర “సాహితీ సుగతుని స్వాగతం” గుర్తుకొచ్చి తీస్తే, దాంట్లో “దేశినామమాల లోని మరికొన్ని తెలుగు పదాలు” అనే వ్యాసం నన్నాకర్షించింది. మన భాషావేత్తల తగాదాలకు రైలుపెట్టెలకన్నా సరైన చోటు మరి లేనట్లుంది.
“నిన్ను చూస్తే తందామనిపిస్తుందోయ్!” అన్నారట చిలుకూరి, మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో తిరుమల రామచంద్రని చూసి. “అంతటి అపరాధం ఏం చేశానండీ?” అని అడిగితే, “అపరాధం? మహాపరాధమే చేశావ్. సంస్కృత ప్రాకృత సాహిత్యాలకే ద్రోహం తలపెట్టావు. గాథాసప్తశతిలో తెలుగు పదాలు చేరాయని వ్రాశావు” అన్నారట.
తిరుమల రామచంద్ర, “నాదేముందండీ, ఆచార్య హేమచంద్రుడంతటి వాడే శ్రమపడి అలాంటి పదాలని “దేశి నామమాల” గా క్రోడీకరిస్తే,” అన్నారట. “పదకొండో శతాబ్దపు హేమచంద్రుడా నీకు ప్రామాణికం?” అంటే, “నేను గూడా సొంతంగా పరిశోధించి కనుగొన్నానన్నా”రట తిరుమల. “ఏదీ చెప్పు చూద్దాం” అంటే, గుక్క తిప్పుకోకుండా, తెలుగు, కన్నడం, తమిళం నుండి సంస్కృతంలో వచ్చి చేరిన పదాలను – వరసలు, వస్తువులు, జంతువులు, రుతువుల గురించి – ఇలా అనేక పదాల పుట్టుపూర్వోత్తరాలని తిరుమల తడువుకోకుండా వివరించారు.
నాకు బాగా నచ్చిన ఒక పదం గురించి మాత్రం రాస్తాను. అందుకు కారణం చిన్నప్పుడు ఆడిన ఆటలూ పెద్దయింతర్వాత చదివిన కవితలూ గుర్తుకురావడమే.
శ్రీశ్రీ Swinburne కవితల్ని “షెల్లీ కవనపు హల్లీసకం” తో పోల్చాడు. నేను పాతికేళ్ళుగా, “హల్లీసకం” అంటే అర్థం తెలియకుండానే ఆ కవితని గుర్తుచేసుకునే వాణ్ణి. ఈ మధ్య, వేలూరి గారితో పరిచయమయిన తర్వాత, “అర్థం తెలియకుండా చదివిన చదువూ ఒక చదువేనా!” అని ఆయన మెత్తని “దీవెనలు” ప్రసాదిస్తే, బుద్ధిగా నిఘంటువు చూడటం అలవాటు చేసుకున్నాను.
“హల్లీసకం” అంటే స్త్రీలు గుండ్రంగా నిలిచి ఆడే ఆట అని బ్రౌన్ లో ఉంది. అది సంస్కృత పదం. దానికి తిరుమల వ్యాఖ్యానం చూడండి:
“హాల్లీసో = రాసకః. మండలేని స్త్రీణాం నృత్యం. మనకు, కన్నడం వారికి హళ్ళి అనే పదం ఉంది. ఇది సున్నకు పర్యాయపదం. చిన్న వర్తులానికి అల్లి అంటారు కొన్ని ప్రాంతాలలో. గోలీలను అల్లి కాయలంటారు. అల్లికాయలంటే గుండ్రని గుళ్ళు. బొంగరాలాటలో నేలమీద గుండ్రని గీటుగీచి దాని మధ్యన ఒక బొంగరాన్ని ఉంచుతారు చూచారా? అలా గీచే గుండ్రని గిరిని అల్లి అంటారు. అలాగే పిల్లలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని గుండ్రంగా పందెం కట్టి నిలవడాన్ని అల్లి కట్టడం అంటారు. కనుక ఈ అల్లే హల్లీసో అయిందేమో! హల్లీసం నుంచే అల్లీ కాకూడదూ అని ఎదురు ప్రశ్న వేస్తారు కదూ? కావచ్చు. కాని హేమచంద్రుడు దీన్ని దేశి పదంగా పరిగణించాడు కనుకనే ఈ శ్రమంతా.”
అలా మాట్లాడుకుంటూ పోతే రైలు అరక్కోణంలో ఆగినప్పుడు గాని తెలియలేదట, ఎంతసేపు అయిందనీ, తను టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాననీ! అప్పుడు చిలుకూరి:
“చూచావా! నీకిదే శిక్ష. తెల్లవారుజాము బండి ఎక్కి మద్రాస్ చేరుకో. మరొకమారి హోరాహోరిగా పోట్లాడుకుందాం. ద్రావిడ భాషావాద సన్నిపాతం ముంచుకొచ్చింది. మీ కందరికీ స్వాస్థ్యం కలగాలంటే కొంతకాలం పడుతుంది,” అన్నారు.
జులై 1959 “భారతి”లో వచ్చిన ఈ వ్యాసాన్ని తిరుమల ఇలా ముగించారు: “నేను బండి దిగాను. బండి కదిలింది. సాహిత్యంలో అభిప్రాయ భేదాలను వ్యక్తిగత ద్వేషంగా భావించుకొని పగపట్టే ఈ కాలం ఎక్కడ? అభిప్రాయ భేదాలు వేరు. అభిమానాదరాలకూ, మానవత్వానికి సాహిత్యంలోని మత భేదాలు అడ్డురావనే ఆ సహృదయ విమర్శక పరిశోధకాగ్రణి ఎక్కడ? అలాంటి ఉదాత్త హృదయుడు మరొకడు నాకు కనిపించలేదు. ఆయన కీర్తిమూర్తికి నా నమోవాకాలు.”
ఇంతకీ చిలుకూరి తెలుగు సంస్కృత ప్రాకృతాలనుంచి పుట్టిందనడానికి కారణాలేవిటో నాకు తెలియలేదు. రైలు ప్రయాణం లో ఎక్కువ మాట్లాడింది తిరుమలే. చిలుకూరి రాసిన “ఆంధ్ర భాషా చరిత్ర” కూడా అందుబాటులో లేదు. ఈ లోటుని ముందు ముందు సురేష్ పూరించాలని కోరుకుంటూ,
కొడవళ్ళ హనుమంతరావు
రెండు ఆకాశాలు గురించి aravind గారి అభిప్రాయం:
01/02/2007 2:11 pm
నాకు ఈ e- పత్రికను చూడగానే చాలా సంతోషం కలిగింది. కాని వెంటనే నాకు ఇన్నాళ్ళుగా దీని గురించి తెలెయనందుకు బాథగా ఉంది. నాకు ఇందులో కథలు బాగా నచ్చాయి.
కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
11/20/2006 10:27 am
స్ఫూర్తిప్రదాతలు
ఈ మధ్య ఒక ప్రబుద్ధుడు గురజాడ అప్పారావును సంస్కృతికి విధ్వంసకుడుగా అభివర్ణిస్తూ ఒక వ్యాసం రాశాడు. తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు రచయితలకూ, వాటిని ప్రచురించేందుకు సంపాదకులకూ హక్కు ఉంటుంది కనక దీనికి అభ్యంతరం చెప్పే పనిలేదు. నా లెక్కన గురజాడ వంటి గొప్ప రచయిత దేని విధ్వంసానికైనా పూనుకుని ఉంటే అది విధ్వంసం చెయ్యతగినదే. ఎటొచ్చీ ఆ విధ్వంసకాండ సమగ్రంగా జరగనందువల్లనే ఇటువంటి అభిప్రాయాలు ఇన్ని దశాబ్దాల తరవాత వ్యక్తమవుతున్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పై వ్యాసాన్ని అవహేళన చేస్తూ నేను ఇంగ్లీషులో రాసి పంపిన ఉత్తరాన్ని అదే పత్రిక సంపాదకవర్గం తమకు తోచిన విధంగా తెలుగులో ప్రచురించింది. తెలిసీ తెలియని నావంటి పాఠకులను వదిలేసినా, హాస్యబ్రహ్మగా పేరుపొందిన భమిడిపాటి కామేశ్వరరావుగారూ, మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారూ గురజాడను యుగకర్తగా గుర్తించారు. మీ రచయిత మేధావి అనీ, పేరు మోసిన ఆ రచయితలిద్దరూ మూర్ఖులనీ నేను వెటకారంగా సంపాదకులతో అన్నాను. నన్ను అపార్థం చేసుకున్న కొందరు పాఠకులకు నామీద కోపం కూడా వచ్చింది. ఈ సంవాదాన్ని పొడిగించి, దీనికి ప్రాముఖ్యతను ఆపాదించడం అర్థంలేనిపని. అంతకన్నా ముఖ్యవిషయాలెన్నో ఉన్నాయి. ఇటీవలి హ్యూస్టన్ (టెక్సస్) సాహిత్య సమావేశంలో మిత్రులను కలుసుకుని చర్చిస్తున్నప్పుడు కొన్ని అంశాలు తలెత్తాయి. వాటిని గురించి క్లుప్తంగా చెప్పడమే నా ఉద్దేశం.
మన దేశంలో హైదరాబాదు, బొంబాయివంటి మహానగరాలు విపరీతంగా విస్తరించడం, కొత్త నగర శివార్లూ, వాటిలో కాలనీలూ పుట్టుకురావడం మనకు తెలిసినదే. ఈ ప్రాంతాలన్నిటిలోనూ కిక్కిరిసిన కొంపల్లో హడావిడి జీవితాలు గడుపుతూ, ఆఫీసులకూ, స్కూలు కాలేజీలకూ పరుగులు తీస్తూ జీవిస్తున్న అసంఖ్యాకులకు ఏకైక సాంస్కృతిక సాధనం టీవీయే. ఎందుకంటే పుస్తకాలు కొని చదివే తీరిక దాదాపుగా సున్నాయే. వ్యాపారమే పరమావధిగా పెట్టుకున్న టీవీ చానళ్ళన్నీ అంతులేని చెత్తను “కళా రూపాల్లో” ఎలా ప్రసారం, ప్రచారం చేస్తాయో మనకు తెలియనిది కాదు. ఈ విషయాలనన్నిటినీ జీర్ణం చేసుకుంటూ గత పాతికేళ్ళుగా కుటుంబాల్లో పెరిగిన పిల్లలే నేటి యువత. వీటన్నిటికీ ఎదురీది, మంచి విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించిన కొద్దిమంది తప్ప తక్కినవారంతా ఉన్న పరిస్థితులకు “బలి” అయారంటే ఆ తప్పు వారిది కాదు. పాతవారికి తెలిసిన కొన్ని సామాన్య విషయాలు కూడా వారికి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు.
పాతవారందరికీ అన్నీ తెలుసునని కాదు. 40 ఏళ్ళ క్రితం మద్రాసులో కాలేజిలో చదువుతున్నప్పుడు నేనొకసారి మా బంధువులబ్బాయి ఒకణ్ణి “కన్యాశుల్కం చదివావా?” అనడిగితే, “ఏం, అది మీనాన్న రాశాడా?” అని ఎదురు ప్రశ్న వేశాడు. కన్యాశుల్కం ఎవరు రాశారో వాడికి తెలియదు సరికదా అది మా నాన్న రాసినందువల్లే నేనా విషయాన్ని ప్రస్తావించానని వాడనుకోవడం కూడా గమనార్హం. కుటుంబ వాతావరణమే ఇందుకు కారణం. ఇటువంటి సంఘటనలు ఈ రోజుల్లో మరింతగా జరిగితే ఆశ్చర్యపోవక్కర్లేదు. “గురజాడ అంత గొప్ప రచయితయితే అతని సీరియల్స్ టీవీలో రావటం లేదేం?” అని ఎవరైనా అడిగే అవకాశముంది.
ఈ పద్ధతిలో జరిగిన కొన్ని అవాంఛనీయ మార్పులను సరిదిద్దేందుకు కొత్త రకమైన ప్రయత్నాలు జరిగితే బావుంటుందనిపిస్తుంది. ఇందుకై బుద్ధిపూర్వకంగా కొన్ని పనులు జరగాలి. మొదటగా, తెలుగులో రాయగలిగినవారందరూ వివిధ విషయాలపై రచనలు కొనసాగిస్తూ ఉండాలి. (వీరిలో కొందరు కేవలం తమ పేరు ప్రఖ్యాతులకై రచనలు చెయ్యవచ్చునేమో కాని అదంత ముఖ్యవిషయం కాదు. రచయిత తాపత్రయం ఎటువంటిదైనా మంచి రచనలే నిలుస్తాయి). ఈ రచనల్లో కొన్నయినా మన సాంస్కృతిక వారసత్వంలోని “ఆరోగ్యకరమైన” విషయాలను పరిచయం చెయ్యగలిగినవై ఉండాలి. తమ మాతృభాషను గురించీ, సంస్కృతిని గురించీ ప్రతి తరంవారూ తెలుసుకోదగిన మంచి విషయాలుంటాయి. తల్లిదండ్రులు చెప్పగలిగిన విషయాలతో బాటు పుస్తకాలూ, ఇతర మాధ్యమాల ద్వారా ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. వీటి గురించి తగినంత ఆసక్తిని రేకెత్తించి, యువతీ యువకులకు ఆ వివరాలను వీలున్నంత బాగా అందజేసే బాధ్యత పాత తరానిదే. ఎటొచ్చీ ఈ పనులన్నీ కొనసాగుతున్న పద్ధతి నానాటికీ అతి బలహీనంగానూ, దయనీయంగానూ అనిపిస్తోంది. ఆధునిక జీవితాల పోకడనుబట్టి చూస్తే “కూటికీ, గుడ్డకూ పనికిరాని” మన పాత సంస్కృతిని గురించి తెలుసుకోవడం ఉత్త టైం వేస్టు. ఈ ధోరణిని నిలువరించి వెనక్కు తిప్పడం ఇప్పటికే అసాధ్యం అయిపోతోంది. అందుకని వీటికై బుద్ధిపూర్వకంగా కొన్ని ప్రయత్నాలను చేపడితే బావుంటుందేమో విజ్ఞులు గమనించాలి.
మనలో చాలామందికి పాతవారి గురించీ, వారు సృష్టించిన సాహిత్యాదుల గురించీ నామమాత్రంగానే తెలుస్తూ ఉంటుంది. వారిని పరిచయంచేసే వ్యాసాలూ, వారి కృషికి ఈనాడున్న రెలవెన్స్ మొదలైన అంశాలూ వగైరాలన్నీ అందుబాటులోకి రావాలి. “ఈమాట”లో ఇటీవల వేలూరివారు తిరుపతి వెంకటకవుల పద్యాలను ఉదహరించడం ఇటువంటి మంచి ప్రయత్నాల్లో ఒకటి. పాత కవిత్వ సంకలనాలను కొని, పూర్తిగా చదివే అవకాశమూ, వ్యవధీ లేనివారికి కనీసం మెతుకు పట్టి చూసిన పద్ధతిలో వాటిని చదివే అవకాశం లభించినట్టవుతుంది. అలాగే ఈ సంచికలో సి.ఆర్.రెడ్డి తదితరులు కొన్ని దశాబ్దాల క్రితం చేసిన సాహిత్య విమర్శలోని అంశాలూ, వాటిలో కనబడుతున్న ఆనాటి సంకుచిత ధోరణులూ వగైరాలను వేలూరివారు బాగా వివరించారు. రెడ్డిగారైనా, బసవరాజు అప్పారావుగారైనా వారు చేసిన కృషి చెప్పుకోదగ్గదే. పేర్లు మినహాగా వీరెవరో తెలియని యువపాఠకులకు వీరి రచనలను గురించి క్లుప్తంగానైనా పరిచయం చేసి తీరాలి. వారి రచనల నమూనాలను ప్రచురించాలి. ఆ రచనలు చేసిన కాలాన్నీ, సందర్భాన్నీ, ఆయా రచయితలు గురి అయిన ప్రేరణలనూ కాస్తయినా వివరించాలి. యువపాఠకులు చాలా తెలివైనవారు. అందిస్తే అల్లుకుపోగలిగిన ప్రజ్ఞ కలవారు. పాతతరంవారు చెయ్యవలసిందల్లా అందించడమే. ఈ ప్రక్రియలో భాగంగా ఇంతకు మునుపు అచ్చయిన పరిచయ వ్యాసాలను మళ్ళీ ప్రచురించడం కూడా మంచిపనే. ఇదంతా ఒక చిన్న ఉద్యమం స్థాయిలో జరిగితే పరిమితంగానైనా కొంత సాంస్కృతిక పునరుజ్జీవనం వంటిది జరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు “ఈమాట” కూడా పూనుకుంటే బావుంటుందని నాకనిపిస్తోంది.
గణపతి బప్పా మోరియా! గురించి satya గారి అభిప్రాయం:
11/10/2006 3:46 am
కత చాలా బాగుంది. కాని వినాయకుడు శివున్ని తిట్టినట్లుగా రాయడము మాత్రము నచ్చలేదు. హాస్యము మాత్రము చాలా బాగుంది
తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ… గురించి Anuradha గారి అభిప్రాయం:
11/08/2006 7:20 pm
శ్రీ వెంకటేశ్వరరావు గారి సూచనలు చాలా బాగున్నాయి.వినోదాత్మక విషయాలకు పెట్టే ఖర్చులో 10% ,భాషాభివృద్ధికోసం ఉపయోగిస్తే ,తెలుగు జాతి తప్పకుండా ప్రగతిని సాధిస్తుంది.భాష,సంస్కృతి,ప్రగతి అనే ఈ మూడు విషయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. భాషలో సంస్కృతి పొదగబడి ఉంటుంది.సంస్కృతి లేని ప్రగతిని నిలుపుకోవడం సాధ్యం కాని విషయం.
తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/08/2006 5:16 am
#
ఉమాకాంతం గారి “నేటి కాలపు కవిత్వం” చదివిన తరువాత నాకైతే అతనికి ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము లోపించాయని అనిపించలేదు. మరి కృష్ణశాస్త్రిగారికి అనిపించింది. ఏది నిజం ఏది కాదు అంటే ఎవరు చెప్పాలి? అయినా ఇవి కావేమో విమర్శకుడికి ఉండల్సిన ముఖ్యార్హతలు.
ఆర్ద్ర దృష్టి కవితా హృదయము కన్నా వేలూరి గారన్నట్లు నిష్పక్షపాత దృష్టి, నిజాయితీ హృదయమే విమర్శకు ఎక్కువగా కావలసిన సామగ్రి అనుకుంటాను.
చదవగానే వినగానే మైమరిచి కరిగిపోయే ఆర్ద్రదృష్టి, భావాల వెల్లువలో తూలిపోయే కవితా హృదయం, భావ సమాధికి తన్మయత్వానికి సాయపడుతాయి కాని, పలు దృక్కోణాలనుంచి సమగ్రంగా అవగాహన పొందడానికి, సంయమనంతో విశేషంగా విశ్లేషించడానికి సాయపడడం కన్నా, అవి కొంత అడ్డుగానే నిలబడతాయని అనుకుంటాను.
రచనలు పలు రకాలైనప్పుడు విమర్శలు కూడా పలు రకాలుగా ఉండడం సహజమూ అనివార్యమూ కూడా. అయితే రకాలు ఎన్నైనా, విషయం పాఠకునికి అందించడమే రచనలన్నింటి ఉద్దేశం. ఆ ఒక్కటి నెరవేర్చడంలోనే ఎన్నో ప్రక్రియలు, మార్గాలు, వైవిధ్యాలూ, సొగసులు, సృజనాత్మకమైన ప్రయోగాలు అన్నీనూ.
అట్లే విమర్శలు ఎన్నో రకాలున్నా విమర్శించే రచన గురించి విశేషమైన అవగాహనను అందించే వరకూ అవి అన్నీ విమర్శలే, ఖచ్చితంగా. అయితే విశేషమైన అవగాహన కలిగించడం సుళువైన పని కాదు, కొన్ని సార్లు రచన కన్నా కష్టతరమైనది కూడా.
మరి సమగ్ర విమర్శకు ఏమి కావాలి ? విమర్శకునికి రచనలో ఉన్న లోతులను చూసే నిశితమైన దృష్టి, అది వ్యక్తపరచే భావాలను అందుకునే హృదయ వైశాల్యం, సోంత ఇష్ట అయిష్టాలకు అందనట్టి ఎత్తులో ఉన్న నిష్పక్షపాతం – ఇవ్వన్నీ ఉంటేనే సమగ్రమైన అవగాహన పొందడానికి కానీ, ఇతరులకు అందించడానికి కాని సాధ్యం కాదనుకుంటాను. ఇక అవగాహన పెరుగే కొద్దీ విమర్శ యొక్క అభివ్యక్తీకరణలో స్పష్టత, క్లుప్తత వస్తుంది, సహజంగా. సూటిదనం కూడా ఉండి పాఠకున్ని విసిగించదు.
మరి విమర్శ చేయడానికి ప్రేరణ, శిక్షణ అవసరమా అంటే తప్పకుండా అవసరమే. అయితే ప్రేరణ అందుకునేదే కాని అందించేది కాదు. ఇక శిక్షణా పద్ధతులు మాత్రం చర్చనీయాంశం.
చివరగా ఒక్క మాట. తెలుగు భాష యొక్క వెలుగే తగ్గుతున్న రోజుల్లో తెలుగు సాహిత్యం పై చేసే విమర్శలో శిక్షణకు ఎంత priority ఉందో, ఉండాలో తెలియదు. తెల్లటి బట్టపై చిన్న మరక పడితే వేలెత్తి చూపిస్తారు కాని, పూర్తిగా మాయకపోయినా తెలె తెల బోయే బట్టపై మరకలను ఎవరు వెతికి చూపిస్తారు! రచనలు ఎక్కువగా నిస్సారమైనప్పుడు గొప్ప విమర్శలు మాత్రం ఎక్కడినుంచి వస్తాయి అని అనుకుంటాను.
విధేయుడు
-Srinivas
తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
11/05/2006 3:43 pm
విమర్శల్లో తెగనాడినవి గుర్తున్నంతగా తక్కినవి గుర్తుండవేమో! తెలుగులో మంచి విమర్శలు చాలానే వెలువడ్డాయి. కాని వేలూరివారు చెప్పినట్టుగా కొన్ని విమర్శల ద్వారా రచన గురించే కాక విమర్శకుడి సంగతి కూడా మనకు తెలుస్తుంది.
పాత సాహిత్యంలో “అమలినం” కాని శృంగారాన్ని పద్ధెనిమిదో శతాబ్దం నుంచీ విమర్శకులు ఈసడించుకోవడం కనిపిస్తుంది. ఆ తరవాతి కాలంలో కూడా ముద్దుపళనివంటివారి రచనలు తీవ్ర విమర్శకు లోనవడం గురించి ఆరుద్ర ప్రస్తావించారు. వాటిలో కొన్ని శృంగారాన్ని గురించిన స్త్రీల దృక్పథాన్ని తెలుపుతాయనీ, వాటిని తరవాతి కాలంలో అణచకుండా ఉన్నట్టయితే అదొక ఆధునిక స్త్రీవాద సాహిత్యానికి దారి తీసి ఉండగలదనీ ఆయన భావించారు.
వ్యాసంలో ప్రస్తావించిన రచనలోనే కృష్ణశాస్త్రిగారు తనకన్నా సీనియర్లనూ, జూనియర్లనూ కూడా పేర్కొంటూ, విమర్శ కాకపోయినా సమీక్ష చేశారు. కె.వి.రమణారెడ్డి అనేకుల రచనలను వివరంగా విమర్శించారు. “ఋణ” దృక్పథంతో చేసిన విమర్శల్లో రాచమల్లు రామచంద్రారెడ్డిగారు దిగంబర కవులను గురించి రాసినది కూడా ఒకటి. త్రిపురనేని మధుసూదనరావు విశ్వనాథ రచనలను విశ్లేషించి మరీ చెండాడాడు.
ఈ మధ్య ద్వానాశాస్త్రి తదితరులు విప్లవ, స్త్రీ వాద, దళితవాద, మైనారిటీ వాద రచనలను సహృదయతతో విమర్శ చేస్తున్నారు. ఇవి అంతగా గుర్తుండకపోవటానికి కారణం ఇవన్నీ దిన, వార, మాసపత్రికల్లో ఏదో ఒక మూల కాస్తకాస్తగా కనిపిస్తూ ఉండడమే. సాహిత్యానికే దిక్కులేని ఈ రోజుల్లో విమర్శలను పట్టించుకునేవారే తక్కువ.
మంచి సాహిత్యాన్నిగాని, ఉన్న సాహిత్యంలో మంచినిగాని పరిచయం చేస్తే అది కూడా ఉపయోగకరమే. 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వెల్చేరు నారాయణరావుగారు వెన్నెల రాత్రి వేళ హాస్టలు డాబామీద తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితను విద్యార్థులకు చదివి వినిపించడం గుర్తుంది.
విమర్శకులూ, సమీక్షకులూ సామాన్య పాఠకులకన్నా కాస్త లోతుగా పరిశీలించి, రచనలను గురించి వ్యాఖ్యానం చేస్తారు కనక సాహిత్యాభిమానులకు అది ఉపయోగపడుతుంది. అయితే వారికి కూడా తప్పనిసరిగా కొన్ని పరిమితులుంటాయి. వేలూరివారి వ్యాసంవల్ల నాకు అర్థమయినదిదే.
తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:
11/05/2006 11:08 am
Alok Vastav గారు కృష్ణశాస్త్రి గారి మూల వ్యాసం చదివి ఉంటే, ఉమాపతి గారి గురించి నేను అన్నమాటలకి అక్షేపణ చేసేవారు కాదనుకొంటాను.
కృష్ణశాస్త్రి గారి “పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము” అన్న 1948 భారతి పత్రికలోని వ్యాసం 1923 నుంచి 1948 వరకూ వచ్చిన కవిత్వంపై, నాటి కవితా ఉద్యమాలపై చక్కని విమర్శనా వ్యాసం అని నిస్సంశయంగా చెప్పవచ్చు.
ఓరియంట్ లాంగ్మన్ వారు 1993 లో ప్రచురించిన “అప్పుడే పుట్టి ఉంటే” అన్న కృష్ణశాస్త్రి గారి వ్యాస సంపుటి లో ఈ వ్యాసం తిరిగి అచ్చయ్యింది. 1/8 డెమీ సైజులో 34 పేజీల సుదీర్ఘ వ్యాసం ఇది. ఆ వ్యాసంనుంచి ఈ కింది వాక్యాలు (చూ: 29 వ పేజీ):
“… కృష్ణపక్షం ప్రచురించాను. స్ఫుటంగా నా మనస్సులో నాటుకొపోయిన మరి రెండు మూడు ఘట్టాలు ఉన్నాయి. 1925 లో నేమో అక్కిరాజు ఉమాకాంతం గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వము” అనే గ్రంథం వచ్చింది. ఆశనిపాతమంత తీవ్రధాటితో వచ్చింది. రాకేం జేస్తుంది? ఎప్పుడయితే నిజమైన ఒక ఉద్యమం బయలుదేరిందో, అప్పుడే దాని గుణదోషవిమర్శన కూడా వస్తుంది. ఆయన తీవ్ర విమర్శననుంచి నావంటి కవులు నేర్చుకోవలసినది లేకపోనూ లేదు; కాని కొంత ఆర్ద్ర దృష్టితో కవితాహృదయముతో ఆ విమర్శన సాగితే, నేటికాలపు కవిత్వంలో వారు చక్కదనమూ కవిత్వగుణమూ గ్రహించి ఉండేవారు. ఊపిరాడనీయనంత కోపంతో ఆ గ్రంథం దాడిచేసినట్లనిపించింది నావంటి వారికి. దానికి జవాబు వ్రాద్దామా అన్నారు కొందరు మిత్రులు. ఏమి జవాబు మేము వ్రాయగలం? కొత్త పద్యాలు వ్రాయడమే జవాబనిపించింది. వ్రాయకుండా ఎలాగుండగలం? ఈ సంకల్పం 1925 లో మదరాసులో మరీ దృఢపడింది.”
ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము ఉమాకాంతపండితులకు లోపించిందని ఇంతకన్నా మృదువుగా, కృష్ణశాస్త్రిగారి కన్నా చక్కగా ఇంకెవరు చెప్పగలరు?
అభివాదాలతో,
వేలూరి వేంకటేశ్వర రావు.
తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Ananth B. Shastry గారి అభిప్రాయం:
11/05/2006 8:41 am
మీ వ్యాసం కాస్త ఓపిగ్గా చదవ వలసి వచ్చింది.
సుమారుగా 100 ఏళ్ళ క్రితం వ్రాసిన విమర్శ గురించి సోదాహరణంగా విపరీతంగా చర్చించారు. 40/50 ఏళ్ళ క్రితం వ్రాయబడ్డ (నాకు ఉమాకాంతం గారు ఏ సంవత్సరంలో వ్రాసారో గుర్తులేదు) విమర్శ గురించి ఒక్క ముక్క చెప్పి, దానిపై మీ అభిప్రాయం వ్రాసారు. ప్రస్తుత విమర్శనా ధోరణి పై మీ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అంత వరకూ బాగుంది. కాని, కొత్త విమర్శలకు ఉదారణలు ఇచ్చి ఉండవలసింది. కనీసం నలుగురి పేర్లు, వారి రచనల పేర్లిచ్చినా బాగుండేది.
విమర్శ ఎలా ఉండకూడదో చెప్పారు బాగానే ఉంది. ఎలా ఉండాలో చెప్పే విమర్శలు తెలుగులో లేవనుకోవాలా? అనే సంశయాన్ని కలిగించారు. మంచి విమర్శల గురించి కనీస ప్రస్తావన చేస్తే బాగుండేది.
వ్యాసంలో ఋణ విద్యుచ్ఛక్తి దండిగా ఉంది. మీ ఆశయం దాన్ని చదువరులకు తెలియజెప్పడం కాదు గదా! వారి దృష్టి ధనాత్మకత వైపు మళ్ళించడానికి అది ఒక వేదిక మాత్రమే.
ఇది ఒక సాహితీ సభలో కీలకోపన్యాసంగా ఇవ్వబడిందని చెప్పుకున్నారు గాబట్టి ఒక మనవి. కీలకోపన్యాసాలు ఋణాత్మకంగా మొదలవడంలో తప్పులేదుగాని, ఉపన్యాసం పూర్తయేసరికి ధనాత్మకత హృదయాల్లో ప్రతిష్ఠించాలి. ఈ వ్యాసం ఆ పని చెయ్యగలదని అనిపించలేదు నాకు.
పైన చెప్పిందంతా కేవలం నాకొక్కడికే అనిపిస్తే అది నాలోపమే.
విధేయుడు
అనంత్
భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
10/20/2006 9:49 pm
ఇది ఆసక్తికరమైన వ్యాసం. పరిశోధనా పరంగా విషయాలను వెతికి వెలికి తీసి అందించిన శ్రమ కొట్టొచ్చి నట్లు కనపడుతుంది. రాజుల గురించి, కావ్యాలు, రచనలను ఉటంకించి ఎన్నో విషయాలను అందజేసారు.
కాని వీటినన్నింటి ఆధారంగా చేసిన విశ్లేషణ, conclusion మాత్రం అసమగ్రంగా, అసంబద్ధంగా ఉంది. ఉదాహరణకు భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇది అని వివరించిన
వాక్యం చూడండి. ఇది ఎందుకు ఉటంకించానంటే, మొత్తం వ్యాసానికి ఇది ప్రధాన భూమికగానే కాక, అంతస్సూత్రంగా కూడా ఉన్న ముఖ్యాంశం.
“(భావ కవిత్వం) దేశంలో ఒక మధ్య తరగతిని తయారు చేసి వాళ్ళ ఊహల ద్వారా ఒక భారత జాతీయతని నిర్మించింది” అని అన్నారు.
ఇది అసంబద్ధంగా ఉంది. కవిత్వానికి ఎక్కడైనా మధ్య తరగతిని తయారు చేసే శక్తి ఉంటుందా ? పోనీ, అలా చేస్తే కవిత్వానికి ఎప్పుడైనా ఒక ప్రత్యేక మైన వర్గానికి చెందిన వారి ఊహలను మాత్రమే ప్రభావితం చేసి, ఇతరులను అంటకుండా ముట్టకుండా వదిలేసే విచక్షణాపరమైన శక్తి కూడా ఉంటుందా? పోనీ, మధ్య తరగతి వాళ్ళ ఊహలు ప్రభావితం చేసిందే అని అంగీకరించినా, నేటి మధ్యతరగతి వాళ్ళు రేపు పేద వాళ్ళుగానో, కడు శ్రీమంతులుగానో మారిపోతే అప్పుడు ఏమైపోతాయి ఆ ప్రభావాలూ, ఆ ఊహలూ అన్నీనూ? భావకవిత్వమైనా, ఏ కవిత్వమైనా సరే, అది రచించినప్పుడు మధ్య తరగతిలో ఉన్న వాళ్ళందరూ కూడా తరువాత అలానే మధ్యతరగతిలో ఉండాలని కానీ, ఉంటారని కానీ ఏమీ గ్యారంటీ లేదు కదా.
అసలు economy వల్ల మధ్య తరగతేనిది ఏర్పడుతుంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే మధ్య తరగతిలోనే కాస్త డొక్క మాడే ఆకలి బాధలు తగ్గి, కొంత కడుపు చల్లబడి తీరికగా ఊపిరి పీల్చే అవకాశాలున్నాయి కాబట్టి అటువంటి సందర్భంలోనే కొంత భావమూ, ఊహలు చేసే అవకాశమూ, ఆలోచనలూ కలుగుతాయి కాబట్టి, అసలు ఈ మధ్య తరగతే “భావ కవిత్వానికి” భూమిక అనీ, “భావ కవుల” ఊహలకు “మధ్య తరగతే” బలం, గళం ఇచ్చిందీ అని ఎందుకు అనుకోకూడదో తెలియదు.
Literature ని economy ని ఒక్క గాటున కలిపేసి ఈ విధంగా ఒక కవిత్వం యొక్క పరిణామాన్ని ప్రతిపాదిస్తూ, ఫలానాది మధ్య తరగతి వాళ్ళ ఊహలను ప్రభావితం చేసిందనడం రెంటికి చెడిన రేవడిలాగా ఉంది.
అంతే కాక, ఏ జాతీయ భావం ఈ కవిత్వం కల్పించిందని అన్నారో, అదే భావానికి అంకితమై, ధనిక, పేద, మధ్య తరగతి అనే ఎటువంటి భేదం అణుమాత్రం లేకుండా ఉన్న ఆస్తులూ, పాస్తులూ, పదవులూ, ప్రాణాలు ఒడ్డి పోరాడి జైల్లలో మ్రగ్గిన వారెందరినో మరచిపోవడమే అవుతుంది, ఈ ప్రతిపాదనను అంగీకరించడం. భారత జాతీయతా అనేది కవిత్వమే కనక సృష్టించి ఉంటే ఆ భావకవులందరినీ బ్రిటీషువాళ్ళు జైల్లో త్రోసి సుళువుగానే దాన్ని నొక్కి ఉంచేవారు.
(భావ) కవిత్వం కాదు భారత జాతీయతను నిర్మించింది! అంకురించి పెల్లుబుకి వెల్లువై విజృంబించిన భారత జాతీయతా భావతరంగాలకు తనదైన గొంతు నిచ్చి రసవంతంగా పలికించిన పదాలే కొన్ని మనం భావ కవితలనే పేరుతో పిలుస్తున్నాము అని అనుకుంటున్నాను.
విధేయుడు
-Srinivas
ఈమాట గురించి గురించి Sridhar Chirravuri గారి అభిప్రాయం:
10/16/2006 11:20 am
హల్లొ అండీ!
సాహితీ లోకానికి మీరు చేస్తున్న కృషి కి ఒక సలామ్! మీ కలానికి ఒక సలామాలేకుం! మీ వ్యాసాలు, శీర్షికలు అదుర్స్ ! కొత్త పాఠకుడిని, నా అభినందనలు!
శ్రీధర్
భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:
09/11/2006 8:07 pm
రచయితలకి నమస్కారం.
మీరు రాద్దామనుకున్న విషయం బాగానే ఉంది. కాని , విషయాలు చెప్పిన విధానంలో స్పష్టత లోపించినట్టనిపించింది. కొన్ని చోట్ల, “చెప్పేసారు” కాని వివరించలేదు. మీ భాషలో చెప్పాలంటే, చెప్పే విషయాలమధ్య బాగా జాగా వదిలేసారు. అలాంటి వాటిలో కొన్నిటిని మాత్రమే ప్రస్తావిస్తాను.
1. మీ రచనలో 3వ పేరా:
అ) ఈ పేరాలో చెప్పినవి కేవలం తెలుగువాళ్ళకేనా, లేక భారతీయులందరికీ వర్తిస్తాయా?
ఆ) చెప్పిన విషయాలకు ఆధారాల్ని జోడించక పోవడం వల్ల, కేవలం అభిప్రాయాల్లా ఉన్నాయి.
ఇ) వందల ఏళ్ళుగా భారతదేశంలోని ప్రజలు వేరు వేరు రాజ్యాల్లో ఉన్నా అందరిదీ ఒకే ధర్మమని ఎందుకు అనుకున్నారు? మనలో అసంగతంగా ఏదో ఒక సంఘటిత భావం లేకపోతే, అందరం కలసి ఉండాలని 1947లో ఎందుకు నిర్ణయించుకున్నాము. వేరు కాపురం పెట్టిన వాళ్ళని చూసికూడా, మనం ఎందుకలా స్పందించలేదు?
ఈ) మనకు గొప్ప చరిత్ర ఉందని మనకు తెలియదా? అశ్వఘోషుడు, కల్హణుడు, బాణుడు మొదలైన వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు చెప్పేవరకూ మనకు తెలియరా? మనం చరిత్ర అని నమ్మిన పురాణేతిహాసాల మాటేమిటి? ఇవన్నీ భావాలు కావా? ఆ భావాల్లో నిజమెంత అన్నది వేరే వాదన. మనకి మిగిలిన కళలు, కావ్యాలు, శిల్పాలు మొదలైనవి ఏ భావం లేకుండానే వెలిసాయా?/పోషింపబడ్డాయా?
2. “ఈ ఊహల ఆధారంగా మనకి ప్రాచీన కాలం నుంచీ జాతీయతా భావం ఉంది అని వాదించడం పొరపాటు”
అ) బ్రిటిష్ వాళ్ళు మనకి చెప్పిన మన చరిత్ర, మన సంస్కృతులకు గూడ, ఆధారాలు కొంతవరకూ “ఈ ఊహలే”. వాళ్ళు చరిత్రకోసం కొన్ని ఆధారాల్ని తవ్వితీసినా, సంస్కృతికి సంబంధించి కొత్తగా చెప్పిందేమిటి? అప్పటికి, ప్రచారసాధనాలు మెరుగవడం వల్ల వాళ్ళకి అందిందాన్ని ఎక్కువమందికి తెలిపారు.
ఆ) భావకవిత్వం తెచ్చిన కొత్త ఊహలతో నిర్మించిన భారత జాతీయతని మనం నమ్మవలసివస్తే, మీ 4 వ పేరాలో లాంటి పాత ఊహల్తో పుట్టిన ఒక జాతీయత పూర్వం ఉండేది అని ఎందుకు నమ్మకూడదు?
ఇ) మన పెళ్ళిళ్ళలో బ్రాహ్మలు అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజాల దగ్గరే ఆగిపోయారెందుకు? పారశీక, మ్లేచ్ఛ, యవన దేశాల్లో అమ్మాయిల్ని ఎందుకు వెతకలేదు. సంస్కృతో, మరేదో అడ్డు వచ్చాయనేనా?
3) “రాజుల్నీ, రాజభావాన్నీ వదిలించుకున్నాకగాని మనకు జాతీయభావం ఏర్పడలేదు [1]” మీరనుకునే జాతీయభావమేదో నిర్వచించండి. [1] అని వదిలేస్తే అర్ధం అవటల్లేదు.
ఆఖరిగా, తెలుగునాట, చదువు వచ్చినవాళ్ళెంతమంది? అందులో, కవిత్వం చదివే వాళ్ళెందరు? వాళ్ళలో ప్రభావితులయే వాళ్ళెందరు?
ఇతరులనుండి గ్రహించిన విషయాల్ని సంగ్రహంగానైనా స్పష్టపరిచి, మరికాస్త లోతైన పరిశోధన చేసి రాస్తే బాగుండేది.
భాస్కర్ కొంపెల్ల
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
09/10/2006 7:29 pm
వేలూరి చెప్పిన అయిదు విషయాలు మక్కీకి మక్కీ:
1. “మన కవులు అక్షరాస్యులేనా అని గుడిపాటి అడిగిన ప్రశ్నని, కొందరు అది కొన్ని రకాల కవిత్వాన్ని అణగదొక్కటానికి వేసిన ప్రశ్నగా తప్పు అర్థం చేసుకున్నారు.”
2. “రాసేవాళ్ళు సమర్థులైతే మంచి కవిత్వం రాస్తున్నారు . సమర్థులు కాని వాళ్ళు ఏ భాషలో రాసినా మంచి కవిత్వం రాయలేకపోతున్నారు.”
3. “కవిత్వపు మంచిచెడ్డలు భాషలో లేవు, అది వాడేవాళ్ళ సమర్థతలో వుండే తేడాల్లో వున్నాయి. ఈ తేడాలని గురించి ఆయా కవులే మాట్లాడాలనీ, తమరంగంలో కవులకి ఎలాటి శిక్షణ కావాలో కవులే చెప్పాలనీ నారాయణ రావు కోరాడు.”
4. “ఎవరి కవిత్వపు మంచి చెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారుచేసుకోవచ్చు. తయారు చేసుకుంటున్నారు కూడా. ”
5. “తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసేవాళ్ళూ , విమర్శ రాసేవాళ్ళూ తమలో తాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏప్రమాణాలూ లేకుండా ఏది రాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.”
వేలూరి గారు చేసిన పై అయిదు ముఖ్యమైన ప్రతిపాదనల్లో (observations అనుకోండి, “ప్రతిపాదన” అనే పదం నచ్చకపోతే) దేనితో కొడవళ్ళ హనుమంతరావు గారు ఏకీభవించడంలేదో నాకు తెలియలేదు. ఆయన రాసినట్లు: “ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.” భిన్నమైన అభిప్రాయాలు శీర్షికలో ప్రశ్న గురించా లేక పైన ప్రస్తావించిన విశయాల గురించా?
కొడవళ్ళగారికీ, వేలూరికీ ఉన్న భిన్నమైన అభిప్రాయం నాకర్ధమైన వరకూ వ్యాసానికి గుడిపాటి పెట్టిన శీర్షికలో ప్రశ్న “మౌలికమైనదా కాదా” అన్న దాని గురించి మాత్రమే అని నేనర్ధం చేసుకున్నాను, మిగాతావి ఏమైనా ఉన్నయా? (శీర్షిక గురించి వేలూరి గారు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు పైగా, ఆయన మౌలికమైందని మాత్రమే అన్నారు). నేను పైపైన చదవలేదు, ఒకటికి రెండు సార్లు ఈ అభిప్రాయాలన్నీ చదివినా నాకర్ధమవకే ఇంతవరకూ రాస్తున్నాను.
విప్లవ్
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/10/2006 1:35 pm
వెల్చేరుతో విభేదం
అక్షరజ్ఞానులేనా? అన్నది అవమానకరమని చెప్పటానికీ, గుడిపాటి వ్యాసంలో నాకు కనిపించిన కొన్ని లోపాల్ని చూపటానికీ, రాశాను. వెల్చేరు వ్యాసానికి సంబంధించి మొదటి విషయాన్ని దాటి పోలేదు. భేదాభిప్రాయాన్ని మర్యాదగా వ్యక్తపరిస్తే చాలు; అంతకుమించి ఏదో “సాధించాలని” కాదు.
బహుశా నేను చేస్తున్న పొరబాటు నెలక్రితం వచ్చిన గుడిపాటి వ్యాసం మీద కేంద్రీకరించడం, నాకు తోచిన విషయాలు మాత్రమే తీసుకోవడం, వేలూరి చెప్పినట్లుగా చర్చని సాగించకపోవడం. కాని ఈ చర్చకి గుడిపాటి వ్యాసం మూలం. దానిమీద నాకూ వేలూరికీ భిన్నమైన అభిప్రాయాలుండటాన వాటిని తెలిపాను.
అవమానకరంగా ఉందన్నానుగాని అ, ఆ ల గురించిన ప్రశ్న అనలేదు. ఈ తెలుగు వాడకాన్ని అర్థం చేసుకోడానికి ఇంగ్లీషుని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. “మన కవులు అక్షరాస్యులేనా?” అన్నది “Are our poets literate?” గా అనువదించుకోవచ్చు. (అదీ సభ్యతగా అనిపించదు.) కాని దాంట్లో మూలానికున్న బలం లేదు. “Do our poets know the ABC of poetry?” అన్నది దగ్గరగా ఉంది. “Do our engineers know the ABC of Computer Science?” అని అడిగితే కించపరిచినట్లే. ”Do our engineers have the right tools and the right training?” అంటే మర్యాదగానే ఉంది, కాని అదీ ఇదీ ఒకటి కాదు.
నిందార్థం ఏమీ లేదన్నారు వెల్చేరు. అది వారి వ్యాసంలో నిజమే, కాని గుడిపాటి వ్యాసమంతా నిందలతో నిండి ఉంది! మన కవులు పుస్తకాలు చదవరు, వ్యాకరణం నేర్చుకోరు, వారి కవితల్లో స్పష్టత లేదు, కూర్పు లేదు – ఇవన్నీ నిందలే. ఆయన నిందార్థంలోనే వాడారని తెలుస్తుంది. నిందిస్తే తప్పేమీ లేదు – ఇది వాళ్ళ సాహిత్యాన్ని గురించే గాని వ్యక్తిగత జీవితాల గురించి కాదు. కాని అవి అపనిందలు కాదని పాఠకులకి చూపెట్టాలి. ఆయన ఆపని చెయ్యలేదన్నది నా వాదన సారాంశం.
అలవోకగా రాసిన అభిప్రాయమని ఒప్పుకుంటాను. అది వ్యాసమంత ముఖ్యం కాదు. గుడిపాటి వ్యాసం లోతైన విశ్లేషణతో విస్తృతాధారాలతో కూడి ఉన్నదా? మన కవులు నిరక్షరాస్యులని తేల్చిన వ్యాసంలో ఏమాత్రం పరిశోధనా, తర్కం ఉన్నాయ్?
ప్రధాన విషయాన్నించి దారిమళ్ళించలేదు. liberal education లో శిక్షణ ఉండి కూడా ఇలా ఎలా రాశావంటున్నారు. శిక్షణ “ఉండి కూడా” కాదు; “ఉండటం వల్లనే” రాశాను. వివరించే ముందు liberal education అన్నదానికి ఒక నిర్వచనం:
“Liberal education, which consists in the constant intercourse with the greatest minds, is a training in the highest form of modesty, not to say of humility. It is at the same time a training in boldness: it demands from us the complete break with the noise, the rush, the thoughtlessness, the cheapness of the Vanity Fair of the intellectuals as well as of their enemies. It demands from us the boldness implied in the resolve to regard the accepted views as mere opinions, or to regard the average opinions as extreme opinions which are at least as likely to be wrong as the most strange or the least popular opinions.” — Leo Strauss.
నాకు ప్రధాన విషయం గుడిపాటి వ్యాసం. దాని ప్రతిపాదన ఇది – అక్షరాస్యత అంటే స్పష్టత, భాషాధికారం, అధ్యయనంపై ఆసక్తి; కొద్ది మంది తప్ప మనకవులంతా నిరక్షరాస్యులు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఈ ప్రతిపాదనకి వ్యాసంలో ఆధారాలేవీ చూపెట్టలేదు. ఆయన చెప్పేదంతా “నాకీ కవులంతా తెలుసు, నమ్మండి” అన్నట్లుగా ఉంది గాని scholarly article లో ఉండాల్సిన పస లేదు.
నేను తమ్మినేని వ్యాసాన్ని ఎందుకు ఉదహరించాను? అనువాద కవిత్వం గురించి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కొన్ని కవితల విశ్లేషణ ద్వారా సమర్థించాడు. అది నాకు scholarly article అనిపించింది. గుడిపాటి అలాంటిది చెయ్యలేదు, కనీసం ప్రయత్నించలేదు. ఆయన సమస్య చాలా విస్తృతమయిందంటారా? కవిత్వమంతా తీసుకోవాల్సిన పనిలేదు. వ్యాసం చదివేవాడికి గూడా బుర్ర ఉంది. ఆయన ప్రస్తావించిన కొన్ని రకాల కవిత్వ వాదాల్లో ఏదో ఒకదానిని తీసుకొని ఆ కవికో కవులకో అస్పష్టత, అనధికారం, అనాసక్తి ఉండటాన వారి కవితలెంత హీనమయ్యాయో చూపెట్టొచ్చు.
అలా చేస్తే ఆయన వాదానికి బలం చేకూరడమే కాక అంతకన్న ముఖ్యమైన ప్రయోజనమొకటి కలిగేది. అదేంటంటే ఏది మంచి కవిత్వమో ఎందుకో కొంతైనా పాఠకుడికి తెలిసేది. గుడిపాటి వాద విధానంలోని లోపాన్ని వేరే వ్యాసంతో పోల్చి చూపెట్టాను. అది liberal education ఇచ్చిన శిక్షణలో లోపమనుకోను.
“పరమ వినయంగా” దాటేయడం గురించి. వినయాన్ని వెల్లడించ లేదు, చూపాల్సిన సందర్భమూ కాదది. వెల్చేరు గారి వ్యాసం లోతుల్లోకి వెళ్ళని మాట నిజమే. కాని వారు కవుల్నీ విమర్శకుల్నీ చర్చకి పిలిచారు కాని పాఠకుల్ని వదిలేశారు.
“గుడిపాటీ, నేనూ … చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబంధించింది కాదు. వ్యవస్థకి సంబంధించినది…”
శిక్షణా సంస్థల గురించి గుడిపాటి ప్రస్తావించ లేదు. అది వెల్చేరు గారి “వివరణ” వ్యాసంలో ఉంది. నేను దానిని గురించి రాయలేదు. గుడిపాటి వ్యాసంలో అర్థంకానంత క్లిష్ట విషయాలేమీ లేవు. అదంతా వ్యక్తుల గొడవే. అస్పష్టత, అనాసక్తి, అవగాహనా రాహిత్యం, పుస్తకాలు చదవక పోవడం – ఇవన్నీ వ్యక్తుల్లో లోపాలు. ఈ లోపాలు కొన్ని వందల కవుల్లో ఉండటాన ఇది వ్యవస్థకి సంబంధించిందని వెల్చేరు అభిప్రాయం కావొచ్చు. దాని గురించి మరో సారి మాట్లాడదాం.
కొడవళ్ళ హనుమంతరావు
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి వెల్చేరు నారాయణ రావు గారి అభిప్రాయం:
09/09/2006 10:57 am
కొడవళ్ల హనుమంత రావుగారు ఈ మాటలో వేలూరి సంపాదకీయం మీద రాసిన అభిప్రాయం/విమర్శ ఎందుకు, ఏంసాధించడానికి రాశారో నాకు అర్థం కాలేదు. కానిఅందులొ కొన్నిమాటలు వార్త లో నేను రాసిన వ్యాసానికి సంబధించినవి కాబట్టిఈ నాలుగు వాక్యాలూ ఇక్కడ రాస్తున్నాను.
మొదటి సంగతి: గుడిపాటి అడిగిన మన కవులు అక్షరాస్యులేనా అన్న ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని, నేను ఆ ప్రశ్న తిప్పి మన విమర్శకులు అక్షరాస్యులేనా అని అడిగిన ప్రశ్నలో అక్షరాస్యులు అనే మాటకి కాని నిందార్థం ఏమీ లేదని, వాళ్ళకి అ ఆ లు వొచ్చునా అని ఆ మాటకి అర్థం కాదనీ, ఇంగ్లీషులో cultural literacy, fiscal literacy అనే మాటల్లో literacy లాటిది ఈ అక్షరాస్యత అనే మాట అనీ హనుమంతరావు గారికి తెలియలేదని నేను అనుకోలేకపోతున్నాను. అది ఆయన ఊహకి అందనంత గహనమైన విషయం కాదు. నా వ్యాసం చివరదాకా చదివితే, నేను ఆ వ్యాసంలో అడిగిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది. ఆయన నా వ్యాసం పూర్తిగా చదవలేదనీ, నేను ఆవ్యాసంలో వేసిన ప్రశ్నలు — తెలుగులో విమర్శకులు తయారవడానికి అందుబాటులో వున్న అవకాశా లేమిటి, వాళ్ళు చదవ వలసిన పుస్తకాలు, పొందవలసిన శిక్షణ ఏమిటి — అనేవి ఆ సంగతుల మీద తెలుగులో ప్రముఖ విమర్శకులు దృష్టిపెట్టేట్టు చెయ్యడానికి వేసిన ప్రశ్నలు అని హనుమంతరావు గారు బోధపరుచుకోలేక పోయారనీ కూడా నేను అనుకోవడం లేదు. పైగాఈ చర్చలలో ప్రధాన విషయాన్ని ఆయన గమనించలేదని అనుకోడానికీ వీలులేదు: “వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది. ” అని ఒక అభిప్రాయం చెప్పారు కాబట్టి. కాని ఆయన పరమ వినయంగా ఈవిషయాన్ని, దీనికి సంబంధించిన వివరాల్నీ వొదిలేసి ఆయనకి ఇష్టమైన మరో విషయంలోకి తన వ్యాఖ్యానాన్ని మళ్లించారు.
ఈ దేశంలో liberal education లో భాగంగా చర్చని ప్రధాన విషయాల మీద కేంద్రీకరించే పద్ధతీ, అప్రధాన విషాయలవేపు మళ్లకుండా వుండే జాగ్రత్తలూ నేర్పుతారు. ఈ శిక్షణని హనుమంతరావు గారు పొందలేదని నేను అనుకోను. అయినా ఆయన అసలు విషయాన్ని వొదిలేసి మరొక దారి లో వ్యాఖ్యానాలు చెయ్యడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి.
తెలుగు సాహిత్యరంగంలో ఆయన కోరుకునే రకమైన పుస్తకాలు రావడంలేదు. ఆయనకి బోధపడేలా ఉదాహరణలూ దృష్టాంతాలూ ఉన్న పుస్తకాలూ, వ్యాసాలూ ఎవరో ఒకరు తప్ప ఎక్కువమంది రాయడం లేదు. ఇది ఆయన లేవనెత్తుతున్న సమస్య. ఈ సమస్య చాలా ముఖ్యమైనది, వివరంగా చర్చించదగినదీని. ఇది అయితే దీన్ని గురించి వేరే వ్యాసంలో పరిశీలన చెయ్యాలి. అంతేకాని వేలూరి వెంకటేశ్వర రావు రాసిన సంపాదకీయం మీద అలవోకగా చేసే వ్యాఖ్యానంలో భాగం చెయ్యకూడదు.
(హనుమంతరావు గారిని ఇంతగా మథనపెడుతున్న ఈ సమస్య ని ఈమాట లో వివరంగా చర్చించడానికి వొచ్చే నెల సంచిక కోసం నేను ఒక వ్యాసం రాస్తున్నాను. అది ఈమాటలో ప్రచురించబడితే అప్పుడు ఆ విషయం ప్రధానవిషయంగా చర్చలు కొనసాగుతాయని ఆశిస్తాను.)
వార్తలో గుడిపాటీ, నేనూ, ఆ తరవాత ఈమాటలో వేలూరి చర్చకి తీసుకొస్తున్న విషయం వ్యక్తులకి సంబధించినది కాదు. వ్యవస్థ కి సంబంధించినది. తెలుగులో కవులూ, విమర్శకులూ శిక్షణ పొందడానికి ఎలాటి సంస్థలు ఉన్నాయి? ఈ రంగం లో ప్రమాణాలు ఎలా నిర్ణయించ బడతాయి? తెలుగు సాహిత్య రంగం కేవలం ఔత్సాహికులు ప్రధానంగా వుండే రంగంగా ఉండి పోకుండా ఇది professionalize ఎలా అవుతుంది? ఈ ప్రశ్నలు ముందు ఈరంగంలో వున్న పదిమందీ వేసుకుంటే — వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో తెలుగు సాహిత్య రంగం వ్యవస్థీకరించ బడడానికి అవసరమైన సంస్థల్ని నిర్మించే ఆలోచనలు చేస్తారని ఒక ఆశ.
ఈ చర్చ తెలుగు దేశం లోనే జరగ వలసిన అవసరం లేదు. వేలూరి అన్నట్టుగా తెలుగు ప్రపంచ భాషగా ఎదుగుతోంది. అంచేత ఇందులో మనకి కూడా జాగా వుంది.
VNR
సంగీతంతో కుస్తీ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/08/2006 6:25 am
సాయిగారి సంతృప్తి కోసమని నేను లోగడ రాసిన వ్యాసం లింక్ ఇస్తున్నాను. అందులో శాస్త్రీయ సంగీతపు 16, 22 శ్రుతులను గురించి క్లుప్తంగా చెప్పాను.
https://eemaata.com/em/issues/200007/789.html
ఆయనకి వ్యాసం నచ్చినందుకు సంతోషం. ఔత్సాహికుల సౌకర్యం కోసమని 16 శ్రుతుల గురించి ప్రస్తావించలేదనీ, నేనూ, ఇతర పాఠకులూ విన్నవించుకోవడం జరిగింది.
మరొక విషయం. 72 మేళకర్తల వరకూ వివరించడానికి 16 శ్రుతులు సరిపోతాయి కాని ఆరభి, దేవగాంధారి వంటి రాగాల మధ్య తేడాలు తెలుసుకోవడానికి ఉపకరించవు. ఔత్సాహికులకు అవసరంలేని ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. 22 శ్రుతుల గురించి తెలియాలంటే ఇది చూడండి.
http://www.rit.edu/~pnveme/raga/Sruti.html
[ఈ 12 vs. 16 vs. 22 శ్రుతుల పై చర్చ ఇంతటితో ముగించవలసిందిగా పాఠకులకు మనవి. – సంపాదకులు]
వానలో ఓ జాణ గురించి అనానిమస్తు గారి అభిప్రాయం:
09/05/2006 2:26 pm
కొంచెం అటూ ఇటూ తిప్పి హిమజ్వాల నవల్లో యీరో యీరోయిన్లకు మధ్య యింట్రడక్షన్/యింటరాక్షన్ సీన్ రాస్తే కాస్త ఇలాగే ఉంటుంది. కాపీ కొట్టారని అనను. కాని, స్వతంత్రభావాలున్న అమ్మాయి చిత్రీకరణ కాస్త స్టీరియోటైప్ అయ్యింది అనగలను. ఒరిజినాలిటీ విషయంలో నాలుగుకు సున్నా మార్కులు.
గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి విప్లవ్ గారి అభిప్రాయం:
09/05/2006 2:03 pm
“గతశతాబ్దపు” అని పేరు పెట్టారు కనుక సరిపోయింది. లేకపోతే ఇప్పటి
“ప్రజాకవులు” మీకొక కవిత్వపు noose తయారు చేసి వేలాడ దీసే వాళ్ళు.
గత శతాబ్దం అనే కంటే, శ్రీ శ్రీ కంటే ముందు ప్రజా కవులు అంటే మీ సొమ్మేం
పోయింది? శ్రీ శ్రీ ని అనవసరంగా గొప్పవాణ్ణి చేస్తామని భయమా :).
అయినా సరే, మొదట “ప్రజల గురించి” కొద్దిగా:
“ఇకపోతే, ఎవరయ్యా నీ ప్రజలు అని నిలదీసి అడిగితే, నా సమాధానం: వీధి
బడికెళ్ళి చదువుకోని వాళ్ళు, వీధిబడికి కూడా వెళ్ళలేని వాళ్ళు, ఏ రకంగానూ చదువుకోటానికి అవకాశంలేని వాళ్ళు, ఏదో ఒక చిన్న బడికెళ్ళి ఓ న మా లు నేర్చుకోని కాస్తోకూస్తో చదవడం చాకలిపద్దు రాయడం నేర్చుకున్న వాళ్ళు. వీళ్ళు అసలు సిసలైన ప్రజలు. మన మహానగరాలు, పెద్ద పెద్ద పట్టణాలూ వదిలేస్తే, నూటికి డెబ్భైమందో, ఎనభైమందో నేను పైన నిర్థారించిన
ప్రజలకిందే జమా కట్టచ్చు. ఈ ప్రజల్లోకి వెళ్ళి బలపడ్డ కవిత్వం ప్రజా
కవిత్వం.”
ఈ ప్రజల నిర్వచనం కూడా “గత శతాబ్ది” కి చెందేదే అనుకుంటాను.
ఇప్పటి ప్రజలు ఏ కొద్ది మందో తప్పితే పట్టణ లేక నగర వాసన, పత్రికల నీడ సోకని వాళ్ళు తక్కువ.
1991 జనాభా లెక్కల ప్రకారం అప్పటికే 25 శాతానికి పైగా పట్టణాల్లో ఉన్నారు, 2001 వచ్చే సరికి అది మూడవ వంతుకు చేరింది. అక్కడితో సరిపెట్టకుండా ఒక ఎస్టిమేట్ ప్రకారం ఈ దశాబ్ది చివరికి యాభై శాతానికి పైగా పట్టణ వాసులే అవుతారు మన జనాభా.
మీరన్న “ప్రజ” ఇప్పటి వాళ్ళు కాదు అనేది కొంత వరకూ క్లియర్. అంతే కాదు, ప్రజల కు నిర్వచనం మారుతుంది ఎప్పటికప్పుడు, స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కూడా. (ఉదా: అమార్త్య సేన్ పుస్తకం ఐడెంటిటీ & వయలెన్స్).
ఇక ప్రజాకవుల గురించి:
“ఈ ప్రజలని ఉత్తేజ పరిచి, వాళ్ళకి ఉత్సాహాన్నిచ్చిన కవిత్వం రాసిన వాళ్ళు
ప్రజా కవులు. ”
ప్రజలు మారినప్పుడు కవిత్వం మారుతుందన్నమాట ఈ ప్రజా కవుల Definition పట్టుకుని వెళితే. ఏది ఉత్సాహాన్ని ఇస్తే, అది ఎట్లా డెలివరీ చేస్తే
వస్తుందో తెలిస్తే ప్రజాకవుల కు కావలసిన మినిమం క్వాలిఫికేషన్ తీరుతుందనుకుంటే ఇక సాధనాలదే ప్రధాన పాత్ర అవుతుంది, ఆ రాసింది ప్రజల నోళ్ళలో నానడానికి. నాటకాలు, అవధానాలు తిరుపతి కవులను ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాయో ఆ తరువాత సున్నమేసిన తెల్ల గోడలు, సినిమాలు, ఇప్పుడు పత్రికలు శ్రీ శ్రీ ని (అతన్ని అనుకరించే వాళ్ళను) ప్రజల్లోకి
తీసుకెళ్తున్నాయి.
తిరుపతి వెంకట కవులు మీరిచ్చిన డెఫినిషన్ accept చేస్తారని నేననుకోను.
ఒక వేళ చేస్తే అది కూడా ముపటి మాట కిందికే వస్తుంది. గతం గురించి
చెప్పేటప్పుడు అనుకోవలసినమాట.
ఇక ఇప్పటి సంగతి: వీధి నాటకాలు ఇప్పటి ఊళ్ళలో అంతగా కానరావు. ఎప్పుడో ఏడేండ్లప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రాత్రి పూట “బావా ఎప్పుడు వచ్చితివీవు …” లాంటివి వింటూ నాటకం చూస్తూ అక్కడే పడి నిద్రపోయి, సగంలో మళ్ళీ “చెల్లియో చెల్లకో …” అంటూ మొదలు పెట్టిన గొంతుకో, హార్మోనియం దెబ్బకో మళ్ళీ దడుచుకుని లేచి ఇక నిద్ర ఎగిరిపోయి ప్రొద్దున ఆ కప్పు చాయ పడే వరకూ చొప్ప బెండ్లతో కచ్రపు బండ్లు చేసుకోవటం వంటివి తీరి రెండు దశాబ్దాలైనా అవుతుంది అనుకుంటాను.
ఇప్పటి రోజుల్లో కొన్ని పట్నాల్లో, నేను కర్నూలు, వరంగల్లు లో కొద్దిగా
చూసాను, నాటక పోటీల పేరుతో; కానీ చాలా వరకు సాంఘికాలే అవి. మరీ గుంటూరు, గోదావరి జిల్లాల్లో అయితే ఇప్పట్లో దసరా సెలవుల్లో రాత్రిపూట స్టేజీ మీద జరిగేవి నాటకాలు అని వెళితే వేలూరి గారు “శివ శివా” అనుకుంటూనో లేక “శెవ్వా ఇదా వేషం” అంటూ అట్లాంటా పరిగెత్తుకు వచ్చేస్తారనుకుంటాను. (అది నా ఊహే, ఆయన అక్కడే పీఠం వేసుకు కూర్చుంటారేమో మరి నాకెరుక లేదు.)
చెప్పేదేంటంటే, ఇదివరకు ప్రజలకు సాహిత్యాన్ని చేరువ గా తెచ్చే ప్రయోగం
నాటకమైతే ఇప్పటి సాధనాలు వేరు అని. ఇప్పుడు పేపరు చదవని వాళ్ళు అతి తక్కువ. ఒక్క ఈనాడు పత్రికను కోటిన్నర మంది చదువుతారట వాళ్ళ లెక్కల ప్రకారం. ఉన్నది ఏడెనిమిది కోట్లే కదా, పిల్లలను తీసేస్తే మిగిలేది
అయిదు కోట్లే. ఇక పత్రికలు చదవని వాళ్ళు ఆ లెక్కన అతి తక్కువ.
అందుకే ఇప్పటి పత్రికల్లో వచ్చేవి ప్రజా కవితలు, కవిత్వం అనిపిస్తాయి ఈ
రోజుల్లో. అవి తవికలే కావచ్చు, మరింకేమైనా కావచ్చు. ఏ పత్రికయినా చదివే వాళ్ళను ఉద్దేశ్యించింది కాబట్టి వాళ్ళనుద్దేశించిన రాతలే ఎక్కువగా
వస్తయి. అవి ఎటువంటివి వస్తాయి అనడానికి పెద్ద ఊహాగానాలు అక్కరలేదు. చికెన్ గున్యా మీద సీస పద్యాలు వస్తయి. మొసపొటేమియా మీద పొటేలు రంకెలు వినిపిస్తయి. ఇదంతా ప్రజా కవిత్వమే.
దీన్ని బట్టి చూస్తే ఎవరైతే ఆ కాలపు మాధ్యమాన్ని, అప్పటి పరిస్థితులకనుకూలంగా, అతి ప్రతిభావంతంగా ఉపయోగించుకుంటారో వారే ప్రజా కవిగా మిగులుతారు, మిగతా వాళ్ళు ఉత్తుత్తి కవులుగా నిలబడి జాతర చూడవలసిందే.
తిరుపతి వెంకట కవుల నాటకాల్లో పద్యాలు అప్పటి కాలంలో ప్రజా కవిత్వం అయితే, ఇప్పటి ప్రజా కవిత్వం ప్రతి రోజూ అచ్చయే పేజీల మధ్య కనిపిస్తుంది.
చివరగా, వాళ్ళే ఇప్పటి కాలంలో ఉండేదుంటే అరాఫత్, ఒసామాల నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి దాకా పొయిట్రీ రాసి ఉండే వాళ్ళే. ఇదేం పోయేకాలమో ఇంతగా చదువుకుని, ఇంతింత విషయాల గురించి తక్కువ పదాలతో పొయెట్రీ రాయగల ఇప్పటి కవులు వాటినే ఇంకొంచెం సాగదీసి వ్యాసం రాయొచ్చుకదా. “ఈనాడు” లాంటి అటూ ఇటూ కాని పత్రిక(లు), వీళ్ళు వ్యాసాలు రాస్తే మీ పేరు పెట్టి వేయం అనే ఒక దరిద్రపు రూలు పెట్టినందుకే మనకు కవులెక్కువ, వ్యాస కర్తలు తక్కువ అని నా అనుమానం.
ఈ లెక్కన “గత శతాబ్దపు” ప్రజాకవుల పక్కన ఇప్పటి ప్రజా కవులను
నిలబెడతానంటే కుదరనిపని. అసలు ప్రజాకవి అనే పదమే అనవసరం అని outlaw చేస్తే మంచిదని నాకనిపిస్తుంది, లేకపోతే “మహాకవి” అనే పదానికి
బహుపదార్ధాలు వాటికి మళ్ళీ తాత్పర్యాలు చెప్పుకున్నట్టే ఇదీ తయారవుతుంది, only more often we get to define and redefine it.
విప్లవ్
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/04/2006 1:33 pm
నేను కవినీ కాదు, విమర్శకుణ్ణీ కాదు. కాని ఓ పాఠకుడిగా “మన కవులు అక్షరాస్యులేనా?” అన్న ప్రశ్న అవమానకరమైన మకుటమనిపించిందిగాని మౌలికమైన ప్రశ్నగా అనిపించలేదు. “ఎదుటివారి అభిప్రాయాలనూ వ్యక్తిత్వాలనూ గౌరవించగల పెద్ద మనిషి తరహా” ఉండాలని చెప్పిన వెల్చేరు గారు కూడా “మన విమర్శకులు అక్షరాస్యులేనా?” అని అడగడం ఆశ్చర్యమేసింది. వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది.
గుడిపాటి తన వ్యాసంలో మన కవుల గురించి చెప్పిన విషయాలు – వేరే వాళ్ళ కవిత్వాన్ని చదవరు, కవిత్వం మీద వచ్చే వ్యాసాల్నీ, సమీక్షల్నీ చదవరు, చదివినా తమ పేరుందో లేదో అన్న ధ్యాసే గాని ఏమి రాశారో అన్న ఆసక్తి లేదు … – ఆ కవులకి సన్నిహితంగా మెలగడాన తెలిసిన సమాచారం కావచ్చు. వాటి గురించి కవులతో కనీసం ముఖ పరిచయం కూడా లేని నాలాంటి పాఠకుడు చర్చించడం వీలవదు.
వెక్కిరింపులూ, అపహాస్యాలూ మన సాహిత్య చర్చల్లో అనివార్యమయినట్లుంది. అయినా వాటితో పాటు నాలుగు ఉపయోగపడే మాటలు, కాసిని ఉదాహరణలతో చెప్తే నాబోటి వాడు అన్వయించుకుని బోధపరచుకుంటాడు.
వాడుక భాషలో రాయడంలేదని వాపోయిన రంగనాయకమ్మ రాసిన పుస్తకం చదివితే వాడుక భాష గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది. మాతృభాషే అయినా తెలుగు భాషా స్వరూపం తెలియని యువకుల్ని చూసి బాధ పడ్డ బూదరాజు రాసిన పుస్తకాలు చదివి కొంతయినా వ్యాకరణ జ్ఞానం పెంచుకోవచ్చు.
అలాగే మన కవిత్వ, విమర్శ రంగాల దుస్థితిని చూసి విచారించేవాళ్ళు కూడా వాటిని సవరించడానికి కృషి చేస్తే బావుణ్ణు. డబ్బుకీ, కీర్తికీ, అవార్డులకీ, రాజకీయాలకీ మన కవులు అమ్ముడు పోయారంటున్నారు. అలాంటి ప్రముఖుల కవితా సంకలనాల్ని కొన్నిటిని తీసుకొని సహేతుకంగా విమర్శించండి. శబ్దం, రూపం, లయ, అవగాహన, పాండిత్యం ఎలా లోపించాయో వివరించండి. వారాల తరబడి జరిగిన చర్చలో ఆరోపణలకు కొదవ లేదు గాని ఉదాహరణలు మాత్రం శూన్యం!
నాకీ విషయంలో సమకాలికుల్లో తమ్మినేని యదుకుల భూషణ్ ఒక్కరే ఆపని చేస్తున్నట్లనిపిస్తుంది. ఉదాహరణకి నిన్ననే చదివిన వారి వ్యాసం, “ఉమర్ ఖయ్యాం – ఉదాహరణలు.” అనువాదానికి ఉండాల్సిన లక్షణాలేమిటో చెప్పి, మూలంలోని రుబాయి నొకదాన్ని తీసుకొని, కరుణశ్రీ, ముద్దుకృష్ణ మొదలైన వాళ్ళ అనువాదాలు ఎందుకు లోపభూయిష్టమో, చలం, ఆదిభట్ల అనువాదాలు ఎందుకు ఉన్నతమైనవో వివరించారు.
విశేష ప్రతిభావంతుడనిపించే తమ్మినేని కున్న లోపం తనకి నచ్చని వాళ్ళని ఎద్దేవా చెయ్యటం, పెద్దమనిషి తరహా లేకపోవడం. “బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా” (?) అన్న వేమన వేదాంతం బాగా వంటబట్టించుకున్నట్లుంది. గుద్దులు తిన్నా, చదివినవాడికి కవిత్వం గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది.
కొడవళ్ళ హనుమంతరావు
సంగీతంతో కుస్తీ గురించి unknown గారి అభిప్రాయం:
09/03/2006 5:07 pm
ప్రసాద్ గారి వ్యాసం ఔత్సాహికులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
వారు చెప్పినట్టు కీబోర్డు మీద గుర్తులు వేసుకుని సాధన చేస్తే రాగాల
లోతులు కాకపోయినా కనీసం చాయలు అర్ధమయి తదుపరి మెట్టు కి ఎదగే స్థాయి సమకూరుతుంది.
మనవి కావని ఏ వాయిద్యాన్నీ కూడా వదులుకోనవసం లేదు. ఘంటసాల వంటి వారు పాతాళభైరవి నాడే “మనవి కానివి” వాడుకుని అద్భుతవైన సంగీతం చేసేరు. కీ బోర్డు మీద సాయి గారి చులకన భావం సముచితంగా లేదు. అయితే వారి భావం ఈ నాడూ అన్ని వాయిద్యాల చోటునా కీ బోర్డు మన కొత్త దర్శకులు వాడుకోడం గురించై ఉంటుంది.
ఏమైనా వారి ధన్యవాదాలూ, క్షమాపణలూ వారి స్థాయి కి తగ్గ ట్టు లేవు.
ప్రసాద్ గారు తమ విద్వత్ప్ర కటన కై ఈ వ్యాసం రాసినట్టు నాకనిపించలేదు. రాగం అంటే ఔత్సాహికులకి నీరసం రాకుండా ఆసక్తి కలిగి అభిరుచి గా మారాలని చేసిన సత్ప్రయత్నమని నా ఉద్దేశం. ఒక వాయిద్యాన్ని ఆకాశానికెత్తి వేరే వాటిని తొక్కేయాలని ఆయన ఇవాళ శ్రమపడి ఒక వ్యాసం రాసేరని నేననుకోను. వ్యాస కర్తగా ఆయన తన అనుభవాన్ని, qualifications ని చెప్పుకుంటే అది వ్యాసానికి మరింత authenticity ని ఇవ్వగలదని నా అభిప్రాయం.
సెలవు.
సందుక గురించి nArAyaNaswAmi గారి అభిప్రాయం:
08/29/2006 6:43 pm
అక్కిరాజు గారూ
మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. నిజమే గతంలోని పేదరికాన్ని గ్లోరిఫై చెయ్యడం సరైంది కాదు. కాని నేను గతంలో వుజ్వలంగా వున్న “కొత్త సమాజాన్ని నిర్మించాలనే ” ఆకాంక్షని గ్లోరిఫై చేస్తున్నాను. మా తొలి యవ్వన వుద్రేకాలవే కదా! ఆ ఆకాంక్ష ఇంకా సజీవంగా వుండాలనే, వుంచాలనే నా కోర్కె.
గది పాడుబడలేదు – మళ్ళీ పిట్టలన్నీ దాని లోకి రావాలని కోరుకోవడం అత్యాశ కాదేమో!
మీరు సభకి వస్తే గొప్పగా వుండేది. మీరు వున్నారని నాకు తెలియదు – తెలిస్తే తప్పకుండా నేను కలిసే ప్రయత్నమైనా చేసేవాణ్ణి.
ధన్యవాదాలు,
మీ
నారాయణస్వామి
నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి చిట్టెల్ల కామేశ్వర రావు గారి అభిప్రాయం:
07/29/2006 11:10 pm
చాలా బాగుంది. అయితే ఒక చోట “పుబ్బలో పుట్టి … మఖలో మాడిపోయి ” అని రాసారు. ప్రాస కోసం అయితే సరే. కాని చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి అయితే “మఖలో పుట్టి , పుబ్బలో మాడి పోయే” అని రాయాలేమో.. అని నా వ్యక్తిగత అభిప్రాయం. రంధ్రాన్వేషణ అనుకోకుండా ఉంటే మంచిదే. లేకపోతే క్షంతవ్యుడిని. ఏదేమైనప్పటికీ, చాలా మంచిగా, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, నిర్భయంగా , సునిశితమైన దృష్ఠతే విశ్లేషించిన తీరు బహూధా ప్రశంసాపాత్రం. మీ నుండి మరిన్ని సమకాలీన సమస్యలపై విశ్లేషణలను ఎదురుచూసేలా చేసారు. హేట్సాఫ్.
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/09/2006 10:27 am
నేనా వ్యాసాన్ని నాకు తెలిసిన ప్రాంతపు భాషలో రాశాను. ఆభాషలో ఒత్తులు, దీర్ఘాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నియమాల్ని పాటించడంలో జాగ్రత్త తీసుకోకపోవడం – అందునా ఓ సాహిత్యపత్రికకి రాసేదాంట్లో – నా అజ్ఞానాన్నీ బద్ధకాన్నీ తెలుపుతుంది గానీ, అదేదో అభ్యుదయం అని సమర్థించుకుంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.
ఆ నియమాలు అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉండవని నాకు తెలుసు. ఆ తేడాలని గౌరవించేపాటి సంస్కారం ఉంది. “మెజారిటీ” సంగతేమోగాని, మన ఆధునిక సాహిత్యంలో వేరు వేరు ప్రాంతాల రచయితలు వారి వారి భాషలో రాశారు; వాటిని ఇతర ప్రాంతాల ప్రజలు గూడా బాగానే ఆదరించారు. ఒకే రచనలో అనేక పాత్రలతో ఆయా ప్రాంతాల, వర్గాల భాషలో సంభాషణలు నడిపించిన నవలొకటి గత శతాబ్దానికే తలమానికంగా నిలిచింది:
“Overwhelmed by sorrow – అంటే యేమిటి?” అని అడిగింది గంగి, పుస్తకంలో వొక పేజీలో గుర్తుపెట్టుకున్న చోట తీసి చూస్తూ.
“సారో అంటే తెలుసుగా విచారం, దుఃఖం. వోవర్ వ్వెల్మింగ్ అంటే – ” అని రెప్పలు మూతపడని కళ్ళతో, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – గంగి” అన్నాడు అనాలోచితంగా.
పగలబడి నవ్వింది, గంగి.
రవి అలాగే చూస్తున్నాడు.
నవ్వు ఆపుకుని, “యాడున్నవ్ సారూ? పాఠం చెప్తున్నవా, కార్కాన్ల వున్నవా?” అంది.
…
తేరుకుని, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – యేదైనా వొక భావంగానీ అనుభూతిగానీ ఫీలింగ్ గానీ – సంతోషమో విచారమో అసూయో ద్వేషమో ప్రేమో యివి యేవీ కాని మరేదో అనిర్వచనీయ భావమో – అట్లాంటిది యేదో వుక్కిరిబిక్కిరిగా పుక్కిలింతలుగా నిర్వీర్యంకాని అశక్తతగా చేసినట్లుగా – ” అని ఆ తరవాత యేం చెప్పాలో రాక ఆగిపోయాడు.
“నువ్వు చెప్పేది అర్థంకాకపోయినా నువు చెప్తుంటే వింటం బావుంటుంది” అంది.
రవి ఫక్కున నవ్వాడు.
“దేన్కి?” అంది కోపంగా.
“నీ మాటకి. నీ అనుకరణకి నవ్వొచ్చింది” అన్నాడు.
“నీలాగా మాట్లాడదాఁవని.” అంది.
నవ్వు ఆపుకుంటూ “దేనికి?” అన్నాడు.
“మా మాట బగ్గడ్ గుంటదిలే! మీ ఆంద్రోళ్ళు మంచిగ మాట్లాడతరు” అంది.
“నేను ఆంధ్రావాణ్ని కాదు. తెలంగాణావాణ్నే” అన్నాడు.
“యేదొకటి. నీ మాట అట్లానే వుంటది. నాకు మంచిగ అనిపిస్తది – ఆతీరు మాట్లాడేది. నా మాట మంచిగుండదులే” అంది.
“బావుంటం అనేది మాటలోకంటే, ఆ మాట్లాడే మనసులో మనిషిలో భావంలో వుంటుంది! పుట్టిపెరిగిన ప్రాంతపు వాతావరణాన్ని బట్టి మాట తీరు వుంటుంది. వొక్కొక ప్రాంతంలో వొక్కొక రకంగా మాట్లాడతారు. మనసులు మంచివైతే ఆ మాట్లాడే తేడాలు అంత ముఖ్యంకాదు.” అన్నాడు.
“కాని నా కెందుకో అట్ల మాట్లాడితె మంచిగా అనపిస్తుంది. అటు ఆంధ్రుల అట్లనె మాట్లాడతరు గద?” అంది.
“లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపూరు చిత్తూరుల వరకు తీసుకుంటే చాలా తేడాలుంటయ్. ఐతే చదువుకుని నాలుగు ప్రదేశాలు చూసిన వాళ్ళు అంతా షుమారుగా అందరూ వొక మాదిరిగానే మాట్లాడతారు. రాస్తారు. దానిని మధ్య సర్కారాంధ్ర భాష అనవొచ్చు. పుస్తకాలలో, సినిమాల్లో, రేడియోలో, పత్రికలల్లో మనం సర్వసాధారణంగా చదివే వినేభాష అది. – ”
…
— “అనుక్షణికం,” పేజీలు 267-268.
కొడవళ్ళ హనుమంతరావు
రాచపుండు గురించి krao గారి అభిప్రాయం:
07/09/2006 7:02 am
చాలా బాగుంది. కధ అంతా చదవడానికి హాయిగా వుంది. కాని రెండవ పేరాకి మిగతా కధకి ఎమీ సంభందం లేదు.
నౌషాద్ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
07/04/2006 9:52 am
తండ్రిని మించిన తనయుడు
సంగీతం గురించి కనీసపు జ్ఞానం లేకపోయినా నేను రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు చదవడానికి కారణం వారి నిరాడంబర భాషా, శైలీ, క్లిష్టమైన విషయాలను విడమరచి సులభంగా చెప్పే నేర్పూ.
నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇతర రాష్ట్రాలకన్నా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా వున్నా కూడా సంగీతంలో ప్రవేశం మనవాళ్ళకంటే వేరే రాష్ట్రాలవాళ్ళకే ఎక్కువున్నట్లనిపించేది. ముఖ్యంగా మనప్రక్కవాళ్ళే అయిన తమిళయన్లలో, ప్రతివాళ్ళూ గాత్రమో వాయిద్యమో చిన్నప్పుడే నేర్చుకునేవాళ్ళని విన్నాను. మనవాళ్ళకి ట్యూషన్లు, కోచింగ్లతో సంగీతానికి సమయం మిగులుతున్నట్లు లేదు. (పల్లెటూళ్ళలో, చిన్న పట్టణాలలో, రెండు మూడేళ్ళకోసారి వెళ్ళి పదిరోజులుండి చూసి ఏర్పరచుకున్న అభిప్రాయమిది; వాస్తవం కాకపోవచ్చు.)
చిన్నప్పుడే, 3-7 ఏళ్ళ మధ్య ప్రతిబిడ్డకూ ఏదో ఒక కళమీద గురి కుదురుతుందనీ, ఆ అభినివేశం పెద్దయ్యాక ఏర్పడటం దాదాపు అసంభవమనీ, చిన్నప్పుడే తగిన వాతావరణం కలిగించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకుందనీ కొకు రాశాడు. పాటల్లోపడితే చదువులు పాడవుతాయని తల్లిదండ్రులకి సహజమైన భయం వుండొచ్చుగాని, దానికి కాస్త మందలింపు సరిపోవచ్చు:
“మా ప్రసాద్ సితార్ తో చదువు పాడు చేసుకోవటం నాకంతగా ఇష్టం లేదు. వాడు పరీక్షలప్పుడు కూడా relax కావటానికి ఓ అరగంట వాయించుకుంటే నేను అభ్యంతరం చెప్పను. కాని social functions లో వాయిస్తే ఇక mind చదువుమీదికి పోదు. ఆమధ్య వాడి స్నేహితులు చిన్న పార్టీ ఏర్పాటు చేసి వాడి చేత రెండున్నర గంటలు సితారు వాయింపించారట. అందులో వున్న ప్రమాదం వాడికీ తెలుసు. అందుకని దాని జోలికిపోక చదువుకోమని రాశాను. డిసెంబరు సెలవుల్లో నెలరోజులూ సితారే వాయిస్తాడు. summer holidays అంతా వాడికి మరోపని వుండదు. వాడికి వ్యక్తిత్వం లేకపోవటమేమిటి? సైన్సులోనూ, సంగీతంలోనూ నాకు వాడు చాలా విషయాలు చెప్పగలడు. నాకున్న వ్యసనాలు కూడా ఆరెండే. అందుచేత వాటిలో నన్ను ఇప్పటికే మించి ముందుకు వెళ్ళాడు.”
— కృష్ణాబాయికి 11-11-1968 న కొకు రాసిన ఉత్తరం నుండి.
కొడవళ్ళ హనుమంతరావు
సందుక గురించి vtp గారి అభిప్రాయం:
07/03/2006 4:06 pm
అన్నా, గీ కైతల్ మస్తుగ రాసినవన్న. కాని జరంత పొడూగున్నయ్.గదిగిట్ట తక్వజేసి, గీ సదివెటోల్లు ఆలోచించనీకి ఏమన్న ఇడిసిపెడితె ఇంక మస్తుగుండు.నా సందూకను అర్రను యాదికిజేసి నా దిల్ కుష్ జేసినవ్.
కోపం గురించి K. Vardhani గారి అభిప్రాయం:
07/02/2006 9:20 am
నిడుదవోలు మాలతిగారి “కోపం” కథ చదివాను. ఈ కథ మాలతిగారి పాత కథల స్థాయిలో లేదు. ఈ కథలో నాకు అర్థంకాని విషయాలు చాలా ఉన్నాయి.
1. జోగిబాబుకీ, జీనీకీ, బిష్ కి ఉన్న బాంధవ్యం ఏమిటో బోధపడలేదు.
2. కాంతం కి ఇండియన్ల మీద అనవసరపు bias ఉన్నట్టు కనిపించింది
3. రాధలాంటి వాళ్ళు తెలుగుదేశంలో చాలా అరుదు. సాధారణంగా మనవాళ్ళు ప్రతి చిన్న విషయం పట్టించుకొని అపార్థం చేసుకుంటారు.
4. కాంతం తనంత తానే గుంటూరు వెళ్ళలేక పోవడం, హైదరాబాద్ నుండి తమ్ముడిని పిలవకపోవడం వింతగా ఉంది. కాంతం దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నదే కదా!
I regret to say that the editors have not excercised their options properly!
Vardhani.
ఈమాట కొత్త వేషం గురించి vtp గారి అభిప్రాయం:
05/31/2006 5:42 pm
అడిగే వాళ్ళ కోరికలకు అంతూ పొంతూ లేదనుకోండి. కాని ఒక చిన్న విన్నపం.
మీ గ్రంథాలయంలోని పాత పుస్తకాల లింకులు పునరుద్ధరించవలసిందిగా మనవి. శిలాలోలిత సగంలో చదివి ఆపేశాను. ఇప్పుడు లింకు కనిపించట్లేదు.
కృష్ణరాయల కవిపోషణ గురించి kAmESwara rAvu గారి అభిప్రాయం:
05/03/2006 9:00 am
1. కృష్ణరాయలు తన కవితాసక్తిని బహిరంగంగా ప్రదర్శించాడా, అతడు కవి పోషకుడా?
ఈ ప్రశ్నకి “ప్రదర్శించాడు” అని సమాధానం చెప్పుకోడానికి పెద్ద సందేహపడక్కరలేదు. పెద్దన, తిమ్మన్న కావ్యాలే కాకుండా, రాయవాచకం, కృష్ణరాయవిజయం కూడా ఇందుకు సాక్ష్యాలే. అయితే కవులపేర ఏమైనా భూములిచ్చినట్టుగా శాసనాలు ఉన్నాయా అంటే అనుమానమే. నారాయణరావుగారు ఉదహరించిన ఆముక్తమాల్యదలోని పద్యం అతని కవి పోషకత్వాన్ని అనుమానించడానికి అడ్డురాదు. అందులో ప్రస్తావించినది కవులగూర్చి కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. కవులని భిక్షువులుగా జటాధారులుగా ప్రస్తావించడం సబబుగాలేదు. అలా అని రామారావుగారన్న బౌద్ధులు, శైవులు, జైనులు అవడానికి కూడా అవకాశం లేదని నా ఉద్దేశం. వైష్ణవుడైన కృష్ణదేవరాయలు వాళ్ళని డబ్బులిచ్చి మార్చెస్తే, ధర్మగ్లాని అవుతుందని ఎందుకంటాడు? పైగా వాళ్ళమీద భక్తి చూపించమని ఎందుకంటాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి బౌద్ధ భిక్షువులో, శైవులో కాదు. వేదం వారి వ్యాఖ్య ప్రకారం, వాళ్ళు సన్యాసులు. “అక్షరం” అంటే (నాశనం కాని, ఆధ్యాత్మిక)విద్య.
2. కృష్ణరాయలు స్వయంగా కవా?
ఇది చాలా controversial ప్రశ్న. దీని గురించి చాలామంది పెద్దలు వాదులాడుకున్నారు. ఆముక్తమాల్యద పెద్దన్న కృతమని చాలా రుజువులే చూపించారు. వీటన్నిటిని వేదం వేంకటరాయశాస్త్రిగారు తన ఆముక్తమాల్యదకి రాసిన సంజీవనీ వ్యాఖ్య పీఠికలో చర్చించారు. తెనాలి రామకృష్ణునిదిగా చెప్పబడుతున్న చాటువు, కోకట గ్రామ కైఫీయతు (ఇందులో ఈ గ్రామాన్ని రాయలు పెద్దనకి దానం చేసినట్టు ఉందిట), అప్పకవి పద్యమూ, గుడుపాటి వేంకటకవిదిగా చెప్పబడుతున్న ఆముక్తమాల్యద టీకా… ఇవన్నీ ఆముక్తమాల్యద కర్త అల్లసాని పెద్దనగా పేర్కొన్నాయి. అంతేకాక, ఆముక్తమాల్యదలో కృష్ణరాయల కృతమని పేర్కొన బడ్డ కొన్ని సంస్కృత కావ్యాలు, “ప్రపంచదర్పణమ్” అనే పుస్తకంలో అల్లసాని పెద్దనవిగా పేర్కొనడ్డాయి. అంతేకాక రాయవాచకమూ, కృష్ణరాయ విజయమూ ఆముక్తమాల్యదని పేర్కొనకపోవడం మరింత అనుమానాన్ని కలిగిస్తుంది.
3. అష్టదిగ్గజాలు అసలు ఉన్నారా లేరా ?
దీనికి సమాధానం సబహుశా లేరనే చెప్పాలి. ఉన్నారని బలమైన సాక్ష్యం ఏదీ లేదుకాబట్టి. అష్టదిగ్గజాలుగా చెప్పబడుతున్న కవుల కావ్యాలలో కాని, రాయవాచకం, కృష్ణరాయవిజయం వంటి కావ్యాలలో కాని వీరి ప్రస్తావన లేదు. ఉన్న ఒకే ఒక చిన్న ఆధారం, కడప మండలంలోని తిప్పలూరు గ్రామ శిలాశాసనంలో అష్టదిగ్గజాల ప్రస్తావన.
విప్లవ్ గారి సందేహానికి సమాధానం, చాలా ప్రబంధాలు రాయలకాలంలోవిగా నిర్ణయించబట్టే ఆ కాలాన్ని ప్రబంధయుగం అన్నారు. అయితే వాటికీ కృష్ణరాయల కవిపోషకత్వానికీ ఎంతవరకూ direct సంబంధమున్నదన్నదే ప్రశ్న.
తుది ప్రార్ధన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/02/2006 9:01 am
అమ్మా నాన్న వద్దు అందామనుకుంటే
“అమ్మ, నాన్న” లను చేసింది నా పుట్టుకే అనిపిస్తుంది
అడవి కాని ఇల్లు వాకిలి వద్దు అందామనుకుంటే
అవేవీ కట్టకముందు అంతా అడవే అనిపిస్తుంది
చదువుకోవడానికి మేష్టార్లు వొద్దనుకుంటే
ప్రతి అనుభూతి పాఠంచెప్పే మేష్టారే అనిపిస్తుంది
సోదర సోదరీమణులు వొద్దు అందామనుకుంటే
కాళ్ళూ చేతులూ సోదర సోదరీమణులే అనిపిస్తున్నాయి
మూడుముళ్ళ బంధమే వద్దు అందామనుకుంటే
తలపుల బంధాలు రోజూ ముడివేసుకుంటున్నాయి అనిపిస్తుంది
బిడ్డలే బరువని వద్దు అందామనుకుంటే
కవితయే కన్యగా కళ్ళెదుట కనిపిస్తుంది
పుట్టుకే లేని భాగ్యం కావాలనుకుంటే
పుట్టకపోతే అది భాగ్యమని తెలిసేదెట్లా అనిపిస్తుంది !
విధేయుడు
Srinivas
వానా పూలు ఇంద్రాణి కవిత్వం గురించి s. kanaka prasad గారి అభిప్రాయం:
05/01/2006 3:58 pm