నిజానికి, ‘నీ రచన చాలా గొప్పగా ఉంది’ అని వచ్చే విమర్శ వల్ల (నిజంగానే ప్రతికూల విమర్శకు అందని రచనైనా సరే) రచయితకు తాత్కాలికానందం తప్ప వేరే ఏ ఉపయోగమూ ఉండదు. రచయితలు అదే కావాలనుకుంటే భజన సంఘాలనేర్పరచుకోవడం తేలికే! (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)
రచయిత వివరాలు
పూర్తిపేరు: మద్దిపాటి కృష్ణారావుఇతరపేర్లు:
సొంత ఊరు: ప. గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం: డెట్రాయిట్
వృత్తి:
ఇష్టమైన రచయితలు: చక్కగా రాసేవారందరూ.
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: పుట్టింది పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా రామన్న గూడెంలో. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కెమిస్ట్రీలో డాక్టరేట్. ప్రస్తుతం డెట్రాయిట్ లోని వేన్ స్టేట్ యూనివర్సిటీలో రిసర్చ్ ప్రొఫెసర్. తెలుగు సాహిత్య, సంగీత, నాటకాది కళలంటే ఎంతో అభిమానం. డిటిఎల్‌సి అని అందరూ పిలుచుకునే డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడిగా సాహిత్యకార్యక్రమాలలో చురుకుగా పని చేస్తున్నారు.
మద్దిపాటి కృష్ణారావు రచనలు
రాబోయే 20 వ తానా సమావేశాలలో (జులై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది. స్త్రీ పాత్రల స్వభావాలలో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలోను, దృశ్య మాధ్యమాలలోను ఎలా ప్రకటితమయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈవేదిక నిర్వహణ ప్రధానోద్దేశం.
ఇక్కడ అసమర్ధతకు, మానసిక ఋగ్మతకు పెద్ద తేడా కనిపించకపోవచ్చు గాని, తెలిసీ, ఎటూ తేల్చుకోలేక వేదన పడే సందిగ్ధ స్థితి అది. సాంప్రదాయపు పొరలను ఛేదించుకుని కాలానికి పరిస్థితులకీ అనుగుణంగా జీవించలేకపోవడం అతని అసమర్ధత.
గత సంవత్సరం సెప్టెంబరులో మా డిట్రాయిట్ లిటరరీ క్లబ్ పది సంవత్సరాల పండుగ సమావేశాలకొచ్చిన సాహితీ మిత్రులందరికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ సెప్టెంబరులో మళ్ళీ రమ్మని ఆహ్వానిస్తున్నాం.