రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

“ఈమాట” సంకలనం,ఈ నేలా .. ఆ గాలీ ..

రచన: కె. వి. ఎస్. రామారావు

ఈ నేలా .. ఆ గాలీ ..

“ఈమాట” వెబ్‌ పత్రిక నుంచి
ఎంచి కూర్చిన రచనల సంకలనం

సంకలన కర్త
కె. వి. ఎస్‌. రామారావు

“ఈమాట” ప్రచురణలు
ఆస్టిన్‌, టెక్సస్‌, యు. ఎస్‌. ఏ.

“ఈమాట” ప్రచురణలు
ఆస్టిన్‌, టెక్సస్‌, యు. ఎస్‌. ఏ.

కాపీరైట్‌ “ఈమాట” ప్రచురణలది

ముఖచిత్రం
పద్మశ్రీ యస్‌. వి. రామారావు

ప్రతులకు :
“ఈమాట”
6500 ARCHARD HILL DR.
AUSTIN, TX 78739, U.S.A.

జులై, 2002

“ఈమాట” మాటేమిటంటే ..

1998 వేసవి. ఇంటర్నెట్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విజంభిస్తోంది. దూరాల్ని దూరం చేస్తోంది. వార్తాపత్రికల నుంచి వ్యక్తిగత ఫోటోల దాకా, కొత్త సినిమా పాటల నుంచి శతాబ్దాలనాటి రాతకోతల దాకా వెబ్‌ మీద నివాసం ఏర్పరచుకొంటోన్నాయి.

ఈ సంధికాలంలో ఆస్టిన్‌, టెక్సస్‌ లో సాహిత్యాభిరుచి ఉన్న వాళ్ళం కొందరం కొంత తరచుగా కలుసుకుని సాహిత్యవిషయాల్ని చర్చించుకోవటం జరుగుతుండేది. ఆసందర్భాల్లో రచనలు చెయ్యటం, వాటిని ప్రచురించటం గురించిన ఆలోచనలు కూడా సాగేవి. ఒకవంక అమెరికా నివాసం వల్ల కలిగిన, కలుగుతోన్న అనుభూతుల్ని, అనుభవాల్ని రచనల్లో ప్రతిబింబించాలనే అభిలాష. మరోవంక అలాటి రచనల్ని ప్రచురించే పత్రికలు గాని మరో ఉదాత్తమైన మార్గాలు కాని కనిపించని నిరాశ.
అప్పటికే అమెరికా రచయితలు కొందరు తమ రచనల్ని ఇండియా పత్రికల్లో ప్రచురిస్తోన్నా, వాటిలో ఎక్కువభాగం ఇండియాలోని అనుభవాలు, జ్ఞాపకాలు, సమస్యల గురించే అయ్యేవి. ఎక్కడన్నా ఇక్కడి జీవితానుభవాలకి సంబంధించిన రచనలు ఉన్నా అవి చాలావరకు ఇండియాలో ఉన్న వారికి అమెరికన్‌ సమాజాన్ని పైపైన, బులబులాగ్గా, చాలా తేలికపాటు (సింప్లిస్టిక్‌) గా, ఏవిధంగా ఉంటే ఇండియాలోని వాళ్ళకు నచ్చుతాయో అలా చూపిస్తూ ఉండేవి. తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్‌ డైలాగ్‌ చెప్పి దానికి వెంటనే తెలుగు అనువాదం చెప్పినట్టు రచనల్లో కూడ పొరపాటున అమెరికా జీవితానికి సంబంధించిన విషయం ఏదన్నా అన్నా వెంటనే దాన్ని చాలాసార్లు గుడ్డివాళ్ళు ఏనుగుని వర్ణించే విధంగా వివరించటం జరుగుతుండేది.

ఇదంతా చూస్తోంటే విదేశాల్లో ఉంటున్న తెలుగు రచయిత్రు(త)లు తమ హదయాల్ని ఆవిష్కరించగలిగే రచనలు చెయ్యాలంటే వేరే మార్గాలు కావాలని స్పష్టంగా తేలిపోయింది మాకు.

ఈ నేపథ్యంలో మేమే ఒక పత్రికను ప్రారంభిస్తే ఎలా వుంటుందనే ఆలోచన రూపుదిద్దుకోసాగింది. ఆ సందర్భంలో రెండు అంశాలు స్పష్టంగా తేలాయి.
మొదటిది ఈపత్రిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి, ముఖ్యంగా విదేశాంధ్రులకి అందుబాటులో ఉండాలనేది. రెండోది అది ముద్రితపత్రిక కాకూడదు అనేది. దీనికి ఒక కారణం ముద్రిత పత్రికను నడిపే సమయం గాని, అనుభవం గాని మాలో ఎవరికీ లేకపోవటం ఐతే రెండోది అలాటి పత్రికని విదేశాంధ్రులకి అందుబాటులోకి తేవటం జరిగేపని కాదనేది.

ఈ అంశాల దృష్య్టా అది ఇంటర్నెట్‌ పత్రిక కావటం ఒకటే మార్గమని అర్థమైపోయింది.
నలుగురం కలిసి ఈపనికి నడుం కట్టాం నేను, విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్‌, కొలిచాల సురేశ్‌.
తెలుగు కంప్యూటరీకరణ మీద విశేషకృషి చేసిన చోడవరపు ప్రసాద్‌ మా ప్రయత్నానికి సహకారం అందించారు. “తెలుసా” చాట్‌ గ్రూప్‌కి తమ సర్వర్‌ మీద ఆతిథ్యం ఇచ్చిన జువ్వాడి రమణ ఈ పత్రికను కూడ అక్కడే ఉంచటానికి అంగీకరించారు. ఇలా “ఈమాట” రాకకి రంగం సిద్ధమయింది.
అమెరికా తెలుగు సాహితీలోకంలో ప్రముఖులకు మా ఆలోచనని తెలియపరిచి సలహాలు, సహాయం అడిగాం. వారు అమెరికాలో తెలుగు పత్రికను నడపటంలో ఉన్న కష్టనష్టాల్ని తమ అనుభవాల్నుంచి వివరించి హెచ్చరించారు.

అలా, 1998 విజయదశమికి వెలువడింది “ఈమాట” తొలిసంచిక. రెండులక్ష్యాలు ఈపత్రిక గమనానికి దారిచూపాయి, చూపుతున్నాయి విదేశాల్లో ఉంటున్న తెలుగువారి అనుభవాల్ని, అనుభూతుల్ని స్పష్టంగా, మొహమాటాలు లేకుండా, అలాటి అనుభవాలే ఉన్న ఇతరుల్తో పంచుకునే అవకాశం కలిగించటం; రాజకీయాలకీ, వ్యాపారధోరణికీ దూరంగా ఉండటం. ఈమూడున్నర ఏళ్ళ కాలంలో జరిగిన సంఘటనల్ని చూస్తోంటే అప్పటి మానిర్ణయం సరైనదన్న నమ్మకం ఇంకా బలపడుతోందిప్పుడు.

ఇప్పటికి వెలువడిన పద్దెనిమిది సంచికలలోను కథలు, కవితలతో పాటు “ఈమాట” ఎన్నో సాహిత్యవ్యాసాలు, వ్యాసాలు ప్రచురించింది. “సంప్రదాయ కథాలహరి” శీర్షికన ప్రభావతీప్రద్యుమ్నం, ఆముక్తమాల్యద, కళాపూర్ణోదయం వంటి తెలుగు గ్రంథాల్ని, స్వప్నవాసవదత్తం వంటి సంస్కృతనాటకాల్ని తేలికైన సమకాలీన వాడుక తెలుగులో అందించింది.

ఇంతేకాకుండా భాగవతంలోని కొన్నిపద్యాలు ఒక విఖ్యాత సంగీతజ్ఞుడు పాడగా వాటిని కూడ “ఈమాట” పాఠకశ్రోతలకు అందించింది. (ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఎవరైనా http://www.eemaata.com వద్ద ఇప్పటి వరకు వెలువడ్డ “ఈమాట” రచనలన్నిటినీ చదవొచ్చు, వినొచ్చు.)

ఇక, ఈసంకలనం విషయానికి వస్తే ..

ఇప్పటివరకు “ఈమాట”లో వచ్చిన రెండువందల పైచిలుకు రచనల నుంచి ఎంచి కూర్పించినవి ఇవి. ఈ ఎన్నికలో వెదికింది రచన విశిష్టంగా ఉందా లేదా అనే ఒకే ఒక్క గుణం కోసం. స్థలాభావం వల్ల ఎన్నో మంచిరచనల్ని ఇందులో చేర్చటానికి కుదరలేదు. అందుకు చాలా చింతిస్తున్నాం. ఐతే “ఈమాట” పాఠకుల కోసం అవన్నీ వెబ్‌ మీద ఉన్నాయి.

స్వేఛ్ఛగా రాయగలిగినప్పుడు ఆంధ్రుల వాణి, బాణి కూడ ప్రత్యేకంగా వినిపిస్తాయని “ఈమాట” నిరూపించింది. ఆవిషయం ఈసంకలనంలో ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాగే ఈరచనల వస్తువులో, శైలిలో, శిల్పంలో కొన్ని కొత్తదారులు కనిపిస్తాయి.

నాకు మరీ నచ్చిన ఒక అంశం “ఈమాట” రచయిత్రు(త)లు తాము చెప్పదలుచుకున్న విషయాన్ని ఏమాత్రం తడబాటు, జంకు, మొహమాటం లేకుండా చెప్పటం. ఎవరి ఒప్పుదల కోసమో మెప్పుదల కోసమో కాకుండా వీరు తమకోసం తాము రాస్తున్నారనటానికి ఇది ఒక నిదర్శనం. ఇది “ఈమాట” కోసం జరుగుతున్న కృషికి సార్థకత కలిగిస్తోందని నా నమ్మకం.

మొన్నమొన్నటివరకు అమెరికా తెలుగు కథకులకు కనిపించిన వస్తువులు పిల్లల పెళ్ళిళ్ళు, అక్కడిఇక్కడి విలువల తేడాలు, మారని మగవారి మనస్తత్వాలు,.. ఇలాటివైతే, ఈసంకలనంలో అందుకు చాలా భిన్నమైన విషయాల గురించిన కథలు కనిపించటం మరో విశేషం. ఇది పరిణతి చెందుతున్న పరిశీలనకు, పెరుగుతోన్న భావవైశాల్యానికి తార్కాణంగా భావిస్తాను నేను.

ఈసంకలనం మీలో తెలుగు రచనలు చేయటానికి, (కనీసం “ఈమాట” పత్రికనైనా) చదవటానికి, ఆసక్తి కలిగిస్తుందని ఆశిస్తున్నాం. పత్రిక చిరునామా మరోమారు: www.eemaata.com .

సెలవ్‌
కె.వి.ఎస్‌. రామారావు
(“ఈమాట” ప్రధాన సంపాదకుడు )

విష్ణుభొట్ల లక్ష్మన్న కొంపెల్ల భాస్కర్‌
కొలిచాల సురేశ్‌ ద్వా.నా. శాస్త్రి (ఇండియా)
(“ఈమాట” సంపాదకులు)
— ————————————————————–

కృతజ్ఞతలు

అద్భుతమైన చిత్రకళాఖండాల్ని ఈ సంకలనం కోసం ఇచ్చిన ప్రఖ్యాత చిత్రకారులు పద్మశ్రీ యస్‌. వి. రామారావు గారికి,

లోతైన, చొచ్చుకుపోయే “ముందుచూపు” తోనూ, ఇంకా అనేకవిధాలుగానూ సహాయం చేస్తోన్న వెల్చేరు నారాయణరావు గారికి,

ఈసంకలనం ప్రచురణకు ఉదారంగా ఆర్థికసహాయం అందించిన బోయరెడ్డి సుబ్రమణ్యరెడ్డి గారికి,

ఈ పుస్తకాన్ని చక్కగా ముద్రించి ఇచ్చిన “రచన” శాయి గారికి,

తమ ద్వైవార్షిక కార్యక్రమాల సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేస్తోన్న “ఆటా” సంస్థకి,

“ఈమాట” పత్రిక ప్రాచుర్యానికి కారకులైన రచయిత్రులు, రచయితలకి,

“ఈమాట”కు సాంకేతిక సహకారం అందించిన చోడవరపు ప్రసాద్‌, జువ్వాడి రమణ, కన్నెగంటి రామారావు గార్లకి.

——————————————–

ఇదీ దారి
ముందు చూపు

వెల్చేరు నారాయణరావు

16
తరవాణికేంద్రం

సావిత్రి మాచిరాజు

33
గతచిత్రం

విన్నకోట రవిశంకర్‌

56
మా అమ్మగదే !

చంద్ర కన్నెగంటి

58
రోజూ చూస్తున్న దృశ్యమే

నందివాడ ఉదయ్‌ భాస్కర్‌

69
చాసో కథ

వెల్చేరు నారాయణరావు

71
పశ్చింగోదార్జిల్లా తణుకుతాలూకా

కనకప్రసాద్‌

84
మంచులో తడిసిన ఉదయం

వైదేహీ శశిధర్‌

92
పందెం ఎలకలు

కె. వి. ఎస్‌. రామారావు

94
చెట్లు

తమ్మినేని యదుకుల భూషణ్‌

103
వాల్మీకి వాకిట్లో కాళిదాసు

భాస్కర్‌ కొంపెల్ల

105
అనగనగా ఒక జైలు

వెన్నెలకంటి వసంతసేన

116
ఊరుకోలేక…

చంద్ర కన్నెగంటి

133
సంస్కృతి శిధిలాలు

సావిత్రి మాచిరాజు

135
కవిత్వీకరణ కొన్ని సంగతులు 2వ భాగం

విన్నకోట రవిశంకర్‌

137
సంకల్పం

కలశపూడి శ్రీనివాసరావు

154
ప్రకృతి

టి. శ్రీవల్లీ రాధిక

170
్లకబ్బులో చెట్టు

వేలూరి వేంకటేశ్వరరావు

174
ఒంటరితనం

విన్నకోట రవిశంకర్‌

182
మా లిఖ

వెల్చేరు నారాయణరావు

183
ప్రతీకారం

కె. వి. ఎస్‌. రామారావు

189
మృత్యువుతో తొలిపరిచయం

చంద్ర కన్నెగంటి

210
బర్సాత్‌ మే బిల్లీ

కనకప్రసాద్‌

211
గింగిర్లు తిరుగుతున్న పాట

నందివాడ ఉదయ్‌ భాస్కర్‌

217
డాట్‌కామ్‌ మాయోపశమనవ్రతం

అక్కిరాజు భట్టిప్రోలు

219
శ్మశానవాటి

కె. వి. ఎస్‌. రామారావు

225
సాక్షి

సయ్యెద్‌ ఎస్‌. నారాయణస్వామి

227
కంచిలో తామరలు

తమ్మినేని యదుకుల భూషణ్‌

235
లెఖ్ఖల పరీక్ష

శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా

237
రచయిత్రు(త)ల గురించి

243

రచయిత్రు(త)ల గురించి

సావిత్రి మాచిరాజు జననం ఏలూరులో. తొమ్మిదేళ్ళ వయసు నుంచి అమెరికా, కెనడాలలోనే ఉన్నారు. నివాసం కేలిఫోర్నియాలో. వాతావరణకాలుష్య రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు, నాటకాలు, ఓ నవల రాసారు.

నందివాడ ఉదయ్‌ భాస్కర్‌ నివాసం ప్లేనో, టెక్సస్‌లో. ఐదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. “అక్షరం సార్థకమవుతుంది” అనే కవితాసంకలనాన్ని ప్రచురించారు. చాలా కవితలు వివిధ పత్రికల్లో వచ్చాయి.

వైదేహీ శశిధర్‌ జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. మెడికల్‌ స్కూల్‌లో రెసిడెన్సీ చేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు.

భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసం ఆస్టిన్‌, టెక్సస్‌లో. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు.

కలశపూడి శ్రీనివాసరావు జననం బొబ్బిలిలో. నివాసం న్యూ హైడ్‌ పార్క్‌, న్యూయార్క్‌లో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు, నవలలు రాసారు.

వెన్నెలకంటి వసంతసేన వీరి వివరాలు తెలియవు.

వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌ లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు. పాతికేళ్ళపైగా అక్కడే ఉన్నారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాసారు.

కె.వి.ఎస్‌. రామారావు జననం ప్రకాశం జిల్లా వలపర్ల లో. నివాసం ఆస్టిన్‌, టెక్సస్‌లో. ఇరవై ఏళ్ళుగా కెనడా, అమెరికాలలో ఉన్నారు. టెలెకమ్యూనికేషన్స్‌ రంగంలో పనిచేస్తున్నారు. పద్య, వచన కవితలు, కథలు, నాటికలు రాసారు.

వేలూరి వేంకటేశ్వరరావు నివాసం డేరియన్‌, ఇల్లినాయ్‌లో. చాలా కాలం నుంచి అమెరికాలో ఉంటున్నారు. ఆర్గోన్‌ నేషనల్‌ లేబొరేటరీలో పనిచేస్తున్నారు. అనేక కథలు, వ్యాసాలు రాసారు.

శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం స్మైర్నో, జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు.

అక్కిరాజు భట్టిప్రోలు జననం, బాల్యం ఖమ్మం జిల్లాలో. నివాసం కేలిఫోర్నియా బే ఏరియాలో. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. “రేవుచూడని నావ” అనే కవితాసంకలనం ప్రచురించారు. నలభైకి పైగా కథలు కూడా.

కనకప్రసాద్‌ జననం విజయనగరంలో. నివాసం కొలరడో, వాషింగ్‌టన్‌ లో. పెట్రోలియం ఇంజనీరింగ్‌ రంగంలో పనిచేస్తున్నారు. చాలా కథలు, కవితలు రాసారు.

విన్నకోట రవిశంకర్‌ పుట్టింది అమలాపురంలో, పెరిగింది పిఠాపురం, కాకినాడల్లో. నివాసం కొలంబియా, సౌత్‌ కేరొలైనా. మూడున్నర యేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. “కుండీలో మర్రిచెట్టు” అనే కవితాసంకలనం ప్రచురించారు. వ్యాసాలు, విమర్శలు కూడా రాసారు.

చంద్ర కన్నెగంటి జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. పదమూడేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి.

తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మే 2001
  • నవంబర్ 2003
  • శాంతి
  • జులై 2003
  • జాతకం

ఇటువంటివే…

  1. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం
  2. “ఈమాట” మాటేమిటంటే ..
  3. పదేళ్ళ “ఈమాట” మాట
  4. ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం!
  5. నవంబర్ 2001

సంచికలో ...

  • రుబాయీలు
  • చెట్లు
  • కత్తి పడవలు
  • కవిత్వీకరణ కొన్ని సంగతులు
  • విన్నపం
  • శిశిర గీతం
  • స్వప్నవాసవదత్తం
  • ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక
  • మన పేర్లు, ఇంటి పేర్లు
  • మీ ఘంటసాల
  • సంకల్పం
  • స్పర్శ
  • ఒక్కడినై..
  • కవి హృదయం
  • కోరిక
  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3
  • నిశ్చయం
  • మన దీపావళి కథ
  • సశేషమ్‌
  • 1998
  • 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
  • e తరమ్‌ (నాటిక )
  • అతిథి
  • అదే నేను
  • అనాచరణ
  • అనురాగ దగ్ధ సమాధి
  • ఆకలి నిజాయితీ
  • ఆవాహన
  • ఆశాగ్ని రేణువు
  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల
  • ఉక్కు శిశువు
  • ఉన్మాద ప్రకృతి
  • ఊరెడుతున్నాను
  • ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  • ఓటమిలోని గెలుపు
  • కలిశాం
  • గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం
  • చెప్పులు
  • జననం
  • జన్మదిన రాహిత్యం
  • జీవన తీరాలు
  • జ్ఞాపకాల వాసన
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • టైటానిక్‌
  • డబ్బు పంజరం
  • తుపాకి కాల్పులు
  • త్రిశంకు లోకం
  • దేవుడూ
  • దేహాత్మ
  • నటించగల ప్రాణి
  • నిద్రపోతు జాతి
  • నిర్విరామం
  • నివాసం
  • పసిఁడిపల్లకి
  • పాపం ఈ లోకం
  • బహు ‘మతులు’
  • బహుశా ఇంకో నిజం
  • బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
  • భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

భూషణీయం
“ఈమాట” మాటేమిటంటే ..

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.