ఎంత హాయిగా సాగిందో, ఈ మీ రెండో installment! అయితే, మీరు తమసానదీతీరానున్న వాల్మీకీ ఆశ్రమం దగ్గర క్రౌంచమిథునంలోని మగపక్షిని కూల్చిన నిషాదుని కథా, మా నిషాద శ్లోకం తరువాత ఈ కింది వాక్యం ఎలా పొసుగుతుంది?
సీత బిట్టేడ్చి శోషిల్లినది ఆ నదీతీరాన కాదు కదండీ (మీరు ఈ యెడన్, ఇచటనే అన్నారు), ఎక్కడో దండకారణ్యం, పంచవటి దగ్గర. అది వనప్రాంతం. నేనన్నదానిలో పొరపాటుంటే సరిచేయగలరు. మీ పద్యగద్యాలు కరుణరసపూరితాలు, I enjoyed reading them!
అద్వైతాన్ని విమర్శించడానికి శంకరచార్యుణ్ణి అది ఇది అనేసి అద్వైతం చెప్పేదాన్ని దాటవేశారు. శంకరుడు అనే వ్యక్తి ఉన్నాడో లేడో తెలీదు, ఆ పెరు మీద అనేక బ్రాహ్మణ సిద్ధాంతకారులు ఏవేవో రాసి ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగత శంకరుడు ఇది చేశాడు, ఇలా బౌద్ధులని నాశనం చేసాడు అనేవి అనవసరమైనవి. ఒకవేళ నాశనం చేసి ఉంటే ఆ విధంగా వ్యక్తిగత విమర్శ చేయవచ్చు, ఏమో. కానీ శంకరుడి పేరు మీద ఆ సిద్ధాంతాన్ని మాత్రం తక్కువ చేయలేం…. అలాగే పోలిస్తే బుద్ధుడి కథల్లో కూడా బుద్ధుడు తన బౌద్ధం గొప్పదని నిరూపించడానికి శ్రావణ మతస్థులని ఓడించి ఆత్మహత్య చేసుకునేలా చేశాడని బౌద్ధ టెక్ష్ట్స్ చెబుతాయి, అవి ఎవరో బౌద్ధం గొప్పది అనడానికి బుద్ధుడి మీద కల్పించిన కథ కావచ్చు… అంత మాత్రనా బౌద్దాన్ని కొట్టిపారేయ్యలేం.
నాకు – చదువు, రీసెర్చ్ మూలంగా తెల్సిన మరి కొన్ని విషయాలు .
రకరకాల తిమింగలాలు ఒక రకమైన ధ్వనితో మాట్లాడుకుంటాయని అంటారు. ఆ భాష ఇప్పటికీ ఎలాంటిదో చెప్పలేకపోతున్నారు అని డేవిడ్ అటేన్ బరో గారు ఉవాచ. వాటిని విపరీతంగా వేటాడేసి సర్వనాశనం చేయబోయారు. ఇప్పటికి అవి రక్షిత జంతువులు కనక బతుకుతున్నాయి. కొంతమంది వాటిని చూడ్డానికి వచ్చినప్పుడు, వాటికి హానిచేయరని తెల్సినప్పుడూ స్నేహంగా కొన్ని శబ్దాలు చేస్తాయిట. వాటికి పిల్లలు పుట్టినప్పుడు ఈ పరిశోధకులకి చూపించి దాన్ని ముట్టుకోవడానిక్కూడా అనుమతిస్తాయిట కొన్ని శబ్దాలతో. అదో వింత ప్రపంచం. ఆ పరిశోధకుల్లో ఒకాయన ‘తిమింగలం ఆ శబ్దం తో నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది నేను అర్ధం చేసుకోలేకపోతున్నాను’ అని కన్నీళ్ళు పెట్టుకోవడం నేను టివిలో చూసాను.
విశ్వంలో పైకి వెళ్ళేకొద్దీ పాలపుంతలూ, అవన్నీ తిరిగేటప్పుడు వచ్చే శబ్దమే ఓంకారం అని అంటారు. అది యోగులకి ధ్యానం లో వినిపిస్తుంది అంటారు. కొంతమంది అక్కడ గాయత్రి మంత్రం వినిపిస్తుంది అంటారు. నేను యోగినీ భోగినీ కాదు కానీ రోగినీ, ఢాకినీ లాంటి వాణ్ణి కనక తెలియదు :-). శ్రీ రామకృష్ణులవంటి యోగులు ధ్యానంలో పైకి వెళ్ళే కొద్దీ అనేకరకాల శబ్దాలు వినిపిస్తాయనీ అవి దాటితే ఆష్ట అణిమాసిద్ధులూ కలుగుతాయనీ కానీ అవన్నీ విడవకపోతే అధోగతి తప్పదనీ అనేకసార్లు చెప్పడం చూడవచ్చు (Ref. Gospel of Sri Ramakrishna, R.K.Math, Belur). ఈ శబ్దాలు మామూలు చెవులకి వినపడేవి కావుట. ఒకానొకపుడు నేను ఇండియాలో రాజయోగం కోసం చేరినప్పుడు ప్రతీ క్లాసులో అందరితోనూ ఒకేసారి గుంపుగా మొదటగా మూడుసార్లు ఓంకారం జపింపచేసేవారు (ఓ……ం అంటూ) ఆ శబ్దం విని ప్రకంపనలు అనుభవిస్తే కానీ అదెలా ఉంటుందో చెప్పలేం. ఒకే ఒక ముక్క – అత్యద్భుతం. భ్రమరీ ప్రాణాయామం అనేది మరొకటి ఇటువంటిదే.
ఇక మంత్రోఛ్ఛాటన విషయం. స్వరం ప్రకారం చదవాలి అంటారు. ఉదా: నమకం. నమస్సోమాచ రుద్రాయచ….. నమశ్శివాయచ, శివతరాయచ … అనేది సస్వరంగా చదువుతూ ఉంటే చదివేవారికీ వినేవారికి తెలుస్తుంది అది కలగచేసే ప్రకంపనలు. అలాగే నమకం మొదట్లో వచ్చే గుక్క తిప్పుకోకుండా చదివే, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ… అనేది కూడా. స్వామి దేవరూపానందగారి పుస్తకం పేరే “సస్వర వేదమంత్ర.” ఇటువంటిదే మంత్రపుష్పం కూడా. అది ఇక్కడ కొద్దిగా చదవచ్చు అర్ధంతో సహా – https://eemaata.com/em/issues/201605/8557.html. శ్రీశైలంలో భ్రమరాంబికాలయం గోడకి చెవి ఆనిస్తే ఝూంకారం వినపడేది ఒకప్పుడు అంటారు. అందుకే అమ్మవారికి ఆ పేరు అని మరో శబ్దం కధ. దేవుడే లేడు ఈ మంత్రం ఏమిటి అనేవారికి శిరస్సు వంచి నమస్కారం.
వినికిడి లోపం కలవారికి హియరింగ్ ఎయిడ్ పెట్టేస్తే వినపడిపోతుంది అనే ఆపోహ ఉంది. ఈ ఎయిడ్ వల్ల వచ్చే నష్టం వారికి తెలియక అలా ఉచిత సలహా పారేస్తూ ఉంటారు. ఎయిడ్ మొదట్లో కొంత పనిచేసినా దాని వల్ల వచ్చే అతి శబ్దంతో కర్ణభేరి పాడై ఉత్తరోత్తరా పూర్తిగా వినికిడి పోతుంది. అలా పోతూ ఉంటే ఆంప్లిఫికేషన్ పెంచుకుంటూ డెసిబిల్స్ పెంచేసి వినికిడిని మరింత తగలేస్తూ ఉంటారు. అలా తనకి జరిగినప్పుడు ఒకాయన అన్నమాట “They purposefully destroyed my hearing increasing the amplification రెగులర్ల్య్ and I did not know until it was too late.” అలాగే కాక్లియార్ ఇంప్లాంట్ కూడా. కొంతమందికి దానివల్ల వాంతులూ తల తిరగడం వస్తాయి. డాక్టర్లు అవి పనిచేస్తే – ఇదిగో ఇలా అద్భుతంగా పనిచేసింది అని ఒక పేపర్ రాసుకుని చంకలు గుద్దుకుంటారు. రెండేళ్లకి అది పనిచేయక వాంతులూ, బేలన్స్ అదీ పోతే రోగి ఏమైనా డాక్టర్లకి పట్టదు, నా పని నేను చేసాను అంటారు. అందువల్ల ఇది అన్ని సర్జరీల లాగే కష్టనష్టాలు చూసుకుని ఎవరికిష్టమైతే వారు ఎంచుకోవాలి. ఒకరికి పనిచేసినది రెండోవారికి పనిచేయదు. కాక్లియార్ ఇంప్లాంట్ అనేది మొదటి మెట్టు మాత్రమే. ఆ సర్జరీ తర్వాత వచ్చే ఏడుపులకి డాక్టర్లు ఏమీ చేయ[లే]రు. కొంతమందికి జీవితాంతం ఏదో ఒక తెరపీ, మందులూ, మరోసరీ మరోసారి సర్జరీలు వగైరా అవసరం కావొచ్చు దానివల్ల. దీనిమీద ఒక సినిమా వచ్చింది ఈ మధ్యనే – Sound of Metal అనే పేరుతో.
రచయిత చెప్పిన ఆ ట్యూన్ ఏమిటో కనిపెట్టు అనేది ప్రస్తుతం కూడా టివిలో వస్తోంది వారానికోసారో అప్పుడప్పుడో. బాపు రమణలకి రంగారావుగారు అనే రికార్డులు పోగుచేసే స్నేహితుడు ఉన్నట్టు విన్నాను. అటువంటివారికి తప్ప ఈ ప్రోగ్రాం చాలా కష్టం అనుకుంటా. ఎంతో సాధన చేయాలి అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి. సినిమా పాటలు తప్ప మరింకేమీరాని నాలాటి వారికి కష్టాతి కష్టం.
మరో విషయం ముగించే ముందు. ప్రాణం పోయే స్థితిలో ఆఖరిగా చచ్చిపోయేది వినికిడి శక్తి అని నిర్ధారించారు, శాస్త్రీయంగా కూడా. అందుకే పోయేవారి చెవిలో రామనామం చెప్పే ఆచారం ఉంది. దీనికి మన కృష్ణుడే ఆధారం “అంతకాలేచ మామేవ స్మరణ్ముక్తా కళేబరం..” (భగవద్గీత 8.5) అంటూ. అంతవరకూ ఎందుగ్గానీ, ఆయన అక్షరాణాం అకారోస్మి … అంటూ, అహమాదిశ్చ మధ్యంచ భూతానమంత ఏవచ అంటూ మొత్తం నేను తప్ప ఇంకేమీ లేదని చెప్పాడుగా? 🙂 స్వస్తి.
మాధవ్ గారి సంపాదకత్వంలో ఈమాటని చదవడం, ఈమాటకి రాయడం రెండూ కూడా చాలా తృప్తినిచ్చిన విషయాలు నాకు. సంపాదకుడిగా వారి ఈ బ్రేక్ నా మనసుకి ఏమాత్రం నచ్చని విషయమే అయినా – ఈ విరామంలో మాధవ్ గారి నుండి “కాల్వీనో కథల నుంచి” లాంటి చక్కని కథలు, మరిన్ని అనువాదాలు వస్తాయన్న ఆశ కూడా ఓ పక్కన వుంది.
మే 2025 గురించి మద్దిపాటి కృష్ణారావు గారి అభిప్రాయం:
05/01/2025 6:46 pm
ఎలాగూ పని చేస్తున్నాడుగదా అని నాలాంటి వాళ్ళం గట్టు మీద నుంచుని చూశాం (అంటే తను చేసిన స్థాయిలో ఏదో చెయ్యగలమని కాదు, ఉడతాభక్తిగానైనా సహాయం చెయ్యలేకపోయామని). ఇప్పుడిక ఆ బరువు మొయ్యలేనంటే కాస్త అపరాధ భావనతో కూడిన బాధ. ఐనా ఏటెల్ల కాలం కంచి గరుడసేవ చెయ్యమనడం భావ్యం కాదుగా! నువ్వు పెట్టిన వరవడిని కొనసాగించే బృందాన్ని తయారు చేసే ఉంటావనే నా నమ్మకం. ధన్యవాదాలు మాధవ్!
బల్లోజు బాబా గారు, సరిగ్గా చెప్పారు. బౌద్దుల గురించి ఈయన చెప్పిన విషయాలన్ని అవాస్తవాలే! బౌద్దం ఒకే బౌద్దంగా లేదు. అన్ని మతాల లాగే హీన యాన మహా యాన అని ముక్కలు ముక్కలుగా చీలిపోయి వుంటే ఏ బౌద్దం గురించి మాట్లాడుతున్నారో స్పష్టత లేదు. మాట్లాడితే వలసవాదం నుండి నేర్చుకున్నారు అంటారు. వలస వాదం అనేది ఏ వలస వాదం? బ్రిటీష్ బలస వాదమా లేక మహామ్మదీయుల వలస వాదమా? భారత దేశానికి అనేక మంది ( జాతులు అంటారు. జాతులు అనడం ఆధునిక లక్షణం కాదు) వలస వచ్చారు. ఆర్యులు వలసవాదులే! మరి ఇప్పుడు ఈ ఆర్యుల వలస వాదుల భావజాలం వేళ్లూనుకొని పోయి దేశాన్ని శాసిస్తుంది! మరి దీన్ని కూడా వలస వాదంగా పేర్కొన గదా? ఇంకొకటి స్వతంత్ర భావాలు అంటున్నారు. ఏ వి స్వతంత్ర భావాలు? సమాజం లో ఉన్న వ్యక్తులు ఆ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసే భావాలు ఏర్పరుచు కుంటారు. ఒక స్థాయి పెరిగిన తర్వాత స్వంతంగా ఆలోచిస్తారు. పునాది లేకుండా ఎవరూ స్వతంత్రంగా ఉండరు. ఉండలేరు. మానవ శాస్త్రం ప్రకారం మానవజాతి అంతా ఒక పునాది నుండి వచ్చిందే! వివిధ ప్రాంతాలకు ఆహారాన్ని వెతుకుంటు వలస పోయి వేరు పడిపోయారు. అందు వల్ల మానవ తాత్వికత , విజ్ఞానం కలగూర గంపలాగే ఉంటుంది గాని, స్వచ్చందంగా ఉండదు. అంతెందుకు శర్మ గారి వ్యాసం విస్తృతం అనిపించే విరుద్ధ భావాలను కలగా పులగం. అసలు ఈయన తాత్విక చింతన ఏమిటి? ఇది వలస వాదులైన ఆర్యుల భావజాలమే? ఒక పక్క దేవున్ని తలకెత్తుకొని ఇంకొక పక్క కుమారీలుడు దైవత్వాన్ని ఖండించాడు. నాస్తికుడనిపించుకున్నాడు, అందరిని గుర్తించిన రోమిలా తాపర్ కుమారీలున్ని గుర్తించలేదని వాపోతున్నారు. గుర్తించక పోతే ఈయన. కేమిటి నష్టం? ఎంతైనా ఆస్తికుడు కదా! ఆస్తికుడికి నాస్తుకుడి మీద ఎందుకు ప్రేమా? ఎందుకంటే వలస వాద భావజాలం కాబట్టి?
కమ్యునిస్టులు, దలిత వాదులు, సోషలిస్టులు అందరు వలస వాద ప్రభావం ఉన్న వారు అంటారు. చార్వాకులను గుర్తించిన వాడు ఇలా అంటారా? బౌద్దం, చార్వాకం.. లాంటి హేతువాదులు నాస్తికులు ఈ దేశంలో లేరా? వారిని ఎంత మరుగు పరిచినా కనిపించకుండా పోతారా? ఈ యన ఏదో ఆదునికుడు అనిపించుకోడానికి పరస్పర విరుద్దమైన భౌతిక వాదాన్ని భావ వాదాన్ని ఒకటి చేసి మాట్లాడతారు! ఏదో ముసుగు ధరించడానికి ప్రయత్నం చేస్తారు. అయినంత మాత్రానా ఎవరో స్పష్టం కాదా? కుమారీలుడు జగం సత్యం అన్నంత మాత్రనా ఆయన ఆలోచనలు బౌతికవాదం మీద ఆదారి పడి ఉన్నాయా? వేదాలను వ్యతిరేకించిన వారినందరిని అప్పుడు నాస్తికులు అన్నారు. నాస్తికులు అన్న మాటకు వాస్తవార్దం ‘వ్యతిరేకులు’ అట.అలా దేవుని వ్యతిరేకించిన వారికందరికి ఆపాదించారు.
Yes I read snehalathareddy, cherabandaraju and others jail episodes, sanjay gandhi sterilization programmes. They are not lone voices. But emergency has other reasons and other motives behind.
My perspective may be misty and selective, but I believe this narrative is the need of hour to understand the hindutva politics.
since I cannot post my article on this topic here….. I post the link for it. you may please gothrough andi.
హేతు చింతనను ఆధునికతకు పర్యాయంగా భావించినప్పటికీ, భారతీయ హేతు చింతన గురించి కమ్యూనిస్టులు, దళితవాదులు, హిందువాదులు వలసవాద ప్రభావంతో తప్పుగా అర్థం చేసుకున్నారని ఈ వ్యాసం వాదిస్తుంది. భారతీయ దృక్పథంలో చక్రీయ కాల భావన ప్రధానమని, శంకరాచార్యులు, బౌద్ధులు స్థల-కాలాలు మనోనిర్మితమని చెప్పారు, ఇది క్వాంటం ఫిజిక్స్‌తో సమానంగా ఉంది. వలసవాద ప్రభావంతో భారతీయ తాత్విక చింతనను మేధావులు, రోమిలా థాపర్ తో సహా తక్కువగా చూసారని అభియోగం మోపుతుంది.
భారతీయులు సుదూర గతంలో గొప్ప హేతుబుద్ధి కలిగి ఉండేవారు, దాన్ని క్రమేపీ కోల్పోయారు….ఈ వ్యాసం మొత్తం మీద ఇదొక్కటే సత్యపూర్వక వాక్యం.
సుదూరగతంలో చార్వాకులు బౌద్ధం రూపంలో గొప్ప హేతుబుద్ది కలిగి ఉండేవారు. క్రమేపీ ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, మోక్షం, స్వర్గనరకాలు, పాపపుణ్యాలు లాంటి అభౌతిక అంశాలను- పండితులు తమ అధిపత్యానికి, ఉదరపోషణకు – మతలక్షణాలుగా స్థిరీకరించి జనబాహుళ్యాన్ని నమ్మించారు.
1. చార్వాకులు ఇలా అన్నారని ఆధారాలేమిటి?
జీవసృష్టిలో చైతన్యం (Consciousness) కూడా ఇలాంటి భౌతిక మూలకాల (భూమి, నీరు, అగ్ని, వాయువు) సంయోగం వల్ల ఉద్భవిస్తుంది. తాంబూలం యొక్క ఎరుపు రంగు లేదా రుచి ఎలా ఒక స్వతంత్ర శక్తి లేకుండా సహజంగా ఏర్పడుతుందో, అదేవిధంగా చైతన్యం కూడా శరీరంలోని భౌతిక అవయవాల సంక్లిష్ట సంయోగం ఫలితంగా ఉత్పన్నమవుతుంది.
ఆత్మ, చైతన్యం లాంటివాటిని చార్వాకులు ఖండించారు. ఇవన్నీ ఆ తరువాత పండితులు చేసిన చార్వాక వ్యాఖ్యానాలలోని వక్రీకరణలు. పై వాక్యాలను చార్వాకులవని నిరూపించే ఆధారాలు చూపండి. ఉదాహరణకు; యావజ్జీవేత్సుఖం జీవేదృణం కృత్వా ఘృతం పిబేత్ । భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః లాంటి చార్వాక వాక్యాలను చూపండి. ఎవరెవరో ఆ తరువాత చేసిన పండిత వ్యాఖ్యానాలు చూపొద్దు. ముఖ్యంగా తాంబూల దృష్టాంతం.
2. భారతీయ తత్వశాస్త్రం కాలం సైక్లికల్ అని చెబుతుంది. కానీ దానికి సంబంధించిన ఆధారాలను చూపదు. ఉదా. ఇది కలికాలం అనుకొంటే అంతకు ముందు జరిగిన కలికాలాన్ని ఉదాహరణగా చూపి వాదించాలి. అలా చెయ్యదు కనుక అది నిరూపణ కాదు. బిగ్ బేంగ్ కూడా ఒక బిందువు నుంచే ప్రారంభమౌతుంది. అయిన్ స్టీన్ రెలటివిటీ కాలాన్ని నాలుగవ డైమెన్శన్ అని లీనియర్ గానే చూపుతుంది. సైక్లికల్ గా కాదు.
కాలం సైక్లికల్ అని చెప్పటం కర్మ సిద్ధాంతంలాగే సంస్కరణను, అభివృద్ధిని నిరోధిస్తుంది. అంతా దైవేచ్ఛ అని ప్రకటించి స్వీయ సంకల్పాన్ని నిరుత్సాహ పరుస్తుంది. కాలం సైక్లిక్ అనే భావన అశాస్త్రీయమైనది. పురాణ కల్పితమైనది. మానవాభివ్రుద్ధికి దోహదపడదు. ఇది పండితులు సమాజంపై చేసిన కుట్ర. దీనిద్వారా వారి ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్నారు.
కాలం చక్రీయమని చెప్పటానికి 60 సంవత్సరాలకు పేర్లు పెట్టి అవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా అని చెప్పటం కురచ వాదన. నేటి కలియుగం అనేది రెండో సారో మూడో సారో ముప్పయ్యోసారో అని చెప్పి ఋజువులు చూపాలి.
3. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలు బౌద్ధమతానికి పూర్వం నుండి ఉన్నాయి. ముఖ్యంగా జైనానికి చెందినవి ఇవి. వైదికంలో కూడా ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకంలో పునర్జన్మ భావన కనిపిస్తుంది.
జైనం కర్మను ఆత్మపై అంటుకునే భౌతిక కణాలుగా వర్ణిస్తుంది.
బౌద్ధం వీటిని అనాత్మావాదం కోణంలోంచి రీడిఫైన్ చేసింది. అంతే తప్ప కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను బౌద్ధం ప్రతిపాదించలేదు. జైన హైందవాలు చెప్పిన అర్థంలో కూడా చెప్పలేదు. వాటిని బౌద్ధానికి ఆపాదించటం ఈ వ్యాసం చేస్తున్న వక్రీకరణ.
కర్మ, పునర్జన్మ వైదికమైనవి. వాటివల్లే నేటి కులవ్యవస్థ ఏర్పడింది. (ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకం– ఈ లోకంలో మంచి కర్మలు చేసిన వారు బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్యులుగా జన్మిస్తారు. కాని చెడు కర్మలు చేసిన వారు కుక్క, పంది లేదా చండాలులుగా జన్మిస్తారు అని అర్థం).
కులవ్యవస్థకు మూలం వైదికంలో ఉండగా బౌద్ధం కారణమనటం అతితెలివి కుటిలపండిత వ్యాఖ్యానం.
చార్వాక దర్శనం కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అనుభవసిద్ధ ఆధారాలు లేని ఊహాగానాలుగా తిరస్కరించింది.
4. బౌద్ధాన్ని నాశనం చేసి, మనుధర్మానికి, బ్రాహ్మణఆధిపత్యానికి శంకరాచార్యుడు సహాయపడ్డాడు. అందుకే నేటికీ పండితులు ఆయనకు ఆహా ఓహో అంటూ పల్లకీలు ఎత్తుతారు.
“శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ………” అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు…..
ఇతనొక మనుధర్మ సమర్ధకుడు. ఇతని గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఇతనిని సమర్ధిస్తూ మాట్లాడే, ఉటంకించే వారిని సమకాలీనంగా అందరూ సమానం అని చెప్పే రాజ్యాంగ వ్యతిరేక వ్యక్తులుగా గుర్తించాలి.
బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అప శూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించిన శూద్ర ద్వేషి…… ఇతనినా! మనం ప్రామాణికంగా తీసుకోవలసింది. ఇంకా అతని భావాలు గొప్పవి, ఐన్ స్టీన్ తో సమానవైన భావాలు అవి అని ప్రకటించే వ్యక్తులవి ఎంత దుర్మార్గమైన కుట్రలు.
శంకరుని భావజాలం బౌద్ధుల భావజాలానికి దగ్గరగా ఉంది అని చెప్పటం కూడా అనాదిగా పండితులు చేస్తున్న కుట్రే. బౌద్ధులేనాడూ పైన శంకరుడు చెప్పినట్లు ప్రజలను విభజించలేదు. అందరూ సమానమే అన్నారు. బౌద్ధులను నిర్మూలించాడన్న అపప్రధను తొలగించటానికి శంకరుడే ప్రచ్ఛన్న బౌద్ధుడని ప్రచారం చేసారు పండితులు.
5. భారతీయ తాత్విక చింతనలలో చార్వాకం తప్ప మరేదీ ఆధునిక సైన్స్ తో సరితూగలేదు. మిగిలినవి అన్నీ సామాజికంగా ప్రజలను ఆలోచనారహిత, క్రియారహిత జఢులుగా తీర్చిదిద్దిన తాత్వికతలే. ఇవేవీ ఆధునిక సైన్స్ పరిధిలోకి రానట్టె, ప్రాచీన తాత్విక చింతనలు కూడా రావు. క్వాంటం ఫిజిక్స్ ను అవి ప్రతిబింబిస్తాయి అని చెప్పటం…. అన్నీ వేదాలలో ఉన్నాయిష అని ఒక్కాణించటమే.
చార్వాకులు చెప్పిన శాస్త్రీయ సత్యాలు
అ. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందని వాటిని అంగీకరించలేదు.చార్వాకమతం. ధర్మాధర్మములు, పాపపుణ్యములు, దేవుడు, జన్మాంతర విషయాలు లాంటివి అభౌతికాలు, ఇంద్రియగోచరములు కావు కనుక వాటిని చార్వాకులు అంగీకరించలేదు.
… సైన్సు కూడా అంతే ప్రత్యక్షప్రమాణాన్నే అంగీకరిస్తుంది.
ఆ. చైతన్యం భౌతికమైనది. దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు.
ఇ. దేవుడు లేడు, స్వర్గనరకాలు లేవు. మరణానంతర జీవితం లేదు. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు తపస్సులు చెయ్యక్కరలేదు. జీవించినంతకాలమే ఆనందించగలం. చావుతరువాత ఏమీ లేదు.
ఈ. వేదాలు, ఆగమ శాస్త్రాలు వంటి ఏ మతగ్రంథాలనైనా జ్ఞాన హేతువులుగా భావించరాదు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు.
ఉ. ఇంకా నిరూపించాల్సి ఉన్న అంశాలైన ఆత్మ, దేవుడు, మరో జన్మ, స్వర్గనరకాలువంటి వాటి ద్వారా నిష్కపట మనస్కులు ఏ కొత్త జ్ఞానాన్ని పొందలేరు
6. ఎవరి విశ్వాసాలను వారికి పరిమితం చేసుకోవటం విజ్ఞత. అది ఎవరికీ అభ్యంతరం కాదు. అలాకాక మా విశ్వాసాలలో ఐన్ స్టీన్ సిద్ధాంతాలు, అణుబాంబు తయారీ, పుష్పక విమానాల తయారీ, కాస్మాలజీ, క్వాంటం థీరి లాంటివి ఉన్నాయి అని మాట్లాడటం అశాస్త్రీయమని గుర్తించాలి.
ఏనాటికైనా భారతీయ తాత్విక చింతనలలో చార్వాక దర్శనమే శాస్త్రీయంగా నిలబడగలిగేది. కానీ దీనిని ప్రచారంలోకి తెస్తే ఆత్మ, దేవుడు, స్వర్గనరకాలు, పాపం, పుణ్యం, మోక్షం, పూజలు, వ్రతాలు అంటూ పండితులకు ఆధిపత్యాన్ని, జీవనోపాధిని ఇచ్చే మోసపూరిత ప్రపంచం మొత్తం కుప్పకూలుతుంది.
అందుకని చార్వాకులను వెనక్కితోసి, మీమాంస, అద్వైతం, ద్వైతం, వేదాలు, ఉపనిషత్తులు, సూక్తాలు అంటూ మనిషిని, తార్కికతను వదిలి చేసే మాయాపూరిత విశ్లేషణలను, పండితులు ముందుకు తెచ్చి శతాబ్దాలుగా చేసిన అనాది మోసమే ఈ వ్యాసంలోనూ కనిపించింది.
ఈమాట లో 2016లో కొలిచాల సురేశ్, సత్తెనపల్లి సుధామయిల ప్రోత్సాహంతో బెరుకు బెరుగ్గా ప్రవేశించాను. మెలమెల్లగా మాచవరం మాధవ్ తెలిసి వచ్చారు.
1990 నుంచి నాకు ఎడిటర్లతో సంపర్కముంది. ఎడిటర్ ఏం చెయ్యాలో పరిపూర్ణ అవగాహన ఉన్న అరుదైన వ్యక్తి మాధవ్. పర్ఫెక్షనిష్టు. అతనితో పనిచేస్తే మన స్థాయి పెరుగుతుంది అనడానికి నేనే నిదర్శనం.
17 సంవత్సరాల నిస్వార్ధ కృషి..హి డిసర్వ్స్ ఎ బ్రేక్.
కానీ ఆయన వెంటనే వచ్చి చేరాలని కోరుకునే స్వార్ధపరుల్లో నాది మొదటి స్థానం.
మౌనంబంతట మాటలాడె… (2వ భాగం) గురించి Srinivasa Nyayapati గారి అభిప్రాయం:
05/01/2025 10:11 pm
కామేశ్వరరావుగారూ,
ఎంత హాయిగా సాగిందో, ఈ మీ రెండో installment! అయితే, మీరు తమసానదీతీరానున్న వాల్మీకీ ఆశ్రమం దగ్గర క్రౌంచమిథునంలోని మగపక్షిని కూల్చిన నిషాదుని కథా, మా నిషాద శ్లోకం తరువాత ఈ కింది వాక్యం ఎలా పొసుగుతుంది?
”
ఒకనా డొక్క మహాపతివ్రతయు నయ్యో! భర్తకున్ దూరమై
వికలంబైన మనంబుతో నిచటనే బిట్టేడ్చి శోషిల్లెగా! (33)
”
సీత బిట్టేడ్చి శోషిల్లినది ఆ నదీతీరాన కాదు కదండీ (మీరు ఈ యెడన్, ఇచటనే అన్నారు), ఎక్కడో దండకారణ్యం, పంచవటి దగ్గర. అది వనప్రాంతం. నేనన్నదానిలో పొరపాటుంటే సరిచేయగలరు. మీ పద్యగద్యాలు కరుణరసపూరితాలు, I enjoyed reading them!
-వాసు-
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి Shivachandra kuruva గారి అభిప్రాయం:
05/01/2025 9:38 pm
అద్వైతాన్ని విమర్శించడానికి శంకరచార్యుణ్ణి అది ఇది అనేసి అద్వైతం చెప్పేదాన్ని దాటవేశారు. శంకరుడు అనే వ్యక్తి ఉన్నాడో లేడో తెలీదు, ఆ పెరు మీద అనేక బ్రాహ్మణ సిద్ధాంతకారులు ఏవేవో రాసి ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగత శంకరుడు ఇది చేశాడు, ఇలా బౌద్ధులని నాశనం చేసాడు అనేవి అనవసరమైనవి. ఒకవేళ నాశనం చేసి ఉంటే ఆ విధంగా వ్యక్తిగత విమర్శ చేయవచ్చు, ఏమో. కానీ శంకరుడి పేరు మీద ఆ సిద్ధాంతాన్ని మాత్రం తక్కువ చేయలేం…. అలాగే పోలిస్తే బుద్ధుడి కథల్లో కూడా బుద్ధుడు తన బౌద్ధం గొప్పదని నిరూపించడానికి శ్రావణ మతస్థులని ఓడించి ఆత్మహత్య చేసుకునేలా చేశాడని బౌద్ధ టెక్ష్ట్స్ చెబుతాయి, అవి ఎవరో బౌద్ధం గొప్పది అనడానికి బుద్ధుడి మీద కల్పించిన కథ కావచ్చు… అంత మాత్రనా బౌద్దాన్ని కొట్టిపారేయ్యలేం.
పంచేంద్రియాలు: 3 వినికిడి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
05/01/2025 8:06 pm
నాకు – చదువు, రీసెర్చ్ మూలంగా తెల్సిన మరి కొన్ని విషయాలు .
రకరకాల తిమింగలాలు ఒక రకమైన ధ్వనితో మాట్లాడుకుంటాయని అంటారు. ఆ భాష ఇప్పటికీ ఎలాంటిదో చెప్పలేకపోతున్నారు అని డేవిడ్ అటేన్ బరో గారు ఉవాచ. వాటిని విపరీతంగా వేటాడేసి సర్వనాశనం చేయబోయారు. ఇప్పటికి అవి రక్షిత జంతువులు కనక బతుకుతున్నాయి. కొంతమంది వాటిని చూడ్డానికి వచ్చినప్పుడు, వాటికి హానిచేయరని తెల్సినప్పుడూ స్నేహంగా కొన్ని శబ్దాలు చేస్తాయిట. వాటికి పిల్లలు పుట్టినప్పుడు ఈ పరిశోధకులకి చూపించి దాన్ని ముట్టుకోవడానిక్కూడా అనుమతిస్తాయిట కొన్ని శబ్దాలతో. అదో వింత ప్రపంచం. ఆ పరిశోధకుల్లో ఒకాయన ‘తిమింగలం ఆ శబ్దం తో నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది నేను అర్ధం చేసుకోలేకపోతున్నాను’ అని కన్నీళ్ళు పెట్టుకోవడం నేను టివిలో చూసాను.
విశ్వంలో పైకి వెళ్ళేకొద్దీ పాలపుంతలూ, అవన్నీ తిరిగేటప్పుడు వచ్చే శబ్దమే ఓంకారం అని అంటారు. అది యోగులకి ధ్యానం లో వినిపిస్తుంది అంటారు. కొంతమంది అక్కడ గాయత్రి మంత్రం వినిపిస్తుంది అంటారు. నేను యోగినీ భోగినీ కాదు కానీ రోగినీ, ఢాకినీ లాంటి వాణ్ణి కనక తెలియదు :-). శ్రీ రామకృష్ణులవంటి యోగులు ధ్యానంలో పైకి వెళ్ళే కొద్దీ అనేకరకాల శబ్దాలు వినిపిస్తాయనీ అవి దాటితే ఆష్ట అణిమాసిద్ధులూ కలుగుతాయనీ కానీ అవన్నీ విడవకపోతే అధోగతి తప్పదనీ అనేకసార్లు చెప్పడం చూడవచ్చు (Ref. Gospel of Sri Ramakrishna, R.K.Math, Belur). ఈ శబ్దాలు మామూలు చెవులకి వినపడేవి కావుట. ఒకానొకపుడు నేను ఇండియాలో రాజయోగం కోసం చేరినప్పుడు ప్రతీ క్లాసులో అందరితోనూ ఒకేసారి గుంపుగా మొదటగా మూడుసార్లు ఓంకారం జపింపచేసేవారు (ఓ……ం అంటూ) ఆ శబ్దం విని ప్రకంపనలు అనుభవిస్తే కానీ అదెలా ఉంటుందో చెప్పలేం. ఒకే ఒక ముక్క – అత్యద్భుతం. భ్రమరీ ప్రాణాయామం అనేది మరొకటి ఇటువంటిదే.
ఇక మంత్రోఛ్ఛాటన విషయం. స్వరం ప్రకారం చదవాలి అంటారు. ఉదా: నమకం. నమస్సోమాచ రుద్రాయచ….. నమశ్శివాయచ, శివతరాయచ … అనేది సస్వరంగా చదువుతూ ఉంటే చదివేవారికీ వినేవారికి తెలుస్తుంది అది కలగచేసే ప్రకంపనలు. అలాగే నమకం మొదట్లో వచ్చే గుక్క తిప్పుకోకుండా చదివే, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ… అనేది కూడా. స్వామి దేవరూపానందగారి పుస్తకం పేరే “సస్వర వేదమంత్ర.” ఇటువంటిదే మంత్రపుష్పం కూడా. అది ఇక్కడ కొద్దిగా చదవచ్చు అర్ధంతో సహా – https://eemaata.com/em/issues/201605/8557.html. శ్రీశైలంలో భ్రమరాంబికాలయం గోడకి చెవి ఆనిస్తే ఝూంకారం వినపడేది ఒకప్పుడు అంటారు. అందుకే అమ్మవారికి ఆ పేరు అని మరో శబ్దం కధ. దేవుడే లేడు ఈ మంత్రం ఏమిటి అనేవారికి శిరస్సు వంచి నమస్కారం.
వినికిడి లోపం కలవారికి హియరింగ్ ఎయిడ్ పెట్టేస్తే వినపడిపోతుంది అనే ఆపోహ ఉంది. ఈ ఎయిడ్ వల్ల వచ్చే నష్టం వారికి తెలియక అలా ఉచిత సలహా పారేస్తూ ఉంటారు. ఎయిడ్ మొదట్లో కొంత పనిచేసినా దాని వల్ల వచ్చే అతి శబ్దంతో కర్ణభేరి పాడై ఉత్తరోత్తరా పూర్తిగా వినికిడి పోతుంది. అలా పోతూ ఉంటే ఆంప్లిఫికేషన్ పెంచుకుంటూ డెసిబిల్స్ పెంచేసి వినికిడిని మరింత తగలేస్తూ ఉంటారు. అలా తనకి జరిగినప్పుడు ఒకాయన అన్నమాట “They purposefully destroyed my hearing increasing the amplification రెగులర్ల్య్ and I did not know until it was too late.” అలాగే కాక్లియార్ ఇంప్లాంట్ కూడా. కొంతమందికి దానివల్ల వాంతులూ తల తిరగడం వస్తాయి. డాక్టర్లు అవి పనిచేస్తే – ఇదిగో ఇలా అద్భుతంగా పనిచేసింది అని ఒక పేపర్ రాసుకుని చంకలు గుద్దుకుంటారు. రెండేళ్లకి అది పనిచేయక వాంతులూ, బేలన్స్ అదీ పోతే రోగి ఏమైనా డాక్టర్లకి పట్టదు, నా పని నేను చేసాను అంటారు. అందువల్ల ఇది అన్ని సర్జరీల లాగే కష్టనష్టాలు చూసుకుని ఎవరికిష్టమైతే వారు ఎంచుకోవాలి. ఒకరికి పనిచేసినది రెండోవారికి పనిచేయదు. కాక్లియార్ ఇంప్లాంట్ అనేది మొదటి మెట్టు మాత్రమే. ఆ సర్జరీ తర్వాత వచ్చే ఏడుపులకి డాక్టర్లు ఏమీ చేయ[లే]రు. కొంతమందికి జీవితాంతం ఏదో ఒక తెరపీ, మందులూ, మరోసరీ మరోసారి సర్జరీలు వగైరా అవసరం కావొచ్చు దానివల్ల. దీనిమీద ఒక సినిమా వచ్చింది ఈ మధ్యనే – Sound of Metal అనే పేరుతో.
రచయిత చెప్పిన ఆ ట్యూన్ ఏమిటో కనిపెట్టు అనేది ప్రస్తుతం కూడా టివిలో వస్తోంది వారానికోసారో అప్పుడప్పుడో. బాపు రమణలకి రంగారావుగారు అనే రికార్డులు పోగుచేసే స్నేహితుడు ఉన్నట్టు విన్నాను. అటువంటివారికి తప్ప ఈ ప్రోగ్రాం చాలా కష్టం అనుకుంటా. ఎంతో సాధన చేయాలి అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి. సినిమా పాటలు తప్ప మరింకేమీరాని నాలాటి వారికి కష్టాతి కష్టం.
మరో విషయం ముగించే ముందు. ప్రాణం పోయే స్థితిలో ఆఖరిగా చచ్చిపోయేది వినికిడి శక్తి అని నిర్ధారించారు, శాస్త్రీయంగా కూడా. అందుకే పోయేవారి చెవిలో రామనామం చెప్పే ఆచారం ఉంది. దీనికి మన కృష్ణుడే ఆధారం “అంతకాలేచ మామేవ స్మరణ్ముక్తా కళేబరం..” (భగవద్గీత 8.5) అంటూ. అంతవరకూ ఎందుగ్గానీ, ఆయన అక్షరాణాం అకారోస్మి … అంటూ, అహమాదిశ్చ మధ్యంచ భూతానమంత ఏవచ అంటూ మొత్తం నేను తప్ప ఇంకేమీ లేదని చెప్పాడుగా? 🙂 స్వస్తి.
మే 2025 గురించి Vijaya Karra గారి అభిప్రాయం:
05/01/2025 7:19 pm
మాధవ్ గారి సంపాదకత్వంలో ఈమాటని చదవడం, ఈమాటకి రాయడం రెండూ కూడా చాలా తృప్తినిచ్చిన విషయాలు నాకు. సంపాదకుడిగా వారి ఈ బ్రేక్ నా మనసుకి ఏమాత్రం నచ్చని విషయమే అయినా – ఈ విరామంలో మాధవ్ గారి నుండి “కాల్వీనో కథల నుంచి” లాంటి చక్కని కథలు, మరిన్ని అనువాదాలు వస్తాయన్న ఆశ కూడా ఓ పక్కన వుంది.
మే 2025 గురించి మద్దిపాటి కృష్ణారావు గారి అభిప్రాయం:
05/01/2025 6:46 pm
ఎలాగూ పని చేస్తున్నాడుగదా అని నాలాంటి వాళ్ళం గట్టు మీద నుంచుని చూశాం (అంటే తను చేసిన స్థాయిలో ఏదో చెయ్యగలమని కాదు, ఉడతాభక్తిగానైనా సహాయం చెయ్యలేకపోయామని). ఇప్పుడిక ఆ బరువు మొయ్యలేనంటే కాస్త అపరాధ భావనతో కూడిన బాధ. ఐనా ఏటెల్ల కాలం కంచి గరుడసేవ చెయ్యమనడం భావ్యం కాదుగా! నువ్వు పెట్టిన వరవడిని కొనసాగించే బృందాన్ని తయారు చేసే ఉంటావనే నా నమ్మకం. ధన్యవాదాలు మాధవ్!
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి P.తిరుపాలు గారి అభిప్రాయం:
05/01/2025 3:16 pm
బల్లోజు బాబా గారు, సరిగ్గా చెప్పారు. బౌద్దుల గురించి ఈయన చెప్పిన విషయాలన్ని అవాస్తవాలే! బౌద్దం ఒకే బౌద్దంగా లేదు. అన్ని మతాల లాగే హీన యాన మహా యాన అని ముక్కలు ముక్కలుగా చీలిపోయి వుంటే ఏ బౌద్దం గురించి మాట్లాడుతున్నారో స్పష్టత లేదు. మాట్లాడితే వలసవాదం నుండి నేర్చుకున్నారు అంటారు. వలస వాదం అనేది ఏ వలస వాదం? బ్రిటీష్ బలస వాదమా లేక మహామ్మదీయుల వలస వాదమా? భారత దేశానికి అనేక మంది ( జాతులు అంటారు. జాతులు అనడం ఆధునిక లక్షణం కాదు) వలస వచ్చారు. ఆర్యులు వలసవాదులే! మరి ఇప్పుడు ఈ ఆర్యుల వలస వాదుల భావజాలం వేళ్లూనుకొని పోయి దేశాన్ని శాసిస్తుంది! మరి దీన్ని కూడా వలస వాదంగా పేర్కొన గదా? ఇంకొకటి స్వతంత్ర భావాలు అంటున్నారు. ఏ వి స్వతంత్ర భావాలు? సమాజం లో ఉన్న వ్యక్తులు ఆ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసే భావాలు ఏర్పరుచు కుంటారు. ఒక స్థాయి పెరిగిన తర్వాత స్వంతంగా ఆలోచిస్తారు. పునాది లేకుండా ఎవరూ స్వతంత్రంగా ఉండరు. ఉండలేరు. మానవ శాస్త్రం ప్రకారం మానవజాతి అంతా ఒక పునాది నుండి వచ్చిందే! వివిధ ప్రాంతాలకు ఆహారాన్ని వెతుకుంటు వలస పోయి వేరు పడిపోయారు. అందు వల్ల మానవ తాత్వికత , విజ్ఞానం కలగూర గంపలాగే ఉంటుంది గాని, స్వచ్చందంగా ఉండదు. అంతెందుకు శర్మ గారి వ్యాసం విస్తృతం అనిపించే విరుద్ధ భావాలను కలగా పులగం. అసలు ఈయన తాత్విక చింతన ఏమిటి? ఇది వలస వాదులైన ఆర్యుల భావజాలమే? ఒక పక్క దేవున్ని తలకెత్తుకొని ఇంకొక పక్క కుమారీలుడు దైవత్వాన్ని ఖండించాడు. నాస్తికుడనిపించుకున్నాడు, అందరిని గుర్తించిన రోమిలా తాపర్ కుమారీలున్ని గుర్తించలేదని వాపోతున్నారు. గుర్తించక పోతే ఈయన. కేమిటి నష్టం? ఎంతైనా ఆస్తికుడు కదా! ఆస్తికుడికి నాస్తుకుడి మీద ఎందుకు ప్రేమా? ఎందుకంటే వలస వాద భావజాలం కాబట్టి?
కమ్యునిస్టులు, దలిత వాదులు, సోషలిస్టులు అందరు వలస వాద ప్రభావం ఉన్న వారు అంటారు. చార్వాకులను గుర్తించిన వాడు ఇలా అంటారా? బౌద్దం, చార్వాకం.. లాంటి హేతువాదులు నాస్తికులు ఈ దేశంలో లేరా? వారిని ఎంత మరుగు పరిచినా కనిపించకుండా పోతారా? ఈ యన ఏదో ఆదునికుడు అనిపించుకోడానికి పరస్పర విరుద్దమైన భౌతిక వాదాన్ని భావ వాదాన్ని ఒకటి చేసి మాట్లాడతారు! ఏదో ముసుగు ధరించడానికి ప్రయత్నం చేస్తారు. అయినంత మాత్రానా ఎవరో స్పష్టం కాదా? కుమారీలుడు జగం సత్యం అన్నంత మాత్రనా ఆయన ఆలోచనలు బౌతికవాదం మీద ఆదారి పడి ఉన్నాయా? వేదాలను వ్యతిరేకించిన వారినందరిని అప్పుడు నాస్తికులు అన్నారు. నాస్తికులు అన్న మాటకు వాస్తవార్దం ‘వ్యతిరేకులు’ అట.అలా దేవుని వ్యతిరేకించిన వారికందరికి ఆపాదించారు.
సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:
05/01/2025 2:57 pm
thank you radha gaaru, for sane reply.
Yes I read snehalathareddy, cherabandaraju and others jail episodes, sanjay gandhi sterilization programmes. They are not lone voices. But emergency has other reasons and other motives behind.
My perspective may be misty and selective, but I believe this narrative is the need of hour to understand the hindutva politics.
since I cannot post my article on this topic here….. I post the link for it. you may please gothrough andi.
https://sahitheeyanam.blogspot.com/2025/04/blog-post_7.html
thank you
bolloju baba
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:
05/01/2025 11:59 am
హేతు చింతనను ఆధునికతకు పర్యాయంగా భావించినప్పటికీ, భారతీయ హేతు చింతన గురించి కమ్యూనిస్టులు, దళితవాదులు, హిందువాదులు వలసవాద ప్రభావంతో తప్పుగా అర్థం చేసుకున్నారని ఈ వ్యాసం వాదిస్తుంది. భారతీయ దృక్పథంలో చక్రీయ కాల భావన ప్రధానమని, శంకరాచార్యులు, బౌద్ధులు స్థల-కాలాలు మనోనిర్మితమని చెప్పారు, ఇది క్వాంటం ఫిజిక్స్‌తో సమానంగా ఉంది. వలసవాద ప్రభావంతో భారతీయ తాత్విక చింతనను మేధావులు, రోమిలా థాపర్ తో సహా తక్కువగా చూసారని అభియోగం మోపుతుంది.
భారతీయులు సుదూర గతంలో గొప్ప హేతుబుద్ధి కలిగి ఉండేవారు, దాన్ని క్రమేపీ కోల్పోయారు….ఈ వ్యాసం మొత్తం మీద ఇదొక్కటే సత్యపూర్వక వాక్యం.
సుదూరగతంలో చార్వాకులు బౌద్ధం రూపంలో గొప్ప హేతుబుద్ది కలిగి ఉండేవారు. క్రమేపీ ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, మోక్షం, స్వర్గనరకాలు, పాపపుణ్యాలు లాంటి అభౌతిక అంశాలను- పండితులు తమ అధిపత్యానికి, ఉదరపోషణకు – మతలక్షణాలుగా స్థిరీకరించి జనబాహుళ్యాన్ని నమ్మించారు.
1. చార్వాకులు ఇలా అన్నారని ఆధారాలేమిటి?
ఆత్మ, చైతన్యం లాంటివాటిని చార్వాకులు ఖండించారు. ఇవన్నీ ఆ తరువాత పండితులు చేసిన చార్వాక వ్యాఖ్యానాలలోని వక్రీకరణలు. పై వాక్యాలను చార్వాకులవని నిరూపించే ఆధారాలు చూపండి. ఉదాహరణకు; యావజ్జీవేత్సుఖం జీవేదృణం కృత్వా ఘృతం పిబేత్ । భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః లాంటి చార్వాక వాక్యాలను చూపండి. ఎవరెవరో ఆ తరువాత చేసిన పండిత వ్యాఖ్యానాలు చూపొద్దు. ముఖ్యంగా తాంబూల దృష్టాంతం.
2. భారతీయ తత్వశాస్త్రం కాలం సైక్లికల్ అని చెబుతుంది. కానీ దానికి సంబంధించిన ఆధారాలను చూపదు. ఉదా. ఇది కలికాలం అనుకొంటే అంతకు ముందు జరిగిన కలికాలాన్ని ఉదాహరణగా చూపి వాదించాలి. అలా చెయ్యదు కనుక అది నిరూపణ కాదు. బిగ్ బేంగ్ కూడా ఒక బిందువు నుంచే ప్రారంభమౌతుంది. అయిన్ స్టీన్ రెలటివిటీ కాలాన్ని నాలుగవ డైమెన్శన్ అని లీనియర్ గానే చూపుతుంది. సైక్లికల్ గా కాదు.
కాలం సైక్లికల్ అని చెప్పటం కర్మ సిద్ధాంతంలాగే సంస్కరణను, అభివృద్ధిని నిరోధిస్తుంది. అంతా దైవేచ్ఛ అని ప్రకటించి స్వీయ సంకల్పాన్ని నిరుత్సాహ పరుస్తుంది. కాలం సైక్లిక్ అనే భావన అశాస్త్రీయమైనది. పురాణ కల్పితమైనది. మానవాభివ్రుద్ధికి దోహదపడదు. ఇది పండితులు సమాజంపై చేసిన కుట్ర. దీనిద్వారా వారి ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్నారు.
కాలం చక్రీయమని చెప్పటానికి 60 సంవత్సరాలకు పేర్లు పెట్టి అవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా అని చెప్పటం కురచ వాదన. నేటి కలియుగం అనేది రెండో సారో మూడో సారో ముప్పయ్యోసారో అని చెప్పి ఋజువులు చూపాలి.
3. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలు బౌద్ధమతానికి పూర్వం నుండి ఉన్నాయి. ముఖ్యంగా జైనానికి చెందినవి ఇవి. వైదికంలో కూడా ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకంలో పునర్జన్మ భావన కనిపిస్తుంది.
జైనం కర్మను ఆత్మపై అంటుకునే భౌతిక కణాలుగా వర్ణిస్తుంది.
బౌద్ధం వీటిని అనాత్మావాదం కోణంలోంచి రీడిఫైన్ చేసింది. అంతే తప్ప కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను బౌద్ధం ప్రతిపాదించలేదు. జైన హైందవాలు చెప్పిన అర్థంలో కూడా చెప్పలేదు. వాటిని బౌద్ధానికి ఆపాదించటం ఈ వ్యాసం చేస్తున్న వక్రీకరణ.
కర్మ, పునర్జన్మ వైదికమైనవి. వాటివల్లే నేటి కులవ్యవస్థ ఏర్పడింది. (ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకం– ఈ లోకంలో మంచి కర్మలు చేసిన వారు బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్యులుగా జన్మిస్తారు. కాని చెడు కర్మలు చేసిన వారు కుక్క, పంది లేదా చండాలులుగా జన్మిస్తారు అని అర్థం).
కులవ్యవస్థకు మూలం వైదికంలో ఉండగా బౌద్ధం కారణమనటం అతితెలివి కుటిలపండిత వ్యాఖ్యానం.
చార్వాక దర్శనం కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అనుభవసిద్ధ ఆధారాలు లేని ఊహాగానాలుగా తిరస్కరించింది.
4. బౌద్ధాన్ని నాశనం చేసి, మనుధర్మానికి, బ్రాహ్మణఆధిపత్యానికి శంకరాచార్యుడు సహాయపడ్డాడు. అందుకే నేటికీ పండితులు ఆయనకు ఆహా ఓహో అంటూ పల్లకీలు ఎత్తుతారు.
“శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ………” అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు…..
ఇతనొక మనుధర్మ సమర్ధకుడు. ఇతని గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఇతనిని సమర్ధిస్తూ మాట్లాడే, ఉటంకించే వారిని సమకాలీనంగా అందరూ సమానం అని చెప్పే రాజ్యాంగ వ్యతిరేక వ్యక్తులుగా గుర్తించాలి.
బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అప శూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించిన శూద్ర ద్వేషి…… ఇతనినా! మనం ప్రామాణికంగా తీసుకోవలసింది. ఇంకా అతని భావాలు గొప్పవి, ఐన్ స్టీన్ తో సమానవైన భావాలు అవి అని ప్రకటించే వ్యక్తులవి ఎంత దుర్మార్గమైన కుట్రలు.
శంకరుని భావజాలం బౌద్ధుల భావజాలానికి దగ్గరగా ఉంది అని చెప్పటం కూడా అనాదిగా పండితులు చేస్తున్న కుట్రే. బౌద్ధులేనాడూ పైన శంకరుడు చెప్పినట్లు ప్రజలను విభజించలేదు. అందరూ సమానమే అన్నారు. బౌద్ధులను నిర్మూలించాడన్న అపప్రధను తొలగించటానికి శంకరుడే ప్రచ్ఛన్న బౌద్ధుడని ప్రచారం చేసారు పండితులు.
5. భారతీయ తాత్విక చింతనలలో చార్వాకం తప్ప మరేదీ ఆధునిక సైన్స్ తో సరితూగలేదు. మిగిలినవి అన్నీ సామాజికంగా ప్రజలను ఆలోచనారహిత, క్రియారహిత జఢులుగా తీర్చిదిద్దిన తాత్వికతలే. ఇవేవీ ఆధునిక సైన్స్ పరిధిలోకి రానట్టె, ప్రాచీన తాత్విక చింతనలు కూడా రావు. క్వాంటం ఫిజిక్స్ ను అవి ప్రతిబింబిస్తాయి అని చెప్పటం…. అన్నీ వేదాలలో ఉన్నాయిష అని ఒక్కాణించటమే.
చార్వాకులు చెప్పిన శాస్త్రీయ సత్యాలు
అ. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందని వాటిని అంగీకరించలేదు.చార్వాకమతం. ధర్మాధర్మములు, పాపపుణ్యములు, దేవుడు, జన్మాంతర విషయాలు లాంటివి అభౌతికాలు, ఇంద్రియగోచరములు కావు కనుక వాటిని చార్వాకులు అంగీకరించలేదు.
… సైన్సు కూడా అంతే ప్రత్యక్షప్రమాణాన్నే అంగీకరిస్తుంది.
ఆ. చైతన్యం భౌతికమైనది. దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు.
ఇ. దేవుడు లేడు, స్వర్గనరకాలు లేవు. మరణానంతర జీవితం లేదు. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు తపస్సులు చెయ్యక్కరలేదు. జీవించినంతకాలమే ఆనందించగలం. చావుతరువాత ఏమీ లేదు.
ఈ. వేదాలు, ఆగమ శాస్త్రాలు వంటి ఏ మతగ్రంథాలనైనా జ్ఞాన హేతువులుగా భావించరాదు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు.
ఉ. ఇంకా నిరూపించాల్సి ఉన్న అంశాలైన ఆత్మ, దేవుడు, మరో జన్మ, స్వర్గనరకాలువంటి వాటి ద్వారా నిష్కపట మనస్కులు ఏ కొత్త జ్ఞానాన్ని పొందలేరు
6. ఎవరి విశ్వాసాలను వారికి పరిమితం చేసుకోవటం విజ్ఞత. అది ఎవరికీ అభ్యంతరం కాదు. అలాకాక మా విశ్వాసాలలో ఐన్ స్టీన్ సిద్ధాంతాలు, అణుబాంబు తయారీ, పుష్పక విమానాల తయారీ, కాస్మాలజీ, క్వాంటం థీరి లాంటివి ఉన్నాయి అని మాట్లాడటం అశాస్త్రీయమని గుర్తించాలి.
ఏనాటికైనా భారతీయ తాత్విక చింతనలలో చార్వాక దర్శనమే శాస్త్రీయంగా నిలబడగలిగేది. కానీ దీనిని ప్రచారంలోకి తెస్తే ఆత్మ, దేవుడు, స్వర్గనరకాలు, పాపం, పుణ్యం, మోక్షం, పూజలు, వ్రతాలు అంటూ పండితులకు ఆధిపత్యాన్ని, జీవనోపాధిని ఇచ్చే మోసపూరిత ప్రపంచం మొత్తం కుప్పకూలుతుంది.
అందుకని చార్వాకులను వెనక్కితోసి, మీమాంస, అద్వైతం, ద్వైతం, వేదాలు, ఉపనిషత్తులు, సూక్తాలు అంటూ మనిషిని, తార్కికతను వదిలి చేసే మాయాపూరిత విశ్లేషణలను, పండితులు ముందుకు తెచ్చి శతాబ్దాలుగా చేసిన అనాది మోసమే ఈ వ్యాసంలోనూ కనిపించింది.
బొల్లోజు బాబా
మే 2025 గురించి దాసరి అమరేంద్ర గారి అభిప్రాయం:
05/01/2025 8:06 am
ఈమాట లో 2016లో కొలిచాల సురేశ్, సత్తెనపల్లి సుధామయిల ప్రోత్సాహంతో బెరుకు బెరుగ్గా ప్రవేశించాను. మెలమెల్లగా మాచవరం మాధవ్ తెలిసి వచ్చారు.
1990 నుంచి నాకు ఎడిటర్లతో సంపర్కముంది. ఎడిటర్ ఏం చెయ్యాలో పరిపూర్ణ అవగాహన ఉన్న అరుదైన వ్యక్తి మాధవ్. పర్ఫెక్షనిష్టు. అతనితో పనిచేస్తే మన స్థాయి పెరుగుతుంది అనడానికి నేనే నిదర్శనం.
17 సంవత్సరాల నిస్వార్ధ కృషి..హి డిసర్వ్స్ ఎ బ్రేక్.
కానీ ఆయన వెంటనే వచ్చి చేరాలని కోరుకునే స్వార్ధపరుల్లో నాది మొదటి స్థానం.
కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి వంగూరి చిట్టెన్ రాజు గారి అభిప్రాయం:
04/30/2025 10:18 pm
అద్భుతమైన వ్యాసం అందించారు, హనుమంతరావు గారూ! ఈ పరంపరలో తదుపరి వ్యాసాల కోసం అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ఈమాట సంపాదకులకి ధన్యవాదాలు.