Comment navigation


15780

« 1 2 3 4 5 6 ... 1578 »

  1. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి Srinivas గారి అభిప్రాయం:

    04/07/2025 11:11 pm

    Above explanation from Hanumantha Rao garu reminded me the origin of petroleum and its products.

    First, they used oil lamps. For better results the rich started using whale oil. One thing to keep in mind here, there was a vast business of hunting whales for this. Still the supply is short and price is high.

    From there there are 2 paths for lighting. One electricity and other petroleum products.

    In 1850’s, petrolem seepage was identified in Pensylvania. First, the tar was having novelty value. It is used for many things including medicine. Then the process of refining was invented and they started refining kerosene and this kerosene started replacing whale oil as cheaper alternative. It interesting to note that they used to discard all residue, after extracting kerosene. Also, as this residue is flammable, there were many accidents. Thus discarding this residue was a problem.

    IC engine invention came as god send, at that time.(in 1900s). From then on slowly, petroleum turned gold.

    Thank you Hanumatha rao garu and Ranga Rao garu, for informative discussion.

  2. ఏప్రిల్ 2025 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    04/07/2025 6:07 am

    భాషా వివేచన లేకుండా సాధించేది లేదు. కవులు/రచయితలూ భాషా పరిణామాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. శ్రద్ధాసక్తులు గలవారు శాసన భాషను అధ్యయనం చేయాలి. వ్యావహారిక భాష, ప్రామాణిక భాష ఈ రెంటి మధ్య గల సంబంధం అర్థం కావాలి. మన ప్రాచీన కవిత్వాన్ని అర్థం చేసుకొనే తీరులో మార్పులు రావాలి. ఉదాహరణకు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా హంపీ కేంద్రంగా వచ్చిన కవిత్వంలో Urban nuances కనిపించవచ్చు. కారణం అప్పటి కాలంలో బీజింగ్ తర్వాత పెద్ద నగరం హంపీయే. తర్వాత కాలంలో దక్షిణాది తెలుగులో ఎక్కువ రచనలు వచ్చాయి – ఉదాహరణకు త్యాగరాజును కేవలం సంగీతానికి పరిమితం చేయకుండా ఆయన భాషలోని ప్రత్యేకతను పట్టుకోవాలి. నౌకా చరిత్ర లో ఆయన శైలి చాలా ఆసక్తి గొలుపుతుంది. తెలుగు భావింప నలవిగాని పెద్ద భాష – దాన్ని సాధించడం అంత సులువు కాదు.

    కాజి నజ్రుల్ ఇస్లాం – భారతీయ పురాణాలను, ఇతిహాసాలను లోతుగా అధ్యయనం చేశాడు, ఆయన గొప్ప గాయకుడు కూడా. ఆయన కొడుకు సవ్యసాచి గానం చేసిన విద్రోహి కవిత:
    https://www.youtube.com/watch?v=29X1GFso6y0
    (బెంగాలీలో విప్లవాన్ని విద్రోహం అంటారు)

    బెంగాలీ ముస్లింల వ్యావహారిక భాషకు/హిందువుల వ్యావహారిక భాషకు మధ్య పెద్ద తేడాలు లేవు. న్యూయార్క్ లో ఒక బెంగాలీ రెస్టారంట్ పేరు ఇత్యాది. నాకు తెలిసిన ఒక బాంగ్లా ముస్లిం అమ్మాయి పేరు ఇతి. మతం వేరైనా వారి సంస్కృతిని, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేయరు. మలయాళీ క్రైస్తవులు సైతం సంస్కృతాన్ని సమాదరిస్తారు. మనలో వివేకం పెరిగే కొద్దీ నేల విడిచి సాము చేయాలి అన్న మూర్ఖత్వం తొలగి భాషా సంస్కృతుల పట్ల ప్రేమ పెరగాలి – ఆ పునాది మీదే సాహిత్య సృష్టి సాధ్యం.

    చక్కని సంపాదకీయం – మంచి విషయాలు ప్రస్తావించినందుకు మీకు ఒక వీరతాడు వేయవలసిందే.

  3. వేలూరిగారితో ఒక సంభాషణ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ . గారి అభిప్రాయం:

    04/06/2025 9:08 pm

    వేలూరి గారిని “అమెరికాలో అర శతాబ్దం” పేరిట తమ అనుభవాలు -జ్ఞాపకాలు గ్రంధస్తం చేయమని కోరాను. ఈ ఇంటర్వ్యూ చదివాక ఆయన తప్పక ఈ పని చేయగలరని అనిపించింది. అభిరుచి ఉన్నవారు ఆత్మ చరిత్రలు రాసుకోవడం వల్ల ఎన్నో లాభాలు. సంజీవదేవ్ గారి ‘తెగినజ్ఞాపకాలు’ చదవక పోతే ఆయన గురించి నాకు తెలిసేదే కాదు. (ఆయన ఆత్మచరిత్ర ద్వారా కలిగిన పరిచయం నాకు ఎంత గానో లాభించింది. తత్వశాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, రస శాస్త్రము, మనస్తత్వ శాస్త్రాలు, చిత్రకళా చరిత్ర — ఇలా అనేకము చిన్న వయసులో అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది). తెలుగు వారికి హైకూలు పరిచయం చేసింది ఆయనే. టర్నర్ రంగుల ప్రపంచం గురించి, Constable చిత్రకళ Turner కన్నా ఏ రకంగా భిన్నం? – ఇవన్నీ ఆయన ద్వారా తెలిసి వచ్చిన విషయాలే. ఒక చిత్రకారుని గురించి లోతులకు పోకుండా తెలుసుకోవడం వేరు – చిత్రకారుని ఆత్మను పట్టుకొని చిత్ర శైలీ పరిణామాన్ని గుర్తెరిగి ఆనందించడం వేరు. ఇవన్నీ, ఎంతో క్రమశిక్షణతో, దక్షతతో చేయవలసిన పనులు.

    ఇక తెలుగులో కవిత్వం, అనువాదం – ఈ విషయాలకొస్తే – మనవారిలో పీఠాధిపతులు, వారికి అడుగులకు మడుగులొత్తి పాదసేవలో తరించే భక్త బృందాలు అధికం. కార్యరంగం విజయవాడైనా, విస్కాన్సిన్ ఐనా దృశ్యం మారదు. స్నేహాలు వేరు, విమర్శలు వేరు అన్న స్పృహే లేదు. కవిత్వం, అనువాదాలు, వాటిపై వచ్చే విమర్శను సీరియస్ గా పట్టించుకోవాలి అన్న వివేకం మన వారికి లేదు. మనకు కావలసింది భజన బృందాలు.

    కొడవళ్ళ గారు ప్రస్తావించినట్టు ఇంటర్‌వ్యూలో అక్కడక్కడా స్పష్టత లేదు. పాద పీఠికలు ఇవ్వాలి – text without context leads to utter confusion -సందర్భ శుద్ధి లేని వచనం, గందరగోళానికి దారి తీస్తుంది.

    నా వంతుగా “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు” పుస్తకానికి లింకు ఇస్తున్నాను.
    https://sundarayya.org/sites/default/files/2023-09/Neti%20kalapu%20kavitwam%20-%20Theeru%20thennulu.pdf

    కొడవళ్ళ గారు ప్రస్తావించిన వ్యాసం, దానికి తోడుగా మరొక వ్యాసం:
    Hibiscus on the lake (పుట 108)
    అనువాదంలో ‘పద్య సమాధి’ (పుట 111)

    అలాగే, తెలుగు విమర్శలో మైలురాయి అనదగ్గ అక్కిరాజు ఉమాకాన్తం గారి పుస్తకానికి లింకు ఇక్కడ:
    https://archive.org/details/in.ernet.dli.2015.333044

  4. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి Ranga Rao గారి అభిప్రాయం:

    04/06/2025 2:25 am

    Thanks Hanumantha Rao garu! You have thrown much light on the source of light in which Edison conducted his experiments before his invention, the electric bulb, came into limelight. I appreciate your reply. 🙏🙏🙏

  5. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    04/06/2025 1:37 am

    మెచ్చుకున్నందుకు రంగారావుకి థాంక్స్. “ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టక మునుపు ఎడిసన్ ఏ దీపపు కాంతిలో ప్రయోగాలు చేశారో చెబితే బాగుండేది.” నిజమే; ఎడిసనే కాదు, ఎవరైనా చీకటిని ఎలా ఛేదించేవారు?

    రాబర్ట్ గోర్డన్, తన ఉద్గ్రంథంలో [1] అంటాడు: “an essential characteristic of the 1870 dwelling was its dimness after dark.” ఎక్కువగా ఇళ్ళల్లో కొవ్వొత్తులు, తిమింగిల తైల దీపాలు (whale oil lamps) వాడేవారు; పెన్సెల్వేనియాలో 1850 ప్రాంతాల్లో కనుగొన్న కిరొసిన్ దీపాలు అప్పటికింకా కొత్త. తిమింగిలం చర్మాన్ని బాగా మరగబెట్టితే దాని కొవ్వునుండి వచ్చేది తిమింగిల తైలం. Herman Melville (1819-1891) ప్రఖ్యాత 1851 అమెరికన్ నవల “మోబీ-డిక్” (ముందటి పేరు “The Whale”) నుండి:

    “Assuming the blubber to be the skin of the whale; then, when this skin, as in the case of a very large Sperm Whale, will yield the bulk of one hundred barrels of oil; and, when it is considered that, in quantity, or rather weight, that oil, in its expressed state, is only three fourths, and not the entire substance of the coat; some idea may hence be had of the enormousness of that animated mass, a mere part of whose mere integument yields such a lake of liquid as that. Reckoning ten barrels to the ton, you have ten tons for the net weight of only three quarters of the stuff of the whale’s skin.

    It does seem to me, that herein we see the rare virtue of a strong individual vitality, and the rare virtue of thick walls, and the rare virtue of interior spaciousness. Oh, man! admire and model thyself after the whale! Do thou, too, remain warm among ice. Do thou, too, live in this world without being of it. Be cool at the equator; keep thy blood fluid at the Pole. Like the great dome of St. Peter’s, and like the great whale, retain, O man! in all seasons a temperature of thine own.

    But how easy and how hopeless to teach these fine things! Of erections, how few are domed like St. Peter’s! of creatures, how few vast as the whale!”

    మెన్లో పార్క్ ల్యాబ్ లో కొవ్వొత్తులు, కిరొసిన్ దీపాలు, గ్యాస్ దీపాలు వాడేవాళ్ళు. గ్యాస్ దీపాలకన్నా విద్యుద్దీపాలు చవకగా అందరికీ అందుబాటులోకి రావాలన్నది ఎడిసన్ ధ్యేయం: “to effect exact limitation of all done by gas, to replace lighting by gas by lighting by electricity.”ఎడిసన్ సమాంతర సర్క్యూట్ గ్యాస్ దీపాలని అనుసరిస్తూ వచ్చినదే.

    [1] The Rise and Fall of American Growth: The U.S. Standard of Living Since the Civil War. Robert J. Gordon. Princeton University Press. 2016.

    కొడవళ్ళ హనుమమంతరావు

  6. వేక్సీన్ రాజకీయాలు గురించి Raghavendra గారి అభిప్రాయం:

    04/05/2025 11:59 pm

    ఇంగ్లండ్ లోని Gloucestershire అనే ఊరిపేరుని గ్లాస్టర్ షైర్ అని పలుకుతారు.

  7. సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి Lakshmi గారి అభిప్రాయం:

    04/05/2025 9:39 pm

    తాడిగడప శ్యామలరావు గారు చెప్పినట్లు,
    తెలుగు సాహిత్యానికి చరిత్ర, తత్వ శాస్త్రం , థియాలజీ లాంటి సంక్లిష్ట విషయాలతో ఏమిటి సంబంధం?
    మాధవ్ గారు చెప్పినట్లు తెలుగులో సాహిత్యవిమర్శయే తక్కువ కదా? అలాంటపుడు ఇంక ఇవన్నీ ఎందుకు?
    తాడిగడప శ్యామలరావు గారికి ధన్యవాదాలు

  8. కాలగర్భ గురించి Vojjala Sharath Babu గారి అభిప్రాయం:

    04/05/2025 1:28 pm

    నాసదీయ కాల గర్భం గర్భాంతరంగంగానే భావగర్భ రహస్యాంతికంగా బాగుంది. గుమ్మన్న గారి వేణు మాధవ శర్మ గారికి శుభాభినందనలు.

  9. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి గుమ్మడిదల రంగారావు గారి అభిప్రాయం:

    04/05/2025 12:36 pm

    హనుమంతరావు గారి వ్యాసం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అసలు ఇది వ్యాసంలా లేదు. రచయిత మన ముందు కూర్చుని మన కళ్లలోకి చూస్తూ చేసిన ఉపన్యాసంలా సాగిన conversational style narrative పాఠకులను ఆకట్టుకునేలా బాగుంది. మొదటి పేరా చూశాక గదికి సరిపోయే కంప్యూటర్ మొదలు నేడు అన్నం తినే కంచం అంత జాగాలో ఇమిడే ల్యాప్ టాప్ వరకు జరిగిన పరిణామ క్రమం గురించి చెబుతారని అనిపించింది. కానీ, ఇది వ్యాస పరంపర అంటున్నారు గనక కంప్యూటర్ పరిణామ క్రమం గురించి మరొక వ్యాసంలో చెబుతారని ఆశిస్తున్నాను. అయితే ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టక మునుపు ఎడిసన్ ఏ దీపపు కాంతిలో ప్రయోగాలు చేశారో చెబితే బాగుండేది అనిపించింది. ఈ వాక్యం చదువుతుంటే ప్రముఖ కథా రచయిత, మా గురువుగారు కీ శే పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు గుర్తుకొచ్చారు. మనం అనునిత్యం వాడే బల్బు కాంతిలో మనకి కనిపించని అనేక విషయాలు తెలిపిన హనుమంతరావు గారికి అభినందనలు.

  10. మౌనంబంతట మాటలాడె… గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:

    04/04/2025 11:34 am

    నమస్తే వాసుగారు,
    Thank you. లేదండి, మొత్తం వాల్మీకి రామాయణం నాకు సాధ్యం కాదు. వీలైనప్పుడు కొన్ని కొన్ని భాగాలను, సన్నివేశాలను మాత్రం ప్రయత్నిస్తున్నాను.

« 1 2 3 4 5 6 ... 1578 »