శర్మ గారి ఉదంతం సరదాగా ఉంది. ‘అది [శంకరాభరణం] సంగీతపరమైనది. మీకు అవసరమా?’ అంటే నాకీ చలసాని రచన గుర్తొచ్చింది:
ఏడాదిన్నర క్రితం, అమెరికాలో పర్యటిస్తుండగా…!
వాషింగ్టన్ లోని మా ‘హోస్టు’ల ఇంట్లో నేనదివరకే చూసేసి, మళ్ళీ చూడాలనుకుంటున్న ఇంగ్లీషు సినిమాల వీడియో కాసెట్లనేకం కనిపించేయి.
వాటిల్లోనుంచి నాకు మరీ ఇష్టమైన నాలుగింటిని ఎన్నిక చేసేను. వాటిల్లో ఓ కాసెట్ మా ఆవిడకు చూపించి అడిగేను. “మూడు నాలుగ్గంటలు పడుతుందీ సినిమా! అద్భుతంగా ఉంటుంది గానీ, చూసే ఓపిక ఉందా?” అని అప్పుడు రాత్రి తొమ్మిది గంటలు! మేమిద్దరం పగలంతా మ్యూజియంలు, ఆర్టు గ్యాలరీలు చూసి, చూసి, నడిచి, నడిచి అలసిపోయున్నాం.
“చూద్దాం! కానీ, పేరుని బట్టి చూస్తే ఇదేదో “మ్యూజిక్” సిన్మాలా ఉందే. మరి మీరు…?” అని సందేహించిందావిడ.
“అవును! నేనీ సిన్మా ముప్పయేళ్ళ క్రిందటనుకుంటా, మొదటిసారిగా హైదరాబాదులో చూశాను. అప్పటికే నాకు బ్రహ్మచెవుడు గదా! అదే సినిమాను మళ్ళీ ఇప్పుడు చూడాలంకుంటున్నానంటే… వింటూ నువ్వింకెంతగా ఎంజాయ్ చేయగలవో గదా!” అని కాసెట్ ను విసిఆర్ లో కెక్కించాను.
నాకే ఆశ్చర్యం కలిగేలా… సుదీర్ఘమైన ఆ సినిమా పూర్తయేదాకా ఆవిడ లేవలేదు, కదల్లేదు!
“చాలా చాలా బాగుందండీ! ఇదింత బాగుంటుందని మీకెలా తెలిసిందీ?” అని ఆశ్చర్యపోయిందామె మరే ప్రపంచం నుండో ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చిపడిన దానిలా!
“నీవు చెవులతో వింటావు! నేను కళ్ళతో వింటాను” అన్నాన్నేను.
ఆ సినిమ పేరు “సౌండ్ ఆఫ్ మ్యూజిక్!”
కథ, కథనం, నటన, సంగీతం, పాటలు, ఛాయాగ్రహణం, లొకేషన్లు, అన్నీ అందంగా కలగలసిపోయిన అపురూప చిత్రమది. అక్షరాలా కళాఖండం!
ఆనాడు నన్నంతగా ఆకట్టుకున్నదా కళాత్మకతే! ఆంగ్ల చిత్రాల పట్ల అంతగా ఆసక్తి చూపని మా ఆవిడను సంభ్రమంలో ముంచి తదాత్మ్యతకు లోను చేసిందీ ఆ కళాత్మకతే!
వేలూరి గారు, “సంజీవదేవ్‌కి రంగులు తెలియవు,” అంటే మనసు చివుక్కుమంది. చిత్రకళ గురించి నాకేమీ తెలియదు కనుక మిన్నకుంటాను. ముగించే ముందు, సంజీవదేవ్ మొదటి పుస్తకం, “రసరేఖలు.” దాని ఎడిటింగ్ లో నార్ల చిరంజీవికి సహకరించిన ఇరవై రెండేళ్ల కుర్రాడు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చిత్రకళా విద్యార్థి తనేనంటూ, చలసాని, “అది 1963 ఏప్రిల్ నాటికి తెలుగులో చిత్రకళకు సంబంధించిన ఏకైక గ్రంథం,” అన్నారు.
హిందుత్వ నియంతృత్వ పోకడలు కలిగినది, నియంతృత్వం తో కూడినది అని వ్యాసకర్త రాణి శివ శంకర శర్మ అభిప్రాయం అని ఈ వ్యాసం చదివినపుడు నాకు తోచింది. ఈ అభిప్రాయంతో బొల్లోజు బాబా విభేదిస్తున్నారు. నేను కూడా బాబా గారితో ఏకీభవిస్తున్నాను. బాబా గారు చెప్పినట్లు హిందుత్వ సహన శీలమైనది, ప్రపంచంలోకెల్లా గొప్పది. ఇటీవలే రామాలయాన్ని నిర్మించుకొని మనం హిందుత్వను పునరుద్ధరించుకున్నాం. బొల్లోజు బాబా గారికి ధన్యవాదాలు.
హనుమంతరావుగారు చెప్పింది నిజం. చలసాని ప్రసాదరావుగారికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చి, వినికిడి పోయింది. మాటపోలేదు. అయితే తాను ఏ బేస్ లో మాట్లాడుతున్నారో తెలియక, వారు అదో గొంతుతో మాట్లాడేవారు. ఆ మాట మనకి అర్థమయ్యేదికాదు.
వారికి వినిపించదు కనుక, చిట్టీల మీద రాసి మనని చూపించమనేవారు. వారు మాత్రం రాసేవారు కాదు. మాట్లాడేవారు. అర్థంకాకపోతే వారు కూడా రాసి అప్పుడప్పుడూ చూపించేవారు.
ఈ సందర్భంగా… నిజంగా జరిగిన ఒకనొక సంఘటన ఇక్కడ చెబుతాను. ఇది అప్రస్తుతం అయినా సహోద్యోగిని సరదాగా తలచుకోవడం నాకు మహదానందం.
శంకరాభరణం సినిమా విడుదలయింది. విజయఢంకా మోగిస్తున్నది. చూడనివ్యక్తి లేడు. తానూ ఆ సినిమా చూస్తానన్నారు చలసాని. ‘అది సంగీతపరమైనది. మీకు అవసరమా?’ అని తెగించి అడగలేకపోయాను వారిని. ‘‘పదండయితే, చూద్దాం’’ అన్నాను.
సినిమాకు బయల్దేరాం.
కోఠీలోని రాయల్ థియెటర్లో ఇద్దరం సినిమాచూశాం. తర్వాత ఆ పక్కనే ఉన్న స్వీట్ స్టాల్ కి వెళ్లాం.
‘‘ఏం తింటావు?’’ అడిగారు నన్ను చలసాని.
కోవా, ఉల్లిపకోడా చూపించాను.
వాటిని రెండేసి ప్లేట్లు తెమ్మని చెప్పారు చలసాని. తింటూ ఇద్దరం మాటల్లో పడ్డాం. ఆ రోజుల్లో కాళీపట్నంగారికి సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. విరసంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఆ అవార్డు కాళీపట్నం తీసుకోవడం ఎంత వరకూ సమంజసం అన్నది చర్చ.
‘‘తప్పేం ఉంది? తీసుకోవచ్చు. ’’ అంటాను నేను. ఆ సంగతిని చేతివేలితో గాలిలో రాసి చెప్పాను. (చలసానిగారికి గాలిలో రాసినా అర్థం అయ్యేది. ) కూడదంటూ చలసాని మాట్లాడుతున్నారు.
చర్చ పాకానపడ్డది. నా భావాలన్నీ కూడా తెచ్చుకున్న న్యూస్ ప్రింట్ మీదా, గాలిలోనూ రాస్తూ రెచ్చిపోతున్నాను.
చలసాని కూడా గట్టిగా మాట్లాడుతూ, మరింతగా రెచ్చిపోతున్నారు.
ఇదంతా మాకు కోవా, పకోడీ సప్లయ్ చేసిన సర్వర్లు చూసి, నవ్వుకుంటున్నారు. వారి నవ్వునీ, అందులోని అంతరార్ధాన్నీ చలసాని గమనించారు. గమనించి, సన్నగా నవ్వుతూ…
‘‘వాళ్లు నిన్ను మూగవాడు అనుకుంటున్నారు. ’’ అన్నారు నాతో.
అంతే! నాకు నవ్వాగలేదు. నవ్వుతూనే…
‘‘ఇదిగో! మీరిద్దరూ ఇలా రండయ్యా. ’’ అని సర్వర్లను పిలిచాను.
వారు షాకయ్యారు.
శ్లోకము గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
చక్కగా ఇంటర్వ్యూ చేసినందుకు పరుచూరి, గొర్తి గార్లకు, ఇచ్చినందుకు వేలూరి గారికి, ప్రచురించినందుకు సంపాదకులకు, కృతజ్ఞతలు. అమూల్యమైన ప్రచురణ అయినా, ఒకటి రెండు నచ్చనివి ప్రస్తావిస్తాను.
“శ్రీశ్రీ అమెరికా వచ్చారా?” అని అడిగి, వెంటనే, “మీరు శ్రీశ్రీగారి మాటల్ని రేడియో స్టేషన్‌లో రికార్డు చేయించారు కదా!” అనడం అసంబద్ధంగా ఉంది.
“ప్రసాదరావుగారు మాట్లాడలేక పోయేవారు. అప్పటికే మాట పోయింది. పేపర్ మీద నోట్ లాగా రాసిస్తుండేవాడిని. … చలసాని ప్రసాదరావుగారి గురించి తెలుసుకోవాలంటే… He is a peculiar person. చాలా తక్కువమందికి తెలుసును.”
చిన్నప్పుడే చలసానికి జబ్బు వచ్చి వినికిడి పోయిందని చదివాను; అందుకే నోట్ రాసి చూపెట్టడం, మాట పోయినందుకు అయి ఉండదు. సందర్భం కళ కావున చలసాని దాంట్లో ఏం సాధించారో, చెప్తే, అడిగితే, బావుండేది.
“ఏదో తామర కొలనులో మందారం పువ్వో అదేదో… మన అంపశయ్య నవీన్ రాశాడు దానిమీద. దట్స్ నాట్ క్రిటిసిజమ్. ఆయన సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయలేదని. పోనీ నువ్వు చెయ్. ఇంతకంటే బెటర్ ట్రాన్స్‌లేషన్ నువ్వు చేసి చూపించు. (తమ్మినేని యదుకుల) భూషణ్‌తో కూడా ఇదే గొడవ. భూషణ్ బాగా చదువుకుంటాడు. ఉమాకాన్తమ్‌ని గుర్తుంచుకున్నామా? లేదు. … కావ్యం మీద పుస్తకమే రాశాడాయన. నేటికాలపు కవి ఎలావుండాలి? అనో ఏమో. చదివారా మీరా పుస్తకం? ఏమైంది, ఎవరు గుర్తున్నారు? ”
ఇక్కడ రచనలని నిర్దిష్టంగా ప్రస్తావించకపోవడం, ఇంకాస్త లోతుకు వెళ్ళి తెలుసుకుందామనుకునే చదువరులలో, గందరగోళం కలిగిస్తుంది. “తామర కొలనులో మందారం,” అంటే వెల్చేరు, “Hibiscus on the Lake,” మనసులో మెదిలింది. దానిని నవీన్ విమర్శించారా? ఎక్కడ? తమ్మినేని, “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు,” లో “వెల్చేరు… ఏమి తేల్చారు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. మందారం తేల లేదు … సరికదా,” అన్నారు. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల, “నేటికాలపు కవిత్వం,” పీఠికలో చేకూరి, “సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతం గారి నిర్ణయాలు ముఖ్యం కాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాస్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు,” అన్నారు.
“నేను సంపాదకునిగా ఉన్నన్నాళ్ళు, ఈమాటకు ఆ రకమైన స్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించాను.”
వేలూరి గారు “ఈమాట” ని న్యూయార్కర్ పత్రిక స్థాయిలో మలచాలని యత్నించడం చెప్పుకోదగ్గ విషయం. మొన్న నా వ్యాసానికి చివరి మెరుగులు దిద్దుతుండగా, సంపాదకులతో నేను ‘కామా’ ల గురించి తర్జన భర్జన పడాల్సొచ్చింది. విరామ చిహ్నాలవరకైనా, ఈమాట న్యూయార్కర్ పద్ధతిని అవలంబిస్తే బావుండు.
చివరగా, వేలూరి గారితో నాకు ఇరవై ఏళ్ళ క్రితం, డెట్రాయిట్ లో తానా సభల సందర్భంగా పరిచయం. కన్నెగంటి రామారావూ, నేనూ కాలువ పక్కన నడుస్తూ వేలూరి గారితో మాట్లాడుతుంటే, వారన్న ఓ మాట, “శ్రీశ్రీ కవిత్వం లోని మాటల కర్థం తెలియకుండానే పొగిడే వాళ్ళు అనేకం,” నాకిప్పటికీ గుర్తు. “షెల్లీ కవనపు హల్లీసకమూ,” అని తన్మయించడమే కాని, హల్లీసకం అంటే అర్థం తెలియదే అని నేను మనసులో అనుకున్నాను. అప్పటి నుండి, నా చదువు కాస్త కుంటు పడింది – అర్థం తెలియని పదం తగిలితే, నిఘంటువులో వెతక్కుండా ముందుకు పోలేక. అందుకూ, మరెన్నెటికో మార్గదర్శకులుగా ఉన్నందుకూ, శ్లాఘనీయులైన వేలూరి గారికి కృతజ్ఞతలతో,
సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/04/2025 11:28 am
ఈమాట ఒక సాహిత్యానికి సంబంధించిన పత్రిక అనుకుంటున్నాను.
ఈవ్యాసం చదివిన తరువాత కొంచెం అనుమానం కలుగుతోంది.
నేను పొరబడ్డానా? ఈమాట సాహిత్యపత్రిక (మాత్రమే) కాదా? లబ్ధప్రతిష్ఠులు ఏమి వ్రాసినా ఈమాటలో తప్పక ఆమోదించబడుతుందా?
వేలూరిగారితో ఒక సంభాషణ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
04/04/2025 12:50 am
శర్మ గారి ఉదంతం సరదాగా ఉంది. ‘అది [శంకరాభరణం] సంగీతపరమైనది. మీకు అవసరమా?’ అంటే నాకీ చలసాని రచన గుర్తొచ్చింది:
ఏడాదిన్నర క్రితం, అమెరికాలో పర్యటిస్తుండగా…!
వాషింగ్టన్ లోని మా ‘హోస్టు’ల ఇంట్లో నేనదివరకే చూసేసి, మళ్ళీ చూడాలనుకుంటున్న ఇంగ్లీషు సినిమాల వీడియో కాసెట్లనేకం కనిపించేయి.
వాటిల్లోనుంచి నాకు మరీ ఇష్టమైన నాలుగింటిని ఎన్నిక చేసేను. వాటిల్లో ఓ కాసెట్ మా ఆవిడకు చూపించి అడిగేను. “మూడు నాలుగ్గంటలు పడుతుందీ సినిమా! అద్భుతంగా ఉంటుంది గానీ, చూసే ఓపిక ఉందా?” అని అప్పుడు రాత్రి తొమ్మిది గంటలు! మేమిద్దరం పగలంతా మ్యూజియంలు, ఆర్టు గ్యాలరీలు చూసి, చూసి, నడిచి, నడిచి అలసిపోయున్నాం.
“చూద్దాం! కానీ, పేరుని బట్టి చూస్తే ఇదేదో “మ్యూజిక్” సిన్మాలా ఉందే. మరి మీరు…?” అని సందేహించిందావిడ.
“అవును! నేనీ సిన్మా ముప్పయేళ్ళ క్రిందటనుకుంటా, మొదటిసారిగా హైదరాబాదులో చూశాను. అప్పటికే నాకు బ్రహ్మచెవుడు గదా! అదే సినిమాను మళ్ళీ ఇప్పుడు చూడాలంకుంటున్నానంటే… వింటూ నువ్వింకెంతగా ఎంజాయ్ చేయగలవో గదా!” అని కాసెట్ ను విసిఆర్ లో కెక్కించాను.
నాకే ఆశ్చర్యం కలిగేలా… సుదీర్ఘమైన ఆ సినిమా పూర్తయేదాకా ఆవిడ లేవలేదు, కదల్లేదు!
“చాలా చాలా బాగుందండీ! ఇదింత బాగుంటుందని మీకెలా తెలిసిందీ?” అని ఆశ్చర్యపోయిందామె మరే ప్రపంచం నుండో ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చిపడిన దానిలా!
“నీవు చెవులతో వింటావు! నేను కళ్ళతో వింటాను” అన్నాన్నేను.
ఆ సినిమ పేరు “సౌండ్ ఆఫ్ మ్యూజిక్!”
కథ, కథనం, నటన, సంగీతం, పాటలు, ఛాయాగ్రహణం, లొకేషన్లు, అన్నీ అందంగా కలగలసిపోయిన అపురూప చిత్రమది. అక్షరాలా కళాఖండం!
ఆనాడు నన్నంతగా ఆకట్టుకున్నదా కళాత్మకతే! ఆంగ్ల చిత్రాల పట్ల అంతగా ఆసక్తి చూపని మా ఆవిడను సంభ్రమంలో ముంచి తదాత్మ్యతకు లోను చేసిందీ ఆ కళాత్మకతే!
అదీ కళ! కళ అంటే అది!
— “వాళ్ళు…,” కబుర్లు, ఈనాడు, 9-4-1997, “రసన,” చలసాని ప్రసాదరావు.
వేలూరి గారు, “సంజీవదేవ్‌కి రంగులు తెలియవు,” అంటే మనసు చివుక్కుమంది. చిత్రకళ గురించి నాకేమీ తెలియదు కనుక మిన్నకుంటాను. ముగించే ముందు, సంజీవదేవ్ మొదటి పుస్తకం, “రసరేఖలు.” దాని ఎడిటింగ్ లో నార్ల చిరంజీవికి సహకరించిన ఇరవై రెండేళ్ల కుర్రాడు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చిత్రకళా విద్యార్థి తనేనంటూ, చలసాని, “అది 1963 ఏప్రిల్ నాటికి తెలుగులో చిత్రకళకు సంబంధించిన ఏకైక గ్రంథం,” అన్నారు.
కొడవళ్ళ హనుమంతరావు
సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి Lakshmi గారి అభిప్రాయం:
04/04/2025 12:13 am
హిందుత్వ నియంతృత్వ పోకడలు కలిగినది, నియంతృత్వం తో కూడినది అని వ్యాసకర్త రాణి శివ శంకర శర్మ అభిప్రాయం అని ఈ వ్యాసం చదివినపుడు నాకు తోచింది. ఈ అభిప్రాయంతో బొల్లోజు బాబా విభేదిస్తున్నారు. నేను కూడా బాబా గారితో ఏకీభవిస్తున్నాను. బాబా గారు చెప్పినట్లు హిందుత్వ సహన శీలమైనది, ప్రపంచంలోకెల్లా గొప్పది. ఇటీవలే రామాలయాన్ని నిర్మించుకొని మనం హిందుత్వను పునరుద్ధరించుకున్నాం. బొల్లోజు బాబా గారికి ధన్యవాదాలు.
అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి Ramesh గారి అభిప్రాయం:
04/03/2025 12:54 pm
నాకు జిమ్ గ్రే గురించి ఏమీ తెలియదు కానీ ఒక మహానుభావుడి గురించి మీ ద్వారా తెలుసుకునే భాగ్యం మీ ద్వారా కలిగింది, ధన్యవాదాలు.
కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి Ramesh గారి అభిప్రాయం:
04/03/2025 12:32 pm
చక్కటి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు
ఎవరెస్ట్ బేస్ కాంప్ – 6 గురించి Ramesh గారి అభిప్రాయం:
04/03/2025 10:25 am
మీ ఎవరెస్ట్ యాత్ర చాలా అద్భుతంగా వుందండి. ఆ దేవదేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చుగాక. మీ మరిన్ని యాత్రలు మాతో పంచుకోగలగాలి, నమస్కారం.
వేలూరిగారితో ఒక సంభాషణ గురించి ఎ.ఎన్. జగన్నాథశర్మ గారి అభిప్రాయం:
04/03/2025 6:28 am
హనుమంతరావుగారు చెప్పింది నిజం. చలసాని ప్రసాదరావుగారికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చి, వినికిడి పోయింది. మాటపోలేదు. అయితే తాను ఏ బేస్ లో మాట్లాడుతున్నారో తెలియక, వారు అదో గొంతుతో మాట్లాడేవారు. ఆ మాట మనకి అర్థమయ్యేదికాదు.
వారికి వినిపించదు కనుక, చిట్టీల మీద రాసి మనని చూపించమనేవారు. వారు మాత్రం రాసేవారు కాదు. మాట్లాడేవారు. అర్థంకాకపోతే వారు కూడా రాసి అప్పుడప్పుడూ చూపించేవారు.
ఈ సందర్భంగా… నిజంగా జరిగిన ఒకనొక సంఘటన ఇక్కడ చెబుతాను. ఇది అప్రస్తుతం అయినా సహోద్యోగిని సరదాగా తలచుకోవడం నాకు మహదానందం.
శంకరాభరణం సినిమా విడుదలయింది. విజయఢంకా మోగిస్తున్నది. చూడనివ్యక్తి లేడు. తానూ ఆ సినిమా చూస్తానన్నారు చలసాని. ‘అది సంగీతపరమైనది. మీకు అవసరమా?’ అని తెగించి అడగలేకపోయాను వారిని. ‘‘పదండయితే, చూద్దాం’’ అన్నాను.
సినిమాకు బయల్దేరాం.
కోఠీలోని రాయల్ థియెటర్లో ఇద్దరం సినిమాచూశాం. తర్వాత ఆ పక్కనే ఉన్న స్వీట్ స్టాల్ కి వెళ్లాం.
‘‘ఏం తింటావు?’’ అడిగారు నన్ను చలసాని.
కోవా, ఉల్లిపకోడా చూపించాను.
వాటిని రెండేసి ప్లేట్లు తెమ్మని చెప్పారు చలసాని. తింటూ ఇద్దరం మాటల్లో పడ్డాం. ఆ రోజుల్లో కాళీపట్నంగారికి సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. విరసంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఆ అవార్డు కాళీపట్నం తీసుకోవడం ఎంత వరకూ సమంజసం అన్నది చర్చ.
‘‘తప్పేం ఉంది? తీసుకోవచ్చు. ’’ అంటాను నేను. ఆ సంగతిని చేతివేలితో గాలిలో రాసి చెప్పాను. (చలసానిగారికి గాలిలో రాసినా అర్థం అయ్యేది. ) కూడదంటూ చలసాని మాట్లాడుతున్నారు.
చర్చ పాకానపడ్డది. నా భావాలన్నీ కూడా తెచ్చుకున్న న్యూస్ ప్రింట్ మీదా, గాలిలోనూ రాస్తూ రెచ్చిపోతున్నాను.
చలసాని కూడా గట్టిగా మాట్లాడుతూ, మరింతగా రెచ్చిపోతున్నారు.
ఇదంతా మాకు కోవా, పకోడీ సప్లయ్ చేసిన సర్వర్లు చూసి, నవ్వుకుంటున్నారు. వారి నవ్వునీ, అందులోని అంతరార్ధాన్నీ చలసాని గమనించారు. గమనించి, సన్నగా నవ్వుతూ…
‘‘వాళ్లు నిన్ను మూగవాడు అనుకుంటున్నారు. ’’ అన్నారు నాతో.
అంతే! నాకు నవ్వాగలేదు. నవ్వుతూనే…
‘‘ఇదిగో! మీరిద్దరూ ఇలా రండయ్యా. ’’ అని సర్వర్లను పిలిచాను.
వారు షాకయ్యారు.
శ్లోకము గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/03/2025 2:45 am
వాగ్వల్లభ దుఃఖభంజనము పుస్తకం లింక్ ఇచ్చినందుకు VSTSayee గారికి ధన్యవాదాలు. సిధ్ధాన్నాన్నిభుజించలేని వాడిలా చింతిస్తున్నాను నాగరిలిపి చదువలేనే అని. తెలుగు లిపిలో దొరికితే మహదానందం. పోనీ యుండి ప్రాప్తించిన లేశమైన పదివేలు అనుకో మన్నాడు పోతున్న.
సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. గారి అభిప్రాయం:
04/03/2025 1:20 am
బల్లోజు బాబా గారి వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను.
వేలూరిగారితో ఒక సంభాషణ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
04/03/2025 12:52 am