Comment navigation


15780

« 1 2 3 4 5 ... 1578 »

  1. వీధి అరుగుపై… గురించి Sailaja Mithra గారి అభిప్రాయం:

    04/29/2025 5:21 am

    Really fantastic and realistic poem sir. specially finishing lines superb.

  2. ఐడెంటిటీ ఉద్యమాలు – స్త్రీలు గురించి శ్రీనివాసుడు గారి అభిప్రాయం:

    04/28/2025 11:52 pm

    “Nothing has really happened until it has been recorded”.

    – Virginia Wolf

    ఔనా? మరి, ఆవిడ కనీసం తన కాలంలో ఇంగ్లండ్‌లో ఇంకా మిగిలేవున్న Wife Selling దురాచారం గురించి ఎక్కడా వ్రాసినట్లు లేదే? ఎందుకనబ్బా? అది రికార్డ్ అవుతుందని భయమా? రికార్డ్ అయితే అది చరిత్రలో నిలచి దేశ ప్రతిష్ఠకు దెబ్బ అని వెఱపా?

  3. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి మధుసూదన్ రెడ్డి శానాల గారి అభిప్రాయం:

    04/28/2025 7:30 am

    మీ వ్యాసం చాలా బాగుంది. సులువుగా అర్థం అయ్యేలా చెబుతున్నారు. తర్వాత భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

  4. ఛందం© – తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్ గురించి రాఘవేన్ద్ర గారి అభిప్రాయం:

    04/27/2025 9:40 pm

    ఆర్యా! మీ కృషి అమోఘం, మీ సేవ అద్వితీయం, తెలుగు పద్యం అంతమొందే సమయంలో మీ సాప్ట్ వేరు తెలుగు పద్యానికి ప్రాణం పోసి బ్రతికించింది. అస్సలు ఛందో జ్ఞానం లేని నాకు ప్రతి రోజు పద్యం రాయాలి అనే ఉత్సాహాని పెంచిన గొప్ప యాప్ మీ ఛందం. దీనిని డెవలప్ చేసిన బృందాన్ని వేనోళ్ళ అభినందిస్తు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను, సెలవు, మీ రాఘవేన్ద్ర

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    04/27/2025 1:51 pm

    శ్యామల రావు గారూ:

    ఈ క్రింది వాక్యం నేను కూడా సందేహంగానే రాసాను. నేనేమీ రూఢిగా చెప్పలేదు.

    ****

    అందులో ఆనందభైరవి రాగంలో స్వరపరిచిన ఓ పాట (“మధురానగరిలో చల్లలమ్మబోదు” పాట అని అంటారు. ఎంతరకూ ఇది నిజమో ధృవీకరించడం కష్టం) వారినత్తుకుంది.

    ****
    ఒక్కో పుస్తకంలో ఒక్కోలా వుంది.

    త్యాగరాజు ఆ కీర్తన స్వరపరచలేదనడానికి నా కేమీ అభ్యంతరం లేదు.

    నాక్కూడా ఆధారాలు పుస్తకాలే.

    ఈ విషయం ఇక్కడితే ముగిస్తే బాగుంటుందన్నది నా అభ్యర్థన.

    నేను అచ్చు వేసిన పుస్తకంలో ఇది సవరిస్తాను.

    నేనేమీ మిమ్మల్ని తప్పు పట్టడం లేదు.

    -సాయి బ్రహ్మానందం

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:

    04/27/2025 7:46 am

    మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నని, నేను పలానా పుస్తకంలోనో పత్రికలోనో చదివానని బుకాయించటం లేదని బ్రహ్మానందం గారు నమ్మగలిగితే చాలా ధన్యుడిని. వికీపీడియాలో ఉన్నదంతా ప్రామాణికమూ, వాస్తవమూ అని నమ్మడం కష్టం అన్నమాట అక్షరసత్యం. అసలు వెబ్ ఆధారంగా తెలియవచ్చేవి చాలావరకు నమ్మశక్యం కానివే ఉంటున్నాయేమో కూడాను.

    నెట్టింట గాలించగా హిండూపత్రిక వ్యాసం ఒకటి ఒకటి రచయిత పేరూ మెయిల్ ఐడీతో సహా ఉన్నది, ఈవిషయం గురించి ప్రస్తావించేది కంటబడింది. ఆవ్యాసం తాలూకు లింక్

    https://www.thehindu.com/features/friday-review/music/a-voice-to-remember/article3686247.ece/amp

    ముఖ్యంగా నేను ఏదో సంగీతం విని కొంచెం ఆనందించగల వాడినే కాని ఆరంగంంలో పాండిత్యప్రతాపాలేమీ ఉన్నవాడిని కాను. ఒకవేళ మధురానగరిలో పాట వేరొకరిదో త్యాగరాజ స్వామిదో అని బ్రహ్మానందం గారు ప్రమాణికమైన ఆధారం వద్ద చదివి ఉంటే ఉండవచ్చును. నా అవివేకం ఉంటే మన్నించగలరు. ఏదో నా యెఱుకకు వచ్చిన విషయం మనవి చేసాను కాని అంతకంటే ఏమీ లేదు.

  7. మౌనంబంతట మాటలాడె… గురించి పరిమి శ్రీరామనాథ్ గారి అభిప్రాయం:

    04/26/2025 7:06 am

    ఈ కథావస్తువు వన్నెను అరగదీయడంలో మానవాళి ఓడిపోతూనే ఉన్నది. నూత్నరుచితో సాక్షాత్కరించిన ఈ పద్యాలు సహృదయహృదయవనాలలో కొత్త అంట్లు కట్టగలవు. రాబోయే కవితాభాగాలకోసం వేయికన్నులతో ఎదురుచూస్తాను. కవితల్లజులు శ్రీకామేశ్వరరావుగారికి నమఃపూర్వక శుభాకాంక్షలు.

  8. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:

    04/24/2025 11:58 pm

    ‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నన్నది నా అభిప్రాయం కాదండీ. మీరన్నట్లు ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన అది చిత్తూరు వారి రచన అనే అభిప్రాయం ప్రామాణికం అవదు కాని ఆంధ్రజ్యోతిలోని ఆ వ్యాసంలో ఆ మాట చెప్పినది సాక్షాత్తూ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గారి కుమార్తె రేవతీ రత్నస్వామి గారు. నిజానికి జ్యోతిలో వచ్చినది ఒక వ్యాసమో ఆవిడతో ముఖాముఖీయో నాకు ఇప్పుడు గుర్తులేదు. వచ్చి ఇరవైయేళ్ళదాకా అయ్యుండవచ్చును. ఆంధ్రజ్యోతివారి నుండి ఆ వ్యాసం సేకరించగలిగితే స్పష్టత వస్తుంది.

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    04/24/2025 3:39 pm

    తాడిగడప శ్యామలరావు గారూ,

    ప్రహ్లాద భక్తి విజయము లోని పద్యంలో ఛందస్సు పరంగా సవరణలు చూపించినందుకు ధన్యవాదాలు.

    ‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నండీ — అన్నది మీ అభిప్రాయం.

    ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన అది ప్రామాణికం అవదు.

    ఇది మీ అభిప్రాయం. నేను ఖండించి, మీకు నిర్ధారణ చేయలేను. త్యాగరాజు గురించి రాసిందీ, కీర్తనలు సేకరించింది ఆయన అనుంగు శిష్యుడు –వేంకట రమణ భాగవతార్, వారి కొడుకు కృష్ణ భాగవతార్. త్యాగరాజు 1848 వరకూ జీవించే ఉన్నారు. ఆనంద భైరవి రాగం గురించి త్యాగరాజు పరంగా వచ్చిన సంఘటన నేను తంజావూరు గ్రంధాలయంలో ఉన్న ప్రతిల్లో కూడా చూసాను. అక్కడ ఫోటోలు తీయనివ్వరు. కాబట్టి, చెప్పడం మినహాయించి, ఎవర్నీ నమ్మించలేను.

  10. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Sai Brahmanandam గారి అభిప్రాయం:

    04/24/2025 3:21 pm

    రామకృష్ణ గారూ,

    ‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారు కాదా? 1930-40 ల్లో అయుండచ్చు.

    మనకి సరైన సాహిత్య చరిత్ర లేదు. అటువంటిదే సంగీత చరిత్ర కూడా.

    కల్పిత కథలూ, సంఘటనలూ ప్రముఖులతో ముడివేసి చెప్పడం, అవి జరిగినప్పుడు తాము పక్కనే ఉండి పర్యవేక్షించినట్లు ఢంకా భజాయిస్తూ చెప్పడం ఒక రివాజుగా మారింది.

    అనేక సంగీత కృతులూ, కీర్తనలకి ప్రక్షిప్తాలు వున్నాయి.

    నేను కూడా ఒక త్యాగరాజు కృతి తీసుకొని ఒక చరణం రాసి, నేను పలానా పుస్తకంలో చదివానని బుకాయించచ్చు.

    వికీపీడియాలో ఉన్నదంతా ప్రామాణికమూ, వాస్తవమూ అని నమ్మడం కష్టం. ఎందుకంటే, వికీలో ఎవరైనా రాయచ్చు, సవరించే అవకాశం కూడా వుంది. మీరు మెంబరు కావాలంతే.

    నేను త్యాగరాజు వ్యాస పరంపర రాసిన క్రమంలో చాలా పుస్తకాలు సేకరించాను. తంజావూరు సరస్వతీ మహలు లైబ్రరీలో కూడా చాలా పుస్తకాలూ, తాళపత్రాలూ చూసాను. చూడ్డమే కాదు, అక్కడ చదివాను కూడా.

« 1 2 3 4 5 ... 1578 »