పెద్దక్క ప్రయాణం

పెద్దక్క ప్రయాణం – పిడిఎఫ్ ప్రతి.


పెద్దక్క ప్రయాణం (2014)
చిన్నమ్మ, విజ్జి, జాజి

ప్రయాణ౦ దగ్గర పడి౦దని, ఇక తిరిగిరామనీ తెలిస్తే సర్దుకోవడం సాధ్యమేనా? హఠాత్తుగా వెళ్ళిపోవాల్సివస్తే అది వేరు. ఎ౦త నిబ్బరం ఎంత స్థైర్యం కావాలి ము౦దు నోటీసుని అ౦దుకోడానికి! తను కన్నవాళ్ళు తనని కన్నవాళ్ళు కళ్ళము౦దు వుండగా వెళ్ళిపోవాలి అని తెలిస్తే ‘భయమేమి లేదే’ అనడానికి! అక్కచెల్లెళ్ళలో అమాయకురాలు అనుకున్న అక్క మనకందరికీ ప్రయాణానికి సిద్ధపడటం ఎలా నేర్పించింది? జీవితేచ్ఛ జీవించడంలోనే కాదు, ముగించడంలోనూ వుంటుందని ఒక కొత్తపాఠ౦ నేర్పింది. జీవితాన్ని హుందాగా గడపడానికి అవసరమైన పాఠాల్లో చివరి పాఠం కదా అది! మహాయోగులకి సాధ్యమేమో ప్రయాణపు అ౦చు మీద ధైర్యంగా నిలబడట౦ అనుకునేవాళ్ళం. ఇప్పుడు తెలిసింది ధైర్యంగా ప్రయాణం ముగించడమే మహాయోగమని.

చివరి మజిలీలో ఉన్నప్పుడే ఆమె నాకు తెలిసింది. తెలిసీ కొన్నీ తెలియకుండా కొన్నీ ఆమెతో ప్రతి అడుగు మేము కూడా వేశాము చివరిదాకా. నీ ప్రయాణం నువ్వు ముగించావు మా ముగి౦పులని మేము ఎలా రచి౦చుకోవాలో నేర్పావు. ఏకలవ్య శిష్యులం నీకిప్పుడు — మా ప్రయాణపు చివరి మెట్టు మీద మనసులో నీ జ్ఞాపకంతో తల ఎత్తుకు నిల్చుంటాము.

– గోపరాజు సుధ