ఎండ

వంటగదిలో ఎన్ని

తంటాలు ఎండతో!

ఏటవాలు కిరణాలు

వేటగాని చూపులా!

వెలిగిపోయేవి

ధూళికణాలు..

జ్ఞాపకముందా?

ఊపిరాడేది కాదు పొగలో

పదునెక్కని కిరణాలు

సదయగా

కిటికీ సందుల్లో తొంగిచూస్తే

చిటికెలో తెరచివేయి తలుపులనీ!

ఎదురు గోడ మీద

మృదువైన నీ నీడను చిత్రించనీ!

గడప దాటకు

పొడవైన నీడతో

నడవాల్సి వుంటుంది

చూడగలవు సూర్యుణ్ణి!

ఎండనంతా త్యజించి

కొండల్లో పడివున్న బాలుణ్ణి!

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...