Comment navigation


15872

« 1 ... 1015 1016 1017 1018 1019 ... 1588 »

  1. కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    11/05/2011 10:52 am

    ఇది బహుశా పరుచూరి శ్రీనివాస్ మాత్రమే చెప్పగలిగిన విషయం. పూనా ఫిల్మ్ ఇన్స్‌స్టిట్యూట్ film archivesలో కూడా ప్రయత్నించవచ్చు.

  2. ప్రజాపతి గురించి Bhavani గారి అభిప్రాయం:

    11/05/2011 4:21 am

    కథనం చాలా బాగుంది. ఐతే తనమీద విప్లవించిన బౌద్ధాన్ని కూడా తన ధృతరాష్ట్రకౌగిలి లోనికి లాక్కున్న హిందూసామ్రాజ్యవాద ధోరణిని కూడా బహుశా తెలియకుండానే రచయిత ప్రదర్శించారు.

  3. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    11/05/2011 1:50 am

    “ఆఖరి తెలుగు సంగీత వాగ్గేయకారుడేమో కూడానూ” లాంటి నిస్పృహని ప్రకటించడం చాలా తప్పు బ్రహ్మానందమ్ గారూ! ఆగామి కాలాన్ని మనం నిర్వచించలేము ఎప్పుడూ!! మన కళ్ళముందు కనిపించేదే స్థిరమూ శాశ్వతమూ ఎప్పుడూ కావు. బాల మురళికి ఉన్న పేరు కారణంగా ఆయన రచనలు [వాటిల్లో సాహిత్యం ఏమీ లేక పోయినా] అచ్చుపడడం జరిగింది. ఇందుకూ ఆయన తెలుగువాడు అయినందువల్ల అన్నది కారణం కానఖ్ఖరలేదు. సాహిత్యం అమోఘమైనది అయితే అదే నిలబడుతుంది. లేనప్పుడూ ఆయన శిష్య గణం వరకే అది పరిమితమైపోతుంది. దానికేం? అంత మాత్రాన ఆయన ప్రతిభకి కొరతా లేదు. ప్రతీ వాళ్ళకీ కొన్ని “లౌల్యాలు” ఉంటాయి. అందులో “కవి” ని అన్పించుకోవాలనే లౌల్యం ఉన్న వాళ్లని మనం ఎందరినో చూస్తూంటాం!! చిన్నాచితకా వాళ్ళే దీనికోసం తాపత్రయపడి ప్రయత్నాలు చేసుకుంటూండగా మరి సంగీతంలో గొప్ప మేధావి అయిన బాలమురళి ఒక్క “సూర్యకాంతి” వైపు అయినా వెళ్ళడా??:)

    ఇంక ఆయన చెప్పిన ఒక మాట ఆయన విషయలోనే కాదు తెలుగునాట చాలమంది విషయంలో పరమ సత్యం. అది ఏ గొప్పవ్యక్తికీ వాళ్ళ జీవితకాలంలో వాళ్ళకి దక్కవలసిన పురస్కారం గానీ ఆదరణ గానీ తెలుగునేల మీద దక్కకపోవడం అన్నది సత్యదూరం కాదు. తెలుగులో తెలిసి తెలిసీ కావాలనే మీడియోకర్ టాలెంట్ ని నెత్తికెత్తుకోవడం చేస్తూంటారు. ఇందులో వాళ్ళవాళ్ళ ప్రయోజనాలుంటాయి. ఇటువంటివి కళాకారులకి వికృతిగా కన్పిస్తాయి. బాలమురళీ చికాకు ఈ విషయలో చాలా నిజం మరి. డబ్బులున్న వాళ్లకి అభిరుచి ఉండదు. అభిరుచి ఉన్నవాళ్ళు రాజకీయాలు కూడా చేయగలిగిన వాళ్ళై ఉండాలి. చాలావరకూ ఈ రెండూ కలిసి ఉండేవే కావు.

    మీరు వాగ్గేయకారులనించి సాహిత్యాన్ని ఆశించకూడదని అంటారు. అని అన్నారు. కానీ అన్నమయ్య సంకీర్తనలు ఈ అభిప్రాయాన్ని తోసిరాజన్నాయి కదా?? తెలుగున గొప్ప సాహిత్యవేత్త ఎవరన్నా ఉంటే అది ముందు అన్నమయ్యే!! వేంకటమఖిని కూడా మీరు తెలుగువాడిని చేసేసేరు. కానీ చతుర్దండి ప్రకాశికని రాసిన వేంకటమఖి కన్నడిగుడు. తళ్ళికోట యుధ్ధానంతరం విజయనగర పట్టణం నేలకూలాకా మిగిలిన ప్రజ వలసలు పోయినప్పుడు సంగీత విద్వాంసులు కొందరు మైసూరు, మరి కొందరు తంజావూరు రాజ్యాలకి వలస వెళ్ళిపోయారు. అలా శరభోజి ఆస్థానం లోకి వెళ్ళిన వాళ్ళలో వేంకటమఖి తండ్రి కూడా ఉన్నాడు.

    రమ.

  4. పలుకుబడి: సంఖ్యాపదాలు – 3 గురించి Raja Piduri గారి అభిప్రాయం:

    11/05/2011 1:38 am

    పదింబదిగ (లేదా) పది పదికి (లేదా) పదివేలకు : ఈ ప్రయోగాలకి “అన్ని విధాల, గట్టిగా, చక్కగా” అన్న అర్థాలిచ్చాడు బ్రౌన్ గారు. అది ఇక్కడ సరిపోతుందా సార్?

  5. కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    11/05/2011 12:11 am

    Raja garu. Your observations are very perceptive.
    చందమామతో బాటుగా కినిమా బాధ్యతలు కూడా చేపట్టినందువల్లనేమో గాని ఈ వ్యాసంలో కొంతభాగం మరెవరో రాసి జత చేసినట్టుగా అనిపించింది. పత్రికకే తప్ప రచయితలకు పేరు రాకూడదనే చక్రపాణి పట్టింపు కారణంగా పూర్తిగా ఒకరే రాయాలనే నియమం పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. చందమామలో విచిత్ర కవలలు అనే సీరియల్ రాసిన రాజారావు గురించి కూడా ఎవరికీ తెలియదు.

  6. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి srinivasaraov,khammam గారి అభిప్రాయం:

    11/04/2011 3:48 pm

    getting two feelings happy and misery. It is our curse for not exploiting him.

  7. కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి srinivasaraov,khammam గారి అభిప్రాయం:

    11/04/2011 3:34 pm

    Sir,

    My father acted in JEEVANNMUKTI, BALANAGAMMA(GEMINI), BHUKAILAS(1st), and CHANDIKA. Can I get photos or songs of Master ViSWAM. It’s the greatest help for me.Or, any suggestions please?

  8. పహాడీ రాగం అందాలు గురించి srinivasaraov,khammam గారి అభిప్రాయం:

    11/04/2011 3:20 pm

    I eagerly await articles from KRP, Paruchuri. I am one such person who uses list of ragas (sent) by Paruchuri and eemaata essays of KRP and trying something on my old harmonium. Please do continue sir. I am able to know something from the experiences of sri KRP. Thanq very much sir, for sharing information. People like me are benefiting from your incomparable analytical articles.

  9. తిక్కన భారతంలో పలుకులపొందు గురించి Tahataha గారి అభిప్రాయం:

    11/04/2011 3:07 pm

    నా ఒళ్ళు పులకించిన అభిప్రాయాన్ని సహృదయంతో అర్థం చేసుకున్న మీకు కృతజ్ఞతలు. విశ్వనాథ చెళ్ళ పిళ్ళ వారిని గురించి రాస్తూ “…సమీచీన్య పథ్యా గతున్డై మరియు తానై కైత కొగ్గన్…” అని రాసారు. ఈ పదబంధానికి నిజమైన అర్థం ఆచార్య భద్రిరాజు వ్యాసం సోదాహరణంగా సోపపత్తికంగా తెలియజేసింది. వారికి నా ధన్యవాదాలు. అలా సామీచీన్య పథ్యా గతుడై మరియు తానై కైత కొగ్గిన మొట్ట మొదటి తెలుగు కవి తిక్కనే అని గూడా తెలిసింది.

  10. లోపలి పిలుపు విని గురించి Raja Piduri గారి అభిప్రాయం:

    11/04/2011 2:35 pm

    మళ్ళీ మళ్ళీ వింటున్నాము ప్రసాద్ గారూ !
    మునుపు శతాబ్దాల నించి ఎవరో తత్వాన్వేషకులు మహతి మీటుకుంటూ మీ హృదయాల్లోంచీ నరాల్లోంచీ
    తీగ సాగారనిపిస్తోంది.
    పదాలు అర్థమయ్యీ కాకుండా అంతా ఏదో మార్మికం గా ఉంది.
    ఊపని ఊయల , రాజేయని అగ్గి, రాత్రి పవలు దీని చిచ్చు….

    ఆగిన తలపుల నడుమన నీ అడుగుల సడి విన్నట్లు ..

    కృతజ్ఞతలు స్వామీ !

« 1 ... 1015 1016 1017 1018 1019 ... 1588 »