రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

క్రీడాభిరామము:3 వ భాగం

రచన: వినుకొండ వల్లభరాయడు

కర్ణాటి

కటిభారంబును చన్నుదోయి భరమున్‌ గల్పించె నా బ్రహ్మ పి
న్నటి కౌదీగకు మున్న యిప్డు విమలార్ణఃపూర్ణమై యున్న యీ
ఘటిభారం బొక డెక్కుడయ్యె ననినన్‌ కర్ణాటి క్రాల్గన్నులన్‌
బటి తాళింపుచు నవ్వె నీలకబరీభారంబు కంపింపగాన్‌

అనుచు గోవింద మంచన శర్మ నర్మసఖుండగు టిట్టిభుండును దానును హట్టమార్గంబున జనునప్పుడు

జిగురుటుండలు నించి డాచేతి యందు
పెద్ద యేనుగుదంతంబు పెట్టె బెట్టి
యింతులకు బ్రీతిగా మైలసంత లోన
సుసరభేత్తని ఘోషించె జోటి యోర్తు

ఇది యేమి ఘోషించుచున్నయది కిరాటకులరత్నంబ! నీవు తేటపడ నెరింగి మాకు నెరింగింపు మనుచు మంచనశర్మ యడిన

ముసిముసినవ్వుతో నతని మోము గనుంగొని వైశ్యు డిట్లనున్‌
రసికకులావతంసుడవు బ్రాహ్మణ యింతకుమున్నెరుంగవే
యసమశరాలయంబునను హత్తిన వెండ్రుక కప్పు వోవగా
వసరు సమీరణం బయిన వేడుక మందిది కొందు రంగనల్‌

కమఠావతారంబు గైకొన్న దైత్యారి
కమనీయ చరమ భాగంబు వోలె
నాదియుగంబునం దావిర్భవించిన
జిననాథదేవుని శిరసు వోలె
కసటు వోవగ తోమి కడిగి బోరగిలంగ
బెట్టిన తామ్రంపు బిందె వోలె
గంగ మట్టియ తోడ సాంగత్య మెడలిన
నునుపారు ముని మిట్టనుదురు వోలె

చిరుత ప్రాయంపునాటి సజ్జికపు జాయ
తొలు సమర్తయ కాలంపు విలసనమున
తరుణులకు పంచబాణ మందిరములమరు
సుసరభేత్తను నీ మందు సోకినపుడు

ఇది నిర్యాస మయంబును సరభేదన సమర్థంబును నగుటం జేసి సుసరభేత్తను నామంబు దీనికిం గలిగె కామనిలయాఘాట రోమాటవీ సముత్పాటన పరిపాటికై పాటలగంధులు దీనిం బాటింతు రనుచు నెరింగించి యట పోవంబోవ ముందంట వెలిపాళెంబు మధ్యప్రదేశంబున హాలికవాటి యందు నొక్క చక్కని జవరాలు కట్టెర్ర తొగరుం గర్రల యొల్లియయెర్ర కలనితంబభారంబున నమర్చి బాలార్క కిరణ సంపర్కంబున చాంపేయ కుసుమ చ్ఛద చ్ఛాయా దాయాదంబులైన యవయవంబులు మిసమిస మెరవం కుక్కుటాసనంబునం గూర్చుండి

పామరభామ

కండుకకేళి సల్పెడు ప్రకారమునం బురుషాయితక్రియా
తాండవరేఖ చూపెడు విధంబున పామరభామ లేత యీ
రెండ ప్రభాతవేళ రచియించె నితంబభరంబు జన్నులున్‌
కుండలముల్‌ కురుల్‌ కదల గోమయపిండము లింటి ముంగిటన్‌

అప్పామరభామారత్నంబు నుద్దేశించి

పొలపములు లేవు కరివంక బొమల యందు
చిన్ని నగవులు లేవు లేజెక్కులందు
కలికితనములు లేవు క్రాల్గన్నులందు
కాపుటిల్లాండ్ర కిట్టి మౌగ్య్ధముల యొప్పు

అటచని వీథీవిటంకంబున టిట్టిభుండు విటపేటికా ప్రకామ ఘటిత కృకాటికా నికట చేటికానుయాత యగు కర్ణాటాంగనం గనుంగొని

కర్ణాటాంగన

కుసుమం బెట్టిన చీరకొంగు వొలయం గ్రొవ్వారు పాలిండ్లపై
ద్రిసరంబుల్‌ పొలుపార వేణి యవటూద్దేశంబుతో రాయ న
ప్పస మెవ్వాడొ యొకండు రాత్రి సురతప్రౌఢిం దనుం దేల్చినన్‌
వసివాళ్‌ వాడుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనం జూచితే

వాహకుండెక్కి విడిచిన వారువంపు
గొదమయును బోలి రతికేళి మదము డిగ్గి
అలసభావంబు తోడ కర్ణాటవేశ్య
వచ్చుచున్నది యదె విప్రవర్య కంటె

ఈమరి యింక నొక్కమరి యింకొకమా రికనొక్కమారు నా
నోములపంటగా యనుచు నోవుల బెట్టుచు రే యొకండు నా
ల్జాములు దీనితో కుసుమసాయక తంత్రము సల్పబోలు లే
దా మృగశాబనేత్ర యఖిలాంగకముల్‌ వసివాళ్ళు వాడునే

అనిన మందస్మితంబుతో గోవింద మంచనశర్మ నర్మగర్భంబుగా దర్భాంకురాలంకృతంబులగు తన కరపంకజంబులం గర్ణపుటంబులు ముట్టుకొని పూతిమాషగోత్రంబును మంచన నామధేయంబునుం జెప్పి నమస్కరించి యిట్లనియె

పంచారించిన నీ పయోధరము లాస్ఫాలింతునో లేతబొ
మ్మంచున్‌ గెంజిగురాకుమోవి ణిసిధాత్వర్థం బనుష్టింతునో
పంచాస్త్రోపనిష ద్రహస్య పరమబ్రహ్మ స్వరూపంబు నీ
కాంచీదామ పదంబు ముట్టుదునొ యో కర్ణాట తాటంకిణీ

వ్రాలని నీ చన్నులతో
వ్రాలెడు జక్కవలు సరియె వలలం బెట్టం
జాలెడు నీ కన్నులతో
బాలకి సదృశములె వలలబడు మత్స్యంబుల్‌

చాటుప్రౌఢి బిసాళమాడెదవు కాసల్నాటి బాపండవో
శాటీహాటక నిష్కముల్‌ వెలిగ జంఝాటంబు చాలించు క
ర్ణాట స్త్రీలు కటారికత్తియలటే రాపాడగా బట్టగా
డా టా లీడ గుణింపరాదు పెరచోటం బోలె బైపాటునన్‌

దిట్టబాపండు నడువీథి దెగడి పలికె
గూట మీక్షింప దెమ్ము కిరాట నేడు
పన్నిదము వీని మెడనున్న జన్నిదములు
సవరగా గ్రుత్తు క్రొత్త పుంజాలదండ

అనుటయు విప్రుం డిట్లనియె

ముసుగు వెట్టిన నేమి ముత్యాల కమ్మల
క్రొమ్మించు లీలలు గులుకరించె
మోము వంచిన నేమి మొలకనవ్వుల కాంతి
చెక్కుటద్దములపై జీరువారె
చూడకుండిన నేమి సొబగురెప్పల మించి
తేట వాల్మెరుగులు దిచ్చరించె
చాటు చేసిన నేమి చక్రవాకుల బోలు
పాలిండ్ల మెరుగులు బయలుపడియె

సిగ్గు నటియించి మావేడ్క చిన్నబుచ్చి
యేల యిటు పిసాళించె దిందేమి సిద్ధి
కాముసామ్రాజ్య పట్టంబు గట్టి నన్ను
కౌగిలింపంగ గదవె యో కరణకాంత

అని చిరునవ్వు నవ్వుచు గోవింద మంచనశర్మ నర్మసఖుండును దానును నట పోవబోవ ముందట

జూదము

పరివేష్టించి ప్రజాకదంబకము పైపై వ్రాలి వీక్షింపగా
బరహస్తంబున నొత్తుకాండ్రు నపలాపప్రౌఢి బోధింప పా
మరులై పన్నిదమాడి యోడి మరి దుర్మానంబుతో నాటగొ
ల్పిరి వేశ్యా వలయాభిసంవళిత మువ్విళ్ళూర్చె గోవిందునిన్‌

సంగాసంగ జయాజయంబు పరిహాస ప్రస్ఫుటాశ్లీల భా
సాంగం బాకలితాంతరా వలయ కక్ష్యాభాగ ముద్రాలస
ద్భంగీ నిష్టిత కాష్ఠ శంకుకము పాపద్యూత మీ పన్నిదం
బంగీకారము సేయువారి మొలలం బ్రాపించు కౌపీనముల్‌

నీకునౌ నీకునౌ నంచు నెమకి నెమకి
ముగుదలగు వారి భ్రమియించి మోసపుచ్చు
పశ్యతోహరు డత్యంత పాపబుద్ధి
పట్టణములో దగుల్పరి పందెగాడు

అనుచు నట ముందట శతానంద గేహినీ కరరుహ ప్రరోహ శిఖర ముఖర వీణాక్వాణ పాణింధమం బైన మధురస్వరంబున

కరణకాంత

విజ్జోడుపడ విడ్డ వెండ్రుకజందెంబు
వలిగుబ్బపాలిండ్ల కెలకు లొరయ
కరమూలమున వెండి మొరవంక కడియంబు
మూడుమూలల లింగముద్ర లొత్త
జంగాళముగ బిందె సవరించి కట్టిన
మడు గొంటిపొరను లోదొడలు మెరయ
పలితంపు విచ్చుటాకుల దుద్దుగమ్మలు
నిద్దంపు చెక్కుల నీడజూడ

నోరుగంటి పురములో నోరగ్రంత
పెద్ద యెలుగున నమ్మె సంపెంగనూనె
కోకిలము పంచమశ్రుతి గొసరినట్లు
కనుమయవ్వలి దేశంబు కరణకాంత

గానులకన్నె

పలికినప్పుడు తేనియ లొలికిపడెడు
జళుకుచూపుల క్రొమ్మించు లులుకుపడెడు
ములికినాటిది కాబోలు చెలి కిరాట
కలికి చిలుకల కొలికి యీ తెలికిజోటి

ఈ నళినాక్షి దా దిరుపుటెద్దు ప్రతోదము మోసి రొప్పుచున్‌
గానుగపట్టెపై దిరుగ గట్టిడి టిట్టిభ మందరాద్రి మం
థానక మథ్యమాన తిమిధామ జలభ్రమి మండలం బధి
ష్టానముగా భ్రమించు నల సంపదచేడియ బోలకుండెనే

మీనవిలోచనంబులును మీటిన ఖంగను గుబ్బచన్ను లిం
పైన వచోమృతంబు సొగసైన మదాలస మందయానముం
గా నొనరించి దీని గణికామణి జేయక నిర్దయాత్ముడై
గానులదాని జేసిన వికారవిధిం తలమొత్తగా దగున్‌

అట యుత్తరంబునం గత్తెరనొత్తి పెక్కువన్నెల పొత్తుల బహువిధనర్తనల హత్తించి యెత్తి కట్టిన పూగొత్తులు మత్తకోకిల కలహంస దాత్యూహ వ్యూహంబులుం గలిగిన మోహరివాడ యందు

కుట్రపువాడు

కొలుచును జేనవెట్టి కుచకుంభయుగం బెగడిగ్గ కన్ను క్రే
నల బరికించు గక్షముల వైచును దృష్టులు మాటిమాటికిం
గలికితనంబునం దరచుగా నగు సౌచికపల్లవుండు గం
చెల వెస గుట్టియీడు వెలచేడియకున్‌ విషయాభిలాషియై

అనుచు నవ్వాడ గడచి యట యుత్తరంబునను నప్పుడు ముందట నొక యింటి మరుంగున మచ్చెకంటిం బొడగని

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • క్రీడాభిరామము:6 వ భాగం
  • క్రీడాభిరామము:7 వ భాగం
  • క్రీడాభిరామము:4 వ భాగం
  • క్రీడాభిరామము:1 వ భాగం
  • క్రీడాభిరామము:3 వ భాగం

ఇటువంటివే…

  1. క్రీడాభిరామము:5 వ భాగం
  2. క్రీడాభిరామము:2 వ భాగం
  3. క్రీడాభిరామము:7 వ భాగం
  4. క్రీడాభిరామము:6 వ భాగం
  5. క్రీడాభిరామము:4 వ భాగం

సంచికలో ...

  • రుబాయీలు
  • చెట్లు
  • కత్తి పడవలు
  • కవిత్వీకరణ కొన్ని సంగతులు
  • విన్నపం
  • శిశిర గీతం
  • స్వప్నవాసవదత్తం
  • ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక
  • మన పేర్లు, ఇంటి పేర్లు
  • మీ ఘంటసాల
  • సంకల్పం
  • స్పర్శ
  • ఒక్కడినై..
  • కవి హృదయం
  • కోరిక
  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3
  • నిశ్చయం
  • మన దీపావళి కథ
  • సశేషమ్‌
  • 1998
  • 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
  • e తరమ్‌ (నాటిక )
  • అతిథి
  • అదే నేను
  • అనాచరణ
  • అనురాగ దగ్ధ సమాధి
  • ఆకలి నిజాయితీ
  • ఆవాహన
  • ఆశాగ్ని రేణువు
  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల
  • ఉక్కు శిశువు
  • ఉన్మాద ప్రకృతి
  • ఊరెడుతున్నాను
  • ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  • ఓటమిలోని గెలుపు
  • కలిశాం
  • గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం
  • చెప్పులు
  • జననం
  • జన్మదిన రాహిత్యం
  • జీవన తీరాలు
  • జ్ఞాపకాల వాసన
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • టైటానిక్‌
  • డబ్బు పంజరం
  • తుపాకి కాల్పులు
  • త్రిశంకు లోకం
  • దేవుడూ
  • దేహాత్మ
  • నటించగల ప్రాణి
  • నిద్రపోతు జాతి
  • నిర్విరామం
  • నివాసం
  • పసిఁడిపల్లకి
  • పాపం ఈ లోకం
  • బహు ‘మతులు’
  • బహుశా ఇంకో నిజం
  • బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
  • భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

క్రీడాభిరామము:2 వ భాగం
క్రీడాభిరామము:4 వ భాగం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.