స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాం.
అక్టోబర్ 2025
తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న కథలు ప్రతి సమాజంలోనూ ఉంటాయి. వారి సమాజంలోని ఆచార వ్యవహారాలను, వారు నమ్మే విలువలను కథలుగా చెప్పుకొనే పురాగాథలే వారి తాతముత్తాతలు అందజేసిన వారసత్వ సంపదగా భావించడం కద్దు. అనేక తరాలుగా చెప్పుకునే ఇటువంటి పురాణాలు, ఇతిహాసాలు కేవలం కాలక్షేపానికి కాదు — అవి ఆ సమాజపు నైతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక చింతనలలో భావసమైక్యతను కలిగించే మూలస్తంభాలు. జీవితపు మూలాలను విశ్లేషించడానికి, సత్యాసత్యాల స్వభావాన్ని అన్వేషించడానికి, మానవ సంబంధాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ పురాగాథలు మూలప్రాతిపదికలుగా పనిచేస్తాయి. భారతదేశంలో పురాణాలు, ఇతిహాసాలు కూడా సమాజంలోని ధర్మాధర్మాలను, నైతిక నియమాలను సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా కథల రూపంలో వివరించడమే వాటి ముఖ్యోద్దేశ్యమని ప్రకటించాయి (“కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ ఇతి భారతమాఖ్యానం కృపయా మునినా కృతమ్” — భాగవతం). భారతదేశంలోని పురాణాలే కాదు, గ్రీకు, జర్మన్, కెల్టిక్ జాతులతో సహా అనేక నాగరిక సమాజాలకు వారివైన పురాగాథలున్నాయి. అయితే, ఆధునిక పాశ్చాత్య ప్రపంచం తమ పూర్వ పురాగాథలను తృణీకరించడం ద్వారా ప్రమాదకరమైన పౌరాణిక శూన్యాన్ని (mythological vacuum) సృష్టించిందని ప్రపంచ సమాజాలలో పురాగాథలపై లోతైన పరిశోధనలు చేసిన జోసెఫ్ క్యాంప్‌బెల్ సిద్ధాంతీకరించాడు. దీనివల్ల ప్రజలు సరైన మానసిక మార్గనిర్దేశం లేక ఆధునిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ప్రతిభావంతంగా ఎదుర్కోలేకపోతున్నారని ఆయన వాపోయాడు. అయితే, ఈ పురాగాథలు తమ ప్రభావాన్ని కోల్పోకుండా, ఎప్పటికీ మార్గనిర్దేశం చేయాలంటే, వాటిని సమకాలీన భాషలో, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా నిరంతరం పునఃసృష్టించాలని జోసెఫ్ క్యాంప్‌బెల్ ప్రతిపాదన. లేకపోతే, అవి తమ శక్తిని కోల్పోయి, నేటి తరానికి మార్గదర్శనం చేయడంలో విఫలమై, కేవలం ప్రాచీన కళాఖండాలుగా మిగిలిపోతాయి. ఒక సమాజం తన పురాగాథలను అక్షరాలా నిజమని (literal truths అని) నమ్మడం మొదలుపెట్టినప్పుడు, అవి తమ ప్రతీకాత్మక శక్తిని కోల్పోతాయని ఆయన సిద్ధాంతం. మారుతున్న కాలంతో పాటు, భాషా, కథల నేపథ్యం, యుగధర్మాలు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. కాబట్టి, కొత్త యుగానికి, కొత్త అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదర్శాలను విప్పి చెప్పే కొత్త కథలు కూడా ప్రతియుగానికి అవసరం అవుతాయి. అందుకే, జేమ్స్ జాయిస్ ‘యులిసెస్’, ‘ఫినెగన్స్ వేక్’లో ఆధునిక కథలను ఉద్దేశపూర్వకంగా ప్రాచీన పురాగాథల నమూనాలో అల్లాడు. సిసిఫస్ పురాణగాథను అబ్సర్డిస్టులు, అస్తిత్వవాదులు జీవితంలోని రోజువారీ కార్యకలాపాలలో అర్థరాహిత్యాన్ని స్పష్టం చేయడానికి ఉపయోగిస్తారు. డబ్ల్యూ.బి. యీట్స్ ‘ఎ విజన్’, ‘ది సెకండ్ కమింగ్’, ‘బైజాంటియమ్’ లలో ఒక నూతన పురాణ వ్యవస్థను సృష్టించాడు. ఈ రకమైన పునఃసృష్టి గతాన్ని నేపథ్యంగా చేసుకొని సమకాలీన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, సమకాలీన దృక్కోణం నుండి గతాన్ని వ్యాఖ్యానించడానికి వారికి విస్తృతమైన అవకాశాన్ని ఇచ్చింది. అలాగే, మన పక్కరాష్ట్రమైన కర్ణాటకలో గత వారం కాలధర్మం చేసిన ప్రముఖ కన్నడ రచయిత భైరప్ప కూడా తన నవలలలో పురాణ ప్రతీకలను ఉపయోగించుకొని ఆధునిక జీవితాలకు ఆ పురాగాథలను, కథలను అన్వయం చేసే ప్రయత్నం చేసాడు. తనకు గొప్ప పేరు తెచ్చిపెట్టిన ‘పర్వ’ నవలలో మహాభారతం కథను మనుష్యుల మధ్య జరిగిన కథలాగా పునఃసృష్టించాడు. అందులో ఏ మంత్రాలు, దైవత్వం, అతీత శక్తుల ప్రస్తావన లేకుండా భారత కథలో పాత్రల స్వభావాలను, వారివారి భావోద్వేగాలను, ఆవేశాలను, బలహీనతలను మరింత బలంగా తీర్చిదిద్దగలిగాడు. తద్వారా ఆయన మహాభారతానికి ఒక నూతన భాష్యాన్ని అందించాడు. దైవత్వాన్ని పక్కనపెట్టినప్పుడు, పాత్రల నైతిక సందిగ్ధతలు, వారి నిర్ణయాల వెనుక ఉన్న మానసిక సంఘర్షణలు మనకు మరింత దగ్గరగా, మరింత వాస్తవికంగా అనిపిస్తాయి. ఈనాటి మన సమస్యలకు, ఆనాటి పాత్రల సందిగ్ధతలకు మధ్య ఒక వారధిని నిర్మించాడు. ఇది పురాగాథను పునఃసృష్టి చేసి బ్రతికించుకొనే ఒక పద్ధతి.
అయితే, ‘పర్వ’ వంటి రచనలను నేటి వాతావరణంలో సృష్టించడం సాధ్యమేనా? నేటి అతిజాతీయవాదం మన పురారాణేతిహాసాలను ప్రశ్నించరాని పవిత్ర గాథలుగా శాసించే ప్రయత్నం చేస్తోంది. భైరప్ప 1979 లో వ్రాసిన ‘ పర్వ’ లాంటి నవలను ఈ రోజుల్లో రాసినట్లయితే, విడుదలైనప్పటి కంటే చాలా ఎక్కువ వివాదాలను, వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చేది అనడంలో సందేహం లేదు. ఇందులో కృష్ణుణ్ని దేవునిగా కాకుండా ఒక తెలివైన నాయకునిగా, కొన్నిసార్లు కుటిలమైన వ్యూహకర్తగా చిత్రించడం, నేటి వాతావరణంలో హిందూ ధర్మాన్ని అవమానించే ప్రయత్నంగా సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగి పెద్ద దుమారం చెలరేగేది. పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్లు వచ్చేవి. పుస్తకాన్ని వెనక్కి తీసుకొమ్మని రచయితకు, ప్రచురణకర్తకు బెదిరింపులు వచ్చేవి. ఈ రకమైన గొడవలలో ఆ పుస్తకానికి ఇప్పుడు వచ్చిన గుర్తింపు, భారత సంస్కృతిని, పురాగాథల ఆత్మను లోతుగా అర్థం చేసుకొన్న తత్త్వవేత్తగా భైరప్పకు గౌరవ పురస్కారాలు కానీ వచ్చి ఉండేవి కావు. ఈ రకమైన వాతావరణం తాత్కాలికమేనని, పురాణాల ఆత్మను గౌరవిస్తూనే, వాటికి కొత్త దేహాన్ని, కొత్త స్వరాన్ని ఇవ్వగల ఎస్. ఎల్. భైరప్ప వంటి రచయితల సాహసాన్ని, విమర్శనాత్మక ఆలోచనను, సృజనాత్మక స్వేచ్ఛను ప్రోత్సహించే వాతావరణం తిరిగి భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ నెలకొంటుందని ఆశిద్దాం. శుభం భూయాత్!
ఛాయ సాహిత్యోత్సవం — 2025. కొత్త కార్యాచరణను ముందడుగు వేయించే ఉత్సాహం ఇది. కొత్త గొంతుకలకు నెలవయ్యే వేదిక ఇది. రానున్న ఎన్నో ప్రయోగాలకిది ప్రారంభపదం.
పర్వ రాసిన అనుభవం నాలో ఒక కొత్తభావాన్ని కలిగించింది. నాకొక కొత్త జన్మనిచ్చింది. మన అనేక విశ్వాసాలకు మూలం రూఢే, పరంపరే, సంప్రదాయమే. వీటన్నిటిని వదిలి జీవితం చివరిలోని చావు దృష్టితో జీవితాన్ని చూస్తే కొత్త అవగాహన, జ్ఞానం పుట్టవచ్చు అనే భావం పెరిగింది.
ద్రౌపది కుమారులు ఐదుగురినీ కోల్పోయిందన్న వార్త నా చెవినపడ్డప్పుడు కూడా అదే జరిగింది. వెంటనే నా మనసు శాంతించింది. ఆమె వెక్కి వెక్కి ఏడవాలి. ఆమె కడుపు మండిపోవాలి. ఆర్యావర్తంలో ముంచుకొచ్చిన ఈ పెనువిపత్తుకు బీజం వేసింది ఆమె అహంకారం కాదా? ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె ధగధగలాడే వజ్రాల కిరీటం ధరించి పట్టమహిషిగా సింహాసనం మీద నవ్వుతూ ఎలా కూర్చుంటుంది?
ఇది మహాభారతాన్ని మరోసారి తమ మాటల్లో, ఆధునిక వచన రూపంలో, చెప్పడం కాదు. మహాభారతంలోని ఎన్నో సమస్యలకు హేతుబద్ధంగా సమాధానాలను వెదికి, సృజనాత్మకంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే ప్రయత్నం ఇది. మహాభారతంలోని పౌరాణిక కల్పన (మిథ్)ను వాస్తవాన్ని విడదీసి, ఆనాటి సామాజిక స్వరూపాన్ని మన కళ్ళముందు పునర్నిర్మించిన విద్వత్ ప్రయత్నం ఇది.
ఈ పద్యంలో భావాన్ని భారతీయతకు మరింత దగ్గరగా తేవాలంటే. “స్వర్గం” బదులు “కైలాసం” అనవచ్చు. మంచుకొండపై నేర్చిన నర్తకుడు కదా నటరాజు! ఈ పద్యంలో భావమేమిటి? అభద్రతలో స్వేచ్ఛ ఉంది. ఆనందం ఉంది. శివుని భిక్షాపాత్ర ఆహార అభద్రతకు ప్రతీక. జారుడు మంచుకొండపై నటరాజు నృత్యం, జీవితంలో అభద్రత అంతర్భాగమని సంకేతిస్తుంది. రిక్తభిక్షాపాత్రలో స్వేచ్ఛ ఉంది. జారుడుమంచుపై నృత్యంలో ఆనందం ఉంది. రవీంద్రభారతిరంగస్థలంపై దొరకని ఆనందం.
భైరప్పగారి వ్యక్తిగత అభిప్రాయాలను తీవ్రంగా విమర్శించేవారు కూడా ఆయన సృజన శక్తిని, విషయాలను లోతుగా పరిశీలించే ప్రామాణికతను, పాత్రలను విశ్లేషణాత్మకంగా చూచే విధానాన్ని కాదనలేరు. చెప్పదలచుకున్న దాన్ని ప్రామాణికంగా చెప్పే గుణం ఆయనది.
భిత్తి ఆత్మ చరిత్ర కష్టాలలో కడతేరిన వ్యక్తి సంకల్ప సిద్ధిని నిరూపిస్తుంది. “ఒక రచయితకు కలిగిన కష్టాలు ఆయనను ఒక మహోన్నత రచయితగా రూపొందించడంలో ఎంతగానో సహకరించాయి” అన్న విషయాన్ని నిరూపిస్తుంది. భిత్తి ఆత్మ కథనంగా మాత్రమే కాక అపురూపమైన కథనంతో కూడిన నవలగా అనిపిస్తుంది.
మహాభారతం అంటే దాయాదుల యుద్ధం, రాజ్యాధికారం కోసం జరిగిన యుద్ధం అనుకొంటారు. కాని, హేతుబద్ధమైన ఆలోచనలతో ఈ నవల రాసి, కొన్ని ఊహించని సత్యాల్ని వెలికి తీశారు. ఆయన వెలికి తీసిన ఎన్నో సత్యాల్లో… ప్రధానమైన ‘స్త్రీల మానసిక క్షోభ. ఆనాడు స్త్రీలు మౌనంగా ఎంతటి దుఃఖాన్ని దిగమింగుకున్నారు.
చెరువుతోనే సరిపెట్టకుండా అందరం దగ్గర్లో ఉన్న ఛోంగ్‌కోర్ వ్యూపాయింట్ దాకా ఎక్కాం… కానీ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ఆ వ్యూ పాయింట్ నుంచి దూరాన గంగపూర్ణ శిఖరం, అన్నపూర్ణ 2, 3, 4 శిఖరాలు, తిలిచో శిఖరం – అన్నీ ఒకేసారి కొలువుదీరి మనసుకు పరవశం కలిగించాయి… చక్కని తేనీరు సేవిస్తూ చుట్టూ పరచుకుని ఉన్న శిఖరాలతో కబుర్లాడటం – అనూహ్యమైన అనుభవమది.
అప్పటివరకు వినోదకరమైన ప్రయోగాలకీ, భయంకరమైన పిడుగులకీ, విద్యుత్తుతో ఏదో సంబంధం ఉందనుకున్నారు కాని, ప్రకృతిని అర్థం చేసుకోవడంలో గురుత్వాకర్షణ శక్తి లాగా విద్యుత్తు కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని డేవీ నిరూపించాడు.
ఒక్కక్షణం అతను దారిద్ర్య సంపదలూ, జాతిమత వయోభేదాలూ, సంఘపు అంతస్తుల మెట్టపల్లాలూ, ఆస్థిమాంసాల శరీరపు దౌర్బల్యాలూ, వ్యక్తి చైతన్యపు, అహంకారపు సరిహద్దులూ, అన్నీ అధిగమించి ఆ కుర్రవాడితో, ఒక మానవ జీవిమాత్రుడై, సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. ఆ కుర్రవాడికీ తనకూ ఏమీ విభేదం లేదనీ, అతన్నించి తనను ఎవ్వరూ వేరుచెయ్యలేరనీ అనుకొన్నాడు.
దునియాలో మోసం చెయ్యందెవరు? తోబుట్టువులైనా మొగుడూ పెళ్ళాలైనా, కిళ్ళీకొట్టోడైనా, మందుల షాపోడైనా, బడే బడే నేతాలోగ్ అయినా… చివరికి ఆ అడుక్కునే కొజ్జావోడైనా – మోసం చెయ్యనోడు లేనేలేడంటా!
Read more వరకూ అలా అలా చదివేసి thumbs up emoji కొట్టి, రచయిత ఎవరో కూడా చూడకుండా తన కాంటాక్ట్స్‌లో కొందరికి, గ్రూపులు కొన్నిటికి forward చేశాడు ప్రసిద్ధ్… నిమిషాల మీద ఆ కథ ప్రపంచమంతా చుట్టేసింది. ఇంకా ఎక్కడో తిరుగుతూనే ఉంది. ఎవరి దృష్టీ తగలకుండా. నకులుని గుఱ్ఱం.
సచ్చిపోనీకి బతకాలన్నంత దైర్నం వుండాల.
చలం మాట ఎత్తగానే, కొన్ని ఏనుగులు వచ్చి నుంచుంటాయి. గదంతా నిండిపోతాయి. అడ్డదిడ్డంగా. వీటిలో కనిపించేవి కొన్నైనా, కనిపించనివి ఎన్నో. ఇప్పుడీ వేదిక ముందూ ఉండే ఉంటాయి ఏనుగుల గుంపులు. ఆ ఏనుగులేమిటో మీకూ కనబడే ఉంటాయి. అవి మీ లోలోనికి చొరబడే ఉండొచ్చు. ఆ ఏనుగులు ఏమిటో మీరీపాటికి గ్రహించే ఉంటారు. పడికట్టు అభిప్రాయాలు. బిగదీసుకున్న ఛీత్కారాలు. నిగడదన్నుకున్న నిర్ధారణలు. విశృంఖలత, విచ్చలవిడితనం, చెడగొట్టే రాతలు, చెడిపోయిన పాత్రలు, ఎగుడు దిగుడు మైదానాలు.
కర్ణుడితో ఉన్నదానికంటే మెరుగైన జీవితం అనుకుంటే భౌతికంగా భద్రమైనదే కానీ దిల్లీకి రాకముందు తను నమ్మి, పాటించిన నీతి వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు. ఏది నీతివంతం? ఏది నీతిబాహ్యం?
వీరు ఒకరి సిద్ధాంతాలను మరొకరు విమర్శించి, తమ తమ సిద్ధాంతాలను సమర్థించుకున్నారు. ఇది కేవలం సైద్ధాంతిక వైరుధ్యమే తప్ప, వ్యక్తిగత దూషణ కాదు. ఈ విమర్శల ఫలితంగానే భారతీయ తత్వశాస్త్రం మరింత సుసంపన్నమైంది.
గుర్తుందా,
చలికాలపు సూర్యుడు సర్దుకునే సమయం?
పొగలు కక్కే కప్పుల్లోకి
చెరోపక్క నుండి మునకేయడం!
ఎన్నున్నా
ఆటుపోట్ల
దేహాల సముద్రంలో
అసంఖ్యాక శ్వాసల నౌకలు
తమిస్ర సహస్రాలు గడిచేక
సహస్రకిరణాల సవితృ దర్శనం
శాంతి మంత్రానికి
సమయం వస్తుంది
తన చిట్టి చిట్టి చేతలతో
ముద్దు ముద్దు మాటలతో
ఆమె అడుగు పెట్టగానే పెద్ద
దర్వాజకు
పచ్చని మామిడాకు తోరణం
కట్టి
పెద్ద కడపను
పూదిచ్చినట్టయింది
దానిలో కొందరు ప్రేమా దయా నింపుతారు
కొందరు అసూయా ద్వేషాలు లోనికి పంపుతారు
అమవస పద్మవ్యూహంలో నక్కిన
కౌముదీ సౌభద్రం సినీవాలి
అబద్ధాల చక్రవ్యూహంలో చిక్కిన
ఒంటరి అభిమన్యం నిజం- వాలీ, సోలీ!
మాకు రెక్కలున్నాయి, ఊహల్లేవు,
నీకు ఊహలున్నాయి, రెక్కల్లేవు,
నీ ఊహలకి మా రెక్కలు తగిలించి
మనదైన మాంత్రికనగరం సృష్టించుకుందామనా?
ఇన్నాళ్ళుగా అల్లుకున్న
మల్లెపందిరి పరిమళం
గదులన్నిటిలో తాజాగా గుప్పుమంటోంది
ఎక్కడి నుండో-
ఎగిరివచ్చిన పిట్టలు,
గుంపులుగా మూగినట్టు
కొమ్మలపై వాలినట్టు
సూర్యుణ్ణి మాయం చేసి
సుదీర్ఘ కాలం ముసురు
ఎక్కడెక్కడ చూసినా
చిక్కటి టీ రంగు నీరు
రాత్రి అనే పల్లె పడుచు వెన్నెలనే మజ్జిగని చిలికి నప్పుడు చల్ల పైన తేలిన తునకలతో చేసిన వెన్నముద్దే ఆకాశం మధ్యలో వెలిగి పోతున్న చంద్రుడట. వెన్నముద్ద కాకుండా చుట్టుపక్కల చెల్లాచెదరై మిగిలిపోయిన తుంపరలే నక్షత్రాలట.
వ్యాసుడు విషయానికి ప్రాధాన్యతనిచ్చి, మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడాన్ని మూడు శ్లోకాలలో ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్న చందంగా తేల్చేసాడు. సన్నివేశ చిత్రీకరణ ఇక్కడ జరగలేదు. పాఠకులకు లేదా శ్రోతలకు, ఈ సన్నివేశంలో ఏమి జరిగిందో తెలుస్తుంది తప్ప వారి ఊహలకు ఊతమిచ్చే వర్ణనలు, వివరాలు ఈ శ్లోకాలలో లేవు.
ప్రపంచం ఎంత పొడుగు పొడుపు కథ!
మట్టికణంలో ప్రాణం నాటిన
నిసర్గ జీవసూత్రమేదో
మహావిశ్వానికి పురుడు పోయడం
ఏ అదృశ్య తెర మీద కనిపిస్తుంది?
‘‘భగవంతుడా! నువ్వు స్త్రీగా మారితే నా బాధ అర్థం అవుతుంది’’ అనుకుంటుంది.
పద్యం, కూతురి కోసం నాన్న కొనితెచ్చే
ఇసుకలో వేయించిన వేరుశనక్కాయల పొట్లం
పద్యం జున్ను ముక్క
ఉప్పు తేగల కట్ట
మేఘాలదేముంది,
వస్తూంటాయి, కమ్ముకుంటాయి
ఏమీ ఎరగనట్టు జారుకుంటాయి
నంగనాచులవి.
సమాజ సంస్కరణకు, సామాజిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసే ఊహలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించాలి. వీరేశలింగం, గురజాడ వంటి సంస్కర్తలు వ్యవస్థలోని రుగ్మతలను సరిదిద్దాలని ప్రయత్నిస్తే, చలం ఆ వ్యవస్థ పునాదులనే ప్రశ్నించే తీవ్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
ఏది నిజం? సిల్కు చీరలా? చింకిగుడ్డలా? మాడినకడుపులా? బలిసిన రొమ్ములా? వృద్ధ వేశ్య ప్రలాపాలా? జవ్వనుల పకపకలా? చీకటిలో ఒంటరితనం? వెలుగులో జంటలు? ఏది నిజం? చావుబ్రతుకుల సంజమసక, కల్తీలేని వెన్నకాచిన నిజం ఏది? ఎలాగుర్తుపట్టటం?