రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఆకాంక్ష

రచన: పద్మావతి రాంభక్త
అక్టోబర్ 2025

తుపానులతో తలపడుతూ
శిశిరాలను ఎదిరిస్తూ
యుద్ధాలు చేసి చేసి
అలసిన శరీరపుకొమ్మలపై
మరో వసంతపుపిట్ట
అప్పుడే ఎలా వాలింది?

మొన్నమొన్ననే కదా
నునుసిగ్గుల మొలక
అమాయకంగా తలెత్తి
సముద్రాన్ని ఈదాలని
తనలోని అణువణువునూ
అత్యంత శ్రద్ధగా కూడదీసుకుంది

కలతబారిన నలతహృదిని
కనురెప్పల కింద దాచుకుని
ఏమీ తెలియనట్టే
మలుపుమలుపులో
ఉత్సాహపు ఊయలలూగింది

చలచల్లని వెన్నెలవాకిట
చుక్కలముగ్గై విరిసిన
అందమైన ఆకాశాలనూ
పసుప్పచ్చని చామంతులసందిట
రంగులరెక్కలై వాలిన
సుకుమార సీతాకోకలనూ
గుప్పెడు గుండెలో ఇముడ్చుకున్న
అనుభూతి సంతకాలనూ
సున్నితంగా తలుపుతట్టి మరీ స్పృశించిన
ఆ వాసంతసమీరం
మరొక్కమారు జ్ఞాపకాలచెట్టును ఊపి
ఎంత చక్కగా గుర్తు చేసింది

ఇన్నాళ్ళుగా అల్లుకున్న
మల్లెపందిరి పరిమళం
గదులన్నిటిలో తాజాగా గుప్పుమంటోంది

నేసుకున్న
అనుభవాల కలనేత
చెక్కిళ్ళపై నలుపుతెలుపుల మెరుపులద్ది
వింతవన్నెలతో రెపరెపలాడుతోంది

జాబిలితో కూడి
నక్షత్రతోరణాలతో నింగి
కళకళలాడుతున్నట్టు
పోగుజేసిన ఆశలతో సహా
భవిష్యత్ ఊహలతో
మది మిలమిలలాడుతోంది

కలలఅంచులమేఘాలపై
నడయాడే కొత్తసూర్యోదయం
పెదవులపై
వేవేల చిరునవ్వుల విత్తులను నాటి
గుత్తుగుత్తులుగా
గులాబీలై పూసే పూలతోటను కాంక్షిస్తోంది

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    venkat KVR January 29, 2026 5:33 pm

    తుపానులతో తలపడుతూ శిశిరాలను ఎదిరిస్తూ యుద్ధాలు చేసి చేసి అలసిన శరీరపు కొమ్మలపై మరో వసంతపు పిట్ట అప్పుడే ఎలా వాలింది? ఏమైనా చెప్పారా… తీసుకున్నవాళ్లకు తీసుకున్నంత, పాఠకుల ఊహలకే ఒక సవాలు విసిరారు…
    కలానికి, ఎన్ని వైపులనుంచైనా పదును పెట్టొచ్చని చెప్పారుగా!

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • బాల్కనీ అతిథులు
  • అపురూపం
  • అదేమిటో
  • నిష్క్రమణ
  • చీకటి కలలు

ఇటువంటివే…

  1. ఆకాంక్ష
  2. పతిత పత్రాల పాట
  3. ఆట
  4. రహస్యనేత్రం
  5. నిశ్శబ్దం అంచున

అక్టోబర్ 2025 సంచికలో ...

  • ‘పర్వ’ను నడిపిన స్త్రీమూర్తులు
  • అక్టోబర్ 2025
  • అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 3
  • అలల దారి
  • అస్తిత్వవాద సాహిత్యం: 3ఇ. నీచ
  • ఆకాంక్ష
  • ఇంటిలోపలి పూల తరువు
  • ఏనుగు, మర్రిచెట్టూ… చలం!
  • ఏమో
  • ఒక గంట జీవితం
  • కంప్యూటర్ చిప్ కథ – 6: రసాయనాన్ని విద్యుత్తుతో సంధించిన హంఫ్రీ డేవీ ప్రయోగాలు
  • కళ్యాణ తిలకం
  • కవి వైద్యుడు
  • కాస్మిక్ డాన్స్
  • గృహ ప్రవేశం
  • చలం — కాలం చెల్లిన నాణెం
  • ఛాయ సాహిత్యోత్సవం — 2025
  • జనం మెచ్చిన మేటి రచయిత
  • జేబు దొంగ
  • నకులుని గుఱ్ఱం
  • నీవు గొంతెత్తి పాడితే
  • నోస్టాల్జియా
  • పంచర్
  • పతిత పత్రాల పాట
  • పద్మవ్యూహం
  • పర్వ అనువాదకుని నివేదన
  • పర్వ మున్నుడి
  • పోతన భాగవతంలో దృశ్యీకరణం – 2
  • బహు సుందరుడు సుందరకాండ చందురుడు
  • బాను ముష్తాక్‌ కథలు
  • బుడగ
  • భైరప్ప నవలలు — భారతీయ దర్శనాలు
  • భైరప్పగారి ఆత్మకథ ‘భిత్తి’
  • ముసురు తర్వాత
  • యూట్యూబ్‍లో ఈమాట: సెప్టెంబర్ 2025
  • సినీవాలి
  • సీతాకోకల కథ
  • సూడోసైన్స్‌పై వైదిక సనాతనుల ధిక్కారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నీవు గొంతెత్తి పాడితే
సీతాకోకల కథ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.