ముసురు తర్వాత

సూర్యుణ్ణి మాయం చేసి
సుదీర్ఘ కాలం ముసురు
ఎక్కడెక్కడ చూసినా
చిక్కటి టీ రంగు నీరు

తటాలున ఓ ఉదయం
తడిసిన ఆకుల మీద
తళతళా మెరుస్తూ
తొలి సంధ్య కిరణాలు

ముడుచుకునే గొడుగులు
తెరుచుకునే మనసులు!


రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి:

2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. “ఏటి ఒడ్డున” కవితా సంపుటి (2006), “ఆత్మనొక దివ్వెగా” నవల (2019), “సెలయేటి సవ్వడి” కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు.

 ...