అచ్చుయంత్రం వేల, లక్షల పుస్తకాలు ప్రజల మీదకు పడేస్తున్నది. ఈ యాంత్రిక యుగంలో ఎప్పటికైనా గ్రంథ దహనోద్యమం ప్రారంభం కాక తప్పదు. ఎందుకంటే, అచ్చు యంత్రాలు లేని రోజుల్లో, మంచి గ్రంథాలు నిలిచి చెత్త గ్రంథాలు పోయేందుకు ఎవరూ ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం లేక పోయేది.
చంద్రలత
మహబూబ్ నగర్
నెల్లూరు
రచయిత్రి, విద్యావేత్త, ప్రచురణకర్త
జీవిత విశేషాలు
చంద్రలత రచయిత, విద్యావేత్త, ప్రచురణకర్త. 1997 లో వీరు రాసిన ‘రేగడి విత్తులు’ అనే నవలకు తానా వారి బహుమతి లభించింది. నవలల రచనతో పాటు చంద్రలత అనేక కథలు, సాహితీ వ్యాసాలు, సిద్ధాంత రచనలు, కథన విశ్లేషణలు, బ్లాగ్ రచనలు, పిల్లల పాటలు, తదితరాలు రచిస్తున్నారు.
చంద్రలత రచనలు
చలం మాట ఎత్తగానే, కొన్ని ఏనుగులు వచ్చి నుంచుంటాయి. గదంతా నిండిపోతాయి. అడ్డదిడ్డంగా. వీటిలో కనిపించేవి కొన్నైనా, కనిపించనివి ఎన్నో. ఇప్పుడీ వేదిక ముందూ ఉండే ఉంటాయి ఏనుగుల గుంపులు. ఆ ఏనుగులేమిటో మీకూ కనబడే ఉంటాయి. అవి మీ లోలోనికి చొరబడే ఉండొచ్చు. ఆ ఏనుగులు ఏమిటో మీరీపాటికి గ్రహించే ఉంటారు. పడికట్టు అభిప్రాయాలు. బిగదీసుకున్న ఛీత్కారాలు. నిగడదన్నుకున్న నిర్ధారణలు. విశృంఖలత, విచ్చలవిడితనం, చెడగొట్టే రాతలు, చెడిపోయిన పాత్రలు, ఎగుడు దిగుడు మైదానాలు.
“సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలుగా అయ్యాయంటే, రెండు సమస్యలు. ఒకటి కాదన లేవు. రెండు నిరూపించ లేవు.” ఈ నవలాకథనానికి మూలసూత్రం అదే.
రవీంద్ర సాహిత్యంలో అడుగడుగడునా పిల్లల లోకంలోని అభూతకల్పనలు, అద్భుత సాహసాలు కనబడతాయి. ప్రాచీన గాథలెన్నో సరికొత్త రూపురేఖలతో పలకరిస్తాయి. రాకుమారులు, రాకుమార్తెలు, ఇచ్ఛాపూరణ్ ఠాకురాణీలు, నిద్రాదేవతలు, అప్సరసలు, యక్షులకు కొదవలేదు. కుట్రలు కుతంత్రాలు మంత్రాంగాలు, గూడు పుఠాణీలు, వాటిని భగ్నం చేసే చాతుర్యం కలిగిన కథానాయకుల ప్రస్తావన సంగతి సరేసరి.
‘పాపని ఎప్పుడూ కోప్పడకూడదు. చాలా చాలా చాలా చాలా చాలా చాలా లడ్డూలు పెట్టాలి.’ అని ఉత్తుత్తి ఉత్తరంలో అమ్మమ్మ మాటగా తన మాటను చెప్పే గడుసుతనం ముచ్చట వేస్తుంది. అలాగే, బేబీ కార్న్‌తో పాటుగా మమ్మీ కార్న్, డాడీ కార్న్ ఉంటే ఫిజ్జు ఇల్లులో హాయిగా ఉంటారన్న ఆలోచన పిల్లలకు కాక ఎవరికి వస్తుంది?