రాజమండ్రి గౌతమీ ఘాట్లో
తప్పిపోయిన నన్ను
కరీంనగర్లో దిగువ మానేరు తల్లి
ప్రేమగా ఒడికట్టుకుంది
తల్లి ఎక్కడైనా తల్లే
శ్రీరామ్ పుప్పాల
శ్రీరామ్ పుప్పాల రచనలు
పద్యం, కూతురి కోసం నాన్న కొనితెచ్చే
ఇసుకలో వేయించిన వేరుశనక్కాయల పొట్లం
పద్యం జున్ను ముక్క
ఉప్పు తేగల కట్ట
రోజూ
లేగదూడ కన్నుల్లోని
నల్లని మూగతనం ముందు
తల్లి ఆవు పాలు పితుకుతున్నట్టు–
అతనేదో కూనిరాగం తీస్తున్నాడు
ఆమె చుక్కల ముగ్గు వేస్తోంది
డాబా మీద పడుకుని
నక్షత్రాల్ని లెక్కవేసేవాడు
మానవ మాత్రులకి రెక్కలు తొడిగి
శుభ్రతలేని చేతి వేళ్ళతో
భూమి గుండెల్లోంచి పక్షుల్ని ఎగరేసేవాడు