చాలామంది వచన పద్యం అంటే ఏమిటో చెప్పకుండానే దానిమీద పెద్ద పెద్ద వ్యాసాలు, వచన కవిత్వాన్ని గురించి కవితామయ నిర్వచనాలిచ్చారు. కవిత్వాన్ని గురించి కవిత్వంలో చెప్పితే అది లక్షణం కాదు.

ఒక్క అంశం మాత్రం ఇక్కడ అవసరంగా చెప్పవలసి వస్తున్నది – వచన పద్య ప్రయోక్త లందరూ వచన పద్యాన్ని ఒక ఛందోరూపంగానే భావిస్తున్నారు తప్ప కేవలం వచనంగానో, లేక గద్యంగానో భావించటం లేదు.

ఈ చిక్కులన్నిటికీ కారణం ఛందస్సాంప్రదాయంలో ఈ వచన పద్యానికి చోటు కల్పించటం కోసం ప్రయత్నించటం. ఏదో రకమైన ఛందస్సూ, గణ విభజన ఉన్నయ్యంటే, వచన పద్యానికి అదనంగా ఏదో గౌరవం వస్తుందనుకోవటం.

మాత్రాఛందస్సులను దాటివచ్చి, తనంతట తానే వచన పద్యం ఛందస్సాంప్రదాయంలో చోటు చేసుకున్నది. కాగా, నేను చేసింది ఆ చోటు యొక్క స్వరూపాన్ని స్పష్టం చేయటమే. ఛందస్సూ, గణ విభజనా ఉన్నంత మాత్రాన ఏ ‘పద్యా’నికీ అదనపు ‘గౌరవం’ రాదు.

భావగణ విభజనలో వ్యాకరణాంశాల పాత్రను సంపత్కుమార పూర్తిగా నిరాకరించలేదు. ఆ పాత్ర ఎంతవరకు అన్నదాంట్లోనే మాకీ అభిప్రాయ భేదం. వ్యాకరణ సంబంధాలకీ, భావాంశాలకీ ఏకైక సంబంధం ఉందని నా అభిప్రాయం.

వచన పద్యానికి నేను చెప్పిన లక్షణమే లక్షణమని, ఇది మాత్రమే నిర్దిష్టమయిందని కాని వాదించే అతిశయం నాకు లేదు. నాకు స్ఫురించిన ఒక పద్ధతిని సూచించటం మాత్రమే నా తాత్పర్యం.

సమకాలీనత పాఠకుడిలో ఉత్సుకత రేపుతుంది. రచయిత దృక్పథం, శైలి, సమర్థత సమకాలీన వస్తువుని మంచికథగా మలచవచ్చు. ఆ కథలు గొప్ప కథలు కావాలన్నా, నాలుగు కాలాలు నిలవాలన్నా ఆ కథల్లో సార్వజనీనత, సార్వకాలికత కూడా ఉండాల్సిందే.

తిరుక్కుఱళ్‌లో నేడు 1330 పద్యాలు దొరుకుతాయి. వీటిని మూడు వర్గాలుగా విభజిస్తారు, అవి – అఱత్తుప్పాల్ (ధర్మ వేదము), పొరుట్పాల్ (అర్థ వేదము), కామత్తుప్పాల్ (కామవేదము). కామత్తుపాల్ అనబడే కామవేదములో 250 పద్యాలు ఉన్నాయి.

రా.రా. ‘తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు’ శీర్షికతో దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ మీద వ్రాసిన సమీక్ష వారి స్థాయికి, వారి రీతికి తగినట్లుగా లేకపోవటం ఆశ్చర్యం వేస్తుంది.

నిజమే మరి. ఇవాళ తిలక్ లేడు. తిలక్ పాట వుంది. నిజంగా వుంది. జాలిగా హాయిగా వినపడుతూ వుంది. ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది.

సాంప్రదాయకవులనీ, భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే విభజన కృత్రిమమైనది. అసలు కవితాతత్వాన్ని పక్కదారి పట్టించేది. కదిలించే కవిత్వాన్ని రాయలేనివాళ్ళకు కవులుగా ఏదోవిధంగా అస్తిత్వాన్ని కలిగించటానికి చేసే వ్యర్ధప్రయత్నం.

ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.

సాహిత్యమండలి సంక్రాంతి సంబరాలలోకవి సమ్మేళనం ఆనవాయితీ. మొదటిరోజున, మల్లెపువ్వులాంటి తెల్లటి గ్లాస్గో ధోవతి, అంతకన్న తెల్లటి లాల్చీ వేసుకొని సభవెనకాల నిలబడ్డ స్ఫురద్రూపిని నేను మొదటిసారిగా చూసాను. ఇటువంటి సభల్లో వెనకాల చేరి అల్లరి చేసే వయస్సు నాది.

విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు తెలుగువారు అని వెంకటరమణయ్య చేసిన ప్రతిపాదనని ‘కర్నాటక’ చరిత్రకారులు వ్యతిరేకించారు.

రాత్రి రాయలు పడకగదికి వెళ్ళి మంచమును తట్టగా అది కూలిపోతుంది. వెంటనే ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది.

దుర్భరమైన కష్టాల్ని, వేదనను స్వయంగా అనుభవించేవాళ్ళు సైతం సృజనశీలురైతే ఆ దు:ఖం అంతర్లీనంగా ప్రవహిస్తూ వాళ్ళ సృజనకు వన్నె తెస్తున్నాది. ఎలాగో?!

“ఈనాడు ‘రిథమ్’ విని ఎక్కువమంది ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు కానీ ‘మాధుర్యం’ ప్రధానంగా వున్న పాటలే చిరకాలం నిలుస్తాయి”

భరత మాత దగ్గరి నించి తెలుగు తల్లి వరకూ, ఈ మాతలు అందరూ ఒకానొక రాజకీయ సందర్భంలో ఎట్లా పుట్టారో, ఈ రకమైన మాతృ దర్శనాలు ఎట్లా ఉపయోగ పడ్డాయో మనమందరమూ మర్చిపోయాము.