సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్రసంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో అన్ని భాషలలోనూ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. […]

పుదుకుట్టయి ఆస్థానంలో బొబ్బిలి కేశవయ్యతో సంగీత భేటీ త్యాగరాజుతో జరిగినట్లుగా కొంతమంది రాసారు. నిజానికది జరిగింది శ్యామ శాస్త్రితో!

మైడియర్ సంపాదకులూ: నా బాధ్యతగా, కొన్ని సూత్రాలను ఈ మెమోతో జత చేస్తున్నాను. వీటిని అమలు చేస్తే చీవాట్ల మాటెలావున్నా శ్రమ ఖచ్చితంగా తగ్గుతుందని నా స్వానుభవం. – ముఖ్య సంపాదకుడు

“ఈ వాక్యం అబద్ధం” అన్నది నిజమైతే, తన గురించి తను చెప్పుకున్నది నిజమన్న మాట; మరి తన గురించి తను ఏం చెప్తున్నది? తను అబద్ధమని!

నాటకీయత సాధించే మహత్తర ప్రయోజనం పాత్రలని కళ్ళముందు కదిలించడమే కాకుండా సంభాషణల ద్వారా ఆయా పాత్రల స్వభావాలని, అంతరంగాలని ధ్వనింపజెయ్యడం కూడా.

ఒక రోజు, అపు నిద్ర లేచిన వెంటనే దిళ్ళ మధ్య తల పిన్ను పడి ఉండటం గమనిస్తూ, అంతలో, ఇంట్లో పనులు చేస్తున్న అపర్ణను తదేకంగా చూస్తూ ఉంటాడు.

నన్నెచోడుడు ఒక చిన్న సామంత రాజు, కాని కవిరాజులకు రారాజు. పరమేశ్వరారాధకుడు మాత్రమే కాదు, ప్రబంధ పరమేశ్వరుడు కూడ. జాను తెలుగులో వస్తుకవితకు మార్గదర్శి.

ఇంత వరకూ లభ్యమైన త్యాగరాజ కృతుల్ని స్థాయిని బట్టీ, సాహిత్యాన్ని బట్టీ మూడు వర్గాలుగా విభజించారు. అవి దివ్య నామ సంకీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ఘనరాగ పనచరత్నాలూ.

ఇది సమాజంలో చాలా పెద్ద మార్పు. ఇలాంటి మార్పు అప్పటి మనుషుల్లో వారి స్థితిని బట్టి, అలజడినో, ఆశనో, ఉత్సాహాన్నో, నిర్వేదాన్నో కలిగిస్తూ వుండి వుండాలి. అలాంటి కాలంలో వేంకటాధ్వరి రాసిన పుస్తకం ఈ విశ్వగుణాదర్శం.

ఈ కావ్యం పేరే ఒక పెద్ద మిస్టరీ! దీనికి ‘ఉత్తర హరివంశం’ అన్న పేరు సోమన ఎందుకు పెట్టాడో ఎవరికీ అంతుపట్టలేదు. పైగా, ఇదొక ‘తలా తోకా లేని’ కావ్యం.

త్యాగరాజుకి స్వతహాగా తమిళ భాషలో ప్రవేశమున్నా, ఒక్క కృతీ అందులో రచించలేదు. అంతే కాదు పరాయి భాషా పదాల్ని కూడా ఎక్కడా రానీయ లేదు.

ఒక పాఠకుడి ప్రశ్న: ‘నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది?’ కొండలరావుగారి జవాబు ‘మీ ముఖంలా ఉంటుంది!’

పథేర్ పాంచాలి సినిమా అంత బాగా తీద్దామనుకొన్నా, ఈ సినిమా విషయంలో తనకి కొంత ఆశాభంగం జరిగిందని రాయ్ స్వయంగా చెప్పుకొన్నాడు.

గణితవేత్తలు గోటింగెన్ యూనివర్సిటీకి రావడానికి కారకుడు డేవిడ్ హిల్బర్ట్ అయితే, వాళ్ళు పారిపోవడానికి కారకుడు అడోల్ఫ్ హిట్లర్.

ఒక కవి పద్యం మీద అభిప్రాయం చెప్పడానికి ఆ కవి ఎదురుగా లేకపోవడం ఒకరకంగా ఉపకారమేనేమో. చెప్పే విషయం కూడా, కొంత గోప్యంగా…