కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం

డిసెంబర్ 1952 సంచికలో భానుమతి గురించిన అచ్చయిన ఈ కినిమా వ్యాసం మా నాన్న కుటుంబరావుగారు రాసినది కాదని నా ఉద్దేశం. దాసరి సుబ్రహ్మణ్యంగారు రాశారో, లేక మరెవరైనా ఇచ్చిన వివరాలకు అక్కడక్కడా కుటుంబరావుగారు తన వ్యాఖ్యలను జోడించారో ఇప్పుడు చెప్పటం కష్టమే. సంచిక బాధ్యత పూర్తిగా నిర్వహించడంతో డెడ్‌లైన్ దృష్ట్యా ఎవరో రాసినదాన్ని ఆయన సవరించారేమోననిపిస్తుంది.

రాసినదెవరైనప్పటికీ 27 ఏళ్ళ వయసులో ఉన్న భానుమతి గురించిన ఆసక్తికరమైన వివరాలతో బాటుగా ఆమె సాధించబోతున్న విజయాలను ముందే ఊహించగలిగిన జర్నలిస్టుల సామర్థ్యాన్ని కూడా ఈ వ్యాసంలో మనం గమనించవచ్చు.

– కొడవటిగంటి రోహిణీప్రసాద్.



కొడవటిగంటి కుటుంబరావు

రచయిత కొడవటిగంటి కుటుంబరావు గురించి:

కొడవటిగంటి కుటుంబరావు (1909 – 1980) ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.

 ...