ఎవరైనా మనుషులో, సమాజాలో కష్టంలో ఉన్నారని తెలుసుకుంటే వాళ్ళలోని ‘లోపాల్ని’ తప్పనిసరై ఎత్తి చూపించవలసినప్పుడు కూడా ఆ పనిలో సానుభూతి, కరుణ కనిపిస్తాయి. సృజనాత్మకమైన పని – అంటే కళ నిర్వహణ, అభివ్యక్తి ఎంత కష్టతరమో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోగలిగితే అది ఒకరకమైన వందనానికి, కరుణకు దారితీస్తుంది.
Category Archive: వ్యాసాలు
విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు.
ఆడవాళ్ళ వ్యక్తిత్వాలని నిబ్బరంగా నిలబెట్టిన రచన ఇది. ఇందులో పాత్రలకి వ్యక్తమైన మనస్సే కాకుండా సుప్తచేతన, అవ్యక్తభావాలు అనేకం ఉంటాయి. ఇలాంటివి ఫ్రాయిడ్ వొచ్చిన తరవాతే మన సాహిత్యంలో కనిపిస్తాయని విమర్శకులు అంటారు. అలా అనుకోవడం తప్పు అని ఈ పాట మనకి గుర్తు చేస్తుంది.
కథ సామాన్య పాఠకులని ఉద్దేశించే రాస్తాము. కాని సామాన్యుడికి శిల్పం అవగతం కాదు. కథ బాగుంటే ఎందుకు బావున్నది సామాన్యుడికి తెలియదు. కథ ఎందుకు బాగులేనిది అలాగ్గానే తెలియదు. సాహిత్యంలో నిష్ణాతులైన విమర్శకులు ఏ అభిప్రాయాన్ని ఇస్తారో ఆ అభిప్రాయమే సరియైనది అవుతుంది.
మన పద్ధతిలోన తర్క మీమాంసకి న్యాయ, వైశేషికాలని పేరు. మన తార్కికులు వితండము, జల్పము, వాదకధ అని తర్క వాదనని మూడు రకాలుగా ప్రతిపాదించేరు. వితండమంటే ప్రతివాదిని ఏదో ఒకలాగ, వెక్కిరింత, తిట్లతో సహా ఎలాంటి పద్ధతుల్నైనా వాడుకొని ఓడించి, నోరు మూయించే పద్ధతి.
కళ కళ కోసమే అనడం కళ ప్రజల కోసమే అనేదానికి వ్యతిరేకం కాదు. జాగ్రత్తగా గమనిస్తే ప్రజల కోసమే కళ. అంటే మొదట దేనినైతే మనం కళ అని పిలవదలచుకున్నామో అది కళ కావాలి కదా. కళ కాని దానిని కళ అని పిలిచి ఇది ప్రజల కోసం అనడం అసంబద్ధమయిన విషయం. కళ కళ కోసం కానిది ప్రజల కోసం కానేరదు.
తెలుగువాళ్ళకి దేన్ని ‘ఎక్కించా’లన్నా సినిమాలే శరణ్యం కనక శంకరాభరణం సినిమాలోని పాటలవల్ల శాస్త్రీయసంగీతానికి కొంత గ్లామర్ అబ్బింది. తద్వారా బ్రోచేవారెవరురా అనే కీర్తన కమాస్ రాగం లోనిదని చాలామందికి తెలిసింది.
మా ఊళ్ళో సాయిబులు పెద్దమ్మ, పెద్దనాన్నల సంతానంతో పెళ్ళి సంబంధాలు నెరపడం చూసి మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకొనేది. అయితే, ఉత్తరభారతీయులు మనం మేనమామ, మేనత్త కొడుకు, కూతుళ్ళతో మేనరికపు పెళ్ళిళ్ళు జరపడం చూసి అంతే ఆశ్చర్యపోతారు.
సినిమా పత్రికలంటే కేవలం సినిమా తారల ముచ్చట్లకే అని కాకుండా అప్పుడు కినిమాలో ‘మీ విజ్ఞానం’ అనే పేరుతో పాఠకులు అడిగిన సినిమా రంగపు టెక్నిక్స్ గురించిన ప్రశ్నలకి సమాధానాలిచ్చే శీర్షిక ఎంతో ప్రాచుర్యం పొందింది.
జేబున్నీసా ఔరంగజేబుకు ప్రియమైన కూతురు. రాజకీయ విషయాలలో ఆమెను సంప్రదించేవాడు. ఆమె తన పెద తండ్రి దారా షికోయొక్క ప్రభావము, ప్రోత్సాహము వలన కవిత్వము వ్రాయడానికి ఆరంభించినది. ఆమెకు అరబీ, పారసీక భాషలలో ప్రావీణ్యత ఎక్కువ. తన తండ్రి ఔరంగజేబ్‌వలె ఆమె భావాలు సంకుచితము కావు.
పహాడీ హిందూస్తానీ రాగమే కాని, కర్నాటక విద్వాంసులు కూడా లలితగీతాల్లో ఈ పహాడీ రాగం వినిపిస్తూ ఉంటారు. బాలమురళి పాడిన అష్టపది రమతే యమునా, వోలేటి పాడిన గడచేనటే సఖీ వగైరాలు ఇందుకు ఉదాహరణలు.
కొన్ని మాండలికాలలో ఎనమండుగురు, తొమ్మండుగురు అన్న వాడకం ఉన్నా, ఆధునిక తెలుగు భాషలో ‘ఎనిమిది’ కీ ఆపై సంఖ్యలకీ మనుష్యార్థంలో ‘మంది’ చేర్చడమే ప్రమాణం. ప్రాచీన భాషలో ‘పదుగురు’ అన్న ప్రయోగం ఉండేది.
ముగ్గులను రెండు రకాలుగా వేయవచ్చును – ఒకటి చుక్కలు పెట్టి ముగ్గులు వేయడము, మరొకటి చుక్కలు లేకుండా రంగులు నింపి వర్ణచిత్రాలుగా వేయడము.
స్పష్టమైన తర్కం, పద్ధతీ ఏర్పడి ఉన్న లౌక్యపు వ్యవహారాలకు నాయకత్వం వహించటమే ఇంత కష్టమైతే, శిధిలావస్థలో ఉన్న కాల్పనిక సృజన ఆవిష్కరణను నిర్వహించటం, అంటే సాంస్కృతిక నాయకత్వం వహించటం ఇంకెంత కష్టతరమైన పని అయిఉంటుంది?
నవంబర్ 1952 కినిమా సంచికలో అప్పటి సినీరంగంలో పైకొస్తున్న హాస్యనటులు రేలంగి, జోగారావు, బాలకృష్ణ, పద్మనాభం తమ తొలి అనుభవాలను వివరించారు.
సినీ పరిశ్రమలో పోస్టర్లు, పాటల పుస్తకాలు, కరపత్రాలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసినదే. ప్రతి వారికీ వీటి గురించి గొప్ప జ్ఞాపకాలే వుంటాయని అనుకుంటున్నాను.
దాశరథి రాసిన నిండుపున్నమి పండువెన్నెల అనే పాట ఏడక్షరాల లయమీద కష్టపడి అమర్చడం జరిగిందనీ బాలసరస్వతి చెప్పింది.