రచయిత వివరాలు

కొణిదెల హనుమంత రెడ్డి

పూర్తిపేరు: కొణిదెల హనుమంత రెడ్డి
ఇతరపేర్లు: హెచ్చార్కె
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

యెప్పుడో మరి చాన్నాళ్ళకు
యెక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చి
అరుగు మీద గూట్లో యేదో మెరిసినట్లై
యేంటా అని వెళ్ళి చూస్తావు
యేదో యెప్పుడో పగిలిన సీసా పెంకు
లేదా చిరిగిన తగరం ముక్క

ఎండా కాలం మా మద్దులేటి వాగు పక్కన
చిన్ని చేతులతో ఇసుక తవ్వి
తీసిన చెలిమ లోంచి కడవ లోనికి
లోటా లోటా తోడుకున్న చల్లని నీళ్ళలో
ఒకే ఒక్క లోటా చాలు
మరి అరవయ్యేళ్ళు బతికేస్తాను జీవనదినై

నిద్రపోక ఏం చేస్తాడు?
నిద్దట్లో మాత్రమే జీవిస్తున్న వాడు
ఎంతో కొంత తనకు తాను లేనప్పుడే
నిజంగా వుంటుంటాడు ఈ మాత్రమైనా
పేటిక మూసుకోవాలి ఇంకా

దేవుడు పని చెయ్యడు
భక్తుడు పని చెయ్యడు
నెత్తిన నెమలీక పెట్టుకుని ఒకరు
తాబేటి చిప్ప పట్టుకుని మరొకరు
బజారు తిరుగుతారిద్దరూ
దేవుడికీ భక్తుడికీ మధ్య రొమాన్స్ కవిత్వం
మీరా, రూమీ, అన్నమయ్య ఎవర్నేనా అడుగు

వేయాల్సిన వెర్రి వేషాలన్నీ అయిపోయాయి
ఇక మరణించాలనుకుంటా
ఎవడు మరణిస్తాడు పోదూ
నక్షత్రము మరణిస్తుందా
భూగోళం మరణిస్తుందా

ఎప్పుడో చూశాను ఇవే గోడల్ని, ఇదే, ఈ ఆకలి గొన్న శునకాన్ని
నన్ను గిరాకీ అనే ఒక సర్వనామంతో సంభావించే చోదక నేత్రాల్ని
ఎప్పుడో చూశాను ఈ గోడల్ని సరిగ్గా ఇవే గొడవల్ని, ఇది మామూలే.

హిమనగాలు కరుగుతాయి, రగుల్తాయి, ఆవిరులై
మరుగుతాయి అతడి కోర్కెల వైను
గ్లాసుల్లో మంచు మైదానాలశాంత
జలధరాలు, పయనమెచటికని మాత్రం అడగకు

అతడూ అమ్మాయి విడిపోయేప్పుడు పంచుకోడానికి
విడిపోయే ఆలోచన రావడానికి ముందు కొనుక్కున్న
సింగిల్ ఫ్యామిలీ హౌస్ కిటీకీలో ఏదో కదలిక

నీరు కాదు ఊహ
కలల పాపాయి పడిపోకుండా పక్కల్లో అమ్మ సర్దిన పొత్తిలి మడతలు
కొన్ని విరామ చిహ్నాలు; అంతే, ఏమీ లేదు
ఏమీ లేదనడమంటే పూర్తిగా అర్థమయ్యేదేదీ లేదని.

ఇది చాల బాగుంది
ఎక్కడికక్కడ విరిగిపోవడం
రెండు పెగ్గులు పద్యం తాగి
ఒక బుజమ్మీద ఒరిగిపోవడం

నిరాకారమై నిర్గుణమై
గొంతుక దాటని బాధలా
పుస్తకంలో చేరని గాథలా
సముద్రం లేని ఘోషలా
కాఫ్కా చెప్ప లేక పోయిన కథలా

అన్నా నీ ప్యాకెట్‌ అంటూ
గస పెడుతూ పరిగెట్టిన పిల్లాడు
ఇప్పుడు లేడనుకుంటే ఇకముందు ఉండడనుకుంటే
చాల భయమేస్తుంది. తరువాతేమిటి?

ఎన్నెన్నో ప్రశ్నలు అన్నింటికి జవాబుగా
ఔనుకు కాదుకు మధ్య ఖాళీ స్థలంలో
అనాదిగా వూగుతున్న లోలక నిశ్శబ్దం