ఎవరో వెళ్ళిపోతున్నారు నా నుంచి నీ నుంచి
చాచిన చెయ్యి చాచినట్టే వుంది
చిరకాలంగా వుంచుకున్న ఆ
కాస్త గాలిని వదిలేసుకుని, మరి దేని కోసమోవెళ్ళిపోతున్నారు మన నుంచీ తన నుంచీ
అతడి ముందొక బొచ్చుకుక్క, గిరగిర తిరుగుతోంది
తన తోకను తా నందుకోలేక
మెడ మీద పటకా మెరుపులు
మంట చుట్టు రెక్కల్లా, మురికి దిగులు చుట్టూ కుక్కకుక్క నోట్లో ఎప్పటిదో చాలా పాత ఎముక ముక్క
తన తోక తాను అందుకోలేని కుక్క అతడి ఆదర్శం,
అతడి గమ్యం, గమనం అదే,
అదే అతడి ఆటవిక రహస్యం;
నడకకు భరోసాగా అసలేమీ లేదని కూడా అనలేంఎంత మాసినా, ఎముక ముక్క బొచ్చుకుక్క సొంతం
హిమనగాలు కరుగుతాయి, రగుల్తాయి, ఆవిరులై
మరుగుతాయి అతడి కోర్కెల వైను
గ్లాసుల్లో మంచు మైదానాలశాంత
జలధరాలు, పయనమెచటికని మాత్రం అడగకుకుక్క అతన్ని అతడి దగ్గరికే చేర్చి భౌభౌమని నవ్వుతుంది
కుక్క నవ్వులో ఏదో పునరుజ్జీవనం, అది ఏదైతేనేం,
శునకమా మొరగకు, మొరిగినా
కవి వేరు కవిత వేరని కరవకు;
చషకమందిమ్ము, సారా ఎంత నాటుదైనా, ఈ పూటకి