ఆధునిక చరిత్రకారులు నాయకరాజ్యాల సంగతి పట్టించుకోలేదు. గత రెండు దశాబ్దాలలో భారత చరిత్ర రాసిన వారు 1565 నుంచి, 1761 వరకు ఉన్న కాలాన్ని దక్షిణభారత చరిత్రలో ఒక అంధకారయుగంలా పరిగణించారు. ఈమధ్యనే ఈ అలక్ష్యానికి బదులుగా నాయకులు, వారి కాలమంటే ఒక కొత్త ఆసక్తి కనబడుతున్నది.
ఈ పుస్తకంలో విశదీకరించినట్టుగా, నాయకరాజులు దక్షిణ భారతీయ సమాజపు భావనలోనూ, సంస్థాగత నిర్మాణంలోనూ మౌలికమైన పెద్ద మార్పుకు సాక్షులు గానూ, కొంతలో కొంతవరకూ కారణభూతులుగానూ ఉన్నారని మా వాదం.